నల్ల రంగయ్య నాకోసం వచ్చాడు:
(నా మణిపూరక చక్ర అనుభవాలు)
మణిపూరక చక్రం స్థితి నా డైరీలు:
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
ఈ చక్రము నందు సాధారణముగా సాధకుడికి వారి ఇష్టదైవము ఈ చక్ర అధిదైవముగా ఉంటారని గ్రహించండి. అంటే మనకి ఈ చక్రము నందు వారి ఇష్టదైవము కాస్తా సాధకుడికి సజీవమూర్తిగా దర్శనమిస్తారు.అదే మన ఆజ్ఞాచక్రము నందు అయితే ఈ ఇష్టదైవము సాక్షాత్కరమవుతారని గ్రహించండి.దర్శనములో మనతో మాట్లాడరు.అదే సాక్షాత్కరములో మానుష్యరూపేణ మాట్లాడుతారు అని తెలుసుకొండి. నాకు ఈ చక్రము నందు ఇష్టదైవముగా పండరీపుర పాండురంగడు ఉంటే...అదే ఈ చక్ర ఇష్టదేవతమాయగా బాల అమ్మవారుగా అందరికి ఉంటారని గ్రహించండి. ఈ ఇష్టదేవత దర్శన మాయను 60% దాటలేకపోయినారని...అలాగే ఇష్టదేవత సాక్షాత్కర మాయను 80% మంది దాటలేదని నా పరిశోధనలో గ్రహించాను.
డిసెంబరు 1: ఈ రోజు నేను ధ్యానం చేస్తున్నప్పుడు గతంలో నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు స్ఫురణకు రావటంతో నా ధ్యానభంగమైనది.నేను ధ్యానం ఆపివేసిన ఈ ఆలోచనలు వదలడం లేదు.
డిసెంబరు 2: ఈ రోజు విచిత్రంగా నేను ప్రేమలో ఉన్నప్పుడు నన్ను మోసం చేసిన అమ్మాయిలు చాలా బాగుగా గుర్తుకు రావడంతో నా ధ్యానభంగమైనది.
డిసెంబరు 5: ఈ రోజు నన్ను బాధ పెట్టిన వ్యక్తి సంఘటనలు బాగా గుర్తుకు వస్తున్నాయి. నా ధ్యానం ఆగినది.
డిసెంబరు 7: ఈ రోజు నా వలన బాధలు పడిన వారు నాకు గుర్తుకు రావటం మొదలైంది. ఇలా ఇది ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో అర్థం అయ్యి చావడం లేదు.
డిసెంబరు 10: ఈ రోజు నేను చేసిన మంచి పనులు గుర్తుకు రావటం మొదలయింది. దానితో నా మనస్సు ఆనందమైంది.
డిసెంబరు 12: ఈ రోజు నా వలన మేలు పొందిన వ్యక్తులు నన్ను కలవడానికి వచ్చారు. నన్ను పొగడ్తలలో ముంచి వెళ్ళినారు.
డిసెంబరు 13: ఈరోజు పొగడ్తల మాటల వలన నా మనస్సు విపరీత ఆనంద ఆలోచనలతో ఉండటంతో ధ్యానం ఆగినది.
P2:
నాకు వచ్చిన తొలి పంచలోహ పాండురంగ రుక్మిణీ విగ్రహ మూర్తులు
డిసెంబర్ 15: ఈ రోజు విచిత్రంగా పండరీపురం క్షేత్రం నుండి అంగుళం ఉన్న పంచలోహ పాండురంగ రుక్మిణీ విగ్రహ మూర్తులు వచ్చినాయి. పూజ లో ఉంచినాను.
డిసెంబరు 18: ఇది ఈరోజు నా బొడ్డు నుండి విపరీతమైన నొప్పి మొదలైంది. నాకు ధ్యానం భంగమైంది.
డిసెంబరు 22: నాకున్న బొడ్డు నొప్పి తగ్గడం లేదు. బాగా పెరుగుతోంది. మందులు వాడాలి అనుకున్నాను.
డిసెంబరు 25: మందులు వాడిన నొప్పి తగ్గకపోగా బాగా పెరుగుతుంది. ధ్యానం మీద ధ్యాస కుదరటంలేదు.
డిసెంబర్ 26: ఇదే విషయం మా గురుదేవునిని అడిగితే “బొడ్డు ప్రాంతంలో ఉండే మణిపూరక చక్రం జాగృతి అయినదని చెప్పినారు. గతంలో జరిగిన ఆనంద బాధాకరమైన సంఘటనలు గుర్తుకు చేయటం ఈ చక్ర లక్షణం అని చెప్పడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. పైగా ఈచక్ర శుద్ధి కోసము ఇష్ట దైవారాధన చేస్తూ త్రాటక క్రియ చేసుకోమన్నారు”. ఏమి జరుగుతుందో చూడాలి.
డిసెంబరు 28: త్రాటక క్రియ విధానం రెండు గంటలకు పైగా చేశాను. కన్నీళ్ళు ఆగటం లేదు. నేను బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం మీదనే త్రాటక క్రియ చేశాను. ఎందుకంటే నాకు అమ్మ అన్నా అమ్మవారు అన్నా అంత పిచ్చి మమకారము.
P3:
డిసెంబర్ 30: ఈ చక్ర శుద్ధి కోసం గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి పొందుతూ ధ్యానమును ఆరు నెలల పాటు చేసుకొమ్మని మా గురుదేవుడు చెప్పినాడు. అప్పుడే ఈ చక్రము శుద్ధి అవుతుంది అని చెప్పటం జరిగినది.
జూన్ 12: ఈ ఆరు నెలల పాటు త్రాటక క్రియ అలాగే మణిపూరక చక్ర ధ్యాన విధానము చేసి ఈ రోజుతో ఆరు నెలలు అయినది.
నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహ మూర్తి అయిన పాండురంగడు విగ్రహ దర్శనం
జూన్ 18: ఈ రోజు నాకు ధ్యానంలో ఒక నల్లని శిలా విగ్రహ మూర్తి అయిన పాండురంగడు విగ్రహము కనిపించినది. ఇది కాస్త పండరీపురం పాండురంగడు కాదు కదా.
నాకు వచ్చిన హనుమంతుడి చిన్న పూజ గంట
జూన్ 20: ఈరోజు నాకు ధ్యానము నందు లీలగా చిన్నగంట మ్రోగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక నాదం లీలగా వినబడినది. విచిత్రంగా అనిపించింది.
జూన్ 21: ఈ రోజు చిన్నగంట నాదము బాగా స్పష్టంగా లీలగా వినబడింది. ఈరోజు మా అమ్మ తన దగ్గరున్న చిన్న హనుమంతుడి పూజ గంటను నాకు ఇచ్చినది.దీనిని మ్రోగిస్తే నాకు ధ్యానములో వినిపించే చిన్నగంట శబ్ధనాదములాగా ఉండటము నాకు ఆశ్చర్యమనిపించినది. ఈనాదమును కాంస్యనాదమని శబ్ధనాదబ్రహ్మ ఉవాచ.
జూన్ 22: ఈ రోజు నాకు ధ్యానంలో పది దళాలు ఉన్న పసుపు పచ్చని పద్మము కనిపించినది. ఈ పద్మములో 'రం' అనే మూల బీజాక్షరము కనిపించి అదృశ్యమైనది. నాకోసం కోణార్క్ సూర్య దేవాలయం నుండి సూర్య స్పటికము తీసుకొని వచ్చాడు. అంటే ఇది పంచాయతన పూజలో సూర్యుడికి ప్రతీకగా వాడే శుద్ధస్ఫటికమని... అందుకే ఇది నాకు వచ్చినదని గ్రహించి... దానిని ముట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది.
జూన్ 25: ఈ రోజు నాకు ధ్యానములో 5 సంవత్సరముల పసిపాప నవ్వుతూ దీవిస్తూ సజీవమూర్తిగా కనబడింది. ఆ పాప నవ్వులో ఏదో తెలియని సమ్మోహన శక్తి ఉన్నట్లుగా అనిపించింది. ఎరుపు లంగా పసుపు జాకెట్ వేసుకున్న పాప కనిపించడం దేనికో అర్ధమై చావడం లేదు.
జూన్ 28: ఈరోజు నాకు వారసత్వముగా మా ముత్తాతులు పూజించిన సిద్ధదుర్గబాలయంత్రము వచ్చినది.ఇది ఒకటి ఉన్నదని తెలిసినది.
జూన్ 30: ఈరోజు నాకు ధ్యానములో అగ్ని ప్రమాద దృశ్యం కనబడింది. కానీ అది ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదు. కేవలం ప్రమాద దృశ్యం కనిపించింది.
P4:
జూలై 8: ఈ రోజు నాకు ధ్యానము లో విమాన ప్రమాద దృశ్యం కనిపించింది. అది ఎక్కడ జరుగుతుందో మాత్రం కనిపించడం లేదు.
జూలై 12: మూడు రోజుల క్రితం నాకు అగుపించిన విమాన ప్రమాద దృశ్యాలకి సంబంధించిన వివరాలు ఈ రోజు పేపర్లో చదవటం జరిగింది. నాకు కనిపించిన దృశ్యాలు కొంపదీసి ఎవరైనా ఫోటోలు తీసినారా అని అనిపించింది.
జూలై 15: నాకు ఇదివరకు ధ్యానములో కనిపించిన అగ్నిప్రమాదం మా స్నేహితుడి ఇంట్లో జరిగినట్లుగా తెలుసుకొని ఆశ్చర్యం చెందినాను. అంటే నాకు జరగబోయే ప్రమాదాలు ఎలా తెలుస్తున్నాయి.
జూలై 20: ఈ రోజు నాకు నిద్రలో ఏదో ఎక్కడో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగినట్లుగా ఎంతో మంది పిల్లలు, పెద్దలు, యువకులు, ఆడవాళ్లు చేసే ఆర్తనాదాలు నా చెవులకు విపరీతంగా వినిపిస్తుంటేసరికి నాకు నిద్ర పట్టడం లేదు. ఎక్కడ ఈ ప్రమాదం జరుగుతోందో అర్థం కావడం లేదు.
జూలై 21: ఈరోజు పేపర్ చదివితే నాకు రాత్రి కలలో కనిపించిన రైలు ప్రమాద సంఘటన వివరాలు చదువుతుంటే నాకు కనిపించిన దృశ్యాలు యదార్ధమని తెలిసేసరికి నాలో తెలియని భయం మొదలైంది.
P5:
జూలై 22: ఈ రోజు ధ్యానము అయిన తర్వాత నాకు విపరీతమైన వాంతులు అయ్యాయి. ఎందుకో తెలియదు.
జూలై 25: ఈ రోజు నాకు విపరీతంగా కడుపులో త్రిప్పడం వాంతి అయ్యే భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ పైత్యము చేసినదా?
జూలై 30: ఈ రోజు విచిత్రముగా నా నోటిలో పొక్కులు రావడం గమనించాను. అసలు నాకు ఏమి జరుగుతుందో గురు దేవుడిని అడగాలి.
ఆగస్టు 2: దీనిని గూర్చి గురు దేవుడిని అడిగితే “ప్రమాద దృశ్యాలు నీకు కనబడుతున్నాయి అంటే నీకు దూర శ్రవణ సిద్ధి వచ్చినది అని అనగా దీని వలన రేడియోలాగా ప్రమాద దృశ్యాలు చూడటమే జరుగుతుందని కానీ ఎక్కడ జరుగుతాయో తెలియదు” అని చెప్పడం జరిగినది. అలాగే ఈ చక్రము బలం కలగటానికి పవనముక్తాసనం,'రం' బీజాక్షర ధ్యానము వల్ల ఈ చక్ర సంబంధిత సమస్యలు రావని చెప్పడం జరిగినది.
ఆగస్టు 6: ఈ గురుదేవుడు చెప్పినవి చేస్తున్నప్పటి నుండి నాకు కడుపులో తిప్పటం, వాంతులు తగ్గటం, బొడ్డు నొప్పి తగ్గుతున్నట్లుగా అనిపించసాగింది.
P6:
మా గుడి అమ్మవారు (భ్రమరిబాలాత్రిపురసుందరిదేవి)
ఆగస్టు 8: ఈ రోజు నేను పూజ చేస్తున్న అమ్మవారి విగ్రహ మూర్తి ఒక లిప్త కాలము పాటు సజీవమూర్తిగా కనిపించినట్లుగా అనిపించినది.
ఆగస్టు 15: ఈరోజు నాకు ధ్యానంలో మా అమ్మ వారి విగ్రహ మూర్తి కనిపించసాగింది. కొద్దిసేపటికి ఈ విగ్రహమూర్తి పెదవులు కదుపుతూ ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపించినది కానీ ఆ మాటలు చెవికి చేరడం లేదని అర్థమైంది.
ఆగస్టు 20: ఈ రోజు నేను నా పని హడావిడిలో అమ్మవారికి నైవేద్యం పెట్టలేదు. ఆ విషయం మర్చిపోయాను. కాని అమ్మ ఒంటి మీదకి ఆ అమ్మవారు వచ్చి నాకు భోజనం పెట్టలేదు గుర్తు లేదా అని గద్దించేసరికి అప్పుడు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది.
P7:
ఆగస్టు 22: ఈ రోజు అమ్మవారి దీపపు సెమ్మె నా కాలు మీద పడినది. వెలుగుతున్న వత్తి దీపము నా కాలు మీద పడిన ఏమీ కాకపోవడం విచిత్రంగా అనిపించింది.
ఆగస్టు 25: ఈ రోజు అనుకోకుండా హోమములో కొబ్బరి కాయ పడితే యధాలాపముగా హోమాగ్నిలో చెయ్యి పెట్టి కాయ బయటికి తీసాను. నా పంచెకు గాని,నా ఉత్తరీయంకు గాని, నా చేతికి గాని అగ్ని ఎలాంటి హానీ కలిగించలేదు.
సెప్టెంబరు 1: ఈ రోజు నేను సరిగ్గా మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాను.అయిన భానుడి వేడిమి నన్ను ఏమీ చేయలేదు. పైగా చల్లగా అనిపించసాగింది.
సెప్టెంబరు 5: ఈ రోజు బాగా మరిగిన వేడి నీళ్లు నా కాళ్ళ మీద పడినాయి. కానీ ఎలాంటి బాధ కలగలేదు. అసలు నాకు ఏమి జరుగుతుంది. ఒకవేళ నేను స్పర్శాజ్ఞానమును కోల్పోతున్నానా లేక వేరే ఏదైనా …. నా మా గురు దేవునిని అడగాలి.
సెప్టెంబరు 8: ఈరోజు మా గురు దేవుడిని కలిశాను. దానికి ఆయన నవ్వుతూ “నాయనా! నీకు అగ్ని మీద ఆధిపత్యం సిద్ధి వచ్చినది. అగ్ని వలన నీకు ఎలాంటి ప్రమాదాలు, భయాలు ఉండవు. సాక్షాత్తు అగ్ని దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు” అని చెప్పినారు.
సెప్టెంబరు 9: మా గురు దేవుడు చెప్పినది నిజమా కాదా అని నేను అగ్ని మీద పరీక్షలు చేయటం మొదలు పెట్టినాను. హోమాగ్ని దగ్గరకు వెళ్లి “అంత తీవ్రంగా ఉండవలసిన అవసరము లేదు. నీ తీవ్రతను తగ్గించు” అనగానే ఎవరో చెప్పినట్లుగా అప్పటిదాకా ఉగ్ర జ్వాలలతో మండుతున్న హోమాగ్ని కాస్త పిల్ల జ్వాలలతో మండే స్థితికి వచ్చే సరికి నాకు తెలియని భయం మొదలైంది.
P8:
సెప్టెంబరు 15: ఈరోజు బాలాత్రిపురసుందరి అవతారం. బాగా అమ్మవారికి చీర కట్టినాను. అలంకారం బాగా కుదిరింది అనుకుంటున్న సమయములో నా దగ్గరకి ఐదు సంవత్సరముల పిల్లకాయ గుడి లోనికి వచ్చి “ఇలా కట్టు. ఇక్కడ ఇది పెట్టు. అక్కడ ముక్కుపుడక సరిగ్గా పెట్టు.చులాకీ సరిగ్గా పెట్టు. గాజులు పెట్టు” అంటూ చెప్పుకుంటూ పోతుంది. నేను ఆమె ఎవరు అని గమనించకుండా పట్టించుకోకుండా కేవలం విగ్రహమూర్తి మీద ఏకాగ్రతను పెడుతూ ఆ పిల్లకాయ చెప్పే పనులు ఈ విగ్రహం మూర్తికి చేస్తున్నాను. అలంకారం పూర్తి అయినది. ఈ పిల్లకాయ అంతర్ధానమైంది. పాప నువ్వు చెప్పినట్టుగానే అలంకారం పూర్తి చేసినాను కదా. బాగానే ఉందా అని అడిగేసరికి పిల్లకాయ అదృశ్యమైనది.ఈ పిల్లకాయ ఎవరు?అసలు గుడిలోకి ఎలా వచ్చింది అని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టినాను.
సెప్టెంబరు 15: ఈ రోజు రాత్రి అలంకారంలో నాకు సహాయపడిన పిల్లకాయ మళ్ళీ కనిపించి నేను పూజించే బాలాత్రిపురసుందరి విగ్రహమూర్తి లోనికి సజీవమూర్తిగా వెళ్లి అదృశ్యమైనది. అంటే ఇష్ట దేవత సాక్షాత్కారమైనది అని నాకు అర్థం అయింది.కాకపోతే పని హడావిడిలో ఈమెను గమనించలేదు. అదే నా స్థానములో రామకృష్ణ పరమహంస ఉండి ఉంటే విగ్రహమూర్తి అలంకారము చేయడానికి బదులుగా ఈ పిల్లకాయకి చేసేవారు.
సెప్టెంబరు 20:ఈరోజు మా స్నేహితులకి నాకు వచ్చిన అగ్ని మీద ఆధిపత్యం ప్రదర్శించడం మొదలు పెట్టాను. నాకు నేను ఈ చక్రం బలహీన పరచుకుంటున్నానని గమనించలేదు.
P9:
సెప్టెంబరు 25: ఈ రోజు అనుకోకుండా పండరీపురం క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ నుండి ఒక అంగుళం పంచలోహ పాండురంగ రుక్మిణీ విగ్రహ మూర్తులు తెచ్చుకోవడం జరిగినది.
అక్టోబరు 1: ఈ రోజు జీర్ణశక్తి బాగా మందగించినట్లు గా అనిపించింది.
అక్టోబరు 5: ఈ రోజు అన్ని పనులయందు తొందరపాటుతనం కనిపించినది.చురుకుదనం తగినది.
అక్టోబరు 8: ఈ రోజు కళ్ళు విపరీతంగా నొప్పులు కలుగుతున్నాయి.
అక్టోబరు 10: కండరాలు విపరీతంగా నొప్పి కలిగి ఉన్నాయి.
అక్టోబరు 11: నిద్రపట్టటం లేదు. తల దిమ్ముగా ఉన్నది.
అక్టోబరు 15: ఈ రోజు బాగా క్రుంగిపోయాను. నా గురించి నాకే తక్కువ అంచనా వేసుకున్నాను. నాకు ఏదో అనారోగ్య సమస్యలు మొదలు అవుతున్నాయి.ఒక వేళ ఈ చక్రం గాని బలహీనపడటం లేదు గదా. గురుదేవుడిని అడగాలి.
అక్టోబరు 18: మా గురు దేవుడికి నాకున్న అనారోగ్య సమస్యలు గురించి చెబితే ఆయన తిట్టినారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే అగ్నితత్వ సిద్ధి ప్రయోగాలు చేస్తూ మా స్నేహితుల ముందు గొప్పలకు పోయినానో ఆ క్షణమే ఈ చక్రం బలహీన పడటం ఆరంభమైనదని చెప్పటం జరిగినది. అందుకే ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ చక్రం తిరిగి బలం పుంజుకోవడానికి బెల్లం పొంగలి,మాగిన అరటిపండ్లు, ఉసిరికాయలు తినమన్నారు. అలాగే సూర్య ముద్ర,అగ్ని సార ముద్ర,అపాన ముద్ర,ఉద్దీయాన బంధన ముద్రలు వెయ్యమని చెప్పివాటిని నా చేత చేయించారు.
P10:
అక్టోబర్ 30: మా గురువు దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉండేసరికి ఈ చక్రం బలహీన పడటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టటం నేను గమనించాను.
నవంబరు 8: ఈ రోజు నాకు ధ్యానంలో 5 సంవత్సరముల పిల్లకాయ అనగా బాలాదేవి కనిపించి నాతో మాట్లాడటం మొదలు పెట్టినది.
నవంబరు 10: ఈరోజు నాకు నా చుట్టూనే బాల అమ్మవారు తిరుగుతున్నట్లుగా సంచరిస్తున్నట్లుగా కాలి అందెల శబ్దాలు వినిపించడం జరిగింది.
నవంబరు 12: ఈరోజు విచిత్రంగా ఒక ఐదు సంవత్సరముల పిల్లకాయ గుడికి వచ్చి నేను ధ్యానం చేసుకుంటే ఏ భయం బెరుకు లేకుండా నా తొడ మీద కూర్చుని గుడి లోపలికి వెళ్ళినది అని నేను ధ్యానమునుండి కళ్ళు తెరిచిన తర్వాత ఈ దృశ్యం చూసిన గుడి భక్తులు అన్నారు. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా అసలు ఈ దృశ్యం నేను గమనించలేకపోయినాను.
నవంబరు 15: ఈరోజు నేను పూజించే విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా ఐదు సంవత్సరముల పిల్లకాయగా కనిపించి నేను పెట్టే మహా నైవేద్యం స్వయంగా కూర్చుని తింటున్నట్లు అనిపించింది.
నవంబరు 18: ఈరోజు నేను నా స్నేహితుడు బైక్ నుండి అనుకోకుండా క్రిందపడి పోతుంటే ఎవరో ఒక స్త్రీ మూర్తి నన్ను పడనీయకుండా ఆపినట్లుగా అనిపించినది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు.
P11:
నవంబరు 21: ఈరోజు శుక్రవారం. చాలామంది కూడా భక్తులు గుడికి వచ్చినారు. 11 మందికి కొబ్బరికాయలు కొట్టినాను. కానీ 12 మంది వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్లారు. ఇది ఎలా సాధ్యం అంటే ఏమో ఎవరికి తెలుసు.
నవంబరు 25: ఈరోజు ఒక బిక్షగత్తె నా దగ్గరికి వచ్చి గాజులకి డబ్బులు కావాలి అని డబ్బులు తీసుకొని వెళ్ళింది. ఎవరైనా ఆకలిగా ఉంది బిక్ష వెయ్యమని అని అడుగుతారు కదా. ఈమె ఏమిటి? గాజులకి డబ్బులు కావాలని అడిగినది. ఈమె బిక్షగత్తె లేదా సుందరి అమ్మవారు కాదు గదా. ఎవరికి తెలుసు? ఇచ్చేటప్పుడు ఈ ఆలోచనలు చచ్చినా రావు.
