బ్రహ్మరంధ్ర అనుభవాలు(134)

 బ్రహ్మరంధ్ర సాధన అనుభవాలు


శివ నందిని కాస్త తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండటం అభ్యాసం చేయడం మొదలుపెట్టింది. మూడు గంటల నుండి 12 గంటల స్థితికి రావడం జరిగింది.  ఒకరోజు ఈ ధ్యాన అభ్యాస స్థితిలో 12 గంటలు ఉండేసరికి…. శివనందిని కాస్త ధ్యానదృశ్యం చూడటం జరిగింది. మొదట ధ్యానంలో ధ్యాన దృశ్యముగా…. ఏదో గాఢాంధకార శూన్యములాగా కనిపించింది.  చుట్టూ చీకటిలాగా ఉంది.  చెప్పటానికి అది థార్ ఎడారి లాగా….ఎవరూ లేకుండా….. తను మాత్రమే ఉండి…. దట్టమైన చీకటి ఉంటే ఎలా ఉంటుందో….అలా గాఢాంధకార చీకటి స్థితి ఉన్నట్టుగా అనిపించింది.  అండపిండ బ్రహ్మాండాలు కానీ…. గ్రహ స్థితులు గాని…. నక్షత్ర మండలాలు కానీ….. ఇవేవీ ఉన్నట్లుగా గానీ ….ఉనికి ఉండి లేనట్లుగా అనుభూతి పొందసాగింది.  అలా తను ధ్యాననిష్టలో ఉండేసరికి…..ఒక చిన్న ఎరుపు రంగు వర్ణంలో ఉన్న ఎర్రటి కాంతి బిందువు…. అతి చిన్న పరిమాణంలో…. జ్యోతి కాంతి లాగా కనపడసాగింది.  సరే అని తను ధ్యాననిష్ఠలో అలా ఉంటూ ఉండేసరికి…. చిన్న జ్యోతి బిందువు కాస్త తన దగ్గరికి వస్తున్నట్లుగా అనిపించసాగింది. నిజానికి…. తన దగ్గరికి ఆ జ్యోతి బిందువు రావడం లేదని, తనే ఆ జ్యోతి బిందువు దగ్గరికి మనో శరీరంతో వెళుతుందని శివ నందినీకి కాస్త అవగాహన అయింది. అలా వెళుతూ ఉండేసరికి ……అది చిన్న జ్యోతి బిందువు కాదని…. పూర్ణ జ్యోతి బిందువు అని…. స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి లోపలకి వెళ్ళటానికి అవకాశం ఉన్నట్టుగా అనిపించడంతో….. మనో శరీరంతో శివ నందిని ప్రవేశించడం జరిగింది. ఈ చితాగ్ని లోపల, కాలుతున్న అగ్ని కపాలదర్శనం కనిపించింది. అప్పుడు పరమహంస గారి ధ్యాన అనుభవాలలో ఇలాంటి అగ్ని కపాలదర్శనం ఎప్పుడైతే మొదలవుతుందో….. అప్పుడు బ్రహ్మ రంధ్రం ప్రవేశానికి అర్హత వచ్చినట్లుగా బ్రహ్మ రంధ్ర చక్రంలో బ్రహ్మదేవుడి కపాల దర్శనం అగ్ని రూపకపాల దర్శనం అవుతుందని…స్పురణ …. శివ నందినికి  అర్థం అవ్వటంతో…. ఈ కపాలం లోపలికి ప్రవేశించేసరికి…. లోపల మొదట త్రిమాతల దర్శనం కనిపించింది.  ఒకవైపు మహాలక్ష్మి, మరొకవైపు సరస్వతి మధ్యలో దుర్గాదేవి ఉన్నట్లుగా ఒకే శరీరానికి మూడు తలలతో త్రిమాతలు కనిపించారు.  వీళ్ళని దాటుకుంటూ లోపలికి వెళ్లేసరికి….. ఏక శరీరంతో, మూడు తలలతో దత్తాత్రేయుడిగా త్రిమూర్తుల దర్శనం కనిపించింది.  వీళ్ళు కదలలేదు…. మెదలలేదు.  సరే అని వీళ్ళని కూడా దాటుకొని….లోపలికి వెళితే, ఒక మానవ కపాల దర్శనం అయ్యింది.  అది ఈ జన్మ యొక్క తన మూల శరీరం యొక్క కపాల దర్శనం అని శివనందినికి అనుభవం అవుతూ ఉండేసరికి…. దీని నోటి నుండి రక్తపు ముద్దలు బయటకు వచ్చేసరికి….. వాటిని చూసి ఇది పునః జన్మకి తీసుకువెళ్లే స్థితి.  దీనిని చూసి భయపడకూడదు, బాధపడకూడదు, ఆలోచించకూడదు అని చెప్పేసి శివ నందిని ఏం జరుగుతుందా!  అని  క్షణకాలం పాటు ఆలోచిస్తూ ఉండేసరికి….. దీనిపైన ఒక చితాగ్ని ఉన్నట్టుగా దర్శనం అయ్యేసరికి…. సరే అని దీని లోపలికి వెళుతూ ఉండేసరికి….. చితాగ్ని శక్తితో శక్తి స్వరూపిణిగా ఉన్న చండీమాత దర్శనం అయ్యింది. ఈవిడ ఎనిమిది చేతులతోనూ, ఒక చేతిలో కపాలము, ఒక చేతిలో ప్రేత శరీరంతో కనపడుతూ ఉండేసరికి…. ఈమె చేతిలో ఉన్న కపాలం కాస్త స్పష్టంగా కనబడుతూ…. దీని నోటి నుండి మాంసపు ముద్దలు రావడం… దీనికి ఉన్న బ్రహ్మరంధ్ర దర్శనమును దాటి లోపలికి ప్రవేశిస్తే….. బ్రహ్మరంధ్రగుహ దర్శనం అయ్యింది.  ఈ బ్రహ్మ రంధ్ర గుహలో ధ్యాననిష్టలో ఉండి ఏక మూల కపాలధారి కనిపించారు. పద్మాసనంలోనే ఈయన జీవ సమాధి అయినట్టు ఉన్నాడు…. ఇది స్త్రీ అస్థిపంజరమా లేదా పురుష అస్థిపంజరమా అని అనుకుంటూ ఉండేసరికి…. ఉన్నట్టుండి అస్థిపంజరం కాస్త స్త్రీమూర్తి స్వరూపిణిగా…. ఆదిపరాశక్తిగా…. పద్మాసనం వేసుకుని ధ్యాననిష్టలో ఉండేసరికి…. తను పురుష ప్రకృతిలో ఉండటం వలన…. అమ్మవారు స్త్రీ మూర్తిగా దర్శనమిచ్చి ఉంటుంది.  అదే పరమహంస గారికి ధ్యానానుభవం ప్రకారంగా చూస్తే….. తనకి కనపడిన మూల అస్థిపంజరం కాస్త…. పురుషుడి రూపం అని చెప్పేసి స్పురణ అందడంతో…. ఈ ఆదిపరాశక్తి శరీరానికి ఉన్నట్టుండి 1,2,4,6,8,10, 12, 14, 16 ,18, 20 ఇలా 11 వరసల్లో 108 తలలతో ఉన్న శరీర రూపధారిగా కనిపించేసరికి…. ఆ తర్వాత కొద్ది క్షణాలకి తలలు కాస్త కపాలాలుగా కనిపించేసరికి…. ఆ కపాలాలు కాస్త చివరికి 1, 2, 4 కపాలధారిగా అంటే…. ఏడు కపాలధారిగా కనిపించేసరికి… అంటే మిగతా శరీరాలు అనగా స్థూల ,సూక్ష్మ ,కారణ, వాయు ఆకాశ ,ఆత్మ ,సంకల్ప, జ్యోతి మోక్షాలు పొందడం వలన…. మిగిలిన కపాలాలన్నీ కూడా అదృశ్యం అయినాయి అని చెప్పి…. ఇంకా మనో, పిండ, లింగ దేహము మోక్షం పొందాలి కాబట్టి…. ఈ ఏడు కపాలాలు ఉన్నాయని  ఈ కపాల దర్శనం ముందు ఒక గోముఖ నీటి కుంట ఉండటం శివ నందిని గ్రహిస్తూ…. ఈ కపాల దర్శనం చూస్తూ ఉండగానే….  శివ నందినికి ధ్యానభంగం అయింది. అప్పుడు సమయం చూస్తే, సుమారుగా 12 గంటల పాటు ధ్యాననిష్టలో ఉండి ఈ ధ్యానానుభవం చూడటం జరిగింది అని….  శివ నందినికి అర్థం అయింది.  తనకి కలిగిన ఈ బ్రహ్మ రంధ్ర ధ్యాన అనుభవం గురించి శివస్వామికి చెప్పేసరికి…. 


శివ స్వామి:- అయితే నువ్వు ధ్యాననిష్టలో 12 నుండి 16 గంటల వరకు ఉంటేనే…. ఇలాంటి ధ్యాన అనుభవం అవుతుంది. నిజరూప కపాల దర్శనం అయ్యింది. ఇప్పటిదాకా నీకు దత్తాత్రేయుడి వలన కపాల దర్శనం అయ్యింది.


శివ నందిని:- అవునా?  నాకు శరీర మోక్షమప్పుడు ఈ జ్ఞానమును ఇవ్వటానికి అని…. తాత్కాలికంగా నీకు బ్రహ్మరంధ్ర గుహలో ఉండే కపాలధారి యొక్క దర్శనం చూపిస్తానని ఆనాడే చెప్పడం జరిగింది.  


నిజానికి ఏకాదశ దేహాలు మోక్షం పొందాలి అంటే….. ఏకాదశ జన్మలు ఎత్తాల్సి వస్తుందని…. ఆ జన్మలు ఎత్తేటప్పుడు మళ్ళీ పునః జన్మల మాయలో పడే ప్రమాదం ఉంది కాబట్టి…. ఈ జన్మలోనే నువ్వు అన్ని రకాల శరీరాల మోక్షాలను పొందాలి.  ఈ మోక్షమును పొందామని అనుభవ అనుభూతి పొందాలంటే… కపాల ధారి యొక్క ఆ శరీరాలు శూన్యం అవుతుంటేనే ….నీ మనసు, శరీరం, బుద్ధి, ఆత్మ ,అనుభవ అనుభూతిని పొంది నమ్ముతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానితో నాకు ఇప్పటిదాకా స్థూల శరీరం నుంచి జ్యోతి శరీరం దాకా మోక్షాలు పొందినాయని ప్రత్యక్ష అనుభవం అనుభూతి పొందడంతో…. ఇవన్నీ కూడా నమ్మడం జరిగింది. ఇంకా ఏడు కపాలాలలో నాలుగు కపాలాలు మానవదేహానికి సంబంధించినవి అయితే…. రెండు కపాలాలు పిండదేహం ఏకకపాలం,  లింగ దేహం అని నాకు అవగాహన కలిగింది.


శివస్వామి:-  మంచిది. ఈ మనో శరీరం నీకు దర్శనం అయ్యేదాకా….. దాంట్లో ఉన్న త్రిమాయలు నశించేదాకా….. నీకు ఆ మూడు రకాల మోక్ష జీవులు నశించేదాకా ఈ 21 రోజుల ధ్యానస్థితికి నీ సాధనకి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు.


శివ నందిని:- స్వామి!  ఈ త్రిమాయలు ఏ విధంగా ఉంటాయి.  మళ్లీ వాటి గురించి మీరు చెప్పలేదు…


శివస్వామి:- నీకు సాధన అనుభవంలోనే నీకే అర్థమవుతుంది.  నీ వ్యక్తిగత శరీరానికి సంబంధించినది అవుతుంది.  ఇక్కడ త్రివిధ మాయలు ఖచ్చితంగా ఇవే అని చెప్పలేము.  కొంతమందికి ఏకాగ్రత ,ఆనందం, భయం కలిగితే…… మరి కొంతమందికి తపన, తాపత్రయాలు ,కుతూహలం కలుగుతాయి.  మరి కొంతమందికి తెలుసుకోవాలి, అనుభవ అనుభూతి పొందాలి అని చెప్పి ఉంటుంది. మరికొందరికి తెలియాలి, తెలియచేయాలి అని మాయలు ఉంటాయి. ఏవైనా గాని మూడు మాయలు ఉంటాయి.  కొందరికి వచ్చేసరికి గర్వం, అహంకారం, అహం అని మూడు మాయలు వస్తాయి.  మరికొంతమందికి ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అని చెప్పేసి మూడు స్థితులు వస్తాయి.  ఇక్కడ ఏంటి అంటే…. యద్భావం తత్పవతి అన్నట్టుగా త్రిమాయలు మన యొక్క కారణ శరీర స్థితిని బట్టి…..కోరికను బట్టి…..కారణ కోరిక కర్మను బట్టి….. మనకి అంతిమంగా ఈ మూడు మాయలు వస్తాయి. ఎప్పుడైతే ఈ మూడు మాయలు దాటావో ……మాయా రహిత స్థితికి తిరిగి చేరుకోవడం జరుగుతుంది.  పిండదేహానికి, లింగ దేహానికి ఇంక  ఎలాంటి మాయలు ఉండవు.  ఏ స్థితులు ఉండవు.  అక్కడ ద్వైత స్థితి అనేది ఉండదు.  ఏకత్వస్థితి ఏక భావ స్థితి ఉంటుంది.  దానిని దాటుకొని నువ్వు సాధన పరిసమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది.  ముందు నువ్వు నీ మనో శరీరం దాకా సాధనను కొనసాగించు…. 


