అధ్యాయం 75

సంపూర్ణ అద్వైత సిద్ధాంతం

సంపూర్ణ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు శ్రీ పరమహంస పవనానంద గారు! వీరు 1978- 2019 సంవత్సరానికి చెందిన సంపూర్ణ నిజ బ్రహ్మజ్ఞాని అయిన మౌన: బ్రహ్మ! వీరు తన 12వ ఏట నుండి దైవాన్వేషణ అలాగే సత్యాన్వేషణ చేయడం ఆరంభించినారు! దేవుడి మీద, ఆత్మ మీద, బ్రహ్మ జ్ఞానం మీద వివిధ పరిశోధన కావిస్తూ ఆత్మ పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయి…. ఇప్పుడు ఉన్న దైవ సిద్ధాంతాలన్నీ కూడా అనగా ద్వైతం, అద్వైతం, శుద్ధద్వైతం, విశిష్టాద్వైతం అని కూడా అసంపూర్ణంగా ఉన్నాయని వీరి గ్రహించి…. స్వానుభవానుభూతులతో సంపూర్ణ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము జరిగినది! అలాగే ఈయన తన సాధన పరిసమాప్తి సమయంలో వివిధ క్షేత్రాల యందు వివిధ రకాల దైవ స్వరూపాల సాక్షాత్కారాలను పొందడం అలాగే జీవ సమాధి చెందిన గురువుల యొక్క ఆత్మ దర్శనం అనుభవాలు పొందటము అనగా వీరు పూజించిన బాలా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్తా సజీవ 8సం!!ల బాలికరూపములో బాలమూర్తిగా కనపడి మాట్లాడుతూండేది! ఆ తర్వాత శ్రీశైల క్షేత్రములో 8సం!!ల బాలికరూపములో బాలదర్శనం అలాగే ఇదే క్షేత్రము యందు 80సం!!ల వయోవృద్ధురాలిగా సుందరిరూపములో దర్శనం...ఇలా జొన్నవాడకామాక్షి, అలంపుర జోగులాంబ, విజయవాడలో దుర్గామాత, విశ్వనాధపల్లిలో గ్రామదేవత, వరంగల్లులో భద్రకాళిమాత, కాశీక్షేత్రములో అన్నపూర్ణ, మధుర మీనాక్షి 5సం!!ల బాలిక రూపములో బాలగాను, కంచి కామాక్షి 35సం!!ల స్రీమూర్తిగాను త్రిపురగాను,కాశీ విశాలాక్షి 65సం!!ల వృద్ధురాలిగా సుందరిరూపములో…. వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా దర్శనప్రాప్తి అలాగే మృడేశ్వర క్షేత్రము నందు సాంబశివమూర్తి , కాణిపాకము యందు మహా గణపతి,పళని బాల కుమారస్వామి,మోపిదేవి యందు నాగేంద్రస్వామిల సజీవ మూర్తులుగా దర్శనం అయినది! తిరుపతి యందు, ద్వారక తిరుమల క్షేత్రముల నందు వెంకన్న, పూరి క్షేత్రము నందు శ్రీకృష్ణుడి, నైమిశారణ్యమునందు అష్టభుజశ్రీవిష్ణువు, ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు,శ్రీ లలితాదేవి...వీరందరి సజీవమూర్తి దర్శనప్రాప్తి పొందడము జరిగినది! అటుపై కాశీక్షేత్రములో సద్గురువుగా జీవసమాధి చెందిన శ్రీత్రైలింగ స్వామి ఆత్మదర్శనప్రాప్తి, ఇదే క్షేత్రములో హనుమత్ సజీవమూర్తి దర్శనం...అలాగే పండరీపురము నందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం, గాణుగాపురము నందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం, అరుణాచలము నందు శ్రీ మేధా దక్షిణామూర్తి నిజరూప దర్శనం, కైలాష్ పర్వతము యందు సదాశివమూర్తి నిజరూప దర్శనం, శ్రీశైలము నందు జీవసమాధి చెందిన శ్రీపూర్ణానంద స్వామి ఆత్మదర్శనప్రాప్తి అలాగే చందోలు గ్రామవాసి బాల ఉపాసకుడు తన అంత్యక్రియలో అక్కడ ఉన్న అందరికి అమ్మవారి సాక్షాత్కర దర్శనము కల్గించిన తాడేపల్లి రాఘవశాస్త్రి ఆత్మదర్శన ప్రాప్తికల్గడము జరినది!