నవంబరు 28: ఈ రోజు అమ్మవారి పేరు మీద నా సమక్షంలో అన్నదానము జరుగుతోంది. సుమారుగా 150 - 200 మంది దాకా వస్తారని అంచనా. కానీ భోజనానికి కూర్చున్న ది 252 మంది దాకా ఉంటే విస్తరాకులు 253 వచ్చినాయి. అంటే ఈ ఒక్క విస్తరాకు ఎవరిది? ఎవరు వచ్చి భోజనం చేసినారు అని ఆరా తీస్తే భోజనాలు జరుగుతున్న సమయంలో పసుపు లంగా ఎరుపు జాకెట్టు వేసుకుని 5 సంవత్సరముల పాప వచ్చి కావాలని మారం చేసి అడిగి విస్తరాకు వేయించుకుని భోజనము తిన్నదని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు.
P12:
డిసెంబరు 8: ఈరోజు ఒక 85 సంవత్సరాల వయస్సున్న పండు ముదుసలి నా దగ్గరికి వచ్చి నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తూ నన్ను మురిపెంగా చూస్తూ “నేను మీకు మాయ కాకూడదు. నీవు నా అంతటి వాడివి అవ్వాలి రా. ఈ లోకానికి మార్గదర్శకుడు అవ్వాలిరా” అంటూ నన్ను దీవిస్తూ నా వైపు ఆప్యాయంగా చూస్తూ గుడి లోపలికి వెళ్ళినది. ఎంతసేపటికీ గుడి లోపల నుండి బయటకి రాకపొయేసరికి ఏదో అనుమానం వచ్చి గుడి లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ కనిపించలేదు. అలాగే ఆనాటి నుండి అమ్మవారు కూడా నాకు ధ్యానంలో, ఇలలో, కలలో కనిపించడం లేదు అంటే ఇష్టదైవమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైనది. శూన్యం లో కలిసి పోయింది.
డిసెంబరు 21: ఈరోజు నాకు పండరీపురం క్షేత్రము నుండి నల్లటి పాండురంగ దంపతుల విగ్రహమూర్తులు వచ్చినాయి. విచిత్రం ఏమిటంటే ఈయన కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారికిలాగా అందరికి సజీవ మూర్తిగా కనిపించి వారిని ముక్తి పథమునకు చేర్చుకున్నారని వారి అగ్రేసర భక్తులైన తుకారాం, నామదేవుడు, ఘోర,మీరాబాయి ఇలా 34మంది జీవిత చరిత్రల ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఇంతటితో ఈ చక్ర సాధన పరిసమాప్తి అని నాకు అర్థం అయింది.
P13:
డిసెంబరు 25: ఈ విగ్రహ పూజలు చేయ లేక నానా చంకలు నాకవలసి వస్తుంది. నా గుడిలో కూడా ఇన్ని విగ్రహ పూజలు ఉండవు. నా మందిరంలో 84 విగ్రహమూర్తులు పూజలు చేయలేక చస్తున్నాను. దీనిని గూర్చి గురుదేవుని అడగాలి.
డిసెంబరు 28: నా విగ్రహరాధన గూర్చి నేను పడే ఇబ్బందులగూర్చి గురుదేవుడికి చెబితే ఆయన చిరునవ్వు నవ్వుతూ “నాయనా! ఇంకా బాహ్య పూజలతో నీకు ఏమి పని? లలితా సహస్ర నామాలలో అమ్మ వారే స్వయంగా నాకు బాహ్య పూజలు కన్నా అంతర పూజలు అంటే చాలా ఇష్టమని సంతృప్తి కలిగిస్తాయని చెప్పినది కదా. అప్పుడు నీవు విగ్రహ పూజ కన్నా విశ్వారాధన పూజ చేసుకో. అదే బాహ్యపూజ కన్నా ఆత్మ ధ్యాన పూజ చేసుకో అన్నారు. దానిని ఎలా చేయాలి అన్నప్పుడు మన శరీరం లోపల 18 మంది ఋత్విక్కులు అహర్నిశము మనకు తెలియకుండా అంతర్ యజ్ఞము చేస్తూనే ఉంటారు. వాళ్లు ఈ ప్రాణాగ్నిని ప్రజ్వరిల్లేటట్లుగా చేస్తూనే ఉంటారు. ఈ అగ్నిలో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. ఈ 18 మంది ఋత్విక్కులు ఎవరో ముందుగా తెలుసుకోవాలి. వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు,పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, రెండు శ్వాసలు,మనస్సు మొత్తం కలిపితే 18 మంది అవుతారు. ఆత్మ వీటికి యజమాని అన్న మాట. అంటే 18 మందిలో 15 మందిని అనగా పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు పూజా సామాగ్రి గా చేసుకోవాలి. దశ విధ ప్రాణములను పనివారిగా చేసుకోవాలి. ఆజ్ఞా చక్రములోని త్రికోణములోని అమృత జలమును గంగాజలంగా అభిషేకాది జలములుగా చేసుకోవాలి.షట్చక్రాలను పుష్పములుగా చేసుకోవాలి.మనలోని జఠరాగ్నిని ధూపముగా చేసుకోవాలి.చిత్కళలను దీపములుగా చేసుకోవాలి. మనకు కలిగే బ్రహ్మానందంను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఇడా పింగళ అనగా సూర్య చంద్ర నాడులను జ్యోతి హారతులుగా చేసుకొని హారతి ఇవ్వాలి.అలాగే మన సహస్రార చక్రమునందు శాంతి అనే (పీనియల్ గ్రంథి) ఈశ్వరి అమ్మవారితో పరబ్రహ్మము ఈశ్వరుడు (పిట్యూటరీ గ్రంధి) కలసి ఆరాధన చేయటమే ఈశ్వర ప్రణీధాన పూజ అవుతుంది. ఇదియే ఆత్మ అంతర ఆరాధన విధానం అని చెప్పటం జరిగినది. నాకు అయితే ఈ పూజా విధానము అర్థమై అర్ధము కానట్లుగా ఉంది. ఏదైనా చేస్తే కాని విషయం అర్థం కాదని నేను గ్రహించాను.
డిసెంబర్ 30: ఈరోజు విగ్రహ బాహ్య పూజల కన్న మా గురువు దేవుడు చెప్పిన అంతర పూజా విధానము మానసికంగా చేశాను. ఏదో తెలియని ఆనందం వేసింది.ఏమో బాహ్య పూజ మీద వైరాగ్య బావాల వలన ఈ ఆనందం వేసినదా? ఎవరికి ఎరుక.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
మణిపూరక చక్ర మా సాధనానుభవాలు:
నాది అలాగే మా జిజ్ఞాసి కూడా మా రెండు చక్రాలు అనగా మూలాధార, స్వాధిష్టాన చక్రం సాధన పరిసమాప్తి అయ్యేసరికి మూడవ చక్రమైన మణిపూరక చక్రం మీద ధ్యానం చేయటం ప్రారంభించాము. మా జిజ్ఞాసి శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి కోసం సాధన చేస్తూ ఉండగా నేను మా ఇంటిలో సాధన చేస్తున్నాను. నా స్వాధిష్టాన చక్రం సాధన వలన మహాలక్ష్మి మాయ దాటటము వలన ఆమె కావలసిన ధనము నాకు ఇచ్చినది కదా. దాంతో నేను ఉద్యోగ వ్యాపార బాదర బంధీలలో పడకుండా వచ్చే వాటితో కాలము వెళ్ళబుచ్చుతూ యోగ సాధనకు ఎక్కువ సమయం కేటాయించే స్థాయికి చేరుకునే లోపల ఒక రోజు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆయన్ని నేను చూడగానే “రండి మీకోసమే ఎదురుచూస్తున్నాను. పాపము. మిమ్మల్ని రంగయ్య బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా” అని నేను అనేసరికి అతనికి ఆశ్చర్యం వేసి “అయ్యా! మీకు ఈ విషయం ఎలా తెలిసినది” అనగానే వెంటనే నేను “స్వామి! మూడు రోజుల నుండి నాకు ధ్యానంలో ఆయన కనిపించి నేను మీ ఇంటికి వస్తున్నాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నీ దగ్గరికి వస్తున్నాను.నీ కోసము వస్తున్నాను” అంటూ నన్ను ఆడుకుంటున్నాడు. “ఒక అంగుళం కూడా లేని వాడు ఆరు అడుగుల ఉన్న నన్నే అదుపులో ఉంచుకున్నాడు. కొంచెం బయటకు తీసి చూపించండి” అనగానే ఆయన తన చేతి సంచిలో ఉన్న పూజపెట్టెలో నుంచి ఒక అంగుళము పరిమాణంలో ఉన్న రుక్మిణీ సహిత పాండురంగ పంచలోహ విగ్రహం మూర్తి బయటకి తీసి నా చేతిలో ఉంచారు. ఎందుకో దానిని ముట్టుకోగానే నా శరీరము ఒక్కసారిగా వేడెక్కటం ఆరంభమైనది. అప్పుడు నాకు అర్థమైనది. ఈ విగ్రహ మూర్తి తన మణిపూరక చక్రం జాగృతి కోసం వచ్చినదని అంటే ఈ చక్ర లక్షణము వేడి అనగా అగ్నితత్వం బయటికి పంపినది అని నాకు అర్థమైనది. పైగా ఆయన తన నిజరూప దర్శనం అగుపించడం జరిగింది. అంటే మణిపూరక చక్రం లక్షణము రూప గుణమని మన యోగ శాస్త్రాలు చెబుతున్నాయి అనుకొంటుండగా ఆ వచ్చిన వ్యక్తి నమస్కరించి మాట్లాడకుండా వెళ్లిపోయినాడు. ఆ వ్యక్తి పేరు కూడా పాండురంగయ్య కావటం విశేషం.
మణిపూరక చక్రం జాగృతి:
కానీ ఈ చక్రములోని ప్రవేశించాలంటే స్వాధిష్ఠాన చక్రము పై ఉన్న బ్రహ్మ గ్రంథిలోకి ప్రవేశించి జాగృతి చేసుకోవాలి. ఆ తర్వాతనే మణిపూరక చక్రం సాధన చేయగలమని నాకు స్పురణకు వచ్చినది. ఈ గ్రంథి గూర్చి నా ధ్యానము సాధన చేస్తుండగా కొన్ని రోజులకు నిజమైన స్పటిక మాల వచ్చింది. దీనిని ఏమి చేయాలో అర్థం కాక నిజ బాబా విగ్రహమూర్తికి వేసినాను. నా దృష్టిలో ఆయన సకల సర్వ దేవతల స్వరూపుడు అని నా వ్యక్తిగత నమ్మకము.ఈ మాల వచ్చేసరికి నేను బ్రహ్మ గ్రంథిలో ఉన్నానని అది జాగృతి అయినది అని నాకు అర్థం అయింది.ఇది ఇలా కొన్ని రోజులు ధ్యానము తీవ్ర స్థాయిలో ఉండగా బొడ్డు ప్రాంతములో విపరీతంగా నొప్పి రావటం మొదలైంది. దాని చుట్టూ వేడి ఆవిర్లు సుడులు తిరుగుతున్నాయి అని నాకు అనిపించసాగింది.తల దిమ్ముగా ఉండటము ఆరంభమైంది.ఇలా కొన్ని వారాలపాటు ఇబ్బంది పడ్డాను. అంటే నాకు మణిపూరక చక్రం జాగృతి అయినది అని అర్థమైనది.మనము గత జన్మలో చేసిన పాప కర్మలు పూర్తి అయ్యేవరకు మనకి బొడ్డు నొప్పి అలాగే కండరాల నొప్పులు, వేడి ఆవిర్లు తగ్గవని నాకు అర్థమైనది. అందాక వీటిని మౌనముగా భరించాలి అనుకుంటున్న సమయంలో ఒకరోజు తీవ్రమైన ధ్యానంలో ఉండగా పండరీపురం పాండురంగ మంగళ విగ్రహ మూర్తి నాకు ధ్యానం నందు సాక్షాత్కరించినది. మాట్లాడదు. అలాగని కనిపించకుండా ఉండదు. నల్లరాతి విగ్రహం నవ్వుతున్నట్లుగా కనపడ సాగింది. కొన్ని రోజుల తర్వాత నేను మా ఆవిడ కలిసి నా స్నేహితుడితో అనుకోకుండా పండరీపురము చూడాలనిపించి వెళ్ళటం జరిగింది. అంటే కొల్హాపురం, భీమశంకరం, పండరీపురము చూడాలనిపించి వెళ్ళటం జరిగింది.
మిగిలిన దేవాలయములను చూసుకొని పండరీపురమునకు మధ్యాహ్నము చేరుకున్నాము. అప్పటికే బాగా రద్దీగా ఉన్నది. పైగా అక్కడ ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి అని తెలిసినది. మాకు స్పర్శ దర్శనం లభించలేదు. కాని దగ్గర ఉండి ఆయన రూప దర్శనం చేసుకుని ఇంటికి బయలు దేరినాము. ఆనాటి నుండి నాకు కష్టాలు ప్రారంభమైనవి. నాకు ధ్యానములో ఈ విగ్రహ మూర్తి కనిపించడము షరా మామూలే అయినది. మాట్లాడదు. ఏమీ చేయదు సజీవ మూర్తిగా విగ్రహ మూర్తి దర్శనం.అంటే నా ధ్యానము ఈ విగ్రహ రూప ధ్యానమే నా సాధనంగా మారింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి.ఒక రోజు నాకు ధ్యానములో ఏవో రత్నాలు మిలమిల మెరుస్తూ ఒక చెక్క భూషణం లో ఉన్నట్లుగా కనిపించసాగింది. ఇప్పుడు దాకా రత్నాలను సినిమాలలో చూడటం తప్ప నిజంగా చూడలేదు. మరి విచిత్రముగా ఇవి ఎలా నాకు కనబడుతున్నాయి. ఇవి నిజమేనా లేదా కల్పితమా అర్థం కాలేదు. ఆయన కనబడటం తర్వాత ఈ రత్నాలు కనబడటం మొదలైంది. వామ్మో! కొంపదీసి ఈయన ఏమైనా గుప్త నిధులు దాచాడా? వాటిని నాకు చూపిస్తున్నాడా? నాకు అర్థం కాలేదు. అవి ఎక్కడ ఉంటాయో చూపించడం లేదు కానీ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. వాటి ఆకారాలు మాత్రమే చూపిస్తున్నారు అనుకున్నాను. మరి కొన్ని రోజుల తర్వాత ఏవో అగ్ని ప్రమాదాలు జరగటం అక్కడ వారి అరుపులు చక్కగా స్పష్టంగా వినిపించడం కనబడేది.ఈయన మొదట కనబడటం ఆ తర్వాత ఈ ప్రమాదాలు కనబడటం ప్రారంభమైంది. అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థం అయ్యేది కాదు. అవి నిజంగా జరుగుతున్నాయో లేదో కూడా అర్థమయ్యేది కాదు.
మణిపూరక చక్రం శుద్ధి:
ఇలా కొన్ని వారాలు జరిగిన తరువాత వరుసగా ఈయన మొదట కనబడటం ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు,పడవ ప్రమాదాలు, గుప్తనిధులు,పాడు బడ్డ దేవాలయాలుఇలా సచిత్ర విచిత్ర దృశ్యాలు కనబడసాగినాయి.కానీ అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థమయ్యేది కాదు. అవి నిజంగా ఎక్కడైనా జరిగినాయా? జరుగుతున్నాయా అనేది కూడా అర్థం అయ్యేది కాదు. దాంతో పాండురంగడు కనబడినాడు అంటే ఏదో ప్రమాదం సూచన ఇస్తున్నాడని నాకు అర్ధమై భయం వేసేది. ధ్యానము చేయాలంటే ఏ దృశ్యము చూడాలో అని భయం వేసేది.అవి జరగకుండా ఉంటే బాగుండునని తీవ్రంగా అనిపించేది.ఆ దృశ్యాలు అంతగా భయపెట్టేవి.బాధపెట్టేవి.ఆయన కనిపించకుండా మానడు.ఈ దృశ్యాలు కనిపించకుండా ఉండేవి కావు. అంటే చక్రం శుద్ధి అవుతుంది అని నాకు అర్థం అయింది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను మా వాసు మామయ్య మా అన్నయ్య తో కలిసి శాంతి క్రాంతి సినిమా కి వెళ్ళటం జరిగినది. సినిమా జరుగుతోంది. మధ్యలో ఉండగా మా వాసు మామయ్య తల పట్టుకొని తీవ్రంగా బాధ పడుతుంటే “తలనొప్పిగా ఉందా” అని అన్నాను. దానికి వాడు “లేదురా! నా కళ్ళముందు రేపు జరగబోయే రైలు ప్రమాద దృశ్యాలు కనబడుతున్నాయి. నాకు ఎప్పుడైనా తీవ్ర ప్రమాదాలు జరిగితే ఇలా దృశ్యాలు కనబడతాయి” అంటుండగా అంటే నాకు లాగానే మరొక పిచ్చోడు ఉన్నాడు అన్నమాట అనుకొని “మామయ్య! మీకు అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలు కనబడతాయి. కానీ నాకు రోజులో 5 సార్లు అన్న ఇలాంటి వివిధ రకాల ప్రమాద దృశ్యాలు కనపడతాయి” అన్నాను. దానికి వాడు వెంటనే “మీకు తెలియదు రా నా బాధ గూర్చి! చూడు ఆ డ్రైవర్ దానిని ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నాడో. ఎదురుగా వస్తున్న మరో రైలు కూడా ఈ రైలుని గమనించకుండా ఎలా దూసుకొని వస్తుందో చూడు. ఆ డ్రైవర్ రాజు గాడు అలాగే ఈ డ్రైవర్ నవీన్ గాడు అంటూ వారి పేర్లు…. ఈ ప్రమాదం జరిగే ప్రాంతాల వివరాలు…. ఎన్ని బోగీలు ఎలా ఎప్పుడు ఏ విధంగా పడిపోతున్నాయి…. ఏవిధంగా ఆ ప్రయాణికులు ప్రమాదము పొందుతున్నారు…. ఎంతమంది చనిపోతున్నారో… ఎంతమంది బ్రతుకుతారో… అందులో ఆడవాళ్లు ఎంత మంది…. మగ వాళ్ళు ఎంతమంది…. పిల్లలు ఎంతమంది…. ఇలా వారి పేర్ల మొదటి అక్షరాలతో చెబుతుంటే… వాడేదో ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ కూర్చున్న సీటును చింపుతూ అరుస్తూ బాధపడుతూ ఊగుతూ వాడు చెప్పిన వివరాలు నేను మనస్సులో రికార్డింగ్ చేసుకున్నాను. ఏమో ఎవరికి తెలుసు. నాకు ప్రమాదాలు మాత్రమే కనబడుతున్నాయి. వాడికి ఏకంగా ఆ ప్రమాదాలు ఎక్కడ ఎలా ఎవరి వలన జరుగుతున్నాయో తెలుస్తోంది కదా. ఇది నిజమైతే నాకు కనిపించేది కూడా నిజమవుతాయి. ఒకవేళ అబద్దం అయితే నావి కూడా అబద్ధం అవుతాయి. అంతా నా భ్రమ భ్రాంతి అనుకోవచ్చు కదా అనుకుంటూ ఉండగా వాడు నేను ఈ సినిమాను చూడలేను అని వెళ్లిపోవటంతో మేము కూడా వెళ్లి పోయాము. మరుసటి రోజు ఉదయమే పేపర్ తెప్పించుకొని చూడగానే నా గుండె గుబేలు మన్నది.వాడు చెప్పిన దృశ్యము చెప్పినట్లుగా జరిగినది. చూచినట్లుగా చెప్పినాడు అని నాకు అర్ధం అయ్యేసరికి నాలో ఏదో తెలియని భయం వణుకు మొదలైంది.అంటే వాడు ఏదో ఒక చక్ర శుద్ధిలో ఉన్నాడు కాబోలు అందువలన వాడికి ఈ ప్రమాద దృశ్యాలు అన్ని వివరాలతో కనపడినాయి. కానీ నాకు కనిపించే ప్రమాదాలు, గుప్త నిధులు అన్ని కూడా నిజమే అన్న మాట. వామ్మో! ఇలా ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ప్రమాదాలు కూడా నెమ్మది నెమ్మదిగా నా కళ్ళముందు కనబడితే నా పరిస్థితి ఏమిటి?రేడియో జాకీయే గదా.రేడియో లాగా సమాచారము వినడం తప్ప చూడటం ఉండదు. అంటే ప్రస్తుతానికి నా సాధన శక్తి వినటం వరకు వచ్చినది. మా వాసు మామయ్య ఉన్న స్థితికి నేను వెళ్ళితే వాడిలాగా వీటిని చూడాలి అంటే టీవీ లాగా అన్నమాట. వామ్మో! ఇంత బతుకు బతికి ప్రస్తుత నా సాధన స్థితి రేడియోనా?ఛీ అనుకుంటూ నాలో ఏర్పడిన భయము వలన మారు మాట్లాడకుండా బాత్రూం లోనికి వెళ్లక తప్పలేదు. నవ్వకండి.మీరు గూడ నా స్థితికి వచ్చేసరికి మీరు కూడా బాత్రూం లో కాపురము చేయకపోతే చూద్దాం.
ఇది ఇలా ఉండగా ఒక భక్తుడు నాకోసం కోణార్క్ సూర్య దేవాలయం నుండి సూర్య స్పటికము తీసుకొని వచ్చాడు. అంటే ఇది పంచాయతన పూజలో సూర్యుడికి ప్రతీకగా వాడే శుద్ధస్ఫటికమని...అందుకే ఇది నాకు వచ్చినదని గ్రహించి... దానిని ముట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది. ఇది నిజమైన స్పటికమేనని నిజమైన స్పటికానికి చల్లదనము ఉంటుంది. కానీ ఈమధ్య వ్యాపారులు కూడా తెలివి మీరి గాజు స్పటికాలు తయారు చేసి తడిపిన దూది మీద వీటినుంచి ఒక బాక్స్ లో పెట్టి అమ్మడం నా దృష్టికి వచ్చింది. దాంతో ఇవి కూడా చల్లగా ఉన్నట్లుగా కనిపిస్తాయి కాని తాత్కాలికముగా ఉంటుంది. అదే నిజమైన స్పటికమును మీరు మొదట పట్టుకోగానే చల్లగా అనిపించి కొన్ని క్షణాలకే వేడి ఎక్కినట్లుగా అనిపిస్తుంది. అంటే ఈ చక్రం యొక్క అగ్ని ఆధిపత్యము అగ్నికి సంకేతముగా సూర్యుడే ఉంటారు కదా.ఈ స్పటిక సూర్యుడిని పూజలో పెట్టుకున్న కొన్ని వారాలకు నాకు ధ్యానములో పది దళాలు 'రం' అనే మధ్య బీజాక్షరం గా ఉన్న పసుపు పద్మం కనపడసాగింది. కొన్ని వారాల తర్వాత నాకు తీవ్ర ధ్యాన స్థితి కలుగుతుండగా నా నేత్రాలు అర్ద నిమిళితంగా తెరవబడి భ్రూమధ్యం వైపు దృష్టి నిలపడం నా ప్రమేయం లేకుండా జరుగుతుండేది. త్రాటక క్రియ జరుగుతోందని నాకర్థమయ్యేది. ఇది ఇలా జరుగుతుండగా నా జీవితములో జరిగిన వివిధ సంఘటనలు వాటి వివరాలు నా ప్రమేయం లేకుండా ధ్యానము నందు గుర్తుకు రావడం జరిగేది. ఇలా మరి కొన్ని వారాల పాటు గడచినవి. అంటే ఈ మణిపూరక చక్రము శుద్ధి అవుతుంది అని నాకు అర్థం అయింది. అపుడు నాకు లీలగా ఈ చక్రనాదమైన వీణనాదము నా చెవులయందు మొదటలీలగా వినపడి...ఆపై కొన్ని నెలలకి నాలో నాకు చాల స్ఫష్టంగా వినపడేది.
మణిపూరక చక్రం ఆధీనము:
నా దగ్గర స్వయంభూ బాల యంత్రము ఉన్నదని మీకు ఇదివరకే చెప్పడం జరిగినది గదా!ఈ యంత్రమును మా తాతగారైన బుద్దు ఉమాపతి(ఉమ్మన్న)గారికి బాలాదేవి స్వయంగా కనబడి ఆయన నాలుక మీద ఏవో బీజాక్షరాలు రాస్తే ఈయన అప్పటిదాకా అజ్ఞానిగా ఉండేవాడు కాస్త మహాజ్ఞానిగా మహామంత్ర వేత్తగా అవతారం ఎత్తారు.ఈయన పూజించిన ఈ యంత్రము నా దగ్గరకి చేరింది. దానిని నేను పూజలో ఉంచాను. నేను అనుకోని పరిస్థితులలో ఈ దుర్గా యంత్రం మీద పండరీపురము నుండి వచ్చిన పాండురంగ విగ్రహం పెట్టడం జరిగినది.దానితో ఈ విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట జరిగినది. ఎందుకంటే దీని క్రింద స్వయంభూ బాల యంత్రము ఉన్నది కదా. ఆ విషయం నేను గమనించలేదు.
దాంతో నాకు ధ్యానములో మాట్లాడకుండా కేవలము విగ్రహమూర్తిగా కనిపించే పాండురంగడు కాస్తా మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయనకి ఏమి కావాలో తినటానికి అన్ని చెప్పడము దగ్గర నుండి జరగబోయే సంఘటనలు చెప్పేదాకా అంటే అర్ధరాత్రి వరకు నాకు కలలో కనిపించి చెప్పేవారు. దాంతో నాకు కావలసిన ప్రసాదాలు చేయలేక మా ఆవిడ అలాగే మా అమ్మ అవస్థ పడేవారు. నాకు సరిగ్గా నిద్ర లేక అవస్థలు పడే వాడిని. మొదట్లో ఆయనతో మాట్లాడటం ఆనందంగా ఉండేది. దీనిని దైవ సాక్షాత్కారము అంటారు. అనగా రామకృష్ణ పరమహంసకి కాళీ మాత కన్పడినట్లుగా, నామ దేవుడికి పాండురంగడు కనపడినట్లుగా ఈయన నాకు అగుపిస్తున్నారని నాకు స్పురణ అయినది.రాను రాను నాకు విసుగు అనిపించేది.ఎలా అంటే కర్ణ పిశాచి అనుభవము మీకు గుర్తుందా? అలా ఈయన నన్ను ఆడుకునేవాడు. పైగా దీనితో పాటు వివిధ దేశాల ప్రమాద దృశ్యాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఉండనే ఉన్నాయి.
ఈయన ఎందుకు ఇలా కనబడుతున్నాడో ఇలా ఈ ప్రమాద దృశ్యాలు ఎందుకు కనబడుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. చాలా మందికి దైవసాక్షాత్కారం చాలా గొప్ప విషయం. కానీ దీనిని దాటితేగాని నా సాధన ముందుకి వెళ్లదు. లేదంటే ఈ సాక్షాత్కార మాయ ఉండి పోవాల్సిందే. అంటే ఈ చక్రములో ఉండే మాయే మన ఇష్ట దేవత సాక్షాత్కార మాయ అని నాకు యోగ శాస్త్రముల ద్వారా తెలిసినది. రామకృష్ణ పరమహంస కాళీమాత సాక్షాత్కారం మాయలో ఉన్నప్పుడు ఆయన దీనిని దాటలేక నానా అవస్థలు పడుతుంటే తోతాపురి అనే సద్గురువు వచ్చి ఈయన భ్రూమధ్యము మీద గాజు పెంకు గాటు పెట్టిన తర్వాత అమ్మవారు కనిపించలేదని వారి చరిత్రలో చదివితే తెలిసినది. అలాగే చక్రధారి అనే సినిమాలో నామదేవుడికి ఈ పాండురంగ సాక్షాత్కారము వలన ఆయనకు తెలియకుండానే భక్తి అహంకారము లోనికి వెళ్లిపోవడం ఘోరా భక్తుడి చేత సగము కాలిన కుండ భక్తుడని ఈయన అనిపించుకోవటం జరిగినది.దానితో ఈ నామ దేవుడికి అహం,కోపం ఎక్కువై పాండురంగడి దగ్గరికి వెళ్ళటం ఆయన వెంటనే ఘోరా చెప్పినది నిజమే. నీవు అసంపూర్ణజ్ఞానివే. పరిపూర్ణ జ్ఞానిగా కావాలంటే విఠోబా అనే మహా బ్రహ్మజ్ఞానిని వెతికి పట్టుకొమ్మని చెప్పడము ఆ తర్వాత నామదేవుడు తన గురువు కోసం వెతకటం, అలా మహా శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్న వయోవృద్ధుడిని చూసేసరికి అతనికి కోపం వచ్చి వెంటనే “సాక్షాత్ పరమ పూజ్యమైన పరమలింగం మీద ఏకంగా కాళ్ళు పెట్టుకుని ఉంటావా? నీకు ఎంత ధైర్యం? సాక్షాత్తు నీవెంత మూర్ఖుడివో నాకు అర్థమైనది” అంటూ ఉండగా ఆ వృద్ధుడు వెంటనే “అయ్యా!వయోవృద్ధుడిని కావటం వలన నా కళ్ళు సరిగా కనిపించడం లేదు. శివలింగం మీద నా కాళ్లు ఉన్నాయా అయితే లింగమూర్తి లేని చోట నా కాళ్లు పెట్టు” అనగానే దానికి ఈ నామదేవుడు వెంటనే” అలా రా దారికి. వృద్ధుడివి కాబట్టి నీ తప్పును క్షమిస్తాను. ఇప్పుడు లింగమూర్తి లేని చోట పెడతాను” అంటూ ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని లింగమూర్తి నుండి తీసి క్రింద పెట్టగానే అక్కడ ఒక క్రొత్త లింగమూర్తి వచ్చినది. అలా ఆయన కాళ్లు ఎక్కడ పెట్టిన ఏ దిక్కులో ఉంచిన కూడా కాళ్ళ క్రింద మరో లింగమూర్తి రావటం చూసేసరికి నామ దేవుడి భక్తి అహం తొలగిపోయి “స్వామి! నన్ను ఎందుకు పరీక్షిస్తారు?లింగమూర్తి లేని చోట లేనే లేదు. అంతటా వ్యాపించి ఉన్న నా దేవుడు కేవలం నేను పూజించే విగ్రహంలోనే ఉన్నాడని అనుకోవటం తద్వారా నాలో తెలియని భక్తి అహంకారము కలగటం జరిగినదని…. దానిని రూపుమాపడానికి ఈ పాండురంగడు మీ దగ్గరికి పంపించాడు” అనగానే వెంటనే ఆయన నవ్వుతూ “నిజం తెలుసుకున్నావు.నీ జన్మ ధన్యము చేసుకున్నావు. విగ్రహరాధనను దాటితేగాని విశ్వారాధన చేయలేవు.నీ దైవము నీ విగ్రహంలోనే ఉన్నాడని అనుకున్నంతవరకూ నీలో అహం ఏదో ఒక రూపంలో ఏదో రకంగా ఉంటుంది.ఈ అహము మాయ నీ విగ్రహ సాక్షాత్కారము వలన జరిగినది.ఎప్పుడైతే నువ్వు నీ దైవాన్ని విగ్రహములో కాకుండా విశ్వంలో చూడటం మొదలు పెడతావో ఆనాటి నుండి విగ్రహరాధన కాస్త విశ్వారాధన అవుతుంది. ప్రతి జీవుడు కూడా ఈ స్థితికి తప్పకుండా రావాలి” అని హితబోధ చేసి అంతర్ధానం అవడంతో ఈ సినిమా దృశ్యము నాకేదో హితబోధ చేస్తుందని తీవ్రంగా అనిపించసాగింది. నేను కూడా ఈ పాండురంగనిని విగ్రహమూర్తి గానే ఆరాధన చేస్తున్నాను అని నాకు అర్థమైనది. కాని విశ్వారాధన అంటే ఏమిటో దాన్ని ఎలా చేస్తారో నాకు అర్థం కాలేదు. అలాగని నాకు దేవుడు కనిపిస్తున్నాడని ఎవరికైనా చెప్పినా నన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించడానికి అందరూ సిద్ధపడతారని తెలుసు. ఈ సాక్షాత్కార దైవ మాయని ఎలా దాటాలో అర్థమయ్యేది కాదు. అలాగని కనిపించకుండా మాట్లాడకుండా ఆపడం లేదు. నాకు అర్ధము కాని విషయము ఏమిటంటే ఈ చక్రమునందు కేవలము మన ఇష్టదేవత దర్శనము జరుగుతుందని..వాళ్ళు కేవలము ధ్యానము నందు కనిపించడమే చేస్తారని...అదే ఆజ్ఞాచక్రము నందు అయితే దైవ సాక్షాత్కరము అనగా మనతో మనుష్యరూపేణ మాట్లాడతారని శాస్త్రవచనము.మరి నాకు ఈ చక్రము నందే పాండురంగడు కనపడి నన్ను ఎలా దొబ్బుతున్నాడో...ఈయన కనపడి మాట్లాడవలసినది నా ఆజ్ఞాచక్రము నందు గదా!మరి ఈ చక్రములో ఎలా...ఏకారణం వలన కనపడి నన్ను చావగొడుతున్నాడో నాకైతే అర్ధమై చావడము లేదు.
ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక రోజు టీవీలో “శ్రీ సత్యనారాయణ స్వామి” అనే సినిమా నడుస్తుంది. నేను ఈ సినిమా చూసే సమయంలో సత్యదేవుడి విగ్రహ ప్రతిష్ట సమయంలో సరైన యంత్రము లేక కారణ జన్ముడు గీసిన సిద్ధ యంత్రం కోసం ఎదురుచూస్తూ… అది రాగానే సత్యదేవుడి ప్రతిష్ట జరగడంతో ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది. స్వయంభూ వెలసిన వెంకన్నకి,సత్య దేవుడికి కూడా ఆత్మ శక్తి,,మంత్ర శక్తి,,యంత్ర శక్తి కలిసిన సిద్ధ యంత్రము అవసరం ఏర్పడింది. అంటే నాకు కనిపించే సాదృశ్య పాండురంగడుకి కూడా సిద్ధ యంత్రం ఏమైనా ఏర్పాటు అయిందా అనుకుంటుండగా నాకు అకస్మాత్తుగా నా దగ్గర ఉన్న దుర్గ బాల సిద్ధ యంత్రం విషయం గుర్తుకువచ్చి ఎక్కడ ఉన్నదో చూడాలని దేవుళ్ళు ఉన్న నా బీరువాలో వెతకడం ప్రారంభిస్తే అది కాస్తా నాకు కనిపించే పండరీపురనాథుడైన పాండురంగడు దగ్గర ఉంది.వామ్మో ఈ విగ్రహ మూర్తికి యంత్ర శక్తి వలన ప్రాణప్రతిష్ఠ జరిగి ఉంటుంది. అన్ని యంత్రాలకి అలాగే అన్ని మంత్రాలకు మూల శక్తి ఓం గదా. దీని ఆధారంగా ఏ విగ్రహమూర్తికైనా ఆ యంత్ర నిర్మాణం జరుగుతుంది. అలాగే ఈ యంత్ర శక్తి మన పాండురంగడు కి ప్రాణశక్తి ఆపాదించబడి ఉంటుంది. వామ్మో! ఇన్నాళ్ళు ఈ విషయమే ఆలోచించలేక పోయాను. అసలు గమనించలేక పోయానే. అది దేనికి అనుసంధానం అవుతుందో ఆ తర్వాత ఆ విగ్రహమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరిగి మనుష్య రూపంలో దైవము మనకి కనపడి మాట్లాడటం జరుగుతుందన్నమాట అనుకుంటూ యంత్రము నుండి పాండురంగ విగ్రహమూర్తిని విడదీసి వీటిని దూరం దూరంగా ఉంచి పూజలు చేయటం ఆరంభించాను. అయినా కూడా ఆయన సాక్షాత్కారాలు మానలేదు. మాట్లాడకుండా తినకుండా ఉండలేదు. ఇలా మరి కొన్ని వారాలు గడిచిపోయాయి. ఎందుకంటే యంత్రశక్తి తగ్గిపోయేదాకా ఈ తిప్పలు తప్పవని తెలిసినది.
కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానములో పాండురంగ స్వామి యధావిధిగా కనిపించేసరికి ఆయనతో “స్వామి! నన్ను పరీక్షించినది చాలు.అవసరాలు లేని వాడికి వరాలతో ఏమీ పని ఉంటుంది.మీకులాగా నేను గూడ వరాలు పుచ్చుకొనే స్థాయి నుంచి వరాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని నా ప్రయత్నం. కానీ మీరే దానికి సాక్షాత్కార మాయగా అడ్డు వస్తే నేను ఏమి చేయగలను. వరాలు అవసరము లేని వాడికి వరాలు ఇచ్చే దేవుడితో ఏమీ పని ఉంటుంది. నాకు ఆనాడు కర్ణపిశాచి ఎలా అయితే చేసిందో ఈనాడు మీరు అలాగే చేస్తున్నారు.అది దెయ్యము. ఇది దైవము. అది ప్రేత శక్తి.ఇది దైవ శక్తి. ఈ రెండు కూడా నా దృష్టిలో ఒక్కటే.నాకు కావలసినది నా ఆత్మ శక్తి.. నాకు ఏ ఇతర వ్యక్తులతో పని లేదు” అనగానే “తధాస్తు! నా పరీక్ష యందు విజయము పొందినావు. శీఘ్రముగా నీ సాధన కొనసాగించు. నన్ను గాని సిద్ధ బాల యంత్రము కాని స్వార్ద ప్రయోజనాలకి ఒక వేళ ఉపయోగించి ఉంటే నీలో అహం పెరిగి పోయి నా భక్తుడు గానే ఉండి పోయే వాడివి. కానీ నన్ను నీ భక్తుడిగా చేసుకోవాలని ఉంది అనే తపన నిన్ను ముందుకు తీసుకొని వెళుతుంది” అంటూ అదృశ్యమైనాడు.ఆనాటి నుండి ఏదో తెలియని ఆనందం మొదలైనది.
బొడ్డు నొప్పి తగ్గడం, అతి వేడిమి తగ్గటం, ప్రమాద దృశ్యాలు కనిపించటం తగ్గినాయి. ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేస్తే దాని వలన రేడియోలాగా మనకి కేవలం అవి జరిగే ప్రమాద దృశ్యాలు వివరాలు మాత్రమే ఈ సిద్ధి ఇస్తుందని ఎక్కడ జరుగుతున్నాయో మాత్రం తెలియదని యోగశాస్త్రాలు వివరించేసరికి అంటే నేను ఈచక్ర ఆధీనము అనగా సిద్ధ బాల యంత్రము కూడా రావడంతో పూర్తి అయినదని నాకు అర్థమయ్యేసరికి నా సాధన మరో మెట్టు పైకి వెళుతున్నందుకు అమిత ఆనందం వేసింది. ఇది ఇలా ఉండగా మా అన్నయ్య కుటుంబసభ్యులు అనుకోకుండా పండరీపురము వెళ్ళటం అక్కడ నుండి నా కోసం నల్లని చెయ్యి పరిమాణములో రుక్మిణి పాండురంగ విగ్రహమూర్తులను తీసుకుని నాకు ఇవ్వటంతో నాకు ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే ఈ చక్రంలో ఉండే దూరదృష్టి సిద్ధిని ఎవరైతే తమ స్వార్థానికి అలాగే ఇతరుల కోసం వినియోగించుకోకుండా ఉండినా అలాగే ఈ చక్ర యోగమాయ అనగా ఇష్ట దేవతా మాయను దాటిన వారికి మాత్రమే వారి ఇష్ట దైవాలు ఇలా నల్లరంగులో వస్తాయి. విచిత్రం ఏమిటంటే నాకు ఈ చక్ర సాక్షాత్కార దైవముగా పాండురంగడు వచ్చినాడని ఆ విగ్రహలు నల్ల రంగులోనే తీసుకోవాలని వీరికి చెప్పిన వాళ్ళు ఎవరు?ఇంకా ఎవరు? ఆ నల్లనయ్య. అదే నల్ల పాండురంగడు. ఇది ఇలా ఉంటే బాల సిద్ధి యంత్రరాధన వలన ఆవిడ కాస్తా బాలరూపములో కనపడుతూ నన్ను చాల పరీక్షలు పెట్టినది. వీటిని నేను వ్రాసుకున్న నా డైరీలోని ఈచక్రానుభవాలను మీరు ఈపాటికే తెలుసుకున్నారు గదా!
జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు
ఈ మణిపూరక చక్రము జాగృతి, శుద్ధి, ఆధీనము ఎలా చేసుకున్నాడో మా జిఙ్ఞాసి మాటల్లోనే చదవండి. “భయ్యా! రెండు చక్రాల సాధన పూర్తి అయిన తర్వాత మూడవ చక్రమైన మణిపూరక చక్రము మీద నా దృష్టి నిలిపి ధ్యానం చేస్తుండగా విచిత్రముగా నాకు బొడ్డు నొప్పి రావటం ప్రారంభమైనది. ఈ నొప్పి భరించలేక నేను నేల మీద పొర్లుతూ ఉండేవాడిని.ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. దానితో పాటుగా నా శరీరము నుండి అధిక వేడి ఆవిర్లు బయటికి వచ్చేవి.అన్నము,నీరు సహించేవి కావు.నిరాహారిగా ఉన్నా కూడా నీరసము ఆవరించేది కాదు. నేను ఉన్న చోట తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. దానితో నేనే వాటికి కారణమని నా చుట్టూ ఉన్న వారు నన్ను అనుమానించడం మొదలు పెట్టారు.సిగ్గుతో,బాధతో,భయముతో బాధపడుతున్న సమయంలో ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి బాల రూపము నాకు కనపడినది. వెంటనే ఆమె “భయపడకు! నేను నీ వెంట ఉండి రక్షిస్తాను. ఎవరు ఏమి చేయరు. నీ పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను. కాకపోతే నేను ఎప్పుడు వస్తానో ఎక్కడికి పోతానో అడగరాదు. వచ్చే రాక పోయే రాక గూర్చి నన్ను ప్రశ్నించొద్దు. జాగ్రత్త సుమా” అని చెప్పి అదృశ్యమయింది. అసలు ఈవిడ ఎందుకు కనపడినది. పూజలు చేయని వాడికి పూజ ఏర్పాట్లు చేయటం ఏమిటి?ఇందులో ఏదైనా మర్మం మాయ కానీ లేదు గదా అని ఆలోచనలు చేస్తుండగా తిరిగి బొడ్డు ప్రాంతంలో విపరీతంగా నొప్పి ప్రారంభమయ్యేది.కళ్ళు తెరిసి ధ్యానభంగము అయ్యేది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయినవి.
ఒకరోజు నేను తీవ్ర ధ్యానసాధన లో ఉండగా నాకు ధ్యానంలో ఒక ఐదు సంవత్సరముల వయస్సు ఉండి ముద్ధుగా,ఎర్రగా, పొట్టిగా చిన్నచిన్న చేతులతో ముగ్ధ మనోహరంగా ఎర్రని జాకెట్ తో మామిడి పండు రంగు లంగాతో నవ్వుతూ నా చుట్టూ ఒక పాప తిరుగుతున్నట్లుగా ఆరంభమైనది. కళ్ళు తెరిచి చూస్తే బయట కనిపించేది కాదు. సరే అనుకొని కళ్ళు మూసుకోగానే ధ్యానములో ఇలా కనబడేది. అంతా నా భ్రమ అనుకొని అలాగే ధ్యానం చేస్తుండే వాడిని. ఒకరోజు నా చుట్టూ అరటి పండ్లు, జామ కాయలు, మామిడి పండ్లు ఉన్నట్లుగా కనిపించగానే కళ్ళు తెరిచి చూస్తే అవి నిజంగానే ఉన్నాయి. వీటిని ఎవరు పెట్టినారో నాకు అర్థం కాలేదు. ధ్యానములో కూర్చోగానే 5 సంవత్సరముల బాల రూపము అగుపించేసరికి ఈ పిల్లకాయే ఈ కాయలను పెట్టినట్లుగా ఉంది అని అనుకోగానే ఆమె అదృశ్యం అయ్యేది. సరే అనుకొని కళ్ళు తెరిచి అక్కడ ఉన్న పండ్లు, కాయల్లో ఏదో ఒకటి తీసుకుని తినగానే విచిత్రంగా నా బొడ్డు నొప్పి అలాగే నా ఒంటి నొప్పులు అధిక వేడిమి తగ్గుతున్నట్లుగా అనిపించేది.కొన్ని వారాలు గడిచేసరికి నాకు అనుమానము వచ్చి అసలు ఈమెకు ఎవరు ఈ పండ్లు, కాయలు ఇస్తున్నారో తెలుసుకోవాలని అనిపించి ఆ రోజు ధ్యానాలు పూర్తి చేసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న పండ్ల కొట్టు వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగితే “అదేమిటి స్వామి! కొత్తగా అడుగుతున్నారు. అదే ఒక ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పాప మా దగ్గరికి వచ్చి మా అయ్యకి ఆకలి వేస్తుంది. కొంచెం పండ్లు ఇవ్వండి” అని ముద్దు ముద్దు మాటలతో అడిగేసరికి మాకు వెంటనే ఇవ్వాలనిపించి ఇచ్చి వేయటం ఇచ్చిన అరగంటలోనే మా పండ్లు అమ్ముడుపోవడంతో మా వ్యాపారాభివృద్ధికి వచ్చిన బాల దేవతగా ఆమెని అనుకొని ఆమె అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా మేము ఇన్నాళ్ళు ఇస్తున్నాము. కాకపోతే ఆమె అందరి దగ్గరికి వెళ్ళదు. ఆమె వెళ్ళిన కొట్టుకి ఆ రోజు పండగే అన్నమాట. మా కొట్టుకి ఎప్పుడు వస్తుందా అని మేమే ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాము. ఆమె మీ కూతురు కాదా” అనగానే నేను మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చి తిరిగి ధ్యానంలో కూర్చోగానే ఆమె బాల ముగ్ధ మనోహర రూపము కనపడి నవ్వుతూ ఉండేది. కొంపదీసి నేను శ్రీశైల క్షేత్రంలో ఉండటంవల్ల భ్రమరి అమ్మవారు కాస్త బాల అవతారంలో నన్ను పరీక్షించటం లేదు గదా ఎందుకంటే ఆవిడ మరి బాల త్రిపుర సుందరి గదా. ధ్యానములో కనిపించేది ఇలలో అందరికీ కనిపించి నాకెందుకు కనిపించడం లేదు. ఇందులో ఏదో మర్మం ఉంది. అది ఏమిటో తెలుసుకోవాలనిపించేది.
రాఘవ శాస్త్రి- అంత్యక్రియలో అద్భుతం
అప్పుడు నాకు లోగడ మనము చందోలు గ్రామవాసి అయిన రాఘవ శాస్త్రి గారి అదే బ్రహ్మ సిద్ధాంతి గురువుగారి అనుభవం నెమ్మది నెమ్మదిగా గుర్తుకు రావటం మొదలైంది. అంటే ఆయన చుట్టూ బాల రూపము అమ్మవారు తిరిగినట్లుగా ఈవిడ ఇప్పుడు తిరుగుతోందని అర్థమయ్యేసరికి ఇందులో ఏదో మాయ అనుకుంటుండగా గుడి గంటలు ఎందుకో మ్రోగినాయి అంటే నేను ఊహించినది నిజమేనని నాకు అర్థమైనది. అంటే ఈ బాల రూపము నా మణిపూరక చక్రం మాయ అయిన ఇష్ట దేవత సాక్షాత్కారం మాయ అయి ఉండవచ్చునని తలంపు నన్ను వెంటాడేది. నాకు ఇష్టమైన అమ్మవారి రూపములలో బాల రూపము ఒకటి. నన్ను తన మాయలో ఉంచాలని అనుకుంటుంది కాబోలు అనుకుంటుండగా నాకు ధ్యానము నందు అగ్ని ప్రమాదాలు, ఓడ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, గుప్త నిధులు, నిక్షేపాలు, భూకంపం ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు ఒకదాని వెంట మరొకటి కనపడటం మొదలైనది. అరుపులు, ప్రమాద దృశ్యాలు తప్ప ఇంకా ఏమీ తెలిసేది కాదు. అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థం అయ్యేది కాదు. అవి నిజంగా జరిగినా నాకు ఏమి ప్రయోజనమో ఏమి చేయాలో అర్థం అయ్యేది కాదు. ఇలా కొన్ని వారాల పాటు తరచుగా ఇవి నాకు కనిపించి నాకు ధ్యానభంగమయ్యేది.ఒక ప్రక్క బాల సంచారము మరో ప్రక్క ప్రమాదాలు నాకు నిద్ర లేకుండా చేసేవి. ఏమిచేయాలో అర్థంకాని అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు నేను విభూది మఠములో తీవ్ర ధ్యానంలో ఉండగా నాకు రాతి మీద ఏదో యంత్రం గీసినట్లుగా ఉన్న రాతి పలక ధ్యానములో కనపడసాగింది. ఈ యంత్రం మధ్యలో నాకు కనిపించిన బాల రూపము కనపడి నవ్వుతూ ఉండేది. నాకు ధ్యానభంగమయ్యేది.అంటే ఈ యంత్రంకు అలాగే ఈమెకి ఏదో సంబంధం ఉంటుందని నాకు బలంగా అనిపించింది. అలాగే నాకు కనపడే ప్రమాద దృశ్యాలుకి ఈ చక్రానికి ఏదో సంబంధం ఉంటుందని అనిపించసాగింది. ఇలా పలుమార్లు ఈ యంత్రము, బాల రూపము, ప్రమాద దృశ్యాలు వరుసగా ఒక త్రికోణ ఆకారంగా కనబడుతూ వచ్చేవి. ఇవి ఎందుకు కనబడుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాల రూపము కనిపించి “ఏమిరా! నేను ఉన్న చోటికి వచ్చి నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా? నేను అందరి దానిని. ఎవరికి అందని దానిని. ఈ యంత్రము బయటకి తియ్యి.నీ కోరికలు తీరుస్తుంటాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను” అని చెప్పి అదృశ్యమయింది. దానితో నాకు ధ్యానభంగమయినది. ఇలా కాదనుకుని అక్కడ దగ్గరలో వేరే మఠాలలో ఉన్న వయోవృద్ధుల సాధకులను పట్టుకుని విచారణ చేయాలనిపించి విచారిస్తే వాళ్లు చెప్పిన వివరాలు చూస్తే విభూది మఠములో ఉన్న యంత్రము పాశుపత యంత్రం అని దాని అధీకృత దైవము బాలాదేవి అని యంత్రము నిర్మాణము అర్జునుడు చేశాడని ఆయన దీనిని ఆరాధించి పాశుపత శక్తిని పొంది దానిని పాశుపత అస్త్రం గా మార్చుకున్నాడని అందుకు బాల రూపము సహకరించినదని అసలు ఆ యంత్రం భూమికి 80 అడుగుల లోతులో ఉన్న ఈ యంత్రము మీకు అంత స్పష్టంగా కనిపిస్తోంది అంటే నీకు దూరదృష్టి వచ్చి ఉండాలని ఏవైనా ప్రమాద దృశ్యాలు కనపడుతుండాలి కనబడుతున్నాయి అంటే నీ చక్ర సాధన మణిపూరకమునకు చేరి ఉండాలి. ఈ చక్ర మాయగా ఇష్థ దేవత సాక్షాత్కార మాయ ఉంటుందని నీవు ఈ క్షేత్రంలో ఉన్నావు కాబట్టి నీ మాయ గా బాలాదేవి వచ్చినట్లు ఉందని ఆ మాయను దాట లేకపోతే మాకు లాగానే తెలియకుండానే నీ సాధన పరిసమాప్తి అవుతుందని వారు చెప్పగానే నాలో నాకే తెలియని భయము,వణుకు ప్రారంభమయ్యాయి. దాంతో నాకు అంతా అర్ధమవ్వసాగింది. అంటే నేను యంత్రమును బయటకి తీసి పూజిస్తే ఆమె తన ఇష్ట కోరికలు తీరుస్తూ ఉంటే నేను కూడా పాశుపత మఠము పెట్టుకొని అందరి కోరికలు తీరుస్తూ ఉండిపోవాలి.మనకి అంత అవసరమా?ఈ చక్ర జాగృతి ఇక చాలు. ఇక ఇక్కడ ఉంటే ప్రమాదము.ఇంకా నయము.నిజరూప దర్శనం మనకి అమ్మ ఇవ్వలేదు. కేవలము ధ్యాన దృశ్యదర్శనమే ఇచ్చినది. అది కూడా ఇచ్చి ఉంటే నా స్వామిరంగా. నా పని కూడా ఈ మాయ దాటలేక అమ్మ కోసం బలి అయ్యేవాడిని. వామ్మో! మనకి ఇష్థ దేవత వద్దు.ఈ సిద్ధ యంత్రం వద్దు. అనుకుంటూ ఈ చక్ర శుద్ధి కోసము కాశీ క్షేత్రమునకు బయలుదేరాను.
తీరా కాశీ క్షేత్రమునకు వెళ్ళి మణికర్ణికా ఘాట్ వద్ద స్నానాదికాలు ముగించుకొని ధ్యానములో కూర్చోగానే “ఏమిరా నన్నే వదిలేస్తే నిన్ను వదిలిపెడ్తానురా. అక్కడ వదిలేసిన ఇక్కడే ఉన్న నన్ను వదల లేవురా. నీ పైన నేను ఉన్నాను” అంటూ అదృశ్యం అయ్యే సరికి ఆ ఘాట్ పైన బాలాత్రిపురసుందరి ఆలయము జ్ఞప్తికి రాలేదు. దూరదృష్టి సిద్ది వలన ప్రమాద దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా దాటాలో ఒక రకంగా చెప్పాలంటే ఎలా వదిలించుకోవాలో నాకు అర్ధమవ్వక నాకు ఏడుపు వచ్చేది.ఒకరోజు ఉన్నట్టుండి నా దృష్టి భ్రూమధ్యము మీదకి వెళ్లి నిలబడటం జరిగినది. అక్కడే శ్వేత జ్యోతిలో బాల రూపము దర్శనం ఇచ్చేది. అంటే నా ప్రమేయం లేకుండా త్రాటక క్రియ విధానం జరుగుతుండేది. తద్వారా నాలో ఏకాగ్రత, జ్ఞానసిద్ధి, విచారణ బుద్ధి పెరుగుతూ రావటం గమనించాను.అంటే యోగశాస్త్రం చెప్పినట్లుగా ఎవరైతే త్రాటక క్రియ విధానం చేస్తారో వారికి వివేక బుద్ధి, జ్ఞానము, ఏకాగ్రత అలవడతాయని ఈ అనుభవాల ద్వారా శాస్త్రాలలో రాసి ఉంటారని నాకు అర్థమైనది.దూరదృష్టి సిద్ది వలన కనిపించే ప్రమాద దృశ్యాలు కి నేను అసలు స్పందించక పోయేసరికి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. అమ్మ మాత్రమే ఇంకా నా మీద దయ లేదు. నేను తీవ్ర ధ్యానములో ఉండగా నా చుట్టూ రక్షణ కవచంగా 5 సంవత్సరముల బాలిక తిరుగుతోందని మేము చూశామని అక్కడ ఉన్న మిగిలిన సాధు సన్యాసులు చెపుతుండేసరికి నేను వారితో “ఆమె నా కూతురు. నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను కదా. ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని నాకు రక్షణ కవచంగా ఉంటుంది. నాకు కనిపించదు. మీకు కనిపిస్తుంది” అని వారికి చెప్పి తప్పించుకునే వాడిని.ఇలా కనిపించే వారందరికీ సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడే వాడిని. కానీ ఏమీ చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాల కనపడి “ఏమిరా! నీ కోరిక తీరుస్తాను అంటే ఇలా పారిపోయి రావటమేనా? కోరికలు తీరుస్తాను అంటే పారిపోయేవాడిని నిన్నే చూస్తున్నాను. అందరూ నా వెంట పడి నానా కోరికలు తీర్చమని వేధిస్తుంటే నేనే నీ వెంటపడి కోరికలు తీరుస్తాను అంటే భయపడి పారిపోతావెందుకురా?కోరికలు లేనివాడిగా ఉన్నావురా?కోరికలతో అవసరాలు వస్తాయని అవి వ్యసనాలుగా మారతాయని తద్వారా కర్మలు జన్మలు వస్తాయని భలే తెలుసుకున్నావురా. కర్మ జన్మ మూల రహస్యమును గ్రహించినావురా. ఎప్పుడైతే నా రూపమును నా సిద్ధ యంత్రమును పట్టించుకోకుండా స్పందించకుండా ఏమీ తెలియని వాడిలా భక్తి అహము ప్రదర్శించకుండా నీవు ఎప్పుడైతే ఇలా ఉన్నావో ఆనాడే నా మాయ తొలగి పోయిందిరా. వరాలు ఇచ్చే వాడిలాగా మారాలనే నీ తపనకి సంతోషమేసిందిరా. నన్నే దాటి వెళ్లాలని నీవు చేసే ప్రయత్నమే నిన్ను మెచ్చుకునేలా నన్ను అనుగ్రహించేలా చేసిందిరా. నన్ను వద్దు అనుకుంటున్నావు అలాగే నేను వచ్చే రాక పోయే రాక తెలుసుకున్నావు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు నీవు ఎప్పుడు తెల్సు కుంటావో నీ నుండి నేను వెళ్ళిపోతాను అని చెప్పినాను కదరా. అయినా నీ మోక్ష కోరిక నేను తీర్చలేను. అందుకు నీకు సద్గురువును ఇస్తాను. ఆయన చూసుకుంటాడు” అంటూ అంతర్ధానమైనది.
అంటే ఈ చక్ర యోగ మహామాయ దాటినాను అని ఈ చక్ర సిద్ది అయిన దూర శ్రవణ సిద్ది దాటినానని అనుకుంటుండగా ఎవరో సాధువు ఇది సత్యమే అన్నట్లుగా తుమ్మడం జరిగినది. ఇక దానితో ఈ చక్రం ఇచ్చే అగ్ని ఆధిపత్యం కోసం సిద్ధ గురువులు ఉండే చోటు అయిన అరుణాచలం చేరుకోవటము అక్కడ 3 సం!! పాటు వివిధ రకాల ఆసన భంగిమలు వేస్తూ త్రాటక క్రియా విధానం చేసుకుంటూ వారి ఈ గురువుల సమక్షంలో సాధన చేస్తుండగా నాకు అగ్ని మీద ఆధిపత్యం వచ్చినది. అగ్నిలో చెయ్యి పెట్టినను కాలేది కాదు.అగ్ని ప్రమాదాలు జరిగే చోటుకి వెళ్ళి అగ్ని దేవా శాంతించు అని ముమ్మార్లు చెప్పగానే అగ్ని దేవుడు తమ జ్వాలాగ్ని శాంతింపజేయడం నాతోటి సాధు సన్యాసులు గమనించేవారు. ఆనందించేవారు. కానీ నేను వాటిని పట్టించుకునే వాడిని కాను. ఇదః శరీరము పరోపకారః అని అనుకునేవాడిని. నాలుగవ చక్రమైన అనాహత చక్రం సాధన కోసం శ్రీశైలం చేరుకున్నాను. ఇంతలో మీ సాధన విషయాలు నాకు తెలిసి నువ్వు కూడా మీ మణిపూరక చక్రము మాయలో పాండురంగడు నిన్ను ఇబ్బంది పెట్టినాడని, బాల దుర్గా యంత్రం నిన్ను పరీక్షించినదని, నల్ల రంగడు మీ ఇంటికి వచ్చినాడని నాకు తెలిసేసరికి చిరునవ్వు వచ్చినది. నీవు కూడా నాలుగవ చక్రం గూర్చి సాధన చేస్తుంటావని అనుకుంటూ అంటూ టెలిపతి నుండి తప్పుకున్నాడు.చూశారా! నాకేమో పాండురంగడు వస్తే మా జిఙ్ఞాసికి బాల వచ్చింది. ఇక్కడ దైవ రూపాలు మారవచ్చు. కాని వారు వచ్చిన పని మాత్రం ఒక్కటే.అదే తమ సాక్షాత్కార మాయ పరీక్ష అని గ్రహించండి. ఇక్కడ ఇది దాటితే వరాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు.లేదంటే వరాలు పుచ్చుకునే స్థాయి లోనే ఉంటారు. మరి మీరు ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. మరి నాతో ముందుకు కదలండి.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
*******************************
గమనిక:ఈ చక్ర జాగృతి లో పండరీపురం నుండి పాండురంగడు, చక్ర శుద్ధిలో కోణార్క్ నుండి స్పటిక సూర్యుడు, ఆధీనంలో బాల సిద్ధ యంత్రం, చివరికి నల్ల పాండురంగడు రుక్మిణి సహితముగా వచ్చినారు.అలాగే మా ఆవిడకి తన ధ్యానములో దొంగతనం దృశ్యాలు, ప్రమాద దృశ్యాలు, పాముకాటు దృశ్యాలు, గుప్తనిధుల దృశ్యాలు కనబడుతున్నాయని చెప్పగానే ఈ చక్రము లో వచ్చిన దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చాను. కానీ ఈమెకి ఇష్ట దేవతగా శిరిడి సాయి బాబా రావటము ఆయన స్వయంభూగా మాట్లాడటం జరిగినది. కానీ నా సూచనలు మేర ఈ మాయను తెలుసుకుని ఆయనను దాటటం కూడా జరిగినది. లేదంటే ఆయన భక్తురాలిగానే జీవితాంతం ఉండేది. కానీ ఇప్పుడు ఆయనను తొలి గురువు అని భావించుకొని ఆరాధన చేస్తూ మోక్షప్రాప్తి మాత్రమే ప్రసాదించమని ఇక ఎలాంటి భోగ యోగ కోరికలు వేడుకోవడము జరిగినది.
అసలు నాకులాగా ఈ చక్రము నందు ఇష్టదేవత దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానుభవాలు ఉన్న "పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి" పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి గూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను ఒకసారి జొన్నవాడ కామాక్షి దేవాలయమునకు చేరుకోవడము జరిగినది.అక్కడ నాకు దిగులుతో సాధన సమస్య ఉన్న సాధకుడు కనిపించాడు.వాడిని చూడగానే నాకు వాడి సాధన విషయము అర్ధమైనది. వాడి దగ్గరకి నేను వెళ్ళి"ఏమిటి వారం అయిన అమ్మవారు నీ స్వప్నములో ఇక్కడ కనిపించలేదని బాధపడుతున్నావా?ఈవిడ ఎలా స్వప్నదేవత అయినదని ఆలోచింస్తున్నావా? అమ్మ ఇక్కడ స్వప్నములో కనపడి అందరి సమస్యలు తీరుస్తుందని నాకు తెలిసి ఇక్కడకి నేను మొదటిసారిగా వచ్చినపుడు స్వయముగా ఆమె ఇలలో కనపడి నా చుట్టు తిరిగి నా దగ్గర నుండి ప్రసాదముగా కొబ్బరికాయను తీసుకొని వెళ్ళిపోయినది. అంటే అమ్మ ఇక్కడ స్వయంభూగా తిరుగుతుందని తెలుస్తోంది గదా అనగానే వాడు వెంటనే "స్వామి! మీకే గాదు మా వాళ్ళకి గూడ ఇక్కడ అమ్మవారు స్వప్నములో కనిపించినదని తెలుసుకొని వచ్చినాను. కాని ఇంతవరకు ఇలలో గాదుకదా కలలో గూడ కనిపించలేదు అనగానే నేను వెంటనే"అమ్మ!నీ బిడ్డను వచ్చాను.నిన్ను చూడటానికి నీ మరో బిడ్డ గూడ ఉన్నాడు.రా...రా...తల్లి" అనగానే నీలం రంగు పట్టుచీర కట్టుకొని 45 సం!!రాల ఒక స్త్రీమూర్తి వచ్చి తను నములుతున్న ఎంగిలి తాంబూలమును తన నోటి నుండి తీసి నాకు ఇచ్చినది.నేను మారుమాట్లాడకుండా దానిని అందుకొని నేను తినడము మొదలు పెట్టినాను. అపుడు ఆ తర్వాత నా ప్రక్కనే ఉన్న సాధకుడికి గూడ తన ఎంగిలి తాంబూలము ఇవ్వబోయేసరికి వాడు కాస్తా అసహ్యం ముఖము పెట్టి “ఛీ..ఛీ...నీ ఎంగిలి తినేవాడికి లాగా కనపడుతున్నానా?నా ఎంగిలి ఎవరికి పెట్టను..నేను ఇంతవరకు ఎవరి ఎంగిలి తినను” అనగానే ఆమె కాస్తా చిరునవ్వు నవ్వి “నువ్వు ప్రతిరోజు నా ఎంగిలి తింటున్నావు.ఆ విషయము నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు.దేనికైనా అర్హత, యోగ్యత ఉండాలి.అవి రానంతవరకు ఏవి కనిపించవు.ఎవరు కనిపించరు.కనిపించిన గుర్తుపట్టలేరు గదా” అంటూ వెళ్ళిపోయినది. ఆమె వెళ్లిపోయిన తర్వాత వాడితో నేను వెంటనే “ఇన్నాళ్ళు అమ్మవారి కోసము ఎదురుచూస్తున్నావని అన్నావు.ఆమె స్వయంగా వచ్చి ఆమె ఎంగిలి ప్రసాదము ఇస్తే ఎలా గాదన్నావు.ప్రతిరోజు ఆమెకి ప్రతినిత్యం నీవు పూజలు చేసి ఆమెకి నైవేద్యాలు పెట్టి ఆమె తిన్నవాటిని నువ్వు ప్రసాదాల పేరుతో తిన్నావు గదా!మరి ఆమె ఎంగిలి తినని అంటావా” అనగానే వాడు వెంటనే అంటే “ఇపుడు వచ్చిన స్త్రీ మూర్తి అమ్మవారని ఎలా నమ్మేది” అనగానే నేను నవ్వుతూ అయితే “నీవు వెంటనే గుడిలోపలకి వెళ్ళు తెలుస్తోంది “అనగానే వాడు గుడిలోనికి వెళ్ళగానే లోపల నీలరంగు పట్టుచీరలో అమ్మవారి విగ్రహమూర్తి కనిపించేసరికి మనవాడు నోరు వెళ్ళబెట్టాడు. ఆరోజు రాత్రి వాడికి అమ్మవారు ఇదేరంగు చీరతో స్వప్న దర్శనమిచ్చి తను నిజముగానే ఇప్పటికి స్వప్నదేవతయని నిరూపించినది. ఇది ఇలా ఉంటే ఆలయపూజారి నా దగ్గరికి వచ్చి “స్వామి!నిన్న మీ మధ్య జరిగిన విషయాలు తెలిసినాయి.నాకు ప్రతి నిత్యం అమ్మవారి దర్శనాలు అవుతూనే ఉన్నాయి.ఈ అమ్మమాయను ఎలా దాటాలో నాకు అర్ధము గావడము లేదు.ఈ చక్రమాయను దాటితేగాని పై చక్రానికి వెళ్ళలేము గదా” అనగానే దానికి నేను ఒక చిరునవ్వు నవ్వి"ఒకడికి అమ్మ దర్శనము గావాలి.మరొకడికి అమ్మదర్శనము మీద వైరాగ్యము కల్గినది. మీ 80 సం!!రాల వయస్సులో గూడ ఈ జన్మ వృధా గాకుండా చేసుకోవాలని తపన చూస్తూంటే అని అంటూ లాగి పెట్టి ఆయన బొడ్డు మీద బలముగా నేను కొట్టేసరికి ఆ దెబ్బ కాచుకోలేక క్రింద పడిపోయారు.”ఇపుడు ఎలాఉంది” అనగానే “అమ్మపాదాలు” దర్శమిస్తున్నాయి అన్నారు.ఇక “వాటిని దాటలేదా” అని నేను ఈ సారి ప్రక్కనే పడి ఉన్న కొబ్బరి చిప్ప పెంకును తీసుకొని వారి భ్రూమధ్య స్ధానములో దీనితో కొయ్యగా రక్తము బయటికి వచ్చినది.అపుడు ఆయన సృహ కోల్పోతూ నాకు దివ్యజ్యోతి ప్రకాశము అవుతోంది అంటూండగానే...ఇదింతా తెలియని గుడి భక్తులు కాస్తా నేను ఫూజారికి ప్రాణహాని కల్గిస్తున్నాని నన్ను తన్నటానికి రావడముతో నేను వారందరిని చేతితో వారిస్తుండగా ఆ పూజారి కాస్త మత్తులో “ఆస్వామిని ఏమి అనకండి.ఆయన నా సద్గురువు.నాకు మంచే చేసినారు” అంటూ మత్తులో పూర్తిగా జారుకున్నారు. ఒక జీవి జీవన్ముక్తి మార్గము పట్టినాడని గ్రహించి నేను అక్కడనుండి మౌనముగా బయలుదేరినాను.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండి104 ee chakramlo jarugaboye Pramadalu thelusthayani cheppatam meeku ayna dhyaanam
రిప్లయితొలగించండిanubhavam next day paper lo raavatam meeru restroom vellatam akkada navvodu ani cheppatam
andari pani ade ani ardhamayyela chepparu.....ee chakraniki sambandhinchina pandurangadi
vigraham ravatam mee Thatha gaari yantram dwara prana prathishta jarugatam ayna karna
pistacchi la mimmalni vedinchatam Sri satyanarayana movie chusi edi thelsukovatam
great.....jignyasi gaari chuttu Bala amma vari thirugatam aa Amma mayala nundi ela bayata
padinarani baga chepparu...