అనేసరికి సరే అని శివ నందిని కాస్త ధ్యాననిష్టలోకి వెళ్లడం జరిగింది. 


ఇంతలో రుద్రస్వామి కాస్త శివ స్వామితో…


రుద్ర స్వామి:- స్వామి!  మరి మా సాధన పరిస్థితి ఏమిటి? మేము ఇంక ఖాళీగా ఉండటమేనా!  మా జ్యోతి శరీర కపాలమోక్షం పొందినట్లు అనుభవం అరుణాచలంలో అయ్యింది.  మరి మా మనో శరీర సాధనా పరిస్థితి ఏమిటో మాకు అర్థం కావట్లేదు.


శివస్వామి:- మీకు కూడా త్రివిధ మాయలు ఏమైనా వచ్చినాయా? 


శివ నందిని:- ఈ మాయలు ,మర్మాలు మాకు ఏమీ తెలియదు.  వచ్చామో రాలేదో కూడా తెలియదు.  దాటేమో లేదో కూడా తెలియదు.


శివస్వామి:- సరే మీరందరూ ధ్యాననిష్టలో కూర్చోండి.  బ్రహ్మ గుహ యందు కపాల దర్శనం అవుతాడు కదా!  మీ సాధన పరంగా మూడవ స్థితిలోని కపాలాలు మిగిలితే…. మీకు మనో శరీరం ఉన్నట్లే …


అనేసరికి పిల్లలు పెద్దలు కాస్త ధ్యాననిష్ఠలో ఉండేసరికి…. వాళ్లకి కపాల దర్శనంలో మనో శరీరం యొక్క కపాలాలు మోక్షం పొందలేదు అని చెప్పేసి అనుభవ అనుభూతి పొందడంతో….కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకు వచ్చి… స్వామి మాకు మనో శరీరం మోక్షం పొందలేదు అని అర్థం అయింది.  మూలాధార చక్రంలో స్థూల శరీరం నుంచి జ్యోతి శరీరం వరకు కపాలాలు అన్నీ కూడా క్షణకాలంలోనే దర్శనం అవ్వడంతోనే కపాల విభేదనం జరిగి….. శూన్యంలో శూన్యం అవ్వడం జరిగింది.  కానీ ఈ మూడు కపాలాలు మాత్రం విభేదన అవటం లేదు. 


శివస్వామి:- అంటే ఈ మూడు మాయలు మీరు దాటవలసి ఉంటుంది.  ఆ మూడు మాయలు ఎవరికి వారికే  వ్యక్తిగతంగా ఉంటాయి.  వాటిని మీరు దాటుకొని రండి.  సాధన చేయండి.  మీకు విషయం ఏమిటి అనేది అర్థం అవుతుంది.


రుద్రస్వామి:- మాకు ఉన్న ఏకైక కోరిక దక్షిణామూర్తిని సజీవమూర్తిగా చూడాలని కదా! 


శివస్వామి:-  అది మీ పిండ దేహంలో జీవాత్మ మాయ ,శివుడు చేత దహనం చేసుకుంటే గాని మీరు శివోహం స్థితికి రాలేరు. దక్షిణామూర్తిని చూడగలిగే అర్హత వస్తుందని చెప్పేసి ఆటవిక నాయకుడు చెప్పకనే చెప్పాడు కదా!


రుద్రస్వామి:- అవును స్వామి!  చెప్పాడు.ఇప్పుడు మా మనో శరీరం మోక్షం పొందితే పిండదేహం మోక్షానికి అర్హత వస్తుంది. అప్పుడు శివుని చేత దహనం అయితే….. మాకు సజీవ దక్షిణామూర్తి దర్శనం ఇస్తాడు  ….అర్థం అయ్యింది స్వామి.  ఈ విషయం తెలిసింది.  ఇక మేము కూడా ధ్యానంలో ఉంటాము…


మహాదేవి:-  స్వామి!  ఇప్పుడు మేము కూడా 21 రోజులు ధ్యాననిష్టలో ఉండే స్థితికి రావాలా? 


శివస్వామి:-మీరు దాని గురించి ఏమీ సాధన చేయాల్సిన అవసరం లేదు.  మొదట మీరు త్రిమాయలను దాటుకోండి.  మీ మనో శరీరం మోక్షం పొందిందని అనుభవ అనుభూతి పొందండి.  ఆ తర్వాత పిండదేహ సాధనలోకి వెళ్ళండి.  అది కూడా మోక్షం శివుడి చేతుల మీదుగా దహనం అయ్యిందని….. అనుభవ అనుభూతిని పొందండి.  అప్పుడు మీకు రావలసింది…. ఏం జరగాలి?  ఏంటి?  అనేది ప్రకృతి నిర్ణయం చేస్తుంది. మీరు అప్పటికే 21 రోజులు సాధనాస్థితికి వచ్చేస్తారు . శివ నందినికి వచ్చే మోక్ష అనుభవాలు ఆఖరిగా అందరం కూడా కలిసి పొందడం జరుగుతుందని…. కాకపోతే మీరు స్థిర మనస్సు, స్థిర నిశ్చల స్థితిని పొందటానికి అర్హత, యోగ్యత, యోగం ఏనాడో పొందడం జరిగింది.  కాకపోతే మీరు పూర్ణ మోక్షం పొందినప్పటికీ…. మనో శరీరం నమ్మకపోవటం వలన…. అది మిగిలిపోవడం జరిగింది.  ఆ నమ్మకాన్ని మీరు సాధన చేసి అనుభవం అనుభూతి పొందితే నలుగురు కూడా మోక్షం పొందడం జరుగుతుంది.  అనుభవ అనుభూతి పొందే స్థితికి వస్తే…. మీది సాధన పరిసమాప్తి అయినట్లే.  మీ మోక్షం విశ్వమోక్షం అవుతుందా!  వ్యక్తిగత మోక్షం అవుతుందా!  అనేది పక్కన పెట్టేయండి.  మోక్షమును పొందిన విషయం అంతిమంగా మోక్షానుభవం పొందవలసి ఉంటుంది.  మీరు ఎప్పుడో చనిపోయారు.  మీ మరణం మోక్షమరణం అయ్యింది.  కానీ మీ మనో శరీరం అనుమాన భయం పెట్టుకోవడంతో….నమ్మకపోవడం వలన పునర్జన్మగా ఈ జన్మ ఎత్తటం జరిగిందని నాకు అర్థం అవుతుంది.  కాబట్టి మీ మనో శరీరమునకు ఉన్న ఈ త్రిమాయలు దాటి పిండదేహానికి రండి.  ఈ పిండదేహం అయిన తరువాత…. అప్పుడు లింగ దేహానికి వచ్చినప్పుడు మనమంతా కలిసి… ఒకే స్థితికి వచ్చి ఏం జరిగింది…. ఏంటి? అనేది మనో శరీరంతో చూడగలిగే స్థితికి వస్తాము.  కాబట్టి ఇక్కడ మానవ శరీరానికి ఉన్న మాయలు దాటాల్సి వస్తుంది. 


అర్థమయింది అని శివ స్వామికి కృతజ్ఞతలు చెప్పి ఎవరికి వాళ్లే ధ్యాననిష్టలోకి వెళ్లడం జరిగింది. 


ఎప్పుడైతే శివ నందిని ధ్యాననిష్ట ఒకరోజుకు చేరుకుందో…. ధ్యాన దృశ్యంగా టెంపుల్ రన్ ఆట మొదలైంది.  అంటే ధ్యానస్థితిలో ఉండగా …. మొదట ధ్యానంలో….గాఢాంధకారంలో చిన్న జ్యోతి బిందువు కనిపించడం….. ఆ జ్యోతి బిందువు లోపల కపాలదర్శనం….. అలా చూసిన వాటినే మళ్లీ రూపాలు చూసుకుంటూ…. బ్రహ్మరంధ్ర గుహలోనికి ప్రవేశించడం…. ఈసారి విచిత్రంగా 64 తలలు ఉన్న బ్రహ్మకపాల ధారి కనిపించేసరికి శివ నందినికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి…. నిజానికి 108 కపాలాలు కనిపించాలి కదా! 64 కపాలాలే కనిపించాయి… అనుకుంటూ ఉండేసరికి…. పరమహంస గారి ధ్యానానుభవం గుర్తుకు వచ్చింది.  భౌతిక నేత్రాలు 37 కపాలాలు మాత్రమే చూస్తే….. మనోనేత్రం 64 కపాలాలు మాత్రమే చూడడం జరుగుతుందని ఈ 64 కపాలాలలో ఉన్న లోకాలను మనోనేత్రంతో చూసే అవకాశం ఉంటుందని…. ఒక్కో శిరస్సులో ఒక్కో లోకం చూసుకుంటూ వెళ్ళటం….ఎప్పుడైతే లోక దర్శనం అయ్యిందో ఆ శిరస్సుకాస్త ఆలోకంలో ఉన్న మాయలను దాటుకుంటూ వెళ్తుంది.  నిజానికి 108 లోకాలు ఈ విశ్వంలో ఉన్నాయని….. ఆ 108 లోకాలను చూడాలంటే మనో నేత్రముతో కేవలం 64 లోకాలు మాత్రమే చూడగలరని…. నిజానికి ఈ కపాలధారి 108వ డైమెన్షన్ లో ఉన్న 108 శిరస్సులు ఉన్న కపాలధారి అని శివ నందినికి స్ఫురణ అందటంతో…. ఇప్పుడు తనకి ఈ 64 శిరస్సులు ఉన్నట్టు కనపడుతున్నాయని అనుకుంటూ ఉండేసరికి…. పరమహంస గారు ఎలా అయితే కపాలయానం చేశారో ఇప్పుడు తను కూడా కపాలయానం ఆత్మ లింగంగా మారి చెయ్యాలి అని అనుకుంటూ ఉండేసరికి…. మనో శరీరం కాస్త ఒకటవ డైమెన్షన్ లోకి ప్రవేశించడం జరిగింది.


