ప్రేత శక్తి ఉన్నదా?
శ్రీశైలంలోని పంచమఠాల లోని ఒకటైన విభూది మఠం లోని సాధువు నాకు దైవ శక్తి అలాగే ప్రేత శక్తి ఉన్నదని ఏదో మంత్రించిన విభూది నా మీద జల్లి చూపించినాడని మీకు తెలుసు కదా! అయినా నాకు వీటి మీద నమ్మకం రాలేదు! కలగలేదు! ఎందుకంటే ఇలాంటి సాధువులు ఏవో కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుని మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారని వివిధ తంత్ర గ్రంథాల ద్వారా నేను తెలుసుకున్నాను! దానితో అవి ఉన్నాయోలేవో నేనే స్వయంగా తెలుసుకోవాలని… అందుకు నాకు వీటి గురించి చెప్పే వారు ఎవరూ లేకపోవడంతో నేను కూడా ఇలాంటి గ్రంధాలు చదవడం ప్రారంభించాను! అందులో ఒక పుస్తకంలో రాత్రిపూట ఆరుబయట నగ్నంగా నిద్రపోతే అవి మన ఒంటి మీదకు వచ్చి పడతాయని చెప్పడం జరిగినది! అదికాకుండా ఎవరైతే స్త్రీలు తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె పెట్టకుండా విరబోసుకుని రాత్రులు వీధుల వెంట తిరిగితే వారికి ఇబ్బందులు కలిగిస్తాయని చదవడం జరిగింది! దాంతో నా బడి స్నేహితులకు ఈ విషయం గురించి చెప్పడం జరిగినది! అందులో ఆడ స్నేహితులు కూడా ఉన్నారు! నేను చెప్పినది నమ్మకపోగా ... ఇలాంటివి వట్టి అభూత కల్పనలని కొట్టిపారేసినారు! దాంతో మాకు ఇవి అసత్యాలని లోకానికి చెప్పాలని …మాలో కొంత మంది కలిసి రాత్రిపూట ఇంటి డాబాల పైన నగ్నంగా పడుకోవాలని నిర్ణయించుకున్నాం! అలాగే మా ఆడ స్నేహితులు కూడా తలంటుపోసుకుని జుట్టుకు నూనె లేకుండా రాత్రులు వీధుల వెంట తిరగాలని నిర్ణయించుకున్నారు!
కొన్ని రోజుల తర్వాత నాతో పాటు మరో ఇద్దరు కూడా రాత్రిపూట డాబాలపై నగ్నంగా …. పైగా కాళ్ళకి పసుపు పారాణి వేసుకుని మరి పడుకున్నాం! కొన్ని రోజులు బాగానే నిద్ర పోయాను! ఆ తర్వాత అసలు కథ మొదలైంది! మధ్య రాత్రి అయ్యేసరికి అనగా అర్ధరాత్రి 12 గంటల నుండి రెండు గంటల మధ్య కాలంలో నల్లటి ఆకారాలు మా మీదకు వచ్చి మా గొంతు నలిపేస్తునట్లుగా… గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా… ఎవరో మమ్మల్ని తొక్కుతున్నట్లు గా ఉన్న నల్లటి ఆకారాలు కనిపించడం మొదలైంది! ఎవరికి చెప్పుకోలేక మాకు నిద్ర కరువైంది! ఎవరికీ చెప్పినా నమ్మరు! మమ్మల్ని పిచ్చి వాళ్ళు క్రింద జమ కడతారు! మా అనుభవాలు మా ఆడ స్నేహితులకు చెప్పితే వాళ్ళు కూడా నమ్మలేదు! “మీరంతా వాటిని ఊహించుకుని… పడుకుని వుంటారు! అందువలన మీకు అలా నల్లటి ఆకారాలు వచ్చినట్లుగా… చూసినట్లు… కనిపించి ఉండవచ్చు! దయ్యాలు లేవు! భూతాలు లేవు! అంతా మీ పిచ్చి! మీ అపనమ్మకం”… అని మమ్మల్ని ఎగతాళి చేసి వెళ్లిపోయారు! “ దీనెమ్మ! మీకు కూడా జరిగితే గానీ… నా సామిరంగా… మా మాట వినరు! నేను చెప్పింది నిజమని… సత్యమని నమ్మి చావరని నాకు అర్థం అయింది!
మరికొన్ని రోజులకు తర్వాత చూస్తే ఈ ఆడ స్నేహితులు కూడా నిద్ర కరువై …. రోగం వచ్చిన వారి లాగా… సన్నగా పీలంగా మారటం కనిపించింది!అప్పుడు అసలు విషయం ఏంటి అని ఆరాతీస్తే … వీరు కూడా తమ తలంటు జుట్టుకి నూనె రాసుకోకుండా… గావాలని రాత్రిపూట వీధులు వెంట అర్ధరాత్రి 12:00 తిరిగి … దానితో ఇంటికి వచ్చిన తర్వాత… వీరికి నిద్రలో నల్లటి ఆకార వ్యక్తులు కనిపించి… గొంతు నలిపేస్తునట్లుగా… గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా… ఎవరో తొక్కుతున్నట్లు గా …. ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లుగా… అనిపించసాగింది! దానితో వీరి వీధుల వెంట తిరగడం ఆపివేసిన కూడా… వీరిని నల్లటి ఆకారాలు వదలడం లేదని తెలిసింది! అకారణంగా ఏడుపు రావటం, చీకటి అంటే భయపడిపోవటం, ఎవరినైనా చూస్తే కోపతాపాలు రావటం, వెర్రి కేకలు, వెర్రి అరుపులు రావటం, నిద్రలో మూలుగులు రావడం, పిల్లి కూతలు రావడం, భయంకరమైన దృశ్యాలు కనపడటం, ఎవరో మంచం దగ్గర ఏడుస్తున్నట్లు కనిపించటం, కాలి అందెలు శబ్దాలు వినబడటం, ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించటం ఇలాంటి లక్షణాలు వీరికి కలిగి నాయి! దాంతో నాకు భయం వేసింది! అవి ఉన్నాయో లేవో తెలుసుకోవాలని ఆత్రములో… అవి ఒకవేళ కనపడితే ఏం చేయాలో… మళ్లీ కనిపించకుండా ఉండటానికి… ఏమి పరిహారాలు చేసుకోవాలో… తెలుసుకోవాలనే విషయం…. నాకు గుర్తుకు రాలేదు! దానితో ఈ విషయం తెలుసుకున్న వారంతా “నీ యవ్వా! నిన్ను నమ్మి అవి ఉన్నాయో లేదో తెలుసుకున్నాము! తీరా అవి మావెంట బడితే వాటిని ఎలా వదిలించుకోవాలా తెలియదని… ఇప్పుడు తాపీగా చెపుతున్నావే! నీయమ్మ! బలిసిందా! ఏం చేస్తావో మాకు తెలియదు! మాకు పట్టుకున్న ఈ నల్లటి ఆకారాలు వదిలించకపోతే … మా తల్లిదండ్రులకి నీవు చేయించిన ఈ ప్రయోగం గురించి చెప్పేస్తామని … వీళ్ళంతా నన్ను బెదిరించి వెళ్ళిపోయినారు ! ఏమి చేయాలో అర్థం కాక తెల్లమొహం వేసినాను! దానితో నాకు ఏదో తెలియని భయం మొదలైంది!
నేను కొన్ని రోజుల పాటు నీరసంగాను… ఉత్సాహంగా లేకుండా ఉండటం… చూసేసరికి మా అమ్మకి ఏదో అనుమానము వచ్చి… విషయం ఏంటి అని అడిగేసరికి అసలు విషయం చెప్పి … “నిజంగానే ప్రేత శక్తి ఉందా అని” అడిగేసరికి… దానికి ఆమె వెంటనే “అ వి ఉన్నాయో లేదో నాకు తెలియదు! కానీ నా జీవితంలో నాకే జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను! అది ఏమిటంటే ఇంకా నువ్వు అప్పటికి పుట్టలేదు! మీ అన్నయ్య కి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది! ఒకరోజు పని హడావుడి వల్లనే… నేను ఆ రోజు తలస్నానం చేసి ముడి వేసుకోకుండా…. కనీసం జుట్టు చివర్లకు కూడా నూనెని రాసుకోకుండా… అనుకోకుండా రాత్రిపూట పేరంటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది! వెళ్ళి వచ్చిన ఆ రాత్రి నుండి…. నిద్ర పోయే సరికి… నిద్రలో ఎవరో ఒక నల్లటి ఆకారం ఉన్న స్త్రీ మూర్తి… నా మీదకు వచ్చి…. నన్ను చంపుతానని బెదిరిస్తుండేది! మధ్య రాత్రయ్యే సరికి నాకు ఇలాంటి కలలు వంటి అనుభవాలు రావటం మొదలైంది! సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి చీకటి అంటే ఏదో తెలియని భయం మొదలైంది! ఇలా కొన్ని వారాల పాటు బాధ పడటం జరిగింది! నిద్ర కరువైంది! రాత్రులు ఎవరో ఒంటి మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేది! ఒళ్లంతా నొప్పులతో ఉండేది! తల భారంగా ఉండేది! ఎవరినైనా చూస్తే కోపం కలుగుతుంది! విపరీతమైన తిండి పిచ్చి మొదలైంది! గారెలు కావాలని విపరీతంగా అడిగి చేయించుకుని తినే దానిని!
ఇదంతా మీ నాన్న గమనించి… తన మంత్ర శక్తితో నా మీద… ఏదో ప్రేత శక్తి ఉన్నదని గ్రహించి… ఒక రోజు నాకు కావలసిన అన్ని రకాల పదార్ధాలు చేయించి తినమని చెప్పి… ఆ తర్వాత ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రతిరోజూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పినారు! కొన్ని వారాలకు నా మీద ఉన్న ప్రేత శక్తి నన్ను వదిలి వెళ్లి పోవడం జరిగింది” అని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు! అంటే ఈ లెక్కన ప్రేత శక్తి ఉన్నట్లే కదా… అంటే మన వాళ్ళని కూడా మన గుడిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు వెంటనే చేయించాలి అని నిర్ణయించుకుని… వాళ్లకు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తుకొని వెళ్లి… వారికి చెప్పి వారిచేత హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయించి వారిని తిరిగి ఆరోగ్యవంతులు అయ్యేసరికి… నా ప్రాణం తోకకు వచ్చింది! కాని నాకున్న వానర బుద్ధి వలన… నిద్రలో కేవలము ఏవో నల్లటి ఆకారాలు కనిపించినంత మాత్రాన ప్రేత శక్తి వున్నట్లేనని నమ్మాలా? అనే సందేహము రావడముతో... ఇవి నిజముగా వుంటే నన్ను పట్టుకుని పీడిస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకున్నాను! దీనికి తగ్గట్లుగా నన్ను ఒక కర్ణపిశాచము పట్టుకుంది! ఆపై ఏమి జరిగినదో తెలియాలంటే... అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !
శుభం భూయాత్
పరమహంస పవనానంద
********************************
గమనిక: ఈ సంఘటనలు యదార్ధముగా నా జీవితములో జరిగినాయి! అందరికీ ఇలాగే జరగాలని లేదు! మాలో కొంతమందికి మాత్రమే జరిగినది! మరి కొంతమందికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు! నల్లటి ఆకారాలు కనిపించలేదు!కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే జాతకరీత్యా ఎవరికైతే చెడు స్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో…. అలాగే ఎవరికైతే అనాహత చక్రం బలహీనంగా ఉంటుందో… వారికి మాత్రమే ఇలాంటి నల్లటి ఆకార ప్రేత శక్తులు పట్టుకుని బాధ పెడతాయని అలాగే ఎవరికైతే సర్పదోషాలు అలాగే జాతకరీత్యా పంచమ, ద్వితీయ స్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో వారికి ఇలాంటి ప్రేత శక్తులు కనబడతాయని తెలుసుకున్నాను! వీటిని అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి! ఖచ్చితంగా పాటించండి! వివాహ వధూవరులు పారాయణ కాళ్లతో ఊరి పొలిమేరలు దాటవద్దు! అలాగే తలంటుపోసుకుని స్త్రీ మూర్తులు తమ జుట్టు కి నూనె రాసుకోకుండా ఉంచుకోవద్దు! అలాగే విరబోసుకుని తిరగవద్దు! కనీసం ముడి వేసుకోండి! వాటి కొసలకినైనా నూనె రాసుకుని ముడి వేసుకోండి! ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలే! పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం! ఒకవేళ మీకు ఇలాంటి ప్రేత శక్తుల అనుభవాలు కలిగితే కంగారు పడకండి! హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి లేదా ఎరుపు నీళ్లతో దిష్టి తీయించుకోండి లేదా నూనె గుడ్డతో దిష్టి తీసుకుని తగలబెట్టండి లేదా ఒక కొబ్బరి కాయతో దిష్టి తీయించుకుని దానిని ప్రవహించే నీటిలో పడి వేయండి! ఆ తర్వాత తప్పనిసరిగా స్నానం చేయండి! లేదా నీకు నమ్మకం ఉంటే దగ్గర్లో ఉన్న మసీదులకు వెళ్లి అక్కడున్న ఫకీర్లు చేత తాయెత్తులు కట్టుకోండి! మానసిక బలహీనతలు ఉన్న వారికి ఇలాంటి మనో దర్శనాలు కలుగుతాయని నాకు తెలుసు! నేను పైన చెప్పిన పరిహారాలు చేసుకుంటే… వీటి మీద మీకు నమ్మకం ఏర్పడి… మానసిక ధైర్యం కలిగి ఆరోగ్య వంతులుగా తిరిగి మారతారని నా వ్యక్తిగత అభిప్రాయము! ఎందుకంటే ఈ విశ్వమంతా విశ్వాసముతో నడుస్తోంది కదా! మన భారతీయ ఆచారవ్యవహారాలు వట్టి మూఢనమ్మకాలు కాదని… అవి మన పూర్వీకులు గ్రహించిన సత్యాలని నేను తెలుసుకుని… మీరు తెలుసుకోవాలన్న నా తపన తాపత్రయం అని గ్రహించండి!
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిika pretha shakti unda ani trials aa, meeku meeru chooseydaaka edi vadalaledu ga... naku chinnappude anubhavam maa amma ki edo aatma venaka thirigedani... meeru ichina remedies correct hanuman ki pradakshanalu chesina 3 years ki emo vadilindi ani gurthu... devudini chudaledu kaani dayyam unte ela untado chusa....
రిప్లయితొలగించండి