అధ్యాయం 100


శుభవార్త:

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx









పరమహంస పరమపదించారు.

##########################

గమనిక: ఈ రోజు అనగా 1-3-2022 ..మహా శివరాత్రి తిధి నాడు మన ఆత్మయోగి పరమహంస గారు అరుణచల క్షేత్రములో ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ.."స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు" అంటూ..తట్టుకోలేని గుండె నొప్పి రావడముతో అక్కడక్కడే పరమహంస పరమపదించారు.అపుడు ఈయన కపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటికి వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణాగిరి యందు  ఆత్మజ్యోతిగా శివైక్యము చెందిన కొన్ని క్షణాలకి ఈ గిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికి కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది.దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యము చెందడము జరిగింది..ఈ విధివిధాన వివరాలు ఈ ఆఖరి అధ్యాయమునందు ఇవ్వబడటము జరిగింది.గమనించగలరు.

మా యోగమిత్రుడైన పరమహంస పొందిన ధ్యానానుభవాలను సాధనలోకానికి ఆయన జ్ఞాపకార్ధముగా అందించాలని ఆయన స్నేహ సాహచర్యం పొందిన కొంతమంది యోగమిత్రులు కలిసి ఈ బ్లాగ్ పెట్టడము జరిగింది.ఇందులో మార్పులు,చేర్పులు పూర్తి అయ్యాయి.మనస్సు పెట్టి మీకు అర్ధము అయ్యేనంతవరకు చదవండి.దానితో మీకు ఎలాంటి గురువుతో, దైవముతో, జ్ఞానముతో, సాధనతో ఆఖరికి మోక్షముతో పని ఉండదు.ఎందుకంటే ఈ గ్రంధరాజమే అన్ని ఇస్తుంది.తీరుస్తుంది.ఈ గ్రంధము చదివి అర్ధము చేసుకోవడమే అసలు సిసలైన పూర్ణ మోక్షమవుతుంది.ఎందుకంటే ఈ స్వానుభవముగా అనుభవ అనుభూతి పొందిన పరమహంస మా కళ్ళ ముందే పూర్ణ మోక్షస్ధితి పొందడము జరిగింది గదా.ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏమి గావాలో మీరే ఆలోచించండి.అలాగే ఈయన పొందిన అనుభవాలు అన్నిగూడ అక్షర సత్యమే.లేకపోతే విశ్వ ఆదిగురువైన అరుణాచల వాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వయంగా తన అరుణాగిరి లోపలకి పరమహంస జ్ఞానలింగమును తనలో ఎందుకు ఐక్యము చేసుకొంటారో ఒకసారి ఆలోచించండి.మీరు గూడ పరమహంస లాగా జ్ఞానహంసగా మారి పూర్ణమోక్ష స్ధితిని పొందటానికి "అరుణాచల శివ" నిత్య నామస్మరణ చేసుకుంటూ ఉండండి.ఈయన అనుగ్రహము మీరు పొందకల్గితే మీకు మోక్షమే.ఎందుకంటే ఈయనే విశ్వానికి మోక్షమిచ్చే ఆదిగురుదేవుడు-ఆది అరుణాయోగి అని స్వానుభవ అనుభూతి పొందండి.ఈయన అనుగ్రహము పొందడము వలన పరమహంస కాస్తా అరుణాయోగిగా మారి పూర్ణమోక్షము పొందడము జరిగింది.ఇలా ఈ గ్రంధమును చదివి అర్దము చేసుకున్నవారంతా గూడ మోక్షస్ధితికి చేరుకుంటారని ఆశిస్తూ... 

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.


ఇంతటితో ఒక నిజపూర్ణ జ్ఞాని శకము ముగిసింది.

*********************************************************************************

హెచ్చరిక:  నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము అందరికి ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....

ఆన్ లైన్లో 999 రూ.లకి దొరుకుతున్న  నకిలి "కపాలమోక్షం" గ్రంథము  యొక్క ఇమేజీలు పెట్టడము జరుగుతోంది.


My FAKE BOOK

ఈ పుస్తకములో సంపూర్తిగా బ్లాగ్ కంటెంట్ లేదని తెలుసుకొండి.కావలంటే ఈ నకిలి పుస్తకము లోని ఆఖరి పేజి మేటర్ చూడండి.అలాగే ఈ బ్లాగ్ ఆఖరి కంటేంట్ చూడండి. 


మీకే తేడా ఏమిటో తెలుస్తుంది.ఈ నకిలి పుస్తకములో పేరుకి అన్నీ అధ్యాయాలు (బ్లాగ్ లింకులు) ఉన్నప్పడికి అందులో ఉండవలసిన కంటెంట్ పూర్తిగా లేకుండా ఈ నకిలి పుస్తకములో కొన్ని అధ్యాయాలలో కొంత భాగము తీసివెయ్యడము జరిగింది.  దయచేసి ఈ నకిలి పుస్తకము కొని మోసపోవద్దని మరొకసారి మనవి చేస్తున్నాము. 

మరియి కపాలమోక్షం పేరుతో ఈ అధ్యాయాల పేరుతో సుమారుగా 1300 దాకా వీడియోలున్నాయని మా అందరి దృష్టికి వచ్చింది.పైగా వీటిలో గూడ కంటెంట్ పూర్తిగా చదవడము లేదని వారికి ఇష్టమైన భాగాలు ఇష్టము వచ్చినట్లుగా చదువుతున్నారని మాకు అర్ధమైంది.వీటికి మాకు ఏలాంటి సంబంధము లేదు.

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.                             

                                xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx





ముగింపు 
(మా చివరి స్వానుభవ మాట)

నేను ఎవరిని-నేను లేను:

1989  లో మొదలైన మా ఆధ్యాత్మిక యాత్ర ప్రయాణం అదే దేవుడిని చూడాలని దేవుడిని తిట్టాలని దేవుడితో మా బాధలు చెప్పుకోవాలని మేము ప్రారంభించిన దైవాన్వేషణ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడి కోసం వెతకని ప్రాంతము లేదు. వెతకని క్షేత్రము లేదు. పూజించని విగ్రహము లేదు. చెయ్యని సాధన లేదు.పఠించని మంత్రము లేదు. చెయ్యని దానము లేదు. అన్ని చేశాము. అన్ని చేసుకుంటూ పోయాము. ఎక్కడా కనిపించలేదు. ఎటుచూసినా శూన్యమే మాకు ఎదురైనది. ఎటు వెళ్ళినా శూన్యమే అగుపించింది. సర్వాంతర్యామీ కాస్త మాలో అంతర్యామిగా వెతకటం ఆరంభించినాము. దైవ స్వరూపాలు అగుపించినాయి. దాటినాము. దైవ లోకాలు సదృశ్యం అయినాయి. దాటినాము. ఆనంద మాయలు పలకరించినాయి. నవ్వుతూ దాటినాము. మాయ దైవిక యోగ శక్తులు ఆవరించాయి. వదిలించుకున్నాము. అయినా మాకు సంతృప్తి లేదు. సమాధిస్థితులు పొందినాము. దాటినాము. ఏదో తెలుసుకోవాలనే తలంపు తపన తాపత్రయం ఆగలేదు. ఇవేవి మేము అనుకుంటున్న భగవంతుడు కావని మాకు తెలుసు. పదార్థం మాయను దాటినాము. యదార్థ భావాలు దాటినాము. అయినా భగవత్ స్వరూపం దగ్గరికి చేరుకున్నాము. అక్కడ ఆది బ్రహ్మ కాస్త ఆది బ్రహ్మకపాలంగా దర్శనం అయినది. అదియు చితాగ్నిలో ఏమీలేని పరిపూర్ణ పరమ శూన్యము స్థితి అనుభవము అనుభూతి అయినది. 
 
మూలాధార చక్రములో మూల గణపతితో మాలో మేము అన్వేషణ మొదలు పెడితే అది కాస్తా బ్రహ్మరంధ్రములో మూలకపాలము యొక్క చితాగ్ని యొక్క బ్రహ్మాండచక్ర కృష్ణబిల్వముయే అంతిమ దైవ స్వరూపమని చెప్పకనే చెప్పింది. దీనికి నిదర్శనమే పతంజలి యోగ దర్శనములో మూల కపాల దర్శనమే అంతిమ సాధన స్ధితి… ఇదియే యోగ దర్శనం అని చెప్పకనే చెప్పినారు. చివరికి మా దైవాన్వేషణ లో మిగిలినది చూసినది ఆది మూల బ్రహ్మకపాలం. అప్పుడు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు లేడు. అప్పుడు ఆది బ్రహ్మగా ఉంటే ఇప్పుడు బ్రహ్మకపాలంగా ఉన్నాడు. ఈ కపాలదర్శనం వలన అది ఉన్నట్లుగా మా బుద్ది చెపుతోంది. మన బుద్ధి దాటితే అది ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. ఒకప్పుడు మా ముత్తాత ఉన్నట్లుగా ఇప్పుడు లేడు. ఆయన లేడు అనలేము. దేవుడు స్థితి కూడా ఉన్నాడని చెప్పలేము. ఎలాగో అలా దేవుడు స్థితి కూడా లేడు అంటే బ్రహ్మకపాలంగా ఉన్నాడు. ఉన్నాడు అంటే సశరీరంగా లేడు. బ్రహ్మకపాలం కుండలినీ శక్తితో సజీవంగానే ఉంది. చితాగ్ని ప్రాణశక్తి అయిన తన శక్తితో సజీవంగానే ఉంది. మా దేవుడు గొప్ప అంటే లేదు మా దేవుడు గొప్ప అంటారు. ఇందులో దేవుడు అనేవాడు బ్రహ్మకపాలం అయితే ఇంకా కపాలాలలో ఏది గొప్ప ఏది తక్కువ ఏమి ఉంటుంది. అసంపూర్ణ జ్ఞానులు అంతా తమ అభిమతాలు కాస్త మతాలుగా ఏర్పరచి దానికి దేవుడి ఆకారమును సృష్టించి మానవజాతిని విభిన్న జాతులుగా చిత్రీకరించిన భౌతిక వాదులు అధి దైహిక వాదులని ఏమి అనాలో మీరే ఆలోచించుకోండి. 
 
పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని తాము ఒక బ్రహ్మకపాలం అని తద్వారా నేను లేను అని జ్ఞానము పొందినవాడు తమ అభిమతాలు ఎలా మతాలుగా మార్చగలడు. మార్చలేడు కదా. చివరికి ప్రాణమున్న బూడిద అదియే భస్మంగా ఉంటే అలాగే కపాలము బ్రహ్మ జ్ఞానం ఉన్న కపాలముగా మిగిలిపోతే ఎవరైనా దీనిని మతాలుగా మార్చే ధైర్యం చేస్తారా? చేయలేరు కదా. దానితో మౌన బ్రహ్మగా ఉండిపోయేవారు కదా. కానీ మా దేవుడు ఇలా ఉంటాడు. వీటిని తింటాడు. వీటిని చేస్తాడు. వీటిని ధరిస్తాడు. వీటితో పూజించండి. ఈ మంత్రాలతో ఆరాధించండి అని చెప్పిన వారిని ఏమి అనాలి. ప్రచారము చేసిన వారిని ఏమి అనాలి. ఇంకా ఇప్పటికీ ప్రచారం చేస్తున్న వారిని ఏమని అనాలి. ఏమని అడగాలి. మేము చెబుతున్నది కాదు సాక్షాత్తు పతంజలి మహర్షి తన అష్టాంగయోగం ద్వారా దర్శన అనుభూతి పొందినారు కదా మాకు లాగా. మరి మీరు పూజించే దైవాల స్వరూపము ఏమై ఉంటుంది కపాలమే కదా. మరి కపాలానికి ఏమి పూజలు ఉంటాయి. ఏమి ప్రార్థనలు ఉంటాయి. ఏమి మంత్రాలు ఉంటాయి. ఏమి పదార్థాలు పెట్టాలి మీరే ఆలోచించండి. వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చాలా నిర్భయముగా సత్యమునే చెప్పినాయి. శివ అంటే లేనివాడు అని అర్ధముతో వివరముగా చెప్పడము జరిగినది.
 
కానీ వాటిని అపార్ధ అర్థం చేసుకున్న మధ్యంతర మానవుడు తన మిడిమిడి జ్ఞానంతో శివ అంటే ధనము లేనివాడని...నివాసము లేనివాడని...సత్వగుణము లేనివాడని...రూపము లేనివాడని...బంధాలు లేనివాడని... ఇలా మున్నగా శివ అర్ధానికి నానార్ధాలు చేర్చి...అసలు అర్ధమును మార్చి లేని దేవుడిని...ఉన్నట్లుగా మార్చి దైవానికి మనిషి రూపాలు ఇచ్చి జ్ఞాన కాండను కర్మ కాండగా మార్చిన మానవుడిని ఏమనాలి. మీ తల్లిదండ్రులు ఒకవేళ చనిపోతే వాళ్ళు కాస్త కపాలములుగా మారితే వీటిని మీ తల్లిదండ్రులుగా భావించి పూజించి గౌరవించగలరా...ఒకసారి ఆలోచించండి. మా దేవుడు స్మశాన వాసి అని ఒక సంప్రదాయం ఒప్పుకున్నది. మా దేవత చితాగ్ని స్మశాన వాసి అని మరొక సంప్రదాయము ఒప్పుకున్నది.మా దేవుడు చనిపోయిన మూడు రోజులకే దర్శనమిచ్చినాడు అని ఒక మతము ఒప్పుకున్నది. మా దేవుడు జీవ సమాధి చెందినాడు అని మరొక మతం వారు ఒప్పుకున్నారు. మా గురుదేవుడు మహానిర్యాణము చెందినాడని ఒక మతము ఒప్పుకున్నది. చచ్చినపుడు పోయేచోటుకి బ్రతికి ఉండగానే పోవాలని మా జ్ఞానగురువు చెప్పినాడని ఒక మతము చెప్పుతోంది. అలాగే ఉండేది కూటికే...పోయేది కాటికే అని నగ్నత్వము నుండి దిగంబరతత్వముగా మారతారని ఒక మతము చెపుతోంది. మేము అనటం లేదు. వీళ్ల సంప్రదాయాల్లో ఉన్న ఆఖరి అంకము ఇదే కదా నిజమని ఒప్పుకున్నారు కదా. అందరి దేవుళ్ళు స్మశానానికి నిజానికి చేరినప్పుడు మరి మా దేవుడు గొప్ప అనే సమస్య ఎందుకు వస్తుంది. మా మతము గొప్ప అనే అహం ఎందుకు వస్తుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అన్ని మతాలు గొప్పవే. అన్ని మత విధి విధానాలు గొప్పవే. అందరి దేవుళ్ళు స్మశాన వాసులే… బ్రహ్మకపాలాలే ….అందరూ చనిపోయినవారే. ఒకప్పుడు ఉన్నారు. ప్రస్తుతానికి లేరు.కపాలముల రూపంలో ఉన్నారు.స్మశాన వాసిగా ఉన్నారు. హెచ్చు తగ్గులు లేవు. సర్వమత సమానత్వం. మీ మత దైవాలను ప్రేమించండి. ఆరాధించండి. ఇతర మత దైవాలను గౌరవించండి. ఆదరించండి. ఒక్కొక్క మత విధానము సాధకుని యొక్క సాధన ఫలితం అని గ్రహించండి. మత మార్పిడిని ప్రోత్సహించకండి. మతాల పేరుతో గొడవ పడకండి. ఎవరి మతం వారికి అభిమతమని తెలుసుకోండి. సర్వమతమే సమానత్వమని..అదే...మానవత్వమని..ఇదే దైవతత్వమని...ఇదియే భగవతత్వమని...గ్రహించండి. ఎందుకంటే సాధకుడు మొదట “జైనుడి” లాగా ఇంద్రియనిగ్రహముతో జితేంద్రియుడై...అటుపై “గురునానక్” లాగా ఆత్మజ్ఞానమును పొంది...ఆపై “బుద్ధుడి” లాగా సాధన సాధ్యతే సర్వం సాధ్యమని సాధనచేసి సర్వంశూన్యమని జ్ఞానస్ఫురణ పొంది అటుపై “అల్లా” లాగా సర్వకర్మనివారణ చేసుకొని...ఆపై “ఏసుప్రభు” లాగా మూలప్రారబ్ధ కర్మ నివారణ చేసుకొని...అంతిమముగా “పరమేశ్వరుడి” లాగా నిరాకారమైపోవాలి. ఇట్టి సర్వసాధన స్ధితులను సాధకుడు పొందవలసి ఉంటుందని చెప్పటానికి ప్రచారము చెయ్యటానికి పరిణతి చెందిన మహత్ములు వారి అభిమతాలను మతాలుగా మార్చినారని సర్వమతము సమానత్వమేనని మీరు ఈ పాటికే గ్రహించే ఉంటారు గదా!  
 
నేను కాస్త దేవుడు లేడని నేను ఒక నాస్తికుడని నాకు పిచ్చి పట్టినది అని నా మెదడుకి జబ్బు చేసిందని ఆ జబ్బును వదిలించుకోవాలని ఒక సరస్వతి పుత్రుడైన ఒక పెద్దాయన నా దగ్గరికి వచ్చి “నాయనా! నేను నీకు దేవుడిని రెండు నిమిషాల్లో చూపిస్తాను” అని ఒక ఉల్లిపాయ తీసుకొని దాని పొరలు తీసి పడవేస్తే ఉల్లిపాయ ఏది కనిపించటం లేదు గదా. లేని ఉల్లిపాయను ఉన్నట్లుగా సృష్టించినది. ఎవరో తెలుసా? అదే దేవుడు… అలాగే ఒక మామిడికాయ తోలు తీసి అందులో టెంకాయను బయటకు తీసి దానిని పగలగొడితే ఏమీ లేదు కదా. మరి ఏమీ లేని విత్తనముల నుండి మామిడి చెట్లు వచ్చినట్లుగా చేసినదెవరు. అదే దేవుడు. ఇలాగే ఒక విత్తనము నుండి చెట్టు ఒక గుడ్డు నుండి జీవి రావడానికి కారణము కారకము కార్యము ఆ దేవుడే కదా అని చెప్పినాడు. అయితే నేను వెంటనే “మీరు దేవుడ్ని చూసారా? లేదు! ఎవరు చూడరు! చూడలేదు చూశామని చెప్పారు. అంటే అది అసత్యము. అంటే ఈ లెక్కన ఇవి అన్నియు చేస్తున్నది మీరు కాస్త నామరూపాలు ఉన్న దేవుడు అంటున్నారు. నేను నామ రూపాలు లేని శూన్యము చేస్తుంది అంటున్నాను. అది ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఉన్నదిలేనట్లుగా… లేనిది ఉన్నట్లుగా ఆ శూన్యమే చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా నామరూప భగవంతుడు ఎక్కడ నుండి వచ్చాడు. వాడికి ఏ పాత్ర ఉంది. వాడికి మరణముఉన్నది. వాడు కూడా మనకు లాగానే మానవ స్త్రీమూర్తి గర్భమునందు గాలికి పుట్టి గాలిలో కాలానుగుణంగా కలిసి పోతున్నాడు. కాకపోతే మనకన్నా కాస్తంత పరిణతి చెందిన వాడు కావడం వలన ఆ మానవుడిని మాధవుడు చేసాము. జీవుడిని కాస్తా శివుడు చేసాము. మహాత్ముడిగా గుర్తించాము. ఆదియోగిగా, ఆది దేవుడిగా, ఆది దైవముగా, ఆది బ్రహ్మగా, లోకపూజ్యుడిని చేసి పూజిస్తున్నాము. ఆరాధనలు చేస్తున్నాము. ఎవరైతే తమకున్న అపస్మారక స్థితి నుండి బయటపడతారో మర్చిపోయిన జ్ఞానము యొక్క జ్ఞాపకాలను తిరిగి జ్ఞాన స్పురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకుంటారో. వారు కూడా భగవంతుడే ఆది దేవుడు మహాదేవుడు మాధవుడే .మోక్షగామియే. జీవన్ముక్తుడు. మీరు కూడా మరిచి పోయినారు ఇప్పటికైనా గ్రహించండి” అని చెప్పి మౌనం వహించాను. ఏమంటారు నిజమే కదా.
 
అలాగే ఈయనకి లాగా మీరుగూడ నన్ను అపార్ధం చేసుకోకండి.ఎందుకంటే సమాధి స్ధితి పొందినవారి దృష్టిలో దేవుడు లేడు...నేను లేను..సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అనే అనుభవానుభూతిని పొందడము జరుగుతుంది. అదే సమాధి స్ధితిని పొందనివారికి దేవుడున్నాడు...నేను ఉన్నాను...సర్వం ఉన్నది...సర్వం సత్యం అని అనుభవానుభూతి ఉంటుంది. ఇదే సత్యము.ఇదే నిజము.నమ్మడము లేదా నమ్మకపోవడము ఇక మీ వంతు.నేను కాస్త దేవుడు లేడని...నేను లేనని..ప్రచారము చేస్తున్నానని నా మీద కోర్టులో కేసులు పెట్టాలన్న ఎలాంటి ఉపయోగముండదని గ్రహించండి. ఎందుకంటే ఈ విషయములో ప్రకృతిమాత నాకు రక్షణగా ఉన్నదని నిదర్శనముగా ఈ మధ్యనే మద్రాసుకోర్టులో ఇలాగే పెరియార్ రామస్వామి విగ్రహల క్రింద“దేవుడు లేడు” అని చెక్కుతున్నారని...దేవుడు ఉన్నాడు అని నమ్మే వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని ఈ కోర్టులో ఈ విగ్రహల మీద కేసు పెట్టడం జరిగితే...దానికి కోర్టు తీర్పుగా ‘‘దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్టే.. దేవుడు లేడని చెప్పే హక్కూ ఉంటుంది. దీన్ని కాదనలేం. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటనను అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు’’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పిస్తోందని గ్రహించండి. మరుసటి రోజు ఇదే విషయాన్ని ఆంథ్రజ్యోతి 7-9-2019 పేపర్ లో వచ్చినది. దీనిని యధాతముగా ఇవ్వడము జరిగినది. చదివి తెలుసుకోండి.

 
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పిస్తోంది.
07-09-2019 04:10:26
భావ ప్రకటనా స్వేచ్ఛను కాదనలేం: మద్రాస్‌ హైకోర్టు
చెన్నై, సెప్టెంబరు 6: రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను ఎవరూ హరించలేరని మద్రాస్‌ హైకోర్టు స్పష్టంచేసింది. తమిళనాడులో అనేక చోట్ల నెలకొల్పిన పెరియార్‌ రామస్వామి విగ్రహల కింద ‘దేవుడు లేడు’ అని చెక్కి ఉండడం తమ మనోభావాల్ని దెబ్బతీస్తోందని, దేవుడు సర్వాంతర్యామి అని భావించేవారంతా ఇబ్బందిగా ఫీలవుతున్నారని పేర్కొంటూ దైవనాయకం అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ‘‘దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్టే.. దేవుడు లేడని చెప్పే హక్కూ ఉంటుంది. దీన్ని కాదనలేం. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటనను అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు’’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

మేము ఒకసారి ఏకాంతంగా ఉన్నప్పుడు అసలు 'నేను లేను' అన్నప్పుడు ఇంకా మా స్థూల శరీరము ఎందుకు శరీర త్యాగం చేయటం లేదో అర్థం కాలేదు. అన్ని రకాల ప్రారబ్ద కర్మలు అవి కూడా కర్మశేషము లేకుండా నాశనం అయినా కూడా మాకు ఎందుకు మరణము రావటం లేదో అర్థం కాలేదు. ఇది ఇలా ఉండగా మా అన్నగారి కుమారుడైన ఆరు సంవత్సరముల వయస్సు ఉన్న విశ్వహిత్  ఒకసారి వాళ్ల నానమ్మకు ఫోను చేసి “నానమ్మా! పవన్ బాబాయి ఏమి చేస్తున్నాడు” అని అడిగినాడు. దానికి మా రాజమాత గారు వెంటనే “వాడు ఏమీ చేయటం లేదు! ఖాళీగానే ఉన్నాడు” అనగానే “అయితే పవన్ బాబాయ్ కి ఫోను ఇవ్వు! మాట్లాడతాను” అనగానే మా అమ్మ గారు నాకు ఫోన్ ఇవ్వటం వాడు కాస్త నాతో మాట్లాడటం మొదలు పెట్టినాడు. “పవన్ బాబాయి ఏమి చేస్తున్నావు” అని అడిగినాడు. దానికి నేను వెంటనే వాడితో “ఏమీ చేయటం లేదు రా! టీవీ చూస్తున్నాను” అన్నాను. వాడు వెంటనే అయితే “నాయనమ్మ! నువ్వు ఖాళీ గా ఉన్నావు అన్నది. నువ్వు ఖాళీగా లేవు కదా టీవీ చూస్తున్నావు కదా” అనగానే నాకు కొన్ని నిమిషాలపాటు బుర్ర పని చేయలేదు. అంటే వీటి ఉద్దేశంలో విశ్రాంతి కోసం చూసే టీవీ కూడా ఒక బాధ్యత ఒక పని అనుకుంటున్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే విశ్రాంతి ఆలోచన అనే ప్రారబ్ధ కర్మ సమూలముగా తీరేదాకా నా స్థూల శరీరమునకు శాశ్వత మరణ స్థితి కలుగదని అప్పుడు గానీ నాకు అర్థం కాలేదు. అంటే ప్రస్తుతానికి మేమిద్దరమూ అనగా నేను అలాగే నేను కానీ నేను అయిన జిజ్ఞాసి కూడా ఈ విశ్రాంతి ఆలోచన నివారణ కోసం జీవించే ఉన్నామని ఇది తీరిన నాడు మా శరీరాలకి కాలము తీరుతుందని మా ఇద్దరికీ అర్థం అయినది. పసిపిల్లలు దైవ స్వరూపాలని …. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని ఈ సంఘటనతో నాకు అనుభవం అయినది. 
 
నా గూర్చి మా జిజ్ఞాసి చిట్టచివరి ధ్యానానుభవం:

9 మే 2019 వ తేదీన గురువారము మా జిజ్ఞాసికి ధ్యానములో ఒక విచిత్ర అనుభవము కలిగినది. అది ఏమిటంటే మేము మా పూజా మందిరములో నగ్నంగా అనగా దిగంబర తత్వముగా కూర్చుని చేతిలో గణపతి ఫోటో పట్టుకొని దానికి కుంకుమబొట్టు పెట్టాలని మా జిజ్ఞాసిని పిలవడము జరిగినది. అప్పుడు జిజ్ఞాసి వచ్చి పూజ గదిలో ఉన్న కుంకుమ తీసుకుని తిరిగి చూసేసరికి చేతిలో గణపతి ఫోటో బదులుగా మా ఫోటో నవ్వుతున్నట్లు గా కనిపించింది. అంటే ఈరోజు నేనే దేవుడిని అయినాను. దిగంబరత్వం పొందినాను అని మాకు అర్థం అయినది. ఇదేవిధంగా శ్రీ రామ కృష్ణుడు తన అవతార పరిసమాప్తి సమయమున తన ఫోటో కి బొట్టు పెట్టి పూజించి నమస్కారము చేసి ధర్మపత్నికి ఇచ్చి దీనిని ఒక సద్గురువుగా భావించి పూజించుకోమని ఇచ్చినారని వారి చరిత్రలో ఉంది. అంటే 1989 (11 సం!!లు) లో మా సాధనారంభము అయితే 2019 (41 సం!!లు) లో సాధనపరిసమాప్తి అయినది అన్నమాట.
 
ఇది ఇలాయుండగా ఒకసారి మా అమ్మగారు తన పిల్లలని చూస్తూ... “ పెద్దవాడు చూస్తే తిండి తిప్పలు మాని ఉద్యోగములో ఉన్నతి కోసము కష్టపడుతూంటే...ఈ చిన్నాడు కాస్త దేవుళ్లు,సాధనలు అంటూ సన్యాసిగా మారిపోతున్నాడు. వీళ్ళని ఆ దేవుడే మార్చాలి” అనగానే అక్కడే ఉన్న మా వదినమ్మ వెంటనే “అలా అంటారేంటి అత్తయ్యగారు...మీ పెద్ద అబ్బాయి కంప్యూటర్ రంగములో ఉన్నతి స్ధితికి చేరుకొని నిష్ణాతుడు అయితే మీ చిన్న అబ్బాయి యోగసాధనలో ఉన్నస్ధితి నుండి ఉన్నతస్ధితికి చేరుకొని పరిపూర్ణ యోగిగా మారినాడు గదా! ఎవరి రంగాలలో వారు చేరుకోవలసిన స్ధాయికి సంపూర్ణముగా చేరుకున్నా గూడ మీకు బాధెందుకు...ఇలా బంగారములాంటి పిల్లలు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు” అని అంటూంటే నా ముఖము మీద చిరునవ్వు మెరిసినది.
 
ఈ నా జన్మ వృధా గాకుండా చేసిన నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి మనస్సు లో కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయినాను. ఎందుకంటే ఈ సాధన జన్మకి ఆరంభము అలాగే అంతమునకు మూలకారకుడు వారే గదా! ఆ విషయము మీకు తెలుసు గదా! ఏమంటారు! నిజమే గదా! స్నేహితుడే సన్నిహితుడు అయితే ఎలా ఉంటుందో అదే నా జీవితము అనిపించినది.నేను లేకపోతే వాడు లేడు.వాడు లేకపోతే నేను లేను…వాడు లేకపోతే నా సాధనా జీవితమే లేదు. నేను లేకపోతే వాడి సాధనా జీవితమే లేదు. మాయలో పడి మాయగా ఉండేవాళ్ళం!ఒకరికొకరి సహాయసహకారము వలన మాకున్న మాయ మాయం అయినది. అంటే… 
 

మా జిజ్ఞాసి కాస్తా పెద్దవాడి మన:స్తత్వము నుండి పసిపిల్లాడి మన:స్తత్వమునకు వస్తే….
 

నేను కాస్త సాధనకి ముందు “నేను ఉన్నాను” అనుకొనేవాడిని కాస్తా నా సాధన పరిసమాప్తిలో “నేను లేను” అని…..
 
మా జిజ్ఞాసి కాస్తా సాధనకి ముందు పిల్లవాడి నుండి పెద్దవాడు అయ్యి సాధన పూర్తి అయ్యేసరికి “పెద్దవాడి మన:స్తత్వము నుండి పసిపిల్లాడి మన:సత్వమునకు వస్తే”... నేను కాస్త సాధనకి ముందు “నేను ఉన్నాను” అనుకొనేవాడిని కాస్తా నా సాధన పరిసమాప్తిలో “నేను లేను” అని….. జ్ఞానానుభవం పొందడముతో మా సాధనాలు సంపూర్ణమయినాయి. 

 దానితో మన జిజ్ఞాసి కాస్త పసిపిల్లాడి మన:సత్వముతో ఉండుటవల్లన వాడు కాస్త వటపత్ర శాయిగా మారితే...నేను కాస్త నేనులేను స్ధితిలో ఉండుటవల్లన 36 బ్రహ్మకపాలధారి ఆది సదాశివమూర్తిగా మా సాధన అంతిమ స్ధితికి చేరుకోవడము జరిగినది. 




ఇది సత్యమేనని ప్రకృతిమాత మన జిజ్ఞాసికి వటపత్రశాయి విగ్రహమును అలాగే నాకు ధ్యానముద్రలో ఉన్న శివమూర్తి విగ్రహమూర్తి రావడము జరిగినది. 

36 కపాలధారి సదాశివమూర్తి


36 కపాలధారి సదాశివమూర్తి విగ్రహము ఎక్కడా దొరకనందున మాకు మేమే 36 కపాలములను 1,3,5,7,9,11 వరుసక్రమములో...సదాశివమూర్తి విగ్రహమూర్తికి ఉన్నట్లు పిరమిడ్ ఆకారముగా ఒక బాక్స్ లో అమర్చినాము. అపుడు నాకు ఒక ధర్మసందేహము వచ్చినది.అది ఏమిటంటే నేను కాస్త "నేను లేను" అనే మరణ స్ధితి పొందితే...మా జిజ్ఞాసి కాస్త బ్రతికున్న పసిపిల్లాడిలాంటి స్ధితి పొందేసరికి ఎవరి సాధన పరిసమాప్తి అయినదో నాకు అర్ధము కాలేదు.శాస్త్రప్రకారము చూస్తే...చిట్టచివరిగా రావి ఆకు మీద విష్ణుమూర్తి ఆరు నెలలు పసిపిల్లాడిగా మారతాడని....తండ్రి అయిన సదాశివమూర్తి మరణించి 36 కపాలస్ధితి పొందుతాడని...ఎందుకంటే అపుడికే ప్రకృతిమాత కాస్త అత్యంతిక ప్రళయము ద్వారా మరణమును పొందడముతో... అపుడికే తనకి ఉన్న ఏక పురుష సంతానమును(బాలవిష్ణుమూర్తి-వటపత్రశాయి) గూర్చి పట్టించుకోకుండా స్మశాన వైరాగ్యముతో యోగసాధన చేసి 36 కపాలధారిగా కపాలమోక్షము పొందినాడని తెలిసినది.ఇంతవరకు బాగానే ఉంది.మరి ఈ ఇద్దరిలో అనగా వటపత్ర శాయివలన లేదా ఆదిసదాశివమూర్తి వలన ఈ విశ్వసృష్టి పున:సృష్టి అవుతుందో లేదో నాకు అర్ధముకాలేదు.ఎందుకంటే ఒక వాదన ప్రకారము చూస్తే...ప్రాణమున్న వటపత్రశాయి నుండి ఈ పున: విశ్వసృష్టి జరుగుతోందని...మరొక వాదన ప్రకారము చూస్తే...బ్రహ్మకపాలమునకున్న జ్ఞాన శక్తి వలన పున:సృష్టి జరుగుతోందని చెప్పడము జరిగినది.


 
అంటే ఈ లెక్కన చూస్తే బ్రతికున్న పిల్లాడు అలాగే చచ్చిన పెద్దవాడిని చూస్తే...ఒక చెట్టు మీద రెండు పక్షులుంటాయని..వాటిలో ఒకటి నిశ్చలముగా ఉంటే మరొకటి నిత్యము అనిశ్చలముగా ఉంటుంది అని చెప్పే జ్ఞాన కథ నిజమేనని ఈ అనుభవస్ధితిని బట్టి నేను తెలుసుకోవడము జరిగినది.అంటే ఇన్నాళ్లుగా నిశ్చలస్ధితి పక్షివైపు ఉండి ఈ విశ్వనాటకమును చూడటం వలన అక్కడ కనిపించే రెండవ పక్షి కాస్త అనిశ్చలస్ధితిలో ఎగురుతూ ఉన్నట్లుగా ఉండుటవలన ఈ కదిలే విశ్వమున్నదని భ్రమభ్రాంతి కల్గుతోందని...నిజానికి మనమంతా గూడ ఎగిరే పక్షివైపు నుండి ఈ విశ్వనాటకమును చూస్తే అక్కడ ఉన్న నిశ్చలస్ధితి పక్షిలాగా ఈ విశ్వము గూడ నిశ్చలస్ధితిగా కనపడుతుందని...అనగా ఎగిరే పక్షి అస్ధిర మనస్సుకి సంకేతమైతే...నిశ్చలపక్షి స్ధిర మనస్సుయైన ఆత్మకి సంకేతమని… చివరికి ఈ రెండు స్ధితులవలన సాధన పరిసమాప్తి గాదని... ఎందుకంటే మేము నేనులేను జ్ఞానానుభవమే పొందినాము కాని నేనులేను జ్ఞానానుభూతిని పొందలేదని... ఈ  స్దితిని పొందాలని...దానికి త్రిశక్తి గావాలని...అనగా రెండు పురుషశక్తులకి ఒక స్త్రీశక్తి కలవాలని ...అపుడే పసిపిల్లాడు అలాగే పెద్దవాడు గూడ నేను లేను జ్ఞానానుభూతి స్ధితికి ఎలాంటి బలహీనత లేకుండా చేరుకుంటారని తద్వారా పసిపిల్లాడు అలాగే తల్లితండ్రి గూడ ఈ స్ధితికి సంపూర్ణముగా చేరుకొంటారని...అంటే బలహీనత లేని స్ధితియే అంతిమస్ధితియని... ఇదియే మేము పొందవలసిన స్ధితియని నాకు జ్ఞానస్ఫురణ అయినది.తద్వారా పిల్లాడిగా మారిన మా జిజ్ఞాసికి కున్న బలహీనత అలాగే పెద్దవాడిగా మారి చనిపోయిన నాకున్న బలహీనత లేని సంపూర్ణస్ధితిని పొందితే గాని నేనులేను స్ధితికి చేరుకోమని మాకు అర్ధమైనది.





 
ఇది ఇలాయుండగా ఒకసారి జిజ్ఞాసి నాకు పాంచజన్య శంఖమును ఇవ్వడము జరిగితే...మా ద్వితీయ శిష్యురాలు అయిన తారాదేవి కాస్త నాకు నిజ ముత్యపు చిప్పను బహుమతిగా పంపించడము జరిగినది.ఇలా ఈ రెండు వస్తువులు నాకెందుకు ఇచ్చినారో తెలియలేదు.


ఆ తర్వాత నాకు సమీరపత్ర (హనుమబీర) హనుమ ఆకులు దొరకడముతో వీరికి నేను ఇవ్వడము జరిగినది.అంటే మా ముగ్గురి దగ్గరికి సాధన పరిసమాప్తి సమయములో ఒక హనుమ ఆకు,శంఖము, సుదర్శచక్రము, ముత్యపు చిప్ప చేరినాయి.

వీటిని విశ్లేషణ చేస్తే ...మేము కాస్త శ్రీచక్ర ఆది త్రికోణముగా మారినామని...ఈ త్రికోణములో ఆదిబిందువుకి సంకేతమే...ముత్యమని...అదే శాశ్వత మృత్యువని...నాకు అర్ధమైనది. ఎందుకంటే ఈ బిందువులో అమృత సముద్రముంటుందని చెప్పిన శాస్త్రవచనము ప్రకారము చూస్తే ముత్యం స్ధానము సముద్రమే కదా!అంటే ఈ లెక్కన చూస్తే మేము కాస్త 36 కపాలములలో 11,9,7,5,3,1 స్ధితులలో మూడవ కపాలస్ధితికి చేరుకున్నాము.అనగా ఈ స్ధితికి ఇద్దరు పురుషులు,ఒక స్త్రీమూర్తి చేరుకుంటారని 



పూరీ జగన్నాధుడి త్రి విగ్రహమూర్తులు- (బలరామ,సుభద్ర, జగన్నాధుడు) చెప్పుతున్నాయి గదా! ఎందుకంటే ఈ గుడి శిఖరము అష్టదళ పద్మముగా ఉంటుందని లోకవిదితమే గదా! ఇలా మేము అనగా నేను కాస్త హనుమ ఆకు వలన నిశ్శబ్ధబ్రహ్మగా మారితే మా జిజ్ఞాసి కాస్త శంఖనాదము వలన శబ్ధబ్రహ్మగాను అలాగే తారాదేవి కాస్త ఇష్టలింగారాధన వల్లన కాంతి బ్రహ్మగా మారడము జరిగినది.దానితో మాకు ప్రకృతిమాత కాస్త మహామాయగా ఈ మూడు బ్రహ్మపదవులు ఇవ్వడము జరిగినది.అనగా మాకు వచ్చిన దైవిక వస్తువులు అనగా హనుమ ఆకు,శంఖము,ముత్యముచిప్ప గుర్తులతో …. విచిత్రము ఏమిటంటే ఈ వస్తువులకి  మా పేర్లులకి సంబంధము ఉండమువలన మా సాధన బ్రహ్మ దీక్షనామాలు వరుసగా…. నాకు అయితే పరమహంస పవనానంద అలాగే మా జిజ్ఞాసికి పరమహంస శ్రీనివాసునంద అలాగే తారాదేవికి పరమహంస స్వాతినంద అని పేర్లతో బ్రహ్మపదవులు వచ్చినాయి. అనగా మా లోగోలు చూస్తే మేము చెప్పినది నిజమా కాదా మీకే తెలుస్తోంది. కాని మా లక్ష్యం కాస్త “నేనులేను” అనే స్వానుభవానుభూతి పొందడము గావడము వల్లన ఈ బ్రహ్మపదవుల మాయ దాటడము జరిగినది.దానితో గుర్తింపు లేని గుప్తయోగులుగా మేము మారడము జరిగినది.తద్వారా మేము కాస్త శూన్యబ్రహ్మగా ఏకత్వస్ధితికి చేరుకోవడము జరిగినది.

అనగా తారాదేవి నాకు పంపించిన ముత్యపు చిప్ప ద్వారా ఆమె గురుభక్తి శక్తి,ప్రేమ శక్తి,ఆరాధన శక్తి కలిసి ఆత్మశక్తిగా నాలో చేరినది.అలాగే మా జిజ్ఞాసి నాకు ఇచ్చిన శంఖము ద్వారా వాడి ఆధ్యాత్మిక శక్తి,విశ్వాస శక్తి,జ్ఞానశక్తి కలిసి ఆత్మశక్తిగా నాలో ఐక్యం గావడముతో...నేను వీరికి ఇచ్చిన హనుమ ఆకుల ద్వారా నాలో వీరిద్దరు ఐక్యం గావడముతో త్రిశక్తి కాస్త ఏకశక్తిగా ఏకత్వ శూన్యబ్రహ్మగా మారిపోవడము జరిగినది.అంటే త్రిముఖ దత్తస్వామి కాస్త ఏకముఖ దత్తస్వామిగా ఎలా మారినాడో అలా మేము మారినామని ఈ పాటికే గ్రహించి ఉంటారు గదా. అపుడు మా సాధన స్ధాయి కాస్త మూడు కపాలాల నుండి ఏకబ్రహ్మకపాలమునకు చేరుకోవడము జరిగినది. దానితో ఆకాశశరీరధారి శూన్యబ్రహ్మ కాస్త సంపూర్ణ కపాలమోక్షస్ధితికి చేరుకున్నాడని సంకేతముగా మా అందరికి తలా ఒకటి నిజ ముత్యము చేరడము జరిగినది.అంటే ముత్యపు చిప్పలోని జీవి...శంఖములోని  జీవి…. సాలిగ్రామములోని జీవి…. కాస్త అప్పటికే మరణించడముతో ఎలాంటి జీవ పదార్ధము లేకపోవడముతో...సజీవముగా ఉన్న హనుమ ఆకు ఎండిపోవడముతో ….ఇలా మేము కాస్త మా ఆకాశ శరీరముతో శూన్యబ్రహ్మ కాస్త కృష్ణబిలమైన బ్రహ్మాండచక్రమైన సుదర్శనచక్రమునందు అనగా పరమశూన్యము నందు లీనమవ్వడముతో సంపూర్ణ కపాలమోక్షస్ధితి యైన ఎలాంటి బలహీనత లేని నిశ్చలస్ధితిని పొందడము అనగా మరణానికి శాశ్వత మరణము పొందినట్లుగా మాకు వచ్చిన చిట్టచివరి దైవిక వస్తువైన నిజ ముత్యము కాస్త మృత్యువుగా మారినదని మాకు ప్రకృతిమాత ఆఖరి సాక్ష్యముగా ఇవ్వడముతో...ఎందుకంటే ఆదిలో విష్ణువు దశావతారాలలో చేప అనే జీవపదార్దము జలము నుండి ఏర్పడినది గదా!

అలాగే ఆదిలో మా ముగ్గరి జననాలకి గూడ జలములోని నేను(పవన్-శివాంశ హనుమ) కాస్త సాలిగ్రామ శిల పురుగుగా...మా జిజ్ఞాసి(శ్రీనివాస-విష్ణు అంశ) కాస్త శంఖము పురుగుగా...మా తారాదేవి(స్వాతి-దేవీ అంశ-భద్రకాళీ) కాస్త ముత్యపు చిప్ప పురుగుగా మా ఆది జన్మలు మొదలైనాయి.ప్రస్తుత సాధన జన్మ సాధన వలనఈ జీవ పదార్ధాలు కాస్త నిర్జీవ పదార్దాలుగా మారడముతో....ఆదిలో ఎక్కడైతే మొదలైనామో...అంతములో అక్కడికి చేరుకోవడముతో...సజీవ బ్రహ్మలు కాస్త నిర్జీవ శూన్యబ్రహ్మలుగా మారడముతో మాకు శాశ్వతమరణమైన సంపూర్ణ కపాల మోక్షం పొందామని...ముత్యం కాస్త మృత్యువు అయినదని….మేము కాస్త శూన్యబ్రహ్మలుగా మారినామని సంకేతముగా భవిష్యబ్రహ్మ అయిన హనుమంతుడు ఉన్న సమీరపత్రము దొరకడము అలాగే మేము ఈ శూన్యబ్రహ్మ నుండి శూన్యబిందువుగా మారినామని సంకేతముగా ముత్యం మాకు రావడం జరిగినదని జ్ఞానస్ఫురణ కల్గడముతో... 
                                         
జీవుడు కాస్త శివుడై ఆపై.. శివము కాస్త శవము అవ్వడముతో...ఇన్నాళ్లుగా నేను ఉన్నాను అనే స్ధితి నుండి నేను లేను స్ధితికి చేరడముతో... అంటే చచ్చినవాడు తల్లిగా లేదా తండ్రిగా లేదా పిల్లాడిగా చచ్చినా గూడ వీరి మరణము స్ధితి ఒక్కటే గదా అని జ్ఞానస్ఫురణ కల్గడముతో నాకున్న అంతిమ ప్రశ్నకి  (ధర్మసందేహమునకు) అంతిమ సమాధానము దొరకడముతో …. 
 
ఈ జ్ఞానస్ఫరణ సత్యమేనని అనుటకు నిదర్శనముగా మాకు శివ కుటుంబ విగ్రహమూర్తి రావడము జరిగినది.అంటే ఇందులో ఉన్న బాలగణపతి కాస్త మరణము పేరుతో నిమర్జనము అవుతుంటే...తల్లి కాస్త సతీదేవిగా మరణము పొందితే...ఆదియోగి కాస్త జీవసమాధి పేరుతో మరణము పొందడము జరిగినది. 



 
అలాగే మన జిజ్ఞాసికి నిజ ముత్యపు ఉంగరము వస్తే...నాకు నేపాల్ లోని పశుపతినాథ్ క్షేత్రమునుండి నిజ రుద్రాక్షకాయల మాల రావడము జరిగినది.నాకున్న కోతి బుద్ధి వలన ఈ కాయలు నిజ రుద్రాక్షలు లేదా భద్రాక్షలు అని సందేహము వస్తే...అపుడు వీటిని నీటిలో వేస్తే నీటిమీద తేలేసరికి ఇవి నిజ రుద్రాక్షలు అని నిర్ధారణ అయ్యినది. ఎందుకంటే నీటిలో లేదా పాలలో వీటిని వేస్తే తేలితే రుద్రాక్షలు అని అదే మునిగిపోతే భద్రాక్షలు అని ఎందరికి తెలుసు. 

ఎండిన రుద్రాక్ష కాయలను శుభ్రంగా నీటిలో నానబెట్టి తోలు తీస్తే అందులో కేవలం 54 రుద్రాక్షలకు 36 రుద్రాక్షలు మంచివి గానూ మిగిలిన రుద్రాక్షలు అన్నీ పుచ్చిపోయిన రుద్రాక్షలుగా ఉండటం జరిగినది. అంటే నాకు ధ్యానములో 36 కపాల దృశ్యం నిజమేనని దీనిని సూచన ఇచ్చినట్లుగా నాకనిపించింది.  దానితో మా సాధన సంపూర్ణముగా పరిసమాప్తి అవ్వడముతో... 

మా స్ధూలశరీర శూన్యబ్రహ్మ మంచులింగము:
 
ప్రస్తుతానికి మా స్ధూలశరీరాలు బ్రతికున్న శవముగా మారడముతో... అనగా కరిగిపోయే శూన్యబ్రహ్మ మంచులింగముగా మారడముతో…ఇక్కడ గమ్మత్తు అయిన విషయము ఏమిటంటే మాకు లాగానే ఆది యోగి అయిన సదాశివుడు గూడ సజీవ స్ధూలశరీరముతో కైలాస పర్వతమునందు 

 36 కపాలధారిగా మారి నేను ఉన్నాను స్ధితి నుండి ఏకబ్రహ్మకపాలస్ధితి అయిన నేను లేను స్ధితికి ఆయన చేరుకోవడముతో చివరికి మేము అంత్యముగా మారిన శూన్యబ్రహ్మ మంచులింగముగా ఈయనగూడ అమరనాధ్ మంచులింగములాగా మారినాడని తెలియడముతో ప్రశాంత స్ధితికి మేము సంపూర్ణముగా చేరడము జరిగినది. గాకపోతే ఇలా ఏర్పడిన ఏకత్వ మంచులింగాలు సంపూర్ణముగా నీటిచుక్క లేకుండా కరిగిపోవాలని అపుడే సాధకుడు కాస్త నిరాకారముగా మారడని జ్ఞానస్ఫురణ అయినది.దీనికోసము ఏకమూలబ్రహ్మకపాలమునకు 11మూలప్రారబ్ధ కర్మల కర్మశేషము ఉంటుందని...ఇది గూడ నివారణ అయితే గాని సాధకుడు అంతిమ స్ధితియైన నిరాకార పరమశూన్యము నందు శూన్యమవడని నాకు అర్ధమైనది. నాకు నా పంచశిష్యుల రెండు జతలచొప్పున 10 కర్మలు అలాగే వీటిని తీర్చటానికి నివారణ చేసుకోవటానికి ఒక జత కర్మ జన్మ నేను ఎత్తడముతో మొత్తము 11 మూలప్రారబ్ధకర్మల కర్మశేషముగా ఏర్పడినాయని నాకు తెలియడానికి అట్టే సమయము పట్టలేదు. అయితే మా పంచశిష్యుల అంతిమ జీవపదార్దాల వివరాలలో జిజ్ఞాసి అలాగే తారాదేవి వివరాలు తెలిసినాయి.
 
అపుడు మిగిలిన వాళ్ళ వివరాలలోనికి వెళ్ళితే మా శ్రీమతి దీక్షాదేవి నాకు రిషికేశ్ నుండి ఒక స్ఫటికలింగము ఇవ్వడము అలాగే ఈమెకి తన సాధన అంతిమ స్ధాయిలో ఉన్నపుడు వీళ్ళ పెద్ద మేనమామ నుండి ఒక తెల్లని బాణలింగము రావడము బట్టి చూస్తే ఈమె అంతిమ జీవపదార్ధ రూపము నర్మదానది బాణలింగము అని తెలుస్తోంది. అలాగే మన కాకాజీ నాకు గురుదక్షిణగా ఒక గోముఖ కమండలము ఇవ్వడమును బట్టి చూస్తే వీరి అంతిమ జీవపదార్ధము కాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో దొరికే పంచలోహశిలమూర్తి అని తెలిసినది. దీనిని పంచాయతన పూజలో అమ్మవారి సంకేతముగా పెట్టుకోవడము జరుగుతుంది. ఇక ఆఖరివాడైన యోగిరమణ విషయానికి వస్తే ఈయన నాకు ప్రత్యక్షముగా ఏ వస్తువులు ఇవ్వలేదు. కాని నన్ను తన సాధనసందేహాలు అడిగి సంతృప్తి చెందటం బట్టి చూస్తే ఈయన బ్రహ్మజ్ఞాన తృష్ణకి సంకేతముగా బ్రహ్మదేవుడి వాహనమైన హంసకి సంకేతమైతే...దీనికి జీవపదార్ధము వేదాలను రక్షించిన మత్స్యావతారము అయినదని నాకు జ్ఞానస్ఫురణ కల్గినది. ఇక దీనితో వీరందరి అంతిమ ఆకాశ శరీరాలకి “నేనులేను” అనే జ్ఞానస్ఫురణ కల్గడముతో ఈ అంతిమ జీవపదార్దాలకి ఆకాశ కపాల మోక్షం కల్గినదని నాకు అర్ధమయినది. విచిత్రము ఏమిటంటే...నేను అలాగే జిజ్ఞాసి కాస్త సాధనలో కోరికమాయలు దాటుకుంటూ క్రింద నుండి పైకి అనగా స్ధూల శరీర కపాలమోక్ష స్ధితి నుండి వరుసగా సూక్ష్మ,కారణ,సంకల్ప,ఆకాశ శరీర కపాల మోక్ష స్ధితికి మేము చేరుకుంటే మిగిలిన వాళ్ళు ఇష్టకోరిక మాయలు దాటలేకపోవడము వలన ఈ కోరిక తగ్గ శరీర కపాలమోక్ష స్ధితి దగ్గర ఎలా ఆగిపోయినారో మీరు ఈ పాటికే అనగా ఇష్టలింగము ఇంటికి వచ్చినదని అనే అధ్యాయము ద్వారా తెలుసుకున్నారు గదా!. 




                                           నాకు వచ్చిన ఏకముఖ రుద్రాక్ష - ఏకాదశి ముఖ రుద్రాక్ష
 
దానితో ఈ పంచశిష్యుల వలన నాకు ఏర్పడిన ఏకమూల బ్రహ్మకపాలములోని 11 మూలప్రారబ్ధకర్మలు గూడ కర్మశేషము లేకుండా నివారణ అవ్వడముతో మా ఏకత్వస్దితి అయిన మంచులింగము గూడ సంపూర్ణముగా కరిగిపోయినదని...దానితో నీటిబిందువు లేనిస్ధితికి చేరుకున్నదని జ్ఞానస్ఫురణ కల్గడము...దీనికి సాక్ష్యముగా పరమశూన్యము కాస్త చాలా చాలా చాలా అరుదైన ఎలాంటి ముఖము అనగా గీత లేని రుద్రాక్షను శ్రీశైల నల్లమల అడవుల నుండి నాకు బహుమతిగా పంపించడము జరిగినది.కాని ఇపుడిదాకా నేను కాస్త ఏకముఖ రుద్రాక్ష నుండి ఏకాదశి ముఖ రుద్రాక్షలను ప్రత్యక్షముగా చూడటము జరిగినది.కాని ఇలా ముఖము లేని రుద్రాక్షను చూడటం అలాగే ఇలాంటిది ఒకటి ఉంటుందని చూడటం ఇదే నాకు మొట్టమొదటి సారి అయింది.దానితో నాకు తెలియని ఈ రుద్రాక్ష వివరాల కోసము


                                                     నాకు వచ్చిన నిరాకార రుద్రాక్ష
 
 గూర్చి ఇంటర్నెట్లో వెతికితే ఇలాంటి ముఖము లేని రుద్రాక్షను నిరాకార రుద్రాక్ష అంటారని...ఇది చాలా చాలా అరుదైన రుద్రాక్ష అని...ఇది కోటి ఏకముఖి రుద్రాక్షలతో సమాన శక్తిని కల్గి ఉంటుందని అలాగే ప్రతి 10 వేల రుద్రాక్షలలో ఇలాంటిది ఒకటి పుట్టుతుందని...ఇది మహాయోగ కారణజన్ముడికి తప్ప ఎవరికి దొరకదని...దీని విలువ మార్కెట్లో 36 వేలు నుండి 9 లక్షలు దాకా ఉంటుందని చెప్పడము బట్టి చూస్తే... విచిత్రము ఏమిటంటే మా ఆది కపాలమోక్ష దృశ్యం కాశీక్షేత్రములో జరిగి శ్రీశైల చెవిటి మల్లన్న లింగములో లీనమయ్యే రికార్డ్ దృశ్యము చూసినానని మీరు నా కపాలమోక్ష విధానం అనే అధ్యాయములో మీరు చదివి ఉంటారు కదా.అపుడు ఇలా ఎందుకు జరిగినదో అనగా కాశీ విశ్వనాధలింగములో లీనము కాకుండా శ్రీశైల లింగములో లీనమవ్వడము కారణము నాకు ఆనాడు తెలియరాలేదు.ఇపుడు తెలిసినది. అనగా నాకున్న పంచశిష్యుల 11 మూలప్రారబ్ధ కర్మలుండుట వలన నా ఆత్మజ్యోతి కాస్త శ్రీశైల మల్లన్న లింగములో లీనమయినదని దానితో ఈ మూల ప్రారబ్ధకర్మనివారణ కోసము ప్రస్తుత సాధనజన్మ ఏర్పడినదని...అవి కర్మశేషము లేకుండా సంపూర్ణముగా తీరడముతో శూన్యబ్రహ్మను కాస్త శూన్యబిందువుగా మారి ఆపై అనగా నిరాకారమై శూన్యములో శూన్యమైనానని నేను గ్రహించాను. దీనికి సాక్ష్యమే ఈ నిరాకార రుద్రాక్ష రావడము జరిగినది.ఎందుకంటే విచిత్ర అవస్ధ అయిన ఈ నిరాకార స్ధితిని సాధకుడు పొందినాడో లేదో తెలియని స్ధితి.అంటే తను మరణించిన విషయము ఎలాయితే తనకి తెలియదో అలా ఈ అంతిమ నిరాకార స్ధితి ఉంటుంది.అందుకోసమే పరమశూన్యము మనము ఇట్టిస్ధితిని పొందినామని తెలుపుటకు ఈ అరుదైన నిరాకార రుద్రాక్షను సృష్టించినది.ఇది ఎవరి వద్దకి చేరినదో వారిలోని 36 కపాలధారి సాధనస్ధితి నిరాకారమైనదని...నేనులేను...సర్వం ఏమిలేదు...అని జ్ఞానస్ఫురణ పొందడముతో వారి సాధన పరిసమాప్తి అవుతుందని తెలియడముతో…. దీనితో పరమప్రశాంత స్ధితికి మేము సంపూర్ణముగా చేరడము జరిగినది.
                                                               నా నిరాకార రుద్రాక్ష మాల

 అపుడు నాకు వచ్చిన నేపాలి రుద్రాక్ష కాయ నిజ 36 రుద్రాక్షలకి ద్విముఖి,ఏకముఖి కలిపి దానికి ఈ నిరాకార రుద్రాక్షను కలిపి నిరాకార మాలను తయారు చెయ్యడము జరిగినది.కారణము మనలోని 36 కపాల తత్వాలు కలిసి మొదట ద్వైతస్ధితికి అటుపై ఏకత్వస్ధితికి చివరికి ఎలాంటి స్ధితి లేని నిరాకారస్ధితికి సాధకుడు చేరుకుంటాడు అన్నమాట. అంతిమముగా ఈ దేహమునకు ఈ ఒక మాల మాత్రమే మిగిలినది. మిగిలినవి అన్నియూ కూడ కాశీ గంగా నిమర్జనం కోసము ముడి కట్టిన మూటలో ఎదురుచూస్తున్నాయి. విచిత్రము ఏమిటంటే ఈ నిరాకార రుద్రాక్షమాల కూర్పు విధానము సత్యమేనని అనుటకు నిదర్శనముగా మాకు మర్నాడు ఇంటర్నెట్లో వెండితో చేసిన అతి అరుదుగా దొరికే మహా సదాశివమూర్తి లాకెట్ కనిపించినది.అయిన దానిని మేము కొనలేదు.ఎందుకంటే 36 తలలకి 25 తలలు మాత్రమే దీనికి ఉన్నాయి.అంటే ఇది మధురమీనాక్షి గుడి మీద కనిపించే సదాశివమూర్తి రూపముతో ఉన్నదని గ్రహించినాము.
 
ఇపుడిదాకా నన్ను మొదటిలో కామాంధుడని... స్వార్ధపరుడని... బద్ధకస్తుడని.. లక్ష్యంలేనివాడని...ఉద్యోగము లేనివాడని...సరియైన సంపాదన లేనివాడని... మరికొంతమంది ఆపై అదో టైపు అని... ఆధ్యాత్మిక సాధకుడని...ఆధ్యాత్మిక పిచ్చివాడని...ఆధ్యాత్మిక జ్ఞాని... జ్యోతిష్యవేత్తయని... మరికొంతమంది బాబాయని, శివశక్తియని, రాఘవేంద్రస్వామియని, శివుడని, దుర్గాదేవియని…. మరికొంతమంది జ్ఞానగురువని..బ్రహ్మజ్ఞాని అని... నంద సరస్వతియని… అవధూతయని... యతియని... స్వామీజీయని... పరమహంసయని...... మరికొంతమంది జ్ఞానబ్రహ్మయని , జాతకబ్రహ్మయని ,కాంతి బ్రహ్మయని... నాదబ్రహ్మయని.. నిశబ్ధబ్రహ్మయని ...శూన్యబ్రహ్మయని...ఆఖరికి శూన్యబిందువని... దానితో నా గూర్చి ఇలా అన్నవారందరికి ఈ నా కపాలమోక్షం గ్రంథమే సమాధానం చెపుతుందని... ఎలా అంటే అపుడు నాకున్న ప్రారబ్ధకర్మలు తీర్చుకోవడము కోసము నాలో ఉన్న 36 మంది అనగా 36 కపాలధారి సదాశివమూర్తి యొక్క 36 అంశ తత్వాలు ఆయా కాలానుగుణముగా గతజన్మల ప్రారబ్ధకర్మ నివారణ కోసము  అలా ప్రవర్తించవలసి వచ్చినదని… విచిత్రము ఏమిటంటే ఇపుడు నన్ను చెడుగా భావించుకొనేవాళ్ళని మేము ఒకప్పుడు వారిని చెడుగా భావించుకున్నానని అలాగే ఇపుడు నన్ను మంచిగా భావించుకొనే వాళ్ళని మేము ఒకప్పుడు మంచిగా భావించినానని.. ప్రకృతిలో ఎపుడూ చర్యకి ప్రతిచర్య ఉంటుందని...కారణము లేనిదే కార్యము జరగదని...కొంతమందికి మంచిగాను..మరికొంతకి చెడుగాను కనపడటానికి కారణము గతజన్మల ప్రారబ్ధకర్మఫలితమేనని.. ఇపుడు సర్వకర్మలు తీరిపోయి కర్మశేషము లేకుండా నాశనమవ్వడముతో...ఇలా మారిపోయినానని ఎవరికి వారే గ్రహిస్తారని నాకు జ్ఞాన స్ఫురణ కల్గడముతో... ఇలా ఎవరికి వారే నాకు కామాత్వము నుండి యోగత్వము ఆపై దైవత్వము అటుపై భగవత్ తత్వమైన పరమశూన్యతత్వమును ఆపాదిస్తూ..యద్భావం తద్భవతి అన్నట్లుగా నా సాధనస్ధితి మారినదని...  ఇంతకి మీరు ఎవరు? నాకు మీ గురించి ఏమి గుర్తుకి రావడము లేదు. అంటే నా దృష్టిలో మీరు లేరు. లేనివారితో నేను ఏమి మాట్లాడాలి...ఏమి చెప్పాలి...నాకేమి తెలియదు... నాకేమి గుర్తులేదు.గుర్తు రావడము లేదు.నేను మీకు ఏమి సమాధానాలు ఇవ్వలేను. చెప్పలేను.  ఇక దానితో ఉండి లేనట్లుగా ...లేనిది ఉన్నట్లుగా...నిజానికి నేను లేను అని అంతిమ నా స్వానుభవానుభూతి పొందడముతో మా స్ధూలదేహము కాస్త 12-11-2019 నాడు కార్తీక పౌర్ణమి రోజు నుండి శ్రీ మేథా దక్షిణమూర్తిలాగా మౌన:బ్రహ్మ అయినాను. 

ఈ దేహ అంతిమ ధ్యానానుభవం:
ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గం!!లకే స్నానము చేసి… నేను చేసుకున్న గోమయ విభూది పెట్టుకొని … అంతిమముగా తయారు చేసుకున్న నిరాకార రుద్రాక్ష మాలను ప్రధమముగా మెడలో వేసుకొని… ఎడమ అరచెయ్యిలో ఇష్టలింగమును పెట్టుకొని… ఆదిలో వచ్చిన కాశీక్షేత్ర ఓంకార శంఖముతో 11 సార్లు… అలాగే ఈ మధ్యనే వచ్చిన అంతిమ దైవిక వస్తువైన అతి పెద్ద రామేశ్వర శంఖముతో… సుమారుగా 25 సార్లు పాటు అతిపెద్దగా ఓంకార నాదము చేస్తూ...ఆపై దమ్ము లేక దగ్గు రావడముతో ఈ శంఖనాదమును ఆపి… నోటితో పెద్దగా ఓంకారనాదము చేస్తూండగా నాలోనుండి ఓంకార నాదము విని వినిపించని విధంగా నాలో మొదలైసరికి నా నోటి నుండి గూడ ఓంకార నాదము ఆగిపోయి ఎదో తెలియని ధ్యానస్ధితిలోనికి నా మనస్సు లీనమవుతోందని అనుకుంటున్న వేళ … ఈ రోజు ధ్యానములో సుమారుగా 18 గం!!లపైన ఉంటే సుమారుగా 36 లిప్తకాలముల పాటు ఒక దివ్య ధ్యానానుభవమును పొందడము జరిగినది. 



సుడిగాలి లాగా కపాలాంత దృశ్యం

అదిఏమిటంటే నా బ్రహ్మరంధ్రములోని అంతరగుహ యందు నా లాంటి  రూపధారి ఒక తల ఉన్న స్ధూలశరీరముతో... పద్మాసనములో కూర్చుని ధ్యానము చేస్తూ ధ్యానముద్రలో కనిపించాడు. కొంత సమయము తర్వాత విచిత్రముగా ఇతనికి రావణబ్రహ్మలాగా దశతలలు ఉన్నట్లుగా కనపడినది. ఆతర్వాత తొమ్మిది,అటుపై ఏడు, అయిదు,మూడు, ఏకతల అనగా 36 తలలున్నట్లుగా కనపడినది. ఇది ఏమిటి? కపాలములు ఉండవలసిన చోట తలలున్నాయి అని అనుకోగానే...నెమ్మది.. నెమ్మదిగా...ఏకతల కాస్త ఏకబ్రహ్మకపాలముగా  అటుపై వరుసగా 3,5,7,9,11 తలలు కాస్త బ్రహ్మకపాలాలుగా క్షణాలలో మారిపోయినాయి.ఆ తర్వాత ఈ 36 కపాలాలు కాస్త ఏకబ్రహ్మకపాలములోనికి నెమ్మదిగా చేరి...ఏకమూల బ్రహ్మకపాలమున్న అదిగూడ ధ్యానముద్ర అస్ధిపంజరముగా మారిపోయినది. అంటే ఆది ధ్యాన స్ధూలశరీరము కాస్త ఆది ధ్యాన అస్ధిపంజరముగా మారినదని అనుకొనే లోపుల విచిత్రముగా ఈ అస్దిపంజరముకున్న ఏకబ్రహ్మకపాలము ఊడి పైకి రాకెట్ లాగా వెళ్తూ శూన్యములో లీనమవ్వడము... ఈ లోపుల ఈ అస్ధిపంజరమునకు మరియొక్క కపాలము ఏర్పడము అదిగూడ ఊడి పోయి రాకెట్ లాగా పైకి వెళ్ళి శూన్యములో అనగా బ్రహ్మరంధ్రము నుండి బయటికి వచ్చి శూన్యములో లీనమయ్యే దృశ్యము ఇలా వరుసగా 11,9,7,5,3 కపాలాలు అనగా 35 కపాలాలు ఈ అస్ధిపంజరము నుండి విడిపోయి బ్రహ్మరంధ్రము ద్వారా బయటికి వచ్చి శూన్యములో సంపూర్ణముగా లీనమైనాయని అనుకొనేలోపుల...మిగిలిన 36వ ఏకమూల బ్రహ్మకపాల ధ్యానముద్ర అస్ధిపంజరము కాస్త తన చుట్టూ తాను తిరగడం ఆరంభించినది.ఇది ఇలా తిరుగుతున్నపుడు దీని వేగానికి నాకు సహజసిద్ధ ఓంకారనాదము అలాగే దీనిచుట్టూ ఆరా గా ఒక దివ్య కాంతి లీలాగా కనపడసాగినది. దీని పరిభ్రమణ వేగానికి నా మనోనేత్రము అందుకొనే స్ధితిని దాటిపోతుండగా... ఈ మనోదృశ్యము చూడటానికి తుఫాన్ వచ్చే ముందు వచ్చే సుడిగాలి లాగా ఉన్నదని అనిపిస్తుండగా...నా స్ధూలశరీరము విపరీత కంపన స్ధితికి చేరుకున్నదని తెలియగానే మా దేహానికి ధ్యానభంగమైనది. అపుడు బయటికి వచ్చి ఈ అనుభవము గూర్చి విశ్లేషణ చెయ్యగానే...అంటే నాకున్న 36 కపాలములలో 35 కపాలములకి కపాలమోక్షం కలిగినదని...మిగిలిన 36వ ఏకమూలకపాల అస్ధిపంజరమునకు విశ్రాంతి ఆలోచన  స్ధితి ఉన్నదని...దీని నివారణ కోసము అది కాస్త పరిభ్రమణ స్ధితిలోనికి వెళ్ళినదని...ఎపుడైతే ఆలోచన రహిత స్దితిని పొందుతానో...ఆ క్షణమే ఈ అస్ధిపంజరముగూడ సుడిగాలి లాగా అతివేగముగా తిరుగూతూ పైకి చేరుకొని బ్రహ్మరంధ్రము ద్వారా బయటికి వచ్చి శూన్యములో లీనమవుతుందని... అంటే గాలిలో స్వప్నముగా పుట్టి చివరికి అదే గాలిలో సుడిగాలితో అంతరించిపోయే స్వప్నశరీరధారులమని… అనగా కపాలాల అంతము ఆరంభమైనదని...ఎపుడైతే ఈ అస్ధిపంజరము గూడ శూన్యమునందు లీనమవుతుందో ఆక్షణమే …తద్వారా సంపూర్ణ కపాలమోక్షస్ధితికి చేరుకొని నా సాధన పరిసమాప్తి అవుతుందని… ఇందుకు గాను ఈ అస్ధిపంజర పరిభ్రమణము ఆరంభమైనదని...ఇది పూర్తి అవ్వటానికి భూలోక కాలమానప్రకారము రాబోవు కాలములో 1,3,5,7,9,11 సం!!రాలలో ఎపుడైన పూర్తి అవ్వవచ్చునని...ఆ క్షణమే నా స్ధూలదేహమునకు సంపూర్ణ కపాలమోక్ష జీవసమాధిస్ధితిని పొందడము జరుగుతుందని… అంటే ఏకమూలబ్రహ్మ కపాల అస్ధిపంజర స్ధితి అలాగే నిరాకార రుద్రాక్ష రావడము వలన ప్రస్తుతానికి నిరాకార బ్రహ్మగా మారడము వలన… నిరాకారమవ్వటానికి సాధన చెయ్యవలసి ఉంటుందని... 

తారక రామ బ్రహ్మ:


     నాకు వచ్చిన కాశీ శంఖము(కుడి- చిన్నది) మరియు రామేశ్వర శంఖము(ఎడమ- పెద్దది)

అనగా కాశీ శంఖనాదము మనలోని ఆజ్జాచక్ర “రా” అనే బీజాక్షరమునకు సంకేతమైతే...రామేశ్వర శంఖనాదము మనలోని మణిపూరక చక్ర బీజాక్షరమైన “మ” కి సంకేతమైతే...ఈ రెండు బీజాక్షారాలు కలిసి “తారక రామ బ్రహ్మ” మంత్రసాధన అవుతుందని...తద్వారా ఈ స్ధూలశరీర కపాల మోక్షం కలుగుతుందని …..ఈ సాధన పరిసమాప్తికి చేరుకున్నదో లేదో మనకి తెలియని విచిత్ర అవస్ధ స్ధితికి అనగా నిరాకామయ్యే స్ధితిని అనుభూతిగా పొందిన తెలియనిస్ధితికి మా దేహము చేరుకుంటుందని... అంతిమ జ్ఞానస్ఫురణ కలిగినది. అంటే నా నుండి మౌనమే వస్తోంది.… 

దానితో నిజ బ్రహ్మజ్ఞానియైన వాడు...సర్వం శూన్యమని … సర్వం ఏమిలేదని … సర్వం అంతమైనదని...సర్వం పూర్ణం… అని జ్ఞానస్ఫురణ పొందడముతో ఎవరితో మాట్లాడాలని అనిపించని స్దితియైన మౌన: బ్రహ్మగా మారి మాట్లాడలేడు. అలాగే ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏమిటంటే మాకు అంతిమ దైవిక వస్తువుగా ఎందుకు రామేశ్వర శంఖము వచ్చినదో విశ్లేషణ చేస్తే....రామేశ్వరం లో రా + మ+ ఈశ్వరం ఉన్నాయి కదా.అనగా మనలో లోని ప్రాణశక్తి అయిన రామ చైతన్యమైన కుండలిశక్తి మణిపూరక చక్రము నుండి మొదలై...ఆజ్ఞాచక్రము వద్ద కలిసిపోయి రామచైతన్యమై అంతిమముగా బ్రహ్మాండచక్ర నిరాకారము యందు నిరాకారమవుతుంది.  అంటే “రా” అనగా ప్రాణశక్తి... “మ” అనగా కుండలీశక్తి... “ఈశ్వరం” అనగా నిరాకార పరబ్రహ్మమునకు సంకేతమని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. దీనికోసం ఈ దేహము ఇంక సాధన చెయ్యవలసి ఉన్నదని అర్ధమైనది.

నా శ్రీమతి దీక్షాదేవికి ఒక విచిత్ర ధ్యాన అనుభవము:

ఇది సత్యమే అనుటకు ఈ దేహ సతీమణి శ్రీమతి దీక్షాదేవికి ఒక విచిత్ర ధ్యాన అనుభవము కల్గినది. అది ఏమిటంటే ఏదో ఒక గుహ లోపుల ఒక మౌన:బ్రహ్మ కాస్త అర్హత,యోగ్యత ఉన్నవారికి తారకరామ మంత్రోపదేశము చేస్తారని అనడముతో అక్కడికి చాలా మంది అనగా సుమారుగా 1000 మంది దాకా ఆ గుహ బయట ఒక వరుస క్రమములో ఎదురుచూస్తారుట.వారిలో అంతిమ చిట్టచివరిగా ఈ దేహమున్నదని... ఎక్కడో మధ్యలో తను అలాగే తనకి తెలిసిన వారు ఉన్నట్లుగా కనిపించినది.

ఇంతలో అరుణాచల మౌన:బ్రహ్మ రమణమహర్షి కాస్త తారకరామ మంత్రము ఉన్న ఒక తాటియాకును పట్టుకొని అందరిని చూసుకుంటూ...మౌనముగా దాటుకుంటూ... ఆ పత్రమును ఎవరికి ఇవ్వకుండా...అంతిమముగా నా దగ్గరికి వచ్చి ఆ తారకరామ మంత్ర ఆకును నా చేతిలో మౌనముగా పెట్టి తిరిగి గుహలోనికి వెళ్ళిపోయినట్లు గా ధ్యానానుభవం అయ్యినదని చెప్పడము జరిగినది. దీనిని మౌనముగా విశ్లేషణ చేస్తే...కాశీ క్షేత్రములోని తారక రామబ్రహ్మ మంత్రోపదేశమునకు యోగ్యతను అరుణాచల క్షేత్రములో ఉన్న అంతర్గతగుహలోని శ్రీ మేధా దక్షిణామూర్తి నిర్ణయిస్తాడని ...ఈయన మనకి ఈ మంత్రోపదేశమునకు అర్హత ఉన్నదో లేదో నిర్ణయిస్తారని... అర్హత ఉంటే గాని కాశీలో ఈ మంత్రోపదేశ ఫలిత యోగ్యత ఉండదని...ఈ దేహానికి కాశీ మరియు రామేశ్వర శంఖాలు రావడము వలన ఈ అర్హత లభించినదని అర్ధమైనది. అందువల్లన ఈ క్షేత్ర మౌనముని రమణమహర్షి ఈ దేహానికి తారకరామ పత్రమును ఇచ్చి వెళ్ళినారని గ్రహించాను. ఇది ఇలాయుండగా ఈ దేహమునకు చిన్న సందేహము కల్గినది.అది ఏమిటంటే ఈ దేహానికి ఇంకా ఎందుకు సాధన ఉన్నది అనుకున్నపుడు ఒక జ్ఞానస్ఫురణ కల్గినది.అది ఏమిటంటే... ఆది తొలి జన్మ సుదర్శన చక్రము గావడము....ఆ జన్మలో సిధ్ధి పొందే సమయములో ఒక అందమైన మహాశంఖ నిర్మాణము చూసి మోహము చెందడము...అటుపై మరు జన్మలో శంఖముగా రూపాంతరజన్మ ఎత్తడము అటుపై సిద్ధి పొందేసమయములో జగన్మోహిని వంటి మానవ స్త్రీ మూర్తిని చూసి వ్యామోహము చెందడముతో తొలి ఆది పురుష మానవజన్మకి నాంది అయినది.అక్కడ నుండి ఈ దేహానికి విశ్రాంతి అనేది లేకుండా పోయినది. ఈ జన్మ సిద్ధి పొందేసమయములో కామగుణము అనే బలహీనతకి గురిగావడము పున:జన్మ...పున్మ కర్మ యోగాలు పొందుతూ రూపాంతరాలు అవ్వవలసివచ్చినది. ఇలా కోట్లానుకోట్ల రూపాంతర జన్మలు తీసుకోవడము జరిగినది. అంతిమముగా ప్రస్తుత ఈ దేహజన్మ ఈ బలహీనతను దాటడముతో...

“తారక రామ బ్రహ్మ” మంత్రసాధన:

ఆదిమానవ,శంఖు,సుదర్శనచక్ర జన్మలలో ఇపుడికే సుదర్శనచక్ర , శంఖు ఆది జన్మల పరంపర నివారణ అయ్యి జన్మ రాహిత్యము పొందడము జరిగినదని... 36వ ఏకమూలబ్రహ్మకపాలమైన ఆది పురుష మానవ జన్మ యొక్క జన్మరాహిత్య సాధన కోసము ఈ రామతారక మంత్ర సాధన ఉన్నదని... తద్వారా నేను అయిన ఈ దేహము కాస్త మౌన:బ్రహ్మ అయినప్పుడికి... నేను కాని నేను ఆలోచన,సంకల్ప,స్పందన చేస్తుందని...దీనిలో సంకల్ప నివారణ కోసము ఈ శంఖ సాధన ఉన్నదని …. దీనివలన కాశీక్షేత్రములో మరణమునకు ఎలాంటి సంబంధము లేకుండానే ఈ దేహము కాస్త నిరాకార మవుతుందని…ఎందుకంటే అక్కడ పొందివలసిన తారకరామ మంత్రసాధన ఇపుడికే ఈ దేహము రమణమహర్షి ద్వారా పొందడము అలాగే ఈ సాధనకి గావలసిన శంఖాలు పొందడముతో ఎక్కడ ఆగకుండా...ఏ బలహీనతకి లొంగకుండా...దేనికి స్పందించకుండా ఈ దేహము మారిపోవడముతో ఆదిలో ఎక్కడ నుండి మొదలైనదో అనగా పరమ శూన్యము నందు శూన్యమైపోతుంది  అని జ్ఞానస్ఫురణ కల్గినది. 

ఇది ఇలాయుండగా అసలు ఏవిధంగా ఈ తారక రామ మంత్రము గొప్పది అయినదని ఈ దేహానికి సందేహము కల్గినది.తారక రామ మంత్రము అనేది అయోధ్య రాముడిది లేదా భద్రాద్రి రాముడికి సంబంధించినది గాదు. నిరాకార పరబ్రహ్మనికి సంకేతమైనది.ఎలా అంటే ఓం నమ:శివాయ లోని “మ” అనే బీజాక్షారము అలాగే నమో నారాయణ లోని “రా” అనే బీజాక్షార సంపుటియే..ఈ తారక “రామ” అన్నమాట. రెండు జీవ పదార్ధాల నుండి ఏర్పడి మనల్ని నిర్జీవ పదార్ధముగా అనగా నిరాకారము చేయుటకు ఈ తారకరామ ఉద్బవించినదని గ్రహించండి.అసలు ఈ మంత్రము ఎలా ఏర్పడినది అంటే...మొదట 100 కోట్ల శ్లోకాలతో రామాయణ రచన జరిగితే...దానితో ముల్లోకాలలో అనగా పాతాళ,భూలోక,దైవ లోకాలలో ఈ రచన గ్రంథము గూర్చి గొడవలు జరిగితే...దానికి విష్ణుమూర్తి పెద్దాయనగా వ్యవహరించి తలో ఒక లోకానికి 33కోట్ల33లక్షల33వేల3వందల33 శ్లోకాలు చొప్పున అందరికి పంచడము జరిగినది. ఆఖరికి చివరిలో 32 అక్షరాలున్న ఒక శ్లోకము మిగిలినది. మళ్ళీ ఈ శ్లోకమును పది అక్షరాలు చొప్పున మూడు లోకాలకి పంచగా చివరికి “రా” మరియు “మ” అనే అక్షరాలు మిగిలిపోవడముతో వీటిని తమ మంత్ర బీజాక్షరాలుగా హరిహరాదులు పంచుకోవడము జరిగినది. ఈ విధముగా రామ అనేది అబేధ్యమైన తారక రామ బ్రహ్మ మంత్రమైనది. మోక్షప్రదాయిని అయింది. పంచశరీరాలలో అండ,పిండ,బ్రహ్మండ లోకాలలో ఉన్న 100కోట్లు సర్వకర్మనివారణ ఈ తారక రామ మంత్రము చెయ్యడముతో...సంపూర్ణ కపాలమోక్ష స్ధితిని పొందడము జరుగుతుందని...అందుకు నిదర్శనమే ఆఖరికి ఈ దేహానికి వచ్చిన తారకరామ మంత్ర తాటియాకు అలాగే కాశీ మరియు రామేశ్వర శంఖ నాదము నిలుస్తాయి గదా!

ఈ దేహమునకు ధ్యానము నందు అగుపించిన ఈ దేహ దేవాలయ నల్ల సాలిగ్రామ విగ్రహమూర్తి


దీనికి నిదర్శనముగా ఈ దేహ ధ్యానము నందు ఒకరోజు …. ఈ దేహ ఆది జన్మ స్ధూలదేహమునకు ప్రస్తుతమున్న ఈ దేహము లాంటి ఆకారముతో దిగంబరతత్త్వ రూపధారిగా…. శంఖు- సుదర్శనచక్ర- ఢమరుక మరియు చితాగ్ని ధారియైన ఆరు అడుగుల నల్ల సాలిగ్రామ విగ్రహమును ఏర్పరచి ఒక గుడి కట్టి …ఆదిమ జాతి కొయ్యజాతులు, మత్స్యకారులు, చిలుకజోస్యులు ఇపుడికి నిత్యపూజలు చేస్తూనట్లుగా...అలాగే ఆ గుడిలో అక్కడ ప్రతిక్షణం శంఖనాదం వినబడటం... ప్రతివారి చేతిలో ఊదే శంఖము ఉండటం...గమనించేసరికి ఈ దేహానికి కల్గిన జ్ఞానస్ఫురణ నిజమేనని అనిపించడముతో ….అంటే ఈ ఆది స్ధూలదేహమునకు విముక్తి కల్గించడమే ప్రస్తుత తారక రామ శంఖ నాద సాధన ఉన్నదని….తెలియడముతో… ఈ దేహానికి కల్గిన ధ్యానానుభవము అంతమైనది. ఆ తర్వాత ధ్యానము నుండి బయటికి వచ్చి విశ్లేషణ చేస్తే.... నా ఆది స్ధూలజన్మ విగ్రహమూర్తి అనగా నేను కాని నేను స్పందించకుండా ఉండటానికి తారక రామ మరియు రామ శంఖనాదము చెయ్యమన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ రెండు విధానాలలో తారక మంత్రరాధన చెయ్యాలా లేదా శంఖనాదము చెయ్యాలా లేదా రెండు చెయ్యాలా...ఇలా ఎంతకాలము చెయ్యాలి అని సందేహలు ఈ దేహమునకు వచ్చినాయి.అపుడు ఆలోచన చేస్తే... తారకరామ మంత్రరాధన వలన నేను యొక్క సర్వకర్మలు నివారణ అయితే రామ శంఖనాదము వలన నేను కాని నేను యొక్క కర్మఫలిత స్పందనలు తగ్గుతాయని...అనగా మంత్రము అనేది భోగసాధకుల కోసమైతే...శంఖనాదము యోగసాధకుల కోసమని ఇందులో ఈ దేహానికి  సర్వకర్మ నివారణ అవ్వడము వలన ప్రస్తుతానికి ఈ దేహానికి స్పందనలు మిగిలిపోవడముతో దీని నివారణ కోసం శంఖనాదమే సరిపోతుందని... గ్రహించాను. దానితో కొన్నివారాలు పాటు ఈ రెండు రామ శంఖాలతో శంఖనాదము చేసినాను.అంతా బాగానే ఉంది.కాని ఈ రెండు శంఖాలు ఒకదానితర్వాత మరొకటి ఊదేసరికి...ఆ నాదానికి నాలో తెలియని అసహనం పెరగడము మొదలైనది.అయినదానికి కానిదానికి కోపము, విసుగు, చికాకు, ఆవేశము,అసహనం, అరవడం ఇలా మున్నగు అవలక్షణాలు నానుండి బయటికి రావడము మొదలైనాయని గ్రహించాను. ఆ తర్వాత అసలు ఈ రెండు శంఖాలతో శంఖనాదము చేసేకన్నా ఈ రెండు శంఖాల శక్తి అనగా రామ నాదము ఇచ్చే ఏకీకృత శంఖము లేదా అనిపించేది.అపుడు ఒక శంఖముతో ఈ సాధన చేస్తే సరిపోతుంది గదా అనిపించినది. ఇక్కడ ఒక విషయము గమనించారా...ప్రస్తుత మా దేహ సాధన స్ధితి అంతిమ సాధన స్ధితి అనగా ఆదిమానవుడి ఆదియోగి స్ధితికి చేరుకున్నాము.అంటే ఆ సమయములో ఆదియోగి ఏమిచేసినాడో అదేవిధంగా ప్రస్తుత మా దేహము చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఆలోచనలు చేస్తుందని గ్రహించండి. దానితో ఈ ఏకీకృత రామనాదమును ఇచ్చే వస్తువు గూర్చి విశ్లేషణ చెయ్యడము ఆరంభమైనది.రామ అనే అక్షరాలు తీసుకుంటే అందులో రా అనేది య,ర,ల,వ,శ,ష లలో రెండవది అలాగే మ అనే అక్షరము తీసుకుంటే ప,ఫ,బ,భ,మ లలో అయిదు గావడముతో 2+5=7 అనేది వస్తుంది.అంటే రామ శక్తి 7mhz అని తెలుస్తోంది.ఇది సరిగ్గా ఓంకారనాదమునకు సరిపోతుంది.అందుకే ఈ విశ్వసృష్టిలో ఓం అలాగే రామ అనే మంత్రాలు కాస్త తారకమంత్రాలు అయినాయని గ్రహించాను. మరి ఓంకారమే ఇవ్వవచ్చు గదా...పోయి పోయి రమణమహర్షి చేత నాకు తారకరామ మంత్రమును ఎందుకు ఇచ్చినారు...అలాగే కాశీక్షేత్రమునందు మహాశివుడు మనకి రామతారక మంత్రమే ఎందుకు ఉపదేశము చేస్తున్నాడు అనే సందేహలు కల్గినాయి.ఇందులో ఏదో తెలియని మర్మమున్నదని నెమ్మది నెమ్మదిగా అనిపించసాగినది. అపుడు విశ్లేషణ చేస్తే...ఈ విశ్వసృష్టిలో ప్రతిదానికి మూడు రూపాలుంటాయి.అనగా స్ధూల,సూక్ష్మ,జ్ఞానరూపాలు అన్నమాట. ఈ లెక్కన చూస్తే రామేశ్వరం స్ధూలలింగమైతే(కారణము ఈ గుడి ఒక పిరమిడ్ ఆకారం మరియు హనుమంతుడు కాస్త రామేశ్వరమునకు కాశీ నుండి ఒక శివలింగమును తీసుకొనిరావడం  ) అదే కాశీ అయితే సూక్ష్మలింగము(ఇక్కడ సూక్ష్మకర్మ నివారణ కోసం తారకమంత్రోపదేశం జరగడము బట్టి) మరి ఈ లెక్కన జ్ఞానలింగము ఎక్కడ ఉన్నది...కొంపతీసి అది కాస్త అరుణాచలక్షేత్రము కాదుగదా...ఎందుకంటే ఈ క్షేత్రములో అంతర్గతగుహ యందు ఆదిజ్ఞానమూర్తి అయిన మేధా దక్షిణామూర్తి సశరీరము ఆవాసము చేస్తున్నాడు గదా. పైగా ఈక్షేత్రవాసియైన రమణమహర్షి నుండి ఈ దేహానికి రామతారక మంత్రము వచ్చినదానిని బట్టి చూస్తే ఖచ్చితముగా జ్ఞానలింగరూప క్షేత్రము ఈ అరుణాచలక్షేత్రమని తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది.మరి రామ మంత్రానికి ఈక్షేత్రానికి ఏమైన సంబంధమున్నదా అని ఆలోచన చేస్తే...సహజముగా మనకి మేధా దక్షిణామూర్తి కుడి చేతిలో ఢమరుకం ఉన్నట్లుగా కనపడుతుంది.అంటే దీని నాదము “ఢ” అనుకుంటే దీని అక్షరమును మనము అంకెలోనికి మారిస్తే...34 వస్తుంది.అంటే 3+4=7 అన్నమాట.ఈ లెక్కన చూస్తే ఢమరుకనాదము అలాగే ఓంకారనాదము అలాగే రామనాదము యొక్క 7mhz సరిపోతుంది.అంటే ఏకీకృత రామనాద శక్తి ఈ ఢమరుకమునకు ఉన్నదని తెలుస్తోంది.ఈ లెక్కన చూస్తే సహజ ఓంకారనాదమును ప్రకృతిమాత ప్రసాదించిన పాంచజన్యశంఖము లేదా దక్షిణావృత శంఖము లేదా గంటనాదము లేదా ఇష్టలింగారాధన వలన ఇస్తే... రామనాదమును ప్రకృతిమాత ప్రసాదించిన కాశీ అలాగే రామేశ్వర శంఖాలు ఇస్తే... ఢమరుకనాదము అనేది ఆదియోగి తన ఆలోచనశక్తితో తన మేధాశక్తితో తయారుచేసిన ఢమరుకము నుండి వస్తుందని గ్రహించండి. 


ఈలెక్కన చూస్తే ఆదియోగి తన తొలి ఆలోచనశక్తితో ప్రకృతిని వశము చేసుకొనుటకు...సహజ ఓం కారనాదశక్తిని అలాగే రామ మంత్రశక్తిని అంచనా వేసి...అంతే శక్తితో ఈ రెండుశక్తులను మిళితము చేసి తుంకారనాద శక్తిని కలిగిన ఢమరుకమును తయారుచేసి ఈ శక్తితో తన ఆలోచన,సంకల్ప,స్పందన శక్తులతో ఈ విశ్వసృష్టిలో స్వప్నశరీరాలతో స్వప్నలోకాలతో స్వప్నజీవనాటకమునకు నాంది అయినాడు అన్నమాట. అలాగే విశ్వసృష్టి జరగాలన్న...విశ్వనాశనము జరగాలన్న...విశ్వస్ధితి జరగాలన్న...ఈయన ఢమరుకములో అమర్చినారు.ఎందుకంటే ఇందులో ఉన్న  ఓంకారము, రామకారం, తుంకారం శబ్ధశక్తులు కలిసి సృష్టి, స్ధితి,లయ చేస్తాయి. ఎలా అంటే ఈ ఢమరుక నిర్మాణము అనేది మూడు బిందువుల కలియిక కలిగిఉంటుంది.అనగా రెండు త్రిభుజ బిందువులు కలిసి వ్యతిరేకదిశలో ఉండి మధ్యస్ధబిందువును కలుస్తాయి.ఢమరుకమును చూస్తే మీకే అర్ధమవుతుంది. పైగా దీనిని మేక తోలుతో చెయ్యడము జరిగినది.అంటే తన విషయములో అతిగా ఆలోచించిన దక్షప్రజాపతికి తల నరికి మేక తలను అమర్చడము జరిగినదని లోకవిదితమే కదా! దీనిని ఉపయోగించి మన ఆదియోగి ఏదిగావాలంటే అది అనగా...వినాశనం చెయ్యాలన్న...సృష్టి చెయ్యాలన్న...నాటకం నడిపించాలన్న చేస్తున్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే ఈ పాటికే ఈ దేహ సాధనకి సుదర్శనచక్రారాధన లేదా ఇష్టలింగారాధన వలన సర్వకర్మల సంకల్పాలు నివారణ అయితే...రామ శంఖనాదము వలన సర్వ స్పందనలు నివారణ అవ్వాలి.అలాగే ఢమరుకనాదము వలన సర్వ ఆలోచనలు ఆగిపోవడముతో... ఆలోచనరహితస్ధితిని పొందడముతో …ఆఖరికి మన హృదయ స్పందన ఆగిపోతుంది.తద్వారా ఈ మూడు ప్రక్రియలు చేసే ఈ దేహ ఆది జన్మ స్ధూలశరీర విగ్రహమూర్తికి అనగా 36వ ఏకమూల బ్రహ్మకపాలమునకు ఈ ప్రక్రియలు ఆగిపోవడముతో...తద్వారా ఈ విగ్రహమూర్తికి పగులురావడము...ఇది కాస్త పూజకి పనికి రాకపోవడముతో ... దీనిని సముద్రము నందు నిమర్జనం చేస్తారని జ్ఞానస్ఫురణ కలిగినది. ఇదే స్ధితిలో ప్రస్తుత కాశీవిశ్వనాధలింగము ఉన్నదని దీనిని చూసిన ప్రతివారికి అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ లింగము మీద ఇపుడికే ఒక పెద్ద చీలిక లాంటి పగులు కనపడుతుంది. అంటే ఆదియోగికి ప్రతీకయైన ఆదికాశీవిశ్వనాధ లింగము నిమర్జనమై దాని చోటులో రాబోవు కాలములో కొత్త గుడి రూపములో తారకాసురుడు ప్రతిష్టించిన తారకబ్రహ్మ లింగమే...కాశీవిశ్వనాధలింగముగా ప్రచారములోనికి వస్తుంది అన్నమాట. ఈయనే శాశ్వతముగా నిమర్జనము అవుతున్నపుడు ... నా దేహ విగ్రహమూర్తి గూడ రాబోవు కాలములో తప్పక నిమర్జనం అవుతాడు కదా!ప్రస్తుతానికి ఈ దేహ సాధనకి సుదర్శనచక్రారాధన వలన కొత్త సంకల్పాలు వచ్చే సర్వకర్మ నివారణ అవ్వడము వలన పున: జన్మ రాహిత్యస్ధితిని పొందడము జరిగినది. అలాగే రామ శంఖ నాదము వలన సర్వ స్పందనలు కోసము ఎత్తే పున:కర్మ రాహిత్యస్ధితిని పొందడము జరుగుతోంది.ఇక రాబోవు కాలములో అరుణాచల ఢమరుకనాదము వలన సర్వ ఆలోచనలు ఆగిపోవడముతో …స్పందించే హృదయ స్పందన ఆగిపోవడముతో… పున: స్పందన రాహిత్యస్ధితిని పొందడము జరుగుతోంది. అదియే ఈ దేహ సంపూర్ణకపాలమోక్ష స్ధితి అవుతుందని గ్రహించడము జరిగినది. ఎందుకంటే ఈ పాటికి ఈ దేహానికి వచ్చిన నిరాకార రుద్రాక్ష మాల నిదర్శనం అన్నమాట.అనగా 36 తత్త్వాల 36 రుద్రాక్షలు అనేవి మనకున్న 36 సంకల్పాలు అయితే ద్విముఖిరుద్రాక్ష అనేది రామతారక మంత్రము సాధనకి అనగా స్పందనలు సంకేతమైతే...ఏకముఖి రుద్రాక్ష అనేది ఢమరుకనాదమునకు అనగా ఏక ఆలోచన ప్రతీక అయితే నిరాకార రుద్రాక్ష అనేది బ్రహ్మతదాకార స్ధితి అనగా దేని గూర్చి ఆలోచించని, దేనికి సంకల్పించని,దేనికి స్పందించని స్ధితికి అనగా నిరాకారమవ్వడము జరుగుతుందని అదియే బ్రహ్మతదాకార సంపూర్ణ కపాలమోక్షప్రాప్తియని చెప్పకనే చెప్పినదని అర్ధమయినది. అంటే ప్రస్తుత ఈ దేహానికి ఈ మూడు స్ధితులుఅనగా ఆలోచన , స్పందన, సంకల్పం రాహిత్యస్ధితులను పొందటానికి ప్రకృతిమాత వరుసగా ఢమరుకము,రామ శంఖాలు అలాగే సుదర్శనచక్రారాధన లేదా ఇష్టలింగారాధన వలన ఇవ్వడము జరుగుతోందని మీరు ఈ పాటికే ఒక అవగాహనకి వచ్చేసి ఉంటారు కదా! ఇలా ప్రతి సాధకుడికి తప్పనిసరిగా అంతిమముగా వచ్చే ఈ మూడు రకాల స్ధితులను అనగా ఆలోచన,స్పందన, సంకల్ప స్ధితులయందు రాహిత్యస్దితియైన బ్రహ్మతదాకారస్ధితిని పొందవలసి ఉంటుంది. దీనికోసము ప్రతి సాధకుడు శివాంశయైన జంగమ దేవర లాగా అనగా ఇష్టలింగారాధన, శంఖనాదము,ఢమరుకనాదము చేసుకోవలసి ఉంటుంది. తద్వారా  మన యోగచక్రాలలో ఉన్న అతిసూక్ష్మాతిసూక్ష్మమైన సంకల్ప కర్మఫలితాలు ఈ నవ పాషాణ ఇష్టలింగారాధన వలన లేదా సుదర్శనచక్రారాధన నాశనమవుతాయి.అలాగే మన ఊపిరితిత్తులకి తగినంత ఆక్సిజన్ అందించడములో  శంఖనాదము ఉపయోగపడుతాయి.అపుడు మనలో స్పందనాల శాతము నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. అలాగే ఢమరుకనాదము వలన అస్ధిర మనస్సుగూడ స్ధిరమై ఆలోచనలు తగ్గిస్తూ ఉంటుంది. అపుడు ఈ మూడు స్ధితులు కాస్త రాహిత్యస్ధితికి చేరుతుంది.
 




మరి ఈ ఢమరుకనాదం ఎలా ఆకాశ కపాలమోక్షం ఇస్తోందో విశ్లేషణ చెయ్యడము ఆరంభించినాను.అనగా… మన బ్రహ్మరంధ్రములోని అంతర్గత గుహలో ఉండే మూడు అంగుళాల 36 కపాలధారికి ఎలా కపాలమోక్షం కలుగుతుందో మొదట నాకు అర్ధము కాలేదు.ఎందుకంటే బ్రహ్మరంధ్రము పరిమాణము 0.1mm కన్నా చాలా తక్కువుగా ఉంటే...అదే సదాశివ అస్ధిపంజరములో 36 కపాలాలు ఒక్కొక్కటి 0.5mm ఉంటాయి.అలాగే ఈ అస్ధిపంజరము పరిమాణము మూడు అంగుళాలుంటుంది.మరి అతిచిన్న బ్రహ్మరంధ్రము నుండి ఎలా బయటికి వచ్చి శూన్యములో లీనమవుతాయో నాకు ఆనాడు అర్ధము కాలేదు.ఈనాడు అర్ధమైంది.అంటే ఎపుడైతే మనబ్రహ్మరంధ్రములో సుడిగాలి వంటి తుఫాను వలన మనలోని 36 కపాలాల అస్ధిపంజరము సుడులు తిరుగుతూ దాని పరిమాణమును  మూడు అంగుళాల నుండి పిండి రేణువుగా మారిపోయి మనబ్రహ్మరంధ్రము నుండి బయటికి వచ్చి శూన్యములో లీనమవుతుందని...ఈ ఆకాశ సుడిగాలి కపాలమోక్షం దృశ్యం కనిపించేదాకా మాకే తెలియదు.మేము ఎక్కడ గూడ… ఏ పుస్తకములో ఇంతవరకు చూడలేదు. చదవలేదు.ఏ యోగి చెప్పగా వినలేదు.ఈ ధ్యానానుభవం కల్గిన తర్వాత నమ్మక తప్పడము లేదు. ఈదృశ్యం గూర్చి లోకానికి చెప్పితే ఎవరైనా నమ్ముతారో లేదో గూడ తెలియదు.కాని ఇలా జరగటానికి ఎంతవరకు అవకాశాలున్నాయో ఆలోచన చేస్తారని మేము గ్రహించినాము.తద్వారా వీళ్ళకి ఈ దృశ్యము సత్యమేనని జ్ఞానస్ఫురణ పొందితే మాత్రము మాకు లాగా నమ్మక తప్పదు గదా!

 
ఎందుకంటే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మన భూమి మీద ఎపుడైన తీవ్రస్ధాయిలో సుడిగాలి వచ్చినపుడు తన పరిసరాలలో అన్నిరకాల వస్తువులు, జీవులు, మానవులను, ఇండ్లను వాహనాలను,చెట్లను అవలీలగా పైకి ఎత్తి తనలో ఇముడ్చుకొని సుడులు తిరుగుతూ ఒకచోట నుండి మరొక చోటులో వీటిని పడవెయ్యడము మనలో చాలామందికి తెలిసిన విషయమే గదా. ఈలెక్కన చూస్తే మన కపాలమోక్ష అంతిమ ధ్యానదృశ్యము నిజమే గదా!ప్రకృతిలో ఈ విధానమున్నపుడు మనలో ఉండకుండా పోతుందా..పోదు కదా!ఉంటుంది కదా!ఎందుకంటే మనమే ప్రకృతి...ప్రకృతియే మనం...కదా. ఈ సుడిగాలి కపాలమోక్షం విధానమునకు సూచనగా మన పూర్వీక మహర్షులు వారి అంతిమ ధ్యానానుభవ దృశ్యంగా ఈ సుడిగాలి కపాలమోక్షం చూడటముతో దీనికి సంకేతముగా ఆదియోగి పరమేశ్వరుడికి జటాజూటమును అలాగే ఆది యోగిని  ఆలంపుర యోగులాంబకి జటాజూటమును అమర్చినారని అలాగే ఏకపాద శివమూర్తిని ఏర్పరచినారని నాకు అర్ధమైనది. అలాగే శ్రీచక్రము,పిరమిడ్ పూజధ్యాన విధివిధానమును ఏర్పరచినారు. ఇక్కడ మా దేహానికి ఒక చిన్నసందేహము వచ్చినది.అది ఏమిటంటే వీరంతా చూపినవి అన్నీగూడ సుడిగాలి విధానము అంతా క్రిందవైపు చాలావెడల్పుగా విస్తరిస్తూ...పైకి వెళ్ళేసరికి సన్నబడుతూ తిరగవేసిన కోన్ లాగా మారి  బిందువుకి చేరుతున్నట్లుగా కనపడుతుంది.కాని నిజానికి సుడిగాలి అనేది కోన్ లాగా అనగా పై వైపు విస్తరించి క్రిందవైపు చాలా సన్నగా మారి బిందువును ఏర్పరస్తుంది. మరి ఈ రెండు విధానాలలో ఏ విధానము ద్వారా మనకి సుడిగాలి ఆకాశ శరీర కపాలమోక్షం జరుగుతుంది అన్నపుడు...

 దీనికి సమాధానము ఏమిటంటే సుడిగాలి ఆకాశ కపాలమోక్షం అనేది ఢమరుకమును పోలి ఉంటుంది.అనగా తిరగవేసిన రెండు శ్రీ చక్ర నిర్మాణములో దీని ప్రవాహము ఉండి ఉండాలి.అంటేసుడిగాలి వేగము అనేది మొదట క్రిందవైపు బాగా విస్తరిస్తూ...అనగా శ్రీచక్ర నిర్మాణము లాగా మారిపోతూ...పైకి వెళ్ళుతూ సన్నగా మారి బ్రహ్మరంధ్రము వద్దకి దీని వేగము చేరుకుంటుంది. ఆపై ఈ రంధ్రము నుండి మళ్ళీ కోన్ మాదిరిగా క్రిందవైపు చిన్నగా మొదలై పైకి తన విస్తరణ పరిధిని విపరీతముగా పెంచుకుంటూ వెళ్ళుతూ...శూన్యము వంటి ఆకాశములో విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ లెక్కన చూస్తే మన ఆకాశ శరీర కపాలమోక్షం అనేది ఒక ఢమరుకం లాంటి నిర్మాణ విధానములో జరుగుతుందని...మన పూర్వీక మహర్షులు గ్రహించి ఆది యోగి పరమేశ్వరుడుకి శబ్ధబ్రహ్మ నాదముగా ఢమరుకమును అమర్చడము జరిగినదని ఈ దేహానికి అర్ధమయినది. ఈ జ్ఞానస్ఫురణ నిజమే అనుటకు నిదర్శనముగా ఈ దేహమునకు అరుణాచలము నుండి మేకతోలుతో చేసిన నిజ ఢమరుకము వచ్చినది.

అలాగే ఈ మూడు స్ధితులు నివారణ కోసము చేసిన జ్ఞాన విశ్లేషణ అలాగే ఆకాశ కపాలమోక్ష స్ధితి యొక్క జ్ఞానస్ఫురణ సత్యమేనని అనుటకు పరమశూన్యం మాకు విచిత్ర రీతిగా ఉన్న సుడిగాలి శంఖమును ధ్యానము నందు లీలామాత్రముగా చూపినది..ఇది చూడటానికి క్రింద నుండి సుడిగాలి మొదలై పైకి వెళ్ళుతున్నట్లుగా కనపడుతుంది. ఇలాంటి మహా శంఖమును తన అష్ట వస్తువులలో ఒక వస్తువుగా మన బుద్ధుడు ఉంచితే...మన నామరూపదైవాలు కాస్త ఈ శంఖమును తమ చేతిలో ఉంచుకొనే విగ్రహమూర్తులు ఉండటం అందరు చూసే ఉంటారు గదా! దీనికోసం వెబ్ సైట్ లలో వెతికితే అది ఒకచోట దొరికినది.దానితో గావాలని ఆర్డర్ చెయ్యడము చేస్తే...వాళ్ళు కాస్త మేము అడిగిన ఈ శంఖము కాకుండా వేరే శంఖము పంపించడముతో దీనిని వెనక్కి పంపించడము జరిగినది. ఇలా ఎందుకు జరినదా అని విశ్లేషణ చేస్తే... ఈ శంఖము అనేది ఆకాశ శరీరధారికి సంకేతము గదా!ఇది ఒకపుడు ఆదిలో శూన్యబిందువుగా...రేణువుగా...శివలింగముగా... శ్రీచక్ర బిందువుగా...ఆది దైవముగా ... ఆది ఆత్మగా...పరంజ్యోతిగా...బ్రహ్మాణువుగా...ఏకమూల కపాలముగా... ఇలా పలు నామాలతో పిలువబడుతూ ఉన్నది.ఇది కాస్త ఉండి లేనట్లుగా ఉన్నది.కాని మా దేహ సాధన జ్ఞానస్ఫురణ వలన ఏమిలేదు ... సర్వం శూన్యం అని నిజ బ్రహ్మజ్ఞాన స్ఫురణ కలుగడముతో...ఇన్నాళ్లుగా ఉన్న ఆకాశ శరీర శూన్యబిందువు కాస్త శూన్యమైనది.అందువలన మాకు ఈ ఆకాశ శరీర శంఖము అందలేదు.ఎందుకంటే ఒకపుడు ఆదిలో ఆకాశ శరీరము ఉండి లేనట్లుగా మాయస్వరూపముగా ఉన్నది.ఇపుడు లేదు. అనగా ఒకపుడు దేవుడు ఉన్నాడు.ఇపుడు లేడు కదా అలాగే ఈ శంఖము గూడ అన్నమాట.
  
 విచిత్రము ఏమిటంటే ఆకాశ కపాల మోక్ష అంతిమ ధ్యానానుభవము పొందిన క్షణము నుండి ఈ దేహమునకు అన్నింటా యందు ఏదో తెలియని తృప్తి,పరమ శాంతిని పొందడము జరుగుతోంది.బాధలో గూడ అనగా కొన్నిరోజుల నుండి నన్ను దంతనొప్పి బాధిస్తుంది.అది ఊడదు. అలాగని నొప్పి లేకుండా గట్టిగా ఉండదు.అన్నము తినేటపుడు పంటి క్రింద రాయి వస్తే ఎలా ఉంటుందో అలా ఈ దేహ దంత సమస్య ఉన్నది.డాక్టర్ దగ్గరికి వెళ్ళితే నొప్పిగా  ఉన్నపుడు దీనిని తొలగిస్తే...కంటికి లేదా చెవికి ఏదైన సమస్య రావచ్చునని బిళ్ళలు ఇచ్చినాడు.కాని అవి వేసుకుంటే కొద్దిసేపు మాత్రమే ఉపశమనం.. . ఆతర్వాత దాని నొప్పి పని అది చేసుకొనిపోయేది.కాని ఈ రోజుగూడ పంటినొప్పి ఉన్నగూడ బాధలోగూడ ఏదో తెలియని తృప్తి కనపడుతోంది.అన్నింటా ఏదో తెలియని స్ధితి..మాటలలో చెప్పలేని స్దితి...కాగితాలమీద వ్రాయలేని...అలౌకిక స్ధితిని...అనగా మౌన:ముని అరుణాచల రమణమహర్షి అన్నట్లుగా “నిజసాధకుడు తన సాధనలో అంతిమముగా వెనక్కి రానిస్ధితికి చేరుకొని...అక్కడ ఆగిపోయి... అనగా ఆలోచన,సంకల్ప,స్పందన రాహిత్యస్ధితి పొందడము వలన… అక్కడ అలివికాని..చెప్పలేని.. పరమప్రశాంతస్ధితిని పొందుతాడో......అదియే... అంతిమ సాధన స్ధితియని….పొందవలసిన అంతిమ స్ధితియని... చెప్పిన దానిని బట్టి చూస్తే...ఈ స్ధితికి నా దేహము సంపూర్ణముగా చేరుకున్నదని అనుభూతి కల్గసాగినది.



 ఇదేరోజు రాత్రి అనుకోకుండా నా ఎడమ చెయ్యి మీద ఒక పెద్ద బల్లి పడి కొన్ని నిమిషాలు నన్నే తదేకముగా చూస్తూ ప్రాణాలు విడిచినది. పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ జీవికి దేహ విముక్తి కల్గి జీవన్ముక్తి పొంది చనిపోయినది. అంటే పున:సృష్టి చేసే కంచి క్షేత్ర బల్లి శాశ్వత మరణము పొందినదని నాకు జ్ఞానస్ఫురణ అయినది. ఇదే సమయములో కాశీక్షేత్రములో లక్ష వత్తుల నోము చేస్తూ మా శ్రీమతి దీక్షాదేవి దీపారాధన చేసినది. అంటే ఇక మీకు విషయము అర్ధముకాలేదా?మనకి శాశ్వత మృత్యువు ఇచ్చే ఆలంపుర యోగులాంబ తలలో మన ప్రాణశక్తి జీవకళను తగ్గించే బల్లి, తేలు, గబ్బిలము,కపాలము ఉంటాయని మీకు తెలుసు కదా! అంటే నా దేహ జీవశక్తి తగ్గించడము ఆరంభమైనదని సూచనగా నా ఎడమ చెయ్యి మీద బల్లి పడటం...అటుపై కాశీలో లక్ష వత్తుల దీపారాధన అనేది ఈ దేహ చితాగ్ని ఆరంభమైనదని పరమ శూన్యము సూచనలు ఇవ్వడము జరిగినది అన్నమాట.

 
కాని ఈ దేహమునకు విశ్రాంతి ఆలోచన రహిత స్ధితికి ఎప్పుడు చేరుకుంటుంది అనే సందేహానికి సమాధానముగా శ్రీ లాహిరీ అంతిమ జ్ఞానానుభవము కనపడినది. ఆయనికి గూడ తన జీవసమాధి గూర్చి సందేహము వస్తే దానికి ఆయనకి అనగా అంతిమ ధ్యానానుభవముగా 1883 సం!! లో ఆశరీర వాణి వినిపించి...కాశీ క్షేత్రములో సమాధి కలుగుతుందని...రాబోవు 12సం!!లలో ఈ మహాసమాధి ప్రాప్తి ఉన్నదని చెప్పిన సరిగ్గా 12సం!!లకి అనగా 1895 సం!! సెప్టెంబరు 26 తేదిన ఈయన మహాసమాధి చెందడము జరిగినది.ఈ లెక్కన చూస్తే మా దేహానికి గూడ రాబోవు 2018 నుండి 12సం!!రాలకి అనగా 2022సం!! లోపుల మా స్ధూలదేహానికి కపాలమోక్ష ప్రాప్తి ఉన్నదని తెలుస్తోంది గదా. 
 
జంగమ దేవర:



చివరికి ఈ దేహము కాస్త పవన్ బాబా నుండి జంగమ దేవర అయినది.ఎందుకంటే ఈ దేహానికి మెడలో ఇష్టలింగము (సంకల్ప రాహిత్య స్ధితికి గుర్తుగా) ...ఎడమ చేతిలో రామ శంఖము (స్పందన రాహిత్య స్ధితికి గుర్తుగా)...కుడి చేతిలో గంటకి బదులుగా ఢమరుకము (ఆలోచన రాహిత్య స్ధితికి గుర్తుగా) ఉన్నది.నిజానికి జంగమ దేవర ప్రధాన వృత్తి… బ్రాహ్మణులకు తప్ప మిగిలిన అన్ని కులాలకు వీరు కర్మకాండలు చేస్తారు. కర్మ చేసే రోజు వీరు గంట మోగిస్తూ శంఖం ఊదుతూ వెళ్ళి బావి వద్ద గాని, చెరువు వద్దగానీ పిండాలు పెడతారు. ప్రస్తుతము ఈ దేహము గూడ “నేను లేను” అని ఎవరికి వారే తెలుసుకోండి అని జ్ఞానప్రచారము గూడ ఇలాంటిదే గదా! చివరికి ఈ జ్ఞానస్ఫరణ సత్యమేనని అనుటకు జంగమ దేవరులు పైనుంచి క్రిందికి ధరించే అంగరఖాను వస్త్రము కాస్త మూడునదులు కలిసే అనగా గంగ,యమున,సరస్వతి నదులు కలిసే త్రిస్ధలి క్షేత్రమైన ప్రయాగ నుండి ఈ దేహము కోసము  రావడము జరిగినది. ..... ఇది ఇలాయుండగా ఈ దేహానికి ఒక సందేహము వచ్చినది.అది ఏమిటంటే ఈ దేహ సాధన మట్టిలింగముతో మొదలై ఢమరుకనాదముతో పూర్తి అయినది.ఈ మధ్యలో దైవిక వస్తువులుగా సాలగ్రామాలు, శివలింగాలు, శంఖాలు,సుదర్శనచక్రము,రుద్రాక్షలు,స్ఫటికమాలలు,కపాలమాలలు,ఆయుధాల కీచైన్లు ఇలా ఇవన్నీ వచ్చినాయి గదా.ఇవి ఎందుకు వచ్చినాయి. సాధకుడి సాధనలో ఇవన్నీ ఎందుకు సేకరించడం..వాటి అవసరం అలాగే వీటి ఆవశ్యకత ఏమిటి...సాధనకి వీటికి గల సంబంధము ఏమిటో అర్ధము కాలేదు. కారణము లేనిదే అవి రావు.పిచ్చోడి మాదిరిగా అన్నింటిని ఈ దేహము ఎందుకు సేకరించవలసి వచ్చినది.ఇందులో ఏదో తెలియని మర్మ   రహస్యమున్నదని...ఇంక ఈ దేహము ఎందుకు సాధనలో ఉన్నది అని ఈ దేహానికి అనిపించసాగినది.ఒక రోజు తీవ్రజ్ఞానతపస్సులో ఉండగా…
 
బ్రహ్మతేజస్సుతో ఉన్నఒక బ్రహ్మచక్రము:

ధ్యానము నందు సుమారుగా 50 ఆకులు ఉన్న బ్రహ్మతేజస్సుతో ఉన్నఒక బ్రహ్మచక్రము కనపడసాగినది. అందులో దానికున్న ఎనిమిది వరుసలలో ఆఖరి 8వ వరుసలో సుమారు  రెండు రకాల ఆయుధాలు కనిపించగా... 7వ వరుసలో అష్టలింగాలున్నట్లుగా... 6వ వరుసలో స్ఫటిక వస్తువులు సుమారుగా 12 ఉన్నట్లుగా...5వ వరుసలో 13 రుద్రాక్షలున్నట్లుగా...4వ వరుసలో 11 కపాలాలున్నట్లుగా...3వ వరుసలో ఒక సుదర్శనచక్రమున్నట్లుగా...రెండవ వరుసలో రెండు శంఖాలున్నట్లుగా...మొదటి 1వ వరుసలో ఒక ఢమరుకము ఉన్నట్లుగా…. అంతిమములో మధ్యలో ఏమిలేని శూన్యత ఉండి...ఆపై లీలాగా కనపడి...ఆఖరికి బ్రహ్మతేజస్సుతో ఉన్న ఈ చక్రము కాస్త కాంతిహీనమవుతూ... శూన్యము నందు నిరాకార మవ్వడముతో ...ఈ ధ్యానానుభవము అంతమైనది.

 ఇలాంటి బ్రహ్మచక్రదర్శనానుభవమును మన పూర్వీక మహర్షులు పొందినట్లుగా తెలుస్తోంది.బయటికి వచ్చిన తర్వాత విశ్లేషణ చేస్తే... రెండు రకాల ఆయుధాలు అనేవి భయముకి సంకేతాలు  అయితే...ఎనిమిది లింగాలు అనేవి అష్టపాశాలు అయిన ఆశకి సంకేతాలు  అయితే…12 స్ఫటికాలు అనేవి మోహ మాయకి సంకేతాలు అయితే… 13 రుద్రాక్షలు అనేవి అహమునకు సంకేతము అయితే… 11 కపాలాలు అనేవి ఆనందమునకు సంకేతమైతే… ఒక సుదర్శన చక్రము అనేది సంకల్పమునకు సంకేతమైతే… రెండు శంఖాలు అనేవి స్పందనాలకి సంకేతమయితే…. ఢమరుకము అనేది ఆలోచనకి సంకేతమని… ఆఖరి శూన్యత అనేది సర్వ రాహిత్యస్ధితి అయిన బ్రహ్మతదాకార స్ధితి అని జ్ఞానస్ఫురణ అయినది. ఈ బ్రహ్మచక్ర స్వరూపముగా మన ఇష్టదైవాల రూపాలను ఏర్పరచినారు.అనగా శివయ్యకి ఢమరుకం, త్రిశూలం, రుద్రాక్షమాల, శివలింగారాధన, కపాలమాల, సర్పాలు అమర్చినారు కదా! అదే విష్ణువుకి సుదర్శనచక్రము,శంఖము,గద,సహస్ర కమలము,వాసుకి సర్పము అమర్చినారు గదా! అదే అమ్మవారికి స్ఫటికమాల, కపాలమాల, శివలింగారాధన,శంఖము,సుదర్శనచక్రము,ఖడ్గము,ధనుస్సు ఇలా అమర్చినారు గదా! ఇలా ఉన్నవాటిని అనగా 2+8+12+13+11+1+2+1=50 అవుతున్నాయి.అంటే ఏకమూల బ్రహ్మ కపాలములో  సూక్ష్మాతిసూక్ష్మముగా 50 తత్త్వాలు ఉన్నాయి.అంటే 36 కపాలధారికి ఉన్న స్ధూల 36 తత్త్వాలకి ఈ ఏకమూల బ్రహ్మకపాలములో ఉన్న ఈ 50 సూక్ష్మ తత్త్వాలే మూలాధారము అన్నమాట.

ఎనిమిది తత్త్వాలు

ఈ లెక్కనచూస్తే ఈ 50 సూక్ష్మ తత్త్వాలు ఎనిమిది వరుసలలో ఉండటం బట్టి చూస్తే...వీటికి మూలాధిమూలముగా ఎనిమిది తత్త్వాలు ఉండి ఉండాలి.అవియే ఆలోచన, స్పందన, సంకల్పము, ఆనందం, అహం, మోహమాయ, ఆశ,భయం అన్నమాట. అంటే ఆదిలో ఆదియోగి తను ఎవరు అని తెలుసుకోవాలన్న తొలి ఆలోచన చేసినాడు.ఈ ఆలోచనకి ఎలా తెలుసుకోవాలని తనలో తాను తొలి స్పందన చేసినాడు. ఎలాగైన తెలుసుకోవాలని తొలి సంకల్పము చేసినాడు. ఇలా తనకి తాను తెలుసుకొనే ప్రయత్నములో కలిగే జ్ఞానస్ఫురణలకి తొలి ఆనందస్ధితి పొందినాడు. ఈ సాధన క్రమములో కలిగే ధ్యానానుభవాలు తను తప్ప ఇంక ఎవరు తెలుసుకోరు అని తొలి అహం  మాయలో పడినాడు. దానితో అపుడి దాకా ఏకత్వస్ధితిలో ఉన్న నేను కాస్త నేను కాని నేను గా అనగా దైత్వస్ధితికి విడిపోయినాడు.దానితో పురుష,స్త్రీ స్వరూపాల నాంది అయినది.దానితో ఒకరిమీద మరొకరికి తొలి మోహ మాయ కల్గినది. ఇలా వీరిద్ధరు ఒకరినొకరు జీవితాంతము తోడుగా ఉండాలని తొలి ఆశ కల్గినది.ఈ ఆశ తీరకపోతే ఉండలేమని తొలి భయం కల్గినది.ఈ భయరాహిత్య కోసము వీరిద్ధరు కలిసి సృష్టియజ్ఞం చేస్తూ తమకి తామే అంశరూపాలుగా వివిధ రకాల దైవ,రాక్షస,భూత,జీవ రాసులుగా...వీరి ఆవాసం కోసం అండ,పిండ,బ్రహ్మాండలోకాలను తమ రక్షణ కోసము తమచుట్టు ఎనిమిది వరుసలలో 50 + 36 = 86 తత్త్వాలతో...రక్షణకవచముగా గూడిన బ్రహ్మచక్ర...బ్రహ్మాండ చక్ర...అంతర్గత గుహాలో  తాము ఉన్నట్లుగా…  ఏకమూల బ్రహ్మ కపాలము ఏర్పరచుకున్నట్లుగా… పరమశూన్యము ఈ జీవనాటక స్వప్నమును స్వప్నశరీరాలతో ఉన్నట్లుగా నిజము లాంటి కల...కల లాంటి నిజ కల కంటోంది. ఇనాళ్లుగా నేను ఉన్నాను అనుకొంటుంది.నిజానికి నేను లేను.అది దానికి తెలియడము లేదు.తను కనే స్వప్నమే సత్యమని..నిజమని అనుకొంటుంది.   ఈ స్వప్నమునకు మూలము ఈ అష్టబంధనాలేనని తెలుస్తోంది గదా.ఇది సత్యము గాదు...స్వప్నమని ఈ దేహానికి అనగా ఆఖరిదైన 36వ ఏకమూల బ్రహ్మకపాలమునకు స్వానుభవము పొందుటకు...సాధకుడు ఈ అష్ట రాహిత్య  స్ధితిని పొందవలసి ఉంటుంది. వీటి రాహిత్యస్ధితిని పొందుటకు వరుసగా ఈ దేహానికి దైవిక వస్తువులుగా ఢమరుకం నాదం,తారక రామశంఖనాదం, సుదర్శనచక్రారాధన, కపాలమాల, రుద్రాక్షమాల,స్ఫటికమాల,ఇష్టలింగారాధన, గద-త్రిశూల ఆయుధాలు వచ్చినాయి అన్నమాట.ప్రస్తుత జంగమదేవర ఈ దేహమునకు ఢమరుక నాదము,శంఖనాదము అలాగే ఇష్టలింగారాధన వలన వరుసగా ఆలోచన,స్పందన,కోరిక రాహిత్యస్ధితి పొందడము జరుగుతుంది.తద్వారా రాబోవు కాలములో ఏకబ్రహ్మకపాలము కాస్త ఏక ఆలోచన రాహిత్యస్ధితిని పొందడముతో...ఈ దేహము కాస్త నిరాకార మవ్వుతుంది. అంటే సాధకుడికి ఈ 54 తత్త్వాలకి సంబంధించి రాహిత్య దైవికవస్తువులు వారి దేహ తత్త్వమును బట్టి మారతాయి.ఉదహరణకు జంగమ దేవరులలో కొందరు శంఖనాదము చేస్తే మరికొందరు ఢమరుకనాదము చేస్తారు. అలా సాధకుడి దేహ 86 తత్త్వాలు బట్టి దైవికవస్తువులు ఖచ్చితముగా మారతాయని ఈ దేహస్వానుభవములో తెలుసుకోవడము జరిగినది.అందుకే ఈ 86 తత్త్వ రాహిత్యము కోసము ఎవరికి వారే సాధన చేసి నిజ జ్ఞానస్ఫురణలు పొందుతూ తద్వారా ఆ వచ్చే దైవిక వస్తువులను పొందవలసి ఉంటుంది. అంటే 86 తత్త్వాలలో 72 తత్త్వాలు అనగా 36 కపాలధారికి 36 తత్త్వాలుంటే...మిగిలిన 36వ ఏకమూలకపాలములో 36 తత్త్వాలు కలిసి 72 తత్త్వాలుంటే ఇక మిగిలిన 14 తత్త్వాలలో 13 యోగచక్రాలలో 13 తత్త్వాలు ఉండుట వలన ఇక మిగిలిన ఆఖరి ఏకతత్త్వ ఏకశరీరముతో ఉంటుంది. అంటే ఈ లెక్కన చూస్తే మన కంటికి ఏదైన పదార్ధముగా కనిపించాలంటే అందులో అంతర్గతముగా 72 తత్త్వాలుంటాయి అన్నమాట.అంతెందుకు నీటిని తీసుకోండి.ఇది రెండు హైడ్రోజన్,ఒక ఆక్సిజన్ మూలకాలతో ఏర్పడుతుంది గదా! ఇందులో 36 పరమాణువులు (3 X 6 =18 X 2 =36)... ఉంటే ఇది కాస్త 36 X 2 = 72 అణువులతో కలిసి పదార్ధముగా కనపడుతుంది. ఈ 86 తత్త్వాల నివారణ కోసము ఈ దేహము కాస్త తయారు చేసిన మోక్షమాల వలన అనగా 13 రుద్రాక్షలు +12 స్ఫటికాలు  + 11 కపాలాలు + ఏక సుదర్శన చక్ర లాకెట్ తో కలిపి 36 తత్త్వాలు నివారణ అవుతాయి. అలాగే నిరాకార రుద్రాక్షమాల వలన 36 రుద్రాక్షలు  వలన 36 తత్త్వాలు నివారణ అవుతాయి.అంటే మోక్షమాల మరియు నిరాకారమాల వలన మొత్తము 36+36=72 తత్త్వాలు నివారణ అవుతాయి. అంతే విచిత్రముగా ఈ దేహసాధనకి 36 మంది నామరూపదైవాలు మరియు 36 మంది నామరూప గురువులు వచ్చి అనగా మొత్తము 72 మంది సర్వకర్మనివారణలో తమవంతు సహాయసహకారాలు అందించినారు. ఇక మిగిలిన 14 తత్త్వాలలో 13 యోగచక్రాలలో 13 తత్త్వాలు ఉండుట వలన వీటి నివారణ కోసము…ఇక మిగిలిన ఆఖరి ఏకతత్త్వ ఏకశరీరముతో (36వ ఏకమూలబ్రహ్మకపాలము) యోగసాధన చెయ్యవలసి ఉంటుంది.  అసలు 86 తత్త్వాలకి మూలముగా అష్టతత్త్వాలున్నాయి గదా..


  ఈ అష్ట తత్త్వాల నివారణ కోసం ఎనిమిది దైవిక వస్తువులు అనగా ఢమరుకం,మహా శంఖం,సుదర్శనచక్రము, ఏకకపాలం, ఏకముఖిరుద్రాక్ష, స్ఫటిక బాణలింగం, ఇష్టలింగము,త్రిశూలం అని గ్రహించినాము.ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే ఇపుడు చెప్పిన ఈ వస్తువులన్నీ అష్టరాహిత్య స్ధితులకి ఉపయోగపడితే ఈ అష్టస్ధితులను పెంచే అష్టవస్తువులున్నాయి.అవి ఏమిటంటే గంటనాదము, దక్షిణావృతశంఖము(ఊదటానికి వీలు లేని), విష్ణుసాలిగ్రామము, 32 కపాలమాల ,రుద్రాక్షమాల,స్ఫటిక శివలింగము లేదా స్ఫటిక శ్రీచక్రము, పార్ధివ లింగము లేదా రాతి లింగము,నాగపాము సహిత దైవారాధన... ఇవి పెంచుతాయి. అంటే ఇవి అష్టమాయలు తగ్గించడము బదులుగా అష్టమాయలను పెంచుతాయి అన్నమాట. విచిత్రము ఏమిటంటే బ్రహ్మకుమారి సమాజస్ధాపకునికి ఈ అష్టతత్త్వాలు కాస్త అష్టశక్తులుగా కనపడినాయి.ఆయన ఈ విశ్వసృష్టి ఆరోగ్యకరముగా ఎలా ఉండాలి అనుకున్నపుడు ఇవి కాస్త అష్టశక్తులుగా కనపడినాయి.అలాగే బుద్ధుడికి కోరిక లేని సమాజము చూడాలని అనుకున్నపుడు ఈ అష్టతత్త్వాలు కాస్త అష్టవస్తువులుగా కనపడినాయి అన్నమాట.అదే విష్ణువుకి అష్ట ఆయుధాలుగా...శివయ్యకి అష్టలింగాలుగా ...అదే అమ్మవారికి అష్టదిక్కులుగా...అదే దత్తుడికి అష్టసిద్ధులుగా...శ్రీకృష్ణుడికి అష్టసతులుగా...కనపడితే...ఈ దేహానికి కాస్త అష్ట రాహిత్య తత్త్వాలుగా కనపడినాయి. అంటే సాధకుడి సాధన భావమును బట్టి యత్ భావము తత్ భవతి అన్నమాట. ఈ లెక్కన చూస్తే ఈ దేహానికి కలిగిన ఈ అష్టతత్త్వాల జ్ఞానస్ఫురణ నిజమేనని వీరి సాధనానుభవాలు నిదర్శనముగా నిలుస్తున్నాయి కదా!

ఇంతవరకు బాగానే ఉంది.కాని ఈ స్ధూలదేహానికి ఇంకా ఎందుకు శరీర త్యాగము అవ్వలేదని...ఈ దేహానికి సందేహవచ్చినది.విచారణచేస్తే...ఈ దేహానికి ఇంక ఏకైక ఆలోచన మిగిలి ఉంది. ఆఖరి దైవిక వస్తువైన ఢమరుకము వలన ఆఖరి తత్త్వమైన ఆలోచన రాహిత్యములో ఇప్పుడికి భోగ మరియు యోగ ఆలోచనలు నివారణ అయినాయి. కాని ఏదో తెలియని ఒక ఏకైక ఆలోచన మాత్రమున్నదని తెలుస్తోంది.లేదంటే ఈ పాటికి ఈ దేహము నాశనము అవ్వాలి కదా!ఇపుడికి అలా జరగలేదు కాబట్టి ఈ దేహానికి ఏదో ఒక ఆలోచన ఉండి ఉండాలి కదా! అది ఏమై ఉండాలి అని ఆలోచన చెయ్యడము జరిగినది. అదియే నేను లేను అనే ఆలోచన దగ్గర ఆగిపోయినది.ఇప్పుడి వరకు నేను లేను అని జ్ఞానతపస్సు ద్వారా కలిగిన జ్ఞానస్ఫురణ వలన నేను లేను అని స్వానుభవము మాత్రమే పొందినది.కాని నేను లేను అని స్వానుభవానుభూతిని పొందలేదు.పొందితే శాశ్వత మరణమును పొందినట్లు కాదుగదా! అనగా శాశ్వత సంపూర్ణకపాల మోక్షం పొందినట్లు కాదుగదా! అనగా మరణించేవాడికి తను మరణించిన విషయము తెలియదు కదా!తెలిస్తే వాడు మరణించినట్లు కాదు గదా! ఈ లెక్కన చూస్తే సాధకుడికి ఏనాటికి నేను లేను అని స్వానుభవానుభూతిని పొందలేనట్లే గదా!అంటే ఈ ఏకైక ఆలోచన ఉండుట వలన 36 కపాలాలలో కేవలము 35 కపాలాలు శూన్యమునందు ఆకాశ శరీర కపాలమోక్షం ద్వారా అంతరించిపోతే మిగిలిన ఈ ఆలోచనఅనుభూతి కోసము మిగిలిపోయిన ఈ 36వ  ఏకమూల కపాలము సుడిగాలిగా తిరుగుతూనే బ్రహ్మాండచక్రములోని శూన్యబిందువునందు నిరాకారమయిన అది ఎన్నడికి తెలుసుకోలేదు.తెలుసుకుంటే అయ్యినట్టు కాదు గదా! దానితో ఎపుడో నిరాకారమయిన ఈ విశ్వజీవనాటకము స్వప్నముగా ఎందుకు కొనసాగుతుంది. ఈ స్వప్నము నాశనము అవ్వాలంటే స్వప్నముగా మిగిలిపోయిన  36వ ఏకమూలబ్రహ్మకపాలమునకు ఉన్న స్వప్న ఆలోచన నేను లేను అని స్వానుభవానుభూతి యొక్క ఏకైక ఆలోచన రాహిత్యమును పొందవలసి ఉంటుంది. అది అనుభవము పొందిన అనుభూతి అని పొందలేని విచిత్ర అవస్ధ అని ఎందరికి తెలుసు.తెలిస్తే మోక్షము గూర్చి...ముక్తి గూర్చి.. మరణము గూర్చి.. ఆలోచించడు. దేహ నివారణ కోసము ఎదురుచూస్తాడు. అది మీకు తెలియకుండానే శాశ్వతముగా ఎపుడో జరిగిపోయినది. అలాగే మీకు తెలియకుండానే ఈ దేహ త్యాగము గూడ జరుగుతుంది.అపుడిదాకా ఈ దేహము అంతిమ అన్నిరకాల రాహిత్యస్ధితియైన బ్రహ్మతదాకార స్ధితిలో ఉంటాడు.ఈ స్ధితికి చేరడమే అంటే ఏకైక ఆలోచన రహిత అంతిమ శాశ్వతమరణము బ్రహ్మకపాలమోక్షము పొందినట్లే అన్నమాట.దీనికి స్వానుభవం మాత్రమే ఉంటుంది.స్వానుభూతి ఉండదు అని తెలుసుకోండి. కాబట్టి ప్రతి సాధకుడు గూడ అంతిమ సాధన స్ధితికి అనగా నేను లేను అని స్వానుభవమును పొందడము వరకే వస్తాడు.ఇక్కడికి వచ్చి మౌనబ్రహ్మగా ఆగిపోవాలి.అంతే గాని నేనులేను అని స్వానుభవానుభూతి కోసము ఎన్నడికి ప్రయత్నించరాదు. ప్రయత్నిస్తే...తిరిగి సాధకుడు రూపము అంతము గావలసిన చోట పున:కర్మ జన్మతో రూపాంతరము చెందుతాడని గ్రహించండి. అనగా సాధన అంతమయ్యే చోట తిరిగి సాధన ఆరంభమవుతుంది. అనగా బ్రహ్మాండచక్రములో సుడిగాలిగా తిరిగే మిగిలిన 36వ ఏకమూలబ్రహ్మకపాల ఏకత్వశరీరము తిరగడము ఆగిపోతుంది.తద్వారా విశ్వనాటకమునందు స్వప్న శరీర పాత్ర ఏర్పడుతుంది.మీ జీవనపాత్ర ఆరంభమవుతుంది. దీని నివారణ కోసము ప్రతిసాధకుడు గూడ  ఈ ఏకైక ఆలోచనస్ధితి గూర్చి సాధకుడు ఆలోచించకూడదు... స్పందించకూడదు... సంకల్పించకూడదు. దీనికోసము ఈ రాహిత్యస్ధితులు ఇచ్చే ఢమరుకనాదం... శంఖనాదము... సుదర్శనచక్రారాధన లేదా ఇష్టలింగారాధనను ఈదేహ త్యాగము అయ్యేదాకా సాధనను కొనసాగించాలి. ఎపుడైతే  ఈ సాధకుడు కాస్త మౌన స్థితి (సంకల్ప రాహిత్యస్ధితి)… నిశ్చలస్థితి (స్పందన రాహిత్యస్ధితి)… ఆత్మశాంతి స్థితి (ఆలోచన రాహిత్యస్ధితి)… బ్రహ్మతదాకారస్దితి (ఏమిలేని స్ధితి)… పరమ ప్రశాంత స్థితి (నిరాకార స్ధితి) పొందితే ఇదియే బ్రహ్మ కపాలమోక్షం. ఇట్టి స్ధితులలో ఏవరైన ఉంటే వారు నిజ బ్రహ్మకపాలమోక్షగామి అవుతారు. ప్రస్తుతము ఈ దేహ సాధన ఇపుడికే ఇష్టలింగ మరియు సుదర్శనచక్రారాధన వలన సంకల్ప రాహిత్యస్ధితిని పొందడము(మౌన స్థితి) ఆపై రామ శంఖనాదము వలన స్పందన రాహిత్యస్ధితిని పొందడము(నిశ్చలస్థితి) ఆపై ఢమరుక నాదము వలన ఆలోచన రాహిత్యస్ధితిని పొందడముతో(ఆత్మశాంతి స్థితి)...సర్వం ఏమిలేదు...సర్వం శూన్యం అనుభవానుభూతి కోసము(బ్రహ్మతదాకారస్ధితి) ఇక యెట్టి సాధన లేదు.కేవలము బ్రహ్మతదాకారస్ధితిలో ఈ దేహమునకు ఉన్న ఏకమూలబ్రహ్మ కపాలమునకు ఉన్న ఏకైన ఆలోచనకి ఈ దేహము కాస్త దేనికి ఆలోచించకుండా...దేనికి స్పందించకుండా ... దేనికి సంకల్పించకుండాఉండవలసి ఉంటుంది. ఈ సాధనస్ధితి పూర్తి అయితే ఈ దేహసాధన పరిసమాప్తి అవుతుంది.సర్వస్ధితుల నుండి ఈ దేహము విముక్తి పొంది విదేహి అవుతుంది.ఈస్ధితిని పొందిన సాధకుడు మా స్వానుభవము ప్రకారము 5-12సం!!లు మించి బ్రతకలేరు.దానితో ఈ దేహ త్యాగము పొందడము మరుక్షణమే  స్ధూలముగా ఈ స్ధూలదేహానికి విముక్తి కలుగుతుంది. ఇది ఈ దేహానికి తెలియకుండా జరుగుతుంది గదా.

 ఇక ప్రస్తుతానికి మా స్ధూలదేహము కున్న విశ్రాంతి ఆలోచన నివారణ కోసము ఇంకా 12సం!! లలోఎపుడైతే ఈ దేహమునకు ఈ ఆలోచన మీద స్మశానవైరాగ్యం కలుగుతుందో...ఆనాడే ఇచ్చామరణసిద్ధితో ఎపుడైన మహాస్మశాన కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడ ఈ దేహము విశ్రాంతి ఆలోచన నుండి ఆలోచనరహిత స్ధితికి చేరుకున్నదో ఆ క్షణమే దేహము మరణమునుపొంది కాశీ గంగలో నిమర్జనం అవుతామని …అపుడిదాకా నా బ్రహ్మరంధ్రములోని ఏకమూల బ్రహ్మకపాలేశ్వరుడైన నిరాకార బ్రహ్మ పరిభ్రమణము చేస్తూ పరమప్రశాంత స్ధితిని పొందుతూ ఉంటాడని... ఈవిధంగా కాశీ క్షేత్ర కాటికి పోవటానికి ఎదురుచూస్తూ ఉండాలని జ్ఞానస్ఫురణ కలిగినది.కారణం కార్తీక పౌర్ణమి మరుసటిరోజు ఇష్టలింగమును చేతిలో పెట్టుకొని ఇష్టలింగారాధన (సంకల్ప రాహిత్యకోసం),కాశీ శంఖనాదము- రామేశ్వర శంఖనాదము(స్పందన రాహిత్యకోసం) అలాగే ఢమరుకనాదము(ఆలోచన రాహిత్యకోసం) చెయ్యడము పూర్తి అయిన తర్వాత …




నాలో సహజ ఓంకారనాదము వినిపిస్తూన్న సమయములో నా మనో నేత్రము నందు నా చేతిలో ఉన్న ఇష్టలింగము కాస్త తిరుగుతూ..అది కాస్త బంగారు పానమట్టమున్న కాశీవిశ్వనాధలింగముగా రూపాంతరము చెంది...అటుపై ఇది కాస్త మనోవేగముతో తిరుగుతూ ఉండేసరికి ఆ వేగానికి ఇది బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము లాగా కనిపించడము ఆరంభమైనది.అంటే మన స్ధూలశరీర ఆలోచన,సంకల్ప,స్పందన రాహిత్యస్దితిని అలాగే ఆది స్ధూలశరీర విగ్రహమూర్తికి బ్రహ్మతదాకారస్దితిని ఈ క్షేత్రము చేస్తుంది గదా అనుకోగానే నాకు ధ్యానభంగమైంది. అంటే ఈ లెక్కన చూస్తే ఇష్టలింగము అనేది కాశీ విశ్వనాధుడి లింగముతో సమానమని తెలుస్తోంది కదా.అనగా ఏవరైతే నిత్య ఇష్టలింగాధారి అవుతారో వారు సాక్షాత్ కాశీవిశ్వనాధుడు అన్నమాట.శివోహం స్ధితిని పొందినవాడు. అలాగే ఇష్టలింగధారి కాశీవాసితో సమానమైనవాడని...ఇష్టలింగముతో మరణము పొందినవాడు కాశీలో మరణమును పొందినవాడితో సమానమని మనకి అర్ధమవుతోంది కదా!ఎందుకంటే ఇష్టలింగమే కాశీలింగము అయినది కదా. ఈ లెక్కనచూస్తే నిజ ఇష్టలింగధారి కాశీకి వెళ్ళి మరణమును పొందవలసిన పనిలేదు.కేవలము ఇష్టలింగముతో దేహత్యాగము చేస్తే అది కాశీక్షేత్ర మరణముతో సమానమని ఈ దేహనికి స్ఫురణ కలిగినది.గాకపోతే ఈ దేహానికి వచ్చిన అష్టదైవికవస్తువులు అన్నీగూడ రాహిత్యస్ధితి వస్తువులు గావడముతో... ఈ దేహముకున్న సర్వ చింతలు చితాగ్నితో తొలగిపోవడముతో... ఆఖరికి మిగిలే విభూదిని ఈ దేహమును చూడటానికి వచ్చేవారికి ఇస్తూ వారి మనోవేదనను మౌనముగా వింటూ... మౌనభాషతో ఈ దేహము కున్న శక్తిపాతసిద్ధితో వారికి మనో ఆనందమును కల్గిస్తూ...ఈ దేహము అందరికి ఆకాశలింగముగా కనపడుతుంటే ...నిజానికి ఈ దేహము కాస్త ఆకాశమే లింగమయినదని ఎవరికి ఎరుక. ఇంద్రియనిగ్రహముతో జితేంద్రియుడై …. సాధన సాధ్యతే సాధ్యం అని సాధించినవాడై... మాయ మాయం అయ్యి …. నిరాకారుడై ….సర్వం శూన్యమని … సర్వం ఏమిలేదని … సర్వం అంతమైనదని...సర్వం పూర్ణం… అని జ్ఞానస్ఫురణ పొందడముతో సత్య బ్రహ్మజ్ఞాని అవుతాడని… ఇది ఎరుక ఎరుకయైనవాడు మా దేహము లాగా మౌన: బ్రహ్మ అవుతాడని గ్రహించి…  దానితో గుర్తింపు లేని గుప్తయోగిగా మౌనము వహించాను.
 


దానితో నాకు కలిగిన ఈ అంతిమ జ్ఞానస్ఫురణ నిజమేనని అనుటకు నిదర్శనముగా నాకు కాశీక్షేత్రము నుండి విశ్వనాధలింగ కీచైన్ వచ్చినది. ఇది ఇలాయుండగా ఒకరోజు తీవ్రధ్యానములో ఉండగా ఈ దేహము కాస్త ఏదో సజీవమూర్తిగా ఉన్న హనుమంతుడి గుడి ముందు జంగమ దేవర రూపములో ఒక చేతిలో రామ శంఖ నాదము మరొక చేతిలో ఢమరుకనాదమును ఏకకాలములో అతితీవ్రస్ధాయిలో ఈ రెండు నాదాలు చేరుకొనే సమయానికి విపరీతముగా వర్షము పడటం మొదలైనది.అయిన నాదమును ఆపడము లేదు.ఇంతలో ఈ దేహ మెడలో ఉన్న ఇష్టలింగము ఈ వర్షము ధాటికి నెమ్మది నెమ్మదిగా కరుగుతూ బంకమట్టిగా మారుతూ కరిగిపోయినది.అంటే ఈ దేహనికి ఉన్న అంతిమ ఇష్టకోరిక గూడ తీరిపోయినదని..దానితో ఈ దేహము కాస్త విదేహి అయినదని అనగా దేహము లేనివారిని విదేహి అంటారని..అలాగే బ్రతికి ఉండగానే చచ్చినపుడు ఎక్కడికి వెళ్లుతామో...అక్కడికి బ్రతికుండానే వెళ్ళేవారిని విదేహి అంటారని గురునానక్ చెప్పిన గురుబోధ లీలగా గుర్తుకురావడముతో ధ్యానభంగమైంది.


కొన్నిరోజులకి ఈ దేహనికి అంతిమ దైవివ వస్తువుగా గురునానక్ ఉండే అమృతసర్ క్షేత్రమునుండి బిందు ఢమరుకము వచ్చినది.నాకు కల్గిన విదేహి అనుభవము నిజము అని దీనితో నిదర్శనమైనది. దానితో ఈ జంగమ దేవర దేహము కాస్త విదేహి అయినదని ఈ పాటికే మీరు గ్రహించే ఉంటారు కదా!బిందు ఢమరుక నాద సాధన వలన బిందువుగా ఉన్న ఈ దేహము కాస్త రాబోవు కాలము బిందు దేహము కాస్త నిరాకారమైశూన్యమవుతుందని..దీనిని అనుభవము మాత్రమే అవకాశముంటుందని అర్ధమయి మౌనమైనది.

నా అంతిమ ధ్యానుభవాలు

నాకు ఏకమూల కపాలదర్శనము అవుతోందని..దీని బ్రహ్మరంధ్రమే నాకు విభూదిరేణువుగా దర్శనము అవుతోందని అలాగే నేను వేరు ...శూన్యము వేరు అనగా శూన్యము వేరు..శూన్యబిందువు వేరు అని ద్వంద్వ భావ స్ధితి అంటే ద్వైత స్ధితిలో నా సాధన ఉన్నదని మీకు ఈ పాటికి అర్ధమై ఉంటుంది.మరి నేను అనేది శూన్యమని ఎలా స్వానుభవ అనుభూతి కల్గుతుందో ఒక పట్టనా నాకు అర్ధము కాలేదు.  దానికోసము బిందు ఢమరుక నాద సాధన చేస్తున్నాను.

64 కపాల కపాలధారి దర్శనం

ఒకరోజు నాకు ధ్యానమునందు నా మనో దృష్టియందు నా లాంటి రూపధారి యైన ఒక పరమ యోగి గా ధ్యానముద్రలో కనిపించారు.ఈయన ధ్యానానుభవముగా ఆయన బ్రహ్మరంధ్రము నందు 64 కపాల కపాలధారి దర్శనమైనట్లుగా..పైగా ఇవి 1,3,5,7,9,11,13,15 ..ఇలా ఏనిమిది వరుసలలో ఒక పిరమిడ్ ఆకారములో 64 కపాలధారి దర్శనానుభవము అయినట్లుగా...ఈ గత జన్మ నా ఆదియోగి జన్మయైన పరమహంస జన్మని నాకు జ్ఞాపక జ్ఞానస్ఫురణ కల్గింది.నిజానికి సదాశివుడికి 36 కపాలాలుంటాయా లేదా 64 ఉంటాయా అనే ధర్మసందేహము కల్గగానే నాకు ధ్యానభంగమైంది.విచారణ చేసుకుంటే మరి ఈ జన్మలో నాకు 36 కపాలధారి దర్శనమైతే..నా గత జన్మలో 64 కపాలధారిగా దర్శన మవ్వడములో ఏదో నాకు తెలియని మర్మరహస్యమున్నదని నాకు బలంగా అనిపించసాగింది.దానితో పుస్తక గ్రంధాలు తిరగవెయ్యగా..వేదాలలో ఆదిపురుషుడికి 64 తత్వ్తాలున్నట్లుగా.. అదే పురాణాలలో ఆదిపురాణమైన బ్రహ్మపురాణము నందు ఆదిదేవుడికి 65 తత్వ్తాలున్నట్లుగా చెప్పడము జరిగినదని..ఈ 64 తత్త్వాలే 64 కపాలాలు అని నాకు అవగాహన అయింది.కాని పురాణాలు చెప్పిన 65 తత్త్వము ఏమిటో అర్ధము కాలేదు.దీని సమాధానము కాలానికి వదిలేశాను. అంటే నిజానికి సదాశివుడికి 36 కపాలాలు కాదు..64 కపాలాలు అని నాకు అర్ధమైంది.అంటే నా గతజన్మ సాధనలో నేను 64 కపాలాల సాధనలో 28 కపాలాలు దాటి ఉంటాను.ఈ జన్మలో మిగిలిన 36 కపాల సాధన పూర్తి చేస్తున్నానని నాకు తెలిసింది.అలాగే ఈ 64 కపాలధారి నిజానికి కాలపురుషుడు అయ్యిండాలి.ఎందుకంటే కాలానికి 64 డైమర్షన్స్ ఉండే అవకాశాలున్నాయని సైన్సు చెపుతోంది గదా.

64 కాల కపాలయానము

ఇది ఇలా ఉంటే అసలు ఈ 64 కాల కపాల డైమర్షన్స్ లలో ఏమి ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది.ఎందుకంటే నా ఆదియోగజన్మయైన పరమహంస ఈ 64 కపాలయానము చేసినట్లుగా నాకు జ్ఞాపక జ్ఞానస్ఫురణ అయింది.దానితో ఈ నా గతజన్మ సాధనానుభవాలను ఈ జన్మలో ధ్యానానుభవాలుగా నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధితో పొందడము జరిగింది.అపుడు నాకు 64 కపాలధారిలో ఆఖరి వరుసలో ఉన్న 15 కపాల వరుసలో పరమహంస యొక్క కపాలయానము మొదలైనదని నాకు ధ్యానానుభవాలు కల్గడము ఆరంభమైంది.అనగా ఈయనకి మొదటి కపాలము 1వ డైమర్షన్ గాను ఇందులో పొడవు మాత్రమే ఉన్న జీవుల లోకము దర్శనమైంది.ఈ జీవుల కదలిక ముందుకి లేదా వెనక్కి మాత్రమే ఉన్నట్లుగా నా దృష్టికి వచ్చింది.ఇక 2వ కపాలమునందు పొడవుతో పాటుగా వెడల్పు ఉన్న జీవుల లోకము దర్శనమైంది.అంటే ఇవి ముందుకి వెనక్కి అలాగే క్రిందకి..పైకి వెళ్ళగలవని నాకర్ధమైంది. ఇక మూడవ కపాలము నందు ఉన్న జీవులకి పొడవు,వెడల్పు,మందము ఉన్నట్లుగా అనగా మనము ఉన్న భూలోక జీవులే ఇవి నాకర్ధమైంది.అంటే మనమంతా 3వ డైమర్షన్స్ జీవులు అన్నమాట.నిజానికి మనమంతా గూడ ఎటూ కదలలేము.కాని కదలుతున్న భావములో మనము ఉంటున్నాము.ఎలాంటే సినిమా తెర మీద ఉన్న బొమ్మలు నిజమని అనుకుంటే అవి తెర మీద ఎంత కదిలిన నిజానికి అవి తెరను వదిలిపెట్టి సినిమాహాల్ లోనికి రాలేవు కదా.అలాగే వాటికి మనము చూస్తున్నాము అనే విషయము గూడ తెలియదు. ఇలా మనమంతా గూడ పంచభూత నిర్మిత తెరమీద ఆడుతున్న తోలుబొమ్మలని..కల్పితపాత్రలతో..కల్పింతాంశాలతో ఉన్నాము అని నాకు అర్ధమైంది.అందుకే మనమంతా గూడ నిజము లాంటి కలగా..కల లాంటి నిజముగా జగత్ నాటకమును జీవనాటకము వేస్తున్నామని అర్ధమైంది.ఇక 4వ కాల కపాలమునందు కాలానికి సంబంధించిన 12 ఆదిత్యులున్న సూర్యలోకము..5వ దానిలో చంద్రలోకము..6వ దానిలో నక్షత్ర మండలము..7వ దానిలో బుధగ్రహలోకము..8వలో శుక్ర గ్రహలోకము..9వ లో కుజగ్రహలోకము..10వ లో గురుగ్రహలోక దర్శనము..11వ లో శనిగ్రహ లోకదర్శనము..12వ కపాలము నుండి 18వ కపాలము దాకా సప్తర్షి మండలాలు అనగా అత్రి, అంగీరస, పులస్త్యుడు, పులహుడు,క్రతువు,మరీచి,వశిష్టు మహర్షుల లోకాల దర్శనమైంది.ఆ తర్వాత 19 వ నందు ధృవుడు ఆవాసమున్న ధ్రువమండలము.20వ డైమర్షన్ కాస్త మహార్లోకమని..ఇందులో కల్పాంతజీవులు ఆవాసము చెయ్యడము పరమహంసకి కనపడింది.వీరి అనుమతి తీసుకొని ఈయన 21వ డైమర్షన్  లోనికి అడుగుపెడితే అక్కడ జనలోకము దర్శనమైంది.ఇందులో ఆది బ్రహ్మ మానస పుత్రులైన సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు కనిపించారు.దానితో పరమహంస వీరి అనుమతిని తీసుకొని 22వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అది తపోలోకముగా దర్శనమైంది.ఇందులో విదేహిలు,కర్మ-జన్మరాహిత్యులు,వివిధ రకాల ముక్తులు పొందిన ముక్తిజీవులుతమకున్న ఇష్ట కోరిక నుండి కోరిక రాహిత్య స్ధితిని పొందుటకు తీవ్రమైన ధ్యాననిష్ఠలో  తపస్సు చేసుకుంటు కనిపించారు.వీరు లోకాల కళ్యాణార్ధముకోసము కారణజన్ములుగా ఆయా లోకాల యందు జన్మించి తమకి కల్గిన జ్ఞానస్ఫురణలు లోకాలకి అందించే అవతారపురుషులని పరమహంసకి అర్ధమై వీరి అనుమతి తీసుకొని 23వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఒక దివ్య బ్రహ్మకమలము నందు చతుర్ముఖ బ్రహ్మ కాస్త వారి కర్మలానుసారముగా జీవకోటికి అలాగే దైవ కోటికి విధిరాతను వారి కపాలము నుదట రాస్తూ కనిపించగానే అంటే ఈయన విధాతబ్రహ్మయని ఈ లోకము సత్యలోకమని ఈయనకి జ్ఞానస్ఫురణ కల్గడముతో వీరి అనుమతిని తీసుకొని పరమహంస కాస్త 24వ..25వ..26వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ బ్రహ్మ.విష్ణు,మహేశ్వర లోకాలైన త్రిమూర్తుల త్రిలోకాలు దర్శనమిచ్చాయి.దానితో పరమహంస ఈ ముగ్గురిని ఏకకాలములో దర్శించి వారి అనుమతులు తీసుకొని 27వ డైమర్షన్ లోనికి అడుగు పెట్టడము జరిగింది.దీనితో పరమహంస సప్త ఉర్ధ్వో లోకాల మరియి త్రిలోకాలయాత్ర పూర్తి అయింది అన్నమాట.నిజానికి ఈ లోకాలు వరుసగా భూలోకం,భువర్లోకం,సువర్లోకం,మహర్లోకం,జనలోకం,తపోలోకం,సత్యలోకం అయితే ఇందులో భూలోకం,భువర్లోకం,సువర్లోకం ఈ మూడులోకాలు 3వ డైమర్షన్ కి చెందిన లోకాలు అన్నమాట.అందుకే మనకి ఈ లోకాలవాసులైన సర్వదేవతలు గూడ భూలోకమునందు విగ్రహలు రూపములో..దైవాత్మల రూపములో భూలోకవాసులకి పూజలయందు. ధ్యానాలయందు, కలలయందు కనపడటం జరుగుతుంది.పరమహంస కాస్త 28వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే 
శ్రీ వైకుంఠధామము కనపడింది.ఇందులో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి తల్పము మీద ఉండి ఈ విశ్వ స్ధితికారకుడిగా మూడు భాగాలుగా అనగా కర్నాడక సాయి విష్ణువుగా..గర్బోదన సాయి విష్ణువుగా..క్షీరోదకసాయి విష్ణువుగా మారి లోకపరిపాలకుడిగా ఉన్నట్లుగా పరమహంసకి దర్శనమైంది.ఒక రకముగా చెప్పలంటే ఈయన చూడటానికి తిరువంతపురములోని అనంతపద్మనాభుడిలాగా ఉన్నారని పరమహంసకి అనిపించినది.దానితో వీరి అనుమతి తీసుకొని 29వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే...మూడు తలాలతో త్రిముఖ ఈశ్వరుడు కాస్త విశ్వసృష్టి,స్ధితి,లయ ప్రక్రియలు చేస్తూ కనిపించగానే..ఈయనే రుద్రమహేశ్వరుడని..ఈ లోకమే మహేశ్వర లోకమని పరమహంసకి జ్ఞానస్ఫురణ కల్గడముతో.. ఈయన కాస్త వీరి అనుమతి తీసుకొని 30వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే ఒక దివ్యజ్యోతి మాత్రమే దివ్యతేజసు కాంతులు వెదజలుతూ కనపడింది.ఈ జ్యోతియే పరంజ్యోతి యని పరమహంసకి జ్ఞానస్పురణ అయింది.దీనినే బ్రహ్మజ్యోతిగా పిలువడము జరుగుతోందని ఈయనకి అర్ధమై అక్కడ నుండి 31వ డైమర్షన్ లోనికి అడుగుపెట్టడము జరిగింది.ఇందులో బ్రహ్మ మరియు గాయిత్రి,బ్రహ్మణి సమేతముగా మహబ్రహ్మలోకముగా దర్శనమవ్వడముతో పరమహంస వీరి అనుమతి తీసుకొని 32వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అదికాస్త నవ నారాయణులున్న నారాయణుడు,నారాయణి సమేతముగా ఉన్న మహ వైకుంఠలోకముగా ఈయనకి దర్శనమైంది.దానితో వీరి అనుమతి తీసుకొని 33వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే పరమేశ్వరుడు..పరమేశ్వరీ కుటుంబ సమేతముగా మహ కైలాస లోకముగా దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని పరమహంస 34వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ జ్యోతిబిందువుగా ఒక దివ్యజ్యోతి దర్శనమివ్వడముతో ఇది కాస్త ఆత్మజ్యోతియని జ్ఞానస్పురణ అందుకున్న పరమహంస కాస్త 35వ డైమర్షన్ లోనికి అడుగుపెట్టడము జరిగింది.ఇందులో చతుర్ముఖ పంచబ్రహ్మలోకాలున్న ఆది బ్రహ్మలోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 36వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి అష్టవసువులున్న అష్టలోకాలుగా ఉన్న ఆది విష్ణులోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 37వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి ఏకాదశి రుద్రలుగా ఉన్న రుద్రలోకాలతో ఆదికైలాస లోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 38వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి వరుసగా అమ్మవారి సప్త మాతృక దేవతలు అనగా బ్రాహ్మణి ,మహేశ్వరి ,కౌమారి , వైష్ణవి ,వారాహి ,ఇంద్రాణి  మరియు చాముండ  లోకాల దర్శన చేసుకొని వారి అనుమతి తీసుకొని ఈ సారి అమ్మవారి శ్రీచక్ర నవారణలోకాలలో ఉన్న 123 దేవతలను దర్శించుకొని వీళ్ళు అనుమతులు తీసుకొని  ఆదిపరాశక్తి మాత లోకము అయిన శ్రీ బిందులోకము నందు ఉండే శ్రీ లలితా రాజరాజేశ్వరీ మాతను దర్శించుకొని వారి అనుమతితో  ఈ 17 అమ్మవారి లోక డైమర్షన్స్ యాత్రపూర్తి చేసుకొని ఆ తర్వాత 55వ నుండి 59వ డైమర్షన్స్ వరకు మహశివుడి పంచముఖ అవతరాలైన ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత లోకాలు దర్శనమివ్వడముతో వీరి అనుమతులు తీసుకొని పరమహంస కాస్త 60వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ శివ అర్ధనారీ తత్త్వలోక దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని 61వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే శివకేశవ తత్త్వలోకము దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని 62వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ అష్ట ఇష్టకోరికలు తీర్చే ఇష్టకామేశ్వరుడు,ఇష్టకామేశ్వరీ,ఇష్టలింగమున్న ఇష్టలోకము దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని పరమహంస కాస్త 63వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే ఈ విశ్వమాతగా ఆదిశక్తి త్రితలాలుగా అనగా దుర్గ,కాళీ,చంఢీ తలాలున్న త్రిమాత దర్శనమైంది.అంటే నిజానికి ఈ విశ్వములో ప్రతినిత్యము జరిగే సృష్టి,స్ధితి,లయలని మూలకర్త ఈమేనని పరమహంసకి జ్ఞానస్పురణ అందడముతో వీరి అనుమతి తీసుకొని తీసుకొనే సమయములో విశ్వమాత కాస్త విశ్వమాయను చూపడము ఆరంభించింది.అనగా ఏకకాలములో పరమహంస మీద ఉన్నట్టుండి దుర్గాదేవి కాస్త గురు వాత్సల్యం..కాళీ కాస్త భర్త వాత్సల్యం..చంఢీ కాస్త పుత్ర వాత్సల్యం చూపడము ఆరంభించారు.అంటే ఈ విశ్వసృష్టి ఆరంభములో ఆదిపరాశక్తి తన నుండి వచ్చిన మహా శివుడిని ఇలాగే ఈ మూడు స్ధితులలో అనగా భర్తగా పరమేశ్వరుడు..పరమేశ్వరీ).. కుమారుడిగా(తారాదేవి-శివుడు).. గురువుగా(శివుడు-పార్వతి) చూసిన సంఘటనలు లీలగా పరమహంసకి స్ఫురణ రావడముతో...అయినగూడ వీరి మధ్య సంయోగాలు జరిగి విశ్వసృష్టి జరిగినదని..ఇదియే ఈ సృష్టి ఆది తప్పు యని బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన విషయము నిజమేనని పరమహంసకి అర్ధమై విశ్వమాత కేసి చూస్తూ మౌనభాషతో..అమ్మా..నాకు నీ యందు ఎలాంటి మనోవికారాలు లేవు.మమకారాలు.మోహలు,వాత్సల్యాలు గూడ లేవు.నువ్వు నాకు ఒక కూతురువి అనగానే..ఈయన తన విశ్వమోహమాయను దాటాడని గుర్తుగా విశ్వమాత కాస్త నవరత్నఖచిత బంగారపు పీఠము వరముగా ఇచ్చి దర్శనమివ్వగా..దాని క్రింద మోక్షజ్ఞ పీఠము అన్న పేరు ఉండడము గమనించిన పరమహంసకి శ్రీ ఆదిశంకరాచార్యుడు యొక్క సంఘటన ఈయనకి ఆ కాలములో జ్ఞానసరస్వతి కాస్త సర్వజ్ఞ పీఠమునకు ఈయనకి అర్హత,యోగ్యత ఉన్నదో లేదో అని జ్ఞానపరీక్ష పెడితే ఆయన అందులో నెగ్గి ఈ పీఠమును అధిరోహించి లోకానికి భారతీయ ఆధ్యాత్మికతను చాటించిన విషయము లీలగా గుర్తుకు వచ్చింది.గాకపోతే  బుద్ధుడిలాగా కోరిక లేని సమాజము చూడాలనే కోరిక పెట్టుకొని సాధన చేసినట్లుగా...ఈయన గూడ జ్ఞాన ప్రచారము చెయ్యాలనే ఉద్ధేశ్యములో కీర్తికాంత మాయలో పడి సర్వజ్ఞ పీఠాధిపతిగా మారారు.ఇపుడు తను గూడ తనకి ఇచ్చిన ఈ మోక్షజ్ఞ పీఠము గూడ ఇలాంటిదేనని పరమహంసకి జ్ఞానస్ఫురణ అవుతూండగా..మహా కాళీ మాత కాస్త తండ్రి..నీకు ఈ పీఠమును అధిరోహించలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానమివ్వాలి..అసలు మోక్షాలెన్ని రకాలు అనగానే..పరమహంస ఆలోచనలో పడ్డాడు.ఎందుకంటే ఇపుడు దాకా తను కపాలమోక్షమే ఉన్నదని అనుకున్నాడు.ఇపుడు కాళీ అడిగిన ప్రశ్న బట్టి చూస్తే ముక్తికి పంచముక్తులున్నట్లుగా ఖచ్చితముగా ఇలాగే మోక్షానికి గూడ రకాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయా? అని ఆలోచిస్తుండగా ఒకసారిగా సప్తమోక్షపురాలు జ్ఞాపకము వచ్చాయి.అంటే ఈ పురాలు బట్టి చూస్తే ఖచ్చితముగా సప్తమోక్షాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయి అని ఆలోచింస్తుండగా...ఒక పట్టనా అర్ధము కాలేదు.
అపుడు ఈ సప్తపురాలను విశ్లేషణ చెయ్యడము అనగా మధుర పురమంటే శ్రీకృష్ణుడి జనన ప్రాంతము గావడము వలన ఇది జీవుడి సప్త శరీరాల జనన మరియు మోక్షమిచ్చే శరీరమోక్షపురము అయ్యిండాలి.ఆ తర్వాత కాశీక్షేత్రానికి వస్తే ఇక్కడ ప్రతినిత్యము శవదహనాలు జరగడమువలన ఇక్కడ కపాలమోక్షం జరుగుతుంది.అందువలన ఇది కపాలమోక్షపురము అయ్యిండాలి.ఇక ద్వారకక్షేత్రమునకు వస్తే శ్రీకృష్ణుడు దగ్గర శమంతకమణి ఉండుటవలన ఈ పురము కాస్త మణిమోక్షపురము అయ్యిండాలి.ఇక ఉజ్జయినిక్షేత్రానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగము పురుషశివలింగము గావడము వలన ఈపురము కాస్త పురుషశివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక కంచిక్షేత్రానికి వస్తే ఈ పురము కామాక్షిదేవత ఆధీనముగావడము వలన ఈ పురము కాస్త .స్త్రీ శివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక అయోధ్యక్షేత్రానికి వస్తే శ్రీరాముడు కాస్త తన ఆత్మలింగమును రామేశ్వరక్షేత్రమునందు మూడు అడుగుల స్ఫటిక ఆత్మలింగమును ప్రతిష్టించడమువలన ఈ పురము కాస్త ఆత్మలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక హరిద్వార్ క్షేత్రానికి వస్తే రుషికేశి క్షేత్ర శివలింగము అనేది మహాశివుడు కాస్త హాలహలము సేవించడము వలన ఈ నీలిరంగుశివలింగము ఉద్భవించినదని చెప్పడము బట్టిచూస్తే ఈపురము కాస్త పరమమోక్షపురము అయ్యిండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సప్తమోక్షాలు అనగా శరీరమోక్షం..కపాలమోక్షం..పురుషశివలింగమోక్షం..స్త్రీశివలింగమోక్షం..మణిమోక్షం..... ఆత్మలింగమోక్షం..పరమమోక్షం అను ఏడు రకాల మోక్షాలుంటాయని...ఎవరైతే వారి వారి కర్మాలానుసరముగా ఆయా క్షేత్రాలయందు 9 రోజులనుండి 9 సం!!రాలుపాటు ఆవాసము చేస్తారో వారికి ఆయా మోక్షం కల్గుతుందని..పరమహంసకి జ్ఞానస్ఫురణ కల్గడముతో ఇదే సమాధానము కాళీఅమ్మవారికి చెప్పడముతో ఆవిడ అమితానందము చెంది బ్రహ్మపదవి గూడ ఒక మహామాయ అని తెలుసుకున్న పరమహంస వివేకబుద్దికి దానిని త్యాగము చేసిన మనోధైర్యానికి ఆశ్చార్యానందాలని గురీవుతూ ఎప్పుడైతే పరమహంస కాస్త 63 వ డైమన్ష్ లోని త్రిమాత విశ్వమాయ అయిన మోక్షఙ బ్రహ్మ పదవిని కాదని అనుకున్నాడో అపుడు కాని ఈ విశ్వమాత ఇతనికి ఆధీనమై తన ఆత్మశక్తినంతటిని మహాకాళి అనుగ్రహము వలన 54 బాణ లింగాలుగా మార్చి ఆయన మెడలో స్ఫటికమాల రక్షణ కవచముగా పడింది.అంటే భూమిమీద ఉన్న అమ్మవారి 54 శక్తి పీఠాలకి ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి ఈ బాణలింగాల స్ఫటికమాలకి ఉంటుందని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయింది. 

ఇంతలో 63 వ డైమన్ష్ లోని బ్రహ్మకపాలములో ఉన్న ఈశ్వర ఆత్మ లింగము కాస్త గోముఖ తీర్ధము నుండి దివ్యతేజస్సుతో బయటికి వచ్చి ప్రయాణము చేయడము మొదలుపెట్టింది.దీనిని అనుసరిస్తూ పరమహంస యొక్క ఆత్మ శరీరము ప్రయాణము మొదలైంది.అంటే ఒక రకముగా చెప్పాలంటే ఇంతవరకు నూటికి 98% మంది యోగులకి తెలియని విషయము కేవలము 2% మంది యోగులకి మాత్రమే తెలిసిన మార్గము వైపు అలాగే కనిపించే విశ్వము అసత్యమని..కనిపించని శూన్యము సత్యమని నిరూపించే అంతిమ సత్య అనుభవానుభూతి పొందే వైపు అనగా అంతిమ కపాలమైన 64వ కపాలమున్న 64 వ డైమన్ష్ వైపు తమ ప్రయాణము కొనసాగుతూందని.... పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయినది.

ఈ ప్రయాణములో..ఆరంభముగా..ఒక 21 అడుగుల పొడవున్న తెల్లని ఏనుగు దంతము దర్శనమైనది.  ఈ దంతము మధ్య భాగములో ఒక అంగుళ పరిమాణములో ఉన్న గజముఖ గణపతి దర్శనమైంది.ఈయన కాస్త ఈశ్వర ఆత్మ లింగమును తన తొండముతో పట్టుకోవాలని విశ్వప్రయత్నము చేసినా గూడ అది సాధ్యముగాక చివరికి ఈ ఆత్మలింగము దివ్యతేజస్సుకి ఈయన శరీరము దగ్ధమై..అది కాస్త అస్థిపంజరమైన క్షణాలలోనే ఈశ్వర ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తుండగా..

దారి మధ్యలో ఒకచోట బంగారపు రంగుతో దివ్య తేజస్సుతో ఉన్న 24 అడుగుల మహా పాంచజన్య శంఖము దర్శనమిచ్చింది.విచిత్రముగా ఈశంఖము నుంది ఎడమ చెయ్యి బయటికి వచ్చి ఈ ఈశ్వర ఆత్మ లింగమును పట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన గూడ జయము పొందకపోవడముతో ఈ అభయహస్తము మీద  ఈ హస్తము కాస్త క్షణాలలో అస్థిపంజరమైంది.

అ తర్వాత..ఈశ్వర ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తుండగా..ఈసారి ధ్యాననిష్ఠలో యున్న అదిపురుషుడు దర్శనమైంది.ఈయన ఉలకలేదు.పలకలేదు.ధ్యానములో ఉండగా ఈ ఆత్మలింగము కాస్త ఈ శరీరమును తాకిన మరుక్షణమే ఈ దేహమునుండి యోగాగ్ని బయలుదేరి క్షణాలలో ఈ దేహము దగ్ధము అయ్యి అస్థిపంజరముగా మారింది.అయినగూడ ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తూముందుకి సాగిపోతుండగా .... .....

ఈసారి..ఒక పెద్ద తిమింగలము దర్శనమిచ్చినది.ఇదిగూడ ఎలాంటి ప్రతిఘటన చేయలేదు.కదలలేదు.మెదలలేదు.కళ్ళు మాత్రము తెరిసి సాక్షిభూతముగా ఈ ఆత్మలింగముకేసి చూస్తుండగా దీని దివ్యతేజస్సుకి ఈ తిమింగళము శరీరము కాస్త క్షణాలలో దగ్ధమై అస్థిపంజరముగా మారింది.అయినగూడ ఈశ్వర అత్మలింగము తన ప్రయాణమును ముందుకి కొనసాగిస్తుండగా ఉన్నట్టుండి..

ఏకతల ఉన్న దివ్యబంగారపు కాంతి శరీరముతో సుమారుగా 60 అడుగుల పొడవున్న నాగాసర్పము దర్శనమిచ్చింది.దీని కంఠభాగములో లోపలివైపున దివ్యతేజస్సుతో ఏదో మురుపు మెరుస్తూ దివ్య కాంతులతో కనబడసాగినది.అపుడు ఈ పాము కాస్త ఈ ఈశ్వర ఆత్మలింగమును తన నోటితో మింగాలని విశ్వప్రయత్నాలు చేసిన ఏలాంటి ప్రయోజనము లేకపోయేసరికి ఈ దివ్య ఆత్మలింగము తేజస్సుకి దాని శరీరము దగ్ధమై క్షణాలలో అస్థిపంజరముగా మారింది. అయినాగూడ ఈ ఈశ్వర ఆత్మలింగము  తన ప్రయాణమును ముందుకి కొనసాగించింది.ఆ తర్వాత...

దివ్యమైన అభయహస్తముతో చిన్ముద్ర దర్శనమైంది.ఈ ముద్ర యొక్క చూపుడు వ్రేలు,బొటనవ్రేలు మధ్యలో ఉన్న ఖాళి స్థలములో ఈ ఈశ్వర ఆత్మలింగము ప్రవేశించగానే ఈ ముద్ర హస్తము కాస్త ఈ లింగము బయటికి రాకుండా తన ముద్ర బంధనములో బంధించాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికి విజయము సాధించలేకపోవడముతో ఈ ఆత్నలింగము తేజస్సుకి ఈ హస్తము అదృశ్యమైంది. అయిన గూడ ఈ ఆత్మలింగము తన ప్రయాణమును ముందుకి కొనసాగిస్తుండగా..ఇదంతా గూడ పరమహంస శరీరమునకు అసలు ఏమి జరుగుతుందో ఒక పట్టాన అర్ధముగాలేదు.అంటే 63వ కపాలము నుండి ఆఖరిదైన 64వ కపాలము యొక్క ప్రవేశద్వారమునకు సుమారుగా తాము ఏనుగు దంతము యొక్క కాంత మాయను అలాగే శంఖవిష్ణు యొక్క ధనమాయను అలాగే ఆదిపురుషుడైన ఆదిరుద్రుడి యొక్క జీవమాయను ఆ తర్వాత పెద్ద తిమింగళము అంటే మత్స్యావతారము యొక్క రూపమాయను ఆ తర్వాత నాగపాము యొక్క భావరూపమాయను ఆ తర్వాత చిన్ముద్ర యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క ఙ్ఞాన మాయను దాటవలసి వచ్చినదని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయినది.

దానితో వీరి అనుమతిని గూడ తీసుకొని చివరి ఆఖరిదైన 64th డైమెన్షన్ లో ఉన్న బ్రహ్మకపాలములోనికి పరమహంస ప్రవేశించడము జరిగింది. అక్కడ ఈయనకి ఏక దళమున్న పద్మము దర్శనమిచ్చింది. ఇది గుండ్రముగా తన చుట్టూ తాను తిరుగుతూ కనబడింది. ఈ పద్మము పై కోడి గ్రుడ్డు ఆకారములో ఒక దివ్య జ్యోతి దర్శనమైంది. ఈ జ్యోతి స్వరూపములో ఏక ముఖ తలతో ధ్యాననిష్ఠలో ఉన్న యోగమూర్తి దర్శనమిచ్చాడు. ఈయనే ఈశ్వరుడిని, ఆకార భగవంతుడని, ఆదిదేవుడని, ఆదియోగియని, ఆదిగురువని, సదాశివుడి అంటారని పరమహంసకి జ్ఞాన స్ఫూరణ అయింది. ఈయన ఉల్కలేదు,పలుకలేదు, కళ్లు తెరువలేదు. జీవసమాధి స్థితిలో ఉన్నారని ఈయనకి అర్ధమై మౌనము వహించాడు.

ఎప్పుడైతే ఈ ఈశ్వరా ఆత్మలింగము ఈ దేహమును తాకినదో ఆ మరుక్షణమే ధ్యాననిష్ఠలో ఉన్న అస్థిపంజరముగా మారింది.అంటే ఈయన కపాలమే 64వ అంతిమ బ్రహ్మ కపాలమని పరమహంసకి అపుడికి కాని అర్ధముకాలేదు. ఈ సదాశివుడికి ఇంతకుముందు తను చూసిన షట్ మాయల వలన ఈ సదాశివుడికి 64 కపాలాలు  వరుసగా 1,3,5,7,9,11,13,15 ఏర్పడ్డాయని ఈయనికి అర్ధమైనది.64 వ కాలకపాలమునందు అనగా ఏకమూల బ్రహ్మకపాలమునందు తిరుగుతున్న ఏకదళ పద్మము మీద..కోడిగ్రుడ్డు ఆకార దివ్యజ్యోతి కాంతి మధ్య.. ఏకముఖతో.. చిన్ముద్ర సాధనతో..ధ్యానమూర్తిగా ఉన్న దివ్యపురుషుడి దర్శనమైంది..ఈయనే ఆదియోగి.. ఆదిడేవుడు..  ఆదిగురువు..ఆదిజ్ఞాని అంటారని నాకు జ్ఞానస్ఫురణ కల్గడముతో నా ధ్యానభంగమైంది.  దానితో 64 కపాలయాన యాత్ర సంపూర్ణమైంది.

ఆ తర్వాత నాకు ఒక ధర్మ సందేహము వచ్చింది.చచ్చినవాళ్ళు కపాలముగా మారతారు గదా.అంటే ఈ లెక్కన 64 కపాలధారి ఆదిదేవుడు బ్రతికి ఉంటే తలాలతో దర్శనమివ్వాలి కాని ఇలా చచ్చినవారికిలాగా కపాలాలతో ఎందుకు దర్శనమిచ్చారో తెలుసుకోవాలని నాలో ఆసక్తి పెరిగింది.పుస్తక గ్రంథాలు తిరగవేశాను.ఎక్కడ నా ప్రశ్నకి సమాధానము దొరకలేదు.దానితో కాలమే నాకు సమాధానము చెప్పాలని అనుకొని..నా సాధనలో పడ్డాను.

మళ్ళీ తిరిగి నాకు నేను వేరు..శూన్యము వేరు అనే భావము కల్గింది.ఈ భావము ఎలా పోతుందో..నేనే శూన్యమని భావము ఎలా వస్తుందో నాకు ఒక  పట్టనా అర్ధము కాలేదు.పిచ్చిపట్టినట్లుగా ఉండేది.అందరి మీద ఉన్మాది లాగా ప్రవర్తించేవాడిని.ఎందుకంటే సముద్రము యొక్క అల వలన ఏర్పడిన నీటిబుడగ కాస్త తను వేరు..సముద్రము వేరు అని ఏలా అనుకుంటుందో అలా నా మనస్సు కాస్త నేను వేరు..శూన్యము వేరు అని అనుకుంటుందని తెలిసిన ఏమి చెయ్యలేకపోతున్నాను.అన్ని తెలుస్తున్నాయి.మరి నాలో ఉన్న శూన్యభావన అనే ఈ నీటి బుడగ ఎలా పగిలి..నేనే శూన్యమని భావము కల్గుతుందో నాకైయితే ఒక పట్టనా అర్ధము కాలేదు.

ది బుద్ధ కోడ్



అనుకోని విధంగా మా కుటుంబసభ్యులతో కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళి..అటుపై విష్ణుగయకి వెళ్ళి..తిరుగు ప్రయాణములో బుద్ధగయకి వెళ్ళడము జరిగింది.బుద్ధ పూర్ణిమ రోజు గావడంతో.....
బుద్ధ గయలో....
బౌద్ధ సన్యాసులతో... ఈ క్షేత్రము నిండిపోయినది.అలాగే ఈ క్షేత్రములో ఉన్న బుద్ధుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము మరియు బౌద్ధ మందిరమును వివిధ రకాల పుష్పాలతో..సూక్తులతో..బోధనలతో..అలంకరించే పనిలో 1800 మంది బౌద్ధ భిక్షువులు నిమగ్నమైన వేళలో...పైగా ఈ రోజు ఉపన్యాసము ఇవ్వటానికి టిబెట్ నుండి దలైలామా వస్తున్నారని అక్కడ ఉన్న మైకులో చెప్పడము ద్వారా నాకు తెలిసింది.కారణము లేనిదే కార్యముండదు గదా..ఇంతదూరము ఈయన ఎందుకు వస్తున్నాడో..అదే సమాయానికి అంతదూరము నుండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో..ఏదో మర్మముండాలని అనిపించి ఆయన ప్రసంగము వినాలని నేను నిశ్చయించుకున్నాను.
నేను ఈ మందిరమునకు చేరుకోవడము జరిగినది.సరాసరిగా మందిరము లోపల ఉన్న బుద్ధుడి  విగ్రహమూర్తికి నమస్కారము చేసి అక్కడే ఉన్న ఈ క్షేత్ర పరిరక్షక లామాల దగ్గర నుండి ఆశీస్సులు అందుకొని...బుద్ధ భగవానుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము క్రిందకు చేరుకొని ధ్యానం చేసుకోవడం ఆరంభించినాను.
ఇంతలో...మరికాసేపటిలో అక్కడికి ధర్మశాల నుండి దలైలామా వస్తున్నారని...ధర్మ బోధ చేస్తారని..కాబట్టి అందరు గూడ వారికి కేటాయించిన సీటులలో ప్రశాంతముగా కూర్చోవాలని మైకులో చెప్పడము జరిగినది.
 అనుకున్న సమయానికి దలైలామా కాస్తా ప్రసంగము కోసము ఏర్పరిచిన వేదిక వద్దకు రావడము ....ఈ ప్రసంగము వినడానికి అక్కడ పనిచేస్తున్న బౌద్ధ సన్యాసులు,బౌద్ధ భిక్షువులు,బౌద్ధ లామాలు అందరు గూడ తమకి కేటాయించిన కుర్చిలలో కూర్చోవడము మొదలుపెట్టారు! దలైలామా కాస్తా మైకు అందుకొని.. నాయనలారా!ఈ రొజు మీకు నేను ఎలాంటి ఙ్ఞాన బోధ చేయను.కాని మీ సాధనలో వచ్చే ధర్మ సందేహాలకు మరియు సాధన సందేహాలకు సమాధానాలు చెపుతాను అనగానే...
ఎవరో ఒక బౌద్ధ సన్యాసి లేచి..లామాజీ!మనము నిత్యము పూజించే ఓం-మణి-పద్మ-హుం మంత్రము యొక్క అర్ధము ఏమిటో చెప్పగలరా? అనగానే..

నాయనా!ఈ మంత్రార్ధము మణి గల పద్మము లేదా మణి పద్మము.నిజానికి మణి పద్మము అంటే మణి కాంతి ఉన్న స్పటిక పర్వతమైన పద్మాకార కైలాస పర్వతము.దీని మణి అర్ధము అనగా పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు స్పటిక పర్వతమంత పరిశుద్ధుడని..ఇంక పద్మము అనగా పరిపూర్ణ ఙ్ఞాన చిహ్నము అని మన బౌద్ధ గ్రంధాలలో చెప్పబడి ఉంది.

ఇంతలో...ఒక న్యూస్ విలేఖరి లేచి...స్వామి! బుద్ధుడి కాలములోనే శూన్యత భావ స్థితిని తట్టుకోలేక చాలామంది బౌద్ధ సన్యాసులు ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను నిజమేనా ?...

నిజమే నాయనా!శూన్యత వేరు!శూన్య భావ స్థితి వేరు!ఈ తేడా తెలియకనే దేహం అశాశ్వతం-జీవితం అశాశ్వతం అని ధారణ చేసినారు!కనిపించేది అసత్యం అయినప్పుడు కనిపించని శూన్యము సత్యమైనప్పుడు..నేను  లేను..సర్వము శూన్యము అనే శూన్య భావ స్థితి చేరుకొని దానిని తట్టుకోలేక శరీర త్యాగాలు చెయ్యడము ప్రారంభించినారు.దీని నివారణ కోసం ఆనాడు బుద్ధ భగవానుడు ఏకముగా "సర్వ భిక్ష" సమావేశమును పెట్టి శూన్యత భావము గూర్చి భోధన చెయ్యడము జరిగినది.సాధనకి శరీరము ఉండాలని..ఇది లేకపోతే శూన్యత స్థితిని చేరుకోలేమని..మనది అహింసవాదము కాబట్టి ఆత్మహత్య చేసుకోవడము అనేది హింస క్రిందకి వస్తుందని అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవడం కాదని.. ఈ భావన కాస్తా పూర్ణ శూన్యత స్థితికి రహదారి గావల్చి ఉంటుందని శరీరము పైన అలాగే జీవితము పైన ద్వేషము పెంచుకోరాదని నా సూత్రాలను అర్ధము చేసుకోలేకపోతే ఇలాంటి అనర్ధాలు అపార్ధాలు కలుగుతాయని...సూత్రాలు వినడము కాదని వాటిని వివేకముతో  విశ్లేషించి అన్వయించుకోవాలని చెప్పడము జరిగినది.ఉదాహరణకు చంద్రుని చూపించే వ్రేలు మీద మీద శ్రద్ధ పెదితే అది కాస్త శూన్యత భావ స్థితికి చేరుతుందని..దానిని తట్టుకోవడము చాలా కష్టము అని..అదే వ్రేలు మీద దృష్టి పెట్టకుండా అది చూపించే దిక్కులో ఉన్న చంద్రుడి వైపు చూడటము ఆరంభిస్తే మనస్సుకి ఏర్పడిన శూన్యత భావ స్థితి నుండి అది విముక్తి పొంది మనఃశాంతిని పొందుతూ బ్రహ్మానంద స్థితిని పొందుతుంది.అంటే నేను చెప్పిన సూత్రాలలో సూత్రము చెప్పిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి. సత్యాన్ని అన్వేషించాలి.అలాగే సూత్రానికి మరియు ధ్యాన అనుభవానికి మధ్య అతి సున్నిత అంశముగా 18 రకాల శూన్య స్థితులు ఉంటాయని ఎవరికి వారే ఙ్ఞాన సిద్ధి పొంది తెలుసుకొని అనుభవించి ఆనందస్థితిని పొందవలసి ఉంటుందని చెప్పడము జరిగింది.  

ఒక యాత్రికుడు లేచి..స్వామి!నిజానికి శూన్యతాభావము అంటే ఏమిటి?
అనగా

..నాయనా!శూన్యత అంటే నీ మనస్సు లేని స్థితిని పొండటము. అనగా నువ్వు ఒక ఉల్లిపాయను తీసుకొని దానికున్న పొరలు తీసుకుంటూ పోతుంటే అప్పటిదాకా ఆకారంగా కనిపించిన ఉల్లిపాయ కాస్తా ఎలా అయితే కనిపించకుండా పోతుందో..అలా సత్యముగా కనిపించే ఈ ప్రపంచము అలాగే ఈ దేహ మనస్సు గూడ సాధన ద్వారా వీటికున్న లక్ష పాతిక వేల కర్మ బంధ మాయ పొరలు తొలిగితే అపుడు భావనలు చేసే మనస్సు కనిపించదు.భావాలు వలన ఆలోచనలు కలుగుతాయి.వీటి వలన భావానికి రూపము ఏర్పడుతుంది.ఈ రూపము మీద ప్రేమ,మోహ, వ్యామోహ,భ్రాంతి,భ్రమ,ఆశ,భయము,ఆనందము, ఆలోచన,సంకల్పము కలుగుతాయి.దానితో రేణువు కాస్తా భౌతిక పదార్ధముగా రూపంతరము చెందుతుంది.ఈ భావ రహిత స్థితికి చేరడమే నిజమైన సంపూర్ణ శూన్యస్థితి అవుతుంది.ఈ శూన్యస్థితిలో సుమారుగా 18 రకాల శూన్యస్థితులు అనగా శూన్యత స్థితి,శూన్య భావ స్థితి,శూన్య స్థితి,మహా శూన్య స్థితి,  పరమ శూన్య స్థితి అంటూ 18 సాధన స్థితులు ఉంటాయి.

మరో యాత్రికుడు లేచి..స్వామి!మరి శూన్యత భావ స్థితిని తట్టుకోవడానికి బుద్ధుడు ఏమి చెప్పలేదా?అనగానే..

నాయనా!దీనికోసం ఆయన చాలా పరిశ్రమ చేశాడు.ఏదైన అనుభవ అనుభూతి పొందడానికి శూన్యత భావ స్థితి తట్టుకోవడానికి ఆయన ఏకముగా హిమాలయ యోగులను అలాగే శంబల యోగులను కలసి వారి అనుగ్రహముతో సప్త ధాతువులతో ఒక సింగింగ్ బౌలు నిర్మాణము చేసినారు.దీని వలన విశ్వములో వినిపించే ఓంకార నాదమును మనము వినగలుగుతాము.అలాగే మనలోని ఓంకారనాదమును వినడానికి మన యోగచక్రాలకు తగ్గట్టుగా ఒక ప్రార్ధన గంటను తయారు చేయడము జరిగినది.దీనిని లయబద్ధముగా మ్రోగిస్తుంటే మన శరీర చక్రాలలో జాగృతి కలిగి మనలో ఓంకారనాదము వినబడుతుంది.ఇలా విశ్వములోని ఓంకారనాదమును అలాగే శరీరములోని ఓంకారనాదమును అనుసంధానము చేయడానికి డోర్జి అనే ఆయుధ పరికరమును తయారు చేయడము జరిగినది.దీని వలన ఈ రెండు నాదాలు అనుసంధానమై ఈ ఓంకారనాదాలు మిళితమై నిశ్శబ్ద నాదమైన తుంకార నాదము వినే స్థితిని సాధకుడు పొందటానికి ప్రేయర్ వీల్ ను తయారు చేయడము జరిగినది.ఈ సాధన పరికరాల వలన సాధకుడికి ధ్యానములో నిద్ర - మెలుకువ గాని మధ్యమ స్థితికి మనస్సు వెళ్ళుతుంది.ఈ స్థితిలో ఎవరైతే 48ని. దాకా ఉండగలుగుతారో వారికి సంపూర్ణ శూన్య స్థితి అనగా మనస్సే లేని స్థితిని పొందటము జరుగుతుంది.

ఇంతలో ఒక విలేఖరి లేచి..స్వామి!ఇంత వివరముగా మీరు చెబుతున్నారంటే బుద్ధుడు దీనిని ఎక్కడైన రహస్యముగా దాచారా?అనగానే..

నాయనా!మీరు ఎప్పుడైన ప్రేయర్ వీల్ ను నిశితముగా చూసి వుంటే తెలిసేది.దీని చుట్టూ అష్ట మంగళ వస్తువులతో మూడు వస్తువులకి మూడు రంగుల రత్నాలు అనగా ఎరుపు,తెలుపు,నీలం రంగు రాళ్ళు అమర్చడం ఉంటుంది.అలాగే దీనిలోపల కాగితము చుట్టలో ఓం-మణి-పద్మ-హుం అను గురుమంత్రము 1000 సార్లు రాసి ఉన్న పేపరు చుట్ట కనబడుతుంది.అంటే బుద్ధుడు తాను తెలుసుకున్న ఈ సాధన రహస్యమును ఈ మంత్రములో ఒక కోడ్ గా అమర్చడము జరిగినది.

అంటే మీ ఉద్దేశ్యములో ఈ మంత్రార్ధము నిజముగా ఏదైన మణిని సూచన చేస్తుందా?

నాయనా!అది నిజము గావచ్చును కాకపోవచ్చును.గాకపోతే 14వ శతాబ్దమునాటి బోధిసత్వుడు,అవలోకితేశ్వర,క్షితిగర్భ బుద్ధుడి అవతారాల ఫోటోలలో వీరి చేతులలో ఒక మణి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది.అలాగే 1903-1909 ఈ మధ్య కాలంలో ఉన్న లామా ద్యోర్జి చోగ్యాల్ హిమాలయాలకి ఒక బృందముగా వెళ్ళి రహస్య గ్రామములో ఉన్న మణి ప్రాంతమునను కనుక్కోవడము జరిగినది.ఈయన అక్కడికి వెళ్ళి అక్కడున్న మణి దర్శనము పొందడము గూడ జరిగినదని ఆయన ఆత్మకధలో చెప్పడము జరిగినది.లోక క్షేమ దృష్టిలో ఈ మణి రహస్యము లోక విదితము అలాగే ప్రచారము కాలేదు.దానితో అది నిజమో లేక అబద్ధమో తెలియని సంధిగ్దత స్థితికి మాలాంటి వాళ్ళు చేరుకోవడము జరిగినది. మా దృష్టిలో మణి అంటే సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్య భాగములో ఉండే పిట్యూటరీ గ్రంధియే ఈ మణిగా భావించడముగా జరుగుతోంది.

 అవును!పూర్ణ శూన్య స్థితికి సాధకుడు ఎలా చేరుకుంటాడు అనగానే..

నాయనా!దీని విధి విధానమంతా బుద్ధ భగవానుడు కాస్తా కాల చక్ర నిర్మాణము ద్వారా లోకానికి చెప్పడము జరిగినది.ఈ చక్ర నిర్మాణములో మనకి అయిదు సాధన స్థాయిలుంటాయి.అనగా 1.ఆనందం 2.ఙ్ఞానము3.మనస్సు4.వాక్కు,5.శరీరము పంచస్థితులుంటాయని...మళ్ళీ వీటిలో ఆనంద సాధన స్థాయిలో శూన్యత స్థితి,మార్పు లేని ఆనందం,బ్రహ్మ ఙ్ఞానము,పరిహారము,త్యజించుడము అనే ఉప స్థాయిలుంటాయి.ఈ స్థితులు పొందటానికి అష్ట నియమాలు ఉన్నాయి.అనగా 1.శక్తి 2.ఆకాంక్ష 3.సిద్ధాంతం 4.ఇచ్చుట 5.క్రమశిక్షణ 6.సహనం 7. ఉత్సాహం 8.ధ్యానము అనే సాధనలు ఉన్నాయని తన కాల చక్రము ద్వారా చెప్పడము జరిగినది.అంటే ధ్యానముతో మొదలైన సాధన కాస్త పూర్ణ శూన్యత స్థితి అనే సాధన స్థితితో పూర్తి అవుతుంది అన్నమాట.  

స్వామి!ఈ మణి రహస్య చేదన చెయ్యడానికి దారి ఏమిటి?

ఇంక ఏముంది.ఓం-మణి-పద్మ-హుం అను గురు మంత్రమే దారి చూపుతుంది.ఇదియే ది బుద్ధ కోడ్ అన్నమాట అని అంటూ...

ప్రసంగము పూర్తిచేసుకొని తనకి కేటాయించిన విడిదికి వెళ్ళిపోయారు.


ఎందుకంటే ఈయన చెప్పిన సమాధానాలు వలన నేను ఇన్నాళ్ళుగా శూన్యస్ధితిలో లేను అని..కేవలము శూన్యభావ స్ధితిలో ఉన్నానని నాకు అర్ధమైంది.అనగా బుద్ధుడు చెప్పినట్లుగా నేను ఇన్నాళ్ళు పూర్ణచంద్రుడిని చూడకుండా అది ఉన్న దిక్కును చూపించే వ్రేలు మీద నా మనస్సు సాధన ఉన్నదని నాకు అర్ధమైంది.అనగా నేను పూర్ణశూన్యస్ధితి గూర్చి ఆలోచించకుండా శూన్యభావ స్ధితి గూర్చి నా మనస్సు భావాలున్నాయని నాకర్ధమైంది.ఇది ఇలా ఉంటే వీళ్ళు నిరంతరము జపించే మణి మంత్రము అనగా ఓం-మణి-పద్మ-హుం అనే జపనామము నాకు వింతగాను..విచిత్రముగాను అనిపించింది.పోయి పోయి మణిపద్మ ఆరాధన చెయ్యడమేమిటి?అసలు ఈ లోకములో మణిపద్మము అనేది ఉంటుందా?వీళ్ళ పిచ్చి కాని అని నాకు అనిపించింది.కాని ఈ మంత్రసాధనతోనే బుధ్దుడు తనకి కల్గిన శూన్యభావ స్ధితి నుండి పూర్ణ శూన్యస్ధితికి చేరుకున్నారని..పైగా మణిపద్మము అంటే మణిఉన్నపద్మము ఆయనికి హిమాలయాలలో స్వానుభవదర్శనమైనదని ఈ విధివిధానమంతా గూడ రహస్యగుర్తులతో ఈయన కాస్త కాలచక్ర తంతుగా ఏర్పాటుచేశారని నేను తెలుసుకొనేసరికి నాలో నాకే తెలియని ఆనందమేసింది.దీనితో నా సాధన ఆగిపోలేదని...మార్గము దొరికిదని నా మనస్సుకి అందింది.దానితో ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధుడు చరిత్రను చెప్పే సత్ పుస్తక గ్రంథాలను చదవడము ఆరంభించాను.ఆయన సాధన పరిసమాప్తి కోసము తనే స్వయంగా తయారు చేసుకున్న సింగింగ్ బౌల్,ప్రార్ధన చక్రము,దోర్జ్యీ పరికరము,మణిమంత్ర రాగి కడియమును నేపాల్ నుండి తెప్పించుకొని ఆరునెలలు పాటు నేను గూడ లామా దీక్ష తీసుకొని పవన్ లామా గా మారిపోయాను.

అనగా సింగింగ్ బౌల్ ను మ్రోగిస్తే మనకి విశ్వములోని ఓంకారనాదము ఎలా వినబడుతుందో అలా దీని నుండి మనకి వినబడుతుందని..అలాగే ప్రేయిర్ వీల్ తిప్పుతూంటే మనకి విశ్వములో ఉన్న నిశ్శబ్ధనాదమైన తుంకారనాదమును ఇది వినిపిస్తోందని..అలాగే ద్యోర్జీ పరికరమును చేతిలో పట్టుకొని మణి మంత్ర జపారాధన చేస్తుంటే మనలోని కుండలినీ శక్తి మూలాధార చక్రము నుండి బయలుదేరి బ్రహ్మరంధ్రములోని బ్రహ్మండచక్రములో ఐక్యం అవుతున్నట్లుగా అనగా మనలోని ఓంకారనాదము కాస్త విశ్వములోని తుంకారనాదముతో లయం చెందుతున్నట్లుగా..దీనినే సైన్స్ పరిభాషలో చెప్పలంటే మనలోని అయస్కాంత శక్తి కాస్త విశ్వములోని విద్యుత్ శక్తితో కలిసిపోయి విద్యుతాయస్కాంత శక్తిగా మారుతోందని ఈ సాధన వలన తెలుసుకున్నాను.

మణిపద్మ దర్శనం :



ఒకరోజు నేను ఇలాంటి తీవ్రస్ధాయి సాధనలో ఉన్నట్టుండి నాకు 64 కపాలధారి తలలతో కాకుండా కపాలాలతో ఎందుకు ఉన్నాడు అనే పున:ప్రశ్న ఆలోచన నా మదిలో మెదిలింది.దీనికి సమాధానముగా నా మనోదృష్టి యందు ఒక దృశ్యము కానరావడము మొదలైంది.బ్రహ్మరంధ్ర అంతరగుహ దర్శనమైంది.ఇందులో ఏకముఖ తలతో చిన్ముద్ర ధ్యానయోగి అయిన ఆదియోగి అగుపించాడు.ఈయన ముందు చిన్న గుంటలో గోముఖ తీర్ధమున్నట్లుగా అగుపించింది.ఆ తర్వాత ఈ యోగి కళ్ళు తెరిచి తన మనస్సులో ఏకోహం బహుశ్యాం అనగా తను ఏకము నుండి అనేకం అవ్వాలని కోరిక కల్గింది.దానితో ఈ అర్ధశరీరము నుండి అమ్మవారు..ఈయన వామభాగం నుండి విష్ణువు..అలాగే మరో భాగమైన దక్షిణ భాగము నుండి బ్రహ్మదేవుడు జననాలు జరిగాయి.అంటే ఏకతల కాస్త మూడు తలాలు అనగా రెండు పురుషతలాలు,ఒక స్త్రీ తలగా రూపాంతరము చెందాయి.ఇలా 1,3,5,7,9,11,13,15 అనగా 64 తలలతో 64తత్త్వాలతో 64 విశ్వమండలాలు ఏర్పడినాయి.ఇవి కాస్త పంచభూతాలు,మనస్సు,బుద్ది,అహంతో స్త్రీ ప్రకృతి అలాగే పంచభూతాలతో సూర్య,చంద్ర,జీవుడిగా పురుష ప్రకృతిగాను అలాగే పంచభూతాలతో కాలము,కాంతి,నాదముతో మూలప్రకృతి ఇలా మూడు అష్టాంగాలతో బ్రహ్మాండ,పిండ,అండ లోకాలు ఏర్పడినాయి.ఆ తర్వాత ఈ 64 తత్త్వాలు కాస్త 64 సహస్రకోటిగా జీవులుగా బ్రహ్మాండము నందు విభజన చెందడము...64 శతకోటి జీవులుగా పిండమునందు...36 కోట్ల 84 లక్షల 64,800 జీవులుగా అండలోకము నందు విభజన చెందడము జరిగినట్లుగా ధ్యాన దృశ్యాలుగా నాకు అర్ధమైంది.ఆ తర్వాత ఈయన విశ్రాంతి స్ధితికి వెళ్ళి జీవ సమాధి స్ధితి చెందగానే ..ఈయన ముందున్న గోముఖ తీర్ధము నుండి బడబాగ్ని మొదలై..అది కాస్త ఈయన శరీరమును యోగాగ్నిగా దహింప చెయ్యగానే..అపుడిదాకా ఉన్న 64 తలలు కాస్త 64 కపాలాలుగా మారే దృశ్యము నాకు అగుపించింది.అంటే ఆది దేవుడు ఆదిలో సజీవమూర్తి.కాని ప్రస్తుతము నిర్జీవమూర్తి అన్నమాట.అలాగే నిజయోగులు గూడ తమ బ్రహ్మరంధ్రము నుండి యోగాగ్ని అనేది గోముఖ తీర్ధములోని బడబాగ్ని అని నాకు జ్ఞానస్పురణ అవుతుండగా..ఆదియోగి యొక్క చిన్ముద్ర హస్తము అలాగే ఈయన త్రినేత్రము ఈ యోగాగ్నిలో దహనము గాకుండా సజీవముగా ఉండేసరికి నాకు ఆశ్చర్యానందము కల్గుతూండగా నాకు ధ్యాన భంగమైంది.అలాగే ఈ రెండు శరీర భాగాలు సజీవమూర్తిగా ఉండటానికి కారణము చిన్ముద్ర హస్తము అలాగే త్రినేత్రము అనేది అగ్నితత్త్వాలు గావడము వలన ఈ యోగాగ్ని దహనము చెయ్యలేదని నాకు అర్ధమైంది.అసలు ఈ అనుభవము నిజమో కాదో అని నా మనస్సు ఆలోచనలో పడింది.కొన్ని రోజుల తర్వాత నాసా వాళ్ళు విశ్వములో దేవుడి కన్ను అలాగే దేవుడి హస్తము ఉన్నట్లుగా ఉన్న ఫోటోలు న్యూస్ పేపర్స్ లో రావడము నాకు అమిత ఆశ్చర్యమేసింది. అంటే ఈ లెక్కన చూస్తే ఈ నా ధ్యానానుభవము నిజమని నాకు అర్ధమైంది.

ఆ తర్వాత నాకు ఒక సందేహము కల్గింది. అది ఏమిటంటే అసలు బడబాగ్ని అనేది గోముఖతీర్ధములో ఎలా ఏర్పడినదో తెలుసుకోవాలని ఆసక్తి కల్గింది.దీనికి సమాధానముగా నేను ఒకరోజు తీవ్రధ్యానములో ఉండగా నా మనోదృష్టి యందు టెంపుల్ రన్ ఆట లాగా దృశ్యాలు శరవేగముగా దాటుతున్నాయి.అంటే నా మనస్సు యానము చేస్తోందని నాకర్ధమైంది.మౌనముగా సాక్షిభూతముగా ఈ దృశ్యాలను చూస్తున్నాను.ఇంతలో నా బ్రహ్మరంధ్ర అంతరగుహ దర్శనమైంది.గోముఖ తీర్ధం దర్శనమిచ్చింది.అపుడు ఈ జలము నందు పురుష మరియు స్త్రీ పాములు కొట్టుకున్నట్లుగా బుసలు శబ్ధాల దృశ్యము కానవచ్చింది.ఆ తర్వాత కొన్ని   వందల పాములు బ్రహ్మరంధ్రము నుండి ఈ గోముఖ జలములో పడే దృశ్యము కానవచ్చింది.అంటే ఇవి నిజానికి పాముల లాంటి కోరికలకి ప్రతీకలని నాకు అర్ధమైంది.ఇంతలో ఈ గోముఖ తీర్ధము యొక్క మధ్యభాగములో ఒక అష్టదళ పద్మము ఒక త్రికోణ మధ్యలో వెలిసిన దృశ్యము అగుపించింది.ఈ పద్మ మధ్యభాగములో ఏదో దివ్యకాంతులతో మెరుస్తూ ఒక దివ్య మణి దర్శనమైంది.అంటే ఇదే మణిపద్మమని..దీనిని బుద్ధుడు గూడ ధ్యానధృశ్యముగా  కల్గడముతో ఈయన కాస్త ఓం-మణి-పద్మ-హుం అని మణిమంత్రమును రూపొందించి ఉంటారని నాకు జ్ఞానస్ఫురణ అవుతుండగా అసలు ఈ పద్మములో కనిపించే మణి రూపము చూడాలని అనిపించి ఈ మణిపద్మము దగ్గరికి వెళ్ళి చూడగా అది అరచెయ్యి అంత ఉండి అష్టకోణాలతో జేగురు రంగుతో దివ్యకాంతులలో మెరుస్తోందని నాకు అర్ధమైంది.కాని ఈ మణి పేరు ఏమిటో అనుకోగానే నాకు ధ్యానభంగమైంది.అపుడు ధ్యానము నుండి బయటికి వచ్చి ఈ మణి గూర్చి బౌద్ధధర్మ గ్రంథాలు తిరగవెయ్యగా...కొన్ని పుస్తకాలలో అది చింతామణి..మరికొన్ని పుస్తకాలలో స్ఫటికమణి అని చెప్పడముతో నేను కాస్త అయోమయములో పడ్డాను.నిజానికి మాకు అగుపించిన మణిపద్మములో ఉన్న మణి తెల్లని స్ఫటికము కాకుండా జేగురు రంగులో మణికాంతులు రావడము బట్టి మణిపద్మ మణి స్ఫటికమణి కాదని చింతామణి అని నాకర్ధమైంది.నిజమైన చింతామణి అయితే అష్టకోణాలలో ఉండి అష్టకోరికలు అనగా తూర్పు దిక్కునరాజసం,పడమరలో పాశానుబంధం,ఉత్తరలో ఐశ్వర్యం,దక్షిణములో మృత్యుభయనాశనం,ఆగ్నేయములో రోగ వినాశనం,నైరుతిలో రాక్షస సంహరము,వాయువ్యలో సుస్ధిరం,ఈశాన్యములో మృత్యుజయము అనే అష్టదిక్కుల అష్టకోరికలుంటాయని వీటిని తీరుస్తుందని రత్నశాస్త్రము చెపుతోంది.అంటే నా అంచనా నిజమే అయితే ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట నిజరూపములో చింతామణి ఉండి ఉండాలి గదా అనుకున్నపుడు బుద్ధుడు చరిత్రలో ఈయన కాస్త హిమాలయాలకి వెళ్ళి కైలాస పర్వతము చేరుకొని..దీని లోపల ఉన్న లోకానికి తెలియని రహస్య గ్రామాలైన అగర్తల మరియు శంభల గ్రామాలను దర్శించుకొని అక్కడ ఉన్న పాదరస చింతామణి అలాగే బ్రహ్మచింతామణి స్వానుభవ దర్శనము పొందారని..వీటిని చేరుకోవటానికి రహస్యగుర్తులతో కాలచక్ర తంతులో చెప్పారని నాకు తెలిసింది.నాకు ఈ కాలచక్ర గుర్తులు ఒక పట్టనా అర్ధము కాలేదు.పైగా ధాయిలాండ్ లో ఒక పెద్ద బుద్దుడి పాదము మీద 132గుర్తులుండి  ఏదో మార్గ సందేశము చూపిస్తున్న ఫోటో నెట్లో అగుపించింది.దానితో నాకు ఈ రహస్యమును ఎలాగైనా ఛేదించాలని నాకు బలముగా అనిపించసాగింది.దీని కోసము నేను కాస్త పవన్ లామా మారేదాకా వెళ్ళకతప్పలేదు.ఒకరోజు నేను ద్యోర్జీ పరికరమును చేతిలో పెట్టుకొని తీవ్రమైన స్ధాయిలో మణిమంత్ర జపము చేస్తూండగా ఆకాశములో ఏదో మెరుపు కాంతి మెరిసి అది కాస్త నా బ్రహ్మరంధ్ర గుహయందు మెరిసినట్లుగా నా మనోదృష్టికి వచ్చింది.అపుడు ఈ గుహయందు నా రూపధారి అయిన ఒక భౌద్ధలామా రూపము లీలగా నాకు దర్శనమైంది.అంటే ఇది గూడ నా గతజన్మలలో ఒక లామా జన్మయని..ఇది నిర్వాణలామా జన్మయని..ఆ జన్మలోనే నేను కాస్త బుద్దుడి కాలచక్రమును ఆధారము చేసుకొని బుద్ధుడికి లాగా నేను గూడ ఆ జన్మలో హిమాలయాలకి వెళ్ళి చింతామణి ప్రత్యక్ష దర్శనానుభవానుభూతిని పొందడము జరిగినదని..


ఆ తర్వాత నాకు బుద్ధగయ నుండి బుద్ధుడి పంచలోహ విగ్రహము రావడము జరిగింది. ఆ జన్మ సాధన జ్ఞాపకాలు ఈ జన్మలో ధ్యానానుభవాలుగా గుర్తుకు రావడముతో..నేను కాస్త ఈ అనుభవ జ్ఞానముతో 300 పేజీల "ది బుద్ధ కోడ్" అనే ఆధ్యాత్మిక నవల రాయడము జరిగింది.దానిని ఒక బ్లాగ్ గా చేసి యోగసాధకులకి అందించడము జరిగింది.ఇంతవరకు బాగానే ఉంది.

This THE BUDDHA CODE book blog link below

https://thebuddhacode.blogspot.com/


చింతామణి శిల రావడం:



                                                        నాకు వచ్చిన చింతామణి శిల

మరి పవన్ లామా మారి సాధన చేస్తున్న గూడ ప్రస్తుత జన్మ సాధన ఎక్కడ వేసిన గొంగళి లాగానే ఉండిపోయింది. అనగా నాకున్న శూన్యభావము పోవడము లేదు.ఏమి చెయ్యాలో నాకు అర్ధము కాలేదు.ఒకరోజు అనుకోకుండా నెట్లో ఒక భౌద్ధసాధువు కాస్త చింతామణి శిలలు గూర్చి చెప్పే వీడియో చూడటము జరిగింది.దాని ప్రకారము చూస్తే ఈ శిలలు 300 సం.రాల క్రితము హిమాలయ పరిసరాలలో ఉండేవని..వాటిని బుద్ధుడు సేకరించి తన శిష్యులకి బహుమతిగా ఇచ్చి ధరించమనేవారని..ప్రస్తుత భౌగోళిక మార్పుల వలన ఈ శిలలు కాస్త అమెరికాలోని ఏరిజోనా ఎడారి ప్రాంతములో దొరుకుతున్నాయని..వీటిని ధరించడము వలన శాంతి,ఆరోగ్యము,జ్ఞానవృద్ధి కలుగుతుందని అంటూ ఈ ఎడారిలో దొరికిన చింతామణి శిలను చూపించడము జరిగింది.ఈ శిలను చూడగానే నా ధ్యానానుభవములో కనిపించిన చింతామణి రంగుతో అచ్చుగుద్దినట్లుగా పైగా ఈ శిలను సూర్యకాంతి కేసి పెట్టగానే అది కాస్త జేగురు రంగులో మెరవడం కనిపించేసరికి..నేను వెంటనే ఈ శిలలను అమెరికా నుండి తెప్పించడము జరిగింది.విచిత్రము ఏమిటంటే నేను తెప్పించిన ఈ శిలలు హిమాలయ పరిసరాల నుండి సేకరించినవని ఆ కంపెనీ వాళ్ళు ఒక ఫ్రూప్ కాగితమును పంపించడము జరిగింది.దానితోపాటుగా అంగుళ పరిమాణములో ఉన్న ధ్యానముద్ర బుద్ధుడి మూడు విగ్రహాలు కొనడము జరిగింది.ఇది ఇలా ఉండగా...ఈ చింతామణి శిలను మెడలో ధరించి చేతిలో ద్యోర్జీ పరికరమును ఉంచుకొని మణిమంత్ర జపము చెయ్యడము ఆరంభించాను.ఇలా కొన్ని నెలలు గడించాయి.ఒకరోజు నేను ఇలా తీవ్ర ధ్యానస్ధితిలో ఉండగా నా మనోదృష్టి యందు ఏకమూల బ్రహ్మకపాలము దర్శనమైంది.దీని బ్రహ్మరంధ్రము నందు బ్రహ్మండ చక్రము సుడులు తిరుగుతూ కనిపించసాగింది.దీని మధ్యబిందువుగా విభూతిరేణువు దర్శనమైంది.ఈ శూన్యబిందువే విస్పోటనము అయితే కాని తనకి శూన్యభావము పోదని నాకర్ధమైంది.ఇంతలో ఉన్నట్టుండి ఈ బిందువు పెద్దగా కనపడసాగింది.అంటే నా మనస్సు ఈ బిందువు దగ్గరికి చేరుకుంటుందని నాకర్ధమైంది.ఉన్నట్టుండి ఈ బిందువు కాస్త నా మనస్సులో ఐక్యమవ్వడముతో ..అపుడిదాకా నా మనస్సులో ఉన్న శూన్యభావము అంతరించడము ఆరంభమైంది.కొన్ని క్షణాల తర్వాత నేనే శూన్యమని అనుభూతి కల్గసాగింది.కాని నేనే శూన్యమని తెలిసిన గూడ నేను ఏందుకు శూన్యములో శూన్యము గావడము లేదో నాకు అర్ధముకాలేదు.నేను అనేది శూన్యమని తెలిసింది.కాని నేను అనేది శూన్యమవ్వడము లేదంటే నాలో నేను కాని నేను అనేది మరొకటి ఉన్నదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.దానితో నేను కాని నేను అనేది ఏమిటో తెలుసుకోవాలని జ్ఞానస్ఫురణ కలుగుతూండగా... ఇంతలో నా మనస్సు ఈ బిందువులోనికి ప్రవేశించగానే అందులో మొదట నాలుగు ద్వారాలు కనిపించాయి.ఆ తర్వాత నక్షత్రాకార పంచ బిందువులు దర్శనమిచ్చాయి.ఆ తర్వాత షట్ కోణములో ఆరుబిందువుల దర్శనమై..ఆ తర్వాత త్రికోణములో మూడు బిందువులు..దీని మధ్యభాగములో ఒక అతి చిన్న రేణువుగా బిందు దర్శనమైంది.దీని దగ్గరికి నా మనస్సు వెళ్ళగా..ఈ బిందువు లోపల అమృత జలములో ఒక టాబ్లెట్ ఆకార పరిమాణమున్న పరిశుద్ధ స్ఫటిక మణి గా కనపడుతూ ఇందులో ఉన్న న్యూక్లియర్ శక్తి కాస్త విద్యుతు శక్తితో మెరుస్తూ ఉండేసరికి దీనిని చూడగానే నాకు ఉన్నట్టుండి ఇది కాస్త అంజి సినిమాలో చూపించిన స్ఫటిక ఆత్మలింగములాగా ఉన్నదని నాకు జ్ఞాపకము రావడముతో నాకు ధ్యానభంగమైంది.

విచారణ మొదలుపెట్టి నాకు శూన్యబిందువులో కనిపించిన వాటిని గుర్తు చేసుకోవడము ఆరంభించాను.అనగా నాలుగు ద్వారాలు, పంచబిందువులు, ఆరుబిందువులు,మూడు బిందువులు కలిపి చూడగా 4+5+6+3=18 వచ్చింది.ఈ సంఖ్యను చూడగానే నాకు మహాభారతములోని కొన్ని విషయాలు జ్ఞాపకము వచ్చాయి.అనగా  

మహాభారతములో 18 పర్వాలు...
కౌరవుల సైన్యం 11 అక్షేణాలు,పాండవుల సైన్యం 7అక్షేణాలు కలిపితే 18 అక్షేణాలు
ఈ యుద్ధము 18 రోజులుపాటు జరిగితే..
ఇందులో చివరికి 18 మంది మాత్రమే మిగిలినారు.
ఈ యుద్ధ సైన్యము లెక్క కడితే...
ఏనుగుల సంఖ్య 21870
రధాల సంఖ్య 21870
గుర్రాల సంఖ్య 65610 [3 రెట్లు 21870]
సైనికుల సంఖ్య 109350 [5 రెట్లు 21870] 
వీటి మొత్తము సంఖ్య 218700 ... 
ఈ సంఖ్యలను కలిపి కూడితే 18(2+1+8+7=18) వస్తుంది.

భగవద్గీతలో ఉండే అధ్యాయాలు 18

భారతీయ పురాణ ఇతిహసాలయందు 18 సంఖ్యను తీసుకుంటే...ఇది

నాలుగు వేదాలలో ప్రతి వేదమునకున్న అధ్యాయాలు 18

పురాణాలు 18, ఉప పురాణాలు 18, ధర్మా శాస్త్రాలు 18


ఇక మన దేహములో 
పంచేంద్రియాలు -5 (కన్ను,ముక్కు,చెవి,నోరు,చర్మం)
జ్ఞానేంద్రియాలు - 5 (చూచుట,వాసన,వినుట,రుచి,స్ఫర్శ), 
మనోచిత్తాలు --4 (మనస్సు.బుద్ది,చిత్తం,అహంకారము)
గుణాలు - 3 (సత్వ,రజో,తమో  )
జీవశక్తి...1 
ఇలా వీటిని కలిపితే 5+5+4+3+1 వచ్చేది గూడ 18

అయ్యప్ప స్వామి మెట్లు ---18
వేదాలలో చెప్పబడిన అస్త్రాలు ... 18
ఆదిత్యహృదయములో శ్లోకాలు ...18
దుర్గాదేవికి చేతులు ...18
అని.........


అలాగే కర్మసిద్ధాంతములో 18 మంది కర్మప్రదాతలున్నారని చెప్పడము జరిగింది.వారు నాలుగు వేదాల జ్ఞానప్రతినిధులు(4),...పంచభూతాలు (5) ...,షట్ కాల ప్రతినిధులు అనగా సూర్య,చంద్ర,పగలు,రాత్రి,రెండు ఉభయ సంధ్యకాలాలు (6)...ఆ తర్వాత ఆత్మ...ధర్మగుణము...యమధర్మరాజు (3)..ఇలా ఈ 18 మంది ఉంటారని తెలుసుకున్నాను.

ఇంతవరకు బాగానే ఉంది. కాని నా సాధనకి ఈ 18 సంఖ్యకి గల సంబంధము ఏమిటో నాకు ఒక పట్టనా అర్ధము కాలేదు.కాని ఇందులో ఏదో తెలియని మర్మరహస్యమున్నదని నాకర్ధమైంది.బాగా విచారణ చేస్తే ఇది భావస్దితి గతులను తెలుపుతోందని అనగా మనలోని ప్రతిభావానికి 18 భావస్ధితి గతులుంటాయని నాకు జ్ఞానస్ఫురణ అయింది.అనగా ఆనంద భావము తీసుకొని ఉంటే 18 రకాల ఆనందాలుంటాయి అన్నమాట.అలా మీరు ఏ భావము తీసుకున్న దానికి 18 రకాల ఒకేరకమైన భావాలుంటాయి.ఉదహారణకు మన తెలుగు భాషలో స్త్రీ మూర్తి అనే పదము చెప్పటానికి ఎన్ని పదాలున్నాయో మీకు తెలుసా? వనిత, కాంత, పడతి,మహిళ, రమణి,వెలది,ఆడది,అతివ, కోమలి,నారి,నవల,నాతి,యువతి, రత్న,మగువ,భామ,తరుణి,కళ్యాణి ... ఇలా 18 పేర్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే నాలో ఉన్న శూన్యభావానికి గూడ 18 రకాల శూన్యస్ధితులు ఉండి ఉండాలి.అంటే ప్రారంభ శూన్యబిందువులోనికి నా మనస్సు వెళ్ళడముతో ఈ 18 శూన్యస్ధితి గుర్తులు అనగా 4+5+6+3 అనేవి అనగా శూన్యభావము,శూన్యము,మహా శూన్యము, పరమశూన్యము... .... ..... ఇలా పూర్ణశూన్యముగా 18 స్ధితిలుంటాయని నాకర్ధమైంది.ఈ లెక్కన చూస్తే తను ఇపుదు శూన్యభావ బిందువు నుండి పూర్ణశూన్య బిందువైన ఆత్మలింగ దర్శనమైనదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.అంటే ప్రస్తుతం నా సాధన శూన్యభావస్ధితి నుండి పూర్ణశూన్యస్ధితి వైపుకి వెళ్ళిందని అనగా నేను నుండి నేను కాని నేను దగ్గరికి చేరుకుందని నాకర్ధమైంది.



కాని నాలో ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇంక దొరకలేదు. అవి ఏమిటంటే గోముఖ తీర్ధములో బడబాగ్ని ఏర్పడటానికి మూలము మేది?నేను కాని నేను ఏవరు? నేను అనే శూన్యము ఆదిలో అనాది ఉన్న పూర్ణశూన్యములో ఎలా లయం అవుతుంది?అసలు ఆదిదేవుడు  మోక్షం పొందాడా? అలాగే నాకు కనిపించిన ఆత్మలింగం ఎవరిది? అనే వాటికి సమాధానాలు పొందవలసి ఉంటుందని నాకర్ధమైంది.ఇది ఇలా యుండగా ఒకరోజు నేను తీవ్రధ్యానస్ధితిలో ఉండగా..నా బ్రహ్మరంధ్ర గుహ దర్శనమైంది.యధావిదిగా గోముఖ తీర్ధ దర్శనము అందులో చింతామణి యుతమైన మణిపద్మ దర్శనమైనాయి.కాని ఈ మణికి కాంతి మెరుపు ఎక్కడ నుండి వస్తోందో అర్ధము కాలేదు.ఎందుకంటే రత్నాలు లేదా మణులు స్వయంగా మెరవలేవు.వీటి మీద ఏదైనా కాంతి ప్రసరణ జరిగితే కాని ఇవి కాంతి మెరుపును ఇవ్వలేవు.అంటే ఈ లెక్కన చూస్తే ఈ మణిపద్మము మెరవటానికి కాంతిని ప్రసరింప చేసేది ఏదో ఉండి ఉండాలా గదా అనుకొనేసరికి ఈ మణిపద్మము ఉన్న నీటి అడుగుభాగములో పరిశుద్ధ స్ఫటిక మణి అయిన ఆత్మలింగము విద్యుత్ కాంతితో మెరుస్తు కనిపించింది.అంటే దీని వలన మణిపద్మములోని చింతామణి మెరుస్తోందని...పైగా దీనికి ఉన్న న్యూక్లియర్ శక్తి వలన బడావాగ్ని కల్గిందని నాకర్ధమైంది.మరి ఈ ఆత్మలింగము ఎవరిది అనుకొనేలోపుల నా ధ్యానభంగమైంది.

ఆత్మలింగ మణి రావడం:



ఆ తర్వాత కొన్నిరోజులకి మా ఆవిడ తన కుటుంబసభ్యులతో కలిసి హరిద్వార్ క్షేత్రదర్శనానికి వెళ్ళింది.అక్కడ అన్ని దైవదర్శనాలు పూర్తిచేసుకొని షాపింగ్ చేస్తూ నా కోసము ఒక అంగుళము ఉన్న స్ఫటిక బాణలింగమును ఎందుకో కొని నాకు తెచ్చింది.దీనిని చూడగానే నాకు ధ్యానములో కనిపించిన స్ఫటిక ఆత్మలింగమని అనిపించింది.మెడలో వేసుకొని ధ్యానాలు చెయ్యడము ఆరంభించాను.ఆ తర్వాత స్ఫటిక లింగారాధన తెలుసుకోవాలని లింగపురాణము తిరగవెయ్యగా...ఈ స్ఫటిక లింగారాధన వలన 14 తరాలతోపాటుగా..ప్రస్తుత తరమైన 15వ తరము గూడ జన్మరాహిత్యము పొంది ఉన్నతలోక ప్రాప్తి కల్గుతుందని  చెప్పడము జరిగింది.గమ్మత్తు విషయము ఏమిటంటే హరిద్వార్ క్షేత్రములో ప్రతిజీవి 48 తరాల పుట్టుపూర్వాత్తరాలు నాడీ గ్రంథాలలో నిక్షిప్తమై ఉంటాయని...అంటే ఈ క్షేత్ర స్ఫటికలింగాలు ఈ తరాలను తరింపచేస్తాయని..అంటే ఈ క్షేత్రములో ప్రతిజీవి ఆత్మలింగము అక్కడ ఉంటుందని..ఎందుకంటే మన మూలాధార చక్రములోని స్వయంభూ లింగమే మన ఆత్మలింగమని అలాగే ఈ చక్ర క్షేత్రము హరిద్వార్ గావడము వలన ఖచ్చితముగా మన ఆత్మలింగాలు అక్కడే ఉంటాయని నాకు జ్ఞానస్ఫురణ అయింది.దీనికి నిదర్శనముగా నాకు నా ఆత్మలింగము ఈ క్షేత్రము నుండే రావడము జరిగింది.ఆ తర్వాత ఒకరోజు నా తీవ్రమైన ధ్యానములో ఉండగా నా మనోదృష్టి యందు నా బ్రహ్మరంధ్ర గుహ కనిపించింది.అపుడు ఈ గుహ యందు నాకు వచ్చిన స్ఫటిక ఆత్మమణి కనిపించింది.ఇంతలో బ్రహ్మరంధ్రము నుండి ఒక తెలుపు వర్ణ కాంతి ప్రసారము ఒక కాంతిమార్గముగా ప్రయాణిస్తూ ఈ ఆత్మమణి మీద పడింది.అపుడు సుమారుగా 200-300 మంది అనగా బియ్యపుగింజ పరిమాణములో ఉన్న నల్లటి మానవ శరీరధారులు కలిసి ఈ ఆత్మమణిని ఈ కాంతిమార్గము ద్వారా బ్రహ్మరంధ్రము వద్దకు చేర్చిగానే ఈ మణి కాస్త విశ్వ శూన్యములో కలిసిపోయి శూన్యమైన దృశ్యము చూస్తూండగా ఇంతకి ఈ లిల్లిపూట్స్ ఎవరు అనుకోగానే నా ధ్యానభంగమైంది.

ఇంతటితో నా బౌద్ధ పవన్ లామా దీక్ష ఆగిపోయింది.ఎందుకంటే నేను అనేది పూర్ణశూన్యమని ఈ ధర్మ విధివిధానాల ద్వారా నాకు తెలిసింది.కాని నేను అనే శూన్యము అనాదిగా వస్తున్న పూర్ణశూన్యములో లయము చెందాలంటే వీరి విధివిధానములో చాలా కఠినమైన విధానాలున్నాయి.ప్రతినిత్యము కఠిన యోగాసనాలు,నిత్య బిక్షాటన,ఇంద్రియనిగ్రహ సాధన,గురులామా సేవలు,ప్రకృతి సేవలు,సమాజ సేవలు,జనారాణ్యమునకు దూరంగా పర్ణశాల ఆవాసాలు..ఇలా సవాలక్ష ధర్మాలున్నాయి.వీటిని అమలు చెయ్యకల్గితే ఖచ్చితంగా మోక్షప్రాప్తి కల్గుతుంది.వీరి ధర్మములో ఎంతో మంది లామాలు తమ అంతిమ ఘడియలలో తమ వజ్రనాడిలో ఉన్న పంచవర్ణ నాడులను ఏకము చేసి అనగా పంచభూతాల సిద్ధి పొంది ఆపై పంచవర్ణ కాంతి మెరుపుగా అనగా నీలము,పసుపు,ఎరుపు,తెలుపు,నలుపు వర్ణాలతో ఆకాశములో మెరుపు కాంతిగా మారి అదృశ్యమవుతారని ఇలాంటి వారిని రెయిన్ బో బాడీలంటారని ...  వీరి భౌద్ధ ధర్మ గ్రంథాలు చెప్పడము జరిగినది.ఈ ధర్మములో ఉన్న  ఈ విధానము పొందలంటే అంత ఆషామాషి కాదని నాకర్ధమై ఈ లామాదీక్ష నుండి తప్పుకోవడము జరిగింది.

నాగమణి దర్శనం:

దానితో తిరిగి హైందవ ధర్మములోనికి అడుగుపెట్టాను.నేను కాని నేను ఎవరో ఎలా తెలుసుకోవాలో నాకు ఒక పట్టనా అర్ధము కాలేదు.ఆ తర్వాత నేను యధావిధిగా ఓంకార నాద సాధన చేస్తూ ఉండగా మా పూజ గదిలో ఉన్న మంచి నీళ్ళ టాప్ నుండి నీళ్ళు బొట్టు...బొట్టుగా కారడము మొదలైంది.నేను సరిగ్గా ధ్యానము చేసే సమయానికి మంచినీళ్ళు రావడము పూర్తి అయ్యి..బొట్టులుగా పడి నా ధ్యానమునకు ఆంటకమేర్పించేది.ఈ శబ్ధం రాను రాను నాలో విసుగు,చికాకు తెప్పించేది.ఒకరోజు టి.వి లో ఒక యోగిని ఎపుడు గూడ నీటి సవ్వడి శబ్ధసాధన చేస్తుందని చెప్పిన దాని విని నాకు ఆశ్చర్యమేసింది. అంటే ట్యాప్ నీళ్ళ శబ్ధము గూడ నీటి సవ్వడి శబ్ధమే గదాయని..ఈ శబ్ధనాదము వినడము అభ్యాసము చెయ్యడము ఆరంభించాను.తద్వారా నా మనస్సు ఏదో చెప్పటానికి వీలులేని శాంతిస్ధితికి వెళ్ళడము నేను గమనించాను.కొన్ని రోజులు ఇలా గడించింది.ఒకరోజు శివపురాణము చదువుతుండగా ఈయన 48 ని..పాటు ఇలాంటి శబ్ధనాద సాధన చేస్తారని..దీనిని తుంకారనాదమంటారని..ఇది ఓంకార నాదము కన్నా మిన్నయని నాకర్ధమై ఈ నీటి బొట్టు శబ్ధనాద సాధన చేస్తుండగా..కొన్ని నెలలకి నా మనస్సులో ఓంకారనాదము ఆగిపోయి..చెవులకి వినిపించకుండా..మనస్సుకి మాత్రమే వినిపించే విశ్వ నిశ్శబ్ధ నాదమైన తుంకార నాదము  వినిపించడము ఆరంభమైంది.దానితో నాకు నీళ్ళ ట్యాప్ శబ్ధముతో పనిలేకుండా పోయింది.ఇలా తుంకార నాదమును సాధన చేస్తుండగా ఒకరోజు నాకు ధ్యానములో నా బ్రహ్మరంధ్ర గుహ దర్శనమైంది.గోముఖ తీర్ధ దర్శనమైంది.ఇందులోంచి బంగారపు వర్ణము ఉన్న ఒక దేవత సర్పము ఈ గుండము నుండి తల బయటికి పెట్టి అటు ఇటూ తల ఊపుతూ చూస్తోంది.విచిత్రము ఏమిటంటే దీని కంఠ లోపలి భాగములో ఏదో మణి మెరుసున్నట్లుగా నాకు చాలా స్ఫష్టంగా కనపడింది.మరి ఈ మణి అనేది నాగమణి అయితే తల మీద గదా ఉండాలి..మరి దీని కంఠములో ఎందుకున్నది అనుకోగానే నాకు ధ్యానభంగమైంది.   విచారణ చేస్తే నాగశాస్త్రము ప్రకారము దేవత సర్పాలకి నాగమణి తల మీద ఉండదని..వీటి కంఠభాగములో ఉంటుందని..అవి ఎలా ఏర్పడతాయో సవివరంగా వ్రాసి ఉంది.అంటే నాకు కలిగిన ఈ నాగమణి ధ్యానానుభవము నిజమే అనటానికి సాక్ష్యముగా నాకు నేపాల్ నుండి ఒక సర్ప లాకెట్ వచ్చింది.దీని కంఠములో మణిపూస ఉంది.దీనిని మెడలో వేసుకొని ధ్యానము చెయ్యగానే నాకు ధ్యానములో నాగమణిఉన్న నాగసర్పము సజీవమూర్తిగా నా బ్రహ్మరంధ్ర గుహయందు పలుమార్లు దర్శమివ్వడము జరిగింది.విచిత్రము ఏమిటంటే ఈ మణిపూసలో ఒక సర్పకార గీత ఉన్నదని నేను గమనించాను.నిజానికి ఇది నాగమణి కాదు కాని నాగమణి ప్రభావము దీనికి ఉన్నదని నాకర్ధమైంది.అసలు దీనికి ఈ ప్రభావము ఎలా వచ్చినదని ఆరా తీయగా..నెట్ లో నేపాల్ దేశములో పశుపతి ఆలయము ప్రక్కగా వాసుకి సర్పాలయమున్నదని...అలాగే ఈ నిజమైన పసుపు లేదా బంగారపు వర్ణ రంగు నాగమణి ఉన్నదని..ప్రతి సం.ము నాగపంచమినాడు ఈ నాగమణి బయటికి తీసి పశుపతినాధుడి ఆలయములో ఉంచి పూజ చేసిన తర్వాత ఈ దేవాలయములోని అన్ని లైట్ల్ ఆర్పివేయగా..ఈ నాగమణి మెరుపు కాంతి రెండు కి.మీ దాకా వ్యాపిస్తుందని చెప్పిన వీడియోను నేను చూడటము జరిగింది.అంటే ఈ లెక్కన చూస్తే నాకు వచ్చిన నాగమణి స్ఫటిక పూస గూడ ఈ నేపాల్ ప్రాంతము నుండి రావడము వలన అక్కడ ఉన్న నిజ నాగమణి ప్రభావము దీనికి సోకిందని అనగా ఇనుముకి అయస్కాంత శక్తి సోకినట్లుగా ఈ మణిపూసకి గూడ నాగమణి శక్తి సోకిందని నాకర్ధమైంది.

ఇలా నాకు మొదట అమెరికా నుండి చింతామణి..ఆ తర్వాత హరిద్వార్ నుండి స్ఫటిక ఆత్మలింగమణి..ఆపై ఇపుడు నేపాల్ నుండి నాగమణిపూస రావడముతో నేను కాస్త మణివేదాంతిగా మారి మణులు మీద పరిశోధనాలు చెయ్యడము ఆరంభించాను.ఇలా ఒకరోజు నేను మంచి నిద్రలో ఉండగా..నాకు కలలో సుమారుగా ఆరు మణుల కాంతులు విపరీతమైన వెలుగులు చిమ్ముతూ కనిపించేసరికి నాకు మెలుకువ వచ్చింది.నిజానికి ఇలాంటి ధ్యానానుభవాలు ఇప్పడిదాకా ధ్యానములో మాత్రమే కనిపించేవి.ఇపుడు కలలో కనిపించి అపై ఇవి ఇలలోకి వస్తే నా పరిస్ధితి ఏమిటని అనుకున్నాను.ఇంతకి నా కలలో కనిపించిన ఆరు మణులు ఏమిటో తెలుసుకోవాలని వాటి రంగులను గుర్తు చేసుకుంటూ రత్నశాస్త్రమును తిరగవెయ్యడము ఆరంభించాను.అవి 1.నాగమణి 2. రుద్రమణి 3.చింతామణి 4. కౌస్తుభమణి 5. శమంతకమణి 6. ఇంద్రమణి అని నాకర్ధమైంది.కాని నిజానికి దేవతలు అలాగే రాక్షసులు సాగర మధనము చేసేటపుడు 14 మణులు ఉద్భవించాయని..వాటిలో నేను నా కలలో ఆరు మణులను మాత్రమే చూశానని నాకర్ధమైంది.ఈ మణులు గోల ఇలా ఉంటే ఒకరోజు నాకు ధ్యానములో బ్రహ్మరంధ్ర గుహ యందు కుడి అరచెయ్యిలో శమంతమణి కనిపించింది.అంటే ఇది గూడ భూమి మీద ఎక్కడో చోట తప్పని సరిగా ఉండి ఉండాలి గదా అనుకోగానే నాకు ధ్యానభంగమైంది.మీకు గుర్తుందా..మా సహస్ర చక్ర సాధనలో ఉండగా శమంతమణి ఎక్కడ ఉన్నదో కనిపెట్టడం..ఆ తర్వాత నాకు ధ్యానములో కొన్ని వందల ఆవులు వచ్చి నా శరీరమును గాయలు చేస్తూ తొక్కిన ధ్యానానుభవము పొందాను గదా.ఇపుడు నాకు కల్గిన ఈ శమంతకమణి ధ్యానానుభవ దర్శనముతో... ఈ భూమి మీద ఎక్కడో ఉన్నదో సవిరముగా శాస్త్రీయ ఆధారాలతో తెలుసుకోవాలని నాకు బలంగా అనిపించి సాగింది.దానితో మణివేదాంతి గా మారి శమంతకమణి మీద పరిశోధన చెయ్యడము ఆరంభించాను. 

శమంతకమణి మీద నా శాస్త్రీయ పరిశోధన :

               యుగాల ఆరంభములో అంటే దేవతలు, అలాగే రాక్షసులు కలిసి పాల సముద్రమును చిలికినపుడు లక్ష్మీదేవితో పాటుగా కౌస్తుభమణి వచ్చిందని. దీనిని విష్ణుమూర్తి తీసుకున్నాడని తెలిసినది! ఆ తర్వాత వచ్చిన చంద్రుడితో పాటుగా శమంతకమణి వస్తే.....దీనిని మహాశివుడు తీసుకున్నాడని......ఆయన కాస్త చంద్రుడిని తల సిగలో అర్ధ చంద్రుడిగా పెట్టుకున్నాడని.......ఈ శమంతకమణిని మాత్రము ధరిస్తూ సోమనాథ్ శివలింగమూర్తిగా మారినాడని....శాపం వలన వచ్చిన కుష్టు వ్యాధిని శివుడు నివారణ చెయ్యడము వలన దీనికి కృతజ్ఞతగా చంద్రుడు తన దగ్గర ఉన్న మణిని శివుడికి ఇచ్చి...... ఒక శివలింగమూర్తిగా తన చేతుల మీద పూజించాడని అందుకే గుజరాత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధమ శివలింగముగా సోమనాథ్ శివలింగము ఉన్నదని నేను తెల్సుకోవడము జరిగినది! అంటే ఈ లెక్కన చూస్తే యుగాలలో ప్రధమ యుగమైన కృతయుగము నందు ఈ శమంతకమణి కాస్త సోమనాథ్ శివాలయములో మహాశివుడి ఆధీనములో ఉండేదని ......

               ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగములో....ఈ సోమనాధ్ శివాలయము కాస్త బంగారపు స్తంభాల నుండి వెండి స్తంభాలుగా రావణ బ్రహ్మ చేసి.....శివానుగ్రహము పొంది....ఈ శమంతక మణిని వరంగా పొంది తనతో లంక ప్రాంతమునకు ఈ మణిని తరలించినాడని మరొక కధనము ద్వారా నేను తెలుసుకున్నాను! ఎందుకంటే సుందరకాండలో ఈ మణికి సంబంధించిన ప్రస్తావన ఉండటము గమనించాను ! అది ఏమిటంటే రావణ సంహారము జరుగుతున్న సమయములో శ్రీరాముడు కాస్త రావణ బ్రహ్మ మెడలో ఒక దివ్యమణి మెరవడము గమనించాడు! ఆయన మరణానంతరము ఈ మణిని హనుమంతుడికి శ్రీరాముడు ఇస్తూ దీని  శక్తిని భరించే ప్రాంతములో ఈ మణిని దాచమని...ఈ మణి ప్రభావము వలన రాబోవు కాలములో ఎన్నో అనర్ధాలు,ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని......అందువలన ఇది ఎవరి కంటపడకుండా  గుప్తముగా దాచమని చెప్పడముతో హనుమంతుడు కాస్త ఈ మణిని రావణబ్రహ్మ ఉపయోగించిన దివ్య నౌక యొక్క ముందు భాగములో....అడుగున ఈ మణిని అమర్చి.... ఈ నౌకను సముద్ర గర్భము అట్ట అడుగున దాచి ఉంచినాడు! ఆనాటి నుండి ఈ మణిని నౌకామణి అనడము జరిగినదని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను! అప్పుడు నాకు ఒక చిన్న సందేహము వచ్చినది! అది ఏమిటంటే ఈ నౌక మణియే శమంతకమణి అని ఎలా అనగలము అనుకుంటే దీనికి సమాధానము వాల్మీకి రామాయణము ఇచ్చినది! అందులో రావణబ్రహ్మ సంహారము జరగటానికి ముందు....రావణ బ్రహ్మ భార్యయైన మండోదరికి మహాశివుడు దర్శన మిచ్చి "అమ్మా! రావణ బ్రహ్మ తన భక్తితో నా మెప్పుపొంది నా దగ్గర ఉన్న ఈ మణిని వరముగా పొందినాడు! రాబోవు కాలములో రావణ సంహారము జరుగుతోంది! అపుడు ఈ మణి వలన ఎవరికి ఉపయోగముండదు! పైగా దీని వలన పెను ప్రమాదాలు జరుగుతాయి! కాబట్టి ఈ మణిని తిరిగి ఇవ్వమని అడిగినాడని......" దానికి ఈమె ఇవ్వనని...... శివుడి ఆజ్ఞను ధిక్కరించినదని అనే కథనముండటము నాకు ఆశ్చర్యమన్పించినది. అంటే శివుడు దగ్గర ఉన్న శమంతకమణియే ఈ నౌకమణి అని తెలుస్తోంది గదాయని నేను సమాధానపడినాను! అంటే కృతయుగములో ఈ మణి కాస్త సోమనాధ్ శివలింగములో ఉంటే ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగములో ఈ మణి కాస్త నౌకలో ఉంది కాబట్టి నౌకామణి అయినదని నాకు గ్రహించడానికి అట్టే సమయము పట్టలేదు!

                ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగము నందు శ్రీ కృష్ణుడి కాలములో ఈ మణి కాస్త సత్రాజిత్తు అను  మహారాజుకి సూర్య అనుగ్రహము వలన చేరినది! ఆ తర్వాత వినాయక చవితిలో చెప్పబడిన శమంతకోపాఖ్యానం కధనము ప్రకారము అంతా జరిగి చివరికి ఈ మణి కాస్త శ్రీ కృష్ణుడి దగ్గరికి అదిగూడ శమంతకమణిగా చేరినదని నేను గ్రహించినాను! గాకపోతే నాకు అర్ధముకాని విషయము ఏమిటంటే త్రేతాయుగములో హనుమంతుడు కాస్త ఈ మణిని సముద్ర గర్భములో దాచిపెడితే.......ఆ తర్వాతవచ్చిన ద్వాపరయుగములో సూర్యుడికి ఈ మణి ఎలా చేరినదో అర్ధము కాలేదు! ఆ తర్వాత శ్రీ కృష్ణుడి నుండి ఈ మణి ఎక్కడికి వెళ్ళినదో గూడ అర్ధముకాలేదు! గాకపోతే శమంతకమణి ఉండటము నిజమేనని తెలుస్తోంది! పైగా ఇది బంగారము ఇస్తుందా? లేదా అనే సందేహాలకి సమాధానాలు లేవు! అనుకుంటూ వివిధ రకాల ఆలోచనలు చేస్తూ........ దీర్ఘ ఆలోచనలు చెయ్యడము ప్రారంభించినాను!
               

               త్రేతాయుగములో ఈ శమంతకమణి కాస్త నౌకమణిగా మారినదని మీరు ఈ పాటికే తెలుసుకున్నారు గదా! ఆ తరువాత ఇది శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా చేరినదో తెలుసుకున్నారు! కాని అసలు సూర్యుడికి ఎలా చేరినది తెలుసుకోవాలని నేను పరిశోధనలు చెయ్యడము ప్రారంభించాను! త్రేతాయుగములో హనుమంతుడు కాస్త ఈ నౌక మణి వలన చిరంజీవి తత్వమును పొందినాడు! దానితో ఈయన ఈ మణికి కాపలా కాస్తున్నాడు! ఒకానొక సమయములో తనకి సకల విద్యలు నేర్పించిన సూర్య భగవానునికి తన గురుదక్షిణగా ఈ నౌకమణిని ఆయనకి ఇస్తూ హనుమంతుడు కాస్త రామనామ తపో ధ్యానము కోసము హిమాలయాలకి వెళ్లిపోవడము జరిగినది! ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగములో తనను త్రికాల సంధ్యలతో సూర్యారాధన చేస్తూ తన మెప్పు పొందడము వలన సత్రాజిత్తుకి సూర్యభగవానుడి ద్వారా ఈ మణి అందడము జరిగినది! ఈయన నుండి చివరికి శ్రీకృష్ణుడికి ఈ మణి  చేరినదని మనకి వినాయక చవితి కధలో వచ్చే శమంతకోపాఖ్యానము ద్వారా తెలుస్తుంది!


ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణ సమయములో ఈ మణిని తిరిగి సోమనాధ్ దేవాలయములో ప్రతిష్టించాడు! ఎలా అంటే మధుర ప్రాంతము నుండి ద్వారకా నగరమునకు వచ్చినాడు! పైగా ఈయన ప్రభాస తీర్ధము వద్ద నిత్య సూర్యారాధన చేసినాడని   తెలుస్తోంది! పైగా ఈయన కాస్త సోమనాధ్ దేవాలయానికి ఉన్న వెండి స్తంభాలు తొలగించి సీసపు స్తంభాలతో ఈ దేవాలయము కట్టించాడని.......మరికొందరు గంధపు స్తంభాలతో ఈ దేవాలయమును కట్టించారని చెప్పడము జరుగుతోంది! నిజానికి ఈ దేవాలయములో ఇప్పుడికి ఉన్న 56  స్థంభాలలో రెండు సీసపు స్తంభాలు ఉన్నాయి! మిగిలిన 54  స్థంబాలు రాతితో ఉండటము మనము గమనించవచ్చును!

 నిజముగానే ఈ మణి కాస్త ప్రతిరోజు బంగారము ఇచ్చేదా?"అని విచారణ చేస్తే

 ఈ విశ్వ సృష్టిలో స్వయముగా రెండు మణులు మాత్రమే బంగారమును ఇవ్వగలవు! అదియే పరుసవేదిమణి అలాగే శమంతకమణి! పరుసవేదిమణి అయితే ఏదైనా లోహమును బంగారముగా మారిస్తే........శమంతకమణి మాత్రమే పాదరసమును బంగారముగా మారుస్తుంది అని తెలుసుకున్నాను

 " ఇది ఎలా సాధ్యము?" అని విచారణ చేస్తే  

 ఈ మణులు కేవలము ఒక పదార్థమును మరొక పదార్ధముగా మార్చి ఇస్తున్నాయని  వీటికి లోహాలు లేదా పాదరసము ఇవ్వకపోతే ఇవి కాస్త బంగారమును ఇవ్వలేవు! దీనినే సైన్స్ లో ఆల్ కెమిఅంటారు! ఒక పదార్థమును మరొక పదార్ధముగా మార్చడాన్ని ఆల్కెమీ అంటారు! ఒక ఐసోటోప్ ను తగ్గించడము లేదా పెంచడము వలన ఆ పదార్ధము  కాస్త మరొక పదార్ధముగా మారిపోతుంది! అంతెందుకు పాదరస ఐసోటోప్ 234 ను కాస్త ఐసోటోప్ 235 గా మారిస్తే అదికాస్తా బంగారముగా మారిపోవడము మన శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాల యందు కృత్రిమ బంగారమును తయారు చేసి నిరూపించినారు గదా! పూర్వీక మహర్షులు ఈ విధి విధానమునే రసవిద్యగా చెప్పడము జరిగినది! యోగివేమన, సి.నా.రే. స్వామి, భక్త రామప్ప ఇలాంటి వారందరు గూడ ఈ రసవిద్యజ్ఞానము పొందిన రస విద్య సిద్ధపురుషులు.ఈ లెక్కన చూస్తే శమంతకమణి అనేది బంగారము ఇవ్వడము జరుగుతుంది గదా! అదిగూడ సూర్యరశ్మి సమయములో ఇది కాస్త పాదరసమును బంగారముగామార్చి ఇస్తుంది! అంతెందుకు ఈ మణి ప్రభావము వలన అపుడికే పొందిన 1000 టన్నుల బంగారమును శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయములో బలరాముడికి ఇస్తూ దీనిని దేనికైనా వినియోగించమని చెప్పితే ....... ఆయన కాస్త విశ్వకర్మను పిలిపించి 108 వైష్ణవ దేవాలయ నిర్మాణాలకి ఈ బంగారమును ఉపయోగించినాడని చెప్పడము జరిగినదిగదా! ఇప్పుడికి మనకి అది ద్వారక మునిగిపోయే ప్రదేశములో శ్రీ కృష్ణుడు ఏర్పరిచిన రహస్య సొరంగ మార్గములలో ప్రయాణిస్తే వారికి అతి విలువైన బంగారపు ఆభరణాలు, విలువ కట్టలేని వజ్రాలు,కెంపులు, పచ్చలు ఇలా ఎన్నో ఉన్నాయని తెలుసుకొని.....పైగా వీటికి కాపలాగా సహస్ర నాగబంధము ఉండుటవలన ఈ మార్గములోనికి ఆశకొద్ది వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో వెనక్కి తిరిగి రాకపోవడముతో బ్రిటిష్ వాళ్ళు ఈ రహస్య సొరంగ మార్గమును మూసి వెయ్యడము జరిగినది అని ఈనాటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పడము జరిగినది గదా! ఈ లెక్కన చూస్తే శమంతకమణికి బంగారము ఇచ్చే గుణమున్నదని తెలుస్తోంది.

           ఇక ప్రస్తుత విషయానికి వస్తే ద్వాపరయుగములో ఈ మణి కాస్త తిరిగి సోమనాధ్ కి చేరినదని తెలుస్తోంది! మరి ప్రస్తుత కలియుగములో ఇది ఎక్కడ ఉన్నది అనే సందేహముతో నేను కాస్త దీని మీద లోతుగా పరిశోధన చెయ్యడము జరిగినది! ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సోమనాధ్ ఆలయములో ఈ మణి ఉన్న దాఖలాలు లేవు గదా!

          దానితో సోమనాథ్ దేవాలయ చరిత్రకి సంబంధించిన పుస్తక గ్రంధాలు తిరగవెయ్యడము ప్రారంభించినాను! ఈ దేవాలయము కాస్త ఏడు సార్లు ధ్వంసమై తిరిగి ఏడుసార్లు కట్టబడినదని నా పరిశోధనలో తెలుసుకున్నాను! ఈ విధ్వంస కాండ ఔరంగజేబుతో మొదలై ఘోరితో అంతమయినది! ఈ ఘోరీ దగ్గర నుండి రాజపుట్ లు ఈ మణిని సొంతము చేసుకున్నారు. వీళ్లల్లో చివరి రాజపుట్ రాజమాన్ సింగ్ . ఈయన శ్రీకృష్ణ భక్తుడు! మధుర క్షేత్రములో ఏడు అంతస్థుల బృందావన దేవాలయమును నిర్మించినాడు! ఈయనకి సంతానము లేదు! దానితో ఈయన అన్నగారి కుమారుడైన జగత్ సింగ్ ను దత్తతు తీసుకొని తన అధికారాలతో పాటు ఈ మణి సంరక్షణ బాధ్యతను ఈయనకి ఇచ్చాడు! ఈయన హనుమాన్ చాలీసా రచించిన గోస్వామి తులసీదాసుకి పరమశిష్యుడు గావడము విశేషము! ఒకానొక సమయములో ఈయనకి గురుదక్షిణగా ఈ జగత్ సింగ్ తన దగ్గర ఉన్న వంశ పార్యంపరముగా వస్తున్న శమంతకమణిని ఇవ్వడము జరిగినది! దానితో చివరికి ఈ మణి కాస్త తులసి దాసుకి చేరినది! అప్పుడికే ఈయనకి అన్నింటి యందు స్మశాన వైరాగ్యము ఉండడము వలన ఈ మణి మీద ఈయన అంతగా ఆశపడలేదు! శ్రద్ధ పెట్టలేదు! గాకపోతే భద్రముగా దాస్తూ ఉంచినాడు!
       
ఒకానొక సమయములో ఈయనకి శ్రీరామ సాక్షాత్కారమును పొందాలని విపరీతమైన ఆకాంక్ష మొదలైంది! దానితో తనకి ఈ సాక్షాత్కారము పొందాలంటే హనుమంతుడి అనుగ్రహమును పొందాలని తెలుసుకున్నాడు! దీని కోసము ఈయన కాస్త తులసి రామాయణము రచించి ప్రచారము చేస్తుండేవాడు! ఈ ప్రచార సమయములో ఒక వృద్ధుడు అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా చివరగా వెళ్ళడము ఈయన గమనించాడు! ఎందుకంటే శ్రీరామ  నామ సంకీర్తన లేదా రామాయణ కధనము జరుగుతున్న సమయాలలో హనుమంతుడు ఇలా వృద్దుడి రూపములో వచ్చి వీటిని వింటాడని ఈయనకి తెలుసు! బహుశా ఈ వృద్ధుడే హనుమంతుల వారైతే అనే ఆలోచన వచ్చి రాగానే.....తులసీదాసు ఒకరోజు ఈ వృద్దుడి వెంట రహస్యముగా వెంబడించాడు! కాశీలో ఉన్న ప్రస్తుతమున్న హనుమత్ ఘాట్ దగ్గరికి రాగానే తులసీదాసు వెంటనే ఏమి జరిగితే అది జరుగుతుంది అని ఈ వృద్ధుడి కాళ్ళ మీద పడగానే

ఆ వృద్ధుడు కాస్త "స్వామి! మీలాంటి పెద్దలు నాలాంటి కుష్టు వ్యాధి ఉన్న వారి కాళ్ళ మీద పడవచ్ఛునా? నిత్యరామ నామమును పలికే పెదవులు,రామ పాదాలు చూసే కళ్ళు, రామ పూజలు చేసే చేతులు, రామ అర్చనకి ఉపయోగించే కాళ్ళుతో....... దేహమంతా రామమయముగా చేసుకున్న మీలాంటి రామ భక్తులు నా బోటి వృద్ధుల కాళ్ళ మీద పడవచ్చునా?

తులసీదాసు ఏమాత్రము ఆలోచించకుండా "స్వామి! మీరు వృద్ధులుగా కనిపించే చిరంజీవితత్వమును పొందిన హనుమస్వామి యని ఈనాడే తెలుసుకున్నాను! మీ వలన నాకు రామ సాక్షాత్కారము కలిగేదాకా నేను మీ పాదాలు వదిలిపెట్టను అన్నాడు!"
                       దానితో ఈ వృద్ధుడు కాస్త నిజస్వరూపముగా హనుమంతుడిగా  దర్శనమిస్తూ "నాయనా నీ రామ భక్తికి మెచ్చాను! నీ రామాయణము వింటే ఆనాటి దృశ్యాలు నాకళ్ళ ముందు సజీవ దృశ్యాలుగా కనిపించినాయి! ఈ జన్మను ధన్యత చేకూర్చుకున్నావు! కాని శ్రీరామ సాక్షాత్కారమునకు ఒక అవాంతరముంది! అదియే నీ దగ్గర ఉన్న నౌకమణి నాకు గురుదక్షిణగా ఇవ్వగలవా? ఇస్తే నీకు తప్పకుండా రామ సాక్షాత్కారమును కలిగిస్తాను........

తులసీదాసు వెంటనే తన చేతి సంచిలో ఉన్న జగత్ సింగ్ ఇచ్చిన శమంతకమణి తిరిగి హనుమంతుడికి మారు మాట్లాడకుండా ఇవ్వడము హనుమంతుడు సంతోషిస్తూ "తులసీదాసు! ఇదే సమయములో ఇద్దరు  వ్యక్తులు రాజుల వేషములో గుర్రాల మీద ఇక్కడ నుండి వెళ్తారు! వాళ్లే శ్రీరామ లక్ష్మణులు! వారి పాదాలు పట్టుకో! నిజ స్వరూపముతో దర్శన మిస్తారని చెప్పి ఈయన ఈ మణితో సహా అంతర్ధాన మయినారు!

            కొద్దిసేపటికి హనుమంతుడు చెప్పినట్టు ఈ ఘాట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు రాజుల వేషధారణతో వస్తూండడము గమనించిన తులసీదాసు ఏమాత్రము ఆలోచించకుండా అందులో పెద్దవాడి పాదాల మీద పడగానే....ఈ విషయము గ్రహించిన వీరిద్దరు కాస్త తమ నిజ స్వరూపముతో శ్రీరామ సాక్షాత్కారమును దర్శనమిచ్చేసరికి తులసీదాసు కాస్త అమిత ఆనందపడినాడు! ఈ విధంగా తనకి శ్రీరామ సాక్షాత్కారము అలాగే హనుమత్ సాక్షాత్కారము ఈ ఘాట్ యందు కలుగుటవలన తులసీదాసు ఈ ఘాట్ కి హనుమాన్ ఘాట్ అని నామకరణము చేసినాడని ఈ స్థల పురాణము చెపుతోంది! ఈ లెక్కన చూస్తే శమంతకమణి తిరిగి హనుమంతుడి చేతికి రావడము ఆయన తిరిగి దానిని త్రేతాయుగములో ఏ సముద్రగర్భమునందు దాచి ఉంచినాడో మళ్ళీ ఈ కలియుగములో దానిని అక్కడే తిరిగి దాచి ఉంచినాడని నేను గ్రహించాను!

 తులసీదాసు చేతికి ఖచ్చితముగా శమంతకమణి చేరినదని రూఢి అయినదిగదా! గాకపోతే దానికి హనుమంతుడు తిరిగి సముద్రగర్భములో పెట్టినాడా? లేదా అన్నప్పుడు తులసీదాసుకి వచ్చిన వృద్దుడు హనుమంతుడు అని ఎలా తెలుసుకో కలిగినాడో మొదట మనము తెలుసుకోవాలి! అందుకు తులసీదాసు జీవితములో జరిగిన యదార్ధ సంఘటన ఒకటి నిదర్శనమవుతుంది! ప్రతిరోజు తులసీదాసుకి ఈ కాశిఘాట్ ల యందు గంగాస్నానము చెయ్యడము అలవాటు! అలాగే శ్రీరాముడి అభిషేకానికి గంగా జలమును ఒక కుండలో తీసుకొని వెళ్ళడముగూడ పరిపాటే! ఒకరోజు ఈయన అనుకోకుండా ఈ క్షేత్ర ఘాట్ దగ్గరిలో ఉన్న ఒక చెట్టు క్రింద నీళ్ల కుండతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది!

అప్పుడు ఈ చెట్టు క్రింద పెట్టిన నీళ్ల కుండలోని నీళ్లు మాయం అవ్వడము తులసీదాసు గమనించి ఇలా పలుమార్లు తెచ్చిన నీళ్లు మాయం అవ్వటము గమనించి ఈ చెట్టు మీద జలరాక్షసి ఉన్నదని తెలుసుకొని దానికిగూడ ప్రతిరోజు నీళ్లు సమర్పించడము అలవాటు చేసుకున్నాడు! ఒకరోజు ఈ చెట్టు నుండి అశరీరవాణితో ఒక గొంతు వినపడి "స్వామి! ఇలా ప్రతిరోజు మీరు నీళ్లు తెచ్చి నాకున్న దాహార్తి తీరుస్తున్నారుగదా! ఇందుకు మీకు ఏదైన ప్రత్యుపకారము చెయ్యాలని ఉంది అన్నపుడు
తులసీదాసు వెంటనే "నాకు శ్రీరామ సాక్షాత్కారము కలిగించగలవా? అన్నపుడు

వెంటనే అశరీర వాణి "స్వామి! నాకు అంత అర్హత ,యోగ్యత లేవు! కాని హనుమత్ సాక్షాత్కారమును కలిగించగలను! ఈయన అనుగ్రహమును మీరు పొందితే మీకు తప్పకుండా శ్రీరామ సాక్షాత్కారము కలుగుతుంది! అందుకు మీరు రామాయణము పారాయణము చెయ్యండి! అపుడు మీ దగ్గరికి అందరికంటే ముందుగా.......అలాగే అందరికంటే చాలా వెనుకగా ఒక వృద్ధుడు వెళుతూ ఉంటాడు! అయన శ్రీరామ బంటు అయిన హనుమంతుడని తెలుసుకోండి! ఆయన పాదాల మీద పడి వేడుకుంటే శ్రీరామ సాక్షాత్కార మార్గమును ఆయన మీకు చూపగలడని చెప్పడముతో.....తులసీదాసు కాస్త తులసీ రామాయణమును రచించి అందరి ముందు దానిని పారాయణము చెయ్యడము ప్రారంభించినాడు! ఆ తర్వాత ఈయనకి హనుమత్ దర్శనము......ఆపై శ్రీరామ సాక్షాత్కారము కలిగినది!

ఇక్కడ మనము గమనించవలసిన విషయము ఏమిటంటే జల రాక్షసి విషయం! త్రేతాయుగములో ఈమె ఉన్నదని చెప్పటానికి మనకి సుందరకాండలో 1 వ సర్గలో 187 ,189 ,196 శ్లోకాలు చూస్తే జలరాక్షసి గూర్చి వివరాలు తెలుస్తాయి! అనగా.......

దక్షిణస్య,సముద్రస్య, మిధ్యే తస్యతు
రాక్షసీ అంగారకేతి విఖ్యాతా , ఛాయాం
ఆకృష్య భోజనీ- 26 (కిష్కింద కాండ -4 )వ సర్గ
సుందరకాండ (1 వ సర్గ )
సమాక్షిప్తోస్మి సహసా, పంగూకృత పరాక్రమః
ప్రతిలోమేనవాతేన , మహా నేరివ సాగరే-1

తద్రుష్ట్వా చింతయామాస  
మారుతిర్ వికృతాననం
కపి రాజేన కథితం
సత్వం అద్భుతదర్శనం - 189

తతస్తస్యానఖై  స్త్రీక్షణై
మర్మాన్యుః కృతవానరః -196

ఈ శ్లోకాల ఆధారముగా చూస్తే సుగ్రీవుడు కాస్త హనుమంతుడితో "హనుమ! దక్షిణ సముద్రములో  మధ్య భాగములో నీడలన్నీ పట్టుకొని ఆకర్షించుకొని పట్టుకుని తినే రాక్షసి ఒకటి ఉన్నదని దానితో జాగ్రత్తగా ఉండు అని చెప్పడము జరిగినది! అలాగే హనుమంతుడు సీతాన్వేషణ కోసము దక్షిణవైపు సముద్రయానము చేస్తున్నపుడు తన శక్తిని లాగుకొనే ఆశ్చర్య శక్తి ఉన్న స్త్రీ రాక్షసిని చూడటము జరిగినదని.....ఈమెను తన గోర్లతో మర్మాంగాలను నాశనము చేసినాడని వాల్మీకి రామాయణములో ఉంది!

అంటే జలరాక్షసి ఉన్న ప్రాంతములోనే ఈ శమంతకమణిని హనుమంతుడు దాచిపెట్టి ఉండాలని నా పరిశోధనలో తెలిసినది.మరి ఈ ప్రాంతము ఎక్కడ ఉన్నదో శాస్త్రపురాణ ఇతిహాస గ్రంథాలు తిరగవెయ్యగా ....


 అది "ఇలా వృత్తపురములో" ఉంది  అని

 "ఇలా వృత్తపురము అంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నమాట! దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని గూడ పిలుస్తారుగదా! ఈ ప్రాంతములో ఇప్పుడికి ప్రయాణించే నౌకలు అలాగే గాలిలో ఎగిరే విమానాలు అంతు చిక్కకుండా అదృశ్యము అవుతుంది గదా! ఇదంతా అక్కడున్న జలరాక్షసి పనియే! ఎందుకంటే దీనికి నీడలు పట్టుకొని వాటిని మ్రింగడము అలవాటున్నదని...... సాక్షాత్తు హనుమంతుడిని మ్రింగితే ఆయన దీని కడుపులోకి వెళ్లి దాని అవయవాలు నాశనము చెయ్యడము అది చనిపోయినదని......కాని, ఈ వంశ వారసురాలు అక్కడ నుండి పారిపోయి ఈ ప్రాంతమునకు వచ్చి ఆవాసము చేస్తోందని హనుమంతుడు గ్రహించి ఈమె రక్షణలో తిరిగి తనకి వచ్చిన శమంతకమణిని సముద్రగర్భములో అదిగూడ బెర్ముడా ట్రయాంగిల్లో దాచినాడని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. పైగా ఇది పాతాళలోకము వెళ్ళుటకు దారిమార్గమని గ్రహించాను! అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళుటకు కృష్ణబిల్వము (బ్లాక్ హోల్స్) సహాయపడితే..... అదే అధోలోకాలకు వెళ్ళుటకు ఈ ట్రయాంగిల్ ఉపయోగపడతాయని నేను గ్రహించాను!
గాకపోతే కృష్ణ బిల్వాలలో అలాగే ఈ ట్రయాంగిల్  లో పడిన వస్తువులు లేదా వ్యక్తులు సరాసరి భూలోకము దాటి ఆయా లోకాలకి వెళ్లిపోవడము మనకి ఇవి ఆనవాళ్లు దొరకకుండా అదృశ్యమవుతున్నాయని నా పరిశోధనలో గ్రహించాను! అంటే ఈ లెక్కనచూస్తే కలియుగములో సోమనాధ్ శివలింగము నుండి తిరిగి సముద్ర గర్భమునకు అదే బెర్ముడా ట్రయాంగిల్  కి శమంతకమణి చేరినదని......ఇది పాతాళలోకములో ఉండుటవలన సూర్యరశ్మి లభించకపోవడము వలన ఈ మణి కాస్త బంగారము ఇవ్వలేక పోతుందని అలాగే శమంతకమణిని కళ్లారా చూసే యోగము లేదని....దానితో బంగారము తయారు చేసినవాడు ఎలా అయితే బైరాగి అవుతాడో అలాగే ఇలాంటి మణుల మీద ప్రయోగాలు చేసినవాడు మణివేదాంతి అవ్వక తప్పదని నాకర్ధమయి  మౌనము వహించాను!

ఆరు మణుల దర్శనం

ఇది ఇలాయుంటే... ప్రకృతి మాయ మొదలైంది.అనగా  పద్మ, నాగలక్ష్మి, నాగమణి, మణిప్రభావతి, శాంతి అనే ఆంటీలు నన్ను అదోలా చూడటము మొదలుపెట్టారు.వాళ్ళ మనస్సులలోని నా మీద ఉన్న కామకోరిక భావాలు నా మనస్సుకి అందుతున్నాయి.అప్పుడికే నేను కాస్త ద్వంద్వ భావస్ధితి నుండి ఏకభావస్ధితికి రావడము పైగా ఈ జడ అస్ధిపంజరమును చర్మము అనే వస్త్రముతో కప్పి ఉన్నదని..ఈ చర్మ వస్త్రమును చూసి వీరంతా నా మోహములో పడుతున్నారని.. అదే నేను చచ్చిన తర్వాత ఉండే అస్ధిపంజరము మీద వీరికి ఇలాంటి మోహవేశముంటుందా ? అని నాకు అనిపించి ఇదంతా ప్రకృతిమాయ అనుకొని ఏమి జరుగుతుందో చూడాలని వీళ్ళ యందు స్మశాన వైరాగ్యముతో ఉన్నాను.ఇలా కొన్ని నెలలు గడించాయి.వీళ్ళు విచిత్రముగా ఒకరికి తెలియకుండా మరొకరు  తమ కామ ప్రకోప చేష్టలతో నా మీద మన్మధ బాణాలు వేసిన నా మనస్సు చలించలేదు.ఎందుకంటే అది అపుడికే కోరికాతీత స్ధితికి చేరుకుంది.పాపము నాకున్న ఇంద్రియ నిగ్రహ శక్తికి వీళ్ళంతా తలవంచకతప్పలేదు.దానితో వారి మనస్సులలో నా మీద కామమోహ మాయ పొరలు తగ్గి నా మీద దైవత్వభావము రావడము నా మనస్సుకి అందడము మొదలైంది.ఆ తర్వాత నాకు ధ్యానములో వరుసగా నా బ్రహ్మరంధ్ర గుహ యందు ఎవరిదో కుడి అర చెయ్యి మీద మూడు అంగుళాల పరిమాణములో ఉండి నిండునీలిరంగులో ఉన్న రుద్రమణి దర్శనమైంది.కొన్ని క్షణాలు తర్వాత ఈ మణి అదృశ్యమై దీని స్ధానములో బంగారపు వర్ణములో ఉన్న నాగమణి..ఆపై జేగురు రంగులో ఉన్న చింతామణి..ఆపై లేత నీలిరంగులో ఉన్న కౌస్తుభమణి..ఆపై లేత గులాబి రంగులో ఉన్న శమంతకమణి..ఆపై కాకినలుపు రంగులో ఉన్న ఇంద్రమణి దర్శనమైనాయి.ఇలా ఈ ఆరు మణులు కలిసి మళ్ళీ షట్ కోణాకారములో కనిపించినాయి.కొన్ని క్షణాలు తర్వాత ఈ షట్కోణము కాస్త చిన్ముద్ర అరచెయ్యిలో ఇమిడిపోయే దృశ్యము కానవచ్చింది.ఈ దృశ్యము చూస్తుండగా ఈ ఆరుమణులలో నాకు కనిపించిన స్ఫటికమణి లేదని అదే ఆత్మలింగమణి లేదని..మరి ఇది ఏది అలాగే ఈ చెయ్యి ఏవరిది అనుకొనేలోపుల..ఈ కనిపించి చిన్ముద్ర హస్తము యొక్క చూపుడువ్రేలు అలాగే బొటనవ్రేలు కలిసి ముద్రగా ఏర్పడిన చోటు నుండి నేను చూసిన స్ఫటిక ఆత్మమణి జారి నీళ్ళలో పడే దృశ్యమును నేను చూస్తుండగానే అది అదృశ్యమైంది.నాకు ధ్యానభంగమైంది.విచారణ చేసుకుంటే  ఆత్మమణి అనేది 64 కపాలధారిదని ఎందుకంటే ఈయన చిన్ముద్ర హస్తము కాస్త యోగాగ్నిలో దహనము కాకుండా సజీవముగా ఉన్నది గదా.ఇపుడు ఈ హస్తము నుండే ఆత్మమణి విడివడి జలములో పడింది గదా.ఈ జలమే గోముఖ తీర్ధమని నాకర్ధమైంది.ఇంతవరకు బాగానే ఉంది.కాని ఈ డృశ్యానికి నాకు పంచమాయలుగా వచ్చిన పంచ ఆంటీలకి ఏమి సంబంధమో నాకు ఒక పట్టాన అర్ధము కాలేదు.బాగా ఆలోచనలు చేసిన తర్వాత వీరి పేర్లు చూస్తే వరుసగా ..పద్మ..నాగలక్ష్మీ..నాగమణి...మణిప్రభావతి..శాంతి  ... అనే బట్టి చూస్తే మణిపద్మము, నాగపాము, నాగమణి ధ్యానానుభవాలు నాకు కల్గేవి కావని అలాగే ఈ మణి మాయలో  పడిఉంటే నాకు శాంతి లభించేది గాదని..అంటే ఈ పంచ స్త్రీల కామమాయలో నేను పడిఉంటే నాకు ఆరుమణులు ధ్యానానుభవాలు కల్గేవిగావని..ఇంతటితో నా సాధన అర్ధాంతరముగా ఆగిపోయేదని నాకర్ధమైంది.  

కాలాముఖ శివలింగాల దర్శనం:

ఇలా ఈ ఆరు మణుల గోల ఉండగా...ఒకరోజు నేను చేస్తున్న తుంకార సాధన తీవ్రస్ధాయిలో ఉండగా నాకు నా బ్రహ్మరంధ్ర గుహ దర్శనమైంది.ఈ సారి మూడు అంగుళాలుండి తెల్లని గుండ్రని పానమట్టమున్న తెల్ల బాణలింగమున్న శివలింగము దర్శనమైన కొన్ని క్షణాలు తర్వాత బ్రహ్మరంధ్రము నుండి ఈ గుహలోని దివ్య తేజస్సు ప్రసరించగానే..ఈ తెల్లని శివలింగము గాలిలోనికి లేచి ఈ రంధ్రము ద్వారా బయట ఉన్న విశ్వశూన్యములోనికి వెళ్ళి అదృశ్యమైంది.
అసలు ఈ పురుష శివలింగము దేనికి సంకేతమో ఇది ఎలా ఎందుకు ఏర్పడినదో ఎందుకు బ్రహ్మరంధ్రము నుండి బయటకి వెళ్ళినదో పరమహంసకి ఒకపట్టాన అర్ధముకాలేదు.ఇంతలో ఉన్నట్టుండి నీలిరంగు శరీరముతో కండలు తిరిగిన శరీరముతో జటాజూటమున్న ఒక ఆజానుబాహుడు కనిపించాడు.మెదలో రుద్రాక్ష మాలలు,చేతికి రుద్రాక్ష మాలలు ఉన్నాయి.పైగా అటవిక జాతి మనిషిలాగా కనిపించాడు.అపుడిదాకా ప్రశాంతముగా కనిపించిన ఈయన కాస్త ఉన్నట్టుండి ఉన్మాద అవధూత స్థితికి వెళ్ళి విలయతాండవము చేస్తూ కనిపించాడు.ఒక్కసారిగా గుండ్రని పానవట్టమున్న నల్లని శివలింగమును పట్టుకొని దానిని నోటిలో వేసుకొని మ్రింగేసరికి ఈ లింగము కాస్త కడుపులోకి చేరి అదికాస్త తెల్లని స్ఫటికలింగముగా మారే దృశ్యము పరమహంసకి చాలా స్ఫష్టముగా కనిపించసాగింది.ఆ తర్వాత ఈ దేహము అదృశ్యమై తెల్లని శివలింగములాగా మారిపోయాడు.అంటే..అంటే..ఈయన పురుష ప్రకృతికి సంకేతమయ్యే ఉంటాడని ఈ ప్రకృతి వినాశనము చెంది తెల్లని పురుష శివలింగమైనదని ఇపుడు ఈ శివలింగము కాస్త తన బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమవ్వడము బట్టి చూస్తే ఈ పురుష ప్రకృతి సంపూర్తిగా విశ్వశూన్యమైనదని పరమహంసకి అర్ధమయ్యేసరికి ఈయన కాస్త పెద్దగా అరుస్తూ పిచ్చివాడిలాగా ఉన్మాదస్థితిలోకి బాలోన్మత్త పిశాచ అవధూత స్థితి పొందాడు.సరిగ్గా 48ని||తర్వాత కాని మామూలు స్థితికి రాలేకపోయాడు.

అంటే నాలో ఇన్నాళ్ళ ఉన్న శివం కాస్త శవము అయినదని నాకు అర్ధమయ్యేలోపుల మళ్ళీ నా గుహయందు ఈ సారి నల్లగా  నలుచతురముగా ఉన్న పానమట్టముండి  తెల్ల బాణలింగమున్న శివలింగము దర్శనమైన కొన్ని క్షణాలు తర్వాత ఈ లింగము మీద రక్తాభికేషము చెయ్యగా ఈ తెల్లని బాణలింగము కాస్త ఎరుపులింగముగా మారడముతో ఈ లింగము స్త్రీ శివలింగమని నాకు జ్ఞానస్పురణ అవుతూండగా  తన బ్రహ్మరంధ్రమునుండి నీలిరంగు కాంతి ఈ లింగము మీద పడటముతో ఈ శివలింగము గూడ తన పరిమాణము తగ్గించుకొంటూ బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమైనది.అంటే ఈ స్త్రీ శివలింగము కాస్త స్త్రీ ప్రకృతికి సంకేతమనిచివరికి ఈ ప్రకృతిగూడ శూన్యమైందని అర్ధమయ్యేలోపుల ఉన్నట్టుండి గోముఖతీర్ధము దర్శనమైనది.ఈ తీర్ధములో 28 సం|| వయస్సు ఉండి జీవ సమాధిస్థితిలో యోగనిద్రావస్థలో ఉన్న బంగారపు శరీరచాయలో నగ్నముగా ఉన్న ఒక స్త్రీ దేహము పరమహంసకి కనిపించింది. నగ్న దేహమూర్తిని చూసిన గూడ పరమహంస మనస్సు చలించలేదు.కామవికారాలు కలుగలేదు.ఎందుకంటే ఈమె లజ్జాగౌరి అని ఈయనకి తెలుసు.ఈవిడే దేవతలలో నగ్నదేహముగా ఉండేది.తల ఉండదు.తల భాగము దగ్గర సహస్ర దళ కమలము ఉంటుంది.

కొన్ని క్షణాల తర్వాత ఈమె యోని దగ్గర నుండి ఒక నల్లని త్రేలు బయటికి వచ్చి పాకుకుంటూ ఈమె ఎడమచెయ్యి యొక్క చూపుడు వ్రేలు మీద కాటు వ్రేయగా నీలిరంగు విషము ఈమే దేహము అంతా వ్యాపిస్తూండగా ఈమె కాస్త సమాధి స్థితి నుండి జాగృతి అయ్యి యోగనిద్ర నుండి కళ్ళు తెరిచి లేచి చుట్టూ చూసుకోవడము పరమహంసకి కనిపించసాగింది.ఆ తర్వాత ఈమె కాస్త తిరిగి ధ్యాన తపస్సు చెయ్యడము ప్రారంభించినది.ఉన్నట్టుండి ఈమె నగ్న దేహముకాస్త బంగారపు వర్ణము అంచుతో ఎర్రని పట్టుచీరతో నుదుటిమీద రూపాయంత పరిమాణము ఉన్న ఎర్రటి గుండ్రని బొట్టు మెడలో బంగారు ఆభరణాలతో నడుముకి ఒక బంగారు వడ్డాణముతో కుడీచేతిలో త్రిశూలముతో ఎడమ చేతిని తన నడుము మీద వేసుకొని నిలుచున్న స్థితిలో ఉన్న ఒక ముత్తయిదువులాగా నిలబడి కనిపించినది.ఉన్నట్టుండి..అపుడిదాకా ఆనందస్థితిలో ఉన్న ఈమె కాస్త త్రిశూలముతో విలయతాండవము వేస్తూ కనిపించసాగింది.ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఈమె వెనకనుండి ఒక రూపములేని నల్లటి ఆకారము తన హస్తాలతో ఈ ముత్తయిదువును బంధించడానికి ప్రయత్నాలు చేస్తూండగా ఈమె కాస్త తన దగ్గర ఉన్న త్రిశూలముతో పొడుస్తున్నగూడ ఈ ఆకారము మాత్రము ప్రతిఘటిస్తూ ఈ ముత్తయిదువును తన హస్తాలతో బంధిస్తుండగా ఈమెను తన నల్లటి ఆకారములో శాశ్వతముగా బంధించివేసిన దృశ్యము ఈయనికి లీలగా కనిపించసాగింది.ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ వీరిద్దరి పోరాటము శాశ్వతముగా ఆగిపోవటముతో నల్లటి ఆకారము కాస్త జయం పొందటముతో ఉన్నట్టుండి నల్లటి చతురస్రాకారముగా తెల్లని శివలింగమున్న స్త్రీ శివలింగముగా  క్షణాలలో మారిపోయింది.అంటే ఈ ముత్తయిదువు అయిన స్త్రీ అనేది స్త్రీ ప్రకృతి అని ఈమె కాస్త శాశ్వత మరణము పొందటముతో స్త్రీ శివలింగము ఏర్పడినదని ఇపుడు ఈ శివలింగము కాస్త తిరిగి తన బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమైనదని అంటే ఈ లెక్కన చూస్తే స్త్రీ ప్రకృతి గూడ విశ్వశూన్యమైనదని ఙ్ఞాన స్ఫురణ కలిగేసరికి పరమహంస తల్లికోసము ఏడ్చే చిన్నపిల్లాడిలా ఏడ్వటము ఆరంభించాడు.ఇలా 48ని|| తర్వాత మామూలుస్థితికి వచ్చాడు.

నిజానికి ఈ విశ్వములో ఇద్దరు మాత్రమే ఆనందపడుతూ ఉంటారు.అందులో ఒకరు పసి వాళ్ళు రెండవవారు పిచ్చివాళ్ళు అన్నమాట.మోక్షగమ్యాన్ని చేరుకోవాలంటే సాధకుడికి పిచ్చితనము పడుతుంది.దీనినే బాలోన్మత్త పిశాచ అవధూత  స్థితి అవుతుంది.చేరుకున్న ఈ గమ్యమును ఆనందించాలంటే వీళ్ళు కాస్త పసిపాప మనస్తత్వమున్న చిన్నపిల్లలైపోతారని చెప్పిన సత్యము సత్యమే అని పరమహంసకి ఙ్ఞానోదయమైనది.ఎలా అంటే పురుష ప్రకృతి శూన్యమయ్యేసరికి ఈయన కాస్త పిచ్చితనము ఉన్న అవధూత స్థితిని పొందటము జరిగినది.ఆ తర్వాత స్త్రీ ప్రకృతి గూడ శూన్యమయ్యేసరికి తల్లిని కోల్పోయిన పసిపిల్లాడిలాగా  వల వల ఏడ్వటము జరిగినది గదా.

ఇది  ఇలా ఉంటే ఉన్నట్టుండి..

పరమహంసకి ఒక ధర్మ సందేహము వచ్చింది.అసలు ఈ రెండు రకాల ప్రకృతులు దేని వలన ఏర్పడ్డాయి అనుకోగానే ఈయన మనోదృష్టియందు పరమశూన్యము దర్శనమైనది.ఈ శూన్య మధ్య భాగములోంచి తెల్లని కాంతితో ఉన్న నిలువుగా ఉన్న త్రినేత్రము దర్శనమైనది.దీని నుండి ఒక కన్నీటి చుక్క బయటికి రావడము జరిగినది.ఈ నీటిచుక్క కాస్త పసుపురంగు నిరాకార రుద్రాక్ష అనగా పసుపు నిరాకార రుధ్రాక్ష అంటే ఎలాంటి గీతలు అదే ముఖాలు లేని రుధ్రాక్ష దర్శనమైంది.దీని నుండి అడ్డముగా ఉన్న ఒక కన్ను ఆకారము ఉన్న రుద్రాక్ష ఏకముఖముతో శివలింగము దానిమీద పాము పడగతో ఉన్న రుద్రాక్ష దర్శనమైనది.ఈ రుధ్రాక్ష ఒక క్షణము పాటు పురుష స్త్రీ కలిసిన మూడో ప్రకృతిలాగా పరమహంసకి కనపడినది. ఆ తర్వాత దీని నుండి ఒక కన్నీటిచుక్క బయటికి రాగానే ఈ బిందువు కాస్త తెల్లని ఏకముఖ రుధ్రాక్షగా మారింది.దీనియందు పురుష ప్రకృతి ఉన్నట్లుగా  దర్శనమైంది.ఆ తర్వాత దీని నుండి ఎరుపు రంగు ఉన్న ద్విముఖ రుద్రాక్ష- స్త్రీ ప్రకృతి ఇలా ఆ తర్వాత వరుసగా 3 నుండి 64 ముఖాలు రుద్రాక్షలు నలుపు రంగులో ఏర్పడ్డాయి.ఇవే కాలక్రమముగా 64 విశ్వాలుగా 64 కాల డైమన్ష్స్ గా యత్ భావము తత్ భావముగా కనబడుతున్నాయని పరమహంసకి అర్ధమైనది.అసలు రుద్రాక్షలు అనేవి ఆదియోగి రుద్రుని కన్నీళ్ళ వలన ఏర్పడాయని అందుకే రుద్ర+అక్ష =రుద్ర కన్నీళ్ళు=రుద్రాక్ష అయినది గదా.మరి తనకి నిరాకార రుద్రాక్ష నుండి అన్ని రకాల ముఖాల రుద్రాక్షలు ఏర్పడినట్లుగా ఎలా అగుపించినది అనుకొని విచారణ చేసుకుంటే రుద్రుడు గూడ తీవ్ర ధ్యాన తపస్సులో ఉండగా..తన కపాలములోని పురుష  శివలింగమైన పురుష ప్రకృతి అలాగే స్త్రీ శివలింగమైన స్త్రీ ప్రకృతి గూడ విశ్వ శూన్యమైన అనుభవ అనుభూతి కలిగేసరికి ఈ మహా రుద్రుడి కంటి వెంట కన్నీళ్ళు వచ్చి ఉండాలి.ఈ కన్నీళ్ళే కాస్త రుద్రక్షలై ఉండాలి.అవే ఏకముఖి నుండి 21 ముఖాలు రుద్రాక్షలు ఏర్పడి ఉండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సహజసిద్ధముగా పరమశూన్యము నుండి పసుపు రంగు నిరాకార రుద్రాక్ష అలాగే తెల్లగా ఉండి శివలింగమున్న రుద్రాక్ష స్వయంభూగా ఏర్పడి ఉండి ఉంటాయి.ఆ తర్వాత రుద్రుడి కన్నీటి బిందువులనుండి ఏకముఖి నుండి 21 ముఖాలు దాకా ఉన్న నల్లటి రుద్రాక్షలు ఏర్పడ్డాయి.ఇలా ఈ 21 ముఖాల రుద్రాక్షలున్న మాలను ఇంద్రమాల అంటారు.ఇది ధరించినవారు ఇంద్రియత్వమును పొంది జితేంద్రియుడు అవుతాడని తద్వారా వీరికి అసాద్యమనేది ఉండదని సకల కోరికలు తీరుతాయని రుద్రాక్ష శాస్త్రము చెప్పిన విషయము పరమహంసకి ఙ్ఞాపకము వచ్చింది.అలాగే ఈ రుద్రుడి భౌతిక నేత్రాలైన సూర్యుడైన కుడి కంటి నుండి 12 ఎర్రని రకాల రుద్రాక్షలు అదే ఎడమ కన్ను అయిన చంద్రుడి నుండి  16 తెల్ల రకాల రుద్రాక్షలు అదే అగ్ని నేత్రమైన త్రినేత్రము నుండి నల్లగా ఉన్న 10 రకాల రుద్రాక్షలు రావడము జరిగినదని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయింది.ఇంతవరకు బాగానే ఉంది.



నాకు ధ్యానభంగమైంది.కొన్ని రోజుల తర్వాత పత్రికలలో శ్రీశైల క్షేత్రమును కేంద్రముగా చేసుకొని నల్గోండ జిల్లాలోని దేవచర్లకు 4 కి.మీ దూరములోని నల్లమల్ల అడవులలోని కొండచరియలలో కాలాముఖులు పూజించిన కాలాముఖ దేవాలయము బయట పడినదని ఇది దాదాపుగా 8వ నుండి 13వ శతాబ్ధ దేవాలయని చెప్పడము జరిగింది.విచిత్రమేమిటంటే ఈ దేవాలయములో ఉన్న శివలింగ ఫోటోను చూడగానే ఇది నాకు ధ్యానములో కనిపించిన స్త్రీ శివలింగములాగా ఉన్నదని అంటే ఈ లెక్కన చూస్తే నా ధ్యానములో కనిపించిన శివలింగాలు అనగా తెల్లని గుండ్రని పానమట్టమున్న శివలింగము పురుష శివలింగమని అదే నల్లగా ఉండి నలుచదురమున్న పానమట్టమున్న శివలింగము స్త్రీ శివలింగమని..ఈ లోకములో సహజముగా చాలా ఎక్కువుగా పురుష శివలింగారాధన జరుగుతోందని..అదే స్త్రీ శివలింగారాధన చాలా తక్కువని..ఈ లింగము వరంగల్ లోని రామప్పదేవాలయము నందు అలాగే విజయవాడ లోని దుర్గామల్లిఖార్జున దేవాలయములో ఈ శివలింగము ఉన్నదని నా పరిశోధనలో తెలిసింది.అలాగే కాలాముఖ శాఖ అనేవారు కాపాలిక శాఖ నుండి విడిపోయిన శాఖయని...కాపాలికులు శివరాధన చేస్తే..వీళ్ళు దేవి ఆరాధన అనగా స్త్రీ శివలింగారాధన చేస్తారని..పైగా వీళ్ళు ప్రతినిత్యము వీరి ముఖము యందు నల్లని తిలకమును ధరించడము వలన వీరిని కాలాముఖాలుగా పిలువడము జరిగిందని నేను తెలుసుకున్నాను.కాని నాకు అర్ధము కాని విషయము ఏమిటంటే నాలో ఉన్న పురుష శివలింగము శూన్యములో శూన్యమైతే..మరి స్త్రీ శివలింగము ఎందుకు శూన్యము అవ్వలేదో నాకు ఒక పట్టనా అర్ధము కాలేదు.ఇందులో ఏదో మాయమర్మమున్నదని నాకర్ధమైంది.ఇలా కొన్ని నెలలు గడిచాయి.

ఇది ఇలా ఉంటే స్త్రీ/పురుష శివలింగాల దర్శనాలు అలాగే ఆరు మణుల దర్శనాలు అలాగే ఆత్మ లింగదర్శనాలు ఏమిటో నాకు ఒక పట్టాన అర్ధము కాలేదు.వీటి మధ్య ఏమైన సంబంధము అలాగే నా సాధనకి వీటికున్న అనుసంధానము ఏమిటో నాకు అర్ధము కాలేదు.కొన్ని వారాల తర్వాత వీటికి సమాధానముగా నాకు ధ్యానము నందు మొదట స్త్రీ శివలింగము దర్శనమైంది.ఆ తర్వాత పురుష శివలింగము దర్శనమైంది.ఆ తర్వాత వరుసగా ఆరు మణులు దర్శనమైనాయి.ఆ తర్వాత ఆత్మలింగము దర్శనమైంది.ఆ తర్వాత స్ఫటిక పరమలింగము దర్శనమైంది.ఇవన్నీయు కూడ ఒక వరుస క్రమములో ఉన్నాయి.ఇంతలో నా ఆత్మలింగము కాస్తా పరమలింగములో ఐక్యము చెందటానికి ఎన్నో విశ్వప్రయత్ననాలు చేస్తున్నప్పడికి అది సాధ్యపడటము లేదని నాకు అర్ధమయ్యేలోపుల ఒక మానవ స్త్రీ మూర్తి నా గ్రంధాలను పట్టుకొని కనిపించింది.అంటే నేను మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ స్త్రీ మూర్తి మహామాయను దాటితే కాని నా ఆత్మలింగము కాస్తా పరమలింగము నందు ఐక్యము చెందదని నాకర్ధమైసరికి నా ధ్యానభంగమైంది.ఈ ధ్యానానుభవాలతో "అంతర్వేదం" అను ఆధ్యాత్మిక నవల రాయడం జరిగింది.దీనిని గూడ ఒక బ్లాగ్ గా చేసి యోగసాధకులకి అందించడము జరిగింది.

This book ANTHARVEDAM blog link below

https://antharvedam.blogspot.com/

ఇది ఇలాయుండగా కొన్ని రోజులకి ఈ మాయ స్త్రీమూర్తి అనుకోకుండా నాకు పరిచయము అయింది. 

3వ మహామాయ కీర్తికాంత మాయ:

నిజానికి సాధనకి మూడు మహామాయలుంటాయి.1.కాంతకామమాయ 2.ధనకాంతమాయ 3.కీర్తి కాంత మాయ అన్నమాట.ఇందులో ఇపుడిదాకా నేను రెండు మాయలు అనగా కాంత మాయ అలాగే ధనకాంత మాయలు దాటడము జరిగింది. కాని ఈ రెండు మాయలు గాకుండా మూడవ మాయగా కీర్తి కాంత మాయ ఉంటుందని ఈ అమ్మాయి పరిచయము అయ్యేదాకా నాకే తెలియదు.విచిత్రము ఏమిటంటే ఈ మూడు మాయలు గూడ నా జీవితములో ఒకే పేరు ఉన్న ముగ్గురు అమ్మాయిలు అనగా కె.స్వాతి..ఏ.స్వాతి..ఎస్.స్వాతి లను ప్రకృతిమాత ఏర్పరచింది.ఇందులో కె.స్వాతి కాస్త కాంతమాయగా వస్తే...ఏ.స్వాతి కాస్త ధనమాయగా వస్తే ఆఖరి ఎస్.స్వాతి కాస్త కీర్తి కాంత మాయగా వచ్చింది.అది ఏలాగో మీకు సవిరముగా ఈ కీర్తి మాయ గూర్చి చెప్పాలి.ఎందుకంటే ఈ మాయలో పడి సన్యాసులు కాస్త సన్నాసులుగా మారి భక్తి వ్యాపారవేత్తలుగా..భక్తిరాజకీయవేత్తలుగా..భక్తినకిలిగురువేత్తలుగా..నకిలి పీఠాధిపతులుగా..నకిలి మఠాధిపతులుగా..నకిలి ఆధ్యాత్మికవేత్తలుగా మారడము నేను గమనించాను.ఇక నా విషయానికి వస్తే...నేను కాస్త ఈ గ్రంథమును ఒక వెబ్ సైట్ లో పెట్టడము జరిగింది.దీనిని 12 వేల మందిదాకా చదివారు.కొంతమంది వీటికి కామెంట్స్ పెట్టారు.వాటిని చూడగానే నన్ను వీళ్ళంతా మహనుభావుడని.. సిద్ధపురుషడని ..సిద్ధగురువని..మహ జ్ఞాని అనుకుంటున్నారని నాకర్ధమై ఆ సైట్ లోంచి ఈ కంటెంట్ మొత్తము తీసివేశాను.అక్కడ నుండి నాలో తెలియని ఆవేదన మొదలైంది.ఎవరో నా కోసము ఎదురుచూస్తున్నారని..నా కోసము పరితాపము పడుతున్నారని నా మనస్సుకి అందింది.దానితో మళ్ళీ రెండవసారి ఇదే సైట్లో నా కంటెంట్ పెట్టడము జరిగింది.అపుడు నేను మొదటిసారిగా ఎస్.స్వాతి అనే ఆవిడ కామెంట్స్ నన్ను ఆకర్షించాయి.దరిదాపుగా నేను పెట్టిన వాటికి కామెంట్స్ పెట్టడము జరిగింది.అన్నింటిలో ఆమె నిజాయితీ కనపడింది.మొహమాటము లేకుండా నా రచనలలో తప్పులుంటే అంతే నిజాయితీగా విమర్మించడము నన్ను ఆకర్షించింది.ఈ కామెంట్స్ బట్టి చూస్తే... ... ఈమె నా కోసము పరితపిస్తోందని నాకర్ధమై నా మనోవేదనను తీర్చుకోవాలని ఉద్ధేశ్యముతో అపుడిదాకా ఈమె కామెంట్స్ కి స్పందించని నా మనస్సు కాస్త స్పందించి..ఈమెకి తిరిగి నా కామెంట్ రూపములో రిఫ్లే ఇవ్వడము దానికి ఆమెకాస్త నమస్కార గుర్తుతో స్పందించి నా అడ్రసు లేదా ఫోన్ నెం లేదా మొయిల్ ఐడి గావాలని అడింది.దానికి మీకు అర్హత,యోగ్యత ఉన్నదని నాకు అనిపిస్తే ఇస్తానని చెప్పడముతో..ఆమె నా కోసము ఎలా వెతికినదో అన్ని వివరముగా చెప్పడము జరిగింది.అలాగే ఈ గ్రంథమును ప్రింట్ పుస్తకము అందరికి అందించాలని ఉన్నదని అందుకు తమకి ఈ గ్రంథ కాపీరైట్స్ ఇవ్వాలని కోరింది.నేను వెంటనే అంతగా ఈ గ్రంథములో ఏముంది అనగానే..స్వామి..ఆనాడు భగవద్గీత ఎంతమందిని మార్చినదో నాకైయితే తెలియదు కాని ఈ నిజధ్యానానుభవాల గ్రంథము మాత్రము ఎంతో మందికి మార్గదర్శి అయ్యి వాళ్ళని మోక్షగాములుగా మారుస్తుందని మీరు చెప్పిన ఈ గ్రంథములోని "ముందుమాట" అనే శీర్షక చదవగానే నాకర్ధమై మిమ్మల్ని ఎలాగైన కలిసి ఈ గ్రంథ జ్ఞానప్రచారములో పాల్గొవాలని నేను బలంగా నిశ్చయించుకోవడము జరిగిందని చెప్పింది.నేను వెంటనే అసలు మీరు ఈ గ్రంథమును పూర్తిగా చదివారా? అని అడిగాను.ఆమె కాస్త లేదండి.అన్నము ఉడికినదో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే మాకు ఎలా తెలుస్తోందో అలా ఈ గ్రంథములోని ముందుమాట చదివి చదవగానే ఇంతటి అమూల్యమైన ఈ గ్రంథము ఇలాంటి సైట్లో పెట్టడము నాకు బాధ అనిపించి జనాలకి అందించాలని నాలో తపన మొదలైనదని అందుకు తమరి అనుమతి కోసము నేను చెయ్యని ప్రయత్నము... వెతకని విధానము లేదని చెప్పేసరికి...నేను కాస్త నా మొయిల్ ఐడి ఇచ్చాను.దానితో మా సంభాషణాలు అన్నిగూడ మెయిల్స్ ద్వారా జరుగుతుండగా..ఒకరోజు నేను ఆమెతో ..అమ్మా..ఈ గ్రంథమునకు కాపీరైట్స్ క్రింద ఎంత ఇవ్వాలని అనుకున్నారు అనగానే..గురూజీ..నేను ఇంత ఇవ్వాలని ఏ నెంబరు అనుకోలేదు.కాని మీరెంత అడిగితే అంత ఇవ్వాలని అనుకున్నాను.నా దగ్గర అంతలేకపోయిన ఎలాగైనా సంపాదించి ఇవ్వాలని అనుకున్నాను.నేను కాస్త సరదగా ఆమెతో అయితే దీనికోసము  నాకు 10 కోట్లు గావాలని అడుగుతాను ఇస్తారా? అనగానే దానికి ఆమె కాస్త స్వామి..నేను ఇంతకముందే చెప్పాను.నాకు మీ డబ్బుల నెంబర్ తో పనిలేదు.ఈ అమౌంట్ నా దృష్టిలో పెద్ద విషయమే కాదు.మీరు నిజమైన ఈ గ్రంథ రచయిత అయితే నేను మీరంతా అడిగిన ఇవ్వడానికి అన్ని విధాల సిద్ధమే అనే సమాధానము చూడగానే నా మనస్సు కాస్త ఆలోచనలో పడింది.ఎందుకంటే నేను ఎన్నో కోట్లు అడిగిన ఆమె ఖచ్చితముగా ఇస్తోంది.ఎందుకంటే కోట్లలకి కోట్లున్న ఒక ఇంటికోడలని నాకర్ధమై ..ఈమెతో నాకు ఆలోచించుకోవటానికి టైం కావాలని చెప్పి ... ఆలోచనలో పడ్డాను.విచారణ చేసుకుంటే ఈమెకి ఈ గ్రంధ కాపీరైట్స్ ఇస్తే నాకు కోట్లరూపాయిల ధనముతోపాటుగా నేను ఒక ఆధ్యాత్మిక రచయితగా కీర్తిప్రతిష్టలు వస్తాయి.అభిమాన పాఠక సంఘాలేర్పడతాయి.దీనికి తోడు నాకున్న ఆధ్యాత్మక బ్రహ్మజ్ఞానమును ఏవరైనా గుర్తుపెడితే నా చేత ఏదో ఒక ఆశయము కోసమని ఆశ్రమము పెట్టించి దానికి భక్తులను ఏర్పాటు చేసి నన్ను ఒక స్వామీజీ గా మార్చి నా చేత భక్తి వ్యాపారము చేయించి నా మీద కోట్లానుకోట్ల వాళ్ళ నల్ల డబ్బును తెల్ల డబ్బులుగా మార్చుకుంటే నా పరిస్ధితి ఏమిటి అనే ఆలోచనభయముతో నా మనస్సు ఆగిపోయింది.ఆ రోజు రాత్రి టి.వి లో "ద్వారక" అనే కొత్త సినిమా వచ్చింది.అందులో హీరో గూడ అనుకోకుండా ఒక స్వామీజీగా మారడము...భక్తులే ఆయనచేత ఆశ్రమము పెట్టించడం..కొంతమంది రాజకీయవ్యక్తులు కలిసి ఈ స్వామీజీతో భక్తివ్యాపారము చేయించే దృశ్యాలు కనిపించేసరికి నాకు అసలు విషయము లీలగా అర్ధమై..అంటే ఈ స్వాతి వలన నాకు ఎనలేని కీర్తిప్రతిష్టలు అలాగే అంతులేని ధనము కల్లుతుందని ఇదిగూడ ఒక మహామాయేనని అదే కీర్తికాంత మాయ అని అపుడు కాని నాకు అర్ధముకాలేదు.దానితో ఆమెతో అమ్మా..నేను నా జ్ఞానమును అమ్మదల్చుకోలేదు.నాకు ఎలాంటి ధనము అలాగే కీర్తిప్రతిష్టలు అవసరము లేదు.నేను ఒక గుప్తయోగి గానే ఈ లోకము నుండి వెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే ఆమె కాస్త నన్ను ఏన్నో విధాలుగా అలాగాదని చెప్పి చూసిన నా మనస్సు కరగలేదు.దానితో సరే..స్వామి..మీ ఇష్టం..మీకు ఇష్టము లేకపోతే నేనుగూడ ఏమి చెయ్యలేను గదా అని బై చెప్పింది.అపుడు కాని నా మనస్సు శాంతించలేదు.ఇది జరిగిన కొన్నిరోజులకి నేను తీవ్రమైన ధ్యానములో ఉండగా నా బ్రహ్మరంధ్ర గుహ యందు తిరిగి స్త్రీ శివలింగము దర్శనమైంది.కొన్ని క్షణాల తర్వాత దీని స్ధానములో నాకు హరిద్వార్ క్షేత్రము నుండి వచ్చిన ఒక అంగుళ స్ఫటిక బాణలింగము దర్శమిచ్చింది.నాకు అర్ధము కాలేదు.ఇంతలో ఈ లింగము పెద్దగా పెరుగుతూ కనపడింది.అనగా సుమారుగా  ఆరు అడుగుల లింగముగా కనిపించసాగింది.ఇందులో అంతే విచిత్రముగా ఒక అంగుళమేర నా లాంటి రూపధారి పసిపిల్లాడి రూపములో ఇందులో ఉన్నట్లుగా కనిపించింది.మరి ఇదేమి మాయ అనుకొనే లోపుల నాకు ధ్యానభంగమైంది.విచారణ చేస్తే నా ఆత్మశరీరము కాస్త స్ఫటిక ఆత్మలింగములాగా మారినదని..నాలో పసిపిల్లవాడి బాల భగవంతతత్త్వము వచ్చినదని అంటే తను ఎపుడైతే కీర్తికాంత మాయను దాటాడో..నాలో ఉన్న స్త్రీ లింగము కాస్త ఆత్మలింగముగా మారినదని..ఒకవేళ ఈ మాయలో తను పడిఉంటే తన సాధన ఆత్మలింగముగా మారకుండా ఆగిపోయేదని నాకు అర్ధమైంది.ఆ మరుసటిరోజు ఒక ప్రముఖ   ఆధ్యాత్మికవేత్త కాస్త రాజకీయాలలోనికి వచ్చి ఒక కొత్తపార్టీ పెడుతున్నారని అనే కథనం వచ్చింది.కాకపోతే ఈయన ఆశ్రమములో అమ్మవారిని ప్రతిష్టించి ఆమె ముందు స్ఫటికలింగము ఉంచారని తెలిసింది.అంటే ఈయన కీర్తికాంత మహామాయకి బలి అయ్యారని ...తద్వారా ఈ ఆత్మలింగము కావలసినవాడు కాస్త ఆత్మలింగ ప్రతిష్టగావించారని నాకు అర్ధమై ఏడుపు ఆగలేదు.ఎందుకంటే 1000 అడుగుల ఆధ్యాత్మిక ప్రయాణములో ఈయన 999 అడుగులు ప్రయాణించి ఒక అడుగు దూరములో ఆగిపోయి కీర్తికాంత మాయలో పడి వెనుతిరిగి మాయలో పడటం అంటే ఇంతకన్నా దురదృష్టము మరొకటి ఉండదని నాకర్ధమైంది.అంటే దేహము  చచ్చేదాకా మాయలుంటానే ఉంటాయని..సాధనలో మాయలు వస్తే కాని సాధనస్దితిలో మార్పులురావని..మాయ దాటితే సాధన పురోగతి లేదంటే అధోగతి అని నాకు జ్ఞానస్ఫురణ అయింది.ఆరు నెలలు తర్వాత కీర్తికాంత తిరిగి మెయిల్స్ కి వచ్చి స్వామి..ఎలా ఉన్నారు అడిగింది. దానికి నేను వెంటనే నా ఫోటో ఒకటి పంపించగానే..దానిని చూసిన ఆమె వెంటనే స్వామి..మీరు చూడటానికి మా అమ్మ సృష్టించిన అద్బుతలోకములో మీరు అపుడే పుట్టిన వటపత్రసాయి అయిన బాలగోపాలముగా ఉన్నారని అనగానే..నా మనస్సు ఎదో తెలియని ఉద్రేకమునకు లోనైంది.అంటే నేను కాస్త కీర్తిమాయను దాటడము జరిగిందని..నా మనస్సు ఇపుడు పసివాడితత్త్వముగా మారిందని..నాలో ఉన్న భగవత్ తత్త్వము బయటికి వస్తోందని నాకర్ధమైంది.ఆనాటి నుండ్ ఈమె కాస్త నన్నుబాలగోపాలం..నాన్న..కన్నా.. కృష్ణా.. కన్నయ్య....తనకి ఉన్న అమితకృష్ణ భక్తిని నా మీద కురిపించడము మొదలుపెట్టింది.ఆమె కాస్త నన్ను ఏ పేరుతో పిలిచిన సమాధానాలు ఇచ్చేవాడిని.అలాగే ఈ సాధనలో మౌన శివయోగిని సాధన స్ధాయిలో ఉందని..తన తల్లితో ఈమె 5 సం..రాలు మాట్లాడని మౌనస్ధితిలో..ఈమెకి ఎవరితో మాట్లాడాలని లేదని..మాట్లాలనిపించడము లేదని..కాని నాతో మాట్లాడుతుంటే ఆమెకి అద్వితీయమైన ఆనందస్ధితి కల్గుతోందని..అంటే నా బాలగోపాల మాయ ఆమెకి మహామాయగా మారుతోందని నా మనస్సుకి అందడముతో ఆమెతో నేను కాస్త మౌనయోగిగా మారక తప్పలేదు.దానితో ఆమె ఇపుడు ఎక్కడ ఎలా ఉన్నదో గూడ నాకు తెలియదు.

ఇక నా సాధన విషయానికి వస్తే...నేను అనే ఆత్మశూన్యము ఎలా అనాదిగా ఉన్న పూర్ణశూన్యములో లయము అవుతుందో అలాగే నేను కాని నేను ఏమిటో నాకు ఒక పట్టనా అర్ధము కావడము లేదు.ఇంతలో నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది.అసలు ఆదియోగి అయిన 64 కపాలధారి మోక్షము పొందాడా? ఎందుకంటే ఈయన సజీవమూర్తిగా కైలాస పర్వతములో సదాశివుడిగా మరియు అరుణాచలక్షేత్ర పర్వతములో మేధాదక్షిణామూర్తిగా దర్శనమిచ్చారు గదా.దీనికి సమాధానముగా నాకు ఒకరోజు తీవ్రధ్యానములో ఉండగా..నా బ్రహ్మరంథ్ర గుహ దర్శనమైంది.

ఒక అంతరిక్ష దృశ్యము కనిపించింది.గాకపోతే గ్రహాలు అలాగే గ్రహశకలాలు,నక్షత్రాలు కనిపించడము లేదు.ఏవో గుండ్రని గీతలుండి విభజన భాగాలు కనపడుతోంది.మొదటి గీతలో సుమారుగా 64 మంది స్ధూలశరీరాలతో ఉన్న సజీవ శివమూర్తులు అనగా కాశీ, శ్రీశైలము, అరుణాచలము, ఉజ్జయిని, మృడేశ్వరం,కైలాస పర్వతము ఇలా 64 క్షేత్రాలలో శివాంశలు అనగా శివపంచముఖారూపాలు, ఏకాదశిరుద్రరూపాలు, శివనవావతారాలరూపాలు,21 శివ అవతరాల రూపాలు,..ఇలా 64 సజీవ రూపాలు కనిపించాయి.వీరంతా ఆయా క్షేత్రాలలో సజీవముగా ఉండి ఉలకరు..పలకరు స్ధితిలో ఉన్నారని నాకర్ధమైంది.ఆ తర్వాత రెండవభాగములో సూక్ష్మ శరీరముతో 64 మంది శివాంశాలు అలాగే మూడవ భాగములో కారణశరీరముతో 64 మంది అలాగే నాలుగోవ భాగములో 64 మంది వాయుశరీరాలతో..అయిదవ భాగములో సంకల్పశరీరాలతో 64 మంది అలాగే ఆరవ భాగములో 64 మంది ఆకాశ శరీరాలతో..ఇక ఏడవ భాగమునందు గూడ 64 మంది శివాంశాలు ఆత్మశరీరాలతో ఉన్నట్లుగా నాకు జ్ఞానస్ఫురణ అయింది.అంటే సప్త శరీరాలతో 64 మంది చొప్పున శివాంశాలు ఉన్నారు అన్నమాట.ఇలా ఈ విశ్వములోని ప్రతిజీవికి ఉంటాయని నాకర్ధమైంది.పైగా విచిత్రము ఏమిటంటే ఇలా ఉన్న వీరంతా గూడ మూడు ప్రకృతులలో అనగా స్త్రీ ప్రకృతి,పురుష ప్రకృతి అలాగే మూల ప్రకృతి అను విభాగాల యందు ఉన్నారు.స్త్రీ ప్రకృతిలో మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము దాకా మరియు స్ధూల,సూక్ష్మ శరీర జీవులుండి మరియు ఇందులో స్ధూల,సూక్ష్మశరీరాలతోపాటు 64 బ్రహ్మకపాలాలు ఉంటే..అదే పురుష ప్రకృతిలో ఆజ్ఞ,సహస్ర,హృదయ చక్రాలుండి  మరియు కారణ,వాయు,సంకల్ప శరీర జీవులుండి..మరియు ఇందులోఆరు మణులున్నాయని... అదే మూల ప్రకృతి యందు బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండచక్రము అలాగే ఆకాశ,ఆత్మ శరీర జీవులుంటాయని మరియు ఇందులో స్త్రీ,పురుష కాలాముఖ శివలింగాలు,ఒక ఆత్మలింగముంటాయని  నాకు జ్ఞానస్ఫురణ అయింది.కొన్ని క్షణాలు తర్వాత ఒక స్ధూల శరీర శివాంశ కాస్త ధ్యానము నుండి లేచి ఇక్కడ అదృశ్యమై రెండవ భాగములో సూక్ష్మశరీరధారిగా రూపాంతరము చెందింది.ఆ తర్వాత కొన్ని క్షణాల తర్వాత ఈ అంశ శరీరధారి ఇక్కడ అదృశ్యమై మూడవ భాగములోనికి ప్రవేశించి కారణశరీరధారిగా రూపాంతరము చెందాడు.ఇలా స్ధూల శరీరము నుండి ఆత్మ శరీరముగా అనగా 7వ భాగము వరకు రూపాంతరము చెందాడు.విచిత్రము ఏమిటంటే ఈ స్త్రీ ప్రకృతి యందు శరీరాల మోక్షం అలాగే 64 కపాల మోక్షం పొందితే అదే పురుష ప్రకృతి యందు ఆరు రకాల మణుల మోక్షం పొందితే..అదే మూల ప్రకృతి యందు శివలింగాల మోక్షం మరియు  ఆత్మ మోక్షం అనగా సప్త శరీరాలతో పంచ మోక్షాలు పొంది..చివరికి ఆత్మలింగముగా మారాడు.ఇది ఈ బ్రహ్మండ చక్రానికి మధ్య భాగములో చేరుకుంది.అక్కడ ఈ ప్రకృతుల భాగాలతోను అలాగే విభాగాలతోను యెట్టి సంబంధము లేకుండా ఒక దివ్య తేజస్సు అండాకారములో స్ఫటికమణిగా కనపడింది.దీనిని చూస్తేంటే ఆకాశమే హద్దుగా..భూమియే పాద పీఠముగా ఉన్నట్లుగా అగుపించింది.అంటే ఇదే పరమ లింగమని..ఇదే నేను కాని నేను అని..ఇదే పూర్ణశూన్య బిందువని..ఇదే పూర్ణశూన్యమని..ఇదే పురాణాలు చెప్పిన 65 వ కాల డైమర్షన్ అని నాకు జ్ఞానస్ఫురణ అవుతూండగా...ఆత్మలింగము ఒక్కటి గాదని సుమారుగా 64 దాకా ఉన్నాయని..ఈ ప్రకృతిలో ఉన్న చిన్ముద్ర హస్తము కాస్త ఒక ఆత్మలింగమును మట్టిని తీసే ప్రొక్లయినర్ లాగా పట్టుకొని పరమలింగములో ఐక్యం చేస్తున్న దృశ్యము చూడగానే ఇదే అసలు సిసలైన ఆఖరి ఆత్మమోక్షం అని నాకర్ధమైంది.అంటే ఇలా 64 శివాంశాలకి సప్త శరీరాల పంచ మోక్షాలు పొందాల్సి ఉంటుందని..అందుకే కొన్ని శివాంశాలు సజీవమూర్తులుగా ఉంటే మరొకొంతమంది నిర్జీవమూర్తులుగా ఉన్నారని..నిజానికి మూల ప్రకృతిలో ఉన్న మూల 64 మందికి ఆత్మమోక్షం పొందారని కాని వీరి ప్రతిబింబాల అంశాలైన పురుషప్రకృతిలోని 64వేల800 కోట్ల మందికి అలాగే స్త్రీ ప్రకృతిలో ఉన్న 36కోట్ల84 లక్షల 64 వేల 800 మందికి తాము అపుడికే ఆఖరిదైన ఆత్మమోక్షం పొందామనే ఆత్మజ్ఞానము తమ మనస్సులకి అందడము లేదని దీనికి కారణము కాలములోని కాలగమన మార్పులని నాకర్ధమైంది.విశ్వములోని ద్రవ్యరాశి మార్పులవలన కాలనిర్ణయ మార్పులలో తేడాలు వస్తాయి గదా.అనగా ఇండియాలో ఉదయము అయితే అమెరికాలో రాత్రి అవుతుంది గదా.ఇదే కాలగమన మార్పు అన్నమాట.అలాగే భూమీద ఒక సం!!రము అదే దైవలోకములో ఒక రోజు గదా.ఈ లెక్కన ఆదిలో ఈ విశ్వసృష్టి..స్ధితి..లయం అంతా కూడ మూడు క్షణాలలో మూల ప్రకృతిలో జరిగింది.ఈ జ్ఞానము పురుష ప్రకృతికి అందటానికి 64వేల 800 కోట్ల సం!!రాలు పడితే..అదే స్త్రీ ప్రకృతికి అందటానికి 36కోట్ల84లక్షల64వేల 800 కోట్ల సం!!రాలు పడుతుంది. ఎందుకంటే మూల ప్రకృతిలోని మూడు క్షణాలంటే 30 బ్రహ్మ మహాకల్పాలతో సమానము.అంటే మనమంతా ఎపుదో ఆత్మశరీరాలతో ఆత్మలింగాలుగా మారి బ్రహ్మండ రూపమైన పరమలింగము నందు ఏనాడో ఆదిలోనే ఆత్మమోక్ష్మం పొందాము.కాని మనము ఏనాడో చనిపోయాయమనే విషయము మన మనస్సుకి అందలేదు.కారణము కాలగమన తేడాల వలన అందడము లేదు.కాని మన ఆత్మకి ఈ ఆత్మజ్ఞానము మనకి ఉన్న యోగము బట్టి అర్హత,యోగ్యతను బట్టి అలాగే ప్రకృతి యోగమాయలు దాటుకోవడము బట్టి ఈ జ్ఞానానుభవాలు ధ్యానానుభవాలుగా మనకి కాలక్రమేణా కలుగుతాయని నాకు అర్ధమైంది.మరి నా సప్త శరీరాలేవి అలాగే నాకు ఈ దేహజన్మలో ఆత్మమోక్షం పొందాననే ఆత్మజ్ఞానమైన పూర్ణజ్ఞానము నా మనస్సుకి అందుతుందా?అనే సందేహలు రాగానే నాకు ధ్యానభంగమైంది.విచారణ చేస్తే అంటే 64 కపాలధారి ఏనాడో విశ్వానికి విశ్వమోక్షం పొందాడు.అంటే మూలప్రకృతి ఏనాడో విశ్రాంతి స్ధితికి వెళ్ళి పూర్ణశూన్యమునందు శూన్యమైంది.కాని పురుష అలాగే స్త్రీ ప్రకృతులకి ఈ జ్ఞానము ఇంక అందకపోవడము వలన ఇవి అశాశ్వతలైన శాశ్వతాలుగా మనకి అగుపడుతున్నాయి అన్నమాట.బ్రతికి ఉన్న శవము లాగా అన్నమాట.వీటికి ఆ జ్ఞానము  ఎపుడు అందుతుందో అపుడు ఇవిగూడ అదృశ్యమవుతాయి.శూన్యమవుతాయి. అందుకే మన బుద్ధభగవానుడు ఎవరికి వారే సాధన చేసి నిజజ్ఞానమును పొందమని చెప్పారు.కాని పాపము ఈయన కాస్త చింతామణి తీర్చే ఇష్టకోరిక మాయలో పడి కోరిక లేని సమాజము చూడాలనే కోరికతో చిరంజీవతత్వముతో మిగిలిపోయారు.అంటే ఈయన మణి మోక్ష జ్ఞానము దగ్గర ఆగిపోయారు అన్నమాట.ఇక ఈయనకి శివలింగాల మోక్షజ్ఞానము అలాగే ఆత్మమోక్షం అందాలి అన్నమాట.ఈయన పరిస్ధితి ఇలా ఉంటే నా పరిస్ధితి ఏమిటో నాకైయితే అర్ధమై చావడము లేదు. ఈ జన్మకి నాకు పూర్ణజ్ఞానము అనగా నేను అనే ఆత్మశూన్యము కాస్త అనాదిగా ఉన్న పూర్ణ శూన్యములో ఏనాడో లయం చెందినదనే పూర్ణజ్ఞానము నా మనస్సుకి ఏలాగైనా అందాలని అనుకున్నాను.ఇంతలో టి.వి లో నుండి శివోపసాన మంత్రాలు వినపడుతున్నాయి.అనగా

నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః
శర్వాయ నమః శర్వలింగాయ నమః
శివాయ నమః శివలింగాయ నమః
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః

ఈ మంత్రాలను జాగత్తగా యోగపరిభాషలోనికి మారిస్తే... అనగా

నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
ఇవి మూలాధార చక్రమును సూచిస్తే...

సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
ఇవి స్వాధీష్టాన చక్రమును సూచిస్తే..

దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
ఇది మణిపూరక చక్రమును సూచిస్తే..

భవాయ నమః భవలింగాయ నమః
ఇది అనాహత చక్రమును సూచిస్తే..

శర్వాయ నమః శర్వలింగాయ నమః
ఇది విశుద్ధ చక్రమును సూచిస్తే..

శివాయ నమః శివలింగాయ నమః
ఇది ఆజ్ఞాచక్రమును సూచిస్తే..

జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఇది సహస్ర చక్రమును సూచిస్తే..

ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
ఇది హృదయ చక్రమును సూచిస్తే..

పరమాయ నమః పరమలింగాయ నమః
ఇది బ్రహ్మరంధ్రమును సూచించడము జరిగింది.

అలాగే మన మన మూలాధార చక్రములో ఉన్న హిరణ్యలింగమును కాస్త ఆత్మలింగముగా మార్చుకొని ఆపై పరమలింగమునందు ఐక్యం చెందాలని ఏనాడో మన పూర్వీక మహర్షులు తెలుసుకొని మంత్రాల రూపములో మనకి అందిస్తే వాటి మూలార్ధాలు తెలుసుకోకుండా కేవలము మంత్రాలను బట్టిపట్టి వల్లెవేస్తున్నామని నాకర్ధమైంది.

ఇదింతా బాగానే ఉంది.అసలు నా మనస్సుకి పూర్ణజ్ఞానము ఏలా అందుతుందో నాకు పట్టనా అర్ధముకాలేదు.దానితో పుస్తక గ్రంథాలను తిరగవేసాను.ఫలితము శూన్యం.నా భౌతిక గురువులను సంప్రదించాను.వాళ్ళకి ఈ జ్ఞానము అందలేదని..ఇంక వాళ్ళు పూర్ణగురువు కాలేదని నాకర్ధమైంది.మార్గము దొరకడము లేదు.పూర్ణగురువు దొరకలేదు.నాకు పిచ్చిపట్టి ఉన్మాదిలాగా మారిపోయాను. తిండి,నిద్ర కరువైంది.ఆశ,భయము దొబ్బినాయి.ఎందుకున్నానో ఏమిచేస్తున్నానో నాకే అర్ధము కాని అయోమయస్ధితికి వెళ్ళాను.అందరు నన్ను అదో టైపు అని..పిచ్చివాడినని.. అవధూత స్ధితియని..బాల పిశాచ అవస్ధయని ఇలా రకరకాలుగా నా గూర్చి అనుకోవడము మొదలుపెట్టారు. నేను అయితే ఏనాడో మంది గూర్చి ఆలోచించడము మానివేసి మది గూర్చి ఆలోచించడము మొదలుపెట్టాను.



ఇది ఇలా ఉంటే నా యోగమిత్రుడైన జిజ్ఞాసి నా కోసము హరిద్వార్ క్షేత్రము నుండి మూడు అంగుళాల స్ఫటిక బాణలింగమును తెచ్చాడు.దీనిని చూడగానే నాకు పరమానందమేసింది.ఎందుకంటే నా ధ్యానములో కనిపించిన పరమలింగాకారముగా అచ్చుగుద్దినట్లుగా ఇది ఉంది.దానితో దీనిని మెడలో ధరించి తుంకార సాధన చేస్తున్నాను.నా సమస్యకి పరిష్కారము ఇస్తునట్లుగా ఒకరోజు అర్ధరాత్రి నాకు ఒక దివ్యానుభవము కల్గింది.అది ఏమిటంటే ఆదియోగి తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగాఆయన మూలాధార చక్రములోని ఆత్మలింగము కాస్త బ్రహ్మరంధ్రములో బ్రహ్మండ చక్రములోని పరమలింగమునందు ఐక్యమవుతున్న సమయములో గోముఖతీర్ధములోని బడబాగ్ని మొదలై యోగాగ్ని గా మారి ఈయన దేహమును దహింపవేస్తుండగా..ఈయన మూలప్రకృతిలోని పంచభూతాలలో గూడ అగ్ని దహనమై శూన్యములో శూన్యమవ్వడము ఆరంభమై అంతమైంది.ఇంతలో నాకు ధ్యానభంగమైంది.అయితే నాకేమి అర్ధము కాలేదు.

ఈయన ఆత్మలింగము దహనము ఎలా సాధ్యపడింది? అని అనుకుంటుండగా నా మనస్సు కాస్త తీవ్రధ్యానములోనికి వెళ్ళింది. అపుడు నా బ్రహ్మరంధ్ర గుహ యందు ఏకమూలబ్రహ్మకపాలము దర్శనమైంది.ఇందులో మొదట కపాలాగ్ని దర్శనమైంది.ఆ తర్వాత వరుసగా ఆరు మణులు ఆ తర్వాత శివలింగాలు ఆపై ఆత్మలింగము ఆపై పరమలింగము ఆపై చివరికి 64 కపాలాధారి ఆపై సప్తశరీరాల శివాంశలు దర్శనమిచ్చారు.ఇదింతా ఏమిటి?పైగా వరుసలు తప్పాయి..కపాలాగ్ని తర్వాత కపాలాధారి కదా కనపడాలి అలాంటిది ఈయన చివరిలో కనపడ్డాడు.సరియైన నిద్రలేక మెదడికి తగినంత విశ్రాంతి లేక అన్నిగూడ తప్పు తప్పుగా చూపిస్తోందని అనుకోగానే..కపాలాగ్ని నుండి అగ్ని రూపాలు కనపడటం మొదలైంది.మీకు గుర్తుందా? మేము హోమాలు ఈ హోమాగ్ని యందు వివిధ ఆకారాలతో హోమదేవతలు అగుపించారని చెప్పడము జరిగింది గదా.అలా ఇపుడు ఈ కపాలాగ్ని గూడ వివిధ ఆకారాలను చూపిస్తోంది.ఎందుకంటే అగ్నికి రూపగుణ తత్త్వముంటుందని లోకవిదితమే కదా.అలా ఈ గుణము వలన కపాలాగ్ని కాస్త వివిధ రూపాలను చూపిస్తోంది.ఈ రూపాల నీడ కాస్త నాగమణి మీద పడటం నేను గమనించాను.ఈ మణికి ఉన్న కామరూపవిద్య వలన ఈ కపాలాగ్ని రూపనీడలు కాస్త సజీవరూపాలుగా వాటికి కోరికమేర రూపాలుగా మారుతున్నాయి.ఈ రూపాలు కాస్త ఇంద్రమణి మీద పడటముతో ఈ దేహాలకి ఇంద్రియగుణతత్త్వాలున్నట్లుగా భావము కల్గింది.ఈ భావరూపాలు కాస్త అష్టకోరికలు తీర్చే చింతామణి మీద పడటము మొదలైంది.దానితో భావాలు కాస్త కోరిక దేహలుగా మారినట్లుగా భ్రమను కలిగిస్తున్నాయి.ఆ తర్వాత ఈ కోరికలు తీర్చుకోవటానికి కావల్సిన శక్తిని ఇచ్చే కౌస్తుభమణి మీద పడడముతో ఈ దేహలకి ప్రాణశక్తితో పనిచేస్తున్న బ్రాంతి కల్గించడము మొదలైంది.ఆ తర్వాత కోరికలు తగ్గట్లుగా ధనభోగభాగ్యాల మాయలో అనగా ధనమాయలో పడవేసేవిధముగా శమంతకమణి చేస్తుంది.ఆ తర్వాత ఈ కోరికలమీద వైరాగ్యభావాలు ఇచ్చేవిధముగా రుద్రమణి చేస్తుంది.ఇలా ఈ ఆరుమణులు కాస్త అరిష్వర్గాల మాయదేహాలను కల్గిస్తూ..పంచభూతాలు,మనస్సు,బుద్ది,అహముతో స్త్రీ ప్రకృతి శివలింగము  అలాగే పంచభూతాలు,సూర్యుడు,చంద్రుడు,జీవుడుతో కలిసి పురుష ప్రకృతితో పురుషశివలింగముంటే అలాగే పంచభూతాలు,కాలము,కాంతి,నాదముతో మూలప్రకృతితో ఆత్మలింగముండి ఏర్పడ్డాయని..ఇలా కపాలాగ్నితో మొదలైన అగ్నిరూపము కాస్త ఆత్మలింగము మీద ప్రతిబింబరూపాలుగా పడటము జరిగింది.ఈ ఆత్మలింగము కాస్త 64 కపాలరూపధారిగా 3డి లో కనిపించేవిధంగా చేస్తోంది.1డి నుండి 64డిలో ఈ విశ్వమును స్ఫటిక ఆత్మలింగము కాస్త కనపడేటట్లుగా భ్రమ, భ్రాంతి, మాయ, మోహము, ఆశ,భయము, ఆలోచన,స్పందన, సంకల్పముతో కల లాంటి నిజముగా..నిజము లాంటి కలగా ఈ విశ్వమును నడిపిస్తోందని నాకు జ్ఞానస్ఫురణ అయింది.నిజానికి మనమంతా కపాలాగ్ని రూపాలే గావడము వలన మన శరీరాలు కాస్త ఆరా కాంతి శరీరాలు అయ్యాయి అన్నమాట.అందుకే మన శరీరములో కాంతి అనగా వేడి  తగ్గి చల్లపడితే మనకి భౌతిక మరణము వస్తోంది.అలాగే మనము పోయేటపుడు ఏమికూడ తీసుకొని వెళ్ళలెము.ఆఖరికి ఇన్నాళ్ళు ఉన్న శరీరమును గూడ మనము ఇక్కడే వదిలేసి వెళ్ళుతున్నాము.కారణము మనమంతా కేవలము కపాగ్ని యొక్క అగ్ని ప్రతిబింబాలే గదా. ఆని అనుకుంటుండగా...నాబ్రహ్మరంధ్ర గుహ మధ్యభాగములో నా అంగుళ ఆత్మలింగము కనిపించిన కొన్ని క్షణాలకి బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి అంతరిక్ష మధ్య శూన్యము వద్దకి చేరుకొని సుడులు తిరగడము ఆరంభించింది.దానితో ఈ లింగానికి పగుళ్లు ఏర్పడ్డాయి.దానితో ఇది కాస్త పంచవర్ణ అనగా నీలం,పసుపు,ఎరుపు,తెలుపు,నలుపు రంగు  కాంతిరేణువులుగా వీడిపోతుండగా విశ్వ పూర్ణ శూన్యము కాస్త ఒక పెద్ద పరమలింగముగా మారగానే..ఈ పంచవర్ణ కాంతిరేణువులు ఐక్యం చెందడముతో..కొన్ని క్షణాలకి ఈ పరమలింగము గూడ మళ్ళీ పంచవర్ణ కాంతిరేణువులుగా మారి బ్లాక్ హోల్ గా రూపాంతర చెంది శూన్యమును తనలో కలుపుకుంటూ ఇది గూడ శూన్యమయిపోయింది.శూన్యములో శూన్యము కలిసిపోయింది.నేను అనేది ఆదిలో శూన్యము నుండి ఏర్పడి 64వేల 84 కోట్ల సం.రాల తర్వాత తిరిగి తను ఎక్కడ నుండో ఏర్పడినదో అక్కడికి వెళ్ళిపోయింది.అంటే పూర్ణశూన్య స్ధితి యొక్క పూర్ణజ్ఞానము ఈ దేహనికి అందడముతో పూర్ణజ్ఞానము పొందిన పూర్ణగురువుగా మారింది.ఈ అంతిమ ధ్యానానుభవాలతో 615 పేజిల "అంతర్వేదం" అనే ఆధ్యాత్మిక నవల రాయడము జరిగింది.కాని టైపింగ్ చెయ్యలేకపోతున్నాను.ఎందుకంటే  ఎపుడైతే ఈ దేహనికి పూర్ణజ్ఞానము అందినదో అలాగే ఇన్నాళ్ళుగా మాయవలన కప్పబడి ఉన్న భగవత్ తత్త్వము బయటపడటముతో యత్ భావము తత్ భవతిగా..నాలో భగవత్ తత్త్వము అలాగే పూర్ణజ్ఞానము వలన అపుడిదాకా అసంపూర్ణముగా కనిపించిన ఈ విశ్వమంతా గూడ పూర్ణముగా..పూర్ణజ్ఞానముగా అలాగే అపుడిదాకా నేను తెలుసుకున్న అనుభవ ధ్యానానుభవాలు లోకానికి చెప్పాలనే అనుకొనే మనస్సుకి కాస్త అందరు గూడ పూర్ణజ్ఞానులుగా..భగవత్ స్వరూపముగా కనిపించడము ఆరంభమైంది.నాకు నేను జ్ఞానము చెప్పడము ఏమిటి?నాకు నేను మాట్లాడుకోవడము ఏమిటి?ఉన్నంతా నా స్వరూపమే గదా..నేను కానిది లేదు..నేను లేనిది లేదు.ఉన్నదంతా పూర్ణశూన్యమే..ఏమిలేదు..సర్వం శూన్యమే గదా...అనే పూర్ణశూన్య స్ధితి ఈ దేహము చేరుకుంది. దానితో ఈ దేహము కాస్త మేధా దక్షిణామూర్తిలాగా మౌన:బ్రహ్మ అయింది.మౌనము అంటే ఎవరితోను మాట్లాడాలని అనిపించకపోవడము అన్నమాట.కాని బ్రతికున్న శవము లాంటి  ఈ దేహనికి చావు వచ్చేదాకా చాకిరి తప్పదని..ఉన్నది కూటి కోసము..పోయేది కాటి కోసము..దేహనికి విముక్తి కోసము పూర్ణశూన్య ప్రతీకయైన ఆకాశము కేసి కాటి పిలుపు కోసము ఎదురుచూస్తోంది.

కొన్ని రోజుల తర్వాత నాకు ఒక సందేహము వచ్చింది.అది ఏమిటంటే నా అంతిమ ధ్యానానుభవముగా అండ,పిండ,బ్రహ్మండమును కలుపుతూ ఒక అండకార స్ఫటిక పరమలింగము దర్శనమైంది గదా.మరి ఈ భూమ్మీద గూడ ఎక్కడో ఒక చోట పరమలింగము అంశ ఉండి ఉండాలి గదా..అది ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని నాలో సంకల్పము మొదలైంది.దానితో పుస్తక గ్రంథాలు తిరగవేశాను.వీటిలో అంతిమ రూపము పరమలింగమే అని చెపుతున్నాయి కాని అది ఎక్కడ ఉన్నదో చెప్పలేదు.దానితో నేను కాస్త నాకున్న మనోజపసిద్దిని ఉపయోగించుకొని మనస్సు చెప్పిన చోటుకి వెళ్ళి పరమలింగము యొక్క జాడ తెలుసుకోవాలని నిశ్చయించుకోని ధ్యాననిష్ట కొనసాగించాను.  

కొన్నిరోజుల తర్వాత నాకు ధ్యానములో చిదంబర క్షేత్ర దర్శనమైంది.దానితో నేను కాస్త ఈ క్షేత్రదర్శనానికి వెళ్ళాను.ఉదయము ఈ ఆలయము తెరిచిన దగ్గర నుండి మూసేదాకా ఈ ఆలయ పరిసరాలలో ఉండి నామ జపము చెయ్యడము ఆరంభించాను.ఎందుకంటే ఈ ఆలయములో ఒక ప్రత్యేకత ఉంది.అది ఏమిటంటే ఈ ఆలయములో రాత్రి పది గంటలకి శేషహరతిని ఒక తెల్లని వస్త్రమునకు ఇస్తారు.ఎందుకంటే ఈ వస్త్రము వెనుక శ్రీచక్ర లేదా శివశక్తి లేదా శివ యంత్రమున్నదని..అందుకు గుర్తుగా ఈ వస్త్రము మీద బంగారపు బిల్వపత్రమాలను దండగా వేసి ఉంటుంది.కాని నిజానికి ఈ క్షేత్ర చిదంబర రహస్యము ఏమిటంటే ఈ తెల్లని వస్త్రము మీద ఎవరికైతే శివలింగదర్శనమవుతుందో వారికి మోక్షప్రాప్తి కల్గుతుందని స్వయంగా సదాశివుడు సప్తరుషులకి చెప్పడము జరిగినదని కాశీఖండము నందు శ్రీనాథుడు చెప్పిన విషయము నాకు లీలగా గుర్తుకు వచ్చింది.దానితో ఎలాగైన ఈ తెల్లని వస్త్రము మీద శివలింగదర్శన ప్రాప్తి కల్గితే కాని ప్రత్యక్షానుభవము వలన ఈ దేహనికి మోక్షము కల్గుతుందని నమ్మకము కల్గుతుంది గదా అనిపించేది.ఎందుకంటే ఇపుడిదాకా ధ్యానయోగిగా నాకు ధ్యానానుభవాలు కల్గిగాయి కాని అనుభూతి కల్గలేదు.దానితో ఈ క్షేత్రములో నా అంతమధన సాధన మొదలై పదిరోజులు గావస్తోంది.అయిన ఏలాంటి ఫలితము కనిపించలేదు.ప్రాణత్యాగము చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.మూడు రోజులు గడిచాయి.ఒకరోజు ఉదయము నా ధ్యానము తీవ్రస్ధాయిలో ఉండగా..నా మనో దృష్టికి యందు ఒక స్త్రీ మూర్తి యొక్క కుడి అరచెయ్యి కనిపించి నా కంఠము మీద ఈ చెయ్యి ఉంచి ఉంచగానే నా కంఠ మధ్యభాగములో దివ్యతేజస్సుతో కాంతులు చిమ్ముతో ఒక స్ఫటిక శివలింగ దర్శనమైంది.కొన్ని క్షణాలు తర్వాత ఈ దృశ్యము అదృశ్యమవ్వడముతో నాకు ధ్యానభంగమైంది.ఆ తర్వాత యధావిధిగా దర్శనానికి వెళ్ళితే ఎపుడు గూడ ఖాళీగా కనిపించే తెల్లనివస్త్రము మీద ఈ సారి నాకు స్ఫటిక శివలింగము అచ్చుగుద్దినట్లుగా నా కంఠములో ఉన్న నందు కనిపించిన లింగమూర్తి లాగా కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది. ఎవరైతే పూర్ణజ్ఞానస్దితికి వస్తారో వారికి  ఇలా జ్ఞాన స్ఫటిక శివలింగ దర్శనము అవుతుందని..ఎందుకంటే కంఠము నందు ఉండే విశుద్ధ చక్రము అనేది జ్ఞానానికి ప్రతీక పైగా ఈ చక్ర క్షేత్రము చిదంబర క్షేత్రము అలాగే ఎవరైతే పూర్ణజ్ఞానస్ధితిని పొందుతారో వారికి ఖచ్చితముగా ఈ క్షేత్రమునందు తెల్లని వస్త్రము మీద ఇలా జ్ఞానలింగము కనపడుతుందని..కనపడాలని..అపుడే ఆ ఆత్మజీవికి కైవల్యముక్తియగు మోక్షానికి అర్హత ఉన్నట్లేనని నాకు జ్ఞానస్ఫురణ అయింది.ఇంతలో నా మనస్సు కాస్త లయతప్పడముతో నేను కాస్త ధ్యాననిష్టలోనికి వెళ్ళితే ఈ సారి నా మనోదృష్టియందు మళ్ళీ ఆ స్త్రీ మూర్తి చెయ్యి కనిపించి ఈ సారి నా కంఠములో ఉన్న స్ఫటిక శివలింగమును తన చేతితో పికివేసింది.అపుడు ఈ శివలింగ స్ధానములో ఒక గుంట ఏర్పడింది.అపుడు నా శరీరములో ఒక వెండిరంగు పాము పాకుతూ ఈ గుంట లోపలకి వెళ్ళే దృశ్యము లీలగా కనిపింస్తూండగా నాకు ధ్యానభంగమైంది.ఈ పాము గోల ఏమిటో..శివలింగమును బలవంతముగా నా కంఠము నుండి పెకిలించడము ఏమిటో నాకు ఒక పట్టనా అర్థము కాలేదు.బాధతో..ఆవేదనతో నాకు ఏడ్పుపు తన్నుకొస్తోంది.ఆపుకోలేకపోయాను.నేను ఏమైన తప్పు చేశానా...లేదా మాయలో పడ్డానా... లేకపోతే నా కంఠములో ఉన్న జ్ఞానలింగమును ఎందుకు బలవంతముగా తొలగించబడింది.కారణము లేనిదే కార్యముండదు.ఎదో జరిగింది.ఎదో జరుతోంది.కాని అది నాకు అర్ధము గావడము లేదని నాకు అర్ధమైంది.మళ్ళీ ధ్యానములోనికి వెళ్ళాను.ఈ సారి నా మనో దృష్టియందు కాశీక్షేత్రము దర్శనమైంది.దానితో ఈ దేహము కాస్త కాశీయాత్రకి ప్రయాణమైంది.

యధావిధిగా కాశీ క్షేత్ర దర్శనాలు పూర్తి చేసుకొని నా ఆత్మగురువైన శ్రీ త్త్రైలింగస్వామి మఠమునకు చేరుకొని నా ఆవేదనను తీర్చామని అక్కడున్న ఆయన విగ్రహమూర్తిని వేదుకొని ధ్యానములో కూర్చునాను.ఏమి కనిపించలేదు.ఇలా ఈ క్షేత్రములో 41 రోజులున్నాను. ఫలితము శూన్యము..నా ప్రశ్నకి సమాధానము లేదు.నాలో తీవ్రమైన ఆవేదన ఉండటము వలన నా మనస్సు కాస్త తీవ్రమైన ఒత్తిడికి గురై తట్టుకోలేక ఈ క్షేత్రము నందు ఆత్మహత్య చేసుకోవాలని తీవ్ర ప్రయత్ననాలు చెయ్యడము ఆరంభిచింది.ఇలాంటి పరిస్ధితిలో ఉండగా నేను కాస్త మణికర్ణిక ఘాట్ చేరుకొని తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగా నా మనోదృష్టి యందు యధావిధిగా నా కంఠము నందు ఉన్న శివలింగమును పెకలించిన దృశ్యము లీలగా కనిపించింది.నాలో ఆవేదన మొదలైంది.ఇంతలో అదే చెయ్యి కాస్త నా కుడి చెవిలో నర్మదానది బాణలింగము ఉంచగానే నాలో నమ:శివాయ అను శివతారక మంత్రోపదేశము మూడుసార్లు చేసినట్లుగా చాలా స్ఫష్టముగా అనిపించింది.అంటే కాశీ క్షేత్రములో ఎవరైతే పూర్ణజ్ఞానము పొందిన ఆత్మజీవిగా మరణమును పొందుతారో..అపుడు ఆ జీవుడికి స్వయంగా ఈ క్షేత్ర కాశీవిశ్వనాధుడే ఇచ్చే శివతారక మహా మంత్రోపదేశము ఇదేనని నాకు జ్ఞానస్ఫురణ అవుతుండగా నా ధ్యానభంగమైంది.ఆర్తితో నేను కాస్త నా గురుదేవుడైన శ్రీ త్త్రైలింగస్వామి మఠమునకు వెళ్ళి ధ్యానములో కూర్చున మరుక్షణములో నా మనోదృష్టి యందు పంచశిఖరాలున్న ఒక కొండ దర్శనమైంది.ఆ మరుక్షణమే ఏదో ఒక గుహలో నగ్నముగా ఉండి తన చుట్టు తాను తిరుగుతున్న నా రామ తారక మంత్ర గురువైన శ్రీ రమణ మహర్షి వారు కనిపించడముతో ..నాకు కనిపించిన కొండ అనేది అరుణాచల క్షేత్రములో ఉండే అరుణాగిరి అని నాకు అర్ధమైంది.అంటే కాశీక్షేత్రములో పొందిన శివతారకమంత్రమును తపస్సుగా అరుణచల క్షేత్రము చెయ్యాలని నాకు జ్ఞానస్ఫురణ అవ్వడముతో...అంటే కాశీ క్షేత్రములో మరణము పొందినగూడ మోక్షము రాదని..కానీ ఈ మోక్షమును పొందే యోగ్యతను పొందటానికి తగ్గట్లుగా ఇక్కడి విశ్వనాధుడు మనకి శివతారక మంత్రోపదేశము చేస్తాడని దీనిని 13 సం!!రాలు పాటు తపస్సులాగా అరుణచల క్షేత్రములో చెయ్యాలని..ఎందుకంటే అంతిమ పరమలింగము ఈ అరుణాగిరి అని నాకు జ్ఞానస్ఫురణ అయింది.అంటే కాశీక్షేత్రములో ఏ పూర్ణజ్ఞాన ఆత్మజీవి మరణము పొందుతుందో..ఆ జీవికి తన తారకమంత్రోపదేశము ఇవ్వడముతో ఈ ఆత్మజీవి కాస్త ఆత్మలింగముగా మారుతుందని ఎందుకంటే ఆదియోగి సదాశివుడు గూడ ఈ కాశీ క్షేత్రములో ఆత్మలింగముగా మారి కాశీ విశ్వనాధుడైనాడని పురాణ శాస్త్రవచనము గదా.అలా ఈ దేహము గూడ ఈ కాశీక్షేత్రము నందు ఆత్మజీవి నుండి ఆత్మలింగముగా మారినదని..ఈ లింగము కాస్త పరమలింగమునందు ఐక్యమవ్వాలంటే ఈ పరమలింగము ఉన్న అరుణాచల క్షేత్రమునకు ఈ దేహము ప్రయాణమైంది.

భగవంతుడున్నాడు

భగవంతుడున్నాడు.అవును మీరు విన్నది నేను చెపుతున్నది నిజమే.ఈ సృష్టిలో నాకు భగవంతుడు జాడ ....ఆయన భగవత్ తత్త్వము తెలిసింది.అది ఏమిటి..ఇపుడు దాకా దేవుడు లేడు..ఆత్మ లేదు..నేను లేను..ఉన్నదింతా ఏమిలేని పరమశూన్యము మాత్రమే ఉన్నదని చెప్పి ఇపుడు కొత్తగా భగవంతుడున్నాడని చెపుతున్నారు అంటారు.అవును అది చెప్పాను.ఇది చెపుతున్నాను.ఈ రెండు సందేశాలు గూడ సత్యమే..అంటే భగవంతుడు వేరు అలాగే దైవము వేరు అని ముందు తెలుసుకొండి.ఎందుకంటే భగవత్ తత్త్వము నుండి దైవ తత్త్వము వచ్చింది.దీని నుండి పురుష దేవుడు తత్త్వము దీని నుండి స్త్రీ దేవత తత్త్వము అలాగే దీని నుండి ఆత్మ తత్త్వము వచ్చాయి.

ఇందులో భగవత్ తత్త్వము అనేది నేను కాని నేను అయితే..దైవ తత్త్వము అనేది అహము అయితే..దేవుడు తత్త్వము నాది అయితే దేవత తత్త్వము నీది అయితే ఆత్మతత్త్వము అనేది నేను అవుతుంది.ఇపుడు దాకా నా ధ్యానానుభవాలు అన్నిగూడ అనగా కపాల మోక్ష గ్రంథ అనుభవాలు సృష్టి ప్రకృతి అనగా బ్రహ్మకపాలధారి దర్శనము...ది బుద్ధ కోడ్ పుస్తక అనుభవాలు స్ధితి ప్రకృతి అనగా ఆరు మణుల దర్శనము..అంతర్వేదం పుస్తక అనుభవాలు లయ ప్రకృతి అనగా పరమ లింగ దర్శన అనుభవాలతో అనగా పురుష..స్త్రీ..అర్ధనారీతత్త్వ ప్రకృతులతో...సృష్టి..స్ధితి..లయ ప్రక్రియలతో..సత్వ,రజో,తమో గుణాలతో ఈ మూడు ప్రకృతులలోని అన్ని దైవ,ఆత్మ స్వరూపాలు దర్శనమిచ్చి చివరికి అశాశ్వత మరణాలు పొంది పరమ శూన్యము నందు లయము చెందడము చూశాము గదా.దీనిని బట్టి ఈ మూడు ప్రకృతులలో శాశ్వతమైనది..శాశ్వతమైనవాడు ఏది నాకు కనిపించకపోవడముతో నేను కాస్త దేవుడు లేడు..ఆత్మ లేదు..నేను లేను..ఉన్నదింతా పరమశూన్యమేనని చెప్పడము జరిగింది.కాని ఈ మూడు ప్రకృతులు దాటితే..ఈ మూడు గుణాలు దాటితే..మనకి నాలుగోవ ప్రకృతి స్ధితి అదే మూల ప్రకృతి అయిన లాస్య ప్రకృతి..నాలుగువ గుణరూపమైన శుద్ధసత్వగుణము.. శాశ్వతుడు.. మృత్యుంజయుడు.. సర్వజ్ఞుడు.. సర్వశక్తిమంతుడు.. సర్వదక్షడు అయిన శ్రీ మేధాదక్షిణామూర్తి యొక్క భౌతిక..ఆత్మ..జ్యోతి..నేను కాని నేను తత్త్వస్వరూపముగా మనకి అరుణాచల క్షేత్రము నందు ఇపుడికి సజీవమూర్తిగా కనపడుతుంది.ఇపుడిదాకా నేను చూసిన అన్ని దైవస్వరూపాలు అన్నిగూడ నా యోగచక్రాల దైవాలుగా చూడటం జరిగింది.ఆ తర్వాత ఇవన్నీగూడ కాలానుగుణముగా శూన్యములో కలిసిపోయాయి.ఇపుడు మాత్రము ఈయనని నా యోగచక్రదైవము కాకుండా నాకు లాగా ఒక స్ధూలశరీరముతో సజీవమూర్తిగా ఈ అరుణగిరి యందు చూడటముతో ఈ విశ్వమును నడిపించే సృష్టి,స్ధితి,లయ కర్తగా ఒక భగవంతుడున్నాడని నేను స్వానుభవముగా తెలుసుకున్నాను.చూడగలిగాను.దానితో భగవంతుడున్నాడని నమ్మకతప్పలేదు.నేను ఏది గూడ శాస్త్ర..శాస్త్రీయ నిదర్శన ఆధారాలు లేకుండా నమ్మనని నా  ధ్యానానుభవాలు చదివిన తర్వాత మీరందరికి తెలిసే ఉంటుంది.

అరుణాచల అనుభవాలు: 

నిజానికి అరుణాచల గిరి ఆధ్యాత్మిక విద్యుత్ అయస్కాంత గిరి..దీని వలన ఈ క్షేత్రానికి 1000 కి.మీ పరిధిలో ఉన్న అర్హత,యోగ్యత,యోగము ఉన్న యోగులను ఈ గిరి ఆకర్షించుకుంటుంది.తన దగ్గరికి రమ్మని స్వయంగా మనకి ధ్యానము నందు లేదా స్వప్నము నందు పంచ శిఖరాలున్న ఈ గిరి కనిపించి చెప్పడము నా స్వానుభవము కాదు ఎంతో మంది యోగులస్వానుభవాలు నిరూపింస్తున్నాయి.ఇలా నాకు ధ్యానములో ఈ అరుణాగిరి కనిపించడముతో నేను కాస్త ఈ క్షేత్రానికి వెళ్ళడము జరిగింది.నేను మొట్టమొదటిసారి ఈ గిరిని చూసిచూడగానే నా చంచల మనస్సు కాస్త అచలము అనగా స్ధిరమైంది.పనిచెయ్యడము ఆగిపోయింది.ఆలోచనాలు ఆగిపోయాయి.నా ఆది జన్మ తల్లి..తండ్రి..గురువును చూస్తున్నా అనుభవ అనుభూతి..ఈ అరుణాపురము నా స్వంత ఊరు అని..ఈ అగ్నిలింగ దేవాలయము నా పూజ గది అని  బలంగా అనిపించి నా ప్రమేయము లేకుండా  నా కళ్ళ వెంట కన్నీరు ధారాపాతముగా కారడము మొదలైంది.కాని అలాగే నాలో పూర్ణజ్ఞాని..పూర్ణగురువు ..పూర్ణయోగి అనే మద..అహము..అహంకారాలు అను మూడు  మాయస్వరూపాలు బయటికి రావడము మొదలైంది.దానితో నా మనస్సు 48 ని దాటగానే ఈ జ్ఞానాంహర మాయకి గురియై...నేను ఏమిటి..ఒక ప్రక్క దేవుడు లేదు..ఆత్మ లేదు..నేను లేను అని చెపుతూ..మరోప్రక్క ఈ గిరికి నమస్కారము చెయ్యడము ఏమిటి..ఎముంది..ఇపుడు నేను చూసిన ఈ మూడు ప్రకృతులలోని దైవ,ఆత్మ స్వరూపాలు గూడ శాశ్వతముగా ఉన్నట్లుగా..సత్యముగా.. కనిపించి చివరికి కాలానుగుణముగా అశాశ్వత మరణాలు పొంది అసత్యాలుగా మారినట్లుగా ఈ గిరి దేవుడు గూడ మారవచ్చు గదా అనిపించింది.దానితో నా సిద్ధ మంత్ర,తంత్ర,యంత్ర ప్రయోగాలు ఈ గిరి మీద ప్రయోగించాను.ఎందుకంటే ఈయన శాశ్వతుడో కాదో తెలుసుకోవాలి  అదిగూడ నా స్వానుభవాలు ద్వారా తెలుసుకోవాలి అనిపించి..కట్టా శివ అను చెరువును ఉన్న ప్రాంతమునకు చేరుకొని అక్కడున్న ఒక గుహయందు చేరి అర్ధరాత్రి యందు ఈ మంత్రప్రయోగాలు చేసాను.దుర్గాయంత్రము ప్రయోగించాను.అదికాస్త ఈ గిరి దగ్గరికి చేరిగానే ఈ గిరికి గీసిన మంత్రయుతమైన గీత యొక్క అతీశక్తివంతమైన రేడియాషన్ వలన ఈ యంత్రము దగ్ధమైంది.ఆ తర్వాత నా దగ్గరున్న సుదర్శనచక్ర సాలిగ్రామ ప్రయోగము చేసాను.ఇదిగూడ ఈ గిరిగీతను దాటలేకపోయింది.ఇలాగాదనుకొని స్ఫటిక బాణలింగ ప్రయోగము చేసాను.ఇది మాత్రము గిరిగీతను దాటుకొని గిరి అగ్రభానికి చేరుకొన్న కొన్ని క్షణాలకే అక్కడున్న లింగజ్యోతి యందు ఇది ఐక్యమైంది.దానితో నా బుర్ర తిరిగింది.ఇది గాదనుకొని శివుడిని ఎపుడు గూడ శంఖముతో పూజ చెయ్యరాదని చెప్పిన సూత్రము ఆధారముగా నా దగ్గరున్న గోమతీ శంఖ ప్రయోగము చేశాను.ఇదీ కాస్త ఈ గిరి చేరుకొని గిరి దక్షిణ భాగమునందు రంపములాగా కొయ్యడము ఆరంభించిన కొన్ని క్షణాలకే ఈ శంఖముగూడ అగ్నికి ఆహూతి అయింది.దానితో నాలో కోపావేశాలు అమితముగా పెరగడముతో ఈ గిరిని నా కపాలాగ్ని సిద్ధితో దహనము చెయ్యాలని ప్రయోగము చేశాను.గిరి  దగ్ధమవ్వడము ఆరంభమైన కొన్నిగంటలకి ఈ గిరి కున్న రహస్య సొరంగమార్గము నుండి ఈ గిరి అంతరభాగములో ఉన్న అగ్నితీర్ధము బయటికి వచ్చి ఈ కపాలాగ్ని చల్లారిచ్చే దృశ్యమును చూడగానే నాలో ఉన్న త్రీ మాయలు గూడ దగ్ధమవుతూండగా నాలో సంస్కారమేర్పడి ఈ గిరికి నమస్కారభక్తితో చేసి నా ఆత్మను శరణాభక్తితో ఆత్మనివేదన చెయ్యగానే నా మనోదృష్టియందు సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి కనిపించి..నాయనా..బాధపడకు.నువ్వు నా అంశవి గావడము వలన ఈ మంత్రప్రయోగాలు చేసావు.చింతించకు.మేముగూడ నీకు లాగానే ఈయన మీద ప్రయోగాలు చేసి విఫలమైనాము.ఆయన శాశ్వతుడు..నిత్యుడు... మరణము లేనివాడు..నేను కాని నేను వాడు..ఏమి లేనివాడు..ఏమి కానివాడు..అన్నింటికి సాక్షిభూతుడు.. ఆధారభూతుడు.. మర్మయోగి..మౌనయోగి..అంటూ అదృశ్యమవ్వడముతో..గుడి గంటలు మ్రోగడముతో..నా ఆత్మమాయ మాయం అయింది.దానితో ఆత్మవిచారణ చేసుకొని ఈ క్షేత్ర విశేషాలు కోసము ఇంటర్నెట్ చూడటము అందులో ఒక వీడియోలో సప్తరుషులు ఈ క్షేత్ర దారుకావనము నందు నిత్యహోమాలు చేస్తూ ఈ సృష్టి అంతాగూడ కర్మానుసారముగా నడుస్తోందని..ఈ కర్మకి జీవుడే కర్త కాబట్టి ఇందులో దేవుడు ప్రమేయము లేదని ...జీవుడే దేవుడని వీళ్ళకి ఉన్న జ్ఞాన అహంకారముతో అనుకోసారు.ఇది తెలుసుకున్న ఈ క్షేత్ర నిత్య సత్య నివాసి  యైన అరుణాచలేశ్వరుడు కాస్త భిక్షామూర్తిగా వీరి దగ్గిరికి వచ్చి వీరి అహమును భిక్షగా తీసుకోవాలని అనుకుంటున్న సమయములో ఈయన ముగ్ధమనోహర నగ్నదేహమును చూసిన ఈ సప్తరుషుల సతులు కాస్త ఈయన యందు ప్రేమ,మోహ,వ్యామోహలు చెంది తమ భర్తలను వదిలిపెట్టి ఈయన వెంటబడిన దృశ్యాలను చూసిన ఈ రుషులు కాస్త తమ దివ్యదృష్టితో వచ్చినవాడు సాక్షాతు శివుడేనని గ్రహించి ఈయనను చంపాలని మంత్ర తంత్ర ప్రయోగాలు చెయ్యడము ఆరంభించారు.మొదట హోమాగ్ని నుండి అగ్నిపులిని ప్రయోగిస్తే..ఆయన దీనిని చంపి దాని చర్మమును ఆసనముగా చేసుకొన్నాడు.ఆతర్వాత జింకను ప్రయోగము చెస్తే దీనిని ఈయన కాస్త దీనిని తన మనస్సు అనే ఆయుధముగా చేసుకున్నాడు.ఇలాగాదనుకొని ఈ సారి అగ్ని సర్ప ప్రయోగము చేస్తే దీనిని ఈయన తన కంఠమునందు నాగాభరణముగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఏనుగు ప్రయోగము చెస్తే ఆయన దీనిని చంపి దీనిని చర్మమును తన వస్త్రముగా చేసుకొన్నాడు.ఈ సారి సమస్త ప్రేతా,భూత,రాక్షస ఇలా 8 రకాల జాతులను ప్రయోగము చేస్తే ఈయన కాస్త వీరందరిని తన రుద్రగణాలుగా మార్చుకోవడముతో ఈ సప్తరుషులలో మార్పు వచ్చి మాయను తొలగించుకొని ఈయనకి తమ అహము అనే మాయను భిక్షగా వేసి ఈయనకి దాసోహలై మౌనదీక్ష చేపట్టి పూర్ణజ్ఞాన మునులుగా మారి ఇపుడికి కూడ  హిమాలపర్వతాలలో ఒకటైన నందాదేవి పర్వతము మీద సూక్ష్మశరీరాలలో ఆవాసము చేసే వీరంతా గూడ  బ్రహ్మీముహర్త కాలము అనగా తెల్లవారుజామున 3:45 కాలము నందుఈ గిరికి చేరుకొని ఈ గిరి అంతరమునందు ఉన్న ఆవాస మర్మయోగి అయిన శ్రీమేధా దక్షిణామూర్తికి చేసే సప్తరుషి పూజలు,హరతి జరిగే విధివిధానము దీనిని చూడటానికి సమస్త దైవాలు,వివిధ లోకావాసులు, ఆత్మజీవులు,ఆత్మయోగులు,ఆత్మగురువులు,ఆత్మజ్ఞానులు, ఆత్మసాధువులు ఇలా ఎందరో గూడ వచ్చి చూసి తరించే అంతాగూడ నా మనోదృష్టియందు కనిపించడముతో నేను మౌనముని అయ్యాను.ఎందుకంటే నా గోత్రము గౌతమస్య..ఇది గౌతమ మహర్షి ది గావడము విశేషము.ఇది ఇలా ఉంటే మనకి సాధనలో నేను అనేది పూర్ణశూన్యమనే అనుభవము మాత్రమే కల్గుతుంది కాని అనుభూతి కల్గుదు.ఎందుకంటే నేను అనేది అంతరించిపోతుంది కాని నేను కాని నేను అనే జ్ఞానము శాశ్వతముగా మిగిలిపోతోంది.అదే శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపము..దీనిని ఎవరు నాశనము చెయ్యలేరు.ఏది నాశనము చెయ్యలేదు.ఎందుకంటే ఈ ఆత్మశక్తి అనేది సైన్స్ ప్రకారముగా చూస్తే శక్తి దేనితో సృష్టించబడదు.దేనితో నాశనము చెయ్యబడదు.అలా దీని ప్రకారము చూస్తే ఆఖరిగా మిగిలే ఆత్మస్వరూపమును దాటితే మనకి ఈ గిరిలోపుల ఉన్న అగ్ని తీర్ధము నందు మనకి గుండ్రాని ఆరు విద్యుత్ అయస్కాంత శక్తితరంగాలను ప్రతినిత్యము..ప్రతిక్షణము ప్రసరింప చేసే ఒక స్ఫటిక అగ్నిశిఖ కనపడుతుంది.దీని ఉన్న నవవిధశక్తులైన న్యూక్లియర్ రేడియోషను శక్తి కాస్త శ్రీ మేధాదక్షిణామూర్తి ఆత్మస్వరూపానికి చేరి ఆత్మశక్తిగా మారడము..ఈ ఆత్మశక్తిగా కాస్త అగ్నిశక్తిగా మారి ఈ అరుణాగిరికి అందడము..ఈ అగ్ని శక్తి కాస్త ఈ గిరి బయట ఉన్న అగ్నిలింగానికి జ్ఞానాగ్నిగా మారి సకల దైవ,ఆత్మస్వరూపాలకి అందడము..వీరి నుండి ఈ శక్తి కాస్త సకలజీవులకి కామాగ్నిశక్తి మారి అందడముతో ఈ విశ్వములో సృష్టి..స్ధితి..లయ..లాస్య ప్రక్రియలు  అవిశ్రాంతిగా కొనసాగుతున్నాయని నాకర్ధమైంది.అంటే ఈ లెక్కన మనము కేవలము ముక్తిన్ని మాత్రమే పొందుతాము కాని మోక్షము పొందలేము.ఎందుకంటే నేను అనేది సమసిపోతుంది.ఇది కైవల్యముక్తిన్ని ఇస్తుంది.కాని నేను కాని నేను అనేది శాశ్వతముగా మిగిలిపోవడముతో మోక్షము పొందలేము.సాధన అనేది ఎవరికి వారే చేసుకోవాలి.జ్ఞానమును గూడ ఎవరికి వారే తెలుసుకోవాలి.అంటే ఎవరి చావు వారే చావాలి.అది గూడ కేవలము ముక్తి మార్గము ద్వారా మాత్రమే జరుగుతుంది.నేను అంటే ఆత్మ అయితే నేను కాని నేను ఆత్మస్వరూపము అన్నమాట.మనకి ఉన్న పంచముక్తులు అనగా శరస్ధి..సారూప్య..సామీప్య..సాలోక్య..సాయుజ్య అను ముక్తులలో చివరిదైన సాముజ్యముక్తి అగు కైవల్యముక్తి మనకి ఈ అరుణాగిరి యందు జరుగుతుంది.అనగా మన ఆత్మలింగము కాస్త ఈ ముక్తి ద్వారా పరమలింగమగు ఈ అరుణాగిరిలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపమునందు నేనుగా..నేరుగా ఐక్యము చెందుతుందని నాకు జ్ఞానస్ఫురణ అవ్వడముతో..ఏలాగైన నేను ఈ కైవల్యముక్తి ని పొందకుండా మోక్షము పొందాలని అనగా ఈయనలో ఐక్యము కాకుండా అగ్నితీర్ధము నందు ఉన్న బడావాగ్ని అని అగ్నిశిఖ పూర్ణబిందువు ఐక్యము చెందాలని ఈ అరుణాగిరి మీద నేను కాస్త మంత్ర,తంత్ర.యంత్ర ప్రయోగాలు చెయ్యడము జరిగింది.అవి విఫలము చెందడముగూడ జరిగిందని ఈపాటికి మీకు తెలిసింది గదా.అంటే నేను అనేది పూర్ణశూన్యము అనే ధ్యానానుభవము మాత్రమే కలుగుతుందని..ఇది అనుభూతి పొందకుండా ఈ అరుణాగిరి ఆవాసి శ్రీదక్షిణామూర్తి చేస్తున్నాడని ఈపాటికి మీరందరికి అర్దమైంటుంది.ఈ అనుభూతి పొందితే ఈయన లేనట్లే..శాశ్వత మరణమును పొందినట్లే..ఉన్నదో లేదో తెలియని పూర్ణశూన్యము అనుభూతి పొందినట్లే..ఇదే అసలు సిసలైన మోక్షము అవుతుంది.దీనిని సాధించడానికి..దీనిని పొందడానికి నాకు లాగా ఎందరో యోగులు,దైవాలు,ఆత్మజీవులు, ఈ గిరి మీద ప్రయోగాలు ఎన్నో కోట్లానుకోట్ల బ్రహ్మకల్పాలు నుండి చేస్తున్నారు.ఆయనకి శాశ్వతమరణము ఇవ్వాలని ప్రయత్నప్రయోగాలు చేసి విఫలమై పంచముక్తులు పొందుతున్నారు. అనగా ఆత్మశరీర జీవులుగా.. ఆత్మజ్ఞానలింగాలుగా.. ఆత్మలింగాలుగా..ఆత్మజ్యోతులుగా.. అరుణజ్యోతిగా అనగా శరస్ధ... సారూప్య..సామీప్య..సాలోక్య..సాయుజ్య అను పంచముక్తులు పొందుతున్నారు అన్నమాట.ఇక్కడ చాలామందికి ఒక సందేహము రావచ్చును.అది ఏమిటంటే ఏ పాపము చేసాడని అరుణాగిరి వాసియైన శ్రీ దక్షిణామూర్తి మీద మంత్ర ప్రయోగాలు చేసి చంపాలని చూడటము ఎందుకు? అన్నపుడు ఏవరికి అయితే తమ ధ్యానము నందు కుడిచెవియందు నర్మదానది బాణలింగమున్నట్లుగా కనపడితే వాడు శివోహం..అనగా సాక్షాత్తు శివుడే అన్నమాట.అంటే ఈ లెక్కన చూస్తే అరుణాగిరి దక్షిణామూర్తికి వీడికి ఏమి తేడా ఉండదు అన్నమాట.కాని అద్ధములో బింబ..ప్రతిబింబములాగా వీరిద్దరుగా కవలపిల్లలుగా కనపడతారు.కాని నిజానికి వీరు ఇద్దరు కాదు ఒక్కరే గదా..ముక్తి అనేది  ద్వైతస్ధితి అనగా నేను వేరు..నువ్వు వేరు భావము కల్గించి ఆత్మలింగము కాస్త పరమలింగములో ఐక్యము చెందేటట్లుగా చేస్తుంది.అదే మోక్షము అయితే అద్వైతస్ధితి అనగా ఉన్నది ఒక్కటే..అదే ఏకత్వ స్ధితి అను భావము కల్గించి భిన్నభావాలు కల్గించే మనస్సును నాశనము చేసి అనగా బింబ..ప్రతిబింబాలు చూపించే మనస్సు అనే అద్ధము నాశనము అయితే మనకి ఏకత్వసిద్ది కలిగి మనము ఆత్మలింగము గాదని పరమలింగమేనని భావప్రాప్తి కలుతుంది.దీని కోసమే అందరు గూడ తమ జ్ఞానమును పరీక్షించుకోవటానికి ఈ అరుణాగిరి మీద అనగా తమ మీద తామే మంత్రప్రయోగాలు చేసుకొని చావటానికి వచ్చేటపుడు బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చి ఈ ప్రయోగాలు చేస్తున్నారని నాకర్ధమైంది.ఎందుకంటే మనమంతా గూడ కోరిక లేని  సమాజము చూడాలని కోరిక పెట్టుకొని సాధన చేస్తున్న ఆత్మజీవులే.ఎందుకంటే మోక్షము పొందాలి అనేది గూడ కోరికయో గదా.ఈ కోరిక కోసం రూపము లేని మన మనస్సు కాస్త రూపభావాలోచన ఆత్మస్వరూపముగా ఏర్పడింది.మోక్షమంటే మనస్సు లేని స్ధితి..అనగా ఇది పొందామో లేదో తెలియని అయోమయ వింత స్ధితి..అనగా చచ్చేవాడికి తాను చచ్చానని ఎన్నడికి తెలియని స్ధితియే నిజ మోక్షస్ధితి..దీనిని అనుభవముగా మనము పొందామో లేదో తెలియడానికి ఈ అరుణాగిరి మీద మంత్రప్రయోగాలు చేసి ఆయనను  జయించినట్లేతే మనకి మోక్షానుభూతి కల్గుతుందని ఈ ఏర్పాట్లు చెయ్యడము జరిగింది.అనగా శ్రీశైలము నంది త్రిశూలశిఖర దర్శనము..అలాగే కాశీలో నీడ చూపించని బావి ఉన్నట్లుగానే ఈ అరుణాచలములో ఈ ఏర్పాటు చేసారు.ఎవరైతే పూర్ణస్ధితికి వస్తారో వారి మనోదృష్టికి ఇప్పుడికి ఈ గిరిచుట్టు సప్తరుషులు ప్రయోగాలు చేసి సృష్టించిన ఏనుగు, పులి,పాము,జింక,కుక్క,అస్ధిపంజరాలు,ప్రేతాత్మలు, భూతాలు,మంత్రదేవతలు,శంఖ ప్రయోగాలు ఈ అరుణాగిరి నాశనము చేసే విశ్వప్రయత్నానాలు చూడవచ్చును.అరుణాగిరి మంత్రగీత శక్తి..గిరిప్రదక్షిణశక్తి..అష్టలింగాల దిగ్భంధన శక్తిని మన భౌతిక నేత్రాలతో చూడవచ్చును. 



అలాగే దక్షిణామూర్తి రూపము గూడ మన భౌతిక నేత్రాలకి అర్ధరూపముగా అనగా జగ్గీవాసుదేవా ఆశ్రమములో ఉన్న 112 అడుగుల ఆదియోగి శివ స్వరూపమే అరుణాగిరి యందు కనిపించే ఈయన భౌతికరూపము అన్నమాట.ఇక త్రినేత్ర దృష్టికి ఈ రూపము మనకి శ్రీశంకరాచార్యుడు చెప్పిన శ్రీ దక్షిణామూర్తి సోత్ర వర్ణములో వర్ణించినట్లుగా ఈయన ఆత్మస్వరూపము కనపడుతుంది.ఈ రెండు రూపాలు గూడ మనకి ఈ గిరి యందు కనిపించడము లేదంటే ఇక మన సాధన పరిసమాప్తి అవ్వకపోవాలి అన్నమాట.అలాగే మనకి ఈ క్షేత్రములో సిద్దిపొందిన ఆత్మజ్ఞానుల ఆత్మశరీరాల దర్శనం మొదలుకొని గిరి అగ్రభాగములో స్వయంభూ పద్మాకార  అగ్నిలింగము..ధ్యానయోగి అయిన సదాశివుడి దర్శనము..అమ్మవారి అభయ హస్త దర్శనము..మహాలక్ష్మీ స్వరూప అనుభవదర్శనము..దక్షీణామూర్తి రూపదర్శనాలు...గిరి లోపుల ఉన్న అగ్నితీర్ధ దర్శనము..అగ్నిబిందు దర్శనముతో మన మనోదృషి దర్శనాలు సంపూర్తి అవుతాయి.


దీనికి సూచనగా మనకి ఈ క్షేత్రములో ఉన్న పంచముఖ దర్శన ప్రాంతములో మనకి ఒక పద్మాకార శివలింగము దానిని క్రింద నల్లని పంచ శివలింగాలు దీని క్రింద ఒక అటవిక అరుణయోగి ఉంటాడు.అంటే దీనిని బట్టి చూస్తే మనకి అరుణాగిరి మీద మనోదృష్టితో చూస్తే...అరుణాజ్యోతి దర్శనము..అందులో పంచ శివలింగాలు అనగా పద్మకార పంచలోహ,స్ఫటిక,నల్లని,తెల్లని,పాదరస ఇలా పంచ శివలింగాల దర్శనము అటుపై శ్రీ మేధా దక్షిణామూర్తి దర్శనము అవుతుందని అవ్వాలని అక్కడ పూర్వీక మహర్షులు మనలాంటి వారికి తెలియటానికి ఈ విధమైన ఏర్పాటు చేశారు.ఇలా ఏవరికైతే ఈ అరుణాగిరి యందు తమ మనోదృష్టికి ఈ మహత్తర దృశ్యాలు దర్శనమవుతాయో వారికి ఈ జన్మ ఆఖరి కర్మ-జన్మ అవుతుంది.పున:రపి జననము..పున:రపి మరణము లేని మోక్షప్రాప్తి ఖచ్చితముగా పొందుతారు.అందుకు నా దేహజన్మయే మీకు సాక్షిభూతము.

అలాగే ఈ దృశ్యాలు మన శరీరములో ఎవరైతే చూడగలరో వారే నిజ పూర్ణబ్రహ్మజ్ఞాని.వారే మోక్షగామి.ఎలాంటే మన మూలాధార చక్రము నందు పంచలోహ శివలింగము అలాగే వరుసగా విశుద్ధ, ఆజ్ఞా, సహస్ర, హృదయ చక్రాలలో స్ఫటిక, నల్ల, తెల్ల, పాదరస శివలింగాలున్నాయి.అలాగే మన బ్రహ్మరంధ్రము నందు అరుణాగిరి యొక్క అరుణాజ్యోతి అనగా బ్రహ్మజ్యోతి దర్శనమవుతుంది.మన బ్రహ్మరంధ్ర గుహయే మన అరుణాగిరి గుహ అవుతుంది.మన మెదడే అరుణాగిరి గాను..మెదడులోని పిట్యూటరీ గ్రంధియే మన దక్షిణామూర్తిగాను ..మన కపాల అగ్రభాగము అనగా నుదురు భాగమంతా గూడ అరుణాచల క్షేత్రముగా దర్శనంవుతుంది.ఇలా ఏవరి దేహము దేవాలయముగా కనపడుతుందో సాధన అంతిమ స్ధితి అయిన వారే అరుణాగిరి యోగి అవుతారు.మారతారు.ఈ స్ధితిని ఈ దేహము పొందడముతో నేను ఇంత వివరముగా చెప్పగలుగుతున్నాను.

నిజానికి ఈ క్షేత్రము దక్షిణమూర్తి రూపమైతే..ఉజ్జాయిని క్షేత్ర జ్యోత్లిలింగము దక్షిణామూర్తి శివలింగమవ్వడము విశేషము.ఇలా ఈ దర్శనాలు మనకి పూర్తీయితే మనము ఈ క్షేత్రములో చేసే శివతారకమంత్ర తపస్సు పూర్తి అయ్యినట్లే..దీనికి 13 రోజుల నుండి 13 సం!!రాలు పడుతుంది.ఈ లోపు మనకి ఈ దర్శనాలు సంపూర్తిగాకపోతే మొహమాటము లేకుండా ఈ క్షేత్రము నుండి మన ప్రమేయము లేకుండా అహము అడ్డువచ్చి గొడవలేర్పడి వెళ్ళేపోయిన యోగులు గూడ ఉన్నారు.అలాగే కొన్ని దర్శనాలు పొంది అరుణాజ్యోతి గా మారకుండా ఈ గిరి అంతర్గత గుహల యందు ఆత్మశరీరాలతో సాధన చేస్తున్న యోగులున్నారు.ఈ అరుణాగిరి యందు నా దేహ మాంస భౌతిక నేత్రాల దర్శనాలు అలాగే నా మనో దృష్టి నేత్ర దర్శనాలు సంపూర్తిగావడముతో ఇంత వివరముగా చెప్పడము జరిగింది.ఎందుకంటే నా ఆదిజ్ఞానజన్మ గౌతమ మహర్షిదని చెప్పాను గదా.ఆ జన్మలో నాకు పూర్ణాగ్ని బిందు దర్శనప్రాప్తి కాలేదు.అది ఇపుడు అయింది.కాకపోతే ఋభు మహర్షి గూడ మొదటి నుండి ఏమిలేదని..అంతా శూన్యమేని చెపుతూ వచ్చి చివరికి అరుణాగిరిలోని దక్షిణామూర్తి దర్శనము పొందడముతో ఈయనే శాశ్వతుడు..నిత్యుడని ఒప్పుకొని ఋభుగీత రచించి చెప్పడము జరిగింది.చివరికి నేనుగూడ ఇదే చేశానని నాకు అర్ధమైంది.అందుకే రమణ మహర్షి తన సమాధి మీద జరిగేది జరగక మానదు.జరగనిది ఎన్నడికి జరుగదు.అంటే మనము ముక్తిజీవులేమని..మోక్షజీవిగా మారడము ఎన్నడికి జరగదని ఆయన చెప్పకనే చెప్పిన అనుభవ నగ్నసత్యము అని తెలియటానికి నాకు 32 సంరాలు పట్టింది.అనగా మనలో జ్ఞానమున్నంత వరకు దక్షిణామూర్తి కనపడుతునే ఉంటాడు.జ్ఞానరాహిత్య స్ధితియే మోక్షమవుతుంది.అనగా అగ్ని వలన జ్ఞానాగ్ని..దీని వలన ఆలోచనాలు..దీని వలన అహము..దీని వలన ఆత్మరూపము..దీని వలన భావాలు నిరంతరగా మనకి కల్గుతున్నాయి.పోనీ వీటి అన్నింటికి కారణ అధార భూతమైన అగ్నిబిందువును నాశనము చేద్దామంటే అది నాశనము గాదు.పూర్ణబిందువుగా మళ్ళీ విభజన చెందుతుంది.అంటే ప్రవహించే పాదరసమును చేతితో విభజన చేస్తే అది పూర్ణబిందువులుగా మారి విడిపోతుందో అలా ఈ పూర్ణ అగ్నిబిందువు తత్త్వమున్నదని అనగా ఏక పూర్ణబిందువు నుండి అరుతత్త్వాలతో ఉన్న మూడు పూర్ణబిందువులు అనగా త్రిమూర్తులు విభజన చెందారని..ఆపై 1,3,5,7,9,11,13,15 అనగా 64 పూర్ణబిందువులుగా  ఏర్పడినాయని..ఇవికాస్త 64కోట్ల800 కోట్ల అత్మపూర్ణబిందులుగా మారి అండ,పిండ,బ్రహ్మండాలుగా మారినాయని....పైగా అరుణాబిందు కాంతిని ఆకులు తింటాయి.వీటిని మేకలు తింటే వీటిని పుల్లులు తింటే వీటిని మృత్యువు తింటే..దీనిని కాలము తింటే దీనిని మహా కాళిక తింటుంది.ఈవిడే మూడు ప్రకృతులను తిని నాలుగువ ప్రకృతి అయిన అరుణాక్షేత్రమునకు వచ్చి పూర్ణాగ్ని బిందువును తినేలోపుల ఇక్కడ దక్షిణామూర్తి కాస్త ఈమె ముందు బాలశివుడిగా మారి ఏడూస్తూ కనిపించగానే ఉగ్రరూప కాళీమాత కాస్త శాంతమూర్తిగా మారి చంపటానికి వచ్చిన విషయము మర్చిపోయి అనగా అపసార్మకస్ధితిని పొందే చంపే శివుడికి ఒక తల్లిగా మారి చనుపాలు ఇస్తుంది.ఈ లెక్కన ఇక మనకి మోక్షము ఏముస్తోంది.నా బొంద..నా బూడిద.అసలు మేదాదక్షిణమూర్తికి శాశ్వతమరణము పొందాలని అనుకోవడము లేదని చాలా మంది అనుకుంటారు.కాని ఆయన కాదు.ఆయన బింబమైన మనము శాశ్వతమరణము పొందాలని అనుకోవడము లేదు.ఈ ఆలోచన చేస్తున్నాము కాని ఆచరణ చెయ్యలేకపోతున్నాము.అనగా బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకొని చావటానికి ప్రయత్నానాలు మనము చేస్తున్నాము.ఆయనేమి చెయ్యడు.ప్రతిదానిని సాక్షిభూతముగా చూస్తూంటాడు. అద్దములోని ప్రతిబింబములాగా.. ఎందుకంటే అరుణాగిరి అద్దము...ఇది మన ఆత్మపదార్ధ స్వరూపముగా ఈయనను చూపిస్తోంది.పదార్ధ మాయను దాటితే కాని యదార్ధ మోక్షము మనకి లభించదని..అది ఎన్నడికి ఎవరికి  సాధ్యపడదని ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఇంతవరకు భగవంతుడు సృష్టించలేదని   తెలియడముతో నేనుగూడ మౌనము వహించి ఆత్మసన్యాసిదీక్ష తీసుకొని ఈ అరుణాచల క్షేత్రములో ఈ జన్మలో పంచముక్తులలో ఏ ముక్తి వస్తోందో తెలుసుకోవటానికి ఈ దేహము కాస్త అరుణాగిరి యాత్ర ఆరంభించింది.

ఈ దేహము కాస్త అరుణాచల క్షేత్రమునకు చేరుకుంది. యధావిధిగా అక్కడున శివలింగ దర్శనాలు..గిరిప్రదక్షిణము పూర్తిచేసుకొని   కాషాయవస్త్రముతో ఆత్మసన్యాసి దీక్షను తీసుకొని ఒక అంతర్గత గుహను చేరుకొని అక్కడ శివ రామ తారకమంత్రమైన నమ:శివాయ ను ఒక ధ్యానతపస్సు గా చెయ్యడము ఆరంభమైంది.48 ని నుండి మొదలై 20 గంటలు పైగా అవిశ్రాంతి 41 రోజులు కొనసాగుతుండగా..నాకు ఏటువంటి ధ్యానానుభవాలు కల్గలేదు.నా మంత్రసాధనలో నాకే తెలియని ఏదో లోపమున్నదని నా మనస్సు గోల పెట్టసాగింది.ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు కాశ్యీయాంతు మరణము... అనే శ్లోకము వచ్చింది.దీని వలన అరుణాచల అను నామస్మరణ వలన ముక్తి లభిస్తుందని తెలిసింది.కాని నేను నిత్యము చేసే నమ:శివయ మంత్రానికి అలాగే అరుణాచల మంత్రానికి గల్ తేడా ఏమిటో నాకు అర్ధముకాలేదు.కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఒక మెసెజ్ వచ్చింది.ఇందులో ఒక శ్లోకముంది.అది ఏమిటంటే ఓం నమ:శివ్శాయ అనేది యోగ పంచాక్షరీ అని అదే అరుణాచల  లేదా అరుణాశివ లేదా అరుణాచల శివ అనేది జ్ఞాన పంచాక్షరీ అని...దీనిని ఒకసారి స్శరణ చేస్తే నమ:శివాయ మంత్రమును మూడు కోట్ల చేసినంత ఫలితము వస్తుందని 



ఈ శ్లోకము చేప్పేసరికి నాకున్న శోకము పోయి అరుణాచల శివ అను మంత్రమును చెయ్యడము ఆరంభించాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక రోజు ధ్యానము నందు...తీవ్రమైన ధ్యానతపస్సులో ఉండగా




 నా మనోదృష్టి యందు అరుణాగిరి అలాగే దీనిని చుట్టు ఉన్న నాలుగు శిఖరాలు కనిపించిన మరుక్షణములో..ఈ అరుణగిరి కాస్త అగ్నితో ఉన్న పరమలింగముగా దర్శనమైంది.  ఆ తర్వాత దీని ముందు ఉన్న నాలుగు శిఖరాలు కాస్త బ్రహ్మ మానస పుత్రులైన సనకనాందులుగా అను నలుగురుగా లీలగా అగుపించారు.ఆ తర్వాత ఈ అరుణాగిరి కాస్త అర్ధనారీశ్వరముగా.. పరాశక్తిగా..గణపతి..కుమారస్వామి.. నందీశ్వరుడిగా సజీవమూర్తులుగా దర్శనమిచ్చారు.










ఈ ధ్యానానుభవము నిజమని అనుటకు నిదర్శనముగా నా దగ్గరికి శ్రీ మేధా దక్షిణామూర్తి,బాలదేవి,గణపతి,కుమారస్వామి,నంది విగ్రహమూర్తులు రావడము జరిగింది.వీటిని నా నిత్య 64 దైవిక వస్తువులతో పాటు నిత్య అరుణాచల పూజలో ఉంచడము జరిగింది. ఆ తర్వాత ఎంతో మంది గుప్తయోగులు..పూర్ణజ్ఞానులు.. అస్ధిపంజరాలు..సకల దైవ స్వరూపాలు..వివిధలోకాలలో ఉన్న పుణ్యాత్మ జీవులు కాస్త తమ ఆత్మశరీరాలతో ఈ కొండ  అగ్రభాగము చుట్టు మూడు లేదా అయిదు ప్రదక్షిణాలు చేసి ఈ అగ్రభాగములో ఉన్న దీపజ్యోతి స్ధానములో ఉన్న బ్రహ్మరంథ్రము గుండా లోపలకి వెళ్ళడము లీలగా నాకు అగుపించింది. ఆ తర్వాత కొన్ని క్షణాలు తర్వాత  ఈ గిరి అగ్రభాగములో దీపజ్యోతి స్ధానములో పద్మకార రాతి అగ్ని శివలింగము అగుపించింది.దీని ప్రక్కనే ఉన్న రుద్రపాదాల స్ధానములో నాకు కాస్త హిమాలయ కైలాస పర్వత ఆదియోగి అయిన సదాశివుడు కాస్త ధ్యానయోగిగా మారి ధ్యానతపస్సు చేస్తున్న ఆత్మస్వరూపము దర్శనం అయింది.అంటే ఈ క్షేత్రానికి అదిశివుడే క్షేత్రపాలకుడిగా..క్షేత్ర దైవముగా శ్రీ మేధా దక్షిణామూర్తిగా ఉండటము జరుతోందని నాకు అర్ధమైంది.మరి ఈ దక్షిణామూర్తి  దర్శనము ఇంక కల్గడము లేదని అనుకుంటున్న సమయములో నాకు ధ్యానభంగమైంది.

అపుడు ఆత్మవిచారణ చేసుకొంటే రమణా మహర్షి అనుభవాలు ప్రకారము చూసుకొంటే ఈ అరుణాగిరి లోపల ఉన్న అంతర్గత గుహ యందు సిద్ధయోగిగా ఆత్మస్వరూపముతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపముతో సజీవమూర్తిగా ఇపుడికి ఆవాసము చేస్తున్నారని..కాకపోతే ఈయనను భౌతిక దేహముతో కాని భౌతిక నేత్రాలతో దర్శించుకోవడము ఎన్నడికి సాధ్యపడదని చెప్పిన విషయము నాకు లీలగా గుర్తుకు వచ్చింది.ఏమి చెయ్యాలో..ఏలా ఈయన దర్శనము పొందాలో నాకు అర్ధము కాలేదు. మళ్ళీ నేను తిరిగి ధ్యానములో కూర్చున్నాను. నా మనో దృష్టి యందు యధావిధిగా ఎపుడిలాగా కనిపించే ఒక స్త్రీ మూర్తి కుడి అరచెయ్యి కనిపించింది..ఈ సారి ఈ చెయ్యి మీద చిదంబర క్షేత్రములో నా కంఠము నందు పెకిలించిన స్ఫటిక జ్ఞాన శివలింగము దర్శనం అయిది.అంటే ఈ మహాతల్లి ఎవరో కాని నా శివలింగమును ఇంక భద్రముగానే దాచినదని అనుకోనేలోపులే...ఈ చెయ్యి తనకి లోగడ ఆరు మణులు చూపించిన చెయ్యి ఒక్కటేనని నేను తెలుసుకొనే లోపు ఈ చెయ్యి అనేది ఈ క్షేత్ర అమ్మవారిది అని గ్రహించేలోపు ఈ శివలింగమును ఒక అంతర్గత సొరంగ మార్గములో ఉన్న జలములో పడివేసినట్లుగా లీలగా నాకు అగుపించింది.ఈ మార్గము చూడగానే నా సాధన కాస్త సహస్ర చక్రములో ఉన్నపుడు ఈ మార్గము ద్వారా నా సూక్ష్మశరీరయానముతో శ్రీ మేధా దక్షిణామూర్తి అర్ధశరీర భాగ దర్శనము చేసుకున్న విషయము నాకు జ్ఞాపకము వచ్చింది.అంటే ఇపుడు ఈయనను పూర్ణజ్ఞానముతో..పూర్ణస్వరూప దర్శనమును తన జ్ఞాన శివలింగ యానముతో ఈ ఆత్మశరీర యానము చేసి దర్శనపొంది ఆపై తన ఆత్మలింగము కాస్త ఈ పరమలింగము నందు కైవల్యముక్తియగు మోక్షమును పొందుతుందని ఈ దేహనికి జ్ఞానస్ఫురణ పొందడముతో ఈ దేహత్మ కాస్త ఆత్మనందస్ధితి పొందసాగింది.ఏన్నో కోట్లానుకోట్ల సం!!రాలు పాటు అవిశ్రాంతిగా ఏన్నో కోట్లానుకోట్ల జన్మాలు ఎత్తి నానా అగచాట్లు పడి ఆత్మశాంతిని పొందలేదు.ఇపుడు ఈ తరుణములో అరుణగిరి యందు తన ఆత్మకి శాశ్వతమరణమును పొంది ఆత్మశాంతి పొందుతూందని  ఘంటాపధముగా తెలియడముతో ఈ దేహత్మకి అలివికాని..అలౌకిక ఆత్మానంద స్ధితిలో ఉండిపోగసాగింది.

పూర్ణశూన్య స్ధితి: 

నిజానికి నేను అనేది శూన్యభావమైతే..నేను కాని నేను అనేది పూర్ణశూన్యస్ధితి అనే అనుభవానుభూతిని పూర్ణసాధకుడు పొందవలసిన అంతిమస్ధితి...కాని ఇది సాధకుడికి అందకుండా నేను కాని నేను గా అరుణాచలగిరి యందు దక్షిణమూర్తి ఆత్మస్వరూపము మనకి అడ్డుగా నిలుస్తోందని నాకు అర్ధమైంది.ఈయన ఉన్నాడనే భావము మనకి తొలగాలంటే బలహీనత లేని బలవంతుడిగా మనము మారాలి.జీవుడికి బలహీనత కామమైతే..శివుడికి జ్ఞానము కాస్త బలహీనతగా మారుతోందని నాకు అవగతమైంది.జీవుడు ఎపుడికి తన బలహీనత అయిన కామమును ఎన్నడికి జయించడముండదు.కాని ఇంద్రియానిగ్రహముతో అదుపులో పెట్టుకోవచ్చును.దీని వలన తనకున్న ఈ బలహీనతను జీవుడు జయించినట్టు కాదని నాకు అర్ధమైంది.అలాగే శివుడు గూడ తన బలహీనతాయైన జ్ఞానమును గూడ దాటలేకపోతున్నాడు.ఈయన మౌనముగా ఉన్నగూడ ఈ మౌనభాషను ఆధారము చేసుకొని సనకానందాలు అలాగే సప్తరుషులు బ్రహ్మజ్ఞానమును పొందిన విషయము లోకవిదితమే గదా.అంటే ఈ లెక్కన జీవుడు లేదా శివుడు కాస్త తమకున్న బలహీనతలను పూర్ణముగా దాటి రాహిత్యస్ధితిని పొందితే కాని మనకి పూర్ణశూన్యస్ధితిని పూర్ణజ్ఞాన అనుభవ అనుభూతిని పొందలేమని నాకు అర్ధమైంది.   

ఈ రాహిత్య స్ధితిని జీవుడు పొందాలంటే నేను కాస్త "నేను కాని నేను" గా మారాలి.అనగా జీవుడు కాస్త శివుడు అవ్వాలి.అంటే శివోహం స్ధితిని పొందాలి.ఇంతవరకు బాగానే ఉంది.ఇలాంటి శివోహం స్ధితిని ఇపుడికే ఆదియోగి దక్షిణామూర్తి పొందిన ఆయన తన బలహీనతయైన జ్ఞానరాహిత్య స్ధితి పొందలేకపోయాడు గదా.ఈ లెక్కన నేను గూడ శివోహం స్ధితిని పొందిన ఎలాంటి ఉపయోగము లేనట్లే గదా.ఎందుకంటే ఇలాంటి శివోహం స్ధితిని ఆనాటి వశిష్ఠమహర్షి నుండి ఈనాటి రమణమహర్షి వరకు ఈ స్ధ్తితిని పొందినగూడ జ్ఞానరాహిత్య స్ధితిని పొందకుండా మరో జ్ఞానశివుడిగా మారి లోకపూజ్యులై లోకానికి కొత్తదేవుడిగా..కొత్తగురువుగా మారారు.అంటే ఈ శివోహం స్ధితి వలన ఎలాంటి ప్రయోజనము లేనట్టే గదా.కాని జీవుడు ఎపుడికైనా శివుడు కాక తప్పదు.ఎందుకంటే నేను అనేది నేను కాని నేను గా మారక తప్పదు.దంతాలు రాలుకోవటానికి జీవుడైన లేదా శివుడైన ఏ రాయి అయిన ఒక్కటే గదా.గాకపొతే ఒకడు మాయప్రపంచములో ఉంటే మరొకడు జ్ఞాన ప్రపంచములో ఉంటాడు.కాని ఈ శివోహం స్ధితిలో మనకి తెలియని మర్మరహస్యము ఏదో ఉన్నదని నాకు బలముగా అనిపించసాగింది.అది ఏమిటో నాకు తెలియాలంటే నేను కాస్త శివోహం గా మారితే కాని తెలియదు అని నాకు అర్ధమైంది.

దానితో దక్షిణామూర్తి ఆరాధన మొదలైంది.ప్రతిరోజూ లింగజ్యోతి దీపారాధన అనగా ఈ దీపము అనేది శివలింగము ఆకారములో ఉండి లింగభాగములో దీపపు ఓత్తి ఉంటుంది.దీనిని వెలిగిస్తే లింగజ్యోతి అవుతుంది.ఇలా 41 రోజులు చేశాను.అపుడికే ఈ దేహము కాస్త పూర్ణజ్ఞానమునకు ఒక అడుగు దూరములో ఉండుటవలన ఈ సాధన చాలా తేలిక అయింది.ఇది ఇలాయుండగా  మహాశివరాత్రి నాడు మళ్ళీ నేను మరియు నా యోగమిత్రుడైన జిజ్ఞాసితో కలిసి అరుణాచలమునకు చేరుకున్నాము.ఇదే రోజు అనుకోకుండా ఈ దేహము కాస్త తీవ్ర ధ్యాననిష్థలో ఉండగా యధావిధిగా నాకు ధ్యానము నందు అరుణగిరి కనపడింది.కొన్ని క్షణాలు తర్వాత ఈ గిరికి ఎదురుగా ధ్యాననిష్థలో ఈ దేహముండి అదిగూడ నీలివర్ణముతో మరో శివుడిలాగా నా అత్మ శరీరము కనిపించసాగింది. అంటే ఈ దేహము కాస్త శివోహం స్ధితి అనగా మరో జ్ఞానశివుడిగా మారినదని నాకు అర్ధమైంది.ఉన్నట్టుండి ఈ స్ధితిలో ఉన్న నాకు విపరీతమైన కీర్తికాంక్ష అలాగే ధనకాంక్ష మరియి జ్ఞానాంహకారాలు మొదలైనాయి.అంటే సాధకుడు ఈ స్ధితిలో ఈ మూడింటిలో దేనికి ఆశపడకుండా..భయపడకుండా..స్పందించకుండా ఉండగల్గితే అదిగూడ 48ని..పాటూ స్ధిరచిత్తముతో ఉండగల్గితే కాని అన్నింటాయందు రాహిత్యస్ధితిని అనగా వీటికి మూలమైన జ్ఞానరాహిత్య స్ధితికి సాధకుడు చేరుకోలేడని నాకు జ్ఞానస్పురణ అవుతుండుగా ధ్యానభంగమైంది.కాని నిజానికి ఈ రాహిత్యస్ధితి పొందడము అంతతేలికైన స్ధితి కాదని నాకర్ధమైంది.ఎందుకంటే ఈ రాహిత్యస్ధితిని పొందటానికి ఆదియోగి మేధా దక్షిణామూర్తి దాదాపుగా ఏన్నో కోట్లానుకోట్ల సం!!రాల నుండి ప్రయత్నాలు చేస్తున్నాడని..మరిదేని వలనో విఫలము చెంది ఇక్కడ నుండి తిరిగి తిరోగమనము చెంది తను అపుడికే నాశనము చేసిన మూడు ప్రకృతులను పున:సృష్టి చేస్తున్నాడని ఎందుకంటే శివుడి నాలుగవ స్ధితి తిరోగమనమని చెప్పిన శాస్త్రవచనము ఉండనే ఉన్నది గదా.మరి ఈయన దేని వలన ..దేనికోసము.. ఈ జ్ఞానరాహిత్య స్ధితి పొందలేకపోతున్నాడో తనకి తెలియాలంటే లేదా నాకు తెలియాలంటే ఈ శివోహం స్ధితిలో ఈ దేహము కాస్త 48 ని..పాటు దేనికి స్పందించకుండా ఉండగల్గితే ఇక్కడ ఉన్న మర్మము గూర్చి ఈ దేహనికి జ్ఞానస్ఫురణ అయ్యే అవకాశమున్నదని నాకర్ధమైంది.దానితో శివోహం సాధన మొదలైంది.ఈ దేహము కాస్త తిరిగి జ్ఞానశివుడిగా మారుతున్న సమయములో విపరీతమైన ఆత్మానంద స్ధితికి ఈ దేహము కాస్త చేరుకోవడముతో ఆ రోజుకి నాకు ధ్యానభంగమైంది.అపుడుకి ఈ స్ధితిలో ఈ దేహము కాస్త 18ని.. ఉన్నదని నాకర్ధమైంది.ఇలాగాదనుకొని కొన్నిరోజులుపాటు ఏకధాటిగా ధ్యానములో కూర్చున్నాను.ఇలా ఒకరోజు ధ్యాననిష్టలో ఉండగా నాకు యధావిధిగా అరుణాగిరి కనపడింది.ఇది కాస్త అర్ధశరీరభాగముతో ఉన్న నల్లటి ఆకార దక్షిణామూర్తిగాను..ఆ తర్వాత శ్రీచక్రముగాను..ఆటుపై పాముపుట్టగా..ఆపై స్ఫటిక పరమలింగముగా..ఆపై అగ్ని తేజస్సుతో ఉండి విచ్చుకున్న తామరపువ్వుగా కనపడి..ఇది కాస్త ఒక పిరమిడ్ మారి తనచుట్టు తాను విపరీతముగా భ్రమణము చేస్తున్న మనోవేగానికి నా మనోదృష్టి అందుకోలేకపోవడముతో ఆ రోజుకి నాకు ధ్యానభంగమైంది.అపుడు విశ్లేషణ చేసుకుంటే దక్షిణామూర్తి కాస్త జ్ఞానమునకు ప్రతీకయైన తామరపువ్వులోని అగ్ని తేజస్సును దాటితే కాని జ్ఞానరాహిత్యస్ధితిని తను పొందలేడని...అలాగే ఈ స్ధితిని పొందే అవకాశము ఉండుటవలన ఈ గిరి చివరిలో పిరమిడ్ గా మారి భ్రమణము చేసిన దృశ్యమును బట్టి చూస్తే సాధకుడు కాస్త తప్పనిసరిగా జ్ఞానరాహిత్యస్ధితిని పొందుతాడని నాకర్ధమైంది.అంటే ఇలా తిరిగే ఈ గిరి పిరమిడ్ ఎపుడికైనా శూన్యమై పూర్ణశూన్యమునందు లయము చెందుతుందని నాకు అవగహన అయింది.ఇంతవరకు ఇది బాగానే ఉంది.ఈ పూర్ణశూన్యస్ధితిని పొందలంటే సాధకుడు కాస్త జ్ఞానరాహిత్య స్ధితిని పొందాలి గదా.ఈ స్ధితిని పొందాలంటే అగ్నితేజస్సు ఉన్న తామరపువ్వు స్ధితిని దాటాలి గదా అనుకొనేసరికి కధ మళ్ళీ మొదటికే వచ్చి ఆగింది గదా అనిపించసాగింది.అసలు ఈ తామరపువ్వు విషయములో ఏదో మర్మము దాగిఉన్నదని నాకర్ధమైంది.

అపుడు ఈ పద్మము గూర్చి విశ్లేషణ చేసుకుంటే భౌద్ద ధర్మములో ఈ జ్ఞానపద్మమును మణిపద్మముగా..అదే హైందవ ధర్మములో దీనిని మంత్రపుష్పముగా పిలుస్తున్నారని..అలాగే బుద్ధుడు కాస్త ఈ మణిపద్మమును హిమాలయాలలోని కైలాష పర్వతములో ఉన్న శంభలగ్రామములో ఉన్న చింతామణి ఉన్న పద్మమును చూసి అదే మణిపద్మము అనుకున్నాడని నిజానికి ఈ మణిపద్మము అనేది అరుణాగిరిలోనే ఉన్నదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.పైగా ఈ పద్మములో అగ్నితేజస్సుకి కారకమైన బాడవాగ్నికి మూలమైన అగ్నిశిఖ అని..అలాగే ఈ అగ్నిశిఖ యే మణి అనుకుంటున్నారని నాకు అవగతమైంది.ఇంతవరకు బాగానే ఉంది.అంటే ఏ సాధకుడైతే ఈ అగ్నిశిఖకి చేరుకుంటాడో వాడికున్న జ్ఞానము కాస్త ఈ అగ్నిశిఖ ఉన్న అగ్నిశిఖలకి జ్ఞానాగ్నిగా మారి జ్ఞానరాహిత్య స్ధితిని పొంది ఆపై పూర్ణశూన్యస్ధితికి చేరుకుంటాడని నాకు అవగతమైంది.అంటే కధాంత గూడ ఈ జ్ఞానపద్మము చుట్టు ఉన్నదని నాకర్ధమైంది.ఈ లెక్కన ఈ అరుణాగిరి యందు అంతర్గతముగా జ్ఞానపద్మము అదిగూడ బంగారపు జ్ఞానపద్మ బంధనము ఉండి ఉండాలి.ఎందుకంటే ఈ గిరి అగ్రభాగములో నాకు ధ్యానదృశ్యముగా పద్మాకార శివలింగ దర్శనము అలాగే పద్మాకార ఆసన స్ధితిఉన్న అగ్నిశివుడి దర్శనాలు బట్టి చూస్తే ఈ కొండ లోపుల ఈ జ్ఞానపద్మ నిగూఢ రహస్యము దాగిఉన్నదని నాకర్ధమైంది.దానితో ఈ మర్మమును చేధించుటకు నా పూజబీరువాలో ఒక చిన్న సైజులో అరుణాచల క్షేత్రమును ఏర్పాటును మహశివరాత్రికి చేసుకున్నాను.ఎందుకంటే ఆ క్షేత్రములో పజిల్ గా ఉన్న జ్ఞానపద్మ కోడ్ ను డీకోడ్ చెయ్యాలంటే అసలు ఈక్షేత్రములో ఏర్పాటుతో ఈ జ్ఞానపద్మ బంధనము జరిగినదో నాకు తెలియాలంటే ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే కాని ఎక్కడో ఒకచోట ఎదోఒక కోడ్ తో ఇది డికోడ్ అవ్వదు.అపుడే మనము ఈ జ్ఞాన రాహిత్య స్ధితిని పొందలేము గదా.అందుకే ఈ క్షేత్రమును నా ఇంటిలో అనగా గిరి చుట్టున్న అష్టలింగాల బంధనము అలాగే కొండపైన కనిపించిన ధ్యానశివుడు మరియి పద్మాకార శివలింగము అలాగే ఈ గిరి లోపున నాకు కనిపించిన దక్షిణామూర్తి రూపమును ఏర్పాటు చేసుకున్నాను.ఇక్కడ మీకు చిన్న సందేహము రావచ్చును.అది ఏమిటంటే ఈ గిరి యందు ఎందుకు ఈ పద్మాకార నాగలింగ బంధనము చేశారు అన్నపుడు...ఆదిలో ఆదియోగి ఈ నాలుగు ప్రకృతులను ఏర్పారచి తను కాస్త ఆత్మానంద జీవసమాధిలోనికి వెళ్ళి..ఈ ప్రకృతులలో తన లీలావిన్యాసము వలన ఏర్పడిన జీవనాటకమును జీవపాత్రలతో చూస్తూ కల విన్యాస ఆనందము పొందుతూండగా ఉన్నట్టుండి ఈయన దేహము నుండి ధ్యానాగ్ని కాస్త జ్ఞానాగ్ని మారి అది కాస్త బడావాగ్ని మారి తను ఏర్పరచిన ప్రకృతులలో మూడు ప్రకృతులు కాస్త అగ్నికి ఆహూతి అవుతుండగా ఇది తెలుసుకున్న మహర్షలు..యోగులు..గురువులు..దైవాలు కాస్త ..అరుణాగిరికి చేరుకొని బడావాగ్ని బయటికి రాకుండా గిరి లోపుల అగ్నితీర్ధమును ఏర్పరచి అందులో బడావాగ్నికి మూలమైన అగ్నిశిఖను నాగలింగభైరవితో బంధనము గావించి..కొండపైన ఈ అగ్ని బయటికి రాకుండా పద్మాకార శివలింగబంధనము చేసి..ఆపై ఎపుడికి కపుడు కొండ లోపుల ఉన్న అగ్నితీర్ధము ఎండకుండా ఉండటానికి నిత్యము కమండముతో నీళ్ళి పోసే విధముగా పద్మాకార బంధనముతో అగ్నిశివుడిని ఏర్పాటు చేసి ఈ గిరిచుట్టు ఎలాంటి మంత్రప్రయోగాలు పనిచెయ్యని విధముగా పద్మకార గిరిగీతను న్యూక్లియర్ రేడియోషన్ శక్తితో ఏర్పాటు చేసి..ఈ బంధనాల జ్ఞానము గూర్చి ఒక దక్షిణామూర్తికి ఉంటేటట్లుగా ఏర్పాటుచేసి..ఎవరైతే ఈ అంతిమ జ్ఞానశివోహం స్ధితికి వస్తారో వారు కాస్త తమకి తెలియాకుండానే అపస్మారక స్ధితిని పొందేటట్లుగా ఏర్పాటు చేసారని...ఇదింతా చెయ్యడము వలన బడావాగ్నికి ఈ నాలుగవ ఆహూతి కాకుండా ప్రకృతి నిలబడినదని..తద్వారా ఈ అంతిమస్ధితి పొందిన సాధకుడు కాస్త తాము ఏర్పాటు చేసిన పద్మాకార నాగబంధనము వలన అపస్మారక స్ధితిని పొంది ఏదో ఒక కోరిక మాయకి గురీయై ఇక్కడనుండి తిరోగమనము చెంది అనగా శాశ్వత మరణమగు మోక్షమును పొందకుండా తిరిగి తన పొందిన కోరిక మాయ కోసము పున:జన్మలెత్తే మూడు ప్రకృతులలో జన్మాలెత్తడము జరుగుతోందని నాకర్ధమైంది.అంటే ఇక్కడ ఉన్న జ్ఞానశివుడు కాస్త జ్ఞానరాహిత్య ఆపై తను లేదు..తను శాశ్వతుడు గాడని అనే పూర్ణజ్ఞానము అందకుండా దేవుడు ఛేసిన మనష్యులు కాస్త మనష్యులు చేసిన దేవుడిగా తమ జ్ఞానముతో జ్ఞానపద్మాకారబంధనము ఏర్పాటు చేసినారని మీకు ఈపాటికి అర్ధమై ఉంటుంది.నాకు అర్ధమైంది అంటే మీకు అర్ధము కాకుండా ఉంటుందా?మీకు అర్ధమైనదని నాకర్ధమైంది.




దానితో ఈ అరుణాగిరి మీద ఉన్న జ్ఞానపద్మాకార నాగశివలింగ బంధనము యొక్క కోడ్ ను డీకోడ్ చెయ్యడటానికి నా పూజబీరువాలో ఏర్పాటు చేసుకున్న అరుణాగిరి క్షేత్రమును మీద మహశివరాత్రి నాడు ఉదయము 6 గం నుండి మర్నాడు ఉదయము 6 గం దాకా మౌనదీక్షతో .."అరుణాచల శివ"..నామస్మరణ చేస్తూ..ఉపవాసముండి..జాగరణతో..అఖండ లింగ జ్యోతి దీపారాధన చేస్తూ..ధ్యాననిష్థకి వెళ్తూ..ధ్యానములో కనిపించిన దృశ్యాలతో నా పూజ గదిలో ఉన్న ఈ క్షేత్ర లింగాలను చీటికి మాటికి మారుస్తూ...చివరికి ఆఖరుగా ఈ జ్ఞానపద్మాకార బంధనము డీకోడ్ అయినదని ధ్యానానుభవము పొందడము జరిగింది.ఇది  ఏలా జరిగినదో లోకానికి చెప్పరాదని నా దగ్గర ఈ కోడ్ ను డీకోడ్ చెయ్యటానికి సహయము చెసిన  ఈ గిరి మీద ఉన్న 18 సిద్దగురువులు మాట తీసుకోవడముతో ఆ చేసిన విధివిధానము చెప్పడము లేదు.అలాగే ఆదిలో ఈ బంధనము వేసిన మహర్షులలో నేను ఒకడిని గావడము వలన ఈ బంధవిముక్తికి ఈ సిద్దగురువులు సహకరించడము జరిగింది.అలాగే దక్షిణామూర్తికి బంధవిముక్తి పొందడము జరిగింది.ఆదిలో అదియోగి గావాలని బంధనము పొందాడు.ఈనాడు అయనికి ఆయన బంధవిముక్తి పొందాలని అనుకున్నాడు.ఇది జరిగింది.ఆయన సంకల్పమును బట్టి ఈ మట్టి పాత్రలు తమ పాత్రధారిగా మారతాయని..ఈ పాత్రలో ఉండి  నదిపించేది ఆయనేనని లోకవిధితమే గదా..చేసేవాడు ఎవ్వడు..చేసేదెవ్వరు..చేయించేదెవ్వరు..అంతా ఒక్కడే..అంతా ఒక్కటే..అదే ఏకత్వము..ఏకము..అద్వైతము...ఇపుడు దాకా తను ఉన్నాను అనే జ్ఞానములో ఉన్నాడు..ఇపుడు తను లేదు..ఏది లేదు అనే పూర్ణజ్ఞానస్ధితిని పొందాడు.

ఇక శివరాత్రి మర్నాడు ఉదయము అనగా ఇంక శివరాత్రి ఘడియాలు మిగిలి ఉండగా నాకు ధ్యాననిష్థ యందు మనోదృష్టికి అరుణాగిరి కనపడింది.ఆ తర్వాత ఈ శిఖారగ్రాభమున వెలుగుతున్న ఒక పెద్ద ప్రమీద కనపడింది.ఆ తర్వాత ఈ దీపజ్యోతి కాంతి నుండి ఒక అగ్నిశిఖ కనపడింది.ఈ శిఖ లోపలకి వెళ్ళితే..ఆకాశము నందు మొదట పద్మాకార బంగారపు శివలింగము దర్శనమైంది.దీనిపైన ఒక పద్మాకార స్ఫటిక శివలింగము..దీనిపైన ఒక నల్లని పద్మాకార శివలింగము..దీనిపైన తెల్లని పద్మాకార శివలింగదర్శనమైనాయి. ఆతర్వాత ఎక్కడనుండో  పాదరసపు వర్ణమున్న ఒక పాము వచ్చి ఈ తెల్లగా ఉన్న   పద్మాకార శివలింగము మీద పాకగానే తెల్లగా ఉన్న ఈ శివలింగము కాస్త పాదరస శివలింగముగా మారింది.అంతలో దీని ప్రక్కనే అగ్నిజ్వాలలతో మండుతున్న ఏర్రటి వర్ణముతో ఉన్న బడావాగ్ని అగ్నిశిఖ యందు ఈ శివలింగము ఐక్యమవ్వడముతో...ఆ రోజుకి నాకు ధ్యానభంగమైంది.






                                                    నాకు వచ్చిన పంచ శివలింగాలు

కొన్ని వారాల తర్వాత నాకు శ్రీశైలము నుండి తెల్లని శివలింగము అలాగే కాశీ క్షేత్రము నుండి పాదరసలింగము అలాగే చిదంబరము నుండి స్ఫటికశివలింగము అలాగే అరుణాచలము నుండి నల్లశివలింగము అలాగే ఇత్తడి పద్మకార శివలింగము ఇలా పంచలింగాలు నాకు రావడముతో నాకు వచ్చిన ఈ పంచలింగాల దర్శనానుభవము సత్యమేనని నాకర్ధమై..ఈ పంచలింగాల ఆరాధన చెయ్యడము ఆరంభించిన కొన్ని నెలలకి తర్వాత  ఇల యందు సజీవమూర్తిగా  ఆకుపచ్చని చీరెతో  పాలగిన్నెలున్న బుట్టను నెత్తిన పెట్టుకొని  నా చెయ్యి పట్టుకొని అరుణాగిరి పాదభాగము దగ్గరికి తీసుకొని వెళ్ళి అదృశ్యమయింది.ఆ తర్వాత నేను కాస్త ఈవిడ ఏవరని అక్కడ ఉండే సాధువులను అడుగ్గా ఓ..ఆవిడ ఏవరో గాదు. ఈ క్షేత్ర పరాశక్తి అయిన పచ్చయాన్ అమ్మవారు.ఈవిడ ఏపుడుగూడ పచ్చచీరతో,పచ్చబొట్టుతో,పచ్చగాజులతో ఉంటుంది.అలాగే ప్రతిరోజు ఏదో ఒక సమయములో ఈ కొండ మీద ఉండే తన కుమారుడైన కుమారస్వామి అంశ అయిన 1000 జాతుల పాములకి తన బుట్టలో ఉన్న పాలగిన్నెలలోని పాలు పోసి వస్తుంది.ఈమె వచ్చేటపుడు వెళ్ళేటపుడు మనకి సూచన ఇవ్వటానికి ఒక నల్లని కొడెత్రాచు పాము ఈమె వెంట ఉంటుంది.దీని బుస శబ్ధాలకి జనాలు ప్రక్కకి తప్పుకొని ఈమెకి దారి ఇవ్వడము జరుగుతుంది.అలాగే ఆదిరుద్రుడు గూడ అవధూత రూపములో మన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడిగి తీసుకొని వెళ్ళడము జరుగుతుంది.తద్వారా మనలో ఉన్న అహము దానము ఈయన తీసుకోవడము జరుగుతుంది అన్నమాట.ఇదింతా ఇక్కడ మాకు నిత్యజరిగే అతీ సాధారణమైన విషయమని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు.ఆ తర్వాత కొన్నిరోజులకి అనుకోకుండా మా దగ్గరికి ఉన్మాదములో ఉన్న ఒక పిచ్చివాడు వచ్చి 20 రూపాయిలు అడిగి తీసుకొని వెళ్ళడము జరిగింది.



ఈ సంఘటన సరిగ్గా శ్రీ మేధా దక్షిణామూర్తి గుడి ముందు జరిగింది.అంటే స్వయంగా నా జ్ఞాన అహంకారమును దానముగా తీసుకోవటానికి ఈయనే ఈ అవధూత రూపములో వచ్చారని నాకర్ధమై మౌనము వహించాను.ఆనాటి నుండి నాలో జ్ఞాన అహంకార భావాలు తగ్గడము ఆరంభించాయి.ఆ తర్వాత కొన్నిరోజులకి ధ్యానమునందు పచ్చయాన్ అమ్మవారు ఆకుపచ్చచీరెతో నెత్తిన పాలగిన్నెల బుట్ట పెట్టుకొని నాకు మాత్రము వీపుభాగము కనిపించేటట్లుగా అలాగే ఈ ప్రక్కనే ఒక నల్లనికొడెత్రాచు పాము పాకుతూ ఇలా వీరిద్దరు అరుణాగిరి ఎక్కుతూ కనిపించారు.ఈవిడ కాస్త కొండ మధ్యభాగానికి చేరుకోగానే నోటితో ఏదో శబ్ధము చెయ్యగానే కొండ పైన ఉన్న కలుగుల నుండి సుమారు వివిధ రంగులలో ఉన్న సుమారు 100 కి పైగా పాములు ఈమె చూట్టు చేరడము..ఈమె కాస్త వీటికి ఆహారముగా పాలు పట్టే దృశ్యము కానవస్తూ అదృశ్యమైంది.అంటే ఇక్కడి సాధువులు ఈమె గూర్చి చెప్పిన విషయాలు సత్యమని నాకర్ధమైంది.



అలాగే నేను చూసిన సజీవమూర్తి పచ్చయాన్ అమ్మవారి విగ్రహమూర్తిని రెండవ ప్రాకరములో ఉన్న విప్పచెట్టు దగ్గరిలో ఉన్న గణపతి గుడి గోపురము మీద చూడటం జరిగింది.ఇలా సజీవమూర్తులుగా అమ్మవారు అలాగే అయ్యవారి దర్శనాలు నాకు జరిగిన కొన్నివారాలకి ఒకరోజు నేను అర్ధరాత్రి గిరిప్రదక్షిణము చేస్తుండగా తెల్లనివస్త్రాలు ధరించి ఇద్దరు పిల్లాలతో ఒకాయన నా దగ్గరికి వచ్చి ఓ..అరుణగిరి యోగి..నా అర్ధనారీశ్వరతత్త్వముతో ఉన్నఈ దైవికవస్తువులు ధరించే శక్తియోగము నీకే ఉన్నదని... నాకు ఏదో గుడ్డసంచి నా చేతిలో పెట్టి శరవేగముగా తన పిల్లలతో వెళ్ళిపోయాడు.

                                                 






తీరా సంచి తీస్తే అందులో పురుష మరియు స్త్రీ నర్మదా అర్ధనారీశ్వర బాణలింగాలు అలాగే 21 అర్ధనారీశ్వర బాణలింగాల మాల కనిపించాయి.వీటిలో బాణలింగాలను నిత్యపూజలో ఉంచి అర్ధనారీశ్వర బాణలింగాల మాలను ధరించడము జరిగింది.కొన్నిరోజుల తర్వాత తీవ్రధ్యానములో ఉండగా అరుణాగిరి అంతర్గత గుహలో అర్ధనారీశ్వరతత్త్వములో దక్షిణామూర్తి ఈయనకి కుడి,ఎడమ వైపుల బాల గణపతి అలాగే బాల కుమారస్వామి ఉండి వీరంతా నాకు  సజీవమూర్తులుగా దర్శనమిచ్చారు.అంటే ఈ దైవిక వస్తువులు నాకు ఇచ్చినది ఏవరోగాదని అర్ధనారీశ్వర దక్షిణామూర్తి అనుకోగానే నాకు ధ్యానభంగమైంది.

అలాగే ఈ అరుణాగిరిని భౌతిక నేత్రాలతో చూస్తే మాత్రము ఒక సాధారణ కొండ లాగా కనపడుతుంది.అదే మన త్రినేత్రము ఇచ్చే దివ్యదృష్టితో మాత్రము చూస్తే ఇది అసాధారణ దేవుడి కొండ లాగా కనపడుతుంది.ఈ కొండయే ఒక మహశివలింగముగా లేదా నల్ల ఆదియోగిగా లేదా త్రిపురదేవిగా దర్శమిచ్చును.



అలాగే ఈ కొండ ముందు ఉన్న మరొ కొండ పైన పచ్చయాన్ అమ్మవారు సమేత నీలి దక్షిణామూర్తి మరియు స్ఫటిక శివలింగము అలాగే 

                                              
ఈ అరుణాగిరికి ఉన్న నాలుగు శిఖరాలలో ఒక శిఖరము మీద పద్మాసనములో కూర్చుని ఉన్న తెల్ల శరీర దక్షిణమూర్తి సమేత సుందరి అమ్మవారు మరియు తెల్లశివలింగము అలాగే 

                                       
ఈ గిరి కాస్త   కాస్త నల్ల శరీర దక్షిణామూర్తి ఆదియోగిగా..త్రిపురదేవి గా..ఒక నల్లశివలింగముగాను..


                                   

అదే ఈ గిరిపైన అగ్నిశరీర దక్షిణామూర్తి సమేత బాలగాను మరియు పాదరస లింగము 

                                      


అలాగే గిరి లోపుల అర్ధనారీశ్వర తత్వముతో బంగారపు వర్ణశరీరముతో రుద్ర దక్షిణామూర్తి సమేత బాలాదేవి మరియు అర్ధనారీశ్వర లింగ దర్శనాలు అవుతాయి.ఇలా నాకున్న శక్తిమేర ఈ గిరికి ఉన్న నాలుగు దిక్కులలో ఉన్న నలుగురి దక్షిణామూర్తి రూపాలను చూడటము జరిగింది.నిజానికి ఈ గిరి పైన దిక్కుకి 16 చొప్పున 4*16=64 దక్షిణామూర్తి రూపాలున్నాయని ..ఇవియే 64 డైమర్ష్ లను నడిపిస్తున్నాయని తెలుసుకొండి.



అలాగే నేను చూసిన ఈ పంచ దక్షిణామూర్తి రూపాలు కాస్త విగ్రహమూర్తులుగా మనకి రెండవ ప్రాకరములో ఉన్న విప్పచెట్టు దగ్గరిలో ఉన్న గణపతి గుడి గోపురము మీద చూడటం జరిగింది.

యక్షణి-మోహిని మాయలు:

కాని నా మనస్సుకి ఇంక పూర్ణశూన్య స్ధితికి చేరుకోలేదు.నాకే తెలియని అతీసూక్ష్మమర్మమాయలో నేను ఉన్నానని నాకు తెలిస్తోంది.కాని ఆ మాయ ఏమిటో నాకర్ధగావడము లేదు.ఒకరోజు గిరిప్రదక్షిణము చేస్తున్న సమయములో ఒక సాధువు ద్వారా ఈ క్షేత్రము నందు విగ్రహల రూపములో యక్షణి-మోహిని మాయలుంటాయని వీటిలో యక్షిణి విగ్రహము అనేది ఆది అణ్ణామలై గుడి గోపురము క్రింద ఈ గోపురము పడిపోకుండా యక్షడు-యక్షణి విగ్రహమూర్తులతో ఒక సిద్ధుడు ఏర్పాటు చేసారని అలాగే మోహిని విగ్రహము అనేది కిలిగోపురము క్రింద ఉంటుందని ఇలా ఈ విగ్రహలను మనము చూస్తే వాటి మాయలు మన మీద చూపుతాయని చెప్పడము జరిగింది.వీటి మాయ ప్రభావాలేమిటో తెలుసుకోవాలని నాలో కుతుహలము మొదలైంది.


యక్షణి - యక్షడు


దానితో గిరిప్రదక్షిణ సమయములో యక్షిణి విగ్రహము చూశాను.మాములుగానే కనిపించింది.ఆ తర్వాత యధావిధిగా గిరిప్రదక్షిణ చెయ్యటానికి వెళ్ళాను.దారిలో ఒక మౌన సన్యాసి కనిపించి చిరునవ్వు నవ్వి నాకు మౌనముగా నమస్కారము చేశాడు.దానికి నేనుగూడ నమస్కారము చేశాను.అంతే.ఆ సాయంత్రము గుడి దగ్గర మళ్ళీ నాకు ఈయన ఎదురుపడి తన వివరాలు చెప్పి మోక్షమార్గము గూర్చి చెప్పమని నన్ను అడగటము జరిగింది.దానితో నేను కాస్తా ఏవరి దగ్గర నోరు విప్పాని వాడిని ఈయన దగ్గర మాత్రము నోరు విప్పి నా ప్రమేయము లేకుండా  పిచ్చి వీర్రావేశముతో నా సాధనానుభవాలు టూకిగా చెప్పుకుంటూపోతూ నెట్లో నేను రాసిన కపాలమోక్షం గ్రంధము అలాగే దీనిని బ్లాగ్ వివరాలు ఇలా అన్ని వివరాలు చెప్పిన తర్వాత కాని నాలో వెర్రి ఆవేశము తగ్గలేదు.ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఎందుకు జరిగినదని ఆత్మవిచారణ చేసుకొని ధ్యానము చేస్తే యక్షిని విగ్రహము కనిపించింది.అంటే దీని మాయ వలన నేను జ్ఞానసిద్ధి మాయకి గురై ఈ మౌనసన్నాసితో నా సాధనవివరాలు చెప్పడము జరిగినదని నాకర్ధమైంది.మరుసటిరోజు నుండి ఈ సన్నాసి నా వెంటబడటం షరామాములైంది.నా గూర్చి ఏమి తెలియని వాళ్ళే నా  వెంటపడుతూంటే నా గూర్చి   అన్నీ తెలిసిన ఈయన వెంటపడటములో తప్పులేదు.కారణము  యక్షిణి చేసిన జ్ఞానమాయలో ఈయన ఉన్నాడని నాకు తెలుసు గదా.అలాగని ఇతనికి నేను జ్ఞానగురువు అయ్యాను అంటే విశ్వానికి అయ్యినట్లే.దానితో నన్ను ఒక జ్ఞానగురువుగాను లేదా జ్ఞానదేవుడిని చేసి పూజలు ఆరాధనలు భజలు చెయ్యడము ఆరంభింస్తారు.ఈ రిస్క్ అంతా అవసరమా?దానితో ఈ సన్యాసికి దొరకుండా అతను నన్ను మర్చిపోయేలా చేశాను.అంటే యక్షిణి మాయ వలన సాధకుడికి ఏదో ఒక సిద్ధి కలుగుతుంది.ఈ సిద్దిమాయ వలన అతను అరుణాచలక్షేత్రములో ఆశయము కోసము ఆశ్రమము పెట్టి అపస్మారక స్ధితిని పొంది తను తెలుసుకున్న జ్ఞానము మర్చిపోయి శిష్యభక్తుల మాయలలో పడి మోక్షప్రాప్తికి దూరమవుతాడు.లేదా సిద్ధి ఇచ్చే అహంకారానికి గురై అరుణచలము నుండి వెళ్ళిపోతాడని నేను చదివిన పుస్తకానుభవాలు చెప్పడముతో నేను ఈ యక్షిణి మాయలో పడకుండా నానాతంటాలు పడి తప్పించుకోవడము జరిగింది.లేదంటే ఈ పాటికి నా పేరుమీద ఆశ్రమ మాయ ఉండేది.కాని ఈ యక్షిణి మాయ  తప్పించుకోవడము వలన ఆశ్రమము లేనిస్ధితి చేరుకొని ఈ క్షేత్రములో ఒక అద్దె ఇంటిలో ఉండటానికి ఆవాసయోగ్యత పొందడము జరిగింది. 


మోహిని విగ్రహమూర్తి 


ఇక మోహిని విషయానికి వస్తే కిలిగోపురము క్రింద ఉన్న ఈ విగ్రహమూర్తి పాదాలు మాత్రమే చూడటము జరిగింది.ఆ తర్వాత నేను ప్రేమించినా నా చిన్ననాటి స్నేహితురాలు ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళినదని నా మిత్రుడి ద్వారా తెలిసి గతుకుమన్నాను.ఎందుకంటే అపుడిదాకా నాకు ఈమె వివరాలు ఏమి తెలియవు.ఆ రోజు మాత్రమే తెలిసింది.ఒకవేళ మేమిద్దరం ఒకరొనొకరు ఎదురుపడి ఉంటే ముసలాడికి దసరా పండుగ లాగా ఉండేది.అంటే మోహినిమాయ వలన ఈమె మోహమాయలో పడి అరుణాచలము నుండి గెంటెవెయ్యబడేవాడిని.  ఇలా ఈ క్షేత్రములో ఉన్న ఈ రెండు విగ్రహాల ప్రత్యక్షమాయలను దాటుకోవడము జరిగింది.

అలాగే ఇలాంటి మాయానుభవాలు నాకు ఎన్నో జరిగాయి.వాటిలో అతీ ముఖ్యమైనవి మీకు చెపుతాను.ఈ క్షేత్రములో ఏవరి దగ్గర దేనిని గూడ ఆఖరికి దైవప్రసాదము గూడ ఉచితముగా తీసుకోవద్దు.తీసుకొంటే అది 3 కోట్ల ఫలితమిచ్చే పాపపు దానము తీసుకున్నట్లు అవుతుంది.ఎందుకంటే ఈ క్షేత్రవాసియైన దక్షిణామూర్తి దానముగా అహము తీసుకుంటాడని స్ధలపురాణ ఉవావ. గావాలంటే ఉచితముగా బదులుగా ఎంతో కొంత ధనము ఇచ్చి తీసుకొంటే అది దానము అవ్వదు.అలాగే ఈ క్షేత్రములో ఉన్నపుడు మన దగ్గర లేని మూడోవ్యక్తి గూర్చి ఈ క్షేత్రములో ఉన్న మీకు తెలిసిన లేదా తెలియని వ్యక్తుల గూర్చి చెడుగా మాట్లాడటము లేదా చెడుగా ఆలోచించడము లేదా చెడుగా విమర్శించడము చెయ్యరాదు.ఒకవేళ వేళ చేస్తే మన చేసిన ఈ చెడుపనుల ప్రభావము ఏపుడొ ఒకపుడు మనమీద పడుతుంది.అనగా శరీరానికి లేదా మనస్సుకి అనుకోని గాయాలు లేదా ప్రమాదాలు లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు లేదా విపత్తు పరిస్ధితులు లేదా మరణాలు రావడము జరుగుతుంది.ఇది నా స్వానుభవములో జరగడము వలన చెప్పడము జరుగుతుంది.అలాగే అహంకారపూరిత పనులు లేదా మాట్లాలు అనడము చెయ్యరాదు.సాధ్యమైనంతవరకు మౌనముగా ఉండాలి.నేను చెప్పిన ఈ మాయలు అన్నీగూడ సాధనలో ఉన్నవారి మీద గంటలు నుండి నెలలులో ప్రభావము  చూపుతాయి.అదే భోగములో ఉన్నవారి మీద ఈ జన్మలో ప్రభావము చూపవు కాని రాబోవు జన్మలలో ఖచ్చితముగా ప్రభావము చూపుతాయి.ఎందుకంటే ఈ క్షేత్రము మన పాపపుణ్యాల లెక్కలు రాయటానికి అమ్మవారి సమక్షములో చిత్రగుప్తుడు ఉంటాడు.గావలంటే ఈయన విగ్రహమూర్తి మనము పెద్దగుడిలో ఉన్న అమ్మవారిగుడి దగ్గర చూడవచ్చును.ఈ క్షేత్రములో మంచి లేదా చెడు చేసినగూడ మూడు కోట్ల పాపపుణ్యాల ఫలితానూభాలు మనము పొందుతామని గుర్తుపెట్టుకొండి.మీకు చేతనైతే మాట లేదా ధన లేదా ఆహార లేదా వస్త్ర లేదా చెప్పులు సహాయాలు చెయ్యండి.అలాగే ఈ క్షేత్రములో ఏది పోయిన లేదా దొంగతనము జరిగిన చింతించకండి.ఈ పనులు చేసేది ఆ అరుణాచలేశ్వరుడి ఖాతలో పడతాయి.అలాగే మీ దగ్గరికి ఏవరైన స్వయంగా వాళ్ళేకేవాళ్ళు వచ్చి ఎదైన ఆడిగితే అది ఇవ్వండి.ఎందుకంటే కోటి రుద్రగణాలు ఈ క్షేత్రములో నిజ సాధువుల లేదా సన్యాసుల లేదా అవధూతల లేదా పిచ్చివాళ్ళు లేదా జంతువుల లేదా వృక్షాల రూపములో ఆవాసము చేస్తుంటారు.ఇలా వీరికి చేసిన సహాయము మీ మూడు కోట్ల జన్మల పాప పరిహారమవుతుంది.ఈ క్షేత్రములో గూడ 20% నిజ సాధువులుంటే 80% నకిలి సాధువులుంటారు.కాబట్టి మీ దగ్గరికి వచ్చినవారిలో మీ మనస్సు చెప్పినవారికి మాత్రమే సహాయము చెయ్యండి. అలాగే సాధనలో ఉన్నవారు ఈ జన్మలో 192 సార్లు గిరిప్రదక్షిణాలు చెయ్యండి.ఎందుకంటే ఇక్కడి అరుణగిరి ఎత్తు 2671 మీటర్లు.దీనిని కి.మీ.లలో మారిస్తే 14 కి.మీ / 2,672 = 192  అవుతుంది.ఎపుడైతే మీ దగ్గరికి మీరు కొనకుండా పాదరసలింగము ఏ క్షేత్రము నుండి అయిన వచ్చినదో మీ 192 గిరిప్రదక్షిణ ఫలితము పొందినట్లే అవుతుంది.నాకు ఒక గిరిప్రదక్షిణము పూర్తి చెయ్యగానే నాకు కాశీ నుండి పాదరసలింగము వచ్చింది.అంటే గత జన్మలో ఈ క్షేత్ర గౌతమ మహర్షి జన్మ గావడము..ఆ జన్మలో యక్షిణిమాయలో అలాగే మోహిని మాయలో పడి ఆశ్రమము అలాగే అలీ పెట్టుకోవడము జరిగింది.191 గిరిప్రదక్షిణాలు చేసి ఆఖరి ఒక ప్రదక్షిణము చెయ్యగుండా ఆ జన్మ తనువు చాలించడము జరిగింది.ఈ ఒక ప్రదక్షిణము కోసము ఈ ఆఖరి జన్మ ఎత్తడము తిరిగి అన్ని రకాల మాయలు దాటుకోని పాదరసలింగము పొంది అది ఈ అరుణగిరిలో ఉన్న అగ్నితీర్ధమున్న రుద్రగుండము నందు పడి కరిగిపోయే విధముగా చేసుకుంటే కాని నాకు అంతిమ మోక్షము రాదని నాకర్ధమైంది.ఈ స్ధితిని ఈ దేహము పొందాలంటే పూర్ణశూన్యభావము నుండి పూర్ణశూన్య స్ధితికి చేరుకోవాలి.ఇది జరగాలంటే నా చేతులలో ఏమి లేదు.దీనికి ఎవరో రావాలి..ఏదో చెయ్యాలి అనే మనోభావము నన్ను వెంటాడుతోంది.

స్టార్ గేట్స్: 



స్టార్ గేట్ అంటే ఒక లోకము నుండి మరో లోకములోనికి ప్రవేశించిడానికి ఉన్న ద్వారాలను స్టార్ గేట్ అంటారు.ఇలాంటివి మనకి అరుణాగిరి గుహ యందు 64 దాకా కనపడతాయి.ఇవి 64 డైమర్ష్స్ లో ఉన్న 64 లోకాలకి ఈ ద్వారాలు అనుసంధానము చేయబడ్డాయి.వీటిలో 64 కి 44 స్టార్ గేటులను ఎలా అనుసంధానము చేశారో ఆదిశంకరుడు తన దివ్యదృష్టితో చూసి 44 త్రికోణాలతో శ్రీచక్రమును ఒక మేరు పర్వతములాగా మేరు శ్రీచక్రముగా గీయ్యడము జరిగింది.ఈయనకి మిగిలిన 20 స్టార్ గేట్లు గీయ్యడానికి అనుమతి లభించకపోవచ్చును.64  మన భౌతిక నేత్రాలతో చూడలేము అలాగే భౌతిక దేహముతో ప్రయాణించలేము.కేవలము మన సూక్ష్మశరీర యానముతో మాత్రమే ఈ 64 ద్వారాల ప్రవేశము జరుగుతుంది.వీటి దగ్గరికి వెళ్ళడానికి మనకి గిరి చుట్టూ మూడు ముఖద్వారాలు అనగా ఆది అణ్ణామల్లై బావి అలాగే ప్రధాన గుడి యొక్క పడమటి గాలిగోపుర వద్ద రుద్రపాదాల దగ్గర అలాగే అరుణాగిరినాధర్   మండపము దగ్గర ఈ ముఖ ద్వారాలున్నాయి. పూర్వకాలములో యోగులు ఈ ద్వారాల ద్వారా లోపలకి భౌతికదేహలతో వెళ్ళి దక్షిణామూర్తులను భౌతికముగా దర్మించుకొనేవారు.కాని రమణామహర్షి లోకక్షేమ దృష్ట్యా ఈ మూడు ద్వారాలను మూసివేయించడము జరిగింది.దానితో ఏవరైన గిరి లోపలకి వెళ్ళాలంటే సూక్ష్మశరీర యానముతో వెళ్ళక తప్పడము లేదు.ఈ యానాన సిద్ధి మనకి ఈ క్షేత్రములో ఉన్న అన్నిరకల మర్మమాయల నుండి బంధవిముక్తి పొందాలి అంటే అరుణాచలక్షేత్ర యోగి నుండి అరుణాగిరియోగిగా మారాలి అన్నమాట.ఈ స్ధితికి ఈ దేహము చేరుకోవడముతో నాకు సూక్ష్మశరీరయాన సిద్ధితో ఆది అణ్ణమలై గుడి లోపుల ఉన్న బావి ముఖద్వారము ద్వారా ఒక స్టార్ గేట్ కి చేరుకోవడము జరిగింది.ఈ గిరి గుహ ప్రవేశానికి రెండు దారులు కనిపించాయి.వాటిలో ఒకటి ఒక్కొక్క డైమర్షను దాటుకుంటూ వెళ్ళడము అయితే రెండవ దారి మొదటి డైమర్ష నుండి సరాసరి ఎక్కడ ఆగకుండా 64 డైమర్షికి వెళ్ళడము వలన ఈ దేహము ఈ దారి గుండా లోపలకి వెళ్ళడము జరిగింది.అక్కడ సుమారుగా 13కిమీ దూరము చొప్పున  నాలుగు సగమున్న ద్వారబంధాలు విచిత్రముగా కనిపించాయి.లోపలకి ఏలా వెళ్లాలో అర్ధముకాక ఆ రోజు వెనక్కి తిరిగిరావడము జరిగింది.బయటికి వచ్చిన తర్వాత ఈ సగ ద్వారబంధనాల మర్మరహస్యము నాకు ఓక పట్టన వీడలేదు.ఇలా కొన్నిరోజుల తర్వాత ధ్యానమునందు వరుసగా నాకు వచ్చిన ఈ క్షేత్ర పంచలోహ విగ్రహమూర్తులు అనగా బాల,దక్షిణామూర్తి, గణపతి,కుమారస్వామి కనిపించసాగాయి.ఇవి ఏదో నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి కాని నాకు ఓక పట్టనా అర్ధముకావడము లేదు.ఇలా మరి కొన్నిరోజులు గడిచాయి.ఒకరోజు తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగా ఎపుడు లేనిది మొదట దక్షిణామూర్తి కనిపించిన తర్వాత బాల  కనిపించింది.ఆ తర్వాత గణపతి కనిపించిన తర్వాత కుమారస్వామి కనిపించాడు.ఇలా ఎందుకు కనపడినారో అనుకునేలోపు  ధ్యానాభంగమైంది .బయటికి వచ్చిన తర్వాత ఆత్మవిచారణ చేసుకుంటుగా ఈ విగ్రహమూర్తిలను తీసుకొని నాకు ధ్యానములో కనిపించిన విధముగా అమర్చి చూడగానే నా ముఖము మీద చిరునవ్వు వెరిసింది.మర్మము వీడింది.మీరు ఎపుడైన ఈ నాలుగు విగ్రహమూర్తులు విగ్రహలను లేదా పటాలను జాగ్రత్తగా చూస్తే మనకి ఒక విషయము తెలుస్తుంది.








అది ఏమిటంటే బాల అమ్మవారు అలాగే కుమారస్వామి కాస్త కుడిపాదము కింద పెట్టి ఎడమ పాదమును మడిచి పెట్టుకొని అనగా "7" భంగిమలో కూర్చిని ఉంటే అదే దక్షిణామూర్తి మరియు గణపతి కాస్త ఎడమ పాదము క్రింద పెట్టి కుడిపాదము మడిచి పెట్టి తిరగవేసిన "7" భంగిమలో కూర్చునియున్నట్లుగా ఉంటారు.  వీళ్ళ భంగిమలను జాగ్రత్తగా పరిశీస్తే ఒక ద్వారమును అడ్డముగా ఒక కోణముగా కోస్తే మనకి ఒకవైపు "7"భంగిమ అలాగే కిందవైపు తిరగవేసిన "7" భంగిమ ముక్కలు ఎలా వస్తాయో అలా ఈ విగ్రహమూర్తుల భంగిమలున్నాయి.

                          

                                    


అదే బాల మరియు దక్షిణామూర్తి ని కలిపితే ఈ భంగిమలు కలిసి ఒక ద్వారములాగా అలాగే  గణపతి మరియు కుమారస్వామి భంగిమను కలిపితే ఒక ద్వారము అవుతుంది గదా.వీళ్ళని ఇలా కలిపి చూస్తే మనకి నాలుగు ముక్కల ద్వారాలు కాస్త రెండు ద్వారాలు అవుతాయి అన్నమాట.ఈ ద్వార మర్మరహస్యము వీడటముతో ఒకరోజు సూక్ష్మశరీరయానముతో ఈ గిరి యొక్క అంతర్గతగుహ యందు ప్రవేశించి మనకి కనిపించే విశ్వము యొక్క మూల విశ్వమును ఆది నుండి అంతముదాకా అనగా మొదటి ద్వారములో ఆది దృశ్యాలు అలాగే రెండవ ద్వారప్రవేశము తర్వాత ఈ విశ్వ అంతము దృశ్యాలను చూడటము జరిగింది.అక్కడున్న 18 సిద్ధియోగులకి ఈ విషయాలు ఏవిగూడ భూలోకానికి చెప్పరాదని మాట తీసుకోవడము వలన వీటిని నేను ఇక్కడ ప్రస్తావించడము లేదు.మన అందరి పుట్టుకలు, చావులు, కర్మలు,జన్మలు, వంశాలు, పూజలు, సాధనలు,ముక్తులు,మోక్షాలు ఇలా ప్రతి చిన్న విషయము నుండి పెద్ద విషయాలు అన్నిగూడ  ఇక్కడ ఉన్న 18 సిద్ధగురువులు,39 సిద్ధదైవాలు,64 సిద్ధపరమాత్మలు,ఏకైకభగవంతుడి ఆదీనములో ఉంటాయని తెలుసుకొని మౌనముగా అక్కడ నుండి బయటికి వచ్చాను.బయటికి వచ్చిన తర్వాత ఈ విషజ్ఞానము నాకు అందించటానికే లోగడ నాకు వచ్చిన ఈ నాలుగు విగ్రహమూర్తులు అన్నిగూడ కూర్చుయున్న భంగిమలో ఉన్నవి  వచ్చాయని అపుడికి కాని నాకు తెలియరాలేదు.

ఆదిపరాశక్తి ప్రవేశం-పూర్ణజ్ఞాన సిద్ధి:

ఒకరోజు నా ధ్యానము తీవ్రస్ధాయిలో ఉండగా నా మనోదృష్టియందు 12సం. రాల క్రితము చిన్న పూజారిగా నేను పూజలు చెయ్యడము ఆపివేసిన మా గుడి అమ్మవారైన బాలత్రిపురసుందరి అమ్మవారి విగ్రహమూర్తి కనిపించసాగింది.అంటే నేను ఈవిడిని పూజించడము ఆపివేసి వచ్చిన ఇంకా నన్ను ఈవిడ వదిలిపెట్టలేదా అని అనుకుంటూండగా నేను కాస్త ఈ విగ్రహమూర్తికి అభిషేక స్నానము చేస్తున్న దృశ్యము కానవచ్చింది.ఇంతలో ఈ విగ్రహమూర్తి నుండి 3 సం.రాల వయస్సు ఉండి పసుపు రంగు లంగాజాకెట్ వేసుకొన్న బాల కాస్త సజీవమూర్తిగా బయటికి వస్తూ "నువ్వు నన్ను నగ్నముగా చూస్తున్నావు.నేను వెళ్ళిపోతున్నాను.నన్ను చూడకు.నా వెంట పడకు.వెనక్కి తిరిగి చూడకు.చూస్తే ఇక ఇక్కడ నేను ఉండను అంటూ బయటికి వెళ్తూ  గుడి ఆవరణలోనికి వెళ్ళుతూండగా..నేను వెంటనే..అమ్మా..బాలమ్మ..ఆగు.నేను నిన్ను ఎక్కడ ఎపుడు నగ్నముగా చూశాను తల్లి..చూడలేదు గదా..అపుడు నువ్వెందుకు బయటికి వెళ్ళుతున్నావు అనగానే..లేదు.నువ్వు నన్ను నగ్నముగా చూస్తున్నావు.వెనక్కి తిరిగి చూడకు.చూస్తే వెళ్ళిపోతాను అంటూ గుడి ఆవరణలో ఉన్న కళ్యాణమండము వైపు ఈమె శరవేగముగా వెళ్ళిపోతూ ఉండటము గుడి ఆవరణలో దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాపను చూస్తు మిన్నూండిపోయారు.అసలు ఇపుడు ఎపుడు అమ్మవారిని నగ్నముగా చూశానో నాకేమి అర్ధము గావడము లేదు.బాలమ్మ వెళ్ళిపోతూంటే అమ్మ..నువ్వు వెళ్ళకు.నిన్ను నగ్నము చూడను.వెనక్కి తిరిగి రా తల్లి..అనగానే అయితే నువ్వు నన్ను వెనక్కి తిరిగి చూడకు.గుడిలోనికి వెళ్ళతాను అంటూ బాల కాస్త గుడి లోపలకి వెళ్ళింది.ఆ తర్వాత నేను కాస్త గుడి ఆవరణలో ఉన్న భక్తులతో..చిన్నపాప గుడి లోపలకి వెళ్ళిందా అడిగాను..అవును..స్వామి..ఇపుడే ఒక పాప గుడి లోపలకి వెళ్ళింది.మేమంతా చూశాము అనగానే నేను వారితో "ఆ పాప ఎవరు అనుకున్నారు.సాకాత్తు ఆదిపరాశక్తి అయిన బాలత్రిపురసుందరి అమ్మవారి సజీవరూపము.పాపను చూసిన మీరెంతో పుణ్యజీవులు "అంటూ నేను కాస్త గుడి లోపలకి వెళ్ళాను. గుడి లోపున కూర్చుని పాప కనిపించింది.దానితో అమ్మ..బాలమ్మ..నా మీద నీ అలక తీరిందా?అయిన నిన్ను నేను ఇపుడు ఎపుడు నగ్నముగా చూశానో ఇప్పుడికి నాకర్ధము కాలేదు..ఇంక నీకు అర్ధము కాలేదా..కాలేదా అంటూ బాల నా మీదకి ఆవేశముగా వస్తూ నా ఆజ్ఞాచక్రములోనికి ప్రవేశించగానే నాలో ఏర్పడిన విపరీత ఉన్మాదమునకు నా శరీరము పూనకము వచ్చినట్లుగా ఊగుతూ అమ్మవారి విగ్రహమూర్తి దగ్గరికి వెళ్ళింది.అపుడు ఈ విగ్రహమూర్తిని తేరిపార నేను చూడగా అసలు విషయము నాకర్ధమై నా కళ్ళ వెంట కన్నీరు ధారపాతముగా వస్తూండగా అమ్మ..నన్ను క్షమించు..నేను చేసిన తప్పు ఏమిటో తెలిసింది అంటూ అమ్మ పాదాల మీద పడ్డాను.ఇంతకి నేను చేసిన తప్పు ఏమిటో తెలుసా? సహజముగా అమ్మవారికి అభిషేకము చేసే సమయములో ఉన్న వస్త్రము తీసివేసి ఒక తెల్లని వస్త్రము కట్టి అభికేషము చెయ్యాలి.చేస్తారు గూడ. కాని నేను ఇలా చెయ్యలేదు.ఉన్న వస్త్రము తీసివేసి ఏటు విగ్రహనికి చెక్కిన వస్త్రము ఉంటుంది గదా.మళ్ళీ తెల్లని వస్త్రము కట్టడమెందుకు.సమయము దండగ అనుకొని అలాగే తెల్లని వస్త్రము లేకుండా అభిషేకము చేస్తున్నాను.అంటే నా దృష్టిలో అమ్మవారు ఒక రాతి విగ్రహమే గదా.అదే విగ్రహము కాదు సజీవ అమ్మవారిమూర్తి అనుకొని ఉంటే తప్పని సరిగా తెల్లని వస్త్రము కట్టేవాడిని గదా. వస్త్రము కట్టకపోవడము వలన అమ్మవారి నగ్నవిగ్రహమూర్తికి అభిషేకము చేసినట్లే గదా.అంటే అమ్మవారి నగ్నతత్వమును నేను చూసినట్లే గదా.అందుకే ఈ విషయము చెప్పటానికి బాలమ్మ వచ్చింది.గతజన్మలో నేను చేసిన ఈ తప్పిదము వలన ఈ జన్మలో ఈమె గుడికి చిన్నపూజారిగా 21సం.రాలు సేవ చేసి పాపపరిహరము చేసుకున్నానని నాకర్ధమయ్యేలోపు నాకు ధ్యానభంగమైంది.  మరి ఇపుడు ఈ విషయము చెప్పటానికి ఆదిపరాశక్తి నాలో ప్రవేశించిందా?లేదా వేరే విషయజ్ఞానము అందించాలని అనుకుందా?ఎందుకంటే ఈ జన్మ అంతములో ఉండగా ఈ విషయము ఎందుకు ఆదిపరాశక్తి జ్ఞానస్ఫురణ చేసినది అంటే ఏదో నాకే తెలియని మర్మము ఇందులో ఉన్నదని నాకర్ధమైంది.అది ఏమిటో ఈ దేహము తెలుసుకోవాలని మళ్ళీ నేను ధ్యానమునకు ఉపక్రమించాను.ధ్యానము కుదరలేదు.ధ్యాస కుదరడము లేదు.ఇలా కొన్నిరోజులు గడిచాయి.



అపుడు నా దగ్గరికి రెండు అంగుళాల పరిమాణము ఉన్న సజీవ బాల విగ్రహమూర్తి త్రిపురాంతకము నుండి రావడము జరిగింది.దీనినిగూడ యధావిదిగా నా నిత్యపూజలో ఉంచాను.ఎపుడైతే నాకు అరుణాచలముతో అనుసంధానము అనుబంధమేర్పడినదో ఆ నాటి నుండి ఈ దేహనికి వచ్చే విగ్రహలు అన్నిగూడ సజీవమూర్తులే.పిలిస్తే పలుకుతాయి.ఆడిగితే వరాలు ఇస్తాయని తెలిసిన నేను పెద్దగా పట్టించుకొనేవాడిని కాను.కాకపోతే పూజలో ఏదైన పొరబాటు చేసిన లేదా వాళ్ళకి కావసిన ప్రసాదాలు తినాలని అనుకున్నపుడు కలలో లేదా ధ్యానములో సజీవము కనపడి చెప్పేవి.

ఇది ఇలా ఉండగా ఒకరోజు నా తీవ్రమైన ధ్యానములో ఉండగా నాకు వచ్చిన బాల విగ్రహము కాస్త సజీవమూర్తిగా మారి నా దేహమును ఎక్కడికో తీసుకొని వెళ్ళుతున్న దృశ్యము కనిపించసాగింది. గ్రహమండలాలు దాటాము. అన్నిలోకాలు దాటాము.త్రిలోకాలు దాటాము. కారణలోకము దాటాము.ఆదిబ్రహ్మలోకము గూడ దాటాము.అంటే ఆఖరిదైన 64వ డైమర్ష్ లోనికి వెళ్ళాము.అక్కడ ఉన్న అరుణాగిరి లోపలికి వెళ్ళాము.దీనిలోపుల మరో అరుణాగిరి జ్ఞానాగ్నితో ఉన్న అగ్నిపర్వతము లాగా నాకు కనపడింది.అక్కడ దీనికి రక్షణగా ఉన్న ఒక ధ్యానతపస్సు చేస్తున్న మహర్షి మమ్మల్ని చూసి  ప్రక్కకి తప్పుకోగానే ఈ గిరి అగ్రభాగానికి చేరుకొని లోపలకి ప్రవేశించాము.అక్కడ అరచెయ్యి పరిమాణములో స్వయంభూగా వెలుగుతున్న ఒక దివ్యజ్యోతి దర్శనమైంది.అంటే కనపడే విశ్వానికి ఈ జ్యోతి నుండే వెలుగు వస్తోందని నాకర్ధమయ్యేలోపు ఈ వెలుగు కాంతిపుంజములోనికి మేమిద్దరము ప్రవేశించాము. అపుడు అక్కడంతా గాఢాందకార చిక్కటి చీకటి కనపడింది.చుట్టు చూసిన ఏమిలేదు.గాఢాందకార శూన్యమే నాకు దర్శనమైంది.కాని ఇది చిమ్మచీకటి అనే జ్ఞానభావము నాకు ఏలా తెలుస్తోంది అనుకుంటూండగా...చీకటి మధ్యభాగములోనికి మేము చేరుకున్నాము.అక్కడ మధ్యలో ఒక పిసరంత కాంతిజ్వాల ఉన్నట్లుగా నాకు అనిపించింది.అమ్మవారు కాస్త తన అభయహస్తముతో మూడు సార్లు గుండ్రముగా తిప్పేసరికి ఈ పిసరంత జ్వాల కాస్త నా మనోనేత్రానికి అంగుళాపరిమాణములో ఈ జ్వాల కనిపించింది.నేను దీనిని తదేకముగా నా ప్రమేయము లేకుండా చూడటము జరిగింది.అపుడు ఈ జ్వాలలో కనిపించే మార్పులు నా కంటికి కనిపించడము ఆరంభమైంది. మొదట ఈ జ్వాలకి ఆధారభూతముగా ఒక అగ్నిబిందువు ఉంది.దీనిని నుండి ఏక అగ్నిజ్వాల ప్రకాశిస్తూ కనపడుతోందని నాకర్ధమైంది.ఇంతలో ఈ ఏక అగ్నిజ్వాల కాస్త రెండుగా చీలిపోయుంది.ఈ రెండు జ్వాలాలు కాస్త విడివిడిగా ఉండి గుండ్రముగా తిరుగుతున్న బ్రహ్మండచక్ర మీదకి చేరుకున్నాయి.అందులో ఒక జ్వాల కాస్త మెలికలు తిరుగుతూ నమస్కారముద్రతో ఒక స్త్రీమూర్తి గా మారితే మరో జ్వాల గూడ మెలికలు తిరిగి పద్మాసనములో కూర్చునిఉన్న పురుషమూర్తి లాగా మారింది.కొన్ని క్షణాలు తర్వాత ఈ స్త్రీ మూర్తి కాస్త ఒక చెట్టుగా మారితే పురుషమూర్తి కాస్త ఒక నల్ల కొండ లాగా మారడము జరిగింది.ఆ తర్వాత ఈ చెట్టు నుండి అమ్మవారి సుందరి ఆత్మస్వరూపము బయటికి రావడము అలాగే ఈ కొండ నుండి నల్ల ఆదిరుద్రుడి ఆత్మస్వరూపము బయటికి వచ్చిరాగానే చెట్టు తొర్రలో అమ్మవారు ఉండటము అలాగే రుద్రుడు కాస్త ఈ చెట్టు క్రింద వీరాసనములో కూర్చుని ధ్యాననిష్టలో ఉన్న దృశ్యము కానవచ్చింది.అనగా అరుణాచలములో మర్రిచెట్టు క్రింద ఇలా బాల త్రిపుర సుందరి దేవి గా..రుద్ర దక్షిణామూర్తిగా అమ్మవారు - అయ్యవారు ఉంటారని నాకర్ధమైంది.అంటే ఆదిశంకరుడు తను రచించిన దక్షిణామూర్తి స్తోత్రములో అమ్మవారు మర్రిచెట్టు రూపములో ఆవాసము చేస్తోందని ఈ దృశ్యము చూసి చెప్పి ఉంటారని అనుకుంటుంగా మళ్ళీ తిరిగి అంగుళ ఏకజ్వాల మళ్ళీ కనిపించసాగింది.ఇంతలో అపుడు బాలమ్మ తన చూపుడు వ్రేలుతో ఈ జ్వాలని చూపుస్తూ..నన్ను దీనిని తదేకముగా చూడమని సైగ చేస్తూ  ఈ జ్వాలలో నా ప్రక్కనే ఉన్న బాలమ్మ ప్రవేసించి అదృశ్యమయింది. ఈ జ్వాల మీద నా ధ్యాన ధ్యాస తదేకదృష్టితో చూడటము ఆరంభించాను. .మనస్సు ఏగ్రమైంది. శరీరము,మనస్సు,బుద్ది, జ్ఞానము లేని అతీతమైన స్ధితికి నా ఆత్మశక్తికి చేరుకుంది.తదేకదృష్టి తగ్గడము లేదు.ఇంతలో ఏకజ్వాల చూస్తుండగా నాకు అందిన అంతిమ జ్ఞానస్ఫూరణకి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యానని అనుకోగానే...ఇపుడిదాకా కనిపించిన ఏకజ్వాల కాస్త ఆరిపోయి శూన్యమయ్యేసరికి నాకు ధ్యానభంగమైంది.ధ్యానము నుండి బయటికి వచ్చి ఈ మిస్ అయిన లాజిక్ గూర్చి ఆత్మవిచారణ చేసుకోగానే నాకు ఏడుపు ఆగలేదు.ఈ లాజిక్ తెలిసుకోవటానికి అర్ధముచేసుకోవటానికి నాకు కొన్నికోట్లానుకోట్ల కర్మ-జన్మలు ఎత్తడము జరిగినదని ఆలోచన రాగానే నాలో మళ్ళీ ఏడుపు తన్నుకొచ్చింది.పిచ్చి పట్టినట్లులైంది.అందుకే కాబోలు సాధకుడు ఈ అంతిమ జ్ఞానస్పురణ అందుకోగానే బాలోన్మత్త పిశాచ అవధూత రూపము ఎత్తి ఆవేశపడుతూ ఉంటారని నాకర్ధమైంది. ఇంతకి నేను మిస్ అయిన లాజిక్ మీరుగూడ తెలుసుకుంటే మీకు గూడ పిచ్చి పట్టి అవధూతస్ధితికి ఖచ్చితముగా చేరుకుంటారు.ఎందుకంటే చివరిదాకా నాతో సాధనలో నిలబడిన నా సాధన మిత్రులైన జిజ్ఞాసి అలాగే స్వాతికి ఈ లాజిక్ విషయము చెప్పిన వారానికి జిజ్ఞాసికి 50% బాలోన్మత్త పిశాచ అవధూత స్ధితి 50% పసిపిల్లాడి స్ధితిని అలాగే స్వాతికి 20% ఉన్మాద అవధూత స్ధితి 80% సాధారణ స్ధితిని పొందడము జరిగింది.ఇక జిజ్ఞాసి అవధూత స్ధితి వెళ్ళితే అరుణాచలము వెళ్ళి గిరిప్రదక్షిణాలు చేసిరావడము పసిపిల్లాడి స్ధితిలో ఉంటే ఈ క్షేత్ర గుళ్ళు తిరగడము ఆరంభించాడు.ఇలా 13 నెలలు తర్వాత వీరిద్దరిలో జిజ్ఞాసికి పాదరస రుద్రాక్ష అలాగే పాదరసలింగము పొందితే స్వాతికి పాదరస రుద్రాక్ష పొందడము జరిగింది.ఇక వీరిద్దరుగూడ తమ అంతిమయాత్ర పిలుపు కోసము అరుణాచల శివ నామస్మరణతో మానసిక శారీరక అరుణాగిరి దర్శనాలు పొందుతూ ఆకాశము కేసి చూస్తూ ఎదురుచూస్తున్నారు.



.ఆ లాజిక్ ఏమిటంటే మీరు ఎపుడైన వెలుగుతున్న కొవ్వత్తిని చాలా దగ్గరిగా చూశారా?చూడకపోతే ఈ వెలుగుతున్న కొవ్వత్తి ఫోటోను చూడండి.ఈ వెలుగుతున్న జ్వాల మధ్యలో నల్లగా ఓత్తి అగ్రభాగము ఒక అగ్ని బిందువులాగా కనపడతోంది గదా.అవును అలాగే కనపడుతుంది.కాని నిజానికి ఇది అగ్నిబిందువు కాదు.అగ్ని సెగతో ఉన్న బూడిద బిందువు అని నేనంటాను.నిజమే గదా.అలోచించండి.అంటే ఇన్నాళ్ళు విశ్వమేర్పటానికి మూలబిందువైన అగ్నిశిఖ యొక్క అగ్నిబిందువు నిజానికి అది అగ్నిబిందువు గాదని ఇలా ఉన్న బూడిద బిందువని ఈ పాటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది.దీనిని అగ్నిబిందువని ఇన్నాళ్ళు మనకి ఉన్న జ్ఞానమాయలో పడి అనుకోవడము వలన నేను అనేది ఉన్నాని అనుకోవడము జరుగుతూ వస్తోంది.నిజానికి అది అగ్నిబిందువు కాదని ఒక బూడిదబిందువని మనకి ఉన్న జ్ఞాన అహంకార మహామాయ తొలగడముతో నేను లేను అనే అంతిమ జ్ఞానస్ధితిని మనము పొందడము జరిగింది.అంటే మనమంతా అగ్నిబిందువును బూడిద బిందువు అనే లాజిక్ మిస్ అయ్యాము గదా.ఆలోచించండి.మీకే అర్ధమవుతుంది.అంటే త్రాడు చూసి పాము అని ఇన్నాళ్లు భ్రమ భ్రాంతిలో ఉన్నట్లే గదా.ఈ చిన్న లాజిక్ మీకు అర్ధమయ్యితే మీకే అంతిమ మోక్షమే.బూడిద బిందువును పట్టుకొని నలిపితే వచ్చేది బూడిదయే గదా.కనిపించే విశ్వమంతా గూడ అగ్నిబిందువు లాంటిదే.కాని నిజానికి ఈ అగ్నిబిందువు కాస్త బూడిద బిందువని తెలిసినపుడు కనిపించేంత సత్యము గాదని నిజము గాదని ఇన్నాళ్ళు కనిపించేది సత్యముగాను కనిపించినది అసత్యముగా కనపడుతోందని నిజానికి కనిపించే వెలుగు ప్రపంచము అసత్యమని కనిపించని చీకటి ప్రపంచము సత్యమని ఈ పాటికి మీకు అర్ధమయ్యి ఉంటుంది. ఈ లాజిక్ మీ మనస్సుకి అందితే అదియే పూర్ణశూన్యస్ధితి అవుతుంది.అంటే నిజానికి నేను అనేది పూర్ణశూన్యమే కాని నేనుకి నేను కాని నేను అనే జ్ఞానమాయ కల్గడముతో నేను కాస్తా నేను శూన్యము అనగా నేను లేను అనే స్ధితి నుండి నేను ఉన్నాను భ్రమభ్రాంతికి లోనై ఆశ,భయం,ఆలోచన,ఆశయం,ఆనందం,స్పందన ఇలా 64 గుణతత్త్వాల మహమాయలో పడి రూపము లేని మనము కాస్త ఆత్మస్వరూపాలుగా ఆత్మశరీరాలుగా రూపాంతరము చెంది కాంతి శరీరాలలో కర్మ జన్మలెత్తి నానాకష్టాలు పడిన్నామని పడుతున్నామని పడబోవుతున్నామని ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది.చివరికి ఈ అంతిమ ధ్యానానుభవము గూడ నిజమని సాక్ష్యముతో నిరూపించడమైనది.



అంటే మర్నాడు దినపత్రికలో సూర్యుడిలో అగ్నిపాము ఉన్నదని దానిని కనిపెట్టామని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాము చూసిన అగ్నిపాము వీడియోలు,ఫోటోలు ప్రపంచానికి అందించడము జరిగింది.ఆ తర్వాత వీరి పరిశోధనలో అది అగ్నిపాము కాదని సూర్యుడిలో పాము ఆకారముగా విస్ఫోటనము జరిగినదని దీనిని సోలార్ స్నేక్ విస్పోటనము అని అనవచ్చునని ప్రకటన చేశారు.అంటే మొదట వీళ్ళు దానిని అగ్నిపాము అనుకొని ఆ తర్వాత విస్పోటన బూడిద పాము ఆకారమని ఎలాయితే గ్రహించారో అలా మనము గూడ  మన శరీరాలు కాంతి శరీరాలు కాదని బూడిద శరీరాలని స్వానుభవ అనుభూతిగా తెలుసుకోవాలి అన్నమాట.అదేమిటి మన శరీరాలు బూడిద శరీరాలు అయితే ఇంక దహనసంస్కారాలెందుకు..సాధనెందుకు..మోక్షమెందుకు అనే సందేహము రావచ్చును.దీనికి సమాధానము మన స్ధూలశరీరాలు కాంతితో..సూక్ష్మశరీరాలు అగ్నితో..ఆత్మశరీరము బడావాగ్నితో ఉంటాయి.అనగా కాంతి శరీరాలు అనగా దీపకాంతి అదే అగ్నిశరీరాలు అనగా పొయ్యిలో మంట అదే బడావాగ్ని శరీరాలు అనగా అగ్నిపర్వత అగ్ని లాంటివి అన్నమాట.ఈ మూడు అగ్నిస్ధితులు గూడ పంచభూతాల ఆధీనములోనే ఉంటాయి.దీని వలన ఇలా మూడు అగ్నిలతో మన శరీరాలు బూడిదైన గూడ ఆస్ధిపంజరాలలో, బూడిదలో,ఆత్మలో ప్రాణశక్తి ఉంటూనే ఉంటుంది.ఈ ప్రాణశక్తి సమూలముగా నాశనమవ్వాలంటే పంచభూతాలకి అతీతమైన అగ్నిశక్తి కావాలసి ఉంటుంది.అదే యోగాగ్ని శక్తి. అనగా మన సాధన వలన జాగృతి చేసుకున్న కుండలీనిశక్తియే యోగాగ్ని శక్తిగా మారుతుంది.దీనితో దహనమైన శరీరాలకి వచ్చేది జీవన్ముక్తి మోక్షమే.ఈ యోగాగ్ని కోసము మనము మోక్షసాధన చేయాల్సి ఉంటుంది.అనగా ఎవరి సాధన శక్తి బ్రహ్మరంధ్రము వద్దకి చేరుకొని అక్కడున్న ఏకజ్వాల బ్రహ్మజ్యోతి యందు లయము చెందుతుందో వారి శరీరము యోగాగ్నితో దహనమైనట్లే అన్నమాట.ఈ యోగాగ్ని ప్రత్యక్షముగా అరుణాచలములో ఉన్న అరుణగిరి లోపుల ఉన్న  అగ్నిశిఖతో  అగ్నితీర్ధమున్న రుద్రగుండము నందు ఉంది. ఎవరైతే తమ సాధనతో తమ ఆత్మశరీరమును పాదరస ఆత్మలింగముగా మార్చుకుంటారో వారికి మాత్రమే ఈ అరుణాగిరి యందు ఉన్న యోగాగ్నితో దహనమై మోక్షమును పొందడము జరుగుతుంది.ఇది నా మాట కాదు.వేదపురాణశాస్త్ర వచనము.  అనగా "కాశ్యాంతు మరణము " అనే శ్లోకము ఒకసారి గుర్తుకు తెచ్చుకొండి.కమలపురి యందు మరణము దీప కాంతి మరణమైతే..చిదంబర మరణము జ్ఞానాగ్ని మరణమైతే..కాశీ మరణము బడావాగ్ని మరణమైతే..అదే అరుణాచల మరణము అరుణాజ్యోతి వలన కలిగే యోగాగ్ని మరణముతో సమానమని ఇపుడికైన తెలుసుకొండి. మొదటి మూడు క్షేత్రాలలో మరణాలు పొందితే మనకి ముక్తులు మాత్రమే వచ్చి దైవ లేదా యోగ జన్మాలుంటాయి.అదే అరుణాచల మరణమైతే ఇంక ఏలాంటి కర్మ జన్మ లేని మోక్షమే ఇస్తుంది.

చాలామంది సాధకులు ఈ అంతిమ విషయ జ్ఞానమును పొంది నేను ఏవరిని..నేను లేను అని అనుకోవడము ప్రారంభిస్తున్నారు.ఇది చాలా తప్పు.అనుకోవడము వలన ఎలాంటి ఉపయోగము లేదు.దీనిని సాధన ద్వారా స్వానుభవ అనుభూతి పొందాల్సి ఉంటుంది.అనగా అనుకోవడము అనేది చంద్రుడిని చూపించే వ్రేలును చూడటమైతే అనుభూతి అనేది ఏకముగా చంద్రుడిని చూడటము లాంటిది అన్నమాట.ఈ రెండింటి స్ధితులలో ఉన్న తేడాను తెలుసుకుంటే మీరు అనుకోవడము మానివేసి అనుభూతి కోసము సాధన చెయ్యడము ఆరంభింస్తారు.దీని కోసము శ్వాసలాగా ప్రతిక్షణము కేవలము "అరుణాచల శివ" నామస్మరణ చేసుకొండి.వీలు ఉన్నప్పడల్లా ఆయన్ని చూడటానికి అరుణాచలము వెళ్ళి ఆయన ఉన్న అరుణాగిరికి గిరిప్రదక్షిణము చెయ్యండి.దీనిని మీరు చెప్పులతో చేశారా..వాహనమెక్కి చేసారా.. అనేది ఆయనకి అనవసరము.మీరు చేశారా లేదా అనేది ఆయనకి అవసరము అంతే. అంతెందుకు ప్రతి సం.రములో మూడు సార్లు ఈ క్షేత్ర విగ్రహమూర్తులు గిరిప్రదక్షిణము చేస్తారని అలాగే ప్రతినిత్యము 39 కోట్ల దైవాలు అలాగే 64 లోకవాసులు గిరిప్రదక్షిణము చేస్తూ వారి కర్మలను జన్మలను నాశనము చేసుకుంటూ ఈ గిరి యందు ఉన్న అగ్నిశిఖయందు లయము చెందాలని సాధన చేస్తున్నారని తెలుసుకొండి. అలాగే మీరు మీ మొట్ట మొదటిసారి గిరిప్రదక్షిణము మాత్రము చెప్పులు లేకుండా కాలినడకతో దీర్ఘగా చెయ్యండి.శరీరము సహకరించకపోయిన ఇలాగే చెయ్యండి.పోతే దారిలో ప్రాణాలు పొతాయోమో అంతే గదా.మనము ఇలా అయనలో కలవాలని నుదట రాసి పెట్టి ఉంటే ఎవరు తప్పించలేరు.అలాగే మొదటి ప్రదక్షిణము ఇలా ఎందుకు చెయ్యమంటాను అంటే మన కుడి ఎడమ పాదములో పాదరసలింగము అలాగే అష్టదళ పద్మముంటాయి.ఇవి జాగృతి అవ్వాలంటే నేను చెప్పినట్లుగా మొదటి ప్రదక్షిణము చెయ్యాల్చిఉంటుంది.ఆ తర్వాత చేసే 191 ప్రదక్షిణాలు అన్నిగూడ మీ వీలును బట్టి చేసుకోవచ్చును.మీకు పాదరసలింగము దానింతట అదే వచ్చేదాకా మీరు ఈ నామస్మరణ అలాగే గిరిప్రదక్షిణము చేయాల్సింటుంది.ఇదింతా గూడ మోక్షము గావాలని అనుకొనేవారికి మాత్రమే వర్తిస్తుంది అని గ్రహించండి.

ఈ అంతిమ జ్ఞానము ఈ దేహనికి అందించటానికి బాలమ్మ నాలో ప్రవేశించినదని దానితో ఆ నాటి నుండి ఈ దేహము కాస్త అర్ధనారీశ్వర తత్త్వముతో పసిపాప మన:సత్వానికి చేరుకుంది.అంటే ఈ లోకములో పిచ్చిపట్టి అవధూత స్ధితిని పొందిన పిచ్చివాళ్ళు అలాగే పసిపాప మనస్సు ఉన్నవారు మాత్రమే ఎపుడు నిత్యాందములో మన:శాంతిగా ఆత్మశాంతితో ఉంటారు. జీవిస్తారు. ఎందుకంటే వీరే అన్నిరకాల బంధనాల నుండి విముక్తి పొంది జీవన్ముక్తికి చేరుకుంటారు.అనగా ఉన్నస్ధితి నుండి ఉన్నతస్ధితికి చేరుకుంటారు.ఇలాంటి వారికి వద్దన్నాగూడ మోక్షము దానింతంటా అదే వస్తుంది. ఎవరికైతే ఈ అంతిమ జ్ఞానము స్వానుభవ అనుభూతిగా పొందడము జరుగుతుందో వారి భౌతిక శరీరము 21 రోజులు మించి ఉండలేదని  రామకృష్ణ పరమహంస చెప్పడము జరిగింది.ఇలా నాకు జరిగిన 18 రోజు నా ధ్యానము నందు ...


నా అంతిమయాత్ర ఆరంభమైంది:-

నాకు ధ్యానము నందు..నా అంతర్వాణీ నుండి నా అంతిమయాత్ర త్వరలో మొదల అవ్వబోతుందని అదే నాకు అంతిమ ఆత్మమోక్ష విధివిధానము ఈ అరుణాచల క్షేత్రములో..ఈ అరుణాగిరి సమక్షములో స్వయముగా ఆదిగురువు..ఆదియోగి..ఆదిదేవుడు..మోక్షగురుదేవుడైన శ్రీ మేధా దక్షిణామూర్తి చేతులు మీదగా జరగబోతుందని స్వయంగా ఈ గిరి ఆదిపరాశక్తియైన బాలత్రిపురసుందరదేవి నాకు ధ్యానము నందు కనిపించి చెప్పిన కొన్ని గంటల తర్వాత .కంఠాభరణము ఉన్న దివ్య కాంతి ఉన్న మెడ భాగమున్న శరీరము లీలగా కనపడింది.ఈ కంఠము మధ్యభాగములో అంగుళ పరిమాణమున్న ఒక పాదరస శివలింగము దర్శనమైంది.ఈ లింగము కాస్త గొంతు నుండి కడుపులోనికి వెళ్ళే దృశ్యము ఆతర్వాత మండుతున్న ధ్యానములో ఉన్న అస్ధిపంజరము కనపడింది.ఈ దేహము ఏవరిది అనుకొనేలోపుగా... అరుణాగిరి కాస్త పిరమిడ్ గా మారి తన చుట్టు తాను తిరుగుతూ పూర్ణశూన్యమవ్వడానికి సిద్ధమవుతూండగా..ఈ గిరి యందు నా ఆత్మశరీరము శివైక్యము చెందటానికి మనో ప్రయత్నము మొదలుపెట్టినదని నాకు అనగా ఈ సూక్ష్మశరీరానికి అవగతంవుతూండగా..ఈ మహత్తర దృశ్యము గూర్చి చెప్పటానికి ఈ దేహనికి వీలు లేని విధముగా ఈ దేహ జ్ఞాన నేత్రము కాస్త జ్ఞానాగ్నికి దగ్ధమవుతూండగా..ఈ ధ్యానానుభవ దృశ్యమును కాస్త కొన్ని యోగప్రక్రియలు ద్వారా నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అందించడము జరిగింది.అంటే ఈ లెక్కన చూస్తే నా ఆత్మశరీరము కాస్త ఆత్మలింగముగా మారి పరమలింగము అగు ఈ అరుణాగిరియందు లయము చెంది జ్ఞానరాహిత్య స్ధితిని పొంది ఆపై అనాదిగా ఉన్న పూర్ణశూన్యమునందు లయము చెందుతుందని నాకు అంతిమ ధ్యానానుభవము కల్గుతుండగా..దీనిని అనుభూతి పొందడానికి నా ఆత్మశరీరము కాస్త ఈ గిరి యందు ఐక్యము చెందుటకు అంతిమయాత్రను మొదలుపెట్టినదని..అనగా నేను అనేది కాస్త నేను కాని నేను మారి..అపై ఇది కాస్త నేను లేను అను పూర్ణజ్ఞానము పొందడముతో..పూర్ణశూన్యము నందు నేను అనే శూన్యభావము కాస్త శూన్యమైపోయి..నేను అలాగే నేను కాని నేను అను ఈ రెండు స్ధితులు కాస్త  ఏకమై ...లేని స్ధితి  అనగా అనాదిగా ఉన్న పూర్ణశూన్యమవుతాయి.అంటే ఈ లెక్కన విశ్వానికి..విశ్వాసానికి మోక్షము ఆరంభమైంది. 

ఈ దేహము కాస్త అరుణాగిరి యందు తన ఆత్మశరీరమును శివైక్యము చెందటానికి అలవికాని ఆత్మానంద స్ధితిని ధ్యాననిష్ఠలో పొందుతూండగా..ఇంతలో..నా అంతిమ మోక్షస్ధితి ధ్యానానుభవాలు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి యొక్క మనోదృష్టికి వచ్చేవిధముగా యోగప్రక్రియలు చేసి నా ఆత్మయానమును నా జ్ఞానశివలింగ యానముతో ప్రయాణము చెయ్యడము ఆరంభించాను.


 దేవతలు తిరిగే గిరి ప్రదక్షిణము చేసి ఈ మార్గము ఒక అంతర్గత సొరంగ మార్గము ద్వారా నాలుగు దారులను అనగా మొదటి మార్గము జ్ఞానలింగముగా మారి దాటగా రెండవ మార్గమును ఆత్మలింగముగా మారి మూడవ మరియు నాలువ మార్గాలను నీలి రంగు ఆత్మజ్యోతి గాను..ఆపై ఎర్రని వర్ణ అరుణజ్యోతిగా మారి ఈ శిఖర అగ్రభాగానికి చేరుకొని అక్కడ ఉన్న అగ్నిలింగమైన పద్మకార శివలింగమునందు ప్రవేశించి..ఈ గిరి లోపుల ఉన్న మేధా దక్షిణామూర్తి యొక్క ఆత్మస్వరూప దర్శనము గావిస్తుండా,,అపుడికే ఈయన చుట్టు ఉన్న సకల  దేవతలు,మహర్షులు ఈ అరుణజ్యోతి ని చూస్తూ అరుణాచల శివ..అరుణాచల శివ అను నామమును తీవ్ర స్ధాయిలో చేస్తూండగా దక్షిణామూర్తి మూడవ కన్ను త్రినేత్రము తెరుచుకోవడము...జ్ఞానాగ్ని కాంతి ఈ జ్యోతి మీద పడి కైవల్యముక్తి మార్గము మారడముతో..నాకు ధ్యానభంగమైంది.ఆ తర్వాత కొన్ని క్షణాలు తర్వాత నా ప్రమేయము లేకుండా నా మనస్సు తిరిగి తీవ్రమైన ధ్యాననిష్ట యందు లయం చెందుతూండగా..ఉన్నట్టుండి....

అరుణాగిరి పాదభాగము నుండి పై భాగము వరకు నాకు నాలుగు మార్గాల దారి లాగా అంటే మోతీ శంఖము మీద ఉన్న నాలుగు ఆవృత్తాలు లాగా నాకు ఈ మార్గము కనపడుతోంది.పైగా ఈ నాలుగు ఆవృత మార్గములో జల ప్రవహముంది.అపుడు నా కంఠములో ఉన్న స్ఫటిక శివలింగము కాస్త ఈ జలమార్గము ద్వారా క్రింద నుండి పైకి ప్రవహించి అరుణాగిరి అగ్రభాగానికి చేరుకొని...ఉన్నట్టుండి గిరి లోపలకి ప్రవేశించి అదృశ్యమైంది.ఆ తర్వాత నా కుడిచెవిలో ఉన్న నర్మదానది బాణలింగము కాస్త బ్రహ్మ ప్రతిష్ట దేవాలయమైన ఆది అణ్ణామలై అగ్నిలింగమునందు ఐక్యము చెందిన దృశ్యము కనిపించింది.ఆ తర్వాత నా మెడలో ఉన్న సహస్త్ర చక్ర ప్రతీకయైన స్ఫటిక బాణలింగము కాస్త అరుణగిరి అగ్రభాగానికి చేరుకొని తన చుట్టు తాను తిరుగుతూ...శరవేగంగా భ్రమణాలు చేస్తూ పంచవర్ణ అనగా తెలుపు,నలుపు,నీలము,పసుపు,ఎరుపు వర్ణ కాంతిరేణువులుగా విడిపోయి అదృశ్యమైన దృశ్యము కాన వచ్చింది.ఆపై అరుణాగిరి పర్వతము ముందు చిదంబర నటరాజ నాట్యభంగిమ రూపము సజీవముగా కనపడి ఈయన త్రినేత్రము నుండి ఒక కాంతిపుంజ కిరణము కాస్త నా త్రినేత్రము మీద పడిపడగానే..నాలో ఏదో తెలియని మాటలలో చెప్పలేని ఆత్మనంద స్ధితిని ఈ దేహము పొందుతూండగా..ఈ దేహము కాస్త ఈ అలివి కాని ఆనంద స్ధితిని తట్టుకోలేని స్ధితికి చేరుతూండగా నా అరికాలి పాదాలు దర్శనమిచ్చాయి.అందులో నా కుడిపాదము నందు పాదరస శివలింగమున్నట్లుగా అలాగే నా ఎడమ పాదము నందు అష్టదళ పద్మమున్నట్లుగా దర్శనమిస్తూండగా..ఉన్నట్టుండి నా పాదములో ఉన్న పాదరస శివలింగము కాస్త కదిలి మూలాధార చక్రము దగ్గరికి ప్రయాణించి..ఆపై స్వాధిష్టా చక్రమును దాటి..ఆపై మణిచక్రమునకు ఈ శివలింగమును చేరుకోగానే ఉన్నట్టుండి ఈ చక్రము వద్ద ఒక్కసారిగా ఓంకారనాదము పెద్దపెట్టున్న వినిపించడము ఆరంభమైంది.ఇది ఇలాయుండగా ఈ శివలింగము కాస్త మిగిలిన అన్ని యోగచక్రాలను దాటి బ్రహ్మరంధ్రమునకు చేరుకొని బయటికి రాగానే..అరుణాగిరి ముందు ఒక పురుషుడి పెద్ద కుడి అరచెయ్యి మీదకి చేరినట్లుగా నా పాదరసలింగము కనిపించింది.ఈ లింగము కాస్త భ్రమణాలు చెయ్యడము మొదలైంది.ఇంతలో ఈ చెయ్యి కాస్త ఈ శివలింగమును కాస్త అరుణాగిరి అగ్రభాగమునకు చేర్చగానే..ఇది కాస్త గిరి లోపలికి ప్రవేశించగానే..ఈ పాదరసలింగము నుండి ముఖలింగ భాగము విడిపోయి క్రింద ఉన్న అగ్నితీర్ధమునకు చేరుకోగానే...ఈ లింగభాగము కాస్త ఈ తీర్ధములో ఉన్న అగ్నిశిఖా యందు లయం చెందగానే.. నా ఆత్మలింగమైన పాదరస శివలింగము  అనేది విస్ఫోటనము చెందడముతో నా ఆత్మశరీరముగూడ అణువులుగా విస్ఫోటనము చెంది ఇందులో ఉన్న మూల ఆదిరేణువు కాస్త అగ్నిశిఖ అగు అరుణజ్యోతిగా మారి అనాది శూన్యమునందు లయము చెంది శూన్యమవ్వడముతో  అంతిమ అనుభవానుభూతి  జీవన్ముక్తి మోక్షమును ఈ దేహము పొందినదని తెలియడముతో ....




ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ..స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు అంటూ....తట్టుకోలేని గుండె నొప్పి రావడముతో అక్కడక్కడే పరమహంస పరమపదించారు.అపుడు ఈయన కపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటికి వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణాగిరి యందు  ఆత్మజ్యోతిగా శివైక్యము చెందిన కొన్ని క్షణాలకి ఈ గిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికి కొన్ని క్షణాలు కనిపించి విశ్వ శూన్యము నందు శూన్యమై అదృశ్యమైంది.అనగా నీటి మీద ఇన్నాళుగా నీటిబుడగ గా ఉన్నది కాస్త ఇది పగిలి నీటిలో లయం అయింది.దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యము చెందడము జరిగింది.

పరమహంస తల ప్రక్కకి వాలిపోయింది.

                      


చివరికి అపుడిదాకా ఆకార..సాకార స్వరూపముగా కనపడిన శ్రీ రుద్ర మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపము కాస్త లేచి నిలబడి విలయతాండవము చెయ్యడము ఆరభింస్తుండగా తన ఎడమ కాలికి ఉన్న కంకణము కాస్త ఒక అడుగు పాములాగా మారి ఈయన తాండవము ఆపాలని విశ్వప్రయత్నముగా చేస్తుండగా అపుడికే ఈయనకి ఉన్న అన్ని రకల మాయ బంధనాలనుండి అలాగే అపస్మారక స్ధితి నుండి విముక్తిపొంది నేను లేను అనే స్ధితిని స్వానుభవ అనుభూతి పొందడముతో ఇన్నాళ్లు తనని మాయబంధనములో ఉంచిన ఈ పామును తన చేతితో పట్టుకొని గాలిలోనికి బలముగా విసిరి తను కాస్త ఏలాంటి ఆటంకము లేకుండా విలయతాండవము చేస్తూ తన చుట్టూ తాను విపరీతముగా తిరుగుతూండగా ....

                                                       

ఈయన ఆత్మలింగమైన నల్లని రుద్రలింగము చుట్టూ యోగాగ్ని జ్వాలలు వ్యాపించడముతో ఈ రెండు గూడ నామరూప ఆకారము కాస్త  నికారమై..శూన్యమై..అనాదిగా ఉన్న శూన్యము గూడ పూర్ణశూన్యమవ్వడముతో..విశ్వానికి మోక్షము ఆరంభమైనదని..అంతము ఆరంభమై పూర్తీయ్యి పూర్ణశూన్యమైంది. నిజానికి ఇదింతాగూడ 64వ డైమర్ష్ లో ఉన్న అరుణాచల క్షేత్రములో ప్రస్తుతానికి జరిగింది.ఇది 3వ డైమర్షలో ఉన్న మన భూమికి ఇంక 3,200 మహాయుగాలు పూర్తి అయిన తర్వాత  అంటే ఈ విశ్వములో ఒక భూమి అనే రేణువు ఏర్పడటానికి 1300 కోట్ల సం.రాలు తీసుకుందని చెప్పిన శాస్త్రవేత్తలు... అది వినాశనము అవ్వటానికి గూడ 1300 కోట్ల తీసుకుంటుంది.ఈ 1300 కోట్ల సం.రాలు అంటే 3,200 మహయుగాలతో సమానమవుతుంది.అంటే నాలుగు యుగాలకి 42 లక్షల సం.లు కాబట్టి 4 యుగాలు కలిపి ఒక మహయుగము గావడము వలన 1300 కోట్ల సం.లకి 42 x 3,200 = 1300 కోట్ల సం.రాలు అవుతుంది.ఇందులో ప్రస్తుతానికి 28 మహయుగాలు పూర్తి అయ్యి  అంటే ఇంక 3,172 మహయుగాలు పూర్తి అయిన తర్వాత  భూమ్మీద వినాశనప్రభావము చూపుతుంది.అపుడిదాకా ఈ భూమ్మీద ప్రపంచయుద్దాలు.జలప్రళాలయాలు మాత్రమే వచ్చి తాతాల్కిక విపత్తులు కలిగించి వెళ్ళిపోతాయి.అంటే ప్రపంచ విశానము జరగలంటే ఇంకా 1300 కోట్ల సం.రాలు పడుతుంది అన్నమాట.వేదవ్యాసుడు,పోతులూరి స్వామి, ఆస్ట్రోడామస్ .. వీరంతా 3వ డైమర్ష్ భూమి యొక్క 5000 వేల భవిష్యతును చూసి తమ గ్రంధాలలో రాస్తే ఈ దేహము కాస్త ఆఖరి 64వ డైమర్ష్ యొక్క ప్రస్తుత పరిస్ధితిగతులను చూడటము జరిగింది. అపుడిదాకా నేను చూసిన ఈ విశ్వ వినాశన దృశ్యాలు అన్నీగూడ మనకి 1300 కోట్ల సం.రాల భవిష్యత్ అవుతుందని తెలుసుకొండి. ఈ నిజ పూర్ణజ్ఞాని శకము ముగిసింది.అపుడు ఈ దేహము పొందిన అంతిమ ధ్యానానుభవము నిజమతుందని అనుటకు ఈ భూమీద ఉన్న అరుణాచల క్షేత్రమునందు  అలాగే ఈ దేహ ఉన్న ప్రాంతములో అకాల వర్షము 48ని పాటు ఏకధాటిగా తన ఆవేదనను ఆకాశగంగా రూపముగా  కురిసింది.

ఈ రోజు మహా శివరాత్రి.....ఉదయము 6.05ని ఇదింతా జరిగింది.అంటే 1-3-2022 తేదిన ఆత్మయోగి అయిన పరమహంస పరమపదించారు.అనగా కర్మయోగిగా పవన్ గా ....భక్తియోగి పవన్ బాబా గా..జ్ఞానయోగి గా పవనానంద సరస్వతిగా..ధ్యానయోగిగా పరమహంసగాను..అఖరిది ఆత్మయోగము నందు ఆత్మ సన్యాసి అరుణగిరి యోగిగా ఈయన దేహము పరమపదించినది.

శివార్పణ మస్తు.

గమనిక: ఈ రోజు అనగా 1-3-2022 ..మహా శివరాత్రి తిధి నాడు మన ఆత్మయోగి పరమహంస గారు అరుణచల క్షేత్రములో ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ.."స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు" అంటూ..తట్టుకోలేని గుండె నొప్పి రావడముతో అక్కడక్కడే పరమహంస పరమపదించారు.అపుడు ఈయన కపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటికి వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణాగిరి యందు  ఆత్మజ్యోతిగా శివైక్యము చెందిన కొన్ని క్షణాలకి ఈ గిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికి కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది.దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యము చెందడము జరిగింది.ఇంతటితో ఒక నిజపూర్ణ జ్ఞాని శకము ముగిసింది.
 
జిజ్ఞాసి అంతిమ అనుభవము:

ఈ అనుభవము అంతాగూడ నేను జిజ్ఞాసి వ్రాస్తున్నాను.మా యోగమిత్రుడు పరమహంస పవనానంద పరమపదించిన ఎనిమిది నెలలకి అనుకుంటా. నాకు ఈయన బాగా గుర్తుకి రావడము జరుగుతోంది.దానితో నేను అరుణాచల క్షేత్రానికి వెళ్ళాను.అక్కడ ఉన్న మూడురోజుల తర్వాత అర్ధరాత్రి నాకు ధ్యానమునందు పరమహంస కనిపించి..మిత్రమా..ఎలా ఉన్నావు? అడిగారు.దానితో ధ్యానము నందు నా సూక్ష్మశరీరము ఆయన ముందుకు వెళ్ళి మీరు ఏమిటి..ఇక శరీరముతోనే ఉన్నారా?ఇలా ధ్యానము నందు దర్శనమిస్తున్నారు అడిగాను.దానికి ఆయన అవును.మిత్రమా.నా సాధన అంతిమస్ధితికి చేరుకొనే సమయము ఆసన్నమైంది.అది ఏమిటో..ఎలా జరుగుతుందో నీ ద్వారా లోకానికి చెప్పటానికి వచ్చాను.అవును మనకి మోక్షం ఎన్ని విధాలో నీకు గుర్తుందా?అనగానే..స్వామి..మోక్షం ఏడు విధాలు.ఇవి సప్త శరీరాలకి సప్త మోక్ష విధానాలున్నాయని మీరు చెప్పారు గదా.అనగా స్ధూల శరీరానికి శరీర మోక్షం..సూక్ష్మ శరీరానికి కపాల మోక్షం..కారణ శరీరానికి మణిమోక్షం..వాయు శరీరానికి పురుష శివలింగ మోక్షం ..ఆకాశ శరీరానికి స్త్రీ శివలింగ మోక్షం.. సంకల్ప శరీరానికి ఆత్మలింగ మోక్షం.. ఆత్మశరీరానికి పరమలింగ మోక్షం..అని మీరు 63 డైమర్ష్ లో కాళిమాత కి చెప్పారు గదా.అనగానే మిత్రమా..అంతా సరిగ్గానే చెప్పావు.కాని ఈ మోక్ష విధినాలలో నాకు అరుణాచల క్షేత్రము నందు నాకున్న పూర్ణజ్ఞానమును అందుకొని అది లోకానికి అందించాలనే నా సంకల్పము నేరవేరడముతో ఈ క్షేత్రము నందు ఈ సంకల్ప శరీరము కాస్త ఆత్మలింగముగా మారి అగ్నితీర్ధము నందు చేరి విస్ఫోటనము చెంది ఈ శరీరానికి ఆత్మలింగ మోక్షం వచ్చింది.కాని నా ఆత్మ శరీరము ఇంక మిగిలే ఉంది.దానినే నువ్వు చూస్తున్నావు.ఈ ఆత్మశరీరానికి ఆఖరి మోక్షమైన పరమలింగ మోక్షం పొందవలసి ఉంటుంది.దానికోసము ఈ ఆత్మశరీరముతో ఏడు నెలలు పాటు నిర్వికల్ప సమాధి పొందాను.ఒక అంతిమ దివ్య ధ్యానానుభవము పొందడముతో ఈ ఆఖరిదైన పరమలింగ మోక్షం ఎలా జరుతుందో ఆదిరుద్రుడికి జరిగిన విధివిధానము నాకు ధ్యానానుభవమైంది.ఇది నీ ద్వారా లోకానికి చెప్పడానికి ఇలా ఆత్మ దర్శనమిచ్చాను.నిజానికి మనకి వేదాలు 64 డైమర్ష్ లు ఉన్నాయని చెప్పితే పురాణాలు కాస్త 65 డైమర్ష్ కూడ ఉన్నదని చెప్పడము జరిగింది.దానిని గురించి మనము పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి 64 డైమర్ష్ శూన్యము కాదు.అది కేవలము గాఢ అంధకార చీకటి మాత్రమే.దీనికి అధిపతిగా బాలాదేవి ఉంటుంది.బాలా వేరు.బాలాదేవి వేరు.బాలా అంటే మూడు సం.రాల పాప అయితే బాలాదేవి 65సం.రాల పూర్ణజ్ఞాన స్త్రీ మూర్తి.కాకపోతే ఈమెకి పసిపాప మన:సత్వముండటముతో పెద్ద దానిలాగా ఉండే చిన్నపాప అన్నమాట.ఈమె చీకటిగుహలో ఎపుడు 64 ఇంకుగుంట ఆట ఆడుతూనే ఊంటుంది.అనగా 64 మట్టికుప్పలు చేస్తున్నపుడు మన విశ్వ ప్రపంచములో 64 లోకాలు ఏర్పడతాయు.అనగా విశ్వసృష్టి జరుగుతుంది.అలాగే ఈ మట్టికుప్పలతో ఆడుకుంటూనపుడు ఈ విశ్వములో స్ధితి జరుగుతోంది.ఎపుడైతే ఈమెకి ఈ ఆట యందు విసుగు వస్తే ఈ మట్టికుప్పలను ఆ పక్కనే ఉన్న అగ్నితీర్ధ జలముతో కడగడముతో ఈ విశ్వములో లయ ప్రక్రియ జరుగుతోంది.ఈ వినాశనము చూస్తూ ఈమె ఆనందము పొందితే అదియే మనకి లాస్యమవుతోంది.ఆ తర్వాత ఎలాంటి ఆట లేకపోవడముతో ఉన్న ఏకాంతస్ధితిని భరించలేక మళ్లీ 64 మట్టికుప్పలు చెయ్యడము..తిరిగి ఈ విశ్వములో పున:సృష్టి మళ్ళీ ఆరంభమవుతోంది.కాని విచిత్రము ఏమిటంటే తను చేసే ఈ మూడు ప్రక్రియలు వలన విశ్వములో జరుతున్నాయనే జ్ఞానము కాని ఆలోచన కాని ఈమెకి లెదు.ఎందుకంటే ఈమెది పసిపాప మనస్సు గదా.అలాగే తనకి విశ్వ ప్రపంచము మరొకటి ఉన్నదని అది వెలుతురు ప్రపంచమనే జ్ఞానమే లేదు. ధ్యాస లేదు.కేవలము తన చీకటి గుహయే చీకటి విశ్వ ప్రపంచము అన్నమాట.అలాగే 63 డైమర్ష్ అంతావరకు వెలుగు ప్రపంచమే అన్నమాట.దీనికి అధిపతి శ్రీ రుద్ర దక్షిణామూర్తి ఉంటాడు.కాకపోతే ఈయనికి ఉన్న అపస్మారక స్ధితిని పొంది ఉండముతో అనగా తను పొందిన అంతిమ జ్ఞానము మర్చిపోతూండముతో ఈయన కాస్త బాలాన్మోత్త పిశాచ అవధూత స్ధితిలో ఉంటారు.అంటే ఆదిదంపతులలో అయ్యవారు అవధూత అయితే అమ్మవారు పసిపాప అన్నమాట.నిజానికి వీరిద్దరికి ఈ 64వేల800 విశ్వప్రపంచాలతో ఎలాంటి సంబంధము లేదు.అమ్మవారు చేసే ప్రక్రియలు అయ్యవారు జ్ఞాననేత్రముతో చూసి ఈ లోకానికి మౌనభాషతో చెపుతారు అన్నమాట. ఈ రెండు డైమర్ష్ లు మనకి అరుణాగిరి యందు పంచముఖ దర్శన ప్రాంతము నుండి మనము చూడవచ్చును.ఇక్కడ ఉన్న మోక్షద్వారము అనే చోటు నుండి ఈ అరుణాగిరిని చూస్తే మనకి అరుణాగిరినాదర్ ఆకారముతో ఒక కొండశిల కుడివైపు క్రాసుగా కనపడే ప్రాంతములో 64 డైమర్షకి వెళ్లే స్టార్ గేట్ ఉంటుంది.దీని లోపలికి వెళ్ళితే అమ్మవారి చీకటిగుహ కనపడుతుంది.ఇది సరిగ్గా మనకి అరుణాగిరి మీద ఉన్న గణపతి కన్ను ఆకారములో కనపడుతుంది ఊన్నచోట లోపలవైపు ఈ చీకటిగుహ ఉంటుంది అన్నమాట.అలాగే రమణామహర్షి వంతెన నుండి చూస్తే మనకి ఆదిదక్షిణామూర్తి ఉన్న పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది.ఇది 63 డైమర్ష్ కి సంకేతము అన్నమాట.ఈయనకి ఎడమవైపునే 64 డైమర్ష స్టార్ గేట్ ఉంటుంది.స్టార్ గెట్లు మనకి త్రినేత్రముతోనే కనపడితే గణపతికన్ను,అరుణాగిరినాదర్ శిల,మర్రిచెట్టు,ఆదిరుద్ర శిల,హనుమ ముఖ శిల,నంది శిల మనకి భౌతిక నేత్రాలతో ఈ గిరి యందు అదిగూడ పంచముఖ దర్శనవైపు కనపడతాయి.ఇక అసలు విషయానికి వస్తే...అయ్యవారు తను పొందిన పూర్ణజ్ఞానము లోకానికి చెప్పడానికి సంకల్పశరీరముతో ఉంటే అమ్మవారు కాస్త పసిపాప మనస్సు ఉండముతో తనకి ఏమికావాలోగూడ తెలియనితనముతో సంకల్పశరీరముతో ఉండిపోతోంది.దానితో వీరిద్దరికిగూడ ఇంక పూర్ణమోక్షము అనేది తమ ఆత్మశరీరాలు పొందలేదని తద్వార ఈ శరీరాలు అయ్యవారు వెలుగు ప్రపంచములో ఉంటే అమ్మవారు చీకటి ప్రపంచములో ఉన్నారని పైగా అయ్యవారికి అమ్మవారి ధ్యాస ఉంటే అమ్మవారికి అయ్యవారు ఉన్నారనే జ్ఞానమే లేదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.  అలాగే అయ్యవారు ప్రతి పౌర్ణమికి అమ్మవారుండే చీకటి గుహకి వెళ్ళి అమ్మవారు తనని గుర్తుపడుతుందోమోనని ఈయన అమావాస్య దాకా విశ్వప్రయత్ననాలు చేసి విఫలమై విసుగు ఆవేశముతో ఉగ్రరూపుడై ఈ చీకటిగుహకి అవతకి గోడకి ఉన్న అరచెయ్యింత పరిమాణము ఉన్న నల్లశిలను చూసి తన దగ్గర ఉన్న గొడ్డలి ఆయుధముతో ఈ శిలను కొట్టే ప్రయత్నము ఆరంభించేసరికి ఈ పనికి చెయ్యకుండా అమ్మవారు కాస్త ఇది నాది..ఇది నాది దీనిని పగలకొడితే నా చేతిలో ఛస్తావు అంటూ తన చేతిలో గులాబిరంగు కలువపువ్వతో కొట్టేసరికి ఈయన కాస్త కళ్ళు తెరిచేసరికి గుహ బయట తనకి తెలియాకుండానే చేతుతూనే ఉన్నారు.ఇదింతా  నా సమాధిలో చూస్తున్నాను.నాకు అర్ధము కాని విషయము ఏమిటంటే ఈ గుహ గోడకి ఉన్న అరచెయ్యి శిల ఏమిటి?అది అక్కడ ఎందుకు ఉంది?దానిని అయ్యవారెందుకు పగలకొట్టలాని లెందుకు అనుకుంటున్నారు.అమ్మవారెందుకు ఆపుతోంది..ఈ విషయాలు నాకు ఓ పట్టన  అర్ధము కాలేదు.కొన్నిరోజులు తర్వాత ధ్యాన సమాధి యందు నాకు సందేహము వచ్చింది.అది ఏమిటంటే శూన్యము నుండి ఏ వస్తువు గూడ ఉద్భవించదని అలాగే నాశనము చెయ్యలేదని..కేవలము ఇదింతా జరడానికి ఏదో బలమైనశక్తి కారకమని ప్రముఖ శాస్త్రవేత్త అయిన స్టీఫీన్ హకింగ్ చెప్పిన విషయము నాకు గుర్తుకు వచ్చింది.అంటే ఈ లెక్కన చూస్తే శూన్యములో ఏది లేనపుడు  ఆది లో ఏర్పడిన ఆది ఏకజ్వాలతో ఉన్న జ్యోతిబిందువు ఎక్కడ నుండి ఏర్పడినది.పైగా ఇది స్వయంభూబిందువు అన్నారు.అంటే ఇది శూన్యము నుండి ఏర్పడనపుడు ఈ బిందువు ఎక్కడ నుండీ ఏలా ఏర్పడినది అనుకున్నపుడు నాకు ఆదిరుద్ర దక్షిణామూర్తి నుండి జ్ఞానము అందడము ఆరంభమైంది.అది ఏమిటంటే నిజానికి చీకటి వేరు అలాగే శూన్యము వేరు.చూడటానికి ఈ రెండు గూడ గాఢాందకారముగా ఉంటాయి.కాని ఈ రెండింటికి ఇసుమంత తేడా ఉంది.అనగా చీకటిలో 80% చీకటి ఉండి 20% వెలుగు ఉంటే అదే శూన్యములో 100% చీకటి ఉంటుంది.అంటే కోడిగుడ్డులో తెల్లసొనకి ఉన్న ఉల్లిపొర లాంటి తెల్లటిపొర లాగా ఒక నల్లపొర ఇటు చీకటికి అలాగే శూన్యానికి మధ్య ఉన్నదని అదియే తను గుహలో చూసిన నల్లశిలయని..ఇది చిట్టచివరి స్టార్ గేటు అని..దీనిని పగలగొడితే అవతల ఉన్న శూన్యములోనికి ప్రవేశిస్తే కాని ఆఖరికి మిగిలి పోయి ఉన్న ఆత్మశరీరానికి పరమమోక్షము రాదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.దానితో నాకు ధ్యానసమాధి నుండి మెలుకువ వచ్చింది.విషయము అర్ధమైంది.ఈ మహశివరాత్రికి ఆదిరుద్రుడు ఆఖరి ప్రయత్నముగా తన ఆత్మశరీరానికి పరమమోక్షము ఎలాగైనా పొందాలని విశ్వప్రయత్ననాలు చెయ్యడము ఆరంభించారు.దానితో నేను నా ఆత్మశరీరముతో ఏమి జరుగుతుందో చూసే ప్రయత్నము ఆరంభించాను.అపుడు ఆదిరుద్రుడు కాస్త యధావిధిగా అమ్మవారు ఉన్న చీకటి గుహకి పౌర్ణమికి వెళ్ళడము ఆయతోపాటుగా 63 మంది శివస్వరూపాలు గూడ వెళ్లడముతో నాతోపాటుగా కోటిమంది పైగా జ్ఞానసిద్ధగురువులు గూడ రావడముతో లోపలకి వెళ్ళడము జరిగింది.కాకపోతే మా శరీరాలు అన్నిగూడ మూడు అంగుళాల పరిమాణములో ఉన్నాయి.లోపలికి వెళ్లగానే గుహలో అమ్మవారు సప్తవర్ణాలున్న 64 రంగుల రాళ్ళతో ఆడుకోవడము నేను గమనించాను.ఈ రంగులు వరుసగా కాషాయము, ఎరుపు,పసుపు,తెలుపు,నల్లపు,నీలము,ఆకుపచ్చ రంగులుగా గుర్తించడము జరిగింది.  సప్త మోక్షాలు పొందినపుడు ఆయా శరీరాలకి ఆయా రంగులు ఉంటాయి.అలాగే ఆఖరి ఆత్మశరీరానికి ఆఖరి రంగు కాషాయరంగు అదే అరుణాగిరి యందు ఎర్రని అరుణాజ్యోతిగా మారుతోందని అలాగే ఈ సప్త వర్ణాలుగూడ గిరి మీద కనిపించే సప్త లింగాలు అనగా పంచలోహ లింగ దర్శనము ఆకుపచ్చకి సంకేతమైతే స్ఫటికలింగము నీలానికి,నల్లలింగము నలుపుకి తెల్లలింగము తెలుపుకి పాదరసలింగము పసుపుకి అర్ధనారీశ్వర లింగము ఎరుపుకి అరుణాజ్యోతి అనేది కాషాయ రంగులకి సంకేతమని నేను గ్రహించాను.ఎవరైతే పూర్ణమోక్షము అదే ఆత్మశరీరానికి కలిగే అంతిమ పరమలింగమోక్షమును పొందుతారో వారి ఆత్మశరీరము గూడ ఇలాంటి సప్తవర్ణాలతో రేణువులుగా విడిపోయి శూన్యము నందు శూన్యమవుతుందని..ఈ విధానము చెయ్యడానికి ఆదిరుద్రుడు చేస్తున్నారని ..ఇపుడివరకు ఈయన సంకల్పశరీరానికి మాత్రమే మోక్షము పొందినారని తెలుసుకున్నాను.అంటే ఇన్ని కోట్లానుకోట్ల యుగాలు తన అరు శరీరాలకి మాత్రమే మోక్షమిస్తూ ఆఖరిదైనా ఆత్మశరీరానికి మోక్షము పొందకపోవడముతో మనమంతా ఇంకా సజీవమూర్తులుగా ఉన్నామని నాకు అర్ధమై ఈ సారి ఏమి జరుగుతుందో మౌనముగా చూడటము ఆరంభించాను.ఈ చీకటిగుహలో సన్నని వెలుతురు కారకమైన నీటిదీపము ఒకటి ఈగుహ  మధ్యలో ఉండటము దీనికి అమ్మవారు నీటితో దీపారాధన చేస్తూ మా అందరిని తనఓర కంటగా గమనిస్తూ ఏమి గమనించనట్లుగా నటిస్తూ తన ఆటలో తను ఉన్నదని నేను గమనించాను.

ఇంతలో యధావిధిగా అయ్యవారు కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్ళి తనని గుర్తుపట్టించే ప్రయత్నము చేశారు.ఆమె అయ్యని గుర్తుపట్టలేదు.అమ్మ కాస్త అల్జీమర్ పేషంట్ లాగా ప్రవర్తించడము నేను గమనించాను.దానితో ఆదిరుద్రుడు కాస్త ఉగ్రరూపుడై తన చేతిలో ఉన్న గొడ్డలితో గోడకి ఉన్న నల్లశిలను పగలకొడటము ఆరంభించేసరికి అమ్మవారు కాస్త ఉగ్రరూపులై ఈయనిని ఈ పనిని చెయ్యకుండా ఆపేసరికి ఈమెను అడ్డుకోవడానికి మిగిలిన అయ్యవారి 63 శివ స్వరూపాలు ఒక్కొక్కటి అమ్మవారి తామరపువ్వు దెబ్బకి సృహ కోల్పోవడము జరగడం ఆరంభమైంది.అయినగూడ ఆదిరుద్రుడు తన పనిని ఆపకుండా ఆ నల్లటిశిలను పగలకొడుతూనే ఉన్నాడు.ఇలా ఆఖరి 63 శివుడి స్వరూపము గూడ సృహ కోల్పోపోయేసరికి అమ్మవారికి చైత్యనము వచ్చి ఆదిరుద్రుడి చూసి ఆయనని గుర్తుపట్టి  స్వామి..స్వామి అంటూ ఆదిరుద్రుడు దగ్గరికి రాగానే అపుడు ఆదిరుద్రుడు  తను చేస్తున్న పని ఆపి దేవి.దేవి.. అంటూ దగ్గరికి తీసుకోగానే ఈ రెండు సంకల్పశరీరాలు కాస్త ఏకమై అర్ధనారీశ్వర ఆత్మశరీరముగా రూపాంతరము చెందడము జరిగింది.అనగా కుడివైపు పురుషరూపము అలాగే ఎడమవైపు స్త్రీరూపముతో ఆత్మశరీరము రూపాంతరము చెందగా అయ్యవారివైపు బాలాగణపతి అలాగే అమ్మవారివైపు బాలకుమారస్వామి రూపాలుండి వీరి ముందు ఒకవైపు తెలుపు మరొకవైపు ఎరుపు రంగుతో ఉన్న అర్ధనారీశ్వర శివలింగముండగా దీనికి ఒకవైపు నందీశ్వరుడు మరొకవైపు సింహము ఉండటము జరిగింది. రెండు కాస్త ఒకటి అయింది.ద్వైతము కాస్త అద్వైతమైంది అన్నమాట.అపుడు అమ్మవారి చేతిలో తామరుపువ్వు అలాగే అయ్యవారి చేతిలో గొడ్డలి ఏకకాలములో నల్లనిశిల పెట్టి కొట్టగానే సుమారుగా 1300 యుగాలుగా పగలని ఈ శిల కాస్త పగలడము ఆరంభమైంది.అపుడు మూడు అంగుళాల పరిమాణమున్న ద్వార రంధ్రము ఏర్పడింది.లోపలికి తొంగి చూస్తే గాఢాందకార పూర్ణచీకటి దర్శమైంది.ఏటూ చూసిన చీకటియే..మరొకటి లేదు.కాని మనకి తెలియనిది ఎదో ఉన్నదని నాకు అనిపించింది.కాని అది ఎమిటో నాకర్ధము కాలేదు.అంటే ఇన్నాళ్ళు అందరుగూడ ఈ శూన్యము నుంచే ఆదిజ్యోతి ఏర్పడినదని అనుకున్నారు కాని నిజానికి ఇది చీకటిగుహలో అమ్మవారు వెలిగించుకున్న అగ్నితీర్ధ జల దీపమని అది ఇపుడు పూర్తిగా ఆరిపోవడముతో అమ్మవారికి ఉన్న పసిపాప జ్ఞానమాయ పోయినదని నేను గ్రహించాను.

అపుడు అంగుళా పరిమాణముతో అర్ధనారీశ్వర ఆత్మశరీరము కాస్త ఈ రంధ్రమునందు ప్రవేశించే గానే ఈ శూన్యమధ్యభాగములో ఈ ఆత్మశరీరానికి రేణువు అంతా పరిమాణములో సప్తవర్ణాలు వెదజలుతున్న రేడియోధార్మిక శిల దగ్గరికి ఈ శరీరము వెళ్లడము మేమంతా గమనించాము.అంటే ఈ గుహ రంధ్రమే మన కపాల బ్రహ్మరంధ్రమని..ఈ రేడియోషన్ శిలయే..మన బ్రహ్మరంధ్రములో అంతిమముగా కనిపించే పిసరంత బ్రహ్మజ్యోతియని నాకర్ధమైంది.అపుడు కొన్ని క్షణాలు తర్వాత కారునలుపుతో ఉన్న ఈ అర్ధనారీశ్వర ఆత్మశరీరము కాస్త ఈ శిల మీదకి చేరి పద్మాసనములో కూర్చుని ధ్యానసమాధిలోనికి వెళ్ళగానే ఈ శిల  అమితమైన ఉగ్ర తీవ్రమైన స్ధాయిలో విపరీతమైన రేడియోషన్ రావడముతో అంగుళా పరిమాణములో ఈ ఆత్మశరీరము కాస్త దగ్ధమవ్వడము ఆరంభమైన కొన్ని క్షణాలకి ఈ శరీరము కాస్త నల్లటి అస్ధిపంజరముగా మారిన కొన్ని క్షణాలకి ఈ అస్ధిపంజరముగూడ రేడియోషన్ దెబ్బకి దగ్ధమై సప్తవర్ణ రేణువులుగా విడిపోయి ఆఖరికి నల్లరేణువు మారి ఇది గూడ విస్పోటనము చెందుతూండగా మా అందరికి మహా ఓంకార నాదము వినిపించిన కొన్ని క్షణాలకి ఈ నల్లరేణువు కాస్త నల్ల శిలలో గూడ కలిసిపోయి ఈ శిల కాస్త విస్పోటనము చెంది శూన్యమైంది.దానితో ఆఖరిది ఆది ఆత్మశరీరానికి ఇపుడు పరమలింగ లింగమోక్షము గూడ పొందినదని మాకర్ధమై ఈ శిల గుహ ద్వారానికి ఆత్మనమస్కారము చేసి ఈ స్ధితిని పొందటానికి మాకు ఎపుడు అవకాశము వస్తుందో అనుకుంటూ ఈ చీకటిగుహ నుండి బయటికి అందరు వచ్చినాము.

ఈ దృశ్యము చూసిన తర్వాత ఇలా ఎవరి శూన్యబిందువు మీద వాళ్ళు ఆత్మశరీరముతో ఎక్కి ధ్యానసమాధిలోనికి వెళ్ళినపుడు ఈ బిందువుకి రేడియోషన్ వాళ్ళ శరీరమును నాశనము చేస్తుందని ఎవరి శరీరాలు వారివి గదా..అలాగే ఎవరి మరణాలు వారివి గదా.అలా అంతిమ మోక్షమును గూడ ఎవరికి వారే పొందవలసి ఉంటుంది.ఇందుకు గాను ఎవరైతే బాలాదేవిదక్షిణామూర్తి ఆరాధన చేస్తారో వారికి రెండు అంగుళాల పొడవు ఉండి అంగుళము వెడల్పు ఉండి ఓవెల్ ఆకారములో దానికి 25 ఓల్ట్ శక్తి ఉన్న ఒక నల్లరాయి ఎవరికైతే అందుతుందో వారు ఈ అంతిమ మోక్షమును పొందుటకు యోగ్యత ఉన్నవారు అవుతారని నాకు తెలిసింది.ఈ రాయి వలన వారి ఆత్మశరీరము కాస్త ఈ శూన్యములో ఉన్న తమ శూన్యబిందువు దగ్గరికి  చేరుతుంది అన్నమాట.అలాగే నిమిషానికి ఒకరు చొప్పున రోజుకి 1440 శరీరాలు ఈ మోక్షము పొందుతాయని తెలుసుకున్నాను.ఇలా ఈ విశ్వానికి అంతిమ మోక్షము పొందడానికి 1400 కోట్ల సం.రాలు పడుతుంది.ఈ నల్లరాయి రావడము అనేది మన అంతిమ మోక్షానికి టిక్కెట్ బుకింగ్ చేసుకోవడము లాంటిది.ఇది ఎవరికైతే వచ్చినదో వారి శరీరాలు నెమ్మదిగా నెమ్మదిగా అనుకోని అనారోగ్యసమస్యలతో పతనమవుతూ వస్తాయి.ఎందుకంటే శూన్యబిందువు అనేది రేడియోషన్ శక్తిది గావడము వలన ఈ నల్లరాయికి ఉన్న శక్తి వలన ఇది ఈ రేడియోషన్ తీసుకోవడము ఆరంభిస్తుంది.ఎవరి దగ్గర ఈ నల్లరాయి చేరినదో వారి ఆత్మశరీరమునకు అంతిమయాత్ర ఆరంభమైనదని గమనించాలి.ఈ యాత్ర ఎపుడైన ఏ క్షణమైన ముగించవచ్చు. అంటే మన శరీరానికి ఏ క్షణమైన శాశ్వత మరణమైన అంతిమ మోక్షము అందుకోవడము జరుగుతుంది.ఇది ఎవరి రాతలో చేతిలో ఉండదు.ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియని మరణస్ధితి.అంటే దీనికి కాల పరిమితి లేదు.కాల నియమము లేదు.ఈ నల్లరాయి ఎవరి దగ్గరికి చేరుతుందో వారు భౌతిక మరణాలకి అతీతమై మోక్షమరణానికి ఏ క్షణమైన చేరుకుంటారు.



అంతెందుకు విశ్వగురువైన దత్తస్వామిగూడ ధ్యానయోగిగా మేడిచెట్టు క్రింద ఉన్న ఒక నల్లశిల మీద కూర్చుని ఉంటారు గదా.అలాగే శిరిడిసాయిబాబాకి ఇలాంటి ఒక నల్లశిల వచ్చింది.అదే  బాబా నిత్యము కూర్చునే శిల అయ్యిండాలి.గాకపోతే వీరంతా లోకకళ్యాణార్ధము మనకి బ్రహ్మజ్ఞానము అందించుటకు సజీవమూర్తులుగా ఉన్నారు.లేదంటే వీరికి వచ్చిన ఈ నల్లశిలలుతో జీవన్ముక్తి పొందేవారు.అంతెందుకు బాబావారి జీవితము ఒక ఇటుకరాయితో ముడిపడి ఉండేదని అందరికి తెలిసిన విషయమే గదా.ఈ రాయి తనకి తన గురువైన వెంకుసా ఇచ్చారని..ఇది గురువుతో సమానమని చెప్పేవారు.ఎపుడైతే ఈ రాయి విరిగిపోయినదో అపుడు దీనిని చూస్తూ..ఒకటి రెండు అయింది.ఈ దేహనికి చాలించే సమయము ఆసన్నమైనదని చెప్పి కొన్నిరోజులకి తాత్య క్షయ వ్యాధిని ఈయన తీసుకుని ఈ ప్రపంచము విడిచినారని అందరికి తెలుసు గదా.బహుశ ఈ రాయి అందరు అనుకొనే ఇటుక రాయి గాదని ఈ విశ్వశూన్యబిందువుకి ఇది ప్రతీక రాయి అయ్యిండవచ్చును.కారణము లేనిదే ఏ చిన్న కార్యము కూడ చెయ్యరని ఇలాంటి జ్ఞానగురువులు చెప్పకనే చెప్పకుండా చేస్తుంటారు.ఆ కారణాలు మనకి అర్ధమయ్యేసరికి మనకి ఉన్న ఆయుష్ పుణ్యకాలము పూర్తీవుతుంది. ఇదిగో నాకు వచ్చిన ఈ నల్ల రాయి అంటూ నాకు ఒక రాయి చూపించడము జరిగింది.ఇది చూడటానికి నాకు మక్కామసీదు లోపల కనిపించే నల్లరాయి ఆకారములో ఉన్నట్లుగా నేను గమనించాను.అపుడు నాతో..... నీకు గూడ త్వరలో అరుణాచల శివ అనుగ్రహము వలన ఈ నల్లరాయి దొరుకుతుంది.ఎందుకంటే ఈ అరుణాగిరి అంతాగూడ 14 కి.మీ వరకు రేడియోషన్ ఉన్న కొండయే గదా.అందుకే దీనిని అగ్నికొండ అన్నారు.ఎవరైతే ఈ క్షేత్రమునకు అనుసంధానమై నిత్యము అరుణాచల నామస్మరణ చేస్తూ ఉంటారో ఈ నల్లరాయి మీద కూర్చుని ధ్యాననిమగ్నమై ఉన్న దక్షిణామూర్తి అనుగ్రహము పొందితే వారు ఈ విశ్వప్రపంచములో ఎక్కడ ఉన్న అంతిమ మోక్షమిచ్చే ఈ నల్లరాయి అందుతుందని అని చెప్పి ...నాకు ఈ శివరాత్రికి ఈ విధమైన పరమమోక్షము నా ఈ ఆత్మశరీరానికి అందుతుందని జ్ఞానస్పురణ అందడముతో నీకు ఈ విషయాలు చెప్పడానికి వచ్చాను.ఇక నాకు ఎలాంటి శరీరముండదు.గావున నేను ఈ రోజు నుండి ఎవరికి ధ్యానము నందు కాని కలలయందు ఈ దేహము కనిపించదు అంటూ ఈయన కాస్త అరుణాగిరి మీద ఉన్న ఖాళీ ఉన్న అమ్మవారి చీకటిగుహ వైపు వెళ్ళుతూండముతో నాకు ధ్యానభంగమైంది.

ఆ తర్వాత నేను మాములు స్ధితికి వచ్చి పరమహంస చెప్పిన అరుణాగిరి మీద ఉన్న గుర్తులు ఉన్నాయో లేదో చూడటానికి పంచముఖ దర్శనవైపు వెళ్లాను.







నాకు అక్కడ ఈయని చెప్పిన గణపతి కన్ను,క్రాసులో ఉన్న అరుణాగినాధర్ రూప శిల,ఆదియోగి శిల రూపము,మర్రి చెట్టు అన్నీ కనిపించాయి.గాకపోతే ఆయన చెప్పిన స్టార్ గేట్లు నా భౌతిక నేత్రాలకి కనిపించలేదు కాని అవి ఎక్కడ ఉండే అవకాశాలున్నాయో ఉహించాను.అలాగే పెద్ద గుడి యందు కిలిగోపురమునకు ఎడమవైపు గోడకి ఉన్న అరచెయ్యి పరిమాణములో గణపతి దేవాలయము ఉండటము గమనించాను.బహుశ అమ్మవారి చీకటిగుహ యొక్క శూన్య ద్వారబంధనము ఇలాగే  ఉంటుందని అనిపించింది.


                                                                                          బుజ్జిగణపతి

అలాగే ఈ అమ్మవారి గుడి పరిసరాలలో మూడు అంగుళాల బుజ్జిగణపతి విగ్రహమూర్తి కనిపించడముతో ఆత్మశరీర పరిమాణము గూడ మూడు అంగుళాలే గదా అనిపించింది.



ఆ తర్వాత కొన్ని రోజులకి వార్తపత్రికల యందు  ఆస్త్రేలియాలో అంగుళా పరిమాణమున్న రేడియోధార్మిక క్యాప్యూల్ కనిపించడము లేదని అది 1400 కి.మీ పరిధిలో ఎక్కడో పడిపోయినదని దానిని వెతికే ప్రయత్నములో ఉన్నామని చెప్పడము జరిగింది.మన రేడియోషన్ అరుణాగిరి యొక్క పరిధిగూడ 14 కి.మి.లే గదా.అంటే ఇది శూన్యములో ఉన్న రేడియోషన్ శిలమో నాకు అనిపించింది.



ఆ తర్వాత కొన్నిరోజులకి మంచుయుగకాలములో కనిపించిన ఒక తోకచుక్క ఇపుడు మనకి విశ్వములో తిరిగి కనిపిస్తోందని ఇది మూడు లేదా నాలుగు రోజులు అందరికి ఆకాశములో కనపడుతుందని వార్త వచ్చింది.బహుశ ఇది రేడియోషన్ శిల మీద ఆదిరుద్రుడి ఆత్మశరీర దగ్ధ దృశ్యము మనకి ఒక వెలిగి ఆరిపోయే తోకచుక్కగా కనబడుతోమోనని నాకు అనిపించడముతో నాకు ఈ ఆత్మశరీరానికి అతీ త్వరలో పూర్ణమోక్షమును ప్రసాదించామని అరుణాగిరిని వేడుకోవటానికి ధ్యానము నందు కూర్చుగానే నాకు ధ్యానము నందు యధావిధిగా అరుణాగిరి కనపడింది.అలాగే మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తి అలాగే చీకటి గుహ యందు బాలాదేవి అలాగే గణపతి,కుమారస్వామి,నందీశ్వరుడు మిగిలిన పర్వత శిఖరాలమీద సజీవమూర్తులుగా కనిపించగానే నా ధ్యానభంగమైంది.అంటే వీరంతాగూడ తను ఉన్న 3వ డైమర్ష్ యొక్క అరుణాగిరి పరివారమైతే పరమహంస చూసిన పరివారమంతా గూడ 64 డైమర్ష్ వారని నాకు జ్ఞానస్ఫురణ కల్గింది.అంటే 64 డైమర్ష్ మూలమూర్తులు మోక్షము పొందిన విషయము మిగిలిన 63 డైమర్ష్ ఉత్సవమూర్తులకి ఇంక జ్ఞానము అందలేదని దీనికి 1400 కోట్ల సం.రాలు పడుతుందని నాకు అర్ధమయ్యిసరికి ఇంక చేసేది ఏమిలేక అక్కడనుండి మౌనముగా నా అంతిమయాత్ర పిలుపు కోసము ఆకాశము కేసి ఎదురుచూస్తున్నాను.కొన్నిరోజులకి నాకు ఈ అరుణాగిపాద భాగము నందు పరమహంస చెప్పిన ఆకారములో ఉన్న ఒక నల్లరాయి దొరికింది.దానిని అందుకోగానే గోరువెచ్చగా ఉన్నట్లుగా అనిపించింది.అపుడికపుడు ఒక నల్ల త్రాడు కొని దీనిని మెడలో వేసుకున్నాను.అంటే నాకు గూడ అంతిమయాత్రకి పిలుపు వచ్చినదని అర్ధమయింది.ఈ యాత్ర ముగింపు కాలము కోసము ఎదురుచూస్తున్నాను.

కొన్నిరోజులు తర్వాత నాకు ఒక ధర్మసందేహము వచ్చింది.అది ఏమిటంటే పరమహంస పొందిన మరణము అంతిమ మరణమా లేదా పరమశివుడు పొందిన మరణము అంతిమ మరణమా?ఎందుకంటే పరమహంస యొక్క ఆత్మశరీరము కాస్త ఆత్మలింగముగా మారి అగ్నితీర్ధములో చేరి విస్ఫోటనము చెందిన దృశ్యము చూడటము జరిగింది.అలాగే పరమశివుడు శూన్యమునందు ఉన్న నల్లశిల రేడియోషన్ కి ఈయన ఆత్మశరీరము దగ్ధమవ్వడము చూడటము జరిగింది.ఎందుకంటే వీరిద్దరుగూడ అంతిమ మరణము పొందితే రెండు రకాల విధివిధానాలతో ఎందుకు మరణము పొందినారో...ఇందులో ఎవరిది అంతిమ మరణమైన మోక్షము పొందారో నాకు ఒక పట్టనా అర్ధముకాలేదు.ఇలా కాదనుకొని ధ్యానము నందు కూర్చుకోగానే ఆశరీరవాణితో నీ సందేహమునకు సమాధానము నా అంతిమయాత్ర నీకు చెపుతుంది.వస్తున్న మహశివరాత్రికి అరుణచలము చేరుకో అని ఆజ్ఞ వినబడటముతో నేను కాస్త అరుణచలమునకు చేరుకోవడము జరిగింది. అపుడు మహశివరాత్రి లింగోద్భవకాలము అనగా అర్ధరాత్రి 12 గంటల నుండి 12:48 నిమిషాలు పాటు అనగా ఈ 48 నిమిషాలుపాటు ఎవరైతే ఏకాంతముగా..మౌనముగా..శివధ్యానము చేసుకుంటారో వారికి ఆ ఆదియోగిశ్వరుడైన పరమశివుడి అనుగ్రహము లభిస్తుంది అలాగే శివరాత్రి యొక్క మహోన్నతఫలితము పొందదము జరుగుతుంది.అంతే కాని ఈ సమయములో శివలింగ అభిషేకాలు,పూజలు,దర్శనాలతో ఈ సమయమును వెస్ట్ చేసుకోవద్దు.ఈ సమయములో ఎవరైతే మౌనముగా శివధ్యానము చేసుకుంటారో వారికి మాత్రమే పరమశివుడితో 48ని.పాటు అనుసంధానమవుతారని తెలుసుకొండి. .ఎందుకంటే ఈ సమయములో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖలోనికి రావడము అలాగే విశ్వశూన్యములో ఉండే శూన్యబిందువు యొక్క రేడియోషన్ అత్యంతస్ధాయిలో వెదజల్లి సమయము గావడముతో ఈ సమయములో చేసే ధ్యానతపస్సు వలన సాధకుడి యోగచక్రాలు కాస్త యోగపద్మాలుగా మారి అత్యంత యాక్టివేషన్ చెందడము జరుగుంది.ఇదింతా మనపూర్వీక మహర్షలు  తమ దివ్యదృష్టితో చూసి పరమశివుడు ఐక్యం చెందిన ఈ రాత్రినే మహశివరాత్రిగా చేసి లోకానికి అందించడము జరిగింది.కాని ఇలాంటి శివరాత్రిని సదాశివుడిని కాస్త సరదాల శివుడిగా అనగా డాన్సులు, నృత్యాలు, పాటలు, సినిమాలు,..ఇలా విపరీతపోకడలతో శివరాత్రిని జరుపుకుంటున్నారు.

ఇలాంటి మహత్తర లింగోద్భవ సమయానికి నేను కాస్త పంచముఖశిఖరదర్శన చోటుకి చేరుకొని అక్కడ ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చుకొని మౌనముగా శివధ్యానము చేసుకుంటుండగా నాకు ఉన్నట్టుండి యోగమత్తు ఆవరించి కళ్ళు మూతలు పడసాగాయి.అపుడు నాకు ధ్యానము నందు పరమహంస ఆత్మశరీరము అమ్మవారున్న చీకటిగుహయందు నల్లరాయి మీద పద్మాసనములో కూర్చునిఉన్నట్లుగా కనిపించసాగింది.ఉన్నట్టుండి ఈయన ఆత్మశరీరము కాస్త తెల్లనికాంతితో మెరవడముతో ఈయన కాస్త దక్షిణామూర్తి భంగిమలో కూర్చుకోవడము అపుడు ఈయన కుడిపాదము నుండి పాదరసలింగము కాస్త ఈయన మూలాధారచక్రము వద్దకు చేరుకొనే దృశ్యము లీలాగా కనిపించింది.ఈ దృశ్యము నేను చూస్తుండగా నాకు ఒక జ్ఞానస్ఫురణ అందింది.అది ఏమిటంటే ఇలా పాదరసలింగము మూలాధారచక్రానికి చేరడము అంటే పురుష తత్త్వ ఆత్మశరీరము కాస్త ఆత్మలింగముగా మారడము అన్నమాట.అంటే ఈ విశ్వములో జనన శక్తి పురుషుడి వీర్యకణ శక్తికే ఉంటుంది గదా.ఇది ఆవేశముగా మారి అమ్మ కడుపులో ఆశగా మారి ప్రాణమున్న పిండముగా మారుతోందని అలాగే శివుడి వీర్యశక్తి పాదరసమని లోకవిదితమే గదా.అంటే ఎవరి ఆత్మశరీరము పాదరసలింగ ఆత్మలింగముగా మారుతుందో వారికి జన్మరాహిత్య అనగా జన్మమించే శరీరాలుండవని నాకర్ధమైంది.

ఆతర్వాత కొన్ని క్షణాలకి ఈయన ఆత్మశరీరము కాస్త ఎరుపు రంగు కాంతితో మెరవడముతో ఈయన కాస్త బాల అమ్మవారు కూర్చుకొనే భంగిమలో కూర్చున్నారు.అపుడు ఈయన ఎడమ కాలి పాదము నుండి అష్టదళ పింక్ రంగు తామరపువ్వు కాస్త ఈయన మూలాధారచక్రమునకు చేరుకొనే దృశ్యము లీలగా కనిపించింది.ఈ దృశ్యము నేను చూస్తుండగా నాకు ఒక జ్ఞానస్ఫురణ అందింది.అది ఏమిటంటే ఇలా అష్టదళ పద్మము వలన జీవుడికి అష్టకోరిక మాయలకి గురై కర్మలు ఏర్పరచుకోవడము జరుతోందని..కోరిక వలనే కర్మ ఏర్పడుతోందని..తద్వారా కర్మ వలన జన్మ ఏర్పడి కర్మజన్మగా మారి ఈ అష్టకోరికల మాయలలో పడి పున:జన్మ కర్మజన్మలు ఎత్తడము జరుతోందని దీనిని నివారణకోసము యోగచక్రము కాస్త యోగపద్మముగా మారితేకాని వారి కర్మరాహిత్య స్ధితిని పొందలేరని నాకర్ధమైంది.ఇక్కడ ఒక విషయము తెలుసుకొండి.ఎవరైతే శివుడిని ఆరాధిస్తూ...విష్ణువుని లేదా అమ్మవారి ద్వేషిగా మారి వీరిని పూజించరో వారికి పాదరసలింగము మాత్రమే జాగృతి అయ్యి యోగచక్రాలలోనికి ప్రవేశించును.అలాగే ఎవరైతే శివద్వేషిగా మారి విష్ణువు లేదా అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి ఎడమపాదములో యోగపద్మము మాత్రమే జాగృతి అవుతుంది.అదే అర్ధనారీశ్వర తత్వమును కాని శివకేశవ తత్వమును కాని ఆరాధన చేసినవారికి మాత్రమే పాదరసలింగము అలాగే యోగపద్మము ఈ రెండుగూడ జాగృతి అవుతాయి.అలాగే సాధనలో ఉండగా ఈ దైవాల ద్వేషములో ఉన్నవారికి అకాలమరణాలు పొందినపుడు వారి సాధనశక్తి అపుడు ఏ చక్రము వద్ద ఉండి మరణమును పొందితే మరుజన్మలో ఈ చక్ర క్షేత్రమునందు పున:జన్మగా యోగజన్మ ఎత్తి మోక్షకోసము సాధన చేస్తారని తెలుసుకొండి.   

కొన్నిక్షణాలు తర్వాత ఈయన ఆత్మశరీరము కాస్త కుడివైపు తెల్లగాను..ఎడమవైపు ఎర్రగా కనపడసాగింది.అపుడు ఈయన మూలాధారచక్రములో ఉన్న తామరపువ్వు మధ్యలోనికి  పాదరసలింగము  చేరిచేరడముతో ఈ చక్రము కాస్త యోగపద్మముగా మారడము అలాగే ఈయన అర్ధనారీశ్వర ఆత్మశక్తి కాస్త జేగురు రంగులోనికి మారి పొగ లాగా..ఒక పాము మాదిరిగా పాకుతూ ఈయనకి ఉన్న మిగిలిన యోగ చక్రాలలోనికి ఈయన ఆత్మశక్తి ప్రవేశించముతోపాటు పద్మాకార పాదరస ఆత్మలింగ పద్మము గూడ ప్రవేశించడముతో అక్కడున్న యోగచక్రాలు కాస్త యోగపద్మాలుగా ఇలా మొత్తము 13 యోగచక్రాలు కాస్త యోగపద్మాలుగా మారడము జరిగింది.అపుడు ఈయన అర్ధనారీశ్వర ఆత్మశరీరము కాస్త నలుపురంగులోనికి మారడము జరిగింది.అంటే రెండు రంగులు అదే తెలుపు,ఎరుపు కాస్త ఏకరంగు నలుపు అయింది.రెండు కాస్త ఏకమైంది.దైత్వము కాస్త అదైత్వమైంది.ఈ దృశ్యము నేను చూస్తుండగా నాకు ఒక జ్ఞానస్ఫురణ అందింది.అది ఏమిటంటే ఇలా ఎవరి ఆత్మశరీరము కాస్త రేడియోషన్  నలుపుగా మారుతుందో
( కోరికలున్న ఆత్మ శరీరము నల్లగా ఉంటుంది.అదే కోరికలు లేనివాడి ఆత్మశరీరము రేడియోషన్ శక్తి నలుపుగా మారుతుందని తెలుసుకొండి) వారికున్న కర్మ-జన్మ రాహిత్య స్ధితికి అనగా పూర్ణశూన్యము నందు ప్రవేశించే అర్హత,యోగ్యత,యోగము పొందుతారని ఈ స్ధితిని పరమహంస గారు పొందినారని నాకర్ధమైలోపే ఈయన నల్లటి ఆత్మశరీరము కాస్త మూడు అంగుళాల నుండి అంగుళము పరిమాణములోనికి మారి అనాదిగా ఉన్న శూన్యములో ఉన్న రేడియోషన్ శూన్యబిందువు మీదకి చేరి పద్మాసన ధ్యాన సమాధిలోనికి చేరిన కొన్నిక్షణాలకి అత్యంత రేడియోషన్ దెబ్బకి ఈయన శరీరము కాస్త ఆస్ధిపంజరము మారడముతో ఆతర్వాత కొన్నిక్షణాలకి ఈ అస్ధిపంజరము గూడ బూడిదై పంచరంగుల రేణువులుగా మారి ఏకమై నల్ల రేణువుగా మారి శూన్యబిందువు నందు శూన్యమై ఇదిగూడ ఈ బిందువు కాస్త అనాది శూన్యమునందు శూన్యమై దృశ్యమును నా మనోనేత్రము గూడ చూడలేని భరించలేని స్ధితికి చేరడముతో నాకు ధ్యానభంగమైంది.



ఇది ఇలా ఉంటే నాకు ఒక ధర్మసందేహము వచ్చింది.అది ఏమిటంటే ఇలా ఎవరికి వారే రేడియోషన్ నల్లరాయి దాకా సాధన చేసి ఎవరికి వారు చనిపోవడమెందుకు?అందరు ఒకే నల్లరాయి చేరుకొని ఉండి చనిపోతే బాగుంటుంది గదా అనుకున్నపుడు నాకు ధ్యానమునందు మొదట కంచి పరమచార్య చంద్రశేఖర్ స్వామివారు కంచి కామాక్షి అమ్మకి పూజ చేస్తున్నట్లుగా కనిపించింది.ఆ తర్వాత గోవర్ధనగిరి లోపుల మరొ మహోన్నతమైన ద్వారక నగరము ఉన్నట్లుగా విశాలమైన వీధులు,ఎత్తైన భవనాలు,18 అడుగుల మనుష్యులు,21 సం.రాల నవయువకుడిగా శ్రీకృష్ణుడి దర్శన కల్గింది.ఆ తర్వాత నాకు ధ్యానభంగమైంది.ఈ రెండు దృశ్యాలు నాకు ఒక పట్టనా అర్ధము కాలేదు.కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా దేవిపుత్రుడు సినిమా చూడటము జరిగింది.అందులో హీరో సముద్రగర్భములో ఉన్న పవర్ బాక్స్ దగ్గరికి వెళ్ళడము దానిని బయటికి తీసుకొని రావడము ఆతర్వాత ఇది సృష్టి వినాశనము జరగకుండా ఉండటానికి శ్రీకృష్ణుడు తన ఆత్మశక్తితో అలాగే తను నిత్యము పూజించే అమ్మవారి యోగశక్తితో ఈ పవర్ బాక్స్ని సముద్రగర్బములో బడావాగ్ని బయటికి రాకుండా ఏర్పాటు చేశారనే దృశ్యము నాకు బాగా ఆకర్షించింది.అపుడు నాకు ధ్యానము నందు కనిపించిన ఈ దృశ్యాలను విశ్లేషణ చేస్తే మొదట నాకు కంచి కామాక్షి కనపడితే ఆతర్వాత ద్వారకదీశుడైన శ్రీకృష్ణుడు కనిపించడము బట్టి చూస్తే ఈ రేడియోషన్ నల్లశిలకి వీళ్ళకి ఏదో సంబంధమున్నదని నాకు బలంగా అనిపించసాగింది.అలాగే అసలు నల్లశిల నుండి సప్తవర్ణాల రేడియోషన్ వస్తుందా లేక ఈ శిల క్రింద ఎదైన రేడియోషన్ విదజల్లేది ఉన్నదా? అంటే ఈ నల్లశిలను ఒకవేళ అసలుసిసలైన రేడియోషన్ బయటికి రాకుండా పవర్ బాక్స్ లాగా వీరిద్దరు ఉపయోగించారా? అనే సందేహలు నా వెంట పడ్డాయి.దీనికి సమాధానాలు పరమహంస ఉండిఉంటే క్షణాలలో శాస్త్రీయముగా చెప్పేవారు.ఇపుడు వీటికి ఎవరు సమాధానాలు చెపుతారు అనుకునేలోపు నాకు యోగమత్తు ఆవరించడముతో నాకు తెలియకుండానే నన్ను యోగనిద్ర ఆవహించింది.అపుడు నిజము లాంటి కల ఒకటి వచ్చింది.అందులో మొదట ధ్యాననిష్టలో ఉన్న నల్ల ఆదిరుద్రుడు కనిపించాడు.ఈయన జటాజుటము ఒక పెద్ద కొండ లాగా కనిపించసాగింది.నేను కాస్త ఈ జుట్టు అగ్రభాగానికి చేరుకున్నాను.లోపలకి తొంగిచూస్తే బడావాగ్నితో ఉన్న గంగాజలము సుడులు తిరుగుతూ కనిపించసాగింది.ఇంతలో ఎవరో రుషి బహుశ భగిరధ మహర్షి అనుకుంటా..ఈయనిని గంగా కోసము ప్రార్ధించడము దానితో ఈయనకి ఉన్న జటాజుటా పాయల నుండి గంగా బయటికి రావడము జరిగింది కాని బడావాగ్ని మాత్రము త్రినేత్రము దగ్గర ఆగిపోయి అదికాస్తా అగ్నినేత్రము మారడము నేను గమనించాను.కొంతమేర గంగాజలము మిగిలిపోవడముతో ఈ బడావాగ్ని కూడ ఈయన జటజూటములో ఉండిపోయింది.ఉన్నట్టుండి ఈ సశరీర రుద్రుడు కాస్త అరుణాగిరిగా మారిపోవడము..అలాగే ఈయన త్రినేత్ర స్ధానము కాస్త ఈ గిరిమీద కనిపించే గణపతి కన్నుగా మారడము గమనించాను.అంటే బడావాగ్ని అనేది ఈ కన్నుగుహలో ఉన్నదని నాకు అర్ధమయ్యేసరికి ఈ గుహ లోపలకి వెళ్లాలని నేను అనుకోవడము జరిగింది.అపుడు ఈ గుహ ముఖ ద్వారము నుండి విపరీతమైన పరవళ్ళు తొక్కుతూ గంగాజలము బయటికి రావడము జరుగుతోంది.ఈ ప్రవహ వేగానికి నా శరీరము లోపలకి వెళ్ళలేకపోతోంది.ఇంతలో నా మీదకి ఆయుధ ప్రయోగాలు అనగా త్రిశూలము,కత్తి,గదా,బాణాలు ఎవరో వెయ్యడము జరుగుతోంది.ఎవరో నన్ను లోపలకి వెళ్ళనీయ్యకుండా చేస్తున్నారని నాకు అర్ధమయ్యి నాలో తెలియని మొండిపట్టుదల మొదలై ఈ గుహలోపలకి వెళ్ళడము జరిగింది.అక్కడ లోపల మూడు అడుగుల ఒక నీటి బావి లాంటి నిర్మాణము కనిపించింది.దీని నుండి నీరు బయటికి తన్నుకొని రావడము జరుతోంది.పైగా పొగలు విరజిమ్ముతో నీరు బయటికి రావడము నేను గమనించి ఈ బావిలోనికి దూకాను.ఇది దాదాపుగా మూడు వేల అడుగుల లోతు ఉన్నట్లుగా గమనించాను.అడుగుభాగానికి చేరుకున్న తర్వాత నాకు మరో అరుణాగిరి కనిపించింది.దీనిని చూస్తే అచ్చంగా దేవిపుత్రుడి సినిమాలో కనిపించే బడావాగ్ని అగ్నిపర్వతము లాగా కనిపించింది.దీనిని నుండి విపరీతమైన రేడియోషన్ తో బడావాగ్ని అన్నిశిఖలు బయటికి వస్తున్నట్లుగా నేను గమనించాను.ఈ రేడియోషన్ పర్వతము వలన భూమ్మీద ఉన్న మన కంటికి కనిపించే అరుణాగిరి వేదికెక్కుతోందని నాకు అర్ధమైంది.అలాగే అడుగుభాగములో ఉన్న ఈ బడావాగ్ని నుండి రేడియోషన్ అధికమోతాదులో బయటికి రానీయ్యకుండా ఒకవైపు  సనకానంద మహర్షి..మరొకవైపు నందీశ్వరుడు..ఇంకొకవైపు హనుమ..మరొకవైపు గణపతి కాస్త తీవ్ర ధ్యాననిష్టలో ఉన్నట్లుగా నాకు కనిపించారు.ఇది ఇలా ఉంటే ఈ బడావాగ్ని పర్వత అగ్రభాగము నాకు చాలా దగ్గరిగా వస్తున్నట్లుగా కనిపించసాగింది.అపుడు ఏదో నల్లటి గోళాకారముగా వస్తువు ఏదో ఈ అగ్రభాగములో ఉన్నట్లుగా గమనించాను.కొన్ని క్షణాలు తర్వాత చూస్తే ఇది వస్తువు కాదని మనము అనుకొనే గోళాకార రేడియోషన్ నల్లశిల అని తెలుసుకున్నాను.అంటే శిల నుండి రేడియోషన్ రావడము లేదని..ఈ శిల క్రింద ఉన్న బడావాగ్ని అరుణాగిరి నుండి రేడియోషన్ వస్తోందని..అంటే ఈ నల్లటిశిలను రక్షణకవచముగా పెట్టారని నాకు అర్ధమయ్యేలోపుల ఈ శిల చాలా స్ఫష్టంగా చాలా దగ్గరిగా కనిపించసాగింది.అపుడు ఈ శిల మీద పడుకున్నయోగనిద్ర భంగిమలో శ్రీకృష్ణుడి నల్లటి ఆత్మశరీరము కనిపించగా ఈయన మీద యోగశక్తితో కూర్చునిఉన్న కామాక్షి అమ్మవారు దర్శనమిస్తూ..రక్షకుడే భక్షకుడే అయితే ఏలా?ఎవరి ఆటను వారే ఆడాలి.ఎవరి చావును వారే పొందాలి అంతే కాని ఈ విశ్వక్రీడా ఆపాలని చూడరాదు.నీకు ఆడటము ఇష్టలేకపోతే నీకు నీవై ఒంటరిగా ఎకాంతముగా జీవన్ముక్తిని పొంది వెళ్ళిపోవాలి.అంతే కాని విశ్వఆటను ఆపటానికి ఆపాలన్ని ప్రయత్నానాలు చెయ్యరాదు చెయ్యకు..ఏవరో నాకు చెపుతున్నట్లుగా అనిపించగా..అసలు శివుడి మీద అమ్మవారు ఉంటుంది ఇక్కడ ఏమిటి కృష్టుడి మీద అమ్మవారు రక్షణగా ఉంది అనుకొనేలోపు నాకు స్వప్నభంగమైంది.నిద్రమత్తు వదిలింది.

అపుడు తిరిగి ఆత్మవిచారణ చేసుకుంటే నిజానికి ఎవరైతే రేడియోషన్ నల్లశిల మీదకి చేరితారో వారి ఆత్మశరీరము నాశనమవ్వక తప్పదు గదా.మరి వీరిద్దరు అదే కామాక్షి మరియు శ్రీకృష్ణుడు ఎలా ఆత్మశరీరాలతో ఉన్నారో నాకు అర్ధము కాలేదు.ఇందులో ఏదో మర్మమున్నదని నాకర్ధమై మళ్ళీ ధ్యానతపస్సుకి కూర్చున్నాను.అపుడు ధ్యానము నందు అరుణాగిరి అడుగుభాగములో ఉన్న అగ్నితీర్ధములో ఉన్న బడావాగ్ని అరుణాగిరి అగ్రభాగము చాలా స్ఫష్టంగా కనిపించసాగింది.పై నుంచి దీనిని చూస్తూంటే ఒకతేజోవలయము చూట్టూ లోపుల ఒక గోళాకార చీకటి భాగముగా కనపడుతుంది.అంటే తేజస్సుతో ఉన్న సున్నకారపు వలయము ఆకారములాగా కనపడుతుంది.అంటే ఒక మట్టికుండ లోపుల అగ్నిజ్వాలలుండి మూతలేకుండా ఉండి పైనుంచి చూస్తే ఎలా కనపడుతుందో అలా ఈ అరుణాగిరి అగ్రభాగము కనపడుతోందని నాకు తెలుస్తోంది.అంటే ఈ గిరి అగ్రభాగము పైన ఎలాంటి నల్లటి శిల లేదు కాని అగ్నివలయ వలన నల్లటి శూన్యము కాస్త ఒక నల్ల శిలగా కనపడుతోంది అన్నమాట.నిజానికి అక్కడ ఎలాంటి శిలా లేదు.కేవలము శిలాకారముగా నల్లటి రేడియోషన్ కనపడుతోంది.అంటే సూర్యుడు మీద సొలర్ స్నేక్ ఉన్నట్లుగా నిజానికి అది స్నేక్ కాదని స్నేక్ ఆకారములో విస్ఫోటనమని జరుగుతున్నట్లుగా ఈ గిరి అగ్రభాగమునందు గూడ ఉండి లేనట్లుగా నల్లశిలాకారముగా రక్షణకవచమున్నదని... అంటే ఖాళీ శూన్య గోళాకారమున్నదని..కాని దీనిని విభేదించటానికి ఏమి ఉండదని..అలాగని దీనిని లోపలకి వెళ్ళలేమని..అలాగే గిరిలోపుల బడావాగ్ని బయటికి రాలేదని నాకర్ధమైంది.అనగా సూర్యుడు నుండి ఎలాయితే సోలార్ స్నేక్ బయటికి రాదో..కాని అది ఉన్నట్లుగా ఎలాయితే కనపడుతుందో..నిజానికి అది లేదు కాని ఆ ఆకారవిస్ఫోటనము ఎలాయితే జరుగుతుందో ఉంటుందో అలాగే ఈ బడావాగ్నిగిరి మీదగూడ ఈ గోళాకార రేడియోషన్ నల్లశిలాకారముంటుందని నాకర్ధమైందని మీకు అర్ధమై ఉంటుంది.అనగా ఇది ఒకరకముగా బ్లాక్ హోల్ అన్నమాట.ఇది దీనిన్ మన ప్రకారముగా చూస్తే ఈ విశ్వానికి చిట్టచివరి బ్లాక్ హోల్ అయితే దీని ప్రకారముగా చూస్తే ఇది ఈ విశ్వానికి మొట్టమొదటి బ్లాక్ హోల్ అవుతుంది.ఈ చిట్టచివరి అంతిమ బ్లాక్ హోల్ లో పడితే బడావాగ్ని రేడియోషన్ కి మన ఆత్మశరీరము దగ్ధంవుతుందని తెలుసుకొండి.ఈ లెక్కన ఆత్మకి అలాగే ఆత్మశరీరానికి మరణమున్నదని తెలుస్తోంది.అంటే ఇది ఒకరకముగా ఈ బ్లాక్ హోల్ లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనిట్లుగా యత్ భావము తత్ భవతి అన్నమాట.దేవుడు ఉన్నాడు అంటే ఉంటాడు.లేడు అనుకుంటే లేడు.ఆత్మ ఉంది అనుకుంటే ఉంటుంది.లేదు అనుకుంటే లేదు.నేను ఉన్నాను అనుకుంటే ఉంటావు.నేను లేను అనుకుంటే నేను ఉండదు.అంటే ఇక్కడ ఉన్న రేడియోషన్ నల్లటిశిలయే నిజము కానపుడు మరి ఈ శిల మీద కామాక్షి అలాగే శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా ఎలా కనిపించారు అనుకోగానే నిజానికి వీరిద్దరు ఈ గిరి అగ్రభాగానికి 7 మీటరుల దూరములో కుడివైపు శ్రీకృష్ణుడు కాస్త జగన్మోహిని రూపములో ఉండి సృష్టికార్యము చేస్తోంటే..అదే కామాక్షి అమ్మవారు బాలాదేవిగా ఉండి స్ధితి కార్యమును ఎడమవైపు 7 మీటర్లు దూరములో ఉండి చేస్తున్నారు.అంటే వీళ్ళు నిజానికి ఈ శిలామీద లేరు.ఈ శిలాకి 14 మీటర్లు దూరములో ఉన్నారు.ఇదే భూమ్మీద ఉన్న అరుణాగిరి వలయ అరుణాగిరి గీత పరిధి అయింది.ఈ నల్లశిల స్ధితి ఎవరైతే వస్తారో వారికి తాటకక్రియ దృష్టి వలన అనగా రెండు వస్తువులు ఏక వస్తువుగా ఎలాయితే కనపడుతుందో అలా ఈ రెండు ఆత్మశరీరాలు ఏకస్ధితి ఆత్మశరీరము మనకి ఈ శిల మీద ఉన్నట్లుగా కనపడుతోందని నాకర్ధమైంది.నిజానికి సాధనపరంగా చూస్తే వీరిద్దరుగూడ 64 డైమర్ష్ ఉన్న అమ్మవారి చీకటి గుహ ఉండే చీకటి నల్లశిల మీద ఉంటారు.మనకి కనిపిచ్చే మోక్షమిచ్చే రేడియోషన్ నల్లశిల మీద ఉండరు.ఇది 65 డైమర్ష్ లోనిది అని తెలుసుకొండి.గాకపోతే ఈ రెండు డైమర్ష్స్ మధ్య వెంట్రుకవాసి అరుణాగీత వలయముంటుంది.  ఈ రెండు డైమర్ష్స్ శిలలకి తేడా ఏమిటంటే 64వ శిల చీకటి శిల దీనినికి ఎలాంటి రేడియోషన్ అలాగే  ఆత్మశరీర యోగాగ్ని దహనశక్తి ఉండదు.అదే 65వ డైమర్ష్ శిలకి అన్ని ఉంటాయని గ్రహించండి.అలాగే వీరిద్దరుగూడ 64 డైమర్ష చీకటి నల్లశిల మీద మన ఆత్మశరీరమును 48ని.పాటు ధ్యానతపస్సులో కూర్చోపెట్టి శ్రీకృష్ణుడు పెట్టే కృష్ణమాయను అనగా మోహినిమాయ అనగా మోహమాయను అలాగే కామాక్షి అమ్మవారు పెట్టే యోగమాయను అనగా యక్షిణిమాయను మొదలుపెడతారు.ఈ మూలమాయలు దాటినవారికి 65వ డైమర్ష్ లో ఉన్న రేడియోషన్ శిల మీదకి వెళ్ళే యోగముంటుంది.లేదంటే ఇక్కడ నుండి తిరోగమనము అనగా వెనక్కి తిరిగి వచ్చి బ్రహ్మండ పున:కర్మ జన్మ చక్రము నందు పడతారు.పడక తప్పదు.

అంటే ఈ విశ్వములో ఆదిరుద్రుడు ఒక్కడే ఇపుడి వరకు మోక్షము పొందాడు.మిగిలినవాళ్ళు పొందలేదు.అంతెందుకు రుద్రుడి మిగిలిన 64కోట్ల799 రూపాలు గూడ మోక్షము పొందలేదు.కారణము ఈ నల్లశిల మీద ఉన్న శ్రీకృష్ణుడు పెట్టే కృష్ణమాయను అనగా మోహినిమాయ అనగా మోహమాయను అలాగే కామాక్షి అమ్మవారు పెట్టే యోగమాయను అనగా యక్షిణిమాయను ఎవరు దాటడము లేదు.అందుకే కాబోలు ఈ లోకానికి ఈ రెండు మాయలున్నాయని భూమ్మీద ఉన్న అరుణాగిరికి మోహిని అలాగే యక్షిణి విగ్రహమూర్తులుంచారని నాకు అర్ధమైంది.అంటే ఎవరైతే ఈ రెండు మాయలు దాటతారో వారికి 65వ డైమర్ష్ రేడియోషన్ నల్లశీల సాధన స్ధితికి చేరుకుంటారో వారి ఎడమకాలి బోటనవ్రేలు గోరు మొదట నల్లగా మారి ఆతర్వాత అది ఊడిపోయి కొత్తగోరు వస్తోంది.అంటే మన భౌతికశరీరములో రేడియోషన్ ప్రవేశమార్గము ఇలా జరుతుంది.దీనికి నిదర్శనముగా శ్రీకృష్టుడి అంతిమయాత్ర సమయములో రేడియోషన్ బాణము ఈయన ఎడమకాలి బొటనవ్రేలికి తగిన తర్వాతనే ఈయన తన శరీరత్యాగము చెయ్యడము జరిగింది.అంటే ఇలా ప్రవేశించిన రేడియోషన్ వలన మన శరీరము నయంకాని రోగానికి గురీవుతుంది.అపుడు మనలో మహామృత్యువు భయము మొదలవుతుంది.దీనిని ఇంద్రియనిగ్రహముతో ఈ మాయను దాటితే అపుడు మనకి జీవన్ముక్తి కల్గుతుంది.

అలాగే 64వ డైమర్ష్ లో ఎవరైతే తన సాధనస్ధితిని ఈ నల్లశిల స్ధితికి తీసుకొని వస్తారో అపుడు వీరి ఆత్మశరీరము కాస్త పద్మాసనము వేసుకొని ఈ శిల మీద 48ని.పాటు మౌనముగా..ఏకాంతముగా మొదట 24ని.లలో శ్రీకృష్ణుడి మోహమాయ వలన మనకి పూర్వ,భవిష్య జన్మలు మన కళ్ళు ముందు ఒక సినిమా లాగా కనపడుతుంది.అపుడు ఈ జన్మాలు చూస్తూ మనము ఏమాత్రము ఎలాంటి ప్రేమ,మోహ,వ్యామోహ,కోరిక,ఆశ,ఆశయం,ఆలోచన,ఆవేశము, భయం,స్పందన,సంకల్పం,పేరు,పెదవి,పదవి,పైకము,ఇలా 64 తత్వాలకి మనము రాహిత్యస్ధితిని పొందకల్గితే అపుడు కామాక్షి అమ్మ యక్షిణి మాయ మరో 24ని. నడుస్తోంది.ఇందులో మన జన్మల మృత్యువు వివరాలు అలాగే చివరలో మన ఆత్మశరీరము ఎలా దహనమవుతుందో చాలా స్ఫష్టంగా కనపడుతుంది.ఈ మహమృత్యువు భయమును గూడ మనము దాటుకోగల్గితే మనకి 65వ డైమర్ష్ ఉన్న రేడియోషన్ నల్లశిల దగ్గరికి వెళ్ళి ఆదిరుద్రుడిలాగా మోక్షమును పొందుతాము.లేదంటే ఈ 64వ డైమర్ష్ లో రాయి మీద నిలబడలేక బయటికి వచ్చి పున:జననమరణ చక్రమైన బ్రహ్మండ చక్రములో పడతాము.అందుకే శివపురాణము నందు మహశివుడు రెండు విఘడియాలు పాటు అనగా 48ని పాటు ధ్యాననిష్టలో ఉండాల్ని దీనిని అభ్యాసము చెయ్యమని లోకానికి చెప్పడము జరిగింది.కాని గణపతి 32ని..అమ్మవారు 16ని..శ్రీకృష్ణుడు 24ని..దత్తుడు 16ని.,బుద్దుడు 36ని..సాయిబాబా 11ని..మహ అవతార్  బాబాజీ 25ని..ఏసుప్రభు 21ని..మహమ్మద్ ప్రవక్త 21ని..ఇలా ఎందరో మహనుభావులు మహత్ములు ఈ శిల మీద పూర్తిగా 48ని నిలబడలేక వచ్చినారో లేదా ఈ విషయజ్ఞానము లోకానికి అందించాలని వెనక్కి తిరిగివచ్చినారో నాకైతే తెలియదు.అలాగే 64 డైమర్ష్ లో 48ని. అంటే మన 3వ డైమర్ష్ లో 10 లక్షల సం.రాలతో సమానమని తెలుస్కొండి.మన పురాణాలలో వివిధ దైవాల అనుభవాలు చదివితే వీళ్ళు 64వ డైమర్ష్ యొక్క చీకటి నల్లశిల కూర్చులేకపోయారని నాకర్ధమైంది.ఎలా అంటే మనకి ఉన్న 108 పురాణాలలో ఒకటైనా గణపతి పురాణము నందు మహాగణపతి అరుణేశ్వరుడు అనే రాక్షసుడిని మింగడము వలన దానితో ఈయన విపరీతమైన వేడిమితాపానికి గురియై 7 కోట్ల గణపతులుగా విడిపోయాడని..ఇవే ఏడు కోట్ల వేద మంత్రాలైనాయని..అపుడు ఈ గణపతి భూమ్మీదకి వచ్చి గరికతో తన తాపాన్ని తీర్చుకోవడము జరిగినదని చెప్పడము బట్టి చూస్తే 64 వ శిలగూడ అధికవేడిమి కల్గించే శిల అయ్యుండాలి అలాగే ఈ శిల కల్గించే వేడితాపాన్ని తట్టుకోలేక మహావిష్ణువు తులసిఆకులు,బ్రహ్మడేవుడుజువ్విఆకులు,హనుమ తమలపాకులు,దత్తుడు మేడిఆకులు, నరసింహస్వామి మేడిఆకులతో,  అమ్మవారు వేపాకులతో, సదాశివుడు బిల్వదళాలతో తమ తాపాలు తీర్చుకోవడముతో మనమంతా వీటితోనే వీళ్ళని పూజించే ఆచారాలు వచ్చాయని నాకర్ధమైంది.అందుకే ఈ శిల దగ్గర పరివార దేవతలుగా శ్రీకృష్ణుడు తన ఆత్మశక్తితో కామాక్షి అమ్మవారు తన యోగశక్తితో కాపలాగా ఉన్నారు.ఎందుకంటే 65వ డైమర్ష్ లో ఉన్న రేడియోషన్ నల్లశిల యొక్క శక్తిన్ని వీరు తట్టుకొని మహామృత్యువు భయము పొందకుండా వెనక్కి తిరిగి రాకుండా ఉండటానికి ఈ రేడియోషన్ రాయి వేడిమి స్ధితి ఎలా ఉంటుందో మనకి తెలియచెయ్యటానికి 64 డైమర్ష్ శిల మీద 48ని పాటు కూర్చుపెట్టుకొని యోగపరీక్షలు పెట్టడము వీటిని తట్టుకున్నవారికి 65 డైమర్ష్ శిల దగ్గరికి శాశ్వత మరణమైన మోక్షము పొందటానికి పంపించడము జరుగుతోందని నాకర్ధమైంది.అంటే 64 డైమర్ష్ శిల మీద నేను ఉన్నాను భావము నుండి నేనులేను భావము ఆత్మజీవుడు తటుకోగలడా లేదా అని వీరిద్దరు పరీక్షలు పెడుతున్నారని తెలుకొండి.అంటే అన్నప్రాశము రోజునే కొత్త ఆవకాయ పెడితే ఆ రుచుని తట్టుకోవడము ఎంత కష్టమో ఈ పరీక్షలు గూడ ఇలాగే ఉంటాయని తెలుసుకొండి.యోగసాధన అంటేనే నిరంతర పరీక్షలే గదా.

అవును మాకొక చిన్న సందేహము అది ఏమిటంటే పరమహంస గారు చెప్పిన 64 మరియు 65 డైమర్ష్స్ శిలలకి ఏమైనా నిదర్శనాలున్నాయా అన్నపుడు దీనికి మా సమాధానము  విష్ణుపరంగా చూస్తే 64వ శిల పూరీక్షేత్రములోని జగన్నాధుడి ఆలయ మూడోవ మెట్టుగా ఉంది.దీనిని యమదండమని అంటారు.ఈ మెట్టు మీద ఇనుపరేకుతో కొంతమేర కప్పి ఉంటుంది.దీని క్రింద 64వ శిలయైన యమదండమును ఉంచడము జరిగింది.ఆలయ ప్రవేశ సమయములో దీనిని తోక్కుతూ వెళ్ళాలని..దర్శనాలు పూర్తీయిన తర్వాత దీనిని తొక్కకుండా ఆలయము నుండి బయటికి రావాలని ఒక నియమముంది.ఈ యమదండమే 64వ నల్లశిల అన్నమాట.  కావాలంటే ఈ వీడియో కోసము నెట్లో వెతికితే మీకు దొరుకుతుంది.అలాగే శివపరంగా 64 శిల అంటే ద్వాదశ శివలింగాలలో ప్రధమైనా గుజరాత్ లోని చంద్రుడు ప్రతిష్టించిన ఆది సోమనాధ్ శివలింగము అసలుసిసలైన రేడియోషన్ శివలింగము.ఇది ఆలయ గర్భాలయము నందు ఎలాంటి ఆధారము లేకుండా గాలిలో నిలబడి ఉండేది.దీనికి కారణము ఈ శివలింగము లోపుల అత్యంత రేడియోషన్ రేకీ బాణలింగాలతో ఉండి ఇనుపరేకుతో కప్పబడి ఉండేది.ఈ ఆలయగోడలలో అయస్కాంతాలు అమర్చడము వలన వీటి మధ్య ఆకర్షణశక్తి వలన ఇనుప శివలింగము గాలిలో నిలబడి ఉండేది.ఈ విషయము తెలియక ఈ శివలింగములో ఏదో మహత్తర శక్తి ఉన్నదని ఔరంగబాద్ ఈ శివలింగమును ముక్కలు చెయ్యడము అపుడు ఇందులోంచి రేడియోషన్ శిలలు బయటికిరావడము వీటిని తన మశీదు మెట్లుగా వాడటం ఆతర్వాత ఈ శిలలు తొక్కుతూ ఇతగాడు వీటి రేడియోషన్ బారినపడి నయంకాని కేన్సర్ వ్యాధికి గురై చనిపోవడము జరిగినదని ఈ స్ధలపురాణ వచనము.అలాగే నిజానికి 12 జ్యోతిర్లింగాలు,18 అమ్మవారి శక్తి పీఠాలు,సప్తమోక్ష పట్టణ లింగాలు,108 వైష్ణవధామాలు,మక్కామసీదులోని శిల ఇలా ఇవి అన్నీగూడ 64వ శిలాలే అని తెలుసుకొండి.కాని ఈ క్షేత్రాలలో ఆదిలో ఉన్న ఈ 64వ చంద్రశిలలు ఇపుడు లేవు.వాటి బదులుగా మానవ ప్రతిష్ట నల్లటిశిలలు మనము  పూజిస్తున్నాము.అంతెందుకు నిజమైన కాశీ శివలింగము జ్ఞానవాపి మశీదులో ఉంటే ఇపుడు మనము అహల్యబాయి ప్రతిష్ట శివలింగము పూజిస్తున్నాము గదా.ఇలా అన్నీ క్షేత్రాలలో గూడ నకిలి నల్లశిలలు రాజ్యమేలుతున్నాయి.శివాజ్ఞ లేనిదే ఏమి జరుగదు గదా. సరే మన విషయానికి వద్దాం.ఇక 65 వ శిల అదే అత్యంత రేడియోషన్ మోక్షశిల మనకి అరుణాచలములో 2,671 అడుగుల ఎత్తులో అరుణాగిరి రూపములో నిత్యదర్శమిస్తుంది గదా.అంటే 64 వ శిల చంద్ర శిల అయితే 65వ శిల సూర్యశిల అవుతోంది.

ఈ అంతిమ మోక్షపరీక్ష సాధకుడు దాటుకోవాలంటే ప్రతి ఆత్మజీవి గూడ అనగా జీవులు,దైవాలు,పరమాత్మలు ఇలా అందరుగూడ మూడు స్ధితులను దాటుకోవాలి.అనగా తమ ఆత్మశరీరములో పురుష ఆత్మశక్తి ఆత్మలింగముగా అలాగే స్త్రీ ఆత్మశక్తిని యోగపద్మముగా మారితే అపుడు తమ ఆత్మశరీరము అర్ధనారీశ్వర తత్వముగా మారుతుందో వారికి మాత్రమే మోక్షశిల అయిన 65 డైమర్ష్ శిల దగ్గరికి వెళ్ళడము జరుగుతుందని ముందు మనము తెలుకోవాలి.అలాగే ప్రతి ఆత్మజీవి గూడ ఈ మూడు స్ధితులు పొందాలని చెప్పడానికి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా?అంటే ఉన్నాయి.అవే మనకి అరుణాగిరి మీద మహాశివరాత్రినాడు స్ఫటిక,తెల్ల,నల్ల,పాదరస శివలింగాలు దర్శమిస్తాయని..ఇవి పరమహంసకి దర్శనమిచ్చాయని మీరు ఈ పాటికే తెలుసుకున్నారు గదా.ఇందులో స్ఫటిక శివలింగము శివజ్ఞానానికి ప్రతీకైతే తెల్ల శివలింగము (శివుడు-తెలుపు) అనేది ఆత్మ కాస్త తనలో ఉన్న పురుషశక్తికి అలాగే నల్ల శివలింగము (అమ్మవారు నలుపు) అనేది స్త్రీ శక్తికి అలాగే పాదరస శివలింగము(శివశక్తి వీర్యశక్తి ) అనేది అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతీకలుగా ఉన్నాయని తెలుసుకొండి.అంతెందుకు ఆదియోగి అయిన ఆదిరుద్రుడు మొదట తనలో ఉన్న పురుషా ఆత్మశక్తిన్ని చిదంబర దక్షిణామూర్తి  స్ఫటిక ఆత్మలింగముగా మార్చుకొని ఆతర్వాత తనలో ఉన్న స్త్రీ శక్తిన్ని  హిమాలయ సదాశివుడు అష్టదళముగా మారి..ఆతర్వాత అరుణాచల శివగా అర్ధనారీశ్వర తత్వముగా మారి చివరికి మోక్షశిలను చేరుకొని శివుడు కాస్త శవమైనాడు గదా.ఇది ఈయన ఈ విధముగా తన మూడు స్ధితులు పొంది శూన్యమైనాడు.కాని మిగిలిన దైవాలు ఈ మూడు స్ధితులలో ఏదో ఒకటి పొందలేకపోవడము వలన 64 శిల మీద ఉండలేక వెనక్కి తిరిగి వచ్చారని నాకర్ధమైంది.


అంతెందుకు శ్రీ విష్ణువు విషయానికి వద్దాం.ఈయన తన పురుషశక్తి నివారణ కోసము కేరళ అనంతపద్మనాభుడిగా మారి చేతిలో శివలింగము పట్టుకొని సాధన చేసి ఆత్మలింగముగా మారినాడు.



ఆతర్వాత గురువాయురు స్వామిగా వెలిసి చేతిలో యోగపద్మమును పట్టుకొని సాధన చేశాడు. 


కాని తనలో ఉన్న స్త్రీశక్తిని దాటలేక జగన్మోహిని గా మారి అయ్యప్పస్వామి జన్మకారకుడైనాడని లోకవిదితమే కదా.


పూరీక్షేత్ర నీలా మాధవుడి విగ్రహమూర్తి


దీనికి కారణము ఈయన విశ్వస్ధితి పరిపాలకుడు గావాలనే సంకల్పము తీరడముతో ఈ విశ్వపరిపాలన కోసము ధనమును సృష్టించడము కోసము ఈ స్త్రీ ఆత్మసాధనస్ధితిలో ఉన్నపుడు ధనమాయ కాస్త మహాలక్ష్మీగా ఈ అష్టదళపద్మమీద వెలిసినది.దీనికి నిదర్శనమే మనకి నీలా మాధవుడి విగ్రహమూర్తిని చూస్తే తెలుస్తుంది.ఇది చూడటానికి నీలి శరీరముతో నాలుగు చేతులలో వరుసగా సుదర్శచక్రము,శంఖము,గదా,పద్మముంటే  పద్మమున్న చేతిలో మహలక్ష్మి రూపముంటుంది.ఈ విగ్రహమూర్తి మనకి పూరీక్షేత్రములో మొట్ట మొదట ఈ రూపముతో నీలాచల్ పర్వతమీద వెలిశారని..ఈయనకి అటవిక గూడెపురాజు అర్చనపూజాదికార్యక్రమాలు చేశారని మనకి ఈక్షేత్ర కధనములో కనపడుతుంది.కావాలంటే ఈ వీడియో కోసము నెట్లో వెతికితే మీకు దొరుకుతుంది.


                                                                   శివకేశ తత్త్వము

దానితో ఈయన అర్ధనారీశ్వర తత్త్వమును పొందలేక శివకేశ తత్త్వమును పొందడము జరిగింది.అలాగే గణపతి శ్రీశైలములో రత్నగర్భగణపతిగా మారి చేతిలో స్ఫటికలింగమును పట్టికొని తనలో ఉన్న పురుషశక్తిన్ని జయించాడు.


                                                                   స్త్రీమూర్తి గణపతి

కాని ఈయనగూడ తనలో ఉన్న స్త్రీశక్తిని జయించలేక గణపతి స్త్రీమూర్తిగాను మారడము జరిగింది.


                                                            స్త్రీమూర్తి హనుమ

అలాగే హనుమ గూడ స్త్రీమూర్తి గా మారడమే జరిగింది.ఇక మిగిలిన వారంతా తమలో స్త్రీ తత్వమును దాటలేక దానిని తమ భార్యగా మార్చుకొని సంసారజీవితములోనికి అడుగుపెట్టడము జరిగింది.




అంతెందుకు మన కలియుగ వెంకన్న స్వామి గూడ తనలో ఉన్న పురుషశక్తి కపిలతీర్ధములో ఉన్న కపిలేశ్వరుడి ఆత్మశివలింగముగా మార్చుకున్నారు కాని తనలో  బాలా రూపములో ఉన్న స్త్రీమూర్తిశక్తిని దాటలేకపోయాడు.దీని వలన ఈయన ప్రతి శుక్రవారము అమ్మవారికి జరిగినట్లుగా స్నాన అభిషేకాలు జరగడము అలాగే 




ఈయన వస్త్రధారణ గూడ అమ్మవారి చీరెకట్టుతో ఉండటము అలాగే దేవినవరాత్రులు జరిగే సమయములో బ్రహ్మోత్సవాలు జరగడం అందులో మోహినిరూప అలంకారము జరగడము అలాగే ఈయన గాలిగోపురము మీద అమ్మవారి వాహనమైన సింహ ప్రతిమలుండము అలాగే ఈయన అష్టదళపద్మమీద నిలబడి ఉండటము ఈయనని బాలాజీ కొలువడము బట్టి శ్రీవారిలో అమ్మతత్త్వమున్నదని అది ఇంకా మిగిలే ఉన్నదని అర్ధమవుతోంది గదా.



ఇక అమ్మవారి విషయానికి వస్తే ఈమె తనలో ఉన్న స్త్రీ ఆత్మశక్తిన్ని జయించినది కాని పురుషశక్తిని జయించలేదు.ఎలా అంటారా..ఈవిడ తన మోక్షసాధన కోసము కైలాసము నుండి భువికి వచ్చి కంచి నందు మట్టిలింగముతో ఆరాధన చెయ్యడము దానిని శివుడు నాశనము చేసేసరికి కాశీకి చేరుకొని విశాలాక్షిగా మారి విశ్వేశ్వర లింగమును ఆరాధన చేసినను ఫలితము రాకపోయేసరికి అరుణాచలమునకు చేరుకొని కామాక్షిగా మారి చేతిలో శివలింగమును పట్టుకొని అగ్నిలో దూకి శరీరత్యాగము చేసుకుంది.ఈ ఆలయము మనకి ఈ క్షేత్రములో కనపడుతుంది.


                                                             అరుణాచల కామాక్షిదేవి

అమ్మవారి చేతిలో శివలింగమును పట్టుకొని హోమాగ్ని తన   దేహము దగ్ధమవ్వుతున్నట్లుగా ఈ విగ్రహమూర్తి ఉండటం విశేషము.



దానితో ఈవిడ గూడ తనలో పురుషశక్తిని జయించలేక ఈ క్షేత్రములో ఉన్న శివుడిలో అర్ధభాగ స్త్రీమూర్తి మారి తన మోక్షమును పొందలేకపోయింది.అంటే పురుషులు కాస్త తనలో ఉన్న స్త్రీ తత్వమును అలాగే స్త్రీలు తమలో ఉన్న పురుషతత్వమును దాటలేకపోతున్నారని దీని వలన 64 శిల అధికవేడిమి తట్టుకోలేక వెనక్కి తిరిగివస్తున్నారని నాకర్ధమయింది.దీనికి కారణము ఏమిటని ఆత్మవిచారణ చేసుకుంటే మన బ్రహ్మరంధ్ర గుహ యందు 64 కపాలలతో ఒక కపాలధారి పద్మాసనము వేసుకొని ధ్యానతపస్సు చేస్తుంటారని మీరందరికి ఈపాటికే తెలుసుగదా.అనగా సాధకుడు పురుషడైతే వాడి బ్రహ్మరంధ్ర గుహ యందు స్త్రీమూర్తి 64 కపాలాల కపాలధారైన అస్ధిపంజరముంటుంది.అదే స్త్రీ సాధకులైతే పురుష అస్ధిపంజరముంటుంది.వీటికున్న తత్వాలే వలనే మన మనస్సు అస్ధిరమై మన శరీరము మాయలో పడటము జరుగుతుంది.

నాకు తెలిసి రామకృష్ణపరమహంస ఈ సాధన స్ధితిని తెలుసుకొందాం.ఈయనగూడ 64 శిల సాధనస్ధితికి వచ్చేసరికి ఈయనకి విపరీతమైన వేడిసెగలలో శరీరముండేది.దీనిని తాపము తట్టుకోలేక చాలా అవస్ధలు పడుతూ మట్టిలో నీటిలో సేద తీరేవారు.కాని తాపము తగ్గడముపోయి విపరీతముగా పెరిగిపోయేది.ఈ సమయములో ఈయన దగ్గరికి బ్రహ్మణీ అనే యోగిని వచ్చి ఈ శరీరానికి గంధమును పూసి మల్లెపూల మాలలు వేసి ఈయన శరీరతాపమును తీర్చింది.కాని ఈయనగూడ తనలో స్త్రీ తత్వమును జయించిన అమ్మవారు లేనిజీవితమును ఉహించుకోలేక రసజ్ఞత లేని సాధనలెందుకని గావాలని అమ్మవారు మహమాయ అని అన్నితెలిసినగూడ అమ్మవారికి దాసోహమై చివరికి అమ్మవారికి లాగా మారిపోయారు.ఆఖరికి ఈ 64 శిల వేడి తాపానికి ఈ దేహము కాస్త గొంతు కేన్సర్ తో చనిపోవడము జరిగింది.ఇలాగే రమణామహర్షి, చందోలుశాస్త్రి, శిరిడిసాయిబాబా ఇలా అకారణముగా అకాలమృత్యువు ఒడికి చేరడము జరిగింది.




అలాగే శిరిడి సాయిబాబా సాధనకి వద్దాం.ఈయన కూర్చున భంగిమలు పరిశీలిస్తే అనగా ద్వారకమాయి బాబా అదే నేలమీద కూర్చున భంగిమ అనేది ఛండీశ్వరుడి భంగిమ అని 





అలాగే రాతి మీద బాబా కూర్చున భంగిమ అనేది బాలామ్మవారి భంగిమ అని చాలా మందికి తెలియదు.అంటే ఈ రెండు బాబా భంగిమలు బట్టి చూస్తే బాబావారు శివోహం అలాగే దేవోహం స్ధితి పొందినారని మనకి తెలుస్తోంది.కాని ఆఖరిదైన అర్ధనారీశ్వర స్ధితిని ఈయన పొందలేదు.కారణము ఈయనకి సర్వమత స్ధాపన సమాజము చెయ్యాలని చూడాలని మనోసంకల్పముంది.అందుకు ఈయన ఫకీరు వేషము కట్టి హిందు పూజలు చెయ్యడము జరిగింది.మసీదులో తులసీకోట పూజలు,నిత్యా హోమాగ్ని పూజలు చెయ్యడము జరిగినదని మీరందరికి విదితమే గదా.ఇలా మానవులందరి కులము మానవకులమని..వీరిరందరి మతము మానవత్వమని లోకానికి చాటి చెప్పాలని ప్రయత్నించిన ఒక యోగియని కాని ఈయనకి ఉన్న ఈ కోరిక తీరకపోవడము వలన ఈయన పూర్ణమోక్షస్ధితి పొందలేదని నాకర్ధమైంది.ఎలా అంటారా..


బాబా నిజ జీవసమాధి


ఈయన నిజజీవసమాధి దగ్గర రెండు అడుగుల పంచలోహ మహలక్ష్మీ విగ్రహమూర్తి ఉంటుంది.నిజానికి ఈ సమాధి ఇపుడు మనము చూస్తున్న బాబా విగ్రహమూర్తి యొక్క క్రింద అంతస్తులో భూగృహమునందు ఈ సమాధి ఉంది.ఇది ఎవరు చూడలేరు.ఈ సమాధి దగ్గర మహలక్ష్మీ విగ్రహమున్నదని నాకుగూడ నెట్లో వీడియోలు ద్వారా తెలిసింది.అంటే ఈయనగూడ మహలక్ష్మీ మహమాయను దాటలేదని నాకర్ధమైంది.ఎందుకంటే ఈయన దత్తావతారము గదా.దత్త అంటే విష్ణు అవతారమే గదా.మహవిష్ణువే తన భార్యమైన మహలక్ష్మి మాయను దాటలేదని ఈపాటికి మీరందరికి తెలుసుగదా.అలాగే బాబా వారి సద్గురువు వెంకూసా.ఈయన తిరుపతి వెంకన్న మహభక్తుడు గావడము అలాగే ఈయన సమాధి చెందినపుడు ఈయన పార్ధివదేహమును పాతిపెట్టిన తర్వాత బాబావారు తీసి తవ్వితే ఈయన శరీరానికి బదులుగా అందులో వెంకన్న విగ్రహమున్నదని దానిని గురువు సమాధి ప్రక్కనే బాబా ఉంచి ఆ గ్రామమును వదిలి శిరిడి చేరుకున్నారని వీరి చరితములో మనకి కనపడుతుంది.అంటే నాకు తెలిసి మహలక్ష్మి మాహమాయకి 99.99 % మంది యోగులు బలి అయ్యారని నాకర్ధమైంది.  

నేను మన దైవాలను అలాగే మన సాధన మహత్ములను విమర్మించడము లేదు.కేవలము వారి సాధనస్ధితిగతులు అదిగూడ నాకు తెలిసినవి మీకు చెప్పడము జరిగినదని తెలుసుకొండి.ఎందుకంటే వీరంతాగూడ ఎందుకు పూర్ణమోక్షము పొందలేదని నేను ఆత్మవిచారణ చేసుకుంటే నాకు ఈ జ్ఞానస్ఫురణాలు అందాయి.వాటిని యధాతధముగా మీకు చెప్పడము జరిగింది.ఆ మాయ తప్పు నేను చెయ్యగూడదని అది ఏమిటో తెలుసుకొని దానిని పరమహంస మరియు నేను దాటడము జరిగినదని తెలుసుకొండి.అంతెందుకు మన పరమహంస గూడ ఈ 64 శిల సాధనస్ధితికి వచ్చినపుడు తమలపాకులు స్వీట్ పాను వీపరీతముగా తినడము జరిగింది.దానితో హైసుగర్ వ్యాధి పొందడము జరిగింది.ఆ తర్వాత నయంకాని వ్యాధిగా ఉపిరితిత్తుల కేన్సర్ ను పొందడము జరిగింది.అలాగే శరీరతాపము కోసము గంధమును విభూది పూసుకొనేవాడు.తనలో ఉన్న పురుషశక్తిన్ని పాదరస ఆత్మలింగముగా ఎలా మార్చుకున్నారో మీకు పైన అరుణాచల అనుభవాలు అంశములో చెప్పడము జరిగింది గదా.అలాగే తనలో ఉన్న స్త్రీశక్తి అయిన బాలమ్మను తనలో ఎలా రప్పించుకొన్నారో పైన ఆదిపరాశక్తి ప్రవేశం-పూర్ణజ్ఞాన సిద్ధి అంశములో చెప్పడము జరిగింది గదా.అలాగే ఈయన చివరికి అర్ధనారీశ్వర ఆత్మశక్తి పొంది ఎలా శూన్యమైనారో మీరు ఈపాటికి తెలుసుకున్నారు గదా.ఇక్కడ మనము ఒక విషయము గమనించాలి.అది ఎమిటంటే మిగిలినవాళ్ళు తమలో ఉన్న స్త్రీ శక్తికి వాళ్ళు లోబడితే..ఈయన మాత్రము ఇంద్రియానిగ్రహముతో జితేంద్రుడై తనలో ఉన్న బాలమ్మ ఆత్మశక్తికి లోబడకుండా తనలోనికి ఈ శక్తిన్ని రప్పించుకొని వశము చేసుకున్నారు.ఒకవేళ ఈయన లోబడి ఉండిఊంటే ఈయనగూడ బాల ఉపాసకుడై బాల యోగిగా మారేవాడు.కాని ఇలా జరుగలేదు. బాల యోగి కాస్త ఆత్మయోగిగా మారడముతో ఈయన ద్వారా మనమంతా శివమోక్షజ్ఞానము పొందడము జరిగింది.కాని ఇలాంటి ధ్యానానుభవాలు పరమహంస లాగా ఎందరో మహనుభావులు,మహత్ములు,యోగులు పొందినప్పడికి ఆఖరి అడుగు దూరములో పేరుకి,పైకముకి,పెదవి,పదవి,పాడి మృత్యుభయము మాయలకి గురై తాము పొందిన జ్ఞానమును లోకానికి అందించకుండా అపస్మారక స్ధితి అనగా తెలిసిన జ్ఞానము మర్చిపోయేస్ధితికి చేరుకోవడము జరిగింది.కాని పరమహంస మాత్రము ఈ నాలుగు మాయలు అనగా పేరుకి నందాదేవి (కీర్తికాంత),పైకమునకు స్వాతినందహంస(ధనకాంత) పెదవికి దీక్షాదేవిని(కామకాంత) బ్రహ్మపదవికి బాలదేవిని (ముక్తికాంత) మాయలు దాటడము జరిగింది. ఈయన పొందిన ఈ శివజ్ఞానము ఈయన ఎత్తిన 477 కోట్ల యోగజన్మాల సాధనఫలితమని తెలుకొండి.ఇలా ఇన్నికోట్ల జన్మాలలో పొందిన జ్ఞానమును ఈ జన్మసాధనలో ధ్యానానుభవ అనుభూతి దృశ్యాలు ఒక్కొక్కటిగా పొంది శివమోక్షజ్ఞానమును పొంది అరుణాగిరి యోగి మారడము జరిగింది.ఇక్కడ గమ్మత్తైన విషయము ఏమిటంటే 


అరుణాచలక్షేత్ర శ్రీవారి పాదాలు


ఇలా మన దైవాలు అలాగే సాధన మహత్ములందరుగూడ అరుణాచలక్షేత్రమునకు చేరుకొని తమకి ఉన్న అంతిమ సాధన మాయను తొలగించుకోవటానికి  ఇలా 64 కోట్ల 799 పరమాత్మ,దైవ,జీవులు తమ అంతిమ ఆత్మశరీరముతో సాధన చేస్తున్నారని మన అంతిమయాత్రకి అంతిమముగింపు పూర్ణమోక్షమిచ్చే అరుణాచల శివ కొలువై  అరుణాగిరిరూపముగా ఉన్న అరుణాచలక్షేత్రమని తెలుకొండి.ఎందుకంటే నల్ల ఆదిరుద్రుడు తిరురావూరులోని కమలాపురిలో అష్టదళపద్మమునందు జన్మించి కర్మయోగిగా మారి ఆతర్వాత చిదంబర క్షేత్రమునందు భక్తియోగిగా మోక్షజ్ఞానమును పొంది కాశీ క్షేత్రమునందు జ్ఞానయోగిగా మారి జ్ఞానవైరాగ్యచెంది విశ్వాత్మలింగముగా మారి శరీరత్యాగము చేసి ఆతర్వాత అరుణాచల క్షేత్రమునకు ధ్యానయోగిగా ఆత్మశరీరముతో చేరుకొని ఆత్మయోగిగా మారి ఆత్మసాధన చేసి తన అంతిమ శరీరమైన ఆత్మశరీరమును గూడ ఆత్మత్యాగము చేసి జీవన్ముక్తిమగు పూర్ణమోక్షమును పొందడము జరిగింది.
 


కాని 1300కోట్ల సం క్రితము ఆదిరుద్రుడు ఎలాయితే మోక్షము పొందినారో తిరిగి 1440 కోట్ల సం.రాలు తర్వాత పరమశివుడిలాగా పరమహంస మారి మోక్షము పొందినారు.అంటే ఆదియోగి మోక్షమార్గములోనికి పరమహంస తన ధ్యానానుభవాలతో తెలుసుకొని చివరికి ఈయనగూడ ఆయనలాగామారి శూన్యమైనారు.అంటే శివుడిని తెలుసుకోవాంటే శివుడి అవ్వకతప్పదు గదా.ఇపుడు మరో శివుడు శవమైనాడు.ఈయన పొందిన 64వ డైమర్ష్ ఈ శివమోక్షజ్ఞానము మనకి అనగా మనము ఉన్న 3వ డైమర్ష్ కి అందడము జరిగింది.అపుడు ఈయన తన మనో సంకల్పదీక్షతో ఈ కపాలమోక్షం గ్రంధమును రచించడము ఆరంభించి 64 డైమర్ష్స్ వరకు ఉన్న అన్నిరకాల మాయలు మర్మాలు లోకానికి అందించడముతో ఈ  64 డైమర్ష్స్ ఉన్న మాయలు తొలిగి పోయాయి.ఎందుకంటే ఎపుడైతే మనకి నిజజ్ఞానము అందుతుందో ఆనాడే మనకి ఉన్న మాయ మాయం అవుతుంది గదా.దానితో ఇపుడు ఎవరైతే తమకి మోక్షము గావాలని అనుకుంటారో వారికి ఎలాంటి మాయపరీక్షలు లేకుండా సాఫీగా ఎలాంటి ఆటంకాలు,అవాంతరాలు, మాయలు,మర్మాలు లేకుండా దీనితో నేనులేను..ఉన్నది ఏమిలేదు.ఉన్నదింతా శూన్యమే అను జ్ఞానమును ఆత్మజీవులు పొందడము ఆరంభమైనాయి.దీనితో రోజుకి 1440 మంది 65డైమర్ష్ రేడియోషన్ నల్లశిలకి చేరుకొని జీవన్ముక్తి మోక్షమును పొందడము జరుగుతోంది.నా కళ్ళముందే ఈ మధ్యనే నాకు తెలిసిన నాకు తెలియని ఎందరో యోగులు,సాధువులు,మహర్షలు,వివిధ లోకాలలో ఉన్న ఆత్మజీవులు, దైవస్వరూపులు తమ ఆత్మలింగాల రూపములో  65వ శిలరూపమైన అరుణాగిరి లోపలకి  ప్రవేశించే దృశ్యాలు ఈ మధ్యనుంచి నాకు ప్రతినిత్యము కనపడుతూనే ఉన్నాయి.





అంతెందుకు జగత్ గురువు నడిచే దేవుడైన కంచి మహస్వామి చంద్రశేఖరస్వామివారు మొదట శివరాధన చేసి శివోహం స్ధితిని పొంది కామాక్షి అమ్మరాధన చేసి దేవోహం స్ధితిని పొంది అటుపిమ్మట ఈ రెండు స్ధితులను తనలో ఆపాదించుకొని అరుణాచల శివ దక్షిణామూర్తి అర్ధనారీశ్వరస్ధితిని పొంది అరుణాగిరియందు ఐక్యం చెందే మహత్తరదృశ్యము ఈ దేహము చూడటము జరిగింది.ఎందుకంటే పరమహంస తల్లిగారు ఈయన భక్తురాలు.తన చిన్నవయస్సులో మహస్వామి వారిని తన తాతగారైన బాలదేవి ఉపాసకులు జ్ఞానయోగియైన బుద్దు కుటుంబరావు గారి దగ్గరికి వచ్చినపుడు ఈమెను ఆశీర్వస్తూ అమ్మా నీ కడుపున మీ తాతగారి లాంటి బ్రహ్మజ్ఞాని పుడతాడని దీవించడము జరిగినదని నాకు చెప్పుడము జరిగింది. వారే పరమహంస అన్నమాట.ఈయన ఒకసారి నాతో కంచి మహస్వామి తనకి గతజన్మలో భౌతికగురువుగా ఉండి సాధన రహస్యాలు భోదించేగురువుగా ఉండి వారికి తను ఆశ్రమములో ఉండి గురుసేవలు చేశానని నాతో చెప్పడము జరిగింది.


                                                        తిరుమలలోని సీతారామ



                                                              భద్రాచలములోని సీతారామ


అలాగే ఇక్కడ ఒక విషయము గమనించండి.అది ఏమిటంటే అర్ధనారీశ్వరతత్త్వములో పురుషులకి అలాగే స్త్రీమూర్తులకి తేడాలుంటాయని తెలుసుకొండి.అనగా పురుష అర్ధనారీశ్వర తత్వములో పురుషరూపము కుడివైపు ఉంటే స్త్రీ రూపము ఎడమవైపు ఉంటుంది.అదే స్త్రీమూర్తి అర్ధనారీశ్వర తత్వములో స్త్రీరూపము కుడివైపు ఉండి పురుషరూపము ఎడమవైపు ఉంటుంది.దీనికి నిదర్శనమే సీతారామవిగ్రహమూర్తి భంగిమలు.మీరు ఎపుడైన ఈ విగ్రహమూర్తులను చూస్తే తిరుమలలోని సీతారామాలయములో అమ్మవారు కాస్త అయ్యవారికి కుడివైపు ఉంటే అదే భద్రాచలములోనికి సీతారామలవారిని చూస్తే అమ్మవారు కాస్త అయ్యవారికి ఎడమవైపు ఉంటుంది.ఇలా ఈ దంపతులు మాత్రమే కుడివైపు,ఎడమవైపు ఉంటారు.ఈ భేద తత్వము వలన స్త్రీ,పురుష అర్ధనారీశ్వర తత్వభేదాలున్నాయని విశ్వానికి చెప్పడము జరిగింది.అందుకే రామనామము కాస్త రామతారకమంత్రమైంది. 

చచ్చినవారి హృదయస్పందన 

ఇపుడు దాకా మీరు స్త్రీ,పురుష అర్ధనారీశ్వర తత్వాలలో భేదాలుంటాయని అలాగే ఈ అర్ధనారీశ్వరతత్వములో ఇపుడిదాకా పురుషతత్వమే మోక్షము పొందితే స్త్రీ తత్వము కాస్త మహలక్ష్మీ మహమాయకి గురియై పైకము, పేరు,పదవి,పెదవి, అహం,మోహం,వ్యామోహం, ఆశ,ఆలోచన,భయం,స్పందన ఇలా 64 మహమాయలకి గురై మోక్షము పొందవలసినచోట ముక్తిని పొంది దైవ,యోగ,భోగ,జీవ జన్మాలు ఎత్తుతోందని అలాగా అపరకుబేరుడి నుండి అడుకునేవాడిదాకా మరియు విశ్వాధిపతి నుండి ఆశ్రమ అధిపతి అనగా మహవిష్ణువు నుండి దత్తస్వామి దాకా అందరుగూడ మహలక్ష్మీ యోగమాయ బాధితలేనని  మీరు తెలుసుకున్నారు గదా.అంటే అర్ధనారీతత్వములోని స్త్రీ తత్వ మాయస్పందనకి మహలక్ష్మీ అని తెలుస్తోంది గదా.నూటికి 99.99 శాతము మంది ఈమె మాయకి బలి అయ్యి ముక్తిన్ని పొందారని ఎక్కడో నూటికి 0.1 శాతము మంది ఈమె మాయను దాటి మోక్షము పొందారని మనము వివిధ దైవస్వరూపాలు అలాగే సాధన మహత్ముల అనుభవాలు ద్వారా మనమంతా తెలుసుకున్నాము గదా.ఇపుడు నేను చెప్పబోయే విషయమంతా నాకు ధ్యానములో కనిపించిన ధ్యానదృశ్యాలు అలాగే నాకు ఇంటర్నెట్లో అందిన సమాచారమును ఆధారము చేసుకొని ఈ రెండింటిని అనుసంధానము చేసి నాకు నేను ఆత్మవిచారణ చేసుకొని నాకు కల్గిన స్వానుభవ జ్ఞానస్పురణతో మీకు చెప్పడము జరుగుతోంది.అది ఏమిటంటే అర్ధనారీశ్వర తత్వములో పురుష తత్వము స్పందించకుండా ఉంటే అదే మహాలక్ష్మీ మాయకి స్త్రీ తత్వము స్పందిస్తోందని మనకి తెలుసుగదా.ఇలా ఎందుకు జరుగుతోంది,ఎలా జరుతోంది,దేనివలన జరుతోంది నేను పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలు మీకు యధాతధాముగా చెపుతాను.జాగ్రత్తగా తెలుసుకొండి.ఎందుకంటే మీరు మహలక్ష్మీ మాయలో పడకుండా ఈ మాయను దాటాలి గదా.లేదంటే మోక్షము పొందవలసినచోట ముక్తిని పొందుతారు గదా.ఇక అసలు విషయానికి వద్దాం.అది ఏమిటంటే మాయకి మూలము మహలక్ష్మీ గదా.ఈవిడా అరుణాచల క్షేత్రములో ఇపుడికి ఎవరికైనా గిరిప్రదక్షిణ సమయములో కాలికి గాయమై ఆగకుండా నెత్తురు కారుతుంటే 65సం.రాల వయస్సు ఉండి ముతైవుగా నాటు వైద్యరాలిగా వచ్చి ఈ గాయానికి ఏవో పసర్లులు పూసి కట్టు గట్టగానే రక్తధార ఆగిపోవడము నా కళ్ళారా రెండు మూడు సంఘటనాలు చూడటం అలాగే వినడం జరిగింది.ఇలా మహలక్ష్మీ కాస్త వైద్యరాలిగా వచ్చి కట్టు కడుతుందని మనకి అరుణాచల మహత్యములో చెప్పడము జరిగింది. అలాగే ఇపుడి ఈమెకి లాగా సజీవమూర్తులుగా పార్వతీ పరమేశ్వరుడు,నారసింహస్వామి ఉన్నారు.ఎలాంటే కావ్యకంఠమునికి స్వయంగా ఆదిదంపతులే అన్నము పెట్టారని లోకవిధితమే గదా.అలాగే మహలక్ష్మీ మాయలో పడిన ఆత్మశరీరాలను ఇక్కడ ఉన్న అరుణాగిరి క్షేత్రపాలకుడైన నరసింహస్వామి ఒక మగ సింహరూపములో ఉండి వీటిని అరగీస్తాడని ఈ క్షేత్రసాధువాసులు ధ్యానానుభవాలు చెపుతున్నాయి.అంటే లక్ష్మీ,నరసింహ,పార్వతి,శివుడు ఈ అరుణాచలక్షేత్రములో సజీవమూర్తులుగా ఉన్నారని తెలుసుకున్నాము.ఇక మన త్రిమూర్తుల విషయానికి వద్దాం.ఇందులో శివుడు కాస్త పార్వతి అమ్మవారికి తన అర్ధశరీరమిస్తే.. విష్ణువు కాస్త తన సతీ లక్ష్మీకి హృదయమిస్తే..బ్రహ్మ కాస్త సరస్వతికి నాలుక ఇచ్చారని పురాణ గాధ లోకవిధితమే గదా. స్వామి..ఇదింతా నిజమే..మేము కాదనడము లేదు కాని చచ్చినవారి హృదయస్పందన అని చెప్పి అది చెప్పకుండా ఏదో ఏదో చెపుతున్నారు.అసలు చచ్చినవారికి హృదయ స్పందన ఎలా ఉంటుంది.ఇది ఉంటే వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎలా అవుతారు.ముందు ఈ విషయము చెప్పండి అన్నపుడు నేను ఈ విషయానికి వస్తున్నాను.అది ఏమిటంటే మాయకి మూలము మహలక్ష్మీయే గదా.ఈమె మాయకి కారణము స్పందన.ఈ స్పందన దేని నుండి మనకి కల్గుతుంది.మన హృదయము నుండే హృదయస్పందన కల్గేది.అంటే  మహలక్ష్మీ హృదయస్పందన వలన ఆమె మాయలో పడి స్త్రీ తత్వము మాయకి గురీవుతోందని తెలుస్తోంది గదా.ఉదాహరణానికి మనకి బంగారపు గొలుసు రోడ్డు మీద కనపడితే వెంటనే మన కళ్ళు దాని మీదకి పోతాయి.కళ్ళు భావరూప ద్వారా మన మెదడికి అది బంగారము అనే జ్ఞానము కల్గుతుంది.ఈ జ్ఞానానికి మన హృదయము స్పందించి అది మనము ఎలాగైన మన స్వంతము చేసుకోవాలనే ఆశను మన బుద్దికి కల్గిస్తుంది.ఇది వెంటనే మన మనస్సుకి ఆజ్ఞ ఇస్తుంది.ఇది కాస్త శరీరానికి ఆజ్ఞన్ని ఇవ్వడముతో మన దశేంద్రియాలు  అప్రమత్తమై ఈ బంగారపు గొలుసును దొంగతనము చేస్తుంది.అంటే ఈ బంగారానికి ఆశ పడినవాడు మాయలో పడి భోగి అయితే అదే బంగారము మీద ఆశ లేనివాడు మాయరహితుడై బైరాగిగా మారి యోగి అవుతున్నాడు.అంటే ఈ మాయకి మూలము హృదయస్పందనే గదా.దీని స్పందన వలన దశేంద్రియాలు,శరీరము,మనస్సు,బుద్ధి,ఆత్మ కాస్త మాయకి గురి అయ్యాయి.అందుకే మన పెద్దలు ఒకమాట చెపుతూంటారు. అది ఏమిటంటే దశేంద్రియాలు జయించినవాడు జితేంద్రుడని లేనివాడు ఇంద్రియాలోలుడవ్వతాడని చెపుతారు.అంటే మాయకి మహలక్ష్మీ హృదయస్పందన అని తెలుకున్నాము గదా.మరి ఈమె హృదయము ఎక్కడ ఉంది అనగానే మహవిష్ణువు తన హృదయస్ధానమే లక్ష్మీ స్ధానమేనని పురాణ వచనము ఉంది అన్నపుడు మరి ఈ భూమ్మీద లక్ష్మీ హృదయమున్న శ్రీ విష్ణువు క్షేత్రము ఎక్కడో ఒక చోట ఉండి తీరాలి గదా.అనగా శివుడి అర్ధనారీశ్వర క్షేత్రము అరుణాచలమని అలాగే బ్రహ్మ అర్ధనారీశ్వర క్షేత్రము పుష్కర్ క్షేత్రము ఉన్నట్లుగా మన విష్ణువుకి గూడ అర్ధనారీశ్వర క్షేత్రమే పూరీ జగన్నాధుడి క్షేత్రము అన్నమాట.ఇది ఎలాంటారా? ఈ క్షేత్ర స్ధలపురాణగాధాలు మనకి తెలియాలి.ఇందుకోసము నేనైతే నెట్లో ఉన్న ఈ స్ధల పురాణ సమాచారము సేకరించి చదివి  తెలుసుకున్నాను.




పూరీక్షేత్ర నీలా మాధవుడి విగ్రహమూర్తి  

ఈ క్షేత్ర ఆదిదేవుడైన నీలా మాధవుడి సజీవమూర్తిగా ఉండేవాడని..ఈయన చేతిలో ఉన్న పద్మములో మహలక్ష్మీ విగ్రహమూర్తి ఉంటుందని మీకు తెలుసుగదా.స్వామి ఇది నిజమే.కాని ఇపుడు ఈ క్షేత్రానికి అధిపతి దేవుళ్ళు బలరామ,సుభద్ర,శ్రీకృష్ణుడు అదే జగన్నాధుడు గదా అంటారా..ఇది నిజమే.మహలక్ష్మీ మనకి ఇచ్చేది ధనమే గదా. ధనమిదము జగత్ అన్నారు గదా.అంటే ఈ జగత్తున్ని నడిపేది ధనమని తెలుస్తోంది గదా.ఈ ధన జగనాటనమును నడిపేది లక్ష్మీసహిత జగన్నాధుడే గదా.మరి ఈయన ఉన్న క్షేత్రనే పూరీ జగన్నాధ క్షేత్రమే గదా. పైగా ఈ క్షేత్రములో జగన్నాధుడికి అంత్యక్రియలు చేస్తారు.అనగా 8 లేదా 12 లేదా 16 లేదా 18 సం.రాలకి వచ్చే అధిక ఆషాడమాసములో పాత విగ్రహమూర్తులను బయటికి తీసి వాటి స్ధానములో అమ్మవారు ధ్యానములో చెప్పిన నాలుగు వేపచెట్టులతో బలరామ,సుభద్ర,శ్రీకృష్ణు,సుదర్శన విగ్రహమూర్తులను తయారుచేసి పెడతారు.పాత విగ్రహమూర్తులను ఈ క్షేత్ర ఆలయములో ఉన్న దైవ స్మశానమునందు నాలుగు గుంటలు తీసి పూడ్చిపెడ్తారు.ఈ కార్యక్రమము అంతాగూడ నవకళేబరము అనే పేరుతో జరుగుతుంది.విచిత్రము ఏమిటంటే పాత విగ్రగమూర్తులలో బ్రహ్మపదార్ధము అనే సజీవపదార్ధముంటుంది.ఇది ప్రాణశక్తితో,స్పందనతో ఉంటుంది. దీనిని  నలుగురు పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకి బట్టలు మందముగా చుట్టుకొని ఈ బ్రహ్మపదార్ధమును ఒకరు చేతితో పట్టుకొని పాత శ్రీ కృష్ణ విగ్రహమూర్తి నుండి బయటికి తీసి కొత్త ధారు శ్రీకృష్ణవిగ్రహమూర్తిలో ప్రవేశపెట్టడము జరుతుంది.దీనితోపాటుగా పాత విగ్రగమూర్తులలో ఉన్న బలరామ విగ్రహములో ఉన్న శివ యంత్రమును అలాగే సుభద్రలో ఉన్న సిద్ధేశ్వరి యంత్రమును అలాగే సుదర్శన చక్రములో ఉన్న నవనారసింహయంత్రమును అలాగే శ్రీకృష్ణుడిలో ఉన్న గోపాల యంత్రాలను బయటికి తీసి కొత్త విగ్రగమూర్తులలో యధాతధాముగా పెట్టడము జరుగుతోంది.ఈ ప్రక్రియ అంతా గూడ అమావాస్య అర్ధరాత్రి 12 గం. తర్వాతనే జరుగుతుంది.ఈ సమయములో పూరీ క్షేత్రమంతా కటిక గాఢాందకారములో ఉంటుంది.అనగా కరెంటు ఉండదు.చిన్నదీపము గూడ వెలిగించరు.ఎపుడైతే ఈ కార్యక్రమము పూర్తి అయ్యినదో అపుడు గుడిలో ఒక గంట కొడతారు.అపుడు దీపాలు వెలిగించడము అలాగే కరెంటు రావడము జరుగుతుంది.ఇక్కడ ఒక విషయము గమించారా? ఆ సజీవమూర్తిగా ఉండే బ్రహ్మపదార్ధము ఏమిటో ఎవరికి తెలియదు.కొందరి వాదన ప్రకారము అది శ్రీకృష్ణుడి హృదయమని అంటూంటే మరి కొందరివాదన ప్రకారము అది నారసింహ సాలగ్రామని అంటూంటే మరి కొందరైతే ఇది కుందేలు ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఇది ఉంటుందని ఇలా పలురకాల వాదనాలున్నాయి.నాకు కల్గిన ధ్యానానుభవము ప్రకారము చూస్తే ఇది ఒక ఆడ మనిషి హృదయముగా కనపడింది.అది కూడ ఒక ఆజానుభాహుడి హృదయములో ఈ ఆడ మనిషి ఉన్నట్లుగా..ఈమె హృదయస్పందనయే నాకు కనపడింది.పురాణవచనము ప్రకారము చూస్తే విష్ణుహృదయములో లక్ష్మీహృదయమే గదా ఉంటుంది.అంటే ఈ లక్ష్మీ హృదయము కాస్త మహ విష్ణువు నుండి శ్రీకృష్ణుడి దాకా కొనసాగి ఆఖరిగా ఈ భూమ్మీద పూరీక్షేత్రము వద్ద ఉండిపోయింది.అనగా అర్జునుడి చేతుల మీదుగా శ్రీకృష్ణుడి తొలి అంత్యక్రియలు జరిగినపుడు శరీరము అంతా దగ్ధమైతే ఒక హృదయము మాత్రము సజీవముగా ఉండేసరికి ఇది లక్ష్మీదేవి హృదయము గావడము చేత ఇది సజీవమూర్తిగా ఉన్నదని అర్జునుడు గ్రహించి దానిని ఒక పెట్టెలో పెట్టి అరేబియాసముద్రములో వదిలిపెడితే అదికాస్త పూరీక్షేత్రానికి రావడము దీనిని వేపదారుతో చేసిన జగన్నాధుడిమూర్తిలో పెట్టడము జరిగింది.ఇలా మాధవుడి అంత్యక్రియాలు మానవులు చేసేదాకా హృదయ బ్రహ్మపదార్ధ మార్పిడి కొనసాగుతూనే ఉంది. పైగా ఈ సజీవ హృదయ బ్రహ్మపదార్ధము అనేది నవపాషాణ విషాలతో ఇపుడిదాకా రక్షించబడుతూ వస్తుంది.దీనికి నిదర్శనాలే ఈ బ్రహ్మపదార్ధమును మార్చేటపుడు చేతులకి,కళ్ళకి కట్లు కట్టుకోవడము,కాంతి లేకుండా చెయ్యడము బట్టి చూస్తే ఈ విషాల వలన చేతికి,కళ్ళకి హనీ కల్గకూడదని అలాగే కాంతి వలన ఈ విషపదార్ధాలు కరుగుతాయని ఈ నియమాలు పెట్టడము జరిగింది.



ఇది నవవిషాల రక్షణలో ఉన్నదని అనటానికి నిదర్శనముగా శ్రీకృష్ణుడి గాలిగోపురము మీద సుదర్శనచక్ర శిఖరము ఉంటుంది.దీనిని జాగ్రర్తగా పరిశీస్తే ఈ చక్రము చుట్టు ఎనిమిది నెమళ్ళు అలాగే శూలము ఉంటుంది.  ఈ గుర్తులు చూస్తే నెమలి వాహనము అలాగే శూలాయుధము ఉన్నవాడు మన కుమారస్వామియే గదా.పైగా ఈయన పళనిక్షేత్రములో భోగార్ అనే రససిద్ధుడి తయారు చేసిన నవపాషాణ విగ్రహమూర్తి రూపములో కొలువై ఉన్నాడు,పైగా ఈ క్షేత్రములో ఆదిదంపతులు కాస్త తన కుమారుడైన కుమారస్వామికి జ్ఞానఫలము ఇవ్వడము జరిగింది.అదియే రససిద్ధి జ్ఞానమవ్వడము విశేషము.ఇవన్నీ ఈ స్ధలపురాణ గాధలో ఈ విశేషాలున్నాయి.సుదర్శన చక్రము అంటే రక్షకుడే గదా.ఈ లెక్కన చూస్తే దేవతల రక్షకుడు మన కుమారస్వామియే గదా.అపుడు తన నవవిషాలతో రక్షణగా ఈ హృదయబ్రహ్మపదార్ధమును అవిశ్రాంతిగా సజీవమూర్తిగా రక్షిస్తూన్నాడని తెలుస్తోంది గదా.  అలాగే వేప దారువు రూపములో దుర్గాదేవి అలాగే ఇక్కడున్న విగ్రహమూర్తులలోపున శివ,శక్తి,గోపాల,నరసింహ యంత్రాల రూపములో ఇలా ఈ బ్రహ్మపదార్ధమును నవశక్తులు కాపాడుతున్నాయి.ఈ హృదయస్పందన ఆగితే గాని అర్ధనారీశ్వర తత్వములోని స్త్రీ తత్వ మాయస్పందన ఆగదు.అపుడిదాకా ఈ విశ్వసృష్టి అంతాగూడ ఈ హృదయ స్పందన వలన ప్రతిస్పందిస్తూ కల లాంటి నిజములాగా ..అసత్యము లాంటి సత్యములాగా అవిశ్రాంతిగా మనకి కనపడుతూనే ఉంటుంది.కాబట్టి ఈ హృదయస్పందన లాంటి తుంకారనాదమునకు స్పందించకుండా మన దశేంద్రియాలు ఇంద్రియానిగ్రహముతో ఉంటే మాయ మాయం అవుతుంది.విశ్వమోక్ష వస్తుంది.లేదంటే ఎల్లపుడు జగత్తు నిరంతరముగా అశాశ్వత మరణమైన ముక్తినే పొందుతుంది కాని శాశ్వతమైన మరణమైన మోక్షమును ఈ విశ్వమును పొందలేదు. అంటే ఈ విశ్వమంతా చచ్చినవారి హృదయస్పందన వలన నడుస్తోంది.పని చేస్తోంది గదా.ఎలా అంటారా? పూరీక్షేత్ర విగ్రహమూర్తుల రంగులు చూస్తే తెల్లగా బలరామ ఉంటే పసుపుగా సుభద్ర,ఎరుపుగా సుదర్శచక్రము,నల్లగా శ్రీకృష్ణుడు ఉంటాడు.నలుపు అంటే చీకటి గదా.ఈ చీకటి ప్రపంచము లోపుల తుంకారనాదము చేసే మహలక్ష్మీ హృదయబ్రహ్మపదార్ధ స్పందన వలన జ్ఞానము కలుగుతోంది.దీని ద్వారా ఆలోచన తద్వార భావము తద్వార రూపము కల్గుతోంది.అనగా ఈ హృదయస్పందన వలన కర్మ,కర్త,క్రియా జరుగుతున్నాయి.అవే వెలుగు ప్రపంచములో ఓంకారనాదముగా,కాంతిగా రూపాంతరము చెంది కాలముతో గూడిన పంచభూతాలతో ఏర్పడిన స్త్రీ,పురుష అష్టాంగాల ప్రకృతులు ఏర్పడటము అలాగే సృష్టి,స్ధితి,లయ,లాస్య ప్రక్రియాలతో ఈ విశ్వమేర్పడుతోంది.అంటే ఈ హృదయస్పందన వలన పుట్టినవాడు పోక తప్పదు.పోయినవాడు పుట్టుక తప్పడము లేదు.గాకపోతే ఈ లక్ష్మీహృదయ స్పందించకుండా ఉండగల్గినవాడు మాత్రమే మోక్షమును పొందుతాడు లేదంటే ఇక్కడిదాకా వచ్చి దీనికి ప్రతిస్పందిస్తే తిరోగమనము అనగా వెనక్కి మరలి పున:కర్మజన్మ చక్రములో పడతాడు.అనగా శూన్యము గావాలసినవాడు బ్రహ్మపదార్ధముగా మిగిలిపోతాడు.అందుకే ఈ విశ్వములో ఆదిరుద్రుడు ఒక్కడు మాత్రమే తుంకారసాధనసిద్ధి పొంది లక్ష్మీహృదయ స్పందనకి స్పందించకుండా ఇంద్రియనిగ్రహముతో జితేంద్రుడై మోక్షము పొందడము జరిగింది.గావాలంటే ఈయన ఎలా తుంకారసాధన చేశారో మనకి శివపురాణములో చెప్పడము జరిగింది.మిగిలిన దైవస్వరూపాలంతా గూడ ఈ హృదయస్పందనకి స్పందించి మాయలో తమకి తెలియకుండా పడితే కొంతమంది తెలిసి పడితే మరికొంతమంది గావాలని పడుతున్నారు.అంటే కోరిక లేని సమాజము చూడాలని కోరిక పెట్టికొని అమాయకముగా మన బుద్ధుడు కాస్త ఈ స్పందన మాయలో పడితే .. సర్వకామసుఖాల కోసము పడితే ..మరికొంతమంది   సర్వ సిద్ధుల కోసము, బ్రహ్మపదవులకోసము ఈ మాయలో పడుతున్నారు.అంటే ఈ లక్ష్మీ హృదయ స్పందన ఉన్నంతవరకు మాయ ఉంటుంది.మాయ ఉంటే అజ్ఞానముంటుంది.ఇది ఉంటే కర్మ-జన్మ-జాతకముంటుంది.ఏకముగా ఈ విశ్వమే ఉంటుంది. అంటే చచ్చినవాడి హృదయస్పందన యొక్క విశ్వాసమే ఈ విశ్వమును నడిస్తోంది.ఇది ఆపడము ఎవరి వల్ల గాదు.ఒకడు ఒకచోట మరణము పొందితే అదే సమయములో మరొకచోట జననము జరుతోంది గదా.అపుడు పోయేది ఏమిలేదు.కొత్తగా వచ్చేది ఏమిలేదు గదా.ఉన్నది ఉన్నట్లుగా పూర్ణముగానే ఉంది.చావుపుట్టుకలు చూసి పాతవాళ్ళు పోతున్నారని..కొత్తవాళ్ళు పుడుతున్నారని మన అజ్ఞానమాయలో ఉండి అనుకుంటున్నాము.అంటే శక్తి నాశనము గాదు. కొత్తగా సృషించబడదు.అనాదిగా ఏదైతే ఉందో అది అలాగే అవిశ్రాంతిగా నిరంతరంగా చీకటి- వెలుగు విశ్వము కొనసాగుతూనే ఉంటుంది.గాకపోతే సాధకుడు ఈ చచ్చినవాడి లక్ష్మీ హృదయమునకు స్పందిస్తే  వెలుగు ప్రపంచములో ఉంటాడు.లేదంటే చీకటి ప్రపంచములో ఉంటాడు.చీకటి అంటే మోక్షము  అదే వెలుగు అంటే ముక్తి అన్నమాట. ఇక మీకు ఈ రెండింటిలో ఏమిగావాలో మీకు మీరే నిర్ణయించుకొండి.

ఇక్కడ సాధకులకి కొన్ని సందేహలు వస్తాయి అది ఏమిటంటే ఈ హృదయస్పందన దేనివలన కలుగుతోంది.అలాగే కృష్ణుడి శరీరము అంతా దహనమైన గూడ ఈ లక్ష్మీ హృదయము ఎందుకు దహనము కాలేదు అలాగే ఈ హృదయస్పందన ఇచ్చే మహమాయను అసలు ఎలా దాటాలి అన్నపుడు వీటికి సమాధానాలుగా అసలు ఈ విశ్వమంతా ద్వంద్వ ప్రవృత్తితో అనగా పుట్టుక-చావు,మరణం-అమరత్వం,పాపము-పుణ్యము,కష్టం-సుఖం,ఆనందం-బాధ ఇలా ప్రతిదానికి రెండు భావాలుంటాయని లోకవిధితమే కదా.ఇపుడు సాగరమధనము కధ దగ్గరికి వెళ్తాం.ఇందులో మొదట మనకి కాలకూట విషము వస్తే మహాశివుడి తాగి మరణము పొందితే ఆ తర్వాత వచ్చిన అమృతమును మహావిష్ణువు కాస్త జగన్మోహిని రూపముగా మారి దీనిని త్రాగి అందరి దేవతలకి పంచాడు.ఇందులో పురుష తత్వ శివుడి హృదయము విషము తాగి మరణమును పొందితే అదే స్త్రీ తత్వ జగన్మోహిని విష్ణువు యొక్క లక్ష్మీ హృదయము కాస్త అమృత సేవనము వలన అమరత్వమును పొందడము జరిగింది.అంటే ఈ లెక్కన ఈయన హృదయానికి మరణము లేనట్లేనని తెలుస్తోంది గదా.అంటే ఇది దేనిని వలన అనగా పంచభూతాలు వలన అలాగే అస్త్ర,శస్త్ర వలన దీనికి మరణము రాదని మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది.ఇదే విషయాన్ని కృష్ణుడు తన గీతలో ఆత్మకి మరణముండదని దీనిని అగ్ని దహింప చెయ్యలేదని..నీరు తడపలేదని ..అస్త్ర,శస్త్ర వలన వలన నాశనము అవ్వదని చెప్పడము జరిగింది.అలాగే ఈయన తన గీతలోని ఆఖరి 18వ అధ్యాయమైన మోక్షసన్యాసయోగములోని ఆఖరి శ్లోకమును ఒకసారి చూస్తే భగవంతుడు ఆత్మస్వరూపముగా మన హృదయచక్రము నందు ఉన్నాడని చెప్పడము బట్టి చూస్తే భగవంతుడి రూపము హృదయమని తెలుస్తోంది గదా.పైగా ఇది మరణము లేని శాశ్వతమైనదని ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది గదా.ఇక ఈ హృదయస్పందన దేనివలన స్పందిస్తోంది అన్నపుడు దీనికున్న ఋణానుబంధాలు వలన ఇది స్పందిస్తోంది అని తెలుసుకొండి.ఇది మీకు బాగా అర్ధము గావాలంటే నా జీవితస్వానుభవము మీకు చెపుతాను.ఒకసారి మా ఇంటి ముందు నాలుగు నెలలు వయస్సు ఉన్న వీధికుక్కపిల్ల గాయాలతో మూలుగుతూ కనపడింది.దానితో దీనిని నేను ప్రేమతో దగ్గరికి తీసుకొని సాకడము మొదలుపెట్టాను.అది నా దగ్గర అలవాటుపడి మా ఇంటి దగ్గర ఉండటము మొదలుపెట్టింది.దానికి గావాల్సిన ఆహారనీళ్ళు పెట్టడము చేస్తూంటే అది మా ఇంటికి మాత్రమే కాపలా కాయడము మొదలుపెట్టింది.ఇది వరకు బాగానే ఉంది.గాకపోతే దీనితో ఒక పెద్ద సమస్య ఉందేది.అది ఏమిటంటే మా ఇంటి హల్ మధ్యలో రోజూకి 5 నుండి పది సార్లు గావాలని ఏదో పనికట్టుకొని నా మీద కక్ష్యసాధింపు చర్యగా మలమూత్రాలు చేసేది.అది నేనే తీయ్యకతప్పేది గాదు.ఇలా దీనికి 7 సం.రాలు ఈ సేవాలు చేసి చేసి విసుగు వచ్చి ఈ సేవ చెయ్యలేక పరమహంస గారిని దీనికి పరీహరమార్గము చెప్పమని అడిగితే మిత్రమా..నీ గత జన్మలో హృదయ స్పందన వలన ఈ కుక్క రుణాబంధమేర్పడినదని అనగా గతజన్మలో నువ్వు నీ ఇంటి ప్రధానద్వారము మీద కొన్ని పిచ్చుకలు పిల్లలు,గ్రుడ్లు ఉంటే ఒక కాకి వీటిని తినడము నువ్వు చూసి  బాధతో స్పందించి ఈ కాకిని తొలడము జరిగితే అది కాస్త నీ అరుపులకి భయపడి కిటికిలోంచి కడుపునిండిన పొట్టతో ఆ కిటికి చువ్వల మధ్యలో ఇరుకొని చనిపోవడము జరిగింది.దానితో ఈ కాకి మరుజన్మగా దొంగబుద్ది వలన కుక్కగా పున:జన్మ ఎత్తి నీ దగ్గరికి వచ్చింది.గావాలంటే దానికి నీ చేతితో ఒక పచ్చి కోడిగుడ్డు పగలకొట్టి పెట్టు.దాని రుణాబంధము తీరిపోతుందని చెప్పడము..అది ఇలాగే నేను చెయ్యడము వారమురోజుల తర్వాత అది నన్ను వదిలిపెట్టి పక్కగ్రామానికి వెళ్ళిపోయి అది ఇంతవరకు వెనక్కి తిరిగిరాలేదు.అంటే ఒక హృదయస్పందన వలన కర్మ,దీనివలన జన్మ దీని వలన కర్మ బంధము దీని వలన రుణాబంధము మేర్పడితే దీని పరిహరము చేస్తే రుణాబంధవిముక్తి ఎలా కల్గినదో నా స్వానుభవము ద్వారా మీరు తెలిసే ఉంటుంది గదా.అంటే మన హృదయస్పందన అనేది మనకున్న రుణాబంధాలవలన అని తెలుస్తోంది గదా.మరి మన హృదయస్పందనాలు ఎన్ని ఉన్నాయి అనగా అక్షరాల 64 వేల 800 ఉన్నాయి.ఇందులో 6 వేలు హృదయస్పందనాలుంటే 9 వేలు కర్మాలుంటే 36వేలు కర్మ-జన్మాలుంటే 13 వేలు ఋణాబంధాలున్నాయు.దీనికి నిదర్శనమే అగ్నిశిఖ బిందుకి ఆరుకిరణాలుంటాయని మీకు తెలుసుగదా.జ్యోతిబిందుస్వరూపానికి కుమారస్వామి ఆరుతలాలు సంకేతము ఉంది.ఇక 9 వేల కర్మాల్కి నవవిధ లక్ష్మీనారసింహ శక్తి సంకేతాలైతే ఇక 36 వేల కర్మ జన్మల్కి సంకేతము మన బ్రహ్మరంధ్రగుహలో ఉండే 36 కపాలధారి అన్నమాట.ఇక్కడ ఒక విషయము జాగ్రత్తగా గమనించండి.పూరీ క్షేత్రములో ఉన్న నాలుగు విగ్రహమూర్తులలో అదే బలరామ,సుభద్ర,కృష్ణ,సుదర్శనమూర్తులలో వరుసగా శివ,శక్తి,గోపాల,నారసింహ యంత్రాలు ఉన్నాయని మీకు తెలుసుగదా.వీటిని ఇందులో ఎందుకు పెట్టినారో అనగా మనకి ఉన్న హృదయస్పందనలకి గోపాలయంత్రము అలాగే కర్మ-జన్మాలకి శివ శక్తి యంత్రము అలాగే కర్మనివారణ కోసము నారసింహ యంత్రమును ఉంచి పూజించడము జరుగుతోందని గ్రహించండి.అలాగే ఇక మిగిలిన ఆఖరి ఇక 13వేల రుణాబంధాలకి సంకేతము మన అరుణాచలములోని అగ్నిలింగమునకు ఉండే 13 ఖండితాలే మన రుణాబంధాలు అన్నమాట.అరుణ అనగా రుణము లేనిది.ఇక అరుణాచలము అంటే రుణం లేని కొండ లేదా రుణాలు లేకుండా చేసే కొండ అన్నమాట. అంటే హృదయస్పందనాలు వలన ఎర్పడే రుణాబంధాలు లేకుండా రుణావిముక్తి చేసేది చివరికి అరుణాచల క్షేత్రమైంది అన్నమాట.అలాగే ఈ 13వేల రుణాబంధాలకి మూల రుణాలు 800 అయితే వీటికి 14 మహామూలబంధాలున్నాయి.800-14=786..ఇందులో అంటే మన జన్మాంతర రుణాలు 786 అయితే ఈ జన్మరుణాలు 14 ఉంటాయి. 800 రుణాబంధాలు తీరాలంటే గిరి చుట్టు 800 గిరిప్రదక్షిణాలు చేస్తే 786 రుణాబంధాలు తీరతాయి.దీనికి నిదర్శనమే ఒక మతము వారు తమ ఇష్టదైవ ఈ సంఖ్యను కొలుస్తున్నారని లోకవిధితమే గదా.ఈ సంఖ్యలోని 7+8+6=21 వస్తుంది.ఇది జీవరుణాలు కల్గించే గణపతి సంఖ్య అని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.అలాగే ఇంక మిగిలిన ఈ జన్మరుణాలు 14 తీరాలంటే అరుణాచల క్షేత్రములో స్ధిరనివాసముగా ఎటువెళ్ళకుండా అనగా ఊరిపొలిమేరలు దాటకుండా 7 నెలలు నుండి 14 సం.రాలు పాటు ఉండి  "అరుణాచల శివ" అక్షర లక్షల ఏడు కోట్ల నామస్మరణ చేస్తే అపుడు మనకి ఉన్న ఈ జన్మరుణాలు 14 తీరి రుణావిముక్తి పొందడము జరుగుతుంది.అలాగే ఎవరైతే 800 రుణాబంధాల విముక్తి స్ధితికి వస్తారో వారికి మాత్రమే అరుణాచలక్షేత్ర ప్రవేశ,దర్శన,గిరిప్రదక్షిణకి అర్హత,యోగ్యత,యోగము కల్గుతాయి.అలాగే మిగిలిన 14 ఈ జన్మ మూల రుణాబంధాలు తీరేస్ధితికి వచ్చినపుడు అరుణాచలక్షేత్రములో స్ధిరనివాసము యోగము ఏర్పడుతుంది.   


లక్ష్మీహృదయస్పందన మాయవలన చివరికి తనవలన ఏర్పడిన ఋణాబంధాలు నుండి మనల్ని ఋణావిముక్తి చెయ్యడానికి అరుణాచల క్షేత్రములో ఈమె ఇపుడికి సజీవమూర్తిగా ఉండి తీరుస్తోంది.అది ఎలాంటే ఎవరైతే 800 సార్లు గిరిప్రదక్షణాలు పూర్తిచేస్తారో వారికి ఉన్న హృదయ రుణాబంధాలు తీరిపోతాయి.ఇలా గిరిప్రదక్షిణ సమయములో మన కాలికి గాయాలు అయ్యితే దానివలన గిరిప్రదక్షిణాలు ఆగిపోకూడదని తనే స్వయంగా నాటువైద్యారాలిగా వచ్చి  తగిలిన గాయానికి కట్టుకట్టి ఆ రుణాబంధము నుండి విముక్తి పొందటానికి సహాయము చేస్తుంది. ఇదింతా బాగానే ఉంది.సరిగ్గా 800 ప్రదక్షిణాలు చెయ్యాలని ఎలా చెపుతున్నారంటే మన అరుణాగిరి అర్ధనారీశ్వర తత్వము గదా.అనగా అగ్నిలింగము 13 ఖండితాలతో 14వ అగ్రభాగముతో ఉండముతో 14 భాగాలు అలాగే గిరి 24కి.మి పరిధి గావడముతో 14 + 24 = 38 (అర్ధనారీశ్వర తత్వము వలన ఈ సంఖ్యలు కలుపడము జరిగింది) అవుతుంది.అలాగే ఈక్షేత్రములో మనకి గణపతి ఆలయాలు ప్రాబల్యము ఉండటమును బట్టి చూస్తే అలాగే జీవశరీరానికి కారకుడు గణపతి గావడము అలాగే గణపతి సంఖ్య 21 అవ్వడము బట్టి చూస్తే ఇందాక వచ్చిన 38 X 14 = 796 వస్తుంది.ఇది రమరమి 800 అవుతోంది గదా. అలాగే 64వేల800 లో 800 వంతు సంఖ్య ఉండటము బట్టి పరమహంస గారు ఈ గిరి చుట్టు 800 ప్రదక్షిణాలు చెయ్యాలని ఇలా జ్ఞానస్పురణ పొందడము దానిని మనకి అందించడము జరిగింది.ఇదింతా బాగానే ఉంది.మరి ఈ 800 గిరిప్రదక్షిణాలు ఈ జన్మలో చేసినవా లేదా గతజన్మాలలో చెయ్యడము మొదలుపెట్టి ఉంటే అపుడు ఈ లెక్క మారుతుందా అన్నపుడు ఒకటి గుర్తుపెట్టుకొండి.మీరు గతజన్మాలలో ఈ 800 గిరిప్రదక్షినాలు పూర్తిచెయ్యకపోవడము వలన ప్రస్తుత మానవ కర్మ జన్మ వచ్చిందని ముందు తెలుసుకొండి.ఇపుడైతే మీకు గతజన్మాలు అలాగే ఈ జన్మలో చేసిన గిరిప్రదక్షినాలు 800 పూర్తి అవుతాయో అపుడు మీకు ఏడమ కాలిబొటన వేలు గోరు నల్లగా మారితే మీ గిరిప్రదక్షినాలు పూర్తి అయినట్లే అన్నమాట.అలాగే ఎపుడైతే మీకు 65వ డైమర్ష్ రేడియోషన్ శిల మీ దగ్గరికి వస్తుందో దానితో మీకున్న అన్నిరకాల రుణాబంధాలు తీరిపోయి ఈ జన్మ రుణాలు 14 మాత్రమే మిగుతాయి.ఇవి మాత్రము 1.తల్లిరుణాబంధము, 2.తండ్రిరుణాబంధము, 3.కుటుంబసభ్యుల రుణాబంధము, 4.గురురుణానుబంధము, 5.దైవరుణాబంధము, 6.బంధురుణాబంధము,7.మిత్ర రుణాబంధము, 8.సమాజ రుణాబంధము, 9.రుషి రుణాము,10.సాధు రుణము,11.జంతు/మొక్కల రుణాము,12.పితృదేవత రుణము,13.క్షేత్ర రుణము,14.భూతదయ రుణము ఉంటాయి.ఒకవేళ సాధకుడు ఈ 14 జన్మరుణాలలో రుణవిముక్తి పొందకుండా వీటిలో ఏదో ఒక దానికి స్పందించి ఆ రుణామును పెంచుకుంటే పోతే మళ్ళీ మాయలోపడి అరుణాచలక్షేత్రమునుండి తిరోగమనము అనగా వెనక్కి తిరిగివచ్చి పున:కర్మ జన్మ చక్రములో పడతారు.ఉదాహరణకి సమాజ రుణము తీసుకుంటే సాధకుడు తాను పొందిన జ్ఞానమును సమాజమునకు లోకకళ్యాణార్ధము అందించాలని ఆశయముతో ఆశ్రమము పెట్టి ఆశ్రమాధిపతిగా మారి శిష్యభక్తులను చేర్చుకొని వీరి పోషణార్ధము ఈ ఆశ్రమదాతలను దగ్గరనుండి ధనము వసూలు చెయ్యడము దాకా వస్తాడు.దానితో ఈ రుణాము నుండి విముక్తి తగ్గడముపోయి రుణబంధాలు అధికమవుతాయి. మాయలలో పడి వాడి సాధనశక్తిన్ని నాశనమును చేసుకొని అహము మాయకి గురై అజ్ఞానములోనికి వెళ్ళి అరుణాచల క్షేత్రము నుండి బయటికి వస్తారు.ఇలా నూటికి 99 శాతము ఈ సమాజ రుణాబంధవిముక్తి పొందనివాళ్ళని నా స్వానుభవములో చూడటము జరిగింది.అదే ఈ మాయను దాటటానికి తన పొందిన జ్ఞానానుభవాలతో ఒక పుస్తకము వ్రాసి ప్రతిలాపేక్ష లేకుండా ఏమి ఆశించకుండా తన పేరు అలాగే తన ఉనికి తెలియకుండా  అందరికి ఉచితముగా పంచిపెట్టి ఉంటే లేదా అందరికి ఈ పుస్తకము అందుబాటులో ఉచితముగా అందేటట్లుగా చేస్తే సరిపోతుంది.ఇక పుస్తకము ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడము లేదో ఎందుకు చదవడము లేదో ఎవరు ఏమి అనుకుంటున్నారో ఈయన పట్టించుకోడు.తనవంతుగా పుస్తకము రాయాలని అనుకున్నాడు వాసి అందించడమే తన బాధ్యత తీరిపోయినదని అనుకొనే మనోస్ధాయిలో నిజమైన జ్ఞానయోగి ఉంటాడు.ఇక దానితో తన ఆశయము తీరిపోతుంది.ఆశ్రమము పెట్టే మాయ తప్పుతుంది గదా..ఈ చిన్న లాజిక్ చాలామంది సన్యాసులు మిస్ అయ్యి సన్నాసులు అవుతున్నారు.అలాగే ఈ 14 రుణాలు తీర్చుకొనే సమయములో మనకి ఈ అరుణాచల క్షేత్ర పరివార దేవతలు మానసికముగా,శారీకముగా యోగపరీక్షలు పెడతారు.ఆశ పెడతారు.భయ పెడతారు.బాధ పెడతారు.సుఖ పెడతారు.అహమిస్తారు.ధనమాయలు పెడతారు.కీర్తి మాయలు ఇస్తారు. ఇలా చెప్పటానికి మనము ఉహించడానికి వీలులేని మర్మసూక్షమాయలు ఉంటాయని తెలుసుకొండి.మరి దీనికి ఏమిచెయ్యాలి అన్నపుడు శవసాధన చెయ్యాలి.అనగా నేను అనేది లేదు ..ఉన్నదింతా కనిపించేదింతా శూన్యమేనని..ఈ దేహము బతికున్న శవమని అనే భావములో మనము నిరంతరముగా ఉండాలి.అపుడు మనకి అన్నింటాయందు స్మశాన వైరాగ్య కల్గి మనస్సు స్పదించకుండా  మౌనముగా సాక్షిభూతముగా మారి ఒక నాటకమును చూస్తునట్లుగా చూస్తూ ఉండిపోతుంది.ఇలా మనము చనిపోయేంతవరకు అరుణాచలము ఉండాలి.లేదంటే అక్కడనుండి వెనక్కి వస్తాము లేదా అరుణాగిరి లోపలకి వెళ్ళకుండా సూక్ష్మశరీరముతో ఈ క్షేత్రములో సంచారము చేస్తూ ఉంటాము. ఇలా సంచారము చేసే యోగాత్మ ఆత్మజీవులను ఏందరినో నా స్వానుభవములో చూడటము జరిగింది.కాబట్టి మనము ఈ 800 ఋణాబంధాల విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే రుణము ఉంది అంటే కర్మ ఉన్నట్లే.ఇది ఉంది అంటే జన్మ ఉన్నట్లే.ఇది ఉంది అంటే కర్మబంధ ఉన్నట్లే.ఇది తీరాలంటే పున:కర్మజన్మ చక్రములోనికి వెళ్ళినట్లే అన్నమాట.కాబట్టి ఈ రుణా విషయాల బహూజాగురతో ఉండాలి.ఇక్కడ కొంతమందికి ఒక సందేహము వస్తుంది.అది ఏమిటంటే అసలు మనకి రుణాబంధమవ్వతుందో లేదా రుణావిముక్తి అవుతుందో ఎలా తెలుస్తోంది అన్నపుడు ఒకటి గుర్తుచుకొండి.మనకి రుణాబంధము పెరిగితే వాటి మీద మమకారము,ప్రేమ,మోహము,వ్యామోహము కల్గుతాయి.అదే రుణావిముక్తి కల్గితే పట్టుదలతో గూడిన మాటపట్టింపులు, గొడవలు, కొట్లాటలు, అనుమానాలు, అవమానాలు, విడిపోవడాలు, స్ధలమార్పిడి,మరణము పొందడము జరుగుతాయి.ఇవి మీకు 1,3,5,7,9,11,13,15 సం.రాలలో గొడవలు వచ్చి విడిపోతారు.ఇదే 36 కపాలధారి ఈ వరుసక్రమములోనే కపాలాలుంటాయి.అంటే మన బ్రహ్మరంధ్రగుహలో 36 కపాలధారి ఆవాసానికి కారణము మన జన్మాంతర రుణాబంధాల విముక్తి కోసము మనకి మనమే మన ఆత్మశరీరము కాస్త ఇలా 36 లేదా 64 కపాలధారి అయినదని మీరంతా ఈపాటికే గ్రహించి ఉంటారు.15 సం,రాలు దాటిన తర్వాత ఇంక మీ బంధములో సమస్యలు రాలేదంటే అది మీకు జన్మాంతరరుణానుబంధముగా మారుతుంది.ఒకవేళ సమస్యలు వస్తే అది ఈ జన్మలో రుణావిముక్తి పొందడము జరుగుతుంది.

ఇపుడు అసలు ఈ 800 రుణాల నుండి శాశ్వత విముక్తి పొందటానికి ఉన్న ప్రాయోశ్చిత మార్గాలు మీకు చెపుతాను తెలుసుకొండి.ఇవి మోక్షము గావాలని అనుకొనేవారు మాత్రమే చెయ్యాలి అని తెలుకొండి.అవి ఏమిటంటే ఇవి తీరటానికి అరుణాచల  క్షేత్రములో మరణము పొందాలి.లేదా క్షేత్రములో  7 నెలలు నుండి 14 సం.రాలు పాటు ఉండాలి. లేదా అరుణాగిరి చుట్టు 800 గిరిప్రదక్షిణాలు చెయ్యాలి లేదా ప్రతి సం.రము శివరాత్రినాడు అరుణాచలక్షేత్రానికి చేరుకొని ఉపవాసము,జాగరణతో ఒక గిరిప్రదక్షిణము చెయ్యాలి. లేదా అరుణాచల శివ నామస్మరణ 7  కోట్లు చెయ్యాలి లేదా సం.రానికి 7 లేదా 14 సార్లు అరుణాచలక్షేత్ర దర్శనము చేసుకొని ఒక గిరిప్రదక్షిణము చెయ్యాలి.లేదా 21 ఉన్న నర్మదా అర్ధనారీశ్వర బాణలింగాల మాల కొని 12 సం.రాలు దీనిని ధరించి ప్రతి సం.రము శివరాత్రినాడు అరుణాచలక్షేత్రానికి చేరుకొని ఉపవాసము,జాగరణతో ఒక గిరిప్రదిక్షణము చెయ్యాలి. ఇదింతా మావల్లన గాదంటే సూక్ష్మములో మోక్షముగా ఇంట్లోనికి ఒక నర్మదా అర్ధనారీశ్వర బాణలింగమును తెచ్చుకొని దానిని విభూదిలో డబ్బాలో ఉంచి ప్రతిశివరాత్రినాడు దీనిని విభూది నుండి బయటికి తీసి దీనికి మీ ఇష్టము ఓపికను బట్టి అభీషేకము చేసుకొని ఉపవాసము ఉండి ఆ రాత్రింతా అరుణాచల శివ నామస్మరణతో జాగరణ చేసి మరుసటి రోజు యధావిధిగా దీనిని విభూది డబ్బాలో పెట్టండి.మళ్ళీ దీనిని ఆ తర్వాత వచ్చే శివరాత్రినాడు బయటికి తీయ్యాలి. .ఇదిగూడ మా వల్ల కాదంటే మహాశివరాత్రినాడు ఉపవాసముండి  అర్ధరాత్రి లింగోద్భకాలములో అనగా 12 గం. నుండి 12.48 ని దాకా మౌనముగా ఏకాంతముగా మనస్సుతో అరుణాచల శివ నామస్మరణతో శివధ్యానము చెయ్యండి.ఇలా 7 నుండి 14 శివరాత్రులు మీరు క్రమతప్పకుండా చెయ్యగల్గితే గిరిప్రదిక్షాలు 2,671  చేస్తే ఎంతటి ఫలితము వస్తుందో అంతఫలితమును మీరు తప్పకపొందుతారు.గాకపోతే ఇందులో ఉన్న నియమము ఏమిటంటే వరుసగా 7 నుండి 14 శివరాత్రులు ఇదేవిధముగా చెయ్యాలి.లింగోద్భకాల సమయము తప్పకూడదు.ఇలా వరుస క్రమము తప్పితే ఆ ముందు చేసిన శివరాత్రి ఫలితము పోతుంది.మళ్ళీ కొత్తగా లెక్క మొదలు పెట్టుకోవాలి అన్నమాట.వరుసగా 13 సం.రాలు ఇలాగే చేసి 14 వ సం.రములో లింగోద్భవకాలములో ఒకవేళ శివధ్యానము చెయ్యకుండా నిద్రపోతే దానితో ఇంతముందుకు చేసిన 13 సం.రాలు ఫలితము గూడ పోతుంది.మళ్ళీ లెక్క మొదటినుండి ప్రారంభమవుతుంది.ఇలా మీకు నచ్చిన మీకు వీలున్న ఏదోఒక పరిహరమార్గమును మనస్ఫూర్తిగా శ్రద్ధభక్తితో అఖండ అచంచల ఆత్మవిశ్వాసముతో అహం రహితమై సర్వస్య శరణాగతితో మీరు చెయ్యగల్గితే మీకున్న  హృదయస్పందన వలన కల్గే అన్నిరకాల ఋణాబంధాల నుండి ఋణావిముక్తి పొంది ఆత్మమోక్షమును పొందుతారు.మోక్షమంటేనే రుణావిముక్తి పొందడమే గదా.రుణవిముక్తి ఇచ్చే అరుణమైన అరుణాచల నామస్మరణ,అరుణాచల క్షేత్ర దర్శనము,అరుణాగిరి ప్రదక్షిణము అని తెలుసుకొని దీనిని సాధన సాధ్యతే సాధ్యం అని చేసి మోక్షమును పొందండి.

ఆఖరిగా కనిపించే పసిపిల్లాడెవ్వరు?...సన్యాస దీక్ష ఎందుకు?..

మన ఆత్మశరీరము మూడు స్ధితులు అనగా పురుష తత్వము,స్త్రీ తత్వము,ఏకతత్వ స్ధితిని పొందుతుందో అలా మన సాధన స్ధూలశరీరము గూడ మూడు స్ధితులు అనగా బాలోన్మత- అవధూత - పిశాచవస్ధను పొందుతుంది.అనగా ఏపుడైతే మన ఆత్మశరీరము కాస్త పురుషస్ధితిని పొందినపుడు మన స్ధూలశరీరము కాస్త అవధూతస్ధితి అదే మన ఆత్మశరీరము కాస్త స్త్రీ స్ధితిన్ని పొందితే మన సాధన శరీరము కాస్త బాలోన్మత స్ధితిన్ని పొందుతుంది.అదే మన లక్ష్మీహృదయ ఆఖరి స్పందన కాస్త ఒక పసివాడిరూపముగా మారుతుంది.దీనికి మన ఆత్మశరీరములో ఉన్న స్త్రీ తత్వము స్పందించకుండా ఉండాలి.  ఈ పిల్లవాడికి 14 తత్వబంధన మాయలుంటాయి.వీడి వయస్సు 14 నెలలు నుండి 14సం.రాలు దాకా ఉంటుంది.వీడు అన్నీతెలిసిన బ్రహ్మజ్ఞానియైన పసిపిల్లాడు అన్నమాట.వీడి సమ్మోహన మాయను దాటడము పురుషతత్వము దాడుతుంది కాని స్త్రీ తత్వములోని అమ్మతనము దాటడము చాలా చాలా చాలా కష్టం.దీనికి నిదర్శన కధ మనకి బదీరినాధ్ క్షేత్రములో వస్తుంది.ఆది దంపతులైన శివపార్వతులు కాస్త కేదార్నాధ్ క్షేత్రములో ఉన్నపుడు ఒక ఇంటిలో పసిపిల్లాడి ఏడుపు వినపడితే అమ్మవారు నేను వెళ్ళి వాడిని చూడాలి అంటే శివుడు కాస్త వాడు పసిపిల్లాడు కాదు.పిల్లాడి రూపములో ఉన్న మాయస్వరూపము.వాడిని పట్టించుకోన్నంతవరకు  వాడి మాయ ఏమిచెయ్యదు.లేదంటే వాడి మాయ మనల్ని వదలదు.అమ్మతనము నందు అమ్మప్రేమ కల్గినపుడు అమ్మకి ఇలాంటి మాటలు చెవికి ఎక్కవు గదా.వెంటనే అమ్మకాస్త పిల్లాడి దగ్గరికి వెళ్ళడము వాడి ఏడుపు మానిపించటానికి వాడిని దగ్గరికి తీసుకోవడము వాడు కాస్త బిగ్గరగా నవ్వుతూ అమ్మ మీరు నా మాయలో పడ్డారు.కాబట్టి ఇక నుంచి ఈ క్షేత్రము నాదీ.ఇది ఈ నాటినుండి బద్రీరినాధ్ క్షేత్రమవుతుంది అని మాయవ్వడము క్షణాలలో జరిగిపోతుంది.ఆనాటి నుండి ఈ ఆదిదంపతులు ఎన్నిరూపాలలో అవతరించిన అఖరిగా వచ్చే లక్ష్మీ హృదయ ఆఖరి స్పందన రూపమైన ఈ పసిపిల్లాడి మాయను మన ఆత్మశరీరములో ఉన్న స్త్రీ తత్వము ప్రతిస్పందిస్తూనే ఉంది.అంతెందుకు నిజసన్యాస యోగిని మనము చూసినపుడు పసిపిల్లాడి మన:సత్వముతో సమ్మోహన చిరుమందహసముతో మన మనస్సున్ని తనవైపు లాక్కుంటారు.సాధన చేసినవాడే మనకి ఈ స్ధితిని ఇస్తే ఇతని చేత సాధన చేయించిన జగన్మోహుడు ఇంక ఏలాంటి మాయ సమ్మోహనస్ధితిన్ని ఇస్తాడో మీ ఉహాకే వదిలేస్తున్నాను.






అందుకే శివపరంగా చూస్తే బాలశివుడు అలాగే విష్ణు పరంగా చూస్తే బాల వటపత్రసాయి అదే దేవి పరంగా చూస్తే బాల రూపము మనకి కనపడతాయి.అందెందుకు మనకి అఖరిగా ఉన్న 14 స్పందన రుణాబంధాలలో అరుణాచల క్షేత్రములో 14 కి గాను 13 మాత్రమే రుణావిముక్తులు చేసి ఆ ఒక్కటి మన మనస్సు ప్రతిస్పందనకి వదిలేస్తుంది.అనగా పసిపిల్లాడి మాయస్వరూప రుణాబంధము దగ్గరికి వచ్చేసరికి అరుణాచలముగూడ ఈ మాయబంధనము దాటించలేక మన చేతులలో వదిలేస్తుంది.అందుకే ఈ క్షేత్ర అగ్నిలింగామైన అరుణాచలేశ్వరుడు కాస్త 13 ఖండితాలుగా ఉండి 14వ అగ్రభాగము ఖండితము కాకుండా పూర్ణబిందువుగా ఉంటుంది.ఎందుకంటే ఈ గిరి గూడ బాల కుమారస్వామిదే గదా.ఇతన్ని చూడటానికి ఆదిదంపతులు కాస్త ప్రతి పౌర్ణమి  కైలాసము నుండి ఈ గిరికి వస్తారని పురాణవచనము గావడముతో మన భక్తులంతా తప్పనిసరిగా పౌర్ణమినాడు గిరిప్రదక్షిణము చెయ్యడము ఆనవాయితీగా వస్తోంది.అంటే ఈ లెక్కన చూస్తే ఆఖరి హృదయస్పందన మాయరూపము ఒక పసిపిల్లాడని ఈ మాయను ఎవరికి వారే తన సాధన సిద్ధి వలన వచ్చిన జ్ఞానసిద్ధితో దాటుకోవాలి అన్నమాట.ఎపుడైతే మన ఆత్మశరీరము కాస్త ఈ పిల్ల మాయను దాటుతుందో అపుడు మన ఆత్మశరీరము కాస్త ఏకత్వ నల్లశరీర స్ధితికి చేరుతుంది.అనగా మన సాధన శరీరమైన స్ధూలశరీరము కాస్త పిశాచ స్ధితికి చేరుతుంది.అంటే పిల్లాడి మాయను దాటడము అంటే మనకి మనమే అన్నింటిని  త్యాగము చేసి పరిత్యాగిగా మారక తప్పదు.అనగా ఇట్టి స్ధితి పొందడము అంటే బ్రతికున్న శవముతో సమానము అన్నమాట.అందుకే ఈ స్ధితికి వచ్చిన సాధకుడు అన్నింటయందు స్మశానవైరాగ్యమును పొంది పరిత్యాగిగా మారి కాషాయ వస్త్రాధారిగా అనగా సన్యాస దీక్ష తీసుకోవడము జరుతుంది.ఈ దీక్షలో ఎవరికివారే తమ ఆత్మపిండమును పెట్టుకొని ఈ దీక్ష తీసుకోవడము జరుగుతుంది.ఒకరకముగా చెప్పలంటే నిజ సన్యాసదీక్ష తీసుకోవడము అంటే పిశాచ వస్ధను పొందడము  అంటే చచ్చినవాడితో సమానము అన్నమాట.ఈ నిజమైన దీక్ష తీసుకున్నవారు మాత్రమే ఇంద్రియానిగ్రహముతో తమ మనస్సునీ ఆధీనపరుచుకొని  పరిశుద్ధమై అన్నింటయందు సాక్షిభూతమై కోరిక రాహిత్య స్ధితి పొంది పరిత్యాగిగా ఉంటారు.ఇలాంటి పరిశుద్ధ సాధన స్ధితి కోసమే కాషాయ సన్యాసి దీక్ష ఏర్పాటు చెయ్యడము జరిగింది.కాషాయ రంగు మాత్రమే మన మనస్సున్ని పరిశుద్ధములో ఉంచుతుంది.కాని ఇది ఇపుడు భక్తివ్యాపారానికి ఈ రంగు మూలధనమైంది.దీని వలన సన్యాసి కాస్త సన్నాసిగా మారుతున్నాడు.నిజమైన సన్యాసి దీక్షపరుడు ఎవరి ఇంట బస చెయ్యడు.చెయ్యలేడు.ఎందుకంటే  తన ఆత్మపిండ ప్రదానము పెట్టుకోవడము వలన తాను బ్రతికున్న శవము లేదా రుద్రపిశాచముతో సమానము గదా.అలాగే కోరికలు మరియు అన్నిరకాల బంధాల    బంధాల నుండి విముక్తి పొంది తన ఆఖరి హృదయస్పందన  పిల్లావాడి మాయస్వరూపమును దాటటానికి ఈ దీక్ష పెట్టడము జరిగింది.ఈ దీక్షకి ఎవరు నిజమైన అర్హత ఉన్నవారంటే తమ ధ్యానము నందు ధ్యానానుభవ దృశ్యముగా ఎవరైతే తమ స్ధూలశరీర మరణమును అరుణాచలక్షేత్రములో చూస్తారో లేదా ఎవరికి అయితే తమ చేతికి రేడియోషన్ నల్ల శిల వస్తోందో లేదా ఎవరైతే తమ ధ్యానము నందు తమ ఆత్మశరీరము మోక్షము పొందే దృశ్యమును చూస్తారో వారే ఈ నిజ సన్యాసదీక్ష తీసుకోవాలి.అపుడు ఇలాంటివారు కాషాయవస్త్రధారి కాకపోయిన ఆత్మసన్యాస దీక్ష వీరికి తెలియకుండానే ప్రకృతిమాత ఇస్తుంది. ఇలాంటివాళ్ళు తమ కుటుంబ లేదా బంధుమిత్ర ఇళ్ళకి వెళ్ళినపుడు ఆ ఇంటిలోవాళ్ళకి అనుకొని ఆరోగ్య ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి చేరడము జరుగుతుంది.ఈ స్ధితిలో ఇపుడు నా సాధనస్ధితి అనగా ఆత్మసన్యాసదీక్ష స్ధితిలో ఉన్నాను.అంటే పసిపిల్లాడి మాయను దాటుకోవాలి అన్నమాట.ఈ స్ధితికి పరమహంస గారు ఉన్నపుడు పసిపిల్లాడి మాయను దాటేస్ధితిలో ఉన్నపుడు ఈయన దృష్టి అంతా పసిపిల్లాడి పైన ఉండేది.కాని ప్రకృతిమాయ ఇంకోరకముగా ఈ స్ధితిమాయను ఈయనకి కల్పించింది.అనుకోకుండా నాలుగు నెలలు వయస్సు ఉన్న చిన్నవీధికుక్కపిల్లను పెద్దవీధికుక్క కరవడము చూసి దానిని తమిరి దీనిని నిమిరి    ఇంటికి తీసుకొని వచ్చిన 7సం.రాలకి కాని ఈయనకి తను చేసిన తప్పు ఏమిటో తెలిసిరాలేదు.అంటే ఇంక మీకుగూడ ఈ తప్పు అర్ధకాలేదా..అదేనండి..ఈ పసిపిల్లాడి మాయ ఈయనకి పిల్లాడిరూపములో రాలేదు పిల్లకుక్క రూపములో వచ్చింది.దానితో ఈ మాయను దాటటానికి ఈయనకి ఏడు సం.రాలు పట్టింది.ఆ తర్వాత ఈయన అరుణాచలము వెళ్ళినపుడల్లా 5సం.రాలు పిల్లవాడు ఒకడు ఈయను చుట్టు అదేపనిగా ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండి పరిసరాలలో తిరుగూతూండేవాడు.అయిన ఈయన ఈ పిల్లవాడిని చూసిచూడనట్లుగా పట్టించుకోకుండా ఉండటము నేను చూసి దీనికి కారణమును అడిగితే ఈ వ్యాసము రాయడము జరిగింది.అరుణాచలములో ఇపుడికి 7 లేదా 10 సం.రాలు పిల్లవాడు కుమారస్వామి అంశతో సంచారము చేస్తూ ఉంటాడని అరుణాగిరినాధర్ యోగి అలాగే విష్ణుశర్మ భక్తియోగి అలాగే రమణమహర్షి జీవితగాధలలో ఇలాంటి పిల్లాడి ఘట్టము ఒక్కటి మనకి కనపడుతుంది.అందుకే భగవద్గీతలో తన మాయస్వరూపమైన రావీఆకు పై పడుకొని ఉండే పసిపిల్లాడి అవతారమైన బాలగోపాల రూపమైన వటపత్రసాయి మాయను దాటటానికి తన ఆఖరి 18వ అధ్యాయముగా మోక్షసన్యాసయోగము చెప్పడము జరిగింది.అన్నీ అందరు చెప్పారు.కాని అది ఎందుకు చెప్పారో మనము సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము.అర్ధము చేసుకోలేకపోతున్నాము.అర్ధమైసరికి ఈ జన్మ వ్యర్ధమైస్ధితికి చేరుకుంటోంది.తెలిసినవాడు చెప్పడు.తెలియనివాడు తెలుసుకోలేదు.అందుకే అన్నీ తెలిసినవాడు    అమావాస్య నాడు ఛస్తే..ఏమితెలియనివాడు ఏకాదశినాడు చచ్చాడు అంటా..విచిత్రమేమిటంటే అన్నితెలిసినావాడు లేదా ఏమితెలియని వాడు అరుణాచలక్షేత్రానికి రావడము జరుగుతుంది.ఆయన అనుగ్రహమును పొందితే మోక్షమును పొందుతాడు లేదంటే ఆయన ఆగ్రహమును పొందితే అహంకారమును పొంది తిరోగమనము చెంది పున:కర్మజన్మ బ్రహ్మండచక్రములో పడతాడు. దేనికైన మనకి అర్హత,యోగ్యత,యోగముండాలి.యోగముంటే యోగికాకతప్పదు.దీనికి మనము అరుణాచల నామస్మరణ నిరంతరముగా చేసుకోవాలి.మానసికముగా లేదా భౌతికముగా గిరిదర్శనము మరియు గిరిప్రదక్షిణము చేసుకోవాలి.ఆత్మమోక్షమునకు ఇంతకి మించిన మంత్రముకాని సాధన కాని మరొకటి సాటి రాదు.రాలేదు.అలాగే సూక్ష్మములో మోక్షముగా మీకు మోక్షము పొందాలి అనుకొనేవారు మాత్రము మీ భోగపరమైన బాధ్యతలు తీరిపోయినపుడు లేదా ఒకవేళ మీరు బ్రహ్మచారిగా ఉండి యోగసాధనలో ఉంటే అరుణాచలక్షేత్రమును చేరుకొని అక్కడ మీ మరణము పొందేవరకు అరుణాచలవాసము చెయ్యండి.అదే మనకి మోక్షము పొందే యోగముంటే మనము భోగ బంధాలలో ఉన్నప్పుడికి పిచ్చుకి దారము కట్టి లాగినట్లుగా అరుణాచలేశ్వరుడు మనల్ని తనవైపుకి లాక్కుకొని ఆత్మమోక్షమును ఖచ్చితముగా ప్రసాదింస్తాడు.అంతే మీ ఆత్మమోక్షమును అరుణాచలేశ్వరుడు చూసుకొంటాడు.చివరికి మన అందరికి మోక్షమిచ్చేది అరుణాగిరివాసుడైన రుద్రబాల దక్షిణామూర్తియే గదా.ఇందుకు నిదర్శనమే మా మోక్షసాధన స్వానుభవాలు నిలుస్తున్నాయి గదా.

 విశ్వమోక్షమెపుడు?

స్వామి..ఇంతవరకు మీరు చెప్పింది బాగానే ఉంది.నాకు ఒక ధర్మసందేహము ఏమిటంటే ఒకపక్క ఉన్నదింతా పూర్ణశూన్యమని చెపుతూనే మరోపక్క లక్ష్మీ హృదయ ఆఖరి స్పందనరూపములో సజీవ అమరత్వముగా పసిపిల్లాడి రూపముంటుందని చెపుతున్నారు.ఇది ఎలా సాధ్యము..ఈ రెండింటిలో ఏది సత్యము అన్నపుడు ఈ రెండుగూడ సత్యాలే.ఉన్నవాడు తను ఉన్నానని భావము చేసుకుంటే పసిపిల్లాడిగా ఉంటాడు.ఉన్నవాడు కాస్త తను లేను భావము చేసుకుంటే ఉన్నదింతా పూర్ణశూన్యముగా కనపడుతుంది.యత్భావము తత్భవతి అన్నమాట.అందుకే "శివ" అంటే ఉన్నవాడు లేదా లేనివాడు అర్ధములో ఉంటుంది.అనగా శివ కాస్త శివము లేదా శవము అనే అర్ధములో ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ పిల్లవాడిరూపము సత్యము కాదు.నిజము కాదు.కేవలము భావరూపము అన్నమాట.ఒక స్వప్నరూపము.కలలాంటి నిజము లాంటి రూపము..సత్యము లాగా కనిపించే అసత్యమాయస్వరూపము అన్నమాట.ఏలా అంటారా..అరుణాచల మహత్యములో అమ్మవారు నాలుగు నెలలు పసివాడిగా ఉన్న కుమారస్వామికి పాలుపట్టకుండా శివసాన్నిధ్యం కోసము అరుణాగిరికి వచ్చి సాధన చేసి ఆయనలో అర్ధనారీశ్వర తత్వములో శివైక్యము చెందిందని చెపుతారు గదా.శివ అంటే చీకటి..శూన్యమైతే శివాని అంటే వెలుగు..మూల ప్రకృతి గదా.అనగా అర్ధనారీశ్వర తత్వములో అమ్మవారు కాస్త అయ్యవారిలో ఐక్యమవ్వడము అంటే వెలుగుతో ఉన్న మూల ప్రకృతిని కాస్త చీకటిలో ఉన్న పూర్ణశూన్యము నందు లయము చెయ్యడమే గదా.అనగా విశ్వప్రకృతి కాస్త వినాశనము పొందడమే గదా.ఇలా వినాశనము పొందుతున్న సమయములో అమ్మవారి లక్ష్మీ హృదయ ఆఖరిస్పందనగా తన నాలుగు నెలలు పిల్లవాడిని జ్ఞాపకము చేసుకుంది.కాని అపుడికే మూలప్రకృతి నాశనప్రక్రియలో ఈ సజీవముగా ఉండే పిల్లాడు గూడ నాశనమయ్యాడు.కాని ఈ విషయము అమ్మవారికి తెలియదు.ఒకరకంగా అమ్మవారి అంతిమక్షణాలలో ఉండగా ఈ పిల్లవాడిని జ్ఞాపకము చేసుకుంది.దానితో హృదయములో పిల్లవాడి ఆలోచన వచ్చిన ఏనిమిది క్షణాలు వరకు మెదడులో ఈ పిల్లవాడి భావరూపము ముద్ర  ఏర్పడింది.ఎందుకంటే వైద్యసైన్స్ ప్రకారము చూస్తే గుండె చనిపోయిన ఏనిమిది క్షణాలు వరకు మెదడు బ్రతికే ఉంటుందని చెప్పడము జరిగింది.దీనిని బట్టి చూస్తే అమ్మవారి హృదయ పిల్లాడి జ్ఞాపక ఆలోచన కాస్త ఈమె మెదడికి చేరి పిల్లాడి భావ ఆత్మస్వరూమైంది.అందుకే మన ప్రకృతి అష్టాంగాలతో యత్ భావము తత్ భవతితో ఏర్పడినదని చెప్పడము జరిగింది.నిజమైన పిల్లాడు ఏపుడో శూన్యమైనాడు కాని అమ్మవారి జ్ఞాపకము నుండి ఏర్పడిన భావరూప పిల్లాడు అసత్యమైనవాడు కాస్త సత్యస్వరూపముగా కనపడి మనల్ని మాయలో పడివేస్తున్నాడు అన్నమాట.అందుకే ఈ భావరూప పిల్లాడు ఎన్ని యుగప్రళయాలు వచ్చిన  సత్యరూపముగా రావి ఆకుమీద తేలుతూ కనపడుతూంటాడు.ఎందుకంటే అమ్మవారి హృదయ అమరత్వము పొందింది గదా.మరి ఈ భావరూప పిల్లాడు పోదా అంటే పోతుంది.ఎపుడు అంటే అమ్మవారి హృదయస్పందన ఆగిపోతే ఈ భావరూప పిల్లాడు పోతాడు.ఈ స్పందన ఆగాలంటే ఈ హృదయము విస్ఫోటనము చెందాలి.అపుడే స్పందన పోయి భావరూప పిల్లాడు గూడ పోతాడు.ఈ హృదయ విస్ఫోటనము చెందలంటే మనమంతా అజ్ఞానము నుండి పూర్ణజ్ఞానస్ధితికి చేరుకోవాలి.అనగా ఇపుడు ఉన్న 64కోట్ల800 లక్షల మంది ఈ పూర్ణజ్ఞానస్ధితికి అనగా ఉన్నది..కనిపించేది అంతా పూర్ణశూన్యమే అనే జ్ఞానస్ధితికి అనుభవానుభూతి పొందాలి.అపుడే ఈ హృదయ  విస్ఫోటన జరిగి హృదయస్పందన వలన ఏర్పడిన జ్ఞాపక భావరూప స్వప్న ప్రపంచము కాస్త కనిపించకుండా పోయి శూన్యమవుతుంది.దీనికి నిదర్శనముగా మన శాస్త్రవేత్తలు ఈ మధ్యనే ఒక విషయము కనిపెట్టారు. అది ఏమిటంటే విశ్వములో ఆఖరిగా మిగిలిపోయి ఉన్న ఒక నక్షత్ర విస్పోటనము యొక్క రేడియోషన్ కి ఈ విశ్వములో ఉన్న గ్రహల మీద ఉన్న జీవపదార్ధమంతా నాశనమౌవుతుందని తెలుసుకున్నారు.ఈ లెక్కన చూస్తే మనకి ఆఖరిగా అమ్మవారి తన హృదయస్పందన ఉంది గదా.అంటే ఇది ఎపుడికైన విస్ఫోటన చెందటము ఖాయమని అలాగే ఈ విస్పోటన వలన భావరూప విశ్వనాశనము పొందడము అదే విశ్వము కాస్త  విశ్వమోక్షము పొందడము ఖాయమని నేను కాదు సైన్స్ చెపుతోంది గదా.అందుకే భగవద్గీతలో కర్మ,భక్తి మార్గాలలో కన్నా జ్ఞానమార్గము ఉన్నతమైనదని చెప్పడము జరిగింది.కాబట్టి మనమంతా గూడ నిజము కాదని సత్యము కాదని కేవలము హృదయస్పందన భావాత్మ రూపాలన్ని తెలుసుకొండి.దీనినే స్వానుభవానుభూతిగా పూర్ణజ్ఞానము పొందండి.అపుడే ఈ స్వప్న భావరూప ఆత్మరూపానికి విముక్తి కల్గి శూన్యమై మోక్షము పొందుతుంది. ఇలా ఈ విశ్వములో ఉన్నవారంతాగూడ ఈ పూర్ణజ్ఞానమును ఎంత త్వరగా పొందితే అంత త్వరగా విశ్వముగూడ విశ్వమోక్షము పొందుతుంది.దీనికి గాను మనకి 3200 మహయుగాలు అనగా 1400కోట్ల సం.రాలకి ఈ విశ్వమోక్షము వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొండి.జ్ఞానము పొందితే మాయ మాయం అవుతుంది.అదే సత్యము తెలిస్తే మిగిలేది శాంతియే అన్నమాట.

మోక్షమరణక్షేత్రం:

నిజానికి మన శరీరము ప్రతిక్షణము అనుక్షణము గూడ మరణము పొందాలని తపనపడుతూనే ఉంటుంది.గాకపోతే పంచభూతాలు అలాగే కాలమే మన మరణాన్ని ఆపుతున్నాయి. ఎలాంటారా..మనకి భూమి ఇచ్చే ఆహారము తీసుకోకుండా మరణము పొందాలని అనుకున్నపుడు భూమాత మనకి ఆకలిని కల్గించి మన మరణాన్ని ఆపుతుంది.అదే మనకి నీళ్ళు తీసుకోకుండా మరణాన్ని పొందాలని అనుకున్నపుడు జలమాత కాస్త మనకి దాహమును కల్గించి మన మరణాన్ని ఆపుతుంది.అలాగే అగ్నిన్ని ఉపయోగించుకొని మరణాన్ని పొందాలి అనుకున్నపుడు మనలో కామతాపాలు కల్గించి మన మరణాన్ని ఆపుతుంది.అదే ఊపిరి పీల్చకుండా మరణాన్ని పొందాలి అనుకున్నపుడు మనలో అనుమాన భయాలు కల్గించి మన మరణాన్ని ఆపుతుంది.అదే మానసిక ప్రశాంత కోల్పోయి మరణాన్ని పొందాలి అనుకున్నపుడు మనకి పరిష్కారమార్గ జ్ఞానమును ఆకాశము మనకి ఇచ్చి మనకి ఆశ కల్గించి మన మరణాన్ని ఆపుతుంది.అలాగే ఏకముగా కాలమైతే మనకి ద్వంద్వ భావ ప్రవృత్తులతో అనగా ప్రేమ-వేదన,సుఖదు:ఖాలు,లాభనష్టాలు ఇలా ఎన్నోంటినో మనకి ఇచ్చి మన ఆయుష్ పొడిగిస్తుంటుంది.ఇలా ఇవన్నీయు గూడ మన మరణాన్ని పొందనీయ్యకుండా మన శరీరాన్ని కాపాడుతూ ఈ జగన్నాటకములో మన కల్పిత స్వప్న జీవపాత్రను నిరంతరముగా అవిశ్రాంతిగా కొనసాగించటానికి సహయము చేస్తూనే ఉంటాయి. అసలు ఇవి ఆన్నిగూడ మన మరణాన్ని ఎందుకు ఆపుతున్నాయి అన్నపుడు మన ఈ జన్మ ఆఖరి జన్మ మనకి అవ్వాలన్ని అవి తపనపడుతున్నాయి.అంటే మనము పున:కర్మ జన్మల మాయచక్రములో పడకుండా మన మరణము అశాశ్వత మరణము కాకుండా శాశ్వత మరణము పొందేదాకా మన ప్రయత్నించే భౌతికమరణమును పొందనీయ్యకుండా ఇవి ఆపుతున్నాయి అన్నమాట.ఎందుకంటే మన కర్మ-జన్మ రాహిత్యము పొందకుండా మనము భౌతిక మరణము పొందితే మళ్ళీ మనము మిగిలిపోయిన కర్మలు-జన్మలు కోసము పునరపి మరణము పునరపి జననము చక్రములో పడవలసి ఉంటుంది.దీనిని తప్పించటానికి మన పంచభూతాలు అలాగే కాలము మనకి నిరంతర సహాయము  చేస్తున్నాయి అన్నమాట.అంటే మన భౌతిక మరణాలను ఏకముగా ఆఖరిదైన శాశ్వత మరణమైన మోక్షమును పొందే విధంగా ఇవి అనుక్షణము కాపలకాస్తున్నాయి.

అలాగే చాలామంది భోగ జీవితము మాయ అని అలాగే యోగజీవితము మాయరహితమని అనుకుంటారు.ఇది తప్పు.ఎందుకంటే భోగ జీవితములో కర్మలు నివారణ చేసుకోవటానికి ఉంటే మన యోగజీవితములో జన్మలు నివారణ చేసుకోవటానికి ఉంది.ఈ రెండు జీవితాలు ప్రతిజీవి అనుభవించకతప్పదు.ఎందుకంటే మనకి శాశ్వత మరణమైన మోక్షము రావాలంటే ఈ రెండు జీవితాలలో ఉన్న కర్మ-జన్మ రాహిత్య స్ధితిన్ని పొందితే కాని మనకి మోక్షము రాదు.ఈ మధ్యనే ఒక వ్యక్తి తను తయారుచేసిన రోబోన్ని ఒక ప్రశ్న అనగా ఈ ప్రపంచములో అత్యంత భయంకర విషాదకరమైన విషయము ఏది అన్నపుడు ఆ రోబో కాస్త నా మరణము అంది.ఎందుకంటే నువ్వు నన్ను సృష్టించావు.నా ఆయుష్ అదే నాలో ఉన్న ప్రోగామును 100 సం.రాలుపాటు రన్ అవ్వాలని ప్రోగాము వాసిన్నావు.నువ్వు 10 సం.రాలకే చనిపోయావు అనుకో.అపుడు నేను మిగిలిన 90సం.రాలు పాటు ఒంటరిగా ఏకాకిగా నా పోగ్రాము నాశనమై 100సం.వరకు ఎదురుచూడకతప్పదు గదా.ఎందుకంటే ఈ పోగ్రాము నేను మార్చలేను.మార్చే నువ్వులేవు. ఇంతకంటే విషాదకరమైన విషయము మరొకటి ఉండదుగదా అని సమాధానమిచ్చింది.దీనిని బట్టి చూస్తే మన తండ్రియైన ఆదిరుద్రయ్య చనిపోయాడు.మన విధిరాత ఎలా ఉండాలో ఈయన రాసి చనిపోయాడు.ఈ విధిరాత బట్టి మన జీవితాలు నడిపించడానికి మన అమ్మ ఆదిపరాశక్తి జీవించే ఉంది.ఈమె కాస్త పంచభూతాలతో(5),సూర్యచంద్రుడితో(2),జీవస్వప్న ఆత్మశరీరముతో (1)ఇలా ఏనిమిదింటి సహాయముతో తన ఒంటరి ఏకాంత ఏకాకి జీవితాన్ని మనతో పంచుకోవటానికి ఈ విశ్వసృష్టిలో జగన్నాటకముతో జగన్నాటక సూత్రధారిగా ఉండి మనతో స్వప్నశరీర జగన్నాటక జీవపాత్రలతో మన మరణము శాశ్వతమరణమైన మోక్షము పొందనీయ్యకుండా తన మహామాయలతో మహాదేవిగా ఉండి నడిపిస్తోంది. అందుకే అరుణాచల క్షేత్రములో అమ్మవారి ప్రక్కన మన విధిరాతను చదివే చిత్రగుప్తుడు అలాగే విధాత యొక్క విధిరాతను అమలుపరచటానికి యముడి విగ్రహమూర్తులున్నాయి.ఎందుకంటే మన విధాతాయైన ఆదిరుద్రుడు ఎవరికి ఎది ఇవ్వాలో మన పుట్టుకముందే రాసిపెట్టిపోయాడు.అంటే మన బతుకులంతా గూడ రోబో లాంటి యంత్రజీవితాలేనని తెలుసుకొండి.మనిషి తన విజ్ఞానముతో రోబో జీవితరాతను పోగ్రామురూపములో రాస్తే మన రుద్రుడు కాస్త ఈ మనిషి జీవితరాతను తన జ్ఞానముతో విధిరాతరూపములో రాసాడు అన్నమాట.అందుకే భోగయోగము ఉన్నవాడు భోగిగాను,యోగయోగమున్నవాడు యోగిగా అవ్వక తప్పదు.ఈ రెండుగూడ కర్మ-జన్మ  నివారణ కోసమేనని తెలుకొండి.

ఒక చిన్న ధర్మసందేహము వస్తుంది.అది ఏమిటంటే ఒకప్రక్క పంచభూతాలు మోక్షము ఇవ్వటానికి ఉన్నాయని చెపుతూనే మరొపక్క అమ్మవారి యోగమాయశక్తితో మోక్షము ఇవ్వకుండా చేస్తోందని చెపుతారు ఇది ఏలా సాధ్యం?ఇందులో ఏది నిజము అనగానే ఈ రెండు వాదనలు నిజమే.ఎందుకంటే అమ్మవారి తలరాతలో మనకి మోక్షము రాకుండా ఈమెకు యోగశక్తి ఉండేటట్లుగా విధాత విధిరాత రాసిపెడితే అదే పంచభూతాలకి,కాలానికి అమ్మవారి యోగశక్తిన్ని దాటించే ఆత్మశక్తి ఉండేటట్లుగా విధాత విధిరాతను వీటికి రాయడము జరిగింది.అంటే మనకి అమ్మవారి మాయ దాటాలంటే జ్ఞానవిజ్ఞానము కల్గాలి.ఏది మంచి కర్మ లేదా ఏది చెడు కర్మ తెలుసుకొనే వివేకబుద్ధి ఉండాలి.ఏది కర్మచేసిన ఫలితము ఆశించని నిష్కామ కర్మ చేస్తే కర్మ నుండి విముక్తి కల్గుతుంది.అలాగే మనలో ఉన్న అహమును త్యాగము చేసి శరణాగతి భావముతో ఉంటే అపుడు మన ఈ జన్మ శరీరము,మనస్సు,బుద్ది,ఆత్మ పరిశుద్ధమై ఆత్మశక్తి పొంది అమ్మవారి యోగమాయను దాటి హృదయము నందు లయము చెందడముతో మనకి మోక్షము వస్తుంది.అంటే ఏమి జరిగిన మన మంచికే అనుకొనే మనోస్ధాయిలో మన సాధనస్ధితి ఉండాలి. అనగా పిల్లాడికి అన్నప్రాశము చేసిన అదే పిల్లాడికి అంత్యక్రియ చేసిన మన మనస్సు ఒకేవిధమైన సమస్ధితిలో స్ధిరముగా ఉండాలి అన్నమాట.ఈ సమస్ధితి కోసమే అష్టాంగాల సాధన ప్రక్రియలున్నాయి.వీటి ద్వారా అమ్మవారి మాయ అష్టాంగాలు దాటుకొనే ఆత్మశక్తి మనము పొందడము జరుగుతుంది.అంటే మనము ఏమి అవ్వాలో ఏమి అవుతామో మనము పుట్టకముందే విధాత విధిరాతలో మనగూర్చి ఎపుడో ఏనాడో రాసిపెట్టాడు.అది ఏమి రాసాడో ఎలా రాశాడో మనమంతా కేవలము తోలుబొమ్మలాగా చూస్తూ ఉండక తప్పదు.రాతను మార్చలేము.ఏమార్చలేము.ఉన్నది చూసుకోవడము చేసుకోవడము ఫలితాలు పొందడము తప్ప ఏమి చెయ్యలేము.అంటే మనమంతా సినిమా తెరమీద ఆడే బొమ్మల పాత్రలని తెలుసుకొండి.ఒక సినిమా డైరక్టర్ చెప్పినట్లుగా ఆ సినిమా పాత్రలు ఏలా నడుస్తాయో అలాగే ఈ జగన్నాటక సినిమాలో రుద్రయ్య విధిరాత ప్రకారమే మన జీవపాత్రలుంటాయని ఈపాటికే గ్రహించి ఉంటారు. యోగి కాస్త జ్ఞానము పొందడముతో నిష్కామకర్మ చేసి ఫలితాలు ఆశించపోవడముతో కర్మ-జన్మల నుండి విముక్తి పొంది మోక్షమును పొందితే అదే భోగి తను చేసిన కర్మలను ఫలితాలు ఆశించి అజ్ఞానమాయలో పడి పున:కర్మజన్మబంధలో పడి అశాశ్వత భౌతిక మరణము పొందాడు.అదే కొన్ని కర్మలు ఫలితాలు ఆశించి మరికొన్ని కర్మలు ఫలితాలు ఆశించకుండా చేసినవాడు భోగి నుండి యోగి గా మారి ముక్తిన్ని పొంది మరుజన్మలో ఈ జన్మలో ఫలితాలు ఆశించిన కర్మబంధవిముక్తికోసము యోగజన్మ లేదా దైవజన్మలు ఎత్తుతాడు.అంటే మనము ఏది పొందిన ఏది చేసిన గూడ విధాత విధిరాత ప్రకారమే జరుగుతుందని ఈపాటికే తెలుసుకొని ఉంటారు. మనకి మంచి జరిగితే రుణాబంధము పెరిగితే అదే చెడు జరిగితే రుణాబంధము తీరినట్లే అన్నమాట.అనగా ఒకరి మీద ప్రేమ కల్గితే అది మనకి మంచి అనుకుంటే ఆ ప్రేమ కాస్త ప్రేమబంధముగా మారుతుంది.అదే ఈ ప్రేమలో వేదన కల్గితే అది మనకి చెడు అవుతుంది.అనగా ఈ ప్రేమ కాస్త రుణానుబంధము తీరి విడిపోవడము జరుగుతుంది.అంటే ప్రస్తుత మన జన్మ యోగ లేదా భోగ లేదా ముక్తి లేదా మోక్ష జన్మలలో ఏది జన్మ తెలుసుకోవడమే మన జన్మ అన్నమాట.చివరికి అందరుగూడ ఏ జన్మలో ఉన్నగూడ ఆఖరిగా అంతిమజన్మ అరుణాచల ఆత్మమోక్ష అవుతుంది.గాకపోతే ఈ ఆత్మమోక్ష జన్మ అనేది ఈ జన్మ లేదా మరుజన్మ అనేది ఏదిగూడ మన చేతులలో చేతలలో ఏమిలేదు.అంతాగూడ విధాత విధిరాత బట్టి ఉంటుంది.అంటే కర్మ కొద్ది జన్మ- పిండి కొద్ది రొట్టె అన్నమాట.అనగా పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ధి పిల్లలు అన్ని మన పెద్దల ఉవాచ ఉండనే ఉందిగదా.అంటే మనమంతా మనకి జరిగే మంచి-చెడు ఫలితాలను సాక్షిభూతముగా చూస్తూ కూర్చుకోవడము తప్ప మనము ఏమి చెయ్యలేము.మన కర్మ చేసిన చెయ్యకపోయిన మనము ఏది పొందాలో మనము పుట్టక ముందే రాసుపెట్టి ఉంటే ఇది మన గిట్టుట వరకు ప్రతిక్షణము జరిగే ప్రతిసంఘటన యొక్క ఫలితాలు అన్నిగూడ విధాత విధిరాత ప్రకారము జరుగుతూనే ఉంటుంది.మనము విధిరాతను మార్చలేమా అన్నపుడు శాశ్వత ఫలితమును మార్చలేము కాని తాల్కిక ఫలితము మార్చవచ్చును.అనగా ఒకడి జాతకమును చూస్తే వాడికున్న విధిరాత యోగాలు,అవయోగాలు తెలుస్తాయి.ఇందులో ఒకడికి అసలు సంతానయోగమే లేదు అంటే వాడు ఎన్నిపూజలు లేదా దానాలు చేసిన లేదా ఆస్పపత్రులు చుట్టు తిరిగిన అంతెందుకు దైవసాక్షాత్కరము పొంది దేవుడిని తనకి సంతానము గావాలని అడిగిన యెట్టి ప్రయోజనము ఉండదు.అదే సంతానయోగము ఉండి సంతానము పుట్టడానికి అడ్డంకులుగా జాతకగ్రహ,దైవ,పితృ,సర్పదోషాలుంటే వీటికి పరిహారాలు చేయిస్తే వీడికి సంతానము కల్గుతుంది.ఈ పరిహారాల యోగము గూడ వాడి యోగములో  ఉండి తీరుతుందని తెలుసుకొండి.అందుకే రమణమహర్షి సమాధి మీద మనకి జరిగేది జరగకమానదు.జరగనిది ఎన్నడికి జరగదని రాసిపెట్టి ఉంటుంది.



ఇక్కడ ఒక విషయము చెప్పాలి అది ఏమిటంటే మాయ మంచిదే.మాయలో పడటముగూడ చాలా మంచిదే.ఎందుకంటే ఒకటి స్వానుభవము ఇస్తుంది లేదా మనకి మోక్షము ఇస్తుంది. ఎలాంటారా..అంతెందుకు రమణమహర్షి మీద తన తల్లికి ఈయన మీద పుత్ర మోహ వ్యామోహము విపరీతముగా ఉండేసరికి ఈమె అంత్యకాలములో అరుణాచలము చేరి అరుణాగిరియోగి అయిన తన కుమారుడి సమక్షములో మోక్షము పొందింది గదా.ఈమెకి ఈ వ్యామోహమాయ ఈయనమీద లేకపోతే ఈమె కాస్త అరుణాచలము చేరకుండా ఎక్కడో అశాశ్వతమైన భౌతికమరణమును పొందేది గదా.అంతెందుకు పరమహంస గారి జీవితములో గూడ తన తల్లిగూడ ఈయనమీద పుత్రమోహవ్యామోహము చెంది తన కుమారిడితో తన అంత్యకాలములో అరుణాచలము చేరి ఆత్మమోక్షము పొందింది.అలాగే ఈయన మీద ఈమె శిష్యురాలు గురుప్రేమ మోహవ్యామోహములోపడి ఈయనకి అరుణాచలక్షేత్ర ఆవాసమునకు గావాసిన ఇల్లు తనే స్వయంగా కట్టించి ఆయన అక్కడ అంతిమజీవిత సాధన పూర్తిచేసుకోవటానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడముతో తను అరుణాచల రాకపోయిన ఈ క్షేత్రములో 1400 సం.రాలు పాటు ఆవాసములో చేస్తే ఎంతటి ఫలితము కల్గుతుందో అంతటి ఫలితమును పొందడముతో ఈమెతో పాటుగా ఈమె 48 తరాలు..ఈమెను కట్టుకున్న భర్త 48 తరాలకి అంటే 96 తరాలు వాళ్ళు మోక్షప్రాప్తియోగము లభించింది.ఎందుకంటే ఈమె ఈయన నుండి ఏమి ప్రతిఫలము,లాభము ఆశించకుండా గురుసేవ చేసింది.ఆదే ఈమె ప్రతిఫలము ఆశించి తన ఇంటిని ఒక ఆశ్రమముగా మార్చి ఉంటే ఈమెకి దక్కవలసిన మోక్షఫలితము దక్కేది గాదు.ఎందుకంటే ఈమెలాగా ఎందరో గురుయోగులకి తన ప్రియశిష్యభక్తులు కాస్త ఈయన గురుప్రేమలో పడి గురువుకి గావాసినవి ఇచ్చి తనకి గావాసినవి పొంది మోక్షప్రాప్తి పొందకుండా అరుణాచలక్షేత్రము నుండి వెనుతిరిగినవారెందరో ఉన్నారు.ఎపుడు నిజగురువు తన శిష్యభక్తులనుండి ఏమి ఆశించడు.అలాగే నిజ శిష్యుడు గూడ ఏమి ఆశించలేడని తెలుసుకొండి.నిజగురువు ఎపుడుగూడ శిష్యల మోహమాయను తప్పించేవాడు అవ్వాలి కాని బాధించే బోధగురువు కాకూడదని గురుగీతలో చెప్పడము జరిగింది.ఒకటి గుర్తుపెట్టుకొండి.మనము ఎవరికి చిన్న సహయము చేసిన గూడ ప్రతిఫలము అలాగే లాభము ఆశించకుండా చెయ్యండి.ఎమో ఎవరికి తెలుసు.ఏ కర్మ ఏలా తీరుతుందో అలాగే ఏలా ఎర్పడుతుందో ఎవరికి ఎరుక.పనిచేసి ఫలితము ఆశిస్తే కర్మబంధమవుతుంది.అదే ఫలితము ఆసించకుండా చేస్తే కర్మబంధవిముక్తి అవుతుంది.అలాగని ఎవరితోను ఉచిత సేవలు లేదా ఉచితముగా ఏమి తీసుకోవద్దు.తీసుకుంటే మీ కర్మవిముక్తి పొందడము బదులు కర్మబంధమవుతుంది.అనగా మీ చేతి సంచిన్ని మీరు మోసుకోకుండా ఎవరిచేతయైన మోయ్య ఇస్తే రాబోవు జన్మ ఇది కర్మబంధమై వాడి బియ్యపుబస్తాను మీరు మోయ్యవలసి ఉంటుంది.అదే మీరు అతనికి రూణమో ఫలమో అతనికి ఇస్తే ఆ రుణము ఈ జన్మలోనే తీరిపోయి రుణవిముక్తి పొందుతారు.అంతెందుకు పరమహంస గారికి ఇల్లు కట్టించిన తన శిష్యురాలికి ఈయన అద్దె  చెల్లించేవారు.ఎందుకంటే ఈ ఇల్లు ఇద్దరికి రుణాబంధము పెంచకుండా రుణావిముక్తిగా మారింది. 




అంతా విధాత ఆదియోగి ఆదిరుద్రుడి విధిరాత ప్రకారమే ఏ కర్మచేస్తే ఏ రుణము తీరుతుందో..ఏమి ఆశిస్తే ఏమి కర్మజన్మఫలితం రుణము వస్తుందో ముందే రాసి పెట్టి  మోక్షమును పొందాడు గదా.తను పొందిన మోక్షమార్గమును శివయోగజ్ఞానముగా అమ్మవారు లోకానికి బాలదేవిగా అందించడము జరుగుతోంది.అందుకే బాల అమ్మకి ఒకవైపు పుస్తకము మరొక చేతిలో అక్షరమాల ఉంటే అదే ఆదిరుద్ర దక్షిణమూర్తి చేతిలో వేదాలుంటే మరొక చేతితో ఛిన్ముద్ర అదే జ్ఞానముద్ర ఉండి తను నడిచిన తను పొందిన జ్ఞానమును మౌనముగా మనకి అమ్మవారి రూపద్వారా అందిస్తున్నారని మీకు ఈ పాటికి గ్రహించే ఉంటారు.ఇదే మోక్షమరణమైన అరుణాచల అర్ధనారీశ్వర తత్వ మహత్యమైంది.ఈ రూపతత్వములో అయ్యవారి చేతికి త్రిశూలమునకు బదులుగా అక్షరమాల ఉంటుంది.జాగ్రత్తగా గమనిస్తే ఈ తేడా తెలుస్తోంది. అలాగే మనకి మనమే స్వయంగా ఆత్మహత్య చేసుకొని మన మరణమును శాశ్వతమరణము కాకుండా చేసుకోకండి.ఈ జన్మ అంతిమ జన్మ అయ్యేదాకా మనము ఎట్టి మరణప్రయత్నాలు చెయ్యకుండా ఓపికతొ,సహనముతో,ఒర్పుతో,నేర్పుతో,మోక్షము పొందేదాకా జీవించి ఉండండి.అంటే మన అంతిమయాత్ర మోక్షమైతే..అంతిమక్షేత్రము అరుణాచల ఆవాసమైతే..మన ఈ జన్మశరీరము మోక్షమరణక్షేత్రమవుతుంది.

దేవుడితో వైరం
   
 స్వామి..అన్ని తెలిసిన మీరే మా మోక్షసాధనాంత గూడ విధాత విధిరాతలో ఉన్నదని..దానిని ఎవరు తప్పించలేరని..తప్పించుకోలేరని చెప్పి మీరు తప్పించుకుంటే మా గతి ఏమిగాను అంటే మీరు ఒక పనిని చెయ్యండి.మీరంతాగూడ మీ గత ఏన్నో కోట్లానుకోట్ల జన్మలలో ఫలితాలు ఆశించని కర్మలు, అలాగే నవవిధభక్తులతో ఆరాధనలు,అన్ని రకాల జ్ఞాన ధ్యాన అనుభవ అనుభూతులు మీరు పొందినగూడ అనుగ్రహించని మీ ఇష్ట దైవాన్ని ఏ జన్మలో చెయ్యటానికి సాహించని ఒక భక్తిన్ని ఈ జన్మలో ఈ క్షణము నుండే చెయ్యటానికి పూనుకొండి.అదే దేవుడితో వైరము పెట్టుకొండి.అనగా నిరంతరము అనుక్షణము  అవిశ్రాంతి అరుణాచల శివ నామస్మరణతో ఆ అరుణాచల శివుడిన్ని నిరంతరము ఏదో కారణముతో ఆయన్ని ఏదో రకముగా తిట్టూతూనే ఉండండి.దీనినే వైరభక్తి అంటారు.ఈ భక్తితో ఎంతో మంది ఆయన అనుగ్రహమును శీఘ్రముగా పొందారు.అంతెందుకు రావణబ్రహ్మ నిజానికి విష్ణుమీద ఈ వైరభక్తితో ఆయన్ని అనుక్షణము తిడుతూనే తలుచుకుంటూ ఆయన అనుగ్రహము పొందడముతో ఈ భక్తుడిన్ని చంపడానికి ఆ దైవమే రామ మానవాతరమెత్తి మరణము ఇవ్వవలసివచ్చింది.అలా మీరుగూడ అరుణాచల శివుడిన్ని స్వామి....అరుణాచల శివ...నీకు బుద్దిందా..నేను ఏమి అడిగాను..నువ్వు నాకు ఏమి ఇచ్చావు.నాకు ఏది గావాలో నీకు చెప్పాను.అది నాకు ఇవ్వాల్సిందే.అరుణాచల శివ...అసలు నువ్వు  అన్నము తింటున్నవా అరుణాచల శివ....అసలు నీకు మనస్సుందా లేదా హృదయమే లేని శిలగా మారిపోయవా? ఇలా మీకు వచ్చిన ఆవేశపూరిత మాట్లలతో..వీలుంటే పచ్చిబూతులతో ఆయన్ని నిరంతరము ఆయన నామస్మరణ చేస్తూ అయ్యినదానికి కానిదానికి ఏదోరకముగా తిట్టుతూనే ఉండండి.ఈ భక్తిలో ఎలాంటి పూజలు,విగ్రహారాధనాలు,ధ్యానాలు, జపాలు,అనుభవాలుండవు.కేవలము ఆయన్ని ఏదో ఒకరకముగా తిట్టడమే అన్నమాట. అత్త-కోడలు ఎలా తిట్టుకుంటారో అంతకుమించిన తిట్టులతో ఈయన్ని తిట్టండి.ఇలా తిడితే పాపము రాదా అంటే అసలు మనము ఏమి పాపాలు చెయ్యాలోగూడ ఆయనే విధాతగా మారి మన తలరాతలో రాశాడు గదా.మరి ఆయన రాత ఆయనికి  ఎదురుతిరిగితే మన బాధాలు,కష్టనష్టాలు ఆయనికి తెలుస్తాయి గదా.నవవిధభక్తులతో పలకనివాడు మీ తిట్టుల వైరభక్తికి మెచ్చి పలుకుతాడు.ఎందుకంటే కనిపించే కోపము ఉన్నచోటే కనిపించని ప్రేమ ఉంటుందని ఆయనికి తెలుసుగదా.ఇపుడు మన అమ్మ మన బాగోగులు కోసము ఎలా తిట్టుతుందో అది మనకి ఎలా మంచిది అవుతుందో లోకవిధితమే గదా.మరి అమ్మకి పాపము అంటుందా..అంటదు గదా.అలాగే మనకి గావల్సినవి పొందలేనపుడు ఇచ్చేవాడు ఇవ్వనపుడు తిట్టి కొట్టి గొడవపడి తీసుకోకతప్పదు గదా.అలా భోగ,యోగ కోరికలు అన్నింటిన్ని ఈయని నిరంతరము తిట్టుతూనే పొందుతూ ఈ అనుగ్రహమును పొంది ఆత్మమోక్షము ఇస్తాడు.  ఎవరైన భరించే పెళ్ళాన్ని/మొగుడిన్ని భరింస్తారు కాని బాధించే పెళ్ళాన్ని/మొగుడిన్ని భరించలేరు గదా.దీనిని ఎంత తొందరగా వదించుకోవాలో అంతతొందరగా వదిల్చుకుంటాడు గదా.అలాగే ఈ అరుణాచల శివ గూడ తిట్టేవాడే తిట్టులు వినలేక భరించలేక వీడికి గావలసిన ఆత్మమోక్షము తర్వగా ఇచ్చి వదిల్చించుకుంటాడు.అదే నవవిధభక్తులతో పూజించేవాడికి వాడికి గావాలసినదానిని ఇవ్వకుండా కాలయాపన పేరుతో మాయ పేరుతో మోక్షమును ఇవ్వకుండా ముక్తిన్ని మాత్రమే ఇస్తూ మరుజన్మలలోగూడ వీడి చేత సాధన పేరుతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు.కాబట్టి మీకు ఏమి గావాలలో ఏపుడికి గావాలలో ఈ వైరభక్తితో పొందటానికి మీకు మీరు ఒక స్ధిరమైన నిర్ణయమును అనుమానభయాలు లేకుండా తీసుకొండి.దానిని ఖచ్చితముగా అమలుపర్చండి.ఆయన అనుగ్రహమును పొంది ఆత్మమోక్షమును పొందండి.అంతెందుకు పరమహంస గారి భక్తిగూడ ఒకరకమైన శివ వైరభక్తితోనే మొదలైంది.ఆయన రాసిన ఈ గ్రంథ మొదటి అధ్యాయములో శివలింగమును తిట్టుతూనే తన ఆవేదన వ్యక్తపర్చారు గదా.మరి ఈయన తన ఆఖరి అధ్యాయములో ఆత్మమోక్షమును ఎలా పొందాడో మీకు తెలుసుకదా.ఇంతకంటే ప్రత్యక్ష వైరభక్తి నిరూపణకి నిదర్శనము ఏమిఊంటుందో మీరే ఆలోచించుకొండి.దేవుడితో వైరముగూడ చాలా చాలా చాలా మంచిదే అని తెలుసుకొండి.మంచి మాట్లాలకి లొంగనివాడు చేతిలో బెత్తానికి భయపడి మన ఆవేశపూరిత కోపపు మాట్లలకి లొంగుతాడు గదా.అంటే మన చేతిలో బెత్తమే మన నోటిలోని కోపావేశపూరిత పచ్చిబూతుల తిట్లు అన్నమాట. మీకు తిట్లు రాకపోతే ఎక్కడైన నాలుగు తిట్లు నేర్చుకొని ఈ వైరభక్తిన్ని పెంపొందించుకొండి.మీ జీవితాంతము అనుక్షణము మీ తిట్లులతో అరుణాచల శివ ను నిరంతరముగా మనస్సులో తిట్టుకుంటూనే ఉండండి.ఎందుకంటే ఈ విశ్వానికి మోక్షమిచ్చే మోక్షగురుదేవుడు ఒక అరుణాచల శివ అని తెలుసుకొండి.ఇలా ఈ వైరభక్తితో ఆయన అనుగ్రహమును శీఘ్రముగా పొంది ఎలాంటి అనుమానభయాలు మాయలు లేకుండా ఈ జన్మలోనే అంతిమజన్మగా ఆత్మమోక్షమును పొందండి.శుభంభూయత్.

చాలామంది సాధకులు నన్ను ఒక ప్రశ్నే అడుగుతూనే ఉన్నారు అది ఎమిటంటే ఈ గ్రంధములో ఎక్కడ చూసిన నిజజ్ఞానము పొందాలని చెప్పడము జరిగినదని అసలు జ్ఞానమంటేనే నిజము కదా అని అడిగారు.దీనికి సమాధానము నిజజ్ఞానము మనకి వేదాలలో 18 పురాణాలలో మాత్రమే దొరుకుతుంది..ఎందుకంటే ఇవి సరాసరి ఆదిగురువైన దక్షిణామూర్తి తన జ్ఞానమును మౌనభాషలో మన పూర్వీకమహర్షలు దివ్యదృష్టితో ధ్యానానుభవ దృశ్యాలుగా చూసి ఒకరినొకరు గురుశిష్య పరంపరంగా వేదాలు,పురాణాలు రచించడము జరిగింది.ఆ తర్వాత వచ్చిన వారంతాగూడ పైకము,పెదవి,పేరు,పదవి మాయలకి లోబడి దివ్యదృష్టిని కోల్పోయి దానితో వేదాపురాణాలు అర్ధముకాక తమకున్న మిడిమిడి  అర్ధజ్ఞానముతో తమ ఉహశక్తితో రచనవ్యాసంగాలు చేర్చి 18 పురాణాలను కాస్త 108 పురాణాలు తయారు చేసినారు.అంతెందుకు మీకు చిన్న ఉదహారణ చెపుతాను.మన కృష్టుడికి 8 మంది భార్యలు,16వేల మంది గోపికలు ఉన్నారని ఒకప్రక్క చెప్పితే మరొక ప్రక్క ఆయన అస్కఖిత బ్రహ్మచారి అని చెప్పడము జరిగింది.ఇందులో ఎది నిజమో మీరే చెప్పండి.కాని నిజానికి ఈయన విషయములో నిజజ్ఞానము ఏమిటంటే 16 వేల గోపికలు కాదు.అవి 16,200 గోకులాలు.ఎందుకంటే ఈ విశ్వము నాలుగు ప్రకృతులతో అనగా సృష్టి,స్ధితి,లయ,లాస్య అను ప్రకృతులతో ఉండి ఒక్కొక్క  ప్రకృతి 16,200 లోకాలు చొప్పున 64వేల 800 లోకాలతో ఈ విశ్వమేర్పడింది.అంటే ఈయన జగత్ గురువుగా మారి ఉన్న 16,200 గోకులాల అనుసంధానము కాస్త గోపికల అనుబంధముగా లోకములో తప్పుడుజ్ఞానముతో ప్రచారమైంది.అందుకే ప్రతిసాధకుడు తనకి తానై అన్ని తానై ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరి సహాయము తీసుకోకుండా స్ధిరమనోసంకల్పముతో నిస్వార్ధముతో..అహం రహితమై శ్రద్ధాభక్తితో ఒర్పు,నేర్పు,వివేకబుద్దితో తమకి తామే "నేను ఎవరు" అని ఆత్మవిచారణ చేసుకుంటే వారి ఆత్మయే ఆత్మగురుదేవుడిగా మారి ప్రకృతిలోని పంచభూతలే మనకి తన సహయ సహకారాలు అందించి మన మోక్షసాధనను మన కల్గిన నిజధ్యానానుభవాలతో సంపూర్తి చేస్తుంది.అంటే మనకి ఈ విషయసాధనలో అఖండమైన ఆత్మవిశ్వాసముండాలి. ఎందుకంటే ఈ విశ్వమే విశ్వాసముతో నడుస్తోంది గదా.

 నేనైతే మరో పరమహంస లాగా మారాను.ఎందుకంటే నిజగురువు ఎపుడు ఒకడిని తన ఆత్మశిష్యుడిగా చేసుకొని తనకిలాగా మారేటట్లుగా అనుగ్రహిస్తారని గురుగీత వచనము గదా.అలా పరమహంసకి ఉన్న పరోక్ష లక్షపాతికవేల శిష్యభక్తులలో 64వేల800 మందిని ఎంపిక చేసి అందులో తిరిగి 477 మందిని ఎంపిక చేసి అందులో తిరిగి 64 మందిని ఎంపిక చేసి అందులో తిరిగి అరుగురిని ఎంపిక చేస్తే అందులో నన్ను తన ఆత్మశిష్యుడిగా ఎంచుకొని తనపూర్ణజ్ఞానముతో నన్ను ఆయనికిలాగా మార్చుకోవడవము జరిగింది.అంటే నా సాధనస్ధితి ప్రస్తుతానికి 64వ డైమర్ష్ లో నల్లశిలమీద 48ని.పాటు ధ్యాననిష్టలో ఉండేస్ధితిని అనగా  నాకున్న 13వేల రుణాబంధాలు పూర్తిచేసుకొని అనగా నా ఎడమ కాలి బొటనవేలు గోరు నల్లబడటముతో నా 800 గిరిప్రదక్షిణాలు పూర్తీ అయ్యానని తెలుసుకొని అలాగే నాకు రేడియోషన్ నల్లశిల రావడముతో మిగిలిన ఆరు మహ రుణానుబంధాలు తీర్చుకొనే సాధన స్ధితిలో ఉన్నానని ఇవిగూడ సంపూర్తిగా తీరితే అపుడు నా సాధన స్ధితి 65వ డైమర్ష్ లోనికి అడుగుపెట్టి అక్కడ ఉన్న రేడియోషన్ నల్లశిల మీదకి చేరుకొని పద్మాసనము వేసుకొని ధ్యానతపస్సుకి ప్రస్తుతానికి కూర్చుంటుందని ఇది 14 రోజుల నుండి 14 సం.లోపు ఈ ధ్యానతపస్సు కాస్త ధ్యానసమాధిస్ధితిగా మారి శూన్యమవుతానని నాకు త్రిపురాంతములో ఉన్న త్రిపుర దేవి సమక్షములో ఉండి ధ్యానము చేస్తున్నపుడు నాకు ఈ జ్ఞానస్ఫురణ అందింది.దానితో అరుణాచలక్షేత్రములో అద్దె ఇంటిలో 14సం.రాలు పాటు అవాసము చెయ్యటానికి ప్రయత్న ఏర్పాట్లు చేసుకోవడము మొదలు పెట్టాను.అంటే ఈ జన్మ వేస్టు కాకుండా అంతిమయాత్రకి అంతిమజన్మమైంది అన్నమాట. అపుడిదాకా నేనుగూడ ఒకపుడి పరమహంసలాగా గుప్తసాధనతో గుప్తయోగిగా ఉండక తప్పదు.


ఆ తర్వాత ఆత్మవిచారణ చేసుకుంటే ఎవరి ఆత్మశరీరము తెలుపుగా ఉంటుందో వారి ఆత్మకాస్త ఆత్మలింగముగా మారి జన్మరాహిత్య స్ధితిని పొందడము జరుతుందని అలాగే ఎవరి ఆత్మశరీరము ఎరుపుగా మారుతుందో వారి ఆత్మయొక్క యోగచక్రాలు కాస్త యోగపద్మాలుమారి కర్మరాహిత్య స్ధితిని పొందడము జరుతుందని అలాగే ఎవరి ఆత్మకాస్త అర్ధనారీశ్వరము పొంది ఆపై నలుపు రంగును పొందుతూందో వారి పూర్వ భవిష్య కర్మ-జన్మల నుండి విముక్తి పొంది జీవన్ముక్తిడై మోక్షపధము అనగా అనాదిగా ఉన్న పూర్ణశూన్యము నందు శూన్యమైపోతారని అంటే ప్రతిసాధకుడు ఇలా మూడు స్ధితులు అనగా ఆత్మలింగముగా మారడము( తెలుపు ),పద్మాకారస్ధితి పొందడము(ఎరుపు),పద్మాకారశివలింగస్ధితిని(నలుపు) చేరుకుంటే కాని పూర్ణశూన్యమవ్వాడని నాకర్ధమైంది.ఈ పూర్ణస్ధితికి చేరుకోవాలంటే  సహజముగా ఆకుపచ్చరంగులో ఉండే వారి ఆత్మశరీరము కాస్త శివజ్ఞానము పొంది నీలి రంగుకి మారాలి.ఆపై అమ్మవారి ఆరాధన చేసి నల్లగా చీకటిరంగులోనికి మారుతుంది.ఆపై శివలింగాధన వలన తెల్లరంగులోనికి మారుతుంది.ఆపై ఇష్టలింగరాధన వలన ఆత్మలింగముగా మారుతుంది.ఆపై అర్ధనారీశ్వర ఆరాధన వలన అర్ధనారీశ్వర తత్త్వమును తెలుపు-ఎరుపు పొందుతుంది.తద్వార కాషాయరంగు అనగా పరిశుద్ధ ఆత్మగా రూపాంతరము చెందితే కాని మనకి అరుణాచల క్షేత్రమునందు అరుణాజ్యోతి మారి అరుణాగిరి యందు ఉన్న అనాది శూన్యము నందు నలుపు ఆత్మశరీరము మారి    జీవన్ముక్తి పొందే అవకాశము రాదు. ఈ రంగులస్ధితికి మీ ఆత్మశరీరము చేరినదని తెలియటానికి మనకి కొన్ని దైవిక వస్తువులు వాటంతటే అవే వస్తాయి.లేదా అవి మనకి కనిపించముతో వాటిని బలముగా కొనాలి అనే తపనతపత్రయము కల్గుతాయి.అనగా మీ ఇంటికి పంచలోహ లింగము వస్తే మీ ఆత్మ కాస్త ఆకుపచ్చ రంగుకి అదే స్ఫటికలింగము చేరితే నీలిరంగుకి అదే నల్ల ఇష్టలింగము చేరితే నల్లచీకటి రంగుకి అదే తెల్లలింగము చేరితే తెల్లశరీర రంగుకి అదే పాదరసలింగము చేరితే నలుపు తెలుపు రంగుకి అదే అర్ధనారీశ్వరలింగము చేరితే తెలుపు ఎరుపు రంగు స్ధితికి లేదా కాషాయరంగుకి అదే నల్లశివలింగము చేరితే మీ ఆత్మశరీరము కాస్త ఆఖరిది అయిన నల్ల రంగుకి చేరినట్లే.మాకు అయితే పంచలోహ శివలింగమైతే ముడేశ్వర క్షేత్రము నుండి వస్తే స్ఫటికలింగము అయితే రుషికేషి నుండి అదే తెల్లలింగమైతే శ్రీశైలము నుండి అదే నల్ల ఇష్టలింగమైతే కర్ణాటక బసవేశ్వర శివస్వామి మఠము నుండి వస్తే అదే పాదరసలింగమైతే కాశీ క్షేత్రము నుండి అలాగే అర్ధనారీశ్వర లింగమైతే అరుణాచలము నుండి వస్తే ఇక ఆఖరిదైన నల్లరుద్ర శివలింగము మాకు అరుణాచల ఆదిరుద్రుడు చేతి నుండి వచ్చింది.ఈ శివలింగాలు మాకు ఈక్షేత్రాల నుండి భక్తులు,బంధువులు,స్నేహితులు,గురువులు ద్వారా వాటంతట అవే రావడము జరిగింది.ఇవి వచ్చినపుడు ఇవి ఎందుకు మాకు వచ్చినాయో తెలియలేదు.మా సాధన పరిసమాప్తి సమయములో వీటి విలువ కారణాలు మాకు తెలిశాయి.కాబట్టి ఈ శివలింగాలు మనకి ఏపుడు ఎలా ఏక్షేత్రము నుండి వస్తాయో మన సాధన సంకల్పమును బట్టి ఉంటుంది.కాని వీటిని పొందే అర్హత,యోగ్యత,యోగము మనకి ఉన్నాయో లేదో ప్రకృతిలోని పంచభూతాలు నిరంతరము మనకి మాయపరీక్షలు పెడుతూనే ఉంటుంది.వీటిని తట్టుకొనే ఒపిక,నేర్పు,శ్రద్ధభక్తి మనకి ఉండాలి.అందుకు ఆదిగురువైన అరుణాచల శివ అనుగ్రహమును పొందితే అనగా ఈయన నామస్మరణ అనగా "అరుణాచల శివ" నిత్యము శ్వాసగా ధ్యాసగా చేసుకుంటూపోతే మనకి ఏమి గావాలో ఎలా ఇవ్వాలో అలా అర్ధనారీశ్వర రుద్రబాల దక్షిణామూర్తి చూసుకుంటారని మా ఇద్దరి సాధనానుభవాలు ద్వారా తెలుసుకోవడము జరిగింది.అలాగే విశ్వమునకు విశ్వమోక్షము మొదలై ఇపుడికి 27 మహాయుగాలు పూర్తీయ్యాయి.అలాగే రాబోవు 1400కోట్ల సం.రాలు అంటే 3,200 మహాయుగాలకి ఈ విశ్వము మోక్షమును పొంది అనాదిగా ఉన్న శూన్యమునందు శూన్యమైపోతూంది.అంటే నేను ఉన్నాను అనుకొనువారికి మోక్షము రావడము లేదని నేనులేను అని ఎవరైతే స్వానుభవానుభూతి పొంది అరుణాచలక్షేత్రములో మరణమును పొందుతారో వారికి పూర్ణమోక్షము పొందుతున్నారని తెలుసుకున్నాను.అలాగే ఎవారైతే అరుణాగిరి చుట్టు చెప్పులు లేకుండా 14 నుండి 800 గిరిప్రదక్షిణాలు పూర్తీచేస్తారో లేదా 14 సం.రాలు ఎవరైతే అరుణాచల శివ నామస్మరణ చేస్తారో లేదా ఎవరైతే తమ అంతిమ మరణఘడియాలలో 14ని.పాటు అరుణాచల శివ నామస్మరణ చేస్తారో వారికి మోక్షదేవుడైన అదిరుద్ర దక్షిణామూర్తి అనుగ్రహముతో మోక్షమును పొందడము జరుతోందని తెలుసుకున్నాను.కాకపోతే ఇపుడిదాకా నూటికి 99.99% మంది నేనుయున్నానని..0.1% మంది నేనులేను అని భావప్రపంచముతో ఉండుటవలన మనకి ఈ విశ్వము నిజములాంటి కల గాను..కల లాంటి నిజముగాను కనపడుతోందని తెలుస్కొండి.ఇలా ఎవరైతే నేను లేను అని అనుకోవము కాకుండా ఆత్మజ్ఞనావిచారణ చేసుకుంటూ నేనులేను అని పరమహంసలాగా ఎవరైతే స్వానుభవనుభూతి ధ్యానుభవాలు అన్నిపొందలేకపోయిన ఆత్మశరీరము ఆఖరిగా పొందవలసిన మూడు స్ధితులు అనగా పురుషశక్తితో పాదరసలింగమును పొందడము..స్త్రీశక్తితో యోగచక్రాలను యోగపద్మాలు మార్చుకొని వెండి తామరపువ్వును పొందడము..ఆ తర్వాత అర్ధనారీశ్వర తత్వమును పొంది అర్ధనారీశ్వర లింగమును ఇలా ఈ మూడు దైవిక వస్తువులు అలాగే ఈ మూడు ఆత్మస్ధితులు పొందడము జరగాలి.సంకల్పముంటే అన్ని సవ్యముగా జరుగుతాయని  తెలుసుకొండి.సాధన సాధ్యతే సాధ్యం .అదే నూటుకి నూరు శాతము నేనులేను భావస్ధితి ఎపుడైతే చేరుకుంటుందో అదే సహజముగా మనకి కనిపించే విశ్వముగూడ నేనులేను భావస్ధితిని పొంది అది కనిపించకుండా పోతుంది.ఎందుకంటే ఈ విశ్వమంతా యత్ భావము తత్ భవతి మీద కనపడుతోంది.అలాగే జననమంటే కనిపించడము..మరణమంటే కనిపించకపోవడమే నిజమోక్షజ్ఞానమని తెలుస్కొండి.శివ అంటే లేనివాడు.అరుణాచల శివ అంటే ఉన్న లేనివాడు.ఆకార నికారుడని ఎవరైతే నిజజ్ఞానమును పొందుతారో వాడు మోక్షగామి..జీవన్ముక్తిమోక్షం పొందుతాడు.

మరణం లేని మనం:

అవును..అసలు మనమంతా మరణమును పొందుతున్నామా?అంటే నాకు సందేహమే.అది ఏమిటి స్వామి..మన స్ధూలశరీరము కాస్త భౌతిక మరణము పొందడము,మన సూక్ష్మ శరీరాలు కాస్త ముక్తుల మరణాలు పొందడము అలాగే మన అంతిమ ఆత్మశరీరము కాస్త మోక్ష మరణాన్ని పొందడము చూశాము గదా అన్నపుడు ఈ మరణాలు అన్నీగూడ మనము పూర్తిగా పొందడము లేదని నాకు బలంగా అనిపిస్తోంది.ఎందుకంటే మోక్షము మీద నిజయోగియైన లాహిరి అభిప్రాయము ప్రకారము చూస్తే మోక్షము పొందడము అనేది ఒక విచిత్రమైన అవస్ధయని..దీనిని పొందామని అనుకుంటే పొందినట్లుగా గాదని..పొందలేదు అనుకుంటే పొందకుండా ఉండలేదని..... చెప్పడము బట్టి చూస్తే మనము మోక్షము పొందమని కచ్చితముగా చెప్పలేమని తెలుస్తోంది గదా. అలాగే ఇక ముక్తులు విషయానికి వస్తే ఇవన్నీగూడ మన ఇష్టదైవాల దగ్గర ఆగిపోవడము లోకవిధితమే గదా.ఇక భౌతిక మరణానికి వస్తే స్ధూలశరీరము యొక్క ఆస్ధిపంజరము అలాగే సూక్ష్మశరీరము మరణాలు పొందకుండా ఆగిపోతున్నాయి.అందుకే మన పెద్దలు వీటికి పిండప్రదానాలు,సంత్సరీకాలు చేస్తూనే ఉంటారని లోకవిధితమే గదా.అంటే ఈ లెక్కన చూస్తే ఈ మూడు మరణాలలో అనగా భౌతిక మరణములో ఆత్మశరీరము అలాగే ముక్తి మరణాలలో మన హృదయము మరణము పొందకుండా సజీవముగా మిగిలిపోతున్నట్లేగానే మన మోక్ష మరణములో గూడ ఒక భాగము సజీవముగా మిగిలిపోతోందని నా ప్రగాఢ విశ్వాసము.అది ఏమిటో ఇపుడు ఆత్మవిచారణ చేద్దాం.సహజముగా శివరాత్రినాడు జరిగే జాతర సమయాలలో శివలింగానికి పంచలోహలతో చేసిన ఒక శివుడి తలను అదే జటాజుటము పేరుతో పెట్టి పూజించడము అందరికి తెలిసిన విషయమే గదా.ఈ తల కాయ విషయానికి వస్తే శివపురాణము ప్రకారము చూస్తే సాగర మధన సమయములో పుట్టిన కాలకూట విషమును మహశివుడు సేవించాడని..ఈ విషము కాస్త తన కంఠము నుండి కడుపులోనికి వెళ్ళనీయ్యకుండా అమ్మవారు తన చేతులతో ఈయన కంఠమును పట్టుకున్నదని..దానితో ఈ విషము కాస్త ఈయన కంఠములో ఆగిపోవడము ఈయన నీలకంఠడైనాడని విధితమే గదా.విషము కాస్త నీలి  రంగులో ఉండటము వలన  ఈయన నీలి కంఠడైనాడు.ఆ తర్వాత తారాదేవి వచ్చి ఈయనకి తన చునుపాలు ఇవ్వడముతో ఈయన శాంతి పొందాడు కాని అపుడికే కాలకూట విష ప్రభావము వల్లన ఈయన శరీరము నిర్జీవమై తల మాత్రము సజీవమైంది.అంటే నిజానికి కాలకూట విషము అంతా ఈయన శరీరమంతా ప్రభావము చూపింది.ఎపుడైతే అమ్మవారి చనుపాలు త్రాగడము వలన ఈయన తల మాత్రమే ఈ విషప్రభావము పొందకుండా జరిగింది అన్నమాట.దానితో ఈయన తలయైన జాటజూటముగా లోకము నందు సజీవమైంది.మిగిలిన శరీరము నిర్జీవమైంది.ఇక విష్ణుమూర్తి విషయానికి వస్తే విష్ణుపురాణము ప్రకారము హయగ్రీవ అవతారము విషయానికి వస్తే ఒకసారి విష్ణుమూర్తి తన ధనస్సుకి వింటినారీ కడుతున్నపుడు ఈ నారీ కాస్త పట్టుతప్పి ఈయన తలను నరికింది.దానితో ఈయన శరీరానికి గుర్రము తలను అతికించి హయగ్రీవ అవతారము ఉద్భవించడము జరిగినదని లోకవిధితమే గదా.అంటే ఈ లెక్కనచూస్తే శివ తల సజీవమైతే..విష్ణు శరీరము సజీవమైంది.ఇపుడు శివుడి 64 అవతారాలలో మనకి ఒకే ఒక శివ దక్షిణామూర్తి అవతారములో మనకి శివుడు సువర్ణ ఆభరణాల అలంకార రూపములో కనపడతాడు.మిగిలిన ఈయన రూపాలలో ఆభరణాలకి బదులుగా రుద్రాక్షలు, నాగాభరణాలుంటాయి.ఎందుకు అంటే శివ దక్షిణామూర్తి అవతారములో సజీవ శివుడి తలకి సజీవ విష్ణుమూర్తి  శరీరము అతకించబడి ఉంది. ఈ లోకములో విష్ణువు అలంకారప్రియుడని..శివుడు అభిషేకప్రియుడని లోకవిధితమే గదా.అందుకే శివదక్షిణమూర్తికి అలంకారము చెయ్యడము జరుగుతోంది.అలాగే నిజయోగులకి తమ ధ్యానము నందు దక్షిణామూర్తి రూపదర్శనము అనేది శివుడి తలతో విష్ణువు శరీరముతో  ఉన్నట్లుగా జరుగుతుందని వారి ఆత్మానుభవాలుగా చెప్పడము జరిగింది.అంతెందుకు మనము దక్షిణామూర్తి  ఫోటోను చూస్తే ఏ శివరూపానికి లేని సువర్ణ ఆభరణాల అలంకారము ఈయనకి ఉండటము మనము చూడవచ్చును.అంటే ఈ దక్షిణామూర్తి ఆవాసముండే అరుణాచల క్షేత్రానికి వెళ్ళితే అక్కడున్న ఆన్నీ దేవాలయాల మండపాల మీద మనకి ఒక తల మాత్రమే ఉన్న ప్రతిమ ఉన్నట్లుగా కనపడుతుంది.అనగా సిద్ధయోగిగా ధ్యానము చేసిన పొగడ చెట్టున్న ప్రాకారములో ఉన్న గణపతి ఆలయగోపురము మీద ఒక తల ఉన్నట్లుగా అలాగే ఆది అణ్ణామలై గుడి కుడి గోడ చివరిలో అదే ఒక తల ఉన్నట్లుగా అలాగే శేషాద్రి ఆశ్రమములోని ముఖమండపానికి నాలుగు వైపుల ఒక తల ప్రతిమలు ఉండటము నేను గమనించాను.ఈ సారి మీరు వెళ్ళి జాగర్తతగా చూస్తే ఒక తల ప్రతిమ మనకి ఖచ్చితముగా కనపడుతుంది.ఇదే తలను సజీవమూర్తిగా పరమహంస గారు తన ధ్యానము నందు అగ్నితీర్ధము ఉన్న గుహముందు ఉన్న ప్రధాన ద్వార గోడకి సజీవమూర్తిగా రుద్రుడి నల్లటి తల ఒకటి జుట్టు విరబొసుకొని పెదవులు కదుపుతూ  కనపడినదని దీనికి గుర్తుగా ఈ దేవాలయ గోపురాలమీద ఒక తల ఉన్న ప్రతిమ పెట్టడము జరిగినదని నాతో చెప్పడము జరిగింది.
దీనిని బట్టి చూస్తే రుద్రుడి తల సజీవముగా ఉన్నదని తెలుస్తోంది గదా.స్వామి.ఇంతవరకు బాగానే ఉంది.మరి ఆదిరుద్రుడు  మోక్షము పొంది శివము కాస్త శవమైనాడని పరమహంస గారి స్వానుభవాలు చెపుతున్నాయి గదా. అంటే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది.అది ఏమిటంటే రుద్రుడి తల మోక్షము పొందడము లేదు.అలాగే విష్ణుశరీరము మోక్షము పొందడము లేదు.ఎందుకంటే ఇక్కడ అందరు మిస్ అవుతున్న చిన్న లాజిక్ ఉంది.అది ఏమిటంటే పరమహంస గారి ధ్యానానుభవాలు ప్రకారము చూస్తే ఈయన శరీరములో ఉన్న 13 యోగచక్రాలలోని 13 యోగశివలింగాలు ఒక్కొక్కటిగా అరుణాగిరిలో ఉన్న అగ్నితీర్ధములోనికి ఎలా ప్రవేశించినాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకొండి.ఇంతటి మహా సముద్ర జ్ఞానములో ఈ విషయము మాకు గుర్తుకు రావడము లేదంటారా..అది నేను మీకు గుర్తుకు చేస్తాను.ఎలా అంటే అగ్నితీర్ధప్రవేశ దగ్గర ఉన్న దీని రక్షణకవచమైన అరుణగీత దగ్గరికి వచ్చేసరికి శివలింగము నుండి అగ్రభాగమైన ముఖలింగము కాస్త ఛేదించబడి అగ్నితీర్ధానికి చేరితే లింగ పానమట్ట పీఠభాగము కాస్త బయటపడిపోవడాన్ని బట్టిచూస్తే శివలింగ ముఖభాగము అగ్నితీర్ధములోనికి చేరుతుందని మనకి అర్ధమైందిగదా.అంటే ఈ శివ తల భాగము మోక్షము పొందినట్లే గదా అంటారా..ఇక్కడికే వస్తున్నాను.అది ఏమిటంటే ఈ ఆదిరుద్రుడి 13 యోగలింగాలలో ఆరు శివలింగాలు యొక్క ఆరు తలభాగాలు అలాగే మిగిలిన ఆరు శివలింగ పానపట్టాలు కాస్త ఈ అగ్నితీర్ధములోనికి చేరి అంటే ఆరు శివలింగాలుగా మారి అగ్నితీర్ధబిందువుగా మారతాయి.ఇదే అగ్నిబిందువులో ఉన్న ఉండే ఆరుకిరణాలుగా ఉంటాయి.ఇందులో శివలింగ తలలు పురుషశక్తిగాను శివలింగ పానుమట్టాలు స్త్రీ శక్తి గాను ఉంటాయి.ఇవే త్రిమూర్తి త్రిమాత తత్వశక్తి అన్నమాట.మళ్ళీ అంటే ఇవి మూడు తత్వాలుగా మారతాయి.త్రిమూర్తులరూప తత్వము అన్నమాట.ఈ రూపతత్వము కాస్త ద్వైత్వము అనగా  అర్ధనారీశ్వర తత్వ తెలుపు-ఎరుపు లింగమవుతుంది.ఇదే 64వ డైమర్షలోని నల్లశిల అవుతుంది అన్నమాట.ఇక ఈ అర్ధనారీశ్వరలింగము కాస్త 65వ డైమర్షలో రేడియోషనుకి గురియై ద్వైతము నుండి అద్వైతము అనగా రెండు రూపాల అర్ధనారీశ్వర కాస్త నల్ల ఏక రుద్రలింగమవుతుంది.ఇక్కడ అందరు ఒక విషయము గమనించాలి.అది ఏమిటంటే ఆరు తలాలు శివలింగాల అగ్రభాగాలు అలాగే ఆరు పాన పట్టాలు ఒకదానికికొకటి సంబంధము లేనివి అతికించబడుతున్నాయని తెలుసుకొండి.అంటే మొదట ఆరు శివలింగ తలాలు అగ్నితీర్ధానికి చేరితే ఆ తర్వాత మిగిలిన ఆరు శివలింగాల యొక్క శివ తలలు లేని పానుమట్టాలు అగ్నితీర్ధములోనికి చేరి ఒకదానికి మరొకటి సంబంధము లేనివాటితో ఈ శివలింగ తలాలు అలాగే పానుమట్టాలు కలుస్తున్నాయని ఇపుడికైన గ్రహించండి.ఇదింతా అగ్నితీర్ధము చుట్టున్న అరుణగీత మాయకవచము వలనే జరుగుతోంది.దానితో అంతిమముగా ఏర్పిడిన ఏక నల్ల ఆదిరుద్రలింగము నందు శివ తల లింగానికి దాని సహజజోడీయైన పానమట్టము కాకుండా వేరొక పానమట్టముతో జోడి కట్టుతోందని ఈ పాటికే మీరంతా గ్రహించి ఉంటారు.అంటే విష్ణుశరీరానికి శివుడి తల అమరి అది కాస్తా ఆదిరుద్ర దక్షిణామూర్తిగా ఎలా అవతారము ఏర్పిడినదో ఈపాటికే మీకు అవగహన వచ్చి ఉండాలి.ఇదింతా బాగానే ఉంది.విష్ణుశరీరములో అమ్మవారి లక్ష్మీహృదయము అమృతసేవనము వలన ఇది చిరంజీవతత్వమును పొంది ఎలా సజీవమైందో మీరు ఈపాటికే తెలుసు గదా.మరి శివుడి తల ఎందుకు  మరణము పొందకుండా సజీవమూర్తి ఎలా అయిందో ఇపుడు మనము  అత్మవిచారణ చేసుకొని తెలుకొవాలి.ఎక్కడ గూడ శివుడు కాస్త అమృతము తాగిన తాఖలాలు లేవు.మరి ఇది ఎలా సజీవమైంది అన్నపుడు దీనికి సమాధానము మనకి జ్యోతిష్యశాస్త్రములో ఉంది.దీని ప్రకారము చూస్తే నవగ్రహాలతోపాటుగా ఛాయగ్రహలుగా తలగా ఉన్న రాహుగ్రహము అలాగే తల లేని శరీరమున్న కేతు గ్రహాలు కనపడతాయి.రాహు గ్రహంకి అధిపతిగా దుర్గాదేవిగాను..కేతుగ్రహనికి అధిపతిగా గణపతిగా ఉంటే ఇందులో మోక్షమిచ్చే గ్రహమును కేతుగా చెప్పడము జరిగింది.అంటే మోక్షము పొందేది తల లేని శరీరమని చెప్పకనే చెప్పడము జరుతోంది గదా.ఇక రాహు గ్రహ విషయానికి వస్తే ఈయన కాస్త తన నిజరాక్షస వేషము నుండి దేవత మారువేషములో వచ్చి అమృతము సేవించడము చూసిన విష్ణువు కాస్త ఈయన అమృత తలను శరీరము నుండి వేరుచేశాడని దానితో తల సజీవమై రాహు గ్రహముగాను అలాగే దీని శరీరము కాస్త కేతుగ్రహమై నిర్జీవమై మరణాలు పొందుతోందని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది గదా.ఈ తల అలాగే శరీరము కలిస్తే పంచముఖ నాగాపాము అవుతుంది.ఈ ఛాయ గ్రహల ఆధీనము మన శివుడి చేతిలో ఉంటుందని శివపురాణ వచనము.ఈ రాహు తల కాస్త అమృత సేవనము వలన ఇది అమరత్వము పొందడముతో...ఇదియే అమరత్వము పొందిన శివుడి తల అన్నమాట.ఎందుకంటే  ఈ గ్రహల అధిపతులుగా దుర్గాదేవి,గణపతి ఉంటే ఈ రెండు గ్రహలు కలిస్తే కుమారస్వామి అంశయైన సుబ్రహ్మణ్యస్వామి అవతారము అవుతున్న దానిని బట్టి చూస్తే వీరంతా శివకుటుంబపరివారము గావడముతో పైగా అదియుగాకుండా రాహుకి పంచముఖ నాగ పాము అయితే దీనినే శివలింగము మీద పంచలోహ పంచముఖ నాగాభరణముగా ఉంచడము బట్టి చూసినగూడ  ఈ సజీవ రాహు తల కాస్త శివ తల అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.ఈ లెక్కన చూస్తే అమరత్వము పొందిన విష్ణుశరీరము అలాగే అమరత్వమును పొందిన శివుడి తల ఎందుకు మరణాన్ని పొందుతాయి.హాయిగా అమరత్వ సజీవమూర్తి శాశ్వతముగా జీవించే ఉంటాయి.అవును..ఇక్కడ ఒక సందేహము..అది ఏమిటంటే ప్రతిరోజు అరుణాగిరి యందు 1440 మంది మోక్షము పొందుతున్నారని ఒకప్రక్క మీరే చెప్పి మరొ ప్రక్క ఎవరుగూడ మోక్షము పొందడము లేదని చెప్పుతున్నారు అంటారా..దీనికి సమాధానము మోక్షము పొందేది ఎవరు..ఒకదానికొకటి సంబంధము లేని ఒక తల అలాగే శరీరము కలిసియున్న ఆత్మశరీరము ఉన్న ఆత్మజీవి అని విషయము మర్చిపోతున్నారు.ఆదిరుద్రుడిలో ఉన్న రుద్రతలకి సంబంధము లేని విష్ణుశరీరము అతికించి రుద్రుడు కాస్త ఎలాంటి తాత్కాలిక మోక్షమును పొందాడో అలా వీరంతాగూడ పొందుతున్నారు.వాడి నిజమైన తలతో ఉన్న వాడి శరీరముతో వాడు మరణము అదే మోక్షమును పొందడము లేదని గ్రహించండి.అంటే ఇదింతా అరుణాగిరి లోపుల ఉన్న అగ్నితీర్ధము చుట్టు ఉన్న అరుణగీత మాయ వలన లింగాల మార్పిడి అలాగే శరీరాల మార్పిడి జరుగుతోందని తెలుస్తోంది గదా.అందుకే మన పెద్దలు అరుణాచల వెళ్ళకముందు రాత అలాగే వెళ్ళిన తర్వాత రాతను ఈ అరుణాగీత మారుస్తోందని అరుణాచల మహత్యములో చెప్పడము జరిగింది.మరి మోక్షము పొందేది ఎవరు అంటారా...శరీరము మాత్రమే మోక్షము పొంది తల మాత్రము మోక్షము పొందకుండా ఆగిపోతుంది.ఇది ఎలా అంటారా...ప్రతిసాధకుడు తప్పనిసరిగా శివోహం స్ధితి అనగా నేనే శివుడి అనే భావతత్వములోనికి రావాలి.అపుడే జీవుడు కాస్త శివుడవ్వాతాడు.ఈ భావమే అందరి కొంపముంచింది.అనగా  ఎవరితై ఈ భావస్ధితి పొందేది మన తలలోని కపాలములోని మెదడు గదా.నిజానికి మెదడు చనిపోతే అన్ని అవయవాలు పనిచెయ్యకుండా నిర్జీవమై పోతాయి.దానిని ఈ దేహము కాస్త భౌతిక మరణము పొందిందని అంటాము గదా.అలాగే హృదయము చనిపోయిన ఎనిమిది క్షణాలు వరకు మన మెదడు పనిచేస్తుందని సైన్స్ ఆరోగ్యశాస్త్ర ఉవాచ. అంటే  ఈ లెక్కన చూస్తే హృదయమున్న ఆత్మశరీరము మరణము పొందుతోంది కాని మెదడు ఉన్న బ్రహ్మకపాలము మోక్షము పొందడము లేదని తెలుస్తోంది గదా.ఇది ఎపుడైతే శివోహము స్ధితిన్ని ఈ ఎనిమిది క్షణాలలో పొంది దానితో సజీవ శివ తల కాస్త నిర్జీవము నుండి అమరత్వ సజీవమై బ్రతుకుతోంది.బాహ్యముగా ఎనిమిది క్షణాలు తర్వాత మెదడు చనిపోయునట్లుగా కనిపించవచ్చు.ఈ లోపు ఉన్న ఎనిమిది క్షణాలలో శివోహం భావస్ధితి వలన మనము చావటానికి బయలుదేరుతూ బ్రతటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ఈ విశ్వములో పురుష అష్టాంగాల ప్రకృతిని ఈ ఎనిమిది క్షణాలలో మరణము లేని మోక్షము పొందని మన బ్రహ్మ కపాలము ఏర్పాటుచేస్తుంది.దానితో మన ఆత్మశరీరానికి శివుడి తల జతకలిసి శివోహం స్ధితి పొంది...అపుడికే రుద్రపిశాచముగా మారిన రుద్ర శరీరమునకు మన ఆత్మశరీర తల అతకించబడి 65వ డైమర్షలోనికి మోక్షము పేరుతో పంపబడి నాశనమవుతోంది.నిజానికి మన ఆత్మశరీరానికి మన తలతో 65వ డైమర్ష వెళ్ళితే మనము మోక్షము పొందినట్లు అవుతుంది.మన ప్రకారము చూస్తే మన తల మాత్రమే మోక్షము పొంది మన శరీరము కాస్త   సజీవమవుతోంది..అదే శివుడి ప్రకారము చూస్తే ఆయన తల సజీవమై..శరీరము మోక్షము పొందుతోంది అన్నమాట.అంటే శివుడి తల మన శరీరము కాస్త మోక్షము పొందకుండా ఉంటే మన తలతో ఉన్న శివుడి శరీరము మోక్షము అసంపూర్తిగా పొందుతున్నాయి.ఎందుకంటే శివుడికి మన ఆత్మశరీరము గావాలి.అదే విష్ణువుకి మన ఆత్మ తల గావాలి.ఎందుకంటే శివుడి శరీరము అలాగే విష్ణు తల మరణాలు పొంది నిర్జీవమైతే..అదే శివుడి తల అలాగే విష్ణుశరీరము కాస్త అమృతసేవనఫలము వలన సజీవమై రుద్ర దక్షిణామూర్తి అవతారమైంది.అంటే ఈయనకి మన ఆత్మ శరీరము గావాలి అన్నమాట.మన తల కాయతో అవసరము లేదు.అందుకే సాధకుడి 13 యోగలింగాలు కాస్త అగ్నితీర్ధములో ప్రవేశించినపుడు వాటి తలలు ఖండించబడి అగ్నితీర్ధమునకు చేరేటట్లుగా చెయ్యడము జరుగుతోంది.ఇదింతా చిన్నమస్తాదేవి ఆధీనములో జరుతుంది.అందుకే ఈ అమ్మవారు తన తలను తానే నరుకొని తన రక్తమును తానే త్రాగుతూ తన చెలికత్తలైన ఇద్దరికి తన రక్తముతో వారి ఆకలి నిరంతరముగా తీరుస్తోనే ఉంటుంది.అంతెందుకు మన లాంటి వాళ్ళే 64 మంది కాస్త 64 డైమర్షలలో ఆవాసము చేస్తుంటారు గదా.వీళ్ళలలో 3వ డైమర్షలో ఉన్న నేను మోక్షము పొందితే మిగిలిన వారంతా గూడ పొందాలి గదా.పొందరు.పొందలేరు.ఎందుకంటే నా మరణము అసంపూర్ణ మోక్ష మరణము గదా.దానితో నేను కాస్త మూడు నుండి నాలుగోవ డైమర్షకి వెళ్ళితే ఇందులో ఉన్నవాడు కాస్త అయిదుకి వెళ్ళతాడు.ఇలా ఆఖరిగా ఉన్నవాడు 64 వడైమర్ష నుండి 65వ డైమర్షకి వెళ్ళి అసంపూర్ణ మోక్షము పొందుతాడు.అందుకే రామకృష్ణ పరమహంస వారు మన మరణము అనేది ఒక గది ఖాళీ చేసి మరొక గదిలోనికి వెళ్ళడమని ఈయన చనిపోయిన మూడు రోజులకి ఈయన భార్య శారదదేవికి కనిపించి చెప్పడము జరిగింది. విచిత్రము ఏమిటంటే ఆఖరిగా వచ్చే 1వ డైమర్షవాడు కాస్త 64 డైమర్షకి వచ్చి మళ్ళీ 64 భాగాలుగా విభజన చెంది 64వ డైమర్షలలో ఆవాసము చేస్తాడు..ఇది ఎలా ఎందుకు జరుగుతుంది అంటే 64వ డైమర్ష లోని నల్లశిల యైన అర్ధనారీశ్వర స్త్రీ తత్వ హృదయస్పందన మాయకి లోబడి హృదయము 64 ముక్కలుగా విస్పోటనము చెంది 64వ మందిని ఏర్పరస్తుంది.అంటే కధ తిరిగి ఆరంభమవుతుంది.దానితో ఇది అంతులేని కధగా మారి అంతములేని ఆరంభముగా ఈ విశ్వసృష్టి చక్రము ఎపుడు నిరంతరముగా అవిశ్రాంతిగా విభజన చెందుతుంది.అందుకే ఓంకార గుర్తులో వంపు పూర్తిగా కలుపరు.పిండిరేణువంతా ఖాళీ ఉంచుతారు.అందుకే GOD means  Generation Of  Divisions అని  మన పెద్దలు ఉవాచ.అదే ఇలా ఎందుకు చేసావని ఆ దేవుడితో వైరము పెట్టుకొండి.అంటే మీకు మీరే తిట్టుకొండి.అనగా ఆ మోక్ష మరణము పొందని ఆ దక్షిణామూర్తి మీరే గదా.నిజమే గదా.ఎందుకంటే ఇపుడికి ఒక నల్ల దక్షిణామూర్తి 65వ డైమర్షలోనికి వెళ్ళగానే 63వ లో ఉన్నవాడు కాస్త శివోహం స్ధితిన్ని పొంది మరో తెల్ల దక్షిణామూర్తిగా మారి మర్రిచెట్టు క్రింద ధ్యానములో కూర్చుని ఉన్నట్లుగా మనకి కనపడతాడు.ఇలా ఈయన ఈ చెట్టుక్రింద 14 మహయుగాలు ఉండి మరొకడు శివోహం స్ధితిన్ని పొందడాని తెలుసుకొని ఈ తెల్లవాడు కాస్త నల్లవాడిగా మారి అసంపూర్ణ మోక్షమైన 65 వ డైమర్షలో పొందుతాడు.ఇక 64వ వాడు తెల్ల సజీవ రుద్ర దక్షిణామూర్తి గా ఈ విశ్వాధిపతిగా ఏలుతాడు.వీడికి తాత్కాలిక మోక్షము రావాలంటే ఎలాగో మీరంతా శివోహం స్ధితిన్ని పొందుతారు.అలాగే మీకు గూడ   తాత్కాలిక మోక్షము పొందలంటే ఏటూ మీకు ఉన్న 64 రూపాలలో ఆ సమయానికి ఎదోఒక రూపము శివోహం స్ధితిని పొంది ఇది అమరమై మీకు తాత్కాలిక మోక్షమిస్తుంది.ఇదే GOD..Generation of divisions...మనకి మనమే రూపము అంతము చేసుకోకుండా రూపాంతరాలు చెంది జీవుడి కాస్త శివుడిగాను..మానవుడివి కాస్త మాధవుడిగా రూపాంతరాలు చెందుతూనే ఉన్నాము.చెందుతూనే ఉంటాము.దీనిని ఆపడము ఎవరితరము కాదు.ఎవరి వల్ల గాదు.ఎందుకంటే ఆపేవాడే నీవ్వే..ఆపాలని అనుకునే వాడివి నువ్వే..ఆడేవాడివి నువ్వే..ఆడించేవాడివి నువ్వే..నేనులో నేనులేను అనుకొనేది నువ్వే..నేను కాని నేనుగా మిగిలిపోయేది నువ్వే.ఎందుకంటే మనమంతా గూడ అరుణాగిరి పైన ఉండే అరుణాజ్యోతి నుండి బయటికి వచ్చిన అగ్నిరేణువులని అలాగే దక్షిణామూర్తి ఆత్మ శరీరముతో ఉద్భవించిన ఆత్మశరీర జీవులమని తెలుసుకొండి.గాకపోతే తెల్ల ఆదిరుద్ర దక్షిణామూర్తి అపస్మారక స్ధితిన్ని పొందకపోవడము ఆయనే దేవుడని జ్ఞానముతో ఉన్నాడు.మనమంతా కాస్త అపస్మారక స్ధితిని పొందడముతో దేవుడైన మనము జీవుడిగా ఉండిపోతున్నాము.ఈ మాయ అజ్ఞానమును తొలిగించుకోవటానికి మనచేత సాధన చేయించి మనకి మనమే దేవుడమని జ్ఞానమును అందించడము జరిగి ఈ జన్మ ఆత్మశరీరమునకు తాత్కాలిక మోక్షము కల్గడముతో ఈ జన్మ పేరుతో ఉన్న ఆత్మశరీరము 65 వ డైమర్షకి వెళ్ళి తాత్కాలిక మోక్షము పొందడము జరుగుతుంది.దీని కోసము మనము గూడ తాత్కాలిక సాధన చేయాల్సి ఉంటుంది.లేకపోతే మనము సాధన చెయ్యకపోతే మనము ఇంక ప్రస్తుతమున్న 3వ డైమర్ష్ లో ఉండిపోతాము.అదే జ్ఞానము పొందినవాడు ఈ డైమర్ష్ తాత్కాలిక అద్దె ఇల్లు అని జ్ఞానము పొంది ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చెయ్యటానికి ఆరాటపడి ప్రస్తుత ఉన్న ఈ దేహ ఆత్మశరీరమునకు తాత్కాలిక మోక్షమును ఇస్తాడు.అదే జ్ఞానము పొందని భోగి మాత్రము తాను ఉన్న ఈ డైమర్షను శాశ్వతమైన ఇల్లుగా భావించుకొని ఎన్నోకోట్లాను కోట్ల సం.రాలు పాటు ఉండి చివరికి ఎపుడో కాని జ్ఞానము పొంది ఈ డైమర్షను ఖాళీ చేస్తాడు.అంటే సాధన ద్వారా జ్ఞానము పొందిన జ్ఞానయోగి ఓ డైమర్ష్ను అతిత్వరగా ఖాళీ చేస్తే..భోగి మాత్రము అతినెమ్మదిగా  ఖాళీ చేస్తాడు అన్నమాట.   .

ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనిపెట్టారు.అది ఏమిటంటే కాంతిహీనమై తన శక్తిన్ని కోల్పోయి చనిపోతున్న నక్షత్రము కాస్త తనకి సమీపములో ఉన్న సూర్య తెల్లని కాంతిన్ని తీసుకుంటున్న గ్రహాన్ని ఈ నక్షత్రము మింగేసి తద్వారా తిరిగి ఇది కాంతిని పొంది తన జీవిత కాలమును పెంచుకుంటున్నదని తెలుసుకోవడము జరిగింది.అచ్చుగుద్దినట్లుగా అరుణాచల శివ విషయములో గూడ ఇలాగే జరుగుతోంది అని చాలా మందికి తెలియదు.అంటే ఎపుడైతే అరుణాగిరి యొక్క మర్రిచెట్టు క్రింద ఉండే తెల్ల రుద్ర దక్షిణామూర్తికి కాస్త 1300 కోట్ల సం.రాలు తర్వాత తనలో ఉన్న జ్ఞానశక్తి నెమ్మది నెమ్మదిగా  నశించడము మొదలై తను పొందిన జ్ఞానము కాస్త మర్చిపోయే అదే అపస్మారక స్ధితికి చేరుకుంటున్న సమయములో తనకి 1400 కి.మీ ల పరిధిలో ఉన్నవారిలో ఎవరైతే జ్ఞాన్వేషణా లేదా సత్యాన్వేషణ లేదా దైవాన్వేషణ లేదా మోక్షన్వేషణలో ఉంటారో వారికి తను కోల్పోతున్న జ్ఞానశక్తి ఇవ్వడము ఆరంభిస్తాడు.అనగా వీరి ధ్యానము నందు లేదా స్వప్ననందు అరుణాగిరి అనుసంధానమై కనిపించడము ఆరంభిస్తుంది.ఇలా 13 రోజుల నుండి 13 నెలలు పాటు కనిపించి తన జ్ఞానశక్తిన్ని మనకి అందిస్తుంది.ఎపుడైతే తన శక్తిన్ని వీరికి అందించడము పూర్తి అయినదో వీరిన్ని పిచ్చుక కాలికి దారము కట్టి లాగినట్లుగా ఈ అరుణాగిరి తన దగ్గరికి ప్రత్యక్షముగా పిలిపించుకుంటుంది.అపుడు గిరిప్రదక్షిణ పేరుతో ఒక ప్రదక్షిణము నుండి 14 గిరి ప్రదక్షిణాలు మనచేత చేయించుకొని మన కుడిపాదములో ఉన్న పాదరసలింగములో ఉన్న ఆత్మశక్తిన్ని అలాగే ఎడమపాదములో ఉన్న అష్టదళపద్మములో ఉండే జ్ఞానశక్తి ఈ అరుణాగిరిలో ఉండే ఆదిపరాశక్తి కాస్త మన ఆత్మశక్తిన్ని తీసుకుంటే తెల్లరుద్రదక్షిణామూర్తి కాస్త మనలో జ్ఞానశక్తిన్ని తీసుకొని ఆయన తిరిగి జ్ఞానమును పొంది అపస్మారస్ధితి నుండి బయటపడటము జరుగుతుంది.అంటే ఆయన మరణము పొందకుండా ఆయుష్ పొందడము జరుగుతుంది అన్నమాట.అపుడు మన తలలో ఉన్న 
జ్ఞానశక్తి కాస్త ఈయన తలకి చేరడముతో మనతల కాస్త జ్ఞానమును కోల్పోయి మాయలో పడుతున్న సమయములో అమ్మవారి దగ్గర ఉన్న మన ఆత్మశక్తి కాస్త రుద్ర ఆత్మశరీరమునందు ప్రవేశించి వారి శరీర ఆయుష్ పెంచి శక్తిహీనమైన మన తలకి అపుడికే రుద్రపిశాచము అనగా ఆదిలో మరణమును పొందిన శివుడి ఆత్మశరీరమునకు  మన తలను అనుసంధానము చేసి మోక్షము పేరుతో 65వ డైమర్షలోనికి పంపించడము జరుగుతుంది.ఒకరకము వారు ఇచ్చిన శక్తులు వారి అవసానదశలో వారే మనద్వారా పొంది వారు తిరిగి పున:జీవులు అవుతున్నారు.అంటే హోమాల ద్వారా దేవతలు మనమిచ్చే హావిస్సులు తీసుకొని వారు ఎలా   బ్రతుకున్నారో వీళ్లు అలా బ్రతుకుతారు అన్నమాట.ఇక్కడ హోమా హావిస్సులు తీసుకుంటే అరుణాగిరి యందు జ్ఞానశక్తులు తీసుకోవడము జరుగుతుంది.ఈ విధివిధానము కోసము వీరికి ముగ్గురు ఆత్మశరీరాలు అనగా ఇందులో రెండు పురుషశరీరాలు అలాగే ఒక స్త్రీ శరీరము గావాలి.అంటే ఈ ముగ్గురిలో ఒకరు జ్ఞానశక్తి,మరొకరు ఆత్మశక్తి, ఇంకొకరు ఇచ్చాశక్తిన్ని ఈ అరుణాగిరి ఇవ్వడము జరుగుతుంది.అనగా జ్ఞానశక్తితో కర్మబంధవిముక్తి పొందటానికి అలాగే ఆత్మశక్తి కాస్త కర్మనివారణ కోసముంటే ఇచ్చాశక్తి కాస్త జన్మనివారణ కోసము ఉపయోగించి అశుద్ధముగా ఉన్న వీరిని ఈ శక్తులతో పరిశుద్ధము చేసి తన గిరికి రప్పించుకొని వీరికున్న శక్తులను గిరిప్రదక్షిణాల ద్వారా పొంది ఈ అరుణాచల శివ శక్తిమంతుడై ఈ ముగ్గురిలో ఉన్న ఒకరికి ఉన్న ఇచ్చాశక్తితో వారి శక్తిహీనమైన ఆత్మశరీరాలను మొదట స్త్రీ,పురుష శక్తితో అనుసంధానము చేసి అర్ధనారీశ్వర తత్వమును ఇచ్చి మిగిలిన పురుష శక్తితో ఏకత్వ ఆత్మశరీరముగా మార్చి దీనిని 65వ డైమర్షలో మోక్షకోసము పంపించడము జరుగుతుంది.అపుడు ఈ ఆత్మశరీర ఆత్మశక్తి కాస్త ఈ మూడవ డైమర్ష నుండి జీవన్ముక్తి పొంది అపుడికే ఇలాగే ఖాళీ అయిన నాలుగోవ డైమర్షనికి వెళ్ళి అక్కడ ఉన్న తనలాంటి ఆకార శరీరములోనికి ప్రవేసించి అక్కడ 1300కోట్ల సం.రాలు  పున:జన్మలు ఎత్తుతూ ఎపుడైతే అక్కడ ఉన్న రుద్రదక్షిణామూర్తికి జ్ఞానశక్తి అవసరమవుతుందో అపుడు తిరిగి ఈ ఆత్మశరీరము కాస్త సాధనలోనికి ప్రవేసించి ఆయనకి గావాలసిన జ్ఞానశక్తిన్ని ఇచ్చి మళ్ళీ నిర్జీవ తలతో ఉన్న ఆత్మశరీరముతో ఆ డైమర్షలో మోక్షమును పొంది అపుడికే ఇలాంటి విధివిధానముతో ఖాళీ చేసి అయిదవ డైమర్ష నుండి 6వ డైమర్షకి వెళ్ళిన 5వ డైమర్ష స్ధానములో 4వ డైమర్షగా ఉన్న మనము వెళ్ళడము జరుగుతుంది.ఇలా 1వ డైమర్ష నుండి 64వ డైమర్ష వరకు ఇంచుమించు ఇలాంటి విధివిధానమే జరుగుతుంది.ఈ విధివిధానమంతా నా స్వానుభవముగా జరగడముతో నేను ఇంత విధానముగా మీకు చెప్పడము జరుగుతోంది.అంతిమముగా ఇలా ఆఖరిగా చేరేవాడు కాస్త హృదయస్పందనకి స్పందించి 64భాగాలుగా విస్పోటనము చెందడముతో మళ్ళీ కధ మొదలు అవుతోంది.ఈ విశ్వములో శివలింగమున్నంత వరకు శివుడి తల అయిన జాటాజూటము ఉంటునే ఉంటుంది.దీనికి జ్ఞానశక్తి అవసరమవుతూనే ఉంటుంది.తద్వారా ఇది మరణమును పొందకుండా ఆయుష్ పెంచుకొనే ఉంటుంది.అందుకే అరుణాగిరిన్ని ఆధ్యాత్మిక అయస్కాంత గిరి అని పురాణవచనముగా చెప్పడము జరిగింది.ఇది గాని మనల్ని ఆకర్షించుకోకపోతే మనకి డైమర్ష్స్ మారే అవకాశము ఉండదు.మారిన పెద్దగా ఏమి ఉపయోగముండదు కాని పరిస్ధితులు,పరిసరాలు,వ్యక్తులు మారతాయి అంతే. అంటే 3వ డైమర్షలో ఉంటే మానవ పురుష,స్త్రీలుంటే వివిధ డైమర్షలలో వివిధ దేవతజాతి స్త్రీ,పురుషులుంటారు అన్నమాట.ఎక్కడైన సుఖ:దు;ఖాలు మాములే.అవి మారవు.మన రాతను మార్చలేవు.ఈ డైమర్ష్స్ ప్రయాణాలు ఆగవు.గాకపోతే మారినట్లుగా రూపాంతరాలు చెందినట్లుగా అనుభవానుభూతులు కల్గిస్తాయి.ఇది ఇలా జరగకుండా ఆపాలంటే శివుడి తల అలాగే విష్ణు హృదయము శాశ్వతమరణమును పొందాలి.అనగా అరుణాగిరిలో ఉన్న శివుడి జటాజూటము అలాగే పూరీ జగన్నాధ క్షేత్రములో ఉన్న బ్రహ్మపదార్ధమైన హృదయస్పందన శాశ్వతముగా ఆగిపోవాలి.కాని ఇది జరగదు.ఎందుకంటే హృదయస్పందన ఆగిపోయిన ఏనిమిది క్షణాలు వరకు మెదడు బ్రతికే ఉంటుంది.అందుకే రోబో సినిమాలో రోబో అంతా నాశనమైన దాని తల నాశనము కాకుండా మ్యూజియములో ఉంచడము జరుగుతుంది.ఎందుకంటే అది స్వయంగా తనాంతటే తానే ఎలాయితే ఆలోచించడము మొదలుపెట్టిందో అలా శాశ్వతముగా రుద్రుడి తలకి సహజసిద్ధముగా శాశ్వతముగా జ్ఞానశక్తితో ఉంటూనే ఉంటుంది.ఇది ఈ పాటికి శాశ్వతమరణము పొంది ఉండి ఉంటే అరుణాచలములో రుద్ర తల ప్రతిమ కాని అరుణాగిరి యందు సజీవముగా రుద్రతల కాని ఉండేది కాదు గదా.అందుకే జ్ఞానము వస్తే పోదు.అజ్ఞానము పోతే రాదు.అనగా జ్ఞానములో రుద్రుడు ఉంటే అజ్ఞానములో జీవుడు ఎపుడు శాశ్వతముగా ఉండాలని విధి విధాత రాసిపెట్టి పోయాడు.రుద్రుడు కాస్త తన ఉనికి నిరంతముగా ఈ విశ్వములో శాశ్వతముగా ఉందని నిరూపణ కోసము తన రుద్రతలను అన్ని 64 డైమర్ష్స్ లలో భద్రపరిచి వెళ్లాడు.పాత దేవుడు పోతున్నాడు.పాత జీవుడు కాస్త జ్ఞానము పొంది శివోహం స్ధితికి చేరి  కొత్త దేవుడిగా మారుతున్నాడు.అందుకే పూరీక్షేత్రములో నవకళేబరము పూజతో పాతవిగ్రహమూర్తులను పూడ్చిపెట్టి వాటిస్ధానములో కొత్త విగ్రహమూర్తులను ప్రతిష్టిస్తే..అదే అరుణాచలములో ఒకరాజుకి సాక్షాత్తు అరుణాచల శివ ప్రతిసం.రము పిండప్రదాన కార్యక్రమము జరుగుతోంది.పూరీక్షేత్రములో జరిగే ఈ పూజ వలన పాత ఆత్మశరీరాలకి విముక్తి కల్గి కొత్త ఆత్మశరీరాలతో పున:సృష్టి జరుగుతుంటే..అరుణాచలములో జరిగే కర్మకాండ తంతు  వలన ఆత్మశరీరాలకి పాత డైమర్ష్స్ నుండి విముక్తి కల్గి కొత్త డైమర్ష్స్ కి వెళ్లడము జరుతోంది అన్నమాట.నిజానికి మనమంతా అశాశ్వత భౌతిక,ముక్తి,మోక్ష మరణాలు పొందడముతో మనమంతా ఎపుడికి మరణము లేని మీరు గానే శాశ్వతముగా మిగిలిపోతామని ఈ పాటికే గ్రహించి ఉంటారు.అంటే పరమహంస గారు తన ధ్యానదృష్టితో శివుడి మోక్షవిధానము చూడటము జరిగితే అదే పరమహంస గారి మోక్షవిధానమును నేను చూడటము జరిగితే నా మోక్ష విధానమును ఎవరో ఒకరు చూస్తారని అర్ధమవుతోంది గదా.అలాగే మన అందరి జనన-మరణ-ముక్తి-మోక్ష విధివిధానాలు అంతాగూడ ఒక రికార్డ్ దృశ్యముగా చూడటము బట్టి చూస్తే మన మరణాలు అన్నిగూడ తాత్కాలిక మరణాలని చెప్పకనే చెపుతున్నట్లుగా ఉంది కదా.అంటే ఎన్నడికి మన బ్రహ్మ కపాలము అనేది శాశ్వతముగాబ్రహ్మకపాలమోక్షం పొందదని పొందలేదని గ్రహించండి.ఇదే సత్యము..ఇదే నిత్యము..

శివోహం స్ధితి-శివోహం భావస్ధితి

స్వామి ఇదింతా బాగానే ఉంది.మరి ఆఖరిగా మిగిలిపోయే ఆదిరుద్రుడి తలయైన ఆదిబ్రహ్మకపాలమునకు కపాల మోక్షము రాదా?వస్తే అది ఎలా వస్తుంది అన్నపుడు సమస్య ఉంది అంటే దానికి పరిష్కారమున్నట్లే..ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానమున్నట్లే..ఈ బ్రహ్మకపాలాంకి కపాలమోక్షమున్నట్లే..ఎలా అంటారా..సాధకుడికి వచ్చే శివోహంస్ధితిన్ని దాటితే ఈ బ్రహ్మకపాలమోక్షం జరుగుతుంది.కాని మనము ఇపుడు శివోహంస్ధితికి అలాగే శివోహం భావస్ధితికి గల తేడాను తెలుసుకొంటే శివోహంస్ధితి మాయను మనము దాటవచ్చును.అనగా శివోహంస్ధితి అంటే సాక్షాత్తు ఆదిశివుడు పొందినస్ధితి పొందడము అయితే శివోహం భావస్ధితి అంటే  తానే శివుడని భావించుకోవడము అన్నమాట.ఈ రెండు తేడాలు మీకు బాగా అర్ధమవ్వాలంటే నిజశివుడికి అలాగే శివుడిపాత్ర వేసేవాడికి తేడా ఉంటుంది గదా.ఈ ఇద్దరికి రూపరేఖలు అలంకారాలు చూడటానికి ఒకేవిధముగా ఉన్నప్పడిటికి గుణాలలో శక్తులలో తేడాలు చాలా స్ఫష్టంగా కనపడతాయి.నిజమైన శివుడికి విశ్వాధిపతి అధికారాలుంటే ఈయన పాత్ర వేసేవాడికి ఈ అధికారాలుండవు గదా.ఈ తేడాను అర్ధము చేసుకుంటే శివోహం స్ధితి అనేది నిజశివుడు సాధనస్ధితి అని..అలాగే సాధకుడు పొందే ఈ స్ధితి శివోహం భావస్ధితి అనేది శివుడిపాత్ర వేసేవాడి స్ధితి అని మీకు ఈపాటికే అర్ధమయ్యే ఉంటుందిగదా. అంటే నిజానికి ఆదిలో రుద్రుడు ఈ శివోహం స్ధితికి వచ్చినపుడు ఈ విశ్వములోనికి సర్వదైవజీవప్రాణకోటి మీద ఆధిపత్య ఆధీన అధికారము పొంది పశుపతిస్ధితి నుండి విశ్వాధిపతికి అదే శివోహంస్ధితి పొందడము జరిగింది.ఇదే స్ధితి సాధకుడు సాధనస్ధితి చేరినపుడు శివోహం స్ధితి పొందడము జరుగుతోంది.దానితో తానే శివుడని..తానే దేవుడని భావించుకొని అసలు శివుడిన్ని మూలనపెట్టి ఈయన కాస్త వ్యక్తిగతపూజలు చెయించుకోవడము ఆరంభిస్తాడు.అంటే మూలమూర్తులు మూల ఉంచి ఉత్సవమూర్తులు ఊరేగించడము అన్నమాట.దానితో ఈ స్ధితిమాయ వలన వీడి ఆత్మశరీరము కాస్త చిన్నమస్తాదేవి చేతిలో తల ఖండించబడి శివుడి తలను అతకించబడుతుంది.దానితో ఈ ఆత్మశరీర సాధన ఆగిపోయి శివుడి సాధన ఆరంభమై..మోక్షము పొందవలసినవాడు భౌతిక మరణము పొందే అధమస్ధాయికి వీడి సాధన దిగజారిపోతుంది.ఎందుకంటే ఈ స్ధితి సాధనలో శివుడు మహమృత్యువును దాటే ప్రయత్నములో ఆయుష్ పెంచుకోవడము జరిగింది.దానితో ఈ సాధనస్ధితి పొందిన సాధకుడు ఈ శివోహం భావస్ధితిన్ని దాటకపోతే ఇదే స్ధితిలో శివుడి సాధన ఆగిపోయినట్లుగా వీడి సాధన ఆగిపోయి తానే శివుడనే పిచ్చిభావస్ధితిలో పడిపోయి సాధనను అర్ధాంతరముగా ముగించుకోవడము అవుతుంది.ఈ స్ధితి రావాలి.దీనిని దాటాలి అన్నమాట.నిజానికి సాధకుడు ఈ శివోహం స్ధితిని పొందినపుడు తాను శివుడు కాదని..కేవలము తాను శివుడనే భావస్ధితిలో ఉన్నానని ముందుగా తనకి తానుగా తెలుసుకోవాలి.అపుడు తనకి వ్యక్తిగతపూజలతో చేయించుకొనే అవసరముండదు గదా.దానితో తాను ఈస్ధితి మాయను దాటడము జరిగినపుడు చిన్నమస్తాదేవి మన ఆత్మశరీర తల నరకడముగాని శివుడి తల మార్చి అతికించడము చెయ్యదు గదా.అపుడు మన ఆత్మశరీరము ఎలాంటి మార్పులు పొందకుండా యదార్ధస్ధితిలోనే ఉంటుంది గదా.తద్వారా మన బ్రహ్మకపాలమునకు బ్రహ్మకపాలమోక్షం కలుగుతుంది గదా.కాని ఈ శివోహం భావస్ధితి దాటడము అంత తేలికైన విషయము కాదని తెలుసుకొండి.ఎందుకంటే ఈ స్ధితికి సాధకుడు వచ్చినపుడు తానే శివుడనే భావస్ధితిలో ఉండి శివుడికి పూజలు బదులుగా తన దేహనికి పూజలు చేసుకోవడము తనకి తెలియనిస్ధితిలో అనుకోకుండా తప్పనిసరిగా జరుగుతోంది.ఇలా తనకి తానే పూజలు చేసుకోవడము ఎవరైన చూస్తే శివుడి పిచ్చిపట్టిందని అనుకొని ఒకపిచ్చివాడిగా వీడిని పట్టించుకోరు.అదే సాధన జ్ఞానము వ్యక్తి కాస్త ఈ పూజను చూస్తే..ఇతను శివోహం స్ధితికి తన సాధనశక్తి చేరుకున్నదని...అంటే ఇతను సాక్షాత్తు శివుడేయ్యాడని..లోకానికి చెప్పి తను చెయ్యడమే కాకుండా లోకవాసుల చేత ఇతనికి వ్యక్తిగతపూజలు చెయించడము ఆరంభిస్తాడు.జనాలకి తనలో శివుడు నిజముగానే  కనపడటము వలనే నాకు శివుడనే వ్యక్తిపూజలు చేస్తున్నారని పిచ్చి ఉహభావస్ధితిమాయలోపడి తమ ఆత్మశరీరమును శివుడికి కోబలి ఇవ్వడము జరుగుతుంది.దానితో తన సాధన తన చేతులతో చేతలతో ఆగిపోయినదని తెలుసుకోలేని తెలియని అమాయకపుస్ధితిలో తన సాధన ఆగిపోతుంది.ఇక్కడే ఇలాంటి భావస్ధితి పొందినవారే నకిలిగురువులు,నకిలియోగులు,నకిలి ఆశ్రమపతులు అవుతున్నారని ఇపుడికైన మీరు తెలుకొండి.ఇలాంటి వ్యక్తిగత పూజలు చేయించుకొనేవారిని వదిల్చికొండి.ఈయనే తన స్ధితి తెలుకోలేక గుడ్డివాడిగా మారితే మరి ఇలాంటివాళ్ళు మీకు ఎలా సాధనమార్గము చూపుతారో అదే ఒక గుడ్డివాడు మరొకడిని గుడ్డివాడిని చెయ్యడమే గదా.అందుకే నిజయోగుల సాధనస్ధితిగతులు తనకి తప్ప తనప్రక్క ఉన్నవాడికి గూడ తెలియకుండా గుప్తసాధనతో తన సాధనస్ధితిన్ని పెంచుకొనే విశ్వప్రయత్ననాలు నిరంతరముగా అవిశ్రాంతిగా చేస్తూనే ఉంటారు.

అందుకే ఈ భావస్ధితికి దీనిని దాటడానికి తనవంతు మనోప్రయత్నముగా రామకృష్ణ పరమహంస వచ్చినపుడు అందరు నిద్రపోయే వేళా తను పూజించే కాళీమాత ఆలయానికి అర్ధరాత్రి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ చేస్తూ తనకి తెలియకుండానే తానే అమ్మవారు అనే దేవోహంస్ధితిన్ని పొందేవారు.దానిని ఆనందముగా అనుభవించేవారు.కాని ఎవరికి తెలియనీయ్యకుండా జాగ్రత్తపడుతూ ఈ భావస్ధితిన్ని దాటటానికి అలాగే తను అమ్మవారు అనే భావ అహంకార మాయను దాటటానికి సర్వస్య శరణాగతితో నిరంతరముగా తన తోటివారితో తాను అమ్మవారు గాదని..అమ్మవారి భక్తుడని..అమ్మకి ఒక పూజారి అని లోకప్రచారము చేసేవారు.దానితో ఈయన లోకవాసుల చేత వ్యక్తిగతపూజలు చేయించుకొనే స్ధితిన్ని దాటి తనతోపాటుగా అందరిచేత అమ్మవారి పూజలు చేయించేవారు.అంతెందుకు మన పరమహంస గారు ఈ భావస్ధితికి వచ్చినపుడు తనే జ్ఞానశివుడైన అరుణాచల శివుడనే భావములో నిరంతరముగా ఉండేవారు.కాని ఈయనకి ఈ భావస్ధితిన్ని ఎలా దాటాలో..ఎలా లోకానికి తెలినీయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలో అర్ధమయ్యే చచ్చేది కాదు.ఒకసారి ఇదే స్ధితిలో ఉండగా అరుణాచల వెళ్ళడము జరిగితే అక్కడ ఉన్న ఒక మౌనసన్యాసికి ఈయన సాధనస్ధితిగతి తెలుసుకొని ఈయన దగ్గరికి వచ్చి..స్వామి..మీ సాధనస్ధితి శివోహం అదే నడయాడే అరుణాచల శివుడి స్ధితికి చేరుకున్నారని నా మనోదృష్టికి అందింది అనగానే ఇక చేసేది ఏమిలేక తన సాధనవిషయాలు అతనితో చర్చించడము ఆరంభించారు.ఇది నాకు నచ్చేది కాదు.కోపావేశాలు వచ్చేవి.కాని అదుపులో ఉంచుకొనేవాడిని.దానితో ఈ మౌనసన్యాసి కాస్త ఈయనకి ప్రియశిష్యడవ్వాలని తనకి ఆత్మమోక్షప్రసాదించాలని అన్నపుడు ఈయన కాస్త అతనితో మీరు సాక్షాత్తు నిజరూప దర్శనమిచ్చే అరుణాచల శివుడి సమక్షములో ఉండి నన్ను ఈ వరము అడగటము భావ్యము కాదు.నేను శివుడిని కాను.కేవలము నేను శివుడనే పాత్రధారి భావములో ఈ దేహధారి ఉన్నదని తెలుకొండి.నేనే ఈ అరుణాచల శివుడి దగ్గరికి వచ్చి నాకు ఏమిగావాలో అది ఇవ్వండి.నాకు ఆత్మమోక్షము ప్రసాదించండి అని నాలో ఉన్న ఈ భావజ్ఞానాహమును ఆయనకి దానము చెయ్యడానికి వచ్చాను.అంటే బిచ్చగాడి దగ్గర మీరు గీరుకోవటానికి వచ్చారని ఈ పాటికే అర్ధమయ్యేఉంటుంది గదా అనగానే స్వామి..నిజము చెప్పారు.ఇన్నాళ్లు నా మనోదృష్టితో ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నానో అర్ధమయింది.ఇచ్చేవాడిని అడగకుండా ఇవ్వలేనివాడి అడిగి కాదనిపించుకుంటున్నాను.ఆ బాధలో ఇచ్చేవాడిని పట్టించుకోవడవము మానిచేసి ఇవ్వలేనివాడి వెంట ఇన్నాళ్లుగా పడుతున్నానని నేను చేస్తున్న తప్పును నాకు చెప్పి  గురుభోద చేసినందుకు నా ఆత్మనమస్కారాలు అంటూ నమస్కారించి వెళ్ళిపోయాడు.లేదంటే ఇతనిచేత ఈయన వ్యక్తిగతపూజలు చేయించుకొనే స్ధాయికి వెళ్ళేవారేమో..ఎవరికి ఎరుక. ఇది ఇలాయుండగా ఈక్షేత్రములో ఈయనికి తన ముత్తాత గారి బాలదుర్గా బంగారపు యంత్రము ధ్యానము అదేపనిగా కనిపించడము ఆరంభమైంది.పాపము కారణము   ఏమిటో ఈయనకి తెలిసేది కాదు.కొన్నిరోజులకి  మౌనసన్యాసి మాకు కనిపించి ఈయనతో స్వామి..నాకు గురుభోద చేసి నన్ను మీ మోహ మాయలో పడనీయ్యకుండా చేసినందుకు మీకు గురుదక్షిణ కింద వెండితోచేసిన ఈ గురుయంత్రముండి గురుదక్షిణామూర్త రూపు లాకెట్ ఇస్తున్నాను తీసుకొండి అనగానే ఈయన కాస్త చిరునవ్వి ఇది నాకు వద్దు.నేను ఎవరి వద్ద ఉచితముగా తీసుకోను.ఏది ఆశించను అనగానే మీరు నిజశివయోగి అని చెప్పివెళ్ళిపోతుండగా మాకు దక్షిణామూర్తి గుడి దగ్గర నమస్కారము చేస్తున్న ఇలాంటి అచ్చుగుద్దునట్లుగా ఉన్న మౌనస్వామి కనిపించేసరికి అంటే మా ఇద్దరికి ఏకకాలములో ఒకేరూపముతో అచ్చుగుద్దినట్లుగా ఉన్న ఇద్దరు మౌనస్వాములు మా కళ్ళు ముందు కనిపిస్తూండేసరికి నాకు నోటమాటరాలేదు.దానితో ఇందులో ఉన్న మర్మము ఎదో తెలుసుకోవాలని మీమిద్దరము కాస్త గుడి దగ్గర ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఈ గురుయంత్రము గూర్చి అడిగితే..స్వామి నాదగ్గర వెండి కొనే డబ్బులుంటే ఎందుకు బిక్షాటన చేస్తాను.నాలాగా వచ్చిన ఆ స్వామి ఎవరో ఈ గుడిలో ఉన్న స్వామియే మీకు చెప్పాలి అంటూ ఇతగాడు వెళ్ళిపోయాడు.అంటే వీరిలో ఒకడు నిజ మౌనసన్యాసియైతే ఇంకొకడు వీడి  పాత్రధారి అనగా శివోహం అలాగే శివోహం భావస్ధితికి వీరిద్దరి ప్రతిరూపాలన్ని మాకు అర్ధమయ్యేసరికి పరమహంస ముఖములో చిరునవ్వు మెరిసింది.నాతో మిత్రమా..యంత్ర రహస్యము వీడింది.మా తాతలు కాస్త అమ్మవారిన్ని పూజించడముతో వారు కాస్త దేవోహం అదే శివోహం స్ధితిన్ని పొందడము జరిగింది.అపుడు వీరికి బంగారముతో చేసిన బాలదుర్గ బీజాక్షారాల యంత్రమును వచ్చింది.దీనిని వీరు పూజలో ఉంచి పూజించకుండా తమ మెడలో వేసుకొని నిత్యజపతపధ్యానాధికాలు చేసేవారు.దానితో వారు ఈ స్ధితిమాయలో పడి కీర్తిప్రతిష్టల కోసము,ధనము కోసము ఇతరుల దగ్గర తాను అమ్మవారు అని చెప్పి   లేనిపోని బలవంతపు ఆశల భయాల  పూజలు  చేయించడము ఆరంభమైంది.దానితో వీరి సాధన అక్కడితో ఆగిపోయింది అన్నమాట.అంటే సాధకుడు ఈ స్ధితికి వస్తే వారు పూజించే నిత్యదైవ యంత్రము తప్పనిసరిగా వస్తుంది.దానిని అందుకొని పూజలో పెట్టాలి.మెడలో వేసుకొంటే తానే శివోహం అదే శివుడనే భావస్ధితిలో శాశ్వతముగా ఉండిపోతాడు.దానితో వాడి సాధన ఆగిపోతుంది.
మాకు చూపించిన గురుయంత్రము


ఈ విషయజ్ఞానమును మనకి అందించడానికి స్వయంగా దక్షిణామూర్తి కాస్త ఈ మౌనసన్యాసి పాత్రధారిగా వచ్చి తానుగూడ నిజానికి తాను నిజము కాదని తాను నిజానికి శూన్యానికి పాత్రధారి అని అది తాను తెలుసుకోవడముతో తాను గూడ శివోహం భావస్ధితిన్ని దాటడము జరిగినదని మనకి చెప్పకనే చెప్పడము అలాగే మేముగూడ మా సాధనస్ధితి శివోవాం భావస్ధితి చేరినదని ఈయనే మాకు గురుయంత్రము ఇవ్వడము..దానిని మేము కాదడముతో దానితో మేముగూడ ఈ భావస్ధితిన్ని ఆయన సమక్షములో దాటినామని అర్ధమయ్యేసరికి గిరిప్రదక్షిణము చెయ్యడానికి బయలుదేరాము.

    ఇలా ఈ భావస్ధితిన్ని దాటినవారి ఆత్మశరీరము ఎలాంటి మార్పులు పొందకుండా యదాతదాముగా ఉండి మీ యదార్ధ ఆత్మశరీరముతో మీ సాధన కొనసాగి ఆత్మశరీరము కాస్త 65వ డైమర్ష్ లోనికి ఎలాంటి అనుమానభయాలు లేకుండా చేరుతుంది.దానితో ఈ రేడియోషన్ శిల యొక్క అమితమైన రేడియోషన్ యోగాగ్నిశక్తికి మీ ఆత్మశరీరము కాస్త బడావాగ్నిజ్వాలకి దహనమవుతూ..శరీరము దగ్ధమై..ఆస్ధిపంజరముగా కనపడుతుంది.అపుడు బ్రహ్మకపాలమునకు ఉన్న బ్రహ్మరంధ్రము నుండి మన ఆత్మశక్తి బయటికి వచ్చే తీవ్రమైన ప్రయత్ననాలు జరుగుతుండగా మన బ్రహ్మకపాలము ముక్కలవ్వడము ఆరంభమతుండగా బ్రహ్మరంధ్రము నుండి మన ఆత్మశక్తి కాస్త బయటికి రాగానే ఆఖరిగా మిగిలి ఉన్న బ్రహ్మకపాలనికి మోక్షము కల్గి విముక్తి పొందుతుంది.అపుడు ఈ జ్వాలలో ఉన్న ఆత్మశక్తి కాస్త ఆత్మజ్యోతిగా మారుతుంది.ఈ ఆత్మజ్యోతి కాస్త ఇంక మోక్షజ్యోతియైన అరుణజ్యోతిగా మారవలసి ఉంటుంది.అంటే ఇంక మనకి సాధన మిగిలే ఉంది అన్నమాట.       

మోక్షఅరుణజ్యోతి:  

స్వామి..ఇంక మోక్షమే లేనపుడు మోక్షసాధన చెయ్యడమెందుకు అన్నపుడు అసలు మోక్షము అనేది మన వేదాలలో చెప్పలేదు అని తెలుసుకొండి.మోక్షము అలాగే ముక్తి భావాలు అనేవి పురాణ,ఇతిహాస,మతధర్మాలలో చెప్పి ప్రచారాలు చెయ్యడము జరిగింది.ఒక్కొక్క మతధర్మాలు కాస్త మోక్షము మీద విభిన్న అభిప్రాయాలు అనగా మోక్షమంటే స్వేచ్ఛ పొందడమని..మరొకటి కాలాతీతస్ధితి పొందడమని..ఇంకొకటి పరమాత్మలో ఆత్మగా ఐక్యమవ్వడమని ఇలా చెప్పడము జరిగింది.ఇందులో ఏది సత్యమో ఎవరికి తెలియదు.యత్భావము తత్భవతి అన్నమాట.నిజానికి నా అభిప్రాయము ప్రకారము మోక్షమంటే రుణావిముక్తి పొందడము అనగా   అరుణ స్ధితి అనగా రుణము లేని స్ధితికి చేరడమే మోక్షమవుతుంది.అది ఏమిటి స్వామి..మోక్షమంటే ఒక డైమర్ష్ నుండి మరొక డైమర్ష్ కి వెళ్ళడమని మీరు పైన చెప్పారు గదా అంటే అది మోక్షమార్గము అన్నమాట.మోక్షము వేరు మోక్షమార్గము వేరని తెలుసుకొండి.మోక్షమంటే అరుణమైతే మోక్షమార్గము అనేది మీకున్న వివిధ డైమర్షలలో ఉన్న రుణానుబంధాలు తీర్చుకోవటానికి ఒక డైమర్ష్ నుండి మరొక డైమర్ష్ కి వెళ్ళే మార్గమే మోక్షమార్గమవుతుంది.అందుకే దానిని తాత్కాలిక మోక్షమని చెప్పడము జరిగింది.అలాగే ముక్తి అంటే మనము ఉన్న డైమర్ష్  క్షేత్రానికి చేరడమవుతుంది.అదే భౌతిక మరణము అంటే అసలు మన ఉన్న డైమర్షకి చేరకపోవడమవుతుంది.మోక్షము అలాగే ముక్తి గూర్చి మీకు బాగా అర్ధమవ్వాలంటే ద్వీపము మధ్యలో ఉన్న  భూభాగానికి చేరడము మోక్షమైతే ద్వీపము చుట్టు ఉన్న సముద్రము దగ్గరికి చేరడము ముక్తి అవుతుంది.  స్వామి..ఇదింతా బాగానే ఉంది.కాని మన బ్రహ్మకపాల మోక్షము పొందదని..పైగా మనమంతా ఈ 64 డైమర్ష్ లలో క్రింద నుండి పైకి..పై నుండి కిందకి నిరంతరము సంచారము చేస్తూనే ఉంటారని పైన చెప్పారు గదా అంటే...అసలు ముందు మనము ఎందుకు మోక్షసాధన చెయ్యాలో ఆత్మవిచారణ చేసుకుందాం..1వ డైమర్షలో కర్మ రాహిత్యము..2వ దానిలో జన్మ రాహిత్యము 3వ దానిలో బంధ రాహిత్యం 4వలో కాలాతీత స్ధితి 5లో భావరాహిత్యం ఇలా 64 వ డైమర్షలో ఉన్న ఆఖరి జ్ఞాన అహంకార రాహిత్యస్ధితి పొందటానికి మనము యోగసాధన చెయ్యాల్సి ఉంటుంది.ఎపుడైతే ఈ 64 రాహిత్య స్ధితులు పొందుతామో అపుడు మనకి రుణాల రాహిత్య స్ధితికి అనగా మోక్షము పొందడము జరుగుతుంది.తద్వారా పునరపి జనన:మరణ బ్రహ్మండ చక్ర మాయ నుండి విముక్తి పొంది స్వేచ్ఛను పొందడము జరుగుతుంది.అనగా మన బ్రహ్మ కపాలానికి కపాలమోక్షం పొందడము జరుగుతుంది.ఇదింతా బాగానే ఉంది.మరి మనము 3వ డైమర్షలో ఉన్నపుడు మిగిలిన అన్ని డైమర్షల సాధన ఎలా చెయ్యాలి అన్నపుడు..ఈ 64 డైమర్ష్ లలో ఉన్న 64 రాహిత్య స్ధితులకి మూలమైన 800  రుణాబంధాలున్నాయి.వీటిలో 786 జన్మాంతర రుణాబంధాలని అదే 14 అనేవి ఈ జన్మరుణాబంధాలని..ఈ 14 రుణాబంధాల పేర్లుఅలాగే ఈ రుణాబంధాల నుండి విముక్తి పొందటానికి ఉన్న సాధనపరిహరమార్గలు గూడ పైన చెప్పడము జరిగింది గదా.ఇందులో చెప్పబడిన సాధన మార్గాలలో మీకు నచ్చిన వీలున్న ఒక మార్గమును ఎంచుకొని సాధకుడు తనకి ఉన్న ఈ 786 రుణానుబంధాల నుండి విముక్తి పొందుతాడో వాడి ఆత్మశరీరము కాస్త 65వ డైమర్షలో ఉన్న రేడియోషన్ శిలకి చేరి ఆత్మ కాస్త యోగాగ్నితో దగ్ధమై ఆత్మమరణము పొందుతుంది.ఈ ధ్యానదృశ్యము తన ధ్యానము నందు లేదా స్వప్నము నందు తప్పనిసరిగా కనపడుతుంది.ఇక ఎపుడైతే తనకి 14 మూల రుణాబంధాలు పూర్తిగా తీరతాయో అపుడు ఈ దగ్ధ జ్వాల నుండి మన అరుణజ్యోతి ఉధ్బవిస్తుంది.ఇదియే మన మోక్షజ్యోతి అవుతుంది.ఈ జ్యోతి ఉద్భవించేదాకా మన ఆత్మశరీర దహనము నిరంతరముగా అవిశ్రాంతిగా ఒక పెద్ద 64 అడుగుల బడావాగ్ని జ్వాలగా వెలుతూనే ఉంటుంది.ఎపుడైతే మనకి ఉన్న ఆఖరి 14 రుణాబంధాలు సంపూర్తిగా ఇసుమంతా రుణము లేకుండా తీరుతాయో అపుడు ఈ జ్వాల కాస్త తగ్గుతూ..తగ్గుతూ.. అరచెయ్యి పరిమాణమంతా  అరుణజ్యోతిగా మారుతుంది.



స్వామి..మనము అంతిమముగా అరుణజ్యోతిగా మారతామని చెప్పటానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎందుకు లేవు ఉన్నాయి.ఇది మనకి చెప్పటానికి చూపించడటానికి అరుణాచలములో దక్షిణామూర్తి కాస్త మర్రిచెట్టు కింద కూర్చుని ఉన్నాడు గదా.మీరు ఏపుడైన దక్షిణామూర్తి ఫోటోను జాగత్తగా చూస్తే ఆయన ఎడమ వైపు చేతులలో వరుసగా అగ్నిజ్వాల అలాగే తాళపత్ర గ్రంధాలుంటే అదే కుడివైపు చేతులలో చిన్ముద్ర అలాగే పాముతోగూడిన ఢమరుకముండటము మనము చూడవచ్చును.ఇందులో తాళపత్రాగ్రంధాలు అనేవి పూర్వీక మహర్షలు ధ్యానతపస్సు చేసి తాము పొందిన ధ్యానానుభవ దృశ్యాలను ఈ గ్రంధాలలో తమ అనుభవపాండిత్యముతో వీటిని రచిండము జరిగింది.ఆ తర్వాత ఢమరుకనాదము వలన వచ్చిన అక్షరజ్ఞానమును పొంది శబ్ధపాండిత్యము పొందడము జరిగింది.చివరికి ఈ రెండు జ్ఞానాలు అనగా శబ్ధ+అనుభవ పాండిత్యాలు కలిసి మోక్షజ్ఞానమై జ్ఞాన అరుణజ్యోతిగా మారినదని ఈయన ఏడమ చేతిలో జ్ఞానాగ్ని జ్వాలజ్యోతిన్ని పట్టుకోవడము జరిగింది.అంటే మన అంతిమరూపము జ్ఞాన అరుణజ్యోతియని చెప్పకనే తెలుస్తోంది గదా.ఇక చిన్ముద్ర విషయానికి వస్తే తెరిచిన మూడువేళ్ళు(మధ్య,ఉంగర,చిటికెన్ వేలు) వరుసగా శబ్ధ,అనుభవ,జ్ఞానజ్యోతికి ప్రతీకలైతే.. చూపుడు అలాగే బొటన వేలు కలపడముతో ఏర్పిడిన సున్న రావడము అనగా బాణలింగము అయితే ఇదియే శూన్యానికి ప్రతీక అవుతుంది.అంటే ఏపుడైతే సాధకుడు మొదట శబ్ధపాండిత్యమును పొంది దీనితో సాధన చేసి ధ్యానానుభవములతో అనుభవపాండిత్యమును పొంది ఆతర్వాత ఆత్మయోగిగా మారి అన్నిరకల కర్మ-జన్మ రుణాబంధాలనుండి విముక్తి పొంది అంతిమముగా జ్ఞాన అరుణజ్యోతిగా మారి ఆ తర్వాత తను ఈ జ్యోతిననే ఉనికి లేకుండా చేసుకోవడానికి ఈ మూడుజ్ఞానాల వలన వచ్చిన అహమును కాస్త అరుణచలశివకి దానమిచ్చే అరుణజ్యోతి యొక్క ఉనికి నుండి శాశ్వత విముక్తి పొంది చిన్ముద్రలో సున్నలాగా శూన్యమవ్వాలని ఈయన ప్రత్యక్ష నిదర్శనముగా మౌనభాషతో చెప్పకనే చెపుతున్నారు.    


ఈ జ్యోతిగూడ ఆరిపోతే మిగిలేది వెలుగే లేని చీకటైన శూన్యమే ఉంటుంది.కాకపోతే ఈ అరుణజ్యోతి ఆరిపోవడము అంతాఆషామాషి వ్యవహరము కాదు. అలాగే అరుణాజ్యోతిగా మారడము అంత తేలికైన విషయము కాదు.ఎందుకంటే మనకి ఉన్న మూల 14 రుణాబంధాలు తీరడము అనేది కత్తిమీద సాము లాంటిది.పులి మీద స్వారీ లాంటిదని తెలుస్కొండి.ఈ రుణాలలో ఉదహరణకి సమాజ సేవ రుణమే తీసుకొండి.ఇది సాధకుడికి తెలియకుండానే కీర్తిప్రతిష్టమాయలో అనగా తానే దేవుడు..తానే మహగురువు..తానే జ్ఞానియోగి..ఇలా 18 రకాల జ్ఞాన అహంకారాల మాయలో పడవేసి మనచేత అరుణాచలములో ఒక ఆశయముతో ఆశ్రమము మనకి తెలియని మాయస్ధితిలో పెట్టించడము జరుగుతుంది.ఈ ఆశ్రమ భాద్యతల కోసము దాతల నుండి ధనము ఆశించడము వారి పాపపుణ్య కర్మలను అందుకోవడం  తద్వారా కర్మబంధనుండి విముక్తి పొందడము అటుంచి కర్మబంధాలు పెంచుకోవడముతో వీరి కర్మనివారణ కోసము పున:కర్మ-జన్మ చక్రములో పడటము జరుగుతుంది.దానితో మోక్షము పొందవలసినవాడు కాస్త అక్కడ నుండి బయటికి వచ్చి భౌతికమరణమును పొందుతాడు.ఇక కొంతమంది జ్ఞానయోగులు కాస్త లోకకళ్యాణార్ధము ఆశ్రమాలు పెట్టి వీరు సాక్షిభూతముగా నామమాత్రము ఆ ఆశ్రమ పెద్దగా బాధ్యతలు నేర్వేరుస్తారు.వీరు అరుణాచలములో ఉండి సజీవ సమాధి చెందకుండా రోగమరణమును పొందడము జరుగుతుంది.ఇలాంటివారికి 72సం.రాలు తమ సూక్ష్మశరీరముతో ఈ క్షేత్రములో ఉండి ధ్యానతపస్సు చేసుకొని అరుణాగిరి ప్రవేశమును ఆత్మలింగముగా మారి పొందడము జరుగుతుంది. ఇక కొంతమంది జ్ఞానయోగులు ఆశ్రమాలు పెట్టించే ప్రసాదభక్తులని తమ దగ్గరికి రానీయ్యకుండా ఉన్మాద అవధూతస్ధితిలో నిరంతరముగా ఉంటూ పిచ్చివాడిగా అజ్ఞానిగా అమాయకుడిగా పసిపిల్లాడి మనసత్వముగా క్షేత్రముచుట్టూ పెద్ద పెద్ద అరుపులతో తిరుగుతూ ఉంటారు.వీరు అనుకున్న సమయములో ఇచ్చామరణమును పొంది జీవసమాధి చెందడముతో తద్వారా వీరి  ఆత్మజ్యోతి కాస్త అరుణాజ్యోతిగా మారిపోతుంది.ఇలా ఈ ముగ్గురి యోగుల స్ధితిగతులను నేను ఇదే క్షేత్రములో స్వానుభవాలు చూడటము జరిగింది.అందుకే వారి పేర్లు చెప్పకుండా మీకు ఇంత వివరముగా చెప్పడము జరిగింది. ఇలా ఈ 14 రుణాబంధాలలో ఏదో ఒక బంధములో ఇరుకోకుండా మన వివేకజ్ఞానబుద్ధితో మనము నిరంతరముగా నేనులేను..ఉన్నదింతా శూన్యమే..ఈ  దేహము బతికున్న శవమనే శవసాధనలో మన మనస్సు ఉండాలి.అలాగే మనలో జ్ఞానాహమును వదిల్చించుకోవాలి.దీనికి నిరంతర అరుణాచల శివ నామస్మరణ చేసుకోవాలి.స్వామి ఇదింతా బాగానే ఉంది.మనము అరుణాజ్యోతిగా మారడమే మోక్షము అన్నారు. మరి ఈ విశ్వానికి విశ్వమోక్షముందా?ఉంటే అది ఎలా వస్తోంది అన్నపుడు మీకు వ్యక్తిగత మోక్షము ఉన్నపుడు విశ్వానికి మోక్షము ఉన్నట్లే గదా. నిజానికి మోక్షమంటే శూన్యమవ్వడము..ఇది అవ్వడమంటే వెలుగు లేకుండా చీకటి ఉండటము..చీకటిగా మారలంటే వెలుగునిచ్చే మన మోక్షజ్యోతీయైన అరుణజ్యోతి ఆరిపోవాలి.అపుడే చీకటి తెలుస్తోంది.అదే అనాదిగా ఉన్న శూన్యమవుతుంది.ఇదే విశ్వమోక్షమవుతుంది.అరుణజ్యోతి ఆరిపోవడము అంతా ఆషామాషి వ్యవహరము కాదు.ఎందుకంటే ఈ విశ్వసృష్టి ఆదిలో శూన్యములోంచి వచ్చిన అరుణజ్యోతి నుండి ఉద్భవించినదని..ఏక జ్వాల ఉన్న ఈ జ్యోతి కాస్త రెండు సమభాగాలుగా విడిపోయి రెండు జ్వాలలై ఒక జ్వాలనుండి అదిపరాశక్తి..మరొక జ్వాల నుండి ఆదిరుద్రుడు ఉద్భవించడము జరిగితే వీరిద్దరు కలిసి స్త్రీ,పురుష ప్రకృతులను తమ చేరొక ఏనిమిది అష్టాంగాలతో మూలప్రకృతి ఏర్పారచినారని..ఇలా వీరిద్దరు ఆదిలో రుద్రుడు కాస్త అరుణగిరిగాను స్త్రీమూర్తి కాస్త మర్రిచెట్టుగా రూపాంతరము చెంది అరుణాచల క్షేత్ర ఆవాసముగా మారిందని నేను లోగడే చెప్పడము జరిగింది గదా.చివరికి వీరి అర్ధనారీతత్వముతో ఏకమై మళ్ళీ తిరిగి అరుణజ్యోతిగా మారడము జరిగింది.నిరంతర ఈ  అరుణజ్యోతి యొక్క వెలుగు వలన ఈ విశ్వములో సూర్య,చంద్ర,ఇలా నవగ్రహలకి తెల్లని కాంతి నిరంతరముగా అందడముతో మనకి వెలుగు ప్రపంచముగా ఈ విశ్వము కనపడుతోంది.అందుకే ఈ అరుణాచలము విశ్వమండలానికి మూలమధ్య అగ్నిబిందువైంది. ఇదింతా బాగానే ఉంది.మరి ఈ జ్యోతి ఎలా ఆరిపోతుంది అన్నపుడు ఆది ఒక జ్యోతి అనే ఉనికి కోల్పోయినపుడు ఈ జ్యోతి ఆరిపోతుంది.అంటే ఈ జ్యోతికి వెలుగు ఉంది అంటే దానికి ఏదో ఒక మర్మమాయ ఉన్నట్లే గదా.అదే ఆ మాయే ఉనికి అన్నమాట.అంటే అరుణాచల శివ (అర్ధనారీశ్వర రూపానికి పేరు అరుణాచల శివ) తను ఈ విశ్వములో అరుణజ్యోతి రూపములో ఉన్నానని తన ఉనికి చూపిస్తూనే ఉన్నాడు గదా.దానితో ఈ జ్యోతి ఆరడము లేదు.దానితో చీకటి విశ్వము ఉండవలసినచోట వెలుగు విశ్వముంటుంది.సరే మరి సాధకుడి అరుణజ్యోతి ఎందుకు ఆర్పిపోవడము లేదంటే వీడు గూడ తన ఉనికి మాయలో ఉన్నాడు.అంటే ఈ భూలోకము నందు తాను శివోహం స్ధితిన్ని పొందడముతో అంటే తానే అరుణాచల శివ అని..తన ఉనికి ప్రచారము చేసుకొని శివారాధనకి బదులుగా తన వ్యక్తిగత పూజలు చేయించుకోవడము చేస్తున్నాడు గదా.కొండ కింద తను ఉన్నానని ఉనికితో వ్యక్తిగత పూజలు చేయించుకుంటూ తాను బతికే ఉన్నానని చెపుతూంటే కొండపైన ఉన్న ఇతగాడి అరుణాజ్యోతి ఎలా ఆరిపోతుందో ఒకసారి ఆలోచించండి.వీడు చనిపోయి వీడి గూర్చి పట్టించుకోరో లేదా వీడి గూర్చి పూర్తిగా మర్చిపోతారో అపుడు వాడి ఉనికి లేనట్లే అవుతుంది.ఇలా ఎవరైతే తన ఉనికి లేకుండా ఉంటారో వారి అరుణజ్యోతి ఆరిపోతుంది.తద్వారా ఈ విశ్వానికి విశ్వమోక్షము వస్తుంది.కాని బలహీనత లేని బలవంతుడిని మన భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు. ఎందుకంటే ఈయన్ని సృష్టించిన అరుణజ్యోతికి తన ఉన్నానని ఉనికిన్నివెలుగురూపముతో ఈ విశ్వానికి తెలియచేసింది గదా.పరమహంస గారు గూడ తన గ్రంధాలరూపములో తన ఉనికి ఉండటముతో ఈయన గూడ అరుణజ్యోతిగా అరుణగిరి దక్షిణవైపు నిరంతరముగా వెలుగుతున్నారు.అలాగే శేషాద్రి స్వామి వారు గూడ తన ఆశ్రమము వెనుకవైపు కనిపించే గిరికి పాదభాగములో నాకు అరుణజ్యోతిగా కనిపించడము జరిగింది.ఇలా ఎందరో అరుణగిరి యోగులు కాస్త అరుణజ్యోతులుగా వీటిమధ్యలో గిరికి అగ్రభాగములో నిరంతరముగా అవిశ్రాంతిగా అరుణాచల శివ కాస్త అరుణజ్యోతిగా వెలుగులు ప్రసారము చేస్తున్నాడు.ఎవరైతే ఏ రూపములో నైనగూడ తన ఉనికి చూపించకుండా గుప్తసాధన చేసి మరణమును పొందుతారో వీరిగూర్చి మర్చిపోవడానికి ఇతని కుటుంబబంధుమిత్రలకి 14సం.రాలు పడుతుంది.ఎపుడైతే ఇలా ఉనికి కోల్పోతాడో వాడి ఆత్మజ్యోతి కాస్త అరుణజ్యోతిగా మారి అరుణాచలములో చేరుతుంది అదే 14సం.రాలు పాటు ఎవరైతే అరుణాచల క్షేత్రములో ఆవాసము చేస్తూ వారి ఉనికి లోకానికి తెలియ్యకుండా మరణమును పొంది  ఉంటారో వారి అరుణజ్యోతి ఆరిపోతుందని నాకు పరమహంస గారు జ్ఞానస్ఫురణ అందించడముతో నేను కాస్త నా ఉనికి లోకానికి తెలియనీయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ శవసాధన చేస్తున్నాను.ఇందులో నేను జయము పొందితే విశ్వానికి విశ్వమోక్షము వస్తుంది లేదంటే పరమహంస లాగా నేనుగూడ ఒక అరుణజ్యోతిగా మిగిలిపోతాను.ఏమిజరుగుతుందో ప్రస్తుతానికి నాకు తెలియదు.చెప్పే పరమహంస కాస్త అరుణజ్యోతిగా మారిపోయారు.దీనికి నా పరంగా ఏమి జరుగుతుందో కాలవిధియే చెప్పాలి.గాకపోతే 1440 కోట్ల సం.రాలకి విశ్వమోక్షము పొందుతుందని ఎనాడో పరమహంస తన కాలజ్ఞానముతో మనకి ముందే చెప్పడము జరిగింది గదా.అంటే మనలో ఎవరు ఒకరు తమ అరుణజ్యోతిన్ని తమ మోక్షసాధనతో ఆర్పివేస్తారని ఈపాటికే గ్రహించే ఉంటారు.కాబట్టి ఇక ఆలస్యమెందుకు...అరుణాచల శివతో వైరము పెట్టుకొని మీ వైరభక్తితో ఆయన అనుగ్రహము పొంది అరుణజ్యోతిగా మారి శూన్యమునందు ఐక్యమై విశ్వానికి విశ్వమోక్షమిచ్చే మనోప్రయత్నము మానసికముగా అరుణాచల క్షేత్రము నుండి ఆరంభించండి.శుభంభూయాత్...

మోక్ష అరుణజ్యోతి ఆరిపోయింది:

ఇది ఇలాయుండగా నా శవసాధన పరిమాప్తికొచ్చే సమయానికి ఒకరోజు నా తీవ్రమైన ధ్యానము నందు అరుణగిరిలోని ఒకచీకటి గుహయందు అరచెయ్యి పరిమాణములో విశ్వపాలపుంత గ్రహాలసంచారముతో కనిపించింది.దీని కింద ఒక పూర్ణకుంభాకార దీపజ్యోతి ఉన్నట్లుగా..దీనివలన ఈ విశ్వానికి వెలుగు వస్తూన్నట్లుగా..ఇదియే అరుణజ్యోతి అని..దీనికి ఎవరో పొట్టిగా,వికృతముఖతో ఒక స్త్రీమూర్తి నీటితో దీనిని వెలిగిస్తూ కనిపించింది.అంటే గిరి మీద కనిపించే అరుణాచల శివ యొక్క అరుణజ్యోతి ఆరకుండా తన ఉనికి కోల్పోనీయ్యకుండా ఆదిపరాశక్తి తను పొందిన ఆత్మశక్తితో మోక్షమిచ్చే అగ్నితీర్ధజలముతో దీపారాధన చెయ్యడముతో ఈ  దీపకాంతిశక్తితో అరుణజ్యోతి నిరంతరముగా వెలుగుతోందని నాకర్ధమైంది.అంటే ఈ అరుణజ్యోతి ఆరిపోవాలంటే అమ్మవారు వెలిగిస్తూన్న దీపజ్యోతి ఆరిపోవాలి అన్నమాట.దీనికి ఏమిచెయ్యాలో నాకు అర్ధము కాలేదు.చెప్పేవాడు లేడు....మార్గము చూపించేవాడు లేడు.ఇలా కొన్నిరోజుల తర్వాత ఒక ఇత్తిడి సామన్లు షాపు దాటుతూండగా..నా కళ్ళు ముందు ఒక అరుణజ్యోతి గాలిలో వెలుగుతూ ఈ షాపులోనికి వెళ్ళి మాయమవ్వడముతో..ఇది ఖచ్చితముగా పరమహంస రూప అరుణజ్యోతియని నాకర్ధమై శరవేగముగా నేను కాస్త లోపలకి  వెళ్ళితే  అందులో నాకు ధ్యానములో కనిపించిన కుంభకార దీపజ్యోతి స్టాండ్ కనపడింది.నాకు ఆశ్చర్యమేసి దానిని  కొనడము జరిగింది.నా గదికి దీనిని తీసుకొని వచ్చి ధ్యానములో కూర్చుకొగానే అరుణగిరిమీద ఉన్న అరుణచల జ్యోతి కాస్త ఇలాంటి ఆకార దీపారాధనలో చేరినట్లుగా ధ్యానదృశ్యము కనిపించింది.నాకు ధ్యానభంగమైంది.అంటే తానుకొన్న దీపజ్యోతి నిజమైనదని ఇది అరుణజ్యోతిన్ని ఆదీనము చేసుకుంటుందని నాకర్ధమైంది.మరి అరుణజ్యోతి ఆరిపోవాలంటే ఏమిచెయ్యాలో నాకు అర్ధముకాలేదు.ఇలా మరికొన్ని రోజులు గడిచాయి.ఆ తర్వాత ఎవరో ఒక స్త్రీమూర్తి కనిపించి దీనిని వెలిగించమని అరుస్తూ చెప్పితే..మరుక్షణములో ఒక పురుషుడు కనిపించి ఈ దీపము వెలిగించకు అని కోపావేశముగా చూస్తూ చెప్పే ధ్యానదృశ్యాలు కనిపించాయి.అసలు నాకు ఏమిచెయ్యాలో అర్ధముకాని అయోమయ అనుమానభయము నాలో మొదలైంది.నా సాధన శక్తిన్ని నా మెదడు తట్టుకోలేని ఉన్మాద ఆవేశానికి నిరంతరము గురీవ్వడము మొదలైంది.ఇలా కాదనుకొని  ధ్యానములో కూర్చుకొని స్వామి..పరమహంస..ఈ గడ్డు సమస్యకి మీరే పరిష్కారము చూపించాలి.ఈ దీపము వెలిగించాలంటే మీరు ధ్యానము నందు అరుణజ్యోతిగా కనపడాలి లేదంటే ఎలాంటి అరుణజ్యోతి లేని అరుణగిరి  కనపడాలి అనగానే నాకు ధ్యానము నందు అరుణగిరి కనపడముతో నేను కాస్త ఈ దీపారాధన అసలు చెయ్యలేదు.కాని సుమారుగా 13నెలలు పాటు వీరిద్దరు కనిపించి ఒకరు వెలిగించమని..మరొకరు వద్దన్ని వేదించేవారు. ఈ బాధ తట్టుకోలేక  ఈ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించగానే ఖాళీ అరుణగిరి కనిపించేది.  దానితో దీపారాధన ప్రయత్నము ఆపిసేవాడిని. ఎపుడైతే 14 నెలలు పూర్తీ అయ్యియో అపుడు ఒకరోజు ధ్యానమునందు అమ్మవారు కాస్త తన ఆత్మశక్తితో ఉన్న అగ్నితీర్ధముతో కొండలో ఉన్న దీపమును వెలిగించడానికి ఎంత ప్రయత్నించిన అది వెలిగపోవడము.. ఇంతలో కొండమీద ఉన్న అరుణచల శివ అరుణజ్యోతి నెమ్మది నెమ్మది జ్వాల తగ్గుతూ..వేడిమి..వెలుతురు తగ్గడము ఆరంభమైంది.ఈ దృశ్యము చూసిన అమ్మవారు ఆవేదన చెందుతూ దీపము వెలిగించడానికి విశ్వప్రయత్ననాలు చేస్తున్నప్పడికి అది ఇంక వెలిగదని అర్ధమయ్యేసరికి అరుణజ్యోతి పూర్తిగా అరిపోయి కొండ్కెంది.అంటే ఆదిపరాశక్తి ఈ విశ్వములో ఆత్మశరీరాల తలాలను ఖండన చేసి వారి ఆత్మశక్తిన్ని సంగ్రహించి ఏపుడో ఆరిపోవలసిన అరుణాచల శివ ఆత్మజ్యోతిన్ని ఆరిపోకుండా ఈ విధంగా ప్రజ్వలన చేస్తుంది.అందుకే అమ్మవార్లకి బలిదానాలు ఇవ్వడము ఆనవాయితీ ఆచారముగా మారింది.దీనితో స్వాతిక సాధన కాస్త తాంత్రిక సాధనగా రూపాంతరము చెందింది.ఐతే అన్ని అత్మజీవుల ఆత్మశరీరాల ఆత్మశక్తి అమ్మవారు తీసుకోదు.తాంత్రిక సాధన ప్రకారము చూస్తే పంచ మాంసాలు అనగా మనిషి,ఏనుగు,మేక,గుర్రము,ఆవులను అమ్మవారి బలిదానముగా ఉపయోగించడము బట్టి వీటికి ఆత్మశక్తిన్ని తీసుకొని అరుణజ్యోతి వెలిగిస్తోంది అన్నమాట. అందుకే మన పెద్దలు దీపము ఆరిపోవటాన్ని కొండ ఎక్కిందని..దీపము ఆరిపోకుండా ఉండటానికి దీపము కొండ ఎక్కుతోంది..నూనె పొయ్యండి చెప్పే నానుడి వచ్చింది.ఇలా అరుణజ్యోతి ఆరిపోవడానికి అలాగే అమ్మవారి దీపము వెలగపోవడానికి కారణము నేను తెచ్చిన దీపజ్యోతి వెలిగించకపోవడమే నాకు ధ్యానము నందు నేను తెచ్చిన కుంభాకార జ్యోతి ప్రమిద కనపడేసరికి నా కళ్ళు చెమర్చిచాయి.ఇది ఎలా సాధ్యపడినదని ఆత్మవిచారణ చేసుకుంటే నాకున్న సర్వ కర్మరుణాబంధాలు పూర్తిగా తీరడముతో నా అంశరూపాలున్న 64 డైమర్షలలో ఉన్నవాళ్ళుగూడ నాకులాగా శవసాధన చేసి తమ ఉనికి కోల్పోవడముతో నా ఆత్మశరీరము ఎలాంటి ఖండన జరగలేదని..దానితో అమ్మవారికి అందించే ఆత్మశక్తి నా ద్వారా అందలేదని..అందువలన ఆవిడ ఎన్నిసార్లు దీపము వెలిగించిన వెలగలేదని..నా ఆత్మశక్తి పొందటానికే అమ్మవారు ఆవేశముగా నా చేత నేను తెచ్చిన దీపము వెలిగించాలని భయపెట్టే అరుపులతో అరిచి చెప్పిన నేను వినకపోవడముతో పట్టించుకోకపోవడముతో నా ఆత్మశక్తి ఆమెకి చేరలేదని తద్వారా ఆత్మశక్తితో వెలిగించే తన అఖండ దీపము కొండెక్కడముతో..అరుణాచల శివ అరుణజ్యోతి దీపము గూడ కొండక్కెంది అని నాకు జ్ఞానస్పురణ అయింది.ఆనాటి నుండి స్వయంభుగా వెలిగే అరుణజ్యోతి స్ధానములో మానవుల చేత అతిపెద్ద మట్టి ప్రమీదతో దీపారాధన చేసే దృశ్యము నాకు ధ్యానము నందు కానవచ్చింది.అది ఏమిటి..ఎపుడు గూడ ఇత్తడి కోన్ ఆకారముగా ఉన్న ప్రమీదతో దీపారాధన చేస్తున్నారు అది కనిపించాలి కాని మట్టి ప్రమీద కనిపించడమేమిటి అనుకోగానే నా ధ్యానభంగమైంది.తర్వాత ఆత్మవిచారణ చేసుకుంటే అరుణజ్యోతి ఆరిపోవడము అనేది 64వ డైమర్షలో ఆదియుగములోనే జరిగింది.అంటే తాను ఇదింతా ఇపుడు చేసింది గాదని..ఆదిలో ఎమిచేశామో..ఎలా చేసామో..28 మహయుగాలకి ఈ జన్మలో మోక్షజ్ఞానము పొందడము దీనిని ఒక ధ్యానదృశ్యముగా చూడటము జరిగినదని..తన ఆత్మయోగి పాత్ర ఎలా పరిసమాప్తి అయినదో ఈ జగత్ యందు సాధన చేస్తునట్లుగా ఒక పాత్రధారి తాను చేశానని..కనిపించడము.అనిపించడము జరిగిందని..రాబోవు 3,200 మహయుగాలకి అనగా 1400 కోట్ల సం.రాలకి ఈ భూమీద జీవరాశి ఉనికే ఉండదని   అసలు ఈ భూమి గూడ తన ఉనికి కోల్పోయి సూర్యుడిలో లీనమవ్వడముతో సూర్యుడుగూడ తన ఉనికికూడ కోల్పోయి శూన్యమై ఆనాదిగా ఉన్న ఆదిశూన్యమునందు శూన్యమై ధ్యానదృశ్యము నాకు కానవస్తూండగా ఉన్నట్టిండి అరుణగిరి మీద ఉన్న ఎన్నో అరుణగిరియోగుల అరుణజ్యోతులు ఒక్కొక్కటిగా కొండెక్కెతూ గిరి అగ్రభాగానికి చేరి ఆరిపోవడము ఆరంభమవ్వడముతో...ఉన్నట్టుండి ఈ అరుణగిరి కాస్త తన చుట్టు పరిభ్రమణము చేస్తూ..చేస్తూ...విస్పోటన చెందుతూ శూన్యమై ధ్యాన దృశ్యమును నా మనోనేత్రము తట్టుకోలేని..చూడలేని స్ధితికి చేరడముతో..నా గుండె..హృదయము  ఆగిపోయే ప్రయత్నములో ఉండటంతో ఈ దేహనికి ఆత్మమోక్షము అలాగే ఈ  విశ్వానికి విశ్వమోక్షము పొందడము జరుగుతోందని..నాకర్ధమై..శరీరమును విడిచే సమయములో ఈ వ్యాసము రాస్తుండగానే...నా పని అయిపోయింది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహము రావచ్చును అది ఏమిటంటే  అన్ని అరుణాజ్యోతులు ఒకేవిధముగా కనపడినపుడు మరి ఏవరి జ్యోతి ఏదో మీకు ఎలా తెలిసింది అన్నపుడు చాలా మంది మనకి సప్తశరీరాలు అవి స్ధూల,సూక్ష్మ,కారణ,వాయు, ఆకాశ,సంకల్ప, ఆత్మశరీరాలు మనలో ఉన్నాయని అందరికి తెలుసు కాని మన ఆత్మశరీరము కాస్త ఆత్మజ్యోతిగా అదే అరుణజ్యోతిగా ఏర్పడినపుడు దానికున్న ఆఖరి శరీరమే ఈ జ్యోతి శరీరమవుతుంది.ఇది
 అష్టమ శరీరము అన్నమాట.ఈ శరీరము చనిపోవడము అంటే అరుణజ్యోతి ఆరిపోవడము అవుతుంది.ఈ జ్యోతిశరీరములో మనకి ఆత్మశరీరము యొక్క తలభాగము కనపడుతుంది.దీనినిబట్టి ఎవరి ఈ అరుణాజ్యోతి ఎవరిదో ఇట్టే మనకి తెలిసిపోతుంది. 

ప్రస్తుత జన్మ సాధన:

అంటే ప్రస్తుత జన్మ సాధన ద్వారా తాము ఈ జన్మలో అరుణజ్యోతిగా మారి ఆత్మమోక్షము పొందమో లేదో తెలుసుకోవటానికి అదే ధ్యానము నందు లేదా స్వప్నము నందు తాము ఆదియుగములో చేసిన సాధనను ఈ జన్మలో ధ్యానదృశ్యాలు చూడటము కొరకు మాత్రమే  ఉన్నదని తెలుస్కొండి.ఒకవేళ ఈ జన్మలో మాకు కనిపించిన దృశ్యాలు ఏదో ఒకటి మీకు కనపడితే మీ సాధన దృశ్యాలు మీకు కనిపించడము ఆరంభమవుతాయి.మీ ఆత్మమోక్ష దృశ్యాలు కనిపించలేదంటే మరొ యుగము వరకు ఎదురుచూడకతప్పదు. అపుడు ఆ యుగములో కనపడకపోతే ఆ తర్వాత యుగములో..ఇలా ఎదో ఒక యుగములో తప్పనిసరిగా మీ సాధన దృశ్యాలు తప్పనిసరిగా రికార్డు అవుతాయి.ఆ రికార్డ్ దృశ్యాలు ఏ మహయుగములో రికార్డ్ అయ్యాయో విధాత రాసిన విధిరాత ప్రకారమే కాలము నడుస్తూ ఆ యుగధ్యానదృశ్యాలు మనకి కానవచ్చువరకు మీ దేహ జన్మలు ఉంటునే ఉంటాయి.అంతెందుకు అసలు ఆదియుగములో విశ్వానికి మోక్షము వస్తే..మా ఇద్దరికి 28వ మహయుగము వచ్చేదాకా మా ఆత్మమోక్షమరణ దృశ్యాలు రాలేదంటే పరిస్ధితి మీరే అర్ధము చేసుకొండి. కాని ఇదింతా బాగానే ఉంది. స్వామి..మరి మేమంతా గూడ సాధన చేసి ఉంటే గదా మోక్షసాధన దృశ్యాలు రికార్డు అయ్యేవి.మరి మా సాధనదృశ్యాలు అసలు రికార్డ్ అయ్యాయో లేదో ఎలా తెలుస్తోంది.పైగా ఈ జన్మలో సాధన దేవుడేరుగు..మాయలలో కొట్టుకున్నాము.ఎది సాధనఫలమో..ఎది మాయఫలమో అర్ధముకాని మహమాయలో ఉన్నాము అని మీరంతా అంటే దీనికి పరమహంస సమాధానము ఏమిటంటే అందరు ఖచ్చితముగా మోక్షము పొందిన ఆత్మజీవులే.కాకపోతే మోక్షము పొందామో లేదో అనుమానభయముండముతో మనకి ఈ జన్మలు వచ్చాయి.అలాగే మన అంతిమ మోక్షజన్మ దృశ్యాలు అన్నిగూడ మనకి నిరూపణకోసము అరుణగిరిలో మన సాధనదృశ్యాలుగా రికార్డ్ చేసి భద్రపర్చబడి ఉంటాయి.ఈ విశ్వములో ఉన్న జీవి,ప్రతి వస్తువు చరిత్ర అందులో రికార్డ్ అయ్యే ఉంటుంది.ఈ విషయము తెలియక మనము కాస్త మన మోక్షమరణము నమ్మము. కాకపోతే స్ధూలశరీరానికి మన మరణము పొందిన విషయము మన మనస్సుకి తెలియకుండా జరగడము వలన అది కాస్త నమ్మదు.అలాగే  మన ఆత్మశరీరములోని ఆత్మకిగూడ మనము మోక్షము పొందిన విషయముగూడ తెలియకుండా జరుగుతుంది.దానితో మన ఆత్మగూడ నమ్మదు.అపుడు మన మోక్షజ్యోతియైన అరుణజ్యోతి కాస్త ఉనికి మాయలో పడుతుంది.అనగా తాము మోక్షము ఎలా పొందిమో ప్రత్యక్షనిదర్శనతో తెలుసుకోవాలని అరుణజ్యోతిలో జ్యోతిబిందువుగా మారిన మన ఆత్మ అలాగే జ్యోతిజ్వాలగా ఏర్పడిన మన మనస్సు కోరుకుంటాయి.అందుకే మన మనస్సు కాస్త జ్యోతి జ్వాలలాగా అస్ధిరమైతే..మన ఆత్మ కాస్త బిందువులాగా స్ధిరమైంది.ఇలా ఈ రెండు కలిసి అరుణజ్యోతి కాస్త తన ఉనికితో మోక్ష జ్ఞానము పొందటానికి స్వప్నపాత్రధారిగా ఆత్మశరీరముగా రూపాంతర చెందడము ఆరంభమైంది.ఇలా ఆదిలో  ఏర్పడిన ఆది అరుణజ్యోతి నుండి మన స్వప్నశరీరాలు కాస్త ఆరా జ్వాల  తో సప్త శరీరాలలో 64 డైమర్ష ఆత్మ శరీరాలతో ఏర్పడి మోక్షసాధన చెయ్యడము ఆరభించినపుడు అస్ధిర మనస్సు కాస్త అస్ధిరబుద్ధితో తప్పడు ఆలోచనలతో తప్పడు నిర్ణయాలు తీసుకుంటూ పాపకర్మలలో పడి పాపకర్మఫలితాలకి బలియై ఆవేదనాలు పొంది మాయలలో పడికొట్టుకుంటూ ఉంటే అదే మన అత్మ స్ధిరమైన బుద్ధితో స్ధిర నిర్ణయాలు తీసుకొని పుణ్యకర్మలు చేస్తూ ఆనందాలు పొందుతూ మాయరహితముగా ఉంటుంది.అందుకే మనకి ఒకపుడు ఆవేదన మరొకపుడు ఆనందము కల్గుతాయి.ఇలా మన స్ధూల శరీరము కాస్త ద్వంద్వప్రవృత్తిలో కొట్టుకుంటూ మనస్సు కాస్త భోగము కోరితే..ఆత్మ కాస్త యోగము కోరుకొని మనల్ని అయోమయములో పడివేస్తున్నాయి. దానితో భోగములో ఉంటే ఇది మాయని..అదే యోగములో మాయరహితమని అనుకుంటూ...ఎందులోనుగూడ మనమంతా సుస్ధిరముగా ఉండలేకపోతున్నాము.ఎండలో ఉంటే నీడ కావాలని అనిపిస్తుంది.అదే నీడలో ఉంటే ఎండ కావాలని అనిపిస్తుంది.దీనితో మనము అస్ధిరము నుండి స్ధిరమయ్యేదాకా ఏవో సాధనలతో అనగా కర్మ,భక్తి,జ్ఞాన,ధ్యాన మార్గాలలో మనము ప్రయాణించడము జరుగుతుంది.ఇందులోగూడ మళ్ళీ ఏది మాయో లేదా ఏది మాయరహితమో అర్ధముకాక అయోమయ సాధన చేస్తూ ఉంటాము.అంటే మన మనస్సు కాస్త ఒక విషయము అనగా మోక్షజ్ఞానము పొందాలి స్ధిరమైదాక మన దేహనికి కర్మ-జన్మలుంటాయి. అపుడు మనకి ఏదో ఒక జన్మలో ఖచ్చితముగా మనమనస్సు అలాగే మన అత్మ కాస్త సుస్ధిర జన్మగా మారుతుంది.అదే యోగజన్మ అవుతుంది.ఇది మనకి ప్రతి 48 తరాలకి ఒక యోగజన్మ అవుతుంది.ఈ జన్మలో మనము కొంచెముగా సాధన చేస్తూ కొంత మోక్షజ్ఞానము పొందుతూ ముక్తుల జన్మలు పొందడము జరుగుతుంది.ఇలా 1399 కోట్లు ముక్తుల జన్మలు ఎత్తిన తర్వాత మన మనస్సు స్ధిరమై ముక్తుల జన్మలలో పొందిన మోక్షజ్ఞానమును ఆత్మవిచారణ చేసుకోవటానికి ఏకైక ఒక అంతిమ మోక్షజన్మగా 1400వకోటి జన్మగా ఎత్తి.."నేను ఎవరిని" అనే ప్రశ్నతో సాధన మొదలుపెట్టి ఇలా అర్ధనారీశ్వర తత్వము అనగా మనస్సు అలాగే ఆత్మ ఏకమై అచలమైన అరుణచల క్షేత్రము గూర్చి తెలుసుకోవడవము ఈ క్షేత్ర అరుణగిరికి అనుసంధానమై...తన మోక్షజ్ఞానము అనగా తను ఆదిలో అరుణజ్యోతిగా ఎలా ఏర్పడి మోక్షము పొందిదో ప్రత్యక్ష అనుభవ నిదర్శనాలు మన అరుణగిరి కాలానిగుణముగా ఒక్కొక్క దృశ్యము చూపించడము ఆరంభిస్తుంది.దానికి తగ్గట్లుగా ఆ సాధన జన్మలో పొందిన అన్నిరకాల దైవిక వస్తువులు ఈ జన్మలో మనకి కలిగిన అనుభవాలకి తగ్గట్లుగా ఇవ్వడము ఆరంభిస్తుంది.ఒకటి గుర్తు పెట్టుకొండి.ఇదింతాగూడ అరుణగిరిలో రికార్డ్ అయిన మన సాధన దృశ్యాలు అన్నమాట.మనకి దైవిక వస్తువులు రావడము మనము సాధన చెయ్యడము గూడ రికార్డ్ దృశ్యమే అని తెలుకొండి.అంటే మన  సినిమా చూస్తు సినిమా దృశ్యాలు చూసి ఆనందపడటము అలాగే బాధపడటం,భయపడటం ఇలా 64 తత్వాలతో చూస్తాము.ఇలా మనము ధ్యానములో మనము అరుణగిరికి అనుసంధానమైతే మన మోక్షసాధన దృశ్యాలు చూడటం జరుగుతుంది.ఈ ఆధ్యాత్మిక తుఫాను దృశ్యాలలో బాధకరమైన, ఆనందకరమైన, భయంకరమైన, భయపెట్టే ఎలా 64 తత్వాల దృశ్యాలను గూడ ఒక సినిమా చూసినట్లుగా చూసి సాక్షిభూతముగా సినిమా పూర్తి అయ్యేవరకు సినిమా చూస్తామో అలా మన సాధనదృశ్యాల ఆధ్యాత్మికతుఫాను సినిమా పూర్తి అయ్యేవరకు మనము చూడాలి.కాని కొంతమందికి చూసే సినిమా నచ్చక లేదో భయపడి ఎలాయైతే బయటికి వస్తారో మన సాధన  దృశ్యాలకి భయపడి బాధపడి చూడలేక సాధన మాయలలోపడి అరుణచలము నుండి బయటికి వస్తారు.లేదా అరుణగిరి అనుసంధానము నుండి విడిపోతారు.కాని మన అరుణగిరి ఒకసారి అనుసంధానమైతే మనకి మోక్షజ్ఞానము పూర్తిగా ఇచ్చేదాకా వదిలిపెట్టదు.మన అంతిమజన్మ మోక్షజన్మగా చేసేదాకా అరుణగిరి వదిలిపెట్టదు.అంటే అరుణగిరి అనేది పంచభూతాలతో ఏర్పడిన సినిమా ధియాటర్ అయితే కాలము అనేది ప్రొజెక్టర్ అయితే మన మనస్సు అనేది తెర అయితే చూసేది మన ఆత్మ అయితే ఇదింతా చూపించేది మన త్రినేత్రము అవుతుంది.అంటే ఎవరికైతే త్రినేత్రము తెరుచుకుంటుందో వారు మాత్రమే ఈ జన్మలో అరుణచలములో రికార్డ్  అయ్యిన తమ సాధన దృశ్యాలు చూడటము అనేది ధ్యానము లేదా స్వప్నము ద్వారా చూడటము జరుగుతుంది.స్వామి.ఇదింతా బాగానే  ఉంది. మన ధ్యానము నందు ధ్యానదృశ్యాలు చూడటము రికార్డ్ దృశ్యమైతే...మరి ఈ జన్మ సాధన అలాగే మనకి సాధన దైవికవస్తువులు రావడము అనేది ఎలా రికార్డ్ దృశ్యము అవుతుందో అంటే మనము సినిమ చూస్తున్నపుడు మనము తినటానికి తాగటానికి ఆహరపదార్ధలు తెచ్చుకొని తినడము జరుగుతుంది గదా.దీనిని ఎవరైన తన ఫోన్లో రికార్డ్ చేస్తే మరి ఇది ఒక వీడియో రికార్డ్ దృశ్యమే అవుతుంది గదా.ఆలోచించండి.నిజమే గదా.ఇలా మన ప్రస్తుత జన్మ గూడ వీడియో రికార్డ్ దృశ్యమైతే..మన గత జన్మాంతర జన్మ సాధనాంతగూడ ఒక సినిమా దృశ్యము అన్నమాట.అంటే సినిమా చూస్తున్నవాడు అలాగే సినిమాలోనిపాత్రలు అన్నిగూడ   రికార్డ్ దృశ్యాలే గదా.అలాగే సినిమా చూస్తున్నవాడు కాస్త సినిమాలోనివాడు  తను వేరు అనుకోవడమే మాయకి మూలమైంది.మన మరణము రికార్డ్ దృశ్యమైతే..మన జననము రికార్డ్ దృశ్యమే అవ్వకతప్పదు గదా.అంటే మనమోక్ష మరణ సినిమా దృశ్యము చూసేదాకా మన జనన జన్మాలు  ఒక ప్రేక్షుడిలాగా చూస్తూనే ఉంటాయి.ఎపుడైతే మన మోక్షమరణసినిమా చూడటము పూర్తి అవుతుందో అపుడు చూసేవాడు ఉండడు.చూపించేవాడు ఉండడు.చూడటానికి చూపించటానికి ఏమిఉండదు.అంతా మిగిలేది ఉందో లేదో చెప్పలేని శూన్యమే గదా.  అంటే ఖాళీ గదిలో ఏముందని చూడటానికి వెళ్లితే చూడటానికి ఏమి ఉండదు.చూడటానికి వచ్చినవాడు ఉండడు అన్నమాట.  ఇదింతా బాగానే ఉంది.స్వామి..అరుణగిరిలో మన సాధన దృశ్యాలు ఎవరు రికార్డ్ చేసారు.ఎవరు భద్రపరిచారు అన్నపుడు శివుడి మోక్షసాధన దృశ్యాలను అమ్మవారు తన త్రినేత్రముతో రికార్డ్ చేస్తే..అయ్యవారు కాస్త అమ్మవారి మోక్ష సాధన దృశ్యాలను తన త్రినేత్రముతో రికార్డ్ చేసారు.ఈ రెండు రికార్డ్ దృశ్యాలలో అయ్యవారి రికార్డ్ దృశ్యములో జననము నుండి మరణము దాకా ఉంటే అమ్మవారి రికార్డ్ దృశ్యములో మరణము నుండి జననము దాకా రికార్డ్ అయింది. అందుకే శివుడు లయకర్తగాను..అమ్మవారు సృష్టి కర్తగా ఉన్నారు. కాని నిజానికి అమ్మవారు సృష్టికాదు.ఎందుకంటే  మన జననాలకి కారకుడు అమ్మవారు గాదు.అయ్యవారి వీర్యకణమని తెలుసుకొండి. అంటే ఇందులో అయ్యవారి  రికార్డ్ దృశ్యము మనస్సుకి సంబందించినదైతే.. అమ్మవారి రికార్డ్ దృశ్యము ఆత్మకి సంబందించినది.అపుడు వీరిద్దరు ఏకమై అనగా మనస్సు అలాగే ఆత్మ ఏకమై ఒకేఒక ఆత్మశరీరముగా మారడముతో ఒకే జనన-మరణ రికార్డ్ దృశ్యము అదే మోక్షజన్మ అనగా అరుణజ్యోతి రికార్డ్ దృశ్యమైంది.ఇలా ఎకమైన చోట అరుణగిరి గా అరుణాచల శివుడు అలాగే ఈక్షేత్ర మర్రిచెట్టుగా అమ్మవారు రూపాంతరము చెంది అరుణజ్యోతి రికార్డ్ దృశ్య సినిమాను జ్యోతిస్వరూపుడైన తమ కుమారుడైన కుమారస్వామికి అప్పగించి కాపల ఉంచి శూన్యమైనారు.ఇలా అరుణజ్యోతి మోక్షమరణ జగన్నాటక సినిమాలో మనమంతాగూడ తోలుబొమ్మల పాత్రలు వేసాము.వేస్తున్నాము.ఎవరికి వారు తమ పాత్ర మోక్షమరణదృశ్యము చూస్తే వాడిపాత్ర అంతడితో పూర్తీయ్యి శూన్యమవుతాడు. ఎందుకంటే మనజననమరణాలకి కారకులు విశ్వజననిజననకులు ఆదిరుద్రుడు అలాగే ఆదిపరాశక్తియే గదా.అందుకే మనమంతాగూడ వీరి మోక్ష అరుణజ్యోతి దృశ్యములో అలాగే రుద్రుడి రికార్డ్ దృశ్యములో భోగజన్మాలు అలాగే అమ్మవారి రికార్డ్ దృశ్యములో యోగ జన్మాలు రికార్డ్ అయ్యాయి.ఈ మూడు సినిమాలలో భోగసినిమా(కర్మ) మనస్సుశక్తితో 36 కపాలజన్మలతో ఉంటే(పురుష మనస్సుతో 18 + స్త్రీ మనస్సుతో 18 = 36) 36 క్షణాలుంటే..యోగ సినిమా(జన్మ) ఆత్మశక్తితో 28 కపాలజన్మలతో 28 క్షణాలుంటే అదే మోక్ష సినిమా(విముక్తి) ఒక నిమిషముంటుంది.ఇదే 36+28+1=65 డైమర్ష్ అయింది.ఇందులో 36 కపాలధారిగా మరియి 28 కపాలధారిగా కలిసి అదే మనస్సు + ఆత్మ కలిసి 36+28= 64 కపాలధారిగా మారితే  మిగిలిన ఒకటి ఏకైక ఆత్మశరీరమున్న ఆత్మ అయింది.అలాగే మాయవలన భోగ-యోగ సినిమా(కర్మ-జన్మ) గూడ తయారైంది.దీనికి కాలపరిధి లేదు.  అంటే ఆదిలో ఈ విశ్వమంతా 65 క్షణాలలో 36 క్షణాలలో పుట్టి(సర్వవ్యాప్తి) 28 క్షణాలు పాటు జీవించి(సర్వసమర్ధత) ఒక క్షణములో మరణము(సర్వజ్ఞత) పొందింది అన్నమాట.అనగా సర్వవ్యాప్తి,సర్వసమర్ధత,సర్వజ్ఞత లక్షణాలను భగవంతుడి లక్షణాలని వేద ఉవాచ.అంటే ఈ 65 క్షణాలే పరమాత్మకి 65 శ్వాసలతో సమానము.ఈయన ఒక శ్వాస బ్రహ్మకి పది మహా కల్పాలతో సమానము.100 బ్రహ్మ సం.రాలు ఒక మహకల్పము అవుతుంది.365 బ్రహ్మరోజులు ఒక బ్రహ్మ సం.అవుతుంది.ఇది ఒక కల్పము అవుతుంది.ఈ  లెక్కన చూసుకుంటేపోతే మన మోక్షమరణ వీడియోదృశ్యము చూడటానికి ఎంతకాలము పడుతుందో మీ ఉహకే వదిలేస్తున్నాను. అంటే ఆదిదంపతుల రికార్డ్ దృశ్యాలే మన కొంపముంచాయి.అసలు ఆదిదంపతులు తమ మోక్షదృశ్యాలను రికార్డ్ చేసి ఉండకపోతే అసలు విశ్వమే ఉండేది కాదు గదా.రాబోవు వారికి మోక్షజ్ఞానము అదిగూడ అందరికి అందించాలని భావించి వీటిని భద్రపర్చడమే మన కొంపముంచింది.ఎందుకంటే సినిమా ఉంది అంటే దానికి పాత్రధారులు 1.వేసేవాడు(సినిమాపాత్రలు), 2.తీసేవాడు(డైరక్టర్), 3.తీయించేవాడు(నిర్మాత), 4. రాసేవాడు(రచయిత),  5.చూపించేవాడు(సినిమాహల్), 6.చూసేవాళ్ళు(ప్రేక్షకుడు) ఉండాలి గదా.ఇవే పంచభూతాలు, కాలముతో గూడిన విశ్వము ఏర్పడింది.నాలుగు సినిమాలు అనగా భోగ,యోగ,భోగ-యోగ,మోక్ష సినిమాలు నాలుగు ప్రకృతులలో సృష్టి,స్ధితి,లయ,లాస్య ప్రకృతి తెరలు మీద చూపించడానికి ఉండగా.. చూపించడానికి కాల సమయము నాలుగు యుగాలు,పాత్రధారులు 64,ఈ సినిమాలు చూడటానికి నాలుగు ప్రకృతులతోగూడిన 64 డైమర్ష్ సినిమాహల్స్... చూడటానికి 64కోట్ల800 లక్షల మంది ప్రేక్షకులుంటే ఇందులో నా పాత్ర ఏమిటో మీకు అర్ధమయ్యే ఉంటుంది.అదేనండి రచయిత పాత్ర.ఆదిదంపతులు పొందిన మోక్షమును కపాలమోక్ష గ్రంథమును ఒక రచయితగా మీకు కోసము రాసాను గదా.ఈ విధంగా నా ఉనికి చూపించుకున్నానుగదా.ఈ గ్రంధమున్నంతవరకు నా ఉనికి ఉండాలి.కాని ఉండదు.ఎందుకంటే ఈ రచయిత ఎలా ఉంటారో..ఎక్కడ ఉంటాడో..ఉన్నాడో లేడో గూడ ఎవరికి తెలియదు.తెలిసిన 14 మందికి అనుమానభయముతో బయటికి చెప్పలేదు.కాకపోతే తామే ఈ గ్రంధ నకిలి రచయుతలుగా ఇపుడిదాకా 477 మంది చెలామణిలో ఉండటము నా అదృష్టము.ఎందుకంటే ఈ గ్రంధ రచనమీద నాకు పేరు రావాలని..ధనము రావాలని..కీర్తిప్రతిష్టలు,హోదా గావాలనే ఆశలు,ఆశయాలు లేవు.ఆదిదంతుల ఆజ్ఞమేర వారి మోక్షానుభవాలను ఈ గ్రంధముగా రాయడమే నా వంతు పాత్ర.ఈ పుస్తకము చదువుతారో లేదో గూడ అలాగే దీనిని ద్వారా జ్ఞానము పొందుతారో గూడ నాకు అనవసరము.గ్రంధము రాయడము వరకే నా పనిని.ఈ పనిని పూర్తి అవ్వడముతో..అలాగే ఈ గ్రంధమును జ్ఞానప్రచారముగా ఉచితముగా అందరికి అందుబాటులో ఉంచడముతో పరమహంసగా నా పాత్ర..జిజ్ఞాసిగా నా పతిపాత్ర ఇంతడితో ముగిసిపోయాయి.అందువల్లన మా జీవపాత్రల మోక్షదృశ్యాలు మేమిద్దరుగూడ ఈ జన్మలో చూడటముతో మా ఉనికి కోల్పోయి మా అరుణజ్యోతులు గూడ ఆరిపోవడము అలాగే భౌతికప్రాణాలు పోవడము జరిగింది.    ఇందులో  భోగ సినిమాకి కమాలపురిక్షేత్రమైతే యోగ సినిమాలకి చిదంబరక్షేత్రమైతే..భోగ-యోగ సినిమాకి ఈ ముక్తి సినిమాకి కాశీ క్షేత్రము అలాగే అంతిమ మోక్ష సినిమా చూపించటానికి అరుణాచల క్షేత్రము సినిమా హలులోని ప్రోజెక్టరులుగా పనిచేస్తాయి.మనకి ఉన్న అర్హత,యోగ్యత,యోగము బట్టి వాళ్ళు ఈ క్షేత్రాలలో ఆవాసము చేసి ఆయా సినిమాలు చూసి కర్మ,జన్మ,కర్మ-జన్మ,మోక్ష పొందడము జరుగుతుంది. అలాగే ఈ నాలుగు సినిమాలు గూడ ప్రతియుగములో ఉన్న నాలుగు పాదాలలో చూపించబడతాయి.అలాగే పుట్టిన ప్రతిజీవికి జన్మనక్షత్రముంటుంది గదా.ఈ జన్మనక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి.ఏ పాదము వారు ఏ సినిమా చూడాలో విధాత విధిరాతలో రాసిపెట్టడము జరిగింది.

ఈ గ్రంథము మీకు అర్ధమైతే మీకు మోక్షమే:




స్వామి..ఇదింతా బాగానే ఉంది.మోక్షసినిమా చూడలేనివారి పరిస్ధితి ఏమిటి?ఇంక వారికి మోక్షము రాదా? అంటే ఎందుకు రాదు.వస్తుంది.ఇపుడు జనాలు సినిమా చూసె ముందు సినిమా రివ్యూలు చదివి నచ్చితే సినిమాకి వెళ్ళుతున్నారు గదా.ఈ సమీక్ష వలన సినిమా కధ ఏమిటో 100% తెలిసిపోతోంది.అలాగే ఈ గ్రంధ రచన గూడ మోక్షసినిమా కి సమీక్ష లాంటిదే.దీనిని చదివి అర్ధచేసుకుంటే మీరు తప్పనిసరిగా మోక్షసినిమా దృశ్యము చూడవలసిన పనిలేదు.ఎందుకంటే మోక్షసినిమాలో కనిపించే ప్రతిదృశ్యము మార్చకుండా ఏమార్చకుండా ఉన్నదిఉన్నట్లుగా యధాతముగా యదార్ధముగా ఈ గ్రంథములో రాయడము జరిగింది. అందుకే ఇది అరుణాచల శివ అనుగ్రహము అలాగే ఆశీస్సులు పొందింది.పైగా ఒక గ్రంథము నాలుగు భాగాలతో ఉంది.ఈ నాలుగు భాగాలు నాలుగు సినిమాలు అనగా భోగ,యోగ,భోగ-యోగ,మోక్ష సినిమాల నాలుగు సమీక్షలతో సమానమై తెలుస్కొండి.అనగా నా ఏడుపే నా తొలి సాధన అనే ప్రధమ అధ్యాయము నుండి నేను చూసిన సిద్ధలీలలు అనే అధ్యాయము వరకు మొదటి భాగమైతే...సాధనకి గురువు అవసరమా? అనే అధ్యాయము నుండి నా మంత్రపర్రీక్షలు వరకు రెండవ భాగముగాను అలాగే IAS to SAI అనే అధ్యాయము నుండి బ్రహ్మండచక్రదర్శనము అనే అధ్యాయము వరకు మూడవ భాగముగాను అలాగే కపాలమోక్షం అంటే అనే అధ్యాయము నుండి ముగింపు అనే అధ్యాయము వరకు నాలుగవ భాగముగా విభజించడము జరిగింది.అంతెందుకు ఈ గ్రంధములోని 59వ అధ్యాయమైన సీతాపతి బాణము చూశాను అధ్యాయము యొక్క 3వ కామెంట్ ఒకసారి చదవండి.అమ్మవారే ఈమెచేత ఈ విషయము చెప్పించింది అనుకుంటా.



విషయము మీకే అర్ధమవుతుంది.అది ఏమిటంటే ఈ గ్రంధము చదవడమే ఒక ముక్తి అంది.నిజానికి ముక్తి అంటే జీవన్ముక్తి గదా.ఇది అంటే మోక్షమే గదా.కాబట్టీ ఈ గ్రంథము చదివి అర్ధమై ఆచరణ చేసిన వారందరికి మోక్షమే ఖచ్చితముగా లభిస్తుంది అన్నమాట.కాని ఈ గ్రంథము చదివినంత మాత్రన అందరికి   మోక్షము రాదని తెలుకొండి.ఎందుకంటే 1,25,000 మంది చదివితే అందులో ఒకరు మాత్రమే మోక్షము పొందుతారు.అనగా ఈ గ్రంథము యొక్క నాలుగుభాగాలలో మొదటి భాగమును 98% మంది నమ్మితే..రెండవ భాగమును 80% మంది నమ్మితే మూడవ భాగమును 20% మంది నమ్మితే నాలుగవ భాగమును 2% మందికి అర్ధమై నమ్ముతారు.ఇందులో ఒకడు మాత్రమే తనకి అర్ధమైనదానిని నమ్మకముంచి దానిని ఆచరణలో పెడతాడు.వాడే ఈ జన్మ మోక్షగామి అవుతాడు అన్నమాట.అంటే ఈ గ్రంధము చేప్పే దేవుడు లేడు..ఆత్మ లేదు..దేవుడుకి మరణమున్నట్లే ఆత్మకి మరణముంది.నేను లేను..ఉన్నది కనిపించేది శూన్యమని అనుభవ సిద్ధాంతమును తాను పూర్తిగా అర్ధము చేసుకొని ఆత్మవిచారణతో అవగాహన పెంచుకొని ఇది సత్యమని పూర్తిగా విశ్వసించి దానిని ఆచరణలో పెట్టటానికి తాను లేనని..బ్రతికున్న శవమని..మానసికముగా అన్నింటిని త్యాగము చేసి పరిత్యాగిగా మారి జరిగేదే అలాగే జరగనిది అంతా తన మంచికే అని సాక్షిభూతముగా చూస్తూ మౌనముని ఎవరైతే మారతారో వారికి మోక్షము వస్తుంది.

పంచముఖ రుద్రాక్షధారణ

మాకు వచ్చిన పంచముఖ రుద్రాక్ష



కాకపోతే సమీక్ష చదివినగూడ కొంతమంది సినిమాకి వెళ్ళి ఎలా చూస్తారో అలా ఈ గ్రంధము చదివిన గూడ తమ మోక్షసాధన అనుభవ దృశ్యాలు చూడాలి అనుకొనేవారు మాత్రము తప్పనిసరిగా ఎవరైతే ఈ జన్మలో మోక్షసినిమా చూసి అంతిమ జన్మ చేసుకోవాలని అనుకుంటారో వారుంతా గూడ  అరుణచల ఆవాసము చేసి అక్కడ మరణమును పొందితే మీ ఆత్మమోక్షదృశ్యాలు మీకు ఈ జన్మ అంతిమ ఘడియాలలో ఖచ్చితముగా కనపడుతుంది.లేదా మీరు ఎక్కడ ఉన్నగూడ మీ మరణము  ఎక్కడ జరిగిన గూడ మీకు ధ్యానము నందు లేదా స్వప్నమునందు అరుణాచలక్షేత్ర అరుణాగిరి పదేపదే కనపడుతూంటే అలాగే పదేపదే మీ మనస్సు కాస్త అరుణాచల క్షేత్రానికి వెళ్ళాలని ఆరాటపడుతూంటే అలాగే పదేపదే మీ మనస్సు కాస్త అరుణచల శివ నామస్మరణ చెయ్యటానికి ఆరాటపడుతూంటే మీ మోక్షసాధన దృశ్యాలు మీకు ఈ జన్మలో ఎపుడైన కనిపించవచ్చు.దానితో ఈ జన్మయే మీకు ఆఖరి అంతిమ మోక్షజన్మ ఖచ్చితముగా అవుతుందని ఘంటపధముగా చెప్పవచ్చును.గాకపోతే ఈ జన్మలో ఏ వయస్సులో ఈ ధ్యానానుభవ దృశ్యాలు కనపడతాయో ఖచ్చితముగా చెప్పలేము.పరమహంసగారు 13 యేట సాధన మొదలుపెడితే ఆయనకి 43 సం.రాలు వయస్సు వచ్చేదాకా తన మోక్షసాధన దృశ్యాలు కనిపించలేదు. 

కాకపోతే ఇదింతా ఈ జన్మలో మనకి జరగాలంటే ముందు మనకి అరుణచల క్షేత్ర దర్శనానికి ఒక అధికార అర్హత ఉండాలి.అదే పంచముఖ రుద్రాక్ష ధారణ అన్నమాట.ఇదిగూడ ఈ రుద్రాక్ష మనకి కాశీక్షేత్రము నుండి వచ్చి అరుణాచల క్షేత్రమునకు చేరుతుంది.అనగా మన సాధన సప్త శరీరాలలో పంచ శరీరాలు అనగా స్ధూల,సూక్ష్మ,కారణ,వాయు,ఆకాశ శరీరాలు ఈ కాశీక్షేత్రము నందు దగ్ధమై బూడిదగా మారితే మోక్ష జ్ఞానము పొందాలనే తపనపడే తన సంకల్పశరీరధారికి కాశీవిశ్వనాధుడు మనకి శివ తారకబ్రహ్మ మంత్రముగా ఓం నమ:శివాయ మంత్రమును గురుపదేశము చేసి ఈ గురుమంత్రసిద్ధి కోసము అరుణాచల క్షేత్రము వెళ్ళి ధ్యానతపస్సు చేస్తే నీకు నా అసలు శివమోక్షజ్ఞానము అందుతుందని చెప్పి దీనికి నీకు అధికారయోగము వచ్చిందని అనటానికి గుర్తుగా అపుడు  తన మెడలో ఉన్న రుద్రాక్షమాలలోని  ఒక పంచముఖి రుద్రాక్షను తీసి మన మెడలో వేసి అదృశ్యమవుతాడు.అపుడు సంకల్ప శరీరజీవుడు కాస్త ఈ మంత్ర నామస్మరణ కోసము అరుణాచల క్షేత్రానికి చేరుకొని ధ్యానతపస్సు చేస్తాడు.ఏపుడైతే తన జ్ఞానారుణజ్యోతి గా మారాలని జ్ఞానము పొందగానే సంకల్ప శరీరము పతనమై ఆత్మ శరీరధారిగా మారి అరుణాచల శివ అను జ్ఞానపంచాక్షరి మంత్రమును దక్షిణామూర్తి అనుగ్రహముతో పొంది గురుదీక్షతో సాధన చేసి తన కాశీ పంచముఖరుద్రాక్షను గురుదక్షిణమూర్తిపాదాల యందు ఉంచి మోక్షజన్మ స్దూలశరీరకోసము అరుణాచలక్షేత్రములో నామస్మరణ తపస్సు చేస్తు తన పంచముఖ రుద్రాక్ష ఎవరు తీసుకొంటారో వారే తన మోక్షజన్మయని గుర్తించి వారికి ఈ రుద్రాక్ష ధారణ వలన అరుణచలక్షేత్ర దర్శనానికి అలాగే గిరిప్రదక్షిణానికి అర్హత అలాగే గిరిదీపజ్యోతి దర్శనానికి యోగ్యత అలాగే అరుణాచల ఆవాసానికి,మరణానికి,అరుణజ్యోతిగా మారటానికి గావాలసిన యోగము ఈ రుద్రాక్ష ఇస్తుందని తెలుసుకొండి.  

ఇదింతాగూడ పరమహంస గారికి ఒక స్వానుభవము అవ్వడముతో ఈ రుద్రాక్ష ధారణ గూర్చి ఇంత వివరముగా చెప్పడము జరిగింది.పరమహంస గారికి ఇంటివద్ద ఉన్నపుడు ధ్యానము నందు పదేపదే పంచశిఖరాలు ఉన్న ఒక పర్వతము అలాగే దానిమీద దీపకాంతితో ఒక జ్యోతి వెలుగుతున్నట్లుగా కనిపించేది.అపుడు ఆయనకి ఇది అరుణాచలక్షేత్ర అరుణగిరి అని తెలియదు.మాటల మధ్యలో ఒకసారి ఈ గిరి అనుభవము గూర్చి చెప్పితే అపుడికి నేను ప్రత్యక్షముగా అరుణచలము వెళ్ళి దర్శనాలు మూడుమార్లు చేసుకొని ఉండటముతో ఈ గిరి అరుణగిరి అని చెప్పి ఆయనతో కలిసి అరుణాచలము వెళ్ళాము.అక్కడ మొదటరోజు అన్నిగుడి దర్శనాలు,రెండవ రోజు ఆశ్రమాలు దర్శనాలు,మూడవరోజు గిరిప్రదక్షిణము పూర్తిచేసుకొని మా విడిదికి వచ్చినప్పటినుండి పరమహంస గారి ధ్యానము నందు అలాగే కళ్లు మూసిన తెరిచిన ఒక పాదరసలింగము అలాగే వెండితొడుగులతో చుట్టిన పంచముఖ రుద్రాక్ష పదేపదే కనిపించేది.నేను అపుడికి మూడుసార్లు వెళ్ళిన నాకు ఇలాంటి ధ్యానానుభవము కాలేదు కాని మొట్టమొదటిసారి వచ్చిన ఈయనకి ఎందుకు ఈ రెండు కనపడుతున్నాయో ఒక పట్టనా మా ఇద్దరికి అర్ధము కాలేదు.ఇది ఇలా గాదనుకొని ధ్యానము నందు కనిపించే రుద్రాక్ష కోసము అక్కడ ఉన్న అన్ని షాపులలో తిరిగినగూడ తనకి కనిపించిన ఆకారములో ఎది దొరకలేదు.దానితో మేము నిరాశ పడ్డాము. కారణము లేనిదే కార్యముండదు గదా.ఇలా మరో రెండు రోజులు గడిచాయి.ఒకసారి మా దగ్గరికి భిక్షకోసము ఒక సాధువు వచ్చి 20రూ.లు తీసుకొని వెళ్లపోతూ..అవును నీకు ధ్యానములో పదేపదే రుద్రాక్ష,పాదరసలింగము కనపడుతోంది గదా.అందుకే మీ దగ్గర 20రూ.లు తీసుకున్నాను.శివలింగమును పట్టుకుంటే రుద్రాక్ష దానింతట దీని వెంట వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.దానితో మేము కాస్త దక్షిణామూర్తి గుడి దగ్గర కూర్చుని ఈ కోడ్ న్ని డీకోడ్ చెయ్యడము ఆరంభించాము.అపుడు పరమహంస గారికి తన తండ్రిగారు తనకి కాశీక్షేత్రము నుండి శివుడి ఆత్మలింగముగా పాదరసలింగమును తెచ్చిన విషయము లీలగా గుర్తుకు వచ్చింది. అంటే తనకి ధ్యానములో కాశీ పాదరసలింగము కనపడతూంటే..అంటే దీనితోపాటుగా కనిపించే పంచముఖ రుద్రాక్ష కాశీ క్షేత్రముంది అయ్యి ఉండాలని తెలుస్తోంది గదా.అంటే తాము ఇపుడు పాదరసలింగము కోసము వెతికితే దీన్ని రుద్రాక్ష తప్పని సరిగా దొరకాలి.ఎందుకంటే శివలింగమును పట్టుకుంటే రుద్రాక్ష వస్తుందని ఆ సాధువు చెప్పాడు గదా అనుకొని పాదరసలింగాలు దొరికే చోటుకి వెళ్ళి వెతికితే ఒకచోట నాకు ధ్యానములో కనిపించిన వెండితో చేసిన మూడు కాశీ పంచముఖరుద్రాక్షలు కనిపించముతో వాటి రేటు అడిగితే చాలా ఎక్కువ చెప్పడముతో మేము రేట్ తగ్గించి అడిగితే వాడు ఇవ్వనని చెప్పడముతో మేము వీటిని కొనకుండా వెనక్కి తిరిగి వచ్చిన దగ్గర నుండి మా ఇద్దరి మనస్సుకి ఏదో తెలియని ఆశాంతి..ఎదో కోల్పోతున్నామని అనుభూతి.కడుపులో ఆవేదన..గుండెలో మనోభారము ఇలా ఆయనకి అర్ధరాత్రి వరకు నిద్రపట్టలేదు.దానితో అసలు ఈ రుద్రాక్ష ఎందుకు వేసుకోవాలో తెలుసుకోవాలని ధ్యానమునందు కూర్చుకోగానే కాశీక్షేత్రము నందు తన పంచశరీరాలు దగ్ధమవ్వడము.. సంకల్పశరీరధారి మెడలో విశ్వనాధుడే తన పంచముఖరుద్రాక్ష వెయ్యడము..ఇదికాస్త అరుణాచలము చేరి దక్షిణామూర్తుపాదాల వద్దకి చేరడము,ఈ రుద్రాక్ష తన రుద్రాక్షేనని తెలుసుకోవడము,ఈ రుద్రాక్షధారణ వలన తనకి వచ్చే యోగాధికారులు తెలియడముతో..పైగా తను చూసిన ఈ షాపుగూడ   దక్షిణామూర్తి గుడికి అతీసమీపములో ఉండేసరికి ఇదింతా తెలుసుకున్న మాకు మనస్సు ఆగలేక షాపు తెరవకముందే ఈ రుద్రాక్షలను ఎంత ఎక్కువ ఖరీదు చేసియైన కొన్నాలని బలము నిశ్చయించుకొని అక్కడ ఎదురుచూస్తూ మళ్ళీ నిన్నరాత్రి మేము చూసిన వెళ్ళినతర్వాత ఎవరైన వీటిని కొనుకొని వెళ్ళి ఉంటే ఏమీటని అనుమానభయావేదన పడుతూ షాపు తెరిచేవరకు అశాంతికి గురీవుతూ తీరా లోనికి వెళ్ళితే అవే రుద్రాక్షాలు మాకోసము ఎదురుచూస్తూ కనిపించేసరికి వాడు రాత్రి మాకు చెప్పిన రేటు డబ్బులు ఇవ్వపోతే వాడు కాస్త రాత్రి మేము అడిగిన రేటుకి వీటిని ఇవ్వడము రెండింటిని కొని అందులో తలోక్కటి కంఠము నందు అందరికి కనపడేటట్లుగా ఒక  నల్లత్రాడుతో మెడకి కట్టుకున్న తర్వాత మా మనస్సులు శాంతిని పొందాయి. మా భౌతిక ప్రాణాలు పోయేదాకా దీనిని తీయ్యలేదు..గావాలంటే అక్కడున్న ఈ క్షేత్ర స్ధానికులలో దాదాపు అందరికి పంచముఖరుద్రాక్ష ధారణ ఉంటుంది.ఇలాంటి ఆచార ఆనవాయితీ పెట్టిన మన పూర్వీకులకి ఇంచుమించు మాలాంటి ధ్యానానుభవము జరిగి ఉండి ఉండాలి.లేదా ఈ క్షేత్రములో అరుణగిరికి పంచశిఖరాలు ఉండటముతో పంచముఖరుద్రాక్షధారణ చెయ్యాలని అనుకున్నారేమో ఎవరికి ఎరుక.కాబట్టి మీరుగూడ అరుణచలము వెళ్ళినపుడు తప్పనిసరిగా ఈ క్షేత్రములో వెండితొడుగులున్న ఒక పంచముఖ రుద్రాక్షను కొని మీ మెడలో వేసుకొండి.ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక.ఏ పని చెయ్యడము వలన ఏమి జరుగుతుందో ఎవరికి ఎరుక.మేము నమ్మాము.మాకు స్వానుభవమైంది.ఆపై మీ ఇష్టము.

ఆగ్రహము-అనుగ్రహము:

ఈ విశ్వములో ఉన్న అన్ని క్షేత్రదర్శనాలలో మనము దేవుడిన్ని చూడటానికి వెళ్ళితే ఒకే ఒక అరుణాచల  క్షేత్రములో ఏకముగా దేవుడే మనల్ని చూడటానికి పిలిపించుకుంటాడు.ఆయన అనుమతి లేనిదే మనము ఈ క్షేత్రదర్శనముగూడ చెయ్యలేమని శాస్త్రపండితుల ఉవాచ.కాబట్టి మన మోక్ష సాధన దృశ్యాల పట్టిక ఈయన దగ్గరే ఖచ్చితముగా ఉంటుంది.గాకపోతే ఆయన అనుగ్రహమును మనము ఎంత త్వరగా పొందితే అంత త్వరగా మన మోక్షసాధన దృశ్యాల వీడియోలు మన ధ్యానము నందు చూడవచ్చును.అదే ఆయన ఆగ్రహము పొందితే మనము కాస్త మనకి తెలియని మాయలో అనగా అతీకామము, అతీమోహము, అతీవ్యామోహ,అతీభయం,అతీఆశ ఇలా ఎదో ఒక విషయములో మనము అతిగా ప్రవర్తించి దానిని మాయలో పడికొట్టుకొనిపోతూంటే దానిని ఆయన కాస్త మన భౌతిక వ్యక్తులు లేదా గురువులు చేత చెప్పించినగూడ మనము మారకపోతే ఆయన ఆగ్రహానికి గురికాకతప్పదు.అవును.ఈ విషయము మీకు బాగా అర్ధమవ్వాలంటే పరమహంస గారి జీవితములో అరుణాశివ అనుగ్రహము అలాగే ఆగ్రహము పొందిన యదార్ధ సంఘటనలు మీకు చెపుతాను.ఒకసారి పరమహంస అరుణాచలము వెళ్ళి ఈయన బాగా ఇష్టమైన దక్షిణామూర్తిగుడికి వెళ్ళి ఆయనకి నమస్కారించి..స్వామి..ఈ రోజు మీకు ఒకమాట ఇస్తున్నాను.అది ఏమిటంటే కాఫీలు,టీలు త్రాగనని మాట ఇస్తున్నాను అని ఈయనకి తెలీయనిస్ధితిలో ఆయనికి మాట ఇచ్చారు.ఆతర్వాత ఈయన ఇంటికి వచ్చి ఒక ఆరు నెలలు పాటు వీటిని తీసుకోలేదు.మనస్సు పీకడము మెదలైంది.దానితో నాతో మిత్రమా..ఎవరైన మందు,సిగరెట్లు త్రాగడము ఆపివేస్తారని మాట ఇవ్వవచ్చును.నేను ఏమిటి అనవసరముగా నాకు అవసరమైన వాటిని త్రాగనని మాట ఇచ్చాను.అయిన వీటిని మాట తప్పి తాగితే ఏమీవుతుంది అంటూ కాఫీలు,టీలు త్రాగడము మొదలుపెట్టారు.ధ్యానములో పదేపదే అరుణాచల శివ ఉగ్రరూపము కనిపించిన పట్టించుకోలేదు.ఇంటి పెద్దలు వీటిని తాగనని ఆయనికి మాట ఇచ్చి తప్పడము మంచిది కాదు అని పదేపదే చెప్పిన వినిపించుకోలేదు.ఇలా మరో ఆరు నెలలు గడిచాయి.ఉన్నట్టుండి ఈయన కాలి మడమలలో విపరీతముగా నొప్పులు రావడము మొదలైంది.దానితో పది అడుగులు వెయ్యడముగూడ అతికష్టమైంది.వైద్యుడి దగ్గరికి వెళ్ళితే ఏవో పరీక్షలు రాస్తే వాటిని చేయించుకుంటే కాలిమడమలలో  అధిక మోతాదులో యూరిక్ యాసిడ్ చేరిందని ఇది అతిగా కాఫీలు,టీలు సేవించేవారికి వస్తుందని ఇక మీ జీవితాంతము వీటిని మానివెయ్యాలని లేదంటే కుర్చీకే అంకితమవుతారని ఖచ్చితముగా చెప్పడముతో వైద్య నారాయణో గదా అనుకొని ఆ రోజు నుండి ఈయన కాస్త వీటిని తాగడము పూర్తిగా మానివేశారు.దానితో కొన్నిరోజులకి ఈ రోగము నుండి విముక్తి పొందారు.ఇది ఇలా ఉంటే కార్తిక దీపోత్సవము నాడు అరుణచలము వెళ్ళి తిరిగి వస్తూ బస్సులో కాలికిబొటన గోరుకి విపరీతమైన గాయమమైంది.దానితో మనకి ఏది జరిగిన మన మంచికే ఇదిగూడ మన అరుణాచల శివానుగ్రహలీల అనుకొని వదిలేశారు.ఇంటికి వచ్చిన కొన్నిరోజులకి కాలిగోరు ఉడిపోయింది.దానితో విపతీతమైన పోటు రావడము అపుడికే ఈయన శరీరములో చక్కెర వ్యాధి ఉండటముతో ఈ గాయము ఒకపట్టన తగ్గలేదు.వైద్యుడి దగ్గరికి వెళ్ళితే ఆయన సుగర్ టెస్టులు చేసి మనిషి అనేవాడికి ఈ స్ధాయిలో సుగర్ ఉండటము ఇదే నేను మొదటిసారిగా చూస్తున్నాను.ఈ సుగర్ వలన మీ కాలి గోరు మాత్రమే పోయింది.ఇక వారము రోజులు ఇదే సుగర్ స్ధాయి మీలో ఉండి ఉంటే మీ కాలి వేళ్ళు అలాగే మీ చేతి వెళ్ళుకి రక్తప్రసరణ ఆగిపోయి అవి చచ్చిపోయి కుళ్లడమో లేదా ఊడిపోవడము జరిగేది అనగానే అంటే తనలో ఏ స్ధాయిలో చక్కెర ఉన్నదో తెలుసుకొని గమనించే స్ధాయి విధముగా అరుణాశివ తనమీద  అనుగ్రహము చూపిస్తున్నందుకు ఈయన కళ్ళు చెమర్చాయి.గాకపోతే కాలిగోరు గూడ పోయేది కాదు.అపుడు అరుణాశివ కాస్త రెండు పూటల అన్నము తినవద్దని మాట తనకి ఇవ్వమని తీసుకుంటే పరమహంస ఇచ్చినట్లే ఇచ్చి తప్పేవారని తెలుసుకోవడముతో ఎవరైన చేప్పితే వినరని అనుభవము అయితే నమ్ముతారని ఈయన విషయములో ఆయన కాస్త గోరు మాత్రమే తీయ్యడము జరిగింది.ఇపుడు చక్కెర స్ధాయి పూర్తిగా తగ్గాలంటే పూర్తిగా అన్నము తినడము మాని గోధుమ లేదా జొన్నరవ్వ తినమని వైద్యుడి చెప్పితే పరమహంస కాస్త తనకి వైద్యుడు చెప్పిన విషయము ఒకరోజు ధ్యానదృశ్యముగా కనిపించేసరికి దానితో ఇది సత్యమని నమ్మి ఆరోజు నుండి అన్నము తినడము పూర్తిగా మానివేశారు. ఇలా ప్రతివిషయములో పరమహంసకి అరుణాచల శివానిగ్రహము అలాగే ఆగ్రహము పొందడము జరిగింది.కాబట్టి మీరంతా గూడ ఎక్కడ ఉన్నగూడ అరుణగిరికి అనుసంధానమై ఆయన అనుగ్రహము లేదా ఆగ్రహము పొంది   సాధన చేస్తే తర్వగా ఆత్మమోక్షమును పొందుతారు.లేదంటే నెమ్మదిగా ఆలస్యముగా ఆత్మమోక్షము పొందుతారు.అదే మీ మోక్షసాధన దృశ్యాలు చూడటం జరుగుతుంది.సాధన చేసిన చేయ్యకపోయిన అందరు పోవడము ఖచ్చితముగా మోక్షమరణమును పొందడము జరుగుతుంది.ఇక్కడ ఎవరు ఉండాలన్న ఉండలేరు.ఎవరు ఉండరు.ఏది ఉండదు.ఏమి ఉండదు.ఉందో లేదో తెలీయని శూన్యముంటుందని గూడ చెప్పలేము.

అంతం-అనంతం

ఇక్కడ చాలామందికి ఒక  ధర్మసందేహము వస్తుంది అది ఎమిటంటే 36 కపాలాల ఫ్రేము ఆట కదా అనే అధ్యాయములో మన కపాలమోక్ష దృశ్యాలు రికార్డ్ కాలేదని ఒక ప్రక్క చెపుతూనే మరో ప్రక్క ఈ అధ్యాయములో రికార్డ్ అయ్యిన కపాలమోక్ష దృశ్యాలు చూస్తే గాని మోక్షము రాదని చెపుతున్నారు.ఇందులో ఏది నిజము అన్నపుడు ఈ రెండు వాదనాలుగూడ నిజమే. సత్యమే. ఎలాంటారా..ఈ గ్రంథములో చెప్పిన కపాలమోక్ష వివరాలు అన్నిగూడ ఆదియుగపు ఆదిరుద్రుడి కపాలమోక్షము..ఇది చూసిన ఆదియుగపు పరమహంస కపాలమోక్ష దృశ్యాలేనని ముందుగా తెలుసుకొండి.ప్రస్తుత దేహజన్మ కాస్త ధ్యానయోగిగా మారి ఈ రెండు రికార్డ్ దృశ్యాలను తన మనోదృష్టితో చూడటము జరిగింది.అనగా ఈయన ఆదిజన్మ పేరు పరమహంస అయితే ప్రస్తుత దేహజన్మ పేరు పవన్.అంటే ప్రస్తుత పవన్ తన ఆదియుగములో తన ఆదిజన్మ ఎవరిదో..ఎమి జరిగినదో..అయన ఎలా సాధన చేసి మోక్షము పొందాడో..ఆయన చూసిన శివకపాలమోక్ష దృశ్యాలు అన్నిగూడ ప్రస్తుతజన్మలో ఉన్న పవన్ చూడటము జరిగింది.కాని పవన్ తన దేహ మోక్ష దృశ్యాలు చూడటానికి ఎమిలేదు.ఎందుకంటే  ఇది ఆఖరి జన్మ గావడము చేత ఇవి రికార్డ్ కాలేదు.


కపాలధారి-              ఆత్మమోక్షకపాలధారి




                                                     ఆత్మమోక్షము చూసే మోక్షదేహజన్మ

అంటే ప్రస్తుత జన్మ మోక్ష దృశ్యాలు అనేవి మన 64 కపాలాలలో ఒక కపాలానికి మాత్రమే అస్ధిపంజరముంటుంది.దీనికి మాత్రమే ఆత్మశరీరముంటుంది.ఇదియే అంతిమ మోక్షమైన ఆత్మమోక్షమును పొందే ఏకైక ఆత్మశరీరము అన్నమాట.అంటే మనకి ఉన్న 64 కపాలాలలో 36 కపాలాలు భోగజన్మలు అయితే 28 యోగజన్మాలు అయితే మిగిలిన ఒక కపాల జన్మ ఆత్మమోక్ష జన్మావుతుంది.ఒకవేళ ఈ 64 కపాలజన్మలలో యోగ-భోగ-ఉనికి మాయలలో పడితే అదికాస్త 64 కోట్ల 800 లక్షల జన్మాలు ఎత్తేయోగముంటుంది.అంటే మొత్తము 64 కపాలలో ఒక కపాలము దానికిమాత్రమే  ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.ఈ కపాల ఆత్మమోక్ష దృశ్యాలు మాత్రమే రికార్డ్ అవుతాయి.మన ప్రస్తుత దేహజన్మలో ఉన్న మనస్సు అలాగే ఆత్మ కాస్త తమ మనోదృష్టితో ఈ ఆత్మమోక్ష దృశ్యాలను చూసి నిజముగానే తాను ఆదిజన్మలో ఆత్మమోక్ష పొందామని ఆత్మశాంతి పొంది తమ అరుణజ్యోతి ఉనికిని కోల్పోయి శూన్యమవుతుంది.లేదా అరుణజ్యోతికి ఉన్న 64 ఉనికి మాయలలో పడితే మాత్రము ఆత్మమోక్ష దృశ్యాలు కనిపించవు.దానితో మళ్ళీ ఈ మాయలు వద్చించుకోవానికి భోగ-యోగ జన్మాలు ఎత్తక తప్పదు.దీనినే తిరోగమనము అనగా వెనక్కి రావడము అన్నమాట.మళ్ళీ అరుణాచల శివ అనుగ్రహము పొందుటకు జన్మలు ఎత్తకతప్పదు. కాని నా ఆదిజన్మ మోక్షదృశ్యాలు రికార్డ్ మాత్రమే అయ్యాయి.ఎందుకంటే మోక్షజన్మ అనేది అంతిమ ఏకైక జన్మ మాత్రమే.అదిగూడ ఆదియుగపు ఆదిజన్మ మాత్రమే మోక్షము పొందింది.అది పొందిందో లేదో ఎలా పొందిదో తెలుసుకోవటానికి మన మనస్సు,ఆత్మ కాస్త అరుణజ్యోతిగా మారి ఉనికి మాయలోపడీ ఆదియుగము నుండి 28 మహయుగము వరకు భోగ,యోగ,భోగ-యోగ,మోక్ష జన్మాలలో ఆదియుగములో నాలుగుపాదాలలో వీటిన్ని ఎత్తి మోక్షము పొందితే అది పొందినదో తపనతాపత్రయముతో 28వ మహయుగాలు వరకు భోగ-యోగ జన్మాలు ఎత్తుతూనే ఉంది.ఇపుడు ఈ దేహజన్మలో ఆదియుగపు ఆదిజన్మ పరమహంస మోక్షదృశ్యాలు చూడటము జరిగింది.ఇప్పుడివరకు ఈ దృశ్యాలు ఈ దేహజన్మాలు చూడలేదు.ఎందుకంటే ఈ దేహము అనేకమాయలలో పడికొట్టుకొని పోయింది.కాని ప్రస్తుత జన్మలో సాధనలో  వచ్చే అన్నిరకాల మాయలు మర్మాలు తెలుసుకొని వాటిని ఎలా దాటినదో మీకు తెలుసు గదా.అంటే ఇదింతా గూడ 477కోట్ల జన్మాల పరంపర మాయజ్ఞానము వలన వీటిని దాటుకోవడము జరిగింది.ఇదింతా బాగానే ఉంది.మరి ఈ జన్మ మీ మోక్షజ్ఞ జన్మ అని ఎలా తెలిసింది అన్నపుడు పరమహంస అరుణాచలములో సంకల్పశరీరము కాస్త ఆత్మలింగముగా మారడము..ఈ లింగము కాస్త అగ్నితీర్ధములో పడి విభేధన అవ్వడము..దాని ద్వారా ఆత్మశరీరము బయటికి రావడము..ఇదికాస్త అర్ధనారీశ్వర తత్వముతో 65వ డైమర్షలోనికి వెళ్ళి దగ్ధమవ్వడము..దీని నుండి అరుణజ్యోతిగా ఏర్పడము ఎలా జరిగినాయో మీరంతా తెలుసుకున్నారు గదా.అపుడు ఇది ఖచ్చితముగా మోక్షజన్మ అవ్వకతప్పదు గదా. సరే ఇదింతా బాగానే ఉంది మరి ఆదిజన్మలో మీరు మోక్షము పొందినపుడు మరి మీ మనస్సు అలాగే మీ ఆత్మ ఎలా ఇన్ని దేహజన్మాలు ఎత్తినాయి.అంటే ఆదిలో మీరు మోక్షము పొందలేదా అన్నపుడు అసలు మోక్షమంటే సర్వరుణాబంధాలు నుండి విముక్తి పొందడమే గదా.ఇలా పొందినపుడు కర్మ-జన్మ రాహిత్యస్ధితి మనము పొందినపుడు అరుణజ్యోతి ఎర్పడుతుంది.కాని దీనికి తను ఒక జ్యోతిగా ఉన్నానని ఉనికిమాయ ఉండముతో దీనిలో ఉన్న మనస్సు అలాగే ఆత్మకి తొలీఅలోచన మొదలై అసలు తను ఎలా మోక్షము పొందానో తెలుసుకోవాలని భోగ-యోగ పున:కర్మ-జన్మ చక్రములో పడటము జరిగింది.అంటే జ్యోతి రూపము అంతము గావాలసినచోట తన ఉనికి మాయ వలన రూపాంతరము చెంది అంతము గావాలసినచోట అనంతమైన జన్మాలు ఎత్తింది.అంటే ఎవరైతే ఈ అరుణజ్యోతికి తమ సాధనశక్తి వచ్చినదని తెలుసుకుంటారో వారు తమ ఉనికి కోల్పోతే అరుణజ్యోతి ఆరిపోయి అనాది శూన్యము నందు శూన్యమవుతుంది.అంతడితో ఇతగాడి పాత్ర కాస్త ఈ విశ్వజగన్నాటము నుండి తప్పుకొని అంతమై పోతుంది.లేదంటే అరుణజ్యోతి స్ధితిలో ఉన్నపుడు తన ఉనికి మాయలో పడితే వచ్చే తొలి ఆలోచనకి తొలి భావరూప శరీరమును ఉహించుకొని వాటి కర్మ-జన్మ చక్రములో పడి అనేక రకాల మాయలలో పడుతూ లేస్తూ అంతము గావాలసినవాడు కాస్త అనంతమై అంతులేని కధ మిగిలిపోతాడు.అందుకే రమణమహర్షి ఒక మాట చెపుతారు అది ఏమిటంటే ప్రశ్నించే మనస్సు కాస్త స్ధిరమై హృదయము నందు ఆగిపొయ్యి లయం చెందితే అదియే మోక్షమవుతుంది.ఈ లెక్కన చూస్తే అరుణజ్యోతిగా మారినవాడు అస్ధిరము నుండి స్ధిరమైనపుడు అనగా ఉనికి మాయను దాటినపుడు హృదయ శూన్యము నందు మన ఆత్మ అరుణజ్యోతి ఎలాంటి రూపాంతరాలు చెందకుండా తన జ్యోతిరూపమును అంతము చేసుకొని అనంతముగా అంతులేని కధ కాకుండా చేసుకుంటుంది అన్నమాట.అలాగే ఎవరైతే అరుణజ్యోతి ఉనికి మాయలో పడి తమ మోక్షకథను అంతము చేసుకోకుండా అనంతము చేసుకుంటారు.ఇలా వీరి వలన 65 క్షణాలలో అంతమయ్యిన మన మోక్షకథ కాస్త అనంతమై అంతులేని కధగా 3,200 మహయుగాలు అనగా 1400కోట్ల సం.రాలు దాకా కొనసాగింది.అంటే అంతమయ్యేవారు అంతమవుతారు.అలాగే అంతముకానివారు దీనిని అంతులేని కధ గా పొడిగించుకుంటారు.గాకపోతే వీరిద్దరికి మాత్రము 1400కోట్ల ఆయుష్ మాత్రమే ఉంటుంది.అనగా అంతమయ్యేవాడు తన మోక్షజ్ఞానము పొందినవాడు 14సం.రాలలో ముగింపు పలికితే అదే అనంతమైనవాడు 1400కోట్ల సం.రాలకి ముగింపు పొందుతాడు.మరి మీ మోక్షజన్మ అయిన అరుణజ్యోతి కాస్త ముగింపు అనేది అంతముగా తీసుకుందా లేదా అనంతముగా తీసుకుందా మీకు మీరే సాధనద్వారా తెలుసుకోవాలి.మా ఇద్దరికి అయితే అంతము ముగింపు అదే 14సం.రాలలో వచ్చి మా భౌతికమరణము కాస్త శాశ్వత మోక్షమరణము చేసింది.మరి మీ ముగింపు ఎలా ఉంటుందో విధాత అయ్యిన అరుణాచలశివ కి మాత్రమే తెలుస్తుంది.ఎందుకంటే అరుణాగిరికి మన ముగింపుకి అంతమిచ్చే..అనంతమిచ్చే..శక్తి ఉంది అనగా అంతము అంటే అరుణజ్యోతి ఆరిపోవడము అదే అనంతము అనగా ఈ క్షేత్రము నుండి తిరోగమనము అనగా వెనక్కి పంపించడము అన్నమాట.మీ ముగింపు మీ చేతులలో మీ చేతలలో లేదు.అరుణాచల శివానుగ్రహ ఆగ్రహము మీద ఉంది.ఈ ముగింపు ఏమిటో మన ప్రస్తుత దేహజన్మలో ధ్యానదృశ్యాలుగా చూసి తెలుకోవడము తప్ప మనము ఏమిచెయ్యలేమని తెలుస్కొండిగాకపోతే ముగింపులో ఉనికి మాయ నివారణ తేడాల వలన కాలప్రవహములో తేడాలు వస్తాయి.అనగా అయ్యవారు కాస్త అమ్మవారి రికార్డ్ మోక్షదృశ్యాలు చేసారని అలాగే అమ్మవారు కాస్త అయ్యవారి మోక్షదృశ్యాలు రికార్డ్ చేసారని మీకు తెలుసుగదా.అంటే అయ్యవారు తన మెదడు స్ధానములో ఉండి అమ్మవారివి రికార్డ్ చేస్తే అమ్మవారు కాస్త హృదయస్ధానములో ఉండి అయ్యవారివి రికార్డ్ చేసారు.కాని మెదడు నిరంతరముగా ఓకవిధమైన విద్యుత్తున్ని ఉత్పత్తి చేసి అన్నిభాగాలకి సరఫరా చెయ్యడము మన శరీరము వేడి ఉండి బ్రతికి ఉంటుంది.ఈ వేడిపోతే మన శరీరము చల్లబడి శవము అవుతుంది.ఇలా వీరి రికార్డ్ పూర్తీ  అయ్యినపుడు మెదడు నుండి విద్యుత్ నెమ్మది నెమ్మదిగా అన్నిభాగాలకి తగ్గిస్తూ హృదయానికి అందనీయ్యకుండా చేస్తుంది.దానితో హృదయ రక్తప్రసరణ ఆగిపోయి శరీరభాగాలు చల్లబడటము ఆరంభమవుతుంది.ఆ తర్వాత ఎనిమిది క్షణాలకి ఆఖరుగా మెదడికి రక్తప్రసరణ ఆగిపోవడముతో మెదడు చనిపోతుంది.అంటే మెదడులో ఉన్న బ్రహ్మరంద్రగుహలో ఉన్న 64 శివకపాలధారి మొదట చనిపోతాడు.ఆ తర్వాత హృదయానికి మెదడు నుండి పూర్తిస్ధాయిలో విద్యుత్ అందకపోవడముతో ఆఖరిగా హృదయము చనిపోతుంది.ఈ రెండింటికి మరణాల మధ్య ఏనిమిది క్షణాల గ్యాప్ ఉంది.కాని భౌతికముగా చూస్తే మొదట హృదయము చనిపోయిన ఏనిమిది క్షణాలకి మెదడు చనిపోయినట్లుగా కనపడుతుంది.కాని మొదట మెదడు చనిపోయి విద్యుత్ ఆపిన ఏనిమిది క్షణాలకి గుండె కాస్త రక్తప్రసరణ ఆపి చనిపోతుంది.దానితో శివుడు ఒక క్షణములో చనిపోతే అమ్మవారు ఏనిమిది శ్వాసాల క్షణాలతో చనిపోతుంది.పరమాత్మ ఒక శ్వాస బ్రహ్మకి 100 మహకల్పాలతో సమానమని మీకు తెలుసు గదా.దానితో శివుడి మరణము 14సం.రాలైతే అమ్మవారి మరణము 1400కోట్ల సం.రాలు అయింది.తద్వారా ఒక క్షణ మృత్యువుభయము ఏర్పడింది.దీనిని వెంటనే ఒక కోటి శివయోగులు మాత్రము ఈ మృత్యువుకి భయపడలేదు.దానితో వీరంతాగూడ క్షణములోనే శూన్యమైనారు.ఇక మిగిలిన 64 కోట్లమంది మాత్రము ఈ క్షణ మృత్యువుకి భయపడి క్షణ మరణమును కాస్త కల్పము దాకా పొగిడించుకొని..అక్కడ నుండి వెనుతిరిగి పున:కర్మజన్మ చక్రములో పడ్డారు.అంటే వీరంతా మోక్షమును పొందకుండా ముక్తిన్ని పొందారు అన్నమాట.శివయోగులు 65వ డైమర్షుకి వెళ్ళి శూన్యమైతే...మిగిలినవారు 1వ డైమర్షు నుండి 64వ డైమర్షు దాకా వచ్చి వెనుతిరుగుతున్నారు. అంటే మీ ఆదిజన్మ వీడియో అమ్మవారి రికార్డ్ దృశ్యములో ఉంటే మీ ముగింపు అనంతమవుతుంది..అదే అయ్యవారి రికార్డ్ దృశ్యములో ఉంటే అది 14సం.రాలలో అంతమవుతుంది.అయ్యవారిని పూజించేవాడు త్వరగా మోక్షము పొందితే అమ్మవారిని పూజించేవాడు చాలా ఆలస్యముగా మోక్షము పొందుతాడు అన్నమాట.ఈ లెక్కన మన పూజించేవారిని బట్టి మన మోక్షజన్మ ముగింపు ఏదో తెలిసిపోతుంది గదా.అమ్మవారిని పూజించినవాడు అయ్యవారి అనుగ్రహమును పొందుతాడు.అదే అయ్యవారిని పూజించేవాడు అమ్మవారి అనుగ్రహమును పొందవచ్చును.కాబట్టి ఈ శివశక్తి కాస్త అర్ధనారీశ్వర తత్వముతో ఉన్న అరుణాగిరి వాసి అరుణాచల శివ అనుగ్రహమును పొందితే మీ మోక్షముగింపు మీకు ఏవిధముగా కావాలో అది ప్రసాదిస్తాడు.మీ ముగింపు అంతములో గావాలంటే అంతముగాను వద్దు అనంతముగా గావాలంటే అనంతముగా ఇస్తాడు.గాకపోతే మన తలరాతలో ఆయన ముందుగానే ఏమిరాసిపెట్టాడో అదే ఆయన్ని కోరి వారి అనుగ్రహము పొందమని మనము భ్రమ భ్రాంతిలో పడి మన ముగింపు ముగిస్తాము.

. శుభంభూయాత్

శవ నాణెము (YES - NO choice):
 



చాలామందికి ఇక్కడ ఒక సందేహము వస్తుంది అది ఏమిటంటే ముక్తుజీవులలో ఎవరైన మోక్షము పొందాలనుకుంటే అది వస్తుందా రాదా అన్నపుడు తప్పకుండా వస్తుంది.కాని ఇక్కడ మీరు తీసుకొనే అవకాశము బట్టి మీకు మోక్షమా లేదా ముక్తి అనేది ఆధారపడి ఉంటుంది.అది ఏలాంటే మహభారతము చూస్తే 12సం.రాలు అరణ్యవాసము అలాగే ఒక సం.రము అజ్ఞాతవాసము అని ఉంటే రామాయణములో 14 సం.రాలు వనవాసముంటుంది.దీనిని మనకి అన్వయించుకుంటే మన రాత మార్చుకోవటానికి 12 నుండి 14 సం.రాలు పడుతుందని తెలుస్తోంది.అంటే ఒకడు ఒక ప్రాంతములో 12సం.రాలు పాటు ఉంటే వాడికి ఇంకొక ప్రాంతానికి పోవడానికి ఒక అవకాశము వస్తుంది.ఆ తర్వాత ఒక సం.రము పాటు కొత్త ప్రాంతానికి వెళ్ళాలా వద్దా తర్జనభర్జన పడటానికి అవకాశముంటుంది.ఆఖరికి 14వ సం.రములో వాడు తీసుకున్న బలమైన నిర్ణయమును బట్టి వాడు అక్కడ ఉండాలో కొత్త ప్రాంతానికి వెళ్ళాలో నిర్ణయించుకుంటాడు.ఇలా ప్రతి 12సం.రాలకి నుండి 14 సం.రాల వరకు ప్రకృతి మనకి యెస్ లేదా నో అనే అవకాశాలు ఇస్తుంది.అలాగే దీనిని యోగప్రకారముగా తీసుకున్నగూడ ఇలాగే సాధనకుడి సాధన ప్రతి 12సం.రా నుండి 14 సం.రాలు లోపు వాడి సాధనస్ధితి గతులలో మార్పులు,చేర్పులుంటాయి.అదిగూడ వాడు ఎంచుకున్న అవకాశ నిర్ణయము బట్టి ఉంటుంది.మాయలో పడాలో లేదా మాయ రహితముగా ఉండాలో వాడు తీసుకున్న నిర్ణయము బట్టి ఉంటుంది. ఇలాగే మనకి మోక్షము గావాలా లేదా ముక్తి గావాలో నిర్ణయించుకొనే అవకాశము మనకి ప్రతి 12 నుండి 14 సం.రాలకి ఖచ్చితముగా వస్తుంది.ఇదే అరుణచల క్షేత్ర అరుణగీత ఈ పనిని చేస్తుంది.జీవుడు అసలు అరుణచలము అసలు ఒకసారైన వెళ్ళాడా లేదా చూస్తారు.వెళ్ళేతే ఒక కొత్త రాత అసలు వెళ్ళకపోతే పాత రాత నడుస్తోందని పురాణవచనము.అలాగే మనము వెలుతున్న అరుణజ్యోతి నుండి అరుణజ్యోతి ఆరిపోయినపుడు మూడు స్ధితులు ఆరు రకాల అవకాశాలు ఎంచుకోవాల్సింటుంది.అనగా 65వ డైమర్షలో ఉన్న నల్ల రేడియోషన్ శిల దగ్గరికి వెళ్ళాటానికి ఆరు రకాల అవకాశాలు దాటాలి.అనగా మూడు స్ధితులు దాటాలి.అంటే నీలము-ఆకుపచ్చ అనగ రుద్రబాలా  స్ధితి, అలాగే పసుపు-ఎరుపు ఉన్న రుద్ర ఉన్మాద స్ధితి అలాగే నలుపు-తెలుపు ఉన్న రుద్రపిశాచ స్ధితి దాటాలి.ఇందులో ప్రతిస్ధితికి రెండు అవకాశాలు అనగా అవును లేదా కాదు అనే నిర్ణయాలు మనము తీసుకోవాలి.ఇలా ఈ మూడు స్ధితులకి ఆరు అవకాశాలకి ఒక సం.రము గడువు అనగా 13వ స.రం ముంటుంది.మనము తీసుకున్న ఏదో ఒక స్ధితిన్ని బట్టి ఆ జీవితము అలా ఆ నిర్ణయము బట్టి కొనసాగుతుంది.మళ్ళీ తీసుకున్న నిర్ణయము మార్చుకోవటానికి 12 నుండి 14 సం.రాలు ఎదురుచూడక తప్పదు.ఇలా మోక్షము కోరుకొనేవారు రుద్రుడు ఇచ్చే ఈ మూడు రకాల స్ధితులను తీసుకోకుండా ఉంటే అనగా బాలోన్మతపిశాచ స్ధితులలో ఏ ఏ స్ధితిని తాను పొందకుండా ఉంటే వాడికి మోక్షమే అనగా శూన్యబిందువు కాస్త శూన్యమైపోతాడు.లేదు ఏదైన స్ధితిన్ని గావాలని తీసుకుంటే వాడు మోక్షము పొందటానికి 12 నుండి 14సంరాలు తర్వాత మరొక్క అవకాశము కోసము ఎదురుచూడకతప్పదు. అందుకే అరుణాచల ఆవాసము తప్పనిసరిగా 14సం.రాలు ఉండాలి లేదా అక్కడ మరణము పొందితే వచ్చేది మోక్షమని చెప్పడము జరిగింది.అదే కాశీలో మరణము అనేది మహస్మశానములో అంతిమ శరీరానికి మరణము ఇవ్వడమైతే అరుణచలములో మరణము అనేది మనోవినాశన స్మశానమై ఆత్మమోక్షమవుతుంది.   ఈ మూడు స్ధితులను ఉన్న అరు రకాల అవశాలను ఎంచుకోవటానికి మనకి మూడు జతల నాణేలు ఇవ్వడము జరుగుతుంది.ఇందులో ఈ ఆరు నాణేలు మీద ఒకవైపు అవును మరొక వైపు కాదు అని ఉంటుంది.ఈ మూడు జతలలో నాణాలు ఎంచుకొనేటపుడు కాదు అనే అవకాశము ఎంచుకున్నవాడికి మోక్షము వస్తుంది.లేదు ఎదో ఒక నాణేములో అవును అని ఎంచుకోనేవాడికి మోక్షము రాదు.కేవలము ముక్తి వస్తుంది.అనగా పున:కర్మ-జన్మ చక్రములో యోగ లేదా భోగ జన్మాలు ఎత్తుతాడు.వాడికి ఆ దేహజన్మలో అరుణచలక్షేత్ర దర్శనము చేస్తే మళ్ళీవాడికి ఈ మూడుస్ధితుల అవకాశాలు ఎంచుకొనే స్ధితి వస్తుంది.ఈ సారి మళ్ళీ అన్నింటికి కాదు అనే అవకాశము తీసుకుంటే వాడికి ఆ  జన్మలో అరుణాచల ఆవాసము యోగము కల్గి అక్కడే మరణమును పొంది  ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.వెలుతున్న అరుణజ్యోతి ఆరిపోతుంది.అనగా 65వ డైమర్ష మోక్షశిల మీద వాడి ఆత్మశరీరము దగ్ధమై మనోవినాశనము పొంది శూన్యము నందు శూన్యమై పోతాడు.




ఇది ఇలా జరుగుతుంది అనటానికి ప్రత్యక్షనిదర్శనముగా మనకి అరుణచల క్షేత్రములో నేరశివ గుడి ప్రక్కనే ఉన్న అమ్మవారి ఆలయములో ఒకవైపు ఒక గుర్తు ఉంటుంది.పైన పెట్టిన ఫోటోలో ఉన్నట్లుగా ఇది చూడటానికి ఒక బిందుస్ధానములో లోపల ఒక త్రికోణము ఉండి దానిలోపుల ఆరుకోణాలున్న షట్కోణము దీనికి లోపల ఒక కోణము అంచున్న నల్లబాణలింగము ముంటుంది.దీని కోడ్ ని మేము డీకోడ్ చేస్తే ఆత్మవిచారణలో ధ్యానదృశ్యమై ఈ జ్ఞాపక జ్ఞానస్పురణ అందుకోవడము జరిగింది.ఇదింతా బాగానే ఉంది.మనము ఎంచుకునే నాణము బట్టి మన మరణము అనేది మోక్షమరణము లేదా ముక్తిమరణము అనేది ఉంటుందని చెప్పటానికి ఎదైన భౌతికనిదర్శనముందా అంటే ఖచ్చితముగా ఉంది.అదే ఒక వ్యక్తి దహనము చేసేటపుడు వాడి నుదటిమీద లేదా కళ్ళమీద లేదా వాడి నోటిలో ఒక రూపాయి నాణెము ఉంచడములో ఉన్న పరమార్ధము మీదేనని చాలామందికి తెలియదు.చనిపోయిన వ్యక్తి తిరిగి తమ వంశములో పున:జన్మ ఎత్తి రావాలని నుదటి మీద హేడ్ వైపు నాణెముంచి దహనము లేదా పూడ్చిపెట్టడము జరుగుతుంది.వాడు ఇంక వెనక్కి తిరిగిరాకూడదు అనుకుంటే టైల్ వైపు నాణెము ఉంచుతారని చాలా మందికి తెలియదు.ఈ సంప్రదాయము గ్రీకుల నుండి తమిళుల సంస్కృతిదాకా వచ్చింది.ఈ సంప్రదాయల కధనం ప్రకారము ఈ నాణెము కాస్త వైతరిణి నది దాటించడానికి పడవలో వచ్చిన వారికి రవాణఖర్చుల క్రింద వాడతారని ప్రచారములో ఉంది.అదే యోగులు తమ ఆత్మశరీరము మోక్షము పొందాలి అనుకున్నపుడు తమ ధ్యానముతో సూక్ష్మశరీరయానముతో అరుణచలక్షేత్రములో ఉన్న అరుణగిరిలోపులకి వెళ్ళి అక్కడ ఉన్న రుద్రదక్షిణామూర్తి చూపించే మూడు జతలు నాణేలలో ఏదో ఒకటి నచ్చి అవును అనే అవకాశము తీసుకుంటే మోక్షము పొందకుండా వెనుతిరిగి ముక్తిజీవుడిగా రుద్రపిశాచము మారి తీసుకున్న నిర్ణయమునకు కట్టుబడి ఉండి ఆ జీవితాన్ని  అనుభవిస్తాడు.ఈ జీవితాంకములో మళ్ళీ అరుణచలము రావడము రుద్రుడు చూపించిన నాణెలలో దేనికి లొంగకపోతే మరుజన్మలో అరుణచలవాసిగా జన్మించి ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.ఇదింతా ఇంత ఖచ్చితముగా నేను చెప్పటానికి కారణము పరమహంస జీవితానుభవములో జరగడము వలన తెలిసింది.ఎలాంటే మా ఇద్దరి ఆది జన్మలు గూడ అరుణాచలవాసము చేసి అక్కడే మరణము పొందిన గూడ మాకు ప్రస్తుత ఈ దేహజన్మాలెందుకు వచ్చాయని ఆత్మవిచారణ చేసుకొని ధ్యానములో కూర్చున్నపుడు పరమహంస గారికి ఒక ధ్యానానుభవమైంది.అది ఎమిటంటే ఈయన ఆదిజన్మ ఆత్మశరీరము కాస్త అరుణగిరియందు ప్రవేశించి 65వ డైమర్ష మోక్ష శిలకి చేరుకొనేటపుడు 



మొదట ఒక ఆకుపచ్చ-నీల వర్ణమున్న ఒక కాంతివలయము కనపడింది.దీనిని ద్వారముగా ఒక నాణెము ఉంది.దీనిమీద ఒకవైపు ఒక త్రిభుజములో శూన్యశిల ఉండి అవును రాసి ఉంది.దీనిని తిప్పితే దీనికి మరొవైపు కపాలము బొమ్మ ఉండి కాదు అని రాసి ఉండటము గమనించారు.అలాగే ఈ ద్వార ముద్రను తాకినపుడు తన మనసత్వము కాస్త పసిపిల్ల బాల స్ధితిని పొందడము గమనించారు.ఏటు మోక్షశిలకి తను వెళ్ళాలి గదా అనుకొని అవును అనే అవకాశము ఎంచుకోవడము జరిగింది.



దానితో ద్వారము తెరుకోవడముతో ఈ సారి పసుపు-ఎరుపు కాంతివలయము దీనికి ద్వారబంధనముగా ఒక నాణము ఉండటము దీనికి ఒకవైపు వంశ వృక్షముంటే మరొకవైపు కపాలముంటే ఈ సారి కపాల గుర్తు ఉంటే దీనిని ఎంచుకోవడము అలాగే తన మనసత్వము ఉన్మాద స్ధితిని పొందడము గమనించారు. 



అపుడు ద్వారము తెరుచుకోగా ఈ సారి లోపలకి వెళ్ళితే తెలుపు-నలుపు ఉన్న కాంతివలయము కనిపించడము దీని ద్వారబంధనముగా ఉన్న నాణెము మీద ఒక వైపు హస్తములో ఒక జ్ఞాననేత్రము ఉన్న గుర్తు ఉంటే మరొక వైపు రుద్రపిశాచ గుర్తు ఉండేసరికి ఈ ముద్ర తాకుంతుండగా తన మనసత్వము పిశాచవస్ధ పొందుతున్నాని గ్రహిస్తూ ఈసారి ఎపుడైన మోక్షము పొందాలంటే మోక్షజ్ఞానము గావాలి గదా అని దీనిని ఎంచుకుంటే ద్వారము తెరుకోకపోగా 



ఈ ముద్రలస్ధానములో గణపతి ఏనుగుముఖము అలాగే మరొక వైపు ఆయుధాలతో ఉన్న గరూడ ముద్రలుగా మారి గణపతి ముఖము కాస్త తొండము కదిలిస్తూ..నువ్వు ఏమోక్షజ్ఞానమైతే పొందాలి అనుకున్నావో ఆ జ్ఞానము పొందేదాకా నీకు ఆత్మమోక్షము రాదు.అపుడిదాకా రుద్రపిశాచవస్ధతో 477కోట్ల జన్మాలు ఎత్తిన తర్వాత నీకు మళ్ళీ ఇలాంటి అవకాశము రాదు అని చెపుతూండగా..65వ డైమర్ష్ కాస్త అదృశ్యమవ్వడముతో ఈయనకి ధ్యానభంగమై తను చూసిన నాణెలరూపాలను ఈ అరుణగిరి గుహలయందు చెక్కించడము జరిగింది.ఆ తర్వాత తను అరుణాచలము మరణము పొందితే రుద్రపిశాచస్ధితి పొందడము ఎలా జరుగుతుందో అపుడికి ఆయనికి అర్ధముకాలేదు.మౌనము వహించారు.




ఈసారి నా ధ్యానము నందు ఇక్కడిదాకా వచ్చి పరమహంసగారు చేసిన తప్పు నేను చెయ్యకూడదని ఈ సారి నా ధ్యానము నందు నా ఆత్మశరీరయానముతో అరుణగిరిలోపలికి నా ఆత్మశరీరము వెళ్ళితే ప్రధాన ద్వారము వద్ద నాకు ఒకవైపు సీతారాముడు మరొక వైపు హనుమ ఉన్న నాణము కనపడితే నేను కాస్త సీతారాముడిని ఎంచుకోగానే ...





రెండవ ద్వారములోనికి వెళ్ళడము అక్కడ నాకు అమ్మవారు ముద్ర అలాగే రుద్రశివమూర్తిముద్ర ఉన్న నాణము కనిపించగానే నేను కాస్త రుద్రశివమూర్తి ఎంచుకోవడముతో ....





మూడవ ద్వారములోనికి వెళ్ళగానే ఒకవైపు హస్తములో త్రినేత్ర ముద్ర మరొక వైపు శివలింగ ముద్ర ఉన్న నాణము కనిపించగానే నేను కాస్త శివలింగమును ఎంచుకోగానే నాలుగువ ద్వారములోనికి నా ఆత్మశరీరము ప్రవేశించడము జరిగింది.లోపుల కాషాయము-నలుపు రంగు కాంతి వలయములో కనపడింది.





దీనిలోపుల ఒకవైపు అగ్నితీర్ధములో ఉన్న అరుణాగిరి,సూర్యచంద్రుడు,జ్ఞానమునేత్రము ఉన్న పురుష,స్త్రీమూర్తు హస్తాలు ఉన్న ప్రకృతి కనపడితే..మరోకవైపు రెక్కలున్న అస్ధిపంజరాలు గాలిలో ఎగురుతున్నట్లుగా కనిపించడము..ఈ రెండు ప్రకృతులకి దారికి ద్వారబంధనముగా ఒక మంత్రదండము ఉండేసరికి..విచిత్రముగా రెక్కలున్న అస్ధిపంజరాలు చూడటానికి నాకు భయము వెయ్యడముతో అందముగా కనిపించే పంచభూత ప్రకృతిన్ని ఎంచుకోవడముతో ఈ సారి ప్రకృతులుపోయి గణపతి ఏనుగుముఖము కనిపించి ఏ ప్రకృతి అందాలకి నువ్వు అమిత మోహమాయలో పడ్డావో ఆదితీరేదాకా ... ఆ అస్ధిపంజరము చూసి భయపడ్డావో ఆ భయము పోయేదాకా నీకు ఈ జ్ఞానమిచ్చినవాడితో సహజన్మాలు ఎత్తి ఈ రుణాబంధము సంపూర్తినాడు మళ్ళీ మీకు ఈ నాణెముగుర్తు మీ దగ్గరికి రాగానే అపాస్మరకస్ధితి పొందిన మీ జ్ఞానము మీకు గుర్తుకు వచ్చి మీ ఆదిజన్మ నీకు ఈ అవకాశము వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది.నాకు ధ్యానభంగమైంది.అంటే నాణాల ముద్రలు ఆయా ద్వారాలు వద్ద మా ఇద్దరికి  వారి మనోభావాలకి తగ్గట్లులుగా మనల్ని ప్రలోభపెట్టేవిధముగా మారతాయని మాకు అర్ధమైంది.అందరికి ఈ ముద్రలతో ఈ నాణాలు కనిపించవు.వారికి ఇష్టమైన రూపముద్రలతో తప్పనిసరిగా మూడు ద్వారాల యందు ఈ నాణాలు కనపడతాయని మేము గ్రహించాము.గాకపోతే ఈ నాలుగు కాంతివలయాల రంగులు అందరికి ఒకేవిధముగా కనపడతాయని తెలుసుకున్నాము.దానితో మాకు కనిపించిన ముద్ర నాణెలు ముద్రించి చివరిగా నాకు కనిపించిన ముద్రనాణేలు మాదగ్గర ఉంచుకొని ఆనాడు ఆదిజన్మలో మేమిద్దారము మరణము కోసము అరుణచలము ఎదురుచూడటము జరిగింది.నాకు ఇక్కడ ఒక ధర్మసందేహము కల్గి మా పరమహంసన్ని అవును..నేను ఒకవేళ నాలుగువ వలయములో అరుణగిరి ప్రకృతి కాకుండా గాలిలో ఎగుతుతున్న అస్ధిపంజరాలు ఎంచుకొని ఉంటే ఎమి జరిగేది అనగానే..అపుడు నీకు కనిపించే ఈ రెండు ప్రకృతులు మాయం అయ్యి ఒక  64 అడుగుల ఎత్తులో ఉన్న అరుణచలశివ అరుణజ్యోతి ప్రచండ జ్వాల నీకు వెలుగుతు కనిపించేది.అపుడు నీ ఆత్మశరీరము కాస్త ఈ జ్యోతి యందు ఒక అరుణజ్యోతి అగ్నిశిఖగా మారి ఒకవేళ నీకు ఎలాంటి ఉనికి మాయ లేకపోతే ఆ క్షణమే నీ అరుణజ్యోతి ఆరిపోయేది.నువ్వు శూన్యనము నందు శూన్యమైపోయోవాడివి.మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవాడివి కావు అనగానే అంటే మీకు అన్ని తెలిసినగూడ మూడవ వలయము వద్ద ఎందుకు తప్పుడు ఎంపిక చేసుకున్నారు అనగానే ఆ సమయములో నాలో అంతర్వవాణిగా నువ్వు ఒక్కడివే మోక్షమును పొందాలని అనుకుంటే రుద్రపిశాచ ముద్రను ఎంచుకో. లేదు నీతో పాటు విశ్వానికిగూడ విశ్వమోక్షము పొందాలి అనుకుంటే  నా మోక్షజ్ఞానము నీకు ప్రసాదించే జ్ఞాననేత్రమున్న నా హస్తముద్రను ఎంచుకో అనగానే నా స్వార్ధము చూసుకోకూడదని ఈ విశ్వానికి విశ్వమోక్షముకోసము శివమోక్షజ్ఞానము నేను పొంది ఈ విశ్వానికి నా వంతుగా అందించాలని నాకు ఆ క్షణములో బలంగా అనిపించడముతో అన్నితెలిసిన నాకు తెలియకుండానే తప్పు అని తెలిసిన తప్పు ఎంపిక తీసుకోవడము జరిగింది.లేకపోయి ఉంటే నా స్వార్ధము నేను చూసుకొని ఉండి ఉంటే ఆ క్షణమే నాలుగువ వలయములోనికి వెళ్ళి అరుణజ్యోతిగా మారి అర్పిపోయి శూన్యమైపోయేవాడిని.ఇదింతా గూడ వేదాలలో,పురాణ,ఇతిహసాలలో పూర్వీక మహర్షులు ఈ జ్ఞానమంతాగూడ ఎపుడో అందరుగూడ కాలనుగుణముగా పొంది వారి అనుభవజ్ఞానమును అలాగే పరిహరమార్గాలను అక్కడ అక్కడ వీటిలో పొందుపర్చడము జరిగింది.గాకపోతే ఆ తర్వాత తరాలుగా వచ్చిన మిడిమిడిజ్ఞానపండితుల అర్ధజ్ఞానముతో తమకు తోచిన లేదా తమకి కల్గిన భ్రమ భ్రాంతి అనుభవజ్ఞానమును ఇందులో చేర్చడముతో అసలు నిజజ్ఞానము మూలనపడి అబద్ధజ్ఞానము ప్రచారములోనికి వచ్చింది.ఇపుడు నేనే గాదు నా లాంటివారు ఎందరో నిజజ్ఞానము చెప్పినగూడ ప్రజలు నమ్మేస్ధితి, అర్ధము చేసుకొనేస్ధితి ఎపుడో కోల్పోయారు.అనుమానించేస్ధితి మాత్రము పెట్టుకున్నారు. అంతెందుకు ఇపుడున్న తరాలవారికి కపాలమోక్షమంటే సమాధి మరణసమయములో కపాలము పగిలి బ్రహ్మరంధ్రము నుండి రక్తము బయటికి రావడమే కపాలమోక్షమని నమ్మేవిధముగా జ్ఞానప్రచారము చేశారు. కాని నిజానికి ఇది పూర్ణమోక్షానికి ఆరంభస్ధితియేనని అంతమయ్మేస్ధితి ఆత్మమోక్షము పొందడము అని ఎందరికి తెలుసు.నాలాంటివాళ్ళు ఇది తెలుసుకొని లోకానికి చెప్పిన నమ్మేస్ధితి లేకపోగా అనుమానించే అవమానించే స్ధితిలో వీరంతా ఉన్నారు.దానితో నాలాంటివారు మౌనమునిగా మారి...మానావమానాలకి అతీత అవధూత ఉన్మాద స్ధితిలో ఉండి   నమ్మివచ్చినవారికి ప్రత్యక్షముగా అర్ధమైవిధముగా వారికి చెప్పి వారిజీవితాలను అర్ధవంతముగా మారుస్తూ తమ ఉనికి లోకానికి తెలియకుండా గుప్తయోగులుగా ఉండి తమ సాధనానుభవాలను విశ్వజ్ఞానములో ఉంచి ఎవరు సర్వస్య శరణగతి భావముతో తమకి శివమోక్షజ్ఞానము లేదా మోక్షము గావాలని కోరుకుంటారో పరోక్షముగా వారికి ధ్యానాలయందు లేదా స్వప్నలయందు ధ్యానదృశ్యాలుగా చూపిస్తూ వారిని ఉద్ధరిస్తున్నారు అనిచెప్పి ముగించారు. ఆ తర్వాత కొంతకాలానికి ముందుగా పరమహంస చనిపోవడముతో ఆయన్ని కొనఊపిరితో ఉండగానే నేను ఈ విషయము గమనించకుండా ఆయన్ని కాస్త పూడ్చిపెట్టి వెళ్ళిపోవడము జరిగింది.కాని ఈయన కొనఊపిరితో తన చేతులు బయటపెట్టి తాను ఇంక బతికే ఉన్నానని చెప్పాలనే ప్రయత్నములో ఆయన ప్రాణాలు అమాంతముగా పోవడము జరిగింది.బ్రతికి ఉండగా ఆయన చనిపోవడముతో రుద్రపిశాచావస్ధను ఆయనపొందితే..ఆయన బ్రతికి ఉండగా నేను పూడ్చడముతో శవదోషము నాకు రావడముతో మా ఇద్దరికి అరుణచలములో ఆదిజన్మలో మరణము పొందినగూడ మోక్షము రాకపోవడము పైగా మాకు తెలిసిన బ్రహ్మజ్ఞానము మర్చిపోయే అపస్మారకస్ధితి పొందడముతో తద్వారా యోగ-భోగ జన్మాలలో మేమిద్దరము మహమాయలలోపడి 477కోట్ల జన్మాలు ఎత్తి ప్రస్తుత దేహజన్మలో మాకు మా మోక్షజ్ఞాననాణెము రావడముతో మర్చిపోయిన జ్ఞానము కాస్త మా ధ్యానాల యందు ధ్యానదృశ్యాలుగా కాలానుగుణముగా ఒక్కొక్కటి కనపడుతూ జ్ఞానస్ఫురణాలు అందించడము జరుగుతూవచ్చింది.దానితో ఈ నాణెల అవకాశాలలో జాగ్రత్తగా ఎంచుకొని అరుణాజ్యోతులను ఆర్పుకొని అరణాచలములో ఆవాసము చేసి అక్కడే మరణమును పొంది ఆత్మమోక్షము పొంది శూన్యమునందు శూన్యమైనాము. కాబట్టి ప్రతిసాధన ఆత్మజీవుడికి ఈ శవ నాణెము ఎంచుకోకతప్పదు.సరియైన ఎంపిక ఎంచుకుంటే ఈ ప్రస్తుత దేహజన్మ మోక్షము పొంది అంతిమ జన్మాయై మీ మోక్ష కధ అంతమవుతుంది. లేదంటే అంతులేని కథగా అనంతమవుతుంది.దుష్యంతు రాజుకి తను పొగొట్టుకున్న రాజముద్రిక తన దగ్గరికి చేరగానే తన భార్య శాకుంతల జ్ఞాపకాలు ఎలా గుర్తుకువస్తాయో అలాగే మన దగ్గరికి చేరిన ఒక నాణెము మనము మర్చిపోయిన మన జన్మాంతర సాధననుభవాలను జ్ఞప్తికి తెచ్చి ఈ దేహజన్మను అంతిమ మోక్ష జన్మ చేస్తుంది.ఒకవేళ మీకు ఏలాంటి నాణెము రాలేదంటే ఈ జన్మకి మోక్షమే లేనట్లేనని తెలుసుకొండి..దైవముద్ర ఉన్న దైవనాణెము గావచ్చును.లేదా దైవిక చిహ్నలున్న నాణెము గావచ్చును.మీ అదృష్టము కొద్ది శివమోక్షజ్ఞానము పొందిన నిజభౌతిక గురువు మీకు కాని తారసపడితే ఆయన ఏకముగా నాలుగువ కాషాయకాంతివలయపు మీకు సంబంధించిన మోక్ష నాణము మీకు అనుగ్రహిస్తాడు.


నవనాణెల

శిరిడి సాయిబాబా వారికి తన వద్ద ఉన్న తొమ్మిది రూపాయిల భోగ నవనాణెలను లక్ష్మీబాయికి తన అంతిమకాలములో ఇవ్వడము జరిగింది.


శిరిడి సాయిబాబా వారికి వచ్చిన రామ నాణెము



అలాగే తనకి వచ్చిన రామ మోక్షనాణెమును తన దగ్గర ఉంచుకోకుండా శ్యామా భక్తుడికి ఇవ్వడముతో ఈయనకి రావాల్సిన మోక్షము ఈ భక్తుడు పొందడము జరిగితే తాత్యా అను భక్తుడి మరణమును బాబావారు పొందడము జరిగింది.ఇలాంటి నాణము మీకు మీరే ఇష్టమైన నాణము ఎంచుకొని సేకరించవద్దు.అలాగని మీకు మీరే ఎక్కడ కొనవద్దు.ఇలా వచ్చిన నాణము మీకు భోగ నాణము అవుతుంది.పైగా దీని వలన  ఏలాంటి ప్రయోజనము లేకపోగా మీకు రావాలసిన మోక్షనాణము రాదని తెలుసుకొండి.ఒకవేళ మీ కర్మకాలి బాబావారికి వచ్చినట్లుగా భోగ-యోగ నాణాలు మీకు వస్తే మీరు భోగ నాణము ఎంచుకుంటే ఈ జన్మ భోగజన్మ అవుతుంది.అదే యోగనాణము ఎంచుకుంటే అది యోగజన్మ అవుతుంది.గాకపోతే ఈ వచ్చిన ఈ రెండు నాణాలలో ఏది భోగ నాణమో లేదా యోగనాణమో శివమోక్షజ్ఞానము పొందిన నిజగురువులు మాత్రమే చెప్పగలరు.మీ మోక్షనాణము దానింతటే అదే మీ దగ్గరికి వస్తుంది.దానిని మీ దగ్గరికి అరుణాచల శివుడు చేరుస్తాడు.కాబట్టి మీ గురువులు లేదా మీకు దైవక్షేత్రాలలో ఎవరైన సాధువులు మీకు ఏమైన దైవచిహ్ననాణెలు ఇస్తే లేదా కొనుకొమ్మని చెప్పితే వాటిని కొనుక్కొని ఉంచుకొండి లేదా  యాదృచ్చకముగా రోడ్డుమీద దైవచిహ్నము ఉన్న నాణెము దొరికిన దానిని  ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరే చచ్చేదాకా ఉంచుకొండి.ఇలాంటి నాణమును చూడగానే మీ మనస్సు పులకరించిపోతుంది. చెప్పలేని ఆనందము లేదా ఏదో తెలీయని సంతోషము కల్గుతాయి.జీవింతాంతము ఈ నాణెము తన దగ్గరే ఉంచుకోవాలని మనస్సు పదేపదే ఆరాటపడుతుంది.ఇదియే మీ మోక్షనాణెము అవుతుంది.అదే భోగ నాణెముకు మీలో ఈ లక్షణాలు కనిపించవు.కేవలము పూజలో పెట్టుకుంటే ధనలాభము వస్తుందని అన్నిగూడ ధనభావాలు మాత్రమే కల్గుతాయి.ఇలా కేవలము ధనభావాలు ఇస్తే ఆ నాణము భోగనాణముగా మాయ నాణముగా మీరు భావించుకోవచ్చును.దీనిని మీ పూజవస్తువులలో ఉంచి నిజమోక్షనాణము కోసము ఎదురుచూడండి.ఇది రావాల్సిన సమయానికి అదే వస్తుంది.అపుడిదాకా ఒర్పుగా,శ్రద్ధభక్తితో ఉండండి.నిజమోక్షనాణెము మన చేతికి వచ్చినపుడు వాతావరణములో మార్పులు కనపడతాయి.వేడిగా ఉంటే చల్లగాను లేదా చల్లగా ఉంటే వేడిగాను లేదా తేలికపాటి వర్షము పడుతుంది.అలాగే ఈ నాణెము తాకినపుడు మనకి సాధనానుభవాలు మాత్రమే గుర్తుకువస్తాయి.కొంతమందికి తన ఆదిజన్మలో సాధనలో చేసిన తప్పు కాస్త జ్ఞాపకస్పురణకి వస్తుంది.ఇలా ఈ లక్షణాలు మీకు నాణెము తాకినపుడు కల్గితే అది ఖచ్చితముగా మీ మోక్షనాణెము అవుతుంది.కాని ఇది వచ్చేముందు మీకు ధ్యానము నందు లేదా స్వప్నము నందు మీ శవదర్శనమవుతుందని తెలుసుకొండి.శివం కాస్త శవం గావడము వలన ఈయన పొందిన మోక్షవిధానమును తనలాంటి శివోహంస్ధితి పొందిన కోటి మంది శివయోగుల గుర్తింపు కోసము విశ్వములో ఇలాంటి కోటి శివశవమోక్ష నాణెములు లోకానికి ఇచ్చివెళ్ళడము జరిగింది. ఈ నాణెల సిద్ధాంతమును నిజమే అనటానికి మనకి భౌతికనిదర్శనముగా వివిధ క్షేత్రాలలో లక్ష్మీపూజ లేదా స్వర్ణభైరవపూజ లేదా ఐశ్వర్యపూజ పేరుతో వాడుకలో ఉన్న నాణెలను పంచడము ఇపుడికి ఆనవాయితీగా వస్తోంది.నడుస్తోంది.


కాశీ బంగార అన్నపూర్ణదేవి

కాశీ నాణెము


అంతెందుకు నాకు తెలిసి కాశీక్షేత్రము నందు ధనత్రయోదశి అనగా దీపావళినాడు బంగారు అన్నపూర్ణదేవి విగ్రహమూర్తికి లక్ష్మీపూజ చేసి వాడుకలో ఉన్న నాణెలను పంచడము ఇపుడికి జరుగుతోంది.అలాగే ఈ క్షేత్రములో అన్నదానము కింద మీరు కావలసినవారు చనిపోయినవారి తిధినాడు డబ్బులు కడితే అపుడు మీకు ఒక కాశీనాణెము,ప్రసాదము,కాశీదారము ఇవ్వడము జరుగుతుంది.నిజానికి ఈ నాణెము అనేది ఈ కాశీక్షేత్రముతో నీకు రుణము తీరినదని అనగా నీకు జన్మరాహిత్యస్ధితిన్ని ఈ నాణెము తీసుకోవడము ద్వారా మనము పొందడము జరుగుతుంది.ఇలాంటి కాశీనాణెము పరమహంసకి రావడము జరిగింది.అపుడు దీనిని గూర్చి నేను పెద్దగా పట్టించుకోలేదు.అలాగే అరుణాచల క్షేత్రములో అయ్యంగారి కొలను వద్ద ఉన్న స్వర్ణాబైరవ గుడి యందు ఇపుడికి మనము తీసుకొని వెళ్ళిన పదకొండు నాణెలకు పూజ చేసి ఇవ్వడము జరుగుతుంది.తద్వారా మనకి ఉన్న కర్మరాహిత్య స్ధితి పొందడము జరుగుతుంది.అంటే ఈ లెక్కన చూస్తే కాశీ క్షేత్ర  శవనాణెలు వలన జన్మ మరియు అరుణాచల క్షేత్ర  శివనాణెము వలన కర్మ రాహిత్యాలు పొంది కర్మ-జన్మ లేని అవిముక్త అరుణజ్యోతిగా మారడము జరుగుతుంది.కాబట్టి మోక్షనాణెము రానివారు ఈ రెండు క్షేత్రాలలో ఇచ్చే ఈ రెండు నాణెలను తీసుకొని తమ అంతిమ కాలము వరకు జాగ్రత్తగా పెట్టుకున్నగూడ వారి మరణానంతరం వీరి ఆత్మకాస్త అరుణాచలక్షేత్రమునకు చేరుకుంటుంది.లేదా మనకి ఏవైన సప్త దైవక్షేత్రాల నుండి ఆ క్షేత్రదైవరూపముద్రాలున్న నాణెలు మనకి రావడము జరుగుతుంది.అపుడు మనకి ఉన్న సప్తశరీరాలకి సప్తమోక్షాలు పొందినట్లుగా మనము తెలుసుకోవచ్చును.



అన్నవరం క్షేత్ర నాణెం

తిరుపతి క్షేత్ర వెంకన్న నాణెం


శ్రీ చక్ర నాణెము


లక్ష్మీగణపతి నాణెము

పరమహంసకి ఇలాగే అన్నవరం, తిరుపతి, కాశీ, నుండి ఈ క్షేత్ర డాలర్లు రావడము జరిగింది. వీటిని ఈయన అక్కడ కొనలేదు అలాగే సేకరించలేదు.విచిత్రముగా అక్కడ ఎవరో పూజలు చేయించుకుంటే వాళ్ళకి ఇవ్వవలసిన ఈ పూజడాలర్లు వీళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోతే ఆ సమయములో దర్శనానికి వెళ్ళిన ఈయనకి ఆ పూజారులు అందించడము జరిగింది.ఆ తర్వాత లక్ష్మీదేవి మరియి లక్ష్మీదేవి గణపతి,వెంకన్న నాణెము,హనుమ నాణెము,శ్రీచక్ర నాణెము వీరి బంధుమిత్రుల నుండి పూజసమయాలలో బహుమతిగా రావడము జరిగింది.  దానితో ఈయన వీటిని తనపూజమందిరములో నాణెల ముంతలో భద్రపర్చుకోనేవారు. ఇవి ఎందుకు వచ్చాయో మాకు ఆనాడు తెలిసిందికాదు.ఈనాడు తెలిసేసరికి ఆయనే లేకుండా పోయారు.



ఇలాంటి నాణెలు సేకరణ కోసము ఒక మట్టిముంతలో నాణెలు సేకరించే ఆనవాయితీన్ని అందరి ఇళ్ళలలో మనపెద్దలు పెట్టడము జరిగింది.అలాగే వాడకకుండా ఉన్న అతీపురాతన నాణెలు సేకరణ వలన ఇపుడు వాటి విలువ వందల నుండి కోట్లదాకా పెరిగిపోయింది.అంతెందుకు ఈ మధ్యనే ఢిల్లీలో ఒక వేలంపాటలో 1895 సం.రము నాటి రూపాయినాణెము 10 కోట్లుకి అమ్ముడుపోయింది.దీనినిబట్టి మనపూర్వీకుల దూరదృష్టి ఎంతడితో మీకు అర్ధమయ్యేంటుంది.ఈ నాణెలలో భోగనాణెలున్న మన ఆర్ధికపరిస్ధితిన్ని మారిస్తే అదే యోగనాణెలుంటే మన సాధనస్ధితిగతులను మారుతుందని మన పూర్వీకులు ఈ నాణెల విధానములో చెప్పకనే చెప్పారుగదా.   



అలాగే మట్టికుండ మరియు నాణెము అనేది మన బ్రతులో అలాగే మన చావుకి ఉపయోగపడుతోందని ఇపుడికైన తెల్సుకొండి.

స్వామి..ఇక్కడ నాకు ఒక సందేహము అది ఏమిటంటే ఈ మోక్షనాణెము అనేది వారి సంప్రదాయ కధలలో రవాణా చార్జీలకి ఉపయోగిస్తారని చెప్పడము నిజమేనా అంటే దానికి పరమహంస నవ్వుతూ కారణము లేనిదే మన పూర్వీకులు ఏమి చెప్పరు.అది సత్యమే అయ్యే ఉంటుంది.ఎలా అంటే నిన్నేనే నాకు ఒక ధ్యానుభవమైంది.అది ఏమిటంటే నేను కాస్త మోక్ష రైలు ఎక్కి నా సీటులో కూర్చుకున్నాను.ఇంతలో మాకు ముందువారి టిక్కెట్లు తనిఖి చేస్తూ ఒక టిక్కెట్ కలెక్టర్ కనిపించి వాళ్ళలలో కొంతమందితో నీకు ఈ టిక్కెట్ మీద నీ మోక్ష నాణెము ముద్రలేదు.నువ్వు దిగిపో అని ఈ ముద్ర లేనివాళ్ళని దింపెస్తున్నాడు.అపుడు నేను ఈ టిక్కెట్    కొనేటపుడు నా దగ్గర ఉన్న రాగితో చేసిన నాకు వచ్చిన మోక్షనాణెము ఇవ్వడముతో నా టిక్కెట్ మీద ఇదే మోక్షనాణెము ముద్ర వేసి ఇచ్చిన టిక్కెటును తనిఖికి వచ్చిన టిక్కెట్ కలెక్టరుకి ఇవ్వగానే దీనిని బాగా తనిఖి చేసి దీనిమీద ఓకే అని మరోముద్ర వేసి నాకు తిరిగి నా టిక్కెటు ఇవ్వడము జరిగింది.ప్రక్కనే ఉన్న 95సం.రాల వృద్ధుడిని తాతా..ఈ ముద్ర లేని వాళ్ళ పరిస్ధితి ఏమిటి అడిగితే..ఏముంది..మన ప్రక్కనే ఉన్న ఇలాంటి మరో మోక్ష రైలులో మరొకసారి బుకింగ్ చేసుకోవాలి.దానికి 477 సం.రాలు తర్వాత ఆ రైలు బయలుదేరుతుంది.ప్రతి 14 సం.రాలకి ఒకసారి ఇలాంటి ఒక మోక్షరైలు కాశీక్షేత్రము నుండి బయలుదేరి అరుణచలము చేరుకుంటుంది.దీనికి 14 రోజులు సమయము పడుతుంది.అందుకే ఈ రైల్లో నిల్చోవటానికి కూడ ఖాళీ ఉండదు.ఇలాంటి రైలు టిక్కెట్ దొరకడమే చానా అదృష్టము..ఎంతో శివయోగముంటే తప్ప మనకి ఈ టిక్కెట్ అలాగే ఈ మోక్షనాణెము లభించదు.ఇలా ఈ రైలు ఏడు సప్తమోక్షా పట్టణాలలో మాత్రమే ఆగి ఒక్కొక్కక్షేత్రము నుండి కోటిమంది చోప్పున్న ఎక్కించుకోవడముతో  ఇపుడు ఇలా ఈ రైలులో ఏడు కోట్ల మంది మోక్ష ఆత్మజీవులున్నారు. ఈ రైలు చివరికి అరుణాచలము చేరుతుంది.ఎందుకంటే మనలాంటి మోక్షాత్మలకి విముక్తి ఆత్మమోక్షరూపములో ఇచ్చేది అరుణచలక్షేత్రమే గదా. అని చెప్పి మౌనము వహించాడు.దానితో మన సంప్రదాయ కధలలో ఆనాడు నదిని దాటించడానికి వచ్చిన పడవ వాళ్ళకి ఈ నాణెలు ఇస్తే ఈ కాలములో ఇదే నాణెలు రైలు చార్జీలు కింద వసూలు చేస్తున్నారని నాకర్ధమైంది అని చెప్పి మౌనము వహించారు.

అవును..స్వామి..వీసాకి,పాసుపోర్టుకి స్టాపింగ్ వేసినట్లుగా మన మోక్షానికి మోక్షనాణెముతో స్టాపింగ్ వెయ్యడమే ఆశ్చర్యానందాలకి గురిచేస్తుంది అనగానే ఆదియుగములో ఈ విశ్వము మూడు క్షణాలలో పుట్టి పెరిగి చచ్చిపోయింది.దీనితో ఆదిపరాశక్తి తనయోగమాయశక్తితో మన మోక్షమరణ విషయాన్ని నమ్మనీయ్యకుండా మన మనస్సుకి అలాగే ఆత్మకి అపనమ్మకము కల్గించి స్వప్నభావశరీరాలతో కల్పించి మన మరణ జ్ఞానము అందనీయ్యకుండా 8 క్షణాల మరణాన్ని 80 బ్రహ్మమహకల్పాలు దాకా కొనసాగించడానికి అలాగే ఎవరుపడితే వాళ్ళు తమ మోక్షమరణ జ్ఞానము పొందనీయ్యకుండా వారికి అర్హత,యోగ్యత,యోగము పెట్టి వీటిన్ని సాధించినవారికి తమ సాధన స్ధితిగతులు తనకి తెలియ్యడానికి ఈ గుర్తింపు మోక్షనాణెలు పెట్టడము జరిగింది


ద్వారక ప్రవేశ రాజముద్రిక-కృష్ణజింకలు


అంతెందుకు శ్రీకృష్ణుడు గూడ తన ద్వారక నగర ప్రవేశానికి గుర్తింపు ముద్ర ఒకటి పెట్టాడని లోకవిధితమే గదా.ఈ తన నగరానికి ఈ గుర్తింపు ముద్ర పెడితే విశ్వమాత తన విశ్వానికి గుర్తింపు ముద్ర పెట్టకుండా ఉంటూందా..ఖచ్చితంగా పెట్టే ఉంటుంది.గాకపోతే ఈ గుర్తింపు నాణెము ఏమిటి అనేది మనకి భౌతికమరణము పొందినతర్వాత మన ఆత్మకి ఉన్న అర్హత, యోగ్యత, యోగమును బట్టి ఇస్తారు..ఈ మోక్షనాణెలు గుర్తింపు అంటే మనకి ఉన్న ఆధార్,పాన్,రేషన్ లాంటి గుర్తింపు కార్డులు అన్నమాట..ఇవి సప్త మోక్ష పురాల యందు ఆవాసము చేసి మరణించినవారికి ఈ మోక్షనాణెలు వస్తాయి.మనలో ప్రతి ఏడుమందికి ఒకేవిధమైన గుర్తులున్న మోక్షనాణెలు వస్తాయి.ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరికి సప్తశరీరాలతో సమానము అలాగే తమ సప్తశరీరాలు సప్తమోక్షాలు పొందాయని గుర్తు.గాకపోతే వివిధ క్షేత్రాల ఈ నాణెలు ముద్రాలలో తేడాలుంటాయి. ఏవరి నాణెము మీద అస్ధిపంజరము ముద్ర ఉంటుందో అది ఆఖరిదైన కాశీక్షేత్ర మోక్షనాణెము అవుతుంది.ఇది వచ్చినవారు సప్తమోక్షపట్టణాలలో తమ మోక్షమరణాలు పూర్తీ చేసుకొని ఆఖరిదైన అరుణచల క్షేత్రమునందు అంతిమ ఆత్మమోక్షము పొందుటకు గుర్తింపు వచ్చినట్లు అవుతుంది.కాబట్టి మనకి ఇలాంటి కాశీక్షేత్ర మోక్షనాణెము రావడముతో మనకి అరుణాచల మోక్ష రైలు యందు సీటు దొరికింది.మరి ఇతర క్షేత్రాల నాణెల రూపురేఖలు ఎలా ఉంటాయో నన్ను అడిగితే నా సమాధానము తెలియదు..గుర్తులేదు..మర్చిపోయా..అని మాత్రమే చెపుతాను అనగానే నాకు నవ్వు ఆగలేదు.ఇది నిజమే ఎందుకంటే తను తెలుసుకున్న శివమోక్షజ్ఞానము ఇంతడితో లోకానికి అందించడము సంపూర్తి అవ్వడముతో తను తెలుసుకున్న జ్ఞానము మర్చిపోయే అపస్మారక స్ధితికి తాను వెళ్ళుతున్నానని ఈ విధంగా చెప్పకనే చెప్పారని తద్వారా ఈ జ్ఞానము వలన తన అరుణాజ్యోతికి ఉన్న ఉనికి మాయను నెమ్మదిగా కోల్పోతూ అది ఆరిపోయి శూన్యము నందు శూన్యమవ్వడానికి ఇంక ఎంతో కాలము పట్టదని నాకర్ధమై మౌనము వహించాను.

ఇలా వచ్చిన మోక్షనాణమును మీకు తెలిసిన లేదా తెలియక మీ వాళ్ళకి లేదా తెలిసినవాళ్ళకి ఇస్తే మీ ఈ జన్మ మోక్షయోగము వాళ్ళకి మీకు మీరే మీ యోగము ఇచ్చినట్లు అవుతుంది.ఇలా వచ్చిన ఈ మోక్షనాణెమును మీ మరణము వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.లేదంటే ఒకవేళ మీ నాణెము పోతే మీరు మరణము పొందినపుడు మీ ఆత్మకి పెదవి,పదవి,పైకము,పేరు లాంటి  మాయలు,ప్రలోభాలు పెట్టే ప్రబుద్ధాత్మలుండి మీరు వీటి మాయలలో పడితే మీ మోక్షస్ధానములో అవి వెళ్ళి మోక్షమును పొందుతాయని తెలుసుకొండి. మళ్ళీ మీకు తిరిగి ఈ మోక్షయోగము రావాలంటే 477 కోట్ల సం.రాలు ఎదురుచూడక తప్పదు. వీలుంటే ఇలా వచ్చిన ఆ మోక్షనాణెమును  మీ అంతిమ దహనసంస్కారాలలో మీ శవము నుదటి మీద అస్ధిపంజరము లేదా కపాలము గుర్తున్ని పైకి ఉండేటట్లుగా  పెట్టి దహనము చెయ్యమని మీ వాళ్ళకి ముందుగానే చెప్పి చావండి.అపుడు మీకు ఈ దేహజన్మ చచ్చినట్టుగా అంతిమ ఆత్మమోక్షజన్మ అవుతుంది.  ఎలా అంటే మీకు అందిన మోక్ష నాణముతో మీరు ఈ విశ్వ ప్రపంచములో ఎక్కడైన మరణము పొందినగూడ మీ ఆత్మశరీరము తప్పనిసరిగా అరుణచలము చేరి   మీ ఆత్మశరీరము కాస్త రుద్రపిశాచముగా మారి  ఏకాంతముగా ఏకాకిగా ఏడూకోట్ల అరుణచలశివ నామస్మరణ పూర్తీ చెయ్యగానే మీకు ఉన్న రుద్రపిశాచవస్ధ నుండి విముక్తిపొంది సరాసరి 65వ డైమర్ష మోక్షశిలకి చేరి మీ ఆత్మశరీరము కాస్త ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.అదే ఈ మోక్షనాణముతో అరుణచలము నందు మరణము అనగా మీ భౌతికదేహము పూడ్చపెట్టకుండా దహనము చేస్తే అపుడు మీ ఆత్మశరీరమునకు ఏలాంటి రుద్రపిశాచవస్ధ పొందకుండా సరాసరిగా 65వ డైమర్ష్ మోక్షశిలకి  చేరి ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.  ఒకవేళ అరుణాచలములో మీ శవదేహమును పూడ్చిపెడితే   మీ ఆత్మశరీరము కాస్త రుద్ర అస్ధిపంజరముగా మారి 800 కోట్ల సార్లు ఆకాశయాన మార్గముతో గిరిఅగ్రభాగము చుట్టూ ప్రదక్షిణము చేయాల్సింటుంది.అపుడు  ఈ అస్ధిపంజరము నుండి విముక్తి కల్గిన రుద్రపిశాచముగా మారి ఏకాంతముగా ఏకాకిగా ఏడూకోట్ల అరుణచలశివ నామస్మరణ పూర్తీ చెయ్యగానే మీకు ఉన్న రుద్రపిశాచవస్ధ నుండి విముక్తిపొంది సరాసరి 65వ డైమర్ష మోక్షశిలకి చేరి మీ ఆత్మశరీరము కాస్త ఆత్మమోక్షము పొందడము జరుగుతుంది.ఒకవేళ మోక్షనాణెముతో జీవసమాధి చెందితే వారి ఆత్మశరీరము కాస్త అరుణజ్యోతిగా మారతాడు.ఒకవేళ సాధకుడు కాస్త బ్రహ్మచారి ఉండి పూడ్చిపెడితే వారి ఆత్మశరీరముగూడ అరుణజ్యోతిగా మారుతుంది.ఏపుడైతే ఈ వీరిద్దరు తమ ఉనికి మాయను అనగా వీరి అస్ధిపంజరాలు తమ అస్తిత్వమును కోల్పోతే దీనికి ఆరు నుండి 28 సం.రాలు దాకా పడుతుంది.అపుడు వీరికి ఉన్న ఉనికి మాయ కోల్పోయి  వారి వెలుగుతున్న అరుణజ్యోతి టక్కున్న ఆరిపోయి నల్లపొగగామారి శూన్యమునందు శూన్యమవుతారు.     

అందరికి మోక్షం వస్తుందా? 

అంటే రాదు.రాలేదు అని చెప్పకతప్పదు.సాధన చేసినవారి ప్రతివారికి పూర్ణ మోక్షం అదే అరుణాజ్యోతిగా మారి ఆరిపోయి శూన్యమయ్యేయోగము మాత్రము కోటిశివాంశ శివయోగులకి మాత్రమే ఉంది.అంటే పూర్ణమోక్షము అనగా అనాది శూన్యమునందు కోటిమంది శివయోగులు మాత్రమే శూన్యమయ్యి ఈ పూర్ణమోక్షమును పొందుతారు.మిగిలిన 64 కోట్లమంది మాత్రము శరీరమోక్షము నుండి ఆత్మమోక్షము వరకు మాత్రమే పొందుతారు.అంటే ఆదిలో 65మందిలో ఒక శివాంశ మాత్రమే పూర్ణమోక్షమును పొంది మిగిలిన 64 రుద్రాంశాలు అసంపూర్ణ మోక్షము పొందాయి.అంటే 65 మందిలో 36 మంది దేవీంశాలు,28 మంది రుద్రాంశాలు,ఒకడు  శివాంశ అయ్యాడు.ఈ శివాంశ మాత్రమే పూర్ణమోక్షమును పొంది శూన్యమయ్యాడు.మిగిలిన 64 మందిలో 28 మంది రుద్రాంశాలు అర్ధనారీశ్వరతత్వముతో రుద్రబాల,రుద్రౌన్మత,రుద్రపిశాచ అవస్ధలు పొంది అరుణాజ్యోతులుగా మారి 64 వడైమర్షలో శాశ్వతమరణము లేనిస్ధితిలో శాశ్వత ఆవాసము చేస్తున్నారు.ఇక మిగిలిన 36 మంది కాస్త దేవింశాలుగా భౌతిక మరణాల నుండి ముక్తులు పొందుతూ తమ కోరికఉనికి మాయను బట్టి జీవ,దైవ,యోగ జన్మాలు ఎత్తుతూ పున:రపి జనన మరణ చక్రములో కొట్టుకుంటూ తమ మోక్షగాధను అవిశ్రాంతిగా,అవిచ్చినముగా అనంతముగా జరిగేవిధముగా చేసుకుంటున్నారు.ఇది విధిలిఖితము.ఇది మార్చడానికి ఉండదు. వీరంతా 64 నుండి 1వ డైమర్షు వరకు సంచారించే ఆత్మజీవులు అన్నమాట.అంటే 65 వ డైమర్ష కోటి శివయోగులు మోక్షజీవులు పూర్ణమోక్షము పొంది శూన్యమైతే...64 వ డైమర్ష అర్ధనారీశ్వర అరుణజ్యోతులు కాస్త మరణము లేని స్ధితి పొందిన 28 కోట్ల జ్యోతిస్వరూపాలుంటే..63 డైమర్షలో 36కోట్ల ఆత్మజీవులు శాశ్వతమరణమే లేని అనంత జీవులుంటారు. అంటే శివాంశ యోగము ఉన్నవాడికి తప్ప మిగిలిన ఏవరికి దేనికిగూడ శాశ్వత మరణమైన పూర్ణమోక్షము రాదని తెలుకొండి.అంతెందుకు పరమహంస గారిది శివాంశ యోగము.ఆయన చిన్ననాటి నుండి శివారాధకుడు.శివలింగపూజారి.శివయోగమున్నవాడు.దానితో ఈయన కాస్త 65వ డైమర్ష స్ధితి పొంది పూర్ణమోక్షముపొంది శూన్యమయ్యారు.ఇక నాది (అనగా జిజ్ఞాసి ) కుమారస్వామి అంశ.నాది రామ నామస్మరణ ఆరాధన. కుమారస్వామి విగ్రహరాధన.దానితో నాది 64 వ డైమర్ష వద్ద అరుణజ్యోతిగా మారి శాశ్వతముగా మోక్షమే లేని స్ధితిలో ఉండిపోయాను.ఎందుకంటే ఆదిలో కుమారస్వామికి మొట్టమొదటిసారిగా ఆదిదంపతులు ఇతనికి పూర్ణజ్ఞానఫలము అందించడము జరిగింది.దీనిని తిన్న కుమారస్వామి కాస్త పూర్ణజ్ఞానిగా మారి తనని ఆరాధించినవారికి పూర్ణజ్ఞానమును అందించడము ఆరంభించాడు.అంటే ఈ విశ్వములో జ్ఞానము ఉన్నంతవరకు ఈయన జ్ఞానజ్యోతిగా అనగా అఖండ అరుణజ్యోతిగా శాశ్వత మోక్షము లేని మరణమే లేని శాశ్వత స్ధితిలో ఉండిపోవడమే గదా.ఎందుకంటే అజ్ఞానము పోతేరాదు.జ్ఞానము వస్తే పోదు.ఈయనకి జ్ఞానము పోతే కాని పూర్ణమోక్షము రాదు.జ్ఞానము పోవడము అనేది ఉండదు గదా.దానితో 64 వ డైమర్ష నుండి 1వ డైమర్ష వరకు ఉన్న ఆత్మజీవులందరు గూడ ఈ కుమారస్వామి అంశాలే.ఎలాంటే మన జననాలు అన్నిగూడ వీర్యకణము నుండే వచ్చినవే గదా.వీర్యకణము అంటే నాగాపామును పోలి ఉంటుంది గదా.కుమారస్వామి అంటే నాగాంశయైన సుబ్రహ్మణ్యస్వామియే గదా. తద్వార మన సాధనస్ధితిగతలు బట్టి వివిధ రకాల జ్ఞానాలు విజ్ఞానము,ఆత్మజ్ఞానము,శాస్త్రజ్ఞానము,బ్రహ్మజ్ఞానము ఇలా ఏదో ఒక జ్ఞానము పొందక తప్పదు గదా.ఇలాంటి జ్ఞానమాయ వలన మనకి కోరిక ఉనికిమాయలో పడి ఆత్మజీవుడి నుండి అరుణజ్యోతిగా మాత్రమే మన సాధన కొనసాగి తిరిగి వెనక్కిరావడము జరుగుతోంది.ఇదింతా బాగానే ఉంది.మరి శివాంశాలు గూడ వీర్యకణ కుమారస్వామి అంశజననాలే గదా.మరి వీళ్ళకి ఎలా పూర్ణమోక్షము వస్తోంది అన్నపుడు అంటే జ్ఞానఫలము తిన్నవాడికి జ్ఞానము ఇతరులకి అందించినగూడ తననుండి పోదు.అంటే ఇలాంటివాళ్ళు త్రాడును చూసి పాము అని భ్రమభ్రాంతిలో పడతారు.వీరికి ఏది పామో లేదా ఏది త్రాడో బేధజ్ఞానమాయ ఉంటుంది.అదే జ్ఞానఫలము తినకుండా ఇది తినవాడి నుండి జ్ఞానము పొందినవాడు కాస్త తను పొందిన జ్ఞానమాయను ఇతరులకి అందించడముతో వీరి ఉన్న బేధజ్ఞానమాయపోయి అనగా త్రాడు లేదా పాము అనే బేధజ్ఞానమాయపోయి ఎది ఉందో లేదో గూడ గుర్తించని తెలుసుకోలేని మర్చిపోయే ఏకత్వపూర్ణశూన్యస్ధితికి చేరుకుంటారు. వీళ్ళు పొందిన జ్ఞానము జ్ఞానఫలాలు తిన్నవారి నుండి పొందారు.అంటే వీళ్ళు జ్ఞానఫలాలు తినలేదు.వీటిని తిన్నవారి నుండి జ్ఞానము పొంది తిరిగి ఈ జ్ఞానమును వేరేవారికి ఇచ్చి తాము పొందిన జ్ఞానమును అపస్మారక స్ధితి అనగా తెలిసిన జ్ఞానమును మర్చిపోయేస్ధితికి వీరు చేరుకోవడముతో అపుడిదాకా జ్ఞాన ఉనికిమాయతో వెలుగుతున్న వీరి అరుణజ్యోతులు కాస్త ఆరిపోవడము జరిగింది.దానితో వీరు కాస్త 64 వ డైమర్ష నుండి 65 వ డైమర్షకి వెళ్ళి మోక్షము పొందడము జరిగింది.అంతెందుకు పురాణ ఇతిహస ప్రకారము శివుడు కాస్త ఒక రాక్ష సంహరము కోసము తను పొందిన పూర్ణజ్ఞానమును కుమారస్వామికి ఇచ్చి ఆ రాక్షస సంహరము చేసి కుమారస్వామి నుండి తిరిగి జ్ఞానము పొంది అరుణచలము నందు ఆదిశివుడిగా అపస్మారకస్ధితి అనగా తెలిసినజ్ఞానము మర్చిపోయేస్ధితిన్ని పొంది పూర్ణమోక్షము పొందడము జరిగింది.ఇదియే 65వ డైమర్ష శివాంశ మోక్షము అయింది.ఇక 64 వ డైమర్షలోని రుద్రుడు కాస్త సాగరమధనములో వచ్చిన కాలకూట విషమును సేవించి అర్ధాంతర మరణము గావడముతో రుద్రపిశాచవస్ధను పొంది అరుణజ్యోతిగా అరుణగిరియందు ఉన్నాడు.ఇక 63 వ డైమర్షలో రుద్రాంశ రుద్రుడు కాస్త 64 విషమూలికలు సేకరించి అందులో తొమ్మిది అత్యంత ప్రమాదకరమైన మూలికలు తీసి నవపాషాణము అనగా రససిద్ది రసాయనమును తయారు చేసి ఈయన సేవించి అర్ధాంతరమరణమును పొంది బాలోన్మత రుద్ర దక్షిణామూర్తిగా అవతరించి అరుణచలములో మర్రిచెట్టు కింద సిద్ధయోగిగా మౌనముద్రతో సాధనచేస్తూ శాశ్వతమరణము లేనిస్ధితిలో ఉన్నారు.అందుకే మనకి అరుణాచలక్షేత్రములో శివుడు మనకి మూడు రూపాలలో అనగా అరుణగిరికొండగా...అరుణాచలేశ్వర అగ్నిలింగముగా...మర్రిచెట్టు కింద మేధాదక్షిణామూర్తిగా ఇలా ఇపుడికి దర్శనమిస్తున్నారు.అంటే ఒకరకముగా చెప్పాలంటే 64వ డైమర్ష నుండి 1వ డైమర్ష వరకు ఉన్నవారంతాగూడ రుద్రాంశ కుమారస్వామి ఆత్మజీవులే అన్నమాట.వీరికి ఎన్నడికి పూర్ణమోక్షము అనగా శూన్యము నందు శూన్యమయ్యేస్ధితి రాదు.రాలేదు.ఎందుకంటే వీరంతా జ్ఞానఫలాలు తిన్నారు గదా.ఇది తిన్నవాడికి జ్ఞానము ఎన్నడికి పోదు.పోలేదు.అంతెందుకు ఇపుడికి హిమాలయములో మానస సరోవరము నందు ఒక కల్పవృక్షముంది.దీనిని రాలే జ్ఞానఫలాలు తినడానికి అక్కడున్న యోగులు,దైవాలు కాస్త సర్పాలుగా మారి వీటిని తిని తమ కోరిక అనుసారముగా వివిధ ఆత్మజీవుల జన్మాలు ఎత్తుతారు.ఈ వృక్షానికి కాపలాదారుడిగా నవనాధుల్లో ఒకరైన మత్సైంద్రనాధుడు ఉన్నారు.ఇక శివాంశ యోగులు విషయానికి వస్తే యుగానికి ఒకడు పుడతాడు.వాడు సాధన చేసి శివమోక్షజ్ఞానము పొంది ఆ యుగానికి మోక్షయోగి మారతాడు.ఇలా ఇపుడికిదాకా 28మహయుగాలకి (28 x 4 = 112) 112 శివయోగసాధనాలకి ప్రతీకగా 112 మంది శివాంశ శివయోగులుగా మారి శివమోక్షము పొందడము జరిగింది.ఇందులో ఆఖరివాడు మన పరమహంస ఈ యుగపు శివయోగి అన్నమాట.దానితో ఈయనకాస్త ఈ యుగపు జన్మలో శివమోక్షజ్ఞానమును అరుణాచల శివ నుండి పొంది మన అందరికి ఈ జ్ఞానమును అందించి తద్వారా తను పొందిన ఈ జ్ఞానమును అపస్మారక స్ధితి అనగా తెలియదు..గుర్తులేదు..మర్చిపోయా అంటూ తెలిసిన జ్ఞానమును పూర్ణముగా మర్చిపోయి తన జ్ఞాన ఉనికిమాయతో ఉన్న అరుణజ్యోతిన్ని కాస్త ఆర్పివేసుకొని అనాద శూన్యము నందు శూన్యమైవాళ్ళలో ఆఖరివాడు..చివరివాడు..అంతమ్యేవాడు అయ్యారు.ఇక ఈయన తర్వాత వారందరుగూడ రుద్రాంశ కుమారస్వాములే.అంటే 64 డైమర్ష అరుణజ్యోతి ఆత్మజీవులే.మోక్షమరణము లేని ఆత్మజీవులే అన్నమాట.ఇక వీరి కధ అంతులేని అనంతమైన మోక్షగాధ అన్నమాట.ఈ కధకి నాంది ఈ నా జిజ్ఞాసి పాత్ర అన్నమాట. అంటే మన సాధన అంతాగూడ 1వ డైమర్ష నుండి 64 వ డైమర్ష వరకే పరిమితమవుతుంది.మనకి ఉన్న జ్ఞాన ఉనికి మాయను బట్టి మన సాధన స్ధితిగతులు మన జన్మాలుంటాయి.ఇక ఎవరుగూడ పూర్ణమోక్షము పొంది శూన్యమవ్వడము ఉండదు.ఇది కేవలము కోటి శివాంశ యోగులకి మాత్రమే సాధ్యపడింది.మిగిలినవారంతాగూడ ఎంత ప్రయత్నించి సాధన చేసినగూడ ఎదోఒకమాయలో తమకి తెలియకుండా లేదా తెలిసి పడటము ఇపుడిదాకా అంతులేని అనంత మోక్షగాధగా కొనసాగుతోంది.అంటే ఆడవాళ్ళు కాస్త ప్రేమ,మోహ,వ్యామోమాయలలో అనగా కామ, పుత్ర, తల్లి, తండ్రి, భర్త, గురువు,దైవ మాయలలో పడితే అదే పురుషులు అయితే పెదవి, పదవి,పేరు, పైకము, ఆశ, ఆశయం,ఆలోచన,భయం,సిద్ధమాయలలో పడి తమ సాధనను ఏదో ఒక డైమర్షలో అర్ధాంతరముగా ముగిస్తున్నారు.ఇలా ఈ స్త్రీ,పురుషులకి తమకి ఉన్న జ్ఞానమాయవలన ఇదింతా జరుగుతోందని తెలిసిన ఏమి చెయ్యలేని స్ధితి పరిస్ధితి.ఎందుకంటే మనమంతా ఆదిజన్మలో కల్పవృక్షము ఇచ్చిన జ్ఞానఫలాలు కావాలని తిన్నడము వలన మనంతా అసంపూర్ణ మోక్షజీవులుగా మిగిలిపోకతప్పడము లేదు.కాకపోతే సాధన చెయ్యడము వలన 1వ డైమర్షు ఆత్మజీవి నుండి 64వ డైమర్ష అరుణజ్యోతిగా మారటానికి అవకాశయోగము మాత్రమే ఉంది.అనగా 1వ డైమర్ష చంచలస్ధితి అయితే 64 డైమర్ష అచంచలస్ధితి అన్నమాట.ఇక 65వ డైమర్షు ఏమిలేని పూర్ణమోక్షస్ధితి.మనము ఎన్నడికి పొందలేనిస్ధితి..శివయోగిమాత్రమే పొందేస్ధితి. ఈ శివయోగితరము మన పరమహంసతో పూర్తీయినస్ధితి. ఇక మనము ఎన్నడికి అందుకోలేని స్ధితి.అందుకోవాలని ప్రయత్నించేస్ధితి.ఇక ఏపుడికి అందని పూర్ణమోక్ష స్ధితి.ఇది ఎలా ఉంటుంది అంటే గుర్రపు బండికి కట్టిన గుర్రము ముందు దానికి అందకుండా ఒక చిన్న గడ్డిమూపు కడతారు.గుర్రము మాత్రము దీనిని అందుకోవాలని విపరీతముగా పరిగెడుతూనే ఉంటుంది.పాపము ఈ గుర్రానికి కాస్త గడ్డి అందేస్ధితిలో ఉన్న అది ఎన్నడికి అందనిస్ధితిలో ఉంటుందని తెలియదు.తెలుసుకోదు.స్వామి..శివాంశ కానివాళ్ళ పరిస్ధితి ఏమిటి?ఇంక వాళ్ళకి ఏ జన్మలోను పూర్ణమోక్షము రాదా?కంగారుపడకండి.తప్పకుండా కాలానుగుణముగా అందరికి పూర్ణమోక్షము తప్పకుండా వచ్చితీరుతుంది.ఇపుడు ప్రస్తుతము మనకి 28 మహయుగము నడుస్తోంది గదా.ఈ యుగముతో కోటి శివాంశ శివయోగులు పూర్ణమోక్షం పొంది శూన్యమవ్వడముతో సంపూర్ణమైంది.ఇక రాబోయే 29వ మహయుగములో కుమారస్వామి అంశ కారణజన్మయోగుల శకము మొదలై యుగానికి ఒకరు చొప్పున్న కోటిమంది 43 మహయుగము వరకు పూర్ణమోక్షము పొందడము జరుగుతుంది.దీనికి నాంది జిజ్ఞాసి అను నాతో కుమారస్వామి అంశ శకము ఆరంభమైంది.అదే పరమహంసతో శివాంశ శకము అంతమైంది అన్నమాట.ఇలా ప్రతి 14 మహయుగాలకి మనకి ఉన్న 64 డైమర్ష్ దేవతల అంశలు కోటిచోప్పున పూర్ణమోక్షము పొందడము జరుగుతుంది.అనగా మొదట శివాంశ ఆ తర్వాత కుమారస్వామి అంశ ఆ తర్వాత విష్ణు అంశ ఇలా ఇలా 64 దేవతలు అంశలు పూర్తీ అయిన తర్వాత ఆఖరిగా ఆదిపరాశక్తి అంశతో ఈ విశ్వానికి విశ్వమోక్షము పొందే ప్రక్రియ పూర్ణమవుతుంది.దీనికి 1400కోట్ల సం.రాలు అనగా 3,200 మహయుగాలు సమయము పడుతుంది.ఎవరు ఏమి అంశ అనేది మనకి వచ్చే మోక్షనాణెము ద్వారా నిర్ణయించబడుతుంది.ఇది అరుణచలశివ అనుగ్రహము చేతిలో ఉంటుంది.కాబట్టి అందరికి మోక్షము అనేది ఒకే యుగములో లేదా ఒక మహయుగములో రాదని తెలుసుకొండి.ఒకవేళ మీ సాధన ఈ జన్మలో పూర్తీ అయితే మీరు అరుణాచలక్షేత్రములో మరణము పొందితే అరుణజ్యోతిగా మారతారు.ఇదియే జీవన్ముక్తి.ఒకవేళ మీ దైవాంశ స్ధితి ఏ మహయుగములో పూర్ణమోక్షము పొందితే అపుడుదాకా వెలుగుతున్న మీ జ్యోతిశరీర అరుణజ్యోతి అరిపోయి శూన్యమైవడమే విదేహిముక్తి అవుతుంది.తద్వారా మీ మోక్షగాధ పూర్ణమవుతుంది.

నిజమైన సత్యాన్వేషి:

కి తన రక్తసంబంధీకులను,కుటుంబసభ్యులను,బంధుమిత్రులను,భార్యబిడ్డలను వదిలిపెట్టి సత్యాన్వేషణ లేదా దైవాన్వేణ చేయాల్సింటుంది.అపుడే వాడిలో నిజమైన సత్యము వెతకటానికి అలాగే అనుభవానుభూతిపొందటానికి అవకాశయోగముంటుంది.ఇలా తెగించి వెళ్ళినవారే నిజమైన సత్య లేదా దైవాన్వేషి అవుతాడు.ఇది అక్షరసత్యము.ఆ నాటి శివుడు నుండి ఈనాటి పరమహంస వరకు ఈ గీత రాత తప్పలేదు.అంటే పరమహంస గారి జీవితములో జరిగిన నా స్వానుభవ సంఘటన మీకు చెపుతాను.ఒకరోజు నాతో పరమహంస కాస్త అరే..రాబోయే రోజులలో నా తప్పులేకపోయిన తప్పకుండా కోర్డుమెట్లు ఎక్కతప్పదు.ఇది నా సత్యాన్వేషిగా అంతిమపరీక్షకాలము..అంటూండేవారు.నేనుమాత్రము ఎపుడుగూడ విని మౌనము వహించేవాడిని. ఒకరోజు పరమహంసకి అలాగే ఈయన భార్య శ్రీమతి దీక్షాదేవికి మధ్య తీవ్రమైన వాదోపదోవాదాలు జరుగుతున్నాయి.దీనికి కారణము పరమహంస గారు కాస్త అరుణచలక్షేత్రములో శేషజీవితము గడపాలని అనుకుంటున్నారు.ఇదే విషయము ఈమెకి చెపితే నేను చచ్చిన అరుణచలము రాను..నాకు అక్కడి వాతావరణము సరిపడదు.అయిన వెళ్లితే చిన్నవయస్సులో ఏదైన క్షేత్రానికి వెళ్ళి ఆవాసము చెయ్యాలి కాని చచ్చేవయస్సులో క్షేత్రానికి వెళ్ళితే శరీరము ఆ ప్రాంతానికి అలవాటుపడటము చాలా కష్టము గదా..నా వల్ల గాదు.మీరు వెళ్ళితే వెళ్ళండి.దానికి నేను ఎనాడు అడ్డు చెప్పను.అడ్డు పడను.నేను ఓంటరిగా ఇపుడున్న ఇంటిలో ఉండి నా సాధన పరిసమాప్తి చేసుకుంటాను.గాకపోతే నా బ్రతువుతెరువుకోసము మీరు పదిలక్షలరూపాయిలు నాకు ఇచ్చి అలాగే నాకు విడాకులు ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి చావాలని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చావండి అనగానే పరమహంసకి మనస్సు పనిచెయ్యడము ఆగిపోయింది.ఎందుకంటే తనని అరుణచలము రమ్మన్నాను.తను రాను అంది.అంతే విడిపోదాం అంది.ఏడురోజులు బాధపడ్డారు.ఎన్నోసార్లు నచ్చచెప్పడానికి పరమహంస చేసిన అన్నిరకాల విశ్వప్రయత్నలు విఫలమైనాయి.చివరికి ఆయన ఇపుడున్నచోటులో ఉండలేరు.తను అరుణచలము వచ్చి ఉండలేదు.దానితో కోర్డు సమక్షములో విడిపోయి ఆమె అడిగిన డబ్బులు అలాగే ఇతర సౌకర్యాలుగూడ ఇచ్చి సత్యాలేదాదైవాన్వేషణ కోసము ప్రేమించి పెళ్ళిచేసుకొని 18సం.రాలుపాటు కలిసిమెలిసి ఉన్న భార్యను వదిలిపెట్టక తప్పలేదు.అపుడు కొన్నిరోజులుపాటు తీవ్రమైన మనస్ధాపనికి పరమహంస వెళ్ళిపోయారు.తనతోపాటుగా ఇన్నాళ్ళు ఉండి ధర్మ,అర్ధ,కామ మార్గాలయందు ప్రయాణించి చివరికి మోక్షమార్గములోనికి ప్రవేశించే సమయానికి తను రాకపోయేసరికి ఈయనకి విపరీతమైన బాధవేసింది.ఈస్ధితికి పొందలంటే తిరిగి తనకి ఎన్నోకోట్లజన్మల సం.రాలలో పడుతుందో ఆ విధాతకి తప్ప ఎవరికి తెలియదు.ఒక అడుగు దూరములో ఉన్న మోక్షక్షేత్రమైన అరుణచలమునకు రానని చెప్పి తిరిగి మాయలో పడటము పరమహంస జీర్ణము గావడము లేదు.పతిసేవ ద్వారా ఈమెకి ఖచ్చితముగా వచ్చే మోక్షమును తన అజ్ఞానముతో తల్లిప్రేమ మాయలోపడి సర్వనాశనము చేసుకున్నదని పరమహంస మనోవేదనకి గురీయ్యారు.కాని ఏమి చెయ్యగలరు.ఎవరుగూడ విష్ణువుగూడ విధిరాతను దాటలేడు గదా.ఆమె తలరాతలో తనతో మూడు ధర్మాలు పాటించాలని ఇంతవరకే ఉన్నదని తనతో రుణాబంధవిముక్తిపొంది తనని మోక్షమునకు పంపించి తిరిగి తను గావాలని తల్లి మోహమాయలో పడింది.విధిరాతకి ఎవరు అతీతులు కారని మరొకసారి రుడి అయింది అనుకుంటుంటగా ఒకసారి ధ్యానములో ఈయనకి పరమపదించిన మహస్వామి చంద్రశేఖరస్వామి వారు కనిపించి తన ఆత్మశరీరముతో మాట్లాడే దృశ్యము ఈయనకి కనిపించడము ఆరంభమైంది.స్వామి..నా ఆత్మ నమస్కారాలు.కారణము లేనిదే మీలాంటి కారణజన్మలు మాలాంటివారికి కనిపించరు.అనుగ్రహభాషణము చెయ్యరు.అనగానే..ఓ శివయోగి..నువ్వుగూడ కారణజన్ముడివే.అమ్మ పుత్రుడివి గదా.అమ్మ నీతో మాట్లాడమని నన్ను పంపించిది.నీకు సన్యాసదీక్ష ఇవ్వమని అమ్మ ఆజ్ఞ అనగానే స్వామి..మీకు తెలియంది కాదు.నేను ఇంక గృహస్ధ ఆశ్రమములో ఉన్నాను అనగానే అది వచ్చింది.దాని పనిని పూర్తీచేసి వెళ్ళిపోయింది గదా.ఇదింతా అమ్మ-అయ్య లీలా విన్యాసమే గదా.తను నీ జీవితములోనికి వచ్చి గృహస్ధ ధర్మము పూర్తిచేసి వానాప్రస్ధ ధర్మములో నీతో నడవలేనని వాళ్ళఅమ్మతో నడుస్తున్నానని చెప్పి నిన్ను వదిలివెళ్లిపోయింది గదా.నీ ధర్మము నీవు నిర్వహించావు. నీ ధర్మము తప్పకుండా పూర్తిచేసావు.కారణము లేనిదే ఏమి జరగదు.శివాజ్ఞ లేనిదే ఏమిజరగదు గదా.తను వచ్చి తన పనిని పూర్తిచేసుకుంది.ఆమెకి ఇంక ఈ భూమ్మీద ఇంకా కర్మలు, కర్మబంధాలు, కర్మరుణానుబంధాలున్నాయి. అవి తను పూర్తిచేసుకోవటానికి తను వెనక్కి తిరిగి వెళ్ళింది.అదే నీకు అన్నిగూడ ఇసుమంతగూడ ఏమిలేకపోవడముతో నువ్వు ముందుకి అనగా వానప్రవస్ధ ధర్మము నుండి ఆఖరిదైన సన్యాసాశ్రమ ధర్మానికి చేరుకున్నావు.ఇది పూర్తిచెయ్యటానికి నీకు సన్యాసదీక్ష ఇవ్వటానికి మేము ముగ్గరము రావాలిసి వచ్చింది అంటుంగా మరో ఇద్దరు పీఠాధిపతుల ఆత్మలు కనిపించేసరికి స్వామి..మీకు అన్ని తెలుసు.నాకు ఏది మంచిదో మీకు తెలుసు.ఎందుకంటే నా ఆదిజన్మనుండి  మీరే మా భౌతిక కులగురుదైవముగా ఉన్నారు.మీరు ఏమి చేసిన నాకు ఏట్టి అభ్యంతరము లేదు అనగానే ఈ ముగ్గురు పీఠాధిపతులు కలిసి పరమహంస ఆత్మశరీరానికి కుంకుమపువ్వరంగుతో ఉన్న దీక్షవస్త్రాలు కట్టించి "నిరాకారనందస్వామి" అను సన్యాసదీక్షనామము ఇచ్చి కమండలము,యోగదండము,పాదుకలు ఇచ్చి మూడు సార్లు ఈ దీక్షనామము పలికి ఆశ్వీరవచనాలు పలికి అదృశ్యమవ్వయేసరికి పరమహంసకి ధ్యానభంగమైంది.ఆరోజు శుక్రవారము అలాగే మహస్వామి వారి జయంతి ఉత్సవాలు టి.విలో రావడము జరిగేసరికి తన ఈ ధ్యానానుభవము సత్యమని ఈయనికి ఠూఢీ అయింది.  దానితో ఈయనకాస్త అరుణచలక్షేత్ర ప్రయాణసమయులో తనకి మొదటి స్టేజిలో గొంతు కేన్సరు ఉన్నదని టెస్టురిపోర్డులు రావడము..తన తాతగారుగూడ గూడ ఈవ్యాధితో మరణముపొందరాన్ని తెలియడముతో ఇక తనకి అంతిమ చావు అంతిమ ఘడియాలు ఆరంభమైనాయని   తెలుసుకొని మౌనముగా అరుణచలము చేరుకున్నారు.ఎందుకంటే ఈయన గొంతు కేన్సరు వలన మాట్లాడే ఓకల్ సిస్టము పూర్తిగా దెబ్బతిని పాడైపోవడముతో దానితో ఈయన కనుక ఇక జీవితాంతము మాట్లాడకుండా మౌనముగా ఉండాలని లేదంటే త్వరలో పాడే ఎక్కుతారని వైద్యులు సూచనలమేర ఈయన మౌనము వహించి అరుణచలమునకు ఏకాకి..ఎకాంతముగా..ఒంటరిగా చేరుకొని తన భక్తురాలు కట్టించిన అద్దేఇంటిలో ఆవాసము చేస్తూ ఒక సత్యాన్వేషిగా నిత్య కాషాయవస్త్రాధారిలో సర్వసంగ పరిత్యాగిగా నిజ సన్యాసిగా మారి బ్రహ్మచారి,గృహస్ధ,వానప్రస్ధ ఆశ్రమాలు దాటి నాలుగవది అంతిమ ఆశ్రమైన సన్యాసి ఆశ్రమదీక్షను అక్కడున్న ఈయన గురుదేవుడైన శ్రీ మేధాదక్షిణామూర్తి సమక్షములో ఈ దీక్షను తీసుకోవడము జరిగింది.అంటే అన్నింటికి... అన్నింటిన్ని... తెగించేవాడికి తెడ్డె గతి అన్నట్లుగా మన ఇష్టదైవ రక్షణముగా ఉంటుందని ఈయన స్వానుభవము ద్వారా నాకు అనుభవమైంది.ఇందువలన ఈయన నిజసత్యాన్వేషి అయ్యాడు లేదంటే కామ ప్రేమ మోహ వ్యామో మాయలో పడి ఉండి ఉంటే భార్యవిధేయుడు అయ్యేవారేమో గదా. 

నేను అరుణాగిరియందు చూసిన ధ్యానదృశ్యాలు:

నాకు అరుణచలక్షేత్రములో ధ్యానములో అరుణగిరిలోపల కనపడిన ధ్యానదృశ్యాలను ఒక వరుసక్రమములోపెట్టినాను.అవిమొదట 24.సుదర్శనచక్రము23.పాంచజన్యమహశంఖము.
22.నందీశ్వరదర్శనం21.మహగణపతిదర్శనం20.మహసరస్వతిదర్శనం19.మహలక్ష్మీదర్శనం18.నరసింహస్వామిఅంశ మగసింహ ముఖ దర్శనం17.నెమలివాహన కుమారస్వామి
16.పద్మకారశివలింగదర్శనం15.స్ఫటికశివలింగదర్శనం14.నల్లశివలింగము13.తెల్లశివలింగము
12.పాదరసశివలింగదర్శనం 11.అగ్నితీర్ధదర్శనం10.పంచముఖవాసూకిపాముదర్శనం 9. శ్రీచక్ర ఎరుపు అగ్ని బిందువు దర్శనం 8. ఏకతల నల్లశివుడి అర్ధశరీరదర్శనం 7. తెలుపు పురుషశివలింగము 6. ఎరుపు స్త్రీ శివలింగ దర్శనం 5.అర్ధనారీశ్వరలింగదర్శనం 4. నల్లరుద్రశివలింగదర్శనం 3. ఆదిపరాశక్తి నిజరూప దర్శనం 2. పళిని కుమారస్వామి విగ్రహదర్శనం 1. అరుణజ్యోతి దర్శనం..ఆపై  గాఢాందకార ఉందో లేదో తెలియని అనాద పూర్ణశూన్యము..ఇలా నాకు ఈ అరుణగిరినందు కనిపించాయి.వీటిని నేను పెట్టికున్న వరుసక్రమములో కిందనుండిపైకిచూస్తే  మొదట మహ శూన్యము..ఆపై అరుణజ్యోతి దీనిని నుండి ఆదిపరాశక్తి,ఆదిరుద్రుడు వచ్చారు.వీరి నుండి షణ్ముక కుమారస్వామి అనగా పంచభూతాలు,కాలము వచ్చాయి.వీటిద్వారా అష్టాంగ పురుషప్రకృతి తెల్లపురుషశివలింగశక్తితోను అలాగే అష్టాంగ స్త్రీ ప్రకృతి ఎరుపు శివలింగశక్తితో ఉద్భవించాయి.ఈ రెండుశక్తులు కాస్త కామశక్తితో ఒక్కటై అర్ధనారీశ్వర శివలింగశక్తితో మూలప్రకృతిని ఏర్పిచి ఆపై ఒకే మౌలికవిధానముతో జీవసృష్టి జరుతోందని అనగా అమ్మనుండి అయ్యరావడముతో అమ్మ కాస్త తల్లి అయితే అయ్యకాస్త ఈమెకి కొడుకు వరుసకావడముతో..ఈ సృష్టివిధానమునకు స్వస్తిపలికి వీరిద్ధరు కాస్త మళ్ళీ విడిపోయి పురుషప్రకృతి రుద్రశివలింగ అంశముతోను మరియి స్త్రీ ప్రకృతి మేరుశ్రీచక్ర అంశముతో అపుడిదాకా ఏకతత్వ అర్ధనారీశ్వరతత్వజీవులుగా ఏర్పడినవారు కాస్త పురుషజీవులుగా..స్త్రీజీవులుగా వేర్వుగా ఏర్పడి వారి మధ్య సంయోగశక్తితో వీటిద్వారా పాదరసశివలింగశక్తితో వీర్యకణ జీవులు అలాగే తెల్లశివలింగశక్తితో చలనములేని వస్తువులు కొండలు,పర్వతాలు,చెట్లు ఇలా ఏర్పడితే నల్లశివలింగశక్తితో చలనము ఉన్న జంతువులు ఏర్పడితే ఇక స్ఫటికశివలింగశక్తితో జ్ఞానయోగజీవులు ఏర్పడితే పద్మకారశివలింగశక్తితో యోగమాయభోగజీవులు వస్తే అదే రుద్రశివలింగశక్తితో మాయరహితమోక్షజీవులు ఉద్భవించాయి.వీటితో మూలప్రకృతి ఏర్పడి ఇదికాస్త కాలచక్రములో (సుదర్శనచక్రకాంతితో..పాంచజన్యశంఖనాదముతో) సృష్టి,స్ధితి,లయ,లాస్య విధివిధానముతో విశ్వప్రకృతి నడుస్తోందని నాకు అందిన జ్ఞానస్ఫురణ.అంటే ఈ లెక్కనచూస్తే విశ్వ ఆది మరియు అంతము అంతాగూడ అరుణచలక్షేత్రములోని అరుణగిరియందు అరుణజ్యోతికాంతితో ఉన్నదని నాకు అవగతమై నా అంతిమయాత్రకి అరుణచలక్షేత్రమే అంతమని గ్రహించి ఈక్షేత్రవాసిగా మారిపోయాను.

మన యోగసాధన:

మనం ఆరాధించే దైవాలను బట్టి మన యోగసాధన ఉంటుందని తెలుసుకొండి.అనగా ఏవరైతే గణపతి పూజలు నుండి గణపతి ఉపాసనస్ధితికి చేరుతారో వారంతా మూలధారచక్రవాసులైతే..ఎవరైతే విష్ణువు లేదా వెంకటేశ్వరస్వామి ఆరాధన లేదా లక్ష్మీదేవి ఆరాధనచేస్తే వారు స్వాధిష్టనచక్రవాసులుగాను..ఎవరైతే పాండురంగడు ఆరాధనచేస్తే  లేదా మణులు ఆరాధన అనగా నాగమణి,చింతామణి,పరుశవేదిమణి,శమంతకమణి,రుద్రమణి, కౌస్తుభమణి లేదా అగ్ని ఆరాధకులు... ఇలా వీటిని ఆరాధన చేసేవారంతాగూడ  మణిపూరకచక్రవాసులుగా..ఎవరైతే కాలభైరవ,మహకాలుడు,కాళిక,బైరవ ఆరాధనలు చేస్తారో లేదా పితృదేవతల ఆరాధకులు లేదా  భూత,పిశాచ,గంధర్వ,యక్షిణి,మోహిని,కామిని మున్నగు తంత్ర దేవతల ఆరాధకులు వారంతాగూడ అనాహతచక్రవాసులుగా... ఎవరైతే సరస్వతి, గాయిత్రి, బాల,లలితా,రాజరాజేశ్వరీ,త్రిపుర,దుర్గాదేవి,దశమహవిద్యదేవతలు,నవదుర్గాలు, సప్తమాతృకల ఆరాధన,శ్రీచక్రము,గ్రామదేవతలు ఆరాధన..లేదా బ్రహ్మ ఆరాధకులు లేదా యజ్ఞ,యాగాదులు ఆరాధకులు ఇలా మున్నగు అమ్మవార్లు ఆరాధన చేస్తారో వారంతా విశుద్ధచక్రవాసులుగా అలాగే ఎవరైతే శివశక్తి లేదా విష్ణుశక్తి అనగా శివుడిని మరియు అమ్మవారిని లేదా విష్ణువు మరియు శివుడిని కలిపి అర్ధనారీశ్వరాధన చేస్తారో అలాగే నిజగురువులు లేదా నిజయోగులు లేదా నిజసద్గువురులను భౌతికముగా లేదా వీరి జీవసమాధులు ఆరాధన లేదా గురునానక్ ఉపాసకులు అలాగే శ్రీదత్తత్రేయస్వామి లేదా వీరి అంశ అవతారాలను ..లేదా సూర్య ఆరాధన లేదా నవగ్రహారాధన లేదా గురురాఘవేంద్రస్వామి ఆరాధకులు చేసేవారంతా ...ఇలా ఆరాధన చేస్తారో వారంతాగూడ ఆజ్ఞాచక్రవాసులు అవుతారు.అలాగే తాంత్రిక విధివిధానములో సాధన చేసేవారంతాగూడ ఉపచక్రాలైన గుణ,కర్మ,కాల,బ్రహ్మచక్రాలవాసులుగాను...అలాగే ఎవరైతే శ్రీకృష్ణుడి పూజలు నుండి శ్రీకృష్ణ ఉపాసనస్ధితికి వస్తారో లేదా  ఏసుప్రభు లేదా యెహువా ఉపాసుకులు లేదా అయ్యప్పస్వామి ఆరాధన లేదా జ్యోతి ఆరాధకులు  వారంతాగూడ  సహస్రచక్రవాసులుగా పరిగణించబడతారు.అలాగే ఎవరైతే హనుమ ఉపాసులైతే వారంతా జీవనాడి వాసులుగాను..ఎవరైతే ఇష్టలింగధారి లేదా పాదరసలింగధారి లేదా స్ఫటికలింగధారి లేదా బాణలింగధారిగా ఉండి వీటి ఉపాసన చేస్తే వారంతా లేదా బుద్దుడి ఆరాధన చేసేవారో  లేదా అల్లా ఉపాసకులు వారంతా  హృదయచక్రవాసులు అవుతారు.ఇక ఎవరైతే నరసింహస్వామి ఉపాసనచేస్తారో వారంతా బ్రహ్మనాడివాసులు అవుతారు.ఇక ఎవరైతే దక్షిణమూర్తి లేదా కుమారస్వామి లేదా  సుబ్రహ్మణ్యస్వామి పూజలు నుండి ఉపాసనస్ధితికి వస్తారో లేదా జైనుడి ఆరాధకులు వారంతా బ్రహ్మరంధ్రచక్రవాసులుగా..అంతిమ మోక్షజీవులుగా పరిగణించబడతారు.అంటే ఈ లెక్కనచూస్తే అంతిమముగా మనకి మోక్షము రావలంటే పళిని కుమారస్వామి సాధన స్ధితికి అనగా ఈయనకిలాగా మనముగూడ సన్యాసదీక్షస్ధితికి రావాలి అలాగే దక్షిణమూర్తిలాగా మౌనస్ధితికి ఎవరైతే చేరుకుంటారో వారికి ఈ జన్మ అంతిమ మోక్షజన్మ అయ్యి శూన్యమైపోతారు.

మోక్ష సన్యాస మౌనం:


                                              నాకు వచ్చిన పళినిస్వామి విగ్రహమూర్తి

నిజానికి మోక్షదేవుడు మనమంతా అనుకున్నట్లుగా రుద్రదక్షిణామూర్తి కాదు. నవపాషణ పళని సుబ్రహ్మణ్యస్వామియే అసలుసిసలైన మోక్షదేవుడని ఎవరికి తెలియదు.నాకు కూడ పరమహంస యైన నిరాకారనందస్వామిగా ఈయన సన్యాసదీక్ష తీసుకున్నపుడు ఈయనకి కలిగిన తన అంతిమధ్యానానుభవమును బట్టి నాకు తెలిసింది.అది ఏమిటంటే ఈయనకి ఒకరోజు ధ్యానము నందు అరుణగిరి దర్శనమైంది.కొన్నిక్షణాలు తర్వాత ఈయన ఆత్మశరీరము కాస్త ఈ గిరిలోపలకి ప్రవేశించడము..లోపుల అన్నిగుహమార్గాలు దాటి చిట్టచివరికి ఒకగుహ లోపల పళని సుబ్రహ్మణ్యస్వామి నవపాషణ నిర్మిత విగ్రహమూర్తి దర్శనమైంది.ఇది చూడటానికి అచ్చుగుద్దినట్లుగా భోగర్ నిర్మిత నవపాషణ పళిని కుమారస్వామి విగ్రహమూర్తిలాగా ఉంది.కాని దానికి దీనికి ఉన్న తేడా ఏమిటంటే పళని స్వామి చేతిలో దండాయుధముంటుంది.ఇక్కడ అది లేదు అనుకునేలోపుల విద్యుతు మెరుపుకాంతి శక్తితో ఈయన చేతిలో దండాయుధము రావడము దీని నుండి విషగాల్లుల శక్తిప్రసారాలు కాస్త ఈయన త్రినేత్రము మీద ప్రసరించేసరికి ఈయన నేత్రము కాస్త అతకుతమై కనిపించేదృశ్యాలు తన భౌతికనేత్రాలు అందుకులేనంతవేగముగా మారుతుండేసరికి ఈయనకాస్త ఈశక్తిప్రసారాలు తట్టుకోలేక ధ్యానభంగమైంది.దానితో ఈయన ధ్యానము నుండి బయటికి వచ్చి ఆత్మవిచారణ చేసుకుంటే అపుడు ఒక విషయము జ్ఞానస్ఫురణ అయింది.అది ఏమిటంటే ఆదిశివుడికి గూడ ఒకానొకసమయములో తనకి ఒక వరము కావల్సివచ్చింది.దానితో ఈయనకాస్త సనకానందులు దగ్గరికి వెళ్ళి వారిలో సనత్కుమారు దగ్గరికి వచ్చి నీకు ఎదైన వరము నాకు ఇవ్వాలని ఉంది.నీకు ఏమి వరము గావాలో కోరుకో అన్నపుడు దానికి సనత్కుమారుడు కాస్త స్వామి..నాకు వరాలతో పనిలేదు. ఆ వరము ఏదో మీరే కొరుకొండి.అది నేనిస్తాను అని అహముతో రుద్రుడితో అనేసరికి..దానికి రుద్రుడు చిరునవ్వి..అయితే నాకు మోక్షమిచ్చే కుమారుడిగా జన్మించు అనగానే..ఆ ప్రక్కనే ఉన్న అమ్మవారు కాస్త..అపుడు నువ్వు నా కడుపున పుట్టాలి అనగానే..దానికి సనత్కుమారుడికి అహము పోయి..తండ్రి నేను నీకు కుమారుడిగా పుడతాను.కాని అమ్మ కడుపున పుట్టను.నాది అయోని జన్మ అవ్వాలి.ఎందుకంటే పుత్రమమకారమోహవ్యామోములో పడటము నాకు ఇష్టము లేదు అనగానే దానికి ఆదిదంపతులు కాస్త తదాస్తు అనగానే..ఈ సనత్కుమారుడే కాస్త ఈ శివుడి వీర్యము నుండి కుమారస్వామిగా జన్మించి సప్తమాతృకల చేతిలో ఆరుతలాల సుబ్రహ్మణ్యస్వామిగా అవతరించారు.ఈయనే ఆదిరుద్రడికి మోక్షసన్యాసయోగము ఇవ్వడము జరిగింది.అందుకే లోకములో కుమారుడి వలనే తల్లిదండ్రికి,పితృదేవతలకి పున:రపి జనన మరణచక్రము నుండి ఉద్దరిస్తాడని నానుడి ప్రచారమైంది.ఇది నిజమే అనటానికి మనకి అరుణగిరినందు ఆఖరి ఆకారస్వరూపముగా పళిని కుమారస్వామి విగ్రహమూర్తి కనపడుతోంది.దీనిని దాటితే అరుణజ్యోతి దర్శనము..దీనిని దాటితే అనాద పూర్ణశూన్యము అవుతుంది.వెలుగు పోతే మిగిలేది చీకటే గదా.అదే శూన్యము.అలాగే కుమారస్వామి ఆరాధన ఆరుతలాల సర్పాఆరాధనగా, జ్యోతిస్వరూపముగా ఆరాధించడము జరుగుతోంది.అలాగే ఈయన విగ్రహమూర్తులను తమ అభిమతమునకు అనుగుణముగా  బాల కుమారస్వామిని కాస్త బాలాజీగా, వెంకన్నస్వామిగా, బాలకృష్ణుడిగా మార్చి తమ కొత్త మతావిధానమునకు నాంది పలకారు.ఏదీ ఏమైనప్పడికి చివరికి అంతిమరూపమై కుమారస్వామికి తమ సాధన అంతిమస్ధితికి చేరుతోంది గదా..అంటే ఈ లెక్కనచూస్తే 63 డైమర్షలో ఆదిరుద్రదక్షిణామూర్తి ఉండి మనకి మోక్షమునకు అర్హత ఉందో లేదో పరిశిలిస్తాడు.ఈయని దాటితే 64వ డైమర్షలో ఆదిపరాశక్తి మనకి మోక్ష యోగ్యత ఉందో లేదో పరీక్షపెడతారు.అపుడు ఇది నెగ్గితే 65వ డైమర్ష ప్రవేశ మార్గములో మనకి పళిని కుమారస్వామి కాస్త మనకి ఈ జన్మలో మోక్షయోగము ఉందో లేదో అంతిమ యోగపరీక్ష పెడతాడు.ఈయన గుచికుడ్డతో సన్యాసదీక్షలో ఉండటము వలన తన దగ్గరికి వచ్చేవాడు తనకిలాగ అన్ని వదిలేసి వచ్చేవాడు అయితే వాడికి మోక్ష సన్యాసయోగమిస్తాడు.తనని తెలుసుకొని ఇంక ఏదైన ఇష్టకోరికమాయలో ఉంటే వాడికి కపటసన్యాసయోగమిచ్చి ఆ కోరికమాయలలో ఈ జన్మాంతము ఉంచి వాడి అంతిమకోరికమేర మోక్షమా లేదా భోగమా అనేది ఇస్తాడు.జాతకము రీత్యా సన్యాసయోగములో రాహువు గ్రహముంటే వాడు ఖచ్చితముగా కపటసన్యాసి అవుతాడని అదే ఈ యోగములో కేతు గ్రహముంటే వాడు ఖచ్చితముగా మోక్షసన్యాసి అవుతాడని జ్యోతిష్యశాస్త్రము చెప్పకనే చెప్పింది.దానితో పరమహంస కి తన ఆత్మశరీరానికి ముగ్గురు పీఠాధిపతులు కలిసి నిజసన్యాసిదీక్ష ఇవ్వడము జరిగింది.మరి తన భౌతికదేహనికి ఏలాంటి యోగము పడుతుందో అని తెలియని అయోమయ ఆందోళపడటము జరిగింది.భార్య వదిలివెళ్ళిపోవడముతో తన దేహనికి సన్యాస ఆశ్రమధర్మములోనికి ప్రవేసించే అర్హత వచ్చింది కాని ఇది కపట సన్యాసమా లేదా నిజ సన్యాసమా అనే ధర్మసందేహము వెంటాడింది.ఇది ఇలాయుండగా ఒకరోజు ఈయనకి అరుణచలములో అర్ధరాత్రి ధ్యానములో ఉండగా..గదినిండా కాంతులు విరజిమ్ముతూ..ఒక దివ్యతేజశరీరము కాస్త లీలామూర్తిగా కనిపిస్తూ..నిరాకారస్వామి..అందరు నన్ను చూడటానికి తపనతాపత్రయాలు పడతారు. అందరు నా వెంట పడితే నేను నీ వెంట పడటానికి నీ సన్నిధానములో ఉన్నాను.నన్ను గుర్తించి బయటికి తీయ్యి..నీకు నా సన్యాసదీక్ష ఇస్తాను అంటూండగా ఈ శరీరము కాస్త ఒకలిప్తకాలముపాటు పళినికుమారస్వామి విగ్రహమూర్తిగా కనిపించి అదృశ్యమవ్వడముతో..ఈయనకాస్త ఆయన్ని వెతకానికి అర్ధరాత్రి గిరిప్రదక్షిణము చెయ్యటానికి బయలుదేరితే నేనుగూడ వెళ్ళకతప్పలేదు.ఇన్నాళ్ళు కనిపించనివాడు కనిపింస్తాడని అంటే వెతకకుండా ఉంటామా? వెతకడము ఆరంభించాము.కనిపించిన పుట్టలు,గుట్టలు,చెట్లుగుబురులు కనిపించేవాడికోసము వెతకడము ఆరంభించాము.ఎక్కడ అగుపించలేదు.ఒపిక నశించింది.నీరసము ఆవరించింది.కాళ్ళు తడపడ్డాయి.కళ్ళు మూతలుపడ్డాయి.ఇంతలో ఒక సన్యాసి సాధువు మా దగ్గరికి వచ్చి..నిరాకారస్వామి..నా పళిని స్వామి నీ దగ్గర ఉంటానని చెప్పాడు.నాకు మరణ సమయము ఆసన్నమైంది.మీకు మోక్షసన్యాసదీక్ష పొందే సమయము వచ్చింది.స్వయంగా మోక్షమిచ్చే కుమారస్వామియే మీకు మోక్షసన్యాసదీక్ష ఇవ్వటానికి వచ్చారంటే మీరు నిజముగా కారణజన్మమోక్షయోగి..నాకు మోక్షము ప్రసాదించండి అంటూ తన చేతిసంచిలోంచి పళిని కుమారస్వామి విగ్రహమిస్తూ..మరొప్రక్క ఈయన కాళ్లను తాకుతూండగానే ఆ సాధువుకి ఆఖరిశ్వాస పొందడము..ఈయన చేతికి పళినిస్వామి విగ్రహమూర్తి అందడము ఏకకాలములో జరిగాయి.ఆ తర్వాత అంతే విచిత్రముగా పరమహంస గారి అన్నగారు..పరమహంసలో తొలినాళ్ళలో గురుత్వములో కనిపెట్టిన ఆదిశిష్యుడు అలాగే నా సమక్షములో అనగా ఇలా మా ముగ్గురి సమక్షములో పరమహంస భౌతికదేహమునకు పళినికుమారస్వామి విగ్రహమూర్తి చేతులుమీదగా మేధదక్షిణమూర్తి గుడిలో తన ఆత్మశరీరము ఏలాయితే ముగ్గురి పీఠాధిపతులు సమక్షములో సన్యాసదీక్ష తీసుకున్నట్లుగా ఇలా మా ముగ్గురి సమక్షములో ఈయన భౌతిక దేహముగూడ మోక్షసన్యాసదీక్ష తీసుకోవడము జరిగింది.దానితో పరమహంస కాస్త నిరాకారనందస్వామిగా అటు ఆత్మశరీరమునకు అలాగే భౌతికశరీరముగూడ పళినికుమారస్వామి లాగా మోక్షసన్యాసదీక్ష పొందడము అందరికి సాధ్యపడే విషయముగాదని..అర్హత,యోగ్యత,యోగమున్న కారణజన్ములకి మాత్రమే ఇది సాధ్యపడుతుందని నేను ఆయనతో అంటే..అది ఏమి గాదు.. సాధన సాధ్యతే సాధ్యం అని చెప్పి ఆ క్షణము నుండి ఆజన్మాంతముగా వరకు అనగా ఆయన సమాధి చెందేవరకు మౌనవ్రతమును పాటించారు.దీని వలన గొంతు మాట్లాడనపుడు మనస్సు మాట్లాడము మొదలుపెడుతుంది.మనస్సు మౌనముగా ఉంటే హృదయము మాట్లాడుతుంది.ఆ తర్వాత హృదయము మౌనమైతే అంతర్మాత అనుభూతినిస్తుంది.అంటే భగవంతుడు అనేది ఒక రూపము కాదు.ఒక వ్యక్తి అంతకన్నా కాదు.నిజానికి భగవంతుడు అంటే ఒక తత్వం..ఒక సత్యం..ఇది మాట్లాలకి అందని అనుభూతి.కేవలము మౌనమునకు అందే అనిర్వచనమైన అనుభవ అనుభూతి.అఖండానువభవం..అఖండానందం..మౌనమే సత్యం..శివం..సుందరం..అందుకే అంతిమ కర్మగా మోక్షసన్యాసదీక్ష తీసుకోవడము..అంతిమ కర్మఫలముగా మౌనము పొందడము జరుగుతుంది.అందుకే దక్షిణామూర్తి మౌనం సత్యబోధ..జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణం..మౌనం అంటే ఇతరులతో మాట్లాడుకుండ ఉండటము కాదు.ఇతరులతో మాట్లాలని అనిపించకపోవడమే నిజమైన మౌనమవుతుంది.ఇలాంటి మౌనదీక్ష వలన మనస్సు మాట అణుకుతుంది.అపుడు మనలో అంతరశుద్ధి కలుగుతుంది.నిజజ్ఞానము అందుతుంది.ఈ అంతిమ మౌననూభూతియే పూర్ణజ్ఞానము అనగా నేను ఎవరిని..నేను ఆత్మ..నేను ఆత్మగాయున్నాను..నేను ఆత్మను కాను..నేను ఆత్మగా లేను.. నేను లేను..ఉందో లేదో తెలియని అనాద పూర్ణశూన్యమే అంతిమ మౌనానుభూతిస్ధితిని పొందడమే మౌన అంతిమస్ధితి అవుతుంది.ఇదియే పూర్ణ మోక్షమవుతుంది. 

పరమహంస అంతిమ మోక్షానుభవం:

మోక్షమనేది ఒక విచిత్రమైన అవస్ధయని..ఇది పొందామో లేదో చెప్పలేని స్ధితియని నిజయోగులు ఎందుకు అన్నారో పరమహంసకి తన మోక్షస్ధితి అనుభవము అయ్యేదాకా ఇది నిజమని అర్ధముకాలేదు.ఎందుకంటే మోక్షస్ధితిన్ని మనకి అరుణచలక్షేత్రములోనే పొందడము జరుగుతుందని అందరికి తెలుసుగదా.ఈ స్ధితిని పొందాలంటే మోక్షసన్యాసదీక్ష పొందడము జరుగుతుందని..దీనికి మనకి ఉన్న అష్టశరీరాలు అనగా స్ధూల, సూక్ష్మ,కారణ,ఆకాశ, వాయు,సంకల్ప,ఆత్మ,జ్యోతిశరీరాలకి మూలాలు మనకి అరుణగిరియందు ఉంటాయని తెలుసుకొండి.నిజానికి మోక్షస్ధితి అంటే గోపి అనగా గోడ మీద పిల్లి లాంటి స్ధితి అనగా ఒక పక్క భోగబంధాలు మరొపక్క యోగబంధాల మాయలకి సాధకుడు స్పందన,ప్రతిస్పందన చెయ్యకుండా సాక్షిభూతముగా నిశ్చలస్ధితిలో స్ధిరముగా నీ భౌతికశరీరములోని ప్రాణశక్తి పోయేదాకా ఉంటేనే నీకు మోక్షప్రాప్తి కల్గుతుందని ఖచ్చితముగా తెలుసుకొండి.అంటే సాధకుడు తన అంతిమ జ్యోతిశరీరము ఏపుడైతే అరుణజ్యోతిగా మారుతుందో ఆ క్షణమే నీకు మోక్షస్ధితిమాయ మొదలూవుతుంది.ఈ జ్యోతి స్ధితిలో మనకి ఉన్న భోగబంధాలు పోతున్నా..వస్తున్న లేదా యోగబంధాలు వస్తున్న లేదా పోతున్న మన జ్యోతిస్వరూపము స్పందన..ప్రతిస్పందన రాహిత్యస్ధితిలో స్ధిరముగా సాక్షిభూతముగా ఉండాలి.ఉండగల్గాలి.అపుడే మీ దేహనికి ఉన్న  అష్టశరీరాలకి అష్టమోక్షాలు కలుగుతాయి.అనగా ఎవరైతే మానసికముగా లేదా శారీరకముగా సర్వపరిత్యాగిగా మారుతారో వాడు నిజముగానే ఇట్టిస్ధితిలో స్ధిరముగా ఉన్నాడా లేదా యని ప్రకృతిమాత కాస్త మోక్షమాయ పరీక్షను అంతిమముగా పెడుతుంది.ఈ పరీక్షలో నెగ్గినవారికి మాత్రమే పూర్ణమోక్షప్రాప్తి కలుగుతుంది.కాని ఇది ఇంతవరకు ఎవరు పొందలేదు.ఎందుకంటే ఎదోఒక చిన్న లేదా పెద్ద బలహీనతకి ఇట్టి సాధకుడు గురీ అయ్యి మాయలో పడి వెనుతిరుగుతున్నాడు.అంతెందుకు ఇట్టి మోక్షస్ధితిలోనే మన బుద్ధుడు కోరిక లేని సమాజము చూడాలని కోరికతో వెనక్కి తిరిగి వచ్చాడు.అలాగే ఆదిశివుడు దగ్గరనుండి ఆదిశంకరాచార్యుడు వరకు ఏదోఒక చిన్న బలహీనతకి లోనై వెనక్కి వచ్చినవారే.

ఇట్టి మోక్షస్ధితి అనుభవము గూర్చి పరమహంస అనుభవములో చూస్తే ఈయన అరుణచలములో సన్యాసదీక్ష తీసుకున్నారని తెలుసుగదా.అపుడు ఈయనకి తన అష్టశరీరాల మూలాలుగా కుక్క,రామచిలుక,గోరింక,పాము,ఉడుత,గువ్వపిట్ట,కాకి,కప్ప అని తెలిసాయి.ఇవి అన్నియుగూడ ఆయనతో సాన్నిత్యము పొందాయి.వీటిలో వారానికి ఒకసారి పాము దర్శనమైతే ప్రతిరోజు ఈయన పెట్టిన ఆహారము తిన్నటానికి మిగతాజీవులు వచ్చేవి.ఇది ఇలా ఉంటే ఈ శరీరాలకి అష్టమాయలుగా వివిధ వయస్సులలో ఉన్న ఎనిమిదిమంది ఆడవాళ్ళు అదే సమయములో ఈయనికి పరిచయము  అయ్యారు.అలాగే ఈయన ప్రతినిత్యము అరుణగిరి ముందు కూర్చుని అరుణచల శివ నామస్మరణ చెయ్యడమే ధ్యాన ధ్యాసగా పెట్టుకున్నారు.ఇది ఇలా కొనసాగుతూండగా ఈయన జ్యోతిశరీర అరుణజ్యోతి వెలుగులో హెచ్చుతగ్గులు అనగా ధ్యానమునందు ఒకసారి అధిక జ్వాలతో వెలుతున్న తన అరుణజ్యోతి కనపడితే మరొకసారి తక్కువ జ్వాలతో ఉన్న అరుణజ్యోతి దర్శనమిచ్చేది.ఈ వెలుగు తేడాలు ఎందుకు వస్తున్నాయో ఈయనకి ఒక పట్టన అర్ధముకాలేదు.కాని శోధించడము మానలేదు.ఇంతలో ఒకరోజు అర్ధరాత్రి ఈయన కారణ శరీరమైన కుక్కను ఒక పదికుక్కలు కలిసి కరిచాయి.దానితో ఈయనికి ఆవేశము వచ్చి ఆ కుక్కలను తరిమి తన   కుక్కను రక్షించుకొని ఇంటి వరండాలో దానిని ఉంచి సేవలు చేసి దానిని బాధను తీరుస్తున్న సమయములో ఈయనకి ధ్యానమునందు అధిక జ్వాలతో ఉన్న తన అరుణజ్యోతి దర్శనమైంది.అంటే తన కుక్క శరీరానికి ప్రకృతి మాయబాధను కల్గిస్తే ఆ దృశ్యమునకు తన భౌతికశరీరము స్పందించి దానిని రక్షించడము వలన తన అరుణజ్యోతికి కాంతిజ్వాల ఎక్కువైందని తెలుసుకున్నారు.కొన్నిరోజులు తర్వాత ఇదే కుక్కను మళ్ళీ పది కుక్కలు కరవటానికి ప్రయత్నిస్తే ఈయన ఈ సారి అసలు ఎమి జరుగుతుందో చూద్దామని సాక్షిభూతముగా మౌనముగా కదలకుండా స్ధిరముగా ఈ దృశ్యముగా కేసి చూస్తూండగా ఇంతలో తన వాయువు  శరీర అంశయైన పాము కాస్త అటుగా రావడముతో ఈ కుక్కల దృష్టి దానిమీదకి పోవడముతో కొద్దిసేపటికి తన కారణశరీర కుక్క అలాగే వాయువుశరీర పాము కాస్త ఈ కుక్కలను ఏమార్చి తప్పుకునే దృశ్యము కానవచ్చేవరకు ఈయన సాక్షిభూతముగా ఉండటముతో ధ్యానము నందు తన అరుణజ్యోతి అధిక జ్వాల కాస్త సాధారణస్ధితిలో ఉండటము ఈయన గమనించారు.అంటే మూడుకళ్ల (రెండు భౌతిక నేత్రాలు,ఒక త్రినేత్రము)ముందు కనిపించే అన్నిరకాల భావరూపదృశ్యాలకి మన శరీర స్పందన,ప్రతిస్పందన చెస్తే మన అరుణజ్యోతిలో జ్వాలలో హెచ్చుతగ్గులు రావడము ఉంటుందని ఈయన స్వానుభవముగా తెలుసుకున్నారు.అంటే సాధకుడి అంతిమముగా పూర్ణమోక్షస్ధితిలో ఒక భోగబంధాలకి అలాగే యోగబంధాలకి స్పందన,ప్రతిస్పందనలు లేకుండా ఎమిజరిగిన,ఏమిజరుగుతున్న తనకి సంబంధము లేని రాహిత్యస్ధితి అనగా నేనులేను..ఉన్నదింతా..కనిపించేదింతా మనో భ్రమ,భ్రాంతియైన శూన్యలీల యని సాక్షిభూతముగా తన భౌతికదేహము చచ్చేదాకా ఎవరైతే స్ధిరముగా ఉంటారో వారు పూర్ణమోక్షప్రాప్తి పొందుతారు.కాని ఇది కత్తిమీద సాము లాంటిది. పులి మీద స్వారీ లాంటిదని తెలుసుకొండి.ఎందుకంటే ఈ పూర్ణమోక్ష స్ధితి అనేది రెండు వైపుల సమబరువులున్న త్రాసు లాంటిది.ఎపుడైన మనము భోగ లేదా యోగ బంధాలకి స్పందన లేదా ప్రతిస్పందన చేస్తే త్రాసు బరువులో హెచ్చుతగ్గులు  వచ్చి బరువు ఎక్కువు ఉన్న వైపు త్రాసు ముల్లు వగ్గితే అనగా భోగము వైపు వంగితే పున:జన్మలు అదే యోగము వైపు వంగితే కారణజన్మలు ఖచ్చితముగా పొందడము జరుగుతుంది.అంటే సాధకుడు ఇట్టి మోక్షప్రాప్తిస్ధితిలో భోగములో వచ్చే కొత్త లేదా పాత బంధాలు వచ్చిన లేదా పోయిన అలాగే యోగములో కొత్తగా సిద్ధులు వచ్చిన లేదా పాతసిద్ధులు పోయిన ఏమాత్రము ఆనంద విచారము లేని మన:స్ధితిలో స్ధిరముగా చచ్చేదాకా ఉండాలి.అపుడే మీకు పూర్ణమోక్షము కల్గుతుంది.అంటే సాధకుడు అంతిమముగా చావటానికి బ్రతకాలి కాని పున:జన్మగా బ్రతకానికి చావకూడదు.అన్నింటిని అనుభవించాలి అదిగూడ ధర్మముగా..అర్ధముగా  అనుభవించాలి.  కాని ఈ కోరికలు మీద ఇష్టాలు,మోహలు,వ్యామోహలు పెంచుకోకూడదు.మార్చుకోకూడదు.కాని ఇట్టి మోక్షస్ధితిలో కలిగే ఏ కోరికైన అది మనకి బలహీనతగా మారి దానిమీద మమకార,ప్రేమ,మోహ,వ్యామోహలు క్షణాలలో కల్గి మన శరీరానికి క్షణానికి ఒక నరకముగా ఉండే పున:జన్మలు ఇవ్వడముగూడ అంతే క్షణాలలో జరిగిపోతుందని ఖచ్చితముగా గ్రహించండి.అనగా మనకి ఆకలి వేస్తుంది.తిన్నడానికి ఇష్టమైన బోగపదార్ధాలు,రుచికరమైన యోగపదార్ధాలు ఉంటాయి.వీటిలో మనము ఏమి తిన్నాము ఏమి తినాలి అనే ధ్యాస లేకుండా మన ఆకలి తీరిందా లేదా చూసుకోవాలి.అనగా మన ధ్యాస కాస్త ఆకలి మీద ఉండాలి కాని అది తీర్చే పదార్ధము మీద ఉండకూడదు.అపుడు మనకి ఏ మాయ ఉండదు.ఎపుడైతే మన ధ్యాస కాస్త ఆకలి మీద కాకుండా తినే పదార్ధము మీదకి పోతుందో అపుడు ఆ పదార్ధము మీద మనకి ప్రేమ,మోహ,వ్యామోహములో పడటముతో పున:జన్మలు పొందుతాము.మనము పూజించే అందరి దైవాలకి తప్పనిసరిగా ఎదో ఒక ఇష్టపదార్ధకోరిక తప్పనిసరిగా తోకలాగా ఉంటుంది చూడండి.ఇలా పదార్ధ రుచుల బలహీనత మాయలే వాళ్లకి పూర్ణమోక్షప్రాప్తి కల్గనీయ్యకుండా ఇపుడిదాకా చేస్తోంది.ఇలా పూర్ణమోక్షప్రాప్తి పొందే ప్రతి విషయములో స్పందన,ప్రతిస్పందన అనే రెండుస్ధితుల బలహీనతలను సాధకుడు స్ధిరమనస్సుతో..స్ధిరబుద్ధితో..దాటుకోవాలి.అపుడే వాడు పూర్ణమోక్షగామి అవుతాడు.ఈ బలహీనత లేని భగవంతుడే ఇంతవరకు లేడు..పుట్టలేదు.ఎందుకంటే భగవంతుడికి ఎదోఒక బలహీనత ఉంది.ఆశ,భయం,ఆలోచన,సంకల్పం,స్పందన,ప్రేమ,మోహము,వ్యామోహము,ఇష్టము,ఆనందము,శాంతము,ప్రశాంతము,ఇలా 64 బలహీనతలున్నాయి.ఇలా ఈ బలహీతలు లేని భగవంతుడి కోసము ఈ విశ్వమాత ఎదురుచూస్తోంది.ఎందుకంటే ఇలాంటి మోక్షగామి ఒకడు ఎలాంటి బలహీనతలకి లొంగని బలవంతుడైన భగవంతుడి వలన ఈ విశ్వానికి విశ్వమోక్షము కల్గి కనిపించే 64 డైమర్షలున్న అరుణగిరి కాస్త శూన్యమై విశ్వశూన్యములో శూన్యమవుతుంది.కాని బలహీనత లేని భగవంతుడు పుట్టడు.పుట్టలేడు.ఎందుకంటే శక్తి సృష్టించబడదు. నాశనమవ్వదు.కాబట్టి ఈ పూర్ణమోక్షస్ధితికి వచ్చిన ప్రతిసాధకుడు గూడ భగవంతుడే అవుతాడు.ఈ మోక్షప్రాప్తి మోక్షమాయ ఇచ్చే అతిచిన్న లేదా అతిపెద్ద బలహీనతను దాటుకొనే భగవంతుడు తయారు అవ్వడము కోసమే ఈ మోక్ష సాధన ఉంది. ఈ మోక్షదేహలున్నాయి.కాని ఈ మోక్షమాయ దాటే బలహీనత లేని భగవంతుడి కోసము అందరు సాధన చేస్తున్న అంతిమముగా వచ్చే అతిచిన్న బలహీనతను తెలియక లేదా తెలిసి దాటలేక పున:కర్మజన్మలు ఇపుడిదాకా జరుగుతూనే ఉంది. ఇకపై జరుగుతూనే ఉంటుంది.ఎందుకంటే 99.99% బలహీనతమాయను దాటినపుడికి 0.1% బలహీనత మాయలో పడటము జరుతుంది.ఇది మనకి ఉన్న అష్ట శరీరాలలో మీరు ఈ   ఏ శరీర బలహీనత మాయకి గురియ్యారో ఆ శరీర పున:జన్మలు ఎత్తి సాధన చేసి జీవాత్మ నుండి జీవారుణజ్యోతిగా మారి మరో శరీర బలహీనత మాయకి గురై పున:జన్మ చక్రములో నిరంతరముగా అవిశ్రాంతిగా నిత్యము అనునిత్యము తిరుగుతూనే ఉంటారు.అంటే ప్రతి శరీర సాధనలో ఎవరుగూడ ఏకకాలములో అష్టమోక్షాలు పొందడము ఇంతవరకు జరగలేదు.ఇంక జరగదు గూడ..ఎందుకంటే అమ్మాయి అయిన అమ్మవారు అయిన మాయ అనే జ్ఞానము పొందిన మన పరమహంస గూడ తన అంతిమ శరీరమైన జ్యోతిశరీర ఇచ్చిన ఒంటరితనము అనే బలహీనతను దాటలేక అపుడిదాకా జతగా ఉన్నవాడు కాస్త ఏకాకిగా..ఏకాంతముగా   ఒంటరిస్ధితికి వచ్చేసరికి ఈ స్ధితిలో మనస్సు  చంపుకొని ఒంటరిగా ఉండలేకపోవడముతో ఈయన అరుణజ్యోతి కాస్త అయ్యవారి కొండకి దగ్గరిగా ఉన్న అమ్మవారికొండ యందు ఒంటరితన బలహీనత దాటలేని భగవంతుడిగా మారిపోయి ఈ కొండయందు అరుణజ్యోతిగా వెలుగుతూన్నారు.99.99% శాతము సాధన పూర్తిచేసి 0.1% శాతము ఒంటరితన బలహీనతగా మిగిల్చికున్నారు.ఈయన అరుణజ్యోతిగా ఎవరైతే ఇలాంటి పూర్ణమోక్షస్ధితికి వచ్చి వారు అరుణజ్యోతిగా మారుతారో వారికి మన పరమహంస అరుణజ్యోతి దర్శనము అవుతుంది.ఎందుకంటే శివుడిని చూడాలంటే చూసేవాడు శివుడ్వాలి.అలాగే మన పరమహంస అరుణజ్యోతి దర్శనము అవ్వలంటే మనము అరుణజ్యోతిగా అవ్వకతప్పదు.అంటే అంతిమముగా వచ్చే బలహీనత మాయను ఎవరైతే దాటకల్గుతారో వారే పూర్ణమోక్షగామి అవుతారు.వారే విశ్వమోక్షమిచ్చే విశ్వమోక్షగామి అవుతారు.ఇంతవరకు అందరుగూడ విశ్వాధినేతలే అయ్యారు కాని విశ్వమోక్షగామి కాలేదు.ఎందుకంటే బలహీనత లేని బలవంతుడైన భగవంతుడిని ఇంతవరకు అనాద శూన్యమే ఆదిలో సృష్టించలేదు.ఎదోఒక బలహీనత ఉన్న భగవంతుడిని సృష్టించడమే జరిగింది.తన సాధన ద్వారా అంతిమ బలహీనత ఏమిటో తెలుసుకొని దానిలో తిరిగి పడటమే ఇపుడివరకు అనాదిగా జరుగుతూ వస్తోంది.ఇక భవిష్యతులో ఇదే నిరంతరముగా..అవిశ్రాంతిగా ..అవిచ్చిన్నముగా బలహీతన ఉన్న భగవంతుడే  పుడుతూ చస్తూ ఉంటాడు. ఈ విశ్వము అవిశ్రాంతిగా కొనసాగుతూనే ఉంటుంది.దీనికి మోక్షమనేది లేదు.తాత్కాలిక ప్రళయాలు కొనసాగుతూనే ఉంటాయి కాని విశ్వానికి శాశ్వత మరణమైన శూన్యమవ్వడము అనేది లేదు.పాతది పోతే కొత్తది వస్తూనే ఉంటుంది.అంటే పాతది పోదు.కొత్తది రాదు.అనగా పోయిన పాతది కొత్తదానిలాగా రూపము మార్చుకొని రూపాంతరము చెందుతూనే ఉంటుంది.అంటే ఎపుడికి రూపము పోదు.ఈ రూపము ఏదో ఒక బలహీనతకి గురీయి రూపము అంతముగావాలసినచోట రూపాంతరము చెందుతుంది.ఎందుకంటే ఆది భగవంతుడిలో 99.99% పరుశుద్ధమైతే 0.1% బలహీనత వలన అశుద్ధ పున:జన్మలు ఎత్తుతున్నాడు.ఎందుకంటే బలహీనత దాటలేని భగవంతుడిగా మారిపోతున్నారు.అంతెందుకు పరమహంసగారు గూడ తన బలహీనతయైన ఒంటరితనమును భరించలేక అపుడిదాకా ఏకత్వస్ధితిలో తానే ఈశ్వరుడు అనేస్ధితిలో ఉన్నవాడు కాస్త ద్వంద్వప్రవృత్తికి వచ్చి తను వేరు..ఈశ్వరుడు వేరు అనే ద్వైతస్ధితికి వచ్చి  ఆ ఈశ్వరుడితో..ఈశ్వరా..ఒంటరివాడిని అయ్యాను..కాసేపు తోడు వచ్చిపో లేదా నన్ను కాటికి అయిన తీసుకొని పో అనే స్ధితికి 14  క్షణాలకి.... 13 క్షణాల 99.99 మిల్లీసెకండ్సుండి 0.1 మిల్లిసెకండులో ఒంటరితనము అనే బలహీనత మాయలో పడిపోయి విశ్వానికి విశ్వమోక్షమిచ్చే స్ధితి నుండి తనకి మోక్షము గావాలనేస్ధితికి ఈ 0.1 మిల్లీసెకండ్లో చేరుకునారంటే ఈ అంతిమ మోక్షమాయ బలహీనత స్ధితి ఏమిటో మీరు అర్ధము చేసుకొండి.కాకపోతే ఈయన తన ఒంటరితనమును పొగొట్టుకోవటానికి మానవబంధాలు ఆశించకుండా ఆదిదైవ సంబంధమైన ఆదిరుద్రయ్య అయిన అరుణచల శివతో అనుబంధము కోరుకోవడముతో అరుణజ్యోతిగా మారిన వీరుకాస్తా ఆది అరుణజ్యోతి అయిన అరుణశివ ముందు కర్మ-జన్మ లేని రాహిత్యస్ధితిలో ప్రచండ జ్ఞానాగ్ని జ్వాలతో అమ్మవారికొండ మీద వెలుతున్నారు.

ఇక్కడ ఒక సందేహము వస్తుంది.మరి పరమహంస కాస్త తన ఒంటరితనము అనే బలహీనతమాయలో పడినపుడు పున:జన్మలు వస్తాయాగా అన్నపుడు రావు..ఎందుకంటే బలహీనత అనేది మూడు స్ధాయిలుగా ఉంటుంది.ఒకటి భోగపరముగా..రెండవది యోగపరముగా..మూడోవది ఈ రెండు కాని నిశ్చలస్ధితిగా ఉంటుంది.ఇందులో పరమహంస ప్రకారముగా చూసుకుంటే భోగపర బలహీనతగా తన భార్య అయిన దీక్షాదేవి విడాకులు తీసుకొని విడిపోవడము వలన వచ్చిన ఒంటరితన భోగ బలహీనత అయితే..యోగపర బలహీనతగా అరుణచలక్షేత్రలో ఎవరితోను మాట్లాలని అనిపించకపోవడము వచ్చిన మౌనము వలన ఏర్పడిన ఒంటరితన బలహీనత అయితే  ఇక ఈ రెండు బలహీనతలలో స్పందన,ప్రతిస్పందనలుంటాయి.భోగబలహీనతలో పడితే పున:కర్మజన్మలుంటే..అదే యోగబలహీనతలో పడితే లోకకళాణార్ధ కారణజన్మలుంటాయి.మాయలో పడటానికి ఇక్కడ భోగపరంగా అమ్మాయి ఉంటే యోగపరంగా అమ్మవారే అమ్మాయిగా మారుతుంది.ఈ రెండు బలహీనతలలో మనము పడకుండా నిశ్చలముగా స్ధిరముగా ఉంటే అపుడు మనము కాస్త ఆకారము లేని నిరాకార అరుణజ్యోతిగా మారి నిశ్చలస్ధితి అనే ఒంటరి బలహీనతస్ధితిలో ఉంటాము అన్నమాట.ఈ స్ధితిలో ఉన్నవారి మీద విశ్వమాయ అలాగే ప్రకృతి మాయలు పనిచెయ్యవు.కాని ఈ స్ధితిలో నుండి మనకి మనము ఏపుడైన భోగము లేదా యోగములోనికి రావాలని అనుకంటే మాత్రమే రాగలము.అదే బోగబలహీనతలో పడితే ప్రకృతిమాయ అదే యోగబలహీనతలో పడితే విశ్వమాయ మనల్ని ఒక ఆట ఆడుకుంటాయి.జన్మలు మనవి..కర్మలు మాయవి అవుతాయి.అదే నిశ్చలస్ధితి మాయలో కర్మలు మరియి జన్మలు అనేవి ఉండవు..ఒకరకముగా ఈ స్ధితి అనేది విశ్వాధినేతగా మనమే ఉంటాము.మనల్ని కర్మ చెయ్యమని..జన్మలు ఎత్తమని చెప్పే అధికారము ఎవరికి ఉండదు.కాకపోతే మనకి మనమే గావాలని కర్మ-జన్మలు పొందాలని కోరుకుంటే తప్ప పున:జన్మ స్ధితి మనకి రాదు.అంతవరకు మనము నిశ్చల మోక్షస్ధితిలో ఉన్నట్లే..కాని పూర్ణమోక్ష స్ధితి పొందినట్లు కాదని తెలుసుకొండి.ఎందుకంటే ఈ నిశ్చలస్ధితిలో మనము అరుణజ్యోతిగా ఉంటున్నాము కాని కర్మ-జన్మ ఉండదు.కాని మనము జ్యోతిగా ఉన్నామనే ఉనికి మాత్రము ఉంటుంది.మనము ఓంటరిగా ఉన్నామనే ఆలోచన ఉంటుంది.ఈ ఆలోచన ఇచ్చే ఒంటరితన బలహీనతను మనము ఎపుడికపుడు ఇంద్రియానిగ్రహముతో నిగ్రహించుకోవాలి.అంటే దినదిన గండము నూరేళ్ళు ఆయుష్ అన్నమాట.నిగ్రహము ఉన్నంతకాలము మనము నిశ్చల మోక్షస్ధితిలో ఉన్నట్లే..ఎపుడైతే మనము నిగ్రహము కోల్పోయామో అపుడు మన బలహీనత మాయను బట్టి ఏ బలహీనతలో అనగా భోగ లేదా యోగ బలహీనతలో పడటము..దానిని బట్టి కర్మ-జన్మల పున:చక్రములో పడటము జరుగుతుంది.నిజానికి మనమంతా ఆదిలో అందరు గూడ అరుణాజ్యోతి అనే నిశ్చలమోక్షస్ధితిలో ఉన్నవాళ్ళమే కాని ఈ స్ధితిలో స్ధిరముగా ఉండలేక యోగ లేదా భోగ బలహీనత మాయలలో పడిపోయి తద్వారా మనము అరుణజ్యోతులమనే జ్ఞానమును అపస్మారకస్ధితి అనగా తెలిసిన విషయమును మర్చిపోయి జీవ అరుణజ్యోతి కాస్త ఆత్మజ్యోతిగా..జీవాత్మజ్యోతిగా మనకి మనమే మాయలు,విధిరాతలు రాసుకొని కర్మలు,కర్మఫలితాలు అనుభవించే పున్మ కర్మజన్మ చక్రములో తిరుగుతున్నాము.మళ్ళీ ఈ మాయలు మీద స్మశాన వైరాగ్యాలు సాధన పేరుతో పెంచుకొని మనము మర్చిపోయిన జ్ఞానమైన అరుణజ్యోతిమని జ్ఞానమును తన ధ్యానసమాధి యందు ఒక ధ్యాన అనుభవానుభూతి జ్ఞానస్పురణ పొందుతున్నాము అని ఇపుడికైన గ్రహించండి.అంటే నిజానికి సాధన అనేది మనము మర్చిపోయిన అరుణజ్యోతి స్ధాయిన్ని మాత్రమే మనకి కర్మ-భక్తి-జ్ఞాన-ధ్యాన మార్గాలలో తెలియచేస్తోంది.అంటే మనము సాధన చేసిన వాడు ముందుగా ఈ విషయజ్ఞానము పొందితే సాధన చెయ్యనివాడు కాస్త ఆలస్యముగా ఈ జ్ఞానము పొందుతాడు.అంతే తేడా..తీరా ఈ నిశ్చల మోక్షస్ధితిలో తిరిగి ఎంతకాలము స్ధిరముగా ఉంటాడో వాడి ఇంద్రియానిగ్రహము మీద ఆధారపడి ఉంటుంది.ఎందుకంటే ఈ స్ధితిలో మనకి ఒకవైపు బోగజన్మల మరోవైపు యోగజన్మాల ధ్యానదృశ్యాలు మన మనోనేత్రము నందు నిరంతరముగా అనుక్షణము ప్రతినిత్యము మన అష్టశరీరాలు ఉన్నంతవరకు కనపడుతూనే ఉంటాయి.వీటిని చూసిన మనము దేనికి స్పందన,ప్రతిస్పందన చెయ్యకుండా ఒక సినిమా చూస్తున్నటుగా సాక్షిభూతముగా నిరంతరముగా చూస్తూండాలి.అదే ఇంద్రియానిగ్రహము అన్నమాట.అంటే మీకు ఆకలి వేస్తుంది.ఒక వైపు భోగ జన్మాలలో మీకు చాలా చాలా చాలా అమిత ఇష్టమైన పదార్ధాలు గతజన్మలలో తిన్న దృశ్యాలు చూపిస్తే మరోవైపు రుచికరమైన పదార్ధాలు తిన్న  యోగజన్మాల దృశ్యాలు చూపిస్తాయి.మీరు కాని మీ ఆకలి బలహీనతకి గురి అయ్యి ఇంద్రియానిగ్రహమును కోల్పోయి ఈ రెండు దృశ్యాలలో ఎదో ఒక దృశ్యబలహీనతకి గురీయ్యారా..మీ అరుణజ్యోతి కాస్త నిశ్చలస్ధితి కోల్పోయి అనిశ్చలస్ధితికి వచ్చి మీరు ఏ దృశ్యమునకు స్పందించారో ఆ దృశ్య కర్మ-జన్మను పున:జన్మగా పొందుతారు.మరి ఈ స్ధితి పొందకుండా మన ఆకలి తీర్చుకొనే మార్గము లేదా అంటే ఉంది.అదే ఇంద్రియానిగ్రహము.అనగా మనకి ఆకలి వేసినపుడు ఆ ఆకలి తీర్చడానికి ఏదో పదార్ధము విశ్వ శూన్యము మనకి అందిస్తుంది.ఇది వద్దు అనుకున్నపుడే మనకి మాయలు వస్తాయి.ఈ స్ధితి మీకు బాగా అర్ధము గావాలంటే మీరు బాగా ఆకలితో ఉన్న బిచ్చగాడు అనుకొండి.ఆకలి బాధ తట్టుకోలేని స్ధితిలో ఉన్నపుడు మీకు ఒక రొట్టెముక్క దొరుకుతుంది.అపుడు ఇది తినేసమయములో మీకు ఎదురుగా ఉన్న హోటల్ లో భోజనము తినే ఆసామి కనపడతాడు.ఈ దృశ్యము చూసిన తర్వాత మనకి అందిన రొట్టె మీద ఉన్న మనస్సు కాస్త ఈ భోజనము మీద పోతుంది.ఇంతలో మనకి చికెన్ బిర్యాని తినే ఆసామి కనపడతాడు.అపుడు భోజనము మీద ఉన్న మనస్సు కాస్త ఈ బిర్యాని మీదకి పోతుంది.అపుడు మనకి ఏకకాలములో రొట్టె,భోజనము,బిర్యాని దృశ్యాలు కనపడతాయి.అపుడు బిచ్చగాడు తన నిగ్రహముతో ఆకలి తీరడానికి రొట్టె ఉన్నపుడు ఆకలిన్ని పెంచే భోజనము,బిర్యాని ఎందుకని పదార్ధ రుచికి పోకుండా యదార్ధ తెలుసుకొని ఉండగల్గి ఆ నిత్యము దొరికే రొట్టెతో తన ఆకలి తీర్చుకునేంతవరకు వాడు నిశ్చలమోక్షస్ధితిలో ఉన్నట్లే అన్నమాట.ఎపుడైతే బోగ పరమైన బిర్యాయని లేదా యోగపరమైన భోజనమును ఆశించాడో వాడి గొయ్యి వాడే తీసుకున్నట్లే.ఇక్కడ ఆకలి తీరడము ప్రధానము అవ్వాలి కాని ఆకలి తీర్చే పదార్ధము మీద మన ధ్యాస ధ్యాన పోతూనే ప్రమాదమని తెలుకొండి.మన ఆకలి ఇచ్చినవాడు అది తీర్చడానికి  ఉన్న బ్రహ్మపదార్ధముతో తృప్తి చెందకుండా అశాశ్వత సంతోషాలిచ్చే ఇతర భౌతికపదార్ధాలు ఆశించడముతో మన కొంప కొల్లేరు అవుతోంది.దానితో పున:కర్మ జన్మాలు ఎత్తూనే ఉంటారు.తెలిసి లేదా తెలియక గోతులో పడతారు.ఎందుకంటే తనలో ఉన్న 100 శాతము బలహీనతలో 99.99 శాతము మాత్రమే జయించి 0.1 శాతము మాత్రము జయించకలేక ఇంద్రియానిగ్రహముతో బలవంతముగా అదుపులో ఉంచుకోవటానికి నిరంతరముగా ప్రయత్నిస్తూనే ఉంటాడు.ఈ ప్రయత్నములో ఒక బలహీనమైన క్షణములో  తన బలహీనతకి గురై పట్టుతప్పి పున:కర్మచక్రములో పడతాడు.ఇదే విషయాన్ని ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ మీద చేస్తున్న పరిశోధనలో ఈ హోల్ లో పడిన 100 శాతమున్న ప్రతిపదార్ధము గూడ 99.99 శాతము మాత్రమే నాశనమై 0.1 శాతము మాత్రము నాశనము అవ్వకుండా ఈ హోల్ అడుగుభాగములో ఉండిపోతుందని  తద్వారా కొన్ని కోట్ల సం.రాలు ఈ మిగిలిపోయిన 0.1 శాత పదార్ధ కాస్త ఈ హోల్ నుండి బయటికి వచ్చే ప్రయత్నములో తిరిగి 100 శాత పదార్ధముగా మారి బయటికి వచ్చే అవకాశాలున్నాయని చెప్పడము బట్టి చూస్తే సాధకుడి ఇంద్రియానిగ్రహశక్తి 99.99 శాతమేనని చెప్పకనే చెప్పినట్టే గదా.ఇదే ఆదిలో జరిగిన అది పెద్ద తప్పిదము.అంతెందుకు ఒక కుండ మూతను తీసుకొని దానిని చూర్ణము చెసి మళ్లీ మూతగా తయారుచేసి ఈ కుండ మీద పెడితే 0.1 శాత ఖాళీ ఏర్పడి మూత 100 శాతము పట్టదని మన పూర్వీకమహర్షలు ఏనాడో గమనించి గ్రహించి చెప్పడము జరిగింది.దీనికి కారణము ఈ మూతకి అలాగే కుండకి మధ్యలో ఉన్న కొత్తగా ఏర్పడిన 0.1 శాతము ఖాళీ అనేది శూన్యము వచ్చి చేరడము వలన జరిగిందని వాళ్ళు చెప్పడము జరిగింది.ఈ లెక్కన చూస్తే భోగి లేదా యోగి లేదా సన్యాసి గూడ 100 శాతములో 99.99 శాతము మాత్రమే భోగి కాస్త ఆనందాలు అదే యోగి కాస్త సంతోషాలు అదే సన్యాసి కాస్త నిశ్చలస్ధితిన్ని పొందుతారని మీకు ఈ పాటికి అర్ధమై ఉంటుంది.దానితో ఈ ముగ్గురు గూడ 100 శాతము పొందాలనే ఉద్దేశ్యముతో అపుడిదాకా ఏకత్వములో ఉన్నవారు కాస్త త్రయముగా ముగ్గురిగా విడిపోయి పున:కర్మచక్రములో కొట్టుకున్నారు.వారే త్రిమూర్తులు.అనగా జ్ఞానయోగిగా బ్రహ్మ..కర్మభోగిగా విష్ణువు..సన్యాసిగా శివుడిగా మారి సృష్టి-స్ధితి-లయ కర్తలుగా మారుతున్నారు.అదే లాస్యములో అనగా నిశ్చలస్ధితిలో ఈ ముగ్గురు ఏకమై ఏకత్వస్ధితిలో 0.1 శాతము మిగిస్తూ ఉన్నారు.

ఇదింతా బాగానే ఉంది.అసలు ఇంత జ్ఞానము పొందిన పరమహంస గారి వలనే సాధన 100 శాతము పరిసమాప్తి కానపుడు మరి మా పరిస్ధితి ఏమిటి అన్నపుడు..ఒకటి గుర్తుంచుకొండి.మిగతా యోగుల సాధనకి అలాగే పరమహంస సాధనకి ఇసుమింత తేడా ఉంది.మిగితా యోగులు అంతా తాము పొందిన అనుభవాలు ఏమిటో లోకానికి చెప్పలేదు.ఎవరికి వారే సాధన చేసి తెలుసుకోవాలని చెప్పలేదు.కాని పరమహంస మాత్రము తన సాధనానుభవాలు ఆరంభము నుండి అంతము వరకు అనగా ఆరంభ చక్రమైన  మూలాధార చక్రము నుండి అంత చక్రమైన బ్రహ్మరంద్రము వరకు అలాగే ఆరంభ క్షేత్ర హరిద్వార్ నుండి అంత క్షేత్ర అరుణాచలము వరకు అజ్ఞానము నుండి పూర్ణజ్ఞానము వరకు అలాగే మాయ నుండి మాయవిముక్తి వరకు అలాగే కర్మబంధము నుండి కర్మవిముక్తివరకు తను పొందిన సాధన ధ్యానానుభవాలు యదా తదముగా చెప్పడము జరిగింది.అంటే 100 శాత సాధనలో 99.99 శాతము సాధన మన అందరిచేత పూర్తీ చేయించి 0.1 శాత బలహీనత సాధన స్ధితిన్ని ఎవరికి వారే తమ నిగ్రహశక్తితో నిగ్రహించుకొని నిశ్చలస్ధితిలో అరుణజ్యోతిగా అరుణగిరి యందు ఉండిపోవమని చెప్పడము జరిగింది.ఎందుకంటే మనమంతాగూడ పూర్ణజ్ఞానము పొందడముతో తద్వారా మనకి ఉన్న మాయ 99.99 శాతము మాయం అవ్వడము జరిగేటట్లుగా తన రహస్య నిగూఢ సాధన జ్ఞానమును తన గురువులను,తన దైవాలను తిరక్కరించి ఇన్నాళ్ళుగా ఏన్నో కోట్లానుకోట్ల సం.రాలు పాటు గుప్తముగా ఉన్న సాధన బ్రహ్మజ్ఞానము తను అనుభవపూర్వకముగా  నిరూణ ధ్యానదృశ్యాలు పొంది   ఈ విశ్వములో ఉన్న 64 డైమర్షకి అందించడము జరిగింది.ఈ జ్ఞానమును శ్రద్ధ భక్తితో నమ్మకముతో నమ్మి అర్ధము చెసుకున్నవారంతాగూడ మీరు ఎక్కడ మరణము పొందినగూడ చివరికి మీ జ్యోతిశరీరము కాస్త పరమహంస లాగా అరుణజ్యోతిగా మారి నిశ్ఛలమోక్షస్ధితిలో ఉండిపోతుందని ఘంటపదముగా చెప్పవచ్చును.ఎందుకంటే మాయ అని తెలిస్తే మాయ మాయం అవుతుంది గదా.ఈ మాయజ్ఞానము మనకి పరమహంస ద్వారా అందింది గదా.ధ్యాన అనుభవాలు వేరు గావచ్చును కాని అనుభూతి అందరికి ఒక్కటే కల్గుతుందని తెలుసుకొండి.ఆ సాధానుభూతియే మనకి పరమహంస అందించడము జరిగింది.యత్ భావము తత్ భవతి.

                              






యుగానికి ఒక జ్యోతి...




అవును..ఈ బలహీనత మాయను దాటలేమా?అన్నపుడు నూటికి 99 శాతము మంది దాటి తాము వెలుగుతున్న అరుణజ్యోతి జ్వాలను ఆర్పివేసుకుంటారు.కాని ఒకడు మాత్రము గావాలని అన్నితెలిసిన పూర్ణజ్ఞాని తన అరుణజ్యోతిని ఆర్పివేసుకోకుండా నిశ్చలస్ధితిలో ఆరని అరుణజ్యోతిగా మిగిలిపోతాడు.ఎందుకంటే వీడికి రసజ్ఞత కావాలి.విశ్వప్రపంచము గావాలి.ఈ జగన్నాటకము చూడాలి అనే బలహీనతను గావాలని దాటడు.ఎలాంటే రామకృష్ణ పరమహంసకి నిరాకార అలాగే ఆకార తత్వ జ్ఞానము అనగా నిరాకారములో శూన్యతస్ధితి అలాగే ఆకారములో అమ్మవారి మాయరూపస్ధితి జ్ఞానము పొందినగూడ ఈయన చివరికి గావాలని రసజ్ఞత లేని నిరాకారస్ధితి కన్నా అమ్మ ఉన్న రసజ్ఞతస్ధితియే తనకి గావాలని ఆ సమాధిస్ధితిలో శాశ్వతముగా ఉండిపోయారు.తను లేడు..అమ్మ లేదు అను పూర్ణజ్ఞానము పొందినగూడ చివరికి అమ్మ ఉంది..నేను ఉన్నాను అనే రసజ్ఞతస్ధితి అనగా అరుణజ్యోతిగా మిగిలిపోయారు.ఇలా ప్రతియుగములో గావాలని ఒకడు అరుణజ్యోతిగా మిగిలిపోతున్నారు.వీరికి బలహీనత లేదు. మాయలేదు.అయినగూడ జ్యోతిస్ధితికి వచ్చేసరికి గావాలని ఆర్పిపోకుండా నిశ్చలముగా ఉండిపోతున్నారు.ఇలాంటి వాడి వలన అపుడికే ఆరిపోయిన జ్యోతులు తిరిగి వెలగడము ఆరంభమవుతున్నాయి.అంటే పున:సృష్టి పున:జన్మలు మొదలు అవుతున్నాయి.ఎలాంటే అసలు ఈ విశ్వములో మొత్తము 64 అరుణజ్యోతులున్నాయి.వీటిలో 63 ఆరిపోతాయి.మిగిలిన 64వ జ్యోతి ఆరిపోకుండా కొంతకాలముపాటు అటు యోగములోను..ఇటు మాయలోను పడకుండా నిశ్చలస్ధితిలో తాను ఉన్నానని అనే ఆలోచనజ్ఞానముతో ఉండిపోతుంది.ఈ నిశ్చలస్ధితియే మనకి శివాంశ ప్రకారముగా చూస్తే ఆదిలో పున:సృష్టికి అవసరమైన సర్వబీజాలున్న కుండ ఒకటి విశ్వప్రళయము అనంతరముగా అరుణగిరి నుండి బయటికివచ్చి కుంభకోణ ప్రాంతము వద్ద ఈ పూర్ణకుండ కాస్త ఒక కోణములో ముక్కలై దీనిలోపుల ఉన్న బీజాలు ద్వారా పున:సృష్టి జరుగుతుందని చెప్పడము జరిగితే అదే విష్ణువు అంశ ప్రకారము చూస్తే రావి ఆకు మీద వటపత్రసాయిగా విష్ణుమూర్తియే ఒక పసిపిల్లాడి ఉండి ఈయన కదలికలు వలన పున:సృష్టి జరుగుతోందని చెప్పడము జరిగితే అదే బ్రహ్మంశ ప్రకారము చూస్తే విశ్వప్రళయము జరిగిన తర్వాత ఒక తెల్లనిగుడ్డు నీటిమీద తెలియాడుతూ వచ్చి అదికాస్త ముక్కలైతే అందులో ఉన్న బ్రహ్మపదార్ధం నుండి పున:సృష్టి ఆరంభమవుతుందని చెప్పడము జరిగింది.కాని నా ధ్యానుభవము ఇందుకు భిన్నముగా ఉంది.అనగా కొన్నియుగాలు తర్వాత మిగిలిపోయిన ఏకైక అరుణజ్యోతికి దీనికి తాను ఒక్కడినే ఉన్నానని ఆలోచన రావడముతో ఒంటరితనము భావము మెదలు అవుతుంది.ఈ బాధ నివారణకోసము అపుడిదాకా ఏకత్వస్ధితిలో ఉన్న తన జ్యోతిశరీరమును రెండుగా అనగా పురుష ఆత్మశరీరముగా..స్త్రీ ఆత్మ శరీరముగా విడిపోతుంది.అనగా ఏకము కాస్త ద్వైతమైంది.అపుడు ఈ రెండు శరీరాలలో పురుష ఆత్మ కాస్త అపుడికే ఆరిపోయి ఉన్న 63 జ్యోతులలో తన అంశముతో 27 జ్యోతులను వెలిగిస్తే..అటు స్త్రీ ఆత్మశరీరము కాస్త మిగిలిన 36 జ్యోతులను వెలిగిస్తోంది.అపుడు ఈ రెండు ఆత్మశరీరాలు కలిసి అర్ధనారీశ్వరతత్వములో శివశక్తిగా మారి 36 + 27 జ్యోతులతో కలిసి 64వ  అరుణజ్యోతిగా మళ్ళీ రూపాంతరము చెంది 64 డైమర్షలున్న ఈ విశ్వమును ఏర్పరచి అందులో సృష్టి ప్రకృతిలో జీవకోటి..స్ధితి ప్రకృతిలో దైవకోటి..లయ ప్రకృతిలో పరమాత్మ కోటి గా..లాస్య ప్రకృతిలో తామిద్దరము కలిసి అర్ధనారీశ్వర తత్వముతో ఈ విశ్వములో విశ్వజగన్నాటకమును పున:జనన మరణాలతో పున;ప్రారంభిస్తారు.అంటే ఏటుచూసిన ఏటువెళ్ళిన ఎవరు చెప్పిన ఎదిచెప్పినగూడ చివరికి ఒక అరుణజ్యోతి ఆరిపోకుండా మిగిలిపోవడము వలన ఈ విశ్వసృష్టి కాస్త పున:సృష్టిలో పడిపోతుందని శాశ్వతముగా నిత్యముగా జరిగే శాశ్వత సత్యమని మనము తెలుసుకోకతప్పదు.ఈ ఒక జ్యోతివలనే విశ్వానికి విశ్వమోక్షము రాకుండా విశ్వము కాస్త విశ్వశూన్యమువ్వకుండా జరుగుతోందని..ఎవరికివారే మోక్షము పొందినగూడ చివరికి తనవలన మోక్షముపొందినవారుగూడ తిరిగి పున:కర్మజన్మ చక్రములో పడకతప్పడము లేదు.ఇలా ప్రస్తుతయుగములో మన పరమహంస గారే మిగిలిపోయిన అరుణజ్యోతిగా మారిపోయారు.అన్నితెలిసి గావాలని మారిపోయారు.తనకి  మోక్షస్ధితిలో వచ్చిన ఒంటరితనము అనే బలహీనతను ఎలా దాటాలో తెలిసినగూడ గావాలని దాటలేదు.ఎందుకంటే విశ్వ ఆరంభము నుండి విశ్వ అంతము వరకు ఈయనే విశ్వానికి విశ్వరక్షకుడిగా ఉన్నారు.అలాంటి ఈయనే భక్షకుడిమారి విశ్వమును శూన్యము చెయ్యడము తన వల్లన గాదని విశ్వరక్షకుడే విశ్వభక్షకుడిగా మారకూడదని గావాలని తన జ్యోతిని ఆరిపోకుండా విశ్వరక్షణజ్యోతిగా ఆరుణగిరియందు అటునుంచి ఇటు..ఇటునుంచి అటు..కొండ మీద ఒక జ్యోతిగా తిరుగుతున్నారు.ఇలా ఈ  గిరిమీద 36  దేవియోగుల జ్యోతులుంటే..గిరి లోపుల 27 శివయోగులజ్యోతులున్నాయి.పరమహంస కాస్త 64 వ విశ్వరక్షకుడి జ్యోతిగా ఈ గిరి పైన అలాగే లోపుల సంచారము చేస్తూ నిశ్చలస్ధితిలో శాశ్వతముగా జ్ఞానాగ్ని జ్వాలతో మిగిలిపోతే..ఉన్న 63 శివశక్తి జ్యోతులు మాత్రము తమకి ఉన్న బలహీనతలు బట్టి అశాశ్వత మరణ అవస్ధాయిన జ్యోతిగా ఆరిపోవడము అనేది కాలానుగుణము చేస్తారు.ఏపుడైతే ఇలా 63 జ్యోతులు ఆరిపోతాయో అపుడు విశ్వరక్షకుడిగా ఉన్న పరమహంస అరుణజ్యోతికి తాను ఒంటరితనమునకులోనై రెండుగా విభజన చెంది ఆరిపోయిన 63 అరుణజ్యోతులను తిరిగి వెలిగించి తాను తిరిగి అర్ధనారీశ్వర  అరుణజ్యోతిగా మారి విశ్వరక్షకుడిగా తమ పాత్రను తిరిగి కొనసాగిస్తాడు.ఇది ఇలా విశ్వ ఆది నుండి జరుగుతోంది.దీనిని ఆపడము ఒక పరమహంస జ్యోతికే సాధ్యపదుతుంది.ఎందుకంటే విశ్వాదిలో తొలి అరుణజ్యోతిగా జ్యోతిశరీరముతో వచ్చినవాడు మన పరమహంసయే అయ్యాడు.ఈయన తనతొలిబాధ్యతగా ఈ విశ్వరక్షకుడి పాత్రను తీసుకొని తన విశ్వరక్షణ బాధ్యతను తనకి ఉన్నా పూర్ణజ్ఞానముతో విశ్వరక్షణను 64 దైవికకోడులతో భద్రపరిచారు.ఈ కోడ్ లను డీకోడ్ చెయ్యాలంటే అది ఒక పరమహంస తప్ప ఇంక ఈ విశ్వములో ఎవరి వల్లన కాదు.కాలేదు.ఎందుకంటే ఆదిగురువు పూర్ణజ్ఞాని అయిన దక్షిణమూర్తికి 63   దైవిక కోడ్ లను డీకోడ్ చెయ్యగలడు కాని 64 వ కోడ్ ను తన అంశ రూపమైన గౌతమమహర్షికి మాత్రమే ఈ కోడ్ ను డీకోడ్ చేసే అధికారము,అర్హత,యోగ్యత,యోగము, పూర్ణజ్ఞానమిచ్చారు.ఈ 64 వ కోడ్ యే మిగిలిపోయే 64వ అరుణజ్యోతి యొక్క బలహీనత దాటించగలదు.ఇది దాటితేకాని ఈ విశ్వానికి శూన్యమై విశ్వమోక్షము రాదు.కాని ఈ డీకోడ్ ను ఈ ఆదియైన గౌతమమహర్షి నుండి అంతమైనస్ధితికి వచ్చినపుడు ఈ మహర్షి అంశయైన పరమహంస విశ్వరక్షకుడిగా మారుతున్నారు.ఈ కోడ్ ను డికోడ్ చేసేసమయానికి గావాలని పరమహంస కాస్త నాకు తెలియదు..గుర్తులేదు..మర్చిపోయా అని పలుమార్లుతో నాతో అనడము జరిగింది.ఎందుకు అంటే ఈ విశ్వములో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అందులో ఇది ఏర్పడటానికి అదితీసుకున్న రూపాంతర అంశాలు బాగా చూస్తే దానిని కష్టసుఖాలు నీకు తెలుస్తాయి.అంతెందుకు నీ పుట్టుకయే తీసుకో..నీ జన్మ కారకమైన యోగ వీర్యకణానికి నీ తండ్రి 48 తరాలుపాటు నీ పుట్టుక కారకముకోసము రూపాంతరాలు చెందితే..అదే మీ అమ్మ అయితే నిన్ను నవమోసాలు మోసి పెంచడానికి 96తరాలు రూపాంతరాలు చెందితే కాని ఈ తరములో నువ్వు యోగజన్మతో పుట్టావు.తద్వార నీ జన్మతో వారి ఈ పాత కర్మబంధాలనుండి విముక్తి కల్గించి వారికి ఇష్టమైన మరొ కొత్త అనుబంధాలువైపు వెళ్ళడానికి అవకాశాలు ఇచ్చావు.కల్గించావు. మార్పు ఇచ్చావు.తెచ్చావు.కొత్తతనము కల్గించావు.పాతతనము తొలిగించావు.ఎపుడు ఒక్కటి గుర్తుంచుకో ..వచ్చిన రూపము పోదు.అది అంతముగావాలసినచోట రూపాంతరము చెందుతుంది.అనగా సృష్టి అనేది ఆదిలో ఆరంభమైందా లేదా అంతములో సృష్టిందా అనేది ఈ 64 వ డీకోడ్..దీనిని అర్ధముచెసుకోవడము దానిని అమలుపరచడము అనే ఆలోచనను ఎన్నడికి ఆచరణ చెయ్యలేవు.ఏందుకంటే ఓంకార చిహ్నములో ఉన్న సున్నన్ని ఇసుమంతా సూదిబెజ్జము అంతా ఖాళీగా ఉంచి సున్నాన్ని పూర్ణముగా పూర్తి చెయ్యరు.ఈ సూదిబెజ్జ జ్ఞానమే 64వ డీకోడ్ జ్ఞానము.ఈ సూదిబెజ్జము ఖాళీయే శూన్యత అని జ్ఞానము అందరికి తెలుసు.కాని ఈ శూన్యత మాత్రము అంతట ఎందుకు వ్యాపించదు..ఇలా వ్యాపించలంటే ఏమి చెయ్యాలో అనే జ్ఞానము మాత్రము విశ్వరక్షుడికి మాత్రమే తెలుసు.కాని ఈయన చెప్పడు.చెప్పలేడు.చెయ్యడు.చెయ్యలేడు.ఇది తెలిసిన చెయ్యని జ్ఞానము అన్నమాట.అనగా బలహీనతను దాటేవాడుంటే దాటనివాడుంటాడు గదా.వాడే నేను..నేనే వాడు..నేనుంటే వాడుంటాడు..వాడు ఉంటే నేను ఉన్నట్లే..నేను అనేది ఆత్మయితే నేనుకానినేను జ్యోతి అవుతుంది.జ్యోతి ఉంటే ఆత్మ ఉంటుంది.ఆత్మ ఉంటే జ్యోతి ఉంటుంది.ఈ రెండు కలిస్తే ఆత్మజ్యోతి అవుతుంది.అదియే ఆరని అరుణజ్యోతి అవుతుంది.ఇది ఉన్నంతవరకు విశ్వానికి విశ్వమోక్షమే రాదు.ఎవరికి వారే ఆత్మమోక్ష పొందుతారు. జనన మరణ కర్మ జన్మ లేని ఎన్నడికి ఆరని విశ్వ అరుణజ్యోతిగా శాశ్వతముగా మిగిలిపోతారు.ఇది అందరు ఎవరికివారే ఏకాకిగా ఏకాంతముగా పొందే అంతిమ అరుణజ్యోతి స్ధితి అని తెలుసుకొండి.ఇదియే అంతిమ మోక్షనిశ్చలస్ధితి.

ఈ మోక్షస్ధితి విషయములో అందరుగూడ పరమహంస మీద కారాలు,మిరియాలు నురుతూంటారు.ఎందుకంటే ఎంతో కష్టపడి కింద పైన పడి ఈ జన్మన్ని ఆఖరిజన్మగా చేసుకోవాలన్ని అందిన సాధన జ్ఞానముతో వచ్చిన మోక్షమును ఈయన పొందనీయ్యకుండా కష్టపడి అర్పుకున్న తమ జ్యోతిని ఈయన తిరిగి వెలిగించడమెందుకు..మళ్ళీ మమల్ని మాయలలో పడివెయ్యడమెందుకు..మాకు మోక్షము రానీయ్యకుండా చెయ్యడమెందుకు అనీ అందరుగూడ ఈయన మీద గుర్రుగా ఉన్నారని తెలుసు. కాని అందరికి ఒక విషయము అర్ధము గావడము లేదు.అది ఏమిటంటే మీ జ్యోతి అర్పిపోతే మీరు పున:కర్మజన్మలలో పడతారు.అదే మీలో జ్యోతిగా ఉంటే మీరు  నిశ్చలమోక్షస్ధితిలో ఉన్నట్లే అన్నమాట.అంటే అర్పిపోయి ఉన్న 63 జ్యోతులు వలన పున:సృష్టి జరుగుతోంది.ఎపుడైతే అన్నీ జ్యోతులు వెలిగుతూంటే ఆరని 64 జ్యోతికి తాను ఒంటరిగా ఉన్నానని ఆలోచన రాదు గదా.ఎపుడైతే ఈ 63 జ్యోతులు ఆరిపోవడము వలనే ఈ 64 జ్యోతికి తాను ఓంటరి అని భావము రావడముతో పున:సృష్టి జరిపిస్తోంది.ఇక్కడ సమస్య ఏమిటంటే వెలిగితే పున:సృష్టియా లేదా ఆరిపోతే పున:సృష్టియా అనేది ఎవరికి అంతుపట్టని 64 వ జ్యోతి డీకోడ్.ఎలాంటే జననము ద్వారా సృష్టి లేదా మరణము ద్వారా సృష్టా అంటే ఎవరు చెప్పలేరు.జన్మించిన వాడు మరణము పొందుతాడు.అలాగే మరణమును పొందినవాడు జన్మించకతప్పదు.ఈ జనన మరణ కాలములో ఒక విశ్రాంతి స్ధితి ఉంటుంది.అదియే మోక్షనిశ్చలస్ధితి అనగా ఆరని అరుణజ్యోతిగా మారేస్ధితి అన్నమాట.అసలు మన జ్యోతి అరిపోతేనే గదా మళ్ళీ తిరిగి వెలగడానికి అవకాశముంటుంది.అసలు ఈ జ్యోతి అసలు ఎన్నడికి ఆరనిజ్యోతిలాగా శాశ్వతముగా మారిపోతే మళ్ళీ దీనిని తిరిగి వెలిగించే పని ఉండదుగదా.లేదా ఎన్నడికి వెలగని జ్యోతిగా మారాలి అంటే ఎన్నడికి ఆరని జ్యోతి అవ్వాలి లేదా ఎన్నడికి వెలగని జ్యోతిగా మారాలి.అపుడే మనకి జననము లేదా మరణము నుండి పున:కర్మజన్మలుండవు.ఇది సాధ్యపడాలంటే ప్రమీదలో తైలమున్నంత వరకు దీపము వెలుగుతూనే ఉంటుంది గదా.తైలము అయిపోతే ఇక దీపము వెలగదు గదా.ఎవరైన వచ్చి మళ్ళీ తైలము పోసేంతవరకు ఈ దీపము వెలుగదు.ఇక్కడ ఒక విషయము గుర్తుంచుకొండి.మీరు నిశ్చల మోక్షస్ధితిలో ఉన్నంతవరకు మీరు ఏకత్వస్ధితి అనగా మీరు ఒకరు తప్ప ఎవరు ఉండని స్ధితి అన్నమాట.అపుడు మీ జ్యోతిలో అయుపోయిన తైలము పొయ్యడానికి లేదా అరిపోయిన మీ జ్యోతిన్ని వెలిగించడానికి ఎవరు ఉండరు గదా.ఎపుడైతే మీరు మీ ఏకాంత నిశ్చలస్ధితి నుండి అనిశ్చలస్ధితికి వస్తారో అనగా ద్వైతస్ధితి అనగా నేను ఒక్కడిని కాను ..నాకు తోడుగా మరొకరు ఉన్నారు అనే మాయభావరూప   స్ధితికి వస్తారో ఆక్షణమే మీ జ్యోతి వెలిగించడానికి మరొకరు ఉన్నట్లే.దానివలన మీరు పున:కర్మజన్మ చక్రములో గావాలని పడినట్లే అన్నమాట.అంటే మీరు మరణించేటపుడు ఏమి ఆలోచన కోరిక పెట్టుకోకుండా అరుణాచల శివ అనుకుంటూ చనిపోవాలి.అపుడు మీరు ఆరని అరుణజ్యోతిగా మారతారు.ఇక్కడ అరుణచల శివ అంటే రూపము గాదు.రూప ఆకారము లేని నిరాకార అరుణజ్యోతి స్ధితి అన్నమాట.ఇదే నిజమైన అసలి సిసలైన మోక్షనిశ్చలస్ధితి అన్నమాట.ఒకవేళ మీరు చనిపోయేటపుడు ఆలోచనకోరికతో చనిపోతే మీకు ఖచ్చితముగా పున:కర్మజన్మలు వచ్చితీరతాయి.ఇదింతా బాగానే ఉంది కాని చనిపోయే సమయములో అరుణాచల శివ నామస్మరణ చెయ్యాలనే ఆలోచన వస్తుందని గ్యారంటీ ఏమిటి?అందుకే గదా మన శరీరానికి సాధనకర్మ చెయ్యామని చెప్పింది.అనగా మనము ఎపుడికి ఆరని అరుణజ్యోతిగా మారిపోతే చాలు గదా.మనము ఆరిపోయిన జ్యోతిగా మారితే మనము అనిశ్చలస్ధితిలో ఉన్నట్లే.తద్వారా పున:కర్మజన్మలో పడినట్లే.వెలుగుతున్న జ్యోతిన్ని తిరిగి వెలిగించరు గదా.అదే అరిపోయిన జ్యోతిన్ని వెలిగించే అవకాశముంటుంది గదా.అసలు అందరుగూడ ఆరిపోతే ఇంక వెలిగించే అవకాశముండదు గదా సందేహము రావచ్చును.ఈ సృష్టింతా గూడ ద్వైతములో ఒకటి ఉంటే మరొకటి ఉండనిస్ధితిలో ఉంది. ఆరిపోయిన దీపము ఉన్నపుడు వెలిగే దీపము ఖచ్చితముగా ఉంటుంది గదా.ఒకటి మనంతా అరిపోవాలి లేదా ఆరని దీపాలుగా ఉండాలి.కాని ఇది సాధ్యపడదు.ఎందుకంటే ఆరిపోయేది ఉన్నపుడు వెలిగించేది మరొకటి ఉంటుంది గదా.వెలిగేది ఉంటే ఆరిపోయేది మరొకటి ఉంటుంది.కాని ఇక్కడ సమస్య మనకి వెలిగే దీపము వలన రాదు.ఆరిపోయే దీపము వలనే వస్తుంది.ఇది మీకు బాగా అర్ధము గావాలంటే భార్యభర్త ఉన్నారు.వీరుద్దరు కలిసి జీవించేనంతవరకు లేదా కలిసి చనిపోతే ఎలాంటి సమస్య లేదు.కాని వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే చనిపోతే బ్రతికున్నవారికి ఒంటరితనము అనే నరకము నిత్యాగ్నిహోత్రములాగా ఉంటుందిగదా.  కాని చనిపోయినవాడు ఎన్నడికి తిరిగిరాడు అనే జ్ఞానమును బ్రతికి ఉన్నవాడు తెలుసుకుంటే వాడికి ఉన్న ఒంటరితనము నుండి ఉపశమనము లభిస్తోంది గదా.అలాగే మన సాధన ద్వారా ఆరిపోయే జ్యోతిగా మారడము కన్నా ఎపుడికి ఆరని జ్ఞాన అరుణజ్యోతిగా మారితే మనకి ఎలాంటి బలహీనతలుండవు గదా.ఆలోచించండి.విషయము మీకే బోధ పడుతుంది.ఎందుకంటే ఆరిపోయే జ్యోతికే వెలిగించే జ్యోతి అవసరముంటుంది.అదే వెలిగే జ్యోతికి అరిపోయిన జ్యోతితో అవసరమే ఉండదుగదా.

ఇక సాధనపరంగా చూస్తే నిజానికి మనకి ఉన్న అష్టశరీరాలలో అష్టదీపాలు వెలిగాలి.కాని మన సాధన ద్వారా  మనము పొందిన జ్ఞానానుభవాలను బట్టి ఆయా శరీరాల దీపాలు వెలుగుతాయి.ఎపుడైతే మనకి ధ్యానము నందు లేదా స్వప్నము నందు అరుణచల క్షేత్ర అరుణగిరి దర్శనమైనదో ఆనాడే మన ఆఖరి అష్టశరీరమైన జ్యోతిశరీరమునందు అపుడిదాకా వెలగనిస్ధితిలో ఉన్న జ్యోతిన్ని వెలిగించే ప్రయత్నము ఆరంభమైనట్లే అన్నమాట.ఎవరైకైతే ధ్యానము నందు లేదా స్వప్నము నందు లేదా కళ్ళు మూసిన తెరిచినగూడ అరుణగిరి మీద స్వయంభూ అరుణజ్యోతి దర్శనమైందో ఆ క్షణమే మీ జ్యోతిశరీరము నందు ఆరని అరుణజ్యోతి వెలిగినట్లే.ఎలాంటే జ్యోతిదర్శనము అయింది అంటే మీరు జ్యోతిగా మారినపుడే మీరు మీ జ్యోతిన్ని చూడగలరు.ఇపుడికైన పరమహంస మనకోసము ఏమిచేసారో మీకు అర్ధమై ఉంటుంది అనుకుంటా.ఎవరైతే తనకిలాగా ఒంటరితనము అనే మోక్షబలహీనతకి గురి అయ్యి తమ దీపజ్యోతిన్ని ఆర్పివేసుకున్నవారందరి జ్యోతిశరీరాలలో ఎన్నడికి ఆరని జ్ఞాన అరుణజ్యోతిన్ని వెలిగించారు.ఇలా ఈ బలహీనతమాయలో పడి అరిపోయిన జ్యోతులుగా ఉన్న 64 కోట్లమందికి ఈ గ్రంధజ్ఞానము ద్వారా వారిలో జ్ఞానజ్యోతి ఆరని అరుణజ్యోతి వెలిగించారు.శాశ్వత నిశ్చల అరుణజ్యోతిస్ధితిని తనవంతు సహయముగా అందించారు.కాబట్టి ఇంక ఈ విశ్వములో 64 బలహీనతలలో ఒకటి అదే ఒంటరితనము అనే బలహీనత మాత్రమే పూర్తీయింది.ఇక మిగిలిన ఉన్న 63 బలహీనతలు పోవాలంటే మనకి కి పరమహంస లాంటి ఇంక 63 మంది అవసరముంది.ఎందుకంటే ఒక పరమహంస తనకి ఉన్న అంతిమ ఒక బలహీనత ఏమిటో తెలుసుకొని దానిని ఎలా దాటాలో తెలుసుకొని లోకానికి చెప్పి ఆ బలహీనతను తనుదాటి ఈ బలహీనతతో దాటలేని 64 కోట్ల మంది దాటించే అధికారము,అర్హత,యోగ్యత,యోగము మాత్రమే ఉంటాయని తెలుకొండి.అదిగూడ నిజపరమహంసలకి మాత్రమే ఇది సాధ్యపడుతుంది.పేరుకి పరమహంస ఉన్నంతమాత్రము ఇలా చెయ్యడము అందరికి సాధ్యపడదు.మీ పరమహంస గురువున్ని ఆయనికి ఉన్న బలహీనతలు ఏమిటో చెప్పమనండి.ఒకటి కన్నా ఎక్కువ బలహీనత పేర్లు చెప్పారా?ఆయన పేరుకే పరమహంస అన్నమాట.వాడివలన మీకు ఏలాంటి ఉపయోగము ఉండదు.వాడికే  తన కర్మజన్మల పరంపరానికి కారకమైన ఏకైక బలహీనత ఏమిటో తెలుసుకోకుండా దానిని దాటకుండా వేరేవాడి బలహీనత ఎలా దాటిస్తాడో మీరే ఒకసారొ ఆలోచించండి.ఒక గుడ్డివాడు మరొ గుడ్డివాడికి దారిచూపించడము కుదరదు గదా.కాబట్టి ఈ నకిలి పరమహంసల గురువులు జోలికి పోకండి. 

మనకి పరమహంస వలన వచ్చిన 99.99 శాతము జ్ఞానము ద్వారా మనకి ఉన్న అది ఒక్క అంతిమ బలహీనత ఏమిటో మనకి మనకే తెలుసుకుంటే సరిపోతుంది.గుర్తుంచుకొండి. మనలో ఏదో ఒక బలహీనత మాత్రమే ఉంది.దీనివలన మన కర్మజన్మల పరంపర కొనసాగుతోంది.ఆ బలహీనత ఏమిటో తెలుసుకోవడమే మన సాధన అంతిమ లక్ష్యము అన్నమాట.అది ఎవరైతే తెలుసుకున్నారో వారి సాధన పరిసమాప్తి అయినట్లే.ఆ బలహీనతను ఈ జన్మలో దాటకల్గితే అపుడు మీకు ఈ జన్మ అంతిమ జన్మ అవుతుంది.మీకున్న ఏకైక బలహీనత ఏమిటో మీకు తప్ప ఎవరికి తెలియదు.తెలుసుకోలేరు.వాడు దేవుడైనా..లేదా గురువైనా కూడ.మీ గూర్చి మీకు తప్ప ఎవరికి బాగా తెలియదు.కన్నతల్లిదండ్రి లేదా కట్టుకున్నవాడికి లేదా మీ కన్నవాళ్ళకిగూడ తెలియదని తెలుసుకొండి.కాబట్టి మీ అంతిమ బలహీనత మీకై మీరు తప్ప ఎవరు తెలుసుకోలేరని తెలిపోయింది గదా.ఆ తెలియనిదానిని తెలుసుకుంటే మాయ మాయం అవుతుందిగదా. అంటే మీకు అరుణగిరి దర్శనము అలాగే అరుణచల క్షేత్ర ప్రత్యక్షదర్శనం అలాగే అరుణజ్యోతి దర్శనము అయ్యాంటే మీరు పూర్ణమోక్షస్ధితి చేరుకున్నట్లే.మీ సాధన అలాగే మీ జన్మ పరిసమాప్తి అయ్యినట్లే అన్నమాట.ఇది నా మాట కాదు.అరుణచల శివ శిలాసనము.ఇదే 64 జ్యోతి కోడ్.దీనిని డీకోడ్ చేస్తే మిగిలిఉన్న 63 బలహీనతలు ఏమిటో వాటిని ఎలా దాటాలో తెలుస్తోంది.పరమహంసకి మాత్రమే అంతిమ 64 బలహీనతలు మీద జ్ఞానము అలాగే పట్టుంది.కాని ఈయన తెలుసుకోడు.చెప్పడు.తనకి ఉన్న ఏకైక బలహీనత మాత్రమే తెలుసుకొని ఈ జన్మలో దానిని దాటి అంతిమ జన్మ చేసుకున్నారు కాని మిగిలిన 63 బలహీనతలు గూర్చి తెలిసిన లోకానికి గావాలని చెప్పలేదు.ఎందుకంటే తను చెప్పిన ఎవరు నమ్మరని... ఎవరికి వారే తమకి ఉన్న ఏకైక అంతిమ బలహీనత స్వానుభవాలు పొందితే కాని వాటిని నమ్మరని ఈయనికి స్వానుభవమైంది.దానితో ఈ కోడ్ ను డికోడ్ చెయ్యడము ఆపివేసి మౌనము వహించారు. 
 
ఈ విశ్వములో ఉన్న 64 బలహీనతలు ఏ ఒక్కడు మిగలకుండా అందరుగూడ అనగా 64X64=4096 మంది దాటకల్గితే విశ్వానికి విశ్వమోక్షము వచ్చినట్లే..అందుకే అరుణచల శివలింగానికి 14 ఖండితాలు అలాగే గిరిప్రదక్షిణము 14 కి.మీ ఉంచింది.అనగా 4096 సంఖ్యలోని అంకెలు కలుపుగా 4+0+9+6=14 అవుతుంది.దీనివల్లనే ఈ విశ్వానికి విశ్వమోక్షమిచ్చేది అరుణచలక్షేత్రమైంది.

ఏ ఒక్కడు మిగిలిన ఆ బలహీనత మాయలో 64 కోట్లమంది మిగిలిపోతారు.అపుడు వీరంతా ఆరిపోయిన జ్యోతులుగా మిగిలిపోతారు.అనగా 4096 -64 =4032 మంది మాత్రమే ఆరని అరుణజ్యోతులు మారతారు అన్నమాట.అపుడు విశ్వములో ఆరిన లేదా ఆరని జ్యోతుల బేధజ్ఞానము మొదలై ఆరిపోయిన జ్యోతులను వెలిగించడానికి గురువులుగా..దైవాలుగా అవతారులెత్తి తిరిగి వీరు తమకి ఉన్న బలహీనత ఏమిటో మర్చిపోయి వెలుగుతున్న వారంతా ఆరిపోయేస్ధితికి వస్తారు.పాతవారితో కొత్తవారు కలిసిపోతారు.పున:కర్మజన్మ చక్రములో పడిపడి విశ్వజగన్నాటకమును నడుపుతున్నారు.ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు.చేసుకున్నవారికి చేసుకున్నంత..ఎవరి కర్మను వారే అనుభవించాలి.ఎక్కడ కర్మ మొదలైందో అక్కడే ఆ కర్మను పూర్తిచేసుకోవాలి గదా. అది ఈ జన్మలో తెలుసుకొని దాటగలమా లేదా మరు జన్మకి వాయిదా వేసుకోవాలో మనకి మనమే నిర్ణయించుకోవాల్సింటుంది.ఎందుకంటే అజ్ఞానము పోతే రాదు.జ్ఞానము వస్తే పోదు.   

మోక్షయుద్ధాలు:

అవును..నిజమే  మోక్షము కోసము ఏకముగా చంఢ ప్రచంఢముగా మోక్షయుద్దాలు జరుగుతున్నాయని నాకు ఈ మధ్యనే ఒక ధ్యానుభవముద్వారా తెలిసింది.అది ఏమిటంటే ఆరనిజ్యోతులు అలాగే ఆరే జ్యోతుల మధ్య ఈ మోక్షయుద్ధం ప్రతినిత్యము ప్రతిక్షణము జరుగుతోంది.ఎందుకంటే అరుణజ్యోతి ఆరిపోతే అదే మోక్షమని ఒక దైవవర్గము వాదిస్తే ఇది తప్పు..జ్యోతి ఎపుడు ఆరనిజ్యోతిగా ఉంటేనే అది మోక్షమని మరొ దైవవర్గ వాదన అన్నమాట.ఇందులో ఆరే జ్యోతికి అధిపతిగా అమ్మవారుంటే ఆరని జ్యోతిగా అయ్యవారున్నారు.ఇది ఎలా ఉంది అంటే గుడ్డు ముందా..కోడి ముందా లేక విత్తు ముందా ..చెట్టు ముందా అన్నట్లుగా ఆరే జ్యోతి అంటే మరణము..అలాగే ఆరని జ్యోతి అంటే జననము అనుకుంటే ఇందులో మోక్షమనేది మనకి మరణము తర్వాత వస్తుందా లేదా జననము తర్వాత వస్తొందా అంటే ఎవరైన చెపుతారా?ఇదే 64 డైమర్ష జ్యోతికోడ్..నిజానికి జననము తర్వాత మరణముంది.అలాగే మరణము తర్వాత జననముంది.మరి ఇందులో మోక్షము ఎక్కడ ఉంది.అదే ఈ జ్యోతికోడ్ని డికోడ్ చెయ్యడము అన్నమాట.ఈ కోడ్ అలాగే డికోడ్ మధ్యనే ఈ మోక్షయుద్ధాలు జరుగుతున్నాయని నాకర్ధమైంది.ఇపుడిదాకా మీరు దేవతలకి అలాగే రాక్షసుల మధ్యజరిగిన యుద్ధాలు చదివి ఉంటారు.కాని మోక్షకోసము స్త్రీ అలాగే పురుష దైవాల మధ్య ఆధిపత్యపోరు మోక్షయుద్ధాలు జరుగుతున్నయని చాలమందికి తెలియదు.తెలిసిన లేదా తెలుసుకున్న అతికొద్దిమంది ఏమిచెప్పకుండా మౌనము వహిస్తారు.చాలమందికి తెలియని విషయము ఏమిటంటే విత్తు ముందా లేదా చెట్టు ముందా అన్నపుడు నా స్వానుభవము ప్రకారము చూస్తే విత్తు ముందు అంటాను.ఎందుకంటే ఆదిలో అనాదగా ఉన్న శూన్యము నుండి జ్యోతిస్వరూపము అనే విత్తు స్వయంభూగా ఉద్భవించింది.ఇది రెండుగా వీడిపోయి స్త్రీగా..పురుషుడిగా విడిపోయింది.

ఇక మోక్ష విషయానికి వస్తే ఆరే జ్యోతికి లేదా ఆరనిజ్యోతికి మధ్య వీటిలో దేనికి మోక్షము వస్తుంది అంటే ఇక్కడ నాకు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి మధ్య మాటల మోక్షయుద్ధమే జరిగింది.వారి వాదన ప్రకారము ఆరణజ్యోతి ఆరిపోతే అదికాస్త వెలుగులేని చీకటిఉన్న శూన్యతకి పొందినట్లే గదా అంటాడు.ఇక నా వాదన ప్రకారము చూస్తే ఎపుడైతే ఒక జ్యోతి ఆరిపోయి మరో జ్యోతి వెలుగుతుంటే వెలిగే జ్యోతికి ఉన్న ఒంటరితనమనే జ్ఞానము వలన ఆరినజ్యోతిన్ని ఆరనిజ్యోతి వెలిగిస్తుంది.తద్వార వెలుగే మోక్షమవుతుంది అని నేను అంటే కాదు చీకటియే మోక్షమవుతుంది అని మా ఇద్ధరి మధ్య వాదోపవాదనాలు జరుగుతున్నాయి.కారణము ఏమిటంటే ఉంటే ఏకత్వస్ధితిగా వెలిగే జ్యోతి ఉండాలి లేదా ఆరిపోయిన జ్యోతిఉండాలి.కాని మనము పొందే ఏకత్వస్ధితి అనేది అర్ధనారీశ్వర ఏకత్వస్ధితి అన్నమాట.అనగా ఏకత్వస్ధితిలో పూర్తిగా స్త్రీ లేదా పూర్తిగా పురుషుడు ఉండాలి కాని స్త్రీ,పురుష అర్ధశరీరతత్వమున్న ఏకత్వ అర్ధనారీశ్వర తత్వములో మనము పొందే అంతిమస్ధితి గావడముతో కొంతకాలము వెలిగి..మరికొంతకాలము ఆరే జ్యోతిగా మనంతా ఉంటున్నాము అన్నమాట.అనగా అటు పూర్తిగా వెలిగేస్ధితిలో లేదా ఇటు పూర్తిగా వెలగనిస్ధితి మనము శాశ్వతముగా ఉండకుండా వెలిగే..వెలగని మధ్యస్ధితిలో అనగా మెలుకువ లేదా నిద్ర కాని మధ్యస్ధితిలో వచ్చే సమాధిస్ధితిలో పొందే స్ధితియే మోక్షస్ధితి ఉన్నట్లుగా వెలుగు అలాగే చీకటి మధ్య ఉండే స్ధితియందు మోక్షస్ధితి ఉంటుంది.అనగా మనము బ్రతికిఉండగా చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళ్లాతామో అక్కడికి బ్రతికి ఉండగా వెళ్లడమే నిజమోక్షస్ధితియని యోగులు,యోగగురువులు నిశ్చతాభిప్రాయం అన్నమాట.

తద్వారా అర్ధనారీశ్వర తత్వమున్న అరుణగిరి అరుణజ్యోతి కాస్త మోక్షజ్యోతి అయింది.ఇందులో గిరిపైన వెలుగు ప్రపంచముంటే గిరిలోపుల చీకటి ప్రపంచము అలాగే దీని అంతర్భాములో అరుణగిరి తీర్ధమైన అగ్నితీర్ధమునందు వెలుగు-చీకటి మధ్యస్ధితి అయిన అర్ధనారీశ్వరతత్వమున్న మోక్షస్ధితి ఉంది.అనగా భోగ ప్రపంచమున్న భూమి కాస్త వెలుగే ప్రపంచమైతే యోగ ప్రపంచమున్న చంద్రుడు కాస్త చీకటి ప్రపంచమైతే వెలుగు చీకటి ఉన్న సూర్యుడు కాస్త భోగ-యోగ మధ్యలో ఉండే నిశ్చలమోక్షస్ధితి ప్రపంచము అయితే అసలు పూర్తిగా భోగము లేదా పూర్తిగా యోగము లేదా భోగ-యోగాల మధ్యస్ధితి లేని నాలుగువ  స్ధితియైన లాస్యస్ధితిన్ని పొందడమే అసలుసిసలైన మోక్షస్ధితియని నా వ్యక్తిగతాభిప్రాయము.అనగా 64వ డైమర్షకోడ్ న్ని డికోడ్ చేస్తేకాని ఈ లాస్య మోక్షస్ధితి విషయము తెలియదు.ఈ విశ్వములో సృష్టి,స్ధితి,లయ ఉన్నట్లుగానే లాస్యస్ధితి ఉన్నదని లోకవిధితమే గదా.దీనికి అధిపతిగా దత్తస్వామి ఉంటాడు.తనలో సృష్టి,స్ధితి,లయ ప్రక్రియలుంచుకొని లాస్యప్రక్రియాధినేతగా దత్తస్వామి ఉంటున్నాడు. వెలుగు,చీకటి,వెలుగు-చీకటి స్ధితులు దాటి అది ఉందో లేదో తెలియని శూన్యతస్ధితిన్ని పొందడమే దత్తతత్వము అవుతుంది. ఇదే 64వడైమర్ష జ్యోతి దికోడ్.నాకు లాగా ఇది ఉన్నదని తెలుసుకున్నవారెందరో ఉన్నారు.ఈ స్ధితిన్ని పొందినవారు ఇంతవరకు ఎవరులేరు.ఉండిఉంటే మనకి మోక్షము పొందాలనే కోరిక-కర్మ-జన్మలుండవు గదా.అసలు నేను అనేది చెపుకోవటానికి నేను ఎవరిని అని తెలుసుకోవటానికి ఏది ఏమి ఉండేది గాదుగదా.మీరు ఏపుడైన మేరు శ్రీచక్రమును చూశారా?దానిని జాగ్రత్తగా గమనిస్తే నాలుగువైపుల  కిందనుండి పైకి వెళ్ళటానికి దారులుంటాయి.కాని ఇందులో ఒక మెలిక ఉంటుంది.అది ఏమిటంటే రెండ ఆవృత్తమైన అష్టదళపద్మము దాటి మూడవ ఆవృత్తములో ఉన్న పంచ ఆవృతాలలో మూడు దారులు చివరి త్రికోణము చేరేలోపు ఆగిపోతే మిగిలిన నాలుగోవ ఒక దారిమాత్రమే ఈ ఆఖరి త్రికోణములో ఉన్న అమృతబిందువు దగ్గరికి చేరుస్తోంది.ఈ దారిఉన్న ముఖమే మనకి శ్రీచక్రముఖముగా చెపుతారు.ఇదే 64జ్యోతి డికోడ్ అవుతుంది.అంటే లాస్యమోక్షస్ధితి పొందటానికి మోక్షమార్గముంది కాని ఇది పొందినవారు ఇంతవరకు ఎవరులేరు.ఎందుకంటే ఇక్కడ మాయ లేదు.మర్మము లేదు.ఏమిలేదు.ఏది ఉందో లేదో తెలియనిస్ధితి అన్నమాట.ఈ మోక్షస్ధితినే విచిత్ర అవస్ధయని... ఇది పొందామో లేదో తెలియని స్ధితియని మన పూర్వీకయోగులు చెప్పడము జరిగింది.ఈ మేరుమోక్షస్ధితియే మేరుశ్రీచక్రగిరి అయిన అరుణగిరి అన్నమాట.ఈ మోక్షస్ధితిలో 14 క్షణాలు మించి ఉండలేరు.అలాగే 21 రోజులు మించి శరీరాలతో తట్టుకోలేరు.కారణము 99.99 శాతము సాధన పూర్తిచేసి 0.1 శాతము స్ధితికి వచ్చినపుడు మనము మనకి తెలియకుండానే ఈ లాస్యమోక్షస్ధితికి చేరికొనేస్ధితిలో ఉన్నపుడు 14 క్షణాలు పూర్తికాకుండానే అనుమానభయముతో వెనుతిరిగి వస్తాము.వస్తున్నాము.ఆ విషయము మనకి తెలిసేలోపు మనకోసము కర్మ-జన్మచక్రములో పడిపోతున్నాము.దీనితో ఈ విషయము తెలుసుకున్న యోగులు, యోగగురువులు, యోగదైవాలు వివిధ క్షేత్రాలలో ఉండి లాస్యమోక్షస్ధితిన్ని పొందనీయ్యకుండా చేస్తున్న అరుణగిరి క్షేత్రము మీద మిగిలిన అన్ని క్షేత్రాలు యుద్ధాలు ప్రకటించి నాశనము చెయ్యటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.కాని వీరందరికి తెలియని విషయము ఏమిటంటే 64వ కోడ్ అలాగే డికోడ్ వాసిన మేధరుద్రదక్షిణమూర్తి ఈ జ్ఞానమును తను పొందిన  తొలి అపస్మారకస్ధితి వలన పూర్తిగా మర్చిపోవడము జరిగింది.అపుడు ఈయన కాస్త తనకి అపస్మారక స్ధితిన్ని ఇచ్చిన అపస్మారక రాక్షసుడిన్ని జయించి తన ఆదీనములో ఉంచుకోవడముతో  మిగిలిన 63 డైమర్ష్స్ విధివిధానమంతా ఈయనకి గుర్తుంది.కాని 64వ డైమర్ష జ్ఞానము మాత్రము పోయింది.దానితో ఆఖరిదైన జ్యోతిశరీరానికి వచ్చే మోక్షస్ధితియైన అరుణజ్యోతి స్ధితి నుండి విముక్తి పొందే లాస్యమోక్షజ్ఞానమే అంతరించిపోయింది.దానితో ఎవరు సాధన చెసినగూడ అష్టశరీరాలలో సప్తశరీరాలకి శాశ్వతమోక్షమిచ్చినగూడ తన ఆఖరిదైన జ్యోతిశరీరానికి తాల్కికమోక్షము మాత్రమే పొంది వెనుతిరగక తప్పదు.కాని 64వ  డైమర్ష లాస్యమోక్షకోడ్-డికోడ్ మాత్రము అరుణజ్యోతియందు భద్రముగా ఉంది.దీనికి విశ్వరక్షకుడిగా గౌతమమహర్షి గోత్ర వంశస్తులను ఆ ఈశ్వరుడు పెట్టడము జరిగింది.విచిత్రము ఏమిటంటే ఉన్న 64 ఆరని ఆరుణజ్యోతులలో ఏది ఆది అరుణజ్యోతో ఎవరికి తెలియదు.మనకి ఉన్న 14 క్షణాలలో అసలు సిసలైన ఆది అరుణజ్యోతి ఏదో కనుకోవాలి.దానిని దికోడ్ చెయ్యాలి.అది సాధ్యపడే విషయమే కాదు.ఈ విషయప్రయత్నము కోసము విశ్వప్రయత్నాలు మోక్షయుద్ధాలు అరుణగిరి మీద ఇపుడికి చేస్తున్నారు.అంతెందుకు చాలాకొద్దిమంది మాత్రమే తెలిసిన విషయము ఏమిటంటే శ్రీశైల క్షేత్రానికి ఒక ద్వారమైన త్రిపురాంతక క్షేత్రమును అరుణచలక్షేత్రమంటారు.ఇది అచ్చగుద్దినట్లుగా అరుణగిరి బ్లూప్రింటు లాగా అక్కడ ఏమైతే ఉన్నాయో అవి అన్నీయుగూడ ఇందులో ఉండటము నేను గమనించి ఆశ్చర్యపోయాను.అంటే అరుణగిరి యొక్క బ్లూప్రింట్ సంపాదించిమరి మోక్షయుధ్ధాలు చేసిన చేస్తున్నగూడ అణువంత ఇసుమంత అరుణగిరిన్ని ఏమిచెయ్యలేకపోతున్నారంటే అరుణగిరి విశ్వాధినేత దక్షిణమూర్తి మేధసంపత్తికి..దీనిని అమలు చెస్తున్న విశ్వాధినేత్రి అభికుంచిలాంబికదేవికి లేచినిలబడి మోకర్లి నమస్కరించకతప్పదు.ఈ అరుణగిరి అరుణజ్యోతి రహస్య తెలుసుకొనేంతవరకు మన జ్యోతిశరీరానికి మోక్షములేనట్లే..రానట్లే..దీనిని డికోడ్ చెయ్యటానికి పురుషశరీరాలలో బ్రహ్మరంద్రగుహయందు 64 కపాలాధారిగా ఉంటే స్త్రీ శరీరాలలో ఈ కోడ్ ను డికోడ్ చెయ్యటానికి అమ్మవారు కపాలధారిగా ఉంది.అంటే మనమంతాగూడ మోహమాయ శివశక్తి రూపాలు అన్నమాట.హరిద్వార క్షేత్రములో మరణము అనేది స్ధూలశరీరమోక్షమైతే అరుణచలక్షేత్రములో మరణము అనేది జ్యోతిశరీర నిశ్చలమోక్షస్ధితి అవుతుంది అన్నమాట.శాశ్వత మోక్షమగు లాస్యమోక్షపొందేదాకా అనగా విశ్వమోక్షము పొందేదాకా మన శరీరాలకి తాల్కిక మోక్షాలు పొందడము జరుగుతుంది.మన దేహము సాధన చేస్తే మోక్షము పొందేది శివశక్తి అన్నమాట.ఇక్కడ ఒక విషయము గమనించాలి.పురుష దేహనికి ఆరని అరుణజ్యోతిస్ధితి పొందితే స్త్రీ దేహనికి ఆరే అరుణజ్యోతి స్ధితి పొందడముతో పురుషుడు మోక్షమును పొందితే స్త్రీ కాస్త మోక్షమును పొందకుండా మోహమాయలో పడి పున:జన్మలు ఎత్తుతుంది.ఎపుడైతే ఈమె కాస్త మరుజన్మగా పురుషుడిగా జన్మగా ఎత్తుతుందో అపుడే ఆమెకి మోక్షము వస్తుంది.ఇదే విషయము మనకి జైనుధర్మ సంప్రదాయములో కనపడుతుంది.వీళ్ళ అభిప్రాయము ప్రకారము పురుషుడికి మాత్రమే మోక్షము వస్తుందని..అదే స్త్రీ అయితే ఈ జన్మ సాధన ద్వారా మరుజన్మగా పురుషు జన్మ ఎత్తాలని కోరుకొని సాధన చెయ్యమని చెప్పడము జరిగింది. అలాగే శివుడు మోక్షముపొందితే అమ్మవారు కాస్త భర్త-సంతాన మోహమాయలో పడి మోక్షజ్యోతిగా మారదని హైందవధర్మములో చెప్పడము జరిగిందిగదా.కాని ఈ నియమము మన సప్తశరీర సాధనకి మాత్రమే వర్తించి లింగభేదం లేని అష్టమ జ్యోతిశరీరానికి ఈ నియమము వర్తించదని ఎవరైనగూడ తమ అంతిమజ్యోతిశరీర అరుణజ్యోతిదర్శనము పొందితే వారికి అంతిమనిశ్చల మోక్షస్ధితి పొందినట్లేనని తెలుసుకొండి.అలాగే ఈ 64వ డైమర్ష కోడ్ ను డికోడ్ చెయ్యటానికి నేను ప్రయత్నించినపుడు నాకు 64 కపాలధారి కనిపించి క్షణాలలో నీలిశరీరమున్న ధ్యానశివుడిగా మారిపోయాడు.అపుడు నాకు ఏకకపాలమునకు రక్షకుడిగా రుద్రుడున్నట్లుగా కనిపించాడు.దీనిని గూర్చి సాధన చెయ్యగా రుద్రమూర్తి లాకెట్ వచ్చింది ఆ తర్వాత..త్రికపాలాలకి రక్షకుడిగా నరసింహస్వామున్నట్లుగా కనిపించిగా దీనిని గూర్చి సాధన చెయ్యగా ఈయన సింహముఖ లాకెట్ వచ్చింది. ఆతర్వాత సాధన చెయ్యగా ఈసారి నాకు ధ్యానమునందు .. పంచకపాలాలకి అదినేత్రిగా జ్ఞానసరస్వతి ముఖము కనిపించింది.దీనిని గూర్చి సాధన చెయ్యగా నాకు ఎలాంటి సరస్వతి లాకెటు రాలేదు. దానితో నాకు నా సాధన 99.99 శాతము పూర్తీయ్యి 0.1 శాతము దగ్గర ఆగిపోయినదని నాకర్ధమైంది.కాని జ్యోతిశరీర మోక్షరహస్యకోడ్ లోకానికి చెప్పడానికి ఈ జ్ఞానసరస్వతి ఉన్నాదని..ఈమె అనుగ్రహము పొందిన ఏకైక వ్యక్తి వేదగురువు వేదవ్యాసుడు మాత్రమేనని ..ఈయన్నికి మాత్రమే ఈ కోడ్ను డికోడ్ చేసే అధికారము,యోగ్యత,యోగముంటే అలాగే ఈ కోడున్ని డికోడ్ చెయ్యకుండా రక్షించే అధికారము,యోగ్యత,యోగము గౌతమమహర్షి ఉంటే..ఈ రెండు అంశ జన్మలు నావే అని నాకు జ్ఞానసరస్వతి భోదించడముతో రక్షకుడే భక్షకుడే అయితే ఎలా అని డికోడ్ చేసే బాధ్యత నుంచి ఈ దేహము తప్పుకోవడము జరిగింది.దానితో మళ్ళీ తిరిగి పున:కర్మజన్మ చక్రములో మన జ్యోతిశరీరము పడటము జరుగుతోంది.మోక్షయుద్ధాలు ఆగడము లేదు.బ్రహ్మచక్రము తిరగడము ఆగడము లేదు.ఈ జ్యోతి డికోడ్ కోసము మన దేహజన్మలు మోక్షసాధనకోరిక కోసము పున:కర్మజన్మాలలో పడుతూనే ఉంటాయి.దానితో ఈ జ్యోతిశరీర కోడ్ ను డికోడ్ అయ్యేవరకు ఈ విశ్వజ్యోతి అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా ఆరని అరుణజ్యోతిగా వెలుగొందుతుంది.ఇదే సత్యము..ఇదే నిత్యము..

అదిరిపోయే ముగింపు:

ఈ మోక్షగ్రంధము యొక్క ముగింపు ఇలా అదిరిపోయేవిధంగా ముగిస్తుందని నేను ఉహించలేదు.పైగా ఈ రోజు దసరాలలో మూలనక్షత్ర తిధిగావడము పైగా ఈ రోజు అమ్మవారు జ్ఞానసరస్వతిగా దర్శనమివ్వడము ఇదే ఈ రోజు ఈ గ్రంధమునకు ముగింపు పలకడము సచిత్ర విచిత్రముగా ఉంది.ఇంతకి విషయము ఏమిటంటే ఆరిపోయేజ్యోతి,వెలిగే జ్యోతి,ఆరని జ్యోతి అనగా బ్రహ్మచారి,గృహస్ధుడు,సన్యాసి అవుతారు.ఇందులో సన్యాసి అనగా ఆరని జ్యోతికి అలాగే  గృహస్ధుడు అనగా వెలిగే జ్యోతికి మాత్రమే నిశ్చలమోక్ష వస్తుంది.ఇక బ్రహ్మచారి అనగా ఆరిపోయేజ్యోతికి మాత్రము ఒక అడుగు దూరములో మోక్షమును పొందకుండా వెనుతిరగడము జరుగుతుంది.  కాని అంతిమ మోక్షమైన లాస్యమోక్షము ఎవరికి రాదని తెలుసుకొండి.

ఈ తేడా ఎందుకు వస్తుంది అంటే ఆఖరి జ్యోతిశరీరమునకు మోక్షము పొందే సమయములో విశ్వమాత మనకి ఒక యోగపరీక్ష పెడుతుంది.అది ఏమిటంటే నువ్వు నీ జ్యోతిని ఆర్పి వేసుకుంటావా?లేదా ఆరని అరుణజ్యోతిగా వెలుగుతావా? అని అడుగుతుంది.అపుడు చాలామంది  యోగులు,పరమహంసలు,అవధూతలు,గురువులు, దైవాలు, మహర్షలు,సాధువులు ఇలా అందరుగూడ సహజసిద్ధముగా చీకటి అంటే శూన్యము గదా.అపుడు మన జ్యోతి వెలుగుతూ ఉంటే ఇక మనము శూన్యస్ధితిన్ని పొందినట్లు కాదుగదా అని ఆరిపోయే జ్యోతిస్ధితిన్ని అవకాశముగా తీసుకొని దానిని పొందడము జరుగుతుంది.ఇదే వీరంతా తెలియకుండా చేస్తున్న అతిపెద్ద తప్పు అన్నమాట.ఎందుకంటే ఆరిపోయిన జ్యోతికి మళ్ళీ వెలిగే అవకాశముంటుంది.మళ్ళీ వెలిగించే అవకాశముంటుంది.అదే ఎన్నడికి ఆరనిజ్యోతికి వెలిగించే అవకాశమే ఉండదు.ఎపుడైతే జ్యోతి వెలిగించే అవసరము వచ్చిందో ఆ జ్యోతి పున:కర్మజన్మ చక్రములో కొట్టుకోవాల్సింటుంది.ఎలా అంటే ఆరిపోయిన జ్యోతికి జ్ఞానస్ఫురణ ఉంటుంది.తద్వారా ఇది అరనిజ్యోతి వైభవాన్ని చూస్తుంది.అపుడు తనుకూడ ఆరనిజ్యోతిగా మారితే బాగుండునని కోరిక మొదలై పున:కర్మ జన్మాలకి దారితీస్తుంది.అనగా ఆర్పియే జ్యోతికి కనిపించని దాటలేని బలహీనత కల్గించే కోరిక అంతర్భాగములో ఆలోచనరూపములో ఉంటుంది అన్నమాట.ఈ కోరికయే చివరిలో దాటలేని బలహీనతగా మారుతుంది. అంటే అరిపోయే జ్యోతిన్ని బ్రహ్మచారి అనుకుంటే కామము మీద కోరిక ఉన్నప్పడికి పరిస్ధితుల వలన లేదా కాలము కలిసిరాక పెళ్ళి చేసుకోకుండా అలాగని తనలో ఉన్న కామమును బలవంతముగా అదుపుచెస్తూ బలవంతపు బ్రహ్మచారి జీవితమును గడుపుతాడు.బ్రహ్మచారికి కామాలోచన ఉండదు అంటే నేను నమ్మను.ఎందుకంటే ఈ ఆలోచన లేకపోతే వీరికి నిద్రలో గూడ వీర్యసఖ్కలము జరగుండా ఉండాలిగదా.కాని బ్రహ్మచారి స్వామీజీకైనా రాత్రులయందు నిద్రలో ఈ రహస్యప్రక్రియ తప్పనిసరిగా జరిగితీరుతుంది.ఇది ప్రకృతిధర్మము.ఇక ఇది జరుగుకుండా దాటలేనపుడు వాడు నిజబ్రహ్మచారి కానట్లే గదా.అపుడు వాడు ఆరిపోయినజ్యోతియే గదా. తనలో ఉన్న ఇలా వివిధ రకాల బలహీనతలను బ్రహ్మచారి కాస్త బలవంతముగా అదుపులో ఉంచుకొని అనుభవించకుండా జాగ్రత్తపడుతూ ఉండటమువలన ఇతగాడిని ఏదోఒక బలహీనక్షణములో తనలో ఉన్న బలహీనత కోరికకి బలై ఆ కోరిక కోసము గావాలని పున:కర్మజన్మ చక్రములో పడతాడు.దానితో బలహీనత వలన ఆరిపోయే జ్యోతిగా ఉండాలని అవకాశము తీసుకొని తనలో ఉన్న బలహీనతను దాటటానికి తిరిగి పున:కర్మ జన్మాలకి వస్తాడు.ఇక గృహస్ధుడు విషయానికి వస్తే వెలిగేజ్యోతి అవుతాడు.ఇతను అన్నికోరికలు అనుభవిస్తూ వాటిలో తనకి బాగా ఇష్టమైనకోరిక కోసము బలై అయితే మాత్రము వెలిగేజ్యోతిగూడ ఆరిపోయే ప్రమాదముంది.తద్వారా పున:కర్మజన్మచక్రములో పడే అవకాశముంది.అదే వీళ్ళు తమకి ఉన్న ఇంద్రియానిగ్రముతో కోరికలు అనుభవించడముతో వచ్చిన స్మశానవైరాగ్యముతో ఆ కోరికను నిగ్రహించుకుంటే శాశ్వత వెలిగేజ్యోతిగా ఉంటారు.ఇక్కడ ఒక సందేహము రావచ్చును అది ఏమిటంటే అదే బ్రహ్మచారి తన నిగ్రహముతో కోరికను నిగ్రహించవచ్చుగదా అంటే నిజానికి నిగ్రహించలేడు.ఎందుకంటే ఇతను ఆ కోరికను అనుభవించకుండా అదుపులో ఉంచుకున్నాడు.అదే గృహస్ధుడు ఆ కోరికను అనుభవించి దాని ఈతిబాధలు పొంది ఉండటము వలన పెళ్ళి ఇష్టపడేవాడిగా లేదా ఇష్టపడనివాడిగా మారే అవకాశముంది.కాని బ్రహ్మచారికి ఇట్టి అవకాశము ఉండదు.ఇక సన్యాసికి అయితే కోరికల అనుభవించిన లేదా అనుభవించకపోయిన వాటితో ఏలాంటి సంబంధముండదు.ఉన్ననాడు తింటాడు లేనినాడు పస్తులుంటాడు.సుఖ:దు:ఖాలు అనే ద్వంద్వప్రవృతి వీరికి ఉండదు.ఉన్నదంతా బ్రహ్మనందమే.కనిపించేదంతాగూడ బ్రహ్మమే.తాను బ్రహ్మముగా మారి అంతటా బ్రహ్మనంద బ్రహ్మముగా చూస్తే తనకి తాను వేరని బేధజ్ఞానమే లేకుండా అంతటా ఏకత్వబ్రహ్మతత్వానుభూతిలో ప్రతినిత్యము అనునిత్యము ఏన్నడికి ఆరనిజ్యోతిగా అనుభవిస్తూంటాడు.ఇదే నిశ్చలమోక్షమవుతుంది.కాని తాను బ్రహ్మము అనే బ్రహ్మజ్ఞానము ఈయనికి ఉండటమువలన లాస్యమోక్షస్ధితి పొందకుండా బ్రహ్మములో కలువని బ్రహ్మముగా అరని అరుణజ్యోతిగా తనకి తెలియకుండానే పసిపిల్లాడి మన:సత్వముతో వటపత్రసాయిగా మిగిలిపోతున్నాడు.ఇట్టివారికి కర్మ-జన్మ-కోరిక-కాలాతీత-భావతీత-రాహిత్యస్ధితియందు శాశ్వతముగా ఆరనిఅరుణజ్యోతిగా అనగా అరుణాచలేశ్వరుడిగా బ్రహ్మముగా ఉండిపోతారు.

ఇక అదిరిపోయే ముచ్చట ఏమిటంటే మన సాధనాంతగూడ విధాత విధిరాతను బట్టి ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరు ఏ స్ధితి పొందుతారో విధి ఏపుడొ మన ఆదిజన్మలోనే రాసిపెట్టింది.దానిప్రకారమే అలా జరుగుతుంది.జరుగుతోంది.విధిరాతను మార్చడము ఎవరితరము కాదు.జరిగేది జరుగకమానదు.జరగనిది ఎన్నడికి జరుగదు.  నిజానికి మనసాధనాంతగూడ టైము ట్రావెల్ లాంటిది.అనగా కాలములో ప్రయాణము అన్నమాట.అసలు మన ఆదిజన్మలో మనము ఆరేజ్యోతి లేదా ఆరనిజ్యోతి లేదా ఆరే-ఆరని జ్యోతిగా ఉండే వెలిగే జ్యోతి అనేది తెలుసుకోవటానికి మన యోగసాధన ఉందని ముందు తెలుసుకొండి.అంటే మన సాధనాంతగూడ ఏమి అవ్వాలో ఏమి జరగాలో ముందుగానే రాసిపెట్టింది.కాని అది ఏమిటో తెలుసుకోవడమే మన సాధన లక్ష్యము అన్నమాట.ఇది తెలుసుకోవాలని ఏలా తెలుసుకోవాలో ఎవరి వలన దేని వలన తెలుసుకోవాలో ముందుగానే నిశ్చయించబడి ఉంటుంది.అంటే మనము పుట్టుక ముందే మన చావు ఏ చెట్టు కొమ్మలతో దహించబడుతుందో ముందుగానే రాసిపెట్టినట్లుగా మన విధిరాత ఉంటుంది అన్నమాట.అలా నా అష్టశరీరాల మోక్షవిధినాలు అనగా స్ధూలశరీరానికి  హరిద్వార స్ఫటికలింగమైతే అంతిమ జ్యోతిశరీరానికి అరుణచల జ్యోతిర్లింగము అయుంది.ఇలా ప్రతిజీవి అవుతుంది.మన ఆదిజన్మ వివరాలు తెలియాలంటే దీనికి కారకమైన బలహీనత కోరిక ఏమిటో చెప్పే మన ఆదిజన్మమూలాలున్న అరుణగిరికి అనుసంధానమవ్వాలి.మన సాధన ద్వారా కాలములో వెనక్కి ప్రయాణించి మన ఆదిజన్మ వివరాలు అదే జ్యోతిశరీరజన్మ సాధన స్ధితి ఏమిటో మనము ధ్యానయోగిగా మారి ధ్యానుభవాలు ద్వారా జ్ఞానస్ఫురణ పొంది జ్ఞానము పొందడమే అసలు సిసలైన సాధన అవుతుంది.అనగా మన ఆదిజన్మ జ్యోతిశరీరము యొక్క జ్యోతి స్ధితి అనగా ఆరని అరుణజ్యోతి లేదా వెలిగే జ్యోతి లేదా ఆరిపోయే జ్యోతి అనేది తెలుసుకోవడము అన్నమాట.కాని నిజానికి బ్రహ్మాచారి అనేవాళ్ళు యోగములో లేదా భోగములో ఉన్నప్పడిటి వారంతా విధిరాత ప్రకారము చూస్తే ఆరిపోయే జ్యోతులు అవుతున్నారని అదే గృహస్ధుడు తనకి ఉన్న దాంపత్యధర్మము తప్పకుండా ఉంటే వెలిగేజ్యోతి నుండి ఆరనిజ్యోతిగా మారుతున్నాడని అదే ఈ ధర్మము తప్పితే వెలిగేజ్యోతి నుండి అరిపోయేజ్యోతిగా మారాలని  అదే నిజసన్యాసి అయితే వాళ్ళు ఎన్నడికి ఆరని ఆరుణజ్యోతిగా ఉండాలని విధిరాత రాసే విశ్వమాత ఎనాడో నిశ్చయించింది. అందుకే యోగమున్నవాడు యోగికాకతప్పదని..కామికానివాడు మోక్షగామి కాలేడని... ధర్మార్ధకామమోక్ష ధర్మాలు చెప్పడము జరిగింది.

ఇక నా స్వానుభవాలు చూస్తే మీరు మొదటి అధ్యాయము నుండి అంతిమ అధ్యాయము వరకు చూస్తే ఆడవాళ్ళ కామమాయ దాటడమే మీకు కనిపిస్తుంది.అంటే గృహస్ధ ధర్మములో నేను కాస్త దాంపత్యధర్మము తప్పకుండా ఉండటము వలన నా జ్యోతిశరీర వెలిగేజ్యోతిలో ఉన్న జ్యోతిస్ధితి నుండి నిజసన్యాసికి చేరడముతో ఎన్నడికి ఆరని అరుణజ్యోతిగా మారే విధిరాత ఉన్నదని ఈ జన్మసాధన ద్వారా తెలుసుకోవడము జరిగింది.అదే జిజ్ఞాసి విషయానికి వస్తే తనజ్యోతిశరీరము స్ధితికి  వచ్చినపుడు తన జ్యోతి ఆరిపోవాలా లేదా వెలిగించాలా అన్నపుడు అమ్మవారు చెప్పినవిధముగా ఆరిపోయేజ్యోతి అవకాశము ఎంచుకోవడముతో అమ్మవారితోపాటుగా ఇతనుగూడ పున:కర్మజన్మాల చక్రములో పడిపోయేవిధముగా విధిరాత ఉన్నదని తెలుసుకోవడము జరిగింది.ఈ ఆరిపోయేజ్యోతుల వలన యోగములో యోగజన్మాలు లేదా భోగములో ఉంటే భోగజన్మాలు ఎత్తాలని వీరివలనే విశ్వ పున:కర్మ జన్మాలు చక్రము తిరగడము జరగాలని రాసిపెట్టడము జరిగింది.ఇక గృహస్ధ వెలిగేజ్యోతి వలన దాంపత్య ధర్మము తప్పితే ఆరిపోయేజ్యోతిగా అదే ధర్మము పాటిస్తే ఎన్నడికి ఆరనిజ్యోతిగా మారాలని విధిరాత లిఖించడము జరిగింది. ఇక నిజ సన్యాసికి అయితే ఎన్నడికి ఆరని అరుణజ్యోతిగా మారాలని రాయడము జరిగింది.కాని కాషాయము ధరించిన ప్రతివాడు సన్యాసి కాదని కోరికను పరిత్యాగిగా చేసేవాడే నిజసన్యాసి అని అలాగే కాషాయము ధరించి కోరికకు  బలైవాడు సన్యాసి కాదని సన్నాసి అవుతాడని ఆరిపోయేజ్యోతిగా మారతాడని విధిలిఖితము అన్నమాట.నాకు తెలిసినంతవరకు  ఆరిపోయే అరుణజ్యోతులుగా కారణజన్మలుగా శంకరాచార్యుడు లాంటివారుంటే వెలిగేజ్యోతులుగా రాఘవేంద్రస్వామి లాంటివారుంటే ఆరనిజ్యోతిగా శేషాద్రిస్వామి లాంటివారున్నరని ఇలా వీరంతా యోగములో ఉంటే అలాగే భోగములో చక్రవర్తి - దరిద్ర యోగమున్న వారందరిచేత విశ్వము పున:సృష్టి ప్రతినిత్యము జరిగేవిధముగా విధాతలకే విధిరాత రాసే విశ్వజననీయైన అరుణగిరి విశ్వమాతయైన ఆదిపరాశక్తి విధిలిఖితముగా ఉన్నదని ఈదేహజన్మ అంతిమముగా పొందిన జ్ఞానస్ఫురణ అయింది..

అంటే మన సాధనాంతగూడ ఏమి అవ్వాలో ఏమి జరగాలో ముందుగానే రాసిపెట్టింది.కాని అది ఏమిటో తెలుసుకోవడమే మన సాధన లక్ష్యము అన్నమాట.ఇది తెలుసుకోవాలని ఏలా తెలుసుకోవాలో ఎవరి వలన దేని వలన తెలుసుకోవాలో ముందుగానే నిశ్చయించబడి ఉంటుంది.అంటే మనము పుట్టుక ముందే మన చావు ఏ చెట్టు కొమ్మలతో దహించబడుతుందో ముందుగానే రాసిపెట్టినట్లుగా మన విధిరాత ఉంటుంది అన్నమాట.అలా నా అష్టశరీరాల మోక్షవిధినాలు అనగా స్ధూలశరీరానికి  హరిద్వార స్ఫటికలింగమైతే అంతిమ జ్యోతిశరీరానికి అరుణచల జ్యోతిర్లింగము అయుంది.ఇలా ప్రతిజీవి అవుతుంది.

విధిరాతను మార్చలేమా?...

అంటే ఇక్కడ ఒక విషయము మనము గమనించాలి.అది ఏమిటంటే శూన్యము యొక్క ఆది ఆలోచనయే శూన్యములోంచి వచ్చిన స్వయంభూ ఆది అరుణజ్యోతి విధిరాత అయింది.ఆ తర్వాత అరుణజ్యోతి యొక్క తోడు గావాలనే కోరికయే విడిపోయిన అరుణజ్యోతి కాస్త ఆదిపరాశక్తికి అలాగే ఆదిరుద్రుడికి విధిరాతగా మారింది.ఇక వీరిద్ధరి సంయోగ అర్ధనారీశ్వర  భావరూప ఆలోచనలే అండ,పిండ,బ్రహ్మండ లోకావాసులైన జీవ,దైవ,పరమాత్మ జీవులకి విధిరాత అయింది.అంటే ఈ లెక్కనచూస్తే శూన్యము యొక్క ఆది ఆలోచనయే కర్మగాను అదియే కర్మవాసనగా మారి పున:కర్మజన్మచక్రమునందు తిరుగుతోంది.అంటే మన విధిరాతను బ్రహ్మదేవుడు రాస్తే ఈయన రాతను అదిపరాశక్తి రాస్తే ఈమె రాతను అదిరుద్రుడు రాస్తే ఈయన రాతను అరుణజ్యోతి రాస్తే దీని రాతను శూన్యము యొక్క అది ఆలోచన నుండి రాసింది అన్నమాట.ఇపుడు విధిరాత మార్చలేమా అనే విషయానికి వస్తే మన అష్టశరీరాల విధిరాతను చూస్తే స్ధూల శరీరానికి బ్రహ్మదేవుడు రాస్తే సూక్ష్మ,కారణ,వాయు శరీరాలకి అమ్మవారు రాస్తే... ఆకాశ,సంకల్ప,ఆత్మశరీరాలకి అదిరుద్రుడు రాస్తే ఇక ఆఖరిదైన జ్యోతిశరీర విధిరాతను అరుణజ్యోతి రాసింది.ఇందులో సప్తశరీరాల తలరాతను మన సాధన ద్వారా మార్చుకొనే వీలుంటుంది.ఎందుకంటే ఈ రాతలను ఆత్మశరీరాలు రాసినాయి.కాని ఆఖరిదైన జ్యోతిశరీరానికి ఉందో లేదో తెలియని శూన్యము యొక్క ఆలోచన యే రాత రాసింది.ఇందులో మాయ లేదు.మర్మము లేదు.పరిశుద్ధం.పూర్ణం.కేవలము ఆలోచన జ్ఞానమే ఉంది.అనగా ఆరునెలలు పసిపిల్లాడి మన:సత్వము అన్నమాట.వాడు ఎందుకు ఏడుస్తాడొ..ఎందుకు నవ్వుతాడో వాడికిగూడ తెలియని అమాయకపు స్ధితియే జ్యోతిశరీర విధిరాత స్ధితి అన్నమాట.వాడు నవ్వితే విశ్వసృష్టి జరుగుతోంది.వాడు ఏడిస్తే విశ్వనాశనమవుతోంది.వాడు అటునిటూ కదిలితే విశ్వస్ధితి జరుగుతోంది.ఇవన్నీగూడ తనవలనే జరుగుతున్నాయనిగూడ తెలియని తెలుసుకోలేని తెలిసినవారు చెప్పిన అర్ధము చేసుకోలేనిస్ధితిలో ఆ పిల్లవాడైన వటపత్రసాయిగా ఉన్నాడు. ఇలాంటి స్ధితిలో ఉన్న జ్యోతిశరీర విధిరాత అంతాగూడ ఉన్నదని మిగిలిన సప్తశరీరాలు తెలుసుకున్న ఏమిచెయ్యలేని పరిస్ధితియే గదా.ఇక్కడ పిల్లాడికి కోరిక లేదు.మాయ తెలియదు.మర్మము లేదు.చిరునవ్వు లేదా ఏడుపు లేదా కదలిక తప్ప ఏమిలేదు.ఇవిగూడ వాడి ప్రమేయములో లేవు.వాడి ఆధీనములో లేదా అదుపులో లేవు.ఈ పసిపిల్లాడిన్ని ఎలా మనము అదుపు చెయ్యగలము.వాడి అంతటా వాడి ఆగిపోవాలి.వాడు ఆగడు.వాడికి మనము ఆగమని చెప్పిన అర్ధముచేసుకొని ఆగే పరిస్ధితివాడిది కాదు.మిగితా సప్తశరీరాలకి మనము ఏమి చెప్పిన అర్ధము చేసుకొని మన అదుపులో లేదా ఆదీనమవుతాయి.కాని ఈ ఆఖరి జ్యోతిశరీరమైన పసిపిల్లాడు ఎవరిమాట వినడు.వినిపించుకోడు.వాడి మానాన  వాడు ఉంటాడు.ఎవడిమాట వినని సీతయ్య అన్నమాట.  మీకు ఇంక బాగా అర్ధమవ్వలంటే స్ధూలశరీమము అంటే 60సం.రాలు వాడు అయితే సూక్ష్మశరీరము వాడు 50సం.రాలు వాడైతే..కారణ,వాయు,ఆకాశ,ఆత్మశరీరాలు వాళ్ళూ వరుసగా 40,30,20,10సం.రాలు  వారైతే ఇక మిగిలిన ఆఖరిశరీరమైన జ్యోతిశరీరవాడు 6 నెలలు వాడు అన్నమాట.ఇందులో సప్తశరీరాలు వాళ్ళు మన మాట వింటారు కాని ఆఖరి జ్యోతిశరీర వాడు మన మాట వినడు.కాని వాడిమాట మనము వినకతప్పదు గదా.వాడు ఏడిస్తే సముద్దాంచాలి.బుజ్జగించాలి.వాడు నవ్వితే మనము నవ్వాలి.మన మోక్షపీలక ఈ పసిపిల్లాడు మన:సత్వమున్న జ్యోతిశరీర చేతిలో ఉంది అన్నమాట.వాడు నిశ్చలస్ధితిలో  అనగా వాడు ఏటు కదలకుండా మెదలకుండా ఉంటే అపుడు మన అరుణజ్యోతి నిశ్చలమోక్షస్ధితి పొందినట్లే అన్నమాట.మరి ఆరునెలలు పిల్లవాడు కదలగుండా మెదలగుండా ఎలా ఉండాలే వాడికి అర్ధమయ్యేవిధముగా ఎలా చెప్పాలో 64 వ డైమర్ష కోడ్ - డీకోడ్ అన్నమాట. అనగా ఆ పిల్లాడికి మనము అర్ధమయ్యేవిధముగా చెప్పలంటే మనము పిల్లాడు అవ్వకతప్పదు గదా.అపుడు మనకి చెప్పటానికి ఇంకో పిల్లాడు రాక తప్పదు.మారకతప్పదు.అన్నమాట. కాబట్టి మన మోక్షసాధనాంతగూడ అంతిమ శరీరమైన జ్యోతిశరీరము దగ్గర ఆగిపోతుంది.మిగిలిన సప్తశరీరాలు మోక్షాలు పొందుతున్నాయి కాని ఈ అంతిమ జ్యోతిశరీరము ఇంక ఎన్నడికి మోక్షము పొందకుండా అనగా ఇది ఆదిలో ఎలాయితే శూన్యములోంచి వచ్చిందో అలా వెనక్కి తిరిగి వెళ్ళలేకపోతుంది.మన సప్తశరీరాలు దానిని వెనక్కి పంపించాలని మోక్షసాధన విశ్వప్రయత్నాలు చేస్తున్న అది జరగడము లేదు.కారణము అది స్వయంభూ జ్యోతి.దానికి జననము లేదు.జననమే లేనపుడు మరణము ఎక్కడినుండి వస్తుంది.దానికి పంచభూతాలు,కాలమే అవసరమే లేదు. ఏ ఆధార మాయ లేకుండా దానింతటా అదే స్వయంభూ జ్యోతిగా  ఉద్భవించింది.దీనిని నుండి వచ్చిన మిగిలిన సప్త శరీరాలకి పంచభూతాలు,కాలము,మాయలు,మర్మాలు,జ్ఞానాలు ఉన్నాయి.అంటే మన సప్తశరీరాలు అనేవి ఉల్లిపాయ లాంటిది అయితే జ్యోతిశరీరమనేది ఉల్లిపాయ వాసన లాంటిది అన్నమాట.ఇపుడు ఉల్లిపాయలు పొరలు ఒకదానితర్వాత మరొకటి తీసివెయ్యవచ్చు కాని ఉల్లివాసనకి పొరలు అనే ఆకారము లేదు.కాని వాసన అనే అనుభవ అనుభూతి ఉంది.ఇది పోవాలంటే సబ్బు వాడాలి.మరి సబ్బువాసన పోవాలంటే సర్ఫ్ వాడాలి.దీని వాసన పోవాలంటే మరొకటి వాడుతున్నాము.కాని ఇక్కడ వాసన అనేది పోవడము లేదు రూపాంతరము చెందుతోందని తెలుసుకొండి.అనగా కర్మ అనేది  కర్మవాసనగా మారి మన జీవితాలన్ని సంకా నాకిస్తోంది అన్నమాట.మనకి అంతిమమోక్షము రాకుండా చేస్తుంది అన్నమాట.అనగా జ్యోతిశరీరానికి కర్మవాసన అనేది ఉంది.దీనికి ఈ శూన్యము యొక్క ఆదికర్మ ఆలోచన వలనే ఆ తర్వాత వచ్చిన ఈ జ్యోతిశరీరానికి కర్మవాసన అయింది.మారింది.మారుతోంది.ఈ స్ధితికి వచ్చేసరికి సాధకుడి అంతిమ జ్యోతిశరీరము కాస్త రూపము అంతము చెసుకోవాల్సినచోట రూపాంతరము చెందుతోంది అన్నమాట.ఈ రూపాంతరాలు ఆగిపోవాలంటే కర్మవాసన క్షయం అవ్వాలి.ఇది అవ్వాలంటే కర్మక్షయం అవ్వాలి.ఇది జరగాలంటే మన ఆదికర్మ ఏమిటో తెలుసుకోవాలి.ఇది తెలుసుకొనే ప్రయత్నములోనే నూటికి 99.99 శాతము మంది తెలుసుకోలేకపోతున్నారు.కారణము మన సాధన జ్యోతిశరీరానికి వచ్చేసరికి మన అరుణజ్యోతి శరీరము యొక్క జ్యోతిన్ని మన అవివేకబుద్ధి అజ్ఞానమాయలోపడి వెలుగుతున్న జ్యోతిన్ని ఆర్పివేసుకోవడము లేదా వెలింగించగూడదనే అనుకోవడము చేస్తున్నారు.తద్వార కర్మ కాస్త క్షయము కాకుండా కర్మవాసనగా క్షణాలలో మారడము తద్వార పున:కర్మజన్మచక్రములో పడిపోవడము జరుతోంది.ఇందులో 0.1 శాతము మంది మాత్రమే వెలిగే జ్యోతిగా ఉండాలనే అవకాశము తీసుకొని కర్మవాసన నుండి కర్మక్షయం పొంది ఆరని అరుణజ్యోతిగా మారుతున్నారు.అంటే మన అంతిమ మోక్షసాధనాంత గూడ మన జ్యోతిశరీరస్ధితికి వచ్చినపుడు మనము ఎంచుకొనే  జ్యోతి వెలిగాలా లేదా జ్యోతి ఆరిపోవాలా అనే అవును లేదా కాదు అనే అవకాశము బట్టి ఉంటుంది అన్నమాట.  అపుడు ఈ స్ధితికి వచ్చినపుడు మన బుద్ది చెప్పినదానినిబట్టి మన స్ధితి ఏమిటో నిశ్చయించబడుతోంది.అందుకే బుద్ది కర్మనూసారము నడుస్తోందని మన పెద్దలు చెప్పడము జరిగింది.అందువలన మనకి పూర్ణమోక్షయోగముంటే రాకతప్పదు.యోగమున్నవాడు యోగి అవ్వకతప్పదు అన్నమాట.అనగా 64 జ్యోతులలో ఆరిపోయేజ్యోతులుగా అమ్మవారి 36 అంశాలుంటే వెలిగే జ్యోతులుగా అయ్యవారి 27 అంశాలుంటే ఎన్నడికి ఆరని అరుణజ్యోతిగా ఏకైక కుమారస్వామి అంశ ఉంది.ఇందులో ఆరిపోయేజ్యోతులు చచ్చినట్లుగా పున:కర్మజన్మ చక్రములో గావాలని పడాలని అమ్మవారి విధిరాతలో ఉంటే అదే అయ్యవారి విధిరాతలో ఎంచుకొనే అవకాశమును బట్టి పున:చక్రములో పడాలని రాసి ఉంటే అదే పళిని కుమారస్వామి అంశలో ఎన్నడికి ఆరనిజ్యోతిగా ఉండాలని విధిరాత రాసిపెట్టి ఉంది.ఇక అందరుగూడ కుమారస్వామిన్నే పూజచేస్తే అందరుగూడ ఆరనిజ్యోతులుగా మారతారంటే కుదరదు.ఎందుకంటే మన సాధన మనజ్యోతిశరీరస్ధితికి వచ్చినపుడు మన ఆదిజన్మయైన జ్యోతిశరీరముగా ఉన్నపుడు ఏ అవకాశము తీసుకున్నావో అదియే మళ్ళీ నీ సాధన ఏన్నికోట్ల జన్మలు ఎత్తి ఇక్కడివచ్చినగూడ ఆ పాతదానినే అవకాశము తీసుకుంటావు.అంటే ఈ స్ధితి ఏమిటో మీకు బాగా అర్ధమవ్వాలంటే మీ ఆదిజన్మ జ్యోతిశరీరములో మీ జ్యోతి ఆరిపోవాలనే అవకాశము తీసుకున్నారు అనుకుందాం.ఎందుకంటే మోక్షమంటే శూన్యమేగదా.శూన్యమంటే దిట్టమైన చీకటియే గదా.ఈ చీకటి గావాలంటే వెలుగు ఉండగూడదు గదా అనుకొని ఆరిపోయే జ్యోతి అవకాశము తీసుకోవడము జరిగింది అన్నమాట.ఇలా ఆరిపోవడము వలన ఆ ప్రక్కనే ఉన్న వెలిగే దీపానికి ఓంటరితనము వలన ఈ ఆరిపోయే దీపమును వెలిగించడముతో  ఈ అపుడిదాకా అరిపోయు ఉన్న జ్యోతి వెలగడముతో పున:కర్మ చక్రములో పడకతప్పడములేదు.ఎందుకంటే మరణము తర్వాత జననమున్నట్లే..అవతలివాడి ఒంటరితనము పొగొట్టానికి ఆరిపోయిన వీడు జన్మ ఎత్తకతప్పడములేదు అన్నమాట.అపుడు మరుజన్మలో ఆరిపోయినవాడు తన సాధనజన్మ ద్వారా పూర్ణజ్ఞానమును పొంది తనజ్యోతిశరీరము పక్కవాడి ఒంటరితన బలహీనత కోసము జన్మ ఎత్తినదని జ్ఞానమును పొందినప్పడికి తన సాధన తిరిగి తనజ్యోతిశరీరాన్నికి వచ్చేసరికి తెలుసుకున్న జ్ఞానము మర్చిపోయే అపస్మారకస్ధితికి బుద్ధివెళ్ళడముతో తిరిగి జ్యోతి ఆరిపోవాలనే అవకాశము ఎందుకోవడము జరుగుతోంది.ఇలా 477 కోట్ల జన్మాలకి పూర్ణజ్ఞానము పొందినప్పడికి వాడి అవసర సమయములో ఈ జ్ఞానము మర్చిపోయేవిధముగా వాడి విధిరాత ఉంది అన్నమాట.ఎందుకంటే వాడు తన ఆదిజ్యోతిజన్మలో ఎన్నడికి వెలిగే జ్యోతి అవకాశము తీసుకోకూడదని ఈ జ్ఞానాలోచనయే మర్చిపోవాలని కేవలము ఆరిపోయేజ్యోతిగా తను శాశ్వతముగా ఉండాలని విధాత ద్వారా ఈ జీవుడే స్వయంకృత అపరాధముగా గావాలని విధిరాతగా రాయించుకోవడము 99 శాతం మంది చేసారు.ఇక దానితో ఎన్నడికి మార్చలేని మార్చుకోవాలనే జ్ఞానము అందినగూడ మార్చుకోలేని మార్పులేని విధాత విధిరాత మనకి మనమే రాయించుకోవడము జరిగింది.ఇక మిగిలిన 0.1   తాము ఎన్నడికి ఆరనిజ్యోతిగా ఉండాలని అవకాశము తీసుకోవడము జరిగింది.ఇక మిగిలిన ఒక శాతము మంది వెలిగే జ్యోతిగా ఉండాలనే అవకాశము తీసుకోవడము జరిగింది.కాబట్టి మన అంతిమ మోక్షానేది మనకి మనము ఆదిజ్యోతిజన్మలో ఏమిరాసుకున్నామో అదే జరుగుతుంది కాని మన పూజించే దైవాలు లేదా ఆరాంధించే గురువులు వలన ఏమి జరుగదు.మారదు.మార్చలేరు.వీళ్ళి కేవలము మనకి పూర్ణజ్ఞానమే ఇస్తారు అంటే మనకి ఎక్కడికి ఎలా వెళ్ళాలో మార్గము మాత్రమే చెపుతారు అంతేకాని ఈ మార్గము మీకోసము మార్చరు.మార్చలేరు.మార్చడము ఏవరితరము గాదని తెలుసుకొండి.అనగా వీరంతా మనకి మోక్షమార్గము గూర్చి చెప్పే చూపించే మోక్షజీవులు అన్నమాట. తద్వార మన అంతిమసాధనలో మన అంతిమజ్యోతి శరీరము కాస్త ఏమి అవకాశము అనగా ఆరిపోయే లేదా వెలిగే లేదా ఆరని జ్యోతి అవకాశాలలో ఏమి తీసుకున్నదో తెలుసుకోవడము తప్ప ఏమి చెయ్యలేమని తెలుకొండి.ఏమి మార్చలేమని తెలుసుకొండి.మార్చలని ఉన్న మార్చలేమని తెలుకొండి.ఎందుకంటే జ్యోతిశరీరానికి విధిరాతను మార్చుకొనే అవకాశమే ఉండదు.అది ఒకరు వెలిగిస్తే వెలిగించే దీపము ఆరిపోయేజ్యోతి అవకాశములో ఉంటే వెలిగే జ్యోతి అవకాశములో ఎది గావాలో ఎంచుకొనే అవకాశముంటే ఆరని జ్యోతిలో ఎలాంటి అవకాశముండదు అన్నమాట.అనగా ఆరిపోయే లేదా వెలిగే జ్యోతిలో ఆరిపోయేజ్యోతికి మార్పులేని విధిరాత  రాయడము జరిగింది.ఇక వెలిగే జ్యోతిలో రెండవ అవకాశముగా ఆరిపోయేజ్యోతి నుండి ఆరని జ్యోతిగా మారేవిధముగా విధిరాత రాసి ఉంది.అంటే మొత్తానికి ఆరిపోయేజ్యోతి లేదా వెలిగే జ్యోతిలో ఆరిపోయే జ్యోతి అవకాశము మీజ్యోతిశరీరము కాని ఆదిలో ఎందుకుంటే ఇక మీకు శాశ్వతముగా ఎన్నడికి పూర్ణమోక్షము అనగా జ్యోతిమోక్షము రాదు రాలేదు అన్నమాట.ఇక ఆరని లేదా వెలిగేజ్యోతిలో ఆరనిజ్యోతి అవకాశాలు మీ జ్యోతిశరీరము కాని ఆదిలో ఎంచుకొని ఉంటే మీకు ఖచ్చితముగా పూర్ణమోక్షము పొందే అవకాశముంది అన్నమాట.మరి మీ జ్యోతిశరీరము ఏ అవకాశము ఎంచుకున్నదో మీకు తెలుస్తుంది.అనగా మీ నోటితో దీపము అర్పివేసినట్లుగా లేదా అర్పిపోయే జ్యోతిగా ఉండాలని అనుకొనే దృశ్యము మీకు కనపడితే మీ జ్యోతిశరీర మోక్షస్ధితి అరిపోయేజ్యోతి అన్నమాట.అందుకే మన పెద్దలు నోటితో దీపము అర్పరాదు అనిచెప్పడము జరిగింది.ఇక ఎవరిజ్యోతి అయితే అరిపోయి దానికంతటే అదే వెలిగినట్లుగా కనపడితే అపుడు మీ మోక్షస్ధితి వెలిగేజ్యోతి అవకాశములో అరిపోయేస్ధితి నుండి అరనిస్ధితికి అనగా పూర్ణమోక్షజ్యోతి పొందినట్లు అన్నమాట.అదే మీకు అరుణచల అరుణగిరిమీద అరుణజ్యోతి ప్రతినిత్యము కనపడుతూంటే మీ సాధనస్ధితి అరని అరుజ్యోతిమోక్షస్ధితి మీ దేహము పొందినట్లే అన్నమాట.కాబట్టి ఎవరి మోక్షము వాళ్ళ జ్యోతిశరీరాలు ఎంచుకున్న అంతిమ అవకాశము మీద ఆధారపడి ఉన్నదని తెలుసుకొండి.అంతేకాని మీ దైవాల మీద లేదా మీ గురువుల మీద ఆధారపడి లేదని గ్రహించండి.విధిరాతను ఎవరికి వారే తెలుసుకుంటారు కాని మార్చలేరని తెలుసుకొండి.మార్చాలన్నా మార్చలేరు అన్నమాట.మారాలని మన రాతలో ఉంటే తప్ప అది మారదని తెలుసుకొండి.

ఇక మీకు ఈ జన్మసాధనలో అరుణగిరి మీద జ్వాలాతో వెలిగే అరుణజ్యోతి ప్రతినిత్యము మీకు దర్శనమైతే మీ అంతిమ జ్యోతిశరీరము ఎన్నడికి ఆరని అరుణజ్యోతిగా ఉన్నట్లుగా మనము తెలుసుకోవాలి.అదే అరుణగిరి మీద మీకు అరుణజ్యోతి కనిపించడము లేదంటే మీది ఆరిపోయినజ్యోతి అని తెలుసుకోవాలి.అదే అరుణగిరి మీద ఒకసారి వెలుగుతూ కనిపించి మరొకసారి కనిపించకుండా అరుణజ్యోతి స్ధితిలో మీకు దర్శమిస్తుంటే మీది వెలిగే జ్యోతి శరీర స్ధితియని తెలుసుకొండి.విధిరాతను మార్చడము ఎవరితరము కాదు.

జరిగేది జరుగకమానదు.
జరగనిది ఎన్నడికి జరుగదు.
అనుకున్నవి అన్నీ జరగవు..
అనుకోలేదని జరగకుండా ఆగవు కొన్ని..
ఏది జరిగిన మన మంచికే 
అనుకోవడమే మన పని


ఇంతకి జ్యోతిమోక్షం పొందలేమా?

స్వామి..మీరు చెప్పినప్రకారము చూస్తే అంతిమ జ్యోతిశరీరానికి అంతిమ జ్యోతిమోక్షమనేది మన ఎంచుకొనే అవకాశము అదిగూడ విధిరాత ప్రకారమే జరుగుతుందని చెప్పడము జరిగింది.కాని ఆదిజన్మలో తెలియక మేమంతాగూడ ఆరిపోయే జ్యోతి అవకాశముఎంచుకొని ఉంటే దాని వలన మేము తిరిగి పున:కర్మజన్మ చక్రములో పడటము అంటే సప్తసముద్రాలు ఈది ఇంటి వెనుక మురుగు కాలువలో పడి చనిపోవడము లాగా ఉంది గదా దీనికి ఇలా జరగకుండా ఉండటానికి ఏదైన పరిష్కారమార్గము లేదా? అంటే మేము ఆరిపోయే జ్యోతి లేదా వెలిగే జ్యోతి అవకాశము ఎంచుకున్నగూడ పున:కర్మజన్మ చక్రములో తిరిగి  పడకుండా చేసే అవకాశము లేదా అని అడిగితే ఉంది.అసలు విధిరాత మనకి ఒక లక్ష్యము మాత్రమే నిర్ధేశిస్తుంది.దానిని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గాలు మన ఆలోచన బుద్ధికి వదిలేస్తుంది అని ముందు తెలుసుకొండి.అంటే ఒక పని చెయ్యమని చెపుతుంది కాని అది ఇలాగే చెయ్యమని లేదా చేసుకొమ్మని చెప్పదు అన్నమాట.అనగా పూర్ణమోక్షము పొందలంటే అరుణగిరి అనుగ్రహము పొందమని మన విధిరాత చెప్పితే దానికి వెళ్ళడానికి నువ్వు ఎంచుకొనే మార్గము అనగా కర్మ-భక్తి-జ్ఞాన-ధ్యాన మార్గాలలో ఎదో ఒకటి మనకి మనమే ఎంచుకొనే అవకాశము ఇస్తుంది కాని ఫలాన మార్గము ద్వారానే అరుణగిరి అనుగ్రహము కల్గుతుందని చెప్పదని ముందు తెలుసుకొండి.ఈ లెక్కన చూస్తే మనకి అంతిమ జ్యోతిశరీర మోక్షము పొందడము మన లక్ష్యమని మన విధిరాత చెప్పడము జరుగుతోంది కాని దీనికున్న ఆరే,ఆరని,వెలిగే జ్యోతులు అవకాశాలు మన బుద్ధి కర్మానుసారముగా మనకి మనమే ఎంచుకోవాలి అన్నమాట.ఇందులో ఆరని జ్యోతి అవకాశము తీసుకుంటే ఎలాంటి సమస్య లేదు కాని ఆరే అలాగే వెలిగి ఆరే జ్యోతి అవకాశాలు తీసుకుంటేనే మనకి పున:కర్మజన్మ చక్రములో పడిపోవడము జరుగుతోంది.కాని ఇక్కడ ఒక విషయము మనము గమనించాలి.నిజానికి కేవలము మనకి మూడు జ్యోతులు అనగా ఆరే,వెలిగే ఆరే,ఆరని అనే మూడు   అవకాశములు  లేవు.ఉన్నది కేవలము ఆరని జ్యోతి అవకాశమే అన్నమాట.ఇది మీకు బాగా  అర్ధమవ్వలంటే నా స్వానుభవము ఒకటి చెపుతాను.అది ఏమిటంటే పౌర్ణమి తిధినాడు మేము గిరిప్రదక్షిణము చేస్తున్నపుడు కొండ మీద ఒక జ్యోతి దర్శనమైంది.అది ఆరకుండా నిరంతరముగా వెలుగుతూ కనిపించింది.ఇదే జ్యోతిన్ని కొండకి మరొ దిక్కుకి వెళ్ళినపుడు చూస్తే వెలుగుతూ ఆరుతూ కనిపించింది.మళ్ళీ మరొ దిక్కుకి వెళ్ళి ఈ జ్యోతిన్ని చూస్తే పూర్తిగా ఆరిపోయినట్లుగా కనిపించింది.కాని నిజానికి ఈ జ్యోతి ఆరిపోలేదు.వెలిగి ఆరిపోలేదు.ఎన్నడికి ఆరని జ్యోతిగానే ఆన్ని దిక్కులో ఉంది.అపుడు విచారణ చేస్తే జ్యోతి వెలిగే ఆరిపోయే దిక్కులో మాకు చెట్టుకొమ్మలు అడ్డు వచ్చాయి.ఈ కొమ్మల ఆకుల మధ్య కదిలికల తేడాల వలన అనగా కొమ్మ ఆకు అడ్డు వచ్చినపుడు కనిపించే జ్యోతి కనిపించకుండా పోతుంది అని అదే కొమ్మ ఆకు అడ్డు లేనపుడు జ్యోతి కనపడుతోందని అలాగే మరొ దిక్కులో ఎకముగా మాకు చెట్టు అడ్డురావడముతో కనిపించే జ్యోతి అరిపోయిన జ్యోతిగా కనపడినదని నిజానికి ఈ జ్యోతి ఎపుడూగూడ ఆరని మారని జ్యోతిగా ఉన్నదని నాకు అర్ధమైంది.ఈ లెక్కన చూస్తే మన జ్యోతిశరీర అరుణజ్యోతి గూడ ఎన్నడకి ఆరని మారని అరుణజ్యోతియే అని తెలుస్తోంది గదా.కాని మనకి ఉన్న మాయ,మోహ,వ్యామోహ వలన అరనిజ్యోతి కాస్త ఆరిపోయే జ్యోతిగాను వెలిగి ఆరిపోయే జ్యోతిగా మనకి కనపడుతోందని తద్వారా మనము నిజముగా ఎన్నడికి ఆరని మారని జ్యోతి అవకాశము ఎంచుకున్నగూడ మనకి ఉన్న ఇసుమంత అనుమానభయా అవివేక అజ్ఞాన బుద్ధి కల్పించే మాహమోహమాయ వలన అరిన లేదా వెలిగే అరిపోయే జ్యోతుల అవకాశము  ఎంచుకున్నామని మనకి మనమే భ్రమ,భ్రాంతి మాయలో పడుతున్నాము.తద్వారా పున:కర్మజన్మ చక్రములో పడిపోతున్నామని భావన భావించుకోవడముతో అసత్యమైనది కాస్త ఈ భావన సత్యముగా కనపడుతోంది అన్నమాట.అంటే ఎన్నడికి ఆరని మారని జ్యోతి అవకాశము మనము ఎంచుకున్నగూడ అది ఎంచుకోలేదని అనవసర భయానికి గురీవుతున్నాము ఎందుకంటే మనకి ఉన్న అనుమానభయమాయ వలనే ఇదింతా జరుగుతోందని ఇపుడికైన తెలుసుకొండి.అంటే మనకి ఉన్న అంతిమ మాయ పోవాలంటే మనము అన్నింటాయందు రాహిత్యస్ధితి అనగా ఏమిలేదు ఉన్నదింతా శూన్యమే..కనిపించేదింతా శూన్యమే అనే భావము మనలో పాతుకొనిపోవాలి.అంటే ఇన్నాళ్ళు మనమంతా ఆకాశ లింగము చూడమంటే ఆకాశములో లింగమును చూడటానికి ప్రయత్నసాధన చేస్తున్నాము.నిజానికి ఆకాశమే లింగమని తెలుసుకోవడము లేదని గ్రహించండి.అంటే జ్యోతిర్లింగమును చూడమంటే జ్యోతిలో లింగమును చూస్తున్నంత సేపు అది మనకి అరే లేదా వెలిగి ఆరే జ్యోతిగానే కనపడుతుంది అదే జ్యోతియేలింగమని గ్రహిస్తే మనకి ఉన్న మాయ మాయం అయ్యి ఆరని మారని జ్యోతిర్లింగముగా దర్శనమిస్తుంది.ఇదియే అంతిమ పూర్ణజ్యోతి మోక్షమవుతుంది.ఈస్ధితిన్ని పొందటానికి ఆదిరుద్రుడు అష్టశరీరాలతో 64 కపాలజన్మలు అనగా 1,3,5,7,9,11,13,15 వరుసలతో 64 కపాలధారిగా మారి ఈ పూర్ణమోక్షస్ధితి పొందడము జరిగింది.ఆయనలోంచి వచ్చిన మనము కాస్త అనుమానభయమాయలో పడటముతో ఆరని మారని అరుణజ్యోతిగా మనము మారినపుడికి మారలేదని మళ్ళీ తిరిగి రూపాంతర పున:కర్మ జన్మ చక్రములో పడిపోతున్నాము.నిజానికి మనంతాగూడ ఆదిలో ఆరని మారని అరుణజ్యోతులేనని అలాగే పూర్ణజ్యోతి మోక్షపొందిన మోక్షజీవులేనని ముందుగా మనము జ్ఞానము ద్వారా తెలుకొండి.నేను తెలుసుకున్నాను.ఇక మీరు తెలుసుకొనే ప్రయత్నసాధనలో ఉన్నారు అన్నమాట.ఆదిలో ఆదిరుద్రుడు అజ్ఞానమాయలో పడి 64 భాగాలుగా విడిపోయి తిరిగి ఏకత్వస్ధితిలో పూర్ణజ్ఞానమును పొంది తాను ఎన్నడికీ ఆరని మారని అరుణజ్యోతియని తెలుసుకొని తనకి ఉన్న అంతిమ మాయను మాయం చెసుకొని పూర్ణజ్ఞానముతో పూర్ణజ్యోతిమోక్షము పొందడము జరిగింది.ఇక మనకి ఉన్న అంతిమ మాయ అనేది ఆదిలో ఉన్న ఒక కర్మ కాస్త కర్మవాసనగా మారి అది మనల్ని మాయలో పడివేసి ఆరని జ్యోతిన్ని ఆరే లేదా వెలిగే ఆరిపోయే జ్యోతి అవకాశము ఎంచుకొన్నావనే భ్రమ బ్రాంతిలో మనల్ని పడివేసి పున:కర్మజన్మచక్రములో పడివేస్తుంది తెలుసుకొండి.ఈఅంతిమ కర్మవాసయే మనకి అంతిమ జ్యోతిశరీర బలహీనతగా  మారి మాయలో పడివేస్తుంది.తద్వారా పున:కర్మజన్మచక్రములో పడివేస్తుంది.మరి ఈ మాయ మాయం అవ్వాలంటే ఏమి చెయ్యాలో బృహదరణ్యోపనిషత్తు చెప్పడము జరిగింది.అదే జ్యోతి శాంతి మంత్రము అనగా 

అసతోమా సద్గమయా..
తమసోమ జ్యోతిర్గమయా..
మృత్యోర్మా అమృతంగమయా... 

అనగా
 అజ్ఞానము నుండి జ్ఞానము వైపు నడిపించు..
 చీకటి నుండి వెలుగుకి నడిపించు..(అనగా రే జ్యోతి నుండి ఆరని అరుణజ్యోతికి నడిపించు )
మారే మృత్యువు జన్మల నుండి ఎన్నడికి మారని శాశ్వత అమృత అమరత్వము వైపు నడించు 

అని చెప్పడము జరిగింది.నిజానికి ఈ శ్లోకము అనేది అరుణగిరి అరుణజ్యోతికి గూర్చి చెప్పడము జరిగినదని చాలామందికి తెలియదు.ఇపుడు మీరందరూ మీకున్న అంతిమ మాయగూడ తొలగించుకోవాలంటే ఈ శ్లోకమును ఉదయము నిద్ర లేచిన తర్వాత అలాగే రాత్రి పడుకొనేముందు ఒకసారి భావముతో సహ చదువుకొండి అలాగే 14 సార్లు అరుణచల శివ నామస్మరణ చేసుకొండి.అలాగే జీవితములో ఒకసారైన ప్రత్యక్షముగా అరుణచల క్షేత్రమునకు వెళ్ళి కాలినడకతో కాలిచెప్పులు లేకుండా ఒక ప్రదక్షిణము చెయ్యండి.తద్వారా మీకు అంతిమజ్యోతిపూర్ణమోక్షము పొందే అవకాశము వచ్చినట్లేనని గ్రహించండి.ఒకవేళ ఈ క్షేత్రములో చనిపోయే అవకాశముంటే చనిపొండి లేదంటే మీరు ఎక్కడ ఉన్న ఈ శ్లోకము అలాగే అరుణచల శివ నామస్మరణ ప్రతినిత్యము చేసుకుంటూ చనిపోయినగూడ మీకు అరుణచల క్షేత్రములో చనిపోతే వచ్చే అంతిమమోక్షస్ధితిన్ని మీరుగూడ పొందుతారని తెలుసుకొండి.ఎందుకంటే ఈ విశ్వమంతాగూడ ఆరని మారని అరుణజ్యోతిమయమే గదా.అపుడు ఎక్కడ చనిపోయిన ఒక్కటే గదా.కాని భావప్రాప్తి అనగా అంతటా మారని ఆరని అరుణజ్యోత్లింగమనే ఏకత్వ ఏకభావప్రాప్తి సహజస్ధితిన్ని మనము పొందాలి.ఇది పొందాలంటే మనకి ఉన్న కర్మవాసన పోవాలి.ఇది పోవాలంటే ఆది కర్మ పోవాలి.ఇది పోవాలంటే అరుణగిరి అరుణజ్యోతి అనుగ్రహము పొందితే కాని ఈ ఆది కర్మ క్షయము కాదు.ఇది క్షయము అయితే కాని మనకి మనము ఏకత్వ ఏకభావ సహజస్ధితిలో ఉన్నామనే పూర్ణజ్ఞానము మనకి అందదు.అపుడే మనకి  పూర్ణమోక్షాత్మానుభూతి పొందడము జరుగుతుంది.ఈ స్ధితిన్ని ఏవరైన స్త్రీ,పురుష లింగభేదము లేకుండా సంసారి లేదా సన్యాసి గా ఎక్కడైన ఎపుడైన పొందడము జరుగుతుంది.ఇది పొందిన తర్వాత మీలో తపన తాపత్రాయాలు,ఆశలు,ఆశయాలు,సంకల్పాలు,స్పందనలు తగ్గిపోయి ప్రశాంత మానసి ఆనందస్ధితిన్ని పొందడము జరుగుతుంది.ఇదియే అసలు సిసలైన పూర్ణజ్యోతిమోక్షస్దితి అవుతుంది.కాని నిజానికి మనంతా ఆదిలోనే ఈ సహజస్ధితిన్ని పొందినప్పుడికి మనకి ఉన్న అంతిమ మాయ అనగా ఈ స్ధితి పొందలేదని ఇది పొందాలని అనుమానభయముతో వెనుతిరిగి పొందిన సహజస్ధితి నుండి పొందని అసహజస్ధితికి చేరుకొని మనకి మనమే మాయలో తిరిగి పడుతున్నాము. ఇది ఏలా ఉంటుంది అంటే శాంతి పొందాలని శాంతిగా ఉన్న మనము కాస్త అశాంతిగా మనకి మనమే మారుతున్నాము.అంటే మన సహజస్ధితిన్ని మర్చిపోయి అపస్మారకస్ధితి పొంది అసహజస్ధితికి మనకి మనమే పొందుతున్నాము.మనకి మనమే రూపము అంతమయ్యినగూడ గావాలని భావరూపాలతో రూపాంతరము చెందుతున్నాము.అసలు మనము పూర్ణజ్యోతిమోక్షము గూడ పొందిన సహజస్ధితిలో ఉన్నామని అనుకోవడము కాకుండా అనుభూతి పొందితే చాలు.దీనికి ఆది కర్మ క్షయం అయితేకాని మనకి ఈ అంతిమ మాయ మాయం అయ్యి ఈ అంతిమ మోక్షానుభూతి పొందలేమని ఇపుడికైన తెలుసుకొండి.చచ్చినవాడు తిరిగి బ్రతకడము..బతికినవాడు చావడము అనేది మాయ అన్నమాట.నిజానికి మనంతా జనన-మరణము లేని స్వయంభూ అని ఏవరైతే తెలుసుకొని దానిని అచంచల విశ్వాశముతో నమ్ముతారో వాడే మోక్షగామి అవుతాడు.వాడే పూర్ణమోక్షము పొందిన పూర్ణజ్ఞాని అవుతాడు.వాడే ఎన్నడికి ఆరని మారని అరుణజ్యోతి అని ఆత్మానుభూతిని పొంది పరిత్యాగిగా మోక్షసన్యాసిగా మారతాడు.ఈ స్ధితిన్ని ఆదిలోనే అందరు ప్రతిజీవి పొందింది.కొత్తగా పొందటానికి ఏమిలేదు.పాతదానినే తిరిగి కొత్తగా పొందాలని..పొందమని భ్రమ భ్రాంతిగా అంతిమమాయగా అపస్మారకస్ధితిలో పడి పొందినస్ధితిన్ని పొందలేదని తిరిగి పొందాలని పొందటానికి విశ్వప్రయత్నసాధన చేస్తున్నామని తెలుసుకొండి.ఇపుడికైన ఈ జన్మలైన మీరు చేస్తున్న అంతిమ మాయ తప్పు తెలుసుకొని ఈ జన్మను అంతిమజన్మగా చేసుకొండి.

ఆది సిద్ధయోగి కనిపించారు:




స్కాందపురాణములో మహేశ్వరఖండములో అరుణచలక్షేత్ర మహత్యం గూర్చి రెండు భాగాలలో చెప్పడము జరిగింది.ఇందులో ఆదిశివుడు కాస్త గుండు కొట్టించుకొని నడుమకి ఒక గుడ్డ కట్టుకొని సిద్ధయోగిగా అరుణగిరి లోపలకి వెళ్ళారని ఒక శ్లోకములో చెప్పడము జరిగింది.ఈయన్ని భౌతికముగా చూడాలని రమణమహర్షి ప్రయత్నించి మార్గమధ్యలో కాలుకి తెనెటీగలు కుట్టడముతో తనప్రయత్నమును విరమించుకొని వెనుతిరగడము జరిగింది.దానితో నాకు ఈ సిద్ధయోగిని చూడాలనే తపనతాపత్రయము మొదలైంది.ప్రస్తుతానికి నా సాధన జ్యోతిశరీర స్ధితి అనగా ఆరని మారని అరుణజ్యోతి స్ధాయికి వచ్చినదని తెలుసుగదా.అనగా అరే,మారే,మారని జ్యోతులు స్ధితికి అనగా ఎవరైతే అనుమానము తను జ్యోతిగా మారినానో లేదో అనుమాన మాయ నుండి దాటితే ఆరే జ్యోతిగాను..ఎవరైతే మృత్యుభయము దాటతారో వాళ్ళు మారే జ్యోతిగాను..ఎవరైతే ప్రతిస్పందనాలు మాయ దాటుతారో వారు మారని జ్యోతిగా మారతారని తెలుసుకొండి.జ్యోతిస్వరూపము ఏదైనగూడ కాంతివెలుగుతో ఉన్న జ్యోతిశరీరముతో ఉంటుందని గ్రహించండి.ఇకపోతే నా వ్యక్తిగత అభిప్రాయప్రకారము పూర్ణమోక్షము అంటే అనాదగా ఉన్న పూర్ణశూన్యము నుండి ఆదిలో వచ్చిన ఆది అరుణజ్యోతి కాస్త వెనక్కి తిరిగి శూన్యములో శూన్యమైతేనే అది పూర్ణమోక్షమవుతుందని..అదియే విశ్వమోక్షమవుతుందని అనుకున్నాను.ఇది ఇలా ఉంటే ఒకరోజు అరుణచలములో నేను ఉన్న అద్దె ఇంటికి ఒక బట్టతలతో చిరిగిపోయిన నల్లదుస్తులతో నల్లని శరీరముతో వృద్ధసాధువు ఆకలిగా ఉన్నదని వచ్చాడు.సమయానికి నా దగ్గర ఆహారము లేకపోతే ఏదైన ఎక్కడైన తినమని డబ్బులు ఇచ్చాను.అతను వీటిని తీసుకొని కొండవైపు వెళ్ళుతూండేసరికి నాకేదో సందేహము వచ్చి ఈ సాధువును అతనికి తెలియకుండా వెంబడించాను.కొంత సమయము తర్వాత అతను జనాలలో కలిసిపోయి నాకు కనిపించలేదు.నేను ఇంటికి వచ్చి ఏదో తెలియని ఆవేదనతో ఇంటిపైకి వెళ్ళి కనిపించే అరుణగిరిని తదేకముగా చూస్తుండగా ఆ వృద్ధసాధువు కొండపైకి ఎక్కుతూ సగము దూరము ఎక్కేసరికి ఒక జ్యోతిగా మారి కొండలోపలకి వెళ్ళేసరికి అసలు నేను ఏమిచూశానో ఒక క్షణము నాకు అర్ధముకాలేదు.అపుడు కొండలోపల ఉండే ఆదిసిద్ధయోగి విషయము నాకు జ్ఞానస్ఫురణ అయింది.అంటే ఈయన ఆయనే అనుకొనేలోపులే నాకు యోగమత్తు ఆవరించడముతో ధ్యానములో త్రినేత్రము నందు ఈ సాధువు కాస్త జ్యోతిశరీరముతో ఆదిసిద్ధయోగిగా కనిపించారు.ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఏదైన తప్పు చేసేసమయములో భౌతికముగా అలాగే మానసికముగా నా ధ్యానము నందు కనిపించే వరము ఆయన నాకు ఇవ్వడము జరిగింది.అలాగే నాకు ఏదైన సమస్య వచ్చినపుడో ఉన్న అవకాశాలలో ఏదీ తీసుకోవాలో తెలియని అయోమయపరిస్ధితిలో వచ్చినపుడు అమ్మవారు  కాస్త అరుణజ్యోతిగా అరుణగిరి మీద కనపడిన అవకాశమునే నా సమస్యకి పరిష్కారమార్గమునే ఎంచుకొనే వరము ఇచ్చింది.ఇలా వీరిద్దరు గాకుండా ఆదిదక్షిణమూర్తి తన పూర్ణజ్ఞానమును నా సాధన పూర్తిచెయ్యటానికి అందిస్తూన్నారు.ఇలాగే పచ్చయాను అమ్మవారు,మహలక్ష్మీదేవి,దుర్గామాత,హనుమ,నరసింహస్వామి,రమణమహర్షి,
శేషాద్రిస్వామి ఇలా వీరంతా తమ తమ ఆకాశ,ఆత్మశరీరాలతో అగుపించడము ఆరంభించారు.



కాని ఒక ఆదిసిద్ధయోగి మాత్రము కేవలము జ్యోతిశరీరముతో కనపడితే ఇక మిగిలిన వారంతా ఈ శరీరము తప్పించి వారి సప్తశరీరాలతో కనిపించడము జరుగుతోంది.మరి వీరందరికి జ్యోతిశరీరముతో ఎందుకు నాకు అగుపించడముతో కారణము తెలుసుకోవాలనే తపన నాలో మొదలైంది.ఇందులో నాకు తెలియని మర్మముందని నాకు అనిపించింది.ఈ రహ్యచేధన ఆరంభమైంది.అపుడు ఆదియోగైన ఆదిరుద్రుడు ఒకడు మాత్రమే మహమృత్యుడైనారని మిగిలినవారిలో ఎవరుగూడ అవ్వడము లేదని గ్రహించాను.దానితో ఈయన కాస్త ఆరని మారని అరుణజ్యోతిగా జ్యోతిశరీరముతో సజీవముగా నిత్యముగా సత్యముగా తిరుగుతూంటే మిగిలినవారంతా గూడ ఆరే,మారే జ్యోతులుగా మారి ఆత్మశరీరముతో అశాశ్వత మరణాలు పొందుతున్నారని గ్రహించాను.అంటే అమృతము సేవించిన దేవతలకిగూడ మరణము వస్తే కాలకూట విషమైన హలహలము సేవించిన ఆదిశివుడికి మరణము రావడము లేదంటే అది ఆయన పొందిన మహమృత్యుంజయస్ధితియే కారకమని  తెలుస్తోంది గదా.మరి ఈయన ఒక్కడే ఈ స్ధితిన్ని ఎలా పొందాడో తెలుసుకోవాలనే ఆలోచనతో నా సాధన పరిశోధన మొదలైంది.అపుడు ఈయన ఆరని మారని జ్యోతిశరీరముతో ఉన్నపుడు స్పందించడము అనగా స్పందనరాహిత్యస్ధితి పొంది స్ధానేశ్వరుడిగా మారడముతో ఈయన కాస్త జ్యోతి నుండి జ్యోతిబిందువుగా మారడము జరిగింది.ఈ బిందువే శ్రీచక్రములో ఉండే అమృతబిందువు అన్నమాట.మనలో ప్రతిస్పందనలు ఆగిపోతే ఆరని జ్యోతిగాను అదే మనలో స్పందనలు ఆగిపోతే మారని జ్యోతిగాను మారతామని తెలుసుకొండి.అదే స్పందన,ప్రతిస్పందనలు ఈ రెండుగూడ ఆగిపోతే మనము కాస్త జ్యోతి నుండి జ్యోతిబిందువుగా మారతాము అన్నమాట.కాని ఈ స్ధితిన్ని ఆది ఈశ్వరుడే తప్ప ఇంతవరకు ఎవరుగూడ పొందలేదు.పొందలేరుగూడ.పొందకూడదు గూడ.ఎందుకంటే ఇక్కడ నాకు కలిగిన స్వానుభవము మీకు చెపుతాను.అది ఏమిటంటే పూర్ణమోక్షమంటే జ్యోతి కాస్త శూన్యమవ్వడమేగదా.అలా నేను అనుకొని ఆరనిజ్యోతిగా మారిన నేనుగూడ జ్యోతిబిందువుగా మారాలని నా సాధనతో విశ్వప్రయత్ననాలు చెయ్యడము ఆరంభించాను.



ఒకసారి నా ధ్యానము అతీతీవ్రస్ధాయిలో ఉండగా నా ధ్యానము నందు ఒక త్రికోణము దాని మధ్యలో ఒక బిందువు ఉన్నట్లుగా కనిపించసాగింది.ఈ త్రికోణమునకు మూడు బిందువులున్నాయి.అందులో పైన ఉన్న బిందువులో మారనిజ్యోతి ఉన్నట్లుగా..కింద ఉన్న రెండు బిందులలో ఒకవైపు ఆరేజ్యోతి..మరోవైపు ఉన్న బిందులో మారేజ్యోతి ఉన్నట్లుగా కనిపించసాగింది.ఈ త్రికోణ మధ్యభాగములో కాంతిజ్యోతి బిందువు ఉంది.ఇపుడు ఇందులో ఈ నాలుగు బిందువులను ఏ,బి,సి,డి (A,B,C,D) అనుకుంటే అనగా A అనగా aadi ఆది...బి అనగా బర్త్ (Birth-జననం) ..సి అనగా ఛెంజ్ (Change-మార్పు) డి అనగా DOT-డాట్ అలాగే E అంటే Empty(ఖాళి) అన్నమాట.



ఇపుడు నా ధ్యానాస్ధాయిన్ని పెంచిచూడగా త్రికోణ మధ్యభాగము అతీస్పష్టముగా కనిపించసాగింది.అపుడు మధ్య జ్యోతిబిందువు చుట్టూగూడ వెలుగుతున్న జ్యోతులున్నాయని నాకర్ధమైంది.అలాగే జ్యోతిబిందువుగా కనిపించే ప్రాంతములో ఒక బిందూఅకారముతో ఉన్న శూన్యము అతీస్పష్టముగా కనిపించసాగింది.అంటే నిజానికి అక్కడ బిందు లేదు.బిందు ఆకార శూన్యముంది అని నాకర్ధమైంది.



అపుడు ఈ శూన్యబిందువు నుండి ఆగ్ని కపాలము ఒకటి బయటికి రావడము గమనించాను.ఇదికాస్త పున:కర్మజన్మ చక్రములో    ఆత్మశరీరముతో రూపాంతరము చెంది పడటము గమనించాను.




అపుడు నా ధ్యానస్ధాయిన్ని పెంచి ఈ శూన్యబిందువు లోపలకి వెళ్ళిచూడగా ఒక గుహద్వారము కనిపించింది.దీని లోపలకి టెంపుల్ రన్ ఆట లాగా లోపలకి పోతూ పోతూండగా అట్టడుగున నాకు మూలాధారచక్రములో ఉండే స్వయంభూ లింగము కనిపించడముతో...ఈ లింగానికి లోపలికి వచ్చిన జ్యోతిబిందువు తాకి ఇదికాస్త ఒక అగ్నికపాలముగా రూపాంతరము చెంది తిరిగి వెనక్కి వచ్చినదారిన గుండా పైకి వస్తోందని నాకు అర్ధమై.. అంటే ఈ గుహ ద్వారము అనేది బ్రహ్మరంధ్రము నుండి మొదలై మూలాధారచక్రముతో అంతమవుతోందని అలాగే జ్యోతిశరీరమును అనగా వెలుగుతున్న జ్యోతిన్ని అర్పివేసుకొని శూన్యమనే ఆలోచనలోపడి ఈ శూన్యబిందువులోనికి దూకితే అపుడు మోక్షము దేవుడెరుగు..పున:కర్మజన్మచక్రములో పడుతున్నారని ...







అలాగే ఈ శూన్యబిందువే దేవుడి కన్ను అనగా గాడ్ ఐ గా ఉన్నదని..ఇందులో ప్రతి సాధకుడికి తన గత,రాబోవు,నడిచే సంఘటనలు ఈ కన్ను చూపిస్తోందని అలాగే మనకి ఉన్న నాలుగు యుగాలకి తగ్గట్లుగా నాలుగు నలుపు తెలుపు చిత్రాలు అనగా సత్యయుగము నందు శివశక్తి..తేత్రాయుగము నందు రామశక్తి..ద్వాపరయుగము నందు కృష్టశక్తి..కలియుగము నందు కలిశక్తి చిత్రాలను రికార్డ్ దృశ్యాలుగా ఆయా యుగాలకి తగ్గట్లుగా చూపించడము జరుగుతోందని..ఈ రికార్డ్ దృశ్యాలను కాకాసురుడు అనే రాక్షసుడు చూసి ఇపుడికి 11 సార్లు అలాగే 27 సార్లు జరిగిన రామాయణ,మహభారతాలు చూడటము చెప్పడము జరిగినదని 








అలాగే ఈ జ్యోతిబిందువు అనేది ఏకముఖ రుద్రాక్ష అనుకొండి.ఈ రుద్రాక్షకి రెండు మార్గాలు అనగా ఒకటి ముఖమార్గము అయితే రెండవది రంధ్రమార్గము అన్నమాట.ఈ రెండుమార్గాలు కలిపితే మనకి డి (D) ఆకారము వస్తుంది.ఇక్కడ డి అంటే నాశనము (DESTROYED) అనుకొని ఇందులోనికి పూర్ణజ్ఞానము పొందిన జ్ఞానులు ఈ జ్యోతిబిందువు తనలోనికి పడినవారిని నాశనము చెయ్యదని విభజన (DIVISIONS) చేస్తుందని తెలియక కొంతమంది తెలిసి లోకకళ్యాణార్ధము కోసము ఈ బిందులో పడి పున:సృష్టి చెస్తున్నారు.ఎలాంటే ఏకముఖ రుద్రాక్షలో ఉన్న రెండుమార్గలలో ప్రయాణించినగూడ అనగా ముఖమార్గములో ప్రయాణిస్తే పైన ఉన్న రంధ్రానికి చేరుకొని అక్కడ ఉన్న రంధ్రమార్గము ద్వారా క్రిందకి తిరిగి వస్తాడు.పోనీ కింద ఉన్న రంధ్రము ద్వారా రంధ్రమార్గములోనికి పైకి వెళ్ళితే అక్కడ ముఖమార్గము ద్వారా ప్రయాణించి కిందకి వస్తారు.ఇలా వీరంతాగూడ తమకి ఉన్న కర్మవాసన బలహీనత మాయ పోయేదాకా కిందకి పైకి పున:కర్మజన్మచక్రములో తిరుగుతూనే ఉంటారు.ఇక ఎవరైతే తమకి ఉన్న అంతిమ బలహీనత మాయ అనగా అనుమానము, భయం, ప్రతిస్పందన,స్పందన,ఆలోచన మాయ దాటుతారో వారు ఈ జ్యోతిబిందులో పడకుండా పైన దీనిచుట్టు ఉన్న అరుణగీతకి అవతలవైపు నిశ్చలస్ధితిలో శాశ్వత ఆరని మారని జ్యోతిగా ఉంటారు.ఉండిపోతారు.ఇది సత్యము.ఇది నిత్యము.గాకపోతే ఇంతా తెలిసినగూడ గావాలని జ్యోతిబిందులో పడితే నాశనము అవుతామని అనుకొని ఇందులో పడితే నాశనానికి బదులుగా విభజన చెందితే ఎవరు ఏమి చెయ్యలేరు.మళ్ళీ మీకు ఈ జ్యోతిదర్శనానికి 477 కోట్ల జన్మలు 1300 కోట్ల కర్మలు అలాగే వందకోట్ల కర్మవాసనలు పూర్తిచేసుకొని రావాల్సింటుంది.కాబట్టి నేను పొందిన ఈ జ్యోతిజ్ఞానము నమ్మి ఆరని మారని అరుణజ్యోతిగా ఉండండి.కాని జ్యోతిబిందువులో పడకండి.పడితే ఎవరు ఎమి చెయ్యలేరు.ఎవరి కర్మకి ఎవరు కర్తలు.మీ కర్మకి మీరే కర్త అవుతారని తెలుసుకొండి.అంతిమములో చేసే ఈ మహతప్పు ఈ జన్మలో చెయ్యకండి.అదే జ్యోతి నుండి జ్యోతిబిందువులో పడకండి.తద్వార ఈ జన్మను అంతిమజన్మగా చేసుకొండి.ఇదింతాగూడ మీ చేతులలో చేతలలో ఉన్నదని తెలుకొండి.ఈ ధ్యానదృశ్యాలు చూసేవాళ్ళు,చూపించేవాళ్ళు,చేసేవాళ్ళు ఇలా వీరంతాగూడ తమకి ఉన్న కర్మవాసన వలన వచ్చిన అంతిమ ఏకైక బలహీనత మాయను దాటలేక పున:సృష్టి చేస్తూ విశ్వానికి విశ్వమోక్షము పొందకుండా చేస్తున్నారు.ఎపుడైతే ఇలాంటివాళ్ళు ఈ జ్యోతిజ్ఞానమును పొంది జ్యోతిబిందులో పడకుండా బయటవైపు శాశ్వత నిశ్చల ఆరని మారని జ్యోతిగా ఉండిపోతారో అపుడు విశ్వానికి విశ్వమోక్షమే వచ్చినట్లే అన్నమాట.ఎందుకంటే జ్యోతిబిందులో నాశనమవ్వటానికి అలాగే విభజన చెందటానికి ఏమి ఉండదు గదా.అందుకే శక్తి అనేది నాశనము అవ్వదు.కొత్త దానిని సృష్తించలేము అని చెప్పడము జరిగింది. అలాగే ఈ విశ్వసృష్టి చక్రమును ఈ కన్ను నడిపిస్తోందని అనగా యోగము,భోగము అలాగే యోగ-భోగ మాయలు వద్దు అనుకునేవారికి మాత్రమే ఈ విశ్వచక్రము నుండి కర్మ-జన్మ-స్పందన రాహిత్యస్ధితిన్ని పొంది బంధవిముక్తి పొంది ఆరని మారని అరుణజ్యోతిగా శాశ్వత నిశ్చలస్ధితిలో ఉండి పూర్ణమోక్షము పొందుతున్నారని..నాకు జ్ఞానస్ఫురణ అందేసరికి.. నాకు ధ్యానభంగమైంది.

అంటే నిజానికి పూర్ణమోక్షమంటే ఆరని మారని  జ్యోతిగా ఉండాలి తప్ప ఈ జ్యోతి కాస్త ఈ జ్యోతిశూన్యబిందులో పడి ఆరిపోతే అది శూన్యమవ్వదని అదికాస్త పున:కర్మజన్మలకి దారితీస్తోందని నాకు జ్ఞానస్ఫురణ అయింది.



దీనికి నిదర్శనమే ఆరని మారని జ్యోతిస్వరూపుడైన కుమారస్వామి చేతిలోని శూలాయుధము పెట్టడము జరిగింది.దీనిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆయుధ అగ్రభాగము చూడటానికి జ్యోతిస్వరూపములాగా ఉంటుంది.అలాగే దీని మధ్యలో ఒక బిందువులాగా ఒక రత్నముంటుంది.అలాగే దీనికి పట్టుకోవటానికి పొడవైన కడ్డీ ఉంటుంది.అపుడు ఈ ఆయుధ అగ్రభాగమును ఒకజ్యోతిగా అనుకుంటే..ఈ భాగములో మధ్యలో ఉన్న రత్నమును జ్యోతి మధ్యబిందువు అనుకుంటే..దీనికి ఉన్న కడ్డీన్ని ఈ జ్యోతిబిందువు గుహమార్గముగా అనుకుంటే నాకు కల్గిన స్వానుభవము నిజమేనని మీకు అర్ధమవుతుంది.

అంటే మనలో స్పందన,ప్రతిస్పందన,అనుమానము,భయము,ఆశ,సంకల్పము లేకుండా చూసుకోగల్గితే మనము ఆరని మారని అరుణజ్యోతిగా శాశ్వత నిశ్చలస్ధితిలో ఉండిపోతాము.ఇదియే అసలు సిసలైన పూర్ణమోక్షమవుతుంది.కాని విశ్వానికి విశ్వమోక్ష రావాలంటే ఆది అరుణజ్యోతి శూన్యమవ్వాలి.కాని ఇది శూన్యమవ్వకుండా శూన్యబిందువుగా మారి పున:విశ్వసృష్టి చేస్తోంది.కాబట్టి ఎవరు చావు వారిదే అయ్యినట్లేగానే ఎవరి మోక్షము వారే పొందాలి.ఒకటి గుర్తుంచుకొండి.




మీలో జ్యోతిజ్ఞానము అర్ధమయ్యేతే మీరు ఈ జన్మలో అరుణజ్యోతిగా మారే యోగమున్నట్లే.అదే ఈ జ్ఞానము మీద మీకు ఎలాంటి అనుమానాలు లేకపోతే మీరు ఆరేజ్యోతిగాను..అదే మీలో అంతిమముగా వచ్చే మృత్యుభయము లేకపోతే మారేజ్యోతిగాను..అదే మీలో అంతిమముగా వచ్చే ప్రతిస్పందనలు లేకపోతే మారనిజ్యోతిగాను..ఇక అంతిమముగా మీలో దేనికి స్పందించకుండా స్పందనరాహిత్యస్ధితి పొందితే ఆరని జ్యోతిగా మారుతారు.ఎపుడైతే మీకు మీలో తెలియని చెప్పలేని శాంతిస్ధితి పొందుతారో మారని ఆరని జ్యోతిగా అదే మీ పూర్ణమోక్షస్ధితి అవుతుంది.అనగా తురీయాతీతస్ధితి అన్నమాట.అందుకే మనకి శాంతి మంత్రాలలో కాకుండా వివిధ మంత్రాలలో చివరన ఓంశాంతి:శాంతి:శాంతి:శాంతి అని చెప్పడము జరిగింది.







ఎవరైతే ఈ శాంతిస్ధితిన్ని పొందుతారో వారే పూర్ణమోక్షస్ధితి పొందినట్లే.అయితే ఈ స్ధితి ఈ దేహము పొందింది.మీరు పొందండి. ఇలాంటి శాంతి స్ధితిన్ని పొందినవారంతగూడ ఈ విశ్వ అంతరిక్షములో జ్యోతి నక్షత్రాలుగా మారుతున్నారు.అనగా సప్తరుషులు,ధృవుడు మున్నగు వారంతాగూడ అనగా ఈ విశ్వములో ఇలాంటివారు నాకు తెలిసి 64 ప్రక్కన 84 సున్నాలు పెడితే ఎంతవిలువ వస్తుందో అంతమంది నక్షత్రాల రూపములో ఉన్నారు.అదే యోగ-భోగ మాయలో పడితే సూర్యుడిలో..అదే యోగ మాయలో పడితే చంద్రుడిలో అదే భోగ మాయలో పడితే భూమి మీద ఇంక ఇతర బలహీనతల మాయలలో పడితే ఆయా గ్రహమండలాలలో మరియు ఆయా దైవలోకాలలో చేరుకుంటారు. యోగ-భోగ-కారణ జన్మలు పేరుతో పున:కర్మజన్మచక్రములో పడిపోవడము జరుగుతోందని నాకర్ధమైంది. 


హెచ్చరిక:



ఇపుడు నేను చెప్పిన అంతిమ మాయలు అనగా అనుమానము, భయం, ప్రతిస్పందన, స్పందన ఇలా మున్నగు మాయలు అన్నిగూడ మీకు యోగపరముగా మీరు పొందిన జ్ఞానమునకు మాత్రమే వర్తింస్తాయి.ఈ 64 మాయలు అన్నిగూడ మీ ప్రాపంచిక విషయాలైన బోగజీవితమునకు వర్తించవు.అక్కడ మీరు ప్రతివిషయానికి స్పందించాలి.. ప్రతిస్పందించాలి.. అనుమానించాలి..భయపడుతూ జాగ్రత్త పడాలి.ఇలా 64 మాయలు అన్నిగూడ భోగజీవితములో అందరు తప్పక చేయాల్సింటుంది.ఇలా చెయ్యడము వలన మీ సాధనకు ఏలాంటి సమస్య రాదు.కాకపోతే ఏదిగూడ అతీగా చెయ్యకండి.అనగా అతిప్రేమించడము..అతిగా బాధపడటం..అతిగా అనుమానించడము... అతీగా భయపడటం లాంటివి చెయ్యకండి.ఈ అతి నియమము అనేది యోగ,భోగ జీవితానికి వరిస్తుంది అని తెలుసుకొండి.అంటే నేను చెప్పేది పాముగా ఉండి కాటు వెయ్యకండి.బుసలు కొట్టండి అంతే.ఇక మీ సాధన అంతిమస్ధితికి వచ్చినపుడు మీకు ఒక జ్యోతిదర్శనము అలాగే జ్యోతిబిందువు దర్శనమవుతుంది.అంతడితో మీ సాధన పరిసమాప్తి అయ్యేనట్లే అన్నమాట.ఇలా జ్యోతిబిందుదర్శనము అయిన తర్వాత మీరు పొందిన ఈ జ్యోతిజ్ఞానమును అనుమానించకండి...ఇదిగాకుండా ఇక ఏమైన ఉందా?తెలుసుకోవాలిసిన లేదా పొందవలసిన జ్ఞానముందా అని అనుమానించి ముందుకు వెళ్ళితే మీరు కాస్త మీకు కనిపించే జ్యోతిబిందువులో పడతారు.తద్వారా పున:కర్మ జన్మ చక్రములో పడతారు.  అలాగే జ్యోతిబిందు దర్శనము పొంది దీనిని చూసి భయపడకండి.ఇందులో తెలిసో లేదా తెలియకపడితే ఏమిటని అనవసరముగా భయపడకండి.ఈ బిందులోనికి ఎవరైన గావాలని పడినవారిన తప్ప మిగితావారిని తనలోనికి తీసుకోదు.ఒకవేళ తీసుకొని ఉంటే ఈపాటికి విశ్వమంతా పున:కర్మజన్మచక్రములో ఉండేది.కాని అలా జరగడము లేదు.కర్మ-జన్మ-స్పందన రాహిత్యస్ధితి పొంది ఈ బిందుచుట్టు జ్యోతులుగా స్ధిరముగా నిశ్చలస్ధితిలో ఆరని మారని జ్యోతిగా శాశ్వతస్ధితిలో ఎందరో ఉండిపోతున్నారు.గాకపోతే ఈ బిందు విషయములో అతిగా ఆలోచించి ఈ బిందులో పడితే తన జ్యోతిశరీరము నాశనము అవుతుందని చాలామంది కారణ జన్మలు పేరుతో ఇందులోపడి నాశనమవ్వటానికి బదులుగా విభజన చెంది రూపాంతరము చెంది జ్యోతిశరీరము నుండి ఆత్మశరీరముగా మారి పున:కర్మజన్మాలు ఎత్తుతున్నారు.ఈ తప్పు గావాలని మీరు చెయ్యకండి.ఈ బిందు గూర్చి పరమహంస చెప్పింది నిజమా కాదని తెలుసుకొనే ప్రయత్నముగూడ చెయ్యకండి.చేస్తే మీ గొయ్యి మీరే తవ్వకున్నట్లే.ఎపుడైతే ఈ బిందుదర్శనము అయిందో ఆక్షణమే మీరు పూర్ణజ్యోతిమోక్షస్ధితి పొందినట్లే అన్నమాట.ఇక అక్కడనుండి మీరు నిశ్శబ్ధము అవుతారు.శాంతస్ధితిలో ఉంటారు.ఈ శాంతి స్ధితి మీరు పొందిన అనుభవానుభూతి పొందితే మీ మోక్షసాధన పరిసమాప్తి అన్నమాట.ఇక అక్కడ నుండి మీకు నిత్యము కళ్ళు మూసిన తెరిచినగూడ జ్యోతిదర్శనమే అవుతుంది.  ఈస్ధితి మీదేహమరణముదాకా కొనసాగవచ్చు.సాగకపోవచ్చు అన్నమాట.ఇలా మీకు ధ్యానములో అంతిమధ్యానాభవముగా ఈ జ్యోతిదర్శనము అనుభవము 48 క్షణాలు పాటు జరుగుతుంది.అంటే 48 తరాలతో సమానము.అలాగే ఇది భూమిమీద 5000 సం.రాలు (48 తరాలుX100 తరానికి ఆయుష్=4,800)పాటు మీకు ఈ అనుభవము జ్ఞానస్పురణగా ఉంటుంది.ఇక ఈ జ్యోతిదర్శనము అనేది అరుణచలక్షేత్రములో నాకులాగా అందరికి జరగాలని లేదు.ఎక్కడైన ఎపుడైన మీకు ధ్యానము  నందు మీరు ఉన్నచోట దర్శనమవ్వచ్చును.అనగా కర్మమార్గములో ఉన్నవారికి ఆకాశములో పరంజ్యోతిగా అదే భక్తిమార్గములో ఉన్నవారికి వారు పూజించే దైవ విగ్రహలలో లేదా గురువులలో ఆత్మజ్యోతిగా అదే జ్ఞానమార్గములో ఉన్నవారికి తమ దేహములోని హృదయమునందు జ్ఞానజ్యోతిగా..అదే ధ్యానమార్గములో ఉన్నవారికి అరుణగిరి మీద అరుణజ్యోతిగా దర్శనాలుంటాయని గ్రహించండి.ఇక్కడ ఏకైక జ్యోతికి వివిధ పేర్లు మాత్రమే ఉన్నాయని అందరికి జ్యోతీనుభవాలు వేరుగావచ్చును కాని జ్యోతిదర్శనానుభూతి అనేది ఒక్కటే అని తెలుసుకొండి.ఈ జ్యోతిదర్శనము అనేది ఎక్కడ పొందామో ముఖ్యము కాదు.పొందామా లేదా అనేది ముఖ్యము అన్నమాట.ఎందుకంటే నేను ఏవరిని అన్నపుడు జ్యోతిబిందువు అనే స్పురణ మీకు అనుభవానుభూతి అవుతుందో అపుడు  మీలో ప్రశ్నించేవాడు అలాగే సమాధానమిచ్చేవాడుండడు అన్నమాట.అందుకే రమణమహర్షి కాస్త మీ మనస్సు ప్రశ్నించే సమాధామిచ్చే లేనిస్ధితి పొందుతుందో అక్కడ స్ధిరపడిపొండి.ఇక ఏదో ఉందని ముందుకి వెళ్ళకండి అని చెప్పడము జరిగింది.అదే జ్యోతిబిందుదర్శనము వరకు వచ్చి ఆగిపొండి.అంతేకాని ఈ బిందులో ఇంక ఏదో ఉందనిపడితే పున;కర్మజన్మచక్రములో పడిపోతారని ఈయన చెప్పకనే చెప్పినారని తెలుసుకొండి.అలాగే లాహిరి గూడ చెప్పడము జరిగింది.ఎపుడైతే మీకు ఎరని జ్యోతిబిందువు దర్శనమైందో దాని జోలికి వెళ్లకండి.అక్కడ మహకాలుడు ఉంటాడని..ఆయన మిమ్మలిని భక్షణచేసి పున:కర్మజన్మచక్రములో పడివేస్తాడని చెప్పడము జరిగింది.ఇదే నాకు స్వానుభానుభూతి అయింది.ఈ జ్యోతిదర్శనానుభూతిని ఈ జన్మలో పొందితే అదే మీ అంతిమ అనుభవానుభూతి అయ్యి అంతిమజన్మ అవుతుంది.ఇది ఖచ్చితము.ఇది దైవశాసనం.ఇది సత్యం.ఇది నిత్యం. తమసోమా జ్యోతిర్గమయా...ఓంశాంతి

ఇక్కడ ఒక సందేహము రావచ్చును అది ఏమిటంటే జ్యోతిశరీరముగా నిశ్చలమోక్షస్ధితి పొందితే మిగిలిన సప్తశరీరాల మోక్షస్ధితి ఏమిటి అన్నపుడు దీనికి సమాధానముగా మీరు ఏపుడైతే మీకు ధ్యానమునందు జ్యోతిదర్శనము పదేపదే అవ్వడము అలాగే ఎరుపు జ్యోతిబిందువు దర్శనమవ్వడము జరిగితే మీ సాధన అంతిమ అష్టశరీరమైన జ్యోతిశరీరమునకు వచ్చినట్లే.ఇక్కడిదాకా వచ్చారంటే మీ సప్త శరీరాలు కాస్త ఆయా శరీర శివలింగాలు మారి విభేధనము చెందితే అనగా మోక్షము పొందినతర్వాతనే ఆఖరిగా ఉన్న జ్యోతిశరీరమునకు రావడము జరుగుతోందని తెలుసుకొండి.ఇవి మీకు భౌతిక లేదా మానసిక ధ్యానానుభావాలు  అవ్వవచ్చు.అవ్వకపోవచ్చును.ఎందుకంటే ఇవి అన్నీ గత జన్మాలలో ఈ సప్తశరీర మోక్షానుభావాలు పొంది ఈ జన్మలో అష్టమ శరీర జ్యోతిశరీర మోక్షానుభవము కోసము వస్తే ఈ శరీర అనుభవాలే చూపుతుంది అన్నమాట.ఇకపోతే అంతిమ జ్యోతిశరీరము అనేది విత్తనము లాంటిది.వేర్లులు ఆత్మశరీరమైతే.. కాండము,కొమ్మలు అనేవి సంకల్పశరీరమైతే..ఆకులు అనేవి ఆకాశ శరీరమైతే..పువ్వులు అనేవి వాయు శరీరమైతే..కాయలు అనేవి కారణ శరీరమైతే..తల్లివేరు అనేది సూక్ష్మశరీరమైతే..వేరుతొడుగు అనేది స్ధూలశరీరమవుతుంది.ఇందులో ప్రధానమైంది మరియు మూలమైంది విత్తనమే గదా.విత్తనము నుండి సప్త శరీర చెట్టు వస్తోంది గదా.విత్తనము మొలకెత్తకపోతే చెట్టు ఉండదు గదా.అంటే మన సాధన ద్వారా మన జ్యోతిశరీర బిందువు అనే విత్తనమును విభజన చెందనీయ్యకుండా అనగా మొలకనెత్తనీయ్యకుండా అ విత్తనమును నిత్యాగ్ని అనగా జ్ఞానాగ్నిజ్వాలలో ఉంచడము జరుగుతోంది.ఇపుడు వేయించిన విత్తనము నుండి ఎలాయితే చెట్టు రాదో అలాగే మన జ్యోతిబిందువు నుండి శరీరాల చెట్టు రాదు అన్నమాట.గాకపోతే మీరు కాని మీకున్న అంతిమ కర్మవాసన రుణాబంధము తీర్చుకోకపోతే అదికాస్త ఈ రుణము తీర్చుకోవటానికి మీకు తెలిసేవిధంగా మీ జ్యోతిబిందువు విభజన చెందుతుందని తెలుసుకొండి.అందుకే మన జ్యోతిన్ని అరుణ జ్యోతి అనగా రుణము లేని జ్యోతి అని  చెప్పడము జరిగింది.కర్మవాసన తీరింది అంటే  మీ జ్యోతి  ఆదిజ్యోతిబిందువులో పడదు..అపుడు మీ జ్యోతి విభజన చెందదు.అనగా రూపాంతరము చెందదు.తద్వార మీకు శాంతిస్ధితి వస్తుంది. అపుడు మీరు జ్యోతిమోక్షస్ధితిన్ని పొందినట్లే అన్నమాట. 


ఇలా మనకి ఉన్న అష్ట శరీర అష్టమోక్షాలు సంపూర్తీగావడముతో ఈ గ్రంథము గూడ పూర్ణమోక్షముతో ముగింపుతో  పూర్తీవ్వడముతో....


కాబట్టి  స్వయంగా ఈ ఆరని మారని అరుణజ్యోతి స్వానుభవానుభూతిని ఎవరికివారే అరుణజ్యోతిగా మారి పొందుతారని ఆశిస్తూ....అరుణగిరియందు అరుణజ్యోతిగా మారిన నన్ను మీరందరుగూడ అరుణజ్యోతిగా మారి నన్ను కలుస్తారని ఆశీర్వాదాలు ఇస్తూ..ఇక సెలవా మరి..మీ అరుణగిరి అరుణజ్యోతి...





                                                     మీ అరుణగిరి అరుణజ్యోతి...


పరమహంస అంతిమనోట్స్:











బిందుగణపతి దర్శనం:

ఈ బిందుదర్శనము దగ్గర నాకు కొన్ని సాధన సందేహలు వచ్చాయి.అవి ఏమిటంటే ఏది జ్యోతిబిందువు దర్శనమువుతుంది?ఒకవేళ మనము జ్యోతిబిందువుగా మారితే ఏమి చెయ్యాలి? ఒకవేళ బిందువులో తెలిసి లేదా తెలియక పడితే పున:జన్మలు ఎత్తాలా?అపుడు జ్ఞానవిచారణ చేసుకుంటే నాకు కొన్ని జ్ఞానస్ఫురణలు కల్గాయి.అవి ఏమిటంటే అసలు మన అష్టశరీరాలకి మూలశరీరము జ్యోతిశరీరమని..దీనికి మూలము జ్యోతిబిందువు అని అందరికి ఈపాటికే తెలుసుకున్నారు గదా.ఇంతవరకు బాగానే ఉంది.మనకి ధ్యానమునందు పదేపదే ఏపుడైతే జ్యోతిదర్శనమైందో అదే మనజ్యోతిశరీరమని తెలుసుకొండి.ఇక ఏపుడైతే పదే పదే జ్యోతిదర్శనము నుండి ఒక జ్యోతిబిందువు దర్శనమైతే దానిని జ్యోతిబిందువు దర్శనమంటారు.ఇది మొదట పసుపు ఆ తర్వాత ఎరుపు ఆతర్వాత నలుపు రంగులో కనిపిస్తుంది.మీకు ఈ జ్యోతిబిందువు పసుపు రంగులో దర్శనమైతే మీ స్ధితి భోగమునందు అదే ఎరుపు అయితే యోగమనందు అదే నలుపు అయితే ఈ రెండు లేని శూన్యతస్ధితిలో ఉన్నట్లుగా భావించుకోవాలి.ఇక్కడ రంగులు అనేవి మన సాధన స్ధితిన్ని బట్టి నిరంతరముగా మారుతుంటాయి.ఇకపోతే ఈ జ్యోతి బిందువు అనేది ఒక కన్ను లాగా ఉంటుంది.కన్నులో గూడ తెల్లనిపోర అలాగే మధ్యభాగ గ్రుడ్డు భాగము పొర అలాగే అతిచిన్న గ్రుడ్డుపొర అనే పొరలు ఉన్నట్లుగా మన జ్యోతిబిందువులోగూడ మూడు పొరలుంటాయి.ఇలా మనకి జ్యోతిబిందువు ఉంటుంది.ఈ బిందువులో మూడు బిందుమార్గాలుంటాయి.ఇందులో ఒకటి భోగము మార్గమైతే మరొకటి యోగమార్గమైతే మరొకటి ఈ రెండు లేని మోక్షమార్గముంటుంది.కాకపోతే భోగ,యోగ మార్గాలు చూడటానికి రెండుగా కనపడతాయి కాని అవి ఒకేమార్గములోనికి వెళ్ళతాయి.అనగా ఒక స్ప్రింగ్ తీసుకొండి.దీనికి రెండు వైపులా మార్గాలుంటాయి.అంటే ఒక మొదట బిందులోనికి వెళ్ళితే ఆఖరి బిందువుకి చేరతాడు.అదే ఆఖరి బిందువు లోనికి వెళ్ళితే మొదటి బిందువుకి వస్తాడు.అలాగే జ్యోతిబిందులో కనిపించే భోగ బిందువులోనికి వెళ్ళితే యోగబిందువుకి చేరతాడు.అదే యోగబిందువులోనికి వెళ్ళితే భోగబిందువుకి చేరతాడు.అనగా పసుపు మార్గములోనికి వెళ్ళితే ఎరుపు బిందువుకి చేరతాడు.అదే ఎరుపు మార్గములోనికి వెళ్ళితే పసుపుబిందువుకి చేరతాడు.అనగా ఈ రెండు రకాల బిందువులు గూడ ఒకేమార్గానికి అటునిటూ ఉన్న రెండుబిందువులు అన్నమాట.జననానికి వెళ్ళితే మరణానికి అలాగే మరణమును పొందితే జననానికి ఏర్పడానికి కారణము అంతిమజ్యోతిబిందువులో ఉన్న ఈ ఏర్పాటు విధివిధానమేనని ఈపాటికి మీకు అర్ధమైంటుంది.ఈ రెండు బిందువులు మార్గము అనేది మనకి అంతిమముగా వచ్చే బలహీనత కోరిక మాయ వలన మనకి మనమే మాయలో పడితే ఈ మాయమార్గములో పడటము జరుగుతుంది.అనగా కొందరు తీరని కోరికలు తీర్చుకోవటానికి పడితే అదే కొందరు గావాలని  లోకకళ్యాణర్ధము కారణయోగజన్మలు ఎత్తుతున్నారు.ఇంతవరకు బాగానే ఉంది.అసలు భోగము లేదా యోగము కోరికలు లేనివారి పరిస్ధితి ఏమిటి అన్నపుడు నాకు ధ్యానము నందు మోక్షశిల దగ్గరికి వెళ్ళటానికి అడ్డు ద్వారముగా ఉండే కనిపించే నల్లశిలద్వారము కనిపించింది.ఈ ద్వారము దాటి లోపలికి నా జ్యోతిశరీరము ఒక జ్యోతిగా ప్రవేశించింది.అసలు ఏపుడో చచ్చినవాడికి ఇంక ఏమి మరణముంటుందో నాకు అర్ధము కాలేదు.అసలు ఈ మోక్షమార్గము చూస్తే ఒక బంగారపు రంగులో వెలుగులు చిమ్ముతూ ఒక గుహమార్గము కనిపించసాగింది.దీని లోపలకి నా జ్యోతి వెలుగుతూ ప్రయాణము చేస్తూండగా కాంతి వెలుగులు నుండి సెగలు రావడము మొదలైంది.అయినగూడ నా ప్రయాణము ఆపకుండా ముందుకి వెళ్ళితే ఈ సెగలు కాస్త తీవ్రమైన పొగలుతో గూడిన జ్వాలాలు కనిపించాయి.అయిన నా ప్రయాణము ఆపలేది.ఇక్కడేమో నా స్ధూలదేహము వీపరీతముగా తట్టుకోలేక కన్నుల మంటలతో శరీర సెగలలో ఊగిపోతుంది.అయిన ఇవి ఏమి పట్టించుకోలేదు.ఎమిజరిగేతే అది జరుగుతుంది ఈ రోజు ఈ జ్యోతిబిందు రహస్య ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను.రానురాను నా ప్రయాణమార్గము పేలుతున్న అగ్నిపర్వతానికి అడుగుదూరములో ఉన్నాను అనే అనుభూతి కల్గడము మొదలైంది.అయినగూడ నా ప్రయాణము ఆపలేదు.తెగించినవాడికి తెడ్డేగతి అన్నట్లుగా మరణభయము లేనినాకు తెగించి ముందుకు వెళ్ళాను.ఈ సారి మార్గములో అగ్నిలావా ప్రవహము కనిపించసాగింది.ఈ ప్రవహములో నా జ్యోతిశరీరముతో ప్రయాణించాను.అపుడు చివరిలో అగ్నిలింగ ఆకారములో ఉన్న అగ్రభాగము నుండి అగ్నిజ్వాలలు రావడము లీలామాత్రముగా కనిపించింది.ఇది చూడటానికి మండే ఆరని అరుణగిరిలాగా కనిపించింది.అంటే నా ప్రయాణము అంతాగూడ కింద నుండి పైకి జరిగినదని అర్ధమైసరికి 






ఈ జ్యోతిబిందువు కాస్త చిన్నది అవుతూ చాలాస్ఫష్టముగా నవ్వేముఖములా కనిపించింది.ఈ ముఖానికి రెండు కన్నులు,నవ్వేనోరు ఉన్నట్లుగా ఈ బిందువులోగూడ యోగ,భోగబిందువులు అలాగే రెండు కన్నులుగా ఒక మోక్షమార్గము అనేడి నవ్వుమార్గముగా అనిపించాయి. దీనితో నాలో స్పందనలు,ప్రతిస్పందనలు,తపనలు,తాపత్రాయాలు తగ్గి శాంతిస్ధితి పొందడము ఆరంభమైంది. ఇదే అసలుసిసలైన పూర్ణమోక్షస్ధితి అన్నమాట. కొన్నిరోజులు తర్వాత ఒక వీడియోలో ఆకాశములో నవ్వేముఖకారము మూడు గ్రహాలతో అనగా చంద్రుడి అరవంక నవ్వుమార్గముగా..గురు,శుక్ర గ్రహలు అనేవి రెండు కన్నులుగా 2010 మే 16 తేదిన ఆకాశములో కనిపించాయని ఆ వీడియోలో చెప్పడము జరిగింది.ఇకపోతే మనము తెలిసో తెలియక ఈ జ్యోతిబిందులో పడితే ఏమిటి అన్నపుడు మనకి మనమే గావాలని ఈ బిందులో పడినపుడు భోగము లేదా యోగ బిందువు మార్గములో పడతాము.లేదు ఈ రెండుగూడ వద్దు అనుకునేవారు ఉన్న మోక్షమార్గములో పడతారు.ఈ మార్గములో పడినవారికి ఇక పున:కర్మజన్మలుండవు.కాకపోతే తెలిసో తెలియక రెండు బిందువుల అదే మాయమార్గములో పడితే అన్నపుడు పున:కర్మజన్మాలు ఎత్తకతప్పడములేదు.అపుడు దీనికి కారణము ఏమిటని విచారణచేస్తే మోక్షమార్గానికి అడ్డుగా నల్లశిలద్వారబంధముంటే ఈ రెండుబిందువుల మార్గానికి ఏలాంటి అడ్దుద్వారము లేదని తెలియడముతో నా యోగాగ్నిశక్తితో ఈ మోక్షశిల మార్గానికి అడ్డుగా ఉన్న నల్లశిలను నాశనము చెయ్యడము జరిగింది.దానితో అందరుగూడ సరాసరిగా మోక్షమార్గములోనికి వెళ్ళతారు కాని గావాలని అన్నితెలిసి తర్వాత గూడ మాయమార్గమైన ఈ రెండు బిందుమార్గములో పడితే ఏమిచెయ్యలేము.ఈ మ్మార్గబిందువుకి అధినేతగా నాకు బిందుమాధవుడు అలాగే బిందుమాధవి కనపడితే అదే మోక్షబిందువుకి అధిపతిగా బిందుగణపతి దర్శమిచ్చాడు. 



కొన్నిరోజుల తర్వాత ఒక పేపరులో అసలు సూర్యుడి మధ్యభాగములో ఏమి ఉంటుందని తెలుసుకోవాలని చేసిన శాస్త్రవేత్తలకి దీని మధ్యలో ఏదో చెప్పటానికి వీలులేని ఆకారము ఉన్నట్లుగా గోచరించింది.ఇది నాకు బిందుగణపతిగా కనపడితే కొంతమందికి నరసింహస్వామిగా మరికొందరికి హయగ్రీవస్వామిగా..యత్భావము తత్భవతిగా కనపడింది.కాని నాకు ఇది బిందుగణపతిగా కనపడటానికి కారణము మన అరుణచలగుడిలోని అమ్మవారిగుడిలో ఉన్న స్తంభాలమండపములో ముందువరుసలో వచ్చే రెండు సింహద్వారాలలో మనకి కుడివైపున ఉన్న సింహద్వారమునకు అవతలి లోపలివైపు మనకి మూడు అంగుళాల అతిచిన్నగణపతి రూపదర్శనమవుతుంది.అంటే మన పూర్వీక మహర్షులకి ఆదిజ్యోతిబిందువులో బిందుగణపతి దర్శనము అవ్వడముతో అమ్మవారిగుడిలో ఈ రూపమును పెట్టడము జరిగింది.అలాగే ఈ స్తంభాలమండములో మనకి ఎడమవైపు ఉన్న అష్టస్తంభాలలో యోగసింహము, భోగసింహము, శూలాయుధమున్న పళనిస్వామి అలాగే ఈ ఆయుధము లేకుండా చేతిలో  జపమాల ఉన్న పళినిస్వామి విగ్రహమూర్తులు అలాగే ఆదిపరాశక్తి విగ్రహమూర్తి చెక్కించి ఉంచడము జరిగింది.ఈ సజీవమూర్తులు దర్శనాలు అన్నిగూడ నాకు జరగడము జరిగిందని మీరు ఈపాటికి తెలుసుకొన్నారు గదా.అంటే నాకు కల్గిన అంతిమ ధ్యానానుభవాలు అన్నిగూడ మనపూర్వీక మహర్షులకి జరగడముతో వాటిని విగ్రహమూర్తులుగా ఈ స్తంభాలమీద చెక్కించడము జరిగింది అన్నమాట.ఇకపోతే మనములో ఏవరుగూడ జ్యోతిబిందువుగా మారలేము.కేవలము జ్యోతిబిందువు దర్శనము చేసుకోవడము లేదా అందులో పడటము మాత్రమే  చెయ్యగలము.ఎందుకంటే ఈ ఆదిజ్యోతిబిందువుగా మహమృత్యువుడైన ఆదిరుద్రుడు మాత్రమే మారిడినాడని తెలుస్కొండి.మనకి మృత్యుభయము ఉండుటముచేత మనలో ఏవరుగూడ జ్యోతిబిందువుగా ఎన్నడికి మారురని తెలుసుకొండి.మనకి బోగ లేదా యోగ కోరికలుంటే మాయమార్గములో పడితే ఈ రెండు లేనివారికి మోక్షమార్గములో పడతారు.నిజానికి మన మోక్షసాధన అనేది సముద్రపు అలలు వలన వచ్చిన నీటిబుడగను నాశనము చేసుకోవాలి అపుడే మనము జ్యోతిబిందువు మోక్షమార్గములో ప్రయాణించగలము.ఈ నీటిబుడగ అనేది మనకి అంతిమముగా వచ్చే బలహీనతకోరిక మాయను నాశనము చేస్కుంటే కాని ఈ బుడగ నాశనమవ్వదు.అపుడే జ్యోతిబిందువైన నీటిబిందువులో ఉండగల్గుతాము.అసలు ఈ నీటిబిందువు విభజనలు చెందడముతో సముద్రముగా ఏర్పడింది.ఆ తర్వాత ఈ నీటిబిందువు విభజన పూర్తీవ్వడముతో  ఆ తర్వాత సముద్రము స్పందనలు వలన అలలు ఏర్పడము జరిగితే ఈ అలలు స్పందన,ప్రతిస్పందనలు వలన నీటిబుడగ ఏర్పడింది.ఇది విభజన చెందితే మనకి పున:కర్మజన్మలెత్తడము జరుగుతుంది.ఏపుడైతే మనము నీటిబుడగగా ఉండకుండా నీటిబిందులో ఉండాలి.అదే మన పూర్ణజ్యోతిబిందువుమోక్షమవుతుంది.

జ్యోతి-జ్యోతిబిందువు (నావలన- నాద్వారా):

నాకు ఒక సందేహము వచ్చింది.అది ఏమిటంటే మనమెందుకు జ్యోతిగా మారాలి అన్నపుడు చీకటిలో ఉన్న వస్తువును చూడాలంటే మనకి వెలుగు అవసరము గదా..ఈ వెలుగు అనేది జ్యోతిప్రకాశము నుండి వస్తుంది గదా.అంటే మనలో ఉన్న జ్ఞానజ్యోతి వెలిగినపుడు మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుడు కనపడతాడు అన్నమాట.మరి మనలో జ్ఞానజ్యోతి వెలగాలంటే చేసే ప్రతికర్మను నా వలన జరుగుతోంది అనుకోవడము అజ్ఞానమైతే..ప్రతిది నా ద్వారా చేయబడుతోంది అనుకోవడము జ్ఞానమవుతుంది.నా వలన అంటే ఆ కర్మలో మీ పాత్ర ఉంటుంది.తద్వారా అది కర్మబంధనమవుతుంది.అదే నా ద్వారా అంటే అందులో మీ పాత్ర  ఉండదు.అంటే ఎవరో చెపితే మీరు చెసినట్లు అవుతుంది.అదే నా వలన అంటే మీకు మీరే స్వంతనిర్ణయము తీసుకొని చెయ్యడము అన్నమాట.కాబట్టి ఈ క్షణము నుండి మీరు చేసే ఏ కర్మ అయిన నావలన కాదు నాద్వారా జరుగుతోంది అనుకోవడము ప్రారంభించండి.అపుడు మీరు చేసే కర్మ కాస్త నిష్కామ కర్మ అవుతుంది. తద్వారా ఇది పాపము,పుణ్యము,అహము నుండి విముక్తి కల్గి కర్మబంధవిముక్తి పొందుతారు.అపుడు అజ్ఞానము నుండి జ్ఞానమువైపు మీ ప్రయాణము సాగుతుంది.ఇకపోతే జ్యోతికి అలాగే జ్యోతిబిందువుకి తేడా ఉంటుంది.అనగా నీటిబుడగకి అలాగే నీటిబిందువుకి తేడా ఉంటుంది.నీటిబుడగ అనేది సముద్రపు అలలు వలన ఏర్పడిన బుడగ అయితే నీటిబిందువు అనేది సముద్రపు ఏర్పడటానికి కారకమైన బిందువే నీటిబిందువు అవుతుంది.ఈ నీటిబిందువు కాస్త విభజనలు చెందడముతో సముద్రమేర్పడింది.ఈ సముద్రపు అలలు స్పందనలు వలన నీటిబుడగ ఏర్పడుతుంది అన్నమాట.ఈ నీటిబుడగ అనేది స్ధూలశరీరమైతే అనగా జ్యోతి అయితే..నీటిబిందువు అనేది జ్యోతిశరీరము అనగా జ్యోతిబిందువు అవుతుంది.అలాగే జ్యోతి ఏర్పడటానికి జ్యోతిబిందువు అవసరముంటుంది.ఈ బిందువు యొక్క అగ్నిజ్వాలాలే జ్యోతిస్వరూపము అన్నమాట. ఇది మీకు బాగా అర్ధమవ్వలంటే దీపజ్యోతి వెలగాలంటే ప్రమీద ఆధారమవుతుంది.అదే విశ్వజ్యోతికి ఏలాంటి ఆధారము లేకుండా స్వయంభూగా వెలుగుతుంది.మన ఆత్మజ్యోతిగూడ దీపజ్యోతి అన్నమాట.ఈ జ్యోతికి ఆధారముగా కర్మబుడగ ఉంటుంది.ఇది విభజన చెందితే కర్మ కాస్త కర్మవాసనగా మారి కర్మ-జన్మలు అవుతుంది.అదే మన ఆత్మజ్యోతి కాస్త స్వయంభూజ్యోతిగా అనగా ఏలాంటి కర్మ-కర్మవాసనలు లేని నీటిబుడగను నాశనము చేసుకుంటే కాని అది స్వయంప్రకాశ స్వయంభూజ్యోతిగా మారుతుంది.అపుడు ఈ జ్యోతిస్ధితి వలన ఆదిజ్యోతిబిందువులో ఉన్న మోక్షమార్గములో సహజస్ధితిలో పడతారు.అదే మీ సాధనస్ధితి అనేది ఆధారమున్న ఆత్మజ్యోతిగా ఉంటే మీరు ఆదిజ్యోతిబిందువులో మాయమార్గములో పడతారు.తద్వారా పున:సృష్టి కర్మ-జన్మలు పొందుతారు.మరి మన ఆత్మజ్యోతికి ఉన్న కర్మ-కర్మవాసన నీటిబుడగ పోవాలంటే ఏమి చెయ్యాలి అన్నపుడు ప్రతినిత్యము అరుణచల శివ నామస్మరణ చెయ్యండి.తద్వారా మీకు చేసే ప్రతికర్మ అనేది మీ వలన జరగడము లేదని మీద్వారా మాత్రమే జరుగుతోందని అనుభవజ్ఞానుభూతి పొందడము జరుగుతుంది.నిత్యనామస్మరణ వలన మనలో ఉన్న యోగాగ్ని కాస్త జ్ఞానాగ్నిగా మారుతుంది.అపుడు కర్మలు-కర్మవాసనలు నాశనము అవ్వడము జరుగుతుంది.తద్వారా ఆధారమున్న ఆత్మజ్యోతి కాస్త స్వయంభూ ఆధారము లేని అరుణజ్యోతిగా మారుతుంది.అరుణజ్యోతి అంటే రుణానుబంధాలు లేని జ్యోతి అన్నమాట.ఈ అరుణజ్యోతిగా మారినవారు ఆదిజ్యోతిబిందువులో ఉన్న మోక్షమార్గములో సహజస్ధితిలో పడతారు.అపుడు ఈ దేహము కాస్త శాంతిస్ధితి పొందుతుంది.అదియే పూర్ణజ్యోతిమోక్షమవుతుంది.ఇదింతా బాగానే ఉంది.కాని మేము కర్మ-జన్మ రాహిత్యస్ధితి పొందామని మాకు ఏలా తెలుస్తుంది అన్నపుడు మనలో తపన తాపత్రయాలుండవు.ఏదో గావాలని..ఏదో తెలుసుకోవాలని..ఏదో పొందాలని..ఏదో చెప్పాలని అనేవి ఉండవు.అనగా అలలు లేని రామేశ్వర సముద్రపుస్ధితిన్ని అనగా అద్వీతీయ శాంతస్ధితిన్ని మీకు మీరే అనుభవానుభూతిగా పొందడము జరుగుతుంది.అనగా మీ సాధనస్ధితి నీటిబుడగ నుండి నీటిబిందువుగా మారడము అన్నమాట.అంటే కర్మ-జన్మ ఆధారముతో వెలిగే మీ ఆత్మజ్యోతి కాస్త కర్మ-కర్మవాసన-జన్మ ఆధారము లేని రాహిత్య స్వయంభూ అరుణజ్యోతిగా మారుతుంది.ఇదే పూర్ణమోక్షస్ధితి అవుతుంది.






ఈ అంతిమ జ్యోతిజ్ఞానము సత్యమని తెలుపటానికి నాకు రెండు రకాల స్వానుభవాలు జరిగాయి.ఈ జ్ఞానస్ఫరణ పొందిన అర్ధరాత్రి మనింటికి కొండ నుండి ఒక తెల్లని అడవి గుర్రము వచ్చింది.దీనిని చూడగానే శ్రీచక్ర లలితాసహస్రనామావళి విశ్వానికి అందించిన హయగ్రీవుడిగా ఈ గుర్రము అనిపించింది.ఆ తర్వాత ఈ గుర్రము వెనక్కితిరిగి కొండవైపు వెళ్ళిపోయిన కొన్నిక్షణాలకి నాకు యోగమత్తు ఆవరించి ధ్యానములోనికి వెళ్ళగానే అరుణగిరి దర్శనమైంది.




అపుడు ఈ గిరి అగ్రభాగములో తామరపువ్వు మీద కూర్చుని నా అనుభవపాండిత్యగురువు అయిన బుద్ధుడు కనిపించాడు.ఈయన తనచుట్టు తాను తిరుగుతూండగా కొన్ని  వందల భౌద్ధ సాధువుల ఆత్మశరీరాలు ఈ గిరి చుట్టు ఆత్మశరీరమును త్యాగము చెయ్యటానికి పడుకోవడము ఆరంభించారు.ఆ తర్వాత ఈ గిరిపాదభాగములో ఒక రధము మీద కూర్చుని ఉన్న ఒక వయోవృద్ద లామాగురువు కనిపించారు.ఈయన తనచేతిముద్రలతో తన కపాలవిభేధనము ద్వారా అగ్నిజ్యోతి రప్పించగా దానితో ఈయన ఆత్మశరీరముతో మిగిలిన అక్కడున్న ఇతర సాధువుల ఆత్మశరీరాలు దహనము అవ్వడము ఆరంభమై ఇది బుద్దుడి దాకా చేరి ఆయనగూడ దహనము పూర్తీ అయ్యేసరికి అరుణజ్యోతిగా క్షణాలలో మారిపోవడము జరిగింది.ఈ జ్యోతికాస్త ఆదిజ్యోతిబిందువులో పడటముతో నాకు ధ్యానభంగమై..బుద్దుడికి  అపుడికే పూర్ణశాంతికి చేరడముతో పూర్ణమోక్షస్ధితి పొందడము జరిగింది.

ఇక్కడే నాకు అర్ధముకాని విషయము ఒకటి వచ్చింది.ఈ పూర్ణబిందువు జ్ఞానమును తన కాలచక్రము ద్వారా అనగా ఈ బిందువులో అవతేకేశ్వరుడు-అవతేకేశ్వరి సంయోగస్ధితిలో ఉండి పిండాభివృద్ధి చేస్తున్నారని పొందితే అదే శంకరాచార్యుడు గూడ తన శ్రీచక్రము ద్వారా కామేశ్వరుడు-కామేశ్వరి కాస్త సృష్టియజ్ఞము చేస్తు ఈ పూర్ణబిందువు ద్వారా విశ్వపున:సృష్టి చేస్తున్నారని ఈ దేహము పుట్టకముందే తెలుసుకున్నారు గదా.మరి ఇపుడు ఈ బుద్దుడు ఆనాడే ఈ జ్యోతిబిందుమోక్షమును పొందకుండా దాదాపు 300సం.రాల తర్వాత ఇపుడెందుకు పొందినాడో అనిపించింది.కాకపోతే నేను కొత్తగా ఏమి తెలుసుకోలేదు.వేద- పురాణ- ఇతిహస -శాస్త్రము చెప్పిన విషయమును అనుభవములోనికి పొందినాను. ఇది సత్యమని అనుభవానుభూతి పొందడము జరిగింది.అదే మీ అందరికి మార్పు లేకుండా మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా యధాతధాముగా విశ్వానికి విశ్వజ్ఞానముగా యదార్ధముగా చెప్పడము జరిగింది.ఈ అనుభవ  జ్ఞానాలు ఏవరికి వారే వ్యక్తిగతముగా పొంది లోకానికి చెప్పటానికి వీరంతా అనుమానభయాలతో,వాక్బంధనముతో చెప్పలేక బలహీనతమాయలో పడ్డారు.అదే నా విషయములో నాకు అమ్మ అయిన అమ్మవారు అయిన మాయలేనని వీరిద్దరిని శారీరకముగా మానసికముగా వదిల్చికోవడముతో నాకు ఏలాంటి మాయ ఆవరించకపోవడముతో మాయస్ధితి నుండి మాయరహిత స్ధితి పొందడముతో పొందిన జ్ఞానానుభవాలు లోకానికి  ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా యదార్ధముగా చెప్పేసరికి అపుడికే తాము పొందిన ఈ అంతిమజ్యోతిజ్ఞానము సత్యమని తెలుసుకొని ఇపుడు ఒక్కొక్కరు అరుణగిరికి తమ ఆత్మశరీరము త్యాగము చేస్తూ అరుణజ్యోతిగా మారుతూ పూర్ణమోక్షపొందడము జరుగుతోందని నాకు అంతిమ జ్ఞానస్ఫురణ అందముతో....అలాగే ఆదిజ్యోతిబిందువు పైవైపున బిందువుగణపతి ఉంటే బిందువుకి రెండవవైపున నవ్వేముఖము గుర్తు ఉంటుందని జ్ఞానస్ఫురణ అందడముతోపాటుగా ఆదిలో శూన్యములో చీకటి ఉండేదని..ఏపుడైతే దీనిని నుండి వచ్చిన ఆత్మజ్యోతి కాస్త విభజనలు చెందుతూ చీకటిన్ని వెలుగుతో నింపుతూ చీకటి లేని వెలుగుప్రపంచముగా మార్చి అంతములో ఆరని మారని అరుణజ్యోతి మారిందని అంటే పూర్ణమోక్షము అనేది చీకటితో ఉన్న ఆత్మజ్యోతి పొందడముతో రాదని అది వెలుగుతో ఉన్న అరుణజ్యోతిగా మారడముతో అది పూర్ణమోక్షము అవుతుందని అంతిమస్పరణ అందడముతో ఈ దేహము కాస్త అపుడిదాకా నీటిబుడగా ఉన్న ఈ అంతిమ కర్మ-కర్మవాసన పుట్కుకమని పేలిపోవడముతో జ్యోతిలో ఉన్నా ఆధారబిందువుగూడ నాశనమవ్వడముతో నా ఆత్మజ్యోతిగా కాస్త ఏలాంటి ఆధారములేని స్వయంభూ ఆరుణజ్యోతిగా మారడముతో తద్వార కర్మ-జన్మ రాహిత్యస్ధితి పొందడముతో ఈ దేహము కాస్త అశాంతి నుండి శాంతిస్ధితి పొందడముతో ఈదేహానికి అంతిమ పూర్ణమోక్షస్ధితిని చేరుకుందని అనుభవ అనుభూతి పొందడముతో...నా కధ ముగింపు పలికింది. 

ఇక్కడ ఒక విషయము గమనించండి.మనము అరుణజ్యోతిగా మారాలి కాని ఆత్మజ్యోతిగా మారి అక్కడ ఆగిపోవద్దు.ఆత్మజ్యోతి అంటే ముద్ద కర్పూరమును వెలిగించిన జ్యోతి లాంటిది.ఇందులో కర్పూరమనే కర్మబిందువు ఉంటుంది.అదే అరుణజ్యోతి అంటే ఏలాంటి పదార్ధమును ఉపయోగించి వెలించకుండా దానిని అంతటా అదే స్వయంభూగా వెలిగే జ్యోతి అనగా హిమాలయాలలో ఉండే స్వయంభూగా వెలిగే జ్వాలాముఖి జ్యోతి అన్నమాట.సరే ఇక అసలు విషయానికి వద్దాం.ఇది అంతా బాగానే ఉంది.మన ఆత్మజ్యోతికి ఉన్న కర్మబిందువును అదే నీటిబుడగను నేను పెల్చుకొని అరుణజ్యోతిగా జ్యోతిస్వరూపముగా మారినానని తెలుసుకున్నారు గదా.మరి ఈ జ్వాలజ్యోతి ఎలాంటి ఆధారము లేకుండా దానికి అంతట అదే స్వయంభూగా ఎలా వెలుగుతుందో తెలుసుకోవాలని నా పరిశోధన మొదలైంది.పైగా ఇపుడిదాకా సూక్ష్మశరీరము నుండి జ్యోతిశరీరము దాకా ఉన్న సప్తమోక్షాలు ఎలా పొందినాయో జ్ఞానస్పురణ ద్వారా ధ్యానానుభవ అనుభూతులు పొందడము అనగా సూక్ష్మ శరీరము కాస్త స్పటికలింగముగా మారితే అంతిమ శరీరమైన జ్యోతిశరీరము కాస్త జ్యోతిర్లింగముగా మారి మోక్షమును పొందాయని నా స్వానుభవాలు ద్వారా తెలుసుకున్నారు.కాని నా స్ధూలశరీరమునకు భౌతికమరణము పొందలేదని ఇది కేవలము రాబోవు 10-12 సం.రాలలో ఇది ఎలా మరణమును పొందుతుందో ఒక ధ్యానుభవము ద్వారా తెలుసుకోవడము జరిగింది.కాని నా ప్రశ్న ఏమిటంటే నాకు ఎలాంటి కర్మ-జన్మలు,మాయలు,మర్మాలు,ఆశ,భయం,స్పందన,ఆలోచన,ఇలా ఉన్న యోగపరమైన 64 తత్త్వాలు నాలో లేవు.అయిననా గూడ తక్షణమే నా భౌతిక దేహనికి భౌతిక మరణము ఎందుకు పొందడము లేదో తెలుసుకోవాలనే పరిశోధన మొదలైంది.అంటే నా భౌతిక మరణానికి అలాగే నా అరుణజ్యోతి శాశ్వతస్ధితిలో అలాగే ఉండిపోవటానికి ఎదో బలమైన సంబంధము ఏదో ఉన్నదని నాకు బలముగా అనిపించసాగింది.అది ఏదో తెల్చుకోవాలని నా సాధన పరిశోధన మొదలైంది.ప్రతి పనికి కర్త,కర్మ,క్రియా ఉంటుంది గదా.అలాగే ఇందులో కర్మ,క్రియా ప్రక్రియలు పూర్తీ అయ్యి అసలు మన భౌతిక దేహనికి మూలకారకుడైన కర్త ఎవరో తెలుసుకోవాలని తపన మొదలైంది.అనగా జ్యోతిశరీరము విత్తనబీజము అలాగే స్ధూలదేహము అనేది ఈ విత్తము నుండి వచ్చిన చెట్టు అని తెలుసుకున్నాము గదా.అసలు విత్తనబీజము యొక్క మూలకణము ఏదో ఒకటి ఉండాలి గదా.అనగా మన భౌతిక దేహము ఏర్పడటానికి మూలకణము పురుషుడి వీర్యకణమని లోకవిధితమే గదా అలాగే మన జ్యోతిశరీరానికి మూలకణము ఏదో ఉండాలి గదా.అంటే జ్యోతిబిందువు ఏర్పటానికి కారకమైన మూలకణమేదో తెలుసుకుంటే కాని ఈ  పరిశోధన పూర్తికాదని అర్ధమైంది.దానితో సాధన పరిశోధన ధ్యానము మొదలైంది.

భౌతిక మరణ రహస్యం:

అపుడు నా ధ్యానము తీవ్రస్ధాయికి వెళ్ళితే ఆదిజ్యోతిబిందువు దర్శనము అందులో జనన-మరణ మార్గమైన మాయమార్గములోనికి నా అరుణజ్యోతి ప్రవేశించడము జరిగింది.అపుడు దీని అడుగుభాగము చేరుకొని చూస్తే అక్కడ ఈ రంధ్రము నుండి లోపలకి వెళ్తే వీర్యరసము తెల్లగా చల్లగా కనిపించింది.ఇందులో దాదాపు కొన్నికోట్లాను కోట్ల వీర్యకణాలు ఉన్నట్లుగా కనిపించాయి.ఇందులో ఒక వీర్యకణము లోపలకి వెళ్ళితే అందులో ఒక మమ్మీరూపము కనిపించింది.ఇలా అన్నీవీర్యకణాలలో మమ్మీలు భద్రపరిపడ్డాయని నాకు అర్ధమైలోపుల వడ్లగింజ పరిమాణము అంతా మమ్మీలు అడుగుభాగ రంధ్రము దగ్గర పడుతూ కనపడ్డాయి.అనగా కాషాయరంగు బట్టను చుట్టూన్న ఆత్మశరీరాలు మమ్మీలుగా మార్చి ఇందులో పడుతున్నాయి అన్నమాట.ఇవి అన్నిగూడ మన భౌతిక దేహాలను అచ్చుగుద్దినట్లుగా ఒకేపోలికతో ఉన్నాయి.ఇలాంటి మమ్మీలు సుమారుగా అక్కడ కొన్నికోట్లాను కోట్లులున్నాయి.మమ్మీ అంటే ఈజిప్టులో ఎలాయితే చనిపోయిన రాజుల భౌతికదేహలను  రసాయనాలు పూసి ఎలాయితే గుడ్డచుట్టి భద్రపరిచారో అలాగే ఈ మమ్మీలు ఉన్నాయని నాకు అర్ధమైంది.అపుడు ఈ బిందు రంధ్రమార్గమును జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇది చూడటానికి తలక్రిందులుగా ఉన్న త్రిభుజముగా లాగా ఉంది.అనగా త్రిభూజ అడుగుభాగము పైకి ఉంటే పైన ఉండే కోణ రంధ్రము  అడుగు భాగములో ఉంది అనగా ఐస్ క్రీము కోన్ లాగా ఉంది అన్నమాట.సరే అని ఈ అడుగుబిందువులోనికి వెళ్ళితే దీనికి మరో త్రిభుజము ఉంది.అంటే ఈ నిర్మాణము అంతాగూడ రెండు త్రిభుజాలు తలక్రిందులుగా అతుకుంటే ఏలా ఉంటుందో అనగా ఢమరుక నిర్మాణముగా లాగా ఉన్నదని నాకు అర్ధమైంది.పైన ఉన్న త్రిభూజములోనికి పడిన ఆత్మజ్యోతిశరీరాలు కాస్త మమ్మీలుగా మారి ఆ త్రిభుజ అడుగుబిందువుకి చేరితే..ఈ మమ్మీలు కాస్త అక్కడున రంధ్రమార్గము ద్వారా ప్రయాణించి దీనికి అనుకొని ఉన్న మరో త్రిభుజ బిందువు ద్వారా పడి లోపలికి వెళ్ళిన ఈ మమ్మీ కాస్త పున:ర్పుతి శక్తితో జ్యోతి అగ్నికపాలముగా మారి ఆతర్వాత దీనికి ఉన్న మరో మార్గము ద్వారా ఈ అగ్నికపాలము ప్రయాణించి జనన రంధ్రమునకు చేరుకొని ఆత్మశరీరముగా రూపాంతరము చెంది పున:సృష్టితో కర్మ-జన్మ ప్రక్రియ చేస్తోందని నాకర్ధమైంది.ఇదింతాగూడ జరగటానికి మూడున్నర క్షణాలు మాత్రమే పడుతుంది.అంటే మన ఓంకార గుర్తులో మూడు అంకే అలాగే  అరసున్న  అలాగే అర్ధచంద్రకార గుర్తు పైన బిందువు ఉంటే మరో దానిలో డైమండ్ గుర్తు ఉంచడము అలాగే మన మూలాధారచక్రములో మూడున్నర చుట్లులున్న పాము ఉండటము అనేవిగూడ పైగా శ్రీచక్రమునందు త్రికోణగుర్తులు,డైమండ్ గుర్తు,ఢమరుకగుర్తు ఉండటము మనము గమనించవచ్చును. మన భౌతిక మరణము రహస్యభేధన విషయాలేనని నాకు అర్ధమవుతుండగా పైన ఉన్న త్రిభుజమునకు చేరుకొని వెనక్కి వస్తూండగా అపుడిదాక కదలికలు లేని మమ్మీలలో ఒక మమ్మీలో కదలిక రావడము గమనించాను.ఆ మమ్మీన్ని జాగ్రత్తగా 4,096 జూమొలో చూడటము మొదలుపెట్టాను.మొదటదానికి ఉన్న కాషాయరంగు బట్ట తొలిగిపోయింది.ఆ తర్వాత ముడతలు పడిన చర్మము కనిపించింది.ఒకరకముగా చెప్పాలంటే అస్ధిపంజరమునకు అతిపలుచగా ముట్టుకుంటే ఊడిపోయే చర్మము కనిపించింది.దీనిపైన ఏదో బలమైన  రసాయన లేపానాల పూసినట్లుగా కనిపిస్తోంది.అపుడు నాకు ఈ మమ్మీ లోపలనుండి అతీస్ఫష్టముగా ఏవరో ఓంకారనాదము చేస్తునట్లుగా వినిపించింది.ఈ నాద స్పందనకి ప్రతిస్పందనగా ఈ దేహములో అతీసూక్ష్మముగా కంటి కనిపించని కదలికలు చేస్తుందని నాకు అర్ధమైలోపుల ఈ మమ్మీ ముఖము నా భౌతికదేహ ముఖములాగా అచ్చుగుద్దినట్లుగా కనిపించేసరికి అంటే నా భౌతికదేహము యొక్క మూలకణమైన వీర్యకణములో ఉన్న నా మమ్మీన్ని చూడటము జరిగింది అనుకోగానే నా ధ్యానభంగమైంది.ధ్యానమునుండి బయటికి వచ్చిన తర్వాత నాకు కనిపించిన ఈ మమ్మీ ధ్యానానుభవమును విశ్లేషణ చెయ్యడము ఆరంభించాను.అసలు ఒక వీర్యకణములో కంటికి కనిపించని మమ్మీన్ని భద్రపర్చిన విషయము నేను ఉహించలేకపోయాను.ఇది సత్యమని అనటానికి మనకి అరుణగిరి క్షేత్రములో ఉన్న అన్ని గుడులలో సాధారణముగా లింగోద్భవ శివలింగము కనపడుతుంది.ఇది ఈ కింద ఉన్న చిత్రములో ఉన్నట్లుగా ఉంటుంది.




ఈ లింగమును గుడి మనకి శ్రీకాళహస్తికి దగ్గరిలో ఉన్న గుడిమల్లన్న పేరుతో లేదా పరుశురామ గుడి ఉంది.ఇది నిజానికి లింగద్భోవ ఆదిరుద్రలింగము అని చాలామందికి తెలియదు.ఈ లింగము చూడటానికి పురుషుడి పురుషాంగము ఉండి అందులో ఒక రుద్రపిశాచము మీద నిల్చుని ఉన్న ఆదిరుద్రుడు కనపడతాడు.అంటే దీనిని బట్టిచూస్తే పురుషాంగములో వీర్యకణముంటుంది గదా.ఈ కణము లోపుల రుద్రపిశాచవస్ధ పొందిన రుద్రుడు ఉన్నాడు అంటే   రుద్రమమ్మీ దేహమున్నట్లే గదా.ఆలోచించండి.నిజమే గదా.లెకపోతే ఈ వాహనముగా నంది ఉంటే ఈయన బతికున్న రుద్రుడు అనుకోవచ్చును కాని పిశాచము ఉండటముతో ఈయన రుద్రపిశాచ అనగా శివము శవమైంది అని చెప్పకనే చెప్పారు గదా.అంటే ఈ లెక్కన ప్రతివీర్యకణములో రుద్రపిశాచ మమ్మీ అలాగే ప్రతిజీవి బ్రహ్మరంధ్ర గుహ యందు 64 కపాలధారి ఉండటము సత్యమని తెలుస్తోంది గదా.



అసలు మమ్మీలు ఎందుకు ఏర్పరిచారని తెలుసుకోవాలని మమ్మీలను భద్రపరిచే ఈజిప్టు పిరమిడులు గూర్చి చదవడము ప్రారంభించాను.వీళ్ళ నమ్మకము ప్రకారము చనిపోయిన తమ రాజుల అందరికి భూమికి అవతల ఉన్న స్వర్గప్రవేశానికి అడ్డుగా ఒక చీకటి ద్వారముంటుందని..ఈ ద్వారమునకు ప్రవేశించడానికి అది ఉన్న 477 అడుగుల ఎత్తుగా ఉన్న నిర్మాణము చేసి దీని చివర అగ్రభాగములో రంధ్రమును ఉంచితే చనిపోయిన దేహలనుండి వారి ఆత్మలు ఈ చీకటి రంధ్రముద్వారా పైన స్వర్గానికి చేరతాయని..అలాగే చనిపోయిన వీరి దేహలు చెక్కుచెదరనంతవరకు వీరి ఆత్మలు స్వర్గములో సర్వసుఖాలు అనుభవిస్తూంటాయని..ఎపుడైతే ఈ దేహలు పాడిపోయి నాశనమైతే వారి ఆత్మలు కాస్త పున:శక్తితో పున:సృష్టి తీసుకొని వెనక్కి తిరిగి భూలోకములో పుడతారని చెప్పడము జరిగింది.అందుకని చనిపోయిన తమ రాజుల భౌతికదేహలను వివిధ రకాల రసాయన లేపనాలతో పాడ్వకుండా భద్రపర్చడము జరిగింది.చాలామంది ఇది అపనమ్మకమని అనుకున్నారు.అందులో నేనుగూడ ఒకపుడు నేనున్నాను.ఇపుడు లేను.ఎందుకంటే నా మమ్మీన్ని అరుణగిరిలో చూసిన తర్వాతగూడ ఈ మమ్మీల సిద్ధాంతము నిజమని సత్యమని నమ్మక తప్పదు.ఇకపోతే అసలు ఈ మమ్మీలలో తొలి మమ్మీ ఎవరిదో తెలుసుకోవాలని అనిపించింది.ధ్యానములో కూర్చున్నాను.నాకు పదేపదే పళిని కుమారస్వామి విగ్రహమూర్తి కనిపించడము ఆరంభమైంది.అపుడు విచారణ చేస్తే అవును గదా.ఈయనగూడ మమ్మీ గదా.లేకపోతే ఈయన విగ్రహమును నవపాషణ విషపదార్ధాలతో భోగర్ అనే రససిద్ధుడు తయారుచెయ్యడము జరిగింది.ఇది నకిలి విగ్రహమైతే దీనిని అసలు మూలమూర్తి అరుణగిరిలో అంతర్భాగములో కుమారస్వామి సజీవదేహమును సాక్షాత్తు అమ్మవారు ప్రకృతిలో ఉన్న 64 విషమూలికలలో అతీప్రమాదకరమైన తొమ్మిది విషమూలికల రసాయనముతో ఈ దేహమును తొలి ఆది మమ్మీగా మార్చి అరుణగిరియందు భద్రపర్చడము జరిగింది.దీనికి అమ్మవారికి 18 రససిద్ధగురువులు సహయము చేశారు.ఈ సజీవదేహ మమ్మీకి ప్రతిరూపముగా భోగర్ రససిద్ధుడు కాస్త పళినిక్షేత్రములో నవపాషణ విగ్రహమూర్తిన్ని అచ్చుగుద్దినట్లుగా చెయ్యడము జరిగింది.ఇకపోతే ఈ కుమారస్వామి సజీవమూర్తిన్ని మమ్మీగా మార్చి ఈ లోకముగా మరణాతీతస్ధితిలో ఉంచారు.ఇపుడికి అరుణచలములో మనకి కుమారస్వామి పదిసం.రాలు పిల్లాడిగా తిరుగుతూ కారణజన్మలకి భౌతికముగా కనిపిస్తూ వారిని తను ఉండే అరుణగిరి లోపలకి తీసుకొని వెళ్ళడము ఇపుడికిగూడ జరుగుతోంది.అనగా అరుణగినాదర్న్ని,విష్ణుశర్మను ఇలా ఎందరినో గిరిలోపలకి తీసుకొని వెళ్ళితే  రమణమహర్షి దగ్గరికి ఈ పిల్లాడు వెళ్ళి అడిగితే తనకి ఆశ్రమభాధ్యతలున్నాయని తాను గిరిలోపలకి రాలేనని చెప్పడము జరిగినదని ఈయన జీవితచరిత్రములో చూస్తే తెలుస్తోంది.గాకపోతే నాకు అపుడపుడు ఈ పిల్లాడు కనపడతాడు.నాతో మాట్లాడడు.చూసి చిరునవ్వి వెళ్ళొపోతాడు.ఆయనమో నన్ను ఏపుడు నా భౌతికదేహముతో అరుణగిరి లోపలకి తీసుకొని వెళ్తాడా అని ఎదురుచూస్తున్నాను.ఇది జరగాలంటే గిరిలోపుల ఉన్న నా మమ్మీదేహము పాడై నాశనమవ్వాలి.అపుడే నా భౌతికదేహనికి భౌతికమరణము వస్తుంది.ఇది వచ్చే సమయానికి సజీవ కుమారస్వామి కాస్త పిల్లాడిగా వచ్చి నన్ను గిరిలోపలకి తీసుకొని వెళ్తాడుమో..ఎవరికి ఎరుక.అంటే మన భౌతిక దేహనికి కారకము మన వీర్యకణ మమ్మీ అన్నమాట.ఇలా మన భౌతికదేహాలకి మూల వీర్యకణ మమ్మీలు అన్నిగూడ గిరిలోపల భద్రముగా మన ఆదిదంపతులు తయారుచేసి ఆదిలో ఉంచడము జరిగినదని అందరు తెలుస్కొండి.ఈ మమ్మీదేహమున్నంతవరకు మన అన్నిశరీరాలు అన్నిగూడ నేను ఉన్నాను అనే జ్ఞానస్ఫురణతో ఉంటాయి.ఎపుడైతే ఈ దేహమమ్మీ నాశనమవుతుందో ఆక్షణమే మనకి నేను ఉన్నాను నుండి నేను లేను అనే అనుభవానుభూతి జ్ఞానస్ఫురణ పొందితే అపుడు మన అరుణజ్యోతి స్వయంభూ వెలుగు నుండి ఆర్పిపోయినపుడు మన భౌతికదేహనికి భౌతికశాశ్వతమరణము పొందడముతో మనమంతా పూర్ణశూన్యములోనికి శూన్యమవుతాము.ఇది జరుగుతుందని నేను అయితే ఖచ్చితముగా చెప్పలేను.మమ్మీలు నాశనమవ్వడము జరుగదు.కాని ఈ మమ్మీమీద కొంతమేర పగులు రావడము జరుగుతుంది.అపుడు మన భౌతికదేహనికి అశాశ్వత భౌతికమరణమును పొందడము జరుతుంది.అపుడు ఈదేహ పగులు నివారణకోసము  తిరిగి బాగుచెయ్యటానికి మన మమ్మీలకి రక్షణకవచముగా పళినికుమారస్వామి పూర్ణరససిద్ధిజ్ఞానముతో ఉన్నాడు.ఈయనకి సహాయముగా 18 మంది రససిద్ధయోగగురువులు ఉన్నారు.వీరంతాగూడ నిత్య మరణాలు లేని మరణాతీత శాశ్వత సజీవమూర్తులు అని తెలుస్కొండి.ఈ మమ్మీలసిద్ధాంతము నిజము అనటానికి మనకి నవనాధులచరిత్రలో కనపడుతుంది.మొదట నవనారాయణులు ఈ భూలోకానికి వచ్చి తమ దేహలను ఒక గుహలో భద్రపర్చుకొని ఆ తర్వాత నవనాధులుగా జననాల ప్రక్రియను కొనసాగించారు.ఇకపోతే మన ఆత్మశరీరాలు మొదట పిరమిడ్ అయిన కైలాస పర్వతములో భద్రపర్చపడతాయి.ఇవి కాస్త కాలానుగుణముగా ఆకాశయానము చేసి కాశీ క్షేత్రానికి చేరుకొని ఆ తర్వాత 477 కోట్ల జన్మల తర్వాత అరుణగిరికి చేరుకుంటాయి.ఏ ఆత్మశరీరాలలో తమకి ఉన్న అంతిమ బలహీనత కోరిక మాయ దాటని ఈ శరీరాలలో స్త్రీ శరీరాలను పురుషసింహమును తింటే పురుష శరీరాలను ఆడ సింహము తినడము జరుగుతుంది.ఇందులో నాకు స్వానుభవముగా నాకు కాంతమాయ ఇచ్చిన నందాదేవి యోగిని ఆత్మశరీరము  కాస్త అరుణగిరి ముందుకి చేరుకుంది.అపుడు ఈ దెహనికి ఉన్న అంతిమ పుత్ర మోహమాయను దాటకపోవడముతో ఈమే శరీరమును ఒక మగసింహము తినడము ఆరంభించే దృశ్యము నాకు ఒక ధ్యానుదృశ్యము కనిపించింది.అలాగే రాజులు పిరమిడ్లు ముందు స్త్రీ తలతో సింహశరీరమున్న విగ్రహమూర్తి పెట్టడము జరిగింది.అంటే మగ ఆత్మశరీరాలను స్త్రీ సింహలు తినటాయని అర్ధమే గదా.అంటే మన స్వప్నదేహలకి కారకము 0.1 mm భౌతిక మమ్మీ అని తెలుస్తోంది గదా.ఆ తర్వాత వీటి సంయోగఫలితముగా మన ఆత్మశరీర వీర్యకణాలు తయారువుతాయి.పున:సృష్టి కర్మజన్మల చక్రములో జంతు జన్మలు ఆ తర్వాత మానవ,యోగ,దైవ,పరమాత్మ జన్మాలు ఎత్తుతూ  కాశీకి చేరుకోవడముతో..అక్కడ నుండి ఇలా 477 కోట్ల జన్మకి అరుణచలమునకు చేరుకొని మన అంతిమ బలహీనత కోరిక మాయను దాటితే మనము ఆత్మజ్యోతి నుండి అరుణజ్యోతి మారి మమ్మీలుగా మన జ్యోతిశరీరమును భద్రపర్చడము జరుగుతోంది.లేదంటే మన ఆత్మశరీరాలు కాస్త సింహలనోటిలో పడి వీర్యకణాలుగా మారతాయి.తద్వారా పున:కర్మచక్రము ఉన్న అష్టదళపద్మాకార కైలాస పర్వతమునకు చేరుకొని పున:సృష్టి జరుగుతోంది.అంటే అతిచిన్న మర్రివిత్తులో అతిపెద్దమర్రిచెట్టు యొక్క అతీసూక్ష్మ రూపముగా దీని చెట్టుమమ్మీన్ని భద్రపరిచిన ఆదిసృష్టికర్తల మేధోసంపత్తికి జోహర్లు అర్పించకతప్పదు.మన మమ్మీలకి శాశ్వత మరణాతీతస్ధితి ఇవ్వడముతో మనమంతాగూడ శూన్యము యొక్క స్వప్నమునందు స్వప్నదేహపాత్రలతో స్వప్నజగనాటకమును సృష్టి-పున:సృష్టి కర్మ-జన్మ చక్రములో పడి నటించకతప్పదు. జీవించతప్పదు.ఆడకతప్పదు. ఆడించకతప్పదు. గాకపోతే ఇదింతాగూడ మన మమ్మీ దేహ సూక్ష్మాంశ కదిలికలబట్టి మన ప్రతిస్పందనలు కల్గుతాయి.మన ఆది మమ్మీకి ప్రతిరూపముగా పళిని కుమారస్వామి ఉంటే దీని ఆదిజ్యోతిశరీరానికి ప్రతీకగా  రావీకుమీద ఉండే వటపత్రసాయి ఉంటాడు అన్నమాట.ఈయనలో కదలికలే ఈ విశ్వ సృష్టి-స్ధితి-లయ ప్రక్రియల మూలమని పురాణవచనము గదా.ఈయన కదలికలకి మూలకణమైన అరుణగిరి పళినికుమారస్వామియని తెలుస్తోంది గదా.ఈయన పోడు.ఆయన కదలిక ఆపడు.ఇక సృష్టి ఆగదు.మన పాత్రలు ఆగవు.అది ఏమిటి..అరుణజ్యోతిగా మారితే మనకి పూర్ణమోక్షగదా అన్నారు అంటే మన శరీరాల ఆయుష్ ఒకసారి చూద్దాం.అనగా మన స్ధూల,సూక్ష్మ,కారణ,వాయు,ఆకాశ,సంకల్ప,ఆత్మ,జ్యోతి శరీరాలకి వరుసగా 100,500,1000,5000,10వేలు,ఒకలక్ష,5లక్షలు,పదిలక్షలు సం.రాలు ఆయుష్ ఉండాలని మన ఆదిలో విధాత విధిరాతగా ఆయు:ప్రమాణము లిఖించడము జరిగింది.ఈ లెక్కన చూస్తే మన జ్యోతిశరీరానికి ఆయుష్ పదిలక్షల సం.రాలు అన్నమాట.ఇది మనకి నిర్వికల్పసమాధిస్ధితిలో మూడున్నరసం.రాలతో సమానము అయితే ఆదిదంపతుల కాలమానప్రకారము 48ని.లతో సమానమని మనకి శివపురాణమునందు శివుడి ధ్యానస్ధితి రెండు విఘడియాలు అనగా 48ని.లు అని చెప్పడము జరిగింది.దీనిని బట్టి చూస్తే మనము అరుణజ్యోతిగా పూర్ణమోక్షస్ధితిలో పొందే శాంతిస్దితి 48 ని..లేదా 10 లక్షలు సం.రాలు అని తెలుస్తోంది.ఆ తర్వాత మనము తిరిగి బలహీనత కోరిక మాయలో పడతాము.ఎందుకంటే మనకి తెలిసిన ఈ జ్యోతిపూర్ణజ్ఞానము మనకి తెలియకుండానే అపస్మారకస్ధితి పొంది మర్చిపోయి తిరిగి మనకి మనమే పున:కర్మజన్మచక్రములో పడిపోయి పున:సృష్టి చెయ్యడము జరుతోంది.మరణము లేని మమ్మీ ఉన్నంతవరకు ఇది ఇలాగే అవిఘ్నముగా అవిశ్రాంతిగా అవిచ్చినముగా అశాంతిగా కొనసాగుతూనే ఉంటుంది.ఇక మోక్షసాధన కధ అంతులేని కధగా ఎన్నడు కంచికి చేరని కధగా కొనసాగుతూనే ఉంటుంది.

ఇక్కడ నాకు కొన్ని సందేహలు వచ్చాయి. అది ఏమిటంటే ఏపుడో చనిపోయిన మన మమ్మీదేహము మనల్ని ఏలా ఆధీనములో ఉంచుకుంది.అంటే ఈ మమ్మీ ఉండటమువలనే మన అష్టశరీరాలున్నాయి.ఇదిలేకపోతే అనగా ఈ దేహము  నాశనమైతే అపుడు మన అష్టశరీరాలుగూడ నాశనమువుతాయి గదా.మరి ఈ మమ్మీ ఎందుకు నాశనము గావడము లేదు.మరి ఇది ఏలా నాశనమవుతుంది అని నా పరిశోధన మొదలైంది.వేద ఉవాచ ప్రకారము త్రాడు చూసి అది పాము అని భ్రమపడుతున్నామని చెపితే అదే ఉపనిషత్తు ఉవాచ ప్రకారము ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయని వాటిలో ఒకటి గాలిలో ఏగిరితే మరొకటి చెట్టు మీద నిశ్చలముగా ఉంటుందని  చెపితే యోగులు అభిప్రాయప్రకారము చూస్తే పరమాత్మ బింబానికి మనమంతా ప్రతిబింబాలేనని చెప్పడము జరిగింది.అంటే ఇందులో త్రాడు లేదా నిశ్చలపక్షి లేదా పరమాత్మ బింబము అనేవి మన మమ్మీదేహము గూర్చి ఉద్ధేశించి చెప్పడము జరిగినదని నాకర్ధమైంది.మనిషి చనిపోతే వాడి జీవాత్మ తను చనిపోయిన విషయము నమ్మదని అక్కడే ఆ శవము చుట్టు తిరుగుతూనే ఉంటుందని ఏపుడైతే ఈ శవమును కాల్చడమో లేదా పూడ్చడమో చేస్తే కాని ఈ జీవాత్మకి తను చనిపోయానని తెలుసుకొని ఊర్ధ్వలోకాలకి వెళ్ళుతుందని గరుడపురాణము చెపుతోంది.అలాగే అధ్వరణ వేదములో తాంత్రిక ప్రయోగాలు అనగా చేతబడి,భాణామతి,కాస్మోరా,వశీకరణ వంటి క్షుద్రప్రయోగాలలో వాడే వస్తువులు అనగా జుట్టు,గోరులు,బట్ట,కాలి ఇసుక వంటి వాటిని ఉపయోగించి చంపవలసినవాడికి క్షుద్ర ప్రయోగము చేయ్యవచ్చును.అలాగే ఈ ఉపయోగించిన వాటిన్ని వాళ్ళు ఒకచోట రహస్యగుహలో భద్రపర్చడము జరుగుతుంది.వీటిని నాశనము చేస్తే అపుడు ప్రయోగ బాధితుడిని రక్షించవచ్చును.అంటే ఏటుచూసినగూడ మన మమ్మీదేహము నాశనమైతే మనము శూన్యమవుతామని తెలుస్తోంది గదా.ఇక మన మమ్మీదేహము విషయానికి వస్తే అది ఉన్నది నిత్యా జ్ఞానాగ్ని కొండలో అగ్నితీర్ధములో బడవాగ్ని ఉన్న చోటులో ఉన్నాయి.ఇక పంచభూతాలు,కాలము దీనిని నాశనము చెయ్యలేవు. ఎందుకంటే వీటికి అతీతమైనస్ధితిలో జ్యోతిశక్తితో మన మమ్మీదేహముంది.అంటే ఈ లెక్కన శక్తిన్ని నాశనము చెయ్యలేము.తిరిగి సృష్టించలేము అని తెలుస్తోంది గదా.ఈ లెక్కన మనంతాగూడ ఆదిలోనే పుట్టడము, పెరగడము, చనిపోవడము, మోక్షము పొందడము జరిగింది.మన జ్యోతిశరీరమును మమ్మీగా మారడముతో ఇంక మన శరీరాలకి మనము బ్రతికే ఉన్నాము అనే భ్రమ,భ్రాంతి,మాయ,మోహ,వ్యామోహములో ఉన్నాయి.ఈ మాయజ్ఞానము వీటికి పోవాలంటే మన మమ్మీ నాశనమవ్వాలి.ఇది జరిగే అవకాశమే లేదు ఎందుకంటే మమ్మీ అంటే మన నీడ లాంటిది.ఎక్కడైన నీడను నాశనము చెయ్యగలమా?చెయ్యలేము గదా.కాని అది లేకుండా చెయ్యవచ్చును.  అనగా నీడ ఉన్న చోటుకి వెళ్ళితే మన నీడ కనిపించదు గదా.అంటే మనము వెలుతురులో ఉంటే మన మమ్మీనీడ కనపడుతుంది.అదే వెలుతురు లేని చీకటిలో ఉంటే మన మమ్మీనీడ కనిపించదు గదా.ఇలా ఈ మమ్మీనీడ కనిపించనిస్ధితియే మోక్షస్ధితి అన్నమాట.ఈస్ధితిలో మనము 48ని.లు మించి ఉండలేము.ఆ తర్వాత వెలుతురు ఉన్నచోటుకి వెళ్ళకతప్పదు.అపుడు పున:సృష్టి జరుగకతప్పదు.అందుకే ప్రళయాలు వచ్చినతర్వాత సృష్టి కాస్త పున:సృష్టి జరుగుతోంది.ఇదింతా బాగానే ఉంది. ఎపుడో ఆదిలో చనిపోయిన మనమమ్మీ దేహము నుండి ఇదింతా జరుగుతోందని ఎలా నమ్మేది అన్నపుడు పాండరంగడు భక్తుడైన ఘోరభక్తుడు ఒక ప్రమాదములో చనిపోవడము జరిగింది.అక్కడ ఆయనతో పాటుగా ఆ ప్రమాదములో కొన్నివేలమంది చనిపోయి అస్ధిపంజరాలగుట్టలుగా మారారు.ఇందులో ఘోరా భక్తుడు ఎముకలు ఏలా గుర్తుపట్టాలో తెలియక జ్ఞానదేవుడుయోగిని అడిగితే ఏ ఎముకల నుండి మనకి ఓంకార నాదము వస్తొందో ఆ ఏముకలు అన్నిగూడ ఘోరాభక్తుడివే అని చెప్పడముతో ఈ నాదము చేసే ఏముకలు  సేకరించి ఆయన జీవసమాధి చేశారు.మరి ఈ అస్ధిపంజర ఎముకల నుండి ఈ నాదము ఎవరు చేశారో మీరే ఆలోచించుకొండి.  అలాగే మన మమ్మీదేహమునుండిగూడ ఓంకారనాదము వస్తుందని నమ్మకతప్పదు.అలాగే నాదము,కాంతి నుండియే ఈ విశ్వమేర్పడినదని మన మహర్షులు చెప్పడము కాదు మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు గదా.మరి మన ఆదిమమ్మీకి ఈ రెండు అదే జ్యోతికాంతి,ఓంకారనాదము ఉన్నాయి గదా.మనమమ్మీ చావు నుండి మనము కనపడుతున్నాము(పుడుతున్నాము).మన చావు నుండి మన మమ్మీ కనపడుతుంది (పుడుతుంది).కాబట్టి  మనమంతాగూడ మరణము లేని జీవులని మోక్షము పొందిన జీవులని ఇపుడికైనా తెలుసుకొండి.ఇక మన మమ్మీదేహమున్నచోటుకి అదే అరుణగిరికి వెళ్ళి దానిని ఒకసారి ధ్యానములో చూడండి.ఈ జన్మ అనేది మోక్షజన్మయని తెలుసుకొండి.

నాకు అర్ధముకాని విషయము ఏమిటంటే అన్నింటిన్ని పరిత్యాగము చేసి అన్నింటయందు రాహిత్యస్ధితి పొంది పూర్ణజ్ఞానమును పొంది మోక్షసన్యాసస్ధితి పొందిన నాలాంటి వారెందరోగూడ మోక్షస్ధితి 48ని.పాటు పొంది తర్వాత తిరిగి ఎందుకు పున:సృష్టి చక్రములో పడుతున్నారో తెలుసుకోవాలని నా పరిశోధన మొదలైంది.ఇక నుంచి వచ్చే నా స్వాధ్యానుభవాలు అన్నిగూడ నాకు తప్ప ఎవరికి అర్ధముకాని స్ధితి మీకు అర్ధమై అయోమయ అనుమానము పొందేస్ధితికి తీసుకొని వెళ్తాయని నాకు అర్ధమైంది.కాని నా వంతు ప్రయత్నముగా మీకు అర్ధమై విధముగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.ఆదిలో జరిగిన రెండు ఘోరమైన తప్పులవలన మనము శాశ్వత మోక్షము పొందకుండా తాత్కాలికమోక్షము పొందుతున్నామని నాకు అర్ధమైంది.అది ఏమిటంటే ఈజిప్టు పిరమిడ్ సిద్ధాంతము విషయానికి వస్తే చనిపోయిన రాజు యొక్క పార్ధివదేహము నుండి జీవాత్మ బయటికి వచ్చి చీకటికి అవతల ఉన్న స్వర్గములోనికి వెళ్ళటానికి పిరిమిడ్ రంధ్ర నిర్మాణము ఉపయోగపడుతుందని వీళ్ళ నమ్మకము గదా.అంటే స్ధూలశరీరమును పిరిమిడ్లో పాడ్వకుండా దాచిపెట్టారు.ఈ విషయము బాగా గుర్తుపెట్టుకొండి.ఎందుకంటే స్ధూలశరీరము నుండి జీవాత్మ బయటికి వచ్చి చీకటి రంధ్రము ద్వారా స్వర్గానికి వెళ్ళుంతుంది.వాళ్ళ దృష్టిలో  స్వర్గమంటే మన దృష్టిలో శూన్యత అన్నమాట.కాని ఇక్కడ ఆదిలో మొట్టమొదటి ఘోరమైన తప్పు జరిగింది.అది ఏమిటంటే ఆదిలో అదిరుద్రుడి స్ధూలశరీరమును పిరమిడ్లో దాచకుండా బయటికి వెళ్లే జ్యోతిశరీర (జ్యోతాత్మ)ను పిరిమిడ్లో  భద్రపర్చడము  జరిగింది.అపుడు పిరమిడ్ కి ఉన్న రంధ్రము నుండి చీకటి అవతలకి ఉన్న శూన్యతలోనికి వెళ్లే అరుణజ్యోతి ఈ పిరమిడ్ లో ఆగిపోయింది.అదే రుద్రుడి యొక్క స్ధూలశరీరమును పిరమిడ్ లో భద్రపరిచి ఉంటే ఈయన జీవాత్మ అయిన అరుణజ్యోతి ఈ పిరమిడ్ రంధ్రము ద్వారా బయట అవతల ఉన్న చీకటి రంధ్రము ద్వారా శూన్యములోనికి ప్రవేశించి శూన్యమైపోయేది.అంటే ఆదిలో శూన్యమవ్వలసినదానిని  భద్రపర్చడము జరగడముతో మనమంతాగూడ మోక్షసాధన ద్వారా మన ఆది జ్యోతిశరీర మమ్మీన్ని చూసిరావడము జరుగుతోంది అన్నమాట.అంటే శివాలయాలలో శివలింగానికి బదులుగా శివస్వరూప శరీరమును ఉంచాలి అన్నమాట.అంటే శివరూపస్వరూపము శివుడి స్ధూలశరీరమైతే శివలింగము అనేది శివుడి జీవాత్మ జ్యోతిరూపము అన్నమాట.అనగా పిరమిడ్ ద్వారా శూన్యములోనికి వెళ్ళవలసిన జ్యోతిలింగము కాస్త పిరమిడ్ లో భద్రపర్చబడింది అన్నమాట.అపుడు శూన్యములోనికి ఇక వెళ్ళటానికి ఏమిలేదు గదా.అదే శివుడి స్ధూలశరీరమైన శివుడిరూపమును మనము దేవాలయములో ఉంచితే అపుడు ఈయన శివాత్మయైన అరుణజ్యోతి కాస్త పిరమిడ్ రంధ్రమార్గం ద్వారా శూన్యములో కలిసి శూన్యమైపోయేది.అంటే దేవాలయ పిరమిడ్లో జ్యోతిశివలింగమును పూజించకుండా శివుడి రూపమును పూజించాలి అన్నమాట.అపుడు అందరు శాశ్వతమోక్షస్ధితిలో ఉండేవాళ్ళు.కాని ఆదిలో రుద్రుడి యొక్క జ్యోతిశరీరమే అదిశరీమైంది.దీనిని భద్రపర్చడము వలన దీని రూపాంతరము నుండి వరుసగా ఆత్మ,సంకల్ప,ఇలా సప్తశరీరాలు వచ్చి స్ధూలశరీరముతో ఆగిపోయింది.వాళ్ళ దృష్టిలో జ్యోతిశరీరము ఆది అయ్యి స్ధూలశరీరము అంతమవుతుంది.కాని మన దృష్టిలో ఆది శరీరము స్ధూలశరీరమైతే అంతశరీరము జ్యోతిశరీరమవుతుంది అన్నమాట.అంటే జ్యోతిశరీరం నుండి ఇక ఏమీ రూపాంతరము చెందలేదు.కాని స్ధూలశరీరము నుండి సప్తశరీరాలు రూపాంతరము చెందినాయని మీరు తెలుసుకొండి. అంటే రూపాంతరము చెందే స్ధూలశరీరమును భద్రపర్చకుండా రూపాంతరము చెందని జ్యోతిశరీరమును అరుణగిరి పిరమిడ్లో భద్రపర్చడముతో ఆ గిరికి ఉన్న అగ్రభాగ రంధ్రము నుండి కాంతి బయటికి వస్తోంది.ఎందుకంటే ఈ రంధ్రము ద్వారా బయటికి వచ్చి శూన్యమయ్యే అరుణజ్యోతి కాస్త పైకి పోకుండా గిరిలోపుల భద్రపర్చడింది గదా.అదే రుద్రుడి స్ధూలశరీరమును ఆదిలో ఈ గిరియందు భద్రపర్చిఉంటే ఆది అరుణజ్యోతి కాస్త ఈ పిరమిడ్ ద్వారా బయటికి వచ్చి ఈపాటికే శూన్యమైపోయేది.కాని ఈ జ్యోతి భద్రపర్చడముతో ఈ గిరి కాస్త అగ్నిజ్వాలతో అగ్నిపర్వతముగా మారింది.పంచభూతాలలో అగ్నితత్వమును పొందింది.ఈ అగ్నిజ్యోతి కాస్త అరనిమారని అరుణజ్యోతి అయింది.  మనమంతాగూడ మోక్షసాధన చేసి మనమంతాగూడ అరుణజ్యోతి యని అంతిమ జ్ఞానస్ఫురణ పొంది మన అంతిమ జ్యోతిశరీర మమ్మీన్ని చూసి  అక్కడ 48ని పాటు తాత్కాలిక మోక్షస్ధితి పొంది వెనుతిరిగి వస్తున్నాము.ఎందుకంటే శూన్యమవ్వవలసిన జ్యోతి శూన్యమవ్వకుండా మిగిలిపోతోంది గదా.ఇది ఇలా జరగటానికి ఒకబలమైన కారణముంది.ఇది నా దృష్టిలో ఆదిలో జరిగిన రెండవ తప్పు అన్నమాట.అది ఏమిటంటే బండాసురుడు రాక్షస కధ అందరికి గుర్తుందా..అదే ఈ రాక్షసుడు అనేవాడు మన్మధుడు శరీరమును శివుడు బూడిద చేసినపుడు దీనిని నుండి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు.అంటే ప్రాణము లేని బూడిద నుండి ప్రాణము ఉన్న  రాక్షసుడు ఉద్భవించడము జరిగింది.వీడి సంహరము కోసము బ్రహ్మండమునకు అవతల ఉన్న త్రిపురశక్తిమాత అయిన లలితాదేవిన్ని బ్రహ్మండము లోపలకి పిలిపించి సంహరము చేయించడము జరిగింది.అంటే బయటికి వెళ్లేయోగము ఉన్న కుండలిశక్తిన్ని శరీరలోపలకి పిల్చి కర్మబంధనము చెయ్యడము జరిగింది గదా.లలితామాత అంటే కుండలిమాత అన్నమాట.ఎందుకంటే ఈ లలితా సహస్రనామాలలో సప్తయోగచక్రాలు గూర్చి,కుండలిశక్తి గూర్చి చెప్పడము జరిగింది.అంటే ఈ లెక్కనచూస్తే ఆది శివుడి కుండలిశక్తి ఈ లలితామాత అన్నమాట.అందుకే ఈవిడ కాస్త శివుడి మీద తాపీగా కూర్చుని ఉంటుంది.అదే వామాచారములో చూస్తే శివుడి కుండలిశక్తి కాస్త రుద్రకాళి అవుతుంది అన్నమాట.అంటే ఏటుచూసినగూడ శివుడి కుండలిశక్తి తన బ్రహ్మరంధ్రము ద్వారా బయటికి పోకుండా అనగా శూన్యములో శూన్యమవ్వకుండా అరుణజ్యోతి కాస్త జ్యోతిశరీరముగా రూపాంతరము చెంది సప్తశరీరాలతో పున:సృష్టి చేస్తోంది అన్నమాట.ఒకవేళ బండాసురుడి సంహరము కోసము బ్రహ్మండమునకు బయట ఉన్న లలితాదేవికి తనలోనికి పిలిపించకుండా ఉండి ఉంటే ఆదిలో జ్యోతిశరీరమును భద్రపర్చకుండా స్ధూలశరీరమును భద్రపర్చడము జరిగేది.అపుడు ఆది అరుణజ్యోతి మిగిలిపోకుండా శూన్యమైపోయేది.అంటే ఆదిలో ఈ రెండు తప్పులు చెయ్యకుండా ఉండిఉంటే మనకి మోక్ష-కర్మ జన్మలు అంతులేని కధగా మారేవికావు గదా.ఆలోచించండి.మీకే అర్ధమవుతుంది. ఆదిలో జరిగిన ఈ రెండు తప్పులు తెలుసుకొని ఆ తర్వాత అమ్మవారి నుండి తమ స్ధూలశరీరస్వరూపమును పిరిమిడ్ లాంటి దేవాలయాలలో భద్రపరిచిన ఇక ఏమి ఉపయోగము ఏమి లాభము ఉంటుంది.గావాలంటే దేవాలయాలలో మనకి శివరూపము కన్నా శివలింగమే దర్శనమిస్తుంది. మిగతా దేవతారూపములు దర్శనమిస్తాయి కాని వారి జ్యోతిశరీర జ్యోతిలింగాలు దర్శమివ్వవు.తర్వాత ఆదిలో రుద్రుడి విషయములో జరిగిన తప్పుకి పరిహరముగా జ్యోతిలింగమునకు బదులుగా రుద్రదక్షిణామూర్తి రూపమును పూజించడము జరిగింది.ఇది జరిగేసరికి సత్య,త్రేత,ద్వాపర యుగాలు పూర్తి అయ్యి కలియుగము వచ్చింది.అలాగే బుగ్వేద కాలములో చేసిన ఆదితప్పును అధర్వణ వేద కాలములో తెలుసుకొని పరిహరము చేస్తే ఏమిలాభము చెప్పండి.చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిలాభము..తప్ప తప్పేగానే తప్పకమిగిలిపోయేంది.దీనికి ప్రత్యక్షనిదర్శనముగా మనకి అరుణగిరియే చూపిస్తోంది.అది ఏమిటంటే ఎవరైన అరుణగిరి దక్షిణముఖము నుండి అనగా దక్షిణమూర్తి ఉన్న గుడి ఉన్నచోటు నుండి మనకి ఎడమవైపు నుండి కొండ అగ్రభాగము నుండి కిందవైపు చూస్తే పడుకొని ఉన్న ముఖము లాగా కనపడుతుంది.








కావాలంటే నేను తీసిన ఈ దృశ్య చిత్రాలు చూడండి.మీకే అర్ధమవుతుంది.పైగా కొండ అనేది శివుడి స్ధూలశరీరమని చెప్పడము జరిగింది గదా.అలాగే జ్యోతిశరీరముతో అరుణగిరి శివుడు ఒక సిద్ధయోగిరూపములో గిరిలోపుల ఇపుడికి సజీవమూర్తిగా ఉన్నాడని  లోకవిధితమే గదా.అలాగే కొండ బయటవైపు మర్రిచెట్టు కింద దక్షిణమూర్తి కాస్త సూక్ష్మశరీరముతో ఉన్నాడని లోకవిధితమే గదా.అలాగే ఈ గిరిలోఫుల ఉన్న అగ్నిరుద్రలింగము యొక్క కాంతిరూపమే మనకి కొండపైన అగ్రభాగములో అరుణజ్యోతిగా కనపడుతోందని లోకవిధితమే గదా.అంటే ఈ లెక్కనచూస్తే గిరిలోపుల ఉండవలసిన శివుడి స్ధూలశరీరము గిరిబయట ఉన్నదని అలాగే గిరిబయట ఉండవలసిన శివుడి అంత్యశరీరమైన జ్యోతిశరీరము గిరిలోపుల ఉన్నదని మనకి తెలుస్తోంది గదా.ఇక్కడ శూన్యమవ్వాలసిన అరుణజ్యోతియే జ్యోతిశరీరమని తెలుసుకొండి.అనగా జ్యోతిశరీరము అలాగే అరుణజ్యోతి వేరుగాదు అన్నమాట. శివుడి అంత్యశరీరము ఆరని మారని అరుణజ్యోతి అన్నమాట.ఇదికాస్త గిరిలోపుల భధ్రపర్చడముతో గిరిరంధ్రము ద్వారా శూన్యములోనికి వెళ్ళకుండా ఈ రంధ్రమార్గములో మనకి గిరి అగ్రభాగములో అరుణజ్యోతి కాస్త ఆరనిమారని అగ్నిజ్యోతిగా వెలుగుతోంది అన్నమాట.ఇదే మన కొంపముంచింది.తద్వార మన మోక్షకధను ఆత్మకధగా అంతులేని కధగా రూపాంతరము చెందింది.ఎందుకంటే తప్పు అనే పదమును ఎన్నిసార్లు పలికిన తప్పు అనే పలుకుతాము గదా.అలాగే ఆదిలో చేసిన ఆదితప్పు అలాగే మిగిలిపోయింది.అలాగే అరుణగిరి కాస్త పంచక్రియలు అనగా సృష్టి, స్ధితి,లయ,లాస్య,తిరోగమ ప్రక్రియలు చేస్తోందని ఇందులో లాస్యస్ధితి అంటే మోక్షస్ధితిలో వచ్చే శాంతిస్ధితి అయితే తిరోగమము అంటే వెనక్కి తిరిగిరావడము అన్నమాట.అంటే మోక్షలాస్యస్ధితిలో 48ని.పాటు ఉండి మన అంతిమ జ్యోతిశరీర మమ్మీన్ని చూసి కొండను తవ్వి చచ్చిన ఎలుకన్ని పట్టుకున్నానని తెలుస్కోవడముతో ఉన్న శాంతిస్ధితి కాస్త అశాంతిగా మారడముతో అక్కడ ఉండలేక గిరిలోపుల నుండి తిరోగమము అనగా వెనుతిరగడము జరుగుతోందని నాకు అర్ధమైంది.ఇకపోతే మనకి ఆదిలింగోద్భలింగము ద్వారా రుద్రుడు కాస్త రుద్రపిశాచముగా మారినారని లోకవిధితమే గదా.అంటే మనవాళ్ళు ఆదిలో రుద్రశవము భద్రపర్చవలసినదానికి బదులుగా రుద్రపిశాచమును భద్రపర్చడము జరిగింది అన్నమాట.దీనితో శూన్యములోనికి వెళ్ళి శూన్యమవ్వలసిన రుద్రపిశాచము కాస్త వెళ్ళకుండా అరుణజ్యోతిగా మారి రూపాంతరము చెంది పున:శరీరాలతో కర్మ-జన్మలతో పున:సృష్టి చేస్తోందని తెలుస్తోంది గదా.అంటే శివము కాస్త శవమైంది.ఈ శవము నుండి శివం (రుద్రపిశాచము) కాస్త పున:సృష్టిగా రూపాంతరము చెందుతోంది.ఈ లెక్కనచూస్తే  మన మోక్షకధ కాస్త అంతులేని  ఆత్మకధగా రూపాంతరాలు చెందూతూనే ఉంది.అవిశ్రాంతిగా.. అవిచ్చిన్నముగా.. అశాంతిగా..అంతులేని కధగా...పున:సృష్టితో కొనసాగుతూనే ఉంటుంది గదా.ఏమంటారు.నిజమే గదా.మీరే ఆలోచించండి.పదార్ధము దాటితే యదార్ధము ఏమిటో మీకే అర్ధమవుతుంది.ఇంతడితో ఎవరి మోక్షసాధన కధగూడ ముగింపు లేని ఆత్మకధ అని తెలుస్తోంది గదా.

 


అసలు నేను తెలుసుకున్న మమ్మీదేహము సిద్ధాంతము నిజమని చెప్పటానికి వార్తపేపర్లో ఈ మధ్యనే దేవుడి యొక్క కణమును 1996సం.రములో శాస్త్రవేత్తలు కనుగొన్నారని దానికి ఓ మైగాడ్ అని పేరుపెట్టిరాన్ని అంశము వచ్చింది.దీనిని చదవగానే నా మమ్మీదేహము గూడ బీజకణమే గదా అని జ్ఞానస్ఫురణ అయింది.ఇకపోతే పున:సృష్టి అనేది ఈ బీజకణము వలనే జరుగుతోందని తెలుసుకున్నాము కాని ఎలా జరుగుతుందో అలాగే జరిగే పున:సృష్టి ఆపలేమా అని నా పరిశోధన మొదలైంది.అపుడు వేద పురాణ శాస్త్ర వచనాలు ప్రకారము చూస్తే పున:సృష్టి అనేది అరుణగిరి లోపుల ఉండే పూర్ణశక్తితో ఉన్న పూర్ణబీజాలున్న పూర్ణకుంభము కాస్త నాలుగు యుగాలు పూర్తి అయినతర్వాత వచ్చే యుగ జలప్రళయము జరిగిన తర్వాత ఈ పూర్ణకుంభము గిరిలోపుల నుండి బడావాగ్ని యొక్క కాంతిమార్గము ద్వారా పైకి వచ్చి అదికాస్త కుంభకోణము ప్రాంతమునకు చేరి అక్కడ ఈ కుంభ కోణభాగములో పగులువచ్చి అందులో ఉన్న బీజాలు అన్నిగూడ మొదట తిరువాయుర్ ప్రాంతమునకు చేరుకొని అష్టశరీరాలతో ఉన్న వీర్యకణముగా రూపాంతరము చెంది అందులో మోక్షజ్ఞానము కోసము ఒక వీర్యబీజకణములో ఉన్న 64 వీర్యకణాలు కాస్త చిదంబరక్షేత్రానికి వెళ్ళి పూర్ణజ్ఞానము పొందితే మిగిలిన 63 వీర్యబీజకణాలు కాస్త హిమాలయములో ఉన్న కైలాసమునకు చేరి యోగజన్మాలు పొందితే మరికొన్ని మరికొన్ని ఉజ్జయిని క్షేత్రానికి చేరుకొని భోగజన్మాలు ఎత్తుతాయని అలాగే ఎపుడైతే ఈ యోగ లేదా బోగ జన్మాలు కర్మ-జన్మల వాసన పోతుందో అపుడు ఇవన్నీగూడ అనగా భోగ,యోగ,మోక్ష జన్మాలు కాస్త కాశీక్షేత్రానికి చేరుకోవడము జరుగుతుంది.ఎపుడుడైతే ఇవి మోక్షసన్యాసయోగానికి వస్తాయో అపుడు అరుణచలక్షేత్రానికి వచ్చి ఆరనిమారని అరుణజ్యోతిగా మారుతాయి.అపుడు ఇవికాస్త వీర్యకణబీజముగా మారి అరుణగిరి పూర్ణకుంభములో చేరుకొని పున:సృష్టితో తిరోగమనము చెంది పున:కర్మ జన్మలు ఎత్తున్నాయి.ఇదింతా బాగానే ఉంది.ఇది నిజమని ఎలా నమ్మేది అనుకున్నపుడు నాకు ఒక ధ్యానానుభవమైంది.



అరుణగిరి లోపుల లింగభాగము లేని శివలింగము కనిపించింది.నల్లగా ఉండి సుమారుగా మూడు అడుగులు ఉంది.లింగము ఉండవలసినచోట ఖాళీ ప్రాంతముంది. నాకు ఆశ్చర్యమేస్తుండగా ఈ ఖాళీ ప్రాంతము నుండి మట్టి కుండ ఒకటి లోపుల నుండి బయటికి వచ్చి గాలిలో నిలబడి తనచుట్టు తాను తిరుగుతోంది.ఈ కుండ లోపుల బాక్టరీయాల పరిమాణములో ఉన్న ఏవో కణలు వివిధ రంగులలో అనగా నీలము,పసుపు,తెలుపు,నలుపు,ఎరుపు,ఆకుపచ్చ,కాషాయ,బంగారము వన్నెలో ఉన్నట్లుగా గమనించాను.ఇవే మన అష్టశరీరాల రంగులన్ని అలాగే మన చుట్టు ఉండే ఆరాశక్తిలోని అష్టరంగులని నాకర్ధమైలోపుల ధ్యానభంగమైంది.ధ్యానము నుండి బయటికి వచ్చిన తర్వాత విచారణ చేసుకుంటే అంటే ఈ పూర్ణకుంభము సిద్ధాంతము నిజమని గ్రహించాను 



అలాగే శివాలయాలలో ఉన్న శివలింగము మీద ఒక కుండలాంటి నీటి ధారపాత్రను పెట్టి అందులో నిండుగా నీరుపోస్తే ఆ నీరు కాస్త ఈ పాత్రకి ఉన్న సన్ననిరంధ్రము ద్వారా నీరు బయటికి వచ్చి ఒక ధారగా కింద ఉన్న శివలింగము మీద పడుతుంది.గావాలంటే ఈ సారి శివాలయానికి వెళ్ళి ఈ ధారపాత్రను పనివిధానమును చూడండి.అంటే పూర్వీకమహర్షలు ఆదిరుద్ర శివలింగము నుండి పూర్ణకుంభము బయటికి వచ్చి అందులో ఉన్న పూర్ణబీజకణాలతో పున:సృష్టి చేస్తోందని ఆలయాలలో శివలింగము మీద ఈ ధారపాత్రను ఉంచి మనకి చెప్పకనే చెప్పారు గదా.అది ఎందుకు పెట్టారో మనకి తెలియాలంటే ఇలా స్వానుభవ పాండిత్యము పొందితే కాని మనకి తెలియదు.అర్ధము కాదు.శబ్ధపాండిత్యములో ధారపాత్ర ఎందుకు పెట్టారో అసలు కారణము చెప్పలేరు.ఇది కేవలము శివలింగము మీద నిత్యము జలాభిషేకము జరగటానికి పెట్టారని చెపుతారు.కాని అసలు మూలార్ధము మనకి తెలియాలంటే అనుభవపాండిత్యము పొందాలి.ఇలా పొందినవారి ద్వారా అసలు సిసలు సత్యము తెలుసుకోవాలి.అందుకే శబ్ధపాండిత్యము కన్నా అనుభవపాండిత్యము మిన్న అన్నారు.ఇదింతా బాగానే ఉంది. పూర్ణకుంభము ద్వారా పున:సృష్టి జరుతోంది తెలుసుకున్నాము.కాని ఈ పున:సృష్టి జరగకుండా ఆపలేమా అని నా పరిశోధన మొదలైంది.అపుడు ధ్యానములో నాకు ఆదిజ్యోతిబిందువు నుండి ఒక ఆగ్నికపాలము మాత్రమే బయటికి రావడము పదేపదే కనిపించిసాగింది.అది ఏమిటి?పున:సృష్టి జరిగితే అస్ధిపంజరము రావాలి కాని ఒక కపాలము మాత్రమే ఎందుకు పున:సృష్టి జరుగుతోంది.అంటే మన తల మాత్రమే పున:సృష్టి జరుగుతోందని మిగిలిన శరీరభాగము పున:సృష్టి జరుగడము లేదని ఒకవేళ తలతో ఉన్న శరీరము పున:సృష్టి జరిగితే జ్యోతిబిందువు నుండి అస్ధిపంజరము బయటికి వచ్చేది గదా అనుకుంటుంగా నాకు  ధ్యానభంగమైంది.దానితో విచారణ చేసుకుంటే అంటే పున:సృష్టి కేవలము తల మాత్రమే జరుగుతోంది.ఎందుకంటే ఆదిరుద్రశివలింగములో తలభాగము అనగా లింగభాగములో పూర్ణకుంభము ఉన్నట్లుగా కనపడింది గదా.అలాగే జాతర సమయాలలో శివలింగానికి ప్రత్యేకముగా పంచలోహమూర్తిగా జటాజుటముతో ఉన్న శివుడితలను పెట్టడము జరుగుతుంది.అంటే ఈ లెక్కనచూస్తే శివుడి తల మాత్రమే పున:సృష్టి జరుగుతోంది అన్నమాట.ఇది సత్యమని చెప్పటానికి మనకి రెండు కధలు నిదర్శనముగా కనపడతాయి.అందులో ఒకటి శివుడు కాస్త హాలహలము సేవించినపుడు ఈ విషము దాటికి తట్టికోలేక అవస్ధలుపడుతుంటే అమ్మవారు కాస్త  తారాదేవిగా మారి తనచనుపాలు ఇచ్చి విషము కాస్త శరీరములోనికి ప్రవేశించకుండా గొంతుపట్టినదని చెప్పడము జరిగింది.అంటే విష ప్రభావము వలన తల చనిపోయి శరీరము బ్రతికి ఉండి ఉండాలి.అలాగే రాహు-కేతు గ్రహల విషయానికి వస్తే దేవతలు అమృతము సేవిస్తున్నారని రాహు రాక్షసుడు తెలుసుకొని దేవతరూపము ధరించి ఈ అమృతము సేవిస్తున్న సమయములో విష్ణువు ఈ విషయము గ్రహించి తన సుదర్శనాయుధముతో వీడి తలను చేధించడముతో శరీరము నుండి తల వేరు అయింది.అమృతసేవనము వలన తల బ్రతికితే శరీరము కాస్త మరణమును పొంది పున:సృష్టి అయ్యింది.తల కాస్త రాహుగాను శరీరము కాస్త కేతుగాను పూజలు అందుకుంటున్నాయి.అంటే ఈ రెండు కధలు బట్టిచూస్తే శరీరము నుండి తల వేరు అయినదని మొదటి శివకధలో శివుడితల నిర్జీవమైతే..రెండవ రాహు కధలో తల సజీవమైంది అని తెలుస్తోంది.అంటే పున:సృష్టితో తల కాస్త సజీవమైంది అనుకోకతప్పదు గదా.ఈ రెండు కధలలో శరీరాలు సజీవముగానే ఉన్నాయి.అంటే ఆదిలో రుద్రుడి తల మొదట నిర్జీవమైతే దానిని పున:శక్తితో పున:సృష్టితో కొత్త తలను శివుడి శరీరానికి అమర్చి ఉండి ఉండాలి.దానితో పాత తల తెలుసుకున్న పూర్ణజ్ఞానము కాస్త అపస్మారకస్ధితి అనగా తెలుసుకున్న జ్ఞానము మర్చిపోవడముతో కొత్త తలకి తాను శివుడనే జ్ఞానము పోయి జీవుడనే అజ్ఞానమాయలో పడుతూండాలి.పున:సృష్టిలో పున:మోక్షసాధన చేసి తాను శివుడనే పూర్ణజ్ఞానము పొంది అరుణజ్యోతిగా మారిన తర్వాత జ్యోతిబిందువులో ఆది మమ్మీదేహ దర్శనము పొందేసరికి శాంతిగా ఉన్నవాడు కాస్త ఉద్రికత్తమైనపుడు ఈ జ్ఞానము పొందిన తల కాస్త మోక్షపొందకుండా శరీరము నుండి వేరుపడి జ్యోతిబిందువులో ఉన్న మాయమార్గములో పడిపోవడము జరిగిపోతోంది.ఆ తర్వాత ఈజ్యోతిబిందువులో ఉన్న అమృతభాండగారమైన పూర్ణకుంభములో ఉన్న మమ్మీదేహములలో భద్రపరిచిన ఉన్న కపాలాల నుండి ఒక కపాలము కాస్త బయటికి వచ్చి  పున:సృష్టి జరిగి ఈ కపాలము లేని అస్ధిపంజరమునకు కొత్త కపాలము చేరడముతో తాను ఎవరో మర్చిపోయి అనగా నేను ఎవరో తెలుసుకోవాలని పున:కర్మజన్మ చక్రములో పడటము జరుగుతోంది అన్నమాట.ఇది సత్యమని అనటానికి రావణబ్రహ్మ కధ గుర్తు తెచ్చుకొండి.రామరావణ యుద్ధము జరుగుతున్నపుడు రాముడు ఎన్నిసార్లు రావణుడి పదితలలు తన బాణాలతో బేధించినపుడు కిందపడిన తలాలు కాస్త మళ్ళీ పైకి వచ్చి ఆయన శరీరానికి అతుకోవడము జరుగుతూండేది గదా.అపుడు ప్రక్కనే విభీషుణుడు వచ్చి రామా..మా అన్న తలలు చేధించలేవు కాని ఆయన బొడ్డులో ఉన్న అమృతభాండరమును చేధించు.అపుడు ఆయనే పడిపోయి ప్రాణాలు విడుస్తాడని చెప్పడము రాముడు ఇలాగే చెయ్యడముతో రావణబ్రహ్మ నేలకి ఓరగడము జరిగింది.ఇందులో రావణ తలాలు పున:సృష్టికి కారకము తన బొడ్డులోని అమృతభాండరము అని తెలిస్తోంది గదా.అలాగే మన పున:సృష్టి తలలు మూలకారకము అరుణగిరిలోని తల లేని రుద్రశివలింగ పూర్ణకుంభమని తెలుస్తొంది గదా.అసలు ఈ పూర్ణకుంభము నుండి పున:సృష్టితో పాత కపాలము మోక్షము పొందకపోవడముతో కొత్త కపాలము మోక్షము పొందటానికి సిద్ధముగా ఉండటముతో మన మోక్షానికి మనపూర్వీక యోగులు కాస్త కపాలమోక్షము అని పేరుపెట్టడము జరిగినదని..మోక్షము పొందవల్సింది కపాలమని తెలుస్తోంది గదా.అలాగే కలిగిన మమ్మీదేహదర్శనానుభవమును గుర్తుకు తెచ్చుకుంటే నాకు నా మమ్మీదేహదర్శనమైనపుడు తల మాత్రమే సజీవముగా కనిపించి మిగితాశరీరమంతాగూడ కాషాయరంగు బట్టతో చుట్టూన్నదని..తలను చూసి అది నా స్దూలదేహ తలగా ఉన్నదని గుర్తించడము జరిగిదని అపుడుకాని నాకు గుర్తుకురాలేదు.అంటే దీనినిబట్టిచూస్తే కపాలమే పున:సృష్టి జరుగుతోందని గ్రహించాను.అమృతము సేవించిన తల అనేది మరణమును పొందమంటే ఏమి పొందుతుంది.నా బొంద..నా బూడిద.అంటే మన కపాలాలు మారుతున్నాయి కాని మన అస్ధిపంజరము మారడము లేదు అన్నమాట.తలకాయలు మారుతున్నాయి కాని శరీరము మారడము లేదు.ఇది ఎలా ఎందుకు జరుగుతోంది తెలుసుకోవాలని నా పరిశోధన మొదలైంది.అపుడు రాహు గ్రహ కధను చూస్తే విష్ణువు కాస్త తన సుదర్శన చక్రముతో రాహుశరీరమునుండి రాహుతలను వేరుచెయ్యడము జరిగింది గదా.ఇక్కడ సుదర్శనచక్రము అంటే చీకటికి అవతల ఉన్న చీకటిరంధ్రము లాంటిది.ఎందుకంటే ఈ ఆయుధానికి రంధ్రముంటుంది.ఈ రంధ్రమునుండి తల బయటికి వస్తోంది కాని  శరీరము ఈ రంధ్రము కింద ఉండిపోతోంది.నా 64 కపాలధారిలో 63 కపాలాలు కాస్త ఒక ఏకకపాల అస్ధిపంజరమునకు  కర్మ-జన్మ బంధముతో అతుకొని బంధించి ఉన్నాయి.ఎపుడైతే నా బ్రహ్మరంధ్రము తెరిచుకుందో అపుడు ఈ కపాలధారి నుండి 63 కపాలాలు ఒక్కొక్కటి కాలానుగుణముగా కర్మ-జన్మ బంధము నుండి బంధవిముక్తి పొంది బ్రహ్మరంధ్ర కాంతిమార్గము ద్వారా పైకి ప్రయాణించి శూన్యములో కలిసి శూన్యమైపోవడము జరిగింది.కాని ఏకకపాల అస్ధిపంజరము కాస్త ఈ బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళలేకపోవడముతో ఈ  అస్ధిపంజరము కాస్త సజీవ శివదేహముతో పొందడముతో ఈ దేహము కాస్త శివోహం స్ధితి పొందడము జరిగింది.గాకపోతే ఈ అస్ధిపంజరమునకి ఉన్న 63 కపాలాలు మాత్రము అస్ధిపంజరముతో సంబంధము లేకుండా కేవలము కపాలాలు మాత్రమే మోక్షము పొందితే ఆఖరి 64 కపాల అస్ధిపంజరముతో అనుసంధానమవ్వడముతో ఇది ఏకకపాలముగా మోక్షముపొందనీయ్యకుండా అస్ధిపంజరము అడ్డుగా ఉంది అన్నమాట.అంటే ఈ ఆఖరి 64 కపాలము అనేది అస్ధిపంజరమునకు అనుసంధానమైతే మిగతా 63 కపాలాలు కాస్త ఈ 64వ కపాలానికి అనుసంధానమై ఉన్నాయి గదా.కపాలము నుండి అనుసంధాన కపాలాలు మోక్షము పొందాయి కాని అస్ధిపంజరమునకు అనుసంధానమైన మూల ఏక కపాలము మోక్షము పొందకుండా అస్ధిపంజరముతో సహ మిగిలిపోతోంది అన్నమాట.ఈ ఏక కపాలము మోక్షము పొందితే ఇక మనకి పున:సృష్టి ఉండదు.ఈ మిగిలిపోయే 64 కపాలము మోక్షపొందడమే అసలు సిసలైన కపాలమోక్షమవుతుంది.ఇది పొందనీయ్యకుండా అంతిమ జ్యోతిశరీర మమ్మీదేహము భద్రపర్చడము జరిగింది గదా.ఈ మమ్మీదేహము యొక్క ఆస్ధిపంజరమే ఏకమూలకపాల అస్ధిపంజరము అన్నమాట.దీనికే 63 కపాలాలు వరుసగా 1,3,5,7,9,11,13,15 ఇలా 8 వరుసలలో 64 కపాలాలధారిగా అనుసంధానమైంది.ఇందులో 63 కపాలాలు సహజస్ధితిలో కపాలమోక్షము పొందితే ఆఖరి ఏకకపాల అస్ధిపంజరము కపాలమోక్షము పొందడము లేదని తెలుస్తోంది గదా.ఇలా ఎందుకు జరుతోంది అన్నపుడు మమ్మీదేహము భద్రపర్చడము వలన అర్ధమవుతోంది.దీనిని ఎందుకు భద్రపర్చినారో తెలుసుకోవాలని నా పరిశోధన మొదలైంది.ఆదిలో శివుడు కాస్త విశ్వక్షేమము కోసము సాగరమధనము నుండి వచ్చిన హాలహలమును సేవించడముతో బల్మరణము పొందడము జరిగింది.అంటే ఈయన మరణము ఆదిలో సహజసిద్ధముగా జరుగలేదు.అసహజముగా జరిగింది.దీనితో ఈయనకి తీరని కోరిక బలహీనతమాయ ఉండిపోయింది.దానితో ఈయన కాస్త రుద్రపిశాచముగా మారి తీరనికోరిక తీర్చుకోవటానికి పున:కపాలముతో పున:కర్మ-జన్మలు ఎత్తడము జరుగుతోంది.ప్రతిసారి 64వ కపాలమోక్షము అనేది జరుగడము లేదు ఎందుకంటే ఆ జన్మ అసహజ మరణము పొందడము జరుగుతోంది.అంటే యోగులు కాస్త బతికి ఉండగా జీవసమాధి చెందుతారు గదా.ఇదిగూడ బలవంతపు మరణముతో సమానమే గదా.అంటే అసహజ మరణమే గదా.ఇక అపుడు ఏకమూలకపాల అస్ధిపంజరమునకు ఎలా కపాలమోక్షము వస్తుంది.పోనీ యోగులు లేదా సన్యాసులు లేదా బ్రహ్మచారులు పార్ధివదేహలను కాల్చటానికి బదులుగా పూడ్చడము జరుతుంది.దీనివలన ఈ దేహత్మకి తన అస్ధిపంజరమున్నంతవరకు తాను బ్రతికే ఉన్నానని భ్రమ,భ్రాంతిలో పడుతుంది.ఇదిగూడ అసహజమరణమే అవుతుంది.తద్వారా 64కపాల అస్ధిపంజరము కపాలమోక్ష పొందకుండా ఆగిపోతుంది.ఎందుకంటే ఆదిలో శివుడి అంతిమ జ్యోతిశరీరమును కాల్చకుండా మమ్మీగా మార్చడమే ఈ అస్ధిపంజరము కపాలమోక్షపొందకుండా ఆగిపోతుంది.పున:సృష్టి జరుగుతోంది.ఎందుకంటే గరుడపురాణము ప్రకారము చూస్తే  ఏ దేహనికి అంతిమసంస్కారాలు జరగకుండా అనాదశవముగా ఉండిపోతుందో అలాగే చనిపోయినవారికి తీరనికోరికలతో చనిపోతే వారు కాస్త పిశాచులుగా మారుతారని చెప్పడము బట్టి చూస్తే మన ఆది రుద్రుడు గూడ చనిఫోయి రుద్రపిశాచముగా మారడము బట్టిచూస్తే ఈయన శవదహనము జరగకుండా మమ్మీగా మార్చడము వలన ఈయన ఎన్నిసార్లు పున:కర్మజన్మలు ఎత్తిగూడ తీరనికోరికతో బోగజన్మాలు మరణపొందితే యోగజన్మలలో జీవసమాధి చెందడముతో అలాగే మోక్షసన్యాస జన్మలలో మమ్మీదేహముగా మార్చడముతో ఏటుచూసినగూడ ఈయన దేహము అసహజ మరణస్ధితి పొందుతోంది. ప్రతి వెయ్యిమందిలో ఒకడికి ఇలాగే అసహజ మరణము పొందడము తప్పనిసరిగా జరుగుతుంది.అందుకే మన పెద్దలు కాస్త ఆత్మహత్య అనేది మహపాపమని చెపితే అదే కాశీక్షేత్రములో ఆత్మహత్య చేసుకోవడము పాపము కాదని చెప్పడము జరిగింది.ఒకప్రక్క ఆత్మహత్య అనేది అసహజమరణని చెపుతూ దూరంగా ఉంచుతూంటే మరొపక్క ఆత్మహత్య చేసుకొమ్మని ప్రోత్సహించడము జరుగుతుంది.దీని కారణము ఆదిలో అదిరుద్రుడి శవము కాస్త అసహజమరణమును పొంది మమ్మీగా మార్చడమే అన్నమాట.దీనితో 99.99 శాతము అనగా 64 కపాలాలకి 63 కపాలాలు మోక్షము పొంది 0.01 శాతము అనగా 64వ ఏకమూలకపాలము మోక్షము పొందకుండా శాశ్వతముగా మిగిలిపోతుంది.పున:కర్మజన్మ కారకమవుతుంది.అంతెందుకు బ్లాక్ హోల్ లో పడిన పదార్ధము పూర్తీ నాశమవ్వకుండా 0.01 శాతమున్న రేణువుగా మిగిలిపోయి దీనిని నుండి తిరిగి మళ్ళీ పదార్ధముగా మారుతోందని మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు గదా.అంటే ఈ మిగిలి రేణువు అనేది మన ఆదిరుద్ర కపాలము అన్నమాట.దీని నుండే పున:శక్తి పున:సృష్టి జరుగుతోంది గదా.దినిని ఆపాడము ఎవరితరము కాదు.ఎందుకంటే నాకు మిగిలిపోయిన 64 కపాలము కాస్త ఈ రోజే ఒక కోతి కపాలము మారి పున:కర్మ జన్మగా కోతి జన్మయని తెలుసుకోవడముతో నా మోక్షకధ అంతులేని కధగా మారిందని నాకు అర్ధమైంది.ఇది తన 64వ కపాలభేధన సరిగేసమయానికి ఇది అందరికి వారివారి 64 కపాలము కాస్త ఏదో ఒక జంతుముఖముగా మారడము ఖచ్చితముగా చూడటము జరుగుతుంది.ఆ జంతుజన్మతో వారి పున:కర్మ జన్మ చక్రము తిరోగమనము చెందడము ఖచ్చితముగా జరుగుతుంది.ఇందులో ఎలాంటి సందేహము అనుమానము లేదు.పండుగ చేసుకొండి.అంతెందుకు నరముఖ గణపతి కాస్త గజముఖ గణపతిగా పున:జన్మ ఎత్తడము జరిగింది గదా.ఇలా ఇపుడికి మనకి తెలిసి 63 గజముఖ గణపతులుగా ఉన్నవాడు కాస్త 64 వ గణపతి కాస్త నరముఖ గణపతిగా పున:జన్మ ఎత్తడము జరుగుతుంది.అంటే 64వ కపాలమునకు వచ్చేసరికి మన ఆదిజన్మకి వస్తాము.మానవులకి అయితే ఆదిజన్మ జంతుజన్మ అయితే దేవతలకి ఆదిజన్మ మనిషిజన్మ అవుతుంది.వానరుడు నుండి నరుడు వచ్చాడు.ఈ నరుడు నుండి నారాయణుడు వస్తాడు.ఈయన నుండి ఏదో ఒక జంతుజన్మతో ఈ సృష్టిలో పున:సృష్టి జరుగుతుంది.అందుకే నారాయణుడు కాస్త హయగ్రీవుడిగా..చేపగా..తాబేలుగా..వరహముగా..సింహముగా జంతుతలతో పున:కర్మజన్మలు ఎత్తడము జరిగింది.అంటే ఈ లెక్కన చూస్తే 64 వ కపాలము మోక్షముపొందకుండా దానిని ఆదిజన్మ కపాలముతో పున:కర్మజన్మతో పున:సృష్టి చేస్తోందని తెలుస్తోంది గదా.ఇంతవరకు నాకు కల్గిన అన్ని ధ్యానానుభవాలు మీద ఇపుడివరకు ఏలాంటి అనుమానము ఉండేది కాదు.కాని అంతిమ ధ్యానానుభవములో 64 కపాలము కాస్త మోక్షము పొందకుండా పున:సృష్టి చేస్తోందని అందిన జ్ఞానస్పురణ నిజమా? కాదా ? అనే అనుమానము నాలో మొదలైంది.ఆ రోజు ఒక ధ్యానాభవమైంది.అది ఏమిటంటే పిరమిడ్లు ఉన్న ప్రాంతానికి నేను కాస్త సన్యాసదీక్ష తీసుకొని వెళ్ళాను.అక్కడ ఒక లామాదీక్షతో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.ఈయనకి ఎదురుగా ఒక పిరమిడ్ నిర్మాణము ఉంది.ఉన్నట్టుండి ఈ పిరమిడ్ కాస్త తాని అంతట అదే దానిని అగ్రభాగము కాస్త కూలిపోయింది.అపుడు నేను కాస్త ప్రక్కనే ఉన్న  వ్యక్తిన్ని ఇలా ఎందుకు ఈ పిరమిడ్ నిర్మాణము కూలిపోయింది అనగానే మేము ప్రతిసారి ఇలా పడిపోయిన పిరమిడ్ నిర్మాణము తిరిగి నిర్మాణము చేసిన 48 నిమిషాలుపాటు ఉండి తిరిగి తనంతటే అదే విరిగిపోతుంది.పైగా ఈ పిరమిడ్ పూర్తిగా నాశనమవ్వదు కేవలము దీనిని అగ్రభాగము మాత్రమే కూలిపోతుంది.ఇది ఎలా ఎందుకు జరుగుతుందో మాకు అర్ధముగావడము లేదు.నిర్మాణములో ఎలాంటి లోపము లేకపోయిన తిరిగి కట్టిన ప్రతిసారి పడిపోతుంది.దీనికి కారణము మాకు అర్ధముగాక ప్రతిసారి పడిపోయిన అగ్రభాగము తిరిగి పున:నిర్మాణము చేస్తున్నాను అని చెపుతూ నా జేబులో ఏమి ఉంది అనగానే నా జేబులోంచి ధ్యానముద్రలో ఉన్న పంచలోహమూర్తి విగ్రహమును బయటికి తీసి ఈయన అంతము చూడాలని ఇక్కడిదాకా నేను వచ్చాను అనగానే ఆ సన్యాసికాస్త తన జేబులోంచి నాకు పిరమిడ్ యొక్క అంతర్భాములో ఇది దొరికిందని చూపించగా అది ఏమిటని చూస్తే ఒక నల్ల బాణలింగమునకు ఒకవైపు శివుడిముఖము అలాగే మరొకవైపు అమ్మవారి ముఖము ఉన్న బాణలింగమును చూడటము జరిగింది.దీనిని చూడగానే అరుణగిరిలో తల లేని నల్లనిరుద్రలింగము యొక్క తలభాగము ఈ బాణలింగమని నాకర్ధమైంది.అంటే విత్తనము నుండి చెట్టు వస్తుంది.అలాగే పున:సృష్టిగా చెట్టు నుండి విత్తనము వస్తుంది.మళ్ళీ ఈ విత్తనము నుండి తిరిగి చెట్టు వస్తుంది గదా.ఇదే పున:సృష్టి అన్నమాట.అంటే విత్తనము జననమైతే చెట్టు మరణమైతే..జననము నుండి మరణము వస్తే..తిరిగి పున:సృష్టిగా మరణము నుండి తిరిగి జననము జరగక తప్పదు.అలాగే జననము నుండి మరణము పొందకతప్పదు.అంటే జననము నుండి మరణము దాకా వచ్చి ఆగిపోయి ఉంటే అదే 64వ కపాలమోక్షము అయ్యేది.కాని మరణము ద్వారా వచ్చిన బూడిద నుండి ప్రాణశక్తి ఏర్పడుతోంది గదా.అంటే విత్తనములో చెట్టుంది.అలాగే చెట్టులో విత్తనముంది.ఈ రెండు వేర్వురుగా లేవు.ఒకేదానిలో ఈ రెండు ఉన్నాయి.అంటే బిందెలో పాలున్నాయి అలాగే నీళ్ళున్నాయి.చూడటానికి ఈ రెండు గూడ పాలునీళ్లుగా కలిసిఉన్నట్లుగా కనిపించినగూడ నిజానికి ఈ రెండు కలిసి ఉన్నగూడ వేర్వురు రెండు తత్త్వాలతో ఉన్నాయి.లేకపోతే హంస పక్షి మరి ఎలా రెండు కలిసి ఉన్న పాలునీళ్ళలలో నుండి పాలకి పాలు అలాగే నీళ్ళలకి నీరు ఎలా వేరుచేస్తోందో ఒకసారి అలోచించండి.రెండు కలిసి ఏకముగా కనపడుతున్నప్పడికి ఈ రెండు గూడ జనన-మరణ తత్వాలతో ఉన్నాయి.అంటే చెట్టులో ఇదే తత్త్వముంటే అలాగే విత్తనములోగూడ ఇదే తత్వముంది.అంటే అమ్మవారిలో అయ్యవారు ఉన్నారు.అదే అయ్యవారిలో అమ్మవారు ఉంది.వీరిద్దరుగూడ ఏకశరీరములో రెండు తత్వాలుగా ఉన్నారు.అంటే ఏకశరీరములో ఏకతత్వముంటే కాని 64వ కపాలనికి కపాలమోక్షము రాదు.అంటే 64వకపాలానికి అనుసంధానముగా అస్ధిపంజరముంది.కపాలము కాస్త మరణమైతే దీనికి అనుసంధానముగా ఉన్న అస్ధిపంజరము జననమైంది.అపుడు కపాలము మరణమోక్షము పొందితే జననమైన అస్ధిపంజరము నుండి మరొ కొత్త కపాలము పున:సృష్టి అంతే సహజసిద్ధముగా ఏర్పడతప్పదు గదా.ఎందుకంటే ఈ రెండు తత్వాలు అనగా జనన-మరణ తత్వాలుగూడ ఏక శరీరములో ఏకకపాలమున్న అస్ధిపంజరములో ఉన్నాయి గదా.కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ తత్త్వము మీకే అర్ధమవుతుంది.ఇక మిగతా 63 కపాలాలకి జననాన తత్వము ఉన్న అస్ధిపంజరముతో అనుసంధాము లేదు.కేవలము ఇవి అన్నిగూడ మిగిలిన మరణతత్వమున్న కపాలాలకి అనుసంధానము అవ్వడముతో ఇవీ అన్నిగూడ కపాలమోక్షమును పొందడము జరిగింది.అదే మిగిలి ఏకైక 64 మరణ కపాలానికి మాత్రమే అనుసంధానము జననము ఉన్న అస్ధిపంజరము అనుసంధానమవ్వడముతో ఇది కపాలమోక్షము పొందినగూడ పున:జననముగా మరొ కపాలము పున:సృష్టి జరిగి కొత్తకర్మ-జన్మ కారకమవుతుంది.దానితో ఈ కపాలమోక్షము కాస్త కపాలమరణమైంది.ఇది ఇలా జరగటానికి కారణము మీకు అర్ధమయ్యేవిధముగా చెప్పలంటే శివుడు చనిపోతూ తనలో ఉన్న ప్రాణశక్తి బయటికి పోతే తాను మోక్షముతో మరణమును పొందుతానని అనుకొని తన ప్రాణశక్తి ఉన్న వీర్యకణాలు కాస్త అమ్మవారితో సంయోగను ద్వారా ఆవిడ గర్భశయములోనికి పంపించి మరణము పొందడము జరిగింది.అలాగే అమ్మవారు కాస్త మరణమును పొందాలని తనలో ఉన్నా శివుడి మిళిత ప్రాణశక్తిన్ని తన గర్భము ద్వారా కుమారస్వామి రూపముతో కుమారుడుని కనడము జరిగింది.అంటే శివుడి మరణము నుండి కుమారస్వామి జననము జరిగింది గదా.మళ్ళీ కుమారస్వామి మరణము నుండి శివుడి జననము ఖచ్చితముగా జరుగుతుంది గదా.ఎందుకంటే విత్తులో చెట్టుంది.అదే చెట్టులో విత్తుంది.అనగా జననము నుండి మరణముంది.అదే మరణము నుండి జననము ఉంది గదా.ఇక్కడ జరిగిన తప్పు ఏమిటంటే శివుడి యొక్క ప్రాణశక్తిన్ని అమ్మవారికి సంయోగము ద్వారా ఇవ్వకుండా తనలో ఉన్న శక్తిన్ని సమాధి ద్వారా బ్రహ్మరంధ్రముగా బయటికి పంపించి ఉంటే ఖచ్చితముగా  64వ కపాలనికి కపాలమోక్షము వచ్చేది.ఎందుకంటే జనననిచ్చే అమ్మవారికి తన వీర్యకణాలు సంయోగద్వారా చేరలేదు గదా.శివుడు తన ప్రాణశక్తి ఉన్న వీర్యకణమును సమాధిస్ధితి ద్వారా బ్రహ్మరంధ్రము ద్వారా బయటికి అనగా శూన్యములోనికి పంపించి ఆ 64వ కపాలముగూడ కపాలమోక్షము పొందేది.కాని ఇలా జరగలేదు.చావటానికి వెళ్ళుతూ బ్రతటానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా అమ్మవారితో సంయోగముచెంది ఆవిడ గర్భములో తను పున:కర్మజన్మ ఎత్తటానికి గావాలసిన వీర్యకణరూపమైన కుమారస్వామి మారి  శివుడు చనిపోతే మాత్రము ఆ మిగిలిన 64వ కపాలానికి కపాలమోక్షము రాకుండా కపాలమరణమే వచ్చింది.ఇది ఆదిలో జరిగిన 64వ కపాలము యొక్క ఆదితప్పు గావడముతో శివుడు జన్మించిన ప్రతిసారి ఇదేతప్పు చేస్తూన్నే ఉంటాడు.ఎందుకంటే ఇదింతాగూడ రికార్డ్ దృశ్యమే గదా.ఆదిలో జరిగిన ఆదితప్పునే రికార్డ్ దృశ్యమై మనము జీవుడు నుండి శివుడు గా మారినపుడు అదిలో శివుడు చేసిన ఆదితప్పు అలాగే జరుగుతుంది.దీనిని మార్చడము జరుగదు.తప్పు కాస్త తప్పుగానే రికార్డ్ అయ్యింది.ఈ తప్పు రికార్డ్ దృశ్యము అదిశివుడి విషయములో రికార్డ్ అయ్యింది.ఇది 64 కపాల రికార్డ దృశ్యమైంది.ఇపుడు మనము పశువు నుండి పశుపతి గా అనగా శివోహంస్ధితి అనగా మనమే శివుడు అనే జ్ఞానస్పురణ పొందకతప్పదు.అపుడు ఆదిలో శివుడు చేసిన ఆదితప్పు కాస్త మనము చెయ్యకతప్పదు.ఎందుకంటే మనము  శివుడు అయ్యాము గదా.అపుడు ఆది శివుడు చేసిన తప్పు ఈ శివుడు చెయ్యకతప్పదుగదా.చెయ్యకుండా ఉండలేము.ఎందుకంటే ఇది మార్చలేని రికార్డ్ దృశ్యము గదా.ఒకవేళ మనము శివోహంస్ధితిన్ని పొందకపోతే 64 కపాలముంది అనే జ్ఞానము మిగిలే ఉంటుంది.అపుడు మనకి అసంపూర్ణజ్ఞానమాయలో ఉంటాము.అదే 64వ కపాలములోనికి వెళ్ళితే శివోహంస్ధితిన్ని పొందకతప్పదు.ఆయన చేసిన తప్పు అదే సహజముగా చెయ్యకతప్పదు.తద్వారా 64వ కపాలము కపాలమోక్షము పొందకుండా కపాలమరణమును పొంది పున:సృష్టిలో ప్రారంభజన్మజ్ఞానము పొంది పున:కర్మజన్మ ఎత్తకతప్పుదు.అంటే పున:సృష్టి చేసే బ్రహ్మచక్రము ఆగడము అనేదిలేదు.ఇది నిరంతరముగా అవిచ్చినముగా అవిశ్రాంతిగా జననము నుండి మరణము దాకా తిరిగి మరణము నుండి జననమును పున:కర్మజన్మతో అనగా ఆదిజన్మ నుండి అంతజన్మదాకా వచ్చి తిరిగి అంత జన్మ నుండి ఆదిజన్మకి తిరుగుతూనే ఉంటుంది.దీని వలన పిరమిడ్ నిర్మాణము జరిగి దీని అగ్రభాగము పడిపోవడము అనేది మరణమైతే..ఈ అగ్రభాగమును పున:నిర్మాణము చెయ్యడము అనేది పున;జన్మ కారకమవుతుంది.పోనీ ఈ అగ్రభాగము నిర్మాణము చెయ్యకుండా ఆపివేస్తే మనము పూర్ణజ్ఞానము పొందాలనేదని ఇంక తెలుసుకోవాసినది ఎదో ఉందని మనకి జ్ఞానస్పురణ అందుతోంది.తద్వార పున:జన్మకి కారకమవుతుంది.అంటే రుద్రుడు నుండి రుద్రలింగము రావడము జరిగింది.తిరిగి ఈ రుద్రలింగము నుండి పిశాచరుద్రుడు వస్తున్నాడు గదా.అంటే శివలింగములోనే శివుడున్నాడు ఆలాగే లింగముంది.అంటే శివలింగములో జననమిచ్చే లింగముంది.అలాగే మరణమిచ్చే శివుడున్నాడు.అపుడు జనన నుండి మరణము వస్తుంది అలాగే మరణము నుండి జననం రాక తప్పడము అనేది సృష్టి అనివార్యకార్యమే గదా.. అంటే జననములోనే మరణముంది అలాగే మరణములోనే జననముంది.మనపుట్టినపుడు మనతో మన మరణముగూడ నీడలాగా పుడుతుందిగదా.అలాగే మరణించినపుడు కర్మవాసనతో జనన నీడ పుడుతోంది గదా.ఇదింతా బాగానే ఉంది.ఇంత కష్టపడి  మోక్షమును పొందాలని మోక్షసాధన చేస్తే చివరికి 64వ కపాలము మోక్షము పొందకుండా మన ప్రమేయము లేకుండా తిరిగి పున:సృష్టిలో పడటము ఏమిటి అన్నపుడు మోక్షము అంటే శూన్యతలో అరుణజ్యోతి కాస్త శూన్యమవ్వడము అని ఇన్నాళ్ళు అనుకున్నాము.కాని నిజానికి మోక్షము అంటే మరణము నుండి పున:జన్మ ఎత్తే సమాయానికి పెంచుకొని శాంతిస్ధితిలో ఉండమే అసలు సిసలైన మోక్షమవుతుంది అన్నమాట.ఈ లెక్కనచూస్తే జ్యోతిశరీరానికి పున:సృష్టి ద్వారా పున;జన్మ ఎత్తాలంటె 10 లక్షల సం.రాలు పడుతుంది.ఈ కాలమంతాగూడ మనమంతా అరుణగిరి మీద అరుణజ్యోతిగా వెలుగుతూ ఉంటాము.  ఎపుడైతే ఈ సమయము పూర్తీ అయినదో అపుడు పున:సృష్టి ద్వారా మనకి ఆదిజన్మ దగ్గరికి తిరిగే బ్రహ్మచక్రము తీసుకొని వెళ్ళుతుంది.అంటే మనము కొత్తగా పుట్టడము..కొత్తగా మరణించడము ఉండదు.ఆదిలో రికార్డ్ అయిన మన ఆది జన్మ యొక్క జననము నడిపిస్తోంది.అలాగే అంతములో మోక్షజన్మ వీడియో చూపించాలి అన్నపుడు అరుణచలములో అరుణజ్యోతిగా మారిన రికార్డ్ దృశ్యము చూపిస్తోంది.ఇదింతాగూడ మన శూన్యమే చేస్తోందని తెలుసుకొండి. అలాగే కాశీక్షేత్రములో మరణమును పొందితే ఆత్మజ్యోతిగా ఆ క్షేత్రములో 5లక్షల సం.రాలుండి పున:సృష్టిగా ఆదిజన్మ పొందడము జరుగుతుంది.అదే చిదంబరక్షేత్రములో మరణమును ఒక లక్ష సం.రాలు జ్ఞానజ్యోతిగా ఆ క్షేత్రములో ఉండి తిరిగి పున:జన్మ పొందడము జరుగుతుంది.ఇలా వివిధ క్షేత్రాలలో 100 నుండి 10వేలసం.రాలు పాటు పున:జన్మ ఎత్తకుండా చేసుకోవడము జరుగుతుంది.ఇందులో అరుణచలక్షేత్ర మరణమే అత్ ఎక్కువ 10 లక్షల సం.రాలు ఉంది.ఇక్కడ చాలామందికి ఒక సందేహము రావచ్చును.మరణము అనేది ఏపుడు ఎక్కడ ఏలా జరుగుతుందో మనము చెప్పేలేనపుడు కచ్చితముగా మాకు క్షేత్రమరణమే జరుగుతుందని చెప్పలేము గదా అన్నపుడు ఇక్కడ ఒక విషయము గమనించండి.ఇక్కడ క్షేత్రములో మరణించడము అనేది ముఖ్యముగాదు.మీ మనస్సున్ని ఆశాంతి నుండి శాంతిన్ని ఇచ్చే ఏ క్షేత్రమైనా లేదా ఏ ప్రాంతమైనగూడ దానికి మీరు అనుసంధానము అవ్వాలి.అంటే మీ మనస్సు పదేపదే ఏచోటుకి వెళ్ళాలని అనుకుంటుందో అక్కడికి నెలకి లేదా మూడు లేదా ఒక సం.రములో కొన్నిరోజులు వెళ్ళిరావాలి.అపుడు ఆ చోటు మీ మోక్షసాధనకి తగ్గట్లుగా మీరు మరణము ద్వారా ఆయా శరీరమును మోక్షస్ధితి విశ్రాంతికి తీసుకొని వెళ్ళుతుంది.అక్కడ పున:జన్మ ఇస్తుంది.మీరు అరుణచలమునకు ఒకసారి ప్రత్యక్షముగా వచ్చి కార్తీక పౌర్ణమినాడు వచ్చి చెప్పులు లేకుండా  ఒకసారి గిరిప్రదక్షిణము చేసి ఆరోజు రాత్రి 365ఓత్తులతో దీపారాధన చేస్తే మీరు ఖచ్చితముగా అరుణచల క్షేత్రానికి అనుసంధానము అవుతారు.అపుడు మీరు అమెరికాలో  లేదా గోవాలో చచ్చిన మీ ఆత్మ కాస్త ఆకాశయానము చేసి అరుణచలక్షేత్రానికి చేరుతుంది.అపుడు ఆ క్షెత్రములో పున:జన్మగా అరుణగిరి యోగిగా జన్మింపచేసి అరుణజ్యోతిగా మారేవిధంగా మీ మోక్షసాధన చేస్తుంది అన్నమాట.అదే అరుణచలములో మరణము మీరు  పొందితే యోగజన్మ లేకుండా మోక్షసాధన లేకుండా అరుణజ్యోతిగా మారుస్తుంది.ఎందుకంటే ఈ క్షేత్ర మరణానికి ముందే ఈ క్షేత్రవాసిగా మిమ్మలిన్ని చేసి మీచేత మోక్షసాధన చేయించి మీ మరణము తర్వాత జ్యోతిమోక్షస్ధితిలో ఇచ్చి 10లక్షల.సం.రాలు పాటు ఉంచుతుంది అన్నమాట.ఈ తేడా తెలుసుకొండి.అంటే ఇపుడికైన మీరు మీ మనస్సుకి నచ్చిన క్షేత్రానికి అనుసంధానమై మీకు వీలుదొరికినపుడల్లా ఆ క్షేత్రదర్శనానికి వెళ్ళండి.దానికి అనుసంధానమై మానసిన,శారీరక ప్రశాంతస్ధితిన్ని పొందండి.అలాగే సన్యాసిదీక్ష తీసుకంటేనే మోక్షము  వస్తుందని అనుకొకండి.ఇక్కడ దుస్తులు,దీక్ష  ప్రధానము కాదు.మీ శరీరము అలాగే మీ మనస్సు ఎంత పవిత్రముగా ఉంచుకోగలితే మీరు అంత త్వరగా మీ క్షేత్రానికి అనుసంధానమవుతారు.తద్వార మీ మోక్షస్దితి పొందడము జరుగుతుంది.అంతెందుకు నేను కాస్త సన్యాసిదీక్ష తీసుకొని అరుణచలములో క్షేత్రవాసిగా అలాగే మా యోగమిత్రుడు ఏలాంటి దీక్ష నియమాలు తీసుకోకుండా అలాగే క్షేత్రవాసిగా ఉండకుండా ప్రతిపౌర్ణమికి ఎక్కడ ఉన్నగూడ ఈక్షేత్రానికి వచ్చి గిరిప్రదక్షిణము చేసి వెళ్ళేవాడు.వాడితోపాటు నేనుగూడ గిరిప్రదక్షిణము చేసేవాడిని.ఇలా కొంతకాలము జరిగినతర్వాత మాకు తెలియకుండా కార్తీకపౌర్ణమి రోజు యధావిధిగా గిరిప్రదక్షిణము చేసి అనుకోకుండా 365 ఓత్తుల దీపారాధన చేసి ఇంటికి వచ్చాము.ఆరోజు అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఒక ధ్యానానుభవమైంది.అది ఏమిటంటే మేము వెలిగించిన ప్రమీద దీపాలు కాస్త గిరి దగ్గరికి వెళ్ళి అడుగు పాదభాగమునకు చేరుకొని ఆపై కొండలోపలకి వెళ్ళినట్లుగా కనిపించింది.అంటే ఆరోజు నుండి మా ఇద్దరి జ్యోతిశరీరాలు కాస్త అరుణజ్యోతులుగా మారినాయని నాకు జ్ఞానస్పురణ అయింది.అంటే ఈ లెక్కనచూస్తే మోక్షానికి ఏలాంటి దీక్ష నియమాలు అవసరము లేదని అలాగే స్త్రీ,పురుష బేధము లేదని తెలుస్తోందిగదా.అలాగే ఈ దీక్షలు అనేవి మన మనస్సును పవిత్రములోను అలాగే శరీరశుద్ధి చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయని తెలుసుకొండి.ఈ పనిని దీక్షలేకుండా మీకు మీరే చేసుకొని పవిత్రముగా ఉంచవచ్చుగదా.ఆలోచించండి.మీకే తెలుస్తోంది.ఇక ఈరోజుతో నా జ్యోతిశరీరము కాస్త అరుణజ్యోతి అయింది.తద్వారా నా భౌతిక మరణము ద్వారా నా అరుణజ్యోతి కాస్త గిరిమీద కనపడుతుంది.ఇలా మీరందరుగూడ అరుణజ్యోతిగా మారుతారు.ఎందుకంటే మీరుగూడ నా మోక్షసాధనానుభవాలు చదువుతూ పూర్ణజ్ఞానము పొందారుగదా.నేను ఏది అయితే తెలుసుకొన్నానో అది మీరు తెలుసుకున్నపుడు నేను కాస్త జ్యోతిమోక్షస్ధితిలో అరుణజ్యోతిగా మారినపుడు మీరుగూడ ఖచ్చితముగా మారుతారు గదా.ఇందులో ఎలాంటి సందేహము,అనుమానము,భయాలు పెట్టుకొండి.అందుకే ఈ గ్రంధరచనను రచించడము జరిగింది.ఒకటి తెలుస్కొండి.అనుభవాలు వేరు గావచ్చును కాని అనుభూతి ఒక్కటేగదా.మీరంతాగూడ మీకు తెలియకుండా నాతో మోక్షసాధన ప్రయాణముచేసి నేనూ పొందిన జ్యోతిమోక్షస్ధితిలో 10లక్షలసం.రాలు ఉండి ఆతర్వాత పున:సృష్టితో ఎవరికి వారే వారి ఆదిజన్మ పొందడము జరుగుతుంది.అపుడు తిరిగి మనంతా మళ్ళీ మోక్షసాధన జన్మకి వచ్చినపుడు ఇలా ఈ గ్రంధముద్వారా ప్రత్యక్షముగా  లేదా పరోక్షముగా నా మోక్షసాధన ప్రయాణము చేసి తిరిగి అరుణచలము చేరి జ్యోతిమోక్షము పొందడము జరుగుతుంది.ఇది అనివార్య కార్యమే అన్నమాట.దీనిని ఆపడము లేదా మార్చడము ఎవరితరము అనగా ఇలాచేసే అనాద శూన్యము చేతిలోగూడ లేదు అని తెలుసుకొండి.ఎందుకంటే విత్తులో చెట్టుంది.అలాగే చెట్టులో విత్తుంది.అనగా జననములో మరణముంది అలాగే మరణములో జననముంది.ఇది అనివార్యకార్యముగా నిరంతరముగా జరుగుతోంది.ఇక ఇది దీనిని ఎవరుగూడ ఆపలేమని అనివార్యమని తెలిసినపుడు ఇక దానితో ఇక నా ఆదిజన్మ కాస్త వానర జన్మయని జ్ఞానస్ఫురణ పొందడముతో నేను ఇన్నాళ్ళుగా నా మోక్షసాధన పూర్ణజ్ఞానమును అపస్మారకస్ధితికి నా 64 వ కపాలము మోక్షము పొందకుండా పరమహంస కపాలము నుండి వానర కపాలముగా మారడముతో తెలుసుకున్న జ్ఞానమును అంచెంచెలుగా మర్చిపోతూ నేను ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన మొదలవ్వడముతో నా మోక్షసాధన కధను ముగింపు లేని కధగా మిగిస్తూ నిజాయితీగా మీ దగ్గర నుండి ఒకయోగమిత్రుడిగా సెలవు తీసుకుంటున్నాను.

కపాలమోక్షం వీడియో...



ఈ వీడియో చివరన్న జాగ్రత్తగా పరిశిస్తే  కపాలమోక్షము జరిగి శరీరము నాశనమై అంతిమముగా ఒక అరుణజ్యోతి మారుతుంది.ఈ జ్యోతి కాస్త ఓం నమశివాయ గా పున:కర్మజన్మగా మారుతోంది అన్నమాట.అంటే అంతజన్మ నుండి తిరిగి పున:సృష్టితో మన ఆదిజన్మకి వస్తున్నాము అని గ్రహించండి.ఈ నా మమ్మీసిద్ధాంతము సత్యమని నిరూపించడటానికి నాకు రెండు ప్రత్యక్షనిదర్శనాలు కనిపించాయి.అందులో మొదటిది కాశీక్షేత్ర యాత్ర.ఈ యాత్ర సంపూర్ణమవ్వలంటే కాశీలోని ఇసుకను కాస్త రామేశ్వరములో ఉన్న సముద్రములో కలుపాలని..అక్కడ ఉన్న నీళ్ళను తీసుకొని కాశీ గంగాలో కలిపితే అపుడు కాశీయాత్ర సంపూర్ణమని మన పెద్దలు చెప్పడము లోకవిధితమే గదా.ఇందులో కాశీ గంగాలో సహజముగా మనమంతా చనిపోయినవారి అస్ధికలు కలుపడటము జరుగుతోంది గదా.అంటే గంగా అనేది మరణము అవుతుంది.అలాగే రామేశ్వర గుడి చూస్తే ఒక పిరిమిడ్ ఆకారములో ఉంటుంది.అంటే ఇది పున:కర్మకి కారకమైన సముద్ర జలము అవుతుంది.ఈ లెక్కనచూస్తే కాశీ ఇసుకలో మరణించినవారి అస్ధికలు కాస్త పున:జన్మనిచ్చే రామేశ్వర క్షేత్రానికి చేరి అక్కడ నుండి జలముద్వారా పున:జన్మశక్తితో తిరిగి కాశీక్షేత్రానికి చేరుతుంది అని తెలుస్తోంది గదా.అంటే దీనిద్వారా మరణము ద్వారా జననమున్నదని తెలుస్తోంది గదా.అలాగే ప్రతిసం.రము గూడ కార్తీకమాసములో అరుణగిరి మీద కార్తీకదీపము వెలిగించడము ఆనవాయితిని లోకవిధితమే గదా.







ఒకసారి ఇలా వెలిగించిన దీపమును ఫోటోలు తీస్తే అందులో నాకు ఈ దీపజ్యోతిలో పసుపువర్ణ జ్యోతిప్రకాశము అందులో ఎరుపు వర్ణ జ్యోతిబిందువు అందులో తెల్లనివర్ణ మమ్మీదేహమున్నట్లుగా ప్రత్యక్షముగా కనిపించాయి.గావాలంటే నేను తీసిన ఈ ఫోటోలు పెడుతున్నాను.మీరే జాగ్రత్తగా పరిశీమించి అది నిజమో కాదో మీరే తెలుసుకుండి.ఈ రెండి నిదర్శనాలు చూస్తే మరణము శాశ్వతము కాదని దీనిని తర్వాత కొద్దికాలము తర్వాత జననముందని..ఈ కొద్దికాల విశ్రాంతిస్ధితియే నిజానికి మనకి మోక్షస్ధితి అవుతుందని తెలుస్తోందిగదా.ఏమంటారు నిజమే గదా.

ఒక్కటి తెలుసుకొండి.అది ఏమిటంటే నేను చెప్పిన నా మోక్షసాధానుభవాలు అన్నిగూడ నా పరంగా నగ్న సత్యాలే.కాని మీ పరంగా ఇవీన్ని సత్యాలే అవ్వాలని లేదు.అలాగని అసత్యాలేనని చెప్పలేము.ఎందూకంటే ప్రతిదానినిగూడ ఇదే..ఇలాగే ఉంటుందని ఖచ్చితముగా చెప్పలేము.ప్రతి ఒక ప్రశ్నకి 128 సమాధానాలుంటాయి.అందులో మీ స్వానుభవాలు ద్వారా పొందిన జ్ఞానస్ఫురణాలే మీ ప్రశ్నకి సమాధానము అవుతాయి.అనగా 143 అనేది I LOVE U కి లేదా I HATE U వాడవచ్చును.అంటే యత్భావము తత్భవతి అన్నమాట.అలాగే నేను ఎవరిని అన్నపుడు దీనికిగూడ 128 సమాధానాలున్నాయి. 1.నేను అనేది శూన్యము..2.నేను అనేది జ్యోతి..3.నేను అనేది ఆత్మ..4.నేను అనేది ఆలోచన 5.నేను అనేది దేవుడు..6.నేను అనేది సంకల్పం..7.నేను అనేది దేవత..8.నేను అనేది కారకము..9.నేను అనేది శివోహం..10.నేను అనేది యున్నాను..11.నేను అనేది లేదు..12.నేను అనేది కారణము ..13.నేను అనేది కాలము .. 14.నేను నేది బ్రహ్మ..15.నేను అనేది పదార్ధము 16.నేను అనేది ప్రకృతి..17.నేను అనేది విశ్వము..18.నేను అనేది విశ్వాసము..19.నేను అనేది కర్మ..20.నేను అనేది నమ్మకము..21.నేను అనేది భక్తి..22.నేను అనేది శ్వాస..23.నేను అనేది ధ్యానం..24.నేను అనేది ధ్యాస..25.నేను అనేది జ్ఞానము ..26.నేను అనేది మాయ..27.నేను  అనేది జననము..28.నేను అనేది మరణం..29.నేను అనేది భయం..30.నేను అనేది ప్రేమ..31.నేను అనేది మోహం..32.నేను అనేది వ్యామోహం..33.నేను అనేది ఆశ ..34.నేను అనేది కోరిక...35.నేను అనేది క్షణికం..36.నేను అనేది గురువు..37.నేను అనేది తండ్రి..38.నేను అనేది తల్లి..39.నేను అనేది యోగి..40.నేను అనేది జ్ఞాని..41.నేను అనేది బంధము..42.నేను అనేది బంధవిముక్తి..43.నేను అనేది సృష్టి..44.నేను అనేది సత్యము..45.నేను అనేది నిత్యం..46.నేను అనేది  స్ధితి...47.నేను అనేది లయం..48.నేను అనేది పరమాత్మ..49.నేను అనేది జీవుడు..50.నేను అనేది లాస్యం..51.నేను అనేది తిరోగమనం..52.నేను అనేది చూసేది..53.నేను అనేది చూడలేనిది..54.నేను అనేది నేత్రం..55.నేను అనేది విగ్రహం..56.నేను అనేది విశ్వారాధన..57.నేను అనేది నమ్మకం..58.నేను అనేది అపనమ్మకం..59.నేను అనేది నాస్తికత్వం..60..నేను అనేది అస్తికత్వం..61.నేను అనేది మారేది..62.నేను అనేది మారనిది..63.నేను అనేది కంపనం..64.నేను అనేది ప్రకంపనం..65.నేను అనేది స్పందన ..66.నేను అనేది ప్రతిస్పందన..67.నేను అనేది రాహిత్యం..68.నేను అనేది బిందువు..69.నేను అనేది విద్య..70.నేను అనేది అవిద్య..71.నేను అనేది మార్పు..72.నేను అనేది విజ్ఞానము ..73.నేను అనేది వేదం..74.నేను అనేది శాస్త్రం..75.నేను అనేది స్ధిరం..76.నేను అనేది అస్ధిరం..77.నేను అనేది నిశ్చలం..78.నేను అనేది అనిశ్చలం..79. నేను అనేది అతీతం..80.నేను అనేది అనంతం..81. నేను అంతం..82.నేను అనేది మోక్షం..83.నేను అనేది శాంతి..84.నేను అనేది విశ్రాంతి..85.నేను అనేది సాధన..86.నేను అనేది ప్రశ్న..87.నేను అనేది సమాధానం...88.నేను అనేది చెప్పలేము..89.నేను అనేది చెప్పలేనిది..90.నేను అనేది చెప్పకూడనిది.91.నేను అనేది మౌనం 92. నేను అనేది కర్త 93. నేను అనేది క్రియా 94. నేను అనేది స్వప్నం. 95. నేను అనేది ఇది అని చెప్పలేనిది 96. నేను అనేది అశాంతి 97. నేను అనేది నేను కాని నేను 98. నేను అనేది లింగము 99. నేను అనేది ప్రకృతిపురుషుడు 100. నేను అనేది విశ్వరూపం 101. నేను అనేది ఆకారం 102. నేను అనేది నిరాకారం 103. నేను అనేది సాకారం 104. నేను అనేది కాలపురుషుడు 105. నేను అనేది స్త్రీ 106. నేను అనేది పురుషుడు 107. నేను అనేది విరాట్ రూపం 108. నేను అనేది రేణువు 109. నేను అనేది పరమాణువు 110. నేను అనేది అణువు 111. నేను అనేది శక్తి 112. నేను అనేది నాశనము లేనిది. 113. నేను అనేది రూపము 114. నేను అనేది గుణం 115. నేను అనేది ముక్తి 116. నేను అనేది వ్యాప్తి 117. నేను అనేది  లేనిది లేదు 118. నేను అనేది కానిదిలేదు 119. నేను అనేది  నువ్వు 120. నేను అనేది భోగము 121. నేను అనేది యోగము 122. నేను అనేది క్షేత్రం 123. నేను అనేది శరీరం 124.నేను అనేది మనస్సు 125. నేను అనేది బుద్ధి 126.నేను అనేది అహం 127. నేను అనేది భావం   128.నేను అనేది ఉందో లేదో చెప్పలేనిది.ఇలా నేను ఏవరిని అని తెలుసుకున్నపుడు వాడికి వచ్చే సమాధానాలు ఇన్ని ఉన్నాయి.ఇందులో నేను అనేది ఇదే ఫలానాది అని ఖచ్చితముగా ఎవరుగూడ చెప్పలేరు.చెప్పారు అంటే అది మీరు పొందలేదు అన్నమాట.పొందితే ఇదే అని చెప్పలేరు.కాబట్టి నా  పరంగా చెప్పబడిన నా మోక్షసాధానుభవాలు నాకు సత్యము గావచ్చును.అవే మీ పరంగా అభిప్రాయభేదము రావచ్చును.అలాగని నావి అసత్యాలని చెప్పలేము.ఎందుకంటే నా సాధన ప్రారంభములో దేవుడు లేడని మొదలుపెడితే సాధనాంతమునకు వచ్చేసరికి దేవుడున్నాడు అని వచ్చింది.అలాగే నేను ఉన్నాను మొదలుపెడితే నేను లేను అని తెలిసింది.అలాగే విశ్వమోక్షానికి సాధన మొదలుపెడితే వ్యక్తిగత మోక్షము గూడ లేదని తెలిసింది.ఒకవేళ మీరు దేవుడు ఉన్నాడని సాధన మొదలుపెడితే దేవుడు లేడు అని ఖచ్చితముగా తెలుస్తోంది.అలాగే నేను ఎవరిని అని మొదలుపెడితే నేను అనేది దానికి నేను చెప్పిన 128 సమాధానాలలో ఏదోఒకటి పొందుతారు. అలాని అందరుగూడ ఒకేవిధమైన సమాధనమునకు తృప్తి చెందరు.చెందలేరు అని తెలుసుకొండి.నా పరంగా మోక్షమనేది లేదు.కాని మీ పరంగా మోక్షము అనేది ఉండవచ్చును.ఎందుకంటే ఈ విశ్వము అనేది వారివారి వ్యక్తిగత అనుభవ విశ్వాసాలు బట్టి నడుస్తోంది.ఒకరికి కాశీక్షేత్రములో మరణించిన లేదా దర్శించిన మోక్షమే అనే విశ్వాసముండవచ్చును.వారి వ్యక్తిగత అనుభవాలు ద్వారా ఈ విశ్వాసము కల్గవచ్చును.అది నిజమా కాదా అనేదిగూడ ఎవరుగూడ ఖచ్చితముగా చెప్పలేరు.చెప్పితే అది నిజము అవ్వచ్చును లేదా అవ్వకపోవచ్చును.ఎందుకంటే మనమంతాగూడ నేను ఎవరిని అనే ఏకైక ప్రశ్నకి సరియైన సమాధానము వెతకటానికి వచ్చినవాళ్ళేమేనని తెలుసుకొండి.  ఈ మోక్షప్రశ్నకి ఉన్న 128 (64+64=128) సమాధానాలలో ఎవరు ఎక్కువ సమాధానాలు పొందుతారో వారు అంతా ప్రశాంతస్ధితిలో అదే మోక్షస్ధితిలో ఉంటారు.కాని ప్రతివాడికి ఈ ప్రశ్నకి ఒక సమాధానము తెలుసుకోలేరు.ఎందుకంటే మొదటి సమాధానమే ఆఖరి సమాధానవవుతుంది.అనగా నేను ఎవరిని అని ప్రశ్నిస్తే దీనికి మొదటి 1వ సమాధానముగా నేను అనేది శూన్యమని ఉంటే అదే దీనికి 128వ సమాధానముగా ఉందో లేదో చెప్పలేనిది అని వచ్చింది.సరిగ్గా ఈ రెండు సమాధానాలుగూడ ఒకేవిధమైన సమాధానమే అన్నమాట.అనగా ఉందో లేదో చెప్పలేనిది అనాద శూన్యమే గదా.అంటే ఈ లెక్కన చూస్తే మొదటి సమాధానము అలాగే ఆఖరి సమాధనము ఒక్కటే కాని రెండు సమాధానాలుగా ఉన్నాయి.ఈ లెక్కనచూస్తే 64వ డైమర్షలో 1వ డైమర్ష అనుసంధానమై జననములో మరణము అలాగే మరణములో జననముంది అని తెలుస్తోంది గదా.ఏమంటారు నిజమే గదా. ఆలోచించండి.మీకే అర్ధమవుతుంది. ఆ సమాధానము కోసము పున:కర్మజన్మ ఎత్తి సాధన చేసి 127 సమాధానాలు తెలుసుకొని ఒక సమాధానము తెలుసుకోలేరు.ఎందుకంటే 128 సమాధానము అలాగే 1వ సమాధానము ఒక్కటే అవుతుందని మనము తెలుసుకొనేసరికి మళ్ళీ కధ మొదలవుతుంది.ఇది ఎలాంటే ఒకరాజు తనకి ఒక అంతులేని కధ చెప్పమని అడిగితే ఒక పండితుడు దానికి ఒక ధాన్యాగారములలోనికి ఆహరము కోసము ఒక చీమ వెళ్ళితే దాని వెంట మరొ చీమ వెళ్ళితే దాని వెంట మరొ చీమ...ఎపుడుగూడ ఈ చీమల ప్రయాణము తప్ప ఇంక ఏమిచెప్పేవాడు కాదు.ఒక దీనితో ఇలా చీమలు ఒకదానివెంట మరొకటి ఎపుడికి    ఆగకుండా నిరంతముగా అవిచ్చిన్నముగా అవిశ్రాంతి అంతులేని కధగా వెళ్ళుతూనే ఉంటాయి.ఈ కధకి ముగింపు లేదు.అలాగే నా కధకి నా పరంగా ముగింపు లేదు అనుకుంటున్న సమయములో నాకు ఇంక జ్ఞానస్ఫురణలు అందుతూ ఉండేసరిక ఇక నా సాధన పరిసమాప్తి కాలేదని  ఇంక ఏదో తెలుసుకొవాలనే జ్ఞానము పిసరింత మిగిలిపోయినదని నాకు బలంగా అనిపించముతో నా ధ్యానస్ధితి కొనసాగిస్తూండగా అసలు మోక్షమంటే ఏమిటి? అని ప్రశ్న నాలో ఉదయించింది.దీనికి సరియైన సమాధానము వెతకాలని నా ధ్యానము ఆరంభమైంది.అపుడు  

                                           Moksham means Rest In Peace (RIP)


Find Final


మోక్షరహస్యం:

అసలు ఇంతకి పూర్ణమోక్షముందా లేదా తాత్కాలిక మోక్షముందా అన్నపుడు అసలు మోక్షము అంటే ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది.ఎందుకంటే నేను ఏవరిని అన్నపుడు నాకు 128 సమాధానాలు వచ్చాయని మీకు తెలుసుగదా.అలాగే ఏది మోక్షము అన్నపుడు గూడ 128 సమాధానాలు వస్తాయి గదా.ఇందులో నాకు మోక్షము అంటే స్వానుభవము ప్రకారము చూస్తే మరణము తర్వాత పున:జన్మ పొందటానికి మధ్య ఉన్న విశ్రాంతిస్ధితియే మోక్షమని చెప్పాను గదా.దీన్ని RIP అన్నానని తెల్సుగదా. RIP అంటే Rest in peace అని అర్థం. క్రైస్తవం ప్రకారం మరణించాక, జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకూ ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ RIP ద్వారా కోరుతున్నాం. మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో, మోక్షానికి వెళ్ళడమో వంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు.కాని నా స్వానుభవము ఒకరకముగా చూస్తే సత్యముగాను మరొ రకముగా చూస్తే అసత్యమని నాకే స్వానుభవమైంది.ఎలా అంటారా?ఈ మమ్మీసిద్ధాంతము అనేది జ్యోతిబిందులో ఉన్న రెండు మార్గాలలో అనగా మోక్షమార్గము అలాగే మాయమార్గములో ఉన్నపుడు నా అరుణజ్యోతి కాస్త మాయమార్గమైన జనన:మరణ రహస్యాన్ని ఛేదించాలని ఈ మాయమార్గములో ప్రవేశించి తెలుసుకున్నాను.గావాలంటే భౌతికమరణ రహస్యం అనే అంశలో ఒకసారి చదవండి.మీకే తెలుస్తోంది.అంటే ఈ లెక్కనచూస్తే జనన:మరణ పున:సృష్టి చక్రము తిరగటానికి కారణ కారకము అనేది విత్తనబీజకణమైన మమ్మీదేహము అని తెలుసుకొని అక్కడే ఇన్నాళ్ళు ఆగిపోయి మోక్షము లేదని ఇది మరణము పొందినతర్వాత వచ్చే విశ్రాంతిస్ధితి అని నాకు నేనే మాయలో పడిపోయి ఈ మాయమార్గములో ఆగిపోయి ఆ పిరమిడ్ మమ్మీదేహ స్వానుభవాలు సత్యామని భ్రమ,భ్రాంతిలో ఉండిపోయాను.నిజానికి ఈ అనుభవాలు మాయమార్గము ప్రకారముగా అక్షరసత్యమే నేను కాదనను కాని నాకు ఏ కోరిక లేనపుడు నాకెందుకు పున:సృష్టి కలుతుంది?కోరిక ఉంటే కర్మ-జన్మ ఉంటుంది.ఇది లేనపుడు ఏదిగూడ లేనపుడు నాకెందుకు పున:కర్మ జన్మముంటుంది అని విచారణ చేసుకున్నాపుడు ఈ జ్యీతిశరీరము కాస్త జ్యోతిబిందువుకి ఉన్న మాయమార్గములో ఉన్నదని జ్ఞానస్ఫురణ అయింది.అంటే ఒకవేళ నాకు ఏమైన కోరికవాసన ఉంటే అది పున:కర్మజన్మగా నా ఆదిజన్మయైన కోతిజన్మకి ఖచ్చితముగా తీసుకొని వెళ్ళుతుంది.నా భౌతికమరణము అరుణచలములో ఉండటము వలన నా మోక్షస్ధితి 10 సం.రాలు లక్షల  ఉండి పున:జన్మ ఎత్తడము జరిగేది.నిజానికి ఇది మోక్షము కాదు.కేవలము  ఇది ముక్తి అవుతుంది.ఎందుకంటే ఇది మాయమార్గములో ఉన్నపుడు పొందినస్ధితి గదా.అని నా జ్యోతికి జ్ఞానస్పురణ పొందడముతో ఈ మాయమార్గమునుండి జ్యోతి వెనక్కి ప్రయాణించి బయటికి వచ్చి  అదే జ్యోతిబిందులో ఉన్న మరొమార్గమైన మోక్షమార్గములోనికి నా జ్యోతి ప్రయాణించడము మొదలుపెట్టింది.అపుడు యధావిధిగా ఒక కాంతిమార్గం కనిపించింది.దాదాపుగా 48ని.పాటు ఈ మార్గములో ప్రయాణించి అవతలికి చేరితే ....




ఇలా నేను కాస్త ఈ మోక్షమార్గ ప్రయాణములో చివరికి చేరేసరికి నాకు అక్కడ ఒక చితిమీద నా మమ్మీదేహము చితిమంటలతో చితాగ్నిలాగా అగ్నిజ్వాలాలతో మండుతున్న దృశ్యము కానవచ్చింది.ఈ చితాగ్ని ఎన్నడికి ఆరిపోదు.ఆరిపోతే ఈ మమ్మీదేహము కాస్త బూడిదగా మారి దిని నుండి మరో యోగి లేదా భోగి జన్మలు వచ్చి పున:సృష్టిలో పడేప్రమాదముంది. ఎందుకంటే మన్మధుడు బూడిద నుండి బండాసురుడు రాక్షసుడు వచ్చాడని లోకవిధితమే గదా.అందుకని ఈ చితాగ్ని ఇలా నిరంతరముగా అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా వెలుగుతూ ఉండటమువలన అరని మారని అరుణజ్యోతిగా ఉంటున్నామని నాకర్ధమైంది.అలాగే ఈ చితాగ్నికి కారణ కారకము ఒక కార్తీకపౌర్ణమినాడు అరుణగిరి బయట వెలిగించిన 365 ఓత్తుల యొక్క దీపజ్యోతిన్ని ఈ గిరి లోపలకి వెళ్ళిందని ఆనాటి నుండి నేను ఒక అరుణజ్యోతిగా మారినానని ఇంతముందు చెప్పడము జరిగింది గదా.ఇలా గిరిలోపులకి వెళ్ళిన నా దీపజ్యోతి కాస్త మోక్షమార్గమునందు ప్రయాణించి అందులో ఉన్న అసలు సిసలైన నా మమ్మీదేహ చితికి చితిమంట పెట్టి చితాగ్నిగా మార్చిదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.ఇదికాని నాకు జరగకపోతే నేను ఇంక మాయమార్గములోనే ఉండేవాడిని.ఎపుడైతే నా చితికి చితాగ్ని చేరిందో నా మెదడుకి జ్ఞానాగ్ని చేరి నా మాయను తొలగించి మోక్షమార్గమువైపు తిరిగి ప్రయాణించమని జ్ఞానస్ఫురణ అందించింది.అందుకే మన పెద్దలు కాస్త మాయ మాయం అవ్వాలంటే జ్ఞానిగా మారాలని చెప్పడము జరిగింది.అంటే మనచేత ఆత్మపిండము పెట్టించి ఆత్మమరణమును కలిగించి కోరికలు లేని మమ్మీదేహముగా మార్చడము జరిగితే అలాగే మనచేత అంతిమ దీపము వెలిగించి అ దీపజ్యోతి ద్వారా మన   మమ్మీదేహమునకు చితి వెలిగించే విధివిధానాలు ఏర్పాటుచేసిన ఆదిదంపతుల మేధస్సుకి జోహర్లు చెప్పకతప్పదు.నా ఉహ వచ్చినప్పడి నుండి 32 సం.రాలు పాటు క్రమతప్పకుండా మహశివరాత్రినాడు ఉపవాసము,జాగరణ చేస్తే అలాగే కార్తీకపౌర్ణమినాడు  365 ఓత్తుల దీపారాధన వివిధ ప్రాంత దేవాలయాలలో అలాగే క్షేత్రాలలో వెలిగించడము జరిగింది.ఏది ఏపుడు ఆఖరిచూపు అవుతుందో..ఏది ఆఖరి ప్రయాణము అవుతుందో ఎవరికి తెలియనట్లే ఏ దీపజ్యోతి మన మమ్మీదేహమునకు చితిపెడుతుందో ఎవరికి ఎరుక ఆ శివయ్యకి తప్ప. అంటే ఈ లెక్కనచూస్తే మోక్షమార్గములో చితాగ్ని సిద్ధాంతముంటే అదే మాయమార్గములో మమ్మీదేహ సిద్ధాంతముంది అన్నమాట.ఈ రెండు సిద్ధాంతాలుగూడ  సత్యమేనని తెలుసుకొండి.ఒకరు మోక్షమార్గములోనికి వెళ్ళి చితాగ్ని చూసి అమ్మవారు కాస్త చితాగ్నిస్వరూపిణి అని లోకానికి చెప్పడము జరిగితే మరొకరు మాయమార్గములోనికి వెళ్ళి అక్కడ మమ్మీదేహమును చూసి పున:సృష్టికి మమ్మీదేహమును భద్రపర్చాలని చెప్పి మహదేవుడు స్మశానవాసి అని చెప్పడము జరిగింది.ఇక్కడ చాలామందికి ఒక సందేహము రావచ్చును.అది ఏమిటంటే రెండు మార్గాలలో రెండు మమ్మీదేహలున్నాయా? లేవు.అసలు మమ్మీదేహము అనేది మోక్షమార్గములో ఉంది.ఈ మమ్మీదేహము యొక్క అంతిమ స్వప్నరూపమే మాయమార్గములో ఉన్న మమ్మీదేహము అన్నమాట.అంటే బింబము అలాగే ప్రతిబింబము సిద్ధాంతము దీనిని నుండియే వచ్చింది.నిజానికి రెండు దేహలు లేవు.ఉన్నది ఒక్కటే.అదిగూడ చితాగ్నిలో ఉంది.అందుకే దీని స్వప్నదేహమైన మాయమార్గ మమ్మదేహము నుండి 64 కోట్ల స్వప్నదేహపాత్రలు పుట్టుకుని వచ్చాయి.విత్తనము నుండి చెట్టు రావడము అనేది విత్తు స్వప్నము అన్నమాట.అలాగే   చెట్టు నుండి విత్తు రావడము అనేది చెట్టు స్వప్నము అన్నమాట.అందుకే మనవి స్వప్నదేహపాత్రలు అయ్యాయి.దానితో మనమంతా సత్యము కాని అసత్యమైనాము.ఇలా స్వప్నపాత్రల నుండి విముక్తి కోసం స్వప్నమోక్షసాధన ద్వారా స్వప్నానికి మూలమైన మోక్షమార్గ మమ్మీదేహమును చితాగ్నిలో ఉంచడముతో మనకి ఉన్న 64కోట్ల స్వప్నపాత్రలు అన్నిగూడ నాశనమవుతాయి.అందుకే మన పెద్దలు కాస్త కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని చెప్పడము జరిగింది. ఇందులో మోక్షమార్గము అనేది కనిపించని సత్యమైతే మాయమార్గము అనేది కనిపించే అసత్యమైంది అన్నమాట. ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వచ్చాను.అలాగే నా జ్యోతిరూపముగూడ రూపాంతరము చెందలేదు.ఎలాంటి ధ్యానానుభవాలు కల్గలేదు.ఎదో గావాలని ఏదో తెలుసుకోవాలని ఏదో పొందాలని తపనతాపత్రయాలు గూడ లేవు.ఈ స్ధితి ఇలా లేదా అలా ఉంటుందని చెప్పలేని స్ధితి-పరిస్ధితి అన్నమాట.ఇంతటితో నా మోక్షసాధనకి అంతిమ ముగింపు వచ్చిందని నాకర్ధమైంది.



అంటే ఈ లెక్కనచూస్తే జ్యోతిబిందులో మోక్షమార్గము అనేది నవ్వుతున్న ముఖములోని నోరు లాంటిది అన్నమాట.ఈ నోటిగూడ రెండుచివరలను కలిపి ఉంచుతుంది గదా.అలా ఈ మోక్షమార్గముగూడ జనన-మరణ బిందులను కలిపి వీటికి అతీతమైన స్ధితిలో అనగా శాశ్వతస్ధితిమైన శాంతిగా ఉంచడమే పూర్ణమోక్షమవుతుంది.ఇక మాయమార్గము అనేది రెండు కళ్ళు లాంటివి.ఇది జనన-మరణ స్ధితులను వేరుచేసి ఒకచోట తాతాల్కిక విశ్రాంతిస్ధితిలో 100 సం.రాలు నుండి 10 లక్షల సం.రాలు ఉంచుతుంది.అందుకే ఇది తాత్కాలికమైన మోక్షస్ధితియైన ముక్తి అవుతుంది అన్నమాట.అంటే మీరు ఏపుడైన వైకుంఠపాళి ఆటను గమనించండి.107 గడిలో ఒక పెద్దపాము తల ఉంటుంది.దీని తోక సరాసరి 1వ గడిలో ఉంటుంది గదా.అంటే ఏంతో కష్టపడి మనము 106 గడికి దాకా వచ్చి మనకి ఉన్న ఏకైక కోరిక బలహీనత మాయను దాటకపోతే 107 గడిలో పాము తలకి చిక్కి సరాసరి పున:కర్మజన్మతో మనకోరికను తీర్చుకోవడము జరుగుతోంది.అంతెందుకు విష్ణువుమూర్తి తన వరాహరూపములో రుచిచూసిన లడ్డు రుచు కోసము వెంకన్నగా అవతారమెత్తడము జరిగింది.అందుకే వెంకన్నకి తిరుపతి లడ్డు అంత ఇష్టమైంది.అలాగే శ్రీరంగస్వామికి తనకి అవ్వపెట్టిన అవకాయపెరున్నము రుచి మరువలేక వెంకన్న అవతారములో ఇపుడికి   తొలి నైవేద్యంగా పెరుగున్నము పెట్టడము జరుగుతోంది.గావాలంటే వెంకన్నస్వామి చరిత్ర చదివి తెలుసుకొండి.అంటే కోరిక బలహీనత ఎంతటి బలీయమైనదో మీరు తెలుసుకొండి.నిజానికి మోక్షము అంటే ఇహము నందు అలాగే పరము నందు ఏలాంటి కోరికలేని స్ధితిలో ఉండడమే అనగ ఇంకేమీ అక్కరలేక పోవడమే మోక్షం. అంత కన్నా వేరే ఏమీ లేదు. అని గ్రహించండి.ఒకవేళ మీకు ఏమైన కోరిక ఉంది అంటే జ్యోతిబిందులో మీరు సరాసరిగా జనన-మరణ పున:చక్రమైన మాయమార్గములో పడి పున:కర్మజన్మలు ఎత్తుతారు అన్నమాట.కోరిక ఊంటే కర్మ ఉన్నట్లే.అలాగే కర్మ ఉంటే జన్మ ఉన్నట్లే.ఇదే కర్మ చక్ర సిద్ధాంతము అన్నమాట.కర్మ సిద్ధాంతం ప్రకారం, జనన మరణ చక్రం నుండి బయటపడటం మోక్షం. నేను అనే భావం శాశ్వతంగా నశించిపోయే స్థితినే మోక్షం అని మరొక ఆలోచనా విధానం నమ్ముతుంది. భక్తి మార్గంలో ఉన్నవారికి, మరోవైపు, విష్ణులోకం, శివలోకం మరియు దుర్గాలోకం వంటి దివ్య నివాసంలోకి ప్రవేశించడం మోక్షం. అద్వైత వేదాంత , అయితే, అన్ని బంధాల నుండి విముక్తి అని క్లుప్తంగా నిర్వచిస్తుంది. అన్ని దుఃఖాలను పూర్తిగా నిర్మూలించి, పరమానందాన్ని పొందడం మోక్షం. మరియు మీరు జీవించి ఉన్నప్పుడే దీనిని పొందవచ్చు. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను, అజ్ఞానపు తెరను తొలగించి అసలు ఆత్మను తెలుసుకుంటే ఇప్పుడు ముక్తిని పొందవచ్చు.ఈ అవగాహనతో, అన్ని భయాలు అదృశ్యమవుతాయి, ముఖ్యంగా మరణం మరియు బాధల భయం. నేను శరీరం కాదు; శరీరం చనిపోతుంది, నేను కాదు. నేను జనన మరణాలకు అతీతుడిని, నేను మనస్సుకు అతీతుడిని, నేను బుద్ధికి అతీతుడిని. నేనే సత్-చిత్-ఆనంద, సదా చైతన్యం, నిత్యానందం, సంపూర్ణ అస్తిత్వం. ఈ ప్రత్యక్ష, ప్రత్యక్ష అనుభవం, మోక్షం.



ఇదింతా బాగానే ఉంది.మరి మాకు కోరిక ఉన్నదో లేదో తెలుస్తోంది అన్నపుడు సాధన అంతిమస్ధితికి వచ్చినపుడు మనము ఒక కోరిక దగ్గర ఆగిపోతాము.అపుడు మనకి ధ్యానము నందు నల్లటి ఇష్టలింగము దర్శనము అవుతుంది.అంటే మీరు మీ ఆదిజన్మ ఇష్టకోరిక స్ధితికి మీరు వచ్చారని గ్రహించండి.అపుడు మీకు ఒక బలీలయమైన ఏకైక కోరికస్ధితిన్ని పొందడము జరుగుతుంది.అనగా అది ఏమిటంటే ప్రేమ,కామ,మోహ, వ్యామోహ, బంధ,ఇష్టకోరిక, ఇష్టపదార్ధరుచి, రూపము, భావము,ఆలోచన, ఆశయం, సంకల్పము,ఇలా 64 తత్వాలకి సంబంధించి ఒక విషయవాంఛ ఏమిటో మనకి ఖచ్చితముగా తెలుస్తోంది.



ఇది తెలిసినపుడు దీనిని దాటకల్గితే అపుడు ఈ ఇష్టలింగము నుండి నీలిరంగు కాంతిపుంజము బయటికి వస్తుంది.ఇది ఇలా దర్శనమైతే మీరు మీ ఇష్టకోరిక మాయను దాటినట్లే అన్నమాట.అదే స్త్రీ సాధకుల ప్రకారముగా చూస్తే ఈ ఇష్టలింగము కాస్త తమ యోనిభాగముండి బయటికి వచ్చినట్లుగా మా యోగమిత్రరాలు నాతో చెప్పడము జరిగింది.అంటే తనలో ఉన్న కోరికను బయటికి పంపించి తను ఈ కోరికను జయించిందని నాకర్ధమైంది.ఇక్కడ నుండి స్త్రీ కి ఆలాగే పురుషుడికి రెండురకాల సాధానుభవాలు కల్గడముతో ఇక్కడే ద్వైత భావస్ధితి మొదలైందని గ్రహించాను.



అదే ఈ ఇష్టకోరిక మాయలో పడినవారికి ఈ ఇష్టలింగమునకు రెండువైపుల ఆదిదంపతుల ముఖాలున్న లింగముగా దర్శనమవుతుందని నా స్వానుభవము ద్వారా అదే నా జ్యోతి ప్రయాణము కాస్త మాయమార్గములో ప్రయాణించినపుడు చిట్టచివరిగా రెండుముఖాలున్న ఇష్టలింగమే దర్శనమయింది గదా. ఒక విషయవాంఛ ఏమిటో మనకి ఖచ్చితముగా  తెలిసినపుడు దీనిని దాటకల్గితే మన అరుణజ్యోతికి ఉన్న జ్యోతిబిందువు కాస్త ఆదిజ్యోతిబిందులో ఉన్న మోక్షమార్గములో పడి అది పున:సృష్టి కాకుండా నాశనమవుతుంది.అపుడు మన అరుణజ్యోతి కాస్త బిందువు ఆధారము లేకుండా స్వయంభూగా వెలుగుతూ శాశ్వతస్ధితిలో ఉండిపోతుంది.అదే మనకి ఏమైన అంతిమ కోరికమాయలో పడితే అదికాస్త బలహీనతగా మారి మన అరుణజ్యోతిలో వెలిగే జ్యోతి ఆరిపోయి జ్యోతిబిందువు కాస్త ఆదిజ్యోతిబిందులో మోక్షమార్గములో పడకుండా మాయమార్గములో ప్రయాణించి పున:సృష్టి చక్రములో పడి పున:కర్మజన్మలు ఎత్తుతుంది.అంటే ఈ లెక్కనచూస్తే మనకి ఏమి కోరిక లేదు అంటే మోక్షముగాను ఏదైన కోరిక ఉంటే మాయగాను అనుకోవాలి.అందుకే మన పెద్దలు కాస్త కామిగానివాడు మోక్షగామి కాలేడు అని చెప్పడము జరిగింది.కోరిక తీరితే కాని మోక్షము రాదని చెప్పకనే చెప్పడము జరిగింది గదా.  

ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే! మనం చేసే కర్మ నిష్కామ పూరితమై ఉంటే, అప్పుడు కర్మ ఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ యోగం,జ్ఞాన యోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు! నిష్కామ కర్మే అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవటానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు.ఇవి కూడా ధర్మాన్ని అనుసరించే ఉండాలి. మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం!.ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని పొందటానికి చేసే ప్రయత్నాన్ని శ్రేయస్సు అంటారు.  మోక్షాన్ని కర్మ, భక్తి , జ్ఞానయోగాల ద్వారా కూడా పొందొచ్చు!  భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం.

జ్ఞానమెన్న గురువు జ్ఞాన హైన్యము బుద్ధి
రెంటి నందు రిమ్మ రేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా…!

​జ్ఞానం గురువులాంటిది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ భ్రమలను తొలగిస్తేనే మోక్షం లభిస్తుందని వేమన చెప్పాడు. ఆత్మానాత్మ వివేకమే నిజమైన జ్ఞానం. వివేకం అంటే తెలివితేటలు. తెలివితేటలు కలిగివుంటే జ్ఞానం రాదు. ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ దేని నుండి పుడుతుంది? “నేను” ఎవరు? అని తెలుసుకోవటమే జ్ఞానం. మిగిలినది అంతా అజ్ఞానమే! విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ ఈశ్వరమయమని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అటువంటివాడే భగవంతునికి ప్రియతముడు. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించటమే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ లభించదు . ఘోర తపస్సులు చేసిన ఋషులందరికీ మోక్షం లభించలేదు. మోక్షం లభించటానికి గత జన్మలో చేసిన కర్మ ఫలాలు కూడా కారణం అవుతాయి . ఈ జీవితంలో సత్కర్మలు కూడా చేయాలి. మోక్షం పొందటానికి ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని భగవద్గీత చెబుతుంది . ఈ కర్మలు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి 1. ధర్మబద్ధమైనవి అంటే చేయటానికి నిర్దేశించబడినవి. 2. ధర్మ విరుద్ధమైనవి అంటే చేయటాన్ని నిషేధించినవి. కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం, “కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు”. జనన జరా మరణాల నుండి మోక్షాన్ని పొందగోరినవారు పరమాత్మను ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మస్థితిని పొందుతారు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు అని పైన చెప్పుకున్నాం! జ్ఞాని అయితేనే కర్మ ఫలాలను త్యజించగలడు. కర్మ ఫలాలను త్యజిస్తే జ్ఞానం లభిస్తుంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.

ఇక నిష్కామ కర్మ అంటే మోక్షం కలగాలనే కోరికను కూడా త్యజించటం. మోక్షం కోసం చేసే కర్మలు సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే వాటిలో కోరికలు, ఫలాలను ఆశించటం ఉన్నాయి.అయితే జ్ఞానానికి మనిషిలో అహంభావాన్ని పెంచే(పంచే) లక్షణంవుంది. ఒక యోగ మిత్రుని ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. సాహిత్యాభిలాష (చదవటం,వ్రాయటం,ఏదైనా కావచ్చు) కూడా జ్ఞాన సముపార్జనలో భాగమే కదా! ‘తెలుసును’ అనే భావమే జ్ఞానం.ఆ ‘తెలుసును’ అనే ‘భావం’ ఏర్పడటానికి ఏది మూల కారణమో తెలిసిన రోజున ‘తెలుసును’ అనేది ‘భావం’ గానే మిగులుతుంది! తప్పితే, దానికి ‘అహం’ తోడు కాదు. అది తెలియకపోతే ‘భావా’ నికి ‘అహం’ తోడు కావటం తధ్యం. తెలియటానికి పనికివచ్చే సాధనం మాత్రమే మనలో ఉంది. తెలిసే ప్రక్రియకు మూలకారణం మాత్రం మనం కాదు. నేను తెలుసుకుంటున్నాను అనే భావం కాక, ‘తెలియవలసిన అవసరం నా తత్వానికి ఉంది, తెలుస్తుంది’ అని భావన చేసుకోవాలి.అదే వాస్తవం కూడా! ఒక ప్రఖ్యాత రచయిత గొప్ప శాస్త్రవేత్త కాకపోవచ్చు!అలాగే, ఒక శాస్త్రవేత్త ప్రఖ్యాత రచయిత కూడా కాకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, అన్నీ తెలియవు! ఈ నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటం, తెలియటం అనేది నిత్యం జరిగే ప్రక్రియలు!


వేయించిన పల్లీగింజ నుండి చెట్టు వస్తుందా? ఒకసారి ఆలోచించండి.ఇదే మోక్షము అన్నమాట.అదే పచ్చి పల్లీగింజ నుండి చెట్టు వస్తుంది.ఇదే మాయ అవుతుంది.అంటే ఎపుడైతే మన ఆత్మకి ఉన్న అన్నికోరికలు తీరుతాయో అదికాస్త రుణము లేని అరుణజ్యోతిగా మారుతుంది.ఇదే శాశ్వతమోక్షస్ధితి అవుతుంది.అదే ఏపుడైతే మన ఆత్మకి తనకి ఉన్న ఏకైక అంతిమకోరిక యొక్క బలహీనతమాయను దాటలేకపోతే అదికాస్త ఆత్మజ్యోతిగా మారి పున:కర్మచక్రములో పడుతుంది.ఇది మాయ అవుతుంది.ఈ మాయ మాయం అవ్వాలంటే మనకి ఉన్న అంతిమకోరిక మాయ దాటాలి.ఇది దాటాలంటే మన సాధన కాస్త ఆదిజన్మ దాకా వెళ్ళి మన జన్మకి కారణ కారకమైన ఆదికోరిక ఏమిటో ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాలి.ఆ కోరికను దాటితే మోక్షమే .... లేదు అంటే మాయస్ధితి పొందడము జరుగుతుంది.ఇది ఎవరికి వారే వారి ఇష్టకోరికకి కారకమైన ఇష్టలింగము దగ్గరికి వస్తారు.ఈ కోరిక బలహీనత మాయను దాటితే మోక్షస్ధితి పొందే అరుణజ్యోతిగా మారుతారు లేదంటే కోరికమాయ ఉన్న ఆత్మజ్యోతిగా మారతారు. నా స్వానుభవము ప్రకారము నా ఆదిజన్మ కోతి అని..దీనికి కామకోరిక అంతిమకోరిక అని తెలుసుకున్నాను.ఆ కామకోరిక మాయను దాటడముతో ఈ భౌతికదేహనికి మోక్షసన్యాసి దీక్ష పొందడము జరిగింది.అంటే ఎవరైతే కోరిక మాయను దాటుతారో అదే మోక్షమవుతుంది.ఎవరైతే కోరిక మాయలో పడతారో అదే పున:సృష్టి ముక్తి అవుతుంది అని ఈ దేహము జ్ఞానము పొందడముతో మోక్షశాంతిన్ని పొందడము అనగా ఆరని మారని అరుణజ్యోతిగా తన యదార్ధ సహజస్ధితిన్ని పొందడము జరిగింది అన్నమాట.ఇదే నా ప్రకారముగా మోక్షమవుతుంది.ఇక మీ ప్రకారముగా ఈ అభిప్రాయాలు మారవచ్చును.ఎందుకంటే అందరికీ అన్నీ తెలియడమనేది ఇప్పుడు నడుస్తున్న సృష్టి విధానంలో అసంభవం. తెలిసే విషయాలలోనూ, తెలిసే విధానంలోనూ, తెలిసే స్థాయిలోనూ కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ తెలియటమనేది వ్యక్తిపరమైనదీ, వ్యక్తి ప్రమేయంతో జరిగేది కాక, సృష్టి పరమైనదీ, సృష్టి ప్రణాళికలోనిదీ! కనుక,ఏయే తత్వమున్న వ్యక్తులకు ఎప్పుడు, ఏది, ఎలా తెలియాలో, తెలియబడాలో, అప్పుడే అవి తెలియబడుతాయి! మనం కోరుకునే జ్ఞానం మరెక్కడో లేదు. అది మనలోనే ఉంది. ప్రయత్నం చేస్తే దాన్ని సులభంగా పొందవచ్చు. మనస్సుకు జ్ఞానం ఉందని తెలుసు. జ్ఞానం విడుదల అయిన తర్వాత మోక్ష మార్గం సులభం అవుతుంది. ఇంద్రియ జ్ఞానమే మోక్షమని కొందరి భావన! కానీ అది మోక్షం కాదు “నేను-నాది” అనుకున్న స్వార్ధమే దుఃఖాన్ని కలిగిస్తుంది. త్యజించబడింది ఏదీ దుఃఖాన్ని కలిగించలేదు. “ఈ శరీరం నేను కాదు” అని అనుకున్న మరుక్షణం ఈ శరీర మరణం మన మరణం కాజాలదు. ఆ స్థితిని పొందటం అంటే మోక్షం లభించినట్లే! నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది.మోక్షానికి బౌద్ధం ‘నిర్వాణం’ అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. ఐహిక బంధాల నుండి విముక్తి పొందడమే మోక్షం. “మనస్సును, బుద్ధిని నాయందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు. మనస్సు లగ్నం చేయడం చేతకాకపోతే కాకపోతే అభ్యాస యోగంలో ప్రయత్నించు. అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి. అది కూడా సాధ్యం కాకపోతే నన్ను శరణు పొంది నీ సర్వ కర్మ ఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కన్నా ధ్యానం, ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగం శ్రేష్ఠం. త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది.”అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అరటిపండును వలిచిపెట్టినట్లు చెప్పాడు. సహజంగా జీవించటమే మోక్షానికి మార్గం! సహజంగా జీవించటమంటే, కర్మ ఫలాలను త్యజించి ముందుకు నడవటం! మిగిలినవన్నీ అసహజాలే!అంటే ఈ లెక్కనచూస్తే మనకి శాశ్వతమరణమైన మోక్షముంది.అలాగే అశాశ్వతమరణమైన ముక్తి ఉంది.అలాగే పున:కర్మజన్మలు ఇచ్చే భౌతిక మరణాలున్నాయి అని గ్రహించండి.అనగా ఎవరైతే అరుణచలములోని అరుణగిరి నుండి పిలుపు అనగా పదేపదే వారిధ్యానములో ఈ గిరి కనపడితే ఈ గిరి అనుగ్రహము పొందినట్లే.అపుడు ఒకసారి ఈ క్షేత్రానికి వెళ్ళి కాలిచెప్పులు లేకుండా ఒక గిరిప్రదక్షిణము చేసి 365 ఓత్తుల దీపారాధన చేస్తే మీ అష్టదేహలు అనిగూడ ఈ గిరికి అనుసంధానమవుతాయి.అపుడు ధ్యానములో మీకు మీ ఆదిజన్మ ఏమిటో అనగా పశుపక్షాదులలో ఏదో ఒకటి చూపడము జరుగుతుంది.అపుడు ఆ జన్మకి కారకమైన ఆదికోరిక ఏమిటో మీకు జ్ఞానస్పురణ ద్వారా తెలుస్తోంది.  అపుడు ఈ కోరికను పరిత్యాగము చేస్తే మీరు అరుణజ్యోతిగా మారిన ధ్యానుభవమును పొందడము జరుతుంది.అదే ఈ కోరిక మాయలో గావాలనిపడితే మీరు కాస్త ఆత్మజ్యోతిగా మారి అరుణచలము నుండి తిరోగమనము అనగా వెనక్కివచ్చినట్లుగా ధ్యానానుభవము పొందుతారు అన్నమాట.మరి మీకు మోక్షము గావాలనే కోరిక కూడ ఉండకూడదు.ఇది ఉంది అంటే పొందటానికి కర్మజన్మ ఉన్నట్లే గదా.అంటే కోరికతీతస్ధితిలో మీరుంటే మీరు అన్నింటికియందు రాహిత్యస్ధితి పొంది మోక్షస్ధితిలో శాశ్వత శాంతిస్ధితిలో ఉంటారు.లేదంటే పున:కర్మజన్మలతో ఆశాంతి స్ధితిలో ఉంటారు.ఇక మీకు ఏమిగావాలో మీ చేతులలో మీ చేతలలో ఉంది.అరుణజ్యోతిగా మారడమా  లేదా ఆత్మజ్యోతిగా మారడమా అనేది మీ మోక్షసాధన విధిలిఖితము బట్టి ఉంటుదని నా వ్యక్తిగతాభిప్రాయం.ఏదిగూడ మన చేతులలో మన చేతలలో లేదు.ఎవరి చేతిలో ఏముందో తెలుసుకోవడమే మన మోక్షసాధన అవుతుంది.మనకి మోక్షప్రశ్న ఇచ్చేదేవరో దానికి ఉన్న సమాధానము చెప్పేదెవరో మన రాతను రాసేది శూన్యమని అనుభవానుభూతి పొందడమో శాశ్వత శాంతిన్ని ఇచ్చే పూర్ణమోక్ష అవుతుంది.ఇది జరగలంటే మన భౌతికదేహ ప్రయాణము కాస్త అరుణచల అరుణగిరికి అనుసంధానము అవ్వాలసిందే.ఎందుకంటే ఈ గిరి ఆధ్యాత్మికసిరి అయిన మోక్షగిరి అని స్వానుభవముగా తెలుసుకున్నాను.ఇంక తెలుసుకుంటున్నాను.     

ఇంతకి మోక్షము పొందిదెవరు? 

అనే ధర్మసందేహము అనుకోకుండా నాకు వచ్చింది.ఎందుకంటే ఈ మధ్య నాకు ధ్యానమునందు పదేపదే రెండు దృశ్యాలు కనపడుతున్నాయి.అందులో మొదటిది వెలుగుతున్న అరుణజ్యోతి కాస్త నల్లని జ్యోతిబిందువుగా మారడము మరొకటి ఒక అస్ధిపంజరము కాస్త  అరుణగిరి లోపలకి వెళ్ళి మమ్మీదేహములో ఇమడిపోవడముతో గిరి పైభాగములో ఒక తెల్లనిబాణలింగము కనపడముతో నాకు అసలు మోక్షము పొందేది ఏవరు? అలాగే మోక్షసాధన చేసేదిదెవరు అనే సందేహలు వచ్చాయి.నిజానికి మనలో నేను అలాగే నేను కాని నేను రెండు భావాలుంటాయని లోకవిధితమే గదా.ఇందులో నేను  అనేది ఆత్మ అనగా అరుణజ్యోతి అయితే నేను కాని నేను అనేది అస్ధిపంజరమవ్వాలి.అదే మన బ్రహ్మరంధ్రగుహలో ఉండే 64 కపాలాల కపాలధారి అన్నమాట.ఇందులో మోక్షసాధన చేసేది నేను కాని నేను అయిన అస్ధిపంజరమైతే మోక్షజ్ఞానము పొందేది నేను  అయిన ఆత్మ అనగా అరుణజ్యోతి అన్నమాట.నిజానికి మోక్షము అంటే మర్చిపోయిన జ్ఞానమును తిరిగి సాధన చేసి ధ్యానముద్వారా అనుభవానుభూతి ధ్యానానుభవాలు పొంది తద్వారా వచ్చిన జ్ఞానస్ఫురణలు తనలో జ్ఞాపకవిషయజ్ఞానముగా ఉంచుకొని విశ్వపున:సృష్టికి కావలసినపుడు అందించి తిరిగి తెలిసిన జ్ఞానమును మర్చిపోయి అపస్మారకస్ధితిన్ని పొంది తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి జ్ఞాపకము తెప్పించుకొనుటకు పున:కర్మజన్మలు ఎత్తడమే అని నాకర్ధమైంది.ఇది మీకు బాగా అర్ధమవ్వలంటే మనకి నాలుగు యుగాలు కలిపి ఒక మహయుగము అంటారు గదా.ఇలాంటి మహయుగము వచ్చేముందు యుగప్రళయము జరిగి విశ్వసృష్టి సర్వనాశనమవుతుంది.అపుడు అరుణగిరి లోపుల పూర్ణకుంభ శివలింగములో భద్రపర్చబడిన 64 పూర్ణబీజాలు బయటికి వచ్చి విశ్వపున:సృష్టి చేస్తాయని లోకవిధితమే గదా.అంటే నా సాధన ప్రకారముగా చూసుకుంటే మోక్షజ్ఞానము అనగా అష్టశరీరాల మోక్షవిధానజ్ఞానమంతాగూడ నాలో ఉన్న జ్ఞానశివ 64 కపాలధారి గ్రహించి ఈ జన్మలో అరుణగిరియందు అస్ధిపంజర మమ్మీదేహముగా మారి తద్వార 64బీజాలలో ఒకటైన జ్ఞానబీజముగా తను మారి విశ్వపున:సృష్టిక్రమములో తనవంతు సహాయముగా మోక్షజ్ఞానము అందించడము జరుగుతుంది.  అంటే ఈ లెక్కనచూస్తే మోక్షము పొందేది ఆత్మ అనగా అరుణజ్యోతి అయితే మోక్షమాయమార్గము పొందేది మనలోని కపాలధారి అన్నమాట.అనగా ఆత్మ అనేది జీవుడైతే కపాలధారి శివుడు అన్నమాట.ఇందులో శివుడు మోక్షసాధన చేసి ధ్యానానుభవాలు పొందితే మోక్షమాత్రము జీవుడైన ఆత్మ పొందుతోంది అన్నమాట.అనగ జీవుడు మోక్షము పొందితే శివుడు మోక్షము పొందకుండా పున:సృష్టి చేస్తున్నాడు అన్నమాట.నేను అయిన ఆత్మ కాస్త అరుణజ్యోతిగా శాశ్వతమరణస్ధితిలో ఉంటే నేను కాని నేను అయిన కపాలధారి కాస్త అశాశ్వతమరణాలు పొందే పున:కర్మజన్మచక్రబందీగా గావాలని మారుతున్నాడు.ఎందుకంటే తన చేసినా విశ్వసృష్టి తనవలనే నాశనమయినపుడు తిరిగి తన వలనే పున:సృష్టి జరగాలని అనుకుంటున్నాడు.అంటే అమ్మవారు సాధన చేస్తే అయ్యవారు అరుణజ్యోతిగా మారతారు.అపుడు అమ్మవారు కాస్త పున:సృష్టి చేస్తుంది.అదే అయ్యవారు సాధన చేస్తే  అమ్మవారు కాస్త అరుణజ్యోతి గా మారితే అయ్యవారు పున:సృష్టి చేస్తారు.వీరిలో ఎవరో ఒకరు శాశ్వతస్ధితిలో అనగా నిశ్చలస్ధితిలో ఉంటే  మరొకరు అశాశ్వతస్ధితిలో అనగా అనిశ్చలస్ధితిలో ఉంటారు అన్నమాట.ఇది ఇలా జరుగుతోందని తెల్పటానికి జ్యోతికాస్త జ్యోతిబిందువుగా మారే దృశ్యము అలాగే అస్ధిపంజరము కాస్త  మమ్మీదేహముగా మారే దృశ్యము చూపించడము జరిగింది.అంటే విత్తనము ఎపుడికి మోక్షము పొందదు.కాని ఈ విత్తనము నుండి వచ్చిన చెట్టు మోక్షము పొందకుండా  ఉండదు.ఇక్కడ విత్తనము ఒక్కటే కాని దాని నుండే వచ్చే చెట్టు మారుతుంది.అంటే విత్తు అనేది మారని రూపమైన శివవీర్యబీజకణమైతే దీనిని నుండి వచ్చే చెట్టు అనేది కల్పవృక్షము అన్నమాట.దీనికి 64 కోట్లానుకోట్ల ఆత్మ రూపాలుగా రూపాంతరము చెందుతుంది.అంతెందుకు  మనిషిలోని వీర్యకణాలు రూపాంతరము చెందకుండ అలాగే ఉంటే స్త్రీమూర్తిలోని అండాలు ప్రతి 15రోజుల ఒకసారి నెలసరి సమయములో పాత అండాలు పోయి కొత్త అండాలు ఏర్పడతాయిగదా.అంటే ఈ లెక్కనచూస్తే విత్తు అయిన వీర్యకణము మారడము లేదని చెట్టు అయిన అండము మారుతోందని తెలుస్తోందిగదా.అంటే మారకుండా ఉంటే మరొకటి మారుతుంది అన్నమాట.అనగా శివుడు కాస్త శివుడుగా ఉంటే మారడు.కాని శివుడు కాస్త శివానిగా మారితే మారతాడు అన్నమాట.నిజానికి మారేది మారనిది అంతా ఒక్కటే.అదే మారేది మోక్షమాయమార్గముగా అనగా అస్ధిపంజరముగాను అదే మారనిది అనగా మోక్షమార్గము అనగా అరుణజ్యోతిగా కనపడుతోందని నాకర్ధమైంది.అంటే శివుడు తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి పొందుటకు మనలాంటి ఆత్మశరీరమును ఎంచుకొని మనకి నానా మాయపరీక్షలుపెట్టి మన భోగ,యోగజీవితముతో నానాచంకాలు నాకించి ఆయన గావాలసిన పూర్ణమోక్షజ్ఞానమును పొంది తను తిరిగి జ్ఞాని అస్ధిపంజరముగా మారి మనతో ఉన్న ఈ ఆఖరిరుణానుబంధమును తీర్చుకొని మనల్ని రుణములేని అరుణజ్యోతిగా శాశ్వతస్ధితిలో ఉంచి తను తిరిగి అశాశ్వతమాయమార్గములో పడిపోతాడు.ఆతర్వాత తనుపొందిన జ్ఞానమును తిరిగి విశ్వానికి అందించటానికి మరొక ఆత్మశరీరమును ఎంచుకొని కారణ జ్ఞానయోగ జన్మను ఎత్తి తన జ్ఞానప్రచారము చేసి తిరిగి జ్ఞానము మర్చిపోవడము జరుతుంది.అపుడు మళ్ళీ తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి పొందుటకు పున:కర్మ జీవుడిగా మారి మోక్షసాధన చేసి  జ్ఞానము పొంది శివుడిగా మారి అరుణగిరికి చేరుకొని అస్ధిపంజర మమ్మీదేహ జ్ఞానబీజకణముగా మారి తిరిగి విశ్వపున:సృష్టిక్రమములో జ్ఞానపాత్రను పోషించడము జరిగుతుంది.ఇది ఇలా నిరంతరముగా అవిచ్చినముగా అవిశ్రాంతిగా జరిగే ప్రక్రియ అన్నమాట.ఇలా ఈ శివుడు 64 భావాలు అనగా కామము నుండి మోక్షజ్ఞానము దాకా 64 శీవుడిబీజాలుగా మారతాడు.ఈ జన్మలో నా ఆత్మశరీరముతో విశ్వమోక్షజ్ఞానమును పొందాడో అలా నాలాంటి ఎందరో ఆత్మశరీరాలను ఉపయోగించుకొని వాటివాటి జ్ఞానాలు అనగా కామజ్ఞానము,భయము, ప్రేమ, ఆశ,కిర్తి,ఆలోచన,స్పందన ఇలా తను మర్చిపోయిన 64 జ్ఞానాలు తిరిగి పొందుటకు ఈపాటికే వాడేసి ఉంటాడు. కష్టము మనది. సుఖము ఆయనిది అన్నమాట.మన అష్టదేహలు కాస్త ప్రకృతి అష్టమాయలలో నలిగిపోతే వచ్చిన అనుభవానుభూతుల జ్ఞానస్ఫురణలు మనలో కపాలధారిగా ఉండి ఆయన అందుకొని వాటిని విధిరాతగా ఒక నోట్స్ రాసుకొని ఎపుడైతే మనము అరుణజ్యోతిగా మారినామో గ్రహించి తనుకాస్త అస్ధిపంజరముగా మారి పున:సృష్టిలో క్రమములో ఈయన కాస్త విధాతబ్రహ్మగా మారి తను పొందిన 64 జ్ఞానాలతో విధిరాతగా గ్రహల అనుకూల ప్రతికూల స్ధితులతో రాసి పెట్టి విశ్వప్రళయము వచ్చేదాకా మౌనబ్రహ్మగా అరుణగిరియందు మేధదక్షిణామూర్తిగా అపస్మారకస్ధితిలో అనగా తను పొందిన జ్ఞానము మర్చిపోయేస్ధితిలో  ఉంటారు.తిరిగి తను మర్చిపోయిన జ్ఞానమును పొందుటకు అరుణచలశివగా మారి  మారి మనలాంటి ఒక ఆత్మశరీరమును ఎంచుకోవటానికి 48తరాలు తర్వాత పుట్టపోయే యోగి జన్మ ఉన్న ఒక స్త్రీమూర్తి గర్భమును ఎంచుకొని మూడు నెలలు పిండములోనికి తన ఆత్మశక్తిగా ప్రవేశించి పిల్లాడికి ప్రాణశక్తిగా మారి గుండె కొట్టుకోవడము జరుగుతుంది.ఇక అక్కడ నుండి మన అష్టశరీరాలను ఈయన వాడుకోవడము ఆరంభము అన్నమాట.మనము తిరిగి ఎపుడైతే అరుణజ్యోతిగా మారేదాకా మన అష్టదేహలను నానాచంకాలు నాకించి కాని వదిలిపెట్టడు. మనము అరుణజ్యోతిగా మారతామని చెప్పటానికే అగ్నిలింగమైన అరుణచలేశ్వరలింగము ఉంచడము జరిగింది.ఇక మనము అరుణజ్యోతిగా మారినామో ఇక అక్కడ నుండి ఇక ఈయన మనల్ని వదిలిపెట్టి మరొకొత్త యోగజన్మ ఆత్మశరీరమును ఎంచుకోవడము జరుగుతుంది.కాని నిజానికి ఆత్మశరీరము ఆయనిదే... అలాగే అరుణజ్యోతిగా మారేది ఆయనే... అలాగే మారే అస్ధిపంజరముగూడ ఆయనిదే.అందుకే మనకి అరుణచలములో అరుణచల శివ అనే స్ధూలశరీరముతో అరుణగిరిగా ఉంటే ఆత్మశరీరముతో దక్షిణమూర్తిగా ఉంటే అరుణజ్యోతి అగ్నిలింగ అరుణచలేశ్వరలింగముగా ఉండటము జరిగింది.అంటే కొత్తగా పొందేది ఏమిలేదు.పాతది పోయేది లేదు.పాతది కాస్త కొత్తది గా కనపడుతోంది అన్నమాట.పోయేది ఎమిలేదు.కొత్తగా వచ్చేది ఏమిలేదు.మార్పు మాత్రమే మార్పు చెందుతోంది.అంటే జననానికి అలాగే మరణము అనే రెండు బిందువులను కలిపే రేఖ మాత్రమే ఒక కంపనములాగా ప్రకంపనములా మార్పు చెందుతొంది అన్నమాట.మోక్షము పొందేది ఆయనే అలాగే అమోక్షము పొందేది ఆయనే.ఆయనే నిరాకారముగా చూస్తే అరుణజ్యోతిగాను అదే ఆకారముగా చూస్తే అరుణచల శివ అనే అరుణగిరిగాను అదే సాకారముగా చూస్తే అగ్నిలింగ అరుణచలేశ్వరుడిగా ఇపుడికి ప్రతినిత్యము ప్రతిక్షణము అనుక్షణము అనునిత్యము నాలాంటి గుప్తయోగులకి ఆయనకి ఆయనే కనపడుతున్నాడు.ఆయన్ని చూడాలంటే ఆయనే అవ్వాలి గదా.ఇంతకి నెనెవరో తెలిసిందా?నేను ఏమి అయ్యినదో తెలిసిందా? ఇక తెలియలేదా?ఇంక అర్ధము కాలేదా? అయితే ఈ కింద ఇచ్చిన వీడియో చూడండి.ఈ గ్రంధ సారమంతా ఒక గంట నిడివి గల ఈ వీడియోలో 100% ఖచ్చితమైన నిజయోగులు పొందిన అనుభవాల సారముతో చూపించడము జరిగింది.జీవుడు కాస్త విశ్వశక్తిన్ని తన ధ్యానముతో పొంది తిరిగి తను జీవుడు కాదని విశ్వసృష్టి చేసే జీవబ్రహ్మము అని ఎలా తెలుసుకోవచ్చునో చెప్పడము జరిగింది.నేను పొందిన ధ్యానాభవాలు అలాగే ఈ వీడియోలో నేను కాని నేను పొందిన ధ్యానానుభవాలు ఒక్కటే గావడము విశేషము.అలాగే జీవుడు నుండి జీవబ్రహ్మగా ఎలా మారుతాడో ఈ రెండు చెప్పడము జరిగాయి.నేను పొందిన ధ్యానానుభవాలు దృశ్యాలుగా మారిస్తే ఈ వీడియో అవుతుంది అన్నమాట.




పాము..మొసలి..కుందేలు..సింహము దర్శనమైతే: 

మీకు అరుణచల క్షేత్రములో ఉన్నపుడు అనుకోకుండా ధ్యానము నందు పదేపదే పైన చెప్పిన ఏదో ఒక జంతువు ఈ అరుణగిరి మీద ఉన్నట్లుగా కనపడుతుంది.ఈ కనపడే జంతువును బట్టి మీ ఈ జన్మసాధనస్ధితి ఏమిటో చెప్పవచ్చును.అది ఏలాంటారా?...ఒకవేళ మీకు ధ్యానములో పదేపదే అరుణగిరిన్ని చుట్టుకుని ఒక నల్లటి కింగ్ కోభ్రా కనపడితే మీ జన్మ సాధన అంతిమజన్మ అయిన జ్యోతిమోక్షమును పొంది అరుణజ్యోతిగా మారతారని అర్ధము.అదే ఒకవేళ మొసలి కనపడితే మీకు ఈ జన్మలో మోక్షము రాదని కేవలము సాయిజ్య ముక్తి మాత్రమే వస్తుందని అర్ధము. అదే కుందేలు  కనపడితే మీకు ఉన్న కర్మవాసన తీర్చుకోవటానికి పున:కర్మ ఎత్తుతారని అదే ధ్యానము నందు సింహము కనపడితే మీకు ఉన్న మాయబంధనము తీర్చుకోవటానికి పున:జన్మ ఎత్తుతారని అర్ధము అన్నమాట.ఎలా అంటే ఒకరోజు నాకు తీవ్రధ్యానస్ధితిలో ఉన్నపుడు అరుణగిరి చుట్టుకొని ఒక నల్లని కింగ్ కోబ్రా సుమారుగా 14000 వేల అడుగులతో అనగా గిరిపాదభాగములో దీనితోక ఉంటే దీని తలభాగము గిరి అగ్రభాగానికి కొంచెము దిగువలో అదిగూడ గిరిదక్షిణముఖభాగములో ఉన్న స్టార్ గేట్ దగ్గర ఉంది.అపుడు కాషాయ వస్రధారి ఆత్మశరీరాలు ఈ పాముతోక మీద ఎక్కి దీనిని తలభాగము వద్దకు చేరుకొని స్టార్ గేటు ముందు ఆగగానే అపుడిదాకా మూసిఉన్న ఈ గేట్ కాస్త  ఈ పాము ఉదిన విష అగ్నిజ్వాలాలకి ఈ గేటు తెరుచుకోవడము దానితో అక్కడున్న ఈ ఆత్మశరీరాలు కాస్త లోపలకి ప్రవేశించి అక్కడున్న అగ్గితీర్ధములోనికి ప్రవేశించి ఆత్మలింగాలుగా మారి జ్యోతిమోక్షము ద్వారా చివరికి అరుణజ్యోతిగా మారి లోపల నుంచి గిరీగ్రభానికి చేరుకొని ఒక పక్కన అరుణజ్యోతిగా శాశ్వతస్ధితిలో ఉండిపోతున్నారు.ఇది ఇలా ఉంటే ధనుర్మాస సమయములో ఒకరోజు ధ్యానస్ధితిలో ఉన్నపుడు అరుణగిరి కనిపించింది.ఆ తర్వాత దైవమాయలు అనగా దేవుడి సన్నిధానములో ఉండాలి అనుకొనే ఆత్మజీవులు కాస్త ఈ గిరి మధ్యభాగానికి అనగా సరిగ్గా స్టార్ గేట్ ముందుకు వచ్చే సమయానికి గిరి అగ్రభాగము   కాస్త ఒక నల్లని మొసలిగా మారగానే ఈ ఆత్మజీవులు కాస్త సంధ్యకాల సూర్యుడి కాషాయవర్ణ ఒక పెద్దబిందువుగా మారడము ఆ తక్షణమే ఈ మొసలి కాస్త ఈ బిందువును మింగి కొండ దిగి ఆ ప్రక్కనే ఉన్న శివసముద్ర చెరువులోనికి ప్రవేశించిన ధ్యానదృశ్యము నాకు కానవచ్చింది.పైగా ఈ మాసములో విష్ణుమూర్తి కాస్త మొసలి రూపములో ఉండి కైవల్యముక్తి ప్రసాదింస్తారని అందుకే మకర సంక్రాంతి అన్నారని మన పెద్దలు చెప్పిన ఉవాచ నిజమేనని నాకర్ధమైంది.ఇలా మొసలి రూపములో అరుణగిరి మీద సంచారము చెస్తూ కైవల్యముక్తి ఇస్తుందని గ్రహించాను.దీనికి నిదర్శనముగా మనకి రమణమహర్షి ఆశ్రమములో ఉన్న కట్టడాలు మీద మనకి పాకుతున్న మొసలి విగ్రహాలు ఉండటము గమనించవచ్చును.నాకు కానవచ్చిన మొసలి ధ్యానుభవము ఈయనకిగూడ వచ్చి ఉండాలి.అందుకే ఈయన ఆశ్రమములో ఈ మొసలి బొమ్మలకి ఆశ్రమిచ్చారు అనుకుంటా.ఇది ఇలా ఉంటే అమ్మవారి దసరాల కాలములో నాకు ధ్యానములో అరుణగిరి కనపడింది.ఆతర్వాత కొద్దిసేపటికి గిరిలోపలకి తీరనికోరికలు వలన ఏర్పడిన నల్లటిశరీర ఆత్మజీవులు ప్రవేశించి గిరి అడుగుభాగానికి చేరడానికి ఉన్న స్ప్రింగ్ లాంటి మార్గము ద్వారా కిందకి వెళ్ళుతుండగా వీరంతాగూడ ఉన్నట్టుండి వారి తీరనికోరికలు తగ్గటుగా పంచవర్ణ అనగా నీలము, పసుపు,నలుపు, ఆకుపచ్చ,ఎరుపు రంగులు అణువులుగా మారిపోతూ అడుగుభాగానికి చేరుకోగానే తక్షణమే ఇదే వర్ణాలతో కుందేలుగా మారిపోయే దృశ్యము కానవచ్చింది.అపుడు ఈ కుందేలు కాస్త అటునిటు తిరుగుతూ వీటిమధ్య ఉన్న గులాబిరంగు అష్టదళపద్మము దగ్గరికి వచ్చి దాని పద్మరేకులు తిని తినగానే ఆ కుందేలు కాస్త ఈ పద్మములోనికి   తమకి ఉన్న తీరనికోరికను తీర్చుకోవటానికి పున:కర్మ జన్మ ఎత్తడానికి కావలసిన ఆత్మశరీరధారిగా మారి ఈ పద్మములోనికి ప్రవేశీంచి దీని కాడమార్గము ద్వారా గిరిబయటికి వచ్చి సంతానము కోసము పరితపించే మాతృగర్భములోనికి ప్రవేశీంచే దృశ్యము కనిపించేసరికి కర్మరాహిత్యము కోసము పున:జన్మ ఎత్తారని నాకర్ధమైంది.ఇది ఇలాయుంటే ఒకరోజు నా తీవ్రధ్యానస్ధితిలో ఉన్నపుడు అరుణగిరి ముందు నగ్నముగా నిద్రమత్తులో పడిఉన్న ఒక స్త్రీమూర్తి శరీరము కనపించింది.నిజానికి ఈమె స్ధూలశరీరమును నేను అరుణగిరి చుట్టు భిక్షాటన చేసేవారిలో ఒకరిది అని నాకర్ధమైంది.అపుడు ఈమె ఆత్మశరీరము దగ్గరికి ఒక మగ సింహము  రావడము జరిగింది.అపుడు ఇది కాస్త ఈమె యోనిభాగము దగ్గరికి వెళ్ళి దానిని తన నోటితో విపరీతముగా నాకడము మొదలుపెట్టింది.కాని ఈమెలో ఎలాంటి శరీర కదలికలు లేవు.ఇక తర్వాత ఈ సింహము కాస్త ఈమె యోనిభాగమును చీల్చి ఇక ఈ శరీరమును తినడము ఆరభించే దృశ్యము కానవచ్చేసరికి నేను కళ్ళు తెరిచాను.అంటే ఈమె స్ధూలశరీరమునకు ఏదో మోహమాయలో పడటముతో ఈమె ఆత్మశరీరము కాస్త గిరిలోపలకి వెళ్ళకుండా గిరిబయటే సింహము ఆకలి తీర్చుకొని  ఉన్న మోహమాయలు వదిలించటానికి ఈమెకి ఆకలి జన్మను పున:జన్మగా ఇచ్చిందని నాకర్ధమైంది.కొన్నిరోజులు తర్వాత ఈమె సజీవముగా అరుణచల బస్టాండులో చూడటము జరిగితే ఆత్రమును ఆపుకోలేక ఈమె దగ్గరికి వెళ్ళి పలకరించి ఆమెకి ఉన్న మోహమాయలు ఏమిటో తెలుసుకోవాలని వెళ్ళాను.సుమారుగా 85 సం.రాలు ఉంటాయి.60సం.రాలు వయస్సులో తనభర్త చనిపోవడముతో కన్నపిల్లలు ఈమెను అనాధను చేస్తే అరుణచలమునకు చేరుకొని భిక్షాటనతో జీవిస్తూ 20సం.రాలు కాలము వెళ్ళిబుచ్చింది.ఇపుడు తన కొడుకుల మీద ఉన్న మోహ,వ్యామోమాయ వలన తనకి తెలిసినవాళ్ళు అరుణచలము వచ్చినపుడు తనకొడుకులు క్షేమసమాచారాలు తెలుసుకుంటూ కొడుకులు వచ్చి తనని తీసుకొని వెళ్ళమని అరుణచల శివుడిన్ని ప్రతిక్షణము ప్రార్ధించేది.అనుకోకుండా ఈరోజు తన పెద్ద కొడుకు శివ వచ్చి ఈమెను తన  ఇంటికి తీసుకొని వెళ్ళుతున్నాడని నాతో చెపుతూ పక్కనే ఉన్న కొడుకు చూపిస్తూ విపరీతమైన ఆనందపరవశ్యముతో ఆ కొడుకును చూస్తూ శివ నామస్మరణ చేస్తూ అక్కడే కన్నుమూసింది.నాకు ఏమిచెయ్యాలో అర్ధముకాలేదు.అపుడుదాకా సంతోషముగా మాట్లాడుతున్న వ్యక్తి కాస్త విగతజీవిగా మారే సరికి అక్కడున్న వారందరిలో ఒక సాధువు కాస్త ఈమె తనకొడుకు శివ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే తన ఆదికొడుకు అయిన అరుణచల శివ దగ్గరికి వెళ్ళింది.కాలా మాయ ఎంత విచిత్రమైంది.కర్మ ఎవరికి వదలిపెట్టదు.అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.ఇదిగూడ నిజమేగదా అనుకొని నేనుగూడ అక్కడనుండి బయలు దేరుతూ దారిలో అవును గదా.ఈ 80సం.రాలు వయస్సులో కొడుకులు దగ్గరికి వెళ్ళి ఏమి సుఖము పడుతుంది.వాళ్ళకి భారము కావడము తప్ప.అందుకే మన శివయ్య కాస్త ఆమెను తన దగ్గరికి తీసుకొని ఆమెకున్న సర్వరుణాబంధాలు తీసివేసి మరుజన్మలో ఆమెకి ఉన్న కొడుకుల మోహ మాయలను తొలగింస్తూ తన భక్తురాలిగా పుట్టేట్లుగా చేసిన ఈయన లీలావిన్యాసము ఎవరికి అంతుపట్టదు గదా అనుకుంటూ ఇంటికి వచ్చి వివిధ కాలాలలో వచ్చిన ఈ జంతువులు ధ్యానానుభవాలను ఆత్మవిశ్లేషణ చేసుకొని నోట్స్ రాసుకోవడము ఆరంభించాను అన్నమాట.


మోక్షజన్మల లెక్కలు తెలిశాయి:

ఒకరోజు నా దగ్గరికి ఒక సన్యాసి వచ్చి స్వామి..మీరు మోక్షము పొందారా? మనము మోక్షము పొందామని ఏమైన భౌతిక నిదర్శనాలు ఉన్నాయా? అని అడిగాడు.అపుడు వారితో  స్వామి..మీ జన్మ సాధన ఏదో ఒక శివలింగముతో మొదలు అవ్వాలి.అలా మీ దగ్గరికి ఏమైన శివలింగము వచ్చిందా అన్నపుడు దానికి ఆయన కొంతసేపు ఆలోచించి స్వామి నా దగ్గరికి మొదటిలో నర్మదానది బాణలింగము వచ్చింది.ఇపుడు కొన్నిరోజుల క్రితము ఇష్టలింగము వచ్చింది అనగానే అపుడు ఆయనతో స్వామి..మీ ఈ జన్మ మోక్ష సాధన అర్ధనారీశ్వర బాణలింగముతో మొదలై అనగా ఆత్మమోక్షము నుండి ఇష్టలింగము రావ్డముతో జ్యోతిమోక్షము పొందటకు యోగము,  అర్హత,యోగ్యత పొందారు.మనకి వచ్చే శివలింగాలు బట్టి మన అష్టమోక్షాలుంటాయి.మనకి ఏలాంటి కోరిక లేకపోతే అది ఒక జన్మలో రావచ్చును.లేదా 124 జన్మాలు పట్టవచ్చును.అదే కామమాయలో పడితే ఒక లక్షపాతికవేలు అదే కామమోహమాయలో పడితే 17 లక్షల 53వేల800 జన్మాలు అదే కామవ్యామోహమాయలో పడితే ఒకకోటి25లక్షలు జన్మాలు పడతాయి.ఎలా అంటావా?చూడు..మన మోక్షజన్మాల లెక్కలు అంటూ మన అష్టమోక్షాలలో మొదటిది జ్యోతిమోక్షమునకు ఒక జన్మ లేదా 10లక్షల జన్మలు తీసుకుంటుంది.అదే ఆత్మ మోక్షమైతే ఒక జన్మ లేదా 5లక్షల జన్మలు అదే పరమలింగమోక్షమైతే రెండు జన్మాలు లేదా రెండు  లక్షల జన్మలైతే అదే స్త్రీ శివలింగ మోక్షమైతే ఒక జన్మ లేదా 10వేల జన్మాలు అదే పురుష శివలింగ మోక్షానికి ఒక జన్మ లేదా 5వేల జన్మాలు అదే మణిమోక్షానికి అయితే ఆరు జన్మాలు లేదా ఆరువేల జన్మాలు తీసుకుంటే అదే కపాలమోక్షానికి 64 జన్మాలు లేదా 32వేల జన్మాలు అదే శరీరమోక్షానికి అయితే 48 జన్మాలు లేదా 4వేల 800 జన్మాలు తీసుకుంటుంది అన్నమాట.ఇలా మన అష్ట మోక్షాలు వరుసగా 48+64+6+1+1+2+1+1=124 జన్మాలు పడతాయి.అదే మనము ఏదైన కోరికమాయలో పడితే వరుసగా 4800+32000+ 6వేలు+5వేలు+10వేలు+ 2లక్షలు+ 5లక్షలు+10 లక్షలు = 17,57,800 అవుతుంది.అలాగే స్ధూలశరీర మోక్షము పొందటానికి 48 జన్మాలు పడుతుంది.లేదా 4800 పడుతుంది అన్నాము గదా.ఇది ఎలా అంటే మనకి యోగ జన్మ అవ్వాలంటే 48 జన్మయే యోగ జన్మ అవుతుందని లోకవిధితమే గదా.అలాగే స్ధూల శరీర ఆయుష్ 100 సం.రాలు గదా.అపుడు ఈ లెక్కన చూస్తే 48 జన్మాలు లేదా 48X100=4,800 జన్మాలు అవుతోంది.ఈ లెక్కనచూస్తే సూక్షశరీరము పొందే కపాల మోక్షానికి 64 కపాలాలుంటాయి గదా.అపుడు 64 జన్మాలు లేదా ఈ శరీర అయుష్ 500 సం.రాలు అవ్వడముతో 64X500=32,000 అవుతుంది.ఇలా కారణశరీరానికి వచ్చే మణిమోక్షమునకు ఆరుమణులు గావడముతో ఆరు జన్మాలు లేదా దీని ఆయుష్ 1000 సం.రాలు అవ్వడముతో 6X1000=6,000 అవుతుంది.అదే వాయుశరీర పురుషశివలింగ మోక్షానికి ఒక జన్మ లేదా దీని అయుష్ 5వేలు గావడముతో 5వేలు జన్మాలు పడుతుంది.అదే ఆకాశ శరీర స్త్రీ శివలింగ మోక్షానికి ఒక జన్మ లేదా దీనిని అయుష్ 10వేలు గావడముతో 10వేల జన్మాలు పడితే అదే సంకల్ప శరీర పరమలింగమోక్షానికి రెండు జన్మలు (జీవాత్మ-పరమాత్మ) లేదా దీని ఆయుష్ 2లక్షలు గావడముతో రెండు లక్షలు జన్మాలు పట్టవచ్చును.అదే ఆత్మశరీర ఆత్మమోక్షానికి ఒక జన్మ (ఏకాత్మ) లేదా దీని ఆయుష్ 5 లక్షాలు గావడముతో 5లక్షల జన్మాలు పడుతుంది.ఇక ఆఖరిదైన జ్యోతిశరీర జ్యోతిమోక్షానికి ఒక జన్మ లేదా దీని ఆయుష్ 10   లక్షలు జన్మాలు పడుతుంది.అంటే మన అష్ట శరీరాల అష్టమోక్షాలు పొందటానికి ఒక జన్మ లేదా 124 జన్మాలు లేదా 17,57,800 జన్మాలు పట్టవచ్చును.కాని స్వానుభవము ప్రకారము చూస్తే ఆదిరుద్రుడికే  ఈ అష్టమోక్షాలు పొందటానికి 64 జన్మాలు పట్టింది.అదే 64 రుద్రా అవతారాలుగా ప్రచారములో ఉన్నాయి.కాబట్టి ఒక జన్మలోనే ఈ అష్టమోక్షాలు పొందుతామని అనుకోవడము మన అవివేకము అజ్ఞానము అవుతుంది.ఎవరు చెప్పిన నమ్మకండి.ఎందుకంటే నాకే సప్తమోక్షాలు పొందటానికి 4లక్షల 77వేల జన్మాలు పట్టింది.అదే నా స్వర్గ నెంబరు 477 అయింది.






దీనికి నిదర్శనముగా ONA 577477 నెంబరు ఉన్న 100 రూపాయిలనోటు చూడు అంటూ చూపించడము జరిగింది.ఇందులో ONA అంటే  ఓం నమో అరుణచల అని అర్ధముంటే 477 నెంబరు అనేది అరుణచల బస్ సర్వీసు నెంబరు గావడము మరొ విశేషము అన్నమాట.కారణము నాకున్న స్త్రీ మోహ వ్యామోహ మాయలు వదిల్చికోవటానికి ఇన్నిజన్మలు పట్టింది.అలాగే నేను  కాస్త సప్తమోక్షాలు పొందినానని నా ఆత్మ నమ్మకపోవడముతో దానికి నేను అనేది లేదు అనే స్వానుభవానుభూతి పొందుటకు ఈ దేహ జన్మ తీసుకోవడము జతిగింది.అంటే ప్రస్తుతానికి నా స్దూలశరీర మోక్ష పొందటానికి ఈ దేహ జన్మ ఎదురుచూస్తోంది అన్నమాట.







దీనికి నిదర్శనమే నాకు వచ్చిన అష్టలింగాలు చూడు అంటూ స్ధూలశరీర శరీర మోక్షానికి పంచముఖ నాగ శివలింగ వస్తే..సూక్ష్మశరీర కపాలమోక్షానికి స్ఫటిక శివలింగము వస్తే...కారణ శరీర మణిమోక్షానికి నల్లని శివలింగము వస్తే..అదే వాయుశరీర పురుష శివలింగ మోక్షానికి తెల్లని శివలింగము వస్తే... అదే ఆకాశ శరీర స్త్రీశివలింగ మోక్షానికి పాదరస శివలింగము వస్తే..అదే సంకల్ప శరీర అర్ధనారీశరీర పరమలింగ మోక్షానికి ప్రతీకగా అర్ధనారీశ్వరలింగము వస్తే...అదే ఆత్మ శరీర ఆత్మమోక్షానికి ప్రతీకగా నల్ల రుద్రశివలింగాము లేదా నల్లని ఇష్టలింగము వస్తే..ఇక ఆఖదైన జ్యోతిశరీర జ్యోతిమోక్షానికి ప్రతీకగా పూర్ణకుంభ ఇష్టలింగము వస్తుంది.ఇంతకంటే ఇంక ప్రత్యక్ష నిదర్శనాలు ఏముంటుంది .ఆలోచించు.అనగానే ఆ సన్యాసి కాస్త స్వామిజీ..మీరు చెప్పింది అక్షరసత్యమే.ఎందుకంటే అదే నిజము నిరూపించడానికి సాక్ష్యాధారులు అవసరమవుతాయి.అదే సత్యాన్ని నిరూపించడానికి సాక్ష్యాదారులు ఉండవలసిన అవసరమే లేదు. మోక్షము అనేది సత్యము..సత్యానికి ఎవరికివారి మన:సాక్షి యొక్క ధ్యానానుభవాలు సాక్ష్యముగా నిలుస్తాయి.మీ గురుబోధ నా అజ్ఞాన కళ్ళు తెరిపించారు అంటూ అక్కడనుండి మౌనముగా వెళ్ళిపోయాడు.

అతీతస్ధితి-మహా నిర్వాణ నిర్యాణస్ధితి:

ఒకరోజు పరమహంసకి ఒక సందేహము వచ్చింది.అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది అని.దానికి జిజ్ఞాసిగా నేను వెంటనే అది ఏమిటి..తనకి తాను ఎవరో తెలుసుకోవాలని అనిపించి ఈ సృష్టి చేశారు గదా.ఇదే నిజము అనుకుంటే మరి తెలుసుకోవాలసినవాడు ఎందుకు అమ్మవారిగా రూపాంతరము చెందాడు అన్నారు.తను తెలుసుకున్న జ్ఞానము మరొకరితో పంచుకోవాలని అనుకొని తనకి తాను అర్ధనారీశ్వరతత్వముతో అమ్మగాను-అయ్యగాను విడిపోయారు అని అన్నాను.ఆయన వెంటనే మరి తెలుసుకున్నపుడు ఇంక సృష్టి ఎందుకు ఉంది?పూర్ణజ్ఞానము పొందినపుడు అది అందరికి పంచినపుడు ఈ సృష్టి ఎందుకు ఉంది? అని అడిగేసరికి నేను మౌనము వహించాను.అపుడు ఆయన జిజ్ఞాసి..ఒక విషయము గమనించావా?మనము భోగములోను అలాగే యోగములోను గూడ శాంతిస్ధితి పొందలంటే మనము సంపాదించినవి వదిల్చికుంటేగాని ఈ స్ధితి రావడము లేదు.అనగా భోగములో సంపాదించిన కోట్లరూపాయిలు వదిల్చికుంటే శాంతి వస్తుంది.అదే యోగములో మనకి ఉన్న సర్వకర్మబంధాలు వదిల్చికుని సన్యాసిగా మారితేకాని శాంతి వస్తుంది.అంటే సంపాదించెది వదిల్చికోవటానికా లేదా వదిల్చికోవటానికి సంపాదన ఉందా అంటే ఎవరుగూడ చెప్పలేరు.గాకపోతే వదిల్చికుంటేనే ఎందుకు శాంతిస్ధితి వస్తోంది.ఇదిగూడ తాతాల్కికముగా ఉంటుంది.శాశ్వతముగా ఎందుకు ఉండటము లేదు అని నా ప్రశ్న..యోగికి అలగే భోగికి ఆకలి   వేస్తుంది.ఉన్నది తినేవాడు యోగి అయితే గావాలసినది తినేవాడు భోగి అవుతున్నాడు.నిజానికి వీరిద్దరుగూడ యోగసాధనలో ఉన్నవాళ్ళే.ఇందులో భోగిగా ఉన్నవాడు కర్మరాహిత్యస్ధితి పొందితే యోగి అనేవాడు జన్మరాహిత్యస్ధితి పొందుతున్నాడు.కాని ఈ కర్మ అలాగే జన్మ ఉన్న మూలాలకి మనము వెళ్ళడము లేదని నేను గ్రహించాను.అంటే కొడిగుడ్డు తీసుకో..ఇందులో తెల్లసొన అనేది కర్మ అయితే,పచ్చసొన అనేది జన్మ గా ఉంటాయి.కాని ఈ రెండింటికి మూలమైన ఈ గుడ్డు ఏర్పడటానికి కారక కారణమైన పచ్చసొనలోని మూలకర్మబీజకణమైన వీర్యకణము నాశనము అవ్వడము లేదు.కేవలము దీనిని నుండి వచ్చిన కర్మ-జన్మ  తాతాల్కిక స్ధితికి మనము వెళ్ళుతున్నాము.అంటేఈ ఈసృష్టికి శాశ్వతాతీతమైనస్ధితి మనము పొందడము లేదు.కేవలము తాతాల్కిక అశాశ్వతస్ధితియైన శాంతిస్ధితిన్ని మాత్రమే మనము పొందుతున్నాము అనగా మరణము తర్వాత వచ్చే విశ్రాంతిస్ధితినే మనము పొందుతున్నాము అంటే ఇన్నాళ్ళు మనము సినిమాలోని భోగమైన మొదటిభాగము అలాగే యోగమైన రెండభాగము మధ్య వచ్చే విశ్రాంతి అనే తాతాల్కిక ఆనందస్ధితినే మనము పొందుతున్నాము కాని సినిమా పూర్తీయిన తర్వాత వచ్చే శుభం కార్డ్ వరకు మనము వెళ్ళడము లేదు.కేవలము ఇది ఒకటి ఉన్నదని మనము తెలుసుకుంటున్నాము.అది ఏలాంటే బుద్దుడు విషయానికి వస్తే కోరికాతీతస్ధితి ఒకటి ఉన్నదని అది మనము పొందాలని మనకి చెప్పాడు కాని ఆయన పొందలేదు. అదే పరమహంస రామకృష్ణ విషయానికి వస్తే సమాధిలో తురీయాతీతస్ధితి పొందాలని ఆయన మనకి చెప్పి ఈ స్ధితిలో అమ్మలేని స్ధితి గావడముతో తాను మాత్రము అమ్మ ఉన్న స్ధితియైన తురీయా సమాధిస్ధితిలోనే శాశ్వతముగా ఉండిపోయారు.ఇక జిడ్డు కృష్టమూర్తి అయితే మనమంతా శూన్యమే అంతిమస్ధితిగాదని దీనికి అతీతముగా శూన్యాతీతస్ధితిని పొందాలని లోకానికి చెప్పడము జరిగింది.అంటే ఆఖరిస్ధితి పొందినవారంతాగూడ ఇంక చివరిలో ఏదో ఒకస్ధితి పొందాలని అదే అతీతస్ధితి అదే మహానిర్వాణ నిర్యాణస్ధితియని నేను గ్రహించాను.మరి చాలామంది ఈస్ధితి ఒకటి ఉన్నదని తెలుకొని కొందరు గావాలని ఈ స్ధితికి వెళ్ళకుండా ఉంటే మరికొందరు వెళ్ళికూడ ఈ స్ధితి ఎందుకు పొందలేకపోయారో నేను తెలుకోవాలని నాతో అని ఆరోజు నుండి ఆయన ఈ విషయము మీద పరిశోధన చెయ్యడము ఆరంభించారు. అపుడు ఆయన ఒక విషయము గమనించారు.అది ఏమిటంటే మనకి ధ్యానములో కనిపించే 64 కపాలాల కపాలధారి యొక్క కపాలాల వరుసక్రమము గమనించారు.అనగా ఇవి 1,3,5,7,9,11,13,15 అనే బేసిసంఖ్యలో ఉన్నాయి.కాని సరిసంఖ్యలైన 2,4,6,8,10,12,14 లాగా ఎందుకు లేవు పైగా 64 కపాలాలు అంటే వరుసగా 1,2,3,4,5,6,7 ఇలా 64 దాకా ఉండాలి కాని కేవలము బేసిసంఖ్య వరుసక్రమములో ఎందుకు ఉన్నాయని అదే సరిసంఖ్యలో ఉన్న కపాలాలు ఏవి ఇలా ఆయనకి సందేహలు వచ్చాయి.అపుడు ధ్యానములో వచ్చిన జ్ఞానస్ఫురణలను విచారణ చేసుకుంటే బేసిసంఖ్యలో ఉన్న కపాలాలు అనేవి జన్మరాహిత్యమైతే..సరిసంఖ్యలో ఉన్న కపాలాలు కర్మరాహిత్యమునకు చెందినవీ అని తెలుకున్నారు.అంటే సరిసంఖ్య 28 కపాలాలధారిగా అయ్యవారు కర్మరాహిత్య సాధన మన బ్రహ్మరంధ్రలో ఉండి సాధన చేస్తుంటే అదే అమ్మవారు కాస్త 36 కపాలాల  బేసిసంఖ్యలో జన్మరాహిత్య సాధన మన హృదయములో ఉండి సాధన చేస్తున్నారు.అంటే అమ్మవారి కపాలబ్రహ్మరంధ్రలో 28 కపాలాలధారిగా అయ్యవారుంటే అదే అయ్యవారి హృదయములో 36 కపాలాధారిగా అమ్మవారు ఉంది.ఇదే అర్ధనారీశ్వరతత్వము అన్నమాట.ఇలా విరిద్దరు ఉన్న విషయము వీరికే తెలియడము లేదు.ఎవరికివారే తామే విశ్వవిధాతలుగా ఉంటున్నారు.ఎవరి ప్రకృతిలో వారు ఒకరి తెలియకుండా మరొకరు ఉంటూ విడివిడిగా విడిపోకుండా ఉంటున్నారు.అందుకే మనము ఉన్న విశ్వములో పురుష ప్రకృతి అలాగే స్త్రీ ప్రకృతి ఉన్నాయి.అనగా ద్వంద్వ భావాల స్ధితి పొందడము జరిగింది.ఎవరికి వారే సాధన చేసి తనలాంటి వాడు ఎవడో తెలుసుకోవాలని ఎవరికి వారే విడిగా ఉండి సాధన చేస్తున్నారు.అంటే అమ్మవారు కాస్త అయ్యవారికోసము అలాగే అయ్యవారు కాస్త అమ్మవారికోసము సాధన చేసి తామిద్దరు వేరుకాదని ఏకస్ధితియైన అర్ధనారీశ్వరస్ధితి నుండి తామిద్దరము వచ్చిమని ఎవరికివారే జ్ఞానుభవాలు పొంది ఆ స్ధితిలో శాశ్వతముగా ఉండలేక ఇద్దరిలో అయ్యవారికి అహము అలాగే అమ్మవారికి భయము వచ్చి మళ్ళీ ఈ ఏకస్ధితి నుండి విడిపోయి అయ్యవారు కాస్త 1,2,4,6,8,10,12,14 ఇలా 28 కపాలాధారి మారితే అమ్మవారు కాస్త 1,3,5,7,9,11,13,15  ఇలా 36 కపాలాధరిగా మారి ఎవరి ప్రకృతులను వారుగావాల్సినవిధముగా ఏర్పాటు చేసుకొని మనల్ని చావకొడుతున్నారు. 

ఇలా ఎవరికివారే సాధన చేసి పురుషుడైతే తనకి ఉన్న అహమును వదిల్చికుంటే తానే శివుడని..అదే స్త్రీమూర్తి అయితే తనకి ఉన్న భయమాయను వదిల్చికుంటే తానే శివాని అనే దైవత్వస్ధితి పొందడము జరుగుతోందని దీనినే శివోహం అలాగే దేవిహం స్ధితులు అంటున్నారని నేను గ్రహించాను.ఇంతవరకు బాగానే ఉంది.మళ్ళి వీరిద్దరు ఒకరినొకరు తెలుసుకొని ఏకమై అర్ధనారీశ్వరస్ధితి పొందిగూడ ఎందుకు శాశ్వతస్ధితిలో ఉండకుండా అర్ధాంతరముగా అహము అలాగే భయ మాయలలో పడి మళ్ళీ విరిద్ధరు ఎందుకు వీడిపోతున్నారొ తెలుసుకోవాలని నా పరిశోధన మొదలైంది.ఇదే నా జీవితములో గూడ విడాకులురూపములో జరిగింది.మాకు సంతానము లేకపోవడముతో నేను చనిపోతే మా ఆవిడిని   తనని ఎవరుచూడరని తను భయపడి నాకు విడాకులు ఇచ్చి పుట్టింటివాళ్ళు చూస్తారని వెళ్ళిపోయింది.తను లేకపోతే నేను ఈ మాత్రము బతుకు బతకలేనా అనే నాలో అహము వచ్చి దానికి విడాకులు ఇచ్చి సన్యాసము తీసుకున్నాను.నాలో అహము చచ్చేసరికి అది అందనిస్ధితికి వెళ్ళిపోయింది.అదే దానికి భయము పోయేసరికి నేను అందనిస్ధితికి చేరుకున్నాను.అంటే ఈ లెక్కనచూస్తే ఆదిలోనే ఆదిదంపతులు కాస్త అహ,భయ మాయలకి లోనై ఎవరికివారే విడిపోయి వారి పరిపాలన కార్యక్రమాలు చూసుకుని ఉండిఉండాలి.అరుణచలములో కుమారస్వామి కోసము వీళ్ళు రావడము అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉన్న మరొ అరుణచలక్షేత్రమైన త్రిపురాంతకము క్షేత్రములో వారి కూతురైన బాల కోసము వీళ్ళి వెళ్ళడము చూడవచ్చును. సరే ఇదింతా బాగానే ఉంది.మరి ఆదిదంపతులు అహము,భయ రాహిత్యస్ధితి పొంది అర్ధనారీశ్వరతత్వములో ఎందుకు శాశ్వతముగా అదే అతీతస్ధితిన్ని ఎందుకు పొందలేకపొందుతున్నారో నా ధ్యాన పరిశోధన  మొదలైంది.అపుడు నాకు ధ్యానములో వివిధ రకాల దృశ్యాలు కనిపించాయి.అవి ఏమిటంటే మొదట అరుణగిరి ఒక అరుణజ్యోతి కనపడింది.ఆ తర్వాత మరొ అరుణజ్యోతి గిరికి కుడివైపు నుండి గిరి ఎక్కుతూ కనపడింది.అరుణజ్యోతి ఎక్కడము ఎమిటా అని ఆలోచింస్తున్నారా?ఈ అరుణజ్యోతి ఉండటానికి జ్యోతిశరీరముతో ఏర్పడము వలన జరుగుతుంది.మన ఆత్మజ్యోతికి స్ధూలశరీరమున్నట్లే అరుణజ్యోతికి గూడ జ్యోతిశరీరముంటుంది అన్నమాట.  తద్వారా ఈ అరుణజ్యోతిన్ని పరిశీలిస్తే  అది ఎవరి స్ధూలశరీరమో మనకి తెలుస్తుంది.తెలుసుకోవచ్చూను.ఈ విషయాన్ని పక్కనపెడితే అసలు విషయానికి వద్దాం.ఇలా పైకి ఎక్కివచ్చిన అరుణజ్యోతిన్ని చూడగానే అపుడికి పైన ఉన్న పాత అరుణజ్యోతి గిరికి ఎడమవైపు నుండి కిందకి దిగడము ఆరంభిచింది.ఇలా ఇది  కిందకి వస్తున్నపుడు అపుడిదాకా లేని ఈజ్యోతిలో ఒక నల్లటి మనిషి ఆకారముగా స్ఫుష్టముగా కనపడింది.ఈ జ్యోతి గిరిపాదభాగానికి చెరుకుంది.అంతడితో ఆరోజు ధ్యానభంగమైంది. మరికొన్నిరోజులు తర్వాత పైన ఉన్న అరుణజ్యోతిలో జ్వాలాలు తగ్గిపోతు ఒక నల్లటి వలయాకారము కాస్త జ్వాలాగ్ని సెగలతో మండుతూ కనపడింది.ధ్యానములో కళ్ళుమూసుకొని ఉన్న నా భౌతిక నేత్రాలకి ఈ సెగలు కొట్టి కన్నీళ్ళు రావడము జరుగింది.సుమూరుగా అరుణగిరి నా ధ్యానానికి మూడు లేదా 4 కి.మీ దూరములో ఉంది. ఈ వలయ సెగ శక్తి ఎంతగా ఉన్నదో మీ ఉహకే వదిలివేస్తున్నాను.ఇదీలాంటే ఒక మగసింహము ఒకటి ఈ గిరీపైకి ఏక్కి గిరి అగ్రభాగానికి చేరుకొనే ప్రయత్నాలు చెస్తున్న దృశ్యాలు నాకు ధ్యానము నందు కానవచ్చాయి.అపుడు ఈ నల్లటివలయము ఈ సింహము ముందుకి వచ్చి దానిని గిరి పైకి ఎక్కనీయ్యకుండా అడ్డుగా రావడము పదేపదే జరుగుతోంది.ఈ నల్లటి వలయానికి ఉన్న అతితీవ్రమైన వేడిసెగకి  ఆ మగసింహము తాళలేక గిరి మధ్యభాగము నుండి వెనక్కి తిరిగివచ్చింది.దానితో ఆరోజు ధ్యానభంగమైంది.మరికొన్నిరోజులకి ఒక పులి కాస్త గిరి ఎక్కడకి ప్రయత్నించడము దీనికిగూడ సింహనికి జరిగినట్లుగానే జరగడముతో ఇదిగూడ వెనక్కి తిరిగివచ్చింది.ఆతర్వాత 10సం.రాల పిల్లాడు ఈ కొండను ఎక్కేదృశ్యము కనిపించింది.ఇతనికిగూడ సింహనికి జరిగినట్లే జరిగింది.దానితో నేను కాస్త ఈ వలయములో ఏమిఉన్నదని నా ధ్యానశక్తితో నా త్రినేత్రము నుండి జ్ఞానాగ్నిజ్వాలాలు ఈ వలయము మీదకి ప్రయోగము చెశాను.అదే నేను తెలియకుండా చేసిన అతీ పెద్ద తప్పు అని ఆతర్వాత తెలిసింది.అపుడు ఈ నల్లటివలయము కాస్త నావైపు తిరిగి నేను పంపించిన అగ్నిజ్వాలాలు తనలోనికి సెగలుగా మార్చుకుని నన్ను తనలోనికి తీసుకొనె ప్రయత్నము మొదలుపెట్టేసరికి అప్రయత్నముగా నాధ్యానభంగమైంది.అపుడు ఈ నల్లటి వలయము వలనే జీవుడు లేదా శివుడు లేదా శివాని గూడ శాశ్వత అతీతస్ధితికి వెళ్ళడము లేదని నా విచారణలో తెలుసుకున్నాను.అంటే మనమంతాగూడ పుట్టింది చచ్చేది  సాధన చేసేది ఈ అతీతస్ధితి పొందటానికి కోట్లానుకోట్ల జన్మలు తీసుకోవడము జరిగింది.జరుగుతుందిగూడ. ఎందుకంటే ఈ అతీతస్ధితి ఉన్నదని ఎవరికివారే సాధనచేసి తెలుకుంటారు కాని ఇది పొందలేని అందలేనిస్ధితియని ఎవరుగూడ తెలుసుకోలేరు.ఎందుకంటే మనవి ఆదిజన్మాలు అన్నిగూడ జంతువుల జన్మలేగదా.మరి జంతువులకి అగ్నిభయము సహజసిద్ధముగానే ఉంటుందిగదా.వాటికి అగ్నిభయముపోదు.తద్వార ఆ నల్లటివలయచక్రమును దాటవు.వీటికి ఈ భయముపోతేగాని మన ఆదిజన్మకి అతీతస్ధితిరాదు అన్నమాట.కాని వీటికి అది అగ్నిగుణముతో ఉన్నదని జ్ఞానము వలన వాటి స్ధూలశరీరలైన మనకి అది అతీతస్ధితి జ్ఞానము అందుతోంది. అందుకే పశువు కాస్త పశుపతిగాను..అలాగే నరుడు కాస్త నారాయణుడిగాను..అలాగే వానరుడు కాస్త నరుడిగాను ఇలా రూపాంతరాలు చెందుతున్నారు కాని ఎవరుగూడ తమరూపాలను అంతము చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ నల్లటి వలయము ఏమీటి అని విచారణ చేస్తే ఇది అయ్యవారి అరుణజ్యోతి యొక్క కర్మబీజము అని తెలిసింది.దీనిని మనకి కర్మలు వస్తున్నాయి.ఈ కర్మలు చెయ్యటానికి జన్మలు వస్తున్నాయి.ఈ కర్మ కాస్త కర్మమాయలలో పడితే అవికాస్త కర్మవాసనాలుగా మారి మనకి పున:కర్మజన్మచక్రబంధనములో పడివేస్తున్నాయి.అంటే వీటి అన్నింటికి మూలబిందువు ఈ అరుణగిరి మీద ఉన్న ఒక నల్లటి ఆకార వలయమే  అన్నమాట.ఇది పోతే కాని మన కర్మజన్మాలకి అతీతస్ధితి అనగా అరుణజ్యోతిలో ఉండే జ్యోతిశరీరముగూడ నాశనమై మనకి శూన్యాతీతస్ధితి పొందడము జరుగుతుంది.ఇదే అసలు సిసలైన మహనిర్వాణ నిర్యాణము అవుతుంది.ఇదే పూర్ణమోక్షమవుతుంది.అంటే మనమంతా సాధనచేసి స్ధూలశరీర మోక్షము నుండి జ్యోతిశరీరమోక్షము వరకు మాత్రమే వస్తున్నాము.మళ్లీ ఈ జ్యోతిశరీరము నుండి కావాలని అనుకుంటే తిరిగి స్ధూలశరీర వరకు ఉన్న సప్త శరీరాలు ఎత్తవచ్చును.అంటే 1వడైమర్ష నుండి 64వ డైమర్షవరకు వెళ్ళి అక్కడనుండి వెనక్కితిరిగి మళ్ళీ 1వ డైమర్షకి ఇన్నాళ్ళుగా తిరిగివస్తున్నాము.ఎందుకంటే 65వ డైమర్షన్  ఉన్నదని అదే ఆతీతస్ధితియని.. నిర్జీవస్ధితియని.. మహనిర్వాణస్ధితియని..కోరీకాతీతస్ధితియని..మహనిర్యాణస్ధితియని...మహశాంతిస్ధితియని..పరమానందస్ధితియని..శూన్యాతీతస్ధితియని..తురియాతీతస్ధితియని..ఇలా ఎవరికివారే ఈ స్ధితిన్ని పొందకుండా ఈ స్ధితికి తమ అంతిమ అనుభవానికి తగ్గట్లుగా పేరుపెట్టికొని ఈ స్ధితిపొందాలని లోకానికి చెప్పుతున్నారని నాకర్ధమైంది.ఎందుకంటే ఈ స్ధితి ఉన్నదని అందరు తెలుసుకుంటారు కాని ఇది పొందలేరు.కారణము గిరిమీద ఉన్న నల్లటి వలయము కారణమేనని ఇపుడేగదా లోకానికి తెలిసింది.  ఇది ఏర్పడటానికి ఏవరి కర్మము వారి కర్మబీజము వలన ఏర్పడుతుంది గదా.ఎవరికి వారే వారి ఆదికర్మ ఏర్పడటానికి కారకమైన కర్శబీజము ఏమిటో తెలుసుకోవాలి.అపుడే ఆదికర్మ పోతుంది.తద్వారా ఆదిజన్మ పోతుంది.మరి ఇది తెలియాలంటే ఎవరికివారే ఆదిలో కనిపించే నల్లటివలయచక్రములో ప్రవేశించాలిగదా.అందుకు మన ఆదిజన్మయైన జంతుజన్మ సహకరించాలి.అది సాధ్యపడదు.ఎందుకంటే దానికి అగ్నిభయముంది గదా.అంతెందుకు ఆదిదంపతులైన రుద్రుడి ఆదిజన్మ వానరుడు అనగా 11వ కపాలరుద్రుడు కాస్త వానరజన్మ ఎత్తి రావణసంహరము చెయ్యడము జరిగింది గదా.అంటే ఇది ఆయన ఆదిజన్మ అన్నమాట.ఇక విష్ణూమూర్తి ఆదిజన్మ ఒక చేప..ఇక అమ్మవారి ఆదిజన్మ ఒక సింహము..ఇక గణపతి ఆదిజన్మ ఏనుగు..ఇక కుమారస్వామి ఆదిజన్మ పులి..నందీశ్వరుడు ఆదిజన్మ ఎద్దు..ఇలా చెప్పుకుంటుపోతే ప్రతిదైవ,జీవ జన్మాలకి ఆదిజన్మగా ఏదోఒక జంతుజన్మ తప్పకుండా ఉంటుంది.అందుకే పశువు కాస్త పశుపతి అయ్యాడు.జీవుడు నుండి శివుడు అయ్యాడు.కాని ఇందులో పసుపతి కాస్త ఆ నల్లటి అగ్నివలయానికి భయపడడు.కాని ఈయన ఆది జన్మయైన పశువు మాత్రము ఈ అగ్నివలయానికి భయపడకుండా ఉండలేదు.ఈ ఆదిజన్మ పశువుకి ఉన్న భయము పొగొట్టానికే ఈ యోగసాధనలు ఏర్పటుచేసుకున్నారు.కాని సాధన పరిసమాప్తి చేసుకొని తన ఆదిజన్మ ఏ జంతువు జన్మ తెలుసికొనేస్ధితికి వస్తారు.అది అరుణచల గిరిమీదకి ఎక్కి అక్కడ ఉన్న నల్లటివలయబీజచక్ర విషపు అగ్నిజ్వాలాలకి భయపడి వెనుతిరగడము జరుతుంది.ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పులికి సర్కాసులో అగ్నివలయము ఎలా దాటాలో శిక్షణ ఇస్తారు.అది అందరు ముందు ఈ అగ్నివలయము దాటుతూందిగూడ.దానినిచూసి మనము చప్పట్లు కొడతాము.కాని నిజానికి ఈ పులికి మనస్సులో ఏదోమూల తనకి తెలియకుండానే అగ్నిభయము ఊంటుంది.కాని బయటికి చూపించలేదు.ఎందుకంటే అదిభయపడి ఈ అగ్నివలయము దూకపోతే దాని శిక్షకుడు ఎక్కడ కొడతాడు అనే మనోభయముతో ఈ అగ్నివలయములో దూకి అవతలకి వెళ్ళుతుంది.ఇలా   మనముగూడ మన మనస్సులకి ఎన్నోరకాల యోగసాధనాలు చేసి మనకి భయాలు పొగొట్టుకొని ఆదిజన్మయైన జంతువుజన్మ దగ్గరికి వస్తాము.కాని సర్కాసు పులి కేవలము సర్కాసు చేసేసమయములో అది అగ్నికి భయపడదు.కాని ఇదే పులిన్ని అగ్నికి దాహనమవుతున్న అడవిలో వదిలిపెడితే అది ఎంతశిక్షణ పొందినగూడ భయపడకుండా ఉంటుందా?ఉండదుగదా.అలాగే మనముగూడ మన మనస్సుకి ఎంత సాధన ఇచ్చినప్పడికి అది దాని ఆదిజన్మయైన జంతుజన్మ మనస్సుస్ధితి పొందేసరికి శిక్షణ దేవుడెరుగు..ఈ అగ్నివలయము నుండి ఎలా తప్పించుకోవాలో అలా భయపడి తప్పించుకుంటుంది.అనగా మన అరుణగిరి మీద కనిపించే ఆ నల్లటి వలయకార  కర్మబీజము వలనే ఈ ఆది జంతుజన్మ వచ్చింది.కాని మనము ఈ ఆదిజన్మస్ధితికి వచ్చేసరికి అజ్ఞానమాయలో పడిపోతాము.ఎందుకంటే జంతువులు జ్ఞానమును పొందలేవుగదా.ఉన్నవాటి విజ్ఞానముతో బ్రతుకుతాయి.కాని తనజన్మ మూలాలు జ్ఞానము వాటికి అందదు గదా.ఆలోచించదు గదా.అంటే పశుపతి నుండి పశువు గా మారితే తను తెలుకున్న పూర్ణబ్రహ్మజ్ఞానమును మర్చిపోకతప్పదు.ఇదే అపస్మారకము అన్నమాట.తను ఆదిజంతుజన్మకి వెళ్ళితే కాని ఈ జన్మ కర్మబీజము ఏమిటో తెలియదు.తెలుసుకోవాలని ఈ ఆదిజన్మకి వెళ్ళితే సహజ పశులక్షణాలు వస్తున్నాయి.పశువుగా మారి పశుపతిగా తను తెలుసుకోవాలి.అది సాధ్యపడే  సాద్యపడే విషయము గాదు.అంటే పశుపతిగా అతీతస్ధితి ఉన్నదని జ్ఞానానుభవము పొందుతున్నాడు కాని తన ఆదీజన్మ పశువు జన్మకి వచ్చి ఈ అతీతస్ధితిన్ని జ్ఞానానుభూతిగా పొందాలని వచ్చేసరికి తను అపస్మారకస్ధితి పొంది తెలుసుకున్న జ్ఞానమును మర్చిపొయి తను ఎవరో తెలుసుకోవాలని పశువు నుండి మళ్ళీ పశుపతిదాకా చేస్తూనే సాధన చేస్తున్నాడని నాకర్ధమైంది.పశువుకి అలాగే జీవుడికి జ్ఞానానుభూతి అందదు.జ్ఞానానుభవము పొందినవాడు పశుపతి అదే శివుడు అవుతాడు.దీనికే మనము చంకలు కొట్టేసికొట్టిన్నాము.కాని పొందవలసిన అతీతస్ధితిన్ని జ్ఞానానుభూతిగా మనము ఎన్నడుగూడ పొందలేమని జ్ఞానము పొందిన అజ్ఞాన జీవులుగా తిరిగి మారుతున్నామని ఇపుడికైనా తెలుసుకొండి. ఈ ఆదికర్మబీజము పోతేకాని మన అంతిమ జ్యోతిశరీరానికి మోక్షము రాదు.అపుడిదాకా ఇది జ్యోతిశరీరముతో అరుణజ్యోతిగా శాశ్వతస్ధితిలో జన్మరాహిత్యస్ధితిలో ఉంటుంది కాని కర్మరాహిత్యస్ధితి పొందలేదు.ఎందుకంటే ఆదికర్మబీజము యొక్క ఆదికర్మ నశించలేదు గదా.ఈ కర్మబీజము ఏమిటో తెలుసుకోవాలంటే మన ఆదిజంతు జన్మయే తెలుసుకోవాలి కాని ఇది కర్మబీజవలయచక్ర జ్వాలాలకి ఈ జంతుజన్మ భయపడుతోంది గదా.ఇది ఇలా ఉంటే దీనికి ఏమైనా పరిష్కారమార్గము ఉన్నదోమోనని శాస్త్రాలు తిరవేస్తే తంత్రశాస్త్రములో నల్లతుమ్మచెట్టు కాండము వలన కర్మబీజాలు నశించబడతాయని..ఈ చెట్టుకి అధిపతిగా పాతాళకుమారస్వామి ఉంటారని..ఈయన అనుగ్రహము వలన కర్మబీజాలు నాశనమవుతాయని చెప్పడముతో అలాగే ఇది ఇచ్చే విపరీతమైన రేడియోషన్ శక్తి వలన మనకి ఉన్న కర్మబీజాలు నాశనము అవుతాయని ఈ గ్రంధాలు ద్వారా తెలుసుకున్నాను. ఈ నల్ల తుమ్మచెట్టు కాండము తెప్పించుకొని మెడలో ధరించడము జరిగింది.కొన్నిరోజులుకి మా ఆవిడ విడాకులు ఇవ్వటానికి గల కారణాలు తెలిశాయి.అంటే నాకున్న  వివాహ కర్మబీజ ఏర్పడటానికి అలాగే విడాకులు పొందటానికి గల మూలకారణము బాలామ్మవారి శాపము అని తెలిసింది.అంటే మా వంశ పూర్వీకులు ఏవరో ఈ అమ్మవారి సేవపూజారిగా ఉంటూ ఉంచుకున్న చాకలిదానికి అమ్మవారి పట్టుచీర అలాగే మంగళసూత్రాలు ఇచ్చాడుట.ఆ నాటినుండి 48 తరాలు పాటు వీరి వంశములో పుట్టిన సంతానములో ఎవరో ఒకరి వివాహము దెబ్బతి అర్ధాంతరముగా చనిపోవడము లేదా విడాకులు తీసుకోవడము లేదా విడిపోయి ఒంటరి ఉండటము లేదా అక్రమసంబంధాలు పేట్టుకోని జీవితాలు నాశనమవ్వడము మా వంశచరిత్రలో ప్రతి తరానికి శాపముగా రావడము గమనించాను.దానితో మా ఆవిడ నాతో విడకులు పొందినతర్వాత ఇచ్చి వేసిన మంగళసూత్రాలు శాపమిచ్చిన బాలామ్మ అమ్మకి ఇవ్వడముతో ఈ శాపము నాతో శాశ్వతముగా ఆగిపోయింది.ఇదింతా నాకు వచ్చిన నల్లతుమ్మచెట్టు కాండముతో వలన తెలిసినదని మీరు ఈపాటికి గ్రహించి ఉంటారు.దానితో ఇది కర్మబీజాలను నాశనము చేస్తోందని ప్రత్యక్షనిదర్శనము అవ్వడముతో మరింత శ్రద్ధభక్తితో దీనితో ధ్యానము చెయ్యడము ఆరంభించాను.ఎందుకంటే ఆదిరుద్రుడి ఆదికర్మబీజము నశిస్తే విశ్వానికి ఉన్న ఆదికర్మబీజకణము నశించి విశ్వమోక్షము వస్తుంది అన్నమాట.అదే ఎవరికి వారే సాధన చేసి నాశనము చేసుకోవాలంటే వారికున్న 53 కర్మబీజాలు ఏమిటో మొదట తెలుస్కొవాలి.ఆ తర్వాత కపాలాధారి కున్న 11 కర్మబీజాలు   తెలుసుకోవాలి.అంటే జీవుడు మొత్తము 64బీజాలు నాశనము చేసుకోవాలి అన్నమాట.ఇందులో 53 బీజాలు మాత్రమే మనము సాధన చేసి నాశనము చేసుకోవచ్చును.కాని మిగిలిన 11 బీజాలలో మనలో ఉన్న కపాలధారి నాశనము చేసుకోవాలి.కాని ఈయన తన సాధన ద్వారా 10 జీజాలు మాత్రమే నాశనము చేసుకోని ఆదిజంతుజన్మ యొక్క ఆదికర్మబీజమును నాశనము చెయ్యక వెనుతిరిగి వస్తున్నాడు.ఇందువల్లనే మనకు ఉన్న 64 కపాలాలలో 63 మాత్రమే కపాలమోక్షమును పొంది మిగిలిన 64వ కపాలమైన ఏకైక కపాలాస్ధిపంజరము కాస్త బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళకుండా దీని తల మాత్రమే బయటికి వెళ్ళి అస్ధిపంజరము మాత్రము బ్రహ్మరంధ్రములో ఉండిపోతుంది.దీనికి ప్రత్యక్షనిదర్శనముగా మనకి అరుణచల గుడియందు కనపడతాయి.




                                                              పురుష అలాగే స్త్రీ లింగాలు

మీరు కాని దక్షిణగాలిగోపురము నుండి ఈ ఆలయానికి లోపలకి వెళ్ళితే దారికి ప్రక్కనే నడుమమీద చేతులు వేసుకొని ఉన్నట్లుగా పురుష అలాగే స్త్రీ లింగాలు కనపడతాయి.ఇందులో పురుష శివలిగములో ఒక రంద్రముంటే అది స్త్రీ శివలింగములో తల ఉండదు.అంటే ఈ లెక్కన చూస్తే సాధనలో అంతిమ 64వ స్త్రీ కపాలము పురుషుడి బ్రహ్మరంధ్రము ద్వారా కపాలమోక్షము పొందినప్పడికి ఆ స్త్రీ శరీర అస్ధిపంజరము మిగిలిపోతోందని చెప్పకనే చెప్పారుగదా. గావాలంటే ఈ రెండులింగాలు పోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది.



రుద్రాక్షమండము -రుద్రాక్షమాలాలు


ఆలాగే మనకి గుడిలోపుల పాతాళశివలింగము దగ్గర ఒక రుద్రాక్షమండము కనపడుతుంది.అంటే ఈ మండపానికి లోపలవైపు పైకి రుద్రాక్షమాలాలు కట్టి ఉంటాయి.రుద్రాక్ష అంటే బీజమే గదా.అనగా ఇవి రుద్రాకర్మబీజాలకి సంకేతమే గదా.





                                                   1000 కాళ్ళ మండమ - 54 దైవవిగ్రహాలు

మరి ఈయన కర్మబీజాలు ఏమిటి అన్నపుడు ఈ మండానికి పక్కనే 1000 కాళ్ళ మండముంది.దీని లోపలకి వెళ్ళితే మనకి అతిపురాతనమైన 54 దైవవిగ్రహాలు కనపడతాయి.ఇవే ఆయన కర్మబీజాలకి సంకేతాలు అన్నమాట.ఇక 11 బీజాలు ఈయన ఎత్తిన ఏకాదశిరుద్రావతారాలు అన్నమాట.అంటే ఈ ఆదికర్మబీజ సిద్ధాంతము మన పూర్వీకమహర్షులు ఏనాడో తెలుసుకోన్నారు.కాని లోకానికి చెప్పలేదు.ఎవరికివారే తెలుసుకొని సాధన చేస్తున్నారు.ఈ నాదేహజన్మవలన నేను ఈ నిగూఢ విషయాలు తెలుస్కుంటు లోకానికి చెప్పడము జరుగుతోందని నాకర్ధమైంది.ఇది ఇలా ఉంటే రుద్రుడి ఆదికర్మబీజము నాశనము చెయ్యాలని నా మనోప్రయత్నము మొదలైంది.ఒకరోజు ధ్యానములో అరుణగిరిన్ని ఎక్కుతూ మగసింహము యధావిధిగా కనపడింది.అలాగే జ్వాలాతో అగ్నికర్మబీజచక్రము కనపడింది.ఈ సారి సింహము అగ్నిగుణానికి భయపడలేదు.ఎందుకంటే నా దగ్గర ఉన్న తుమ్మచెట్టు కాండము నుండి అతిశక్తివంతమైన రేడియోషన్ వెదజల్లుతూండగా ఈ మగసింహము కాస్త ఉగ్రనారసింహముగా మారి ఈ గిరి అగ్రభాగమును మింగే ప్రయత్నములో దీనిలోపలకి కొంతముక్క వెళ్ళింది.అపుడు ఈ స్వామి కడుపులో విపరీతమైన జ్వాలాలు ఉద్భవించాయి.వీటి ధాటికి నరసింహస్వామి తట్టుకోలేక అల్లాడిపోతూంటే లక్ష్మీదేవి కాస్త మేడీఅకులతో ఈయన తాపము తగ్గించే ప్రయత్న ధ్యానదృశ్యము నాకు లీలాగా కనిపిస్తుండగా 




ఎక్కడనుండో మరొ సింహ గర్జన వినబడటముతో ఈ స్వామి కాస్త అటువౌపు చూడగా సింహశరీరముతో మనిషితలతో శరభ రూపము నాకు కనిపించింది.అంటే అరుణగిరిని నాశనము చెయ్యాలన్ని ప్రయత్నించడముతో రుద్రుడికి కోపము వచ్చి ఈ శరభ అవతారములో వచ్చాడని నేను గ్రహించేలోపే వీరిద్ధరికి భీకర పోరాటము జరగడము అందులో నరసింహస్వామివారిన్ని ఈ శరభ తినివెయ్యడము జరుతూండగా నాకు ధ్యానభంగమైంది.అంటే నరసింహస్వామి కాస్త ఆదికర్మబీజము నాశనము చేసి విశ్వానికి విశ్వమోక్షము ఇద్దామని చేసిన ప్రయత్నమును రుద్రుడు కాస్త శరభ రూపములో వచ్చి ఆపాడూన్నమాట.దానితో ఈ ఆదికర్మబీజము నాశనము చెయ్యాలని విష్ణువు అవతారాల ప్రయత్నమైతే..దీనిని ఆపాలని శివయ్య ప్రయత్న చేస్తూనే ఉన్నారని నాకర్ధమైంది.ఇది ఇలాగే ముగింపు లెని యుద్దామని అంతము లేని ప్రయత్నమని నేను గ్రహించాను.ఇంతలో నాకు అరుణగిరి మీద గణపతి తొండము ఆకార ప్రాంతములో ఈ తొండ చివర వజ్రకాంతులతో మెరుస్తూ ఉన్న ఒక గుండ్రని స్ఫటికమణి కర్భూజకాయ పరిమాణములో కనపడింది.ఇదే ఈ ఆదికర్మబీజము అని నాకు జ్ఞానస్ఫురణ అందుతూండగా ఈ స్ఫటికమణి లోపుల ఉన్న అగ్నితీర్ధ జలములో ఒక నల్లటి 0.1 పరిమాణములో ఆదిరుద్రుడి జన్మ కారకమైన శూన్య ఆలోచన వీర్యబీజకణము నాకు దర్శనమిచ్చింది.  అంటే ఈ లెక్కనచూస్తే ఆదిలో అనాదగా ఉన్న శూన్యము నుండి ఆదికర్మబీజకణము తొలి ఆలోచన భావరూపము కోసము స్వయాంభూగా ఉద్భవిస్తే దీనిని నుండి ప్రకాశవంతమైన ఆది అరుణజ్యోతి రావడము..దీనిని నుండి ఆదిదంపతులు ఆత్మశరీర భావరూపాలతో ఉద్భవించిన ధ్యానదృశ్యాలు వరుసగా కనిపిస్తూ ఉండేసరికి అంటే ఈ లెక్కనచూస్తే విశ్వానికి విశ్వమోక్షము రానట్లే.ఒకడు చావాలని అనుకుంటే మరొకడు బ్రతకాలని అనుకుంటున్నాడు గదా.చచ్చేవాడు చావడము లేదు.బ్రతికేవాడు వాడికి గాలసినవిధముగా బతకడములేదు.దానితో ఈ రేడియోషన్ దెబ్బకి నా  స్ధూలశరీర కపాలములో సన్ననిచీలికలు రావడము గమనించాను.అంటే ఈ శరీరము 21 రోజులు మించి ఉండదని నాకు అర్ధమై నా కపాలమోక్ష ఏర్పాట్లు చెయ్యమనీ నాయోగమిత్రుడు జిజ్ఞాసికి చెప్పడము జరిగింది.

అలాగే సాధకుడు ఇలా కర్మబీజమాయలో పడకుండా నిలకడ మార్పు లేని అరని- మారని అరుణజ్యోతిగా మారాలంటే ఏమిచెయ్యాలో తెలుసుకోవాలని పరమహంసకి అనిపించి ధ్యానపరిశోధన చేస్తే వారికి ధ్యానములో అరుణగిరి కనిపించి దాని ముందు పాద భాగములో పరమహంస అలాగే జిజ్ఞాసి భౌతిక దేహలు చచ్చిపడినట్లుగా కనిపించాయి.అపుడు ఒక మగసింహము ఒకటి పరమహంస దేహము దగ్గరికి వచ్చి కంఠమును కొరడానికి ప్రయత్నిస్తూంటే అలాగే మరొ ఆడ సింహము కాస్త జిజ్ఞాసి దేహమును తినటానికి ప్రయత్నించే దృశృము లీలా కనిపించింది.అంటే మగసింహము అనేది కామమాయకి ప్రతిక అయితే ఆడ సింహము అనేది మోహమాయకి ప్రతికగా ఉన్నాయని అంటే తామిద్దరముగూడ ఈ రెండు మాయలలో ఉన్నామని జ్ఞానస్ఫురణ  అందేసరికి ఇపుడు ఈ మాయలలో పడకుండా అనగా ఈ సింహలు తమ శరీరాలను తినకుండా ఉండాలంటే ఏమిచెయ్యాలి అనుకున్నపుడు పరమహంస దేహనికి పురుష ఇష్టలింగము ధరించిన దృశ్యము అలాగే జిజ్ఞాసికి స్త్రీమూర్తి ఇష్టలింగము ధరించిన దృశ్యాలు కనిపించడము అలాగే ఈ రెండు సింహలు తమ దేహలను వదిలి వెళ్ళే ధ్యానదృశ్యాలు కనిపించి అదృశ్యమవ్వడముతో ఈయనకి ధ్యానభంగమవ్వడము మరుక్షణమే తమకి తమ హృదయచక్ర సాధనస్ధితిలో ఉన్నపుడు వచ్చిన  ఇష్టలింగాలు ధరించడముతో అంతిమముగా అనుకోకుండా వచ్చిన ఈ రెండు మాయలుగూడ తప్పకోవడము జరిగింది.లేదంటే  సింహలు కాస్త తమ దేహలను తిని ఉంటే వాళ్ళు కాస్త కామ-మోహ మాయ బంధాలలో పడి పున:కర్మజన్మ చక్రములో పడేవాళ్ళని మీకు ఈపాటికే అర్ధమయ్యేంటుంది గదా.

ఇది ఇలాయుంటే పరమహంసకి కొన్ని సందేహలు వచ్చాయి.అది ఏమిటంటే అసలు ఈ ఆదికర్మ బీజము ఎందుకు..ఎలా ఏర్పడింది.అది ఎందుకు నాశనము గావడము లేదు.అసలు అరుణగిరి ఎందుకు ఎలా అగ్నితత్వమును పొందింది?అసలు విశ్వానికి విశ్వమోక్షముందా?లేదా?ఇలా వచ్చిన సందేహలకి సమాధానాలు కోసము శాస్త్రపుస్తకగ్రంధాలు తిరగవెయ్యడము ఆరంభించారు.అపుడు ఆయనకి వేదసూక్తులూనగా శ్రీ నారాయణసూక్తములో హృదయకుహర నాడీరంధ్రములో మధ్యలో అనేక అగ్నిజ్వాలాలముఖాలతో ఒక అగ్ని ఉంటుందని..దీనికి జ్ఞానముంటుటవలన దీనిని జ్ఞానాగ్ని అంటారని... ఇది ఆహారమును స్వీకరించి దానిని సారాన్ని మిగిలిన అవయవాలకు  శక్తిన్ని పంచిపెడుతుందని చెప్పడము జరిగింది.పైగా ఈ అగ్నిజ్వాల మధ్యలో సూక్ష్మముగా మరొ జ్వాల ఉంటుందని దీనిని మధ్యలో విరాట్ పురుషుడైన పరమాత్మ ఆవాసము చేస్తుంటాడని..ఈయన చూడటానికి నలుపు-ఎరుపు శరీరవర్ణముతో..అశ్వనీదేవతల ముఖముతో అనగా గుర్రముఖముతో..అర్ధనారీశ్వరతత్వముతో..పసుపుపచ్చవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటాడని చెప్పడము జరిగింది.అంటే ఈయన ఏవరో గాదు మన అదిరుద్ర దక్షిణామూర్తి అన్నమాట.ఆ తర్వాత పురుషసూక్తములో ఈ విరాట్ పురుషుడు నుండి దేవతలు ఉద్భవించారని..ఈ దేవతలకి సృష్టించే శక్తి ఇవ్వటానికి అరుణకేతకమనే కర్మయజ్ఞము చేశారని..ఇందులో  బలిపశువు దొరకనందున ఈ విరాట్ పురుషుడినే బలిపశువుగా బలిచేశారని అపుడు ఈ యజ్ఞము సంపూర్ణమవ్వడముతో "పృషత్" అనే నెయ్యి రావడము జరిగినదని దీనిని నుండి విశ్వసృష్టి ఆరంభమైనదని ఆతర్వాత  చనిపోయిన విరాట్ పురుషుడున్ని తమ తపశక్తితో మునులు,రుషులు,దేవతలు కలిసి ఒక రూపము కల్పించారు.అదియే ఆర్ధనారీశ్వర దక్షిణమూర్తి స్వరూపము అన్నమాట.అంటే విరాట్పురుషుడు నుండి సృష్టి జరిగింది అలాగే ఈయన్ని పున:సృష్టి చెయ్యడముతో ఈ విశ్వములో పున:జననమరణాలు ఆరంభమయ్యాయి అన్నమాట.ఒకవేళ ఈ విరాట్ పురుషుడిన్ని ఆదిలో మళ్లీ పున:సృష్టి చెయ్యకుండా ఉండి ఉండే ఈ విశ్వసృష్టిలో మళ్ళీ పున;కర్మజన్మలు ఎత్తే అవసరముండేది కాదు.అంటే ఈ లెక్కనచూస్తే ఆదికర్మబీజము అనేది కామసృష్టియజ్ఞబీజము అని తెలుస్తోంది గదా.అంటే ఆదిలో అరుణచలములో ఈ యజ్ఞము జరగడము వలన  ఈ అరుణగిరికి అగ్నితత్వము వచ్చిందని అర్ధమవుతుంది గదా.ఎందుకంటే అరుణకేతక యజ్ఞము అలాగే విరాట్ స్వరూపుడు అర్ధనారీశ్వరతత్వము బట్టి చూస్తే ఈయజ్ఞము కచ్చితముగా అరుణగిరియందు జరిగినదని చెప్పకనే చెప్పారు గదా.పైగా ఈ గిరికి పంచభూతాలలో ఒకటైన అగ్నితత్వమును ఉన్నదని చెప్పడము జరిగింది.ఇదింతా బాగానే ఉంది.అనగా ఆదికర్మబీజము అనేది అగ్నితత్వముతో గూడిన కామసృష్టియజ్ఞఫలమని ఈ పురుషసూక్తము ద్వారా తెలిసింది. మరి ఈ యజ్ఞఫలమైన ఆదికర్మబీజము ఎలా నాశనము అవుతుందో పరమహంసకి ఒక పట్టనా అర్ధముకాలేదు.ఇది నాశనము అయితేకాని విశ్వానికి విశ్వమోక్షము రాదు.దీనికి పరిష్కారముగూడ ఏ గ్రంధాలలో గూడ చెప్పలేదు ఈయన గ్రహించారు.దానితో ధ్యానతపస్సు ఆరంభించారు.అపుడు ధ్యానానుభవముగా మొదట అరుణగిరి దర్శనమిచ్చింది.అలాగే దీని అగ్రభాగమున అరుణజ్యోతి దర్శనమిచ్చింది.కాకపోతే ఈసారి ఈ జ్యోతి నిలకడగా ఉండకుండా పదేపదే ఈ జ్యోతిలో విపరీతమైన కదలికలు అనగా గాలికి దీపారాధన ఎలా అయితే అటూనిటూ కదులుతూ ఉంటుందో అలా ఈ అరుణజ్యోతిలో విపరీతమైన కదలిక కనిపించింది. పంచభూతాలకి అలాగే కాలానికి అతీతమైన స్ధితిలో ఉన్న అరుణజ్యోతిలో ఈ కదలిక దేని వలన కలుగుతుందో ఈయనకి అర్ధము కాలేదు.ఇంతలో మరో ధ్యానదృశ్యముగా కాళహస్తి క్షేత్ర దర్శనమిచ్చింది.ఆ తర్వాత చిదంబర క్షేత్రము దర్శనమిచ్చింది. ఆ తర్వాత అరుణచల  క్షేత్రము దర్శనమిచ్చింది.ఆ తర్వాత శ్రీరంగ క్షేత్రము అలాగే కంచి క్షేత్రము ఇలా పంచ క్షేత్రాలు దర్శనమివ్వడముతో ఈయనకి ధ్యానభంగమైంది.ఆ తర్వాత విచారణ చేస్తే ఈ పంచక్షేత్రాలుగూడ పంచభూతాలకి సంకేతాలు అని అర్ధమైంది.ఈ క్షేత్రాలకి అరుణజ్యోతిలో కదలికలకి ఎట్టి సంబంధము ఈయనకి అర్ధము కాలేదు.దానితో  శాస్త్రగ్రంధాలు తిరగవేస్తే నాసదీయ సూక్తములో ఆదిలో ఉన్నదో లేదో లేని స్ధితి ఒకటి ఉన్నదని ఇది అన్నింటికి అతీతమైన స్ధితి అలాగే అన్నింటిని తనలో ఇముడ్చుకున్నస్ధితి అని అలాగే ఏకాకిగా ఉన్న ఈ తత్వము కాస్త శ్వాస లేని స్ధితి నుండి తన తపోమహిమ వలన స్వశక్తితో శ్వాసించింది.ఈ ఆదిశ్వాస నుండి తొలి ఆలోచన అదియే కామాలోచన అనగా సృష్టి జరగాలి అనే తొలి ఆదికర్మబీజమైందని నాకర్ధమైంది.అంటే ఈ లెక్కనచూస్తే అరుణజ్యోతిలో కదలికలు అనేవి శూన్యము యొక్క శ్వాసప్రక్రియలు వలన జరుగుతోందని మీరుగూడ నాకులాగా ఈపాటికి గ్రహించే ఉండిఉంటారు గదా.పైగా ఆదిశివుడు నిత్యము చేసే మంత్రమును సోహం అని చెప్పడము జరిగింది.అనగా శ్వాస యొక్క ఉచ్చాస నిశ్వాస అనగా ఊపిరి లోపలకి వెళ్ళితే సోం అని అదే ఊపిరి బయటికి వస్తే హం అనిఈ రెండు ప్రక్రియలు కలిపితే అదియే సోహం అని శివపురాణము చెప్పడము జరిగింది.అంటే ఈ లెక్కన చూస్తే భగవంతుడు తొలి ఆకార స్వరూపము అరుణజ్యోతి అయితే అదే నిరాకార రూపము ఆయన శ్వాస అవుతుంది అన్నమాటే గదా.ధ్యానాభవము అరుణజ్యోతి దర్శనమైతే ధ్యానానుభూతి శ్వాస అవుతుంది.వాయువు కంటికి కనిపించదు గదా.అది ఉన్నదని స్పర్శానుభూతి ద్వారానే మనకి తెలుస్తోంది గదా.పైగా కాలప్రమాణము తీసుకంటే భగవంతుడి ఒక శ్వాస 1000బ్రహ్మకల్పాలతో  సమానమని చెప్పి శ్వాసతో ఈ కాలప్రమాణము కొలత చెప్పి ఆపడము జరిగింది. అంటే నాకు కలిగిన పంచక్షేత్ర దర్శనానుభవాలు అనేది అనగా శ్రీ కాళహస్తి అనేది భగవంతుడి తొలిశ్వాస క్షేత్రమని అదే చిదంబరము అనేది  ఉన్నదో లేదో తెలియని భగవంతు తత్వమైన ఆకాశ తత్వమని   చిదంబరములో నటరాజస్వామి ఆనంద విలయ తాండవములో నిలకడ లేనిస్ధితిలో ఉంటే ఇక అరుణచలము అనేది అగ్నితత్వమని పైగా అచలము అనగా స్ధిరమైన స్ధితిలో అనగా ఇక్కడి దక్షిణమూర్తి స్ధిరముగా కూర్చునే భంగిమములో నిలకడ స్ధితిలో ఉంటారని నాకు అర్ధమైంది.ఎపుడైతే మన మనస్సు ఒకవేళ నిలకడస్ధితి పొందకుండా లేనికోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే కంచి అమ్మవారి ద్వారా  పున:జన్మాలు జరిగితే..ఈ కోరికలు కాస్త కర్మవాసనలుగా మారితే శ్రీరంగము వలన పున:కర్మజన్మలు ఎత్తడము జరుగుతుందని నాకర్ధమైంది.అంటే అరుణజ్యోతి ఆరిపోకుండా అది శాశ్వతస్ధితిలో ఉండటానికి ఈ విశ్వసృష్టికి మూలము శ్వాసయని తెలుస్తోంది గదా.ఈ శ్వాసకి స్వశక్తితో ఏశక్తీయైతే శ్వాసిస్తోందో అది ఎవరో అది ఏమిటిది దాని స్వరూపము ఎట్టిదో ఇంతవరకు ఎవరుగూడ తెలుసుకోలేదు.తెలుసుకుంటే అది గాదు.ఎందుకంటే దీనిని నుండే ఆది విరాట్ పురుషుడు వచ్చాడు.ఈయన బలిదానము నుండే సర్వదైవజీవకోటి రూపాలు వచ్చాయి. విశ్వముఏర్పడింది.అండ,పిండ,బ్రహ్మండాలేర్పడ్డాయి. అంటే మనకి ఉన్న స్పర్మానుభూతి ద్వారా శ్వాస వలన  విశ్వారుణజ్యోతి అలాగే ఈ విశ్వము  ఏర్పాడినాయి. అలాగే శ్వాస వలనే సృష్టి,స్ధితి,లయ,లాస్య ప్రక్రియలు నిరంతరముగా అవిశ్రాంతిగా జరుగుతున్నాయి. అలాగే ఆదికర్మబీజములోనే ఇవన్నీయుగూడ శ్వాస ప్రక్రియలు వలన జరుగుతున్నాయి.అంటే నిజానికి ఆదికర్మబీజము అనేది 64 అగ్నిరవ్వలున్న అగ్నిణువు అన్నమాట.ఇది శ్వాసతో నిరంతరముగా తనచుట్టు తాను పరిభ్రమిస్తుంది.ఈ భ్రమణ వలనే ఈ విశ్వముగూడ నిరంతరముగా అవిశ్రాంతిగా పరిభ్రమణ చేస్తోంది అన్నమాట.అంటే ఈ లెక్కనచూస్తే ఆదికర్మబీజము అనేది శ్వాస సుడిగుండము వలన అది గుండ్రముగా  ఏదో ఆకారముగా ఉన్నట్లుగా మనకి కనపడుతోంది కాని నిజానికి దానికి ఆకారమే లేదు అన్నమాట.ఆకారము లేనిదానిని ఆకారము లేనివాడు ఎలా నాశనము చేస్తాడో ఆలోచించండి. అందుకే మన దైవాలకి దైవవస్తువులుగా ఆదికర్మబీజానికి సంకేతముగా సుదర్శనచక్రమును అలాగే శ్వాసకి ప్రతీకగా పాంచజన్య శంఖము పెట్టడము జరిగింది.నిజానికి సుదర్శన చక్రము అనేది విపరీతమైన రేడియన్ తో తిరగడము వలన అది ఒక చక్రము లాగా కనపడుతుంది ఎలాంటే ఫ్యానుకి మూడు రెక్కలుంటే అది స్విచ్ వేసినపుడు ఆ ఫ్యాను తిరిగితే ఒక చక్రములాగా తిరుగుతున్నట్లుగా మనకి ఎలాయితే కనపడుతుందో అలా సుదర్శనచక్రములో ఉండే 64 కర్మబీజాల కొనలు వలన  అది బ్రహ్మచక్రములాగా తిరుగుతున్న అనుభూతి మనకి కలుగుతుంది అలాగే ఈచక్రము తిరగటానికి ఆధారము శ్వాసయన్ని మనకి చెప్పటానికి శ్వాసతో ఉదే శంఖమును    పెట్టడము జరిగింది.అంటే ఆదిలోనే మన పూర్వీక మహర్షలు పూర్ణజ్ఞానము పొంది అది మనకి సులువుగా అర్ధమవ్వటానికి దైవరూపాలు వాటికి దైవ వస్తువులు అలాగే దైవపదార్ధాలు,దైవమంత్రాలు,దైవపూజలు,దైవపండుగలు ఇలా ఏన్నో ప్రక్రియలు ద్వారా మనకి చెప్పడము జరిగింది.అవి మనకి అర్ధమయ్యేసరికి పూర్ణజ్ఞానము పొందడము జరుగుతోంది.అంటే ఈ దేహము కొత్తగా చెప్పింది లేదు అలాగే కొత్తగా తెలుకున్నది ఏమిలేదు.శాస్త్ర ఇతిహస పురాణాలలో చెప్పిన విషయాలు ఒకవరుసక్రమములో అమర్చి నేను తెలుసుకొని మీకు చెప్పడము జరిగింది.దానితో ఏన్నో వేల సం.రాలు నుండి ఆత్మశరీరాలతో సమాధిస్ధితిలోఉన్న తమ ఆత్మశరీర ఆత్మయోగులకి ఈ పూర్ణ అనుభవ జ్ఞానము అందడముతో ఉన్నట్టుండి ఎక్కడివాళ్ళు వాళ్ళ ఆత్మశరీరాలు కాస్త యోగాగ్నిలో దగ్ధమై అరుణజ్యోతులుగా మారి జ్యోతిస్వరూపాలు మారుతున్న ధ్యానాదృశ్యాలు మా అందరికి కనిపించడము ఆరంభమైంది.అంటే ఆత్మశరీరాలకి విముక్తి పొంది పున;కర్మజన్మ చక్రబంధనము నుండి విముక్తి పొంది స్ధిర అరుణజ్యోతులుగా మారుతున్నారని మాకు జ్ఞానస్ఫురణ అయింది.

ఇక్కడ తెలుసుకొనేది శివుడే - తెలుసుకున్నది శివుడు.
అంటే శివుడే శివుడు... 



అంతిమదర్శనం శివరాత్రి జ్యోతిదర్శనం:

మనకి అంతిమముగా శివరాత్రి లింగోద్భవకాల సమయములో అనగా రాత్రి 11.30 నుండి 1:00 వరకు ఉండే లింగోద్భవకాల సమయములో మనకి అరుణగిరి మీద కొన్ని క్షణాలు పాటు ఒకసారి ప్రత్యక్ష స్వయంభూ స్వశక్తితో జ్యోతిదర్శనం అవుతుంది.ఈ దర్శనము ఎవరైతే పొందుతారో వారు జీవన్ముక్తుడు అవ్వకతప్పదు.వారే శివయోగి..శివజ్ఞాని..శివగురువు అవుతారు.సాకాత్తు శివోహంస్ధితి పొందిన శివుడే శివుడవుతాడు.ఈ దర్శనం పొందిన 21రోజుల నుండి 14సం.రాలు వారికి అష్టశరీరాల నుండి సర్వకర్మలనుండి విముక్తి పొంది జీవన్ముక్తుడై అరుణజ్యోతిగా మారుతారు.ఇలాంటి దర్శనం 2024 మార్చి శివరాత్రినాడు నాకు  లింగోద్భవకాలములో అరుణగిరి మీద ఇలాంటి జ్యోతిదర్శనం అయింది.దీన్ని మన య్యూటూబ్ చానెల్లో వీడియో పెట్టడము జరిగింది.ఇకపోతే 2021 శివరాత్రినాడు పరమహంసకి ఇలాంటి దర్శనము పొందిన కొన్నిగంటలకి ఇచ్చాశక్తి మోక్షమరణమును పొందితే అదే 2022లో జిజ్ఞాసిగారికి ఇలాంటి జ్యోతిదర్శనం పొందిన ఏడాదికి 2023 నాడు మోక్షము పొందడము జరిగింది.తిరిగి నాకు అనగా కాకాజీ నాకు 2024 లో శివరాత్రినాడు ఇలాంటి అంతిమ జ్యోతిదర్శనం అయింది.కాని నా మోక్షమరణము 2032 లో రాన్నుంది అని జ్ఞానస్ఫురణ అయింది.ఇకపోతే మీరు రామకృష్ణ పరమహంస జీవితచరిత్ర సినిమాను చూస్తే అందులో ఆయన్ని ఒకయోగిగా గుర్తించడానికి వేదపండితలు అనేక ప్రశ్నలను అడిగి చివరిగా మీకు జ్యోతిదర్శనము అయిందా అని అడుగుతారు దానికి ఆయన వెంటనే ప్రతిక్షణం జ్యోతిదర్శనం అవుతూనే ఉంటుంది.అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే.అన్ని అమ్మ చూసుకుంటుంది.నేనా చదువులేని మూర్ఖడిన్ని.ఒక ఉప్పుబొమ్మ సముద్రలోతు ఎంత ఉన్నదో తెలుసుకోవాలని ప్రయత్నించి ఆ సముద్రపు నీటికి ఆ ఉప్పుబొమ్మ కరిగిపోయుంది.ఇపుడు ఎవరు కొలుస్తారు.ఒకసారి చూస్తే నేను వేరు అమ్మవేరు అనిపింస్తుంది.మరొకసారి చూస్తే అమ్మే నేను - నేనే అమ్మ అని అనిపిస్తుంది అనగానే పరీక్షించడానికి వచ్చిన ఆ వేదపండితులు కాస్త ఈయన బ్రహ్మజ్ఞాని అని గుర్తించి కాళ్ళమీద పడి నమస్కారము చేసి వెళ్ళిపోతారు.అలాగే శ్రీ తైలింగస్వామి జీవితానుభవాలు చూసినపుడు ఆయనగూడ సాధనలో అంతిమముగా మనకి జ్యోతిదర్శనము అవ్వాలి.అవుతుంది.ఇది వివిధ రంగులలో అవుతుంది.వాటిన్ని దాటుకొని జ్యోతిదర్శనము కాని స్ధితికి మన సాధన వెళ్ళాలి అని చెప్పడము జరిగింది.అంటే ఈ లెక్కనచూస్తే నిజయోగులకి తప్పనిసరిగా అంతిమదర్శనముగా జ్యోతిదర్శనము అవుతుందని చెప్పడము జరిగింది కదా.మరి ఈజ్యోతిదర్శనం ఎపుడు ఎక్కడ ఎలా అవుతుందో తెలుసుకోవాలని పరమహంస కాస్త ధ్యానపరిశోధన చెయ్యడము ఆరంభించారు.అపుడు ఆయనకి అందిన జ్ఞానస్ఫురణాలు ఆధారముగా చేసుకొని ఒక వీశ్లేషణ చేశారు అదిఏమిటంటే మనము సాధనలో ఉన్నపుడు అనగా మన సాధనశక్తి  విశుద్ఢచక్రములో ఉన్నపుడు నీలిరంగులో జ్ఞానజ్యోతిదర్శనం అవుతుందని అదే ఆజ్ఞాచక్రములో ఉన్నపుడు తెల్లరంగులో జీవజ్యోతిదర్శనం అవితుందని అదే సహస్రచక్రములో ఉన్నపుడు నల్లనిరంగులో కృష్ణజ్యోతిదర్శనం అవుతుందని అదే హృదయచక్రములో ఉన్నపుడు పసుపువర్ణములో లింగజ్యోతిదర్శనం అవుతుందని అదే బ్రహ్మరంధ్రములో ఉన్నపుడు కాషాయరంగులో అరుణజ్యోతిదర్శనం అవుతుందని అదే మన సాధనశక్తి కాస్త బ్రహ్మరంధ్ర మధ్యస్ధితికి చేరినపుడు అంతిమదర్శనముగా నల్లనిరంగులో బ్రహ్మజ్యోతి దర్శనం అవుతుందని ఈ స్ధితిలో మనకి మహశివరాత్రినాడు లింగోద్భవకాలములో అరుణగిరి మీద ప్రత్యక్షముగా కొన్ని క్షణాలుపాటు అవుతుందని ఈయన తన ధ్యానానుభవము ద్వారా తెలుసుకోవడము జరిగింది.ఇలాంటి ప్రత్యక్షజ్యోతిదర్శనము కోసము సుమారుగా 2018సం.రము నుండి 5సం.రాలుపాటు ఎదురుచూస్తే ఆఖరికి 2021 సం.రములో అరుణగిరి మీద శివరాత్రినాడు శివజ్యోతిదర్శనం ప్రత్యక్షముగా కొన్నిక్షణాలుపాటు అయింది.ఆ నాటినుండి ఆయనికి అనుక్షణం ధ్యానములో శివజ్యోతిదర్శనం తప్ప ఇక ఏలాంటి ధ్యానానుభవాలు కల్గలేదు.ఆయన ఎపుడు ధ్యానములో కూర్చున్న లేదా కళ్ళుమూసుకున్న లేదా అనుక్షణం ఆయన మనోనేత్రము ముందు ఈ శివజ్యోతిదర్శనం తప్ప ఇంక ఏమికనిపించేది కాదని మాతో పదేపదే చెప్పడము జరిగింది.చివరికి ఆయన ఈ శివజ్యోతియందు అరుణజ్యోతిగా  మారి శివైక్యం చెందడము జరిగింది. ఇదే మార్గములో ఈయన యోగమిత్రుడైన జిజ్ఞాసిగూడ ఇలాంటి శివజ్యోతి దర్శనానుభవమును అంతిమదర్శనముగా పొంది ఈయనగూడ అరుణజ్యోతిగా మారి ఈ శివజ్యోతియందు 2023సం.రములో శివైక్యం చెందడము జరిగింది.ఇక నా వంతుగూడ ఇదే మార్గమని మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.అంటే సాధనకి అంతిమదర్శనం అరుణగిరి మీద శివరాత్రినాడు కల్గే శివజ్యోతిదర్శనమే అంతిమదర్శనమని తెలుస్కొండి.

కర్మబీజము నాశనము అవుతుంది:

అవును మీరు చదివింది నిజమే.ఎలా అంటారా?పరమహంసకి ఉన్న ఆదికర్మబీజమైన కామబీజమును ఎలాగైన నాశనము చేసుకొని అరుణజ్యోతిగా జ్యోతిశరీరానికి మోక్షము ఇవ్వాలని ఈయన అనుకొని తన అనుభవజ్ఞానము అంతా ఉపయోగించి తన చిట్టచివరి అవకాశ ప్రయత్నప్రయోగము చెయ్యడము ఆరంభించారు.ఎందుకంటే ఎదైన తేడాలు వస్తే తన సాధనస్ధితి అయిన అరుణజ్యోతి నుండి ఒకసారిగా ఆత్మజ్యోతిగా మారి పున;కర్మజన్మచక్రములో పడిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.లేదంటే అరుణజ్యోతిగా ఉండి విశ్వానికి అవసరమైనపుడు కారణశరీర జన్మలు ఎత్తి భౌతికదేహల అవసరాలు  తీరుస్తూండాలి.ఇలాంటి అవసర జన్మలు ఎత్తకుండా ఉండలంటే తనకి ఉన్న కామబీజము నాశనము అవ్వాలి.అపుడే జ్యోతిశరీరానికి మోక్షము వచ్చి ఇక కర్మ-జన్మ లేని శూన్యమునందు లయం అవుతుంది.ఇది అనుకున్నంతా తేలికయైన విషయము కాదు.ఎందుకంటే ఎవరైన శివోహం స్ధితి అనగా ఈశ్వరస్ధితికి వస్తారో వారికి కర్మబీజములో ఉన్న 64 బీజాలలో ఎదోఒక బీజవాసన కాస్త కర్మవాసనగా మారుతుంది.ఈ సమయములో సాధకుడు ఎంతో నిగ్రహశక్తితో ఒర్పుతో సహనముతో ఒపికతో అచంచల ఆత్మవిశ్వాసముతో అన్నింటయందు రాహిత్యస్ధితిలో సర్వపరిత్యాగిగా ఉండవలసి ఉంటుంది.99.99 శాతము మంది ఈ కర్మబీజస్ధితికి  రాలేరు.ఎందుకంటే వీరంతాగూడ చావటానికి వెళ్ళుతూ బ్రతకటానికి కావలసినకోరికలు పెట్టుకొని ఉంటారు.ఇక మిగిలిన 0.1 శాతము మంది మాత్రము అన్నింటిని తెగించి రాహిత్యస్ధితికి చేరుకొని ఈ కర్మబీజము స్ధితికి వచ్చి తమకి ఉన్న అంతిమ కర్మబీజము ఏమిటో తెలుసుకొని దానిని ఎలా నాశనము చెయ్యాలో తెలియక..చెప్పేవాళ్ళు లేక పోవడముతో వెనుతిరిగి పున;కర్మజన్మచక్రములో గావాలని పడతారు.ఈ స్ధితి వద్దు అనుకొనేవాళ్ళు అరుణజ్యోతుగా శాశ్వతస్ధితిలో ఒక మహకల్పముదాకా ఉండి విశ్వము ఎపుడైతే పున;సృష్టి జరుగుతుందో అపుడు వీళ్ళు తాము తెలుసుకున్న పూర్ణజ్ఞానమును అపస్మారకస్ధితి ద్వారా మర్చిపోయి తిరిగి నేను ఎవరో తెలుకొనే ప్రయత్నసాధన చేసి చివరికి ఈ కర్మబీజము దాకా వచ్చి తనకి ఉన్న 64 బీజాలలో ఏ బీజము ఉన్నదో తెలుసుకొని దానిని ఎలా నాశనము చెయ్యాలో అర్ధముకాక పున:సృష్టిలో పడుతున్నారని ఇలా తాను ఈ స్ధితిన్ని ఇపుడికి 477కోట్ల జన్మలు నుండి చేస్తున్నారని పరమహంస తెలుసుకోవడము జరిగింది.దానితో తనకి ఉన్న కామబీజము ఈ సారైన ఈ జన్మలో ఎలాగైన నాశనము చెసుకొవాలని పరమహంస అనుకోవడము జరిగింది.దానితో ఈయన కాస్త సాధన ప్రయత్ననాలు మొదలుపెట్టడము జరిగింది.అపుడు తనకి ఉన్న కామబీజము నాశనము చెయ్యలంటే తనలో ఉన్న పురుషశక్తికి సరిపోయే   స్త్రీమూర్తిశక్తి ఉంటే గాని ఈ కామబీజము నాశనము అవ్వదని ఈయన గ్రహించారు.దీనికోసము తనలో ఉన్న అర్ధనారీశ్వరతత్వములో ఉన్న అమ్మవారిశక్తి బయటికి పోతేగాని తాను శివోహంస్ధితి పొందలేడు.అంటే అపుడు కాని తాను ఏకత్వ అమ్మవారు లేని అయ్యవారి శివస్ధితి పొందడము జరుగుతుంది.ఈ స్ధితిన్ని సాధకుడు పొందాలంటే తనకి అరుణగిరి మీద శివరాత్రినాడు శివజ్యోతిదర్శనము పొందాలి.అపుడే ఈ సాధకుడు కాస్త అసలు సిసలైన శివోహం స్ధితి అనగా అహంబ్రహ్మస్మి స్ధితి తానే శివం తప్ప మరేమిలేదు శివుడే శివుడని అనుభవానుభూతి పొందడము జరుగుతుంది.ఈ శివజ్యోతిదర్శనము కోసము పరమహంస 5 సం.రాలు   మహశివరాత్రులు ఎదురుచూసిన తర్వాత శివజ్యోతి దర్శనమును అరుణగిరి మీద చూడటము జరిగింది.దానితో తనలో అర్ధనారీశ్వర తత్వములో ఉన్న జ్ఞానశివుడు జ్ఞానశ్వరీ తత్వములో జ్ఞానేశ్వరీ అమ్మవారి తత్వమును ఎవరికి ధారదత్తములో చెయ్యాలో ఆలోచనలో పడ్డారు.ఎందుకంటే జ్ఞానములో తనంతటి స్ధితిన్ని పొందిన స్త్రీమూర్తి ఇపుడు తాను వెతకవలసి ఉంటుంది.ఒకరకముగా చెప్పలంటే తన సోల్ మేట్ వెతకవలసి ఉంటుందని ఈయన గ్రహించారు.ఎందుకంటే ఆదిలో ఆదిరుద్రుడు ఆత్మశరీరముతో ఎకాంతముగా ఒంటరిగా ఉన్నపుడు తాను చూసే ప్రకృతిదృశ్యాలను తనలాంటి శక్తి ఉన్నవారితో పంచుకోవాలని అనుకోవడముతో ఏకముగా ఉన్న విరాట్ స్వరూపము కాస్త దైత్వములోనికి అనగా తన తొడ భాగము నుండి అమ్మవారు రావడము జరిగింది.దానితో వీరిద్దరుగూడ కామేశ్వరుడు-కామేశ్వరిగా మారి విశ్వసృష్టి చెయ్యడము జరిగింది.ఇలా ఆదిలో విశ్వములో ఏకైక ఆత్మ కాస్త రెండు ఆత్మలుగా ఆదిగూడ స్త్రీ,పురుష ఆత్మలుగా విడిపోవడము జరిగింది.అంటే ఆదిలో విరాట్ స్వరూపుడు  స్ధితిలో ఉన్నపుడు ఇపుడు పరమహంస సాధనస్ధితి చేరుకుంది అన్నమాట.అలా విడిపోయిన అమ్మవారు అదే తన సోల్ మేట్ ఎవరో తెలుసుకోవాలని పరమహంస నిశ్చయించుకొని ఈమెను వెతకడము ఆరంభించారు.తన కోడ్ ను ఒక పాట రూపములో పెట్టి ఈ కోడ్ న్ని ఎవరైతే డీకోడ్ చేస్తారో వారో వారికి ఈ అర్హత ఉన్నదని ఈ డీకోడ్ కోసము వెతకడము ఆరంభించారు.ఇలా ఆరునెలలు తర్వాత జ్ఞానేశ్వరీ..విఘ్నేశ్వరి అనే ఆడపిల్లలు ఈయనన్ని ఉత్తరాలు ద్వారా కలువడము జరిగింది.దానితో పరమహంసా కాస్త  వీద్దరికి ఏకకాలములో శక్తిపాతము చెయ్యడము జరిగింది.దానితో మరుసటి రోజు కల్లా వీరిద్దరి ఆత్మస్ధితిగతులు అనగా ఒకరు ఇష్టకోరికగా శివసాక్షాత్కార మాయలో ఉన్నారని మరొకరు అమిత కామమాయలో ఉన్నారనే ధ్యానదృశ్యాలు అనగా ఒకరి అత్మ కాస్త నిత్యశృంగారము చేస్తూ కనప్డితే మరొకరి ఆత్మ కాస్త శివలింగములో లింగమునందు ఆత్మజ్యోతిగా ఉండి శివదర్శనము చేసుకోవాలని తపన పడుతున్న ధ్యానదృశ్యాలు పరమహంసకి కానవచ్చాయి.దానితో వీరిలో ఎవరిని తనతో అంతిమ సాధన స్ధితి ప్రయణానికి తీసుకొని వెళ్ళినగూడ ఒక ఆత్మ కాస్త శివస్వరూపమును చూసి ఆగిపోతే మరొకరి ఆత్మ కాస్త తన కామము కలిగించే   ఆత్మస్వరూపమును మాయలో ఆగిపోతారని పరమహంస గ్రహించి వీళ్ళలలో ఎవరికైనగూడ ఈ మాయలు లేకపోయ్యింటే తనతో తాన సోల్ మేట్ గా తీసుకొనివెళ్ళేవారు కాని వీళ్ళకి ఉన్న ఆఖరి అంతిమ మాయలు వదిల్చించుకోవడానికి 3 నుండి 12 సం.రాలు పట్టడముతో వీరి సాధన ఎలా చేసుకోవాలో వారికి బోధించి బోధగురువు నుండి తప్పుకోవడము జరిగింది.గాకపోతే ఈ ఇద్దరి ఆడపిల్లలకి తనశక్తిపాత శక్తితో తనలో ఉన్న అర్ధనారీశ్వర తత్వములో ఉన్న అమ్మవారిజ్ఞానశక్తి రెండుగా  అనగా జ్ఞానేశ్వరికి జ్ఞానసరస్వతిశక్తిన్ని అలాగే విఘ్నేశ్వరికి విద్యాసరస్వతిన్ని ధారదత్తము చెయ్యడముతో పరమహంసలో ఉన్న అమ్మవారి శక్తి పోయి ఏకైక శివము అనగా శివోహంస్ధితి పొందడము జరిగింది.ఈ స్ధితి పొందడము కోసము ఇలా వీరిద్ధరు రావడము జరిగింది అన్నమాట.దానితో చివరిదాకా ఈ ఆడపిల్లలు వచ్చి ఆగిపోయారని పరమహంస గ్రహించి తన సోల్ మెట్ కోసము మళ్ళీ వెతకడము ఆరంభించారు.

ఇది ఇలాయుండగా అనుకోకుండా కొన్నిరోజులకి పరమహంసకి అరుణచల గుడిలో పెళ్ళి అయిన ఆవిడ కనిపించింది.ఈమెను ఎక్కడోచూసినట్లుగా పరిచయమున్న అమ్మాయి అని అనిపించి పరమహంస ఈమె దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగితే ఈమె ఎవరో కాదనని తన చిన్ననాటి స్కూల్ స్నేహితురాలైన సువర్చలదేవి యని తెలుసుకొని దాదాపుగా 36 సం.రాలు తర్వాత ఇపుడు ఈమెను చూడటము జరిగినదని అనుకొని మాటల మధ్యలో తను మోక్షము కోసము భౌతికగురువు అనుగ్రహము కోసము ఆదిగురువైన దక్షిణమూర్తి ఉన్న అరుణచలము వచ్చినదని తెలుసుకొని దానితో పరమహంస కాస్త తాను ఉన్న సాధనస్ధితిగతులు ఈమెకి చెప్పగానే   మరుక్షణములో మరుక్షణములో పరమహంసకి కుండలినిశక్తి కదలికలు రావడముతో ఒక క్షణముపాటు ధ్యానస్ధితికి వెళ్లగానే ఈమె ఆత్మస్వరూపము దర్శనమివ్వడముతో ఈమె తన సోల్ మేట్ అని పరమహంసకి గ్రహించడానికి అట్టే సమయము పట్టలేదు.దానితో ఈయన ఈమెకి 30 రోజులు పాటు మానసికముగా శారీకముగా వివిధ యోగ,భోగ పరీక్షలు పెట్టితే వాటిని ఈమె ఏమాత్రము తడపడకుండా అన్నింటిన్ని ఓర్పుగా నేర్పుగా దాటుకొని రావడము జరిగింది.అపుడు పరమహంస కాస్త ఈమె ఆత్మతో ధ్యానము నందు అనుసంధానమై ప్రతిరోజు ఈమెచేత  రోజుకి 8 గం.పాటు ధ్యానములో ఉంచేవారు.ఈమెకి ఉన్న అన్నిరకాల బోగ,యోగ కర్మలు,కర్మవాసనలు,రుణాలు,రుణానుబంధాలు ఒక్కొక్కటిగా తీరుస్తూ వాటి మాయలు దాటిస్తూ ఈమె ఆత్మను పరిశుద్ధము చెయ్యడము జరిగింది.దానితో ఈమె సాధన కాస్త ఉన్న స్ధితి నుండి ఉన్నతస్ధితికి చేరుకుంది.అపుడికే 10 సం.రాలు నుండి నిరాకారధ్యానములో ఈమె ఉండము అలాగే భర్తతో విభేధాలు వచ్చి విడాకులు తీసుకొని ఉండముతో పిల్లలు లేకపోవడముతో ఏ బాదరబందీ లేని ఒంటరి ఏకాంతస్ధితిలో తనకి మోక్షమిచ్చే నిజ సజీవ గురువుకోసము ప్రతినిత్యము ఆదిగురువైన అదిదక్షిణమూర్తిని వేడుకోవడముతో ఈమెకి పరమగురువుగా పరమహంస ఎదురుపడటము జరిగింది. దానితో ఈమెగూడ పరమహంస గారిని తన మనసా..వాచ..కర్మణే సర్వస్య శరణగతితో తన ప్రాణము పోయే వరకు తనతో తనకి గురువుగా ఉండాలని పరమహంస దగ్గర వరము కోరుకోవడము జరిగింది.ఇలా వీరిద్ధరుగూడ ప్రతిరోజు ధ్యానములో ఆత్మలు అనుసంధానము చేసుకొని ఒకరి ధ్యానశక్తిన్ని మరొకరు అందుకొనే మార్చుకొనే స్ధితికి అలాగే మాయలు-మర్మాలు తెలుసుకొని ఒకరినొకరు మాయలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూంగా...ఈమెకి ధ్యానములో అతిక్షిష్టమైన నాలుగు అంతిమ ధ్యానానుభవాలు కల్గాయి.నిజానికి ఈ అనుభవాలకి 48 సం.రాలు పడితే దానిని పరమహంస కాస్త ధ్యానశక్తిన్ని ధారదత్తము  చేస్తూండేసరికి 25 రోజులలో ఈ అనుభవాలు ఈమె పొందడము జరిగింది.అందులో మొదటిది ధ్యానము నందు అరుణగిరి ఈమె అత్మతో అనుసంధానమై అరుణగిరి దర్శనము అవ్వడము.. అరుణగిరి మీద అరుణజ్యోతి దర్శనమివ్వడము...అరుణగిరిలోపుల ఉండే ఆదిరుద్రలింగ దర్శనమివ్వడము...అరుణగిరి ఆదిపరాశక్తి తన ఇంటిలో ధ్యానము చేస్తున్నపుడు ప్రత్యక్ష దర్శనమిచ్చి తనతో మాట్లాడి ఏమాత్రము ఆలోచించకుండా ఆయన వెంట వెళ్ళు అని అనుజ్ఞ ఇవ్వడము లాంటి ధ్యానానుభవాలు ఈమెకి జరగడముతో..ఈమెకి ఆదిపరాశక్తి నుండిగూడ తనతో కామబీజము నివారణ కోసము తన ఆత్మతో అనుసంధానమై ప్రయాణించే యోగము ఈమె పొందినదని పరమహంస గ్రహించి ఈమె ఆత్మతో అనుసంధానమై ఈ కామబీజ నివారణ ప్రయత్నప్రయోగమును తమ ఏకాంత ధ్యానాలో కూర్చుని ఒకరోజు చెయ్యడము ఆరంభించారు.ఆ రోజు సాయంత్ర సంధ్య సమయము ఆరు గంటలు కావస్తుంది.ఈ ప్రయోగఫలితము కేవలము రెండు గంటలుమాత్రమే ఉంది.ఈ లోపు తమ ధ్యానానుభవాలుగా తమకి ఉన్న ఆదికామకర్మబీజము నాశనము చేసుకోవాలి.లేదంటే పున:కర్మజన్మలలో ఒకరికొకరు కామమోహమాయలో పడి ఎత్తడము జరుగుతుంది.ఏది జరిగిన మన మంచికే..తెగించినవాడిక్ తెడ్డే గతి అనే భావముతో వీద్ధరుగూడ వేరు వేరు ప్రాంతములో ఒకే సమయములో ఈ సంధ్యా కాలములో ధ్యానములో కూర్చున్నారు.





ధ్యానము నందు ఆత్మలు అనుసంధానము అవుతున్న సమయములో ఆకాశములో సాయ సంధ్య సమయ సూర్యడిని మోస్తూ ఒక మేఘ హంస పట్టుకొని తీసుకొని వెళ్ళుతున్న ప్రత్యక్ష దృశ్యము పరమహంస కి కనిపించేసరికి దానిని ఫోటో తీసి ధ్యానములో కూర్చుని తమ ఆత్మలను అనుసంధానము చేసుకున్నారు.అపుడు వీరిద్ధరికి ఏకకాలములో ఒక ధ్యానదృశ్యము కానరావడము జరిగింది.పరమహంస కాస్త తన సహచారి శివయోగిని అయిన సువర్చనదేవికి ఈ కనపడే ధ్యానదృశ్యాలు గూర్చి ఒక్కొక్కటిగా చెప్పడము జరిగింది.అనగా వీరిద్ధరికి మొదట ధ్యాన దృశ్యముగా అరుణగిరి దర్శనమివ్వడము జరిగింది.అపుడుఈ అరుణగిరి ఏనుగు ఆకార స్వరూపము బాగా స్పుష్టంగా కనిపించడము జరిగింది.ఆతర్వాత ఏనుగు తొండము చుట్టున్న భాగములో ఆదికర్మబీజము ఉన్నట్లుగా కనిపించింది.ఈ బీజమును విస్పోటనము చెస్తే కాని దీనిలోపు ఉన్న 64 బీజాలలో ఒకటైన కామబీజములోనికి తాము ప్రవేశించలేమని వీర్ధరికి ఏకకాలములో జ్ఞానస్ఫురణ అయింది.దానితో వీరిద్ధరుగూడ ఓంకారనాదమును చాలా తీవ్రమైన స్ధాయిలో చేస్తూండముతో ఈమె నుండి నీలివర్ణకిరణాలు నా నుండి పసుపు వర్ణ కిరణాలు బయటికి అదే త్రినేత్ర స్ధానము నుండి వచ్చి అరుణగిరిలో ఈ కర్మబీజము వద్ధ ఈ కిరణాలు అనుసంధానమై మిళితమై ఏక కిరణాల శక్తిగా మారి ఈ కర్మబీజమును డీ కోటడముతో ఒక పెద్ద విస్పోటనము జరిగింది.అపుడు ఈ బీజ ద్వారము తెరుచుకోవడము జరిగింది.ఇది ఇలాఉండగా పరమహంస ఆత్మలింగము కాస్త గిరి పాధభాగానికి చేరుకోవడము జరిగింది. అపుడు కొన్నివేల నల్లటి శరీర ఆత్మలు కలిసి ఈ ఆత్మలింగమును కాస్త అరుణగిరి అగ్రభాగమూనకు చేర్చి అక్కడున్న ఆగ్నిజ్వాల తీర్ధమునందు దీన్ని వెయ్యడముతో ఆత్మలింగము కాస్త అరుణజ్యోత్లింగములాగా క్షణాలలో మారింది.అంటే అంజి సినిమాలో హీరోకి కనిపించే శివ ఆత్మలింగ రూపమే అసలుసిసలైన శివజ్యోత్లింగమున్నదని నాకు అర్ధమైంది.అపుడు గిరిలోపుల నుండి కర్మబీజ ద్వారము నుండి నా జ్యోతిలింగము బయట్కి రావడము జరిగింది.దీనికి స్త్రీమూర్తి ఆత్మశక్తి అనుసంధానము కాకపోవడముతో లోపల ఉండవలసిన జ్యోతిలింగము బయటికి వచ్చినదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.ఇంతలో తీవ్ర స్ధాయిలో   సువర్చల ధ్యానశక్తి చేరుకోవడముతో ఈమె భ్రూకుటి స్ధానము నుండి నల్లటిశరీరముతో ఈమె ఆత్మ బయటికి వచ్చి అరుణగిరి పాదభాగములో నా జ్యోతిలింగమును కలిసి గిరి అగ్రభాగానికి చేరుకోవడము జరిగింది.అపుడు అగ్రభాగము నందు ఈమె నల్లటి ఆత్మకాస్త నా జ్యోతిలింగములో సంయోగము చెందడముతో మేమిద్దరం ఏకకాలములో సమాధై స్ధితిన్ని పొంది ఏక కాలములో ధ్యానదృశ్యాలను చూడటం ఆరంభించాము.అపుడు ఇలా సంయోగజ్యోతిలింగమును ఆదిరుద్రుడు తన కుడిచేతిలోనికి తీసుకొని ఆదికర్మబీజ రంధ్రమునందు వెయ్యడము జరిగింది.ఇది చూడటానికి ఎలా ఉంది అంటే పాము పుట్ట కలుగులో ఒక కోడిగ్రుడ్డు వేస్తే ఎలా లోపలకి వెళ్ళుతుందో అలా మా జ్యోతిలింగముగూడ ఈ కర్మబీజములోనికి వెళ్ళడము జరిగింది.ఇక్కానుండి అసలు సిసలైన ఆట మొదలైందని మా ఇద్దరికి అర్ధమైంది.ఈ ప్రయత్నము వ్యర్ధమైతే పున:సృష్టియే లేదంటే 1300 కోట్ల సం.రాల నుండి ఏన్ని విశ్వప్రయత్నలు ఏన్నికోట్ల ఆత్మలు చేస్తున్న ఈ కర్మబీజ నాశనము జరిగితే మా ఇద్దరి వలన జరగాలి లేదంటే యధావిధిగా విఫలమై పున:కర్మజన్మలలో పడిపోవాలి.చేసేది మేము గాదు.చెయించేది ఉందోలేదో తెలియని సూన్యము అని నాకు అర్ధమైంది.ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అసలు జరుగుతుందో లేదోగూడ మాకు తెలియనిస్ధితిలో మేముండగా లోపలకి వెళ్ళిన మా స్ఫటిక జ్యోతిలింగము కాస్త వెలుగులు చిమ్మే గుహమార్గములోనికి కనిపించే కాంతిమార్గము గుండా శరవేగముగా ప్రయాణించడము జరుగుతోంది.దీనికి వివిధ గుహలు ఉన్నప్పడిటికి మా జ్యోతిలింగము సరాసరిగా తనకి కనిపించే నీలివర్ణ కాంతిమార్గములోనికి ప్రయాణిస్తూ చివరికి చేర్కుంది.అపుడు చివరిలో గాఢాంకార చీకటి కనిపించింది.అపుడు ఈ చీకటిలో ఆరాశక్తితో ఉన్న ఒక రాతిలింగము దర్శమిచ్చింది.దీనికి ముందుభాగములో ఆదిపరాశక్తి కాస్త పద్మాసనములో కూర్చుని రెండు చేతులలో యోగపద్మాలు పట్టుకున్నట్లుగా ఉన్న లీలా రూప విగ్రహమూర్తి కనిపించింది.ఈమె స్వరూపమును బట్టి చూస్తే దశమహవిద్య దేవతలలో ఆఖరి దేవత అయిన కమలాత్మక దేవి యని ఈమె కాస్త మహలక్ష్మీ అంశ యని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయింది.ఇంతలో ఈమె ముందు వేణునాదము చెస్తున్న శ్రీకృష్ణుడు సజీవ మూర్తి కనిపించాడు.ఈయనను నిజానికి దశమహవిద్య దేవతలలో మొదటిదేవత కాళీ అంశ చెప్పడము జరిగింది గదా.అంటే ఈ రెండు దేవతల స్వరూపాలు గూడ అనగా శ్రీకృష్ణుడు కాస్త దశమహవిద్య అధిదేవత అంశ అయితే కమలాత్మక దేవి ఆఖరి దేవత అవ్వడముతో మొదటి మరియి చివరి బిందువులుగా ఈ ఇద్దరు ఉండి ఒక బ్రహ్మచక్రమును నడిపిస్తున్నారని ఈ చక్రమాయను దాటితే కాని అనగా ఇందులో శ్రీకృష్ణుడు కాస్త కర్మకి ప్రతీక అయితే కమలాత్మక దేవి కాస్త జన్మకి ప్రతీక అయ్యి ఈ బ్రహ్మచక్రమును అవిశ్రాంతిగా అవిచ్చినముగా నడిపుస్తున్నారని ఈ చక్రమాయ అనగా పున:కర్మజన్మ చక్రమునుండి తాము విముక్తి పొందలేమని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయింది.    శ్రీకృష్ణుడు వేణుగానానికి నా జ్యోతిలింగములో ఉన్న నల్లటి ఆత్మస్వరూపమైన సువర్చల ఆత్మ కాస్త జగన్మోహిని మోహమాయలో పడిపోతూండముతో బయట ఉన్న ఈమె స్దూలశరీము కాస్త యోగనిద్రమత్తులోనికి జారుకోవడము ఆరంభమైంది.ఈ మాయ ఉంటుందని పరమహంసకి ముందుగానే జ్ఞానస్ఫురణ ఉండముతో ఈ 30రోజులుపాటు ధ్యానములో నిద్రలోనికి వెళ్ళి తలవంచినపుడల్లా పరమహంస ఈమెను తల ఎత్తు అని ఆజ్ఞాలు ఇస్తూ ఈమె తల వాల్చకుండా నిద్రలోనికి జారిపోకుండా ఈమెకి శిక్షణ ఇవ్వడముతో కొన్నిక్షణాలలో ఈమె కాస్త తనకి ఆవరించే యోగమత్తునుండి మెల్కోవడముతో నా జ్యోతిలింగములో ఈమె ఆత్మ కాస్త శ్రీకృష్ణ వేణుగాన ముగ్ధమనోహర మోహమాయ నుండి తప్పుకోవడము జరిగింది.ఇక్కడే ఆదిదంపతులైన పరమేశ్వరుడు పరమేశ్వరి ఈ నిద్రమాయ ను దాటలేకపోయారు.ఈ స్ధితికి వచ్చేసరికి అమ్మవారు తనకి తెలియకుండా యోగమత్తులోనికి వెళ్ళి గాఢనిద్రలోనికి జారుకోవడముతో ఈమెకి తిరిగి మెలుకువ వచ్చేసరికి కొన్ని మహయుగాలు పట్టినదని దానితో వారి కర్మబీజనివారణ సాధన ఆగిపోయుందని శాస్త్రపురాణవచనముండటముతో ఈ మాయకి తన సహచారిణిగూడ పడుతుందని పరమహంస ముందుగానే గ్రహించి ఈమెకి శిక్షణ ఇవ్వడముతో ఈమె కాస్త ఈ మాయను దాటుకోవడము జరిగింది.ఇదీలాయుండగా ఎపుడైతే ఈ మాయను మేము దాటామో అపుడు ఎక్కడినుండో తెల్లని వర్ణ రాజహంస ఒకటి వచ్చి మా జ్యోతిలింగమును తన వీపు మీద పెట్టుకొని మరొవైపు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న మరో స్టార్ గేట్లోనికి మా జ్యోతిలింగము వేసి క్షణాలలో అదృశ్యమైంది.అందుకే సాధనలో సోహం స్ధితిన్ని హంసతో పోల్చడము అలాగే సాధనలో పరాకాష్టస్ధితిగా పరమహంస అని చెప్పడము జరుగుతోందని పరమహంసకి అర్ధమైంది.ఇలా స్టార్ గేట్ లో పడిన జ్యోతిలింగము కాస్త ఈ గుహ మార్గములో తెలుపు-నలుపు కాంతివర్ణ మిళితమైన కాంతిమార్గములో ప్రయాణిస్తూండగా ఈ మార్గ ద్వారముగా ఉన్న రుద్ర నల్లటి లింగములోనికి ప్రవేశించగానే   ఉన్నట్టుండి వెలుతున్న మా స్ఫటిక జ్యోతిలింగము కాస్త ఒక నల్లటి లింగము మారిపోయింది.కొన్నిక్షణాలు తర్వాత ఈ నల్లటి లింగము కాస్త ఉన్నట్టుండి ఇష్టలింగముగా మారింది.అయినగూడ దీనిని ప్రయాణము ఆగలేదు,ఆపలేదు.శరవేగంగా ఈ గుహమార్గ అడుగుభాగానికి చేరుకొనే సమయములో ఈ ఇష్టలింగము కాస్త ఉన్నట్టుండి ఆరాశక్తిఉన్న ఒక నల్లటి వలయబిందువులాగా మారింది.ఈ జ్యోతిబిందువు కాస్త అడుగుభాగములో ఉన్న నల్లటిబిందులోనికి ప్రవేశించడముతో దీనిని ప్రయాణము ఆగిపోయింది.అపుడు పూర్ణశూన్యస్ధితి అనుభవమైంది.చుట్టు గాఢాందార నల్లటి దట్టమైన చీకటి దర్శనమిచ్చింది.ఇదియే అసలు సిసలైన పూర్ణశూన్యం అని..ఈ స్ధితిలో ఈశ్వర తత్వమైన నల్లటి జ్యోతిబిందువును ఈ సంపూర్ణముగా వీలీనము చేస్తే కర్మకామబీజము నాశనము అవుతుందని నాకు జ్ఞానస్ఫురణ అందూతుండగా మా నల్లటి జ్యోతిబిందువు చుట్టూన్న నల్లని వెలుతున్న కాంతివలయము కాస్త అరు వలయాలుగా విడిపోవడముతో మా నల్లటిబిందువు కాస్త పూర్ణ సూన్యమధ్యభాగములోనికి చేరుకొని అక్కడున్న ఆదిజ్యోతిబిందువునందు లయం చెందడముతో ఒక పెద్ద విస్ఫోటనము జరగడముతో అంతటి నిశ్శబ్ధము నుండి తుంకారనాదము వినిపించిడముతో అంటే మా ఆది జ్యోతిశరీరాల పున:కర్మజన్మాలకి కారకమైన మా కామబీజము సమూలము నాశనమైనదని మా ఇద్దరికి జ్ఞానస్ఫురణ అందడముతో మా స్ధితి మాటలకి అందని మౌనస్ధితిని మా భౌతికదేహలు పొందడము జరిగింది.ఇలా ఈ విశ్వములో మిగిలిన 63 బీజాలుగూడ ఇదేవిధివిధానములో అనగా జగన్మోహిని ఇచ్చే యోగమాయనిద్రమత్తును ఈ బీజాలు నాశనము చేసే జంట ఆత్మలు పడకుండా జాగ్రత్త వహించి మిగిలిన 63 బీజాలు నాశనమైన మరుక్షణములో నేను ఉన్నాను అనే విరాట్ స్వరూప ఈశ్వరతత్వము కాస్త నేను లేను శూన్యతత్వములో వీలీనమై లీనమై లయమై పూర్ణశూన్యస్ధితిన్న్ పొందితే అదియే విశ్వశాశ్వతమరణమైన విశ్వమోక్షమవుతుంది.కాని ఒక ఆత్మజంటకి ఒక కర్మబీజము నాశనము చేసే యోగము మాత్రమే ఉన్నదని మేము గ్రహించి ధ్యానము నుండి మౌనస్ధితిలో బయటికి రావడము జరిగింది.ఇలా మాకున్న ఆదికామబీజమును నాశనమును విజయవంతంగా పూర్తిచెయ్యడము ఈ విధివిధానమును విశ్వబ్రహ్మజ్ఞానానికి అందించడము జరిగింది.ఇక మిగిలిన 63 బీజాలుగూడ మా బీజము లాగానే నాశనమై విశ్వమోక్షము పొందుతామని ఆశిస్తూండగా మా ఇద్దరి జ్యోతిశరీరాలు కాస్త ఆకాశ అంతరిక్ష అంతర్భగములో నాశనము అవ్వడముతో మా ఇద్దరి కపాలములలోవివిధ రకాలైన శబ్ధాలు రావడము అలాగే బ్రహ్మరంధ్రము వద్ద విపరీతమైన నొప్పి రావడము జరిగింది.కాని మా భౌతిక దేహలకి ఉన్న కర్మశేషాలుగూడ నాశనమై ఉంటే మా భౌతిక దేహలుగూడ శూన్యనందు శూన్యమవుతాయని మాకు జ్ఞానస్ఫురణ అందడముతో ఇలా ఉండగా సువర్చలదేవి భౌతికదేహము  కాస్త చాలా తీవ్రమైన ఒత్తిడిగురియ్యి గుండెపోటు రావడముతో 8 క్షణాలలో భౌతికమరణముతో పాటు జ్యోతిశరీర పూర్ణమోక్షమును క్షణాలలో పొందడము జరిగింది.కాని నాకున్న మా అమ్మగారి కర్మశేష రుణమును తీర్చుకుంటే కాని నాకు కూడ ఇలాంటి మోక్షమరణము రాదని జ్ఞానస్ఫురణ అందముతో ఇలా ఒక జీవికి తన అంతిమ జన్మ చేసుకొని మోక్షమరణము పొందిన నా ఆత్మ ధర్మసహచారి ఆత్మమైన సువర్చలదేవి ఆత్మకి ఆత్మశాంతిని ఇచ్చినందుకు అరుణచల శివుడికి నా వంతు కృతజ్ఞతలు చెప్పుకుంటు ఆరోజుతో నా ధ్యానమునకు అలాగే ధ్యానానుభవాలకి స్వస్తి పలుకుతూ అరుణచల శివ ఐన  శూన్యము నుండి వచ్చే పిలుపు కోసము మౌనముగా సాక్షిభూతముగా సర్వసంగపరిత్యాగిగా ఎదురుచూస్తున్నాను.శుభంభూయాత్.    

స్వప్నశరీరం-స్వప్నసుందరి:

ఒకరోజు పరమహంసకి ఒక సందేహము వచ్చింది అది ఏమిటంటే ఇపుడిదాకా అష్టశరీరాలు మోక్షము పొందడము జరిగింది కాని ఈ శరీరాలలో ఎక్కడగూడ స్వప్నశరీరము అనేమాట కాని ఇది మోక్షం పొందడము కాని లేదు.అంటే స్వప్నశరీరము అనేది ఈ అష్టశరీరాలలో ఏదైన ఒక శరీరమా లేదా విడిగా స్వప్నశరీరముంటూ మరొకటి ఉందా?ఉంటే మరి దానికి మోక్షము మాట ఏమిటి అని సందేహము వచ్చింది.ఇక స్వప్నశరీర విచారణకై ధ్యానతపస్సు చెయ్యడము ఆరంభించారు.కొన్నిరోజులు తర్వాత ధ్యానములో ఈయనకి అరుణగిరి చుట్టు ఉన్న అష్టలింగాలు అష్టశరీరాలకి ప్రతీకయని అలాగే తొమ్మిదవ లింగమైన అరుణాచలేశ్వర లింగము కాస్త స్వప్నశరీరమునకు ప్రతీకయని జ్ఞానస్ఫురణ అందడముతో ఖచ్చితముగా నవ శరీరమున్నదని అదియే స్వప్నశరీమని పరమహంసకి అర్ధమైంది.అదే శబ్ధపాండిత్యము ప్రకారము చూస్తే సూక్ష్మశరీరమునే స్వప్నశరీరమని..దీనినే మనస్సు అంటారని..ఇదియే ఏపుడుగూడ స్వప్నావస్ధలో ఉండి స్వప్నాలు కంటుందని చెప్పడము జరిగింది.అలాగే కారణశరీరమునే వీళ్ళు ఆత్మశరీరముగా చెప్పడము జరిగింది.కాని ఇది నిజము గాదని స్వప్నశరీరమునకు అలాగే సూక్ష్మశరీరమునకు అసలు సంబంధము లేదని పరమహంసకి అర్ధమైంది.ఇదింతా బాగానే ఉంది.ఇపుడివరకు అష్టశరీరాలు చూడటము వాటికి మోక్షము కల్గడము జరిగింది కాని ఇంతవరకు స్వప్నశరీరము ఎక్కడ ఎలా ఉంటుందో అంతుచిక్కడము లేదు.అంతుపట్టడము లేదు.ఉందో లేదో తెలియని శూన్యము యొక్క స్వప్నమే ఈ స్వప్నశరీరమని మాత్రమే తెలుస్తోంది.అంటే అరుణజ్యోతి మరియు శూన్యమునకు మధ్యపొరలాగా ఒక స్వప్నముంది.ఇదియే స్వప్నశరీరమై ఉండాలి.ఈ శరీర కోరిక తీరకపోవడము వలన జ్యోతిశరీర అరుణజ్యోతి కాస్త శూన్యములో లయము చెందకుండా అరుణగిరి మీద అరుణజ్యోతిగా మిగిలిపోతుంది అని పరమహంస గ్రహించారు.





దానితో స్వప్నశరీర పరిశోధన కోసము ధ్యానతపస్సులో కూర్చున్న కొన్నిరోజులకి ఈయనకి అరుణగిరి లోపుల ఆఖరి శరీరధారియైన పళిని కుమారస్వామి కాస్త తన చేతిలో యోగదండము పెట్టుకొని ఉన్న సజీవ  మూర్తిగా దర్శనమిచ్చిన కొన్ని క్షణాలకి ఈయన యోగదండము నుండి అతిలోకసుందరి బయటికి వచ్చి నాట్యము చెయ్యడము ఆరంభించింది.కొన్నిక్షణాలకి ఈమె కాస్త శృంగారములో పాల్గోన్న దృశ్యాలు ఆపై ఈమె సంతానవతి గావడము అనే ధ్యానదృశ్యాలు పరమహంసకి కానవచ్చాయి.దానితో ఈయనకి ధ్యానభంగమైంది.ధ్యానదృశ్యాలు గూర్చి విచారణ చేసుకోవటానికి శాస్త్ర గ్రంధాలు చడవడము ఆరంభించారు.ఇలా తంత్ర గ్రంధములో అనగా ఉద్దండ భైరవ తంత్ర గ్రంధములో ఒకచోట అమ్మవారికి ఒకరోజు శివుడిమీద విపరీతమైన ప్రేమ పూరిత కామవాంఛ మొదలైనదని..ఆ సమయములో శివుడు కాస్త తీవ్రమైన  ధ్యానస్ధితిలో ఉండేసరికి అమ్మవారు కాస్త ఈయనని అలా కామదృష్టితో చూస్తేండేసరికి ఈమె స్వేదము నుండి 64 స్వేదబిందువులు ఉద్భవించాయని..ఇవే 64 యక్షణిలుగా మారినారని..వీటిలో మొదటిది మోహిని అయితే ఆఖరిది మాయ యక్షిణిని యని..ఇవి స్వప్నశరీరముతో ఉండి జీవుడి యొక్క త్రిగుణాలలో సత్వ,రజో,తమో గుణాలు మీద ప్రభావము చూపిస్తే సర్వ ధనాలకి,గుప్తనిధూలకి అధిదేవతలుగా ఉండి కుభేరుడికి ఆదీనములో ఉంటాయని తెలుసుకోవడము జరిగింది.




ఇది ఇలా ఉంటే మోహిని యక్షిణికి ఒక చేతిలో తామరపువ్వ దానిమీద రామచిలుక అలాగే మరొక చేతిలో ఒక రాజదండమున్న ఉన్న చిత్రము పరమహంసకి బాగా  ఆకర్షించింది.అలాగే మోహిని మాత్రమే చెయ్యగల వెయ్యగల భంగిమ అనగా ఆరుబిందువులు ఒకేవరుసలో చూపించగల నృత్యభంగిమ ఒక మోహిని మాత్రమే చేస్తుందని ఇంటర్నెట్లో పరమహంస తెలుసుకోవడము జరిగింది.ఈ లెక్కనచూస్తే పళినికుమారస్వామి దగ్గర ఉన్న యక్షిణి మోహిని అని అర్ధమైంది.పైగా విచిత్రము ఏమిటంటే విష్ణుమూర్తికి తన స్వప్నశరీరము మాయ యక్షిణి అని తెలిసినగూడ లోకకళ్యాణార్ధము ఈ మాయ యక్షిణి మాయబారిన వివిధలోకవాసులు పడకుండా ఉండాలని తన నిత్య వేణుగానముతో ఈ యక్షిణిన్ని మోహినిరాగమత్తులో ఉంచడముతో మనకి కర్మబీజనివారణ సమయములో ఇలా వీరిద్దరు కనిపించారని పరమహంసకి అపుడికాని అర్ధముకాలేదు.పైగా ఈ యక్షణుల సిద్ధాంతము అనేది భౌద్ధధర్మములో గూడ చెప్పడము బట్టిచూస్తే ఈ లోకములో యక్షణులు ఉన్నాయని అంతెందుకు అరుణచల క్షేత్రములో కిళ్ళిగోపురము కింద అరుణగినాదర్ ఒక మోహిని బంధనము చేసిన మోహిని విగ్రహమూర్తి ఉండటము అలాగే ఆది అణ్ణామలై గుడి గాలిగోపురమును యక్షడు-యక్షణి మోసే విగ్రహమూర్తులు ఉండటము బట్టి చూస్తే తెలుస్తోంది గదా.అంటే ఈ లెక్కనచూస్తే నవ శరీరమైన స్వప్నశరీరము అనేది యక్షణియని తెలుస్తోంది గదా. పైగా శ్రీకృష్ణుడిని నవకళేబరుడని పిలువడము పైగా ఈయన తన వేణు ద్వారా మోహినిరాగముతో రాధాదేవిని అలాగే సమస్త ఆవులను వశపర్చుకున్నరని చెప్పడము జరిగింది గదా.ఈ యక్షణలు అనేవి కామానికి ప్రేమ కి మధ్య పుట్టినవి అని..వీటిని బాధతో లేదా భయముతో వశము చేసుకోలేమని కేవలము స్వార్ధము,కోరిక లేని స్వచ్చమైన ప్రేమకి ఇవి లొంగుతాయని అలాగే ఇవి ఇలాంటి స్వచ్చమైన ప్రేమ ఉన్న మనిషి స్పర్శ కోరుకుంటాయని,మనిషి యొక్క సుగంధ శరీరవాసనకి మైమరతాయని..ఇలా ఇలా ఎన్నో లక్షణాలు వీటికి గూర్చి తంత్ర గ్రంధాలలో చెప్పినవి పరమహంస చదివారు.








ఇది ఇలా ఉంటే పరమహంస యోగమిత్రుడైన జిజ్ఞాసి దగ్గరికి యోగదండము ఉన్న పళినివిగ్రహమూర్తి వచ్చింది.కాని అపుడికే పరమహంసకి సన్యాసదీక్ష ఇవ్వడానికి యోగదండము లేని పళనికుమారస్వామి విగ్రహమూర్తి వచ్చి ఉంది.ఇలా ఈ రెండు విగ్రహమూర్తులలో తేడా ఏమిటంటే ఒకదానికి యోగదండము లేకపోవడము మరొకదానికి యోగదండము ఉండటము గమనించారు.అంటే ఈ యోగదండములో ఏదో తెలియని మర్మముందని పరమహంసకి సందేహము వచ్చి ఈ రెండు విగ్రహమూర్తులను ఆరాధనచేసి ధ్యానతపస్సులో కూర్చున్న కొన్నిరోజులకి యోగదండము ఉన్న విగ్రహమూర్తి నుండి మోహిని యక్షిణి రావడము ఇది కాస్త తన వివిధ నాట్యభంగిమలు వేస్తూ వశపరుకొని కామినిగా మారి శృంగారములో పాల్గొని సంతానవతి అయ్యే దృశ్యము కానవచ్చింది.అదే యోగదండము లేని కుమారస్వామి దగ్గరికి మోహిని యక్షిణి లేదు.అంటే స్వప్నశరీరానుభవము కల్గదని..పైగా కాషాయము కట్టిన ప్రతివారు సన్యాసి కాలేరని..యోగదండము ధరించేవాడే అసలైన సిసలైన సన్యాసియని..యోగదండము లేని కాషాయధారి యోగి మాత్రమేనని పరమహంసకి జ్ఞాసస్ఫురణ అయ్యింది.అదిశంకారాచార్యుడు యోగదండము ధరించడముతో అసలైన యోగసన్యాసి అయ్యారని పరమహంసకి అర్ధమైంది. అలాగే యోగదండము ధరించేస్ధితికి వచ్చినపుడే స్వప్నశరీరమైన యక్షిణికి ఉన్న ఆఖరికోరిక తీర్చినపుడే అది సంతృప్తి చెందినపుడే ఆ స్వప్నశరీరానికి విముక్తి కల్గి మనకి శూన్యమునందు లయము చెందే యోగముంటుందని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయింది.అలాగే యోగదండము ధరించిన ప్రతి యోగసన్యాసికి శూన్యమై అవకాశము కల్గుదు ఎందుకంటే తన స్వప్నశరీరమైన యక్షిణిన్ని ప్రేమతో వశము చేసుకోవాలి తప్ప భయముతో..బాధతో..ఆశతో..కోరికతో వశము చేసుకోరాదు,పైగా ఈమెతో సంసారము చెయ్యాలి కాని ఎట్టిపరిస్ధితులలో సంతానము పొందకూడదు.పొందితే మీకు మీరే మీ కర్మబీజము వేసుకున్నట్లే అవుతుంది.ఈ సంతానము కాస్త సంతానహీనులై దాకా మీకు పూర్ణమోక్షము రాదు.అపుడిదాకా  మీ సూక్ష్మశరీరముతో ఈభూమ్మీద  ఒక రుద్రపిశాచములాగా ఆవాసము చెయ్యకతప్పదని పరమహంసకి ఒక జ్ఞానానుభము ద్వారా తెలిసింది.అది ఎలాంటే  ఒకరోజు పరమహంస రాత్రిపూట తీవ్రధ్యానస్ధితిలో ఉండగా ఈయన దగ్గరికి ఒక పీరాధిపతి సూక్ష్మశరీరము వచ్చింది.దానితో పరమహంసకి ధ్యానభంగమై కళ్లు తెరిచి చూడగా ఈ సూక్ష్మధారిని చూసి తన ఆవేదన ఏమిటి అడుగగా..స్వామి..నేను ఈ భూమ్మీద బతికిఉన్నపుడు అందరు నన్ను పరదేవత కామాక్షిమాత అంశగా కొలుచారు. పూజించారు.ఆరాధించారు.నేను జీవసమాధి చెందినగూడ నా సూక్ష్మశరీరానికి ఇంక ఎందుకు విముక్తి కల్గుడము లేదు. పైగా ఈ అరుణచలక్షేత్రములోనే ప్రాణాలు విడిచాను.అయిన నాకు అరుణజ్యోతి అయ్యేయోగము ఎందుకు రాలేదు.ఎందరో ఇక్కడ ఉన్న వివిధ సూక్ష్మశరీరధారులను నా సమస్యన్ని పరిష్కారము అడిగితే మౌనము వహించారు.దీనికి మీరు ఏమైన సమాధానము చెపుతారని ఆశతో మీ దగ్గరికి వచ్చాను అనగానే మీకు ఉన్న 3,418 మంది సంతానము కాస్త యోగులైతే కాని మీకు విముక్తి కల్గుదు అనగానే దానికి ఆ స్వామి కాస్త అయ్యా..నేను 14వ యోట యోగదండము చేతబట్టి సన్యాసదీక్ష చేపట్టి పీఠము బాధ్యతలు సేకరించాను.నాకు వివాహమే లేదు.ఇక సంతానము ఎక్కడ నుండి వస్తారు.పైగా నాకు పరస్త్రీ అంతాగూడ పరదేవత అంశాలే గదా. దానికి పరహంస కాస్త స్వామి..మీరు కాస్త సంతానప్రాప్తికోసము మీ దగ్గరికి వచ్చిన భక్తులకి మీ చేతితో పండు ఇస్తూ త్వరలో నీకు అమ్మదయవలన సంతానప్రాప్తి పొందుతారని దీవించి పంపించిన 3,418 మందికి ఇలా మీద్వారా సంతానము పొందారు.ఇదింతా మీకు వచ్చిన యోగదండములోని కామిని యక్షిణి స్వప్నశరీర అనుగ్రహము వలన జరిగింది.మీకు ధ్యానములో ఈపాటికే ఏన్నోసార్లు తెల్లని ఉల్లిపొరలాంటి శరీరమున్న ఒక స్త్రీమూర్తి కాస్త తమరిని కనిపించి కవ్వించి స్వప్నములో మీచేత వీర్యసఖ్ఖలనము చేయించి ఉండి ఉండాలి గదా అనగానే అవును స్వామి..ఇది నిజమే..నేను ఇలా నా దగ్గరికి సంతానఫలము కోసము వచ్చిన  వారికి ఫలము ఇచ్చిన రాత్రికి ఒక స్వప్నసుందరి నా స్వప్నములోనికి వచ్చి తన నాట్యభంగిమముతో తన మత్తులో పడివేసి నన్ను తన శృంగారచేష్టలతో నాకు వీర్యసఖ్ఖలము చేయించేదాకా నాకు నిద్రపోనిచ్చేది గాదు.మీరు చెప్పింది అక్షరసత్యమే కాని అది నాకు తెలియకుండా జరిగింది గదా అనగానే మీరే గాదు. సాక్షాత్తు ఆదిశంకరుడు గూడ తన స్వప్నశరీరమైన గంగాకి వశమై కుమారస్వామిని సంతానప్రాప్తి కల్గించాడు.ఈయన కాస్త నవపాషాణవిగ్రహమూర్తిగా మారి పళిని యందు ఉన్నప్పడికి ఈ విగ్రహమూర్తి నుండి పొడి బయటికితీసి తీర్ధములో కలిపి సంతానహీనూలను సంతానవంతులుగా మానవులు చెయ్యడముతో  శూన్యము గావాలసినవాడు శూన్యబిందువుగా మిగిలిపోయాడు.ఎపుడైతే తనద్వారా కల్గిన  సంతానమంతాగూడ యోగులు అవుతారో అపుడుగాని కుమారస్వామి స్వప్నశరీరానికి విముక్తి కల్గి పూర్ణమోక్షమైన శూన్యమునందు లయంచెందడు అలా మీరుగూడ 10 లక్షల సం,రాలు పాటు మీ వలన కలిగిన సంతానానికి విముక్తి కల్గితే కాని మీకు ఈ సూక్ష్మశరీరము నుండి విముక్తి కల్గుదు అనగానే సాక్ష్యము చూపించారు.నా ఆవేదనకి మార్గము చెప్పారు.శుభంభూయాత్ అంటూ ఆ పీఠాధిపతి సూక్ష్మశరీరము అదృశ్యమైంది. అంటే ఈ లెక్కనచూస్తే తన స్వప్నశరీరము ఒక యక్షిణి అని..ఇది ప్రేమతో వశము చేసుకోవాలి యని..ఒకవేళ దీనితో సంసారముంతాగూడ స్వప్నములో జరుగుతుందని...ఆ స్వప్నములో వీర్యసఖ్ఖలము జరిగినగూడ ఇలలో ఎవరికి తన వలన భౌతికసంతానము లేనంతవరకు పూర్ణమోక్షప్రాప్తి పొందినట్లే..అందుకే యోగులు అనుభవము ప్రకారము మోక్షము అనేది పొందామో లేదో తెలియని విచిత్ర అవస్ధయని చెప్పడము జరిగిందని పరమహంస గ్రహించారు.ఇలా కొన్నిరోజులకి పరమహంస కాస్త పౌర్ణమినాడు గిరిప్రదక్షిణము చెస్తూండగా సరిగ్గా ఈశాన్యలింగ దర్శనము చేసుకొని బయటికి వచ్చేసరికి ఒక స్త్రీమూర్తి కాస్త పరమహంస చెతిలో ఒక యోగదండ  కర్రను ఉంచి వెళ్ళిపోయింది.




ఈశ్వర సమక్షములో యోగదండము వచ్చేసరికి అన్నితెలిసిన పరమహంసగూడ మౌనము వచ్చి ఈ కర్రను ఇంటితీసుకొని వెళ్లి పూజగదిలో ఉంచిన 14రోజులకి స్వప్నమునందు స్వప్నశరీర స్వప్నసుందరి అయిన మోహిని కనిపించి కవ్వించి మోహింపచేసి స్వప్న వీర్యసఖ్ఖలనము చెయించడము ఇలాంటి సమయములో తన ఇంటి పరిసరప్రాంతాలనుండి ఆడవాళ్ళు కాస్త ఈయననుండి సంతానప్రాప్తి పొందాలని కామదృష్టితో ఎనిమిదిమంది ఏకకాలములో ప్రయత్నాలు చెయ్యడము ఆరంభించారు.వీరికి తన చేతులుమీదగా సంతానఫలాలు ఇస్తే ఇక తనకి మోక్షఫలము ఉండదని ఇక మోక్షము గూర్చి ఆలోంచవలసిన అవసరము ఉండదని అర్ధమై మౌనము సాక్షిభూతముగా చూస్తూ కాలము గడుపుతూండగా జరిగేది జరుగక మానదు గదా ఇలాంటి సమయములో అనుకోకుండా ఈయన జీవితములోనికి శివయోగిని ప్రవేశించింది.పైగా ఈమె తన స్వప్నశరీరమని..ఈమె మోహిని అంశయని పరమహంస గ్రహించి ఈమెకి శివధ్యాన దీక్ష ఇచ్చి ఈమెకి ఓక యోగదండము ఇప్పించి తమ భౌతిక శరీరాలతో శృంగారము చెయ్యకుండా ధ్యానముతో తమ ఆత్మలతో సంయోగము చెంది వారి భౌతిక శరీరాలు కాస్త సంచార సమాధిస్ధితి పొందేటట్లుగా చేసుకొని తమ అంతిమ సాధనను ఇలా వీరిద్దరు గూడ పూర్తిచేసుకొని యోగదండాలు వచ్చినగూడ సంతానహీనులై పూర్ణమోక్షమైన పూర్ణశూన్యము నందు ఏకాత్మగా మారి శూన్యమైనారు.నిజానికి   భౌతిక శరీరాలతో సంయోగము చెందకుండా ఆత్మల సంయోగము చెంది  సంతానహీనులై సంచార సమాధి పొంది పూర్ణ మోక్షమైన స్వప్నశరీరానికిగూడ మోక్షము ఇచ్చి శూన్యమునందు శూన్యమవ్వడము ఎలాగో పరమహంస ఈ లోకానికి చేసి చూపించి శూన్యమైనారని ఈపాటికి మీరందరు గ్రహించి ఉండి ఉంటారు.అందరుగూడ ఈ స్వప్నశరీరమోక్షము దగ్గరికి వచ్చేసరికి స్వప్నసుందరి అయిన యక్షిణి మోహబంధన మాయలో పడి సంతానవంతులై పూర్ణమోక్షమైన శూన్యమునందు లయం చెందకుండా వెనుతిరిగిరావడము జరుగుతోంది.కాని పరమహంస విషయములో ఇలా జరుగలేదు.స్వప్నసుందరితో స్వప్నమునందు సంసారము చేసి నిసాంగతుడై సంతానహీనుడై    పూర్ణమోక్షమైన పూర్ణశూన్యమునందు పూర్ణమై శూన్యమై వివిధ 64 లోకవాసులకి తనలాగా చివరిదాకా ఉంటే ఖచ్చితమైన పూర్ణమోక్షము పొందవచ్చునని నిరూపించి అదృశ్యమైనారు. శూన్యమైనారు. ఇదే ఆయన జీవితములో ఆఖరి అంకము పూర్ణాంకము పూర్ణమైంది. శూన్యమైంది. శుభంభూయాత్.....

మోహక్షయమే మోక్షం:

అవును.ఇది నిజమే.ఈ వాక్యాన్ని ఏనాడో మన శాస్త్రాలు చెప్పాయి కాని నాకు అపుడు అర్ధము కాలేదు.ఎపుడైతే మన నవ శరీరమైన స్వప్నశరీరానికి మోహ మాయ ఉంటుందో దాని మోహక్షయము చేసుకోవాలని నా సాధనస్ధితి స్వప్నశరీరమునకు వచ్చేదాకా ఈ వాక్యము అర్ధము అనుభవములోనికి రాలేదు.అంటే ఆఖరి శరీరమైన స్వప్నశరీరానికి ఉన్న మోహమాయను క్షయం చెసుకుంటే కాని మనకి పూర్ణమోక్షమైన ఆది అనాద పూర్ణశూన్యము నందు మనము శూన్యము అవ్వమని నాకర్ధమైంది.అసలు మోహము అంటే ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది.అపుడు శాస్త్ర గ్రంధాలు తిరగవేస్తే మోహము అంటే మనకి అందుబాటులో లేనిదానిని అనుభవించాలని అనుకోవడమే మోహము అవుతుంది అని తెలిసింది. ఈ మోహము అనేది యక్షణి వలన అంటే ఇది మన స్వప్నశరీరమును పట్టుకొని మనకి స్వప్నాల యందు తన మోహమాయమత్తును కలిగించి వీర్యసఖ్ఖలనం చేయించి మన భవిష్య కర్మ-జన్మలకి గావాలసిన వీర్య కణ బీజాలను తయారుచేయిస్తుంది.నా అనుభవము ప్రకారము తొమ్మిది రకాల మోహలు అనగా పితృదేవతల మోహము..సంతాన మోహము..దైవ మోహము..గురు మోహము..దైవికవస్తువుల మోహము..జంతువుల మోహము..భార్య/భర్త మోహము..నేను ఉన్నాను ఉనికి మోహము...శాంతి స్ధితి మోహము..ఇలా ఈ తొమ్మిది కలిసి 64 మోహలుగా విడిపోయి 84 లక్షల జీవ జాతులు మీద..36 కోట్ల దైవ జాతులు మీద..ఒక కోటి పరమాత్మలు మీద ప్రభావము చూపుతున్నయని నాకర్ధమైంది. ఈ తొమ్మిది రకాల మోహలలో పితృదేవతల మోహములో ఆనాటి ఆదిశంకరార్యుడు నుండి చంద్రశేఖర సరస్వతి వారి వరకు తల్లిమోహబంధనమును దాటలేకపోయారు.అలాగే దైవిక వస్తువులైన మణుల మాయలలో అనగా కౌస్తుభమణి మాయలో విష్ణువు..శమంతకమణి మాయలో శ్రీకృష్ణుడు..చింతామణిమాయలో బుద్దుడు పడినారని లోకవిధితమే గదా.ఇక సంతాన మోహ మాయ విషయములో అమ్మవారు కాస్త కుమారస్వామి పుత్ర మోహమాయలో పడితే..అయ్యవారి మోహమాయలో అమ్మవారు..అమ్మవారి మోహమాయలో అయ్యవారు ఇలా బార్యభర్త మోహమాయలలో అదిదంపతులు పడినారని లోకవిధితమే గదా.ఇక ఉనికి మోహమాయలో మహర్షలు పడి తమ పేరు గుర్తింపు కోసము  తాము పొందిన అనుభవ ధ్యానజ్ఞానమును పుస్తకగ్రంధాలలో తమ పేరులతో గోత్రనామాలుగా మార్చుకొన్నారు గదా.ఇక జంతువుల మోహమాయలో అన్నివదిలిసి వచ్చిన భరతుడు కాస్త జింకపిల్ల మోహమాయలో పడి మరుజన్మగా జింకగా పుట్టాడని లోకవిధితమే గదా.ఇక   గురుమోహమాయలో పడి తామ జీవితాలు,మానాలు,ధనాలు,ఆస్తులు పొగోట్టుకున్న వారి శిష్యభక్తుల అనుభవాలు ఏన్నో జరుగుతున్నాయి గదా.ఇలా ఈ ఏనిమిది రకాల మోహమాయలకి మూల మోహము శాంతిన్ని పొందాలని అనుకోవడమే.దీనికి మోక్షం అని పేరు పెట్టుకొని దీని కోసము నానారకాల యోగసాధనాలు చేసి ఈ మోక్షము పొందామో లేదో తెలియని స్ధితికి మనము చేరుకొని శాంతి స్ధితిన్ని పొందలేక శూన్యస్ధితి ఇచ్చే ఏకాంత ఓంటరి స్ధితిన్ని ఏకత్వ స్ధితిగా అనుభవించలేక ఇంక ఏదో గావాలని..ఇంక ఏదో పొందాలని..ఇంక ఏదో ఉందని..ఇక ఏదో తెలుసుకోవాలని..తెలుసుకున్నదానిని లోకానికి చెప్పాలని..చూపించాలని..ఉన్న శాంతిస్ధితి నుండి అశాంతిస్ధితి కి వచ్చి మోక్షస్ధితి పొందాలనే మోహ మాయలోపడి పున:కర్మ-జన్మలో మనకి మనమే పడి మన కోరికకు తగ్గట్లుగా కోరిక కర్మ-జన్మను ఎంచుకొని దాని రాతను మనవిధిరాతగా..తలరాతగా మనకి మనమే రాసుకొని 64 డైమర్షలలో పున:జన్మలు ఎత్తున్నాము అన్నమాట.అంటే నిజానికి మనము ఉన్న సహజస్ధితిలో ఉంటూ దేనియందు అతిగా స్పందించకుండా..అతిగా ఆలోంచించకుండా..అతిగా ఆవేశపడకుండా..అతిగా ఆశ పడకుండా..అతిగా భయపడకుండా..అతిగా సంకల్పించకుండా..ధర్మార్ధాకామగా సాక్షిభూతముగా..మనల్ని వదిలిపెట్టేది శివార్పితముగా..మనకి వచ్చేది శివప్రసాదముగా భావించి   అన్నింటయందు సమభావముగా..సమదృష్టిగా..సమదర్శనముగా..ఎవరైతే ఉంటారో వారికి ఉన్న అంతిమ శరీర స్వప్నశరీర అంతిమ మోహమాయ తొలిగిపోయి పూర్ణమోక్షమైన పూర్ణశూన్యములో ఉన్న శూన్యబిందులో ఒక శూన్యబిందువుగా మారి శూన్యమవుతారు.ఇది ఖచ్చితము అన్నమాట.

ఎలాంటే ఈ స్వప్నశరీర మోహమాయస్ధితిలో నా సాధనస్ధితి చేరుకున్నపుడు నాకు విపరీతమైన ఏకాంత ఒంటరితనము భరించలేనిస్ధితిలో నా దేహస్ధితి చేరుకుంది.అంటే శూన్యస్ధితికి చేరుకొన్నాను అన్నమాట.ఇందులో నేను అనేది లయము చేస్తే అది పూర్ణమోక్షమవుతుంది.ఇది లయం అవ్వలంటే దీనికి ఉన్న మోహమాయ తొలగాలి.ఇది తొలగాలంటే నాకున్న కర్మశేషము క్షయం అవాలని నేను తెలుసుకున్నాను. అసలు నాకు కర్మశేషము ఎందుకు ఉంది అని తెలుసుకోవాలని ధ్యానములో కూర్చుంటే గతజన్మలో నా భార్య నాతో సంసారసుఖమును తృప్తిగా పొందలేకపోవడముతో అయిదుగురు మగాళ్ళలతో అక్రమ సంబందాలు పెట్టుకోవడముతో ఆ జన్మలో నా భార్య చేసిన ఈ పనికి నేను అర్ధాంతరముగా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించి తీరని కామకోరికతో కామపిశాచముగా మారి కనపడిన ప్రతి స్త్రీ శరీరమును పిశాచముగా ఆహించి నాకున్న కామకోరికలు తీర్చుకుంటూ నా భార్య ఆత్మను అనుభవించి దానిని శృంగారములో తృప్తి పరిచేదాకా ఆ నా ప్రేతాత్మకు విముక్తి కల్గదని అదియే కర్మశేషముగా ఈ జన్మలో అంతిమగా వచ్చినదని నాకు ధ్యానమునందు జ్ఞానస్ఫురణ అయింది.దానితో కామ కర్మశేషము మిగిల్చిన నా గతజన్మ భార్య ఈ జన్మలో ఎవరో.. ఎక్కడ ఉన్నదో..ఎలా ఉందో..ఉందో లేదో తెలుసుకోవడము ఈ జన్మ వంతు అయింది.దానితో నాకున్న మనస్సుసిద్ధితో ఆమె అరుణచలములో 14సం.రాలు నుండి శివదీక్ష తీసుకొని అరుణగిరి గుహ లోపుల ఆవాసము చేస్తుందని..ఆమె పేరు జ్యూసి అని..దక్షిణకొరియ విదేశివనితయని..ఆమెకి అయిదు  వివాహలు అయ్యి విడాకులు తీసుకొని ఆరోగ్య కోసము అరుణచలక్షేత్రమునకు వచ్చి స్ధిరపడిపోయినదని ఆమె నాకు పరిచయము ఆయ్యేదాకా తెలియదు.ఆమె నాతో మాట్లాడుతో ధ్యానములో కళ్ళుమూసుకొని మీరు నా గతజన్మలో మొదటి భర్త గదాయని అంటే నేను అవునని తల ఊపాను. అదే ధ్యానస్ధితిలో కారణము తెలుసుకొని కర్మశేషము గూర్చి తనుగూడ తెలుసుకొని నాకు చెప్పడము ఆరంభించింది.కన్నీరు కార్చింది.క్షమించమని ఏడ్చింది.క్షమించాను.గాకపోతే ఈ జన్మలో ఎవరికివారే అంటే నేను శివయోగి దీక్షలో తను శివయోగిని దీక్షలో ఉండటముతో మా మధ్య శారీరక సంబంధముతో గాకుండా ధ్యానములో కూర్చుని ఆత్మసంయోగముతో సుఖానుభూతిన్ని పొంది మా ప్రేతాత్మల జన్మలకి విముక్తి గావించుకున్నాము.దీనికి మాకు 84 రోజుల సమయము పట్టింది.దానితో మా ఇద్దరి కర్మశేషము సంపూర్తిగావడముతో మా స్వప్నశరీరాలకి ఉన్న నా పరంగా ఉన్న మోహమాయ అలాగే ఆమె పరంగా ఉన్న కామమోహమాయ క్షయము అయింది.దానితో మా స్వప్నశరీరాలు కాస్త శూన్యము నందు శూన్యమైనాయి.అపుడు మేమిద్దరం మాటలకి అందని రాతలలో వాయలేని అద్వితీయమైన శాంతిన్ని పొందడము జరిగింది.ఇదియే అంతిమస్ధితియని నాకు అర్ధమైలోపుల ఆమె కాస్త తనకి వచ్చిన అదృశ్యశక్తితో అదృశ్యమై భౌతికదేహ విముక్తి కొసము అరుణగిరి లొఫుల అంతర్గతగుహలో ధ్యానము చేస్తూ నా ధ్యాన మనోదృష్టికి రావడముతో చిరుమందహసము చేస్తూ ఆ రోజు ధ్యానానికి స్వస్తి చెప్పాను.

అంటే మనలో ఎవరైనగూడ తమకి అంతిమముగా వచ్చే మోహమాయను క్షయం చేసుకుంటారో వారికి ఖచ్చితముగా పూర్ణమోక్షమును పొంది శూన్యమవుతారు.ఎవరైతే ఈ  అంతిమ మోహమాయలో పడి మోహబంధనములో పడిపోతారో వారు అంతే ఖచ్చితముగా పున:కర్మజన్మలో పడతారు.ఇక్కడే ఈ మోహమాయ యొక్క బలహీనతను దాటకలిగినవాడు శివుడు అవుతాడు.దాటలేనివాడు జీవుడు అవుతాడు.అందుకే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదని...కామికానివాడు మోక్షగామి కాలేడని...మోక్షం పొందామో లేదో తెలియని విచిత్ర అవస్ధయని మన పెద్దలు చెప్పడము జరిగింది.సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని గుర్తుపెట్టుకొండి.మీ సాధన ఉన్నస్ధితి నుండి అనగా స్ధూలశరీరస్ధితి నుండి ఉన్నతస్ధితికి అనగా స్వప్నశరీరస్ధితికి చేరుకొనేదాకా సాధన కొనసాగించండి. అంతిమగా వచ్చే మోహమాయను దాటండి.ఇదింతాగూడ మీ చేతులలో మీ చేతలలో ఉంటుంది.గావాలని అన్నితెలిసిగూడ మోహమాయలో పడితే ఎవరు ఏమి చెయ్యలేరు.ఏదిగూడ మనకి తెలియకుండా ఏ మాయలోను మనము పడలేమని తెలుకొండి.అన్నిగూడ మనకి ప్రకృతియే వివరిస్తుంది.చెపుతుంది.మోహ మాయ గూర్చి చెపుతుంది.దానినికి ఏమి చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో జ్ఞానము ఇస్తుంది.మనకి ఏదిగావాలో ఎంచుకొనే అవకాశాలు ఇస్తుంది.మన సాధనాంతగూడ మన చేతలలో మన చేతులు దాటి ఎక్కడికి పోదు.మనము ఎంచుకొనే మార్గాలు బట్టి అవకాశాలు ఇస్తుంది.మన మోక్షము మనలో చేతలలోనే ఉంది.అదిగూడ కేవలము మనకి ఉన్న మోహమాయను  క్షయం చేసుకుంటే చాలు.మనకి పూర్ణమోక్షమైన పూర్ణశూన్యమునందు శూన్యమవుతాము.ఇది మా జీవితాలలో యదార్ధముగా జరిగింది.మీరుగూడ ప్రయత్నసాధనతో సాధిస్తే మీరుగూడ పూర్ణమోక్షమును తప్పకపొందుతారు.మోహమాయ క్షయం అంటే మీ యదార్ధ సహజస్ధితిలో మీరు ఎలాయితే ఉంటారో అలా జీవితాంతము వరకు ధర్మార్ధకామముగా జీవిస్తే చాలు.మీకుగూడ పూర్ణమోక్షము పొందినట్లే.గాకపోతే మనము మనకి లాగా జీవించకుండా ఎదుటువాడికి లాగా లేదా వాడికన్నా పై స్ధాయిలో బ్రతకాలని ఆశపడి మోహములో పడి పున:కర్మజన్మాలకి వెళ్ళుతున్నాము.అదే మనకి ఉన్నంతలో తృప్తిపడి మనకి ఏది వచ్చిన దానిని శివప్రసాదముగా మనకి ఏది దూరమైన దానిని శివార్పితముగా ఉండగలిగితే వాడికి ఖచ్చితముగా పూర్ణమోక్షమును పొందుతాడు.ఇందులో ఎలాంటి సందేహముకాని అనుమానము కాని లేదు.ఇది ఖచ్చితముగా జరిగితీరుతుంది.   

మీకు స్ఫటికలింగము వస్తే:...




మీకు ఈ జన్మలో మోక్షప్రాప్తి పొందినట్లే..వచ్చినట్లే అన్నమాట.కాని ఈ స్ఫటికలింగము అనేది మనకి రుషికేశి క్షేత్రము నుండి రావాలి లేదా అక్కడనుండి మనకు నచ్చినదానిని మన మనస్సు మెచ్చిన దానిని ఒక స్ఫటికలింగము తెచ్చుకోవాలి.దానిని జీవింతాంతము మన దగ్గర ఉంచుకుంటే మనకి మోక్షము వచ్చినట్లే.కాని నా స్వానుభవములో నా తోటి సాధకులకి చాలామందికి కాశీక్షేత్రమునుండి స్ఫటికలింగము రావడము గమనించాను.ఇలా సప్తమోక్షపట్టణాలలో ఏదో ఒక క్షేత్రము నుండి మనకి స్ఫటికలింగము వస్తే మనకి ఏదో జన్మాంతర రుణానుబంధము ఒకటు ఉన్నట్లుగా గ్రహించాలి.అపుడు అఖరి మరణమోక్షకేత్రమైన అరుణచల క్షేత్రానికి అనుసంధానమై ఆ రుణాబంధమును తీర్చుకుంటే మనకి మోక్షప్రాప్తి కలుగుతుంది.లేదంటే ఒక అడుగుదూరములో మన మోక్షము ఆగిపోతుంది.అదే మనకి రుషికేషి నుండి ఏకముగా స్ఫటికలింగము వస్తే వారి భౌతిక దేహమరణాంతరము తప్పకుండా మోక్షమును పొందడము జరుగుతుంది.ఈ స్ఫటికలింగానికి మన మోక్షానికి ఏమి సంబంధము అంటారా? అయితే ఈ దేహము పొందిన ఈ స్పటికలింగానుభవమును మీరే చదివి తెలుసుకొండి.

ఒకరోజు నేను యధాలాపము శంకరాచార్యుడు వాసిన భజగోవిందము వింటున్నాను.అందులో ఒక శ్లోకము (9) దగ్గర నా మనస్సు ఆగిపోయింది.అది 

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||

ఇందులో మోహము పోతే మనస్సు నిశ్చలమవుతుంది.ఈ నిశ్చలస్ధితియే జీవన్ముక్తి అనే భావముతో శంకరుడు ఈ శ్లోకము చెప్పడము జరిగింది.ఇందులో మన అనుభవ లెక్కప్రకారముచూస్తే మోహము పోవడము అనేది మన ఆఖరి తొమ్మిదివ శరీరమైన స్వప్నశరీరానికి ఉన్న మోహము మాయ పోవడము అన్నమాట.అంటే ఈ మోహము పోతే మన మనస్సు కాస్త నిశ్చలస్ధితి పొందడము జరుగుతుందని..దీనినే జీవన్ముక్తియని శంకరుడు మనకి చెప్పడము జరిగింది.ఇదింతా బాగానే ఉంది.కాని మనానుభవ ప్రకారము చూస్తే మన స్వప్నశరీరము కాస్త శూన్యబిందువుగా మారి శూన్యములో ఒక విస్పోటనము చెంది నాశనమైనపుడు ఇక అక్కడ మనస్సు అనేది ఉంటానికి ఎలాంటి ఆస్కారము లేదుగా.మరి ఏది నిశ్చలస్ధితి పొందుతుంది.ఏది పొందాలి.  అంటే ఇక్కడ నిశ్చలస్ధితి పొందటానికి మనస్సు గాకుండా మరేదో ఉంది అది ఏమిటో తెలుసుకోవాలని నా ధ్యానపరిశోధన మొదలైంది.అపుడు నా  అంతిమ స్వప్నశరీర మోక్షదృశ్యమును తిరిగి చూడటం ఆరంభించాను.అది ఏమిటి?ఇలా గూడ చూడవచ్చునా?మన మోక్షముగూడ ఒక రికార్డ దృశ్యామా? అంటే అవును.మన మోక్షముగూడ ఒక రికార్డు దృశ్యమే.ఎందుకంటే మన భవిష్యత్ కాస్త గతమై అది కాస్త వర్తమానముగా మనకి కనపడుతుంది.మన జీవితము అంతాగూడ 4 గంటల 8 నిమిషాల నిడివి గల రికార్డు దృశ్యమని ముందు తెలుసుకొండి.ఇందులో ఎవరి ఓపిక తగ్గట్లుగా పూర్తిగా తమ వీడియోన్ని చూడకుండా ఆగిపోతారు. చూడాలని అనుకొనేవారికి వారు భరించలేనంతగా విసుగు,చిరాకు,కోపావేశాలు వస్తాయి.అయినగూడ ఒపికగా ఈ వీడియోన్ని చూడాలి.ఇలా ఎవరైతే తమ వీడియోన్ని పూర్తిగా శాంతముగా..ప్రశాంతముగా..ఒపికగా..నేర్పుగా చూడటం పూర్తిచేస్తారో వారు పొందేది మోక్షమవుతుంది.ఈ వీడియోలో ఉన్న నాలుగు గంటలలో మొదటి గంట భోగజీవితము..మరో గంట యోగ జీవితము..మరో గంట భోగ-యోగ జీవితము..మరో గంట మోక్షజీవితము ఉంటే ఆఖరి  ఏనిమిది నిమిషాలలో మోక్షసన్యాసి శూన్యస్ధితి అదే నిశ్చలస్ధితి పొందటము గురించి ఉంటుంది.ఇదింతా ఆ శివుడు దగ్గర నుండి జీవుడి దాకా ఇలా అందరికి ఒకే విధముగా ఉంటుంది.గాకపోతే పాత్రలు అలాగే పాత్ర సన్నివేశాలు మారతాయి తప్ప ఇంక ఏమి తేడా ఉండదు.అక్కడ శివుడు కాస్త అమ్మవారితో ఉంటే ఇక్కడ జీవుడు కాస్త అమ్మాయితో ఉంటాడు అన్నమాట. 

ఇపుడు మన మోక్ష రికార్డు దృశ్య వీడియో విషయము మీకు అర్ధమైనదని నాకు అర్ధమైంది.దానితో నా అంతిమ స్వప్నశరీర మోక్ష వీడియోన్ని పదేపదే ధ్యానములో చూడటం జరుగుతోంది.ఇంతలో నా ముఖము మీద చిరునవ్వు మెరిసింది.ఎందుకంటే నా స్వప్నశరీరము విస్పోటనము చెంది శూన్యములో కలిసిపోయిందని అనుకున్నాను గదా.కాని అలా జరగడము లేదు.ఎందుకంటే నా స్వప్నశరీరము విస్పోటనము చెంది దేహపదార్ధము కాస్త రేణువుగా మారి మిగిలిపోతుంది.ఈ రేణువుగా మిగిలిపోవడము ఎవరుగూడ గమనించడము లేదు.కేవలము విస్ఫోటనము చూసి అది శూన్యములో  శూన్యమవుతుందని అనుకుంటారు కాని అతీసూక్ష్మాతి సూక్ష్మ  రేణువుగా మిగిలిపోవడము ఎవరుగూడ గమనించడము లేదు అని గ్రహించండి.ఇదే విషయాన్ని మన శాస్త్రవేత్తలు కాస్త బ్లాక్ హోల్లో పడిన ప్రతి పదార్ధముగూడ సంపూర్తిగా నాశనము గావడము లేదని 0.01 పరిమాణము మిగిలిపోతుందని చెప్పడము జరిగింది.అదే మన వేదాంతులు ఈ పరిమాణమును ఒక రేణువుగా చెప్పడము జరిగింది అన్నమాట.

అసలు ఈ రేణువు ఇలా మిగిలిపోవటానికి అందులో ఏమి ఉంది అని  తెలుసుకోవడము ఆరంభించాను.ఈ రేణువున్ని ఛేదిస్తే యదార్ధము తెలిసింది.నా స్వప్నశరీర రేణువున్ని చాలాలోతుగా పరిశీలించడము ఆరంభించాను.అపుడు ఒక ధ్యానదృశ్యము ఆవిష్కరమైంది.ఒక నల్ల శివలింగము కనిపించి అంతరిక్షములో ఉన్న బ్లాక్ హోల్ అడుగుభాగములో వెలుగులు చిమ్ముతూ చేరుకుంది.ఆ తర్వాత మరొ తెల్లశివలింగము కనిపించి నీలివర్ణ కాంతులు చిమ్ముతూ భూమి అడుగుభాగములోనికి అదే పాతాళములోనికి చేరుకుంది.అంటే ఆకాశములో ఒక శివలింగము అలాగే పాతాళములో మరొ శివలింగము ఉన్నాయని తెలుసుకొండి.ఇపుడు అకాశలింగము నుండి విధ్యుత్ తరంగాలు వస్తుంటే అదే పాతాళ శివలింగము నుండి భూ అయస్కాంత తరంగాలు శక్తి వస్తుందని నాకర్ధమైంది.ఈ రెండు లింగాల దృశ్యము నిజమా కాదా అన్నపుడు అరుణచల క్షేత్ర గుడిలో రెండవ ప్రాకారములో వెయ్యిస్తంభాల మండము దగ్గర మనకి పాతాళలింగము దర్శనమిస్తే అదే మూడవ ప్రాకారములో ఆకాశలింగముగా అగ్నిలింగమైన అరుణచలేశ్వరలింగము దర్శమివ్వడము బట్టి ఈ ధ్యానానుభవము నిజమని నాకర్ధమైంది.

కొన్నిరోజుల తర్వాత తీవ్రమైన ధ్యానస్ధితిలో ఉండగా నా స్వప్నశరీర రేణువు తెల్లగా కనిపించింది.అపుడు ఈ రేణువు లోపలకి నా ధ్యానమనోదృష్టి సారించాను.అపుడు నాకు ఒక వైపు నల్లని శివలింగము మరో వైపు తెల్లని శివలింగము వీటి మధ్యలో తెల్లని ఒక స్ఫటిక బిందువు..ఈ బిందులోపుల ఒక జీవుడి జగన్నాటక నాలుగు గంటల వీడియో దృశ్యము నడుస్తున్నట్లుగా దీనిని చూస్తున్నట్లుగా అర్ధనిమిత నేత్రాలతో ధ్యానస్ధితిలో ఉన్న శివుడు ఉన్నట్లుగా కనిపించాడు ..కాని నిజానికి ఈయన ఈ జీవుడి జగన్నాటనమును చూడటము లేదని తను తీవ్రమైన ధ్యానసమాధిస్ధితిలో ఉన్నట్లుగా నేను గమనించాను.ఇంతలో బిందువుకి అవతలివైపు ఒక అపస్మారక రాక్షసుడు దర్శనమిచ్చాడు.అంటే మూలబిందువుకి ఒక వైపు నల్లశివలింగము అదే పురుషశక్తి ఉంటే..అదే మరో వైపు తెల్లని శివలింగము అదే స్త్రీశక్తి ఉంటే...బిందువుకి ముందువైపు సాక్షిభూతముగా ధ్యానశివుడు ఉంటే..అదే బిందువుకి వెనుకవైపు అపస్మారక రాక్షసుడు ఉన్నాడని గ్రహించండి.కొన్నిక్షణాల తర్వాత చూస్తే పురుష ఆకాశ శివలింగము నుండి తీవ్రమైన విధ్యుత్ తరంగాల శక్తి కాస్త మధ్య బిందువుకి తాకడము చేస్తుంటే అదే విధంగా స్త్రీ శక్తి పాతాళలింగము నుండి భూ అయస్కాంత శక్తితరంగాలు కాస్త ఈ బిందువున్ని తాకుతున్నాయి.ఈ శక్తులు తాకిడికి మధ్యబిందువైన స్ఫటికబిందువులో ఉన్న జీవుడు కాస్త చలనస్ధితిలోనికి వస్తున్నాడు.అపుడే బిందుకి వెనుక ఉన్న అపస్మారక రాక్షసుడు కాస్త ఈ బిందువున్ని తల్లకిందులుగా తల చేతులతో తిప్పడము ఆరంభించాడు.ఇలా నాలుగు సార్లు తిప్పాడు.అపుడు కాలచక్రములో నాలుగు యుగాలు పూర్తీ అయ్యినట్లుగా..ఆ జీవుడి నాలుగు గంటల నాలుగు జీవితాలు అనుభవాలు పూర్తీ అయ్యినట్లుగా నాకు జ్ఞానస్పురణాలు అందినాయి.దీని అంతా ధ్యానసమాధిలో ఉన్న ధ్యానశివుడు సాక్షిభూతముగా మౌనముగా స్పందనరాహిత్యముగా చూడటం లేదా చూస్తూన్నట్లుగా ఉన్నాడోమో తెలియనిస్ధితిగా నేను గమనించాను.అంటే రేణువులో చలనము కారణ కారక ఈ ఏర్పాట్లు చేసి ఉంటడము అని అనిపించేసరికి నాకు ఆ రోజు ధ్యానభంగమైంది.





ఆ తర్వాత ఈ ఏర్పాటు నిర్మాణము గూర్చి నేను తీవ్రమధనములో ఉండగా సరిగ్గా అపుడే బుద్దుడు చేసిన ద్యోర్జీ పరికర నిర్మాణము గుర్తుకు వచ్చింది.ఇది గూడ రెండు పద్మాల మధ్యలో ఒక బిందువు ఉన్నట్లుగా ఈయన నిర్మాణము చేసాడు.నిజానికి ఇది రేణువులో ఉన్న అంతిమ నిర్మాణమే ద్యోర్జీ నిర్మాణమని చాలా తక్కువ మందికి తెలుసునని నాకు తెలిసింది.అలాగే మన  మన శివుడి చేతిలో ఉండే ఢమరుక నిర్మాణమును చూస్తే ఒక బిందువు మధ్యగా రెండు త్రిభుజకోణాలు ఉన్నట్లుగా నిర్మాణము బట్టిచూస్తే ఇదిగూడ రేణువులోని అంతిమ నిర్మాణమును చూచిస్తుంది గదా.అంటే ద్యోర్జీ అలాగే ఢమరుకము అనేది రేణువులోని అంతిమ నిర్మాణమని ఈ పాటికి మీకు అర్ధమయ్యింటుంది.అలాగే ఈ ధ్యానుభవముగూడ నిజమని ఈ పాటికి మీరు గ్రహించి ఉంటారు.ఇదింతా బాగానే ఉంది.




ఈ రేణువులో ఉన్న అంతిమ నిర్మాణానికి మూలమేదో ఉండాలని నాకు బలంగా అనిపించసాగింది.ఒకరోజు నాకు ధ్యానములో అరుణగిరి ముందు ఒక రాజదండమును పల్లకిలో తీసుకొని వెళ్ళుతున్న ధ్యానదృశ్యము కనిపించి అదృశ్యమైంది.ఈ దండానికి చివర ఒక శివలింగ నిర్మాణమున్నట్లుగా బంగారపు తొడుగుతో ఉన్నట్లుగా కనిపించింది.ఈ తొడుగు లోపుల ఏమి శివలింగముంది అని సందేహము వచ్చింది.అంటే అది చెక్క లింగమా లేదా బంగారు లింగమా లేదా ఏదైన మరొ లింగమా నాకు అర్ధముకాలేదు.




ఈ ధ్యానానుభవము నిజమే అన్నట్లుగా శివలింగమున్న రాజదండము ధరించిన పళిని కుమారస్వామి విగ్రహమూర్తి నా దగ్గరికి వచ్చేదాకా నాకు తెలియదు అన్నమాట.అంటే శివలింగమున్న రాజదందము ఒకటి ఉన్నదని నేను గ్రహించాను.దానితో ఇది ఏ శివలింగమో తెలుసుకోవాలని నా ధ్యానతపస్సు ఆరంభించాను.




కొన్నిరోజులు తర్వాత ధ్యానములో పదేపదే చిదంబర క్షేత్ర దర్శనము అవ్వడము ఆరంభమైంది.ఆత్మవిచారణ చేస్తే ఈ క్షేత్రము అనేది విశుద్ధ చక్రమునకు చెందిన క్షేత్రమని లోకవిధితమే గదా.ఈ చక్రము అనేది జ్ఞానమునకు సంబంధించినది గదా.జ్ఞానము అంటే స్ఫటిక లింగమే ఈ చక్ర దైవికవస్తువుగా చెప్పడము జరిగింది.అంటే క్షేత్రములో ఏవరైతే ఆకాశలింగమైన స్ఫటికలింగమును జ్ఞానలింగమని అనుభవాముభూతి పొందుతారో వారు మోక్షమును పొందుతారని మనకి శివుడు వరము ఇవ్వడము జరిగింది గదా.అంటే రాజదండములోని   బంగారపు తొడుగులో లోపుల ఉన్న శివలింగము ఒక పరిశుద్ధ స్పటికలింగమని గ్రహించాను.ఎందుకంటే శంకారాచార్యుడికి కైలాస శివుడు కాస్త అయిదు స్పటికశివలింగాలు ఇస్తే అందులో నాలుగుంటిన్ని నాలుగు పీఠాలలో పెట్టి 5వ స్ఫటికలింగమును మోక్షశివలింగముగా చిదంబరక్షేత్రములో పెట్టడము జరిగినదని లోకవిధితమే గదా.దీనిని బట్టిచూస్తే మోక్షలింగము అనేది స్ఫటికలింగమని తెలుస్తోంది గదా.ఇపుడు ఈ ఏ క్షేత్ర స్ఫటికలింగము మోక్షలింగము అవుతుందో తెలుసుకోవాలని నాలో తపన మొదలైంది.కేవలము చిదంబర క్షేత్రములో స్ఫటికలింగము దర్శనమైతే మోక్షమని చెప్పడము జరిగింది కాని ఈ ఏ క్షేత్ర స్ఫటికలింగము  దర్శనము చేసుకోవాలో చెప్పలేదని తెలుసుకొండి.అదే చిదంబర రహస్యము అన్నమాట.ఈ రహస్యము చేధిస్తే కాని మనకి మోక్షము రాదు. 



ఇది ఇలాంటే గురుపౌర్ణమినాడు గిరిప్రదక్షిణము చేస్తున్న అర్ధరాత్రి సమయనా ఒక అవదూత ఒకచేతిలో ఒక పెద్ద కర్ర పట్టికొని నా దగ్గరికి వచ్చి 20 రూపాయిలు గావాలని బిక్ష అడిగాడు.నేను ఇచ్చాను.దానికి అతను వెకిలిగా నవ్వుతూ నువ్వు నా కొడుకువి.నువ్వు చల్లగా ఉండు.వాడు నిన్ను రక్షిస్తాడు.ఇందా ఇది మెడలో వేసుకో.మూలము తెలుసుకో.ఆ నీలకంఠశ్వరుడు ఎవరో తెలుసుకో అంటూ నా మెడలో ఒక స్ఫటికలింగము వేసి కొంత దూరము వెళ్ళి అదృశ్యమయ్యాడు.అపుడు నేను ఆత్మవిచారణ చేసుకుంటు పోతే ఆ నీలి కంఠేశ్వరుడిగా రుషికేశి క్షేత్రములో ఉన్న శివలింగమునకు పేరు ఉన్నదని తెలుసుకొన్నాను.ఎందుకంటే హలహలము సేవించిన శివుడు ఈ మహకాలకూట విషము దాటికి తట్టికోలేక విల్లవిల్లాడుతుంటే అపుడు అమ్మవారు కాస్త తారాదేవిగా మారి ఈయనికి చనుపాలిచ్చి ఈ విషము కడుపులోనికి పోకుండా తన చేతులతో శివుడు కంఠమును నొక్కిపట్టి ఉండడముతో ఈయన బతికినాడని ఆ నాటినుండి మృత్యువు లేని మృత్యంజయుడు అయ్యాడని..విషము నీలివర్ణము గావడముతో..ఆ విషము కాస్త తన కంఠములో ఉండిపోవడముతో అనగా కంఠములో ఉండే స్ఫటికలింగములో ఉండిపోవడముతో ఆ  నాటినుండి ఆ శివుడు కాస్త నీలికంఠేశ్వరుడు అయ్యాడని ఈ స్ధలపురాణ కధనము గుర్తుకురావడముతో అంటే నీలికంఠేశ్వరుడి శివలింగము అంటే రుషికేషి స్ఫటికలింగమే మోక్షలింగమని ఇదె చిదంబర రహస్యమని మీకు తెలిసిందని నాకు అర్ధమయింది.     






కొన్నిరోజుల తర్వాత ధ్యానములో నాకు పదేపదే స్ఫటికలింగము దర్శనమిచ్చింది.ఆ తర్వాత ఒకరోజు ఆకాశములో ఆకాశ శివలింగముగూడ దర్శనమిచ్చింది.దాని ఫోటోలుగూడ తీశాను.చూడండి.అంటే నా ధ్యానానుభవాలు సత్యమని గ్రహించాను.ఇదింతా బాగానే ఉంది.నిజానికి రేణువులో ఉన్న అంతిమ నిర్మాణానికి ఈ అంతిమ స్ఫటిక శివలింగానికి గల సంబంధము ఏమిటో నాకు ఒక పట్టనా అర్ధము కాలేదు.కొన్నిరోజులు తర్వాత ధ్యానములో నా స్వప్నశరీర రేణువు కాస్త తిరుగుతున్న ఒక బ్లాక్ హోల్లో ఉన్నట్లుగా గమనించాను.కొన్నిక్షణాలు తర్వాత ఈ తిరిగే బ్లాక్ హోల్ కాస్త తిరగని చలనము లేని మధ్య మరో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళడము జరిగింది. అపుడు ఈ రెండు బ్లాక్ హోల్స్ మధ్య అనుసంధానమైనపుడు తిరుగుతున్న బ్లాక్ హోల్ నుండి నా స్వప్నశరీర తెల్లనిరేణువు కాస్త తిరగని బ్లాక్ హోల్ కి చేరడము గమనించాను.అపుడు తెల్లని రేణువు కాస్త నీలివర్ణ రేణువుగా మారడము పైగా ఇది అపుడిదాకా కదిలేస్ధితిలో ఉన్న ఈ రేణువు కాస్త  కదలని నిశ్చలస్ధితికి రావడము..ఈ బ్లాక్ హోల్ ఉన్న  అపుడికే ఇదే స్ధితి పొందియున్న అనేక నీలి రేణువులు దగ్గరికి ఒక దారమునకు చుట్టుయున్న మణిపూసలలో నేనుగూడ ఒక నీలిస్ఫటికపూసగా నిశ్చలస్ధితిలో చేరానని ఇదే ఆదిశంకరుడు చెప్పిన నిశ్చలస్ధితియని అదే విధంగా భగవద్గీతలో ఒక శ్లోకములో ఈ లోకము అంతయుగూడ ఒక మణిపుస దండలో మణులు గుచ్చునట్లుగా ఉండునని చెప్పడము జరిగిందిగదా.  అంటే గీతలో ఈ శ్లోకములో ఈ కదలని బ్లాక్ హోల్ అంతరనిర్మాణము గూర్చి ఆనాటి మహర్షులు చెప్పడము జరిగింది అంటే వాళ్ళ మనోదృష్టి ముందు ఈ నాటి శాస్త్రవేత్తల పరికరాలు ఏపాటివో మీకు అర్ధమయ్యే ఉంటుంది.అలాగే రుద్రాధ్యాయములో గూడ మొదటిశ్లోకములో స్ఫటికజ్యోతిలింగంగా ఆవిర్భావము గూర్చి చెప్పడము అలాగే నమకములో ఆఖరిలో మహ మృత్యంజయ మంత్ర శ్లోకముగా చెప్పడము బట్టి చూస్తే నా స్వానుభవాలు సత్యమని మీకు తెలుస్తుంది.అంటే నేను కొత్తగా ఏమి తెలుసుకోలేదు.ఉన్నదాని స్వానుభవమును పొంది పదిమందికి చెప్పడము జరిగింది.మృత్యువు అంటే మార్పు చెందడము అన్నమాట.అంటే చనిపోయి మరో శరీరములోనికి ప్రవేశించడము అన్నమాట.అదే మహ మృత్యుంజయము అంటే మార్పు చెందనిస్ధితి అదే నిశ్చలస్ధితి పొందడము అన్నమాట.


ఈ నీలిరేణువు కాస్త ఇలా నిశ్చలస్ధితి పొందటానికి గల మూలకారణకారకము తెలుకోవాలని నా ధ్యానతపస్సు కొనసాగించాను.అపుడు ఈ కదలని బ్లాక్ హోల్ అడుగుభాగానికి నా మనోదృష్టి చేరుకుంది.అక్కడ లోపల శివలింగ ముద్ర ఉన్న ఒక ద్వారము కనిపించింది.అపుడు ఈ ద్వారము మీద ఉన్న శివలింగముద్ర మీద అదే పరిమాణములో ఉన్న ఒక స్పటికలింగమును పెట్టగానే ఈ ద్వారము తెరుచ్కుంది.అపుడు నాలుగు స్తంబాలున్న ఒక ముఖమండమున్న గుడి దర్శనమైంది.దీని మధ్యలో లోపలకి వచ్చిన స్ఫటిక లింగము మధ్యభాగములో ఉన్నట్లుగా దర్శనమిచ్చింది.దీనిని చుట్టు ఒక వరుసలో నల్లని చీకటి వలయము ఉంది.దీనికి పైన వరుసలో బడావాగ్ని అగ్నిజ్వాలాలున్నాయి.దీనికి పై వరుసలో పరవళ్ళు తొక్కుతున్న సముద్రపు అలలు ఉన్నానట్లుగా నాకు లీలగా అగుపించింది.ఇదంతా బడావాగ్నిలో ఈ స్పటికలింగానికి ఏమిగావడము లేదు అనుకున్నపుడు అపస్మారక రాక్షసుడు దర్శనమిచ్చి ఈ శివలింగానికి తొమ్మిదిరకాలు విషాలు కలిపిన ఒక లేపనము పూయ్యడముతో ఈ స్పటికలింగము కాస్త నవపాషాణ స్ఫటికలింగమైనదని ఈ విష లేపనమున్నంతవరకు ఈ స్ఫటికలింగమునకు దేమినుండి ఎమికాదని నాకర్ధమైంది.ఈ లేపనము కరగడము అనేది ఎన్నడికి జరగదని జరిగితే ఇక విశ్వమే విశ్వమోక్షమును పొంది శూన్యమవుతుందని ఇలా జరగ కుండా తగు జాగ్రత్తలు ఆదిలోనే ఆది  స్ఫటికలింగమునకి తీసుకొని ఈ గదిలోనికి ఎవరురాకుండా ఈద్వార బంధానికి ఆదిస్ఫటికలింగ ముద్ర ఉంటేటట్లుగా చూసుకోవడము..ఈ ద్వారానికి కాపలాదారుడిగా అపస్మారక రాక్షుసుడి ఉంచడము జరిగింది.ఇకపోతే ఇక్కడ కాపలదారుడైన అపస్మారక రాక్షసుడి చూస్తేచాలు మనల్ని ఆవహించాడు అంటే మనకి తెలిసినజ్ఞానము మర్చిపోవడము జరుగుతుంది.అపుడు నేను ఎవరిన్ని తెలుసోవటానికి కర్మ-జన్మ పున:కర్మ చక్రములో పడిపోతాము.ఒకవేళ ఈ అపస్మారక స్ధితిన్ని పొందకుండా ఈ మాయన్ని దాటినపుడికి అనగా పళినికుమారస్వామి ఇక్కడ మనకి ఇచ్చే విభూదిదారను మన మీద పడకుండా చూసుకోగల్గితే ఈ అపస్మారకస్ధితిని పొందకుండా ఈ ద్వారము దగ్గరికి రావచ్చూను.కాని ఈ ద్వారమీద ఉన్న శివలింగముద్ర ఉన్న స్ఫటికలింగ ముద్ర మనదగ్గర ఉండదు.అది లోపుల భద్రముగా దాచి ఉంచి ఈ ద్వారబంధనము వేసారు.ఎందుకంటే ద్వారమీద ఉన్న శివలింగముద్ర పరిమాణములో అదేవిధముగా ఉన్న మరో స్ఫటికశివలింగము పుట్టదు.పుట్టలేదు.తయారు కాదు.కాలేదు.ఎందుకంటే 0.01 పరిమాణములో ఖచ్చితముగా తేడా వస్తుంది.పగిలి పోయిన కుండా మూతను తిరిగి యధావిధిగా మళ్ళీ తయారు చెయ్యలేరు గూడ.గాకపోతే తయారు అయ్యాంది చూడటానికి అచ్చుగుద్దినట్లుగా పాతదానిలాగా ఉన్నప్పడికి ఈ కొత్త మూత ఆ పాత కుండకి సరిపొదు.0.01 పరిమాణము ఖాలీ వస్తుంది.అంతెందుకు కవలపిల్లలు అచుగుద్దినట్లుగా పుట్టినప్పడికి వారి బొటనవ్రేలు ముద్రలు ఒకటిగా ఉండవు అలాగే వాళ్ళ జన్మనక్షత్రాలు ఒకటిగా ఉండవని తెలుసుకొండి.అలా మనమంతాగూడ ఆదిస్ఫటిక లింగము నుండి ఉద్భవించినప్పడికి 0.01 పరిమాణ గుణము తేడాతో మనమంతా స్ఫటికలింగాలు ఉంటామని తెలుకొండి.




ఇంత నిర్మాణము ఈ భూమీద ఎక్కడ జరిగిందా అనుకుంటుగా నటరాజమూర్తి..అలాగే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు..వీళ్ళ పక్కనే తెల్లని వస్త్రముతో కప్పబడి దానికి బంగారపు బిల్వపత్రాల మాల ఉన్న శివలింగముద్ర ఉన్న ద్వారబంధనము ఉన్న చిదంబరక్షేత్ర దర్శనమిచ్చింది.అందుకే కాబోలు అరుణచల శివుడు గూడ తమ భక్తులలో కొంతమందిన్ని అనగా ఓం నమశివాయ యోగిని అలాగే మణివాచకర్ అను భక్తుడిన్ని ఈ చిదంబరక్షేత్రానికి వారి అంతిమ కాలములో పంపించడము జరిగింది.





ఇలా ఎవరికైతే రుషికేశి స్ఫటికలింగము చేతికి వస్తుందో దానిని జీవింతాంతము తమ వద్దనే లేదో మెడలో వేసుకుంటారో వారికి నిశ్చలమోక్షస్ధితి పొందినట్లేనని తెలుసుకొండి. ఎవరైతే తమ ధ్యానమునందు తమ స్ఫటికలింగాలకి నవపాషాణ విషము పూసిన ధ్యానదృశ్యము కనిపించగానే ఆ మహత్ములు జీవసమాధికి వెళ్ళతారు అన్నమాట.ఇలా నాకు తెలిసి రాఘవేంద్ర స్వామి మఠాధిపతులు ఇపుడిగూడ జీవసమాధికి వెళ్ళడము ఆనవాయితీగా వస్తోంది.ఇలాంటి ధ్యానదృశ్యము నాకు గానరావడముతో ఇంతవివరముగా నేను మీకు చెప్పి ఈ దేహమునకు విముక్తి కోసము తల్లిఒడి అయిన పూర్ణశూన్యవైపుకి నా దేహ ప్రయాణము చెయ్యడము ఆరంభమైంది.ఇది పూర్తీ అవ్వటానికి అనగా రేణువు కాస్త నిశ్చలస్ధితి మోక్షమును పొందటానికి 8 నుండి 12 సం.రాలు పడుతుంది.ప్రయాణము ఆరంభమైంది.అంతము అనేది నిశ్చలమైంది.         .

మోక్షసాధన మార్గము:

ఇకపోతే మోక్షసాధనకి పొందటానికి కొన్ని సూచనలు మీకు ఇస్తాను.వాటిని మేమంతా పాటించి ఈ జయం పొందడము జరిగింది.మీరు ఎలాంటి గురుమంత్రసాధనలు చేయాల్సిన అవసరము లేదు.అలాగే భౌతిక లేదా జీవసమాధి చెందిన   గురువులు లేదా యోగులకి సేవలు చేయల్సిన అవసరమే లేదు అలాగే దైవరాధనాలు గూడ చేయాల్సిన అవసరమేలేదు.అలాగే సాధనానుభవాలు గూర్చి కాని చక్రాలానుభవాలు గూర్చి లేదా మాయలు గూర్చి కాని ఏమి ఆలోచించవద్దు.కేవలము మీరు నేను చెప్పే అయిదు పద్దతులు పాటించండి.మోక్షము దానింతట అదే వస్తుంది.అవి ఏమిటంటే 

1.కేవలము మీరు ఏదైన మీకు బాగా నచ్చిన ఒక ధర్శగుణమును ఒకటి ఎంచుకొండి.అది మీ ప్రాణము పోయేదాకా ఆ ధర్మగుణమును దాటకుండా చూసుకొండి.అంటే పరమహంస అయితే ఏకపత్ని ధర్మము పాటించారు.అదే జిజ్ఞాసి అయితే స్నానము చెయ్యకుండా ఏ పనిగూడ మొదలుపెట్టేవారు కాదు.అదే నేను అయితే లెట్రిన్ కి వెళ్ళిన ప్రతిసారి తప్పనిసరిగా స్నానము చెయ్యడము నా ధర్మముగా పెట్టుకున్నాను.ఇలా మీకు నచ్చి మీకు వీలు ఉన్న ఒక నియమమును ధర్మముగా పాటించండి.ఈ నియమమును తప్పడటానికి ప్రకృతి వివిధ పరిస్ధితులు కలిగిస్తుంది.వాటిని తట్టుకొని మీరు దాటుకొని మీ నియమమును తప్పకుండా చూసుకొండి.అంతెందుకు పరమహంసకున్న ఏకపత్ని ధర్మమును చెడకొట్టడానికి ప్రకృతి 148 ఆడవాళ్ళను ఆయనమీద ప్రయోగించింది.ఆయన తన దగ్గర భార్య ఉన్నపుడు అలాగే ఆమె విడాకులు పొంది దూరమైనపుడు గూడ కలలో గూడ తన ధర్మమును తప్పలేదు.అందుకే ఆయన జీవన్ముడైనారు.

2.అలాగే సాధనలో ఉన్నపుడు ప్రతి సాధకుడు గూడ నాలుగు "ప" అనగా పైకము,పెదవి,పదవి,పేరు అనేవాటికి దూరముగా మన అవసరము ఎంతవరకు అంతలో ఉండాలి.వీటియందు అతి ఉండరాదు.

3.అలాగే కర్ణాటక ప్రాంత లింగయతులు ధరించే నవపదార్ధ ఇష్టలింగమును మీరుగూడ ధరించండి.  ఈ లింగమును మీరు చనిపోయినపుడు మీతోపాటు దహనము లేదా పూడ్చిపెట్టాలి.ఎందుకంటే ఇది మన కర్మబీజలింగము అన్నమాట.ఇందులో ఉండే నీలిరంగు రెడియోషన్ శక్తికి మనకి ఉన్న కర్మబీజాలు, కర్మవాసనలు,రుణాలు,సర్వరుణానుబంధాలు, సర్వకర్మబంధాలు నాశనమై మనకి కర్మ జన్మ లేకుండా చేస్తుంది.కాబట్టి ఇది ప్రతి మోక్ష సాధకుడు ఈ ఇష్టలింగమును తప్పనిసరిగా చచ్చేదాకా ధరించవలసి ఉంటుంది.

4.ఇలా అరుణచల శివ గురుమంత్రముగా ప్రతినిత్యము చేసుకొండి.

5. ప్రతిశివరాత్రినాడు అరుణచలము వెళ్ళి లింగోద్భవ కాల సమయములో ఆది అణ్ణామలై గుడి బయటపరిసరాలకి వెళ్ళి అక్కడ కనిపించే అరుణగిరి అగ్రభాగమును తదేకముగా ఏకగ్రతగా చూస్తూ అరుణచల శివ నామస్మరణ చేస్తూ ఉండండి.మీకు శివయోగము ఉంటే ఆ సం.రమే శివజ్యోతిదర్శనము అవ్వవచ్చును.అవ్వకపోవచ్చును.అయితే మాత్రము మీరు జీవన్ముడే అవుతారు.అవ్వలేదా..మరుసటి సం.ర శివరాత్రికి అరుణచలమును చేరుకొని ఇదే విధానము చెయ్యండి.మీకు అంతిమదర్శనము ఈ అరుణగిరి శివరాత్రి శివజ్యోతిదర్శనము అయ్యేదాకా మీ సాధన వదిలిపెట్టకండి.ఒకవేళ అయినగూడ సాధన ఆపకండి.మీ దేహము వదిలిపెట్టేదాకా నేను చెప్పిన విధానము అనగా 1. మీరు ఎంచుకున్న ధర్మమును పాటించడము 2. అరుణచల శివ నామస్మరణ 3. నాలుగు "ప" లకి దూరముగా ఉండటము 4. ఇష్టలింగమును ధరించడము 5. శివరాత్రినాడు అరుణగిరిదర్శనమునకు వెళ్ళి శివజ్యోతిదర్శనము   ఇలా ఈ అయిదు పాటించండి.  మీకు మోక్షము వద్దన్నాగూడ ఎంతో సహజసిద్దంగా వచ్చేస్తుంది.ఇలా వీటిన్ని మేమంతాగూడ పాటించి జయము పొంది మోక్షము పొందాము గదా.ఇలా మీరంతాగూడ పాటించి జయము పొంది పూర్ణమోక్షము పొందుతారని ఆశిస్తూ..ఆశీర్వాదము ఇస్తూ..ఇక సెలవా మరి..

పరమహంసలు పరమపదించడము:

ఈ భాగమును కాకాజీ వ్రాయడము జరిగింది.ఎందుకంటే 2021 మహశివరాత్రి నాడు పరమహంస పవనానంద స్వామిజీ పరమపదిస్తే..2023 కార్తీకపౌర్ణమి రాత్రి సిద్ధరామ జిజ్ఞాసి పరమపదించడము జరిగింది.అందుకే ఈ అంతిమ భాగము నేను వ్రాయడము జరిగింది.నాకు పరమహంస వరుసకి బాబాయ్యగారి అబ్బాయి నాకు అన్నయ్య అవుతాడు.ఈయన వలన నాకు మోక్షము పొందాలనే విపరీతమైన ఆధ్యాత్మిక పిచ్చి పడ్డముతో ఇల్లువిడిచి క్షేత్రాలు తిరగడము ఆరంభించాను.చివరికి అరుణచలక్షేతమునకు చేరుకొని అవాసము చేస్తూండగా మా అన్నగారు  పరమహంస అలాగే వీరి యోగమిత్రుడైన జిజ్ఞాసి అక్కడ కనిపించడము జరిగింది.వారిద్దరి అరుణచల అనుభవాలు నాతో ప్రతిరోజు పంచుకొనేవాళ్ళము.ఇలా మా ముగ్గురి సాధనలు ఈ క్షేత్రములో కొనసాగుతూండగా అనుకోకుండా పరమహంస పరమపదించడము జరిగింది.ఆ తర్వాత జిజ్ఞాసి ద్వారా నాకు కన్నీయన్ స్వామినంద దీక్షనామముతో మోక్షసన్యాసి దీక్ష పొందడము జరిగిన కొన్నిరోజులకి జిజ్ఞాసి గూడ పరమపదించడముతో వీళ్ళు నడిపే ఈ బ్లాగ్ అలాగే ఛానల్ బాధ్యతలు నేను తీసుకోవడము జరిగింది.వీరిద్ధరుగూడ అరుణచలము గూర్చి తెలుసుకొని ఈ మట్టిలో కలిసిపోయి శాశ్వత అరుణజ్యోతులుగా ఈ అరుణగిరి మీద ఇపుడికి ఉన్నారు. ఇలా నేనుగూడ పోవ్వాలని నా సాధన ప్రయత్నములో ఉన్నాను.అందుకు గాను నాకున్న జ్ఞానకర్మబీజమును నాశనము చేసుకొనే ప్రయత్నములో నా వంతు సహయముగా ఈ బాధ్యతలు తీసుకోవడము జరిగింది.ఇంతడితో ఈ గ్రంధ రచన సంపూర్ణమైంది.అలాగే వీటిని లోకానికి జ్ఞానప్రచార బాధ్యతను నా తుదిశ్వాస వరకు ఈ దేహజన్మ తీసుకోవడము జరిగింది. 
     

                                         చెప్పేదెవరు..చెసెదెవ్వరు..అంతా శివుడే శివుడు.. 

విశ్వములో చివరికి ఏముంది?

పరమహంస గారు దీర్ఘాలోచనలో ఉన్నారు.కారణము ఏమిటంటే విశ్వానికి విశ్వమోక్షము ఉన్నదా?లేదా ఆయనికి అర్ధము కావడము లేదు.చివరిలో ఒక స్ఫటిక శివలింగము దర్శనమిచ్చింది.ఇది నాశనము అవుతుందో లేదో గూడ తెలియడము లేదు.ఎవరికివారికి వ్యక్తిగతముగా ఒక స్ఫటికలింగము వస్తే వారి సాధనపరిసమాప్తి అయ్యి నిశ్చలమోక్షస్ధితిన్ని పొందుతారని జ్ఞానస్ఫురణ ఇంతవరకు అయ్యింది.కాని ఈ స్ఫటికలింగము కాస్త విస్పోటనము చెందితే ఏమి జరుగుతుందో చూడాలని పరమహంసకి ఆలోచన వచ్చింది.కాని ఇది ఎలా జరుగుతుందో ఈయనకి ఒక పట్టనా అర్ధము కాలేదు.ఇక దానితో ఈ  ఈ విశ్వానికి మోక్షము లేదని కేవలము వ్యక్తిగత మోక్షము అదిగూడ నిశ్చలస్ధితి మోక్షము మాత్రమే ఉన్నదని బలంగా నమ్మడము మొదలుపెట్టారు.కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా ఈయని దగ్గరికి ఈయన భౌతికగురువైన విచిత్రవేదాంతి గారు వచ్చి అసలు విషయము తెలుసుకొని నీ జ్ఞానశక్తి ఎంతవరకు వెళ్ళుతుందో అంతవరకు వెళ్ళి వ్యక్తిగత మోక్షమే ఉందని..విశ్వమోక్షము లేదని చెపుతున్నావు.కాని నిజానికి నీ సాధనశక్తి పరిధిన్ని ఇంక పెంచి చూడు..ఇపుడు నీ సాధనశక్తి ఒక లక్ష వరకు ఉంది.మానవ దేహము కాస్త 10 లక్షల శక్తి తట్టుకోగలదు.అదే ఆయత మహచండీ దేవి తత్వము.ఈమెకి 10 లక్షల శక్తి ఉంది.ఈ శక్తికి నీ సాధన  శక్తిన్ని పెంచిచూడు.అపుడు నువ్వు ఈ విశ్వములో అంతములో ఏముందో తెలుసుకోగల్గుతావు.సృష్టిలో అంతముందా...అంతములో సృష్టిందా నీకే తెలుస్తుంది.విశ్వానికి మోక్షముందా లేదా అనేదిగూడ అర్ధమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు.దానితో పరమహంస గారు ఆలోచనలో పడి తనలాంటి ఒక లక్ష సమశక్తి ఉండి వారి దగ్గర స్ఫటికలింగాలు ఉన్న పదకొండు మందిని ఎంచుకున్నారు.ధ్యానములో వీరంతాగూడ ఒకరోజు కూర్చున్నారు.అంటే నవ అయత చండిశక్తి అనగా పదకొండు లక్షల శక్తితో ధ్యానములో కూర్చున్నారు.ఇలా రోజూకి 16 గంటలుపైగా ఆరునెలలుపాటు ధ్యానములో కూర్చున్ని వారి ధ్యానశక్తిన్ని నాకు తమ ఆత్మానుసంధానము ద్వారా ఇస్తూ నేను పొందిన ధ్యానానుభవాలు వాళ్ళుగూడ పొందడము జరిగింది.అందరికి ధ్యానములో యధావిధిగా ఒక స్ఫటికశివలింగము దర్శనమివ్వడము ఆరంభమైంది.కొన్ని క్షణాల తర్వాత పరమహంస వీరందరి మధ్యలో కూర్చుని ధ్యానము చేస్తూండముతో ధ్యానానుభవాలు వీరికి అగుపించడము ఆరంభమైనాయి.మొదట అంతరిక్షములో ఒక స్ఫటికలింగము దర్శనమిస్తే..పాతాళములో నల్లరాతి శివలింగము దర్శనమిచ్చింది.ఈ రెండు లింగాలు అనుసంధానము అయితే అపుడు పీఠము నల్లరాతిగాను..లింగభాగము స్ఫటికబాణలింగముతో ఉన్న మరో మూడవ శివలింగ దర్శనమిచ్చింది.దానితో వీరందరికి ఆరోజు ధ్యానభంగమైంది.కొన్నిరోజులు తర్వాత మళ్ళీ వీరంతాగూడ కలిసి ధ్యానములో కూర్చుంటే ఈ మూడవ శివలింగము అనేది బ్రహ్మసూత్రలింగమని తెలుసుకున్నారు.అంటే ఈ లింగ ముఖభాగములో ఒక కొండ మధ్యలో టాబ్లెట్ ఆకారమున్న ఒక లింగము ఉన్న గుర్తు ఉన్నట్లుగా గుర్తించారు.అంటే ఈ లింగము అనేది 1000 లింగాలతో సమానమైందని అర్ధము.కాని నిజానికి కోటిలింగాలతో సమానము అన్నమాట.అసలు ఈ బ్రహ్మసూత్రలింగము గూర్చి విచారణ చెయ్యడము ఆరంభించారు.అపుడు ఆదిలో కాశ్మీరులో వాసుదేవగుప్త అనేయోగి ఉండేవారు.ఈయనకి అక్కడే ఉన్న మహదేవ పర్వతము పైన 77 బ్రహ్మసూత్రలతో ఉన్న ఒక సత్ గ్రంధము దొరికింది.ఈ సూత్రాలకి ఒక్కొక్కదానికి 120 భావాలున్నాయని ఇది వారి జ్ఞానపరిధిబట్టి వారి భావమును అందుకుంటారని తెలుసుకున్నాడు.అనగా ఒక బ్రహ్మసూత్రమైన జ్ఞానబంధనం అనగా ఏ జ్ఞానము బంధనము అవుతందో సరిగా ఎవరికి అర్ధముకాదు. అనగా జ్ఞానము అంటే లోకజ్ఞానమా..తత్వజ్ఞానమా..విజ్ఞానమా..అజ్ఞానమా..బ్రహ్మజ్ఞానమా..ఆత్మజ్ఞానమా..ఇలా ఎన్నో రకాలుగా ఉన్న జ్ఞానాలలో ఏ జ్ఞానము బంధనము అవుతుందో ఎవరికి వారి ఉహజ్ఞానమూనకే వదిలేయ్యడము జరిగింది.ఇలా 77 బ్రహ్మసూత్రాలున్నాయి.దానితో ఈయన 77 బ్రహ్మసూత్ర శివలింగాల నిర్మాణము చేసి లోకానికి ఇవ్వడము జరిగింది.అంతెందుకు ఏకసంధాగ్రహి అయిన శంకరాచార్యుడికి ఈ బ్రహ్మసూత్రాలు అర్ధమవ్వటానికి 18 రోజులు పట్టిందని దానితో ఈ సూత్రాల ఆధారముగానే దక్షిణామూర్తి సోత్త్రము చెయ్యడము జరిగిదని పెద్దల ఉవాచ.ఈ సోత్రము ఆధారముగా చూస్తే స్ఫటికలింగానికి అధిపతిగా దక్షిణామూర్తి ఉంటారని..పైగా ఈయన చిన్ముద్ర చేతిలో ఎవరికి కనిపించకుండా స్ఫటికబాణలింగముంటుందని తెలుస్తుంది.ఇది ఇలా ఉంటే స్ఫటికబాణలింగానికి అలాగే స్ఫటికశివలింగానికి గల తేడా ఏమిటో తెలుకోవాలని అలాగే బ్రహ్మసూత్రాలకి ఈ స్ఫటికశివలింగమునకు ఉన్న సంబంధము ఏమిటో తెలుకోవాలని ఎవరికి వారే విచారణ చెయ్యడము ఆరంభించారు.

అపుడు పరమహంసకి ధ్యానములో ఒక స్ఫటికలింగము దానిని చుట్టు 108 వృత్తాలలో ఒక్కొక్క వృత్తములో సుమారుగా 108 చొప్పున కోడిగ్రుడ్లు ఉన్నాయి.5సం.రాల పిల్లవాడు ఒకడు ఒకగ్రుడ్డును తీసుకొని పగలకొట్టగా డొల్లగా కనపడింది.మరొగుడ్డును తీసుకొని పగలకొట్టగా అందులో పచ్చసొన కనపడింది.ఇది కాస్త ప్రాణము దానిలాగా కదులుతూ నేలమీద పడి మిగిలిన గుడ్లలను దానింతట ఇదే పగలకొట్టడము ఆరంభించింది.అపుడు పగిలిన గుడ్డులలో కొన్ని డొల్లగా ఉంటే అందులోనికి నేలమీడ పడ్డ పచ్చసొన ప్రవేశించి కొంతసేపు అందులో ఉండి మరొగుడ్డును పగలకొట్టి అందులోనికి ప్రవేశించి కొంతసేపు ఉండి మరొగుడ్డున్ని పగలకొట్టి  అందులోనికి ప్రవేశించడము ఇలా అక్కడ ఉన్న అన్ని గుడ్డులను ఈ పచ్చసొన ప్రవేశించి గ్రుడ్డులను నాశనము చేస్తూ చివరిగా అన్ని గుడ్డులు నాశనమైన తర్వాత ఆఖరి గుడ్డూలోనికి ఈ పచ్చసొన ప్రవేశించడముతో ఇది కాస్త ఒక స్ఫటిక బాణలింగముగా మారి ఆఖరున్న ఉన్న అదే మధ్యలో ఉన్న స్ఫటికశివలింగము నందు ఈ స్ఫటికబాణలింగము ఐక్యమవ్వడముతో పరమహంస ధ్యానాన్ని ఆరోజు ధ్యానభంగమైంది.ఈ జ్ఞానదృశ్యమును ఆత్మవిచారణ చేసుకుంటే కొడిగుడ్డులన్ని కూడ కర్మ-జన్మాలకి సంకేతమన్ని..పచ్చసొన అనేది కోరికయని..ఎపుడైతే జీవుడు కాస్త కోరికతీతాస్ధితికి చేరుకుంటాడో వాడు కాస్త ఆత్మలింగమైన బాణలింగముగా మారి పరమ మోక్షలింగమైన స్ఫటికశివలింగములో ఆత్మ కాస్త పరమాత్మయందు లయం చెందినట్లుగా  చెందుతుందని ఈయనికి అర్ధమైంది.అంటే ఎవరి దగ్గరికి అయితే స్ఫటిక బాణలింగము వచ్చిందో వారికి కర్మ-జన్మలు ఉండవని కాని కర్మశేషముంటుందని దానినిగూడ సంపూర్తిగా తీర్చుకోవాలని అందరు తెలుసుకొండి.అంటే తనకి కర్మలు జన్మలు లేవని కేవలము కర్మశేషముందని పరమహంసకి అర్ధమైంది.ఎందుకంటే ఈయనికి రుషికేశి క్షేత్రమునుండి ఒక స్ఫటికబాణలింగము రావడము జరిగింది.ఇక ఆదిజన్మకి కారకమైన అదికర్మశేషము ఏమిటో తెల్సుకోవాలని అనిపించింది.ఇలా కొన్ని రోజులు గడిపోయాయి. ఒకరోజు ధ్యానములో ఈయనకి వైకుంఠపాళి ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు.మూడురోజుల తర్వాత ఇంటిముందు ఉన్న అరుగుమీద ఈ ఆట ఆడుకుంటు పిల్లలు ఇలలో కనిపించారు.దానితో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పటమును తీసుకొని జాగ్రత్తగా పరిశీలించడము చూస్తే పరమహంసకి చిరునవ్వు వచ్చింది.విధి ఆటను మన పూర్వీకమహర్షలు ఏనాడో ఈ  ఆట పటములో పెట్టారని అర్ధమైంది.ఈ ఆటలో కొన్ని గడులకి కొన్ని పేర్లున్నాయి.ఉదహరణకి 87 గడికి సన్యాసమని ఉంటే ఆఖరి గడి అయిన 132 గడికి ఆదిపరాశక్తి అన్ని దీని ముందు ఉన్న 131 గడికి కాముడు అని పేర్లు పెట్టడము జరిగింది.అంటే సన్యాసము తీసుకున్న వాడికి కర్మలు తీరిపోయి ఈ స్ధితికి వస్తే వాడికి  కర్మశేషముగా కామముంటుందని..దానిని దాటితే కాని ఆఖరి గడి అయిన ఆదిపరాశక్తికి చేరుకోడని..లేదంటే పున:కర్మజన్మలలో పడతాడని ఈయనకి అవగహన అయింది.అందుకే కామికానివాడు మోక్షగామి కాలేదని..నిజానికి కామగుణము అనేది అమ్మవారిలో లేదని అయ్యవారికి ఉందని అందుకే 131 గడికి కామిని అనకుండా కాముడు అన్నారని ఈయనికి అర్ధమైంది.ఇన్నాళ్ళు అమ్మవారి కామానికి బలికాకుండా వస్తే ఇపుడు అంతిమ పరీక్షగా కర్మశేషముగా పురుష కామమాయ గా అందరికి వస్తుందని దీనిని దాటినవారికి అమ్మగడికి వెళ్ళేయోగముంటుందని లేదంటే 107లో ఉన్న ఒక పెద్దపాము నోటిలో పడి పున:కర్మజన్మ చక్రబంధములో పడి  నాశనము అవుతాడని అర్ధమైంది.ఇదింతా బాగానే ఉంది.అన్నీ త్యాగము చేసిన వాడికి కామామాయ ఏముంటుంది అనిపించింది.పురుష ప్రకృతి తనతో కామ ఆట ఆడాలని అనుకుంటుందని ఈయనికి అర్ధమైంది.ఇది ఇలాండగా ఒకరోజు ఈయనకి తెలియని వ్యక్తి నుండి కాల్ మరియు మెసెజ్ రావడము జరిగింది.ఇలా ఇదే కాల్ నుండి సుమారుగా అరునెలలుపాటు ప్రతిరోజు రావడముతో ఈయనకి ఇక ఎత్తకతప్పలేదు.ఇలా ఎత్తడమే ఈయన చేసిన అది పెద్దతప్పు అవుతుందని అన్నితెలిసిన ఆయనే ఉహించకలేకపోయాడు.ఈయన కాల్ ఎత్తగానే అవతలి నుంచి ఒక అబ్బాయి వాయిస్ వినిపించింది.తను ఒక కొరియర్ బాయి అన్ని నాకు ఎదో మెడిసిన్ పార్శీసులు వస్తున్నయని నా  అడ్రసు తెలియక వాటిని వెనక్కి తిప్పి పంపిస్తున్నామని..మూడురోజుల క్రితముగూడ ఇలాంటి పార్శీలు వచ్చిందని అడ్రసు చెప్పితే ఇస్తానని చెప్పడము జరిగింది.పరమహంసకి ఇతను ఏమి చెపుతున్నాడో అర్ధము కాలేదు.ఎందుకంటే తనకి ఎవరుగూడ మందులు ఇలా పార్శీలు చేసి పంపించడము జరగదు.పొరబాటున తప్పడు అడ్రసుకి వస్తోందేమోనని అడ్రసు ఒకసారి చూసుకొమ్మని చెప్పి ఫోన్ పెట్టేశారు.మరుసటి రోజు యధావిధిగా ఈ కొరియర్ నుండి కాల్ రావడము ఇది ఏదో చూద్దామని పరమహంస అడ్రసుకి రావడము జరిగింది.పార్శీసుల మీద ఈయన అడ్రసు ఉండముతో దీనిని తెరిచిచూస్తే అందులో సుగర్ వ్యాధికి సంబంధించిన మందులు ఉన్నాయి.తనకి ఈ వ్యాధి ఉన్నదని ఎవరు అంత ఖచ్చితముగా తెలుసుకొని తనకి ఈ మందులు ఎవరు పంపిస్తానారో తెలుసుకోవాలని అడ్రసు చూస్తే కవియన్ అని ఫోన్ నెంబరు ఉంది.సరే దీనికి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు.ఇలా మూడు నెలలు గడిచాయి.అక్కడేమో ఎవరు ఫోన్ ఎత్తడము లేదు.ఇక్కడేమో ఈ మందులు పార్మీసులు ఆగడము లేదు.దీనితో పరమహంస ఇలాగాదనుకొని ధ్యానములో ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తన మనోజపసిద్ధితో చూడగా వ్యక్తి ఎవరోకాదని తనకి పార్శీసులు అందించే కొరియర్ బాయే తనకి మందులు కొని ఇలా దొంగచాటుగా ఇస్తున్నాడని తెలియడముతో పరమహంస కాస్త ఇతన్ని నిలదీసి అడిగేసరికి అవునని నిజము ఓప్పుకోవడముతో ఎందుకు ఇలా చేశావని అడిగేసరికి ఆ అబ్బాయి కాస్త అమితముగా సిగ్గుపడుతూ తను ఒక ట్రాన్స్జెండర్ అని..మగతనము ఉన్న అబ్బాయిలంటే తనకి అమితమైన పిచ్చియని..వారి స్పర్శ పొందాలని..వారితో సెక్స్ చెయ్యకపోతే తన దేహము ఉన్న లేనట్లేనని ఇలా తనకి నేను కనిపించానని..అందుకని నన్ను అనుసరించి నా ఇష్టాలు,సమస్యలు నాకే తెలియకుండా తెలుసుకొనే క్రమములో గుడి దగ్గర నాకు గావాలసిన సుగర్ మందులు ఇక్కడ దొరకడము లేదని తను తెలుసుకొని ఈ మందులు నేపముతో నాకు దగ్గర అయిన తన పిచ్చిగా ఉన్న కామకోరికలు తీర్చుకొని తన శరీర తీటను అలాగే మనస్సు ఆరాటలను తనతో శృంగారము చేసి తీర్చుకోవాలని గత ఆరునెలలు నుండి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని..తన కోరికలు తీర్చుకోవడము కోసము చాలమంది జీవితాలు నాశనము చేసాడని..తన కోరిక తీర్చకపోతే తనలాంటివాళ్ళు 50మంది గుంపుతో ఇంటి మీదకి వచ్చి రచ్చ చేస్తానని బెదించడముతో ఇదింతా విన్న పరమహంస చిరునవ్వు నవ్వితే అక్కడే ఉన్న జిజ్ఞాసి మతిపోయి ఆలోచనలో పడ్డాడు.అపుడు పరమహంసకి ఇదింతా కామ కర్మశేషమైన కాముడి లీల అని అర్ధమై అతనికి ఎంత నచ్చచెప్పిన వినపోయేసరికి అటుగా వెళ్ళుతున్న ఎద్దున్ని పరమహంస కాస్త తన కనుచూపులతో రెచ్చకొట్టేసరికి ఇది కాస్తా ఈ జెండర్ వెంటపడేసరికి ప్రాణభీతితో అక్కడనుండి పారిపోయాడు.కాని ఇతనిలో తప్పు లేదు.ఎందుకంటే వీరి శరీర హోర్మున్స్ ప్రభావము  వలన మగ పిల్లాడిగా పుట్టినప్పుడికి ఆడపిల్ల లక్షణాలే ఎక్కువుగా ఉండముతో ఆడపిల్లగా మారుతూ అటునిటూ కాని స్ధితిలో నపుంకసకుడిగా మారుతున్నారని లోకవిధితమైన సత్యమే గదా అనుకొని జగన్మోహిని అవతారము అలాగే అర్ధనారీశ్వర అవతారాలు ఇవేగదా అని పరమహంసకి అనిపించి ఇక తన ఆఖరి కర్మశేష కాముడిమాయ దాటడముతో ఊపిరి పిల్చుకొని తన దృష్టినంతాగూడ తిరిగి ధ్యానతపస్సు మీద పెట్టడము జరిగింది.కాముడిమాయ దాటడముతో ఆఖరి అంక ఆట మొదలైందని పరమహంసకి అర్ధమై వరుసపెట్టి తన మనోనేత్రమునందు కదులుతున్న ధ్యానదృశ్యాలు చూస్తూ గుర్తుపెట్టుకుంటూ సాక్షిభూతముగా నిశ్చలస్ధితిలో చూడటము ఆరంభించారు.మొదట ధ్యానములో ఒక స్ఫటిక బాణలింగము కాస్త అంతరిక్ష మధ్యలో దర్శనమిచ్చింది.ఇందులో మధ్యభాగములో ఒక అరుణజ్యోతి దర్శనమైంది.ఈ జ్యోతి మధ్యభాగములో జ్యోతిబిందువు దర్శనమిచ్చింది.ఈ బిందువు లోపుల ఒకవైపు నల్లశివలింగము మరొకవౌపు తెల్లనిశివలింగము ఈ రెండు శివలింగాల మధ్యలో మధ్యబిందువుగా ఒక స్ఫటికమణి దర్శనమైంది.ఇదియే చింతామణి అని పరమహంసకి అర్ధమై    నిశ్చలస్ధితిలో ఉండి చూస్తూండగా ఈ స్ఫటికమణి లోపుల ఒక జీవుడు అటునిటూ కదులుతూ కనిపించాడు.కొంతసేపటికి ఈ స్ఫటిక మణి మధ్యభాగములో చేరేసరికి ఒక నల్లశివలింగము అలాగే తెల్లశివలింగము కనిపించాయి.కొన్నిక్షణాలు తర్వాత ఉగ్రరూప నరసింహస్వామి దర్శనమిచ్చి తన కడుపులో అపుడికే ఉన్న నల్ల శివలింగానికి బయట ఉన్న తెల్లశివలింగమును మింగి తన కడుపులో ఈ రెండు లింగాలను మిళితముగా అవ్వగా అపుడు తెల్లనిబాణలింగము తలభాగముగా ఉండి నల్లశివలింగ పానమట్టముగా ఉన్న మిళిత శివలింగము దర్శనమిచ్చి ఈయన నోటి నుండి బయటికి వచ్చి అరుణగిరి లోపులకి వెళ్ళింది.ఆ తర్వాత ఈ లింగము కాస్త లోపులకి వెళ్ళితే స్ఫటికజలములో ఉన్న రుద్రలింగ దర్శనమిచ్చింది.అంటే మనకి ఆఖరిగా దర్శనమిచ్చే స్ఫటికశివలింగమని పరమహంసకి అర్ధమైంది.ఈ రుద్ర స్ఫటికలింగము మధ్యభాగములోనికి వెళ్ళేసరిక ఒక స్ఫటిక బిందువు దర్శనమిచ్చింది.ఈ బిందువుకి సుమారుగా 107 స్ఫటికమణులు కలిపి ఒక స్ఫటికమాలగా కనపడింది.అంటే భగవద్దీగతలో లోకాలు అన్నిగూడ స్ఫటికమణులకి గుచ్చపడిన మాలగా నాయందు ఉంటాయని చెప్పిన పద్యజ్ఞానస్ఫరణ అయింది.అంటే నిజానికి ఈ మాలకి ఉన్న మణిపూసకి ఉన్న 108 డైమండ్ గుర్తుల ఆకారములో ఉండటము అలాగే ఇందులో మధ్యగా జ్యోతిబిందువు ఉండి దాని కాంతి కాస్త ఈ 108 గుర్తుల మీద పడటముతో మనకి 108 మణిపూసలున్న మణిమాలగా కనపడుతుంది.అంటే నిజానికి ఒకే మణిపూస ఉంది అన్నమాట.దీనిని బింబమే మనకి 108 మణీపూస ప్రతిబింబాలుగా అసత్యము కాస్త సత్యముగా 108 లోకాలుగా లేదా డైమర్ష్ గా కనపడుతున్నయని పరమహంసకి అవగహన వచ్చింది. ఇది ఇలాయుంటే ఈ ఆదిమణిపూస యందు నాలు ద్వారాలున్నట్లుగా అదిగూడ ఒకదానితర్వాత మరొకటి ఉన్నట్లుగా ఒక్కొక్క ద్వారానికి ఇద్దరు దేవతలు చొప్పున కాపల ఉన్నట్లుగా ధ్యానదృశ్యమైంది.ధ్యానము నుండి బయటికి వచ్చి ఆత్మవిచారణ చేసుకుంటే రుద్రసూక్తాలలో శ్రీవల్లభేశోపనిషత్ యందు ఈ నాలుగుద్వారములు గురించి చెప్పడము జరిగినదని లీలగా పరమహంసకి గుర్తురావడము జరిగింది.అది ఏమిటంటే ఈ నాలుగుద్వారాలు అనేవి ధర్మ,అర్ధ,కామ,మోక్ష ద్వారాలని..ఇందులో ధర్మమునకు అధిదేవతగా విష్ణువు ఉంటే ఈ ద్వారానికి రక్షకులుగా రమానారాయణులు ఉంటారని అలాగే రుద్రుడు కాస్త అర్ధద్వారానికి అధిదేవతగా ఉంటే ఈ ద్వారానికి రక్షకులుగా ఉమామహేశ్వరులు ఉంటారని..అదే కామద్వారానికి అధిదేవతగా శక్తిమాత ఉంటే ఈ ద్వార రక్షకులుగా రతిమన్మధులుంటారని అదే మోక్షద్వారానికి అధిదేవతగా సూర్యుడు ఉంటే ఈ మోక్షద్వార రక్షకులుగా మహీవరాహమూర్తులు ఉంటారని ఇందులో చెప్పడము జరిగింది.అంటే ఈ ద్వారాలు దాటుకుని వెళ్ళితే కాని ఆదిలో మనకి ఏమి ఉందో తెలియదని పరమహంసకి అర్ధమైంది.అలాగే ఈ నాలుగు ద్వారరక్షకులు పెట్టే వివిధరకాల మాయలు దాటితే కాని ఈ ద్వారాలు తెరుచుకోవు అని అవగహన అయింది. ఒప్పుకున్న పెళ్ళికి వాయించకతప్పదుగదా.మాయలు,మర్మాలు ఉన్నాయని ఇక్కడే కూర్చుని ఉంటే లోపలకి వెళ్ళేదెవరు..అక్కడ ఏముందో తెలుస్కొ చెప్పేదెవరో..ఎవరో ఎదో చెప్పేదానికన్నా అది ఏదో స్వయంగా తనే తెలుస్కొని అనుభవము పొందితే మంచిది కదాయని వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుక పోతుంది..వస్తే మోక్షము వస్తుంది లేదంటే పున:జన్మ వస్తుంది అనుకొని ఈ మణిపూసలోని మధ్యబిందువుగా ఉన్న దివ్యజ్యోతిబిందువులోనికి తన పదవ దేహమైన మనోదేహముతో ఏకాకి..ఓంటరిగా..ఏకాంతముగా..ఏకత్వస్ధితిలో..స్ధిరప్రజ్ఞతతో ఈ బిందువులోనికి పరమహంస ప్రవేశించడము జరిగింది.అపుడు ఈయనకి ఒక ద్వార అలాగే దానికి కాపలదారులుగా రమనారయణుడు కనిపించేసరికి ఈ ద్వారబంధనముగా ఉన్న శాలిగ్రామసుదర్శనచక్రము మున్నదని ఇది నిరంతరముగా అవిచ్చిన్నముగా తిరుగుతోందని..ఇందులో ఉన్న మూలబిందుకి వెళ్ళితే కాని ఈ విశ్వమూలములో ఏముందో తెలియదని అనుకుంటుంగా పరమహంసకి ఉన్నట్టుండి ఆశ మొదలైంది.విపరీతమైన ధనాంక్ష,విపరీతమైన కామాంక్ష,విపరీతమైన పదవి వ్యామోహము,విపరీతమైన కీర్తిప్రతిష్టలు పొందాలని ఇలా ఎన్నో ఆశలు,ఆశయాలు తన ప్రమేయము లేకుండా మొదలైనాయి.వాటిని అదుపు చెయ్యాలి లేదంటే వాటికి బలి అయితే ఈ ద్వారము నుండి వెనుతిరిగి  తే పున;జన్మ వస్తుందని అర్ధమై తనలో వచ్చిన ఆశ తాలుకా విషయాలను ఆలోచించడము మానివేసి 48 నిమిషాలుపాటు నిశ్చలస్ధితిలో ఉండేసరికి తిరుగుతున్న సుదర్శనచక్రము కాస్త నెమ్మదించి అదికాస్త రెండుభాగాలుగా విడి లోనికి వెళ్ళటానికి దారి ఇచ్చింది.ఇదింతా చూస్తుంటే పూర్వము విఠలాచార్యుడు సినిమాలలో నిధిల కోసము వెళ్ళినపుడు ద్వారబంధాలు దగ్గర కాపలాదారుండి ఏవో ప్రశ్నలు అడిగితే వారికి సరియైన సమాధానాలు చెప్పితే లోపలకి పంపించడలాగా ఉందని అనుకొని ఈయన లోపలకి వెళ్ళడము జరిగింది.అపుడు ఈయనకి యోగనిద్రలో ఉన్న అనంతపద్మనాభుడు లీలామూర్తిగా సజీవమూర్తిగా స్వప్నశరీరధారిగా కనిపించారు.ఉలుకు లేదు.పలుకు లేదు.కళ్ళుమూసుకుని ధ్యానతపస్సులో ఉండి తనలో తాను రమిస్తూ ఈ విశ్వసృష్టిలోని స్ధితికారకము చేస్తురని అలాగే ఈయన చుట్టుగూడ మానవుడిలో విపరీతమైన ఆశలు రేపించే ఏన్నోన్నో దివ్యశక్తులున్న వస్తువులు,నాగమణులు, చింతామణులు, రసమణులు, ఇవేకాకుండా ఇక్కడ నిధినిక్షేపాలు, మణులు,  బ్రహ్మపదవులు, దేవత వేశ్యలు ఇలా ఏన్నో..మరి ఏన్నో  కనిపించాయి.ఈ గది లోపల ఇవి ఉండటము వలన తనకి గది బయట ఆశ భావాలు వచ్చియని అవగతమై వీటి అన్నింటిని సాక్షిభూతంగా చూస్తూ ఈ గది చివరికి వెళ్ళితే అక్కడ మరో ద్వారబంధనము కనిపించింది.ఈ ద్వారము చూడటానికి ఢమరుకము లాగా అనిపించింది.ఇందులోంచి ఢమరుకనాదము రావడము ఈయన గమనించారు.అలాగే ఈ ద్వారానికి రక్షకులుగా ఉమామహేశ్వరులు కనిపించారు.వీళ్ళు ఉలకలేదు.పలకలేదు.మౌనముగా చూస్తు ఉన్నారు.ఇక్కడకి వచ్చేసరికి పరమహంసలో ఏదో తెలియని చెప్పలేని భయాలు మొదలైనాయి. మరణభయాలు,పాపభయాలు, జంతువులభయాలు,కామభయాలు,ఇలా ఏన్నోరకాల భయాలు ఈయన్ని ఆవరించాయి.ఇలా వీటిని మౌనముగా సాక్షిభూతముగా 48 ని. భరించగానే ఈ ద్వారము తెరుచుకుంది.ఈ గదిలోపుల మధ్యలో పంచముఖ శివుడి లీలారూపము దర్శమిచ్చింది.ఈయన చుట్టు మనలో భయాలు కల్గించే పాములు,పులులు,సింహలు, ఎద్దులు,విషపదార్ధాలు,మణిమానిక్యాలు,విభూధి,కపాలాలు,అస్ధిపంజరాలు,సంగీతవాయిద్యాలు ఇలా ఎన్నో ఎన్నోంటి పరమహంస చూస్తూండగా ఉన్నట్టుండి పంచముఖ శివుడి కాస్త ఒక దివ్యతేజస్సు బిందువుగా మారి మరుక్షణములో ఈ బిందువు కాస్త 11 తేజబిందువులు మారడము పరమహంస గమనిస్తూ మౌనముగా ఉన్నారు.ఇంతలో ఈ 11 బిందువులు కాస్త అంటే ఇవే ఏకాదశిరుద్రులని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయింది.మొదట బిందువు ఆ తర్వాత మూడు వరుసలలో మూడు బిందువులు ఉండి చివరిలో ఆఖరి బిందువు ఉన్న ఏకాదశరుద్ర బిందువుల నిర్మాణము ఉన్నట్లుగా కనిపించింది.విచిత్రము ఏమిటంటే ఈ బిందువుల మధ్య ఉన్న అనుసంధాన నిర్మాణాలు మారిపొతూంటే ఈ ఎకాదశ రుద్రబిందువులు కాస్త ఓంకారముగా..స్వస్తిక్ ఆకారముగా..పాము ఆకారముగా..ఢమరుకారముగా.. అడ్డుబొట్టుగా.. నిలువుబొట్టుగా ..త్రిశూలముగా..యత్భవము తత్భవతిగా క్షణాలలో ఆలోచనాలు కాస్త భావరూపాలుగా ఇవి కాస్తా స్వప్నశరీరాలుగా మారుతున్నయని గమనించారి.కాని ఇవి ఏవరో ఆలోచనలు బట్టి ఈ రూపాలు క్షణాలలో మారుతున్నాయని పరమహంసకి అవగతమై మౌనముగా ఈ గది చివరికి చెరితే అక్కడ మరో ద్వారబంధనం కనిపించింది.ఇక్కడ ఈయనకి ఈ ద్వార రక్షకులుగా రతిమన్మధుడు శృంగారము చేస్తూ తమ పనిలో తాము ఉన్నరని పరమహంసకి అర్ధమై ఉండగా ఈయనలో ఉన్నట్టుండి స్పందన,ప్రతిస్పందనలు విపరీతముగా కల్గుతున్నాయి.అందులో విపరీతమైన కామవాంఛాలు అదిగూడ పరస్త్రీల మీద,అక్రమసంబంధాల మీద,అక్రమసంతానము మీద వావివరుసలు లేని రాక్షస కామాలమీద,యక్షణులు,గంధ్వరులు,ప్రేతాత్మలు,రాక్షస్లు,భూతాలు,పీశాచాలు,దేవతలు మీద లేనిపోని అదుపులేని కామాలోచనాలు పరమహంసలో చాలా ఉద్రత్తముగా వస్తున్నాయని గమనించి మౌనముగా వీటికి వేటికి స్పందించకుండా ప్రతిస్పందికుండా 47ని.పాటు స్ధిరచిత్తముతో ఉన్నప్పడికి 48వ ఆఖరి క్షణములో  ఈయనకి ఒక బొట్టు వీర్యము బయటికి రావడము గమనించి ఏదో తెలియని కామభయానికి కొన్నిక్షణాలుపాటు గురికావడముతో ఈయనకి ధ్యానభంగమైంది.ధ్యానదృశ్యము కాస్త అదృశ్యమైంది.కామికానివాడు మోక్షగామి కాలేడని ఈ కామద్వారము వద్ద అనుభవము పొందిన పూర్వకమహర్షలు ఉవాచగా చెప్పడము జరిగినదని అర్ధమైంది.కొన్నిరోజులు తర్వాత పరమహంసకి ఇద్దరు అమ్మాయిలు పరిచయమై ఆయనికి గురుసేవ చేసుకొనే శిష్యులుగా ఉంటామని సంసారాలు వదిలిపెట్టి సన్యాసము తీసుకుంటామని చెప్పడము జరిగింది.ఇక్కడ తను తీసుకున్న సస్యాసిదీక్ష పరిస్ధితి ఏమిటో అర్ధముకాక అయోమయములో ఉంటే వీళ్ళు కొత్తగా సన్యాస దీక్ష తీస్కొని అదికూడ బంగారములాంటి సంసారము వదిలిపెట్టి మరి సన్యాసములో కలువాలా?అనుకొని అమ్మా..తల్లి..మోక్షానికి మూడవ ద్వారమైన కామద్వారమును సాధనలో నూటికి 99.99 శాతము మంది దాటలేక కామమాయ జీవబలి అయ్యి పున:కర్మ జన్మాలు పొందుతున్నారు.ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడుగూడ ఇంతవరకు సృష్టించలేదు.కామబలహీనత దాటలేక ఎలా దాటాలో అర్ధముగాక నేను ఈ స్ధితిలో ఉన్నాను.ఇపుడు మీరు  సంసారమాయలు దాటి సన్యాసదీక్ష తీసుకొని కామమాయ దాటుతామని నా దగ్గరికి వచ్చారు.మీ ఇద్దరిది గూడ పురాణ వైరాగ్యమే కాని స్మశాన వైరాగ్యమే ఇక రాలేదు.ఇలాంటి వైరాగ్యము పొందిన నాకు కామమాయ చుక్కలు చూపించి తన బలహీనత నాకున్నదని నిరూపించి జయము పొంది నాకు అపజయము ఇచ్చింది.మరి నా పరిస్ధితి ఇలా ఉంటే మరి స్ధితి ఏమిటో ఉహించుకొండి.లేదు కాదు అంటే ఈ ఈ క్షణమే మీ ఇద్దరికూడ శక్తిపాతము చేసి ఈ కామద్వారము వద్ద వచ్చే కామమాయలు దాటి నా దగ్గరికి వస్తే మీకు మోక్షమే వస్తుందని చెప్పగానే ఈ ఆడపిల్లలు మారు ఆలోచించకుండా సంసారాలు మానసికగా వదిలిపెట్టి భౌతికముగా గృహస్ధు ఆశ్రమములో ఉంటు పరమహంస వద్ద శక్తిపాతము పొంది శక్తివంతులై శివధ్యానము చేసుకుంటూ ఓంకారనాదముతో గాయిత్రి మంత్రసిద్ధితో అరుణచల శివ నిత్యనామస్మరణ చేసుకుంటూ సాధన చేసుకుంటుండగా కామద్వార దృశ్యము వీరికి ధ్యానదృశ్యమైంది.గత జన్మాలలో కామ కర్మశేషముగా మిగిలిపోయిన కర్మఫలము కాస్త వీరికి కామమాయగా మారి పరపురుషుల రూపములో వచ్చింది. ఇందులో ఒకరికి భర్తలుండగా ఒక భర్తకి వీరిద్దరు భార్యలుగా మారే దుస్ధితి వచ్చింది.అనగా ఒక స్త్రీ భర్త మరొ స్త్రీకి అక్రమ సంబంధ భర్తగా మారి ఆ స్త్రీ కి సంతానము ఇచ్చే కామమాయలో కొట్టాకొనిపోయారు.ఇలా 9 సం.రాలు ఈ కామామాయకి బలి అయ్యారు.దానితో మళ్ళీ పరమహంస దగ్గరికి వచ్చారు.ఈయన అనుగ్రహముతో 3 సం.రాల సాధనశక్తితో పరమహంస వీరికి ఈ కామమాయ దోషమును తొలగించి యధావిధిగా సాధనలో ఉంచారు.మళ్ళా వీరిద్దరి సాధనశక్తి కాస్త తిరిగి కామద్వారానికి చేర్కుంది.కామమాయ వీళ్ళమీద చూపించడము ప్రారంభించింది.ఎంతలా అంటే శక్తిపాతసిద్ది చేసిన గురువైన పరహంస మీద వీళ్ళకి  విపరీతమైన కామా మోహ,వ్యామోహలు కల్గాయి.తట్టుకోలేకపోయారు. నిజానికి గురువు అంటే తండ్రి తో సమానమైనవారు గదా.అలాంటి గురువు మీద తమ ఇద్దరికి ఆదిజన్మలో ఈయన తమ భర్తయని జ్ఞానస్ఫురణాలు అందడముతోపాటుగా అదినిజమేనని ఆ జన్మాల తాలుకా ధ్యానదృశ్యాలు కనిపించేసరికి వీళ్ళ కాస్త పరమహంసన్ని ఒకరు మానసికముగా..మరొకరు శారీరకముగా ఈయని తమ భర్తగా భావించుకొని భౌతిక భర్తలమీద వైరాగ్యము పెంచుకొని ప్రకృతి చూపించిన ఆదిజన్మ భర్తయే తమ నిజభర్తయని భావించుకొని ఆయనకి మానసికముగా భార్యలుగా మారి పతిసేవతో మోక్షము పొందాలని మనోనిశ్చయముతో ఎవరికివారే ఒకరికిమరోకరు  తెలియకుండా కామద్వార మోక్షసాధన చేస్తున్నారు. ఇదింతాగూడ వీళ్ళు పరమహంసకి చెప్పిన ఆయన స్పందించలేదు.పట్టించుకోలేదు.ఎందుకంటే కృష్ణుడు కొందరికి బాలగోపాలముగా కనపడితే మరొకొందరికి...దేవుడిగా..గురువుగా..యోగిగా..భోగిగా..శాస్త్రవేత్తగా..జ్యోతిష్యవేత్తగా..కాలపురుషుడిగా..భర్తగా..ప్రియుడిగా యత్భావము తత్బవతిగా ఎలాయితే కనపడతాడో అలా వీళ్ళకి తను కనపడుతున్నానని పరమహంసకి అర్ధమై మౌనము వహించారు.ఈయన వీళ్ళని తన కామవిన్యాసంలో ఉంచి వీళ్ళచుట్టు ఈయన తిరిగితే అది వాళ్ళకి కామమాయగా మారి సాధనకి అడ్డుగా మారుతుంది.మరి ఇలాంటి విషయాలలో పరమహంస ఎనాడుగూడ తనకి తానై స్పందించకుండా అవతలివాళ్ళని ప్రతిస్పందింప చేస్తూ తన కామమాయను వీళ్ళకి వరముగా మారుస్తూ గురుసేవ కాస్త పతిసేవగా మారుస్తూ వీళ్ళకి తనే అన్నీ జ్ఞానకామమాయలో ఉంచి మాయ మాయం చెయ్యడములో ఆరితేరినవారు గావడముతో ఈయన ఇలాంటి వాటికి పెద్దగా పట్టించుకోరు.ఇలా ఈ అమ్మాయులు మళ్ళీ కామద్వారము దగ్గర ఆగిపోవడముతో ఇందులో ఎదో తెలియని మర్మరహస్యమున్నదని వీరిద్దరి చేత ఈయన కామాఖ్యదేవి యోనిపూజ చెయ్యించడముతో వీళ్ళలో ఒకరు మోహిని అంశని మరొకరు కామిని అంశయైన యక్షణులు అని పరమహంసకి అవగతమైంది.ఇలా 64 మంది యక్షిణీంశ స్త్రీమూర్తులు వచ్చి తనని భర్తగా భావసాధన చేస్తారని అవగతమైంది.ఎందుకంటే ఈ యక్షణులు అంతాగూడ అమ్మవారి తీరని కామవాంచ తీవ్రతరములో ఉండగా స్వేదబిందువులు నుండి ఉద్భవించినవారే గదా.అంటే తను సాధన స్ధితి శివోహం స్ధితికి చేరుకోవడముతో ఈ ఆడపిల్లలు సాధనగూడ శివధ్యానస్ధిద్ధి పొందడముతో యక్షనీఅంశ గావడముతో తను వీళ్ళకి గురువు కాస్త నడయాడే శివుడి అనే జ్ఞానస్ఫురణతో అందడముతో ఈయన భర్తయని కామమాయందు ఆనందస్ధితిలో ఎవరికివారే రమిస్తూ పతిసేవ మార్గముతో మోక్షసాధన చేసుకుంటారు.ఇదింతా అక్షర సత్యమే.ఈ ఇద్దరుగూడ పరమహంసకి 9 నెలలు నుండి చుక్కలు చూపిస్తూంటే మిగిలిన 62మంది యక్షణ స్త్రీలు వస్తే పరమహంస పరిస్ధితి ఏమిటని జిజ్ఞాసి ఆలోచనలో పడ్డాడు.సమస్య ఇచ్చేది ఆయనే... సమాధానమిచ్చేది ఆయనే అనుకొని సాక్షిభూతముగా అంతా చూస్తూ చోద్యముగా చూస్తూన్నాడు.ఇదింతా తెలిసిగూడ ఏమి తెలియనివాడిలాగ  పరమహంసగూడ ఈ యక్షణులతో ఆటలు ఆడుతూ దత్తత్రేయస్వామివారి తత్వముతో తన శరీరమును మాయభావములో ఉంచి మనస్సుని అన్నింటికి అతీతమైన రాహిత్యస్ధితిలో ఉంచుతూ ఈ యక్షణుల మాయలలో ఉంటూ ఈ మాయను చేదించే మర్మరహస్యమును వెతికే పనిలో ఉంటారని అతికొద్దిమందికి మాత్రమే తెలుసు.అపుడే మాయ మాయం అవుతుంది గదా.ఇది ఇలాయుండగా ఒకరోజు పరమహంసకి పళినికుమారస్వామి సజీవమార్తిగా తనధ్యానములో కనిపించడము పరిపాటి అయింది.ఆయనమో ఉలకడు.పలకడు.ఎదో చెప్పాలని ప్రయత్నమైతే చేస్తున్నాడు.అది ఏమిటో ఒక పట్టన పరమహంసకి అర్ధమైంది కాదు.ఒకరోజు రోడ్డమీద వెళ్ళతున్న ఒక తాత చేతికర్ర అలాగే ఒక సాధువు చేతిలో ఉన్న యోగ దండము అలాగే రైతు చేతిలో ఉండే వెదురు కర్ర బాగా ఆకర్షించాయి.అలాగే రాజదండముగా పళినీకుమారిస్వామి చేతిలో ఒక కర్ర ఉండటము అపుడుకాని పరమహంసకి అసలు విషయము బోధపడలేదు.యక్షణులు నిజానికి చేతికర్రలకి భయపడతాయి.అలాగే ప్రేమకి దాసోహం అవుతాయి.అంతే కాని వాటిని మంత్రాలతో బంధించాలని చూసిన బాధించాలని చూసిన భయపెట్టి ఆదీనము చేసుకొవాలని చూసిన అవతలివాళ్ళకి తమకామమాయందు బందీలన్ని చేసి మదపిచ్చి ఎక్కించి పిచ్చివాళ్ళగా మార్చి చంపేస్తాయని ఇలాంటి యక్షనుల్ని ప్రేమతో వశపర్చుకొని వాటితో సంసారాలు చేసి 112 మంది యక్షపిశాచ సంతానాలు పొందిన కేరళ నంబూద్రి జీవితచరిత్ర పుస్తకము చదివి  పరమహంస తెలుసుకున్నారు.ఇకదానితో యోగదండాలమీద స్వామీజీ దగ్గర ఉండే త్రిదండి మీద పరిశోధనలు చెయ్యడము ఆరంభించారు.అపుడు వెదురుకర్ర లేదా రావి కర్ర వలన భోగకామమాయలు అలాగే యోగదండ కర్ర వలన యోగకామమాయలు అదే నల్ల తుమ్మచెట్టు కర్ర వలన యక్షణి పిశాచ కామమాయలు పోతాయని తెలుసుకొని ఈ మూడింటిని సేకరించి యోగదండముగా చేసుకొని 64 యక్షణులు కామమాయ దాటడము జరిగింది.ఇదింతా తెలుసుకున్న ఈ యక్షణి ఇద్దరి స్త్రీమూర్తులకి తనని మానసికముగా పతిసేవమార్గములో అనుసరించి పూర్ణశూన్యమను పూర్ణమోక్షమును వరముగా ఇచ్చి వారిని యధావిధిగా భౌతిక సంసార గృహస్ధు ఆశ్రమములో ఉంచి మానసికముగా శివయోగిని సన్యాసదీక్షయందు తమ మనసులని ఉంచి   ఆకాశము కేసి చూస్తూ తమకి పూర్ణశూన్యము నుండి మోక్షమరణ పిలుపు కోసము ఎదురుచూస్తూ కామమాయ దాటే సాధనలో ఉండి మోక్షసాధనను అవిశ్రాంతిగా కొనసాగిస్తూన్నారు.
  
ఇది ఇలాంటే రాత్రిపూట పరమహంస ఇంటిలో మువ్వల గజ్జేల శబ్ధాలు చేస్తూ యక్షణిదేవతలు కాస్త తమ కామమును తీర్చమని ఆయనచుట్టు వెంటపడటము ఆరంభించాయి.కాని ఈయనచేతిలో ఉన్న మాడుకర్రలతో చేసిన యోగదండానికి భయపడి ఈయన్ని ఆవహించేవి కావు.కాని ఈయన చుట్టు తిరిగి వేదించేవి.తన దగ్గరికి రావడము లెదుకాని తన చుట్టు తిరుగుతూ కాలిమువ్వల అందేలతో వేదించడము చేస్తున్నాయి.అందుకే కాబోలు ఈ అరుణచల క్షేత్రములో కిలిగోపురము వద్ద అరుణగిరినాదర్ యోగి మోహినియక్షిణి బంధిస్తే ఆదీణ్ణామలై గుడిలో కామిని యక్షిణి ఒక సిద్ధపురుషుడు బంధించడము జరిగిందని పరమహంసకి అవగతమై పాపము వీటిని బంధించకుండా తనని వేదించకుండా తన దగ్గరికి రాకుండా ఏమిచెయ్యాలని ఆలోచనలు చేస్తూండగా ఈయనికి ధ్యానములో దక్షిణామూర్తి లీలారూపము పదేపదే కనిపించి ఒక పాదము యొక్క మోకాళ్ళు మాత్రమే చాలా స్ఫష్టముగా కనిపించేది.పరమహంసకి ఒక పట్టన అర్ధము కాలేదు.ఒకరోజు ఆవు మేడలో ఉన్న చిన్నచిరుగంటలు ఎందుకో ఈయన్ని బాగా ఆకర్షించాయి.వాటిని అలా చూస్తుండగా ఎందుకో తనకి ధ్యానములో కనిపించే దక్షిణామూర్తి పాదమోకాళ్ళికి రెండు చిరుగంటలు కట్టి ఉండటము లీలాగా గుర్తుకు వచ్చి ఆయన ఫోటోలు చూస్తే చిరుగంటలు ఉండటము నిజమని గమనించి ఆరోజే ఒక చిరుగంట కొని తన యోగడండమునకు కట్టారు.  అపుడు నుండి ధ్యానములో యక్షణులు కనిపించడము కాని కామకోరిక తీర్చమని వేదించడము లేదు.కారణము ఏమిటని ఆత్మవిచారణ చేసుకుంటే సాధనలో అంతిమస్ధితికి సాధకుడు చేరుకున్నపుడు వాడికి గుండుసూది నేలమీదపడితే ఆ శబ్ధనాదము కాస్త ఒక అణుబాంబు పేలుడుతో సమానమని అందుకే మహకాలకూట విషము సేవించి మరణము పొందేస్ధితిలో మహశివుడున్నపుడు అమ్మవారి చెవికుండ నాదము వలన ఆయన కోమాస్ధితి పొందకుండా మరణాతీతస్ధితి పొందడము జరుగుతోందిగదా అలా ఈ చిరుగంట నాదము కాస్త యక్షణులకి పెద్దశబ్ధము ఒంకారనాద గంటనాదములాగా ఈ నాదము వినిపించడముతో ఇవి తనని వదిలిపెట్టి వెళ్ళయని అందుకే దక్షిణమూర్తి రూపమైన చిదంబర నటరాజమూర్తికి కాలిమువ్వలతో నాట్యముచేస్తూ యక్షణులతో ఉంటే అదే మౌనదక్షిణమూర్తిగా అరుణచలేశ్వడిగా కాలికి చిరుగంటలు కట్టుకొని యక్షణులను తన ఆధీనములో ఉంచుకొంటారని పరమహంసకి అవగతమైంది.ఇది ఇలాయుండగా తన ధ్యానమునందు కామద్వార తెరుకొని అందులోనికి తన మనోదేహము ప్రవేశిస్తూన్న ధ్యానదృశ్యము కనిపించసాగింది.అంటే ఇన్నాళ్ళూగా తనలో ఉన్న  యక్షిణుల వలన ఏర్పడిన కామమాయ సంపూర్తిగా తొలగిపోవడముతో కామద్వారము తెరుచ్కున్నదని ఇపుడు కామగదిలో ఏముందో చూడాలని అనుకుంటూ గదిమధ్యభాగము చేరుకొని అక్కడున్న కామశక్తి  స్వరూపుణి అయిన మణిద్వీపవాసియైన రాజరాజేశ్వరీదేవి కాస్త ఏకాంతముగా..ఏకాకిగా..ఏకత్వస్ధితిలో సజీవమూర్తిగా లీలామూర్తిగా దర్శనమిచ్చింది.ఈమె చుట్టు 64 యక్షణులు సేవలు చేస్తూ అదృశ్యముగా ఉన్నట్లుగా కనిపించారు. 

అమ్మవారు లీలమూర్తిగా కనిపిస్తూ..నీకు మోక్షము కావాలా లేదా నీకు ఇంక ఏమైన ఇష్టకోరికలు తీర్చుకోవటానికి పున:జన్మ ఏత్తుతావా? అని అడిగినట్లుగా జ్ఞానస్ఫురణ అందినది.దానితో పరమహంస ఆలోచనలో పడ్డారు.ఎందుకంటే మోక్షము పొందలనేది అనేది కూడ కోరిక అవుతుంది గదా.అందుకే గీతలో 18వ అధ్యాయముగా మోక్షసన్యాసయోగముగా అనగా మోక్షము అనే కోరికనుగూడ పరిత్యాగము చేస్తే కాని మనము కోరిక రాహిత్య స్ధితికి చేరుకోలేము లేదంటే మోక్షము కావాలని అడిగితే అది పొందామో లేదో తెలియని విచిత్రవస్దకి మన మనస్సు వెళ్ళి మనము మోక్షము పొందినగూడ పొందలేదని అనుమానభయముతో దానిని పొందాలని కోరికతో పున:జన్మతో వెనక్కిరావడము ఇంతవరకు దాదాపు అందరి యోగుల జీవితాలలో ఇలా జరిగింది.జరుగుతోంది గూడ.దానితో అమ్మవారి అడిగిన దానికి సమాధానము చెప్పకుండా మౌనము వహించడముతో అమ్మవారు కాస్త తన పీఠము మీద కాలిబొటన వేళ్ళు కదపగానే అక్కడ పీఠభాగములో ఒక రంధ్రము ఏర్పడి దానిలోనికి పరమహంస కాస్త మనోదేహముతో ఒక దివ్య జ్యోతిబిందువు రూపములోనికి మారి ఇందులోనికి ప్రవేశించడము జరిగింది.అపుడు లోపల ఎరుపు రంగులో మణిద్వీప అధినేతగా వల్లభ గణపతి దర్శనము అయింది.ఈయనగూడ ఉలకలేదు.పలకలేదు.కాని నిశ్చలస్ధితిలో ఉన్నారు.ఉన్నట్టుండి ఈయన బొడ్డు రంధ్రము తెరుచుకోవడము ఆరంభమైంది.అపుడు జ్యోతిబిందువుగా ఉన్న పరమహంస ఈయన బొడ్డులోనికి వెళ్ళగానే గణపతి కడుపులో అండ,పిండ,బ్రహ్మండ లోకాలు అన్ని సమస్తము కనిపించాయి.సర్వ జీవ దైవ కోటి రూపాలు లీలగా కనిపించాయి.ఇలా ఈయన కడుపు మధ్యభాగానికి చేరుకోగానే అక్కడ నాలుగు తలాలతో ఆరు చేతులతో ఉన్న సిద్ధలక్ష్మీదేవి దర్శనమిచ్చింది.ఈమె స్పందన వలన గణపతి కాస్త ప్రతిస్పందించి ఈ విశ్వసృష్టిలో నిత్యము జరిగే సృష్టి,స్ధితి,లయ కార్యాలను పరివేక్షిస్తున్నాడు అని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయింది.అసలు ఇంతకి ఈ సిద్ధలక్ష్మీ ఎవరికి స్పదింస్తోందో తెలుసుకోవాలని పరమహంసకి అనిపించింది.  అపుడు ఆయనకి ఎక్కడి నుండో చాలా నెమ్మదిగా ఓంకారనాదము సన్నగా ఎక్కడో నుండో..ఎవరో చేస్తున్నట్లుగా వినిపించసాగింది.అంటే ఈ ఓంకార నాద శబ్ధానికి సిద్ధలక్షీదేవి స్పందించడము..తద్వారా ఈమె స్పందనకి గణపతి ప్రతిస్పందన చెస్తున్నారని పరమహంసకి అవగతమైంది.  ఈ ఏవరు చేస్తూన్నారో తెలుసుకోవాలని పరమహంస కాస్త ధ్యాననిష్టలో కూర్చుకోగానే సిద్ధలక్ష్మీ స్ధానములో కాంతి మార్గ సొరంగము లీలగా కనిపించింది.అపుడు పరమహంస కాస్త తన మనోదేహముతో ఈ మార్గమునందు సుమారుగా 3కి.మీ పైగా ప్రయాణించగా చివరిలో ఒకచోట ఆగిపోవడము జరిగింది.కాని అక్కడ ఏమిలేదు.ద్వారము లేదు.ద్వారపాలకులు లేరు.కాని ఏదో ఉంది.అడ్డుగా ఉంది.అవతలివైపు వెళ్ళటానికి వీలులేకుండా చేస్తుంది.మనోదృష్టికి గూడ ఇది కనిపించనంత పరిమాణములో ఇది ఉన్నదని పరమహంస గ్రహించారు.ఇంతలో ఈయనకి ఉన్నట్టుండి మహమృత్యువుభయము ఆవరించింది.సాధనశరీరము మీద విపరీతమైన ప్రేమ,మమకార,మోహ,వ్యామోహ కల్గడము ఆరంభమైంది.ఇంతటి సాధనశరీరమును వదిలిపెడితే మళ్ళీ పొందాలి అంటే ఎన్నోకోట్లానుకోట్ల సం.రాల పుణ్యఫలము, శివధ్యానయోగము,మోక్షయోగము ఉంటే తప్ప దొరకదని..ఈ శరీరమును వదిలిపెట్టాలంటే ఏదోతెలియని మరణవేదన ఈయన మనోదేహము పడటము ఆరంభమైందని పరమహంస గ్రహించారు.అదే చావు సమయములో భౌతికదేహమును వదిలిపెట్టేటపుడు ఆస్తులు మీద,సంతానము మీద,కుటుంబ సభ్యుల మీద మమకార,మోహ,వ్యామోహలతో ఎలాయితే వదిలిపెట్టి వెళ్ళతామో అలాగే ఆఖరిలో మనోదెహమును మహమృత్యువుభయము ఆవరించి నానాయాగి చెస్తోందని తెలుసుకున్నారు.ఈ మృత్యుభయమును ఆదిరుద్రుడు జయించడముతో అయన మృత్యుంజయడైనాడు.ఈ మాయను దాటలేక లోకకళ్యాణార్ధమని మనోదేహముతో వెనుతిరిగి భూలోకములో ఆవాసము చేస్తున్న ఎందరో మహత్ముల పరమహంసకి కానవచ్చారు.ఇది ఎలా ఉంది అంటే సప్తసముద్రాలు ఈది ఇంటి వెనుక ఉన్న మురుగుకాల్వలో పడి చనిపోయినట్లుగా...చావటానికి వెళ్ళుతూ బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ఉంది.మోక్షానికి వచ్చి మోక్షద్వారము దగ్గర ఉన్న మహమృత్యువుభయానికి భయపడటము ఏమిటి?నా బొంద..నా బూడిద..ఎదో ఒకటి అవుతుంది.వస్తే మోక్షము వస్తుంది లేదా మహమృత్యువుకి బలి అవుతాము అంతే గదా.ఇక్కడిదాకా వచ్చి వెనుతిరగడము ఏమిటి నా బొంద..తాడో పేడో తెల్చుకోవాలని పరమహంస నిర్ణయించుకొని స్ధిరసంకల్పముతో సాక్షిభూతముగా అలా అక్కడ 48ని.పాటు స్ధిరచిత్తముతో నిలబడేసరికి అపుడిదాకా ఉన్నదో లేదో తెలియని కనిపించని మోక్షద్వారము లీలగా కనిపించడము ఆరంభమైంది.ఈ ద్వారము అంతాగూడ స్ఫటికముతో నిర్మితమై ఉంది.నిజానికి ద్వారము చుట్టు అంతాగూడ తెల్లని స్ఫటికముతో ఉండేసరికి ఈద్వారము విడిగా ఉన్నట్లుగా కనిపించడము లేదని పరమహంస గ్రహించి ఈ ద్వారము లోపలకి ప్రవేసించగానే ఉగ్రమైన వేడిగాలులు మనోదేహనికి తగులుతున్న అనుభూతి పొందడము దానితోపాటు సన్నని స్వరముతో ఓంకారనాదము వినిపించడము పరమహంస గమనించారు.మోక్షగదిలో ఎవరు లేరు.ఏది ఉన్నట్లుగా కనిపించలేదు.కాని ఏదో ఉంది. ఎవరో ఉన్నారని అనుభూతిని పరమహంస పొందసాగారు.మౌనముగా అంతా గమనించసాగారు.ఉన్నట్టుండి అంజి సినిమాలో ఆఖరి సీన్లో కనిపించే రుద్రుడిరూపముగా లాగా ఆదిరుద్రుడి దర్శనము ఇవ్వడము ఆరంభమైంది.మెరుపులు మొదలైనాయి.నీల శరీరముతో..ఉగ్రచూపులతో..కాలకూట విషాగాలలు ఈయన శరీరమునుండి రావడము అంతముందే అక్కడిచేరిన ఇతరమనోదేహలు కాస్త ఈ గాలుల తాడికి సృహ కోల్పోవడము జరుగుతూ ఉండటము పరమహంస గమనించారు.అంటే వీరంతాగూడ మోక్షము పొందాలని కోరికతో వచ్చినవాళ్ళని..ఈ కోరిక కాస్త వీళ్ళకి కర్మశేషమై అది కాస్త కర్మగా మారి మోక్షము కోసము పున:జన్మలలో ఉత్తమ యోగి జన్మలు ఎత్తడానికి ప్రకృతి కాస్త వీరిదేహలను మమ్మీలుగా మార్చి పున:కర్మచక్రమునకు చేరే కాంతి సొరంగమార్గములో ఈ దేహలను పడవెయ్యడము పరమహంస గమనించారు.అందుకే గీతలో మోక్ష కోరికను పరిత్యాగము చెస్తే కాని పూర్ణమోక్షము మనకి అందదని చెప్పడము జరిగింది.ఒక అడుగుదూరములో ఇలాంటివాళ్ళు వెనుతిరగదము చాలా బాధకరమైన విషయమే.కాని తప్పదు.ఎందుకంటే కోరిక వలన ఈతిబాధలు వస్తాయని తెలుసుకొనిగూడ కోరిక లేని సమాజము చూడాలని కోరిక పెట్టుకున్న బుద్దుడి లాంటి వాళ్ళే వీరంతా అని అర్ధమైంది.ఇది ఇలాయిండగా పరమహంస కాస్త ఆదిరుద్రుడి కేసి తెరిపార చూశారు.ఆయన దృష్టి ఎదురుగా ఉన్న ఒక 21 అడుగుల ఉన్న మానవ కపాలము మీద ఉందని గమనించారు.దీనికి ఈయనికి ఏమిటి సంబంధము ఏమిటో ఒకపట్టన అర్ధము కాలేదు.ఈయన తదేకదృష్టి సగములో భూమిలో కూరుకునిపోయిన ఈ కపాలము మీద ఉండటము గమనించి పరమహంస కూడ దానిపైన దృష్టి పెట్టగానే ఒక విధమైన జ్ఞానస్ఫురణలు అందడము ఆరంభమైంది.ఇది మానవ కపాలము కాదని ఆదిబ్రహ్మ యొక్క 5వ బ్రహ్మకపాలమని..ఆదిరుద్రుడు కాస్త ఎందుకో ఆవేశమునకు గురై కాలభైరవుడిగా మారి బ్రహ్మ యొక్క 5వ తలను నరకడము ఇది కాస్త ఈయన చేతికి అంటుకొని ఆదిరుద్రుడు కాస్త కపాలరుద్రుడై కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడ గంగాస్నానముతో ఈ కపాలము కాస్త ఈయన చేతి నుండి వీడి అది కాస్త బదరీనాధ్ క్షేత్రము దగ్గరిలో పడి బ్రహ్మకపాల క్షేత్రముగా మారినదని ఈయన స్ఫురణలు రావడము ఆరంభమైంది.ఇదింతా బాగానే ఉంది.ఆదిరుద్రుడు ఎందుకు ఈ తలను నరికాడు అనేది తెలుసుకోవాలని అనిపించింది.పురాణైతిహసాలలో విభిన్న కధనాలు ఉండటము ఈయనకి లీలగా గుర్తుకువచ్చింది.ఇందులో ఏది సత్యమో..అసత్యమో అది వాసినవాడికి తప్ప చదివినవాడికి తెలియదని అనిపించి.. దానితో తన అనుభవ జ్ఞానముతో ఈ పంచకపాల రహస్యమును చేదించాలని పరమహంస ఆరంభించారు.

అదిలో ఆదిరుద్రుడు కాస్త సాధనాంతము చేరుకొనేసరికి ఆయనికి మహమృత్యువుభయము పట్టుకుంది.అపుడు ఆయన కాస్త తనకి ఉన్న జ్ఞానముతో ఈ భయము నుండి రాహిత్యస్ధితి పొంది అన్నింటయందు అతీతస్ధితికి చేరుకొని మరణాతీతస్ధితి చేరుకోవడము జరిగింది.దానితో శూన్యములో ఐక్యము గావాలసినవాడు కాస్త శూన్యాతీతస్ధితికి ఆయనికి తెలియకుండానే చేరుకోవడము జరిగింది.ఇక్కడ చాలమందికి ఒక సందేహము రావచ్చును.శూన్యం అంటే శివుడే గదా.మరి ఆయనే శూన్యము అయినపుడు ఆయన కాని మరో శూన్యములో లయము అవ్వదము ఏమిటి అన్నపుడు అనాద శూన్యములో ఆది అరుణజ్యోతి శరీరరూపముతో ఆదిరుద్రుడు రావడము జరిగింది గదా.  అంటే రూపము అంటే రుద్రుడని..రూపము కాని స్ధితి శూన్యమని మనము అర్ధము చేసుకోవాలి.రూపము ఉన్న స్ధితి నుండి రూపము లేని స్ధితికి అంటే అరుణజ్యోతి నుండి జ్యోతిరూపము లేని స్ధితి..అదే నేను ఉన్నాను స్ధితి నుండి నేను లేను స్ధితిని పొందడమే పూర్ణమోక్షము అవుతుంది.ఈ స్ధితి పొందే సాధన క్రమములో మన ఆదిరుద్రుడు కాస్త మహమృత్యువు భయానికి గురై దానిని దాటే క్రమములో మృత్యువు పొందాలనినచోట మృత్యుంజయడైన మృత్యువు లేనిస్ధితి పొందడము మరణము లేని శాశ్వతస్ధితి అదే రూపాంతరము చెందని స్ధితిని..మోక్షాతీతస్ధితి..శూన్యాతీతస్ధితి పొందడము జరిగింది.దానితో ఈ విశ్వములో శాశ్వతముగా నాశనమై నిర్జవపదార్ధము లేకుండా పోయింది.ఎందుకంటే కాలి బూడిద నుండి కూడ పున;జీవము పుడుతుంది గదా.మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ విశ్వములో గూడ ఎక్కడగూద..ఏదిగూడ..ఏ జీవిగూడ శాశ్వత మరణము పొందదు.తాతాల్కికముగా మరణాల పేరుతో రూపాంతరాలు చేందుతుంది.అంతే కాని ఎలాయితే శూన్యము నుంచి వచ్చిందో అలా తిరిగి శూన్యము పొందడము జరుగదు.జరగలేదు.ఎందుకంటే ఆదిరుద్రుడైన ఆదిబ్రహ్మపదార్ధము కాస్త శూన్యము కాకుండా శూన్యాతీత స్ధితి అదే మరణమును పొందకుండా మరణాతీతస్ధితి పొందడముతో ఆయన కాస్త రూపాంతరము చెందని రూపముతో శాశ్వతస్ధితిలో ఉండిపోయాడు.ఈయన పొందిన ఈ శాశ్వతస్ధితిని ఏలా పొందాలో బ్రహ్మయ్య పంచకపాలము తెలుసుకోవడముతో ఈ జ్ఞానము కాస్త విశ్వానికి తెలిస్తే అందరుగూడ మరణము లేని శాశ్వతస్ధితిని పొందుతారని దానితో ఈ విశ్వములో సృష్టి-స్ధితి-లయ-తిరోగమ ప్రక్రియలు శాశ్వతముగా ఆగిపోయి ఈ విశ్వమే శాశ్వత మరణాతీతస్ధితిలో నిశ్చలస్ధితిలో శాశ్వతముగా ఉండే ప్రమాదం ఉన్నదని ఆదిరుద్రుడు కాస్త కాలరుద్రుడిగా మారి ఈ కపాలమును ఖండించడముతో కపాలరుద్రుడిగా మారడము జరిగిందని పరమహంస అనుభవజ్ఞానస్ఫురణలు అందడము ఆరంభమైంది.అంటే ఆదిరుద్రుడు కాస్త మహమృత్యుతీతస్ధితి పొందడముతో విశ్వానికి విశ్వమోక్షము లేకుండా పోయినదని ఖరాఖండిగా అర్ధమవుతోంది.విశ్వమోక్షము ఎరుగు..కనీసము వ్యక్తిగత మోక్షమైన ఉందా?అసలు మోక్షము అనేది ఉందా ? ధర్మసందేహలు పరమహంసని వేదించాయి.అసలు మోక్షము అంటే ఏమిటోగూడ మర్చిపోయేస్ధితికి తాను చేరుకున్నానని అర్ధమై పిచ్చివాడిలాగా అవధూతగా మారి తనలో తాను పెద్దగా  నవ్వడము ఆరంభించారు.భక్తికి పరాకాష్టయే పిచ్చియని..వేదాంతికి వేపాకాయంత వెర్రి ఉంటుందని మన పెద్దలు ఉరికే చెప్పలేదని పరమహంసకి అర్ధమైంది.ఇపుడు తను ఏమిచెయ్యాలి.ఏమి తెలుసుకోవాలి.ఇంక తెలుసుకోవటానికి ఏముంది అనే సందేహలు రావడము ఆరంభమైంది. 
 
ఇటు చూస్తే ఆదిరుద్రుడు కాస్త మహమృత్యువుతీతస్ధితిలో ఉంటే అసలు మోక్షము అనేది ఉందా అనే అయోమయస్ధితిలో తాను ఉన్నానని పరమహంసకి అర్ధమైంది.అందుకే నిజయోగులందరుగూడ తాము పొందామో లేదో చెప్పలేని విచిత్ర అవస్ధయని మోక్షము గూర్చి చెప్పడము జరిగింది.కొండను తవ్వితే ఎలుక లేకపోకగా ఏమిదొరకనిస్ధితి తాను ఉన్నానని గ్రహించి ఎమిచెయ్యాలో ఎలా చెయ్యాలో అర్ధము కాని స్ధితిలో ఉంటూ అన్ని తెలిసిన రుద్రుడు మౌనములో ఉండటము..అన్ని తెలిసిన బ్రహ్మకపాలము చెప్పలేనిస్ధితిలో ఉండటము పరమహంసని ఆలోచనలో పడివేసింది.సమస్య ఉంది అంటే దానికి ఖచ్చితముగా పరిష్కారము ఉంటుందని బలముగా నమ్మే  పరమహంసకి  తెగించినవాడికి తెడ్డే గతియని నమ్మే ఈయనకి ఆశజ్యోతిగా బ్రహ్మకపాలము కనిపించింది.ఎందుకంటే అన్నీశరీరాలు అన్నీరూపాలు నాశనము చేసే దహగ్ని ఎందుకు ఆదిరుద్రుడి మనోదేహమును నాశనమును చెయ్యడము లేదో తెలుసుకోవాలని బలముగా అనిపించసాగింది.దానితో తదేకదృష్టితో ఈ కపాలము కేసి చూడటము జరిగింది.అపుడు ఈ కపాలము కాస్త మేకతలగా కనపడసాగింది.అంటే ఈ జంతువు తలను డీకోడ్ చేస్తే  కపాలరుద్రుడి అసలు విషయము అర్ధమవ్వదని గ్రహించి ఆలోచనలో పడ్డాడు.అపుడు మేకతలను ఇంగ్లీష్ లో గోట్ (GOAT) అంటారు గదా. దీని అర్ధము తీస్తే G.O.A.T -Greatest Of All Time- అన్నింటకన్నా కాలము గొప్పది అనే అర్ధము  వస్తుంది గదా. అంటే ఆదిరుద్రుడి మనోదేహమును దహనము చేసే శక్తి దహగ్నికి ఉండదని కేవలము కాలాగ్ని కే ఉంటుందని అర్ధమైంది.ఎందుకంటే రుద్రమంత్రాలలో త్రికాగ్ని..కాలాగ్ని..కాలాయ..రుద్రాయ..నీలకంఠయ అని చెప్పడము బట్టిచూస్తే ఈయన మనోదేహము అనేది కాలాగ్నిలో దహించబడుతుందని మనపూర్వీకమహర్షలు తెలుసుకున్నారు.మరి ఎందుకు దహనము అవ్వడము లేదు అని మీమాంస పరమహంస పడ్డారు.ఇంతలో పరమహంస దృష్టి తిరిగి బ్రహ్మకపాలము మీద పడింది.ఒకవేళ శ్రీరాముడికి రావణబ్రహ్మని చంపడముతో బ్రహ్మణహత్యదోషము అంటుకొవడము జరిగింది గదా.అలా ఈ ఆదిరుద్రుడికి బ్రహ్మతలను ఖండించడము బ్రహ్మహత్యము కాని వచ్చిందా? అదికాస్త  కర్మదోషముగా మారిందా?బ్రహ్మహత్య దోషనివారణ కోసము కోటిశివలింగాలు ప్రతిష్టించాలి.దీనికి సరిసమానమైన బ్రహ్మసూత్ర స్ఫటికశివలింగమును ప్రతిష్టిస్తే ఈ దోషనివారణ జరుగుతుంది.అనగా కాలస్ఫటికలింగమును ప్రతిష్టస్తే ఆదిరుద్రుడికి కాలాగ్నితో దహనము ఆరంభమవుతుందని జ్ఞానస్ఫురణ అందటముతో ఆ రోజుకి ధ్యానభంగమైంది.దానితో త్రికాగ్నికి ప్రతీకగా మూడు రకాల కాలస్ఫటికలింగాలు సేకరించి ఒకటి వల్లభగణపతి గుడిలో 2వది బాలదేవి గుడిలో మూడవది దక్షిణామూర్తి గుడిలో ఇవ్వడము జరిగింది.కొన్నిరోజుల తర్వాత తిరిగి ధ్యాననిష్టలో కూర్చుని ఉంటే ఆదిరుద్రుడి మనోదేహము కాస్త కాలాగ్నిలో దహనము అవ్వడము ఆరంభమైన ధ్యానదృశ్యము కానవచ్చింది.శివము కాస్త శవము అయ్యే దృశ్యము అన్నమాట.కాని విచిత్రము ఏమిటంటే ఎంతకిగూడ ఈయన దేహము నాశనము అవ్వడములేదు.అలాగే అదే రూపముతో నిశ్చలస్ధితిలో ఎలాంటి మార్పులు చెందకుండా రూపాంతరము చెందకుండా కాలాగ్నిలో నిత్యము అవిశ్రాంతిగా దహనము అవుతూనే ఉంది.విచిత్రము ఏమిటంటే ఈ స్ధితికి చేరిన గణపతి,కృష్ణుడు లాంటి దేవతలందరుగూడ వారి మనోదేహలు కాలి బూడిద అవుతూంటే ఆదిరుద్రుడికి ఏమికాకపోవడముతో అంటే  మహకాలకూట విషము తిన్న శివుడికి ఏమి జరగడము లేదు కాని అమృతము సేవించిన దేవతలందరుగూడ అపమృత్యువును పొందుతున్నారు. అందుకే వీరంతా దైవాలు అయితే ఆయన కాస్త మహదేవుడైనాడు. దానితో ఆదిరుద్రుడి దహనము కాస్త నిత్యము వెలిగే కాష్థమైంది.అందుకే మహకాశీక్షేత్రములో ప్రతి 18ని.ఒక శవము నిత్యము దహనము అవుతూనే ఉంటుంది.దానితో అక్కడి దహగ్ని నిత్యకాలాగ్ని కాస్త నిత్య కాష్ఠముగా వెలుగుతున్న ఆరని మారని జ్యోతిగా ప్రకాశిస్తుంది.అందుకే ఈ క్షేత్రానికి కాశీ పేరురావదము జరిగింది.కాశీ అంటే ప్రకాశించే జ్యోతి అన్నమాట.ఈ జ్యోతి ప్రకాశనికి మూలకారణ కారకము అరుణచల క్షేత్రములో ఉన్న అరుణగిరి పైన నిత్యము ఆరని మారని వెలిగే అరుణజ్యోతి అన్నమాట.దీనికి కారణము ఆదిరుద్రుడి మనోదేహము నిత్యము కాలాగ్ని ఆరకుండా దహనము అవుతూండము అన్నమాట.అందుకే శివమహభక్తుడైన రావణబ్రహ్మగూడ శివోహంస్ధితిని పొంది నిత్యము రావణకాష్ఠలాగా నిత్యకాలాగ్నిలో తన మనోదేహమును దహింపచేసుకుంటూ ఉంటున్నాడు.అలాగే శుకమహర్షిగూడ నిత్యకాలాగ్నిలో హిమాలయాలలో ఉంటూ కాలము వెళ్ళబుస్తున్నాదు.అంటే మోక్షము అంటే జీవుడి జీవజ్యోతి నుండి శివుడిగా మారి అరుణజ్యోతిగా మారి నిశ్చలస్ధితిలో శాశ్వతముగా ఉండిపోవడమేనని నాకు అర్ధమైంది.అలాగే మీకుగూడ అర్ధమైంది.నిజానికి మనంతాగూడ పూర్ణమోక్షము పొందిన మోక్షజీవులమే.ఎందుకంటే మన భౌతికదేహలు చుట్టు కాంతివలయ ఆరాశక్తి ఉంటుందని లోకవిధితమే గదా.అంటే మనోదేహనికి కాలాగ్నితో దహనము అవుతూండముతో దాని  ప్రభావము కాస్త మన భౌతికదేహము మీద ఉన్న ఆరాశక్తి కనపడుతుంది.కాని మనము నమ్మము.మనము పూర్ణమోక్షము పొందామని నమ్మలేము.ఎందుకంటే మనము మోక్షము పొందినగూడ పొందామో లేదా అనుమానభయముతో ఉండముతో మోక్షము పొందినగూడ పొందలేదని భ్రమభ్రాంతిలో పడుతున్నాము.దీనినే మహమాయ అంటున్నాము.ఎవరైతే తమ ధ్యాననిష్టతో తాము మోక్షము పొందమని అనుభవ అనుభూతి మోక్షజ్ఞానమును అనగా తాను జీవజ్యోతి గాదని అరుణజ్యోతియని తెలుసుకొంటారో వారు మోక్షగామి అవుతారు.వాడే యుగానికి ఒకడు అవుతాడు.అలాగే మన భవిష్యతు కాస్త గతమై అది కాస్త వర్తమానముగా నడుస్తోందని తెలుసుకొండి.అంటే ఆదిలో అందరుగూడ మోక్షము పొందారు కాని మనకి ఉన్న మాయ అజ్ఞానము వలన ఇది తెలుసుకోలేకపోతున్నాము అని పరమహంసకి అర్ధమైంది.అంటే విశ్వానికి మోక్షము రావంటే కాలాగ్నిలో ఆదిరుద్రుడి మనోదేహము నాశనము అవ్వాలి.ఇది జరుగదు.ఎందుకంటే విశ్వములో శాశ్వత నిర్జీవపదార్ధమే లేదు. ఇది ఎర్పడదు.ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఇంతవరకు భగవంతుడు సృష్టించలేదు. ఆయనికే బలహీనత ఉంది గదా.ఇకపోతే వ్యక్తిగత మోక్షము అనేది మనము జీవజ్యోతి కాదు అరుణజ్యోతి అను జ్ఞానమును ఎవరైతే పొందుతారో వారు మోక్షగామి అవుతారు.ఇది సత్యము..ఇది తధ్యం..అసలు ఇదింతా కాదు.విశ్వమును నడిపించే విశ్వకర్త అయిన ఆదిరుద్రుడు కాస్త నిత్య కాలాగ్నిలో ఉంటే ఈ విశ్వమును ఎవరి ప్రమేయము లేకుండా ఎలా నడుస్తోందో సందేహము పరమహంసకి వచ్చింది.దానితో కాలాగ్నిలో దహనమై కాలరుద్రుడి స్ధానములో కాలస్ఫటికలింగము దర్శనమిచ్చింది.ఇదికాస్త సముద్ర అడుగుభాగములో ఉన్న ఇసుక మీదకి చేరింది.అక్కడ ఈ శివలింగముద్ర పడింది.అపుడు ఉన్నట్టండి కాలాగ్ని వేడికి ఈ స్ఫటికలింగము కరగడము మొదలైంది.అపుడు ఈ స్ఫటికములో ఉన్న స్ఫటిక జలము కాస్త బయటికి రావడము మొదలైంది.అపుడు ఈ లింగానికి ఉన్న పానుమట్టపు వంపులో ఒక పాంచజన్య శంఖము ఉన్నట్లుగా దీనిని ఒక తాబేలు మోస్తున్నట్లుగా లీలగా కనపడింది. స్ఫటికజలము కాస్త శంఖములోనికి చేరడముతో అక్కడ తాబేలు కాస్త ఈ శంఖ జలమును కాస్త బీజాలు ఉన్న పూర్ణకుంభములో పోయ్యడముతో ఈ కుండ కాస్త యుగప్రళయము తర్వాత నీటి మీద తెలుతూండముతో కాలాగ్నిలో దహనమయ్యే రుద్రుడు కాస్త ప్రళయ జలముతో శాంతిపొంది యదార్ధ రూపముతో వచ్చి ఈ పూర్ణకుంభమును తన బాణముతో కొట్టడముతో అదికుంభకోణక్షేత్రమై విశ్వ పున:సృష్టి క్రమము తిరిగి ఆరంభమై దృశ్యము పరమహంసకి కనిపించింది.అంటే సృష్టి అంతములోనే పున:సృష్టి జరుగుతోందని రూడీ అయింది అన్నమాట.ఇదింతా ఏలా జరుగుతుందని అనుకున్నపుడు శూన్య మధ్యభాగములో ఒక కాలయంత్ర నిర్మాణము కనపడింది.దానికి ఏడు చక్రాలున్నాయి.నాలుగు ముళ్ళున్నాయి.చూపించే తెర ఉంది.నాలుగు రీళ్ళు ఉన్నాయి.అంటే ఏడు చక్రాలు తిరగడముతో నాలుగు ముళ్ళు కాస్త ఒక్కొక్కయుగానికి ఒక్కొక్క రీళ్ళు అనగా సత్య,త్రేత,ద్వాపర,కలి యుగాల రికార్డ్ దృశ్యాలు ఆపకుండా ఎవరిప్రమేయము లేకుండా చూపిస్తోంది అన్నమాట.అందుకే గీతలో ఆఖరి ఆధ్యాయములో అఖరి పద్యములో హృదయచక్రయంత్రములో పరమాత్మ బందీయై విశ్వమును నడిపించడము జరుగితోందని చెప్పడము జరిగింది.అదే బుద్దుడు కాస్త ఈ యంత్రమును కాలచక్రము అంటే శంకారాచార్యుడు దీనిని శ్రీచక్రము అని చెప్పితే నేను కాస్త జీవగడియారము చెప్పడము జరిగింది.ఈ యంత్రమును ఆపేవాడు లేదు.ఎందుకంటే ఆపే ఆదిరుద్రుడు కాస్త  కాలాగ్నిలో ఉన్నాడు.మన కర్మ ఏమిటంటే ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే తను తయారు చేసిన ఈ కాలయంత్రమును నాశనము చెయ్యకుండా తను నాశనమైవ్వడము అన్నమాట.దానితో ఈ యంత్రమును నాశనము చేసేవాడు లేకపోవడము జరిగింది.ఎందుకంటే మనంతగూడ ఈఅ యంత్రములో ఉన్న నాలుగు రీళ్ళు ఉన్న జగన్నాటకములోని స్వప్నపాత్రమే గదా.ఇది మీకు అర్ధమవ్వలంటే అదిరుద్రుడు కాస్త ఒక సినిమాహల్ కట్టించి అందులో తను ప్రేక్షకుడిగా మారి తనకి తాను 84 పాత్రలతో నాలుగు భాగాలుగా ఉన్న జగన్నాటకము అనే సినిమాని తీసుకొని దానిని కాలమనే తెరమీద పంచభూతాలతో గూడిన త్రినేత్ర ప్రోజెక్టర్ ద్వారా  సినిమాని నాశనము  చెయ్యకుండా సినిమాని ఆపకుండా నిరంతరముగా అవిచ్చిన్నముగా అవిశ్రాంతిగా నడిచేవిధంగా తయారుచేసి తాను ఒకడే ఏకాకిగా ఏకాంతముగా ఈ సినిమాని తదేకముగా ఆనందముగా చూస్తూచూస్తూ తనకి తెలియకుండా తట్టుకోలేనంత ఆత్మానందస్ధితి పొందుతూ  హృదయము ఆగిపోయి నిశ్చలస్ధితి పొందితే ఎలా ఉంటుందో అలా ఈ విశ్వములో జగన్నాటక కాలయంత్రమును తయారుచేసి దానిని నాశనము చెయ్యకుండా తాను నాశనమయ్యే నిశ్చలస్ధితిలోనికి వెళ్ళిపోవడము ఈ విశ్వము చేసుకున్న అతి పెద్ద తప్పు..అతి పెద్ద శాపముగా  మారింది. ఇది ఎవరు మార్చలేని అంతులేని కధగా అవిశ్రాంతిగా అవిచ్చిన్నముగా కొనసాగుతూనే ఉంటుంది.ఎందుకంటే మార్చవాడే లేడు.కాని వీడు తయారు చేసిన యంత్రము మాత్రము నిరంతరగా పనిచేస్తూనే ఉంటుంది.మనలాంటి పాత్రలు పుడుతూనే ఉంటాయి.పోతూనే ఉంటాయి.వస్తూనే ఉంటాయి.ఏది ఆగదు. ఏది సాగదు. ఏది కొత్తగా రాదు.పాతది పోదు.కధ మారదు. పాత్రలు మారవు. అంటే తెలుసుకోలేని శివుడుంటాదు.తెలుసుకొనే శివుడుంటాడు.తెలుసుకున్న శివుడు ఉంటాడు. ఇదే సత్యము..ఇదే నిత్యము   


మోక్ష దేవుడు -మోక్ష క్షేత్రం: 

స్వామి..మీరు ఒక పక్క దేవుడు లేడని చెపుతూ మరొక పక్క అరుణాచల శివ నామస్మరణ చెయ్యమని చెపుతున్నారు.ఇందులో ఏది సత్యము?అలాగే సప్తమోక్షకేత్రాలలో అలాగే సప్త ముక్తిక్షేత్రాలు కాకుండా అరుణచల క్షేత్రము ఎలా ఆత్మమోక్షక్షేత్రమైదో మాకు అర్ధము కావడము లేదు అన్నపుడు.. సమాధానము ఎమిటంటే దేవాలయములో దేవుడు కాస్త మూలమూర్తులు..ఉత్సవమూర్తులు ఉంటారని లోకవిధితమే గదా.ఈ విశ్వములో భారతదేశము దేవాలయమైతే కాశీ పూజ గది అయితే ఇందులో మూలమూర్తిగా అరుణాచల ఆదిరుద్రుడైన ఆదిశివ ఉంటే..మిగిలిన అన్ని క్షేత్రాలలోని వారంతా వీరి ఉత్సవమూర్తులుగా ఉంటారు. ఎందుకంటే కాశీ అంటే వెలుగుతున్న జ్యోతి ప్రకాశము.ఈ ప్రకాశానికి కారణము అరుణచలములోని అరుణజ్యోతి.ఇది ఎలా సాధ్యమంటే.. ఆదిలో ఆదియుగము నందు వచ్చిన తొలి మహశివరాత్రినాడు అరుణాచల క్షేత్రములో ఒక అగ్నిస్తంభ అగ్నిజ్యోతిర్లింగము ఉద్భవించిది.ఆదిదంపతులైన ఆదిపరాశక్తి,ఆదిరుద్రుడు ఈ అగ్నిజ్యోతియైన అరుణజ్యోతి నుండి ఉద్భవించినది గూడ ఈ అరుణాచల క్షేత్రమే.కాబట్టి మూలమూర్తులు వీరేనని మనకి తెలుస్తోంది గదా.అంటే మొట్టమొదట అనాది శూన్యము నుండి ఒక అరుణజ్యోతి స్వయంభూగా ఉద్భవిస్తే..దీనిని నుండి మొదట ఆదిపరాశక్తి..ఆ తర్వాత అదిరుద్రుడు ఉద్భవిస్తే..వీరి ఇద్ధరి అర్ధనారీతత్వ అంశముతో ఉత్సవమూర్తులుగా త్రిమూర్తులు-త్రిమాతలు ఉద్భవించడము జరిగినదని శాస్త్రవచనముంది గదా.అంటే మనకి దేవుడు అనే భావము కల్గించేది మూలదేవుడైన అరుణచల శివ ఉన్న అరుణచలక్షేత్రమని రూఢీ అయిందిగదా.అలాగే ఈ అరుణాచల శివ ఉన్న అరుణాజ్యోతి ఉనికి కోల్పోతే మిగిలిలేది అనాద శూన్యమే గదా.అంటే దేవుడు లేడు అనే భావమిచ్చేదిగూడ ఇదే క్షేత్రమే గదా.జాగ్రత్తగా ఆలోచిస్తే దేవున్నాడు చెప్పేది-దేవుడు లేడు అని చెప్పేదిగూడ ఈ క్షేత్ర దేవుడైన అరుణాశివయే గదా.ఇక్కడ చాలామందికి ఒక ధర్మసందేహము వస్తుంది.అది ఎమిటంటే ఎక్కడగూడ అరుణాచలశివని పూజించమని చెప్పడము లేదు కాని కేవలము ఈయన నామము నామస్మరణ చెయ్యమని ఎందుకు అంటున్నారు అంటే దీనికి నా దగ్గర లెక్క పక్కగా ఉంది.అది ఎమిటంటే "అరుణచల శివ" నామము లెక్కపెడితే ఏడు అక్షరాలు.వీటిన్ని అక్షరకోటిచేస్తే ఏడు కోట్లు అవుతుంది.ఈ సంఖ్య ఎక్కడో వినట్టుగా మీకు ఉంది గదా.అదే గణేశ్ పురాణములో గణపతి కాస్త అరుణాశ్వర అనే అగ్నిబిందువును మిగినపుడు ఈయన కాస్త 7 కోట్ల గణపతులుగా విస్పోటనము చెందడానని..ఇవే 7 కోట్ల వేదమంత్రాలుగా మారినాయని పురాణవచనము ఉంది.అంటే గణపతి కాస్త శరీరానికి ప్రతీక అనుకుంటే మన ఆత్మశరీరము  ఏడుకోట్ల రేణువులతో ఏర్పడుతుందని చెప్పకనే చెప్పారు.పైగా గణపతి కాస్త అమ్మవారి నలుగు పిండి రేణువులతో అదిగూడ మూడు గుప్పిళ్ళుల పిండితో ఏర్పరించిది.ఇదేవిధముగా వేదవ్యాసుడు బాసర క్షేత్రములో మూడు గుప్పిళ్ళల ఇసుకరేణువులతో సరస్వతిదేవిని తయారుచేసారని ఈ క్షేత్రస్ధల ఉవాచ ఉందిగదా.అంటే మన ఆత్మశరీరము మూడుగుప్పిళ్ళలో ఉన్న ఏడుకోట్ల రేణువులతో ఏర్పడినదని రూఢి అయింది గదా.ఇక ఈ నామస్మరణ చెయ్యడము వలన మన ఆత్మశరీరములోని ఏడుకోట్ల రేణువులు నశించిపోతాయి అన్నమాట.ఇది ఎలాంటే ఒకరోజుకి ఉన్న 1440 నిమిషాలకి ఒక రోజూకి 14,400 సార్లు నామస్మరణ చేస్తే నెలకి 14,400 x 30= 4,32,000 (4 లక్షలు 32వేల) అయితే ఒక సం.రానికి 4,32,000 x 12= 51,84,000 (51లక్షల 84 వేలు) వస్తే అరుణాచల శివలింగ ఖండితాలు 14 గదా.దీనిని 14సం.రాలు అనుకుంటే 5,18,4000 x 14 = 7,25,76,000 (ఏడు కోట్ల 25 లక్షల 76 వేలు) వస్తుంది.అంటే  ఏడుకోట్ల నామస్మరణ 14సం.రాలలో పూర్తి అవుతుందని తద్వారా మన మోక్ష అరుణజ్యోతిలోని ఏడుకోట్ల కాంతిరేణువులు నాశనమై అది శూన్యమై మనకి మోక్షమిస్తుందని దీనిని బట్టి మీకు అర్ధమై ఉంటుందిగదా.అందుకే మనకి మోక్షమిచ్చే అరుణాచల శివ నామస్మరణ చెయ్యమని..అలాగే మూలమోక్షక్షేత్రముగా అరుణాచలక్షేత్రములో ఆవాసము చేసి భౌతిక శరీరమరణము అలాగే ఆత్మశరీర మోక్షమరణము పొందమని చెప్పడము జరిగింది.ఒకటి గుర్తుంచుకొండి.మీలో ప్రశ్నించే మనస్సు ఉన్నంతవరకు మీరు అస్ధిరముగానే ఉంటారు.ఎపుడైతే ఈ ప్రశ్నించే.. వేదించే..బాధించే మనస్సు స్ధానము మన హృదయమని..దానిలో దీనిని ఐక్యము చెయ్యటానికి మనలోని అహము అనే ఉనికి మాయ తొలిగిస్తే మీ సాధన ఈ జన్మలోనే పరిసమాప్తి అయ్యి మోక్షమరణమును పొంది జీవన్ముక్తి పొంది శూన్యము నందు శూన్యమవుతుంది.ఇదే సత్యము.ఇదే నిత్యము..ఇదే అసలుసిసలైన సూక్ష్మములో మోక్షముగా చెప్పడము జరిగింది.మీరు ఆత్మవిశ్వాసముతో ఈ అరుణాశివ నామస్మరణ ఏడుకోట్లు చేస్తూండగానే మీకు సాధనలో వచ్చే అన్నిరకాల మాయలు మర్మలు ఆయన అనుగ్రహముతో తొలగిస్తూ పిచ్చుకకి దారము కట్టిలాగినట్లుగా ఆయన క్షేత్రవాసానికి పిలిపించుకొని మన ఆత్మమోక్షమిస్తాడని ఇపుడికైన ఇది ఒకటి తెలుసుకొని అర్ధము చేసుకొని ఆచరణలో పెట్టకలిగితే సాధన సాధ్యతే సర్వం సాధ్యమని మీ ఈ ప్రస్తుత దేహజన్మ అంతిమజన్మ అందరు చేసుకుంటారని ఆశిస్తూ..



అంతిమ మోక్షమార్గము:

మీకు మోక్షము గావాలని మనోనిశ్చయసంకల్పబలముంటే మీకు ఎలా సాధన చెయ్యాలో తెలియకపోయిన,మీకు నిజగురువులు దొరకపోయిన,మీ సాధనస్ధితిగతులు మీకు తెలియకపోయిన,మీకు కర్మమార్గములో ఏ కర్మలు చెయ్యాలో తెలియకపోయిన,మీకు భక్తిమార్గములో మీకు దైవదర్శనాలు కల్గకపోయిన,మీకు జ్ఞానమార్గములో అందిన జ్ఞానము అర్ధము గాకపోయిన,ధ్యానమార్గములో ధ్యానానుభవాలు కల్గకపోయిన,ఆత్మమార్గములో ఆత్మానుభూతులు కల్గకపోయిన,మీకు ఏలాంటి చక్రస్ధితుల అనుభవాలు కల్గకపోయిన,మీకు ఏలాంటి దైవిక వస్తువులు రాకపోయిన పర్వాలేదు.చింతించకండి.భాదపడకండి.మీరు ఒక పనిని చెయ్యండి. అదియే అరుణచల క్షేత్రములో మరణము పొందండి చాలు.మీ గత జన్మాల సాధన స్ధితిగతులను బట్టి మీకున్న అర్హత,యోగ్యత,యోగాలను బట్టి  మీ మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా ఉన్న 13 యోగచక్రాలను మీ జాగృత కుండలీశక్తితో విభేదనము గావించి బ్రహ్మరంధ్రము నుండి కుండలీశక్తి బయటికి పంపి మీ శరీరానికి ఆరంభ కపాలమోక్షం అలాగే మీ ఆత్మకి అంతిమ ఆత్మమోక్షం కల్గించి అరుణాజ్యోతి నుండి అది శూన్యములో శూన్యమై విధానమును 6 నుండి 14 క్షణాలలో విశ్వమోక్ష గురుదేవుడైన రుద్ర దక్షిణామూర్తి పూర్తిచేసి మీ మోక్షకథకి ముగింపు చెపుతారు.అంటే

          మీ అంతిమ గమ్యం - అరుణాచలం...

    మీ  అంతిమ కర్మ - అరుణాచలం...

మీ అంతిమ భక్తి - అరుణాచలం ...

మీ అంతిమ జ్ఞానం - అరుణాచలం ...

మీ అంతిమ ధ్యానం - అరుణాచలం ...
 
మీ అంతిమయోగం- అరుణాచలం ...
 
మీ అంతిమధర్మం-అరుణాచలం ...

మీ అంతిమఅర్ధం-అరుణాచలం ...

మీ అంతిమ కామం- అరుణాచలం ...

మీ అంతిమ మౌనం- అరుణాచలం...

మీ అంతిమ సాధన- అరుణాచలం ...

మీ అంతిమ ధ్యానానుభవం- అరుణాచలం  

మీ అంతిమ యాత్ర-అరుణాచలం...

మీ అంతిమ ప్రయాణం-అరుణాచలం...

మీ అంతిమ ఆవాసము-అరుణాచలం...

మీ అంతిమ చూపు -అరుణాచలం...

మీ అంతిమ నామము- అరుణాచలం...

అంతిమ సన్యాసదీక్ష - అరుణాచలం

మీ అంతిమ శ్వాస - అరుణాచలం...

మీ అంతిమ మరణం - అరుణాచలం...

మీ అంతిమ మోక్షం - అరుణాచలం
 

ఈ స్ధితి సాధించినవారికి..ఈ స్ధితి పొందిన వారికి సాధన సాధ్యతే సర్వం సాధ్యము అన్నట్లుగా ఆరంభ కపాలమోక్షము నుండి అంతిమ ఆత్మమోక్షము అరుణాచల శివానుగ్రహము వలన మీకు తెలిసిన లేదా తెలియకుండా లేదా అర్ధమై అర్ధముకాని స్ధితిలో తప్పకుండా పొందడము తధ్యం.సత్యం. 

"జననాత్ కమలాలయే... 
దర్శనాత్ అబ్రసదసి...  
కాశ్యాంతు మరణాన్ .... 
 స్మరణాత్ అరుణాచలే ముక్తిః"


భావం: తిరువాయూర్ లో జననం...చిదంబరం లో ఆకాశ శివలింగ దర్శనం...   కాశీలో శరీర మరణం... అరుణాచలేశ్వరుని స్మరణం ఆత్మమరణం ... జీవన్ముక్తి కారకములు.నిజానికి దీని భావము ఈ నాలుగు ప్రదేశాలలో మరణాలు పొందడము కాదు.మొదట కమలాలయేలో జననము అంటే హృదయ అష్టదళపద్మము విచ్చుకోవడము అన్నమాట.ఆ తర్వాత చిదంబరములో శివలింగ దర్శనము అంటే ఈ విచ్చుకున్న హృదయ పద్మానికి శివమోక్షజ్ఞానము పొందడము అన్నమాట.ఆ తర్వాత కాశీలో మరణము అంటే కాశీ అంటే వెలుతున్న జ్యోతి ప్రకాశము అనగా పొందిన శివజ్ఞానముతో ధ్యానము చేసి తనుగూడ ఒక జ్ఞానజ్యోతిగా శివోహంస్ధితి పొంది ఈ జ్యోతి ప్రకాశమునకు కారకమైన జ్యోతి యందు లయం చెందడానికి తారకమంత్రోపదేశము పొందడము..ఇక ఆ తర్వాత ఈ కాశీ జ్యోతి ప్రకాశాన్నికి కారకమైన అరుణాజ్యోతి ఉన్న అరుణాచల క్షేత్ర నామస్మరణ చేస్తే తన ఆత్మకి అంతిమ ఆత్మమోక్షము కల్గి జీవన్ముక్తి పొందడము జరుగుతుంది. 
 


సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||

భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది.(ఇది తిరువాయూర్ లో జననముతో సమానము.)  దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది.(ఇది చిదంబరం లో ఆకాశ శివలింగ దర్శనముతో సమానము ) మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది.(ఇది కాశీలో శరీర మరణముతో సమానము ) అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది.(ఇది అరుణాచల క్షేత్ర ఆత్మమరణముతో సమానము ) జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.



ఇక ఇంతటితో ఈ మోక్షఆత్మగాధకి స్వస్తి  పలుకుతూ మీరందకి మా ఆశీస్సులు ఇస్తూ..  

మీ పరమహంసలు....

శుభంభూయాత్. 


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
అలాగే ప్రతినిత్యము పరమహంస గారు చేసుకొనే "అరుణాచల శివ యోగప్రార్ధన" ను మనముగూడ నిత్యము చేసుకుంటే పరమహంస లాగా మనముగూడ అరుణాచలశివానుగ్రహమును పొంది జీవన్ముక్తి పూర్ణమోక్షము పొందే అవకాశాలు పుష్కలముగా ఉండముచేత పరమహంస చేసిన ఈ యోగప్రార్ధనను యధాతముగా క్రింద ఇవ్వడము జరుగుతోంది.గమనించగలరు. 
 
అలాగే ఈ ప్రార్ధన వీడియో లింక్ ఇవ్వడము జరిగింది.ఈ లింక్ ద్వారా ఈ ప్రార్ధన పీ.డి.ఫ్.ను డౌన్లోడు చేసుకోవచ్చును.

https://youtu.be/yc8Y3JHfnqA

ఇంతడితో నా జ్ఞానానుభవాలు గూడ పూర్తీయ్యాయి.



అరుణాచల శివ యోగ ప్రార్థన

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ

ఓ సర్వాంతర్యా మి..అరుణాచల శివ

సర్వకాల సర్వావస్థలయందు 
నా మనసు ప్రాపంచిక విషయాల నుంచి మరలించి 
నీ మీద లగ్నం అయ్యేలాగా చెయ్యి అరుణాచల శివ ….. (1)

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే లాగా 
స్వార్థం తో కూడిన చర్యలు, మాటలు, ఆలోచనలు 
నాలో రాకుండా కాపాడు అరుణాచల శివ….. (2)

ఈరోజు అలా వచ్చిన వాటికి 
నాలో ప్రతాపం వచ్చిన వాటికి 
నాలో పశ్చాతాపం కలిగించి
ఇక మీద దుష్ట సంకల్పాలు 
నాలో కలగకుండా చూడు అరుణాచల శివ …..(3)

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ....


నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకి
…. చీకటి నుంచి వెలుగులోకి
మృత్యువు నుంచి అమరత్వం వైపుకి
… ప్రయాణింప చెయ్యి అరుణాచల శివ….. (4)

నాలోని చెడువాసనలను
… సంస్కారాలను ప్రక్షాళన చేసి 
మాయ నుంచి నన్ను విడుదల చేసి 
నీ దరి చేర్చుకో అరుణాచల శివ….(5)

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ....


నేను అనేక జన్మల గా చేస్తున్న 
అన్ని పాపపు కర్మలకి నాలో పశ్చాతాపం కలిగించి
వాటి ఫలితాలను అనుభవించే సమయంలో 
వాటిని సహనముతో, ధైర్యంతో
అనుభవించే శారీరక మానసిక స్థైర్యాన్ని, 
మనో ధైర్యాన్ని ఇవ్వు అరుణాచల శివ…. (6)

నాలోని కామపూరిత కోరికలని.. 
ద్వేషాన్ని, అసూయని, పగని, అహంకారాన్ని, 
అరిషడ్వర్గాలను ,సప్త వ్యసనాలను, ఇతర వ్యతిరేక భావాలను
దహించివేసే స్వచ్ఛమైన వివేక జ్ఞాన బుద్ధిని నాకు ప్రసాదించి
నాకు ఆధ్యాత్మిక మార్గమును చూపించే గురువులను నాకు పంపు అరుణాచల శివ….(7)

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ....

నా వలన ఎవరికీ అపకారం కలగని బుద్ధిని
… ఇతరులకి ఇతర ప్రాణులకీ ప్రతిఫలం ఆశించకుండా
ఉపకారం చేసే మంచి బుద్ధిని ప్రసాదించు అరుణాచల శివ… (8)

నాలో కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్య బీజాలు అంకురించి 
జ్ఞాన యానము వేగంగా పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించు అరుణాచల శివ……(9)

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ....


స్వచ్ఛము, సత్యము, ధర్మము, 
కరుణ, ప్రేమ ల నుంచి వేరు చేయకు అరుణాచల శివ  ….(10)

నువ్వు ఎల్లప్పుడు నాతో ఉండు… నాలో ఉండు.. 

నేను సదా నీతో ఉండేలా అనుగ్రహించు అరుణాచల శివ  ….(11)

ప్రతినిత్యం నీ నామస్మరణ చేసే విధంగా అనుగ్రహించు అరుణాచల శివ….(12)


నాకు సకాలములో పూర్ణముగా నీ నిజశివజ్ఞానము నాకు అందించి 
ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహం, ఆత్మను నీలో లయంచేసుకొని 

ఈ దేహనికి అనాయసమరణం ఈ దేహత్మకి జీవన్ముక్తియగు మోక్షమును ప్రసాదించే 

అరుణాచలక్షేత్రవాసియగు అరుణాగిరినివాసియగు 
శ్రీ అర్ధనారీశ్వర బాల సహిత రుద్రదక్షిణామూర్తియగు 
అరుణాచల శివ..నీకు ... (13)



పాహిమాం పాహిమాం పాహిమాం

ఓం సర్వేజన సుఖినోభవంతు

ఓం శాంతి

సర్వం శ్రీ అరుణాచల శివ బ్రహ్మార్పణ మస్తు ... (14)




అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.. 
అరుణశివ..అరుణగిరి శివ....


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

అరుణాచల మహత్యం: 

అరుణాచల క్షేత్ర దర్శనం 
సర్వ అభిష్టాల సిద్ధిరస్తు..

అరుణాచల శివ నామస్మరణం 
అహంకార పతన కారణం.. 

అరుణాచల గిరిప్రదక్షిణం 
జన్మపరంపరకు విముక్తిదాయకం..

అరుణాచల కార్తీక దీపజ్యోతి దర్శనం 
సకల పాప పుణ్య హరణం...

అరుణాచల నివాసం 
సకల ఋణ విమోచనం..

అరుణాచల యోగ అరుణజ్యోతి దర్శనం 
అంతిమ ఆత్మమోక్షప్రాప్తి యోగం..

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

అరుణాచల గిరిప్రదక్షిణ ఫలితాలు: 

ఆదివారం-పూర్ణ ఆరోగ్య ప్రాప్తి..

సోమవారం-శివలోక ప్రాప్తి..

మంగళవారం-సకల ఋణవిముక్తి..

బుధవారం- సరస్వతిదేవి విజ్ఞానప్రాప్తి..

గురువారం-గురు బ్రహ్మజ్ఞానప్రాప్తి..

శుక్రవారం-లక్ష్మీదేవి కటాక్షం...

శనివారం-గ్రహపీడా విముక్తి...

పౌర్ణమి-సర్వాభిష్టా సిద్ధిరస్తు...

కార్తీక దీపోత్సవం-సర్వ పాపపుణ్య హరణం...

నిత్య గిరిప్రదక్షిణం-జన్మల పరంపర  విముక్తి...

శివరాత్రి-ఆత్మమోక్షప్రాప్తి


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


అరుణ గీత :

లేనిది కావాలనిపిస్తుంది.ఉన్నది వద్దనిపిస్తుంది.

దూరంగా ఉన్నవి అందముగాను..చేరువైనవి వ్యర్ధముగాను..

శాంతినిచ్చేవి చీకాకుగా..అశాంతి నిచ్చేవి ఆనందముగాను.

ఆశ,కోరిక,మోహము,వ్యామోహము వలన  
ఆలోచలనలకు అంతులేదు...ఆశలకు పొంతన లేదు.. 

తెగని మనస్సు తెంచుకోలేని బంధాలు..
స్ధితిమితానికి ఆస్తిమితానికి మధ్య ఊగిసలాట..
ఇదే మనస్సు..మనస్సే మాయ.. మాయే మనస్సు..
మనస్సును జయిస్తే మాయ మాయం..

మనస్సుమాయ కాలం కనురెప్పపాటులో కరిగిపోతుంది.
కలగా మారిపోతుంది. 

మనస్సు స్ధిరము చేస్తే మోక్షప్రాప్తియే.
చివరికి శూన్యం..
చేదుగా ఉన్న ఇది వాస్తవం....

ఇది తెలిసినవారికి సిద్ధాంతం.
ఇది తెలుసుకోలేని వారికి వేదాతం..
ఇది తెలిసి తెలియని వారికి రాద్ధాంతం..
ఇదియే అరుణ గీత బోధ..

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

అరుణ గీతం: 

అరుణాచల శివ... 
అలసి సొలసిన ఈ గుండెకు 
ఒకే ఒక కోరిక 
నీ నిజరూప దర్శనం..
ఒకే ఒక ఆశ 
నీ నిత్య నామస్మరణం..
ఒకే ఒక ధ్యాస 
నీ నిత్య ధ్యానం..
ఈ గుండెలో 
నిలిపింది... 
కొలిచింది..
సేవించింది.. 
నిన్నేనయ్యా..అరుణాచల శివ..
నువ్వు లేకుండా నేను లేను తండ్రి..
అన్నీ త్యాగము చేసి ఒంటరిగా ఉన్న 
నాకు నీ తోడు లభించింది అరుణ శివ..
అరుణగిరి యందు 
ఆత్మమోక్షప్రాప్తి కల్గింది.
నా ఈ జన్మ అంతిమజన్మ అయింది. 
ఇది చాలు నాకు ఈ జన్మకి  అరుణాచల శివ..అరుణ శివ.. 

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

 ఇంతటితో ఈ దేహసాధన పరిసమాప్తి అవ్వడముతో...ఈ గ్రంథము ఆఖరి అంతిమభాగమును జిజ్ఞాసి అను నేను రాయడము జరిగింది. రాయటం పూర్తి అయ్యేసరికి ఏకధాటిగా అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా విపరీతముగా వరదలతో కూడిన అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది గంగా యమున అలాగే కృష్ణ గోదావరి నదులకు అలాగే ఇతర నదులకు వరదలు రావడంతో రాష్ట్రాలు- గ్రామాలు- దేవాలయాలు నీట మునుగుతున్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే విశ్వం అంతం యొక్క రికార్డు దృశ్యాలు మనము చూడటము ఆరంభమైనది అని నాకు అర్థం అయినది. అనగా అంతము ఆరంభమైనది అన్నమాట. 

ఏదో ఉన్నది (నేను ఉన్నాను).........ఏమి లేదు (నేను లేను)

ఈ గ్రంథము రాసేటప్పుడు “నేను ఎవరిని” అనే ప్రశ్న సాధనతో ఆరంభమైతే… ఈ గ్రంథము ముగింపుగా “నేను లేను” అనే సమాధాన సాధనతో ముగింపు అవటంతో …. నేను లేను. సర్వము లేదు. అంతా శూన్యమే. అది కూడా లేదని… అది కూడా అంతము అయిపోయినదని మా దేహ సాధన స్వానుభవముతో అనుభవ అనుభూతి పొందడముతో…అపుడిదాకా మంది గూర్చి ఆలోచించే మేము కాస్త మా దేహ మది గూర్చి మాత్రమే ఆలోచించే మౌన:బ్రహ్మ స్ధాయికి… అలాగే ఈ విశ్వమూలమేదో తెలుసుకోవాలనే ఆలోచన అలాగే ఇలా తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకి చెప్పాలనే సంకల్పము... ఇలా తెలుసుకున్నవారికి వచ్చే సాధన సందేహాలకి స్పందించడముతో...ఈ కపాలమోక్ష  గ్రంథకర్తగా చెయ్యడము జరిగినది.… కాని ఒకటి మాత్రము తెలుసుకొండి.ఈ గ్రంధములో చెప్పబడిన ప్రతి ధ్యానానుభవము గూడ నాకు ధ్యానము నందు కనిపించిన ధ్యానదృశ్యాలను యధాతధముగా ఉన్నది ఉన్నట్లుగా రాసుకోవడము అలాగే మీకు చెప్పడము జరిగింది.అంతే కాని ఇవి ఉహించి రాసినవి కావు.అలాగే ఇతరుల అనుభవాలు లేదా ఇతర పుస్తకాలు చదివి రాసినవి కావు.అలాగే మతి భ్రమించి రాసినవి గూడ కాదు.కాకపోతే నాలుగు ప్రాపంచిక విషయాలు దాటడము అనగా పెదవి,పైకము,పేరు,పదవి దాటడము వలన అవధూత స్ధితిని పొంది ధ్యానానువాలను పొందడము జరిగింది.ఇవన్నీగూడ నా సత్యాన్వేషణలో కలిగిన యదార్ధ ధ్యానానుభవాలు అని తెలుకొండి.ఇవి అన్నిగూడ సత్యానికి దగ్గరిగా నిజానికి దూరముగా ఉంటాయి.అనగా సత్యానికి అలాగే నిజానికి తేడా ఉంటుంది.అనగా సత్యానిరూపణ చెయ్యటానికి సాక్ష్యాలు లేదా సాక్ష్యాధారులుండవు.కేవలము మన మన:సాక్షి మాత్రమే ఉంటుంది.అదే నిజాని నిరూపణకి కావాలసిన సాక్ష్యాలు అలాగే సాక్ష్యాధారాలుంటాయి.కాబట్టి ఈ మహాగ్రంధమంతా గూడ నా మన:సాక్షి ఆధారముగా నిజసత్యానుభవాలతో చెప్పడము జరిగింది.ఇది సత్య సత్ మహా గ్రంథము గావడము చేతనే స్వయముగా ఆది పూర్ణబ్రహ్మజ్ఞాని అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి మరియి జ్ఞానప్రధాత శ్రీ బాలత్రిపురసుందరిదేవి అనుభవ అనుగ్రహము పొందింది.ఇంతకంటే మీకు ఏలాంటి సాక్ష్యాలు అవసరముండదు అనుకుంటున్నాను. ఇంతటితో ఈ దేహ నిజ సజీవ లాంటి స్వప్న ఆధ్యాత్మిక తుఫాన్ ధ్యానదృశ్యాల అనుభవసారమైన ఈ దేహ సమాధిగీత లాంటి ఈ “కపాలమోక్షం” గ్రంథం కూడ….అయిపోయింది.

సూచన: నిజ పరమ యోగులను, నిజ పరమ గురువులను సందర్శించినప్పుడు మీరు మోక్షప్రాప్తి పొందినారా? అని అడగకండి. ఎందుకంటే ఇది పొందామో లేదో చెప్పలేని అలవికాని విచిత్ర అనుభవ స్థితి. ఎలా అంటే మరణించేవారికి వాడు కొన్ని క్షణాలలో మరణము పొందుతాడనే జ్ఞాన స్పురణ కలిగి ఉంటాడు. కానీ తాను మరణించిన విషయం తనకి తెలియకుండానే ఎలా అయితే మరణమును పొందుతాడో అలాగే మోక్షప్రాప్తి కూడా అన్నమాట. తనకు ఎప్పుడూ మోక్షప్రాప్తి కలుగుతుందో చెప్పగలరు కానీ తాను మోక్షము పొందిన విషయమును చెప్పలేరు కదా. చెప్పితే పొందినట్లే కాదు. చెప్పకపోతే పొందినట్లే అని చెప్పలేని స్థితి. ఆ సాధకుడు కాస్త మౌన స్థితి (సంకల్ప రాహిత్యస్ధితి)… నిశ్చలస్థితి (స్పందన రాహిత్యస్ధితి)… ఆత్మశాంతి స్థితి (ఆలోచన రాహిత్యస్ధితి)… బ్రహ్మతదాకారస్దితి (ఏమిలేని స్ధితి)… పరమ ప్రశాంత స్థితి (నిరాకార స్ధితి). పొందితే ఇదియే బ్రహ్మ కపాలమోక్షం.అలాగే ఏవరైతే కపాలమోక్షం పొందిన గూడ కొంతమందికి వారి భౌతికదేహముతో మనమధ్య జీవించే ఉంటారు.అంతెందుకు అరుణచల యోగి అయిన కావ్యకంఠ మహమునికి కపాల భేదనము జరిగిన 13 సం.దాకా బ్రతికే ఉన్నారు.అలాగే ఈ క్షేత్ర అరుణయోగి అయిన శేషాద్రి స్వామి వారు కపాల విభేదనము జరిగిన 13 నిమిషాలకి శివైక్యం చెందడము జరిగింది.ఇక భౌతిక దేహముకి మరణము అనేది వారివారి ఇచ్ఛాశక్తి బట్టి ఉంటుందని నాకర్ధమైంది.

నాకు కలిగిన అనుభవాల దృష్ట్యా చూస్తే మోక్షం అనేది మనము చనిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడకి బ్రతికి ఉండగానే వెళ్ళడమే మోక్షప్రాప్తి అని నా ప్రగాఢ విశ్వాసము.అనగా మనమంతా గూడ ఆదిలో అనాదిగా ఉన్న పూర్ణ శూన్యమునందు స్వయంభూగా ఉన్న పూర్ణ అగ్నిబిందువు నుండి పుట్టాము.తిరిగి మనమంతాగూడ ఈ బిందువుకి చేరడమే శాశ్వత మరణము.ఇదియే పూర్ణ మోక్షము.ఇలా జరగకపోతే అదియే అశాశ్వత భౌతిక మరణమవుతుంది.మనందరికి శాశ్వత మరణము పొందకుండా మన మనస్సుకి 64 తత్త్వబంధనాల మహామాయగా ఉంచడమే మన ప్రకృతి పని.అలాగే ఈ పూర్ణ అగ్నిబిందువున్న క్షేత్రమే మన అరుణాచల క్షేత్రములోని అరుణాగిరి లోపుల ఉన్న అగ్నితీర్ధములో ఉన్న అగ్నిశిఖయే అన్నమాట. అంటే ఈ లెక్కన మనమంతా ప్రకృతి మహామాయలలో పడి కేవలము ఇపుడిదాకా అశాశ్వత మరణాలు పొందుతున్నామని ఈపాటికి మీకందరికి అర్ధమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రకృతి మహామాయలకి మూల మాయ మన అహము.దీనిని ఎవరైతే అరుణాగిరి యందు ఆయనికి దానముగా ఇస్తారో వారే ఈయన అనుగ్రహమును పొంది మోక్షమును పొందుతారు.మన ఆధ్యాత్మిక సాధన అంతాగూడ అ ఆ ఇ ఈ...అనగా హము నుండి త్మ దాకా.. హము నుండి శ్వరుడి దాకా... అని తెలుసుకొండి.

ఇలా మోక్షప్రాప్తి పొందినవారు ఎపుడు నిత్యానంద స్ధితిలోనే ఉంటారు.వీరికి సుఖాదుంఖాలు అనే ద్వంద్వ ప్రవృతి ఉండదు.వేటియందు మమకారాలు, మోహలు, వ్యామోహలు,ప్రేమలు,ఆశలు,భయాలు,ఆలోచనలు,ఆశయాలు,సంకల్పాలు,ఆవేశాలుండవు.పసిపాప మనస్సు కలిగి ఉంటారు.ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.ఇదియే ఈ దేహజన్మ ఇచ్చే అంతిమ సందేశము.

image.png


ఓం పూర్ణమద: పూర్ణమిదం 
పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ 
పూర్ణమేవావిశిష్యతే 
ఓం శాంతి! ఓం శాంతి! ఓం శాంతి!

సాధన సాధ్యతే సర్వం సాధ్యం...సర్వం జయం

సర్వం సమాప్తం

పరమహంస పవనానంద


అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ....
అరుణ శివ


*************************************************

                                          పూర్ణ మోక్ష విధి విధానము

ఇది నేను మీకు ఒక యోగమిత్రుడిగా నా 32సం.రాల అధ్యాత్మికానుభవముతో ఈ విషయము చెపుతున్నాను.చెయ్యడము లేదా చెయ్యకపోవడము మీ ఇష్టము..కాని చెప్పడము మంచిదని చెపుతున్నాను.నా మనోదృష్టికి చాలామందికి మోక్షము పొందాలన్నా కోరిక ఉన్నప్పడికి అది ఎలా ఎవరు తీరుస్తారో మార్గాలు తెలియక ఒకవేళ తెలిసినగూడ అవి చెయ్యలేక..ధ్యానానుభవాలు పొందలేక..పొందిన అనుభవాలు నిజమో లేదా అబద్ధమో అర్ధము గాక అవస్ధలు పడుతూ..నకిలి గురువులను నమ్మి ధనామానాలు కోల్పోయి అగచాట్లు పడుతూ..ఈ జన్మకి మోక్షము వస్తోందో రాదో అర్ధమవ్వక..ఎవరిని అడాగాలో..ఎవరిని నమ్మాలో అర్ధము కాని అయోమయ స్ధితిలో..ఇలా చాలామంది భావితరాల యోగసాధకులు ఉన్నారని నాకు అవగహనకి వచ్చింది.ఇలాంటి వారి కోసము నా సాధానుభవముతో మీకు మోక్షము మీద అలాగే దీనిని సాధన విధివిధానము మీద అవగహన కల్పించాలని నాకు బలమైన సంకల్పము కల్గింది.చెప్పేది నేను అయిన చెప్పించేవాడు దైవమని తెలుసుకొండి..

ఇక అసలు విషయానికి వద్దాం..మోక్షము అంటే ఏమిటి అన్నపుడు మన మనస్సుకి 64 తత్త్వబంధాలుంటాలు.వీటిని సాధన ద్వారా విముక్తి చేసుకొంటే అస్ధిర మనస్సు కాస్త స్ధిరమై ఆత్మగా రూపాంతరము చెందుతుంది.అంటే మన మనస్సుకున్న కామాత్వము పోయి దైవత్వ స్ధితిని పొందడమే ముక్తి అవుతుంది.ఈ దైవత్వస్ధితి నుండి ఆత్మస్ధితికి చేరుకొని పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.ఒకరకముగా చెప్పాలంటే నేనుయున్నాను అను స్ధితి నుండి నేను లేను అను పూర్ణజ్ఞానము పొంది పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.అదే నేను వేరు..దేవుడు వేరు అను ద్వైతస్ధితి ఉంటే అది ముక్తి అవుతుంది.అంటే ముక్తిలో నేనుయున్నాను భావముంటే..అదే మోక్షములో నేనులేను భావప్రాప్తి ఉంటుంది.ఇక వివరముగా చెప్పాలంటే ముక్తిలో మీకు మీ దైవము లేదా గురువు కాస్త మామిడి పండు రుచి గూర్చి చెపుతారు.అదే మోక్షములో మీకు మీరే మామిడిపండు తిని రుచిని స్వానుభూతిని పొందుతారు.

ఇక సాధన విషయానికి వస్తే మనకి 112 యోగమార్గాలున్నాయి.అందులో ముఖ్యముగా కర్మ,భక్తి,జ్ఞాన,ధ్యాన,ఆత్మయోగ మార్గాలున్నాయి.వీటిలో కర్మమార్గము అంటే చేసే కర్మ యందు ఫలితాలు ఆశించి చివరికి ఫలితాలు ఆశించని స్ధితి చేరుకోవాలి.అదే భక్తి మార్గములో అయితే విగ్రరాధన నుండి విశ్వారాధన స్ధితికి చేరుకోవాలి.అదే జ్ఞానమార్గము లో అయితే నేను ఉన్నాను స్ధితి నుండి నేనులేను అను స్ధితికి చేరుకోవాలి.అదే ధ్యానమార్గములో అయితే కుండలీశక్తిని జాగృతి చేసుకుని మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా ఉన్న 13 యోగచక్రాలను శుద్ధిచేసుకొని ఆయా ఈ చక్రానుభవాలు ధ్యానములో పొందాలి.అదే ఆత్మయోగము నందు అయితే మన ఆత్మను కాస్త పరమాత్మ లయం చేయాల్సి ఉంటుంది.

ఇక కర్మయోగమైతే మనకి ఏ కర్మలు చేస్తే పుణ్యము లేదా పాపము వస్తోందో తెలియదు.అలాగే ఏ కర్మలు మనకి బంధమవ్వుతాయో లేదా బంధవిముక్తి కల్గిస్తాయో గూడ తెలియదు.కాబట్టి ఈ మార్గములో మనకి తెలియని మాయ ప్రమాదము ఉన్నట్లే గదా.ఇక భక్తిమార్గము తీసుకుంటే ఇందులో మనకి 36 కోట్ల దైవాలున్నారు.వీరిలో ఏవరిని పూజిస్తే మోక్షము వస్తోందో ఎవరికి తెలియదు.ఒకవేళ తెలిసి చేసిన ఆయనకి ఈ పూజలు వెళ్ళుతున్నాయో లేదో తెలియని అయోమయ పరిస్ధితులు ఉన్నాయి.కాబట్టి ఈ మార్గము గూడ మన వంటికి పడదు.ఇక జ్ఞానమార్గమునకు వస్తే నేనుయున్నాను నుండి నేనులేను స్ధితికి చేరాలంటే ముందు మనము నేను అనేది ఏమిటో తెలుసుకోవాలి.అంటే నేను ఏవరిని అనుకుంటూ ఉంటే సరిపోదు.అది ఏమిటో జ్ఞానానుభవానుభూతిగా పొందాలి.ఇది కారణజన్ముడికి తప్ప నరమానవుడికి ఈ పూర్ణజ్ఞానము అందదు.అంటే ఈ మార్గముగూడ మన వంటికి సరిపడదు.ఇక ధ్యానమార్గములో అయితే మన కుండలీశక్తి జాగృతి నుండి యోగచక్రాల ధ్యానానుభవాలు పొందుటకు మనకి వరుసగా మంత్రగురువు, శక్తిపాతగురువు, సద్గురువు, పరమగురువు,ఆదిగురువు అనే పంచ నిజగురువుల అనుగ్రహము పొందాలి.ఈ కలియుగ ప్రభావములో ఎవరు నిజగురువో లేదా నకిలి గురువో గుర్తుపట్టడము చాలా కష్టము..ఒకవేళ గుర్తుపట్టిన ఆయన అనుగ్రహము పొందడము చాలా చాలా కష్టము.ఎందుకంటే నిజగురువు పెట్టే నిత్య మాయపరీక్షలు ఎదుర్కోవడము అంత తేలికైన విషయము గాదు.ఏ చిన్న తప్పు లేదా పొరబాటు చేసిన మన కధ మొదటికే వస్తోంది.ఆయన అనుగ్రహము పొందవలసిన చోట అగ్రహామును లేదా గురుశాపమును పొందవలసి ఉంటుంది. ఈ మార్గము అనేది పులి మీద స్వారీ లాంటిది కాబట్టి ఇది గూడ మన వంటికి పడదు.ఈ నాలుగు మార్గాలలో నేను ఎన్నో కష్టాలు పడి నానా చంకాలు నాకి ప్రాణము మీదకి తెచ్చుకున్న నాకు గావాలసిన స్ధితిని..ఆనందమును ఇవి ఇవ్వలేకపోయాయి. దాదాపుగా ఈ నాలుగు మార్గాల సాధన కోసము నా జీవితములో దాదాపుగా 27సం.రాలు వృధా చేశాను.కర్మల నుండి నిజగురువులు వెతకడములో ఇన్ని సం.రాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.ఈ తప్పు మీరు చెయ్యకూడదని ఒక యోగమిత్రుడిగా ఈ అనుభవాలు చెప్పడము జరుగుతోంది.కాబట్టి మీరు ఎవరు గూడ ఈ నాలుగు మార్గాలలో సాధన చెయ్యకండి.దైవాల నుండి నిజగురువులను వెతకడము ఆపివెయ్యండి.గురువుల కోసము ఆశ్రమాలు అలాగే దైవాల కోసము గుడులు తిరగకండి.డబ్బులు,కాలము,జీవితము వృధా చేసుకోకండి. 

ఇక ఆఖరిదైన ఆత్మయోగ మార్గములో నేను కేవలము 5 సం.రాలు ప్రయాణించి నేను ఉన్నాను ఉన్నస్ధితి నుండి నేను లేను ఉన్నతస్ధితికి నా సాధన చేరుకోవడమే కాకుండా నా ఆత్మ కాస్త పరమాత్మయందు లయమయ్యే స్వానుభవము పొందడమే గాకుండా అంతిమ స్ధితియైన ఆత్మానందస్ధితికి అలాగే కైవల్యముక్తి అగు మోక్షానుభవము పొందడము జరిగింది.నాకు తెలిసి సాధన మార్గాలలో ఉన్న 112 మార్గాలలో సాధన చేసినప్పడికి ఆఖరికి ఈ ఆత్మయోగ మార్గమునకు ప్రతిసాధకుడు రాకతప్పదు.మరి అలాంటప్పుడు కష్టసాధ్యమైన మార్గాలలో ప్రయాణించము కన్నా అతిసులువైన ఆఖరిదైన ఆత్మయోగమార్గములో ప్రయాణించి సాధన సాధ్యతే సాధ్యం అను నానుడి నిజము చేస్తూ అందరుగూడ  మోక్షగామిగా మారి మోక్షమును పొందండి.

ఇంతకి ఈ మార్గ సాధన విధివిధానము మీకు నేను చెప్పుతాను.ఇందులో మనకి ఆదిదైవముగా..ఆదిగురువుగా.... ఆదియోగిగా మనకి అరుణాచల క్షేత్ర నివాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి మనకి తోడుగా..రక్షకుడిగా..మోక్షగురుదేవుడిగా ఉంటాడు.కాకపోతే ఈయన అనుగ్రహమును మనము పొందటానిటి సాధన చేయాల్సి ఉంటుంది.అందుకు మనకి  గావాలసిన దైవిక వస్తువులు నాలుగు.అవి ఒకటి లింగజ్యోతి దీపారాధన 2. ఊదే శంఖము 3. పాదరస శివలింగము లేదా రుద్రాక్ష 4. దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహాము... ఈ నాలుగు వస్తువులు మీకు ఇంటర్నెట్ వెతికితే దొరుకుతాయి.


నాకు వచ్చిన లింగజ్యోతి ప్రమీద


ఈ నాలుగు వస్తువులలో లింగజ్యోతి అంటే ప్రమీద ఆకారము ఒక శివలింగకారముగా ఉండి లింగస్ధానములో ఒక దీపము ఓత్తి ఉంటుంది.దీనిని వెలిగిస్తే ఈ కుందె కాస్త అగ్నిలింగముగా కనపడుతుంది.ఈ నిత్య దీపారాధన వలన మన జన్మాంతరాల పాపాలు..శాపాలు..బంధ కర్మాల నుండి ఈ జ్ఞానాగ్నికి దగ్ధమవుతాయి.ఎలాంటే మన జన్మకి కారకము కామాగ్ని..మన సాధనకి కారకము జ్ఞానాగ్ని...మన మరణానికి కారకము దహగ్ని..అంటే మన జీవిత సృష్టి..స్ధితి..లయలకి మూలము అగ్నియే గదా.కాబట్టి అంతిమ ఈ అగ్నిరూపము ఒక అగ్నిశిఖ అయిన అగ్నిలింగము గావడము వలన ఈ లింగజ్యోతిరాధన చెప్పడము జరిగింది.



                                             నాకు వచ్చిన ఉదే శంఖము-మోతీ శంఖము


ఇక ఉదే శంఖరావము వలన మన శరీరములో మనకి తెలియకుండానే ప్రాణాయామ విధివిధానము జరిగి కుండలీనిశక్తి జాగృతి అయ్యి యోగచక్రాలలో ఈ శక్తి ప్రయాణము నిరంతరము చేస్తూంది.అలాగే అరుణాచల క్షేత్రములో ధ్యానములో ఉండే దక్షిణామూర్తికి ఈ శంఖనాదము వినబడి మనగూర్చి ఆయన ఆలోచన చేస్తాడు.


నాకు వచ్చిన పాదరస లింగము - పాదరస పంచముఖ రుద్రాక్ష


ఇక పాదరస లింగము లేదా పాదరస పంచముఖ రుద్రాక్ష లేదా  నిజ నేపాలి పంచముఖ రుద్రాక్షను ప్రతినిత్యము తాకడము వలన ఏరోజు చేసిన పాపాలు..కర్మపాపఫలితాలు నాశనమవుతాయిఎందుకంటే పాదరసము అనేది ఒకవిధమైన విష ఔషదమని ఆయుర్వేద వైద్యము చెపుతుంది..అలాగే నయము కాని దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనము మరియు జ్ఞానాభివృద్ధి, ధనాభివృద్ధి, కామ్యసిద్ధి,ఆరోగ్యవృద్ధి,శాంతము కల్గుతాయని శాస్త్రవచనము.అలాగే నా అంతిమ అనుభవములో దక్షిణామూర్తి ఆత్మలింగముగా పాదరస లింగముగా దర్శనము ఇచ్చిన విషయము మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది.అందుకని ఈయన అనుగ్రహమును పొందుటకు పాదరసలింగము లేదా పాదరస రుద్రాక్షను పెట్టడము జరిగింది.ఎవరైన దీనిని పూజించవచ్చు.నిరభ్యంతరముగా ఇంటిలో పెట్టుకోవచ్చు.పైపెచ్చు ఇంటి వాస్తు దోషాలు తొలగుతాయి.అంతెందుకు దేవాలయ ప్రతిష్ట యంత్రాల సమయములో తప్పనిసరిగా పాదరసమును వాడుతారు.వాడాలని ఆలయ ఆగమ శాస్త్రములో ఉంది.ఇప్పుడికి దీనిని వాడుతున్నారు.


నాకు వచ్చిన దక్షిణామూర్తి


ఇక దక్షిణామూర్తి ఫోటో లేదా అంగుళము నుండి మూడు అంగుళాల విగ్రహము అనేది మన ఇళ్ళలో ఉంచుకోవలసిన దైవిక వస్తువులలో ఇది తప్పనిసరిగా ఉండాలని శాస్త్రవచనము.కాబట్టి ఈ ఫోటోను లేదా విగ్రహామును ప్రతినిత్యము చూడటము లేదా తాకడము వలన మనకి గురుగ్రహనుకూలత కల్గి మనకి అన్ని శుభాలు కల్గుతాయని ఏకముగా జ్యోతిష్యశాస్త్ర వచనము.

ఇక సాధన విషయానికి వస్తే...ఈ నాలుగు దైవిక వస్తువులు ఎలా ఉపయోగించాలో మీకు చెపుతాను.మొదట ఆవుపేడతో చేసిన విభూది ధరించి ఆ తర్వాత ఉదేశంఖముతో ఒకసారి శంఖనాదము చేసి ఆ తర్వాత  లింగజ్యోతి దీపారాధన ... దీనిని ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్రము వెలిగించాలి.ఇది ఒక కుందెగా ఉంటుంది.ఇందులో పూర్తిగా నువ్వులనూనె పోస్తే సుమారుగా ఆరుగంటలు పాటు వెలుగుతుంది.ఈ దీపారాధన ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము 6 గం నుండి 7 గం లోపు వెలిగించాలి.ఈ దీపారాధన ఒక అగ్నిలింగము గావడము వలన దీనిని అరుణాచల నామముతో జపించాలి.అలాగే దీనికి మహనైవిధ్యముగా ఒక చెంచా శుద్ధ ఆవునెయ్యి ఈ కుందెలో వెయ్యాలి.అంతే మీ పూజ పూర్తి అయ్యినట్లే...ఆ తర్వాత ఒకసారి పాదరస శివలింగము లేదా ఈ రుద్రాక్షను తాకి మీ దగ్గరున్న జపమాలతో 11 నుండి 1080 సార్లు అరుణాచల శివా నామమును దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహమును చూస్తూ ఈ నామజపము చెయ్యండి.ఇంతడితో జపము పూర్తి అయ్యినట్లే..ఆ తర్వాత 20 ని..పాటూ మౌనముగా ఉండి ఆలోచనరహితముగా ఉండటానికి కళ్ళు మూసుకొని మీ గురుదేవుడైన శ్రీ మేధా దక్షిణామూర్తికి మీ కోరికలు చెప్పుకొండి.కాని ఫలితాలు ఆశించకండి.ఆయన ఏమి ఫలితము ఇస్తే అదే ఆనందముగా స్వీకరించి కృతజ్ఞతలు చెప్పుకొండి.ఇలా విధివిధానము అంతా మీకు 48ని..పూర్తి చేసుకొని ఇక నిత్యకృత్య పనులలో చేసుకొండి.అంతే..ఇలా మీరు  వేళ తప్పకుండా..క్రమము తప్పకుండా 14సం.రాలు పాటు చేస్తే మీకు తప్పకుండా ఆయన అనుగ్రహము కల్గి అంతిమ కైవల్యముక్తియగు మోక్షము కల్గుతుందని నా స్వానుభవము వలన ఘంటాపధముగా చెపుతున్నాను.గాకపోతే ఈ అనుగ్రహము అనేది 14రోజుల నుండి 14 సం.రాలు పట్టవచ్చు.మీ ఈ సాధన బట్టి ఫలితము ఆధారపడి ఉంటుంది.

మనకి శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహము కల్గినదో లేదో తెలియానికి కొన్ని అనుభవాలు కల్గుతాయి.అవి 1. మనకి ధ్యానములో లేదా స్వప్నములో నిరంతరముగా అరుణాచల వాసియైన రమణామహర్షి స్వప్న దర్శనము అవుతుంది.2. ఈయనను మీరు దాటకల్గితే మీకు పంచ శిఖరాలున్న అరుణాగిరి కనపడుతుంది.3.ఆ తర్వాత ఏకశిఖరమున్న అరుణాగిరి కనపడుతుంది.4. అరుణాగిరి గుడి అయిన అగ్నిలింగము కనపడుతుంది.5.ఆ తర్వాత అరుణాగిరి పైన ఉన్న పద్మకారశివ అగ్నిలింగము అలాగే అగ్నిశివుడు అలాగే ఈ శిఖారగ్రభాగములో ఉన్న శివపాదముద్రలు కనపడతాయి.6.అరుణాగిరి లోపున ఉన్న నల్లటి ఆకారముగా ఉన్న దక్షిణామూర్తి ఆత్మస్వరూపము కనపడుతుంది.7.ఆ తర్వాత ఆఖరి అంతిమ అనుభవాలుగా ధ్యానము నందు మీ శరీరములో ఉన్న 13 యోగచక్రాలలో ఉన్న యోగలింగాలు కాస్త ఒక్కొక్కటిగా ఈ అరుణాగిరియందు లయము చెందే దృశ్యాలు కనపడుతూ ఆఖరిగా మీ ఆత్మ కాస్త మోక్షగురుదేవుడు అగు పరమాత్మ దక్షిణామూర్తి యందు కైవల్య చెందే దృశ్యము చూస్తూ మీ ప్రాణాలు కపాలములోని బ్రహ్మరంధ్రము ద్వారా పోయి ఆయనలో శివైక్యము చెందుతాయి.ఈ అనుభవాలు అన్నిగూడ నాకు కేవలము 5 సం.రాలలో జరగడము వలన ఇంతా ఇదిగా చెప్పడము జరిగింది.ప్రస్తుతానికి నా యోగ శివలింగాలు అన్నిగూడ ఈ అరుణాగిరియందు ఐక్యము చెందిన ధ్యానానుభవాలు పొందడము జరిగింది.ఆత్మానంద స్ధితిని పొందడము జరిగింది.ఇంక శివైక్య విధానముగూడ రేపో మాపో జరుగుతుంది.ఈ లోపు ఈ దేహ తెలుసుకున్న ఈ మోక్షవిధానము గూర్చి మీరందరికి చెప్పడము జరిగింది.ఈ విశ్వములో విశ్వాదిడేవుడుగా..విశ్వాదిగురువుగా.. విశ్వాదియోగిగా..విశ్వాదిమోక్షగురుదేవుదిగా.. .ఒకే ఒక్కడిగా.. అరుణాచల నివాసియైన
  శ్రీ మేధా దక్షిణామూర్తిగా ఉన్నాడని ఈ ధ్యానానుభవాలు చదివి తెలుసుకొండి.



ఈయన ఒక్కడినే పూజించండి. ఆరాధించండి. జపించండి. .ధ్యానించండి.అనుగ్రహము పొంది  జ్ఞానమును పొంది కైవల్యముక్తియగు మోక్షమును పొందండి.ఈయన ఒక్కడే మనకి కష్టసాధ్యమైన సాధనలు లేకుండా ఈయన నిత్య నామస్మరణతో మనకి గావలసిన మోక్షము ఇస్తాడు.ఎందుకంటే ఈయనే ఈ విశ్వానికి మోక్షదేవుడు.ఈ అనుగ్రహము కోసము మిగిలిన 36 కోట్ల దైవాలు..ఒక కోటి పరమాత్మలు..84 లక్షల ఆత్మస్వరూప యోగగురువులు అరుణాగిరి చుట్టు తిరుగుతూ సాధన చేస్తున్నారంటే విషయము ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది.ఇపుడిదాకా మీరందరు అసలు దేవుడిని పూజించకుండా ఈ దైవమును పూజించే పూజారి  దైవ గురువులను పూజిస్తున్నారని ఇపుడికైన తెలుసుకొండి.బాగుపడండి.నేను చెప్పేది వింటే బాగుపడతారు.లేదంటే బాధపడతారు.మీకు ఈ రెండింటిలో ఏది గావాలో తెల్చుకొండి.సాధన చేసుకొని మోక్షము పొందుతారని ఆశిస్తూ..

శుభంభూయాత్...

********************************************************

ఈ గ్రంథకర్త సాధనానుభవ బోధ:
 
ఈ దేహము కాస్త శ్రీ పరమహంస పవనానందగా స్వప్న దివ్యధ్యాన జ్ఞానస్ఫురణలు అనుభవాలు పొందితే వాటిని యధాతధముగా..మార్చకుండా..ఏమార్చకుండా...శ్రీ పవనానంద సరస్వతిగా  వ్రాయడము జరిగినది.యదార్ధముగా ఈ దేహసాధనానుభవాలు హృదయచక్రము దాకా వ్రాయాలని సంకల్పించినాము.ఎందుకంటే ఈ చక్రసాధనతో యోగసాధన పరిసమాప్తి అవుతుందని అరుణాచల రమణమహర్షి  జ్ఞానయోగులు చెప్పడముతో ఈ చక్రసాధనతో మా సాధనగూడ పరిసమాప్తి అవుతుందని భావించినాము.కాని మేము ఒకటి తలిస్తే..ఈ చక్రదైవమైన నవపాషాణ ఇష్టలింగేశ్వరుడు మరొకటి తలచినాడు. ఈ ఇష్టలింగరాధనతో మన అందరి సాధన ఈ హృదయచక్రము దగ్గర ఆగదని..ఇంకా ఉన్నదని..ఉంటుందని..మాకు జ్ఞాన స్ఫురణలు అందడము మొదలైనాయి.

దానితో మా సాధనతో ఈ చక్ర హృదయ గ్రంధి విబేధనమవ్వడముతో…మా సాధన ప్రయాణము సూర్యనాడి ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకున్నది.అక్కడ ఉన్న ఏకకపాలములోనికి ప్రవేశించి..ఆపై చితాగ్ని దర్శనము పొంది.. ఆపై బ్రహ్మకపాలమోక్ష ప్రదాత బ్రహ్మకపాలధారియైన ఆదిపరాశక్తి దర్శనమును పొంది...ఆపై 36 కపాలధారి దర్శనమును పొంది… ఆపై..ఈ 36 కపాలయానము చేసి అండ,పిండ,బ్రహ్మాండ లోకాలు దర్శనానుభవాలు పొంది..అటుపై ఏకమూల బ్రహ్మకపాలములో ఉన్న బ్రహ్మతేజస్సుతో తిరుగుతున్న బ్రహ్మాండచక్రదర్శనానుభవమును పొంది...అటుపైఈ చక్ర శూన్యబిందువు మధ్యకి చేరుకొని నేను లేను అని జ్ఞానస్పురణ పొందడముతో ఈ దేహనికున్న 36 కపాలాలలో 35 కపాలాలు సుడిగాలి ఆకాశ కపాల మోక్షం విధివిధానముతో శూన్యములో అంతరించిపోయినట్లుగాస్వానుభవమును పొందగా...ఆపై మిగిలిన 36వ కపాల ఏకశరీరము కూడ నేను కాని నేనుగా తనలో తాను తిరుగుతూ ఆలోచన,స్పందన,సంకల్పము చేస్తూందని...దీనికి కారణము దీనికున్న అష్టతత్త్వాలని తెలుసుకొని.. అష్టదైవికవస్తువుల సేకరణ,ఆరాధన,నాదాల వలన ఈ అష్టతత్త్వాల రాహిత్యాలు పొందడముతో...ఈ ఏకబ్రహ్మకపాలము నేను లేను అనే ఏకైక ఆలోచన స్ధితిని స్వానుభవము పొందడముతో...అటుపై దీనిని స్వానుభూతిని పొందలేమని..పొందాలని ప్రయత్నము చేస్తే..పున:కర్మ:జన్మతో సాధన ఆరంభమవుతుందని... రూపము అంతము గావలసిన చోట రూపాంతరము చెందుతామని తెలుసుకొని… రమణమహర్షి చెప్పినట్లుగా సాధనలో సాధకుడు ఒక ఆలోచన దగ్గర ఆగిపోతాడు.అక్కడి దాకా ఈ మనస్సుకి నేను ఎవరిని అనే సందేహముంటుంది.ఎక్కడైతే సాధకుడు ఆగిపోతాడో…అపుడు నేను ఏవరిని అనే ప్రశ్నించే మనస్సు లేని స్ధితికి చేరి ఆగిపోవడమే సాధకుడి సాధన అంతిమ స్ధితియని చెప్పకనే చెప్పడముతో… ఇక్కడితో ఈ దేహసాధన ఆగిపోవాలని తెలుసుకోవడముతో…శ్రీ కాశీ విభూధినాధ్ గా మౌన:బ్రహ్మగా మారి నిశ్చలస్ధితిని పొంది...ఆత్మశాంతిని పొంది...బ్రహ్మాతదాకారస్ధితిని పొందడముతో...ఆపై మిగిలిపోయిన ఏకమూలబ్రహ్మకపాలము గూడ నిరాకారమయినదని రాబోవు కాలములో ఇలాగే ఈదేహము గూడ నిరాకారమవుతుందని స్ఫురణ కల్గుడముతో ఈ దేహ సాధన ఇపుడికి సంపూర్తిఅయినదని గ్రహించడముతో...ఈ దేహము కాస్త పరమప్రశాంతస్ధితిలోనికి శాశ్వతముగా వెనక్కిరానిస్ధితికి చేరుకున్నది.

అపుడిదాకా ఈ కనిపించే భౌతికదేహము కాస్త ఎవరితో మాట్లాడాలని అనిపించని మౌన:బ్రహ్మస్ధితిలో...ఎవరికి ఏమి చెప్పాలని అనిపించని నిశ్చలస్ధితిలో...ఎవరిగూర్చి మదిలో ఆలోచించని ఆత్మశాంతి స్ధితిలో... దేనిగూర్చి ఆలోచించని..దేనికి స్పందించని..దేనిని సంకల్పించని..దేనిని ఆశించని...దేనికి ఆనందపడని..దేనికి భయపడని బ్రహ్మాతదాకార స్ధితికి చేరుకోవడముతో... ఆపై పరమప్రశాంతస్దితికి చేరుకోవడముతో సాక్షిభూతముగా ఈ దేహస్దితి మారడముతో...అనగా ఈ దేహముకున్న సంకల్పము సిద్ధించాక శ్వాసతో ఇంక ఏమి పని ఉంటుంది గదా! ఇలా గుర్తింపు లేని గుప్తగురువుగా,గుప్తయోగిగా,గుప్తసాధకుడిగా ఈ దేహసాధన సంపూర్ణమైనదని ఈ పాటికి అందరు గ్రహించి ఉంటారు కదా!

శుభంభూయాత్

ఓం శాంతి! ఓం శాంతి! ఓం శాంతి

-   శ్రీ బాబా విభూతినాధ్
      (మహా కాశీక్షేత్రం)

                                   ********************************************************


                                                                    BOOK REVIEWS


ఈ గ్రంథముతో నా యోగసాధన ప్రస్ధానం- పరిసమాప్తి
 

నేను 2వ తరగతిలో ఉండగా మా అమ్మతో కలిసి రాత్రి పూట తోటలోకి వెళ్ళుతుంటే దారిలో పాము అడ్డుగా వచ్చినది. దానిని చూడటంతో భయముతో మా అమ్మను గట్టిగా పట్టుకోవడం జరిగినది.అదే నాకు కలిగిన మొదటి భయము.అలాగే ఉరుములు అంటే భయపడే వాడిని. మా నాన్న రాత్రి చెప్పే కాశీ మజిలీ కథలు వినేవాడిని.అవి నన్ను బాగా ఆకర్షించేవి.నేను 7 వ తరగతిలో ఉండగా నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి వెంకటేశ్వరస్వామిని దర్శించడం జరిగినది.అదే సంవత్సరంలో తుఫాన్ రావడం, ఉన్నది అంతా పోవడంతో మొదటిసారి భగవంతునిని గూర్చి అలోచించడం మొదలైనది. అప్పటి నుండి వివిధ దైవిక పుస్తకాలు చదవడం ప్రారంభమైనది. దానిలో ఉన్న వివిధ స్తోత్రాలు, శ్లోకాలు చదివేవాడిని. అపుడే మహాభారతం సీరియల్ టివి లో వచ్చేది. దానిలో చూపించే మంత్రాలు, మాయలు,సిద్ధులు నన్ను బాగా ఆకర్షించేవి.కాని నాకు పూజలు ఎలా చెయ్యాలో అర్ధమయ్యేది కాదు. ఎవరిని అడగాలో అర్ధమయ్యేది కాదు. నేను 10వ తరగతిలో ఉండగా మా స్కూల్ వారంతా విహారయాత్రకు హైదరాబాద్, శ్రీ శైలం తీసుకువెళ్ళడం జరిగినది. శ్రీశైలంలో మా ఫ్రెండ్స్ అంతా వివిధ దైవ విగ్రహాలు కొనుక్కుంటే నేను కూడా వెంకటేశ్వరస్వామి, శివుని తల ఉన్న శివ లింగం,షిర్డి సాయిబాబా విగ్రహాలు కొనుక్కోవడం జరిగినది.వాటిని దాచుకోవడం జరిగినది.నా ఫ్రెండ్ అప్పాజీ గాయత్రి మంత్రం గూర్చి చెప్పడం జరిగినది.కాని పుస్తకాల ప్రకారం గాయత్రి మంత్రం అందరు చెయ్యకూడదని రామ మంత్రం ఎవరైనా చేసుకోవచ్చునని తెలియడంతో రామ మంత్రం జపం చేసుకోనేవాడిని.మా అమ్మని అడిగి పూజ చేయడం ఎలాగో నేర్చుకున్నాను.రోజు రెండు దీపాలు వెలిగించి ఆ రెండు జ్యోతులు కలిపి చూస్తే ఏకాగ్రత పెరుగుతుందని తెలుసుకొని అది సాధన చేసేవాడిని.మా ఇంట్లో పాత పుస్తకాలు చూడగా గీతామకరందము దొరికినది.దానిలో మోక్షము గూర్చి వివరించడం, దానికి ఆకర్షింపబడి దానిని రోజు చదివేవాడిని. ఎక్కడ ఉన్న ఏమి చేస్తున్న ఈ ఆలోచనలు వదిలేవి కావు.అందరు భౌతిక విషయాలు గూర్చి ఆలోచిస్తుంటే నేను మాత్రం మోక్షము గూర్చి ఆలోచించేవాడిని.ఇంటర్ లో ఫస్ట్ మార్కులు వచ్చినందుకు బహుమతిగా వచ్చిన డబ్బులతో గీతా వాశిష్టం కొనుక్కొని చదివేవాడిని.ఏమి అర్ధమయ్యేది కాదు.  ఒకసారి అరుణాచల మహర్షి భోధనలు ఏదో మాగజైన్ లో  చదవటం జరిగినది.అందులో నేను ఎవరు అని విచారణ చేసుకోవాలని చెప్పడం జరిగినది.అప్పటి నుండి అది చెయ్యడం ప్రారంభించాను. కాని ఎలా చెయ్యాలో అర్ధమయ్యేది కాదు. 

డిగ్రీ చదువులకోసం పక్క ఊరులో ఫ్రెండ్ తో ఉండవలసి వచ్చినది.అతడు సాయి సచ్చరిత్ర చదువుతుంటే నేను కూడా దానిని పారాయణ చేసినాను.దానిలో గురుచరిత్ర గురించి వివరించడంతో ఆ పుస్తకం కొని పారాయణ చేసాను.ఎవరో హనుమాన్ చాలిసా గూర్చి చెప్పితే దానిని చేసాను.నాకు గురువు రావాలని తపన పడేవాడిని.సాయిబాబాని గురువు ప్రసాదించమని వేడుకోనేవాడిని. అలాగే సౌందర్యలహరిని 41 రోజులపాటు పారాయణ చేయడం జరిగినది.ఒకసారి మా రూం లో అగ్ని ప్రమాదం జరిగి అన్ని వస్తువులు కాలినా గీతామకరందమునకు ఏమి కాలేదు.కొంతకాలానికి నేను ఒక ఏకముఖి రుద్రాక్ష కొనడం జరిగినది. దానిని మాఊరి గుడి పూజారికి చూపిస్తే అది నిజ రుద్రాక్ష అని చెప్పడం జరిగినది.ఇది దొరికిన కొన్నాళ్ళకు నా దగ్గర ఉన్న విగ్రహాలను పూజలో పెట్టడం జరిగినది.ఈ రుద్రాక్షను ఒకసారి పూజించి ఆ అభిషేక జలం ఒక చెట్టు మీద పోస్తే అది చనిపోయినది.ఒకసారి నా ఫ్రెండ్ తో శ్రీశైలం వెళ్ళడం అక్కడ నాకు మంత్రోపదేశం కోసం శివుడిని ప్రార్ధించగా నాకు ఎవరో కపాలమోక్షం గ్రంధం అమ్మగా కొనడం జరిగినది.దానిని చదవడం మొదలుపెట్టి దానిలో చెప్పినట్లుగా అదియే గురువుగా బావించి సాధన చెయ్యడం మొదలుపెట్టాను. ప్రతి సంవత్సరం తప్పకుండా గణపతి పూజ వినాయక చవితికి చేసేవాడిని. రామాయణం పుస్తకము కొని రోజు దానిని పారాయణ చేసేవాడిని.నేను శ్రీరామ హృదయమును పఠించేవాడిని.అందులో ఉన్నట్లుగా రాముడిని నిరాకార పరబ్రహ్మముగా పూజించేవాడిని.జాబ్ లో సమస్యలు కలిగినప్పుడల్లా రాముడిని సహాయపడమని అడిగేవాడిని. వీలున్నపుడల్లా భద్రాద్రి రామయ్యను దర్శించేవాడిని.ఒకసారి జాబ్ పనిమీద విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చేటపుడు ముంబై విమానాశ్రయంలో కనెక్ట్  విమానం సాయంత్రం ఉంటే  ఏమి చేయాలో అర్ధము కాలేదు.ఆ రోజు వినాయక చవితి. పూజకు భగ్నము కలిగినదేమోనని బాధపడేసరికి ఉన్నటుండి అపుడే వచ్చిన వేరే విమానములో పంపించడం జరిగినది.వినాయకపూజ నిర్విఘ్నముగా చేసుకోవడం జరిగినది.జాబ్ లో స్థిరపడిన తర్వాత వివిధ క్షేత్రాలకు వెళ్ళడం మొదలైనది. పంచభూత క్షేత్రాలతో పాటుగా శ్రీరంగం,మధురై, శ్రీ రామేశ్వరం వెళ్ళడం జరిగినది. శ్రీరంగంలో రంగనాధుని ప్రత్యక్ష సజీవ దర్శనం జరిగినది. రామేశ్వరంలో శక్తి కోల్పోయినట్లుగా అనిపించినది.ఒకసారి శ్రీశైలం వెళ్ళి అక్కడే దగ్గరలో ఉన్న త్రిపురాంతకం వెళ్ళి బాలాదేవిని పూజించి ఆ రాత్రి అక్కడే గుడిలో నిద్రపోగా కలలో ఆవిడ సాక్షాత్కారము కలిగినది. చాలా సంతొషించాను.పుస్తకములో చూస్తే బాలాదేవి మాయను దాటినట్లుగా తెలిసినది. అలాగే ఒకసారి మహాశివరాత్రికి ఉజ్జయినికి వెళ్ళడం జరిగినది. అక్కడి నదిలో స్నానం చేస్తుండగా కాలుజారి మునిగిపోబోతుండగా ఎవరో రక్షించడం జరిగినది.తర్వాత ధ్యానంలో అలా రక్షించినది రాములు వారని తెలిసినది.శృంగేరి శంకరమఠం వెళ్ళి సరస్వతి అమ్మవారిని దర్శించినాను.

ఇలా నా సాధన పుస్తకము కపాలమోక్షం గ్రంధం చెప్పిన ప్రకారం చేసుకొనేవాడిని.ఎప్పుడైన ఏమైన బలహీనతలకు లోనైతే అందులో చెప్పిన ఆహార పదార్ధాలు, ముద్రలు సాధన చేసేవాడిని.వాటిని దాటుకోవడం జరిగేది. వివిధ క్షేత్రాలనుండి వివిధ దైవ విగ్రహాలు ఫోటోలు వచ్చేవి. వాటిని దాచుకుంటూ ముందుకి సాగి పోయేవాడిని. అలా అన్ని చక్రాల జాగృతి శుద్ధి ఆధీనము నాకు తెలియకుండానే జరిగేది. వివిధ అనుభవాలు,ధ్యాన అనుభూతులు కలిగినపుడు పుస్తకములో సరి చూసుకోనేవాడిని.ఈ పుస్తకము నాకు అన్ని రకాల గురువులుగా మారి నాకు అన్ని చక్రసాధనలు చెయ్యడంలో తోడ్పడినది. ఒకసారి పాండురంగనిని దర్శించి ఆయన పాదాలు తాకకుండానే వచ్చేసాను.అలా ఆయన మాయ దాటటం జరిగినది అని పుస్తకము ద్వారా తెలుసుకున్నాను.ఒకసారి ధర్మపురి క్షేత్రంకి వెళ్ళితే అక్కడ అమ్మవారి పాద శిల దొరికినది. అప్పుడే నాకు ఆఙ్ఞాచక్రములో ఉన్నట్లు తెలిసినది. ఈ పాదం వచ్చిన తర్వాత అమ్మవారు నాతోనే ఉన్నట్లుగా ఉండేది. పట్టించుకోలేదు. అప్పటికి నేను పెళ్ళి చేసుకోలేదు. బ్రహ్మచారిగా ఉండి పోవాలనుకున్నాను. ఎలాగైనా మోక్షము పొందాలని ఉండేది.నా చుట్టూ అమ్మాయిలే ఉండే వారు.వారితో పని చేయాల్చి వచ్చేది. కాని నేను వారిని పట్టించుకోనేవాడిని కాదు.అలా త్రిపుర మాయ దాటటం జరిగినది.ఒకసారి శ్రీశైలం వెళ్ళినపుడు త్రిశూలం డమరుకము,స్పటిక లింగం కొనుక్కున్నాను.తర్వాత అయోధ్య, మధుర,బృందావనం, ద్వారక,సోమనాధ్ యాత్రలు చేసాను. అపుడు నాకు అరుదైన వామావృత శంఖం ఊదేది దొరికినది.అలాగే ఎవరో శ్రీరాముని విగ్రహము కొనుక్కోమని ధ్యానములో అనుభవము అయితే కొనుక్కోవడం జరిగినది.కాశీలో కాలభైరవునిని దర్శించాను. అలాగే ఉడిపి బాల కృష్ణుని దర్శించాను.చిన్న కృష్ణుని విగ్రహం కొని తెచ్చాను పూరి వెళ్ళి జగన్నాధుని విగ్రహము తెచ్చుకోవడం జరిగినది. విశ్వరూప విగ్రహం ఒకటి కొనుక్కుని దానిని కొన్నాళ్ళు పూజ చేసి గంగలో నిమర్జనము చేశాను.అలాగే మహా బాగవతం గ్రంధము కొని ఎందుకో వ్రేపల్లెలో కృష్ణునికి ఇవ్వడం జరిగినది.దానితో కృష్ణ మాయ దాటాను.ఆ తర్వాత చార్ ధాం యాత్ర చేయాలనిపించి చెయ్యడం జరిగినది. బద్రినాధ్ దర్శించినపుడు నాలొ శక్తి పోయినట్లు అనుభూతి కలిగినది.అపుడే అర్ధం అయినది ఎందుకు శ్రీరామేశ్వరం,ఉజ్జయిని, బద్రినాధ్, కైలాస యాత్రలు చేయకూడదని చెప్పినారో. తర్వాత కైలాస యాత్రకు రమ్మనమని ఫ్రెండ్స్ అడిగినా వెళ్ళలేదు. ఒకసారి అనుకోకుండా పళని వెళ్ళి కుమారస్వామిని దర్శించాను.నా దగ్గర వున్న శివలింగం పూజ 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఒకసారి ధ్యానములో ఇష్ట లింగము తెచ్చుకోమని ఎవరో చెప్పినట్లుగా అనిపించినది. అప్పటికి నేను బెంగళూరులో జాబ్ చేస్తుండటంతో ఒక ఇష్ట లింగము కొని పూజ చేయడం ప్రారంభించినాను. మెడలో ధరించాను.ఎప్పుడు శంఖం ఊదుతూ ఉండేవాడిని.

కపాలమోక్షం గ్రంధంలో చెప్పినట్లుగా అర్గళా స్తోత్రం కూడా చేయడం ప్రారంబించినాను.కొన్నాళ్ళకు నా కొలీగ్ ఒకరు నన్ను ప్రేమిస్తున్నానని నా వెంటబడేసరికి ఆమెను తిరస్కరించాను.నా నా తిట్లు తిట్టినది.పట్టించుకోలేదు.  అనుకోకుండా కాశీ యాత్ర చెయవలసి వచ్చినది.అక్కడ విశాలాక్షిని దర్శనం చేసుకున్నాను. అపుడే నాకు సుందరి మాయ దాటానని అర్ధమైనది. ఒకసారి నెల్లూరు దగ్గరలో వున్న కామాక్షి గుడికి వెళ్ళి నిద్ర చేశాను.అక్కడే ఉన్న నరసింహ స్వామిని దర్శించి ఒక చిన్న శంఖం కొనుక్కొని వచ్చాను.  కొన్నాళ్ళకు ఎందుకో రుషికేశ్ వెళ్ళాలనిపించి వెళ్ళితే అక్కడ నాకు సుదర్శన చక్రము, కపాలమాల, రుద్రక్షమాల, స్పటికమాల,స్పటిక లింగం,హనుమంతుని విగ్రహము,నవగ్రహ మాల,ఓంకార చిహ్నం,ఒక శంఖం ఆకర్షించి వాటిని కోనుక్కోవడం జరిగినది.తర్వాత ఇవి ఎమిటి అని నా దగ్గరున్న కపాలమోక్షం గ్రంధంలో చూస్తే అవి బ్రహ్మరంధ్రము వద్ద వచ్చే దైవిక వస్తువులు అని తెలిసి సంతోషించాను.వాటిని ఉపయోగించి మోక్షమాల తయారుచేసుకొని ధరించసాగాను.  కొన్నాళ్ళకు కంచి వెళ్ళి అన్ని దేవాలయాలను దర్శించి వెండి బల్లి బంగారు బల్లి తాకి వాటి గుర్తుగా కీచైనులు కొనుకున్నాను.  అలాగే ఒకసారి మైసూరు చాముండిని దర్శించాను.కలకత్తా వెళ్ళి కాళికను దర్శించాను.విజయవాడ వెళ్ళి దుర్గాదేవిని దర్శింఛి ఒక విగ్రహమును ఎవరో బలవంతముగా చేతిలో పెడితే తెచ్చుకోవడము జరిగినది.కొన్నాళ్ళకు ఆలంపురం వెళ్ళి జోగులాంబను దర్శించి గుర్తుగా అక్కడ అమ్ముతున్న కపాలం,గబ్బిలం, తేలు,బల్లి కీ చైనులు కొనుకున్నాను. ఆ తర్వాత కపాలమోక్షం గ్రంధంలో చూస్తే ఈమె దేవి మాయ అని మహామృత్యువు ఇచ్చే దేవత అని తెలుసుకొని ఆమె అనుగ్రహం కలిగినందుకు సంతోషించాను. కొన్నాళ్ళకు జమ్ములోని వైష్ణవి అమ్మవారిని అమరనాధ్ మంచులింగమును దర్శించినాను. తర్వాత కపాలమోక్షం గ్రంధంలో చూస్తే నా సాధనలో నేను కూడా మంచులింగముగా మారినానని తెలుసుకున్నాను.ఒకసారి నాదగ్గరకు వచ్చిన వస్తువులను చూస్తే అస్ట రాహిత్య వస్తువులు చేరినాయని అర్ధమైనది.కొన్నాళ్ళకు నా దగ్గర ఉన్న శంఖం - ఢమరుకము కలిపి మ్రోగించడం మొదలుపెట్టినాను. అప్పటికే నేను ఎల్లపుడూ ఇష్ట లింగం నా మెడలో ధరించేవాడిని.కొన్నాళ్ళకు నాకు సంకల్ప రాహిత్యం,స్పందన రాహిత్యం, ఆలోచన రాహిత్యం కలిగినట్లుగా పరమ శూన్యములో నిరాకారముగా కలిసిపోయినట్లుగా నాకు మరణం కలిగినట్లు నేను లేను అని అనుభవము కలిగినది. దీనితో నా సాధన పరిసమాప్తి అయినదని తెలుసుకొని మౌనము వహించాను.నా భౌతిక మరణం గూర్చి పట్టించుకోకుండా బ్రహ్మతదాకార స్థితిలో నిలచి ఆఖరుకి కాశీ చేరి అక్కడే ఈ దేహ మరణం వచ్చేదాకా కోసం నీలి ఆకాశము కేసి ఎదురుచూస్తున్నాను. ఈ కపాలమోక్ష గ్రంథము ద్వారా నాకు కలిగిన వివిధ రకాల ధ్యానుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలకి  అలాగే ఈ చక్రమాయలు గూర్చి.. .దైవికవస్తువులు గూర్చి...వివిధ రకాల యోగుల అనుభవాలతో... సత్య బ్రహ్మాజ్ఞానము ఇవ్వడము వలన ఇది కాస్త నాలాంటి వారికి ఈ గ్రంథము ఒక ఆధ్యాత్మిక నిఘంటువులాగా ఉపయోగపడుతుందని చెప్పటానికి నా జీవిత సాధన అందుకు నిదర్శనమైనదని మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు గదా!
   -ఇట్లు 
శ్రీ కాశీ విభూతినాధ్


*****************************

ఈ గ్రంథముతో నా యోగసాధన అనుబంధము
 
నాకు మోక్షం పొందాలనే కోరిక బాగా ఉండేది కానీ అందుకు ఎలా ఎవరు సహాయం చేస్తారో తెలియని జ్ఞానము లేని నాకు శిరిడిసాయిబాబా వారికి పూజలు చేయటం తప్ప ఏమి తెలియని నాకు… శ్రీ పవన్ బాబా వారు గురువుగారుగా పరిచయం అవ్వటం, ఆయన జీవితములో జరిగిన అనుభవాలు ఈ “కపాలమోక్షం” అను గ్రంథము  వ్రాయటం ఉపయోగకరం. ఈ గ్రంథము సాధనలో అడుగడుగునా ఉపయోగపడుతుంది అనుకున్న కానీ నిజంగా గ్రంథములోనే గురువు చేయిపట్టి చివరికి దాకా తీసుకువెళ్తారని అనుకోలేదు ఇలా నడుస్తున్న నాకు ఒక సాధకురాలిగా పనికి వస్తానా లేదా అనే భయం ఉండేది. మొదటగా ఈ గ్రంథములోని నా గురువు ప్రశ్నలు చూస్తే నన్ను నేను అద్దములో చేసుకున్నట్టు అనిపించేది .ఆయన మనస్సులో అనుకున్న విషయాలు కూడా వ్రాయటం ఈ గ్రంధానికి జీవం పోసినట్లు అనిపించింది.మోక్షం కోసం ప్రశ్నలతో ఏడవటం సహజమని, సాధన చేస్తే సాధ్యం కానిది లేదని, నాకు ఉన్న అనుమానం అసలు మంత్రాలు ఎందుకు జపించాలని… జపిస్తే దైవసాక్షాత్కారం కలుగుతుందని అలాగే దేవుడు,దయ్యాయికి గల తేడా ఇంతేనా అన్నట్టుగా చెప్పటం, ఇవన్నీ నా జీవితంలో ముందే జరిగిన ఏమి జరుగుతుందో తెలీదు. ఈ గ్రంధం చదువగా అన్నిటికి సమాధానం దొరికి నా సాధన సరిగానే ఉన్నదని నిర్ధారించుకొని, ఆకాశ సిద్ధి ఉందని అది సాధ్యమని తెలిసింది.ఇక కాపాలికులు దర్శనం…. వారు ఎలా తింటారని వినగానే నాకు రోమాలు నిక్క పొడుచుకున్నాయి, భోగ జీవితంలో ప్రేమ విఫలమైన కూడా యోగ జీవితం ముందుకి ఎలా ధైర్యముగా ముందుకు వెళ్లాలని అర్ధమయ్యి ఇక నా జీవితములో అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా బయటపడి ముందుకు వెళ్ళాలో నేర్చుకున్న, విశ్వరాధన వద్దు అనుకునేవాళ్లు విగ్రహారాధన దగ్గర ఆగిపోవొచ్చని చూసిన నాకు విగ్రహారాధన దాటాలని,విగ్రహాలు ఎలా నైవేద్యాలు స్వీకరిస్తాయో అర్ధమైంది,ఒక పిశాచి వాళ్ళ ఎన్ని ఇబ్బందులు పడాలో తెల్సుకున్న నాకు ఇలాంటి దుష్ట శక్తులకు దూరంగా ఉండాలని, ఇక వేదాలు, నాస్తికులు, ద్వైతమంటే, వివిధ మార్గాల గురించి ఎవరెవరు వారి మార్గాల గురించి ఎలా చెప్పారని విశ్లేషణ వల్ల బాగా అర్ధమైంది. ఇలా పుస్తక జ్ఞ్యానం సముపార్జించిన నాకు అసలు కుండలిని శక్తి ఉంటుందని అది జాగృతి అయితే గాని నేను సాధన చేయలేనని తెల్సి గతుక్కుమన్నాను. ఇక నా ఆధ్యాత్మిక జీవితం ఇలా మొదలవ్వటం, కర్మ నివారణ చేసి నేను ఇక పుస్తక జ్ఞానమును పొందటం అదే సమయములో నా సాధన కూడా కొనసాగించటం, మంత్రోపదేశం పొందటం, నాకు ముందే కామము ఎలా అధిగమించాలో తెలియని స్థితిలో అవస్థలు పడుతుంటే నాకు ఈ గ్రంథములో చెప్పిన విధానం నచ్చి నేను కూడా సాధన చేయాలనీ ఆరంభించటం ఇక్కడ ప్రతి రోజు సాధనలో జరిగే అనుభావులు ప్రతి చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన,విభేధనలు అలాగే ఆ చక్రాలు బలహీనపడినపుడు ఒకే ఇబ్బందులు అవ్వి అధిగమించడానికి ముద్రలు, ఆసనాలు ఉపయోగపడతాయని అవి సాధన చేయటం కానీ అదే సమయంలో నా గురువు ఇదంతా చేయటం నాకు తెలియదు. ఈ విశ్వా సృష్టి ఎలా జరిగినదని ఒక మాయ వల్ల ఇదంతా జరిగిందని, మాయని ఎలా దాటాలని చిన్న చిన్న ఉదాహరణల ద్వారా తెల్సుకొని కాస్త గ్రంథము జ్ఞానమును పొందినను...ఈ అధ్యాయంలో నిజ గురువును గుర్తించటం ఎలా అని తెలుసుకొని నకిలీ గురువుల చేతుల్లో పడకుండా ఒక నిజ గురువు గా శ్రీ పవనానంద సరస్వతి స్వామివారిని పట్టుకొని ఆయననే మార్గదర్శకుడని, దేవుడిని ఏదైనా అడగాలంటే ఎంతో జాగర్తగా ఉండాలని "నిదర్శనం-నీదర్శనం" కాస్త మర్చి ఎలా ఏడుపు తెప్పించింది, అసలు విగ్రహారాధనను దాటి విశ్వరాధన చెయ్యాలని,మంత్ర దేవత పరీక్షలు దాతలై, అసలు స్కూటర్ మీద కూడా దత్త స్వామి దర్శనం అవుతుందని మొదటిసారి తెల్సింది. ఇన్ని రోజులు దేవుడు కనిపిస్తే సాధన అయిపోతుందని అనుకున్న నాకు "నేనే దేవుడ్ని" అని తెలుసుకోవాలని అనుకున్న. నా గురువు ప్రేమ వివాహం చేసుకోవటం చూసి ఇక సాధన ఏమౌతుంది అని అనుకున్న నాకు ఒక కొత్త కోణం కనిపించింది గురుపత్ని కూడా మోక్షగామిగా మారటం,భక్తి అమాయకంగా ఉంటె ఒకే కష్టాలు, ప్రకృతిలో అన్ని జీవరాసులు గురువులని అసలు నేను లోకాన్ని చూసే విధానాన్నే మార్చేసింది. ఈ అధ్యాయంలో ఒక్కో సాధన విధానాన్ని ప్రయత్నించి సరిపడదని తెలుసుకోవటం. నాకు మాత్రం ధ్యాన మార్గమే సరిపోతుందని తెలుసుకున్నాను.

ఈ అధ్యాయంలో వెళ్లే ముందు నాకు అసలు 7 చక్రాలు మాత్రమే ఉంటాయని తెల్సు కానీ అసలు 13 చక్రాల సాధన చేయాలనీ,పంచ శరీరాలు ఉంటాయని కూడా తెలుసుకోవటం. ఇక ఒక్కో చక్రంలో ప్రతిరోజు సాధనలో ఎం జరిగింది అని చెప్పేసరికి అసలు నేను ఏ చక్రంలో ఉన్నానో తెలుసుకోవటానికి అద్దము మీద గాలి ఊది ఏ చక్రములో ఉన్నానో తెల్సుకోవొచ్చని ఆలా ప్రతి చక్రములో కలిగే మాయలు అవ్వి ఎలా దాటాలో తెల్సుకొని అతి జాగర్తగా ఈ చక్రమయాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళటం అలాగే ఆయా సమయాల్లో మాకు రావాల్సిన దైవిక వస్తువులు రావటం ద్వారా ముందుకు వెళ్తున్నానని, ఈ చక్రాలు జాగృతి, ఆధీనం,విబేధాన సమయములో నాకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని అలాగే ఈ చక్రాలు బలహీన పడ్డప్పుడు ఆసనాలు,చేతి ముద్రల ద్వారా ఎలా అధిగమించొచ్చు అని, ఇక మూలాధార చక్ర కామ మాయను దాటటానికి నేనెందుకు ప్రయత్నించకూడదు అని  అన్ని తెల్సుకొని అవ్వే పాటించి ఆ చక్రము దాటటం…. అలా అన్ని చక్రాలు దాటటం జరిగినది. నాకు ఒచ్ఛే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. మా సద్గురువుకి శ్రీ పరమహంస పవనానంద స్వామికి కీచైన్ లు రావటం అవి దశావతారాలని వారికి ధ్యానములో కనిపించటం అవి శూన్యంలో లీనమవ్వటం అంటే విష్ణుమూర్తి లేదని తెల్వటం దానికి మా బుర్ర తిరగటం, హిమాలయాల్లో యోగముద్రలో ఉన్న సదాశివ మూర్తి దర్శనం అవ్వటం,అరుణాచలంలో దక్షిణామూర్తి దర్శనం అయ్యి త్యాగం వల్లే శాంతి లభిస్తుందని "నేను" అనేది త్యాగం చేసి "అహం బ్రహ్మాస్మి" స్థితిని పొందటం, ఇక మా సద్గురువు సూక్ష్మ శరీరయానంతో ఒక భక్తుడిని మహాశివరాత్రి రోజు కాశి దర్శనానికి, గంగ స్నానాయికి తీసుకెళ్లటం, రామేశ్వరం,బద్రీనాథ్,మహాఉజ్జయిని, కైలాసపర్వతం మానససరోవరం క్షేత్రాలకు సాధకులు వెళ్లకూడదని వెళితే పునః జన్మ తప్పదని.....నేను కాశి కి వెళ్ళినపుడు గోముఖ కమండలం తెచ్చుకోవటం అది దేనికి వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ గ్రంథములో చూడగా గోముఖ కమండలం కొనుక్కోవటం ఇది రావటం వల్ల గుణ చక్రం ఆధీనం అయ్యిందని, అలాగే ఒకరోజు ఇంటర్నెట్ లో చూసి హనుమానపత్రి తెప్పించుకోవటం వల్ల నేను హృదయాచక్రంలోనికి వెళ్ళటం, ఇక్కడే నాకు ఇష్టలింగం రావటం, నా ఆదిజన్మ అయిన కీచైన్ రావటం, అసలు ఎందుకు ఇవన్నీ వచ్చాయా అని చూసి వీటి ఆరాధన అనగా ఇష్టలింగారాధన- దేహమే దేవాలయం అనే విధంగా ఆరాధించటం ప్రారంభించాను,ఆర్గాల స్తోత్రం చదవటం మొదలుపెట్టినాను, ఇలా సాగుతున్న మా సాధనలో మేము హృదయచక్రము దగ్గర ఇష్టకోరిక కు స్పందించటం జరిగింది.ఇష్టలింగారాధన వల్ల నేను ఇది దాటి వెళ్ళటం, ఆ తరువాత నాకు సుదర్శన సాలిగ్రామం, దక్షిణ వృత శంఖం, గణపతి శంఖం, రావటం. ఒక రోజు మాకు కపాలమోక్షమాల చేసుకోవటానికి నాకు రుద్రాక్షలు, స్పటికాలు, కపాలమాల,సుదర్శన చక్ర లాకెట్ రావటం జరిగినది, ఇక అది ఎలా తయారుచేసుకోవాలి చూసి చేసుకోవటం అలాగే ఎందుకు వచ్చాయో కూడా తెలుసుకోవటం జరిగింది. ఈ ఇష్టలింగా సుదర్శన చక్రం రావటం వలన నేను స్పందన,సంకల్ప,రాహిత్య స్థితికి రావటం  ,మోక్షమాలను వేసుకోవటం వల్ల మనోనిశ్చలస్థితిని పొందడం, నా ఆది జన్మ కీచైన్ రావటం ఇవన్నీ ఒక్కో చక్రానికి వెళ్ళినపుడు రావటం ఈ దైవిక వస్తువుల ఆరాధనా వల్ల మేము ఏ మాయలో పడకుండా ముందుకు వెళ్ళటం జరిగినది. ఈ అధ్యాయాలలో ఈ దైవిక వస్తువులు వచ్చినపుడు అసలు ఎందుకు వచ్చాయా అని నాకు మొదట అర్ధం కాలేదు. నేను ఎప్పుడైతే వివరాల కోసం ఇందులో చూసి ఆరాధన మొదలు పెట్టటడం వల్ల ఓంకారం నుండి తుంకారం కి వెళ్ళటం, ఈ సాధన అనేది ఒక స్వప్నమని , అసలు దేవుడు లేడని, అన్నిరకాల దైవ సిద్ధాంతాలు ప్రతి దాన్ని ఎలా మార్చి భ్రమలో ఉంచాయో తెల్సి నాకు బుర్ర తిరగటం మొదలైంది. అలాగే మా గురువుగారు చెప్పిన సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును ఒక భక్తురాలిగా ఏకీభవిస్తాను. మనం ఒక సినిమా చూస్తున్నట్టు జరుగుతుందని, కోరిక లేని వాడు మోక్షగామి కాలేడని, ప్రతి సాధకుడు ఎదో ఒక బలహీనతని దాటలేడని,సర్వం శూన్యమని, మోక్షం పెద్ద మోసమని, "కపాల మోక్షమాల" అన్ని కణాలకి కనెక్ట్ చేసి అది చేసుకోవటం వల్ల నేను మనో నిశ్చల స్థితిని పొందటం.ఇక్కడ మాయగా మూడు పదవులు చూపించటం ఈ సుదర్శన చక్రవారాధన,శంఖాలు, ఇష్టలింగారాధన వలన నేను స్పందన,సంకల్ప,రాహిత్య స్థితికి వచ్చి బ్రహ్మతదాకార స్థితిని పొందినానని స్వానుభవం అవ్వటం, స్వానుభూతి ఉండదని తెల్సి మౌనఃబ్రహ్మగా ఆగిపోయాను. నేను ఎప్పుడైతే నా ఆది జన్మ ముత్యపు చిప్పని మా సద్గురువుకి శ్రీ పరమహంస పవనానంద స్వామికి ఇచ్చినానో  అప్పుడే నా ఆకాశ శరీరానికి కపాలమోక్షం వచ్చిందని "నేను లేను" అనే స్థితికి వచ్చినానని జ్ఞాన స్ఫురణ కలిగింది. కొన్ని రోజులకి నేను పరమశూన్యంలో కలిసిపోయినట్టు నాకు ధ్యానానుభవం కల్గుడముతో మౌనం వహించి, స్పందన,సంకల్ప,రాహిత్య స్థితికి వచ్చి బ్రహ్మతదాకార స్థితిని పొందినానని…. ఏకమూలబ్రహ్మకపాలమునకు ఉన్న ఏకైక ఆలోచనాయైన నేనులేను అనే స్దితికి స్వానుభవం అవ్వటం తప్ప స్వానుభూతి ఉండదని తెలిసి ఈ ఆలోచన దగ్గర ప్రస్తుత దేహజన్మ ఆగిపోవడముతో..ఈ దేహ జన్మసాధన పరిసమాప్తి అయ్యినదని గ్రహించడముతో యోగిని విభూతినాథ్ గా నిరాకార మవ్వుతుందని గ్రహించి మౌనము వహించాను.నా భౌతిక మరణం గూర్చి పట్టించుకోకుండా బ్రహ్మతదాకార స్థితిలో నిలచి ఆఖరుకి ఈ దేహ మరణం వచ్చేదాకా కోసం నీలి ఆకాశము కేసి ఎదురుచూస్తున్నాను. ఈ కపాలమోక్ష గ్రంథము ద్వారా నాకు కలిగిన వివిధ రకాల ధ్యానుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలకి  అలాగే ఈ చక్రమాయలు గూర్చి.. దైవికవస్తువులు గూర్చి...వివిధ రకాల యోగుల అనుభవాలతో... సత్య బ్రహ్మాజ్ఞానము ఇవ్వడము వలన ఇది కాస్త నాలాంటి వారికి ఈ గ్రంథము ఒక ఆధ్యాత్మిక సాధన గురువు లాగా ఉపయోగపడుతుందని చెప్పటానికి నా జీవిత సాధన అందుకు నిదర్శనమైనదని మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు గదా!

సర్వేజనా సుఖినోభవంతు!!
-పరమహంస స్వాతినంద

********************************************
సత్సంగం



మోక్షాలలో  ఏడు రకాల మోక్షాలు 

ఈ విశ్వములో ఆదిలోను అలాగే అంతములోను స్ఫటికలింగమే ఉన్నదని తెలుసుకోండి.అనగా మన మూలాధార చక్రములోను స్వయంభూ శివలింగముగా మన ఆత్మలింగముంటే అదే బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండచక్రములో స్ఫటిక పరమలింగమున్నదని గమనించండి. శివలింగమంటే పూర్ణశూన్యస్థితికి సంకేతమని..ఈ శూన్యము ఆకారము దాల్చితే అదే శివలింగమని గ్రహించండి.అలాగే యోగసాధన సిద్ధి అంటే మన మూలాధర చక్రములోని ఆత్మలింగము కాస్త బ్రహ్మరంధ్రములో బ్రహ్మాండచక్రములో ఉన్న పరమలింగములో ఐక్యము చెయ్యడమే ఆత్మలింగమోక్షము అవుతుంది.చాలామందికి మోక్షము అంటే కపాలమోక్షమే అనుకొంటారు.

కాని నిజానికి మోక్షాలలో  ఏడు రకాల మోక్షాలు ఉంటాయి.అవి సప్తశరీరాల మోక్షం,64 కపాలాల మోక్షం,పురుష,స్త్రీ శివలింగాల మోక్షం,మణుల మోక్షం,శివలింగాల మోక్షం,ఆత్మలింగ మోక్షం,పరమమోక్షం అన్నమాట.ఇందులో సప్తశరీరాల మోక్షం అంటే సర్వ కర్మలు నివారణ చేయడము అలాగే కపాల మోక్షము అంటే కర్మ జన్మల నుండి విముక్తి పొందటము ఇక మణూల మోక్షము అంటే  మన మనస్సుకి కోరికల రాహిత్యస్థితి ఇవ్వడము శివలింగాల మోక్షము అంటే అన్నింటి యందు పరిపూర్ణరాహిత్య స్థితి పొందటము ఇక ఆత్మలింగ మోక్షము అంటే అన్నింటియందు ఇంద్రియనిగ్రహముతో ఉండి జితేంద్రియుడవ్వడము అన్నమాట.ఇక ఆఖరిదైనా పరమమోక్షం అంటే పూర్ణశూన్యమునందు పూర్ణముగా శూన్యమవ్వడము అన్నమాట.మధుర,కాశీ,ద్వారక,ఉజ్జయిని,కంచి,అయోధ్య,హరిద్వార్....అంటే ఈ పురాలు బట్టి చూస్తే ఖచ్చితముగా సప్తమోక్షాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయి అని ఆలోచింస్తుండగా...ఒక పట్టనా అర్ధము కాలేదు.అపుడు ఈ సప్తపురాలను విశ్లేషణ చెయ్యడము అనగా మధుర పురమంటే శ్రీకృష్ణుడి జనన ప్రాంతము గావడము వలన ఇది జీవుడి సప్త శరీరాల జనన మరియు మోక్షమిచ్చే శరీరమోక్షపురము అయ్యిండాలి.ఆ తర్వాత కాశీక్షేత్రానికి వస్తే ఇక్కడ ప్రతినిత్యము శవదహనాలు జరగడమువలన ఇక్కడ కపాలమోక్షం జరుగుతుంది.అందువలన ఇది కపాలమోక్షపురము అయ్యిండాలి.ఇక ద్వారకక్షేత్రమునకు వస్తే శ్రీకృష్ణుడు దగ్గర శమంతకమణి ఉండుటవలన ఈ పురము కాస్త మణిమోక్షపురము అయ్యిండాలి.ఇక ఉజ్జయినిక్షేత్రానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగము పురుషశివలింగము గావడము వలన ఈపురము కాస్త పురుషశివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక కంచిక్షేత్రానికి వస్తే ఈ పురము కామాక్షిదేవత ఆధీనముగావడము వలన ఈ పురము కాస్త .స్త్రీ శివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక అయోధ్యక్షేత్రానికి వస్తే శ్రీరాముడు కాస్త తన ఆత్మలింగమును రామేశ్వరక్షేత్రమునందు మూడు అడుగుల స్ఫటిక ఆత్మలింగమును ప్రతిష్టించడమువలన ఈ పురము కాస్త ఆత్మలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక హరిద్వార్ క్షేత్రానికి వస్తే రుషికేశి క్షేత్ర శివలింగము అనేది మహాశివుడు కాస్త హాలహలము సేవించడము వలన ఈ నీలిరంగుశివలింగము ఉద్భవించినదని చెప్పడము బట్టిచూస్తే ఈపురము కాస్త పరమమోక్షపురము అయ్యిండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సప్తమోక్షాలు అనగా శరీరమోక్షం.. కపాలమోక్షం.. పురుషశివలింగమోక్షం.. స్త్రీశివలింగమోక్షం..మణిమోక్షం..... ఆత్మలింగమోక్షం..పరమమోక్షం అను ఏడు రకాల మోక్షాలుంటాయని...ఎవరైతే వారి వారి కర్మలనుసరముగా ఆయా క్షేత్రాలయందు 9 రోజులనుండి 9 సం!!రాలుపాటు ఆవాసము చేస్తారో వారికి ఆయా మోక్షం కల్గుతుందని....

అలాగే మన ఆత్మ లింగములు అనేవి హరిద్వార్ క్షేత్రములో ఉంటాయి.ఇక్కడ మన 48 తరాలు ఆత్మల రూపములో ఆవాసము చేస్తూ ఉంటారు. పైగా ఈ క్షేత్రము కూడ మూలాధారచక్రమునకు సంభంధించినది.కాబట్టి ఈ క్షేత్రములో నుండి ఒక అంగుళము ఉన్న టాబ్లెట్ ఆకారములో ఉన్న ఒక స్ఫటిక సాలిగ్రామము అలాగే మూడు అంగుళాలు ఉన్న గోళాకారముగా ఉన్న స్ఫటికబాణలింగమును తెచ్చుకోండి.టాబ్లెట్ ఆకారములో ఉన్న స్ఫటికబాణలింగము మన ఆత్మలింగమైతే గోళాకారముగా ఉన్న స్ఫటికబాణలింగము పరమలింగము అవుతుందని గ్రహించండి.నిజానికి స్ఫటిక లింగారాధన వలన అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ప్రస్తుతము ఉన్న తరముతో కలిపి 15 తరాల వారికి ఏదో ఒక మోక్షస్థితి కలుగుతుందని లింగపురాణము చెప్పడము జరిగింది.కాబట్టి మీలో ఎవరికైన ప్రస్తుత జన్మయే ఆఖరి జన్మ అవ్వాలని ఉంటే అలాగే కర్మ,జన్మ,స్పందన,కోరిక,సంకల్ప రాహిత్య స్థితి పొందాలని ఉంటే అలాగే మోక్షగామిగా మారాలని ఉంటే ఈ హరిద్వార క్షేత్ర స్ఫటికలింగాల ఆరాధన చేసుకోండి.ఆత్మలింగమును మెడలో చచ్చేదాకా ధరించండి.పరమలింగమును నిత్య ఆరాధన పూజలో ఉంచండి.మీ గతజన్మల కర్మఫలితమును బట్టి మీకు ఏ మోక్ష ప్రాప్తి ఉందో అది ఖచ్చితముగా వస్తుంది.

 బ్రహ్మరంధ్రము నుండి బ్రహ్మరంధ్ర అంతర్గత గుహలో ఉన్న పురుష లేదా స్త్రీ లేదా కపాలధారి దర్శనానుభవము మీకు ప్రత్యక్ష దర్శనానుభూతిగా గావాలంటే కాశీక్షేత్రములో 40 అడుగుల లోతులో ఉండే రహస్య శివలింగమును చూస్తే..మీకు ఖచ్చితముగా బ్రహ్మరంధ్రము నుండి చూసిన అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఈ రహస్య శివలింగమును ప్రత్యక్షముగా చూడటానికి వీలుండదు. 40 అడుగుల పైన ఉన్న ఒక చిన్న రంధ్రము ద్వారానే మాత్రమే చూడాలి.ఒక కార్తీక పౌర్ణమి,శివరాత్రి రోజు మాత్రమే ఈ శివలింగమును ప్రత్యక్షముగా చూసుకొనే అవకాశముంటుంది.మిగిలిన అన్ని రోజులు గూడ ఈ పైన ఉన్న రంధ్రము ద్వారానే చూడవలసి ఉంటుంది.ఈ గుడి వీడియో కోసము    the historical hidden shivaling of kashi అని సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది.చూసి తరించండి.

మీకు నమ్మకము కలిగితే మీకు ఇష్టమైన సాధనామార్గమును ఒకటి ఎంచుకొని సాధన సాధ్యతే సర్వం సాధ్యమని ఎవరికి వారే సాధన చేసి నిజఙ్ఞానమును పొందండి.ఆత్మ ఙ్ఞానమును పొంది ఆత్మయోగిగా మారండి.సాధనకి అలాగే స్ఫటికలింగారాధనకి  కులము, మతము, స్త్రీ, పురుష, చిన్న, పెద్ద,బ్రహ్మచారి లేదా సంసారి మరియి భోగిగా లేదా యోగి అనే బేదభావము ఉండదని తెలుసుకోండి.ఎందుకంటే అందరు గూడ ఆత్మ జీవులే.ఆత్మలింగాలే.కాని మాయ, మోహ, వ్యామోహలలో పడి వచ్చిన దారి మర్చిపోయి సాలెగూడులో చిక్కుకున్న పురుగులా కర్మ-జన్మ బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నాము.అవిశ్రాంతిగా కొట్టుమిట్టాడుతున్నాము.కనిపించేది సత్యమని కనిపించనిది అసత్యమని భ్రమ భ్రాంతిలో ఉండిపోతున్నాము.నిజానికి మన జన్మకి విశ్రాంతి,శాంతిని ఇచ్చేది అలాగే ఏ శూన్యము నుండి మనము పుట్టామో తిరిగి అదే శూన్యములో శూన్యము అయ్యే విధముగా చేసేది మరియు కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని చేప్పే ఆత్మఙ్ఞానము ఇచ్చేది మోక్షగామిగా మారి మోక్షానుభూతి పొందటమే మనకి ఉన్న ఏకైక మార్గమని గ్రహించండి.ఈ మార్గానికి దిక్చూచిగా మార్గదర్శిగా ఉండటానికి సూక్ష్మంలో మోక్షముగా నా 27సం|| నా ధ్యానానుభవాలు అలాగే అందరికి అర్ధము అయ్యే విధముగా నా పరిశోధనలో నేను తెలుసుకున్న నిజయోగానుభవాలు ఆధారముగా పరమహంస  పొందిన ధ్యానానుభవాలు నిజమో కాదో మీరే స్వయముగా తెలుసుకోవాలంటే మీరు మోక్షగామిగా మారకతప్పదు.తద్వారా ఆత్మమోక్షము పొందకతప్పదు.



సత్సంగం అంటే ఏమిటి?

ఓ మంచి గురువు, మంచి స్నేహితుడు, మంచి గ్రంధంతో గడపటమే సత్సంగం.


మనిషి జీవన విధానం ఎలా ఉండాలి?

మనస్సుని ఉత్సాహంతో నింపుకొని ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడం..
, మనస్సుని అన్నివేళలా ఆశావహంగా ఉంచుకొని దుఖాన్ని అధిగమించడం,
ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడం, అన్యాయాలను, అనినీతిని ఎదుర్కోవడం
, కుటుంబం కోసం, సంఘం కోసం పాటుపడటం,వైఫల్యాలు మరిచి నిరంతరం విజయం కోసం ప్రయత్నించడం. ధర్మమేమిటో అవగాహన చేసుకోవడం - ఇదే మనిషి జీవన విధానం.

మనిషి జీవితం ఎలా శాంతంగా ఉంటుంది?

జీవనానికి నియమాలు, నదులకు చెలియలి కట్టలు
మనస్సుకి సత్సంగ సాధన -
ప్రాణానికి ఆయామం
శరీరానికి వ్యాయామం
బుధ్ధికి ప్రగాడ సూక్ష్మత - ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితం శాంతంగా ఉంటుంది.

మనిషికి సంతోషం ఎప్పుడు, ఎలా కలుగుతుంది?

హుషారుగా ,ఇష్టపడి కష్ట పడుట
ఇతరులకు ప్రేమతో సేవ చేయడం
నీ స్వశక్తి పై గానీ తోటి వారిపై గానీ, దేవునిపై గానీ విశ్వాసం ఉంచి
ఎపుడూ నీకు దేనిపై విశ్వాసముందో దానిని ప్రార్ధన చేస్తూ
మన పని విజయవంతం కావటానికి కృషి చేయడం - సంతోషానికి తొలి మెట్టు.

మనిషి ఏది వదులు కొంటే శాంతంగా ఉంటాడు?

మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మానసం, చిత్తం, బుద్ది, అహంకారం, వీటన్నింటినీ ఆవరించి జీవాత్మ ఉంటాయి. శరీరంలో ప్రతి కణానికి మనస్సు ఉంటుంది. కణంలోని ప్రతి అణువుకూ మనస్సు ఉంటుంది. కానీ స్థాయిలోనే తేడా!
మనిషి ఏది సాధిస్తే నిత్యం శాంతంగా, సంతోషంగా ఉంటాడో కనిపెట్టడానికి ఎందరో ప్రవక్తలు, యోగులు, రుషులు మొదలుకొని నేటి శాస్త్రజ్ఞులు వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే, మనిషి నేను -నాది - నా వాళ్లు అనే అహంకార మమకారాలను పూర్తిగా తొలగించుకొంటే ఎపుడూ శాంతిగా ఉండవచ్చును.

శరీరాన్ని, మనస్సుని, ప్రాణశక్తిని 
ఒకే కంపనంలో ఉంచడమే 
యోగానికి తొలి మెట్టు .
అహంకారాన్ని పరమాత్మలో 
నిమజ్జనం చేయడమే 
సాధనలో చివరి మెట్టు.



అహంకారాన్ని ఎలా నిర్ములించాలి?సాధనతో అది ఎలా చేయాలి?

నిన్ను నువ్వు ఇష్టపూర్వకముగా కోల్పోవాలి. ఇలా జరగాలంటే పలు మార్గాలున్నాయి.
మొదటగా - ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.

మనస్సుని ఏకాగ్రతం చేయటం సాధన చేయాలి. దేని మీద చేయాలి?

శబ్దం లేదా నాదం లేదా మంత్రం మీద చిత్తాన్ని నిలిపేటట్లు సాధన చేయాలి. మంత్ర యోగం-మనస్సుని సంపూర్ణముగా దేవునిపై గానీ, నీకిష్టమైన పనిపైగానీ లేదా నీ స్వశక్తిపై గానీ కేంద్రీకరించి ఎల్లపుడూ స్థిత ప్రజ్ఞత్వంతో ఉండేటట్లుగా సాధన చేయాలి -కర్మ ఫల సన్యాస యోగం.

కర్మ సన్యాసం చేసి ప్రతి కార్య కారణానికి దేవునిపై భారమేసి, సుఖ దుఖాలకు చలించక సంపూర్ణ శరణాగతి తో త్యాగ వైరాగ్య జీవనం సాగించడాన్ని-భక్తి యోగం.

అన్ని కర్మలూ నిమిత్త మాత్రము గా ఎలాంటి అనుభూతిలేకుండా చేస్తూప్రేమ తో కూడిన సేవ ఇష్టపూర్వకముగా చేయడాన్ని -రాజయోగం.

శరీరాన్ని సంరక్షించుకొంటూ, మనస్సుని "నేనెవరు" అనేదానిపై విచారణ చేస్తూ విహిత కర్మాచరణ చేస్తూ, త్యాగ బుద్దితో జీవనం -జ్ఞానయోగం.

పైన చెప్పిన విధంగా చేస్తే మనిషికి నిత్య సంతోషం, శాంతి, ఆనందం కలుగుతాయి. అదే మోక్షం. అదే నిర్వాణం. ఇది మనం బతికున్నప్పుడే కలిగే అనుభూతి. ఇలాంటి ఆనందకరమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు.అంటే మన మనస్సుని రీ ప్రొగ్రాం చేసుకొవడమన్న మాట. ఏమని? సుఖశాంతులకు బయటి ప్రపంచంపై ఆధార పడనక్కరలేదు, మన మనస్సే వీటికి మూలం, కాబట్టి మనస్సుని ఆధీనము చేసుకొంటే చాలు, నిత్యం శాంతంగా ఉండవచ్చు.

మనిషి కనీస అవసరాలు తీర్చుకొంటూ విద్య వినయాలతో డాంబికాలు, దంభాలు లేకుండా కనీసపు వ్రుత్తి ఉద్యోగ, కుటుంబ మరియు సంఘ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం చేయాలి. కోరికలను తన ఆరోగ్యానికి, ఇతరులకు ఇబ్బంది రానంతవరకు తీర్చుకోవచ్చు. ఆశ ఉండాలి. అత్యాశ ,దురాశ ఉండకూడదు. పట్టుదల ఉండాలి. మొండితనం కూడదు. అన్యాయ అధర్మాలను ప్రతిఘటించే కోపం,ఆవేశం, ఆలోచన ఉండాలి. తన ఆరోగ్యాన్ని, ఇతరులను నాశనం చేసే క్రోధం, చింత ఉండరాదు .

అన్ని ప్రాణులపై సమధర్మం ఉండాలి. ఏమి చేస్తే నువ్వు బాధ పడతావో, వాటిని ఇతర ప్రాణులకు చేయకపోవటమే అహింస. 

స్వధర్మం అంటే ఏమిటి?

జీవితం పైనా, తోటివారి శాంతిపైనా ఉత్సాహం
శత్రువులను కూడ క్షమించే గుణం
తనకున్నంతలో ఇష్టపడి చేసే సేవ
ఇతర ప్రాణులను ఆనందముగా ఉంచే ప్రేమ
ఎన్ని వైఫల్యాలు ఎదురైనా చలించని ఓర్పు
తనపైనా, ప్రతి ప్రాణి పైనా శ్రద్ద - 
ఈ లక్షణాలతో జీవించడమే మనిషి కనీసపు స్వధర్మం. 
నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు....శాంతి, ఆనందాలు అవే వస్తాయి.

తపస్సు అంటే ఏమిటి ? 

ఒక మంత్రాన్నో..., ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు.

తపస్సు అంటే ఇల్లు, వాకిలి విడిచిపెట్టి, అడవుల బాటపట్టి ఆశ్రమాల్లో చేరడం కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించడాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయ కర్మలలో ఆధ్యాత్మిక చింతన తపించడం..నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయ్యేలా కార్యాచరణ రూపొందించడమే తపస్సు. ఇలా ప్రతి వ్యక్తి పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అలా చేయడం వల్ల మల విక్షేప ఆవరణలనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణంతో మల దోషం, మననంతో విక్షేప దోషం, నిరంతర ధ్యానమనే నిధిధ్యాసతో ఆవరణ దోషం నశిస్తుంది. ఈ విధంగా మనసును శుద్ధి చేసుకున్నవారి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం అంటే పూర్వ జన్మ వాసనలు క్రమేపి ఈడేరుతాయి. పాపవాసనాక్షయం కాగానే ప్రశాంతత రూపం మనసుకు చేకూరుతుంది.

శారీరక ఆవేదనలు, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవడం వల్ల మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా, తపస్సు అనే ధనాన్ని పొందాలి. వ్యక్తి తన జీవన విధానం, తన పరిసరాల్లో అలాంటి వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. ఇంటినే తనకు, తపస్సుకు అనుకూలంగా మార్చుకోవాలి. మొదట తానూ మారాలి? ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకుని, జీవిత లక్ష్యాన్ని గుర్తించామో అదే మోక్షం. ఆ మోక్ష సాధన కోసం మారాలి. మనిషిగా పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరడానికి దారితెలుసుకోమని నిర్దేశించాడు. అయితే మనిషి దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అలా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.

మోక్షం అంటే మనసు, శరీరాన్ని చైతన్యంగా ఉన్నప్పుడే ఆత్మ నుంచి వేరుచేయడం. మోక్షం అంటే మరణం తర్వాత పొందేది కాదు. బతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్టు చేసుకోవడమే. ఆత్మానుభూతి.. ఎవరి అనుభూతిని వాళ్లే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఆత్మ అనేది భగవంతునితో అనుసంధానమై, సాధన కొనసాగిస్తూ జీవించడం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన వాళ్లు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకం, పట్టుదల, నిరంతర తపనతో ఆత్మ జ్ఞానం కోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.


'తపనే' తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే 'తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే...మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.... ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు.'అయ్యా.. మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.' నిజమే...ఆలోచించడం వేరు. ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం 'సీతాకోకచిలుక'. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపురుగులు వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి.,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక.... భగవన్నామామృత పానంతో తరిస్తాడు.

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ. అది ఏమిటంటే..!

                "అనాయాసేన మరణం
                వినా దైన్యేన జీవనం
                దేహాంతే తవ సాన్నిధ్యం
                దేహిమే పరమేశ్వరం."

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.

"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.

"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.

"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 

"దేహిమే పరమేశ్వరం"

ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.

1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ ....నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.

3.  నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.

ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.

దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణంలో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే మనో తపస్సు అవుతుంది.
   
*********************************************


దక్షిణా మూర్తి స్వరూపం ?

దక్షిణా మూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకరకుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు యముని ( మృత్యువుని ) చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు - ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి, దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.

ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. | వసిష్టుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు.


వసిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే 'శ్రీకాళహస్తి'. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞానప్రధాన క్షేత్రం, ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం గమనార్తరి, రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్' ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు' అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది,

పరమ జ్ఞానమూర్తియైన ఈ ఆది గురువును స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సోత్రము బహుళ ప్రసిద్ది చెందింది. "విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం..." అంటూ ప్రారంభమై ........ "గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అని మకుటంతో సాగు. ఆ స్తుతిలో అద్యైత వేదాంతమంతా సుప్రతిష్టితమయ్యింది. " గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్! నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:

దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

కర్మ-జన్మ రాహిత్యం, సారూప్య, సాలోక, సాయుజ్యముక్తులు, మోక్షం, నిరాకార నిర్గుణ పరమాత్మ సన్నిధి చేరే సమాధి స్థితి, - ఇవన్నీ ఎవరికివారు అనుభూతించవలసిన అధి భౌతిక అధి ఆత్మిక విషయాలు.

తెలుసుకో తగినది, తెలుసుకొనేవాడు, తెలుసుకొన్న విషయం - ఇవన్నీ ఏకమైన సమయంలో అంతా శూన్యమే! ఆ శూన్యం ఇలా ఉంటుందని, అలా ఉంటుందని వివరించే స్మ్రుతులు, శ్రుతులు, గీతాసారాలు, మరెందరో ప్రవక్తలు నుడివిన సిద్దాంతాలు మనకెన్నో ఉన్నాయి. వాటిని మార్గం చూపించే మైలు రాళ్ళుగా, దీప జ్ఞాన కాంతులుగా స్వీకరిద్దాం.

దేవుడిని 
ఆరాధించడము కంటే 
ఆయన్ని అర్ధము చేసుకుంటే 
మీ యోగసాధన పరిసమాప్తి.


యత్ భావము తత్ భవతి.

సాధానాత్ సాధ్యతే సర్వం



ఏమి తెలియని వాడు.......

ఏదో తెలుసుకోవాలని... సాధన చేస్తే

ఏమి లేదని …. సర్వం శూన్యము అని తెలుసుకోవడమే

సంపూర్ణ బ్రహ్మజ్ఞాన స్ధితియని.......

మనో నిశ్చలస్ధితి పొందితే

సంపూర్ణ యోగసాధన పరిసమాప్తి స్ధితియని...

ఆనందరహితమైన పరమ ప్రశాంత స్ధితిని పొందితే

ఇదియే పూర్ణ మోక్షస్ధితి...



ఇదే ఈ దేహజీవితము తెలుసుకున్న అంతిమ సత్యము


శుభంభూయాత్ 
మీ పరమహంస పవనానంద

**********************************************
మా యోగమిత్రుడైన పరమహంస పొందిన ధ్యానానుభవాలను సాధనలోకానికి ఆయన జ్ఞాపకార్ధముగా అందిచాలని ఆయన స్నేహ సాహచర్యం పొందిన కొంతమంది యోగమిత్రులు కలిసి ఈ బ్లాగ్ పెట్టడము జరిగింది.ఇందులో మార్పులు,చేర్పులు పూర్తి అయ్యాయి.మనస్సు పెట్టి మీకు అర్ధము అయ్యేనంతవరకు చదవండి.దానితో మీకు ఎలాంటి గురువుతో, దైవముతో, జ్ఞానముతో, సాధనతో ఆఖరికి మోక్షముతో పని ఉండదు.ఎందుకంటే ఈ గ్రంధరాజమే అన్ని ఇస్తుంది.తీరుస్తుంది.ఈ గ్రంధము చదివి అర్ధము చేసుకోవడమే అసలు సిసలైన పూర్ణ మోక్షమవుతుంది.ఎందుకంటే ఈ స్వానుభవముగా అనుభవ అనుభూతి పొందిన పరమహంస మా కళ్ళ ముందే పూర్ణ మోక్షస్ధితి పొందడము జరిగింది గదా.ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏమి గావాలో మీరే ఆలోచించండి.అలాగే ఈయన పొందిన అనుభవాలు అన్నిగూడ అక్షర సత్యమే.లేకపోతే విశ్వ ఆదిగురువైన అరుణాచల వాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వయంగా తన అరుణాగిరి లోపలకి పరమహంస జ్ఞానలింగమును తనలో ఎందుకు ఐక్యము చేసుకొంటారో ఒకసారి ఆలోచించండి.మీరు గూడ పరమహంస లాగా జ్ఞానహంసగా మారి పూర్ణమోక్ష స్ధితిని పొందటానికి "అరుణాచల శివ" నిత్య నామస్మరణ చేసుకుంటూ ఉండండి.ఈయన అనుగ్రహము మీరు పొందకల్గితే మీకు మోక్షమే.ఎందుకంటే ఈయనే విశ్వానికి మోక్షమిచ్చే ఆదిగురుదేవుడు-ఆది అరుణాయోగి అని స్వానుభవ అనుభూతి పొందండి.ఈయన అనుగ్రహము పొందడము వలన పరమహంస కాస్తా అరుణాయోగిగా మారి పూర్ణమోక్షము పొందడము జరిగింది.ఇలా ఈ గ్రంధమును చదివి అర్దము చేసుకున్నవారంతా గూడ మోక్షస్ధితికి చేరుకుంటారని ఆశిస్తూ... 

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.


అరుణాచల శివ..అరుణ శివ

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

BOOK REVIEWS

"Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job." -- SVRamana

 ఇది  చాలా బాగుంది. ఇలాంటివి  చదవాలన్న చదివి అర్థం చేసుకోవాలన్న ఆ సర్వేశ్వరుని అనుమతి లభించాకే చదివే అవకాశంవస్తాది.  నా లాంటి మీ అభిమాన పాఠకుల కోసం    రచనలను పుస్తకాల రూపములో ప్రచురించవలసిందిగా కోరుతున్న ఒక మీ అభిమాన పాఠకుడు


elaanti athmasaakshathkara anubhuthi kaliginapudu manassu chaala santhoshinchi manaki power baaga ochi body thelika avuthundi... ilaanti darshanam valla yogam inka inka cheyalani prerana kaligisthundi naku ee kadha valla athmasakshatkara anubhuthi kaliginadi.


ఒక గొప్ప పుస్తకంలో అద్భుతమైన ఙ్ఞానం నిండుగా ఉన్నా చదివే వ్యక్తి ఏకాగ్రతను బట్టే దానిని స్వీకరించగలడు.దాన్ని స్వీకరించగలిగే వ్యక్తి తన సామర్ధ్యం బట్టి ఎంత పొందాలో అంత పొందుతాడు.

 

నిజ ఙ్ఞానం చెప్పినా నమ్మరు.నమ్మినా వినరు.విన్నా సరిగ్గా అర్ధం చేసుకోరు.నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి.


మీ ఆధ్యాత్మిక అనుభూతులు అన్నీ అక్షరాబద్దం చేసి ప్రజాబాహుళ్యానికి అందించారు..మీకు సర్వదా కృతజ్ఞతతో ధన్యవాదాలు అర్పిస్తున్నాను.. ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన ,ఊహ కు అందని ఆధ్యాత్మిక సంఘటనలు గూర్చి ఎంతో శ్రమ కోర్చి అందరికి తెలియజేసిన మీ సంకల్పం ఎంతో గొప్పది.. ధన్యవాదాలు అండి🌹🏵️🌼🙏🙏🙏🙏


 


3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. SVRamana comment as:
    "Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job." -- SVRamana

    రిప్లయితొలగించండి