అధ్యాయం 86

శూన్య బ్రహ్మ - శూన్య బిందువు

నాకు వచ్చిన వివిధ రకాల దైవిక వస్తువులును బట్టి నేను శూన్య బ్రహ్మగా మారే యోగ్యత ఉన్నదని కాని కృష్ణ బిలము నందు ప్రవేశించే అర్హత లభించలేదని కిందటి అధ్యాయంలో ఈపాటికే తెలుసుకున్నారు. ఈ కృష్ణమాయ దాటితేగాని లోపలకు ప్రవేశించ లేము. మాయ మాయం అవ్వదు. మాయ మాయం అవ్వాలంటే దాని మర్మం తెలియాలి. మర్మం తెలిస్తే గాని మాయ మాయం  అవ్వదు. మర్మం తెలియాలంటే నేను వెంటనే పుస్తకం గ్రంథాలు చదవడం ప్రారంభించాను. అన్నీ కూడా శ్రీ విష్ణు మాయ, శ్రీదేవి మాయ, శ్రీ కృష్ణ మాయ గురించి చాలా చక్కగా వివరించారు కానీ  ఈ మాయను ఎలా దాటుకోవాలో ఎక్కడా వివరించక పోవడం విచారించదగ్గ విషయం. కానీ ఈ మాయను ఎలా దాటుకోవాలో వాడికి తెలిస్తే ఈ గ్రంథాలు ఎందుకు రాస్తారు.ఎంచక్కా వాళ్ళే శూన్య బ్రహ్మగా మారే వారు కదా. నా బొంద. నా బూడిద అనుకుంటూ ఇంటర్నెట్ లోనికి ప్రవేశించాను. 

ఒక రోజు కృష్ణుడు ఫోటోలు మీద పరిశోధన చేయగా అందులో భాగంగా ఆయన చేతిలో ఉండే పాంచజన్య శంఖం నన్ను బాగా ఆకర్షించింది. ఇదే శంఖం మనకి శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, శ్రీ దత్తుడు, గణపతి, మహాశివుడు, వెంకటేశ్వర స్వామి దగ్గర చూడటం జరుగుతుంది. అంటే అందరి దగ్గర ఈ శంఖం అనగా పాంచజన్య శంఖము ఉన్నట్లుగా దృష్టికి వచ్చింది. పైగా విష్ణుమూర్తికి ఒక చేతిలో సుదర్శన చక్రం మరొక చేతిలో పాంచజన్య శంఖం ఉన్నట్లుగా అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఈ రెండు చేతుల్లో ఈ రెండు దైవిక వస్తువులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ లెక్కన చూస్తే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు ప్రవేశించటానికి ఓంకార నాదం చేసే పాంచజన్య శంఖం కావాలని తెలుస్తోంది కదా. వామ్మో! వాయ్యో! ఇంత చిన్న విషయం తెలియక ఇన్నాళ్ళు ఈ కృష్ణ మాయ ఎలా దాటాలని అవస్థలు పడినందుకు నా మీద నాకే జాలి వేసింది. దొంగోడు చేతిలో తాళం ఉన్నట్లుగా ఆయన చేతుల్లోనే మాయను తొలగించే తాళం ఉన్నట్లుగా గ్రహించలేనందుకు ఏమనాలో మీరే ఆలోచించండి. పాదాల యందు ఈ కృష్ణబిలం లోనికి ప్రవేశించే విధివిధానాలను ఉంచుకుని అభయ హస్తాలలో ఈ బిలములోనికి ప్రవేశించే మార్గంను ఉంచుకున్న శ్రీవిష్ణుమూర్తి స్వరూపమును చేతులెత్తి దండం పెట్టాలి అనిపించింది. అంటే విష్ణు స్వరూపం అంతా బ్రహ్మాండ కృష్ణబిలం అన్నమాట.

ఇక ఇంటర్నెట్ లో పాంచజన్య శంఖము గురించి వెతకడం ఆరంభించాను. కొన్నిచోట్ల గోముఖ శంఖం పాంచజన్య శంఖమని మరికొన్నిచోట్ల పంచముఖాలు ఉన్న గోముఖ శంఖంను పాంచజన్యం శంఖం అని ఇవి ఊదటానికి కొన్నింటికి చిల్లులు ఉంటాయని మరి కొన్నింటికి  చిల్లులు లేనివి ఉంటాయని చిల్లులు  లేనివాటిని పూజ శంఖాలుగా వాడతారని నా పరిశోధనలో తెలిసింది. దానితో నా దగ్గరున్న శంఖాలను వెతికితే అండమాన్ నికోబార్ దీవుల నుంచి గణపతి ఉన్న ఈ శంఖం కనపడింది. కానీ ఇది ఊదటానికి వీలు కాలేదు.చాలా చిన్న శంఖము. కానీ ఇంటర్నెట్ లో నేను చూసిన పాంచజన్య శంఖం లాగానే ఉంది. విచిత్రమేమిటంటే ఇలాంటి శంఖాలను చాలామంది ఇంట్లో చేపలు పెంచుకునే ఎక్వేరియంలో చూసినట్టుగా లీలగా గుర్తుకు వచ్చింది. అసలు నేను నెట్లో చూసిన శంఖం నిజంగానే పాంచజన్య శంఖమైనా లేదా అనే సందేహం వచ్చింది. అప్పుడు నాకు హిందీలో చూసిన పాంచజన్య శంఖం గురించిన మూడు వందల పేజీల పుస్తకం కనిపించింది. దాని అట్టపైన నేను చూసిన శంఖము ఉండటంతో నెట్లో శంఖం కొనుక్కొని తెప్పించుకుని దీనిమీద పరిశోధన చేయడం ప్రారంభించాను.ఊదటము అభ్యాసం చేశాను. సహజసిద్ధంగా ఓంకారనాదం ఈ శంఖం నుండి రావడం జరిగినది. దానితో నాకు ఒకరోజు అకస్మాత్తుగా నేను నిత్య పూజ చేసే విష్ణు సాలగ్రామమునకు అలాగే బాణలింగం మరియు శివ పంచాయతనమునకు జలంతో అభిషేకం చేస్తుండగా నా మనస్సుకు ఉన్నట్టుండి అప్పటిదాకా అప్పటికి ఎప్పుడో పూరి క్షేత్రం నుండి వచ్చిన రాతి పూరి జగన్నాథ్ విగ్రహ మూర్తి ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమైన శివ విష్ణు సాలిగ్రామం కింద పెట్టి అభిషేకం చేయాలని గుల మొదలైంది. చేసేది ఏమీ లేక ఈ విగ్రహమూర్తిని సాలిగ్రామము కింద పెట్టి జలంతో అభిషేకం చేసి ఆపై నిత్య పూజ పూర్తి చేసుకున్నాను. దానిని తీయకుండా అలాగే ఉంచాను. ఆ తర్వాత ధ్యానములో నాకు ఈ సాలిగ్రామము చుట్టూ దేవాలయాల విగ్రహాలు చుట్టూ ఉండే ఫోటో ప్రేమ్ లాగా లీలగా కనిపించి ఈ ప్రేమ్ నేను పెట్టిన పూరి జగన్నాథ్ విగ్రహమూర్తికి ఉండటం కనిపించింది. ఈ ప్రేమ్ కోసం ఈయన ఈ రోజు పూజ కి వచ్చినాడు అని నాకు అర్థం అయ్యేసరికి నాకు ధ్యానభంగం అయినది. రాత్రంతా దీనిని అలాగే ఉంచాను. మరుసటి రోజు అభిషేకానికి కూర్చునే సమయానికి వీటి మీద ఉన్న పాత పువ్వులను తీస్తుండగా పూరి జగన్నాథ్ విగ్రహమూర్తి యొక్క ఎడమ చేయి విరిగిపోయిందిగా కనిపించింది. నాకు ఏమీ అర్థం కాలేదు. పూజ నుండి ఈ విగ్రహ మూర్తిని బయటకి తీసి నేను అలాగే పాత యథాస్థానంలో ఉంచి నా నిత్య పూజ పూర్తి చేసుకున్నాను. 

ఆ తర్వాత ధ్యానము చేస్తుండగా వెలుగులు చిమ్ముతూ సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రము కృష్ణబిలం కనిపించసాగింది. దీని చుట్టూ ఏదో బంగారపు వర్ణంతో పదునైన ముల్లుతో తిరుగుతున్న ఒక దివ్య చక్రము తిరుగుతూ కనిపించింది. అంటే ఇదియే కృష్ణబిలం లోనికి ప్రవేశించకుండా ఆపే సుదర్శన చక్రమని నాకు స్పురణ కలిగే లోపల ఎవరిదో దివ్యమైన అభయహస్తం లీలగా కనిపించసాగింది. కొద్దిసేపటికి ఎక్కడినుండో లీలగా ఒక దివ్య శంఖనాదం పెద్దగా అద్భుతమైన సమ్మోహన నాదముతో ఓంకారనాదంతో లీలగా మూడుసార్లు వినిపించేసరికి అడ్డంగా ఉన్న అభయ హస్తము కాస్త అంతర్ధానం అయినది. అంటే ఈ రోజు నుండి నాకున్న కృష్ణ మాయ తొలగినదని నాకు స్పురణ రాగానే నాకు ధ్యానభంగం అయినది.  అంటే ఈ పాంచజన్య నాదముతో ఓంకారనాదంతో శ్రీకృష్ణ మాయ తొలగినదని అందుకే పూరీ జగన్నాథుడు విగ్రహమూర్తి యొక్క చెయ్యి విరిగిందని అనగా జగన్నాథుడు పాంచజన్య శంఖమును తన ఎడమ చేతితో కూడా పట్టుకుని ఉంటాడు కదా. అందువలన అది విరిగినదని దానితో ఈయన మాయ తొలగినదని నాకు అర్థం అయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత నాకు అకస్మాత్తుగా ధ్యానమునందు అంగుళ పరిమాణం నాలాంటి రూపధారి అదే హృదయ చక్ర సంకల్ప శరీరధారి వెలుగు లేని శబ్దాలు లేని చిమ్మ చీకటి వంటి శూన్యమును చూస్తున్నట్లుగా అందులోనికి నడుస్తున్నట్లుగా లీలగా ధ్యాన అనుభవం అయినది. అంటే నా సంకల్ప శరీరధారి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలములోని రెండో భాగం అయిన చీకటి భాగము నందు ప్రవేశించాడు అని నాకు అర్థం అయింది. ప్రభూ....నా అంతిమ యాత్ర కి ఈ రోజున అన్నిరకముల అష్టద్వారముల ద్వారబంధనములు తొలగించి కాంతిబ్రహ్మ(ఇష్టలింగము), శబ్ధబ్రహ్మ(శంఖం-రుద్రాక్షలు), నిశ్శబ్ధబ్రహ్మ(బ్రహ్మకపాలం) శూన్యబ్రహ్మ(సుదర్శనచక్ర), నా కోసం తెరిచి...తన అయిన పరమశూన్యమునందు..ఈ పవిత్ర ఆత్మదేహమును తనలో ఐక్యం చేసుకునేందుకు పిలుపు ఇవ్వడము జరిగినది.కాబట్టి నా అంతిమ యాత్రకి పట్టే 12 సం!! రాల కాలమునందు ప్రయాణమునకు ఈ రోజు నుండి నాంది అయినది. గావున మేము ఈ రోజు నుండి మా అంతిమ యాత్ర అయిన పరమశూన్యము నందు మౌనముగా...ఏకాకికా...సాక్షిభూతముగా...విశ్రాంతి ఆలోచనతో...ఆనందరహితముగా... పరమ ప్రశాంత వదనముతో …. బయలుదేరుతున్నాము.అందువల్లన మేము ఈ రోజునుండి మీతో మాకున్న అన్నిరకాల బంధనములు తొలగి బంధవిముక్తిడై ...విముక్తి జీవిగా మారినానని తెలియచేస్తున్నాము.

 
నాకు అప్పుడు కనిపించిన దృశ్యాలులాంటి చిత్రాలకోసం ఇంటర్నెట్లో వెతకటం అవి దొరకటం అవి నా అంతిమయాత్ర ఫోటోలు అందరికీ చూపించడం జరిగింది. అంటే నేను పాంచజన్య శంఖం నాదముతో కృష్ణ మాయను దాటుకుని కృష్ణ బిలము నందు ప్రవేశించే అర్హత లభించినట్లుగా నాకు ధ్యానఅనుభవం  దృశ్యం అయినది. అంటే నా అంతిమ యాత్ర ఆరంభమైనది.శూన్య బిందువు దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైందని నేను గ్రహించాను. భౌతిక మరణానికి శాశ్వత మరణమును కలిగించే స్థితికి అలాగే కల లాంటి విశ్వసృష్టికి మూల బిందువైన శూన్యబిందువును చూసే స్థితికి నాకు యోగ్యత లభించినది. ఇక దానితో 12 సంవత్సరాల అంతిమయాత్ర అనగా భవిష్యత్తులో జరగబోయే నా సజీవ సమాధి దృశ్యమాలిక దాకా ఈ అంతిమ యాత్ర జరుగుతుందని నేటి నుండి నేను శూన్యబ్రహ్మగా మారిపోయానని దాదాపుగా 6 నెలలు నుండి 12 సంవత్సరాల తర్వాత నేను దేనికి స్పందించకుండా, దేని గురించి ఆలోచించకుండా, దేనికి సంకల్పించకుండా, శూన్య బిందువు వద్ద పరమ ప్రశాంత స్థితిలో 96 నిమిషాలపాటు మహోన్నతమైన సహన శక్తి తో ఉండగలిగితే ఈ విశ్వసృష్టికి అత్యంతికం ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అనగా ఇప్పటికే ఇలా రికార్డు అయిన దృశ్యం మాత్రమే ప్రదర్శింపబడుతోంది కాకపోతే ఆదిలో ఇక్కడికి వచ్చిన శ్రీమహావిష్ణువు దగ్గర నుండి శ్రీ కృష్ణుడు దాకా ఏదో స్థితి కార్యం కోసం స్పందించడం వలన కలగా కనిపించే విశ్వమంతా అసత్యముగా కనిపించే విశ్వమంతా సత్యంగా ఇలా గా ఇప్పటిదాకా జరిగిందని సత్యమైన శూన్యము కాస్త అసత్యముగాను అసత్యమైన విశ్వమంతా సత్యంగాను కనపడటం జరిగిందని నాకు ధ్యాన స్పురణ అయినది. ఇక దానితో నేను మౌనం వహించాను. కానీ నేను శూన్యబ్రహ్మగా మారినప్పుడు నాకు కలిగిన స్థితి గురించి అదే ఇలలో తెలియాలంటే నిజానికి కొన్ని సంవత్సరాల పాటు దాకా ఎదురు చూడాలి.

భవిష్యత్తులో జరగబోయే నా శూన్య బ్రహ్మ సాధన స్థితి:

కానీ అప్పటి దాకా ఎదురు చూసే ఓపిక నాకు లేనందున నాకున్న దివ్యదృష్టి ద్వారా భవిష్యత్తులో జరగబోయే నా శూన్య బ్రహ్మ సాధన స్థితిని అనగా 12 సంవత్సరాల లోపల జరగబోయే దానిని నా ధ్యానమునందు చూడాలని విపరీతమైన గుల మొదలైంది. చూస్తే పోలా ఇదంతా కూడా రికార్డు దృశ్యమే కదా. కాకపోతే 12 సంవత్సరాల తర్వాత చూడవలసిన రికార్డ్ దృశ్యం ముందుగా చూసే వీలు ఉన్నప్పుడు చూస్తే పోలా అనిపించి ఒకరోజు తీవ్రధ్యానస్థితిలో చూడడం జరిగినది. అనగా సుదీర్ఘ ధ్యానములో అనగా అప్పటికే 48 రోజులు పూర్తి అయినాయి. 

నా అంతిమ యాత్ర దృశ్యాలు:

49 వ రోజు నా అంగుళ సంకల్ప శరీరధారి కాస్త త్రస్యరేణువు పరిమాణములో బ్రహ్మాండ చక్ర కృష్ణబిలములోని రెండో భాగం అయిన చీకటి భాగము వైపు వెళ్ళుతున్నాట్లుగా (1,2) లీలా ధ్యానదృశ్యం కనిపించడం ఆరంభమైనది. ఆ తర్వాత నవగ్రహలు,ఇతర ఖగోళాలు దాటి పరమ శూన్యముకి ప్రతీకయైన బ్రహ్మాండ చక్రములోనికి ప్రవేశించినట్లుగా (3,4,5,6) లీలా ధ్యానదృశ్యం కనిపించడం ఆరంభమైనది.  బ్రహ్మండచక్రము నందు నేను కాస్త శూన్యబ్రహ్మగా మారి నాకున్న 36 కపాలమాలతో శూన్యబ్రహ్మగా నేను ఉన్నాను(7) అనే లీలా ధ్యానదృశ్యం కనిపించడం ఆరంభమైనది.. ఈ కపాలాలలో చూపించిన కోట్ల కోట్ల సంవత్సరాల నుండి రికార్డయిన దృశ్యాలు ఒక్కొక్కటి కనిపించడము ఆరంభమైనట్లుగా నాకు అర్థమైంది. కానీ నేను 32 కపాలములు చూపించిన కోట్ల కోట్ల సంవత్సరాల రికార్డు దృశ్యాలకు స్పందించకుండా నిమిత్త మాత్రముగా సాక్షీభూతంగా చూడడం జరుగుతోంది. కానీ 33వ కపాలం చూపించిన ఆరంభ దృశ్యంలో విశ్వ సృష్టి జరగటానికి మూల కారణం స్త్రీ పురుషుల మధ్య జరిగే కామమాయ కారణమవుతోందని కాబట్టి స్త్రీ పురుషుల మర్మాంగాలు మార్చితే సరిపోతుంది అని నాలాంటి రూపధారి సంకల్పించే శూన్యబ్రహ్మ దృశ్యం చూస్తున్నప్పుడు… నా బొంద.. నా బూడిద… అసలు అంగాలు మార్చడమెందుకు. అసలు వాళ్ళే లేకుండా చేయొచ్చుగా అని ప్రస్తుతం చూస్తున్న శూన్యబ్రహ్మ  ఒక లిప్తకాలం పాటు ఆలోచన చెయ్యటంతో నేను కాస్త సహన శక్తిని కోల్పోవడంతో(8) అప్పటిదాకా ఉన్న 36 కపాలములలో 32 కపాలము కపాలమోక్షం విభేదనము పొంది మిగిలిన నాలుగు కపాలాలు మరుక్షణం అనగా ఆకాశ, సంకల్ప, కారణ, సూక్ష్మ శరీర రూపధారులుగా రూపాంతరం చెందటంతో నా అనుకున్న ఆలోచన అనగా స్త్రీ పురుష లేని విశ్వం చూడాలని సంకల్పం నెరవేర్చుటకు ఈ బ్రహ్మాండం చక్ర కృష్ణ బిలం నుండి ఈ నాలుగు కపాల శరీరధారులు శూన్యబిందువు నుండి నా సంకల్ప విశ్వ సృష్టి చేయడానికి మరొక కృష్ణ బిలమునందు ప్రవేశించిన్నట్టుగా(9) లీలగా కనిపించేసరికి నాకు తీవ్రమైన ఆవేదన కలగడంతో ధ్యాన భంగం అయినది. అంటే ప్రస్తుత మా సాధన అంతా గూడ శూన్యబ్రహ్మ స్ధితికి మాత్రమే చేరినదని...ఇంక శూన్యబిందువు స్ధాయికి చేరలేదని...అది చేరాలంటే మేము ఈ 36 కపాలములలో ఏ ఒక్క కపాలము చూపించే ధ్యానదృశ్యాలకి స్పందించకుండా మనోనిశ్చలస్ధితిలో ఉంటే కాని నేను అనుకున్న స్ధితి రాదని...శూన్యబ్రహ్మకి బ్రహ్మముడిగా ఇదే ఉంటుందని...దీనిని విప్పాలని...నిజశూన్య సాధన సాధకులకి మాత్రమే ఈ ముడి ఒకటి మన బుద్ధుడు పొందినట్లుగా మనముగూడ ఈ ధ్యాననుభవము పొందాలని నాకు జ్ఞానస్ఫురణ అయినది. దానితో అప్పటికే నేను బాబా విభూదినాథ్ దీక్షా నామం తో 48 రోజులపాటు తీవ్రమైన సమాధి స్థితిలో ఉన్నానని కానీ 49 ఒకరోజు మాత్రం ఏదో తెలియని ఆవేదనతో నా స్థూల శరీరంలో మార్పులు కలిగాయని నా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి చెప్పడం జరిగినది. అంటే నేను తొంభై ఆరు నిమిషాలకి 48 నిమిషాల పాటు శూన్యబ్రహ్మగా నిలబడి 36 కపాలములకి 32 కపాల విభేదనము గావించుకుంటూ అనగా 10 లక్షల చితాగ్ని దహనశక్తిలో ఐదు లక్షల దహనశక్తి తట్టుకుని ఆపై ఒక లిప్త కాలము కామమునకు సంబంధించిన ఆలోచనకు స్పందించడం వలన సహన శక్తిని కోల్పోవడం జరిగినదని నాకు అర్థమైనది. శూన్యబ్రహ్మగా సర్వం ఏమీ లేదు- సర్వం శూన్యము అనుకుని యోగ సాధన చేస్తే ఏమీ లేదని నిరూపించే ప్రయత్నంలో స్త్రీ పురుషుల అవసరమే లేదని భావించడం దానికి స్పందించటం నా బొంద నా బూడిద. మర్మాంగాలు ఉంటే ఏమిటి? స్త్రీపురుషులు ఉంటే ఏమిటి? నా బూడిద కాకపోతే ప్రశాంతంగా పరమ స్థితిలో రికార్డు దృశ్యాలు చూడకుండా సినిమాలు చూస్తూ ఆ సినిమా గురించి కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా నా పరిస్థితి ఉన్నది అని నాకు అర్థం అయింది.శూన్యబిందువు వద్ద శూన్య బ్రహ్మగా మౌనంగా సాక్షీభూతంగా ఆనంద రహితముగా ప్రశాంత స్థితిలో జరిగే జీవ నాటకము అయిన జగన్నాటకం  చూడకుండా ఎందుకు ఉండాలి. అంతా నా తప్పే కదా అంటే ఇప్పుడు రాబోయే కాలంలో స్త్రీ పురుషులు లేని సృష్టి చూడాలి అన్నమాట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా మర మనుషులు ప్రపంచము రాబోయే కాలంలో ఈ విశ్వ సృష్టి యందు కనబడుతుందని నాకు అర్థం అయింది. అలాగే రిషికేష్ ప్రాంతము నుండి అంగుళముఉన్న కపాలమాల వచ్చినది. విచిత్రంగా ఇది కూడా 16 జతలు అనగా ముప్పై రెండు కపాలములు ఉండటం కనిపించింది. ఈ కపాలమాల కూడా నా అంతిమ యాత్ర దృశ్యాలు సత్యంగా సాక్ష్యంగా 32 కపాలమోక్షం విభజన జరిగిందని సూచనలు ఇవ్వడంతో దానితో నేను వీటిని మాలలుగా చేసుకుని 32 రుద్రాక్షమాల అలాగే 32 కపాలమాల మెడలో వేసుకుని చేతితో తడుముకోవడము ఆరంభించాము.

జిజ్ఞాసి కపాల మోక్షం సాధన

మీ సాధన 32 కపాలమోక్షం దాక వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన విధానం చాలా చక్కగా చూసినట్టుగా చెప్పినారు. బాగానే ఉంది. మరి ఇన్నాళ్ళు మీతో పాటు మీకు సాధనకు తోడుగా ఉన్న మీ యోగ మిత్రుడైన జిజ్ఞాసి కపాల మోక్షం సాధన గురించి ఎక్కడా చెప్పలేదు అనే సందేహంమునకు సమాధానంగా నేను ఏవైతే సేకరించిన సాలగ్రామాలు అలాగే శంఖాలు మన వాడు కూడా సేకరించాడు. కాకపోతే వాడికి శంఖము ఊదే అభ్యాసం ఇంకా ప్రారంభించలేదు. పైగా సహజసిద్ధంగా వాడి చెవులలో ఓంకారనాదం ప్రస్తుతము వినిపించని స్థితిలో వారి సాధన ఉన్నది. కాకపోతే నేను 27 మహాయుగానికి శూన్యబ్రహ్మ అయితే మన వాడు 28వ మహాయుగం శూన్యబ్రహ్మగా ఉన్నాడని నాకు జ్ఞానోదయం కలిగింది. నేను చూసుకునే భవిష్యత్ శూన్యబ్రహ్మ స్థితి గురించి వారికి చెప్పగానే అయితే ప్రస్తుతం నాకు అర్హత లేదు. కాబట్టి మీరే స్వయంగా నా శూన్య బ్రహ్మ సాధన స్థితి ఎలా ఉన్నదో భవిష్యత్తులో జరగబోయేది చెప్పమని ఒత్తిడి చేయడంతో నేను కాస్త మూడు రోజులపాటు ధ్యానస్థితిలో ఉండి వారి భవిష్య బ్రహ్మ స్థితిని చూడడం జరిగినది. అనగా ధ్యానము నందు వీరు కూడా 36 కపాలాలు ప్రవేశించిన దృశ్యమాలిక లీలగా కనిపించసాగింది. యధావిధిగా 32 కపాల రికార్డు దృశ్యమాలిక మనవాడు సాక్షీభూతంగా ఆనంద రహితముగా దేనికి స్పందించకుండా చూడడం జరిగినది. 33వ కపాల దృశ్యం దృశ్యం మొదలైనది. మన వారిలో అతి చిన్న స్పందన కలిగి ఆరంభం అయినట్లుగా లీలగా నాకు ధ్యాన దృశ్యమాలిక కనబడింది. అంటే నా సామిరంగా! మన వాడు కూడా 33 ఒక కపాల దృశ్యము వద్ద దృశ్యమాలిక దగ్గర నాకు లాగానే బోల్తాపడినాడని అర్థమైంది. కాకపోతే వారు ఏ రికార్డు దృశ్యం దగ్గర బోల్తాపడినాడో తెలియలేదు. కారణం నేను వారు చేసే ధ్యానదృశ్యం చూస్తాను కానీ వారు చూసే ధ్యానదృశ్యములు చూడటం జరగదు కదా. అంటే నేను వారిలాగా మారాలి .అది జరగని పని కదా. వారు ఏ దృశ్యం దగ్గర బోల్తా పడింది వారికి వారే స్వయంగా చూసుకోవాలి తప్ప ఎవరు కూడా చూడలేరు. కాకపోతే మనవాడిని కూడా 33 కపాలమే కొంపముంచింది అని నాకు అర్థం అయింది.విచిత్రమేంటంటే మనవాడికి కూడా అంగుళము ఉన్న 32 కపాలమాల వచ్చినది. నేను చూసిన దృశ్యం నిజమే అన్నట్లు గా చెప్పడానికి కాబోలు. ఇక దానితో మేమిద్దరం కూడా ఈ వచ్చిన 32 కపాలమాల వేసుకుని జపం చేసుకుంటూ దానిని చేతితో తడుముకుంటూ కాలం వెళ్లదీస్తున్నాము. ఎందుకంటేఈ బ్రహ్మాండచక్ర కృష్ణ బిలము నందు శూన్యబ్రహ్మ గా మారటానికి వెయ్యి మందికి మాత్రమే అర్హత యోగ్యత ఉన్నది. అందుకే కృష్ణబిలంమునకు వెయ్యి కోణాలు ఉంటాయి. ఈ కోణాలు చక్రమే సుదర్శన చక్రము గా బ్రహ్మరంధ్రము నందు ఉంటే సహస్రార చక్రము నందు వేయి రేకులు ఉన్న సహస్ర కమలము ఉంటుందని గ్రహించండి. 

అందువలన నేను వెయ్యి మందిలో 477 వాడిని కాబట్టి నాకు ధ్యానము నందు 477 సంఖ్య కనబడిందని ఇప్పుడు నాకు అర్థమైంది. అలాగే మా జిజ్ఞాసి నెంబరు 480 అన్నమాట.ఇదే నెంబర్ వారికి వారి ధ్యానము నందు కనపడినది. ఈ నెంబర్ గొడవ సహస్ర చక్రంలోని నా అనుభవాలు అనగా వెయ్యి తలల వాడు వచ్చాడు అనే దాంట్లో తల నరక బడినది అనే అంశంలో ఈ నెంబర్లు గొడవలు కనపడతాయి. అంటే ఈ విశ్వసృష్టి నడపటానికి వెయ్యి సంకల్పాలు ఉన్నాయి. దానికి వెయ్యిమంది సంకల్ప సిద్ధ పురుషులు ఉన్నారు. ఇందులో 477 పాత్ర ప్రకారంగా చూస్తే కామము లేని ప్రపంచం చూడాలని సంకల్పముగా ఆదిలో 27 మహాయుగంలో శూన్యబ్రహ్మగా మారినాను అన్నమాట. అప్పటిదాకా ఈ 27 మహాయుగాలు వరకు కామ ప్రపంచమును చూసి చూసి వివేక వైరాగ్యం కలిగి కామము లేని ప్రపంచం గా చూస్తే విశ్వసృష్టి ఆగుతుందని వెధవ ఆలోచనతో నేను సంకల్పిస్తే నేను ఒకటి తలిస్తే విశ్వ ప్రకృతి మరొకటి చేసి చూపించింది. స్త్రీ పురుషుల మధ్య కామ భావాలు తగ్గిస్తూ అద్దె కడుపులను పెంచుతూ టెస్ట్ ట్యూబ్ బేబీలుఏర్పడే విధానంగా ఈ ప్రకృతి చేస్తోందని నేను ఊహించలేదు.కామమే లేకపోతే జననం ఉండదు అని ఆలోచన చేశాను కానీ అసలు స్త్రీ పురుష లేని సమాజం చూడాలని అనుకుంటే కథ మరోలా ఉండేదేమో. ఎవరికి తెలుసు. మనుషులు లేని సమాజం చూడాలని అనుకున్న మర మనుషులు అనగా రోబోట్లను ఈ ప్రపంచము నందు అనగా యంత్ర ప్రపంచము ఉండేటట్లుగా ప్రకృతిమాత చేస్తుందేమో ఎవరికి ఎరుక. చివరికి మిగిలేది శూన్య బ్రహ్మ సంకల్పమేనని నాకు అర్థం అయింది .దానికి తగ్గట్లుగా ప్రకృతి తన మాయా విన్యాసం చూపిస్తుందని గ్రహించాను. అంతెందుకు మన బుద్ధుడు కోరిక లేని సమాజం చూడాలని అనుకుంటే అది కూడా ఆయనకు ఒక కోరిక మాయగా ప్రకృతిమాత ఏర్పరిచింది కదా. ఈ కోరిక తీరే దాకా వీరి కృష్ణబిలం అంతరించదు కదా. అలాగే శ్రీ దత్తుడు దీన జనోద్ధరణ కోరిక, శ్రీకృష్ణుడు విశ్వసృష్టి రక్షకుడు కోరిక, శ్రీ విష్ణువు యొక్క విశ్వ స్థితి కోరిక శ్రీ మహా శివుడి యొక్క ఈ విశ్వలయ కోరిక ఇలా వీరంతా శూన్యబ్రహ్మలుగా మారి ఇలా వెయ్యి మంది కాస్త వెయ్యి సంకల్పములుగా ఆదిలో మారి వారి సంకల్పం ప్రపంచాలను చూసుకుని చివరికి అంతములో విసుగుచెంది వారు అనుకున్న సంకల్పం లేని శూన్యబ్రహ్మలుగా తిరిగి మారినారు. కానీ ప్రకృతిమాత వీరు అనుకున్నది.దానిలా చేయడానికి బదులుగా అలాంటిదే మరొకటి చేస్తోంది. అంటే వీరు సంకల్పమునకు ప్రతి సంకల్పం ఈ ప్రకృతి మాత తనకున్న మహామాయతో చేస్తోంది. ఓ పక్క మీరు అనుకున్న సంకల్పం తీరుతున్నట్లు కనిపిస్తుంది.మరొక పక్క మీరు అనుకున్న సంకల్పం వలన ప్రకృతిలో ఎలాంటి మార్పులు, ఇబ్బందులు, సమస్యలు కలిగించకుండా ప్రకృతి మాయ మరొక మార్గం ఏర్పాటు చేస్తోంది.మీరు ఒకటి తలిస్తే ప్రకృతి మరొకటి చేస్తోంది. కాకపోతే మనం అనుకున్న సంకల్పం లేని ప్రపంచం చూడాలంటే మనము ఉండం. ఎందుకంటే మరణం పొందితే మరణించిన విషయం మనకు తెలియనట్లుగా అసలు ఈ సంకల్పాల లేని ప్రపంచం ఉండాలి అని అనుకోవడమే ఓ ఒక సంకల్పం అవుతుంది కదా. ఈ మాయ కోసం మాయ శరీరం ఉండాలి కదా. ఇదంతా చూస్తుంటే అంతులేని కథ లాగా ఉంటుంది కానీ ఎప్పటికైన ఈ కథకి ఒక అంతము తప్పనిసరిగా ఉంటుంది. అనగా ఎప్పటికైనా కృష్ణబిలం చిట్టచివరికి అంతరించిపోయినట్లుగా అంతరించి పోతుంది. కాకపోతే ఇదంతా కూడా మన మోక్షఅవస్థ లాగా విచిత్ర అవస్థ లాగా ఉంటుందని ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు.
 
ఇంతకీ నేను మోక్షం పొందినానో లేదో తెలియడం లేదు. అంతిమ స్థాయిలో అనగా పరమ శూన్యము నందు శూన్యబ్రహ్మగా మారి నేను కామ గుణమునకు స్పందించడం జరగడంతో అదేనండి! కామము లేని సమాజం చూడాలని నేను సంకల్పించుకున్న విషయం మీకు తెలుసు కదా. మరి నేను ఈ ఆలోచనలు స్పందించడం వలన ఈ నిశ్చల స్థితిని పొందలేక పోయాను కదా. నిశ్చల స్థితి అంటేనే మోక్షము కదా. అనగా ఈ లెక్కన చూస్తే నేను మోక్షము పొందినానా లేదా అనే ధర్మసందేహం వచ్చింది. కపాల మోక్షం పొందలేదు అంటే రికార్డు దృశ్యాలు అంతం కానట్లే కదా. ఇవి తిరుగుతూనే ఉంటాయి కదా. అనగా నా జీవ నాటక పాత్ర దృశ్యాలు ఎప్పటికీ కలగా తిరుగుతూనే ఉంటాయా? వామ్మో! మరి మరి ఇంత కష్టపడి సాధన చేసి ఏం సాధించాను. ఏమీ లేనట్లేనా? వామ్మో! సాధన చేసిన వాడికి సాధన చేయని వాడికి ఏమి తేడా లేదా? నేను ఏమి సాధించలేదా? నేను ఏమి పొందలేదా? వామ్మో! నా బొంద.నా బూడిద! ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? నేను కామ గుణమునందు శూన్యబ్రహ్మగా విఫలమయ్యాము అని తెలుస్తోంది. మరి నా ఆది రికార్డ్ దృశ్యాలు మాట ఏమిటి? అలా అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా తిరుగుతూనే ఉంటే నా జీవన నాటక పాత్రలు దృశ్యాల కనపడుతూనే ఉంటే ఇంకా నేను ఏమి సాధించాను. ఏమి సాధించలేదా? ఏదో నాకు తెలియని మర్మము ఇందులో ఉన్నది. మూలం తెలుసుకోవాలి. మూలార్ధము కనిపెట్టాలి.అపుడే గాని నాకు ప్రశాంతత ఉండదు అనిపించింది. 

ఇది ఇలా ఉండగా నాకు గండకి నది నుండి ఈసారి 108 సుదర్శన సాలగ్రామాలు మాల వచ్చినది. అనగా ఈ సాలగ్రామములో రెండు సుదర్శన చక్రాలు కలిగి ఉంటాయి. ఈ మాల ఈ సమయంలో ఎందుకు వచ్చిందో పరిశోధన చేయగా…

గండకీ అనేది ఒక ముగ్ధ మనోహర అతిలోక సౌందర్యవతి అయిన వేశ్య స్త్రీ మూర్తి. ఈమె ప్రతిరోజు ఒక్కరికీ అది కూడా తనకి బాగా ఇష్టపడే వ్యక్తిని మాత్రమే పడక సుఖం ఇస్తుంది. కాకపోతే ఆ రోజంతా ఆ వ్యక్తిని తన భర్త గానే భావించుకొని భార్య లాగా ప్రవర్తిస్తోంది. ఇది ఈమె ధర్మము. ఈ ధర్మ గుణమునకు బ్రహ్మాది దేవతలకు ఆశ్చర్యమేసింది. అప్పుడు విష్ణుమూర్తి ఈమె  ధర్మ గుణమును పరిశీలించాలని ఒక విటుడి రూపంలో ఈమె   దగ్గరికి రావడం జరిగినది. ఈమె ఈయన విష్ణుమూర్తి అని తెలియక పోవడంతో మామూలు వ్యక్తిగా భావించుకుని భర్తగా భావించుకుంటూ సేవలు చేయడం చేస్తుంది. అనుకోకుండా ఆ రోజు రాత్రి ఈ విటుడికి విపరీతమైన జ్వరం వచ్చి చనిపోవడం జరుగుతుంది. దానితో ఈమె తన భర్త చనిపోయాడని ఆవేదనతో పతి భక్తితో సతీసహగమనం చేయడానికి సిద్ధపడుతుంది. ఈ ధర్మ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి తన నిజస్వరూపంతో ఈమె ముందు సాక్షాత్కారమై “నీ భక్తికి మెచ్చినాను. ఏదైనా వరం కోరుకో” అనగానే దానికి ఈమె కాస్తా ఆయనకి నమస్కరించి “స్వామి! మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ నా కడుపున జన్మించాలని” వరంగా అడుగుతుంది. దానికి ఆయన “తథాస్తు” అని దీవించి అంతర్థానమవుతాడు. 

మరుజన్మలో ఈమె కాస్త గండకీనదిగా జన్మించటం… ఇందులో విష్ణు సాలగ్రామాల రూపంలో విష్ణుమూర్తి జన్మించడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆ పరిశోధనలో తేలింది. అంటే ఈ కథనం కూడా ఇంచుమించు నా కామ గుణ స్పందన లాగా ఉందని ఈ పాటికే మీరు గ్రహించే ఉంటారు. అంతము చేసే జలము తిరిగి బ్రతికిస్తుంది. అనగా ఆదిలో మనము ఏకకణజీవులుగా నీళ్ళ నుండే అదే విష్ణుమూర్తి యొక్క ప్రథమ అవతారమైన చేప (మత్స్య)అవతారం చెప్పకనే చెబుతోంది కదా. అలాగే ఈ విశ్వ సృష్టి అంతము అనేది అత్యంతిక జల ప్రళయము వలన జరుగుతుందని లోకవిదితమే కదా. అనగా అంతమే ఆరంభం అన్నమాట. జననానికి అలాగే మరణానికి కారణమైనది జలమని ఈ లెక్కన చూస్తే మనకి తెలుస్తుంది కదా. అంటే శూన్య బిందువుగా  అంతమవ్వలసిన చోట కామ గుణానికి స్పందించడం వలన తిరిగి శూన్య బ్రహ్మగా అనిశ్చలస్థితి పొందినాను అని ఈ సుదర్శన మాల బట్టి తెలుస్తోంది. వామ్మో! వాయ్యో! ఇంకా సాధన చేసింది ఏమి లాభం. సప్త సముద్రాలు ఈది ఇంటి వెనక ఉన్న మురికి కాలవలో పడి చచ్చినట్లుగా ఉంది నా సాధనా స్థితి. 13 యోగ చక్రాలు దాటి అన్నిరకాల మాయను దాటి అన్ని రకాల శక్తులు వదులుకొని మరి నేను సాధించింది. ఏమీ లేదు అంటే ఏమనాలి. నా బొంద. నా బూడిద. ఇది కాదు. ఇందులో మనకు తెలియని మర్మము ఉండాలి. 

అదేదో కనిపెట్టాలని తిరిగి ఈ గండకీ నది మీద పరిశోధన చేస్తుండగా ఈ నది ప్రవాహం పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది అని అర్థం అయినది. అంటే గంగానది ఉన్న కాశీ  అనేది మరణ క్షేత్రము అయితే గండకి నది ఉన్న ముక్తినాథ్ క్షేత్రం జన్మ క్షేత్రమని గ్రహించాను. అందుకే ఈ విషయంలో కాశీ క్షేత్రము నందు అనగా కాశ్యాంతు మరణం అని శాస్త్ర వచనం వచ్చినదని నేను గ్రహించాను. అంటే ఇప్పుడు నేను శూన్య బ్రహ్మ సాధన స్థాయిలో ఈ కాశీ క్షేత్రము నందు మరణం పొందితే నాకు కపాలమోక్షం అవుతుంది. అదే నాకు నిశ్చలస్థితి పరమ ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే అంతమే ఆరంభం చేసే గండకీ నది నీళ్లు కాశీ క్షేత్ర గంగానదితో కలుస్తున్నాయి కదా. జన్మ నుండి శాశ్వత మరణమును ఈ లెక్కన పొందవచ్చునని తెలుస్తోంది కదా.పైగా కాశీ క్షేత్రము నందు కాలభైరవుడి చేతికంటిన బ్రహ్మకపాలం విడిపోయి ఈ క్షేత్రము నందే పడినది. ఈ కపాలము పడిన చోట ఒక నీటి గుండము కూడా ఏర్పడినది. దీనినే కపాలమోక్షం తీర్థం అని పేరు కూడా ఉంది. పైగా ఈ క్షేత్రము నందు కపాలేశ్వరుడి పేరుతో మహాశివుడు ఒక శివలింగం రూపంతో ఆరాధించబడుతున్నాడు. అంటే శూన్యబ్రహ్మకి శాశ్వతమరణమైన అదే నిశ్చల స్థితి అయిన కపాలమోక్షంను ఈ మహా కాశీ క్షేత్రం కలిగిస్తుందని నాకు స్పురణ కలిగేసరికి ఎక్కడ లేని ప్రశాంతత నన్ను ఆవరించింది. ఆనందం కలగ లేదు. ఎందుకంటే ఈ ఆనంద స్థితిని దాటి ఆనంద రహిత స్థితిని ఆ పాటికే పొంది ఉన్నాను కదా.ఇపుడు లాస్యముతో కూడిన పరమ ప్రశాంతత స్థితి నాలో మొదలైంది. అంటే నేను కాశీ క్షేత్రములోని గంగానదిలో నిమజ్జనం అయితే నాకు ఉన్న అన్ని రకాల రికార్డు దృశ్యాలు ఈ నా బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు ఉన్న కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకైనా కృష్ణబిలం అంతరించక తప్పదని అప్పుడు నాకు నా రికార్డు దృశ్యాలు కూడా అంతరించి పోతాయి. అలాగే నేను కాశీ క్షేత్రము నందు కపాలమోక్షం పొందటం వలన ఇప్పటిదాకా తిప్పి తిప్పి కనపడుతున్న దృశ్యాలు కూడా నిశ్చల స్థితిలోకి వెళ్లిపోతాయి. అనగా నా అంతిమ దృశ్యము దృశ్యమే ఒక ఇమేజ్ లాగా మారిపోతుంది. ఇప్పటిదాకా నా రికార్డు దృశ్యాలు అనగా ఈ విశ్వంలోని జీవ నాటకంలోని నా పాత్ర దృశ్యాలన్నీ కూడా ఒక వీడియో లాగా ఒక సినిమా లాగా ఒక నాటకం లాగా ఈ 27 మహాయుగాలు పాటు 7 మన్వంతరాలు పాటు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలా జరగదు. అలా ఉండదు. ఈ వీడియో రికార్డు దృశ్యాలన్నీ కూడా సర్వనాశనమై నేను పొందిన కపాల మోక్ష దృశ్యం మాత్రమే ఒక ఇమేజ్ గా మాత్రం కనపడుతుంది. ఎందుకంటే అంతిమ సాధన పరిసమాప్తి లో నేను కాస్త శూన్య బ్రహ్మగా కామగుణమునకు స్పందించడం వలన ఈ ఇమేజ్ మిగిలిపోయినది. అలాగే కాశీ క్షేత్రము నందు కపాలమోక్షం పొందటం వలన అప్పటిదాకా ఉన్న వీడియో రికార్డు దృశ్యాలు నాశనమయ్యాయి. అంటే నేను పరమశూన్యమునందు శూన్య బిందువు లేదా శూన్య బ్రహ్మగా  నిశ్చల స్థితిలో మిగిలిపోతాను అన్నమాట. కానీ శూన్యమునందు సంపూర్ణంగా లయము చెందను. అలాగని నాకు జననాలు మరణాలు ఉండవు. ఎందుకంటే ఈ విశ్వ సృష్టి యొక్క నిజంలాంటి కల యొక్క జీవ నాటకము నుండి నా పాత్ర తప్పుకున్నది కదా. నా పాత్ర లేని నాటకమే కొనసాగుతుంది అన్నమాట. ఇన్నాళ్ళు ఈ నాటకములో నా పాత్ర  ఉండేది కానీ నా సాధన వలన ఈ నాటకం నుండి ఈ పాత్ర తప్పుకోవడం జరిగింది. అంటే నా సాధన వృధా కాలేదు. ఈ నా జన్మ వృధా కాలేదు. నా సాధన సంపూర్ణంగా పరిసమాప్తియై సంపూర్ణ కపాలమోక్షం స్థితి పొందటం జరుగుతుంది. నా సాధన పరిసమాప్తి అంతిమ సందేశం ఏమిటంటే కేవలం మీరు కూడా మూడు పనులు చేస్తే చాలు. మీకు కూడా కపాలమోక్షం పొందినట్లే. ఏమిటంటే నిజమైన గండకి నది యొక్క విష్ణు సాలగ్రామమును పొందండి. రెండోది పంచముఖాలున్న పాంచజన్య శంఖం పొందండి. ప్రతిరోజు జలముతో విష్ణు సాలగ్రామమునకు అభిషేకము చేస్తూ పాంచజన్య శంఖముతో ఓంకారనాదం అభ్యాసం చేయండి. అప్పుడే కాశీక్షేత్రంలో స్వచ్ఛంద మరణం పొందే అర్హత యోగ్యత లభిస్తుంది.దానితో మీకు కపాలమోక్షం లభించినట్లే. కాకపోతే ఈ మూడు స్థితులు మీకు కలగాలంటే మీకు యోగం ఉండాలి. అనగా మీరు ఎవరియందు వేటియందు మోహ వ్యామోహాలు పడకుండా సహన శక్తి తో అచంచల భక్తి విశ్వాసాలతో ఓర్పుగా ఉండగలిగితే అదియే మీ నిజ సాధన అవుతుంది. ఎవరిదైనా ప్రేమ యందు మమకారాలు యందు మోహ వ్యామోహాలు పెంచుకుంటే అది కాస్తా మీకు మహా మాయ గానూ కర్మ బంధంగా మారి పునః జనన మరణాలకి అవుతుంది అని గ్రహించండి. ఈ మూడు స్థితిల వలనే కపాలమోక్షం స్థితి అనగా శూన్య బ్రహ్మ సాధన స్థితి కలుగుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అన్నప్పుడు మన నామరూప దైవాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 

మహా శివుడి దగ్గర ఓంకారం శంఖం అలాగే సుదర్శన చక్రము ఉన్నది.ఈయన కాశీ వాసియే గదా. ఈయన నుండి విష్ణుమూర్తి వరంగా సుదర్శన చక్రమును పొందినాడు అని లోకవిదితమే కదా. ఈయన కుడి చేతిలో సుదర్శన చక్రం అలాగే ఎడమ చేతిలో మహా పాంచజన్య శంఖం ఉన్నాయి. ఈయన కూడా కాశీలోని మణికర్ణికా ఘాట్ నిర్మితమని అక్కడ బిందుమాధవుడిగా ఉన్నాడని లోకవిదితమే కదా. దత్త స్వామికి, హనుమంతుడికి, దుర్గాదేవి కూడా సుదర్శన చక్రము- పాంచజన్య శంఖాలు ఉండటము… వీరంతా కూడా కాశీక్షేత్రం దైవాలుగా అక్కడ ఆవాసం చేయడం లోకవిదితమే కదా. అంతెందుకు. యోగసాధన అధిదేవత అయిన ఆనందనిలయవాసియైన సప్త యోగ చక్ర వాసియైన సప్త కొండల నివాసియైన  ఏడుకొండలస్వామి అయిన తిరుపతి వెంకటేశ్వర స్వామి చేతిలో సుదర్శన చక్రం కూడా అలాగే పాంచజన్య శంఖం ఉండటం మీరు గమనించే ఉంటారు కదా. ఈ లెక్కన చూస్తే మనం పూజించే నామదైవాలు కూడా ఈ రెండింటినీ కూడా పొంది శూన్యబ్రహ్మలుగా మారినప్పుడు వీటిని పొందితే మనము మారకుండా ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితముగా మారతాము గదా.అందుకు నిదర్శనమే ప్రత్యక్ష సాక్ష్యమే ఈ నా సాధన జీవితమైనా ఆత్మకథ అయిన ఈ కపాలమోక్షం గ్రంథమే కదా. ఈ గ్రంధం ద్వారా నేను కూడా ఈ మూడు స్థితులు పొంది ఉన్నాను. ఈ మూడు స్థితిలు నేను ఏ విధంగా సంపాదించినానో దానికి నేను ఏ విధంగా మాయలు మర్మాలు దాటానో మీరు ఈపాటికే తెలుసుకున్నారు కదా. కపాల మోక్షమును సాధన చేస్తే పొందవచ్చునని ఈ నా సాధన జీవితమే మీకు స్ఫూర్తి కావాలని ఈ అనుభవాలతో కూడిన సాధన ఆత్మ కథ అందుకు నిదర్శనం అని గ్రహించండి. సాధన సాధ్యతే సర్వం సాధ్యం.

నాకు కపాలమోక్షం అనేది రాబోవుకాలంలో గానీ కలుగదు. అప్పటిదాకా నాకు వచ్చిన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు ప్రతీక అయిన గండకీనది విష్ణు సాలగ్రామంతో పాటుగా అప్పటిదాగా నాకున్న వివిధ యోగ చక్రాల యందు వచ్చిన వివిధ దైవిక శిలలైన సాలగ్రామాలకి లింగాలకి పంచాయత వస్తువులకి జలముతో అభిషేకము చేస్తూ పాంచజన్య శంఖంతో ఓంకార నాద అభ్యాసం చేస్తూ నీలి ఆకాశం కేసి చూస్తూ శాశ్వత మరణ స్థితి అయిన కపాలమోక్ష ప్రాప్తి కోసము ప్రసన్న వదనముతో పరమ ప్రశాంత స్థితిలో సాక్షిభూతంగా ఆనంద రహితంగా అన్నిటి యందు స్థితప్రజ్ఞతగా స్పందన రాహిత్యంగా బ్రహ్మతదాకార స్థితిలో శూన్య బ్రహ్మ సాధన స్థాయిలో సాధన కొనసాగిస్తూ …..నా సాధన పరిసమాప్తి నాకు ఇలా ఉంటే అనగా శూన్య బ్రహ్మ స్థితిగా అంటే పరమశూన్యమునందు శూన్యం అవకుండా కేవలం సాక్షీభూతంగా నిశ్చలస్థితియైన శూన్య బ్రహ్మగా మిగిలిపోవడం మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసికి నచ్చలేదు. వాడు కూడా కాంతి బ్రహ్మ స్థాయికి చేరుకున్నాడు. శూన్య బ్రహ్మగా కాకుండా శూన్యములో కలిసి పోవాలని వాడిలో తపన మొదలైంది. దీనిని ఎలాగైనా సాధించాలని ఇదే అంతిమ సాధన స్థితి అని వారిలో ఏదో తెలియని కసి పట్టుదల మొదలైంది. ఇక దానితో నేనైతే శూన్య బ్రహ్మగా పరమ ప్రశాంతంగా ఉండి పోతాను. కావాలంటే శూన్యబిందువుగా అనగా శూన్యమునందు లయము అవ్వాలంటే శూన్యము అవ్వాలి అంటే దానికి నీకు నువ్వే ముందుకు వెళ్లాలని వాడికి నేను చెప్పి ఇంతటితో నేను నా సాధన ను శూన్యబ్రహ్మగా ఆగిపోవడం జరిగినది. ఎందుకంటే అరుణాచల రమణ మహర్షి మాటలు ప్రకారంగా చూస్తే ఎప్పుడైతే నువ్వు  పరమ ప్రశాంత స్థితికి నీ మనస్సు నీ తనువు చేరుతుందో అంతటితో నువ్వు అక్కడ ఆగిపోతే పరమ ప్రశాంత స్థితిని అనగా మోక్ష ప్రాప్తిని పొందుతారు అని చెప్పిన విషయం నాకు లీలగా గుర్తుకు రావడంతో ఆగి పోవడం జరిగినది. ఇలాంటి నామరూప దైవాలు అందరూ కూడా పరమ గురువులు అందరూ కూడా దేవభూమి అయిన హిమాలయాల యందు శూన్యబ్రహ్మల సాధన స్థాయికి చేరుకుని పరమ ప్రశాంత స్థితిలో ఉన్నారు.ఇలా వీరందరూ కూడా కారణము లేకుండా ఆగిపోరు కదా. ఆగిపోయారు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి కదా. లేకపోతే వీరంతా శూన్య బ్రహ్మ స్థాయి నుండి శూన్య బిందువుగా మారిపోయి పరమ శూన్యమునందు కలిసి పోయేవారు కదా. అలా కలిసి పోకుండా పరమాత్మ అనే శూన్య బ్రహ్మగా ఎందుకు ఉండి పోతారు అని నాకు స్పురణ కలిగింది. దానితో శూన్య బిందువుగా మారడము కన్నా శూన్య బ్రహ్మగానే మిగిలిపోవడము మంచిదనిపించింది. దానితో నేను కూడా శూన్య బ్రహ్మ సాధన స్థాయి దగ్గర ఆగి పోవడం జరిగినది. కానీ మన వాడైనా జిఙ్ఞాసికి  మాత్రం తాను శూన్య బిందువుగా మారితే వచ్చే కష్టనష్టాలు లేదా లాభం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచన మొదలైంది. దానితో అసలు సాధకులు శూన్య బిందువుగా మారకుండా ఎందుకు మిగిలిపోతున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేమిద్దరము దీనిమీద పరిశోధన చేయడం ఆరంభించాము. 

అప్పుడు మాకు శూన్య బిందువుగా మారాలి అంటే సాధకుడికి ఎడమ చేతిలో పట్టుకుని దక్షిణావృత శంఖం అలాగే  సుదర్శన చక్రాల మాల లేదా విష్ణు సాలగ్రామాల మాల రావాలని తెలుసుకున్నాము. దానితో ఈ 3 వస్తువులు ఎవరైనా పొందినారా అని తెలుసుకోవాలని నామరూప దైవాల మీద పరిశోధన చేయటం మొదలు పెట్టినాము. అప్పుడు కాని అసలు విషయం తెలియ రాలేదు. అదేమిటంటే వీరందరూ ఎడమ చేతిలో ఉంటే శంఖాలు అన్నీ కూడా కుడిచేతితో ఊదే దక్షిణావృత శంఖాలని తెలిసింది. అంటే వీరందరూ కూడా కుడిచేతి శంఖాలు ఎడమ చేతిలో పెట్టుకున్నారు అని తెలిసే సరికి మా బుర్రలు తిరగడం మొదలైంది. అంటే ఎడమ చేతితో ఊదే శంఖాలు లభించలేదని అర్థం అయినది.వామ్మో అనుకుని ఇంటర్నెట్ లో ఇలాంటి ఎడమచేతివాటం శంఖాలు  ఉన్నాయేమో అని వెతకడం ప్రారంభించాను. ఇక్కడ కూడా లభించలేదు. కనిపించలేదు. కేవలం కుడిచేతివాటం ఉన్న శంఖాలు మాత్రమే కనిపించాయి. ఎడమచేతి శంఖాలు అనగా దక్షిణావృత శంఖాలు ఉన్నాయి కానీ ఇవి ఊదటానికి రంద్రాలు లేవు. ఉన్న ఈ శంఖాలు కూడా పనికిరాకుండా పోయినాయి. దానితో ఎడమ చేతి వాటం శంఖాలు ఎవరి దగ్గర లేదా అని పరిశోధన చేస్తూ ఉండగా….
 

 మా దృష్టి యందు అనుకోకుండా ఆభరణాలు వస్త్రాలు లేని పాండురంగడి నగ్న విగ్రహమూర్తి మీద పడినది. విచిత్రముగా ఆయన చేతిలో ఎడమచేతి వాటం ఉన్న వామావృతం శంఖము పట్టుకొని కుడిచేతిలో తొడిమి ఉన్న సహస్ర కమల పద్మముని పట్టుకుని ఉన్నట్లుగా కనిపించేసరికి ఆనందానికి అంతులేదు.కారణం విశ్వ సృష్టిలో తప్పనిసరిగా ఎడమచేతితో ఊదే శంఖము ఉన్నదని మాకు అర్థమయింది. మరి ఈయన సాధన ఎందుకు పూర్తి కాలేదు అంటే వీరికి సుదర్శన చక్ర మాల రాలేదని గ్రహించాము. వీరికి మాలగా నడుముచుట్టూ బిల్వపత్ర మాల ఉన్నట్టుగా కనపడుతోంది. అలాగే చిదంబర దక్షిణామూర్తికి అయిన ఆకాశలింగం మూర్తికి కూడా బంగారు బిల్వ పత్రముల మాల ఉంటుంది. అంటే వీరిలో కొందరికి సుదర్శన మాల లభించక పోవడం వలన శూన్యబ్రహ్మలుగా మిగిలిపోయారని గ్రహించాము. శంఖాలు దొరికిన సాలగ్రామాల మాల దొరకలేదని తెలుసుకున్నాము. 

ఇదిలా ఉంటే 2016లో ఐదు కేజీల బంగారం 27 పెద్ద 2 సాలగ్రామాల మాలలు తిరుపతి వెంకటేశ్వర స్వామికి బహుమతిగా ఎవరో భక్తుడు ఇచ్చారని తెలుసుకున్నాము. మరి ఈయన ఎందుకు శూన్యబిందువు కాలేకపోయారు అని విచారణ చేస్తే వీరికి సుదర్శన మాలలు ఉన్నాయి కానీ ఎడమచేతితో ఊదే శంఖమునకు బదులుగా ఎడమ చేతిలో కుడి చేయితో ఊదే శంఖము లభించడం జరిగినదని నాకు అర్థమైనది.శంఖాలు వస్తే సుదర్శన మాల రావటం లేదు. సుదర్శన మాల వస్తే శంఖాలు రావటం లేదు. వారి సాధన స్థాయిశూన్య బ్రహ్మ దగ్గర ఆగిపోయినారని నాకు స్పురణ కలిగినది. ఈ విషయాలన్నీ కూడా మా జిఙ్ఞాసితో చెప్పేసరికి ఏడుపు మొదలు పెట్టినాడు. ఎందుకంటే వాడికి సాధన ఆరంభంలో శ్రీశైల క్షేత్రంనందు ఎడమచేతితో  ఊదే దక్షిణావృత శంఖం లభిస్తే దానిని మూడు సార్లు శంఖనాదం చేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడని తెలిసింది. అలాగే సాధన అంతిమ స్థితిలో ఉన్నప్పుడు అనుకోకుండా చార్ధామ్ యాత్ర చేయడం వలన ఆపై ముక్తినాథ్ క్షేత్రం వెళితే అక్కడ వీడికి ఒక సాధువు కనిపించి 12 సుదర్శన చక్రాలు మాల ఉన్న 7000/- అమ్ముతానని వీడికి ఇవ్వటం వీడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా దీనిని కొనకుండా వెనక్కి తిరిగి రావడం జరిగిందని… తనకి రెండు వస్తువులు కూడా లభించాయని కానీ తనకున్న అవివేకబుద్ధి వలన తనకున్న అవివేకం వలన వాటిని జారవిడుచుకున్నానని…. లేదంటే శూన్యబ్రహ్మగా కాకుండా శూన్యబిందువుగా ఈ పాటికే ఈ పరిశోధన బట్టి చూస్తే ఈ రెండు దైవిక వస్తువులు ఉంటే మారిపోయే వాడిని కదా అని ఏడుపు అందుకున్నాడు. నిజమే కదా. ఈ రెండు వస్తువులు పొంది ఉంటే కథ మరోలాగా ఉండేది. అందుకు నేను మౌనం వహించాను. ఏందుకంటే అపుడికే నా దగ్గరికి మహాశంఖము అలాగే ఈ మధ్యనే సుదర్శన శాలిగ్రామమాల వచ్చినాయని మీరు తెలుసుకున్నారు గదా!అసలు ఈ విశ్వంలో ఈ దైవిక వస్తువులు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని గ్రంథాలు పుస్తకాలు తిరగేస్తుంటే మా ఇద్దరికి మార్కండేయుడు జీవిత చరిత్ర గ్రంథం లభించినది. అందులో ఈయన కూడా కల్పాంతమందు జరిగే జలప్రళయానికి గురి అవుతాడు. సముద్రంలో తానొక్కడే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మునకలు వేస్తూ పైకి తేలుతూ వుంటాడు. తన చుట్టూ నీళ్లు తప్ప మరి ఏ ఇతర వస్తువు గాని జీవి గాని లేదని తను ఒక్కడే ఉన్నాను అని ఙ్ఞాన స్పురణ కలగడంతో భయంతో ఆవేదనతో ఆర్తితో బాధగా అరుస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు మహాసముద్రంలో మునకలు వేస్తూ గడుపుతుంటాడు. చిట్టచివరికి ఈయనికి అంతిమంగా వటపత్ర శాయి బాలకృష్ణుడు ఒక రావి ఆకు మీద పడుకుని ఉన్నట్లుగా కనిపించడంతో వెంటనే తనని రక్షించమని అడగడంతో ఈయన వెంటనే వీరిని తన శ్వాస ద్వారా తన శరీరం లోపలికి తీసుకొని తీసుకోవడం ఏకకాలంలో జరిగిపోతాయి. అపుడు శ్రీబాలకృష్ణుడు కడుపు లోనికి వెళ్లిన మార్కండేయుడికి లోపల ఉన్న అనేక కోట్ల కోట్ల భువన మండలాలలో ఒక బ్రహ్మాండంలోని భూమి యందు తను ఆవాసము చేసిన ఆశ్రమం కనిపించేసరికి తిరిగి ఆయన తన ఆశ్రమంలోనికి చేరుకోవడం జరిగిందని ఈ కథాంశం. అంటే ఈ లెక్కన చూస్తే శూన్యబిందువు అనేది ఒక ఊబి. దానిలో పడి మునిగిపోకుండా 12 సంవత్సరాలపాటు ప్రాణాలతో సహనంగా ఓర్పుగా నేర్పుగా ఈ ఊబి ఒడ్డును పట్టుకుని ఉంటే కానీ ఆ సాధకుడు శూన్యబిందువుగా మారడు. అప్పుడే గానీ శూన్యములో కలవడు. ఒకవేళ ఊబిలో కూరుకుని ప్రాణాలు పోతే తిరిగి పునర్జన్మ పొందే అవకాశాలు ఉన్నాయి.లేదంటే తట్టుకోలేక పోతే ఊబి నుండి బయటపడవేయటానికి శూన్య బ్రహ్మగా పాండురంగడు ఉంటాడు. బయట పడితే యధావిధిగా శూన్య బ్రహ్మ పదవి ఉండనే ఉంటుంది కదా. అదే ఇందులో కూరుకునిపోతే ప్రమాదం అని పునర్జన్మ కలుగుతాయని లేదా ఊబిలో ప్రాణాలతో పాటు 12 సంవత్సరాలు ఉండగలిగితే అనగా కోటి 20 లక్షల సంవత్సరాల పాటు అనగా ఒక మన్వంతర కాలం పాటు ఉండే గాని శూన్యబిందువుగా మారలేడని నాకు స్పురణ కలిగినది. అప్పుడే గాని శూన్యములో కలిసిపోడు. మరి అప్పటి దాక ఊబి వంటి శూన్య బిందువులో ఉండటం ఎన్నటికీ సాధ్యం కాదని నామరూప దైవాలు తెలుసుకుని అలాగే పరమ గురువులు తెలుసుకుని అయితే రాజు లేదంటే సేవకుడు అనగా అయితే శూన్యములో కలిసిపోవడం లేదంటే జీవాత్మ కు మారే ప్రమాదం ఉన్నదని గ్రహించడంతో కాబట్టి శూన్య బ్రహ్మగా పరమాత్మగా ఆగిపోవడం మంచిదని గ్రహించడంతో వీరంతా విశ్వాత్మ గా మారి శూన్యములో కలిసిపోకుండా మిగిలిపోయినారని నాకు స్పురణ అవటంతో ఇదే విషయం మన జిఙ్ఞాసికి చెప్పడంతో అప్పుడు వాడు తన చేతి సంచిలో నుంచి తనకి మళ్ళీ కన్యాకుమారి క్షేత్రం నుండి వచ్చిన ఎడమచేతితో ఊదే శంఖమును అలాగే గండకీ నది నుండి వచ్చిన సుదర్శన చక్రం మాలను మరియు సుదర్శన సాలగ్రామాలు బయటకు తీస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది.అంటే తనకి ఈ వస్తువులు వచ్చినా కూడా తను శూన్య బిందువు అనే ఊబిలో పడకుండా ఈ ఊబి ఒడ్డున  శూన్య బ్రహ్మగా సాక్షీభూతంగా బ్రహ్మ తదాకార స్థితిలో ఆనంద రహితముగా స్థితప్రజ్ఞత గా ఉండిపోవాలని కృతనిశ్చయంతో ఉన్నాడని నాకు అర్థమైనది. ఇలా వచ్చిన ఈ వస్తువులను తన అంతిమ కాలంలో తన ఆవాస క్షేత్రమైన కాశీ యందు నిమజ్జనం చేయాలని అలాగే మా ఇద్దరి శరీరాలు కూడా ఈ నదిలో నిమజ్జనం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. దానితో ఇప్పటికే 32 కపాలాలు విభేదనము జరిగి ఇక కాశీక్షేత్రం మరణంతో మిగిలిన మూడు విభేదనము అవడంతో మొత్తము 35 కపాలాలు విభేదనము చెంది శూన్య బ్రహ్మగా ఆకాశ శరీరముతో త్రస్యరేణువు పరిమాణములో ఏక మూల కపాలముగా బ్రహ్మకపాలం మిగిలిపోవడంతో మా ఇద్దరిలోను ఇదే జరుగుతుందని గ్రహించాము. కాబట్టి మీరందరూ కూడా మీ మనస్సు మీ తనువు కూడా పరమ ప్రశాంతత స్థితి పొందితే అంతటితో మీరు శూన్య బ్రహ్మ సాధన స్థాయికి వచ్చినట్లేనని అంతటితో శాశ్వతముగా అక్కడే శూన్యముగా దైవాలుగా పరమ గురువులు గా అందరికి లాగా మాకు లాగా మీరు కూడా ఆగిపోతారని తద్వారా పరమ ప్రశాంతత అనే కపాలమోక్షం స్థితిని పొందుతారు అని ఆశిస్తూ ఆశీర్వాదం ఇస్తూ ఆశీర్వదిస్తూ.. సాధన సాధ్యతే సర్వం సాధ్యం.
 
నేనేమో శూన్యబిందువు వద్ద శూన్య బ్రహ్మగా సాధన స్థాయిలో 33వ బ్రహ్మకపాలం చూపించిన కామగుణ దృశ్యాలు ప్రపంచమునకు స్పందించడంతో వెయ్యిమంది బ్రహ్మల్లో 477 వ శబ్దబ్రహ్మగా మిగిలిపోవడం జరిగితే అదే జిజ్ఞాసి అయితే తన 33వ బ్రహ్మకపాలం చూపించిన సంపూర్ణ జ్ఞాన దృశ్య ప్రపంచమునకు స్పందించడంతో 480 కాంతిబ్రహ్మగా మిగిలిపోవడం జరిగినది. ఇదంతా కూడా గత జన్మలో కోట్ల కోట్ల సంవత్సరాల నుండి జరుగుతున్న రికార్డు దృశ్యమే. ప్రతిసారి మేమిద్దరమూ శబ్దబ్రహ్మ గాను వాడు కాస్త కాంతి బ్రహ్మ గాను మిగిలిపోతూనే వస్తున్నాము కానీ ఈ ఈ సారీ ఈ జన్మ సాధన వలన అంతిమ సాధన స్థితియైన బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలములో మేము ప్రవేశించి శూన్య బ్రహ్మలు కాస్తా శూన్య బిందువు నందు సంపూర్ణముగా మా పంచ శరీరాలను తునాతునకలు చేసుకుంటూ అందులో లయము చేయడం జరిగినది కాకపోతే శూన్య బిందువుగా మారవలసిన మేము శూన్య  బిందువులలో శూన్య బ్రహ్మగా త్రస్యరేణువు  పరిమాణములో లయము చెందడం జరిగింది అని గ్రహించండి. అంటే మేము శూన్యములో శూన్య  బిందువుగా అనగా నేనేమో ఙ్ఞాన శూన్య బ్రహ్మగా ను మన వాడేమో ఙ్ఞానమును పంచే శూన్య బ్రహ్మగా పరమ శూన్యములోని శూన్యం బిందువులో ఉన్నామని గ్రహించండి. కాకపోతే మేమిద్దరం కూడా శూన్య బిందువులో శూన్య బ్రహ్మలగా ఉన్నాము గాని శూన్యము కాలేక పోయాము. అయి ఉంటే కథ మరోలా ఉండేది. అవకాశం ఉన్నా కూడా మేము సాహసం చేయలేక పోయాము. ఎందుకంటే జయం పొందితే శూన్యము అవుతాము. లేదు అంటే అపస్మారక స్థితి పొంది మాయా స్వరూప జీవాత్మ అవుతాము. కథ మళ్లీ మొదటికి వస్తుంది.ఈ భయము వలనే 36 మంది శూన్య బ్రహ్మలు అనగా 36 కోట్ల దైవ స్వరూపాలుగా ఉన్నారు. వీరిలో మేము కూడా ఉన్నాము కాకపోతే వారి రికార్డు దృశ్యాలు తిరుగుతాయి. ఇకనుండి మావి తిరగవు అంటే మేము కాస్త కృష్ణ బిలములాగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకు అంతరించిపోతోంది. ఎలా అంటే మిగిలిన వారంతా కూడా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం బయట ఉంటే నేనిన్నాళ్ళూ అలాగే బయట ఉండి ప్రస్తుతం సాధన జన్మలో ఈ కృష్ణబిలం నందు  ప్రవేశించి మా నాలుగు సాధన శరీరాలను 32 కపాలాలను నాశనం చేసుకుని శూన్య బిందువు నందు త్రస్యరేణువు పరిమాణంలో నాలుగు కపాలాలు ఉన్న ఆకాశ శరీరముతో నిశ్చల స్థితిలో ఉండి పోయినాము. బ్రతికున్న శవంలాగా మారిపోయాము. అంటే మా కృష్ణ బిలము నందు ఈ స్థితి అంతరించిపోయే దాకా ఈ స్థితి ఉంటుంది. దీనికి 10 లక్షలబిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ ఇలా 11 బిలియన్ కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాకపోతే మా రికార్డు దృశ్యాలు రికార్డ్ విషయాలు అంతరించిపోయాయి. మా నాలుగు శరీరాలు అంతరించిపోయాయి. 36 కపాలాలలో 32 కపాలాలు అంతరించిపోయాయి. నా ఒక ఆకాశ శరీరం కూడా బ్రతికున్న శవమై మరణించిన స్థితి పొందినది. ఉన్నా లేనట్లే. ఎందుకంటే వాడు కోమాలో ఉన్న వాడు ఎప్పటికైనా మరణము పొందుతాడు కదా. అప్పటిదాకా వాడు బ్రతికున్నశవమే కదా.మా సాధన ప్రస్తుత పరిస్థితి కృష్ణబిలం అంతరించి నట్లుగా ఇప్పుడు మేము రాబోవు కాలంలో కూడా తప్పకుండా అంతరించి పోతాము. అప్పటిదాకా మేము ఉన్నా లేనట్లే.చచ్చిన పామును చూసి పాము బతికే ఉన్నది అని అనుకోవడమే ప్రస్తుత మా ఇద్దరి సాధన జీవితాలని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఇంతకి “నేను ఏవరిని” అనే సందేహము నాకు కల్గినది. మరి దీని సమాధానము మీరు తెలుసుకోవాలని ఉందా? అయితే దానికి మీరు ఏమి చెయ్యాలో మీకు తెలిసు గదా! 

శుభంభూయాత్
పరమహంస పవనానంద
****************************

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. స్వామీ తమరి చరవాణి తెలియజేయగలరని విన్నవించుకుంటున్నాను.

    భట్టాచార్య

    రిప్లయితొలగించండి