అధ్యాయం 74

విశ్వ సృష్టి ఎలా?
(సంపూర్ణ అద్వైత సిద్ధాంత నాంది…)
 
భగవంతుడు లేకపోతే ఈ విశ్వ సృష్టి ఎలా ఏర్పడింది అలాగే ఇందులో నడిచే జీవ నాటకము ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని నాలో తపన తాపత్రయం మొదలైంది. అందుకోసం నేను శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యం మిన్న అని గ్రహించి జ్ఞాన తపస్సు చేయడం ఆరంభించాను. అప్పుడు కలిగిన జ్ఞానం ఈ అధ్యాయములో నాంది అయినది. ఆదిలో పరిశుద్ధమైన పరమ శూన్యము ఉండేది. అనగా మానవుడిలో బ్రహ్మరంధ్రము స్థానంలో ఉండే శూన్యమే పరమ శూన్య స్థానం అని గ్రహించండి. ఇది పసిపాప మనస్సు లాంటిది. అనగా ఇందులో సమస్త సద్గుణాలు దుర్గుణాలు 36 తత్వాలు కర్మలు త్రిశక్తులు మాయ స్వరూపము పంచభూతాలు,10 ఇంద్రియాలు, ఆలోచనలు, సంకల్పాలు, స్పందనలు, కర్మలు, కర్మల ఫలితాలు, జన్మలు ,జన్మ శరీరాలు ఇలా మనకు విశ్వములోనూ అలాగే మనలో కనిపించే అన్ని రకాల లక్షణాలు ఆదిలో ఉండే పరమ శూన్యములో అంతర్గతంగా ఉన్నాయి. అంటే విత్తనములో ఎలా అయితే సంపూర్ణంగా చెట్టు ఉంటూ అంతర్గతంగా ఉంటుందో అలా ఈ పరమ శూన్యములో సర్వ లక్షణాలు ఉన్నాయని గ్రహించండి. పరమ శూన్యము ఎల్లప్పుడూ కూడా పసిపాప మనస్సులాగా సచ్చిదానంద స్థితిలో ఉండేది. విచిత్రం ఏమిటంటే అది ఈ ఆనంద స్థితిలో ఉన్నదని కూడా దీనికి తెలియని స్థితి. కాకపోతే దీనికి మాయ స్వరూపం ఆవరించి ఉంది. అనగా సూర్యుడికి కాంతి ఎలాగో పువ్వులకి సువాసన ఎలాగో అలాగా జీవుడికి 'ఆరా' వంటి కాంతిశక్తి ఎలా ఉంటుందో అలా పరమ శూన్యముకు మాయ స్వరూపం ఆవరించి ఉంది. ఇది ఒకప్పుడు మాయ సహితంగా మరొకప్పుడు మాయ రహితంగా వుండేది. పగలు సూర్యుడు కనిపించి రాత్రి అవగానే సూర్యుడు కనిపించకపోవడం ఎలాగో ఈ మాయ స్వరూపం ఒకప్పుడు మాయ సహితంగా మరొకప్పుడు మాయ రహితంగానూ ఉండటం జరుగుతోంది. విచిత్రమేమిటంటే మాయరూపం తేడా స్థితిల వలన పరమ శూన్యములో ఉన్న త్రి గుణాలలో అనగా సత్వ రజో తమో గుణాలు హెచ్చుతగ్గులు రావడం జరిగినది. 

అనగా ఆరు నెలల పసి పాపకి నిజానికి ఆకలి అంటే ఏమిటో తెలియదు. నిద్ర అంటే ఏమిటో తెలియదు. నవ్వడం లేదా ఏడవటం అంటే ఏమిటో తెలీదు. ఒక సంవత్సరం పిల్లవాడికి ఆకలి నిద్ర ఎలా తెలుస్తాయో అలాగే మూడు సంవత్సరాల పిల్లవాడికి నవ్వడం ఏడవడం ఎలా తెలుస్తాయో ఆలోచించండి. అనగా వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడులోని అభివృద్ధి వలన వాడి దశేంద్రియాలలో ఆలోచనలు భావాలు ఎలా మారినాయో అలా ఈ పరిశుద్ధ పరమ శూన్యములో కూడా మాయ స్వరూపం  హెచ్చుతగ్గులు వలన తద్వారా త్రిగుణాలకు హెచ్చుతగ్గులు మార్పులవలన దానికి మొట్టమొదటిసారిగా ఆలోచన అనేది వచ్చినది. తద్వారా తాను నిత్య సచ్చిదానంద స్థితిలో ఉన్నానని జ్ఞాన భావం తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుండి సంతోషంగా ఉండలేక పోయినది. తనకున్న మాయ స్వరూపం  హెచ్చుతగ్గుల వలన ఈ స్థితి కలిగినది. నిజానికి ఏకాకి అయినవాడు ఎవడు కూడా సంతోషంగా ఉండలేడు కదా. అలా ఈ పరిశుద్ధ పరమ శూన్యము ఉండేది. మాయ స్వరూపం మాయ వలన తనలాంటి సహచారిణిని కావాలని ఆశ కలిగినది. దీనితో పాటుగా ఏదో తెలియని కారణము లేని భయం కూడా కలిగినది. మాయ స్వరూపం సంకేతాలు ఆశా భయము అని గ్రహించండి. 

ఏది ఏమైనా గానీ తన లాంటి సహచారిణి కావాలని పరమ శూన్యము సంకల్పం చేసుకుంది. దానితో ఇది కాస్త రెండు భాగాలుగా విడిపోయి పరిశుద్ధాత్మతో పరమ శూన్యము అనగా సర్వేశ్వరుడి గాను పరిశుద్ధ శూన్యముగా ఏర్పడినది.అపుడు అతిపెద్ద విస్పోటనం జరిగినది. దీనివలన శబ్ద నాదముగా పరమ శూన్యము నందు తుంకార నాదం ఏర్పడినది. అలాగే మహోన్నతమైన బ్రహ్మతేజస్సుతో చితాగ్ని ఉద్భవించినది.ఈ ఆది నాదము అలాగే బ్రహ్మ తేజస్సు ఒకదానికొకటి స్పందించడం వలన సంయోగం చెంది దైవకణం పిండి రేణువు పరిమాణములో ఆకాశ తత్వం ఆకాశ శరీరముతో ఆకారముగా ఆకార పరబ్రహ్మంగా అవతరించింది. అంటే ఈమె ఏర్పడటానికి కారణం పరమ శూన్యము అంశలైన ఆలోచన సంకల్పం స్పందన అని గ్రహించండి. అలాగే ఆశ భయము ఆనందం అనే మాయ స్వరూప అంశాలు కారణం అని గ్రహించండి. అంటే బ్రహ్మ తేజస్సు మాయ స్వరూపము అంశ అయితే శబ్ద నాదము పరమ శూన్యము అంశ అని గ్రహించండి. అనగా పరమ శూన్యము నుండి ఆదిలో పంచభూతాలలో ఆకాశం అనేది మొట్టమొదటి సారిగా బయటికి వచ్చినది. ఎందుకంటే తుంకార శబ్ద నాదానికి కారకమైనది కదా. ఆకాశంలో శబ్దమనే గుణం ఉంటుంది అని తెలుసు కదా. ఇతర వస్తువులను ఉండటానికి అవకాశం ఇచ్చేది కాబట్టి పైగా ఏమీ లేని దాని నుండి ఉండి లేనట్టుగా కనిపించే తత్వం గుణం దీని వలన ఆకాశం అన్నారు అని గ్రహించండి. ఈ పరబ్రహ్మ పరిమాణము పిండి రేణువుఅంత అని గ్రహించండి.దీనినే ఈశ్వరుడు అన్నారు. పరమ శూన్యమైన నిరాకార పరబ్రహ్మను సర్వేశ్వరుడు అన్నారని గ్రహించండి. పరమ శూన్యమునకు ఎట్టి ఆకారము ఉండదని గ్రహించండి. అలాగే నామము ఉండదని గ్రహించండి. అంటే పరమశూన్యము అనేది నామరూపధారి కాదు అన్నమాట. అనగా మనలో ఆకార పరబ్రహ్మ స్థానము బ్రహ్మరంధ్రము వద్ద ఉంటుందని ఇందులో బ్రహ్మ తేజస్సుతో చితాగ్ని కాస్త పరం జ్యోతి స్వరూపంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆకాశ శరీరధారి ఆలోచన సంకల్పం స్పందన ఆశ భయము ఆనందము త్రిగుణాలు అనే లక్షణాలు ఉన్నాయని గ్రహించండి. ఈయనకి పిండి రేణువు అంత రూపం ఉన్నదని గ్రహించండి. అనగా రంధ్ర స్వరూపము లేదా బిందు స్వరూపము అని గ్రహించండి. ఈ ఆకార పరబ్రహ్మస్వరూపం రంధ్రం లాగా ఉండటం వల్లనే ఈ రేణువు ఉండే స్థానం బ్రహ్మరంధ్రము స్థానం అని చెప్పడం జరిగినది. ఎందుకంటే ఈయన పరమ శూన్యము నుండి శూన్య బ్రహ్మగా రంధ్రం చేసుకుని ఆకార బ్రహ్మగా ఉద్భవించాడు.పైగా బ్రహ్మరంధ్రము అనేది మన శరీరంలో మాడు ప్రాంతములో సూదిబెజ్జం అంత పరిమాణంలో మధ్య భాగంలో ఉంటుంది.ఇది సాధారణంగా మూసుకుని ఉంటుంది. దీని వలన మనము చీకటి ప్రపంచంలో ఉంటాము. పసిపిల్లవాడి మాడు భాగంలో మధ్య ప్రాంతములో గమనిస్తే గుండ్రముగా అంగుళం పరిమాణంలో మెత్తటి కొంచెం లోతుగా ఉన్న భాగం మనకి కనపడుతుంది. అంటే ఈ ఆకాశ శరీరం యొక్క పిండి రేణువు పరిమాణం కాస్త అంగుళం  పరిమాణము గా మారే వీలు ఉంటుందని గ్రహించండి. 

ఈ ఆకాశ శరీరధారి కూడా పరమానంద స్థితిని సంతోషముగా అనుభవించ లేకపోవటంతో తనకి మరో సహచారిణి కావాలని ఆలోచన సంకల్పము చేయటంతో తన నుండి విస్పోటనము జరిగి ఓంకార నాదముతో దివ్యకాంతి శక్తితో వాయు తత్వంతో సంకల్ప శరీరధారిగా ఉద్భవించడం జరిగినది. ఇదియే ఈవిశ్వసృష్టి చేసిన అతిపెద్ద తప్పు అన్నమాట.తనతో పాటు ఉద్బవించిన వారితో సృష్టియజ్ఞం చెయ్యడము అనగా సంయోగము చెయ్యడము తప్పు గదా. అంటే ఆకాశ శరీరము కాస్త ఒక భాగము పురుషుడిగా...మరొక భాగము స్త్రీ భాగముగా రూపాంతరము చెందినది.ఇలా తన నుండి ఏర్పడిన స్త్రీ,పురుష ఆత్మల మధ్య సంభోగము సాగడము అంటే ఒకే మౌలికత్వం నుండి ఏర్పిడిన వాటిమధ్య శృంగారము సాగినట్లే గదా.నిజానికి వీరిద్ధరు అంటే వరుసకి వీరిద్దరు తండ్రి,కూతురు అవుతారు గదా. వావివరుసలు పాటించకపోవడము ఆ జ్ఞానము లేకపోవడము వలన వీరిద్దరి మధ్య సంయోగ ప్రక్రియ జరిగినది.తప్పు జరిగినది. అపుడికే వీరి శృంగార భావతత్త్వము వలన బ్రహ్మాండ,పిండ,అండ లోకాలయందు జీవ సృష్టి జరిగిపోయినది. దానితో తామిద్దరం సాగించిన శృంగారము ఎంత తప్పో తెలిసి ...ఈ తప్పుకు ఎంతగానో బాధపడి శూన్యం నుండి ఉద్భవించాక చేసిన ఏకైక భరింపరాని అతి పెద్ద తప్పుయని గ్రహించి...ఈ ఆత్మ స్వరూపాలు కాస్త స్త్రీ ఆత్మస్వరూపము కాస్త గోవుగా రూపాంతరము చెందితే...ఈమె విరహవేదనను భరించలేక పురుషాత్మ కాస్త ఎద్దుగా రూపాంతర చెంది సంయోగము చెందడము జరిగినది.అంటే ఆకాశ శరీరము నుండి వాయువు శరీరధారులుగా మారి గోజాతిని వృద్ధి చేసినారు.ఆ తర్వాత మళ్ళీ వీళ్లు చేసిన తప్పు గుర్తుకి రావడము...మళ్ళీ గోజాతి రూపములో తప్పు చేసినామని గ్రహించి బాధపడటం...ఈ సారి ఇలా గాదనుకొని ఈ సారి స్త్రీ ఆత్మ స్త్రీ గుర్రముగా మారితే..దీనికి అనుగుణముగా పురుషాత్మ కాస్త పురుష గుర్రముగా మారడం..మళ్ళీ కధ యదావిధిగా జరగడం...దానితో మళ్ళీ మరొక జాతి స్త్రీపురుషులుగా వీరిద్ధరు రూపాంతరం చెందడము జరిగినది.దానితో ఈ విశ్వసృష్టి వివిధ రకాల దైవ,జీవ జాతుల మూలబీజాలు ఏర్పడినాయి అన్నమాట. ఈ లెక్కన వీరు చేసిన ఆది తప్పుకి మనమంతా..మన దైవాలంతా...మన జీవ కోటి ఏర్పడి నానాకష్టాలకి నాందిని ఏర్పరచినారు అన్నమాట. ఈ మాట మేము అనడము లేదు. స్వయంగా బృహదారణ్యక ఉపనిషత్ చెప్పడము జరిగినది.దాని సారము ఇక్కడ ఇస్తున్నాను.చదువుకొండి.తెలుసుకోండి.బాధపడండి.ఎందుకంటే ఈ ఆదితప్పు చేసిన ఆది ఆత్మస్వరూపము మీరే గదా.
 

 
అంటే ఆకాశం శరీరధారి రేణువు పరిమాణంలో ఉంటే ఈ వాయువు శరీరధారి అంగుళ పరిమాణం ఉంది. దానితో మళ్ళీ ఈ రెండు శరీరధారులలో మధ్య ఓంకారనాదం కాంతిశక్తి ఒకదానికొకటి స్పందించడం వలన సంయోగం చెంది బ్రొటనవేలు పరిమాణంలో అగ్నితత్వం అయిన కారణ శరీరధారి ఉద్భవించడం జరిగింది. వీటిని మన పరిభాషలో చెప్పాలి అంటే ఆకాశ శరీరధారిని ఈశ్వరుడిగాను వాయు తత్వ సంకల్ప శరీరధారిని ఈశ్వరి గాను కారణ శరీరధారి అనంతపద్మనాభుడు ఆది విష్ణు మూర్తి గా చెప్పడం జరిగినది. అంటే ఆకాశము నుండి వాయువు ఆపై అగ్ని ఏర్పడి వచ్చినాయని తెలుసుకోండి. అలాగే ఈశ్వరుడు మరియు ఈశ్వరి  స్థానాలు మన శరీరంలో హృదయ ఆకాశమైన హృదయ చక్రము నందు అంగుళం పరిమాణంతో ఎనిమిది రేకులు ఉన్న నీలి పద్మములో మధ్యలో ఆవాసం చేస్తూ ఉంటారని వీరి ఇష్ట కోరిక మాయ అనగా కామ మాయ ఉండుటవలన వీరిని ఇష్టకామేశ్వరుడిగాను ఇష్టకామేశ్వరి అని పిలవడం జరుగుతోంది. వీరిద్దరిని కామేశ్వరి శక్తిగా పరమ శూన్యము ప్రతీక అయిన ఇష్టలింగముతో ఆరాధించడం జరుగుతోందని గ్రహించండి. అలాగే అగ్ని తత్వమైన కారణ శరీరధారి అయినా శ్రీ మహా విష్ణు వు అనంత పద్మనాభుడిగా ఈ చక్రము నందు ఆవాసము చేస్తూ ఉంటారని అనగా ఈ చక్రము నందు ఇష్ట లింగేశ్వరుడు ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంతపద్మనాభుడు ఉంటారని గ్రహించండి.

ఇష్ట లింగ ఆరాధన చేస్తూ ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి ఉంటే వీరిద్దరినీ ఆదిదంపతులుగా తనను కన్నదైవాలుగా అనంతపద్మనాభుడు ఆరాధన చేస్తూ ఉంటాడు. దీనికి సంకేతమే ఈయన కుడిచేతిలో ఇష్టలింగము అలాగే ఎడమ చేతిలో నీలిరంగు అష్టదళపద్మం ఉంటుందని గమనించండి. మీరు ఎప్పుడైనా మహాశివుడు లింగారాధన చేస్తున్నట్లుగా పార్వతీదేవి లింగారాధన చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు గమనించి ఉంటారు. నిజానికి వాళ్ళు చేస్తున్న ఇష్ట లింగ ఆరాధన ఈ హృదయ చక్రంలో పరమ శూన్యము యొక్క ప్రతీకైన సర్వేశ్వరుడు యొక్క నిజమైన లింగారాధన అని తెలుసుకోండి. ఆ తరువాత అగ్ని తత్వ స్వరూపుడైన కారణ శరీరం కూడా పొందే బ్రహ్మానంద స్థితిని ఒంటరిగా అనుభవించలేక తనలాంటి సహచరి కావాలని సంకల్పించుకోవడంతో తద్వారా దాని బొడ్డు నుండి పంచముఖాలతో జలతత్వంతో సహస్రదళ పద్మంలో సూక్ష్మ శరీరధారిగా బ్రహ్మదేవుడు ఉద్భవించడం జరిగినది. అనగా అగ్ని నుండి జలము బయటికి వచ్చినది. కారణ శరీరం నుండి సూక్ష్మశరీరము బయటికి వచ్చింది అని తెలుసుకోండి. ఈయన 83 అంగుళాల పరిమాణంతో మన శరీరంలో బ్రహ్మ చక్రం వద్ద ఆవాసం చేస్తూ ఉంటాడు. అలాగే శ్రీమహావిష్ణువు ఎప్పుడైతే సంకల్పం ఇచ్చినాడో ఆయన కాస్త వెయ్యి భాగాలుగా విడిపోయి సహస్రార చక్రము నందు విష్ణుమాయగా ఙ్ఞానమిచ్చే జగద్గురువుగా ఉండిపోవడం జరిగింది. అనంతపద్మనాభుడు కాస్త చండీమాతతో కలిసి పరిపాలన సాగిస్తూ సహస్రార చక్రము వద్ద సహస్ర భాగాలుగా విడిపోయి విశ్వరూప దర్శనధారిగా మారడం జరిగి బ్రహ్మాండమును సృష్టించడంతో దానితో సృష్టి కార్యం కోసం తన బొడ్డు నుండి బ్రహ్మదేవుడిని సృష్టించడం ఈయన చేత దైవ సృష్టి చేయించటం ఈయన సృష్టి నుండి మళ్ళీ విష్ణువు జన్మించటం ఈయన బ్రహ్మాండము యొక్క స్థితి చూడటం ఈయన నుండి మళ్ళీ ఆది రుద్రుడు అంశతో మహేశ్వరుడు పుట్టడం జరిగినది. ఇదంతా బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయలను చూసుకోవడం జరిగినది.అలాగే సూక్ష్మ శరీర ధారి అయిన బ్రహ్మదేవుడికి అసలు తను ఎవరు ఎక్కడి నుండి ఉద్భవించినవాడో మొదట తెలియరాలేదు. చూస్తే జలం మాత్రమే కనిపించినది.తన పుట్టుకకు కారకమైన అనంతపద్మనాభుడు ఆయనకు అగుపించలేదు. ఆసనమైన సహస్ర దళ పద్మము మాత్రమే అగుపించింది. దీనిని మొట్టమొదటి ఆకార రూపం అని శాస్త్రవచనం చెప్పడం జరిగినది. 

ఈ పద్మము నుండి నీటి బొట్లు తప తప మంటూ జలములో పడుతూ ఉంటే ఈ తప నాదమునే మంత్ర ధ్యానంగా చేసుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేయగా వారికి స్వానుభవంగా సహస్రదళ పద్మం యొక్క తొడిమి భాగం కనపడటం దాని ద్వారా లోపలికి వెళితే అనంతపద్మనాభుడు దర్శనమివ్వటం వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. తానే గొప్ప అంటే తానే గొప్ప అని గొడవ పడటం ఇందులో వీరిద్దరి తగవు తీర్చడానికి సర్వేశ్వరునికి (పరమ శూన్యము ప్రతీక) యొక్క అంశ రూపమైన అపురూపమైన ఇష్టలింగము కాస్త బ్రహ్మతేజస్సుగా ఉద్భవించడం దాని ఆది అంతము వెతకడంలో బ్రహ్మదేవుడు అబద్ధాలు చెప్పడంతో వారి పంచ తలలలో ఒక తల ఖండించడం అది కాస్తా బ్రహ్మకపాలంగా మారడం జరిగినదని విధి విధాన కథను చదివి ఉంటారు కదా.ఈ లింగోద్భవ కాలమే మహాశివరాత్రిగా మనము చేసుకుంటామని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. 

సర్వేశ్వరుడు ఆజ్ఞ మేరకు శ్రీమహావిష్ణువు స్థితి కర్తగాను బ్రహ్మదేవుడు సృష్టి కర్త గాను తన అంశయైన రుద్రుడు లయ కర్త గాను ఉండటం జరిగినది. ఈ త్రిమూర్తులు కలిసి తమకున్న త్రిగుణాల మాయ వలన తాము పొందే ఆనంద స్థితిని ఒంటరిగా అనుభవించలేక తమలాంటి సహచారిణులు కావాలని సంకల్పించడంతో ఓంకార నాదము నుండి ఏడు రాగాలు కాంతిశక్తి నుండి ఏడు వర్ణాలు ఏర్పడటం అది కాస్త ఒకదానికొకటి స్పందించడంతో త్రిమూర్తులుగా త్రికర్మలు చేస్తూ ఇచ్చా క్రియా ఙ్ఞాన శక్తులుగా త్రిమాతలు  అనగా పార్వతి లక్ష్మి సరస్వతి ఉద్భవించడం జరిగినది. మళ్లీ ఈ త్రిమూర్తులు త్రిశక్తులు సంయోగము వలన 36 మంది ఉద్భవించారు. మీరు కాస్త ఒక్కొక్కరికి ఒక కోటి చొప్పున 36 కోట్లగా మారడం జరిగినది. వీరంతా సూక్ష్మ శరీరధారులతో జల తత్వముతో 14 లోకాలు ఆవాసం చేయడం జరిగినది. వీరంతా కోటానుకోట్ల త్రిమూర్తులుగా త్రిశక్తి మాతలుగా అలాగే కోటాను కోట్ల భువనలోకాలలో ఆవాసం చేస్తున్నారని దేవి పురాణము చెప్పడం జరిగినది. మళ్లీ బ్రహ్మదేవుడు మనస్సు నుండి భూ తత్వంతో స్థూల శరీరంతో 84 లక్షల జీవజాతులతో భూలోకం ఏర్పాటు చేయడం జరిగినది. విచిత్రం ఏమిటంటే ఈ విశ్వంలో కోటాను కోట్ల త్రిమూర్తులు త్రిమాతలు ఉన్నారని కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని అంటే జలము నుండి భూమి బయటికి వచ్చినది అనగా సూక్ష్మశరీరము నుండి స్థూల శరీరము బయటకు వచ్చిందని గ్రహించండి. పంచభూతాలతో పంచ శరీరాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము ఏర్పడినాయి. అలాగే మాయ అంశలుగా మాయ మోహము వ్యామోహం అరిషడ్వర్గాలు సప్తవ్యసనాలు దుర్గుణాలు ప్రాణము మృత్యువు సద్గుణాలు సర్వ గుణాలు ఏర్పడినాయి. మంచితో పాటు చెడు కూడా ఏర్పడింది. దీంతోపాటు ప్రతి సృష్టి ఏర్పడినది. అందుకే మనకి కనిపించే విశ్వమంతా ద్వంద్వ భావాలతో ఉంటుంది. చీకటి వెలుతురు మంచి-చెడు సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు స్త్రీ పురుష ఇలా మున్నగు ద్వంద్వ బేదాలు కనపడతాయి. దీనికి కారణం మనకి ఆవరించి ఉన్న మాయ స్వరూపం అని గ్రహించండి. దీనివలన పరమాత్మ కాస్త జీవాత్మగా మారినట్లుగా వేరుగా కనపడుతున్నాడు. నిజానికి జీవాత్మ ఎక్కడి నుండి వచ్చినది. పరమాత్మ నుండే కదా. జీవాత్మ అంటే స్థూల శరీరధారి. అదే పరమాత్మ అంటే ఆకాశం శరీరధారి. మరి స్థూల శరీరమైన భూమి తత్వం దేని నుండి వచ్చినది. ఆదిలో ఉన్న ఆకాశం నుండే కదా. అదేనండి. మొదట ఆకాశము వాయువు అగ్ని జలము భూమికి వచ్చినాయని తెలుసుకున్నారు కదా. వీటి తత్వాలు అయిన ఆకాశ శరీరము సంకల్ప శరీరము కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము వచ్చినాయని  తెలుసు కదా. అంటే మనమంతా ఆకాశ తత్వం అయిన ఆకాశ శరీర ప్రతీక అయిన పరమ శూన్యము నుండి అకార పరబ్రహ్మముగా శూన్య బ్రహ్మగా అవతరించామని గ్రహించండి. ఎందువలన అంటే పరమాత్ముని యొక్క ఆలోచన వలనే కదా. ఆలోచన దేనికి వచ్చింది. దానికి ఆవరించి ఉన్న మహామాయ స్వరూపం వలన. ఇంతవరకు బాగానే ఉంది. 
మనలో ఆది యోగచక్రాలు ఏర్పడిన విధానం:

పరమశూన్యము ఏకాకిగా సంతోషమును భరించలేక మనల్ని పుట్టించడం అదే దైవాలని జీవాలని పుట్టించడం జరిగినది అని తెలుసుకున్నారు కదా. అంటే హృదయ చక్రం వద్ద విశ్వం యొక్క విశ్వ సృష్టిని ఈశ్వరుడు -ఈశ్వరి చేసి అక్కడ ఆది మహా విష్ణువు, ఆది బ్రహ్మ, ఆది రుద్రుడు కాస్త విశ్వసృష్టి స్థితి లయకు అలాగే దీప దుర్గ- దీప కాళి- దీప చండీ ఇఛ్ఛా- క్రియా- ఙ్ఞాన శక్తులతో సంకల్ప శరీరాలైన స్వప్న శరీరాలతో విశ్వసృష్టి నడిపిస్తూ ఉంటే ఆది పద్మనాభుడు ఆది చండిక మాత్రము సహస్రార చక్రము వద్ద బ్రహ్మాండము యొక్క బ్రహ్మ సృష్టి స్థితి లయల కోసం త్రిమూర్తులుగా త్రిశక్తి మాతలుగా మహావిష్ణువు మహాలక్ష్మి మహా సరస్వతి మహా బ్రహ్మ మహాదేవుడు మహాదేవి సృష్టి యఙ్ఞము చేస్తున్నారని గ్రహించండి. వీళ్ళకి అలాగే హృదయ చక్రం లోని త్రిమూర్తి త్రిశక్తి మాతలకి సంబంధం లేదు. హృదయము వద్ద ఈశ్వరుడు ఈశ్వరి సృష్టి యఙ్ఞము అయితే సహస్రార చక్రము వద్ద ఆది అనంతపద్మనాభుడు ఆది విష్ణువు యొక్క బ్రహ్మాండ సృష్టి యఙ్ఞము అని గ్రహించండి. అక్కడ వారంతా(హృదయము ) అంగుళ పరిమాణంలో ఆకాశ శరీరముతో ఆకాశ తత్వముతో తొమ్మిది మంది కాస్త తొమ్మిది లోకాలలో ఆవాసము చేస్తుంటే ఇక్కడ (సహస్ర చక్రము) 3 అంగుళాల పరిమాణంతో కారణ శరీరంతో అగ్నితత్వం వెయ్యి మంది ఒక్కొక్కరు వెయ్యి కోట్ల మంది సహస్ర లోకాలలో ఆవాసము చేస్తున్నారని గ్రహించండి. ఎవరి సృష్టి వారిది. ఎవరి త్రిమూర్తులు ఎవరి త్రిమాతలు వారివి. ఇలా వీరంతా కూడా వారి వారి యొక్క కల స్వరూపమైన స్వప్న శరీరధారులేనని ఇలా వీరంతా సత్యంగా కనిపించే అసత్యమని మనం మర్చిపోరాదు. ఆ తర్వాత ఆది రుద్రుడు అలాగే ఆది రుద్రుడు దీప కాళీ లయ ప్రక్రియ చేస్తూ శివశక్తి సంయోగంతో జలతత్వంతో 83 అంగుళాల పరిమాణంతో సూక్ష్మశరీరధారులుగా 36 మందిని సృష్టించడంతో పిండ ప్రకృతి ఏర్పడినది. ఈ 36 మందియే 36 కోట్ల దైవాలుగా దైవ జాతులుగా రూపాంతరం చెందడం జరిగింది. వీటికోసం మహా బ్రహ్మ మహా విష్ణువు మహాదేవుడు అంశలతో శ్రీబ్రహ్మ -బ్రహ్మణి, శ్రీ విష్ణువు -వైష్ణవి, శివుడు -శివాని త్రిమూర్తి శక్తి మాతలు సూక్ష్మ శరీరధారులుగా సృష్టి స్థితి లయలు చేయడం జరిగినది. అంటే ఇది మన శరీరంలో ఉండే ఆజ్ఞాచక్రం స్థితిలో ఉండే స్వరూప స్థితి అన్నమాట. వీళ్ళకి పైన ఉన్న వారికి ఎట్టి సంబంధము లేదు. వీళ్లంతా కూడా స్వప్న శరీరధారులేనని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మన విశుద్ధి చక్రము వద్ద ఆది బ్రహ్మ ఆది దుర్గ సహాయంతో సృష్టి యజ్ఞం చేస్తూ ఆది బ్రహ్మ ఆది బ్రహ్మణి ఆనంద స్థితి కోసం సంయోగము చెంది అండ ప్రకృతిని సృష్టించి వీరికోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులుగా సరస్వతి లక్ష్మి పార్వతి దేవి త్రిశక్తులుతో సృష్టి స్థితి లయ ప్రక్రియలు చేస్తూ స్థూల శరీరమునకు 84 అంగుళాలతో 84 లక్షల జీవరాశులతో వెయ్యి కోట్ల స్థూల శరీరములతో అండ ప్రకృతిని భూతత్వముతో జీవాత్మలుగా సృష్టించడం జరిగినది. అంటే హృదయ చక్రములో ఆదిదంపతులైన ఈశ్వరుడు ఈశ్వరి ప్రకృతికి ప్రతీకగా సహస్రార చక్రము నందు ఆజ్ఞా చక్రము నందు విశుద్ధి చక్రము నందు వరుసగా బ్రహ్మాండ పిండ అండ ప్రకృతులను ప్రతి సృష్టి జరిగినాయి అని అది కూడా వారి వారి స్వప్నాలతో స్వప్న శరీరధారులతో కలలాంటి నిజముతో సత్యముగా కనిపించే అసత్యముగా ఏర్పడినారని మనం మర్చిపోవద్దు. ఇంతవరకు బాగానే ఉంది. ఏమి గొడవలు లేవు. ఎవరి కలలు వారివే. ఎవరి సుఖాలు వారివే. ఎవరి ఊహాలోకాలు వారివి. ఎవరు ఊహా ప్రపంచములు వారివి. ఎవరి ఊహా శరీరాలు వారివి. అయితే కోటానుకోట్ల త్రిమూర్తులు త్రిశక్తి మాతలు అలాగే భువనలోకాలు ఉన్నట్లు దేవి పురాణము చెప్పడం జరుగుతున్నది. నిజమే కదా.అంటే హృదయ చక్రము వద్ద ఈశ్వరుడు సహస్రార చక్రం వద్ద ఆదివిష్ణువు ఆజ్ఞాచక్రం వద్ద  ఆది రుద్రుడు విశుద్ధ చక్రము వద్ద  బ్రహ్మదేవుడు ఎవరికి కావలసిన వాళ్లు స్వప్న ప్రపంచం లోకాలను స్వప్న శరీరధారులను ఉన్నట్లుగా చేస్తున్నట్లుగా నాశనం అవుతున్నట్లుగా ఎవరికి వారికి తగ్గట్టుగా ఎవరికి వారే స్వప్నాలు కనడం జరుగుతోందని గ్రహించండి. ఇది ఇంత వరకు ఇలాగే ఉంటే బాగుండేది. ఎవరికి ఎలాంటి గొడవ గోల ఉండేది కాదు. 

కానీ విశుద్ధ చక్రము వద్ద ఉన్న ఆది బ్రహ్మదేవుడికి కలిగిన స్వార్ధం వలన మనుష్యులంతా నా నా చంకలు నాకవల్సి వచ్చినది. అది ఏమిటంటే తనకు ఉన్న బ్రహ్మ జ్ఞానము వలన ఈ విశ్వమంతా ఆనంద స్థితి యొక్క ఆలోచనల వలన ప్రతి సృష్టి జరుగుతోందని జ్ఞానం పొందడం జరిగినది.ఇలా బ్రహ్మదేవుడు విశ్వసృష్టిని కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు చేసి చేసి విసుగు చెంది తన ప్రమేయం లేకుండా జీవ సృష్టి ఎలా చేయాలో ఆలోచన చేయడం ఆరంభించాడు. అప్పుడు మానవజాతిని అనగా విచక్షణ జ్ఞానం సృష్టించడం జరిగినది. అనగా సనక సనకాదులు మహర్షులు దేవతలు ఋషులు మున్నగు వారిని సృష్టించడం జరిగింది. వీరంతా పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాన సిద్ధులు కావడంతో వయస్సు వచ్చేసరికి గోచి గుడ్డతో స్మశాన వైరాగ్యం చెంది గృహస్థ ఆశ్రమము లోనికి అడుగు పెట్టకుండా సన్యాసులుగా మారిపోవడం జీవ సృష్టి ఆగిపోవటం జరుగుతుంది అని బ్రహ్మదేవుడు దృష్టికి వచ్చింది. దానితో ఈయన వీరందరికీ అవిద్య మాయ అనగా బ్రహ్మజ్ఞాన రహితంగా మార్చటంతో యధావిధిగా జీవ సృష్టి జరుగుతోంది. ఇందులో తన ప్రమేయం లేకపోవడంతో బ్రహ్మదేవుడికి విసుగు చెంది వీరికి ఆనంద స్థితిని దూరం చేయడం జరిగినది. ఈ స్థితి పొందాలి అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కావాలి కదా. దీనికోసం జీవులు తన కోసం జ్ఞాన తపస్సు చేయవలసి వస్తుంది కదా. ఇప్పుడు తన అవసరం వీరందరికీ ఏర్పడుతుంది కదా అని ఆలోచించి బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి మనస్సు నిశ్చల స్థితి పొందితే కలుగుతున్న విజ్ఞానము మానవుడికి అందకుండా ఎలా చేయాలో ఆయనకు మొదట అర్థం కాలేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలిగించే మనస్సుని మానవుడిలో ఎక్కడ ఉంచాలో తెలియలేదు. ఎందుకంటే మనస్సు స్థితి తెలిసిన మానవుడు కాస్తా మాధవుడు అవుతాడు అని మన స్థితి తెలియని నరుడు కాస్త వానరుడు అవుతాడు అని గ్రహించిన బ్రహ్మదేవుడు దానితో మనిషిలో మనస్సు ఎక్కడ ఉంచాలో సలహా కోసం మిగతా జీవులు సహకారం తీసుకోవడం జరిగినది. .

ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు

ప్రపంచాన్ని సృష్టించాను
పశుపక్ష్యాదులను సృష్టించాను
అయినా తృప్తిగా లేదెందుకని
 
ఓ చిన్న ఆలోచన చేసి
తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు
 
మనిషి
అని నామకరణం చేశాడు
అన్ని తెలివితేటలను,
సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు.
ధైర్యం,
సాహసం,
నమ్మకం,
ముందుచూపు,
ఆత్మ విశ్వాసం
నిండా నింపేశాడు.
 
భూమి మీద
వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది.
 
వీడు
కాలాంతకుడు,
ప్రాణాంతకుడు,
దేవాంతకుడు
అయిపోతాడేమో..
వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
 
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు.
ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు."
అన్నాడు బ్రహ్మ.
 
"పోనీ ...
నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
 
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
 
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.
 
"భేష్....
మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నింటినీ గెలుస్తాడు.
 
కానీ
తన లోపలికి వెళ్లడు.  తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం,"
అన్నాడు బ్రహ్మ.
 
అప్పటి నుంచీ మనోబలం
మనిషి తనలోనే ఉంచుకుని..
బయట వెతుకుతూనే ఉన్నాడు.
హిరణ్యకశిపుడు దైవం కోసం బయట వెతికితే…… ప్రహ్లాదుడు తనలోనే ఉన్నాడని గ్రహించాడు.
 
దానితో బ్రహ్మ దేవుడు మానవుని యొక్క మనస్సు అతని శరీరం లో 5 స్థితులలో ఉంచినాడు. అంటే మనస్సు నిశ్చలస్థితి పొందితే అది ఆత్మ స్వరూపమని మనస్సు అనిశ్చలమనస్సు  పొందితే అస్థిర మనస్సు రూపంగా ఉంటుందని మానవుడు తెలుసుకోలేని మనస్సుకి మాయ స్వరూప స్థితిని పెట్టడం జరిగినది. ఈ విశ్వములో తన ప్రమేయం లేకుండా జీవసృష్టి జరగడము అలాగే మనస్సు తెలుసుకునే వారికి కావలసిన బ్రహ్మ ఙ్ఞాన స్థితిని కలిగించడంలో తన వంతు పాత్రను కొనసాగిస్తూ ఈ విశ్వములో నిజములాంటి కలలో కలలాంటి నిజంతో జీవనాటకం నడిపిస్తున్నాడు అన్నమాట. ఇలా ఈ విశ్వ సృష్టిలో సృష్టికార్యం జరుగుతుందని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. అలాగే ఈ బ్రహ్మదేవుడి స్వార్ధము వలన మనము కాస్త ఆనంద స్థితిని కోల్పోయాము. తద్వారా మనకి అవిద్య మాయ వలన అపస్మారక స్థితి అనగా తెలిసినది మర్చిపోవడం జరిగినది. దానితో మనము కాస్త పరమాత్మనే జ్ఞానము కోల్పోయి పరమాత్మ వేరు నేను వేరు అనుకుంటూ జీవాత్మగా అథమ స్థాయికి చేరుకోవడం జరిగినది. మనకి మనమే మనమీద వివేక వైరాగ్యాలు కలగటంతో గురువులు సహాయముతో మనలోని కుండలిని శక్తి జాగృతి చేసుకుని యోగ చక్రాలను శుద్ధి చేసుకుని ఆధీనము చేసుకుని వివిధ రకాల మాయలు భ్రాంతులు భ్రమలు దాటుకుంటూ సాధన పరిసమాప్తి అయిన హృదయ చక్రం వద్దకు చేరుకుని తామే పరమాత్ముడని బ్రహ్మ జ్ఞానము అనగా మర్చిపోయిన జ్ఞానంస్పురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే కోల్పోయిన ఆనంద శక్తిని తిరిగి మనం సంపాదించుకోవడానికి మనిషి జన్మలు అలాగే యోగసాధనా విధానాలు ఉన్నాయని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు కదా. ఎప్పుడైతే మనము హృదయ చక్రము వద్ద అహం బ్రహ్మాస్మి అనగానే పరమాత్మ అయి ఉన్నాను అని జ్ఞాన స్థితిని పొందుతామో అప్పుడు మనకి ఇష్ట కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఈ మాయలో పడితే మళ్ళీ మనకి ఆలోచన సంకల్పం స్పందన కలిగి వీటిలో ఏదో ఒక దానికి బలి అయితే తిరిగి మనం అపస్మారక స్థితి అనగా తెలిసిన జ్ఞానము అదే నేను పరమాత్మ అను జ్ఞానం కోల్పోయి కర్మ జన్మ కోసం పునర్జన్మగా జీవాత్మగా అజ్ఞాన మాయతో అవతరించడం జరుగుతుంది. అదే ఈ చక్రం కలిగించే ఇష్ట కోరిక మాయను దాటుకోగలిగితే మనకి దీనికి స్పందించన స్థితి కలిగి ఆనంద సమాధి స్థితి పొందటం జరుగుతుంది. తద్వారా మనం అపస్మారకం వలన మర్చిపోయిన జ్ఞానం తిరిగి మనకి జ్ఞానంస్పురణ ద్వారా జ్ఞప్తికి వస్తుంది. కాకపోతే మనము మళ్లీ ఆనంద స్థితిలో ఏకైక ఆలోచన స్థితికి స్పందించకుండా ఉండాలి. లేదు అంటే మళ్లీ కథ మొదలవుతుంది.

అంటే ఈ పంచస్థితుల్లో మన మనస్సును స్థూలశరీరం- సూక్ష్మశరీరం- కారణ శరీరము- సంకల్ప శరీరము- ఆకాశ శరీరములో ఉంచడం జరిగినది. సంకల్ప శరీరంతో స్పందన (పురుషతత్వం ), భయము (స్త్రీ తత్వం లో) మహాకాలుడు మహంకాళి రూపాలతో మనల్ని అనాహత చక్రము నందు అహంకార స్థితి రూపంలో ఉంచడం జరిగినది. మన ఆది బ్రహ్మదేవుడు ఇలా తన స్వార్థం కోసం మనకు తెలియకుండా మన మనస్సును పంచభూత సహితముగా సూక్ష్మ పంచభూత స్థితులలో సూక్ష్మాంశ పంచ శరీర తత్వాలతో పంచ చక్రాలలో విశుద్ధ చక్రము నందు ఆకాశ శరీరతత్వంతో స్పందన స్థితి మాయను అదికూడా బ్రహ్మజ్ఞానంకు స్పందించే విధంగా అమర్చటం దీనికి అదేవిధంగా పంచముఖ గాయత్రీ మాతను నియమించడం జరిగినది. అలాగే సంకల్ప శరీరముతో సంకల్పాలతో వాయుతత్వం తో అనాహత చక్రము నందు సంకల్పము మాయతో మరణభయమునకు గురి అయ్యేటట్లుగా అమర్చడం దీనికి అధి దైవాలుగా మహాకాలుడు మహాకాళిక వీరి ఆవాసము మహాస్మశానముగా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే మణిపూరక చక్రము నందు కారణ శరీరంతో అగ్ని తత్వంతో ఆలోచన స్థితిలో ఇష్ట దైవసాక్షాత్కారం మాయలో స్పందించే విధంగా ఇష్ట అధిష్టాన దైవం గా మార్చడం జరిగినది. అలాగే మన స్వాధిష్ఠాన చక్రము నందు జల తత్వముతో సూక్ష్మశరీరధారిగా భయము అనే స్థితి యందు ధన వ్యామోహం లక్ష్మీనారాయణ దైవాలను అమర్చడం జరిగినది. అలాగే మన మూలాధార చక్రము నందు భూతత్వముతో స్థూల శరీరమునకు ఆశ స్థితి యందు కామ మాయతో మహాగణపతి దైవంగా ఏర్పాటు చేయడం జరిగినది. నిజానికి ఇదంతా కూడా సత్యములాగా కనిపించే అసత్యమనే విషయము మానవజాతికి తెలియకుండా సాధన చేస్తే తను ఇచ్చే బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నట్లుగా ఉండేటట్లుగా ఈ ఆది బ్రహ్మదేవుడు తన విశుద్ధ చక్రము వద్ద జీవ ప్రకృతి కోసం స్వార్థపూరితమైన భయంకరమైన కలలు కనడం జరుగుతుంది. దానితో మన స్వప్న శరీరధారులుగా స్వప్నలోకాల నందు ఆవాసం చేస్తున్నాము. మనము పరమాత్మ అనే విషయం మర్చిపోయి అదికూడా కలలో మర్చిపోయినట్లు బ్రహ్మదేవుడు తన స్వార్ధ కల కనగడంతో మనమంతా మన మానవులంతా తామే మాధవుడు అనే విషయం మర్చిపోయి మానవులుగా వానరులుగా జీవనగమనంలో జీవ పాత్రను వేస్తున్నాము. కలలో నానా కష్టాలు పడుతూ నా నా చంకలు నాకుతూ ఉన్నాము, అంటే హృదయ చక్రం వద్ద ఈశ్వరుడు కల వలన సహస్రార చక్రము వద్ద ఆదివిష్ణువు కల వలన ఆజ్ఞాచక్రము వద్ద ఆది రుద్రుడు కల వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీరి కలలయందు వారంతా పరమాత్మ ఆత్మ దైవాలుగా ఉన్నారు. ఆనంద స్థితిలో ఉన్నారు. మరోస్థితిగాని భావముగాని బాధ కాని వారి కలలో లేదు. కాని ఆది బ్రహ్మదేవుడి భయంకరమైన కల వలన మానవులు నానా చంకలు అనగా విశుద్ధ చక్రము నుండి మూలాధార చక్రము దాకా నానా కష్టాలు పడుతున్నారు. దీనికి కారణం బ్రహ్మదేవుడికి ఉన్న అహం మీద కొట్టిన దెబ్బ అయ్యి ఉండవచ్చును. తాను ఆది బ్రహ్మ అని కాకుండా ఆది పరబ్రహ్మగా గుర్తించడం జరగలేదని అహంకారము వలన తన తలను విడకొట్టిన ఆది రుద్రుడిని శివుడిగా జీవుడిగా తన కలలో ఊహించుకోవడం వలన అనగా అనాహత చక్రము నుండి మూలాధార చక్రము దాకా మహాకాలుడు మొదలై జీవ బ్రహ్మస్వరూపం అయిన జీవుడు దాకా వీళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఆది బ్రహ్మదేవుడు సంతృప్తి చెందుతూ ఉండాలి.తనకి కలిగిన అవమానభారంను ఈ విధంగా బదులు తీసుకోవడం జరిగింది. జరుగుతోంది. ఇది కూడా నిజములాంటి కల అయినప్పటికీ మనమంతా స్వప్న శరీరం అయినా కూడా మన మనస్సుకి ఈ ఙ్ఞానమును అందించకుండా మన సూక్ష్మాంశ పంచభూత శరీరాల స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలకు వరుసగా ఆశ భయము ఆలోచన సంకల్పం స్పందన అనే స్థితులు మన మనస్సుకి ఇచ్చి వాటిలో కామ మాయ, ధన మాయ, ఇష్ట దైవ దర్శనం మాయ, మృత్యుభయ మాయ,బ్రహ్మఙ్ఞాన మాయలలో మన మనస్సుని ఉంచేటట్లుగా నానా కష్టాలు పడేటట్టుగా భయంకరమైన కలను కనడము ఆ బ్రహ్మదేవుడు చేస్తున్నాడని ఎవరికీ తెలియకుండా పోయినది. విచిత్రమేమిటంటే తను ఈ భయంకరమైన కలలు కంటున్నప్పుడు తను ఆది బ్రహ్మదేవుడనే బ్రహ్మ జ్ఞానమును కోల్పోవడం జరిగినది. అనగా తను కనే కల తను ఉండే విశుద్ధ చక్రంతో మొదలు కావడంతో తనకు తెలియకుండా తను అవిద్యమాయలో పడటం జరిగినది. ఆతర్వాత ఈయన హృదయ చక్రం వద్ద ఆవాసం చేస్తున్న ఆదివిశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయుడి వద్ద శరణు పొంది మర్చిపోయిన బ్రహ్మ జ్ఞానమును తిరిగి సంపాదించుకోవడంతో ఇలా తన కలలో అవస్థలు పడుతున్న అనాహత చక్రం వాసి అయిన మహాకాలుడుకు ఈ జ్ఞానం అందటంతో అసలు విషయము ఈయన తెలుసుకుని స్మశాన వైరాగ్యం చెంది ఇదంతా బ్రహ్మదేవుడు తన స్వార్ధముతో తను ఇబ్బందులు పడేటట్లు కల కన్నాడని తెలుసుకుని కోపావేశాలతో ఈ బ్రహ్మదేవుని ఎవరు పూజించరాదు అని ఎవరు పూజలు చేయకూడదని శాపమిచ్చి యోగ సాధన చేయటానికి దానికి 112 సాధన విధివిధానాలు అష్టాంగ యోగాలు పంచ చక్ర స్థితులలో బ్రహ్మదేవుడు కల నుండి తప్పుకోవడానికి పంచ సాధనలు అనగా కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని మార్గాలను ఏర్పరుచుకుని వాటిని సాధన చేస్తూ తిరిగి తను బ్రహ్మ కల నుండి అనగా విశుద్ధ చక్రము దాటి జీవ ప్రకృతి దాటి తన నిజ స్థావరమైన ఆజ్ఞాచక్రం లోనికి చేరుకుని ఈ బ్రహ్మ దేవుడు సృష్టించిన సూక్ష్మాంశ పంచభూతాలను అనగా బ్రహ్మ దేవుడు కనే పంచ కలలను పంచ లోకాలను పంచ శరీర వాసులను తన ఆధీనంలోకి తెచ్చుకుని తన కలను కొనసాగించటం జరగటంతో బ్రహ్మదేవుడు ఏమీ చేయలేక మౌనం వహించి మౌన బ్రహ్మగా మారిపోయాడు. 
 
నిజానికి యోగ సాధన అంటే ఒకరి కల ప్రపంచంలో నుండి మరొకరి కల ప్రపంచంలోనికి స్వప్న శరీరముతో స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా స్వప్నము లేని స్థితి అయిన బ్రహ్మరంధ్రం స్థానమునకు చేరుకుని నిశ్చల స్థితిలో ఆనంద రహిత స్థితి పొందుతూ పరమ ప్రశాంత స్థితిగా మారడమే సంపూర్ణ మోక్ష స్థితి అని తెలుసుకోండి. ఇదంతా కూడా స్వప్నము లోనే జరుగుతుంది అని గ్రహించండి. జీవ నాటకం అన్నమాట. ఈ నాటకంలో మాయలో ఉండే వాళ్ళు మాయ లేని వాళ్ళు మాయ లేకుండా చేసుకునే పాత్రలు-పాత్రధారులు ఉంటాయి. నాటకం అంటే నిజము కాదు కదా. క్షణికమైన ఆనంద స్థితి నిచ్చేది కదా. అలాగే మనము మనమంతా మన దైవాలు అంతా మన పరమాత్మ అంతా చేసే యోగ సాధన అంతా కూడా ఒక కల ఒక స్వప్నమే. స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా స్వప్న శరీరముతో స్వప్న మోక్ష స్థితిని పొందడమేనని స్వప్న జ్ఞానంతో స్వప్నంగా తెలుసుకోండి. ఇలా మన స్వప్న శరీరములో బ్రహ్మరంధ్రము హృదయ చక్రము సహస్రార చక్రము బ్రహ్మ కాల గుణ కర్మ ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూరక స్వాధిష్టాన మూలాధార చక్రాలు ఏర్పడినాయి. ఈ మాయలో పడే జీవుల కోసం నాలుగు గ్రంధులుగా హృదయ గ్రంధి రుద్రగ్రంధి విష్ణు బ్రహ్మ గ్రంధులలో ఉంచితే మళ్లీ తిరిగి యోగసాధన పరిసమాప్తి చేసుకోటానికి అదేనండి జీవ నాటకం యొక్క కల ప్రపంచం నుండి స్వప్న శరీరమునకు నిశ్చలస్థితి పొందటానికి ఈ కలలో అవకాశాలు ఇచ్చినారు అన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొత్తగా వచ్చిన బ్రహ్మ- కాల –గుణ- కర్మ చక్రాల గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండి. ఆ విషయానికే వస్తున్నాం. మీరు కలలో కూడా ఈ కల విషయం బాగానే గుర్తు పెట్టుకున్నారు. మన అనాహత చక్రం వద్ద స్మశానవాసియైన మహాకాలుడు తన సాధన ద్వారా బ్రహ్మ కల నుండి తప్పుకున్నాడని తెలిసింది. అదే విధంగా తన అంశ రూపుడైన శివుడు నుండి జీవుడు దాకా ఈ చక్రాలలొ ఉండిపోవడం బాధ వేసి తిరిగి సాధన పరిసమాప్తి తగ్గ కలను సాధన కలలను కనటం ప్రారంభించినాడు. దానికోసం పంచ చక్రాలులో ఉండేవారిని వరుసగా తన ఆజ్ఞాచక్రమైన గుప్తముగా చతుర్ధ గృహ అనగా కర్మ గుణ కాల బ్రహ్మ చక్రాలను ఏర్పాటు చేసినట్లుగా వాటిల్లో వరుసగా త్రిముఖ శ్రీ దత్త స్వామి శ్రీరాముడు కాలభైరవుడు ఏకపాదుడు అధిష్టాన దేవతలుగా ఏర్పరిచి అటుపై ఆదివిష్ణువు కలయైన సహస్ర చక్ర కల ప్రపంచములోనికి వెళ్ళేటట్లుగా వెళుతున్నట్లుగా కలలు కనడం జరిగినది. అందుకే మనము చనిపోయేటప్పుడు ఏదో గుహలాంటి ద్వారం కనబడుతుందని వీళ్లంతా చనిపోతూ గు..గు.. అంటూ చనిపోతారని తెలుసుకోండి. అంటే బ్రహ్మ దేవుడి యొక్క కలకి తను కనే కల తెలియకుండా ఉండటానికి ఈ నాలుగు చక్రాలను చీకటి ప్రపంచంలో చతుర్ధ గుహలుగా ఏర్పరిచి తను స్మశానవాసి అగుట వలన ఈ చతుర్ధ గృహ సాధన కోసం తాంత్రిక విధి విధానమును వరసగా కర్మ చక్రం కోసం కాపాలికుడిగా… గుణచక్రము కోసము అఘోర శివ మూర్తి గా ….కాలచక్రము కోసం కాలభైరవుడి గా …. బ్రహ్మ చక్రమునందు నాగ సాధువుగా అవతరించినట్లుగా సాధన చేసి బ్రహ్మ కల నుండి తప్పుకున్నట్లుగా తను ఒక కలను కనడం జరిగినది. ఈయన ఈ విధంగా సాధన కలలు కంటున్నాడని బ్రహ్మదేవుడికి తెలియదు. ఎలా తన కల నుండి శివుడు నుండి జీవులు జ్ఞానం పొంది సాధన పరిసమాప్తి చేసుకుంటున్నారో తెలియ చస్తున్నాడు. ఇదంతా కలయేనని కలసాధనేని మాత్రము మర్చిపోకండి. అంటే ఈ లెక్కన చతుర్థ చక్రాల కోసం తాంత్రిక విధానం చేయవలసి ఉంటుందని గ్రహించే ఉంటారు. దీనికి తగ్గ సాత్విక విధి విధానాలు ఉన్నాయని మేము తెలుసుకోవడం జరిగినది. కంగారు పడకండి. ఈ తాంత్రిక విధి విధానాలు ఉన్నాయని తన జీవులకు తెలియకపోవడంతో మహారుద్రుడు కాస్త శ్రీ ఆది శంకరాచార్యుడుగా అవతరించి వీటిని ఖండిస్తున్నట్లు గా నటిస్తూ ఈ సాధన విధివిధానాలు లోకానికి తెలిసేటట్లుగా చేయడం జరిగినది. ఇలా ఈ తాంత్రిక విధానాలతో బ్రహ్మదేవుడు కల నుండి ఆది రుద్ర లోకములోనికి కల ప్రపంచంలోకి చేరుకోవడం జరుగుతుందని తెలుసుకోండి. ఇంతవరకు బాగానే ఉంది. 

ఆది స్వప్న సాధన:  

ఇంకా స్వప్న సాధన  విషయానికి విచారణ చేద్దాము. స్వప్న ప్రపంచంలో ఒక స్వప్నము నుండి మరొక స్వప్నము లోనికి వెళ్ళడము అక్కడున్న శరీరధర్మముతో పంచభూత తత్వముతో అక్కడున్న త్రిగుణాల మాయలతో ఆనంద కష్టాలు అనుభవించడం ఇదంతా బ్రహ్మ చక్రం గా అండపిండ బ్రహ్మాండాలతో కూడిన విశ్వం ఒక కల ప్రపంచంగా జీవ నాటకం తిరుగుతున్నట్లుగా గమనించి స్వప్నము లేని స్థితికి వెళ్లాలని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని దీనిమీద అసలైన వైరాగ్యం చెంది ఆది రుద్రుడు కాస్త  స్వప్న యోగ సాధనను స్వప్న శరీరము స్వప్న సాధకుడుగా చేయడం ప్రారంభించాడు.అంటే మూలాధార చక్రము నందు జీవుడుగా మారి సాధన ప్రారంభించినట్లు కల కనడం ప్రారంభించాడని తెలుసుకోండి. ఎప్పుడైతే తను బ్రహ్మ కలయందు ప్రవేశించినాడో అతనికి జ్ఞానమాయ వస్తుందని దీనిని గుర్తు చేయడానికి గురువులను ఏర్పరచుకునే విధంగా కల కనడం జరిగినది. అనగా మంత్ర గురువు, దీక్ష గురువు, సద్గురువు ,పరమ గురువు, ఆది గురువుగా ఇలా పంచ గురువులు ఏర్పరచుకుని ఈ కల సంగతి కలలేని స్థితి ఎక్కడుందో తెలుసుకోవాలని స్వప్నం లాంటి స్వప్న సాధన కలలు కనడం జరిగినది.ఇది అంతా ఆది రుద్రుడి కలలో జరిగినది అని తెలుసుకోండి. మంత్ర గురువు యొక్క గురోపదేశము వలన కుండలినీ శక్తి జాగృతి చేసుకోవడం అలాగే దీక్ష గురువు చెప్పిన పంచ యోగసాధనా విధానాలు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని యోగ విధానాలతో బ్రహ్మదేవుడు ఆధీనమైన పంచ సూక్ష్మాంశ పంచభూత నిర్మితం చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి చక్రాలను వాటి మాయలను దాటుకుని అక్కడున్న పంచభూత సిద్ధులను వశపరచుకుని 

సాధన చేస్తున్న సమయంలో పంచభూత అంశ కపాలాలను సేకరించి వీటి సూక్ష్మాంశ అయిన పంచభూత అంశాలైన శబ్ధ, స్పర్శ, రూప, రస ,గంధాలు అంశాలైన కపాలాలు పంచ కర్మేంద్రియాలు… జ్ఞానేంద్రియ కపాలాలు అనగా 20 కపాలాలు తీసుకుని తన ఆజ్ఞ చక్ర వాసమునకు చేరుకోవడం జరిగినది. సద్గురువు సహాయముతో ఆజ్ఞ గుణ కర్మ కాల బ్రహ్మ చక్రాలను ఆధీనము చేసుకోవటానికి తాంత్రిక సాధనలైన కాపాలిక అఘోర భైరవ నాగసాధువులు సాధన చేస్తూ తపస్సు ద్వారా వీటిని ఆధీనము చేసుకొని ఇక్కడున్న మనస్సును అహంకారము బుద్ధి కపాలాలు సేకరించి విష్ణువు కల ప్రపంచమైన సహస్ర చక్రములోనికి చేరుకుని పరమగురువు సహాయముతో శివకేశవ తత్వముతో యోగసాధన చేసి ఈ చక్రములకు పరమగురువు చేసుకుని ఇక్కడ ఉన్న ప్రకృతి, పురుషుడు, శుద్ధ విద్య, నియతి, కాలము, రాగము విద్య, కళ, మాయ అనే తొమ్మిది బ్రహ్మకపాలాలను సేకరించి అటుపై ఈశ్వరి ప్రకృతికి జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రమునకు చేరుకోవడం జరిగినది. 

అంటే ఈయన ఇక్కడికి వచ్చేసరికి ఈయన  చేతుల్లో 20+3 +9 = 32 కపాలాలతో చేరుకోవడం జరిగినది. అటుపై ఆదిగురువు సహాయముతో ఇష్ట కోరిక మాయ దాటటానికి స్పందనా రాహిత్యం సాధన చేసి బ్రహ్మ తదాకార స్థితిని పొంది ఇక్కడున్న ఈశ్వరుడు ఈశ్వరి తన పంచ గురువులు ప్రతీకలైన జ్ఞాన రూపమైన ఆదిగురువు కపాలము అనగా మొత్తం మూడు కపాలాలు అనగా తాను ఇక్కడికి తెచ్చిన 32 కపాలాలతో పాటు ఈ మూడు అనగా మొత్తం 35 కపాలాలతో  తను సదాశివమూర్తిగా బ్రహ్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకుని తనతో కలిపి 36 కపాలాలతో సదాశివమూర్తి యోగసాధన చేయటంతో అదే స్వప్న శరీరముతో స్వప్న సాధనతో కదలలేని స్థితి అనగా స్వప్న మోక్ష స్థితి కోసం స్వప్న సాధన చేయడం ఆరంభించాడు. అంటే ఏక మూలకపాలములో 36 కపాలములతో యోగసాధన చేయడం ఆరంభించాడు. ఈ బ్రహ్మరంధ్రము వద్ద తీవ్ర స్థాయిలో అతి ఘోరాతి ఘోరంగా యోగ సాధన చేయటం వలన మూలకపాలము నుండి అతి భయంకరమైన ఉగ్రజ్వాలలు అదే చితాగ్ని ఉద్భవించడం జరిగినది. తన సాధన పరిసమాప్తి లక్ష్యమైన కదలలేని స్థితి కదలలేని స్థితి పొందాలనే లక్ష్యంతో స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తున్నప్పుడు ఇలా ఉద్భవించిన చితాగ్ని యొక్క అగ్నిజ్వాలలలో నెమ్మదినెమ్మదిగా అనగా మొదట నవశక్తితో అటుపై సహస్ర సిద్ధి ఆపై పదివేల శక్తితో ఆపై లక్షల శక్తితో ఉగ్రరూపం దాల్చే సరికి ఈ లోపల తన కపాలముతో పాటుగా 34 కపాలములకి కపాల మోక్షం జరిగి విభేదనము జరిగినప్పుడు విపరీతమైన వేడిమి శక్తికి తట్టుకోలేక లిప్త కాలం పాటు సహన శక్తిని కోల్పోవడంతో రెండు కపాలాలు మిగిలిపోయిన సాధన అర్ధాంతరంగా ఆగిపోవటం తో ఈ సాధన శక్తిని తట్టుకో లేకపోతే తన అగ్నిజ్వాల నుండి ఆది పరాశక్తి అయిన తారా దేవి స్వయంగా ఉద్భవించినది. తనకి తన చను పాలు ఇచ్చి ఈ సదాశివమూర్తికి ఉపశమనం కలిగించింది. అదృశ్యము అయినది. దానితో ఈయన తెలివి తెచ్చుకుని తను చేసిన తెలివితక్కువతనమునకు సిగ్గు పడి బాధపడి తను చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదని ….

తన కపాలముతో తన జ్ఞాన శక్తియైన మరొక కపాలముతో అనగా దక్షిణామూర్తి అవతారంతో ఆది గురువుగా ఉంటూ సదాశివమూర్తి కలలాంటి ప్రపంచంలో స్వప్న సాధకుడుగా సాధన చేస్తున్నాడు. ఇలా కోటానుకోట్ల సంవత్సరాలు ఇదే కలను కనడం జరుగుతోంది. ప్రతిసారి తన కలలో తన సాధన పరిసమాప్తిలో వచ్చే చితాగ్ని ఉగ్ర జ్వాలలు యొక్క లక్ష శక్తి తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ దాటితేగాని మిగిలిన రెండు కపాలాలు అయిన జ్ఞాన ప్రాణ కపాలాలు విభేదనము కావు. ఇవి విభేదనము అనగా వీటికి కపాల మోక్షం కావాలంటే అగ్నిజ్వాల శక్తిని 10,00,000 తట్టుకోవాలి. కలలోని వేడిమిని స్వప్న శరీరము తట్టుకోవడం లేదని గ్రహించండి. దానితో కదలలేని స్థితి అనగా నిశ్చలస్థితి అంటే మోక్షం స్థితి ఇంతవరకు ఎవరూ కూడా పొందలేదు. ప్రతి పరమాత్మకి ప్రతి దైవానికి ప్రతి జీవికి తన మూలకపాలములో ఇలా 36 కపాలాలు ఉన్నాయని గ్రహించండి. సాధన పరిసమాప్తి సమయంలో బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న ఏకమూల కపాలము ధ్యానము చేస్తూ అస్థిపంజరం దానికి వరుసగా ఏక, త్రి, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశి అనగా 36 కపాలాలు ఉన్న సదాశివమూర్తి అస్థిపంజరం మాకు ధ్యానములో కనిపించడం జరుగుతుంది. దానితో మా సాధన కూడా 34 కపాలాలు విభేదనము గావించబడి జ్ఞానకపాలము దగ్గరికి వచ్చే సరికి తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పాలని అనుకునేసరికి నిశ్చలస్థితి కోల్పోవటం ఆపై బాధపడటం ఏకకాలంలో జరిగి 11 కపాలధారిగా విడిపోవడం తన స్వప్నం అయినప్పుడు తనే స్వప్న శరీరధారి అయినప్పుడు మరొక స్వప్న శరీరధారి చెప్పడం ఏమిటి. నా బొందా నా బూడిద కదా. మిగిలిపోయిన జ్ఞాన కపాలాల కపాల మోక్ష స్థితికి చితాగ్ని యొక్క దహన స్థితి లక్ష నుండి 10 లక్షల దాకా తట్టుకోవడం వస్తోందని జ్ఞాన అనుభూతి పొందడంతో మృత్యు భయంతో లేదా జ్ఞానం మాయతో లేదా కామ మాయతో ఒక లిప్త కాలం పాటు స్పందిస్తుంటే శాశ్వత మరణమును పొందవలసిన చోట అశాశ్వత మరణమును పొందడం జరుగుతుందని ఎందుకంటే ఆదియోగి అయిన రుద్రుడు తన స్వప్న సాధనను సంపూర్ణంగా చేయలేక పోవడం జరిగింది అని తెలుసుకున్నారు కదా. ఆయన కల ఎంత వరకు కన్నాడో అంత వరకు అనగా 36 కపాలములలో 34 మోక్షము పొంది అనగా నిశ్చల స్థితి పొందటం జరిగింది. ఆపై ప్రాణశక్తి ఉన్న సాధన శరీర సదాశివమూర్తి అలాగే జ్ఞాన శక్తి యొక్క సాధన శరీర కపాలము దక్షిణామూర్తికి చితాగ్ని దహన శక్తి దాటికి తట్టుకోలేక సహన శక్తిని కోల్పోయి ఈ రెండు కపాలాలు అనిశ్చల స్థితి పొందటం అలాగే నిజంలాంటి కలను కలలాంటి నిజం కొనసాగిస్తున్నాడు. అంటే సదాశివమూర్తిగా సాధన శరీరంతో సాధన చేస్తూ దక్షిణామూర్తిగా ఆది గురువుగా సాధన చెప్పటానికి ఉండిపోవటం అనగా స్వప్న శరీరధారిగా మిగిలిపోవడం జరిగినది. అంటే ఈ లెక్కన ఎవరు కూడా కపాలమోక్షం సంపూర్ణ కపాలమోక్షం ప్రాప్తి పొందలేదు కదా.అనగా బలహీనత లేని బలవంతుడైన సాధకుడు ఆ భగవంతుడు తన కలలో సృష్టించలేదని తెలుస్తోంది కదా. ఒకవేళ ఈ రెండు కపాలాలు అదే జ్ఞాన ప్రాణ కపాలాలకి గూడ స్వప్న సాధన యందు కపాలమోక్షం కలిగి ఉంటే మనకి నిజంలాంటి కలలాంటి నిజం అలాగే స్వప్న శరీరం స్వప్న విశ్వము అంతా కూడా ఉల్లిపొర తీస్తే ఎలాగైతే ఉల్లిపాయ చిట్టచివరికి కనపడక అదృశ్యమౌతుందో అలా సహజంగా కనిపించే ఈ విశ్వమంతా కనిపించకుండా అదృశ్యమై పరమ శూన్యము యొక్క స్వప్నము అదృశ్యమయ్యేది. అప్పుడు సాధించటానికి స్వప్నములో స్వప్న సాధన ఉండేది కాదు. దీనికోసం స్వప్న సాధన శరీరాలు ఉండేవి కావు. ఎవరైతే తమ స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసి తమ 36 కపాలాలకు 34 కపాలాలకు కపాలమోక్షం కలిగిస్తారో వారు పిండి రేణువు పరిమాణముతో ఆకాశ తత్వముతో ఆకాశ శరీరముతో మనో నిశ్చల స్థితి పొంది ఆనంద రహిత పరమ ప్రశాంతత అయిన మోక్షప్రాప్తి పొందడం జరుగుతుందని వీళ్లు స్వప్న జీవ నాటకంలో ఉన్నా లేనట్లే అన్నమాట. ఎందుకంటే సంపూర్ణ నిశ్చల స్థితిలో ఉండి పోతారు.కాని ఎప్పుడైనా వీరి కపాలమోక్షం పొందని జ్ఞాన కపాలం దేనికైనా స్పందిస్తే మాత్రము దీనికి ప్రతిస్పందనగా మిగిలిన కపాలమోక్షం పొందని రెండవ ప్రాణశక్తి కపాలము స్పందించి దానికి తగ్గట్లుగా స్వప్న శరీరముతో స్వప్న విశ్వమునందు జీవ నాటకంనందు స్వప్న పాత్ర వేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ స్వప్న సాధకుడు యొక్క నిశ్చలస్థితి కోల్పోతే మాత్రమే జరుగుతుంది. దానితో ఈయన విశ్వాధినేత స్వప్న పాత్ర దగ్గరనుండి స్వప్న పాత్ర వేసే దాకా ఈయనకి అవకాశాలు ఉంటాయి. ఏ పాత్ర కావాలంటే ఆ పాత్ర ఎన్ని రూపాల్లో పాత్రలు కావాలంటే అన్ని పాత్రలు ఇది ఏకకాలంలో వేయవచ్చు. ఎందుకంటే ఇదంతా స్వప్నం కదా. స్వప్నం లో ఉండే ఊహించుకున్నాడు.ఊహించు కోకపోవటం వలన ఉండవలసిన అవసరమే ఉండదు.

మనమంతా స్వప్న శరీరధారులేనని నమ్మకం ఏమిటి?

అసలు మనమంతా మన దైవాల అంతా కూడా పరమ శూన్యము యొక్క స్వప్న శరీరధారులేనని నమ్మకం ఏమిటి అన్నప్పుడు హోమాలు చేస్తున్నప్పుడు హోమాగ్ని దైవ స్వరూపం మనకి కనపడుతుంది. హోమాలు చేస్తున్నప్పుడు మనము గాని ఫోటోలు తీస్తే ఆ విషయము బయటపడుతుంది. కావాలంటే మా సమక్షంలో చేసిన హోమాలను చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు గమనిస్తే మీకే తెలుస్తుంది. 

హోమము నందు హోమాగ్ని గుర్రం తలగా కనపడింది కదా. జీవ భాషలో దీనికి గుర్రమని అదే దైవ భాషలో హయగ్రీవ దేవుడు అని అంటారు. మరో ఫోటో చూస్తే అందులో ఒక పాము ఉన్నట్లు కనబడుతుంది. జీవ భాషలో అయితే పాము గాని అదే దైవ భాషలో అయితే నాగేంద్ర స్వామి అంటారు. అలాగే మరొక ఫోటో చూస్తే అందులో మనకి సింహ ముఖం కనపడుతుంది. దీనికి జీవ భాషలో సింహము అంటే అదే దైవ భాష అయితే నరసింహ స్వామి అని అంటారు. అలాగే మరొక ఫోటో చూస్తే ఏనుగు కనపడుతుంది. దీనినే జీవ భాషలో ఏనుగు అని దైవ భాషలో గణపతి దేవుడని అంటారు. ఇలా జీవ స్వరూపాలు కాస్త దైవ స్వరూపాలుగా హోమాగ్ని చూపించడం జరిగింది.

ఇవే కాకుండా శుద్ధ దైవ స్వరూపాలుగా అనగా హోమాగ్ని దేవతలుగా నటరాజ్ స్వరూపము, దీపదుర్గ స్వరూపము, శివలింగ స్వరూపం, శ్వేతార్క గణపతి స్వరూపము మహాలక్ష్మి స్వరూపము చిట్టచివరికి కపాల స్వరూప దర్శనము మనకి హోమ ఫోటోలు గమనిస్తే కనపడుతుంది. అంటే ఈ హోమానికి జీవ స్వరూపాలను అలాగే దైవ స్వరూపాలుగా మారే స్థితి ఉన్నప్పుడు మారే శక్తి ఉన్నప్పుడు అదే ప్రాణము అలాగే జ్ఞానం ఉన్నచోట అగ్ని స్వరూపం కాస్త జీవ అలాగే దైవస్వరూపంగా చూపించే శక్తి ఉండదా? ఆలోచించండి. తప్పనిసరిగా ఉంటుంది కదా. మరి చితాగ్ని ఎక్కడ నుండి వచ్చినది. పరమ శూన్యము యొక్క బ్రహ్మతేజస్సు నుండే కదా. శూన్యము అంటే ఏమీ లేనప్పుడు అందులోనుంచి చితాగ్ని స్వరూపము రావటం అనేది స్వప్నమే కదా. ఎందుకంటే మన హోమాగ్నిలో మనకి కనపడేవి నిజమైన దైవ స్వరూపాలు కాదు కదా. కేవలం వీటిని గుర్తుకు తెస్తున్నాయి అంటే హోమాగ్ని స్వప్న రూపాలే కదా.సత్యమే. మనము అలాగే మన దైవాలు కూడా చితాగ్ని యొక్క స్వప్న శరీరధారులమే అనడం అంతే సత్యము కదా. మనము చేసే హోమాలలో హోమాగ్ని రూపాలే ఉన్నాయి అంటే పరమ శూన్యం చేసే చితాగ్ని యఙ్ఞము యందు చితాగ్ని స్వప్న శరీరాలు ఉంటాయి కదా. ఆలోచించండి. విషయం మీకే అర్థమవుతుంది. కాబట్టి మనమంతా మన జీవకోటి అంతా మన దైవాలు అంతా కూడా చితాగ్ని యొక్క స్వప్న శరీరధారులు అయితే ఈ శరీరధారులకు కావలసిన ప్రాణశక్తి ఇవ్వటానికి మనము చేసే హోమాలు, యజ్ఞాలు, యాగాలు కారణమవుతాయి. అందుకే వీటికి సమర్పించే హవిస్సులే మన దైవ స్వరూపాలుకి ఆహారం అవుతుందని శాస్త్రవచనం కదా. చితాగ్నిలో జ్ఞాన కపాలము శక్తి ఉంటే మనము చేసే హోమాలు యజ్ఞాలు యాగాలులో ప్రాణం ఉన్న కపాల శక్తి ఉంటుందని ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఇదంతా కూడా స్వప్నం అని గుర్తుంచుకోండి. మనము ఉన్నాము మనము చేస్తున్న పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు, ధ్యానాలు, జపతపాలు, ఉపవాసాలు, ఉపాసనలు, యోగ సాధన ఇదంతా కూడా మన స్వప్న శరీరాలతో స్వప్నసాధకుడిగా స్వప్న సాధన చేస్తున్నామని ఎందుకంటే స్వప్న మోక్ష స్థితిని పొందటానికి అని మీకు మీరే స్వప్న సాధన చేస్తున్నట్లుగా అందువలన మోక్ష ప్రాప్తి పొందినట్లుగా స్వప్నము పొందుతున్నారని స్వప్నంలో మీరు ఇదంతా తెలుసుకుంటే చాలు. భగవద్గీత నేను అనేది బ్రహ్మ లేదా ఆత్మ అని చెప్పడం జరిగితే బ్రహ్మము లేదు ఆత్మ లేదు నేను లేదు అని ఋభు గీత చెప్పడం జరిగితే సర్వము ఏమీ లేదు సర్వము  శూన్యము అని ఉన్నదంతా కనిపించేదంతా పరమ శూన్యము యొక్క స్వప్నమని మనమంతా మన దైవాలంతా ఈ స్వప్న శరీరధారులేనని సమాధి గీత చెప్పడం జరిగింది అని గ్రహించండి. అంటే మనమంతా మన దైవాలంతా నిజమని మనకి కనిపించే విశ్వమంతా నిజమని కోటాను కోట్ల మంది భావన చేయడం వలన అసత్యమైన విశ్వమంతా సత్యంగా కనిపిస్తోందని కేవలం 36 మంది మాత్రమే ఇది అసత్యమని ఇది పరమశూన్యము యొక్క స్వప్నమని 36 కపాలాలున్న తుంకార నాద స్వరూపమైన మహా సదాశివమూర్తి మాత్రమే సంపూర్ణ నిజ బ్రహ్మజ్ఞానమును పొందటము ఆయన కాస్తా మౌన బ్రహ్మగా శ్రీ మేధా దక్షిణ మూర్తిగా మారిపోయి ఆది గురువుగా ఇలాంటి సాధన కోసం వచ్చిన స్వప్న సాధకుల కోసము స్వప్న శరీరముతో అరుణాచలం క్షేత్రములోని ఒక అంతర్గత గుహ యందు ఆవాసము చేస్తూ నిజ స్వప్న సాధకులకి తాను పొందిన సముపార్జన జ్ఞానాన్ని తన శక్తిపాత శక్తితో కావలసిన వారికి స్వప్నము నందు అనుగ్రహించడం ఇప్పటికీ జరుగుతున్న అక్షర సత్యం. అలాగే తనకు ఉన్న మిగిలిపోయిన రెండు కపాలాలు మోక్షసిద్ధికై కైలాస పర్వతము నందు సదాశివమూర్తిగా ఆజ్ఞాచక్రం ముద్రతో స్వప్న శరీరముతో స్వప్న సాధన చేస్తున్నారు. అలాగే మురుడేశ్వర క్షేత్రము నందు సముద్రపు ఒడ్డున సాంబశివ మూర్తిగా స్వప్న శరీరముతో ఒక పక్క జ్ఞానమిచ్చే దక్షిణామూర్తిగా స్వప్నం కంటూ మరొక పక్క యోగ సాధన చేసే సదాశివమూర్తి స్వప్నము కంటున్నాడని ఈ పాటికి గ్రహించి ఉంటారు. మూడు ప్రాంతాలలో సదాశివుడు స్వరూప యదార్థ స్థితి మనకి సజీవ మూర్తిగా స్వప్నము నందు కనబడతాయని తెలుసుకోండి. ఎందుకంటే ఇలా నాకు అనుభవ అనుభూతి అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. శివ అంటే శివుడు కాదని లేదు ఏమీ లేదు అని లేని వాడని అర్థం ఉన్నది అని గ్రహించండి. మనమంతా మన దైవాల అంతా వీళ్ళు ఉండే విషయం అంతా గూడా స్వప్నంలో ఉన్నామని తనకున్న 36 కపాలాలు స్వప్నములో స్వప్న మోక్షస్థితి పొందితేకాని సత్యం గా కనిపించే జీవ నాటకము యొక్క స్వప్నం ఆగిపోకూడదని తను స్వప్న సాధన చేస్తూనే మన చేత స్వప్న శరీరంతో స్వప్న సాధన చేస్తూ స్వప్న మోక్షప్రాప్తికే స్వప్నములో ఉన్నారని ఈ పాటికే గ్రహించి ఉంటారు.

దైవ సిద్ధాంతాలు:
 
ఇప్పుడు దైవ సిద్ధాంతాలను ద్వైతం, అద్వైతం, విశుద్ధ, అద్వైతం, విశిష్టాద్వైతం చెప్పే వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ద్వైతం ప్రకారంగా చూస్తే జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెబుతోంది కదా. మీరు చెప్పండి ఎలా వేరు అవుతాము. మనమంతా పరమాత్మ అంశ స్వరూపాలు అయితే ఆయన మనము కాకుండా ఎలా ఉంటాము. బ్రహ్మము నుండి వీడిన బ్రహ్మపదార్థం మనమే కదా. పరమాత్మ నుండి విడిపోయిన ఆత్మలు మనమే కదా. కేకు నుండి కేకు ముక్కలు విడదీస్తే అసలుకి ఏమైనా తేడా ఉంటుందా ఉండదు కదా. కానీ ఈ సిద్ధాంత కర్త ఒక పొరపాటు పడినారు. అది ఏమిటంటే కేక్ నుండి విడిపోయిన కేకు ముక్కలు ఒకటి కావు. ఒకే ఆకారంతో ఉండవు కదా. కాబట్టి కేకు అలాగే ముక్కలు ఆకార పరిమాణంలో తేడాలు ఉంటాయో బ్రహ్మము నుండి విడిపోయిన బ్రహ్మపదార్థం కూడా తేడా ఉంటుందని వీరి వాదన. కాని ఈ ఆకారం పరిమాణాలలో తేడాలు ఉన్నట్లుగా మనకి అనిపించడం కారణం మహామాయ స్వరూపమే కదా. ఈయన బాహ్యంగా చూసాడు కానీ అంతర్గత గుణమైన రుచి చూడలేదు. ఎలా అంటే వివిధ రంగుల్లో ఆవులు ఉంటాయి కదా. అవి ఇచ్చే అన్ని పాలు ఎలాగైతే లేత పసుపు వర్ణంలో తెల్లగా ఉంటాయి కదా. రంగులు వేరైనా పాలు రంగు ఒకటే కదా.అలాంటప్పుడు మనము కూడా అంతే కదా.పరమాత్మ నుండి పుట్టిన జీవాత్మలు ఈ లెక్కన ఒకటే అవ్వాలి కదా. ఆలోచించండి. సిద్ధాంతం తప్పు అని తెలుస్తుంది కదా. 

అద్వైతం ప్రకారం గా చూస్తే బ్రహ్మము సత్యము జగత్ మిధ్య చెప్పడం జరిగినది. ఏక పరమాత్మ అలాగే మాయ స్వరూపం ఉన్నదని చెప్పడము మనము సంభవించవచ్చును. ఎలా అంటే నిరాకార పరబ్రహ్మ మైన పరమ శూన్యము నుండి జీవ బ్రహ్మ(జీవ ఆత్మగా) అవతరించినాము కదా. ఏక పరమాత్మ నుండి అనగా ఏకత్వం నుండి భిన్నత్వంకు మారినాము. ఇది నిజమే అంటే కేక్ నుండి కేక్ ముక్కలతో విడిపోవడం జరిగినది. కేక్  ప్రారంభము నుండి అనేక బ్రహ్మ పదార్థాలుగా విడిపోవడం జరిగింది. ఇది నిజమే. అలాగే జగత్ మిధ్య అనటం ఎలా నిజమో చూద్దాము. మనమంతా నిజానికి పరమ శూన్యము యొక్క ఆలోచన సంకల్పం స్పందన వలన మనం ఏర్పడినట్లు గా మనము ప్రాణాలతో శరీరాలతో వివిధ కర్మలు చేస్తున్నట్లుగా దైవజన్మలుగా జీవజన్మలుగా వివిధ లోకాలలో అండపిండ బ్రహ్మాండాలతో కూడిన ఈ విశ్వంలో ఉన్నామని తెలుసు కదా. నిజానికి మనము లేము. మనము ఉన్నట్లుగా మన మాయలే మనకి చూపిస్తోంది. ఆలోచన నుండి శరీరం ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఏర్పడదు కదా. కేవలం మాయ వలన ఇది ఏర్పడినట్లు మనకి అనిపిస్తోంది. అంటే మనమంతా పరమాత్మ యొక్క స్వప్న అంశాలే కదా.ఒక విత్తనము తీసుకోండి.దీనిని పగలగొడితే మనకి చెట్టు కనిపిస్తుందా? కనిపించదు కదా. మరి ఆ విత్తనంలో ఉండవలసిన చెట్టు ఏది? ఎక్కడ ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. మంచిగా అర్థమవుతుంది. అదే ఈ విత్తనం నాటితే చెట్టు వస్తుంది. తనను నాటకముందు లేని చెట్టు విత్తనం నాటితే ఎలా వస్తుందో ఆలోచించండి. ఈ లెక్కన చూస్తే చెట్టు అనేది విత్తనం యొక్క ఆలోచనే కదా .అనగా స్వప్నమే కదా. దీనికున్న సంకల్పము స్పందన వలన విత్తనము పగిలి పంచభూతాల సహాయంతో చెట్టుగా రూపాంతరం చెందినట్లుగా మనకి అగుపిస్తోంది. అదే నిజమైతే మనము విత్తనము పగలగొడితే చెట్టు కనిపించాలి కదా. ఇది మాత్రమే దానికంతటికి అది పగిలితే చెట్టు ఎలా ఏర్పడుతుంది. చెట్టు అనేది నిజం కాదని ఇది విత్తనము యొక్క కలయని నిజములాంటి కలను మనకి చూపిస్తోందని తెలుసుకోండి. దానితో మనకి కనిపించే జగత్తు కూడా వటవృక్షం అనుకుంటే మరి ఈ జగత్తు లేనట్లే కదా. ఈ లెక్కన చూస్తే జగత్తు మిధ్య (లేదు)కదా.ఇది వరకు ఇది బాగానే ఉంది.కాని వచ్చిన సమస్యల్లా బ్రహ్మ సత్యం జగత్ మిధ్య అని మనం తెలుసుకున్నాము. కానీ చెట్టు మిధ్య అయినప్పుడు చెట్టు కారకమైన విత్తనము కూడా మిధ్య అవ్వాలి కదా. చెట్టు లేకపోతే విత్తనం ఉండదు. తను లేకపోతే చెట్టు ఉండదు. విత్తు ముందా చెట్టు ముందా. బ్రహ్మ పదార్ధం ఉందా. ఈ రెండూ కూడా అసత్యాలే కదా. చెట్టు మిధ్య అయినప్పుడు విత్తనము కూడా మిధ్య అవ్వాలి కదా. నేనే లేనప్పుడు నేనే దేవుడిని ఎలా అవుతాను. దేవుడు ఎలా ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. జీవాత్మ లేకపోతే అదే జీవాత్మ మిధ్య అయితే పరమాత్మ కూడా మిధ్య అవ్వాలి కదా. పరమాత్మ ఉండడు కదా. నిజానికి పరమాత్మ అనే ఆయన ఆకార పరబ్రహ్మము ఎక్కడినుండి వచ్చాడు. ఏమీ లేని పరమశూన్యము యొక్క నిజంలాంటి కల యొక్క ఆలోచన నుండి వచ్చినాడు కదా. ఈయన యొక్క నిజం లాంటి కల యొక్క ఆలోచన వలన మనము వచ్చినాము కదా. ఈ లెక్కన చూస్తే ఏమీ లేని దాని నుండి ఏదో పుట్టిందనే ఏదో ఉందని అనుకోవడం సత్యం కాదు కదా. బ్రహ్మము అలాగే జగత్ మిధ్య అవుతాయి. అనగా బ్రహ్మం అసత్యము. జగత్తు మిధ్య. బ్రహ్మమే జగత్ మిధ్య అని తెలుస్తోంది కదా. ఆత్మ లేదు. బ్రహ్మము లేదు. దేవుడు లేడు. జీవుడు లేడు. ఏమీ లేదు కదా. నిజమే కదా. అద్వైత సిద్ధాంతకర్త పొరబాటు పడటానికి ఈ విశ్వసృష్టిని ఏర్పడటానికి ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి అనుకోవడం జరిగినది. సృష్టి స్థితి లయ కర్త ఎవరో ఒకరు ఒకరు ఉన్నారని ఆయనే బ్రహ్మమని ఆయనే ఆత్మ అని అనుకోవడం జరిగినది. నిజానికి ఈ విశ్వ సృష్టి అంతా ఏమీ లేని పరమేశ్వరుని యొక్క ఆలోచన నుండి తన ఊహా ప్రపంచంలో ఊహించుకోవడం జరిగినది. దీనికి కూడా ఆలోచన చేస్తున్నామని కూడా తెలియని స్థితి ఎలా ఉంటుంది. అంటే అది బయట ఉన్న వ్యక్తి ఏమీ లేని గది లోపలికి వెళితే అక్కడ చూడటానికి చూసేవాడు చూపించేవాడు లేకపోతే ఏమి ఉంటుంది. శూన్యమే కదా. ఒక ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఉల్లిపాయ కనపడుతుందా. కనిపించదు కదా.అప్పటిదాకా కనిపించే ఉల్లిపాయ ఏది. ఉల్లిపాయ నుండి వచ్చే చెట్టు మిధ్య అంటున్నాడు. దానికి మేము ఉల్లిపాయ కూడా మిధ్య అనే అంటున్నాము.ఎందుకంటే ఉల్లిపొరలో తీస్తే మిగిలేది శూన్యమే కదా. శూన్యమంటే ఏమీ లేనిది కదా. ఏమీ లేకపోవడం అనేది మిధ్యయే కదా. ఆలోచించండి. ఏదో ఒకటి ఉన్నదని ఏదో కనపడుతోంది అని అనుకోవడం మిధ్యయే కదా. ఇక్కడ మరొక వాదన చేయడం జరిగినది. ఈ సిద్ధాంతకర్త నిజానికి చెప్పినది ఏమిటంటే బ్రహ్మము సత్యము.జగత్ మిధ్య. అనగా ఈ లెక్కన చూస్తే జగత్ కూడా సత్యమే అని చెప్పటం జరిగినది. పోని ఈ వాదనలో ఎంత సత్యం ఉందో చూద్దాం. పరమ శూన్యము నుండి దీని యొక్క స్వప్నము వలన పరమాత్మ స్వప్న ఆకాశ శరీరధారిగా రావడం జరిగింది కదా. ఈ పరమాత్మ యొక్క స్వప్నము వలన జీవాత్మ కాస్తా స్థూల శరీరధారిగా రావడం జరిగినది. మరి ఎక్కడైనా స్వప్నాలు నిజము కాదు కదా. స్వప్న శరీరాలతో కూడిన స్వప్న జగత్ అలాగే స్వప్న బ్రహ్మము ఎలా సత్యమవుతాయి. సత్యం కాదు కదా. అంటే వాదన సరైంది కాదని తెలుస్తోంది కదా. భగవంతుడు అనే వాడు నాకు కనిపించలేదు కాబట్టి అతను అసత్యమని నాకు కేవలం జగత్ మాత్రమే కనపడుతోందని అదే సత్యమని జాబిలి మహర్షి వాదన చేసినాడు. ఈ వాదన చూస్తే కనిపించేది సత్యముగాను కనిపించనిది అసత్యము అన్నమాట.మరి విత్తనములు విడదీస్తే కనిపించే చెట్టు ఏది? ఈ పొరలు తీస్తే కనిపించే ఉల్లిపాయ ఏది?ఇవి సత్యాలు అయితే అవి నిజంగా కనిపించాలి కదా. మరి కనిపించకుండా శూన్యస్థితిని ఎలా చూపిస్తున్నాయి. అంటే కనిపించని శూన్యము సత్యమని తెలుస్తోంది కదా.కనిపించేది అసత్యమని తెలుస్తోంది కదా. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా తప్పు అని తెలుస్తోంది కదా.

ఇక శుద్ధ అద్వైతమునకు వస్తే శ్రీ కృష్ణుడే సర్వాధికారి. సర్వకర్త. సర్వరూపధారి అంటూ వల్లభాచార్యుడు తన కృష్ణ భక్తిని చాటుకోవడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. యద్భావం తద్భవతి. ఏమీ లేని పరమ శూన్యమునకు శ్రీకృష్ణుడు అంటే ఏమిటి? రాముడు అంటే ఏమిటి? అల్లా అంటే ఏమిటి? ఏసు అంటే ఏమిటి? శివుడు అంటే ఏమిటి? శివాని అంటే ఏమిటి? ఎవరికి భావాలు తగ్గట్టుగా వారు నామరూపాలు నామాలతో పిలుచుకుంటే తప్పులేదు .దీనిని మాయ స్వరూపము అనడమే విచిత్రంగా ఉన్నది. అంటే మహామాయే విష్ణు మాయ అంటారు కదా. మాయ స్వరూపాన్ని ఆరాధన చేస్తూ మాయను పూజిస్తూ మాయ లేదు అనటం విచిత్రం కదా. ఈ విశ్వంలో మాయ లేకపోతే మనకి ద్వంద్వ భావాలు ఎలా కలుగుతున్నాయి. మాయ లేకపోతే ద్వంద్వ స్వరూపాలుగా ఎలా కనబడుతున్నాయి. స్త్రీ పురుషులు జాతుల భేదాలు ఎలా కనపడుతున్నాయి.మాయ లేకపోతే మనకి ద్వంద్వ ఆలోచన ఎలా కలుగుతున్నాయి. అనగా మంచి చెడు పాపపుణ్యాలు ఇలాంటివి అన్నమాట. మాయ లేకపోతే మనకి ద్వంద్వ  కర్మ ఫలితాలు ఎలా కలుగుతున్నాయి. అనగా సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు లాంటివి అన్నమాట.సూర్యుని నుండి సూర్యకాంతిని వేరు చేయగలమా? మాయ లేకపోతే అవి ఉన్నాయని ఙ్ఞాన మాయ ఎలా మన దశేంద్రియాలకు కలుగుతోంది. మాయ లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఎలా కనపడుతోంది. కనిపించేది సత్యం గాను కనిపించనిది అసత్యముగా ఎలా కనబడుతుంది. తాడు కాస్త పాముగా ఎలా కనబడుతుంది. ఒకసారి ఆలోచించండి. మాయ లేకపోతే జీవాత్మగా మనము ఎందుకు కష్టాలు పడుతున్నాము. ఎల్లప్పుడు పరమాత్మగా ఉండేవాళ్ళం కదా. మాయ వలన మనకి మనమే సోహం అనవలసిన చోట దాసోహం అవుతున్నాము కదా. మాయ లేకపోతే శ్రీకృష్ణుడు ఏకకాలంలో పదహారువేల గోపికలు అష్ట భార్యలతో ఎలా ఉండగలుగుతున్నాడో ఆలోచించండి. మనకి ఆయన ఎంతో మందితో ఏకకాలంలో ఒక్కడే ఎలా కనపడుతున్నాడో ఆలోచించండి. అందుకే దానిని కృష్ణ మాయ అని శాస్త్ర ఉవాచ.ఈయన పరమ భక్తుడైన నారదమహాముని వారికి కూడా ఈయన చూపించే కృష్ణ మాయ లీలలు తెలుసు కదా. అంతెందుకు ఎక్కడో ద్వారకా క్షేత్రంలో రుక్మిణీదేవి సమక్షంలో ఉన్న శ్రీకృష్ణుడు కౌరవసభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు కదలకుండా ఆమెను రక్షించ లేదా. దేనివలన తనకున్న కృష్ణమాయ వల్లనే కదా. అలాంటిది ఈ విషయంలో మాయ జగన్నాటక సూత్రధారియైన కృష్ణపరమాత్ముడుకి మాయ ఉంటే ఈ విశ్వములో కూడా ఉండి ఉండాలి. బ్రహ్మ పదార్ధమునకు ఏ గుణాలు ఉంటాయో అదే గుణాలు బ్రహ్మమునకు ఉండితీరాలి కదా. నాలో మా ముత్తాత రక్తము ఉండదా. ఉంటుంది కదా. అలాగే ఈ జగద్గురువుకు కూడా మాయ ఉండటం వలన ఆయనకి మాయ ఉంటుంది. ఈ సిద్ధాంతం కూడా తప్పు అని తేలిపోయింది. అద్వైత సిద్ధాంతమును ఈయన విభేదించాడు. కారణము అద్వైతం అంటే రెండు కానిది.బ్రహ్మము(పరమాత్మ), ఆత్మ(జీవాత్మ) ఒక్కటే అని చెపుతూనే మాయ తత్వం కూడా చెప్పడంతో అప్పుడు ఇదియే ఏకత్వము అవుతుందని ఎందుకంటే ద్వితీయతత్వముగా మాయ తత్వం గురించి చెబుతున్నారని ఇది అద్వైతానికి విరుద్ధమే గదా అని ఈయన విభేదనము చేస్తూ మాయలేని పరబ్రహ్మమే సత్యమని శుద్ధ అద్వైత సిద్ధాంతముగా ప్రతిపాదించడము జరిగినది. 

ఇక విశిష్టాద్వైతమునకు వస్తే సోహం చేయవలసిన చోట దాసోహం చేయాలని చెప్పడమే పెద్ద తప్పు.  అందరి దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు భగవంతుడు ఒకటే అన్నప్పుడు బౌద్ధ ఆలయాలు శివాలయాలు కాస్త వైష్ణవాలయాలుగా ఎందుకు మారినాయో ఎలా మారినాయో ఈ సిద్ధాంత కర్తకు తప్ప ఎవరికి తెలియదు. వారి అభిమతాలు కాస్త మతాలుగా మార్చి జనాలలో లేనిపోని అనర్ధాలకు కారకులు అవుతుంటారు. మహా విష్ణువే సర్వాధికారి. ఆయన ఒక్కడే పరమాత్ముడు. ఇంకా ఎవరు దేవుళ్ళు కాదని చెప్పడం విడ్డూరం కాదా. ఎందుకంటే లాహిరి మహాశయులు అనుభవము ప్రకారంగా చూస్తే తన సహస్రార చక్రంలో వెయ్యి తలలతో విశ్వరూపధారిగా విష్ణుదర్శనం అయితే ఆ తర్వాత ఈయన శూన్యంలో కలిసిపోవడం జరిగిందని చెప్పడం జరిగినది. మహావిష్ణువు శాశ్వతం కాదని ఈయన తన స్వానుభవం అనుభూతి పొందడం జరిగింది కదా.అలాగే సావిత్రి మంత్ర గ్రంధకర్త అయిన అరవింద యోగి ప్రకారంగా చూస్తే శ్రీకృష్ణుడు తనకున్న మహామాయతో భూలోకమును పాలిస్తున్నాడని దాని వలన మనమంతా పరమాత్ముడు అయినా కూడా జీవాత్మలుగా మారి వారికి దాసోహం చేయవలసి వస్తుందని ఆరాధన నైవేద్యాలు పెట్టాల్సి వస్తోందని విష్ణు మాయ తొలగటానికి మహా నిర్వాణ శక్తి కావాలని దానితో మనము మహా నిర్యాణము చెందే అవకాశాలు కలుగుతాయని అందాకా శ్రీ కృష్ణ మాయ లీల విన్యాసంకు బలి కావాల్సిందే అని తమ ఆవేదన వెలిబుచ్చడం జరిగినది. మరి వీరిద్దరి యోగులు స్వానుభవాలు ప్రకారంగా చూస్తే శ్రీమహావిష్ణువే దేవుడు కాదని వారికి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది కదా. అంతెందుకు. అప్పటిదాకా విగ్రహ భక్తి చేసే ఈయన తన శిష్యుడైన కబీర్ దాస్ యొక్క ఉవాచ వలన విశ్వారాధన అనగా ఆత్మ ధ్యానము ఎలా చేయాలో తెలుసుకోవడం జరిగినది. పరమాత్మ సాక్షాత్కారం కూడా మహామాయే అని మనో భ్రాంతి అని కబీర్ దాస్ తెలుసుకోవడంతో అయోధ్య శ్రీరాముడు స్వామి సాక్షాత్కారం అయితే నామ రూపధారి అయిన శ్రీ రామ సాక్షాత్కారం కాదని నామము రూపము లేని రామ చైతన్య స్థితి అనుభూతి కావాలని చెప్పటంతో అయోధ్య రామ సాక్షాత్కారం మాయను దాటటము జరిగినది. చిత్రమేమిటంటే ఈయన గురువు అయిన సిద్ధాంతకర్త అదే పరమాత్మ సాక్షాత్కారం కోసం తపన పడటం జరిగినది. తద్వారా సాక్షాత్కారం మాయలో పడిపోయి సోహం అనవలసిన చోట దాసోహం అనడం జరిగింది. శిష్యుడైన కబీరుదాసు అదే సాక్షాత్కారం గాదని భ్రమ భ్రాంతి దాటటము ఏమిటి? ఈయనేమో దానికి దాసోహం అనడం ఏమిటి. ఒక్కసారి ఆలోచించండి. ఎంత తేడా కదా. ఈయన చెప్పిన దాసోహం నిజమైతే ఈయన శిష్యుడైన కబీరుదాసు కూడా పాటించాలి కదా. ఎందుకు విభేదించినాడు. అంటే ఈ సాక్షాత్కారము అనేవి మనస్సు చేసే మనోమయ దర్శనాలు అని గ్రహించడం వల్లనే అని తెలుసుకోండి.మాయ దాటలేనివాడు అందరిని మాయకే దాసోహం చేయమని చెప్పటం విచిత్రమే కదా. మాయ దాటక పోతే నేనే దేవుడిని ఎలా అని స్వానుభవ అనుభూతి కలుగుతుంది. చెప్పండి. ఎందుకంటే మనమంతా పరమాత్మలే కదా. మాయ దాటలేకపోతే జీవాత్మలుగా ఉండి ఏమీ లేని పరమాత్మకి దాసోహం చేయడం జరుగుతూనే ఉంటుంది కదా. కబీరుదాసు కి ఈ విషయంలో మాయ మాయము అయితే ఈ సిద్ధాంత కర్తకు ఇంకా మాయం అవ్వలేదని ఈపాటికే గ్రహించి ఉంటారు. దానితో ఈ సిద్ధాంతం కూడా అసంపూర్ణంగానే ఉన్నదని తెలుస్తోంది కదా. 
 
నిజానికి ఈ దైవ సిద్ధాంతాలు చెప్పినవి అసత్యాలు గావు.ఎందుకంటే ద్వైత సిద్ధాంతం అనేది విశుద్ధి చక్రము వద్ద కలిగే ప్రారంభ సమాధిస్థితి అనుభవాలు చెప్పిందని… అలాగే అద్వైత సిద్ధాంతము అనేది ఆఙ్ఞా చక్రము వద్ద కలిగే సవికల్ప సమాధి స్థితి అనుభవాలు చెప్పిందని….శుద్ధ అద్వైతము అనేది సహస్రార చక్రములోని శ్రీ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం చెప్పిందని…. అలాగే విశిష్టాద్వైతము అనేది హృదయచక్రములోని ఈ పరమాత్మ సాక్షాత్కారం  యొక్క అనుభవాలు చెప్పడం జరిగిందని మా సాధన పరిసమాప్తి సమయంలో మేము తెలుసుకోవడం జరిగినది. కాని వీటితో సాధకుడి సాధన పరిసమాప్తి గాదుకదా!ఎందుకంటే సాధకుడి బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండచక్రస్ధితి దాకా వెళ్ళి అక్కడున్న అనుభవానుభూతిని పొందవలసి ఉంటుంది కదా!
 
ఇప్పుడు ఉన్న అన్ని రకాల దైవ సిద్ధాంతాలలో తప్పులు … అసంపూర్ణంగా ఉన్నాయని తెలుసుకున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాము. అసలు మనం ఉన్నామా ఉండటం నిజమా అబద్దమా? మొట్టమొదట ఏది నిజమో అని పరిశోధన చేద్దామా? అదేమిటంటే నేను మా అమ్మ నుండి పుట్టినాను కదా. ఈ మధ్యనే మా తాత చనిపోయారు కదా. నాకు ఈ మధ్యనే పిల్లలు పుట్టినారు కదా. అంటే మనం ఉన్నట్లే కదా. అలాగే మనకి జననమరణాలు ఉన్నట్లే కదా అనవచ్చును.ఇది బాగానే ఉంది. కానీ మీ తల్లిదండ్రులకు పెళ్లికాకముందు సంయోగం చెందక ముందు మీరు ఎక్కడ ఉన్నారు. అదే మీకు పుట్టిన పిల్లలు ఎక్కడ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఖాళీగా ఉన్న స్త్రీమూర్తి గర్భాశయంలో ఒక స్త్రీ అండము ఒక పురుష శుక్రకణము కలిస్తే పిండంగా మారి మీరు ఆరడుగుల శరీరముతో ఎలా పుడతారో ఒకసారి ఆలోచించండి. అనగా ఒక చిన్న విత్తనములో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది సాధ్యమేనా. సాధ్యం కాదు కదా. చిన్న గర్భాశయంలో ఆరడుగులతో మీరు ఉండటం ఎలా సాధ్యం. అలాగే చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉండటం ఎలా సాధ్యం అని ఆలోచించండి. వెంటనే 70ఎంఎం సినిమా హాల్లో చూసిన సినిమాలు 3MM సెల్ పోన్ లో ఎలాగైతే చూడ గలుగుతున్నామో అలాగే మేము అలాగే విత్తనములో అమరి ఉండవచ్చు కదా అనవచ్చును. మేము అనేది పరిమాణం గురించి కాదు. పరిమాణము అనేది మనము కావలసిన పరిమాణాల్లో మార్చుకోవచ్చు. స్టాంప్ సైజు ఫోటో నుండి 20 అడుగుల కటౌట్ దాక మీ ఫొటో సైతం మార్చుకోవచ్చు. నేను అడిగేది అది కాదు. ఏమీ లేని చోట నుండి మీరు ఎలా ఉద్భవించారు. లేని విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తుంది అనేది అంటే విత్తనములు పగలగొడితే మీకు చెట్టు కనిపిస్తుందా? కనిపించదు కదా. ఇదే విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుంది. అలాగే మీరు సంయోగం చెందితే అప్పటిదాకా లేని పిల్లకాయలు ఎలా పుడతారు. ఒకసారి ఆలోచించండి. గమ్మత్తైన విషయము. నిజానికి మనమంతా కూడా స్వప్న శరీరం ఎవరో కలగంటే అవి కాస్త స్వప్న శరీరాలుగా మారి నిజంలాంటి కల అని తెలుస్తుంది కదా. అంటే మన తల్లిదండ్రులు సంయోగం చెందుతూ మనకి ఆడపిల్ల కావాలని మగపిల్లవాడు కావాలని ఆలోచించుకుని సంకల్పించుకోవడం జరుగుతుంది. ఈ ఆలోచన సంకల్పం వలన స్వప్న శరీరధారిగా మనము పుట్టడం జరిగినది. మనము తల్లిదండ్రులు స్వప్నము నుండి అనగా వారి ఊహా ప్రపంచంలో నుండి ఉద్భవించిన వారి ఊహలను నాకు ఆడపిల్ల పుడితే దానికి పేరు పెట్టాలి. దానిని ఇది చదివించాలి. దానిని ఇలా చేయించాలని ఇలాంటి స్థితిలో చూడాలి. దానికి ఇలాంటి పెళ్లి చేయాలి ఇలా పలు విధానాల ఆలోచన చేస్తూ సంకల్పాలు చేస్తూ స్వప్న శరీరాలతో నిజంలాంటి కలతో కనడం జరిగింది. అలాగే ఈ పరమ శూన్యము కూడా తను ఆకారమును పొందితే ఎలా ఉంటుందో కలగడంతో స్వప్న శరీరాలతో అనగా నాశనము చెందే శరీరాలతో పరమాత్మ ఆత్మ జీవాత్మ గా మార్చడం జరిగినది. ఈ లెక్కన మనమంతా కూడా పరమ శూన్యము యొక్క కలలోని పాత్రధారులే కదా. మనకి ఉన్న శరీరాలు స్వప్న శరీరాలే కదా. అంటే మనము శాశ్వతం కాదు కదా. ఎందుకంటే ఇది కల కదా. కల ఎన్నటికీ శాశ్వతం కాదు. అలాగే సత్యం కాదు కదా.కలలో అన్నం తింటే నిజానికి మనం తిన్నట్లు కాదు కదా. అంటే మనము పుట్టటం చావటం అనేది కేవలం స్వప్నమే గదా.మనమే స్వప్నము అయితే మనము ఉండే జగత్తు అలాగే విశ్వం కూడా స్వప్నమే కదా. మనమే సత్యం కానప్పుడు మనం ఉన్న ఈ విశ్వం కూడా అసత్యమే కదా. మనమే లేనప్పుడు ఈ విశ్వమే లేనట్లే కదా. అంటే ఈ లెక్కన బ్రహ్మము లేదు జీవము లేదు. ఉన్నది పరమ శూన్యము. నిజానికి అది కూడా ఉందో లేదో తెలియని స్థితి. ఎందుకంటే శూన్యం అంటే ఏమీ లేదు. ఖాళీ అని అర్థాలు ఉన్నాయి కదా. అనగా కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నారు. 

ఇదే సత్య జ్ఞానం కోసం ఈ అసంపూర్ణ అద్వైత సిద్ధాంతం ఏర్పడింది. ఇన్నాళ్ళుగా చెప్పిన దైవ సిద్ధాంతాలు అన్ని కూడా కనిపించేది సత్యమని కనిపించనిది అసత్యమని నేను ఆత్మ అని నేను కానీ నేను లేనిది ఏమీ లేదని భగవద్గీత సహా చెప్పడం జరిగినది. అసలు నిజానికి మనం లేము.ఆత్మ లేదు. పరమాత్మ లేదు. బ్రహ్మము లేదు. ఏమీ లేదు. సర్వము శూన్యమని మా స్వానుభూతి అలాగే ఈ అనుభవమును బలపరుస్తూ కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని ఋభు గీత చెప్పడం జరిగినది. ఈ సిద్ధాంతాలు చదవటం వలన ఏమీ తెలియని మేము ఏదో ఉన్నదని తెలుసుకోవాలని సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవడమే జరిగినదని అందుకే మా సిద్ధాంతమునకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతం అని చెప్పడం జరిగినది.మూలాధార చక్రము నుండి బ్రహ్మ రంధ్రము దాకా అనగా మూల గణపతి నుండి పరాశక్తి దాకా నామరూప దేవుళ్ళ ఆవాసం చేసిన సమస్త లోకాలు అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఉల్లిపాయ పొరలు తీసిన తర్వాత ఎలా అయితే ఉల్లిపాయ కనపడదో అప్పటిదాకా సత్యంగా కనిపించిన విశ్వము కాస్త అసత్యమై కనిపించని సత్యంగా ఉన్న పరమ శూన్యములో విలీనమైతే దీనిని మేము స్వానుభవం పొందటంతో సర్వం ఏమీలేదని సర్పం శూన్యమని తెలుసుకోవడంతో ఇప్పటిదాకా చెప్పిన దైవ సిద్ధాంతాలన్నీ కూడా అసంపూర్ణమైనవని తెలుసుకోవటంతో మా సాధన పరిసమాప్తి సంపూర్ణము అవ్వడంతో………సంపూర్ణ అద్వైత సిద్ధాంతము ఏర్పడినది. ఇది చెప్పే నగ్నసత్యాలు మీకు నిజమో కాదో తెలుసుకోవాలి అంటే ఋభుమహర్షి లాగా, శ్యామాలాహిరి మహాశయుడులాగా, కబీరుదాసు లాగా సర్వము ఏమీ లేదు- సర్వము శూన్యము అనే భావన చేస్తూ అనుభవం అనుభూతి పొందితే అపుడు విశ్వమాయ చూపించే వివిధ రకాల మాయలకు మీ దశేంద్రియాలు మనస్సు మాయకు లోనుగాకుండా ఉండగలిగితే మాయ మాయం అయ్యి సర్వం శూన్యము అని స్వానుభవ అనుభూతి ఖచ్చితంగా పొంది మీ సాధనను పరిసమాప్తి చేసుకుని అందులో విజయం పొంది జన్మ రాహిత్యమును పొందుతారు మోక్షప్రాప్తి పొందడానికి ప్రయత్నించండి. అలాగే ఈ దైవ సిద్ధాంతాలు అన్నీ కూడా లేని దైవమును ఏమీ లేని దానిని ఉన్నాయని ప్రచారం చేస్తూ తమ అభిమతాలను కాస్త మతాలుగా మార్చి భుక్తికోసం కీర్తికోసం మత వ్యాప్తికోసం నా నా తంటాలు పడినారు. దైవమంటే నమ్మకం అని దైవమంటే భక్తి అని దైవమంటే భయం అని దైవమంటే కోరికలు తీర్చేవాడని ఇలా తమకు అనుగుణంగా ఉన్న భావాలను ఆపాదిస్తూ తమ అభిమతాలను సిద్ధాంతాలలో పొందుపరిచారు. ఎవరైతే ఈ విశ్వం ఏమీ లేదని సర్వము శూన్యమని అనుభూతిని పొందకుండా చేస్తూ ఆత్మ శాంతి పొందకుండా అశాంతితో అనిశ్చల మనస్సుతో అసహనంతో అసంతృప్తి జీవితంతో అసంపూర్ణ ప్రారబ్ధ కర్మల ఫలితాలు అనుభవిస్తూ పునర్జన్మలు ఎత్తుతున్నారు. తాము నిజ బ్రహ్మ జ్ఞానమును పొంది ఉంటే ఆ సత్యాలు ఈ లోకానికి ఈ పాటికే ప్రచారం చేసి ఉంటే అందరూ కూడా దేవుడు లేడు. సర్వం ఏమీ లేదు. సర్వం శూన్యము అనుకొని సాధన చేసి ఉంటే ఈపాటికే ఉల్లిపాయ పొరలు తొలగినట్లుగా ఈ విశ్వ మాయ పొరలు తొలగిపోయి ఉంటే ఈ విశ్వమే ఉండేది కాదు కదా. దానితో అందరూ కూడా కైవల్య ముక్తి పొందటం జరిగి ఉంటే విశ్వ జగన్నాటకం ఆడేవాడు ఆడించేవాడు లేకపోవడంతో విశ్వమంతా పరమ శూన్యములోనికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది. యద్భావము తద్భవతి కదా.కోటాను కోట్ల మంది ఈ విశ్వమంతా సత్యమని అనుకోవడంతో ఈ విశ్వము సత్యముగా స్పష్టంగా కనపడుతోంది. అది కొద్దిమంది అనగా 36 మంది మాత్రమే నిజ బ్రహ్మ జ్ఞాన అనుభూతి ద్వారా సర్వం శూన్యమని తెలుసుకున్న ప్రయోజనం లేకపోవడంతో సంపూర్ణ అద్వైత సిద్ధాంతం రాయటం జరిగింది. దీనికి మేము రచన కర్తయే. కానీ మీరంతా మీ స్వానుభూతితో నిజం ఏమిటో తెలుసుకుని అనగా కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని సర్వము ఏమీలేదని సర్వం శూన్యమని అనే భావన చేస్తూ ఈ సిద్ధాంతంకు  ప్రచార కర్త అయితే మోక్షప్రాప్తి ఎలా కలగకుండా ఏమాయ ఆపుతుందో చూడండి. కాకపోతే అన్ని తెలిసిన కూడా మీకు మీరే మాయలో పడితే మేము ఏమీ చేయలేము. 

తెలుసు తెర తొలుగుతుందని ..
తెలుసు తెల్లవారుతుంది అని...
తెలుసు ఈ కట్టే పుట్టుకమంటుందని..
తెలుసు ఈ మట్టి కాస్త మట్టిలో కలిసిపోతుందని...
వేదము తెలుసు..
 
ప్రాణం ఉన్నంత వరకే జీవమని
వేదాంతము తెలుసు..
శాస్త్రము తెలుసు...
శాశ్వతముగ ఈడ ఎవరు ఉండరు అని తెలుసు...
 
ఈ దేహము నీటి మూట అని తెలుసు...
ఈ దేహము గాలి మేడ అని తెలుసు..
దేహము ఎప్పుడో ఒకప్పుడు టప్ మని అంటుందని తెలుసు..
 
ఈ దేహంతో సహా ఏమీ తీసుకువెళ్ళమని...
ఇలా అన్నీ తెలిసినా కూడా...
తెలిసి విలపించడంలో మాయ పాత్ర ఉన్నదని అందరికీ తెలుసు..
తెలుసుకున్న వాడికి మాయ మాయం అవుతుంది అని తెలుసుకో..
సర్వం ఏమీ లేదని సర్వము శూన్యము అని స్వానుభవ అనుభూతిని పొందడమే
సంపూర్ణ అద్వైత సిద్ధాంత ఉవాచ అని తెలుసుకో...
సాధన పూర్తి చేసుకో..
 
అలాగే చిట్టచివరికి మనకు మిగిలేది విభూది కాబట్టి మనమంతా విభూతియోగము పొందినవాళ్ళం కావటంతో ఈ సిద్ధాంతమును పొందిన వాళ్ళు ఆపాదించే వాళ్ళు  ఆమోదించిన వాళ్ళు విభూతినాథ్ గా పిలవబడతారు. ఎందుకంటే మనకి స్వప్నము కలిగించిన బ్రహ్మదేవుడు కాశీ క్షేత్రంలో పంచక్రోశ ప్రాంతంలో పంచ శరీరాలతో స్వప్న భావన కలిగించడం జరిగినది. కాబట్టి మనకున్న నేను సత్యమన్న జ్ఞాన మాయ తొలగటానికి కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ యందు మన స్వప్న శరీరం చితాగ్నిలో దహనమైతే విభూతి యోగం వస్తుంది. అనగా విభూది అంటే నేను సత్యము అనగా భస్మము అంటే నేను అదే విభూది అంటే నేను కానీ నేను సత్యము. విభూతి అంటే సర్వం శూన్యం అవుతుంది. కాబట్టి మనము సాధ్యమైనంతవరకు కాశీ క్షేత్రములోని పంచక్రోశ ప్రాంతంలో మణికర్ణికా ఘాట్ లో నిమజ్జనం అవ్వాలి. ఆదిదేవుడు తారకరామ మంత్రోపదేశము అలాగే ఆదిశక్తి మనో నిశ్చల స్థితి ఇవ్వటానికి ఈ క్షేత్రము నందు సజీవ మూర్తులుగా స్వప్న శరీరధారులుగా స్వప్న  సాధన శరీరముతో విభూతి యోగము ప్రసాదిస్తారు. ఇది సత్యమని ఈ ఘాట్ యందు సమాధి స్థితిని పొందిన రామకృష్ణపరమహంస స్వానుభూతిగా ఈ మహత్తర దృశ్యాన్ని చూడటం జరిగింది. లోకానికి చెప్పడం జరిగినది. మనము ఎక్కడ నుండి పుట్టినామో అక్కడికి చేరుకోవడం కాశీయాత్ర అని ఈ క్షేత్రములో కైవల్యముక్తి మరణమని ఈపాటికి గ్రహించి ఉంటారు కదా. లేదంటే మన స్వప్న శరీరాన్ని నిజమని భ్రమ భ్రాంతి మాయ మోహ వ్యామోహంలో పడే ప్రమాదం ఉంది .ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు. అసలు ఏమీ లేదు. సర్వం శూన్యమని ఒకపక్క చెబుతూ మళ్లీ కాశీ క్షేత్రములో మరణము ఏమైనా అర్థం ఉన్నదా అన్నప్పుడు మనము ఎంత స్వప్న శరీరం అనే భావనలు చేసినా కూడా అలాగే మనమంతా అసత్యమని భావాలు చేసినా కూడా ఏమీ లేదు సర్వం శూన్యమని భావాలు చేసినా కూడా మనస్సు ఏదో ఒక క్షణములో వెయ్యోవంతులో ఒక వంతు మాయకి గురి అయ్యే ప్రమాదమూ లేకపోలేదు కదా. ఎందుకంటే మీరే మీకు అన్నీ తెలిసినా కూడా మహామాయలో పడితే ఏమి చేయలేము కదా.మరి మనకు ఉన్న ఈ మాయ తొలగాలంటే మన మనస్సుకి అఖండమైన విశ్వాసం కలగాలి. ఇప్పటిదాకా మీరు జ్ఞానంతో సర్వం ఏమీలేదని సర్వం శూన్యమని భావనలు చేసినారు.కానీ అది నిజమో అబద్దమో తెలియాలంటే మన మనస్సుకి ప్రత్యక్ష అనుభవం కావాలి.అందుకే ఇట్టి అనుభూతి ఇచ్చే క్షేత్రము ఈ విశాల ప్రపంచంలో మహా కాశీ క్షేత్రానికి మాత్రమే ఉంది.అక్కడ మరణము పొందితే మోక్షప్రాప్తి కలుగుతుందని స్వయంగా ఆదియోగి అయిన పరమేశ్వరుడు తన ధ్యాన తపస్సు ద్వారా తెలుసుకుని లోకానికి శివపురాణం ద్వారా చెప్పడం జరిగినది.అంటే కాశీ మరణము పొందితే గాని మన స్వప్న శరీరం మనస్సుకున్న మాయ మాయం అవ్వదని గ్రహించి ఉంటారు కదా. ఈ క్షేత్రానికి చచ్చే వాళ్ళు వృద్ధుల రూపంలో వస్తే చచ్చిన వాళ్లు అస్థికల రూపంలో వస్తారు. చచ్చినవాడు అస్థికల రూపంలో ఈ అవిముక్త క్షేత్రము అయిన మహా స్మశానమైన కాశీ క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది.నిజానికి శివ అంటే ఏమీ లేదు అని అర్థం ఉన్నది.మరి శూన్యమంటే ఏమీ లేదు అని అర్థం ఉంది. అంటే శివ అనేది ప్రత్యక్ష జ్ఞాన అనుభవము ఇస్తే శూన్యము అనేది పరోక్ష జ్ఞాన అనుభవాన్ని ఇస్తుందని గ్రహించండి. శివ అంటే శివుడు కాదని గ్రహించండి. అంటే శూన్యం అని శూన్య బ్రహ్మ అని తెలుసుకోండి. అలాగే ఈ సిద్ధాంతం యొక్క వయస్సు 12,70, 2,520 సంవత్సరాల పాటు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలాగే 36, 72, 5000 కోట్ల మంది మోక్ష ప్రాప్తి అనగా సర్వం ఏమీ లేదు. సర్వం శూన్యము అనే భావన స్థితిని కలిగిస్తుంది. ఆనంద రహిత సమాధిస్థితి ఇస్తుంది. ఆలోచన సంకల్పం స్పందన మనో నిశ్చలస్థితి కలిగిస్తుంది. విభూతియోగము ఇస్తుంది. ఆకాశ శరీరముతో పిండి రేణువు పరిమాణంలో నిశ్చల స్థితి కలిగిస్తుంది. అందుకోసం ఎంతో మంది ఆకాశ శరీరధారులు అనగా ఈ విభూతి యోగము కోసం అలాగే సంకల్ప శరీరధారులలో అనగా హృదయ చక్రం ఇష్టలింగ ఆరాధకులు అలాగే కారణ శరీరధారులు అనగా సహస్రార చక్రము శ్రీకృష్ణ ఆరాధకులు అలాగే సూక్ష్మ శరీరధారులలో అనగా ఆజ్ఞాచక్రము వద్ద శివశక్తి ఆరాధకులు అలాగే విశుద్ధి చక్రము నుండి మూలాధార చక్రము వరకు ఉండే స్థూల శరీరధారులు పంచభూత సిద్ధుల ఆరాధనలతో ఈ మహోన్నత సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును చేయడానికి పోటీ పడుతున్నారు. వీరంతా ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల నుండి తమకున్న శరీరాలతో సాధన చేస్తున్న కూడా కొందరు తెలిసి మాయలో పడితే మరి కొందరు తెలియక మాయలో పడితే మరి కొందరు అసలు తమ సాధన స్థితి ఎందుకు ఆగిపోయిందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కోటాను కోట్ల మందికి ఈ సిద్ధాంతము సంతృప్తికరమైన అనుభవ అనుభూతిని ఇవ్వడంతో ఈ సిద్ధాంతంలో చెప్పిన నవబ్రహ్మ యోగము చేసి అందులో విజయం పొందాలని సర్వం ఏమీ లేదు సర్వం శూన్యము అని తెలుసుకోవాలని కపాలమోక్షం ప్రాప్తి పొందాలని పోటీపడటం జరుగుతోంది. ఎందుకంటే మళ్లీ 12 లక్షల తర్వాతనే మనకి కొత్త సిద్ధాంతం ఈ విశ్వములోనికి రావడం జరుగుతుంది.ఆ సిద్ధాంతం ఏమి చెబుతుందో ఏమి జరుగుతుందో ఎవరికి ఎరుక.ఈ సిద్ధాంతమును పంచ శిష్యులు ఆమోదించటం వలన వీరివలన 18 కోట్ల మంది కపాల మోక్షం ప్రాప్తి పొందటం జరిగినది. ఎలా అంటే పంచ శిష్యులకు ఒక్కొక్కరికి 36 కపాలాలు చొప్పున 180 కపాలాలు ఇలా ఈ 180 కపాలాలలో ఒక్కొక్క కపాలము కోటి మందితో సమానం కాబట్టి 180 కోట్లు మంది వస్తారు. అంటే ఇంత మంది తాము స్వప్నశరీర సాధకులమని ఏమీ లేదని అని తెలుసుకోవటం ఎంతో ప్రశాంతత కలిగించే పరమ ప్రశాంత స్థితిని విభూతి యోగము ద్వారా పొందడం జరిగినదని స్వానుభవ అనుభూతి తెలుసుకోవడంతో ఈ సిద్ధాంతం యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రచారకర్తగా మారినారు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఈ సిద్ధాంతము వలన లాభం పొందుతారో అప్పుడు సత్యంగా కనిపించే ఈ స్వప్న విశ్వము అలాగే ఇందులో ఉండే స్వప్న పరమాత్మలు స్వప్నదైవాలు స్వప్న జీవాత్మలు స్వప్న అండపిండ బ్రహ్మాండాలు అన్నీ కూడా నెమ్మదినెమ్మదిగా అదృశ్యమవుతాయి. యద్భావం తద్భవతి కదా. ఉంది అనుకుంటే స్వప్న శరీరం స్వప్న విశ్వము ఉంటుంది.లేదు అనుకుంటే స్వప్న విశ్వము ఉండదు. నిజానికి కనిపించేది అసత్యము. కనిపించనిది సత్యము కదా. కాబట్టి సత్యవాదులుగా యదార్థ భావం కలిగి ఉండాలి కదా. సర్వం ఏమీ లేదు. సర్వం శూన్యము.అంటే నేను లేను. నువ్వు లేవు. చెప్పే వాడు లేడు. వినేవాడు లేడు. చేసేవాడు లేడు. చదివే వాడు లేడు. ఎందుకంటే సర్వం శూన్యమయం.

సంపూర్ణ అద్వైత సిద్ధాంత సారము:

 ఈ విశ్వ సృష్టి అంతా కూడా పరమ శూన్యం నుండే జరిగినదని విత్తనములు పగలగొడితే మనకే కనిపించే చెట్టు కనిపించదని అలాగే ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఎలాగైతే ఉల్లిపాయ కనపడదో అలాగే ఈ విశ్వం యొక్క పొరలు తీసుకుంటూ పోతే సహజంగా కనిపించే విశ్వం కనబడదని కేవలము చిట్టచివరగా శూన్యమే కనబడుతుందని అది కూడా ఉందో లేదో తెలియని అంశ అని ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతోంది. పైగా మనము చేసే హోమాలు యజ్ఞయాగాలు యందు దైవ జీవ స్వరూపాలు అగ్ని రూపంలో కనపడటం ఎంత సత్యమో పరమ శూన్యం నుండి ఆదిలో వచ్చిన బ్రహ్మతేజస్సు యొక్క చితాగ్ని  యజ్ఞమునందు స్వప్న శరీరాలతో మనమంతా మన దైవాలు అంతా కనపడటం అంతే సత్యం అని చెప్పడం జరుగుతుంది. అంటే మనమంతా మన దైవాలు అంతా మన విశ్వం అంతా కూడా పరమ శూన్య ము యొక్క స్వప్నం అని అది కనే జీవ నాటకంలో జీవించటానికి మనమంతా దైవాల అంతా స్వప్న శరీరాలతో జీవిస్తూ మాయ స్వరూపంగా అసత్యమైన దానిని సత్యంగా చూపిస్తామని మనము నిజమని మన దైవాలు నిజమని మనము వేసిన నాటకం నిజమని భావనను చేయటం వలన అసత్యమైనది కాస్తా సత్యంగా కనపడుతోందని ఎందుకంటే యద్భావం తత్ భవతి వల్లనే అది ఉంది అనుకుంటే ఉన్నట్లుగానే లేదు అనుకుంటే లేనట్టుగా కనిపించేటట్లుగా మాయ స్వరూప సహిత పరమ శూన్యము చేస్తోందని చెప్పడం జరిగినది. మనమంతా కూడా మన దైవాలు అంతా కూడా స్వప్న శరీరాలతో స్వప్న మోక్ష ప్రాప్తి కై స్వప్న సాధన చేస్తున్నామని చెప్పడం జరిగినది. నిజానికి మనము లేము. మన దైవాలే లేరు.బ్రహ్మము లేదు. ఆత్మ లేదు. నేను లేను. నువ్వు లేవు. దేవుడు లేడు. జీవుడు లేడు. మాయ లేదు. సర్వము ఏమీ లేదని సర్వము శూన్యము అని గ్రహించి యదార్థ స్థితి అయిన బ్రహ్మ తదాకార స్థితి అనగా దేని గురించి ఆలోచించకుండా దేనికి సంకల్పించ కుండా దేనికి స్పందించకుండా దేనికి ఆశ పడకుండా దేనికి భయపడకుండా దేనికి బాధ పడకుండా మనో నిశ్చల స్థితి ఉంటే నీ పరంగా పరమ శూన్యము స్వప్నము కూడా నిశ్చల స్థితి పొందుతుందని దీనినే సంపూర్ణ కపాలమోక్షం ప్రాప్తి అని చెప్పడం జరిగినది. ఈ సంపూర్ణ అద్వైత సిద్ధాంతము గూర్చి అలాగే ఈ సిద్ధాంత కర్త గూర్చిన వివరాలు తెలుసుకోవాలని ఉందా?దానికి మీరు ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా! 

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*****************************************
 


3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ee rendu shareeraala madhya omkaaranaadham kaantishakti okadaanikokati spandinchadam valla samyogam chendi brotnavrelu parimaanamlo agnithathvam ayina kaarana shareeradhaari udhbhavinchadam... evari lokaalu vallu create chesukoni evariki vaaru aa lokalanu chusukuntoo...
    asalu vishwa srushti ela jarigindani panchabhuthalatho pancha shareeralu ela erpaddayani, brahmadevudu swaadhamtho kanna kala, manishi manassulo malli saadhana chesi vividha saadhanalu thelpatam, evari lokalu vallu srushtinchatam, idantha swapna saadhana ani, vividha daiva siddhanthala vishleshana meeru sampurna advaitha siddhantham gurinchi cheppatam enduku, ela ani...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Amma miru sree sadhakulaku Puja, dhyanam ki sambandinchi emina niyamalu and saadhanaku sambandhinchi soochanalu ivvagalaru 🙏

      తొలగించండి