వాక్సిద్ది
నా జీవితంలో నెమ్మది నెమ్మదిగా జ్యోతిష్కుడు చెప్పిన సంఘటనలు ఒకదాని వెంట మరొకటి జరుగుతూ ఉండే సరికి…. నా జీవితం నా చేతుల్లో లేదని… గ్రహాలు ఆధీనంలో ఉందని నమ్మకం బలపడటం జరుగుతోంది! ఎవరు తన విధిరాతను మార్చలేరని… విధిరాతను తెలుసుకునే జ్యోతిష్యుడిగా అవతరించే పరిస్థితులు నా జీవితంలో ఎలా వచ్చినాయో మీరే చూడండి!
నేను గాయత్రి ఉపాసన సిద్ది పొందుతున్న సమయములో… నెమ్మది నెమ్మదిగా నా వాక్కు దైవవాక్కు గా మారినది! ఎదుటి వాడి మొహం చూడగానే నాలో ఏదో తెలియని ఉద్దేశం కలిగి వాక్ రూపంలో … వారికి జరిగిన నాలుగు సంఘటనలు… జరగబోయే పది సంఘటనలు వారికి చెప్పడం జరిగేది! అది నా ప్రమేయం లేకుండానే జరిగేది! అవి వారికి అక్షరసత్యంగా జరిగినాయని తెలిసేసరికి… నామీద నాకే అనుమానం వచ్చేది! భయం వేసేది! నేను ఎలా వీరికి వారి భవిష్యత్తు సూచనలు చెపుతున్నాను అంటే నాకు అర్థమయ్యేది కాదు! అంటే ఈ లెక్కన భవిష్యత్తు ముందే వ్రాసి ఉంటుందా? మన జీవితం జాతకాల మీద ఆధారపడి ఉంటుందా? గ్రహాల మీద ఆధారపడి ఉంటుందా ?భవిష్యత్తు దర్శిని చేయించడం వీలవుతుందా? అనే సందేహాలు నన్ను వెంటాడినాయి! నేను ఇంటర్ తప్పడంతో… నాలో అప్పటి దాకా చదువు మీద ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గినది! నిజము చెప్పాలంటే దొబ్బినది! కానీ నా తల్లిదండ్రులు పడే బాధను చూడలేక…
తప్పిన పరీక్ష కోసం తిరిగి చదవడం మొదలు పెట్టాను! ఈ ఆరు నెలల సమయంలో చదివే పుస్తకాలు పక్కనపెట్టి… భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య గ్రంథాలు పుస్తకాలు… వందల పుస్తకాలు చదవడం ఆరంభించాను!
గుడిలోకి వచ్చే భక్తులకు నాకు వచ్చిన వాక్సిద్ధి ద్వారా వారి భవిష్యత్తు చిన్నగా నాకు తెలియకుండానే సరదాగా చెప్పడం ఆరంభించాను! నా భవిష్యత్తులో జరగబోయే భవిష్య జ్యోతిష్యవేత్తగా అక్కడే బీజం పడుతుందని గ్రహించే వయస్సు కానీ మనస్సు కాని నాకు లేదు! ఎందుకంటే నా చేత చెప్పించుకుని వారంతా అచ్చం నువ్వు చెప్పినట్టుగానే జరుగుతోంది! అక్షరం కూడా పొల్లు పోవడం లేదు! నువ్వు చాలా చక్కగా ఖచ్చితంగా చెబుతున్నావు! నువ్వు అంతా! నువ్వు ఇంత! నువ్వు పెద్ద తోపు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే… నా వయస్సు కన్నా పెద్ద వారే… నా ముందు చేతులు కట్టుకుని… నేను చెప్పే నాలుగు వాక్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటే… చీదరింపులు, అవమానాలు మిగిల్చిన ఇంగ్లీషు చదువులు ఇంకా నా బుర్రకి ఏమి ఎక్కుతాయి? ఇలాంటి సమయంలో ఒక జిజ్ఞాసి పరిచయము అయినాడు! వాడు వచ్చి నా చదువు భోగ జీవితాన్ని ఎలా యోగ జీవితంగా మార్చినాడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !
శుభం భూయాత్
పరమహంస పవనానంద
********************************
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmee vaaksiddhi gurinchi cheppatam bagundi.
రిప్లయితొలగించండి