ఇందులో పొడుగు జీవులు ఉన్న లోకం దర్శనమైంది.  ఆ తర్వాత రెండవ కపాలము లోకంలోకి వెళ్తే వెడల్పు జీవుల దర్శనం అయ్యింది.  ఆ తర్వాత మూడవకపాల లోకంలోకి వెళితే…. బుద్ధి జీవులు ఉన్న భూలోక దర్శనం అయ్యింది.  ఆ తర్వాత నాలుగవ కపాల లోకంలోకి వెళితే ద్వాదశఆదిత్యులు ఉన్న సూర్యలోకం దర్శనం అయ్యింది. ఆ తర్వాత ఐదవ కపాలలోకంలోకి వెళితే… 16 కళలు ఉన్న చంద్రలోకం దర్శనం అయ్యింది.  ఆ తర్వాత కపాల లోకంలో నక్షత్రం మండలం, ఆ తర్వాత బుధ గ్రహాలోక దర్శనం, ఆ తర్వాత శుక్ర గ్రహలోక దర్శనం,ఆ తర్వాత కుజ గ్రహ లోక దర్శనం, ఆ తర్వాత గురు గ్రహలోక దర్శనం, ఆ తర్వాత శని గ్రహలోక దర్శనం, తర్వాత సప్తర్షి లోకాల దర్శనము, ధృవమండల దర్శనము, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, త్రిమూర్తులలోకం, ఆది బ్రహ్మ, ఆది విష్ణు,ఆది రుద్రుడు ఉన్న లోకములు, పరంజ్యోతి ఉన్న శూన్య లోకం, ఆ తర్వాత మహా త్రిమూర్తులు ఉన్న లోకము, ఆ తరువాత మహా శూన్యం ఉన్న ఆత్మ జ్యోతి లోకము, తర్వాత అష్ట వసువులు ఉన్న లోకము, ఏకాదశ రుద్ర లోకాలు, సప్తమాతృకలు, పద్దెనిమిది అమ్మవార్ల లోకాల దర్శనాలు, ఆ తర్వాత శివపంచముఖ  లోక దర్శనాలు, ఇలా 62 కపాలానికి తను వచ్చినట్టుగా…. 62వ కపాలంలో హృదయ చక్రంలో ఉండే ఇష్టలోక దర్శనము, 63లో మణిదీప దర్శనము, 64వ లోకానికి వెళుతూ ఉండగా….ఇక తనకి ధ్యానానుభవం తట్టుకునే శక్తి కోల్పోవడంతో స్థూల శరీరానికి ఎగ శ్వాస రావటంతో …..శివ నందినికి ధ్యానభంగం అయింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే…. ఒకరోజు నుంచి మూడు రోజులపాటు ధ్యాననిష్ట లో ఉండి….. ఈ లోకాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది అని….. 63 లోకాల వరకు మాత్రమే తను దర్శనం చేసుకునే అవకాశం కలిగింది అని…. మణిద్వీపం లాంటి లోక దర్శనం అయ్యింది అని అనుకుంటూ ఉండేసరికి…… శివ నందినికి ఒక చిన్న అనుమానం వచ్చి అసలు 63వ లోకంగా మన మణిద్వీప దర్శనం అని చెప్తున్నారు కదా!  అసలు ఈ మణిద్వీపమును అంతరిక్షంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చా?  అనే సందేహం వచ్చింది.  ఈ 63 లోకాల దర్శనానికి వెళ్తున్నప్పుడు…. తనకి మోక్ష అనుభవాలు పొందాలని తపన, తాపత్రయం కుతూహలము అనేది మూడు భావాలు కలిగినాయి అని అనుకుంటూ ఉండేసరికి…. ఇది ఇలా  కాదు అని శివ స్వామిని అడిగేసరికి….


శివస్వామి:- నీకు త్రిమాయలుగా తపన తాపత్రయం, కుతూహలం కలిగాయి . నీకు మోక్ష అనుభవాలు పొందాలని తపన,తాపత్రయం కుతూహలం నీకు ఈ మాయలుగా ఏర్పడ్డట్టుగా ఉన్నాయి. 


శివ నందిని:- స్వామి! నేను మనో శరీరంతో అంతరిక్షంలో ఎక్కడైనా ప్రత్యక్షంగా మణిద్వీపం ఉందా లేదా అని దర్శనం పొందాలనుకుంటున్నాను..


శివ స్వామి:- యోగులు కాస్త మానసికంగా శ్రీ చక్ర ఆరాధన చేస్తూ…. నవావరణంలో చేస్తూ కూడా మణిదీప దర్శనానికి వెళ్లినట్లుగా… శ్రీ చక్ర ఆరాధనలో అనుభవ అనుభూతి పొందుతారు కదా! అలాగే నువ్వు కూడా శ్రీ చక్ర ఆరాధన చేసుకొని అనుభవ  అనుభూతి పొందు.


శివ నందిని:- కాదు స్వామి!  నేను అంతరిక్షంలో ప్రత్యక్షంగా ఉందా లేదా!  అని చూసుకొని వెతికి…. ఈ మణిద్వీపానికి వెళ్లాలి అనుకుంటున్నాను. 


శివ స్వామి:-  అమ్మ నువ్వు వెళ్ళేది ఆదిపరాశక్తి ఉన్న రాజరాజేశ్వరి ఉన్న మణిదీపానికి. ఆవిడ శ్రీ చక్ర బిందువులో ఉంటుంది.  పక్కన లలితాదేవి, బాల, వారాహి, హయగ్రీవ వీళ్ళందరూ కూడా ఉంటారు.  ఏదైనా తేడా వస్తే మాత్రం…. ఆదిపరాశక్తి మహా మాయలో ఇరుక్కొని…. అక్కడ దైవ జన్మ ఎత్తడం జరుగుతుంది. అమ్మవారికి సేవ చేసుకునే తత్వమును పొందడం జరుగుతుంది యోగము ఉంటే నువ్వు వెనక్కి తిరిగి రాగలుగుతావు.  లేదంటే తిరోగమనం చెంది…. అక్కడే నువ్వు మోక్షం పొంది…. అమ్మవారికి సేవలు చేసే 323 యోగినిలలో ఏదో ఒక యోగినీ జన్మ ఎత్తటం జరుగుతుంది.


శివ నందిని:- ఏదైనా కానీ…. అసలు మణిద్వీపం ఉందా లేదా అనేది నేను ప్రత్యక్షంగా చూసి రావాలి.


అని చెప్పి శివనందిని అనేసరికి…. ఇక తను మొండిపట్టు పట్టింది అంటే…. ఎవరిమాటా వినదు. సాక్షాత్తు దేవుడైన, గురుదేవుడైనా ఎవరు చెప్పిన మాట కూడా వినదు అని …శివ స్వామికి అర్థమయి…. 


శివస్వామి:- అర్ధరాత్రి ధ్యాననిష్ఠలో ఉండి మణిద్వీప దర్శనానికి…. మనో శరీరంతో ఆకాశయానం చేసి …..అంతరిక్షంలో ఉందో లేదో తెలుసుకో! అయినా నీకు పరమహంస గారి ధ్యానానుభవాలు చూస్తే…. ఆయన మణిద్వీప దర్శనం పొందడం జరిగింది అని చెప్పారు కదా!  అదే నువ్వు చూడవచ్చు కదా! 


శివ నందిని:- ఆయన తన బుద్ధ కోడ్ లో బుద్ధుడు ఏ విధంగా మణిదీప దర్శనం చేశాడో…..మన కాలచక్ర విధివిధానములో చెప్పడం జరిగింది.  చివరికి చింతామణి గృహానికి వెళ్ళటం జరిగింది.  బుద్ధుడు ప్రత్యక్షంగా వెళ్లి దర్శనం చేసుకున్నాడు కదా!  


శివస్వామి:- అందుకే ఆయన చింతామణి మాయలో పడి కోరికలు లేని సమాజం చూడాలని కోరికతో పునః సృష్టికి రావటం జరిగింది. ఇప్పుడు నువ్వు అంతరిక్షం ద్వారా మణిద్వీప దర్శనం పొంది…లేనిపోని తపన ,తాపత్రయం, కుతూహలం అనే మూడు మాయల్లో ఉన్నావు.అమ్మవారిని చూడాలని ఈ మూడు మాయలతో వెళ్తున్నావు… విశ్వ మోక్షం కాస్త వ్యక్తిగత మోక్షం కూడా పొందకుండా….. శరీరం మోక్షం మాత్రమే పొందడం జరుగుతుంది.  జ్యోతి శరీరం మోక్షంతో…. నీ శరీరం ఆగిపోయి…. మనో శరీరంతో అమ్మవారికి సేవ చేసుకునే స్థితిని పొందుతావేమో జాగ్రత్త.. ఒకటికి పది సార్లు ఆలోచించుకో! ప్రతిదీ కూడా అనుభవం పొందాలంటే కుదరదు.  కళ్ళు వెళ్లే చోటికి మనసు వెళ్ళకూడదు. వెళ్ళాయి అంటే మనో మాయలో పడే ప్రమాదం ఉంటుంది.  ఆ తర్వాత భ్రమ, బ్రాంతి కలిగిస్తుంది.  ఆవిడకి సేవ చేసుకుంటూ…. ఆవిడ మాయని దాటలేని విధంగా ఉంటుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో! 


శివనందిని:- ఏదైనా కానీ…. నాకు ప్రత్యక్ష  అనుభూతి పొందితే గాని…. నేను ముందుకు వెళ్లలేను.  ఒకవేళ ఆగిపోయే ప్రమాదం వస్తే ఆగిపోతాను.  నేను చేసేది ఏమీ లేదు కదా!  మరో జన్మలో చూసుకుంటాను.


శివస్వామి:- నీ కర్మ… నేనేమీ చేయలేను.  నేను గుర్రాన్ని నీటి దాకా తీసుకురాగాలను గాని…. దాని చేత నీటిని తాగించలేను కదా! ఏం జరగాలని రాసిపెట్టి ఉందో….అదే జరుగుతుంది. సరేలే …నాదేముంది! 


శివ నందిని:- సరే నేను ఇవాళ అర్ధరాత్రి మనో శరీరంతో…. ఆకాశ అంతరిక్షంలో ఉందో లేదో తెలియని మణిద్వీపం గురించి ధ్యానానుభవం పొందుతాను.  కానీ ధ్యానంలో మణిద్వీపం ఉన్నట్టుగా కనపడుతుంది.  నిజంగా అది ఉందో లేదో నేను చూడాలి. 


శివస్వామి:- సరే నీ ఇష్టం. 


ఆ తర్వాత ఆ రోజు రాత్రి శివ నందిని కాస్త తీవ్రమైన ధ్యానంలో ఉండి….. మనో శరీరంతో ఆకాశమార్గంలో ప్రయాణం చేస్తూ…. అంతరిక్షంలో ఉన్న మణిద్వీపంలోనికి ప్రయాణించడం జరిగింది. 


శ్రీచక్రము అనేది శివుడు- శివాని సంయోగ సృష్టి చక్రం అని…. కొంతమంది గ్రహ మండలాలు వివరించే చక్రం అని….. మరికొంతమంది ఇది సహస్రార చక్రం అని…. మరికొంతమంది శివుడు- అమ్మవారి సంయోగ విధానం అని ఇలా వాళ్ళ అభిప్రాయాలు చెప్పటం జరిగినది. ఉన్నది ఒక్కటే. కనిపించే అనిపించే భావం బట్టి దాని ఆలోచనలు కలుగుతాయి అని శివ నందినికి అర్థమైనది. కాలచక్రమే కొందరికి శ్రీచక్రము మరికొంతమందికి కాలయంత్రం మరికొంతమందికి సంయోగ యంత్రం మరికొంతమందికి సహస్రార చక్రము విశ్వసృష్టి చక్రం ఎవరి భావాలకు తగ్గట్టుగా వారికి ఇది కనపడి ఉండి ఉండాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. మరి నాకు ఈ కాలచక్రం ఏవిధంగా దర్శనము ఇవ్వాలని అనుకుంటుందో వేచిచూడాలి అనుకుంటుండగా   శ్రీ చక్ర దేవతగా బాలా త్రిపుర సుందరి అని మరి కొందరు శ్రీలలితాదేవి అని మరి కొందరు రాజరాజేశ్వరి దేవి అని మరి కొందరు కామేశ్వరి కామేశ్వరుడని  శ్రీదేవి అని ఇలా రకరకాలుగా విని ఉండడంతో అసలు సత్యం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటూ శివ నందిని ధ్యాన నిష్ఠను కొనసాగించడం జరిగింది . 

ఇది ఇలా ఉంటే శ్రీ మేరు చక్రములో 3 రేఖలతో చతురస్రాకారంగా ఉన్నదానిని త్రైలోక్య మోహనము లేదా భూపం అని… 16 రేకులు ఉన్న వృత్తమును సర్వ ఆకార పరిపూరకము అని…. 8 రేకులు ఉన్న వృత్తమును సర్వ సంక్షోభం అని…. 14 త్రిభుజాలు సర్వ సౌభాగ్య దాయకమని…. 10 త్రిభుజాలు సర్వార్ధ సాధకాలని… 10 త్రిభుజాలు సర్వరక్షకాలని…. 8 త్రిభుజాలు సర్వరోగహరమని…. మధ్యనున్న ఒక త్రిభుజము సర్వసిద్ధి ప్రదమని… ఈ త్రిభుజములో ఉన్న బిందువును సర్వానందమయమని అందురు. ఇలా 14, 10, 10, 8,1 త్రిభుజాలు కలిపి మొత్తం 43 త్రిభుజాలు ఉన్నాయని… వీటిలో నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వ ముఖంగా ఉండి శివశక్తి సూచిస్తే మిగిలిన ఐదు సమ బాహు త్రిభుజాలు అధోముఖముగా ఉండి స్త్రీ శక్తి సూచిస్తాయని కావున శ్రీచక్రంలో ఇలా 9 సమద్విబాహు త్రిభుజాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా సంగమించే దివ్యశక్తుల సంగమం అని ఈ నవ త్రిభుజాలు  ఆవరణాలు కలిపి నవ ఆవరణాలుగా పిలుస్తారని ఇవి నవగ్రహాలకి సంకేతమని అనగా వజ్ర కోట శుక్రగ్రహానికి…. వైఢూర్య కోట కేతుగ్రహానికి…. గోమేధిక కోట రాహుగ్రహానికి… నీలకోట శనిగ్రహానికి… ముత్యపుకోట చంద్రగ్రహానికి…. మరకతకోట బుధ గ్రహానికి…. పగడపుకోట కుజగ్రహానికి…. కెంపుకోట సూర్యగ్రహానికి… ఇక ఆఖరిది అయిన పుష్యరాగంకోట గురుగ్రహానికి సంకేతాలుగా చెప్పడం జరిగినది. ఆకాశ తత్వమును వజ్ర కోట యందు…. పృధ్వి తత్వమును వైఢూర్య కోటయందు…. వాయుతత్వంను గోమేధికం కోటయందు… జల తత్వమును నీల కోట యందు…. అగ్ని తత్వమును ముత్యపు కోటయందు…. మాయ తత్వమును మరకత కోట యందు…. శక్తి తత్వమును మాణిక్య లేదా పగడ  కోట యందు…. సర్వ శక్తి తత్వమును  కెంపు కోట యందు స్థాపించడం జరిగింది. మేరు శ్రీ చక్ర కోట వెళ్లాలంటే  అర్హత ఉంటే ప్రవేశం పొందవచ్చు అని శివ నందినికి అర్థం అయింది. ఒక్కొక్క కామ్య సిద్ధి పొందుటకు పరమేశ్వరుడు ఒక్కొక్క తంత్ర శాస్త్రమును చెప్పటం జరిగినది. అంటే సర్వ కామ్య సిద్ధి కోసం 64 తంత్రాలు చేయవలసి వచ్చినది అన్నమాట. ఇది కష్టసాధ్యమని పరమేశ్వరుడు తిరిగి సులభ మార్గంగా శ్రీవిద్యోపాసన శ్రీచక్రార్చన ఆరాధన చెప్పడం జరిగినదని ఇందులో 12 సత్ సంప్రదాయాలను అనుసరించి శ్రీ చక్రరాధన జరుగుతుందని శివ నందిని గ్రహించింది అందుకే ఈ చక్రము యద్భావం తద్భవతిగా వివిధ రకాల భావపరంపరలు కొనసాగుతున్నాయి. 

అలాగే శ్రీచక్రము లోని మొదటి ఆవరణ అయిన భూపము నందు ఉన్న మూడు వరుసలలో మొదటి వరుసలో 10 దేవతలు అనగా అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, పశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే సర్వ కామ్య సిద్ధి  దేవతలుగా ఉండగా రెండవ వరుసలో ఎనిమిది మంది దేవతలు ఉంటారు. అనగా బ్రాహ్మి. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, చాముండి, చండిక ఉంటారు. వీరిని అష్టమాత్రుకలు అంటారు వీరు అష్టభైరవులు భార్యలు గా ఉంటారు. ఒక రకంగా వీరే అష్ట బైరవి అన్నమాట. అనగా బ్రాహ్మి- అసితంగ బైరవ, మహేశ్వరి-రురు భైరవ, వైష్ణవి- క్రోధ భైరవ, కౌమారి-చండ భైరవ, వారాహి-ఉన్మత్త భైరవ, నరసింహి- కపాల భైరవ, చాముండి-భీష్మ భైరవ, చండిక -సంహార భైరవలతో కలిసి ఉంటారు.వామాచారమును పాటించేవారు ఈ అష్ట భైరవ లలో ఏదో ఒక రూపాన్ని ఆరాధించడము జరుగుతుంది ఇక మూడవ వరుసలో సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశఙ్కరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశే, సర్వఖేచరి,సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖణ్డే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ దేవి ఉంటారు. అంటే మొత్తం మీద మొదటి ఆవరణలో మూడు వరుసలలో 30 మంది దేవతలు ఉంటారని అర్థమైనది.వివిధ ఆవరణ దేవతలు వరుసగా

ప్రధమావరణ దేవతలు:


అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, పశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే,సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చామున్డే, చండిక (మహాలక్ష్మి),సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశఙ్కరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశే, సర్వఖేచరి,సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖణ్డే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


ద్వితీయావరణ దేవతలు:


కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గన్ధాకర్షిణి, చిత్తాకర్షిణి,ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,


తృతీయావరణ దేవతలు:


 అనఙ్గ కుసుమే, అనఙ్గమేఖలే, అనఙ్గమదనే, అనఙ్గమదనాతురే, అనఙ్గరేఖే, అనఙ్గవేగిని, అనఙ్గాఙ్కుశే, అనఙ్గమాలిని, సర్వసఙ్క్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ, 


చతుర్ధావరణ దేవతలు:


సర్వసఙ్క్షోభిణీ, సర్వవిద్రావిని, సర్వాకర్షిణి, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తమ్భినీ, సర్వజృమ్భిణీ, సర్వవశఙ్కరి, సర్వరఞ్జనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణీ,సర్వమన్త్రమయి, సర్వద్వన్ద్వక్షయఙ్కరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సమ్ప్రదాయ యోగినీ,


పంచమావరణ దేవతలు:


సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే, సర్వప్రియఙ్కరి, సర్వమఙ్గలకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ,సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణీ, సర్వాఙ్గసున్దరి, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ, 


షష్థావరణ దేవతలు:


సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఙానమయి, సర్వవ్యాధివినాశినీ, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే,సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామినీ, నిగర్భయోగినీ, 


సప్తమావరణ దేవతలు:


వశినీ,కామేశ్వరీ, మోదిని, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌలినీ, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ, 


అస్టమావరణ దేవతలు:


బాణినీ, చాపినీ, పాశినీ, అఙ్కుశినీ, మహాకామేశ్వరీ,మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,


నవమావరణ దేవతలు:


 శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానన్దమయ చక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ, 


నవచక్రేశ్వరీ దేవతలు:


త్రిపురే, త్రిపురేశి, త్రిపురసున్దరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురసిద్ధే, త్రిపురామ్బ, మహాత్రిపురసున్దరి, 


శ్రీదేవి విశేషణ నామాలు:


మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానన్దే, మహామహాస్కన్ధే,


మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి, నమస్తేనమస్తే నమస్తే నమః .


అంటే ఈ లెక్కన చూస్తే శ్రీ చక్రములోని నవావరణ మొత్తం దేవతలు కలిపి 30 +19+11+17+12+12+14+5+3=123 దేవతలు ఈ మేరు శ్రీచక్రము దేవి స్వరూపాలుగా ఉంటారని  శివ నందిని గ్రహించింది. ఈ శ్రీచక్రము లోని 43 త్రిభుజాలు కాలము యొక్క 43 డైమన్షన్ గా పేర్కోవటం జరుగుతోంది. ప్రస్తుతానికి మానవుడి మేధాశక్తి కాలము యొక్క 14 డైమన్షన్ వరకు మాత్రమే కనుక్కో గలిగింది. ఇంకా తెలుసుకోవాల్సిన 29 డైమెన్షన్స్ ఉన్నాయి అన్న మాట. పూర్వీక భారతీయ మహర్షుల మేధాశక్తితో మొత్తము ఈ కాలము యొక్క 43 డైమన్షన్ చేరుకోవటం జరిగి ఉండాలి. ఈ కాలం డైమన్షన్స్  ఉన్న ఈమేరు శ్రీ చక్ర కోటలోనికి యోగ్యత సంపాదించుకొని ప్రవేశించి ఉండి ఉండాలి. ఈ కోట అసలు ఉందా? ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానములు హైగ్రీవ ఉపదేశం అయిన శ్రీ లలితా సహస్రనామాలు సమాధానం ఇచ్చినాయి. అమృత సముద్రము మధ్యలో మణిద్వీపము ఉందని… దీనిలో కల్పకోద్యానము ఉన్నదని… దీని లోపల నీపోవనము ఉన్నదని… దీని మధ్యలో చింతామణి గృహము ఉన్నదని… ఈ గృహం లోపల నాలుగు కోళ్ళు ఉన్న మంచము ఉన్నదని… బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు ఈ మంచము నాలుగు కోళ్ళు గా ఉన్నారని… పంచబ్రహ్మ స్థితిలో సదాశివుడు పడుకొని ఉండగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈయన మీద కూర్చొని ఉన్న స్వరూప దర్శనము దర్శనమైంది. పైగా కాలస్వరూపిణి అయిన కామేశ్వరి ఈ శ్రీచక్రానికి అధి దైవముగా ఉంటుందని లలిత నామాలలో చెప్పకనే చెప్పినారు. అంటే ఈ లెక్కన చూస్తే శ్రీ చక్రం అనేది కాలచక్రం అని ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే వామాచారం పరముగా చూస్తే బుద్ధుడు ప్రతిపాదించిన కాలయంత్రం కూడా శ్రీ చక్ర పురమునే అనగా కాల చక్రమునే చూపిస్తోందని చెప్పకనే అర్థమైనది. పూర్వీకులు చెప్పిన అమృత సముద్రము అంటే ఈ కాలంలో మానస సరోవరము అయి ఉండాలని… మణిద్వీపము అంటే అష్టదళ పద్మము హిమాలయ పర్వత పంక్తి అయి ఉండాలని... శివ నందినికి స్ఫురణకు వచ్చినది. అలాగే కల్పకోద్యానము అంటే శంబల గ్రామ పరిసరాలు అయి ఉండాలని ఈ రహస్య గ్రామ పరిసరాలలో ఎవరైతే యోగ్యత కలిగి ఉన్నారో…. వారికి మాత్రమే సుగంధ పరిమళాలు సువాసనలు వస్తాయని ఎవరైతే అర్హత లేకుండా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారో వారికి కాలకూట ప్రభావము ఉన్న వాసనలు వస్తాయని వీటిని పీల్చినవారికి మతి భ్రమణం చెందటం లేదా పిచ్చివాళ్లు కావడంగాని జరుగుతుందని పరమహంస తన  కపాల మోక్షం గ్రంథములో నేను చదివినట్టుగా స్పురణకు వచ్చింది. అంటే శ్రీచక్రము అనేది దేవతలు ఆవాసమైన శంబల గ్రామమును చూపించే మార్గం విధానం అని తెలుస్తోంది. పైగా హిమాలయ పరిసరాలలో అంతర్భాగంలో రహస్యముగా ఏకముగా స్వయంభు స్పటిక శ్రీ చక్రము ఉన్నదని దీని లోపలకి యోగ్యత ఉన్న లామాలు ప్రవేశించి భవిష్యత్ సంఘటనలు తెలుసుకుని బయటికి వస్తారు అని ఒక రహస్య గ్రంథము ద్వారా నేను తెలుసుకోవడం జరిగినది అని పరమహంస కపాల మోక్షం గ్రంథములో రాయడం జరిగినది అని శివ నందిని అనుకుంటూ ఉండగా…….అయితే బుద్ధుడు ప్రతిపాదించిన ఈ శ్రీచక్రము 43 భుజాలను కలిగి ఉంటుంది కాకపోతే 14 త్రిభుజాలు 14 తిధులుగా 10 త్రిభుజాలు అంటే పది చంద్రమాసాలుగా మరొక 10 త్రిభుజాలు అంటే దశావతారాలు తొమ్మిది త్రిభుజాలు అంటే తల్లి గర్భంలోని జీవుడి నవ మాసాలుగా కాల సంబంధిత వ్యవహారంగా చెప్పడం జరుగుతుందని శివ నందినికి అర్థమైనది. 8 దళాలు అంటే జీవుడికి శరీరములో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అని అలాగే 16 దళాలు అంటే చంద్రుడి యొక్క 16 కళలు అని చెప్పకనే చెబుతున్నారు.


శ్రీచక్ర కోటయందు పరిక్రమము 


ఇక  శ్రీ చక్ర కోట పరిక్రమమునకు ఎలాంటి యోగ మాయ విఘ్నాలు ఉండవని కానీ ఇక్కడ ఉండే ప్రవేశ మార్గం దేవత అయిన సేకీరు అనుమతి తీసుకోవాలని ఆమె పెట్టే జ్ఞాన పరీక్షలో నెగ్గితే యోగ్యత లభిస్తుందని పరమహంస గారి అనుభవాల ద్వారా అప్పటికే తెలుసుకొని ఉండడంతో ….. ఏమి జరుగుతుందో కాలమే సమాధానం చెప్తుంది అని అలాగే ధ్యానిమగ్నమై ధ్యానం కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు అర్ధరాత్రి పూట నేను ఈ చక్ర సాధన స్థితిలో ఉండగా శివ నందిని మనోనేత్రం ముందు ఉన్నట్టుండి టెంపుల్ రన్ వే ఆట మొదలైంది. మొదట భూమండలము కనిపించి దానిని దాటటం జరిగినది. ఆ తరువాత నక్షత్ర చంద్ర మండలాలు దాటటం జరిగినది.తర్వాత అడ్డంగా ఉన్న కాల నేత్రము దర్శనం అయినది. దీని లోపలకి శివ నందిని మనో శరీరము ప్రవేశించడం జరిగినది. అప్పుడు తను సూర్యమండలం లోనికి ప్రవేశించినట్లు అనుభవము అవుతుండగా  3D డైమన్షన్ లో తిరిగి శ్రీ చక్ర కోట నిర్మాణం చాలా స్పష్టంగా కనపడ సాగింది. అంటే తన  మనోశరీరధారి తనకి ఈ శ్రీచక్ర కోటను చూసే యోగ్యత ఉన్నదో లేదో పరీక్షించుకోవటానికి వెళుతుందని శివ నందిని అర్థమైనది. ఏమి జరిగితే అది జరుగుతుందని జరిగే దానిని సాక్షీభూతంగా స్థూల శరీరము తన మనోనేత్రం ద్వారా మౌనముగా చూడటం ఆరంభించింది. అప్పుడు మనో శరీర ధారి ఈ చక్రానికి ఉన్న నాలుగు ద్వారాల లో అన్ని ద్వారాలు కలిపి ఉంచే ఏకైక మార్గం ద్వారమైన మోక్ష ద్వారం వద్దకు చేరుకోవడం జరిగినది. ఎందుకంటే మేరు శ్రీచక్రము లో నాలుగు మార్గాలు ఉన్నప్పటికీ ఒక మార్గం లోనే అన్ని కోణాలు కలుస్తాయని తెలుసుకోండి. మిగిలిన మార్గాలలో పంచభూత కోణాలలో ఏదో ఒక కోణము కలవదు. జాగ్రత్తగా లోహ మేరు శ్రీచక్రమును పరీక్ష చేస్తే అర్థం అవుతుంది. దీనిని చూస్తుండగా…పరమహంస గారి తండ్రి గారు దీని గురించే ఆయనకి చెప్పినట్టు కపాల మోక్షం గ్రంథములో రాయడం స్పురణకు రావడంతో….. శివ నందిని మనో శరీరం ఇలా అన్ని త్రిభుజాలు కోణాలు కలిసే ఏకైక మార్గం ద్వారమునకు చేరుకున్నదో అప్పుడు ఈ చక్రం ప్రవేశానికి అనుమతి కావాలని అక్కడ ఉన్న కాపలా దేవతలను అడగటం అందులో ఒకరు లోపలికి వెళ్లి సెకీరు దేవత రావడం జరిగినది.ఈమె శివ నందినికి ఈ యోగ్యత ఉన్నదో లేదో పరీక్షిస్తుంది అని అర్థమైనది. ఇంతలో ఈమె ప్రశ్నలు అడగటం ప్రారంభించింది.


1.చచ్చినా ప్రాణము ఉండేది ఏది?


చితాభస్మం (బూడిద గా మారిన చచ్చిన వాడి ప్రాణశక్తి ఉంటుంది)


2. ప్రాణం ఉన్న కదల లేనిది ఏది?

       గ్రుడ్డు


3.అన్నం పెడితే బ్రతుకుతుంది నీళ్లు త్రాగితే చస్తుంది అది ఏది?

    A)అగ్నిహోత్రము (హోమములో నెయ్యి వేస్తే మండుతుంది. అదే నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా)


4. దేనిని పలికితే అది పోతుంది?

      A)  శాంతి 


5.ఎప్పుడు పలికిన అది తప్పు గానే ఉంటుంది? 

       A)తప్పు అనే పదము 


6.మానవ స్పర్శ లేని జలము ఏది?

          A)కొబ్బరికాయలో ఉండే నీళ్లు 


7.మాయ అంటే ఏమిటి?

A) మోహ,వ్యామోహము కల్గించేది.


8.భూమిని సృష్టించటానికి పూర్వము ఎవరున్నారు?

A)పంచభూతాలు, కాలం, ఈశ్వరుడు, శూన్యం,పరమ శూన్యం 


9.మనిషికి మిత్రుడు అలాగే శత్రువు ఎవరు?

A) అతని ఇంద్రియాలే 


10.లోకులకు అర్థము కానిది తెలియనిది ఏది?

 A)స్త్రీ మనస్సు ,స్త్రీ చరిత్ర


11.జన్మించిన వారెవరు?

A) తిరిగి జన్మించవలసిన అవసరం లేని వారు 


12.చనిపోయిన వారు ఎవరు? 

A)తిరిగి రావలసిన అవసరం లేని వారు 


13.దుఃఖమునకు మూలము ఏది? 

A)మాయ 


14.ఏది తెలిసిన తరువాత మరేమీ తెలుసుకోనక్కరలేదు?

 A)స్వస్వరూప జ్ఞానం 


15.చంచలమైనవి ఏవి?

A)మనస్సు ,ధనము, బలము, ఆయువు 


16.చేయకూడని పని ఏది?

A) పాపకార్యాలు 


17.ఈశ్వరుడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది?

A)నేను ఉంటే ఆయన ఉన్నట్లు నేను లేకపోతే ఆయన లేనట్లే.


18. ఆకారము లేని వాడిని ఎలా తెలుసుకోవాలి?

A)ఆకారం లేని మనస్సు బుద్ధి అహంకారం మాయ…. గాలి ఎలా తెలుసుకున్నామో అలా 


19.ఈశ్వరుడు యందు భక్తి-,సాధన ఎందుకు చేయాలి?

A)మనము మన సంతానము యందు ఎందుకు భక్తిగా ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నామో అందుకోసమే


20.మహామృత్యువు అంటే ఏమిటి?

A)నేను ఆత్మ అని మరచిపోవుట


21.పరమేశ్వరుడు పూజించే లింగము?

A)ఇష్ట లింగము 


22.మహామాయ అంటే?

A) తన ఏకైక ఇష్ట కోరిక తెలుసుకుని దానిని దాట లేకపోవటం 


23.కామికానివాడు మోక్షగామి కాడు అంటే అర్థం ఏమిటి?

A)కామము మోక్షము అని రెండు అనుభూతులు పొందాలంటే తప్పనిసరిగా శరీరము ఉండాలని అర్థం 


24.పూజనీయుడు ఎవరు?

A)నాలాంటి శబ్ద అనుభవ నిజ పాండిత్యంతో స్వస్వరూప జ్ఞాన అనుభూతి ఆత్మానుభూతి ఉన్న బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి 


అనగానే వెంటనే సెకీరు ఈ మోక్ష ద్వారం నుండి ఈమెను లోపలికి పంపించడానికి అనుమతి ఇవ్వటం జరిగినది. దీనితో ఈమె మనో శరీరధారి ఈ శ్రీ చక్ర కోట లోనికి ప్రవేశించిందని శివ నందినికి అర్థం అయింది. ఈ కోట లోపల పశ్చిమానికి తిరుగుతూ ఉత్తరానికి వెళ్లి అక్కడ నుండి పశ్చిమానికి వస్తే ఒక చిన్న త్రోవ కనిపించినది. ఈ త్రోవలో గుండా వెళితే అది కాస్త ఉత్తరం వైపుకి తిరగటం ఆరంభించింది. అక్కడ నుండి మళ్ళీ పశ్చిమానికి తిరిగితే అక్కడ రెండు చిన్న దారులు కనిపించాయి. ఇందులో ఒక దారి పూర్వ దిక్కుకి చూపిస్తుంటే మరోదారి పశ్చిమదిక్కుకు చూపిస్తుందని శివ నందినికి అర్థమైనది. ఇక్కడ ఏ వైపుకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఇందులో ఒక మార్గము లోపలికి తీసుకొని వెళితే మరో మార్గం మాయ లోనికి దింపి అక్కడే ఉంచేస్తుందని  అనుభూతి కలగ సాగింది. అక్కడ ఉన్న అష్టవసువులని అడిగినా ప్రయోజనం ఉండదు. వాళ్లు ఉలకరు.పలకరు.మౌనముగా ఉంటారు. స్థిర మనస్సులకు మాత్రమే ఇందులోని నిజ త్రోవ తెలుస్తోంది. అస్థిర మనస్సులకి అయితే ఖచ్చితంగా మాయ త్రోవలోకి వెళ్ళటం జరుగుతుంది.  అప్పుడు ఈమె మనో శరీరధారి తన ఏకాగ్రత మనస్సుతో పూర్వ దిక్కున త్రోవ లోనికి ప్రవేశించడం అనుభూతి కలిగింది. అప్పుడు అక్కడ ఒక మహా ద్వారము కనబడినది. ఈ ద్వారం లోపల గోముఖ తీర్థం అనే పుష్కరిణి కనబడినది. ఈ పుష్కరిణిలో స్నానం చేయటానికి శివ నందిని మనో శరీరధారి ఇందులోనికి దిగుతూ ఉండటం అనుభవము గా కనబడుతోంది.ఇలా స్నానము చేసి వచ్చిన  మనో శరీరధారికి స్థిరబుద్ధి, నిజ జ్ఞాన బుద్ధి కలిగి ఉన్న వివేక బుద్ధి ఏర్పడినట్లుగా అనుభూతి పొంద సాగింది. దానితో ఇది కాస్త ఉత్తర దిశకి వెళ్ళటం ప్రారంభించినది. అప్పుడు మరల పూర్వ దిక్కుకి వెళితే అక్కడ మరల రెండు త్రోవలు కనిపించినాయి. ఇక్కడ ఏ దారిలో వెళితే ఏమి వస్తుందో అర్థంకాక సతమతమవుతుంటే అక్కడ ఉన్న ఏకాదశ రుద్రులు ఉలకరు.పలకరు. దానితో స్థిరబుద్ధితో దక్షిణ దిక్కు ఉన్న ద్వారం దారి వైపు కి వెళ్ళటం జరిగినదని శివ నందినికి అర్థమైనది. ఎందుకంటే వివేక బుద్ధి వలన ఉత్తర దిక్కుకి వెళ్లితే నక్షత్ర మండలాలు నక్షత్రాలు కనబడతాయని ఇది ఒక మాయా ప్రపంచం అని అనుభూతి కలిగేసరికి ఆ దిశ వైపు వెళ్ళకుండా దక్షిణ దిశకి వెళ్లడం జరిగింది అని ఈమె గ్రహించింది. అప్పుడు ఒక చిన్న సోపానము కనిపించింది. ఇందులో 16 మెట్లు కనబడతాయి. ఈ చిన్నగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉండగా అక్కడ ఒక వృత్తాకార మైన త్రోవ కనబడసాగింది. అంటే శ్రీమేరు చక్రములో ఈ 16 మెట్లు కాస్త 16 రేకుల పద్మం అని ఈమెకు అర్థం అయినది. ఈ వృత్తాకార మార్గము గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక మహాద్వారం కనిపించినది. మళ్లీ ఈ ద్వారము వద్ద రెండు చిన్న దారులు కనిపించినాయి. అందులో ఒకటి పశ్చిమ దిక్కుకి వెళితే మరొకటి పూర్వ దిక్కుకి వెళుతుంది.  ఇక్కడ అష్టభైరవులు కనబడతారు. కానీ వాళ్లు ఉలకరు. పలకరు. వివేక బుద్ధి వలన ఆలోచన చేస్తే పూర్వ దిక్కుకి వెళ్ళితే ఈసారి స్వర్గ  భవనము కనబడుతుందని ఇందులో అతి గుప్తమైన చింతామణి, శమంతకమణి, కౌస్తుభమణి, రుద్ర మణి ఇలాంటి నవ మణులు,నవ రత్నాలు సుందరమైన విగ్రహలు ఉంటాయి. వీటిలో అష్ట సిద్ధులను ఇచ్చే మాయా దేవతలు ఆవాసము చేస్తూ ఉంటారని చచ్చినా కూడా ఈ సుందర భవనం లోనికి వెళ్లకూడదని ఈమె సూక్ష్మధారి నిశ్చయించుకొని పశ్చిమ మార్గం వైపు ప్రయాణించడం జరిగినదని  అనుభూతి కలగ సాగింది. నూటికి 80% మంది యోగసాధకులు ఇక్కడ అష్టసిద్ధులు మాయలో పడి తమ సాధనను పరిసమాప్తి చేసుకుని అక్కడే నిలబడి పోతారని అనుకుంటూ శివ నందిని మనో శరీరము ముందుకి కొనసాగినది. ఇలా వెళ్ళుతుండగా ఇక్కడ చిన్న సోపానము కనిపించినది. అందులో 8 మెట్లు కనిపించినాయి. ఈ మెట్లు చూస్తుంటే నాకు శ్రీమేరు శ్రీ చక్రములోని 8 రేకులు ఉన్న పద్మము లాగా కనపడినది. ఈ త్రోవ గుండా వెళితే అక్కడ మనకి ద్వాదశాధిత్యులు కనపడసాగుతారు.వీళ్లు కూడా ఉలకరు. పలకరు అనుకుంటూ ఈమె సూక్ష్మధారి అక్కడ ముందుకి కనిపించే త్రోవ లోనికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద సోపానం కనిపించింది. అందులో 14 మెట్లు కనిపించినాయి. వీటిని చూస్తుంటే శివ నందినికి శ్రీ మేరు శ్రీచక్రము లో నాలుగవ ఆవరణలో ఉన్న 14 త్రిభుజ కోణాలకి సంకేతం అని అర్థం అయింది. వీటిని ఎక్కడము చాలా కష్టమని శ్రమపడి ఎక్కవలసి ఉంటుంది అని …..తీరా ఎక్కి చూస్తే నీలాకాశం చాలా విశాలమైన ఒక చక్ర ద్వారమైన వస్తువు ఉన్నట్లుగా కనబడుతుంది. ఇందులో జలదేవత ఆవాసము చేస్తుంది. దీనిని నీలకోట గా పిలవడం జరుగుతుంది.ఈ దేవత అనుగ్రహము వల్లనే మనకి జలాలు వర్షాలు కలుగుతున్నాయని శివ నందినికి అర్థమైనది. అప్పుడు దీనిని దాటుకుంటూ వెళ్ళితే  ఒక చిన్న సోపానం కనబడుతుంది. ఈ సోపానము లోపల 10 చిన్న మెట్లు కనిపించినాయి. వీటిని ఎక్కితే ఒక వృత్తాకార మైన రెండు దారులు కనబడతాయి. ఇక్కడ అగ్ని దేవత ఆవాసము చేసే ముత్యపు కోట కనబడుతుంది. ఈయన వద్ద దగ్ధశక్తి, నిగ్రహశక్తి, అగ్నిస్తంభన శక్తి సాధకునికి ఇవ్వటం జరుగుతుంది. ఈ పది మెట్లు చూస్తుంటే శ్రీ మేరు శ్రీచక్రములో పంచమ ఆవరణలో ఉన్నట్లుగా అనిపించసాగింది.ఇక్కడ ఉన్న పన్నెండు దేవతలు మనకి దర్శనము ఇస్తారు. వీళ్లు ఉలకరు. పలకరు.కాబట్టి మన వివేక బుద్ధిని ఉపయోగించుకుని నైఋతి దిక్కున ఉన్న మార్గం వైపుకి వెళ్లాలి. అక్కడ మళ్ళీ చిన్న సోపానము కనబడుతుంది. ఈ సోపానంలో మనకి తిరిగి పది మెట్లు కనబడతాయి. ఈ మెట్లు చూస్తుంటే మనం శ్రీమేరు శ్రీ చక్రములోని ఆరవ ఆవరణము లోనికి ప్రవేశించినట్లుగా శివ నందినికి అర్థమైనది. మళ్ళీ ఇక్కడ రెండు దారులు కనబడతాయి. ఇది మరకత కోట అని శివ నందినికి అవగతమైనది. ఇందులో మాయ దేవత ఆవాసము చేస్తోంది. ఇక్కడ 12 మంది దేవతలు కనబడతారు… కానీ వీళ్లు కూడా ఉలకరు. పలకరు అన్నట్లుగా ఉన్నారు. మన చావు మనమే చావాలి. ఇక్కడ కనిపించే దారులలో ఒక దారి ఉత్తరానికి వెళితే మరొక దారి దక్షిణానికి వెళ్ళుతుంది. ఇది దక్షిణ మార్గంలోనే మాయ సుందరి ఆవాసమైన మరకత కోట ఉంటుంది. ఇక్కడ అమ్మ వారు కాస్త సుందరి రూపములో అతి సుందరమైన స్త్రీ మూర్తిగా దర్శనం ఇస్తుంది.ఈమెకి భువన సుందరి అని పేరు ఉంది. ఈమె మోహమాయకి చిక్కిన వారు ఇక్కడ ఈ కోటను దాటి ముందుకు వెళ్ళలేరు. అక్కడితో ఆగిపోవాల్సి ఉంటుంది. ఈమె  దగ్గర ప్రపంచ గమన మాయ శక్తి ఉంటుంది.ఈమె  చెప్పినట్లుగానే అసత్యముగా ఉండే ప్రపంచము కాస్త మాయ వలన మనకి సత్య ప్రపంచంగా కనబడుతుందని శివ నందినికి అర్థమైంది. తప్పనిసరిగా ప్రతి సాధకుడు అలాగే సాధకురాలు ఈ కోట మార్గంలోనే ప్రవేశించాలి. ఈ మోహ మాయను దాటి పోవాలి. ఈమెను దాటుకుని వేళ్తే ఉత్తర మార్గంవైపుకి వెళ్లే మార్గము కనబడుతుంది. అక్కడ మౌనముగా ఉండే చతుర్ముఖ బ్రహ్మలు కనబడతారు. వీరి అనుగ్రహమును పొంది ముందుకు వెళితే మనకు చిన్న సోపానము కనబడుతుంది. అందులో 8 మెట్లు కనబడతాయి. వీటిని చూస్తుంటే శ్రీ మేరు శ్రీ చక్రములోని ఏడో ఆవరణలో ఉన్న ఎనిమిది త్రిభుజ కోణాలు అని అర్ధం అవసాగింది. ఇక్కడ మనకి 14 మంది దేవతలు అగుపడతారు. ఇక ఇక్కడ నుండి మనము మెట్లు ఎక్కవలసిన పనిలేదు. అవి పైకి తీసుకుని పోతాయి. ఎందుకంటే ఈ విశ్వ ప్రపంచములో ఉన్న నానావిధ రకాల మహామాయలను మనము దాటటం జరిగినది కదా. ఎలా అంటే ఇక్కడ మనకి మాణిక్య కోట ఉంటుంది. ఇందులో శక్తి దేవత ఉంటుంది. ఈమె అనుగ్రహము మనము పొందినట్లయితే అపారమైన ప్రపంచ శక్తి మన స్వాధీనంలోకి వస్తుందని  శివ నందినికి అర్థం అయినది అలాగే తన మనో శరీరధారికి కూడా అనుభూతి పొందటము జరిగినది. ఈమె అనుగ్రహము వలన మనో శరీరం ముందుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాడికి కెంపు కోట కనబడినది. ఈ కోట లోపల సర్వశక్తి దేవత ఉన్నట్లుగా ఈమె అనుగ్రహము పొందితే మనకి ఈ లోకంలో భావాతీత స్థితి పొంది విభిన్న భావాలను ఏక భావ స్థితికి చేరుకోవడం జరుగుతుందని ఇది శ్రీమేరు శ్రీచక్రము లోని అష్టమ ఆవరణము క్రిందకి వస్తుందని అర్థమైనది. ఈ ఆవరణలో మనకి పంచ దేవతలు కనబడతారు. వీరు కూడా ఉలకరు.పలకరు. వీరి అనుమతి తీసుకుని శివ నందిని మనో శరీరం ముందుకి వెళ్ళడం జరుగుతుంది అని  అర్థమైనది. అప్పుడు వాడికి ఒక చోట అది కాస్త త్రికోణాకారంలో ఉంది. ఇందులో అమృత సముద్రము ఉన్నట్లుగా శివ నందిని మనో శరీరం అనుభూతి పొందుతూ ఉండగా ఈ అమృత సముద్రము మధ్యలో ఒక బిందువు ప్రాంతము ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇది శ్రీమేరు శ్రీచక్రంలో అష్టమ ఆవరణలో ఉన్న త్రికోణము అని  అర్థమైనది. ఆ కనిపించే బిందువు కాస్త నవమ ఆవరణలో మేరు శ్రీ చక్ర బిందువు అని అర్ధమయ్యేసరికి శివ నందిని మనో శరీరధారి ఈ అమృత సముద్రములో కనిపించే బిందువు వైపుకి ఈదుకుంటూ వెళుతున్నాడు అని ఈమెకు అర్థం అయింది. అంటే శ్రీ చక్ర పరిక్రమణ చిట్ట చివరి అంకానికి చేరుకుందని  అర్థం అవుతుండగా ఈమె స్థూల శరీరం కాస్త ఈ బిందువు దగ్గరికి చేరుకోవడం జరిగినది. అక్కడ కోటి పరమాత్మలును 36 కోట్ల మంది దైవ స్వరూపాలు 13 కోట్ల వివిధ రకాల దైవ జాతులు 84 లక్షల జీవజాతులు ప్రతినిధులు కనిపించి వరుసగా కారణ లోకము, సూక్ష్మ లోకాలు, సహస్ర లోకాలు, గ్రహలోకాలు గురించి అందులో ఉండే సుఖభోగాలు గూర్చి లోక పాలకులు వివరించడం జరుగుతుంది. ఒకవేళ మనము ఇక్కడ ఏమైనా ఆశిస్తే మనకి కూడా ఒక బ్రహ్మ పదవిని ఇచ్చి మన కోసం ఒక లోకమును సృష్టించి ఇవ్వడం జరుగుతుంది అని పతంజలి మహర్షి అలాగే శ్రీ లాహిరీ మహాశయుడు చెప్పిన విషయాలు ఈమెకు. లీలగా గుర్తుకు రావడం జరిగినది. ఈమె మనో శరీరధారి వీరు చూపించే ప్రలోభాలకి ఆశలకి అలాగే నన్నే గదా స్వయంగా సిద్ధగణాలు ఆహ్వానించారని ఇసుమంత గర్వం లేకుండా మౌనముగా భావ రహితముగా స్పందన రహితముగా ఉండేసరికి అమృత బిందువు లోపలకి అనుమతి  కలిగినదని శివ నందినికి అర్థమైనది. ఈ బిందువు లోపల ఒక మణిద్వీపము ఉన్నట్లుగా అందులో ఒక మనోహరమైన ఉద్యానవనము ఒకటి ఉన్నట్లుగా దీని లోపల ఒక ముగ్ధ మనోహరమైన సుగంధపరిమళాలు విరజల్లే ఒక వనము ఉన్నట్లుగా దీని లోపల ఒక గృహము ఉన్నట్లుగా ఈ గృహం లోపల నాలుగు కోడులు ఉండి త్రిభుజాకారముగా ఉన్న ఒక మంచము ఉన్నట్లుగా ఈ మంచము మీద బ్రహ్మ తదాకార స్థితిలో మహాశివుడు యోగ నిద్రలో ఉండగా శ్రీ రాజరాజేశ్వరీ మాత ఈయన మీద కూర్చుని ఉన్న ముగ్ధ మనోహర దృశ్యం కనిపించి అనుభూతి పొందుతూ ఉండగా అమ్మవారు పలికే పలుకులు ఈమెకు వినిపించడం లేదని  ఈమె స్థూల శరీరానికి సందేహము రాగానే నా మనోనేత్రం నందు శ్రీ మేరు శ్రీ చక్ర కోట పరిక్రమణ దృశ్యము అంతర్ధానమైంది. ప్రతి సంవత్సరము దేవీనవరాత్రుల సమయంలో తనే ఒక అమ్మవారిగా అలంకారము చేసుకుంటూ ఆయా ఆభరణాలను ఆయా అలంకారాలు చేస్తూ ఈ నవరాత్రులలో నవఆవరణలను దాటుతూ అమృత బిందువుకి చేరుకుని ఏకైక పరబ్రహ్మ స్వరూపమని జ్ఞానము పొందుతారని తన జీవిత చరిత్ర లో చెప్పిన మైసూర్ పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్పిన అనుభవాలు అక్షర సత్యమని …ఈ విషయాన్ని పరమహంస గారు కపాల మోక్షం గ్రంథములో రాయడం జరిగినది అని…ఈ శ్రీ చక్ర పరిక్రమణ అనుభవముతో ఇది సత్యమేనని శివ నందిని గ్రహించింది. దానితో ఈ కాల చక్రము ఇచ్చే కాలాతీత స్థితికి చేరుకోవడం జరిగినది. విచిత్రము ఏమిటంటే చూడటానికి లలితాదేవి అలాగే రాజరాజేశ్వరి అమ్మవార్లు ఒకటిగానే ఉంటారు.


ఇలా శివ నందిని అంతరిక్షంలో ఉన్న మణిద్వీపానికి వెళ్లి,  అక్కడ ఆవరణలు దాటుకొని, ఆదిపరాశక్తిగా ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని… ఈమె కదలకుండా మెదలకుండా యధావిధిగా క్షేమంగా ఈమె మనో శరీరంలో లోకి ప్రవేశించడానికి సుమారుగా ఏకంగా 20 రోజుల పైనే పట్టింది.  అంటే శివ నందిని యొక్క ధ్యాననిష్ట ఒకరోజు నుంచి 20 రోజులకి మారింది అన్నమాట!  ప్రకృతి ఈ సాధనా స్థితిని పెంపొందించడానికి కైలాస పర్వత దర్శన అనుభవమును…. మణిద్వీప దర్శన అనుభవమును…. బ్రహ్మలోక, శివలోక, వైకుంఠ దర్శనాలుగా పెట్టడం జరిగింది. ఈ లోకవాసుల మహామాయలో పడిపోతే… వాళ్ళు మోక్షం బదులుగా ముక్తులు పొందడం జరుగుతుంది.  కాకపోతే శివ నందిని విషయంలోనూ… పరమహంస విషయంలోనూ…. వాళ్ళు దేనికి స్పందించకుండా, ఆశపడకుండా, భయపడకుండా, సంకల్పించకుండా ఆలోచించకుండా, మౌనంగా…. సాక్షిభూతంగా… ఒక సినిమాను చూసినట్టుగా చూసి… ఒక నాటకం జరిగేటప్పుడు తెరమీద నాటకము ఒక పాత్రధారిగా చూస్తున్నట్టు.. ఆ నాటకానికి ఏమీ ఇబ్బంది కలగకుండా …లోపలికి వెళ్లి నాటకం అంతా చూస్తూ…. పాత్రధారులకి ప్రత్యక్షంగా చూసి తిరిగి ఎలా అయితే రావడానికి అవకాశం ఉందో… శివ నందిని మణిద్వీపానికి వెళ్లి అక్కడ ఉన్న 323 దేవతా స్వరూపాలను, 9 ఆవరణలను…. ఆవరణలలో ఏమేమి ఉన్నాయి…. అమ్మవారి లోకాలు ఏమిటి?  అన్ని కూడా ఆవిడ దర్శనం చేసుకుని….తిరిగి యధావిధిగా… దేనికి స్పందించకుండా, సాక్షి భూతంగా ఉండి అన్నీ చూసుకొని…. తిరిగి రావడం జరిగింది.  20 రోజుల తర్వాత తన భౌతిక దేహంలో కదలిక రావటంతో….శివ స్వామి గ్రహించి హమ్మయ్య…. యధావిధిగా తిరిగి వచ్చింది.  లేదంటే 21 రోజులు దాటితే తను మణిద్వీపంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మానవ భౌతిక దేహం సాధనా శక్తిని 21 రోజులకు మించి తట్టుకోలేదు అని చెప్పి రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పడం జరిగింది.  21 రోజులు దాటితే ఆ శరీరం తునాతునకలు అయ్యే ప్రమాదం ఉన్నదని…. మోక్ష మరణం కాస్త భౌతిక మరణంగా మారే పెను ప్రమాదం ఉన్నదని…. సాధనకి శరీరం ఇంక పనికిరాదు అని…. ఆయన అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.  కాబట్టి 21 రోజులు దాటుతుందా? అని ఎవరికి వారే ఆలోచనలో పడ్డారు.  కానీ ఏం జరుగుతుందా అని ….ఎవరికి వారే చూస్తూ ఉండిపోయారు.  కానీ, 20వ రోజు అర్ధరాత్రికి శివ నందిని భౌతిక శరీరంలో కదలిక రావటంతో…. ఇక తను మణిద్వీప దర్శనం చేసుకుని యధావిధిగా తిరిగి వచ్చింది అని తెలుసుకునేసరికి…. శివ నందిని శరీరం కళ్ళు తెరిచి తను చూసిన మణిద్వీపం యొక్క వర్ణనను చెప్పడం ఆరంభించింది.


పూర్విక మహర్షులు కూడా… ఇలాగే భౌతిక శరీరంతో… వాళ్ళ ఆత్మ శరీరాలతో… అంతరిక్ష యానం చేసి తెలుసుకోవడం జరిగింది అని శివ నందినికి అనుభవం అయింది.   ఇప్పటికాలంలో యంత్ర ప్రపంచంలో యంత్రాలను ఉపయోగించి ….టెలిస్కోప్ ద్వారా చూస్తున్నారు…. కానీ పూర్వీకులు స్థూల శరీరంతోఉండి , సంచారం చేసే శరీరాలతో అంతరిక్ష యానం చేసి…. అక్కడ ఉన్న విశేషాలు ఏమిటి!  అక్కడ ఉన్న విధానాలు ఏమిటి ! లోకాలు ఏమిటి!  లోకవాసులు ఎవరున్నారు!  వారు జీవించే విధానం ఏమిటి! అని అన్నీ తెలుసుకోవడం జరిగింది అని చెప్పేసి శివ నందినికి అనుభవం అవ్వడంతో…. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది.  


రుద్రస్వామి:- మంచిది తల్లి నీ సాధన ఆగిపోలేదు.  మణిద్వీపంలోని ఆదిపరాశక్తి మాయలో పడి ఆగిపోతుందేమో అని చెప్పేసి….మేమంతా కంగారు పడ్డాము.  కానీ శివ స్వామి మాత్రం ఏమీ పట్టించుకోనట్టుగాను, సాక్షిభూతం గానూ ఉన్నారు. ఆయన దేనికి స్పందించలేదు…. దేనికి భయపడలేదు…. దేనికి బాధపడలేదు…. ఏం జరిగినా తనకి ఏమీ జరగనట్లుగానే ఉన్నాడు. అంతటి నిశ్చల స్థితి ఉండడం కూడా కష్టమని మాకు  అర్థం అయ్యింది. 


శివ నందిని:- ఆయన ఆ స్థితిని పొందాడు కాబట్టే…. మనల్ని కూడా ఆ స్థితికి తీసుకురావాలని తపన, తాపత్రయం పడుతున్నారు. 


శివస్వామి:- ఆహా…!  అవి నాకు లేవు.  నాకు ఎలాంటి స్పందనలు లేవు…మాయలు లేవు… అవన్నీ ఉన్నవి మీకే…


శివనందిని:-  నాకు ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనం అయ్యింది.  అదే రాజరాజేశ్వరి రూపంలో… ఇంకో రూపంలో లలితాదేవి కూడా దర్శనం అయ్యింది.  ఒక ఆవిడ కదులుతుంది.  ఒక ఆవిడ ధ్యాన నిష్టలో ఉంది.  లలితాదేవి దగ్గర ఐదు సంవత్సరములు ఉన్న పాప కనపడితే…. రాజరాజేశ్వరి దగ్గర ఎవరు కనిపించలేదు.  ఆవిడ ధ్యాన నిష్టలో ఉంది.  ఎందుకో ఆవిడని చూసేసరికి తపన, తాపత్రయం, కుతూహలం కూడా మాయమైపోయాయి. అప్పటిదాకా ఆవిడని చూడాలి…. ఆదిపరాశక్తి అయిన అమ్మవారి యొక్క అంత్య రూపం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి….. నేను అన్నీఆవరణలు దాటుకుంటూ….  బిందు స్థానానికి వెళ్ళినప్పుడు, కామేశ్వరుడు కామేశ్వరి కనపడ్డారు.  ఆ తర్వాత లలితాదేవి కనబడింది.  అది దాటిన తర్వాత పంచముఖ శివుడు కనపడ్డాడు.  అది దాటిన తర్వాత లలితాదేవి కనబడింది.  ఆ లలితాదేవి పాదము దగ్గరికి వెళితే లోపల నిశ్చల స్థితిలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం అయ్యింది.  


శివస్వామి:- అవునా మంచిదే కదా! 


శివనందిని:-  మీరు ఏకంగా కైలాస పర్వతంలో ఉన్న అగర్తలా, శంబలా గ్రామంలో ,కైలాస పర్వతం లోపల ఉన్న నీలం శివుడు యొక్క సాధనను కూడా స్వయంగా చూశారు కదా!  అలాగే మణిద్వీపం కూడా దర్శనం చేసుకున్నారు.  శంబల కూడా దర్శనం చేసుకున్నారు.  జంబుద్వీపం కూడా దర్శనం చేసుకున్నారు కదా!  అవన్నీ మీకు ప్రత్యక్ష అనుభవం పొంది వచ్చారు కదా!  కానీ మీరు వాటి మాయలో పడకుండా వెనక్కి తిరిగి వచ్చారు.  నేను ఎక్కడ మాయలో పడతానో అని అనుమానంతో నన్ను ఒకటికి పది సార్లు హెచ్చరించారు.  కానీ ఆపలేదు.  ఆ మాయని తట్టుకునే శక్తిని నాకు రావాలని అనుమతి ఇచ్చారు.  తట్టుకోగలుగుతానా లేదా అని అనుభవ అనుభూతిగా అంతరిక్షంలో ఉన్న మణిద్వీపానికి వెళ్లడం జరిగింది.  తిరిగి రావడం కూడా జరిగింది. 


శివస్వామి:- ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకు.  అన్నివేళలా అనుకూలంగా ఉంటుందని అనుకోవద్దు. ఏ చిన్నపాటి పొరపాటు చేసినా కూడా సాధన అంతా కూడా అధోగతి పాలవుతుంది.  మళ్ళీ మొదటికి వస్తుంది.  అంతం కావలసిన చోట ఆరంభం అవుతుంది.  అది మాత్రం గుర్తుపెట్టుకో .! 


మహాదేవి:-మేము కూడా మాకున్న త్రిమాయలను తొలగించుకోవాలంటే…. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లాలా!  అమ్మవారి దర్శనం చేసుకుంటే గానీ మాకు ఉన్న మాయలు పోవా? 


శివస్వామి:-  మీ మాయలేమిటో మీకు తెలుసా?


అని శివస్వామి అడిగేసరికి…. ఒక్కొక్కరు వాళ్ళ త్రిమాయల గురించి ఆలోచించారు. రుద్రస్వామికేమో శాంతము, మనశ్శాంతి ,ఆనందం అనే మూడు మాయలు వస్తే…. మహాదేవికి ఏకాగ్రత, ఆనందం, సంతోషం మూడు మాయలుగాను….. బాలగణపతికి అనుభవం, అనుభూతి, ఆనందస్థితి …..బాల కుమారస్వామికి స్థితి, కార్యము, కారకము అనే మూడు స్థితులు మాయలుగా ఉన్నట్లుగా చెప్పేసరికి…. అయితే శివ నందిని ఆ మూడు మాయలు దాటలేదు.  ఈ మూడు మాయలతో అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది.  తనకి మోక్ష అనుభవాలు పొందాలని…. తపన ,తాపత్రయం ,కుతూహలం ఉంది అనేసరికి… అవి సహజంగా ఉంటాయి కదా!  అనేసరికి మాయలు అనేవి తాత్కాలికంగా దాటాము అని మనం అనుకుంటాం.  ప్రవచనకర్తలు చెబుతున్నప్పుడు…. ఇతిహాస పురాణాలు చదువుతున్నప్పుడు…. మనకి ఒక రకమైన వైరాగ్యం వస్తుంది.  దానిని పురాణ వైరాగ్యం అంటారు.  అదే అనుభవంలోకి వచ్చేసరికి… స్మశాన వైరాగ్యం కలుగుతుంది.  అంటే ఇప్పుడు ఇంకొకరి చావును చూస్తే… పురాణం వైరాగ్యం కలుగుతుంది.  అదే మన ఇంట్లో వాళ్ళ చావును చూస్తే అది స్మశాన వైరాగ్యం కలుగుతుంది.  కాబట్టి తనకి పురాణ వైరాగ్యం మాత్రమే కలిగింది. స్మశాన వైరాగ్యం కలగలేదు అనేసరికి…. అవును. ఆ విషయం నాకు అర్థం అవుతుంది అని శివ నందిని అనేసరికి…. మరి ఈ త్రివిధ మాయలు దాటడానికి ఏం చేయాలి? అనేసరికి…. పరమహంస గారి ధ్యాన అనుభవాల ప్రకారంగా చూస్తే…. ఇక్కడ మూడు లింగాల స్థితిని మనం పొందవలసి ఉంటుంది.  నల్ల శివలింగం,  స్పటిక రుద్ర లింగం,నల్ల రుద్ర స్పటిక లింగం, నల్ల రుద్ర శివలింగం, ఇంకొకటి తెల్ల రుద్ర స్పటిక లింగం. ఈ రెండు లింగాలను కలిపితే…. అంటే పానవట్టం నల్లగా ఉండి, పైన లింగభాగం స్పటికంగా ఉండే మూడో లింగమును మనం దైవిక వస్తువులుగా పొందితే…. ఈ త్రివిధ మాయలు పోతాయి అని చెప్పేసరికి ….అరుణాచలంలో వీరందరూ కూడా ఈ లింగాలు దొరుకుతాయేమోనని తిరగటం ఆరంభించారు. నల్ల రుద్ర లింగం, స్పటిక రుద్ర లింగం మాత్రమే దొరికినాయి.  కానీ మూడవ లింగం దొరకకపోయేసరికి….ఏం చేయాలి అని శివ స్వామిని అడిగేసరికి…. అక్కడ ఒక శిల్పి లింగంలేని పానమట్టం తయారు చేసి అమ్మకానికి పెట్టడం చూసిన ఈయన కాస్త….ఇది ఏమిటి?  దీని వల్ల ఉపయోగం ఏమిటి?  అనేసరికి ఈ పానమట్టం పైన ఎవరికి కావలసిన శివలింగం ఆకారం  పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు.  కొంతమంది స్పటిక లింగం పెట్టుకుంటారు… కొంతమంది నల్లరాతి బాణ లింగం పెట్టుకుంటారు.  ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అనేసరికి…. నల్ల రుద్ర శివలింగం, తెల్ల స్పటిక రుద్ర శివలింగం ,రుద్ర శివలింగ పీఠము ,స్పటిక బాణ లింగము వీళ్ళకి దైవిక వస్తువులుగా దొరకడం జరిగింది. ఇక శివ నందిని 21 రోజుల ధ్యానంలో ఉండేసరికి…. ఆమెకి ధ్యానంలో టెంపుల్ రన్ ఆట మొదలైంది.  అంటే మొదట గాఢాంధకార శూన్యము, ఆ తరువాత ఎరుపు రంగు శూన్య బిందువు, ఆ తర్వాత జ్యోతిగా కనిపించడం, ఆ జ్యోతిలో అగ్నికపాల దర్శనము, ఆ తర్వాత వరుసగా తనుచూసిన ధ్యాన అనుభవాలు పొందుతూ…. చివరికి 64 కపాలధారి అనుభవం పొందుతూ…. 63 లోకాలు వరుసగా 1 నుంచి 63 లోకాల కపాలాలకు చేరుకొని ….63వ కపాలంలో ఉన్న మణిద్వీప అనుభవం తిరిగి చూడడం జరిగింది. ఆ తర్వాత 64వ లోకానికి వెళుతున్నప్పుడు….  మొదట ఒక తెల్లని ఏనుగు దంతం దర్శనం అయ్యింది…. దీనిమీద గజముఖ గణపతి ఉండటం ….తన ఆత్మ లింగమును ఆపాలని తొండముతో విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ఆత్మ లింగం అనేది తనకి వచ్చిన రుద్ర బాణలింగం అన్నమాట!  ఆ తర్వాత పాంచ జన్య శంఖం దర్శనం అయ్యింది . ఈ శంఖంలో విష్ణుమూర్తి దర్శనం అవ్వటం…. ఈయన ఎడమ చేయి బయటకు పెట్టి…. తన ఆత్మ లింగాన్ని ఆపాలని ప్రయత్నం చేయటం…. అది వీలుకాక పోవడంతో చెయ్యి అదృశ్యం అవడం జరిగింది. ఆ తర్వాత ధ్యాననిష్టలో ఉన్న ఆది శివయోగి దర్శనం అయ్యింది.  కానీ ఈయన ఉలకలేదు, పలకలేదు, ఏమీ చేయలేదు.  దానితో ఈయనను కూడా దాటుతూ ఉండేసరికి…. ఒక పెద్ద తిమింగలం దర్శనం అయ్యింది.కానీ ఇది కూడా ఏమీ చేయలేదు.  ఇది కూడా ఉలకలేదు….పలకలేదు.  ఆ తరువాత ఒక అరవై అడుగులు ఉండి దివ్య కాంతి శరీరంతో ఉన్న సర్పము దర్శనమైంది.  ఇది కాస్త నోటితో ఆత్మ లింగమును మింగాలని ప్రయత్నం చేసినప్పటికీ…. కూడా తన ఆత్మ లింగం దానికి వశం కాకపోవటంతో…. ఆ పాము కాస్త అస్థిపంజరంగా మారిపోయింది.  ఆ తర్వాత దక్షిణామూర్తి చిన్నముద్రలో దర్శనమిచ్చారు.  ఆయన తన ముద్రలో ఈ ఆత్మలింగమును బంధించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా…. అంటే త్రివిధమాయలు ఈ చిన్ముద్ర ద్వారానే అంటే తపన,తాపత్రయం, కుతుహలం అనే మూడు మాయలు దాటడంతో…. ఈ ముద్రలో కూడా ఆత్మలింగం ఇమడలేదు.  ఆ తర్వాత ఈ చేయి కూడా అదృశ్యం అయింది.  ఇక 64వ డైమెన్షన్ లోకి ప్రవేశిస్తుందని శివ నందిని అర్థమయింది. 


ఇక అక్కడ ఏకదళపద్మ దర్శనం కనపడింది.  అది తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేసరికి , ఈ పద్మం పైన కోడిగుడ్డు ఆకారంలో ఒక దివ్య జ్యోతి దర్శనం అయ్యింది.  ఈ దివ్య జ్యోతి లోపల ఏక ముఖతలతో పద్మాసనంలో కూర్చొని ధ్యాన నిష్ట లో ఉన్న శరీరధారి నీల శివుడు అయిన శంభు రుద్ర మూర్తి దర్శనం అవ్వటం….. ఈయన ముందు గోముఖ తీర్థ దర్శనం అవడం….శివ నందినికి అనుభవం అవుతూ ఉండగా….. తన యొక్క స్థూల శరీరం ఎగశ్వాస పొందడంతో…. శ్వాసకు ఇబ్బంది కలగడంతో…. శివ నందినికి ధ్యాన భంగం అయింది.  ధ్యానం నుంచి బయటకు వచ్చి శివ స్వామికి…. తనకి కలిగిన ధ్యాన అనుభవాల గురించి చెప్పేసరికి….. 


శివస్వామి:- నువ్వు పురుష ప్రకృతిని చూసే అర్హత కలిగింది.  నువ్వు ఆత్మలింగం ప్రయాణంతో ఈ ప్రకృతిలోనికి వెళ్ళటం జరుగుతుంది. ఈ ప్రకృతి తో పాటుగా నీల శివుడు అయిన శంభు రుద్రుడు ముందు వెళ్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళవలసి ఉంటుంది. అంటే 21 రోజుల ధ్యాననిష్టను నువ్వు పొందడం జరిగింది కాబట్టి….. నువ్వు ఇక్కడ నుండి ఆపకుండా, భయపడకుండా, కదలకుండా, ఆలోచించకుండా, సంకల్పించకుండా…. 21 రోజులపాటు ధ్యాననిష్ట లో ఉండి స్థిరత్వంతో ఉంటే…. ఇంక చివరి మోక్ష అనుభవం ఏమిటి అనేది నీకు తెలుస్తుంది.  ముందు పురుష ప్రకృతి యొక్క అనుభవం ఏమిటి అనేది తెలుస్తుంది….. కాబట్టి నీ మానసిక, శారీరక స్థితిని బట్టి 21 రోజుల పాటు నువ్వు ఎప్పుడైతే ఆపకుండా,కదలకుండా, మెదలకుండా ధ్యాననిష్టలో ఉండగలిగే స్థితిని పొందుతావో…. అప్పుడు చివరి మోక్షానుభవం పొందడం జరుగుతుంది. ఈ మోక్ష అనుభవాలకి మనం అందరం కూడా ధ్యాననిష్ట లో ఉండడం జరుగుతుంది. 


శివనందిని:-  మరి మనో శరీరం, పిండ శరీరం, లింగదేహాల మోక్షం సంగతి ఏమిటి?


శివస్వామి:- ముందు మనో శరీరంతో… మనో ఆత్మలింగంతో… మోక్ష అనుభవం ఏమిటి అనేది రికార్డు దృశ్యాలు చూడగలిగే స్థితి పొందాలి. ఇక్కడ స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి, మూల ప్రకృతి ఈ మూడు ప్రకృతిలో ఉన్న అండ పిండ బ్రహ్మాండాలు ఉన్న విశ్వ జగత్తు యొక్క మోక్ష విధివిధానాలు చూసే మానసిక స్థితిని పొందాలి. ధ్యానభంగం కాకుండా 21 రోజులపాటు నువ్వు ధ్యాననిష్ట లో ఉండగలిగితే…… విషయం ఏమిటి అనేది నీకు అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు మనో శరీరంతో ధ్యానానుభవాలు చూసిన తరువాత…. అప్పుడు నీ సాధన స్థితిగతులు ఏమిటి? అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఏ మోక్షం పొందావు… ఏమాయ దగ్గర ఆగిపోయావు… తెలిసి ఆగిపోయావా!  తెలియక ఆగిపోయావా!  అనేది ఇప్పుడు ఈ సాధనలో  నీకే తెలుస్తుంది.  ఆ తరువాత నీ మనో, పిండ, లింగ దేహములలో ఏదో ఒక దేహం మిగిలిపోతుంది.  లేదు సాధన పరిసమాప్తి చేసుకుంటే…. ఈ మూడు దేహాలు వెళ్లిపోయి…. నీ వ్యక్తిగత మోక్షం కాస్త విశ్వమోక్షం అవుతుంది.  ఇప్పుడు ఎక్కడైనా ఏ దేహమైన ఆగింది అనుకో….. ఇప్పుడు మనోదేహం ఆగిందంటే పురుష ప్రకృతిలో మనో శరీరం మోక్షం ఆగిపోయినట్టే….అదే పిండ దేహం ఆగిపోయింది అంటే మూల ప్రకృతిలో పిండ దేహం వద్ద మోక్షం ఆగిపోయినట్టే….. అదే లింగ దేహం దగ్గర నీ సాధన ఆగిపోయింది అంటే నువ్వు విశ్వ మోక్షం దగ్గర నీ శరీరం ఆగిపోయినట్టే….కాబట్టి ఎక్కడ? ఏమిటి? అనేది చూసుకునే మానసిక శారీరక స్థితిని బట్టి…. ఆధారపడి ఉంటుంది.


శివనందిని:- మరి పరమహంస గారికి లింగ దేహం దహనం అయ్యింది కాబట్టి మోక్షమును పొందడం జరిగింది. విశ్వ మోక్షం ఎందుకు పొందలేదు.


శివస్వామి:- ఆకాశరీర మోక్షం దగ్గర ఆయన ఆగిపోవడం జరిగింది కదా! ధర్మపత్ని  ఋణం తీర్చుకోవడం జరిగింది కదా!  ఆ ధర్మపత్ని ఋణం తీరిపోవటంతో…. ఆయన విశ్వమోక్ష జ్ఞానమును పొందటం జరుగుతుంది.  ధర్మపత్ని నాకు నువ్వే అయినప్పుడు …..ఆయన శరీరానికి తగ్గట్టుగా సిద్ధాదేవి ధర్మపత్ని అవుతుంది.  మన అనుభవాలనే ఆయన అనుభూతిగా పొంది…. విశ్వ మోక్ష గ్రంథం రాయడం జరుగుతుంది. తద్వారా ఆయన విశ్వమోక్షం పొందడమే జరుగుతుంది. ఆయన 11 దేహాలలో పది దేహాలు మోక్షమును పొందడం జరిగింది. ఆకాశ శరీరం మోక్షం ఆగింది.  అది ఎందుకు అంటే పురుష ప్రకృతిలో అనుసంధానమైన ధర్మపత్ని ఋణాలు ఉండటం వలన….. ఆదిపరాశక్తి బంధం ఆపింది.  


అనేసరికి ఓహో! అని శివనందిని అనుకొని….


శివ నందిని:- సరే నాకు కొన్ని రోజులు శారీరక మానసిక స్థితి తట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడైతే నేను సంసిద్ధురాలని అవుతానో ….. అప్పుడు 21 రోజుల పాటు ధ్యాననిష్టలో ఉందాము.  ఇక  చివరిసారిగా మోక్షానుభవాలు పొందుతూ నా సాధన పరిసమాప్తి అయిందో…. లేక ఎక్కడైనా ఆగిందో…. అని ఆ అనుభవాలను బట్టి నేను గ్రహించగలుగుతాను. 


శివస్వామి:- కాకపోతే మానసికంగా, శారీరకంగా నువ్వు సంసిద్ధురాలివి అవ్వాలి. ఎలాంటి మాయలో పడకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండు 


అనేసరికి… సరే అని శివ నందిని అనడం జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి