అధ్యాయం 79


ఓంకార నాదం కన్న తుంకార నాదం మిన్న

నిజానికి మా ఇద్దరికీ రుషికేశ్ ప్రాంతము నుండి నిజ ఓంకారనాద చిహ్నము రాలేదు. కేవలం ఈ క్షేత్రం నుండి నవరత్న ఓంకార చిహ్నము రావాలని మాత్రమే మాకు స్పురణ అయినది. అక్కడ మాకు అన్నీ కూడా ఒంపు కింద ఉన్న ఓంకార చిహ్నములు మాకు కనిపించాయి. దాదాపుగా 36 షాపులు వెతికిన 99% నకిలీ ఓంకార చిహ్నములు మన వాడికి అగుపించాయి. దానితో నిజ నవరత్న మాల తీసుకోవడం జరిగినది. కాకపోతే మా అదృష్టం కొద్ది ఈ రత్నమాలకు ఇచ్చిన చిన్నబ్యాగ్ మీద నిజ ఓంకారం చిహ్నము ఉన్నది మాకు ఈ క్షేత్రం నుండి వచ్చినది. ఒకవేళ మాకు అక్కడనుండి నకిలీ ఓంకారం చిహ్నమే దొరికేది అన్నమాట. అందువలన మా జగద్గురువైన ప్రకృతిమాత ఈ బ్యాగ్ రూపంలోని ఓంకారం పంపించడంతో అందులోనూ నవరత్నాల సహితంగా పంపించడంతో  మాకున్న ఓంకార మాయ దాటుకోవటం జరిగినది. జిజ్ఞాసి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వస్తువులు విశ్లేషణ చేస్తే నవరత్న నిజ ఓంకారం చిహ్నము రావాలని అది పొందాలని మాకు ధ్యాన స్పురణ అయినది. దానితో నేను ఇంటర్నెట్ లో ఈ ఓంకారం చిహ్నము కోసం అనేక రకాల షాపింగ్ సైట్లను వెతికితే అందులో మాకు 99% నకిలీ ఓంకార ముద్రలు కనిపించాయి. 

అవి కూడా ఉంగరాలు రూపంలో, కడియాల రూపంలో, లాకెట్ రూపంలో, దైవిక వస్తువులు రూపంలో ఇలా ఎన్ని విధాలుగా వెతికిన మాకు 99 శాతం ఉన్న నకిలీ ఓంకార రూప వస్తువులు కనిపించడంతో నాలో తెలియని అసహనానికి గురి అయ్యాను. విషయం తెలియక మాయలో పడితే ఆ కథ వేరు. అన్నీ తెలిసి కూడా మాకు మేమే నిజమైన ఓంకార చిహ్నము సంపాదించలేకపోతే మాయలో పడటం అనేది నాకు చాలా బాధ వేసింది. కాకపోతే 99.99 శాతం మంది ఈ ఓంకార చిహ్నము మాయలోపడినారు. మాకున్న అదృష్ట యోగము వలన అలాగే రిషికేశ్ క్షేత్రం నుండి ఓంకారం రావడం వలన ఈ మాయను దాటుకున్నాము కానీ నిజ ఓంకార చిహ్నము ఎలా పొందాలో నాకైతే అర్థం కాలేదు. బుర్ర తిరగటం ఆరంభమైనది. కళ్ళవెంట కన్నీరు రావడం ప్రారంభమైనది. ఏదో దిగులు తెలియని అసహనం స్థితిని పొందడం జరుగుతుంది. 

కానీ ఇంతకు మాకు ఇంటర్నెట్లో వెతుకులాటలో నిజ ఓంకార చిహ్నము ఉన్న చెవి రింగులు కనపడుతున్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు మా జిజ్ఞాసికి ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటంటే కాశీక్షేత్రంలో మనకి మణికర్ణికా ఘాట్ ఉన్నది కదా. మణికర్ణిక అంటే చెవి రింగు కదా. శివుడి యొక్క చెవి రింగు ఈ ఘాట్ యందు పడటం వలన ఈ ఘాట్ మణికర్ణికా అని పేరు వచ్చిందని అలాగే ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క చెవి రింగు కదిలిక శబ్దము వలన అపస్మారక స్థితి పొందిన మహా శివుడు తిరిగి పునర్జీవితుడయ్యాడు అయినాడని ఈయన చెప్పడం జరిగినది అని అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి ఈ ఓంకార చిహ్నము ఉపయోగించి ఉండవచ్చు కదా. అందుకే మనకి నిజ ఓంకార చిహ్నములో చెవి రింగు రూపంలో కనపడుతున్నాయని చెప్పడం జరిగింది. వాడి విశ్లేషణ బాగానే ఉంది కానీ ఈ ఓంకారనాదం చెవుల ద్వారా వినాలని మనము చేసే ఓంకారనాదం ఎడమ చెవి నుండి వినపడుతుంది అదే మనలో సహజసిద్ధంగా ఓంకారనాదం వినపడితే అది కుడి చెవి నుండి వినపడుతుందని ఇదే ఓంకారం ఆ స్థితి అందుకే కాశీక్షేత్రంలో మనము చనిపోయే అన్ని రకాల జీవులు ఈ యొక్క కుడిచెవి ఆకాశం వైపు ఉంచి చని పోతాయని అంటే తుంకార నాదం అర్హతని ఈ జీవులు ఈ విధంగా పొంది ఉంటాయని నాకు స్పురణ అయ్యి వారికి చెప్పడం జరిగినది. ఇలా కాదనుకుని ఓంకార రూపిణి మంత్రాలకు మూల బీజాక్షరం అయిన ఓంకార స్వరూపిణి అయిన గాయత్రి మాతను వేడుకోవడం జరిగింది. 

కొన్ని రోజులకి మాకు జైపూర్ ప్రాంతము నుండి మా జిజ్ఞాసికి తెలిసిన మిత్రుడు నుండి నవరత్న ఓంకార చిహ్నము లాకెట్ లు రావడం జరిగినది. విచిత్రమేమిటంటే జైపూర్ అనేది రాజస్థాన్ కి చెందినది. ఇక్కడ ఉన్న పుష్కర్ క్షేత్రములో గాయత్రి సహిత బ్రహ్మ దేవాలయము ఉన్నది. మాకు ఈ వేద మాత అనుగ్రహము వల్లనే ఈ క్షేత్రం నుండి అది కూడా నవరత్న  చిహ్నము రావడం మా అదృష్టం. ఆమె అనుగ్రహం వలనే జరిగినది. లేదంటే అడుగు దూరంలో మా యోగసాధన మా నిజ ఓంకార చిహ్నము లేకపోవడం తెలిసినా కూడా ఆగిపోయేది కదా. ఆ తర్వాత ఇలా వచ్చిన పంచలోహ నవరత్న ఓంకారం మా చేతిలోకి తీసుకోగానే మాకు కుడి చెవి నుండి సహజసిద్ధంగా ఓంకారనాదం కొన్ని లిప్తకాలం పాటు వినిపించేసరికి మా ఇద్దరిలో ఎనలేని ఆనందం వేసింది. అంటే ఇది నిజమైన ఓంకార చిహ్నమని మాకు నిరూపణ అయినది.
 
దానితో రిషికేశ్ నుండి వచ్చిన అంగుళాల టాబ్లెట్ స్పటిక లింగము అలాగే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అయిన విష్ణు సాలగ్రామము అలాగే జైపూర్ నుండి వచ్చిన ఈ నిజ ఓంకార చిహ్నము పూజలో ఉంచడం జరిగినది. ఓంకార నాదం నుండి తుంకార నాదం స్థితికి సాధన చేయడం ఆరంభించినాము. ప్రతిరోజు ఉదయము ఓంకారనాదంతో స్పటిక లింగమును అలాగే విష్ణు సాలగ్రామమును నీటితో అభిషేకాలు చేసి వాటిని నీటిలో ముంచడం చేస్తున్నాము. ఎందుకంటే సాలగ్రామముకు దహన శక్తి గుణం ఎక్కువ. అలాగే స్పటిక లింగాలు చాలా చల్లదన శక్తిని ఎక్కువ కలిగి ఉంటాయి.అంటే వేడినీటిని(సాలగ్రామము) అలాగే చల్లని నీటిని(స్పటిక లింగాలు) ఈ రెండింటిని కలిపి నీళ్లలో ఉంచటం వలన మెదడు తట్టుకునే యోగసాధన శక్తిని పొందడం జరుగుతుంది. అలాగని అధిక వేడిని భరించలేదు. అలాగని అధిక చల్లదనము భరించ లేము కదా. వేడి నీళ్ల కి చన్నీళ్లు తోడు చేసి శివకేశవ తత్వముతో లింగ సాలగ్రామములను ఓంకారనాదంతో ఆరాధన చేస్తున్నాము. ఓంకార నాదం కన్నా తుకారం నాదం వినాలనే తపన తాపత్రయం కొనసాగుతోంది. ఆపై ఏమి జరిగిందో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడక తప్పదు కదా. ఇలా ఒక ఆరు నెలల పాటు మేమిద్దరమూ కూడా ఈ ఓంకారనాదం సాధన చేసినాము. 
 
అనుకోని విధంగా ఒక రోజు అర్ధరాత్రి పూట నాకు నిద్ర పట్టలేదు. ఏదో తెలియని అసహనం అసంతృప్తి గురవుతున్నానని అర్థం అయినది. దానితో ఓంకారం చేసుకుంటే నా మనస్సు కాస్త కుదుట పడుతుందని ఆ రాత్రి పడుకుని ఓంకారం ధ్యానం చేయడం ఆరంభించాను. కొద్దిసేపటికి నా పెదవుల ఓంకారము ఉచ్చరించటం ఆపివేసిన ఆపై కుడిచెవి నుండి దూరంగా ఎవరో నాలో నుండి ఓంకారనాదం చేస్తున్న శబ్దము చాలా స్పష్టంగా వినిపించింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నాలో ఉండి ఓంకారనాదం చేసేది ఎవరు అనుకోగానే 36 కపాలాలు ఉన్న సదాశివమూర్తి అని నాకు స్మరణ అయినది. ఇంతలో మాకు విచిత్రంగా ఒక జ్ఞాన అనుభవం అయినది. నేను పూజ చేస్తున్న విష్ణు సాలగ్రామము నుండి అదే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నుండి ఒక అంగుళం పరిమాణంలో ఉన్న దివ్యజ్యోతి బయటకు వచ్చినట్లు అగుపించినది. ఈ జ్యోతి కాస్త నేను పడుకుని ధ్యానం చేస్తున్న గదిలోనికి రావడం జరిగినది. నా పక్కనే ఉన్న సోఫాలో ఇలా వచ్చిన దివ్య జ్యోతి చేరినది. 

ఆలంపుర యోగులాంబ

వెనువెంటనే జ్యోతి స్థానంలో నల్లటి రూపముతో నల్లటి వస్త్రముతో నల్లటి చింపిరి జుట్టుతో వెకిలినవ్వుతో ఒకరకంగా 85 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తి అనగా విఠలాచార్య సినిమాలో కనిపించే వృద్ధమాంత్రికురాలుగా… అచ్చంగా ఆలంపుర యోగులాంబ లాగా ఈమె ఉన్నదని అనుకుంటుండగానే “నేనేరా! నీకు కపాల మోక్షమిచ్చే మహామృత్యు దేవతను. నువ్వు ఆరాధన చేస్తున్నావు కదరా. నేను నిన్ను తింటాను. బ్రహ్మపదార్థాలు అంటే నాకు విపరీతమైన మోజు. వాటిని చాలా ఇష్టంగా తింటాను. నువ్వు కూడా శబ్దబ్రహ్మవి అయినావు కదా. తింటాను రా” అంటూ నా మీదకి తెల్లని కోర పండ్లతో పొడవైన వాడిగా ఉన్న తెల్లని గోర్లతో నా దగ్గరికి వచ్చేసరికి ఈవిడెవరో నా దగ్గరకు వస్తుంది అంటూ అనుకోగానే ధ్యాన భంగము అయినది. యోగనిద్ర నుండి బయటికి వచ్చినాను.నాకు ఈ విధంగా మహామృత్యువైన కపాలమోక్షప్రదాత ఆదిపరాశక్తి ఈ రూపంలో దర్శనమిచ్చినదని నాకు ఆ తర్వాత ధ్యాన స్పురణ అయినది. ఆనందమేసింది. నా పూజలు ఆమెకు అందుతున్నాయని ఆమె నాకు కపాలమోక్షం ఇవ్వటానికి ఎదురు చూస్తోందని నాకు అర్థమైంది. అడుగు స్థూల శరీర కపాలము కాస్త రేణువు ఆకాశ కపాలములోనికి తీసుకురావడం జరిగిందని దీనితో ఆకాశ కపాలమోక్ష స్థితి పొందటం జరిగినదని నాకు అర్థమైనది.

హృదయ చక్రమునందు ఇష్టలింగ ఆరాధన వల్లనే అది ఇచ్చే కాంతి శక్తి వలన కాంతి బ్రహ్మగా మారినానని అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. అంటే పరమ శూన్యము నుండి మొదట ఓంకారనాదం ఆపై జ్యోతి ఏర్పడినాయని లోకవిదితమే కదా. ఈ ఓంకారనాదమే శబ్ద బ్రహ్మంగా పరంజ్యోతియే కాంతి బ్రహ్మగా ఇది ఇష్టలింగ ఆరాధన వలన సిద్ధి పొందితే శబ్ద బ్రహ్మము అనేది బ్రహ్మరంధ్రం వద్ద స్పటిక లింగం ఆరాధనవల్ల శబ్ద బ్రహ్మ అయినానని నాకు జ్ఞాన స్పురణ అయినది. అంటే ఓంకార నాదముని చేసే స్థితి నుండి సహజముగా వినిపించే స్థితికి నా సాధన స్థితి చేరుకుందని నాకు అర్థమైనది. ఇప్పుడు నోటితో ఓంకారనాదం చేయవలసిన అవసరం లేదు. అప్పుడప్పుడు సహజసిద్ధంగా నా చెవుల్లో రెండు చెవుల నుండి సహజ సిద్ధ ఓంకారనాదం వినపడుతోంది. కాకపోతే అది ప్రతిరోజు వినిపించడం లేదు. ఇక్కడ సాధకులు ప్రతి రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా వింటూ ఉంటే కొన్నాళ్లకు సహజసిద్ధంగా వినిపించే తుంకార నాదం వినబడుతుందని ప్రతి క్షణం వినిపించే స్థాయికి చేరుకోవాలని ఆపైన నా నుండి నా చుట్టూ ఉన్న వాళ్లకి ఈ నాదం వినిపించే సాధన స్థాయికి చేరుకోవాలని అర్థం అయినది. అంటే ఓంకార నాదం నుండి తుంకార నాదం వైపుకి సాధన కొనసాగుతుండగా….

ఒక రోజు మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి తను చేసే పూజా విధానం దైవిక వస్తువులను మా ఇంటికి తీసుకుని రావడం జరిగినది. ఒకరోజు తర్వాత అతనికి ఒక ఎరుపు రంగు చీర ధరించి 45 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక స్త్రీ మూర్తి వాడు ఉన్న మంచం దగ్గరికి వచ్చి “నాయనా! మాకు కూడా దొరకని మహత్తర అవకాశం అలాగే అతి శక్తివంతమైన విష్ణు సాలగ్రామమును పొందడం జరిగినది. అవకాశం చేజార్చుకోకు.నిరంతరముగా ఇలాగే ధ్యాననిష్ఠ కొనసాగించు. మనల్ని పుట్టించిన మాయలో కలిసిపో” అని దీవించి అదృశ్యమైనట్లు అలాంటి అనుభవం పొందడం జరిగినది. వాడికి మెలకువ రావటంతో నాకు ఈ కల గురించి వినేదాకా నన్ను చావ కొట్టడం జరిగినది. వీడు నాకు సంబంధించిన ఈ అనుభవం గురించి చెప్పే సరికి నా కళ్ళు చెమర్చినాయి.అంటే కామత్వ శరీరం నుండి దిగంబరత్వమునకు అలాగే ఓంకారనాదం నుండి తుంకార నాదం స్థితికి స్పందించే స్థితి నుండి స్పందన లేని స్థితి కోరిక స్థితి నుండి కోరిక లేని స్థితికి ఆలోచన నుండి ఆలోచనలు లేని స్థితి అనగా మనస్సు నుండి మనస్సు లేని స్థితికి అనగా పరమ ప్రశాంతస్థితి అయిన పసిపాప మనస్సున్న ఉన్న పరమాత్మ స్థితికి చేరుకున్నాము అని తెలియగానే ఒక విధమైన ప్రశాంతత కూడిన స్థితిని పొందడం జరిగినది. అంటే ఇంతటితో నా సాధన పరిసమాప్తి అయినది. ఇక్కడతో నేను ఆగిపోవాలి. ముందుకు వెళ్ళటానికి ఏమీ ఉండదు. కానీ వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పరమ ప్రశాంత స్థితిలో నిరంతరంగా ఉండిపోవడానికి నేను సహజసిద్ధంగా నాలో వినిపించే తుంకార నాదమును ప్రతిరోజు ప్రతిక్షణం సహజ సిద్ధముగా నా ప్రమేయము లేకుండా వినగలిగే స్థితికి చేరుకోవాలి. ఆత్మ నిష్ఠ అనగా ధ్యాననిష్ఠను  కొనసాగించాలి. అపుడే సహజానంద రహిత సమాధి యోగ స్థితిని పొందడం జరుగుతుంది. ఇదియే జీవ సమాధి అన్నమాట. అనగా తుంకార నాదమును వింటూ ఉంటే ఎప్పుడో నా పంచ శరీరాలు తునాతునకలై వాటికున్న 36 కపాలాలు విభేదన చెంది చిట్టచివరకు ఏక మూలకపాలము కూడ విభేదన చెందితే అదే సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందడం జరుగుతుంది. ఇదే చిట్టచివరిసారిగా సాధకుడు పొందవలసిన స్థితి అని నాకు అర్థమయింది. ఇక్కడ నేను ఏది చేయటానికి ఏమీ ఉండదు. కేవలం తుంకార నాదమే ఆహారం…. ఈ నాదమే నాకు దాహార్త గంగా నీళ్లు… ఈ నాదమే నాకు గంగా స్నానం… ఈ నాదమే యోగనిద్ర… ఈ నాదమే నాకు ఆత్మ బంధువు… ఈ నాదమే  నేను. నేనే ఈ నాదము అన్నమాట. ఇక మాయ లేదు.మర్మము లేదు. మాయలో పడేవాడు లేడు. పడేసేవాడు లేడు. నేనే లేను. నాదమే ఉంది. చివరికి ఈ నాదము వినిపించని స్థితిలో పరమ శూన్య స్థితి పొందటం అన్నమాట.ఇదియే మనో నిశ్చల స్థితి. అన్నమాట.ఇదియే మోక్ష స్థితి. ఇది పొందామో లేదో తెలియని స్థితి. చావు గురించి ముందుగానే తెలుసుకోవచ్చు కానీ మనము చనిపోయిన విషయము మనకు ఎలాగైతే తెలియదో ఎలా అయితే తెలుసుకోలేమో అలాగే మనలో వినపడే సహజసిద్ధ తుంకార నాదం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.ఆగిపోతే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నశించినట్లే. అనగా సైన్స్ ప్రకారం ఈ కృష్ణబిలంలో హైడ్రోజన్ నిల్వలు తగ్గి పోయినట్లే. తద్వారా న్యూట్రాన్లు కాస్త కాంతి హీనమై అప్పటిదాకా ఉన్న నక్షత్ర కృష్ణబిలం కాస్త కాంతి హీనమైన దట్టమైన పరమ చీకటి అయిన పరమ శూన్యము నందు ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కూడా నశించి పోతుంది. ఇదియే మరణానికి శాశ్వతం మరణము ఇవ్వటం అన్నమాట. ముక్తికి జీవన్ముక్తి ఇవ్వటం అన్నమాట. ఇదియే  ప్రతి సాధకుడు స్వయంగా స్వంతంగా పొందవలసిన చిట్టచివరి సాధన పరిసమాప్తి స్థితి అన్నమాట. ఇదే సంపూర్ణ కపాలమోక్షం అవుతుంది. ఓంకారనాదమును అలాగే తుంకారనాదమును దాటినపుడు ఇంక ఏమైన నాదాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా?ఇంకా ఆలస్యం ఎందుకు… మాతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణము చేయండి. 
 
