ఇష్ట లింగము ఇంటికి వచ్చినది:
(నా హృదయ చక్ర అనుభవాలు)
నా హృదయ చక్ర అనుభవాలు (నా డైరీలో):
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది. అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
ఆగస్టు 8: ఈ రోజు అరుణాచల వాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారి “నీ సహజ స్థితిలో ఉండు” అనే గ్రంధము చదవటం వలన సాధన అనేది సహస్రార చక్రము దగ్గర ఆగి పోకూడదని దీనికున్న జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రమునకు చేరాలని అప్పుడే సాధన పరిసమాప్తి అవుతుంది అని చెప్పటం జరిగినది. దానితో నా బుర్ర తిరగటం ఆరంభమైనది.
ఆగస్టు 9: జీవనాడి మార్గమునకు అధి దైవముగా పంచముఖ హనుమంతుడు ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవం అయినది.
ఆగస్టు 10: ఈ రోజు శ్రీశైలం వెళ్లి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాను. ఈమె చేతిలో ఒక లింగం ఉంది. దీని వివరాలు తెలియదు.
ఆగస్టు 13: ఈ రోజు అనంత పద్మనాభుడి ఫోటో అలాగే చిన్న విగ్రహమూర్తి తిరువనంతపురం క్షేత్రం నుండి వచ్చినాయి. విచిత్రంగా ఈయన కుడిచేతిలో ఒక శివలింగం మూర్తి ని పట్టుకుని ఉన్నట్లుగా ఉన్నది.
ఆగస్టు 15: ఈ రోజు మాకు ఇష్టలింగము అనగా నవపాషాణ నిర్మిత ఇష్టలింగము గూర్చిన వివరాలు తెలుస్తున్నాయి. ఈ లింగమును కాంతి యోగి అయిన బసవేశ్వరుడు నిర్మితము చేసి పూజించేవాడని తెలుసుకున్నాము. ఈ హృదయ చక్రం స్థితికి వచ్చినప్పుడు ఈ లింగమూర్తి రావాలని మాకు
P2:
మా గురువు దేవుడు నాతో చెప్పినారు. నిజ ఇష్టలింగము ఎప్పుడు ఎక్కడ నుండి వస్తుందో ఆయనకే తెలియదు అని చెప్పినారు. ఈ లింగమూర్తి వస్తేనే సాధకుడు హృదయ చక్రమునకు చేరుకుంటారని లేదంటే వెనుతిరిగి జీవనాడి ద్వారా మళ్లీ సహస్ర చక్రమునకు చేరుకుంటాడు అని చెప్పటం జరిగినది. అయినా నాకు బాధ లేదు. భయము లేదు. ఆశ లేదు. కారణం తెలియదు.
ఆగస్టు 17: ఈ రోజు ధ్యానము నందు అనవసరమైన ఆలోచనలు ఎక్కువైనాయి అని తెలుసుకున్నాను.
ఆగస్టు 18: ఈ రోజు ధ్యానము నందు ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తున్నానని గ్రహించాను.
ఆగస్టు 19: ఈ రోజు లేనిపోని వాటిని సంకల్పాలు పెట్టుకుంటున్నాను. అనే ఆలోచనలు వస్తున్నాయి.
ఆగస్టు 20: ఈ రోజు మా గురువు దేవుడిని వీటిని గూర్చి అడగాలని అనుకున్నాను. కుదర్లేదు. పైగా ఈ రోజు నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు తింటూనే ఉన్నాను. కడుపుతో ఉన్న స్త్రీ మూర్తికి ఉన్న కోరిక లాగా అన్నమాట.
ఆగస్టు 21: ఈ రోజు ఎందుకో నాకు ఇష్టమైన పదార్ధాలు చేయించుకొని తినటము ప్రారంభించాను. కారణము తెలియటం లేదు. ఇష్ట పదార్థము కావాలా భగవంతుడు కావాలా అంటే నా మనస్సు ఇష్ట పదార్ధాలనే కోరుకుంటుందని గ్రహించాను.
ఆగస్టు 22: వీటిగురించి మా గురు దేవుడిని అడిగితే హృదయ చక్రం స్థితులని ఈ చక్రము నందు ఆలోచన, సంకల్పము, స్పందన అనే పరిస్థితులు ఉంటాయని అలాగే ఇష్ట కోరిక మాయ కూడా ఉంటుందని ఈ ఇష్ట కోరిక మాయ ప్రారంభ స్థితి ఇష్ట పదార్ధాలు తినటం అని ఈ చక్రానికి అధిదేవతలుగా ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అనంతపద్మనాభుడు ఉంటారని అధిదైవముగా నవపాషాణం నిర్మిత ఇష్ట లింగం ఉంటుందని దీనినే ఈ త్రిమూర్తులు పూజిస్తూ ఉంటారని అందుకే ఇష్టకామేశ్వరిని దర్శించుకోవటం అలాగే అనంత పద్మనాభుడి విగ్రహం మూర్తి రావటం జరిగిందని చెప్పడం జరిగినది.
P3:
నాకు వచ్చిన ఇష్టలింగాలు
ఆగస్టు 25: ఈ రోజు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి విశ్వ ప్రయత్నాలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని సర్ప భూషణ మఠము నందు 400/- కి ఒక అంగుళం పరిమాణము నిజ ఇష్ట లింగమును 500/- కి రెండు అంగుళాల పరిమాణం ఉన్న ఇష్ట లింగములను కొని నాకు అందించడం జరిగింది. దానితో నేను ఈరోజు నా సాధన అనుభవాలతో "కపాలమోక్షం" అను ఆధ్యాత్మిక గ్రంథ రచన పూనుకోవటం జరిగినది.
ఆగస్టు 28: ఇష్ట లింగమును మెడలో వేసుకుని నిత్య శివదీక్షాపరుడిని అయినాను. దానితో ఈ హృదయ చక్రం స్థితిగతులు తగ్గడం మొదలైంది అని నాకు అనిపించసాగింది.
సెప్టెంబర్ 10: విచిత్రంగా ప్రతి చిన్నదానికి ఆవేశ పడటము అలాగే ప్రతి దానికి ఆశ పడటం గమనించాను. కారణం తెలియదు.
P4:
సెప్టెంబరు 15: ఈ రోజు ఎందుకు కోడి మాంసం తినాలని విచిత్ర కోరిక మొదలైనది. బ్రాహ్మణులు మాంసం తినటం ఏమిటో.
సెప్టెంబర్ 18: ఈ రోజు చేపల కూర తినాలని ఆశ కలుగుతోంది. ఇదంతా నా మెడలో ఉన్న ఇష్ట లింగ యోగమాయ పరీక్ష అని నాకు అర్థం అయింది.
సెప్టెంబరు 20: ఈ రోజు నాకు ధ్యానము నందు నా దగ్గర ఉన్న రెండు అంగుళాల ఇష్టలింగము విడిపోయి అందులోనుంచి దివ్యకాంతి బయటికి వస్తున్నట్లుగా ధ్యాన అనుభవము అయినది. విచిత్రంగా అనిపించింది.
సెప్టెంబరు 25: ఈ మధ్య ఎక్కువగా ఈ ఇష్ట లింగము ధరించిన దగ్గర నుండి చావు భోజనాలు ఎక్కువ అయినాయి.మైల భోజనాలు ఎక్కువ అయినాయి. అయినా ఈ లింగము అశుద్ధి కాకపోవటం విచిత్రంగా ఉన్నది.
సెప్టెంబరు 28: ఈ లింగము గూర్చి బసవేశ్వరుడు చెప్పిన నియమాలు తెలుసుకోవటం జరిగినది. అష్ట మైలాలు కూడా ఈ లింగమును అశుద్ధి చేయలేవని మాంసము, మత్స్యము తినరాదు.కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలని ఇలా పలు రకాల సూచనలు చేయటం జరిగినది.
అక్టోబరు 10: ఈ లింగము ఆరాధనతో సంసార సుఖానికి దూరమైనాను. సంయోగము అంటే స్మశాన వైరాగ్యం మొదలైనది. కారణం తెలియదు.
P5:
అక్టోబరు 12: ఈ రోజు దేవి నవరాత్రులు ప్రారంభం అయినాయి. ధ్యానము నందు అమ్మవారు స్వయంగా నా మెడలో ఉన్న ఇష్టలింగము ఆరాధన చేస్తున్నట్లుగా అగుపించినది. విచిత్రంగా ఉంది.
అక్టోబరు 15: ఈ రోజు నా ఎడమ చెవి నుండి చిన్న పాటి అతి చిన్న శబ్ద నాదము లీలగా వినబడ సాగింది.
అక్టోబరు 28: నాకు తరచుగా వినిపించే శబ్దం గుండె చప్పుడుని పోలి ఉంటుందని గ్రహించాను. దీనిని గూర్చి మా గురు దేవుడిని అడిగితే ఇది ఓంకారనాదం కన్నా అతి పురాతనమైన తుంకార నాదము అని ఈ తుంకార నాదము ఉపాసనను పరమేశ్వరుడు చేసినారని దీనిని నిశ్శబ్ద నాదము అంటారని ఈ నాద ఉపాసన సిద్ధి పొందితే హృదయ చక్రము శుద్ధి అవుతుందని ఆపై ఆధీనము అవుతుందని చెప్పటం జరిగినది.
P6:
నవంబరు 10: ఈరోజు నా ధ్యానము నందు నీలిరంగు అష్టదళ పద్మము కనిపించినది. హృదయ చక్రము అయి ఉంటుందని అనుకోగానే నాకు ధ్యాన భంగమైనది. ఎవరి గదిలోనైనా నీలిరంగు బల్బు పెట్టుకుంటే వారికి గుండె జబ్బులు అంత త్వరగా రావని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కనిపెట్టినారు. కానీ ఈ విషయం మన యోగ శాస్త్రంలో హృదయ చక్రము నీలిరంగులో ఉంటుందని తద్వారా హృదయ వ్యాధులు చేరవని చెప్పటం జరిగినది.
P7:
నవంబరు 18: ఈ నిత్య లింగ ఆరాధన వలన నా ముఖము నందు బ్రహ్మ తేజస్సు పెరుగుతుందని అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా నాకు ఆకర్షితులు అవుతున్నారు అని గ్రహించాను.
నవంబరు 25: ఈ రోజు నాకు గడ్డము తీసుకోవాలని అనిపించటం లేదు. అలాగే తెల్ల జుట్టుకి నల్లరంగు కూడా వేసుకోవాలి అని అనిపించడం లేదు. మమకార వ్యామోహాలు పోయినట్లుగా ఉన్నాయి. తెల్లని జుట్టుతో తెల్లని గడ్డంతో చిన్న లాల్చీతో ఉండాలని శివదీక్షపరుడులాగా మారిపోతున్నానని పరమయోగిగా అడుగులు వేస్తున్నానని నాకు అర్థమైనది. నన్ను… నా లాగా ఉండాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి, మా ఆవిడ దృష్టికి రావడం జరిగినది.
డిసెంబర్ 10: ఈ రోజు నాకెందుకో నేను అన్నిటి యందు స్పందనా రాహిత్యం స్థితికి వెళుతున్నానని అంతా కూడా సాక్షీభూతంగా చూస్తున్నానని చేస్తున్నానని నాకు అనిపించసాగింది. క్షేత్రాలుకి వెళ్ళటం పూర్తిగా మానివేసినాను. నా మెడలో విశ్వ లింగం అయిన ఇష్ట లింగము ఉంటే ఇక క్షేత్రాలతో పని ఎందుకు. నా దేహమే దేవాలయము అయినప్పుడు వేరే భౌతిక దేవాలయాల దర్శనం ఎందుకు అని వైరాగ్య భావాలు కలుగుతున్నాయి. నిజమే కదా.
డిసెంబరు 18: ఈ రోజు నాకు తెలియకుండానే ఎన్నో రకాలుగా పదార్థాలు చేసినను పూర్తిగా తినలేక పోయినాను. ఇప్పుడు అన్ని పదార్థాలు ఒక్కటే. వేరుగా లేవు. ఆకలి తీర్చుకోవడానికేగా.
P8:
పదార్ధము దాటితేగాని నాకు యదార్థము తెలియరాలేదు. పదార్థ కోరిక మాయ దాటితేగాని అసలు జ్ఞానము బయటికి రాదని నాకు అర్థమైనది. పాపము మన బుద్ధుడు కోరికలే భాదలు కష్టాలకి కారణం అని తెలుసుకుని కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకొని ఆగిపోయినాడు అని నాకు అర్థం అయింది.
డిసెంబరు 21: ఈ రోజు నాకు అన్ని విషయాలలో బాధాకరమైన విషయాలలో అకారణముగా నవ్వు వస్తోంది. తెలియని అద్వితీయమైన ఆనందము వేస్తోంది. నాకు రెండుగా లేవు. కష్టసుఖాలు అనేవి లేవు. కేవలం ఆనందమే ఉన్నది. ఆనందమే కనబడుతుంది. ఆనందమే చూస్తున్నాను.
డిసెంబర్ 25: నాకున్న స్థితి గురించి మా గురుదేవుడిని అడిగితే ఇదియే ప్రారంభ ఆనంద సమాధి స్థితి అని ఇందులో 21 రోజులు మించి ఉండలేరని ఆపై ఉంటే ఈ స్థూల శరీరము తట్టుకోలేక వినాశనము పొందుతుందని చెప్పినా కూడా భయము అనిపించలేదు. ఆనందం వేస్తుంది. మరణ భయం దాటిన ఆనంద మృత్యుంజయుడుని అని అనిపించసాగింది.
P9:
డిసెంబరు 21: ఈరోజు నాకు ధ్యానము నందు అనంతపద్మనాభుడు సజీవ మూర్తి లీలగా కనిపించి శూన్యము నందు లీనము అయినది.ఆ తర్వాత ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి కూడా సజీవ మూర్తిగా లీలగా కనిపించి శూన్యము నందు లీనం అయినారు. ఆపై ఇష్ట లింగము కూడా అఖండమైన దివ్యతేజస్సుతో కనపడి చివరికి కాంతి హీనమై శూన్యము నందు విలీనం అయినట్లుగా ధ్యాన అనుభవము అయినది. అంటే చివరికి వీళ్ళు కూడా శాశ్వతం కాదని నాకు అర్థం అయ్యేసరికి నా ధ్యాన భంగము అయినది. ఆనందము వేస్తూనే ఉన్నది.
డిసెంబర్ 30: ఇంకా సాధన చేయటానికి ఏమీ లేదని సాధించటానికి ఏమీ లేదని మా గురువు దేవుడి ద్వారా తెలుసుకున్నాను. ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో ఉంటుందని గ్రహించాను. క్రొత్తగా కోరికలు లేనివాడిగా… క్రొత్త భావాలు లేని వాడిలాగా… క్రొత్త ఆలోచనలు లేని వాడిలాగా… క్రొత్త సంకల్పాలు లేని వాడిలాగా.. క్రొత్త స్పందనలు లేని వాడిలాగా అన్నిటి యందు సాక్షీభూతంగా ఆనంద స్థితిలో ఉంటున్నానని గ్రహించాను.
జనవరి 5: ఈ రోజు నాకు ధ్యానము నందు బొటనవేలు కారణ శరీరము కాస్త అంగుళ పరిమాణం సంకల్ప శరీరముగా మారినట్లుగా ధ్యానము అనుభవమైనది. ఇది ఎక్కడికో దేనికోసమో బయలుదేరినట్లు గా నాకు అర్థం అయింది. ఎక్కడికో తెలియదు. కారణం తెలియదు.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకొండి!
ఇష్ట లింగము ఇంటికి వచ్చినది:
మేము ఒక రోజు అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు టెంపుల్ రన్ ఆట మొదలైనది. మహాశూన్యం దాకా అన్ని దృశ్యాలు కనిపిస్తూ దాటుతూ శూన్య స్థితి కనిపించసాగింది. ఈ శూన్యము యొక్క మధ్యభాగములో పరమ శూన్య స్థితి ఉన్నట్లుగా అనుభూతి కలగ సాగింది. సుమారుగా 5 కిలోమీటర్ల పరిధిలో ఈ పరమ శూన్య స్థితి పరిధి ఉన్నట్లుగా కనిపించసాగింది. ఇట్టి శూన్యములో నీలిరంగు అష్టదళ పద్మము ఉన్నట్లుగా లీలగా కనిపించసాగింది. ఈ పద్మమును చూడగానే ఎక్కడో చూసినట్లు గా లీలగా గుర్తుకు రాసాగింది. అవును నిజమే ఇలాంటి నీలి పద్మమును చిన్నమస్తాదేవి హృదయ భాగంలో ఉన్నట్లుగా గుర్తుకు రాసాగింది. అంటే మేము హృదయకమలంలోకి ప్రవేశించినామని మాకు అర్థం అయినది. అప్పుడు మాకు ఏదో లీలగా వినబడ సాగినది. అది ఓంకారనాదం కాదని ఖచ్చితంగా నాకు అర్ధం అయ్యే లోపల మా కళ్ళముందున్న దృశ్యము అదృశ్యమైనది. ఇంతలో ఈ అష్టదళపద్మంలో అంగుళ పరిమాణంలో అనంతపద్మనాభుడు కనిపించసాగినాడు. ఈయన చేతిలో పిసరంత రేణువు పరిమాణములో ఒక నల్లని శివలింగము ఎంతో తెల్లని కాంతితో మెరుస్తూ లీలగా కనపడ సాగింది. ఈ లింగము కాస్త మహా లింగంగా కనపడ సాగింది. జూంలో అప్పుడు నలుపు నీలవర్ణము కాకి నీలములో లేదా ఇంద్రనీల వర్ణంతో గాని లింగము ఉన్నదని ఇదియే నవపాషాణం లింగమని మేము గ్రహించే లోపల ఈ దృశ్యము కాస్త అదృశ్యం అయినది. బయటికి వచ్చిన తరువాత విశ్లేషణ చేస్తే లింగరూప రేఖలు మా మనస్సులో ముద్ర బాగానే పడినది. వెంటనే ఈ నాదం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటాయా అనుకుంటూ పురాణ గ్రంథాలు తిరగవేస్తే మహా శివపురాణం లో మహాశివుడు చేసిన శబ్దమే తుంకార నాదమని ఈ నాదము మన హృదయ చక్రము నందు వినబడుతుంది. ఇది ఓంకారనాదం కన్నా అతి చిన్న శబ్దం అని గ్రహించిన వెంటనే దీనికి సంబంధించిన సైన్స్ గ్రంథాలు తిరగవేస్తే ఓంకార నాదానికి 7MHZ ఉంటే ఈ తుంకార నాదానికి 4MHZశక్తి ఉంటుందని దీని శబ్దమును సాలెపురుగులు చేస్తాయని తన తోడు కోసం మగ సాలిపురుగు సంగీతంతో ఈ నాదమును చేస్తుందని ఈ నాదమును ఆడ సాలెపురుగు తన కాళ్లతో వింటూ ఈ శబ్ద నాదము చేసే మగ సాలిపురుగు దగ్గరికి చేరతాయని తెలుసుకునేసరికి నా కళ్ళు తిరిగాయి. ఈ నాదము గూర్చి రామకృష్ణ పరమహంస అయితే ఒక నల్ల చీమకి ఒక చిరు గంట కడితే ఎంతటి శబ్దం చేస్తుందో అదే ఈ నాదమని చెప్పటం జరిగిందని అలాగే శ్రీ శంకరాచార్యులు వారైతే అమ్మవారి ఎడమ చెవి కమ్మలు కుండలాలు గాలికి కదిలితే వచ్చే నాదమే ఈ నాదమని చెప్పటం జరిగినది. అదే లాహిరి మహాశయుడు అయితే గుండె చప్పుడు శబ్దమే ఈ నాదమని చెప్పటం జరిగినది. ఏది ఏమైనప్పటికీ ఈ నాదము ఓంకారనాదం కన్నా చిన్న నాదమని ఇదియే మిన్న అంతిమ నాదము అని గ్రహించినాను. ఈ నాదము వినటానికి దాదాపుగా మూడున్నర సంవత్సరముల పైగా శబ్దబ్రహ్మ సాధన చేయవలసి వచ్చినది. ఆ తర్వాత నాకు ధ్యానము నందు ఒక రోజు అర్ధరాత్రి పూట హృదయ చక్రమునందు నీలి కమలము కనపడ సాగింది.
గూగుల్ తల్లి ద్వారా ఈ లింగం ఏమిటో దీనికి పేరు ఏమిటో ఇది ఎక్కడ దొరుకుతుందో దీనిని ఎవరు పూజిస్తారో వివరాలు సేకరణ మొదలు పెట్టినాను. దానిలో దీనిని ఇష్ట లింగము అని లింగాయతులు ఈ లింగాన్ని ప్రాణ లింగంగా భావించి నిత్యము మెడలో వేసుకుంటారు అని నిత్య శివదీక్షతో దీనిని ఆరాధన చేస్తారని ప్రస్తుత అనివార్య కారణాల వలన ఇష్ట లింగము దొరకకపోతే నర్మదా నది బాణ లింగము లేదా శ్రీశైల ప్రాంతంలో దొరికే లింగాల గుట్ట దగ్గర లోని నల్ల రాళ్ళ లింగాలను మెడలో వేసుకొని శివ పూజలు చేస్తున్నారని మేము తెలుసుకున్నాము. అక్కమహాదేవి, ఇష్టకామేశ్వరి దేవి, మహాగణపతి ,మహా పార్వతి, మహావిష్ణువు ఇటువంటి ఇష్ట లింగాలను ఆరాధన చేసినారు అని అర్థం అయినది. అలాగే పరమేశ్వరుడు కూడా స్వయంగా ఈ లింగమును ఆరాధన చేస్తున్నాడని దానిని ఆత్మలింగము అంటారని ఆత్మ నివాస స్థానము మన హృదయమని మంత్రపుష్పము ద్వారా నమక చమకాలు ద్వారా చెప్పకనే చెప్పినారు కదా. అసలు నిజమైన ఇష్ట లింగాలు దొరుకుతాయేమోనని ఇంటర్నెట్లో వెతకగా 40 నుండి 400 దాకా ధరలలో ఉన్నట్లుగా కనిపించినాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం కల్తీ లేనని మేము గ్రహించినాము. దానితో నిజమైన ఇష్ట లింగము ఎలా ఉంటుందో ఎక్కడ దొరుకుతుందో అర్థమయ్యి చావక ఏమి చెయ్యాలో అర్థమవ్వక అయోమయ స్థితిలో ధ్యానములో కూర్చోగానే మాకు ధ్యానములో శ్రీశైల ప్రాంతములోని ఇష్టకామేశ్వరి దేవి విగ్రహ మూర్తి కనిపించేసరికి అంటే శ్రీశైలం కి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో అని అనుకుంటూ బయలుదేరినాను.
ఈ క్షేత్రానికి చేరుకొని అక్కడ నుండి ఇష్టకామేశ్వరి గుడి ఉన్న గతుకుల రోడ్డు మీద అడవి మార్గంలో నడుచుకుంటూ చేరినాము. అక్కడ చిన్న సమాధి లాంటి లోపల అమ్మవారి గుడి ఉంది. ఒక మనిషి మాత్రమే పట్టే మార్గం ఉన్నది. అనగా జీవనాడి మార్గంలాగా. సరే అని మేము లోపలికి వెళ్లి అమ్మవారికి కుంకుమ పెట్టినాము. ఈ విగ్రహము ప్రత్యేకత ఏమిటంటే నుదుటి భాగంలోని బొట్టు పెట్టుకునే ప్రాంతము మానవ బొట్టు ప్రాంతము మెత్తగా తగిలినట్లుగా స్పర్శ అనుభూతి కలుగుతుంది. అది అవునో కాదో అనుకొని ఈమెకి నా కూతురు అని బొట్టు పెట్టడం జరిగినది. అది నిజము అనే లోపల ఆమె ఎడమ చేతిలో ఉన్న లింగం దివ్య కాంతితో మెరిసినట్లుగా లీలగా ఒక క్షణం అనిపించింది. ఇంతలో బయట నుండి “స్వామి! ఇంకా ఎంతసేపు లోపల ఉంటారు బయటికి రండి” అని పిలవడంతో మేము నెమ్మదిగా ఆ ఇరుకు సందులో నుండి బయటికి వచ్చినాము. ఇలా మా స్థూల శరీరం స్వయంగా జీవనాడి మార్గ యాత్ర పూర్తి చేసిందని మాకు తెలియదు. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత నంది దగ్గర స్వయంగా ఏర్పడిన రాతి శివలింగం మూర్తి ఉన్నట్లుగా అనిపించే సరికి దానిని మా శిష్యుడు చేత అక్కడ నుండి మాయ చేసినాము.
నాకు శ్రీశైల ఇష్టకామేశ్వరి ఇచ్చిన రాతి లింగము
అది ఇష్ట లింగం అని భ్రమలో పడి దానిని ఇంటికి తీసుకొని వస్తే అది కేవలం రాతి లింగమని తర్వాత కొన్ని వారాలకు తెలిసినది. చేసినది ఏమీ లేక అది కాస్తా శివుడి విగ్రహమూర్తి ముందు ఆయన ఆత్మలింగముగా పెట్టి ఇంతకీ అసలు సిసలైన నవపాషాణం లింగము ఎక్కడ దొరుకుతుందో అర్థం అవ్వక మళ్ళీ కథ మొదటికి వచ్చిందని మాకు అర్థం అయినది.ఇలా కొన్ని వారాలు గడిచి పోయినాయి.
నేను కాస్త సూక్ష్మశరీరముతో కాశీయాత్ర:
ఒక రోజు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి “గురువు గారు! ఈ శివరాత్రికి కాశీ క్షేత్రానికి వెళ్లాలని అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా పోయినది. మా వాళ్ళంతా వెళ్ళినారు. నేను వెళ్ళలేకపోయాను” అన్నాడు. దానికి మేము వెంటనే “ఈ రోజు శివరాత్రి కదా. ఇంకెందుకు ఆలస్యం. రైలు విమానాలు అవసరము లేని కాశీయాత్ర ప్రయాణము సూక్ష్మధారితో చేయవచ్చును” అని చెప్పి శవాసనంలో పడుకుని శివ మంత్ర ధ్యానం చేస్తూ యోగ నిద్ర లోనికి వెళ్ళమని చెప్పి మేము అలా చేస్తూ మేము యోగనిద్ర స్థితిలోనికి వాడు యోగనిద్ర స్థితిలోనికి వెళ్ళటం జరిగినది. మా ఇద్దరి సూక్ష్మ శరీరాలు ఆజ్ఞా చక్రంలోనిస్థానము నందు మేము అనుకున్న కాశీ క్షేత్రములోనికి మా సూక్ష్మ శరీరాలు వెళ్లి విశ్వనాథుని దర్శనం చేసి రావడం జరిగినది. ఇంతలో మా ఇద్దరికీ ధ్యాన భంగము అయ్యేసరికి మేము ధ్యానము నుండి బయటికి వచ్చినాము. వారిని అడిగితే తనకు ధ్యానంలో “కాశీ క్షేత్రములో విశ్వనాథ లింగ మూర్తి దర్శనము చేసినట్లుగా అనుభవం అయినదని” కానీ అది నిజమేనా? అని వాడి సంశయ బుద్ధితో మళ్ళీ ప్రశ్నించుకోగానే వారికి మా సూక్ష్మ శరీరము నందు ఉన్న దివ్యక్షేత్రాలు ఒక్కొక్కటిగా శివ లింగ మూర్తితో సహా చూపించటం జరిగేసరికి వారికి కొంచెం తల తిరిగినట్లుగా అయినది. దిమ్మ తిరిగినది. మరి మీకు కూడా దిమ్మ తిరగాలి అంటే మన శరీరంలో ఈ క్షేత్రాలు ఎక్కడ ఎలా ఉంటాయో తెలుసుకుంటే మంచిది కదా. కొన్ని రోజుల తర్వాత వీడి వాళ్ళు వచ్చి మేము వీడు కలిసి కాశీక్షేత్ర గంగలో స్నానం చేయడం అలాగే విశ్వనాథుని దర్శనం చేయడం చూశామని…వాళ్ళు పిలుస్తున్న పట్టించుకోకుండా వచ్చేశామని అసలు గురువు గారికి నీకు ఎలా టిక్కెట్లు దొరికినాయి అని ఎదురు ప్రశ్న వేసేసరికి మన వాడికి కాస్త ఉన్న మతి పోయింది. వెంటనే వాడు మా దగ్గరికి వచ్చి “గురువు గారు! నేను నిజంగానే కాశీ విశ్వనాథ దర్శనం అలాగే గంగాస్నానం చేశారని మా వారి మాటలను బట్టి తెలుస్తోంది. చాలా కృతజ్ఞతలు” అని చెప్పగానే వాడితో మేము “నాయనా! మనము శరీరాలతో అక్కడ స్నానము చేశామని మీవాళ్లు భ్రమ పడుతున్నారు. అది నిజం కాదని మన ఇద్దరికీ తెలుసు. ఎవరికి కూడా చెప్పకు.ఇలా సూక్ష్మశరీర యానాలు చేయవచ్చునని నమ్మకపోగా నిన్ను నన్ను ఒక పిచ్చివారు అంటారు” అని చెప్పి తిరిగి నా నిత్య పూజకి సమయం అవుతుంటే వెళ్లిపోయినాము. వాడు నాకేసి మౌనంగా చూస్తూ జరిగిన దానిని సాక్షీభూతంగా ఉండి పోయినాడు.
దేహమే దేవాలయం ఎలా అవుతుందో:
దేహమే దేవాలయం ఎలా అవుతుందో తెలిస్తే బాహ్య పూజలు అనగా విగ్రహ పూజలు మానివేసి అంతర పూజలు అనగా హృదయములో ఉన్న ఆత్మ లింగమును ఆరాధనతో పూజ చేయటము ఆరంభిస్తారు గదా. ఏమంటారు. చూస్తారా అయితే చూడండి. అనగా మా హృదయ చక్రమునందు మురుడేశ్వర క్షేత్రంలోని ఆత్మలింగ దర్శనము, సహస్రార చక్రము నందు కైలాస పర్వతము లోని బంగారపు శివ లింగ మూర్తి దర్శనము, ఆజ్ఞా చక్రము నందు కాశీ క్షేత్ర విశ్వనాథ లింగ దర్శనం, బ్రహ్మ చక్రమునందు పుష్కర్ క్షేత్రములోని బ్రహ్మ లింగ దర్శనము, కాల చక్రము నందు ఉజ్జయిని క్షేత్ర మహాకాలుడు లింగ దర్శనము, కర్మ చక్రము నందు రామేశ్వర క్షేత్ర రామలింగేశ్వర దర్శనము, గుణ చక్రము నందు కాశీ క్షేత్రములోని శ్రీ దత్త శివ లింగ మూర్తి దర్శనం, విశుద్ధి చక్రమునందు చిదంబర క్షేత్ర ఆకాశ లింగ దర్శనము, అనాహత చక్రము నందు శ్రీ శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగ దర్శనము, మణిపూరక చక్రము నందు అరుణాచలక్షేత్ర అగ్ని లింగ దర్శనము, స్వాధిష్ఠాన చక్రము నందు జంబుకేశ్వర క్షేత్రములోని జల లింగ దర్శనము, మూలాధార చక్రము నందు కంచి క్షేత్రం లోని పృథ్విలింగం దర్శనాలు ఉన్నట్లుగా ఒకసారి మేము ఒక మహాశివరాత్రి నాడు అనుభవ అనుభూతి పొందటము జరిగినది. దానితో మా దేహమే దేవాలయము అని తెలుసుకుని దేవాలయాలకి క్షేత్రాలకి వెళ్ళటం సంపూర్తిగా మానివేశాము. ఈ అనుభవానుభూతి నిజమేనని అనుటకు నిదర్శనముగా మరునాడు ఈనాడు తెలుగు పేపర్లోని అంతర్యామి విభాగము నందు దీనికి సంబంధించిన ఒక కధనం వచ్చినది.దానిని యధాతధాముగా ఇక్కడ ఇస్తున్నాను.చదివి తెలుసుకోండి.
బ్రహ్మాండమంతా నీలోనే16-10-2019 03:14:46
పారమార్థిక దేహేహి షట్చక్రాణి భవంతి చ
బ్రహ్మాండే యే గుణాఃప్రోక్తా తేష్యస్మిన్నేవ సంస్థితాః
పాపాత్ముని మరణానంతర మార్గపు భయంకర ప్రయాణాన్ని గురించి శ్రీహరి గరుత్మంతుడికి చెబుతూ మానవ శరీరపు అద్భుతమైన వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని ఇలా విడమరిచి వివరించాడు. ఆ పరమాత్మ తెలిపిన ప్రకారం.. మానవ దేహమునందు షట్చక్రాలతోపాటు బ్రహ్మాండంలోని గుణాలన్నీ శక్తులు, కర్మలతో సహా సంస్థితాలై ఉన్నాయి. అతల లోకం నుంచి మహాతలం వరకూ లోకాలు.. పాదాల అడుగు భాగం నుంచి తొడల వరకూ ఉన్నాయి. నాభియందు భూలోకం, ఆ తర్వాత వరుసగా భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మరంధ్రమునందు సత్యలోకం.. ఇలా పద్నాలుగు లోకాలూ ప్రతిష్ఠితాలై ఉన్నాయి. హృదయ కమల త్రికోణ ప్రదేశంలో మేరు, మందర కైలాస, హిమవత్పర్వతాలున్నాయి. ఊర్థ్వరేఖ యందు నిషధ పర్వతాలతో పాటు గంధమాదన, రమణక పర్వతం, ఇలా ఏడు కుల పర్వతాలు విస్తరించి ఉన్నాయి. మానవ చర్మములో శాల్మలీ, ప్లక్ష, గోళ్లలో పుష్కర ద్వీపాలు ఉంటాయి. శరీరంలోని ద్రవాలన్నీ లవణ, క్షీర, సురఘృత, చెరకు, దధి, జల సముద్రాలై ఉంటాయి.
నాద చక్రంలో సూర్యుడు, బిందు చక్రంలో చంద్రుడు, కళ్లలో కుజుడు, హృదయంలో బుధుడు, విష్ణుస్థానంలో గురుడు, శుక్రంలో శుక్రుడు, నాభి స్థానంలో శని, ముఖంలో రాహువు, పాయువులో కేతువు నెలకొని ఉంటారు. ఈ విధంగా బ్రహ్మాండ రూపమంతా మానవ దేహంలో ప్రసరితమై ఉన్నదని.. ఇలాంటి మానవ జన్మ దుర్లభమని హరి ఆ గరుత్మంతుడికి బోధించాడు. సర్వవ్యాపియైున పరమాత్మ మానవ శరీరంలో సహస్రారములో సూక్ష్మరూపంలో స్థితుడై ఉన్నాడు. తెలివిగల మానవుడు తన శరీర వైభవాన్ని తలచుకొని పరమాత్ముడిని తనలోనే దర్శించుకొని తాను విశ్వాత్మనని గ్రహించి, అష్టదిక్పాలకులు పంచభూతాలు, పంచలోక పాలకులు తన అంగాంగాల్లో వ్యాపించి ఉన్నారని తెలుసుకుని మానసిక పూజ కావించాలి. ఇలా అంతరంగ పూజ చేస్తూ దైనందిన బాహ్యకర్మలను ధర్మబద్ధంగా పరమాత్మ సాక్షీభూతంగా చేయాలి. శరీరాభిమానం తగ్గించుకొని ఆత్మభక్తి పెంపొందించుకోవాలి. మోక్షకామియైు ఉండాలి. మనస్సును ధ్యానం, యజ్ఞం, దానం, తపస్సు శుద్ధీకరిస్తాయి. వాటి వల్ల శుద్ధి పొందిన మనస్సుతో పరమాత్ముడిని భక్తిపూర్వకంగా ఆరాధించాలి. తాను పరమేశ్వరుడి అంశనే అని నిర్ధారించుకోవాలి. నిషేధింపబడిన కోరికలను త్యజించి తన జీవనయానమే మహాయజ్ఞంగా, శరీరమే హోమగుండంగా, యజ్ఞకర్తయే జీవుడుగా, కర్మఫల వాసనలే ఆహుతులుగా తలచాలి. 84 లక్షల జన్మలలో మానవజన్మను ఉత్తమమైనదిగా గ్రహించి తాను పరమాత్ముడికి చేరువలో ఉన్నానని తలచి సవిచారణతో, స్వవిచారణతో యథార్థం తెలుసుకోవాలి. పరార్థంగా, తృప్తిగా జీవిస్తూ సంతృప్తి ఆత్మభావనతో జీవిత ప్రస్థానం చేయాలి. అప్పుడే మానవ జన్మకు సార్థకత.
తుంకారనాదము:
కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానములో టెంపుల్ రన్ ఆట మొదలైనది. యధావిధిగా శూన్యము ముందు వచ్చే అన్ని రకాల దృశ్యాలు నన్ను దాటుకుంటూ వెళ్లి పోతే చివరికి పరమ శూన్య స్థితి కనపడ సాగింది. విచిత్రంగా ఇక్కడ నుండి మాకు నిశ్శబ్ద నాదము లాంటి నీటి బొట్టు పడే శబ్దం లాంటి శబ్దం వినబడ సాగినది. అనగా నీళ్ల టాప్ నుండి నీరు కట్టేసిన ఆఖరి నీటి బిందువులుగా బొట్టు బొట్టు పడుతూ చూడటము మన అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడు వినిపించే ఇలాంటి నాదమే టప్ టప్ మంటూ ఇక్కడ వినబడుతుంది. నలభై ఎనిమిది నిమిషముల పాటు ఈ నాదము వినబడినది. ఎగశ్వాస వచ్చేసరికి నాకు ధ్యానము భంగం అయినది. విచారణ చేస్తే శ్రీ లాహిరీ మహాశయుడుకి ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు గడియారంలోని టిక్ టిక్ లాంటి శబ్ద నాదము విన్నానని అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస అయితే ఏక వీణను మీటితే వచ్చే శబ్దం విన్నాను అని అలాగే శ్రీ శంకరాచార్యుడు అయితే అమ్మవారి చెవి దిద్దులు కదిలినప్పుడు వచ్చిన శబ్ద నాదము వినటం జరిగినదని చెప్పటం జరిగినది. అంటే అప్పటిదాకా ఓంకారనాదం వినబడటం జరిగినది. కానీ ఈ చక్ర స్థితిలో ఓంకారనాదం కన్నా అతి చిన్నదైన శబ్ద నాదము వినటం జరుగుతుందని దీనిని రకరకాల శబ్దాలతో వివిధ యోగులు పోల్చటం జరిగిందని ఈ శబ్దము ఏమి అయి ఉంటుందని ఇంటర్నెట్లో వెతికితే ఒక చోట 7mhz ఉంటే అది ఓంకారమని దీనికన్నా 4mhz ఉన్న నాదము ఉన్నదని దానిని తుంకారము అంటారని ఓంకారం నాదము అనేది సూర్యుని నుండి భూమి దాకా వినటం జరిగితే ఈ తుంకారము అనేది సూర్యుడిని దాటితే వినబడుతుంది. దీనిని నిశ్శబ్ద నాదము అని కూడా అంటారని చెప్పటము జరిగినది. అంటే దీనిని బట్టి చూస్తే మన హృదయ చక్రములో వినబడే నాదమే తుంకారము నాదమని మేము గ్రహించినాము. ఓంకార నాదం కన్నా తుంకారము నాదము మిన్న అని మాకు అనిపించింది. ధ్యానములో ఈ నాదము వినటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. సుమారుగా ఆరు నెలల పాటు కష్టపడితే గానీ ఈ నాదము వినే స్థితికి అంతటి ఏకాగ్రత సిద్ధికి మా శరీరము చేరుకోలేదు. ఇలా ఈ తుంకారము నాదము వినే ప్రయత్నంలో ఉండగా మా దగ్గరకి ఏక త్రాడు వీణ వచ్చినది. దీనిని మ్రోగించగానే తుంకార నాదం పలుకుతుందని మాకు అర్థం అయినది. దీనిని వాయిస్తూ మేము ధ్యానములో తుకారాం నాదము వినటం అభ్యాసం చేస్తూ కొన్నాళ్ళకి బయట ఎలాంటి వాయిద్యాలు లేకుండా ఎలాంటి ప్రయత్నం లేకుండానే సహజ సిద్దముగా ఈ నాదము వినే స్థాయికి చేరుకునేసరికి మాకు ధ్యానమునందు నీలి వర్ణ అష్టదళ పద్మం మధ్యలో కాకి నీలవర్ణము ఉన్న శివ లింగమూర్తి కనిపించేసరికి ఈ చక్రము శుద్ధి అయినదని మాకు అర్థమైనది. పైగా ఈ క్రమంలో మా సూక్ష్మ సంకల్ప శరీరధారి ఒక అంగుళం పరిమాణములో ఉండి మిగిలిన కర్మ వాసనలు నాశనము చేసుకోవటానికి తురీయాతీత స్థితిలో ధ్యానముద్రలో ఉన్నట్లుగా తరచుగా మాకు ధ్యాన అనుభవాలు అనుభూతులు కలగసాగినాయి.
భోగర్ సిద్ధ యోగి తయారుచేసిన పళని క్షేత్ర కుమార స్వామి విగ్రహము
ఇలా నవపాషాణం శివ లింగ మూర్తి ధ్యానములో కనబడుతున్నాడు కానీ ఇలలో ఎప్పుడు కనబడతాడో అర్థం అవ్వక సతమతమవుతూ తీవ్ర ఆవేదన చెందుతున్న సమయంలో మాకు ఒకరోజు తీవ్ర ధ్యానములో ఒక దృశ్యం కనిపించసాగింది. భోగర్ సిద్ధ యోగి తయారుచేసిన పళని క్షేత్ర కుమార స్వామి విగ్రహము నుండి పొడి తీస్తూ చూస్తూ ఉన్న ఒక పీఠాధిపతి వెనక భాగము అగుపించినది. వామ్మో! ఈయన ఈ పొడి తో ఏమి చేస్తున్నాడు? ఎందుకు తీస్తున్నాడో అర్థం అవ్వక అలా సాక్షీభూతంగా చూస్తుంటే ఒక సంచిలో ఈయన దాచిన పొడి మరొక సాధువు చేతిలో పడినట్లుగా ఈయన దానితో బొటనవ్రేలు పరిమాణములో ఒక లింగమూర్తి రెండు లింగాలను అనగా అంగుళ పరిమాణంలో ఉన్నవి తయారు చేసినట్లు దృశ్యము కనిపించినది. ఈ మూడు లింగాలు కాస్త మరొక పీఠాధిపతి పేరిట చేతికి చేరినాయని వీటిని ఈయన నిత్య పూజలో వుంచుతూ పూజ చేసుకుంటూ తన అవసాన సమయము అయినది అని గ్రహించి ఈ లింగాలకి మరో ఐదు లింగాలు నకిలివి కలిపి నిజమైన యోగ్యత ఉన్న వారికి నిజమైన నవపాషాణం లింగాలు దొరకాలని అనుకుంటే వీటిని అమ్మకానికి పెడుతున్నారని తెలిసినది. వామ్మో! దీనమ్మ జీవితం. అంటే అసలైన భోగర్ తయారు చేసిన పదార్ధంతో ఈ మూడు లింగాలు తయారు అయ్యి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అయ్యో! ఇవి ఎక్కడ అమ్ముతున్నారో తెలియదే. పీఠాధిపతి ఎవరో కూడా తెలియదు అనుకుంటూ ఉండగా నాకు ధ్యాన భంగము అయినది. రుచి చూపించి దానిని తినేసరికి అందకుండా చేయడానికి మాయ ముందు ఉంటుంది కదా. దాని పని అది చేస్తుంది. మన పని మనం చేయాలి అని అనుకుంటూ మా శిష్యుడికి ఈ విషయాలు ఏమీ చెప్పకుండా నవపాషాణం లింగాలు బయటికి వచ్చినాయి. కానీ అవి ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఒక మఠాధిపతి చేతిలో ఉన్నాయని మొత్తము అక్కడ 8 లింగాలు ఉంటాయని కానీ వాటిలో మూడు లింగాలు మాత్రమే నిజమైన నవపాషాణం లింగాలని ఆ ఫోటోలు మాకు పంపితే ఏవి ఆ లింగాలో చెప్పటం జరుగుతుంది అని ఫలానా రోజు ఫలానా సమయంలో వెతకమని చెప్పి ఒకవేళ ఆ రోజు వెతికితే ఈ లింగాలు పట్టుకోకపోతే మనకు ఇంకా నవపాషాణం లింగము దొరకదని వారికి చెప్పి పంపించడం జరిగినది. దానితో మఠాలు, పీఠాలు ఉండే చోటికి చేరుకొని తనకి కావలసిన లింగాలు గురించి ఆరా తీస్తూ తిరుగుతున్నా ఎక్కడా ఏమీ కనిపించలేదు. అప్పటికే మధ్యాహ్నము అయినది.
దీనితో మావాడు ఇలా కాదనుకుని అక్కడ ఉన్న మల్లన్న ఆలయానికి వెళ్లి శివుడి యొక్క నంది చెవిలో ఈ నవపాషాణం లింగాలు దొరికేటట్లుగా చేయమని కోరి బయటకి వచ్చిన తర్వాత మన జిజ్ఞాసి నాగసాధువు ఇతనికి కనిపించాడు. నా శిష్యుడికి నా యోగమిత్రుడైన జిజ్ఞాసి నాగసాధువు ఎవరో తెలియదు. నిజానికి మన జిజ్ఞాసి అక్కడకి వస్తాడని నేను ఊహించలేదు. అపుడు జిజ్ఞాసి వెంటనే నా శిష్యుడిని వెంటపెట్టుకొని “నీకు..నీ గురువుకి గావాలసిన నిజ నవపాషాణ లింగాలు నాకు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు...నా వెంట నడువు..అని గద్దించగానే...మనవాడు భయ పడుతూనే వీరి వెంట బయలుదేరినాడు.ఈయన కాస్త సర్పభూషణ మఠమునకు తీసుకొనిపోయి లోపల శివస్వామి అనే సిద్ధయోగి ఉంటాడు.ఆయనను అడిగితే మీకు గావాలసిన ఇష్టలింగాలు ఇస్తాడు.సందేహించకు. ఇక్కడ దొరికేవి అన్ని ఇష్టలింగాలు కూడ నిజమేనని నా మనోనేత్రముతో చూసి చెపుతున్నాను.నన్ను నమ్ము!నిజ ఇష్టలింగము ఇంటికి చేర్చు!నేను ఏవరో అపుడే నీకు తెలుస్తుంది.నేను బయట నీకోసం ఎదురుచూస్తూంటాను. ఇద్దరము కలిసి మీ గురువు ఇంటికి వెళ్ళాలి” అనగానే మనవాడు కాస్త ఆశ్చర్యానందానుమాన భయానికి గురి అవుతూ మారుమాట్లాడకుండా ఈ మఠములోనికి ప్రవేశించడము జరిగినది. లోపల అమ్మకానికి ఉంచిన లింగాలను ఫోటో తీసి నాకు పంపించాడు. నిజమైన లింగాలకు మాకు ధ్యానములో కనిపించిన ఓంకార గుర్తు, కాకి నలుపు దివ్యకాంతి నీలి వర్ణము, మెరుపు కాంతి వాటి పరిమాణాలు గుర్తించి చెప్పగా ఇవి అన్నీ కూడా ఈ మూడు లింగాలకే మాత్రమే కనబడుతుంది అని చెప్పగానే మాకే చిన్నపాటి ఆనందము వేసినది. వెంటనే ఆ లింగాలను చేతిలో పెట్టుకొని అవి అతుక్కుంటూ ఉన్నాయో లేదో చూడమని చెప్పి శివ అష్టకము లేదా శివపంచాక్షరి మంత్రము చదవమని చెప్పగానే మనవాడు వాటి దగ్గరికి వెళ్లి ఈ మంత్రమును చదువుతూ ఎడమచేతి అరచెయ్యిలో పెట్టుకోగానే నెమ్మదినెమ్మదిగా అతకటము ఆరంభం అయ్యే సరికి మేము ఉన్న ప్రాంతంలో చిన్నపాటి చిరు జల్లు పడేసరికి ఇవి నిజమైన భోగర్ లింగాలు అని అర్ధమయ్యి…. వాటిని 1300 రూ!!లకి మూడు ఇష్టలింగాలను కొనడము జరిగినది.ఆ తర్వాత ఈ లింగాలను తీసుకొని ఆ మఠము నుండి బయటికి రాగానే అక్కడ గూడ చిన్నపాటి వర్షం పడినది అని ఈ లింగాలు ఆరు నెలల వరకు ఎలాంటి నీటితో గాని వర్షము తో కానీ తడపకూడదని తడిస్తే ఇవి పాడు అవుతాయి అని చెప్పటం జరిగినది. ఇంతలో తను ఒక నాగాసాధువుతో ఉన్నానని మన జిజ్ఞాసితో కలిసి ఒక ఫోటో తీసుకొని పంపించగానే...ఆ ఫోటో ఉన్న జిజ్ఞాసిని చూడగానే హిమాలయాలలో ఉండవలసినవాడు కాస్త ఈ మఠముతో ఏమి పని..నాకు నిజ ఇష్టలింగాలని ఇప్పించటానికి వచ్చాడా?లేక సాధన పరిసమాప్తి అయినదా?దీనియ్మా జీవితం..అసలు ఏమి జరుగుతోంది అనుకోగానే...ఫోన్ ఆగిపోయినది. వారం రోజులకు ఇలా ఇష్ట లింగము మా ఇంటికి రావడం జరిగినది అనగా అంగుళ పరిమాణం లింగము బొటనవేలు పరిమాణ లింగము మేము మా దగ్గర ఉంచుకుని మరో అంగుళ పరిమాణ లింగము మా శిష్యుడికి ఇవ్వటం జరిగినది.
వీటిలో అంగుళ లింగాలు మా మెడలో వెండి బాక్స్ లో పెట్టించుకుని వేసుకోవటం జరిగితే బొటనవ్రేలు లింగమును నిత్య అర్చనలో ఒక చెక్క పెట్టె లో దీనిని మాత్రమే నిత్య అర్చనమూర్తి గా ఉంచడం జరిగినది. మిగిలిన సర్వ దేవత విగ్రహ మూర్తులు దైవిక వస్తువులు మూట కట్టడము జరిగినది. ఎందుకంటే ఇవన్నీ కూడా మూలప్రకృతి విగ్రహ మూర్తులు అయితే ఒక ఇష్టలింగము మాత్రమే మూలప్రకృతి దాటిన మహాలింగం అని మాకు అర్థమయింది.ఇలా ఇంటికి వచ్చిన ఈ ఇష్టలింగముని ఎడమ చేతిలో ఉంచుకుని శివపంచాక్షరీ మంత్రమును చదువుతూ ఉండగానే అది మా చేతికి అతుక్కోవడం ఆరంభమైనది. విచిత్రం ఏమిటంటే మా శిష్యుడు చేతికి తనకి ఇచ్చిన లింగము మాత్రమే అతుక్కోవడం జరిగినది. ఎవరి ఇష్ట లింగాలు వారి ఎడమచేతికి అతుక్కోవడం జరుగుతుందని అప్పుడు మాకు అర్థమైంది.ఇక్కడ మీకు చిన్న సందేహము రావాలి. ఈ లింగాలను ఎడమ చేతిలో పెట్టుకొని ఎందుకు పరీక్షించాలి అని. దీనికి కారణం మన హృదయము ఉండేది ఎడమభాగంలోనే కదా. మరి ఇష్టలింగ స్థానము కూడా హృదయకమలం లోనే కదా.ఈ ఇష్ట లింగమును మెడలో నిత్యము ధరించడం అంటే నిత్య శివ బ్రహ్మ దీక్ష తీసుకోవటమే అవుతుంది. అనగా అయ్యప్ప స్వామి దీక్షలాగా, భవాని దీక్షలాగా, హనుమత్ దీక్షలాగా, శివదీక్షలాగా, గోవింద దీక్షలాగా, బాబా దీక్షలాగా నలభై రోజులపాటు చేసి మానివేయటం ఉండకూడదని… నిత్యజీవిత దీక్ష ఉండాలని ఈ లింగాయత్ సంప్రదాయమును బసవేశ్వరుడు అను సిద్ధయోగి ప్రారంభించినారు. తల్లి కడుపులోనే ఉన్నప్పుడు బిడ్డ కోసం తల్లి మెడలో ఒక లింగము ఉన్న ఇష్ట లింగము బాక్స్ మెడలో వేస్తారు. వాడికి 8 నుండి 11 సంవత్సరముల తరువాత బ్రహ్మ దీక్ష నిత్యజీవిత దీక్షగా ఒక గురువు చేత ఇప్పించడం లేదా తన కన్నతల్లియే గురువుగా మారి ఇప్పించడం జరుగుతుంది. ఈ ఇష్ట లింగమే అన్ని యోగ చక్రాల శుద్ధి, జాగృతి చేస్తూ అంతిమ సాధన జ్ఞానము అందించడం జరుగుతుంది.
బసవేశ్వరుడు ఈ దీక్షకు కొన్ని నియమాలు :
బసవేశ్వరుడు
1.ప్రతిరోజు ఇష్టలింగ ఆరాధనను చేసుకోవాలి. పంచామృతాలు లేదా నీళ్లు లేదా భస్మముతో అభిషేకము చేసి పంచదార నైవేద్యంగా పెట్టాలి.
2.శాఖాహారమే తినాలి. చేపలు, మాంసం, మద్యం ఎట్టి పరిస్థితులలో సేవించరాదు.
3.ఎట్టి పరిస్థితులలో అవసరమున్నా లేకపోయినా కూడా దొంగతనము చేయరాదు.
4.ఇతరులను మాటలతో, చేతలతో బాధ పెట్టరాదు. అలాగే చంపరాదు.
5.సాధ్యమైనంత వరకు అబద్ధము ఆడరాదు.
6.ఇతరులను పొగడరాదు. వారి పొగడ్తలకు లొంగరాదు.
7.ఎవరిని కోపముతో తిట్ట రాదు. శాపనార్థాలు పెట్టరాదు.
8.సాధ్యమైనంతవరకు ఎవరినీ ఆవేశములో తిట్టరాదు.
9.దానముగా లేదా ఉచితముగా లేదా ఎవరి వద్ద ఏమీ తీసుకోరాదు.
10.మీకు అవసరమైన అనవసరమైన వస్తువులు ఇతరుల నుండి ఉచితముగా తీసుకోరాదు.
11. ఉచిత సలహాలు...ఉచిత సేవలు చేయించుకోరాదు.
12. దేహమే దేవాలయం అనే భావముతో ఉండాలి.
13. జాతిసూతకము,జనన సూతకము,రజస్వల సూతకము,ఎంగిలి సూతకము,మరణ సూతకము పాటించరాదు.
14. జాతి,వర్ణ,వర్గ,కుల,గోత్ర,పేరు అనే ఈ ఆరు తారతమ్యాలు ఎంచరాదు.
15. మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
16. ఆహారం, ఇల్లు,బట్ట, జ్ఞానం, వైద్యం ఇవి మానవుని కనీస హక్కులు అని తెలుసుకోవాలి.
17. భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
18. దేవుడికి ప్రజలకు మద్య పూజారులు అవసరం లేదని గ్రహించాలి.
19. సాధనకి స్త్రీ, పురుష భేదం లేదని గ్రహించాలి.
20. అందరియందు,అన్నింటయందు అంతట ఒకే పరమాత్మ ఉంటున్నాడని అనుకోవాలి.
21. అంధవిశ్వాసములు,మూఢాచారాలు విడువవలెను
22. తాను ధరించిన ఇష్టలింగమును సాక్షాత్తు శివ పరమాత్మ తనతో..తనలో ఉన్నాడని నిత్యభావముతో ఆరాధించాలి.
ఇష్టలింగ పూజ విధానం:
“నేను లింగాన్ని ఆరాధిస్తాను
కాబట్టి శరీరం, మాట మరియు ఆలోచన యొక్క పాపాలు,
తెలిసి లేదా తెలియకుండా నా చేత కట్టుబడి,
తొలగించబడుతుంది;
కాబట్టి నా శారీరక, కారణ మరియు సూక్ష్మ శరీరాలు
శుద్ధి చేయబడుతుంది;
కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం,
జనగమ మరియు లింగా
నా మీద ఉండండి;
తద్వారా నేను నిజం, మంచితనం, అందం కనుగొంటాను
మరియు ఆనందం నిత్య .. “
లింగా:
పరమ భగవంతుని కనిపించే చిహ్నం లింగా. ఒక వీరశైవ లింగాయత్‌కు లింగం అనేది పరశివ మరియు పరాశక్తి యొక్క నిజమైన శరీరం, ఇది అత్యధిక మెరుపు, శాశ్వతమైన ఆనందం, అత్యున్నత జ్ఞానం, విశ్వం యొక్క మూలం మరియు అన్ని జీవులలో ఉన్న అదృశ్య చైతన్య. ద్రవ్యరాశి ఒక వ్యక్తి ఎప్పటికీ ఉండడు అని నమ్ముతారు శరీరంపై లింగా ధరించినంత కాలం కలుషితమవ్వదు, ఎందుకంటే లింగా అన్ని మలినాలను కాల్చే అగ్ని.
లింగపూజ:
లింగపూజ అంటే ఇష్టలింగం యొక్క పరిమిత రూపంలో అనంతమైన దేవుని ఆరాధన. ఇది దేవుని పట్ల మనకున్న గౌరవం మరియు ప్రేమకు వ్యక్తీకరణ. ఇది మన మనస్సులో మరియు మన దైనందిన జీవితంలో దేవుని ఉనికిని ఆహ్వానించే ఒక ప్రక్రియ. మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవునితో సన్నిహితంగా ఉండి, మంచి వ్యక్తులుగా మారడానికి మాకు సహాయపడుతుంది.
శివయోగంలో భాగంగా ఇది ఐక్య లేదా పరమాత్మ (యూనివర్సల్ ఆత్మ) తో జీవాత్మ (వ్యక్తిగత ఆత్మ) యొక్క తుది యూనియన్‌ను లక్ష్యంగా చేసుకుంది.
పూజ అనేది వివిధ రకాల నైవేద్యాలతో లింగమును ఆరాధించడం, మీ అత్యంత ప్రియమైన మరియు గౌరవనీయమైన స్నేహితుడు మరియు అతిథికి మీరు సత్కార్యాలు చేసే విధంగా ఇష్టలింగముకు సత్కార్యాలు చేస్తారు. సువాసనగల గంధపుచెట్టు పేస్ట్, అందమైన పువ్వులు, ధూపం, శుభ కాంతి, మంత్రాలు మరియు పాటలను ఆయన ప్రశంసలలో అందించడం వంటి లింగానికి మీరు అన్ని మంచి, ఆహ్లాదకరమైన పనులు చేస్తారు. ఈ సమర్పణలను ఉపచారాలు అని పిలుస్తారు. నిర్దేశించిన ఉపచారాలు ఎనిమిది, పదహారు, ముప్పై రెండు లేదా నలభై ఎనిమిది సమూహాలలో ఉన్నాయి (సమయం మరియు ప్రదేశ అనుమతి వలె ప్రదర్శించబడతాయి) సాధారణంగా ఉపయోగించే ఉపచారాలు ఎనిమిది (అష్టవిడా లింగార్చన) లేదా పదహారు (షోడశోపచార). అయినప్పటికీ ఒకటి లేదా అంతకంటే తక్కువ సమర్పణ చాలా క్లిష్టమైనది కాదు. పూజ మీరు కోరుకున్నట్లుగా సరళంగా లేదా విస్తృతంగా మరియు సమయం తీసుకుంటుంది. మీరు లింగపూజ చేసి, మీ ప్రార్థనలను రోజుకు ఒక్కసారైనా దేవునికి అర్పించడం ముఖ్యం. అన్ని పూజా వస్తువులు అందుబాటులో లేనప్పుడు మీరు కనుగొనగలిగినన్ని వాడండి. కనీసం లింగాన్ని నీటితో స్నానం చేయండి, విభూతిని వర్తింపజేయండి, మీ ఆలోచనలను దేవునిపై లింగా రూపంలో కేంద్రీకరించండి, ఓం నమః శివాయఅని చెప్పి నమస్కారం చేయండి. మరేమీ కాకపోతే మీరు భక్తితో భగవంతుని గురించి ఆలోచించగలిగితే, ఓం నమః శివాయ అని చెప్పి, ఎప్పుడైనా ఏ ప్రదేశంలోనైనా శివుడికి నమస్కరించండి.
లింగపూజ ప్రతిరోజూ, ప్రాధాన్యంగా ఉదయం, పూజ గదిలో ఇంట్లో స్నానం చేసిన తరువాత చెయ్యాలి.ఉదయం లింగపూజ చేయడం ద్వారా మీరు ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరమైన మనస్సుతో రోజును ప్రారంభిస్తారు. అష్టవారణులు, అవి గురు (ఆధ్యాత్మిక గురువు) లింగా (దేవుని చిహ్నం), జంగమ (ప్రయాణ ఆధ్యాత్మిక మార్గదర్శి), విభూతి (పవిత్ర బూడిద), రుద్రాక్షి (శివునికి పవిత్రమైన బెర్రీ), మంత్రం (పవిత్ర అక్షరాలు), పడోదక (ఏకీకృత నీరు) మరియు ప్రసాదం (పువ్వులు లేదా ఆహారం రూపంలో ఆశీర్వాదం) ఒక లింగాయత్ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎనిమిది సహాయకులుగా భావిస్తారు.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అష్టవారణాలు తప్పిపోయినట్లయితే ఇక్కడ మళ్ళీ మనం పూజలు చేయడాన్ని గుర్తించలేము. ఉదాహరణకు రుద్రాక్షి అందుబాటులో లేకపోతే, పూజ అస్సలు చేయకుండా, పూజా లేకుండా వ్యక్తిగా ఉండాలి. రోజువారీ పూజల కోసం లింగా గురు మరియు జంగమ రెండింటినీ సూచిస్తుందని గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైనది మన భక్తి మరియు ప్రార్థనలు చిత్తశుద్ధితో చెప్పబడ్డాయి. మనం పూర్తిగా దేవునిపై దృష్టి కేంద్రీకరించాలి మరియు ఆయన సంరక్షణకు మనల్ని అప్పగించాలి. పూజ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే మార్గం. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు కనీసం 5 విషయాలు (ఉపచారాలు) దేవునికి అర్పించాలి. చెవులు ఇవ్వడానికి పువ్వులు, రుచి ఇవ్వడానికి ప్రసాదం, వాసన ఇవ్వడానికి ధూపం, కళ్ళు ఇవ్వడానికి దీపం, మరియు స్పర్శ భావాన్ని ఇవ్వడానికి గంధం.
లింగాపూజ విధానం.
1. జలశుద్ది:
విభూతి పైన కుడి మధ్య వేలు చిట్కాను రుద్దండి . పూజకు ఉపయోగించాల్సిన మంచినీటిలో “ ఓం” ను విభూతి పూసిన మధ్య వేలు చిట్కాతో రాయండి. ఇది నీటిని పవిత్రం చేస్తుంది. మీ తలపై మరియు పూజా పాత్రలపై కొన్ని చుక్కలను చల్లుకోండి.
2. విభూతి లేదా భస్మా
ధరించడం విభూతి మనస్సు యొక్క స్వచ్ఛతను మరియు భగవంతునికి సమర్పించడాన్ని సూచిస్తుంది.
మీ కుడి చేతి యొక్క మూడు మధ్య వేళ్ల లోపలి భాగాన్ని విభూతితో విభూతి ఉండ లేదా విభూధి పొడి పైన రుద్దడం ద్వారా మీ వ్రేళ్ళలకి అంటించుకొండి..
3. భస్మధారణ
సాధారణంగా రోజంతా విభూతిని ధరించాలి.. స్నానానికి ముందు పొడి విభూతి, మరియు స్నానం చేసిన తరువాత తడి విభూతి. తడి ఉపయోగించినప్పుడు విభూతి నుండి ఒక పొడిని తయారు చేయండి, ఎడమ అరచేతిలో నీటితో ద్రవ పేస్ట్ లాగా చేయండి. మధ్య వేలు, రింగ్ ఫింగర్ మరియు థంప్ ఉపయోగించి తడి విభూతి తీసుకోండి. నుదుటి యొక్క ఎడమ వైపున మధ్య మరియు ఉంగరపు వేళ్లను ఉంచండి (మధ్యలో తక్కువ స్థలాన్ని వదిలివేయండి) నెమ్మదిగా 2 వేళ్లను కుడి వైపుకు లాగండి, ఆ 2 వేళ్లను ఎత్తకుండా, నుదిటి యొక్క కుడి వైపున బొటనవేలు (మధ్య రేఖ కోసం) ఉంచండి మరియు దానిని ఎడమ వైపుకు లాగడం ప్రారంభించండి ( మీరు ఇతర 2 వేళ్లను తీయవచ్చు). అభ్యాసం ద్వారా మీరు దాన్ని సరిగ్గా పొందవచ్చు.
విభూతి పూతతో మీ కుడి చేతికి మూడు మధ్య వేళ్లు మీ నుదిటిపై ఎడమ నుండి కుడికి విభూతిని వర్తించండి. మధ్య వేలు చిట్కాను ఉపయోగించి విబూతి యొక్క రెండు కనుబొమ్మల మధ్య చుక్కను వర్తించండి - జ్ఞాన కేంద్రం. -
4. భస్మధారణ
సర్వాంగ విభూతి మణికట్టు, చేతులు మరియు గుండె మరియు కడుపు యొక్క రెండు వైపులా విభూతిని కనీసం 6 ప్రదేశాలకు వర్తించండి.
5. రుద్రాక్షి
మీ మెడ చుట్టూ ఉన్న తీగపై 108,32 లేదా కనీసం ఒక రుద్రాక్షి ధరించండి.
6. అభిషేకం
మీ ఎడమ అరచేతి మధ్యలో ఉన్న లింగా మీదుగా ఒక ప్రవాహంలో పవిత్రమైన నీటిని పోయాలి. మీరు లింగమును మధ్య వేలితో నొక్కి ఉంచవచ్చు, తద్వారా లింగా పడదు.
7. వస్త్ర
లింగా మరియు మీ చేతులను వస్త్రంతో తుడవండి ( తువ్వాళ్లు పూజకు మాత్రమే)
8. విభూతి
అంచుతో మీ ఎడమ అరచేతిలో ఆరు వైపుల నక్షత్రాన్ని (పైకి చూపించే త్రిభుజం, పైకి త్రిభుజంతో కప్పబడి ఉంటుంది) గీయండి. మధ్యలో ఓం రాయండి.
9. పంచకోన మరియు ఓం
ప్రత్యామ్నాయంగా మీ ఎడమ అరచేతిలో ఐదు వైపుల నక్షత్రాన్ని మరియు ఓం (కన్నడ / సంస్కృతం) ను విభూతితో గీయండి.
10. ఆసన
మీ ఎడమ అరచేతిపై ఉన్న నక్షత్రం మీద ఆసన ఉంచండి. జలహరి మీ కుడి వైపుకు గురిపెట్టినట్లు నిర్ధారించుకోండి (జలహరి ఓం ద్వారా సూచించబడుతుంది, లేదా లింగా వైపు ఒక చిన్న నిక్ ద్వారా సూచించబడుతుంది)
11. లింగాకు విభూతి
బొటనవేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలు ఉపయోగించి వృత్తాకార కదలికలో మూడు సార్లు విభూతిని లింగా చుట్టూ వర్తించండి. (ప్రత్యామ్నాయంగా విభూతిని మీ నుదిటిపై విభూతిని వర్తించే విధంగా మూడు మధ్య వేళ్ళతో లింగానికి వర్తించవచ్చు).
12. గంధ ధారణ
గంధ ముంచడం గంధ లో కుడి వేలు (చెక్కల కలప పేస్ట్). లింగా ముఖానికి మధ్యలో గంధ చుక్కను వర్తించండి.
13. అక్షత
రెండు నుండి ఐదు ధాన్యాలు అక్షత (ముడి పగలని బియ్యం ) గంధ చుక్క మీద వేయండి.
14. పత్రి మరియు పుష్పా
బొటనవేలు, మధ్య మరియు ఉంగరాల వేళ్లను ఉపయోగించి పువ్వులు మరియు బిల్వా ఆకులను లింగా పైన ఉంచండి.
15. ధూపా
లింగానికి ముందు ధూపం కర్రను వెలిగించాలి.
16. ఘంటే / ఘంటా గిలక్కాయల
కదలికను ఉపయోగించి గంటను ధ్వనిస్తుంది .
17. హారతి
హారతి దీపాలను లింగానికి ముందు సవ్యదిశలో పైకి క్రిందికి కదిలించండి.
18. కర్పుర దీపా
లైట్ కార్పురా (కర్పూరం) మెటల్ కర్పూరం హోల్డర్‌లో ముక్క మరియు లింగా ముందు మేల్కొలపండి.
19. ద్రస్తి యోగ
మీ అరచేతిలో ఉన్న లింగాన్ని మీ కంటి స్థాయికి తీసుకురండి.లింగపై కన్ను మరియు ఆలోచనలను కేంద్రీకరించండి. కళ్ళు సగం మార్గంలో మూసివేయండి, తద్వారా మీ దృష్టి పూర్తిగా లింగాపై ఉంటుంది, మరియు పరిసరాలను అస్పష్టం చేస్తుంది, ఇది ఏకాగ్రత మరియు మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది.
20. మంత్రం
లింగంపై దృష్టి సారించేటప్పుడు “ఓం నమః శివయ” మంత్రాన్ని పన్నెండు సార్లు చెప్పి ధ్యానం చేయండి (ప్రారంభంలో మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే చెప్పండి. కొంత కాలానికి మీరు క్రమంగా మీరు మంత్రాన్ని పునరావృతం చేసే సంఖ్యను పెంచవచ్చు) - ఓం నమః శివయ.
21. జపవిధి
రేఖాచిత్రం నమూనాను చూపిస్తుంది. మీరు 9 కి చేరుకునే వరకు మీ బొటనవేలు కొనతో 1 కౌంట్ క్లాక్ వారీగా ప్రారంభించండి. పాయింటర్ వేలితో 10 మరియు 11 లెక్కింపులను కొనసాగించండి. బొటనవేలుతో లెక్కింపును పున: ప్రారంభించండి. మధ్య వేలు అడుగున ముగుస్తుంది. ప్రతి గణనతో “ఓం నమః శివయ” అని ఒకసారి చెప్పండి. 26 సార్లు లెక్కించడానికి ఒకే నమూనాలో మరోసారి వెళ్ళండి, మరో రెండు గణనల కోసం కొనసాగించండి, చిన్న వేలు దిగువ భాగంలో ముగుస్తుంది.
22. జపమాల
“ఓం నమః శివయ” మంత్రాన్ని 51 సార్లు, 108 సార్లు, లేదా 1000 సార్లు జపమాల సహాయంతో (పూసలు లేదా రోసరీ లెక్కింపు), రుద్రాక్షితో తయారు చేస్తారు. షికమణి లేదా టాప్ పూస పక్కన ఉన్న పూసతో ప్రారంభించండి. (షికమణి కట్టిన పూస కాబట్టి అది పొడుచుకు వస్తుంది) .మీరు మంత్రము పునరావృతం చేసిన ప్రతిసారీ మీరు శిఖమణికి చేరుకునే వరకు ఒక పూసను మీ వైపుకు కదిలించండి.
23. నైవేద్య
ఒక చిన్న పళ్ళెంలో కొన్ని ఎండుద్రాక్షలను అమర్చండి. మీ అరచేతిని ఎండుద్రాక్షపై మరియు లింగా వైపు వేవ్ చేయండి, ఆహారాన్ని అర్పించడాన్ని సూచిస్తుంది (పూజ పూర్తయిన తర్వాత మీరు ఎండుద్రాక్షను ప్రసాదంగా తినవచ్చు)
24. అచమన
నైవేద్య తరువాత కొన్ని పోయడం ద్వారా నీరు అందిస్తారు కూజా నుండి మజ్జనసాలి (గిన్నె) లోకి నీరు
25. నమస్కర
లింగా పక్కన ఉన్న అరచేతి ప్రాంతానికి మీ నుదిటిని తాకడం ద్వారా లింగానికి నమస్కరించండి.
26. నిర్మల్య
బొటనవేలు మరియు పాయింటర్ వేలు ఉపయోగించి పువ్వులు మరియు ఆకులు లింగాన్ని తీసివేసి మజ్జనసాలిలోకి వదలండి. (తరువాత మజ్జనసాలిని ఒక సజీవ మొక్క యొక్క బేస్ వద్ద ఖాళీ చేయండి)
27. అపారా స్నానా
మరొకసారి లింగాన్ని నీటితో కడిగి పొడి వస్త్రముతో తుడవండి
28. చిద్బాస్మా
మళ్ళీ బొటనవేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలుతో (లేదా మూడు మధ్య వేళ్ళతో) లింగానికి విభూతిని వర్తించండి
29. పడోడాక లేదా తీర్థ
నీటిని పవిత్రం చేయడానికి లింగాపై కొంత నీరు పోసి మీ అరచేతిలో లింగా కింద సేకరించండి.
30. తీర్థ స్వీకర
కుడి చేతితో లింగమును పట్టుకొని, లింగాచే వచ్చిన పవిత్రమైన నీరు తీర్ధ స్వీకరణ చెయ్యండి.
31. హుదుగడ పావుడా
లింగాన్ని ఆరబెట్టి హుదుగడ పావుడాపై ఉంచండి (కొత్త వస్త్రం సుమారు 2 ”x 2“ పరిమాణంలో లింగానికి కేటాయించబడింది) .లింగమును కవర్ చేయడానికి పావుడా యొక్క నాలుగు వైపులా పైభాగం వైపు మడవండి. హుడుగడ పావుడా మరియు లింగా కలిసి లింగంలో ఉంచండి గండగాడిగి / కరాడిగే దిగువ సగం.
32. గండగదిగి / కరాడిగే.
గండగదిగి పైభాగాన్ని దిగువ భాగంలో స్లైడ్ చేసి, పక్క స్తంభాల మీదుగా శివధర (గండగదిగిని పట్టుకున్న దారం) తో ముడి వేయడం ద్వారా వాటిని భద్రపరచండి.
33. లింగాయత్
మీ మెడ చుట్టూ గండగడ్గి ధరించండి, తద్వారా లింగా మీ గుండె పక్కన ఉంటుంది.
34. అంతిమ ప్రార్థనలు
పూజ ముగింపులో “జయ నమః పార్వతి హర హర మహాదేవ” (పార్వతి మరియు శివునికి మహిమ)
********************************************************
ఇలా ఈ నిత్య శివ బ్రహ్మ జీవిత దీక్ష ఉంటుంది. ఈ దీక్ష కోసం తెలుపు, నలుపు, నీలం, నారింజ, ఆకుపచ్చ, కాషాయ రంగులలో ఏదో ఒక రంగు పైజమా లాంటివి వేసుకొని దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దీక్ష తీసుకున్న 8 గంటల నుండి లింగ ప్రభావము చూపటము జరుగుతుంది. మా అనుభవాలు చూస్తే ఈ లింగము మేము వేసుకున్న దగ్గర నుండి విపరీతమైన వీర ఆవేశము కలుగుతూ ఉండేది. ఎవరో ఒకరిని కారణము ఉండి లేదా కారణం లేకుండా తిట్టటం జరుగుతుండేది. మైధున సమయంలో మెడలో నుంచి తీసి పూజ గదిలో పెట్టి వచ్చేవాడిని. మర్నాడు స్నానం చేసి వేసుకొనే సమయానికి ఏదో ఒక అవాంతరం వచ్చి దానిని వేసుకునే అవకాశం ఉండేది కాదు లేదా మర్చిపోవటం జరిగేది. అంటే మైధున సమయాలలో గూడ దీనిని తీయరాదని నాకు అపుడు తెలిసేది గాదు.ఎందుకంటే మైధునం అనేది ఒక సృష్టియజ్ఞం అయినపుడు అది పాపము ఎలా అవుతుంది? మేము ఎవరి ఇండ్లకు అయినా వెళ్ళవలసి వస్తే వారికి ఇష్టమైతే నా మెడలో ఉంటుంది. ఇష్టం లేకపోతే పూజగదికి చేరుకుంటుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పుడు మాటలు గాని తప్పుడు ఆలోచనలు చేస్తే వెంటనే నా ఎడమ చేతి వేళ్లకు ఏదో ఒక గాయము అవ్వటం జరుగుతుంది.విచిత్రమేమిటంటే ఈ లింగమును మన ఎడమ చేతిలో పెట్టుకొని శివపంచాక్షరీ మంత్రమును చదువుతూ 108 పూర్తి చేయగానే ఎడమ చేతికి అతుక్కుని గాని అక్కడ నుండి ఏదో నరములలో కదలికలు ఏర్పడి హృదయము దాకా ఏదో శక్తి ప్రవాహము జరుగుతుందని మనకి ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. ఒకవేళ ఈ లింగంలో ఉన్న మహా నిర్వాణ శక్తి లేదా న్యూక్లియర్ శక్తి మనలోనికి కొద్ది కొద్దిగా ప్రవేశిస్తుంది అనుకుంట. ఇలా ఈ ఇష్ట లింగము ఆరాధనను 12 సంవత్సరముల పాటు చేస్తే 1,3, 5, 7, 9, 11,16, 21,32, 48 సంవత్సరములలో మనకి లేశమాత్రం కర్మలు ఉన్నా కూడా నాశనమవుతాయి. ఈ కర్మలకి కారకులైన వ్యక్తులు మనకు ధ్యానములో లేదా కలలో కనబడతారు. కనపడిన కొన్ని రోజుల కల్లా మనకి వారితో విభేదాలు వచ్చి విడిపోవటం లేదా వాళ్ళు దూరప్రాంతాలకు వెళ్ళిపోవటం ఖాయం అని నా స్వానుభవాలు చెబుతున్నాయి. అంటే వారితో మన రుణము తీరిపోయి ఉండాలి లేదా మన రుణము వారికి తీరిపోయి ఉండాలి. అనగా మనము వాడికి బాకీ పడి ఉండాలి లేదా వాళ్ళు మనకి బాకీ ఉండాలి. బాకీ తీరిపోయిన తర్వాత వాళ్లు లేదా మనము రుణ విముక్తి అవుతాము. అనగా కోపముతో విడిపోవటం లేదా ప్రాంతాలు మారిపోవడం లేదా స్థల మార్పిడి జరగడం కానీ జరుగుతుంది. దీనమ్మ జీవితం. ఈ లింగ రాధన చేస్తున్నప్పటి నుండి విచిత్రంగా చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, జంతువులు, గురువులు, శిష్యులు, భక్తులు, దైవాలు ఇలా అందరూ కూడా మాతో ఏదో ఒక రకంగా మమ్మల్ని రెచ్చగొడుతూ అవమాన పరుస్తూ మాకు దూరం అవ్వటం జరిగినది. దానికి బాధ గాని, చింత గాని, ఆందోళన గాని ఉండేది కాదు. కొన్ని రోజుల తర్వాత వారి గురించి వివరాలు వారితో మాట్లాడిన సంఘటనలు అనుభవాలు అనుభూతులు ఇలాంటివి మా మది నుండి మాయం అవ్వేవి. వాళ్ల గురించిన ఆలోచనలు రమ్మన్నా వచ్చేవి కావు. అదేమి విచిత్రమో గానీ మాకు తెలిసేది కాదు. అలాగే మాకు హాని లేదా ప్రమాదం తలపెట్టే వారి నుండి కూడా మాకు తెలియకుండానే వాళ్ళు దూరమయ్యే వాళ్ళు. అంటే మాకు తెలిసినది ఏమిటంటే ఈ లింగ ఆరాధన వలన మనకున్న అన్ని రకాల మాయ, మోహ, వ్యామోహ, ఆశ, భయము కర్మ బంధాలనుండి బంధవిముక్తి కలిగిస్తుంది. ఏకాకిగా మారుస్తుంది. అనగా ఆదిలో మనము వున్న పూర్వ స్థితికి తీసుకొని వెళుతుంది. ఈ పరిస్థితిలో మనము ఒకడే ఉండేవాడిని. మనకున్న ఇష్ట కోరిక వలన ఏకత్వం నుండి భిన్నత్వం అనగా ఒక రూపము నుండి వెయ్యి రూపాలుగా విడిపోవటం జరిగినది. ఈ 1000 రూపాలులో ఒక్కొక్కటి కోటితో సమానము కాబట్టి 1000 కోట్ల రూపాలుగా విడిపోవటం జరిగినది. అనగా ఉన్న ఒక్కడు కాస్త వెయ్యి కోట్లుగా మారడం జరిగినది. ఇప్పుడు ఈ లింగ ఆరాధన అనేది మనము ఎప్పుడైతే వెయ్యికి వస్తామో అనగా మన సాధన శక్తి సహస్ర చక్రము స్థితికి వచ్చి మేధా దక్షిణామూర్తి యొక్క అపస్మారక స్థితి మాయ దాటతామో అప్పుడు ఈ ఇష్ట లింగమునకు యోగ్యత లభించినట్లు నవపాషాణం నిర్మిత కుమార స్వామి నిజరూప దర్శనం కలుగుతుంది. ఎప్పుడైతే ఈలింగ ఆరాధన చేస్తామో 1000 నుండి తిరిగి ఏకత్వం రావటం అనగా ఏకాకి స్థితికి అనగా ఏకైక ఇష్ట కోరిక దగ్గరికి తీసుకుని రావటం జరుగుతుంది. ఈ కోరిక మాయ వలన ఏకాకి గా ఉన్న వాళ్లు కాస్త వెయ్యి కోట్ల మంది దాకా మారిపోయినాము అన్నమాట. మళ్లీ పూర్వస్థితి అయిన ఇష్ట కోరికకి ఈ లింగము తీసుకొని రావటం వలన ఇదియే ఇష్ట లింగము అని అన్నారు.ఈ ఇష్ట లింగ ఆరాధన స్థితికి గౌతమబుద్ధుడు వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా శివలింగ ఆరాధన చేస్తే తన అభిమతమమునకు విరుద్ధము అవుతుందని ఎడమ చేతిలో ఈ లింగమునకు బదులుగా నల్లటి భిక్ష పాత్రను పెట్టుకొని ధ్యానము చేసి అన్ని కష్టాలకి కారణం ఇష్ట కోరిక అని తెలుసుకున్నాడు కానీ ఇష్ట లింగము ఆరాధన చేయకపోవటం వలన ఇష్ట కోరిక మాయను దాటలేక ఈ కోరికకు మళ్ళీ స్పందించి కోరిక లేని సమాజం చూడాలని కోరికను పెట్టుకుని మతమును ఏర్పరచటం జరిగినదని మాకు అర్థం అయినది. ఈ స్థితిలో నల్ల భిక్షపాత్ర కి బదులుగా ఇష్ట లింగ ఆరాధన చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది కాబోలు. ఎవరికి తెలుసు.ఇలా ఈ లింగాలను రావణబ్రహ్మ ఆత్మలింగముగా… తారకాసురుడు బ్రహ్మ లింగంగా… దత్త స్వామి యోగ లింగముగా.. గణపతి, అమ్మవారు, మహాశివుడు ఇలా అందరూ కూడా పూజించటం జరిగినది.
కాశీ క్షేత్రములోని దత్త ఇష్టలింగము
దత్తస్వామి తనకి వచ్చిన ఇష్ట లింగమును కాశీ క్షేత్రములోని విశ్వనాధుని గుడి కి పశ్చిమ దిక్కులో ప్రతిష్టించడం జరిగినది. ఈ లింగము దత్త లింగముగా పూజింప బడుతుంది. ప్రస్తుతం దాని ముందు షాపులు వెలిసినాయి. ఒక చిన్న సన్నని దారి మాత్రమే ఈ గుడికి వెళ్లడానికి దారి ఉంటుంది. అక్కడ శివ బ్రహ్మ దీక్షలో ఉన్న నల్లటి దత్త స్వామి విగ్రహము అలాగే దత్త ఇష్టలింగము ఉంటాయి. యోగము ఉన్న వారికి మాత్రమే ఈ గుడి దర్శనం కలుగుతుందని ఉవాచ. మేము కూడా ఈ ఇష్ట లింగ ఆరాధన చేస్తుంటే మా ఏకైక కోరిక ఏమిటో తెలిసింది. అది ఏమిటంటే నిజ బ్రహ్మజ్ఞానము పొందాలనే కోరిక అని తెలిసినది.
కాశీలోని వేదకాశీ యందు వేదవ్యాసుడి ఇష్టలింగాలు
ఎందుకంటే వేదవ్యాస అవతారములో మహావిష్ణువే ఆది దేవుడని ప్రచారం చేస్తే అది కాస్తా కాశీక్షేత్రంలో మహానంది చేతిలో వాదనలో ఓడిపోయి మహావిష్ణువు కాదని మహాదేవుడు ఆదిదేవుడు ఒప్పుకోవటం జరిగినది. నిజానికి ఈయన తన సాధన శక్తి శ్రీ సహస్ర చక్రంలో ఉంటే మహావిష్ణువు ఆదిదేవుడుగా భావించారు కానీ నిజానికి జీవనాడి ద్వారా హృదయ చక్రములోనికి వెళితే అక్కడ అష్టదళ పద్మములో ఉన్న నల్ల శివలింగ దర్శనం అనుభూతి కలగటంతో మహాదేవుడు ఆది దేవుడని ఒప్పుకోవటం జరిగినది. ఈ ఇష్ట లింగ ఆరాధన కోసమే వెయ్యి కోట్ల జన్మలను 10 లక్షల దాకా అనుభవించి ప్రస్తుతం సాధన స్థితికి రావడం జరిగిందని మాకు స్మరణ అయినది. విచిత్రం ఏమిటంటే మాకు అందరి ఇష్ట కోరికలు ఏమిటో ఈలింగ ఆరాధన వలన తెలుసుకోవటం ఆరంభమైనది. కానీ మహత్తర చిట్టచివరి ఈ అంతిమ స్థితికి ఇంతవరకు ఎవరూ కూడా సాధించలేకపోయారు. ఎందుకంటే వాళ్లంతా తమ హృదయ చక్రంలోని ఇష్ట కోరిక తీర్చేఇష్ట లింగం దగ్గరే ఆగి పోవడం జరిగినది. అంటే ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా తన ఇష్టలింగం దగ్గర పాలపాయసం కోసం ఆగిపోవడంతో ఈయన దగ్గర నుండి వచ్చిన వారంతా అలాగే వీరి నుండి వచ్చిన మనమంతా ఆగిపోవడం జరుగుతుంది. అనగా మొట్టమొదటి ఆదిదేవుడు మహాశివుడు పాలపాయసం దగ్గర ఆగిపోతే, ఈయన తర్వాత వచ్చిన పరమేశ్వరి గారెలు పులిహోర దగ్గర ఆగిపోతే, ఈమె తర్వాత వచ్చిన మహావిష్ణువు కూడా దద్దోజనం,నేతి పరమాన్నం దాటలేకపోయినారు. ఇలా వచ్చిన 32 మంది కూడా తమ తమ ఇష్టకోరికలు తీర్చే ఇష్ట లింగం దాటలేకపోయారు.
దేవి కామమాయ - నా ఇష్ట కోరిక మాయ:
ఇప్పడిదాకా మేము కాస్త బాలా,త్రిపుర,సుందరి కామమాయలు దాటివచ్చినామని మీకు తెలుసు కదా! ఇపుడు ఆదిపరాశక్తి అంతిమ రూపమైనా దేవి కామమాయ ఈ చక్రము నందు నాకు ఎలా కలిగినదో తెలుసుకోండి.నిజానికి నా ఇష్ట కోరిక ఏమిటంటే రతి క్రీడ. మైధునము అంటే వల్లమాలిన అభిమానం. ఇష్టం. ప్రాణం. అది సమయానికి దొరకకపోతే పిచ్చివాడిలా గా ప్రవర్తిస్తున్నాను. అప్పుడే నా దైవత్వం చూపు కాస్త కామత్వము చూపుగా మారుతుంది. ఇలాంటి స్థితిలో భార్య సంయోగము దూరమైనది. కామానికి హద్దులు లేకుండా పోయినది. అప్పుడు 72 సంవత్సరముల వృద్ధురాలు నా వెంట పడటం మొదలు పెట్టినది. ఈమెను చూడగానే ఇష్టకామేశ్వరి తన కామమాయ నా మీద ప్రయోగం చేస్తోందని అర్థమైనది. ఇలా దాదాపుగా నాకోసం 15 సంవత్సరముల పాటు ఎదురుచూస్తూ ఉన్నదని తెలియగానే నా గుండె గుభేలు మన్నది. అంటే 65 సంవత్సరముల వయస్సు నుండే నన్ను ఆ దృష్టితో చూస్తుంది కానీ నాకు ఆమె ఈ వయస్సులోనే పరిచయము అయినది. అనగా ఇప్పుడు 15 సంవత్సరములు పూర్తి అయినాయి. నేను ఎప్పుడూ ఆమెను ఆ దృష్టితో చూడలేదు. ముసలమ్మ మీద ఎవరికైనా కామము కలుగుతుందా? కలగదు కదా. నా ఖర్మ కాలి నా సాధన ఈ హృదయ చక్రం స్థితికి రావటము 15 సంవత్సరముల తరువాత ఈమె తన మనస్సులో మాట బయట పెట్టడం జరిగినది. నా బొంద.నా బూడిద. ఈమెతో సంసారం చేస్తే ముసలోడికి దసరా పండుగలాగా ఉంటుంది. ఈమె తన మాటలతో నన్ను రెచ్చగొట్టటం చేస్తుంది. పొరబాటున ఈమె స్నానము చేసిన సమయములో వెళ్ళితే నా కళ్ళుముందర నేను చూస్తున్నానని తెలిసిన గూడ పడకగది తలుపు వేసుకోకుండా నగ్నముగా మారి బట్టలు మార్చుకొనేది.నాకు నవ్వు వచ్చేది.ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో నగ్నముగా నీ దగ్గరకి అమ్మాయి వస్తే ఏమి చేస్తావని ఒక వ్యక్తిని అడిగితే దానికి అతను వెంటనే బట్టతో తుడుస్తాను అన్నాడు.అధికారుల దృష్టిలో వయస్సు ఉన్న యువతి అయితే మనవాడి దృష్టిలో యువతి కాస్త పసిపాప అయినదని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు గదా!యత్ భావము తత్ భవతి!మనము చూసే దృష్టిని బట్టి అంతా ఉంటుంది. ఈ కామ బామ్మను ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు. దీనికి తోడు కోపముతో ఉన్న హనుమంతుడు ముఖము ఉన్న వాల్ పోస్టర్ లు ఎక్కడపడితే అక్కడ కనపడుతున్నాయి.ఒకవేళ నేను కాస్త పాతివ్రత్య ధర్మానికి భంగము కల్గిస్తానని...అది కల్గకుండా చెయ్యటానికి నాకు రక్షణ ఇవ్వటానికి ఈ రూపములో కనపడుతున్నాడని అనిపించినది.ఎందుకంటే సాధకుడికి క్షణికము చాలు పట్టు తప్పటానికి. ఒకరోజు నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర సినిమాను చూసినాను. అందులో ఆయనకి ఒకసారి తన భార్య మీద విపరీతమైన కామవాంఛ కలుగుతుంది. ఆమె దగ్గరికి వెళ్లతాడు కాకపోతే ఆమె మంచి నిద్రలో ఉంటుంది. ఆమె దేహమును చూస్తూ ఈ సుందర దేహము ఎప్పటికైనా అస్థిపంజరంగా మారవలసినదే కదా. నాకు కామ దేహము కావాలా? సుందరమైన నిశ్చలముగా నిలిచిపోయే భగవత్తత్వం కావాలా? ఈ దేహం శాశ్వతం కాదు కదా. శాశ్వతము కాగలిగే భగవత్ తత్వమే కావాలని ఆయనకు స్ఫురణకునచ్చింది. ఆ గది నుండి బయటకి వెళ్ళిపోతారు. ఈ దృశ్యము చూసిన తర్వాత ఇష్టకామేశ్వరి నామీద కామ దేహ పరీక్షలు పెడుతుందని ఈ మాయలో పడితే నా సాధన ఈ చక్రమందే ఆగిపోతుందని నాకు స్ఫురణ అయినది.బుద్ధుడు ఇష్ట కోరిక దగ్గర ఆగి పోతే నేను ఇష్ట కామకోరిక దగ్గర ఆగి పోతానా అని అనిపించినది. దానితో ఏదో తెలియని భయం వేసింది. ఈమె నా దగ్గరకి ఇలా కామ దృష్టితో రావడానికి కారణము విశ్లేషణ చేసినప్పుడు ఆమె నా ఆది జన్మ యొక్క కామ స్త్రీమూర్తి అని స్మరణ అయినది. ప్రస్తుతము నేను ఒక అడుగు దూరంలో ఉన్నాను. ఈమె మాయ దాటితేగాని నా సాధన ముందుకు వెళ్ళదు. లేదంటే అడుగు దూరంలో ఆగిపోవాల్సి ఉంటుంది.ఆగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించినాను. ఒక రోజు ఆమె దగ్గరికి వెళ్ళి నా బొటన వేలుతో ఆమె ఆజ్ఞాచక్రం స్థానమును ఉత్తేజ పరిచినాను. దానితో ఆమెకి నా మీద ఉన్న కామ వ్యామోహము పూర్తిగా పోయినది బాధలేదు. ఆనందమూ లేదు. ఏదో తెలియని స్థితిలో ఆమె ఉన్నదని గ్రహించినాను. ఈ విధముగా నాటి నా చిట్ట చివరి మాయ పరీక్ష అయిన ఆ దేవిమాయను దాటినాను. అనగా నా ఇష్టకామ కోరిక దాటటము జరిగినది. లేకపోతే బుద్ధుడి లాగా అర్ధాంతరంగా ఆగిపోవలసి వచ్చేది. ఈ కామమే ఏకత్వ స్థితిని పొందనీయకుండా భిన్నత్వం స్థితిలోనే ఉంచేది. నన్ను ఈ కామమాయ దాటించిన ఆ వృద్ధ స్త్రీ మూర్తి కి కృతజ్ఞతలు చెప్పే లోపల అకారణముగా మూడోరోజు బాత్రూంలో కాలుజారి తలకి పెద్ద దెబ్బ తగిలి ప్రాణాలు వదిలినదని తెలిసినది. ఆ రోజు నుండి ఎవరైతే నన్ను కామ దృష్టితో చూస్తున్నారో వాళ్లు నాకు దూరం అవ్వటం ద్వారా వాళ్లకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావటం లేదా మానసిక రుగ్మతలు రావటం లేదా ఇంట్లో ఏదో ఒక తీవ్ర సమస్యలు రావటం నా దృష్టికి అలాగే నా మనోదృష్టికి వచ్చినాయి. అందుకే కామికానివాడు మోక్షగామి కాలేడు అన్నారు. కానీ కామము దాటితే గాని మోక్షము పొందలేరు అన్నమాట. అందరికీ కామము పరీక్ష అంతిమ పరీక్షగా ఉండాలని లేదు. ఇష్ట పదార్థము లేదా ఏదైనా బలమైన ఇష్ట కోరిక అంతిమ పరీక్షగా ఉంటుందని నేను గ్రహించాను.
అలాగే ఈ చక్రములోని అష్టదళ పద్మములో అష్టమాయలుంటాయి.అవి సాధకుడి మానసిక స్ధాయిని బట్టి మారుతుంటాయి.అనగా ఇవే మాయలు కాస్త విష్ణువుమూర్తికి అష్టలక్ష్మీల మాయలు అయితే అదే దత్త స్వామికి అష్టసిద్ధులమాయలుగా వస్తే...అలాగే శ్రీకృష్ణుడికి అష్టసతులుగా ఈ మాయలు ఏర్పడినాయి. నాకు మాత్రము అష్టమాయలుగా 1.ఇష్టకోరిక మాయ 2. ఇష్ట పదార్ధమాయ 3.ఇష్ట జ్ఞాన మాయ 4.తల్లి మాయ 5. భార్యమాయ 6.పరస్త్రీ కామ మాయ 7. ఇష్టదైవమాయ 8.ఇష్టలింగ మాయ వస్తే అదే మన జిజ్ఞాసి వరుసగా అష్టమాయలు 1.ఆలోచన 2.సంకల్పము 3.స్పందన 4.ఇష్టకోరిక 5. ఇష్టపదార్ధం 6. జ్ఞానమాయ 7.తల్లి మాయ 8.ఇష్టలింగ మాయ వస్తే అదే శ్వేతాదేవికి వరుసగా ఈ మాయలు కాస్త 1.ఇష్టకోరిక మాయ 2. ఇష్టగురువు మాయ 3.తల్లి మాయ 4.తండ్రి మాయ 5.భర్త మాయ 6. కొడుకు మాయ 7.ఇష్ట దైవ మాయ 8. ఇష్ట పదార్ధమాయ వచ్చినాయి. ఇందులో భాగముగా నేను కాస్త ఇష్టజ్ఞాన మాయకి స్పందించడము అనగా మూలమేది ఉందో తెలుసుకోవాలనే ఆలోచనకి స్పందించడము చేస్తే... దానితో ఈ కపాలమోక్ష గ్రంథమే వ్రాయవలసి వచ్చినది. మన జిజ్ఞాసి మాత్రము జ్ఞానమాయకి సంకల్పించడముగా అనగా తను పొందిన నిజ జ్ఞానమును ఇతరులకి చెప్పాలని సంకల్పించడము చేసినాడు. దానితో ఈ నిజ బ్రహ్మజ్ఞానమిచ్చే ఈ గ్రంథమును ఇతర సాధకులకి అందించడానికి మనవాడు కాస్త ఇంటర్నెట్లో పెట్టడము జరిగినది. అదే శ్వేతాదేవి మాత్రము అన్ని వద్దు అనుకొని...ఇష్టగురువు మాయను దాటలేకపోయినారు. అనగా ఎక్కడ తన నిజ గురువు తన నుండి దూరమవుతాడో అని విపరీత గురుప్రేమభక్తికి అతిగా స్పందించి 8 పేజీల ఉత్తరము వ్రాసి తన మనోవేదన చెప్పకనే చెప్పినది..నిజ సాధకులకి ఈ హృదయ చక్రము చూపించే ఇష్టమాయ దాని ప్రభావము అందరికి తెలియాలి గదా.మాయ దాటలేక సహన శక్తిని కోల్పోతే ఏమి జరుగుతుందో తెలియాలి గదా. ఈ సుదీర్ఘ ఉత్తర మనోవేదననికి ఈమె గురువు ఏమాత్రము దేనికి స్పందించకపోయేసరికి సహనశక్తిని కోల్పోవడముతో…. ఈమె కాస్త
ఆకాశ శరీర సాధన వస్తువులైన సుదర్శచక్రము,శంఖము,మోక్షమాల మున్నగు వాటిని వదిలి వెయ్యాలని అలాగే … మోక్షము లేదు... తొక్కలేదు...అంటూ తన నోటితోనే తనకి తానే శాపము ఇచ్చుకున్నది. దానితో రావలసిన సమయానికి ఈమెకి ఇష్టలింగము రాలేకపోయినది.కాని ఆకాశ కపాలమోక్ష స్ధితికి గావలసిన సుదర్శనచక్రము,ఓంకార శంఖము,మోక్షమాల పొందే యోగ్యత సంపాదించినారు . కాని ప్రస్తుత జన్మసాధనలో తన ఇష్ట గురు మాయ దాటలేకపోవడముతో సంకల్ప శరీర కపాలమోక్ష అర్హతను కోల్పోవడము జరిగినది. విచిత్రము ఏమిటంటే వీరి తల్లిగారు గూడ తన ఆజ్ఞాచక్ర ఇష్టగురుమాయ దగ్గర ఆగిపోయినారు.ఇదే వారసత్వమాయగా కూతురుకి వచ్చినది.దానితో ప్రస్తుతము తల్లి-కూతురు లేని తమ గురువు మాయ దగ్గర ఆగిపోయేటట్లుగా ఆజ్ఞాచక్ర- హృదయచక్ర ఇష్ట ప్రకృతి దైవాలు అయిన ఇష్టకామేశ్వరుడు కామేశ్వరి చూపించిన ఇష్టమాయకి స్పందించడము వలన సహనశక్తిని కోల్పోయి తల్లి కాస్త సూక్ష్మశరీర కపాలమోక్షం దగ్గర ఆగిపోతే ఈమె కూతురు కాస్త సంకల్ప శరీర కపాలమోక్ష దగ్గర శాశ్వతముగా ప్రస్తుత జన్మసాధనలో ఆగిపోవడము జరిగినది. ఈమె ఇలా ఆగిపోవటానికి అనగా ఇష్టగురుమాయ దాటపోవటానికి బలమైన కారణము ఈమె సంసార మాయలో ఉండి కామభావమునకు గురై సంతానమును పొందినది.దీనివలన ఈమె సాధన ఆగిపోయినది.ఎందుకంటే ఎవరైనా చావటానికి వెళ్తూ బ్రతకటానికి ఏర్ఫాట్లు చేసుకున్నట్లుగా తను అంతరించటానికి వెళ్ళిపోతూ తన అంశరూపాలను సంతానరూపములో ఏర్పరచి వెళ్ళితే ఏమి లాభము...ఆలోచించండి.మీకు అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే... ఉదహరణకి ఒక మామిడి చెట్టు తీసుకోండి.ఇది కాస్త కాయలను భూమిమీద ఉంచి చెట్టు చనిపోతే...శాశ్వతముగా మామిడి చెట్టు పోయినట్లు గాదుకదా.ఎందుకంటే ఈ చెట్టు యొక్క విత్తన కాయలు ఇంకా ఉన్నాయి.అదే ఈ చెట్టుకాస్త ఎలాంటి విత్తన కాయలు ఇవ్వకుండా చనిపోయి ఉంటే శాశ్వతముగా మామిడి చెట్టు నశించిపోయేది.ఎందుకంటే ఈ చెట్టు విత్తనాలు లేవు కదా.అలాగే సంసార సాధకులు గూడ తమ అంశ మూలమైన సంతానమునుకలిగి ఉంటే...ఫలాన తండ్రి లేదా ఫలాన తల్లి అని మీ అంశరూపాలు ఎపుడు గుర్తుచేస్తూనే ఉంటాయి గదా.మరి అలాంటపుడు మీరు చావటానికి వెళ్తూ బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకున్నట్లే గదా!ఆలోచించండి.విషయం మీకే అర్దమవుతుంది.అందుకే ఈ విషయము తెలిసి సంసార సాధకుడైన శ్రీరామకృష్ణ పరమహంస కాస్త సంతానమును కనకుండా … కంటే వారికి అన్నప్రాశాలు చెయ్యాలి అలాగే అంత్యక్రియలు చెయ్యాలి..ఇదంతా అవసరమా.. సంతానమును కనడం తేలిక కాని సాకడం బహుకష్టం...సంతానమాయలో పడితే బయటికి వచ్చేది ఉండదని...ఈయన సంతానం కనకుండా సాధన పరిసమాప్తి చేసుకున్నారు.అదే శ్రీ లాహిరీ విషయానికి వస్తే సంసారములో ఉంటూ సంతానమును పొంది...సాధన పరిసమాప్తి చేసుకుండా ఈ చక్ర సంకల్ప శరీర కపాల మోక్షమును మాత్రమే పొందినారు.కారణము ఈయనికి అంతిమ ధ్యానానుభవములో అతి సూక్ష్మాతిసూక్ష్మముగా పిండిరేణువు పరిమాణములో అది ఉండి లేనట్లుగా బ్రహ్మాణువు దర్శనమైనట్లుగా చెప్పడము జరిగినది.అంటే ఆకాశలింగమంటే ఈయనకి ఆకాశములో బ్రహ్మాణువు లింగము కనపడినది.కాని ఆకాశమే లింగమని ధ్యానానుభవమును పొందలేకపోయినారు.కారణము వీరి అంశరూపాలు సంతానరూపములో ఏర్పరచుకోవడము జరిగినది. పైగా వీరు వెనక్కి తిరిగివస్తారని చెప్పడము జరిగినది. అంటే వీరి సంకల్పశరీరము ఉన్నట్లే గదా! ఆలోచించండి.
అందువల్లన ఈయన తన భార్యకి తన అంతిమ సంస్కారముగా జీవసమాధి ఏర్ఫాటు చెయ్యమని చెప్పితే…ఆఖరి సమయముదాకా ఈమెకి ఈయన చెప్పిన విషయం స్ఫురణకి రాకపోవడము...దానితో ఈయన సంసార సాధకుడు గావడము వలన జీవసమాధికి పనికిరారని..అగ్నిదహనం చేసిన తర్వాత కాని ఈమెకి తను చేసిన పొరబాటు గుర్తుకు రాలేదు.అప్పడికే జరగవలసిన తప్పు జరిగిపోవడముతో చేసేది ఏమిలేక మౌన:వహించారు. దీని అంతటి కారణము తన శరీర అంశరూపాలుగా సంతానము ఏర్పరచుకోవడము అన్నమాట. అంటే ఇట్టి సంతాన సాధకులు తమ సాధన పరిసమాప్తి కోసము 5వేల సం!!రాలు పాటు ఈ సంకల్ప శరీరముతో దేవభూమి అయిన హిమాలయాలయందు సాధన చేసుకోవలసి ఉంటుంది.వీరి సంతాన వంశవృక్షములో ప్రతి 48వ తర వ్యక్తిగా యోగజన్మతో కారణజన్ముడిగా జన్మించి సాధన చేసుకోవలసి ఉంటుంది.ఇలా 5 వేల సం!!రాలు పాటుచెయ్యవలసి ఉంటుంది.అపుడికిగూడ సంసార సంతాన మాయను దాటలేకపోతే..మళ్ళీ 5 వేల సం!!రాల పొడగింపు ఉంటుంది.ఎపుడైతే మీరు ఆజన్మ బ్రహ్మచారి జన్మ లేదా సంతాన రహిత సంసార జన్మ పొందుతారో..అంతటితో మీఇష్టకోరిక కామమాయను దాటడము జరుగుతుంది.దానితో మీకు ఆకాశ శరీర కపాలమోక్షమును పొందుటకు అర్హత,యోగ్యతను పొందినవారు అవుతారు.అంటే ఈ లెక్కన చూస్తే మన బుద్ధుడు గూడ సంతానమును పొందడము వలన ఇష్టకోరిక మాయలో పడినారని తెలుస్తోంది గదా!అందుకే రాబోవు భవిష్య కారణజన్మగా కల్కి అవతారము ఏర్పడినదని ఎందరికి తెలుసు.అలాగే ఈ చక్రము వద్ద శ్రీరాముడు తన సంతానమాయ దాటలేకపోవడము భవిష్య కారణజన్మగా శ్రీకృష్ణ అవతారము ఏర్పడినది.శివయ్యకి సంతానము లేదు కాని శివానికి సంతానమాయ ఉండుటవల్లన ఆయన జీవసమాధిలో నిశ్చలముగా ఉంటే...ఈమె మాత్రము అనిశ్చిలస్ధితిలో ప్రకృతిమాతగా మిగిలిపోయినది. మరో గమ్మత్తు అయిన విషయము ఏమిటంటే ప్రస్తుత సాధన జన్మలో సంతానము లేకపోయిన లేదా సంసారము లేకపోయిన గతజన్మల స్ఫురణ కల్గి ఈజన్మ సాధన ఆగిపోయిన వారిలో శ్రీ తైలింగ స్వామి,శ్రీ రమణమహర్షి,శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారు.ఎలాంటే వీరికి గత జన్మలో శ్రీ తైలింగ స్వామికి కాస్త హరినాధ్ భక్తుడు కుమారుడు గావడం...ఈ జన్మలో ఇతను మీద వీరు మమకారమాయలో పడటం అలాగే రమణమహర్షికి లక్ష్మీ అనే ఆవిడ భార్య గావడము...ఈ జన్మలో లక్ష్మీ గోవుగా ఈయన దగ్గరికి రావడము...దానిమీద ఈయన మమకారము పెంచుకోవడము అలాగే రామకృష్ణకి గతజన్మలో వివేకానందుడు కుమారుడు గావడం...ఈ జన్మలో ఇతనిని తన దత్తపుత్రుడిగా మమకారము పెంచుకోవడముతో వీరి సాధనాంతగూడ ఈ చక్ర సంకల్పశరీర కపాలమోక్షం పొందడము వరకు వచ్చినాయి.అందుకే సాక్షాత్తు మహా కాశీయందు జీవసమాధి చెందిన గూడ మా సద్గురువు శ్రీ తైలింగ స్వామికి సంపూర్ణ కపాలమోక్షం కలుగలేదు.అందువలన ఈయన కాస్త ఈ క్షేత్రము నందు ఇప్పడికి సంకల్పశరీర ఆత్మదర్శనం ఇస్తున్నారు. అంటే ఈ లెక్కనచూస్తే గతజన్మలలో భవబంధనాల గూర్చి జ్ఞానస్ఫురణలు కలిగిన ఈ జన్మలో వారి స్వరూప జ్ఞానము కలిగినగూడ స్పందించకుండా ఉండాలని తెలుస్తోంది గదా! అలాగే నేను కాస్త సంసారి అయ్యి సంతాన రహితస్ధితిలో ఉంటే మరియు మా జిజ్ఞాసి కాస్త ఆజన్మ బ్రహ్మచారిగా మారి ఎలా ఈ చక్ర మాయలు దాటినామో తెలుసుకోండి.
మా ఇష్టపదార్థ మాయ:
అంతెందుకు మేము ఇద్దరం కూడా ఈసాధన స్థాయికి వచ్చిన తర్వాత నేను మిరపకాయ బజ్జి ల దగ్గర ఆగిపోతే మా జిఙ్ఞాసి గోంగూర పచ్చడి దగ్గర ఆగి పోవడం విశేషం. అలాగే తిరుపతి వెంకన్న తిరుపతి లడ్డును దాటలేకపోయారు. ఇలా వివిధ రకాల పదార్థాలు మహామాయ లో సకల సర్వదేవతలు ఉండిపోయారు. వారంతా కారణలోక వాసులుగా ఉండిపోయారు. మనకి కోరికలు తీర్చే కోరిక దేవతలుగా పరమాత్మలుగా ఉండిపోయారు. తద్వారా వారి కోరిక ప్రసాదములను మన చేత చేయించుకుంటూ వారు సంతృప్తి చెందుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే సప్త సముద్రాలు దాటి ఉప్పు ధాటికి తట్టుకోలేక ఉన్నది పోయి మురుగు కాల్వలో పడి చచ్చినట్లుగా ఉంటుంది.నానా చంకలు నాకుతూ మంత్ర గురువు నుండి ఆది గురువు దాకా దర్శన అనుభూతులను అలాగే బాల నుండి సుందరి అమ్మవారి సాక్షాత్కారంస్థితిని వదిలి అలాగే 12 యోగ చక్రాలు ఇచ్చే సకల యోగశక్తులను వదిలి అలాగే అన్ని యోగమాయలను కూడాదాటి చివరికి వదిలిపెడుతూ వచ్చి మేము పచ్చి మిర్చి బజ్జీలు దగ్గర మా వాడేమో మా జిఙ్ఞాసి గోంగూర దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. విచిత్రమేమిటంటే ఈ ఇష్ట కోరిక మన పుట్టుకతో ఆరంభమవుతుంది. అది మనకు తెలియకుండానే మనం పెరిగినట్లుగా అది కూడా నీడలా పెరుగుతుందని మనకి మన సాధన స్థాయి అంతిమ స్థాయికి వచ్చేదాకా మనకు తెలియదు అన్న మాట. అందుకే మన పూర్వీకులు కాశీ క్షేత్రం లో గాని విష్ణుగయలో గాని మన ఇష్టమైన వాటిని వదిలి పెట్టమని ఆచారం పెట్టినారు. కానీ మనం మన ఇష్టమైన వాటిని వదిలి పెడుతున్నానని భ్రాంతి చెంది మనం అసలైన దానిని వదిలి పెట్టకుండా వేరే వాటిని వదిలి పెడుతున్నాము. అంటే నేను కూడా కాశీ క్షేత్రంలో పొట్లకాయ. సపోటా,బచ్చలి కూర వదిలిపెట్టాను కానీ అంతర్గతంగా నాకు ఇష్టమైన నేను దాటలేని మిరపకాయ బజ్జీలు కోరికను కాదనలేక పోయాను. వదలలేకపోయాను . ఎందుకంటే నాకు వేడి వేడి నూనెలో వేయించిన మిరపకాయ బజ్జీలు వాసన వస్తుంటే మాత్రం నా కాళ్లు నాకు తెలియకుండా ఆగిపోతాయి. నా మనసు నాకు తెలియకుండా అటువైపు లాక్కుపోతుంది. నా కళ్ళనుండి అలాగే నా నోటి నుండి నాకు తెలియకుండానే కన్నీళ్లు అలాగే నీళ్ళు ఊరి పోతుంటాయి. దానెమ్మా! అవి గుర్తుకొస్తుంటే ఆ వాసన వస్తుంటే పరమాత్మ కావాలా? బజ్జీలు కావాలా? అంటే నేను మాత్రం బజ్జీలు కావాలి అంటాను. దాని పిచ్చిలో నేను ఎంత లోతులో ఉన్నానంటే బజ్జీలు మీద కవితలు రాసే స్థాయికి వెళ్లి పోయాను అంటే దాని మహామాయ లో ఎలా ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది.
అలా వేయించిన బజ్జీలను నిలువునా కోసి అందులో ఉల్లిపాయలు కూర్చి దానిమీద నిమ్మకాయ పిండి తింటుంటే దానెమ్మా! జీవితం! ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఇచ్చే ఆనందానుభూతి ఏమి ఉంటుంది అని అనిపించే స్థాయిలో నేను మిరపకాయ బజ్జీలు మహామాయ లో ఉన్నానని నా యోగ సాధన స్థాయి హృదయ చక్రం చేరే దాకా నాకు తెలియదు. అసలు నాకు ఒక కోరిక ఉంటుందని అనేది కూడా తెలియదు. ఇలా ఇష్టకోరిక దానిని దాట వలసి వస్తుందని కూడా తెలియదు. ఇష్టకోరిక మిరపకాయ బజ్జీలు అని కూడా తెలియదు. ఊరికే మామూలు పదార్థాలు కంటే ఈ పదార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం సహజమే కానీ అదే నా సాధన కొంప కొల్లేరు చేస్తుందని నేను ఊహించలేదు. అలాగే మా వాడైనా జిఙ్ఞాసి కూడా ఇష్ట కోరిక గోంగూర వాడి సాధన నాశనం చేస్తుందని ఊహించలేదు. అసలు ఎవరైనా కలలో కూడా ఊహిస్తారా చెప్పండి. ఊహించనిచర్యకి మా యోగ సాధన పూర్తిగా పూర్తవకుండా సంపూర్ణంగా కాకుండానే ఆగిపోయింది అంటే సాధన చిట్టచివరి స్థితి అయిన మోక్ష ప్రాప్తి అని మాకు తెలిసింది కాబట్టి పరిపూర్ణం అన్నమాట కానీ మేము హృదయ చక్రం వద్ద ఇష్టకోరిక తీర్చే ఇష్టలింగం వద్ద నేను మిరపకాయ బజ్జి దగ్గర అలాగే మా వాడు గోంగూర దగ్గర ఆగిపోవడంతో మా యోగసాధన సంపూర్ణంగా లేదు కదా మేమే కాదు ఆదిదేవుడైన ఆదియోగి అయిన మహాశివుడు ఇష్ట కోరిక మహామాయను దాటలేకపోయారు. కపాల మోక్షప్రాప్తి పొందకుండా ఆ బ్రహ్మ కపాలం చేతికి అంటించుకుని మహా కాశీ క్షేత్రమునకు కాలభైరవుడు రూపంలో చేరుకోవడం జరిగింది. మేము కూడా మా ఇష్ట కోరికలైనా బజ్జీలు అలాగే గోంగూర మాయలను దాటలేక నేను వేదవ్యాసుడు లాగా మా వాడేమో మేఘ మయుడు లాగా ఉండిపోయాము. నేను ఇతరులకు నిజ జ్ఞానం ఇచ్చే పరమ గురువుగా మిగిలిపోతే మా వాడేమో నిజ జ్ఞానం పంచే కర్మయోగిగా మిగిలిపోవడం మాకు మిగిల్చిన అంతిమ విషాద గాధ!
అనగా వాసుదేవానంద సరస్వతి జ్ఞానము పంచాలనే కోరిక, గోంగూర పచ్చడి ఇష్ట పదార్థము గాను… అమెరికాలోని శ్వేతాదేవి యోగినికి మోక్షము పొందాలని ఇష్ట కోరిక, చుక్కకూర ఇష్ట పదార్ధమని… మా శ్రీమతి దీక్షాదేవికి మోక్షము పొందాలని కోరిక, మామిడిపండు ఇష్ట పదార్థం అని ఇలా తెలుసుకోవడం జరిగినది. పలు రకాల సాధకుల ఇష్ట కోరికలు అలాగే కంచి పీఠాధిపతి అయిన మహా స్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి ఇష్ట కోరికగా ఇతరుల కష్టాలు విని ఓదార్పు ఇవ్వటం ఇష్ట పదార్థము తోటకూరపప్పు అని అలాగే దత్త స్వామికి ఇష్ట కోరికగా దీన జనోద్ధరణ అని ఇష్ట పదార్ధము లడ్డూలు తీపి పదార్థము అని… శ్రీ కృష్ణపరమాత్మ కోరిక మూల ప్రకృతి పరిరక్షణ అని ఇష్ట పదార్థం ఏదైనా తీపి పదార్థము అని… శివపరమాత్మ కోరిక బ్రహ్మతదాకార స్థితి అని ఇష్ట పదార్థము పాలపాయసం అని… అమ్మ వారి ఇష్ట కోరిక జీవ ప్రకృతి పరిరక్షణ అని ఇష్ట పదార్థము బెల్లం పాయసం అని… అలాగే శ్రీ మహావిష్ణువు ఇష్ట కోరిక భక్తుల దీన జనోద్ధరణ అని ఇష్ట పదార్థం చక్రపొంగలి అని ఇలా మున్నగు వారంతా తమ ఇష్ట కోరిక దాటలేక గౌతమ బుద్ధుడుగా ఉండి పోతున్నారని ఉండిపోయారని మాకు అర్థం అయినది. ఇష్ట కోరికను దాటిన వారికి కోరికకు స్పందించని స్థితి కలుగుతుంది. దీనినే బ్రహ్మ తదాకారము అంటారు. తుంకార నాదము అలాగే ఈ తదాకార స్థితి అనేవి మనకి ఈ హృదయ ఆకాశమున హృదయ కమలము నందే కలుగుతాయి.
కంచి పీఠాధిపతి అయినచంద్రశేఖర సరస్వతి మహాస్వామి తన ఇష్టకోరిక మాయను దాటడం:
అనుభవించిన సకల కోరికలలో మీ మనసు స్పందించే ఏకైక అంతిమ ఇష్ట కోరిక అంటే ఏమిటో తెలుస్తుంది.అది చుక్కకూర కావచ్చు లేదా తోటకూర కావచ్చు ఏమో ఎవరికి తెలుసు. కానీ దాన్ని వదిలి పెడితే అది నీకు అమిత ఇష్టమైన కోరిక కాకపోవచ్చు. ఎందుకంటే కంచి పీఠాధిపతి అయినచంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి వారి భోజనంలో తోటకూర పప్పు వేయడం జరిగినది. దీనిని గూర్చి ఆయనకే అప్పటి దాకా తెలియదు. అలాంటి ఆకుకూర చేస్తారు అని గాని అలాగే దానిలో పప్పు వేస్తారని తెలియదు.కానీ ఈయన పప్పు రుచికి మోహం చెంది చాలా ఇష్టంగా తినడం ఆయనకు వంట చేసే వంటవాడు గమనించి అక్కడి నుండి వరుసగా పదిహేను రోజులపాటు ఈ తోట కూర పప్పు నే వెయ్యటం ప్రారంభించారు. స్వామివారు మారుమాటాడకుండా సంతృప్తిగా ఈ పప్పుతో భోజనం పూర్తి చేసేవారు.ఒకరోజు కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయనకి ఈ పప్పు భోజనంలోనికి రాలేదు. కారణం ఏమిటని వంటవాడిని ప్రశ్నించగా “స్వామి!మీరు నన్ను క్షమించాలి. ఈ పప్పు చాలా ఇష్టంగా తింటున్నారని గ్రహించి మన పీఠానికి వచ్చే భక్తుల చేత ఇప్పటిదాకా ఈ తోట కూర కాడలుతెప్పించి మీకు పప్పు చేయడం జరిగినది. కానీ ఈ రోజు ఎందుకో మాకు ఈ ఊరిలో ప్రక్క ఊరిలో కూడా ఒక చిన్న తోట కూర కూడా దొరకలేదు. దాంతో మేము ఏమి చేయలేకపోయాను అని చెప్పగానే స్వామివారి వెంటనే చివాలున లేచి అక్కడికి దగ్గర్లో ఉన్న గోశాల కు వెళ్లి లక్ష్మి ఆవు యొక్క ఆవుపేడను నోటికి రాసుకోటం చూసేసరికి అక్కడున్న భక్తులందరికీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వెంటనే ఆయన “అయ్యలారా! మీరు ఎందుకు బాధ పడతారు. మీరు తోటకూర తీసుకురావడం కోసం నాకోసం ఇంత కష్టపడేటట్లుగా నాకు తెలియకుండానే నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా పవిత్రమైన ఆవుపేడతో నా ఏకైక కోరికను నాశనం చేసుకున్నాను. పదార్ధం దాటితేగాని యదార్థం రాదు కదా! యదార్థం దాటితేగాని పరమార్ధం అర్థం కాదు కదా!మనకు ఉన్న ఏకైక కోరికను మన మనస్సు తీర్చుకుంటే అది దేనికి స్పందించని బ్రహ్మ తదాకార స్థితి పొందుతుంది.ఇట్టి బ్రహ్మ తదాకార స్థితి యోగ సాధన ఉత్కృష్టమైన పరిపూర్ణమైన యోగ సాధన అంతిమ స్థాయి. దాంతో కర్మ,జన్మ, స్పందనా రాహిత్యం పొంది నేను లేని స్థితిని పొందుతారు. ఇదే అసలు సిసలైన బ్రహ్మతదాకార స్థితి. ఈ ఒక్క కోరిక అదే తోటకూర కాడల నన్ను ఆపితే మరి మీ గురించి నేను ఏమి చెప్పగలను. నేను నీకు ఏమి ఇవ్వగలను. నేనే ఈ కోరిక దగ్గర ఆగిపోతేనేను మీకు చెప్పే అర్హత కోల్పోతాను. ఏదైనా నేను మీకు చెప్పాలంటే దానిని ముందుగా దాటాలి కదా! అందుకే నాకు తెలియకుండానే నేను తోటకూర దగ్గర చిన్నపాటి మోహానికి గురయ్యాను అని నాకు అవగతం అయ్యేసరికి నేను తెలియక చేసిన మహా అపరాధానికి శిక్షగా ఈ ఆవుపేడను రాసుకోవడం జరిగినది.అలాగే మేము తిన్న ఈ పదిహేను రోజుల కొరకు పదిహేను రోజుల వరకు అన్ని రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండబోతున్నాను” అని వారికి అనుజ్ఞ ఇచ్చి మౌనబ్రహ్మ లాగా తిరిగి ఆశ్రమంలోకి వెళ్ళి పోతున్న ఆ మహా స్వామిని చూసి అక్కడున్న భక్తులు మౌనంగా ….ఏమిటి? ఒక చిన్న తోట కూర పప్పు తిన్నందుకు ఇంత పెద్ద కఠిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం తెలుసుకునేసరికి యోగ సాధన స్థాయి ఎంత కత్తిమీద సాము వంటిది తెలుసుకునేసరికి వాళ్లకి కన్నీళ్లు ఆగలేదు. మరి ఇంతటి మహానుభావుడు యోగసాధనలో ఎందుకు సంపూర్ణంగా పరిసమాప్తి రాలేదు మాకు తెలిసిన మీకు చెప్పరాదు.ఎవరికి వారే తమ సాధన స్థాయి ఈ హృదయచక్రము స్థాయికి వచ్చిన తర్వాత తెలుసుకుంటారు .ఎవరి స్వానుభవమే వారికి తెలుస్తుంది.అంటే ఈ చక్ర సాధనలో మేము మాకు ఉన్న ఏకైక ఇష్ట కోరిక మాయను దాటాలని నిశ్చయించుకొని ఈ చక్ర ధ్యానం అయిన తుంకార నాదముతో ఈ చక్ర సాధన చేయటం ఆరంభించినాము. 1993లో మూలాధార చక్ర సాధనతో మొదలుపెట్టి నిజమైన బ్రహ్మ జ్ఞానమును పొందాలని చిట్టచివర ఎవరు ఉండేది తెలుసుకోవాలనే తపన నేను అనేది ఏమిటో తెలుసుకోవాలని తాపత్రయంతో ఈ యోగ సాధనను మొదలుపెట్టి 2018 దాకా అనగా హృదయ చక్రము దాకా వచ్చి చేరినాము. అనగా మూలాధారచక్రంలో ని స్వయంభూ లింగం అనుభూతి నుండి హృదయ చక్రములోని స్వయంభు నవపాషాణం లింగ ఆరాధన దాకా అనగా సంపూర్తి పరిపూర్ణ సాధన స్థాయికి చేరుకోవడం జరిగినది.మా ఇష్ట కోరిక అయిన పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానమునకు ఒక అడుగు దూరంలో ఉన్నాము అని మేము గ్రహించినాము. ఎందుకంటే మా సాధన ఆకాశ శరీరముతో బ్రహ్మరంధ్రము దాక వెళ్ళవలసి ఉంటుంది అని మాకు స్ఫురణ అయినది.
స్పందన అంటే:
ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు విచిత్ర సంఘటనలు ఎదురైనాయి. అది ఏమిటంటే మా శ్రీమతికి సహాయముగా చిక్కుడుకాయలు తొడుగు తీస్తుండగా అందులో నుంచి కొన్ని పురుగులు బయటికి రావడం మొదలైనవి. వాటిని ప్రక్కనపెట్టి తొడుగు తీస్తుంటే ఈ లోపల మా మిక్సీ కింద నుండి ఒక బల్లి వచ్చి ఈ పురుగులను ఆత్రంగా తినటం ఆరంభించినది. దానికి మేము స్పందించకుండా జరిగే దానిని సాక్షీభూతంగా చూస్తూ ఊరుకున్నాము. బల్లి పురుగులు పూర్తిగా తిని వెళ్లిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మా శ్రీమతి ఏమిటండీ! ఆ పురుగులను ఈ బల్లి తింటుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? కనీసం మానవత్వం గా అయినా ఈ పురుగులను దాని నోటికి అందకుండా ఈ చెత్త బుట్టలో పడేసి ఉంటే వాటి మానాన అవి బ్రతికి ఉండేవి కదా. రాను రాను మీ సాధన వలన మీలో మానవత్వం తగ్గిపోయి స్పందనలు లేని స్థితికి వెళ్ళిపోతున్నారు అంటూ ఏదో అంటున్నా కూడా పట్టించుకోకుండా నవ్వుతూ మౌనంగా అక్కడ నుండి బయటికి వచ్చినాము. ఇంతలో మా మనోనేత్రం ముందు సాలెపురుగు గూడులో ఏదో పురుగు ఇరుక్కొని ప్రాణభయంతో కొట్టుకున్నట్లుగా ఉండటంతో అది ఎక్కడ ఉందో తెలుసుకునేసరికి ఆ సాలెపురుగు ఈ పురుగును తినటానికి వస్తుంటే దానిని రక్షించి బయటికి వదిలి పెట్టినాము. అది సంతోషంతో ఎగురుకుంటూ వెళ్లి పోయినది. పాపము ఈ సాలెపురుగుకి ఆకలి మిగిల్చాను అని బాధ నాలో మొదలైనది. ప్రొద్దున చిక్కుడుకాయ లోని పురుగులు బల్లి తింటుంటే స్పందించని మనస్సు అదే సాలెగూడులో పడిన పురుగు తింటే మనస్సు ఎందుకు స్పందించినదో నాకు అర్థం కాలేదు. ఇందులో ఏదో అర్ధం కాని మర్మము ఉన్నదని నాకు అర్థం అయినది.
కొన్ని వారాల తరువాత అనుకోకుండా మేము టీవీలో “మా వూళ్ళో మహాశివుడు” సినిమా వస్తుంది. ఇందులో ఆలయ పూజారికి సాక్షాత్తు పరమేశ్వరుడు కనిపించి సుఖదుఃఖాలు గురించి చెబుతూ ఉంటాడు. ఇంతలో ఒక రోజు స్వామి వారు చాలా ఆలస్యంగా ఈ పూజారి దగ్గరికి వచ్చేసరికి ఆలస్యం అవ్వటానికి కారణం ఏమిటని అడిగితే దానికి పరమేశ్వరుడు నవ్వుతూ “భక్తా! ఏమిలేదు. పాముకి బాగా ఆకలిగా ఉంది అంటే దానికి ఆహారముగా ఒక కప్పను ఇచ్చి వస్తున్నాను” అనగానే ఆ భక్తుడు వెంటనే “స్వామి! అది పాపం కాదా? ఒక జీవి ఆకలి కోసం మరొక జీవిని చంపటం పాపం కాదా?” అన్నప్పుడు దానికి మహాశివుడు నవ్వుతూ “భక్తా! గత కొన్ని నెలలుగా తనకు మోక్షము ఇవ్వమని ఈ కప్ప నన్ను అడుగుతుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా నాకు ఆకలి తీర్చమని ఈ పాము అడగటంతో దాని ఆకలి తీరుస్తూ దీనికి ఆకలి లేకుండా చేసినాను” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. అంటే ఈ లెక్కన చిక్కుడుకాయ లోని పురుగులు చావు కోరుకుంటే దానికి నా మనస్సు స్పందించలేదు. అందుకే భయం లేకుండా బల్లి వాటి అన్నిటినీ తిని వేసినది. ఇక సాలెపురుగు గూడులో చిక్కుకున్న పురుగు ఇంకా తను బ్రతకాలని కోరిక ఉండటం వల్ల నాలో స్పందనలు కలిగి దానిని రక్షించడము జరిగినదని మాకు అర్థం అయినది. అంటే మనలో స్వార్థపూరిత కోరిక ఉంటే అది కాస్తా మాయలోనికి దింపి నానా చంకలు నాకి ఇస్తుందని అదే కోరికకు కూడా స్పందించకుండా ఉంటే బ్రహ్మ తదాకార స్థితిలోనికి తీసుకొని వెళుతుందని మాకు అర్థం అయినది.
ఇంకా దానితో మోక్షము పొందాలనే కోరిక జ్ఞానము పొందాలనే కోరిక లాంటివి కూడా పూర్తిగా వదిలి వేయడం జరిగినది. అనగా ఈ చక్రము నందు ఇష్ట కోరికను త్యాగము చెయ్యడము జరిగినది. ఈ కోరికకు స్పందించి ఏకత్వము నుండి భిన్నత్వం గా మారి నానా జన్మలలో నా నా చంకలు నాక వలసి వచ్చిందని మాకు అర్థం అయినది. అసలు కోరిక లేని స్థితి పొందితే సరిపోతుంది గదా. కోరిక ఉంటే కర్మ వస్తుంది. జన్మ కావాలి. ఈ కోరిక మాయ వలన పునర్జన్మలు కలుగుతూనే వుంటాయి. కోరిక అతీత స్థితి పొందితే ఏ తల్లి యోని యందు కూడా ఎవరూ కూడా జన్మింప చేయలేరని మేము గ్రహించినాము. కోరిక ఉంటే పునర్జన్మ ప్రాప్తి అని ఎట్టి కోరిక లేకపోతే మోక్షప్రాప్తి అని మేము గ్రహించినాము. కాబట్టి మీరు కూడా మోక్షము పొందాలని జ్ఞానము పొందాలని జ్ఞానం పంచాలని జ్ఞానం తెలుసుకోవాలని సిద్ధులు పొందాలని మానవాతీత శక్తులు పొందాలని ఇలా కోరికలు పెట్టుకోకుండా వుంటే మీకు మోక్షప్రాప్తి లేదంటే పునర్జన్మ ప్రాప్తి కానీ కామి కానీ వాడు మోక్షగామి కాలేడు అనేది నిజానికి అది కాదు కామము లేని వాడు అనగా కోరిక లేని వాడు మాత్రమే మోక్షగామి అవుతాడు. అనగా కామి లేని వాడు మోక్షగామి కాలేడు అనే సామెతను మన మిడిమిడి జ్ఞానంతో కామికానివాడు మోక్షగామి కాలేడు అని ప్రచారం చేసినారు. కోరిక ఉంటే ఇంకా మోక్షం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఆ తీరని కోరిక కోసం తీరని జన్మలు ఎత్తవలసి ఉంటుంది కదా ఆలోచించండి.
అలాగే పనిలేని మంగలి వాడు పిల్లి తల గొరిగినట్లు అంటారు అనగా నిజానికి పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు…. పిల్లినికాదు… పిలిచి కాస్త పిల్లిగా మార్చినారు మన మిడిమిడి జ్ఞానులు. ఇలాగే కామి లేని వాడు అంటే కామి గాని వాడు అని ప్రచారం చేసినారు. విశ్వసృష్టి అంతానికి అలాగే ఆరంభానికి కారణం కోరికయే అని తెలియ చేయటం అనేది సప్త నదులు ఈది గంగానదికి చేరుకున్నట్లుగా ఉంది. కాశీ క్షేత్రంలో మొట్టమొదటి సారిగా వెళ్ళినప్పుడు గంగా స్నానం చేసిన తర్వాత ఏదో ఒకటి ఇష్టమైన కోరికను గంగా మాతకి వదిలిపెట్టాలని అక్కడి పూజారులు నాతో చెబితే “స్వామి! నాకు అత్యంత ఇష్టమైనది మా శ్రీమతి! మరి దానిని ఇక్కడే వదిలి వేయమంటారా?” అని నా ఇష్ట కోరిక చెప్పేసరికి…. అక్కడి వాళ్ళు బిక్కమొహం వేసి అయోమయంగా నా వంక చూసేసరికి చిరునవ్వు నా మొఖం మీద మెరిసినది. కోరికను దాటితే బ్రహ్మ తదాకార స్థితి కలిగి మోక్ష ప్రాప్తి పొందటం జరుగుతుంది. అదే కోరిక మాయలో పడితే నన్ను పరమ గురువుగా జ్ఞాన బ్రహ్మ పదవి ఇచ్చి నిమ్మకాయ పులిహోర, మిరప బజ్జీలు, మైసూరుపాకు నిత్య నైవేద్యాలు పెట్టి నన్ను పూజించటం ఆరంభిస్తారు అని తెలియగానే నాలో తెలియని భయం మొదలైనది. ఇప్పటికీ తిరుపతి వెంకన్నకు నైవేద్యంగా దోసెలు పెడతారు. ఏమో ఎవరికి తెలుసు. ఆయన ఇష్ట పదార్థము అదే లేదా లడ్డు అయి ఉండాలి. తన భక్తులకి ఆర్థిక అవసరాలు తీర్చటానికి కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ భక్తులకు ఆ డబ్బులు పంచుతూ భక్తులు చెల్లించే వడ్డీల రూపంలో కుబేరుడికి కట్టుకున్న వడ్డీకాసులవాడు రూపధారి కావటం అనేది జనాలకి ఆర్థిక అవసరాలను తీర్చాలని ఇష్ట కోరిక ఉండుట వలన కలిగినది.
అసలు జీవుడికి ఎన్ని కర్మలు ఉన్నాయి?
ఒక రోజు మాకు చిన్న ధర్మ సందేహము వచ్చినది. అసలు జీవుడికి ఎన్ని కర్మలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవటానికి ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన మా మదిలో కలిగినది. దానితో పుస్తక గ్రంథాలు చదవడం ప్రారంభించినాను. ఒక యోగి ఆత్మకథ అను పుస్తకము చదివిన తర్వాత పది లక్షల సంవత్సరాలు పడుతుందని రోజుకు వెయ్యి చొప్పున మంత్రానుష్టానము లేదా ప్రాణాయామము విధిగా చేస్తే ఒక సంవత్సరానికి మూడు లక్షల 65 వేలు పడుతుందని ఇలా మూడున్నర సంవత్సరంలలో పది లక్షలు పూర్తి అవుతుందని ఇదే నిర్వికల్ప సమాధి యొక్క మూడున్నర సంవత్సరాల కాలానికి సమానం అని మాకు అర్థమయింది. అంటే సాధన పరిసమాప్తి అవ్వటానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని పరమహంస యోగానంద అనుభవం చెబుతోంది.ఇక తాజుద్ధీన్ బాబా యొక్క అనుభవము చూస్తే తాను ఒక లక్షా 25 వేలు అనగా లక్షా పాతిక వేలు కర్మలు నివారణ చేసుకోవటానికి జీవసమాధి చెందుతున్నానని వారి చరిత్ర లో చెప్పడం జరిగినది. అంటే ఈ లెక్కన చూస్తే లక్షా పాతిక వేలు కర్మలు తీరటానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. మరి ఎన్ని జన్మలు పడతాయి అంటే 8 ముక్తి జన్మలు పడతాయని చెప్పటం జరుగుతుంది. అనగా పది లక్షలను లక్షా పాతిక వేలతో భాగిస్తే 8 వస్తుంది. ఈ ఎనిమిదియే అష్ట ముక్తి జన్మలు అవుతాయి.దీనికి సంకేతముగా మహాశివుడు అష్ట మూర్తి రూపంలో ఉన్నాడు.అనగా పంచభూతలింగాలగా, సూర్య,చంద్ర లింగాలగా, పశుపతి యజమాని లింగముగా ఇలా అష్ట మూర్తి రూపంలో ఉన్నాడు. దీనికి సంకేతముగా అష్ట ముక్తులు ఉన్నాయి. ముక్తి అనగా మణిపూరకములో కలిగే సాలోక్య ముక్తి.. అనాహత చక్రములో కలిగే సారూప్య ముక్తి.. విశుద్ధి చక్రములో కలిగే సామీప్య ముక్తి… ఆజ్ఞాచక్రం లో సాయుజ్య ముక్తి… సహస్రార చక్రం లో కలిగే శరాస్థి ముక్తి… హృదయ చక్రం లో కలిగే కైవల్య ముక్తి.. ఇక ఆఖరిది చివరిది అయిన ఏడవ ముక్తి అయిన జీవన్ముక్తి అనేది బ్రహ్మరంధ్రం వద్ద కలుగుతుందని ఆ తర్వాత కలిగేదే కపాల మోక్షం అని హైందవ గ్రంధాలు పలుచోట్ల పలు విధాలుగా చెప్పడం జరిగినది. ఈ లెక్కన చూస్తే ఒక్కొక్క ముక్తి పొందటానికి పంచ శరీరాలు అనగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలతో సప్త జన్మలు పడతాయి. అలాగే ఒక్కొక్క ముక్తి పొందటానికి ఏడు జన్మలు పడతాయి. ఈ ఏడు జన్మలకి ఒక లక్షా 25 వేల సంవత్సరములు ఒక లక్షా 25 వేలు కర్మలు తీర్చుకోవటానికి పడుతుంది. అనగా చిట్టచివరిదైన జీవన్ముక్తి దాటిన తర్వాత అనగా కపాలమోక్షం స్థాయికి సాధన శక్తి రావాలంటే మన సాధకుడు ఏడురకాల ముక్తులను ఈ ఏడు జన్మలలో 8 లక్షల 75 వేల సంవత్సరములు పడుతుంది. ఇక మిగిలిన ఆఖరి ముక్తి అయిన జీవన ముక్తి కోసం ఎనిమిదో జన్మగా కపాల మోక్షం పొందడానికి ఒక లక్షా 25 వేలు కర్మలు చేయడానికి వస్తారు. అంటే మేము ప్రస్తుతము కైవల్య ముక్తి దాటిన తరువాత కపాలమోక్షం ప్రాప్తి కోసము ఈ జన్మ సాధన ఉన్నదని గ్రహించినాము. అనగా స్థూల శరీరంతో పవనానంద సరస్వతిగా మోక్ష ప్రాప్తి కోసము ఉంటే గత జన్మలలో సాలోక్య ముక్తి అనేది రావి చెట్టు రూపంలోనూ సారూప్య ముక్తి అనేది నాగుపాము రూపంలోనూ సామీప్య ముక్తి అనేది శారదాదేవి అనే స్త్రీ రూపంలోనూ సాయుజ్య ముక్తి అనేది వేదవ్యాసుని అంశ రూపంలోనూ శరాస్థి ముక్తి అనేది చిలుక రూపంలోనూ కైవల్య ముక్తి అనేది కారణ బ్రహ్మగా పాండురంగడి రూపంలోను పొందినాము అని నా ఎడమ చేతిలో ఉన్న ఇష్ట లింగము మాకు ధ్యానములో అనుభూతులు ఇవ్వడము చేసినది. ప్రస్తుతము సాధన వలన జీవన్ముక్తి అగు జన్మ కోసం ఎనిమిదవ ముక్తి కోసం బ్రహ్మరంధ్రము సాధన కోసం ప్రస్తుతం మానవ జన్మ అయిన శ్రీ పవనానంద సరస్వతి జన్మ ఉన్నదని మాకు అర్థం అయినది.ఈ లెక్కన కపాలమోక్షం ప్రాప్తి కి 10 లక్షలు -ఒక లక్షా 25 వేల కర్మలు- 8 జన్మలు -ఎనిమిది ముక్తులు-పంచ శరీరాలు అవసరము పడతాయని నాకు అర్థమైనది. అలాగే హృదయ చక్రంలో సంకల్ప శరీరముతో ఇష్ట కోరిక మాయ దాటితే కైవల్యము ముక్తి దాటటం జరుగుతుంది. బ్రహ్మరంధ్రము దగ్గర ఆకాశ శరీరముతో జీవన్ముక్తి సాధనను ఇంకా చేయాల్సి ఉంటుందని మాకు అర్థం అయినది. ఒకవేళ జీవన్ముక్తి దాటితే మాకు మోక్షప్రాప్తి కలుగుతుందని మేము గ్రహించాము. నిజానికి ఈ జన్మ సాధన అనేది బ్రహ్మరంధ్రము వద్ద ఉండుట వలన మాకు అన్ని చక్రాల యోగ స్థితులు యోగ మాయను దాటుకోవటం జరిగినది. అనగా ఏమీ లేని పరమ శూన్యములో ఏకత్వంగా శూన్య బ్రహ్మగా నా ఆది అవతారము పాండురంగడు కారణ బ్రహ్మ జన్మ అంశ అని తద్వారా ఆయన ఇష్ట కోరిక అయిన తల్లి ప్రేమను పొందాలని కోరికలు తీర్చుకొనుటకు వెయ్యి రూపాలతో ఎత్తడం జరిగినదని ఈ వెయ్యి రూపాలు కాస్త వెయ్యి కోట్ల సంవత్సరాలుగా వెయ్యి కోట్ల జన్మలు ఎత్తవలసి వచ్చినది అని అందుకే కాబోలు శ్రీ వేదవ్యాసుడు గూడా తల్లి ప్రేమ కోరిక మీద సంతానవృద్ధి జరిగినదని తల్లిప్రేమ దాటితే జ్ఞాన మాయ వదులుతుందని తద్వారా ఇష్ట కోరిక మాయ దాటటము జరుగుతుందని మాకు అర్థమైన కొన్ని నెలలకి ఇది నిజమని అనుటకు నిదర్శనంగా మా అమ్మ మా దగ్గరకి శాశ్వతంగా ఉండటానికి వచ్చినది. ప్రస్తుతం వీరి సేవలు చేస్తూ ఈ తల్లి ప్రేమ మాయ దాటటం జరుగుతుంది. ఎప్పుడైతే మాయ ఎరుక అయితే మాయ కాస్త మాయం అవుతుంది కదా. నాకున్న తల్లి ప్రేమ ఏకైక ఇష్ట కోరిక మాయను దాటటం మొదలైనది.
మా ఇష్టలింగములో కాంతిశక్తి ఉన్నట్లుగా అనుభూతి:
ఒకరోజు మేము మంచి నిద్రలో ఉండగా “మాకు చలిగా ఉంది! రక్షించు! లోపల పెట్టు!” అనే మాటలు చాలా స్పష్టంగా నిద్రలో వినిపించినాయి. ఇలా వరుసగా మూడు సార్లు వినిపించేసరికి మేము ఉలిక్కిపడి లేచి చూస్తే ఏమీ లేదు. ఎవరిని రక్షించాలని అర్థం అవ్వక సతమతమవుతుంటే మా కళ్ళముందు ఇష్ట లింగము ఒక్కసారిగా కనబడి అదృశ్యమైనది. దానితో మేము పూజగదికి వెళితే అక్కడ ఇష్ట లింగము యధాస్థానంలో బయట బాగానే ఉంది. దీనిని రక్షించాలా? ఎందుకు ఎలా అనుకుంటుండగా మా కాలభైరవ కుక్క ఇక్కడ ఏదో ఉందని ఈ మహాలింగం వాసన చూడటానికి వస్తుందని తెలిసి దానికి ఈ లింగానికి పూసిన ఆవునెయ్యి వాసనను పసిగట్టి వస్తుందని మేము గ్రహించి వెంటనే ఈ లింగమును ఒక చెక్క పెట్టెలో ఉంచి పూజించడం ఆరంభించిన కొన్ని వారాల తరువాత ఒకరోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు మొదట ఇష్టలింగము కనబడినది. ఈ లింగము లోపల అనేక దైవ శక్తులు, యోగ శక్తులు, మానవాతీత శక్తులు, అస్త్ర శక్తులు, మంత్ర శక్తులు, యంత్ర శక్తులు ఇలా మున్నగు శక్తులు ఇందులో ఉన్నట్లుగా లీలగా కనపడ సాగింది. కొన్ని క్షణాల తర్వాత చిమ్మచీకటి వాతావరణంగా మారినట్లు నాకు అనుభూతి కలిగినది. ఈ లింగము పైన ఉన్న అతి సూక్ష్మ రంధ్రం నుండి దివ్యకాంతి కాస్త ఆకాశం వైపు ప్రసరిస్తూ ఉన్నట్లుగా స్పష్టముగా కనపడ సాగింది. అనగా మహా నిర్వాణ శక్తి అయిన న్యూక్లియర్ శక్తి ఇదే అని మాకు అనుభూతి కలిగినది.చిమ్మచీకటిలో టార్చ్ లైట్ ఫోకస్ ను ఆకాశంకేసి చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ లింగం యొక్క ఫోకస్ అని మేము అనుకునేసరికి మాకు ధ్యాన భంగము అయినది. అంటే ఇది నిజమైన నవ పదార్ధ నిర్మిత ఇష్టలింగము అని మరి మాకు రూఢి అయినది. అందుకే ఈ ఇష్టలింగాలు తయారుచేసే సిద్ధయోగులను కాంతియోగులంటారని తెలిసినది. అందరు డబ్బులు పెట్టి కార్లు ఇల్లు కొంటారు. కానీ నేనేమో డబ్బులుపెట్టి ఈ లింగమును కొన్నాను. ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఒకరికి భోగ పిచ్చి. మరొకరికి యోగ పిచ్చి. ఈ రెండు కూడా పిచ్చి వాళ్లకి భౌతిక వస్తువులు మాయగా వస్తే మాకు దైవిక వస్తువులు మాయగా వచ్చినది. అంతే తేడా. మా దృష్టిలో యోగానందమునకు భోగానందమునకు పెద్ద తేడా లేదు. యోగానందము దీర్ఘముగా ఉంటే భోగానందము క్షణికము గా ఉంటుంది.దోమకి ఒక క్షణం ఆయుష్షు ఉంటే మనిషికి 100 క్షణాల ఆయుష్షు ఉంటుంది. ఈలెక్కన చూస్తే ఈ రెండు ఆయుష్యును ఒకటే. మనకున్న ద్వైత భావ మాయ వలన ఒకటి దీర్ఘముగా రెండవది తక్కువగా కనబడుతుంది. ఒక కేజీ రాయికి అలాగే 100 x 10 =1000 గ్రాముల రాళ్ళకి ఒకటే బరువు ఉంటుంది కదా. ఒక క్షణం ఆయుష్షు 100 క్షణాల ఆయుష్షు విడగొట్టబడి ఉంటుంది. అదే తేడా.
మాకు ఇష్టలోక దర్శనానుభవం:
ఒక రోజు మాకు ఇష్టలింగ ఆరాధన చేసిన తర్వాత ఏదో తెలియని మత్తు అనిపించగా ఏదో స్పురణ అవుతూ వచ్చినది. అది ఏమిటంటే హృదయ చక్రములో ఇష్టకామేశ్వరుడు ఇష్ట లింగేశ్వరుడు ఇష్టకామేశ్వరి మాత్రమే ఉంటారని వీరిని ఇష్టలోక వాసులుగా పిలుస్తారని ఈ లోకంలో నివసించే వారికి సంకల్ప శరీరము ఉంటుందని వీళ్ళకి స్పందన రాహిత్య స్థితి అయిన బ్రహ్మ తదాకార స్థితి కలిగి ఉంటారని ఈ లోక వాసులను ఇష్ట దేవి ఇష్ట దేవుడు గాను ఇష్ట పదార్థాలుగా ఇలా ముందు ఇష్ట పదంతో కలిపి పిలుస్తారని వీరికి ఇష్ట కోరిక మాయగా ఉంటుందని ఈ మాయకి అధిదైవముగా అనంతపద్మనాభుడు ఉంటాడని అధిష్టానం అధిదేవతగా పంచముఖ హనుమంతుడు ఉంటాడని ఈ లోకములో నాలుగు లోకాలు ఉంటాయి అవి కాస్త ఎరుపు నలుపు తెలుపు నీలి -నలుపు రంగులు ఉంటాయని ఈ లోక వాసులుగా 8 మందే ఉంటారని వీళ్లే ప్రళయాలు తర్వాత సృష్టికర్తల కి ఉపయోగపడే బీజాలు అని కుండలో వీళ్ళని భద్రపరచి ప్రళయ కాలపు నీటి ప్రవాహం మీద వదిలిపెడితే ఎప్పుడైతే అదికాస్తా ప్రవహిస్తూ ఒక చోటికి వచ్చేసరికి మహాశివుడు ఈ కుండను బద్దలు కొడితే అది కాస్త కుంభకోణ క్షేత్రము అవుతుందని మాకు అర్థం అయినది. వీళ్ళు ఒక లక్ష ఇరవై ఐదు వేల సంకల్పాలు కలిగి ఉంటారని అంగుళ పరిమాణంలో ఎనిమిది మందే అష్టమూర్తులుగా లోక ప్రచారము అవుతున్నారని శివ అష్టమూర్తి రూపాలుగా, దేవి అష్టమూర్తి రూపాలుగా, అష్ట లింగ మూర్తులు,అష్ట వసువులుగా ఉంటున్నారని, మేము గ్రహించిన ఎనిమిది మంది మూర్తి స్వరూపాలే సాధన శరీరాలని ఇదియే ఎనిమిది రకాల ముక్తులు పొందుతాయని ఒకవేళ హృదయ చక్రములోని హృదయ గ్రంధి విభేదము కాలేకపోతే ఇక్కడి వారికి కైవల్య ముక్తి మాత్రమే కలుగుతుందని అనగా ఆరు నెలలు యోగనిద్రలో అచేతన స్థితి ఆ తర్వాత ఆరు నెలలు భోగనిద్రలో అనగా చైతన్య స్థితి ఉంటుంది.మహా విష్ణువు కాస్త తొలి ఏకాదశి నాడు వీరు యోగనిద్ర లోనికి వెళ్తతారు. మళ్ళీ ముక్కోటి ఏకాదశినాడు భోగనిద్రకి వస్తారు.అనగా చైతన్య స్థితిలోని కి వస్తారు. వీరు యోగనిద్ర లోని కి వెళ్లినప్పుడు బ్రహ్మాండాలు జలప్రళయంలో మునిగిపోతాయి. బ్రహ్మదేవుడు మరణమును పొందుతాడు. కానీ సూక్ష్మ లోక వాసులు భూలోక వాసులు ఈ విషయము గ్రహించలేరు. వీళ్ళు నిద్ర లేచిన తర్వాత పునఃసృష్టి మొదలవుతుంది. అండపిండ బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయము అనేవి ఈ జగన్నాటకం లోని అన్ని రకాల ఈతి బాధలకు మోహ మాయలకు రాగద్వేషాలకు సుఖదుఃఖాలకు ఈ అష్టమూర్తులు ప్రధాన భూమికను వహిస్తారు. వీరి సంకల్పాల ఆధారముగా కారణలోక వాసులు (సహస్రార చక్రం లోని వారు) ఆలోచనలు చేస్తారు. వీరి ఆలోచనలు ఆధారముగా సూక్ష్మ లోక వాసులు (ఆజ్ఞాచక్రం లోని వారు) భావాలు చేస్తారు. వీరి భావాలు ఆధారముగా జీవ ప్రకృతి జీవులు (విశుద్ధిచక్రములోని నుండి మూలాధార చక్ర జీవులు వరకు)కర్మ క్రియలు జన్మలు ఎత్తి చేస్తారు. సంకల్పము చేసేది ఒకరు. అనుభవించేది మరొకరు. మొత్తము కలిపితే ఒక్కరే. అదే ఇష్ట కోరిక ఇష్ట లింగేశ్వరుడు అన్నమాట. అనగా విశ్వ లింగమే ఇష్ట లింగము అని మాకు అనుభూతి కలిగే సరికి ఎగశ్వాస వచ్చేసరికి ధ్యానము భంగం అయినది.
ఇంక ఎంతకాలము ఈ విశ్వముంటుంది:
బయటికి వచ్చిన తర్వాత మాకు ఒక విషయము లీలగా అర్ధం అవసాగింది. అది ఏమిటంటే మొట్టమొదట పరమ శూన్య స్థితి ఉంది. ఏమీ లేదు. అది ఉన్నదని ఎవరికీ తెలియదు. ఎవరూ లేరు. దీనికున్న ఏకైక సంకల్పము నుండి ఒక శూన్య బ్రహ్మ వచ్చి ఉంటాడు. వీరు ఆకాశ శరీరంతో ఉండి ఉంటాడు.వీడికున్న సంకల్పం మాయ వలన తనకు తోడు కావాలని సంకల్పించాడు. దానితో మన వాడు కాస్త అష్టమూర్తులుగా విడిపోయి ఉంటాడు. నాలుగు జంటలుగా అన్నమాట. ఆదిదేవుడు ఆదిపరాశక్తి… త్రిమూర్తులు త్రిశక్తి మాతలు… కలిపి అష్టమూర్తులు అయి ఉంటారు. వీరే కాస్త పంచభూత సూర్యచంద్ర యజమాని శక్తులుగా కలిగి ఉంటారు. ఇందువలన పంచభూత శక్తులైన ప్రకృతిని త్రిమూర్తులు త్రిశక్తి మాతలు బాధ్యతలు తీసుకొని ఉండి ఉండాలి. సూర్యచంద్రుల శక్తిని ఆదిపరాశక్తి అనగా మూల ప్రకృతిగా అవతరిస్తే యజమాని పశుపతిగా ఆదిదేవుడైన ఈశ్వరుడు తీసుకొని ఉంటాడు. ప్రకృతి కాస్త 1000 ప్రకృతులుగా సహస్రార చక్రంలో విడిపోయి కారణలోక వాసమైన 1000 బ్రహ్మాండాలను సృష్టించి ఉండి ఉండాలి. అలాగే పెద్ద పంచభూత శక్తులతో సూర్యచంద్రుల తో 36 కోట్ల 84లక్షల జీవరాసులూ 14 భువన మండలాలు అండపిండ లోకాలు ఏర్పరిచి ఉండి ఉండాలి. జీవ ప్రకృతికి పంచభూతములే అధిదేవతలు గా ఉంటే ప్రకృతికి త్రిమూర్తులు త్రిశక్తి మాతలు అధిదేవతలుగా ఉంటే మూల ప్రకృతికి ఆదిపరాశక్తి అధిదేవతగా ఉంటే ఈ మూడు ప్రక్రియలకు అనగా హృదయ చక్రము నందు యజమాని దైవముగా అధిదైవముగా ఇష్టలింగేశ్వరుడు అయిన సర్వేశ్వరుడు ఉండి ఉండాలి.ఒక్కడు కాస్త అండపిండ బ్రహ్మాండాలలో వెయ్యి కోట్లతో 84లక్షల జీవరాసులూ 84 కోట్ల లక్షల జీవరాసులూ గా ఉండి ఉండాలి. ఒకడు ఒక కోటి మందితో సమానమని 33 దైవాలు కాస్తా 33 కోట్ల మంది అని హైందవ గ్రంధాలు చెబుతున్నాయి కదా. అలా చూస్తే సహస్ర చక్రానికి వెయ్యి మంది కాస్త 1000 కోట్లు అవుతారు కదా. అలాగే భూలోకములో 84 లక్షల జీవరాశులని గరుడ పురాణము చెబుతోంది కదా. దీనిని బట్టి చూస్తే వెయ్యి కోట్లు X84 లక్షలు కలిపితే 84 కోట్ల లక్షలు అవుతుంది కదా. ఇందులో ఒక జీవికి 8 జన్మలు ఉన్నాయి కదా. అనగా 84 కోట్ల లక్షలు X 8= 6.72e16 కోటానుకోట్లు అవుతుంది. ఒక జీవికి కపాల మోక్షం పొందాలంటే పదిలక్షల సమయం పడుతుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము కదా. ఇప్పుడు వచ్చిన దానికి అనగా 6.72 e16 X10 లక్షలు = 6.72e22 అవుతుందని మా క్యాలిక్యులేటర్ చెప్పడం జరిగినది. దానిని ఎలా పలకాలో తెలియక రాయటం లేదు. నిజానికి ఒకడు శూన్యంలో పుట్టినవాడు శూన్యంలో కలవాలంటే వాడి ఆయుష్షు సుమారుగా 6.72e22 కోట్లు కోట్లు ఉంటుంది. మరి అలాంటిది వెయ్యి కోట్ల మంది కలిపితే వెయ్యి కోట్లు X6.72e22=6.72e32 అని చెప్పటం జరిగినది. అంతకాలం ఈ జగన్నాటకం కొనసాగగుతూనే ఉంటుంది. ఇలా లెక్కన చూస్తే ప్రస్తుతం 27 మహాయుగాలు పూర్తిచేసి 28వ మహాయుగం లోని 4వ యుగమైన కలియుగంలో ఉన్నాము. ఒక్కొక్క మహా యుగానికి నాలుగు యుగాలు సమానం కదా. ఈ నాలుగు యుగాలలో వరుసగా కృత యుగానికి 17 లక్షల 28 వేల సంవత్సరములు త్రేతా యుగానికి 12 లక్షల 96 వేల సంవత్సరములు ద్వాపర యుగానికి 8 లక్షల 64 వేల సంవత్సరములు కలియుగానికి 4 లక్షల 32 వేల సంవత్సరములు. 27 మహాయుగాలు పూర్తి అయినాయి కాబట్టి చూస్తే 43లక్షల 20 వేలు X27 మహాయుగాలు = 11, 66, 40000 వస్తోంది. అంటే కేవలము సుమారుగా 11 కోట్లు మాత్రమే ఈ కాలచక్రము నడిచినది. ఇక్కడేమో విశ్వం ఆయుష్షు సుమారుగా 6.72e 32 అలాగే జీవుడి ఆయుష్షు సుమారుగా 6.72e22 గా వస్తుంది కదా. కేవలము బ్రహ్మపదార్థంలో రేణువు అంత కాలం మాత్రమే గడిచినది.
ఇంతవరకు ఎందుకు ఎవరూ కూడా మోక్షమును పొందలేదు?
ఈ లెక్కన చూస్తే ఎవరూ కూడా కపాలమోక్షం పొంది ఉండలేదు కదా. పొంది ఉంటే విశ్వము ఉండేది కాదు. అన్ని జీవరాశులలో ఏకైక ఒక్కడే ఉన్నప్పుడు వారికి ఆయుష్షు మూడితే అందరికీ మూడాలి కదా. మనము చనిపోలేదు అంటే వాడు అదే మన ఆదిదేవుడు బ్రతికి ఉండి ఉండాలి. ఎందుకంటే మనమంతా ఆయన స్వరూపాలే కదా. ఆయన ఉంటే మనము ఉన్నాము. మనము ఉంటే ఆయన ఉన్నట్లే. మనమే ఆయన. ఆయనే మనము. మనము లేకపోతే ఆయన లేనట్లే. ఆయన లేకపోతే మనము లేనట్లే. మరి ఆయన ఎవరు? ప్రస్తుతానికి ఎవరి స్వరూపం లో ఉన్నాడు. ఇంకా ఎవరు నాయనా! మన దక్షిణామూర్తి ఆత్మ స్వరూపంగా ఉండి కపాలమోక్షం సాధన చేస్తున్నాడు. అది కూడా మౌన దీక్ష జ్ఞానముద్రతో మౌన భాషతో మౌన బ్రహ్మగా తీవ్ర తపస్సు స్థితిలో అర్థనిమీలిత నేత్రాలతో సాధన చేస్తున్నారు. మరి ఈయన స్థూల సూక్ష్మ కారణ సంకల్పం శరీర రూపధారిగా మహేశ్వరుడు(శ్రీశైలం) సాంబశివుడు( కైలాస పర్వతము), పరమేశ్వరుడు( మురుడేశ్వర క్షేత్రము- కర్ణాటక) సదాశివమూర్తి గా (కైలాస పర్వతము) క్షేత్రాల యందు సమగ్రమైన భంగిమలతో సజీవమూర్తిగా ఉన్నట్లు మాకు ఒక్క శివరాత్రికి ఈ చోట్ల క్షేత్రాలలో సజీవ పూర్తిగా సంచరిస్తున్నట్లుగా ధ్యాన అనుభవాలు ఇవ్వటం జరిగినది. ఈ లెక్కన ఈయన కపాల మోక్షం పొందాలంటే సుమారుగా ఇంకా 577 మహాయుగాలు పడుతుంది. అనగా 116640000X577= 6.73e10 వస్తుంది. మన ఆయుష్షు సుమారుగా 6.72e32 గా ఉంది కదా. ఈ లెక్కన సుమారుగా 604 మహాయుగాలు కలిపి బ్రహ్మాండము యొక్క ఆయుష్షు అవుతుంది. ప్రస్తుతానికి 27 మహాయుగాలు అయితే మిగిలినవి 577 మహాయుగాలు కదా. ఈ లెక్కన మనకి కపాలమోక్షం స్థితి కలగాలంటే 577 మహాయుగాలు ఎదురు చూడాలి అని తెలుస్తోంది కదా. ఇప్పుడు దేవ కాలమాన ప్రకారం మన దేవుడు ఆయుష్షు ఎంతో చూద్దాము. మనకి ఒక సంవత్సరం దైవానికి ఒక రోజుతో సమానం ఈ లెక్కన 12 వేల సం!!రాలు నాలుగు యుగాలకి అనగా ఒక మహా యుగానికి సమానం. అనగా మనుష్య లెక్క అయితే 43 లక్షల 20 వేల సంవత్సరముల తో సమానం. మన 71 మహాయుగాలు దైవానికి ఒక మన్వంతరం గా చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతానికి 14 మన్వంతరాలు జరిగినాయి అంటే మన కాలముగా లెక్కిస్తే 43 లక్షలు 20,000X 71= 306720000 అనగా సుమారు 30 కోట్ల సంవత్సరములు వస్తుంది. ఇప్పుడు 14 మన్వంతరాలు అవ్వటంతో 306720000 X14=4294080000 అనగా సుమారు నాలుగు వందల ఇరవై తొమ్మిది వందల కోట్లు వస్తుంది. అలాగే 28 మన్వంతరాలు అనగా 2 కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజుతో సమానం అనగా 4294080000X 14= 6.011712e10 వస్తుంది. ఇప్పుడు 360 బ్రహ్మ రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరము తో సమానం అనగా 6.011712e10 X360=2.164216e13 వస్తుంది. ఇలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు కలిపి ఒక మహా కల్పము అవుతుంది. అనగా 2.164216e13X100=2.164216e15 అని వస్తుంది. అలాగే ఇలాంటి 10 మహా కల్పాలు పరమాత్ముడికి ఒక శ్వాసతో సమానం. అనగా 2.164216e15X 10=2.164216e16 అని వస్తుంది. ఈయన ఆయుష్షు మన లెక్కన సుమారుగా 6.72e32 గా వచ్చింది కదా. అంటే 6.72e32-2.1642e16=4.64e16గా వస్తుంది. మేము 28 మన్వంతరాలు లెక్కవేస్తే 2.164216e16 వచ్చింది. కానీ ప్రస్తుతం 14 మన్వంతరాలు గడిచినాయి కాబట్టి ఈ లెక్కన వేస్తే 4294080000 X7=3.005856e10 వస్తుంది. రెండు కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజు అంటే ఏడు కల్పాలు కలిసి మూడున్నర రోజులు బ్రహ్మకి అవుతాయి. ఈ లెక్కన చూస్తే 3.005856e10X3.5=1.05205e11 అని వస్తుంది. బ్రహ్మదేవుడికి 360 బ్రహ్మ రోజులు కలిపితే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ప్రస్తుతానికి మూడున్నర బ్రహ్మ రోజులు గడిచినాయి. బ్రహ్మ ఒక సంవత్సరం పూర్తి కావటానికి 360 -31/2=356 రోజులు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎటు చూసినా మన ఆదిదేవుడు బ్రతికే ఉన్నాడు. ఆయన ఇంకా ఆయుష్షుతో ఉన్నాడు అని తెలుస్తుంది కదా అంటే ఈ లెక్కన ఎవరు కూడా ఇప్పటిదాకా అష్ట ముక్తులే పొందినారు. కానీ మూల కపాల మోక్షమును పొందలేదని తెలుస్తోంది. ఎందుకు పొంది ఉండరు. ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యము ఉండి ఉండాలి. అది ఏమిటో తెలియాలంటే మన సాధన బ్రహ్మరంధ్రము దాక వెళ్ళాలి అని నాకు అర్థమైనది. అలాగే జీవుడు సత్యమే. దేవుడు సత్యమే.జీవుడికి ఆయుష్షు ఉంది. అలాగే దేవుడికి ఆయుష్షు ఉంది. ఒకటి సత్యం అయితే మరొకటి ఖచ్చితంగా అసత్యమే అవ్వాలి కదా అనే మీ సందేహం. అయితే మనమంతా నిజానికి వివిధ రకాల శరీరాలు ధరించిన వారము. ఎవరి సంకల్పం వలన? మన దేవుడు సంకల్పం వల్లనే కదా. అంటే మనము లేము కదా. ఉన్నది ఆయనే కదా. ఆయనే విభిన్న స్వరూపాలుగా శరీరాలతో ఉన్నాడు కదా. అది నిజమే కదా. మా విరాట్ స్వరూప జ్ఞాన అనుభూతి చూస్తే విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను. నేనే ఉన్నాను. నేను లేనిది… నేను కానిది ఏది లేదని అనుభవ అనుభూతి కలిగినది కదా. అంటే ఈ లెక్కన శ్రీకృష్ణుడికి తన విశ్వరూప దర్శనం శ్రీ శంకరాచార్యులు తన అద్వైత సిద్ధితో ఇలాంటి ఏకత్వ స్థితి కలిగినది. ఇట్టి ఏకత్వ స్థితి ప్రతి సాధకుడికి తప్పకుండా జరుగుతుంది అని నా ప్రగాడ విశ్వాసం. ఈ అనుభూతి పొందలేదు అంటే వారు పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానులు కారని నా వ్యక్తిగత అభిప్రాయం.ద్వైత భావంలో ఉంటే ఇంకా ఎప్పుడు అద్వైత స్థితికి అనగా ఏక భావ స్థితికి ఎలా వచ్చినట్లో మీరే చెప్పండి. ఈ లెక్కన చూస్తే మన ఏకత్వ స్థితికి వచ్చినప్పుడు సమాధిస్థితిలో మనమే ఉంటాం. దేవుడు ఉంటాడు. మనమే దేవుడు నేనే దేవుడు అన్నమాట. అదే వెలుపల ఉంటే బాహ్య స్థితిలో చూస్తే మనము వేరు దేవుడు వేరు అనగా నేను వేరు దేవుడు వేరు అనే భావంలో ఉంటాము. అసలు నిజానికి మనమే పరమాత్మ. మనకు మనమే దేవుళ్లము. మనమే జీవులము. కాకపోతే దానికి తగ్గ శరీర మాయల వలన మనకి మనమే మాయలో పడిపోయి పరమాత్మ కాస్త దేహాత్మ గా మారిపోయాము అని భ్రమ భ్రాంతి మోహ వ్యామోహ మాయలో ఉంటున్నాము. జీవిస్తున్నాము. నిజానికి రెండు ఆత్మలు లేవు. రెండు స్థితులు లేవు. ఒక్కటే ఆత్మ. ఒక్కటే స్థితి. అదే సత్య జ్ఞానము.ఈ లెక్కన జగత్తు మిధ్య అనే కదా. ఎందుకంటే మనమంతా ఆయన శరీర చొక్కాలు లాంటి వారని తెలుస్తోంది కదా. శరీరానికి విలువ ఉంటుంది. అది వేసుకునే చొక్కాకి విలువ ఉంటుందా? దేహానికే కదా. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో జీవుడు తన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును వేసుకున్నట్లే పరమాత్మ కూడా చెప్పినారు. చొక్కా నిజమే కావాలి కదా. చొక్కా అనేది నిజం కాదు. అది కేవలము భ్రాంతి. నిజంలాంటి భ్రాంతి అన్నమాట. చొక్కా లోని దారము ప్రోగులు తీసుకుంటూ పోతే చొక్కా కనబడుతుందా? ఉల్లిపాయలో పొరలు తీసుకుంటూ పోతే ఉల్లిపాయ కనబడనట్లుగా చొక్కా పొరలు తీసుకుంటూ పోతే చొక్కా కనపడదు కదా. అంటే చొక్కా రూపము అంతము చెంది మార్పు చెందుతుంది. ఆత్మ అయితే రూపాంతరం చెంది రూపము మార్చుకుంటుంది. రూపం అంతానికి రూపాంతరంకి తేడా తెలుసుకోండి. రూపం అంతము అంటే మీ రూపము అంతము అవ్వటము అదే రూపాంతరము అంటే మీరు ఇష్ట కామరూపం ద్వారా మరొక రూపంగా మారటం అన్నమాట. ఇప్పుడు చెప్పండి. బ్రహ్మము సత్యము. జగత్తు మిధ్య అని తెలుస్తుంది. మరి జీవుడికి ఆయుష్షు వుంది కదా అలా లెక్కన చూస్తే బ్రహ్మము సత్యము …జగత్ మిధ్య ….జగత్ బ్రహ్మము అనేది నా స్వానుభవ అనుభూతి. మన ఆది దేవుడి ఆయుష్షు ఆరు శ్వాసలకి ఒక శ్వాస మాత్రమే పూర్తి అయినది అని మన దైవ కాలమాన లెక్కలు చెబుతున్నాయి కదా. ఇక జీవుడి ఆయుష్షు ఇంకా 577 మహాయుగాలు ఉన్నదని మన మనుషులు లెక్కలు చెబుతున్నాయి కదా. అలా లెక్కన రెండు సత్యాలే కదా. ఒకటి సత్యమైతే మరొకటి దాని ప్రతిరూపం కూడా సత్యము అవుతుంది గదా. అద్దములో మీరు మీ ప్రతిబింబము కనిపెడితే మీరు మీ ప్రతిబింబము సత్యమే కదా. ఆ రెండు వేరు కాదు గదా. కానీ అద్దము అనే మహా మాయ వలన అది వేరుగా కనబడుతుంది. ఇది ఎలా ఉంది అంటే ఆది మానవ పురుషుడికి ఒక అద్దము కనబడితే అందులో తన ప్రతిబింబమును చూసుకొని ఇది తన రూపం అని గ్రహించక దేవుడు అని పూజించడం ఆరంభించాడు. అదే ఆది స్త్రీమూర్తి అదే అద్దములో తన ముఖమును తనే చూసుకుని నన్ను గాకుండా ఈయన వేరే దానితో తిరుగుతున్నాడని అనుమానించినదట. అనుమానము పుట్టిన తర్వాత ఆడది పుట్టినదని సామెత వచ్చినది. నిజానికి వీరిద్దరి ప్రతిబింబాలే అద్దము సాక్షీభూతంగా మాయాదర్పణముగా చూపించటం జరిగినది. ఆత్మ పరంగా చూస్తే జగత్తు సత్యం అని ఆత్మ కి భిన్నంగా చూస్తే జగత్తు మిధ్య గాను కనబడుతుంది. అనగా మాయ సత్యము రెండు కూడా ఒకటేనని అనేది నగ్నసత్యం. అందుకే జాబాలి మహర్షి దేవుడు అసత్యముగా జీవుడు సత్యముగా కనబడితే శ్రీ శంకరాచార్యులుకి జగత్తు మిధ్య గాను బ్రహ్మము సత్యము గాను కనబడటం జరిగినది. మాకు అయితే ఆయుష్షు లెక్కలపై రెండు సత్యాలే అని కనపడినది. మన ప్రతిబింబము అద్దంలో కనపడినట్లుగా ఈ రెండు కూడా ఒకటే అన్నట్లుగా శ్రీ అరుణాచల రమణ మహర్షికి కలిగిన అనుభూతిలాగా బ్రహ్మము సత్యము జగత్తు మిధ్య జగత్తు బ్రహ్మము. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నా స్వానుభవం ప్రకారము నాకున్న మేధాశక్తితో ఆయుష్షు లెక్కలు వేస్తే ఈ రెండు సత్యము లేనని జగత్తు బ్రహ్మము సత్యమేనని స్వానుభవం అనుభూతి పొందడం జరిగినది. ఇది నిజమా కాదా అనేది మీకు తెలియాలంటే మీ సాధన శక్తి కూడా హృదయ చక్రానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఎవరు ఎంత అనే లెక్కలు తెలుస్తాయి. తేలతాయి. కానీ నాకు అర్థం కాని సమస్య ఏమిటి అంటే ఇంతవరకు ఎందుకు ఎవరూ కూడా మోక్షమును పొందలేదు. కేవలం ఒక్కరు మాత్రమే సదాశివమూర్తిగా కైవల్య ముక్తి మాత్రమే పొంది మోక్ష ప్రాప్తి కోసం ఆదిదేవుడు యోగసాధన చేస్తున్నాడని మాకు స్పురణ అయినది.దీనికి నిదర్శనమే తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం యొక్క తూర్పున ఉన్న గోపురం పైన 25 తలలతో 20 చేతులతో సదాశివమూర్తి స్వరూప విగ్రహమూర్తి కనబడుతుంది. 25 తలలు దేనికి సంకేతం? ఈ రూపం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలియాలంటే మన సాధన శక్తి బ్రహ్మరంధ్రము దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి హృదయ చక్రం వద్ద అన్ని రకాల సాధనాలు యోగ మాయలు యోగ శక్తులు మహామాయ కూడా నశించిపోతాయి. కేవలము సాధకుడు దేనికి స్పందించకుండా బ్రహ్మ తదాకార స్థితిలో ఉంటాడు. ఇక్కడ నుండి సాధన చేయటానికి ఏమీ ఉండదు. శబ్ద నాదాలు ఉండవు. చక్ర సాధనలు ఉండవు.ముద్రలు ఉండవు. విగ్రహారాధన లు ఉండవు. మంత్రము తంత్రము యంత్రము ఉండవు. దేవుళ్ళు ఉండరు.పరమాత్మలు ఉండరు. గురువులు ఉండరు. ఉన్నది నువ్వే. ఒక్కడివే. మరొకటి ఉండదు. చివరికి కోరిక మాయ దాటితే ఇష్ట లింగేశ్వరుడు ఉండడు. ఎందుకంటే నువ్వే ఇష్ట లింగేశ్వరుడు అవుతావు. సమాధి స్థితిలు ఉండవు. కోరికలు ఉండవు. సంకల్పాలు ఉండవు. కర్మలు ఉండవు.ఇలాంటి పరిపూర్ణ బ్రహ్మ తదాకార స్థితికి వెళ్ళిన వారికి హృదయ గ్రంధి విభేదము జరిగి అక్కడ ఉన్న అతి చిన్న గొట్టము మాదిరిగా ఉన్న సన్నని కాంతి మార్గము నుండి అదియే బ్రహ్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రము లోనికి పిండి రేణువు వంటి ఆకాశ శరీర యానం చేయాల్సి ఉంటుందని మాకు స్పురణ అయినది.
॥ అర్గలాస్తోత్రమ్ ॥
॥ శ్రీ॥
శ్రీచణ్డికాధ్యానమ్
ఓం బన్ధూకకుసుమాభాసాం పఞ్చముణ్డాధివాసినీమ్ ।
స్ఫురచ్చన్ద్రకలారత్నముకుటాం ముణ్డమాలినీమ్ ॥
త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీమ్ ।
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ॥
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్ ।
అథవా
యా చణ్డీ మధుకైటభాదిదైత్యదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచణ్డముణ్డమథనీ యా రక్తబీజాశనీ ।
శక్తిః శుమ్భనిశుమ్భదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా
సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ॥
అథ అర్గలాస్తోత్రమ్
ఓం అస్య శ్రీఅర్గలాస్తోత్రమన్త్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛన్దః,
శ్రీమహాలక్ష్మీర్దేవతా, శ్రీజగదమ్బాప్రీతయే సప్తశతిపాఠాఙ్గత్వేన
జపే వినియోగః ।
ఓం నమశ్వణ్డికాయై
మార్కణ్డేయ ఉవాచ ।
ఓం జయ త్వం దేవి చాముణ్డే జయ భూతాపహారిణి ।
జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోఽస్తు తే ॥ ౧॥
జయన్తీ మఙ్గలా కాలీ భద్రకాలీ కపాలినీ ।
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే ॥ ౨॥
మధుకైటభవిధ్వంసి విధాతృవరదే నమః ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౩॥
మహిషాసురనిర్నాశి భక్తానాం సుఖదే నమః ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౪॥
ధూమ్రనేత్రవధే దేవి ధర్మకామార్థదాయిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౫॥
రక్తబీజవధే దేవి చణ్డముణ్డవినాశిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౬॥
నిశుమ్భశుమ్భనిర్నాశి త్రిలోక్యశుభదే నమః ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౭॥
వన్దితాఙ్ఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౮॥
అచిన్త్యరూపచరితే సర్వశత్రువినాశిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౯॥
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౦॥
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చణ్డికే వ్యాధినాశిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౧॥
చణ్డికే సతతం యుద్ధే జయన్తి పాపనాశిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౨॥
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖమ్ ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౩॥
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియమ్ ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౪॥
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౫॥
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేఽమ్బికే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౬॥
విద్యావన్తం యశస్వన్తం లక్ష్మీవన్తఞ్చ మాం కురు ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౭॥
దేవి ప్రచణ్డదోర్దణ్డదైత్యదర్పనిషూదిని ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౮॥
ప్రచణ్డదైత్యదర్పఘ్నే చణ్డికే ప్రణతాయ మే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౧౯॥
చతుర్భుజే చతుర్వక్త్రసంసుతే పరమేశ్వరి ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౦॥
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదామ్బికే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౧॥
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౨॥
ఇన్ద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౩॥
దేవి భక్తజనోద్దామదత్తానన్దోదయేఽమ్బికే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౪॥
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౫॥
తారిణి దుర్గసంసారసాగరస్యాచలోద్భవే ।
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨౬॥
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః ।
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభమ్ ॥ ౨౭॥
॥ ఇతి శ్రీమార్కణ్డేయపురాణే అర్గలాస్తోత్రం సమాప్తమ్ ॥
ఇలాంటి బ్రహ్మ తదాకార స్థితి పొందేందుకు ప్రతి సాధకుడు హృదయ చక్రమునందు తుంకార నాదం వింటూ నిత్యం నిష్ఠలో నియమాలతో నవ పదార్ధ నిర్మిత ఇష్ట లింగము ఆరాధన చేస్తూ అర్గళాస్తోత్రం ముందు మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు సార్లు చదువుకుంటూ అనగా అర్గళా అంటే ద్వారాన్ని బంధించే దారు దండకము అంటే మన హృదయంలోనికి ఎలాంటి కోరికలు ప్రవేశించకుండా చివరికి ఇష్ట కోరిక కూడా ప్రవేశించకుండా మన హృదయ ద్వారబంధము చేయటానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. అర్థం కాలా! ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు పరమశివుడే రచించినాడు అని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ స్తోత్రమును చదువుతూ నిత్యము ఇష్టలింగ ఆరాధన వలన నెమ్మదినెమ్మదిగా కోరికలకి స్పందించకుండా మనకున్న ప్రారబ్ద కర్మలు తీర్చుకుంటూ బ్రహ్మ తదాకార స్థితిలోనికి పరబ్రహ్మము గా వెళ్ళటం జరుగుతుంది.
ఇష్టలింగారాధన వలన పోయే కొన్నిఅవలక్షణాలు :
విపరీతమైన కోపము, సహనశక్తి లేకపోవటం, విపరీతమైన స్త్రీ వాంఛ కలగటం, పర స్త్రీ యందు ఆసక్తి ఏర్పడటం, ఇతరులను చులకనగా మాట్లాడటం, వెకిలి చేష్టలు వెకిలి మాటలు, మాటలలో చేతలలో స్పష్టత లేకపోవడం, నిద్రపట్టకపోవడం, శరీరమునందు అధికవేడిమి కలగటం, ఒళ్ళునొప్పులు తరచుగా రావడం, అధిక కామశక్తి కలగటం, ఇష్ట పదార్ధాలు తినటం, మత్తుపదార్థాలు సేవించాలని ఆసక్తి, మత్తు పానీయాలు సేవించాలి అనే తపన, మద్యపానము ధూమపానము చేయాలని తాపత్రయాలు కలగటం, విపరీతమైన వీరావేశం కలగటం, ఈర్ష్యా ద్వేషాలు అసూయ లు ఎలా శివమూర్తి కి అహము మదము అహంకారాలు…. ఇలా శివమూర్తి కి చెందిన అన్ని రకాల తమోగుణ లక్షణాలు ఈ ఇష్టలింగ ఆరాధన వలన పోతాయని మేము గమనించాము. కానీ వీటి అన్నింటి నీ మేము ఆలోచించకుండా, స్పందించకుండా కేవలము సాక్షీభూతంగా మొద్దుబారిన చెట్టు లాగా హృదయము లేని వాడిలాగా బ్రతికి ఉన్న శవము లాగా ఉండటం ఆరంభించే సరికి ఈ పైన చెప్పిన మాయలు గుణాలు తొలగటం ప్రారంభమైనాయి. ఈ నవ పదార్ధ ఇష్ట లింగము వలన కలిగే ఏకైక ఇష్ట కోరిక మాయ వలన 24 రకాల అవలక్షణాలు మాయలు బయటికి వస్తాయి. అవి మనో మాయలు అని తెలుసుకుంటే వాటిని తట్టుకొని స్పందించకుండా ఉండ గలిగినప్పుడు ఇష్ట కోరిక మాయమవుతుంది. అప్పుడే మనకున్న లేశ మాత్రపు ప్రారబ్ద కర్మలు అంతరించిపోతాయి. లేదంటే ఇవే కాస్త లక్షా పాతిక వేలు జన్మలుగా రూపాంతరం చెందుతాయి. జాగ్రత్త వహించండి. పసిపాప మనసున్న వారిలాగా మారిపోండి. మనశ్శాంతి పొందండి. ఆపై ఆత్మశాంతి పొంది ప్రశాంతముగా జీవించండి.
ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు దైవిక వస్తువులు గా నవపదార్ధ ఇష్టలింగము, ఏకముఖ నాగుపాము, పంచముఖ నాగేంద్రుడు, సప్తముఖి నాగేంద్రుడు, త్రిశూలము మీద ఉన్న బ్రహ్మకపాలం, నీలి స్పటికమాల, రుద్రాక్ష మాల, ఇష్టలింగ యంత్రము, శివ నాగ కంకణము, 8 రేకుల గులాబీ పద్మము, మూడు గంటలు, నీలం ఆకుపచ్చ ఎరుపు చేపల బొమ్మలు, నీలి వర్ణ వస్త్రధారణ శ్రీపాద స్వామి ఫోటో, వెండి త్రిదళము, వెండి బ్రహ్మకమలాలు వచ్చినాయి. వీటిని విశ్లేషణ చేయటానికి నాకు మూడు నెలలు పైన పట్టినది. ఇందులో రుద్రాక్షమాల అనేది భూతత్వ సంకేతం అయితే బ్రహ్మకమలము అనేది జలతత్వానికి త్రిదళము అగ్ని తత్వానికి నాగపాము అనేది వాయు తత్వానికి బ్రహ్మకపాలం అనేది ఆకాశ తత్వానికి సంబంధించినట్లుగా గుర్తించడము జరిగినది. అలాగే మూడు రంగుల చేప బొమ్మలు అనగా నీలి ఆకుపచ్చ ఎరుపు రంగులు అనేవి దేని గురించి ఆలోచించకుండా దేనికి స్పందించకుండా దేనిని సంకల్పించకుండా ఉండాలని చెబుతున్నాయి. చేప అనేది నీటి లో ఎప్పుడూ ఎక్కడా స్థిరంగా ఉండదు. మన మనస్సుకి లాగా అప్పుడు చేపను నిశ్చల స్థితిలో ఉంచితే మనస్సుని ఉంచాలి. ఇది ఎలా ఉండాలి అంటే పైన చెప్పిన మూడు క్రియలు అనగా ఆలోచన స్పందన సంకల్పము లేని స్థితిలో ఉండాలి. దీనికి సంకేతము 3 గంటలు వచ్చినాయి. వీటిలో గంట కొట్టడానికి ఇందులో కాడ లేదు. వీటిలో అంటే మూడు క్రియలను చెయ్యకుండా మౌనముగా నిశ్చల స్థితిలో ఉండాలని ఈ మూడు గంటలు చెబుతున్నాయి. ఇలా నిశ్చలస్థితి కోసం ఇష్ట లింగము దీక్షను జీవిత దీక్షగా నీలిరంగు వస్త్రంతో తీసుకోవాలని అందుకే నీలి స్పటిక మాల నీలి వస్త్రము నాగకంకణము శివ యంత్రముతో ఇష్టలింగ ఆరాధన చేస్తూ ఉండాలని దీనికి సంకేతము నీలి వస్త్రధారి అయిన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వచ్చినారు అని మేము గ్రహించినాము. కాబట్టి ఎవరైతే ఈ చక్ర స్థితికి వస్తారో వారు తప్పనిసరిగా నిత్యజీవిత ఇష్ట లింగేశ్వర స్వామి దీక్ష తీసుకోవటం జరుగుతుందని తద్వారా ప్రారబ్ద కర్మలు నశించి త్రిక్రియలను మనస్సు చేయకుండా నిశ్చల స్థితిలో పొందుటయే అసలు సిసలైన బ్రహ్మ తదాకార స్థితి అవుతుందని మాకు అర్థం అయినది.
బాలగణపతి ఈ కపాలమోక్ష గ్రంథము రాయమని ధ్యానసూచన ఇవ్వడం:
నాకు వచ్చిన గోకర్ణ బాల గణపతి
అలాగే కొన్ని నెలలకి నాకు ఒక విచిత్రమైన ధ్యాన అనుభవము కలిగినది. అది ఏమిటంటే 11 సంవత్సరముల వయస్సు ఉన్న అడ్డ విభూతి రేఖలు పెట్టుకున్న పిల్లవాడు కనిపించినాడు. వీడి మెడలో అర్థ చెయ్యి అంత పరిమాణము గుడ్డు ఆకారంలో ఇష్ట లింగము ఉన్న వెండి బాక్స్ వేలాడుతూ కనబడినది. దానిని నా మెడలో వేసినాడు. దానిని తెరిచి చూద్దామని ప్రయత్నిస్తే దానిని తెరచి చూడాలని ప్రయత్నించగా దానికి ఒక తాళం వేసినట్లుగా కనపడినది. మళ్లీ దాని లోపల తాళంచెవి కావలసిన లాక్కున్నది. దానితో దీనిని తెరవలేక పోయినాను. అప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతో ఇందులో నవపాషాణం లింగము ఉన్నది. నీ దగ్గర ఉన్నదే నా దగ్గర ఉంది అంటూ ఉండగా ఎవరో రెండు గ్రూపుల దొంగలముఠాల వాళ్లు మా మీదకి తుపాకులతో కాల్పులు జరపగా ఈ పిల్లవాడు నన్ను ఒక గుప్త గుహలోనికి తీసుకొని వెళ్ళినాడు. ఇలా ఆ దొంగల నుండి తప్పుకున్నాము. అప్పుడు ఆ పిల్లవాడు నా చేతిలో రెండు పెన్నులు ఉంచి ఒక పెన్ను తీసుకొని మరొక పెన్ను ఇస్తూ నువ్వు కూడా నాకు లాగా గ్రంథాలు రాస్తున్నావు కదా. నీకు కావాలి కదా. ఇదిగో తీసుకో ….త్వరలో నీ ఇష్టలింగారాధనతో...నిజబ్రహ్మజ్ఞానభూతులతో గూడిన కపాలమోక్షం వ్రాస్తావు.దానికి గావలసిన సహాయసహకారాలు మా కుటుంబము నీకు అందిస్తుంది.ఇది చెప్పటానికి నేను మీఇంటికి వస్తున్నాను అంటూ…. ఆ గుహ లోపలకి నవ్వుతూ వెళ్లిపోగా వెనక నుండి ఆ పిల్లవాడు కాస్త నిలుచుని ఉన్న బాలగణపతి నల్లటి ఆకారం కనిపించింది. ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. నాకైతే ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజులకి అనుకోకుండా నా కొరకు గోకర్ణక్షేత్రము నుండి మొట్టికాయల నిల్చుని ఉన్న బాలగణపతి విగ్రహమూర్తి వచ్చినది. అప్పుడు గానీ నాకు వచ్చిన అనుభవము అర్థం కాలేదు. ఇంకా మీకు అర్థం కాలేదా? ఈ బాల గణపతి చేతిలో దంతము ఉంటుంది. ఈయన భారతానికి రాయటానికి దంతముతోనే కదా రాసినది.అలాగే ఈ క్షేత్రంలోని మహా శివుడి ఆత్మలింగం ఉన్నది కదా. అలాగే నా దగ్గర ఉన్న నవపాషాణం లింగమూర్తి కూడా ఆత్మలింగముతో సమానం అని దానికి కాపలాగా తుపాకుల దొంగల బారి నుండి రక్షించినట్లుగా నా లింగమును రక్షిస్తాడని నాకు అర్థం అయినది. విచిత్రము ఏమిటంటే నేను ఈ లింగమును ఒక చెక్క పెట్టెలో వెండి బాక్స్ లో లాక్ చేసి ఉంచినాను. అందుకే ఈయన మెడలో ఉన్న వెండి బాక్స్ లోని లింగమూర్తికి లాక్ ఉన్నదని నాకు అర్థమైనది. అంటే ఈయన గోకర్ణక్షేత్రము నుండి నా నవపాషాణం లింగమును కాపలా కాయడానికి వచ్చినాడు అని గ్రహించగానే నాకైతే ఏమీ పాలుపోలేదు.
జిజ్ఞాసి వెనక్కి తిరిగి వచ్చాడు:
ఒకరోజు అకారణము నాకు ధ్యానమునందు జిజ్ఞాసి నాగసాధువు కనిపిస్తూనే ఉన్నాడు.అవును గదా!ఈయన నాకు ఇష్టలింగమును ఇప్పించిన తర్వాత నాకు ఆత్మసంధానము కాలేదు.పైగా మా శిష్యుడితో త్వరలో మీ గురువు గారి ఇంటికి వస్తానని చెప్పడము జరిగినది.వీరి సాధన అయ్యిపోయినదా...లేదా ఆగిపోయినదా... ఎందుకు సాధనదీక్ష నుండి అనగా యోగజీవితము నుండి మళ్ళీ భోగ జీవితానికి ఎందుకు వస్తున్నారు.కొంపతీసి “నేనేదేవుడిని” అనే సినిమాలోని అఘోరుడిలాగా ఒకవేళ తనకున్న ప్రారబ్ధకర్మలు తీర్చుకోవటానికి వెనక్కి వస్తున్నాడా?ఎందుకంటే ఈ చక్రమాయలు అనగా దేవి కామమాయ,ఇష్టపదార్ధమాయ,ఇష్టకోరికమాయలు దాటగానే ప్రారబ్ధకర్మలున్నాయని...అవి తీర్చుకోవాలని మాకు జ్ఞానస్ఫురణ అయినది.నా అంచన ప్రకారము అయితే జిజ్ఞాసి తనకున్న ప్రారబ్ధకర్మలు ఏమిటో తెలుసుకొని వాటిని తీర్చుకుంటూ త్వరలో నా దగ్గరకి రావాలి అనుకున్నాను.కొన్నిరోజులకి నాగాసాధువు దీక్షతో మా ఇంటి తలుపును మన జిజ్ఞాసి కాస్త తట్టినాడు. తలుపు తియ్యగానే “శివజ్ఞాని! మీరు నా గురించి ఊహించినదంతా నిజమే!ప్రస్తుతము నాకున్న ప్రారబ్ధకర్మలు తీర్చుకుంటూ ఉంటే నా కర్మశేషం లేకుండా చేసుకోవటానికి గుప్తయోగిగా కర్మయోగమునందు ప్రవేశించాలి. మన ఇద్ధరి సాధనానుభవాలతో గూడిన కపాలమోక్షం అను గ్రంథము రచన చేద్దాం!మన ఆర్ధిక పరిస్ధితిని బట్టి వాటిని ముద్రణ చేసి ఉచితముగా పంచుదాం!ఈ పని చెయ్యమని నాకు మీకు లాగా బాలగణపతి కనిపించి అనుజ్ఞ ఇచ్చినాడు చెప్పగానే నాకు నవ్వు వచ్చినది. ఆరోజు నుండి నా పాతడైరీలలో వ్రాసుకున్న నా సాధనానుభవాలతోపాటుగా తను వ్రాసుకున్న అనుభవాల చెత్తకాగితాలతో గూడిన తెల్లకాగితల పుస్తకాలు నాకు జిజ్ఞాసి ఇచ్చినాడు.దానితో నేను కాస్త మా ఇద్దరి అనుభవాలు వివిధ అధ్యాయాలు రాస్తూ ప్రస్తుతానికి ఈ రోజుతో ఈ చక్రానుభవాలు అన్నిగూడ పూర్తి అవ్వడముతో మా గ్రంథము పూర్తి అయినదని మేము ఆనందపడుతూంటే...అంతవరకు మేము వ్రాసుకోని కొత్త సాధనానుభవాలు మా కోసము ఎదురుచూస్తున్నాయని మేమిద్ధరం గూడ ఊహించకలేకపోయినాము.అవి ఏమిటో మాకే తెలియదు గదా!అపుడిదాకా మాకు ప్రారబ్ధకర్మలు ఎలా తీరినాయో తెలుసుకోండి.
ప్రారబ్ద కర్మలు:
గత జన్మలో ఎవరైనా మనకి రుణము ఉన్నా లేదా మనము ఎవరికైనా రుణము ఉన్న ఆ బంధనాలు ప్రారబ్ద కర్మలు ఈ జన్మలో వస్తాయి. ఈ కర్మలు పూర్తిగా నాశనము కావచ్చును లేదా మాయ వలన పెరగ వచ్చును. ఈ కర్మల నుండి విముక్తి కలిగినదని సూచనగా స్థల మార్పు జరుగుతుంది లేదా పట్టుదల కలిగి వాళ్ళని విడదీస్తుంది లేదా చావు వస్తుంది.అలాగే ఈ కర్మలు బంధనముగా మారుతున్నాయి అంటే వాటి యందు ఆకర్షణ, ప్రేమ, మోహము, వ్యామోహాలు కలుగుతాయి. దానితో బంధవిముక్తి కాస్త బంధనం అవుతుంది. దీనిని ఎవరూ మార్చలేరు. అనుభవించక తప్పదు. పాప భారము పెంచుకొని పునర్జన్మ ఎత్తి నా నా చంకలు నాక వలసి ఉంటుంది. ఇలా మేము సాధన మొదలు పెట్టిన ఇరవై ఒక్క సంవత్సరాలుకు మాకు ఈ ప్రారబ్ధకర్మలు నివారణ అవ్వటము మొదలైనాయి. గత జన్మలో ఒకతను నన్ను మూడు సార్లుగా నది పుష్కరాలు చేయించిన ప్రారబ్ధకర్మ కాస్త మేము ఈ జన్మలో అతనికి మూడు సార్లు గోదావరి నది పుష్కరాలకి తీసుకొని వెళ్ళగానే పట్టుదల వలన ఏదో గొడవలు మొదలై మేము విడిపోయినాము. అలాగే గత జన్మలో ఇరవైఒక్క మంది నాకు ధనము అప్పుగా ఉంటే వారికి జాతక సమస్య పరిష్కారాలు చెప్పి డబ్బులు తీసుకుని వారిని రుణ విముక్తులు గా చేసి మేము రుణ విముక్తి పొందడం జరిగినది. అలాగే గత జన్మలలో 52 వేల మంది శిష్యుల భక్తులకి ఈ జన్మలో వారికి ఉచితంగా సమస్యలు పరిష్కారాలు చెప్పి వాళ్లను నా నుండి విముక్తి కలిగించి మేము విముక్తి పొందినాము.
విచిత్రం ఏమిటంటే నా రుణ గ్రస్తులు ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి వెళ్లి వైద్య సేవలు చేసి వారి నుండి కూడా విముక్తి చెంది గొడవలు పడి బయటకి రావడం జరిగింది. అలాగే 27 మంది శిష్యులకి సాధన దీక్ష ఇచ్చి వారి సాధన పురోభివృద్ధి అయ్యేటట్లు చేసి వారిని మా నుండి విముక్తి కలిగించినాము. ఉద్యోగాలు చేస్తూ వారిని మా నుండి విముక్తి చేస్తూ ఉద్యోగం చేసే కర్మ నుండి సంపూర్తిగా విముక్తి చెందినాము. అలాగే ఒకసారి ఇది ఇలా ఉంటే దైవ స్వరూపాలు కూడా మా నుండి విముక్తి చెంది వారు విముక్తి చెంది మమ్మల్ని విముక్తి చేసినారు. ఇలా ఇరవై ఒక్క సంవత్సరాలు పాటు చేసిన శివలింగ అర్చకత్వం నుండి విముక్తి కలిగింది. అలాగే ఒక రోజు స్వప్న దేవత అయిన జొన్నవాడ కామాక్షి దేవి నుండి సందేశము వస్తే వెళ్లి ఆవిడని స్వయంగా చూసి ప్రత్యక్ష అనుభవం అనుభూతి పొంది ఆవిడ కాస్త నైవేద్యముగా కొబ్బరికాయను అడిగి తీసుకొని దానిని కొట్టి నన్ను తన కర్మ బంధం నుండి విముక్తి చేసినది. అలాగే మరొక సారి మహా మంత్రగత్తె అయిన జోగులాంబ దగ్గరికి వెళితే ఆకుపచ్చ జాకెట్టు ఇచ్చి సుమంగళిగా ఉండమని మా ఆవిడకి కనిపించి దీవించి తన కర్మ బంధము నుండి విముక్తి చేసుకున్నది. దండి పార్వతి అమ్మవారు తనని చూడాలని పూనకము ద్వారా చెప్పితే ఆ గ్రామానికి వెళ్లి అమ్మ విగ్రహ మూర్తిని చూడగానే ఒక క్షణం పాటు సజీవ మూర్తిగా కనిపించి నన్ను సాధనలో పరిపూర్ణ స్థితికి వెళ్ళమని దీవించి పంపించినది. ఎందుకంటే ఈ అమ్మను 18 సిద్ధ యోగులు పూజించినట్లు అక్కడ ఉన్న శిలా ప్రతిమలు శిలా శాసనాలు చెబుతున్నాయి.
ఒకసారి కాశీ క్షేత్రానికి వెళ్లినప్పుడు మేము ఘాట్ లు చూస్తూ సమయం గురించి పట్టించుకోలేదు. ఇంతలో మాకు షుగర్ వ్యాధి ఉండటం వలన మా లో నెమ్మదినెమ్మదిగా లెవెల్స్ తగ్గటం కళ్ళు తిరగడము ఆరంభమయ్యాయి.ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. షుగర్ కోసము హోటల్ లోకి వెళ్లి తినే సమయం లేదు. అప్పుడు దగ్గరలో ఉన్న ఆశ్రమములో అన్నదానము చేస్తుంటే వెళ్లి ఒక పక్కన కూర్చుని తినటం ప్రారంభించాను. నా పక్కనే బిచ్చగాళ్లు సాధువులు కూర్చుని ఉన్నారు. ఒకప్పుడు మేము శిరిడికి ఎవరికీ చెప్పకుండా పారిపోవడము జరిగినది. మా అమ్మ కాస్త నిరాహారిగా ఉండి కఠిన ఉపవాస దీక్షలో ఉండేసరికి శిరిడి లో ఉన్న బాబా వారు నాకు ఒక శ్లోకం రూపంలో తల్లిదండ్రుల విలువ గూర్చి చెబుతూ నన్ను వెనక్కి పంపించటం మేము వెనుతిరిగి ఇంటికి రావడం జరిగినది. నన్ను చూసిన మా అయ్య నాకేసి అదోలా చూసి “ఏమిరా! నీకు సాధన కావలసి వచ్చినదా? ఎవరినైనా చేతులతో అడుక్కొని ఆకలి తీర్చుకోగలవా? అంత మనోస్థితి నీకుందా? అన్న మాటలు ఇప్పుడు ఈ సమయంలో గుర్తుకు రావటం మొదలైనది. ఇప్పుడు నేను ఉన్న స్థితి నిజంగానే బిక్షగాడి పరిస్థితి కదా. ఫైవ్ స్టార్ హోటల్స్ లో తినే ఆర్థిక స్తోమత ఉన్న మేము ఈనాడు జానెడు పొట్ట కోసమే ఎవరో అన్నసంతర్పణ చేస్తున్న చోట బిచ్చగాళ్ళ మధ్య ఒక బిచ్చగాడిగా తినటం చూస్తుంటే నాలో ఉన్న అన్ని రకాల అహాలు మటుమాయం అవుతున్నాయని అనుభూతి కలగ సాగింది. ఇంతలో మేము లేచి చేతులు కడుక్కునే సమయానికి కళ్ళు తిరిగే సరికి విస్తరాకు కాస్త టేబుల్ మీద నుండి అనుకోకుండా నేల మీద పడే సరికి ఆ సత్రం యజమాని నా దగ్గరికి వచ్చి “స్వామి! ఒళ్ళు బలిసిందా? తేరగా వస్తే ఉచితముగా తినటానికి తయారు అవుతారు. ఆ మాత్రం చూసుకోరా? తియ్యి.ముందు నువ్వు తిన్న విస్తరాకు తియ్యి” అనగానే మేము మౌనముగా నేలమీద ఒంగి తీస్తుంటే ఒక నలభై ఐదు సంవత్సరములు ఎర్రని చీర ధరించి ఉన్న ముత్తయిదువు వచ్చి “నాయనా! నువ్వు వెళ్లి చేతులు కడుక్కో. నేను ఉన్నానుగా నీ విస్తరాకులు తీస్తాను” అని చెప్పి ఆవిడే స్వయంగా తీసుకుని బయటకి వెళుతుంటే అక్కడే ఎవరో స్త్రీ మూర్తి కి పూనకం లాగా వచ్చి “ఒరేయ్! నా బిడ్డ విస్తరాకు తీయటానికి స్వయంగా వచ్చినానురా. నేను ఉన్న చోట ఆహారానికి ఎవరు కూడా బాధ పడకూడదు అంటే బాధపడకూడదు. వారు బాధ పడినా నిన్ను ఏమి చేస్తానో చూడు. వాడు నా జ్ఞాన పుత్రుడు. వాడినే ఇస్తరాకు తియ్యమంటావురా? వాడి ఎంగిలి ఇస్తరాకు తాకే యోగ్యత కూడా నీకు లేదురా. అందుకే నేను వచ్చి గోమాతకి ప్రసాదం పెట్టడానికి వచ్చినానురా. దానికే ఆ అర్హత ఉందిరా” అంటూ ఆమె స్పృహ తప్పే సరికి నా మనోనేత్రం ముందు కాశీ అన్నపూర్ణ విగ్రహమూర్తి ఎరుపురంగు చీరలో కనిపించే సరికి ఆ సత్రం యజమాని మా దగ్గరికి వచ్చి “అయ్యా స్వామి! ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. అన్నపూర్ణా దేవికి ఎరుపు పట్టు చీర ఇచ్చి అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాను. ఇంతలో ఇలా అనుకోని అవాంతరం జరిగినది. అమ్మవారే సాక్షాత్తుగా మీకోసం వచ్చినది అంటే మీరు సామాన్యంగా కనిపించే అసామాన్య వ్యక్తి అని నాకు అర్థం అయింది” అని ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉంటే మేము వాటిని పట్టించుకోకుండా మౌనముగా అక్కడి నుండి బయలుదేరినాము.
ఒక రోజు మా గుడిలో అమ్మవారి గజ్జల శబ్దాలు వినపడుతున్నాయి అని మా అమ్మ అంటూ ఉంటే అది ఎంత వరకు నిజమో చూద్దామని ఒక రోజు రాత్రి పూట గుడిలో ఆమెకి ఎదురుగా కావాలని పడుకున్నాను. మధ్య రాత్రి 12 గంటలు దాటిన తర్వాత లీలగా నాకు ఎవరో స్త్రీమూర్తి కూర్చుంటే వచ్చే కాలి గజ్జల శబ్దాలు వినిపించి మెలుకువ వచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు. లేచి చుట్టూ చూసాను. బయటికి వచ్చి చూశాను. ఎవరు కూడా కనిపించలేదు. ఇలా ఒక వారం రోజుల పాటు ఆమెను పరీక్షించటానికి ఆమె సమక్షంలో గుడిలో పడుకున్నాను. గుడి పందిట్లో గజ్జల శబ్దాలు వినపడ్డాయి కానీ ఎవరివో అర్థమయ్యేవి కావు. ఒక శుక్రవారం రోజు అర్ధరాత్రి పూట నాకు ఒక కలలో 8 సంవత్సరముల బాలిక ఎరుపు రంగు జాకెట్టు మామిడి పండు రంగు లంగా వేసుకొని చేతిలో ఏదో చిన్నపాటి కోరడా పట్టుకుని నన్ను పట్టుకొని కొడుతున్నట్లుగా అనిపించేసరికి కొరడా దెబ్బలకు తట్టుకోలేక నేను పెడబొబ్బలు పెడుతున్నట్లుగా అనిపించేసరికి కల వచ్చేసరికి నాకు భయంతో ఉలికి పడి లేచేసరికి నిద్రాభంగం అయినది. ఇంకా నిద్ర రాలేదు. మర్నాడు యధావిధిగా అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేస్తుండగా ఎవరో అక్కడ అశరీర వాణితో “ఏమిరా? ఇప్పటికైనా బుద్ధి వచ్చినదా. నన్నే పరీక్షిస్తావు. ఇకనుండి నాకు పూజ చేసే అర్హత కోల్పోయావు. ఇక్కడి నుండి వెళ్ళిపో” అని ఎవరో గద్దించినట్లుగా అనిపించేసరికి అమ్మవారి విగ్రహ మూర్తి కాస్త ఒక క్షణం పాటు ముఖం మాత్రమే సజీవ మూర్తి గా కనిపించి పెదవులు కదుపుతూ ఉన్నట్లుగా అనిపించే సరికి ఏదో తెలియని భయం నాలో మొదలై కంగారుతో బయటికి వచ్చినాను. ఇది జరిగిన ఆరు నెలలకి శాశ్వతముగా నేను ఆ గుడి సేవ కి దూరము అవ్వటము జరిగినది. ఈ విధముగా ఆ సాక్షాత్కారము కలిగినది. అలాగే మా అమ్మకి రుణము తీరిందని మాకు ఇప్పుడు అర్థం అవ్వసాగినది. ఏదైనా కానీ అమ్మ అనుగ్రహించిన అంతగా అయ్యవారు అను గ్రహించలేదు. అయ్య లే అమ్మ మిన్న. అయ్య దొబ్బతిని ప్రసాదాలు నైవేద్యాలు సేవలు చేయించుకుంటాడు. అలాగే మా దేవాలయ అమ్మవారు నాకు ధ్యానమునందు కనిపిస్తూ నన్ను గుడి పూజారిగా రమ్మని అడిగినది. నేను మౌనం వహించాను.ఇలా పాపము ఆవిడ నా చుట్టూ మూడున్నర సంవత్సరాలు అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నము చేసినది. నా మౌన సమాధానము ఆవిడకి సహన శక్తిని కోల్పోయేటట్లుగా చేసినది. మళ్ళీ ఇప్పటిదాకా కనిపించలేదు. ఒకవేళ నేను వెళితే ఆమె మాయను దాటేవాడిని కాను. ఆమే సర్వస్వము అనుకునేవాడిని. ఎందుకంటే ఆవిడ ఎవరో కాదు భ్రమరీ బాలాత్రిపురసుందరి. ఈమె ఎవరో మీకు తెలుసు కదా. కాబట్టి నా మౌనమే ఆవిడకి ప్రారబ్ధకర్మ అయ్యి రుణము తీరినది.
ఒకసారి మేము ఒక వ్యాపారం పెట్టే యోగము ఒక కర్మబంధముగా మారే స్థితి వచ్చినది. ఆ వ్యాపారం చేస్తే సుమారుగా రెండు వేల కోట్ల ఆదాయం వస్తుందని మా జాతకము చెప్పేసరికి మేము గతుక్కుమన్నాము.ఆ అవకాశం రానే వచ్చింది. ఒక కంపెనీ వారు మాతో వ్యాపార భాగస్వామి ఒప్పందం చేసుకోవాలని వచ్చినారు. దానితో ఏమి చేయాలో అర్థం కాలేదు. యోగి దగ్గర పైసలు ఉండరాదు. భోగి దగ్గర ధనం లేకుండా ఉండరాదు. అటు యోగి గాను ఇటు భోగి గాను ఉండలేని స్థితి. ఒకటి గుర్తుపెట్టుకోండి. యోగి కావాలని అనుకునే వారు వివాహం చేసుకోవద్ధు. బ్రహ్మచారిగానే ఉండాలి లేదా సన్యాసిగా మారి పొండి అలాగే భోగి కావాలని అనుకునేవారు గృహస్థ ఆశ్రమము చేస్తూ యోగిగా మారండి. ఇక దానితో ఈ వ్యాపార భాగస్వామి ప్రారబ్ధ కర్మను ఎలా దాటాలో అర్థం కాలేదు. ఒక రోజు వారి ఆఫీసుకు వెళ్లి 15 గంటల పాటు ఒకే చోట ఒక కుర్చీలో కూర్చుని వారితో ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్లకి అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. అగ్రిమెంటు కని వచ్చి మౌనంగా ఇలా కూర్చోవటం ఏమిటో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ వచ్చిన వ్యాపార భాగస్వామికి మాకు పట్టుదల వచ్చి గొడవలు కలిగి విడిపోయినాము. లేదంటే వారితో 15 సంవత్సరముల పాటు వ్యాపారంలో చేయాల్సి ఉంటుంది. దానిని మేము కాస్త గంటలలోకి మార్చినాము. మాకు కావలసినది అదే. లేకపోతే ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించి ఏమి చేసుకోవాలి. చివరకు మిగిలేది బూడిదే కదా. అవసరానికి మనకి ప్రకృతి మాత ఇస్తున్నప్పుడు అత్యాశకి పోవటం అంత అవసరమా. ఆ డబ్బులు ఐటి వాళ్లకి లెక్కలు చూపించ లేక చావాలి. అలాగని దొంగతనంగా దాచుకోవాలి. దాచుకోలేను. అది మన మనస్సుకి విరుద్ధం అవుతుంది. వేల కోట్లు సంపాదించి మహా మాయలో పడే కంటే ఉన్న మాయలు వదిలించుకుంటే చాలా మిన్న మంచిది కదా. ఏమంటారు.
ఒక అమ్మాయి తన 12వ ఏట నన్ను ఒక బస్టాండ్లో టాటా చెప్పటానికి వస్తే ఈ కర్మ ఫలమును తిరిగి ఈమె 24వ ఏట ఆమెను ఊరికి పంపిస్తూ నేను టాటా చెప్పినాను అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నా జీవితంలో కనిపించలేదు. ఇలా టాటా కూడా ప్రారబ్ధకర్మ అన్నమాట. మరొక అమ్మాయి నాతో 12 సంవత్సరములు మంచి స్నేహం చేసినది. మంచి స్నేహితులులాగా వున్నాము. ఇలా జీవితాంతం మాకు పెళ్లిళ్లు అయినా కూడా ఇలాగే స్నేహం కొనసాగించాలని అనుకున్నాము కానీ నాకు ఒకానొక సమయంలో లక్ష రూపాయలు అవసరం పడినాయి. ఈమె ఇచ్చినది. కొన్ని వారాలకు నేను ఈమెకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చి వేసినాను. అంటే మా ఇద్దరి మధ్య వేరే వారి స్నేహం కోసం పట్టుదలతో కూడిన గొడవలు వచ్చి విడిపోయాయి. మళ్లీ మేమిద్దరము ఎదురుపడలేదు అంటే నమ్మగలరా? ఇది కూడా అంటే అప్పు కూడా ప్రారబ్ధకర్మ అన్నమాట. అది తీరినది. మాకు రుణము తీరినది. ఒక అమ్మాయికి ప్రేమ వివాహము చేపిస్తే రుణానుబంధం తీరినది. మరొక అమ్మాయికి సంతాన పూజలు చేస్తే బంధము తీరినది. మరొక అమ్మాయికి తన భర్త అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగిస్తే రుణం తీరినది. ఒక అబ్బాయికి తనకున్న సర్ప బాధలు తొలగిస్తే ఆ రుణ బంధము తీరినది. ఒక అమ్మాయికి గురు మంత్రము ఇస్తే మరో అమ్మాయికి జ్ఞానం ఉపదేశము చేస్తే వీరి ప్రారబ్ద కర్మలు తీరినాయి. అంతెందుకు విచిత్రంగా మా స్నేహితుడు కూతురిని ఎత్తుకుని మూడు గంటలు పైగా నడవటం జరిగినది. దానితో వాడి ప్రారబ్ధకర్మ తీరినది. ఒక అమ్మాయికి తొలిసారిగా నేను ఐలవ్యూ చెప్పినాను. దానితో ఆమె మళ్ళీ కనిపించలేదు. అలాగే ఒక అమ్మాయికి నేను తొలి ప్రేమ లేఖ ఇచ్చినాను. ఆరునెలలు బాగానే ఉంది. ఆ తర్వాత పట్టుదల గొడవలు వచ్చి విడిపోయినాము. ఇది కూడా ప్రారబ్ద కర్మ. ఒక అమ్మాయి నన్ను అకారణంగా తిట్టినది. దానితో ఆమెకి నాకు రుణము తీరినది. మరొక అమ్మాయి నన్ను బావా అంటూ ప్రేమిస్తున్నానని చెప్పినది. దానితో ఈమె రుణం తీరినది. నేను ఒకరికి పెన్ను బహుమతిగా ఇచ్చినాను. మళ్ళీ వారు కనిపించలేదు. మరొకరికి పర్సు ఇంకొకరికి పుస్తకము ఇలా ఇచ్చినాను. వాళ్ళు అలా తీసుకొని విదేశాలకి వెళ్లి పోయినారు. మళ్లీ నాకు ఇంతవరకు కనిపించనేలేదు. నేను ఒకరి ఆపరేషన్ సమయంలో ఆసుపత్రిలో ఉండి సేవలు చేసినాను. దానితో వారి రుణానుబంధం తీరినది. నేను ఒకరి ఇంట్లో వారం రోజులపాటు ఉండవలసి వచ్చినది. ఉన్నాను. దానితో వారు నాకు దూరం అయినారు. నేను ఒకరి దగ్గర ₹500 తీసుకున్నాను అది వారికి ఇచ్చే లోపల వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినారు. వాళ్లు 500/- రూపాయలు నాకు అప్పు అన్న మాట. నేను ఒకడికి 40 రూపాయలు అదనంగా ఇచ్చాను. వాడు నాకు ఇచ్చే లోపల వాడు అనారోగ్యంతో మరణము పొందినాడు. నేను వాడికి 40/- రూపాయలు బాకీ అన్నమాట. ఈ బాకీ కోసం వాడు ఇన్నాళ్లుగా బ్రతికి ఉన్నాడు. ఒకడు నన్ను మానసికంగా శారీరకంగా మూడున్నర సంవత్సరముల పాటు ఉద్యోగ సమయంలో అకారణంగా ద్వేషం పెంచుకుని తిట్టేవాడు. ఇప్పుడు వాడు పక్షవాతంతో మంచం ఎక్కినాడు. కొన్నాళ్ళకు మరణించినాడు.ఒక దంపతులు నన్ను ఒక విషయము నందు ఇరికించి అకారణంగా తిట్టినారు. ఇది జరిగిన 12 సంవత్సరాలకి ఆమెకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువు పొందినది. నన్ను తిట్టడమే వారికి శాపంగా మారింది. నా మౌనమే వారికి మారణాయుధము అయినది అని నాకు అర్థం అయింది. గత జన్మలో నేను వారిని తిట్టినాను. ఆ కర్మను ఈ జన్మలో వాళ్లు నన్ను తిట్టడముతో ప్రారబ్ధకర్మ తీరినది. ఇలా జంతువులు కుక్కలు, కోతులు, కుందేలు, పావురాలు, చిలుకలు, గేదెలు, ఆవులు, మొక్కలు కూడా నాతో అనుబంధము పెంచుకుని వాటికున్న ప్రారబ్ద కర్మలు మరణం పేరుతో నా నుండి వెళ్ళిపోయి స్మశానానికి చేరుకున్నాయి. నాకు స్మశాన వైరాగ్యం కలిగించినాయి.ఇలా ఏమి ప్రారబ్ద కర్మయో కర్మ ఏది కర్మబంధమో ఏది విముక్తి కర్మయో మనం తెలుసుకోలేము.ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎవరు ఎప్పుడూ గొడవ పడతారో ఎవరు ఎప్పుడు ప్రేమగా ఉంటారో ఎవరు ఎప్పుడు దూరమవుతారో మనల్ని సృష్టించిన పరమశూన్యమునకే తెలియాలి. దానితో మా ప్రారబ్ద కర్మలు అన్ని కూడా నెమ్మది నెమ్మదిగా కలలో… ధ్యానములో కానీ తీరటము మొదలైనాయి. దానితో మా మనస్సు కాస్త శాంతి పొందటం ఆరంభమైనది. ప్రశాంత జీవితం వైపు అడుగులు పడటం ఆరంభమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షా పాతికవేల ప్రారబ్ద కర్మలు వ్రాయవలసి వస్తుంది. మాకు బాగా గుర్తుకు ఉన్న ప్రారబ్ద కర్మలు మాత్రమే రాయటం జరిగినది. ఇంకా ప్రస్తుతానికి 11 వేల ప్రారబ్ద కర్మలు మిగిలి పోయినాయి. వాటిని సంపూర్తి చేస్తే గాని మాకు కపాలమోక్షం కలగదు. దీనికి ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పన్నెండు సంవత్సరముల కాలం పడుతుంది అని మాకు స్పురణ అయినది.ఈ కర్మలు సంపూర్తి అయితే మహా స్మశానం అయిన కాశీ క్షేత్రమునకు చేరుకొని మా సద్గురువైన శ్రీ త్రైలింగస్వామి మఠానికి గురువు సేవలు చేస్తూ కాలభైరవుడి దర్శనం చేసుకుంటూ కపాల మోక్షం కోసం ఎదురుచూడటం జరుగుతుందని మాకు అర్థమైనది.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*********************************
గమనిక: మీ నిజమైన మనస్సు పూర్తిగా నచ్చిన ఇష్టకోరిక ఏమిటో మీకు తెలియాలి అంటే మీరు మీ సాధన స్థాయిలో చిట్టచివరి యోగచక్రం ఐన హృదయ చక్రం దాకా మీరు చేరవలసి ఉంటుంది. అప్పటిదాకా మీకు మీ ఇష్ట కోరిక తెలిసే ఉంటుంది మీ ఇష్ట కోరిక ఏమిటో మీకు అంతగా తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. మీరు అంతగా పట్టించుకోవడం జరగదు. అసలు ఎన్నిఇష్టకోరికలు ఉన్నాయో మనకే తెలియదు.ఇన్ని ఇష్ట కోరికలలో అందులో ఏకైక ఇష్ట కోరిక ఏమిటో మనం తెలుసుకునే స్థాయిలో ఉండమని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఏకైక ఇష్టమైన కోరిక తెలియాలంటే తప్పనిసరిగా ఖచ్చితంగా యోగ సాధన మీ హృదయ చక్రానికి వెళితే గానీ అప్పటిదాకా మీకు అనుభవించిన సకల కోరికలలో మీ మనసు స్పందించే ఏకైక అంతిమ ఇష్ట కోరిక అలాగే ఇష్టపదార్ధము అంటే ఏమిటో తెలుస్తుంది.అది చుక్కకూర కావచ్చు లేదా తోటకూర కావచ్చు అలాగే మోక్షకోరిక లేదా కామకోరిక లేదా నిజ బ్రహ్మజ్ఞానము పొందాలని ఇష్ట కోరిక కావచ్చును. ఏమో ఎవరికి తెలుసు.
అలాగే నా పంచశిష్యులలో ఒక జిజ్ఞాసి మాత్రమే తన కోరిక మాయలో పడి దానిని కర్మశేషం లేకుండా చేసుకొని బ్రహ్మరంధ్ర సాధనకి అర్హత,యోగ్యతను సంపాదించినాడు.ఇక మిగిలినవారు వారి ఇష్ట కోరికమాయలో పడి బయటికి రాలేక తమ సాధనను ఆపుకోవడము జరిగినది.ఎలా అంటే కాకాజీ తన ఇష్ట కామకోరికను దాటలేక ఈ జన్మ సాధన స్ధూలశరీర కపాల మోక్షము వరకు వస్తే...అదే యోగిరమణ తన ఇష్టదైవ వెంకన్న స్వామి దర్శనానుభవ మాయ దాటలేకపోవడముతో సూక్ష్మశరీర కపాలమోక్షం వరకు వస్తే...అదే మా శ్రీమతి దీక్షాదేవి మాత్రము తన ఇష్టదైవము అయిన పరమేశ్వరుడు కాస్త తన ఇష్టసఖిగా కనపడితే ఈ మాయను దాటలేకపోవడముతో కారణశరీర కపాల మోక్షం దగ్గర ఆగిపోవడము జరిగినది.ఇక శ్వేతాదేవి కాస్త తన ఇష్టగురువు మాయను దాటలేకపోవడముతో సంకల్పశరీర కపాలమోక్షం దగ్గర ఎలా ఆగిపోయినదో మీరు ఈ పాటికే తెలుసుకున్నారు గదా! విచిత్రము ఏమిటంటే వీరందరి అనగా పంచశరీర కపాల మోక్ష సాధన ఏపుడో ఆదిలోనే సంపూర్తి అయినది. ఈ గ్రంథ ముగింపు అధ్యాయములో ఈ విషయము మీకు తెలుస్తోంది.కాని వీరందరు జగత్ గురువైన ప్రకృతిమాత చూపించే ఇష్టకోరిక మాయకి స్పందించడము వలన ఆయా శరీరాలు ఆ కోరిక తీర్చుకోవడము కోసము మిగిలిపోవడముతో నేను లేను అనే స్వానుభవానుభూతిని పొందలేకపోతున్నారు.దానితో తాము బ్రతికే ఉన్నామని భ్రమభ్రాంతిలో ఉండిపోతున్నారు.అనగా బుద్ధుడిలాగా అన్నమాట.ఈయనగూడ కష్టాలకి కారకము కోరిక యని తెలుసుకొని...కోరిక లేని సమాజము చూడాలని కోరికమాయలో పడటములో ఏమైనా అర్ధమున్నదా?లేదు కదా!అలాగే నా పంచశిష్యులలో ఒక జిజ్ఞాసి మాత్రమే ఈ ఇష్టకోరిక మాయలో పడి బయటికి వచ్చినాడు.మిగినవారు ఇంక ఈ ఊబిలో మునిగి కొట్టుకుంటున్నారు. ప్రస్తుతము నడిచే కలియుగములోని నాకు 27 యుగములో అనగా 7వ మన్వంతరములో 27 యుగము అనగా 1987 యుగము...మన జిజ్ఞాసికి 28 యుగములో అనగా 7వ మన్వంతరములో 28 యుగము అనగా 1988 యుగము...ఈ ఇష్టకోరిక మాయను దాటే రికార్డ్ దృశ్యాలు ఉంటే..ఈ మిగిలినవారికి రాబోవు పదిలక్షల యుగాలలో ఏదో ఒక యుగములో తమ సాధన సంపూర్ణ రికార్డ్ దృశ్యము చూడక తప్పదు.ఎందుకంటే అంతరించిపోయిన శూన్యము నుండి అంతరించే శూన్యబ్రహ్మలుగా మనమంతా అవతరించినాము.కాబట్టి ఎవరి కోరికకి తగ్గట్లుగా వారు అంతరించిన అంతిమ దృశ్యము కాలానుగుణముగా కనపడుతుంది.ఎవరుగూడ శాశ్వతముగా ఉండరని శాస్త్రవచనము గదా! నేనులేను అని జ్ఞానస్ఫురణ ఇచ్చే ఆ యుగకాలము వచ్చేదాక మనము ఎదురుచూడక తప్పదు. ప్రస్తుతానికి మా ఇద్దరికి అనగా నాకు అలాగే మన జిజ్ఞాసికి ఆ కాలము వచ్చినది. అది ఎలాగో ఈ గ్రంథ ముగింపు అధ్యాయము మీకు చెపుతుంది.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే...ఈ నవపదార్ధ ఇష్టలింగ మూర్తిని నిత్యముగా ధరించినట్లయితే జీవిత శివదీక్షధారి కింద అవుతుంది. మద్యం, మాంసం, చేపలు తినరాదు. నిత్య లింగార్చన చేసుకోవాలి. పంచదార గుళికలు నైవేద్యంగా పెట్టాలి. ధర్మ జీవితంతో ధర్మబద్ధమైన సంపాదనతో ధర్మ యుక్తమైన కోరికలు తీర్చుకుంటూ ఏదో ఒక ధర్మమును ప్రతినిత్యము జీవితాంతము పాటించాలి. సాక్షాత్తు మహా శివుడే మన ఒంటి మీద ఉన్నాడని జాగ్రత్తతో ఉండాలి. జాగ్రత్తగా మసలుకోవాలి. తేడాలు వస్తే చెమడాలు ఒలుస్తాడని నాకు అర్థమైనది. నియమాలు పాటించాలి లేదంటే చుక్కలు కనిపిస్తాయి. అనర్ధాలు కలుగుతాయి.
మా సాధన పరిసమాప్తి సమయములో మేము కాస్త శ్రీశైల ఇష్టకామేశ్వరి ఆలయమునకు వెళ్ళుతూండగా ఒక నిజబ్రహ్మజ్ఞాని ఏదో సందేహముతో కనిపించాడు. వారిని సమస్య ఏమిటని అడుగగా దానికి “స్వామి! బ్రహ్మతదాకార స్ధితి అంటే దేనికి స్పందించకుండా...దేని గూర్చి ఆలోచించకుండా...దేనిని సంకల్పించకుండా.. అన్నింటయందు సాక్షిభూతముగా ఉండటమే గదా!ఇది ఎలా సాధ్యపడుతుంది” అనగానే దానికి మేము వెంటనే... “జ్ఞాని!ఈ స్ధితి మనకి హృదయచక్రస్ధితిలో ఉన్నపుడు వస్తుంది.నిజానికి మన ఇష్టలింగారాధన వలన మనకి నిజ బ్రహ్మజ్ఞానానుభవానుభూతులు కలలయందు లేదా ధ్యానము నందు కలుగుతాయి. ఇలా మన ధ్యానములో కనిపించే మన గత లేదా భవిష్య జన్మల తాలూకా సాధన దృశ్యాలు చూసి వాటికి మనముస్పందించకూడదు. వీటిని చూసి వేరే ఆలోచనలు చెయ్యకూడదు.అలాగే వీటిని చూసి కొత్తగా సంకల్పాలను సంకల్పించకూడదు.అలాగే వీటిని చూసి ఆశపడకూడదు.అలాగని భయపడకూడదు.బాధపడకూడదు. మనకి చెప్పిన బ్రహ్మతదాకార స్ధితి లక్షణాలు అన్నిగూడ ఈ చక్ర అనుభవ దృశ్యాలకి మాత్రమే సంబంధించినవని తెలుసుకోండి.అంతేగాని భోగ లేదా యోగ జీవితానికి సంబంధించిన వాటికి మనము యధావిధిగా ఆలోచనలు,సంకల్పాలు,స్పందనలు చేయవచ్చును.అది మాయ అవ్వదు. అని తెలుసుకోండి” అనిచెప్పి అమ్మదర్శనానికి నేను కాస్త మౌన:వహిస్తూ వెళ్ళడం జరిగినది.
ఇక మా రెండవ శిష్యురాలియైన తారాదేవి సాధన విషయానికి వస్తే...ఈవిడికున్న సంపూర్ణ కపాలమోక్ష మనో సంకల్పమునకు జగత్ గురువైన ప్రకృతిమాత స్పందించి...వీరికున్న పాతివ్రత్యధర్మమునకు సాధన పరీక్షలు పెట్టడముతో వాటిని ఈమె ఎన్నో మానసిక,శారీరకపరీక్షలు తట్టుకోవడముతో... ఈమెకున్న సంకల్పమును తీర్చుటకు ఈమెకి కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఈమెకి ఉన్న మోక్షము పొందాలనే ఇష్టకోరికకి స్పందించి...ఇలాంటివారికి మోక్షము ఇవ్వాలన్న కోరిక ఉన్న ఈ మహాస్వామి కాస్త ఇష్టలింగము ద్వారా అనుసంధానము అవ్వడము ఈమెకి ఈయన గురుదేవుడై ఈమె సాధన పరిసమాప్తి చేస్తారని అనుభవమైనది.అంటే మాకు ఈమెతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధనము తీరడముతో ఇన్నాళ్లుగా ఈమెకి గురువుగా ఉన్న మేము కాస్త శ్రీ పవనానంద సరస్వతి స్వామి నుండి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి గురువుగారికి ప్రకృతిమాత మార్చడము జరిగినది. అంటే స్త్రీమూర్తి సాధకులకి ధర్మ,అర్ధ,కామ పురుషార్ధాలను ధర్మజీవితముతో ఆచరిస్తే వీరికి తప్పకుండా నాలుగ పురుషార్ధామైన మోక్షము తప్పకుండా పొందుతారని వీరి సాధన జీవితము నిదర్శనముగా నిలుస్తున్నాయి.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిhrudayachakra jagruti, vibedhana,aadheena visheshalu.. thumkaaranaadam minna ani, srisaila kshetra prayatnalu, sookshma shareera yaanamtho kaashiki vellatam, dehame devalayam ela avthundani, ishtalingam raavatam puja vidhaanam,devi maaya daatatam, ishtakorikala gurinchi vishleshana karmalu, mukthula rakalu aa tharvathey kapalamoksham ani, aayishu gurinchi vivarana bagundi.ashtamurthula valana malli srushti punah prarambham jaruguthundani...tholi ekadashi, mukkoti ekadashi gurinchi, brahma devudu chanipovatam malli punah srushti jaragatam. brahma padaardhamlo renuvu antha kaalam maatrame gadichinadi ante chinagaa burra thiruguthundi.argalaa sthothram chadavatam valla ye korikalu hrudayamloki raakundaa chesthundaniadi paramashivude rachincharani..prarabdha karmalu theerithe kaani kapalamoksham raadani...pancha shishyullo okkaru maatrame raavatam....migatha andaru maayaki spandinchatam...
రిప్లయితొలగించండి