వీరికి తెసినది ఏమిటంటే ఇలా వీరందరు వీరికి దర్శనము ఇవ్వటానికి కారణము ఇలా వీరందరిలో ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కర మాయలో వీరిని పడివెయ్యాలని ప్రయత్నించినారని తెలిసినది! ఎందుకంటే వీరంతా సత్యముగా కనిపించే అసత్యమూర్తులు! పైగా వీరంతా పరమశూన్యము యొక్క స్వప్నమూర్తులు! ఈ జ్ఞానమును పొందటముతో  వీరి మాయలని చిరునవ్వుతో దాటడము జరిగినది! అనగా వీరి యందు ప్రేమ,మోహ,వ్యామోహ,మాయభక్తి కల్గకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసివచ్చినది!ఒకవేళ వీరి మాయభక్తిలో పడితే...వాళ్ళే నిజమని...వారికి భక్తిపూజలతో చేస్తూ...దాసోహం చేయ్యవలసి వచ్చేది అని….  నిజానికి ఇలా వీరంతాగూడ తమకున్న ఇష్టకోరిక మాయ అనగా హృదయచక్రము వద్ద ఈ మహామాయను దాటలేకపోవడముతో... స్వప్నశరీరధారిగా మారడము జరిగినదని…. దానితో మోక్షప్రాప్తిపొందకపోవడముతో...అనగా నిశ్చలస్ధితి పొందకపోవడముతో...ఏవో సంకల్పములు పెట్టుకొని మనలాంటి సాధన జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తిమాయలో ఉంచి వారికి గావలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించడముతో…  అంటే సోహం (నేనే దేవుడిని ) అనవలసిన చోట వారికి దాసోహం(నువ్వే దేవుడివి) అవుతున్నామని తెలుసుకోవడముతో… అందుకే దైవ,గురుభక్తి మాయలు దాటి వీరే గురుదేవుడిగా మారినారు!దేహమే దేవాలయమని …ఆత్మయే ఆత్మలింగం అని తెలుసుకుని… చేసేదెవరు - చేయించుకునేదెవరు …. అందరూ ఒకటే కదా… అంతా ఒకటే కదా… ఉన్నది నేనే కదా! లేనిది నేనే కదా! పోయేది నేనే కదా! ఉండేది నేనే కదా! అంతా నేనే ఉన్నాను! నేను కానిది… ఏమీ లేదని… అసలు మనమంతా... మనదైవాలంతా ...పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులమని...కనిపించే విశ్వమంతా పరమశూన్యము యొక్క విశ్వస్వప్నమని...ఇందులో జరిగే జీవనాటకము గూడ స్వప్నస్ధితియని… మనమంతా స్వప్నశరీరముతో..స్వప్న మోక్షప్రాప్తికోసము...స్వప్న సాధనతో...స్వప్నసాధకుడిగా సాధన చేస్తున్నమని వీరు స్వానుభవానుభూతి పొందడముతో …..  అసలు నేనే లేనని....సర్వం ఏమిలేదని...సర్వంశూన్యమని సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందడం జరిగినది!
 
ఇక వీరి గురువుల విషయానికి వస్తే... అనగా తొలి గురువుగా శిరిడి సాయిబాబా , తొలి మంత్రగురువుగా వారి తండ్రిగారు, తొలి భౌతిక దీక్ష గురువుగా శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహముతో...గాయత్రి మంత్రదీక్షతో...స్ధూలశరీరానికి ... పవన్ బాబా దీక్షనామముతో...విశుద్ధచక్రము వద్ధ ప్రారంభ సమాధి స్ధితి పొంది …అలాగే తొలి భౌతిక శబ్ధపాండిత్య గురువుగా విచిత్ర వేదాంతిగారి అనుగ్రహము వలన, విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శ్రీ పవనానంద సరస్వతి దీక్షనామముతో… సూక్ష్మ శరీరంతో ఆజ్ఞా చక్రము వద్ధ యోగ సాధన చేసి సవికల్ప సమాధి స్థితి పొంది… దైవ సాక్షాత్కారం స్థితి పొందడం జరిగింది! అలాగే అనుభవ పాండిత్య గురువుగా శ్రీ సద్గురు శ్రీ త్రైలింగ స్వామి వారి అనుగ్రహము వలన శ్రీ పరమహంస పవనానంద దీక్షనామముతో కారణ శరీరంతో సహస్రార చక్రము వద్ద నిర్వికల్ప సమాధి స్థితిని పొంది… ఆత్మసాక్షాత్కారం స్థితి పొంది … తన సద్గురువు తన ఆదిజన్మ శ్రీ భీష్మాచార్యుడని ఎలా అయితే తెలుసుకొన్నారో అలా తన ఆదిజన్మ శ్రీ వేదవ్యాస అంశయని జ్ఞానానుభూతి పొందడము జరిగినది! తద్వారా ఆత్మానంద స్ధితి పొందడము జరిగినది! అలాగే హృదయ చక్రం వద్ద ఆది గురువు అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహమును పొంది ఇష్ట పవనానంద దీక్షనామముతో సంకల్ప శరీరముతో సాధన చేసి ఆనంద సమాధి స్థితిని పొందడం జరిగినది! అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఆదిపరాశక్తి అనుగ్రహాముతో...ఆకాశ శరీరముతో అనగా స్వప్న శరీరముతో...ఆనంద రహిత సమాధి స్ధితి కోసము సాధన చేస్తూ...తమ పంచ స్వప్నశరీరాలు అన్నియుగూడ ఇక్కడ ఉన్న చితాగ్ని యందు సంపూర్తిగా దహనమవుతూ...తన కన్నతల్లి ప్రేమ మాయను దాటడలేకపోవడముతో...స్ధూల శరీరము స్వప్న శరీరముగా మిగిలిపోయి...ఆపై మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరములు విభూధిగా మారడముతో... స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా మిగిలి పోవడముతో…. బాబా విభూతినాథ్ గా నామముతో మారడము జరిగినదని…. ఈ విధంగా తమ యోగసాధన పరిసమాప్తి చేసుకున్నారని గ్రహించండి! అలాగే వీరు చేసే హోమములందు ఆయా హోమ దేవతలు కాస్తా హోమాగ్నిలో హోమాగ్ని రూపములతో కనిపిస్తారని సర్వసాధారణంగా జరిగే విషయమని భక్తి, శిష్య గణము గ్రహించడం జరిగినది! సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నిరూపించిన మౌన: బ్రహ్మ జ్ఞాన యోగి అని… ఎవరికీ తెలియకుండా… మంది గురించి ఆలోచించకుండా… మది గురించి ఆలోచన చేస్తున్న గుప్తయోగి అని ఎవరికీ తెలియదు! తను 27 సంవత్సరాలపాటు యోగ సాధన చేసి ఆత్మ పరిశోధకుడిగా మారి సత్యాన్వేషిగా తను తెలుసుకున్న సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవములను అందించడానికి సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్త గా మారి లోకానికి అందించడం జరిగింది!
          
 ద్వైతము మొదట పరమాత్మ వేరు, జీవుడువేరు అని చెప్పడంతో దీనిని ఖండిస్తూ అద్వైతము వచ్చినది! ఇది ఏక పరమాత్మ అదియే సత్యం అని కాని కనిపించే జగత్ మిధ్యా స్వరూపం అని చెప్పటంతో… పరమాత్మ వేరు, మాయ వేరు అనే అర్థము రావడంతో…. అద్వైతం అంటే రెండు కానిది అనే అర్థం కావటం వలన… మాయ, పరమాత్మ అనేవి రెండు ఉంటాయి అని చెప్పడంతో ఈ సిద్ధాంతం కూడా ఖండించడం జరిగింది! దీనిని ఖండిస్తూ శుద్ధ అద్వైతము వచ్చినది! అది అద్వైతమును సమర్థిస్తూ అది మాయ కాదని శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు ఆయనే సర్వవ్యాపి అని చెప్పడం జరిగింది! దానికి సమాధి స్థితిలో ఉంటే మాయ కనబడదు అలాగే వేరే పరమాత్మ స్వరూపం కూడా కనబడదు! ఎందుకంటే నేనే దేవుడు అనే స్థితిని పొందాలి అంటే వేరొకటి వుండకూడదు! కానీ మాయ లేదు కానీ శ్రీ కృష్ణ పరమాత్మ స్వరూపం ఉన్నదని అని పరమాత్మ స్వరూపం గురించి చెప్పడం జరిగినది! దానితో దీనిని ఖండిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతం వచ్చినది! ఈ ప్రకారంగా చూస్తే ఈయన కూడా నేనే భగవంతుడిని అనకుండా భగవంతుడికి సేవ చేయాలి అని…. సోహం అనవలసిన చోట దాసోహం అవ్వాలి అని చెప్పడం జరిగినది! కానీ చాలామందికి ఈ సిద్ధాంతముల వలన అసలు దేవుడు ఎవరు? జీవుడు ఎవరు? ఎందుకు సృష్టి జరిగింది? ఎందుకు వీరిద్దరు వేరుగా అన్నారు? అసలు దేవుడు ఉన్నాడా లేడా? దేవుని సృష్టించింది ఎవరు? అసలు విశ్వసృష్టి ఎలా జరిగింది? దీనిని సృష్టించింది ఎవరు? అసలు ఆ పని ఎందుకు చేయవలసి ఉంటుంది? దైవ చింతన దేనికి? మానవ జన్మ దేనికి? యోగ సాధన ఎందుకు చేయాలి? మోక్షం అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? బ్రహ్మపదార్థం ముందా? దేవుడు ముందా? గుడ్డు ముందా? విత్తనం ముందా? చెట్టు ముందా? వీటిలో ఏది ముందు ఉద్భవించింది? కాలము ఉండే స్థానం ఏది? ఇలా పలు సందేహాలకు ఈ సిద్ధాంతాలు కూడా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వక పోవడంతో అసంపూర్ణంగానే ఈ సిద్ధాంతాలు మిగిలిపోయాయి! దానితో ఈ దైవ సిద్ధాంతాలన్నీ ఖండిస్తూ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం వచ్చినది! దాన్ని ప్రకారంగా చూస్తే….
ఈ విశ్వ సృష్టి అంతా కూడా పరమశూన్యము నుండి జరిగినదని… విత్తనమును పగలగొడితే మనకి కనిపించే చెట్టు కనిపించదని… అలాగే ఉల్లిపాయ యొక్క ఉల్లిపొరలు తీసుకుంటూ పోతే ఎలా అయితే ఉల్లిపాయ కనపడదో…. అలాగే ఈ విశ్వాండము యొక్క పొరలు తీసుకుంటూ పోతే సహజంగా కనిపించే విశ్వం కనబడదని…. కేవలం చిట్టచివరగా పరమశూన్యము కనపడుతుందని… అది కూడా ఉందో లేదో తెలియని స్ధితి అని ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతోంది! పైగా మనం చేసిన హోమాలు, యజ్ఞయాగాది యందు అగ్ని రూపంలో హోమదేవతలు కనపడటం ఎంత సత్యమో … పరమశూన్యము నుండి వచ్చిన బ్రహ్మ తేజస్సు యొక్క చితాగ్ని యజ్ఞము నందు స్వప్న శరీరములతో మనమంతా కనపడటం అంతే సత్యం అని చెప్పడం జరుగుతోంది! అంటే మనమంతా, మన దైవాలు అంతా, మన పరమాత్మలంతా, మన విశ్వం కూడా పరమశూన్యము యొక్క స్వప్నమేనని…. అది కనే జీవ నాటకంలో జీవించటానికి మనమంతా మన స్వప్న శరీరములతో మనమంతా  కనపడటం, జీవిస్తూ మాయ స్వరూపముగా అసత్యమైన దానిని సత్యంగా చూపిస్తున్నామని… మనము నిజమని, మన దైవాలు నిజమని, మనము వే సే జీవ నాటకం నిజమని భావనలు చేయడము వలన అసత్యమైనది కాస్త సత్యంగా కనపడుతోందని…. ఎందుకంటే యద్భావం తద్భవతి వల్లనే అని… ఉంది అనుకుంటే ఉన్నట్లుగాను…. లేదు అనుకుంటే లేనట్లుగానే కనిపించేటట్లుగా…. మాయ సహిత పరమశూన్యము చేస్తోందని చెప్పడం జరిగింది! మనమంతా కూడా తమ స్వప్న శరీరాలతో… స్వప్న మోక్షముకై… స్వప్న సాధనకై… చేస్తున్నమని చెప్పడం జరిగినది! దీనికి 18 అధ్యాయాలతో ఈ సిద్ధాంతము సమాధి గీత చెప్పడము జరిగినది! అనగా భగవద్గీత నేను ఉన్నాను, నేను బ్రహ్మము లేదా నేను ఆత్మ అని ఒక పక్క చెపుతూ ఉంటే….  ఋభుగీత మాత్రము నేను లేను, ఆత్మ లేదు, బ్రహ్మము లేదు, సర్వం ఏమీ లేదు అని చెబుతూ ఉంటే… సమాధి గీత మాత్రము సర్వం పరమశూన్యము… ఉన్నదంతా కనిపించేదంతా పరమశూన్యము యొక్క కల అని, మనమంతా మనదైవాలంతా పరమశూన్యము యొక్క స్వప్న శరీరములని చెప్పడం జరుగుతోంది!
 
