ఆరంభం
జీవిత ప్రయాణ రైలు నుండి ఒక అమ్మాయి దిగి కాశీ క్షేత్రానికి చేరుకుంది . ఇది ఈమె జీవితానికి ఆరంభ క్షేత్రం . చూడటానికి ఈమె 32 సంవత్సరాల వయసు ఉన్న యువతిలా ….నల్లని శరీరంతో, భుజానికి ఒక బ్యాగ్, చేతిలో ఒక బాటిల్ తో, కళ్ళలో ఏదో తెలియని బాధ, ఆవేదన చూపులతో దేని గురించో తీవ్రమైన ఆలోచన చేస్తున్నట్టుగా ఈ క్షేత్రంలో అడుగు పెట్టింది. ఆమెకి ఈ క్షేత్రం గురించి తెలియదు. జీవితంలో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. దేనికోసమో తెలీదు. బస్టాండ్ లో కూర్చుని బాధతో నిండిన కళ్ళతో, మనోవేదనతో దిగాలుగా కూర్చుని …. కళ్ళనుండి నీళ్లు కారుతుంటే …. ఎవరైనా చూస్తారేమో అని అనుమానా భయంతో కళ్ళు తుడుచుకుంటూ…. అసలు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంది. చుట్టూ ఉన్నవాళ్లు పట్టించుకోవడం లేదు. ఆమెకి మరింత బాధ పెరిగింది. అయినా చావటానికి వచ్చి, బతకడానికి ఎందుకు ఆలోచన చేయడం అని తన సంచి తీసుకుని ఈ క్షేత్రంలో ఉన్న కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని గుడికి బయలుదేరింది. తన దగ్గర ఉన్న ఫోన్ ద్వారా ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నది. ఈమె తెలుగు అమ్మాయి కావటం వల్ల ఈ క్షేత్రంలో ఉన్న కేదార శివలింగం ఉన్న ఘాటు వద్ద తెలుగు వారు ఎక్కువగా ఉంటారని తెలుసుకొని అక్కడ ఉన్న ఒక హోటల్ రూమ్ తీసుకోవడం జరిగింది. తన సామాన్లు సర్దుకుంది. ఆ రూమ్ లో ఉన్న మంచం మీద పడుకొని తీరని ఆలోచన చేస్తుంది. ఇంతలో మళ్ళీ కళ్ళ వెంబట నీళ్లు రావటం మొదలైంది. తనలో ఆవేదన ఆరంభమయ్యింది. ఇలా కాదనుకొని దశాశ్వమేధ ఘాట్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేసి బయటకు వచ్చింది. ఈ క్షేత్రంలో ఉన్న కాశీ విశ్వనాథుడు ,కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దర్శనానికి వెళ్లాలని ….
ముందుగా ఈ క్షేత్రపాలకుడైన కాలభైరవుని గుడికి వెళ్లాలని నెట్ సమాచారం ద్వారా తెలుసుకుంది. దానితో ఈ గుడి ఉన్న దశాశ్వమేధ ఘాట్ కి వెళ్ళింది. అక్కడ కాలభైరవుని దర్శనం చేసుకుంది. ఆయన ముందు కూర్చుని ఒక పది నిమిషాల పాటు కళ్ళు మూసుకుంది. ఇంతలో తనలో ఏదో ఆవేదన మొదలై కన్నీరు రావడం ఆరంభం అయ్యింది. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు గమనిస్తారని కళ్ళు తుడుచుకొని… కాలభైరవునికి నమస్కారం చేసి ఆ గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేసుకొని, గుడి దగ్గర ఉన్న షాపులో కాలభైరవ నల్ల త్రాడు కట్టుకుని, కాశీ విశ్వనాధుని దర్శనానికి అని బయలుదేరింది. ఇలా బయలుదేరేటప్పుడు ఒక చెంబులో కాశీ గంగాన తీసుకొని, దళాలు తీసుకుని, పూలు తీసుకొని ఆ కాశీ విశ్వనాథునికి తన చేతుల మీదగా అభిషేకం చేసుకోవాలని ఈయన దర్శనానికి బయలుదేరింది. క్యూ లో నిలబడింది. చాలామంది దర్శనానికి రావడంతో రద్దీగా ఉన్నది.
మొదట అక్కడ ఉన్న డుండి గణపతిని దర్శనం చేసుకుంది.
ఆ తర్వాత గుడి లోపలికి వెళ్లి కాశీ విశ్వనాథ లింగాన్ని దర్శనం చేసుకుంది. తను తెచ్చిన గంగ నీళ్ల చెంబుతో విశ్వనాథ శివలింగానికి అభిషేకం చేసి మనస్ఫూర్తిగా తాకింది. ఏదో తెలియని ప్రశాంత ఆనంద స్థితి ఒక్క క్షణం పాటు కలిగింది. ఆ తర్వాత బయటకు వచ్చింది. అక్కడే ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత దర్శనం చేసుకుంది. ఏదో తెలియని ఆనందం ఒక క్షణం పాటు కలిగింది. ఈ జన్మ ఆదిదంపతులైన కాశీ విశ్వనాథ, అన్నపూర్ణ దర్శనం అయినదని మనసులో ఏదో తెలియని సంతోషం కలగసాగింది. ఆ తర్వాత అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళటం జరిగింది. అక్కడ పూజారి ఈమెను దగ్గరికి పిలిచి, తల్లి! నువ్వు కాశీకి రావడం ఇదే మొదటి సారా! అని హిందీలో అడగడం జరిగింది. అవును స్వామి! అంటే…. దా…! నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి అమ్మవారిని దగ్గరగా చూపించాడు. అక్కడ గుడి లోపల మొదట ఒక అమ్మవారి రాతి విగ్రహం కనబడింది. ఆ తర్వాత దీని వెనకవైపు రెండవ అమ్మవారి విగ్రహం ఉన్నట్లుగా కనబడింది. మొదట విగ్రహ మూర్తి నూతనంగా ప్రతిష్ట చేసినట్టుగా, రెండవ విగ్రహ మూర్తి పురాతన విగ్రహం మూర్తిగా కనిపించింది. అప్పుడు ఆ పూజారి హిందీలో…. అమ్మ! ఆ వెనుక వైపు ఉన్న అమ్మవారు నిజమైన అమ్మవారు…కాకపోతే తురష్కుల దాడి వలన అమ్మవారి విగ్రహం ముక్కలు చేయడం జరిగింది. పూజకు పనికిరాదు కానీ….. ఇది స్వయంభు అమ్మవారి కావడం చేత, ఆ అమ్మవారి శరీర భాగాలన్నీ అతికించి ఒక విగ్రహం మూర్తిగా చేసాము. పూజకి అర్హతగా నూతనంగా ఇలాంటి అమ్మవారి మూర్తిని చెక్కించి పెట్టడం జరిగింది. దీన్ని శృంగేరి పీఠాధిపతులు ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహ మూర్తి కూడా తురష్కుల చేతిలో మొక్కలైతే …..దానికి కూడా ఇలాగే చేసి నూతన విగ్రహంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ దత్తాత్రేయుడు ప్రతిరోజు స్నానం చేసి, ఆయన ప్రతిష్ట చేసిన దత్త శివలింగం కూడా మనకి కాశీ విశ్వనాథుని లింగానికి పశ్చిమ దిక్కులో కనబడుతుంది. అక్కడ మనకి దత్తాత్రేయ విగ్రహ మూర్తి అలాగే ఆయన ప్రతిష్ట చేసిన శివలింగం కూడా చూడవచ్చును. అలాగే భాస్కరరాయులు అనే ఆయన ….లలితాదేవి ఉపాసన చేసిన శ్రీ చక్ర శివలింగం కూడా ఈ విశ్వనాధుని గుడిలో మనం చూడవచ్చును అని చెప్పి నిజానికి నాకు తెలిసినంతవరకు, నిజమైన కాశీ విశ్వనాథ లింగం ఔరంగజేబు చేత కట్టబడిన మసీదులో ఉన్నదేమో అని నా అనుమానం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాశీ విశ్వనాథ గుడిలో ఉన్న పెద్ద నందీశ్వరుడు మసీదు ఉన్న కిటికీ వైపుకు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ లింగం ఒకనాటి అహల్యబాయి ప్రతిష్ట చేసిన లింగం. ఈ లింగానికి ఎదురుగా ఒక చిన్న నంది చూస్తున్నట్లుగా ఉంటుంది. కానీ పెద్ద నంది మాత్రం మసీదు గోడ వైపు ఈ కిటికీ ఉన్న వైపు చూస్తుంది. ఈ కిటికీ వెనక వైపే లోపల వైపు మనకి ఒక పెద్ద శివలింగం కనబడుతుంది. దాని పక్కనే ఒక చిన్న శివలింగం కనబడుతుంది. ఆ శివలింగమే కాశీ విశ్వనాథ లింగం అని మా తాతలు చెబుతూ వస్తారు.. కొంతమంది అభిప్రాయం ప్రకారం త్రేతా యుగంలో…. రాములవారు రామేశ్వర క్షేత్రంలో , రావణా బ్రాహ్మణ హత్యాదోషం నివారణార్థం శివలింగ ప్రతిష్ట చేయాలని సంకల్పించారు. అప్పుడు శివలింగం కోసం హనుమంతుడిని తెమ్మని ఆజ్ఞాపించగా…. ఆయన కాశీ క్షేత్రమునకు చేరుకొని తన చేతులతో ఒక శివలింగమును తీసుకొని వెళ్లి రామేశ్వరంలో ప్రతిష్ట చేశారని చెప్పడం జరిగింది. ఈయన అక్కడికి తీసుకొని వెళ్లే లోపల ప్రతిష్టా సమయం మించిపోతుందని, సీతాదేవి తన చేతుల మీదుగా .. మట్టితో చేసిన శివలింగమును అప్పటికే శ్రీరాములు ప్రతిష్ట చేయడం జరిగింది. తను తెచ్చిన కాశీ విశ్వనాథ లింగమును అదే గుడిలో మరొక చోట ప్రతిష్ట చేయడం జరిగింది. అందుకనే కాశీ యాత్ర పూర్తి కావాలంటే రామేశ్వరం నుంచి తెచ్చిన ఇసుకను కాశీ క్షేత్రం గంగలో కలపాలని, అలాగే ఈ క్షేత్రంలో ఉన్న నీళ్లను తీసుకుని రామేశ్వర క్షేత్రంలోని లింగానికి అభిషేకం చేయాలని మన పెద్దలు చెప్పటం జరిగింది. ఇందులో సత్యాసత్యాలు ఏమిటో కాలానికే తెలియాలి. యద్భావం తద్భవతి. అంటూ ఆమె గోత్రనామాలు అడిగి పూజ చేసుకొని ఆమె అతనికి దక్షిణ ఇచ్చి ఆ పూజారికి నమస్కారం చేసి గుడి బయటకు రావడం జరిగింది.
అక్కడ ఉన్న 84 ఘాట్ లోని దేవాలయాల దర్శనం చేసుకోవడానికి అని ఒక గైడ్ సహాయం తీసుకుని ఆ గైడ్ ద్వారా అక్కడ ఉన్న 84 ఘాట్ లను చూడడం జరిగింది.
శివ నందిని కాశీలో చూసిన 84 ఘాట్ ల వివరాలు:
ఈమె మొదటగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆది కేశవ ఘాటుకి చేరుకుంది. ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం దర్శనం చేసుకుంది.
ఆ తర్వాత అహల్య బాయి ఘాట్ వద్దకు చేరుకుంది. ఈ రాణి అహల్యాబాయి కాశీ విశ్వనాథ ఆలయంలోని లింగంతో పాటుగా అమేథీ ఆలయంతో సహా మరెన్నో దేవాలయాలను నిర్మించింది అని గైడ్ చెప్పగా తెలుసుకుంది.
ఆ తర్వాత అస్సీ ఘాట్ కు చేరుకుంది. ఈ ఘాటు వద్ద సాయంత్రం వేళలో గంగా హారతి జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక రావి చెట్టు కింద శివుని లింగం కూడా కనిపించింది. ఇక్కడి నుంచి పడవ ప్రయాణాలు కూడా చేయవచ్చని గైడ్ చెప్పగా తెలుసుకుని ఈ రావి చెట్టు కింద ఉన్న శివలింగానికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరింది. ఇక్కడే హనుమాన్ మందిరం కూడా దర్శించుకుంది.
బద్రి నారాయణ ఘాట్ వద్దకు వెళ్లగానే…గతంలో దీనిని మహాత ఘాట్ గా కూడా పిలిచేవారు కానీ ఆ తర్వాత ఇక్కడ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించడం వల్ల బద్రీనాథ్ ఘాట్ గా మార్చారు అని చెప్పడంతో అక్కడ ఉన్న బదిరి నారాయణునికి నమస్కారం చేసుకుంది.
ఆ తర్వాత బాజీరావు ఘాటుకు చేరుకుంది. ఇక్కడ దత్తాత్రేయే శ్వర ఆలయం కనిపించడంతో నమస్కారం చేసుకొని మరొక ఘాటుకు బయలుదేరింది.
ఆ తర్వాత చాలామంది తీర్థయాత్రలు చేసేవారు ఎక్కువగా దర్శించే బౌలి ఘాట్ కు చేరుకుంది. దీనినే ఉమా రావు గిరి లేదా అమ్రోహ ఘాట్ అని కూడా పిలుస్తారు అని ఇది చాలా పురాతనమైనది అని తెలుసుకుంది.
ఆ తర్వాత భోంస్లే అనే ఘాటుకు చేరుకుంది. ఇక్కడ మరాఠీయులు నిర్మించిన భోంస్లే ప్యాలెస్ నువ్వు సందర్శించి ఆ తర్వాత యమేశ్వర మరియు యమాదిత్య ఆలయాలను సందర్శించుకుంది.
వారణాసి నగరం మొత్తానికి నీటి అవసరాలు తీర్చే అతి పురాతనమైన ఘాట్ భాదైని ఘాటని గైడ్ చెప్పగా తెలుసుకుంది.
ఆ తర్వాత గంగా మహల్ ఘాటు వద్ద ఉన్న బెనారస్ మాజీ మహారాజు రాజభవనాన్ని దర్శించుకుంది.
ఇక్కడ రీవా అనే ఘాట్ లో రాజుల కాలం నాటి ప్యాలెస్ ను సందర్శించింది.
ఆ తర్వాత తులసి ఘాటుకు చేరుకుంది. మహాకవి తులసీదాసు పేరు మీదగా దీనికి తులసి ఘాటు పేరు పెట్టడం జరిగిందని ఈ ఘాటు వద్ద ఒక హనుమాన్ ఆలయాన్ని ఒక మతం మరియు అస్సహాను స్థాపించారని ఒకప్పుడు ఈ ఘాటును లోలార్క్ ఘాటని పిలిచేవారు అని గైడ్ చెప్పడం జరిగింది.
ఆ తర్వాత జానకి ఘాటుకు చేరుకుంది. దీనిని ఒక బీహార్ రాణి నిర్మించారని చెప్తారు. అయినప్పటికీ జానకి అనేది రాముడి భార్య సీతకి మరో పేరుగా కూడా చెప్తారు అన్నట్టుగా గైడ్ చెప్పడం జరిగింది.
ఆ తర్వాత ఆనందమయి ఘాటు వద్దకు చేరుకుంది. ఈ ఆనందమయి అనే ఆవిడ ఒక మహిళ సాధువు. మన కాశీలో ఉన్న ఘాట్లలో చాలా వరకు కూడా కొన్నింటిలో ఆలయాలు మరికొన్నింటిలో ప్యాలెస్లు నిర్మించడం జరిగింది. ఈ ఆనందమయి అనే సాధువు బాలికల కోసం ఒక ఆశ్రమాన్ని ఈ ఘాటు పై నిర్మించిందని చెప్తారు.
వచ్చ రాజు ఘాట్ అనే ఘాటుకు దగ్గరలో చాలామంది జైన సంప్రదాయం కి చెందిన వాళ్లు నివసిస్తూ ఉంటారు. ఇది జైన సాంప్రదాయంలోని ఏడవ తీర్థం కరుడైన సుపార్శ్వ నాథుని జన్మస్థలం అని కూడా నమ్ముతారు.
జైన్ ఘాట్ కూడా వచ్చరాజ్ ఘాట్లో భాగంగా ఉండేది ఇక్కడ పడవ నడిపేవారు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు.
ఆ తర్వాత నిషాద్ ఘాటుకు చేరుకుంది. రామాయణంలో రాముడు సీతా మరియు లక్ష్మణుడు సరయునదిని దాటడానికి సహాయం చేసిన నావిక అధిపతి అయినా నిశాధుని పేరు మీద ఈ ఘాటు కు ఈ పేరు పెట్టడం జరిగింది .
ప్రభు ఘాట్ …మహారాజు ప్రభువు నారాయణ సింగ్ పేరు మీదగా ఈ ఘాటుకి ఈ పేరు పెట్టారు.
ఆ తర్వాత పంచకోట ఘాటును బెంగాల్ రాజు నిర్మించాడని చెప్పడం జరిగింది .
ఇలా అన్ని దర్శనాలు పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్నం 12 గంటలకి సకల దేవతా స్వరూపాలు వచ్చి స్నానం చేస్తారని ప్రచారం ఉండటంతో ….. ఈమె ఆ మణికర్ణిక ఘాటుకి చేరుకొని అక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేసి మణికర్ణికా స్తోత్రం చేసుకొని బయటికి రావటం జరిగింది. అక్కడ ఈమెకి నల్లని దుస్తులు ధరించిన తంత్ర ఉపాసకులు, అఘూరీలు, శివదీక్ష సన్యాసులు, శివ దీక్ష సాధువులు, కపాల మాలలు వేసుకున్న కాపాలికులు, శివ భక్తులు, శివయోగులు, భక్తి వ్యాపారం చేసే వ్యక్తులు, యోగ సాధన చేస్తున్న సాధకులు ఈ ఘాట్ లలో దర్శనం ఇచ్చారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూసుకుంటూ…ఒకరిని చూడగానే నమస్కారం చేయాలనిపిస్తే నమస్కారం చేయడం…. చూసి చిరునవ్వు నవ్వటం…కొంతమంది దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం చేసింది.
ఆ తర్వాత గంగా నదికి అవతల ఉన్న, వేదవ్యాసుని చేత నిర్మింపబడిన వేద కాశీకి చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక కోట నిర్మాణం నందు పంచాంగ వివరాలు తెలిపే ఒక పెద్ద గడియారం చూడడం జరిగింది. అలాగే ఈ కోటను పరిపాలించిన రాజులు వాడిన కత్తులు, వస్తువులు చూడడం జరిగింది. అలాగే వ్యాసుడు ప్రతిష్ట చేసిన మూడు ఇత్తడి శివలింగాలను కోట అగ్రభాగంలో ఉన్న పూజ గదిలో చూడడం జరిగింది. ఈ శివలింగాల ప్రతిష్టకి కారణం ఏమిటంటే వేద వ్యాసుడు ఇక్కడికి వచ్చినప్పుడు శివుడి కన్నా విష్ణువే గొప్పవాడు అని…విష్ణువే ఆది దైవమని…నమ్మిక తో ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నందీశ్వరుడు తన అనుభవ జ్ఞానంతో విష్ణువు ఆదిదైవం కాదని, ఇతనిని మించిన దేవుడు ఆదిదేవుడు మహాదేవుడేనని సాక్షాధారాలతో నిరూపించి …. వేదవ్యాసుడికి పరాభవం కలిగించడం జరిగింది. ఇక ఆ తర్వాత వేదవ్యాసుడు భిక్షాటన చేస్తూ శివ మోక్షజ్ఞానం పొందటానికి జ్ఞానతపస్సు చేయడం ఆరంభించాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అతనికి 13 రోజుల పాటు ఈ కాశీ క్షేత్రం వాసులు ఎవరూ కూడా తినడానికి బిక్ష వేయకపోయేసరికి, తీవ్రమైన ఆకలి బాధను అనుభవించి, ఆ బాధతో ఈ క్షేత్రమును చూస్తూ ….“ స్వయంభు అన్నపూర్ణ తల్లి నివసిస్తున్న కాశీ క్షేత్రంలో అన్నం దొరకపోవడం ఏమిటి” అని మదనపడి… ఆవేదన చెంది, ఆకలి బాధ తట్టుకోలేక ఈ క్షేత్రాను శపించాలి అని…. ఈ క్షేత్రంలో మరణించిన వారికి మోక్షమరణం కాకుండా భౌతిక మరణం పొందాలని గాడిదజన్మ ఎత్తాలని శపించబోతూ ఉండగా అంతలో…మనుష్య రూపేనా అన్నపూర్ణాదేవి వచ్చి, “నాయనా! వేదవ్యాస….. ఆగు! ఈ క్షేత్రానికి శాపం ఇచ్చే అంత సాధన శక్తి నీకు లేదు. ఆగు ” అని అంటూ కేవలం 13 రోజులు ఆకలి బాధని తట్టుకోలేని వాడివి…. ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని ఎలా పొందుతావు? సాధన కి అహంకారం అవరోధం అని తెలియదా? శాంతించు….. నీకు ఆకలి బాధ కలిగించడం కూడా ఆ విశ్వనాధుని లీలే అని గ్రహించలేకపోయావా?? ఎన్నో సంవత్సరాలు ఆహారం లేకుండా…. కేవలం ఆకులు తిని సాధన స్థితికి నేను వచ్చినట్లుగానే…. నువ్వు వస్తావేమోనని విశ్వనాథుడు ఈ లీల చేశాడని గ్రహించలేకపోయావా? కేవలం ఆకలి బాధనే తట్టుకోలేని వాడివి…ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి ఎలా చేరతావు? ఆ ఆది దేవుడి దర్శనం ఎలా పొందుతావు? ఆయనే ఉన్నాడని ఎలా తెలుసుకుంటావు? ఆకలినే జయించలేని వాడివి అరిషడ్వర్గాలు ఎలా జయించగలవు? సాక్షాత్తు ఆది శివుడు ఆవాసం ఉన్న ఈ క్షేత్రము నీ శపించే అంతటి శక్తివంతుడివి అనుకుంటున్నావా? ఒక క్షణం ఆలోచించు….. ఆవేశం తగ్గించు.. నిదానించు.. విషయం నీకే బోధపడుతుంది అనగానే….. వేదవ్యాసుడికి ఆవేశం తగ్గకపోగా, తల్లి! ఆకలి ఎవరు ఇవ్వమని చెప్పారు? ఆకలి ఎవరు కలిగించమని చెప్పారు? మేము ఏమైనా అడిగామా? మమ్మల్ని సృష్టించమని చెప్పామా? మమ్మల్ని బాధ పెట్టమని చెప్పామా? నాలో ఉన్నది శివుడే….. నీలో ఉన్నది శివుడే…. నాలో శివుడు ఆకలి బాధపడుతున్నాడు. నీలో ఉన్న శివుడు అన్నపూర్ణేశ్వరుడై ఆకలి బాధ తీరుస్తున్నాడు. మరి నాలో శివుడు ఆకలి బాధపడుతున్నప్పుడు…నీలో ఉన్న శివుడు ఆ బాధను తీర్చలేడా? అదేమిటంటే దత్తాత్రేయుని లాగా యోగ పరీక్షలు పెడుతున్నారు అంటున్నావు…పరీక్ష పెట్టేది నువ్వే…ఉత్తీర్ణత చేసేది నువ్వే….. ఇక్కడ నేను అంటూ ఏమున్నది.. నాదంటూ ఏమున్నది.. చేసేది నువ్వే.. చేయించేది నువ్వే…బాధపడేది నువ్వే…అని చెప్తావు. కానీ ఆ ఈతి బదులు నా శరీరం పడుతుంది. ఆ మనోవేదన నా శరీరం పడుతుంది. నా ఆకలి బాధ నాకు తప్ప నీకు తెలియదు. తెలుసుకోలేవు. అదేమనంటే నీలో ఉన్నదీ శివుడే…. నాలో ఉన్నది శివుడే అని చెప్తావు. కానీ నాలో ఉన్న శివుడు ఈతి బాధలు పడడు. నా శరీరం బాధపడుతుంది. నా మనసు బాధపడుతుంది. దాని ఆవేదన ఎవరు తీరుస్తారు? దాని ఆకలి బాధ ఎవరు తీరుస్తారు? నా ఆకలి బాధ తీరితే గాని నాలో ఉన్న శివుడు శాంతించడు. ఆ ఆకలిని తీర్చేది నువ్వే. కానీ తీర్చడానికి అర్హత యోగ్యత యోగం ఉండాలని చెప్పేది నువ్వే…. చెప్పేది నువ్వే.. చేసేది నువ్వే…పరీక్ష పెట్టేది నువ్వే…పడేది మేమా! అనుభవించేది మేమా! నువ్వే ఆలోచించు తల్లి…లోకానికి ఏం చెబుతున్నారు? ఏం చేస్తున్నారు? అర్థం చేసుకోండి. ఈ జీవుడు శివుడైతే తప్ప మోక్షం రాదు. నాకు కాశీ క్షేత్ర ఆవాసం లేదు. కాశీ క్షేత్రం మరణం లేదని మీరే చెప్పారు. అలాంటప్పుడు…… ఇక్కడ నాకు మరణం లేనప్పుడు…. నాకు మరణం ఇచ్చే ప్రాంతమును నాకు నేనే సృష్టించుకుంటా అని ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు ఆయన గంగా నది అవతలగా తన శక్తి సామర్థ్యాలతో వేద కాశీని ఏర్పాటు చేసి సాధన చేసుకోవడం జరిగింది. కానీ కాశీ క్షేత్ర పరిపాలకుడైన కాలభైరవునికి ఈ విషయం నచ్చలేదు. దాయితో వేదవ్యాసునికి అతని సాధనకి అనేక అవాంతరాలు, ఆటంకాలు కలిగించారు. ఆహారం దొరకకపోవడం , శారీరక అనారోగ్యం కలిగించడం, మానసిక మనోవేదన కలిగించడం, ఏకాగ్రత లోపించడం, అతి కామం కలిగించడం…, అతి మనోవేదన కలిగించడం, ప్రశాంత స్థితి కోల్పోయేలా చేయడం, అస్థిర మనసులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. దానితో మళ్లీ ఈయనకి తీవ్రమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలో ఏకంగా కాశీ విశ్వనాథున్నే శపించాలని అనుకుంటున్న సమయంలో… అశరీరవాణితో ఆ కాశీ విశ్వనాథుడు నాయనా! వేద వ్యాసా…! నీ కోపమే నీకు శత్రువు అయింది. నీ సాధనని ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకువచ్చింది. కోపాన్ని జయించలేని వాడివి, అహంకారాన్ని జయించలేని వాడివి, ఆధ్యాత్మిక పురోగతి నువ్వు పొందలేవు కదా! ఈసాధనలో ఆదిదైవమైనా నన్ను నువ్వు చూడలేవు కదా! నేను కేవలం ఒక శివలింగం రూపంగా మాత్రమే కనపడుతున్నా…. కానీ శివతత్వం అంటే ఏమిటో నీకు తెలియదు. తెలుసుకోలేవు. తెలుసుకునే అర్హత, యోగ్యత నీకు ప్రస్తుతానికి ఇంకా రాలేదు. నువ్వు ఏర్పాటు చేసిన ఈ వేద వ్యాస కాశీలో ఎవరైతే మరణం పొందుతారో, వారు గాడిదజన్మ ఎత్తాలని ఎత్తుతారని నువ్వు చేసిన దోషపరిహారం ఇదే అని అంతర్ధానం అవ్వడం జరిగింది. దానితో వేద వ్యాసుడు తనకి ఈ క్షేత్రం మరణం లేదని తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపంగా తన కోపావేశాన్ని ఈ క్షేత్రంలో వదిలిపెట్టేసి…. శాంతమూర్తిగా దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామం వైపుకి వెళ్లడం జరిగింది. దానితో వేద కాశీలో జీవించే రాజులు ఇప్పటికీ కూడా తన మరణ సమయంలో కాశీ క్షేత్ర ప్రాంతంలో ఉన్న మోక్ష భవనానికి చేరుకొని మరణావస్థ ను దాటి మోక్షమరణం పొందడం జరుగుతుంది. ఎందుకంటే వేద వ్యాసుడు నిర్మించిన వేద కాశీలో పునర్జన్మగా గాడిదజన్మ వస్తుందని…. ఆ కాశీ విశ్వనాథుడు చెప్పడం జరిగింది కదా! ఈ వివరాలన్నీ కూడా ఈమెకి అక్కడ ఉన్న గైడ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇవి ఉన్నా మనోస్థితి ప్రకారం ఇది నిజమా కాదా అని తెలుసుకునే స్థితిలో లేదు. ఈ ప్రాంతంలో ఏమున్నాయి ? ఏం చూడాలి? అన్న ఆసక్తి కూడా ఈమెకి లేదు. ఏదో వెధవలాపంగా యాదృచ్ఛికంగా మనసు లేని స్థితిలో, ఏం చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో అన్నింటిని సాక్షిభూతంగా చూస్తూ వస్తుంది. కానీ తన కళ్ల వెంట అప్పుడప్పుడు వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ….. తనలో కలిగిన మనోవేదనకి ఎవరు ముగింపు ఇస్తారా ? అనుకుంటూ ఈ వేద కాశీ క్షేత్రం నుంచి బయటకు వచ్చి, తన గదిలోనికి వెళ్లి పడకపై విశ్రమించడం జరిగింది.
ఇలా గదిలో గాఢ నిద్రలో ఉన్న శివ నందిని కి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి పైకి లేచింది. తనకి ఎందుకు మెలకువ వచ్చిందో అని ఒక క్షణం ఆలోచనలో ఉంది. ఆ తర్వాత విచారణ చేసుకుంటే తనకి స్వప్నంలో ఎవరు ఒక వృద్ధ సాధువు కనిపించాడు. ఆయన “లేచి రా..! లేచి రా…! నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను…. పంచగంగా ఘాట్లో నీకోసం ఎదురు చూస్తున్నా” అన్నాడు. ఇతను చూడటానికి గుండ్రని ముఖంతో, తెల్లని శరీరంతో, భారీ కాయంతో, మెడలో రుద్రాక్ష మాలతో నగ్నంగా ఉన్నాడు. ఈయన ఎవరో కూడా శివ నందిని కి నీకు అర్థం కాలేదు. ఎందుకు తనని రమ్మంటున్నాడో కూడా అర్థం కాలేదు. కాకపోతే భౌతికంగా తనని తట్టి లేపినట్టుగా అనిపించేసరికి గాఢ నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఈయన ఎందుకు పంచగంగా ఘాటుకు రమ్మంటున్నాడో ఒక పట్టాన అర్థం కాలేదు. కానీ ఆలోచించే ఓపిక కూడా ఈమెకు లేదు. తన భర్త ఆలోచన చుట్టూనే తన మనసు తిరుగుతుంది. ఉన్నట్టుండి తన భర్త గుర్తుకు రావడం జరిగింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి….. 16 సంవత్సరాల పాటు తనతో కాపురం చేసిన అబ్బాయి…. అర్ధాంతరంగా కారణం లేకుండా…. అధర్మ ప్రవృత్తితో…. వ్యసనపరుడై…. తన నుంచి వెళ్ళిపోవడం ఆమె జీర్ణించుకోలేక పోతుంది. తీవ్రమైన మనోవేదనకు గురి అవుతుండడం చూసి ……తల్లిదండ్రులు ఈమెని ఏదైనా క్షేత్రానికి గాని ఏదైనా ప్రాంతానికి గాని వెళ్లి కొన్ని రోజులపాటు ఉండి రమ్మని చెప్పడంతో మరి మాటని కాదనలేక ఈ కాశి క్షేత్రానికి రావడం జరిగింది. కానీ ఈ కాశి క్షేత్రంలో మరణిస్తే మోక్షం వస్తుందని తన స్నేహితులు చెప్పడంతో… ఈ కాశీ క్షేత్రంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఈ క్షేత్రానికి నిజానికి రావటం జరిగింది. ఈ క్షేత్రం చూసినప్పటికీ , తన ఆవేదన తగ్గకపోగా ఇంకా పెరగడం జరుగుతుంది. ప్రశాంతత లేకపోగా మనసంతా అశాంతిగా, ఆవేదనతో ఉండటం గమనించింది. ఇలా ఈమె మానసిక ఆందోళనలో ఉంటే ఈ యోగుల దర్శనాలు ఏమిటో………ఈ స్వప్న దర్శనాలు ఏమిటో……ఆమెకి ఒక పట్టానా అర్థం కాలేదు. కానీ పంచగంగా ఘాటుకి ఈ యోగి ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాలేదు. అసలు ఈ యోగి ఎవరు..? ఎందుకు స్వప్న దర్శనం ఇచ్చారో తెలియదు. ఒకపక్క తన భర్త చేసిన నమ్మకద్రోహాన్నీ జీర్ణించుకోలేక అయోమయంలో ఉంటే…. మరొకపక్క యోగి తన దర్శనానికి రమ్మని చెప్పి అనటం తనకి అర్థం కాలేదు. ఏం చేయాలా అనుకుని……ఇదంతా స్వప్నమేనని అనేక రకాలుగా అనుకుంటూ, ఈ క్షేత్రంలోని అఘోరాలను, సాధువులను, సాధకులను, సన్యాసులను చూడడం వలన తనకి ఈ ఆలోచనలతోనే పడుకొని ఉండటం వలన ఆ యోగి దర్శనం అయి ఉంటుందని భావించి…. మంచం మీద నుంచి లేచి నీళ్లు తాగి కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపోదామని అనుకుంటూ ఉండగా……మళ్లీ ఆ నగ్న యోగి దర్శనం అవ్వడం ఆరంభమైంది. ఈయన ఎవరు? అసలు ఎందుకు కనబడుతున్నాడు? ఎందుకు స్వప్న దర్శనం ఇస్తున్నాడు? అని అనిపించింది. కలలో ఈ స్వప్న దర్శనంతో ఎందుకు బాధిస్తున్నాడో అర్థం కాలేదు. కళ్ళు మూసినప్పుడు ఈయన కనిపించడం….. కళ్ళు తెరిస్తే ఏమి కనపడకపోవటం అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకపక్క భర్త జ్ఞాపకాలు వేధిస్తుంటే…. మరొక పక్క ఈ నగ్న యోగి దర్శనాలతో నిద్ర పట్టలేని అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఇలా కాదనుకొని కళ్ళు తెరుచుకుని కూర్చుంది. అప్పుడు తన భర్త జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలు పెట్టాయి. తన భర్త తన దగ్గరికి వచ్చి తనంతట తనే ప్రేమ ప్రపోజల్ పెట్టి, తనని ప్రేమించేలా చేసి, తన ప్రేమ మాయలో పడేటట్లుగా చేసి, తనకి ప్రేమ రుచులు చూపించి చివరికి కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని 16 సంవత్సరాలు కాపురం చేసి, మోసపూరిత ఆలోచనలతో బుద్ధితో ఒక గృహస్థుడిగా ఉండకుండా స్వేచ్ఛ జీవి అంటూ తన నుంచి వెళ్ళిపోవడం ….విడాకులు తీసుకొని వివాహ బంధనం నుంచి వెళ్లిపోవడం అర్థం కాని అయోమయ విషయంగా ఉంది. కారణం ఏంటో తెలియదు. ఎందుకు తనకి ఈ ఆలోచన వచ్చిందో అర్థం కాలేదు. జీర్ణించుకోలేని విషయం. కేవలం స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిపోయాడు. తనని ఏనాడూ ఇబ్బంది పెట్టటం, బాధ పెట్టడం చేయలేదు. ఎలాంటి చెడు వ్యసనాలు లేకుండా కేవలం భర్త పిల్లలు అని మాత్రమే అదే ప్రపంచంగా ఉంటున్నప్పటికీ….. ఉన్నదాంట్లో తృప్తిగా బతకడమే జరిగింది. ఇలా తన భర్త జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పటికీ…. వేదన తగ్గటం వదులుగా మనోవేదన పెరుగుతూ ఉంటుందని చెప్పి అసలు ఆ నగ్నయోగి ఎవరు, ఎందుకు రమ్మంటున్నాడు? అని కోపావేశాలకు లోనై …లేచి ఆ గది తలుపులు వేసి, ఆ పంచ గంగా ఘాటు వద్దకు వెళ్ళటం జరిగింది. అక్కడ ఒకచోట తను స్వప్న స్వప్నంలో చూసిన ఒక యోగి దర్శనం ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్లి…..
శివనందిని:– స్వామి! నమస్కారం. మీకున్న ఆత్మ ధ్యాన శక్తితో నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. మీరెవరో నాకు తెలియదు. మీరు ఎందుకు నాకు పదేపదే దర్శనం ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? నా భర్తకే నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నన్ను కాదనుకున్నాడు. నేను ఆత్మహత్య చేసుకుందామని అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడికి వద్దామని ఆలోచించుకుని ….నిశ్చయించుకుని నిద్రపోయాను. కానీ సరిగ్గా మీరు 12 గంటలకి స్వప్న దర్శనం ఇచ్చి తట్టి లేపారు. నాకున్న ఆత్మహత్య ఆలోచనను గుర్తు చేశారు. సరే, ఎటూ మణికర్ణికా ఘాట్లో చనిపోవాలనుకున్న దాన్ని……పంచగంగా ఘాటులో చేద్దామని ఇక్కడికి వచ్చాను. చెప్పండి అసలు….. మీరు ఎందుకు నాకు పదేపదే స్వప్న దర్శనం ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఒకపక్క భర్త చేసిన నమ్మకద్రోహానికి నా మనసు అతలాకుతలం అవుతూ ఉంటే ……మరొక పక్క మీ స్వప్న దర్శనంతో ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కారణం ఏంటి అని…..
తన కోపా వేశాలు, ఆవేదనతో, ఆవేశంగా ఆ యోగి కి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యోగి…
యోగి:- తల్లి! నా పేరు త్రైలింగస్వామి! నేను నడయాడే కాశీ విశ్వనాధుని ఇక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను కారణం లేని ఎవరికీ దర్శనం ఇవ్వను. చాలామంది చాలా యుగాల నుంచి , చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు…. కాకపోతే నీకు దర్శనం ఇవ్వడానికి లోక కళ్యాణార్థం ఒక మహత్తరమైన కార్యం ఉంది. అది నీకు తెలియకపోవచ్చు. అది నీకు తెలియజేయడానికి నేను ఇలా దర్శనం ఇవ్వడం జరిగింది.
శివ నందిని:- అసలు నా గురించి మీకేం తెలుసు స్వామి!...
త్రైలింగస్వామి:- తల్లి! నాకు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు.. నాకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. నువ్వు ఈ జన్మ గురించి ఆలోచిస్తున్నావు. చన్మాంతరంలోని నీ యొక్క సాధన స్థితిగతులు నాకు తెలుసు. ప్రస్తుతం నువ్వు ఈ జన్మలో నీ భర్త చేసిన మనోవేదనకి గురి అయ్యి …ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చావని తెలిసింది. నీ వలన లోక కళ్యాణార్థం కార్యము ఒకటి ఉన్నది. అర్ధాంతర చావు వల్ల నువ్వు చేయవలసిన కర్మ తీరకపోవడంతో రుద్ర పిశాచంగా మారి ఈ కాశి క్షేత్రంలోనే తిరగాల్సి వస్తుంది. నీ కర్మ ని నువ్వు నిర్వర్తించి నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు ఈ జన్మ సార్ధకత పూర్తి అయ్యి, మోక్షం పొందడం జరుగుతుంది. అది చెప్పడానికే నేను పదేపదే ఇలా స్వప్న దర్శనాలు ఇవ్వటం జరిగింది. నిన్ను విసిగించడం జరిగింది.
శివనందిని:- స్వామి! నా భర్త సమస్యకి నేను పరిష్కారం చూపించుకోలేని దాన్ని. లోక కళ్యాణార్థం ఏదో లోక కర్మ చేయాలని చెబుతున్నారు. అది ఏమిటో తెలియదు. నేను ఈ క్షేత్రానికి రావడానికి కారణం ఏమిటంటే నా భర్త పెట్టిన మానసిక క్షోభని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని…కాశీ క్షేత్రంలో చనిపోతే మోక్షం వస్తుందని.. పెద్దలు చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనోవేదనకి శాంతి కలిగించడం బదులు అశాంతి పెరుగుతూ వచ్చింది. బాధ తగ్గకపోగా పెరుగుతూ వస్తుంది. శాంతిని పొందాల్సిన చోట అశాంతి పెరుగుతూనే ఉంది. ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్న నన్ను….. నా ద్వారా ఏదో లోక కళ్యాణం జరుగుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మాలి…ఒకవేళ మీకు ఆ లోక కళ్యాణానికి సంబంధించిన కార్యం తెలిస్తే… మీకు మీరే చేసుకోండి. నన్నెందుకు చావగొడతారు. నావల్ల లోక కళ్యాణములు, కార్యాలు చేయలేరు. ఇప్పుడు ఉన్న మానసిక స్థితికి ఆత్మహత్య చేసుకోవడమే తప్ప ఏమీ లేదు. కాబట్టి నా చావు నన్ను చావనివ్వండి.
అనగానే ఆ యోగి చిరునవ్వు నవ్వుతూ…..
త్రైలింగస్వామి:- తల్లి! నీ చావు నువ్వు చావడంలో గొప్పతనం ఏముంది? నీ చావులోనే అందరి చావు కావాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నీ చావు వ్యక్తిగతమవుతుంది. అదే నీచావు మోక్షచావు అయితే విశ్వానికి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది అనగానే…..
శివ నందిని కి ఏమీ అర్థం కాలేదు.
శివనందిని:- అసలు మోక్షం అంటే ఏంటో తెలియని దానికి వ్యక్తిగత మోక్షం లేదా విశ్వానికి మోక్షం అని చెప్తున్నారు. అసలు ఆ పదాలకు అర్థం కూడా నాకు తెలియదు. దానికి నేనేం చేయాలి. అర్థం చేసుకోండి. మీరే చావండి. నా చావు నన్ను చావు ఇవ్వండి. మీకు దండం మహాప్రభు….! నావల్ల ఏమీ కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. నావల్ల ఏదో అవుతుందని మీరు అనుకుంటున్నారు. నావల్ల ఏమీ అవ్వదు. ఆత్మహత్య చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నన్ను చావనివ్వండి. నా మౌనమే నన్ను వదిలేయండి …. అనగానే ఆ యోగి చిరునవ్వు నవ్వుతూ……
త్రైలింగస్వామి:- చావు రావాలి అనుకుంటే చావలేవు. వస్తే ఎవరూ ఆపలేరు. జరిగేది జరగక మానదు. జరగనిది ఎన్నటికీ జరగదు. నువ్వు చావాలనుకున్నా చావలేవు. శివుడు చావాలని అనుకుంటేనే నువ్వు చస్తావు. శివుడు బతికించాలి అనుకుంటే నువు చావలేవు. శివుడు బతకాలనుకుంటే నువు చావాలన్న చావలేవు. నువు బతకాలని అనుకున్నా ఆయన చావాలని అనుకుంటే నువ్ చస్తావు. ఏదైనా నీ చావు ఆ శివయ్య చేతుల్లోనే ఉంది. కాదు అని చెప్పి నీకు నువ్వే అనుకుంటే… నీకు నువ్వే చావాలని ప్రయత్నిస్తే….. ఆ లోక కళ్యాణ కార్యం కాకుండా చావాలంటే….. నువ్వు ఆ లోకకళ్యాణార్థం కోరిక తీర్చకుండా నీకు మరణం ఎలా వస్తుందో నేను చూస్తాను కావాలంటే వెళ్లి చూడు…
అనగానే శివ నందిని కి విపరీతమైన కోపం వచ్చి…..
శివనందిని:- నా చావును కూడా మీరే నిర్ణయిస్తారా? నేనే చావాలని అనుకుంటున్నాను. ఎలా చావనో చూస్తాను.
అంటూ గంగలో దూకటం జరిగింది. లోతుల్లోకి వెళ్ళింది. ఊపిరి ఆగడం జరుగుతుంది. ఇక చావు వచ్చింది అనుకునే లోపే, అక్కడ ఉన్న పడవ నడిపే జాలరి వాళ్లు ఈ విషయం గమనించి , అతని పడవ వేసుకుని వాయువేగంతో వెళ్లి, ఈమె మునిగిన చోట వలవేసి నీటిలో నుంచి బయటకు తీశారు. అప్పుడు ఆమెతో తల్లి! ఈ క్షేత్రంలో ఎవరికి వారే ఆత్మహత్య చేసుకుని మరణించడం సహజ మరణం కాదు. సహజ సిద్ధంగా అనారోగ్య సమస్యలతోనో, తీవ్రమైన మనఃస్థాపం తోనో…మనోవేదనతోనో…అలా సహజ సిద్ధంగా చనిపోవాలి. ఆత్మహత్య చేసుకుని చనిపోతే రుద్ర పిశాచంగా ఇక్కడ ఈ క్షేత్రంలో తిరుగుతారని ఇక్కడ ఉన్న సాధువులు, యోగులు చెప్పడం జరిగింది. చూస్తే యవ్వనంలో ఉన్నావు. పెళ్లయిన ఆడపడుచులా ఉన్నావు. భర్తని పిల్లల్ని వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావో మాకు తెలియదు. కారణం కూడా తెలియదు. కానీ చావు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రావాలంటే మాత్రం జరగదు. ఆ శివుడు నిర్ణయిస్తేనే నీకు మరణం వస్తుంది. ఆ శివుడు దహనం చేస్తేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న త్రైలింగస్వామి నవ్వేసి ఊరుకున్నారు.
ఇది నా కాదు అనుకుని …..ఆ తర్వాత శివ నందిని మరింత కోపంతో తను తెచ్చుకున్న బ్యాగ్ లో నుంచి విషమును తీసి నోట్లో పోసుకుంది. గొంతు మండుతుంది. శరీరం తట్టుకోలేక పోతుంది. తహతహలాడుతుంది. ఇక తనకి మరణం వస్తుంది అని అనుకుంటున్న సమయంలో.. ఆ పక్కనే ఉన్న అఘోర సాధనలో ఉన్న అఘోరుడు తన చేతి సంచిలో నుంచి ఒక మూలికను బయటకు తీసి …ఈమె విషం తాగే ప్రయత్నం చేసిన విషయం గమనించి….. ఆ వేరును అక్కడికక్కడే నేల మీద రుద్ది , రసం తీసి….“ సంజీవని వేరు ఇది… విషాన్ని హరించి వేస్తుంది… నువ్వు తాగిన విషయం శరీరంలోకి ఇంకకుండా పనిచేయకుండా ఉంటుంది” అని ఆమెకు మందు చికిత్స చేశాడు. తిరిగి ఆ అఘోరుడు శివనందినితో “నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో నాకు తెలియదు…. కానీ చావు ప్రయత్నం చేస్తావని , మూడు రోజుల క్రితమే తెలిసింది. అందుకే నీ చావు ….మరణానికి వెళ్ళనివ్వకుండా ఆ వేరుని తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి అతను అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు”.
శివ నందిని కి ఏం అనాలో…. ఏం చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. అలా అక్కడే ఉన్న తైలింగస్వామి కేసి చూసి …..ఇలా కాదనుకొని తన చేతిలో ఉన్న చేతి సంచి లో నుంచి పదునైన కత్తిని తీసింది. త్రైలింగ స్వామి కేసి చూస్తూ… నన్ను ఇప్పుడు ఎవరు ఎలా రక్షిస్తారో చూస్తా అంటూ.. గొంతును ,మణికట్టును కోసుకోగానే ,రక్త ప్రవాహం వచ్చేసరికి …ప్రాణ శక్తి తగ్గుతూ, నిరసానికి వెళ్ళిపోతూ, చుట్టూ చూస్తూ… ఎవరైనా వస్తారా! ఎవరైనా రక్షిస్తారా! అని చూస్తూ, ఎవరూ రావట్లేదని గమనించి… తనకి మరణం వచ్చింది అని, ఇక తన మరణించబోతున్నాను అని అనుకుని తైలింగస్వామి కేసి చూడటం జరిగింది. త్రైలింగస్వామి మౌనంగా చూసి ఊరుకున్నారు. ఆయన రాకపోయేసరికి….. తనని రక్షించడం కోసం చుట్టుపక్కల వ్యక్తులు ఎవరు రావటం లేదు. ఇక తనకి మరణం వచ్చిందిలే! అనుకుని నేను మరణం పొందుతున్నాను అంటూ…. శివ నందిని ఒక తెలియని ఆనంద స్థితిలోనికి వెళ్తూ ఉండగా…. స్నానానికని చెప్పి అక్కడికి ఒక వైద్యుడు వచ్చాడు.. పరిస్థితిని గమనించి, కారు దగ్గరికి వెళ్లి , ప్రాథమిక చికిత్స కిట్టుని గబగబా తీసుకో వచ్చి… అందులో ఉన్న వస్తువులతో బ్యాండేజ్ కట్టి ఈమె ఘాటుకి మందు కోసేసి బ్యాండేజ్ వేసేసి….. “ తల్లి…! ఎందుకు ఇలాంటి బలవంతపు మరణం పొందాలనుకుంటున్నావు? దీనివలన ఉపయోగం లేదు. నాకు రాత్రి 12 గంటలకి మెలకువ వచ్చింది. స్వప్నంలో ఎవరో ఘాటు దగ్గర కత్తితో గాయాలు చేసుకొని… ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు అని తెలిసింది. అందుకే ఇంటి దగ్గర నుంచి అన్ని ఘాట్లు వెతుక్కుంటూ ఇక్కడిదాకా రావడం జరిగింది. ఇప్పుడే నువ్వు ఇలా కోసుకుంటూ కనబడవు. రక్తం మడుగులో ఉన్నావు. నీకు విపరీతంగా రక్తం పోయింది. నీరసించిపోతున్నావు. నువ్వు దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్ళు అని…. రక్తం ఆపడానికి, రక్తం గడ్డ కట్టడానికి సంబంధించిన మందు పూతల పూసేసి అతను మౌనంగా వెళ్ళిపోయేసరికి నవ్వాలో ఎడవాలో అర్థం కాని అయోమయ స్థితిలో శివ నందిని ఉండిపోయింది. ఇదంతా కూడా అక్కడే ఉన్న త్రైలింగస్వామి చూస్తూ నవ్వుకున్నారు. ఇక తనకి ఎన్ని విధాలుగా మన ప్రయత్నాలు చేసినా కూడా మరణం రాదని తెలుసుకొని , ఏం చేయాలో అర్థం కాక…. ఏం చేసినా కూడా ఉపయోగం లేదు అని గ్రహించి , మళ్లీ తిరిగి ఆ త్రైలింగ స్వామి వద్దకు వెళ్లి….
శివ నందిని: - స్వామి..! నేను మరణం పొందడంలో విఫలమయ్యాను.. నా మరణం లోక కళ్యాణార్థం ఉపయోగపడుతుందని మీరు ఇందాక అన్నారు. అది నాకు అర్థం కాలేదు. పైగా ఏదో మోక్షం , వ్యక్తిగత మోక్షం, విశ్వ మోక్షం అని పెద్దపెద్ద పదాలు చెప్పుకొచ్చారు. నాకు అసలు ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటో తెలియదు…సాధన అంటే ఏమిటో తెలియదు. ఆరాధన అంటే ఏమిటో తెలియదు. ఉపాసన తెలియదు. జపాలు తెలియవు. ధ్యానాలు తెలియవు. దైవిక పుస్తకాలు చదవడం తెలియదు. నాదంతా కూడా బోగ జీవితంలో ఇంటిపట్టున ఉన్నామా……ఇల్లు చక్కదిద్దుకున్నామా…ఇల్లాలిగా నా బాధ్యతను నెరవేర్చామా…. తిన్నామా…పిల్లల బాధ్యతలు చూసుకున్నామా ఇలా ఉంటుంది. కుటుంబం గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది. ఏదో పండగ సమయాలలో నమస్కారం చేసుకొని పూజ చేసుకోవడం… అంతేకానీ దేవుడు ఉన్నాడా లేడా అని కూడా నేను శోధించలేదు. ఏదో ఈ విశ్వాన్ని ఒక దైవిక శక్తి మాత్రం కాపాడుతుందని తెలుసు. అదేవిక శక్తికి సైన్సు ఏమో ఆకర్షణ శక్తి అని…గురుత్వాకర్షణ శక్తి అని ఏవో రకరకాల పేర్లు పెడతారు. అదే శాస్త్ర ప్రకారంగా అయితే నిరాకార తత్వమైన శివస్వరూపమని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఆలోచించి అవకాశం లేదు. అవసరమూ లేదు. సమయం కూడా లేదు. అలాంటిది…. దానిని బోగ జీవితంలో ఉన్నదానిని.. ఇప్పుడు ఆధ్యాత్మిక యోగ జీవితంలోకి రమ్మంటున్నారు. ఈ యోగ జీవితం గురించి ఆలు లేదు సులు లేదు కొడుకు పేరు రామలింగ ఉన్నట్టు…నన్ను మీరు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. ఈ దేహం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగము లేదు. నా చావు నన్ను పొందనివ్వండి. నా పాటికి నన్ను వదిలేయండి. కానీ నా మరణం ప్రయత్నాలు ఎన్ని చేసినా మరణం రాదని అర్థమయింది. ఆ మరణం వచ్చే విధంగా అనుగ్రహించండి. అది చాలు అనగానే…
స్వామివారు నవ్వుతూ…..
త్రైలింగస్వామి:- అదే కదా…..! అది చెప్పడానికే కదా నీ దగ్గరికి వచ్చింది. నీ మరణం విశ్వ మరణం అవుతుంది. నీ మరణమే మోక్షమరణం అవుతుంది. నీ మరణమే విశ్వమోక్షమరణము అవుతుంది. “స్వామి…! అంటే ఇప్పుడు నేను భౌతికంగా చావాలి అనుకుంటే చావలేనా” అంటే చావలేదు. జరగాల్సింది జరగక తప్పదు. జరగనిది ఎన్నటికీ జరగదు. నీ ద్వారా లోకానికి ఒక విషయం జ్ఞానం తెలియాలి. అదే మోక్ష విషయ జ్ఞానం. అది ఏమిటో …ఎలా తెలియాలో…. ఎలా తెలుసుకోవాలో…. అనేది ప్రస్తుతానికి ఇది ఆరంభమే. అంతంలోకి వచ్చేసరికి విషయం నీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు భోగ జీవితంలో స్మశాన ఆరోగ్యం పొందిన తరువాతనే ఈ స్థితికి వస్తారు. అంతెందుకు యోగివేమన కూడా ముందు భోగ విలాసుడై…తర్వాతే వైరాగ్యం పొంది రస సిద్ధి ద్వారా బంగారమును తయారుచేసి…. బైరాగి అయ్యి, స్మశాన వైరాగ్యం పొందిన తర్వాతే ,ఆయన జ్ఞాని అయి లోకానికి ఎన్నో విషయాలు చెప్పి అంతర్ గుహలోనికి వెళ్ళాడు కదా! అదేవిధంగా ప్రతి జీవికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అని తెలుసుకుని చనిపోతే గాని అతనికి మరణం మోక్షమరణం కాదు. అది తెలుసుకోకుండా…ఆ కారణం తెలియకుండా…. ఆ కర్మ చేయకుండా…మరణం పొందితే , అది భౌతిక మరణం అనగా రూపాంతరం చెంది మరణం…కర్మ – జన్మ పునర్జన్మలకి కారణం అవుతుంది. అని చెప్పగానే….
శివ నందిని:- స్వామి..! ఇవేమీ నాకు తెలియదు. మోక్షం అంటే ఏంటో తెలియదు. అయి కర్మలు అకర్మలు పెద్ద పెద్ద పదాలు చెప్తున్నారు. వీటి అర్థాలు , పరమార్ధాలు వీటి విషయాలేంటో కూడా నాకు అర్థం కావు. అర్థం చేసుకోలేను. అలాంటి దానిని……మీరు ఏదేదో చెప్తున్నారు. అని అర్థమై అర్థం కానట్టు ఉన్నాయి. ఈ అజ్ఞానితో మీకు ఎలాంటి ఉపయోగం ఉందో నాకు అర్థం కావడం లేదు . నా చావు నన్ను చావనివ్వండి. నన్ను దహనం చేయండి. అంతకన్నా ఇంకేం వద్దు.
త్రైలింగస్వామి:- అమ్మా..! శివ నందిని…. నువ్వు ఎవరో నీకు తెలియకపోవచ్చు. కానీ నీ జన్మ ఏంటి? నీ జన్మంతా జన్మలేంటి? నీ ఆధ్యాత్మిక సాధన స్థితి ఏంటి అనేది ఆ కాశీ విశ్వనాథుడికి, కాశీ విశాలాక్షికి తెలుసు. వారు నాకు జ్ఞానస్ఫురణ గా చెప్పడం ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. కాకపోతే తెలియని దల్లా నీకే.. ఏ విషయము తెలియదు. ఆ తెలియని విషయం ఏంటో తెలుసుకోవడమే ఈ జన్మ సార్థకత. అదే నీ మరణం. నీ మరణ రహస్యాన్ని చేధిస్తే విశ్వమరణ రహస్యాన్ని చేదించినట్టే అవుతుంది. కాబట్టి అసలు మరణం ఎందుకు వచ్చింది..
అసలు జీవం ఎందుకు వచ్చింది…జీవానికి, మరణానికి మధ్య గల సంబంధం ఏమిటి? ఎందుకు జీవుడు పుడుతున్నాడు? ఎందుకు జీవుడు మరణిస్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరు పుట్టిస్తున్నారు…? ఎవరు మరణింప చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి.. కాకపోతే ఇవన్నీ శబ్ద పాండిత్యంలో చూస్తే, శివుడు, ఆదిపరాశక్తి, గణపతి, కుమారస్వామి ఆ తర్వాత సూర్యుడు అంటూ రకరకాల దేవతల పేర్లు ,దేవుళ్ళ పేర్లు చెప్పడం జరుగుతుంది. ఈ శబ్ద పండిత్యం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవి శాస్త్రం వరకే. ఎవరికి వారు తమ వ్యక్తిగత అభిప్రాయాలను తమ గ్రంథాలలో రాసి ప్రపంచానికి చెప్పడం….. శబ్ద పాండిత్యంలో జరుగుతుంది.. అందులో మిడిమిడి జ్ఞానం పొందిన వాళ్లు ఉంటారు. అర్ధ జ్ఞానం పొందిన వాళ్లు ఉంటారు. పూర్ణజ్ఞానం పొందిన వాళ్లు ఉంటారు. ఎవరి అనుభవాలు వాళ్లకి తగ్గట్టుగా తమ గ్రంథాలలో శబ్ద పాండిత్యంతో రాయడం జరుగుతుంది. కానీ శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న అని తెలుసుకో! అనుభవ పాండిత్యంలో ఎవరికి వారే పొందిన అనుభవాల ద్వారా తను వచ్చిన జన్మకి కారణం ఏంటో తెలుసుకొని ఆ కారక కర్మను పూర్తి చేస్తారు. ఎలా పూర్తి చేయాలో తెలుసుకునే జ్ఞానమే అనుభవ పాండిత్యం అవుతుంది. ఈ అనుభవ పాండిత్యం పొందాలంటే అర్హత ,యోగ్యత ,యోగం ఉండాలి. అదే శబ్ద పాండిత్యానికి వచ్చేసరికి…. ధ్యానం చేసినా లేదా జపం చేసినా లేదా దైవ ఉపాసన చేసినా లేదా మంత్రపదేశ ఉపాసన చేసినా మనకి ఏవో కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాలనీ తనకి ఉన్న బుద్ధి జ్ఞానంతో ఊహించి ….విచారణ చేసి రాయడం జరుగుతుంది. కానీ అనుభవ పాండిత్యంలో అలా జరగదు. తాను ధ్యానంలో వివిధ రకాల ధ్యానానుభవాలు చూడడం జరుగుతుంది. ఈ అనుభవాలన్నీ కూడా సత్య స్వరూపమైనవి. మన మనసు వాటి స్థితికి వెళ్ళినప్పుడు అనగా ఆ సాధన స్థితికి వెళ్ళినప్పుడు ధ్యాన దృశ్యాలు చూపించడం జరుగుతుంది. ఆ ధ్యాన దృశ్యాలు … వాటి యొక్క విశ్లేషణ మన ఆత్మ చేస్తుంది. ఆ ఆత్మ విశ్లేషణ చేసినప్పుడు ఆ విచారణలో మనకి జ్ఞాన స్ఫురణలు అందుతాయి. ఈ జ్ఞాన స్ఫురణలు సత్యం అవుతాయి. వీటిని లోకానికి చెప్పాలి….. శబ్ద పాండిత్యంలో వచ్చే అనుభవాలు అన్నీ కూడా నిజమవుతాయి , కానీ వీటికీ ఆధారాలు, సాక్ష్యాలు అవసరం అవుతాయి. అదే అనుభవ పాండిత్యంలో వచ్చే అనుభవాలు అన్నీ కూడా అక్షరసత్యాలు అవుతాయి. దీనికి మనస్సాక్షి యే ఆధారం అవుతుంది. ఇలా అనుభవ పాండిత్యంలో చెప్పేవారు ….చాలా చాలా అరుదుగా ఉంటారు. అదే శబ్ద పాండిత్యం చెప్పేవారు నూటికి 90 మంది ఉంటే అనుభవ పాండిత్యం చెప్పేవారు నూటికి పది మంది మాత్రమే ఉంటారు. కాబట్టి నీ అనుభవ పాండిత్య జ్ఞానంతో ఏదో తెలియని విషయం తెలుసుకోవాలని ఈ విశ్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విషయం ఏమిటి అనేది నీకు నువ్వే తెలుసుకోవాలి…..……..నాకు అందిన ప్రకారం అయితే ఆ విషయం జ్ఞానం నీ మరణ రహస్యమే. నీ మరణ హాస్య విషయం తెలిస్తే, విశ్వమరణం రహస్య చేధన అవుతుంది. కాబట్టి నీ వ్యక్తిగత మరణమే విశ్వ మోక్షమరణ రహస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను ఎప్పుడూ కూడా విశ్వమోక్షం మరణం గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే దానిని ఆలోచించే అర్హత, యోగ్యత నాకు లేదు. నాదంతా వ్యక్తిగత మోక్షమరణం ఏనాడో పూర్తి అయింది. ఆత్మ స్వరూపిగా ఇప్పుడు ఉన్నాను. నీకోసమని భౌతిక దేహమును ధరించి రావటం జరిగింది.. కానీ మోక్షాన్ని పొందలేదు. ఈ కాశి క్షేత్రంలో ఇక్కడ 280 సంవత్సరాల పాటు ఉండి ఆ తరువాత ఆత్మ శరీరంతో ఇక్కడ ఉన్నాను. ఎవరికి లోక కళ్యాణార్థం ఏ సాధకులకి ఈ క్షేత్ర దైవతలైన విశాలాక్షి, విశ్వనాథుడు వారు చేయాల్సిన కర్మలను చెప్పడం నాకు జరుగుతుంది. ఆ విధంగా నేను ఈ దేహమును లోకకళ్యాణార్థం ఉపయోగిస్తున్నాను. అలాగే నువ్వు కూడా ఈ లోకానికి ఉపయోగపడే నీ వ్యక్తిగత మరణం గురించిన విషయములను నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకునే అంతవరకు నీకు మరణమే రాదు. నీకు భౌతిక మరణమే కాదు. నువ్వు చావాలన్నా చావలేవు. కావాలని నువ్వు ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నం చేశావు. అది విఫలమయ్యింది. ఎవర్ని రమ్మని అడగలేదు. నీ దగ్గర ఎవరూ లేరు. కానీ నువ్వుమరణం ప్రయత్నం చేసిన తరువాత …..అనుకోని విధంగా అనుకోకుండా వాళ్ళు రావడం జరిగింది. నీకు సేవలు చేయడం జరిగింది. నేను రక్షించడము జరిగింది అంటే నువ్వు మరణిస్తావని నీ మరణానికి మూడు గంటల ముందే… ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా వాళ్ళకి స్వప్న దర్శనాలు ఇచ్చారు. అంటే నీ మరణం నీ కన్నా ముందే రాసిపెట్టి ఉంది. రాసిపెట్టిన మరణం పొందనీయకుండా రక్షించడానికి ప్రకృతి ఆ వ్యక్తుల్ని పంపించింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు…దేనికి చేస్తున్నారు….??. అది తెలుసుకో. నువ్వు పుట్టడం జరుగుతుంది. ఎందుకు పుడుతున్నామో…. ఎందుకు చస్తున్నామో…అది తెలుసుకో. పెళ్లి చేసుకున్నావు…విడిపోవడానికి జరిగాయి.. కాపురము చేశావు…. పిల్లల్ని కన్నావు…జన్మలు ఎత్తావు.. ఇవన్నీ దేనికి.. ఎందుకోసం.. ఏం కావాలి…ఏం పొందుతున్నావు…ఆనందం కోసమా? ఆవేశం కోసమా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావ్? దీనికి అంతం ఉందా? దీనికి ఏ విధంగా అంతం ఉంది. నువ్వు ఎన్నో జన్మలు చేసిన పనే చేస్తున్నావు. ఎన్నో జన్మలు ఎత్తిన జన్మలే ఎత్తుతున్నావు. ఎన్నో జన్మలు నీ భర్త వల్ల బాధలు పడ్డావు…. విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. ఆవేదన చెందారు. ఇలా ఎంతకాలం. అది ఆలోచించు…. ఇంకా ఎన్ని జన్మలెత్తుతావ్…అది ఆలోచించు.. దీనికి అంతం ఇవ్వవా? అంతం లేదా? ఎవరో సృష్టించారు. ఆ సృష్టిని అంతులేని కథగా నడుపుతున్నారు. నీ పాత్రను ఏర్పాటు చేశారు. ఈ జగన్నాటకం ఎందుకు ఉంది. ఈ పాత్ర ఎందుకు ఆవేదన చెందుతుంది. ఈ పాత్ర ఎందుకు ఆనంద పడుతుంది. ఈ పాత్ర ఎందుకు బ్రహ్మానందంలో ఉంది. ఈ పాత్ర ఎందుకు భోగంలో ఉంది. ఈ పాత్ర ఎందుకు యోగంలో ఉంది. నువ్వు ఎందుకు నీకు కావాల్సినట్టు ఉండలేకపోతున్నావు. నీ మరణం నీ చేతిలో ఎందుకు లేదు. నీ పుట్టుక నీ చేతుల్లో ఎందుకు లేదు. ఒకసారి ఆలోచించు అంతులేని దానికి అంత ఉందా లేదా అని ఆలోచించు. అంతులేని కథ ఆరంభమా ?అంతమా? అనేది తెలుసుకో! దానికి ప్రయత్నం చెయ్యి. అది ప్రయత్నం చేయడానికి నువ్వు పుట్టావని తెలుసుకో. అంతేకానీ నువ్వు భౌతిక మరణాలు పొందటానికి ఈ కాశి క్షేత్రానికి రాలేదు. నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం కారకం ఉన్నది. నీ భోగ జీవితానికి అతని ద్వారా స్మశాన వైరాగ్యం కలిగించి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఎందుకు వైరాగ్యం కలిగిస్తున్నారు? ఏం తెలుసుకోవాలని చెబుతున్నారు? ఏం తెలుసుకోవాలి…ఎలా తెలుసుకోవాలి…ఎలా చేయాలో తెలుసుకో.. అని చెప్పి…
ఆయన అక్కడి నుంచి అంతర్దానం అయ్యారు. ఇది చూసిన తర్వాత శివ నందిని కి …నోట మాట రాలేదు. అంటే తను ఇంతసేపు ఒక ఆత్మతో ….చనిపోయి జీవ సమాధి చెందిన ఆత్మతో…. తను మాట్లాడుతున్నానని తెలుసుకునే సరికి శివ నందిని కి వణుకు రావటం ఆరంభమైంది. కళ్ళు తెరుపుల్లాడాయి.. శరీరం అంతా చమటలు పట్టి బట్టలు తడిసిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఉన్నచోటే కూలబడిపోయింది. ఏదో తెలియని కరెంటు షాక్ తగిలినట్లుగా అనిపించింది. శరీర రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఒళ్ళు గగ్గురు పొడిచింది…ఆలోచనలో పడింది..
శివ నందిని తన ఆలోచనలతోనే ఉండిపోయింది. త్రైలింగ స్వామి ఇచ్చిన షాక్ నుండి కోలుకున్న తరువాత ఒకపక్క భర్త చేసిన నమ్మక ద్రోహం యొక్క ఆలోచన, మరొకపక్క చచ్చిపోయిన దయ్యాలు/ఆత్మలు తనకేదో లోకకళ్యాణార్థం కర్మ ఉన్నదని…. చెప్పడం విని అర్థం చేసుకునే స్థితి కానీ, ఎలా అర్థం చేసుకోవాలో…. ఏం చేయాలో …?అర్థం కాని అయోమయ గందరగోళం తెలియని భయంతో అక్కడే ఆ ఘాట్ దగ్గర నేల మీద పడుకుంది. పడుకున్న కొన్ని నిమిషాలకి….
ప్రేమించిన వాడు తన జీవితం నుంచి ఎందుకు వెళ్లిపోయాడు? తనలో ఎలాంటి లోపం లేకపోయినా తను ఎలాంటి తప్పు లేకపోయినా వెళ్ళిపోయాడు…. తన వెళ్ళిపోయినందుకు బాధ లేదు. తనకి జీవితాంతం తోడు నీడై ఉంటానని మాట ఇచ్చి…. ఆ మాటలను నిలుపుకోకుండా అర్ధాంతరంగా ఏదో ఒక సాకు పెట్టుకొని వెళ్లిపోవడమే ఆమెకు అర్థం కాని విషయం. ఎందుకు వెళ్లిపోయాడో ., ఎలా వెళ్లిపోయాడో తనకి తెలియదు. తెలుసుకునేదాకా తన మనోవేదన ఆగట్లేదు. తెలుసుకుందామంటే చెప్పేవాళ్ళు లేరు. తన మనోవేదన తగ్గించే వాళ్ళు లేరు. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇదిలా ఉంటే…. ఏదో ప్రశాంతత కోసమని కాశీ క్షేత్రానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తే….. ఆ ఆత్మహత్య కూడా ఆపాలని ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు. అంటే నిజంగానే ఇంకా తనకి ఎక్కడా కూడా మరణం రాదా? తను చావాలనుకున్న చావలేదా? నిజంగానే ఆ యోగి చెప్పినట్టుగానే తను తెలుసుకొని విషయం ఏమైనా ఉందా? ఆ విషయం తెలుసుకుంటే గాని మరణం రాదా? అయినా కూడా ఈ యోగి చెప్పిన మాటలు ప్రకారంగా చూస్తే తన వ్యక్తిగత మరణమే, తన భౌతిక శరీర మరణమే విశ్వ రహస్య మరణానికి సంకేతం అని, ఆరంభం అని, మార్గమని చెప్తున్నారు. అసలు తన మరణం విశ్వమరణం ఎలా అవుతుంది? అంటే తను మరణిస్తే విశ్వంలో ఉన్న వాళ్ళంతా మరణిస్తారా?....అంటే నేను తింటే అందరికీ ఆకలి తీరిపోతుందా? ఇప్పుడు నా భర్త నాకు మనోవేదన కలిగించి వెళ్లిపోయాడు. కానీ మిగతా వాళ్ళందరికీ అలా లేదుగా…..! మిగతా వాళ్లంతా భార్యా పిల్లలతో సుఖంగా సంసార దాంపత్య జీవితాలతో ఉన్నారు కదా! అంటే నా మరణం వ్యక్తిగత మరణం అవుతుంది కానీ విశ్వ మరణం ఎలా అవుతుంది…. విశ్వమరణ రహస్యం ఎలా అవుతుంది….? పోనీ ఈ విషయం చెప్పినా ఆయన మనిషి కాదు…ఆధ్యాత్మికత్వంలో ఉన్నత స్థితి పొందిన వాడిలాగా ఉన్నాడు.. కానీ ఆయన జీవించి లేడు. చనిపోయి ఆత్మస్వరూపంగా ఇక్కడ తిరుగుతున్నానని చెప్పాడు. అవసరమైనప్పుడు భౌతిక శరీరం ధరించి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తానని ఒకపక్క చెబుతున్నాడు…. అది సత్యమని అర్థమయింది…అతను చనిపోయిన విషయం గానీ, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. అసలు ఈయన నిజంగానే చనిపోయాడా? కనికట్టా? భ్రమ బ్రాంతా? అసలు ఈయన ఎవరు? అసలు ఈయన గురించి ఎలా తెలుసుకోవాలి? అసలు నా మరణం, నా చావు నన్ను చావనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు. అసలు నా చావుతో విశ్వానికి సంబంధం ఏమిటి? ఒకపక్క ప్రశాంతత లేక అశాంత స్థితిలో ఇక్కడికి వస్తే., నా మరణమే ప్రశాంతత స్థితిని ఇస్తుంది అనుకుంటే…. నా మరణ రహస్యం తెలుసుకోమని చచ్చిపోయిన వాడు చెప్పడం ఏమిటి? ఇందులో అసలు అర్థం ఉందా? అసలు ఈయన నిజంగానే చచ్చిపోయాడా? చచ్చిపోయాడని నేననుకుంటున్నానా? అసలు ఏమి జరుగుతుంది? నా జీవితం నా ప్రమేయం లేకుండానే భోగి జీవితం నాశనం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏదో యోగ జీవితం, ఈ యోగ జీవితంలోకి అడుగు పెట్టాలి…ఆధ్యాత్మిక జీవితం సాధన చేయాలి…పూజలు చేయాలి.. ధ్యానాలు చేయాలి…. జపాలు చేయాలి…. నేనేదో తెలుసుకోవాలి….. నా మరణమే విశ్వ మరణం అని చెప్పి చెబుతున్నారు.. అసలు ఏం జరుగుతుంది.. అసలు నేనేం చేయాలి…ఏం తెలుసుకోవాలి…ఇప్పుడు నేను చావాలనుకున్న చావలేని పరిస్థితికి తీసుకువచ్చారు. నేను చావాలనుకున్నప్పుడు నా మరణం వీళ్ళకి ముందే ఎలా తెలుస్తుంది.. అంటే ఏం జరుగుతుంది….? నేను చనిపోతానని నన్ను రక్షించిన వారందరికీ అసలు ధ్యానంలో ఎలా కనబడింది! అంటే ఏంటి…. ఒక వ్యక్తి మరణం ఒక వ్యక్తి చావు పుట్టుకలు ముందే తెలిసిపోతాయా? అందరికీ అర్థం అవుతాయా? అందరూ చూడగలుగుతున్నారా? అలా చూడగలిగిన వారు ఎందుకు ఆపుకోలేకపోతున్నారు వారి మరణాన్ని…. ఎందుకు చిరంజీవులుగా ఉండలేకపోతున్నారు. ఎందుకు మరణాన్ని చేదించలేకపోతున్నారు…ఎందుకు ఈ చావు , పుట్టుకలు వస్తున్నాయి. ఇందులో నేను తెలుసుకోవాల్సింది…..నేను ఎందుకు పుట్టాను ఎందుకు చనిపోతున్నాను తెలుసుకుంటే విశ్వానికి ఏదైనా ఉపయోగం ఉంటుందా..? చూడాలి…. ఇందులో ఏదో తెలియని మర్మం ఉంది. ఏదో నా మరణ మర్మ రహస్యమే విశ్వమరణ రహస్యం చేతన అవ్వచ్చేమో! నాకు అంత సీన్ లేదు…నాకు ఆసక్తి కూడా లేదు. నా భర్త విషయంలోనే నేను ఏమి చేయలేకపోయాను… సాక్షిభూతంగా అడిగినవన్నీ ఇచ్చి పంపించాను…. అలాంటిది విశ్వానికి సంబంధించిన మర్మ రహస్యాన్ని, నేను ఎలా చేదించగలను …..నా భర్త మనసులో ఏమున్నదో తెలుసుకోలేకపోయాను . తన మనస్సులో ఏం ఉంచుకొని నాకు విడాకులు ఇచ్చాడో తెలియదు. నా భర్త మనస్సులోని మర్మ రహస్యమే నాకు తెలియనప్పుడు….. విశ్వమరణ రహస్యం ఎలా తెలుస్తుంది? అది కూడా నా భౌతికమైన రహస్యంతో సంబంధం ఉందని వీళ్ళు ఎలా చెప్తున్నారు.. ఇది నిజమేనా ఒకవేళ నేనేమైనా మాయలో పడుతున్నానా? అసలు మాయ అంటే ఏమిటి …. భ్రమ అంటే ఏమిటి? బ్రాంతి అంటే ఏమిటి? అసలు నేనెందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది ….ఏం తెలుసుకోవాలి…. దీనికి ఎవరు సమాధానం చెబుతారు ….చూడాలి…. ఇక్కడ ఏదో ఉంది ..అదేదో నేను తెలుసుకోవాలి….
శ్రీ త్రైలింగ స్వామి చెప్పిన మోక్షమరణం గురించి ఆలోచిస్తూ ….శివ నందిని ఆఘాట్ మీద గాఢ నిద్రలోకి జారుకుంది. సుమారు ఉదయం ఐదు గంటలకి పక్షుల కిల కిలా రావాలకి….. గంగా నది పరవళ్ళకి ఆమెకి మెలకువ వచ్చింది. చుట్టుపక్కల చూస్తే ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో…. ఆమెకి గుర్తు చేసుకుంటే ఏమీ అర్థం కాలేదు ….జీవ సమాధి చెందిన ఒక వ్యక్తి ఆత్మ శరీరం… తనకి దర్శనం అవటం నిజమా? అబద్దమా? లేదా భ్రమ, భ్రాంతి పడుతున్నానా అని ఆలోచించింది. నిజం కానప్పుడు, తన గదిలో పడుకోవలసిన మనిషి పంచగంగా ఘాట్ మీద ఎందుకు పడుకుంటుంది. ఎందుకు తను ఇక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది . అంటే తనకు నిజంగా స్వప్న దర్శనంలోనే శ్రీ త్రైలింగ స్వామి ఆత్మ దర్శనం జరిగి ఉండాలి. అలాగే ఆయన భౌతిక దర్శనంతో వచ్చి …తన ఆత్మ జన్మకి కారణం ఏంటో తనకి అర్థం అయి కానట్టుగా చెప్పి మోక్షం గురించి చెప్పి ఉండాలి. ఇది నిజమై ఉంటుందని భావన చేసుకుంది. కానీ నిజమా అబద్దమా అని ప్రస్తుతం ఆలోచించే పరిస్థితిలో తను లేదు. ఎందుకంటే తన భర్త తనతో 16 సంవత్సరాలు ఉండి ….జీవితాంతం తోడు ఉంటానని చెప్పి… అనుకోని విధంగా పరస్త్రీ వ్యామోహం లో పడి ,బిడ్డని కని ,తనని తీసుకువచ్చి తనకి సవతిగా తీసుకురావాలని ప్రయత్నించడమే అతను చేసిన తప్పు. అతను చేసిన ఈ ఘోరమైన తప్పుకి తను తీవ్రమైన మనోవేదనను 16 సంవత్సరముల పడుతున్నప్పటికీ …..అతను తెలుసుకోకుండా తనకి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా, బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల మధ్యలో చివరికి తను ఉంచుకున్న ఆడదాన్ని దృష్టిలో కూడా చులకన చేసి మాట్లాడటం తనకి నచ్చలేదు. మనసు బాధ వేసింది . ఇక అక్కడి నుంచి పుట్టింటికి చేరుకొని విడాకులు కావాలని అతన్ని కోరి …. అతని నుంచి స్వేచ్ఛను కోరి విముక్తి పొందింది. కానీ అతను చేసిన తప్పు వల్ల ఇప్పుడు తను బాధపడుతుంది. నిజానికి బాధ అనేది మనసుకు మాత్రమే. ఆయన పుట్టినప్పటినుంచి 16 సంవత్సరముల వరకు లేడు . అతను ఎవరో తెలియదు . మరో 16 సంవత్సరముల వరకు అనగా 32 సంవత్సరంల వరకు అతను తాళి కట్టిన భర్త మాత్రమే … ఏనాడు భర్త సౌఖ్యం ఇవ్వడం కానీ ప్రేమాభిమానాలు చూపించడం కానీ పిల్లలకు తండ్రిలాలన అందించడం కానీ ఏమీ చేయలేదు……నామకవాస్తి సమాజం కోసం పిల్లల్ని కన్నాను… సమాజం కోసం పెళ్లి చేసుకున్నాను, సమాజం కోసం అనడమే కానీ ,తనకంటూ ..తనొక స్త్రీ మూర్తి ,తన భార్య, నాది, మనవాడు, తను నా సొంతం అని చెప్పి ఎక్కడా కూడా చెప్పటం, చూపించడం, ప్రేమ చూపించడం, చేయలేదు. పోనీ అతనికి ప్రేమ చూపించడం తెలియదా అంటే పరస్త్రీలు అందరినీ ప్రేమగాను, ఆప్యాయంగాను గౌరవం గాను, దగ్గరికి తీయడం చూడటం చేస్తాడు .కానీ తన దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఉండవు…….
సరేలే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడు ఏం లాభం లేదు. ఇప్పుడు జరగవలసినది ఏంటి? రాత్రి ఆత్మహత్య ప్రయత్నాలు చేశాము. అయినా కూడా చనిపోలేదు. చనిపోయే పరిస్థితికి వచ్చేసరికి రావాల్సిన వాళ్ళు వచ్చి కాపాడాల్సిన వాళ్లు కాపాడి వాళ్ల కర్మను చేసి వెళ్లిపోయారు. ఇదంతా కూడా నిజమే….. జరిగింది….. ఇప్పుడు ఏం చేయాలి? అసలు మోక్షం అంటే ఏంటో తెలియదు .ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటో తెలియదు. ఏదో పండుగనాడు ఇంట్లో పూజలు చేయడం ,నిత్య దీపారాధన చేయడం ,ఏవో కోరికలు మనసులో ఆవేదన కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, మొక్కులు వరకే తెలుసు.
తనకి కులదైవంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం తెలుసు. కులదేవతగా విజయవాడ దుర్గమును ఆరాధించడం తెలుసు. అంతకుమించి ఇంకా తనకి ఏమీ తెలియదు. ఏదో అప్పుడప్పుడు రామాయణ ,మహాభారతాలు, ఇతిహాస గ్రంధాలు అది కూడా ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు…, మనసు బాగోనప్పుడు, తన భర్త అనే మాటల వల్ల, భర్త చేసే చేష్టల వల్ల ,భర్త చేసిన పనుల వల్ల, ఇతరులు అనే మాటల వల్ల ,మనసుకు బాధ కలిగినప్పుడు దగ్గరలో ఉన్న శివాలయానికి హనుమ ఆలయానికో వెళ్లి దర్శనం చేసుకోవడం ఇన్నాళ్లు చేయడం జరిగింది . ఇప్పుడు ఈ భర్త చేసిన ఘోరమైన తప్పు వలన పరస్త్రీ వ్యామోహంలో పడి పక్కన పెట్టడం వలన… మనసు విరిగిపోయి, విడాకులు తీసుకోవడం జరిగింది. దాంతో ఇన్నాళ్లు పొందిన పురాణ వైరాగ్యం కాస్త స్మశాన వైరాగ్యం గా ….ఏదో మనసు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు చెప్పిన మాట విని కాశీ క్షేత్రానికి రావడం జరిగింది . ఈ కాశీ క్షేత్రంలో మరణం పొందితే మోక్షం వస్తుందని శాస్త్ర ఉవాచ ప్రకారంగా చనిపోవాలని అనుకున్నాను. కానీ అది జరగలేదు. అది జరగకుండా ప్రకృతి ఆపుతుందని సిద్ధగురు అయిన అఘోర తైలింగస్వామి ఆత్మ స్వరూపంగా చెప్పాడు . చనిపోయిన ఆయన ఎలా కనపడ్డాడో అర్థం కావడం లేదు. అసలు ఆయన నిజంగానే చనిపోయాడా ? అసలు ఈ క్షేత్రంలో శ్రీ త్రైలింగ స్వామి అనేవారు ఉన్నారా..? ముందు అది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి…. ఆ పక్కన పరవాళ్ళు తొక్కుతున్న గంగా నదిని చూడగానే శరీరం, మనసు పులకరించి స్నానానికి దిగటం జరిగింది.
స్నానంలో కావలసినంత సేపు.. మనసు సేద తీరేంతవరకు ….ఆనంద పులకరింత పొందే వరకు …. మునకలు వేసుకుంటూ పైకి వచ్చింది …అలాగే ఆ తడి బట్టలతోనే ,ఆ పక్కనే దగ్గరలో ఉన్న వెళ్లాలని అనిపించింది. దాని దగ్గరికి వెళ్తూ ఉండగా మెట్ల దగ్గర ఉన్న మఠం లోపలికి వెళ్లేసరికి …. తను రాత్రి చూసిన శ్రీ త్రైలింగ స్వామి మఠం అని , అక్కడ ఉన్న విగ్రహ మూర్తిని చూడగానే ఈమెకి అర్థం అయ్యింది . త్రైలింగ స్వామి వారు నిత్యం పూజించిన అతిపెద్ద బాణలింగం అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది . అలాగే త్రైలింగ స్వామికి నిత్యం దుర్గాదేవి ఒక బాల స్త్రీ మూర్తిగా కనపడేదని, ఆయన ఆరాధన చేసిన దుర్గా సుమంగళీ దేవి విగ్రహమును చూడటం జరిగింది . దర్శించుకోవడం జరిగింది. ఆమె పాదాలకి నమస్కారం చేయడం జరిగింది. అలాగే త్రైలింగ స్వామి వారు 280 సంవత్సరాలు జీవించి …..ఆపై పంచగంగా ఘాట్ లో జీవ సమాధి చెందారని…. ఆయన సమాధి చెందుతున్నప్పుడు ,ఆయన శరీరమును ఒక బాక్స్ లో పెట్టి పంచగంగా నదిలో వదిలిపెట్టమని తన తోటి భక్తులకి చెప్పగానే ……ఆయన ప్రాణం విడిచిన భౌతిక శరీరమును ఒక బాక్స్ లో పెట్టి పంచగంగా ఘాట్ లో వదిలిపెట్టగానే అది కొంత దూరం ప్రయాణించి…. లోపలికి వెళ్లి మునిగిపోయిన కొద్దిసేపటికి ఆ బాక్స్ నీళ్లలో పైకి తేలడంతో ……కొంతమంది భక్తులు ఈ విషయాన్ని గమనించి , ఆ బాక్స్ దగ్గరికి పడవలో ప్రయాణించి వెళ్లి, నది ఒడ్డుకి అనగా ఘాట్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ బాక్స్ ని తెరిచి చూడగానే కొన్ని మల్లె పువ్వులు ఉండటం గమనించారు. ఆ మల్లెపూలని స్వామివారి ప్రసాదంగా భావించి …..వాటిని తీసుకొని ,స్వామివారు నిత్యం ఉండి ,భక్తుల సమస్యలను పరిష్కారం చెప్పే గదిలో ….ఈ పువ్వులను ఉంచి ఒక చిన్నపాటి సమాధి పెట్టడం జరిగింది. ఆ సమాధిని ఎవరు పడితే వారు దర్శించుకోవడానికి వీలు లేకుండా…. తలుపులు వేయడం జరిగిందంట. స్వామి వారు ఎప్పుడైతే ,ఎవరికైతే ఆత్మ దర్శనం ఇస్తారో ….వారికి మాత్రమే ఆ తలుపులు తీసే అవకాశం ….ఆ సమాధిని చూసే అవకాశం కల్పించడం జరుగుతుంది. అనుకోకుండా తనకి గురువుగారి ఆత్మ దర్శనం అయ్యిందని తెలుసుకొని అక్కడున్న ఒక వ్యక్తి ఈమె దగ్గరికి వచ్చి…..“ అమ్మ .! నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను …రాత్రి మీకు మా గురువుగారు త్రైలింగ స్వామి వారి ఆత్మ దర్శనం అయ్యిందని, నాకు రాత్రి 12 గంటలకు ధ్యాన అనుభవం అయింది. నీ రూపురేఖలు, నీకు ఏ విధంగా దర్శనం అయిందో ….ధ్యాన దృశ్యంగా చూడటము జరిగింది . కాబట్టి స్వామివారి అనుగ్రహం నువ్వు పొందాలి. ఆ గదిగిలోనికి వెళ్ళు అని గది తలుపులు తీసి ….ఆమె గదిలోకి వెళ్లిన తరువాత తలుపులు వేసి యధావిధిగా ఆయన పనిలో నిమగ్నమయ్యాడు. ఆవిడకి ఆ గదిలోకి వెళ్లి ఆ చిన్నపాటి సమాధి, శ్రీ త్రైలింగ స్వామి సజీవ మూర్తిని చూడగానే ….ఎందుకో ఏమో ఏదో తెలియని అవినాభావ సంబంధం ఆప్యాయత కలిగింది . కళ్ల వెంట కన్నీటి ధార మొదలైంది.
ఫోటోలో ఉన్న శ్రీ తైలింగ స్వామి సజీవమూర్తి స్వరూపాన్ని చూస్తూ ….“స్వామి …! మీరు ఎవరో నాకు తెలియదు . ఇక్కడికి నా భర్త చేసిన నమ్మకద్రోహం తట్టుకోలేక ప్రశాంతత స్థితి కోసం అందరూ వెళ్లమని చెప్తే…. కాశీ క్షేత్రానికి రావడం జరిగింది . నిజానికి ఈ కాశి క్షేత్రంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని బయలుదేరి వచ్చాను. కానీ నిన్న రాత్రి ఆత్మ స్వరూపంగా భౌతిక దేహంతో నాకు కనబడి గురుబోధ చేశారు . అది నాకు మాత్రం అర్థమై అర్థం కానట్టు ఉంది. అసలు నాకు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటో కూడా తెలియదు. మోక్షం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏమీ తెలియని దానిని …..ఏదో చేస్తానని చెప్పి లోక కళ్యాణార్థం ఉపయోగపడే కార్యం ఏదో ఉందని చెప్పారు అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. అలా అని అర్థం అయ్యిందని చెప్పలేను. అర్థం కాలేదు అని చెప్పలేను…. అర్థం అయి కానట్టుగా ఉంది. ఇప్పటికీ అది నిజమా ?అబద్దమా ? అన్నది కూడా నాకు తెలియదు . నాలో అంత సాధనా శక్తిని మీరు చూశారు అంటే ఏదో ఉండి ఉండాలి. కాకపోతే ఇప్పుడు నేను నా మనశ్శాంతి కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను….. కానీ చనిపోయి సాధించేది ఏదీ లేదని…… ఈ జన్మకి లోక కళ్యాణార్థం ఉపయోగపడే మహాకార్యం ఒకటి ఉందని ….మీ ద్వారా నాకు అర్థం అయింది . అది ఏంటి అనేది …ఎలా అనేది ……ఎలా జరుగుతుంది అనేది కాల నిర్ణయమే చేయాలి. నా మటుకు నాకు తెలియదు . దానికి దారి చూపించే మార్గం మీరే దగ్గరుండి చూపించండి. మీరు చెప్పిన అడుగుజాడల్లోనే ….మీరు చెప్పిన ఇది విధానాల్లోనే నేను నడుచుకుంటాను. ఆ దారికి సహాయం చేసే సహాయకుల్ని నాకు పంపించండి. వాళ్లు చెప్పిన మార్గం ద్వారా అయినా నేను చేయవలసిన లోక కళ్యాణ కార్యక్రమం చేస్తాను. చనిపోయి సాధించేది ఏమీ లేదని….. నాకు అర్థం అయింది . ఆ చచ్చేముందు ఈ జన్మ కారణం ఏంటో తెలుసుకొని సాధ్యం అయినంతవరకు దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను . అప్పటికైనా నా మనసుకి మనోవేదన తగ్గి అశాంతి నుండి మనశ్శాంతి పొందుతానేమో తెలియదు. పొందవచ్చు ….పొందకపోవచ్చు ….పొందుతాననే స్వార్థం నాకు ఉంది ..నమ్మకం ఉంది …విశ్వాసము ఉంది …ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా విశ్వాసంతోనే నడుస్తుంది కదా! కాబట్టి మీరు గురుదేవులుగా ఉండి నన్ను అనుగ్రహిస్తానని ఆశిస్తున్నాను” అని ఆ సమాధికి పాదాభివందనం చేసుకొని , కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడ ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి …… “ స్వామి..! శివయ్య! ఈ శవమును అర్పిద్దామని ఈ క్షేత్రమునకు వచ్చాను…. కానీ ఈయన మా గురుదేవులైన శ్రీ త్రైలింగ స్వామి గురు బోధ ద్వారా నా ఆత్మను ఆత్మ నివేదన భక్తితో నీకు సమర్పించాలని అంటున్నారు . ఈ ఆత్మను నీలో లయంప చేసుకుంటావో ….విశ్వంలో లయింప చేస్తావో నాకు తెలియదు . నాకు నీ విశ్వ మోక్షజ్ఞానం అందేటట్లుగా అనుగ్రహించు. కాబట్టి నువ్వు ఉన్నావని…. అసలు నువ్వు ఉన్నావో లేవో కూడా తెలియదు . కొంతమంది నువ్వు ఉన్నావని చెబుతున్నారు………. మరి కొంతమంది నువ్వు లేవని చెబుతున్నారు …ఉన్నావన్న వారిని ఆస్తికులు అంటున్నారు. లేరన్న వారిని నాస్తికులు అంటున్నారు . ఇప్పటికీ నువ్వు ఉన్నావు, లేవు అని ఏమీ చేయలేదు . ప్రతిసారి కూడా నా అవసర భక్తితోనో ….నా కోరికలు తీర్చుకుంటూ…. ఇన్నాళ్లు వచ్చాను . కాకపోతే నాకంటూ ఏమీ కోరికలు లేవు
ఏ భోగాలు లేవు . ఏ అవసరాలు లేవు . చచ్చిపోయే వాళ్ళకి కోరికలు ఏమి ఉంటాయి? చావాలనుకున్న వారికి చావు భయం ఎందుకు ఉంటుంది? నాకు ఆశలు లేవు. భయాలు లేవు. ఆలోచనలు లేవు. సంకల్పాలు లేవు .స్పందనలు లేవు. ఏమీ లేవు. నా సంతానం గురించి ఆలోచన లేదు. నా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే ఇది లేదు. నా తల్లిదండ్రుల గురించి ఆలోచన లేదు .నా అత్తమామల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. అందరినీ….అన్నింటినీ వదిలేసి ఏకాంతంగా ఒంటరిగా నీ దగ్గరకు ఎందుకు రప్పించుకున్నావో తెలియదు .. కాకపోతే నిన్న రాత్రి జరిగిన గురువుగారి సంభాషణ ప్రకారం లోకకల్యానార్థం నేను తెలుసుకోవాల్సింది ఒకటుంది. అది చేయగలిగితే లోక కళ్యాణ కార్యం అవుతుంది. ఆ కార్యం పూర్తి అయితే గాని ఈ కాయం మాయం అవదని అర్థం అయింది . కాబట్టి నా కాయం మాయం అవడానికి నేను ఎన్ని చేసినా అవి సఫలీకృతం కాలేదు కాబట్టి…. ఈ కాయం మాయం అవ్వాలి అంటే కారణం , కార్యం పూర్తిచేయాలని నాకు అర్థం అయింది . ఆ కార్యము ఏంటో నీ అనుగ్రహంతో తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించు. అలాగే గురువుల అనుగ్రహ సహాయాలతోనూ….. నా దగ్గరికి అనుగ్రహించి పంపిస్తే , వారి సహాయ సహకారాలు తీసుకొని ఆ కార్యం పూర్తి చేస్తాను. పూర్తి చేస్తానో ,చెయ్యనో కూడా నాకు తెలియదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మోక్షం అంటే ఏమిటో తెలియని నాకు….. నా మరణమే ఏదో విశ్వమోక్షమరణం అవుతుందని ….గురువుగారు బోధన చేశారు . ఇప్పుడు నా ఆధ్యాత్మిక సాధన తెలుసుకొని ….సాధన మొదలుపెట్టి పూర్తి చేస్తానా ?చెయ్యనా? అనేది కూడా నాకు తెలియదు . అసలు ఆ మూలమే తెలియని వాడికి మూలం లేకుండా చేయాలి అనడం ఆ సాధ్యాసాధ్యములు ఎంతవరకు అనేది కూడా నాకు అర్థం కావడం లేదు… కాకపోతే సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదు అని ఎక్కడో చదివినట్టు గుర్తు . సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని చెప్పి ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు . కాబట్టి ఆ సాధన నేను మనస్ఫూర్తిగాను మనసా వాచా కర్మణా ఆత్మ నివేదన భక్తితో సర్వస్య శరణాగతి భావంతోను శ్రద్ధ భక్తి విశ్వాసాలతోనూ చేస్తానని మాత్రం నేను మాట ఇవ్వగలను . ఆ కార్యం పూర్తి చేయగలనా లేదా అనేది నీ నిర్ణయానికే ఇస్తున్నాను. వదిలేస్తున్నాను……” అని అక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుని, అక్కడే ఉన్నా సుమంగళీ దేవి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని, ఆ పీఠమునకు అన్నదానం కింద ఒక లక్ష రూపాయలు కట్టి నమస్కారం చేసుకొని అక్కడ అక్కడ నుంచి బయటకు రావడం జరిగింది….
ఆ తర్వాత శివ నందిని కి త్రైలింగస్వామి మఠమును దాటుకొని టిఫిన్ చేయడానికి అని ఘాట్ నుండి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్లి ఆ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో టిఫిన్ తినడం పూర్తి చేసింది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఒక్కొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం ఆరంభించింది .
అలా అన్ని దేవాలయాలు పూర్తి చేసుకున్న తర్వాత గదికి బయలుదేరింది . దారిలో ఉన్నట్టుండి ఆమెకి చనిపోయిన జీవులు అనగా ఆవు మృతదేహం, కుక్క మృతదేహం, పంది మృతదేహం, కోతి మృతదేహం కనిపించాయి . విచిత్రం ఏమిటంటే… ఈ చనిపోయిన మృత దేహాలన్నీ కూడా కుడిచెవు పైకి పెట్టి చనిపోవడం గమనించింది. ఇలా ఎందుకు జరుగుతుంది. .? అన్ని కూడా వేర్వేరు ప్రాంతాలలో చనిపోయినప్పటికీ….. కుడిచెవిని పైకి పెట్టుకుని ఆకాశం కేసి చూస్తూ ఎలా చనిపోయాయి? దీనికి ఏమైనా కారణం ఉందా ? అని ఆలోచిస్తూ గదికి వెళ్ళింది . తడిచిన బట్టలు మార్చుకొని వెళ్లి బట్టలు మార్చుకుని రాత్రి తనకి జరిగిన తైలింగస్వామి అనుభవం అంతా తన వ్యక్తిగత డైరీలో రాసుకోవడం మొదలుపెట్టింది. అన్ని వివరాలు యధావిధిగా గుర్తుకు తెచ్చుకొని మరీ రాసుకుంది. ఆ తరువాత వాటన్నింటినీ చదువుకుంది . కానీ అది అర్థమై అర్థం కానట్లుగా అర్థం అయింది .ఉన్నట్టుండి చనిపోయిన మృతదేహాలు కుడిచెవి పైకి పెట్టుకొని ఎందుకు చనిపోయాయి….. అని ఆలోచించింది. కానీ అనుకోకుండా రాత్రంతా నిద్ర లేకపోవడంతోను ….పైగా జీవ సమాధి చెందిన గురువుగారి దర్శనం పొందడంతో…. ఏదో తెలియని మనోభయం తనలో మొదలై….. ఏదో తెలియని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే మధ్యాహ్నం ఒంటిగంట అయింది. సరే అని దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్లి భోజనం చేసుకొని ఆ దగ్గరలో ఉన్న గుడి పరిసరాలను చూడటానికి వెళ్ళింది.
అలా దర్శనం చేసుకుని…. సాయంత్రం 6 గంటలకు సంధ్యా సమయంలో ఇచ్చే గంగాహారతి చూడటం జరిగింది. ఏదో తెలియని అనుభవ అనుభూతిని కి లోనయింది . ఆ తర్వాత ప్రశాంతంగా రాత్రి 10 గంటల వరకు దశాశ్వమేధ ఘాట్ మీద దగ్గర అలా గంగానదిని చూస్తూ ఉండిపోయింది . భర్త చేసిన పనులు….. తనతో ప్రవర్తించిన జ్ఞాపకాలు ….వదిలిపెట్టలేదు. ఆలోచనలు వస్తున్నాయి . తన ప్రేమ ఆయన్ని మార్చలేక పోయింది అనే మనోవేదన మొదలైంది. కళ్ల వెంట కన్నీరు రావడం మొదలైంది . ఏం చేయాలో అర్థం కాలేదు . ఒకవైపు భర్త బాధ పెట్టిన ఆలోచనలు…. మరొక పక్క అర్థం కాని ఆధ్యాత్మిక స్థితి …ఏం చేయాలో , ఎలా చేయాలో, ఏం పొందాలో అర్థం కాని అయోమయ స్థితి . తనని తాను తమాయించుకొని….మౌనంగా 10 గంటల అవుతుందని గదికి వెళ్దామని బయలుదేరుతూ ఉండగా…. “ ఆగు…. ఆగు…నేను నీకోసమే వచ్చాను. నేను నిన్ను చూడడానికి గత మూడు నెలల నుంచి ఎదురుచూస్తున్నాను” అని ఒక ఆడ గొంతు లీలగా వినిపించింది. ఎవరా ఆమె అని చూస్తే నల్లని దీక్ష వస్త్రాలను ధరించి చేతిలో కపాల యోగ దండం పట్టుకుని తన దగ్గరికి వస్తుంది. దగ్గరగా వచ్చాక ఆమెను పరిశీలించి చూస్తే, ఆమె మెడలో కపాలమాలలు , రుద్రాక్ష మాలలు ఉన్నాయి. ఆమె శివ నందినితో….“ అమ్మాయి! నా పేరు మహాదేవి. నేను అఘోర తంత్ర సాధన చేస్తున్నాను. గత 12 సంవత్సరముల నుంచి ఈ కాశీ క్షేత్రంలో ఉన్నాను. గత మూడు నెలల నుంచి నీ రూపమే నా మనసులో మెదులుతుంది. నీకు నాకు ఏదో తెలియని అనుబంధం…. జన్మాంతర కార్యం ఉన్నది అని అనిపించింది. నేను అఘోరంలో సిద్ధి పొందాలంటే నీ కార్యం ఏదో మిగిలింది. ఆ కార్యం నేను సఫలీకృతం చేయడానికి సహాయపడాలి అని చెప్పి నా గురుదేవులు నాకు ఆజ్ఞ ఇచ్చి పంపించారు. కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడకు. నేను నీకు సొంత అక్క లాంటి దానిని. కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా నీ మనసులో ఉన్న ఆవేదన, బాధ నాతో పంచుకో.. నీ భర్త చేసిన ద్రోహం గురించి ఆలోచించకు.. నాకన్నీ విషయాలు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు. నువ్వు ఏం చేయాలో తెలుసు. ఏం పొందాలో తెలుసు. కాబట్టి నా వంతు సహాయ సహకారాలు నీకు అందించాలని వచ్చాను. ఇందులో నా స్వార్థం లేకపోలేదు. నీ ద్వారా కార్యం పూర్తయితే నా అఘోర సిద్ధి కలుగుతుంది” అని చెప్పి తనని పక్కన కూర్చోపెట్టుకొని ఓదార్చింది….. అన్ని వదిలేసిన దానికి …..ఏకాంతం, ఒంటరితనమే దిక్కు అనుకుంటున్న సమయంలో… ఏ స్వార్థం లేని, నిస్వార్థంతో, నిష్కామముతో, స్నేహబంధం అందిస్తానని…. తనంతట తానే తన దగ్గరికి వచ్చింది కాబట్టి …ఆదిపరాశక్తి రూపమైన విశాలాక్షి రూపమే ఈమె అనుకుంటా….. అని శివ నందిని ఈమె పాదాలు తాకింది. దానికి ఆమె….“ అయ్యో! నువ్వు నాలాంటి దానివే …. కాకపోతే నువ్వు భోగ జీవితంలో అనుభవాలు పొందావు. నేను యోగ జీవితంలో అనుభవాలు పొందాను. అంతే తేడా! ఇక్కడ పేర్లే మార్పు. ఇద్దరం కూడా ఒకరకంగా సాధనలోనే ఉన్నాము . నువ్వు భోగ సాధన చేశావు. నేను యోగంలో తంత్రసాధన చేశాను. అంతే తేడా .. ! భోగంలో ఏంటంటే …..కోరికలు పెరుగుతాయి. యోగంలో కోరికలు తగ్గించుకుంటాము . భోగంలో కోరికలు పెరగటం వలన పునర్జన్మలు వస్తూ ఉంటాయి. అదే యోగంలో కోరికలు తీర్చుకుంటూ జన్మలో లేకుండా చేసుకుంటూ ఉంటారు… మనిద్దరికీ అదే తేడా. ఇద్దరం కూడా ఒకే విధమైన సాధనలో ఉన్నాము. కానీ మాయవలన భోగం వేరు, యోగం వేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ భోగంలో ఉన్నవాళ్లు బిర్యాని తింటే యోగంలో ఉన్నవాళ్లు పచ్చడి మెతుకులు తింటారు. భోగంలో ఉన్నవాళ్లు బంగారు పళ్లెంలో తింటే, యోగంలో ఉన్నవాళ్లు విస్తరాకులో తింటారు. అంతకుమించి ఏమీ లేదు. ఇద్దరు కూడా ఆకలి తీర్చుకునే జన్మలే. యోగంలో ఆకలి తగ్గించుకునే జన్మ, భోగంలో ఆకలి పెంచుకునే జన్మ. అంతే తప్పితే ఇంక ఏమీ లేదు. ఇక్కడ ఇద్దరం కూడా ఒకే విధమైన సమదృష్టిలో, సమస్థితిలోనూ ఉన్నాము. కాకపోతే నీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలియదు. మోక్షజ్ఞనం అంటే ఏమిటో తెలియదు. మోక్షం అంటే ఏంటో తెలియదు. జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. రాత్రి మా గురువుగారైన త్రైలింగ స్వామి వారు చెప్పిన గురుబోధ నీకు అర్థం కాలేదని నాకు అర్థం అయింది. అది అర్థమై అర్థం కానట్టుగా ఉన్నావని గ్రహించాను. కాబట్టి నీకు అన్ని ఆయన చెప్పిన ప్రతి మాట నీకు అర్థమయ్యే విధంగా…. నీకు ప్రతిదీ అనుభవంలోకి వచ్చి , నీ అంతట నీకే అర్థమవుతుంది…అప్పుడే మాయ మాయమవుతుంది. అంతవరకు ఎదురుచూస్తూ ఉండు. కాబట్టి ఇప్పుడు నువ్వు గదికి వెళ్ళు. విశ్రాంతి తీసుకో.. నీకు నా అవసరం ఉంది అన్నప్పుడల్లా నాకు నేనే నీ దగ్గరికి వస్తాను. అంతవరకు నువ్వు కంగారు పడకు. నీకు ఈ విశ్వానికి ఉపయోగపడే కార్యానికి నాతో పాటు ఇంకొకరు కూడా వస్తారు. ఆయన పరిచయం అయిన తరువాత మన ముగ్గురం కలిసి ఏం చేయాలి ?ఎలా చేయాలి? ఏంటి? అనేది చూద్దాం.. కంగారు పడకు.. జరిగే కార్యం జరగక మానదు. కావలసిన కార్యం గంధర్వులు తీరుస్తారు. అంతే. ఏం ఆలోచించకు. భర్త గురించి మనోవేదన చెందకు. మనోవేదన చెందుతున్న కొద్ది బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు. దాని నుంచి మనసుని దైవం వైపుకి మరలచుకో. ఆధ్యాత్మికత్వం వైపుకి మరల్చుకో ” అని చెప్పి “ఓం శివోహం” అనే మంత్రమును గురు మంత్రముగా ఉపదేశం చేసి ….. “ ఈ మంత్రమును మనసులో పూట్ నిరంతరం చేసుకుంటూ ఉండు…జరగాల్సింది జరుగుతూ ఉంటుంది…నీకు ఆధ్యాత్మిక స్థితి ఏమిటి? నువ్వు పొందవలసిన జ్ఞానం ఏమిటి? నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అనేది కాలానుగుణంగా పరిస్థితుల క్రమంగా నీకే తెలుస్తుంది…అందాక ఎదురుచూస్తూ ఉండు. కాబట్టి ప్రతినిత్యం ఈ మంత్రమును 24 గంటలు చేస్తూ ఉండు. నిద్రలో కూడా చేసుకుంటూ ఉండు. ఏం జరగాలో, ఎలా జరగాలో ఆ విశ్వనాథుడు చూసుకుంటాడు. ఏమీ ఆలోచించకు. ధైర్యంగా ఉండు” అని చెప్పి ఈమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శివ నందిని కూడా ఈమె దగ్గర సెలవు తీసుకుని ఈమె గదికి వెళ్లి తేలికపాటి మనసుతో మనోవేదన తగ్గించుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉపక్రమించింది.
గదిలో పడుకున్న శివనందునికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి…ఎదురుగా ఉన్న గడియారంలో సమయం చూస్తే, ఉదయం ఆరు గంటలు అయిందని తెలుసుకుంది. రాత్రంతా మంచి గాఢ నిద్ర పట్టింది. ఎలాంటి స్వప్న దర్శనాలు కానీ, ఎలాంటి మనోవేదనలు, ఆవేదనలు లేకపోవడంతో ప్రశాంతంగా నిద్రపోయింది. ఇలాంటి నిద్రపోయి తను దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఏదో తెలియని ఆనందం, మనసు తెలియక పడినట్లుగా, ఆవేదన తగ్గినట్లుగా అనిపించింది. ఉన్నట్టుండి రాత్రి తోబుట్టుగా వచ్చిన మహాదేవి గుర్తుకు వచ్చింది. ఈమె చూడటానికి తెల్లని శరీరంతో, తేజస్సు ఉన్న ముఖంతో, పైన జడముడి ఋషులకు ఉన్నట్లుగా ఆ తలముడి ఉన్నట్లుగా గమనించింది. ఆ ముడికి కూడా రుద్రాక్ష మాలలు ఉండటం లేలాగా గుర్తుకు వచ్చింది. చెవుల దిద్దులకు బదులుగా రుద్రాక్ష దిద్దులు ఉన్నట్లుగా గమనించింది. ఆమె శరీరం అంతా కూడా రుద్రాక్ష మాలలతో నిండిపోయినట్లు, నల్లని వస్త్రాలతో ఉన్నట్లుగా గమనించింది. వయసు కూడా సుమారుగా 30 లేదా 35 మహా అయితే 32 సంవత్సరాలు ఉంటాయేమో…ఇంత చిన్న వయసులోనే అంత వైరాగ్యం పొంది…. సాధనకి అందులోనూ తంత్రసాధనకి వచ్చి ఎలా నిలబడిందో ఎలా చేసిందో ఈమెకి అర్థం కాలేదు. సరే ఈసారి ఆమె వచ్చినప్పుడు తన తంత్ర సాధన ఎలా మొదలుపెట్టిందో ఏంటో తెలుసుకోవాలని అనుకుంది. కాళ్లు ,చేతులు, ముఖం కడుక్కొని టిఫిన్ చేయడానికి అని బయటకు వచ్చి…. దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్లి గారెలు ,ఒక దోశ తినేసి …ఒక కప్పు కాఫీ తీసుకొని… అది కూడా తాగి ….గదికి వచ్చి ఒక జత బట్టలు తీసుకుని మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానానికని ఆటో ఎక్కి బయలుదేరింది. మణికర్ణిక ఘాట్ దగ్గరికి చేరుకుని చూస్తే అక్కడ ఎవరూ లేరు. మధ్యాహ్నం 12:00 కి ఈ ఘాట్ లో జనాలు వచ్చి స్నానం చేయడం పరిపాటి. తను కొన్ని రోజుల నుంచి ఈ విషయం గమనించింది. అదేమిటంటే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ ఉన్న దేవతలు స్నానం చేస్తారని వినికిడి. అది నిజమో కాదో తెలియదు అనుకుంటూ….. తనివి తీరా స్నానం చేసి…. ఎవరు చూడని ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి….. బట్టలు మార్చుకొని…. తడి బట్టలు సంచిలో పెట్టుకొని ఆమె మెట్ల మీద కూర్చుంది. ఒకవేళ తను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని మహాదేవి ఇక్కడికి వస్తుందేమో అనుకుంది. కానీ రాలేదు. ఒక గంట సేపు ఎదురుచూసింది. ఉపయోగం లేకపోయింది. సరే ఇంక తాను రాదేమో లే అని అనుకుంటూ బయలుదేరబోతుంటే……”అమ్మ! భిక్ష…” అనుకుంటూ ఒక ఆయన గొంతు వినబడింది. ఈయన ఎవరా అని చూస్తే సుమారుగా 45 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తిగా కనిపించారు. గుబురు గడ్డంతోనూ…చేతిలో నల్లని కర్ర దండాయుధం ఉన్నది. సరే అని తన చేతి సంచిలో చూడగానే ఆమె డబ్బుల పరుసు తీసుకురాలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆమె అతనితో…..“స్వామి! గదిలోనే డబ్బులు మర్చిపోయాను. ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు బిక్ష వేస్తాను” అని చెప్పింది. దానికి అతను…. “అమ్మ! నీ దగ్గర డబ్బులు ఉంటే బాధపడాలి. లేకపోతే ఎందుకు బాధపడటం…డబ్బు ఉంది అంటే అహం ఉన్నట్టే. అవసరం ఉన్నట్టే. కోరిక ఉన్నట్టే. కోరిక లేని స్థితికి వెళ్లాలని వచ్చావు కదా! చావాలని అనుకుని కూడా చావలేక పోయావు కదా! అయినా నీ దగ్గర డబ్బులు ఉంటే బాధపడాలి. లేవు కదా! డబ్బులతో పని ఏముంది.?. ఆకలి జన్మ లేకుండా చేసుకోవాలి మోక్షం పొందాలి అని నీ రాత రాసిపెట్టి ఉంటే నువ్వేం చేయగలవు. యోగం ఉంటే యోగిని కాక తప్పదు కదా! నువ్వు ఈ జన్మ యోగిని అవ్వాలని అది కూడా మోక్షజన్మ చేసుకోవాలని చెప్పి ఆ విధాత రాసి పెట్టాడు…. నువ్వు మాత్రం ఏం చేయగలవు. కట్టుకున్న వాడు నమ్మకద్రోహం చేసి వెళ్ళిపోయాడు. కారణం తెలియదు. నమ్మించి మోసం చేశాడు. ఒక చిన్నదానిని ఉంచుకున్నాడు. దానితో పిల్లని కన్నాడు. ఆ విషయం నీకు తెలిసేసరికి మనోవేదన చెందావు. విడిపోయారు. వాడేమో సుఖాలు పొందుతున్నాడు. నువ్వేమో సుఖాలు వదులుకొని కష్టాలు అందుకొని ఈ క్షేత్రానికి వచ్చావు. ఇక్కడ ఒంటరితనం ,ఏకాంతం అనుభవిస్తున్నావు. నా అనే వాళ్ళు లేరు. ఎవరికి నీ బాధ చెప్పుకోవాలో తెలీదు. ఎవరి దగ్గర వెళ్లి ఏడవాలో తెలియదు. ప్రతివాడు నీకు జాలి ,సానుభూతి చెప్పేవాడే.. నువ్వే చేతులారా చేసుకున్నామని నిందించే వారే…. నీ బాధని అర్థం చేసుకునే వారు ఎవరూ లేరు. నీ గురించి ఆలోచించేవాడు లేడు. అందరూ సమాజం గురించి ఆలోచిస్తూ మగాడు అనేవాడు తప్పులు చేస్తాడు…. ఆడది తిరిగి చెడితే …..మగాడు తిరగక చెడతాడు అని చెప్పి…. సామెత ఉన్నది కదా! అని ఆడది తిరగకూడదని చెప్తున్నారు కదా! మగాడు పదిమందితో తిరిగితే తప్పులేదు…. అదే ఆడది పది మందితో తిరిగితే తిరుగుబోతు దానిగా చూస్తూ వేశ్య అని అంటారు.. అదే మగవాడు తప్పు చేస్తే వాడు మగాడు అని పదిమందితో తిరిగిన తప్పులేదు అంటారు. ఇది పురుషుల యొక్క ఆదిక్యత లోకం. పురుషులు రాసిన ప్రపంచం. పురుషులు జీవించే లోకం. ఇది మూర్ఖపు పురుష , ఆధిక్య ,పురుష అహంకార ,పురుషుల ప్రపంచం తల్లి…నీలాంటి అమాయకులు ఉండలేరు. కానీ నీ రాత ఏంటంటే చావాలనుకున్న చావలేని స్థితి. నువ్వైనా ఏం చేయగలవు?” అని అంటూ….“సరేలే! నాకు భోజనం చేసే టైం అయ్యింది. అక్కడ శవం సిద్ధమైంది. శవ భోజనం చేయాలి .. ఇక్కడే ఉండు వస్తా” అని చెప్పి మణికర్ణిక ఘాట్ లో అప్పుడే దహనం చేస్తున్న ఒక శవం దగ్గరికి ఈయన ఆశగా వెళ్తున్న దిక్కుకు వెళ్లి…… “ ఏంటి? ఇప్పుడు శవాన్ని తింటాడా? ఎలా తింటాడు? శవం తినే నరమాంసభక్షకులా ఏంటి? అని ఆలోచనలో శివ నందిని ఉండిపోయింది.
కొద్దిసేపటికి …..ఈయన తన చేతిలో గదలాగా ఒక శవం చేతిని పట్టుకొని రావటం గమనించింది. ఈయన ఈ శవం యొక్క చేతిని ఏం చేస్తాడా? అని ఆలోచిస్తూ మౌనంగా చూస్తుంది. అప్పుడు ఈయన ఈమె దగ్గరికి వచ్చి…..“ ఈరోజు నాకు ఈ శవం చెయ్యే ఆకలి తీరుస్తుంది…ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా ……నా పేరు రుద్రయ్య అంటారు .ఇక్కడ వాళ్ళందరూ కూడా గలాటా స్వామి అంటారు . ఎందుకంటే నేను అందర్నీ భ్రమ బ్రాంతులకి గురి చేస్తూ ఉంటాను . గొడవలు చేస్తూ ఉంటాను. గొడవలు పెడుతూ ఉంటాను .నా చేష్టలకి చాలామంది భయపడుతూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే…… దేవుడు ఉన్నాడా? లేడా? కొంతమంది ఉన్నారని చెబుతారు. కొంతమంది లేరని చెబుతారు. ఉన్నవాడి దగ్గరికి వెళ్లి లేడని చూపిస్తాను…. లేని వాడి దగ్గరికి వెళ్లి ఉన్నాడని చూపిస్తాను ……అందుకనే నా వాదనలు…… రెండు కూడా సమవాదంగా ఉండేసరికి …..ఆస్తికులకి ,నాస్తికులకి గొడవలు పెడుతున్నానని చెప్పి ….నన్ను ఇక్కడ వాళ్ళందరూ గలాటా స్వామి అంటారు… అయినా నీకు కూడా ఆకలి వేస్తుందేమో కదా ! ఈ చేయి తింటావా ?అని” చెయ్యి చూపిస్తుంటే…….. శివనందిని “స్వామి! ……స్వామి! వద్దు… నేను అలాంటి దాన్ని కాదు,ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చా”.. అనగానే ఈయన ఆమె వంక తేరిపారా చూస్తూ….. “ఆ చేసావులే! రెండు ఇడ్లీలు ఒక మినప దోశ … అదేం ఆకలి తీరుస్తుంది…. ఇది చూడు ….చక్కటి చెయ్యి…. ఇప్పుడే కాలిన చెయ్యి….. ఎంత సువాసనగా ఉంటుందో…! చూడు ఎంత సుమధురంగా ఉందో చూడు…... ఎంత మెత్తగా ఉందో! ఎంత చక్కగా ఉడికిందో…! ఎంత చక్కగా కాలిందో …..! స్వర్గం కనబడుతుంది. నీకు తెలియదు ఇది రుచి చూడు….. రుచి చూడు” అంటుంటే ……“స్వామి! స్వామి! నేను ఇలాంటిది తినలేను .నావల్ల కాదు ..శవం కాలుస్తుంటేనే నేను చూడలేదు ఇంతవరకు… ఏదో ఈమధ్య ఇక్కడ మణికర్ణిక ఘాట్ లో శవ దహనం చూశాను . ఇప్పుడు మీరు ఏకంగా శవం చెయ్యిని ….అదేదో మిరపకాయ బజ్జీ తిన్నట్టుగా తింటున్నారు ”అని చెప్తే ….నువ్వు ఇంతవరకు శవం తినలేదా ?నిజం చెప్పు . బతికున్న కోడిని చంపి ఆ శవాన్ని వండుకొని తినలేదా ?కోళ్లు తినలేదా? పందుల్ని తినలేదా ?చేపల్ని తినలేదా? మేకల్ని తినలేదా? ఇప్పుడు నేను చచ్చిన మనిషిని చెయ్యి తింటే అది శవం అవుతుందా? నువ్వు తినేది మాత్రం శవం కాదా ? నువ్వు బతికిన జీవిని చంపి తినవచ్చా ?నేను చచ్చిన జీవిని తింటే మాత్రం శవమా? నేను అఘోరీ నా? నరమాంసభక్షకుడినా ? నువ్వే చెప్పు… అందరు నన్ను అలాగే అంటారు. నువ్వు కూడా అలాగే అంటున్నావా? నువ్వు చేస్తే తప్పులేదు….. నేను తింటే తప్పు వచ్చిందా……. ఇది నేను తింటే నీకు వాంతులు వస్తున్నాయా? కడుపులో తిప్పుతుందా? అదే ఇష్టంగా బతికున్న కోడిని చంపి ఆ శవానికి రుచికరమైన మసాలాలు ఉప్పు, కారం వేసి బాగా దట్టించి….. ఆహా! ఎంత బాగుందో …! అని ఊరించుకుంటూ… ఊరించుకుంటూ తింటావు…! అది అరుగుతుంది. కానీ ఈ చచ్చిన శవం యొక్క చెయ్యి మాత్రం అరగదా? తినలేవా? వాంతులు అవుతాయా? ఏమైనా అర్థం ఉందా ఇందులో…నువ్వే చెప్పు” అంటూ ఈ చెయ్యిని తింటావా లేదా అని ఆ మోచేయి నుంచి విరిచి ఆమె చేతుల్లో పెట్టేసరికి…. అది ఆమె అందుకునేసరికి శివ నందిని ఒణుకు మొదలైంది. ఉన్నట్టుండి ఒకసారిగా శవం యొక్క చెయ్యి తన చేతిలో కనపడేసరికి…. తెలియని భయంతో కింద పడేసింది. “ అదేంటి….. ఆ తినే ఆహారాన్ని ఎవరైనా కింద పడేస్తారా? తప్పు కదా! అందులోనూ అదే బ్రహ్మ పదార్థం! పైగా ఆకలి తీర్చే పదార్థం…ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరి ఉన్న చోటనే ఆహారాన్ని కింద పడేయడమా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు కదా! ఆహారాన్ని కింద పడేయకూడదు కదా! తీసుకొని తిను”. …అనగానే గట్టిగా గదమాయించేసరికి…. శివ నందిని ఏం చేయాలో అర్థం కాక …..కళ్ళు మూసుకొని కింద పడ్డ చెయ్యని తన చేతిలోకి తీసుకుని….. కళ్ళు తెరిచి చూసేసరికి చేయి కాస్త తీయని రొట్టెగా మారింది. ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి స్వామి! అని ఆయనకేసి చూసింది. “పదార్థం మారితే గాని యదార్థం తెలియదు తల్లి! ఇక్కడ పదార్థాలు రూపాంతరం చెందుతూ ఉంటాయి. నిజానికి అన్నీ కూడా బ్రహ్మ పదార్థాలే! చూసి చూపును బట్టి ఉంటుంది. భావం బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి. నీ చెయ్యి నువ్వు రొట్టె అనుకుంటే రొట్టెగా కనబడుతుంది. కట్టే అనుకుంటే కట్టెగా కనబడుతుంది…మాంసం అనుకుంటే మాంసంలా కనబడుతుంది.. శవం అనుకుంటే శవంలా కనపడుతుంది. జీవం అనుకుంటే జీవంగా కనపడుతుంది…ఒక బ్రహ్మ పదార్థమే అన్ని విధాలుగా… అన్నింటికీ తగ్గట్లుగా, నీకు తగ్గట్లుగా, మీ భావానికి తగ్గట్లుగా, మీ ఆలోచనకి తగ్గట్లుగానే ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించుకునే పరిస్థితిని బట్టి ….మనం తీసుకునే పదార్థం కనబడుతుంది. ఇప్పుడు నువ్వు దానిని రొట్టెగా తినగలవు. నేను దానిని శవంగా తినగలను. రెండు అరాయించుకో గలుగుతాయి. రెండు అరుగుతాయి. నీకు సాత్విక ఆహారం ….. అదే నేను దానిని శవంగా తింటేనేమో తాంత్రిక ఆహారం. అంతే తేడా! చూసేదాన్ని బట్టి అంతా ఉంటుంది. అది తెలుసుకో. విషయం అర్థం అవుతుంది. పదార్థం దాటితే గాని యదార్థం అర్థం కాదు. నీ భర్త పదార్థం మాయని విడిచిపెట్టు. అసలు యదార్థమును తెలుసుకో. నీ భర్త నీకు ఎందుకు అన్యాయం చేశాడు తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. తెలుసుకోవాలని ప్రయత్నం కూడా అవసరమే లేదు. ఆ జీవితం అయిపోయింది. ఆ జీవితానికి అంతం పలికేసేయ్…ఇప్పుడు కొత్త జీవితంలోకి ప్రవేశించు. కొత్త జీవిగా రూపాంతరం చెందు. అదే ఆధ్యాత్మిక స్థితిలోకి అడుగుపెట్టు. నీ సహాయంగా నా సఖి వస్తుంది. అదే…. ఆ మహాదేవి! నిన్న రాత్రి వచ్చిందిగా..! అది. దానికి నాకు పడదులే…అది నా మాట వినదు. దాని మాట నేను వినను. కానీ ఒకరికి ఒకరం చూసుకోకుండా ఉండలేము. అది నా గత జన్మలో భార్య. ఆ విషయం దానికి చెబితే అర్థమై చావదు. ఈ జన్మలో భార్యని కాదు కదా అంటుంది. ఏదోకథ జన్మ వాసనలు ఉన్నప్పుడు ఈ జన్మలో పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది కదా! కాస్త నువ్వయినా చెప్పు పెళ్లి చేసుకోమని…. సుఖ సంసారం ఇవ్వమని చెప్పు…అదేమో నా మాట వినడం లేదు.. దానికోసం నేను ఇక్కడ సన్యాసిగా మారాను. ఏం చేయమంటావు చెప్పు.” అనగానే …అటు నుంచి……
మహాదేవి:- ఇంక సోది మొదలు పెట్టావా? ఇంకా చెప్పలేదంటా అనుకున్నా! యౌడికి కూడా నీ దర్శనం ఇచ్చావా…? ఏంటమ్మా శివ నందిని! ఏమంటున్నాడు ముసలాయన….
అనగానే
రుద్రయ్య:- నేను ముసలాడిని కాదు…. కేవలం 50 సంవత్సరాలు. నీకేమైనా తక్కువా? 40 సంవత్సరాలే కదా! …
అని మహాదేవి కేసి చూస్తూ….. నీకు నాకు 10 సంవత్సరాలు కదా తేడా! ఈ పది సంవత్సరాల లోనే ముసలోడిని అయిపోయానా? కావాలంటే దా..! పెళ్లి చేసుకో…నీకు ఇద్దరు పిల్లల్ని కనిస్తాను…
మహాదేవి:- ఆ……కనిచ్చావులే…! ఇప్పుడు అదొక్కటే తక్కువ..
అని చెప్పి…
అమ్మా! శివ నందిని…ఆయన గొడవ పట్టించుకోవద్దులే…ఆయన వాగుడు వాగుతూనే ఉంటాడు. అయినా కనపడ్డ ఆడదాన్నల్లా అలాగే అంటాడు. అదొక టైపు మనిషి లే…..
అని చెప్తుంది.
రుద్రయ్య :- ఓ మహాదేవి! ఆ మాట అనమాకు! కనబడిన ఆడదానినల్లా నేను చూడలేదు. నేను చూసిందే ఇద్దరిని. ఒకళ్ళనేమో నిన్నే చూశాను. నీటిలో ఉన్న ఆ గంగమ్మను చూశాను. గంగమ్మ ఏమో నీరుగా ప్రవహిస్తుంది. దానితో నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు ఉన్నావన్న పేరే గాని నువ్వు గత జన్మలో భార్యవి. ఈ జన్మ భార్యవి కాదు కదా అని తప్పించుకుంటున్నావ్.. నువ్వు సంసార సుఖానికి పనికిరావు. నీరుగా మారిన గంగమ్మ పనికిరాదు. నేనేం చేయాలో చెప్పు. నన్నేం చేయమంటావో చెప్పు. నా జీవితం సుఖ సంసారం లేకుండా చేసేశారు…..
ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? లేదా? నేను తనతో మాట్లాడాలి….. అని మహాదేవి గద్దించేసరికి…….. “ఆ…ఏముందిలే…ఆడవాళ్లు ఆడవాళ్లు కలిస్తే మగవాడితో పనేముంది…నాతో నీకు ఇంక ఏం పనుంది..? ఎప్పుడు చూసినా నువ్వు కోప్పడుతూనే ఉంటావు! నన్ను పంపిస్తూనే ఉంటావు! మళ్లీ వస్తానమ్మా ! శివ నందిని! జాగ్రత్త. ఈ మహాదేవి తో జాగ్రత్త అని చెప్తూ ఈ రుద్రయ్య వేరే ఘాట్ వైపుకి వెళ్లడం వీరిద్దరూ చూశారు.
ఆ తరువాత మహాదేవి అక్కడే ఉన్న శివ నందిని కేసి చూస్తూ….
మహాదేవి:- “అమ్మాయి! ఆయన గురించి ఏం పట్టించుకోకు . నా ఆయన నా గత జన్మ పెనిమిటి. ఈ జన్మలో మేమిద్దరం యోగసాధకులుగా కాశీ క్షేత్రంలో మొదలుపెట్టాము. నేను వామాచారంలోకి వెళ్లి తంత్రసాధన పూర్తి చేశాను . ఆయన దక్షిణాచారంలోకి వెళ్లి పూర్ణజ్ఞాని అయ్యారు. కాకపోతే నాకు గత జన్మాంతరాలలో ఆయన భర్తగా ఉన్నాడని తెలిసినా కూడా…. జ్ఞాన స్పురణలు పొందినా కూడా…. ఈ జన్మలో భర్తవి కాదని చెప్పి …దాటేస్తూ, ఉడికిస్తూ ఉంటాను . ఆయన కూడా నన్ను కవ్విస్తూ , ఏదో ఒకటి అంటూ వెళ్ళిపోతాడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. నాకు విషయాలు తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుగా ఉంటాము. ఆయన వల్ల నీకు ఎలాంటి ఆ ప్రమాదము జరగదు. ఆయన నీకు తండ్రి లాంటివాడు .నేను నీకు తల్లి లాంటి దాన్ని. మా ఇద్దరి గురించి నువ్వు అనుమానాలు పెట్టుకోవద్దు .అపోహలు పెట్టుకోవద్దు. మేమిద్దరం కూడా పరిపూర్ణ జ్ఞానులం . నేను తంత్రసాధనలో పరిపూర్ణ జ్ఞాని అయితే , ఆయన సాత్విక సాధనలో పరిపూర్ణ జ్ఞాని అయ్యారు. ఆ విషయం గుర్తుంచుకో. కాకపోతే మేమిద్దరం విడివిడిగా ఉన్నా విడిపోకుండా ఉండాలి అని చెప్పి ఇద్దరం కలిసి ఈ క్షేత్రంలోనే ఉంటున్నాము ” అని చెప్పుకొచ్చింది.
అప్పుడు శివ నందిని ఈమె వంక చూస్తూ…
శివనందిని :- నిన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుంది. పిలవచ్చా?
మహాదేవి:- పిలవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు . నువ్వు నాకు కూతురు లాంటి దానివే. కూతురివే అనుకో!
శివ నందిని:-అవును! ఈ రుద్రయ్య ఏంటి…. నా వెంట పడ్డాడు…. నిజంగానే శవాలు తింటాడా? శవాలు తినే మనిషా?
మహాదేవి:- ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదమ్మా! ప్రతి దానిని రూపాంతరం చేయగలడు. పదార్థమును మార్చగలడు. తనకి అనుగుణంగా మార్చుకోగలడు. ఇసుక నుంచి బంగారము తీయగలడు . నీళ్లలో నుంచి బంగారం తీయగలడు. ఆయనకి సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు తెలియని విద్య అంటూ ఏమీ లేదు. తెలియని విషయం అంటూ ఏమీ లేదు. తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. కాకపోతే ఆయన దగ్గర ఏదో దైవ రహస్య యంత్రం ఉంది . ఆ దైవ రహస్య యంత్రాన్ని ఛేదించగలిగే వ్యక్తుల కోసం మాత్రం ఆయన ఈ క్షేత్రంలో ఉన్నాడని మాత్రం నాకు అర్థమైంది. ఆ యంత్రం కూడా నాకు ఒకసారి చూపించారు. కానీ, నాకు అది అర్థమై అర్థం కానట్టుగా ఉండేది. ఆ యంత్రం ప్రస్తుతం ఆయన ఎక్కడో… ఒకచోట భద్రపరిచారు. ఆ యంత్రమును చదివి ఆ యంత్రంలో ఉన్న రహస్యాన్ని చేదించగలిగితే ఈ విశ్వానికి ఏదో తెలియని విషయం తెలుస్తుంది…. అని మాత్రం ఆయన చెప్పారు. ఆ యంత్రానికి ఈయన కాపలాదారుడు గా ఉంటాడని మాత్రమే నాకు తెలుసు. ఈయన తంత్రసాధన పూర్తి చేశారు. దక్షిణాచారము పూర్తి చేశారు …వామాచారం పూర్తి చేశారు… అన్నింటి యందు పరిపూర్ణ యోగ జ్ఞాని . ఆధ్యాత్మిక స్థితిలో పరిపూర్ణ స్థితి పొందిన వాడు. యోగ చక్రాలను జాగృతి చేసుకొని ఆధీనం చేసుకున్నవాడు ….. పంచభూతాలు, కాలము ఈయన ఆధీనంలో ఉంటాయని అంటారు…. అన్ని సిద్ధులు తెలిసినా …అన్ని సిద్ధులు పొందినా ….ఏమీ తెలియని అజ్ఞానిగా, పిచ్చివాడిలాగా, అమాయకుడిలా, పసి పిల్లవాడి మనస్తత్వంతో బాలోన్మత్త పిశాచ అవధూత స్థితిలో ఉంటాడు ఈయన దాదాపుగా దర్శనం ఇవ్వడం అరుదుగా ఉంటుంది. ఈయన దర్శనం ఇచ్చాడు అంటే…. తన దగ్గర ఉన్న దైవ రహస్య యంత్రాన్ని డీకోడ్ చేయగలిగే వారికి మాత్రమే ఈయన దర్శనం ఇస్తారని చెప్పి… ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఒకసారి నా దగ్గరికి వచ్చి ఈ యంత్రం కూడా చూపించారు. నాకు అది అర్థం కాలేదు . అర్థం అయ్యి కానట్టుగా ఉంది. ఒకవేళ నీకు ఆ యంత్రాన్ని ఛేదించగల శక్తి ఉందేమో …! అందుకే మా గురువుగారైన తైలింగస్వామి కూడా… ఆత్మ శరీరం కాస్త భౌతిక శరీరంతో దర్శనం ఇచ్చారు. కారణం లేనిదే కార్యం జరగదు కదా! ఏదో లోక కళ్యాణ కార్యం నీ చేతుల ద్వారా జరగాల్సి ఉంది .
అనగానే….
శివ నందిని :- అవునమ్మా! నిన్న ఆయన ఏదో గురు బోధ చేస్తున్నప్పుడు నా భౌతిక మరణమే విశ్వమోక్షమరణం అవుతుందని అన్నారు. అసలు నాకు మోక్షం అంటే ఏంటో తెలియదు. మోక్షం మరణం అంటే ఏంటో తెలియదు. అసలు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కూడా తెలియదు. నాకు ఆ పదాలు అర్థం కాలేదు . అది అర్థమయి అర్థం కానట్టుగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మొన్న ఏమో త్రైలింగ స్వామి దర్శనం ఇచ్చారు. నిన్నేమో నువ్వు ఎక్కడి నుంచో తోపుట్టుగా వచ్చావు . ఈరోజు అమ్మాయి అయ్యావు . ఇందాకేమో ఈయన రుద్రయ్య వచ్చి నేను నీకు తండ్రి లాంటి వాడిని అని చెప్తున్నారు. అసలు ఈ కాశి క్షేత్రంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. మహిమలు లేవు అంటే మహత్యాలు చూపిస్తున్నారు. దేవుడు లేడు అంటే దేవుడు ఉన్నాడని అనుభవాలు, అనుభూతులు చూపిస్తున్నారు . చచ్చిపోదామని వచ్చిన నాకు బతకడానికి ఆశ కలిగిస్తున్నారు. నేనేదో తెలుసుకోవాలి…… అది లోకానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఏమీ తెలియని నాకు ఏం తెలుసుకోవాలో ,ఎలా తెలుసుకోవాలో మాత్రం అర్థం కావడం లేదు . ఆ తెలుసుకునే దానిని నేను తెలుసుకుంటానని నమ్మకాలు పెట్టుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని నేను ఎంత వరకు వమ్ము చేయకుండా పూర్తి చేస్తానో అని నాకు భయం వేస్తుంది . ఆలోచనలో పడి తీవ్రమైన ఆవేదనకు గురి అవుతున్నాను.
మహాదేవి :- తల్లి! అంత ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకి మించింది ఏది ఇవ్వదు . మనకి తట్టుకునేది మాత్రమే ఇస్తుంది. కారణం లేనిదే కర్మ లేదు. కర్మ లేనిదే జన్మ లేదు. కారణం ఏంటి అనేది నీ పరంగా అది విశ్వానికి సంబంధించింది అయింది ….అందరికీ కూడా వ్యక్తిగత కోరికల వలన కారణాలు ఏర్పడతాయి. ఆ కోరికల వల్ల కర్మలు ఏర్పడతాయి . వాటి వల్ల జన్మలు ఏర్పడతాయి. ఆ కోరిక తీరితే జన్మ లేకుండా మోక్షం పొందుతారు. ఆ కోరిక తీరకపోతే పునః జన్మ పొందుతారు అంతే తేడా..!
శివ నందిని :- అమ్మ..! నువ్వు చెప్పింది నిజమే! కాకపోతే నేను ఇప్పుడు సాధన మొదలుపెడితే, ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానిగా మారతాను. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ….అసలు లోక కళ్యాణార్థం కావాల్సిన కార్యము ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడితే…… ఆ కార్యం చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో.! అది ఆలోచిస్తున్నాను. నాకు లోక కళ్యాణార్థం కావలసిన కార్యం ఏంటి అనేది తెలియదు . అది తెలుసుకునే ప్రయత్నాలు, చేసే అవకాశాలు ఇంతవరకు కనిపించలేదు. ఎక్కడ మొదలవుతుంది….? ఎలా మొదలవుతుంది…..? అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను సాధన మొదలుపెడితే , అది తెలుసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది.? అది ఆలోచిస్తున్నాను…. దాని గురించి ఆలోచిస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. చేయాలని నిన్న రాత్రి నిర్ణయం తీసేసుకున్నాను. స్వామివారి ముందే నేను ప్రమాణం చేసి చెప్పాను. ఈ దేహాన్ని దహనం చేయాలని నువ్వు నిశ్చయించావు. నా దహనమే మోక్ష దహనం అవుతుందని చెప్పావు…. కాబట్టి అది ఏ విధంగా చేయాలో… స్వామి వారికే వదిలేసాను. కాకపోతే అది ఎప్పుడు ఎలా సాధ్యపడుతుంది అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు అసలు నువ్వు తంత్రసాధన చేసి ఇది పూర్తి చేయడానికి నీకేది సంవత్సరాలు పట్టింది అనేది నాకు తెలియదు. అసలు నువ్వు తంత్రసాధనకి ఎందుకు వచ్చావు…. ఎలా వచ్చావు తెలుసుకోవాలని ఉందమ్మా.! ఏమనుకోవద్దు… దయచేసి మీ జీవిత రహస్యాలు చెప్పు. నా జీవిత రహస్యాలు ఏమిటో నీకు తెలియకుండా ఉండవు. కాలానుగుణంగా నేనే పరిస్థితులను బట్టి నీకు ఒక విషయం చెప్తాను. కాకపోతే అసలు ఎవరు నువ్వు…. ఎందుకు తంత్రసాధనలోకి వచ్చావు ….నువ్వు సాధనకు రావడానికి కారణాలు ఏంటి ? ఈ విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఏమీ అనుకోకుండా చెబితే నీ జీవిత అనుభవాల ద్వారా నేను తెలుసుకోవాల్సింది తెలుసుకొని….. నా మనోవేదన కొంతవరకు తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను…
అనగానే….
మహాదేవి :- తల్లి..! శివ నందిని… అది చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క విషయం మీకు చెప్పుకుంటూ వస్తాను. కాకపోతే నాకంటూ కుటుంబం లేదు. నేనేదో వైరాగ్యంతో ఇక్కడికి రాలేదు. నా పుట్టుకే కాశీలో జరిగింది. నా మరణం మాత్రం కాశీలో ఉండదు అని నాకు అర్థం అయింది. నా కార్యం ఏదో పూర్తయిన తర్వాత నా మరణం నాకు వస్తుంది. ఆ మరణం ఏంటిదో…. ఎక్కడ జరుగుతుందో ….అనేది నీకు లోక కళ్యాణార్థం జరిగే కార్యంలోనే జరుగుతుంది . నిజానికి లోక కళ్యాణార్థ కార్యం అంటే…. రుద్రయ్య దగ్గర ఉన్న దైవ రహస్య యంత్రంలోనే ఉన్నట్టుంది . నాకు తెలిసి నీకు దానిని చేదించే అర్హత ,యోగ్యత, యోగం ఉన్నట్టు ఉంది. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది అనుకుంటాను. కాబట్టి ఇప్పటికి నేను వెళ్తున్నాను… ఆ రుద్రయ్య కూడా వచ్చాడు. నేను కూడా వచ్చాను కాబట్టి…. నువు చేయవలసిన కార్యానికి మేమిద్దరం కూడా సహాయం చేయాలని చెప్పి…. ఆ కాశీ విశ్వనాథుడు నిర్ణయం తీసుకున్నాడు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ఈలోపుల “ఓం శివోహం” మంత్రాన్ని చేస్తూ ఉండు విషయం మీకే తెలుస్తుంది అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక దానితో కాశీ విశ్వనాథుని, విశాలాక్షి అమ్మవారిని ,కాలభైరవుని దర్శనం చేసుకోవాలని కోరిక శివనందిని లో కలగడంతో…. ఆ దేవాలయాల వైపు బయలుదేరింది.
శివ నందిని తన అనుకున్న దేవాలయాలన్నీ కూడా దర్శించుకుని ….దగ్గరలో ఉన్న మణికర్ణిక ఘాటుకి ఆటోలో వెళ్లడం జరిగింది. ఆ ఘాట్ దగ్గర ఆటో దిగి నడుస్తూ…. వెళ్తూ ఉండగా…. దారిలో మరికొన్ని క్షణాలలో మరణం పొందుతున్న ఒక కుక్కని చూడడం జరిగింది. కుక్క నోట్లో నుంచి, చెవిలో నుంచి, మర్మాంగం నుంచి రక్తం రావడం గమనించింది. ఇక ఇది ఎక్కువ సేపు బతకదని అర్థమైంది. ఇక ఈ కుక్క ఎలా చనిపోతుందో చూడాలని గమనిస్తూ ఉంది . ఈ కుక్క కూడా ఈమెను చూసింది. ఇక రోడ్డు మీద చనిపోవడం ఎందుకు అనుకుందేమో ….ఎవరూ లేని చోటుకి ఈ కుక్క వెళ్ళటం గమనించింది. దానితో పాటే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది . కుక్క తన చుట్టుపక్కల ఎవరూ లేరని చూసి ….గమనించి…. ప్రశాంతంగా పడుతుంది. ఇక తనకి మరణ సమయం ఆసన్నమైనదని గ్రహించినట్లు ఉందని శివ నందిని అనుకుంది. కాకపోతే ఎడమ చెవు ఆకాశం వైపు పెట్టి పడుకుంది. అదేంటి కుడిచేది పెట్టి కదా ఉండాలి ….ఇదేంటి ఎడమ చెవి పెట్టింది ఏంటి .? అని శివ నందిని అనుకుంది.. సరే ఏం జరుగుతుందో చూద్దామని ఆసక్తిగా చూస్తుంది. ఈమె గమనిస్తుందని కుక్క కూడా తెలుసుకుంది….అయినా తను కదలని స్థితిలో ఉండడం వలన అదే స్థితిలో ప్రశాంతమైన మరణం పొందాలి అని …. శివ నందినిని గమనించినా కూడా ఏమీ చేయకుండా పడుకుంది. కదల్లేదు… మెదల్లేదు. కొన్ని క్షణాలు ఆకాశం కేసి తల ఎత్తి చూసింది. ఆ తర్వాత విశ్వనాథ శివలింగం ఉన్న దిక్కుకేసి చూసింది . మూలిగింది. అరిసే ఓపిక లేక మూలిగింది . కొన్ని క్షణాలకి కళ్ళు తేలేస్తూ ఉండగానే…. కుడిచేది ఆకాశం వైపుకు పెట్టి కన్నుమూసింది. అంటే చనిపోయింది. ఆఖరి క్షణంలో ఎవరో తన శరీరానికి దిక్కు మార్చమని అంటే ……తన కుడిచెవిని ఆకాశం వైపు పెట్టినట్లుగా ఒక క్షణం పాటు శివ నందిని అనిపించింది… ఆకాశంలో ఎవరో వచ్చి చెప్పినట్లుగా వారి వారి ఆజ్ఞని కుక్క పాటించినట్లుగా అనిపించింది. అప్పటిదాకా ఎడమ చెవి ఆకాశం వైపు పెట్టిన కుక్క కాస్త… ఎవరో చెప్పినట్టు మరణ సమయంలో కుడి చెవి ఆకాశం వైపు పెట్టడం ఆశ్చర్యం వేసింది. ఇందులో పరమార్థం ఏదైనా ఉందా? అని అనుకుంటూ…. ఆ కుక్కకి మోక్షం రావాలని అనుకుంటూ ….మణికర్ణిక ఘాటు వైపుకు వెళ్ళింది. ఘాట్ లోపలికి వెళ్ళి కూర్చుంది. చూస్తే జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు . సరే అని “ ఓం శివోహం” మంత్రం ధ్యానం చేసుకుంది. ఒక గంట సేపు ధ్యాన నిష్ఠ లో ఉండిపోయింది . ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసింది. ఆ తర్వాత తనని ఎవరో గమనిస్తున్నారని ….కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా రుద్ర స్వామి చూస్తూ….
రుద్ర స్వామి :- ఏమైంది ఆలోచిస్తున్నావ్! దేని గురించి ఆలోచిస్తున్నావ్! నేను వచ్చానని కళ్ళు తెరిచావా?
శివ నందిని :- లేదు స్వామి! నన్ను ఎవరో గమనిస్తున్నారని చెప్పి కళ్ళు తెరిచాను. అయినా కూడా 48 నిమిషాలకు మించి నేను ధ్యానంలో ఉండలేకపోతున్నాను..
రుద్ర స్వామి :- లేని వాడి కోసం ఉన్నదాని లాగా ధ్యానం చేస్తున్నావన్నమాట!
శివ నందిని :- అంటే ఏంటి .!స్వామి దేవుడు లేడు అంటారా?
రుద్ర స్వామి :- నేను ఆ మాట అనట్లేదు ! ఉన్నవాడికి లేనివాడిగా కనపడతాడు. లేని వాడికి ఉన్నవాడిగా కనపడతాడు . ఆయన ఉన్నాడో లేడో అనే అయోమయ స్థితిలో మాయ పడేస్తుంది. ఆ మాయని చేదించడానికి కదా నువ్వు ఇక్కడికి వచ్చింది..! మా అందరికీ చెప్పడానికే కదా వచ్చింది …..ఇప్పుడు నేను దేవుడు లేడు అంటాను.. మహాదేవి దేవుడు ఉన్నారు అంటుంది. నువ్వు ఇందులో ఏది సత్యమో ఏది అసత్యమో అనే తేల్చుకొని మాకు చెప్పాలి …..
అనేసరికి ఆమెకి అర్థం కాక,
శివ నందిని :- నేను చెప్పడం ఏంటి స్వామి! మన పూర్వీకులు, మహర్షులు చెప్పేసి ఉంటారు కదా! నేను కొత్తగా తెలుసుకునేది ఏమిటి? చెప్పేది ఏమిటి ?
రుద్ర స్వామి :- ఇక్కడ తెలుసుకోవడానికి ఏమీ లేదు… తెలియనిది ఏమీ లేదు…. ఎందుకంటే అందరూ పూర్ణజ్ఞానులే! కాకపోతే పూర్ణ ఙ్ఞానం మరిచిపోయిన అజ్ఞానులు.
శివ నందిని :- స్వామి! ఇదంతా నాకు తెలియదు. నిజంగా దేవుడు ఉన్నాడా ?లేడా? మీ అనుభవం ప్రకారంగా చెప్పండి!
రుద్ర స్వామి :- అమ్మా ! నాకు ఒకప్పుడు దేవుడు ఉన్నట్టుగా కనబడతాడు. ఒకప్పుడు దేవుడు లేనట్టుగా కనపడతాడు.. ఒక్కప్పుడు ఉన్నదంతా శూన్యం లాగా కనపడుతుంది. ఒక్కొక్కసారి బతికున్న శివుడిగా కనపడతాడు. ఒకొక్కసారి చనిపోయిన శివుడుగా కనపడతాడు. శివ శవ దర్శనం అవుతుంది …ఇంకొకసారి ఏమో…. జీవమున్న శివుడు దర్శనం ఇస్తాడు. ఏమని చెప్పమంటావు చెప్పు …..! అదే నాకు అర్థం కాక ఈ క్షేత్రం నందు ఉన్నాదిగా…. అవధూతలాగా… పిచ్చివాడిలాగా ఈ ఘాట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాను . ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారేమో ! అని వెతుకుతున్నాను.
శివ నందిని :- అంటే మీ అనుభవం ప్రకారం…. దేవుడంటే …. అది ఏంటో తెలియని, అయోమయ అర్థం కాని స్థితిలో ఉంటారని ఉంటారు.
రుద్ర స్వామి :- ఉన్నాడు అనుకున్న వాడికి ఉన్నాడు. లేడు అనుకున్న వాడికి లేడు.
ఉన్నాడు అనుకున్న లేడు. లేడుఅనుకున్న వాడికి ఉన్నాడు.. “god is no where, god is now here.” దీంట్లో నువ్వు ఏం చెప్పగలవు.?
శివ నందిని :- స్వామి ! మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా?
రుద్ర స్వామి :- నాకు తెలియని భాషలు లేవు. తెలియని విద్యలు లేవు. ఆధీనం కాని శక్తులు లేవు. అన్నీ ఉన్నాయి . అర్థం కాని విషయం దేవుడే. అర్థం కాని పదార్థం బ్రహ్మ పదార్థమే… ఏది ముందు వచ్చింది? ఏది వెనక వచ్చింది? గుడ్డు ముందు వచ్చిందా ! కోడి ముందు వచ్చిందా! విత్తనం ముందు వచ్చిందా? చెట్టు ముందు వచ్చిందా? చెట్టులో నుంచి విత్తనం వస్తుంది.. విత్తనం నుంచి చెట్టు వస్తుంది. ఏది ముందు వచ్చింది? ఏది సృష్టిస్తుంది? ఏది నాశనం చేస్తుంది… విశ్వం అంతంలో సృష్టి జరిగిందా? సృష్టిలో అంతం జరిగిందా? అర్థం కాని అయోమయ స్థితి… ఏం చెప్పమంటావ్? ఈ అనుమానాలు, సందేహాలు తీర్చడానికి ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తూ ఉన్నాను. అలాంటి సమయంలో నువ్వు ఉన్నావని చెప్పారు.
శివ నందిని :- అంటే స్వామి! నాకన్నా ముందు తెలుసుకోలేదని చెప్పారా! ఇప్పుడు నేను సాధన చేసి తెలుసుకోవాలని అంటున్నారా!
రుద్రస్వామి:- తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు…. మౌనం వహించారు. చెప్పవలసినది చెప్పనివ్వకుండా ఆదిపరాశక్తి వాక్ దిగ్బంధనం చేసింది. వాళ్లేం తెలుసుకున్నారో తెలియదు.. తెలిసినవాడు మాట్లాడడు. తెలియని వారు మాట్లాడకుండా ఉండలేరు… మాట్లాడాడు అంటే వాడికి ఏమీ తెలియదు అని అర్థం. తెలిసిన వాడు మాట్లాడడు. ఆ తెలిసినవాడు మాట్లాడే స్థితికి తీసుకురాగలిగే వాడు రావాలి . వాడికోసమే ఈ ప్రకృతి వెతుకుతుంది . కాకపోతే నాకు తెలిసినంతవరకు ఒకాయన తన సాధన అనుభవాలు శబ్ద పాండిత్యంతో కాకుండా అనుభవ పాండిత్యంతో తనకి తానే ధ్యాన అనుభవాలు పొంది నూటికి 98 శాతం మాత్రం తెలుసుకున్నాడని గ్రహించాను . ఆయన జ్ఞానం విశ్వానికి అందించడం వలన నాలాంటి కొన్ని లక్షలాదిమంది యోగులకు ఆయన జ్ఞానం అందింది. ఆ జ్ఞానం నిజమా? కాదా? అది సత్యమా? అసత్యమా? అని పరిశోధనలో మిగిలిన వారంతా పడ్డారు . నిజానికయితే ….. నిజానికి, సత్యానికి చాలా తేడా ఉంది. సత్యం అంటే నిరూపించడానికి సాక్ష్యాధారాలు అక్కర్లేదు. మనస్సాక్షి ఆధారం అవుతుంది. అదే నిజం నిరూపించడానికి సాక్షాలు, ఆధారాలు అవసరం అవుతాయి. కాకపోతే ఆయన చెప్పిన అనుభవ జ్ఞానం నూటికి 90 శాతం సత్యమని నేను చెప్తాను.
శివ నందిని :- అదేంటి…నూటికి నూరు శాతం నిజం కాదంటారా?
రుద్ర స్వామి :- ఆయన సాధన మొదలు పెట్టేటప్పుడు విశ్వమునకు మోక్షం ఇవ్వాలని విశ్వ మోక్ష సాధన మొదలుపెట్టాడు. అనుకోకుండా అంతంలోకి వచ్చేసరికి విశ్వమోక్షం కాస్త వ్యక్తిగత మోక్షంగా మార్చుకున్నాడు. తెలుసుకున్నాడు. విశ్వ మోక్ష జ్ఞానం కాస్త వ్యక్తిగత మోక్షజ్ఞానం అయ్యింది. ఎందుకయింది ..? ఎలా అయింది అనేది ఆయనకి తెలియకుండా పోయింది. మాకు తెలియకుండా పోయింది . ఏ తప్పు చేయలేదు. ఏ మాయలోను పడలేదు . అన్ని మూలాలు తెలుసుకున్నాడు. మర్మ రహస్యాలు చేదించాడు. కానీ ఎక్కడో ఏదో చిన్న తప్పు . ప్రకృతి చేయడం వల్ల ఇలా జరిగింది. ఆదిలో ఆదిదంపతులు తప్పు చేశారు. ఆ తప్పు తప్పుగానే పడిపోయినట్టుంది. ఆ తప్పు ఈయన విషయంలో మరో రకంగా జరిగింది.
శివ నందిని :- అదేంటి స్వామి! వాళ్ళు ఆది దంపతులు కదా.! దైవ స్వరూపాలు కదా! వాళ్లెందుకు తప్పు చేస్తారు. ?
రుద్ర స్వామి :- అమ్మ! నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను . ఏ మార్చను. నా అనుభవం ప్రకారం సృష్టిలో శివుడి నుంచి అమ్మవారి వచ్చింది అనుకో…. అప్పుడు అమ్మవారు ఏమౌతుంది. కూతురు అవుతుంది . తండ్రి కూతుర్ల మధ్యలో శృంగారం ఎలా జరుగుతుంది ?అది తప్పే కదా! పోనీ అమ్మవారి నుంచి శివుడు వచ్చాడు అనుకుందాం ! అప్పుడు అమ్మవారు తల్లి అవుతుంది .శివుడు కొడుకు అవుతాడు . మళ్లీ తల్లి కొడుకుల మధ్యన శృంగారం జరిగి సృష్టి ఎలా జరిగింది? ఆదిలో ఆదిదంపతులు ఎక్కడ నుంచి వచ్చారు. ఒకరి నుంచి ఒకరేగా వచ్చింది. శివుని తొడ భాగం నుంచి అమ్మవారి వచ్చిందని చెబుతారు. అమ్మవారి యొక్క హృదయ భాగం నుంచి శివుడు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి . వీటిలో ఒకళ్ళేమో తండ్రి కూతుర్లు అవుతున్నారు. మరొకరు తల్లి కొడుకులు అవుతున్నారు. వీరి మధ్య శృంగారం జరగడం అనేది తప్పు కదా! అది ఆది తప్పే అని చెప్పొచ్చు కదా ! ఈ తప్పు నేను చెప్పట్లేదు . బృహదారణ్య కోపనిషత్తులోనే ఉన్నది. ఆది తప్పుగా ఒక ఆత్మ నుండి రెండు ఆత్మలుగా విడిపోయాయి . ఈ రెండు ఆత్మల మధ్య తల్లి కొడుకు బంధం అయినా ఉండాలి . తండ్రి కూతురు బంధమైన ఉండాలి. కానీ ఈ రెండు బంధాలకి అతీతంగా అవి సంయోగం చెంది ….శృంగారం చేసి 84 జీవజాతులుగా మారారని చెప్పి… ఈ 84 జీవజాతుల ఆవాసం కోసం అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించినారు అని …..ఈ 84 జీవజాతులు కాస్త 84 లక్షల జీవజాతులు అయ్యాయని…. అవి కాస్త 84 కోట్ల జీవజాతులు అయ్యాయని ఈ విశ్వమంతా ఒకటి నుంచి కోటిగా మారడం జరుగుతుంది. దీనిబట్టి ఇది ఆది తప్పుగానే పరిగణించవచ్చు కదా!
శివ నందిని :- ఆ మీరు చెప్పారు అంటే ….పురాణాల్లో ఉంది అంటే ….అది తప్పుగా పరిగణించవచ్చు! కానీ, మీ విశ్లేషణ ప్రకారం చూసినా గాని అది నిజంగా తప్పే కదా ! మన మనుషులలో….తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య శృంగారం అనేది జరగదు కదా! ఆ శృంగారం జరగడం అనేది తప్పు కదా ! ఒకే రక్తం మధ్య శృంగారం జరగడం అనేది తప్పు కదా! అదే జంతువులకి ఆ జ్ఞానం లేకపోవడం వలన శృంగారం వాటి మధ్య జరుగుతుంది . కానీ మనుషులకి జ్ఞానం ఉండటం వల్ల ఆ విధంగా సంబంధాన్ని కొనసాగించలేము కదా ! సరే ..! ఇందాక మీరేదో ఆయన గురించి చెప్తున్నారు కదా…. ఎవరు ఆయన..?
రుద్ర స్వామి :- ఆయన ఎవరో కాదు …,“పరమహంస పవనానంద స్వామీజీ” . ఈయన కపాల మోక్షము అనే గ్రంథం రాశారు. తన ధ్యానానుభవాలు మూలధారం నుంచి బ్రహ్మ రంధ్రం వరకు ఉన్న ధ్యాన అనుభవాలు….. అలాగే స్థూల శరీరం నుంచి లింగ దేహం వరకు తన పొందిన మోక్ష స్థితులు ….అన్నీ కూడా యధావిధిగా , యదార్థంగా ఏ మార్చకుండా, ఏమీ మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయడం జరిగింది. ఆ జ్ఞానం అంతా విశ్వానికి అందించడంతో మాలాంటి వాళ్ళందరికీ అందింది. అలాగే మీ ఫోన్లో దానికి సంబంధించిన ఆ పుస్తకం ఎక్కడో ఒకచోట ఉచితంగా ఉంటుంది కావాలంటే చూసుకో.!
అనగానే శివ నందిని అవునా ? కాదా అని చెప్పి తన సంచిలో ఉన్న ఫోన్ ని బయటకు తీసి కపాల మోక్షం అని ఇంటర్నెట్లో వెతకగానే ఒక బ్లాగ్ కనబడింది . ఆ బ్లాగ్ లో 100 అధ్యాయాలు ఉన్న కంటెంట్ కనబడింది. అని అడిగింది
శివ నందిని :- ఓహో ఇదా! అయితే ఇది చదవాలి అన్నమాట ! చదివితే ఏం తెలుసుకోవాలి?
రుద్ర స్వామి :- నువ్వు ఈ గ్రంథం చదివితే నీకు 95% ఆధ్యాత్మిక అనుభవ పాండిత్యం తెలిసిపోతుంది. ఏది మోక్షమో …ఏది అమోక్షమో తెలుస్తుంది . మోక్షానికి , ముక్తికి తేడా తెలుస్తుంది. విశ్వ మోక్షానికి, వ్యక్తిగత మోక్షానికి తేడా తెలుస్తుంది. ఎందుకంటే మన పూర్విక మహర్షులు, సప్తయోగ చక్రాలు ఉన్నాయని చెప్పారు . సప్తదేహాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఈయన అనుభవ పాండిత్యం ప్రకారం చూస్తే, సప్తదేహాలు కాదు ఏకాదశ దేహాలు ఉన్నాయని ….సప్త చక్రాలు కాదు 13 యోగ చక్రాలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అలాగే ఏకాదశ మోక్షాలు అనేది ఒక మోక్షం కాదు ….ఏకాదశ మోక్షాలు ఉన్నాయని, ఈ ఏకాదశ దేహాల మోక్షాలే…. ఏకాదశ మోక్షాలు అని చెప్పడం జరిగింది. ఇది నిజమా? కాదా అనేది స్వానుభవాల సాధన చేసుకుంటూ, కొంతమంది నిజమని, కొంతమంది మాకు అనుభవాలు అందలేదని చెప్పడం జరిగింది. నా వరకు 98% ఈ అనుభవాలు పొందాను. సత్యమని తెలుసుకున్నాను.
అని కపాల మోక్షం యొక్క విషయాలు చెప్పడం ముగించాడు.
శివనందిని:- స్వామి ! నేను కాశీలో ఒక విషయం గమనించాను .
అనగానే…. శివనందిని కేసి అదోలా చూస్తూ నవ్వి…
రుద్ర స్వామి:- కుడి చెవి ఆకాశం వైపు పెట్టి ఎందుకు చనిపోతున్నాయి అనే కదా! నీ ధర్మసందేహం.
శివ నందిని:- అవును స్వామి!
రుద్ర స్వామి:- ఏమీ లేదమ్మా! మణికర్ణిక ఘాట్ నందు కాశీ విశ్వనాథుడు చనిపోయిన మృతదేహముల ఆత్మని బయటకు తీసి… ఆ ఆత్మ శరీరానికి గురు మంత్రోపదేశం గురు మంత్రముగా ఓం నమశ్శివాయ అని చెప్పడం జరుగుతుంది. అది నిజమా, కాదా అని నీకు తెలియాలంటే నీ సాధన శక్తి ఆజ్ఞా చక్రస్థితికి రావాలి. అంటే కాశి క్షేత్రానికి నువ్వు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు ఆ అనుభవం నిజమా, కాదా అని మళ్లీ మణికర్ణిక ఘాట్ కి వెళ్తే తెలుస్తుంది.
శివనందిని:- నేను ఈ మంత్రోపదేశ విధానం జరిగిందని… రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చదవడం జరిగింది.
రుద్రస్వామి: - యోగులు చూసిందే చెబుతారు కదా! సత్యమునే నమ్ముతారు కదా! సత్యమునే చెప్తారు కదా ! ఆయన అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కదా ! ఆయన మణికర్ణిక ఘాట్ లో తన సాధనా శక్తితో కాశీ విశ్వనాథుడు చేసే గురు ఉపదేశ మంత్రాన్ని చూసి ఉంటారు. నేను చూశాను. నువ్వు చూడటానికి దానికి అర్హత ,యోగ్యత ,యోగం ఉండాలి. నేను చెప్పింది నిజమా? కాదా అనేది నువ్వు సాధన అనుభవంతో తెలుసుకోవాలి.
శివనందిని:- మీలాంటి పెద్దలు, రామకృష్ణ పరమహంస లాంటి యోగులు చెప్పినా కూడా అది నిజం కాకుండా పోతుందా!
రుద్ర స్వామి:- అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపురి వచ్చి… అమ్మవారి సాక్షాత్కార మాయను దాటమని చెప్పినప్పుడు, నాకు ధ్యాన స్థితిలో అమ్మవారి పాదాలు దర్శనం అవుతున్నాయి నేను అమ్మవారి మాయలో దాటలేకపోతున్నాను అని అన్నారు . అప్పుడు రామకృష్ణ పరమహంస భ్రుకుటి స్థానంలో ఆజ్ఞా చక్రం ప్రాంతంలో ఉన్న మనోనేత్రానికి…. ఆయన గాటు పెట్టగానే , నిజరూప అమ్మవారి దర్శనాలు ఆగిపోయి అమ్మవారి స్థానం ఏమీ లేని ,ఏమీ తెలియని, అర్థమయ్యి అర్థం కాని అర్థం కానిది ఏదో….. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా… అంటే గాఢాంధకార పూర్ణ శూన్యం చూడడం జరిగింది. అంటే నిరాకర తత్వంలో చూడడం జరిగింది. ఒకప్పుడు ఈయన భక్తి మార్గంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆకార రూపినిగా మారింది. అదే ఈయన ధ్యాన మార్గంలోకి వెళ్ళగానే అమ్మవారు కాస్త నిరాకారంగా మారింది . ఇది ఎలా సాధ్యపడింది అంటావు , అంటే ఆకార స్వరూపంగా ఉంటే దేవుడు ఉన్నట్టు…. నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు లేడని అనిపిస్తుంది. తెలుస్తుంది. అర్థం అవుతుంది…ఈ భావాలకి మూలం ఎలా జరుగుతుంది… కానీ రామకృష్ణ పరమహంస మాత్రం పాము కదిలితే ఆకారం, పాము కదలక పోతే నిరాకారం. కాబట్టి నాకు అమ్మవారి దర్శనం ఇచ్చే సాకారతత్వంలోనే ఉండిపోతాను. అమ్మవారు కనిపించని నిరాకర తత్వం నాకు వద్దు అని చెప్పడం జరిగింది. అంతెందుకు ….శివుడు లేడు అమ్మవారు లేరు …నిరాకార తత్వమే అని చెప్పిన తోతాపూరి… విపరీతమైన కడుపులో నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళినప్పుడు , నది దూరమవుతున్నట్టుగా కనబడింది. ఎంత నదిలో మునగాలనుకున్నా….పాదాలకు మించి నీరు ఉండేది కాదు . ఇది ఎలా సాధ్యపడుతుందని ధ్యానంలో కూర్చున్నప్పుడు, రామకృష్ణ పరమహంసకి నిత్యం కనిపించే కాళికా దేవి ఆయనకి నిజరూపంలో దర్శనం ఇచ్చింది. అమ్మ దర్శనం అయింది అని గుడికి వెళ్తాడు. అంటే దేవుడు లేడు అన్నవారికి దేవుడు ఉన్నట్లు చూపించారు. దేవుడు ఉన్నాడు అన్నవారికి దేవుడు లేనట్లుగాను చూపించారు. ఇప్పుడు ఇందులో దేవుడు ఉన్నట్లా? లేనట్లా ? ఇప్పుడు మా తాత ఒకప్పుడు ఉన్నాడు . ఇప్పుడు లేడు. మా తాతను చూసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు తాత ఉన్నట్టా? లేనట్టా.? తాతలు లేడు అనుకుంటే…. తాతను చూసినవారు ఉన్నారు. తాత ఉన్నాడు అంటే, ప్రస్తుతానికి ఆయన లేడు. మరి ఉన్నవాడు లేనివాడిగా ఎక్కడికి వెళ్ళాడు. లేని వాడు ఉన్నవాడిగా ఎలా కనపడుతున్నాడు. అదే అర్థం కాని అయోమయ ప్రశ్న! దీనికి సమాధానం కావాలంటే నీలాంటి సాధకులు వ్యక్తిగత మరణాన్ని వదిలి మోక్షమరణాన్ని పొందాలి. అలాగే 98% పరమహంస పవనానంద తన అనుభవ పాండిత్యంలో పొందాడు ….కానీ ఎక్కడో ఏదో తెలియని తప్పు జరగటం వలన విశ్వమోక్షం కాస్త వ్యక్తిగత మోక్షంగా జ్ఞానమును పొంది ఆయన వ్యక్తిగత మోక్ష మరణమును పొందడం జరిగింది. అదేవిధంగా ఆయన చూపించిన వ్యక్తిగత మోక్షమరణ మార్గమునకే కొన్ని లక్షల మంది వెళ్లి మోక్షమరణమును పొందడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ విశ్వం అనేది 108 డైమెన్షన్స్ లోకాలతో ఏర్పడినది అని ఈ కపాల మోక్షం ద్వారా తెలుస్తుంది. ఒక్కొక్క డైమెన్షన్ లో 11 దేహాలు ఉన్నవాళ్లు ఉంటారు. ఇప్పుడు భూలోకం అనేది మూడవ డైమెన్షన్ కి సంబంధించింది . ఈ మూడవ డైమెన్షన్ లో నాలాంటి వారు 11 మంది నాలో ఉంటారు. అలాగే నాలుగవ డైమెన్షన్, ఐదవ డైమెన్షన్ ,ఆరవ డైమెన్షన్ ఇలా 108 డైమెన్షన్ల దేహాలు చొప్పున 1188 దేహాలు ఉంటాయి. ఈ దేహాలన్నింటికీ ఏకకాలంలో మోక్షం రమ్మంటే రాదు. ఇప్పుడు మూడవ డైమెన్షన్ లో నేను మోక్ష సన్యాసిగా మారి మోక్షం పొందడం జరిగింది. అదే నాలుగవ డైమెన్షన్ లో వాడు భోగ మాయలో పడి సంసారంలో ఉన్నాడు. అదే ఐదవ డైమెన్షన్ లో ఉన్నవాడు ధనాన్ని సంపాదిస్తూ ఆ మాయలో ఉన్నాడు. అదే ఆరవ డైమెన్షన్ లో ఉన్నవాడు వ్యభిచారిగా ఉన్నాడు. ఏడవ డైమెన్షన్ లో ఉన్నవాడు పోలీస్ ఆఫీసర్ గాను, ఎనిమిదవ డైమెన్షన్ లో ఉన్నవాడు జ్యోతిష్యవేత్తగానూ, తొమ్మిదవ డైమెన్షన్ లో ఉన్నవాడు డిటెక్టివ్ గానూ, ఇలా రకరకాలుగా ఉన్నారు. పదవ డైమెన్షన్ లో వాడు పూజలు ,11వ డైమెన్షన్ల వాడు తంత్ర సాధన, 12 డైమెన్షన్ లో వాళ్ళు దక్షిణాచారంలో, ఇంకో డైమెన్షన్ లో కర్మ మార్గంలో, ఇంకో డైమెన్షన్ లో భక్తి మార్గంలో ,ఇంకొక డైమెన్షన్ లో జ్ఞానమార్గంలో, ఇంకొక డైమెన్షన్ లో ధ్యానమార్గంలో ఇలా అనుసరించి …. పలు విధాలుగా పలు రకాలుగా ఉన్నారు. నాలాంటి స్వరూపం ఉన్నవాళ్లు ఉన్నారు. అప్పుడు మూడవ డైమెన్షన్ లో ఉన్న నేను పూర్ణ మోక్షం పొంది మోక్షం పొందడం జరిగింది. అదే నాలుగో డైమెన్షన్ లో వాడు , ఐదవ డైమెన్షన్ లో వాడు , ఆరవ డైమెన్షన్ లో వాడు ఇలా 108 డైమెన్షన్ లో ఉన్నవాళ్లు ఎప్పుడు మోక్షం పొందుతారు? ఎలా మోక్షం పొందుతారు? నాకు మోక్షం పొందటానికి 28 మహా యుగాలు పట్టింది. మోక్షజ్ఞానం తెలియడానికి…. మరి మిగతా మెన్షన్ లో వాళ్ళకి ఎంత కాలం పడుతుంది? ఇలా నీలోను 1188 శరీరాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న అన్ని జీవులలోనూ ఉంటాయి . అంటే సుమారుగా ఒక్కొక్కడికి 1000 శరీరాలు అంటే 1000 కోట్ల శరీరాలు ఉంటాయి. ఇలా విశ్వమంతా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే అద్దం ముక్కలు అయింది. అది చిన్న చిన్న ముక్కలు అయింది. ఆ ప్రతి ముక్కలోను ప్రతిబింబం కనబడుతున్నది కదా! అంటే ఈ సృష్టి ఆరంభంలో ఆది రుద్రుడు విభజన చెంది 64 రుద్రులుగా మారడం జరిగింది. ఆ 64 రుద్రులుగా మారిన తరువాత ఏ రుద్రుడు కి ఆ రుద్రుడు మోక్ష జ్ఞానమును పొంది… మోక్షం పొందడం జరిగింది. అంటే ఆయన విభజన చెందకుండా 64 రుద్రులుగా కాకుండా ఏకరుద్రుడిగా ఉన్నట్టుంటే…. పూర్ణ మోక్షం వచ్చేది . అంటే విశ్వమోక్షం పొందడం జరిగేది . అంటే ఇప్పుడు ఆయన 64 భాగాలుగా విభజన చెందడం వల్లే గా మనమంతా ఏర్పడింది. మనమంతా వచ్చింది. ఆయన విభజన చందకుండా ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా! ఆయన నుండి అమ్మవారు వచ్చింది . ఏకత్వం నుంచి ద్వైతం వచ్చింది. అటు నుంచి త్రిమూర్తుల తత్వం వచ్చింది. ఆ త్రిమూర్తుల నుంచి త్రిమాతల తత్వం వచ్చింది. ఇలా ఆయన విభజన చెందకుండా ఉండి ఉంటే ఏకత్వ స్థితిలో ఉంటే అదే విశ్వమోక్షం అవుతుంది.
శివ నందిని :- స్వామి ! ఇదంతా నాకు అర్థమై అర్థం కానట్టుగా ఉంది. మోక్షం అంటే ఏమిటో తెలియదు. సాధన అంటే ఏమిటో తెలియదు . జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. ఆధ్యాత్మిక సాధనా అంటే ఏమిటో తెలియదు. ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటో తెలియదు. అలాంటి దాన్ని…. ఏదో లోక కళ్యాణార్థం ఉపయోగపడతానని…. ఏదో విశ్వమోక్షం నా మరణంతో ముడిపడి ఉందని….. సిద్ధగురువు త్రైలింగ స్వామి చెప్పారు. ఇది సాధ్యపడుతుందంటారా?
రుద్ర స్వామి: - తెలియనంత వరకు ఏదీ కూడా తెలియదమ్మా! తెలుసుకుంటే మాయ మాయమవుతుంది. ఇప్పుడు కపాల మోక్షం చదువు . నీకు ఆధ్యాత్మిక సాధన యొక్క శబ్ద పాండిత్యం ఏమిటో అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆయన పొందిన అనుభవాలు సత్యాసత్యాలని నువ్వు చూడు. కాకపోతే ఇక్కడ ఆయన పొందిన అనుభవ పాండిత్యం అంతా కూడా ధ్యాన అనుభవాలే. ఉదాహరణకి ఆయన ధ్యానంలో కూర్చుని అంతరిక్షంలోని మణిద్వీపంలో చూడటం జరిగింది. అది నిజమా ? కాదా , అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారే సాధనలో కూర్చున్నప్పుడు అనుభవ దర్శనం అవుతుంది . కానీ నేనేమంటానంటే …..ఆకాశ సిద్ధి తో అంతరిక్షంలోకి వెళ్లి, అక్కడ నిజంగా మణిద్వీపం ఉందా , లేదా? అక్కడ అమ్మవారు ఉందా ? లేదా? ఉంటే ఏ అమ్మవారు ఉంది. ఏ భంగిమలో ఉంది. ఇలా తెలుసుకుంటే ప్రత్యక్ష దర్శనం పొంది…. మళ్లీ యధావిధిగా వస్తే , అది లోకానికి చెప్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి ప్రతిరూపమే నువ్వు. ఇప్పుడు పరమహంస పవనానంద కదలకుండా కూర్చున్న చోటనే ధ్యాన అనుభవాలు పొందాడు . అవన్నీ సత్యమే. కాదని అనను. కానీ ఇప్పుడు ఆయన పొందిన అనుభవాలలో 80% మనందరికీ సరితూగుతాయి. ఆ అనుభవాలు ఆయన ధ్యానంతో చూశాడు . నువ్వు అది నిజమా? కాదా ? అని ప్రత్యక్షంగా వెళ్లి చూడు . అంటే నీకు ధ్యానంలో మణిద్వీప దర్శనం అయ్యింది అనుకో …..ధ్యానంలో అది నిజమా కాదా అని అంతరిక్షంలోకి వెళ్లి చూసే స్థితి పొందు . కాకపోతే ఆయన ఆ స్థితిని పొందాడు కానీ… ఆ సిద్ధిని ఉపయోగించలేదు. సిద్దమాయలో పడిపోతానని భయపడ్డాడో …..సాధన ఆగిపోతుందేమోనని అనుమాన భయంతో ఆగిపోయి ఉండవచ్చు కదా ! నువ్వు ఆ సిద్ధులను నిస్వార్ధంగా ఉపయోగించు . స్వార్థం కోసం ఇతరుల కోరికలు తీర్చడానికి, దైవ ప్రతిష్టల కోసం లేకపోతే ధనం కోసం , ఐశ్వర్యం కోసము ,ఆశించకుండా నువ్వు చూసిన ధ్యాన అనుభవం నిజమా? కాదా? అని ప్రత్యక్ష దర్శన అనుభవం పొంది లోకానికి చెప్పు. అప్పుడు విషయం నీకు అర్థం అవుతుంది…
శివనందిని:- స్వామి మీరు చెప్పింది… అంతా బాగానే ఉంది. అంతటి మహాయోగికే చిట్టచివరిలో 98% చేసి…. రెండు శాతంలో విశ్వమోక్షం పొందవలసిన చోట వ్యక్తిగత మోక్షజ్ఞానం పొందారని మీరే చెప్తున్నారు . మరి అంతటి సాధన చేసి అంతటి స్థితికి వెళ్లే సామర్థ్యం నాలో ఉందంటారా?
రుద్ర స్వామి:- కారణం లేకుండా కార్యం ఉండదు. కారణం లేకుండా కర్మ ఉండదు. కర్మ లేకుండా జన్మ ఉండదు. కారణం, కర్మ, జన్మ అంటే సృష్టి, స్థితి లయ ఉండాలి . నువ్వు సంసార శిఖాలు అనుభవించడానికో , భోగ జీవితం అనుభవించడానికో రాలేదు. నీ భౌతిక మరణమే విశ్వమోక్షమరణం అయ్యే అర్హత ,యోగ్యత, యోగం నీకు ఉంది. అది తెలుసుకోవడానికి నిన్ను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాడు. పొందవలసింది పొందాడు. ఎక్కడైతే తప్పు జరిగిందో…. ఎక్కడైతే ఆయన మలుపు తిరిగి ఆగిపోయాడో….. ఆ మలుపు మార్పును నువ్వు నీ జ్ఞానంతో పొంది…. అది పూర్తి చేయడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంతో విఫలం అయితే మోక్షం మరణం పొందుతావు. జయం పొందితే విశ్వ మోక్షం జరుగుతుంది …. అయితే వ్యక్తిగత మోక్షం పొందుతావు. లేదంటే విశ్వమోక్షం పొందుతావు. వ్యక్తిగత మోక్షంలో 108 లోకాలలో ఉన్న 1188 దేహాలు మోక్షం పొందుతాయి. లేదు అంటే 840000×118=997,92,00,000 ల శరీరాలు. అదంతా మోక్షం పొందినట్టే అవుతుంది. అదే విశ్వమోక్షం . అది నీ ద్వారా చేయించాలని ….నువ్వు తెలుసుకుంటావని… ఆ యోగం నీకు ఉందని తెలుసుకొని , ఆ కాశీ విశ్వనాథుడు నిన్ను ఇక్కడికి పంపించడం జరిగింది . ఆయన ప్రయత్నం ఆయనకి సాధ్యమైనంత వరకు చేశాడు. జయం పొందాడు .నువ్వు చెయ్యి. ఇప్పుడు కపాలం మోక్షం ద్వారా పురుష ప్రకృతి మోక్షం పొందింది. ఇప్పుడు నీ ధ్యాన అనుభవాల ద్వారా స్త్రీ ప్రకృతి మోక్షం పొందే అవకాశం ఉందేమో ప్రయత్నం చెయ్యి. స్త్రీ ,పురుష ప్రకృతులు కలిస్తే, అది విశ్వమోక్షం అవుతుందేమో …..ఎవరికి ఎరుక. కాబట్టి నీ మోక్ష మరణమే విశ్వ మోక్షం మరణం అవ్వడానికి అవకాశం ఉంది.
శివ నందిని :- స్వామి ! ఇక్కడ నాకు చిన్న సందేహం వస్తుంది . నాకు పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి అంటే ఏంటి ? అర్థం కాలేదు.
రుద్ర స్వామి :- అమ్మ! ఈ విశ్వమంతా కూడా అర్ధనారీశ్వర తత్వంతో ఉంది. అంటే కుడివైపు పురుషుడు ఎడమవైపు స్త్రీ తత్వంతో అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది . ఇందులో ప్రకృతి కూడా స్త్రీ ప్రకృతి , పురుష ప్రకృతి ఉంటుంది. మన దేహాలలో కూడా అంటే పురుషదేహంలో స్త్రీ మూర్తి ఉంటుంది. స్త్రీ దేహంలో పురుషుడు ఉంటాడు.. అంటే xy క్రోమోజములతో మిళితమై అర్ధనారీశ్వర తత్వంతో ఉంటుంది. దేహమే దేవాలయం అవుతుంది కదా! అలాగే ప్రకృతిలో బ్రహ్మ పదార్థం, జీవుడు కూడా అర్ధనారీశ్వర తత్వంతో ఉంటాడు. ఇదే అర్ధనారీశ్వర తత్వంలో పరమహంస పవనానంద తన సాధన ద్వారా పురుష ప్రకృతిలో మోక్షం పొందడం జరిగింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతికి నీ ద్వారా మోక్షం పొందే ప్రయత్నం జరుగుతుంది. స్త్రీ పరంగా చూస్తే, పురుష ప్రకృతిని కదిలే ప్రకృతి అంటారు…. స్త్రీ ప్రకృతిని కదలని ప్రకృతి అంటారు. ఇప్పుడు కదిలే ప్రకృతి మోక్షం పొందాలి. కదలని ప్రకృతి మోక్షం పొందింది . ఆ కదలని ప్రకృతి మోక్షం పొందింది అని పరమహంస పవనానంద ద్వారా తెలిసింది . కదిలే ప్రకృతి మోక్షం పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది.. ఈ కదిలే ప్రకృతి , కదలని ప్రకృతి ….ఈ రెండు మిళితమై స్థిర ప్రకృతి ఏర్పడే అవకాశం వస్తే , అప్పుడు విశ్వ మోక్షం అవుతుంది. అంటే పాజిటివ్ శక్తి మరియు నెగిటివ్ శక్తి కలయిక అనేది తటస్థ శక్తి . న్యూట్రల్ శక్తి అవుతుంది కదా! ఆలోచించు. నెమ్మది నెమ్మదిగా ఆలోచిస్తే విషయం నీకే అర్థమవుతుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. పురుష ప్రకృతిలో కదలని స్థితిలో దక్షిణామూర్తి మరియు ఆకుపచ్చ చీర ధరించిన రాజరాజేశ్వరి ఉంటారు. అదే స్త్రీ ప్రకృతిలో ఆకాశ శరీర తత్వ కదిలే చిదంబర నటరాజమూర్తి ఉంటే అమ్మవారిగా మందార రంగు చీర ధరించిన లలితాదేవి ఉంటుంది. నిజానికి లలితా దేవి కి , రాజరాజేశ్వరి కి తేడా లేదని అంటారు. కానీ వాళ్ళు కూర్చునే భంగిమలో తేడా ఉంటుంది . ఎలా అంటారా ? దక్షిణామూర్తి కుడికాలు కింద పెట్టి ,ఎడమ కాలు మడత పెట్టడం జరుగుతుంది. అదే రాజరాజేశ్వరి అమ్మవారి వచ్చేసరికి దక్షిణామూర్తికి లాగానే కూర్చుంటుంది అదే లలితాదేవి దీనికి వ్యతిరేక భంగిమలో కూర్చుంటుంది. అదే స్త్రీ ప్రకృతిలో లలితాదేవి ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు మడత పెట్టి కూర్చుంటుంది . ఈ తేడా వల్ల స్థిరంగా కూర్చున్న చిదంబరుడు కాస్త , నటరాజ స్వరూపంగా మారడం అయ్యింది . అప్పుడు దాకా కదలని ప్రకృతి కాస్త కదిలే ప్రకృతిగా మారింది అని చెప్పి….
ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే అనుకుంటున్నాను అన్నాడు. ఈ చిన్న జ్ఞానం అందకపోవడంతో పరమహంస విశ్వ మోక్షం కాస్త ….వ్యక్తిగత మోక్షం అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది.
పరమహంస పవనానంద అనుభవం ప్రకారం… కదలని ప్రకృతి, కదిలే ప్రకృతి అని ఉన్నాయి. పురుష ప్రకృతి మోక్షం పొందింది అని తెలుసుకున్నాడు . ఇప్పుడు నీ యొక్క సాధనా అనుభవం ప్రకారం…. కదిలే ప్రకృతి అయిన స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందో ,లేదో తెలుసుకోవాలి. ఇప్పుడు పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి మోక్షం పొందితే ……స్థిర ప్రకృతి అయ్యి ,శూన్యంలోకి వెళ్లే యోగం ఉన్నది. అప్పుడే దాన్ని విశ్వమోక్షం అంటారు. లేదంటే నీ ప్రకారంగా అది వ్యక్తిగత మోక్షం అవుతుంది. ఇప్పుడు నీకు అర్థం అయ్యే విధంగా చెప్పాలంటే నీలోనూ శివుడు ఉన్నాడు…. నాలోను శివుడు ఉన్నాడు. కానీ నాలో శివుడు మరియు నేను పురుష ప్రకృతి వాళ్ళం . కాబట్టి మోక్షం పొందుతున్నాము. నీవు మరియు నీలో ఉన్న శివుడు కదిలే ప్రకృతి కాబట్టి ….. స్త్రీ ప్రకృతి కాబట్టి మోక్షం పొందటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే …. స్త్రీ మోక్షం పొందుతుంది కానీ, స్త్రీలో ఉన్న శివుడు మోక్షం పొందట్లేదు. ఆ విషయం గమనించు. అదే పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందుతున్నాడు. పురుషుడిలో ఉన్న శివుడు మోక్షం పొందుతున్నాడు. ఇప్పుడు పరమహంస అభిప్రాయంగా చూస్తే ఆదిపరాశక్తి మోహమాయలో పడింది అని…. అందుకే ఆవిడ మోక్షం పొందడం లేదని…. అదే శివుడు మోహ రహితుడై, మాయా రహితుడై మోక్షం పొందాడని చెప్పడం జరిగింది. నిజానికి ఆదిపరాశక్తి లో ఉన్నది కూడా శివుడే కదా! అంటే స్త్రీలో ఉన్న శివుడు మోక్షం పొందటానికి భయపడుతున్నాడు. మాయలో పడుతున్నాడు. మరణ భయం పొంది మోక్షం పొందకుండా ఆగిపోతున్నాడేమో! అదే పురుషులలో ఉన్న శివుడు మృత్యుంజయుడై మోక్షం పొందుతున్నాడేమో! అలా ఆలోచించు. అంటే మొదట పురుష ప్రకృతి మోక్షం పొందిందని అవగాహన వచ్చింది. అర్థమైంది . జ్ఞానం పొందాము. ఇంతవరకు బాగానే ఉంది .ఇప్పుడు స్త్రీ ప్రకృతి నీ ద్వారా మోక్షం పొందింది అనే అవగాహనకి వచ్చాం అనుకో……. అప్పుడు అది ఏమవుతుంది ?పాజిటివ్ శక్తి మరియు నెగిటివ్ శక్తి కలిసి న్యూట్రల్ శక్తి అవుతుంది .పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి కలిసి స్థిర ప్రకృతి అవ్వాలి . ఒక విధంగా కదిలే ప్రపంచం ,కదలని ప్రపంచం కలిస్తే స్థిర ప్రపంచం అవ్వాలి. అదే శూన్యం అన్నమాట! ఎలాగైతే శూన్యం నుంచి వచ్చామో అలాగే శూన్యంలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే….. పురుషుడు మరియుపురుషుడిలో ఉన్న శివుడు మాత్రమే శూన్యంలోకి వెళ్తున్నారు. స్త్రీ వెళ్లే అవకాశం ఉంది . కానీ స్త్రీలో ఉన్న శివుడు మాత్రం వెళ్లడం లేదు . ఇప్పుడు కదిలే శివుడు…. నీ ద్వారా సాధన చేసి….. కదలని స్థితికి వెళ్లి….. పూర్ణ మోక్షం పొందాలని అనుకుంటుంది . అది ఎలా? ఎప్పుడు? జరుగుతుంది అనేది….. కాశీ విశ్వనాథుని నిర్ణయం . అప్పటిదాకా, ఆయన ఆజ్ఞ వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉండాలి. అప్పటివరకు కపాల మోక్ష గ్రంథమును పూర్తిగా అర్థం అయ్యే విధంగా చదువుకో ! అప్పుడు నీకు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది . కానీ అనుభవ జ్ఞానం పొందాలంటే నువ్వు సాధన చేయవలసి ఉంటుంది. ఆ సాధన ఎప్పుడు, ఎలా చేయాలి ? అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. దానికి సంబంధించిన జ్ఞానం నువ్వు శబ్ద పాండిత్యం ద్వారా పొందు. ఆయన పొందిన అనుభవాలు నువ్వు పొందావా లేదా తెలుసుకో … పరిశోధించు …..విషయం ఏంటో తెలుసుకో… ఆయన అనుభవాలు అన్నీ కూడా ధ్యాన అనుభవాలే పొందాడు . ధ్యాన దృశ్యాలే పొందాడు . ఆ అనుభవాలను నువ్వు కూడా పొంది, అది నిజమా? కాదా ? అనేది ప్రత్యక్ష దర్శనాలు పొందు. అప్పుడు విషయం నీకే అర్థం అవుతుంది . పరమహంస ద్వారా పురుష ప్రకృతి మోక్షం పొందింది అని అర్థమైంది. ఇప్పుడు నీ ద్వారా స్త్రీ ప్రకృతి మోక్షం పొందుతుందా లేదా అనేది తెలియాలి. ఈ ప్రకృతి కలిస్తే ఏమవుతుంది ….అది విశ్వమోక్షం అవుతుందా లేదా? నీ పరంగా వ్యక్తిగత మోక్షం అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఇందులో పోయేది ఏమీ లేదు .వచ్చేది ఏమీ లేదు. పోతే విశ్వమోక్షం వస్తుంది…. లేదంటే వ్యక్తిగత మోక్షం వస్తుంది.. నీలో ఉన్న శివుడు పోతే విశ్వమోక్షం అవుతుంది . లేదంటే నువ్వు పోతావు. అది వ్యక్తిగత మోక్షం అవుతుంది. ఇప్పుడు పరమహంస కూడా తనలో ఉన్న శివుడు కామమాయకు లోనయ్యాడు అని చెప్పడం జరిగింది. ఆయన పోయాడు. అది వ్యక్తిగత మోక్షం అయింది. ఇప్పుడు నువ్వు వ్యక్తిగత మోక్షం పొందుతావా? విశ్వమోక్షం పొందుతావా ? అనేది స్త్రీపరంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము . దానికి నీకు అర్హత, యోగ్యత, యోగం ఉంది . అందుకని నీ భోగ జీవితమును సంక నాకించి యోగ జీవితానికి నాంది పలికించడానికి కాశీ క్షేత్రమునకు రావడం జరిగింది . కానీ మనోవేదనకి గురైపోయి…. లేని భర్త ఉన్నవాడిగా.., ఉన్న భర్తని లేనివాడిగా అనుకుంటూ సంతాన మోహంలో పడిపోయి, మనోవేదనకు గురి అయ్యి, ఆవేదన చెంది, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు. కానీ నిజానికి నువ్వు చావటానికి రాలేదు. మోక్షం మరణం కోసం బతుకుతున్నావని తెలుసుకో! అంటే చావడానికి…… చావడం కోసమే బతుకుతున్నావు. అదే విశ్వమోక్షమరణం అవుతుంది . అది గుర్తుపెట్టుకో! ఇక ఏది ఎలా చేయాలనేది ఆ విశ్వనాధుడు చెప్తాడు. ఈలోగా ఈ కపాల మోక్ష గ్రంథాన్ని చదువు . విషయం నీకే అర్థమవుతుంది . విషయ జ్ఞానం నీకే తెలుస్తుంది. ఆధ్యాత్మికత గురించి ఏమీ తెలీదు అనేవన్నీ నెమ్మదిగా అర్థం అవుతాయి. శబ్ద పాండిత్యం ద్వారా… ఆ శబ్ద పాండిత్యంలో నువ్వు పొందిన అనుభవాలు…. ఆ జ్ఞానంతో నువ్వు ధ్యాన అనుభవాలు పొంది…. అనుభవ పాండిత్య జ్ఞానమును పొందు .విషయం నీకే అర్థమవుతుంది.శుభం భూయాత్ అని
చెప్పి ఆయన అక్కడి నుంచి …అక్కడే ఉన్న పంచగంగా ఘాట్ వైపుకి కాలభైరవ దర్శనం కోసం వెళ్లడం జరిగింది . ఆయనకి నమస్కారం చేసి సెలవు తీసుకుని గదికి వెళ్లి పరమహంస పవనానంద గారు రచించిన కపాల మోక్ష గ్రంథమును చదవడానికి శివ నందిని ఉపక్రమించింది.
ఇలా గదిలోకి వెళ్లిన శివ నందిని… తన ఫోన్లో కపాలమోక్షం బ్లాగ్ ను ఓపెన్ చేసి… అప్పటిదాకా ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో తెలియని ఆమె, ఒక్కొక్క అధ్యాయం చదవడం ఆరంభించింది. తను పొందిన అనుభవాలన్నీ కూడా యధావిధిగా యధార్ధంగా ఏమార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా రాసిన జ్ఞాన అనుభవాల గ్రంథమును చదవటం ఆరంభించింది. ఇలా 14 రోజులపాటు నిద్రాహారాలు మితంగా చేసుకొని…. అనగా తక్కువ ఆహారం తీసుకోవడం, తక్కువ నిద్రపోవటం, ఎక్కువ సమయం ఈ గ్రంథం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ….. ఈ గ్రంథం చదవడం పూర్తి చేసింది. రుద్రస్వామి చెప్పినట్టుగానే ఈయన ధ్యానంలో అనుభవ పాండిత్యం ద్వారా పొందిన ధ్యాన అనుభవాలు చెప్పడం జరిగింది కానీ…. అవి ప్రత్యక్షంగా విశ్వంలో ఉన్నాయా? లేదా ? అని ఎక్కడా పరిశీలించి చూసినట్టుగా కనిపించలేదు. కానీ ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజమా? అబద్దమా అని తెలుసుకోవాలంటే , ఎవరికి వారే వ్యక్తిగతంగా సాధన చేసి అనుభవం పొందితే తప్ప సత్యం ఏమిటో తెలియదు అని ….శివ నందిని కి అనిపించింది . కాకపోతే ఈయన 48 సంవత్సరాల పాటు సాధన చేసి ఈ స్థితిని పొందాడు. ఇప్పుడు నాకు 32 ఏళ్ళ వయస్సు. ఈ 32 కి మరో 55 సంవత్సరాలు కలిపితే 83 సంవత్సరాలు అవుతుంది . అంటే 83 సంవత్సరాల కి ఈ జ్ఞానం పొందడానికి సమయం పడితే….. అప్పుడు శరీరం సహకరించదు. మనసు సహకరించదు. ఆత్మస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు వ్యక్తిగత మోక్షం పొందామో …విశ్వ మోక్షం పొందేమో…. లేదా స్త్రీ ప్రకృతికి ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అని చెప్పి….. అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోయింది . 14 రోజుల దాకా బయటికి రాని ఆమె కాస్త ఏదో తెలియని ఆనందంతోను, సంతోషంతోను, ప్రశాంత వదనంతోను, మణికర్ణిక ఘాటు వద్ద స్నానానికని బయలుదేరింది. తన చేతి సంచిలో ఉన్న బట్టలను బయటకు తీసి స్నానానికి అని ఘాట్లో ఉన్న గంగా నదిలోకి దిగి , మనసు సేద తీరేంతవరకు మునకలు వేస్తూ ……మనసు ఆనంద డోలికల్లో మునకలేస్తూ…. తన భర్త యొక్క జ్ఞాపకాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతున్నాయని, సంతానం మీద మమకార మోహక్షయం అవుతుందని తెలుసుకుంటూ…. భర్త ద్వారా తను పొందిన ఆవేదన తన దరి చేరట్లేదని గ్రహించింది. ఏదైతే అది అవుతుంది…. చావడానికి సిద్ధపడి వచ్చాము. చావాలని అనుకున్నాను కానీ చావలేకపోయాను. నా చావు ఏదో విశ్వానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అంటున్నారు. మోక్షం అంటే ఏంటో ….ముక్తి అంటే ఏంటో …మోక్షం అంటే ఏంటో….. వ్యక్తిగత మోక్షం అంటే ఏమిటో….. మోక్షం అంటే ఏమిటో….. కపాల మోక్షం ద్వారా అర్థం అయింది. ఆధ్యాత్మిక స్థితిగతులు ఏంటి? ఆధ్యాత్మిక అనుభవాలు అంటే ఏంటి? అనేది కూడా అర్థమయింది. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటో అర్థం అయింది. కాకపోతే అది శబ్ద పాండిత్య జ్ఞానం అయింది . ఆయన పరంగా అది అనుభవ పాండిత్యం అవ్వచ్చు. కానీ అది నా పరంగా శబ్ధ పండిత్యం అయింది . నాకు ఆ అనుభవాలు ధ్యానంలో పొందితే కానీ అది నిజమా కాదా అనేది తెలుస్తుంది . అప్పటిదాకా మనం ఎదురు చూడాలి అనుకుంటూ….. బట్టలు మార్చుకొని మెట్ల పైన వచ్చి కూర్చొని “ ఓం శివోహం” చేయడం ఆరంభించింది . అలా ఒక గంట సేపు ధ్యాననిష్ట లో ఉన్న తరువాత… ఎవరో తనని చూస్తున్నారని కళ్ళు తెరిచి చూసింది . ఎదురుగా మహాదేవి కనిపించింది.
శివ నందిని :- అమ్మ ! ఏంటి ఏమైనా కనపడలేదు. ఇవాళ వచ్చావు…
మహా దేవి :- నీ దగ్గరికి ఆయన వచ్చాడు కదా! ఆయన మాట్లాడుతున్నాడు కదా…. సరే ఏదో మాట్లాడుతున్నాడు లే అని నేను వెళ్ళిపోయాను!
శివ నందిని :- అంటే ఆయన ఉంటే నువ్వు రావా?
మహా దేవి :- ఉన్నప్పుడు రావడానికి నాకేం అభ్యంతరం లేదు ….కాకపోతే నన్ను వంకరగా మాటలు మాట్లాడుతాడు.
శివ నందిని:- అసలు ఆయనకి, నీకు గొడవేంటమ్మా?
మహాదేవి:- గొడవలేవీ లేవు… నన్ను చూస్తే వెర్రెక్కుతుంది. అలా అని నామీద చేతులు వేయడం కానీ…. తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేయడం కానీ చేయడు. కాకపోతే వంకర టింకర గా మాట్లాడుతాడు . ఏదో నన్ను కవ్విస్తూ ఉంటాడు . నన్ను రెచ్చగొడుతూ ఉంటాడు. నేను కోపంలో ఏదో అంటూ ఉంటాను.
శివ నందిని :- ఆయన నీకు ఎప్పటి నుంచి తెలుసు?
మహాదేవి :- నేను ఆయన కళ్ళముందే పుట్టాననుకో… ఆయనకే 10 సంవత్సరాల వయసులో నేను పుట్టాను. ఆయన కళ్ళముందే పెరిగాను . ఆయన కళ్ళముందే తిరుగుతున్నాను.
శివ నందిని :- ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారా?
మహా దేవి :- ఇప్పుడు నా చరిత్ర నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని నాకు అర్థం అయింది. సరే ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా! అని
అంటూ ఉండగానే రుద్ర స్వామి అక్కడికి రావడం జరిగింది. ఇంకేముంది ….ఏం చెప్తాను ! వచ్చాడు కదా మహానుభావుడు. ఇక నన్ను వదిలిపెట్టడు. నన్ను విసిగిస్తాడు. ఏదో ఒక మాట అంటాడు. నాకు కోపం వస్తుంది. చిర్రెత్తుకొస్తుంది. ఆయన్ని నాలుగు మాటలని నేను వెళ్ళిపోవాలి
అంటూ ఉంటే…. రుద్ర స్వామి మహాదేవి కేసి చూస్తూ….
రుద్ర స్వామి:- ఏంటి పిల్లా ! నన్ను పెళ్లి చేసుకుంటావా ?చేసుకోవా? నాకు సంసార సుఖం ఇస్తావా లేదా? చెప్పు . ఏమీ మాట్లాడకుండా నన్ను ఎండగట్టి ఇట్ట సావగొడుతున్నావ్? ఎండలో పడేసావ్! ఇది నీకేమైనా భావ్యంగా ఉందా?
ఆ తర్వాత శివ నందిని వైపు చూస్తూ…
అవును శివ నందిని ఆ పుస్తకం చదివావా? 14 రోజులు కనపడకుండా పోయావు…చచ్చిపోయావేమో అనుకున్నాను! గాల్లోకి కలిసిపోయావేమో అనుకున్నాను! బతికే ఉన్నామన్నమాట! ఏంటి ఆ పుస్తకం అర్థమైందా అసలు…అర్థం కాక పిచ్చి పట్టిందా? నాకు తెలిసి అందరికీ అర్థమయ్యే విధంగానే ఆయన చెప్పాడు. అందరికీ అర్థం అవుతుంది. నీకు అర్థం కాకపోవడం అనేది ఉండదు. సరే నీకు అర్థం అయిందా లేదా అని …..నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానం చెప్పు….
శివ నందిని :- అలాగే స్వామి! చెప్తాను. నాకు తెలిసినంతవరకు నాకు అర్థమైనంత వరకు చెప్తాను.
రుద్ర స్వామి :- యోగ చక్రాలు ఎన్ని, వాటి పేర్లు చెప్పు!
శివ నందిని :- మూలాధార చక్రం , స్వాదిష్టాన చక్రం ,మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం, మళ్లీ ఈ ఆజ్ఞా చక్రంలో ఉపచక్రాలు కర్మ చక్రం, గుణ చక్రం , కాలచక్రం, బ్రహ్మ చక్రం ఆ తర్వాత సహస్రార చక్రం ,తన హృదయ చక్రం ,ఆ తర్వాత బ్రహ్మ రంధ్రం. వీటితో పాటుగా జీవనాడి బ్రహ్మనాడి ఉన్నాయి. ఈ చక్రాలకు దేవతలు, అధిదేవతలు వాటికి సంబంధించిన శివలింగాలు ఉన్నాయి.
రుద్ర స్వామి :- సరే ఏకాదశ దేహాల గురించి చెప్పు.
శివనందిని:- స్థూల శరీరము,సూక్ష్మ శరీరము, కారణ శరీరము, వాయు శరీరము, ఆకాశ శరీరము, ఆత్మ శరీరము, సంకల్ప శరీరము, జ్యోతి శరీరము ,మనో దేహము ,పిండా లేదా బీజదేహం ,లింగ దేహం.
రుద్ర స్వామి :- ఇప్పుడు మోక్షానికి ,ముక్తికి తేడా ఏంటి చెప్పు?
శివ నందిని :- మోక్షం అంటే పూర్ణ శూన్యం నుంచి ఎలా అయితే వచ్చామో…. అలా మన శరీరాలన్ని కూడా లయం చెందటమే మోక్షం అవుతుంది. అదే ముక్తి అంటే మన ఇష్ట దైవంలో లయం చెందటం లేదా ఇష్టదైవ ఆరాధన చేయడం లేదా ఆయన పక్కన కూర్చోవడం లేదా ఆయన్ని ధ్యానం చేయటం ,ఆయనలా మారడం అనేది పంచరకాల ముక్తులుగా చెప్పడం జరిగింది . ముక్తి అనేది శివుని లో ఐక్యమవటం…. మోక్షం అనేది శూన్యంలో ఐక్యమవడం.
రుద్ర స్వామి :- ఆహా….. అవగాహన వచ్చింది. ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటో అర్థమైంది. సరే, చక్రాల అనుభవాలు తెలుసుకున్నావు… బాగానే ఉంది. అలాగే ఏకాదశ దేహాల అనుభవాలు తెలుసుకున్నావు. బాగానే ఉంది . ఇప్పుడు నీకు ఆధ్యాత్మిక స్థితిగతులు అంటే ఏమిటో ఒక అవగాహన వచ్చింది. అంటే శబ్ద పాండిత్య అవగాహన వచ్చింది కదా!
శివ నందిని :- ఆ వచ్చింది స్వామి! కానీ నేను శబ్ద పాండిత్యం లోనే చెప్పగలను. అనుభవ పాండిత్యంలో చెప్పలేను. ఎందుకంటే అది ధ్యానస్థితిలోనే వస్తుంది అని నాకు అర్థమైంది. కాకపోతే ఆయన పొందిన అనుభవాలన్నీ ధ్యాన అనుభవాలే కదా! ఆ అనుభవాలన్నీ నేను పొందుతానో లేదో తెలియదు. నేను ధ్యానంలో పొందితే వాటిని ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి నా సాయ శక్తులా ప్రయత్నించి చూడాలి. తెలుసుకోవాలి . అది సత్యమా ? కాదా? అని విశ్లేషణ చేసుకొని, విచారించి, పరిశోధించి, తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అది కూడా దైవ, ధ్యాన అనుభవాలతో పాటు ప్రత్యక్ష అనుభవాలు పొందాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగానే స్త్రీ ప్రకృతికి మోక్షం రాలేదు. ఆదిపరాశక్తి మోహమాయలో పడింది అని చెప్పడం జరిగింది. ఆది రుద్రుడు మాయా రహితుడే మోక్షం పొందాడని …..అదే ఆదిపరాశక్తి మాయా సహితమై అమోక్షం పొందడం జరిగిందని అర్థం అయింది.
రుద్ర స్వామి :- సరే మోక్షానికి, అమోక్షానికి ఉన్న తేడా తెలుసుకున్నావు. మోక్షానికి, ముక్తికి తేడా తెలుసుకున్నావు. అలాగే వ్యక్తిగత మోక్షానికి, విశ్వ మోక్షానికి తేడా తెలుసుకున్నావు! సరే….. గ్రంథం నీకు అర్థం అయిందని నాకు అర్థం అయింది .
అక్కడే ఉండి ఇదంతా వింటున్న మహాదేవికి…. ఏం అర్థం కాలేదు. ఏదో పుస్తకం గురించి మాట్లాడుతున్నారని గ్రహించింది. ఎప్పుడైతే రుద్రస్వామి మాట్లాడకుండా మౌనవహించాడో అప్పుడు నెమ్మదిగా శివ నందిని వంక చూస్తూ…
మహా దేవి :- ఏం పుస్తకం చదివావు! ఆ పుస్తకం పేరేంటి?
శివ నందిని :- కపాల మోక్ష గ్రంథం చదివాను.
మహా దేవి :- ఓహో…. అదా… పరమహంస పవనానంద గారు రచించిన గ్రంథమేనా?
శివ నందిని :- ఆ…
మహా దేవి :- ఓహో ! ఆ గ్రంథం నేను కూడా చదివాను. అది చదివే ఇలా ఆధ్యాత్మిక స్థితికి రావటం జరిగింది.
అని అంటూ ఉండగానే కళ్ళు మూసుకొని నిద్రావస్థ లో ఉన్న రుద్ర స్వామి ఒక్కసారిగా కళ్ళు తెరిచి…..
రుద్ర స్వామి :- శివ నందిని! మహాదేవి ఎవరనుకుంటున్నావో తెలుసా? అఘోరా కాకముందు …ఆవిడ ఒక కుక్కల డాక్టర్ . Ms.phd చేసింది . భోగ ప్రపంచంలోకి వెళ్లి కుక్కల వైద్యం చదివి, అక్కడ ఉన్న మానవ మృగాలు చేసే పనులు తట్టుకోలేక ….ఆ స్వార్థ కోరికలు, ఈర్ష్య రాగద్వేషాలు తట్టుకోలేక కుక్కల వృత్తిని వదిలేసి ఆ కుక్కలకు వాహనంగా చేసుకున్న కాలభైరవ దర్శనం కోసం ఇలా అఘోరంగా మారింది.
అని టూకీగా చెప్పడం జరిగింది. ఇదంతా వింటున్న మహాదేవి రుద్ర స్వామిని చూస్తూ……
మహాదేవి :- ఊరుకోవయ్యా…. ఊరుకో! నేనేం చదివానో ….నేనేం చేశానో…. ఆ పిల్లకు ఎందుకు చెప్తావు ? అదంతా ఆ పిల్లకు ఎందుకు? చెప్తే సాధన గురించి చెప్పు ….. నా యోగ జీవితం గురించి చెప్పు .
రుద్ర స్వామి :- ఇంకో విషయం తెలుసా ! శివ నందిని నువ్వు ఏ పుస్తకం అయితే చదివావో…. ఆ పుస్తకమే ఈమె విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యింది…
అనగానే అక్కడే ఉన్న శివ నందిని…. మహాదేవి వంక చూసి…. నీకు వివాహం కూడా అయ్యిందా? పిల్లలు ఉన్నారా? నీ భర్త ఏం చేస్తున్నాడు? అంది. దానికి మహాదేవి సిగ్గుపడుతూ…..
మహా దేవి :-ఏదో అయింది అమ్మ ….ఈ జన్మకి . వైద్య వృత్తి చేశాను కదా! నా పక్కనే సహ ఉద్యోగిగా ఉన్న అతను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ధన సంపాదన మీద అమితమైన ఇష్టం. అవసరానికి డబ్బులు ఉంటే చాలు అనేది నా మనస్తత్వం…. కానీ ఆయన అవసరానికి డబ్బులు ఉంటే రేపు పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది అని అవసరానికి మించిన సంపాదన కోసం దేశ విదేశాలు వెళ్ళాడు. ఆయన కూడా మనుషుల వైద్యుడు. నేనేమో కుక్కల వైద్యురాలిని . కాకపోతే మా ఇద్దరికీ పొరపత్యాలు రావడానికి కారణం …..ఒకరకంగా చెప్పాలంటే ఈ కపాల మోక్ష గ్రంథం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన తరువాత నాకు ఎక్కువ సమయం పని లేకుండా పోయింది. రోజు మొత్తం మీద మూడు గంటల్లో లేదా ఆరు గంటలు మాత్రమే వైద్య వృత్తిలో ఉండేదాన్ని. రాత్రంతా ఖాళీగా కూర్చుని దాన్ని. ఒక రోజు అనుకోకుండా నా ఫోన్లో ఈ కపాల మోక్ష గ్రంథం ఉన్న బ్లాగ్ ను చూడడం జరిగింది. దానిని చదవటం మొదలుపెట్టాను. చదవడం మొదలుపెట్టి…. ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ…. అర్థం కాని దాన్ని ఒకటికి పది సార్లు చదువుతూ అర్థం చేసుకుంటూ ,ఆయన అనుభవాలు నిజమా? కాదా? అని అనుకుంటూ వెళుతూ ఉండేదాన్ని. ఒకరోజు ఈయన నా ఫోన్ చూసి ఈ కపాల మోక్ష గ్రంథం చదువుతున్నానని తెలుసుకొని… నన్ను నిలదీశాడు. నువ్వు ఆధ్యాత్మిక పిచ్చిలో పడి సంసారం వదిలిపెట్టేసి సన్యాసిగా మారతావా ఏంటి? ఇప్పుడు అలాంటి పనులు చేయమాకు. పూజలు, పునస్కారాలు వరకే… పండగలు ,పబ్బాల వరకు మాత్రమే ఉండాలి . ఆయనలాగా నువ్వు తెలుసుకొని… అనుభవాలు పొంది… జ్ఞానం పొంది ఏం చేస్తావు? ఆయన పని పాట లేక, ఏదో ఆయన పొందిన అనుభవాలు రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని అమ్మి ఉంటే పది కోట్లు వచ్చేది. కానీ అమ్మకానికి పెట్టుకోకుండా ఉచితంగా తన అనుభవాలను చెప్పి ….. ఏదో బాగుపరచాలని ఏదో చేయాలి అనుకుంటున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన పుస్తకం, ఆయన ఇష్టం . కాకపోతే ఆ పుస్తకం చదివి అర్థం చేసుకునే అంత అర్హత యోగ్యత, యోగం నీకు ఉందో లేదో చూసుకో. ఆ పుస్తకం చదివి ఆ పిచ్చితో సన్యాసిగా మరి సంసారం వదిలేస్తావేమో అని భయంగా ఉంది. నువ్వు ఆ పుస్తకం చదివితే ఊరుకోను… అని ఒకటికి పది సార్లు చెప్పి వెళ్ళి పోయేవారు. ఇలా రెండు మూడు సార్లు పుస్తకం చదవడం గమనించి, ఫోన్ నాకివ్వడం మానేశారు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ పోరు పడలేక ఆ ఫోన్ నాకు ఇచ్చేవారు. నేను ఫోన్లో పుస్తకం చదవటం ఈయనకి ఇబ్బందిగా ఉందని చెప్పి…. బాత్రూంలో కూర్చుని పుస్తకం చదవడం చేసేదాన్ని. కానీ 15 నిమిషాలకు మించి బాత్రూంలో ఉండేసరికి నువ్వేం చేస్తున్నావ్. బాత్రూంలో ఇంతసేపు అని గదమాయించేవాడు . దాంతో ఆ పుస్తకం చదవటం ఆపేసి ఏమీ తెలియనట్లుగానే ఉండడం జరిగింది. అయినా గాని ఆయనకు తెలియకుండా దొంగ చాటుగా పుస్తకం చదవడం చేశాను. నాలో నెమ్మది నెమ్మదిగా పురాణ వైరాగ్యం కాస్త , స్మశాన వైరాగంగా మారడం మొదలైంది. నాకే తెలియకుండా జరిగింది. అలాగే ధ్యానం చేసుకుంటూ, ముద్రలు వేసుకుంటూ, చక్రాలు జాగృతి చేసుకుంటూ, ఉండగా ప్రకృతి…గురువులను పంపించడం మొదలు పెట్టింది. గురువులు నాకు మంత్రోపదేశం చేయడం జరిగింది. ఆ తర్వాత శక్తి జాగృతి అయినట్లుగా, చక్రాలు జాగృతి అయినట్లుగా…. ఇలా ధ్యానా అనుభవాలు రావడం మొదలయ్యాయి. రాను రాను నాకు ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువైంది. సంసార పిచ్చి తగ్గిపోయింది . కామ కోరికను తగ్గిపోయాయి. ఆయనకి దాంపత్య సుఖం ఇవ్వడం తగ్గించేశాను. దాంతో మా ఇద్దరి మధ్య విభేదాలు రావడం మొదలయ్యాయి. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. వాళ్ళని పెంచుకుంటూ ఉండేసరికి….. ఆయన సంపాదన కోసం పోషణార్థం… ఉన్నత చదువుల కోసం అని చెప్పి విదేశాలకు వెళ్లిపోయాడు . దానితో ఎక్కువ సమయం ఆ పుస్తకం చదవటానికి సరిపోయింది . ఆ పుస్తకం చదువుతూ ….అందులో ఆయన పొందిన అనుభవాలు పొందుతూ ….సాధనలోకి వచ్చాను. ఆజ్ఞ చక్ర స్థితికి వచ్చేసరికి ఆయన ఉన్నట్టుండి తాంత్రిక సాధన లోకి వెళ్లినట్టుగా అర్థమయింది. నాకు వాళ్ళ స్నేహితులు జిజ్ఞాసి తాంత్రిక సాధన లోకి వెళితే…. ఈయన తాంత్రిక స్థానంలోకి వెళ్లకుండా…. దక్షిణాచారంలోనే సాధన చేసినట్టుగా అనిపించింది. కానీ నా సాధన అనుభవం ప్రకారంగా వచ్చేసరికి ….నాకు తాంత్రిక సాధన చేయాలని చెప్పేసి కర్మ చక్రంలో బలంగా అనిపించింది . కర్మ చక్రంలో అఘోర గా మారాలని నా మనసు భలేగా కోరుకుంది . కానీ ఉన్నట్టుండి దక్షిణాచారం నుంచి వామాచారంలోకి మారడం ఎలాగో నాకు అర్థం కాలేదు . అనుకోకుండా గంగానది పుష్కరాలు సమయంలో అఘోరాలు, కాపాలికులు ,నాగసాధువులు, భైరవులు ఇలా అందరూ తమ తమ గుహలనుండి బయటకు వచ్చి గంగా స్నానం చేస్తారని తెలుసుకొని…. ఆ పుష్కరాల సమయంలో మా వారు విదేశాలలో ఉండటంతో…. మా పిల్లల్ని కుటుంబ సభ్యులనీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని వేలమంది అఘోరాలను చూసేసరికి…. నాలో నగ్నత్వమునకు మారాలని అనిపించి … బట్టలు తీసేసి …ఒక అఘోర దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది. ఇదంతా మా కుటుంబ సభ్యులకు తెలిసి ,నన్ను ఇక్కడే ఉండి తీసుకువెళ్లాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను ఇంకా పట్టించుకోలేదు .మా వారు ఈ విషయం తెలుసుకొని అమెరికా నుంచి ఇండియాకు వచ్చి కాశీకి చేరుకున్నారు. ఆయన కూడా బతిమాలారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించమని చెప్పారు. పిల్లల్ని మా తల్లిదండ్రులు చూసుకుంటారు. నన్ను ఇంకా మర్చిపోండి.కావాలంటే మరో పెళ్లి చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడాకులు ఇస్తానని చెప్పాను. ఇక ఆయన ఆధ్యాత్మిక స్థితినీ …నా పిచ్చిని చూసి ….ఇంకా ఈమె స్మశాన వైరాగ్యం చెందింది అనుకుని …..ఇక నన్ను వదిలి పెట్టేసి …తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లల్ని చూసి కూడా నా మనసు కరగలేదు. తల్లిదండ్రులను చూసి నాకు బాధ అనిపించలేదు. ఆయన వదిలిపెట్టి వెళ్తున్నా… కూడా కన్నీరు రాలేదు . ఏదో కర్మ బంధాలన్నీ తీరిపోయినాయి…. అని ఏదో తెలియని ఆనంద స్థితి నాలో కలిగింది.
ఇలా 21 సంవత్సరాలకే నా భోగ జీవితమును వదిలిపెట్టి …ఈ అఘోర సాధనలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను . అఘోరినిగా మారాను. ఇక ఆ తరువాత నీ కర్మ ఉన్నదని…. దానికి నేను సహాయం చేయాలని…. మా గురుదేవులు నాకు చెప్పడంతో …నీ దగ్గరికి అఘోరినిగా రావడం జరిగింది. ఇది నా కథ. నా అఘోర సాధన తో పాటు మా గురువుగారి దగ్గర ఈయన కూడా సాధన చేసి సిద్ధి పొందాడు . కాకపోతే నేను నగ్నంగా అర్ధరాత్రిలో నగ్న పూజలు చేస్తున్నప్పుడు, తను కూడా నగ్నంగా ఉండి నాకు కాపలాగా ఉండి, తమ సాధన తన అఘోర సాధన చేసుకునేవాడు. ఏనాడు నా ఒంటి మీద చెయ్యి వేయాలని చూసేవాడు కాదు …వక్రంగా చూసేవాడు కాదు…. కాకపోతే నన్ను వంకరగా మాటలు మాట్లాడుతూ ,నన్ను కవ్విస్తూ, నాకు కోపం తెప్పించి…. నాతో తిట్లు తినటం ఆయనకి అలవాటైపోయింది . ఆయన నగ్నత్వం చూసినా…. నాలో ఎలాంటి కామ వికారాలు కలిగేవి కాదు . ఆయనకి కూడా నాలో నగ్నత్వం చూసిన కామ వికారాలు కలిగేవి కాదు. మా ఇద్దరికీ …. నేను ఆడతనం , ఆయన మగతనం అనేది సృష్టి యజ్ఞం చేయడానికి ఉపయోగపడే అంగాలని జ్ఞానం పొందడంతో…. మాకు కామ వికారాలు పోయి…. వాటి స్థానంలో నగ్నత్వస్థితికి వచ్చి …. దిగంబర తత్వాన్ని పొందడం జరిగింది. అఘోరతత్వంలో నగ్నత్వాన్ని ఛేదించి …..దిగంబర తత్వాన్ని పొందటమే సాధన అవుతుంది. అంతేగాని శవాన్ని పీక్కు తినటం….. బతికున్న వాళ్ళని చంపి తినటం లేదా కపాలాలతో సహవాసం చేయడం ….స్మశానంతో సావాసం చేయడం …..ఇవన్నీ కూడా ఏంటి అంటే …..శరీరం మీద కలిగే నగ్నత్వాన్ని చేధించడానికి …..శరీరం మీద కలిగే మోహ వ్యామోహాలు , శరీరం మీద కలిగే మనోవికారాలను వదిలించుకోవడానికి అఘోర తత్వం నిర్దేశించబడింది అని నాకు అర్థం అయింది. అంతేగాని అఘోర సాధన అనేది పవిత్రమైన సాధన . అందుకనే శివుడి పంచముఖాలలో అఘోర ముఖమును పెట్టడం జరిగింది. కాకపోతే ఆజ్ఞ చక్రంలో ఉన్న నాలుగు ఉపచక్రాలలో కర్మ చక్రానికి అఘోరతత్వమును, గుణ చక్రానికి కాపాలిక తత్వమును ,కాలచక్రానికి భైరవ తత్వమును, బ్రహ్మ చక్రానికి నాగసాధువు తత్వముగా తంత్రసాధనలో చెప్పడం జరిగింది . కాకపోతే ఇక్కడ ఎవరి ఇష్టం ప్రకారం ఈ నాలుగు ఉపచక్రాల సాధన చేయవచ్చు. వామాచారం చేయలేని వారు దక్షిణాచారంలో కూడా సాధన చేసి సిద్ధి పొందవచ్చునని పరమహంస పవనానంద గారి జీవిత అనుభవం చెప్పడం జరిగింది. అలాగే దక్షిణాచారం ఇష్టపడలేక వామాచారంలో సిద్ధిపొందిన యోగులు, దేవతలు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు….. సరస్వతీదేవి ఉంది., వామాచారంలో నీలం సరస్వతిగా ఆరాధన చేస్తే, దక్షిణాచారంలో జ్ఞాన సరస్వతిగా ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే హయగ్రీవుడిని వామచారంలో ఉగ్ర హాయగ్రీవుడిగాను, దక్షిణాచారంలో శాంత హయగ్రీవుడిగాను ఆరాధన చేస్తారు. అలాగే హనుమంతుడిని వామాచారంలో ఉగ్ర పంచముఖ హనుమంతుడిగా ఆరాధన చేస్తే ,దక్షిణాచారంలో అభయాంజనేయ స్వామిగా ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే మహాగణపతిని ఉచ్చిష్ట గణపతిగా వామాచారంలో ఆరాధన చేస్తే ,దక్షిణాచారంలో 32 శాంత గణపతులుగా ఆరాధన చేయడం జరుగుతుంది. కాబట్టి మన ముందు ఉన్న దైవాలు కూడా ఈ నాలుగు ఉపచక్రాల్లో దక్షిణాచారం కన్నా, వామాచారానికే ఎక్కువ సాధన చేసి సిద్ధి పొందారు. నిజానికి తంత్ర సాధనలో దక్షిణాచారంలో సిద్ధి పొందడానికి 44 సంవత్సరాలు పట్టేది…. కాస్త అదే వామాచారంలో సరిగ్గా సాధన చేసి సిద్ధి పొందటానికి కేవలం 41 రోజులు పడుతుంది. ఈ కాలంలో ఇలా తంత్రసాధనలో సిద్ధి పొందిన వారు కుర్తాళం పీఠాధిపతి అయిన సిద్దేశ్వర స్వామి ఉన్నారని తెలుసుకున్నాను. ఆయన తంత్ర సాధన మీద వివిధ రకాల ధ్యాన అనుభవాలు, అనుభవ పాండిత్యం పొందాలని నాకు అర్థం అయింది. ఆయన చెప్పిన విధివిధానాలను కొన్నింటిని నేను పాటించి అఘోరత్వంలో సిద్ధి పొందడం జరిగింది. 12 సంవత్సరాల నా అఘోర సాధన పూర్తి అయ్యింది. ఈ అఘోర సిద్ధి నుంచి ముందుకు వెళ్లడానికి నీకున్న నా కర్మపాత్ర నివారణ చేసుకుంటే…… నాకు మోక్షం వస్తుందని మా తంత్ర గురువైన అఘోర స్వామి చెప్పడం జరిగింది. అలాగే రుద్ర స్వామి కూడా ఇలాగే చెప్పడంతో నేను కూడా నీ రాక కోసం ఎదురుచూస్తూ గత ఆరు నెలల నుంచి ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా? ఎప్పుడు నిన్ను చూస్తామా ? ఎప్పుడూ నీ కర్మలో మా పాత్ర పూర్తి పూర్తి చేసుకుంటామా? మేము ఎప్పుడు ఋణ విముక్తులం అవుతామా అని ఎదురుచూస్తూ ఉన్నాము. మేము అనుకున్నట్టుగానే నువ్వు రావటం జరిగింది. ఊహించినట్టుగానే నువ్వు ఉన్నావు. అలాగే ఆధ్యాత్మిక స్థితి అనేది ఈ పుస్తక గ్రంధం చదవడం ద్వారా నువ్వు తెలుసుకున్నామని నాకు అర్థం అయింది.
శుభం భూయాత్










మీరు మొత్తం మార్చేశారు ఆ ప్రింట్ అయ్యిందని... ఎందుకు అంటే నేను ముందే చదివాను.... కామం బదులు మిరపకాయ బజ్జీ ఇష్ట. పదార్థం గా చెప్పే వారు.. దయచేసి మళ్ళీ రి అప్ లోడ్ చేయగలరు..
రిప్లయితొలగించండినమస్కారం.... కామమాయ అనేది శృంగారానికి సంబంధించింది.... ఇది మూలాధార చక్రంలో వస్తుంది. అదే ఇష్ట కోరికా మాయ, ఇష్ట పదార్థ మాయ అనేది హృదయ చక్రం లో వస్తుంది. ఈ లెక్కన పరమహంస గారికి ఇష్ట కోరిక మాయగా కామ మాయ(హృదయ చక్రంలో).... ఇష్ట పదార్థ మాయగా మిరపకాయ బజ్జీలు వచ్చాయి. అయినప్పటికీ... కపాల మోక్ష గ్రంథము లోని 100వ అధ్యాయంలో చాలా కంటెంట్ add చేశారు. ఇప్పుడు 101నుంచి వస్తున్నది.. స్త్రీ మూర్తి సాధకురాలు అయితే .... అనే concept తో రాయడం జరుగుతుంది.
తొలగించండి