మూడు తలల ఆసామి కనిపించాడు
(నా గుణ చక్ర అనుభవాలు)
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
ఆజ్ఞాచక్రము లోని చతుర్ధ గుహ లో ఉండే నాలుగు చక్రాలు అయిన గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రాల సాధనకి ప్రతి సాధకుడు తాంత్రిక విధి విధానము లోనికి అదే వామాచారం లోనికి వెళ్లి సాధన చేయాల్సి ఉంటుందని ఈ విధానంలో కాపాలిక సాధన ద్వారా గుణ చక్రమును అఘోర సాధన సిద్ది ద్వారా కర్మ చక్రమును అలాగే భైరవి సాధన ద్వారా కాలచక్రమును నాగ సాధువులు చేసే అగ్ని సాధన ద్వారా బ్రహ్మ చక్రంను వరుసగా గుణాతీతస్థితి, కర్మాతీత స్థితి, కాలాతీత స్థితి, భావాతీత స్థితి సిద్ధి పొందుతారని దీనికోసమే ఆదియోగి అయిన మహాశివుడు ఆదియోగి అయిన మహా శివాని కూడా ఈ చక్రాల సాధన కోసం గుణ చక్రము సిద్ధి కోసం కాపాలికుడు/ కాపాలికురాలిగా, అదే కర్మ చక్ర సిద్ధి కోసం అఘోరమూర్తి గాను /అఘోరిమూర్తిగాను కాలచక్ర సిద్ధి కోసం కాలభైరవుడు/ భైరవి గాను బ్రహ్మ చక్ర సిద్ధి కోసం నాగ సాధువుగా/నాగా నాగినిగా అవతరించి ఈ నాలుగు చక్రాలు దాటినారు. ఇదంతా కూడా వామాచార పద్ధతిలో సాధన కొనసాగినది. కానీ దక్షిణాచారం పద్ధతిలో కూడా ఎలా చేయాలో పరమేశ్వరుడు తన భార్య అయిన పరమేశ్వరికి బోధించినారని శ్రీ లాహిరీ మహాశయుడు అనుభవ జ్ఞానము ద్వారా లోకానికి తెలియజేసినారు. నా బోటి అనామకులకు ఈ జ్ఞానం ఎంతగానో ఎలా ఉపయోగపడిందో మీరే తెలుసుకోండి. నిజానికి వామాచారంలో పంచ మకారాలు ఉంటాయి. పంచ మకారాలు అంటే ఇందులో ఉన్నవి అన్నీ కూడా 'మ' అనే అక్షరంతో మొదలు అవటము వలన దీనికి పంచ మకారాలు అనే పేరు వచ్చినది. అవి ఏమిటంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము. ఈ సంప్రదాయంలో మద్యం సేవించి సాధన చేస్తే ఆ సాధకుడికి నగ్నత్వం చేదించే తత్వమును పొంది కాపాలికుడు త్రిగుణాతీతుడు అయ్యి గుణ చక్రమును ఆధీనము చేసుకుంటారు. అదే కేవలము మాంసమును సేవిస్తూ సాధకుడు సాధన చేస్తే అట్టివానికి ఈ భౌతిక ప్రపంచం కాస్త బ్రహ్మ పదార్థంగా సిద్ధి పొంది కర్మాతీతుడై కర్మ చక్రమును ఆధీనము చేసుకుంటాడు. అదే కేవలము మత్స్యము అంటే చేపలను తింటూ సాధకుడు సాధన చేస్తే కాలాతీతుడై మహా కాల భైరవ తత్వమును పొందుతాడు. ఆ తరువాత ముద్రలు ఉపయోగించి వివిధ రకాల యోగ హస్త ముద్రలు వేస్తుంటే వాటి సిద్ధి వలన అతడికి ఇంద్రియాల యందు పట్టు సాధించి జితేంద్రియుడు అయ్యి బ్రహ్మ చక్రం లోనికి ప్రవేశించ కలుగుతాడు. ఆ తర్వాత ఏకకాలంలో ఈ నాలుగు చేసుకుంటూ పోతే సర్వ పాపాలు సర్వకర్మలు సర్వజన్మలు సర్వపునఃజన్మల నుండి విముక్తుడై బ్రహ్మస్వరూపుడు అవుతాడు. సృష్టి బ్రహ్మ లేదా కారణ బ్రహ్మ, భవిష్య బ్రహ్మ,జ్ఞాన బ్రహ్మ, గురు బ్రహ్మ ఇలా ఎన్నో బ్రహ్మ పదవులలో ఏదో ఒక బ్రహ్మ పదవిని పొందుతాడు. ఇట్టి చక్ర స్థితిలోనే మన హనుమంతులవారికి రాబోవు కాలంలో మనకి భవిష్యత్ బ్రహ్మ గా ఉంటాడని శాస్త్ర వచనము. ఈ వామాచారంలో దేవతను తల్లిగానో మరే వరాలు ఇచ్చే ఆవిడగానో పూజించరు. తాను దేవత అన్న భావముతో ఇతర దేవతలను తన ప్రియురాలిగా భావించి ఆరాధన చేయటం జరుగుతుంది. అందుకే మన ప్రమేయం లేకుండానే ఆజ్ఞా చక్రము నందు మన దేవుడు/ దేవత కాని మనకి ప్రియుడిగా/ ప్రియురాలిగా లేదా భర్త/ భార్యగా చూపించడం తెలుసు కదా. ఈ ప్రకృతి చేసే మాయ ఆధారంగానే నిజానికి వామాచారం అనే సంప్రదాయం మొదలైనది. దక్షిణాచారంలో ఇలా దైవాలను తమ ఇష్ట సఖులు గా చూడటం ఆరాధించడం పూజించటం మహా అతి ఘోరమైన పాపం కనుక వామాచార సత్సంప్రదాయం బయలుదేరి ఇలా ఊహించుకోవటం భావనలు చేయడం తప్పు కాదని ఇది ఒక దివ్య భావ మార్గమని లోకానికి తెలియజేసే ప్రయత్నాలు చేసినారు. కాని ఆదిశంకరాచార్యుడు వీటిని గౌరవించి కాపాలికునికి తల ఇవ్వటానికి సిద్ధపడిన విధానము చూసినను జంతుబలి నరబలి విధివిధానాలే వీరు వ్యతిరేకించటం జరిగినదని వారి చరిత్రలో మనకి అవగతం అవుతుంది. కానీ ఈ వామాచారం అంతా క్షుద్రపూజల వరకే పరిమితం చేసి లోకమునకు లేనిపోని భయాలు అపోహలు కలిగించి వీటిని మరుగుపరిచి ఉన్నారని నాకు అర్థమైనది. అంతెందుకు ఉచ్చిష్ట గణపతి ఆరాధన ను పూర్తిగా మడి కట్టుకొని జపము చేస్తానంటే కుదరదు. దాన్ని ఈ వామాచార పద్ధతిలోనే అశుచియై దిగంబరుడై తాంత్రిక మార్గంలోనే ఉపాసన చేస్తే గాని ఈ ఆరాధన సిద్ది కలగదు అని ఎందరికీ తెలుసో చెప్పండి. అలాగే గాయత్రీ మహా మంత్రం ఇలా వామాచారంలో చేస్తే 24 మంత్ర దేవతలు ఉగ్ర స్వరూపులుగా మారి ఆ సాధకుడిని తిని వేస్తాయి. దీనిని కేవలం దక్షిణాచారంలోనే ఆరాధన చేస్తే ఈ మంత్రసిద్ధి కలుగుతుంది అని ఎవరికి తెలుసు. మనము పూజించే దైవాలలో-ఎవరిని ఎలా పూజించాలో ఏది వామాచారం ఏది దక్షిణాచారం పద్ధతిలో ఆరాధించాలో చెప్పే నాథుడు తెలుసుకునే జ్ఞానం మనకి లేరని చెప్పటానికి కొంత బాధ గానే ఉన్నది. ఇది తెలిసిన వారు చెప్పకుండా మౌనం వహిస్తారు. తెలియనివాడు తనకి తోచిన విధంగా చేస్తే మంత్రసిద్ధి పొందలేడు. తెలిసిన వాడు చెప్పడు. తెలియనివాడు తెలుసుకోలేడు. చాలామంది ఈ చక్రాల సిద్ధికి వచ్చేసరికి వామాచార విధానాలకు భయపడి వారి సాధన బలవంతముగా ఆపివేసుకుని కావాలని ఏదో ఒక మాయలో పడి సాధనను నాశనం చేసుకున్న వారిని నా స్వానుభవం లో చూశాను. పోనీ ఈ చక్ర స్థితులకు వచ్చేసరికి సరియైన వామాచార విధివిధానాలను సరిగ్గా అర్థం చేసుకోక మతిభ్రమణము చెందిన వారిని శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ,పుష్కర్, కామాఖ్యాదేవి క్షేత్రాలలో నేను చూడటము జరిగినది.
ఇక ఈ పంచ మకారాలు దక్షిణాచారంలోఎలా చేయాలో శ్రీ లాహిరి మహశయుడు అనుభవ జ్ఞానము లో చూద్దాము. ఈయన మాటలను బట్టి చూస్తే మద్యపానం వలన తాగుబోతులు అయిన వారికి నిత్యం మాంసము తినే వారికి నిత్యం చేపలు తినే వారికి నిత్యము స్త్రీ సంభోగం చేసే వారికి అంటే పామర జనులకు కూడా చక్రాల శుద్ధి కలిగి మోక్షము కలగాలి కదా. మరి ఎందుకు కలగటం లేదు అని తంత్ర శాస్త్రం చెబుతోంది అని వీరి వాదన. నిజానికి పంచ మకారాలలో చెప్పబడే మద్యం అనేది సారాయి షాపులలో బ్రాందీ షాపుల లో దొరికే మద్యం బాటిల్స్ కాదని మన బ్రహ్మరంధ్రము నుంచి సహస్రారచక్రము లోనికి ప్రవేశించి ఆజ్ఞా చక్రమునకు చేరుకుని మన కొండనాలిక అంగిట్లో చేరే చిక్కటి ద్రవం పదార్థమైన అమృతం సేవించేవారని నిజానికి మద్యపాన సాధకులు అందురు. అంటే కారణ శరీర స్థితి పొందిన పరమయోగులు అమృతధార నిత్య పానము చేసుకుంటారు కాబట్టి వీరిని మద్యపాన సాధకులు అంటారు. ఇక పంచ మకారాలలో రెండవది అయిన మాంసము. ఈ మాంస భక్షణ అంటే ఏదో ఒక జంతు మాంసం లేదా నర మాంసం తినటం కాదు. నిజానికి మాంసభక్షణ అంటే జిహ్వ సంయమనము. అనగా నాలుకను అదుపులో ఉంచుకోవటం. మా అనే మాటకు అర్థము రసన అనగా నాలిక. రసనలో అంశము వాక్యము. అంటే రసనా భక్షణ అనగా వాక్యం సంయమనాన్ని పాటించే వాడు అని అర్థం. అనగా గురూపదేశము అనుసరించి సాధకుడు ఖేచరీ ముద్ర సాధనను అనగా నాలుకను వెనక్కి మళ్ళించి కొండనాలికని తాకినప్పుడు మాట్లాడడానికి వీలు పడదు కదా. తద్వారా మాట్లాడాలనే కోరిక నశించును. మౌనము అంటే ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవడమే గాని బలవంతముగా మాట్లాడకుండా ఉండుటకాదు. ఇది నిజమైన జిహ్వ సంయమనము వలన మౌనః బ్రహ్మ గా మారటం జరుగుతుంది.ఇట్టి జిహ్వముతో మాటలను భక్షణము చేసే కర్మ చేయటం వలన ఇట్టి సాధకుడిని మాంసభక్షణ సాధకుడు అంటారు. ఇక పంచ మకారాలలో మూడవది అయిన మత్స్యము అంటే భౌతికముగా దొరికే నీటి జీవులు కాదని సాధకుడి శరీరంలో ఇడా నాడి- గంగ పింగళా నాడి- యమున అనే ఈ రెండు నదుల మధ్య శ్వాస ప్రశ్వాస అని రెండు చేప జాతులు 21,600 చేపలు తిరుగుతూ ఉంటాయని వీటిని అనగా ప్రాణాయామం ద్వారా శ్వాస ప్రశ్వాసలు అదుపులో ఉంచటమే మత్స్యము భక్షించే మత్స్య సాధకులు అంటారు. ఇక పంచ మకారాలలో నాలుగోది అయిన ముద్ర అంటే ఎవరైతే తమ సహస్రార చక్ర పద్మ కమలములో కోటిమంది సూర్యచంద్రుల కాంతులతో చిన్ముద్రలో ఉండే గురుదక్షిణామూర్తి స్వరూపమును పరమాత్మగా దర్శించే యోగులను ముద్రా సాధకులు అంటారు. ఇక పంచ మకారాలలో చివరిది అయిన ఐదవది అయిన మైధునము అంటే నాభి చక్రములోని (మణిపూరక చక్రము) కుండం లోపల కుంకుమ వంటి ఎరుపు వన్నె 'రా' కారము అనే తేజ సత్త్వమును అజపారూప ధ్యాన విధివిధానంతో ఆజ్ఞాచక్రములో ఉండే మహా యోని లోపల బిందు స్వరూపం లో ఉండే 'మ' కారానికి సమ్మేళనము అనగా రామ అనే మైధునము చేస్తే అద్వితీయమైన మైధునము వలన పరమానంద స్థితి పొంది బ్రహ్మజ్ఞానము ఉదయిస్తుందని చెప్పటం జరిగినది. అంటే ఈ లెక్కన చూస్తే అమృత సేవనం మద్యపానం అని దీని ద్వారా త్రిగుణ చక్రము ఆధీనము అవుతుందని ఖేచరీ ముద్ర సాధనయే మాంస భక్షణమని దీనిద్వారా కర్మచక్రం ఆధీనము అవుతుందని శ్వాస సంయమనము సిద్ధియే మత్స్య భక్షణ అని దీని ద్వారా కాలచక్రము ఆధీనము అవుతుందని యోగముద్రల సాధనయే ముద్ర విధానమని దీనిద్వారా బ్రహ్మ చక్రం ఆధీనము అవుతుందని ఏక కాలంలో వీటిని చేస్తూ మనలో ఉన్న మణిపూరక చక్రము లోని 'రా' అనే శబ్ధము ఆజ్ఞాచక్రము లోని 'మ' అనే శబ్దంతో అనుసంధానము చేసి మైధున ప్రక్రియను దీనివలన పరమ ఆనందమును కలిగి బ్రహ్మ జ్ఞానసిద్ధి తో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు అవుతారని నాకు అర్థమైనది. మీకు కూడా అర్థం అయినదా?
త్రిలోకాలు- త్రిమూర్తుల దైవ దర్శనాలు:
అలాగే గుణ చక్రమునకు అధి దైవముగాశ్రీ దత్త స్వామి, కర్మ చక్రమునకు శ్రీరాముడు, కాలచక్రమునకు కాలభైరవుడు, బ్రహ్మ చక్రమునకు బ్రహ్మదేవుడు వరుసగా అధి దైవాలుగా ఉంటారని నేను గ్రహించాను. కాకపోతే వామాచారంలో నిజమైన చేపలు, మాంసం, మద్యం, మగువతో మైధునాలు పొందితే అదే దక్షిణాచారంలో సాధకుడు శరీరములో వాటిని పొందాల్సి ఉంటుందని అవగాహన వచ్చినది. ఇక గుణ చక్రం యొక్క గుణాతీత స్థితిని పొందుటకు నా చక్ర సాధనను దక్షిణాచారంలోని అంగిట నుండి అమృతధారను పానము చేసే విధి విధానాలు గురువు వద్ద నేర్చుకుని సాధన చేయటం ఆరంభించాను. ఇలా ఆరు నెలలు గడిచిన తర్వాత నా అంగిట అయిన కొండ నాలుక నుండి చిక్కటి తీయని పదార్థము బొట్టుబొట్టుగా ఆరంభం అయ్యే సరికి నాలో తెలియని ఆనందం మత్తు మొదలైనాయి. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానము నందు మనోనేత్రం ముందు త్రిలోకాలు- త్రిమూర్తుల దైవ దర్శనాలు ఆరంభమైనాయి. ఇవి నిజమో అబద్ధమో తెలియని అర్థంకాని మనో స్థితి. అంటే త్రిగుణాల దేవతలు రజోగుణానికి సృష్టికర్త అయిన బ్రహ్మ తమో గుణానికి లయ కర్త అయిన మహేశ్వరుడు, సత్వగుణానికి స్థితి కర్త అయిన విష్ణువు ఉంటారని శాస్త్ర వచనము.ఈ త్రిమూర్తులు దర్శనంతో త్రిగుణాలు ఉన్న గుణ చక్రము శుద్ధి అవుతున్నదని నాకు అర్థమైనది. జీవుడి దేహములో ఈ మూడు త్రిగుణాలు ఉండి ఆడిస్తున్నట్లుగా విశ్వ దేహములో కూడా సృష్టి- స్థితి- లయ అనే త్రివిధ కర్మ గుణాలు ఆడిస్తున్నాయని జీవుడి శరీరములో బొడ్డు క్రింద వరకు తమోగుణము, బొడ్డు నుంచి కంఠము వరకు రజోగుణము, కంఠము నుంచి ఆజ్ఞాచక్రము వరకు సత్వ గుణ ప్రధాన కేంద్రాలని ఆజ్ఞాచక్రము పైన గుణాతీత నిర్గుణ స్థితి ఒకటి ఉంటుందని దీనిని పొందటానికి నిజరూప దత్తుడి అనుగ్రహము పొందాల్సి ఉంటుందని నాకు స్పురణ అయినది. జీవుడు తన అంతిమ శ్వాస సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో ఆ మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దాని ఆయా గుణానికి మోహము చెంది పునః జన్మకి కారణం అవుతుందని ఇలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ సాధన శక్తితో గుణాతీత స్థితిలోనికి మనస్సును చేర్చినట్లయితే నిలకడ పొంది త్రిగుణాతీత అవస్థను పొందుతుంది. ఇక్కడ త్రిమూర్తులుగాని త్రిశక్తి మాతలు ఉండరని శ్రీకృష్ణుడు తన భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అంటే సాధకుడు దత్త స్వామిగా మారవలసి ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి. ఆజ్ఞా చక్రము నుండి యోగసాధనను మన భౌతిక శరీరం చెయ్యదని కేవలం మన సూక్ష్మశరీరమే సాధన చేస్తుందని గ్రహించండి. అంటే మనము ఈ చక్ర సాధన చేస్తున్నప్పుడు మనోనేత్రం ముందు టెంపుల్ రన్ వే ఆటలాగా మన సూక్ష్మ శరీరము ఎక్కడికో దేనికోసమో పరిగెత్తుతున్నట్లుగా పరిగెత్తుతూనే దర్శనాలు ఖచ్చితముగా దర్శనం అవుతాయని నా స్వానుభవం. ఇట్టి స్థితిని పొందటాన్ని మా శ్రీమతి దీక్షాదేవి విషయంలో అలాగే మరికొందరు యోగ సాధక విషయాలలో చవి చూశాను. కాబట్టి ఈ చక్ర సాధన సమయంలో టెంపుల్ రన్ వే ఆట మొదలవుతుంది అని తెలుసుకోండి. కంగారుపడకండి. ఏమి జరుగుతుందో ధైర్యంగా మీ మనోనేత్రం ముందు చూస్తూ ఉండండి. బయటి శబ్దాలు అరుపులు విని ధ్యానమునుండి బయటకు రావద్దు. మీ ధ్యానమును భంగం చేయటానికి మంత్ర దేవతలు అనగా 13 రకాల జాతుల వారు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. దయచేసి ధ్యానంలో ఉండగా భౌతిక కళ్ళు తెరవద్దు. ఏమీ జరిగితే అది జరగని... పోతే ఈ దేహమే కదా. పోనీ చచ్చే వాడికి భయం ఎందుకు అనే మనోధైర్యంతో ఈ సాధనను ముందుకి కొనసాగించండి. మీరు కేవలము ఈ స్థూల శరీరము ఎంత సేపు అంటే మూడు నుండి ఐదు గంటల పాటు తీవ్ర ధ్యానస్థితిలో ఉంచగలిగితే ఈ స్థితిలో మీరుంటే ఈ చక్రాల సాధన పరిపూర్ణంగా అవుతుందని నా అనుభవ సారము. మీ వెన్నును నిటారుగా నిలిపి కూర్చొని లేదా శవాసనంలో పడుకొని ధ్యానం చేసుకోండి. ఈ పిచ్చి వాడి మాటలు వినండి. మీకు మేలు జరుగుతుంది. దయచేసి ధ్యానం చేస్తూ నిద్రపోకండి. నేను చాలాసార్లు ఈ చక్రము స్థితిలో నాకే తెలియకుండా నిద్ర మెలుకువ కాని స్థితి లో ఉండగానే గాఢనిద్రలోకి జారుకునేవాడిని. నిద్రపోవటానికి నా చక్ర సాధన ఉపయోగపడుతుందని నాకు తెలిసి నామీద నాకే కోపము, ఆవేశము, చికాకు, అసహనము కలుగుతుండేది. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. బయట శబ్దాలు వినండి. కానీ వాటికి స్పందించకండి. కళ్ళు తెరవకండి. మీ మనో దృష్టియందు టెంపుల్ రన్ వే ఆటను నిరంతరముగా చూస్తూ మీ ఇష్ట దైవ మంత్రమును మనస్సులో మననం చేసుకుంటూ సాధనను కొనసాగించండి.
ఇలా నేను నా సాధన కొనసాగిస్తూ ఉండగా నా మనోనేత్రం ముందు అర్ధచంద్రాకారపు దివ్యతేజస్సుతో చంద్రుడు దర్శనం ఇచ్చాడు. ఇది భలేగా ఉంది అనుకొని లోపల సుమారు 32 దాకా వరుసగా అర్థచంద్రుడు వరుసగా ఒకదాని తరువాత మరొకటి దర్శనమిస్తూ నా మీదకి వస్తూ ఉన్నాయి. అంటే నేను వాటిని దాటుకుంటూ ముందుకు వెళుతున్నాను అని నాకు అర్థమైనది. ఇలా సుమారుగా 32 అర్థ చంద్రులను దాటిన తరువాత ఒక చంద్రుడిలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాడు అంటే వైకుంఠ ద్వారదర్శనం అన్నమాట. కొద్దిసేపటికి మరో చంద్రుడిలో మహాశివుడు దర్శనం ఇచ్చాడు అంటే కైలాస దర్శనం అన్నమాట. మరికొద్దిసేపటికి మరో చంద్రుడిలో బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు అంటే బ్రహ్మలోకం దర్శనం అని అర్థం అయినది. ఈ లోకాలు ఉండటము నిజమే. ఈ త్రిమూర్తులు ఉండటము సత్యము అనుకునే లోపలే చంద్రుడు వెనక్కి వెళ్ళి పోతున్నట్లుగా చిన్న నక్షత్రముగా ఒక తార కనబడుతుండగా ఆకాశంలో మిగిలిన నక్షత్రాల దర్శనాలు ఇస్తూ ఉండగా ఈ త్రిమూర్తులు ఉన్నచోట 3 తారలు ఒకే వరుసలో ఉన్నట్లుగా అనుభూతి పొందుతూ ఉండేసరికి నాకు చిన్నప్పుడు వేసవి కాలంలో రాత్రిపూట గాలి కోసమని ఆరుబయట పడుకొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఇలా మూడు నక్షత్రాలు ఒకే వరుసలో ఉండటం గమనించి ఆశ్చర్యపోవటం దానిని గూర్చి అమ్మను అడిగితే అవి కొఱ్ఱ కొయ్యలని అవి ఒకే వరుసలో త్రిమూర్తులు గా ఉంటాయి అని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చేసరికి నాకు ధ్యాన భంగము అయినది. ఆ తర్వాత షిరిడి సాయిబాబా వారి చరిత్రలో ఒక భక్తుడి కోసం బాబా వారు త్రిమూర్తుల దర్శనము త్రిలోక దర్శనాలు కలిగించిన అనుభూతి నిజమేనని అప్పటిలో ఇది పుక్కిట పురాణమా అని అనుకునేవాడిని. కానీ ఈరోజు నా ధ్యాన అనుభవం వలన శాస్త్రాలు చెప్పినవి అన్నియు అక్షరసత్యాలని నాకు అవగతమైనది. మీరు నిజమని వీటిని నమ్మాలంటే మీ సాధన స్థాయి ఇక్కడి దాకా రావలసినదే. శ్రీ లాహిరి మహాశయులు కూడా త్రిమూర్తుల దర్శనము మూడు లోకాల దర్శనము పొందినాను అని ఒక డైరీలో రాసుకున్నారు. మరొక చోట ఇదియే నా స్థిర గృహం ఈరోజు పొద్దున రెండు నిమిషాల సేపు ఈ గృహము నందు ఉన్నానని ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనే త్రిమూర్తి స్వరూపాన్ని అని రాసుకున్నారు. ఈ గుణ చక్రమును ఈయన స్థిర గృహముతో పోల్చినారు అని తెలుసుకోండి.
ఇలా నేను ఈ చక్ర ధ్యాన సాధన చేస్తుండగా తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా ఆవు అది కూడా ఒక కపిలవర్ణ ఆవు ముఖము జీవకళతో కనపడ సాగింది. కొద్దిసేపటికి కపిలగోవు దర్శనం ఇవ్వడం ఆరంభమైనది. ఈ గోమాతలో వివిధ రకాల దైవ దర్శనాలు అనగా ఒక్కొక్క దైవ స్వరూపం ఆవు యొక్క అంతర భాగము నుండి బయటికి రావటం కనిపించింది. కొంతమంది పేర్లు తెలుసు. మరి కొంతమంది పేర్లు తెలియవు. వారిని ఎక్కడ చూసినట్లుగా కూడా గుర్తులేదు. ఇలా సకల దైవ స్వరూపాలు ఈ కపిలగోవులో ఉన్నాయని అనిపించసాగింది. ఇంతలో దీని పొదుగు వద్ద దూడ పాలు త్రాగుతున్నట్లు గా కనిపించేసరికి ఆవు దూడ దర్శనము దేనికి సంకేతమో అనే సందేహము నాలో మొదలయ్యే సరికి నా ధ్యానం భంగమైనది. అంటే గోలోకం అయిన అయ్యుండాలి లేదా దత్తుడి దగ్గర మాయకు సంకేతంగా ఉండే ఆవు అయ్యి ఉండాలి అని నాకు అర్థం అయినది. కొన్ని రోజుల తర్వాత నేను నా సొంత గృహప్రవేశ సమయానికి వెండితో చేసిన ఆవు దూడ ఉన్న ప్రతిమ పెట్టి ఈ కార్యక్రమం జరిపించిన మూడు రోజుల తర్వాత నా ప్లాట్ ముందుకి నాకు కనిపించిన కపిల ఆవు దూడ మా ఇంటికి ఎదురుగా ఉన్న దేవాలయంలో ఎవరో దానంగా ఇస్తే రావటం జరగటము దానిని చూసి నేను ఆశ్చర్యపోవటం అది నా కేసి అదోలా చూడటం నా ఓరచూపు నుండి తప్పుకోలేదు. అంటే నేను అనుమానించినట్లు గా శ్రీదత్తుడు తన యోగ మాయ నా మీద ప్రయోగిస్తున్నాడని సంకేతముగా నాకు తెలియటానికి ఈ గోవును ప్రత్యక్షంగా ధ్యానమునందు పరోక్షంగా చూపుతున్నారని నాకు అర్థమయ్యే సరికి గతుక్కుమన్నాను. అలాగే శ్రీ లాహిరి మహాశయుడు ఒక డైరీలో ఆవు ముఖము బొమ్మ గీసి నేను ఈ రోజు ఆవు ముఖమును అదే గోముఖ తీర్థము చూశానని రాసినారు. అంటే నాకు ధ్యానంలో మనోనేత్రం ముందు కపిలగోవు దర్శన అనుభూతి నిజమేనని శ్రీ దత్త యోగమాయకి సిద్ధపడాలని అప్పుడే ఈ మాయ దాటితేగాని మనకి గుణాతీత స్థితి కలగదని నాకు అర్థమయ్యే సరికి నాలో తెలియని భయం వణుకు మొదలైనది. నేను వెంటనే ప్రకృతి కార్యాలు(1,2) పిలుస్తూ ఉండేసరికి నేను వెంటనే వాటిని తీర్చుకోవటానికి వెళ్ళవలసి వచ్చినది.ఇది ఇలాయుండగా నా ధ్యానము తీవ్రస్ధాయిలో ఉండగా నా కుడి చెవి నుండి దుందుభి నాదము అనగా పెద్ద డ్రమ్ముల శబ్ధం లీలగా వినబడసాగినది.ఆ తర్వాత కొన్నిరోజులకి చాలా స్ఫష్టంగా ఈ నాదము వినబడసాగింది. ఆ తర్వాత నాకు శ్రీ శైలము నుండి త్రిశూలము రావడము జరిగినది.విచిత్రము ఏమిటంటే ఈ క్షేత్ర మల్లన్నగుడికి త్రిశూల శిఖరముంటుంది.పైగా మనలోని త్రిగుణాలకి ప్రతీకగా త్రిశూలముంటుందని శాస్త్రవచనము.
మా శ్రీమతికి నిజరూప దత్తదర్శనం:
దత్తుడి లీలా మాయ కి తగ్గట్లు గానే మా కుటుంబ సభ్యులు అనుకోకుండా దత్త స్వరూపుడైన శ్రీ శ్రీ నృసింహ సరస్వతి నివాసస్థలమైన గాణ్గాపూర్ క్షేత్ర దర్శనమునకు ప్రయాణం కట్టినారు. నాలో భయము మొదలు. పరీక్షలో నెగ్గితే పర్వాలేదు. నెగ్గకపోతే ఈ చక్రం వద్ద సాధనకు టాటా చెప్పాల్సి ఉంటుంది. ఆయన మాయలకే మహా మాయగాడు. భయపడుతూ కూర్చుంటే ఏమి చేయలేము. ఏదో ఒకటి జరుగుతుంది. ఏమి జరిగినా బాధపడకూడదు. భయపడకూడదు. ఆనంద పడకూడదని నిశ్చయించుకొని అప్పటికే నేను రాసిన సంపూర్ణ గురు చరిత్ర గ్రంథం యొక్క సీడీలు సిద్ధమయ్యేసరికి ఒక పది కాపీలు తీసుకొని ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళటం జరిగినది. రాత్రికి ఈ క్షేత్ర బస్టాండ్ కి చేరుకునే సరికి ఎదురుగా తెల్లని పైజమా లాల్చీ ధరించి చిరు గడ్డంతో చింపిరి జుట్టుతో పిచ్చి వాడి మాదిరిగా పిచ్చి మాటలతో పిచ్చి చూపులతో ఓరకంట అంతా గమనిస్తూ బిక్షగాడుగా నా ఎదురుగా అగుపించే సరికి నా వెన్నులో ఏదో తెలియని శక్తి ప్రకంపనాలు (కుండలినీశక్తి జాగృతి) ఒక విద్యుల్లత లాగా పైకి ఎగబ్రాకి వేగంగా నా భృకుటి మధ్య భాగము దాకా చేరుకునే సరికి నా మనోనేత్రం ముందు మూడు తలల ఆసామి తన మాయ ఆవుతో దర్శనము శ్రీ దత్త దర్శనం ఇచ్చాడు అని అనుకునే లోపల నాకు ఎదురుగా ఉన్న ఈ బిక్షగాడు నన్ను వదిలి పోయాడని నేను గమనించ లేదు. ఒకవేళ ఈ బిక్షగాడు ఈ మాయగాడు కాదు కదా అనుకొనే లోపల ఈ బిక్షగాడు నాకు ఎక్కడా కనిపించలేదు. నేను ఎవరి కోసమో ఎదురుచూస్తూ కంగారు పడటం మా దీక్షాదేవి గ్రహించి “మీకు పరిచయము లేని ఈ క్షేత్రంలో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారని ఎవరి కోసం వెతుకుతున్నారు” అనగానే “ఇంకా ఎవరు? నా రంకు మొగుడు. నా మాయావి. దత్తుడు కోసము. ఇప్పుడే బిక్షగాడి రూపంలో అవధూతగా అగుపించి నేను గమనించే లోపే అదృశ్యమైనాడు” అని చెప్పే సరికి ఆమె వెంటనే “నిజమా! మీకు నిజరూప దత్తుడు కనిపించాడా? నాకు కూడా చూపించరా నేను చూస్తాను ప్లీజ్ ప్లీజ్” అని నన్ను బ్రతిమాలింది. అప్పుడు నేను వెంటనే “అయితే నేను ఏ వ్యక్తిని తీక్షణ దృష్టితో చూస్తూ వారి చర్యలను గమనిస్తూ ఉంటానో ఆ వ్యక్తి శ్రీదత్తుడు అని గ్రహించు. నేను నోటితో చెప్పే సరికి ఆ నిమిత్తమాత్రుడు మాయం అవుతాడు. నా చూపే నీకు ఆయనను చూపించే మార్గమని నా కనుసైగ ఆయనను చేర్పించే మార్గమని తెలుసుకో. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ క్షేత్రానికి తప్పనిసరిగా బిక్షకు వచ్చి ఈ బిక్ష ను తీసుకొని మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ని మహాలక్ష్మితో అనగా తన అనఘా శక్తి తో కలిసి భోజనము చేస్తారని వారి చరిత్రలో చదవటం జరిగింది. ఇది నిజమైనప్పుడు అది కూడా తప్పకుండా నిజమే అవుతుంది. కాబట్టి నువ్వు నాతో మధ్యాహ్నం 12 గంటలకి బిక్ష సమయానికి ఈ గుడిలో ఉండేటట్లుగా చూసుకో. నేను నోటితో చెప్పను. నా కను సైగతో అర్థం చేసుకో” ఆమెకు చెపుతూ ఈ క్షేత్రములో మేము బస చేసే చోటుకి చేరుకొని రేపు ఈ మహానుభావుడు పెట్టే యోగమాయ పరీక్ష ఏమిటో అర్థం అవటం లేదు అని అనుకుంటూ నిద్రలోకి జారుకోవడం జరిగినది. తెల్లవారుజామున మూడు గంటలకే లేచి స్నానాదికాలు నిత్యపూజలు పూర్తి చేసుకొని శ్రీ నృసింహ సరస్వతి నిజపాద దర్శనంకి నాలుగు గంటలకే దేవాలయానికి మేము వెళ్ళాము. అక్కడ జరిగే పూజ హారతి కార్యక్రమాలు తనివితీరా చూసుకుని మేమిద్దరం గుడి ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటుండగా నా మనోనేత్రం ముందు 24 సంవత్సరముల వయస్సు ఉన్న నగ్న యువకుడు దర్శనం ఇచ్చి “నన్ను చూడటానికి ఇంతదాకా వచ్చినావా?నా మాయ చూడటానికి వచ్చినావు కదా. నా మాయను నన్ను గుర్తించలేవు. నన్ను తెలుసుకోలేవు. నన్ను గుర్తించటమే నీ మాయ పరీక్ష. నన్ను అందుకోవటమే గుణాతీత స్థితి. నేను వచ్చే రూపాలను నీవు తెలుసుకో. నన్ను చేరుకో. నీ దగ్గరికి ముమ్మారు వస్తాను” అని చెప్పి అంతర్ధానం అయ్యేసరికి నాకు ధ్యాన భంగమైనది. మధ్యాహ్నం 12 గంటలకి భిక్ష జరిగే ప్రాంతానికి మేమిద్దరం చేరుకున్నాము. సరిగ్గా పన్నెండు గంటలకి రాత్రి బస్టాండ్ వద్ద నాకు కనిపించిన పిచ్చివాడి బిక్షగాడు నాకు దర్శనం అయ్యేసరికి నా చూపు ఆ వ్యక్తి మీద నిలబడే సరికి మా శ్రీమతికి కథ అంతా అర్థమయ్యి ఆయనని వెంబడించడం మొదలు పెట్టినది. ఇంతలో ఈమెను ఎవరో తోసేసరికి ఆయన మీద పడిపోయి తమాయించుకొని ఆయనను ఒడిసి పట్టుకొని పైకి లేపుతుండగా ఆయన నా వంక ఓర చూపుతో అదో రకంగా చూస్తూ అందరినీ హిందీ లో బండబూతులు తిట్టటం ఆరంభించినాడు. కానీ మా శ్రీమతికి ఆయన మీద ఎలా నమ్మకము కుదిరిందో తెలియదు గాని ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనని వెంబడించుట మానలేదు. ఈ భిక్ష కార్యక్రమాన్ని ఈ గుడి అర్చకులు ఒక పళ్ళెములో మహా నైవేద్య పదార్థాలు పెట్టుకుని ఏడు ఇళ్ళకు బిక్షకి త్రిప్పుతూ వారికి ప్రసాదంగా కొంత భాగం ఇస్తూ ఉంటారు. ఈ సమయములో ఈ అవతారి వారి దగ్గరికి వెళ్లి “నాకు కూడా భిక్ష పెట్టండి స్వామి” అనగానే వాళ్ళు కను సైగతో ఇతడి వాలకము చూసి మహా పిచ్చిగాడని మతి భ్రమించినవాడు అని అనుకొని సైగలతో లేదు పొమ్మని చెప్పేసరికి ఈయనకి కోపము వచ్చి హిందీలో వీరందరిని తిడుతూ “నీ అమ్మ! నా పేరు చెప్పి మీరు తింటున్నారా వెధవల్లారా! ముండాకొడుకుల్లారా! లంజముండ లారా! అందరూ దొంగలే. నన్ను ముంచే వాళ్ళే. నన్ను మించిన వాళ్లే లేరు. ఎదవ నా లంజా ముండ లారా! నా అన్నము నాకు పెట్టరా. మాట్లాడని వారికి పెడతామని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎందుకు తింటారో నాకు అర్థం అయి చావదు” అంటూ ఒక చిన్న బీడీ ముక్క కాల్చుకుంటూ ఒక అరుగు మీద కూర్చొని ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చూస్తున్నాడు.
దత్త స్వామి నాకు పెట్టిన పరీక్షలు:
ఇంతలో మా ఇద్దరిని ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు అని నాకు అర్థమయ్యే లోపల నా దృష్టి అంతా అవతారి మీద ఉండగానే అక్కడికి ఒక బిచ్చగత్తె వచ్చి “బాబు! ఇదిగో స్వామి ప్రసాదం” అంటూ తన నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసి మరి నా నోటిలో పెడుతూ ఉండేసరికి నేను అది గమనించి వెంటనే “ఓయ్! ముసలిదానా! నాకే పెడతావా. నీకు ఎంత ధైర్యం? పైగా దత్త ప్రసాదము అని చెబుతున్నావు. ఎవరైనా దైవ ప్రసాదాన్ని ఎంగిలి చేస్తూ ఇస్తారా.ఫో. ఇక్కడనుండి” అంటూ ఆ బిచ్చగాడి రూపంతో ఉన్న దత్తస్వామి మళ్లీ ఎక్కడికి పారిపోతాడో అని అనుకుంటూ ఆయన మీద దృష్టిపెట్టినాను గాని అనఘాదేవి ఈ బిచ్చగత్తె రూపంలో వచ్చి నాకు తన స్వామి ఎంగిలి చేసిన ప్రసాదం ఇస్తుందని ఆ క్షణంలో నేను గ్రహించలేకపోయాను. అయ్యను చూస్తూ అమ్మను పట్టించుకో లేకపోయినాను. అయ్య నాకు ఎదురుగా ఉన్నాడు గదా ఆయన ఎక్కడికి పోకుండా చూడాలని ధ్యాస లో ఉన్నాను గాని అమ్మను పట్టించుకోలేక పోయానని గ్రహించలేక పోయినాను. ఇంతలో ఆ బిక్షగాడు ఎంతో మనోవేగంతో నా కనుచూపు నుండి తప్పుకునే సరికి స్వామి నిన్నటి రూపములో దర్శనమిచ్చాడు. నేను ఆయనని గుర్తు పట్టాను కదా. ఇంకా ఏముంది నా మాయ దాటినాను గదా అని నేను ఆనందపడే సమయానికి నా మనోనేత్రం నందు ముసలి బిచ్చగత్తె రూపము కనపడి అది కాస్త శ్రీ దత్త అనఘాదేవిగా కనిపించేసరికి అమ్మ! ఏమి దెబ్బకొట్టినాడు. మన గురుడు అంటే నేను చూడవలసిన రూపము ఆయనది కాదు. ఎందుకంటే ఉదయము ధ్యానంలో కనిపించి చెప్పినట్లుగా నన్ను గుర్తించటమే నీ మాయ పరీక్ష నన్ను అందుకోవటమే నీ గుణాతీత స్థితి అంటే అమ్మవారి రూపముగా ఈ ఆడ బిచ్చగత్తెగా రావటం అందుకోవటం అంటే ఆయన ఎంగిలి ప్రసాదం ఉచ్చిష్ట ప్రసాదమును అందుకోవటం అని తెలుసుకునే సరికి నా గుండెకాయ కొన్ని క్షణాలు పనిచెయ్యడం ఆగిపోయింది. అంటే నా దగ్గరికి ఆయన ఏ రూపంలో నైనా రావచ్చును ఇలా మూడుసార్లు వస్తాడు కానీ ఈ బిచ్చగత్తె రూపము నేను గమనించ లేకపోవటం వలన నాకు ఇంకా రెండు అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నాకు అర్థమయ్యే సరికి భోజనాలకు రమ్మని పిలుపు వచ్చింది. భోజనము చేయడానికి ఇష్టం లేకపోయిన మనస్సును చంపలేక ఆకలి బాధను భరించలేక తిట్టుకుంటూ సాక్షాత్తూ తన గురువు అయిన జనార్ధన స్వామి సమక్షంలో ఉన్నప్పుడు ఏకనాధస్వామికి శ్రీ దత్త స్వామి యొక్క లీలా రూపాలు గుర్తుపట్టలేక పోయినాడు. మరి నా పరిస్థితి ఏమిటో నా ఇష్టదైవమైన శివదత్తుడుకే తెలియాలి అని అనుకుంటూ భోజనానికి వెళ్ళటం జరిగినది. ఆ రోజు రాత్రి అక్కడ ఎవరో ద్వారా తెలిసిన వారికి సంపూర్ణ గురు చరిత్ర సీడీలు ఇవ్వటానికి వెళ్లేసరికి వారిని పరిచయాలు చేసుకుని వారికి ఈ సి డి లు ఇవ్వడం జరిగినది. అక్కడి వారు మా వాళ్లు ఫలానా చోట ఫలానా ఇంట్లో ఉన్నారని మీ చేతితో ఈ సి డి లు ఇస్తే వారంతా సంతోషిస్తారని చెప్పగానే ఇది ఒక ప్రారబ్దకర్మ అయ్యుండాలి చేస్తే సరిపోలా అనుకుంటూ వాళ్ళు చెప్పిన అడ్రస్ కి చిమ్మ చీకటిగా ఉన్న దారిలో వెళుతూ ఉండగా ఒకచోట ఏవో జంతువుల కళేబరాల వాసన ఎముకలు కనిపిస్తుండగా ఏదో శంకించిన ముందుకు సాగుతూ ఉండగా ఎవరో ముస్లిమాన్ ఒక ఇంటి ముందు ఒక ముసలి ఆవు తల నరకడానికి సిద్ధ పడుతుంటే అది కాస్త బాధగా అరుపులు అరుస్తూ ఉంటే నా చెవిన పడే సరికి అటువైపు భయముతో చూడగా “ఏందిరా! ఇట్టా కేసి ఉరిమి ఉరిమి చూస్తున్నావు. అన్నీ మూసుకుని వెళ్ళిపో. నీ పని చేసుకో. నా పని చేసుకుంటాను. కావాలంటే ప్రసాదంగా ఈ గోమాంసము పెడతాను. తిని వెళ్ళు. భలే కమ్మగా మా ఆవిడ వండుతుంది” అంటుండగానే నాకు కడుపులో తిప్పినట్టుగా దే వేసినట్లుగా అనిపించి ముక్కు మూసుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్ ఉన్న ఇంటికి వెళ్లేసరికి అక్కడి వాళ్లు నన్ను ఎగాదిగా చూస్తూ “అదేమిటి స్వామి! సాయంత్రం మీరే వచ్చి ఈ సి డి లు ఇచ్చారు కదా మళ్లీ ఎందుకు వచ్చినారు. వీటిని మళ్లీ ఎందుకు ఇస్తున్నారు” అంటూ లోపల నుండి ఈ సి డి లు తీసుకుని వచ్చే సరికి నేను గతుక్కుమన్నాను. వామ్మో! ఈ మధ్య నాకు తెలియకుండానే నా సూక్ష్మ ధారి వస్తువులను తీసుకుని వెళ్లి నాకు కావలసిన వారికి కూడా ఇవ్వటం ఆరంభించినాడా. వాయ్యో! ఇలా డబ్బులు, నగలు ఇస్తే నా పరిస్థితి ఏమి గాను. నా క్రెడిట్, డెబిట్ కార్డులు ఇస్తే ఏమి చేయాలి. వామ్మో! దీనమ్మ జీవితం. ఇంటిలో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటే ఇదే కాబోలు. నాకు తెలియకుండా నా వస్తువులు ఇది ఎలా ఇస్తుంది. అయిన సూక్ష్మ ధారి వస్తువులను పట్టుకోలేదు గదా. వస్తువుతో రూపాంతరము చెందగలదు గాని వస్తువులని పట్టుకోవడము సాధ్యపడదు కదా. దీనెమ్మ జీవితం!ఈ క్షేత్రము అంతా ఈ మాయగాడి మాయలతో నిండినట్లుగా ఉంది అనుకుంటూ వచ్చిన దారి వెంట తిరిగి వస్తుండగా ఇందాక కనిపించిన జంతువుల కళేబరాలు ఆ ముసల్మాన్ వ్యక్తి అగుపించకపోయేసరికి నాకు కథ అంతా అర్థమైనది. వామ్మో! వామ్మో! నేను గోమాంసము తినలేనని తెలిసి ముసల్మాను గా వచ్చి మాయావి అయిన గోవధ చేస్తున్నట్లు గా నటించి నన్ను మాయలో ఉంచి ఆయన ఈ రూపంలో వారికి సి డి లు ఇచ్చి ఉండాలని అనుకోగానే ఇది నిజమని ఆ గుడి గంటలు మ్రోగేసరికి దీనమ్మ జీవితం! వామ్మో! నా పరిస్థితి విష్ణు దత్తుడి కన్నా హీనంగా తయారు అయినట్టు ఉంది కదా.పాపము ఈయనకి కూడా మూడుసార్లు ఒక రాక్షసుడు సహాయంతో గుర్తుపట్టిన ఆయనని అందుకోలేక నానా అవస్థలు పడటం నాకు స్ఫురణకి వచ్చింది. అంటే ఈ లెక్కన నా రెండవ అవకాశం కూడా దొబ్బింది. చచ్చింది గొర్రే. ఆ ఆవు మాంసము ఏదో తిని ఉంటే మాయ కాస్త మాయం అయి గుణాతీత స్థితి వచ్చేది కదా. ముండా కొడకా! మూఢ ఆచారాలు పెట్టుకుని చంక నాక వలసి వస్తుంది. ఆయన రూపమే అర్థం అవ్వక చస్తుంటే నా రూపంలో తిరిగితే ఎలా నేను గుర్తు పట్టాలో అర్థం అవ్వక బుర్ర బాగా వేడి ఎక్కువై వేడి కాఫీ తాగాలనిపించి కాఫీ కొట్టుకు వెళ్ళినాను. ఇక ముచ్చటైన మూడవ అవకాశము ఎట్టి పరిస్థితులలో వదలకూడదని వదిలి పెట్టకూడదని మనోధైర్యంతో మనోబలము మనోనిశ్చయమును చేసుకొని మనోదీక్షతో ఎదురు చూడసాగాను. ఎవరు ఏమి తినమని ఇచ్చినను తీసుకోకుండా ఉండకూడదని దానిని ఖచ్చితంగా తీసుకొని తినాలి అని అనుకుంటూ ఉండగా ఇవాళ మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తరువాత ఇక్కడ నుండి వైద్యనాథుడైన పర్లి వెళ్లాలని మా కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారని నాకు తెలియగానే గుండెల్లో రాయిబడినట్లు గా అయినది. అంటే నేను తొమ్మిది గంటలు మాత్రమే ఈ దత్త క్షేత్రంలో ఉంటాను. ఈ లోపల ఈ మూడవ పరీక్ష అవకాశం రావాలి. జరగాలి. జరుగుతుందో లేదో తెలియని స్థితి. దానిని నేను దాటుతున్నానో లేదో తెలియని అయోమయ స్థితి. ఏమి జరిగితే అది జరుగుతుంది. నా సాధన ఇక్కడి దాకా వచ్చి ఆగి పోవాలని ఆ శివయ్య నిశ్చయించుకుంటే ఈ జీవయ్య ఏమి చేస్తాడు. మాయావి దత్తయ్య మాయను దాటించే శక్తి ఆ శివయ్య ఈ జీవయ్యకి ఇస్తే ముందుకి వెళ్తాను లేదంటే నమస్కారాలు చేసి వెళ్లి పోవటం తప్ప ఏమి చేయలేను కదా అనుకుంటూ ఈ క్షేత్ర పరిసరాలలో ఉన్న వివిధ రకాల ఆలయాలు శ్రీపాదులు సంచరించిన ప్రాంతాలు త్రివేణి సంగమ స్నానం చేయాలని అనుకొని మేమంతా బయలుదేరినాము. త్రివేణి స్నానాలు ముగించుకొని ఆయన ధ్యానము చేసుకున్న ప్రాంతానికి చేరుకోగానే నాలో ఏదో తెలియని ఉత్తేజము కలగటం ఆరంభమైనది. కళ్ళు మూసుకొని నా మనోనేత్రం నందు శ్రీ దత్త దర్శనం అగుపించగానే నా మూడవ అవకాశం పరీక్ష మాయ మొదలవుతుందని గ్రహించి నెమ్మదిగా జాగ్రత్తగా ఎవరైనా ఏమైనా తినమని చెబితే అది తప్పకుండా వదిలిపెట్టకుండా కాదనకుండా తినాలని అనుకున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నాకు జరిగిన ఈ రెండు పరీక్షలలో ముసలి అవ్వ రూపంలో ఎంగిలి ప్రసాదము పెట్టటం నేను దానిని కాదనటం రెండవసారి ఒక ముస్లిం రూపములో వచ్చి ఆవు మాంసం తినమని చెప్పటము నేను కాదని అనటం జరిగినాయి కదా. ఈసారి కూడా ప్రసాదం కానీ ఏదైనా జీవపదార్థం గాని తినమని ఎవరైనా ఆఫర్ చేస్తే మారు మాట్లాడకుండా తినాలని నిశ్చయించుకున్నాను. ఎవరికి తెలుసు ఆ మాయగాడి లీలలు. నేను ఒకటి తలుస్తున్నాను. ఆయన మరొకటి చేస్తే ఏమో ఎవరికీ తెలియాలి. తెలిసినవాడు మౌన బ్రహ్మ గా ఉంటాడు. తెలియనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు. తెలియచేయటానికి వచ్చిన వాడు తన యోగ మాయ పెడతాడు అనుకుంటూ పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణ గావించి క్షత్రియ బ్రాహ్మణ మనుషులను చంపడం వలన వచ్చిన బ్రహ్మహత్యా దోష నివారణకు స్వయంగా శ్రీ దత్త స్వామి బ్రహ్మ కర్త పదవి అలంకరించి ఈయన చేత ఒక హోమము చేయించిన ప్రాంతానికి మేము చేరుకున్నాము. అక్కడ అంతా సుమారుగా రెండు ఎకరాల స్థలం అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ అంతా అక్కడక్కడ బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి. హోమము ఆయన చేసినారో ఇక్కడ వాళ్లు చేసినారో నాకైతే అర్థం కాలేదు. కానీ విచిత్రముగా ఒక చోట నాలుగు కుక్కలు వివిధ రంగులలో అనగా తెలుపు, నలుపు, బ్రౌన్, గోధుమ వర్ణాలలో కనిపించినాయి. అవి నా కేసి అలా చూసేసరికి నాకు శ్రీదత్తుడు చుట్టూ ఉండే నాలుగు కుక్కలు కాదు కదా అని ఒక్క క్షణం అనిపించింది. రోడ్డుమీద నాలుగు కుక్కలు కలసి కనబడితే ఏకంగా అవి శ్రీదత్తుడు కుక్కలేనా? మరీ నా ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నాయి అని అనుకుంటూ ఎవరికి తెలుసు. ఇవి అవి కావచ్చును. కాకపోవచ్చును. దత్త క్షేత్రం లో ఉన్నాను కనుక దత్త కుక్కలుగా అనుకుంటే ఏమి పోతుంది అనుకుంటూ ముందుకి నేను ఒక్కడినే పోతున్నాను. మా వాళ్ళంతా ఏమీ లేని చోట ఏదో కావాలని తెచ్చుకోవాలని ఏదో చేయాలని ఆ పరిసరాల్లో తిరుగుతున్నారు అంటే ఒక దాని మీద ఒకటి వరుసగా 4 లేదా 6 లేదా ఎనిమిది రాళ్లు పేరిస్తే స్వగృహ యోగం కలుగుతుందని అక్కడ ఉన్న వారు వీరికి చెబితే మా వాళ్ళంతా రాళ్లు పేర్చడంలో మునిగిపోయారు. ఈ రాళ్లను ఈ ఆలోచనను సృష్టించి ఆడించే వాడి కోసం నేను ముందుకి అంటే వెనక్కి తిరిగి వెళ్ళి పోతూ ఉంటే అక్కడ ఉన్న చిన్న గుడిసె మీదకి నా మనస్సు పోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న గుడిసెల నుండి ఏదో ఒక గుడిసెలో నుంచి కోడి కూర లేదా కోడిగుడ్ల కూర లేదా చేపల కూర వండుతున్న వాసనలు నా ముక్కు రంధ్రాలకు చేరినాయి. ఈ వాసనను నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా పీల్చే వాడిని. ఎలా అంటే మా ఇంటి ముందు అల్యూమినియంతో చేసిన వంట గిన్నెలు అమ్మేవాళ్ళు చెట్ల క్రింద వంట చేసుకుంటూ అక్కడే ఉన్న వసారాలో పడుకునే వాళ్ళు. వీళ్లంతా ప్రతిరోజూ తప్పనిసరిగా ఇలాంటి మసాలా వంట చేసుకోవడం అది నా దృష్టికి నా ముక్కుకి వచ్చేవి. నా స్వామిరంగా! ఆ వాసనలు ఇప్పటికి కూడా మర్చిపోలేక పోతున్నాను అంటే ఎంత చక్కగా రుచిగా వండి ఉండేవారో కదా. కానీ మాకున్న ఆచార వ్యవహారాల వల్ల తినే అవసరం రాలేదు. కేవలం వాసన పీల్చే అవకాశం మాత్రం ఉండేది. అది మా అమ్మకు తెలిసినంతవరకు. తెలిసిన తర్వాత వాసనలు కూడా దూరమయ్యాయి. ఆ తర్వాత వీటిని ప్రత్యక్షంగా తినే అవకాశాలు అనగా ఉద్యోగ పార్టీలు సమయాలలో బంధుమిత్రులు కలయిక సమయాలలో కుటుంబ సభ్యుల పార్టీల సమయాలలో అవకాశాలు వచ్చినా నేను తినలేదు. సాధనకు శాఖాహారమే ప్రధానమని మాంసాహారం నిషేధమని యోగశాస్త్రము చెప్పేసరికి వాటి కోసం తాపత్రయ పడితే నా ఆకలి తగ్గటం దేవుడెరుగు. తీరని ఆకలి కోసం పునః జన్మ ఎత్తవలసి వస్తుంది అని వాస్తవికతను తెలుసుకున్నాను. జీవులను చంపి వాటి శవాలను పీక్కు తినడం ఏమిటో నాకు అర్థమైనది కాదు. ఎవరి ఆహారము వారిది. పులి ఆహారమైన మాంసం వదిలి గడ్డి తినమంటే తింటుందా. అదే ఆవు తన ఆహారమైన గడ్డి వదిలి మాంసమును తినమంటే తింటుందా. ఎవరి జన్మ కి తగ్గట్లుగా వారి ఆహారములు ఉంటాయి. వివేకానందుడు అన్నట్లుగా ప్రాణమున్న దుంపలు తింటే తప్పులేదుగాని నాలుగు చేపలు తింటే పాపమా? నా దృష్టిలో ఈ రెండు కూడా ఆకలి తీర్చే పదార్థాలు అని ఆయన చెప్పటం స్పురణకు వస్తూ ఉండగా ఒక గుడిసె నుండి నాకు ఇష్టమైన మసాలా పదార్థాలు వాసన వస్తుంది అని గ్రహించి ముందుకు వెళ్ళి పోతుంటే ఆ గుడిసె ముందు ఏదో గొడవ జరుగుతుందని అక్కడికి మెల్లగా వెళ్ళగా ఇద్దరి ముసలి దంపతుల మధ్య 8 సంవత్సరముల వయస్సు పిల్లవాడితో గొడవ పడుతున్నారు. వాళ్లేమో “నీవు తినవు. ఈ చేపల కూర నేల మీద పడేస్తావు. నేను నీకు ఇవ్వను” అని గొడవ చేస్తుంటే ఆ పిల్లవాడు “తాత! ఆ చేపలు నేనే తెచ్చాను కదా. ఆ కూర నాదే కదా మరి. నాకూర నాకెందుకు ఇవ్వరు. నాకూర నేను ఏమైనా చేసుకుంటాను. నీకెందుకు? తింటాను.లేదా పడ వేస్తాను. గిర గిరా గిరాటు వేస్తాను. నా కూర నా ఇష్టం” అని గోల చేస్తుంటే అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం అవ్వక నేను ఏమి జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉండగా ఈ పిల్లవాడు కాస్త ఆ ముసలాడి బొచ్చ నుండి ఒక చేపను లాక్కొని నోటిలో పెట్టు కుంటూ నేల మీద పడేసాడు. మరోసారి ముసలమ్మ నోటికాడ చేపను బలవంతంగా లాక్కొని నేలమీద కొట్టేసాడు. అది కాస్త మట్టిపాలు అయినది. ముసలాడికి కోపము లేసి “ఆరి భడవ. నీకు కాదురా చెప్పేది. మా నోటికాడి కూడును ఎలా నేలపాలు చేస్తున్నావురా. మమ్మల్ని తిననివ్వవు. నువ్వు తినవు. నువ్వు పెట్టవు. తినేవాడిని చెడగొడుతున్నావ్” అంటూ పైకి వచ్చే సరికి ఆ పిల్లవాడు ఆ ముసలాడి ఆఖరి చేప కూడా లాక్కొని పరిగెత్తుతూ పారిపోతుండగా ముసలాడు నన్ను చూసి “అయ్యా! అయ్యా! వాడిని పట్టుకోండి.వాడి దగ్గర నా చేప ఉంది. దానిని తీసుకోవాలి” అంటూ నన్ను అడిగేసరికి నేను యధాలాపముగా ఈ ముసలి వారికి సహాయం చేద్దామని ఆ పిల్ల వాడి వైపు వెళ్లే సరికి వాడు నన్ను చూస్తూ “అన్నా! నువ్వు ఎవరో నాకు తెలియదు. మా మధ్య గొడవలలో నువ్వు తలదూర్చవద్దు. చేపలు వారికి పడవు. నేను అందుకే లాక్కున్నాను. నన్ను నమ్ము. నేను ఎంగిలి చేసిన చేపను ఎవరూ తినలేరు. వాడు నువ్వు తింటావా అయితే నా దగ్గరికి రా అన్న అనేసరికి నువ్వు తింటావా అనే వాక్యము నన్ను ఆకర్షించినది. దీనమ్మ జీవితం! ఈసారి దత్తుడు ఈ పిల్లగాడుగా వచ్చి ఉంటాడు. వామ్మో! ఈ అవకాశము వదలకూడదు. ఈ సారి నాకు ఆహారంగా ఈ చేప ప్రసాదముగా ఇస్తున్నాడు. నాకు నా మూఢ ఆచారాలను పక్కనపెట్టి ఈ చేప ప్రసాదమును ఎలాగైనా తినాలి అని నిశ్చయించుకొని “తమ్ముడు! నీ ఇష్టం అదే అయితే నీ ఎంగిలి చేపనునాకు ఇవ్వు. ఆయనకు ఇవ్వను. నేనే తింటాను” అనగానే వాడు కాస్త “అన్నా! బాగా ఆలోచించుకో. నువ్వు పూజలు చేసే వాడి లాగా ఉన్నావు. ఆచార వ్యవహారాలు పాటించే వాడి లాగా ఉన్నావు. ఈ ముష్టి ఎంగిలి చేపకి ఆశ పడితే నీ పూజల శక్తి గంగ పాలవుతుంది. నిన్ను మీ కులము నుండి వెలి వేస్తారు. నువ్వు తిన లేవు. తిన కూడదు” అనగా వెంటనే నేను “తమ్ముడు! ఈ సృష్టిలోని అన్ని జీవులు కూడా బ్రహ్మ పదార్థాలే. వాటి నామరూపాలే తేడా. నా దృష్టిలో అన్ని కూడా ఒకదానికొకటి ఆకలి తీర్చుకునే బ్రహ్మ పదార్థాలు. ఒక బ్రహ్మము మరొక బ్రహ్మమును ఆహారముగా తింటే ఏమి కాదులే. జ్ఞానికి ఏది పాపమో ఏది పుణ్యమో తెలియదు. అన్నీ తెలిసినవాడివి. నీవు ఆటలు ఆడిస్తావు. ఏమీ తెలియని వాడిని నేను. మీ ఆటలో పాత్రధారిగా ఉంటాను. నిజానికి పాత్రధారి నాకు తెలిసిందిలే “అంటూ ఉండగానే వాడు కాస్త ఆ చేపను బూడిదలో పడవేసి “అయితే దీనిని తిను చూద్దాం” అనగానే నేను అందుకనే లోపల అక్కడున్న నాలుగు కుక్కలలో నల్ల కుక్క దీనిని అందుకునే లోపల నేను అందుకున్నాను. వెంటనే ఆ పిల్లవాడు కాస్త తన నల్ల కుక్క కేసి చూస్తూ “ఎంత పని చేసినావురా. నువ్వు తినాలని అనుకున్నాను. వాడికి ఇచ్చావు రా. నువ్వు తింటావులే అనుకున్నాను. అంటే మన వాడు గట్టిగా ఉండే ఘటికుడే. నీకు నీ కాలుడి నోటికి చిక్కలేదు అంటే ఇక చేతి మాయకి ఎందుకు చిక్కుతాడు అంటుండగా ఆ పిల్లవాడు పారిపోతుంటే వాడి వీపు కేసి నేను చూడగా త్రిముఖ దత్తుడిగా 3 తలలతో దర్శనం ఇవ్వగానే నా చేతిలో ఉన్న చేప కాస్త నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జి గా మారే సరికి దానిని నేను ఆప్యాయంగా తింటూ ఉంటే అది చూసిన మా వాళ్లు ఈ క్షేత్రానికి వచ్చిన కూడా నీ జిహ్వాబుద్ధి మార్చుకోలేదు.అయినా నీకు ఎక్కడ ఈ బజ్జీలు దొరికినాయి అంటూ నిలదీసేసరికి ఈ మిరపకాయ బజ్జీ విలువ వాళ్లకి చెప్పిన అర్థం కాదు అని నేను నిశ్చయించుకొని మౌనంగా అక్కడినుండి అందరితో కలిసి షాపింగ్ చేయాలని బయలుదేరినాను. నాకు ఒక షాపులో గోముఖ చెంబు మీద కమండలము దృష్టి పడినది. వాడు బాగా ఖరీదు చెప్పేసరికి అంత డబ్బులు పెట్టి కొనే స్థోమత లేక పోయే సరికి నేను మౌనము వహించి మరో క్షేత్ర ప్రయాణానికి సిద్ధపడినాము.అన్ని యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత నాకు కాశీక్షేత్రము నుండి ఒక గోముఖ చెంబు నేను చూసిన దానికన్నా చాలా పెద్దదిగా గోముఖ చెంబు నాకోసం నా తమ్ముడు కాకాజీ తీసుకొని రావడం జరిగినది. దానితో నాకు కపిలగోవు మాయ తొలగినది అని అర్థమయ్యే లోపల చెంబు కాస్త నాకు ధ్యానంలో ఒక కపిలగోవుగా దర్శనం ఇవ్వడం అలాగే కాకాజీకి మా శ్రీమతికి కూడా వారి వారి ధ్యానాలయందు ఈ గోముఖ కమండలము కాస్త ఒక సజీవ కపిల గోవులాగా వారి వారి ధ్యానము లో కనిపించే సరికి నాకు ఆశ్చర్యము వేసింది. ఒకరోజు నేను తీవ్ర ధ్యాన స్థితిలో వుండగా నాలో త్రిగుణాలు ఒకదాని తర్వాత మరొకటి తమ ప్రతాపాలు చూపిస్తూ ఆఖరికి త్రిగుణాతీత స్థితి అయిన శుద్ధ సత్వ గుణము లోనికి నేను ప్రవేశించడం జరిగినది. ఈ అనుభూతి ఎవరికి వారే అనుభవించాలి చెబితే తెలిసేది కాదు. దాంతో నా మనోనేత్రం ముందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కలిసి ఉన్న అనఘా దేవి స్వరూప దర్శనం లభించే సరికి నాకు గుణాతీత సిద్ధి కలిగినది అని నాకు గుణ చక్రము ఆధీనము అయినది అని అవగతం అయ్యేసరికి హిమాలయ దర్శనం మొదలైనది.
వామ్మో! ఇదేమీ మాయ అనుకునే లోపల నాకు తెలియని యోగ మత్తు నన్ను ఆవరించడం మొదలైనది. మరుసటిరోజు యధావిధిగా ధ్యానములో కూర్చోగానే మళ్ళీ హిమాలయ పర్వత శిఖర దర్శనం జరుగుతూ ఉండగా విచిత్రముగా ఒక నల్లని శిల 3 ముఖాలు 6 చిల్లులు సాలిగ్రామం వంటిది గిరగిరా తిరుగుతూ వెలుగులు విరజిమ్ముతూ కనపడసాగింది. వామ్మో! ఈ రాయి ఏమిటి? దేనికి సంకేతమో అర్థంగాక అయోమయమునకు గురి అయ్యే సరికి నాకు ధ్యాన భంగము అయినది. ఇలా వరుసగా తొమ్మిది రోజులపాటు దరిదాపుగా ఇలాంటి సాలగ్రామ రాయి దర్శనమే నాకు ధ్యానమునందు కనిపించసాగింది. ఇంటర్నెట్లో ఈ రాయి గూర్చి వెతికితే కొంతమంది దానిని చింతామణి అని మరికొంతమంది సీతారామ సాలిగ్రామం అని మరికొంతమంది దత్త శిల అని చెబుతూ ఉండేసరికి మరింత అయోమయానికి గురి అయినాను. ఇలాంటి చక్ర స్థితిలో రామకృష్ణ పరమహంస తండ్రి ఒకసారి ఒక గ్రామానికి వెళుతూ ఉంటే ఆయనకు నిద్ర వస్తుంటే ఒక చెట్టుకింద నిద్రకు ఉపక్రమించేసరికి కలలో ఒక దివ్యకాంతులతో మెరుస్తూ ఒక సాలిగ్రామ శిల దర్శనమిస్తూ “నేను ఇక్కడే ఉన్నాను .నన్ను పూజించు. నీకు మేలు జరుగుతుందని ఎవరో చెప్పినట్లుగా కనిపించేసరికి” ఆయన కి మెలుకువ వచ్చింది. అప్పుడు తనకి కలలో కనిపించిన సాలగ్రామ శిల గూర్చి వెతకగా అక్కడున్న చెట్ల పొదలో అది నల్లని రంగులో మెరుపు కాంతితో కనిపించిన దానిని అది సీతారామ సాలిగ్రామం అని దానిని నిత్య పూజలో ఉంచుకున్నారని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఉన్నది. అంటే నాకు కూడా ఇటువంటి ఏదో నల్ల సాలగ్రామ శిల వస్తుందని అది కూడా హిమాలయాల ప్రాంతము నుండి అయి ఉండవచ్చునని నాకు అర్థమయ్యే సరికి మా గుడి గంటలు మ్రోగే సరికి ఇది సత్యం అని నాకు అవగతమైనది. కొన్ని రోజులకి మా బంధువు ఒకరు హిమాలయాలలోకి మానససరోవరానికి వెళ్లి తిరిగి వస్తూ గండకీనదిలో విష్ణు సాలగ్రామములు కోసం వెతుకుతుండగా ఎలాంటివి కనిపించలేదు. అన్ని నల్లరాయి ముక్కలే ఎక్కువగా కనిపించినాయట. అప్పుడు ఎవరి పేరు మీద అయినా దొరుకుతాయేమోనని ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ ఈ నదిలో మునిగి చేతికి దొరికిన రాళ్లను ఒడ్డుకు తెచ్చి మూట కట్టడం ఆరంభించాడట. ఇదిగో అలాంటి ఇది నీకు అంటూ ఒక రాళ్ల మూట ఇచ్చాడు. నేను ఆ మూటను తెరచి రాళ్లను నేల మీద కుప్పగా పోసి వెతుకుతుండగా నాకు ధ్యానము లో కనిపించిన గుండ్రటి నల్లని సాలగ్రామము మూడు ముఖాలతో ఆరు రంధ్రాలతో చాలా చాలా అరుదైన దత్త సాలగ్రామము నాకు కనిపించేసరికి తెలియని ఆనందం వేసింది. నా బంధువు కి నోట మాట రాలేదు. ఎందుకంటే మార్కెట్లో ఆ సాలగ్రామానికి ఖరీదు సుమారు 6 లక్షల దాకా ఉంటుందని వాడు విన్నాడట. అసలు ఇలాంటి సాలగ్రామాలు వెతికి అమ్ముకోవాలని వాడు ఈ నదికి వెళ్ళాడట. కానీ దాదాపుగా ఇరవై ఒక్క ఇలాంటివి తీస్తే అందులో ఈ ఒక్క ఈ అరుదైన సాలగ్రామము దొరికిందని వాడు చెబుతుంటే నా మనస్సు వినే స్థితి దాటిపోయింది. ఏదో యోగ మత్తు ఆవహిస్తోండగా శవాసనం వేసుకొని ధ్యానము లోనికి వెళ్లగా “నీ దేవుడు వచ్చినాడు కదా. చాలా జాగ్రత్తగా ఉంచుకో. అసలే వాడు టక్కరివాడు. మాయగాడు. నువ్వు ఏమరుపాటుగా ఉంటే నిన్ను వదలి వెళ్ళిపోగలడు అంటూ ఎవరో చెప్పినట్లుగా” అనిపించగానే నాకు ధ్యాన భంగమైనది. అంటే ఈ శిల ఖచ్చితముగా దత్త శిల అనిపించగానే నన్ను ఈ మాయగాడు ఈ విధముగా కరుణించి నందులకు కృతజ్ఞతలు చెబుతూ ఉండగా ఈ శిల నుండి దత్తుడి రూపము నా లోనికి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించేసరికి నేను అవధూత స్థితికి నా సాధన స్థాయి చేరుకున్నదని అనుభూతి పొందుతుండగా యోగ మత్తు ఆవరించింది.
జిజ్ఞాసి యొక్క ఈ చక్రానుభవాలు:
ఇంతలో నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి (సిద్ధ రామ) తన సూక్ష్మ శరీర అనుసంధానంతో దర్శనం ఇవ్వడం ఆరంభించారు. నా ఈ చక్ర సాధన వివరాలు వాడి మనోనేత్రం ముందు కనిపించినాయి అని అంటూ వాడి సాధన వివరాలు నాకు తెలియ చేయటం ప్రారంభించాడు. వాడు తన గుణ చక్ర సాధన కోసం శ్రీశైల ప్రాంతం ఎంచుకొని వామాచారంలో కాపాలిక సాధన చేయాలని నిశ్చయించుకుని భైరవకోన చేరుకున్నాడని మీకు తెలుసు కదా. అప్పుడు ఈ సత్సంప్రదాయ గురువు వద్దకు వెళ్లి ఈ సాధన దీక్ష అనగా కాపాలిక దీక్ష తీసుకుందామని అనుకుంటుండగా వారి గురువు ఈయనతో “నాయనా! వామాచార పద్ధతిలో సాధన చేయటం అంత తేలికైన విషయం కాదని మనస్సు నిలకడగా ఆశ, భయాలు లేకుండా మనోనిబ్బరంతో మనోధైర్యంతో భ్రాంతులకు గురి కాకుండా ఉండాలి. ఈ కాపాలిక సాధన అంతా కపాలముతోనే ముడిపడి ఉంటుందని కపాలములోనే భోజనాలు చేయాలని, కపాలములోనే మద్యము పోసుకొని పానము చేయాలని, అశుచిగా ఉండాలని, నిద్రాహారాలు మాని వేసి అర్ధరాత్రులు స్మశానాలలో పూజలు చేయాలని, నగ్నంగా తిరుగుతూ ఉండాలని పగలు ఎవరికీ కనిపించకుండా చిక్కటి అడవులలో గుప్తముగా ఉండి యోగనిద్ర పోతుండాలని చెబుతూ అసలు ఈ వామాచార సాధన ఆరంభించాలంటే ముందుగా ఈ సంప్రదాయాల అధిపతి అయిన విశ్వగురువు శ్రీ దత్త స్వామి అనుగ్రహం ముందుగా పొందాల్సి ఉంటుందని చెప్పి మౌనము వహించారట. ఇలాంటి సాధన కోసం అప్పటికే దత్తుడు అనుగ్రహం కోసం కొంతమంది సాధకులు కొన్ని సంవత్సరముల నుండి పడిగాపులు పడుతున్నారు అని తెలియగానే నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. స్వామి! బుర్ర తిరిగినది. దత్తుడు అనుగ్రహం పొందటం అంటే కత్తి మీద సాము అని నాకు ముందుగానే తెలిసి ఉండటంతో ఏమి చేయాలో ఎలా చేయాలో అర్థం కాని అయోమయస్థితిలోకి జారుకున్నాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు ధ్యానము నందు మనోనేత్రం ముందు దత్త క్షేత్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిరినార్ క్షేత్రానికి ఇక్కడున్న మరి కొంత మంది సాధువులతో వెళుతూ ఉండటం కనిపించేసరికి వారిని తీసుకొని ఈ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడున్న 9999 మెట్లు ఎక్కి ఏకముఖ దత్త విగ్రహ మూర్తి ని దర్శించుకున్నాను. దీనిని స్వయంగా తన తల్లి అయిన అనసూయ మాత పూజించినది అని తెలియగానే నా మనస్సులో ఏదో తెలియని ఉత్తేజము కలిగింది. ఇంతలో మేమంతా భిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక అవధూత స్థితిలో ఉన్న మరో బిచ్చగాడు మా దగ్గరకి వచ్చి “ఏమి మీకు ఆకలిగా ఉందా? ఎన్నాళ్ళు ఈ భౌతిక పదార్థాలు తింటారు. వీటిని తింటే మీకు ఆకలి కోరిక తీరినదా? అదే నా దగ్గర ఉన్న బ్రహ్మ పదార్ధము తింటే మీకు ఆకలి ఉండదు. నేను కొంచెం కొంచెంగా తయారు చేసుకొని ఈ పదార్ధం తింటాను. మరి మీకు కావాలా” అనగానే అదేదో అతి ఖరీదైన తీపి పదార్థం అనుకొని నా ప్రక్కన ఉన్న వాళ్ళు ఆనంద పడిపోతూ మేము తింటాంలే మేము తింటాము అంటూ సంబరపడిపోతూ ఉంటే అతను వెంటనే “నేను తయారుచేసే బ్రహ్మపదార్థం చూసేసరికి ఆ సమయానికి ఎంతమంది తినటానికి ఉంటారో చూడాలి కదా” అంటూ మా అందరినీ గిరినార్ అడవి ప్రాంతంలో ఉన్న ఒక చీకటి గుహ లోనికి తీసుకొని వెళ్ళి నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన సంచిలో నుంచి సుగంధ వాసనలు ఉన్న పదార్థాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తుండగా మిగిలినవారికి నోరు ఊరుతుంది. అతను వెంటనే ఈ పదార్థాలన్నింటినీ కలిపి పిసికి అప్పుడు తన సంచిలో నుంచి ఒక చచ్చిన పామును బయటకి తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయ ముక్కలు కలిపినట్లుగా అందులో కలుపుతుండగా మన వాళ్ళకి గుండెలు జారిపోతుండగా ఆ ప్రక్కనే ఉన్న జిల్లెడు చెట్టు నుండి జిల్లేడు పాలు బాగా తీసి ఇందులో కలిపే సరికి మా వాళ్లు ఒక్కడు కూడా అక్కడ లేడు. “వామ్మో! అన్ని రకాల విష పదార్థాలు కలుపుతూ బ్రహ్మ పదార్ధం అని అంటాడు. ఏమిటి ఇతనికి నిజంగానే మతిభ్రమణం చెందిన పిచ్చివాడని” అని అంటూ అరుస్తూ వేగంగా వీరంతా ఆ చీకటి గుహ నుండి బయటకి పరిగెత్తుకుంటూ పోవడం నా ఓరచూపు నుండి తప్పు కోలేక పోలేదు. ఇవేమీ ఇతను పట్టించుకోకుండా తను చెప్పిన బ్రహ్మ పదార్ధము తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. నేను ధైర్యంగా ఏమి జరిగితే అది జరుగుతుంది. పామును తిన్న ముంగిస బ్రతకటం లేదా? ఆయుర్వేదంలో జిల్లేడు పాలు ఉపయోగించడం లేదా? కేన్సర్ వ్యాధికి పాము విషము మందుగా వాడుతున్నారు కదా. ఇక ఎందుకు భయం అయితే ఈయన ముందే చస్తాను. బ్రతికితే ఈయనను దాటి బ్రతుకుతాను అని అనుకుంటూ ఉండగా ఆయన నా వైపు తిరిగి “ఏమిరా! నీ తోటివాళ్లు వెళ్లిపోయారు కదా. ఇంకా నువ్వు పారిపోలేదా అంటే నిజంగానే బ్రహ్మ పదార్ధము తినాలని మనో నిశ్చయముగా ఉన్నావా?భేష్ రా.బాగుంది రా. నీ తపన. నీ సాధన స్థితి. నాకు నచ్చావురా” అంటూ నా చేతిలో తను చేసిన పదార్థము పెట్టేసరికి దత్త ప్రసాదం అనుకుంటూ నేను సేవించే సరికి ఏకముఖ దత్త నిజరూప దర్శనం నాకు అయినది. ఈ విధముగా నాకు ఈయన అనుగ్రహం కలిగినదని నాకు అర్థమైనది. ఆయన అంతర్ధానమయ్యారు. నేను మౌనము వహిస్తూ ఈ చీకటి గుహ నుండి బయటకి వచ్చేసరికి అక్కడే నాతో వచ్చిన శ్రీశైల సాధకులు ఎదురుపడి “స్వామి! మీరు ఆ పిచ్చివాడు చేసిన పదార్థమును తిన్నారా మీకు ఏమీ కాలేదా” అనేసరికి నేను వెంటనే “ఏమి అవుతుంది. ఏమీ కాదు. ఎందుకంటే ముందుగానే ఆయన చెప్పినాడు కదా. అది బ్రహ్మ పదార్ధం అని. దీని తయారీకి వివిధ జీవాలను ఈ విశ్వంలో ఉన్న వివిధ వాటిని భౌతిక పదార్థాలు ఉపయోగించినాడు. అంతే. అంతెందుకు. మూలాధార చక్ర అధిపతి గణపతియే గదా. అందుకే జిల్లేడు వేరు పాలు కలిపినారు ఆ తర్వాత చచ్చిన పాము అంటే నిద్రావస్థలో ఉండే కుండలినీ శక్తికి సంకేతం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలినీశక్తి జాగృతి చేస్తే భౌతిక పదార్థాలు దాటి యధార్ధమైన బ్రహ్మ పదార్ధం జ్ఞానము పొందుతానని ఆయన చేష్టల ద్వారా మనకి చెప్పకనే చెప్పినారు. ఒకటి గుర్తుంచుకోండి. మనము సాధనలోఉన్నప్పుడు మనము ఎంత వరకు దేనిని భరించగలుగుతామో అది మాత్రమే మనకి ప్రకృతి మాత ప్రసాదిస్తుంది. మనము తట్టుకోలేని దానిని ఎన్నటికీ అది ఇవ్వదు. అలాగే మనకు అవసరమైనప్పుడు అవసరమైనది మన అవసరానికి తగ్గట్టుగా ఇస్తుందని గ్రహించండి” అంటూ మేమంతా తిరిగి కాపాలిక సాధన కోసం శ్రీశైల క్షేత్రానికి చేరుకోవటం నాకు శ్రీ దత్త స్వామి అనుగ్రహం కలిగి ఉందని వారు సంతోష పడుతూ ఆ గురువు నాకు కాపాలిక సాధన దీక్షను అనుగ్రహించటం జరిగినది. అక్కడికి దగ్గరలో ఉన్న స్మశానానికి వెళ్లి గురువు అనుగ్రహించిన ఒక కపాలమును తీసుకొని కాపాలిక సాధన విధి విధానాలతో పూజలు చెయ్యడం ప్రారంభించాను. పురుషుడు అయితే స్త్రీ నగ్నత్వం అలాగే స్త్రీ అయితే పురుషుని నగ్నత్వం ఛేధిస్తూ సాధన చేస్తూ ఉండాలి. నగ్న శరీరములతో అర్ధరాత్రులు శ్మశానములో ఒంటరిగా కూర్చుని ప్రేతాత్మల సమక్షంలో మహాకాలుడి ఆరాధన చేస్తుండాలి. కపాలములోనే భోజనములు నీళ్లు మద్యం తాగుతూ తింటూ ఉండాలి. 24 గంటలు మానవ కపాలం మన వెంట ఉండాలి. ఎముకలే ఆభరణాలుగా ఉంచుకోవాలి. వాటిని పూజ వస్తువులుగా వాడుకోవాలి. స్త్రీలలో పురుషులలో నగ్నత్వం బదులుగా దిగంబర తత్వమును చూడ గలిగే స్థాయికి వచ్చినట్లయితే కాపాలిక సాధన పరిసమాప్తి అవుతుంది. ఈ స్థితిలో 41 రోజులు లేదా 41 సంవత్సరాలు లేదా నలభై ఒక్క జన్మలే పట్టవచ్చునని నాకు తెలిసినది.
నేను ఒక రోజు స్మశానం లో కూర్చొని కాపాలిక పూజలు చేస్తూ వుండగా తీవ్రస్థాయిలో మద్యపానం సేవించడం ఆరంభించానట. తాగి పడిపోయిన దాన్ని వదిలి పెట్టకుండా లేచి మళ్ళీ త్రాగుతూ పూర్ణఆనందపరవశం అయ్యే విధముగా తాగుతూనే ఉన్నానట.కల్లు పాత్ర కాస్త బ్రహ్మగాను కల్లు కాస్తా విష్ణువుగాను త్రాగే తాను భైరవ రుద్రుడుగా అనుభూతి పొందసాగినానట.ఇంతలో మా గురుదేవుడు వచ్చి “ఒరేయ్!ఈస్త్రీ శవ నగ్న దేహముతో మైధునము చేయరా” అని ఆజ్ఞాపించారు. నాకు స్త్రీ వ్యామోహం లేదు గాని స్త్రీ అనే జ్ఞానం కలుగుతుంది కదా. అలానే వాళ్లు స్త్రీలు అని వాళ్లు పురుషులు అనే జ్ఞానం ఉన్నది. దీనికి కారణం తనలో ఉన్న ఏదో ఒక మూల దాగి ఉన్న కామశక్తియే కారణము. ఈ శవ స్త్రీతో మైధునము చేస్తే అది కూడా వీర్య స్కలనం కాకుండా చేస్తే తనలో ఉన్న కామశక్తి కాస్త రామ శక్తిగా మారుతోందని వాడికి స్పురణకు రాగానే ఆ స్త్రీ శవంతో మైధున ప్రక్రియచేయటానికి ఉపక్రమించటం అప్పుడు ఈ మైధునానికి చాలా కష్టపడవలసి వచ్చినదట. మూసుకుని పోయి ఉన్న స్త్రీ శరీర మర్మాంగంతో సంయోగము చేయటం ఎంత కష్టమో వారికి బాగా తెలిసి వచ్చినది. ఇలా తన అంగప్రవేశానికి 21 రోజుల పాటు కష్టపడ వలసి వచ్చినది అంటే మీరే అర్థం చేసుకోండి. దానితో వారికి తెలియకుండానే స్త్రీ శరీరం మీద స్మశాన వైరాగ్యం కల్గినప్పుడు కొండనాలిక నుండి ఏకధారగా అమృతధార రావటం దానికోసం దానిని సేవిస్తూ ఉండేసరికి తనలో అమితమైన పరమానంద స్థితి కలిగి ఉండగా నగ్నత్వం నుండి దిగంబరత్వం వైపు తన మనస్సు వెళ్ళిపోయినది. తనకి ఉన్న త్రిగుణాల వలన తనలో కామశక్తి కలుగుతుందని తద్వారా ఇది కాస్త కామ కోరికగా మారి భోగులు అయితే సంసార బంధములో అదే యోగులు అయితే ఊర్ధ్వరేతస్కులైతే అదే తాంత్రికులు అయితే నగ్నత్వం ఛేధించి దిగంబరత్వం సాధన శక్తిగా మార్చుకుంటారని వాడికి అనుభూతి కలుగుతుండగా మంత్ర దేవత వాడికి ప్రత్యక్షమై మా వాడికి వశమైనదట. దానితో తను గుణాతీత స్థితికి చేరుకున్నానని అర్థం అయినదట. ఇలా ఈ కాపాలిక సాధనను సుమారుగా 18 నెలలపాటు చేయాల్సి వచ్చిందని చెప్పటం జరిగినది. రామకృష్ణ పరమహంస కూడా ఈ నాలుగు చక్ర స్థితులు దాటటానికి భైరవ బ్రాహ్మణి అనే తాంత్రిక గురువుల సహాయంతో వామాచార సాధనలు శవ సాధనలు తాంత్రిక సాధనలు చేసినారని వారి చరిత్రలో అక్కడక్కడా కనిపిస్తాయి. అలాగే బెంగాల్లో రామకృష్ణ పరమహంస కన్నా ముందు యోగి అయిన రామ్ ప్రసాద్ అనే యోగి కూడా ఈ చక్ర స్థితిలో వామాచార పద్ధతిలో 12 సంవత్సరముల పాటు నిరంతర మద్యపానం చేస్తూ పంచ కపాలాసనము మీద కూర్చొని తీవ్ర తపస్సుచేసి కాళీమాత సాక్షాత్కారమును పొందినారని వారి చరిత్రలో మనకు కనబడుతుంది. ఇట్టి స్థితి కోటి మంది మహానుభావులు సాధన చేస్తే ఏ ఒక్కరికో మాత్రమే ఫలితము దక్కుతుంది. మిగిలిన వారికి అంతా త్రాగుడు మాత్రమే మిగులుతుందని తంత్ర శాస్త్రాలు చెప్పకనే చెప్పినాయి. నేను ఈ చక్ర స్థితి కోసం ఆరు సంవత్సరముల పాటు దక్షిణాచారంలో సాధన చేస్తే మన జిజ్ఞాసి కేవలం వామాచారంలో 18 నెలల్లోనే సిద్ది పొందినారు. కోటి మందిలో ఒక్కడు కావటంతో నాకు ఆనందం వేసింది. వాడు కాస్త కర్మ చక్ర ఆధీనము కోసము అఘోర సాధనలో సిద్ధి పొందుటకు కాశీ క్షేత్రమునకు బయలుదేరుతున్నాను అని నాకు చెబుతూ తన ఆత్మ అనుసంధానము నుండి తప్పుకున్నాడు.
ఈ చక్ర స్థితిలో షిరిడి సాయిబాబా వారికి గోసాయి రూపంలో శ్రీదత్తుడు దర్శనమిచ్చారనీ అలాగే కళ్యాణి క్షేత్రవాసి అయిన అవధూత యోగి అయిన మాణిక్య ప్రభువుకి కూడా శ్రీ దత్త స్వామి ఒక యతీశ్వరుడిగా దర్శనమిచ్చినట్లు గా….. అలాగే ఏకనాథ స్వామికి మూడుసార్లు మూడు రూపాలలో శ్రీ దత్త స్వామి దర్శనం ఇచ్చినట్లుగా వారి చరిత్రలో చూడవచ్చును. కానీ శ్రీ లాహిరి మహాశయులు తనకు దత్త స్వామి దర్శనము కలిగినట్లుగా ఎక్కడ రాయలేదని అని చెప్పటం జరిగినది. అలాగే ఈ వామాచారం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్త్రీ /పురుష నగ్నత్వం ఛేధించడం ఆడదానిని/ పురుషుని మోహ పూరిత కవ్వింపు చూపులు ప్రేమ మాటల వలన ఎవరికి వారే తమకి తెలియకుండానే మోహ వ్యామోహాలు పెంచుకొని మలమూత్ర స్థానాలైన వారి మర్మాంగాల మీద ప్రేమ పెంచుకొని కామ కోరిక మాయకి లోనై సంసార సాగరమునకు నాంది అవుతున్నారు. మద్యపానం చేస్తే ఎంతటి మత్తు ఉంటుందో అంతే మొత్తం ఈ కామములోనే ఉంటుంది. అతి కామము అనగా పర స్త్రీ /పురుష మాయలో సంసారాలు జీవితాలు నాశనం చేసుకునే స్థాయిలో ఉంటుంది. అందుకే కాపాలిక సాధనలో నగ్న స్త్రీ /పురుష దేహాలతో మైధునము నిత్యము మద్యపానము పెట్టినది. నిరంతరము వీటిని చూస్తూ తాగేసరికి కొన్నాళ్ళకి వీటి మీద స్మశాన వైరాగ్యం తప్పని సరిగా కలుగుతుంది. ఆ క్షణమే నగ్నత్వం స్థానంలో దిగంబరత్వం అనగా దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వారిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య అనుభూతి కోసము ఈ కాపాలికులు నగ్న పూజలు,శ్మశానాల సంచారాలు, కపాల భోజనము నిత్య శవ సంభోగాలు,నిత్య మద్యపానము సేవించేది. ఆచరించేది. నిజానికి వీళ్ళు పిచ్చివాళ్లు కాదు.వీరి చేష్టలు పిచ్చివి కావు. వీరి పనులు పిచ్చివి కావు.తమకున్న అరిషడ్వర్గాల్లో మొదటిది అయిన కామమాయ దాటుకోవడానికి ప్రయత్నించే తాంత్రిక సాధువులని తెలుసుకోండి. సంసార సాగర మాయను ఛేధించడానికి కష్టాలు పడుతున్న అవధూతలని గ్రహించండి. అలాగే గుణాతీత స్థితి అంటే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవటం త్రిగుణాలు తన మీద ప్రభావం చూపకుండా చూసుకోవటం అతిగా ఆశ- భయము- స్పందన లేకుండా ఉండటం అతి అనేది వేటియందు లేకుండా చూసుకోవటం మనస్సును అదుపులో ఉంచుకోవటం నిరంతరముగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ పాపపు ఆలోచనలకి చూపులకి దూరముగా ఉండటము అందరితో మంచిగా ఉంటూ అందరిని ప్రేమగా చూసుకోవడం ఈ స్థితి లక్షణాలు. సప్త వ్యసనాలకు దూరముగా ఉండటము అన్నిటియందు మనస్సుని ఏకాగ్రత వైపు ఉంచి వివేక బుద్ధితో ఆలోచించుకుని నిశ్చల స్థితిలో ఉండటానికి ప్రయత్నించటమే శుద్ధ సత్వ గుణం అయిన గుణాతీత స్థితి అవుతుంది. అలాగే వామాచారంలో కపాల సాధన సిద్ధి అలాగే దక్షిణాచారం లో అమృత పానమును చేయలేని వారి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఈ చక్ర స్థితుల కోసం ప్రతి వారు గృహస్థు అయితే ఉదాహరణకి ఏక పత్ని/ ఏక పతి ధర్మముతో అదే వారు బ్రహ్మచారులు అయితే పర స్త్రి/పురుషులందు కామ దృష్టి లేకుండా ఉండగలిగితే ఇలా 12 నుండి 36 సంవత్సరాల పాటు ఇలా ఎన్నో ధర్మాలలో ఉన్న ఏదో ఒక దానిని అనగా సత్యము పలకటము, నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ మొదలగు వాటిని పాటించగలిగిన వారికి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీనము అలాగే నిజరూప దర్శనం కలుగుతాయని ఘంటాపధంగా చెప్పవచ్చును. ఇలాంటి ఏక పతి/ఏక పత్నిధర్మము పాటించుట వలన సీతారాముడిని( రాజు, రాణి) దైవ స్వరూపముగా అయోధ్య రాముడిగా భద్రాద్రి రాముడిగా పూజలు చేస్తున్నాము. ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఏదైనా ఒక ధర్మమును పాటించాలని నిర్ణయించుకుంటారో మరుక్షణమే యోగమాయ పరీక్షలు మొదలై ఆ ధర్మమును మీ చేత అధర్మముగా అంటే ధర్మం పాటించకుండా చేయాలని చూస్తాయి. అంతెందుకు. ఏక పత్ని ధర్మమును నేను 12 సంవత్సరములు (పెళ్ళై 12 సంవత్సరాల) నుండి పాటిస్తుండగా నాచేత ఈ ధర్మము చేయకుండా ఉండాలని స్వప్నములో, ధ్యానములో, మానసికంగా, శారీరకంగా ఇప్పటిదాకా 148 స్త్రీ మూర్తులును ఎదుర్కో వలసి వచ్చినది. అలాగే ఈ చక్ర స్థితిల కోసం మా ధర్మపత్ని అలాగే అమెరికా నివాసి అయిన శ్వేతాదేవి అనే యోగిని ఏక పతి ధర్మమును పాటించడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికీ పడుతున్నారు. వీళ్ళది 12 సంవత్సరములు దాటటముతో ఈ చక్ర స్థితులు పూర్తి చేసుకుని కర్మ చక్రానికి వెళ్ళగలిగినారు.ఈ ధర్మమును మధ్యలో వదిలేసి కామ మాయలో పడినవారు లేకపోలేదు.పెళ్ళి కాకపోయినా సంసారిగా ఉండే వాళ్ళని పెళ్ళి అయిన రెండు సంసారాలు చేసేవారిని అలాగే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి పిల్లల్ని కన్న వాళ్లని చాలామందిని స్వానుభవంలో చూడటం జరిగినది. ధర్మము పాటించటము అంటేనే కత్తిమీద సాము లాంటిది. పులి మీద స్వారీ లాంటిది. జాగ్రత్త లేకపోతే కత్తి వేటు అలాగే పులి పంజా దెబ్బ ఖచ్చితంగా పడి తీరుతుంది. దానితో మన సాధన అంతటితో పరిసమాప్తి అవుతుంది. అందుకే మన వాళ్ళు ధర్మ- అర్ధ- కామ- మోక్షమని చెప్పకనే చెప్పినారు. ఇందులో మోక్షప్రాప్తికి ధర్మగుణం మొట్టమొదటి అంగముగా చెప్పకనే చెప్పినారు. దీనినిబట్టి ధర్మ గుణము పాటిస్తే నిలబడగలిగితే ఖచ్చితంగా మనకి మోక్షప్రాప్తి కలుగుతుందని అర్థమవుతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు. మీకు వీలు అయితే మీకు ఇష్టమైతే మీరు తట్టుకొని దాటుకోగలరని నమ్మకము మీలో ఉంటే ఏదో ఒక ధర్మమును పాటించి ఈ చక్ర స్థితులు పూర్తి చేసి నాతో పాటుగా మాంసభక్షణ చేయటానికి ముందుకు కదలండి.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
********************************
గమనిక: ఈ చక్ర స్థితిలో మనకి శ్రీదత్తుడు విగ్రహాలు, ఆవు దూడ బొమ్మ, గోముఖ కమండలము, దత్త శిల, త్రిశూలము, నిజరూప దత్త పరీక్ష దర్శనాలు అదే దక్షిణాచారం చేస్తే కలుగుతాయని నాకు అర్థం అయినది. అలాగే తప్పకుండా ఏదో ఒక దత్త క్షేత్రానికి వెళ్లి వారి నిజరూప దర్శనం అనుభూతిని పొందటం జరుగుతుంది అని నేను చేసే దక్షిణాచార సాధన ద్వారా అలాగే మా జిజ్ఞాసి చేసే వామాచార సాధన వలన నాకు అర్థం అయినది. ఇట్టిచక్ర స్థితిని చతుర్ధ గుహ అని పతంజలి మహర్షి చెబితే శ్రీ లాహిరీ మహాశయుడు కాస్త ఈ నాలుగు చక్రాలను నాలుగు గృహాలతో పోల్చటం జరిగినది. అనగా స్థిర, అగమ్య, అజర, అమర గృహాలతో పోల్చటం జరిగినది. అలాగే మరి కొన్ని తంత్ర యోగ శాస్త్ర గ్రంథాలలో అయితే ఈ నాలుగు ఉప చక్రాలను లలన, మానస, సోమ, గురు చక్రాలుగా చెప్పటం జరిగినది. నేను అయితే ఈ నాలుగు ఉప చక్రాలను గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలుగా చెప్పటం జరిగినది. ఈ నాలుగు ఉప చక్రాల స్థితుల ఆధీనము కోసమే తాంత్రిక సాధన అనగా కాపాలిక, అఘోర, భైరవ, నాగ సాధువు సాధన విధి విధానాలు ఉన్నాయి. అందుకే రామకృష్ణ పరమహంస తన తాంత్రిక స్త్రీ గురువైన బ్రాహ్మణి భైరవి సహాయంతో శవ సాధన చేసినారని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే బెంగాలి యోగి అయిన రాంప్రసాద్ జీ అను వారు కూడా కేవలం పన్నెండు సంవత్సరముల పాటు మద్యం సేవిస్తూ ఉపాసన చేసి కాళీమాత సాక్షాత్కారం పొందటం జరిగినదని వారి చరిత్రలో ఉంది. అలాగే నడయాడే కాశీ విశ్వనాధుడైన నా తాంత్రిక సద్గురువైన శ్రీ త్రైలింగస్వామివారు కూడా అఘోర సాధన చేసి త్రిఖండ సిద్ది పొందిన ప్రముఖ అఘోరుడని లోకవిదితమే గదా.అలాగే ఈ చక్ర స్ధితి యందు లాహిరి మహాశయుడికి త్రిగుణాల ప్రతీక అయిన త్రిశూల దర్శనం అలాగే గోముఖ దర్శనం మరియు త్రిలోకాలు - త్రిమూర్తుల దర్శనం అయినట్లుగా "పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి "వారి గ్రంథము అనుభవాలలో చెప్పడం జరిగినది.
**********************
నా సాధన పరిసమాప్తి సమయములో:
నా సాధన పరిసమాప్తి సమయములో నేను అనుకోకుండా దత్తక్షేత్రమైన పిఠాపురమునకు వెళ్ళడము జరిగినది.అక్కడ నాకు యవ్వన వయస్సులో ఉన్న యువకుడు ఏదో తెలియని దిగులుతో ఉన్నట్లుగా కనిపించాడు. వాడి దగ్గరికి వెళ్ళి కారణము అడిగితే వెంటనే అతను"స్వామి!నాకు ఒక విషయము అర్ధము గావటము లేదు.నాకు మంచిది అది వేరేవారికి చెడుగా ఎందుకు కనపడుతుంది" అనగానే నేను వెంటనే “అదియే త్రిగుణాలమాయ ప్రభావం అన్నమాట.నువ్వు ఎంచుకున్న గుణమును బట్టి అది అందరికి కనపడుతుంది. చూపబడుతుంది. గుర్తించబడుతుంది.గుర్తింపబడుతుంది.నీ మంచి ఆలోచయే సత్వగుణమవుతుంది.ఇది అందరికి అందరిచేత ఆమోదించబడుతుంది.నీ ఆలోచన నీకు మంచిది గావచ్చును.కాని అందులో నీకే తెలియని హాని ఉంటే అది మిగిలిన వారికి చెడుగా కనిపించవచ్చును!అలాగే యత్ భావము తత్ భవతి అన్నమాట.దుర్యోధనుడికి ఈ లోకములో ఉన్నవారంతా చెడుగా కనిపిస్తే ... అదే ధర్మరాజుకి ఈ లోకములో వారంతా చాలా మంచిగా కనిపించారు.అంటే ఈ లోకమంతా మనము చూసే దృష్టి బట్టి,మన భావము బట్టి,మన గుణగణాల బట్టి కనపడుతుందని గ్రహించు!నువ్వు ఎల్లపుడు శుద్ధ సత్వగుణములో ఉండి ఈ లోకమును చూడటం అలవాటు చేసుకో!ఈ గుణముతో పనులు చెయ్యి!అపుడు నీకు మంచి లేక చెడు అనే తేడా కనిపించదు.దానితో నువ్వే కారణ జన్ముడి అవుతావు!సిద్ధపురుషుడిగా పూజింపబడతావు! సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని చెప్పి దత్త దర్శనానికి మేము వెళ్ళిపోవడము జరిగినది.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిupachakramaina gunachakramulo kapaalikuluga, aghoralu, bhairavulu, naga saadhuvulu
రిప్లయితొలగించండిga ee 4 chakrala saadhana chesthe gunatheetha, karma kaala bhaavatheetha sthithi
pondutharani....pancha makaraalu ante nijanga enti ani cheppatam bagundi, trilokalu, trimurthula
darshanam, dathudu yoga Maya pedthunnatluga kapilavarna govu darshanam annitikante last ki
odalakunda chepa pillanaina notlo vesukovalane mee druda nischayam.......datha saaligrama shila
mee peruna andi nundi theeyatam baganpinchindi......vammo ikkada jignyasi gaari saadhana
gaggurlu podichela anipinchindi last lo mana aalochana lo haani unte adi andariki nachadani manam
chusi daanni batti untundani.....