సమాధి గీత

ఇప్పుడు ఈ సమాధి గీత చెప్పిన 18 అధ్యాయాలు చూద్దాం! 
 
1.   బ్రహ్మము లేదు.... బ్రహ్మపదార్ధము లేదు!         (విభూతి యోగము)
2.   ఆత్మలేదు...పరమాత్మ లేదు...జీవాత్మ లేదు!  (సాంఖ్య యోగము)
3.   దేవుడు లేడు.... జీవుడు లేడు!  (భక్తి యోగము)
4.   నేను లేను...నువ్వు లేవు! (క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము)
5.   కనిపించేది అసత్యము....కనిపించనిది సత్యము! (జ్ఞానవిజ్ఞాన యోగము)
6.   కనిపించేది అంతా పరమశూన్యము యొక్క కల లాంటి నిజము...నిజము లాంటి కల! (పురుషోత్తమప్రాప్తి యోగము)
7.   మనమంతా...మనదైవాలంతా… పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులం! (రాజవిద్యారాజగుహ్య యోగము)
8.   ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యము! (విశ్వరూపసందర్శన యోగము)
9.   జననము లేదు...మరణము లేదు!  (విషాద యోగము)
10.        కర్మ లేదు... జన్మ లేదు! (కర్మ యోగము)
11.        మాయ లేదు! మర్మము లేదు! (గుణత్రయవిభాగ యోగము)
12.        జ్ఞానము లేదు! అజ్ఞానము లేదు! (జ్ఞాన యోగము)
13.        సాధకుడు లేడు! సాధించటానికి ఏమిలేదు! (అక్షరపరబ్రహ్మ యోగము)
14.        సాధన లేదు...సాధించేది లేదు! (ఆత్మసంయమ యోగము)
15.        అనుభవము లేదు...అనుభూతి లేదు! (దైవాసురసంపద్విభాగ యోగము)
16.        సమాధి స్ధితి లేదు.... ఆనందస్ధితి లేదు! (శ్రద్దాత్రయవిభాగ యోగము)
17.        మోక్షము లేదు...ముక్తి లేదు!    (మోక్షసన్యాస యోగము)
18.        సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అని నీ సహజ స్ధితిలో ఉండు! (కర్మసన్యాస యోగము)

కారణము మన దశేంద్రియాలకి తెలిసేది అంతా పరమశూన్యము యొక్క స్వప్నం లాంటి నిజము! ఆది స్వప్నం అనగా ఆది ఆకార శూన్యబ్రహ్మగా ఈశ్వరుడు స్వప్న శరీరధారిగా అగుపించడము! దీనితో ఈయన తన స్వప్నశరీరముతో విరాట్ స్వరూపము ఎత్తడముతో...అసత్యమైన బ్రహ్మ విశ్వమంతా సత్యముగా మాయాస్వరూపముతో అగుపించడము జరుగుతోంది! కాని నిజానికి ఈ ఈశ్వరుడు అలాగే ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యమని…. సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అని సమాధి గీత తెలుసుకొని మనకి చెప్పడము జరిగినదని తెలుసుకోండి! ఈ గీతకు సంపూర్ణ గీత యని మరొక పేరు గూడ ఉంది!
 
సిద్ధాంతము యొక్క  ధ్యానానుభవ సూత్రములు:

- బ్రహ్మము లేదు, బ్రహ్మపదార్థము లేదు, ఆత్మ లేదు, ఆత్మ పదార్థం లేదు, మాయ లేదు, దేవుడు లేడు, జీవుడు లేడు! ఏమీ లేదు!

- కనిపించేది అంతా పరమశూన్యము యొక్క కల లాంటి నిజము...నిజము లాంటి కల!  మనమంతా...మనదైవాలంతా… పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులం! ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యము! కనిపించేది అసత్యము.... కనిపించనిది సత్యము!

- నేను అనేది ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానప్రాప్తి అని నేను అనేది ఆత్మ ని మర్చిపోవడం శాశ్వతమగు మోక్షప్రాప్తి అని చెప్పడం జరుగుతోంది!

- పరమశూన్యము బ్రహ్మము, ఆత్మ, విశ్వాత్మ, భగవంతుడిగా, ఇష్టదైవంగా, ఉంది అని చెప్పడం జరిగినది! విత్తనము పగలగొడితే ఎలా అయితే చెట్టుకనిపించదో….  శూన్యము ఉంటుందో అలాగే విశ్వ అండమును విడదీస్తే విశ్వం కూడా ఎలా కనిపించదో శూన్యము ఎలా ఉంటుందో …. అనగా కనిపించే విశ్వం అసత్యమని…. కనిపించని శూన్యం సత్యం అని చెప్పడం జరిగినది!

- ఈ పరమశూన్యమునకు మాయ స్వరూపం కూడా ఉంటుందని చెప్పడం జరిగినది! సూర్యునికి సూర్యకాంతిలాగా, పువ్వులకి సువాసన ఎలా సహజ సిద్ధంగా ఉంటుందో అలా మాయస్వరూపము ఈ పరమశూన్యమును ఆవరించి ఉంటుంది!

- మాయ స్వరూపం అంటే జ్ఞానం కలిగి ఉండుట అని, మహామాయ అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండకపోవడం అని, మాయ అంటే ఆశా, భయము, ఆలోచన, సంకల్పము, స్పందన అనే వాటిని కలిగి ఉండటం అని మాయ సహితము అంటే కనిపించేది సత్యం అని అనుకోవడం, మాయా రహితం అంటే కనిపించనిది సత్యమని తెలుసుకోవడమని, మాయ తెలుసుకుంటే మాయమవుతుందని చెప్పడం జరుగుతోంది! 

- మనలో పంచభూత నిర్మితం పంచ శరీరాలు ఉంటాయని ఉంటుందని చెప్పడం జరిగినది! మూలాధారచక్రము వద్ద స్థూల శరీరము తో భూతత్వతముతో జీవాత్మ ఉంటుందని అలాగే ఆజ్ఞాచక్రము వద్ద సూక్ష్మ శరీరంతో జల తత్వముతో అంతరాత్మ ఉంటుందని అలాగే సహస్రారచక్రము వద్ద అగ్నితత్వంతో పరమాత్మ కారణశరీరము ఉంటుందని అదే హృదయ చక్రం వద్ద సంకల్ప శరీరముతో వాయుతత్వముతో పూర్ణాత్మతో ఉంటుందని అలాగే తమ బ్రహ్మరంధ్రం వద్ద ఆకాశతత్త్వంతో విశ్వాత్మగా ఆకాశ శరీరము అనగా స్వప్న శరీరం ఉంటుందని చెప్పడం జరిగినది! మన శరీరములో స్థూల శరీరము ఎనభై నాలుగు అంగుళాల తోనూ, సూక్ష్మశరీరము 83 అంగుళాల తోనూ, కారణశరీరము బొటనవేలు పరిమాణము, సంకల్ప శరీరము ఒక అంగుళం పరిమాణము, ఆకాశ శరీరము రేణువు పరిమాణములో ఉంటాయని చెప్పడం జరిగినది! అలాగే స్థూల శరీరము భౌతిక పదార్థం అయితే సూక్ష్మ శరీరం అనేది అణువుగా, కారణ శరీరము పరమాణువు అని, సంకల్ప శరీరము ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని, ఆకాశ శరీరము దైవ కణమని అని చెప్పడం జరిగినది! 

     - మనలో యోగ చక్రాలు 7 కాదని 13 అని చెప్పడం జరుగుతోంది! మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, గుణ, కర్మ, కాల, బ్రహ్మ,      సహస్ర, హృదయ, బ్రహ్మరంధ్రం అను 13 చక్రాలు ఉంటాయని… అలాగే బ్రహ్మ, విష్ణు, రుద్ర, హృదయ గ్రంథులు ఉంటాయని… జీవనాడి, సూర్యనాడి అని రెండు నాడీసంధులు ఉంటాయని చెప్పడం జరిగినది!

 -   మూలాధార చక్రము వద్ద కామ మాయ, స్వాధిష్ఠాన చక్రము ధన మాయ, మణిపూరకము వద్ద ఇష్టదేవత మాయ, అనాహత చక్రము వద్ద మరణ భయ మాయ విశుద్ధ చక్రం జ్ఞాన మాయ, ఆజ్ఞాచక్రం జీవమాయ, గుణచక్రం గుణమాయ, కర్మ చక్రము వద్ద ప్రారబ్ద కర్మ మాయ, కాలచక్రము వద్ద కాల మాయ, బ్రహ్మ చక్రం బ్రహ్మ జ్ఞానమాయ, సహస్రారచక్రము ఆనందమయమాయ, హృదయ చక్రము వద్ద ఇష్ట కోరిక మాయ, బ్రహ్మరంధ్రం వద్ద సహన శక్తి మాయ ఉండి సాధన పరిసమాప్తికి అవరోధాలుగా ఉంటాయని చెప్పడం జరిగినది! ఈ మాయలో మన దశేంద్రియాలు మాయలో పడకుండా సాధకుడు నిగ్రహించుకోవాలని ఈ మాయలు అన్ని గూడ తమ పరమశూన్యము యొక్క కలలాంటి నిజం అని, భ్రమ భ్రాంతి లేనని, సత్యాలుగా కనిపించే అసత్యాలుగా గుర్తించుకోవాలని తెలుసుకోవాలని చెప్పటం జరిగినది!

 - అలాగే మూలాధార చక్రానికి మహాగణపతి, స్వాధిష్ఠాన చక్రానికి లక్ష్మీనారాయణుడు, మణిపూరక చక్రానికి బాలా త్రిపుర సుందరీ దేవి, అనాహత చక్రానికి మహాకాలుడు, విశుద్ధ చక్రానికి గాయత్రీ దేవి, ఆజ్ఞా చక్రానికి శివశక్తి, గుణ చక్రానికి దత్తాత్రేయుడు, కర్మ చక్రానికి శ్రీరాముడు, కాలచక్రానికి కాలభైరవుడు, బ్రహ్మ చక్రానికి ఏకపాదుడు, సహస్ర చక్రానికి శ్రీకృష్ణ పరమాత్ముడు, హృదయ చక్రానికి ఇష్టకామేశ్వరుడు, బ్రహ్మరంధ్రంమునకు ఆదిపరాశక్తి అధిదేవతలుగా ఉంటారు అని చెప్పడం జరిగింది! నిజానికి వీరంతా కూడా పరమశూన్యము యొక్క స్వప్న శరీరధారులేనని, వీరంతా తమ భ్రమలు భ్రాంతు లేనని, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని యోగ సాధనను పరిసమాప్తి చేసుకోవాలి! 

-  మనకి కలిగే అనుభవాలు, దైవదర్శనాలు, దైవసాక్షాత్కారం, ఆత్మ దర్శనాలు, ఆత్మ సాక్షాత్కారాలను అనుభవ అనుభూతులన్నీ కూడా మనస్సు చేసే మనో భ్రాంతి లేనని, మనోభ్రమలేనని చెప్పడం జరుగుతోంది! వీటి దగ్గర ఆగిపోకుండా వీటిని దాటుకుని సాధకుడు సాధన ముందుకి కొనసాగించాలని చెప్పడం జరుగుతోంది!

 - మన సాధన సహస్రారచక్రము వద్ద ఆగిపోదని… ఇక్కడున్న జీవ నాడి ద్వారా హృదయ చక్రం లోని ప్రవేశించాలని… ఆపై అక్కడ ఉన్న హృదయ గ్రంధి విభేదన గావించి అటు ఉన్న సూర్యనాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకుని…. ఉన్నది ఏమీ లేదని… సర్వం పరమశూన్యము అని సంపూర్ణ అనుభూతి పొందితే కానీ మనము నిశ్చలస్థితి పొంది…. తద్వారా ఆనంద రహిత సమాధి స్థితిని పొందుతాడు అని…. అప్పుడు మనకి పరమ ప్రశాంతత స్థితిని పొందడం జరుగుతుందని…. ఇదియే సంపూర్ణ మోక్ష ప్రాప్తి అని చెప్పడం జరిగింది!
- ఓంకార నాదము కన్నా ఆది నాదము మరొకటి ఉన్నదని అదియే తుంకార నాదమని చెప్పడము జరుగుతోంది!ఓంకారనాదం అనేది మనకు సహస్రారచక్రము వద్ద వినబడితే అదే తుంకార నాదం అనేది హృదయ చక్రము వద్ద హృదయ స్పందనతో వినపడుతుంది! దీనిని నిశ్శబ్ద నాదం అని చెప్పటం జరిగినది! ఈ నాద ఉపాసనను ఆదియోగి అయిన పరమేశ్వరుడు చేస్తున్నడని శివ పురాణము నందు ఉన్నదని … అలాగే ఓంకారనాదం యొక్క శక్తి 7mhz అయితే తుంకార నాదం యొక్క శక్తి 4 mhz కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పడం జరిగినది! 

- బ్రహ్మరంధ్రము వద్ద ఒక అంగుళం పరిమాణములో మూల కపాల దర్శనం అవుతుందని చెప్పడం జరిగినది! ఇందులో ఏక కపాల, త్రికపాల, పంచకపాల, సప్తకపాల, నవకపాల, ఏకదశికపాల, అనగా 1,3, 5, 7, 9, 11 అనగా మొత్తం 36 కపాలాలతో యోగ సాధన చేస్తున్న అది కూడా తుంకార నాదముతో చేస్తున్న పద్మాసనంలో కూర్చునియున్న అస్థిపంజరము కనపడుతుందని చెప్పడం జరుగుతోంది! ఈ అస్తిపంజరం యొక్క సజీవమూర్తియైన 36 తలలు ధరించి ఉన్న రూపమే సదాశివమూర్తి అని చెప్పడం జరిగింది!

