అధ్యాయం 43


మంత్ర దేవత పరీక్షలు

క్రిందటి అధ్యాయంలో సాధన విధానాలు, గురువులు వచ్చే విధానం అంతా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు  నా యోగసాధన ప్రారంభ స్థాయి అయిన మంత్ర దేవత యొక్క మంత్రసిద్ధి నుండి ఎలా నా జీవితం ఆరంభమైనది. నా యోగ జీవితం నా యోగ చక్రాలు జాగృతి, శుద్ధి,ఆధీనం అవుతున్నప్పుడు నేను పొందిన అనుభవాలు, అనుభూతులు, యోగ మాయలు, యోగ శక్తులు, వచ్చిన దైవిక వస్తువులు, తిరిగిన దైవిక క్షేత్రాలు, చేసిన దైవిక ఆరాధనలు అన్ని కూడా పూర్తిగా ఆరంభమవుతాయి. ఒక్కొక్కటిగా ఇప్పటిదాకా వివిధ రకాల యోగుల చరిత్రలు  అనుభవాలు, పుస్తక అనుభవాలు మాత్రమే చదవడం జరిగింది. అంటే కేవలం శబ్ద పాండిత్యమును పొందడం జరిగినది. కానీ నాకు రామకృష్ణ పరమహంస లాగా తన ఇష్టదైవమైన కాళీమాతను ఎలా అయితే దైవ సాక్షాత్కారం పొంది ఆమెతో మనుష్య రూపంగా ఎలా మాట్లాడినాడో అలా నేను కూడా నా ఇష్టదైవం తో మాట్లాడాలని నా యోగ జీవితం ఆరంభించాను..ప్రధమ స్థాయి అయిన అందులో మంత్ర గురువు ద్వారా నాకు వచ్చిన మంత్రోపదేశం తో మహా మంత్రమైన గాయత్రి మంత్రం చేయడం   ఆరంభించాను. అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు(12X2లక్షలు=24లక్షలు) అక్షర లక్ష 24 లక్షల గాయత్రి శుద్ధ గాయత్రి అనుష్ఠానము పూర్తి చేస్తుండే సరికి మంత్రసిద్ది ఆరంభమైనది. గాయత్రి  మహా మంత్రంలో 24బీజాక్షరాలు, 24 దేవతలు, 24 దేవతా శక్తులు, 24 గురువులు, 24 రుషులు ,24  అస్త్రశక్తులు అంతర్గతంగా ఉంటాయి. 24 అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి లక్ష చొప్పున 24 లక్షలు పూర్తిచేస్తే దానిని అక్షర లక్ష మంత్రజపము పూర్తి అయినట్లే లెక్క. అందరికీ గాయత్రి మంత్రం గురు మంత్రంగా రావాలని ఉండదు. కొందరు శివ పంచాక్షరి మరికొందరు అమ్మవారి మంత్రం, నారాయణ మంత్రము అలాగే మరికొందరికి  విష్ణుమూర్తి ద్వాదశ మంత్రం అలాగే మరికొందరికి దేవీ దేవతల మంత్రాలు ఇవ్వటం జరగొచ్చు. వచ్చిన ఈ మంత్రం అక్షరాలు బట్టి  అన్ని లక్షల జపం చేస్తే ఆ మంత్రం  మంత్ర సిద్ధి పొందినట్లే అన్నమాట.ఏ మంత్రం మనకి గురువు ఇస్తాడో మనకి తెలియదు. అందుకే మంత్ర గురువు వచ్చేదాకా మన సాధన భక్తి కేవలం విగ్రహారాధనకే పరిమితం అవుతుంది.ఎప్పుడైతే మనకి మంత్రం గురువు సంప్రాప్తి అయ్యి మంత్రోపదేశం రావటం జరుగుతుందో ఆనాటి నుండి మన సాధన భక్తి విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధనకు వెళ్లడం ప్రారంభం అవుతుంది. మాకు శ్రీశైల క్షేత్రంలో ఒడుగు కార్యక్రమం 27 మంది బాల వేదపండితుల సమక్షంలో నాన్నగారి నుండి గాయత్రి  మహా మంత్రం ఉపదేశంగా తీసుకోవటం జరిగినది అని ప్రస్తావించడం జరిగింది కదా. కానీ ఇప్పుడు 24 లక్షల మంత్ర జపము సిద్ధి  మహా శుద్ధ గాయత్రి  మంత్ర దేవత కోసం ఆమె సాక్షాత్కార అనుభవం కోసం నేను ప్రస్తుతం ఎదురు చూడటం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇంకొక ఆరు నెలలలో నా గాయత్రి మంత్రం మంత్ర జప సిద్ధి పూర్తి అవుతుంది అనగా ఆ మంత్ర దేవత అయిన గాయత్రి  మాత తన దర్శనమునకు నాకు అర్హత ఉందా లేదా అని పరీక్షించడం అలాగే పరిశోధించడం మొదలు పెట్టడం జరిగింది. ఒకరోజు నేను తీవ్రమైన మంత్ర జపం లో ఉండగా నాకు విపరీతమైన ఆవులింతలు వచ్చినాయి. 


నాకు తెలియకుండానే ఒక విధమైన నిద్ర మత్తులో జోగుతూ ఊగుతూ గాయత్రి  మంత్ర జపం అక్కడక్కడా ఆగుతూ ఆపుతూ ఆగిపోయానని తిట్టుకుంటూ తల విదిలించుకొని మొదలు పెడుతూ మళ్లీ ఆవలింతలు రావడం ఇలా పలుమార్లు జరుగుతున్న సమయంలో నా కళ్ళముందు గాయత్రి మాత తన రాజహంస మీద కూర్చుని నీళ్లపై కనపడటం లీలగా ఒక నీడలాగా ఆరంభమైంది. కానీ పూర్తిగా కానీ నీడ ఆకారమే కనపడనిది. అంటే గాయత్రి మాత కనిపించలేదు కానీ ఆమె నీడ నాకు కనబడింది. దాంతో నాకు గాయత్రి మంత్ర సిద్ధి ఆరంభమైనదని తెలిసి నాలో నాకే తెలియని ఆనందం ప్రారంభమైనది .ఇది జరిగిన మూడు నెలల తర్వాత నాకు అనుకోకుండా రాబోయే మూడు రోజుల సంఘటనలు ముందుగానే తెలియటం ప్రారంభమైనది. అంతకు ముందే నాకు వాక్సిద్ది ఆరంభమైనది అని చెప్పాను కదా.ఇప్పుడు కొత్తగా జరగబోయే మూడురోజుల సంఘటనలు ప్రారంభమైనవి. ఎవరి ముఖం చూసినా చాలు వాడికి జరగబోయే మూడురోజుల సంఘటనలు నాకు లీలగా స్పురణకు వచ్చి త్వరలో వాడిని చూడగానే నా వాక్సిద్ధి వలన వాడికి ఆ సంఘటనలు వరుసగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగినది. దాంతో వారు కొద్దిగా నమ్మేవారు. మరికొంత జరిగినప్పుడు చూద్దామని ఊరుకునేవారు. కానీ నేను చెప్పిన వాడికి మూడు రోజుల్లో అన్ని సంఘటనలు అక్షర సత్యాలు జరగటం నాకే ఏదో తెలియని ఆనందం అలాగే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని తెలియని ఆందోళన నన్ను వెంటాడేది. కానీ నేను ఎవరిని నుండి ఏమి గాని ధనము గాని, సహాయం గాని ఆశించకుండా అడిగిన వారందరికీ అలాగే అడగనివారికి నాకు స్పురణకు వచ్చిన మూడురోజుల భవిష్య సంఘటనలు అలాగే వారికి చెప్పడం,వారు ఇచ్చే పొగడ్తలలో పడటం జరిగింది.

ఇది ఇలా కొనసాగుతుండగా నాకు మరో దైవశక్తి వస్తుందని అన్నట్లుగా ఈసారి కూడా అమ్మవారి నీడ రూపంలో గాయత్రి మాత కనిపించేది కానీ ఈ సారి ఆమె నిజంగానే నీళ్లలో నీడ వెలుగుతూ కనిపించింది. మిగతా హంస మీద అన్ని రకాల ఆయుధాలతో పంచముఖ గాయత్రి మాత నీడ లాగానే కనిపించేది. కానీ నీళ్లు చక్కగా కనబడి మిగిలినదంతా ఎందుకు కనపడలేదో అర్థం కాక అయోమయానికి గురి అవుతూ ఉండేవాడిని.కానీ కొంతమేరైనా వెలుగు తను కనబడినందుకు సంతోషించేవాడిని. మనస్సుతో అప్పుడు విచారించి నాకున్న విశ్లేషణ వలన నా వివేక బుద్ధి వివేకంతో నీవు ఎవరి నుండి ధనము గాని,  సహాయం గాని, ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా అలాగే తన మాయలో పడకుండ ఉన్నందుకు అంటే ఆమె ఇచ్చిన మూడురోజుల భవిష్య శక్తిని నా స్వార్థం కోసం ఉపయోగించకుండా ఉన్నందుకు ఇలా నీళ్ల మీద వెలుగుతూ నన్ను అనుగ్రహించిందని అలానే మిగిలిన ఆమె పెట్టే ఇలాంటి పరీక్షలు యోగ మాయ దాటుకుంటూ ఉంటే ఆమెను పూర్తిగా నీడ వెలుగు నుండి ఇష్ట మంత్ర దేవతగా నాకు దైవ సాక్షాత్కారం అనుగ్రహిస్తుందని తెలిసి ఒకవైపు ఆనందం మరొకవైపు తెలియని భయం నన్ను వెంటాడింది.ఏమో చెప్పలేం. ఆమె ఈ సారి ఏ సిద్ధి ఇస్తుందో జాగ్రత్తగా ఉండాలని ఎదురుచూడసాగాను.ఆ రోజు రానే వచ్చింది అదియే ఆత్మానుసంధాన సిద్ధి (టెలిపతి సిద్ది) అంటే ఏక కాలంలో ఇద్దరు వేరే ప్రాంతంలో ఒకే సమయం లో ఉండి ఏమి ఆలోచనలు చేస్తారో… అవి ఒకరి ఆలోచనలను మరొకరికి ఈ విధానం ద్వారా తెలుస్తాయని పుస్తక విధానం తెలిసినది.  దాంతో నాకు అలాగే జిఙ్ఞాసికిఈ సిద్ది పరీక్షించాలని  ఒకరోజు ఒక సమయంలో ఎవరి ఇండ్లలో వారు ఉండి ఏమి ఆలోచన చేస్తున్నాము ఎవరికి వారే కాగితం మీద రాసుకుని ఆ తర్వాత వచ్చి దీనిని గూర్చి చర్చించుకోవాలని నిర్ణయించుకున్నాము.అనుకున్నదే తడవుగా ఇద్దరము ఇండ్లకు వెళ్లి పోయి ఫలానా సమయంలో మా వేర్వేరు ఇంట్లో కూర్చొని వచ్చిన ఆలోచనలు, భావాలు కాగితం మీద రాసి మరుసటి రోజు ఎదురు చూడగా వాటిలో వాడి గూర్చి చెప్పిన 10 పాయింట్లు రాస్తే అందులో రెండు మాత్రమే నిజమైనాయి. అలాగే వాడు నా గురించి ఆలోచించి వ్రాసిన 15 పాయింట్లలో 5 పాయింట్స్ సరిగా ఉన్నాయి. దాంతో మాలో మాకే తెలియని చిన్నపాటి ఆనంద ఆవేశాలు కలిగి ఎదురుగా మాట్లాడుకోవడం మానేసి ఇలా టెలిపతి విధానం ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించాము. కొన్ని రోజుల తర్వాత ద్వారా టెలిపతిలో 98% ఆలోచనలు సరిగ్గా సరిపోయే స్థాయికి టెలిపతి సిద్ధి ఉండేది. ఆ తర్వాత ఈ టెలిపతి  సిద్ధితో ఎవరితోనైనా నేను అనుసంధానం అయ్యి వారిఆలోచనలను గురించి ఫలానా సమయంలో లో ఏమి అనుకున్నారో మా యోగ, భోగ మిత్రులకు చెప్పి వారిని ఆశ్చర్యానందాలకు గురి చేసే వాడిని.వారి ఆనందం చూసి నాలో తెలియని చిన్నపాటి గర్వము అహంకారం వచ్చేవి. అది వస్తుందని తెలుసుకునే స్థితిలో నేను ఉండే వాడిని కాను.కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం, వారిని బాధపెట్టటం జరిగేది కాదు.ఎందుకంటే వాళ్ళు నన్ను ఏ సమయంలో తిట్టుకునే వాళ్ళో మెచ్చుకునేవారోతెలిసినా వాళ్లందరినీ సమదృష్టితో చూసే వాడిని.ఇలా ఉండటంతో ఈ సారి గాయత్రి మాత మాత్రమే నీడగా ఉండి రాజహంస వెలుగులతో కనబడేది.

ఇది ఇలా ఉండగా ప్రారంభ సంకల్పము సిద్ది నాకు వచ్చిందని తెలియటం జరిగినది.అంటే నేను తలచుకున్న వ్యక్తి నా దగ్గరికి రావాలని అనుకోగానే వాళ్ళు ఎవరో పిలిచినట్లుగా వచ్చేవారు.అదిగాక ఎవరు నాకోసం వస్తున్నారో నాకు ఒక గంట ముందుగానే వారి గురించి ఆలోచనలు వచ్చేవి.అలాగే వారు ఆ సమయంలో నా గురించి ఆలోచించిన ఆలోచనలు నా మెదడుకి వచ్చేవి.వాళ్ళు రాగానే ఫలానా సమయంలో నువ్వు నా గురించి ఇలా ఆలోచించినట్లు వాళ్లకు చెప్పే సరికి కొంతమంది నిజమని ఒప్పుకుంటే మరికొంతమంది మొహమాటంతో నిజమని ఒప్పుకునేవారు కాదు. అది అబద్ధమని తెలిపిన వారిని నేను ఇబ్బంది పెట్టే వాడిని కాను. కానీ ఈ సిద్ధితో వర్షం కురవాలంటే కురిసేది కాదు కానీ వారం రోజుల తర్వాత వర్షం పడేది.కానీ అది నా సంకల్పసిద్ధి వలనో కాదో నమ్మాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండే వాడిని.ఎందుకంటే నేను అనుకున్న మరుక్షణంలోవర్షం పడాలి కానీ అది జరగడం లేదు.ఎప్పుడో వారం పది రోజుల తర్వాత పడే వర్షం నావల్ల అని అనిపించేది కాదు. కానీ నాకు నా సిద్ధి సరిపోవడం లేదని అర్థం అయ్యేది. దాంతో నాకు ఆవేశం వచ్చింది. నేను అనుకున్న క్షణంలో వర్షం పడాలని వచ్చిన సిద్ధి కోసం తీవ్రంగా ఆలోచించేవాడిని.ఎలాగైనా సిద్ది ప్రాప్తి పొందాలని వివిధ పుస్తక గ్రంథాలలో ఉన్న విధి విధానాలు చేయడం మీద ఆసక్తి చూపటం జరుగుతుంది.అప్పుడు నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు గ్రంథము నా వద్దకు వచ్చింది. దానిని చదువుతూ ఉన్నప్పుడు ఒక కథనం అనుభవం నన్ను బాగా ఆకర్షించింది.అది ఏమిటంటే ఒకసారి ఒక సిద్ధుడు రామకృష్ణ దగ్గరికి వచ్చి నేను నీళ్లలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి వెనక్కి రావటం చూసి ఈయన నవ్వారు.దానికి ఆ సిద్ధుడు “ఎందుకు నవ్వుతున్నావ్” అని అడిగేసరికి దానికి రామకృష్ణ వెంటనే “అయ్యా! మీరు ఈ సిద్ధి కోసం ఎంత కాలం కష్టపడినారు” అని అనగా దానికి అతను “సుమారు 28 సంవత్సరాలు కఠోర నియమాలతో సాధన చేస్తే ఆ సిద్ధిపొందడం జరిగింది” అని చెప్పగా దానికి ఆయన వెంటనే “అయ్యా! అంటే మీరు 28 సంవత్సరములు సాధన చేసి అర్థణా మాత్రమే సంపాదించారు అన్నమాట. బాబు! ఒక పడవ వాడు ఈ నది దాటించడానికి  అర్థణా మాత్రమే తీసుకుంటారు కదా. అర్థణా ఖర్చుపెడితే అవతలికి వెళ్లే అవకాశం ఉంటే ఈ సిద్ది రావడం కోసం 28 సంవత్సరాలు ఎందుకు వృధా చేసినావో అర్థం గాక నాకు నవ్వు వచ్చింది” అనగానే ఆ సిద్ధుడు రామకృష్ణ పరమహంస పాదాలకు నమస్కరించి “అయ్యా! వచ్చిన ఈ సిద్ది వలన నాలో వచ్చిన సిద్ధ అహంకార మాయ తొలగించారు. అర్థణా కోసం నా 28 సంవత్సరాలు వృధా చేయటం నాకు సిగ్గుగా ఉంది.ఈనాటితో ఈ సిద్ధిని ఎవరు ముందు ప్రదర్శించను అని చెప్పి వెళ్ళిపోయాడు” అని చదివేసరికి నాకు ఆరు నెలలుగా వర్షము పడాలని చేస్తున్న సంకల్ప సిద్ధి ప్రయత్నం విరమించుకోవటం ఏకకాలంలో జరిగినాయి.ఆనాటి నుండి సిద్ధులు వచ్చినాయా లేదనికేవలం పరీక్షించుకుని వచ్చినాయి అని తెలియగానే వాటి గురించి మర్చిపోవడం ఇతరులకు ఉపయోగించుకోవడం లేదా నేను నా స్వార్థానికి వాడుకోవద్దని మానివేశాను.ఇలాంటి ఎన్నో సందర్భాల్లో  నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన ఎన్నో అనుభవాల కథలు నా యొక్క విఘ్నాలు దాదాపుగా తొలగించడం జరిగినది. అది ఎలాగో ఈ రాబోవు అధ్యాయంలో చూడగలుగుతారు.

ఇక నేను ఎప్పుడైతే ఈ సంకల్పసిద్ధి మాయ కూడా దాటేసరికి  గాయత్రి మాత తన పూర్తి వెలుగుల కాంతి శరీరంతో ఒక ముఖంతో దర్శనం ఇవ్వటం జరిగినది.దాంతో ఈమె పెట్టిన అన్ని రకాల యోగ మాయలు దాటుకోవడం జరిగినదని అర్థమైంది కానీ పంచముఖ గాయత్రి అలాగే ఏకముఖ గాయత్రికి గలతేడా ఏమిటి అర్థం కాలేదు.ఒక రోజు అర్ధరాత్రి నిద్రలో ఉండగా నిద్ర లాంటి మెలకువలో ఉండగా నిజంలాంటి కలలో గాయత్రి మాత ఒకసారి పంచముఖాలతో మరొకసారి ఏకముఖముతో దర్శనమిచ్చింది.అప్పుడు నేను వెంటనే “అమ్మా!వీటి అర్థం ఏమిటో  అర్థం చేసుకునే జ్ఞానము నాకు తెలియటం లేదు” అనగానే అమ్మ ఏదో అన్నది గాని నాకు వినబడలేదు. ఆమె కదులుతున్న పెదవులు మాత్రమే కనబడుతున్నాయి. అంటే నా సాధన ఆమె మౌనం స్వరూపాన్ని వెలుగు చూడటానికి మాత్రమే ఉందని ఆమె మాటలు వినే స్థితిలో లేదని తెలియగానే నాలో తెలియని ఆవేదన వచ్చేసరికి ఆ దైవ సంఘటన అదృశ్యమైంది.ఇది నిజమా అబద్దమా అర్థం కాలేదు. ఏదేమైనా నా సాధన స్థాయి ఎంతవరకు ఉందో తెలియజేసినందుకు అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలోకి జారుకోవడం జరిగినది. 

ఇది జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత ఒక 45 సంవత్సరాలు స్త్రీ మూర్తి నా దగ్గరికి వచ్చి “రాత్రి అమ్మవారు తన పంచముఖ గాయత్రి విగ్రహమూర్తి మీకు ఇమ్మని” చెప్పడం జరిగింది. నాన్నగారు దీనిని నిత్యం పూజలో ఉంచుకొని ఈమె అనుష్టానము చాలా నిష్ఠగా చేసి ఈ మంత్ర శక్తి జపంతో మమ్మల్ని సంతానంగా పొందడం జరిగినది.  కానీ వారు నెల రోజుల క్రితం పరమపదించడం జరిగింది. అది అక్కడనుండి ఇంట్లో ఏదో తెలియని గొడవలు, మనస్పర్ధలు రావటం ,కలహాలు, అగ్ని ప్రమాదాలు, ఏవో అనుకోని వాహన ప్రమాదాలు,విడిపోయే పరిస్థితి వరుసపెట్టి వస్తుండే సరికి నేను ఒక జ్యోతిష్య వేత్తను సంప్రదించగా వారు ఏవో కొన్ని ప్రశ్న చక్రాలు గీసి “అమ్మా! మీ ఇంటిలో అతి శక్తివంతమైన పంచముఖ గాయత్రి మాత విగ్రహం ఉన్నట్లుగా తెలుస్తోంది.దానికి పూజలు చేసేవారు లేకపోవడంతో అది ఉగ్రరూపం దాల్చింది.అందుకే అనుకోని సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి.మీ వంశస్థులు ఇంకా ఎవరు కూడా అంత మంత్ర శక్తి తట్టుకునే వారు లేకపోవడంతో దానిని మీరు ఎవరికైనా ఇవ్వండి అని సలహా ఇస్తూ మీ ఇంటికి పలానా దిశలో పలాన దిక్కులో ఫలానా ఇంటిలో ఫలానా ముఖకవళికలు ఉన్న వ్యక్తి ఉన్నారని వారు కూడా గాయత్రి  మంత్రానుష్టానం సిద్ధులని మీ గురించి చెప్పడం జరిగింది. దాంతో ఈ పెద్దమ్మను మీకు ఇవ్వడానికి వచ్చాము.ఏమిటి నేను ఇవ్వడం ఏమిటి నా బొంద.ఆమెకు కావలసిన వారిని ఆమె తెలుసుకున్నది అంటూ నేను చెప్పేది వినకుండా నా ఒడిలో ఈ పంచముఖ గాయత్రి విగ్రహం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.ఈ విగ్రహం నన్ను కూడా భయపెడితే నా పరిస్థితి ఏమిటని మధనపడుతుండగా నాకు మళ్ళీ నిద్ర మెలకువ స్థితిలోనికి వెళ్లేసరికి ఈసారి కూడా ఏకముఖ గాయత్రి కనపడి “నాయనా! నేనే నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చాను. మీ నిష్కామ భక్తి వలన నేను నీ భక్తికి దాసురాలను అయినాను. నేను నీ దగ్గరికి రావడానికి వాళ్లతో రుణానుబంధం తెంచుకోవటానికి అలా ప్రవర్తించవలసి వచ్చింది.కానీ నీ మీద నాకు ఎలాంటి కోపావేశాలు ఉండవు. నేను నీకు బ్రహ్మ జ్ఞానం అందించే వేదమాతనే గాని ఆవేశపడే అమ్మను కాను. నువ్వు నన్ను చూడు.నేను నిన్ను చూసుకుంటాను” అని అభయమిస్తూ అదృశ్యమైంది.ఈసారి ఆమె మాటలు నాకు స్పష్టంగా వినబడటంతో ఈ విగ్రహారాధనతో నా మంత్ర సిద్ధి సాధన స్థాయి పెరుగుతుందని అర్థమయ్యేసరికి నా దేహం అంతా రోమాలతో గగుర్పాటు చెందినది.కొన్ని రోజులకు నాకు నా బుద్ధికి విశ్లేషించే వివేక బుద్ధి అలవడింది.ఎలాంటి సమస్య అయినా సందేహమైన కొన్ని క్షణాలు ఆలోచించి ఆ సమస్యకు ఉన్న పలురకాల పరిష్కార మార్గాలు అలాగే వాటికి తగ్గ సమాధానాలు ఎంతో చాకచక్యంగా విశ్లేషించి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించేది కాదు.ఎందుకంటే ఇదంతా గాయత్రి  మాత విగ్రహం-అనుగ్రహం వల్లే సాధ్యపడుతుందని, చెప్పేది ఆమె అని చూపించేది నన్ను అని నాకు మాత్రమే తెలుసు. ఆమె ఎందుకు అలా చేస్తుందో నేను ఆలోచించే వాడిని కాను .ఎందుకంటే అమ్మ తన వంతు సహాయంగా తన సహాయ సహకారాలు కోరిన వ్యక్తులకు వారికి కావలసిన వివరాలు చెబుతున్నదని నన్ను ఉపయోగించినందుకు ఆమెకి నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. అలాగే రుణపడి ఉండేవాడిని.ఏది ఏమైనా ఇలాంటి ప్రాథమిక సిద్దులు ఎవరు మంత్రరాధన పూర్తి చేసిన వస్తాయని గ్రహించండి. వాటి మాయలో పడకుండా ముందుకు వెళ్ళండి. లేదంటే మీరు కూడా అర్థణా అయ్యే ఖర్చు కోసం మీ జీవితమే నాశనం అవుతుందని గ్రహించండి.జాగ్రత్త పడండి.ఉంటాను.మీ ఇష్ట దేవత మంత్రము జపము చేసుకొని మళ్లీ నాతో ముందుకి ప్రయాణం చేయండి. నా మంత్రదేవత వేదమాత గాయిత్రిమాత ఏలాంటి దీక్ష గురువు ని చూపినదో మీకు తెలుసుకోవాలని ఉందా?

గమనిక:ఇక్కడ ఒక విషయము మనము తెలుసుకోవాలి అది ఏమిటంటే దైవదర్శనమునకు అలాగే దైవసాక్షాత్కరమునకు తేడా ఉంటుంది.అదే దైవ దర్శనము అంటే మన మంత్రదేవత స్వప్నమునందు కనపడి మనకి గావాలసిన సూచనలు ఇస్తుంది!అనగా ఇది కల లాంటిది! అదే దైవసాక్షాత్కరమంటే ధ్యానములో లేదా నిశ్చల సమాధి స్ధితిలో కనపడుతూ...ఇలలో మనుష్యరూపేణ కనపడుతూ...మనతో మాట్లాడుతూ మనవెంట ఉన్నట్లుగా కనపడతారు.అసలు నిజానికి మన సూక్ష్మశరీరమే మన మంత్రదైవముగా లేదా మన ఇష్టదైవముగా కనపడుతుంది.ఈ విషయము మన ఆఙ్ఞాచక్రములో ఉన్న జీవమాయ దాటేవరకు మనకి తెలియదు.దైవదర్శనం మొదలు అంటే బాల మాయ మొదలు అదే దైవసాక్షాత్కరం మొదలు అంటే త్రిపుర మాయ మొదలు అని తెలుసుకొండి! అందుకే ఈ దైవదర్శన,సాక్షాత్కరాలను మనోభ్రాంతులని...వీటిని దాటాలని మన సద్గురు వచ్చి చెప్పేదాకా మనకున్న జీవమాయ పోదు! అపుడే నేనే దేవుడిని అనుభూతి పొందడము అనగా అహం:బ్రహ్మస్మి.

స్కూటర్ నడుపుతున్న దత్తాత్రేయ స్వామి

నాకు గాయత్రి మంత్ర సిద్ధి అయినదని ఇంతకుముందు అధ్యాయం లో చదివి ఉన్నారు కదా.ఇలా ఉండగా గాయత్రి మాత కలలో కనిపించి “నాయనా!నా అనుగ్రహం వలన నీ దీక్ష గురువు నీ దగ్గరకి రేపు వస్తున్నారు.వారిని బాగా పరీక్షించి, పరీక్షలు పెట్టి, పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ దీక్ష గురువుగా వారిని ఎంచుకో.నీకు నచ్చితే వారే నీకు దీక్ష గురువుగా నువ్వు వారిని నీ జీవితాంతం భావించుకోవాల్సి ఉంటుంది.అవసరమైతే వారికి గురు సేవ చేయాల్సి ఉంటుంది.ఒకసారి నమ్మిన తర్వాత ఆయన ఎలాంటి వారైనా వదిలి పెట్టవద్దు. అలాగని గురువులను మార్చవద్దు. నీ ఈ సాధన స్థాయిని పెంచే నీకు వచ్చే 18 రకాలయోగ సాధన మార్గాలలో ఈయన జ్ఞాన మార్గంలో నడిచిన జ్ఞాన సిద్ధుడని తెలుసుకో. ఆయన నిన్ను ఏమార్చడానికి నిన్ను విసిగిస్తాడు. అజ్ఞానిగా ఉంటాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు.పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చివాడి మాదిరిగా ఉంటాడు. కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత” అని గ్రహించు అని చెప్పి అంతర్ధానం అయినది. మరుసటి రోజు నేను యధావిధిగా మా గుడిలోని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఒక నడివయసు వ్యక్తి గుడి లోనికి రావడం జరిగినది. దేవాలయం అంతా తిరుగుతూ  ఏవో చేస్తూ గాలిలో చేతులు ఊపుతూ అప్పుడప్పుడు పిచ్చివాడి మాదిరిగా పిచ్చి చూపులు ,వెర్రి నవ్వులు తనలో తాను నవ్వుకుంటూ చేస్తున్నారు.అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి “స్వామి! నమస్కారం. రాత్రి అమ్మ  మీ గూర్చి చెప్పినది. ఇదిగో దేవుని ప్రసాదం అంటూ ఆయన చేతిలో అరటిపండ్లు పెట్టినాను. వెంటనే ఆయన అమ్మ చెప్పిందా? మా అమ్మ చనిపోయింది కదా. చనిపోయింది ఎలా వచ్చి చెబుతుంది.లేని అమ్మను ఉందని, నీతో చెప్పిందని కథలు చెబుతున్నావా? నాతో లంజా కొడకా! నా దగ్గర  దొంగతనం చేయడానికి వచ్చినావా ముండా కొడకా! ఏమిరా నాటకాలు ఆడుతున్నారు. మీ అమ్మ చెప్పినది విని మా అమ్మ చెప్పినది అని అంటావా వెధవ  నాయాల! ఏమిరా నా దగ్గర ఉన్న వాటిని దోచుకు వెళ్లాలని ఎన్నాళ్ల నుంచి నువ్వు మీ అమ్మ కలిసి పథకాలు వేసినారు ముండాకొడుకుల్లారా. మీ అమ్మ ఒక వెధవ ముండ, నువ్వు పని లేని ముండాకొడుకు. బుద్ధిలేని సన్యాసి! వెధవ మాటలు మాట్లాడే వెధవ నాయాల! నీకు సిగ్గు శరం ఉన్నదా! దమ్ముంటే ఇదిగో  నా ఎంగిలి తిను చూద్దాం!” అంటూ నేను ఇచ్చిన అరటిపండ్లలో ఒక పండు తీసి దానిలో పండు నా మీద కొట్టి తొక్క కొంత తిని నా నోట్లో పెడుతుంటేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. నిజంగానే ఈయన మతిభ్రమణం చెందిన వ్యక్తి అయి ఉంటారు.!ఈరోజు నిజముగానే బాలోన్మత పిశాచ అవస్ధ పొందిన అవధూతను చూస్తున్నానని నాకు అనిపించినది! “వామ్మో! తెలుగులో ఇన్ని పచ్చి బూతులు ఉంటాయని  ఇప్పుడే తెలిసింది. నన్ను ఇన్ని తిట్లు కూడా ఎవరూ తిట్టలేదు. వీళ్లు దీక్ష గురువు అని పొరపాటు పడినందుకు నా చంక నా చేత నాకిస్తున్నారు. పండు వదిలేసి తొక్క తినటం ఏమిటి కాకపోతే? అందులో సగం తొక్క నా నోట్లో పెట్టడానికి ప్రయత్నించడం ఏమిటి? వామ్మో! ఎటు పారిపోవటానికి అవకాశం లేకుండా వీడి దగ్గర ఇరుక్కుపోయాను” వెంటనే నాకు వచ్చిన మంత్రాలు చదువుతూ ఉండగా ఈయన పెట్టిన మరో భయం వలన మంత్రాలు కూడా సరిగ్గా ఉచ్చరించలేక ఒక మంత్రానికి మరొక మంత్రం కలుపుతూ కొత్త మంత్రాలు తయారు చేస్తున్నాను అని తెలుసుకొనే స్థితిలో నేను లేను. వెంటనే మట్టి లింగమూర్తి అలాగే సజీవ బాబా మూర్తిని అలాగే గాయత్రి మాతను తలుచుకుంటూ ఉండగా “ఏమిరా ఈ మాత్రానికే బాబాను, గాయత్రిని,లింగయ్యను  ఈ మంత్రాలతో పిలుస్తావా! నీ మంత్రం అంత అవసరం లేదు. ఇదిగో ఈ ప్రసాదం అంటూ తను సగం తిన్న అరటిపండు భాగము నాకు ఇచ్చి నేను తినే దాకా ఎదురు చూస్తుండగా నాకు ఏదో తెలియని నిద్ర మత్తు ఆవహిస్తోంది అని తెలియగానే “వామ్మో! గురువుగారు కాదు. పాడు కాదు. వీరు నిజంగా దొంగ. ఈ గుడిలో దొంగతనం చేయడానికి వచ్చి అరటి పండ్లులో మత్తుమందు కలిపి దానిని తనచే తినిపించాడు. వామ్మో! దీనమ్మ! సమయానికి ఎవరూ కూడా లేకుండా పోయారు. అవసరానికి ఎవరు ఉండరు. అవసరం లేనప్పుడు వద్దన్నా ఉంటారు” అని  తిట్టుకుంటూ నిద్రలోకి జారిపోవడం జరిగింది.మెలకువ వచ్చేసరికి మళ్లీ ఈయన నా ఎదురుగా ఉండి, “నేను దొంగను కాను. నీవే దొంగ.నా దగ్గర ఉన్న అమూల్య జ్ఞాన రత్నం నీకు ఇవ్వాలని వచ్చాను. ఇచ్చాను. అదియే శక్తిపాత సిద్దితో కూడిన  నా ఎంగిలి అరటిపండు ప్రసాదం. ఈ నాటి నుండి మీలో కుండలిని శక్తి జాగృతి అయ్యి 13 యోగ చక్రాలు జాగృతి అవుతాయి. కంగారు పడకు. నెమ్మదిగా లే. మీ శరీరం ఈ శక్తి పాతమునకు తట్టుకోలేక పోయినది. అందువలన కళ్లు తిరిగి పడిపోయావు. కంగారు పడకు.నెమ్మదించు. భయపడకు. రాత్రి గాయత్రి చెప్పిన వ్యక్తిని నేనే. ఆ గాయత్రి ఎవరో కాదు నా కూతురే అంటుండగా “వామ్మో! సాక్షాత్తు మహా గాయత్రి మంత్ర దేవతను ఈయన స్వయంగా తన కూతురు గావించుకొని ఆరాధన  చేసినారు అంటే ఖచ్చితంగా మహాత్ముడు అని” ఈయన కాళ్లకు నమస్కారం చేయగానే “అదేరా! మీతో వచ్చిన చిక్కు. చమత్కారాలు చేస్తే గాని నమస్కారాలు చేయరా! అవును కానీ నీకు ఏమి కావాలి రా! ఎవరి దర్శనం కావాలో చెప్పు. క్షణాలలో వారు నీ ముందు ఉంటారు” అనగానే 

నాకు అకస్మాత్తుగా గురువులకే గురువైన విశ్వ గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూడాలనిపించి ఇదే విషయాన్ని వారితో చెప్పాను. ఆయన నవ్వుతూ, దానికి “అదేమంత పెద్ద విషయం కాదు. ఆ టక్కరిదొంగ నా సన్నిహితుడే! నువ్వు కొన్ని నిమిషాలు ఎదురు చూడాలి. పద రోడ్డు మీదకు వెళ్లి చూద్దాం” అని చెప్పి రోడ్డు మీదకు తీసుకుని వెళ్లి అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఇంతలో నాకు “అవును! ఆయన ఇంత సులభంగా ఎవరికి దర్శనం ఇవ్వరు కదా! ఎన్నో యోగ పరీక్షలు పెట్టే  పరీక్షదత్తుడు అని నేను విన్నాను. మరి ఈయన ఏమో నాకు చూపిస్తానని ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈయన పిలిస్తే ఆయన వచ్చేస్తారా! వామ్మో! ఈయన ఎంతటి గొప్ప యోగిపుంగవుడు అయ్యి ఉంటాడు. అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నాను. అసలు ఆయన మాయా రూపాలు ధరించే మాయావి. ధరించిన రూపం ధరించకుండా వచ్చే అఖండ మేధావి.మాయల కే మహా మాయగాడు” అనుకుంటుండగా 

ఆయన వెంటనే “అదిగోరా! అలా స్కూటర్ మీద అదిగో వస్తున్నాడే మీ దత్త స్వామి జాగ్రత్తగా చూడు పారిపోతాడు” అన్నాడు. వెంటనే చాలా ఆసక్తిగా అటు వైపు చూస్తే ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసి స్కూటర్ మీద వెళ్తున్నారు కానీ వారిలో ఎవరికి కూడా దైవిక శక్తి లేదు. ఎందుకంటే వారిలో ఇద్దరు నాకు తెలిసిన వ్యక్తులే అని ఆయన తిరిగి వైపు “ వీళ్లు దత్తాత్రేయుడా?  మీకు ఎలా కనబడుతున్నాను.  వాళ్లలో నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.అప్పుడప్పుడు మా గుడికి వస్తూ ఉంటారు. ఇంతకంటే ఏమీ లేదా? నాకు చూపించడానికి…. మీకు నవ్వులాట లాగా ఉంది. ఎంతో ఆశగా దత్త స్వామి చూపిస్తారు అంటే మా ఊరి మనుష్యులను నాకు చూపిస్తున్నారు” అనగానే ఆయన వెంటనే “ఒరేయ్ పిచ్చోడా! దత్త స్వామి అంటే ఫొటోలో చూపిన విధంగా నాలుగు కుక్కలుతో,  పసుపు రంగు వస్త్రాలతో, వివిధ రకాల రుద్రాక్ష మాలలు ఉన్న రూపంలో వ్యక్తి గానే వస్తేనే నువ్వు దత్త స్వామి అంటే ఎలా కుదురుతుంది. మీ దత్త స్వామి మూడు తలల ఆ స్వామి కదా.ఇందాక స్కూటర్ మీద వెళుతున్న వారిలో నడిపేవాడు ఎదురుగా చూస్తుంటే మిగిలిన ఇద్దరూ  తమ తలలను కుడివైపు ఒక్కడు మరొకడు ఎడమవైపు నుంచి చూస్తూ వెళుతున్నారు కదా!  మరి ఇప్పుడు ఈ ముగ్గురు తలలు కలిపి సరిగ్గా చూడు. మీ దత్త స్వామికి కూడా ఉన్న మూడు తలలు లాగానే ఈ ముగ్గురు తలలు ఉన్నాయి కదా. ఇంకా ఏమిటి? దత్తాత్రేయుడే కదా! వీళ్లు” అనగానే “వామ్మో అంటే ఈయన సాధన స్థాయి ఎంత మహోన్నతమైన స్థాయిలో ఉంది. ఈయన చెప్పినది నిజమే కదా. దత్తుడికి మూడు తలలు ఉన్నట్లుగా ఈ స్కూటర్ నడిపే వ్యక్తులు మూడు తలలు కలిపి చూస్తే మూడు తలల ఆ స్వామి కనపడేది అంటే నేను దేవుడిని ఒక మానవుడిలా భావించుకొని ఆరాధన చేస్తూ వచ్చాను కానీ ఈయన మాత్రం మానవుడిలో దేవుడు గావించుకొని ఆరాధన చేస్తున్నారు. నాది విగ్రహారాధన అయితే వీరిది విశ్వ ఆరాధన అవుతుంది. భక్తి మార్గంలో ఉన్న వారికి దేవుడు ఒక మానవుడు అయితే జ్ఞాన మార్గం ఉన్నవారికి మానవుడు మాధవుడిగా కనబడతాడు” అని నా వివేక బుద్ధి విశ్లేషించి వివరణ ఇచ్చేసరికి ఆ దీక్ష గురువు అక్కడి నుండి అదృశ్యం అయినారు అని గమనించలేదు.

నాకు కొంత బాధ,ఆవేదన,మనోవేదన కలిగించాయి. నిజానికి ఆయన నన్ను తిట్టలేదు నాలో ఉన్న లోపాలను, పాపాలను ఆయన తిట్ల రూపంలో బయటకు పంపించివేశారు.నాలో ఆవేశం కలిగించే అరటిపండు ప్రసాదం ద్వారా తమ యోగశక్తిని తమ శక్తి పాత సిద్ది ద్వారా నాలోనికి పంపించి యోగ గురువు అయ్యారు. ఆయన రూపురేఖలుమాత్రమే గుర్తున్నాయి. వీరిని నా చిన్నపుడు ఇదే గుడిలో ఉన్నపుడు చూడటం జరిగినట్లుగా...వారు శ్రీశైలములో నివసించే శ్రీపూర్ణానంద యోగిగా  లీలగా గుర్తుకు వచ్చినది కాని సంపూర్తిగా గుర్తుకు రావడము లేదు. కాని వారి సాధన వివరాలు తెలియలేదు. యోగుల పూర్తి వివరాలు తెలుసుకోవటం చాలా అసాధ్యమని గుర్తుకు వచ్చే సరికి నా ప్రయత్నం విరమించుకుని ఇంతటి మహత్తర శక్తి ఉన్న నిజ దీక్ష గురువు నాకు ప్రసాదించినందుకు గాయత్రి మాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మౌనంగా గుడిలోనికి వెళ్ళి మిగిలిపోయిన పూజాది కార్యక్రమాలు పూర్తి  చేయసాగాను. నా గురువు గురించి నా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.మహా నైవేద్యం గిన్నెను తీసుకొని ఇంటి వైపు వెళ్లి పోయాను. 

ఇప్పటిదాకా నాకు పుస్తక పఠనంతో శబ్ద పాండిత్యమే ఉన్నది గానీ చక్రాలు జాగృతి అయినప్పుడు ఏమి జరుగుతుందో స్వానుభవం అనుభవ పాండిత్యం కలిగి లేదు కదా! కాబట్టి శబ్ద పాండిత్యం వివరాలు నిజమే అని నేను నమ్మడానికి వీలు ఉండదు కదా! ఇక నేను అనుభవం కోసం సాధన చేయడం ప్రారంభించాను. కుండలినీ శక్తి లో కదలికలు ప్రారంభమవుతాయని దీక్ష గురువు చెప్పి వెళ్ళినారు కదా!  చూద్దాం! అది జాగృతి అయినది అని మనకు ఎలా తెలుస్తుందో గమనించాలి అనుకొని యధావిధిగా మంత్రానుష్టానం చేసుకుంటుండగా నాలో ఏదో తెలియని ఆవేదన ఆరంభమైనది. ఎందుకు ఏదో తెలియని భయం ఆందోళన నాలో ప్రారంభమయ్యాయి. ఎందుకో తెలియదు. ఒక రోజు అర్ధరాత్రి సమయంలో మంచి నిద్రలో ఉండగా వెన్నుపూస క్రింద మూలాధార చక్ర ప్రాంతం క్రింద భాగంలో అడుగు భాగంలో  ఏదో శక్తి కదులుతున్నట్లుగా అనిపించసాగింది. కలలో నాగుపాము తల తరచుగా కనపడసాగింది.  ఇది ఎందుకు కనపడుతుందో నాకు అర్థం అయ్యేది కాదు. ఇందులో ఏదో తెలియని శక్తి ఉన్నదని అనిపించసాగింది. కదలికలు విపరీతంగా అవుతున్నాయి అని అనిపించసాగింది.ఈ అనుభవం ఏమిటో ఎందుకు కలుగుతుందో అర్థమయ్యే స్థితిలో నేను లేను. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. రాత్రులు నిద్ర పోతుంటే తరచుగా నాగుపాము పడగ కలలో కనిపించేది. అది కనిపించినప్పుడల్లా ఏదో కదలికలు అనుకోకుండా కదులుతున్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్య దారితీస్తుంది ఏమోనని భయం మొదలైంది. ఈ క్రింది లక్షణాలు తరచుగా కనబడటం:1.  ఇటు అయోమయ స్థితి  ఉండటము 2.పలకరిస్తే పలక పోవడం 3.నా లోపల నేను ఉండటం.4. వేళకి భోజనము, నిద్ర లేని స్థితి 5. ఎక్కువగా ఏకాంతంగా మౌనంగా ఉండటం 6.ఎక్కువగా రాత్రిళ్ళు నిద్ర పోకుండా మెలుకువగా ఉండటం ! ఇలాంటి లక్షణాలు ఎందుకు కలుగుతాయో దేనివలన కలుగుతాయో అర్థం కాక అయోమయంలో పడి పోవడం జరిగినది. దాంతో నాకు దీక్ష గురువు వచ్చిన తర్వాతనే  ఆయన ఇచ్చిన అరటి పండు తిన్న 12 రోజుల తర్వాత ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయని తెలియగానే నాలో మరో మూల భయం పట్టుకుంది. ఆయన నాకు నమ్మకం కలిగించడానికి శక్తిపాత సిద్ధితో నన్ను తన వశం చేసుకుని కనికట్టు గాని చేతబడి గాని గాని చేయలేదు కదా! క్షుద్ర ప్రయోగం లేదా ఏదైనా గుప్తనిధుల కోసం నన్ను నర బలి చేయడానికి ఏమైనా చేసి వెళ్ళినాడా అని అనుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని చర్చించడానికి నాతో నా వెంట యోగి మిత్రుడైన జిఙ్ఞాసి కూడా లేడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. ఈ దీక్షగురువు రూపురేఖలు మాత్రమే గుర్తున్నాయి!కాని వారి వివరాలు తెలియవు. నాకు ఇలా వచ్చి శక్తిపాతము చేసిన ఈ దీక్షగురువు గూర్చి తెలుసుకోవాలని మళ్ళీ బాబా చరిత్ర పారాయణం చెయ్యడము ఆరంభించినాను!

 గమనిక:వీరిని భౌతికముగా నేను ఏనిమిదివ తరగతి(1992) చదువుతున్నడు చూడటము జరిగినది! అంతే విచిత్రముగా నెలలు తేడాతో మా భౌతిక గురువును చూడడము జరిగినది!ఇదింతా నా ప్రారంభ సాధన సమయములొ నాకు తెలియకుండా జరిగినది!వీళ్ళే నాకు గురువులు అవుతారని తెలియదు!ఇదింతా నా పూర్వజన్మ సుకృతము అనుకుంటా! ఆతర్వాత వీరిని( దీక్షగురువు) పైన చెప్పిన విధానములో వారి సూక్ష్మశరీయానముతో నాదగ్గరికి సూక్ష్మశరీరముతో వచ్చి నాకు శక్తిపాతము చేసినారని నా సాధన పరిసమాప్తి సమయములో వీరిని నా సూక్ష్మశరీరయాన సిద్ధితో తెలుసుకోవడము జరిగినది!సిద్ధగురువులకి సాధ్యము కానిది ఏముంటుంది!

నిజ దీక్షగురువు దర్శనం

తీవ్రముగా శిరిడీసాయి బాబా చరిత్ర పారాయణం చేస్తున్న సమయంలో… నాకు వచ్చిన దీక్షగురువు ఎవరో అని తీవ్రమైన మనోవేదన పడుతున్న సమయంలో… ఒక రోజు అర్ధరాత్రి నా కలలో సూక్ష్మ శరీరధారి వెలుగులతో శరీర కాంతితో దివ్య సిద్ధపురుషుడు అగుపించి “మేము… బాబా వారు సమాన సాధన స్థాయి వాళ్ళమే!  ఆయన కనిపించకుండా ఆయన కోసం పరితపించే వారి కోసం తపన పడతారు. మేము కనిపిస్తూ మాకు అగుపించే వారి కోసం మేము తపన పడతాము. మీ గురువు కోసం పడే తపన వలన నా మనస్సు ద్రవించింది. మేము యోగులం. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. మమ్మల్ని వెతుకు! అనుగ్రహం పొందు” అని చెప్పి అంతర్ధానం అయినారు.  ఆయన ఎవరో తెలియదు .ఇది  కల లేదా భ్రాంతి అని అర్థం కాలేదు. ఒకటి మాత్రం నాకు అర్థం అయింది. వారు నాకు వచ్చిన దీక్షగురువులని!  వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే వారు పెట్టిన గురు పరీక్ష పూర్తి అవుతుంది అని పోలికలు గుర్తుకు తెచ్చుకుంటూ జిజ్ఞాసికి ఫోన్ చేసి సిద్ధ పురుషుడు పోలికలు చెప్పేసరికి…. అతను “నువ్వు చెప్పేదాన్ని బట్టిచూస్తే  శ్రీశైల క్షేత్రం లో ఉన్న హఠకేశ్వరం గుడి పరిసరాలలో “పూర్ణానంద” అనే యోగి మౌనముద్రలో ఉంటున్నారని…వారి పోలికలతో నువ్వు చెప్పిన పోలికలు సరి పోతున్నాయని” చెప్పడంతో నాలో నాకే తెలియని ఆనందం వేసింది.

పూర్ణానంద యోగి

 కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్లి ఈ పూర్ణానంద యోగి గురించి ఆరా తీసినప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో (1991-1992) ఉన్నప్పుడు మా ఆలయం ట్రస్టీ వాళ్లు ఒకసారి ఈయనను గుడికి కూడా తీసుకొని వచ్చినారని… కేవలం ఆయన ఎవరితో మాట్లాడకుండా… ఎవరు ఇచ్చినా వాటిని స్వీకరించకుండా… ఎవరి వైపు తీక్షణంగా చూడకుండా… తనలో తాను ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ… మూడు గంటలపాటు అలాగే మౌనంగా ఉంటూ… గుడి లోపలికి వచ్చి శివలింగ మూర్తిని చూసి “ఓం నమశ్శివాయ” అని అని ముమ్మారు పెద్ద గా అని… 




మా నాన్నగారి వైపు తిరిగి ఆయనకు ఐదు రూపాయల నోటు అలాగే కొంచెం మంత్రించిన బియ్యం ఇచ్చి “వీటిని దాచుకో! ధనానికి ,అన్నపూర్ణ కి లోటు ఉండదని… ఆ సమయంలో నీవు అక్కడికి వచ్చేసరికి నిన్ను మాత్రం కొన్ని క్షణాలు దీక్షగా తీక్షణంగా చూసి తన బొటనవ్రేలు నీ బొట్టు స్ధానములో తాకించి ఏదో చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయినారని చెప్పడంతో… నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది! నాకు ఊహ తెలియని వయసులో వచ్చి ఊహ తెలిసేసరికి కనిపించని స్థాయికి వెళ్లిన సిద్ధ పురుషుడు ఆయన… నాకు కలలో కనిపించిన వ్యక్తి అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఒక్కరేనని… ఒకరే అయితే ఇంతకుముందు ముందే నన్ను చూసేవాడిని అని చెప్పేవారు కదా… అలా చెప్పలేదు అంటే ఆయన ఈయన కాదేమో అని సందేహం వచ్చేసరికి నాలో తెలియని వణుకు మొదలైంది. ఈయన ఆయన కాకపోతే నాకు వచ్చిన దీక్షగురువు ఎవరో అని చేసిన పూజలు, తపనలు దేనికి పనికిరాకుండా పోతాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఏమి చేయాలి అనుకుంటూ నాలో నేను తిట్టుకుంటూ ఆవేశపడుతూ, ఆవేదన పడుతూ కొన్ని రోజులు ఆందోళనతో గడిపాను.



 ఇది ఇలా కాదని ఏమి జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంతో శ్రీశైలం చేరుకున్నాను. సున్నిపెంట వద్ద ఉన్న పూర్ణానంద యోగి ఆశ్రమానికి చేరుకున్నాను.లోపలికి వెళ్లాలంటే ఏదో తెలియని భయం. వణుకు. ఈయన ఆయన కాకపోతే ఊహించుకోలేని పరిస్థితి. మళ్లీ మనస్సులో ఆందోళన మొదలైంది. అయినా కూడా అసంపూర్తి మనస్సుతో ఆశ్రమంలోనికి అడుగు పెట్టాను. ఇంకేముంది! ఎదురుగా ధ్యానముద్రలో ఆయన సజీవ విగ్రహమూర్తి కనిపించినది. ఇది అలాగే నాకు కలలో కనిపించిన అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఆయన ఒక్కటేనని… నిజమేనని వారు వీరే అన్నట్లుగా ఆయన సజీవ సమాధి కూడా కనిపించేసరికి ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి బ్రధ్ధలైనట్లు  అనిపించింది. “వామ్మో! నేను నాకు వచ్చిన దీక్ష గురువును కలుసుకున్నానా?” నన్ను నేను నమ్మ లేని స్థితి! ఎవరు గిల్లినా కూడా స్పర్శ లేని స్థితి! మాటలకు అందని అద్వితీయ స్థితి! ఇలాంటి స్థితిలో ఉండగా అక్కడ ఉన్నవారు ఆ విగ్రహమూర్తి దగ్గరగా కూర్చోమని 2 అరటి పండ్లు ప్రసాదంగా ఇచ్చినారు. అలా మూడు గంటలపాటు గడచిపోయినది… అని నాకు మాత్రం మూడు క్షణాలుగా గడిచి పోయినట్టు అనిపించింది. నేను తీవ్రధ్యానములో ఉండగా అక్కడ ఉన్నవారు అక్కడినుండి వెళ్ళమని నన్ను చూస్తూ సంఙ్ఞ చేసేసరికి… వారి సజీవ విగ్రహమూర్తి పాదాలకు నమస్కారం చేయగానే ఏదో కరెంట్ షాక్ తగిలి కాకిలాగా కొన్ని క్షణాలు నా శరీరము నాకు తెలియకుండా, నాకు అర్థం కాకుండా, నా ప్రమేయం లేకుండా ప్రకంపించడం  మొదలైనది. వణుకు రోగం మొదలైందని అనుమానం వచ్చినది. ఒకవేళ ఫిట్స్ వస్తే ఎలా అని సందేహం వచ్చింది. వెంటనే సజీవ విగ్రహమూర్తి వైపు చూడగానే నా కళ్ళకేసి కొన్ని క్షణాలపాటు చూసి “ఓం నమ:శ్శివాయ” అని చిరునవ్వు నవ్వి వెళ్ళమని అనుఙ్ఞ ఇచ్చి నట్లుగా లీలగా అనిపించినది! కాకపోతే ఆయన సజీవ విగ్రహమూర్తి వదిలిపెట్టి వెళ్లడం  సుతారామము ఇష్టం లెదు.కానీ గురువాఙ్ఞ పాటించక తప్పదు కదా! ఆయన ఇచ్చిన శివపంచాక్షరీ మంత్రమును మననం చేస్తూ ఆ సమయంలో నేను దానిని గురుమంత్రం గా భావించి ఆయనతోపాటు మనస్సులో ముమ్మార్లు చదువుకున్నాను. ఇప్పుడు గాయత్రి మంత్రం తో పాటుగా శివపంచాక్షరీ కూడా చేరింది. ఇంటికి వెళ్లి యోగ గ్రంథాలు తిరగేయటం ఆరంభించాను. అది  కరెంటు షాక్ కాదని మనలో కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని… సిద్ధ పురుషులు  కళ్ళ ద్వారా,స్పర్శ ద్వారా, పాద సేవ ద్వారా  శక్తిపాతము చేస్తారని… తద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతం అయ్యి… యోగ చక్రాలు జాగృతి అవుతాయని తెలుసుకొని… నాకు కలిగిన అనుభూతి వీటికి సంబంధించినది అవ్వడంతో నా గుండెల మీద ఉన్న బరువు దూదిపింజలుగా ఎగిరిపోయింది. దాంతో నేను ఆనందం అనుభూతి పొందుతూ ఉండగా …కాకపోతే ప్రస్తుతానికి నిజ దీక్షగురువు దర్శనము కలిగినది అలాగే వీరి అనుగ్రహము వలన నాకు శక్తిపాతసిద్ధి ద్వారా కుండలినీశక్తిని జాగృతిగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడము తప్ప ఏమి చెయ్యలేకపోయినాను! కాని ప్రస్తుతము ఈయన భౌతికముగా లేకపోయేసరికి మళ్ళీ నిజ శబ్ధ,అనుభవ పాండిత్యమున్న సజీవ భౌతికగురువు కోసము నా మనస్సు తపన ఆగలేదు! ఇంకా తర్వాత జరిగిన విచిత్ర దైవ అనుభవాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు? నాతో ముందుకి ప్రయాణించండి. 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*******************
గమనిక: ఈ పూర్ణానంద యోగి ఇచ్చిన మంత్రించిన బియ్యము, 5 రూపాయల నోటు ఇప్పటికి అనగా 27 సంవత్సరాలపాటు భద్రంగానే ఉన్నాయి! విచిత్రమేమిటంటే ఆయన మంత్రించి ఇచ్చిన  బియ్యం ఇప్పటికీ  దాదాపుగా 27 సం!!రాలు గావస్తున్న పాడవకుండా, విరిగిపోకుండా, ముక్కు వాసన రాకుండా, పురుగు పట్టకుండా అలాగే భద్రంగా ఉన్నాయి. సిద్ధ పురుషుల మహత్యాలు ఇలాగే యోగ తత్వమును కనబరుస్తాయి. అదే నకిలీ స్వాములు చేసే మహత్యాలు మ్యాజిక్ నేర్చుకుని వారు చేసే కనికట్టును ప్రదర్శిస్తాయి. 


కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అంటే 2000 సంవత్సరంలో పరమపదించిన గురువుగారు(1939-2000 (61సం!!)) ఇంకా ఇప్పటికీ (2019)  సజీవమూర్తిగా ఉన్నారా? అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది. దీనిని నివృత్తి చేసుకోవటం కోసం మరల శ్రీశైలం వెళ్ళినాను.  స్వామివారి సజీవ సమాధి అలాగే వారి విగ్రహ మూర్తి ని దర్శనం చేసుకున్నాను. అక్కడ యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. నా సందేహ నివృత్తి కోసం అక్కడే ఉండి ధ్యానం చేసుకున్నాను. బహుశా 48 నిమిషాల తర్వాత నా ధ్యానంలో ఆయన ప్రియ శిష్యుడు స్వామి ప్రణవానంద సూక్ష్మ శరీరం కనబడినది. కాషాయ వస్త్రధారి గా ఉన్నాడు. ఈయన నన్ను చూసి “మీరేనా! స్వామి పరిపూర్ణానంద కోసం వచ్చిన వారు” అనగానే నా చుట్టూ అడవి ప్రాంతం ఉన్నట్టుగా, నా వెంట రండి అంటూ చెట్ల తోపులో తీసుకొని వెళ్ళినారు. అక్కడ ఉన్న ఒక రాతి మీద కూర్చొని ఉన్న తెల్లని వస్త్రాలు ధరించిన స్వామి వారు కనిపించారు. వారికి నమస్కరించే లోపే వారు చాలా వేగంగా లేచి అక్కడే ఉన్న చిన్నపాటి కొలనులో మునిగి అదృశ్యం అయినారు.అంతటితో నా ధ్యాన అనుభవం పూర్తి అయినది. కానీ అది ఖచ్చితంగా శ్రీశైల పరిసర ప్రాంతం అని చెప్పవచ్చు. కాకపోతే అది భీముని కొలను లేదా భైరవ సేల ప్రాంతము లేదా ఏదైనా ప్రాంతం కావచ్చును. ఖచ్చితముగా అక్కడ ఒక కొలను, రాతి బండ మాత్రము ఉన్నట్లుగా, చుట్టుపక్కల అడవి ప్రాంతం పరిసరాలు కనిపించినాయి. అంటే ఇప్పటికీ  వీరు సజీవమూర్తిగా,సూక్ష్మ శరీరధారిగా శ్రీశైల పరిసర ప్రాంతంలో సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారని నాకు దివ్య ధ్యాన అనుభవం ఇచ్చినందుకు స్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకొని వారి జీవ సమాధికి పాదనమస్కారం చేసి మౌనంగా అక్కడ నుండి మౌనముగా బయటకు వచ్చాను.

నిజానికి శక్తిపాతము అంటే నిజగురువు తను కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని తను ఎంచుకున్న ఏకైక ఉత్తమ ప్రియశిష్యుడికి తన స్పర్శద్వారా... లేదా చూపుద్వారా... లేదా తమ బొటనవ్రేలు శిష్యుడి  త్రినేత్రము వద్ద ఉంచి తనలో ఉన్న శక్తిని అంతటిని ఈ శిష్యుడిలోనికి పంపి తద్వారా ఇతనికి కుండలినీశక్తిని జాగృతి చేసే విధానమునే శక్తిపాతము అంటారు! ఇలాంటి నిజగురువు ఒక నిజశిష్యుడికి మాత్రమే శక్తిపాతము చేస్తారు!ఒకసారి గురువు ఈ శక్తిపాతము అంటూ చేస్తే...ఆతర్వాత వీరు జీవ సమాధి పొందడము లేదా నయంకాని తీవ్రమైన వ్యాధి పొందడము జరుగుతుంది. రామకృష్ణపరమహంస నుండి ఈ శక్తిపాతమును ఒక వివేకానందుడు మాత్రమే పొందినాడు.ఆ తర్వాత ఈయన నయంకాని గొంతు కేన్సరుతో జీవసమాధి చెందినారని లోకవిదితమే గదా! అలాగే మౌన:యోగి అయిన అరుణాచలవాసియైన భగవాన్ రమణమహర్షి వారుగూడ తన ప్రియశిష్యుడైన కావ్యకంఠ గణపతి మునికి ఈయన శక్తిపాతము చేసిన తర్వాత ఈయనగూడ నయంకాని రాజపుండుతో జీవసమాధి చెందినారని లోకవిదితమే గదా! అలాగే పురాణాల ప్రకారము చూస్తే...శ్రీరాముడికి-వశిష్టుడు అదే శ్రీకృష్ణుడికి - సాందీపముని ఈ విధముగానే శక్తిపాతము చేసినట్లుగా తెలుస్తోంది!అంటే ఈ లెక్కనచూస్తే నిజగురువు తన జీవితకాలములో ఒక నిజశిష్యుడికి మాత్రమే శక్తిపాతము చేయడం జరుగుతుందని తెలుస్తోంది గదా! ఇలాంటి నిజ భౌతిక దీక్షగురువును ఏవరైతే పొందుతారో వారికి మాత్రమే కుండలినీశక్తి జాగృతి అవుతుంది! ఈవిధంగా తన గురువైన రాఖాడిబాబా నుండి శ్రీ పూర్ణానంద శక్తిపాతమును పొందితే….  అలాగే మేముగూడ మాకు శ్రీపూర్ణానంద ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక శక్తిని మా అంతిమ సాధన పరిసమాప్తి సమయములో…. మా నిజప్రియశిష్యుడైన జిజ్ఞాసికి శక్తిపాతసిద్ధి ద్వారా ధారాపాతము చేసినాము. తద్వారా మేముగూడ నయంకాని ఊపిరితిత్తులవ్యాధిని పొందడము జరిగినది.ఆపై ప్రస్తుతము మేము జీవసమాధి కోసము ఎదురుచూస్తున్నాము! అదే ఈ మధ్య నకిలిగురువులు తనకి లేని ఆధ్యాత్మిక శక్తికి శక్తిపాతసిద్ధి పేరుతో డబ్బులు గుంజుతూ ఎంతో మంది అమాయక శిష్యుల జీవితాలతో ఆడుకోవడము జరుగుతోంది!కాబట్టి ఇలాంటి నకిలగురువుల విషయములో జాగ్రత్తగా ఉండండి!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeku deeksha guruvu vastarani ammavaaru anni jaagrathalatho mundugaane cheppatam, ammavaaru munde cheppina meeru antha kangaru padipovatam mee manasulo aratipandu prasadam thinamannappudu anukunna maatlaki navvu aapukolekapoya.
    meeru chaala lucky mee guruvu meeku evari darshanam kaavali ani adigi mari chupinchatam...scooter meeda velthunna vyakthulanu adi meeku thelsina vallani chupinchi dattaswamy darshanam cheyinchatam dhaaniki mee prashnalu aayana ishleshana vigrahaaradhana,vishwaradhana theda ikkada baaga chepparu..thitla roopamlo mee lopalu, paapalu theeyatam, meeru chinnappudu choosinavaare meeku guruvugaa raavatam, yogula ivaraalu poorthigaa thelsukolerani mee prayatnam viraminchatam...meeku kundalini shakti levatam dhaani valla manasu sthithi ela untundo... mee 8th class lo bhouthukanga chudatam aa tharvata last lo twist ayna sukshma shareeramtho ocharani cheppatam bagundi

    రిప్లయితొలగించండి