రుద్ర గ్రంధి (126)

 రుద్ర గ్రంధి 








శివ నందిని తన రుద్ర గ్రంధి విభేదనము కోసం ఏ క్షేత్రానికి వెళ్లాలి అని అనుకుంటూ ఉండగా…. బాల గణపతి కాస్త అమ్మ!  నీ నాగసాధువు సాధన పరిసమాప్తి అయింది కాబట్టి….నీకు ఏదో ఒక విగ్రహమూర్తి వచ్చి ఉండాలి కదా!  అనేసరికి…..అప్పుడు శివ నందిని కాస్త పిల్లలతో నాగసాధువు దీక్షలో మాతంగి విగ్రహం మూర్తి రావడం జరిగింది అని చూపించేసరికి …..బాల గణపతి దానిని సాధన విగ్రహ మూర్తి చేతిలో పెట్టేసరికి….. ఆ విగ్రహ మూర్తి యొక్క రుద్ర గ్రంధి జాగృతి అయ్యి…. ఒక దివ్య తేజస్సు, దివ్య కాంతితో….  ప్రజ్వలిస్తూ ఉండగా అందులో నుంచి ఒక ఆధారం ఉన్న రాగి రేకు బయటకు రావడం జరిగింది. దీనిని బాల కుమారస్వామి నేను చదువుతాను అని చదవటం ఆరంభించారు. 


నన్ను ఆరాధించిన వాడు శ్రీరాముడికి అక్క మొగుడు….

నేను బాలింత కట్టులో ఉంటాను…. 

నన్ను పుట్టింటిలోనూ అలాగే మెట్టింటిలోనూ పూజిస్తారు….

నన్ను పంచమినార్ లో ఉంచారు… 

నా చుట్టూ కాళీమాత భక్తుల గుళ్ళు ఉన్నాయి… 

అని చెప్పి ఆధారాలు ఉండేసరికి కాస్త పంచమినార్ లో ఉండే శక్తిపీఠం ఏమై ఉంటుంది అని వెతకగా అది కాస్త కలకత్తా ప్రాంతంలోని శృంఖల దేవి శక్తిపీఠం అని తెలుసుకోవడం జరిగింది.  అప్పుడు స్థలపురాణం గురించిన వీడియోలు వింటూ ఉంటే….ఈ శ్రీరాముడి అక్క అయిన శాంత దేవిని వివాహం చేసుకున్న భర్త వలన…. ఈ శృంఖలా దేవి ఆరాధన లోకానికి రావడం జరిగింది. ఈవిడ బాలింత కట్టులో ఉంటుందని…అటు పుట్టింటిలోనూ ఇటు మెట్టింటిలోనూ రెండు చోట్ల ఈ మహర్షి ఆరాధన చేశాడు అని…. అలాగే ప్రస్తుతం ఈవిడ శక్తిపీఠం పంచమినార్లో ఉంచడం జరిగింది కాబట్టి…. పూజాదికాలకి అవకాశం లేదు కాబట్టి… తలుపులు 24 గంటలు తెరిచి ఉంటాయి.  బయట నుంచి మాత్రమే మినార్ని దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతుంది అని స్థలపురాణం విశేషాలను బట్టి నిర్ధారణ చేసుకొని…. ఇక తన రుద్ర గ్రంధి విభేదనం కోసం శృంఖల దేవి క్షేత్రానికి వెళ్లాలి అని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది.  ఇక దానితో వీళ్ళందరూ కలిసి రైలు మార్గంలో ప్రయాణించి శృంఖల దేవి క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. అష్టాదశ మహాశక్తిపీఠాలలో మూడవదిగా ప్రసిద్ధి చెందిన శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న పాండువా ప్రాంతంతో సంప్రదాయబద్ధంగా అనుసంధానించబడింది. పురాణ సంప్రదాయం ప్రకారం, దక్షయజ్ఞంలో సతీదేవి తన దేహాన్ని త్యజించిన అనంతరం, ఆమె వియోగంతో పరమశివుడు సతీదేవి దేహాన్ని తీసుకొని సంచరిస్తుండగా, లోకకల్యాణార్థం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని వివిధ భాగాలుగా విభజించాడని, ఆ భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం, సతీదేవి ఉదరభాగం ప్రద్యుమ్నం అనే ప్రదేశంలో పడగా, ఆ తల్లి శృంఖలా దేవిగా కొలువుదీరిందని విశ్వసిస్తారు. ‘శృంఖల’ అనే సంస్కృత పదానికి గొలుసు లేదా నడుముకు ధరించే ఆభరణం అనే అర్థాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలోని “లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలా దేవీ…” అనే శ్లోకభాగంలో ఈ అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాలు మహర్షి ఋష్యశృంగుని తపస్సుతోనూ ఈ క్షేత్రాన్ని అనుసంధానిస్తాయి.అంగదేశాన్ని పాలించిన రోమపాద మహారాజు రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడింది. ఋష్యశృంగ మహర్షి అడుగుపెడితే వర్షాలు కురిసి కరువు తొలగుతుందని తెలుసుకున్న రాజు, ఆయనను తన రాజ్యానికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అనంతరం మహర్షి అంగదేశానికి రావడంతో వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలిగిందని కథ చెబుతుంది. రోమపాదుని కుమార్తె శాంతను ఋష్యశృంగునికి వివాహం చేసినట్లు సంప్రదాయం పేర్కొంటుంది. చారిత్రకంగా పాండువా ప్రాంతం మధ్యయుగ బెంగాల్‌లో ముఖ్యమైన కేంద్రంగా ఉండేది అని స్థల పురాణ విశేషంగా శివ నందిని అందరికీ చెప్పడం జరిగింది. మొదటగా వీళ్ళు. హంసేశ్వరి ఆలయాన్ని దర్శనం చేయడం జరిగింది. పదమూడు కమల మొగ్గల ఆకారంలో కనిపించే శిఖరాలు. సాధారణంగా కనిపించే గోపుర నిర్మాణాలకు భిన్నంగా, ఈ ఆలయం ఐదు అంతస్తుల నిర్మాణంతో, పదమూడు శిఖరాలతో రూపొందించబడింది. ప్రతి శిఖరం వికసించబోయే కమల మొగ్గను తలపిస్తుంది. 1799లో రాజా నృసింహదేవ రాయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆయనకు తంత్రశాస్త్రం, కుండలినీ యోగం, మానవ శరీరంలోని చక్రాల భావనలపై ఆసక్తి ఉండేదని చారిత్రక కథనాలు పేర్కొంటాయి. 1802లో ఆయన మరణించడంతో ఆలయ నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. అనంతరం ఆయన భార్య రాణి శంకరి నిర్మాణ బాధ్యతలను స్వీకరించి 1814లో ఆలయాన్ని పూర్తి చేయించారు.. ఈ ఆలయంలోని అమ్మవారు కాళికామాత స్వరూపం లాగా ఉండటం అందరూ గమనించి నమస్కారం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ హంసేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న 1679లో రాజా రామేశ్వర్ దత్తా నిర్మించిన విష్ణు ఆలయం. ఇటుకలపై రూపొందించిన టెర్రకోట శిల్పాల్లో శ్రీకృష్ణుని లీలలు, రామాయణం, మహాభారతానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఒకే ప్రాంతంలో శక్తి ఆరాధనకు సంబంధించిన హంసేశ్వరి ఆలయాన్ని, వైష్ణవ సంప్రదాయానికి చెందిన అనంత వాసుదేవ ఆలయాన్ని చూడటం జరిగింది. ఆ తర్వాత త్రివేణి గంగా ఘాటును దర్శనం చేసుకుని కొన్ని నీళ్లు తలపై చల్లుకుని ఆ నదికి నమస్కారం చేసుకొని వెళ్లడం జరిగింది. ఇలా దగ్గరలో ఉన్న పాలయాలు ఇతర క్షేత్రాలు అన్ని దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళు గది తీసుకున్న సత్రం వద్దకు వచ్చి భోజనాలు కానించుకొని విశ్రాంతి తీసుకోవడం జరిగింది. 

శృంఖల దేవి ఆలయానికి వెళ్లే ముందు కాళికామాత భక్తుల ఆలయాలు… దేవాలయాలు అనగా రాంప్రసాద్ యోగి ఆరాధించిన కాళికామాత  దేవాలయం…. అలాగే రామకృష్ణ పరమహంసకి స్వయంభుగా కనబడి దర్శనం ఇచ్చిన దక్షిణ కాళీమాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తర్వాత వచ్చే శృంఖల దేవి ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడ పంచమినార్ మాత్రమే ఉన్నది .తలుపులు వేసి ఉన్నాయి.  లోపలి వెళ్లడానికి లేకుండా ఇనుప తీగలతో కంచె వేయడం జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కంచె దాటి లోపలికి వెళ్ళటానికి లేదు….. కేవలం బయట నుంచి మినార్ దర్శనం చేసుకోవాలి అని…. లోపల అమ్మవారు ఉన్నది అని భావన చేసుకోండి అని చెప్పడంతో సరే అని అక్కడ దర్శనం తలుపులకే చేసుకునే సరికి…మహాదేవి కాస్త అక్కడ ఉన్న మట్టిని సేకరించడం జరిగింది.  ఆ తర్వాత వీళ్ళు రామకృష్ణ పరమహంసకి నిత్యం దర్శనం ఇచ్చిన దక్షిణ కాళీ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం కాసేపు కూర్చోవడం జరిగింది. ఇలా  ఉండేసరికి…. బాల గణపతి ఉన్నట్టుండి అమ్మ!  విగ్రహాలు నిజంగానే మాట్లాడతాయా.!  కనపడతాయా?  అనేసరికి అది మన సాధన శక్తిని బట్టి ఉంటుంది…. ఎవరికైతే రుద్ర గ్రంధి  విభేదనం జరుగుతుందో , వాడు శివోహం స్థితిని పొందుతాడు. శివోహం స్థితిని పొందినవాడితో మాత్రమే స్వయంభూ దేవత ఆరాధన అయిన  అమ్మవారు గుర్తించి మనతో మాట్లాడడం జరుగుతుంది.  మనలో శివోహం స్థితి కలగనంత వరకు దేవత మూర్తులు మాట్లాడడం జరగదు.  ఇక్కడ విగ్రహం మాటాడడం జరగదు… ఇక్కడ విగ్రహ మూర్తి ప్రతిష్ట రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి స్వయంభు ప్రతిష్ట, రెండోది మానవ యంత్ర ప్రతిష్ట.  స్వయంభు ప్రతిష్ట అంటే పరమేశ్వరుడు శక్తిపీఠాలలో అమ్మవారిని భావ రూపంగా ఆరాధన చేసుకొని….ఆ శక్తిని తన సాధన శక్తిని అందులో నిక్షిప్తం చేసి…ఆయన కూడా ఒక శివలింగంగా ఈ శక్తి పీఠాలలో ఉండటం జరిగింది. అవి స్వయంభు క్షేత్రాలు అవుతాయి.  రెండోది మానవ ప్రతిష్ట…అంటే విగ్రహ మూర్తికి సంబంధించిన ఒక యంత్రం తీసుకొని, దానిని 41 రోజులపాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమం  జరిగి …..ఎవరైతే కోరిక తీరకుండా దైవ ఉపాసనలో ఉంటారో ….ఆ ఆత్మలను ఈ యంత్రంలోనికి ప్రవేశింప చేసి ఆరాధించడం జరుగుతుంది. ఇది మానవ ప్రతిష్ట విధివిధానం అన్నమాట.  మనకి ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్టలు గాని… ధ్వజస్తంభ ప్రతిష్టలు గాని… జరిగేటప్పుడు తంత్ర విధి విధానం ఉన్న సిద్ధాంతి రావడం జరుగుతుంది. తాంత్రిక గురువు రావడం జరుగుతున్న అన్నమాట.  ఆయన మాత్రమే ఈ విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది.  అనగా దగ్గరలో ఉన్న స్మశానంలో ఉన్న ఆత్మలను దైవ ఉపాసనలో ఉన్న వాటిని మంత్ర బలంతో బంధించి…. ఈ విగ్రహంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అదే స్వయంభు విగ్రహ ప్రతిష్ట అయితే…. దానిలో నీకు స్వయంభుగా అమ్మవారి శక్తి గాని, అయ్యవారు శక్తి గాని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అదే స్వయంభు ప్రతిష్ట విగ్రహాలు అంటే ద్వాదశ లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు అయితే మిగిలినవన్నీ కూడా…. మానవ ప్రతిష్ట లింగాలే దేవాలయంలో ఉన్నవి  అని చెప్పడం జరిగింది.  మానవ ప్రతిష్ట  ఉన్న దేవాలయాలు అంటే అమ్మవారి అంశతో ఉన్న విగ్రహ మూర్తి మాత్రమే అమ్మవారిగా మారి మాట్లాడడం జరుగుతుంది. అదే స్వయంభు శక్తి పీఠాలలోనూ, లింగాలలోనూ సాక్షాత్తు ఆదిపరాశక్తి , ఆది శివుడే మనకి ధ్యానంలో గాని….స్వప్నంలో కానీ… కనపడి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మన సాధన యొక్క స్థితిగతులు బట్టి మనకి వాళ్లు మాట్లాడే మాటలు గాని వినడం జరుగుతుంది. ఎప్పుడైతే సాధకుడు యొక్క సాధనా స్థితి రుద్ర గ్రంధి విభేదనం అయిన తర్వాత శివోహం స్థితికి వచ్చిన తరువాత మాత్రమే ఇది జరుగుతుంది. నేనే దేవుడిని… నేనే శివుడని ….అనుకోవటం వలన అది శివోహం స్థితి కాదు. ఇది శివుడి పాత్ర వేసిన వారిలాగా శివోహం స్థితి వస్తుంది. ఎవరికైతే రుద్ర గ్రంధి విభేదనం జరుగుతుందో…. వాడే నిజమైన శివోహం స్థితికి వెళ్తాడు.  అలాంటి వాళ్ళకి మాత్రమే అమ్మవారు గానీ, అయ్యవారు గానీ మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి రుద్ర గ్రంధి విభేదనం తర్వాతనే అమ్మవారు మాట్లాడడం, చేయడం… ఇదంతా కూడా ఆయనకి జరిగింది.  ఆయనకి నిత్యం అమ్మవారు మాట్లాడుతూ ఉండడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే….. ఆ విగ్రహం మధ్యలో అమ్మవారు స్వయంగా ఆదిపరాశక్తి రూపంలో ఉండడం జరిగింది అన్నమాట!  తాను శివుడు అవడం వలన అమ్మవారు గ్రహించి… ఆయనకే స్వప్న దర్శనములో కానీ…. భౌతిక దర్శనం కాని…. ధ్యానంలో కనిపించి సమస్యలు ,పరిష్కారాలు చెప్పడం… సందేహాలు తీర్చడం జరిగింది. అంతెందుకు ….ఇప్పుడు చందోలు శాస్త్రి గారు అని చెప్పేసి ఆయన లలితా దేవి ఉపాసకుడు.  తన శక్తిని అంతా కూడా లలితా యంత్రం లోకి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. కారణం ఏమిటి అంటే… లలితాదేవి ఆయన నాలిక మీద బీజాక్షరాలు రాయటం వలన ఆయన ఒక యంత్రం తయారు చేసుకొని… ఆ యంత్రంలోని లలితాదేవి ఆరాధన చేయడం జరిగింది.  అలా లలితా దేవి ఆయనకి బాల రూపంలో ఐదు సంవత్సరాల పాప లాగా కనపడుతూ ఉండేది . ఆయనకి కనబడుతూ మాట్లాడుతూ ఉండేది.  ఆయన ఆయన పురుషుడైనప్పటికీ కూడా ఎవరైనా దూరం నుంచి చూస్తే అమ్మవారు కూర్చుని ఉన్నారా అనేంత భావం చూసేవాళ్ళకి కలిగేదన్నమాట. అంత ఉపాసన స్థితి పొందిన ఆయన్ని దహనం చేసేటప్పుడు,  తనలో ఉన్న ఆదిపరాశక్తి అయిన లలితాదేవి ఆత్మ శరీరం బయటికి వెళ్లడం దానిని ఫొటోస్ లో తీయడం వాటిని లోకానికి చూపించడం జరిగింది. కాకపోతే ఆ ఫొటోస్ చూపిస్తాను చూడు అని చెప్పి ఒక న్యూస్ పత్రికలో చందోలు శాస్త్రి గారి అంతిమ దహన సమయంలో కనిపించిన దృశ్యం యొక్క ఫోటోలు పిల్లలకు చూపించడం జరిగింది. వాటిని చూసి పిల్లలు ఆనంద పడిపోయారు. అంటే సాధన చేస్తే అమ్మవారి పలుకుతుందన్నమాట… ఆ విగ్రహ రూపంలో అమ్మవారు ఉంటుందన్నమాట… మనం పెట్టే పదార్థాలు కూడా అమ్మవారు తింటుంది అని చెప్పేసి తెలుస్తుంది అంటూ ఉండేసరికి… శివ నందిని కాస్త ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను… కృష్ణా నది తీరంలో ఒక రాజు గారికి ఒక చెల్లెలు ఉండేది.  ఆవిడకి నరమాంసం తినాలని విపరీతమైన కోరిక ఉండేది.  ఆ రాజు మాత్రం నరమాంసం తప్ప వేరే ఇతర జంతువుల మాంసం తినమని చెప్పి ఆవిడకి భోజనం పదార్థాలుగా ఇతర పదార్థాలు పెట్టినప్పటికీ…. ఆవిడ సంతృప్తి చెందక నరమాంసం కోరిక తీరట్లేదు అని కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రేతాత్మగా మారి ఊరి జనాలందరిని… రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పీక్కు తింటూ ఉండేసరికి… దీనికి పరిష్కారం ఏం చేయాలి అని చెప్పి వేద పండితులను అడిగినప్పుడు,  దుర్గాదేవి విగ్రహం మూర్తిని ప్రతిష్ట చేయాలి అని చెప్పి నిశ్చయించుకోవడం….దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట చేసి, ఆ విగ్రహ ప్రతిష్ట లోనికి ఈ ప్రేతాత్మగా మారిన రాజు గారి చెల్లెలిని యంత్ర ప్రతిష్టలో బంధించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ అర్ధరాత్రి పూట తమోగుణానికి గురి అయ్యి ఉగ్ర స్వరూపంతో ఊరి మీద పడి జనాలని, జంతువులని, కోళ్లను, మేకలను, ఆవులను ఇలా ఏవి పడితే  అవి,  మనుషుల్ని, పిల్లల్ని ఎవరిని పడితే వారిని తినటం ఆరంభించింది. ఇలా ప్రతిరోజు అర్ధరాత్రి పూట మాత్రమే జరిగేది.  తన చెల్లెలు దుర్గాదేవి అంశగా మారినప్పటికీ కూడా…. తన మాంసం తినాలని కోరుకుంటుంది అని రాజు ఆవేదన చెందుతూ ఏం చేయాలో తెలియక ఎలా ఆపాలో అర్థం కాక మనోవేదనకి గురి అయ్యి చనిపోవడం జరిగింది. కాలక్రమంగా 300 సంవత్సరాల తర్వాత ఈ స్థితిగతులను తెలుసుకున్న శంకరాచార్యులు కాస్త శ్రీ చక్ర ప్రతిష్ట చేసి ….ఆవిడని దిగ్బంధనం చేయడం జరిగింది. తద్వారా ఆవిడ సాత్విక స్థితికి రావడం జరిగింది.  నరమాంసం గురించి ఆలోచించడం మానేసి …..సాత్విక ఆహారం భుజించడం జరిగింది. ఆ రాజుగారు చెల్లెలే ప్రస్తుతం దుర్గాదేవిగా ఆరాధనలోకి రావడం జరిగింది. ఇది ఒక గ్రామంలో ఆవిడ పిలిస్తే పలుకుతుంది అన్నట్లుగా అందరికీ జనాలకి ఏమో దుర్గాదేవి పలుకుతుందని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి పలికేది పలికించేది కూడా ఆ దుర్గాదేవి రూపంలో ఉన్న రాజుగారి చెల్లెలు అని నిజ యోగ్య అనుభవాలలో తెలుస్తుంది.  కానీ శబ్ద పాండిత్యంలోని పండితులు మాత్రం ఈ విషయం తెలుసుకున్నప్పటికీ కూడా…. ఈ విషయం ప్రచారం చేయకుండానే సాక్షాత్తు దుర్గాదేవి మాత్రమే కోరికలు తీరుస్తుంది అని వరాలు ఇవ్వడం జరిగింది. అందుకే శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న అన్నట్టు అనుభవ పాండిత్యంలోనే నిజ నిజాలు తెలుస్తాయి. శబ్ద పాండిత్యంలో నిజాలు బయట పెట్టడానికి భయపడతారు.. బాధపడతారు… చెబితే ఏమవుతుందో అని ఆలోచిస్తారు. ఎందుకంటే శబ్ద పాండిత్యంలో ఇవన్నీ గుప్తంగా ఉండటం జరిగింది. నిజానికి అది దుర్గాదేవి శక్తి పీఠం కాదు కానీ రాజుగారి చెల్లెలు ఆత్మ అందులోకి ప్రవేశించి దుర్గాదేవి అంశగా మార్చడం వలన అక్కడ నిజంగానే దుర్గాదేవి ఉంది అని చెప్పేసి చాలామంది పూజలుచేస్తూ …. ఉండడం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీయటం ఎందుకు అని పండితులు, శబ్ధ పాండిత్య గురువులు కూడా మౌనం వహించడం జరుగుతుంది. అందుకే తెలిసినవాడు మౌనం వహిస్తాడు… తెలియనివాడు మాట్లాడుతూ ఉంటాడు అనే సామెత పుట్టడం జరిగింది కాబట్టి…. మనకి విగ్రహారాధనలో స్వయంబు విగ్రహారాధన లేదు… మానవ ప్రతిష్ట విగ్రహారాధనను బట్టి అందులో ఉన్న ఆత్మలు, ఆత్మ శక్తులు మాట్లాడడం జరుగుతుంది. స్వయంభు దానిలో అయితే అమ్మవారి ఆత్మశక్తిని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అది సాక్షాత్తు పర మశివుడే చేయడం జరిగింది. అదే ప్రతిష్ట విగ్రహాల్లో మానవ ఉపాసకుడు తను చేసిన దైవిక ఉపాసనని యంత్రంలో నిక్షిప్తం చేసి ఆ పక్కనే ఉన్న దైవ ఉపాసన ఆత్మలను బంధించి, విగ్రహంలో పెట్టి ఆ ప్రేతాత్మని కాస్త దైవాత్మగా మార్చి, దేవతగా మార్చి ఆరాధనలో పెట్టడం జరుగుతుంది అని ఆ తర్వాత నాకు తెలిసింది అని ఆ వివరాలన్నీ చెబుతూ ఉండేసరికి… పిల్లలు కూడా విని ఊరుకున్నారు. రుద్ర స్వామి అలాగే మహాదేవి కూడా వినేసి ఊరుకున్నారు.  ఇది నిజమేనని రుద్ర స్వామి కూడా తల ఊపడం జరిగింది. ఆ తర్వాత శివ నందిని కాస్త రుద్ర గ్రంధి విభేదనం కోసం పంచమినార్ లో శృంఖల దేవి అమ్మవారి ముందు, ఆలయ ప్రాంగణంలో దూరంగా కూర్చుని ధ్యానం నిష్ఠలోకి వెళ్ళటం జరిగింది. ఇలా కొంతకాలం కొనసాగింది.  అయితే ఒకరోజు శివనందిని తను ఏకాంతంగా ఒంటరిగా ఉండే ధ్యాననిష్ఠలోకి వెళ్ళటం జరిగింది. కాకపోతే ఆ రుద్ర గ్రంధిలో వచ్చే మహామాయ అయిన అహంకార మాయ ఆమెకు తెలియకుండానే ఆవరించడం మొదలైంది.  దానితో ఈమె ధ్యాన నిష్ఠ పూర్తి అయిన తర్వాత శివ నందిని కి తన తంత్ర సాధన విని విధానాలన్నీ కూడా జ్ఞాన స్ఫురణ రావడం మొదలైంది.  అంటే కాపాలిక సాధన, అఘోర సాధన, భైరవ సాధన, ఆ తరువాత నాగసాధువు సాధన, ఈసాధనలకి అన్నింటికీ కూడా సుమారుగా ఏడు జన్మల నుంచి 21 జన్మలు పడతాయి.  అంటే 84 జన్మల సాధనను తను 84 రోజులలోనే పూర్తి చేసింది అంటే…. తనకి మించిన సాధకురాలు ఈ భూ ప్రపంచంలో లేరు అనే ఒక రకమైన అహంకారం మొదలవడం జరిగింది. దానితో నేను మాత్రమే ఇది సాధించాను… ఈ ప్రపంచంలో దీనిని ఏ పురుషుడు, ఏ స్త్రీ సాధించలేదు అనే అహంకారం మొదలయ్యింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే…. అహంకారానికి విశ్వాసానికి తేలికపాటి తేడా ఉంటుంది.  విశ్వాసం అంటే ఇది నేను చేయగలను అని అనుకో వడం.  ఆత్మవిశ్వాసం అయితే ఇది నేను మాత్రమే చేయగలను అని అనుకోవడమే ఆత్మ అహంకారం అన్నమాట. ఈ అహంకారాలు 18 రకాలుగా ఉంటుంది.  ఇందులో కర్మ అహంకారం నుంచి జ్ఞాన అహంకారం దాకా ఇలా 18 అహంకారాలు ప్రతి సాధకుడికి కూడా ప్రభావం చూపించడం జరుగుతుంది. అందులోనూ తన రుద్ర గ్రంధి సాధన స్థితికి వచ్చేసరికి….పంచభూతాల మీద మరియు కాలం మీద ఆధిపత్యం రావటం కూడా జరిగింది. దానితో సృష్టికి ప్రతి సృష్టి చేయగలను, ప్రతిదీ పొందే అర్హత, యోగ్యత, యోగం దక్కిందని తను చెప్పినట్టుగా పంచభూతాలు మరియు కాలం తన ఆధీనంలో ఉంటాయి అని…మహామాయ అయిన అహంకారం తనకు తెలియకుండానే శివ నందిని లోకి ప్రవేశించడం జరిగింది. దానితో శివ నందిని కాస్త ఎవరిని లెక్కచేయకుండా ఉండటం, మాటల్లో పొగరు, అహంకారం, అందరిని చులకనగా చూడటం, వాళ్ళని బానిసలుగా చూడటం, తండ్రి సమానులైన రుద్రస్వామిని, తల్లి సమానులైన మహాదేవిని కూడా…  పట్టించుకోవడం మానేసింది. ఆఖరికి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే…. శివ స్వామి ప్రత్యక్షంగా ఈమె దగ్గరికి వచ్చినా కూడా ఆయన్ని కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇది వరకు శివ స్వామి అంటే గౌరవం, మర్యాదలు చూపించేది కానీ…. శివ స్వామిని మించి తను గొప్ప సాధకురాలిని అయ్యాను అనే అహంకారం తనలో మొదలైంది. ఈ విషయం శివ స్వామి కూడా గమనించాడు. దానితో రుద్ర స్వామి శివ స్వామితో అయ్యా! అన్ని తెలిసిన మీరు కూడా…. ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఎలాగా?  ఆ అమ్మాయి అహంకారం మాయలో ఉన్నది కదా!  అహంకారం మాయ తొలగించకపోతే ఎలాగా? అనేసరికి మాయలో పడటం జరిగింది.  ఆ మాయ యొక్క అనుభవాలు పొందాలి… ఆ దారిని పట్టింది.  కాలమే నిర్ణయం చేయాలి.  తను మాయలో పడింది కాబట్టి ఆ మాయను దాటుతుందా లేదా అనేది తనకే వదిలేయాలి. గురువైన దేవుడైన సాధకురాలు లేదా సాధకుడు ఎంతవరకు వెళ్లింది… ఎక్కడ ఆగింది… ఏంటి?  అనేది చెబుతారు.  అంతేకానీ సాధకుడు మాట వినేటట్టుగా గురువుగారు కానీ, దేవుడు గాని చెయ్యడు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు….ఈ మాయలో ఉన్నావు అని తెలుసుకో తల్లి…అని చెప్పడమే. అది మాత్రమే గురువు బాధ్యత. ఇప్పుడు తను ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు.  నా మాటే కాదు… మీ మాట కూడా వినే పరిస్థితి కాదు.  ఆ అమ్మాయి అంత అహంకారం స్థితిలో ఉంటుంది.  యవ్వనంలో అడుగుపెట్టిన స్త్రీ, పురుషులు ఎలా అయితే తల్లిదండ్రుల మాటలు… బంధుమిత్రుల మాటలు పట్టించుకోకుండా నచ్చినట్టుగా అనుభవాలు పొందాలి అని మాయలో పడతారో… అలా శివ నందిని కూడా అదే ప్రస్తుత స్థితిలో ఉంది.  తనకి తానే తెలుసుకొని బయటికి రావడం తప్ప… ఎవరూ చెప్పినా వినే పరిస్థితి తను చేయి దాటిపోయింది.  మీరు అంతవరకు ఎదురుచూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది.  దానితో శివ నందినిలో ఇంకా అహంకారం పెచ్చురేగింది. శివ స్వామి సాధన కూడా దాటేశాను, శివ స్వామి కూడా నా ముందు అల్ప జ్ఞానియే అని , తనే ఇప్పుడు విశ్వానికి మోక్షం ఇవ్వాలి అని, త్రిమూర్తులందరికీ కూడా తనే మోక్షం ఇవ్వాలి అని, జ్ఞాన స్ఫురణ పొందడంతో… ఏదో తెలియని అహంకారం, మాయ లోతుల్లోకి వెళ్ళటం జరుగుతుంది.  మహాదేవి, రుద్రస్వామి కూడా ఈ పిల్ల మాటలను, చూపులలోను, అసహ్యంగా చూడటం, అలుసుగా చూడటం, ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్న కూడా ఇవన్నీ కూడా సాధనలో కలిగే స్థితిగతులే అని ఎవరికి వారే మౌనం వహించడం మొదలుపెట్టారు.  ఏది మాట్లాడినా మంచి చెప్పినా ,చెడు చెప్పినా శివ నందినిలో కోపం, చిరాకు, ఆవేశం, నేను చెప్పిందే జరగాలి…. నేను చెప్పిందే చేయాలి… నేను చెప్పినట్టే నడుచుకోవాలి…. ఈ విశ్వమే నా మాట వింటున్నప్పుడు…. మీరు ఎందుకు వినరు అని  వీళ్ళ ముందు అహంకార పూరితంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.  ఈమె దగ్గరికి వచ్చే అవసర భక్తులు, ప్రసాద భక్తులు కూడా నిన్ను మించిన సాధకులు… ఈ భూ ప్రపంచంలో లేరు… నువ్వే గొప్ప సాధకురాలివి… ఆదిపరాశక్తి కూడా శివ మాయలో పడిపోయింది.  నువ్వు ఆ మాయని కూడా దాటేశావు.. శివసాక్షాత్కారం కూడా పొందేశావు. ఇప్పుడు నువ్వు రుద్ర గ్రంధి కి వచ్చేసావు.  రుద్రుడి సాక్షాత్కారం కూడా పొందే పొందేసావు అంటే…. సాధనలో ఇంక నీ అంత సాధన స్త్రీ మూర్తులు ఉండరు . స్త్రీ మూర్తులందరికీ కూడా నువ్వు ఆదర్శమూర్తివి అని డప్పు కొడుతూ ఉండేసరికి…. ఆ పొగడ్తల మాయకు అహంకార మాయలో ఇంకా లోతుల్లోకి వెళ్ళటం జరిగింది. అవును కదా!  నిజమే కదా!  తన సాధన వల్లే కదా ఈ స్థితిగతులు కలిగాయి. తను కష్టపడే సాధించుకున్నదే కదా!  84 రోజుల్లో ఎవరు తంత్రసాధన పూర్తి చేస్తారు… అలాగే పంచభూతాల మీద, కాలం మీద ఏ స్త్రీ మూర్తి ఆధిపత్యం సాధించింది.  అసలు మోక్షానికి అర్హత ఏ స్త్రీ మూర్తి పొందింది. చరిత్రలో కూడా ఎక్కడా లేదు.  తనను మించిన సాధకురాలు ఎవరూ లేరు అని అహంకారం లోకి వెళుతూ…. చూపులు కూడా పైపైనే ఉండటం జరిగే పరిస్థితికి రాసాగింది.  ఈ పరిస్థితి ఇలా ఉంటే నిప్పుకు గాలి తోడినట్టుగా శివ నందినికి ధ్యానంలో ఉండగా 16 చేతులతో విలోహిత రుద్ర మూర్తి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ రుద్ర మూర్తి కాస్త ఈమెతో సంభాషించడం, సలహాలు ఇవ్వడం, నీడలాగా ఉండటం శివ నందిని గమనిస్తూ సాక్షాత్తు రుద్రుడే నా వెంట.. నా వెనకాల నీడలాగా ఉన్నాడు.  రుద్రుడు నా మాట వింటున్నప్పుడు…. ఇంక నాకు విశ్వాధీనేత స్థితి వచ్చినట్టే.  నేను విశ్వాన్ని నాకు నచ్చినట్లుగా… నాకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు.  పంచభూతాలను, కాలాన్ని ఆధీనంలోకి వచ్చినట్లుగా… ఆది రుద్రుడే నా స్వాధీనంలోకి వచ్చేసాడు.  నా భక్తికి మెచ్చి నా ఆధీనంలోకి వచ్చేసాడు.  ఇంతకుమించి సాధనలో సాధించడానికి ఏముంటుంది అని రుద్రుడు తన వెంట రక్షణగా ఉన్నాడు అని…. అహంకారంలోకి ఉండిపోతూ…. రాను రాను అహంకారం తగ్గించుకోవాల్సింది పోయి పెంచుకోసాగింది. ఇటు పంచభూతాలు మరియు కాలం మీద ఆధిపత్యం, రుద్రుడి సాక్షాత్కార మాయవలన, ప్రసాద భక్తులు అవసర భక్తులు మాయా వలన, తర్వాత తన పొందిన జ్ఞాన స్థితిలు వలన, వివిధ రకాల అహంకారాల మాయలో కూడా శివ నందినినీ  తెలియకుండానే చుట్టుముడుతూ విపరీతమైన అహంకారంలోకి వెళుతున్నాను అనే స్థితిలో కూడా శివ నందిని లేదు.  ఈ స్థితిగతులు తెలుసుకొని రుద్రస్వామి, మహాదేవి కూడా అక్కడ ఉన్న శృంఖలాదేవిని ప్రార్థించడం జరిగింది.  అమ్మ!  మా అమ్మాయి శివ నందిని …. అహంకారమాయలో బంధింపబడుతుంది.  నువ్వే ఆవిడకి విముక్తి కలిగించాలి.  ఆ అహంకారంలో పడిన వాళ్ళు నేను నాది అనుకుంటారు.  నేనే చేస్తున్నాను… నేను మాత్రమే చేయగలను అనే స్థితిగతుల్లో వాళ్ళు ఉండిపోతారు.  ఇది నాకు సంబంధించింది. ఇది నాది అనే స్థితికి కూడా చేరుకుంటారు కదా!  ఈ నేను నాది అనే అహంకారమాయ నుంచి విముక్తి కలిగే మార్గం ఏదైనా చూపించు తల్లి… తను రానురాను…. ఈ మాయలో కూరుకుపోతుంది కానీ, బయటికి రావాలి అనే తపన తాపత్రయం ఏమాత్రం కలగడం లేదు.  ఇక్కడదాకా రావడమే కష్టం.  అలాంటిది రుద్ర గ్రంధి విభేదనం చేస్తేనే గాని స్త్రీ ప్రకృతి నుంచి పురుష ప్రకృతికి  రాగలిగే అర్హత, యోగ్యత, యోగం పొందదు కదా!  ఈ రుద్రుడు సాక్షాత్కారం వలన రుద్రుడు తన మాయలో ఉంచడం జరిగింది. ఇప్పటిదాకా స్త్రీ ప్రకృతిలో తను శివసాంగత్యం మాయలో పడి శివుడే సర్వస్వం.. సర్వం శివమయం అని అనుకోవడం జరిగింది. ఏదో  సాధన పురోగతి చెందటం వలన అది శివమాయ అని చెప్పి తెలుసుకొని వచ్చి…. ఈ రుద్ర గ్రంధి దగ్గర మళ్లీ ఈ రుద్రమాయలో తను పడుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. కాబట్టి మా యందు దయ ఉంచి తన సాధన పురోభివృద్ధికి తీసుకువెళ్లే మార్గమును చూపించు తల్లి అని ప్రార్థిస్తూ ఉండేసరికి…. ఈ ప్రార్థనలను కూడా టెలిపతి ద్వారా విన్న శివ నందినికి కోపావేశాలు వచ్చేసి…. వీళ్ళిద్దరిని చంపడానికి అన్నట్టుగా…. తన చేతిలో ఉన్న త్రిశూలం లంఘించడం చేస్తూ ఎవర్రా మీరు? ఎవరిని అడుగుతున్నారు… శృంకలాదేవి నాకింద బానిస.  నేను చెబితేనే ఆవిడ చేస్తుంది. సాక్షాత్తు రుద్రుడే నా మాట వింటున్నప్పుడు…. మార్గం చూపించేదాన్ని నేను మాయలో ఉన్న అనటం ఏమిటి ? అహంకార మాయ ఎలా అవుతుంది? నా ఆత్మవిశ్వాసంతో నేను సాధించుకున్న స్థితి ఇది. నేను అనుభవించాల్సిన స్థితి.  మీరు పొందలేని స్థితి నేను పొందుతున్నాను అని మీరు ఈర్ష్య ద్వేషాలకు గురి అయ్యి నన్ను మాయలో పడ్డానని లేనిపోని ఆలోచనలు కలుగజేస్తున్నారు. అసలు మీరెవరు? మీరు నా సాధన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను మాయలో ఉన్న అని మీరు అనుకోవడం ఏమిటి?  అది మీకు అహంకారంగా అనిపించవచ్చు కానీ, అది నా ఆత్మవిశ్వాసం అయి ఉండవచ్చు కదా!  ఎవరో చెప్పారు…. ఇవన్నీ ఆత్మవిశ్వాసం అని, అహంకారం అని, మనం మనమే పెట్టుకున్న పేర్లు.  మనం పెట్టుకున్న వ్యవహారం వ్యవహారాలే కదా!  ఇంకొకసారి మీరు నా విషయంలో కానీ…. మీరు ఇలా ప్రవర్తిస్తే నా కింద బానిసలుగా ఉన్న దేవతలని, దైవాలని మీరు శరణు వేడితే ఊరుకోను.  నా చేతిలో చచ్చే యోగం ఉన్నట్టుంది. ఇంకోసారి అవకాశం ఇవ్వను.  ఏదో మీరు నా వెంట వచ్చారు.  సాధనలో ఉన్నారు.  కాబట్టి ప్రాణ భిక్ష పెడుతున్నాను అని చెప్పి హుం కరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  ఈమె యొక్క స్థితిగతులను చూసే సరికి రుద్రస్వామి లో తెలియని ఒక విధమైన అనుమాన భయం కలిగింది.  ఇవి రుద్రమయ దాటే పరిస్థితి ఉందో లేదో తెలియదు.  ఒకవేళ దాటకపోతే తామంత కలిసి కాశీకి వెళ్లిపోవాలి అని అనుకున్నారు. ఈ రుద్రమాయ స్థితిని దాటుతుందా లేదా?  ఈ అహంకారం దాటుతుందా లేదా అని ఎదురుచూస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ…. మనసులోనే అమ్మవారికి చెప్పుకుంటూ… వేడుకుంటూ గమనించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఒక రోజు శశివ నందిని ధ్యాన నిష్ఠ నుంచి బయటకు రావడం గమనించి ఈమె దగ్గరికి ఒక వయో వృద్ధురాలు రావడం జరిగింది.  ఈవిడని చూసి ఎవరు నువ్వు?  అని శివ నందిని అనేసరికి… నేను ఎవరు అనేది పక్కన పెట్టు, నువ్వు ఎవరు అనేసరికి నేను స్త్రీ మూర్తి సాధకులలో గొప్ప సాధకురాలిని… స్త్రీ మూర్తులకు మోక్షం ఇవ్వడానికి సాధన చేసే మోక్ష సాధకురాలిని.  ఇప్పుడు ప్రస్తుతం విశ్వాధినేత పొందటానికి అర్హత యోగ్యత యోగం ఉంది. రుద్రుడు నా వెంట నీడలాగా ఉన్నాడు.  పంచభూతాలు, కాలం, ఆధీనం చేసుకున్నాను అనేసరికి… ఓహో నువ్వు ఆధీనం చేసుకున్నావని అనుకుంటున్నావా?  అంటే నేను ఆధీనం చేసుకున్నాను.  నేనే ఇదంతా సాధించాను అనేసరికి…ఈ నేను అనేది ఎవరు?  అనేసరికి నేను అనేది నేనే….శివ నందిని అనేసరికి శివ నందిని అనేది నీ పేరు, నేను అనేది ఎలా అవుతుంది అనేసరికి…. నీ మెట్ట వేదాంతం నా ముందు పని చేయవు.  నేనే శివనందిని… నేనే ఈ సాధన స్థితిని సాధించాను.. పొందాను… నువ్వు ఎవరు? అనేసరికి నేను ఎవరు అనేది పక్కన పెట్టు…నేను ఎందుకు వచ్చాను అనేది ఆలోచించు.  నువ్వు సాధించాను అంటున్నావు కదా! నువ్వు ఏం సాధించావు నాలో ఉన్నది ఎవరు? ఎవరు సాధించారు… నేను సాధించడం…అంటే  నేను సాధించిందా…. నేను అంటే లోపల ఉన్న ఆత్మ సాధించిందా….. నేను కానీ నేను సాధించిందా ?ఆలోచించు…  అనేసరికి అదేంటి నేను అనేది నేనే కదా! నేను కానీ నేను ఎక్కడి నుంచి ఉంటుంది . నేను అనేది దేహం అనుకుంటే నేను కానీ నేను అనేది ఆత్మ అవుతుంది.  దేహానికి, ఆత్మకి మధ్య అనుసంధానం ఉంటుంది.  ఈ మనసు అనేది కాస్త నేను చేస్తున్నాను అనే మాయలో పడేలా చేస్తుంది. మనోమాయ అంటారు దీన్ని.  అతి చిన్న అహంకారం మాయ నువ్వు దాటలేకపోతున్నావు… అంటే అది అహంకారం కాదు.. ఆత్మవిశ్వాసం. అనేసరికి  ఆత్మవిశ్వాసం అంటున్నావు…. ఆత్మవిశ్వాసం అంటే నేను చేయగలను… అదే అహంకారం అంటే నేను మాత్రమే చేయగలను అని అనుకుంటున్నావు.   నువ్వు ఎవరు సాధించలేదు అని అనుకుంటున్నావు కదా!  ఈ. స్థితిని ఆదిపరాశక్తి ఏనాడో దాటేసుకొని ఆవిడ ధూమవతిగా అమ్మవారిగా చిట్ట చివరిగా ఒక రూపంలో నిలబడి ఉన్నది.  పొగదారిగా ఉన్నది.  నీ సాధనాస్థితి కాస్త రుద్ర గ్రంధిలో ఉంది.  ఆవిడ సాధనాస్థితి కాస్త బ్రహ్మ రంధ్రము మధ్య భాగంలో ఉన్న బిందు స్థానం వద్ద ఉన్నది.  మూలాతి మూలమైన పూర్ణాతి పూర్ణమైన బిందు స్థానంలో ఆమె సాధన స్థితి ఉన్నది.  ఆవిడకి నీకు పోలిక ఏమిటి?  నువ్వు ఒక్క విశ్వానికి విశ్వాధినేత పొందాలనుకుంటున్నావు.  కొన్ని కోటానుకోట్ల, వేలకోట్ల, లక్షల కోట్ల, బ్రహ్మాండానికి ఈవిడ  బ్రహ్మాండనాయక.  ఆవిడే కదా లలితా త్రిపుర దేవి.  బ్రహ్మాండాలకి అతీత స్థితిలో ఆవిడ ఉన్నది.  నువ్వు   ఒక బ్రహ్మాండం లోపల ఇది చేస్తున్నావు. నీ సాధన ఎలా ఉందంటే సముద్రం ఒడ్డున ఉన్న  ఇసుక రేణువు మీద నువ్వు ఆధిపత్యం సంపాదించేసరికి నువ్వు విశ్వాధినేత అంటున్నావు. అలాంటిది ఆమె సముద్రం మీదే ఆధిపత్యం సాధించింది.  సముద్రంలో నీటి మీద కూడా ఆవిడ ఆధిపత్యం సాధించింది.  అన్నిటికీ అతీత స్థితిలో ఆవిడ ఉన్నది.  మరి నీ సాధన స్థితి గొప్పదా?  ఆవిడ సాధనాస్థితి గొప్పదా? నువ్వే ఆలోచించుకో… అంతెందుకు నేను సాధించాను… నేను పొందాను అని అంటున్నావు కదా!  చూడు ఎవరు పొందారో, నీకే తెలుస్తుంది అనేసరికి… శివ నందిని శరీరంలో నుంచి ఒక ఆత్మ స్వరూపం బయటికి రావటం జరిగింది. ఆ ఆత్మ స్వరూపం చూసేసరికి ఆ దరిదాపు తన పోలికలతోనే ఉన్నది.  కానీ తను వేరు శివ నందిని వేరు అని ఆమెకు అర్థమైంది.  ఈ ఆత్మ పేరే రాధాదేవి.  ఈవిడే రుద్రుడి యొక్క సాంగత్యం కోసం సాధన చేసి రుద్ర మాయనే చేదించలేక ఆత్మ స్వరూపంగా ఉండి సాధన చేస్తుంది. ఈవిడ సాధించిన తంత్ర విధివిధానములోనే నువ్వు 41 రోజులు ఒక్కొక్క సాధన విధివిధానం సిద్ధి పొంది…. ఆవిడ ఒక్కొక్క సాధన స్థితి కోసం 41 యోగ జన్మలు తీసుకోవడం జరిగింది. ఆవిడ చేసిన సాధన ఫలితాన్ని ఫలంగా పొందడం జరిగింది. అంతే తప్ప నువ్వు సాధించావు…. నువ్వు చేసావు…. అని నువ్వు అనుకుంటున్నావు.  కావాలంటే నువ్వు పంచభూతాల మీద ఆధిపత్యం చూపించు.  కాలం మీద నువ్వు ఆధిపత్యం చూపించు. అంతెందుకు ….. అక్కడ నేల మీద ఉన్న రాయిని గాలిలోకి లేపు చూద్దాం అని అనేసరికి…. అదేమన్నా అంత పెద్ద విషయమా?  అది నాకు క్షణకాలం పని ….అనేసి శివ నందిని ధ్యాన నిష్ఠలో ఉండి భూమి మీద ఆధిపత్యం సంపాదించింది కాబట్టి… రాయిని గాలిలోకి లేపాలి అని…. ఎంత ప్రయత్నించినా రాయి కదలలేదు.  అది అంత పెద్ద రాయి కూడా కాదు… గులకరాయి.  ఆ గులకరాయి కూడా తను కదల కలపలేకపోతున్నాను అని చెప్పేసరికి తనలో ఒక విధమైన కోపావేశాలకి వెళ్లడం జరిగింది. తనలో పంచభూత స్థితులు, తన పొందిన అష్టసిద్ధులు అన్నీ కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గులకరాయిని కదపను కూడా కదపలేక పోయేసరికి….. శివ నందినికి విషయం అర్థం అయింది.  ఇన్నాళ్లు తను నేను చేస్తున్నాను…. అనుకున్నది కానీ, నేను చేయటం లేదు… తనలో నేను కానీ నేనుగా ఉన్న ఆత్మ చేస్తుంది. ఆవిడ వల్ల వస్తుంది.  పోనీ ఆవిడ సాధించిందా లేదా అని అనుకుంటూ ఉండేసరికి… ఆ గులకరాయిని చూసేసరికి…. ఆ గులకరాయి కాస్త పెద్ద కొండ రాయి లాగా మారిపోవడం… ఆ కొండ రాయి కాస్త గులకరాయిగా మారిపోవటం… గాలిలో తేలుతూ ఉండేసరికి, శివ నందినికి అప్పటికి గాని విషయం అర్థం కాలేదు. ఈ దేహం చేస్తుంది… నేను చేస్తున్నాను… అనుకోవడం చాలా తప్పు. నేను చేస్తున్నాను అని కాదు… నాలో ఉన్న ఆత్మశక్తి ఉండటం వలన తనకి ఈ స్థితి వచ్చింది.  తనలో ఉన్న ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకునేసరికి…ఆ రాధాదేవిలో నుంచి రుద్రుడు బయటకు రావటం జరిగింది. అంటే ఈశ్వరుడే ఈ శక్తిని అంతా కూడా నడిపిస్తున్నాడు. అప్పుడు నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది.  నేను అనేది కూడా ఆత్మ అహంకారం అవుతుంది. నేను చేస్తున్నాను అనుకోవడం దేహా అహంకారం అయితే ….నేను కానీ నేను చేస్తున్నాను అని ఆత్మ అనుకుంటే ఆత్మ అహంకారం అవుతుంది. నేను అలాగే నేను కానీ నేను లో ఉన్నది కూడా ఈశ్వరుడే.  ఆ ఈశ్వరుడే జీవాత్మగాను, ఆత్మగానూ రూపాలుగా మారింది.  తనకి తానే ఈ కర్మ ఫలాలను అనుభవిస్తూ… కర్మ అధికారం పొందుతూ…. తనకు తానే మోక్షమును పొందుతున్నాడు అని చెప్పేసి అనుకున్నది.  ఇక్కడ స్త్రీ,పురుష దేహాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా… స్త్రీలోనూ పురుషునిలోను ఉన్నది చిట్టచివరి అంతిమ స్వరూపం ఈశ్వర స్వరూపమే అని చెప్పి శివనందినికి అప్పటికి గానీ అర్థం కాలేదు. తను ఇన్నాళ్లు రుద్రుని స్వాధీనం చేసుకున్నాను… పంచభూతాలని ఆధీనం చేసుకున్నాను.. కాలాన్ని అధీనం చేసుకున్నాను అనుకున్నది. అది  తన భ్రమ, బ్రాంతి అని…. కేవలం తను ఆధీనం చేసుకోలేదని…. అలాగే స్వాధీనం చేసుకోలేదు… తనలో ఉన్న రుద్రుడే ఈ విధంగా పొంది…. సాధన చేసి సాధించింది. తనలో ఉన్న రాధాదేవి ఆత్మ అని చెప్పేసి శివ నందిని కి అర్థం అవుతూ ఉండేసరికి… నెమ్మది నెమ్మదిగా తనలో అహంకారం మొదలు అణుకువ రావటం మొదలైంది.  ఎప్పుడైతే అహంకారం పోయి ఓంకార నాదం సిద్ధి పొందడం జరిగింది… అహంకారానికి విరుగుడు ఓంకారం నాదం అని చెప్పిన శాస్త్ర వచనం శివ నందిని లో నెమ్మదిగా సత్య నిరూపణ అవటం అయింది. ఈ స్థితిలోకి వస్తూ ఉండేసరికి… తనకి ఒక విధమైన ఓంకార నాదం స్పష్టంగా వినపడుతూ ఉండేసరికి…ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు యధావిధిగా రుద్రుడి యొక్క రుద్ర ఆత్మశక్తి కాస్త రాధాదేవి ఆత్మలోకి ప్రవేశించడం…. రాధాదేవి తిరిగి శివ నందినిలోకి ప్రవేశించడం…. ఇదంతా చెప్పిన ఆ వృద్ధ స్త్రీ శృంఖల మాతగా మారి అదృశ్యం అవ్వటం… క్షణకాలంలో జరిగింది.  తీవ్రమైన ధ్యాన నిష్ఠలోకి వెళ్లిన శివనందినీకి తనకి తెలియకుండానే కళ్ల వెంట నీరు రావటం మొదలైంది. తను అహంకార మాయలో ఉండి తను చేసిన దోషాలు, తప్పులు, ఒప్పులు అన్నీ కూడా గుర్తుకు రావటం జ్ఞాన స్ఫురణ రావడంతో…. ఇక తనకి ప్రాయశ్చిత్తంగా చనిపోవాలని.. ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి… తన దేహాన్ని యోగాగ్నితో నాశనం చేసుకోవాలని చెప్పేసి…. యోగాగ్ని రగిలిస్తూ ఉండగానే ఇది గమనించిన శివ స్వామి  కాస్త పక్కనే దర్శనం ఇచ్చి దేవి!  అలాంటి తప్పు చేయమాకు.  నువ్వు అహంకార మాయలో పడి తెలిసో తెలియకో ఈ తప్పు చేశావు.  అంతకుమించి ఇవేమీ లేదు.  నేను నాది అనేది పోగొట్టుకొని….. అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు… సర్వం ఈశ్వరమయం అనే అనుభవం పొందావు.  నాగసాధువు సాధనలో ఉన్నది కేవలం ఈశ్వరుడు అనే జ్ఞానం పొందడం జరిగితే, ఆ జ్ఞానం అనుభవంలోకి ఈ రుద్ర గ్రంధిలో పొందడం జరిగింది. అలాగే చేస్తుంది ఈ రుద్రుడే అనే స్థితిని పొందావు కాబట్టి…. నీలో ఉన్న రుద్ర గ్రంధి విభేదనము జరుగుతుంది. నీ సాధన స్థితి సహస్ర చక్రానికి వెళ్ళటానికి అర్హత ,యోగ్యత ,యోగం పొందే స్థితికి నువ్వు చేరుకోవటం జరిగింది. ఇది నేను చేస్తున్నాను… నేను మాత్రమే చేస్తున్నాను… నేను మాత్రమే చేయగలను… అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాయలో పడటం జరుగుతుంది. నేను అనేది ఎవరైతే వదిలించుకుంటారో…పరిత్యాగం చేస్తారో లేదా త్యాగం చేస్తారో అప్పుడు నేను కానీ నేను అనే స్థితిని పొందడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను అనేది వదిలించుకున్నావు కాబట్టి… రుద్ర గ్రంధి విభేదనం జరిగింది అంటూ ఉండేసరికి…. శివ నందిని చేతుల్లోనికి రుద్ర స్ఫటిక శివలింగం ప్రత్యక్షం అయ్యేసరికి చూశావా!  రుద్ర గ్రంధి విభేదనము జరగటంతో నీకు శివలింగం రావటం జరిగింది .ఎవరి దగ్గర అయితే ఈ రుద్రస్పటిక శివలింగం చేరుతుందో… వాళ్లలో నేను అనే అహంకారం పోయినట్టు ఈ శివలింగం సూచిస్తుంది.  స్పటిక శివలింగానికి అలాగే రుద్ర స్పటిక శివలింగానికి కొద్దిపాటి తేడా ఉంటుంది.  స్పటిక శివలింగం యొక్క లింగ భాగం చూడటానికి దోసకాయ ఆకారంలో ఉంటే, రుద్ర స్పటిక శివలింగం అయితే గొడుగు ఆకారంలో ఈ శివలింగం ఉంటుంది. ఈ చిన్నపాటి తేడా తెలుసుకుంటే ….మన దగ్గర ఉన్నది స్పటిక లింగమా లేదా రుద్ర స్ఫటిక లింగమా అనేది తెలుస్తుంది.  స్పటిక శివలింగం అనేది విశుద్ధ చక్రం శుద్ధి అయినప్పుడు వస్తుంది.  ఈ రుద్ర గ్రంధి వివేధనం పూర్తి అయినప్పుడు…. రుద్ర స్ఫటిక శివలింగం అనేది…. సాధన పురోగతి స్థితిలో వస్తుంది. నువ్వు దీనిని పొందావు . దీనితో నువ్వు నీ సహస్ర చక్ర సాధన పరిసమాప్తి చేసుకోవడానికి నీ సాధనని తీసుకువెళ్ళు అనేసరికి… నన్ను క్షమించండి స్వామి!  నేను తెలిసో తెలియకో అహంకారం మాయలో పడ్డాను అన్న విషయం నాకు తెలియలేదు.  ఇప్పుడు అన్ని నేను చేస్తున్నాను… నేనే కష్టపడ్డాను… నేనే చేశాను …నేను లేకపోతే ఏదీ జరగదు… ఏది ఉండదు …అనే స్థితిగతులలో నాకు తెలియకుండా… 18 రకాల అహంకార మాయల్లో ఉన్నానని నాకు ఇప్పుడే అర్థం అయింది.  ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా!  ఈ విషయం ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది.  చేస్తున్నది, చేయించేది అంతా కూడా ఈశ్వరుడే.  నిజానికి ఈశ్వరుడు ఈశ్వరుడినే చూస్తున్నాడు… ఈశ్వరుడిలోనే ఈశ్వరుడు ఐక్యం అవ్వాలని అనుకుంటున్నాడు.  ఈశ్వరుడు ఈశ్వరుడినే సాధన చేస్తున్నాడని నాకు అర్థం అయింది.  నేను స్త్రీ కాబట్టి నాలో ఉన్నది అమ్మవారి స్థితి అనుకున్నాను.  అమ్మవారి లో కూడా ఉన్నది ఆత్మస్థితి అని నాకు అర్థం అయింది.  ఆ ఆత్మస్థితిగా ఉన్నది కూడా ఈశ్వరుడే అని అవగతం అయింది. అహంకార మాయలో పడి నా మాటల వలన, చేష్టల వలన మీ మనసును నొప్పించాను.  నన్ను క్షమించండి.  మీరు క్షమించాను అంటే గాని నాకు మనశ్శాంతి కలగదు అనేసరికి…. ఇక్కడ క్షమాపణలు, క్షమించడాలు ఏమీ ఉండవు దేవి!  ఎవరికి వారే సాధనా స్థితిలో సాధనా మాయలో పడటం అనేది వ్యక్తిగత సాధన స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది.  నీవు ఆ స్థితిని దాటావు. నీవు ఆహంకార మాయలో దాటగలిగావు.  తద్వారా నీలో ఉన్న అహంకారం పోయి ప్రాయశ్చిత్త స్థితికి నువ్వు రావటం జరిగింది అని చెప్పి ఇంకా నువ్వు సహస్ర చక్ర సాధన గురించి ఆలోచించుకో!  అని చెప్పేసి అనడం జరిగింది. ఆ తర్వాత ఈ శృంఖల దేవి స్వయంగా వచ్చి… శివ నందినికి అహంకార స్థితిని ఎలా పోగొట్టిందో ధ్యాన నిష్ఠలో చూసిన రుద్రస్వామి, మహాదేవి దగ్గరికి వస్తూ ఉండటం గమనించిన శివ నందిని కాస్త పరుగు పరుగున వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదాల మీద పడి నన్ను క్షమించండి …నేను తెలిసో తెలియకో నేను పొందిన అహంకార మాయవలన… నా అహంకార చేష్టలతోనూ… హుం కరించాను.  ఆ మాటలు చేష్టలు అవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటే తట్టుకోలేనంత బాధగా ఉన్నది.  అమ్మవారి దయవలనే నేను ఈ అహంకార స్థితి నుంచి బయటపడ్డాను.  పశ్చాతాపం పడుతున్నాను.  నన్ను క్షమించండి అనేసరికి…. క్షమించాము తల్లి!  నువ్వు మా కూతురివి కాబట్టి…. కూతురు తప్పుడు పనులు చేసినా , ఒప్పు పనులు చేసినా అది తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి…. అర్థం చేసుకోవడం జరిగింది.  మేము సాధన స్థితిలోనే ఉన్నాం కాబట్టి ఈ అహంకారం మాయ స్థితిలో నువ్వు ఉన్నావని తెలిసింది.  మేము అర్థం చేసుకున్నాము.నువు  ఏమన్నా అది నిన్ను ఆవరించి ఉన్న అహంకార మాయవలనే ఇవన్నీ చేస్తున్నావు… నీవు నీకుగా నువ్వు చేయట్లేదని మాకు అర్థం అయింది.  కాబట్టి నేను నువ్వే తెలుసుకుని… చేస్తుంది నువ్వు కాదు ఈశ్వరుడు అని అనుభవ జ్ఞానం పొందడంతో అహంకార మాయను పోగొట్టుకోవటం జరిగింది.  అక్కడికి వచ్చిన పిల్లలు కాస్త అమ్మ!  నీ చేతిలో ఏదో శివలింగం ఉంది ఏంటది?  అనేసరికి ఇది రుద్ర గ్రంధి వివేదనం చేసినప్పుడు సాధకులకి వచ్చే రుద్ర స్ఫటిక శివలింగం అనేసరికి అవునా?  అని మహాదేవి కాస్త ఆ రుద్ర స్పటిక శివలింగం చూస్తూ…. నేను ఈ స్పటిక శివలింగం కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.  నాలో నాకే తెలియని అహంకార బీజమాయలో ఉన్నానని నాకు అర్థం అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి…. రుద్రస్వామి కాస్త ఈ రుద్ర ఈ స్పటిక శివలింగం నేను పొందడం వలన నాకు రుద్రుడు అని ఇది చేశారు.  ఎప్పుడైతే నాలో ఉన్న అహంకారం మొదలైందో…. ప్రసాద భక్తులు అవసర భక్తులు నాలో రుద్రుని చూడటం మొదలుపెట్టేసరికి నేను నిజంగానే రుద్రుని అయి ఉండవచ్చు… లేదంటే వాళ్లకు రుద్రత్వం ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకొని దానిని రుద్ర అహంకార మాయ అని ఆనాడు తెలియక, నేనే రుద్రడ్ని అనే దాంట్లో ఉండిపోయాను. అక్కడే ఉండిపోవడం జరిగింది.  నాకు రుద్ర గ్రంధి విభేదనం జరగలేదు.  జరగాలి అని నేను ప్రయత్నం కూడా చేయలేదు. అప్పటి నుంచి రుద్ర స్వామిగా పేరు ప్రఖ్యాతలు పడిపోయి అలా ఉండిపోయాను అని ఇప్పుడు నిన్ను చూశాక అర్థం అవుతుంది.  మా ఇద్దరి సాధన స్థితిగతులు కాలమే నిర్ణయం చేస్తుంది. ఏం జరుగుతుంది అనేది…. కాకపోతే నేను శాశ్వతంగా రుద్రుడిగా ఉండిపోతానని నాకు అర్థం అయిపోయింది.  అలాగే మహాదేవి కూడా తనకి ఉన్న రుద్ర గ్రంధి విభేదనం చేసుకోకుండా…. అందగత్తె అనే అహంకార మాయలో పడిపోయి…. శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది అని కూడా నాకు అర్థం అయింది.  మా సాధన స్థితి ఆదిలోనే ఇక్కడ ఆగిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నీ సాధన చూసి తెలుసుకోవడమే.  కాకపోతే మాకు మాకే నేను రుద్రుడిగా ఉండాలని… అలాగే రుద్రుడికి సేవ చేసుకుంటూ రుద్ర సాంగత్యం చేసుకుంటూ మహాదేవి తన అందచందాలు అహంకారంతో రుద్రుడిని నేను స్వాధీనం చేసుకున్నాను అనే అహంకారంలో ఆ అమ్మాయి అలా ఉండిపోయింది.  మేము శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాము.  మాకు తెలిసినా కూడా మేము ముందుకు వెళ్లలేము.  ఎందుకంటే మాకు ఈ స్థితిగతుల్లోనే ఆనందం కలుగుతుంది.  ఈ ఆనందమాయకు మేము దాటాలని అనుకోవడం లేదు. మాకు ఇదే ఒక విధమైన మోక్షము.  రుద్ర లోకమే మాకు మోక్షలోకం అవుతుంది తల్లి . కాబట్టి నువ్వు ఈ రుద్ర మాయని దాటి ముందుకు వెళ్ళిపోయావు. కాబట్టి రుద్ర గ్రంధి విభేదం జరిగింది.  కాబట్టి ఇక నుంచి నువ్వు సహస్ర చక్రానికి ఏం చేయాలి… ఎలా చేయాలి?  అని నీ దగ్గర ఉన్న సాధనా మూర్తిని అడుగుదాం అని అనేసరికి….సరే అయ్యా!  మీ ఇష్టం అనేసరికి శివ నందిని కాస్త అహంకార రహిత స్థితిని పొందడం కోసం ఓంకార సాధన చేయడం…. తనలో సహజసిద్ధంగా వినపడుతున్న ఓంకార నాదం మౌనంగా వింటూ… ధ్యాననిష్ఠలోకి వెళ్లిపోవడం జరిగింది. 

ఆ తర్వాత కొంతసేపటికి బాలగణపతి వచ్చి.. ఈ రుద్ర గ్రంధి విభేదం పూర్తి అయింది కాబట్టి…ఆ తర్వాత ఏ క్షేత్రానికి వెళ్ళాలి అని నిర్ణయించుకునే స్థితికి,  కావలసిన దైవీక వస్తువు మనం పొందవలసి ఉంటుంది అనేసరికి…. దీనికి సంబంధించిన దైవిక వస్తువు రుద్ర స్పటిక లింగమే కదా!  ఈ రుద్ర  స్పటిక శివలింగమును సాధనా విగ్రహ మూర్తికి కుడివైపున ఉన్న పద్మములో పెడితే సహస్ర చక్ర జాగృతి, శుద్ధి ఆధీనం, ,విభేదనానికి…. ఏ క్షేత్రానికి వెళ్ళాలో మనకి ఆధారం చూపిస్తుంది కదా!  అనేసరికి ఈసారి రుద్ర స్వామి కాస్త రుద్ర స్ఫటిక శివలింగమును తీసుకొని… సాధన విగ్రహ మూర్తి కుడి వైపు ఉన్న పద్మంలో పెట్టి పెట్టగానే… ఈ రుద్ర గ్రంధికి వ్యతిరేక దిశలో ఉన్న శివలింగం ఉత్తేజితం అయ్యి….దాని నుంచి ఒక ఆధారం బయటకు రావడం జరిగింది.  దీనిని మహాదేవి తీసుకొని చదవటం ఆరంభించింది. మహాదేవి కాస్త రాగి రేకు తీసుకొని దానిలో వచ్చిన ఆధారాలు చదవడం ఆరంభించింది. 


నా తలను మాత్రమే పూజిస్తారు…

 నా ఆవాసం మూడు కొండలతో ఉంటుంది…

 ఒక కొండమీద మూడు తలల ఆసామీ ఉంటాడు…

 ఆసామీ తల్లితండ్రులు మరొక కొండ మీద ఉంటే…

 నేను తలతో ఒక కొండమీద ఉంటాను..

 నా ముక్కు చూస్తే పావు కోళ్ళు మాదిరిగా ఉంటుంది …


అని ఆధారం చదివేసరికి… శివ నందినికి మిగతా వాళ్ళకి ఒక పట్టానా అర్థం కాలేదు. అసలు మూడు తలల ఆసామీ ఎవరు అని అనుకుంటూ ఉండేసరికి… బాలగణపతి కాస్త ఇంకెవరై ఉంటారు.. దత్తాత్రేయ స్వామి!  ఆయనకి మూడు తలలు ఉంటాయి కదా అనుకునేసరికి… దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులు ఎవరున్నారు అనుకుంటే… ఆత్రి మహర్షి, అనసూయ మాత ఉన్నారు కదా!  అనుకునేసరికి…. ఈ అమ్మవారికి ఒకవైపు దత్తాత్రేయడు, మరొకవైపు ఆత్రీ మహర్షి అనసూయ ఆవాసం ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి… తలని మాత్రమే పూజించే దేవాలయం ఏమై ఉంటుంది అంటే శివ నందిని కాస్త ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభిస్తే అది మహారాష్ట్రలోని మెహూర్ ప్రాంతంలోని ఏకవీర ప్రాంతం అని చెప్పి ఏకవీర మాత శక్తిపీఠం అని చెప్పేసి తెలిసేసరికి… దానికి స్థలపురాణం సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండేసరికి… ఆవిడ తల మాత్రమే ఉంటుందని…. ఆవాసం మూడు కొండలతో ఉంటుందనీ , దత్తాత్రేయుడు ఒక కొండ పైన, అత్రి అనసూయలు ఒక కొండపైన ఉంటారని… చెప్పేసి ఈవిడ ముక్కును చూస్తే పావుకోళ్ల మాదిరిగా ఉండటం గమనించి… ఇప్పుడు తన సహస్ర చక్ర శుద్ధి కోసం ఏకవీర క్షేత్రానికి వెళ్లాలి అని చెప్పేసి… నిర్ధారణ అయింది అని శివ నందిని అనుకునేసరికి బాలగణపతి కాస్త అమ్మ!  ఈ ఏకవీర క్షేత్రంలోని ఈ సహస్ర చక్ర జాగృతి అవుతుందని ఎలా అనుకుంటున్నావు అని అనేసరికి….అప్పుడు రుద్రస్వామి కాస్త సహస్ర చక్రంలో మనకు సహజంగా నాలుగు భాగాలుగా ఉంటాయి.  ఒక భాగంలో విష్ణుమూర్తి నుంచి కృష్ణుడు వరకు ఉంటే, ఒక భాగంలో చినమస్తా దేవి ఆరాధన ఉంటుంది.  మరొక భాగంలో హనుమంతుడి నుంచి అనంత పద్మనాభుడి వరకు ఉంటే, మరొక భాగంలో హృదయ చక్రమునకు వెళ్ళటానికి దక్షిణామూర్తి అనుగ్రహం పొందవలసి ఉంటుంది.  ఈ విధంగా మనకి సహస్ర చక్రంలో నాలుగు భాగాలుగా ఉన్నప్పుడు…. ఈ ఏకవీర మాతని రేణుక మాత అంటారు.  ఈ రేణుక మాత ఎవరో కాదు పరశురాముని తల్లి.  పరశురాముడు తండ్రి కోరిక మీద తల్లి తల నరకడం జరిగింది. అలాగే మన సహస్ర చక్రంలో చిన్నమాస్తా దేవి కూడా తలనరుకుతుంది అని చెప్పేసి పరమహంస సాధన అనుభవాలు ప్రకారంగా తెలుస్తుంది.  అందుకోసమని చెప్పి ఇక్కడ తల నరకడం అనేది ఏకవీరా దేవి తల ఆరాధన బట్టి చూస్తూ ఉంటే… శివ నందినికి సహస్ర చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనం కోసం ఈ క్షేత్రంను నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి రుద్ర స్వామి వివరించేసరికి…. అందరూ కూడా ఇది సత్యమే అయి ఉంటుందని నిర్ధారణ అవటంతో…. ఇక అక్కడి నుంచి ఈ ఏకవీర క్షేత్రమునకు బయలుదేరటానికి కావలసిన ఏర్పాటు చేయడం జరిగింది.  అంటే కలకత్తా నుంచి మహారాష్ట్రకి రైలు టికెట్లు బుక్ చేసుకునే పనిలో శివ నందిని పడటం జరిగింది. ఆ తర్వాత సాధన కుటుంబం అంతా కూడా ఈ మేహౌర్ క్షేత్రానికి వెళ్లడానికి జరిగింది . అక్కడ పిల్లలు కాస్త ఈ క్షేత్రంలో ఉన్న స్థల పురాణ విశేషాలు వాటి గురించి చెప్పమని అడగడంతో…. శివ నందిని కాస్త వాటికి సంబంధించిన విశేషాలు అప్పటికే ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని ఉండటంతో వాటిని యధావిధిగా చెబుతూ ఉండటం జరిగింది. ఒకరోజు నదీ తీరంలో గంధర్వరాజు చిత్రరథుడు అప్సరసలతో జలక్రీడలు ఆడుతుండగా రేణుకాదేవి కాసేపు వారిని చూసింది. ఆ కారణంగా ఆమె మనస్సు క్షణకాలం చలించిందని, దాంతో తన తపోబలం వల్ల కుండను తయారుచేయగలిగే శక్తి ఆమెకు ఆ సమయంలో తగ్గిపోయిందని కొన్ని పురాణ కథనాలు చెబుతాయి. ఆమె ఆశ్రమానికి ఆలస్యంగా తిరిగి వచ్చింది.దివ్యదృష్టి కలిగిన జమదగ్ని మహర్షి జరిగిన విషయాన్ని తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన కుమారులను పిలిచి తల్లిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు తండ్రి ఆజ్ఞను పాటించడానికి నిరాకరించారు. చివరగా పరశురాముడు పిలువబడగా, తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించి తన గొడ్డలితో రేణుకాదేవి తలను నరికాడని పురాణగాథ.పరశురాముని విధేయతకు సంతోషించిన జమదగ్ని మహర్షి, అతనికి వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి తిరిగి జీవం పొందాలని, తన సోదరులు కూడా మునుపటి స్థితికి రావాలని కోరుకున్నాడు. తండ్రి వరప్రసాదంతో రేణుకాదేవి తిరిగి జీవం పొందిందని కథనం చెబుతుంది. ఈ తల పడిన చోటే ఏకవీర క్షేత్రం గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రధానంగా ఏకవీరా అమ్మవారిని ప్రధాన ఆలయం మనకి దర్శనం ఇస్తుంది.  ఈ ప్రదేశంలోనే పురాతన ఒక వృక్షం కూడా మనం చూడవచ్చు…ఆలయం బయటవైపున వినాయకుడి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పక్కన 150 మెట్లు కిందకు దిగితే పరశురాముల ఆలయం ఎక్కడ దర్శనం వస్తుంది. ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన తర్వాత మనకి దత్త శిఖరం కనిపిస్తుంది. ఈ దగ్గరే అనసూయ శిఖరం కూడా కనిపిస్తుంది. పురాణగాథ ప్రకారం, అత్రి మహర్షి, అనసూయాదేవి సంతానం కోసం గొప్ప తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారికి అనుగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక ప్రసిద్ధ కథా సంప్రదాయం ప్రకారం, త్రిమూర్తులు సన్యాసుల రూపంలో అత్రి ఆశ్రమానికి వచ్చి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించారు. ఆమె తన ధర్మానికి భంగం కలగకుండా, అతిథులకు సేవ చేయడానికి తన తపోశక్తిని ఉపయోగించి వారిని శిశువులుగా మార్చిందని కథ చెబుతుంది.అనసూయాదేవి మాతృప్రేమతో ఆ శిశువులను చూసుకుంది. అనంతరం త్రిమూర్తులు తమ నిజరూపాలను వెల్లడించి, ఆమె భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నారు. ఆమె వారి అంశాలతో కూడిన కుమారుడిని ప్రసాదించమని కోరింది. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య అంశాల సమ్మేళనంగా దత్తాత్రేయుడు అవతరించాడని పురాణ కథనంగా చెప్పడం జరుగుతుంది. వీటిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో అమ్మవారిని రేణుకాదేవి స్వరూపంగా భావిస్తారు. ప్రధాన ఆలయంతో పాటు జోగేశ్వరి దేవి సన్నిధి, అమ్మవారి పాదుకలుగా భక్తులు భావించే పాచ్పైరీ పాదుకా ఆలయం, కొండ అడుగున ఉన్న ఏకవీరా దేవి పాయిఠా మందిరం, బాబాజీ మహారాజ్ సమాధి సన్నిధి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. . ఈ ఆలయ సముదాయంలో మూడు గర్భాలయాలు వరుసగా ఉండటం ఒక ప్రత్యేక నిర్మాణ విశేషంగా చెప్పబడుతుంది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సమీపంలోని ప్రాచీన కార్లా బౌద్ధ గుహలు, మహా చైత్యగృహం ఇక్కడ మనం చూడవలసిన ప్రదేశాలుగా చెప్పడం జరిగింది.  ఈ గుహలు ప్రాచీన భారతీయ బౌద్ధ సంప్రదాయం, శిల్పకళ, రాతి నిర్మాణ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి. అదనంగా, సమీపంలోని భాజా గుహలు, లోహగఢ్ కోట, లోణావళా, ఖండాలా, పావనా సరస్సు వంటి ప్రదేశాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చును. కార్లా ఫాటా ప్రాంతంలోని దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఏకవీరా అమ్మవారిని ముఖ్యంగా కోళీ, ఆగ్రి సమాజాలవారు కులదేవతగా ఆరాధిస్తారు. నవరాత్రులు, చైత్ర మాసపు యాత్రల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి పూజలు, కుంకుమార్చనలు, పుష్ప సమర్పణలు చేయడం జరుగుతుంది అని స్థల పురాణ విశేషంగా చెప్పడం జరిగింది అని చెప్పి శివ నందిని అందరికీ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత సాధన కుటుంబం అంతా ఏకవీరా క్షేత్రంనకు కూడా చేరుకోవడం జరిగింది.

శుభం భూయాత్ 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి