సైన్సు విజ్ఞాని అనుభవం
(పాల లింగము - మంచు లింగము దర్శనము)
ఈ సైన్సు విజ్ఞాని ఎవరో గాదు! స్వయనా మా అన్నగారు ఘంటసాల శశిధర్ శర్మ! వీరికి ఆధ్యాత్మిక విషయాలయందు అలాగే విజ్ఞాన శాస్త్ర విషయాలయందు మంచి పట్టు సాధించిన కర్మయోగి అన్నమాట!కాని దేనినైన గూడ సైన్స్ కి ముడిపెట్టి అది ఉన్నదని నిరూపిస్తే నమ్ముతాడు! అలాగే దేవుడి విషయము సైన్స్ నమ్మదు కాబట్టి మనవాడు నమ్మడు!కాని తనవాళ్ళ కోసము పూజలు చేస్తాడు! మా విచిత్ర వేదాంతి లాగానే వీడు గూడ నాకు అపుడపుడు అర్ధముకాడు! కాని వీరి జీవితములో నా పూజల వలన వీరికి కలిగిన విచిత్ర శివ అనుభవము ఏమిటో మీరే స్వయంగా తెలుసుకొండి!
మా మట్టి మోక్ష శివలింగం
మా అమ్మకి వారసత్వంగా మట్టి మోక్ష శివలింగం వచ్చినది అని మీకు తెలుసు కదా అలాగే దానిని పూజించమని ఇచ్చినప్పుడు దాని విలువ తెలియక వెనక్కి తిరిగి ఇచ్చేశాను కదా. అదే నిజగురువు వెతుక్కునే సమయంలో అమ్మ నాకు ఈ లింగమూర్తి ఇచ్చి శివ రాత్రి పూజ చేసుకోమని చెప్పింది కదా. అప్పుడు దాని విలువ తెలియక వద్దు అన్నాను. విలువ తెలిశాక వదలి పెట్టలేక పోతున్నాను. అమ్మ ప్రేమగానే ఇష్టంగానే లింగమూర్తి నాకు ఇచ్చినది. మా అయ్య చేసిన పొరపాటు నేను చేయకూడదని అమ్మ చేత రెండవసారి ప్రయత్నంలో నేను అడగకుండానే అమ్మ నాకు వారసత్వంగా ఈ మట్టి లింగమూర్తి ఇచ్చినది. ఈ సారి ఈ మహత్తర అవకాశం వదులుకోలేదు. దాన్ని భద్రంగా ప్రాణ లింగం గా చూసుకోవడం చేశాను.చేస్తున్నాను .ఇప్పటికీ నా దగ్గరే ఉన్నది. నాకు మోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మోక్ష లింగం అయిన శివుడి మట్టి ఆత్మలింగం. కొన్ని వారాల తర్వాత ఆ సంవత్సరమునకు మహాశివరాత్రి రానే వచ్చింది. ఆరోజుతో 3 సం!!రాల నుంచి చేస్తున్న 5 లక్షల శివ పంచాక్షరీ మంత్రరాధన పూర్తి అవుతుంది! అంటే శివమంత్ర సిద్ధి నాకు కలిగినట్లుగా శివ దైవానుభవము కలగాలని అనుకుంటూ …. నాకు ఇంతలో చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మ నాకు ఇచ్చిన మహత్తర లింగమూర్తికి ఇంకా ఇప్పటికీ సిద్ధులు ప్రదర్శించే మహత్యం ఉన్నదా అనే సందేహం వచ్చింది. దీనికి సమాధానం వెతకాలని ఈ లింగమూర్తిని పరీక్షించి శోధించాలని మహాశివరాత్రి నాడు ఆ సమయంలో ఈ మట్టి లింగమూర్తికి మా అన్న గారి ఇంటిలో అభిషేకం చేయడం జరిగినది. ఎందుకంటే మావాడి ఇంట్లో ఉండి చదువుకుంటూ, ఉద్యోగం చేస్తున్నాను. ఇంతలో అభిషేకం పూర్తి అయినది. అభిషేక పాలు ఒక గిన్నెలో వంపుతుండగా క్రింద కొన్ని పాలు పడినాయి అని నేను గమనించలేదు.
పాలు... ఒక మహా శివ లింగమూర్తి ఆకారంగా
(పాల లింగము)
యధావిధిగా లింగమూర్తి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పైకి లేచే సమయానికి నేల మీద పడిన పాలు ఒక మహా శివ లింగమూర్తి ఆకారంగా మారాయి.నాకు ఎంతో ఆశ్చర్యం తో కూడిన ఆనందం వేసింది. నోట మాట రాలేదు. వామ్మో! ఈ లింగమూర్తి కి ఇంకా మహత్తర శక్తులున్నాయి….. తగ్గి పోలేదని…. తగ్గిపోయాయని భ్రమపడినందుకు…. నా అజ్ఞానం క్షమించమని…. శివయ్యను వేడుకోవటం తప్ప ఏమి చేయలేకపోయాను. వెనువెంటనే ఫోటో తీశాను. అలాగే ఈయన మీద ఉంచిన బిల్వ పత్రాలలో ఒక బిల్వపత్రం నాగపడగ ఆకారంలో ఉండటం దానిని కూడా ఫోటో తీసి భద్రంగా దాచుకున్నాను.
వెంటనే మా అన్న గారికి ఈ పాల లింగమూర్తి చూపించడం జరిగింది. దానికి వాడు వెంటనే “భలేవాడివి రా చిన్నోడా! సైన్స్ ప్రకారం చూస్తే నేల మీద పడిన ద్రవపదార్థమేదైనా ఇలాంటి ఆకారాలుగా మారుతుంది. పాలే కాదు నీళ్లు పోసిన లేదా నూనె పోసిన లేదా నెయ్యి పోసిన ఇలాగే కనబడతాయి. నీకు బాగా లింగారాధన పిచ్చి ఎక్కువ అవటం వలన ప్రతిది కూడా లింగమూర్తి లాగా కనబడుతోంది. ఇలాంటి వాటిని నేను నమ్మను. వీటిని ఎవరికీ చూపించకు. ఎవరికీ చెప్పకు” అని చెప్పి వాడు తన గదిలోనికి వెళ్ళిపోయాడు. కానీ నాకు మాత్రం వీడి మాటలు రుచించలేదు .అలాగని కోపం రాలేదు.యద్ భావం తత్ భవతి. ఎవరి భావం తగ్గట్లుగా వారికి అలా కనిపిస్తుంది అని నాకు లీలగా సామెత గుర్తుకు వచ్చినది. ఏమోలే అనుకుని మహాశివరాత్రి నాడు దివ్యమైన ప్రత్యక్ష దైవం అనుభవం కలిగినందుకు సంతోషపడుతూ మిగిలిన కార్యక్రమాలు చేయడానికి నేను వెళ్లడం జరిగింది. వారం రోజుల తర్వాత నిద్ర పోని మాదిరిగా వాడిపోయిన మొహంతో మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి “చిన్నోడా! నేను పడుకునే మంచానికి దయ్యము పట్టినట్లుగా ఉంది! ఆరోజు నిన్ను అని వెళ్లిన తర్వాత ఒక విచిత్రమైన అనుభవం నాకు ఎదురైనది. నేను ప్రతిరోజూ పడుకునే మంచం మీద యధావిధిగా పడుకున్నప్పుడు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నిజం లాంటి కల వచ్చింది. 28 సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు తన భుజాన శవమును వేసుకొని స్మశానానికి తీసుకుని వెళ్లి చితి పెడుతుండగా గదినిండా శవాల వాసనతో, జుట్టు కాలిపోతున్న వాసనలతో భయంకరమైన జంతువుల అరుపులు నాకు విపరీతమైన భయంకర బీభత్సం వాతావరణం ఒక కలగా కనిపించింది. ఇంతలో నాకు మెలుకువ వచ్చింది. ఆ తర్వాత నేను ఆ మంచం మీద పడుకోవటానికి భయపడుతుంటే మీ వదిన వచ్చి పడుకుంది. నాకు వచ్చిన కలలాగే మీ వదిన కూడా వచ్చినది. ఇలా వారం రోజులపాటు ఇదే కల మా ఇద్దరికీ వచ్చింది. దాంతో మా ఇద్దరికీ నిద్ర లేదు. నిద్రపోతే ఈ కల తప్ప ఇంకేమీ లేదు. ఇలా ఆ మంచం మీద ఎవరైతే పడుకుంటున్నారో వారికి నాకు వచ్చిన కల రావటం వాళ్లు భయపడటంతో గత వారం రోజులుగా మాకు జరుగుతున్న తంతు ఇదే. మాకు ఎవరికీ నిద్ర లేదు. ఈ సమస్యకు నువ్వే ఏమైనా మార్గం చూపించు. పుణ్యం కట్టుకో” అని నాతో అన్నాడు. వాడి బాధ చూసి బాబా సూక్తులు పుస్తకము తీసి ఒక నెంబర్ కోరుకోమని చెప్పగానే వాడికి వచ్చిన సమాధానం "నేను లేనని నేను ఒక పిచ్చి వాడిని అని నన్ను పూజించే భక్తులును నువ్వు మూర్ఖులు అని అనుకుంటున్నావు కదా” అని సమాధానం వచ్చింది. అప్పుడు దీనిని పాల లింగ దర్శనం రోజు జరిగిన సంఘటన సంభాషణలు నాకు వెనువెంటనే గుర్తుకు వచ్చినాయి. అపుడు నేను వెంటనే దీనికి పరిష్కారమార్గము ఏమిటి? అని ప్రశ్నించినపుడు ఒక నెంబర్ చెప్తే అప్పుడు దానికి బాబా పుస్తకం సమాధానంగా “ఈ విభూతిని నా పేరుతో మంత్రించి ఆ పిల్లవానికి ఇచ్చి అతని జీవితం కాపాడు” అని ఆజ్ఞ సమాధానంగా వచ్చింది. వెంటనే నేను విభూతిని మంత్రించి ప్రసాదంగా మంచం మీద చల్లమని చెప్పినాను.అప్పుడు వెంటనే అతను దీనితో నాకు కష్టాలు తీరినట్లేనా అని ప్రశ్నించాడు. నెంబరు చెప్పటం సమాధానం చూపించేసరికి దానిలో “ఆందోళన చెందవద్దు. భయము లేదు. నిన్ను ఈ దయగల ఫకీరు రక్షించును.ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండు. ఆదుర్దాగా తిరగవద్దు” అని సందేశం సమాధానంగా వచ్చింది. వెంటనే అన్నయ్య తను పాలశివలింగము గూర్చి తప్పుగా అన్నందుకు శివుడిని క్షమించమని అనడముతో నేను నాకు బాబా ఇచ్చిన ఆజ్ఞమేర మంత్రించిన విభూతితో వాడి గదిలోనికి వెళ్ళి ఆ మంచము చుట్టు దీనిని చల్లి వచ్చినాను! కొన్ని గంటల్లో స్వస్థత పొంది ఆ రోజు రాత్రి యధావిధిగా అదే మంచం మీద ఎలాంటి భయాలు లేని కలలు రాని గాడనిద్రలోకి జారుకున్నాడని నాకు తరువాత తెలిసింది.అప్పటిదాకా నాకు మాత్రమే బాబా జవాబులు సరిగ్గా వస్తాయి అని అనుకునేవాడిని. కానీ అన్నయ్య కు వచ్చిన బాబా జవాబులు చూసి ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. ఆయన మీద విశ్వాసంతో శ్రద్ధతో భక్తితో అడిగితే సరైన పరిష్కారాలు సమాధానాలు వస్తాయని ఈ అన్నయ్య ప్రశ్నలు అనుభవంతో నాకు అర్థం అయ్యి మౌనం వహించాను.
కొన్ని రోజుల తర్వాత టీవీలో అమర్నాథ్ లో స్వయంభూగా ఏర్పడే మంచు లింగం అనగా అమర్ నాథ్ లింగం గూర్చి కార్యక్రమం వస్తోంది. మంచు తో ఎలా లింగంగా ఏర్పడుతుందో అర్థం కాలేదు. అదే కాక మంచు కరగకుండా సుమారు కొన్ని రోజులపాటు ఉండటంతో ఇందులో ఏదో తెలియని మర్మము ఉన్నదని దీనిని ఎవరో ఇలా ఏర్పాట్లు చేస్తున్నారేమోనని ఎలా అంటే శబరిమల లో కనిపించే జ్యోతిని ఏర్పాటు చేసి చూపించినట్లుగా కూడా తయారు చేసే ఏర్పాట్లు చేసి ఉండవచ్చునని అనుమానం వచ్చింది. దీనిమీద పరిశోధన గ్రంథాలుచదివితే ఈ గుహలో రెండు నీటి పైపులు ఉన్నాయని వీటి నుండి నీరు బయటకు వచ్చి మంచు లింగముగా ఏర్పడే విధంగా అలాగే మంచు కరిగిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. బాధ వేసింది. మానవ మూఢభక్తి తో ఎలా వ్యాపారం చేస్తారు? ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.
మా ఇంటి లో ని డీప్ ఫ్రిజ్లో మంచు గడ్డలు మంచు లింగాలుగా ఏర్పడటం
(మంచు లింగం )
కానీ విచిత్రంగా కొన్ని రోజుల తర్వాత మా ఇంటి లో ని డీప్ ఫ్రిజ్లో మంచు గడ్డలు మంచు లింగాలుగా ఏర్పడటం మొదలు పెట్టినాయి. అచ్చంగా అమర్ నాథ్ లింగం లాగానే ఈ మంచు లింగంలు ఉండేవి. వీటిని చూసి నాకు మా కుటుంబ సభ్యులకు ఎంతో ఆశ్చర్యం వేసేది. విచిత్రం ఏమిటంటే శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేసే మాసములో అయ్యవారు ఇలా మంచుశివలింగాలుగా ఏర్పడేవి. మిగతా కాలాలలో ఎలాంటి లింగాకారాలు లేని మంచుగడ్డలు ఉండేవి.దానితో మంచు లింగాకారాలు ఏర్పడే సమయంలో నేను వీటిని కొన్ని ఫొటోస్ తీయటం జరిగినది. మీకోసం ఇక్కడ ప్రచురించడం జరిగింది.అలా పాల లింగము, మంచు లింగం ఉన్న ఫోటోలు చూడండి. తరించండి.
అప్పుడు కాని నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏమిటంటే ఎవరి ప్రమేయం లేకుండానే నా ఫ్రిజ్లో మంచు లింగము ఏర్పడితే అమర్నాథ్ గుహ లో ఏర్పడే అమర్ నాథ్ మంచు శివలింగం కూడా నిజమే కదా కాకపోతే ఈ మంచు లింగం ఆదిలో స్వయంభూగా ఆ ప్రాంతంలో ఏర్పడి ఉండాలి. ప్రస్తుతము భూ వాతావరణంలోని మార్పుల వలన అధిక వేడిని, అధిక ఉష్ణోగ్రత , అధిక కాలుష్యం వాతావరణ పరిస్థితుల వలన ఈ లింగం ఏర్పడక పోయి ఉండవచ్చు. కానీ ఈ లోకానికి ఈ సత్ సంప్రదాయం కొనసాగించడానికి ప్రభుత్వం వారు ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేసి ఉండాలి. అలాగే శబరిమల క్షేత్రంలో కూడా ఆదిలో స్వయంభూగా జ్యోతి దర్శనం కలిగి ఉండాలి. ఎందుకంటే యోగంలో ఉన్న ప్రతి సాధకుడికి తన సహస్ర చక్ర స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా శివకేశవ శక్తి అయిన పరంజ్యోతి సాక్షాత్కార అనుభూతిని పొందడం జరుగుతుందని యోగ శాస్త్రాలు చెప్పడం జరిగింది కదా. మన సహస్రార చక్రంలో ఈ పరంజ్యోతి స్థానమే ఈ విశ్వంలోని శబరిమల క్షేత్రమై ఉండి ఉండాలి. అందువలన ఆదిలో ఈ క్షేత్రంలో స్వయంగా పరంజ్యోతి దర్శనం జరుగుతుండేది. కానీ ప్రస్తుతం కలి ప్రభావం వలన ఈ జ్యోతి స్వయంభూగా దర్శనం ఇచ్చిన నమ్మలేని పరిస్థితి, అనుమాన స్థితిలో ఉండటం జరిగినది. దానితో స్వయంభూ జ్యోతి దర్శనం, పరంజ్యోతి దర్శనాలు ఆగిపోయి ఉండాలి.దానితో దీనికి గుర్తుగా ఈ లోకానికి ఈ సత్ సంప్రదాయం కొనసాగించాలని ఉద్దేశంతో స్వయంగా ప్రభుత్వం వారు స్వయంభూ పరంజ్యోతి ఏర్పడిన ప్రాంతంలోనే మానవ ప్రయత్నం ఏర్పాట్లతో ఈ పరంజ్యోతి ప్రజ్వలనం చేసే ఏర్పాటు చేసి ఉండాలి. ఈ సంప్రదాయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేను ఏమీ చేయలేక పోయాను. నిజమే కదా. ఎలా మహాశివుడు పాలలింగముగా, మంచు లింగముగా ఉద్భవించి స్వయంగా నన్ను తరింప చేసినందుకుఆ సర్వేశ్వరుని కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి. మీరు కూడా ఈ ఫోటోల ద్వారా ఆ సర్వేశ్వరుడి స్వయంభూ దర్శనాలు భాగ్యం మీకు కల్పించినాడు కదా. నేను ఈ గ్రంథం రాయకపోతే అందులో వీటి గురించి చెప్పకపోతే వీటిని మీరు చూసే వాళ్ళు కాదు కదా. ఏమంటారు. నిజమే కదా. ఈ విధంగా శివమంత్రసిద్ధి వలన ఈయన చూపించిన నిజ భౌతిక సిద్ధగురువు గూర్చి తెలుసుకోవాలని ఉందా?
************************************
గమనిక: మన వేదాలలో సర్వ విజ్ఞాన,బ్రహ్మజ్ఞాన,తత్త్వజ్ఞాన,ఆత్మజ్ఞాన...ఇలా అన్నింటిని సమకూర్చినది!వీటిలో లేనిది..క్రొత్తది అంటూ ఏమిలేదు! వేదాలు సంపూర్ణముగా తెలుసుకొంటే...మన సైన్స్ అవి ఏమి తెలుసుకున్నాయో ఆలోచించకుండా...అవి చెప్పేవి నిజాలు అవునా గాదా అనే దానిమీద వ్యర్ధపరిశోధనలు చేస్తూ వేదాలు తెలుసుకున్న దానిని క్రొత్తదానిగా పేరు పెట్టి తిరిగి అదే చెపుతోంది! వేదాల జ్ఞానము కొండంత అయితే మన విజ్ఞానము గోరంత అని తెలుసుకొండి! వాయువు లాంటిది మన వేదాలు అయితే అదే వాయువును చూడాలనే విశ్వప్రయత్నము చేసేది మన సైన్స్ అన్నమాట! ఇది ఎన్నడికి సాధ్యపడదని మన విజ్ఞానశాస్త్రవేత్తలు ఎపుడు తెలుసుకుంటారో వారికే తెలియాలి!
విచిత్ర వేదాంతి
నా భౌతిక సిద్ధగురువు
నాకు శివ మంత్ర సిద్ధి అయినదని ఇంతకుముందు అధ్యాయం లో చదివి ఉన్నారు కదా.ఇలా ఉండగా శివుడి ఆకారము లాంటి నీడ ఒకటి నాకు కల నందు కనిపించి “నాయనా!నా అనుగ్రహం వలన నీ భౌతిక గురువు నీ దగ్గరకి రేపు వస్తున్నారు.వారిని బాగా పరీక్షించి, పరీక్షలు పెట్టి, పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ భౌతిక గురువుగా వారిని ఎంచుకో. కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత అని గ్రహించు” అని చెప్పి అంతర్ధానం అయినది! నాకు శివుడి ఆకారము లాంటి నీడ కల నందు కనిపించి చెప్పిన నిజభౌతిక గురువుగా వచ్చిన ఇతను ఎవరో కాదు! నాకు కొండ మీద దుర్గాంబ నిజ స్వరూప దర్శనం చేద్దామని ప్రయత్నించినది ఇతనే ! నేను శిరిడి పారిబోయినపుడు మా ఇంటికి తీసుకొని వ్యక్తి గూడ ఇతనే గావడము విశేషము! ఇతను నాకు ఒక జ్యోతిష్యవేత్త జాతకము చెప్పిన వ్యక్తి. పైగా చింతామణి దుర్గాదేవి చూపించటానికి ప్రయత్నించిన
వ్యక్తి! ఇతను స్వయంగా నాకు వరసకు అన్నయ్య అవుతాడు. అనగా మా అమ్మకు పిన్ని కొడుకు అన్న మాట! ఇతని పేరు సాయినాథ్.ఇతను నా కన్నా 12 సంవత్సరాలు పెద్ద అలానే సాధనలో అనుభవము అప్పటికే సిద్ధి పొంది ఉన్నాడు. మంత్ర, తంత్ర, యంత్ర ,వేదాలలో అనుభవ సాధనలో వివిధ రకాల అనుభూతులు పొందినాడని అతడి మాటలలో, చేష్టల ద్వారా నాకు తెలిసినది. ఎందుకంటే ఈ వ్యక్తి ముఖము ఎంతో బ్రహ్మ తేజస్సుతో సమ్మోహనం వర్చస్సుతో బ్రహ్మ తత్వ విచారణ సిద్ది తో మాటలలో తన్మయత్వ శక్తితో ఉన్నాడు. ఇతను బాల మంత్ర ఉపాసన సిద్ధి పొంది మంత్ర శాస్త్రమును ఔపాసన పట్టి వేద జ్ఞానం పొంది అతి విచిత్ర సచిత్ర పనులు చేస్తూ నా దృష్టిలో విచిత్ర వేదాంతిగా ఉండిపోయాడు. ఈ సంఘటనలు అన్నిగూడ 12 సం!!రాలు పాటు జరిగినాయి! అంటే నేను ఒక వ్యక్తిని నా భౌతిక గురువుగా ఎంచుకోవటానికి ఆయనని పరిశీలించటానికి,ఆయనికి పరీక్షలు పెట్టటానికి నాకు 12సం!!పట్టినది! ఆయన నాకు చూపించిన ఏనిమిది యదార్ధ సంఘటనాలను ఏమాత్రము మార్చకుండా వ్రాయడము జరిగినది!దయచేసి ఎవరూ గూడ తప్పుగా భావించుకోవద్దని నా మనవి!నిజగురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలనే ఉద్ధేశ్యముతో వాటిని మీ వీలుకోసము వాటన్నింటిని ఒకచోట చేర్చి వ్రాయడము జరిగినదని గ్రహించండి!
వ్యక్తి! ఇతను స్వయంగా నాకు వరసకు అన్నయ్య అవుతాడు. అనగా మా అమ్మకు పిన్ని కొడుకు అన్న మాట! ఇతని పేరు సాయినాథ్.ఇతను నా కన్నా 12 సంవత్సరాలు పెద్ద అలానే సాధనలో అనుభవము అప్పటికే సిద్ధి పొంది ఉన్నాడు. మంత్ర, తంత్ర, యంత్ర ,వేదాలలో అనుభవ సాధనలో వివిధ రకాల అనుభూతులు పొందినాడని అతడి మాటలలో, చేష్టల ద్వారా నాకు తెలిసినది. ఎందుకంటే ఈ వ్యక్తి ముఖము ఎంతో బ్రహ్మ తేజస్సుతో సమ్మోహనం వర్చస్సుతో బ్రహ్మ తత్వ విచారణ సిద్ది తో మాటలలో తన్మయత్వ శక్తితో ఉన్నాడు. ఇతను బాల మంత్ర ఉపాసన సిద్ధి పొంది మంత్ర శాస్త్రమును ఔపాసన పట్టి వేద జ్ఞానం పొంది అతి విచిత్ర సచిత్ర పనులు చేస్తూ నా దృష్టిలో విచిత్ర వేదాంతిగా ఉండిపోయాడు. ఈ సంఘటనలు అన్నిగూడ 12 సం!!రాలు పాటు జరిగినాయి! అంటే నేను ఒక వ్యక్తిని నా భౌతిక గురువుగా ఎంచుకోవటానికి ఆయనని పరిశీలించటానికి,ఆయనికి పరీక్షలు పెట్టటానికి నాకు 12సం!!పట్టినది! ఆయన నాకు చూపించిన ఏనిమిది యదార్ధ సంఘటనాలను ఏమాత్రము మార్చకుండా వ్రాయడము జరిగినది!దయచేసి ఎవరూ గూడ తప్పుగా భావించుకోవద్దని నా మనవి!నిజగురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలనే ఉద్ధేశ్యముతో వాటిని మీ వీలుకోసము వాటన్నింటిని ఒకచోట చేర్చి వ్రాయడము జరిగినదని గ్రహించండి!
నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇతను మా ఊరి జాతరకు వచ్చినాడు. అప్పుడే చూడటమే మొట్టమొదటిసారి అన్నమాట! అంటే ఒకరకముగా సాధన ఆరంభదశలోనే ఈయన ఒక ఆత్మబంధువుగా ప్రకృతి పరిచయము చేసినది! ఎంతో తేజస్సుతో ఉండేవాడు. ముఖములో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండేది. అప్పటికే అతను మంత్రాలను నేర్చుకున్నాడు. ఏదో దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. నాకు లాగానే దైవము యొక్క నిజ స్వరూపం చూడాలనే తపన కసి గా ఉండేది.తెల్లవారుజామున నిద్ర లేచి నది ఒడ్డున గొంతు వరకు మునిగి మంత్ర సాధన చేసే వాడని అలాగే పాము, తేలు మంత్ర సిద్ధి పొందినాడని, పోయిన వస్తువులను తెలుసుకునే వాడని, జ్యోతిష్య శాస్త్రము లో దిట్ట అని, వాక్సిద్ది ఉన్నవాడని, చెప్పినట్లుగా జరుగుతుందని అతని గూర్చి అందరూ చెప్పటం మొదలుపెట్టినారు. అసలే ఇలాంటి విషయాలు అంటే చెవి కోసుకునే నాకు ఈ వ్యక్తి ఏదైనా చేస్తే చూడాలని, ప్రత్యక్షముగా చూడాలని అనుభవాలు పొందాలని అని నాలో తపన మొదలైంది. అతనితో స్నేహం మొదలైంది. అతను చాలా తక్కువగా మాట్లాడుతాడు. మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదో తెలియని వేదాంత ధోరణి ఉంటుంది. రాత్రిపూట మా గుడిలోకి వెళ్లి కాగితాల మీద అమ్మవారి బొమ్మలు గీయటం నేను చూశాను. అచ్చు గుద్దినట్లు గా ఫోటో తీసినట్లుగా అమ్మవారిని గీయడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. చిత్రలేఖనము అంటే ఇదే కదా ఫోటోలో సజీవ కళ తెప్పించడం అంటే ఇదే కాబోలు అని అనిపించేది.
సంఘటన:1 ఆ తరువాత మా నాన్న స్నేహితుడు యొక్క మైక్ సెట్ పోయినది. అది కూడా మా జాతర జరిగే సమయంలో పోయినది పోలీసులకు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి ఎందుకో ఈ విషయము మా అయ్య దగ్గర ఇతను ప్రస్తావించే సరికి దానికి మా అయ్య వెంటనే అతనితో కంగారు పడకు మన సాయి గాడు ఉన్నాడు కదా వాడు అంజనం వేసి ప్రశ్న వేస్తే ఎవరు తీసుకున్నారో క్షణాలలో తెలిసిపోతుందని వెంటనే ఈ దొంగతనం విషయం గూర్చి మా సాయికి చెప్పటం వెంటనే అతను కొన్ని కాగితాలు తీసుకుని ఒంటరిగా ఒక గదిలో వెళ్లిపోవడం క్షణాలలో జరిగినది అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఇది అంతా గమనిస్తున్న నాకేమీ అర్థం కావడం లేదు? ఏమిటి? పోలీసుల వలన కాని పనిని ఏదో అంజనం ప్రశ్న వేసి, దొంగ ఎవరో కని పెట్టొచ్చా? ఇంకా ఎందుకు పోలీసులు, పోలీస్ స్టేషన్లు? నా బొంద మరీ వెర్రి జనాలను చేస్తున్నారు వాడు ఏదో మంత్రసిద్ధి పొందినాడు అని అనుకోగానే మరీ జనాలను ఇలా నమ్మించి ఇలా మోసం చేస్తాడని చేస్తున్నాడని పోలీసులకు దొరకని దొంగ ఇతను వేసే అంజన ప్రశ్నకు దొరుకుతాడా ఏమో ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏ పాముందో? దొరకవచ్చు దొరకక పోవచ్చు దొరికితే మంత్ర శాస్త్రం గొప్పతనం లోకానికి తెలుస్తుంది. లేకపోతే ఎటూ పోయిన వస్తువు దొరకదు కొద్దిసేపు ఆగితే ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా! ఆ విచిత్రం ఏమిటో తెలుస్తుంది కదా అనుకుంటుండగా మా సాయి తన గది నుండి బయటకు వచ్చి ఏదో కాగితం రాసిన విషయం వస్తువు పోయిన వ్యక్తికి ఇచ్చినాడు. అందులో దొంగ వ్యక్తి యొక్క రూపురేఖలు, పుట్టుమచ్చలు, మనస్తత్వం, అవలక్షణాలు, అప్పుడు వేసుకున్న బట్టల వివరాలు, అతను వేసుకున్న చెప్పుల రంగు, సైజు ఇలా పలు విషయాలు వ్రాయటం జరిగినది. ఇది చదివిన వెంటనే ఆ వ్యక్తి ఎవరో వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి క్షణాలలో ఊహించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గట్టిగా దబాయించి విచారించి బెదిరించగా ఆ వ్యక్తి దొంగతనం చేసినాడని అని తెలిసినది. విచిత్రం ఏమిటంటే పోయిన వస్తువు మీకు దొరకదని కేవలం దొంగ మాత్రమే దొరుకుతాడని చేతితో వ్రాసిన విషయము కూడా నిజమైనది. అతను ఆ వస్తువును తక్కువ ధరకే ఎవరికో అప్పటికే అమ్మేసి ఆ డబ్బులు ఖర్చు చేసినాడని తెలిసేసరికి వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి తో పాటు నేను కూడా గతుక్కుమన్నాను. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఇది నాకు చాలా చిన్న విషయమని ఆ సాయి కాస్త క్రికెట్ ఆటకు వెళ్లిపోతుంటే వాడిని చూస్తూ ఏమనాలో నాకు అర్థం కాలేదు వామ్మో మంత్ర శాస్త్రానికి అంత శక్తి ఉంటుందా పోయిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చా అయితే సాయిని పట్టుకొని ఎలాగైనా ఈ మంత్రమును నేర్చుకోవాలని ఆసక్తి దురద నాలో మొదలైంది. సాయి మీద స్నేహ భావం ఇంకా పెరగటం ఆరంభమైంది. ఇది ఎందుకంటే నాకు తెలియని ఎన్నో రహస్య విషయములు ఉన్నాయని ఆనాడే నేను గ్రహించాను.
సంఘటన:2 ఇది ఇలా ఉంటే ఒకసారి మా స్నేహితునికి ఏదో తేలు కుట్టినది. దాని బాధ తట్టుకోలేక వాడు నానా అవస్థలు పడుతుంటే వాడి బాధ చూడలేక వైద్యుడి దగ్గరకు మందు కోసం నేను పరిగెత్తుకు వెళ్లాలని అనుకుంటే మా అయ్య ఎదురై “అక్కడ సాయి గాడు లేడా? ఉంటే వాడికి చూపించు! మంత్రము వేస్తాడు తగ్గిపోతుంది? ఎందుకు పరిగెత్తుతావు?”అని చెప్తుంటే ఏమిటి మంత్రాలకు రోగాలు కూడా తగ్గుతాయా బాధలు కూడా పోతాయా ఇదేదో విచిత్రంగా ఉందే ఇలాంటి అవకాశం మరల రాదని వెంటనే సాయి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లాను. వెళ్ళితే వాడు నవ్వుతూ కళ్ళు మూసుకుని వేద మంత్రాలు చదువుతూ తను తాగుతున్న సిగరెట్ బూడిద నా చేతిలో పెడుతూ “తేలు కుట్టిన చోట ఇది రాయి! వెంటనే బాధనుండి ఉపశమనం లభిస్తుంది” అని చెప్తుంటే ఏమిటి? సిగరెట్టు బూడిదకి తేలు బాధ తగ్గితే విష బాధ తగ్గితే నొప్పి బాధ తగ్గితే… నా స్వామిరంగా… ఇంతకన్నా విచిత్ర విషయం మరొకటి ఉంటుందా? తగ్గితే మంచిదే చూస్తే పోలా? తగ్గకపోతే వీడి మీద కూడా కేసు పెట్టవచ్చు కదా” అనుకుని మళ్లీ తేలుకుట్టిన స్నేహితుడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి గాయం అయిన చోట నేను తెచ్చిన బూడిద రాసిన కొన్ని క్షణాలకే బాధ నుండి విముక్తి అయ్యేసరికి నాకు నోట మాట రాలేదు. దానికి మా స్నేహితుడు వెంటనే “స్నేహితుడు అంటే నీవే రా! నా బాధ చూడలేక వైద్యుడు నుండి తెచ్చిన మందు రాసినావు వెంటనే తగ్గింది రా! పోతే పోనీ గాని భలే మందు ఇచ్చినాడు” అంటే అంటుంటే అసలు విషయం వీటికి తెలిస్తే వాడు స్పృహ తప్పి పడి పోతాడేమో అని భయమేసి మౌనంగా నవ్వి ఊరుకున్నాను.మా సాయి తన ఊరికి వెళ్లిన వారం రోజులకు విషయం గూర్చి మా స్నేహితుడికి చెప్పితే వాడు వారం పాటు జడుసుకుని మంచం దిగలేదు.
సంఘటన 3: కొన్ని సంవత్సరాల వరకు నేను మా సాయి ని చూసే అవకాశం రాలేదు. అప్పటికే జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండ పండితుడుగా మారాడని ఎంతో మంది ప్రముఖులు ఇతని దగ్గరకు వస్తూ వారి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించు కుంటున్నారని తెలిసినది.ఏదో దేవాలయంలో పూజారి గానే ఉంటూ ప్రవృత్తిగా జ్యోతిషవేత్త గా ఉంటున్నారు అని తెలుసుకున్నాను. నేను నా చదువు హడావుడిలో నేను ఉండిపోయాను. నాకు తెలియకుండానే మూడు సంవత్సరములు గడిచిన తర్వాత సాయి పనిచేస్తున్న గుడి ఉన్న ప్రాంతానికి వేసవి శెలవులు వస్తే వెళ్లడం జరిగినది. 36 సంవత్సరాల వయస్సు కి వచ్చినాడు. ముఖంలో ఎలాంటి తేజస్సు గాని తగ్గలేదు వర్చస్సు ఇంకా పెరిగినట్లు అనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ ఏదో మొన్ననే చూసినట్లుగా పలకరించి తన విధుల్లోకి వెళ్లిపోయినాడు. నేనేమో నాకు శ్రీశైలం క్షేత్రంలో జరిగిన అనుభవాలు గూర్చి దైవ చింతన గూర్చి మాట్లాడాలని వచ్చినాను. ఏదో గుడి ఆవరణలో పెద్ద గొడవ జరుగుతూ ఉండేసరికి ఏమిటని బయటకు వస్తే అమ్మవారి ఆభరణాలు ఉన్న భోషాణం తాళం గుత్తి కనిపించడం లేదని తెలిసినది. దానిని గుడిలో అలాగే అందరి ఇళ్లల్లో వెతకడం ఆరంభించారు. ఎంత వెతికినా ఎక్కడ వెతికినా తాళాల గుత్తి కనిపించలేదు. తాళాలు లేకపోతే భోషాణం తెరవలేరు. దీనిని తెరవకపోతే అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేము. విచిత్రమైన పరిస్థితి! విపత్కర పరిస్థితి ఏమి జరుగుతుందో చూడాలని నాకు తీయని దురద మొదలైంది! ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం చేసే సాయి ఉండగా నాకైతే ఆందోళన లేదు గాని దీనికి సాయి ఏమి చేస్తారో చూడాలని విచిత్ర కుతూహలం మాత్రం ఉంది! వెంటనే మా వాడు అక్కడ ఉన్న ఆలయ అధికారి తో “నాకు కొంత సమయం ఇస్తే ఈ భోషాణం తాళాలు లేకుండా తెరవటానికి వీలవుతుందో లేదో చూస్తాను” అంటూ ఆ పెట్టెను ఒక గదిలోనికి చేర్చి తను ఒంటరిగా అందులో ఉండే తలుపులు వేసుకున్నాడు. ఏమి చేస్తాడని ఆసక్తితో దొంగచాటుగా కిటికీ గుండా చూస్తే మనవాడు ఆ భోషాణం ఎదురుగా కూర్చుని ధ్యానముద్రలో కళ్ళు మూసుకునే ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత గాలి లోనికి చేతులు లేపి ఏదో తనకు తాళము దొరికితే తీసినట్లుగా భోషాణంను ఖాళీ చేతులతో అలా చేసి బయటకు వచ్చాడు. అసలు లోపల ఏమి జరిగిందో నాకైతే అర్థం కాలేదు. వీడు అర్థం కాడు. వీడి భయంకర చేష్టలు అర్ధమవ్వవని అని అనుకున్నాను.గది ముందరికి వచ్చేసరికి నాకు నోట మాట రాలేదు. ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది. అర్థం కాకపోవడానికి ఏముంది. నా బొంద! తాళం లేకుండానే భోషాణం తెరుచుకున్నది! తన మంత్ర శక్తితో వేసిన తాళం తీసి నాడని నాకు అర్థమైనది. మీకు కూడా అర్థం అయి ఉంటుంది.
సంఘటన:4 ఇది ఇలా ఉంటే ఆ వూరి జనాల మాటలను బట్టి చూస్తే వీడు అప్పటికే స్త్రీ వ్యసనపరుడు అయినాడని అక్కడున్న వేరే ఉపాలయాల పూజారి పెళ్ళాన్ని గోకుతున్నాడని తెలిసినది. నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఏదో ఆడవాళ్ళతో మాట్లాడినంత మాత్రాన అక్రమ సంబంధాలు జనాలు కట్టి పడేస్తున్నారని అనుకొని ఊరుకున్నాను. ఇదే విషయాన్ని వాడిని అడిగితే “అది నిజమే! అబద్ధం కాదు” అనగానే నా బుర్ర తిరిగినది. తప్పు చేయడమే కాకుండా తప్పు చేస్తున్నానన్న భావన కానీ బాధ గాని అతని ముఖంలో కనిపించలేదు. పైగా తన తప్పును నిజంగా ఒప్పుకుంటున్నాడు. అంత గులగా ఉంటే వివాహం చేసుకోవచ్చు గదా! పోయి పోయి పక్క వాడి పెళ్ళాం మీద ఆశ పడటం ఎందుకు? ఇది ఏదో తేడాగా ఉంది. మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వీడే కామమాయలో ఉన్నాడు. వామ్మో! ఇక్కడ ఉండలేము.ఇక ఈ నగ్న సత్యాలు తట్టుకోలేను! వామ్మో! ఎలాగైనా నేను ఊరికి వెళ్లి పోవాలని అనుకున్నాను.వెంటనే సాయి “ఆగు! తొందర పడకు! రెండు రోజుల్లో ఇక్కడ సహస్ర కుంభాభిషేకం జరగబోతుంది.వర్షాలు పడక పోతుంటే శివలింగానికి ఈ సహస్ర అభిషేకం చేయాలని సంకల్పించాను. అనగానే అప్పటిదాకా ఇతని మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా ఎప్పుడైతే పర స్త్రీ వ్యామోహంలో ఉన్నాడని తెలియగానే పూర్తిగా పోయినది. అయినా ఇంటికి వెళ్లి చేసేది ఏమీ లేదు. రెండురోజులు ఉండి ఈ పూజ చూస్తే పోలేదా? పైగా ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఎవరు ఎలా పోతే నాకెందుకు? ఎవరు ఎలా ఉంటే నాకేంటి? ఏదో ఇతని దగ్గర దైవ శక్తి ఉందని ఇన్నాళ్లు నమ్మాను. కానీ పరస్త్రీ వ్యామోహ చేష్టలతో నా మనస్సుకు విపరీతమైన బాధ వేసింది! ఏడ్చేశాను! కానీ సాధనలో వచ్చే కామ మాయ గురించి నాకు తెలియదు. దాని మీద నాకు అవగాహన లేదు.రెండో రోజు తెల్లవారుజామున మన సాయి ఎక్కడా కనిపించలేదు. తల్లి కంగారు పడుతుంది.తోటి అర్చకులు కంగారుపడుతున్నారు. వీరి హడావుడికి నాకు మెలుకువ వచ్చింది. సమయము చూస్తే మధ్యరాత్రి మూడు గంటలు అయింది. ఏమి జరిగినది అని అడిగితే సాయి కనిపించటం లేదని చెప్పారు.ఉదయం 7 గంటలకే సహస్ర కుంభాభిషేకం ఉన్నదని ఇప్పటికే మూడు గంటలు అయినదని వీడు ఉన్నట్టుండి ఎటు వెళ్ళాడు అనుకొని అందరూ తలా ఒక దిక్కు వెళుతుంటే నాకు ఎందుకు సందేహం వచ్చి అప్పుడు వారితో రాత్రి 11 గంటలకు అమ్మవారి ఆలయానికి వెళ్ళడం చూశానని, చేతిలో ఏదో నీళ్ల వంటి సీసాను కూడా తీసుకొని వెళ్ళినాడు రేపు పొద్దున పూజ గదా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలని వెళ్ళాడో ఏమో అని అనుకున్నాను అనగానే వారంతా వెళ్లి గుడిలోకి శివ లింగ మూర్తి గుడి తలుపులు తెరిచి చూస్తే ఏముంది? మీరు ఊహించగలరా? ఊహించలేరు. అక్కడ మనవాడు నగ్నంగా శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని పక్కనే పూజారి భార్య ఒడిలో నిద్రపోతూ, మైధున ప్రక్రియ భంగిమలో పూర్తిగా తాగిన మైకంలో కనిపించేసరికి ఈ దృశ్యం చూసిన వారంతా మీరు మాకు షరా మామూలే కదా అనుకున్నంత తేలిక వారి దగ్గరకు వెళుతుంటే నాకైతే నోట మాట రాలేదు. త్రాగుబోతుకి, తిరుగుబోతుకి మంత్ర విద్య లో బ్రహ్మ జ్ఞానమా! నా స్వామిరంగా? ఇలాంటి చేష్టలు చేసే వ్యక్తి ఇంకొకడు దొరుకుతాడా! వీడు నిజంగానే దత్తాత్రేయుడిని మించిన చేష్టలు చేస్తున్నాడు! వామ్మో! వీడిని నమ్మి ఇక్కడిదాకా వచ్చినాను.వీడి చేష్టలు చూస్తుంటే మతి పోతుంది.ఖచ్చితముగా పిచ్చాసుపత్రికి చేరటము ఖాయం అనుకుంటుండగానే భక్తులు నెమ్మది నెమ్మదిగా రావడం మొదలయ్యే సరికి ఆ గుడిని వీడి చేత ఖాళీ చేయించి ఇంటి లోనికి తీసుకొని వెళ్ళినారు.పూజ సమయం వస్తుంది. మన వాడికి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదు! జోగుతూనే ఉన్నాడు మగతగానే ఉన్నాడు. ఏమి చేయాలో ఎవరికీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా సరిగా 6:40 కల్లా ఎవరో పిలిచినట్టుగా అసలు ఏమి జరిగిందో తెలియనట్టుగా వేగంగా నిద్రలేచి స్నానం కూడా చెయ్యకుండా విభూది పెట్టుకొని మడి బట్టలు కట్టుకుని యధావిధిగా పూజ కోసం గుడిలోనికి వెళుతున్న వాడిని చూసేసరికి నాకు నోట మాట రాలేదు. శరీర శుద్ధి లేదు.మనస్సు శుద్ధి, ఆత్మ శుద్ధి లేదు. కనీసం ఆచార వ్యవహారాలు పాటించడం లేదు. వీడి లాంటి వాడిని నమ్మి “నా స్వామిరంగా! ఈ పూజ చేస్తున్నారు. ఇంకా వర్షాలు ఏమి కురుస్తాయి. ఇలాంటి వాడు చేస్తే వర్షాలు పడతాయి సరే!నా బొంద నా బూడిద! మనకెందుకు !ఈ పూజ తంతు అయ్యేసరికి మనము మన ఇంటిలో అనుకుంటూ ఇష్టం లేని పూజలు చూడాలని నేను శుచిగా, మడిగా, గుడిలోకి వెళ్లడం జరిగింది.పూజ మొదలైంది. మనవాడి మంత్ర స్మరణ బిగ్గరగా సాగుతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. వాడు మంత్రాలు చదువుతున్న విధానం వలన నాకు ఏదో తెలియని తన్మయత్వం నాలో మొదలైంది. నాకే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా మొదలైందని నాకు అర్థం అయింది. వేగంగా మంత్రాలు, అభిషేకాలు జరుగుతున్నాయి.అక్కడ గుడి అంతా వేద మంత్రాల ఘోష తో వినబడుతుంది. ఎంతో శ్రద్ధగా అనురక్తి, ఆసక్తిగా ఏకాగ్రతతో నిశ్చల స్థితి తో పరిసరాలు కూడా మరిచిపోయి ఎంతో బిగ్గరగా మంత్రాలు చదువుతూ కుండలతో శివలింగ మూర్తి అభిషేకము చేస్తుంటే నిజంగా కైలాసంలో పరమ లింగానికి లేదా పరమేశ్వరునికి అభిషేకం చేస్తున్నారా అని అనిపించింది. నాకు కొన్ని క్షణాలపాటు పరమానందయ్య శిష్యుల కథలు లోని అప్పటిదాకా హీరో తన నర్తకి తో రాసలీలలు చేసి శివలింగం కోసం వెతికి ఎక్కడ దొరకకపోతే ఆ నర్తకి వక్షస్థలము శివలింగంగా భావించి ఎంతో తన్మయత్వంతో పూలతో పూజ చేస్తుంటే ఆ పూజ కాస్త కైలాసంలో ఉన్న శివుడు పాదాలకి ఎలా చేరతాయో…. అలా మన వాడు చేస్తున్న పూజలు కూడా ఆయన పాదాలకి చేరుతున్నాయా అనిపించసాగింది. అప్పుడిక వాడు చేసిన వెకిలి చేష్టలు గుర్తుకు రాలేదు.శివుడు ముందున్న నంది లాగా కనబడుతున్నాడు. అప్పటిదాకా రతీమన్మధులుగా కనిపించిన వాడు కాస్త కామేశ్వరుడుగా కనిపించసాగారు. వామ్మో అసలు నాకు ఏమి జరుగుతుంది. అసహ్యం పెంచుకున్న వాడి మీద అనూహ్యమైన దైవభక్తి కలగటం ఏమిటి? అనుకుంటుండగా అభిషేకం పూర్తి అయి గది నిండా నీళ్ళు నిండిపోయాయి. అప్పటిదాకా కనిపించే శివ లింగమూర్తి కనిపించకుండా ఆ సహస్ర నీళ్ళల్లో మునిగి పోవడం జరిగినది. ఆఖరి మంత్రం చదువుతూ ఒక బిల్వ పత్రం ఆ లింగమూర్తి మీద పెట్టి పెట్టగానే గత 31/2సంవత్సరాలుగా రాని వర్ష మేఘాలు ఈయన మంత్ర పూజ దెబ్బకి వచ్చి వారం రోజులపాటు అవిశ్రాంతిగా వర్షాలు కురిశాయని మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా.
అసలు అక్కడ ఏమి జరిగినదో నాకైతే అర్థం కాలేదు. ఒక ప్రక్క చెడు ప్రవర్తన తో ఉంటూ మరొక ప్రక్క దైవాన్ని పంచభూతాలను ఎలా ఆధీనంలో ఉంచుకున్నారో నాకైతే అర్థం కాలేదు దీనిని గూర్చి వారిని అడిగితే “నువ్వు కూడా నాకు లాగే పరిపూర్ణ జ్ఞాని అయితే అన్ని రకాల మర్మ రహస్యాలు తెలుస్తాయి. నేను ఏ వికట వేషంలో ఉన్న నేను వెకిలి చేష్టలు చేసినను ఇందులో శరీరం ఉంటుంది గానీ నా మనస్సు ఉండదు.ఎట్టిపరిస్థితులలోనూ నా మనస్సు జారదు. నేను నిశ్చల స్థితిలో ఉంటాను. నన్ను అనుకరణ చేయకు. కేవలము అనుసరించు. ఏ జ్ఞానిని అనుకరణ చేయకు.అలాగే అజ్ఞానిని అనుసరించకూడదు. అది గ్రహించు! మంత్ర విద్యల జోలికి వెళ్లకు. మంత్ర దేవతలు ఉన్నారో లేరో తెలుసుకో! అసలు ఇంతకీ నువ్వు ఎవరో తెలుసుకో! దీనికోసము నీ మనస్సుని గట్టిగా పట్టుకో! అది ఎక్కడ ఉందో నీకు ఒక కథ ద్వారా చెపుతున్నాను విను!అంటూ…
ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు.
ప్రపంచాన్ని సృష్టించాను.
పసుపక్ష్యాదులను సృష్టించాను.
అయినా తృప్తిగా లేదెందుకని?
ఓ చిన్న ఆలోచన చేసి
తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు.
మనిషి
అని నామకరణం చేశాడు.
అన్ని తెలివితేటలను,
సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు.
ధైర్యం,
సాహసం,
నమ్మకం,
ముందుచూపు,
ఆత్మ విశ్వాసం
నిండా నింపేశాడు.
భూమి మీద
వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది.
వీడు
కాలాంతకుడు,
ప్రాణాంతకుడు,
దేవాంతకుడు
అయిపోతాడేమో..
వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు.
ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు."
అన్నాడు బ్రహ్మ.
"పోనీ ...
నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.
"భేష్....
మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నింటినీ గెలుస్తాడు.
కానీ
తన లోపలికి వెళ్లడు. తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం"
అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ మనోబలం
మనిషి తనలోనే ఉంచుకుని..
బయట వెతుకుతూనే ఉన్నాడు.
అనగా సాధన అంటే బయటచూడకు!బయట చదవకు!లోపలకి వెళ్ళు!లోపల మనస్సు పొరలకి వెళ్ళు!లోపల ఏముందో తెలుసుకో!లోపల ఉన్నవాడు ఎవరో తెలుసుకో!వాడే ఆత్మయని గ్రహించు!వాడే నీవని ఆత్మాభూతిని పొందు! నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే !నాకు మొట్టమొదట చేసిన హితబోధ! అవును! నిజమే కదా! తను స్త్రీ వ్యామోహం లో ఉంటే ఇతను చేసిన పూజకు వర్షాల పడేవి కావు కదా! వర్షం పడింది! నాకున్న మాయ తొలగినది. అంటే సాధనకు మనస్సు శుద్దిగా ఉండాలి. మనస్సు నిశ్చలస్థితి అవ్వాలి. అప్పుడే తను కూడా జ్ఞాని అవ్వటం. అనగా అన్నం తినాలి… దేనికోసం అంటే ప్రాణాలు కోసం… ఇది ఎందుకు అంటే జ్ఞానం కోసం …ఇది ఎందుకు అంటే ఆనందం కోసం …ఇది ఎందుకు అంటే మనస్సు నిశ్చలస్థితి కోసం. ఇది ఎందుకు అంటే మోక్ష ప్రాప్తి కోసమని శాస్త్రాలు చెప్పటం నేను చదివాను. ప్రస్తుతం అలాగే మన వాడు తన మనస్సును నిశ్చల స్థితికి ఎప్పుడో చేర్చాడు అన్నమాట. పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయినారు. చేష్టలు లోకానికి వింతగానూ, విచిత్రంగా అసహ్యంగానూ ఉండవచ్చు కానీ మనస్సు స్థిరమైన వాడు పసిపాప మనస్సు ఉన్న వారితో సమానం అన్నమాట.ఇలాంటి వాడికి తనే పరమాత్మ అను జ్ఞానం కలుగుతుంది. అంటే మనవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండి ఉండాలి. వామ్మో వీడి చేష్టలకు ఇంకా ఎప్పుడు భయపడకూడదు. అసహ్యించుకోకూడదు అనుకుంటూ వాడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ నా జీవితానికి ఆధ్యాత్మిక స్థితి కలిగించటానికి ఒకడు ఉన్నాడని ఆనందపడి నేను మా ఊరికి పయనమయ్యాను.
సాయి విషయం అదే పర స్త్రీ వ్యామోహం కథనాలు బంధువులకి ప్రచారం అయినాయి. దాంతో అందరూ వీడిని దూరంగా పెట్టడం ప్రారంభించారు. పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు వీడి చూపుకోసం ఎదురు చూసే వారంతా వీడి కంటికి కనిపించకుండా దూరంగా తిరగటం ప్రారంభించేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన మొదలైనది! మంచి పదిమందికి చేరే లోపల చెడు మాత్రం క్షణాలలో లక్షల మందికి చేరిపోతుంది. ఒక చెడు జరిగితే అంతవరకు చేసిన మంచి మొత్తం కూడా క్షణాలలో తుడుచుకుని పోతుంది కదా! ఇదే విషయం మన వాడికి కూడా జరిగినది. సన్మానాలు చేసిన వారంతా అవమానాలు చేస్తుంటే తట్టుకోలేక నా పరిస్థితి ఇలా ఉంటే మరి వాడి పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించి వాడు ఉన్న ఊరికి వెళితే… మనవాడు దిగాలుగా బాగా బాధ పడుతూ కూర్చుంటాడు అని అనుకుంటే వాడు కాస్త చదరంగం ఆడుతూ తాపీగా కనిపించాడు. ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమిటని వాడిని అడిగితే దానికి నవ్వుతూ “మానవమానాలు, సన్మానాలు అనేవి నాకు రెండుగా ఉండవు. పొగడ్త అయినా విమర్శ అయినా నా దృష్టిలో ఒక్కటే. ఆనాడు వీరంతా పొగడి దైవ పుత్రుడని అన్నప్పుడు వారంతా ఇప్పుడు కామ పుత్రుడిని అని అన్నప్పుడు నాకు ఏమీ భేదం కనిపించడం లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నా ఆనంద స్థితి ఎలాంటి స్థితి మారలేదు కదా. విమర్శించేటప్పుడు పొగిడేటప్పుడు అదే స్థితిలో ఉన్నాను కదా! దీనిని సమదృష్టి అంటారు! సమ దర్శనం అంటారు! దీనిని సాధించు! అన్నింటా జయం పొందుతారు” అని పంపించి వేసినారు.
సంఘటన:5 కొన్ని నెలల తరువాత అనుకోకుండా వీడిని మళ్లీ కలవడం జరిగినది. అప్పుడు నేను వెంటనే వారితో “అలా పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు” అనగానే దానికి వాడు నవ్వుతూ “నేను ఎక్కడ ఉన్నాను రా?నువ్వే ఆ స్త్రీల గురించి ఆలోచిస్తున్నావు.నేను ఎప్పుడో ఆ స్త్రీలను ఆ క్షణాన్నే గుర్తుపెట్టుకుని వదిలి వేశాను. కానీ నీవు ఆ స్త్రీల ఆలోచనలలో తిరుగుతున్నావు .నేను ఏమి అవుతానో అని ఆలోచిస్తూ నువ్వు ఏమి అవుతావో మర్చి పోతున్నావ్” అని గుర్తించు! నేను ఏమీ కాను! నేను నా సహజస్థితిలో నిశ్చలస్థితి కోసం ఉన్నాను! నేను దేనికీ స్పందించని, ఆలోచించని స్థితిలో ఉన్నాను” అనగానే నాకు కొన్ని అర్థం అయ్యి కొన్ని అర్థం కాలేదు. వాటిని అర్థం చేసుకునే వయస్సు, మనస్సు రెండు కూడా నాకు ఆనాడు లేవు.అప్పుడు నేను వెంటనే గురువా? దేవుడు ఉన్నాడా అంటే వెంటనే అతను “లేడు! కేవలం దేవుడు ఉన్నాడని నమ్మకం మాత్రమే ఉంది. ఈ విశ్వాసమే ఈ విశ్వమును నడుపుతుంది. కావాలంటే చూపిస్తాను రా నా వెంట” అని నన్ను ఊరి చివర కి తీసుకుని వెళ్లి అక్కడే పడి ఉన్న మైలురాయిని తీసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానికి ముందర కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నిలబడి ఏమి జరుగుతుందో చూడు అనగానే ఒక రైతు ఇది చూసి మిగిలిన వారికి చెప్పటానికి వెళుతూ ఉండటం నేను ఓరకంట గమనించటం జరిగినది. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఈ ప్రాంతానికి చేరుకునేసరికి మా పసుపు కుంకుమ మైలురాయికి పూజలు చేసే జనాలతో వందలలో కనిపించేసరికి నాకు నోట మాట రాలేదు. పైగా అక్కడ దీనికి ఒక కొత్త గుడి కట్టించాలని అనుకుంటున్నారని తెలిసేసరికి గతుక్కుమన్నాను.దీనికి బొడ్డు దేవర అని నామకరణం చేసి పూజలు చేస్తున్న పూజారిని చూసేసరికి అసలు అక్కడ ఏమి జరుగుతుందో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. అప్పుడు వాడు వెంటనే “ఆ రాయి ఏమిటన్నది మన ఇద్దరికీ తెలుసు. మనము ఇప్పుడు చెప్పినా వీరు నమ్మరు. పైగా కోపపడతారు. మనకు అంత అవసరమా? వీళ్ళ నమ్మకమే వీళ్ళకి మైలురాయి కాస్త బొడ్డు రాయి గా కనిపించింది. అలాగే దైవ విషయంలో కూడా జరిగినది. లేనివాడిని ఉన్నవాడిగా ప్రచారం చేసినారు. కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నావు కదా! కనిపించే బొడ్డురాయి అసత్యమని కనిపించని మైలురాయి సత్యమని అలాగే పరమ శూన్యమే సత్యమని కనిపించే నామరూపాలు అసత్యమని ఏ నాటికి నువ్వు తెలుసుకుంటావో ఆనాడే నువ్వు నిజ బ్రహ్మజ్ఞాని అవుతావు” అని హితబోధ చేశాడు.
సంఘటన:6 అప్పుడు నేను ఇన్ని తెలిసిన మీరు ఇలా పర స్త్రీల వెంట పడటం పాపం కదా దానికి వాడు చిరునవ్వుతో అవి “నా ప్రస్తుత ప్రారబ్ధ కర్మలు. వాటిని తీర్చుకుంటున్నాను. గత జన్మలలో వీరికి నేను బాకీ ఉన్నాను లేదా వారు నాకు బాకీ ఉన్నారు వాటిని తీర్చుకుంటున్న ఈ విషయాలు నీకు ఇప్పుడు అర్థం కావు. జ్ఞానంలో వయస్సుకు వచ్చిన తర్వాత అర్థం అవుతాయి. మా నాన్న ఇదే పరస్త్రీ ప్రారబ్ద కర్మ కోసం అమ్మను అలాగే తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి వెళ్లిపోయినాడు. వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు తండ్రి అయిన తరువాత కూడా మా నాన్న ఈ పరస్త్రీ వ్యామోహం లో పడి నడిరోడ్డు మీద మా కుటుంబమును వదిలిపెట్టి వెళ్లిపోయినాడు. లేత వయస్సులో నేను నా కుటుంబ బాధ్యతలు మోయవలసి వచ్చింది. పుస్తకాలు ఉంచవలసిన చేతిలో మంత్రాలు ఉంచినారు. పూజారి గా మారి నా కుటుంబ పోషణ చేసినాను. అయినను నాకు బాధ లేదు. ఎంత చేసినా నాకు నాన్న మీద కోపంగాని, కసిగాని, పగగాని, ద్వేషముగాని లేదు. ప్రారబ్ద కర్మ కు ఆయన బలి అయినారని గ్రహించాను. అందుకే అన్నిటియందు రాగద్వేషాలు వదిలేశాను. దేనికి స్పందించటం మానివేశాను. అలా నా వారికి ఈ పరిస్థితి రాకూడదని నాకున్న అన్ని కుటుంబ బాధ్యతలు తీర్చేసుకుని నా వివాహం అయ్యే సరికి అన్ని రకాల ప్రారబ్ద కర్మలు సంపూర్తి చేసుకొని కట్టుకున్న ఆలికి అన్యాయం చేయకూడదని కృతనిశ్చయంతో ఉన్నాను” అని చెబుతుంటే నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా మన వాడు కాస్త బ్యాట్ పట్టుకొని చిన్నపిల్లాడిలా గా క్రికెట్ ఆడటానికి బయలుదేరుతుంటే చిన్న పిల్లవాడో పెద్ద పిల్లవాడో అర్థం కాక కృష్ణుడో నికృష్టుడో అర్థం అవ్వక అలా చూస్తూ ఉండిపోయాను.
సంఘటన:7 సాయంత్రం వేళ ఒక సందేహము వారిని అడిగాను. అది ఏమిటంటే “ఈ విశ్వములో ఏమి ఉంది” అనగానే “ఏమీ లేదు! త్రాడు చూసి పాము ఉన్నదని భ్రమ పడుతున్నారు. కావాలంటే రాత్రికి జరిగే లలితా సహస్రనామ పూజలో జరిగే విచిత్రం గమనించు. నిజం తెలుస్తుంది అనగానే మళ్లీ మన గురుడు ఎలాంటి మాయ చూపుతాడో అనుకుంటూ సాయంత్రం దాకా ఎదురు చూశాను. మనవాడు శ్రీ చక్ర పూజ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన స్త్రీ మూర్తులు అంతా లలితా సహస్రనామాలు చదువుతున్నారు. వీడు ఏమి చేస్తాడో అని నా చూపు అంతా మనవాడి మీదనే పెట్టినాను. కొన్ని నిమిషాల వరకు ఏమీ జరగలేదు. ఇంతలో కరెంటు పోయింది. గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో మన వాడి నీడ గోడ మీద తన నీడ పడవలసిన చోట లలితా దేవి రూపం నీడలో కనిపిస్తుండే సరికి నాకు నోట మాట రాలేదు. అమ్మవారి విగ్రహం ఖచ్చితముగా కాదని అలాగని ఉత్సవ విగ్రహ మూర్తి నీడ కాదని తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ గోడ మీద సాయి నీడ కనిపించాలి. కానీ విచిత్రంగా లలితాదేవి నీడ కనపడుతుంటే ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఎక్కడైనా ఏ మూలనైనా అమ్మవారి విగ్రహం ఉందేమో అని చుట్టూ పరికించి చూసి శోధించి వెతికిచూసినా అలాంటిది ఏమీ లేదని రూఢీ అయింది. అంటే సాయి మనిషి రూపం స్థానంలో లలితా దేవి రూపము నీడగా పడుతుందని నేను గ్రహించే లోపుగా ఇదేమీ తనకు సంబంధం లేనట్లుగా శ్రీ చక్ర అర్చన ఏకాగ్రమైన మనస్సుతో చేస్తున్నాడని గ్రహించాను.అంటే ఉదయం మన వాడు చెప్పిన సాయి మనిషి రూపం పాము అని, ఈ త్రాడు అనేది అమ్మవారని నాకు అర్థం అయింది. ఇలాంటి అనుభవాలు ప్రత్యక్షంగా చూస్తే మతి పోవటం ఖాయం! కానీ ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మలేం గదా అనుకుంటుండగా కరెంటు రావడం… మనవాడు ఏమీ తెలియనట్లుగా యధావిధిగా అందరికీ ప్రసాదం పంచుతూ ఉండేసరికి వాడిని ఏమి అనాలో నాకు అర్థం అవ్వక సతమతమయ్యాను.
సంఘటన:8 ఒకరోజు ఉన్నట్టుండి గుడిలో పంచవలసిన తీర్థము అయిపోయినది. వాడు ఈ విషయము గ్రహించి గుడి వెనక్కి వెళ్లి తన మూత్రము తీర్థ గిన్నెలో పోసి తీసుకొని రావటము నేను గమనించి ఆశ్చర్యం చెందలేదు. ఎందుకంటే పవిత్ర గోమూత్రం తాగి పవిత్రముగా పరిశుద్ధం అవుతుంటే నిజ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందిన అవధూత స్థితి ఉన్న మన సాయి మూత్రము కూడా గోమూత్రం సమానమని నాకు స్పురణ వచ్చేసరికి వాడు దానిని అందరికీ తీర్థముగా పంచటం కనిపించినది. వారికి తీర్థములో ఎలాంటి రుచి మార్పులు గమనించక పోయేసరికి నా మతి పోయింది! ఇలాంటి లీలలు చూస్తే కచ్చితంగా నా మానవ మెదడు దెబ్బతిని నాకు పిచ్చి ఎక్కడం ఖాయమని నాకు భయము వేసి వారికి నమస్కారం చేసి నేను నా ఇంటికి బయలుదేరాను. వారు చూపించిన విచిత్ర చేష్టలు వ్రాయటానికి ఈ గ్రంథం సరిపోదు. అందువలన వారు చేసే విచిత్ర చేష్టలు వలన వీరిని నేను మరింత ప్రేమగా విచిత్ర వేదాంతి అని నామకరణం చేసినాను. ఇక ఇంతటితో నాతొలిగురువుగా జీవసమాధి చెందిన శిరిడిసాయిబాబా వారు అలాగే జ్ఞానగురువుగా జీవసమాధి చెందిన శ్రీ భగవాన్ రమణమహర్షి వారు మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారని అలాగే మంత్రగురువుగా మా నాన్నగారు అలాగే నా దీక్షగురువుగా జీవసమాధి చెందిన శ్రీశైల పూర్ణానందయోగి అలాగే నిజ భౌతిక సిద్ధగురువుగా మా సాయి అన్నయ్య ఉన్నారని తెలుసుకోండి!
నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాలు అన్నియు మా జిఙ్ఞాసికి చెప్పినాను. వాడు వెంటనే “నీవు శివ గాయత్రి మంత్రం చేసినప్పటి నుండి నీ యోగ సాధన స్థాయిలో మెరుగు పడుతున్నావు. దైవ అనుభవాలు పొందుతున్నావు. ఇప్పుడేమో సిద్ధ పురుషుడు తన అరచేతి లో సృష్టించిన మహత్తర యోగం పొందిన యోగ లింగం పొందినావు. అంతవరకు ఉన్నాడో లేడో తెలియని లింగమూర్తిని ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నావు. నేను మాత్రం నా సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ముందుకు వెళ్లటం లేదు అలాగని వెనక్కి వెళ్లడం లేదు. మాయలో పడటం లేదు. అనుభవాలు పొందడం లేదు. మీకు లాగా నాకు ఎప్పుడూ దైవ అనుభవాలు కలుగుతాయి చూద్దాం? అని అనుకుంటుండగా ….. మా వాడికి దీక్ష గురువు గురించి, దీక్ష గురువు వచ్చి చేసిన విషయాలు చెప్పడం… వాడికి ఏకకాలంలో విపరీతమైన కోపానికి గురై “భయ్యా! నీకు మంత్ర గురువు అలాగే దీక్ష గురువు వచ్చి వారి శక్తి మీకు ఇస్తున్నారు కానీ నాకోసం ఇంతవరకు మంత్ర గురువే రాలేదు. బాబాని అడిగితే నీ సొంత తెలివితేటలు మీద ఆధారపడటం వలన జరిగినదని బాబా పుస్తక జవాబు వచ్చింది. నాలో అంత తెలివితేటలు ఉన్నాయా? మీ భక్తిలోనూ నా భక్తిలోనూ అసలు ఏమి తేడా ఉన్నది. నువ్వు ఎలా ఏవిధంగా అర్చనలు, స్తోత్రాలు చదువుతున్నావో అదేవిధంగా నేను కూడా తూచా తప్పకుండా చేస్తున్నాను.మరి నాకెందుకు గురువులు రావటం లేదు? నీకు ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. నేను ఖచ్చితంగా నా భక్తిలో ఎలాంటి లోపం లేదు. ఎందుకంటే నీ భక్తి విధానాలే నేను పాటిస్తున్నాను. ఒక్కటే మన ఇష్టదైవాలు వేరు అంతే తేడా. కానీ నిజానికి వీరు కూడా ఒకటే కదా! ఆ మాటకు వస్తే నీకు వచ్చినట్లే నాకు కూడా గురువు రావాలి కదా! మరి నాకు ఎందుకు రావడం లేదు? లేదు భయ్యా! ఇలా కాదు నేను గురువుల కోసం స్వయంగా వేట మొదలు పెడతాను.నా గురువులు ఎక్కడ ఉన్నారో నేను స్వయంగా తెలుసుకుని వారి నుండి మంత్ర సాధన అలాగే దీక్ష శక్తి తీసుకొని ఆరు నెలలో వస్తాను. ఒకవేళ నాకు ఈ గురువులు కనపడకపోతే కాశీ క్షేత్రానికి వెళ్లి శరీర త్యాగం చేస్తాను. అక్కడ చనిపోతే పునర్జన్మ లేకుండా జీవన్ముక్తి కలుగుతుంది కదా! వస్తే గురువుల శక్తితో వస్తాను లేదంటే చస్తాను అనే విషయం మీకు తెలిసేటట్లు చేస్తాను. మరి “నేను- నువ్వు కూడా ఒకే సమయంలో వేరు వేరుగా గురు గ్రంధం పారాయణాలు ఎంతో శ్రద్ధ భక్తులతో చేశాము గదా! మరి నిన్ను సాయిబాబా అనుగ్రహించినట్లు… నన్ను దత్త స్వామి ఎందుకు అనుగ్రహించలేదు. నాకు ఎందుకు గురువుని ప్రసాదించలేదు. ఒకవేళ నాకు నిజగురుదర్శనము కాకపోతే…. ఆనాటి నుండి నా దృష్టిలో దేవుడు లేడు అలాగే గురువు లేడు. ఏమాయ బంధనం నా యోగ సాధనకు అడ్డు వస్తుందో నేను చూస్తాను. గురువు లేకుండానే యోగ సాధన ఆరంభిస్తాను! నువ్వు మోక్షం పొందుతావో … నేను పొందుతావో చూద్దాం అని ఆవేశపడుతూ ఏదో తెలియని కోపంతో నా దగ్గర నుండి వెళ్లిపోయినాడు! అతని కోపం నాకు అర్థమైనది. గురువు కోసం పడే తపన ఇద్దరు సమానమే గాని గురువును వెతుక్కునే మార్గాలు వేరు అయినాయి. నేను శిరిడి సాయిబాబాని పట్టుకుంటే అతడు దత్తస్వామిని పట్టుకున్నాడు.
ఈయనేమో పరీక్షల పెట్టే యోగ పరీక్ష దత్తుడు గదా! ఒక పట్టాన ఎవరికీ పట్టుబడడు! నానా చంకలు నాకించి నవ్వుతూ కనబడతాడు! సామాన్యుడు లాగా కనిపించే అసామాన్య వ్యక్తి… అందరి వాడిలాగా కనిపించే అందని వాడిని… అందుకోవటానికి మరికొంత కాలం జిఙ్ఞాసికి పడుతుందేమో అని నాకు అనిపించింది! మౌనంగా అతడు వెళ్లే వైపు చూస్తూ ఉండిపోయాను!” అని…. వీరావేశంలో శపథం చేసి నేను ఏమి చెప్పేది కూడా చెబుతున్నది వినిపించుకోకుండా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాయువేగంతో గురువులను చూడాలనే కసితో ఇంటి వైపు వెళ్లిపోతున్నారని చూస్తూ కళ్ళు అప్పగించి చూడడమే తప్ప ఏమీ చేయలేక పోయాను.ఎందుకంటే వాడు కూడా మోక్షగామి. మోక్ష ప్రాప్తి పొందాలని తీవ్రంగా తపిస్తున్న కారణజన్మ యోగి. కానీ గురువుల దర్శనం లేకపోవటం వారి యోగసాధన ఆగిపోతుంది ఏమో అని… అనేక జన్మలు ఎత్తుతూనే ఉండాలనే వారి ఆవేదన తెలియజేస్తోంది. ఇక్కడ నాకేమో సాధన స్థాయి పెరుగుతుంటే వాడికేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు గా ఉన్నది. ముందుకు వెళ్లటం లేదు అలాగని వెనక్కి వెళ్లడం లేదు.మాయలో పడటం లేదు. అసలు మాయ పరీక్షలు జరిగితే గాని మన సాధన స్థాయి పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలిసేది. వాడు మహా మొండి. పట్టుపట్టాడు అంటే అది పూర్తయ్యే దాకా వదిలిపెట్టడు. దాని అంతు చూసేవరకు వాడికి ఆకలి, నిద్ర, భయం, అన్నపానీయాలు పట్టించుకోడు. అనుకున్నది జరగకపోతే ఎంత దాకా అయినా వెళ్లిపోతాడు. వెనకా ముందు ఆలోచించడు. అప్పు అన్న, అప్పులు ఇవ్వాలన్న తీసుకోవాలన్న వాడికి తట్టుకోలేని మనస్తత్వం. అలాంటి వాడు ఇలా ఉగ్రంగా మారిపోయి తీవ్ర భీష్మ ప్రతిజ్ఞ చేసే స్థాయికి వచ్చాడు అంటే ప్రకృతి ఏదో విషయం వీడిద్వారా లోకానికి తెలియజేయాలని అనుకుంటోందని అది మనకు తెలిసే దాకా వీడు మనకు కనిపించడు అని అవగతమై భారమైన హృదయంతోచెప్పి ఆవేదనతో ఇంటికి వెళ్లిపోయాడు. వాడు చెప్పినది నిజమే కదా. నాకు గురు మంత్రం అనుగ్రహం వలన దైవ అనుభవాలు కలగటం ఆరంభమైనది. పాపం వీడికి ఇంకా గురు మంత్రం కలగడం లేదు. దైవ అనుభవాలు ఎందుకు కలగడం లేదు. నేను నా సాధనలో ముందుకు వెళుతున్నాను. వాడు సాధనలో ఆగిపోతున్నాడో అర్థంకాని అయోమయ స్థితి.మా సమస్యకు ఎవరు సమాధానం ఇచ్చే వారు లేరు. వాడికి ప్రత్యక్ష భౌతిక గురువు అనే వారు లేరు. కేవలం నా గురువులు ఇప్పటిదాకా నాకు తారసపడినారు.పాపం జిఙ్ఞాసికి అది కూడా ఇంతవరకు కలగలేదు. ఏమి చేద్దాం? ఏమి చేయాలో? ఎలా చేయాలో? రాబోవు కాలమే నిర్ణయించాలి. నిర్ణయించటానికి అనుకోవటానికి నేను ఎవరిని అనుకుంటూ గుడి లోపలికి వెళ్లి పోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి జిఙ్ఞాసి తన గురువుల కోసం ఉన్న ఉద్యోగం, ఉన్న ఊరును, ఉన్న వారిని అందరిని వదిలేసి ఎవరితో చెప్పా పెట్టకుండా పారిపోయినాడు అని తెలిసి…. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక… ఏమి చేయాలో… ఏమి అనాలో…. అర్థం కాక…. వాడు తిరిగి వచ్చేటట్లుగా నా ఇష్ట దైవాన్ని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోయాను. గాకపోతే వీడు వెళ్ళుతూ నా జీవితమును మలుపు తిప్పే సంఘటనలో ఏమి చేసి వెళ్ళినాడో తెలుసుకోవాలని ఉందా... ఇంక ఆలస్యమెందుకు! నాతోపాటు గా ముందుకు పదండి.
శుభంభూయాత్
పరమహంస పవనానంద
********************************
గమనిక: మీరు ఈ అధ్యయములో ఒక విషయము గమనించారా? మా గురుదేవుడు నాకు ఎనిమిది(8) రకాల విచిత్ర సంఘటనలు చూపించడము జరిగినది! ఈ ఎనిమిది ప్రతి ఒక శిష్యుడిలో ఉండే అష్టపాశాలకి సంకేతము! అవి ఏమిటంటే...1.సంశయం 2.అసహ్యం 3.భయం 4.బలం 5. శీలం 6. మోహం 7. దయ 8. అజ్ఞానం. ఇవి ప్రతి నిజ గురువు అయితే వీటిని నాశనము చేస్తాడు! అలాగే నిజగురువు అయితే తన శిష్యుడికి పరమానంద ప్రశాంత స్ధితిని కల్గిస్తాడు! ఎనిమిది పాశాలు అనగా ఇందులో దయ అనేది రాగ లక్షణము అయితే అసహ్యం ద్వేష లక్షణము అలాగే నా వంశమే నాకు బలము...నేను శీలవంతుడిని...ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక పోవడమే సంశయము…. నాకు అన్నియు తెలుసన్న అజ్ఞానం, మనస్సులో ఉండే వివిధ రకాల భయాలను, అన్నింటి మీద మమకారాలు పెంచుకోవడమే మోహం అవుతుంది! వీటిని ఈయన నా విషయములో ఎలా నాశనము చేసినారో మీకు వివరంగా చెప్పటానికి అనగా సంఘటన:1- సంశయం, సంఘటన:2- భయం, సంఘటన:3- బలం, సంఘటన:4- మోహం, సంఘటన:5- అజ్ఞానం, సంఘటన:6- శీలం, సంఘటన:7- దయ, సంఘటన:8- అసహ్యం! అనగా నాలో ఉన్న అష్టపాశములను ఈయన ఈ ఎనిమిది విచిత్రసంఘటనలు ద్వారా నాలో నాశనము చేసినారు! ఆతర్వాత మా విచిత్రవేదాంతి నాకు ఏవిధంగా పరమానందమును కల్గించినారో తెలుసుకోండి!
కొన్ని సంవత్సరముల తరువాత ఈ నాకు ఈయన భౌతిక దీక్ష గురువుగా మరి నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేసినారు. జ్ఞాన జ్యోతి నాలో వెలిగించారు.తన మాటలతో, తన చేష్టలతో, నా ఆధ్యాత్మిక స్థితిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చినారు. తనకి లాగా మంది గురించి ఆలోచించకుండా మది గూర్చి ఆలోచించటం అలవాటుగా చేసినారు. నా స్వాధిష్టాన చక్రంలో మహాలక్ష్మి ధన మాయ వలన నేను ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నేను తీసుకున్న ఇంటికి EMI కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, నేను చదువుకున్న కంప్యూటర్ చదువులు నాకు అవసరానికి ఉపయోగం పడనప్పుడు వారిని సంపూర్తిగా అఖండ విశ్వాస భక్తితో నమ్మేసరికి…. నాకు జీవిత మార్గదర్శి అయ్యి…. కేవలం నిమిషాలలో జ్యోతిష్య శాస్త్ర మెళుకువలను నేర్పించి అనగా వాడికి ఉన్న జ్యోతిష్య జ్ఞానం నాకు శక్తిపాత సిద్ధితో ప్రసాదించి నన్ను జ్యోతిష్యవేత్తగా మార్చి నా ఆర్థిక స్థితిని, నా విషయ స్థితిని, నా ఆధ్యాత్మిక జీవిత స్థితిని సమూలంగా మార్చివేసి వెనుతిరగని స్థితికి చేర్చినాడు.
తను చేసిన అన్ని రకాల హోమాలు చేయించుకున్న వారి కుల దైవాలను, వారి ఇష్టదైవాలను వారికి హోమ దేవతలుగా హోమాలలో చూపించి వారికి జాతక సమస్యలు నివారించడంలో నాకు ఎనలేని సహాయ సహకారాలు అందించినారు. నాకు ఈ విధంగా పరమానందమును కల్గించినారు.
వీరు నా జీవితంలో లేకపోతే నాకంటూ ఆధ్యాత్మిక జీవితం ఉండేది కాదు. ఇలా మీ ముందు జ్ఞాన బిక్షువుగా ఉండే వాడిని కాదు. రోడ్డుమీద బిక్షం ఎత్తుకునే వాడిని. నిజ జ్ఞానం పొందిన వారు అవధూత స్థితిలో, పరమహంస స్థితి లేదా సిద్ధ యోగి స్థితి పొందిన వారు తమ మాయ చేష్టలు ఇలాగే ఉంటాయని దత్తాత్రేయ జీవిత గాథ తెలుపుతుంది. అలాగే దశ దత్త గురువుల జీవిత చరిత్రలను చదివిన తర్వాత కూడా నాకు తెలిసినది. దేనికి స్పందించకుండా, దేని గురించి ఆలోచించకుండా, దేనికి సంకల్పించుకుని ఉండకుండా తన మనస్సు నిశ్చల స్థితి పొందటానికి ఇలాంటి వారు తన చుట్టూ ఉండే ప్రసాద భక్తులను దూరం చేసుకోటానికి అలాగే నిజ భక్తులను అక్కున చేర్చుకోవడానికి ఇలాంటి చేష్టలు చేయాల్సి వస్తుందని నేను ఇలా చేసే స్థాయికి వచ్చినప్పుడు ఇంతకంటే భయంకరమైన చేష్టలు నేను కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆనాడు వాడి చేష్టలు చూసి నేను ఎలా భీతి చెందినానో ఈనాడు నేను చేసే చేష్టలకు అలాగే నా చుట్టూ ఉన్న ప్రసాద భక్తులు భయపడుతుంటే నాకు నవ్వు ఆగలేదు. ఆగటంలేదు. వినోద క్రీడ లాగా అనిపించసాగింది. ఇంతకీ సాయి ఎవరో తెలుసా? "గీతా ప్రపంచం" అనే మహత్తర గ్రంథము రచించిన బుద్దు కుటుంబరావు గారి కూతురి బిడ్డ అన్నమాట. నేను కూడా వీరి వంశములోని వాడినే కావటం వలన నాలో కూడా ఆధ్యాత్మిక బీజాలు పడినాయి. వాటిని మొక్కలుగా మార్చినవాడు మన వాడైనా సాయినాథ్ అన్నమాట. విచిత్రమేమిటంటే నా తొలి గురువు షిరిడి సాయినాథ్ అయితే నా మలి గురువు మా అన్నయ్య అయిన సాయినాథ్ అన్నమాట! వీరు కొన్నాళ్ళకి వివాహం చేసుకొని సంతానం కనటం తేలికే కానీ వారిని సాకటం చాలా కష్టమని ముందే తెలుసుకుని ఉండటంతో సంతానము వద్దని ఏకపత్ని ధర్మంతో మనస్సుకు నచ్చిన విధంగా ఉంటూ… రాత్రి సినిమాలకు వెళుతూ, పది నిమిషాలకు ఒక సిగరెట్టు కాలుస్తూ… సర్వ సుఖ భోగాలు అనుభవిస్తూ, రాత్రిళ్లు గుప్తంగా యోగ సాధనలు చేసుకుంటూ… తన విచిత్ర చేష్టలకు స్వస్తి పలికి అందరినీ దూరంగా ఉంచుతూ…. ఏకాంతంగా మంది గురించి ఆలోచించకుండా…. మదిలో అద్వైత సిద్ధి సాధన కోసం అహర్నిశలు మానసికంగా కష్టపడుతూ… తన నిజ యోగ సాధకులకు తన సహాయ సహకారాలు అందిస్తూ… భోగులకు మహామాయ స్వరూపంగా కనిపిస్తూ… యోగులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా కనిపిస్తూ… భోగంలో తల్లి మాయ దాటలేక… యోగములో పరమ శివుడి యోగమాయ దాటలేక…. ధ్యాన బ్రహ్మగా సాధన చేస్తూ… శాశ్వత మరణం కోసం నీలి ఆకాశం వంక చూస్తూ విచిత్ర వేదాంతిగా కొనసాగుతున్నారు! ఈ విధంగా ఏ మహాత్ముడు తన శిష్యునికి యొక్క అష్టపాశములను కరుణ అనే ఖడ్గముచేత ఛేధించి నాశనము చేసి మనకి శాశ్వత బ్రహ్మానందమును కలుగుచేస్తారో వారే మనకి నిజ భౌతిక సిద్ధగురువని ఆదిగురువైన మేధాదక్షిణమూర్తి తన గురుగీత ద్వారా లోకానికి చెప్పడముతో ఆనాటి నుండి వీరిని నా భౌతిక సిద్ధగురువుగా ఎంచుకోవడము జరిగినది!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిscience ki link petti maatrame namme mee annagaaru thanavalla kosam
రిప్లయితొలగించండిpujalu cheyatam vichitram.... mokshalinganni ee saari theesukoni shakthulu unnaya leda
chuddamani chesina praytnam lo paalalinga darshanam alage naagapadigala bilvapatram ee rendu
shakthulu chupinchadam....adi mee annagaaru nammakapovatam dhaniki nidarshananga
bhayamkara kala raavatam dhaniki meere parishkaaram chupatam....annitikante meeru
yadhbhaavam thadhbhavathi ani vadilesanu annaru kada edi baganipinchindi.
87meeku mantra siddhi avvadamu shivudu kanipinchi mee guruvuki pareekshalu
pettukomani cheppatamu meeru 12 samvathsaraalu pareekshalu pettam anthakumunde meeku
aayna chinthamani durgadevini chupinchatam,shiridi nunchi mimmalni theesukuraavatam chesina
malli enni pareekshalu pettaru.....sainadh gaaru annitlo dhitta ani, siddhulu pondinarani meeru
prathyekamuga choosina chithralekhanamu. 1. mike set povatam manishi roopurekhalu,
puttumachalu mainga cheppula size tho sahaa cheppatam aascharyam munde vasthuvu dorakadani
cheppadam alage jaragatam... 2. thelu kaatu vishamuku cigarette boodidha? edi nijanga vichitram.
mee shehithudu daduchukoka em chesthadu papam. 3.ammavaari boshaanam thaalalu
kanipinchakapovatam...wow! mantra shaktitho kuda thaalam veyochani ippude thelisindi edi nijanga
bagundi. dhyaana mudralo kurchoni theeyatam adi meeru kitiki lonchi cudadam.... asalu ye chance
miss cheyaledu kada...... 4. sthri vyasana parudila kanipisthu nak ekkada dimma thirgindi ante
andaru ayna nagnanga padukunnadi choosi kuda edi maaku maamule ani theesukuvellaru inkoti
6:40 ki emi jaraganattu maamulga raavatam ikkada nota maata raaledu, meeru ikkada evaru ela
unte nakenduku anukoni motham puja chudalani aagipoyaruga edi nachindi. intha jarigina varsham
padatam ye shuddhi lekunna edi jargatam aascharyam.
brahma srushtikadha bagundi manishi anni jayisthadu kaani thanani thaanu jayinchaledu ani cheppatam...5. meere aa sthrila gurinchi mosthunnarani ayanaki emi
sambandham ledani cheppatam. ika devudu unnada ane prashnaki mailurai tho prathyakshanga
chupinchatam. mari aa vayassuloe meeru ala thelsukunnaru kada mari devudini
nammalanipinchinda leda emi cheppaledu. 6. prarabdha karmalanu pelliki munde theerchukoni pelli
tharuvatha thana bhaarya ki maatrame ankitham avvatam ikkada na prashnaki samaadhanam
dorikindi. annitikante thandri meeda ye spandana lekapovatam vishesham. 7.abbabba!! em
chepparu thaaduni chusi paamu ane daaniki manchi anubhavam kalipincharu kaani meerannattu
prathyakshamuga chusthe kaani nammalemu. 8. theerdhamu kosam muthram ni gomuthra
samaanamani cheppatam ikkada mee pancha guruvulu evarani thelpatam jignyasi gaari aaveshamu
samanjasame. prathi saadhakudiki jignyasi laanti thapana undali..... gamanika: ashtapaashalu ante
emiti ani theliparu vaatini sangatanalatho meeku arthamayyela chesaru inka memu waiting meeku
aanandam ela kaligincharo ani.
అమ్మ కి పిన్ని కొడుకు .. మీకు మెనమామ అవుతాడు కదా , మరి అన్నయ్య అని అన్నారు
రిప్లయితొలగించండి