శుభం భూయాత్

పరమహంస పవనానంద
**********************************
గమనిక: మన హృదయ చక్రము వద్ద ఇష్ట పదార్ధ మాయ అలాగే ఇష్ట కోరిక మాయలు ఉంటాయని నా హృదయ చక్ర అనుభవాలు ద్వారా ఈ పాటికి మీరు తెలుసుకున్నారు కదా. ఇష్ట పదార్థాలు అందరికీ వేర్వేరుగా ఉండవచ్చును కానీ ఇష్ట కోరిక మాత్రం అదే కామము అనేది అందరికీ ఒకటే ఉంటుందని నేను గ్రహించాను. అంటే అనుభవాలు అందరికీ వేరుగా ఉండవచ్చును కానీ అనుభూతి మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది కదా. అలాగే ఇష్ట పదార్ధాలుగా వేరు వేరుగా ఉండవచ్చును కానీ ఇష్ట కోరిక అందరికీ ఒకటే ఉంటుంది. ఎవరైతే ఇష్ట పదార్థం మాయ దాటుతారో వారికి ఓంకారనాదం సిద్ధి పొంది ఇష్టకామేశ్వరుడు /ఇష్టకామేశ్వరి అవుతారని అలాగే ఎవరైతే ఇష్ట కోరికైనా కామమున దాటుతారో అనగా అసంకల్పిత బ్రహ్మచారిగా కామ దృశ్యాలు చూసిన చదివినా చేసిన మనస్సు స్పందించని స్థితికి వెళుతుందో అప్పుడు సాధకుడుకు భావ ప్రాప్తి అనగా వీర్యస్ఖలనము పొందటము జరగదు. అసంకల్పిత బ్రహ్మచారి స్థితిగా నెమలి పక్షి లాగా శ్రీకృష్ణుడి స్థితి లాగా అన్నమాట. పదహారు వేలమంది గోపికలతో అష్ట భార్యలతో శ్రీకృష్ణుడు కామలీల విన్యాసము చేసిన నిత్యసంసారి అయినా కూడా నిత్య బ్రహ్మచారి అని స్వయంగా భీష్మాచార్యుడు ఈలోకానికి ధర్మరాజు ద్వారా తెలియజేయడం జరిగినది. అంటే శ్రీకృష్ణుడు వీరందరితో మనస్సుతో కాకుండా శరీరంతో శృంగారం జరుపుతున్నాడు. ఎప్పుడైతే మనస్సు లేని స్థితి ఉంటుందో అట్టి సాధకుడికి భావప్రాప్తి పొందే అవకాశం ఉండదు అనగా వీర్యస్ఖలనము పొందే స్థితి ఉండదు.ఇదియే అసంకల్పిత బ్రహ్మచారి స్థితి. దీనిని ఎవరైతే పొందుతారో వారు అనగా ఇష్ట కోరిక మాయ దాటుతారో వారు తుంకార నాద సిద్ధిని పొందిన వారు అవుతారు. ఎప్పుడైతే ఓంకారము అలాగే తుంకారనాద సిద్ధిని దాటుతారో వారు ఇష్ట లింగేశ్వరుడిగా అనగా పరిశుద్ధ పసిపాప మనస్సు వంటి పరిశుద్ధ స్పటిక లింగముగా మారతారు. ఇదియే కామత్వమును అలాగే నగ్నత్వమును దాటి దిక్కుల్నే వస్త్రాలుగా ధరించి స్త్రీ పురుష లింగ బేధం జ్ఞానం లేని దిగంబరత్వం సిద్ధి పొందడం జరుగుతుంది. అనగా మనస్సే లేని స్థితిని అలాగే శబ్దం వినలేని స్థితిని పొందుతారో అదే మోక్ష స్థితి అన్నమాట. ఇది పొందామో లేదో తెలియని విచిత్రమైన స్థితి అని ఈపాటికి మీకు తెలుసు కదా. ఇది రావాలంటే సాధకుడు ఎంతో సహన శక్తి పొందగలిగే స్థితప్రఙ్ఞత పొందవలసి ఉంటుంది. ఇష్ట పదార్థాలు తింటే వచ్చే అనుభవానంద స్థితిని అలాగే ఇష్ట కోరిక అయిన కామమును తీర్చుకుంటే వచ్చే మనస్సు యొక్క నిశ్చల అనుభూతి స్థితిని సాధకుడు దాటుకోవాల్సి ఉంటుంది.
 
సిగరెట్ అలవాటు ఉన్నవాడు అలాగే మద్యం అలవాటు ఉన్న వారు సమయానికి ఇవి పడకపోతే ఎలాంటి అసహన స్థితికి చేరుకుంటాడో అలాగే సాధకుడు కూడా సమయానికి ఇష్ట పదార్థాలు అలాగే ఇష్టకోరిక లేకపోతే సహన శక్తిని కోల్పోతాడు. తద్వారా నిశ్చల స్థితిని కోల్పోతాడు. ఆపై ప్రశాంత శక్తిని కోల్పోతాడు. కాబట్టి ఈ రెండు రకాల మాయలు కూడా సాధకుడు తట్టుకోగలిగితే అప్పుడే అతనికి అసలు సిసలైన ఆనంద రహిత స్థితిని పొందడం జరుగుతుంది. తద్వారా పరమ పరమ ప్రశాంత స్థితిని పొందుతాడు. ఈ స్థితిలో సాధకుడు తన ధ్యాననిష్ఠలో కొన్ని నిమిషాల నుండి కాలమే తెలియని స్థితికి అనగా పది లక్షల సంవత్సరాల స్థితికి చేరుకుంటే అదే కపాలమోక్షం స్థితికి చేరుకుంటాడు అని నాకు అర్థం అయింది. కాకపోతే సాధకులలో 20 శాతం మంది ఇష్ట పదార్థ మాయను దాటితే 8 శాతం మంది మాత్రమే కామమాయ దాటుతున్నారని యుగానికి ఒక్కడు మాత్రమే ఈ రెండింటిని దాటుతున్నాడని ప్రస్తుతం 27 మహాయుగంలో నేను ఈ స్థితిని పొందడం జరిగినది. ఈ దృశ్యము రికార్డ్ అయినది. అది మాకు రాబోవుకాలంలో కనబడుతుందని అలాగే ప్రస్తుతం నడుస్తున్న 28వ మహాయుగంలో మా జిఙ్ఞాసికి ఇలాంటి యుగపురుషుడు  స్థితిని పొందడం జరిగిందని దీనిని తన రాబోవు కాలంలో తన జీవసమాధి రికార్డ్ దృశ్యాలు చూడటం పొందుతాడని అంటే ఆదిలోనే తొలి మన్వంతరంలోని 27 మహాయుగంలో అలాగే మరి 28వ మహా యుగాలలో మా ఇద్దరి సజీవ సమాధి దృశ్యాలు రికార్డు అయినాయని మా ఇద్దరి జాతకాలు వల్ల తెలిసింది. కాకపోతే మేము 10 లక్షల సంవత్సరాల పొందిన ధ్యాననిష్ఠ దృశ్యం చూడాలంటే మా బ్రహ్మాండ కృష్ణబిలం 10 లక్షల బిలియన్ బిలియన్ ఇలా 11 బిలియన్ సంవత్సరాలపాటు ఎదురు చూడాలి. అప్పటి దాకా మా జీవసమాధి రికార్డ్ దృశ్యమే అందరికీ కనపడుతూ ఉంటుంది.

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి