అధ్యాయం 61

అహంబ్రహ్మాస్మి (నేనే దేవుడిని)
(మా బ్రహ్మ చక్రానుభవాలు)

 బ్రహ్మ చక్ర సాధన నాకు ఎలా చేయాలో అర్థం కాని స్థితి ఏర్పడినది. ఎందుకంటే వామాచారం లో నీలసరస్వతి అని ఉగ్ర దేవతను ఆరాధన చేయాలని అన్నారు. నిజానికి సరస్వతీదేవి శాంతిస్వరూపిణి కదా. కానీ ఇక్కడేమో నీలముగా ఉండి ఉగ్ర స్వరూపిణిగా ఉంటుందని  ఈమె సాధనను వశిష్ట మహర్షి పూర్తి చేయలేక పోయినాడని.. వేదవ్యాస మహర్షి పూర్తి చేసినాడని తంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి. పోనీ దక్షిణాచారంలో చూస్తే ఏకపాద శివమూర్తిని ఆరాధన చేయాలంట. అసలు ఆయన ఎవరు? ఆయన స్వరూపము ఎలా ఉంటుందో ఇంతవరకు నాకు తెలియదు. తెలియని వారిని ఎలా ఆరాధించాలి అని అర్ధమయ్యి చావటం లేదు. పోనీ గ్రంథాలు తిరగవేస్తే …బ్రహ్మ చక్రం రెండు భాగాలుగా ఉంటుందని… మధ్యలో ఒక బిందువు వంటిది ఉంటుందని…. ఈ చక్రం వలన మనకి భావాలు కలుగుతూ ఉంటాయి అని…. ఈ చక్ర స్థితి వలన మనకి అన్నిట యందు ద్వైత భావాలు అనగా వెలుతురు- చీకటి, మంచి- చెడు, పాపము- పుణ్యము, దేవుడు- జీవుడు, కష్టము- సుఖము, జ్ఞానము- అజ్ఞానము ,విద్య- అవిద్య ఇలా విభిన్న ద్వంద్వ భావాలు కలుగుతాయని…. అనగా ఒకే విషయము నందు రెండు విభిన్న భావాలు ఈ చక్ర స్థితి వలన కలుగుతాయని నాకు అవగతమైనది. ఎవరికైతే భావాతీత స్థితి అనగా స్థిర ఏక భావాతీత స్థితి కలుగుతుందో వారికి ఈ చక్ర స్థితి ఆధీనము అయినట్లేనని నేను గ్రహించాను. కానీ ఈ చక్ర దైవమైన ఏకపాద శివమూర్తి గూర్చి పరిశోధనలు చేయాలని మరికొన్ని గ్రంథాలు చదవడం ప్రారంభించాను. “అంశుమద్ భేదగమ” అనే ఆగమశాస్త్రములో ఈ ఏకపాద శివమూర్తి గూర్చిన విషయాలు ఉన్నాయి. అలాగే అధర్వణ వేదములో అయితే ఈయన రెండు ప్రపంచ భావాల నుండి ఏక భావంతో ఉద్భవించినాడు అని చెప్పటం జరిగినది. ఈయన చూడటానికి జడలు కట్టిన జుట్టును కిరీటముగా ధరిస్తారని ఈయనకు మూడు నేత్రాలు ఉంటాయని ఒక చేతిలో శూలం, మరొక చేతిలో టంక(చిన్న సుత్తి) కలిగి ఉంటాడని, ఈయన ఒక చేత్తో అభయ ముద్రను, మరొక చేత్తో వరద ముద్ర ఇస్తాడని చెప్పటం జరిగినది. ఈయన తనకి ఏకత్వ స్థితి భావన సిద్ధి కోసం ఒంటి కాలు మీద నిల్చొని తీవ్రమైన తపస్సు చేయడం వలన ఈయనకు ఏకపాద శివమూర్తి అని పేరు వచ్చినది. ఈయన ఏకాదశరుద్రులులో ఒకరని…. ఈయన కుబేరుడి బంగారానికి కాపలాదారుడుగా ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది.   
        
పైగా ఈయనకి మూడు రూపాలు ఉన్నాయని… అవి ఏకపాద శివమూర్తి అనగా ఒకే ఒక కాలు కలిగిన ఒక శివ రూపమే అన్నమాట. ఇక ఏకపాద త్రిమూర్తి రూపము అనగా ఒకే ఒక ఏక పాదము కలిగి ఉండి మధ్యలో ఉన్న శివుడి శిరస్సుకి అటు బ్రహ్మ మొండెము ఇటు విష్ణువు మొండెము అతికించబడి ఉండే రూపం అని అన్నమాట. ఇక మూడవ రూపమైన త్రిపాద త్రిమూర్తి రూపము అనగా మధ్యలో శివుడి పాదము పొడవుగా ఉండి అటు బ్రహ్మ తల ఒక కాలు ఇటు విష్ణువు తల ఒక కాలుతో కలిసి మూడు తలలు మూడు కాళ్ళు ఉండుటవలన ఈయనకి త్రిపాద త్రిమూర్తి అనే పేరు వచ్చినది. అలాగే ఈ ఏకపాద మూర్తిని వామాచారం లో ఏకపాద బైరవుడుగా అర్చన చేస్తూ ఈయనకు రక్తాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు.ఇలా ఒరిస్సా నేపాల్ రాజస్థాన్ దక్షిణభారతంలో ఇటువంటి ఏకపాద శివమూర్తి ఆరాధనలు ఉన్నాయని వివిధ హైందవ మత గ్రంధాలు చెబుతున్నాయి. అంటే రాజస్థాన్లోనే బ్రహ్మదేవుడి మందిరము ఉన్నది. కొంపదీసి మహాకాలుడుకి మరో రూపము శనీశ్వరుడు ఉన్నట్టుగా ఈ బ్రహ్మ దేవుడికి మరో రూపంగా ఏకపాద శివమూర్తి లేడు కదా అనే ధర్మ సందేహం నాకు వచ్చినది. ఎవరికి తెలుసు. ఈ గ్రంథ పఠనము ద్వారా ఈ ఏకపాద శివుడిని గురించిన విషయాలు తెలిసినాయి. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈయన ని ఎలా పూజించాలి? విగ్రహాలు లేవు. ఈయనకి సంబంధించిన దైవిక వస్తువులు గాని మంత్రారాధనలు గాని నాకు తెలియవు. చచ్చింది గొర్రే. అనుకుని ఏమి జరిగితే అది జరుగుతుందని అనుకుంటూ అన్ని దేవతలకి ఓంకారమే ప్రథమ బీజాక్షరము గదా అని దీనితోనే ధ్యానం చెయ్యడం ప్రారంభించాను. ఏకధాటిగా మూడు గంటల పైగా కేవలం ఓంకారనాదం చెయ్యటం చేశాను. ఎందుకో ఏమిటో తెలియదు. ఈ నాదమే చేయాలని నాకు బలంగా అనిపించేది. అలాగే చెయ్యసాగాను. 

మేఘగర్జన నాదము

కొన్నివారాలకి నాకు ధ్యానమునందు ఆకస్మాత్తుగా నాకు దగ్గరిలో పిడుగు పడినట్లుగా లేదా మేఘాలు శబ్దము చేస్తున్న నాదము వినబడేది.దానితో నాకు భయమువేసి కళ్ళు తెరిచిచూసేవాడిని. కాని వాతావరణము చాలా ప్రశాంతముగా ఉరుములు లేని స్ధితిలోనే ఉండేది.కాని ధ్యానములో ఉన్నపుడే నాకు ఈ మేఘగర్జనలు వినబడుతున్నాయని కొన్ని రోజుల తర్వాత తెలిసినది. ఆ తర్వాత పుస్తక-గ్రంథాలు తిరగవేస్తే ఈ బ్రహ్మచక్రము నందు సాధకునికి మేఘగర్జన నాదము వినబడుతుందని...ఇది ఏకపాదుడి అనుగ్రహ సంకేతమని...ఈ నాదము విని భయపడి ధ్యానము నుండి బయటికి రావద్దని...ధ్యానమును అలాగే కొనసాగించాలని చెప్పడముతో నాలో తెలియని భయము పోయి...తెలియని మనోధైర్యం మొదలైంది.దానితో నా ధ్యానము నిరంతరము అవాంతరము లేకుండా కొనసాగినది. మా శ్రీమతి కాస్త మహా ఉజ్జయిని యాత్రకి వెళ్లి అటునుండి రాజస్థాన్లోనికి ప్రపంచములోనే ఏకైక బ్రహ్మ దేవాలయము ఉన్న పుష్కర్ క్షేత్రానికి అలాగే దీన్ని దగ్గరలో ఉన్న అజ్మీర్ ప్రాంతములోని అజ్మీర్ దర్గాను సందర్శించి వచ్చింది. నా కోసం పుష్కర్ నుండి ఏమీ దైవిక వస్తువులు రాలేదు. అంటే మనకి ఈ చక్ర జాగృతి కాలేదా అనే ధర్మ సందేహం నాలో మొదలైనది. ఎందుకంటే ఈ బ్రహ్మ చక్రానికి అధిష్టాన దైవం గా బ్రహ్మ దేవుడు ఉంటాడు. మరి ఈయన ఆవాసమైన పుష్కర్ క్షేత్రం నుండి దైవిక వస్తువులు రాకపోయేసరికి నాకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు.

నా ముద్ర సాధన: 

నేను ఇలా తీవ్రమైన ఓంకార నాద సాధన చేస్తున్న సమయంలో నాకు ధ్యానము నందు వివిధ దేవతల యొక్క చేతి ముద్రలు తరుచుగా కనిపించడం ఆరంభమైనది. అనగా శ్రీరాముడి అభయముద్ర, దక్షిణామూర్తి చిన్ముద్ర, పరమ శివుడి ఆజ్ఞ ముద్ర, వెంకన్న స్వామి వరద ముద్ర ఇలా దైవాల చేతి ముద్రలు కనిపించటం ఆరంభమైనది. ఇవి ఎందుకు కనబడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. కొన్ని రోజుల తరువాత దక్షిణాచారం లో పంచ మకారాలులో నాలుగవది ముద్ర అని అందువలన నాకు ఈ చక్ర స్థితిలో చేతి ముద్రలు తరచుగా అగుపించటం ఆరంభమైందని నాకు స్పురణ కి వచ్చినది. దీనితో నేను వివిధ రకాల చేతి ముద్రలను సంబంధించిన గ్రంథాలు పుస్తకాలు చదవటం ఆరంభించాను. అప్పుడు నాకు 480 దాకా హస్త ముద్రలు ఉన్నాయని వీటితో వివిధ చక్రాలను జాగృతి చేసుకోవచ్చునని వివిధ పూజ ముద్రలు ఉన్నాయని ఈ ముద్రలతో వివిధ రకాల రోగాలను వ్యాధులను తగ్గించుకొని ఆరోగ్యమును పొందవచ్చునని తెలిసినది. కాకపోతే వీటిలో ఏ ఏ ముద్రలు వెయ్యాలో నాకు అయితే అర్థం కాలేదు. 480 ముద్రలు వెయ్యాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు. అలాగని వీటిలో ఏవి బ్రహ్మ చక్ర జాగృతికి ఉపయోగపడతాయో ఎక్కడా కూడా వివరముగా వివరించలేదు. కేవలము సప్త చక్ర జాగృతికి, కుండలిని శక్తి జాగృతికి, ఆరోగ్యం కోసం, ఏకాగ్రత కోసం, పూజ ఫలితాలకోసం, నవగ్రహ శాంతి కోసం ఈ ముద్రలు చెప్పటం జరిగినది. అప్పుడు నేను నాకు ధ్యానం లో కనిపించిన పది రకాల ముద్రలకి సంబంధించిన వివరాలు ఈ గ్రంథాల ద్వారా తెలుసుకొని వాటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తూ అలా ఒక సంవత్సరము పాటు ఈ ముద్ర అభ్యాసము చెయ్యటం జరిగినది. కాకపోతే నా స్వానుభవం లో అందరికీ నాకు కనిపించిన ముద్ర భంగిమలు కనిపించటం లేదని వేరువేరుగా వారికి కావలసిన శరీర స్థితికి చక్ర  అనుగుణముగా వాటికి తగ్గట్టుగా ఈ హస్త ముద్రలు వాటి దైవ స్వరూపాలు కనిపించడం జరుగుతుందని నా దృష్టికి వచ్చినది. నా మనోనేత్రం ముందు కనిపించిన వివిధ రకాల ముద్రలు గూర్చి ఆరాతీయగా అవి లింగముద్ర, యోని ముద్ర, అక్షమాల ముద్ర, కపాల ముద్ర, ఢమరుకం  ముద్ర, కామ ముద్ర, నరసింహ ముద్ర, హయగ్రీవ ముద్ర, ధనుర్ ముద్ర, బాణ ముద్ర అని తెలిసినది, ఇవి శివ ముద్రలుగా అందులో చెప్పటం జరిగినది. ఇందులో విచిత్రం ఏమిటంటే లింగముద్ర మరియు యోని ముద్ర గుణ చక్రము స్థితికి అలాగే ధనుర్ ముద్ర బాణ ముద్రలు కాస్త కర్మ చక్రము స్థితులకు ఢమరుకం ముద్ర హయగ్రీవ ముద్ర కామ ముద్రలు కాస్త కాలచక్ర స్థితికి ఉపయోగపడితే అక్ష మాల ముద్ర, కపాల ముద్ర, నరసింహ ముద్ర అయితే బ్రహ్మ చక్రం స్థితులకు ఉపయోగపడినాయి. అదే మిగిలిన వారిలో ఎక్కువగా మూలాధార చక్రము స్థితిగల పృధ్వి ముద్ర, స్వాధిష్టాన చక్రం స్థితిగల  జల ముద్ర, మణిపూరక స్థితి గల సూర్య ముద్ర, అనాహత చక్రం స్థితి గల వాయుముద్ర, విశుద్ధ చక్రం స్థితిగల  ఆకాశ ముద్ర,ఆజ్ఞా చక్రముస్థితి గల   జ్ఞాన ముద్ర అలాగే సహస్ర చక్రము స్థితి గల శూన్య ముద్ర కనిపించినాయి. అదే మరి కొందరికి అయితే 24 గాయత్రి ముద్రలు కనబడితే మరికొందరికి నవగ్రహ ముద్రలు అలాగే మరికొందరికి వాస్తు ముద్రలు మరికొందరికి 24 నాట్య ముద్రలు కొందరికి పంచభూత ముద్రలు మరికొందరికి పంచ ప్రాణ ముద్రలు ఇంకొందరికి శక్తి ముద్రలు మరికొందరికి ధారణ శక్తి ముద్రలు మరికొందరికి అయితే శ్రీ చక్ర దశ ముద్రలు ఇంకొందరికి అయితే గురువందన ముద్రలు మరి కొందరికి వారి ఇష్ట దైవ ముద్రలు కనపడటం గమనించదగ్గ విషయం. వారికి ఇలా కనిపించిన ముద్రలు అభ్యాసం చేసి ముద్ర సిద్ధి పొంది స్థిర మనస్సుగాను బుద్ధి నిలకడగా ఆలోచన లేని అలాగే అనుమానము లేని  వివేక బుద్ధి స్థితి కలుగుతాయని నా స్వానుభవం వలన నేను తెలుసుకున్నాను. మీరు ఏ ముద్ర వేసిన అభ్యాస సిద్ధి పొందినను మీకు ఈ రెండు ఫలితస్థితులే కలుగుతాయి అని నాకు అర్థం అయింది. అలాగే మనకు అగుపించే ప్రతి దైవ స్వరూపానికి ఏదో ఒక హస్త ముద్ర భంగిమలోనే కనబడతారు. అలాగే వీరి విగ్రహాలు, ఫోటోలు ఉండటం విశేషం.

నాకు వచ్చిన మానవ అస్ధిపంజర బొమ్మ- పాలరాయి కపాలమాల

ఇంతలో నాకు అమెరికాలోని లాస్ వేగాస్ ప్రాంతము నుండి ఒక అస్థి పంజరం బొమ్మ ఒకటి వచ్చింది. అది ఎందుకో తెలియదు గాని అది నన్ను బాగా ఆకర్షించింది. కొంపదీసి నేను నాకు తెలియకుండానే తాంత్రిక ఉపాసనకి వెళుతున్నాను అనే సందేహం కూడా వచ్చింది. కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ అస్థి పంజరానికి ముందుగానే వారం రోజుల ముందు నాకు ధ్యానంలో ఒక అస్తిపంజరం తరచుగా కనపడసాగినది అది ఇదే అని నాకు అర్థం అయింది. కానీ ఇది దేనికి సంకేతమో అయితే అర్థం కాలేదు. ఈ అస్థి పంజరపు బొమ్మను పూజగది గోడకి వేలాడ తీసుకున్నాను. అందరి చేత నానా తిట్లు తిన్నా కూడా పట్టించుకోలేదు. ఈ అస్థి పంజరం బొమ్మకి నాకు ఏదో తెలియని అనుబంధ సంకేతము ఇస్తోందని నాకు బలముగా అనిపించసాగింది. కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానములో మనో దృష్టి యందు లాస్ వెగాస్ లో నా భవిష్యత్ జన్మ తాలూకు దృశ్యాలు లీలగా కనబడుతూ చివరికి ఆ జన్మలో నేను చనిపోయిన చోటు నుండి ఈ అస్థి పంజరం బొమ్మ వచ్చినదని నాకు కనపడినది. అంటే భవిష్య జన్మకి కారకమైన ప్రారబ్ధకర్మ నాకు ఈ జన్మలో అనగా కపాల మోక్షం గ్రంథమును రచించడం వలన ఈ కర్మ తీరిపోతుంది అని తద్వారా రాబోవు మైఖేల్ జన్మ ఉండదని నాకు అర్థం అయినది. దీనికి సంకేతముగా ఆ ప్రాంతము నుండి ఈ బొమ్మ వచ్చినదని అవగతమైనది. ఇప్పటికీ నా దగ్గర ఇది ఉంది. నా భవిష్యత్ తాలూకు వస్తువు గదా. ఇలా కొన్ని రోజుల తర్వాత ఎందుకో విచిత్రముగా నాకు కాశి క్షేత్రం నుండి 54 కపాలాలు ఉన్న కపాల మాల వచ్చినది. దీనమ్మ జీవితం. ఈ బ్రహ్మ చక్ర సాధన చేస్తున్న అప్పటినుండి నాకు కపాలాలు కపాలమాల అస్థిపంజరాలు రావటం అర్థం కాని విషయం. ఈ చక్రము లో వచ్చే దైవిక వస్తువులు ఇవేనని నాకు అప్పుడు తెలియదు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి- మహాసరస్వతి వలన ఎవరు పూజించరాదు అని శాపము ఉన్నది. అలాగే కాలభైరవుడు కోప ఆవేశానికి గురై తన పంచముఖాలలో ఒక ముఖమును పోగొట్టుకుని బ్రహ్మకపాలంగా అది ఉండిపోయినది. దానితో మనకి ఈ చక్ర సాధన సమయంలో దైవిక వస్తువులుగా కపాలాలు, అస్థిపంజరాలు వస్తాయని కొన్ని సంవత్సరముల తర్వాత నాకు తెలిసినది. నాకు వచ్చిన ఈ కపాలమాల వేసుకోగానే నాకు ధ్యానములో మణిపూరక చక్రములో 'రా' అనే శబ్దము అలాగే ఆజ్ఞాచక్రములో ఉన్న త్రికోణ బ్రహ్మ యోని నుండి 'మ' అనే శబ్దము కలిసి రామ అనే శబ్దం నాదము అనగా రా అనే అక్షరము అలాగే మ అక్షరంతో మైధునము చెంది రామ అనే శబ్దం నాదము రావటము మొదలైనది. అంటే దక్షిణాచారంలో మైధున ప్రక్రియ అంటే రామ శబ్దం నాదము వినటం అయితే వామాచారం లో అయితే స్త్రీ తాంత్రిక గురువుతో మైధున ప్రక్రియ చేయడం లాంటిది అని నాకు అర్థం అయింది. అంటే నాలో ఈ చక్రశుద్ధి ప్రారంభమైనదని అవగతమైనది. ఇలా ఏక రామ శబ్దం నాదము ఉద్ధృతంగా సమ్మోహనంగా తాళం యుక్తముగా లయబద్దంగా వినబడ సాగినది. నేను నా ఓంకారనాదం అలాగే ఓంకార మంత్రం నా ప్రమేయం లేకుండానే ఆగిపోయి తారకరామ బ్రహ్మ మంత్రం అవలీలగా వినబడ సాగినది. 

మానవ కపాలం

ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నాకు ధ్యానములో నా మనోనేత్రం ఒక విచిత్రమైన దృశ్యము కనబడసాగింది.ఒక చీకటి వెలుతురు కలిసి ఉన్న సంధ్య లాంటి వెలుతురు ఉన్న దట్టమైన ఒక చీకటి ప్రదేశం కనిపించసాగింది. అంటే అర్ధరాత్రి పూట ఎవరు లేని ఒంటరి గా థార్ ఎడారి ని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించసాగింది. ఎవరూ లేరు. నేను ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. నేను ఒక్కడినే ఒంటరిగా ఏకాంతంగా ఉన్నాను. కని కనిపించని ప్రాంతం లాంటి కాంతి లో ఉంది. ఒక చోట దీని మధ్య భాగంలో గాలిలో ఒక పెద్ద తెల్లని మానవ కపాలం కనపడినది. దీనికి ఏమి ఆధారము లేదు. కేవలం గాలి లో ఉంది. దీనిని బాగా పరిశీలన చేస్తే అర అంగుళం కన్నా చిన్నదిగా ఉన్న రెండు అనగా ఆడ మగ భ్రమరాలు ఈ పుర్రె  చుట్టూ అతివేగముగా తిరుగుతున్నాయి.  ఒకదానికొకటి తాకుతూ విడిపోతూ వేగంగా తిరుగుతున్నట్లుగా నేను గమనించాను. ఆ తరువాత ఈ రెండు భ్రమరాలు కలిసి పుర్రె  కన్ను భాగములోని కి వెళ్లి గుడ్లు పెట్టడం, గూడులు కట్టటం కొద్దిసేపటికి అవి బయటికి తిరిగివచ్చి ఈ పుర్రె చుట్టూ గాలిలో తిరుగుతూ అంతరించి పోవటం మళ్లీ ఈ పుర్రె కళ్ళనుండి కొత్త భ్రమరాలు రెండు రావటము ఈసారి ఈ పుర్రె  యొక్క ముక్కు రంధ్రాలలో గూడులు కట్టి గుడ్లు పెట్టి తిరుగుతూ చనిపోవటం ఈ గుడ్లు నుండి మళ్లీ కొత్త రెండు భ్రమరాలు రావటము ఇలా చెవి ముక్కు నోటి కన్ను రంధ్రాల నుండి పంచేంద్రియాల నుండి ఈ రెండు భ్రమరాలు పుట్టటము చచ్చిపోవటం దీనికి ఏమాత్రం సంబంధం లేదని అన్నట్లుగా మానవ కపాలం ఉండటం నాకు ఆశ్చర్యంగా అనిపించేసరికి నాకు ధ్యాన భంగమైనది.ఈ దృశ్యము దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత విశ్లేషణ చేసుకోగా అంటే ఈ మానవ కపాలం చుట్టూ తిరిగే ఈ రెండు ఆడ మగ భ్రమరాలు అనేది రెండు విభిన్న భావాలకి సంకేతమని అలాగే పంచేంద్రియాలు అంటే పంచ ప్రాణాలు అనగా చూడటం తినటం పడుకోవడం లేవటం రుచి చూడటం స్పర్శ ఆనందం పొందటము వినటం ఇలాంటి భావాలకి సంకేతాలని నాకు అర్థం అయినది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే వివిధ రకాల భావాలకి మనము ఏకైక అద్వైత స్థితి కి వెళ్ళటం చలన రహితంగా స్పందన రహితముగా భావ రహితముగా ఉన్న ఈ మానవ కపాలము సూచిక అని అవగతమైనది. అన్నింటా యందు అన్ని విషయాల యందు ఏక భావముతో అంటే కనిపించే భౌతిక పదార్ధ భావాలు కలిసి ఏక బ్రహ్మపదార్థం భావము గా నాకు అగుపించాలని  గ్రహించాను. 84లక్షల భౌతిక భావాలు కలిసి అలాగే 36 కోట్ల దైవ భావాలు కలిసి ఏక భావములోన కి రావాలి అన్నమాట. ఇన్ని లక్షల జీవజాతులు లేవని అలాగే ఇన్ని కోట్ల దైవ స్వరూపాలు లేవని ఉన్నది ఒక్కటే ఏకైక దైవ స్వరూపమని అదియే నేను అని అంటే నేనే దేవుడని …నేనే ఆత్మ ఏకమై ఉన్నదని భావ స్పురణకి రావాలని  నాకు తెలిసినది.వివిధ రకాల ద్వైత భావాల స్థితిలో నుండి అద్వైత భావ స్థితినందు ఈ చక్ర సాధన అని దీనికోసమే మహా దేవుడైన మహాశివుడు ఏక పాదముతో తీవ్ర సాధన చేసిన ఆదియోగి అని దీనికి సంకేతమే ఏకపాద శివమూర్తి రూపం అని చెప్పకనే అర్థమైనది.కానీ నాకు ఈ ఏకపాద శివమూర్తి స్వరూపము ఎవరిది? అలాగే ఈయన కి సంబంధించిన దైవిక వస్తువులు ఏమై ఉంటాయని ధర్మసందేహాలు నన్ను వెంటాడటం మొదలు పెట్టినాయి. ఎన్ని గ్రంథాలు పుస్తకాలు తిరగ వేసిన నాకు సంతృప్తిని ఇచ్చే సమాధానాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇలా కొన్ని రోజులు గడిచి పోయినాయి. ఒక రోజు నేను అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. అంటే నా సూక్ష్మధారి ఏదో విషయాన్ని తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాడు అని నాకు అవగతమైనది. నేను ఏమి జరుగుతుందో ఏమి జరిగినా కూడా అన్నింటికీ సాక్షిభూతంగా ఉండాలని నిశ్చయించుకొని మౌనముగా ఏదో వీడియో చూస్తున్నట్లుగా జరగబోయే దానిని చూడాలని అనుకున్నాను. ఇంతలో నటరాజ విగ్రహం మూర్తి కనపడి ఇది కాస్త నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. 

చిదంబర రహస్యము వీడినది:

ఆ తర్వాత చిదంబర దేవాలయ దృశ్య మాలిక కనపడినది. ఇది కూడా దాటుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏదో ఆలయంలో ఉన్న నాట్య ప్రాంగణ సభ కి చేరుకున్నాను అని అర్థమైనది. అక్కడ ఎంతో మంది వివిధ రకాల దైవ జాతులు ఉన్న దైవ స్వరూపాలు వారివారి ఆసనాలలో కూర్చుని వున్నట్లుగా లీలగా కనపడ సాగింది. దీనమ్మ జీవితం. దేవుళ్ళు ఇలా నాకు మనుషులు కనిపించినట్లుగా కనబడుతున్నారు. ఒక దేవత యొక్క దైవసాక్షాత్కారం కోసం భూలోకములో జీవుడు నా నా చంక నాకి నానా అగచాట్లు పడుతున్నారు. మరి నాకేమిటి ఇలా అందరూ కనబడుతున్నారు. నేను నిజంగానే దేవతలని చూస్తున్నానా లేదా భ్రమ పడుతున్నానా? ఒకవేళ నాది భ్రమ అయితే చిదంబర క్షేత్రం నటరాజ మూర్తి స్వరూపము, టెంపుల్ రన్ ఆట, సూక్ష్మ శరీర యానం ఎందుకు కనబడతాయి. అంటే వీళ్లు నిజంగానే దేవతలు అయిఉండాలి. వీళ్లు ఏర్పాటు చేసుకున్న దైవ సభకు నా సూక్ష్మధారి వెళ్లి ఉండి ఉండాలి. దీనిని బట్టి చూస్తే చిదంబర క్షేత్రంలో ఉన్న పంచ సభలలో నాట్య సభలో జరిగే పార్వతీపరమేశ్వరుల నృత్య తాండవమునకు నా సూక్ష్మధారి వచ్చినాడని నాకు అర్థమైనది. ఈ లెక్కన పరమేశ్వరుడు నిజంగానే ఆనంద అలాగే విలయ తాండవం చేస్తాడు అన్నమాట. ప్రస్తుతానికి ఆనంద తాండవము జరుగుతుంది. దానిని చూడటానికి వచ్చినాను అనుకుంటున్న సమయములో పార్వతీ పరమేశ్వరులు సభాప్రాంగణం లోనికి రావటం… వాళ్ళ మధ్య ఏదో సంభాషణలు జరగడము అక్కడ వారితోను మాట్లాడటం… ఏదో సంభాషణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ వారి మాటలు నాకు వినిపించడం లేదు. అంటే ప్రస్తుతానికి నాకు ఆడియో లేదని కేవలం వీడియో చూసే యోగము మాత్రమే ఉన్నదని నాకు అర్థమైనది. కొన్ని క్షణాల తర్వాత పార్వతీపరమేశ్వరులు తమ నృత్య ప్రదర్శనను ఏకకాలంలో చూపించడం జరుగుతుంది. ఇద్దరూ కూడా పోటీపడి మరీ నాట్యము చేస్తున్నారు. నాకైతే ఇది అంతా ఏదో సినిమాలో క్లిప్పింగ్ చూస్తున్నానని అనుభూతి కలగ సాగింది. కాకపోతే ఏమిటి? నా బొంద. నా బూడిద. నేను నిజంగానే ఈ నాట్యం చూస్తున్నా నా లేదా నా మనస్సులో ఏదో సినిమా దృశ్యం ఇలా జ్ఞాపకంగా మిగిలితే ఇలా దృశ్యరూపంలో కనబడుతుందా? అర్థం అయ్యి చావడం లేదు. అంతా ఏదో మాయలాగ ఉంది.నిజంగానే చిదంబర రహస్యం లాగా ఉంది అనుకుంటూ ఏది జరిగితే అది జరుగుతుంది చూస్తే పోలా అనుకొని ముగ్ధ మనోహరమైన నాట్యం చూస్తూ ఉండగా… అమ్మవారు తన కాలి బొటన వేలితో విభూదితో అయ్యవారి వాహనమైన నందీశ్వరుడు చిత్రం గీస్తే అయ్యవారు తన ఎడమ కాలి బొటన వేలుతో పసుపుకుంకుమలతో అమ్మవారి వాహనమైన ఆడసింహము చిత్రం గీయడం జరిగినది. అంటే అమ్మ వారి వాహనము మగ సింహం అలాగే మగ పులి కాదని ఆడ సింహం అని నాకు అర్థం అయ్యే లోపల వీరిద్దరి నాట్యం కాస్త తాండవంగా మారి ఆనంద తాండవం చేస్తుండగా  అది కాస్త చాలా ఉగ్రమైన పరమానంద స్థాయికి వెళుతుండగా అక్కడ అయ్యవారు కాస్త తమ ఎడమ కాలిని పైకి ఎత్తడం అమ్మవారు ఈ భంగిమ చేయలేక సిగ్గుతో తల దించుకుని ఒక లిప్త కాలంలో ఏకకాలంలో జరిగినాయి. అంటే అమ్మవారు ఈ నాట్యంలో ఓడిపోయారని నాకు అర్థమయే లోపల అయ్యవారు అలాగే ఒంటి కాలి మీద నిలబడి ఎడమ కాలును ఆకాశము కేసి పైకి ఉంచుతూ కుడి కాలును భూమికేసి క్రింద ఉంచుతూ అంటే ఏకపాద శివమూర్తి స్వరూపము ఇదేనని నా మట్టి బుర్రకి అప్పుడుగాని తట్టలేదు. ఇట్టి సమయములో ఉండగా అతను ఈ నాట్యము నందు గెలిచినానని పరమానందభరితుడై అయ్యవారు ఉండగా దీనికి సంకేతముగా ఆయన లింగము నుండి ఒక వీర్యము బొట్టు నేల మీద పడుతూ ఉండగా అమ్మవారు ఇది గమనించి ఎడమ చేతితో ఈ వీర్య బొట్టును పట్టుకోగానే అది కాస్తా పాదరస శివలింగం గా మారటం నేను గమనించాను. దాంతో అప్పటిదాకా ఆనంద తాండవం కాస్త నెమ్మది నెమ్మదిగా విలయ తాండవముగా మారుతుంది అనే సరికి ఒక్కొక్క దైవస్వరూపం అచేతన స్థితిలో నికి వెళుతూ నేల మీదకి ఒరగడము మొదలైనది.అలా సకల దైవ స్వరూపాలు ఆగిపోయినాయి చివరికి సాక్షాత్తు పరమేశ్వరి కూడా ఈయన చేస్తున్న విలయతాండవం కి ఒరిగిపోవటం జరుగుతున్న సమయంలో అసలు ఆయన ఏమీ గమనించకుండా ఏక పాదముతో ఉగ్రమైన తీవ్రమైన విలయ తాండవం చేస్తూ తనలో తాను తిరుగుతూ చేస్తున్న సమయంలో అమ్మవారి చేతిలో ఉన్న పాదరస లింగం ఒక లిప్త కాలము కదలటం ఈ  కదలిక తరంగాలు కాస్త అమ్మవారు హృదయానికి చేరటం అవి కాస్త స్పందనగా మారి అమ్మవారి ఎడమ చెవి చేరటం అది కాస్త అమ్మవారి చెవికి ఉన్న దుద్ధికి చేరటం ఈ దుద్ధి కాస్త స్పందించి కదలటం ఈ స్పందన కాస్త మహా ధ్వనిగా ఏమీలేని పరమ ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు మన గుండె చప్పుడు కూడా మహా ధ్వని లాగా ఎలా అయితే వినబడుతుందో అమ్మవారి ఎడమ చెవి దుద్ధి శబ్దము కూడా అచేతన స్థితి లోని కి వెళుతున్న విలయతాండవం అంతిమ స్థాయి కి చేరుతున్న వేళ ఈ దుద్ధి శబ్దం ఈయన చెవికి చేరటంతో అంటే సౌందర్యలహరిలో శ్రీ శంకరాచార్యులు చెప్పిన విధముగా జరుగుతుందని నేను అనుకుంటున్న వేళ అచేతన స్థితి నుండి  ఈయన కాస్త చేతన స్థితికి వస్తూ విలయతాండవం నుంచి ఉపశమనం పొందుతున్న వేళ ఈ సృష్టి అంతా అచేతన స్థితి అనగా లయ కార్యానికి నాంది అయ్యేదని తెలియగానే ఈయన త్రినేత్రం నుండి ఒక కన్నీటి బొట్టు అమ్మవారి చేతిలో ఉన్న పాదరస లింగం మీద పడే సరికి అది కాస్త ఏకముఖి రుద్రాక్షగా మారటం దానితో రుద్రాక్షలకు ఉండే సహజ అయస్కాంత విద్యుత్ శక్తి వలన అమ్మవారికి జాగృతి స్థితి రావడం జరిగినది. తద్వారా మళ్ళీ వీరిద్దరూ కలిసి కామిని కామేశ్వరులుగా మారి మైధునము ప్రక్రియ చేస్తూ తమలోని కామ శక్తిని కాస్త ప్రాణ శక్తిగా మార్చుకుంటూ అచేతన స్థితిలో ఉన్న వివిధ రకాల జీవ దైవ స్వరూపాలకుధార పోస్తూ వారిని తిరిగి చైతన్య స్థితిలోనికి తెస్తూ పునః జీవులు చెయ్యటం జరిగినదని అనుకుంటుండగా దీనమ్మ జీవితం. ఇది అంతా నిజమేనా లేక నా భ్రమ ఏవో నాలుగు సినిమా సీన్లు కలిపి ఒక సినిమా లాగా చూసినట్టుగా ఉంది అనుకోగానే నాకు ధ్యాన భంగం అయినది. ఆ తర్వాత నేను విశ్లేషణ చేసుకుంటే ఈ దృశ్యము నిజమో అబద్దమో నాకు చూపించిన సర్వేశ్వరునికే తెలియాలి. అది నాకు అనవసరం. నాకు తెలిసిన విషయాలు ఏమిటంటే ఏకపాద శివమూర్తి అంటే నటరాజ స్వరూపం అని ఈయన దైవిక వస్తువులు అనగా ఆనంద తాండవం లో పాదరస లింగం గాను అలాగే విలయ తాండవము లో ఏకముఖి రుద్రాక్ష గాను అని నాకు తెలిసినది. అది నిజమే కావచ్చును. సంసారులకు నిజమైన క్షణిక అనుభూతి స్త్రీపురుష మైధున ప్రక్రియలో స్కలనము అయినప్పుడు కలుగుతుందని లోకవిదితమే కదా.అంటే పాదరస లింగం అంటేనే మహా శివుడి యొక్క వీర్యము  సంకేతమని లింగ పురాణం చెబుతుంది కదా. అలాగే రుద్రాక్షలు అనేవి రుద్రుడు అక్షము నుండి కన్నీటి ధార వచ్చినప్పుడు వచ్చినాయి అని శివపురాణం రుద్రాక్ష శాస్త్ర గ్రంధాలు చెప్పకనే చెప్పినాయి  కదా. ఈ లెక్కన చూస్తే ఈ చక్ర దైవము స్వరూపముగా ఏకపాద శివమూర్తి అనగా నటరాజ మూర్తి గాను దైవిక వస్తువులు పాదరస లింగం ఏకముఖి రుద్రాక్ష అయి ఉండాలి అని నాకు అర్థం అయినది. మరి మీకు కూడా ఇది నిజమేనని అనిపిస్తుంది కదా. నిజమే. నిజములాంటి కలలాంటి ధ్యాన అనుభవము. చెప్పటం వరకు నా వంతు. వినడము వినకపోవడం అలాగే నమ్మడం నమ్మకపోవడం మీ వంతు. 

నేనే దేవుడిని:

 ఇది జరిగిన కొన్ని వారాల తరువాత నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు భ్రుకుటి మధ్య చిన్న శ్వేత జ్యోతి కనబడుతూ అదికాస్తా పెరుగుతూ కోడిగుడ్డు పరిమాణము లోనికి మారినది. ఇందులో అడ్డముగా ఉన్న త్రినేత్రం కనపడినది. అది కాస్త నిలువుగా ఉన్న నేత్రము గా మారినది. నా మాడు లోపలి భాగంలో శూన్య స్థితి ఏర్పడినట్లుగా అనుభూతి కలగ సాగింది. ఇంతలో ఆకాశంలో నీలి ఆకాశం సూర్యచంద్రుల గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు... వివిధ గ్రహశకలాలు... వివిధ దేవతా లోకాలు ఒకదాని తర్వాత ఒకటి కనపడ సాగినాయి. అంటే అంతరిక్ష నాసా వారి వీడియో చూస్తున్నట్లుగా కనిపించసాగింది.ఇలా ఈ భౌతిక ప్రపంచ వస్తువులు అన్నీ కూడా నన్ను దాటి వెళ్ళి పోతూ… మళ్ళీ త్రిమూర్తుల త్రిలోకాలు కనిపించినాయి.కొద్దిసేపటి తర్వాత ఈ లోకాలు అలాగే త్రిమూర్తులు గూడ అంతరించిపోతూ కనిపించసాగినారు.అంటే వీళ్ళుగూడ శాశ్వతము గాదని నాకు అనుభవ  అనుభూతి కలుగుతూండగా… ఏదో లోకదర్శనమైనది.ఇందులో నాలాంటి రూపమున్న దేవతలు,యోగులు ఇలా మున్నగువారంతా ధ్యానసమాధి స్ధితిలో ఉన్నట్లుగా కనపడినారు.అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ,అమ్మవారు,శ్రీరాముడు,శ్రీకృష్ణుడు, సాయిబాబా,హనుమంతుడు,శ్రీతైలింగస్వామి,రమణామహర్షి,రామకృష్ణపరమహంస ...ఇలా మున్నగువారంతా గూడ వారి అవతరాలలో నారూపములో కనపడుతూ ఉండేసరికి సర్వము నేనే ఉన్నాను...నేనైయున్నాను... నేనే దేవుడిని అనుభవానుభూతి కలుగుతూండగా…. ఏమీ లేని ఏమీ కనిపించని మధ్యస్థంగా ఉన్న చిమ్మ చీకటి వెలుతురు స్థితి మాత్రమే దర్శనం ఇవ్వసాగినది. అంటే మనకి కనిపించే భౌతిక ప్రపంచ పదార్థాలన్నింటిని దాటితే మిగిలేది శూన్యమే అన్నట్లుగా అనుభూతి కలగ సాగింది. ఇంతలో నాలో నుండి వివిధ రకాల భావాలు ఉత్పన్నము అవ్వటం మొదలైనాయి. ఆనందము, ఏడుపు, ఏకాగ్రత, ఆవేదన, సంతోషము పొందుట, ఏడ్చుట, త్రాగడం, తృప్తి, చూడటం, బాధపడటం ఇలా 112 భావాలు నన్ను చుట్టుముట్టి నట్లుగా అనుభూతి కలిగింది. మరి నాకు ఏకైక భావ స్థితి అంటే శూన్య స్థితి పొందాలంటే నేనేమి చెయ్యాలి అనుకునేసరికి అశరీరవాణి నుండి  'త్యాగాత్ శాంతి రనంతరం' అని మూడుసార్లు వినబడినది. అంటే త్యాగం వలన శాంతి లభిస్తుందని దీని అర్థం. అంటే దేనిని త్యాగం చేయాలి. ఇంకా నేను త్యాగము చేయటానికి నా దగ్గర ఏమీ లేదు కదా? ఇంకా నేను ఏమి చేయాలి అన్ని త్యాగం చేశాను కదా. ఇంకా నేను ఏమి త్యాగం చేయాలని చెబుతుంది. నేను ఏమి త్యాగం చేయాలని ఈ శూన్య స్థితి చెబుతోంది. అసలు ఈ శూన్య స్థితి నేను కాక మరి ఎవరు ఉన్నారు? వివిధ రకాల భిన్న విభిన్న భావాలను నుండి ద్వైత భావము లోనికి అనగా నేను వేరు… శూన్యము వేరు అనే భావంలో ప్రస్తుతము నేను నా సాధన స్థితి ఉన్నదని ఎప్పుడైతే త్యాగము చేస్తానో అది కాస్త అనగా అద్వైత స్థితి కలుగుతుందని ఈ శూన్య స్థితి నాకు చెపుతున్నదని స్పురణకు రాగానే నాకు ధ్యాన భంగం అయినది. అంటే నేను ఏమి త్యాగం చేయాలో తెలుసుకోవాలి అప్పుడే గాని నాకు ద్వైత స్థితి నుండి అద్వైత స్థితి రాదు. మరి నాకు శూన్య స్థితిలో వినిపించిన వాణి ఎవరిది? త్యాగం వల్లనే శాంతి లభిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? నేను కానీ నేను ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు? అసలు నేను ఏమి త్యాగము చేయమని చెబుతున్నారు అనుకుంటూ నాలో పరి ప్రశ్నలు మొదలైనాయి. ఒకవేళ తన శరీరమును త్యాగం చేయాలా? చేస్తే మరి తన సాధన పరిసమాప్తికి ఈ శరీరము ఉండాలి కదా. అంటే శరీరము త్యాగం కాదు. మరి దేనిని త్యాగము చేయాలి. దేనికోసం అంటే శాంతి కోసం అని మన:శాంతి కోసం అని అర్థం అవుతున్నది. కానీ దేనిని త్యాగము చేయాలో అర్థం అయ్యి చావటం లేదు. 

నేను కాస్తా శూన్యబ్రహ్మగా మారడం:

ఇది ఇలా ఉండగా నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నేను చేసే శివ మంత్రము ఆగిపోయినది. శబ్దాలు వినబడటం ఆగిపోయినాయి. ధ్యాన అనుభవాలు ఆగిపోయినాయి. ఏ ఆలోచన లేని స్థితిలో వెళ్ళటం అదే నా మనస్సు పొందటం జరుగుతుంది. అలాగని నిద్ర అవస్థకాదు అలాగని మెలుకువ అవస్థ కాదు.అంటే గాఢ నిద్ర అవస్థలో ఏమి జరుగుతుందో మేలుకొని ఉండి తెలుసుకొనే సమాధిస్థితి అని తెలుస్తుంది. అంటే పంచేంద్రియాలు పనిచేస్తున్న పంచజ్ఞానేంద్రియాలు పనిచేస్తున్న కానీ నా మనస్సు వీటితో కలిసి పనిచేయడం లేదని అవగతమవుతుంది. అంటే నా మనస్సు పూర్తిగా పనిచేయలేని చివరికి ఆలోచనలు చేయలేని స్థితికి చేరుకుంటుంది అని నాకు అనిపించసాగింది. దానితో కాలము కూడా తెలియటం లేదని అవగతమవుతోంది. నా మనస్సులోని కోరికలు, తలంపులు, భావాలు, ఆలోచనలు, ప్రేమలు, మోహాలు, వ్యామోహాలు, రుచులు, అభిరుచులు, ఇష్టాలు అయిష్టాలు, సుఖదుఃఖాలు లేవు .విభిన్న రూప నామాలు లేవు. కానీ ఇట్టి స్థితిలో నేను ఉన్నాను అన్న స్పురణ మాత్రమే తెలుస్తోంది. అంతకు మించి వేరే ఆలోచన గాని భావము గాని లేదు. ఈ సమాధి స్థితి నుండి బయటకి రావడం జరిగినది. అప్పుడు నా మనస్సుకి ఏదో తెలియని తన్మయ అవస్థలో ఉన్నదని నాకు అర్థం అయినది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ వస్తువును చూసిన దేనిని చూసిన దేనిని ముట్టుకున్న దేనిని తాకినా కూడా ఏదో తెలియని ఆనంద దాయకంగా క్రొత్త ప్రశాంత లోక అనుభూతిని పొందటం ఆరంభమైనది. మనస్సు నిండా ఏదో తెలియని ఆనంద తాండవం ఉన్నదని నాకు అర్థమైనది. ఇట్టి సమాధిస్థితి దేనిది అని నా ఆలోచనలు చేస్తుండగా ఇట్టి సమాధిస్థితిలో తెలుసుకోవలసిన ధ్యాని, తెలుసుకోవలసిన విషయం అయిన ధ్యానము, తెలియవలసిన విషయము అయిన ధ్యేయము ఈ మూడు కలిసి ఒకటిగా మారిపోయే సమాధి స్థితియే సవికల్ప సమాధి అని ఇట్టి స్థితిలో ఆలోచన రహిత స్థితి కలుగుతుందని అనగా భావ రహిత స్థితి ఏర్పడుతుందని కాకపోతే ఇట్టి స్థితిలో సాధకుడు కొన్ని గంటలు వరకు మాత్రమే ఉంటాడని యోగ శాస్త్ర గ్రంధాలు తిరగవేస్తే నాకు అర్థమైనది .అంటే నాకు ఈ చక్ర స్థితిలో సవికల్ప సమాధి స్థితి అనుభూతి కలుగుతుందని నాకు అవగతమైనది.కాకపోతే నేను ఏమి త్యాగము చెయ్యాలి అనే ఆలోచన రాగానే అప్పటిదాకా ఉన్న ఆలోచన రహిత స్థితి కాస్త నాకు ధ్యాన భంగమై సమాధి నుండి బయటకి రావడం జరుగుతోంది. ఇది తరచుగా నాకు జరుగుతోంది. 48 నిమిషములు అయిన తర్వాత నాకు తెలియకుండానే ఈ ఆలోచన రావటం మొదలు అవుతుంది. నాకు ధ్యాన సమాధి నుండి బయటకి రావడం జరుగుతుంది. కానీ ఈ సమాధి స్థితిలో ఉండగా కొన్ని గంటల కాలము కాస్త కొన్ని నిమిషాలలో నడిచినట్లు గా ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే నేను ధ్యానంలో కూర్చుని నాలుగు గంటల పైన ఉన్నానని అర్థం అవుతున్నది. కాలమే తెలియని స్థితి. భావము లేని స్థితి. ఆలోచన రాని స్థితి. శాంతి కలిగే స్థితి. బ్రహ్మానందము పొందే స్థితి అని మాత్రం నేను చెప్పగలను. ఇట్టి సమాధి స్థితిలో నేను ఉండగా నా మనస్సులో నుంచి వివిధ సూక్ష్మ కర్మ వాసనల వలన నేను ఎన్నో కోటానుకోట్ల జన్మల నుండి నింపుకున్న విషయ వాసనలు అనగా తీరని కోరికలు, ఇష్ట కోరిక, తీర్చే కోరికలు, తీర్చుకోవలసిన కోరికలు ఇలా అన్ని కూడా అనగా భావాలు ఆలోచనలు కర్మలు వీటి కర్మఫలాలు అన్ని కూడా నాలో నుంచి ఒక్కొక్కటి ఖాళీ అవుతున్న కొద్దీ నాలో ఉన్న కామత్వము తగ్గి దైవత్వము భర్తీ అవసాగింది. నాలో మనస్సు లేని స్థితి నేను నెమ్మదినెమ్మదిగా చేరుకుంటున్నాను అని అవగతం అవసాగింది. అంటే నా మాట తీరు నా కంటి చూపు కాస్త అన్నీ కూడా మనస్సులేని పసిపాప తీరుగా ప్రవర్తనగా మారసాగడము నేను గమనించని స్థితి అన్నమాట.అంటే ఇన్నాళ్ళుగా నాలో మనస్సు మాయ నందు ఉండుటవలన కామిగా ఉన్నాను ఇప్పుడు కాస్త ఆ మాయ పోవటంతో మాయ కాస్త మాయము అవటంతో కామికానివాడు మోక్షగామి కాలేడు అన్నట్లుగా కామి కాస్త మోక్షగామిగా మారుతున్నానని నాకు అర్ధం అవసాగింది. కానీ నేను ఏమి త్యాగము చెయ్యాలో దేనిని త్యాగం చేస్తే నాకు పరమశాంతి కలుగుతుందో నాకున్న ద్వైత భావ స్థితి నుండి అద్వైత భావ స్థితి ఎలా కలుగుతుందో మాత్రమే నాకు ఇంకా అర్థం కాని పరి ప్రశ్నలు గానే మిగిలిపోయింది. అలాగే తను శూన్య స్థితి అని తెలిసినా కూడా తను శూన్యంలో కలవకుండా ఒక శూన్య బ్రహ్మ గానే మిగిలి పోవటం జరుగుతోందని తెలుస్తోంది. అంటే నాకు ఈ ప్రపంచం ఇంకా భిన్నంగానే కనబడుతుందని కానీ నేనే ఈ ప్రపంచము అని ఈ ప్రపంచమే నేను అన్న అనుభూతి అనగా నేనే శూన్యము అని కాకుండా నేను వేరు శూన్యము వేరు అనే స్థితిలో ప్రస్తుతానికి నా సాధన స్థితి ఉన్నదని అవగతమయ్యే సరికి ఏదో తెలియని బాధ ఏడుపు నన్ను ఆవరించి సాగినాయి. అంటే నా సాధన పరిసమాప్తి అనగా నేను ఈలోకానికి భిన్నము కాదు నా స్వరూపములే ఈ స్వరూపము అనే జ్ఞాన అనుభూతి కోసం నా మనస్సు పరిపరి విధాలుగా తపన పడుతోంది. ఇది ఎలా సాధ్యమో అర్ధం అవ్వటం లేదు. ఎందుకంటే నేను దేనినో త్యాగం చేస్తే గాని నాకు అనుభూతి రాదు. దేనిని త్యాగము చేయాలో తెలియదు. అంతదాకా నేను కాస్త అద్వైత స్థితి కాకుండా ద్వైత స్థితిలోనే ఉండక తప్పదు. ఇట్టి అనుభవం అనుభూతి సిద్ధికోసం తరచుగా సవికల్ప సమాధి స్థితి పొందుతూ నేను కాస్త ఏమి త్యాగము చేయాలనే తలంపు రాగానే సాధన ధ్యాన సమాధి నుండి బయటకి రావడం జరుగుతూనే ఉంది. అంటే ఎవరైతే బ్రహ్మ చక్ర ఆధీన స్థితికి వస్తారో వారికి ఏకైక భావ స్థితి కోసం సాధన అనగా ఏకపాద శివమూర్తి లాగా సాధన చేయాల్సి ఉంటుందని నాకు అవగతమైనది. ఇట్టి చక్ర స్థితిలో సాధకుడు తను ఒక బ్రహ్మ స్వరూపమని అనుభూతి పొందసాగుతాడు.అనగా హనుమాన్ కాస్త భవిష్య బ్రహ్మగా, శ్రీ లాహిరి కాస్త శూన్య బ్రహ్మగా, శ్రీ త్రైలింగ స్వామి కాస్త జ్ఞాన బ్రహ్మగా, శ్రీరాముడు కాస్త తారకరామ బ్రహ్మగా, అమ్మవారు కాస్త ప్రకృతి బ్రహ్మగా, మహావిష్ణువు కాస్త స్థితి బ్రహ్మగా, మహాశివుడు కాస్త లయ బ్రహ్మ గాను,  వేదవ్యాసుడు కాస్త శబ్ద బ్రహ్మ గా, మహా బ్రహ్మ కాస్త సృష్టి బ్రహ్మగా, అరుణాచల రమణ మహర్షి కాస్త మౌన బ్రహ్మగా, నేను కాస్త శూన్య బ్రహ్మగా అనుభూతి పొందడం జరిగినది. కానీ నేను ఇట్టి శూన్యములో కలిసిపోకుండా శూన్య బ్రహ్మగా మిగిలిపోవడం నాకు తీరని బాధ గా మిగిలిపోయింది. సముద్రములో గవ్వగాను లేదా ముత్యములాగా లేదా పాంచజన్య శంఖము లాగా ఇలా మున్నగు రూపాలలో మిగిలిపోతే ఏమి లాభము. సముద్రములో సముద్రపు నీటి బిందువులుగా కలిసిపోతే కాని మజా రాదు. కిక్ రాదు, మరి నేను కాస్త శూన్య బ్రహ్మ అనే దానిగానే మిగిలిపోతున్నాను. నేను కానీ నేనులా మారటం లేదు. అంటే నేను ఆలోచన రహిత స్థితిని సంపూర్తిగా పొందటం లేదు. కేవలం తాత్కాలికంగానే పొందుతున్న స్థితి. మరి నాలో ఉన్న ఏకైక ఆలోచన ఏకైక భావము ఏకైక ఇష్ట కోరిక పోవాలంటే నేను ఏదో త్యాగం చేయాలి అప్పుడే కానీ నాకు సవికల్ప సమాధి స్థితి నుండి నిర్వికల్ప సమాధి అనగా ఆలోచన రహిత సమాధిస్థితి కలుగదు. కానీ నేను ఏమి త్యాగం చేయాలి అది అర్థం అయ్యే దాకా నేను నా సాధనను ముందుకే కొనసాగించాలి. ప్రస్తుతమున్న సవికల్ప సమాధి కాస్త నిర్వికల్ప సమాధి స్థితి గా మారే దాకా అంటే శూన్య బ్రహ్మ నుండి శూన్య స్థితి లోనికి పరిపూర్ణముగా వెళ్ళేదాకా ప్రస్తుత నా సాధన స్థితిని కొనసాగించాలని నాకు అవగతమైనది.ఇలా నేను చెప్పి స్థితిని పొందటానికి ఆరు సంవత్సరముల పాటు సాధన చేయాల్సి వచ్చినది. 

జిజ్ఞాసి కి ఈ చక్రానుభవాలు:

మరి నా జిజ్ఞాసి నా మనో దృష్టి యందు ప్రత్యక్షమయ్యే సరికి వాడు ఈ చక్ర సాధన అనుభవాలు నాతో చెప్పటానికి సిద్ధపడుతున్నాడు అని నాకు అర్థం అయినది. వామాచారంలో నాలుగవది అయిన ముద్రలో తను ఎంచుకున్న నరసింహ భైరవి అనే స్త్రీ గురువుతో కలిసి తను లింగముద్రతో ఆమె చేత యోని ముద్రతో ముద్ర సాధన చేయటం ప్రారంభించాడు. వీరిద్దరూ నగ్నముగా ఏకాంతముగా అర్ధరాత్రి పూట స్మశానం లో కూర్చొని ఈ ముద్ర సాధన చేయటం ఆరంభించారు. తద్వారా వీరిలో విపరీతమైన వేగంతో చాలా ఉదృతంగా కామశక్తి అదే కామకోరిక జాగృతి అవ్వటము వీరిద్దరిలో మొదలైనది. ఒకేసారి 1000 వయాగ్రా టాబ్లెట్లు వేసుకుంటే ఎంతటి కామాసక్తి కలుగుతుందో అంతకుమించిన కామకోరిక వీరిద్దరిలో మొదలైనది. మెదడు భరించలేక శరీరము తట్టుకోలేక ఊగడము ఆరంభమైనది. అయినా కూడా వీరిద్దరూ ఏమాత్రం జంకకుండా నిగ్రహశక్తి తో అలాగే సాధన చేస్తున్నారు. ఈ విధమైన అభ్యాస విధానమును ఆరు నెలల పాటు ఒకరినొకరు నగ్నత్వం చూసుకుంటూ ముద్ర సాధన చేస్తూ తమలో కామ కోరిక జాగృతి చేసుకొని దీనిని తట్టుకుని నిగ్రహ శక్తిని పెంపొందించుకొని సాధన చేయటం ఆరంభించి విజయము పొందినాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ భైరవ గురువు వీరి దగ్గరికి వచ్చి మైధున ప్రక్రియ చేయమని ఆజ్ఞాపించినారట. అంటే సాధకుడు ఎవరితో మైధునము చేస్తారో వారి యోని యందు వీర్యస్కలనం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ స్త్రీకి ఎక్కువ సార్లు భావప్రాప్తికి తీసుకొని వెళ్లి ఆమె శక్తిని తనలో ఇముడ్చు కోవాలి. అదియే మైధున సాధన అవుతుంది. ఇలాంటి సాధకుడినే వామాచారం లో అయితే అస్కలిత ఊర్ధ్వ రేతస్కుడు అంటారు. వీరి వీర్య శక్తి బయటకు రాకుండా మెదడుకి చేరుతుంది. తద్వారా మేధా నాడీ బలము చేరి విపరీతమైన జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి కలుగుతున్నాయని తంత్ర గ్రంధాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత నేను అలాగే నా బైరవి తో కలిసి మైధున ప్రక్రియ విధానము చెయ్యటం ప్రారంభించినాము. ఇందులో ఎవరు అయితే ముందుగా స్కలనం పొందుతారో వారు తమ సాధన శక్తిని ఇతరులకు మనస్ఫూర్తిగా సమర్పించవలసి ఉంటుంది. మేము కూడా ఎంతో పవిత్రమైన ఈ మైధునము ప్రక్రియను ప్రారంభించినాము. ఇందులో నేను బైరవుడు గాను ఆమె కాస్త బైరవిగా భావించుకుంటూ పూర్తి ఏకాగ్రతతో తాంత్రిక మంత్రాలు చదువుతూ శ్లోకాలను పఠిస్తూ మేమిద్దరము సంభోగిస్తూ సాధన మొదలు పెట్టినాము. కానీ మా ఇద్దరి సంభోగము కూడా కామము తీర్చుకోవటానికి అలాగే సంతానం పొందడానికి కాదని మీకు తెలుసు కదా. మా కుండలినీశక్తి మూలాధారచక్రంలో నుండి సహస్రార చక్రము దాకా చేరటానికి అక్కడ స్థిరపడటానికి పవిత్రమైన ఈ మైధున ప్రక్రియ సాధన చేస్తున్నాము. ఇందులో నేను ఆమెకి తొమ్మిది రకాల భంగిమ పుష్పాలు అనగా నవ పుష్పాలు సమర్పించాలని మా గురుదేవుడు ఆజ్ఞాపించారు. దానితో నేను ఆమెకి ఆలింగనం, చుంబనం, స్తన మర్దనము, దంత కర్మ, స్పర్శనం, విస్తృతము, వత్తిడి, ప్రవేశ ఆరంభము, ప్రవేశము అంటూ ఆమెను రెచ్చగొడుతూ భావప్రాప్తి స్థితికి నేను తీసుకుని వెళ్ళటం నేను నాకు వీర్యస్కలనం కాకుండా జాగ్రత్త పడటం ఇలా 1080 గంటల పాటు పలుమార్లు పలు విధాలుగా గురువుతో సంయోగం చెంది ఆమెకు భావ ప్రాప్తి కలిగించి నేను అస్కలిత జయము పొందటంతో నాకు దివ్యమైన పరమానంద అనుభూతి కలుగుతూ ఉండగా….  నేను ఇంకా భావాతీత స్థితి అనగా వివేక జ్ఞాన బుద్ధి పొందలేదని విషయము స్పురణకి రాసాగింది.దానితో మా మైధున పూజ క్రియ విధానము ఆగిపోయినది. 

నీల సరస్వతి అమ్మవారు
కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానం లో నీల సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చి “నా అనుగ్రహమును పొందు. నీవు అనుకున్నది సిద్ది పొందుతావు” అని అనుజ్ఞ ఇవ్వటంతో మా గురు దేవుడి దగ్గర క్రతువు పూజ విధి విధాన వివరాలు తెలుసుకొని ఒక రోజు అర్ధరాత్రి పూట ఏకాంతముగా స్మశాన మందు కూర్చొని నా స్త్రీ గురువైన నరసింహ భైరవి తో (మగువ తో) కలిసి మద్య, మాంసం తింటూ అమ్మవారి శ్లోకం స్తోత్రాలు బీజాక్షర మంత్రాలు చదువుతూ మా ఇద్దరి రక్తమును ఆమెకి మహా నైవేద్య ముగా పెడుతూ సాధన చేయటం ఆరంభించినాము. కానీ ఈమె పెట్టే మనోధైర్యం పరీక్షలకి నేను లిప్త కాలము పాటు భయ పడే సరికి లీలా మాత్రంగా అగుపించే అమ్మవారు కాస్త అదృశ్యము అయ్యేది. ఇలా పలుమార్లు జరిగినది. ఈమె పరీక్షలను ఎలాగైనా తట్టుకొని నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఆరు నెలల పైగా గడిచి పోయినాయి. నేను చాలాసార్లు ఈమె చేతిలో అలాగే రక్షణగా భక్షణ కి సిద్ధంగా ఉండే భయంకరమైన తోడేళ్ళు నుంచి దెబ్బతినే అవకాశాలు నుండి తప్పుకోవడం జరిగింది. ఏక కాలంలో ఈమె ఒక రోజు అనేక పరీక్షలు పెట్టటం వాటిని నా ఇంద్రియ నిగ్రహంతో మనోధైర్యంతో అనగా వేదవ్యాసుడు లాగా దాటుకోవటం జరిగేసరికి ఆమె కాస్త నిజరూప దర్శనం ఇచ్చి వాక్సుద్ధి, కవిత్వ శక్తి, ఊహా శక్తి, మేధా శక్తి, వివేక జ్ఞాన శక్తి అనుగ్రహించి అంతర్థానమైంది. అప్పుడు నేను కాస్త భావాతీత స్థితి అయినా వివేక జ్ఞాన బుద్ధి సిద్ధిని పొంది ఉండగా  నేను కాస్త సవికల్ప సమాధి స్థితి పొందుతున్నానని అనుభూతి పొందసాగినాను. ఈ సమాధి స్థితి యొక్క పూర్వాపరాలు అన్నీ కూడా మాకు గురుదేవుడు నాకు ముందుగానే చెప్పి ఉండటంతో నాకు అవి స్పురణకి రాసాగినాయి.నేను ఇలా సమాధి స్థితిలో మూడు రోజుల పాటు ఏకధాటిగా ఉన్న సమయంలో ఎవరో ఒక ఆయన అగుపించి లీలా మాత్రుడిగా నాతో “నాయనా! ఇట్టి సమాధి స్థితి నీకు నిలకడగా ఉండాలంటే త్యాగాత్ శాంతి అనంతరం” అని చెప్పటంతో నా సమాధికి భంగం వాటిల్లింది. దానితో నేను ఈ సమాధి స్థితి నుండి బయటికి వచ్చినాను. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఏమి త్యాగము చేయాలో అర్థం కాలేదు. త్యాగము చేస్తేనే శాంతి లభిస్తుంది అని ఆయన చెబుతున్నారు. ఈ సాధన కోసం నేను అందరినీ వదిలి పెట్టి వచ్చినాను కదా. అన్నింటిని పట్టించుకోకుండా పట్టించుకోవటం మానేశాను కదా. కానీ ఏమీ త్యాగము చేయాలో అర్థం కాని స్థితిలో మీ యోగసాధన స్థితి ఉన్నదని నాకు అర్థమైనది. మనిద్దరికీ అర్థం కాని విషయం. అసలు మనము ఏమి త్యాగము చేయాలి? దేనిని త్యాగం చేయాలి? అన్ని త్యాగము చేసిన వాడి దగ్గర ఇంకా చెయ్యటానికి ఏముంటుందో నాకైతే అర్థం అవటం లేదు. “శివ జ్ఞాని! ప్రస్తుతము ఈ సమస్య దగ్గర కొట్టుకుంటున్నాను కనుక నేను ఏమి త్యాగము చేయాలో ఈ శూన్య బ్రహ్మకి ఇంకా తెలియడం లేదు శూన్యము లో కలిసిపోకుండా నేను కేవలం శూన్య బ్రహ్మ గానే మిగిలి పోతానేమో” అని భయం నాలో మొదలైంది అంటూ నా ఆత్మ సంధానము నుండి తప్పుకోవడం జరిగింది. 

నిజ శూన్యబ్రహ్మస్ధితి లక్షణాలు:

దానితో నేను ఉన్న సాధన స్థితిలోనే నా జిజ్ఞాసి గూడ ఉన్నాడని అర్థం అయినది. వారు కూడా నాకు లాగా శూన్య బ్రహ్మ స్థితి పొందినాడు అని అవగతమైనది. మేమిద్దరము కూడా ఇలా శూన్య బ్రహ్మ స్థితి పొందిన దగ్గర నుండి మాలో తెలియని మార్పులు రావటం మొదలయ్యాయి. మాలో తెలియని ఉన్మాద స్థితి కలుగుతుందని అవగతమైంది. తను శూన్యం అని తెలిసినా కూడా శూన్య స్థితి పొంద కుండా శూన్య బ్రహ్మగా మిగిలిపోతున్నామనే బాధ ఉంది. మేము ప్రత్యేక చైతన్యము గానే ఉండి పోతున్నాము. కానీ ఈ విశ్వ చైతన్యమే ఈ శూన్య స్థితి అని అనుభూతి పొందలేక పోతున్నాము అనే బాధ మా ఇద్దరి లోను ఉంది. దానితో మా ఇద్దరికీ అనుకోకుండా ఏడుపు రావటం అంతలోనే పెద్దపెట్టున దేనికో తెలియని నవ్వు రావడం జరుగుతోంది. ఇలాంటి స్థితిలో ఉండగా ఎవరైనా మా దగ్గరికి తమ సమస్యలు తీర్చమని కోరికలు తీర్చమని తమ సందేహాలు తీర్చమని అడిగే వారి మీద అకారణముగా కోపము రావటము వారిని నానా తిట్లు తిట్టడం లేదా వాళ్ల మీదకి రాళ్లు రువ్వడం చేస్తూ వారిని మేము దూరంగా ఉంచుతున్నాము. మా సాధన స్థితి ఎలా ఉన్నది అంటే సముద్రం నీటి మీద ఒక పెద్ద నీటి బుడగ ఏర్పడినది. ముందు తనకి మాయ ఉండుట వలన ఈ నీటిబుడగ కాస్త తను ఈ సముద్రానికి భిన్నమని అనుకుంటుంది. తరువాత తను జ్ఞానము పొంది తను భిన్నము కాదని ఈ సముద్రపు నీటితోనే తను ఏర్పడిన నీటి బుడగ అని తెలుసుకుంటుంది. దానితో ఇది ఆనందపడుతుంది. సంతోషపడుతుంది. దానితో తను తిరిగి ఈ సముద్రపు నీటిలో కలవాలని అనుకుంటుంది. కానీ కలవలేక పోతుంది. ఎందుకంటే తనకి తాను పగల కొట్టుకోవడం చేతకాదు. అందుకు ఇతరుల సహాయం కావాలి. ఉన్నది తనే వేరే వాళ్ళు లేరు. ఈ బుడగ రూపంగా ఉన్న తను తిరిగి ఈ సముద్రపు జలాలలో  ఎలా కలవాలో అర్థం కాక తన్నుకుంటుంది. త్యాగము చేస్తేనే శాంతి కలుగుతుందని చెబుతున్నారు. దానికి ఏమి త్యాగం చేయాలి. మా ఇద్దరికీ అర్థము కానీ అయోమయ స్థితిలో ప్రస్తుతము మేమిద్దరమూ ఉంటే…. లేని సమస్యలు తీర్చమంటూ మమ్మల్ని వేధించటం అంత అవసరమా? అందుకే మా ఇద్దరి దగ్గరికి వేరే వాళ్ళు రాకుండా చూసుకుంటూ ఉన్నాము. మేము అర్థం కాని సమస్యని ఎలా పరిష్కరించాలో అర్ధంకాక చస్తుంటే మేము వేరే సమస్యలు ఎలా పరిష్కరిస్తామో మీరే ఆలోచించండి. మాలో కోరికలు తగ్గిపోయి నాయి. రుచులు పట్టించుకోవటం లేదు. ఆకలి అనిపించదు. నిద్రపోవాలని అనిపించదు. ఏమి పని చేయ బుద్ది కాదు. ఏమి చెయ్యలేము. ఏమి చేయాలో అర్థంకాని స్థితి. తినబుద్ధి కాదు. పడుకో బుద్ధి కాదు. పడుకుంటే లేవాలని అనిపిస్తుంది. లేస్తే తిరగాలని అనిపిస్తుంది. తిరిగితే కూర్చోవాలి అని అనిపిస్తుంది. కూర్చుంటే పడుకోవాలని అనిపిస్తుంది.పడుకుంటే లేవాలని అనిపిస్తుంది. నిద్ర రాదు. మెలుకువ స్థిరంగా ఉండదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఎవరిని కలవాలని అనిపించదు. ఎవరిని చూడాలని అనిపించదు. దేని కోసం ప్రాకులాడాలని అనిపించదు. ఏమి చేయాలని అనిపించదు. ఏదో పొందాలని అనిపించదు. పొందినామని ఆనందము అనిపించదు. బాధ అనిపించదు. దుఃఖము అనిపించదు. మానవమానాలు పట్టించుకోదు. తిట్లు పొగడ్తలు ఒకటే అనుభూతి. ఎదురు మాట్లాడాలని అనిపించదు. సమాధానం చెప్పాలని అనిపించదు. ఎవరినైనా తిట్టాలి అని అనిపించదు. దేనికి స్పందించాలని అనిపించదు.చావాలి అని అనిపించదు. బ్రతకాలి అని అనిపించదు. దేనికి బ్రతుకుతున్నామో తెలియాలని అనిపించదు. అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసుకోవాలని అనిపించదు. ఉంటే తింటాము. లేకపోతే లేదు. ఉంటే అనుభవించటం. లేదంటే లేదు. ఇది కావాలని అనిపించదు. ఇది లేదు అనిపించదు. ఇది పోయిందని బాధ అనిపించదు. దీనికి దెబ్బ తగిలిందని బాధ అనిపించదు. దీనికి రోగము వచ్చినదని భయము అనిపించదు. జననాలును చూసిన ఆనందము అనిపించదు. మరణాలు చూసిన చలించాలని అనిపించదు.పూజలు చేయాలని అనిపించదు. మంత్రాలు ప్రార్థనలు చదవాలి అని అనిపించదు. జ్ఞానము పొందాలని అనిపించదు. శబ్ద పాండిత్యము అనుభవ పాండిత్యములు పొందాలని ప్రయత్నాలు చేయాలని అనిపించదు. సత్ గ్రంథాలు పారాయణాలు చేయాలని అనిపించదు. యాత్రలు చేయాలని అనిపించదు. గుడికి వెళ్లాలని అనిపించదు. సినిమాలు చూడాలని అనిపించదు. ఆనందం ఇచ్చే వాటిని తీసుకోవాలని అనిపించదు. తపన తాపత్రయం లేవు.రాగ ద్వేషాలు లేవు. సుఖ దుఃఖాలు లేవు. అరిషడ్వర్గాలు లేవు. సప్త వ్యసనాలు లేవు. గుణాలు లేవు. కర్మలు లేవు. మాయలు లేవు. మర్మా లు లేవు. అన్నింటికి సాక్షీభూతంగా ఉండటం. అన్ని తెలుసుకుని మౌనంగా ఉండటం. దేనికి స్పందించాలని అనిపించదు. ఎవరితోనూ చర్చించాలని అనిపించదు. ఇది కావాలని అనిపించదు. ఇది లేదు అనిపించదు. ఇక ఏదో కావాలని అనిపించదు. ఇంకా ఏదో పొందాలని అనిపించదు. అన్నీ ఉంటాయి. ఏమి కావాలో తెలియదు. ఏది వాడుకోవాలని అనిపించదు. దొరికితే తినటం లేదంటే లేదు. తెలుసుకోవలసిన అవసరం ఉండదు. ఇతరులకు చెప్పవలసిన అవసరం ఉండదు.ఏదో చేయాలని అవసరం ఉండదు. మమతానురాగాలు ఉండవు. ప్రేమ ఆప్యాయతలు ఉండవు. పాపపుణ్యాలు ఉండవు. మోహ బంధాలు ఉండవు. బంధవిముక్తులు ఉండవు. మరణించిన ఏమీ లేదని బ్రతికున్న ఏమీ లేదని మట్టి బంగారము ఒక్కటేనని ఉంటాయి. వీరియందు ఇట్టి స్థితి శూన్య బ్రహ్మ స్థితి అని యోగ శాస్త్రాల ఉవాచ. ప్రస్తుతము మేమిద్దరము ఉండటానికి వేర్వేరు ప్రాంతాలలో ఉన్నప్పటికీ మా సాధన స్థితులు అలాగే మా ఆత్మ స్వరూపాలు స్థితి ఒక్కటే కాబట్టి శూన్య బ్రహ్మ స్థితిలో ఉన్నామని మాకు అవగతమైనది. మా నామరూప శరీరాలు వేరుగా ఉన్న కూడా మా ఆత్మ స్వరూపం జ్ఞానము ఒకటేనని మాకు స్పురణ అయినది. కానీ మేము ఎందుకు ఉన్నామో తెలియటం లేదు. 

అంతా నాటకమని
ఇదంతా నటన అని
జ్ఞానము పొందిన
నేను ఎందుకు ఉన్నాను.
ఎవరికి తెలుసు
 
అంతా మిధ్య అని.
అంతా మాయేనని
అంతా భ్రాంతియేనని
జ్ఞానము పొందిన నేను
ఎందుకు ఉన్నాను
ఎవరికి తెలుసు.
 
ఉన్నవాడు లేడని
లేనివాడు ఉన్నాడని
జ్ఞానము పొందిన నేను
ఎందుకు ఉన్నాను
ఎవరికి తెలుసు
 
కోరికలు తీరినాయి
ఆశలు ఆవిరి అయినాయి
సంకల్పాలు పూర్తి అయినాయి
నేను ఎందుకు ఉన్నాను
ఎవరికి తెలుసు
 
నేను అంతా ఉన్నాను
నేను ఉన్నాను
నేను కానిది లేదు
నేను లేనిది లేదు
నేను ఎందుకు ఉన్నాను
ఎవరికి తెలుసు
 
శూన్య బ్రహ్మ అయినను
మౌన బ్రహ్మ అయినను
కారణ బ్రహ్మ అయినను
త్రికాల జ్ఞాన బ్రహ్మ అయినను
భవిష్య బ్రహ్మ అయినను
నేను ఎందుకు ఉన్నాను
ఎవరికి తెలుసు
 
నాకు తెలియనిది
నేను తెలుసుకోవలసినది
ఏదో ఉన్నదని అప్పుడే
నాకు ఉన్న మాయ
మాయం అవుతుందని
తెలిసి పోయినది ఇది
తెలిస్తే నేను ఎందుకు ఉన్నాను
తెలిసిపోతుంది అని 
తీవ్ర ఆవేదనలో 
అనుకుంటూ నేను సవికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. 



సృష్టి రహస్యం వీడినది:

అప్పుడు నాకు ధ్యానము నందు చీకటి అలాగే వెలుతురు లేని సాయంసంధ్య వంటి మహా శూన్యము కాన వచ్చినది. శూన్యము అంతటా వ్యాపించి నట్లుగా ఉంది. అక్కడ మధ్యలో ఏదో ఒక దివ్యజ్యోతి బిందువు చిన్న చిచ్చుబుడ్డి వెలుగుతున్న ట్లుగా అనుభూతి కలగ సాగింది. కొన్ని క్షణాలకే ఈ బిందువు కాస్త ఒక సూర్యుడు లాగా కనిపించసాగింది. అంటే నేను దానిని దగ్గరగా నా కంటి చూపు చేరినది. మరికొద్ది సేపటికి ఈ జ్యోతి బిందువుగా కనబడసాగింది. అంటే నేను దానికి దూరంగా ఉన్నాను. దూరంగా ఉంటే ఈ జ్యోతి ఒక వెలుగుతున్న బిందువుగా దగ్గరగా ఉంటే మండుతున్న అగ్నిగుండము లాంటి సూర్యుడి లాగా నాకు కనబడుతోంది. మిగతా ప్రాంతమంతా చిమ్మ చీకటిగా ఉంది. అంటే నేను ఈ శూన్యంలో పరమ శూన్యము అన్న ప్రాంతమును చూస్తున్నానని అనుభూతి కలగ సాగింది. ఈ పరమ శూన్యములోని ఈ జ్యోతి బిందువే బ్రహ్మ చక్రములో మధ్య బిందువు అని నాకు అర్థం అయింది. ఈ జ్యోతి బిందువు నుండి అన్ని పుడుతున్నాయి. కొద్దిసేపటికి అన్ని బిందువులో లీనము అవుతున్నాయి. ఆ తర్వాత ఈ బిందువు కాస్త పరమ శూన్యములో లీనం అవుతుంది. మళ్లీ తిరిగి ఈ పరమ శూన్య నుండి ఈ జ్యోతి బిందువు రావటం ఇది కాస్త సూరీడుగా దీనినుండి ఓంకారము వినబడటం ఇది కాస్త చంద్రుడిగా మారటం దీని నుండి ఈ బిందువు నుండి మనమంతా పుట్టటం, బ్రహ్మాండాలు పుట్టటం, కొన్ని దైవ జాతులు పుట్టడం, జీవ జాతులు పుట్టడం, కొన్ని క్షణాల తర్వాత ఒక్కొక్కటి ఈ బిందువులో సహజసిద్ధంగా లయము చెందటం చివరికి ఈ బిందువు కూడా పరమ శూన్యములో లయము చెందటం జరుగుతుంది అని నాకు అనుభూతి కలగ సాగింది. 

మొదట జ్యోతి బిందువు నుండి స్త్రీ- మాత, పురుష- పితృ రూపాలు ఏర్పడినట్లు గా ఎనిమిది సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక  కాస్త మాతృ రూపము (బాల రూపము) 12 సంవత్సరముల వయస్సు ఉన్న బాలుడు పితృ  రూపము ఏర్పడినాయి. వీరిద్దరే ప్రకృతి స్త్రీ పురుషులు అయ్యి కామినీ కామేశ్వరులుగా ఈ జీవ ప్రకృతి మూల ప్రకృతికి మూల కారకులు గా ఉంటూ 84 లక్షల జీవజాతులు 36 కోట్ల దైవ జాతులు అండ పిండ బ్రహ్మాండాలు ఏర్పరచుటకు కారణభూతులై వీరికి వీరే అనంత రూపాలలో అనేక నామాలతో అనేక పాత్రలు ధరిస్తూ ఆడుతూ లయం చెందుతూ చివరికి వీరిద్దరూ కూడా దివ్యజ్యోతి బిందువు యందు లయం చెంది నామ రూపము లేకుండా మారిపోతూ పరమ శూన్యము నందు ఈ దివ్య జ్యోతి బిందువు కూడా లయం చెందుతున్నట్లు గా అనుభూతి కలగ సాగింది. ఈ దివ్య బిందువునే బ్రహ్మ జ్యోతి గాను, ఆత్మజ్యోతి గాను దివ్య జ్యోతి గాను, పరం జ్యోతి గాను మన పూర్వీక మహర్షులు పిలవటం జరిగినదని ఇదియే జీవ సృష్టి రహస్యం అని ఇది అంతయు ఈ బ్రహ్మ చక్రము నందు జరుగుట వలన బ్రహ్మయే విధాత బ్రహ్మగాను,  సృష్టి బ్రహ్మ గాను,  కారణ బ్రహ్మ గాను, భవిష్యత్తు బ్రహ్మ గాను ఉంటున్నాడని కొన్ని క్షణాల తర్వాత ఈ బ్రహ్మ కాస్త మరణమును పొంది బ్రహ్మ కపాలముగా మారుతున్నాడు అని ఈ కపాలములను సేకరించి మహాకాలుడు మహా కాళికా మెడలో బ్రహ్మ కపాలం మాలగా వేసుకుంటున్నారని అంటే వీరి వయస్సులు వరుసగా ఎనిమిది, పన్నెండు సంవత్సరములు మించి ఉండదని వీరే ఈ సృష్టి స్థితి లయ కారకులు అని ప్రకృతి స్త్రీ పురుషులని అనుభూతి కలగగానే నాకు ధ్యానము భంగమై సమాధి స్థితి నుండి బయటికి రావడం జరిగినది. 

శ్రీ లాహిరి మహాశయులు యొక్క ఈ చక్రానుభవాలు

ఇలాంటి అనుభవం అనుభూతి తాను కూడా పొందినట్లుగా శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో(పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి గ్రంథ) రాసుకోవడం జరిగినది. ఆయన జ్యోతి బిందువుని ఆత్మ సూర్యుడు గాను మరికొన్నిచోట్ల బ్రహ్మ జ్యోతి గాను సంబోధించడం జరిగినదని అలాగే వీరికి ఈ జ్యోతి బిందువు నుండి స్త్రీ- మాత, పురుష- పితృ రూపాలు ఏర్పడినట్లు గా అనగా ఎనిమిది సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక అనగా కాస్త మాతృ రూపము (బాల రూపము) 12 సంవత్సరముల వయస్సు ఉన్న బాలుడు పితృ  రూపము ఏర్పడినట్లుగా ధ్యానానుభవాలు కలిగినట్లుగా నాకు అర్థమైనది. ఇలాంటి దివ్య జ్యోతి దర్శనం నా జిజ్ఞాసికి గూడ అయినట్లుగా తర్వాత నాకు తెలిసినది. అలాగే శ్రీ శంకరాచార్యుడుకి, శ్రీ  త్రైలింగ స్వామికి, రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి ఈ జ్యోతి బిందువు దర్శనము పొందినట్లుగా అలాగే ఇందులో ప్రకృతి స్త్రీ -పురుషుల యొక్క బాలిక- బాలుడు దర్శనాలు పొందినట్లుగా వారి చరిత్ర లో చూడడం జరిగినది. కానీ అప్పుడు నేను వీటిని నమ్మలేదు. ఇప్పుడు నాకు నా స్వానుభవం అయిన తరువాత నమ్మక తప్పటంలేదు. ఇంతటితో దక్షిణాచారం లో నేను చేస్తున్న తాంత్రిక సాధన అలాగే మా జిజ్ఞాసి చేస్తున్న వామాచారం లోని తాంత్రిక సాధనకి పరిసమాప్తి అయినది. చివరికి మళ్లీ మేమిద్దరమూ కూడా దక్షిణాచారంలో రాబోవు చక్రాల సాధనను కొనసాగించడం జరుగుతుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు. మాతో ముందుకు కదలండి. అయ్యలారా అమ్మలారా యోగ భక్తులారా.

శుభం భూయాత్
 
పరమహంస పవనానంద
*****************************************

గమనిక: ఈ బ్రహ్మ చక్ర సాధన స్థితిలో మనకి దైవిక వస్తువులు గా కపాలమాలలు, బొమ్మ వంటి అస్థిపంజరాలు వస్తాయని నా స్వానుభవంలో నేను తెలుసుకున్నాను. విచిత్రం ఏమిటంటే అందరికీ కూడా ఈ చక్ర స్థితిలో ఇలాంటి వస్తువులు రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది. బ్రహ్మదేవుడు యొక్క అంత్య రూపమే బ్రహ్మకపాలం అని వివిధ హైందవ మత గ్రంధాలు చెప్పకనే చెప్పినాయి కదా. అందుకే మనకి ఈ దైవిక వస్తువులు వస్తాయని నాకు అర్థం అయినది. అలాగే ఈ చక్ర మధ్య బిందువు అయిన జ్యోతి బిందువుకి అధి దైవముగా శ్రీ ఏకపాద శివ మూర్తి ఉంటాడని ఈయనే చిదంబర నటరాజ స్వరూపం అని నాకు ఎరుక అయినది. అలాగే ఈయన దైవిక వస్తువులుగా పాదరస లింగం, ఏకముఖి రుద్రాక్ష అని తెలిసినది. నాకు కాశి క్షేత్రం నుండి మా అయ్య ద్వారా అనగా నా మంత్రగురువు నుండి ఈ పాదరస లింగం రావడం జరిగినది. అలాగే మా ముత్తాత గారైన బుద్ధు కుటుంబరావు గారి కళ్ళేపల్లి ప్రాంతము నుండి ఏకముఖి రుద్రాక్ష రావటం యాదృచ్చికంగా జరిగినాయి. అలాగే మా యోగ మిత్రుడైన జిజ్ఞాసికి కూడా ఈ చక్ర సాధన స్థాయిలో ఉండగా ఎవరో కోయ జాతి వాళ్ళు వీరికి ఏకముఖి రుద్రాక్ష ఇవ్వటం జరిగినది అని దానిని శివాలయానికి ఇచ్చి వేసినానని నాకు చెప్పటం జరిగినది.

నేను ఎందుకు ఉన్నాను అనే నా ప్రశ్నకి సమాధానంగా కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి వారి మహా స్వామి వారి జీవిత చరిత్ర గ్రంథమైన నడిచే దేవుడు అనే గ్రంథము సమాధానము ఇచ్చినది. ఈ పుస్తకం యొక్క ఆఖరి అట్టపైన ఈ క్రింది విధముగా వ్రాసి ఉన్నది. అది చదువుతుంటే నాకు చంద్రశేఖర సరస్వతి సూక్ష్మ ధారి నా మనోనేత్రం ముందు కనిపించినట్లుగా స్వయంగా ఆయనే నాతో నాకు చెప్పినట్లుగా నా ప్రశ్నకి సమాధానం చెప్పినట్లు గా అనిపించసాగింది.

 నేను జీవించి ఉండటం దేనికి? 

"భగవంతుని సన్నిధిలో తమ బాధలు చెప్పుకుంటే అవి నివృత్తి అవుతాయని భక్తులకు ఒక నమ్మకం ఉన్నది. అయితే ప్రజలందరికీ ఈ భగవత్ సన్నిధి సరిగ్గా పూర్తిగా లభించడం లేదు. నాలో ఇట్టి భగవత్ సన్నిధి ఉన్నది అని నమ్మి అమాయకంగా వీరంతా నా వద్దకి వచ్చి భగవంతుడికి చెప్పుకున్నట్లుగా నాతో కూడా తమ కష్టసుఖాలు చెప్పుకుని తృప్తిగా వెళుతున్నారు. అట్టివారి ఈ నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి. ఈ మాత్రమైనా వారిలో ఇలాంటి భగవత్ చింతన ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. తమ కష్టాలు చెప్పుకుంటే వినటానికి కాకపోతే అసలు నేను ఎందుకు జీవించి ఉండాలి. ఇందువలన నా శరీరానికి శ్రమ కలిగిన నా మనోబలము క్షయమైన నాకే కొదువా లేదు. నేను వీరికి తోడుగా నీడగా ఉన్నానని సంతృప్తి నాకు పరమావధి. పరమానందము. ఇట్టి నిత్య స్థితి పొందుటకు నేను జీవించి ఉన్నాను"- శ్రీ చంద్రశేఖర సరస్వతి

ఇది చదివిన తర్వాత నా వలన ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమము జరగాలని అందుకే నేను ఉన్నాను అనిపించినది. కొన్ని సం!!రాలు తర్వాత ఈ గ్రంథ రచన వలన పరమాత్మలు,దేవతలు,యోగులు,గురువులు,జీవులు ఇలా మున్నగు వారికి వాళ్ళకి కలిగిన దైవధ్యానానుభవాలకి సత్యనిరూపణముగా ఈ కపాలమోక్షం గ్రంథము నిలిచినదని స్వయంగా జగత్ గురువైన విశ్వప్రకృతి కాస్తా దైవికవస్తువులతో, కలలో కనిపించిన ధ్యానుభవాలు ఇలలో చూపించడం చేసేసరికి అదిగూడ పంచభూత సాక్ష్యంగా నిరూపణ చేసి చూపించేసరికి నేను ఎందుకు ఉన్నానో నాకు తెలిసినది.ఈ చిట్టచివరి ప్రారబ్ధకర్మ యొక్క కర్మశేషం లేకుండా సంపూర్తిగా తీరేసరికి నాకు శ్వాసతో పని ఉండదని అర్ధమైనది.

********************
నా సాధన పరిసమాప్తి సమయములో

నా సాధన పరిసమాప్తి సమయములో నేను రాజస్ధాన్ లోని పుష్కర్ బ్రహ్మదేవాలయ దర్శన యాత్రలో ఉండగా అక్కడ ఒక ఆనందభైరవ సాధకుడు అగుపించాడు.ఏదో సాధన సందేహ సమస్యతో ఉన్నాడని నాకు అనిపించి వారి దగ్గరికి వెళ్ళితే ఆయన నాతో “స్వామి!కనిపించే జీవుడు సత్యమా?కనిపించని దేవుడు సత్యమా?ఏది సత్యము? ఏది అసత్యమో తెలియడము లేదు” అనగానే అపుడు నేను వారితో "స్వామి!నిజానికి ఏది సత్యము గాదు.యత్ భావము తత్ భవతి!చివరికి జీవుడైన...దేవుడైన అంతరించేపోయేవాళ్ళే!ఏవరు ఏది శాశ్వతము గాదు!ఏది నిత్యము గాదు!ఏది సత్యము గాదు! నామరూప దేవుళ్లు అందరుగూడ మానవులుగా పుట్టి మాధవుడిగా మారి తమ అవతారాలను పరిసమాప్తి చేసుకున్నవాళ్ళేగదా! మనకి కనిపించేది అంతాగూడ కాలనుగుణముగా క్షణానికి ఒకమారు మార్పుచెందుతూ అంతరిస్తూ...కొత్తదానితో ఉద్భవిస్తూంటుంది.అంటే ఇది శాశ్వతముగాదని తెలుస్తోంది గదా! ఇక మనకి అగుపించని పరమశూన్యం గూడ అది ఉన్నదో లేదో ఏవరికి ఏరుక!ఇది ఆకాశము లాంటిది.ఆకాశము చూడటానికి అది ఉన్నట్లుగా కనబడుతుంది.తీరా మనము ఆకాశములోనికి వెళ్ళితే మేఘాలు తప్ప ఆకాశము కనిపించదు. కాబట్టి మనమంతా గూడ,మన దైవాలంతాగూడ పరమశూన్యము నుండి ఉద్భవించిన అశాశ్వత శూన్యబ్రహ్మలమే! అంతరించిపోయిన శూన్యము నుండి అంతరించిపోయే శూన్యబ్రహ్మలు వస్తున్నారని గ్రహించు! ఎవరు ఎక్కువ గాదు!ఎవరు తక్కువ గాదు!ఎవరు శాశ్వతము గాదు!ఎవరు సత్యము గాదు! నిజానికి ఇద్దరు లేరు!ఉన్నది ఒక్కటే!జీవుడే దేవుడు!దేవుడే జీవుడు!అపస్మారకస్ధితిని పొందినవాడు జీవుడు అనగా తనకి తెలిసిన జ్ఞానమును మర్చిపోయినవాడు అన్నమాట! తన జ్ఞానతపస్సుతో అపస్మారకస్ధితి నుండి తిరిగి జ్ఞానస్ఫురణతో తన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకొనేవాడు దేవుడు అన్నమాట! అంటే అహంబ్రహ్మస్మి:నేనే దేవుడు!జీవుడు కాస్త దేవుడు అవ్వడము అన్నమాట! అగుపించని పరమశూన్యము నుండి శూన్యబ్రహ్మగా నామరూపదేవుడు వస్తాడు!ఈయన అపస్మారకస్ధితిని పొందితే జీవుడు లేదంటే దేవుడు అని గ్రహించు!ఇది అంతాగూడా నేను అనే ఏకత్వస్ధితిలో ఉంది!నేనే జీవుడు లేదా నేనే దేవుడని భావించవచ్చును! అదే నేను ఉన్నాను అనుకుంటే కనిపించే విశ్వప్రపంచమంతాగూడ సత్యములాగా కనపడుతుంది!అదే నేనులేను అనుకుంటే సత్యము అనుకొనేది కాస్త అసత్యముగా కనపడుతుంది!అనగా సమాధిస్ధితి ముందు అసత్యమైనది కాస్త సత్యముగా కనపడుతుంది!అదే సమాధిస్ధితిలో ఏది సత్యముగా కనిపించదు!ఏది శాశ్వతమని,సత్యమని,నిత్యమని అనిపించదు! అంతే తేడా! అపుడిదాకా సత్యముగా కనిపించే “నేను” కాస్తా అసత్యమై “నేను లేను” అనే జ్ఞానస్ఫురణను పొందుటయే నిజ ఆనంద సచ్చిదానందస్ధితి యని గ్రహించు! అని చెప్పి మౌనముగా అక్కడనుండి నేను లేను అని వెళ్ళిపోవడము జరిగినది!

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. unit 61: brahma chakram rendu bhaagalugaa untundi ani madhyalo oka binduvu vantidi untunndani...ee chakram valla manaki
    anniti yandu dwaitha bhaavlu kaluguthuntayani, evarikaithe sthira sthithi kaluguthudo vaariki ee
    chakram aadheenam aythundani...ekapaadha shivudu onti kaali meeda thapassu cheyatam valla eeyana ki aa peru vachindani
    ...ela cheyalo em cheyalo thelidu kaani omkaaram maatrame cheyalani anipinchatam,
    megha gharjanalu vinabaduthayani saadhakudu bhayapadi bayatiki raakudadani,ee brahma chakraniki adhishtaana daivam
    brahma devudani,mudrala valla sthira manassuga, buddhi nilakadagaa, aalochana leni viveka buddhi sthithi kaluguthundani...kapaala
    maala,asthipanjaram mee raaboye janma spurana kalgatam,taraka raama naamam vinabadatam,rendu bramarakeetakala tho ela edantha
    jarguthundani alage advaitam loniki vachi anni nene ani thelsukovalani,shivathaandavam jaragatam andulo srushti ela
    jaruguthundani,shivudi veeryame paadarasa lingam ani ammavaari chevi duddi shabdhaniki malli antha jargatam, ika ekapaada shivudu ante
    nataraja swamy ani ee chakra daivika vasthuvulu paadarasa lingam, eka mukhi rudraksha ani,,,,thyagamtho advaitam loki vellochani...
    shunya brahma nundi shunya sthithilonniki maarataniki prayatnalu,shunya brahma sthithi ante lakshanalu ela untayi,asalu srushti
    ela jarigi ela layam chendi malli modalavuthundo cheppatam mee anubhavalu laahiri gaari anubhavalatho kalavatam
    enduku inka brthike unnaru anedaaniki samaadhanam bagundi.

    రిప్లయితొలగించండి