అధ్యాయం 69

 
అంతా స్వప్నమేనా? 
(కనిపించేదంతా మా స్వప్నమేనా)
 
 ఈ కనిపించే విశ్వమంతా మనమంతా మన దైవాలు అంతా కూడా ఒక స్వప్నమేనా? ఒక స్వప్నం లో జరిగే జీవ నాటకమేనా.. నిజంలాంటి కలయేనా కలలాంటి నిజమా ఇది కూడా సత్యము కాదా.. కనిపించే జగత్తంతా అసత్యమేనా కనిపించని బ్రహ్మం కూడా సత్యమేనా.. ఎందుకంటే వీరిద్దరు కూడా పరమ శూన్యము నుండి వచ్చిన వారే కదా. శూన్యం అంటే ఏమీ లేదు ఖాళీ అనే కదా. మొదట బ్రహ్మము వస్తే అటుపై జగత్తు వచ్చినది. ఈ బ్రహ్మము అనేది పరమ శూన్యము యొక్క స్వప్నము అయితే ఈ జగత్ అనేది ఈ శూన్య బ్రహ్మము యొక్క అంటే శూన్య బ్రహ్మ యొక్క స్వప్నం అని తెలుస్తోంది. అసలు ఇది ఎలా స్వప్నమైనదో విచారణ చేయాలి. మనకి కనిపించే అంతా కూడా మనకి కనిపించని దాని స్వప్నము అనుటకు నిదర్శనముగా ఒక విత్తనము తీసుకుంటే దానిని పగలగొడితే మనకి చెట్టు కనిపిస్తుందా.. కనిపించదు గదా! పోనీ విత్తనములో చెట్టు లేదు అనడానికి లేదు. దానిని పాతిపెడితే చెట్టు వస్తుంది. అప్పటిదాకా మనకి కనిపించని చెట్టు ఈ విత్తనమును పాతి పెడితే అది చెట్టుగా ఎలా రూపాంతరం చెందుతోంది అంటే విత్తనం యొక్క స్వప్నమే చెట్టు గదా. నిజానికి చెట్టు లేదు. అలాగే విత్తనము లేదు. ఈ రెండూ కూడా పరమ శూన్యము యొక్క స్వప్నమే లేకపోతే ఏమిటి ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రిచెట్టు ఎలా ఉంటుందో ఒకసారి సావధానముగా నిదానముగా ఆలోచించండి. అది సాధ్యమేనా ఎన్నటికీ సాధ్యం కాదు కదా. అంటే విత్తనం యొక్క స్వప్న శరీరమే ఈ చెట్టు అని అనుకోవచ్చు కదా. కాకపోతే కొంతమందికి ఇక్కడ ఒక సందేహము రావచ్చును. అది ఏమిటంటే మనకి సాధనలో వచ్చే అష్టసిద్ధులలో అణిమా సిద్ది అనేది ఉంది. దీనివలన ఎవరైనా రేణువుగా మారిపోవచ్చు లేదా బ్రహ్మాండము అంతా కూడా విస్తరించవచ్చును కదా. ఈ సిద్ధితో విత్తనములో చెట్టు ఉండవచ్చును కదా అని అనవచ్చును. దీనికి సమాధానం ఏమిటంటే ఈ సిద్ది వలన వస్తువు యొక్క పరిమాణాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి.
 
 అంటే 70 mm సినిమా….. మీరు 7 mm సెల్ ఫోన్ లో ఎలా అయితే చూడగలుగుతున్నారో అలా ఈ విశ్వములో ఈ విత్తనములో చెట్టు ఉండి ఉండాలి కదా.కానీ మనము ఈ విత్తనము పగలగొడితే రేణువు రూపంలో అయిన ఈ చెట్టు ఆకార పరిమాణము కనపడాలి కదా. కనబడుతోందా? కనపడదు కదా. అంటే విత్తనములో అసలు చెట్టే లేనట్లే కదా. చెట్లు లేకపోతే విత్తనములు పాతిపెడితే చెట్టుగా అది ఎలా వస్తోందో ఆలోచించండి. అనగా విత్తనము యొక్క స్వప్నము వల్లనే ఈ చెట్టు కాస్త స్వప్న శరీరంగా మారి మనకి చెట్టుగా అగు పడుతోంది అని తెలుస్తోంది కదా. ఈ సిద్ధాంతములాగానే మనకి కనిపించే విశ్వమంతా కూడా పరమ శూన్యము యొక్క స్వప్నమేనని ఈ స్వప్నములో ఉండే జీవ నాటకము వేసే స్వప్న శరీరాలని మనమంతా అలాగే దైవాలు అంతా అని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. అలాగే మన కారణ శరీరము ఎన్నటికీ నిద్రపోని స్థితిలో ఉంటుందని శ్రీ లాహిరి మహాశయులు తన అనుభవాలలో చెప్పటం జరిగినది. ఇవి సత్యమని మేము కూడా అనుభవ పూర్వకముగా తెలుసుకోవడం జరిగినది.

 ఒక మనిషికి నిద్ర రాలేదు అంటే అతను వేరే వారి స్వప్నములో పాత్ర వేస్తున్నాడని అర్థం ఉంది. ఈ లెక్కన చూస్తే మన కారణ శరీరము నిద్ర పోవడం లేదు.అంటే అది వేరే వారి స్వప్నములో వేస్తూ ఉండాలని తెలుస్తోంది కదా. అనగా పరమ శూన్యం యొక్క స్వప్నములో మన కారణ శరీరము కాస్త స్వప్న శరీరముగా మారి ఈ విశ్వములో స్వప్న జీవ నాటకములో జీవ పాత్ర లేదా దైవ పాత్ర లేదా పరమాత్మ పాత్ర వేస్తున్నాడు. వేస్తోంది కూడా. అందుకే మనమంతా దైవాలు అంతా పరమాత్మలు అంతా కూడా స్వప్న శరీరధారులుగా ఉన్నాము. ఉంటున్నాము. సత్యము లాంటి అసత్యము లాగా….. అసత్యము లాంటి సత్యములాగా ఉంటున్నాము అన్నమాట. ఇలా ఈ కారణ శరీరము నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా కారణము ఉండి ఉండాలి కదా. ఈ శరీరానికి కారణము లేకపోతే కారణ శరీరమని ఎందుకు అంటారు. ఆ కారణం ఏమిటి అని విచారణ చేస్తే పరమ శూన్యం యొక్క స్వప్నము నుండి బయటపడటమే దీనికి కారణమని తెలుస్తోంది. అనగా జీవ నాటకము నుండి జీవన్ముక్తి పొందాలని ఈ కారణ శరీరము తపన పడుతోంది. పరమ శూన్యము యొక్క స్వప్నమును ఆపివేయాలని ప్రయత్నిస్తోందని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా.
అందుకే కదా స్వప్న శరీరాలతో స్వప్న సాధకుడుగా మారి స్వప్న సాధనను మనమంతా దైవాలు అంతా సాధన చేస్తున్నారు. 

మరి ఎందుకు ఇందులో జయము పొందటము లేదో విచారణ చేద్దాం. ప్రతి స్వప్న సాధకుడికి ఉన్న స్వప్న శరీరానికి 36 స్వప్న కపాలాలు ఒక మూల ఏక కపాలంలో ఉంటాయని ఈపాటికే మీరు తెలుసుకున్నారు కదా. ఇందులో 34 కపాలాలు మాత్రమే మోక్షము పొందుతున్నాయి. మిగిలిన రెండు కపాలాలలో ఒక కపాలానికి నేను బ్రతికే ఉన్నాను నేను ఉన్నాను అనే జ్ఞానశక్తి ఉండుటవలన అది కాస్త జ్ఞాన కపాలముగా శ్రీ మేధా దక్షిణామూర్తిగా నామ రూపధారిగా ఒక స్వప్న శరీరముగా అరుణాచల క్షేత్రంలోని అంతర్గత గుహ యందు జీవ నాటకములో జ్ఞాన పాత్ర కోసం మిగిలి పోతున్నాడని అలాగే కపాలము ప్రాణశక్తితో ఉండి చితాగ్ని యొక్క సహన శక్తిని తట్టుకోలేక పోవటంతో అపస్మారక స్థితిని పొంది అది కాస్త నేను చనిపోకూడదు నేను జీవించాలి ఈ జీవ నాటకములో పాత్రలు వేస్తూ ఉండాలని కపాల మోక్షము పొందకుండా వెనుతిరగటం చేస్తూ ఉండటంతో అది కాస్త ప్రాణ కపాలముగా సదాశివమూర్తి నామ రూపధారిగా  స్వప్న శరీరముతో హిమాలయాలలోని కైలాస పర్వతము నందు స్వప్న శరీరముతో చితాగ్ని సహన శక్తిని తట్టుకోవటానికి తనకు కలిగిన అపస్మారక స్థితిని దాటుకోవటానికి సదాశివమూర్తిగా యోగ సాధకుడుగా యోగిగా      ఆది యోగిగా ఈ విశ్వ నాటకములో పాత్ర వేస్తున్నారని ఈపాటికే గ్రహించి ఉంటారు. అంటే తమకున్న జ్ఞాన మాయను వదిలించుకోవటానికి ఈ రెండు కపాలాలు అయినా కాస్త ఏక కపాలం గా మారి అటుపై మూల కపాల మోక్షం కలుగుతుందని ఈపాటికే గ్రహించి ఉంటారు. 

అప్పటిదాకా మనమంతా కూడా దైవాలంతా కూడా అలాగే మన పరమాత్మలంతా కూడా ఈ విశ్వమంతా కూడా  పరమ శూన్యం యొక్క ఆధీన ఆలోచన, సంకల్ప, స్పందన, ఆనంద,భయ,ఆశ మధ్యనే కొట్టుమిట్టాడవలసి వస్తుందని చనిపోవాలన్న మనము చనిపో లేమని కేవలం భౌతిక మరణాలతో శరీరాలు విడుస్తున్నామని మన చేతుల్లో ఏమీ లేదని అంతా వున్నట్లుగా మనమే చేస్తున్నట్లుగా కేవలం కనపడుతోందని చేసేది చేయించేది అంతా పరమ శూన్యమేనని తెలుసుకోండి. అంటే మనము కల కనడం లేదని మనము కనే కల కూడా పరమ శూన్యం యొక్క ఒక కలయే అని గ్రహించండి. మనము కల కంటే మన కారణశరీరం నిద్ర పోవాలి కదా. కల రావాలంటే నిద్రలో ఉండాలి కదా. మరి నిద్ర లేని కారణం శరీరము ఎవరి కలయో ఈపాటికి గ్రహించే ఉంటారు కదా.అదేనండి పరమశూన్యం  యొక్క స్వప్నములో మన కారణ శరీరము ఒక స్వప్న శరీర పాత్ర వేస్తోందని అనడము నిజమే కదా. లేకపోతే మనమిప్పుడు చనిపోవాలి లేదా సమాధి చెందాలి అని అనుకుంటే జరుగుతుందా జరుగదు కదా. అంటే మన మరణము మన చేతులలో లేదుకదా. మరి ఎవరి చేతులలో ఎవరి చేతలలో ఉందో ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా.అదేనండి! అది ఉందో లేదో తెలియని అంశ అయిన పరమశూన్యం  యొక్క ఆలోచన స్థితిలో మన మరణస్థితి ఉంది అని తెలుసుకోండి.ఎందుకు అంటే స్వప్న శరీరాలు రావటానికి కారణం ఈ పరమశూన్యం   కాస్త విశ్వ జీవ నాటకం అనే స్వప్నము కనడము వలన జరుగుతోందని తెలుస్తోంది కదా. 

 
ఈ నాటకంలోని పాత్రలు పాత్రధారులు అంతా ఒక్కరే వేస్తున్నారు. అంటే సినిమాలో హీరో పది పాత్రలు ఎలా వేస్తాడో అలా ఒకే కారణ శూన్య బ్రహ్మ కూడా ఈ జీవ నాటకము నందు త్రిముఖి ఈశ్వరుడు కాస్త త్రిమూర్తులుగా సృష్టి స్థితి లయము అనగా పుట్టుట పెరుగుట చచ్చుటలాగా వేసే వాడి పాత్రలుగాను(సృష్టి )చూసే వాడి పాత్రలుగాను( స్థితి గాను) చచ్చేవాడి పాత్రలు (లయము గాను)ఇలా దాదాపుగా ఒక కోటి పరమాత్మ పాత్రలు 36 కోట్ల దైవ పాత్రలు 84 లక్షల జీవరాశులలో జీవ పాత్రలు ఒకే ఒక్కడు మన మెదడులో పిట్యూటరీ గ్రంధి లోపల పరమాత్మ పాత్రలో మూడు అంగుళాల పరిమాణం మేర మన కారణ శరీరము యొక్క కారణ శూన్య బ్రహ్మ పాత్ర ఉన్నదని తెలుసుకోండి. వీడు నాటకాలు వెయ్యటానికి ఆడటానికి ఆడించడానికి కారకమైనది పరమ శూన్యమేనని గ్రహించండి. 

వేదాంతములో ఒక కథ ఉంది. అది ఏమిటంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి. అందులో ఒక పక్షి కదులుతూ ఉంటే మరొక పక్షి నిశ్చల స్థితిలో ఆ చెట్టు మీదనే ఉంటుంది. ఇలా నిశ్చల స్థితిలో ఉండే పక్షి పరమ శూన్యము అయితే కదులుతూ ఉంటే పక్షి అనేది కారణ శూన్య బ్రహ్మ అన్నమాట. అంటే నిశ్చలస్థితి పక్షి యొక్క నీడే కదులుతూ ఉంటే పక్షి అన్నమాట.ఇక్కడ చిన్న ధర్మ సందేహము రావచ్చును. అది ఏమిటంటే నిశ్చలస్థితి పక్షి పరమ శూన్యము అయితే అది ఎలా కల కంటుందో అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే మనిషి ఒకవేళ కోమాలో ఉన్న కూడా తను ఆలోచనలను చేస్తూనే ఉంటాడు గదా. బ్రతికి ఉన్న శవములాగా ఉన్నప్పటికీ తన ఆలోచన కొనసాగిస్తూనే ఉంటాడు కదా. కాకపోతే ఇలాంటి ఆలోచనలు పక్కనే ఉన్న వారికి మనకి తెలియవు. అలాగే పరమ శూన్యము యొక్క నిశ్చలస్థితి కూడా కోమా స్థితిని పొందిన మనిషి స్థితి లాంటిదే అని తెలుసుకోండి. అంటే నేను అనేది నిశ్చలస్థితి పొందుతోంది అని కానీ నేను కాని నేను నిశ్చలస్థితి పొందటం లేదు. అనగా పైకి మాత్రమే పరమ శూన్యము నిశ్చల స్థితి అనగా కోమా స్థితి ఉన్నట్లుగా కారణ  శూన్యబ్రహ్మ లైన మనకి కనపడుతోంది కానీ నిజానికి పరమ శూన్యము  అంతర్గతముగా నేను కానీ నేను గా ఉండి ఆలోచన, సంకల్ప, స్పందన, ఆనంద, భయ, ఆశలు అనే భావాలకి వీటి మాయలకి గురికావటంతో ఈ కారణ శూన్యబ్రహ్మ కూడా స్పందించడం జరుగుతోంది. దీనికంతటికీ కారణం పరమ శూన్యము యొక్క అంతర్గత ఆలోచనలే కదా. ఆలోచనలే జ్ఞానము అన్నమాట. ఆలోచన లేకపోవడం మాయా రహితం అన్నమాట. ఆలోచనలు ఉండటం మాయా సహితం అన్నమాట. ఈ ఆలోచన మాయే. మన మాట మన చేతలు అన్నమాట. అంటే ఆలోచన లేనివాడే మోక్షగామి. ఇది సాధ్యమేనా కోమాలో ఉన్నాకూడా మనిషి ఆలోచనలు వదిలి పెట్టావు కదా. ఆలోచన లేకపోవడం అంటే మనము శ్వాస తీసుకోకపోవటం లేదా  ప్రాణము లేనట్లే.ప్రాణము  లేదంటే మనము లేనట్లే కదా. ప్రాణము లేనట్లే కదా. ప్రాణం లేదంటే మరణం కలిగినట్లే. ఇదియే స్వప్న మోక్షము అన్నమాట. కానీ ఇలా ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఆలోచన రహితము లేని వాడు ఇంతవరకు లేడు. రాయిలో కూడా, చెట్టులో కూడా ప్రాణశక్తి ఉండుటవలన ఆలోచన శక్తి ఉంటుంది. విశ్వం అంతా కూడా పరమ శూన్యము యొక్క ఆలోచన మయం అయినప్పుడు ఆలోచన లేని స్థితి ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. కాకపోతే ప్రాణాయామం ద్వారా తాత్కాలికముగా కొన్ని లిప్త కాలాలపాటు ఆలోచనలు లేకుండా ఆప్కో వచ్చును. కానీ తాను ఏమీ ఆలోచనలు చేయడం లేదని ఆలోచన చేయడం కూడా ఆలోచనే కదా. నేను ఏమీ ఆలోచన చేయకూడదని అనుకోవడం ఒక ఆలోచనే కదా. కోరికలు లేని వాడు కోరికలు లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం ఎలా ఉంటుందో అలా ఈ కారణ శూన్యబ్రహ్మ స్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. బలహీనత లేని బలవంతుడిని… చిన్న ఆలోచన లేని ఆలోచన రహితుడు…. కారణములేని కారణ శరీరము ….ఇంతవరకు ఆ భగవంతుడైన పరమశూన్యము కల కనలేదు. ఎందుకంటే ఈ స్థితి లేకుండా అది లేదు. ఆలోచన లేని స్థితి ఉంటే విశ్వము ఎందుకు ఉంటుంది. మనం ఎందుకు ఉంటాము. మన దైవాలు అలాగే ఆత్మలు అలాగే పరమాత్మలు ఎందుకు ఉంటాయి.

కాకపోతే తను కనే స్వప్నాల మీద తాత్కాలికముగా వైరాగ్యాలు కలిగి నప్పుడు తాత్కాలిక ప్రళయాలు ద్వారా స్వప్నం మార్చుకుని జీవ నాటకము కంటోంది. అదే సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగాలు అన్నమాట. ఆది మనకి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అన్నమాట. ఎప్పటికి పరమశూన్యము  యొక్క స్వప్న ఆలోచన నశించదు. పోదు.సత్యముగా కనిపించే అసత్యమైన పరమశూన్యము  యొక్క స్వప్నమైన విశ్వ జీవ నాటకం యందు కారణ శూన్యబ్రహ్మగా, దైవ బ్రహ్మగా, జీవ బ్రహ్మగా నాటకీయ రాజకీయ పరిణామాలతో పరిస్థితులతో వివిధ రకాల స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలతో స్వప్నంలో ఉండక తప్పదు. అప్పటిదాకా మనమంతా దైవాలంతా పరమాత్మలంతా కూడా విశ్వము అంతా కూడా మరణము లేని మనముగానే స్వప్న శరీరాలతో స్వప్న జనన మరణాల తో స్వప్న పాత్రలు వేస్తూ స్వప్న జీవ నాటకం వేస్తూనే ఉంటాము. వేస్తూనే ఉండాలి.అది కూడా అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా ఎన్నటికీ ఆగిపోని నాటకం లాగా ఎక్కడ ఆగిపోని పాత్ర లాగా బ్రహ్మాండ చక్రములో తిరుగుతూనే ఉండాలి.చూస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి.పోతూనే ఉండాలి. మరి ఇక్కడ చిన్న సందేహం రావచ్చును. అదేమిటంటే మరి సాధన ఎందుకు అని? దీనికి సమాధానముగా స్వప్న జీవ నాటకములో మీరు పాత్రలు వేస్తారా… వేయిస్తారా… చూస్తారా… అని తెలుసుకోవడానికి ఈ స్వప్న సాధన కావాల్చి వస్తుంది. అంటే హీరో అవుతారా… డైరెక్టర్ అవుతారా…. లేదా ప్రేక్షకుడు అవుతారా అని మీరు తేల్చుకోవాలి. దీనికి అర్హతయే స్వప్న యోగసాధన అన్నమాట. పాత్రలు అంటే కర్మ జన్మ వేసే కష్టసుఖాల తో కూడిన జీవిత పాత్రలు అన్నమాట. పాత్రలు వేయించడం అంటే నాటకమును పరమశూన్యమునకు కావాల్సిన విధంగా ఉండేటట్లు చేయడం అన్నమాట. అనగా దైవ పాత్రలో అన్నమాట. ఇక ప్రేక్షకుడు అంటే పరమాత్మ పాత్రలు అన్నమాట. వీరంతా జీవ నాటకమును చూసి ఆనందించటం లేదా బాధ పడటం లేదా స్పందించడం చేస్తూ ఉంటారు. అనగా పరమహంసలు, అవధూతలు, పరమ యోగులు, పరమ గురువులు, పరమాత్మలు అన్నమాట. అంటే జీవ పాత్రలు అంటే మహా జీవమాయలలో వుండేవారని దైవ పాత్రలు అంటే సిద్ధులు శక్తులు సుఖభోగాల మాయలో ఉండేవారని అదే పరమాత్మ పాత్రలు అంటే ఇష్ట కోరిక మాయలో ఉండే వారని అర్థం. ఇప్పుడు పాత్రలు వేస్తారా…. పాత్రలు ఎలా ఉండాలో చెబుతారా…. పాత్రలు చూస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పాత్రలు వేసేవారు అంటే మాయలో  ఉండే మన లాంటివారు అన్నమాట. అంటే వీరికి సాధన అంటే ఏమిటో కూడా తెలియని స్థితి. పాత్రలు ఎలా ఉండాలో చెప్పే వారు అంటే యోగ సాధనలో పరిసమాప్తి కాకుండా 50 శాతంతో అర్ధాంతరంగా ఆగిపోయిన దైవజనులు అన్నమాట. అదే పాత్రను చూస్తున్న వారు అంటే నాటకము చూసేవారే అన్నమాట. అంటే సాధనలో పరిసమాప్తి లో 99.99 శాతం పూర్తిచేసుకునే యోగులు అన్నమాట. ఇప్పుడు పరమశూన్యము యొక్క స్వప్నములో జీవ నాటకం యందు ఈ మూడు స్థితుల్లో ఏ స్థితి పాత్రలో మీరు ఉండాలో మీకు మీరే సాధనచేసి సత్ఫలితాలను సిద్ధి పొందిన దానిని బట్టి మీ పాత్ర ఉంటుంది. కేవలం పరమశూన్యములో జీవన నాటకం అనే స్వప్నం మాత్రమే ఉంటుంది. అందులో ఎవరి పాత్రలు ఎవరు వేస్తారు ఎలా వేస్తారు ఎందుకు వేస్తారు అనే విషయాలు దీనికి పట్టవు. అంటే పరమశూన్యము అనేది సినిమా నిర్మాత లాంటిది. వారికి తనకి ఉన్న ఆలోచన తగ్గట్లుగా ఏదైనా కథ దొరికితే నిర్మాతగా ఉండి సినిమా తీస్తాడు. కానీ డైరెక్టర్ చెప్పినట్లుగా తనకి ఉన్న ఆలోచనా విధానం తగ్గట్లుగా సినిమా తీసుకుంటాడు. కానీ పాత్రలు వేసే వారు.. వారు ఎలాంటి వారు…. వారు ఈ సినిమాకి సరిపోతారా లేదా అనేది సినిమా డైరెక్టర్ మీద ఎలా అయితే భారము సినిమా నిర్మాత వేస్తాడో అలా ఈ పరమశూన్యము  కూడా తన స్వప్న జీవన నాటకం యొక్క భారమంతా ఈ నాటకధారి అయిన అనగా డైరెక్టర్ అయిన మన కారణ శరీరధారి అయిన శూన్యబ్రహ్మ మీద వేస్తుంది అన్నమాట. సినిమా భాషలో చెప్పాలి అంటే పరమ శూన్య ము అనేది ఆకాశ శరీరధారి నిర్మాత అయితే సంకల్ప శరీరధారి ఈ నాటక కథారచయిత మరియు  ప్రేక్షకుడు కూడా అయితే కారణశరీరధారి  ఈ నాటకం డైరెక్టర్ అయితే సూక్ష్మ శరీరధారి  అలాగే స్థూల శరీరధారి  ఈ నాటకం పాత్రధారులు అనగా హీరో విలన్ పాత్రలు అన్నమాట. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. ఈ నాటకానికి డైరెక్టర్ లేదా హీరో లేదా విలన్ లేదా ఏ పాత్ర వేయాలో ఆలోచించుకోండి.
 
ప్రేక్షకుడు అంటే మీ సాధన హృదయ చక్రము దాకా రావాలి. అదే డైరెక్షన్ అంటే సహస్రార చక్రము దాకా రావాలి.అదే దైవ పాత్రలు అంటే ఆజ్ఞాచక్రము దాకా అదే జీవ పాత్రలు అంటే విశుద్ధి నుండి మూలాధార చక్రము దాకా మీ సాధన స్థాయిలు వుండాలి అన్నమాట. ఏమీ లేదు.పరమశూన్యము యొక్క స్వప్న జీవన నాటకం యందు మీ పాత్ర ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీ స్వప్న సాధన కూడా ఉన్నత స్థితిలో ఉండాలి.హృదయ చక్రం నుండి మూలాధార చక్రము దాకా ఈ సాధన స్థాయిలని బట్టి ఈ నాటక ముందు మీ సాధన పాత్రలు ఉంటాయి అని గ్రహించండి. అసలు ఈ స్వప్న నాటకమే వద్దు అనుకుంటే మీ సాధన స్థాయి బ్రహ్మరంధ్రము వరకు తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చితాగ్ని యందు మీకున్న 36 మోక్ష కపాలాలు అన్నింటికి కపాలమోక్షం ఇవ్వండి. అంతే ఈ స్వప్న జీవన నాటకమే ఉండదు. అందుకు మీరు సహన శక్తితో మౌన స్థితి లో 96 నిమిషాలపాటు అనగా 30, 67,2000 కోట్ల సంవత్సరాల పాటు ఎలాంటి ఆలోచన లేని మనోనిశ్చల స్థితిలో ఉండాలి.కాకపోతే మనిషి జన్మలో 18 సెకన్స్ దైవ జన్మలో 24 నిమిషాలు అదే పరమాత్మ జన్మ లో 48 నిమిషాల పాటు మాత్రమే అమితమైన ఆలోచనను తగ్గించుకుని 36 ఆలోచనలు దాకా రాగలుగుతున్నారు. ఈ 36 ఆలోచనలు కాస్త ఏక ఆలోచనలోకి రావాలి. 

ఈ ఏక ఆలోచన కూడా రహితం అయితే కానీ మనము అనుకునే ఏక మూలకాల మోక్షప్రాప్తి కలగదు. అప్పటిదాకా పరమశూన్యము యొక్క స్వప్న జీవ నాటకము స్వప్నంగానే అ విశ్రాంతిగా అవిచ్చిన్నముగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్వప్నమును ఆపేవాడు అనేవాడు ఉంటే కదా. ఎందుకంటే ఎవరైతే ఆపాలని అనుకుంటున్నాడో వాడి కలయే ఈ నాటకమని వారి సాధన సమయంలో తెలియటంతో ఒక లిప్త కాలం పాటు దీనికి స్పందించడంతో అంతమయ్యే ఈ స్వప్నము కాస్త తిరిగి ప్రారంభం అవుతోంది. అంటే అంతము కావాల్సిన చోట రూపాంతరం చెందుతుంది అన్నమాట. రూపము పోవాల్సిన చోట రూపాంతరం చెందుతుంది అన్నమాట. విశ్వం అంతము కావాల్సిన వాడు కాస్త విశ్వ ఆరంభకుడు అవుతున్నాడు అన్నమాట. స్వప్న జీవ నాటకములో అంతము చేయటానికి వెళ్ళిన వాడు కాస్త ఈ నాటకమును పునః సృష్టిస్తున్నాడు. ఎందుకంటే వీరికి ఉన్నజ్ఞానము కాస్త అపస్మారక స్థితికి అనగా తెలిసిన జ్ఞానం మరచి పోవడం వలన పరబ్రహ్మము కాస్త ఆకార దైవ జీవ బ్రహ్మముగా మారి ఈ స్వప్న నాటకమును కొనసాగిస్తున్నాడు. ఇలా యుగానికి ఒక్కడు ఈ పరిపూర్ణ సాధనను స్థితికి వెళ్లి జ్ఞాన శక్తి వలన అపస్మారక స్థితి పొంది మాయలోపడి స్వప్నమును కొనసాగిస్తున్నాడు. ఇంకా కొనసాగిస్తున్నారు. రాబోవు కాలంలో కూడా కొనసాగిస్తారు. అందుకే ఇంతవరకు ఎవరు కూడా మూల కపాలమోక్షం స్థితి పొందలేదు. అనగా ఆకాశ శరీర మోక్ష స్థితిని పొందలేదు. 

అందుకే ఆదియోగి అయిన సదాశివమూర్తి కూడా ఈ మోక్షం స్థితిని పొందలేక ఆకాశ తత్వం అయిన చిదంబర క్షేత్రము నందు నటరాజు స్వరూపముతో ఆనంద విలయ తాండవం చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు తనకి తోడు కావాలని ఆనంద తాండవం చేస్తూ స్వప్న లోకమును సృష్టిస్తున్నాడు. తన తోడు వలన పడే బాధలు భరించలేక వైరాగ్య భావాలు పెంచుకుని విలయ తాండవం చేస్తూ అప్పటిదాకా తను కల కనే స్వప్న లోకమును తాత్కాలికంగా నాశనం చేస్తున్నాడు. అంటే ఒకపక్క మేధా దక్షిణామూర్తి గానూ మరో ప్రక్క చిదంబరమూర్తి గాను ఈ స్వప్న జీవ నాటకము సృష్టి స్థితి లయము చేస్తున్నాడు. మేధా దక్షిణామూర్తిగా తన మౌన ఆలోచనలతో ఈ జీవ నాటకము సృష్టిస్తూ సదాశివమూర్తిగా ఈ స్వప్న జీవ నాటకము కొనసాగిస్తూ చిదంబర మూర్తిగా లయము చేస్తూ అనగా 

ఒక నది ఒడ్డున ఇసుక దిబ్బల తో ఆడుకునే పిల్లవాడి లాగా ఆదియోగి ప్రవర్తిస్తున్నాడు. పిల్లవాడు కూడా ఎందుకు మట్టితో ఇల్లు కడతాడో తెలియదు. ఎందుకు వాటితో ఆడుకున్నాడో తెలియదు. ఎందుకు వాటిని నాశనం చేస్తారో తెలియదు. మళ్లీ కొద్దిసేపటికి ఎందుకు మళ్లీ కొత్తగా మట్టితో ఇల్లు కడతాడో తెలియదు.అంతా కూడా సచ్చిదానంద స్థితిలోనే చేస్తాడు. కట్టిన ఆడిన కూల్చిన వాడికి ఆనంద స్థితిలోనే ఉంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో వాడికి ఎలా అయితే తెలియదో అలా ఈ శూన్య బ్రహ్మ కి కూడా తెలియదు. ఎందుకు ఈ సృష్టి స్థితి లయలు చేస్తాడో తెలియదు. మీకు తెలుసు కదా! పరమ శూన్యము యొక్క ఆలోచన, సంకల్పము, స్పందన ఈ శూన్య బ్రహ్మ చేస్తున్నాడని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. అంటే కేవలం శూన్య  బ్రహ్మ జీవ నాటకము ఆపాలని ప్రయత్నిస్తున్నాడు కానీ తనలో ఉన్న జీవ నాటకము ఆడే ఆలోచనను ఆపలేక పోతున్నాడు. ఎందుకంటే ఈ శూన్య బ్రహ్మకు కూడా తనలో కారణ శూన్య బ్రహ్మధారి ఉంటాడు కదా. వాడు కూడా పరమ శూన్యము యొక్క ఆధీనపరుడే కదా. దానితో ఆలోచనా రహిత స్థితి మోక్షసాధకుడైనా శూన్య బ్రహ్మ పొందలేకపోతున్నాడు. ఎందుకంటే వీడు కూడా స్వప్న పాత్రధారి యే కదా. స్వప్నము నుండి బయటికి రాగలిగితే ఆలోచన లేని స్థితి పొందగలుగుతాడు. ఇది ఎలా ఉంటుందంటే ఆకాశలింగంలాగా ఉంటుంది. అనగా ఆకాశమే లింగమని తెలుసుకోవాలి. కానీ శూన్య బ్రహ్మ కాస్త ఆకాశములో లింగమును చూడటం చేస్తున్నాడు అంటే తను ఆలోచనా రహిత స్థితి పొందకుండా ఆలోచనా రహిత స్థితి పొందాలని జ్ఞానమును ఇతరులకు చెప్పాలని ఆది గురువుగా మేధా దక్షిణామూర్తిగా ఆగి పోతున్నాడు. ఎప్పుడైతే ఈ ఆదియోగి ఇలా ఆగి పోయినాడో ఇక్కడ దాక వచ్చిన ప్రతి సాధకుడు కూడా ఇదే స్థితిని పొంది తను తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకు చెప్పాలని ఇతరులకు తెలియ చేయాలని అనుకోవడం చేస్తున్నాడు. అంతెందుకు నేను కాస్త తెలుసుకున్న జ్ఞానమును పుస్తకరూపములో పెట్టాలని స్పందిస్తే.... మన జిజ్ఞాసి ఈ స్థితిని పొంది తెలుసుకున్న నిజ జ్ఞానమును ఇతరుల చెప్పాలని స్పందించడం జరిగింది. దానితో ఈసాధన కాలము కొంతకాలము ఆగిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే ఇతరులకి చెపుతాడో దానితో తనకి తెలియకుండానే 18 రకాల జ్ఞాన అహంకారమును అనగా నేను మాత్రమే ఈ జ్ఞానమును పొంది ఉన్నాను అనే అహంకారం మాయలో పడటం తను చేసిన తప్పు తెలుసుకునేసరికి విలయతాండవం తో నటరాజ స్వరూపం చిందులు వేయడం ద్వారా అపస్మారక స్థితి పొందటం అనగా ఆ జ్ఞానం మర్చిపోవటం తిరిగి యోగసాధన చేసి అపస్మారక స్థితి వలన పోయిన జ్ఞానమును జ్ఞాన తపస్సు ద్వారా స్మరణ చేసుకునేందుకు సదాశివమూర్తి గా హిమాలయాలలోని కైలాస పర్వతము నందు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న తంతు అన్నమాట. ఇదే అసలు సిసలైన స్వప్న జీవ నాటకము అన్నమాట. అంటే శూన్య బ్రహ్మ నిశ్చల స్థితిని పొందలేక పోవడం వల్లనే ఇదంతా జరుగుతోంది. అంతెందుకు మేము కూడా శూన్య బ్రహ్మ స్థాయికి వచ్చినాము. దక్షిణామూర్తి లాగానే మౌనఃస్థితిలో ఉండకుండా ఆలోచన రహిత స్థితి పొందాలని తెలుసుకుని అసలు ఈ జ్ఞానము పదిమందికి చెప్పాలని సాధన అనుభవాలతో కూడిన ఈ కపాలమోక్షం గ్రంథం రాయటంలో ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. నేను లేకపోతే మీరు ఎక్కడి నుండి వస్తారు. నేను ఎప్పుడైతే నేను పొందిన విజ్ఞానమును పదిమందికి పంచాలని అనుకోవటం ఏమిటి? దానికోసం పదిమందిగా నాకు నేనే విడిపోయి నా గ్రంథమే నేను చదువుకోవడం ఏమిటి? ఆలోచించండి. ఉన్నది నాలో ఉన్నది మీరే కదా. మీలో ఉన్నది నేనే కదా. అంటే సంపూర్ణ శూన్య స్థితిని మేము ఆదియోగి లాగ పొంద లేనట్లే కదా. ఒకవేళ నేను ఈ గ్రంథం రాయకపోయిన నాకున్న ఈ ఆలోచన వలన ఈ విశ్వ జ్ఞానములో జ్ఞాన ఆలోచన చేరుతుంది. ఈ గ్రంథమును చదివిన లేదా చదవకపోయినా లేదా ఈ గ్రంథమును మేము రచించిన లేదా రచయిత కాకపోయినా మేము పొందిన ఆలోచనా రహిత స్థితి పొందాలనే జ్ఞానము మా కపాలములో ఉండి పోతుంది కదా. ఎందుకంటే మౌన స్థితిలో ఉన్న దక్షిణామూర్తి మౌనంగా ఉన్నప్పటికీ సనకాదులతో ఏమీ మాట్లాడక పోయినా ఏమీ చెప్పకపోయినా వారు ఎలా జ్ఞాన సిద్ధి పొందినారో ఒకసారి ఆలోచించండి. అంటే మౌనముగా ఉన్నా కూడా భాష ఉంటుంది. అదియే మౌన భాష అన్నమాట. అనగా టెలిపతి అన్నమాట. దీనివలన మేము గ్రంథం రాసిన రాయకపోయినచెప్పిన చెప్పకపోయినా మాకు తెలిసిన జ్ఞానము ఎలాగో అందరికీ తెలుస్తుంది. ఎవరూ తెలియకుండా ఆపలేరు. ఆపితే ఆలోచనా రహిత స్థితి పొందినట్లే కదా. ఇతరులకి చెప్పాలని అనుకోవడమే ఏకత్వము నుండి భిన్నత్వంలో కి రావటం. అలాగే తను పొందిన జ్ఞానము కలిగి ఉండటం వలన భిన్నత్వం నుండి ఏకత్వం లోకి రావటం అన్నమాట. కానీ తనలో ఆలోచనలు ఉన్నా లేదా తన ఆలోచన ఇతరులకు చెప్పిన పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే నేను అలాగే నేను కానీ నేను అలానే ఉంటాయి కదా. ఎందుకంటే నేనే నువ్వు నువ్వే నేను కదా. నేను స్పందించిన లేదా నువ్వు ప్రతిస్పందించిన ఒకటే కదా. నేను స్పందించకపోయినా నువ్వు స్పందిస్తావు. నువ్వు స్పందించకపోయినా నేను స్పందిస్తున్నాను. ఇలా నేను -నువ్వు స్పందించడానికి కారణం నాకున్న ఆలోచన భావాలే. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి పొందుతానో అనగా సర్వం ఏమీ లేదు. సర్వం శూన్యం. ఆత్మ లేదు. బ్రహ్మము లేదు.దేవుడు లేడు. భగవంతుడు లేడు. దేవత లేదు అని అనుకుంటాడో అదియే మోక్షప్రాప్తి. కానీ ఇలాంటి ఆలోచన అనేది కూడా ఆలోచనే కదా. మోక్షము పొందాలనే కోరిక కూడా కోరికే కదా. అనగా కోరికలు లేని సమాజం చూడాలనే కోరికలాంటి దేనని గ్రహించండి. మోక్షము పొందాలనే కోరిక లేకపోతే సాధన చెయ్యలేము. సాధన చెయ్యలేకపోతే మోక్షము రాదు. ముందు గొయ్య వెనుక నుయ్యి ఇదే అన్నమాట. కోరిక ఉంటే ఒక తంటా. కోరిక లేకపోతే మరో తంటా. ఆలోచన లేకపోతే సాధన లేదు. సాధన లేకపోతే ఆలోచన లేదు. దీనమ్మ జీవితం. మనిషికి నీడలాగా సూర్యుడికి సూర్యకాంతి లాగా  పువ్వులకి సువాసన లాగా సాధకుడికి ఆలోచన ఉంటుంది. దీనినే మాయ అనండి. దీనినే మర్మం అనండి. పరమ శూన్యము అనండి.  ఆత్మ అనండి.  భగవంతుడు అనండి. బ్రహ్మం అనండి.  దేవుడు అనండి. కర్మ అనండి.జన్మ అనండి. జ్ఞానం అనండి. యోగం అనండి. స్వప్నము అనండి. అదే సాధన అనండి లేదా వివిధ నామరూప దైవ నామాలతో పిలుచుకుంటూ సాధన ఆగిపోయే ఆలోచనకి ఏ పేరు పెట్టుకుంటే ఏమి లాభం. ఆలోచనా రహిత స్థితి పొందితే అదియే మాయా రహిత స్థితి. ఇది పొందటం ఎన్నటికీ సాధ్యం కాదు. సూర్యుడి నుండి సూర్యకాంతి వేరు చేయగలమా? మనిషి నుండి నీడవేరు చేయగలమా? ఇక్కడ చిన్న సందేహం వస్తుంది. రాత్రిపూట సూర్యకాంతి ఉండదు కదా. అలాగే మనిషి నీడలో ఉంటే నీడ ఉండదు కదా.దీనికి సమాధానము ఎలాంటి ఆలోచన చేయకూడదు అని అనుకుని ఆలోచన చేయటం లాంటిదే ఇవి అన్నీ కూడా అన్నమాట. రాత్రిపూట చంద్రకాంతి ఉండనే ఉంటుంది కదా. పళ్ళు రాలకొట్టుకోవటానికి వెయ్యి ఆలోచనలు ఉంటే ఏమిటి? ఒక ఆలోచన ఉంటే ఏమిటి? ఒక రాయితో అయినా పళ్ళు పగలగొట్టు కోవచ్చు కదా. 

అసలు ఆలోచన రహిత స్థితిని పొందిన వాడు ఆ భగవంతుడు అయిన పరమ శూన్యమే సృష్టించలేదు. ఎందుకంటే తనే ఏక ఆలోచనలో ఉంది కదా. అసలు సృష్టించటం ఎందుకు? దానిని నాశనం చేయాలని అనుకోవడం ఎందుకు? అసలు దానికి తోడు కావాలని ఏక ఆలోచన చేయడమే ఆది ఆత్మ చేసిన అతి పెద్ద తప్పు. ఈ ఆలోచన స్థితిని దాటకుండా ఈ ఆలోచన వలన వచ్చిన ఈ విశ్వమును ఎన్నిసార్లు నాశనము చేసిననూ ఏమి లాభం. ఆలోచించేవాడు ఆలోచించకుండా ఉంటే ఏమీ లేని స్థితిని ఎవరూ లేని స్థితిని పొందుతాడు కదా. అదియే పరమ శూన్యము స్థితి కదా. ఇది ఎలా ఉంటుందంటే ఏమి లేని గదిలో ఆ గది బయట వ్యక్తి ఉండి గదిలో ఏమీ లేదు సర్వం ఖాళీ సర్వం శూన్యము అని తెలుసుకుని ఈ గది దగ్గరికి వచ్చే వారికి ఈ విషయం చెప్పాలని ఎదురు చూడటం ఎంత అవివేకం కదా. ఉన్నది వీడు ఒక్కడే కదా. వేరే వాళ్ళు లేరు కదా. వెంటనే ఆ ఖాళీ గదిలోనికి వెళ్లిపోతే ఏమీ ఉండేది కాదు కదా.చూసేవాడు చూడబడేది ఏమీ ఉండేది కాదు కదా. గది బయట కూర్చుని తను పొందిన జ్ఞానము అనగా గది లోపల ఏమీ లేదు సర్వం శూన్యము అని తెలుసుకున్నవాడు ఎవరో వస్తారని వారికిది చెప్పాలనుకోవడం ఏమిటో ఎప్పుడైతే వాడు ఇలా అనుకున్నాడో వెంటనే దానికి తగ్గట్లుగా ప్రకృతిలో మార్పులు వచ్చి తనలాంటి వారు ఉన్నట్లుగా సాధన చేస్తున్నట్లుగా వీడికి అనుభవాలు అనుభూతులు కలగడంతో తానే ఇలా మారిపోతున్నానే జ్ఞానమును మర్చిపోవటంతో అపస్మారక స్థితిని పొందటంతో గది బయట ఉండే స్థితి నుండి గదికి దూరముగా గది ఎక్కడ ఉందో సంగతి మర్చిపోయి గది కోసం వెతికే సాధకుడు లాగా మారిపోతున్నాడు. అంటే అంతమయ్యే చోట ఆరంభం అవుతున్నాడు. అంతము తీసుకోవాల్సిన చోట రూపమును అంతము చేసుకోవలసిన చోట రూపాంతరము చెందుతున్నాడు. స్వప్నము అంతము కావాల్సిన చోట తిరిగి తన సృష్టితో స్వప్న శరీరముతో ఈ విశ్వ సృష్టి జరుగుతుందని ఎలా జరుగుతోందో ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. అన్నం తింటే ఆయాసం తినకపోతే నీరసం. ఆలోచన ఉంటే సాధన లేదు.సాధన లేకపోతే ఆలోచన ఉంటుంది. ఈ రెండిటిని విడదీయలేము. ఆలోచనా రహిత స్థితి పొందలేము. మనం ఎప్పటికీ శూన్యము కాలేము.శూన్య బ్రహ్మ గానే మిగిలిపోవడం జరుగుతుంది. శూన్యము అంటే మన ఆలోచన శూన్యము అవ్వాలి.అప్పుడే పరమశూన్యమైన మనము శూన్యముని పొందుతాము. స్వప్నము పోతుంది. సాధన పూర్తి అవుతుంది. ఇది సాధ్యమేనా? సాధ్యము కాదు. ఎందుకంటే మనకి మనమే ఈ జీవ నాటకమనే స్వప్నము కంటున్నాము. ఈ స్వప్న ఆలోచన చేస్తున్నాము. అప్పుడప్పుడు ఈ ఆలోచన రహిత స్థితి పొందాలని ఆలోచనలు చేస్తూ ఈ స్థితి పొందలేక ఎలా పొందాలో అర్థం కాక నిశ్చల స్థితిని పొందలేక కైవల్య ముక్తి ద్వారా తాత్కాలిక శాంతిని పొందుతూ భౌతిక మరణాలు పొందుతున్నాము లేదా అశాశ్వతం మరణాలు పొందుతున్నాము. ఇలా పది లక్షల సంవత్సరాల తర్వాత ఈ స్వప్న ఆలోచనకి పునఃసృష్టి చేస్తూ నా నా చంక నాకుతున్నాము. మనకి మనమే అవస్థలు పడుతున్నాము. ఈ విషయం తెలియకుండా జ్ఞాన మాయ అనగా ఆలోచన మాయలో నిజంలాంటి కలలాగా కలలాంటి నిజము లాగా అసత్యము లాంటి సత్యములాగా సత్యము లాంటి అసత్యము లాగా ఉన్న ఈ జీవ నాటకము నందు స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలు ఒకపక్క వేస్తూ మరోపక్క ఈ స్వప్నములో నాశనము చేసే వైరాగ్య పాత్రలు వేస్తూ స్వప్న సాధకుడి పాత్ర మనకి మనమే వేసుకుంటున్నామని చేస్తున్నామని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు కదా.

ఈ గ్రంథములో ఆది అధ్యాయముగా నా ఏడుపే నా తొలి సాధన గురువు అనే అధ్యాయంలో పరమేశ్వరుడు ఎందుకు ఈ జీవాలను సృష్టిస్తున్నాడు ఎందుకు నాశనం చేస్తున్నాడు అని పరమ శివ లింగ మూర్తి మీద అభండాలు నిందలు తిట్లు తిట్టడం జరిగిందని మీకు తెలుసు కదా. ఇప్పుడు నేనే కదా ఆ పరమేశ్వరుడిని. నేనే కదా ఆ పరమ లింగమును. నేనే కదా ఆ శివ లింగ మూర్తి నేనే కదా. ఈ సృష్టిలోని జననమరణాలు అనేవి నాకున్న ఏకైక ఆలోచన స్థితి గతులే కదా. అంటే నాకు నేనే తిట్టుకున్నాను కదా. మరి ఆదిలోనే ఆది ఆత్మ గా ఉండి నాకు తోడు కావాలని తొలి ఆలోచన చేయడం ఎందుకు? ఈ ఆలోచన స్థితిలో ఆనంద స్థితిని సంపూర్ణముగా అనుభవించకుండా ఉండటం ఎందుకు? బాధపడటం ఎందుకు? వైరాగ్యం చెందటం ఎందుకు? విలయతాండవము చెయ్యడము ఎందుకు? నాకున్న ఆలోచన వలనే ఈ జగత్తు ఎలా అయితే సృష్టించబడిందో అదే ఆలోచన వలన ఈ జగత్తు నాశనం చెయ్యటం ఎందుకు? నాకు నేనే జననాల జీవ పాత్రలు వేయడం ఎందుకు? నాకు నేనే మరణాలుగా జీవ పాత్రలు నాశనం చేసుకోవడం ఎందుకు అవి నాశనం అవుతున్నాయని బాధపడటం ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా మనకున్న ఏకైక ఆలోచనా స్థితి వల్లనే జరిగినది కదా. ఆలోచన చేయకుండా ఉండి ఉంటే ఇదేమీ ఉండేది కాదు కదా. మీరు ఉండే వాళ్లు కాదు కదా. నేను ఉండే వాడిని కాదు కదా. విశ్వమే ఉండేది కాదు కదా. ఈ స్వప్న జీవ నాటకం ఇది ఉండేది కాదు కదా.అంటే అంతా శూన్యంగానే ఉండేది గదా. ఇదియే మోక్ష స్థితి చిట్టి కథ. నీ మనస్సు కదిలితే శివం కదలకపోతే శవం.శవమును కాస్త శివము గాను జీవము గాను ఎందుకు మారటం. నాకున్న ఆలోచన వలనే కదా. విచిత్రమేమిటంటే అందరికీ ఇదే ఆలోచన ఉంది. కాకపోతే మనకున్న ఆలోచన  మాయ వలన అది వేరు వేరు స్థితుల్లో గా వేరు వేరుగా ఉన్నట్లుగా కనపడుతోంది. అన్నముతో బిర్యాని చెయ్యవచ్చును. అదే అన్నముతో పులిహోర లేదా దద్ధోజనము లేదా పరమాన్నము చేసుకోవచ్చును. వీటికి అన్నిటికీ మూల పదార్థము అన్నమే కదా. 

 
అలాగే ఈ విశ్వం అనే బ్రహ్మపదార్ధము ఏర్పడటానికి మూలము ఏక ఆలోచన. అదియే తనలాంటి తోడు కావాలని అనుకోవడమే ఈ స్వప్నం విషయం ఏర్పడటానికి కారణమైంది. ఆ ఆలోచన అనేది మీరే కావచ్చును. నాదే కావచ్చును. ఎందుకంటే నిజ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో ప్రశ్నించాలని ఆలోచన మీదైతే అది ఏమిటో తెలుసుకోవాలని ఆలోచన నాది కావచ్చును. అందువలన స్వప్న ప్రపంచంలో నేను స్వప్న మోక్ష స్థితి పొందటం జరిగింది. కానీ నేను కాని నేనుగా మీరు ఈ జ్ఞానప్రాప్తి తెలుసుకోవాలని ఆలోచించే స్థితిలో ఈ గ్రంథమును చదువుతున్నారు. ఏమీ లేదని తెలుసుకుని మౌనః స్థితిలో ఉండకుండా ఏమీ లేదని మిగిలిన స్వప్న సాధువులకు చెప్పాలని స్వప్న జ్ఞాన ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా ఈ స్వప్న సాధనను మనకున్న ఆది ఆలోచన ఏనాడైతే ఆరంభమయినదో ఆనాడే ఈ ఆలోచన అంతము చెయ్యాలని ఆరంభమై స్వప్న శరీరముతో స్వప్న సాధకుడిగా స్వప్న సాధన చేస్తూ స్వప్న ఆలోచనా రహిత స్థితిని పొందలేక స్వప్న విశ్వములో స్వప్న జీవ నాటకం నందు స్వప్న శరీరముతో స్వప్న పాత్రధారిగా మిగిలి పోతున్నామనే స్వప్న ఆలోచనలతో స్వప్నంగా మిగిలిపోతున్నారు. అది కూడా అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా అంతులేని కథ లాగా స్వప్న ఆలోచనతో మీరు నా స్వప్నములో నేను మీ స్వప్నములో నేను లేదా నేను కాని నేను స్వప్నంగా మిగిలిపోతున్నాము. కారణము లేని నేనుగా మీరుగా ఉండి పోతున్నాము. చిత్రమేమిటంటే ముక్తి అంటే స్వప్న లోకమునుండి వేరేవారి స్వప్న లోకములోనికి వెళ్ళటం అన్నమాట. అనగా భూలోకము నుండి ఊర్ధ్వ సమస్త లోకాలలో ఈసాధన కల బట్టి ఆయా స్వప్న లోకాలలో ఏదో ఒక లోకానికి వెళ్లి ఈ స్వప్నము యొక్క ఆలోచన శక్తి వరకు అక్కడ ఉండి వెనుతిరిగి యదార్థ స్వప్నలోకం లోనికి రావడం అన్నమాట. అదే మోక్షం అంటే మీ స్వప్న లోకంలో నువ్వు అలాగే ఇతరుల స్వప్న లోకంలో యందు ఉండక ఈ విశ్వంలో ఉన్న మన జీవన నాటకము నుండి జీవన ముక్తి పొంది సాక్షి భూతంగా ఆకార స్థితిలో బ్రహ్మ తదాకార స్థితిలో నిశ్చల స్థితిలో ఉండటం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే జీవ నాటకము చూసే ప్రేక్షక పాత్ర వేయడం అన్నమాట. నాటకంలో నవ్వొస్తే నవ్వడం బాధలు వస్తే బాధపడటం అనగా నాటకానికి కేవలం సాక్షీభూతంగా స్పందించడం 10 లక్షల సంవత్సరాల పాటు చేస్తాడు. అటు పై ఆలోచన- సంకల్పము –స్పందన- భయము -ఆశలలో ఒకదానికి గురి అయి స్వప్నాల లోకము లో ఏదో ఒక స్వప్న పాత్ర వేయడం చేస్తాడు. అదే భౌతిక మరణం అంటే ఈ స్వప్న లోకములో పాత పాత్ర నుండి తప్పుకుని కొత్త స్వప్నములో కొత్త స్వప్న పాత్ర వేయడం అన్నమాట. అనగా కర్మ జన్మ లతో కూడిన పునరపి మరణం పునరపి జననం…. పునరపి మరణం కూడిన పునః జన్మ పాత్రలు ఈ స్వప్నంలో వేసుకోవటం అన్నమాట. అంటే భౌతిక మరణాలు వలన ఈ స్వప్న చక్రము దాటి రాలేవు. అందువలన అందులోనే కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. అనగా భౌతిక మరణము సాధన వలన స్వప్నములో 120 సంవత్సరాల నుండి అయిదు వందల సంవత్సరాల పాటు ఉంటావు. అదే ముక్తి సాధన వలన వారి స్వప్నం లోకమునందు ఐదు వందల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల పాటు ఉంటావు. అశాశ్వతం మరణము వలన పదివేల సంవత్సరాల నుండి లక్షల సంవత్సరాల వరకు  వారి కారణ లోకమునందు వేరే వారి కారణ లోకమునందు ఉంటావు. అదే మోక్ష ప్రాప్తి సాధన వలన లక్షల సంవత్సరాల వరకు ఎవరి లోకాల యందు స్వప్న పాత్రల వేయకుండా వాటిని అన్నింటిని సాక్షి భూతంగా చిన్న పిల్లవాడి మనస్సుతో ఇది గమనించి చూస్తూ ఉంటావు. భౌతిక మరణం సాధన అనేది  వైరాగ్య భావాలు వలన కలిగితే ముక్తి సాధన వలన స్మశాన వైరాగ్య భావాలు కలిగితే మోక్ష సాధన వలన జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. భౌతిక మరణం సాధనలో స్వప్న దైవ దర్శనాలు స్వప్న దైవసాక్షాత్కారం మాయలు దాటితే అలాగే ముక్తి సాధన అనేది స్వప్న గురు దర్శనాలు స్వప్న గురు సాక్షాత్కార దర్శనాలు స్వప్న ఆత్మ సాక్షాత్కార దర్శనాలు మాయలు దాటితే మోక్ష సాధన అనే దాంట్లో ఇష్ట కోరిక మాయలు అలాగే ఆలోచన సంకల్పం స్పందన ఆనందము ఆశా భయమూ లాంటి మాయలు దాట కలిగితే ఆలోచనా రహిత స్థితి వస్తుంది.అనగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మీకు ఎలాంటి స్వప్న స్థితి సాధన కావాలో మీ కల కని అనగా దానినే సాధన చేస్తున్నట్లుగా దానిని పొందుతున్నట్లు గా స్వప్నములో స్వప్న సాధనతో స్వప్న శరీరముతో సాధకుడుగా స్వప్న కపాలమోక్షం పొందండి, స్వప్న విజయం పొంది స్వప్న జీవ నాటకము నుండి స్వప్న జీవన్ముక్తి పొందండి. మరి ఈ స్వప్నము ఆదిలో ఎవరు కన్నారో తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఎందుకు ఆలశ్యం. నాతోపాటు ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణము చేస్తూ ముందుకి ప్రయాణించండి.

శుభం భూయాత్

పరమహంస పవనానంద

**************************************************
 

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. edantha paramashunyam yokka swapnamani oka vithanamu udaharanatho ardhamayyela chepparu. kaarana shareeram ani vinna prathisaari ee pere enduku ani anukunedi ye kaaranam lekunda kaarana shareeram ani peru pettarani eppudu anipisthundedi adi endukani ippudu ardhamayyela chepparu,swapna naatakamu nundi bayatapadatame kaaranam ani, ika enduku avvatamledate oka gnana kapaalam,rendavadi chithagni yokka sahanashakti thattulekapovatamtho apasmaaraka sthithini pondatam kaneesam ee rendu kapalaalaina ekamouthayemonani atupai moola kapaalamoksham kaluguthundani, saadhana endukante swapna jeevanaatakamulo ye paatralu veyalani ledante 36 kapaalalaki km ivvalani..
    mukti ante swapnalokamu nundi verevaari swapna lokamuloniki vellatam

    moksham ante swapnalokallo undaka saakshibhuthanga chudatam, nischala sthithilo undatam ani

    రిప్లయితొలగించండి