అధ్యాయం 73

సర్వం శూన్యం

 
ఈ విశ్వ సృష్టిలో ఏమీ లేదు
అసలు  విశ్వమే లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో పరంజ్యోతి లేదు కాంతి లేదు
ఓంకారం లేదు శబ్దం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో పరబ్రహ్మము లేదు బ్రహ్మము లేదు
బ్రహ్మ పదార్ధం లేదు జీవ పదార్థము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో విశ్వాత్మ లేదు పరమాత్మ లేదు
జీవాత్మ లేదు ఆత్మ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో విశ్వ శక్తి లేదు దైవ శక్తి లేదు
కుండలినీ శక్తి లేదు ప్రాణశక్తి లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో దేవుడు లేడు దేవత లేదు
దైవం లేదు భగవంతుడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో గురువు లేడు జ్ఞానము లేదు
సాధన లేదు శిష్యుడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో రేణువు లేదు పరమాణువు లేదు
అణువు లేదు పదార్థము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో మాయ లేదు మర్మము లేదు
భ్రమ లేదు భ్రాంతి లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో కర్మ లేదు కర్మబంధము లేదు
కర్మ ముక్తి లేదు కర్మ జన్మ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో జీవుడు జీవాత్మ లేదు
పురుష జన్మ లేదు స్త్రీ జన్మ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో దైవ జన్మ లేదు జీవ జన్మ లేదు
జాతి జన్మ లేదు లింగ భేద జన్మ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో మనస్సు లేదు బుద్ధి లేదు
అహము లేదు చిత్తము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో మరణము లేదు శాశ్వత మరణము లేదు
అశాశ్వతం మరణం లేదు భౌతిక మరణం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో పాపము లేదు పుణ్యము లేదు
పాపపుణ్యాలు లేవు కర్మ ఫలితాలు లేవు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో భయము లేదు బాధ లేదు
ఆశ లేదు ఆవేశం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో ఆలోచన లేదు భావము లేదు
సంకల్పం లేదు స్పందన లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో సృష్టి లేదు రతి లేదు
సంయోగము లేదు సంతానము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో పుట్టుట లేదు గిట్టుట లేదు
ఆనందమూ లేదు బాధ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం  శూన్యం
 

ఈ విశ్వములో అరిషడ్వర్గాలు లేవు సప్త వ్యసనాలు లేవు
మోహం లేదు వ్యామోహం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో ప్రేమ లేదు ఆప్యాయత లేదు
అనురాగం లేదు అనుబంధము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో భక్తి లేదు విగ్రహం లేదు
నిగ్రహము లేదు అనురక్తి లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో తెలుసుకునేది లేదు పొందేది లేదు
అనుభవించేది లేదు అనుభవించే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో సుఖము లేదు దుఃఖము లేదు
ఆనందం లేదు కష్టం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వంలో పాత్రధారి లేడు సూత్రధారి లేడు
పాత్రలు లేవు జగన్నాటకం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో విధిరాత లేదు విధాత లేడు
తలరాత లేదు కర్మ ప్రదాత లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో నువ్వు లేవు నేను లేను
నాది లేదు నీది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో కనిపించేది అసత్యం - కనిపించనది సత్యం
సత్య అసత్యాలు లేవు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో జ్ఞానము లేదు బ్రహ్మజ్ఞానము లేదు
విజ్ఞానము లేదు అజ్ఞానము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో ఆత్మ లేదు మనస్సు లేదు
కోరిక లేదు కర్మ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో సాధన లేదు సాధించటానికి లేదు
సాధించే వాడు లేడు సాధనలో లేని వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో విద్య లేదు అవిద్య లేదు
బ్రహ్మవిద్య లేదు ఆత్మ విద్య లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో తత్వం లేదు ఆత్మ తత్వం లేదు
బ్రహ్మ తత్వం లేదు జీవ తత్వం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో శరీరము లేదు స్థూల శరీరము లేదు సూక్ష్మశరీరం లేదు
కారణ శరీరము లేదు సంకల్ప శరీరము లేదు ఆకాశ శరీరము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో ఆకాశము లేదు వాయువు లేదు
అగ్ని లేదు నీరు లేదు భూమి లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో ఆలోచన లేదు ఆలోచించే వాడు లేడు
ఆలోచన లేని వాడు లేడు ఆలోచన ఇచ్చే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో కాలము లేదు కాలచక్రము లేదు
కాల విధాత లేడు కాల ప్రదాత లేడు కాలాతీతుడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో గుణము లేదు సత్వగుణము లేదు
రజోగుణము లేదు తమోగుణము లేదు శుద్ధ సత్వగుణము లేదు పరిశుద్ధ గుణం లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో శివుడు లేడు జీవుడు లేడు
మాధవుడు లేడు మానవుడు లేడు నరుడు లేడు వానరుడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో నువ్వు లేవు నేను లేను
మనము లేము మనది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం

 
ఈ విశ్వములో నువ్వు లేవు నీది లేదు
నేను లేను నాది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో తెలుసుకోవాల్సింది లేదు తెలుసుకునేది లేదు
తెలుసుకునే వాడు లేడు తెలిపే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో బంధనము లేదు బందీ లేదు
బంధించేది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో మరణము లేదు చావు లేదు
మరణ భయం లేదు చావు భయం లేదు కర్మ ఏమీ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో  గ్రహించేది లేదు గ్రహించబడినది లేదు
నాశనం అయ్యేది లేదు నాశనం కానిది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వంలో సృష్టించేది లేదు సృష్టించబడేది లేదు
సృష్టించబడుతుంది లేదు సృష్టించే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం

 
ఈ విశ్వములో నిజము లాంటి కల కలలాంటి నిజము
సత్యము లాంటి అసత్యము అసత్యములాంటి సత్యము
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో చూసేది లేదు చూసేవాడు లేడు
కనిపించేది లేదు కనిపించే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో నడిచేది ఏమీ లేదు నడిపించే వాడు లేడు
నడవటానికి లేదు నడిచే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో లయం చేసేది ఏమీ లేదు నాశనము అయ్యేది ఏమీ లేదు
లయ కర్త లేడు లయం అయ్యేది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అండము లేదు పిండము లేదు బ్రహ్మాండము లేదు
సర్వ లోకాలు లేవు సర్వ ప్రతినిధులు లేరు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో చెట్టు లేదు పుట్టలేదు
విత్తు లేదు మట్టి లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో గుడి లేదు బడి లేదు
దైవము లేదు జ్ఞానము లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో చేయటానికి ఏమీ లేదు చేసేవాడు లేడు
చేయించేవాడు లేడు చేసుకునే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో భయము లేదు భయపడేవాడు లేడు
భయపెట్టే వాడు లేడు భయం పుట్టించే వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో నీది నాది అంటూ ఏమీ లేదు నువ్వు తెచ్చింది లేదు
ఇచ్చింది లేదు నువ్వు తీసుకుని వెళ్లేది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో వెలుగు లేదు వెలుతురు లేదు
వెలిగించే వాడు లేడు వెలిగేది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో చీకటి లేదు చీకటి అయ్యేది లేదు
చీకటి చేసేది లేదు చీకటి కానిది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో గొప్ప వస్తువు లేదు రూపము లేని వస్తువు లేదు
రూపము కానిది లేదు రూపము అయ్యింది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో భ్రమ లేదు భ్రాంతి లేదు
ఉన్నది లేదు లేనిది ఉండదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో మాట్లాడేది ఎవరు మాట్లాడించేది ఎవరు
ప్రశ్నించేది ఎవరు  ప్రశ్న బదులు ఇచ్చేది ఎవరు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో జ్ఞాని లేడు జ్ఞానము ఇచ్చే వాడు లేడు
జ్ఞానము పొందేవాడు లేడు జ్ఞాని కానివాడు ఎవరూ లేరు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో గొప్ప వాడు లేడు గొప్ప అయిన వాడు లేడు
గొప్ప అనిపించుకునే వాడు లేడు గొప్ప అనేవాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో పొగడ్త లేదు పొగిడే వాడు లేడు పొగిడించుకునే వాడు లేడు
పొగడ్త ఆశించేవాడు లేడు పొగడ్త  కాని వాడు లేడు పొగడ్తలు లేని వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అహము లేదు అహంకారము లేదు
అహంకారి లేడు అహం లేని వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వంలో కోరిక లేదు కోరిక లేనివాడు లేడు కోరికలు ఉన్నవాడు లేడు
కోరికలతో తృప్తిపడినవాడు లేడు కోరికలు అనుభవించనివాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అన్నము లేదు తినేవాడు లేడు
తినిపించేవాడు లేడు వండేవాడు లేడు వడ్డించేవాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో బాధ లేదు బాధ పడేవాడు లేడు
బాధించేవాడు లేడు బాధ లేనివాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం

 
ఈ విశ్వములో కష్టము లేదు కష్టపడే వాడు లేడు
కష్ట పెట్టేవాడు లేదు కష్టాలు లేని వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో సుఖము లేదు సుఖం ఇచ్చేవాడు లేడు
సుఖము పొందేవాడు లేడు సుఖము కానిది లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అన్నీ ఉన్నట్లుగానే కనిపిస్తాయి ఏమీ లేనట్ల గానే అనిపిస్తాయి
అన్నీ ఉన్నా ఏమీ ఉండదు ఏమి ఉన్న అన్ని ఉండవు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో పని లేదు చేసేవాడు లేడు
చేయించే వాడు లేడు చెయ్యటానికి ఏమీ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అనుభవం లేదు అనుభవించేది లేదు
అనుభవాలు ఇచ్చేవాడు లేడు అనుభవాలు పొందే వాడు లేడు 
అనుభవాలు పొందటానికి ఏమీ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో అనుభూతి లేదు అనుభూతి పొందేవాడు లేడు
అనుభూతి పొందనివాడు లేడు అనుభూతి ఇచ్చేవాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో ఆనందమూ లేదు ఆనందం ఇచ్చేవాడు లేడు
ఆనందమును పొందేవాడు లేడు ఆనందమును పొందనివాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో భావన లేదు భావించేవాడు లేడు
భావాలు పొందనివాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో బోధన లేదు బోధించేవాడు లేడు
బోధన తెలియనివాడు లేడు బోధన వినేవాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో సాధన లేదు సాధించడానికి ఏమీ లేదు
సాధించినవాడు లేడు సాధన చెయ్యని వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో అసంపూర్ణము ఏమీ లేదు పూర్ణము కానిది లేదు
పూర్ణం అయినది లేదు కావటానికి ఏమీ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం


ఈ విశ్వములో రెండూ లేవు రెండు కానిది లేదు
రెండు లేనిది లేదు రెండు చేయడానికి ఏమీ లేదు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో ఏకత్వం లేదు ఏకత్వం కానిది లేదు
ఏకత్వము లేనిది లేదు ఏకత్వం కాని వాడు లేడు ఏకమైన వాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో ఎరుక అనేది లేదు ఎరుక అయిన వాడు లేడు
ఎరుక కానివాడు లేడు ఎరుక పరిచేవాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో మోక్షమూ లేదు  మోక్షమును పొందని వాడు లేడు
మోక్షమును పొందిన వాడు లేడు మోక్షప్రాప్తి ఇచ్చేవాడు లేడు మోక్షప్రాప్తి అందుకునే వాడు లేడు
సర్వము ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో కదలిక లేదు కదిలించేవాడు లేడు కదిలేది లేదు
కదిలేవాడు లేడు కదలిక లేనివాడు లేడు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వములో ఉన్నది ఏమీ లేదు లేనిది ఏమి కానిది లేదు లేనిది ఉన్నట్లుగా
ఉన్నది లేనట్లుగా ఉండేది అసత్యముగాను 
ఉండనిది సత్యముగాను ఉన్నది లేనిది ఏమీ లేనట్లుగా
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం
 

ఈ విశ్వంలో నీలోనే నువ్వు సంబరపడుతూ నీలోనే నువ్వు ఆనందపడు
నీలోనే నువ్వు బాధ పడు నీలోనే నువ్వు కష్టపడు నీలోనే నువ్వు సుఖపడు
ఇన్నేళ్లుగా చూసుకో నీలో నువ్వు తృప్తిపడి నీలోనే నువ్వు అనుభవించు
నీలోనే నువ్వు అనుభవాలు పొందు నీలోని నువ్వు అనుభూతులు పొందు
నిన్నే నువ్వు గా చూసుకో ఇదే సంసార మాయ నీదే సంసారము సన్యాసంశూన్యం 
నువ్వు నిజము కావని తెలుసుకో నువ్వు ఇంతకంటే తెలియటానికి ఏ మున్నది
ఈ విశ్వంలో రెండూ లేవు రెండూ లేకపోతే ఒకటి లేనట్లే 
భయం ఉంటే అభయం ఉండాలి అభయము లేకపోతే భయము లేదు
 సత్యం ఉంటేఅసత్యం ఉండాలి సత్యమే లేకపోతే అసత్యం ఉండదు 
చీకటి ఉంటేవెలుతురు ఉండాలి చీకటే లేకపోతే వెలుతురు ఉండదు 
దేవుడు ఉంటేజీవుడు ఉండాలి దేవుడు లేకపోతే జీవుడు లేనట్లే
సృష్టి ఉంటే లయం ఉండాలి లయం లేకపోతే సృష్టి లేదు
పుట్టుక ఉంటే గిట్టుట ఉండాలి గిట్టుట లేకపోతే పుట్టుక లేదు
నేను ఉంటే నువ్వు ఉంటావు నువ్వు లేకపోతే నేనులేను
నేను లేకపోతే నువ్వు లేవు నేను లేను
నేను నిజముగాదు నువ్వు నిజం కాదు
నీకు నువ్వే బూడిద చేసుకో నువ్వే విభూతిగా మారిపో
ఇదియే నీ నిజ సహజస్ధితియని గ్రహించు
సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం

                                                       *******************************

మరి ఇంతకి ఈ విశ్వము ఏలా ఏర్పడినది అనే నా ధర్మసందేహనికి సమాధానము తెలుసుకోవాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

శుభంభూయాత్

పరమహంస పవనానంద

*********************************
గమనిక:నేను ఇన్ని సం!!రాలుపాటు పూజించిన దైవాలు అలాగే నా గురువులు అలాగే నా అనుబంధాలు ఏవి శాశ్వతము గాదని...చివరికి నేను గూడ సత్యము గాదని అనిపించగానే నాలో నాకే తెలియని ఆవేశపూరిత భావాలు బయటికి వచ్చేవి.దానితో నాకు ఖాళీ గోడ లేదా సిగరెట్ పాకెట్ అట్ట లేదా పేపర్ ముక్క కనిపించిన వదిలిపెట్టకుండా వాటి నిండా నా భావాలతో నింపేసేవాడిని. ఈ భావాలను కలిపితే దాదాపుగా 1000 పేజిల పుస్తకము అవుతుందని నాకు తెలుసు.కవితావేశము అలాంటిది మరి.దానితో ఈ భావాలకి “భావలహిరి” అనిపేరు పెట్టుకున్నాను.వాటిలో కొన్ని ఇపుడు చదివినారు అన్నమాట.
 


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. ee pusthakamlo edo undani chadivithe, emi ledani, parama prashaanthathani ponde vidhangaa kaani vraasinaaaru leru, chadive vaariki medadu panicheyatam ledu... sarvam emi ledu sarvam shunyam. chadivinavaadu emundaa ani chadivite, maatladaaniki, thittukotaniki, pattinchukotaniki emiledani thelusukunnavaadu... sarvam emiledu sarvam shunyam ani prashanthatha pondaka thappadu...

    రిప్లయితొలగించండి