శుభవార్త:
మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక: నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము అందరికి ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....
ఆన్ లైన్లో 999 రూ.లకి దొరుకుతున్న నకిలి "కపాలమోక్షం" గ్రంథము యొక్క ఇమేజీలు పెట్టడము జరుగుతోంది.
ఈ పుస్తకములో సంపూర్తిగా బ్లాగ్ కంటెంట్ లేదని తెలుసుకొండి.కావలంటే ఈ నకిలి పుస్తకము లోని ఆఖరి పేజి మేటర్ చూడండి.అలాగే ఈ బ్లాగ్ ఆఖరి కంటేంట్ చూడండి.
మీకే తేడా ఏమిటో తెలుస్తుంది.ఈ నకిలి పుస్తకములో పేరుకి అన్నీ అధ్యాయాలు (బ్లాగ్ లింకులు) ఉన్నప్పడికి అందులో ఉండవలసిన కంటెంట్ పూర్తిగా లేకుండా ఈ నకిలి పుస్తకములో కొన్ని అధ్యాయాలలో కొంత భాగము తీసివెయ్యడము జరిగింది. దయచేసి ఈ నకిలి పుస్తకము కొని మోసపోవద్దని మరొకసారి మనవి చేస్తున్నాము.
మరియి కపాలమోక్షం పేరుతో ఈ అధ్యాయాల పేరుతో సుమారుగా 1300 దాకా వీడియోలున్నాయని మా అందరి దృష్టికి వచ్చింది.పైగా వీటిలో గూడ కంటెంట్ పూర్తిగా చదవడము లేదని వారికి ఇష్టమైన భాగాలు ఇష్టము వచ్చినట్లుగా చదువుతున్నారని మాకు అర్ధమైంది.వీటికి మాకు ఏలాంటి సంబంధము లేదు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఊర్లో దయ్యం- ఒంటి లో దడ
ఆ రోజు రాత్రి పూట 12:00 తర్వాత పసుపు పారాయణ కాళ్ళుతో శ్రీశైలం వీధుల్లో తిరగడం ఆరంభించానని మీకు తెలుసు కదా! ఇంతకుముందు అధ్యాయం చదివినారు కదా! అక్కడ ఉన్న కొంతమంది చిరువ్యాపారులు నన్ను వింతగాను… నా ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటం చూసి.. నా దగ్గరకు వచ్చి “స్వామి! మీకు ఈరోజు ఫలానా సత్రములో ఉపనయనం జరిగినది గదా! ఈ సమయంలో నిద్ర పోకుండా రాత్రులు వీధుల వెంట ఎందుకు గస్తీ తిరుగుతున్నారు? మా అమ్మ భ్రమరాంబికా దేవి తిరిగే సమయం ఇది! ఆవిడ కంటపడితే రక్తం కక్కుకుని ఛస్తారు! అసలు బ్రహ్మచారి లాగా ఉన్నారు! ఏమీ అనుభవించకుండా పైకి పోతారు! మా మాట విని మీ సత్రానికి వెళ్లి పడుకోండి” అని చెప్పి వెళ్ళిపోయారు! అప్పటికే నేను సంపూర్తిగా వానరుడై ఉన్నాను కదా! వీరి మాటలు కూడా నా బుర్రకి ఎక్కలేదు! లేని శివయ్య కోసం ఎన్నో సంవత్సరాల నుండి పూజలు చేసిన కనిపించలేదు! కాళ్ళకి పసుపు పారాయణం వేసుకున్నంత మాత్రాన ఆయన కట్టుకున్న మహాతల్లి ఊరికే కనపడుతుందా? కాళ్ళకి పసుపు పారాయణాలు రాసుకుని అర్ధరాత్రి పూట ఊరి పొలిమేరలలో తిరిగితే దేవుడు కనపడితే … దయ్యాలు కనపడితే… ఎందుకు సాధనలు? సన్యాసులు అవ్వటమెందుకు? నా బొంద! రానురాను పిచ్చి భక్తి కాస్తా మూఢభక్తి గాను మారినట్లుగా …భయభక్తులు మారినట్లుగా ఉంది అనుకున్నాను! పొద్దున మా ముసలాయన ప్రేత శక్తి ఉంది అన్నాడు! ఇప్పుడేమో వీళ్ళు దైవ శక్తి ఉంది అన్నారు! వీటిలో ఏది నిజం? ఏది ఉంది? ఈ రెండు ఉన్నాయా? లేవా? ఉన్నాయని లేని వాటిని లోకానికి చెబుతున్నారా…. ప్రచారం చేస్తున్నారా…. నా బొంద? కాళ్ళ పారాయణకి ప్రేత శక్తి లేదా దైవశక్తి ఒకవేళ ఉంటే నా ముందు కనపడని …దీనమ్మ జీవితం… నేనో ... అదో ...తేల్చుకుంటా.. అనుకుంటూ ..ఏదో తెలియని జగమొండి ధైర్యంతో వీరభద్రుడి లాగా వీరావేశంతో
నాకు తెలియకుండా కటిక చీకటి వీధిలోనికి గుడికి దూరంగా …. అగుపించని దూరంలో నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను! అక్కడ ఒక వీధి చివర చిమ్మచీకటి ఎవరు లేని నిశ్శబ్దం తాండవిస్తున్న సమయంలో నాకు చిన్నపాటి ఏడుపు లాంటి మూలుగు సన్నగా వినపడుతోంది! గాజులు కదులుతున్న శబ్దం… గజ్జెల సవ్వడి… వింత శబ్దం తో నాకు వినపడుతోంది! ఇలాంటి సమయంలో ఇంత చీకటిలో ఎవరున్నారని తెలుసుకోవాలనే… నాలో తపన …ఏదో తెలియని అనుమానం… భయం… నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి మన లాగానే గజ్జెలు వేసుకుంటాయా? మరి వింత శబ్దాలు ఏమిటి? నా బొంద! ఉంటే చూద్దాం! లేదంటే లోకానికి లేవని చెపుదాం ! ఏదో ఒక అనుభవం మిగులుతుంది కదా! తెలుగు వీర లేవరా …సాహసము చేయరా… ధైర్యం చేయరా డింభకా అనే పాటను గుర్తు చేసుకుని ఆ మూలుగు శబ్దాలు వచ్చే దిశ వైపు అడుగులు వేసినాను! అక్కడ నాకు ఒక పండు ముసలావిడ సుమారుగా 80 సంవత్సరాల వయస్సున్న ఆవిడ ఎరుపురంగు చీరకు నలుపు రంగు జాకెట్ తో…. గాజులు తడుముకుంటూ…. గజ్జెలు ఊపుతూ… బాధతో మూలుగుతూ కనపడినది! దాంతో నాలో తెలియని మొండి ధైర్యం వచ్చింది! నాలో ఉన్న భయం నుండి విముక్తి కలిగి ఆనందంగా… వెనుకా ముందు ఆలోచించకుండా ఆవిడ దగ్గరికి వెళ్లి ” అవ్వ! ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమన్నా కావాలా?” అని అడిగాను! దానికి ఆవిడ నా వైపు తిరిగి “బిడ్డ ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీకు భయం లేదా? ధైర్యముగా ఇక్కడదాకా వచ్చినవా?” అని అన్నది! దానికి నేను “ అవ్వ …నేను ఎవరో నాకు తెలియదు! ఇది తెలియక ఛస్తున్నాను! కానీ ఎందుకు ఈ నిశ్శబ్ద ప్రాంతంలో ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు?” అని అడిగాను! దానికి ఆమె “ఏమీ లేదురా! నాకు బాగా ఆకలిగా ఉంది! మా ఆయన్ని తొందరగా వండి పెట్టమని అడుగుతున్నాను! ఆయన నా మాట వినడం లేదు రా! ఆకలి బాధ తట్టుకోలేక ఏడుపు వస్తుంది రా! ఏమీ చేయను! చేసుకోవడానికి ఆరాటపడతాడు కానీ అన్నం పెట్టడానికి నానా వంకలు వెతుకుతున్నాడు రా!” అన్నది! నేను వెంటనే “ఎక్కడ అవ్వ! మీ ఆయన… నాకు ఇంతవరకు కనిపించలేదు! ఎక్కడున్నాడు? నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను అడుగుతాను! కడిగి పారేస్తాను! “అన్నాను! దానికి ఆవిడ మౌనంగా ఒకవైపు తన చేతి ఎత్తి చూపింది! నేను ఆ దిశ వైపు చూడగా ఒక పెద్ద గంగాళంలో నీళ్లు తిప్పుతూ దూరంగా ఒక వయోవృద్ధుడు కనపడినాడు! నా అడుగులు ఆ ముసలాయన వైపుకి తిరిగి నాయి! ఆయన వైపు తిరిగి “ ఏమయ్యా! అవ్వను ఆకలితో మాడ్చడం అవసరమా? వంట ముందుగానే చేసి ఉంటే ఆవిడకి ఈపాటికి పెట్టి ఉండే వాడివి కదా! అది అర్ధరాత్రి పూట అన్నం తింటే అరుగుతుందా? అనారోగ్యాలు వస్తాయి గదా!! చూస్తే మీరు ఇద్దరు ముసలి వారిలాగా ఉన్నారు! వంటరిగా ఉన్నారు! పైగా తోడు ఎవరు లేరు! ఇంత అర్ధరాత్రి మీ ఇద్దరికీ ఏమైనా జరిగితే ఎవరికి దిక్కు! ఎవరు సమాధానం చెప్పాలి! నేను మాట్లాడుతూ ఉంటే నీవు నీ నీళ్ల గంగాళం తిప్పుతూనే వున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పు? అనగానే ఆ వృద్ధుడు నా వైపు తిరిగి “వంటకి వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయి! వండే పదార్థమే లేదు ! ఉడికించటానికి… తినటానికి పదార్థం కావాలి కదా! దాని కోసం ఎదురు చూస్తున్నాను! నువ్వు వచ్చావు… అంటుండగానే అక్కడికి వచ్చిన ముసలవ్వను నేను గమనించే లోపే ఆవిడ వెంటనే” ఆ పదార్ధాలు… ఈ పదార్థాలు ఎందుకు? ఈ కొత్తగా వచ్చిన ఈ బ్రహ్మ పదార్థము ఉడికించి నాకు పెట్టవచ్చు కదా! నా ఆకలి తీరుతుంది కదా! వాడి ఆకలి తీరుతుంది కదా? వెంటనే నా వైపుకి తిరిగి “ఏమిరా బ్రహ్మచారి… నాకోసం ఉడుకుతావా? నా ఆకలి తీరుస్తావా? నీకు ఆకలి లేకుండా చేసుకుంటావా?” అంటూ ఉంటే నా బుర్ర కొన్ని క్షణాలపాటు మొద్దుబారిపోయింది! ఏమిటి వీళ్లు నన్ను వండుకుని తింటారా?… కొంపతీసి వీళ్ళు నరమాంసభక్షకులు గాదు కదా? శ్రీశైలంలో కాపాలికులు ఉండేవారని శ్రీ శంకరాచార్య జీవిత చరిత్ర లో చదివినట్లుగా గుర్తు! వీళ్ళు కాపాలికులు కాదు కదా! దిక్కూ మొక్కూ లేకుండా ఈ కాపాలికులకి నేను నరబలి కావాల్సిందేనా? మా ముసలాయన మాట వినకుండా … చిరు వ్యాపారులు మాట వినకుండా … అర్ధరాత్రి పూట తిరగటం అవసరమా ? ఇప్పుడు చావు దగ్గరికి వచ్చేసరికి చావు భయం మొదలైందా…. చావు దగ్గరికి వచ్చేసరికి చావు భయం అంటే ఇదే కాబోలు…. వామ్మో! ఇక్కడే ఉంటే నన్ను అప్పడము లాగా నంచుకుని తింటారేమో… మిరపకాయ బజ్జీలు లాగా వేయించుకుని తింటారేమో? అంత అవసరమా? అసలే గాయత్రి మంత్రోపదేశం జరిగినది ! పొద్దున వాళ్ళు చెప్పిన గాయత్రి మంత్రం సరిగ్గా గుర్తుకు రావడం లేదు! సరిగ్గా విని వుంటే… మననం చేసుకుని ఉంటే అన్ని గుర్తుకు వస్తాయి! ఇప్పుడు నా చావుకి వచ్చింది! మంత్రాలకి క్షుద్రశక్తులు పోతాయి అని అన్నారు కదా! మరి నాకేమో మంత్రాలు గుర్తుకు రావడం లేదు! ఇంతలో ప్రకృతి కార్యం ఒకటి నా పంచె నుండి కారడము మొదలైంది! ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగానే.. నా భయభ్రాంతులు మధ్య నాకు భ్రాంతిగా… మాయ చూపించిన… ఆ ఇద్దరూ వయోవృద్ధులు మాయం అవుతున్నారని నేను గ్రహించే లోపల గుడిలో సుప్రభాత సేవ మొదలవుతోందని అన్నట్లుగా దూరంగా ఉన్న గుడిగంటలు నాకు దగ్గరగా వినపడుతున్నట్లుగా తెల్లారి పోయింది అని ఆనందంతో చూడగా.. అప్పటిదాకా నాకు అగుపించిన వయోవృద్ధులు అంతర్ధానమయ్యారని తెలిసి మౌనంగా… భయంతో… భారంగా… నా సత్రం వైపు అడుగులు వేసాను! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !
శుభం భూయాత్
పరమహంస పవనానంద
********************************************************
గమనిక: ఇంతకీ ఆ ఇద్దరూ వయోవృద్ధులు ఎవరో తెలుసుకున్నారా? అనే సందేహమే కదా! అనగా నాకు ఉపనయనం జరిగిన సరిగ్గా 3 సంవత్సరాల తరువాత ఆరాధన శక్తి వలన వీరిద్దరూ భ్రమరీ,మల్లన్న లని తెలుసుకుని ఆనందపడ్డాను! మరి భయపడి నందుకు బాధపడ్డాను! వారికి ఆహారం కానందుకు చింత పడ్డాను! అయ్యివుంటే అమ్మ అన్నట్లుగా “నాకు ఆకలి లేకుండా మరో జన్మ అనేది లేకుండా చేసేది కదా”! ఈ మహత్తర మహోన్నతమైన అవకాశం చేజార్చుకున్నందుకు నా మీద నాకే తెలియని అసహ్యము వేసినది! అప్పుడు తెలియని వయస్సు… ఇప్పుడు తెలిసిన వయస్సు… కానీ ఏమీ చేయలేము కదా! అట్టి అవకాశం మళ్ళీ రాదు కదా! ప్రస్తుతానికి నేను ఇంకా ఏమీ తెలియని వయస్సు లోనే ఉన్నాను కదా! గాయత్రీ మంత్రానుష్టానం మొదలుపెట్టాను! ఇంకా ఏం జరిగిందో చూడండి !
Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job
రిప్లయితొలగించండిfirst ocindi devude kada aa tharvata anni anubhavalu first emaindi annadi matters... inkoti mee panche thadichindi ani dhaachukokundaa chepparu kada adi naaku baaga nachindi... meeru eppudaithe musalamma edusthundi annaro appude naku arthamaindi ammavaaru ani.... meeku baadha ne vallaki food avvaleka poyaru ani ayyunte mem miss ayyevallam mimmalni....
రిప్లయితొలగించండి