అధ్యాయం 70

36 ఫ్రేమ్స్ కపాలముల రికార్డు దృశ్యం కథ

ఇదంతా కనిపించేదంతా పరమ శూన్యము యొక్క స్వప్నం అని మనకి తెలిసినది. శూన్యం అంటే ఏమీ లేనిది కదా. మరి ఏమీ లేని చోటఎవరు కలలు కంటున్నారు. ఎవరు చూస్తున్నారు స్వప్నం అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక చోట నిద్రావస్థలో ఉండి కల కనాలి కదా. మరి ఎవరు లేనప్పుడు ఏదీ లేనప్పుడు సర్వము లేనప్పుడు సర్వం శూన్యము అయినప్పుడు మన స్వప్న శరీరాల స్వప్న జీవ నాటకము అనే స్వప్నమును కల కనేది ఎవరు?చూసేది ఎవరు? అలాగే మన యోగ సాధన ఎందుకు పరిసమాప్తి కావటం లేదో తెలుసుకోవాలని ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యం ఉన్నదని అది ఏమిటో తెలుసుకోవాలని నాకు అనిపించింది. నిజానికి మన బ్రహ్మరంధ్రము వద్ద వెలుగులు చిమ్ముతూ  బ్రహ్మాండ చక్రము నిరంతరముగా తిరుగుతూ తనలోనికి రేణువులు లాంటి కాంతి శరీరాలను తీసుకుంటోందని మాకు స్వానుభవము అయినదని మీకు తెలుసు కదా. అంటే ఈ బ్రహ్మాండ చక్రము నిరంతరముగా తిరుగుతూ ఉండటం వలన దీనిలో ఉన్న అండ పిండ బ్రహ్మాండము లోని ప్రతిపదార్థము ప్రతి జీవి కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నిరంతరముగా మనము కనిపించే భూమి తిరుగుతూ ఉంటుందని అలాగే నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనకి తెలుసు కదా. ఇందులో ఇక్కడ తన చుట్టూ తాను తిరుగుతూ లేదా తన చుట్టూ తాను తిరుగుతూ వేరే దాని చుట్టూ తిరగటం చేస్తూ ఉంటాయని జగమెరిగిన సత్యమే కదా. ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఒకటి ఉంది. 

అది ఏమిటంటే మీరు ఎప్పుడైనా సినిమా రీల్ చూశారా? ప్రతి పనికి 24 ఫ్రేమ్స్ తీసుకుంటుంది. అంటే మీరు కొట్టే సీను సినిమాలో చూపించాలంటే 24 బొమ్మలు దృశ్యాలు ఉండాలి అన్నమాట. ఒకేసారి వేగంగా ఈ 24 ఫ్రేమ్స్ కదులుతూ ఉండేసరికి కొట్టేసినట్లు కనపడుతుంది. నిజానికి అక్కడ కొట్టేది ఉండదు. కానీ 24 బొమ్మలు కదలిక వలన నిజంగానే కొట్టుకుంటున్నారా అని అనిపిస్తుంది.ఇదే సిద్ధాంతమును మన బ్రహ్మాండ చక్రానికి పెట్టి చూస్తే అసలు విషయం ఏమిటో మీకు అర్థం అవుతుంది. ప్రతి పనికి సినిమాకి 24 ఫ్రేమ్స్ ఎలా ఉంటాయో ఈ చక్రానికి కూడా 36ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ 36 ఫ్రేమ్స్ 36 కపాలాలు అన్నమాట. ఈ విశ్వ సృష్టిలో ప్రతి దానికి ఈ 36 తత్వాలు లేదా 36 కపాలాలు తప్పనిసరిగా ఉంటాయి అని గ్రహించండి. విశ్వ సృష్టిలో జరిగే ప్రతి దానికి జరుగుతున్న ప్రతి దానికి జరగబోయే ప్రతి దానికి 36 ఫ్రేమ్స్ యొక్క చర్యలే ప్రధాన కారణమని గ్రహించండి. అంటే మనము చేసే ప్రతి పనికి ఈ 36 కపాలము యొక్క తత్వ దృశ్యాలు కదలడం వలన అవి జరుగుతున్నట్లుగా మనకి అనిపిస్తోందని తెలుసుకోండి. 

అనగా సినిమాలో 24 ఫ్రేమ్స్ ఎలా పనిచేస్తాయో అలా ఈ బ్రహ్మాండ చక్రములోని 36 బ్రహ్మకపాలాలు అలాగే పనిచేస్తాయి. ఈ 36 కపాలాలే 36 కోట్ల దృశ్యాలకి ప్రతీకలని గుర్తించండి. ఈ లెక్కన ప్రతి జీవికి తమ బ్రహ్మరంధ్రము నందు ఈ 36 కపాలాలు ఉండి వీటి దృశ్యాల అనుగుణంగా మన పంచ శరీరాల కదులుతున్నట్లుగా చేస్తున్నాయని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. ప్రతి జీవి తన 120 సంవత్సరాల జీవితకాలంలో 12 కోట్ల 372 లక్షల 20 వేల కర్మలు చేస్తాడని శాస్త్ర వచనము. అనగా 36 కోట్ల దృశ్యాలలో 12 కోట్ల దృశ్యాలే ఇతను చూస్తాడు అన్నమాట. ఇదేవిధంగా దేవతలు వెయ్యి సంవత్సరాలలో అదే పరమాత్మలు పదివేల సంవత్సరాలు తమకున్న కోటానుకోట్ల దృశ్యాలలో కొంతమేర చూసి మరణావస్థలో అనగా ప్రళయాలు ద్వారా విముక్తి చెంది పునఃజీవులుగా ఏర్పడతారు. ఎవరు కూడా సంపూర్తిగా ఈ 36 కపాల దృశ్యాలను చూడలేదు. అంటే ఈ లెక్కన నిరంతరముగా ఎవరి ప్రమేయం లేకుండా సహజసిద్ధంగా తనంతట తానే ఈ బ్రహ్మాండ చక్రం తిరుగుతూ 36 బ్రహ్మకపాలముల ఫ్రేమ్స్ వలన ఇందులో నిక్షిప్తమైన దృశ్యాల వలన ఈ జీవ నాటకం నడుస్తోందని అర్థమైంది కదా.

 ఈ బ్రహ్మాండ చక్రముకు సృష్టించడానికి ఏమీ లేదు. అసలు నువ్వు చేసేది లేదు. నాశనం చేసేది లేదు. ఇది కేవలం ఒక శక్తి మాత్రమే. అది కూడా కాంతిశక్తి మాత్రమే. వలయాకారంగా ఉన్న కాంతి వలయ శక్తి మాత్రమే. నిరంతరముగా సుడులు తిరుగుతూ ఉండే కృష్ణబిలం లాంటిది ఈ బ్రహ్మాండ చక్రం అన్నమాట. ఇది నిరంతరముగా తిరుగుతూ ఉండటం వలన ఇందులో ఉన్న 36 బ్రహ్మకపాలములు వివిధ రకాల దృశ్యాలను కలిగి ఉండుట వలన మనమంతా జీవించే ఉన్నామని అంతా మనమే ఏదో చేస్తున్నామని మనమే ఏదో పొందుతున్నామని మనకి ఇంకా ఏదో కావాలని మనకి మనమే ఏదో మాయ లో ఉన్నామని భ్రమ భ్రాంతులకి కారణం ఈ 36 కపాలములలోని దృశ్యాలే కారణమని తెలిసి ఉంటుంది కదా. అంటే మనము చేసే పనులు అనుభవాలు అనుభూతులు సాధన అన్నీ కూడా ఈ 36 బ్రహ్మకపాలముల ఫ్రేమ్స్ యందు నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించండి. అనగా ఈ విశ్వ సృష్టి లోని జీవ నాటకము అనే సినిమాలో మనము వేసే పాత్ర ఎలా ఉండాలో ఎలా ఉంటుందో అనేది ఈ 36 కపాల ఫ్రేమ్స్ ఆదిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రేమ్స్ లోని దృశ్యాలు ప్రతి మిల్లీ సెకనుకి మారుతూ ఉండుటవలన మనము ఏదో చేస్తున్నామని మనకి అనిపిస్తుంది. నిజానికి చెయ్యటానికి పొందటానికి ఇక్కడ ఏమీ లేదు. మనం ఆదిలోనే ఒకేసారి చేసినాము. అది కాస్తా ఈ 36 ఫ్రేమ్స్ లో నిక్షిప్తమై రికార్డయిన దృశ్యాలు విషయాలుగా ఈ బ్రహ్మాండ చక్రమునందు ఉండిపోయాయి.

 బ్రహ్మాండ చక్రం తిరుగుతున్నంతసేపు అనగా సినిమా హాల్ లోని ప్రొజెక్టర్ ఉన్నంతసేపు సినిమా ఎలా అయితే నడుస్తుందో అలా ఈ బ్రహ్మాండ చక్రములో మనం ఆదిలో వేసిన జీవ నాటకంలోని జీవ పాత్ర ఈ 36 ఫ్రేమ్స్ ద్వారా తిరుగుతూనే ఉంటుంది. అంటే మనము మోక్షము పొందినామో లేదో తెలియాలి అంటే ప్రస్తుత జన్మలో ఈ 36 ఫ్రేమ్స్ లో ఆ దృశ్యము ఉన్నదో లేదో తెలుసుకోవాలి అన్నమాట. ఆ దృశ్యం వచ్చేదాకా మనం ఎదురు చూడాలి. ఆదిలో మనకి మోక్ష సాధన దృశ్యము నిక్షిప్తము అయితే మనకి ఇప్పుడు అది కనపడాలి. లేదంటే కనపడదు. నిజానికి మనమంతా ఆదిలోనే పుట్టడం పెరగడం చనిపోవటం కపాల మోక్షం పొందటం అలాగే మనము ఆదిలో  ఏమి చేసినామో అదియే ఈ 36 కపాల ఫ్రేమ్స్ చూపిస్తుందని గ్రహించండి. అంతకు మించి ఏమీ చేయదు. ఏమీ చూపించదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ పెళ్లి వీడియో చూడండి. ఆరోజు ఎవరైతే మీ పెళ్లికి వచ్చినారు ఏమి చేసినారు ఏమి తిన్నారు మీరు ఎలా ఉన్నారు మీరు ఏమి చేసినారు అన్నిరకాల దృశ్యాలు ఎలా అయితే రికార్డు అవుతాయో అలా మీరు ఆదిలో మీరు చేసిన జీవ పాత్ర కూడా 36 ఫ్రేమ్స్ ను రికార్డు చేసినాయి. ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీ పెళ్లి వీడియో చూస్తే ఎలా ఉంటుంది. అందులో మీరు కొత్తగా మీకు పుట్టిన పిల్లకాయలు ఈ వీడియోలో ఉండరు కదా. ఈ పెళ్లి వీడియో లో కొత్తగా పుట్టిన మీ పిల్ల కాయలను మీ పిలకాయలకి కొత్తగా అమర్చ లేము కదా. నీ పెళ్లి వీడియో ఎంతవరకు ఉన్నదో అంత వరకు ఉంటుందో అలా మీ ఆది జీవ పాత్ర వీడియో కూడా అంతే అన్నమాట. ఆదిలో మీరు అనుకుంటున్న కపాలమోక్షం సాధన పొందే దృశ్యాలు మీరు చేసి ఉంటే అది పొంది ఉంటే ఆ వీడియో దృశ్యాలు ఈ బ్రహ్మాండ చక్రములోని 36 కపాల ఫ్రేమ్స్ యందు నిక్షిప్తమై వాటిని చూపిస్తాయి. అంటే కొత్తగా వాటిని చేర్చదు. కేవలము ఈ జీవ నాటకములో నీ జీవ పాత్ర ఏమిటో ఎలా ఉంటుందో ఎలా ఉందో తెలుసుకోవటం యోగసాధన అన్నమాట. అది కూడా సంపూర్తిగానే రికార్డు చేసి ఉన్నాయి కానీ అందులో మనము సంపూర్తిగా మన పాత్ర చేసినామో లేదో తెలియాలి అన్నమాట. సినిమా పిచ్చి ఉన్నవాడు సినిమాలు చూస్తాడు. సినిమాలు చేస్తాడు. సినిమాలు తీస్తాడు. ఇదే సృష్టి స్థితి లయలు అన్నమాట. ఇది ఎలా అయితే జరుగుతుందో అలా మీరు మీ ఆది హీరో పాత్ర కూడా ఈ త్రికర్మలలో ఒక కర్మ పాత్రకి తప్పనిసరిగా చేస్తారన్నమాట. చేసే ఉంటారు. సృష్టి అంటే మాయలో ఉన్న వారు. స్థితి అంటే మాయా సహిత మాయా రహిత కానీ మధ్య స్థితి లయము అంటే మాయా రహిత స్థితి అన్నమాట. ఈ మూడు పాత్రలలో ప్రతి జీవి ఏదో ఒక పాత్ర వేస్తాడు.

మీరు ఆదిలో వేసిన పాత్ర యొక్క రికార్డ్ దృశ్యాలే ఇప్పుడు మనము కలల ద్వారా అనుభవాల ద్వారా అనుభూతుల ద్వారా జాతకాల ద్వారా తెలుసుకున్న దృశ్యాలు అన్నమాట. ఒకసారి రికార్డ్ అయిన తర్వాత ఇవి ఎప్పటికీ మారవు అని చెప్పటానికి మనకి రామాయణంలో ఒక కథనం కనిపిస్తుంది. అది ఏమిటంటే కాకభుంశుడు అనే రాక్షసుడు కాలాతీత స్థితిని పొంది 11 సార్లు జరిగిన రామాయణమే చూడటం అలాగే ఇరవై రెండు సార్లు జరిగిన మహాభారతం చూసినట్లుగా చెప్పడం జరిగినది. అంటే ఈ లెక్కన చూస్తే సత్య త్రేతా ద్వాపర యుగాలలో ఆదిలో ఏమైతే దృశ్యాలు రికార్డు అయినాయో అవే దృశ్యాలు జరిగిన 27 మహాయుగాలుగా మనము చూస్తున్నామని అలాగే రాబోవు యుగాలలో ఇవే దృశ్యాలు ఉంటాయని మనకు అర్థం అవుతుంది కదా. అనగా డైలీ సీరియల్ లాగా అన్నమాట. ఏ వారము ఏ సీరియల్ వస్తుందో అలా ప్రతి సెకన్ కి ఏమి దృశ్యం రావాలో ఈ 36 బ్రహ్మకపాలములు ఫ్రేమ్స్ లో నిక్షిప్తమైనాయి అని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. ఒకసారి సినిమాలో నటిస్తే ఆ సినిమా ఎప్పుడు చూసినా అదే పాత్ర ఎలా అయితే ఉంటుందో అలా మన జీవ పాత్ర కూడా ఈ విశ్వ జీవ నాటకమునందు నిక్షిప్తమైనది. అది కూడా మనకి ప్రమేయము లేకుండా మన తో సంబంధం లేకుండా జీవ పాత్ర ఎప్పటికీ నిరంతరముగా ఆ విశ్రాంతిగా నడుస్తూనే ఉంటుంది అని గ్రహించండి.ఈ పాత్ర నాటకము మీరు ఆపాలన్న ఆపలేరు. ఎందుకంటే ఇది రికార్డయిన దృశ్యాలు అన్నమాట. ఇదంతా ఒక స్వప్న దృశ్యం అన్నమాట. మీరు ఒక సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడటమే గాని దానిని ఆపే అధికారం ఉండదు కదా. ఆపలేరు కదా. ఒకవేళ ఆపాలని అనుకున్నా ఆపలేరు. ఎందుకంటే మీదంతా రికార్డ్ దృశ్యమే కదా. ఈ దృశ్యంలో మీరు ఆపే దృశ్యాలు రికార్డ్ అవ్వాలి కదా. అలా ఎవరివి కూడా ఇంతవరకు రికార్డు అవ్వలేదు. అనగా ఎవరు కూడా సినిమాని ఆపాలని యోగసాధన చేసి ఆపలేక మాయలోపడి వెనుదిరిగిన దృశ్యాలే రికార్డయ్యాయి. తొంబై ఆరు నిమిషాల ఈ జీవ నాటకము యందు 48 నిమిషాల పాటు ఆదియోగి అయిన పరమేశ్వరుడు సాధించిన దృశ్యాలే రికార్డ్ అయినాయి. ఆ తర్వాత ఆయన ఈ నాటకంలో రూపాంతరం చెంది వేరే రూపముతో వేరే విధంగా సాధన చేసిన దృశ్యాలు రికార్డు అయినాయి. అంటే రూపం అంతము చేసుకునే సమయంలో అనగా తొంబై ఆరు నిమిషాల పాటు ఈయన ఇదే పాత్రలో ఉండి ఉంటే ఆ పాత్ర అంతమయ్యే దృశ్యాలు రికార్డు అయ్యేవి. కానీ నలభై ఎనిమిది నిమిషాలకు ఈ ప్రక్రియను విసుగుచెంది సహనము కోల్పోయి పాత పాత్ర కాకుండా కొత్త పాత్ర వేయటంతో రూపం అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందిన దృశ్యాలు రికార్డు అయినాయి. ఈ 96 నిమిషాల పాటు అంటే30,67, 20000 వేల కోట్ల సంవత్సరాలు ఒకే పాత్ర వేయాలి అంటే విసుగు రాక వస్తుందా.. వచ్చింది.అదే మన కొంపముంచింది. ఎప్పుడైతే ఆదిపాత్ర విసుగు చెంది రూపం మార్చుకున్నదో ఆయన అంశ రూపాలైన మనము కూడా రూపాలు మార్చుకోవడం మొదలు పెట్టినాము. దానితో ఎవరి పాత్రలు కూడా సంపూర్తిగా పూర్తిగాలేదు. సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు చివరిదాకా ఉండి పోయినట్లుగా ఈ జీవ నాటకము యందు కామేశ్వరుడు కామేశ్వరి పాత్రలు అలాగే మిగిలిపోయాయి. ఈ పాత్రను చనిపోయినట్లుగా ఉంటే మన పాత్రలు  కూడా చనిపోయేవి.కానీ అలా జరగలేదు.మీ పరిధిలో ఉన్న పాత్రలు గానే ఈ 36 కపాలాలు రికార్డు చేసినాయి. తాము రికార్డు చేసిన దృశ్యాలను మహాకల్పాలు పాటు తిప్పి తిప్పి చూపిస్తున్నాయి. అంటే ఆదిలో పరమ శూన్యము తాను ఆకారము పొందితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆలోచన రావడంతో అది కాస్త నిరాకారము నుండి ఆకారముగా శూన్య బ్రహ్మ పంచభూత పంచ శరీరాలతో 36 కపాల తత్వాలతో ఉద్భవించాడు. ఇదంతా కూడా కలయే అన్నమాట. కలలో స్వప్న పాత్రగా స్వప్న శరీరముతో ఆది శూన్య బ్రహ్మ అయినా 36 కపాలధారి అయిన సదాశివమూర్తి ఉద్భవించాడని గ్రహించండి. దీనినే మనము ఈశ్వరుడు అని, భగవంతుడు అని, బ్రహ్మమని, ఆత్మ అని, ఆది బ్రహ్మకపాలం అని, ఆది యోగి అని, ఆది దేవుడని, ఆది గురువు అని, ఆదిశక్తి అని ఇలా పలురకాలుగా నామాలతో పిలవడం జరిగింది. 

ఆ తర్వాత ఈయన కూడా తనలాంటి సహచరి కావాలని కల కనడంతో సాకార పరబ్రహ్మముగా ఆదిపరాశక్తి ఉద్భవించినది.ఇలా వీరిద్దరు కూడా స్వప్న శరీరాలతో స్వప్నము కనటం మొదలు పెట్టి 36 కోట్ల దైవ కలలు 84 లక్షల జీవరాశులలో కలలు ఒక కోటి పరమాత్మ కలలు కనడం చేసినారు. అండపిండ బ్రహ్మాండాలతో కూడిన ఈ విశ్వ సృష్టి కలను కన్నారు. దానితో జీవ నాటకం అనే స్వప్నము సాక్షాత్కరింప చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కోట్లాను కోట్ల సంవత్సరాల పాటు ఇదే కల కొనసాగేసరికి వీరిద్దరూ విసుగుచెంది తిరిగి ఎక్కడ నుండి వచ్చినామో అక్కడికి వెళ్లాలని యోగ సాధన చేసినారు. కానీ సహనశక్తి దగ్గర ఆదియోగి ఆగిపోతే ఆలోచనాశక్తి దగ్గర ఆదిపరాశక్తి ఆగిపోయి తమ స్వప్నాల నుండి స్వప్న పాత్రల నుండి అలాగే జీవ నాటకము నుండి జీవన్ముక్తి  పొందలేక పోయినారు. 

దానితో వీరిద్దరూ కలిసి రూపాంతరం చెంది మరొక అవతారాలుగా అవతరించి ఇదే స్వప్న జీవ నాటకము యందు పేర్లు మార్చుకుని అలాంటి పాత్రలు వెయ్యడము ఆరంభించారు. అనగా ఆది విష్ణువు ఆదిలక్ష్మిగాను అలాగే ఆది బ్రహ్మ ఆది సరస్వతి గాను అన్నమాట. ఇదంతా 36 కపాలాలు ఈ స్వప్న జీవ నాటకమును రికార్డు చేసినాయి. పంచభూతాలు కాస్త సినిమా తెరలుగా ఉపయోగపడ్డాయి. తిరిగే బ్రహ్మాండ చక్రము ప్రొజెక్టర్ గా పనిచేయడం చేసినది. దానితో ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా తాను రికార్డు చేసిన జీవ నాటక దృశ్యాలే మహాకల్పాలే తిప్పి తిప్పి చూపిస్తున్నాయి. అంటే ఎవరు కూడా సంపూర్తిగా తమ కల పూర్తి చేయకుండా అసంపూర్తిగా పూర్తి చేసుకున్నారు. అనగా ఆదిలో పరమ శూన్యము స్వప్నము కనడము నిజము. కానీ ప్రస్తుతం అది స్వప్నము కనడము లేదు. కేవలం తను కన్న ఆది స్వప్నం.స్వప్నము యొక్క రికార్డు దృశ్యాలే పంచభూత తెరల మీద పంచ శరీర పాత్రలతో అండపిండ బ్రహ్మాండాల యందు రికార్డు దృశ్యాలుగా ప్రదర్శన చేస్తోంది. ఇది ఎన్నటికీ ఆగదు. ఎందుకంటే ఇందులో ఎవరి ప్రమేయం లేదు కదా. అంటే సినిమా హాల్లో ఎవరు ఉన్నా లేకున్నా సినిమా అయితే ఎలా నడుస్తుందో అలా ఈ స్వప్న జీవన దృశ్యాలు అలాగే నడుస్తాయి. అనగా అసంపూర్తి నాటక దృశ్యాలే ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి. కొత్తగా చెయ్యటానికి పొందటానికి ఏమీ లేదు. ఆదిలోనే అంతా కూడా ఆదిలోనే జరగవలసిన తప్పు అదే అసంపూర్తి నాటకము దృశ్యాలే కొనసాగిస్తున్నాయి. 

తిరిగే బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రం ఆగిపోతే కానీ ఈ కనిపించే స్వప్న దృశ్య నాటకములు దృశ్యాలు ఆగిపోవు. అది ఆగిపోవటానికి ఉంటే కదా. ఆది బ్రహ్మాండ చక్రము అంటే సున్నా  లాంటిది. అంటే శూన్యమే కదా. శూన్యము అంటే ఖాళీయే కదా. ఖాళీ అంటే ఏమీ లేనట్లే కదా. కానీ అది ఉన్నట్లుగా భూమి అలాగే ఆకాశం కలిసి ఉన్నట్లుగా ఎలా అయితే కనిపిస్తుందో ఆకాశము నిజానికి ఉందా లేదు కదా. కానీ అది ఉన్నట్లుగా భూమి అలాగే ఆకాశం కలిసి ఉన్నట్లుగా ఎలా అయితే కనిపిస్తుందో అలా బ్రహ్మాండ చక్రము నందు జీవ నాటక దృశ్యాలు సత్యం గా కనపడతాయి. నిజానికి ఆకాశము లేదు. అలాగే బ్రహ్మాండ చక్రము దృశ్యాలు లేవు. అనగా సత్యముగా కనిపించే అసత్యము అన్నమాట. కనిపించేది అసత్యము. కనిపించనిది సత్యం లాగా మనము ఆదిలో కన్న కల యొక్క స్వప్నజీవ నాటక దృశ్యాలే మనం వివిధ రూపాల్లో ఎత్తి మరియు చూస్తున్నాము. నిజానికి మనము చూడటం లేదు. అలాగే జన్మలు ఎత్తటం లేదు. మనము చూస్తున్నాము అనే దృశ్యాలు అలాగే మనము జన్మ ఎత్తిన దృశ్యాలు కూడా ఇప్పుడు ఆదిలోనే రికార్డయిన దృశ్యాలు అని గ్రహించండి. రికార్డింగ్ గాని దృశ్యాలు ఏమీ కొత్తగా ఉండవని గ్రహించండి. అంటే మనము పరమ శూన్యము యొక్క ప్రస్తుత స్వప్న దృశ్యాలు చూడడం లేదు. ఎప్పుడో ఆదిలో అది కన్న ఆది స్వప్నము యొక్క స్వప్న జీవన నాటక దృశ్యాలను అది కూడా మనం చూస్తున్నామని దృశ్యాలతో రికార్డయిన దృశ్యాలతో మనము చూస్తున్నామని అర్థం చేసుకోండి. ఉదాహరణకు నేను పుట్టక ముందు నేను ఏ సంవత్సరంలో ఏ ఫలానా తేదీన పుడతానని జ్ఞాన యోగి అవుతానని జ్యోతిష్య వేత్తలకు ఎలా తెలిసింది అంటే ఈయన దృశ్యాలు చూపించే నవ గ్రహ సంచారము ఆధారముగా జన్మ జాతకం తెరమీద విషయాలను కదిలే దృశ్యాలను తన మనోనేత్రంతో చూసి చెప్పబట్టే కదా ఈయనికి తెలిసినది.నేను పుట్టక ముందే నేను ఏమి అవుతానో ఉన్నప్పుడు ఇక నేను ఏం సాధించినట్లు ఏమి పొందినట్లు. అంటే ఆదిలో ఆది పాత్రగా ఏమి  సాధన చేసినానో ఎలా చేసినానో తెలుసుకోవటానికి ఆదిలో చేసిన సాధన పాత్రను రికార్డు చేసిన నా 36 కపాల దృశ్యాలను నా పంచభూత శరీర పాత్రలుగా విశ్వ తెరమీద చూసినట్లే కదా.ఇది ఇలా నేను చూస్తున్నాను అనే దృశ్యం కూడా ఆనాడే రికార్డు అవటంతో ఆ దృశ్యాలు చూసే దృశ్యం కూడా రికార్డు అవ్వడం జరిగిందని ఈ పాటికి గ్రహించి ఉంటారు.
 
ఆదిలో ఏదైతే ఈ 36 ఆది బ్రహ్మకపాలాలలో రికార్డు చేసినాయో అవే దృశ్యాలు అవే పాత్రలు అదే జీవ నాటకం ఈ విశ్వం తెరమీద ఎప్పుడు ఎల్లప్పుడూ అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా సాగుతూనే ఉంటుంది. మీ అదృష్టం కొద్దీ కపాల మోక్షసాధన పాత్రను మీరు ఆదిలో వేసుకుంటే ఆ పాత్ర దృశ్యాలే మీకు అనుభవం అనుభూతి దృశ్యాలుగా కనపడతాయి. ఈ పాత్ర దృశ్యాలు మీరు చూసినట్లుగా రికార్డ్ అయినట్లేనని గ్రహించండి. నాటకం ఆగిపోదు. ఎందుకంటే కొత్తగా నాటకము వేసే వాళ్ళు లేరు.నాటకము చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే నాటకము లేదు. నాటక పాత్ర లేదు. కేవలము ఆదిలో వేసిన నాటక దృశ్యాలు చూసినవి అలాగే వేసిన ఈ దృశ్యాలు మనము చూస్తున్నాము. అవి అన్నీ కూడారికార్డు  కావటం వలన రికార్డు విషయాలు కావటం వలన ఉన్నామని అనుభూతిలో మనము ఉంటున్నాము. 

ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు సినిమా హాల్లో సినిమా చూస్తున్నారనుకోండి. మీరు సినిమా చూస్తున్న దృశ్యం కూడా రికార్డు అయ్యి అది కూడా మీరు చూస్తే ఎలా ఉంటుందో అలా మీరు ప్రస్తుతము ఆదిలో వీరు వేసిన జీవ పాత్ర ఏమిటో యోగ సాధన పాత్ర ద్వారా తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా ఇది కూడా రికార్డు దృశ్యాలే విషయాలే చూస్తున్నారని గ్రహించండి. ఈ లెక్కన మనము పరమ శూన్యము యొక్క స్వప్నము యొక్క స్వప్న దృశ్యాలు మాత్రమే చూస్తున్నాము. అది కూడా  36 ఫ్రేమ్స్  బ్రహ్మకపాలాలు రికార్డు చేసిన దృశ్యాలే చూస్తున్నాము.జరిగిపోయిన అసంపూర్తిగా జరిగిన జీవ నాటక స్వప్న దృశ్యాలే అది కూడా రికార్డు దృశ్యాలే మనము చూస్తున్నాము.విచిత్రము ఏమిటంటే బ్రహ్మాండ చక్రము తిరగడం మొదలు పెట్టిన నాటి నుండి ఇందులో కదిలిక ఏర్పడిన నాటి నుండి ఇందులో ఉండి రికార్డు చేసిన 36 కపాలాల ఫ్రేమ్స్  దృశ్యాలు కదులుతున్నట్లు గా పంచ శరీర పాత్రలు వేస్తున్నట్లుగా ఈ విశ్వం తెరమీద కనపడుతున్నాయి. అందుకే ఎవరు కూడా ఈ నాటకము ఆపలేక పోతున్నారు. ఎందుకంటే ఎవరూ నిజము కాదు. కేవలం ఈ నాటక దృశ్య పాత్రలో వాడు ఎంత వరకు ఏమి చేసినాడో ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాడు కదా. వీడు ఇలా చూసే దృశ్యం కూడా రికార్డు అయ్యి అది కూడా అదృశ్యమైన విషయం వీరికి తెలియటం లేదు. నాటకము వేసేవారిని ఆపవచ్చు కాని రికార్డ్ అయిన నాటక దృశ్యాలు ఎలా ఆపుతామో చెప్పండి. ఆలోచించండి. ఎందుకంటే అందులో వాడు ఆపే దుష్ట పాత్ర వేసి ఉండాలి కదా. అనగా రికార్డు అయ్యే దృశ్యాలను మనం చూస్తున్నామని మనము చూసే దృశ్యాలు కూడా ఒక దృశ్యం అయితే ఎలా ఆపుతాము ఆపలేము కదా.అంటే ఆపాలంటే అది ఆపినట్లుగా రికార్డు అవ్వాలి. అది రికార్డు అయిన దృశ్యమే లేదు. ఎందుకంటే తొంబై ఆరు నిమిషాల నాటకములో 48 నిమిషాలు మాత్రమే వేసి ఆపై సహన శక్తిని కోల్పోయి వేరే పాత్ర వేస్తే ఆ పాత్ర దృశ్యాలు కనపడతాయి కదా. అంటే రూపం అంతం చేసుకోవాల్సిన చోట రూపాంతరము చెందటం… మనము ఆదిలో చేసిన ఆది తప్పు. సహన శక్తి కోల్పోవటం మనం చేసిన రెండవ తప్పు. ఈ తప్పు సరిదిద్దుకోవాలి ఆలోచనతో మరో పాత్రధారిగా ఏర్పాటు ఏర్పడటం మనము చేసిన మూడో తప్పు. ఈ తప్పుడు దృశ్యాలే ఆదిలో రికార్డ్ అయినాయి. ఈ దృశ్యాలు మనము ఇప్పటికి ఎప్పటికీ చూస్తూనే ఉంటున్నాము. ఎందుకంటే ఇలా తీసే లేదా చూసే లేదా చేసే దృశ్యాలు అన్ని కూడా ఎప్పుడో ఆదిలోనే రికార్డ్ అయినాయి అన్నమాట. చూసిన లేదా చేసిన దృశ్యాలు చూస్తున్న దృశ్యాలు కూడా రికార్డు అవడం అంటే కొత్తగా చెయ్యడానికి మనకి ఏమున్నది. 

అరచెయ్యి మూసుకుని ఉంటే అందులో ఏదో ఉంది అని సాధన చేసి చూస్తే అందులో ఏమీ కనిపించక నీ చెయ్యి కనపడితే అలా కనిపించే దృశ్యం కూడా రికార్డు అయిన దృశ్యం అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అనగా మీరు సినిమా హాల్లో సినిమా చూస్తున్న దృశ్యం కూడా రికార్డ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. అచ్చంగా మన కపాలమోక్షం సాధన కూడా అంతే. ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం ఒకటి రావచ్చును. ఏమిటంటే ఆది స్వప్న దృశ్యాలే రికార్డు చేసి ప్రస్తుత  స్వప్న దృశ్యాలు ఎందుకు ఈ 36 కపాలాలు రికార్డు చేయటం లేదని సందేహము రావచ్చును. దీనికి సమాధానముగా మన సినిమా రీలు మూడు గంటల వరకే ఎలా ఉంటుందో అలా ఈ 36 కపాలాల రికార్డు రీలు కూడా నాలుగు యుగాల కాలము వరకు అనగా ఒక మహా యుగము వరకు ఉన్నది. ఆ సమయంలో ఆదిలో ఎంతవరకు ఏది రికార్డు అయిందో ఏమి రికార్డు చేసినాయో అవే రికార్డ్ అయినాయి. ఆపై రీలు లేదు అలాగే కాలము లేదు. వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి 365 రోజులు ఇలా ప్రతి దానికి ఒక లెక్క ఉన్నట్లే ఈ 36 కపాలాలు రికార్డు రీలు  కూడా తొంబై ఆరు నిమిషాల పాటు మాత్రమే రికార్డు చేసే అవకాశం ఉన్నది. కానీ ఇందులో 48 నిమిషాల పాటు ఆదియోగి జీవించి మరణం పొందకుండా మృత్యుంజయుడై మరో పాత్ర వేయటంతో మిగిలిన 48 నిమిషాలలో ఈ కొత్త పాత్ర విషయాలు ఉండటం జరిగినది. అంటే దీనితో ఆదియోగి తొంబై ఆరు నిమిషాల పాత్ర రికార్డు అయినది. అక్కడి నుండి మరో 96 నిమిషాలపాటు మరో స్వప్న పాత్రతో ఈ 36 కపాలాలు రికార్డు చేసినాయి. ఇలా ఎవరికి వారే తమ స్వప్న కలలతో స్వప్న పాత్రలతో ఈ 36 కపాలాలు తొంబై ఆరు నిమిషాల పాటు రికార్డు చేసుకుంటూ పోయినాయి. ఎప్పుడు చూసినా 96 నిమిషాలలో 48 నిమిషాల పాటు వేసిన పాత్రే మనము చేస్తున్నాము. అలా మిగిలిన 48 నిమిషాలలో వేసిన పాత్ర చూస్తున్నాము. స్వప్న పాత్ర పెరిగితే ఈ స్వప్న 36 కపాలాలు కొత్తగా పెరుగుతాయని గ్రహించండి. 96 నిమిషాలకు మించి ఈ రీలు ఉండదని గ్రహించండి. అందులో కేవలం ఆదియోగి 48 నిమిషాల పాటు అత్యధికంగా ఉపయోగిస్తే అమ్మవారు 36 నిమిషాల పాటు మహాగణపతి 32 నిమిషాల పాటు దత్తాత్రేయ స్వామి 16 నిమిషాల పాటు వారి అవతారాలు సంఖ్యతో ఎవరికి వారే తొంబై ఆరు నిమిషాల లోపల ఉపయోగించుకున్నారని అందులో మేము కూడా ఆదిలో ఆది యోగి లాగా 48 నిముషాలు మించి ఉపయోగించుకో లేదని లిప్త కాలం పాటు సహన శక్తిని కోల్పోవటంతో అప్పటిదాకా వేసిన శ్రీ పవనానంద సరస్వతి పాత్రను ముగించకుండానే మరో రూప పాత్రగా శ్రీ బాబా విభూదినాధ్ గా పాత్ర వేసినామని తెలుసుకునేసరికి మా స్వప్న సాధన దృశ్యం అదృశ్యమైంది. దానితో మేము కూడా అందరికి లాగా మౌన దీక్షతో సాక్షి భూతంగా ఉండిపోక తప్పలేదు. స్వప్న పాత్ర మార్చకుండా స్థిరముగా అదే పాత్రను 96 నిమిషాలపాటు వేసుకుంటే కథ మరో లాగా ఉండేది. మన శాశ్వత మరణ దృశ్యాలు కూడా రికార్డు అయ్యేవి కానీ మరణ సమయానికి వచ్చేదాకా ఎవరు కూడా ఏ పాత్ర కూడా 96 నిమిషాలపాటు సహనంగా ఉండలేకపోయారు. ఎప్పుడైతే 48 నిమిషాల వచ్చిన తర్వాత తన పాత పాత్ర శాశ్వత మరణమును పొందనీయకుండా కేవలం భౌతిక మరణం పొందించి పునర్జన్మతో అదే పోలికలతో పుట్టినట్లుగా జీవించినట్లు గా మిగిలిన 48 నిమిషాలతో కొత్త పాత్రతో దృశ్యాలు నిండేసరికి 96 నిమిషాల రీలు పూర్తి అయినది. ఇదే ఆది శూన్య బ్రహ్మ తెలియక లేదో తెలిసి చేసిన అతి పెద్ద తప్పు. అంటే సినిమాలో హీరో చనిపోతే మళ్లీ పునర్జన్మతో వేరే చోట అది పోలికలతో పుట్టి సినిమాలో నడిపించినట్లుగా ఆది యోగి మొదట శాశ్వత మరణమును పొందకుండా అటుపై ఆదిదేవుడుగా అవతారమెత్తి ఈ విశ్వ జీవ నాటకమును నడిపిస్తున్నాడని గ్రహించండి. ఇలా ఆయనే కాదు ఎవరికి వారే తమ ఆది పాత్రకి శాశ్వత మరణము ఇవ్వకుండా కేవలం భౌతిక మరణం ఇచ్చి వారి 36 కపాలముల యొక్క 96 నిమిషాల రీలు పూర్తి చేసుకోవడం చేసినారు. అంటే జీవ నాటకము నందు ఆదిలో వేసిన 36 ఆది పాత్రలు శాశ్వత మరణమును పొందకుండా భౌతిక మరణాలు పొంది 36 బ్రహ్మకపాలములుగా మిగిలిపోయి అందులో 34 కపాలములుమాత్రమే నిశ్చల స్థితిని పొంది మిగిలిన రెండు కపాలములలో ఒకటి జ్ఞాన కపాలముగాను మరొకటి ప్రాణశక్తి కపాలముగాను మిగిలిపోయి సదాశివమూర్తి గాను మరియు దక్షిణామూర్తి గాను లేదా శివుడు గాను లేదా శివాని గాను లేదా ఇష్టకామేశ్వరుడు లేదా ఇష్టకామేశ్వరి గాను మారి ఈ విశ్వ జీవ నాటకమును తమ 36 కపాల ఫ్రేమ్స్ లో తొంబై ఆరు నిమిషాల పాటు అసంపూర్తిగా దృశ్యాలతో నింపినాయని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. ఇలా 96 నిమిషాలపాటు 36 కపాలములు రీలు పూర్తవడంతో ఇంకా కొత్తగా ఏమీ దృశ్యాలు రికార్డు అవుతాయి. అసలు రికార్డు చేయటానికి అలాగే కొత్తగా చేయటానికి ఏముంది. అంతా కూడా మనము ప్రస్తుతము రికార్డు అయిన దృశ్యమే కదా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే ఆదిలో తొంభై ఆరు నిమిషాల పాటు ఏ జీవ నాటకము అలాగే ఏ నాటక పాత్రలు రికార్డు అయ్యాయో అదే నాటక దృశ్యాలు మనం చూసేది అంటే తొంభై ఆరు నిమిషాల పాటు రికార్డు పూర్తయిన తర్వాత ఈ పాత రికార్డుయేనాలుగు యుగాల తర్వాత మళ్లీ తిరిగి ప్రదర్శింపబడుతోంది అని గ్రహించండి. 
 
అందుకే కాకభుంశుడు జరిగిన రామాయణ మహాభారతాలను కొన్ని సార్లు తిరిగి చూడటం జరిగింది. అంటే ఆదిలో ఆది యోగి మరణించటానికి బయలుదేరుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుని బయలుదేరి యోగసాధన చేసినాడు. ఎప్పుడైతే తన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రము యొక్క బ్రహ్మతేజస్సు అయిన చితాగ్ని యొక్క దహనశక్తిని పది లక్షల సంవత్సరాలకు గాను ఐదు లక్షల సంవత్సరాల శక్తికి మించి తట్టుకోలేక అనగా 48 నిమిషాల పాటు మాత్రమే నిగ్రహశక్తి తో ఉండి ఆపై సహన శక్తిని కోల్పోయి శాశ్వత మరణమును పొందకుండా అశాశ్వతం మరణమును పొంది మరో దేహ పాత్రలతో జీవ నాటకము నందు నీవు పాత్రను వేసినాడు అదే తను మరణించే ముందు బతకడానికి ఏర్పాట్లు చేసుకోకుండా ఉండి ఉంటే కథ మరో లాగా ఉండేది. ఆదియోగిని అనుకోవడమే ఎందుకు. నన్ను నేను అనుకోవాలి. తిట్టు కోవాలి కాకపోతే ఏమిటి. అమ్మ అంతిమ సంస్కారం కోసం నేను ఆగిపోవడం ఏమిటి? నా బొంద కాకపోతే. అది ఎలాంటే మహ మృత్యువైనా కపాలమోక్షస్ధితి ఈ సం!! అనగా 2019 మార్చి 11 మహశివరాత్రి పర్వదినమున ఉదయం 10:05 లకి మా సూక్ష్మ,కారణ, సంకల్ప, మా మూలకపాలము యొక్క చితాగ్నిలో ఈ మూడు శరీరాలు దహనమై...విభూదిగా మారడముగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందడము జరిగిన ట్లుగా  మాకు ఆ రోజు ధ్యానానుభవమైనది! ఇదే ధ్యానములో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాధ్ కి జై...అంటూ...స్వయంగా గోమయ విభూది చేసుకొని వాడుకో అని ఆదేశము రావడముతో.... 

ఇదే రోజు బాగా ఎండిన ఆవుపేడను సేకరించి...దానికి ఆవునెయ్యి,కర్పూరం వేసి కాల్చడము...ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాముపొడిని ఆవుపాలతో కలిపి ఎండిపెట్టి...దీనినే విభూతిగా వాడటము జరుగుతోంది!   దీనిని స్నానము చేసే నీళ్ళలలో చిటికెడు కలుపుకొని విభూధి స్నామము చెయ్యడము అలాగే ఈ విభూధితో ధారణ చేసుకోవడము చేస్తున్నాను! అలాగే ప్రతి సం!! వచ్చే మహాశివరాత్రినాడు ఈ విధంగా విభూధిని తయారు చేసుకోవాలని...వీలు అయితే అందరికి ఈ నిజమైన గోమయ విభూధిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడము జరిగినది! దానితో మా దీక్ష నామము అయిన శ్రీ పవనానంద సరస్వతి నామము కాస్తా బాబా విభూతినాధ్ గా మారడము జరిగినది! దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్దాంతము అలాగే సమాధి గీత రచించడము జరిగినది! కాని మా స్ధూల శరీరానికి నా చిట్టచివరి ప్రారబ్ధకర్మగా మా అమ్మగారి అంతిమ యాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్ధూల దేహవిముక్తి కల్గదని… అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారము మా చేతులలో జరగాలని ఆమె కోరడముతో...నాకు ఇంతటి సంపూర్ణ సాధన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా...ఆమె అడిగిన కోరికను తీర్చడము కోసము మా స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా ఆగిపోవడము జరిగినది! ఆమె మరణము తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్ధూల శరీరము….  ఆపై ఇది గూడ కాశీక్షేత్రములో మా అస్ధిక చితాభస్మము ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే...ఈ శరీరమునకు బంధవిముక్తి కల్గి  మనోనిశ్చలస్ధితి పొంది స్ధూల కపాలమోక్షస్ధితి పొందడము జరుగుతుంది! అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! అసలే నేనే లేనప్పుడు అమ్మ ఎక్కడి నుండి వచ్చింది. ఆమె ప్రేమ ఎక్కడ నుండి వచ్చింది. నా బొందా నా బూడిద. పైగా నేను తెలుసుకున్న జ్ఞాన రహస్యాలు వేరే వాళ్ళకి చెప్పాలని గ్రంధం రాయటం ఎందుకు? అసలు నేనే లేనప్పుడు మీరు ఎక్కడ ఉంటారు నేను బ్రహ్మజ్ఞాని అయ్యానని మరో పరబ్రహ్మ జ్ఞానికి చెప్పినట్టుగా లేదు. నేనే లేకపోతే మీరు లేనట్లే కదా. నేనే లేకపోతే అమ్మ లేనట్లే కదా. ఈ మాత్రం ఆలోచించకుండా సాధనా పరిసమాప్తి సమయంలో మా బ్రహ్మరంధ్రము వద్ద బ్రహ్మాండ చక్ర చితాగ్ని దహన శక్తితో మా 36 కపాలములులో రెండు కపాలాలు మిగిలిపోవడానికి ఈ రెండు కారణాలు కారణమయ్యాయి. అందులో ఒకటి జ్ఞానము పంచాలని జ్ఞాన కపాలముగాను అమ్మ కోసము ఉండాలనే ప్రాణశక్తి కపాలముగాను మేము మిగిలిపోవడంతో 48 నిమిషాల దగ్గరికి వచ్చేసరికి అప్పటిదాకా వేస్తున్న శ్రీ పవనానంద సరస్వతి జీవ పాత్ర కాస్త ఈ రెండు కారణాల వలన శ్రీ బాబా విభూది నాధ్ గా మారి పోవడం జరిగినది. అంటే మరణించడానికి మేము బయలుదేరుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా అన్ని బంధనాలు మోహా మహామాయ అని తెలిసినా కూడా బంధన మహామాయలో పడటం ఏమైనా అర్థం ఉందా.మన బుద్ధుడి లాగా కోరికలే బంధాలకి కారణం అని తెలుసుకుని కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకున్నట్లుగా మేము కూడా మా సాధన సంపూర్తి పొందలేదని దానితో ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పొందలేదని మాకు మా స్వప్న సాధన స్వప్న శరీరం స్వప్న పాత్ర స్వప్న మోక్ష స్థితి వచ్చే దాకా తెలియలేదు మేము చేసిన తప్పు ఏమిటో. అప్పటికి గానీ అర్థం కాలేదు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభము. అంతా ఆదిలోనే ఈ తప్పులు చేసిన తర్వాత ఇప్పుడు అనుకుని ఏమి లాభము. దానితో నా పరిస్థితి ఆటలో అరటిపండు లాగా అయినది. అలా అని ఈ జీవ నాటకములో పాత్ర వెయ్యలేను. నటించలేను. జీవించలేను. ఎందుకంటే ఇదంతా రికార్డు స్వప్న దృశ్యమేనని జ్ఞానం కలిగింది కదా. అలాగని ఆటలో ఉండకుండా ఉండలేను. అంటే ఆటలో అరటిపండు అన్నమాట. వీడు ఆటలో పేరుకే ఉంటాడు. అలాగే ఆట ఆడడు అలాగని ఆట నుండి తప్పుకోలేడు. ఆదియోగి పరిస్థితి ఇలాగే ఉంది. ఆయన అంశలైన మన పరిస్థితి కూడా ఆటలో అరటి పండు అని తెలుసుకోండి. ఏమి తెలుసుకున్న ఏమి లాభం. ఆట ఆగదు. ఆట సాగదు. ఆట మారదు. అంతా పరమ శూన్యము స్వప్న నాటక రికార్డు దృశ్యమే కదా.  ఇదంతా కూడా ఒకప్పటి రికార్డు అని దృశ్యమే అని నమ్మకం ఏమిటి? అన్నప్పుడు మనము పుట్టకముందే మన భవిష్యత్ జాతక వివరాలు నిజ జ్యోతిష్యవేత్తకు ఎలా తెలుస్తున్నాయి. అలాగే మన మనోనేత్రం ముందు భవిష్యత్తు దృశ్యాలు ఎలా కనబడుతున్నాయి. అలాగే మన వాక్శుద్ధి ద్వారా జరగబోయే విషయాలు మన నోటి నుండి ముందుగానే ఎలా వస్తున్నాయో ఆలోచించండి. అలాగే ఇలా రికార్డు భవిష్య దృశ్యాలు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి తమ మనోనేత్రం ముందు కనపడితే వాటిని చూస్తూ ఆయన కాలజ్ఞాన గ్రంథమే రచించడం జరిగింది కదా. అలాగే తనకున్న విషయ పరిజ్ఞానం ద్వారా ముందుగానే జరగబోయే విషయాలను ఆస్ట్రోడామస్ చెప్పి ఉన్నాడు కదా. అంటే ఇదంతా ఎక్కడో ఒక చోట రికార్డు చేసి ఉండాలి కదా. ఆ రికార్డు దృశ్యాలు మనకు నవగ్రహ సంచార స్థితిని బట్టి లేదా మనోనేత్రం ముందు భవిష్యత్తు దిశగా కనపడుతున్నాయి. మరి ఈ రికార్డు దృశ్యాలు ఎక్కడ ఎలా రికార్డు అవుతున్నాయో మీకు తెలుసు కదా. అదేనండి మన  బ్రహ్మాండ చక్రము 36 కపాలాల యొక్క ఫ్రేమ్స్ నందు ఆదిలో 96 నిమిషాల పాటు నిడివిగల తొలి 71 మహాయుగాలు అనగా ఆది మన్వంతర కాలంపాటు కొనసాగే  శూన్య స్వప్న జీవ నాటక దృశ్యాలే రికార్డ్ అయినాయి అని తెలుసుకున్నారు కదా. అలాగే రామాయణంలో కాకభుంశుడు అనేవాడు కాలాతీత స్థితిని పొంది జరిగిన రామాయణ, మహాభారతాలను చూడటం జరిగింది అని చెప్పినాడు కదా. అంటే ఒకప్పుడు ఆదిలో రికార్డు రామాయణ, మహాభారతాలు దృశ్యాలే మనవాడు తిప్పితిప్పి చూసాడని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. ఎందుకంటే వాడు ఇలా చూసే దృశ్యం కూడా రికార్డు దృశ్యమే కదా. ఎందుకంటే ఈ స్వప్నము తొంభై ఆరు నిమిషాల పాటు అనగా ఒక మన్వంతర కాలం పాటు అనగా 71 మహాయుగాలు పాటు కొనసాగి ఆ పై మొదటి మహా యుగానికి వస్తుంది. అంటే మనకున్న తెలుగు 60 సంవత్సరాలు పూర్తి అయ్యి తిరిగి ఆది మొదట నామ సంవత్సరానికి ఎలా అయితే వస్తున్నామో అలా ఈ బ్రహ్మాండ చక్రము కూడా 71 మహాయుగాలు పాటు తిరిగి మొదటి మహా యుగానికి వస్తుంది అన్నమాట. ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరములో 28వ మహాయుగంలో ఉన్నాము అంటే ఈ యుగంలో మేము యోగసాధన స్వప్న పాత్ర వేసినాము.తద్వారా కపాల మోక్షజ్ఞానమును పొందడం జరిగినది. అంటే ఆదిలో 28వ మహాయుగం లోని నాలుగు యుగాలలో వరుసగా సత్య యుగము నందు ఆదియోగిగా త్రేతా యుగము నందు శివాంశ హనుమంతుడిగా ద్వాపరయుగము నంది వేదవ్యాసుడుగా కలియుగమునందు శ్రీ పవనానంద సరస్వతిగా జీవ నాటకము నందు జీవ పాత్రలు వేసినాము. అంటే ప్రతి 28వ మహాయుగంలో జీవ పాత్రలు తిరుగుతూ ఉంటాయి. అనగా బ్రహ్మాండ చక్రం 71 మహాయుగాలు పూర్తిచేసుకుని 28వ మహాయుగం వచ్చిందాకా ఈ విశ్వములో స్వప్న జీవ నాటకములో మాత్రం నా జీవ పాత్ర ఉండదు.కనిపించదు. అప్పటిదాకా మేము నిశ్చల స్థితిలో పరమ శాంతిని పొందుతూ మౌనముగా సాక్షీభూతముగా ఆకాశ శరీరముతో రేణువు అంత పరిమాణములో శ్రీ బాబా విభూది నాధ్ గా శూన్య బ్రహ్మగా ఆటలో అరటి పండు లాగా ఉండే దృశ్యమే మనకి కనపడుతుంది. ప్రతి వారికి ఏదో ఒక మహా యుగము లో ఇలాంటి యోగసాధన పాత్ర వేసుకునే ఉంటారు. ఆ పాత్ర వచ్చేదాకా మరణము లేని చిరంజీవులుగా ఉంటారు. పరమ శాంతితో నిశ్చల స్థితిలో ఉంటారు. ఇదంతా కూడా రికార్డు విషయాలని దృశ్యాలని మర్చిపోకండి. అనగా ఆదిలో అందరి స్వప్న పాత్రలు అలాగే మన దైవాల స్వప్న పాత్రలు మరియు మన పరమాత్మ స్వప్న పాత్రలు అన్నీ కూడా ఈ బ్రహ్మాండం చక్రమునందు 96 నిమిషాలపాటు అనగా 71 మహాయుగాలు రికార్డింగ్ అయిన విషయం తెలుసుకోండి. వాటిని తిప్పి తిప్పి బ్రహ్మాండ చక్రం చూపిస్తోంది. మనం చూస్తున్న దృశ్యం కూడా ఒక రికార్డు అయింది అని గ్రహించండి. విచిత్రమేమిటంటే నా పుట్టిన తేది 27 కావటం అలాగే చక్రము నందు 27 యుగాల సజీవ పాత్రలు రికార్డు అవడం ఆశ్చర్యంగా ఉంది. 
 
ఇప్పటికైనా మన యోగసాధన ఎందుకు సంపూర్తిగా లేదో అర్థమైందా. ఎందుకంటే ఆదిలో మనము మన అసంపూర్తి సాధన దృశ్యాలే రికార్డయ్యాయి. సాధన పూర్తి అవుతున్న సమయంలో ఆదిలో మనకి మనమే పాత్ర అంతం చేసుకోవాల్సిన చోట కొత్త పాత్రతో ఆరంభం చేసుకున్నాము. అవే దృశ్యాలు ఈ 36 కపాలాలు రికార్డు చేయడంతో వాటికున్న 96 నిమిషాలు రీలు అయిపోవడంతో అవే దృశ్యాలు మన బ్రహ్మాండ చక్రమునందు జీవ దృశ్యాలుగా 71 మహాయుగాలు పాటు తిప్పితిప్పి ప్రదర్శించబడుతోంది. ఒక మన్వంతర కాలము అన్నమాట. ఇప్పుడు మీరు చదువుకున్న ఈ గ్రంథం కూడా ఆదిలో ఒకప్పుడు రికార్డు దృశ్యమే అన్నమాట. అంటే మనమంతా మన దైవాలు అంతా మన పరమాత్మలు అంతా మనకి కనిపించే దంతా ఈ విశ్వం అంతా కూడా ఆది లో జరిగిన రికార్డు స్వప్న దృశ్యమే అని గ్రహించండి. ఇక చేయటానికి పొందటానికి ఏమి ఉంటుంది. ఏమీ లేదు కదా. రికార్డు శూన్య స్వప్నమే కదా. దానినే మనం చేస్తున్నట్లుగా చూస్తున్నాం కదా. దీనమ్మ జీవితం! నేను పుట్టడం ఒక రికార్డు దృశ్యమే. నేను పెరగడం ఒక రికార్డు దృశ్యమే. నేను చదవటం, నేను ఉద్యోగాలు చేసుకోవటం, నేను పెళ్లి చేసుకోవటం, నేను ఏడవడం, నేను సంతోష పడడం, నేను బాధ పడటం, నేను వైరాగ్యం చెందటం, నేను సాధన చేయడం, శివ భక్తుడుగా మారటం, నేను యోగ సాధకుడుగా మారటం, నేను జ్ఞాన యోగిగా మారటం, నేను గ్రంథకర్తగా మారటం, యోగసిద్ధి పొందటం, జీవ సమాధి చెందటం, కపాల మోక్షం పొందడం అంతా కూడా ఆదిలో రికార్డు దృశ్యమే అంటే ఎవరికైనా పిచ్చి ఎక్కకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఎక్కుతుంది కదా. అది కూడా ఎందుకంటే పిచ్చెక్కిన దృశ్యాలు కూడా రికార్డ్ అయి ఉంటాయి కదా. అందుకే కాబోలు ఆదియోగి ఇదంతా కూడా ఒకప్పటి రికార్డు దృశ్యమేనని గ్రహించి మౌనం వహించాడు. అంటే ఇందులో కొత్తగా పుట్టడం లేదు చనిపోవడం లేదు. జన్మ లేదు. కర్మ లేదు. పాపము లేదు. పుణ్యము లేదు. సాధన లేదు. సమాధి లేదు.ముక్తి లేదు.మోక్షం లేదు. ఇది తెలిసిన పరమ హంసలు, పరమ అవధూతలు బాల ఉన్మత్త పిశాచ అవస్థలు పొంది పిచ్చి వాళ్ళు మాదిరిగా తయారవుతున్నారు. ఇది తెలిసిన మన దైవాల కూడా నిత్య స్మశానవాసిగా ఉంటున్నారు. ఎందుకంటే ఇది కూడా రికార్డు దృశ్యమే కదా. ఆదిలో నేనేదో జ్ఞానం పొందేనని నేను అనుకోవడం ఎందుకు? అందరికీ చెప్పాలని ఈ గ్రంథాలు రాయడం ఎందుకు? ఇది కూడా ఒక రికార్డ్ దృశ్యమే కదా. ప్రతి 27వ మహాయుగంలో ఇప్పుడు ఎవరైతే ఈ గ్రంథమును చదువుతారో అలాగే నా అంశతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రికార్డ్ అయినారు అన్నమాట. అంటే ప్రతి ఇరవై ఏడోవ మహా యుగము నందు ఇప్పుడు ఏమి చేసినామో అదే చేస్తాం కదా. ఎందుకంటే ఆది 27 మహాయుగంలో ఏది అయితే రికార్డయిందో అది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం అన్నమాట. ఎలా అంటే ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరం అయినా వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. అందులో 27 మహాయుగంలో చివరి యుగమైన కలియుగంలో ప్రథమ పాదములో ఉన్నాము అనగా ఒక మన్వంతరంకి 71 మహాయుగాలు ఉంటాయి. అంటే ప్రస్తుతం ఏడో మన్వంతరం అంటే ప్రస్తుతానికి 6x71=426 ఏడవ మన్వంతరం 27 మహాయుగం 426+27=453 మహాయుగాలు పూర్తయినాయి. ఆది ఒక మన్వంతరం లో తొంబై ఆరు నిమిషాల అనగా 71 మహాయుగాలులో రికార్డు అయిన దృశ్యం దృశ్యాలే పూర్తి అయినాయి. ఆరు మన్వంతరాలు మనము రికార్డు దృశ్యాలు చూశామని ఈపాటికే గ్రహించండి. అనగా ప్రతి మన్వంతరములో వచ్చే ప్రతి 27 మహాయుగము నందు నాలుగు యుగాలలో రికార్డైన నా జీవ పాత్ర దృశ్యాలే నా అంశ పాత్ర దృశ్యాలే నేను అలాగే మీరు చూస్తున్నాము అన్నమాట. అంటే దాదాపుగా గత యేడు మన్వంతరాలలో అనగా 453 మహా యుగాలలో ఇదే రికార్డు దృశ్యాలు నేను చూస్తున్నాను మీరు చూస్తున్నారు అన్నమాట. ఇదంతా చూస్తుంటే నాకైతే పిచ్చెక్కుతోంది. మరి మీ పరిస్థితి ఏమిటో ఆ పరమ శూన్యమునకే తెలియాలి.ఈ గ్రంథం ద్వారా మనము ప్రస్తుతము ఏడో మన్వంతరము లోని 27 మహా యుగము ద్వారా కలుసుకోవడం జరిగింది కదా. ఇదే రికార్డు దృశ్యము మనకి రాబోయే ఎనిమిదో మన్వంతరములో 27వ మహాయుగంలో ఇదే దృశ్యమాలికను చూస్తాము. కలుస్తాము. జరిగేది జరగక మానదు. జరగనిది ఎన్నటికీ జరగదని నా సందేశంగా తీసుకోండి.
 
అలాగే బ్రహ్మరంధ్రము లోని బ్రహ్మ తేజస్సు కలిగిన బ్రహ్మాండ చక్రం తన చుట్టూ తాను తిరుగుతూ తన పరిధిలో ఉన్న అంగుళము వంటి సంకల్ప శరీరాలను తనలో ఇముడ్చుకుంటున్నది. ఒకసారి ఇవి తనలోనికి వెళ్ళిన తర్వాత బయటికి రావు. కాకపోతే ఈ బ్రహ్మాండ చక్రం వెనక్కి తిరిగితే నెమ్మది నెమ్మదిగా అప్పుడు తనలో ఉన్న సంకల్ప శరీరాలను నెమ్మది నెమ్మదిగా బయటికి విరజిమ్మే అవకాశాలున్నాయి. అంటే బ్రహ్మాండ చక్రములో మొదటలో తనలోకి అన్నిటిని తీసుకుంటుంది. ఆ తర్వాత ఉన్న వాటినన్నిటిని తీసుకోవటానికి దీనికి ఒక మన్వంతర కాలము అనగా 30,67,20000 వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఇది వెనక్కి తిరుగుతూ తనలో ఉన్న వాటిని తిరిగి బయటకు పంపించడానికి ఒక మన్వంతర కాలం పడుతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే ఈ చక్రము రికార్డు చేసిన దృశ్యాలు 71 మహాయుగాలు అనగా మన్వంతర కాలమునకు సరిపోతాయని తెలుసు కదా. ఈ 71 మహాయుగాలు అనగా 284 యుగాలతో సమానం (అనగా ఒక మహా యుగము నాలుగు యుగాలలో సమానము) ఈ విశ్వంలోని ప్రతి అణువు యొక్క దృశ్యాలు ఈ యుగానికి యుగ కాలానికి సరిపోయేటట్లు గా రికార్డు చేసినాయి. సెకండ్ కాలమును 1000 భాగాలు చేసి అందులో వచ్చిన కాలమును మళ్లీ వంద భాగాలు చేస్తే ఎంత కాలము వస్తుందో కలికాలంలో అనగా ఒక లిప్త కాలంలో 36 కోట్ల దృశ్యాలు నిక్షిప్తము చేసినాయి అని గ్రహించండి. ఒక లిప్త కాలము అంటే కనురెప్ప మూసి తెరిచే సమయంలో మన శరీరం చర్య దృశ్యాలు ముప్పై ఆరు కోట్లకు చేరింది అని తెలుసుకోండి. ఇలా 71 మహాయుగాలు లో ఎవరికి తగ్గట్లుగా వారు ఆదిలో చేసిన జీవ పాత్ర దృశ్యాలను నిక్షిప్తం చేసుకున్నాయి. ఒక మనిషి జీవిత కాలం 120 సంవత్సరాలు అనుకుంటే ఒక లిప్త కాలంలో 36 కోట్ల దృశ్యాలు కదులుతూ ఉంటే ఆ లెక్కన చూస్తే ఎన్ని కోటాను కోట్ల దృశ్యాలను నిక్షిప్తం చేసుకుని ఉంటాయో కదా. అంటే మనమే మహాయుగంలో మన జీవ పాత్ర రికార్డ్ విషయాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే యోగ సాధన చేస్తే మనకి తెలుస్తుంది. అది కూడా సాధన ద్వారా మనం తెలుసుకున్న దృశ్యాలు చూసే దృశ్యాలు ఉండాలని గుర్తుంచుకోండి. లేకపోతే మీకు అనుభవాలు అనుభూతులు కలగవు. ఇలా కలగని వారిని మాయలో ఉన్నారని మన వాళ్ళు చెప్పడం జరిగినది. అంటే మీ సాధన దృశ్యాలు రికార్డు అవ్వలేదు అన్నమాట లేదా మీరు ఆదిలో సాధన చేసి ఉండకపోవచ్చు. అలాగే బ్రహ్మాండ చక్రము తనలో మన పాత్ర దృశ్యాలు ఏ యుగములో తీసుకునే దృశ్యాలు రికార్డు అయ్యాయో ఆ యుగం వచ్చేవరకు మనం బయట ఉంటాము. అలాగే ఏ యుగము వచ్చినప్పుడు మన పాత్ర దృశ్యాలను తన లో నుంచి బయటికి పంపించి రికార్డ్ దృశ్యాలు వచ్చేదాకా మనము ఈ బ్రహ్మాండ చక్రము నందు నిశ్చల స్థితిలో ఉంటాము. అనగా ఆటలో అరటి పండు లాగా అన్నమాట.దీనినే కపాల మోక్షం పొందడం అవుతుంది. జీవసమాధి సిద్ధి లేదా జీవన్ముక్తి అవుతుంది. ఇది ప్రతి జీవికి తప్పనిసరిగా జరుగుతుంది. ఇది రికార్డయిన దృశ్యాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఒకరికి 27 మహాయుగములో రికార్డు అయితే మరొకరికి 28వ మహాయుగంలో రికార్డు అవుతుంది. అంటే మనము సాధన చేసినా చేయకపోయినా వాడు బ్రహ్మాండ చక్రము నుండి బయటకి రావడం లేదా లోపలికి వెళ్లడం చేస్తాడు. దీనికి కర్మలు పాపపుణ్యాలు దైవ పూజలు కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో ధ్యాన మార్గాలలో ఇలా మనకు వాటిలో ఎలాంటి సంబంధం ఉండదు. గడియారం ముల్లు ఎలా అయితే మన ప్రమేయం లేకుండా తిరుగుతుందో అలా ఈ బ్రహ్మాండ చక్రం కూడా దీని ప్రమేయము లేకుండా సంబంధం లేకుండా దేనితోనూ సంబంధం లేకుండా తన పనులు అనగా ఒకటి తీసుకోవడం రెండోది బయటికి వదిలి పెట్టడం చేస్తుంది. తనలోకి తీసుకోవటాన్ని మోక్షమని తన నుండి బయటకు వదిలి పెడితే అది మాయ అని అర్థం చేసుకోండి. బయటకు వచ్చినవాడు భోగి అయితే లోపలికి వెళ్ళినవాడు యోగి అవుతాడు. భోగి అయిన వాడు యోగి అవ్వక తప్పదు. అలాగే ఒకప్పుడు యోగిగా ఉన్నవాడు తిరిగి భోగిగా మారక తప్పదు. ఇదే పునరపి జననం పునరపి మరణం అన్నమాట. బ్రహ్మాండ చక్రములోనికి వెళ్ళడము మరణము అయితే బ్రహ్మాండ చక్రములోని నుండి తిరిగి బయటకు రావడం అనేది జననము అన్నమాట. 
 
ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. సాధన చేసిన వాడికి అలాగే సాధన చేయనివారికి తేడా లేనప్పుడు ఎందుకు విగ్రహ పూజలు విగ్రహారాధనను యోగసాధన పెట్టినారు అని సందేహం రావచ్చు. ఈ సమాధానం ఏమిటంటే సాధన చేసిన వారు త్వరగా బ్రహ్మరంధ్రము వద్దకి అనగా 20 లిప్తల కాలము అనగా ఒక నిమిషం నుండి 12 సంవత్సరాల లోపల ఉంటే సాధన చెయ్యని వాడు పది లక్షల సంవత్సరాలకు చేరుకుంటాడు. ఎవరైతే మోక్షం పొందాలని అనుకుంటారో అనగా యోగి కావాలని అనుకుంటారో వారు తప్పనిసరిగా సాధన చేయవలసి ఉంటుంది. కాకపోతే ఈ సాధన చేయటం వలన త్వరగా చేరితే సాధన చెయ్యకపోతే చాలా ఆలస్యంగా చేరుకుంటారు. అనగా సాధన చేసిన వాడు కుందేలు అయితే సాధన చేయనివాడు తాబేలు అన్నమాట. చివరికి ఇద్దరూ కూడా చేరే కాలాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అంతిమంగా బ్రహ్మాండ చక్రమునందు లయము పొందుతారు. జీవన్ముక్తిని పొందుతారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ప్రస్తుతం మనము గడిచిపోయిన ఆదిలో మనం చేసిన జీవ దృశ్యాలు మనం చూస్తున్నాము కదా. కొత్తగా మీరు సాధన ఏమీ చేయరు. ఆది పాత్రలో యోగ పాత్ర అనగా యోగసాధనా దృశ్యాలు ఉంటే ప్రస్తుతం అది మీకు అనుభూతి దృశ్యాలుగా కనిపించేసరికి మన మేదో గొప్ప యోగసిద్ధి పొందినట్లుగా మనం ఏదో కష్టపడి సాధన చేస్తున్న అనుభవం అనుభూతి పొందినట్లుగా మనకనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాధన దృశ్యాలు కూడా ఒకప్పటి రికార్డు దృశ్యమే కదా. అంటే మీరు ఆదిలో ఈ యుగంలో బ్రహ్మాండ చక్రములోని కి వెళ్ళినారు. ఆ యుగం వచ్చేదాకా మీరు భోగి అలాగే ఆ యుగంలో మీరు బయటికి వచ్చినారు. ఆ యుగము వచ్చేదాకా మీరు యోగి విచిత్రమేంటంటే ఈ విశ్వంలోని ప్రతి అణువు కూడా ప్రతి జీవి కూడా ప్రతి దైవం కూడా ప్రతి పరమాత్మ కూడా ఈ రెండు పాత్రల దృశ్యాలు అనగా యోగి అలాగే భోగి పాత్ర దృశ్యాలు 48 నిమిషాల చొప్పున మారుస్తూ తొంబై ఆరు నిమిషాలు ఈ రెండు పాత్రలు చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అంటే భోగి పాత్ర నుండి 48 నిమిషాల పాటు వేస్తే 48 గంటలపాటు యోగి పాత్ర వేశారు అన్నమాట. చేసిన తప్పు ఏమిటంటే ఏ పాత్రని కూడా సంపూర్తిగా వేయలేదు. అంటే ఏకధాటిగా తొంభై ఆరు నిమిషాల పాటు ఓకే భోగి పాత్ర లేదా ఓకే యోగి పాత్ర వేసి ఉంటే మనకి ఈ తిప్పలు ఉండేవి కావు. అంటే బ్రహ్మాండ చక్రము నందు నిరంతరముగా తిరిగే అవకాశం ఉండేది కాదు. అనగా సంపూర్ణ ఏకపాత్ర అంటే జననం నుండి శాశ్వత మరణం పొంది ఉంటే అనగా మనో నిశ్చల స్థితి పొంది ఉంటే మన తలలో అలాగే విశ్వంలో ఉన్న బ్రహ్మరంధ్రం యొక్క బ్రహ్మాండ చక్రము కూడా శాశ్వత నిశ్చల స్థితికి వెళ్ళిపోయేది. దానితో ఒకసారి రికార్డయిన పాత్ర దృశ్యాలు త్రిప్పి త్రిప్పి  కనిపించేవి కావు. అంటే సినిమా హాల్ లోని ప్రొజెక్టర్ పని చేయకపోతే సినిమా రీలు ఏమి తిరుగుతుంది. ఈ రీలు తిరగకపోతే తెర మీద ఏ దృశ్యాలు కనిపిస్తాయి. కనిపించవు కదా.అలాగే ఈ బ్రహ్మాండం చక్రము తిరగకపోతే ఈ కనిపించే కదులుతున్న విశ్వమంతా కూడా ఎప్పుడో నిశ్చల స్థితిని పొంది ఆగిపోయేది కదా. కానీ అలా జరగలేదు కదా. ఎప్పుడైతే 48 నిమిషాల నుంచి ఒక పాత్ర వేయలేక అదే రూపం పునర్జన్మగా అదే పాత్రలో తిరిగి వెయ్యడమే మన కొంపముంచింది. దానితో బ్రహ్మాండ చక్రము నిశ్చలస్థితి పొందకుండా చలన స్థితిలో ఉండి పోయింది. అనగా మనము శాశ్వత మరణము పొందకుండా భౌతిక మరణమును పొందినాము కదా. ఆదిలో తొంభై ఆరు నిమిషాల పాటు  ప్రతి 48 నిమిషాలకి కొత్త పాత్ర వేయడం ఎందుకు ఇప్పుడు కష్టాలు పడడం ఎందుకు ఏమంటారు నిజమే కదా. మీరు ఏమని అనాలన్నా ఆ దృశ్యం కూడా రికార్డ్ అయి ఉండాలి కదా. రికార్డ్ అయి ఉంటే మీకు తెలుస్తుంది. లేకపోతే తెలియదు. కాకపోతే ఆదిలో తన పాత్ర రికార్డయిన దృశ్యాలు చూసుకోవడం తప్ప మనం ఏమి చేయలేము కదా. మనం చూస్తున్న దృశ్యం కూడా ఒక రికార్డు దృశ్యమే కదా. అనగా సినిమా హాల్లో మీరు సినిమా చూస్తున్న దృశ్యమే ఇక్కడ అయితే ఎలా ఉంటుందో అలా మన అందరి పరిస్థితి ఉంది. తెలిసినవాడు మహా పిచ్చి వాడు అవుతాడు.తెలియని వాడు అదృష్టవంతుడు. అందుకే మన పెద్దలు వేదాంతులకి పిసరంత వెర్రి ఉంటుందని జ్ఞానికి తనకు తెలిసిన విషయం ఇతరులకు చెప్పకుండా ఉండలేని మాయరోగము ఉంటుందని చెప్పకనే చెప్పినారు కదా. ఈ రెండు స్థితులు మేము ఆదిలోనే పొందినామని రికార్డ్ విషయాలు మాకు కనిపించిన తర్వాత ఇది నిజమేనని మాకు అర్థమయింది. కాకపోతే ఏమిటి తాడుని చూసి పాము అని భ్రమ పడటం ఎందుకు అది పాము కాదని తాడు అని జ్ఞానం పొందడం ఎందుకు. ఇలా జ్ఞాని అయితే ఈ విషయం పదిమందికి చెప్పాలని గ్రంథాలు రాయడం ఎందుకు. మన పెద్దలు చెప్పిన జ్ఞానికి ఇతరులకు తనకు తెలిసిన విషయం చెప్పాలని మాయరోగము ఉంటుందని నా విషయంలో నిజమైనది కదా. అలాగే సృష్టి అంతంలో అనగా వేదాంతంలో చిట్టచివరి స్థితి ఏముందో ఉన్నది అని అనుకోవడం ఎందుకు అక్కడ పరమ శూన్యము యొక్క స్వప్న జీవన నాటక రికార్డు దృశ్యాలు ఉంటాయని తెలుసుకుని వేదాంతిగా మారి వెర్రి ఎక్కించుకోవడం ఎందుకు. వేదాంతులకి వెర్రి ఉంటుందని ఈ విషయం కూడా నా విషయంలో నిజమైంది కదా.
 
అలాగే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే ప్రాణంలేని కపాలాలు ఈ దృశ్యాలను రికార్డు చేసినాయని అన్నప్పుడు దీనికి సమాధానం ఆదిలో ఆది యోగి మన సదాశివమూర్తి ప్రాణంతో ఉన్నా 36 తలలు ఉండేవి. ఆయన సమాధి చెందనంతవరకు ఇవి కూడా ప్రాణంతో ఉండి విశ్వ జీవ నాటకం రికార్డు చేసినాయి. కాకపోతే సంపూర్ణంగా రికార్డు చేయలేదు. ఎందుకంటే ఈ 36 కపాలాలకి 96 నిమిషం నిడివి గల రీలు ఉందని అనుకున్నాము కదా. నిజానికి నూట ఎనిమిది నిమిషాల నిడివిగల రీలు ఉండాలి. ఎలా అంటే 36 నిమిషాలు సృష్టి కార్యాలు 36 నిమిషాల స్థితి కార్యాలు 36 నిమిషాల లయ కార్యాలు ఆది లో రికార్డు ఈ 36 తలలు మనోనేత్రాలు కెమెరాలాగా ఉండి రికార్డు చేయాలి. కానీ ఇందులో 36 నిమిషాలు సృష్టి అలాగే 36 నిమిషాల స్థితి దృశ్యాలు సంపూర్ణంగా రికార్డు చేసిన అదే లయ కార్యక్రమ దృశ్యాలు వచ్చేసరికి 36 నిమిషాల బదులుగా ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే రికార్డు చేసి మిగిలిన ఒక నిమిషము ఏమీ రికార్డు చేయలేదు. ఎందుకంటే రికార్డు చేసేవాడు 35 నిమిషాలకు చనిపోవడంతో ఈ తలలు కూడా పనిచేయక 36 కపాలాలుగా మారిపోవడంతో అసంపూర్తిగా ఆ లయ కార్యక్రమ దృశ్యాలు రికార్డు చేసినాయి. ఎంత వరకు అంటే అత్యంతిక ప్రళయాలు విషయాలు వరకు మాత్రమే రికార్డు చేసినాయి. అటుపై సదాశివమూర్తి సమాధి చెందటం ఈ 36 తలలు 36 కపాలాలుగా మారిపోవడంతో ఈ ప్రళయములో ఏం జరిగిందో రికార్డు చేయలేదు. దానితో లయ కార్యక్రమ దృశ్యాలు అసంపూర్ణంగానే రికార్డయ్యాయి. అందుకే కాబోలు చనిపోయినవారికి తాను ఎప్పుడు చనిపోతాడు తెలుసుకుంటాడు కానీ తను చనిపోయిన విషయం తెలుసుకోలేకపోయాడు. తెలుసుకుంటే మరణించినట్లు కాదు కదా ప్రాణం ఉన్నట్లే కదా. అంటే యోగులు కూడా తాము మోక్షము పొందినామో లేదో ఖచ్చితంగా చెప్పలేని విచిత్ర అనుభవం అనుభూతియే మోక్షం అని చెప్పడం జరిగినది. మోక్షం అంటే ఒక రకంగా మరణం లాంటిదే. అంటే ఈ 36 తలలు మోక్షము స్థితి వరకే రికార్డు చేసినాయి. అది పొందినామో లేదో రికార్డు చేయలేదు. రికార్డు చేస్తే మనం పొందినట్లు కాదు కదా. చేయకపోయినా అయినట్లేనా. అయినట్లేనని కాదు కదా. సాక్ష్యం లేదు. అది జరిగిందో జరగలేదో తెలియని అంశంగా మిగిలిందనేది నగ్నసత్యం. ఒకవేళ జరిగితే అది జరిగినట్లు కాదు. జరగకపోతే అది జరిగినట్లే అనుకోవటానికి లేదు. ఆదిలో లయ కార్యక్రమంలో ఆఖరి నిముషంలో ఏమి జరిగిందో ఎవరికీ ఎన్నటికీ ఎవరు కూడా తెలుసుకోలేరని మనము నమ్మవలసిన నగ్నసత్యం. ఎవరైనా అది తెలుసుకున్నానని ఎవరైనా చెపితే వాడు తెలుసుకో లేదని అర్ధమే కదా. ఇది తెలుసుకోవడానికి ప్రాణం ఉండాలి కదా. ప్రాణం ఉంటే ఏమి తెలుసుకోనట్లే కదా. మరణించిన వాడికి ప్రాణం ఇస్తే ఇక వాడు మరణించిన వాడు ఎలా అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే నడిచే సూర్యుడు ఎన్నటికీ చీకటి చూడలేడు. వెలుతురు ఉన్న చోట చీకటి అనేది ఉండదు కదా. ప్రాణం ఉన్న చోట మరణం ఉండదు కదా. కాబట్టి మన మరణ రహస్యం ఎప్పటికీ దైవరహస్యముగానే చిదంబర రహస్యంగానే ఉండిపోక తప్పదు. దానిని చేధించేవాడు భేధించేవాడు ఎవడు లేడు. ఎవడు ఉండడని మనము నమ్మవలసిన నగ్నసత్యం అని గ్రహించండి. ఇది శాశ్వతంగా ఎన్నటికీ మనకు తెలియని అంశగానే పరమ శూన్యములాగా అది ఉందో లేదో తెలియనట్లుగానే శాశ్వత మరణము పొందినామో లేదో ఎన్నటికీ తెలియదు. ఎవరు కూడా తెలుసుకోలేరు. అంటే మనము పూర్ణ కపాలమోక్షం స్థితిని పొంది ఉండవచ్చు లేదా పొందకపోవచ్చు. ఆడపిల్ల లేదా మగపిల్లాడు అన్నట్లుగా ఉంది మన మరణ రహస్యం పరిస్థితి. ఏమి జరిగినదో ఈ ఆలోచన చేసిన పరమ శూన్యమునకే తెలియాలి. అంటే మన కపాలమోక్షం స్థితి అర్థమై అర్థం కానీ మౌన స్థితియే కదా. అందుకే కాబోలు నిజ బ్రహ్మ జ్ఞానులంతా తమ సాధనా పరిసమాప్తిగా మౌన స్థితినే చిదంబర రహస్యం అయినా శ్రీ మేధా చిదంబర దక్షిణామూర్తి లాగా స్థితిని పొందడం జరుగుతుంది అనగా మాకు లాగా అన్నమాట. ఆదిలో సదాశివమూర్తి మొట్టమొదటిసారిగా జీవ సమాధి చెందటంతో ఆఖరి ఒక నిమిషంలో లయము ప్రళయంలో ఏం జరిగిందో రికార్డు చేయలేదు అన్నమాట. అంటే ఈయన సమాధి లో సంపూర్ణ కపాలమోక్షం పొందినాడో లేదో అనే విషయము రికార్డు చేయలేదు. ఇది రికార్డు చేసే ఆఖరి నిమిషంలో ఆ కపాలం అయినా సదాశివమూర్తి తల జీవసమాధిలోనికి వెళ్లిపోవడంతో ఆఖరి నిమిషం దృశ్యము రికార్డు అవ్వలేదు. ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఆయన మాత్రం మోక్షము పొందినాడో లేదో ఎవరికీ తెలియదు. తెలియకుండా పోయినది. ఎందుకంటే ఆఖరి ఘట్టము ఆఖరి ఒక్క నిమిషము రికార్డు కాలేదు. తర్వాత ఈయన 10 లక్షల సంవత్సరాల పాటు సమాధిలో ఉండి అస్తిపంజరం గా మారిపోయి 36 కపాలాలతో ఏకమూల కపాలములో ప్రాణశక్తితో తుంకారనాదంతో బయటికి వచ్చి సమాధి వరకు రికార్డైన దృశ్యాలను ప్రతి జీవి ఒక మూల కపాలంలో ధ్యాన అస్తిపంజరం రూపంలో చూసిన దృశ్యం చూస్తూ కాలం గడుపుతున్నాడు. అంటే అందుకే కాబోలు ప్రతి జీవి బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న మూల కపాలంలో మనకి ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం కనబడుతుంది. ఇది కూడా 36 కపాలాలతో కనబడుతుంది. ఇది నిజమేనని నా స్వానుభవం ద్వారా తెలిసినది. ఈయన అస్థిపంజరంగా మారాడా లేదా ప్రాణశక్తితో ఉన్నాడా లేదా ఎవరికీ తెలియదు. కేవలం ఎవరి బ్రహ్మరంధ్రము సాధన స్థితి వద్ద వారికి ఏక తల ఉన్న ధ్యానస్థితిలో ఉన్న అస్థిపంజరంగా కనపడుతుంది. అది ప్రాణంతో ఉందా లేదా ఎవరికీ తెలియదు. ప్రాణాలతో ఉంటే శరీరం ఉండాలి కదా. ప్రాణాలు ఉండటానికి శరీరమే అవసరం లేదని యోగులు అనుభవాలు చెబుతున్నాయి. పాండురంగ భక్తుడైన గోరా భక్తుడు చనిపోతే వారి ఎముకలు రంగా రంగా అంటూ నామ జపం చేసేవని జ్ఞాన దేవుడు లోకానికి చెప్పినాడు. అలాగే షిరిడి సాయిబాబా వారు తన ఏకాదశి సూత్రాలలో నా సమాధినుండి నా మానస శరీరం మాట్లాడును అని చెప్పడం జరిగినది. అలాగే దత్తాంశ దత్త గురువులు కూడా సమాధి చెందినప్పుడు వారి సమాధి నుండి మనకు కావలసిన జ్ఞానబోధ చేస్తారని వారు భక్తులకు చెప్పడం జరిగినది. అంటే ఈ లెక్కన చూస్తే అస్థిపంజరానికి ప్రాణము ఉన్నట్లే కదా.కానీ అదే మనిషి చనిపోతే ప్రాణం లేని అస్థిపంజరం మిగిలిపోతే యోగి చనిపోతే అది అనగా సమాధి చెందితే మరి వీళ్ళకి అస్థిపంజరాలలో ప్రాణశక్తి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అంటే ఈ లెక్కన మనిషి బూడిద కూడా ప్రాణశక్తి ఉన్న విభూదిగానే మనం గుర్తించాలి. ఎందుకంటే మనిషి చనిపోతూ తన ప్రాణ శక్తి కాస్త ప్రాణము ఉన్న బూడిదగా మారుతున్నాడు అన్నమాట. అందుకే కాబోలు భస్మాసురుడు నుండి ప్రాణశక్తి ఉన్న శరీరాలు పుట్టుకొచ్చాయి. ఈ లెక్కన భోగి అలాగే యోగి చనిపోవడం లేదు కదా. భౌతిక మరణంతో భోగి తన శరీరమును విడిస్తే జీవ సమాధి పేరుతో యోగి తన శరీరమును త్యాగం చేస్తున్నాడు.
 
అంటే ఈ లెక్కన ఎవరికీ మరణం లేదు అంటే ఆఖరి నిమిషంలో మనం పొందిన శాశ్వతమైన మరణ దృశ్యాలు ఆఖరి కపాలమైన సదాశివమూర్తి కపాలం రికార్డు చేయలేదు. కేవలం తాను అస్థిపంజరంగా మారేదాకా మాత్రమే రికార్డు చేయడంతో నిజానికి శాశ్వత మరణం పొందిన కూడా రికార్డు దృశ్యాలతో ప్రాణమున్న అస్థిపంజరం ద్వారా రికార్డు అవటంతో మన శాశ్వత మరణ రహస్యం అయోమయ స్థితిలో పడిపోయింది. దానితో మనం శాశ్వత మరణం పొందామో లేదో తెలియని అర్థమై అర్థం కాని స్థితి పొందటం జరిగింది.ఇది కాస్త చిదంబర రహస్యం అయినది. ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చును. మనం నిజంగానే శాశ్వత మరణం పొందే అదే నిశ్చలస్థితి పొందితే మరి మన బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి ఎలా తిరుగుతోంది. అది కూడా నిశ్చల స్థితిని పొంది శాశ్వతంగా ఆగిపోవాలి కదా. అన్నప్పుడు దీనికి సమాధానముగా నిజానికి సదాశివమూర్తి జీవసమాధి చెంది అస్థిపంజరం మారే సమయంలో ఈయన తను చేసిన జీవ నాటకం మళ్లీ ఒకసారి చూడడం జరిగినది. దీనితో బ్రహ్మాండ చక్రము తిరుగుతూ ఆయన వేసిన  జీవ నాటకం రికార్డు చేసింది. తరువాత ఆయన ఎప్పుడైతే జీవసమాధిలో తను వేసిన నాటకం లో చూడాలని అనుకున్నాడో అప్పుడు బ్రహ్మాండ చక్రం వెనక్కి తిరిగి తను రికార్డు చేసిన నాటక దృశ్యాలను కొద్దిగా ఒక మన్వంతరము కాలంపాటు చూపించడం జరిగింది. దానితో ఈయన తను చేసిన నాటకం దృశ్యాలను అలాగే నాటకంలోని పాత్రలు చూసి విపరీతమైన బ్రహ్మానంద స్థితిని పొంది శాశ్వత మరణమైన కపాలమోక్షం స్థితిని చిట్టచివరి ఆఖరి నిమిషంలో పొందటం జరిగింది. కాకపోతే ఆఖరికి అపారమైన అస్థిపంజరంగా మారి వెనక్కి తిరిగి జరిగిన నాటకము చూసేదాకా మాత్రమే రికార్డు చేసి ఆఖరి నిమిషంలో ఆయన పొందిన శాశ్వతమైన సంపూర్ణ కపాలమోక్షం స్థితి ఆఖరి కపాలము రికార్డు చేయలేదు. ఎందుకంటే ఈయన అప్పటికే శాశ్వత మరణమును పొందినాడు కదా. మరి చనిపోయిన వాడికి ప్రాణం ఉండదు కదా. ప్రాణం లేకపోతే తల కాస్త కపాలముగా మారిపోవడంతో అది రికార్డు చేయలేకపోయింది. దానితో ఈయన చేసిన జీవ నాటకము అలాగే ఈయన చూసిన అదే జీవ నాటకము మాత్రమే రికార్డు దృశ్యాలుగా రికార్డ్ అవటంతో అదే బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి తిరిగి దృశ్యాలు రికార్డు అవడం తో మనం ఇదివరకు రికార్డు దృశ్యం నాటకమని చూస్తున్నాము. మనము చూస్తున్న విషయం కూడా ఒక రికార్డు దృశ్యం అని గ్రహించండి. దానితో మనకి బ్రహ్మాండ చక్రం ముందుకి వెనక్కి ఎప్పటికీ అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా తిరుగుతున్న రికార్డు దృశ్యాలే అన్ని కాలాల్లోనూ ఇదే కనబడుతుందని గ్రహించండి. ఇది ఆపటానికి ఆపే దృశ్యం రికార్డ్ కాకపోవడంతో సదాశివమూర్తి మోక్షము పొందిన విషయము అలాగే మనము శాశ్వతం మరణము పొందిన విషయము రికార్డు కాకపోవడంతో మనం  చనిపోయిన జీవులని మరి ఎన్నటికీ తెలుసుకోలేము. తెలుసుకోలేక పోతున్నాము. జరిగిపోయిన బతికున్న రికార్డు నాటక దృశ్యాలు చూస్తూ మనం బ్రతికే ఉన్నామని మనం జీవించే ఉన్నామని మనం ప్రాణాలతో ఉంటున్నామని మనము జనన మరణాలు పొందుతున్నామని మనం ఏదో చేస్తున్నామని మనమేదో పొందుతున్నామని మనం ఏదో కావాలని అనుకుంటున్నామని ఇలా పలు రకాల భావాలతో ఉంటున్నాము. నిజానికి ఇది నిజం కాదు కదా. ఇవన్నీ కూడా మనము బతికి ఉన్నప్పుడు తీసిన జీవన దృశ్యాలే కదా. అదే మనము చనిపోయినప్పుడు తీసిన దృశ్యాలు ఉంటే కథ మరోలా ఉండేది. కేవలము మనము చనిపోయిన కూడా ఆ దృశ్యాలు లేకపోవడంతో ఎప్పుడో బ్రతికి ఉన్న దృశ్యాలను నిజమని సత్యమని మనం నమ్మే మాయా స్థితిలో ఉన్నామని గ్రహించండి. ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. మనం బ్రతికి ఉన్నప్పుడు తీసిన దృశ్యాలు రికార్డు చేసినప్పుడు అదే మనము పోయినప్పుడు దృశ్యాలు రికార్డు చేయొచ్చు కదా దీనికి సమాధానం ఏమిటంటే ఈ విశ్వానికి ఒకే ఒక కెమెరామెన్ ఉన్నాడు అనుకుందాం. ఆయన బ్రతికి ఉన్నంత వరకు రికార్డు చేసినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన దృశ్యాలు రికార్డు చేయడానికి మరో వ్యక్తి లేడు కదా. అంటే ఈ సృష్టిలో ఏకైక ఆత్మ ఒక్కటే ఉన్నదని మరొకటి లేదని ఏకాత్మ కాస్త ఆలోచన వలన విభేదనము చెంది అనేక ఆత్మలుగా మారిందనేది వేదాంతం చెబుతోంది కదా. మరి ఏకైక ఆత్మ ఉన్నప్పుడు అన్ని రకాల దృశ్యాలను రికార్డు చేసింది. ఎప్పుడైతే ఈ ఆత్మ జీవ సమాధి చెందినదో తన మరణం దృశ్యాలను రికార్డు చేయలేదు. రికార్డు చేయలేదు కదా చేస్తే ఆయన మరణించినట్లు కాదు కదా. చనిపోయినాడు అంటే వారిలో ప్రాణశక్తి లేనట్లే కదా. ప్రాణ శక్తి ఉంటే వాడు మరణం పొందినట్లు కాదు కదా. ఆలోచించండి. అంటే మీరు చనిపోయిన విషయం మీకు తెలియటం లేదు. ఎందుకంటే ఆమరణ దృశ్యాలు రికార్డు కాలేదు. రికార్డు అయితే మీరు మరణించినట్లు కాదు కదా. విషయం అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఇన్నాళ్ళు మేము అలాగే మీరు కూడా కేవలం జరిగిపోయిన రికార్డు అయినా అదికూడా బ్రతికి ఉన్న జీవ నాటక దృశ్యాలే అవి కూడా బ్రహ్మాండ చక్రము ముందుకి వెనక్కి తిరుగుతూ ఉండటం వలన అవే దృశ్యాలు యుగ యుగాలుకే యుగాలు చూస్తున్నాము. మనము మరణించిన అదే శాశ్వతం మరణమును అనగా సంపూర్ణ కపాలమోక్షం స్థితిని ఆదిలోనే పొందిన కూడా ఆ దృశ్యాలు వీడియో రికార్డ్ కాకపోవడంతో ఇప్పుడేదో మోక్షం పొందాలని యోగ సాధన చేయాలని నానాతంటాలు పడుతున్నామని మరి ఈ పాటికి గ్రహించి ఉంటారు. నిజానికి మోక్షం లేదు ముక్తి లేదు. సాధన లేదు సాధించేది లేదు అనుభవం లేదు అనుభూతి లేదు. ఏమీ లేదు కదా. ఉన్నదంతా గతంలో మనం బ్రతికి ఉన్నప్పుడు జరిగిన జీవ నాటక రికార్డు దృశ్యాలే ఉన్నాయని తెలుసుకోండి. మనము చనిపోయిన దృశ్యాలు లేనందువలన మనకి కనిపించేదంతా సత్యం గాను కనిపించనది అసత్యము గాను కనపడుతోందని తెలుసుకోండి. కానీ నిజానికి మన కనిపించేదంతా కూడా గతంలో జరిగిన రికార్డు దృశ్యాలు కావటం వలన అది అసత్యమైనదని అలాగే గతంలో ఆదిలో మనము మరణించిన దృశ్యాలు రికార్డు కాకపోవడంతో కనిపించనది సత్యమని గ్రహించండి. మీరు నిజా బ్రహ్మజ్ఞాని అయినట్లే మీకున్న మాయ మాయం అయినట్లే. ఇది కూడా మీ పాత్రలో రికార్డు దృశ్యం అయితే కానీ మీరు నమ్మలేరు అని గ్రహించండి. నీ చేతలలోను నా చేతుల్లోనూ ఆ భగవంతుడు చేతుల్లోనే చిట్టచివరి మిగిలిపోయినా అది ఉందో లేదో తెలియని పరమశూన్యము చేతిలో ఏమీ లేదని అంతా కూడా మనము ఆదిలో వేసిన జీవ నాటకంలోని రికార్డ్ అయిన జీవ పాత్ర విషయాలలోనే ఉన్నదని అది ఏమి రికార్డు చేసిందో మనము కూడా ఆ సదాశివమూర్తి లాగా సమాధి స్థితిలో ఉండి ఆయన ఎలా అయితే వెనక్కి తిరిగి తను చూసిన నాటకంను చూస్తున్నాడో అలా మనమంతా కూడా మన దైవాల అంతా కూడా మన పరమాత్మల అంతా కూడా జరిగిపోయిన జీవ దృశ్యాలు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నామని తెలుసుకుంటే అదే చాలు. ఈ గ్రంథం రాసినందుకు అలాగే ఈ గ్రంథం చదివినందుకు మీకు జ్ఞాన ఫలితం కలుగుతుంది. ఇలా జరగాలని మీకు అలాగే నాకు కూడా రికార్డు దృశ్యాలు ఉండాలని గ్రహించండి.లేకపోతే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆదిలో రికార్డ్ లో జరిగేది జరగక మానదు. ఇందులో రికార్డయిన దృశ్యాలు మనకి జరిగినట్టుగా కనపడుతున్నాయి. అదే జరగనిది ఎప్పటికి జరగదు. అనగా ఇందులో రికార్డు కానీ దృశ్యాలు లేనప్పుడు అవి ఎన్నటికి మనకి జరగదు అన్నట్లుగా కనబడతాయని నేను తెలుసుకున్న చిట్టచివరి నిమిషములోని ఆఖరి జ్ఞాన సత్యము.ఆపై ఇదంతా మనం చేసేదంతా చూసేదంతా కనిపించేదంతా ఒకప్పటి పరమశూన్యము యొక్క ఆది స్వప్నమైన జీవ నాటిక రికార్డు దృశ్యాలే నేను ఇన్నాళ్లుగా ఇన్ని కోట్లానుకోట్ల సంవత్సరాలు చూస్తున్నానని అనగా ప్రస్తుతానికి కోట్ల సంవత్సరాలు చూశాను అంటే చూసిన దానిని చూస్తున్నానని తెలిసినప్పుడు రికార్డు దృశ్యాన్ని చూస్తున్నప్పుడు పిచ్చి ఎక్కకుండా ఉంటుందా. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అది ఏమిటంటే ఇది ఆనంద రహిత సహజ స్థితి అన్నమాట. ఇన్నాళ్లు నేనేదో సాధన చేస్తున్నాను. నేనేదో జ్ఞాన అనుభవాలు అనుభూతులు పొందుతాను అని ఆనంద స్థితిలో ఉండే వాడిని. అనగా హృదయ చక్రం స్థితికి వచ్చినప్పుడు ఆనంద స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే మన సాధన స్థాయి బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకున్నదో నేను పొందిన అన్ని రకాల ఆనంద స్థితులు అలాగే సాధన స్థితిలు భౌతిక స్థితులు ఇవన్నీ కూడా ఒకప్పటి రికార్డు దృశ్యాలు అన్నప్పుడు తెలుసుకున్నప్పుడు అప్పటి దాకా పొందిన ఆనంద స్థితి దొబ్బి ఆనంద రహిత స్థితి అయినది. ఎందుకంటే ఇవన్నీ కూడా రికార్డు దృశ్యాలే కదా.
 
అంటే నేను కొత్తగా సాధన చేసింది అలాగే పొందినది ఏమీ లేదు కదా. పొందినాను నేను చేసినాను అని అనుకోవడం తప్ప దానితో నాకు ఉన్న ఆనందం దొబ్బి ఆనందం లేకుండా పోయింది. దానితోపరమ ప్రశాంత స్థితిని పొందడం జరిగినది. ఎలా అంటే ఇప్పటిదాకా సాధనలో ఎక్కడ ఆగిపోకూడదు అని ఆగ కూడదని ఏమాయ లోను పడకూడదని ఎవరి దగ్గర దేని దగ్గర సాధన ఆగిపోకూడదు అని ఏ సిధ్ధి దగ్గర ఏ యోగశక్తి దగ్గర దైవ సాక్షాత్కారము దగ్గర ఏ చక్ర స్థితి దగ్గర ఏ గురు దర్శనం దగ్గర  ఏ ఆత్మదర్శనం దగ్గర యోగసాధన ఆగిపోకూడదు అని నిరంతరంగా ఏదో తెలియని ఆందోళనలతో నిద్రలో కూడా బహు జాగ్రత్తలతో అవిశ్రాంతంగా విచిత్రంగా ఏదో తెలియని భయం తో ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఆదిలో రికార్డు అయిన దృశ్యం అని తెలిసినప్పుడు నా సామిరంగా ఇప్పుడు అసలు నాకు అసలు సిసలైన పరమ ప్రశాంతత స్థితిని పొందడం జరిగినది. దేనికీ భయపడలేదు. భయం లేదు. మాయ లేదు మర్మము లేదు. నేనెప్పుడూ అలాగే మీరంతా కూడా మనం ఎన్నాళ్ళనుంచో దేనినైతే పొందాలని అనుకుంటున్నామో నేను పొందటానికి చాలా రకాలుగా మధన పడతామో అదియే శాశ్వతం మరణమైన సంపూర్ణ కపాలమోక్షం స్థితిని అందరూ కూడా ఆదిలోనే పొందినారు అని తెలియగానే నా మనస్సు పరమశాంతి స్థితిని పొందడం జరిగినది.మనస్సే లేని స్థితి పొందటం జరిగినది.మౌనమే చిట్టచివరి స్థితి అయినది. ఇది ఇలా స్వానుభవ అనుభూతిగా తెలుసుకుని రాస్తున్నప్పుడు నా చేతులు అలాగే నా మనస్సు నా అధీనంలో లేవు. ఇదంతా కూడా రికార్డు దృశ్యమే అయినప్పుడు అందులో చిట్టచివరి బ్రహ్మరంధ్రము లోని అస్థిపంజరంగా అందరూ మారిన విషయం ఎవరికి వారే వారి యుగానికి తగ్గట్లుగా కాలములతో పాటు వారి జీవ పాత్రలు రికార్డ్ అయినది అని తెలుసుకోండి. కాకపోతే మీకు నాకు ఉన్న చిన్న తేడా ఏమిటంటే నేను నా జీవన నాటక పాత్ర దృశ్యము నాకు 27 మహాయుగంలో రికార్డయితే మీకు ఈ విషయము స్వంతంగా తెలియనంత వరకు మీకు మీది ఓ పాత్ర రికార్డయిన తెలుసుకోవాలి అంతే. మేము తెలుసుకున్నాము. ఇంకా మీరు తెలుసుకునే ప్రయత్నంలో ఉండి ఉండాలి అంటే మీ రికార్డ్ అయిన మీ పాత్ర దృశ్యాలు ఈ పాటికే చూస్తూ ఉండాలి. ఏదో చూడటానికి ఎదురు చూస్తూ ఉండాలి లేదా ఈ పాటికే చూసేస్తున్నారో మీకే తెలియాలి. నేను మాత్రం అలాగే ఈ గ్రంధమును చదివే వారంతా కూడా మొత్తానికి సంబంధించిన మీ జీవ పాత్ర దృశ్యాలు ఈ 27 మహాయుగాలు లోనివేనని గ్రహించండి. అంటే నేను చూడటం జరిగింది మీరు కూడా చూడటం జరుగుతూ ఉండాలి. నేనే మీరు కదా మీరే నేనే కదా. నేనే నువ్వు నువ్వే నేను కదా. మీరు చూసినట్లే ఏది పడితే అది మీరు పొందినట్లే. ఎందుకంటే నా గ్రంధ రచన తో పాటు అలాగే నాతో పాటు మీరు కూడా ఇన్నాళ్లు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారు కదా.ఆది నుండి అంతము దాక నాతోపాటు వచ్చినట్లే కదా.
 

నేను అంతమునకు చేరుకుంటే మీరు కూడా చేరుకున్నట్లే కదా. అందుకే దీనిని M.S.G అని అన్నాను. అనగా మోక్ష సాధన గ్రూపు అన్నమాట. మనమంతా ఇన్నాళ్లుగా ఒక మోక్ష సాధకులు గుంపుగా మూలాధార చక్రము నుండి బయలుదేరి చిట్టచివరిది బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకుని అటుపై ఇక్కడున్న బ్రహ్మాండ చక్రము నందు మన అందరి పంచ శరీరాలు ఒకదాని తర్వాత ఒకటి అందులో నెమ్మది నెమ్మదిగా లయం అయ్యే దృశ్యాలు మనకు నెమ్మది నెమ్మదిగా చూడటం మొదలయ్యి కొన్ని సంవత్సరాలకి అంతమవుతాయి. అనగా మేము రాబోవుకాలంలో శాశ్వత మరణమైన సంపూర్ణ కపాలమోక్షం స్థితి అయిన జీవసమాధి పొందటం జరుగుతుంది. మేము పొందినాము అంటే మీరు కూడా కాలంలోని నెలలు రోజులు వారాలు తేడాలతో కాస్తా వెనకా ముందు మీరు కూడా తప్పకుండా జీవసమాధి పొందుతారు. ఎందుకంటే ఆదిలో మనము పుట్టి నాము పెరిగినాము చనిపోయినాము మనం చనిపోయిన విషయం అనగా మన మరణ రికార్డు దృశ్యాలు మనకి ఆదిలో రికార్డు అవ్వలేదని గ్రహించండి. కేవలం జీవసమాధి పొంది అస్థిపంజరం మారేదాకా రికార్డయిన దృశ్యాలు మీరు మీకాలానికి తగ్గట్లుగా కనపడతాయి. ఇలా మన ఆది మన్వంతరంలో జరిగిన రికార్డు దృశ్యము ఆరు మన్వంతరంలు పాటు చూసి ప్రస్తుతం ఏడో మన్వంతరంలోని వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు మళ్లీ తిరిగి చూస్తున్నాము. ఈ గ్రంథము ద్వారా చదువుతున్నాము. తెలుసుకున్నాము. మళ్లీ ఇదే రికార్డు దృశ్యము మనం రాబోవు ఎనిమిదవ మన్వంతరములో 27 మహాయుగంలో వచ్చినప్పుడు చూస్తామని తెలుసుకోండి. ఎందుకంటే బ్రహ్మాండ చక్రము ఆగిపోయినా అదే నిశ్చల స్థితి పొందిన విషయము అనగా ఆదియోగి జీవ సమాధి చెంది శాశ్వత మరణమైన కపాలమోక్షం స్థితిని పొందిన విషయం రికార్డు తెలియకపోవడంతో అప్పటిదాకా రికార్డయిన దృశ్యాలు మనము నిరంతరమూ అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా ఎవరి ప్రమేయం లేకుండా సంబంధం లేకుండా ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు చూసినా చూడకపోయినా బ్రహ్మాండ చక్రము తిరుగుతూ కపాలాలు రికార్డు చేసిన దృశ్యాలను చూపిస్తూనే ఉంటుంది. అంటే మీకు సాధనలో పాము కరిచినట్లుగా ధ్యానములో కనపడితే అది సాధన ప్రారంభం దృశ్యాల స్థితి అని సాధనలో బ్రహ్మరంధ్రము నందు వెలుగుతూ తిరుగుతూ ఉన్న బ్రహ్మాండ చక్రము కనబడితే సాధన పరిసమాప్తి అని దృశ్యాలని గ్రహించండి. ఈ దృశ్యాలు ఈ విశ్వములో ఉన్న ప్రతి జీవి ప్రతి ప్రతిదానికి రికార్డు అయినాయి.అందులోఎలాంటి సందేహము అనుమానము భయము లేదు. ఎందుకంటే ఆదియోగి వీటిని పొందినాడు కదా. ఆయన పొందితే మనము పొందినట్లే కదా. అంటే ఆయనే మనము మనమే ఆయన అన్నమాట. అదే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అలాగే రాబోవు మన్వంతరం కాలంలో ప్రతి 27 మహాయుగంలో ఇలాగే మనం కలుస్తాము. మేము చూసినది రాసినది చదువుతూనే ఉంటారు. ఇదంతా కూడా రికార్డు దృశ్యమే కదా. అంతా నిరంతరంగా ప్రదర్శించే రికార్డు దృశ్యమే కదా. మరి రాబోవు ఆరవ మన్వంతరంలోని రాబోయే ఎనిమిదవ మన్వంతరంలోని 27 మహాయుగంలో ఇప్పుడు కలిసినట్లుగా మళ్లీ కలుద్దాము. మీరు కూడా ఇదంతా రికార్డ్ దృశ్యాలని గ్రహించి మనశ్శాంతి నుండి ఆత్మ శాంతి అటుపై ప్రశాంత స్థితిని పొందుతారని ఈ శాంతులుగా మీ జీవి  పాత్ర రికార్డ్ దృశ్యాలు త్వరలో చూస్తారని ఆశిస్తున్నాను.
 
అలాగే ఇక్కడ కొంతమందికి చిన్న ధర్మ సందేహం రావచ్చు. అది ఏమిటంటే ఆదియోగి నిజంగానే సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొంది నిశ్చల స్థితిలో ఉన్నాడని ఎలా చెప్పగలరు. ఎందుకంటే ఈ దృశ్యాలు 36 కపాలం రికార్డు చేయలేదు కదా. అంటే దీనికి సమాధానముగా ఆదియోగి నిశ్చల స్థితి అనగా శాశ్వత మరణము పొందకపోతే అది ఒకటి ఉన్నదని దాన్ని పొందాలని జ్ఞానం మనకు ఎలా వస్తుంది. ఎలా కలుగుతుంది. విశ్వంలో ఎవరికో ఒకరు ఈ స్థితిని పొందితే దాని అనుభవం అనుభూతి జ్ఞానము ఈ విశ్వంనందు ఉంచితే ఎవరైనా ఈ సాధన స్థాయికి వచ్చినప్పుడు ప్రకృతిమాత ఈ విషయంలో ఉంచిన విజ్ఞాన సమాచార స్థితి మనకు అందించడం చేస్తుంది. చేసింది.అంటే ఈ లెక్కన ఆదియోగి అన్నిరకాల ఆలోచనలు సంకల్పాలు స్పందనలు చేసి సంతృప్తి చెంది పరమ ప్రశాంతంగా మహా నిర్వాణ శక్తితో మహా నిర్వాణము చెంది ఉన్నాడు కదా. ఇది రికార్డు అయితే ఆయన ఎలా శాశ్వతం మరణము పొందుతాడు. బ్రతికి ఉన్నట్లే కదా. అందుకే ఈ ఆఖరి దృశ్యం రికార్డు కాలేదు. అంటే ఆయన శాశ్వత మరణము పొందినట్లే కదా. రికార్డు అయితేనే సమస్య రికార్డు కాలేదంటే పరిష్కారం పని అయినట్లే. చనిపోయిన వాడు తన మరణము దృశ్యాలు ఎలా రికార్డు చేసుకుంటాడో ఒకసారి ఆలోచించండి. రికార్డ్ చేసుకున్నాడు అంటే వాడు మరణించినట్లు కాదు కదా.ఎలా మరణించిన వాడు అవుతాడు. కాబట్టి మనకి ఆదియోగి శాశ్వత మరణము  దృశ్యాలు ఎక్కడా రికార్డు కాలేదు. అంటే ఆయన నిజంగానే మరణము అనగా సంపూర్ణ కపాలమోక్షం స్థితి అనగా మనో నిశ్చల స్థితిని పొందినట్లే కదా. ఆలోచించండి. అంతెందుకు. మన మతాల పూజించే వివిధ రకాల నామ దేవుళ్ళు చివరికి ఎక్కడికి చేరుకున్నారు స్మశానములోనే కదా. మహాశివుడు స్మశాన వాసి అన్నారు. అమ్మవారు కాళికాదేవి స్మశాన వాసి అన్నారు. మా దేవుడికి సిలువ వేయబడి మరణమునకు పొంది మూడు రోజుల తర్వాత స్వప్న శరీరంతో దర్శనమిచ్చినారని ఒక మతం వారు చెబుతున్నారు. ఆ దేవుడు జీవ సమాధి చెందటం వలన వారి సమాధిని లోనే మేము ప్రార్థన చేస్తున్నాం అని మరొక మతం వారిని చెప్పకనే చెప్పారు కదా. అంటే వీరందరి దేవుళ్ళు చిట్టచివరికి మనం పొందే స్మశానం వరకు చేరుకున్నారు కదా. అప్పుడు ఆదిలో ఆదియోగి ఇలాంటి శాశ్వత మరణము పొందకపోతే మరి వీరి అంశలైన వీరందరికీ మనందరికీ మరణాలు ఎలా సంభవిస్తాయి. ఆదియోగి మరణించక పోతే మనం ఎప్పుడూ భౌతిక మరణం లేని నిత్య చిరంజీవులుగా ఉండేవాళ్ళం కదా. మరి అలా ఉండటం లేదు అంటే ఆదియోగి ఆదిలో సంపూర్ణ కపాలమోక్షం స్థితిని తప్పనిసరిగా పొంది ఉండాలి.కాని ఈ దృశ్యము రికార్డు కాలేదు సాక్ష్యం లేదు.ఉంటేనే తంటా. లేకపోతే అయినట్లే గదా.మన మరణ సమయము ఎప్పుడు అని తెలుసుకుంటాము కానీ మనము మరణము పొందిన విషయం అందరికీ ఎవరు కూడా అనగా మనము మన దైవాలు మన పరమాత్మలు తెలుసుకోలేరని గ్రహించండి. ఉంటే వాడు ప్రాణాలతో ఉన్నట్లే కదా. వాడు మరణం పొందినట్లుగా ఎలా అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మరణ చిదంబర రహస్యం మీకే అర్థమవుతుంది. అంటే ఆదిలో మనమంతా ఒకసారి పుట్టడం పెరగడం మరణించడం అంతా కూడా మూడు నిమిషాల్లో జరిగిపోయినది. అందులో రెండు నిమిషాలు పుట్టుక(సృష్టి) పెరగటం (స్థితి) ప్రకృతి దృశ్యాల రికార్డయితే మరణించడం(లయం) ఆ ప్రక్రియ ఆఖరి ఒక్క నిమిషం లో రికార్డు కాలేదు. రికార్డ్ అయి ఉంటే వాడు మరణమును ఎలా పొందిన వాడు అవుతాడు కదా. కాబట్టి మొదటి రెండు ప్రక్రియలు జరిగినప్పుడు అంతే సహజంగా మూడో ప్రక్రియ కూడా జరిగి ఉండాలి కదా. జరిగిపోతుంది. జరిగిపోయినది. కాకపోతే ఇది జరిగింది అనటానికి సాక్ష్యం గా మనకి రికార్డు దృశ్యం లేదు. అంతే తేడా. ఉంటే అది జరిగినట్లు కాదు కదా. పోనీలే మరణమును వేరే వాళ్లకు ఇవ్వచ్చు కదా అంటే వేరేది గాని వేరే వాడు గానీ అనే వాడు మరొకడు లేడు కదా. ఉన్నది ఒకటే కదా. ఉన్నది ఒక్కడే కదా.ఉన్నది ఒక్కటే కదా. ఆ ఒక్కడే తన మరణం ఎలా రికార్డు చేసుకుంటాడు. చేసుకోలేడు కదా. తన మరణమును తన బ్రహ్మరంధ్రం ప్రాంతములోని బ్రహ్మాండ చక్రములోని 36 తలలలోనే రికార్డు చేయాలి కదా. ఎప్పుడైతే తను శాశ్వత మరణం పొందినప్పుడు ఈ తలలు కూడా మరణం పొంది ఉండాలి కదా. అప్పుడు ఈ తలలు కాస్త కపాలములుగా మారితే ప్రాణశక్తి నిర్జీవులుగా మారినప్పుడు అవి ఎలా రికార్డు చేస్తాయి. మరణం పొందితే మన అస్థిపంజరం అలాగే మన కపాలమునకు ప్రాణశక్తి ఉంటుందా? వాటికి విలువ ఉంటుందా ఉండదు కదా అలాగే ఆదియోగి అస్థిపంజరం పరిస్థితి కూడా అంతే. అంతెందుకు ఈ ఆదియోగి నిజంగానే శాశ్వత మరణము పొందినాడు అనటానికి ఒక బలమైన ఆధారం ఒకటి ఉన్నది. 

అది ఏమిటంటే మన బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్రము నందు ఉన్న ఏకమూల కపాలమునందు మరి ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం ఒకటి ఉన్నట్లుగా దీనిని చూసినట్లుగా దానికి 36 కపాలాలు ఉన్నట్లుగా పరమ యోగులు, పరమ గురువులు ఎలా చెప్తున్నారు. ఇట్టి అనుభవము నిజమేనని స్వయంగా మేమే స్వానుభవం పొందటం జరిగింది కదా. మరి ఈ అస్థిపంజరం ఎవరిది అయి ఉండాలి అంటే అదిలో ఎవరో ఒకరు శాశ్వతం మరణమును పొంది అస్థిపంజరంగా మారింది అని బలంగా తెలుస్తోంది కదా. పైగా ఇది మనకి సాధన అంతిమ స్థితిలో అలాగే సాధన అంతిమ స్థానము నందు ఈ విచిత్ర అస్థిపంజరం అనగా బ్రహ్మరంధ్రము నందు మాత్రమే ఉన్నట్లు గా మనకు దర్శనమిస్తోంది. అంటే ఆదిలో ఆది యోగి తన అంతిమ సాధన స్థితి ఇదేనని చెప్పినట్టు చెప్పకనే చెప్పినట్లుగా లేదు. ఆలోచించండి. విషయం మీకే తెలుస్తుంది.ఈయన శాశ్వత మరణము పొందకపోతే అందరిలాగానే సజీవ మూర్తిగా బ్రహ్మరంధ్రము నందు దర్శనం ఇవ్వాలి కానీ అలా జరగకుండా చిట్టచివరి అంతిమ రూప స్థితిగా పైగా ధ్యానస్థితిలో కూర్చున్న అస్థిపంజరం కనబడుతోంది. మిగతా నామరూప దేవుళ్ళు అందరూ కూడా మనకి ఆయా చక్ర స్థానాల యందు సజీవ మూర్తులుగా ను ఆయా శరీరాలతో కనపడుతూ చివరికి పరమ శూన్యము నందు అంతర్థానం అయినట్లుగా మేము మా సాధన యందు అనుభవ అనుభూతులు పొందడం జరిగినది. మీకు అన్నీ తెలుసు కదా. అలాగే అంతిమ సాధన స్థితిలో ఆదియోగి అంతిమ ధ్యానస్థితిలో ఉన్నఅస్థిపంజరం కనపడినది.పైగా ఈయన తన ధ్యాన తపస్సులో జీవసమాధి చెంది శాశ్వత ఆనందం పొందినట్లుగా మనకి కనిపించే ఈ అస్థిపంజరం యొక్క ధ్యాన స్థితి అని చెప్పకనే చెబుతోంది కదా. మనకి మహాశివుడు ఎప్పుడు ధ్యానముద్రలో ఉన్నట్లుగా వివిధ చిత్రాలలో ఈ పాటికే చూసి ఉంటారు కదా. కాకపోతే అది సజీవమూర్తిగా ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా కనపడతాయి. నిజానికి అది యోగి లేదా ఆదిదేవుడు శాశ్వత మరణమును పొంది ధ్యాన స్థితి అస్థిపంజరంను పొందినాడు. అంటే ఎవరి శరీరాలు యందు బ్రహ్మరంధ్రము వద్ద కనిపించే అస్థిపంజరం ఎవరిది వారిదే అన్నమాట. ఎవరికి వారే  బ్రతికి ఉన్న శవాలు అన్నమాట. చనిపోయిన కూడా బ్రతికే ఉన్నామని వారే భ్రమ భ్రాంతి మాయలో ఉంటున్నారని ఈపాటికి  గ్రహించే ఉంటారు. ఎందుకంటే వారి తలలోను వారి 36 కపాలాల అస్థిపంజరం తప్పకుండా ఉంటుంది. అస్థిపంజరం ఉన్నది అంటే మరణం పొందినట్లే కదా. ఈ విషయం తెలుసుకున్న వివిధ రకాల యోగులు లోకానికి ఆదిదేవుడు లేదా ఆది యోగి లేడు అని తెలిస్తే లోక విపత్తు జరుగుతుందని భయంతో చనిపోయిన ఆది దేవుడు కాస్త బ్రతికే ఉన్నాడని ఆయన మృత్యుంజయుడని మరణ భయం లేదని మహా కాలకూట విషము తన కంఠంలో ఉంచుకున్న కూడా మరణం పొందలేదని ఇలా పలు కథలు కథనాలు ప్రచారం చేసినారు. తాము చూసిన 36 కపాలాల అస్థిపంజరం కాస్త సజీవ మూర్తిగా 36 తలల సదాశివమూర్తిగా మార్చి లోకానికి అసలు సత్యము చెప్పకుండా అసత్యమునే సత్యమని స్వయంగా ప్రచారం చేసి మనల్ని మహామాయ లో ఉంచినారు. ఈ విషయాలన్నీ కూడా మా స్వానుభవాలు అయ్యేదాకా మాకు తెలియ రాలేదు. తెలిసిన తర్వాత నోట మాట రాలేదు. ఇదంతా కూడా ఒకప్పటి రికార్డు దృశ్యాలని తెలీగానే మా మతి పోయినది.పిచ్చెక్కినది వెర్రి వచ్చినది. మౌనమే మౌన భాష అయినది. కాకపోతే దీనివల్ల కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని నిజానికి లోకానికి చెప్పటానికి బదులుగా కనిపించేది సత్యమని కనిపించనిది అసత్యమని మన ఆది పూర్వీకులు అసత్య ప్రచారం చేయడము చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు ఆదిలో దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. ఒకప్పుడు మా ముత్తాత ఉండేవాడు. ఒకప్పుడు మా ముత్తాత ఉన్నాడు ఇప్పుడు లేడు. ఇదేవిధంగా అనగా దేవుడు ఒకప్పుడు ఉండేవాడు.ఇప్పుడు లేడు అని ఆనాడే చెప్పేసి ఉంటే జనాల్లో దేవుడంటే భయం దేవుడు అంటే ఒక నమ్మకం దేవుడంటే భక్తి వ్యాపారము దేవుడు అంటే అది ….దేవుడు అంటే ఇది అనే భావాలు ఉండేవి కావు కదా. శాస్త్రాలు తెలుసుకున్నారు. శాశ్వతంగా ఎవరు ఉండరని తెలుసుకున్నారు కానీ తాము తెలుసుకునే యధార్థ సత్యజ్ఞానమును లోకానికి చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే దేవుడు లేడు అంటే నమ్మకాలు పోతాయి. భయాలు పోతాయి. పాపాలు పెరుగుతాయి. అరాచకాలు పెరుగుతాయి. హింసలు పెరుగుతాయి.నా బొంద పెరుగుతుంది నా బూడిద పెరుగుతుంది అంటూ రకాలుగా ఊహించుకుంటూ విషయము చెప్పలేదు. ఇదంతా తెలుసుకున్న వాళ్లు ఇదంతా కూడా అనగా విశ్వ జీవనాటకము అంతా కూడా అనగా మనకి కనిపించేది తెలిసేది జరిగేదంతా కూడా ఒకప్పటి ఆదిలోనే రికార్డు అయిన దృశ్యం నాటకమని ఎందుకు తెలుసుకోలేకపోయారో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు అదిలో ఏమి జరిగి ఉంటే అది ఇప్పుడు మనం చూస్తున్నామని కొత్తగా చూసేది ఏమీ ఉండదు కదా.ఆదిలోనే మన జీవనాటకము నందు హింసలు అరాచకాలు పాపాలు పుణ్యాలు ఇలాంటివి భయంకర దృశ్యాలు రికార్డు అయి ఉంటే వాటికి దేవుడు లేడు అని చెప్పినంత మాత్రాన మార్చగలరా ఎవరు కూడా మార్చలేరు కదా. ఎందుకంటే ఇదంతా రికార్డు దృశ్యమే కదా. చూసే వాడు కూడా తను రికార్డు చూస్తున్నట్లుగా ఒక రికార్డు అయింది కదా. ఇలా మన పూర్విక యోగులు ఈ రికార్డు దృశ్యాలు చూసి అవి భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలని భావించుకుని అవి జరక్కుండా ఉండాలనే తపన తాపత్రయంలో ఈ లోకంలో లేని దేవుడు ఉన్నట్లుగా తమ జ్ఞానముతో ప్రచారం చేసినారు.భక్తి ఉద్యమాలే చేసినారు. భక్తి ప్రచారాలే చేసినారు.మత ప్రచారాలు తీశారు అసత్యమును సత్యముగాను…. సత్యము అసత్యము గాను అనగా కనిపించేది సత్యము గానూ…. కనిపించనిది అసత్యముగా లోకానికి ప్రచారం చేసి అతి పెద్ద తప్పు చేశారని మా మనో దృష్టికి వచ్చింది. అసలు భయపడటానికి ఇక్కడ ఏముంది. నా బొందా నా బూడిదే. అంతా కూడా ఆదిలో జరిగిపోయిన రికార్డు దృశ్యమే కదా. మరి ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం అవ్వడంలేదు. అంటే తమ మనోనేత్రం ముందు ఆ దేవుని జీవసమాధి చెందుతున్న సమయంలో ఆయన చూసిన ఆయన తెలుసుకున్న అతను వేసిన జీవన దృశ్యాలు రికార్డు అవటంతో ఆ రికార్డు దృశ్యాలు వీరందరికీ కనపడుతూ ఉండేసరికి అందులో హింసా దృశ్యాలు చూసేసరికి దానిని ఆపాలని దానిని జరగకుండా చూడాలని అలా ఉండాలి అంటే లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయాలని అనుకోవడమే. అది తప్పు గదా!  మీరే ఆలోచించండి. అంటే వీళ్ళు అందరూ కూడా ఆఖరిలో జరగబోయే అత్యంతిక ప్రళయము దృశ్యాలు చూడడం జరిగినది. వాటిని చూడగానే వీళ్ళందరికి ఒణుకు,భయం మరణ భయాలు కలిగి రాబోవు విపత్తు ఆపాలంటే మనము లేని దేవుడు ఉన్నట్లుగా అందర్నీ నమ్మిస్తే ఆయనే ఈ విపత్తు జరక్కుండా చూసుకుంటాడని తప్పుడు ప్రచారం చేసి ఉండాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆదిత్య 369 సినిమాలో హీరో తన భవిష్యత్తు లోనికి వెళ్లి నప్పుడు తను చనిపోయే భవిష్యత్తు దృశ్యాలు చూస్తాడు కానీ పూర్తిగా చూడడు. మరణం దృశ్యాలు మాత్రమే చూస్తాడు. తను తిరిగి బ్రతికి ఉంటాను అనే రాబోయే దృశ్యం చూడకుండా వెనుతిరుగుతాడు. అలాగే మన పూర్వీక మహర్షులు కూడా వారి బ్రహ్మరంధ్రములోని ఆఖరిగా రికార్డు అయిన అత్యంతిక ప్రళయాలు దృశ్యాలు చూసి మరణ   భయమును పొంది వెనుతిరిగి లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేసినారు. అంటే ఒక భయంకరమైన హారర్ సినిమా చూసి భయపడి వెనుతిరిగినారన్నమాట. కాకపోతే ఈ ప్రయాణంలో ఎవరికి వారే తమ మరణాలు తను ఎలా చనిపోతున్నాడో తెలుసుకునేసరికి వణుకు భయం మొదలై దేవుడు లేడు అని ప్రచారం చేస్తే తమకి ఇలాంటి గతి పడుతుందని ప్రకృతి మనకు సందేశం ఇస్తోందని భ్రమపడి భయపడి లేని దేవుడిని ఉన్నట్లుగా ప్రచారం చేయటానికి పూనుకొని ఉండాలి. నిజానికి ఇదంతా కూడా ఆదిలో జరిగిన అత్యంతిక ప్రళయ దృశ్యాలే మనం చూసినామని ఆదిలో మనం ఎలాగ మరణము పొందినామో ఆ రికార్డు దృశ్యాలను మనం చూస్తున్నామని కాబట్టి వీటిని మనం మార్చలేమని కేవలం చూడటమే జరుగుతోందని రెండవ మన్వంతరంలో చూసిన మన పూర్వీకులు గ్రహించి ఉంటే కథ మరోలా ఉండేది. నిజానికి వీళ్లంతా ఆదిలో ప్రథమ మన్వంతరంలో జరిగిన రికార్డు దృశ్యాలే తిరిగి రెండవ మన్వంతరంలో  చూడడం జరిగినది. అదే మన భవిష్యత్తు మరణ దృశ్యాలని వీళ్లంతా భయపడటం మన కొంపముంచింది. ఎప్పుడు చూసినా ఏమి చేసినా ఏమి చెయ్యకపోయినా ఆదిలో ఏమి రికార్డు దృశ్యాలు రికార్డు అవుతాయో అవి అన్ని కాలాల్లోనూ అన్ని యుగాలలోను తిప్పితిప్పి మన బ్రహ్మాండ చక్రం తాను తిరుగుతూ చూపిస్తోందని విశ్లేషించుకోలేకపోయారు. వీళ్ళు గ్రహించలేకపోయారు. గ్రహించలేక పోవటమే రెండవ మన్వంతరం యోగులు చేసిన అతి పెద్ద తప్పు. దానితో లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయటం వలన లేనివి ఉన్నట్లుగా అనుభవాలు అనుభూతులు ఇవ్వడం జరిగినది. యద్భావం తద్భవతి కదా. మనము ఏమి భావం చేసుకుంటామో అది కనపడటం అనగా నువ్వు లేవు అనే భావన చేస్తే నువ్వు లేవని రికార్డు దృశ్యాలు(48ని!!) నువ్వు ఉన్నావని భావన చేస్తే నువ్వు ఉన్నట్లుగా(48ని!!) రికార్డ్ దృశ్యాలు అనగా 48+48=96 నిమిషాల నిడివి కల రికార్డు దృశ్యాలుమనకి ఏమీ లేని.. అది ఉన్నట్టుగా అనిపించే భ్రమ కలిగించే మాయ కలిగించే పరమ శూన్యము మనకు చూపిస్తోందని గ్రహించండి. అంటే అది నువ్వు బతికున్నప్పుడు రికార్డు దృశ్యాలు 48 నిమిషాల పాటు రికార్డయితే అలాగే నువ్వు అస్థిపంజరంగా మారిన నువ్వు లేని రికార్డు దృశ్యాలు 48 నిమిషాల పాటు రికార్డు అయ్యాయి. ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఎన్ని తరాల చూసిన ఎన్ని యుగాల చూసిన ఈ రెండు రికార్డ్ దృశ్యాలు కనపడతాయి. ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఆది యోగులు చేసిన తప్పు చేయకండి. వాళ్లంతా ఇది రికార్డు దృశ్యం అని గ్రహించలేకపోయారు. 
 
ఈ రికార్డు దృశ్యాలలో అత్యంతిక ప్రళయం జరక్కుండా చూడాలనే పిచ్చి తపన తాపత్రయంతో రికార్డు దృశ్యాలు మార్చలేమని గ్రహించకుండా తెలుసుకోకుండా అతి పెద్ద తప్పు చేసినారు కదా. అలా మీరు నేను తప్పు చేయకూడదని ఆదిలో జరిగేది జరుగుతుందని అందులో జరగనిది ఎప్పటికి జరగదు అని అందులో ఆదిలో మన ఆది యోగి 36 కపాలాలు ఏమి రికార్డు చేసినాయో అవే దృశ్యాలు మనకు తిప్పితిప్పి మనకు బ్రహ్మరంధ్రము వద్ద బ్రహ్మాండ చక్రం చూపిస్తోందని దానిని మార్చటం ఉండదనీ మార్చలేమని ఒకసారి విడుదల అయిన సినిమాను మార్చడం ఎలాగైతే వీలు కుదరదో అలా ఒకసారి రికార్డు అయిన జీవన నాటకము అనే దృశ్యము మార్చటం జరగదని దానిని చూడడం తప్ప ఏమీ చేయలేమని మేము గ్రహించడంతో ఇదే విషయాన్ని లోకానికి చెప్పాలని ఈ పూర్వికులు చేసిన తప్పు నేను చేయకూడదని అప్పుడు దేవుడు ఉన్నాడు ఇప్పుడు లేడని కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని ఎవరికి భయపడకుండా దేనికి బాధ పడకుండా దేనికి భయపడకుండా దేని గురించి ఆలోచించకుండా లోకానికి గ్రంథం ద్వారా నిజ బ్రహ్మజ్ఞాన అనుభవాలు ఇవ్వాలని నేను అనుకోవడంతో అప్పటిదాకా 27 26 మహాయుగాలు లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేస్తే అది కూడా నేనే ప్రచారం చేయడంతో వేదవ్యాసుడు రూపంలో దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయడంతో ఇదంతా ఇలా కాదనుకుని 27 మహాయుగంలో సాధన చేసి ఉన్న దేవుడు లేడని సత్య జ్ఞాన అనుభూతి పొందటంతో ఎవరికీ భయపడకుండా నిజం చెప్పాలని ఆనాడు అనుకోవడంతో ఈ  నిజ జ్ఞానం అనుభవాలుతో కపాలమోక్షం గ్రంధము రచించడం జరిగింది. అది కూడా ఆదిలో రికార్డ్ దృశ్యం ఉండబట్టి అనగా 27 మహాయుగములో ఈ గ్రంథం రికార్డు దృశ్యాలు ఉండబట్టి ప్రస్తుతం వాటిని నేను చూశానని మీరు ఈ గ్రంథం ద్వారా చూస్తున్నారని గ్రహించండి. ఇప్పటికైనా సత్యమేదో తెలుసుకోండి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించండి. సర్వం ఏమీ లేదు. సర్వం శూన్యము.ఒకప్పటి రికార్డ్ దృశ్యాలే ఇవన్నీ. అందులో ఆదిలో ఏమి రికార్డు అయిందో ఎలాంటి దృశ్యములు రికార్డు అయినాయో వాటిని సినిమా హాల్లో ఉండి సినిమా చూస్తున్నట్లుగా జరగబోయే రాబోయే మన జీవ పాత్ర జీవన దృశ్యాలు చూస్తున్నామని వాటిని మార్చలేమని సాక్షి భూతంగా మౌనముగా ఆటలో అరటి పండు లాగా చూడటం తప్ప ఏమీ చేయలేమని సత్య జ్ఞానమును ఇప్పటికైనా పొందండి. పొందేది ఏంటి నా బొంద. పొందినట్లుగా మీకు ఆదిలో రికార్డ్ విషయాలు ఉంటే పొందుతారు కదా. అందరికీ నా బాధ అర్థం అవ్వాలనిలేదు. ఈ గ్రంథం అర్థం అవ్వాలని లేదు. చదవాలని లేదు.ఈ గ్రంథం చదువుతున్న లేదా ఆ బాధ మీకు అర్థమవుతున్నా అవన్నీ కూడా ఆది లో రికార్డ్ దృశ్యాలు ఉండబట్టే జరుగుతోందని గ్రహించండి. మీకు నా బాధ అలాగే ఈ గ్రంథం అర్థం కాలేదు అంటే మీకు ఆ రికార్డ్ విషయాలు ఇంకా పొందలేదని ప్రస్తుత 27 మహాయుగంలో పొందలేదని రాబోయే యుగంలో పొందుతారు ఏమో తప్పనిసరిగా ఈ గ్రంథం చదివే దృశ్యాలు అందరికి రికార్డు అవుతాయి. అవి వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే ఎప్పుడో ఆదిలో త్రేత ద్వాపర యుగంలో రాసిన రామాయణ అలాగే మహాభారతాలు మీరు ఇప్పుడు కలియుగంలో చదవడం లేదా జ్ఞానము పొంద లేదా చదివిన దృశ్యాలు అలాగే జ్ఞానం పొందిన దృశ్యాలు రికార్డు అయినాయి. 

అలాగే ఆనాడు ఆదిలో త్రేతాయుగంలో వాల్మీకిగా రామాయణం రాస్తే ద్వాపర యుగంలో వ్యాస మహాభారతం రాస్తే కలియుగంలో విభూది నాధ్ గా ఈ కపాలమోక్షం గ్రంథం రాయడం జరిగినది. వాటిని చదివిన దృశ్యాలు రికార్డు అయినాయి. ఈ గ్రంథ రచన అలాగే చదివి దృశ్యాలు రికార్డు అయి ఉంటాయి కదా. కారణము లేనిదే కార్యం ఉండదు కదా. కాకపోతే ఈ గ్రంథం చదివితే మీకు అర్థం అవుతే ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అట్లే మీకు ఈ గ్రంథం అర్థం కాలేదు అంటే ఈ రికార్డు దృశ్యాలు చూడటం లేదని తప్పనిసరిగా రాబోవు కాలంలో చదువుతారని ఆ రికార్డు దృశ్యాలు చూస్తారని అందరూ కూడా 27 మహాయుగంలోని గ్రంథం చదివే రికార్డు దృశ్యాలు ఉండవని వారి వారి సాధన స్థాయిని బట్టి అనగా ఎవరైతే మోక్షము పొందాలని వెర్రి ఆశ పిచ్చి కోరిక అంతం అవ్వాలని ఉంటుందో వారికి మాత్రమే ఈ 27 మహాయుగంలోని ఈ గ్రంథము చదివే యోగము అర్థమయ్యే యోగము నిజ బ్రహ్మ జ్ఞానం పొందే యోగము అంతిమ కపాల మోక్షం పొందే యోగము రికార్డ్ అయినాయి. ఇవే దృశ్యాలు ప్రస్తుత కాలంలో లేదా రాబోవు యుగ కాలాల్లో చూస్తారు. చూడటం జరుగుతుంది. శాంతిని పొందడం జరుగుతుంది. మాకు లాగానే మీకు అన్నీ దొరుకుతాయి. అప్పటికి మేము సజీవంగా ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఆ సమయములో నా జీవ పాత్ర ఏ దృశ్యాలు రికార్డు చేసినది ఎవరికి ఎరుక. 

దానితో మేము దేవుడే లేని గర్భాలయము ఉన్న గుడి కట్టాలని అనుకున్నాము. ఇలాంటి గుడి సాక్షాత్తు స్థానమైన చిదంబర క్షేత్రంలో భగవంతుడు లేని గర్భాలయం ఉన్న గుడి ఒకటి ఉన్నది అని తెలుసుకుని మౌనం వహించాను. కాకపోతే నాకు తెలిసిన అంతిమ అనుభవ స్పురణ జ్ఞానం అనగా భగవంతుడు లేడు అనే సత్యము నిజమేనని ఈ దేవాలయము అందుకు సాక్ష్యంగా నిలిచింది. 

 
ఈ సృష్టిలో ఏదీ లేదని సర్వం శూన్యమని చెప్పిన ఋభుగీత నా అంతిమ జ్ఞానానికి సాక్ష్యంగా నిలిచినదని నాకు అర్థం అయింది. కాబట్టి మేము కొత్తగా చెయ్యటానికి కొత్తగా పొందినది ఏమీ లేదని గ్రహించి మౌనం వహించి సాక్షి భూతంగా ఆటలో అరటి పండు లాగా మౌన బ్రహ్మగా మారి మా జీవ సమాధి రికార్డ్ విషయాలు ఎప్పుడు చూస్తానా అని నీలి ఆకాశం కేసి నేనే జ్యోతి గా ఉన్న సంకల్ప శరీరముతో ఎదురుచూస్తూ గడపడం తప్ప ఏమి చెయ్యలేమని గ్రహించినాము. ప్రస్తుతానికి మేము చేయవలసిన ఏకైక పని మాకు అర్థమైనది. ఇన్నాళ్ల పాటు ఇన్ని యుగాల పాటు ఆది యుగములో ఆదియోగి చేసిన ఆది జీవనాటకము అది రికార్డు దృశ్యాలే ఆదినుండి చూస్తూ అదే పనిగా చూస్తూ గడపక తప్పదు కదా.
 
ఈ రికార్డు దృశ్యాలు 108 నిమిషాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్నప్పుడు మన హైందవ ధర్మానికి 108 కి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్నది. అది ఏమిటంటే జాతక రీత్యా 12 రాశులు మరియు 9 గ్రహాలు కలిపితే 12 X 9 = 108 వస్తుంది. ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున ఉంటాయి 27 నక్షత్రాల కి పాదాలను చొప్పున 27 x 4 = 108 పాదాలు ఉంటాయి. త్రికాలాలలో భవిష్యత్తు చెప్పే వీటికి 108 సంఖ్య అనుసంధానించబడి నట్లుగా మన 36 కపాలములకి అనగా 36 X 3 = 108 నూట ఎనిమిది నిమిషాల అనుసంధానించబడింది. అంతెందుకు మనము వేసుకునే లేదా వాడుకునే జపమాల కి 108 పూసలు ఉండటం మీరు గమనించి ఉంటారు కదా. ఈ 108 ని!!ల రికార్డ్ దృశ్యమునే బ్రహ్మ రాత అని… మరికొంతమంది విధిరాత అని… మరి కొంతమంది తలరాతనే  పేరు పెట్టినారు. ఎవరు ఏ నామంతో పిలిచినా ఈ రికార్డులను యొక్క దృశ్యం ఎన్నటికీ మారదు. ఎన్నటికీ ఆగదు. మార్పు లేనిది. మార్చలేనిది. విశ్వం లో ఏదైనా ఉంది అంటే ….అది ఈ 36 బ్రహ్మకపాలం రికార్డు దృశ్య మైన బ్రహ్మ రాత మాత్రమేనని నేను గ్రహించాను. అవును గానీ విశ్వం అసంపూర్ణంగా లేదా సంపూర్ణముగా అన్నప్పుడు అసంపూర్ణంగా కనిపించే సంపూర్ణమైనదని నేను గ్రహించాను. ఎందుకంటే అసంపూర్ణ దృశ్యాలు మాత్రమే రికార్డ్ అవటము వలన విశ్వమంతా మనకి అసంపూర్ణంగా ఇంకా ఏదో సాధించాలి. ఏదో పొందాలి. చెయ్యాలి పలురకాల తపన తాపత్రయంలతో అసలు భయాలు ఆలోచనలు సంకల్పాలు స్పందనలు ఆనందాలు ఇలాంటివి ఉండనే ఉంటున్నాయి. కాకపోతే పూర్ణమైన దానిని ఈ 36 కపాలాలు రికార్డు చేయలేదు. అది రికార్డు చేస్తే అది సంపూర్ణము ఎలా అవుతుంది. అవ్వదు కదా. చేస్తే అయినట్లు కాదు. చెయ్యకపోయినా అయినట్లు కాదు. ఈ లోకం అసంపూర్ణంగా ఉన్నదని భావించేవాడు వాడికి తెలియని ఏదో మాయలో ఉన్నట్లే. మోక్షము పొందాలనే కోరిక కూడా ఇష్ట కోరిక అవుతుందని గ్రహించండి. ఎవరైతే సాక్షీభూతంగా ఆనంద రహితముగా స్మశాన వైరాగ్యం తో మౌన భాష ను కలిగి ఉంటారో వారికి మాత్రమే విశ్వమంతా కనిపించేదంతా కూడా సంపూర్ణం అయినట్లుగా జ్ఞానోదయం అవుతుంది. వీరే నిజమైన బ్రహ్మజ్ఞానులు. వారికి తమ బ్రహ్మరంధ్రము నందు బ్లాక్ హోల్ గా అనగా కృష్ణబిలంగా బ్రహ్మాండ చక్రము అత్యంత బ్రహ్మ తేజస్సుతో భ్రమణం చేస్తూ కనపడుతుంది. ఇది కనబడితే వారికి నిజ బ్రహ్మజ్ఞాని అనుభూతి కలుగుతుంది. సర్వం  ఏమీ లేదు సర్వం శివమయం సర్వం శూన్యం అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్నాళ్లు ఇన్నేళ్లుగా సర్వం  ఏమీ లేదు సర్వం శూన్యమని భావన అనుకోవడం చేస్తే ఈ బ్రహ్మాండ  చక్రము దర్శనముతో వారికి అనుకోవడంతో పాటు అనుభూతి పొందటం చేస్తాడు.తద్వారా ఇన్నాళ్ళు అసంపూర్ణంగా కనిపించేదంతా ఆదిలో ఒకప్పుడు సంపూర్ణమైనది అని అది రికార్డు కాలేదని రికార్డ్ అయిన సంపూర్ణ దృశ్యం నాటకంలోని తన జీవ పాత్ర దృశ్యాలు ఇంతవరకు చూశానని రాబోవు కాలంలో కూడా చూస్తానని వారు జ్ఞానాన్ని పొందటంతో ఏమీ అనలేక చేసేది ఏమీ లేదని చేసింది ఏమీ లేదని తెలుసుకోవడంతో మౌనం వహించి తన జీవన పాత్రకి మరణానంతరం వచ్చేదాకా సాక్షి భూతంగా వడ్లగింజలో బియ్యపు గింజ లాగా ఆటలో అరటి పండు లాగా ఉండిపోతారు. కాకపోతే ఈ దుస్థితి పొందినవారు మెదడు యొక్క శక్తిని తట్టుకోలేరని దానితో చాలా మంది ప్రముఖులు పరమ జ్ఞానులు పరమ యోగులు శరీర త్యాగము చేస్తారని వివిధ అనుభవాల ద్వారా తీసుకోవడం జరిగినది. 
 
 
ఇలాంటి వారిలో శ్రీరామచంద్రుడు ఒకరు. అందరికీ భార్య విరహవేదన అనుభవించలేక శరీర త్యాగం చేశారని అనుకుంటారు .కానీ నిజానికి లోకములో చేసేది ఏమీ లేదని సర్వశూన్యమని అంతా సంపూర్ణ మని ఈయన గ్రహించడంతో సరయూ నదిలో జల సమాధి ద్వారా శరీరము త్యాగము చేసి యోగసిద్ధి పొందడం జరిగినది.ఈ బ్రహ్మాండ చక్రం ఆగకుండా అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా భ్రమణం చేస్తూనే ఉంటుందని ఎలా చెప్పగలరు? అన్నప్పుడు నువ్వు నిల్చుని ఉన్న భూమి తిరగడం లేదా నవగ్రహాల తిరగడం లేదా గడియారము తిరగడం లేదా కాల చక్రమే పిండ చక్రమే అండ చక్రమే జీవిత చక్రామే తిరుగుతున్నప్పుడు బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్రము తిరగకుండా ఉంటుందా తిరుగుతూనే ఉంటుంది కదా. ఎందుకంటే ఇది తిరిగే దృశ్యాలు రికార్డు అయినాయి. కానీ ఇది ఆగిపోయిన దృశ్యము రికార్డు కాలేదు. అయి ఉంటే కథ మరోలాగా ఉండేది. అవును గాని మా బంధువులు చనిపోయినప్పుడు వారి చావు దృశ్యాలు దహన దృశ్యాలు రికార్డు చేయగలిగినప్పుడు ఆది బ్రహ్మ చనిపోయినప్పుడు కూడా రికార్డు చేసే అవకాశం ఉండేది కదా అన్నప్పుడు దీనికి సమాధానముగా ఆయన భిన్నత్వంలో ఏకత్వం గా ఉన్నప్పుడు జీవ సమాధి పొందడం జరిగినది. అప్పటిదాకా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆపైన సిద్ది పొందినప్పుడు తన 36 తలలు కూడా కపాలాలు గా మారడంతో ఆయన మరణ గుప్త దృశ్యాలు రికార్డు చేయలేదు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరూ లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. మరొకరు కానీ మరొకటి గాని లేవు. అనగా భిన్నత్వంలో నుండి ఏకత్వంలోకి వచ్చినప్పుడు సర్వం నేనే ఉన్నాను. నేను కానిది ఏదీ లేదు. నేను లేనిది లేదు అని అద్వైత సిద్ధి పొందుతారని మీకు తెలుసు కదా. ఆదియోగి పొందటంతో సర్వం ఆయన మయంగా కనిపించటంతో నాలో నువ్వు నీలో నేను ఆయనకి ఆయనే కనిపించటంతో ఆయన మరణ దృశ్యాలు ఇంకా ఎవరూ రికార్డు చేయగలరో చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక కుటుంబ బంధుమిత్రులతో ఆనందంగా ఉన్నారు. ఒకరోజు స్మశాన వైరాగ్యం చెంది ధార్ లాంటి ఎడారికి ఒంటరిగా వెళ్లి అక్కడే ఉంటే మీరు తప్ప మరొకరు లేరు. మరొకటి లేదు.ఎవరూ లేరు మీరు తప్ప అన్నపుడు మరణమును పొందితే రికార్డు చేసే అవకాశం ఉంటుందా ఆలోచించండి. ఉన్నది మీరే కదా. మరల మీకు ఏ నిమిషంలో మరణము కలుగుతుందో గ్రహించగలరు కానీ మీరు మరణించిన విషయం మీకు తెలుస్తుందా తెలియదు కదా. తెలిస్తే మీరు మరణించినట్లు కాదు కదా ఆలోచించండి. మరణ రహస్యములోని అతి సూక్ష్మమైన మర్మము తెలుసుకోండి. ఇదే నియమము మోక్షానికి కూడా వర్తిస్తుంది.జీవుడుగా మరణమును పొందితే భౌతిక మరణము అదే యోగిగా మరణం పొందితే జీవ సమాధి దేవుడిగా మరణం పొందితే జీవన్ముక్తి అన్నారు. ఏ మరణం అవస్థ కూడా మనము పోయేటప్పుడు తెలియదు. అవును కాని ఏ సినిమా అయినా తన రీలు అయిపోయినాక ఆగిపోతుంది కదా. మరి ఈ కపాలాల రీలు 108 ని!! ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవాలి కదా. మళ్లీ వెనక్కి తిరిగి ఎలా చూపిస్తోంది అన్నప్పుడు దీనికి సమాధానంగా నూట ఎనిమిది నిమిషాల రీలు అయిపోయే సమయానికి రీలు మొదలయ్యే దృశ్యాలు దీనికి అతికించబడి ఉంటే కలపబడింది అనగా అంతమయ్యే చోట ఆరంభమైనది అన్నట్లుగా మనకి కనపడుతోంది. అంటే మరణించిన విషయాలు ఉండవలసిన చోట ఈ ఆది జన్మ జనన దృశ్యాలు కలపడటంతో మరణం లేని జననం దృశ్యమైంది. నిజానికి మనమంతా శాశ్వతమైన మోక్ష పధమును ఆదిలోనే పొందాము. ఆదిలోనే అన్ని పొందినప్పుడు ఇది పొందకుండా ఉంటామా? జననం ఉన్నప్పుడు మరణం కూడా ఉండాలి కదా. కాకపోతే ఈ మరణాల దృశ్యాలు రికార్డు అవ్వకపోవడం తో చివర మళ్ళీ జనన దృశ్యాలు కలపడంతో చక్రం తయారయింది. రెండు బిందువులు కలిసి ఒక వృత్తముగా ఏర్పడుతున్నాయి. అనగా రెండు  అనగా రికార్డు అయిన జననం రికార్డు కానీ మరణం దృశ్యాలు కలిసి జీవనం చూపించే జీవ నాటకమును చూపించే బ్రహ్మాండ చక్రమును సృష్టించాయి. దానితో జరిగిపోయిన స్వప్న జీవన నాటక దృశ్యాలే వాటిని మనం చూస్తున్న రికార్డ్ దృశ్యాలతో చూడడం జరుగుతోంది.ఇది ఎప్పటికీ అంతులేని కథ లాగ సాగుతూనే ఉంటుంది. మార్పులేని కథలాగా మారని కథలాగా ఆగని కథలాగా అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా సాగుతూనే ఉంటుంది. నిజానికి మూడు బిందువులతో ఒక త్రిభుజం ఏర్పడాలి పుట్టడం పెరగడం మరణించడం అనే దృశ్యాలు రికార్డు అవ్వాలి. కానీ జననం స్థితి దృశ్యాలే రికార్డ్ అవటంతో ఈ రెండు బిందువుల కలిసి ఒక వృత్తమును ఏర్పరచడంతో ఆ వృత్తము కాస్తా బ్రహ్మాండ చక్రముగా అనగా బ్లాక్ హోల్ అనగా కృష్ణ బిల్వంగా రూపాంతరం చెందినది. మన శాస్త్రాలు కూడా ఆది దంపతులకు ఆదివిష్ణువు జన్మించాడని అనగా ఆదిశివుడు మరణం పొందితే(లయ కర్త) ఆది దేవి సృష్టికర్త అయితే ఆది విష్ణుమూర్తి స్థితి కర్త అన్నమాట. ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే కలిసినారు వారే ఆదిపరాశక్తి అలాగే ఆదివిష్ణు అన్నమాట. అనగా సృష్టి కర్త స్థితి కర్త కలిసినా లయ కర్త అయిన ఆది దేవుడు కలిసిన దృశ్యం రికార్డు కాలేదు. దానితో విష్ణుమూర్తి కాస్తా జగన్మోహిని అవతారం ఎత్తి అవతరించాడు. అంతమయ్యే కథని ఆరంభము చేసినాడు. క్షీరసాగర మధనంలో మహా కాలకూట విషము మహా శివుడు ఒక్కడే సేవిస్తే ఆ తర్వాత వచ్చిన అమృతమును అందరూ సేవించినట్లు గా చేసిన జగన్మోహిని పాత్ర ఏమిటో లోకవిదితమే కదా.ఇవి పుక్కిటి పురాణాలు కావని ఇందులో విశ్వ రహస్యాలను  మర్మ రహస్యముగా చిదంబర రహస్యంగా అంతర్లీనంగా దాచి ఉంచిన సత్యాలని పరమార్థ కథలని తెలుసుకునే సరికి మళ్లీ మనమంతా మర్చి పోయే స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అనగా అంతమే ఆరంభం కదా. ఏమంటారు నిజమే కదా. అసలు ఇంతకీ నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే నాకు ఉన్న వివిధ చక్రాల్లో కనిపించిన వారంతా చివరికి వారంతా కూడా శూన్యం స్థితిలో కలిసి పోయినారు కదా. నామ రూప దేవుళ్ళుగా మిగిలిపోయినారు కదా. మరి వీళ్లు కూడా మనకి లాగానే అశాశ్వతంగా అంతరించి పోయినారు కదా. మరి శాశ్వతంగా అంతరించిపోయిన దేవుడు ఉన్నాడా లేదా అని సమాధానం తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఎదురుచూడక తప్పదు. ఈ లోపల 36 కపాలాల  రికార్డ్ విషయాల గురించి నాకు కలిగిన కవితా భావాలను మీ ముందు ఉంచుతున్నాను.
 
ఆదిలో మీరు వేసిన జీవ నాటకములో
జీవ పాత్ర యొక్క రికార్డ్ దృశ్యాలు
ఇప్పుడు చూస్తున్నారు గతంలో చూసినారు
రాబోవుకాలంలో చూడబోతున్నారు
 
కేవలం వీటిని సాక్షి భూతముగా
స్పందనా రాహిత్యంగా ఆనంద రహితంగా
మనఃశాంతితో ఆత్మశాంతితో
పరమశాంతి తో చూడండి
 
చేసేది ఏమీ లేదని పొందేది ఏమీ లేదని
తెలుసుకునేది ఏమీ లేదని
చేయవలసింది ఏమీ లేదని
సాధించవలసినది ఏమీ లేదని అన్నియు ఆదిలోనే
చేశామని పొందినామని గ్రహించండి
 
కనిపించే దృశ్యాలు వినిపించే శబ్దాలు
పొందే ఫలితాలు అన్నీ కూడా
ఒకప్పటి రికార్డ్ దృశ్యాలుగా
దేనికి భయపడకుండా బాధపడకుండా
ఆలోచించకుండా దేనికి ఆశ పెంచకుండా
దేనిని సంకల్పించకుండా దేనికి స్పందించకుండా
దేనియందు ప్రేమ మోహం వ్యామోహం లేకుండా
అన్నిటి యందు కర్మాతీత స్థితిలో
కాలాతీత స్థితిలో భావాతీత స్థితిలో
స్పందన రహితస్థితిలో చూడండి
 
గతంలో జరిగిన వాటినన్నిటిని
ఒక రికార్డు దృశ్యం గానూ
జరుగుతున్న వాటిని రికార్డ్ దృశ్యాలు గానూ
రాబోయే జరగబోయే వాటిని రికార్డ్ దృశ్యాలుగాను
చూస్తున్నట్లుగా పాత్ర దృశ్యాలను సాక్షీభూతముగా చూడండి
 
గతంలో జరిగిన సంఘటనలు
అరిగిపోయిన రికార్డు దృశ్యాలుగా
బాధపడకుండా జ్ఞాపకం లేకుండా తీసుకోండి
ప్రస్తుతం జరిగే సంఘటనలు రికార్డు  దృశ్యాలుగా చూస్తూ
మనఃశాంతిగా చూడండి
రాబోవు జరగబోయే సంఘటనలను చూసి
భయపడకుండా సాక్షీభూతంగా రికార్డు దృశ్యాలే కదా అని
మనోధైర్యంతో పరమ శాంతి తో మెలగండి
 
శుభం భూయాత్

పరమహంస పవనానంద

***********************************************

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeru ee 36 frame cheppataniki cinema example enduku theesukunnara ani aalochisthe ee adhyaayam chaduvuthunte nijangaane cinema kanipisthundi. burra thiragatam aagatamledu brahmandachakram laaga. ee jeeva naatakamulo nee jeevapatra emito, ela undo thelusukovatame yogasaadhana ani... srushti,sthithi,laya gurinchi baaga chepparu. ika ee sushti ela jarigindi ani anthaa recordu drushyalu manamu emi cheyalemani aadilo chesina moodu thappula gurunchi cheppatam...anthaa vinnaka pichi ekkatam kuda drushyame ante boothulu raavatam kooda recorde ani...ika mounam vahinchaka emi peekalemani...
    saadhana chesevaadiki cheyyanivaadiki theda thelpatam, manam ela roopantharam chendinamane vivarana,brahmanda chakram reverse lo thirgataaniki kaaranam paigaa adi last lo chanipoyina drushyam record cheyalekapovatam. srushti, sthithi karthalu kalvatam, laya kartha kalavakapovatam. ikkade antha cheppaka inkaa intha pusthakamlo em chepparane uthsukatha migilcharu.

    రిప్లయితొలగించండి