అధ్యాయం 72

ఆట కదరా…
(మా తత్వాలు)

ఆడిన ఆట గదరా!
ఆడిన మారని ఆట గదరా..!
ఆది నాటకమును ఎవరు మార్చలేరురా!
ఆదిలో ఆడిన జీవ నాటకము ఆటగదరా! ఆటగదరా!
 
ఆదియోగిగా ఆడిన ఆట కదరా !
ఆదిదేవుడుగా ఆడిన ఆట కదరా !
ఆది జీవుడుగా ఆడుతున్న ఆట కదరా !
 
ఆయనే చేస్తూ ఆడిన ఆట గదరా !
ఆయనకి ఆయనే ఆడిన ఆట గదరా !
నీకు లాగా నాకు లాగా ఆడిన ఆట గదరా !
 
ఆయన అనుకున్న ఆలోచన ఆటగదరా !
ఆయనకే ఆయన సంకల్పించుకున్న ఆటగదరా!
ఆయనకే ఆయన స్పందించుకున్న ఆటగదరా !
 
ఆయన సృష్టించుకున్న ఆటగదరా !
ఆయన ఆడించుకున్న ఆటగదరా !
ఆయన నాశనం చేసుకునే ఆటగదరా !
 
ఆయనకే ఆయన మళ్ళీ చూసుకునే ఆటగదరా !
ఆయన ఆశించిన ఆట కదరా !
ఆయన ఆటకే ఆయన ఆనందపడే ఆట కదరా !
ఆయన ఆటకే ఆయన బాధపడే ఆట కదరా !
ఆయన ఆటకే ఆయన భయపడిన ఆటగదరా !
ఆయన ఆట మీద స్మశాన వైరాగ్యం కలిగిన ఆటగదరా !
ఆయనకి ఆయనే జ్ఞానము పెంచుకున్న ఆటగదరా!
 
ఆయనకే ఆయన విడిపోయిన ఆటగదరా !
ఆయనకే ఆయన కలిసిపోయే ఆటగదరా !
ఆయనకే ఆయన ఎవరో మరిచిపోయిన ఆటగదరా !
 
ఆయనే నేను అని తెలియని ఆటగదరా !
ఆయన వేరు నేను వేరు నువ్వు వేరు అనుకునే ఆటగదరా !
ఆయన ఎవరో ఆయనకే తెలియని ఆటగదరా !
 
ఆయన ఆట లో ఉన్నాడని తెలియని ఆటగదరా !
ఆయనకే ఆయన ఈ ఆట ఆడిస్తున్నాడని తెలియని ఆటగదరా !
ఆయనే ఆడించేవాడు ఆడేవాడు అని తెలియని ఆటగదరా !
ఆయనకే ఇది ఒకసారి ఆడిన ఆటని తెలియని ఆటగదరా !
 
ఆడిన ఆట ఇదే నిజమని నమ్మించే ఆటని తెలియని ఆటగదరా !
ఆడిన ఆట అని జ్ఞానం పొందిన మారని ఆటగదరా !
ఆడిన ఆట మాయ అని తెలిసిన ఆగని ఆట కదరా !
ఆయనకే ఈ ఆటను ఎలా ఆపాలో తెలియని ఆటగదరా !
ఆయన తెలుసుకోవాలని అనుకున్న  తెలిపే వాడు లేని ఆటగదరా!
 
ఆయన జననముతో మొదలైన ఆటగదరా!
ఆయన మరణంతో ఆగని ఆటగదరా !
ఆయన ప్రాణశక్తితో ఆడిన ఆట కదరా !
ఆయన కపాలముగా మారిన ఆగని ఆటగదరా!
 
ఆయనెవరు అన్నప్పుడు …..
ఆయన నువ్వే నువ్వే ఆయన !
ఆయనలో నేను ఎవరు అన్నప్పుడు ….
ఆయనకే అది తెలియని స్థితి !
అది ఉందో లేదో తెలియని అంశ
అది నువ్వే అది నేనే అదియే
నామ రూపాలు లేని పరమ శూన్యము ….
 
అదియే ఆది బ్రహ్మము !
అదియే ఆది ఆత్మ!
అదియే ఆది దైవము !
అదియే ఆది యోగి !
అదియే ఆది జీవి !
 
అదియే ఆదిలో ఆడిన స్వప్న జీవ నాటకం
అదియే ఆడిన నాటకం
అదియే ఇప్పుడు చూస్తున్న ఆడిన ఆది నాటకము
అదియే ఆడిన ఆట చూస్తోంది
అదియే ఆడిన ఆట ఆడుతోంది
అదియే ఆడిన ఆటను ఆడిస్తోంది
 
ఆట చూసేది ఎవరు మనమే కదా!
ఆట వేసిన దెవరు మనమే కదా!
ఆట ఆడిన దెవరు మనమే కదా!
ఆట ఆడించేది ఎవరు మనమే కదా !
ఆడిన ఆటలో ఆది ఆటలో ఉన్నది మనమే కదా !
మనము ఎవరు ఆయనే కదా!
ఆయన ఎవరు పరమ శూన్యమే
పరమ శూన్యము అంటే ఏమీ లేనిది కదా!
ఏమీ లేదు అంటే ఎవరూ లేనట్లే కదా !
ఎవరూ లేనట్లే అంటే సర్వం ఏమీ లేదు కదా !
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమే కదా!
అది ఉందో లేదో తెలియని అంశయే కదా !
అదియే చిదంబర రహస్యం గదా !
చిదంబరము అంటే ఆకాశమే కదా!
ఆకాశము ఉందో లేదో తెలియని అంశయే గదా!
 
మనలాగా పరమ శూన్యములాగా
ఆటలో అరటిపండులా
సాక్షీభూతంగా ఆడిన ఆటను….
ఆగని ఆటను మారని ఆటను
చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితి
అందరిదీ మన అందరిదీ కదరా!
 

ఇదియే బ్రహ్మ చక్ర తత్వము
 
ఆధ్యాత్మికతయే ఆనంద స్థితి
ఆనంద స్థితియే ఆత్మశాంతి
ఇదియే యోగ తత్వము
 
అన్నప్రాశనము చేస్తే ఆనందము
అంత్యక్రియలు చేస్తే ఆవేదన
ఇదియే భోగ త్వము
 
ఆవేశాలు కలిస్తే ఆనంద సుఖాలు
ఆవేశాలు తగ్గిస్తే ఆందోళన దృశ్యాలు
ఇదియే కామత్వము
 
చూస్తే కనబడనిది
చేస్తే తెలియనిది
పొందితే అందనిది
ఇది ఉందో లేదో తెలియని అంశయే
ఇదియే భగవత్తత్వం
 
దేహము మీద వ్యామోహము
అస్థిపంజరం మీద వైరాగ్యం
ఇదియే మాయ తత్వము
 
రేణువులు కలిస్తే పరమాణువు
పరమాణువులు కలిస్తే అణువు
అణువులు కలిస్తే పదార్థము
ఇదియే విజ్ఞాన తత్వము
 
పదార్ధము దాటితే యదార్థము
యదార్థము దాటితే పరమార్థము
పరమార్థము దాటితే మూలార్ధము
ఇదియే బ్రహ్మజ్ఞాన తత్వము
 
సత్ప్రవర్తనయే సచ్చిదానందము
మానవ సేవయే మాధవ సేవ
సమాజసేవయే సదానందం
ఇదియే కర్మ తత్వము
 
విగ్రహారాధనయే విశ్వ ఆరాధన
విగ్రహమే నిగ్రహము
నిగ్రహమే భక్తి తన్మయత్వం
ఇదియే భక్తి తత్వం
 
శ్వాస మీదయే ధ్యాస
ధ్యాసయే ధారణ
ధారణయే సమాధిస్థితి
ఇదియే కుండలిని యోగ తత్వము
 
గురువు చెంతనే ఆధ్యాత్మిక  చింతన
ఆధ్యాత్మిక చింతనయే సమాధిస్థితి
సమాధిస్థితియే ఆత్మానంద స్థితి
ఇదియే గురువు తత్వము
 
ఆడేవాడు ఆడించేవాడు ఒక్కరే
నీలోను నాలోను ఉండేది ఒక్కరే
ఆ ఒక్కరే పరబ్రహ్మము
ఇదియే వేద శాస్త్ర శబ్ద పాండిత్య తత్వము
 
కనిపించేది అసత్యము
కనిపించనిది సత్యము
ఇది తెలిసిన వాడు జ్ఞాని
ఇది తెలుసుకోలేని వాడు అజ్ఞాని
ఇదియే అనుభవ పాండిత్య తత్వము
 
తెలిసినవాడు మాట్లాడలేడు
తెలియనివాడు మాట్లాడకుండా ఉండలేడు
తెలిసినవాడు చెప్పకుండా ఉండలేడు
తెలియనివాడు వినకుండా ఉండలేడు
ఇదియే మనిషి తత్వము
 
ఒకడికి వింటే ఆనందము
మరొకరికి తింటే ఆనందము
మరొకరికి చేస్తే ఆనందము
మరొకరికి చేయిస్తే ఆనందము
మరొకరికి నాశనం చేస్తే ఆనందము
ఇదియే భావ తత్వము
 
జ్ఞానం స్వయంగా తెలుసుకోవాలి
అనుభవము అయితే గాని అనుభూతి రాదు
ఉన్న వాటిని అనుమానించటం
లేని వాటిని సృష్టించడం (ఊహించుకోవటం)
ఇదియే మెదడు తత్వము
 
మంచి ఆలోచనలు- చెడ్డ ఆలోచనలు
మంచి కర్మలు- చెడు కర్మలు, పుణ్య- పాపాలు
అని వేరు చేసి చూపించడమే
ఇదియే ఆలోచన తత్వము
 
రూపము లేని మనస్సు
రూపమున్న వస్తువులు
పొందితే ఆనందము
పొందకపోతే ఆవేదన
ఇదియే మనస్సు తత్వం
 
నాలో ఉన్న వాడు- నీలోన ఉన్న వాడు
ఒకటే నేను- నువ్వు ఒక్కటే
ఇదియే అద్వైత తత్వము
 
నీవు వేరు- నేను వేరు
నీ రూపము వేరు- నా ఆలోచన వేరు
ఇదియే ద్వైత తత్వము
 
నేను గొప్ప నువ్వు దిబ్బ
నీవు నాకు దాసోహం చేయాలి
ఇదియే విశిష్టాద్వైత తత్వము
 
ఇక్కడ ఏదీ లేదు- కనిపించేది అసత్యము
కనిపించనిది సత్యము- సర్వము శూన్యము
శాశ్వతంగా ఇక ఎవరు ఏది ఉండరు
ఇదియే సంపూర్ణ అద్వైత తత్వము
 
బ్రహ్మము బ్రహ్మమునే తింటూ
మూలకము మూలకమును నాశనం చేస్తుంటే
పదార్థం పదార్థంనే  విచ్ఛిన్నం చేస్తుంటే
ఇదియే భయ తత్వము
 
బ్రహ్మము బ్రహ్మములో కలిస్తే
పదార్థము పదార్థములో మిళితమైతే
మూలకము మూలకముతో బంధం అయితే
ఇదియే ప్రేమ తత్వము
 
రూపము లేని మనస్సు
ఏదో పొందాలని ఆశ పడటమే
ఇదియే కోరిక తత్వము
 
శ్వాసతో ఆలోచనలు
ఆలోచనలతో భావాలు
భావాలతో ఆశయాలు
ఆశయాలతో స్పందనలు
ఇదియే అస్థిర మనస్సు తత్వం
 
ఏ కర్మ చెయ్యనివాడు
యోగి అయితే
అన్ని రకాల కర్మలు చేసే వాడు
భోగి అవుతాడు
ఇదియే స్థిర మనస్సు తత్వం
 
ప్రాపంచిక విషయాలలో
పడినవాడు మాయ ధూత
ప్రాపంచిక విషయాలను
దాటినవాడు అవధూత
ఇదియే అవధూత తత్వము
 
విషయ జ్ఞానం తెలిసిన వాడు
ఏమి చెప్పలేడు
ఇది తెలియని వాడు
ఎన్నటికీ తెలుసుకోలేడు
ఇదియే పరమహంస తత్వము
 
శ్వాసను తగ్గించుకుంటూ
వెళ్ళే వాడు యోగి
శ్వాసను పెంచుకుంటూ
వెళ్ళే వాడు భోగి
శ్వాస అందక ఇబ్బంది పడుతూ
ఉండేవాడు రోగి
ఇదియే సృష్టి జీవ తత్వము
 
భగవంతుడిని నమ్మేవాడు
బలహీనుడు అయితే
భగవంతుని నమ్మనివాడు
బలవంతుడు
ఇదియే నిజ భక్తుల తత్వము
 
భగవంతుడంటే ఆశ
భగవంతుడంటే భయము
భగవంతుడంటే నమ్మకము
భగవంతుడంటే భక్తి
భగవంతుడంటే భుక్తి
ఇదియే భక్తి తత్వము
 
బలహీనత లేని వాడు
బంధము లేని వాడు
మోహము లేనివాడు
ఆశ లేనివాడు
ఆశయం లేని వాడు
ఆలోచన లేని వాడు
స్పందన లేని వాడు
భయము లేనివాడు
ఆనందము లేని వాడు
ఏమీ లేదు ఏమీయు లేదు
ఏది లేని వాడు ఏది కాని వాడే
నిజమైన భగవంతుడు
వాడే అవిముక్తుడు
ఇదియే నిజ శివోహం తత్వము
 
ఉన్నది లేనట్లుగా చూపించటం
త్రినేత్ర దృశ్యం అయితే
లేనిది ఉన్నట్లుగా చూపించటం
భౌతిక నేత్రాలు దృశ్యమైతే
ఇదియే దృశ్య తత్వము
 
పాపాలు ఎంచకు పాపకర్మలు ఎంచకు
పాప ఆలోచనలు కలిగించకు పాప భావాలు ఎంచకు
మంచి దృష్టి తప్పించకు మంచి జీవితం ఎంచుకో
మోహపడకు మధన పడకు
మాయపడకు వేదన పడకు
ఇదియే గురూపదేశ తత్వము
 
అన్నింటా మౌనమే మూలము
అన్నింటికీ మౌనమే సమాధానము
అన్నింటినీ మౌనంగా భరించాలి
అన్నింటిని మౌన దృష్టితో చూడాలి
అన్నింటితో మౌన భాష సంభాషించాలి
అన్నింటిని మౌనముతో పూర్తి చేయాలి
అన్నింటిని మౌనముతో అంతరింప చేసుకోవాలి
ఇదియే సంపూర్ణ సాధన తత్వము
 
రాబోవు పరిస్థితులకి సమస్యలకి
సిద్ధ పడేలా చేయటమే కాకుండా
గ్రహశాంతియే మనశ్శాంతి
ఇదియే జ్యోతిష్యశాస్త్ర తత్వము
 
దేవుడికి కోపం వచ్చిన
వైద్యుడికి దగ్గరకి పంపిస్తాడు
వైద్యుడికి కోపం వచ్చిన
దేవుడి దగ్గరకి పంపిస్తాడు
ఇదియే మరణతత్వము
 
పక్షి కాస్త
బ్రతికి ఉన్న పురుగులు తింటుంది
పక్షి చనిపోతే
బ్రతికి ఉన్న పురుగులు దీనిని తింటాయి
ఇదియే సృష్టి ధర్మ తత్వము
 
కాశీ క్షేత్రానికి
చచ్చే వాళ్ళు వృద్ధుల రూపంలో
చచ్చిన వాళ్లు అస్థికల రూపంలో చేరతారు
ఇదియే కాశీ క్షేత్ర తత్వము
 
ఈ సృష్టిలో
ఏదీ సృష్టించబడలేదు ఏది నాశనము
చేయబడదు మరణము లేదు జననము లేదు
ఇవి ఉన్నాయి అని భ్రమ భ్రాంతి మోహము మాయ వ్యామోహము
ఆశ భయం ఆనందాలు కలిగించడమే
ఇదియే విశ్వ సృష్టి తత్వము
 
దేవుడు సత్యం అంటూ
దేవుడి పాటలు విన్నా కూడా
సినిమా అసత్యం అంటూ
సినిమా పాటలు విన్నా కూడా
మనస్సును లయింపచేయటం
ఇదియే నాదయోగ తత్వము
 
ఏది ఎప్పుడు జరగాలో
ఏది ఎప్పుడు ఆపాలో
ఏది ఎక్కడ ఆగాలో
ఏది ఎక్కడ మొదలవ్వాలో
జరగనిది ఎన్నటికీ జరగకుండా
జరిగేది జరిగే విధంగా చెయ్యటమే
ఇదియే కాలచక్ర తత్వము
 
కోరికలు తగ్గించుకుంటూ
ఆశలు అదుపులో ఉంచుకుంటూ
మానాభిమానాలు గౌరవాలు పట్టించుకోకుండా
పరిస్థితులకు పరిసరాలకు అనుగుణంగా ఉంటాయో
ఇదియే శివతత్వం
 
కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడుతూ
సృష్టిలో తన పాత్ర కోసం తపన పడుతూ
సృష్టిలో లోపాల నివారణ కోసం రూపాంతరాలు ఎత్తుటయే
ఇదియే విష్ణుమూర్తి తత్వము
 
అందము అహంకారముతో
ఏదో ఒకటి చేయాలనే తలంపులతో
చేసేది పద్ధతిగా నిక్కచ్చిగా ఉండాలనే తపనతో
అన్ని తానే చేస్తూ గుర్తింపు లేని స్థితియే
ఇదియే ఆదిపరాశక్తి తత్వము
 
కుండల నిండా పాలు ఉన్న
అందులో ఒక విషపు చుక్క చేరితే
తలలనిండా జ్ఞానం ఉన్న
అందులో పరస్త్రీ వ్యామోహం చేరటమే
ఇదియే రావణబ్రహ్మ తత్వము
 
భూమి అంతులేనిది
జలము ఆగనిది
అగ్ని తాకనిది
వాయువు కనపడనిది
ఆకాశము అంతుచిక్కనిది
ఇదియే పంచభూత తత్వము
 
పిల్లలకి పాలు
భక్షకులకి మాంసము
ఆరోగ్యంకి మూత్రము
పరిసరాల శుద్ధి కి పేడ ఇచ్చుటయే
ఇదియే గో మాత తత్వం
 
ఆకలి వాడికి పండ్లు
ఆశ్రయమునకు నీడ
అవసరానికి కట్టెలు
అందాలకి పువ్వులు ఇచ్చుటయే
ఇదియే చెట్టు తత్వము
 
భయం ఉన్న వాడికి అభయ హస్తముగా
ఆశ ఉన్న వాడికి అక్షయపాత్రగా
అవసరాలు ఉన్నవాడికి తీర్చే ఆశాదీపంగా
సమస్యలు ఉన్న వారికీ పరిష్కార కర్తగా
పాపాలు చేసే వాడికి పాపభీతిగా
దైవ నిందలు చేసేవాడికి దైవభీతి గా ఉండుటయే
ఇదియే దేవాలయ తత్వము
 
దృశ్యము సదృశ్యం అయితే జననము
దృశ్యము అదృశ్యమైతే మరణము
ఇదియే వైరాగ్య తత్వము
 
బంగారం లాంటి అమ్మాయి కావాలా
బంగారము ఉన్న అమ్మాయి కావాలా
ఇదియే  కనకపు స్త్రీ తత్వం
 
నేను ఉన్నాను నేను అన్నింటిలో ఉన్నాను
నేనై ఉన్నాను నేను కానిది లేదు
నేను లేనిది నేను అనంతుడిని
నేను సత్యుడిని నేను నిత్యుడిని
ఇదియే భగవద్గీత తత్వం
 
నేను లేను నువ్వు లేవు
ఏదీ లేదు ఏమీ లేదు
నీవు అంటూ ఏదియును లేదు
ఇదియే ఋభుగీత తత్వము
 
ఏమీ తెలియని వాడు ఏదో ఉందని
సాధన చేస్తే ఏమీ లేదని
తెలుసుకోవటమే సమాధి స్థితి అని
ఇదియే సమాధి గీత తత్వము
***************************************
యద్భావం తద్భవతి:
ఉన్నావు ఉన్నావు అంటారు ఒకరు
ఉన్నావో లేవో అంటారు ఇంకొకరు
లేవు లేవు అంటారు మరొకరు
ఉన్నావో లేవో తెలుసుకోమంటారు ఇంకొకరు
ఉన్నది ఒక్కటే అంటారు ఇంకొకరు
ఉన్నది కామమే అంటారు మరొకరు
ఉన్నా లేనట్లే అంటారు ఒకరు
అంతా నువ్వే చేస్తున్నావు అంటారు మరొకరు
లేదు నువ్వు ఏమీ చేయవు అంటారు మరొకరు
అంతా మాయే అంటారు ఒకరు
అంతా బ్రహ్మమే అంటారు ఇంకొకరు
కాదు కాదు స్వప్నమే అంటారు మరొకరు
అంతా మూలకణాల సంయోగ వియోగ మే అంటారు ఒకరు
అంతా శూన్యమే అంటారు మరొకరు
అంతా భ్రమ భ్రాంతి అంటారు ఒకరు
కాదు అది నువ్వే అంటారు ఇంకొకరు
నీవు లేవని తెలుసుకో అంటారు ఇంకొకరు
నువ్వు ఎవరో తెలుసుకో అంటారు మరొకరు
అంతా నీవై ఉన్నావు అని అంటారు ఒకరు
సర్వము ఏమీ లేదు సర్వము శూన్యము అంటారు మరొకరు
నిజానికి అంతిమ సత్యం ఏమిటంటే
నా స్వానుభ ప్రకారంగా చూస్తే ….
ఉన్నది మన జ్ఞాపకమే 
కనిపించేది మన ఆలోచన భావమే
వినిపించేది మన స్పురణయే
చూసేదంతా మన భావ సంకల్పమే
ఉన్నది సర్వము జ్ఞాపకమేనని
ఎవరైతే సంపూర్ణ జ్ఞానముతో స్వానుభవ
అనుభవ అనుభూతి పొందుతారో వారే
జ్ఞాపకము నుండి నిష్క్రమిస్తారు మౌన బ్రహ్మగా
 
గమనిక: ఈ తత్వము నా యోగ మిత్రుడైన శ్రీ పరమహంస వాసుదేవానంద(జిఙ్ఞాసి) నోటి నుండి అనర్గళంగా వచ్చిన వాక్యాలని గ్రహించండి
**********************************
బాలోన్మత్త పిశాచ అవధూత తత్వము
తత్వము తెలిసినవాడు తిరిగిరాడు.
తెలియని వాడు ముందుకు పోలేడు .
తెలిసి తెలియని వాడు నిలబడలేడు.
అన్ని తెలిసిన వాడు ఏమి చేయలేడు .
ఏదో చేద్దామని ముందుకు వెళితే తలరాత దాటినాడు.
ఎన్ని తెలిసిన ఈ మనస్సు ముందుకు
వెళ్లకుండా ఉండలేనిది.
ఇదియే బాలోన్మత్త పిశాచ అవధూత తత్వము
 
గమనిక: ఈ తత్వమును వరంగల్ కు చెందిన శ్రీ పరమహంస శారదాదేవి యోగిని అనర్గళంగా చెప్పటం జరిగినది
***************************************
 
ఎరుక అయినది సాధన పూర్తి అయినది:
పరమ శూన్యమే పరబ్రహ్మమని
మూల కపాల చితాగ్నియే పరంజ్యోతి అని
బ్రహ్మరంధ్రమే పరమ శూన్యమని
మూల బ్రహ్మకపాలమే శూన్య బ్రహ్మ అని
శూన్య బ్రహ్మయే నిరాకార ఆకార సాకార బ్రహ్మ అని
ఆకార బ్రహ్మగా ఆది దేవుడని
సాకార బ్రహ్మగా ఆది పరాశక్తి అని
మూల శబ్ద నాదము తుంకారనాదం అని
శబ్ద బ్రహ్మము ఓంకారమని
కాంతి బ్రహ్మగా ఓంకార సప్తవర్ణాలని
ఆది జీవ బ్రహ్మగా మూల గణపతి అని
ఆది జీవ అంతిమ స్వరూపముగా బ్రహ్మకపాలం అని
అండపిండ బ్రహ్మాండాలే ఆలోచన సంకల్పము స్పందనలని
పరిపూర్ణ బ్రహ్మజ్ఞాన స్థితియే పరమ శూన్య జ్ఞానమని
ముక్తి పద సోపాన స్థితియే ఆత్మ అనే జ్ఞానమని
మోక్షప్రాప్తి పద సోపాన స్థితియే ఆత్మని మరిచే జ్ఞానమని
పరమ మోక్ష స్థితియే పరమ ప్రశాంత స్థితి అని
పరమ ప్రశాంత స్థితియే పరమ ఆత్మశాంతి స్థితి అని
ఆత్మ శాంతి స్థితియే పరమ నిశ్చలస్థితి అని
పరమ నిశ్చలస్థితియే పరబ్రహ్మ తదాకార స్థితి అని
పరబ్రహ్మ తదాకార స్థితియే పరమ శూన్య స్థితి అని
పరమ శూన్య స్థితియే ఆత్మ లేని స్థితి అని
ఆత్మ లేని స్థితియే ఆత్మానంద స్థితి అని
ఆత్మానంద స్థితియే పరమానంద స్థితి అని
పరమానంద స్థితియే ఆనంద రహిత స్థితి అని
ఆనంద రహిత స్థితియే ఆనంద స్థితి అని
ఆనంద స్థితియే మనస్సు లేని స్థితి అని
మనస్సు లేని స్థితియే శూన్య బ్రహ్మ స్థితి అని
శూన్య బ్రహ్మ స్థితియే మనస్సు మౌన స్థితి అని
మనస్సు మౌనము లేని స్థితియే మాయ స్థితి అని
మాయ స్థితియే మనస్సున్న స్థితి అని
మనస్సున్న స్థితియే నేను అనే అహం స్థితి అని
నేను అనే స్థితియే మహా మాయ స్వరూపము స్థితి అని
మహా మాయ స్వరూప స్థితియే మోహ వ్యామోహం స్థితి అని
మోహ వ్యామోహ స్థితియే ఆలోచన సంకల్ప స్పందన స్థితి అని
ఆలోచన సంకల్ప స్పందన స్థితియే కర్మ స్థితి అని
కర్మ స్థితియే జన్మ స్థితి అని
జన్మ స్థితియే ఇష్ట కోరిక స్థితి అని
ఇష్ట కోరిక స్థితియే పునర్జన్మ స్థితి అని
పునర్జన్మ స్థితియే పునరపి జననం మరణం స్థితి అని
పునరపి జననం మరణం స్థితియే దైవ జీవ స్వరూప స్థితి అని
దైవ జీవ స్వరూప స్థితియే అహంకార స్థితి అని
అహంకారం స్థితియే బుద్ధి స్థితి అని
బుద్ధి స్థితియే మనస్సు స్థితి అని
మనస్సు స్థితియే మాయా స్వరూప స్థితి అని
మాయా స్వరూప స్థితియే నేను అనే స్థితి అని
నేను అనే స్థితియే మనస్సు స్థితి అని
మనస్సు స్థితియే భ్రమ భ్రాంతి స్థితి అని
భ్రమ బ్రాంతి స్థితియే మాయ స్థితి అని
ఎరుక అయినది మాయ మాయం అయినది
అప్పుడు నేను అనే అహం త్యాగం అయినది
భ్రమలు భ్రాంతులు తొలగినాయి
మోహ వ్యామోహాలు అంతర్ధానం అయినాయి
ఆలోచన సంకల్పము స్పందనలు అంతరించినాయి
మాయ లేని స్థితియే మనస్సు మౌన స్థితి అయినది
మనస్సు మౌన స్థితియే నేను కానీ నేను స్థితి అయినది
నేను కానీ నేను స్థితియే శూన్య బ్రహ్మ అయినది
శూన్య బ్రహ్మ స్థితియే మనస్సు లేని స్థితి అయినది
మనస్సు లేని స్థితియే ఆనంద స్థితి అయినది
ఆనంద స్థితి నుండి పరమానంద స్థితి అయినది
పరమానంద స్థితి నుండి ఆత్మానంద స్థితి అయినది
ఆత్మానంద స్థితి నుండి ఆత్మ లేని స్థితి అయినది
ఆత్మ లేని స్థితి నుండి పరమ శూన్యమైనది
పరమ శూన్య స్థితి నుండి బ్రహ్మ తదాకార స్థితి అయినది
బ్రహ్మ తదాకార స్థితి నుండి నిశ్చలస్థితి అయినది
నిశ్చల స్థితి నుండి ఆత్మ శాంతి అయినది
ఆత్మశాంతి నుండి పరమ ప్రశాంత స్థితి అయినది
పరమ ప్రశాంత స్థితి నుండి కపాలమోక్షం స్థితి అయినది
ఇది పొందామో లేదో తెలియని అదోరకమైన విచిత్ర అనుభవ అనుభూతి స్థితి.
 
 
వింటే బాగుపడతారు
వినకపోతే బాధపడతారు
ఇదియే బోధ తత్వము
 
శుభంభూయాత్
పరమహంస పవనానంద
***********************************
సూచన: పరమ యోగులను పరమ గురువులను సందర్శించినప్పుడు మీరు మోక్షప్రాప్తి పొందినారా అని అడగకండి. ఎందుకంటే ఇది పొందామో లేదో చెప్పలేని అలవికాని విచిత్ర అనుభవ స్థితి. ఎలా అంటే మరణించేవారికి వాడు కొన్ని క్షణాలలో మరణము పొందుతాడనే జ్ఞాన స్పురణ కలిగి ఉంటాడు. కానీ తాను మరణించిన విషయం తనకి తెలియకుండానే ఎలా అయితే మరణమును పొందుతాడో అలాగే మోక్షప్రాప్తి కూడా అన్నమాట. తనకు ఎప్పుడూ మోక్షప్రాప్తి కలుగుతుందో చెప్పగలరు కానీ తాను మోక్షము పొందిన విషయమును చెప్పలేరు కదా. చెప్పితే పొందినట్లే కాదు. చెప్పకపోతే పొందినట్లే అని చెప్పలేని స్థితి. మౌన స్థితి నిశ్చలస్థితి ఆత్మశాంతి స్థితి పరమ ప్రశాంత స్థితి. ఇదియే బ్రహ్మ కపాలమోక్షం.
 


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. yogam, bhogam, bhakti,dhyaanamu, guruvu shabdha paandithyam, jignasi gaari thathvamu, srushti thathvamu, mee sthithi thathvamu, layamu kosam shaaradaadevi kottukuntunnattu... thathvamulu amogham.ee thathvaalalo tookigaa yogi prayaanam vivarincharu. elagaithe 0.01% sahana shakti kolpoyi ela malli janamaku kaaranamouthundo alaa....

    రిప్లయితొలగించండి