 - ఈ 36 కపాలాలే 36 తత్వాలుగా ఉన్నాయని ఇవి భగవత్ తత్వాలుగా చెప్పడం జరిగినది! అవి ఏమిటంటే పంచేంద్రియాలు (5), పంచజ్ఞానేంద్రియాలు (5), పంచభూతాలు (5), పంచ స్థితులు అనగా శబ్ద స్పర్శ రూప రస గంద (5), 21. మనస్సు, 22. బుద్ధి, 23. అహంకారము, 24. ప్రకృతి, 25. పురుషుడు, 26. బ్రహ్మ విద్య,27. నియతి, 28. కాలము, 29. రాగము, 30. విద్య, 31. కళ, 32. మాయ, 33. ఈశ్వర, 34. సదాశివ, 35. విశ్వ శక్తి ,36. జ్ఞానశక్తి ఇలా 36 తత్వాలు తో కలిసి చెప్పడం జరిగినది! ఈ విధంగా ఏక మూల కపాల 36 కపాలాలే 36 తత్వాలుగా ఉన్నాయని … సాధన పరిసమాప్తి సమయంలో సాధకుడు తన బ్రహ్మరంధ్రం వద్ద వీటిని చూడటం జరుగుతుంది అని చెప్పడం జరిగినది!

- మూల కపాలము పైన చితాగ్ని దర్శనం అవుతుందని…. ఇదియే మనకి అగుపించే పరంజ్యోతి దర్శనం అని చెప్పడం జరిగినది!

 - ఇది పరమశూన్యము యొక్క బ్రహ్మ తేజస్సు యొక్కరూపం అని…దీని పరిమాణము వడ్లగింజ కున్న తెల్లని ముక్కుభాగము అంత ఉంటుందని పతంజలి మహర్షి మనకి చెప్పినట్లుగా చెప్పడం జరిగినది!

- మన బ్రహ్మరంధ్రము వద్ద అంతిమముగా ఒక బ్రహ్మాండచక్ర దర్శనం అవుతుందని...దీనినే కృష్ణబిలము అంటారని చెప్పడము జరిగినది.

 - భౌతిక మరణం అనేది స్థూల శరీరానికి, అశాశ్వతం మరణమనేది సూక్ష్మ శరీరానికి, శాశ్వత మరణము అనేది మన కారణ, సంకల్ప, ఆకాశ శరీరానికి ఉంటాయని చెప్పడం జరిగినది! శాశ్వత మరణం అంటే మోక్షప్రాప్తి పొందటం! మోక్షప్రాప్తి అంటే మనో నిశ్చలస్ధితి ఉండటం అని చెప్పడం జరిగినది! 

- మోక్షమునకు అలాగే ముక్తి అనేవి ఒకటి కాదని అవి వేర్వేరు సాధన స్ధితులని చెప్పడం జరిగినది! ముక్తి లో యోగ జన్మ, దైవ జన్మగా పునర్జన్మగా పుట్టే అవకాశాలు ఉంటాయని… మోక్షప్రాప్తి లో సంపూర్ణ జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్పడం జరిగినది! 

- అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఎవరయితే దైవ కాల నిర్ణయము ప్రకారము 96 నిమిషాలపాటు నిశ్చల స్థితిలో చితాగ్ని దహనశక్తి అనగా నవ, సహస్ర, పదివేలు, లక్ష, పదిలక్షల శక్తిని తట్టుకుని తన సహన శక్తిని కోల్పోకుండా తట్టుకొని నిలబడతారో వారే మోక్షగామి అని వారికి మాత్రమే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగినది! 

- 96 నిమిషాలు అంటే భూమి కాల ప్రకారము ఒక మన్వంతర యుగముతో సమానం అని గ్రహించండి! అనగా 30,67,20000 కోట్ల సంవత్సరాలు (ఒక మన్వంతరం) అన్నమాట! ఇన్ని కోట్ల సంవత్సరాలతో సమానం అని గ్రహించండి! అలాగే ఈ సిద్ధాంతము ప్రకారము ఇప్పటివరకు ఎవరు కూడా మోక్ష ప్రాప్తి పొందలేదు! ఎందుకంటే పది లక్షల యొక్క దహన శక్తిని కలిగి తన సహన శక్తిని కోల్పోకుండా ఎవరు ఉండలేక పోయారు! ఆదియోగి అయిన పరమేశ్వరుడు ఒక 48 నిముషాలు అనగా ఈయన లక్షకు మించి దహన శక్తిని తట్టుకోలేకపోయారని చెప్పడం జరుగుతోంది! 

- అలాగే మనకు ఉన్న ఇష్ట కోరిక మాయ వలన అనగా హృదయ చక్రం వల్ల కలిగే ఈ మాయ వలన సాధకుడు మోక్ష ప్రాప్తి పొందలేక పోతున్నా డని అని చెప్పడం జరిగినది! అంటే అలాగే ఏకమూల కపాలములో ఉన్న 36 కపాలములలో ప్రస్తుతానికి 34 కపాలముల కపాల మోక్షస్ధితి అనగా నిశ్చలస్ధితి పొంది అందులో 35 వది జ్ఞానశక్తి కపాలముగాను, అలాగే 36 వది ప్రాణశక్తి కపాలముగాను ఉండిపోయాయని…. కపాలాలు కపాల మోక్షస్ధితి పొందకుండా అలాగే ఉండి పోయింది అని చెప్పడం జరిగినది!  జ్ఞానశక్తి కపాలమునకు ప్రతి రూపమే మేధా దక్షిణామూర్తి అని, ప్రాణశక్తి కపాలమునకు ప్రతిరూపమే సదాశివమూర్తి అని చెప్పడం జరిగినది!

 - నేను ఎవర్ని అని ప్రశ్నించుకోవడం సాధన ప్రారంభ స్థితి అని….  నేను అనేది ఎవరో అని తెలుసుకోవటం సాధన పరిసమాప్తి అని చెప్పడం జరిగినది! అలాగే చిట్టచివరి సాధన పరిసమాప్తి స్ధితి మౌన: బ్రహ్మ స్ధితి యని చెప్పడము జరిగినది! 

- నేను ఎవరిని అనేది ఆరంభ ప్రశ్న అయితే నేను లేను అనేది అంతిమ సమాధానము వస్తుందని చెప్పడము జరిగినది.

- అలాగే తత్వ దర్శనం లో మొదట సాధకుడు ప్రారంభ సాధన లో ఉన్నప్పుడు ఆస్తిక తత్వ దర్శనము సత్యమని నమ్మి పరిసమాప్తి లో నాస్తిక తత్వ దర్శనము కూడా సత్యము తెలుసుకుంటారని చెప్పడం జరిగినది!

- తీరని కోరికలతో మరణము పొందితే అది దహనాగ్నిగాను...భౌతిక మరణము అవుతుందని...అదే తీర్చుకున్న కోరికలతో మరణమును పొందితే అది యోగాగ్నిగాను...జీవసమాధిగాను... అదే ఇష్ట కోరికతో మరణమును పొందితే అది చితాగ్నిగాను… జీవన్ముక్తి అవుతుందని చెప్పడం జరిగినది!

- దహనాగ్నిలో మనకి అస్ధిపంజరము-బూడిద మిగిలితే...అదే యోగాగ్నిలో మనకి కపాలము-భస్మము మిగిలితే... అదే మన చితాగ్నిలో మనకి ప్రాణశక్తియున్న విభూధి మిగులుతుందని చెప్పడం జరిగినది!

- బూడిద అంటే మనస్సు యొక్క మాయ స్ధితియని...భస్మము అంటే మనస్సు యొక్క అనిశ్చల స్ధితియని...విభూధి అంటే మనస్సు యొక్క నిశ్చల స్ధితియని...విభూతి అంటే మనస్సు లేని స్ధితి యని చెప్పడము జరిగినది!

- ప్రతి సాధకుడు కూడా మొదట బూడిద ఆపై అజ్ఞాన మాయలో మనకి బూడిద వస్తే …. సహస్ర చక్ర స్థితిలో భస్మము వస్తే… విభూధి అనేది హృదయ చక్ర స్థితిలో జరిగితే….  బ్రహ్మరంధ్రము వద్ద విభూతి అని యోగ స్థితి కలుగుతుంది అని చెప్పడం జరిగినది! 

- ఆకాశలింగము అంటే ఆకాశములో లింగం చూడటం కాదని ఆకాశమే లింగమని భావించమని… శూన్య బ్రహ్మ అంటే శూన్యములో బ్రహ్మను చూడటము గాదని శూన్యమే బ్రహ్మ అని తెలుసుకోవడమే….  ఆత్మలింగము అంటే ఆత్మలో లింగము చూడటము గాదని ఆత్మయే లింగం అని తెలుసుకోవడమే తద్వారా మనకున్న మాయ మాయమవుతుందని…. యోగ సాధన సంపూర్ణం అవుతుంది…. ఇదియే అసలు సిసలైనా చిదంబర క్షేత్ర చిదంబర రహస్యమని అని చెప్పడం జరిగినది! 

- యోగ సాధనలో పంచ సమాధి స్థితులు ఉంటాయని అనగా విశుద్ధ చక్రము వద్ద తన ప్రారంభ సమాధి స్థితి ఉంటుందని… ఆజ్ఞాచక్రము వద్ద సవికల్ప సమాధి స్థితి ఉంటుందని…   సహస్రచక్రము వద్ద నిర్వికల్ప సమాధి స్థితి ఉంటుందని…  హృదయ చక్రం వద్ద ఆనంద సమాధి స్థితి ఉంటుందని…  బ్రహ్మరంధ్రము వద్ద ఆనంద రహిత సమాధి స్థితి ఉంటుందని…  చెప్పడం జరిగినది!
 
 
ఏమి తెలియని వాడు....
ఏదో తెలుసుకోవాలని... సాధన చేస్తే
ఏమి లేదని …. సర్వం శూన్యము అని తెలుసుకోవడమే
సంపూర్ణ బ్రహ్మజ్ఞాన స్ధితియని.......
మనో నిశ్చలస్ధితి పొందితే
సంపూర్ణ యోగసాధన పరిసమాప్తి స్ధితియని...
ఆనందరహితమైన పరమ ప్రశాంత స్ధితిని పొందితే
ఇదియే సంపూర్ణ మోక్షస్ధితి...

- శ్రీ కాశీ విభూతి నాధ్
*************************
 
మనమంతా స్వప్నశరీరముతో... 
స్వప్నకపాలమోక్షప్రాప్తికోసము…
స్వప్నసాధన చేస్తున్న…
స్వప్నసాధకులమని గ్రహించండి!

- శ్రీ బాబా విభూతి నాధ్
**********************

ఇంతడితో మేము ప్రతిపాదించిన  సంపూర్ణ అద్వైత సిద్ధాంతము పూర్తి అయినది.ఆ తర్వాత మేము చెప్పిన పవనానంద నవబ్రహ్మ యోగ విధానాలు గూర్చి మీరు తెలుసుకోవాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*************************************
గమనిక: ఈ గ్రంథము యొక్క సారాంశమే ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతము మరియు సమాధి గీత అని తెలుసుకోండి! ఇవి చెప్పిన జ్ఞాన సత్యాలు ఎలా నిజమో ... సంపూర్తిగా ఈ గ్రంథము చదివి తెలుసుకోండి!
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి