అధ్యాయం 45


మలి ప్రేమ- వివాహము

 మేము యోగ సాధన చేస్తున్నప్పుడు మాలో కుండలిని జాగృతి అనుభవ అనుభూతులు కలగటం ప్రారంభమయ్యాయి. అలాగే మాలో విపరీతమైన స్త్రీ కామ వాంఛ మొదలైంది. ఒకేసారి వెయ్యి వయాగ్రా బిళ్ళలు వేసుకుంటే ఎంతటి కామ శక్తి కలుగుతుందో అంతటి శక్తి మాలోఉద్రేకం అవ్వటం మొదలైంది అని అర్థమైంది. తట్టుకోలేని పరిస్థితి కి చేరుకున్నాను. ఒకేసారి వంద మంది స్త్రీలు కూడా వచ్చిన ఏ మాత్రం జంకకుండా సుఖ ప్రాప్తి కలిగేటట్లుగా చేస్తామని అనిపించసాగింది. ఎవర్ని చూసినా దేనిని చూసినా కామ దృష్టి తప్ప మరొకటి కనిపించని స్థితి.  12 సంవత్సరాల వయస్సు నుండి 120 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు కూడా నాకు అందంగా, కామముగా కనిపించడం ఆరంభమైనది. ఇలాగాకుండా ఇష్ట దేవతా స్వరూపాలు, వివిధ దేవతా విగ్రహ మూర్తులు కూడా  అమ్మ కి బదులుగా అమ్మాయి గా కనపడటం మొదలైంది. దానితో ప్రణవ మంత్రము కాస్త ప్రణయం మంత్రముగా మారింది. ఏమి చేయాలో తెలియని స్థితి. ఏమి చేసుకోవాలో తెలియని పరిస్థితి. తలను దేనికి కొట్టుకోవాలో అర్థంకాని స్థితి.ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉండగా బాబా వారిని అడగగా అనగా సమాధానాలు చెప్పే బాబా పుస్తకం తీసి అడగగా ఆయన దానికి “మీకు త్వరలో గౌరీతో వివాహం నిశ్చయమైనది” అని సమాధానం చెప్పగానే నేను గతుక్కుమన్నాను. ఒక ప్రక్క యోగసాధనలో దింపుతూ మరో ప్రక్క సంసార బాధ్యతలు అనగా గృహస్థ జీవితం లోకి వెళ్ళమని చెబుతున్నాడు. “వామ్మో!  దీనెమ్మ జీవితం. ఖచ్చితంగా నా యోగసాధన చంక నాకినట్టే.ఎందుకంటే గృహస్థ జీవితంలోకి వెళ్తే పిల్లలు వారి చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్లు సంతానం వారితో తిట్లు చివాట్లు పడటం అవసరమా!  ఇంకా మన జీవితం మన చేతుల్లో ఉండదు. వారి కోసం మన జీవితం మన జీతం అన్నట్లుగా తయారవుతుంది. ఇక్కడ నాకే దిక్కులేదు మరి వచ్చే మహాతల్లికి ఏమి పెట్టాలి.నా బొంద నా బూడిద” అనుకుంటూ నా యోగ సాధన కొనసాగిస్తూ ప్రతి గురువారం వచ్చే జాతక సమస్య ఉన్నవాళ్లకి పరిష్కార మార్గాలు చెబుతూ కాలం గడుపుతున్నాను.

ఇలాంటి సమయంలో మా బంధువుల ద్వారా నాకు అంత వరకు వరుస అయ్యే అమ్మాయి వస్తుందని తెలిసి గతుక్కుమన్నాను. కాకపోతే అంత వరకు చాలా మంది పెళ్లికాని అమ్మాయిలు,బంధువుల అమ్మాయిలు వచ్చారు కానీ ఈమె వివరాలు  తెలుసుకున్న దగ్గర నుంచి నాలో తెలియని ఆందోళన మొదలైంది. అంటే వచ్చే  ఈమెకు మాత్రమే నాకు శ్రీమతి అయ్యే యోగం ఉన్న స్త్రీ అని అర్థమైంది. పైగా ఈమె కూడా బాబా భక్తురాలు అవటం విశేషం. దానితో మా బంధువుల ద్వారా ఈమెను రావద్దని చెప్పినా కూడా  వాళ్లు ఈ విషయం ఈమెతో చెప్పకుండా తప్పుకున్నారు. జరిగే యోగం ఉన్నప్పుడు జరగక తప్పదు కదా. వివాహ యోగం ఉంటే వివాహం కాకుండా తప్పదు కదా.ఆ అమ్మాయి ఒక గురువారం తన జాతక సమస్యలు గూర్చి నన్ను అడగటానికి ఒక జ్యోతిషవేత్త దగ్గరికి వచ్చినట్లుగా వచ్చింది. చూస్తే బొద్దుగా ముద్దుగా బాగానే ఉంది. అందంగా ఉంది. ముఖంలో ఏదో తెలియని అమ్మవారి దైవిక శక్తి కనబడుతుంది. రమ్మని కూర్చోమని బాబాకి నిత్య హారతి పూజ నైవేద్యం కార్యక్రమాలు చేస్తున్న కూడా నా మనస్సు ఈమె గూర్చి ఆలోచన చేయడం చేస్తూనే ఉంది. ఈమె నా భార్యనా? ఈమే కదా. ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది. మంచి మనస్సు ఉంది. అమాయకత్వంగా కనబడుతుంది. మంచి తెలివితేటలు ఉన్నాయి. మంచి అధిక స్తోమత ఉన్న కుటుంబ వ్యక్తి లాగా ఆమె వేసుకున్న దుస్తులు చెబుతున్నాయి. అలాగే ఆమె మాట్లాడే తీరు అందర్నీ ఆకర్షించే విధంగా ఉన్నాయి. మంచి అణకువ విధేయత గౌరవ మర్యాదలు కనబడుతున్నాయి. ఎటు చూసిన నేను ఖచ్చితంగా ఈమెకి తలతూగను.బాబా చెప్పిన వ్యక్తి ఈమె ఖచ్చితంగా కాదు అనుకున్నాను.  కానీ ఈమె ఆమె అని కొన్ని క్షణాల తర్వాత నాకు అర్థమయ్యే సరికి నా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలైనాయి. 

యోగి గా కావాలని నేను అనుకుంటే బాబా వారు నన్ను కాస్తా కామ భోగిగా మారుస్తున్నారని మనస్సులో ఆవేదన, బాధ, భయం, ఆందోళన మొదలయ్యాయి. నాకు కూడా పూజ పూర్తి అయినది.  నా పూజా విధానానికి ఆమె తన్మయత్వం చెందినట్లు అనిపించింది. ఆమెను దగ్గరకు పిలిచి ఒక జ్యోతిషవేత్త గా ఆమెతో “ఏమి కావాలి? ఎందుకు వచ్చారు చెప్పండి” అనగానే తన M.Sc ప్రాజెక్ట్ కు సంబంధించిన రిపోర్టు వివరాలు  ఏడుస్తూ బాధపడుతూ చెప్పగానే ఆమెతో “చూడండి మీకు M.Sc పూర్తి కాదు. ఈ ప్రాజెక్టు దగ్గర ఆటంకాలు ఉన్నాయి. చాలా కష్టపడవలసి వస్తుంది. మీ ప్రొఫెసర్ అందుకు సహకరించడు. వాడు మీ దగ్గర ఏదో ఆశిస్తున్నాడు అని మాకు అర్థం అయినది” అని చెప్పేసాను. ఇంకా దానితో తను పని చేస్తున్న ఉద్యోగం ప్రమోషన్ గురించి,  తన వివాహం గురించి, తన బంధు మిత్రుల గురించి ఇలా మూడు గంటల పాటు నన్ను అడిగింది. ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ చివరకు “చూడండి మీకు రెండు వివాహ విధి విధానాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ వివాహం. మరొకటి పెద్దలు కుదిర్చిన వివాహం. ఇందులో ప్రేమ వివాహానికి 80% అవకాశాలు ఉన్నాయి. ఈ వివాహం తో మీరు స్వేచ్ఛ గా మీకు కావలసిన విధంగా జీవించగలుగుతారు.అదే పెద్దలు కుదిర్చిన వివాహం అయితే మీరు కాస్త బంగారు పంజరంలో బంధించిన రామచిలుక లాగా బ్రతుకుతారు.  అన్ని రకాల సుఖాలు భోగభాగ్యాలు అందుతాయి కానీ మీకు తృప్తి ఉండదు. బంగారు పళ్లెంలో అన్నం తింటారు కానీ మీ ప్రక్కనే ఎవరూ ఉండరని ఏకాంత స్థితి. తృప్తి లేని బంధీ జీవితం అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి జీవితం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ తేదీన మీకు వివాహ యోగ కాలము నాకు తెలుస్తుంది” అని చెప్పి చెప్పగానే ఆమె విని మౌనంగా కూర్చొని  భారంగా ఊరుకొని కొన్ని నిమిషాలు తర్వాత   ఏవైనా సమస్యలను అడగటానికి నా ఫోన్ నెంబర్ కావాలని అని అడిగి తీసుకొని బాధగా వెళ్లి పోవడం జరిగినది. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు ఫ్రీగా ఉంటే మీతో మాట్లాడాలని మెసేజ్ చేసింది. ఏమై ఉంటుందా అని చెప్పి నా మనస్సు లాగడం మొదలు పెట్టంది. దానితో ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది. ఫోన్ మాటలు కాస్త పార్క్లు దాకా వెళ్లి మాటలు మాట్లాడుకునే స్థాయికి మేమిద్దరం చేరుకున్నాం. 

ఒక ప్రక్క నా మనస్సు చెబుతూనే ఉంది ఇది చాలా తప్పు! ఆమె నీకు సరిజోడి కాదని నువ్వు ఆమెకి సరిపోవని చెబుతుంటే ఒకసారి అదే విషయం ఆమెతో చెప్పగా అయితే నేనేమో భోగంలో ఉన్నత స్థితిలో ఉంటే  మీరేమో యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నారు.నేను ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నాను. మీరు బాబా భక్తి లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇంకా ఎన్ని ఈ పాప మానవ జన్మలు ఎత్తాలి? నాకు ఇష్టం లేదు. నాకు జననం లేని జన్మ స్థితి కావాలి. అందుకు మీరే సరైన వ్యక్తి అని బాబా గారు  నాకు వివిధ అనుభవాల ద్వారా తెలియజేసినారు. నేను మిమ్మల్ని వదులుకోను. మీరు నన్ను వదిలి ఉండిన నేను అలా ఉండలేను అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కానీ నిన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకోరు అని చెప్పగానే నా గుండెలో రాయి పడినట్లయింది. వామ్మో!  పోయి పోయి లేచిపోయి పెళ్లి చేసుకోవాలా? ఇంకా ఏమైనా ఉందా. నా బ్రతుకు “ప్రేమిస్తే” సినిమా హీరో పరిస్థితి అనగా  ప్రేమ పిచ్చితో రోడ్డు మీద పడితే పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. పిచ్చివాడిగా యోగం అవధూత స్థితి పొందాలని నేను అనుకుంటే ఈమె కాస్త నన్ను తన ప్రేమ వలన భోగి పిచ్చి వాడిగా మార్చాలని అనుకుంటుందా… అసలు దీనంతటికీ కారణం ఆ ముసలాడు వల్లనే అదే షిరిడి బాబా వల్లనే వచ్చినది అనుకుంటూ మౌనంగా ఏదో తెలియని ఆందోళనతో, భయంతో ఇంటికి చేరుకున్నాను. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె నుండి ఫోన్ వచ్చింది.  ఒకటే ఏడుపు.నాకు బాధగానే ఉంది. కానీ ఆమెను ఇలా వివాహం చేసుకోవటమే నాకు ఇష్టం లేదు.  అలాగని ఆమె తల్లిదండ్రులను అడిగే స్థాయి నాకు లేదువాళ్ళ పిల్లను ఎలాగైనా తమ కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇచ్చుకోవాలని ఘనంగా వివాహం చేసుకోవాలని, ఉన్నత ఉద్యోగికి ఇవ్వాలని, విదేశీ వ్యక్తికి ఇవ్వాలని వాళ్ల కోరికలు వాళ్ళకి ఉంటాయి కదా. పోనీ ధైర్యం చేసి ఈమె అడిగితే మన విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను కట్టడి చేస్తారు. నన్ను ఉద్యోగం మానిపిస్తారు. నన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి లేదంటే నన్ను మర్చిపోకండి. నేను నీ పెళ్లి కి రాను. అలాగే మీరు నా పెళ్ళికి రావద్దంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె బాధ ఆమెది నా బాధ నాది.  కొన్ని గంటలు గడిచినాయి. అర్ధరాత్రి 2 గంటలకు ఆమెకు ఫోన్ చేసి  సరే నీ ఇష్టప్రకారమే వివాహం చేసుకుందాము అనగానే చాలా థాంక్యూ! నల్ల బంగారం!ఐ లవ్ యూ అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఆనందం నాకు ఆందోళన మిగిలాయి. ఈ రకంగా నా పరిస్థితి తియ్యని దురద లాగా తయారైంది. అటు ఆమెను కాదనలేను.ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఇంట్లో మా అన్న వాళ్ళకి అక్క వాళ్లకి విషయం చెప్పగానే వాళ్లు గతుక్కుమని మేము నీ పెళ్లి విషయంలో ఎలాంటి సహకారం అందించమని తప్పుకున్నారు. వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి.ఆ క్షణం నుండి మానసికంగా నాకు సోదర ప్రేమ మోహ వ్యామోహాలు పోయినాయి. నేను సమస్యల్లో ఉన్నప్పుడు సహకరించ లేనప్పుడు ఇంకా వీళ్ళు నాకెందుకు అనిపించసాగింది. దాంతో మానసికంగా దూరం అయ్యాను. మా తల్లిదండ్రులకు చూచాయగా విషయం చెప్పాను. వారు మౌనం వహించారు. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. అపుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అన్ని విషయాలు చెపితే...వాడు పెద్దగా నవ్వి"స్వామి!అది ఏమిటి?తమరు భార్యబాధితుల సంఘం పెట్టాలని...దానికి తమరు అధ్యక్షుడిగా ఉండాలని...దీనికోసము బ్రహ్మచారిగా ఉంటానని నాతో చెప్పినట్లుగా గుర్తు అన్నాడు!వెంటనే వాడితో"ఇపుడు జోకులు అవసరమా?ఇక్కడ నా బొంద నా జీవితమే నా చేతులలో లేదు!ఇపుడు నా పెళ్ళి సంగతి ఏమి చెయ్యాలో చెప్పు"అన్నాను! దానికి వాడు వెంటనే "మా అమ్మ అయిన మీ ఆవిడగారు ఏమి చెపితే అలా చెయ్యడము తప్ప మనచేతులలో ఏమి లేదని తెలుసుకో ...నీకు ఆమెతో బాబావారు వివాహాము చెయ్యాలని బలంగా అనుకున్నారు..ఖచ్చితముగా చేస్తారు…. పైగా ఇందులో నా సహాయసహకారాలు ఎపుడూ ఉంటాయని " అన్నాడు. ఇదే విషయం ఆమెతో చెబితే “మన వివాహం అయిన తర్వాత అన్ని విషయాలు సర్దుకుంటాయని మన వెంట వీళ్లు లేకపోయినా బాబా గారు ఉన్నారు” అని నాలో లేని ధైర్యం పోసింది. అనుకున్న సమయానికి ఇంట్లో నుంచి ఒక రోజు మేమిద్దరం జంపు అయ్యి  ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాము. సాక్షి సంతకాల కోసము మా జిజ్ఞాసి ఉన్నాడు!నా తెలిసినవాళ్ళు వచ్చి తమ సహాయసహకారాలు అందించి దగ్గర ఉండి మా పెళ్ళికి వీళ్ళే పెళ్ళిపెద్దలు ఉండి ఇక్కడ చేయించినారు! అటు వాళ్ళ వాళ్ళకి ఇటు నా వాళ్ళకి మా వివాహ విషయం తెలిసే సరికి గతుక్కుమన్నారు. ఒక ప్రాంతంలో ఆమె తరపు బంధువులు ఆమె తల్లిదండ్రులు కలిసి సమావేశపరిచారు. ఆమెను నానా తిట్లు తిట్టినారు. కొట్టినారు. వెంటనే నేను అడ్డుగా వెళ్లి వాళ్ళని అడ్డగించి ఈమెను నా ప్రాణ ప్రదంగా చూసుకుంటానని అక్కడ వాళ్ళకి మాట ఇచ్చాను. దానితో అక్కడ నుండి మౌనంగా వేదనతో వెళ్లిపోయారు. 

మేము కూడా మా ఇంటికి సత్యనారాయణ వ్రతం కోసం చేరుకున్నాము.ఈ వ్రతానికి మా అన్న, అక్క సభ్యులు లేరు. ఉన్న తల్లిదండ్రులు మేము అలాగే నాకు తెలిసిన ఊర్లోని వారంతా ఉన్నారు. మరియు నా జిజ్ఞాసి చివరిదాకా నా తోడుగా రక్షకుడిగా ఉన్నాడు!మా సొంత అన్న వదిన,అక్కబావ భయపడితే...వీడు మాత్రము నాతో ఎలాంటి రక్తసంబంధము లేకపోయిన...కేవలము ప్రాణస్నేహం కోసము నా కోసము నా సంరక్షణ కోసము ఉన్నాడు! వారి సమక్షంలో మరొకసారి చిన్నపాటి విధముగా పెళ్లి చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. వ్రతం సమయానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావటం కొద్దిపాటి వాదనలు జరగటం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లి పోవడం జరిగినది. శోభనం రాత్రి రానే వచ్చింది.పాలు తీసుకుని రావలసిన మా శ్రీమతి బదులు మా కార్య ముహూర్తము పెట్టిన పండితుల వారు పాలు తీసుకుని వచ్చేసరికి గతుక్కుమన్నాను. ఇంతలో మా శ్రీమతి వచ్చింది. మేము బాధలు చెప్పుకున్నాము. ఆనందాలు పంచుకున్నాము అటుపై యోగ సాధనకి అడ్డుగా వచ్చే సంతాన మాయలో పడకూడదని అందుకే పిల్లలు వద్దని మేము ఇద్దరం కలిసి స్థిరనిశ్చయం ఆ రోజే తీసుకొని మా వివాహ దాంపత్య జీవితం ప్రారంభించే సరికి బాబా వారు ఎందుకు ఈమెను నాకు శ్రీమతి గావింపజేసినారో అప్పుడు గాని అర్థం కాలేదు. ఎందుకంటే ఈమెకు నాకు అలాగే ఈ వివాహం అనే ప్రారబ్ధకర్మ మాత్రమే ఉంది. అలాగే ఈమె కాకుండా మరో స్త్రీ అయితే భోగభాగ్యాలు కావాలని, సంతానం కావాలని నానా చంకలు నాకించడం జరిగేది. ఖచ్చితంగా భోగ మాయలో పడి పోయే వాళ్ళం.  అటు బ్రతకలేక చావలేక జీవితాలను అసంపూర్తిగా అనుభవిస్తూ, ఎందుకు బ్రతుకుతున్నామో, దేనికోసం బ్రతుకుతున్నామో అర్థం కానీ అయోమయ స్థితిలో నేను ఉండేవాడిని. కాకపోతే పెళ్లి చేసుకోవడం వల్ల మేమిద్దరం కూడా రామకృష్ణ పరమహంస శారదాదేవి లాగా ఉండిపోయి యోగ సాధన చేయాలని బాబా వారు అనుకున్నారని నేను ఊహించలేదు. దంపతులుగా కాకుండా యోగ సాధకులుగా యోగ సాధన చేయాలని ఆమెకి ఎందుకు కలిగిందో మీకు తెలియాలంటే ఇంకా ఎందుకు ఆలస్యం ముందుకు మాతో పదండి!

మా ఆవిడ మోక్ష గామి కావడం


  నేను గృహస్థ ఆశ్రమం లో ఉన్నాను అని మీకు తెలుసు కదా. నా యోగ సాధన అనగా కుండలినీశక్తి  జాగృతి ప్రారంభ రోజులు. అలాగే నా వివాహ రోజులు ప్రారంభమైనాయి. వివాహమైన ఆరు నెలల వరకు నేను ఏం చేస్తున్నానో నా ఇష్టాలు ఏమిటి? నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాయి అని కలవరపడుతూ ఆనందపడుతూ గడిచి పోయినాయి. ఆ తర్వాత నేను ఎక్కువగా సొంత ఊరికి వెళ్ళినప్పుడు గుడిలో ఎక్కువగా ధ్యానజపాలు చేయడం, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట మూడు లేదా నాలుగు గంటలపాటు మంత్ర జపం చేయడం, శని ఆదివారాలలో ఏడు లేదా ఎనిమిది గంటలపాటు జపం చేయడం, గ్రహణ సమయములో, పండుగల సమయంలో అనగా మహాశివరాత్రికి అలాగే కార్తీక పౌర్ణమి రోజులలో ఎక్కువ జప తపాలు చేయడం కూడా తను బాగానే గమనించినది. అలాగని తను దాంపత్యం వదిలి పెట్టడం లేదని తనను ప్రేమగా చూసుకుంటున్నానని తనకి తెలుసు.  అలాగే అన్ని రకాల గృహసంబంధ భార్య బాధ్యత బంధాలు చక్కగా చేస్తున్నానని తనకి మానసిక శారీరకంగా  చక్కగా సుఖ ఆనందంలో ఉంచుతున్నాను అని తెలుసుకొని అందరికి లాగా ఈయన ఉండటం లేదని జపధ్యానాలు చేయటమే తనకి కొత్తగా వింత గానే ఉండేది. దాంతో ఒక రోజు రాత్రి తను గమనించిన విషయాలు అన్ని నాతో చెప్పడం జరిగినది. అప్పుడు దానితో “సఖి!ఇల్లాలా!నేను ఎవరో తెలుసుకోవాలని నా ప్రయత్నం. నన్ను సృష్టించిన వారు ఎవరో నాకు తెలియాలి. నేను అనేది ఎలా నశిస్తుందో తెలుసుకోవాలి” అనగానే  ఆమె “అదేమిటి మీరు మీరే కదా! ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏమిటి? మిమ్మల్ని సృష్టించినది అత్త మామయ్య గారులే కదా. ఇంకా ఏముంది మీరు మరణం పొందితే మీరు ఉండరు కదా” అని చెప్పేసరికి నాకు నవ్వు ఆగలేదు. నేను నవ్వేసరికి మొఖం మీద పెదవులతో బుంగమూతి రావడం నేను గమనించి “అమ్మా! తల్లి! పెళ్ళామా! నేను అంటే ఫలానా వ్యక్తి పేరు కాదు. ఫలానా వృత్తి కాదు.ఫలానా కొడుకును కాదు. అసలు నువ్వు ఎవరో ఒకసారి ధీర్ఘంగా ఆలోచించు. నువ్వు అంటే అమ్మాయివా? కూతురివా? తల్లివా? చెల్లివా?అక్కవా? స్నేహితురాలివా? బంధువా? భక్తురాలివా ఇలా వీటిలో నువ్వు ఎవరివి దానిని ముందుగా తెలుసుకో. ఈ జన్మకి నా తల్లిదండ్రులు వీరు. మరివీళ్ళని సృష్టించిన వాళ్లు ఎవరు వాళ్ల తల్లిదండ్రులు. మరి వాళ్ళని సృష్టించింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడే ఆఖరి ఆది తల్లిదండ్రులను సృష్టించినట్లు మనకు తెలుస్తుంది.  మరి దేవుడును సృష్టించిన దెవరు? నాలోనూ దేవుడు ఉన్నాడు నీలోనూ దేవుడు ఉన్నాడు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మనలో దేవుడిని ఎవరు సృష్టించారో తెలియదు కదా మరి.అంటే ఒక రకంగా చూస్తే నిన్ను సృష్టించినది ఎవరో నీకు తెలియదు. అలాగే నీవు (నేను) అంటే ఏమిటో తెలియదు. ఎందుకు పుడుతున్నావో ఎందుకు చస్తున్నావో తెలియదు. ఎవరి వలన పుడుతున్నావో ఎవరి వలన మరణిస్తున్నావో నీకు తెలియదు. ఇలా తెలియని దానిని తెలుసుకోవాలని నా యోగ ప్రయత్నమే నీవు చూస్తున్న ధ్యాన విధానాలు. అంటే మోక్షగామిగా మారి నేను ఎవరో నాకు తెలియాలి అని నన్ను సృష్టించిన దెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రయత్న వాదిని. ఉన్నదో లేదో తెలియని దానిని తెలుసుకోవాలని  నా మనస్సు చెప్పిన విధానంతో ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాను” అని చెప్పగానే దాని చిన్న బుర్రకి మొదట ఏమీ అర్థం కాలేదు. అర్ధమయ్యి అర్ధం కాలేదని నాకు అర్థమయ్యే సరికి దానిని కదల్చటం అవసరమని… ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఒకవేళ ఆ పాము కుండలిని పాము అయితే దానికి కర్మవాసనలు పూర్తి అయ్యే సమయం దగ్గర పడటంతో తనకి నా జప ధ్యాన ప్రక్రియలు ఆకర్షించాయి. నా విగ్రహారాధనలు పిలుస్తున్నాయి. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాయి. యోగం ఉండటం వల్లే నన్ను వివాహం చేసుకుంది. భార్య అయినది. యోగ మార్గం వైపు తన మనస్సు తనకు తెలియకుండానే అడుగులు పడుతున్నాయి” అని నాకు అర్థం అయింది. శివపార్వతులు లాగా తను ఈమెకు గురువుగానూ ,భర్త గాను ఉండి యోగము, భోగం యోగాలను పరిసమాప్తి చేయాల్సి ఉంటుందని  గ్రహించి మౌనం వహించి నిద్రలోకి జారుకోవడం జరిగినది. 

ఆమె నిద్ర  పోకుండా మెలకువగా ఉండి  “నేను” అంటే ఏమిటో? నాకు సమాధానం చెప్పాలని తనకి తోచిన సమాధానాలు కాగితము మీద రాసుకుంటూ పది పేజీలు నింపే సరికి అవేవీ నేను కాదని తెలుసుకొని నా వంక ఆర్తిగా, అయోమయంగా చూస్తూ నిద్రలోకి జారుకోవడం నా ఓరకంట నేను గమనిస్తున్నాను” అని ఆమె తెలుసుకోలేక పోయింది. ప్రొద్దునే లేచి కాఫీ ఇస్తూ “ఏమండీ! రాత్రంతా కూర్చుని నేను ఆలోచించి కాగితాల మీద నేను గూర్చి వ్రాసినాను. కానీ నేను అనేవి అవి ఏవీ కావని నాకు అర్థమైనది.మరి నేను అంటే ఏమిటి?” అని అడిగింది. నేను వెంటనే “దీక్షా! నేను అంటే అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. అలాగని అసాధ్యం కాదు. నేను అనే దానిని పట్టుకుని అరుణాచల రమణ మహర్షి జీవన్ముక్తి పొందినారు. ఇది తెలుసుకోవాలని రామకృష్ణ పరమహంస వివిధ యోగ సాధన ప్రక్రియలు, వివిధ మత సంప్రదాయాలు చెప్పిన విధి విధానాలు చేసి నేను తెలుసుకొని అవి నిజమే చెబుతున్నాయి” అని లోకానికి తన అనుభవాలను కథల రూపంలో చెప్పి మోక్ష ప్రాప్తి పొందినారు. నేను అనేది  తెలుసుకోవాలని బుద్ధుడు గృహస్థ ఆశ్రమం వదలి అడవుల వెంట పిచ్చి వాడిగా మోక్షగామి అయ్యి ఙ్ఞాన సిద్ధుడు గా మారి మోక్ష ప్రాప్తి పొందినాడు. అంతెందుకు మహాశివుడు తన సతీదేవి మరణ విరహవేదనను తట్టుకోలేక   పిచ్చివాడై ఆదియోగి గా మారి యోగసాధనతో నేను అనేది తెలుసుకొని లోకానికి చెప్పటానికి ఆయనే ఆది గురుమూర్తిగాను మరో ప్రక్క ఆయనే ఆదిదేవుడు లింగమూర్తి గా మారినాడు” అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి.ఇలా ఎన్నో లక్షల కోట్ల మందిని నేను అనే మహా మాయ భోగ ప్రపంచం నుండి సత్య ప్రపంచం వైపు కి సత్యాన్వేషి గా మార్చడానికి యోగ ప్రపంచం వైపు ప్రయాణింప చేసినవి” అని చెప్పగానే దానికి మా ఆవిడ “స్వామి! నేను కూడా నేను అనేది ఏమిటో? మీతో కలసి తెలుసుకోవాలని ఉంది. అందుకు నాకు కావలసిన జ్ఞానప్రాప్తి మీరే ఇవ్వవలసి ఉంటుంది. నాకు మాయలు, మర్మాలు, మార్గాలు ఏమీ తెలియవు. మీ వెంట మీరు అన్నట్లు నేను అడుగులు వేస్తాను.నేను అనేది ఏమిటో నన్ను సృష్టించినది దేనికి నేను కూడా నేనుగా తెలుసుకోవాలని ఉంది” అనగానే వెంటనే నేను “దీక్షా! అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అలాగని అసాధ్యం కాదు. కానీ ప్రస్తుతం గృహస్థాశ్రమంలో ఉన్నాము. డబ్బులు సంపాదించాలని పిల్లలు వృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు యోగ సాధన గురించి ఆలోచిద్దాం. నీవు నేను అందాక మన ఇష్టదైవాలను పూజలు, జపములు చేసుకుందాం. మనకు కావలసిన కోరికలు తీర్చుకుందాం. మన ఆనంద జీవితానికి కావలసిన ఇల్లు, కారు, అనేక సదుపాయాలు,  మంచి ఉద్యోగం, మంచి జీతంతో మన భోగ జీవితం అనుభవించి ఆ తర్వాత చివరికి మన అంతిమ స్థితిలో మన పిల్లలు అందరూ అభివృద్ధిలోకి వచ్చిన తరువాత తీవ్రమైన యోగ సాధన చేద్దాము” అనగానే” ఏమండీ! ఎన్ని కోట్ల జన్మల పాటు ఈ సంసార మాయలో పడిన మీకు బుద్ధి రాలేదా? మనము పుట్టడం దండగ అనుకుంటే మనకే తోకలు అవసరమా! మన జీవితానికి అర్థం పరమార్థం తెలియటం లేదా?  పైగా లేనిదానిని కొత్తగా సృష్టించుకొని లేనిపోని బంధాల మాయలో పడి అవమానాలు, అపనిందలు, అవహేళనలు, ఆనందాలు, కష్టాలు పడుతూ లేస్తూ మునుగుతూ తేలుతూ ఉండటం ఇక నావల్ల కాదు. నిన్నటిదాకా మీరు నేను అనేది ఒకటి ఉన్నదని చెప్పేంతవరకు నాకు నేను ఎలాంటి మాయా ప్రపంచం లో ఉన్నానో అని అర్థమై చావలేదు.నేను అనేది తెలుసుకోవడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టినదా? అని చులకనగా అనిపించి రాత్రి అంతా అది ఏమిటో తెలుసుకొని తెల్లవారేలోగా మీకు నేను అంటే కేవలం ఫలానా అది అని చెప్పాలని పది పేజీల కాగితాల మీద వ్రాస్తూపోతే చెత్త పెరుగుతుందే గాని నేను అనే దానికి సరైన అర్థం, భావము, ఆలోచన నాకు స్ఫురణకు రాలేదు. ఓరిని! ఒక నేను అనేది తెలుసుకోకపోతే ఎందుకు నా బతుకు అనిపించింది. ఒకటి అండి నేను అనేది తెలుసుకుని చావాలని రాత్రి నిశ్చయించుకున్నాను. అందరూ వెళ్లే మార్గాలలో నేను వెళ్ళను. ఇప్పటిదాకా అందరూ కూడా గృహస్థ ఆశ్రమంలోనికి వెళ్లి పిల్లలని కని వారికి ముడ్డీలు కడిగి వారికి కావలసిన వాటిని పెట్టి భయపెట్టి బుజ్జగించి నా నా చంకలు నాకి చదివించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లిళ్ల పేరుతో, ఉన్నత ఉద్యోగాల పేరుతో, విదేశాలకు వెళ్లి మనకు చింతలు మిగిల్చి చితికి వెళ్ళే దాకా రాకుండా ఉండటం మనకు అవసరమా? అన్నప్రాసాలు,అంత్యక్రియలు వాళ్ళకి చేయడము అవసరమా? నిజంగా చెప్పండి. ఏమి సాధిస్తారు.ఏమీ లేదుగా. మనకు మనమే ఊహాప్రపంచం ఏర్పర్చుకుని ఆనందాలు, కష్టాలలో పడుతూ లేస్తూ ఎన్నో కోట్ల సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము.అది తీయని దురదలాగా నుండి తీరని కోరికగా మిగిలిపోతుంది. కామము ఎన్నటికీ ఆగదు. దానిని మనమే అదుపులో ఉంచుకోవాలి. కామ గుఱ్ఱమునకు ఆధీనమై హయగ్రీవ శక్తిని ఇస్తుంది. సంయోగ మందులు అమ్మే  పెట్టెల మీద బొమ్మల గుర్తుకు మిగిలిపోతుంది. అది మనకి అవసరమా చెప్పండి” అనగానే ఈమెకు ఇంతటి జ్ఞాన ప్రవాహం ఎలా వస్తుంది? ఎక్కడ నుండి వస్తుంది? ఖచ్చితంగా మామూలు స్త్రీ కాదు. గత జన్మ లో ఎక్కడో సాధన మాయకు గురి అయ్యి ఈ జన్మలో దానిని పరిసమాప్తి చేసుకోటానికి కొంపదీసి వచ్చిన కారణ జన్మురాలుకాదు కదా. నా కొంప కొల్లేరే! ఎందుకంటే ఎలాగైనా కామ మాయలో పడితే సంసారం మాయలో పిల్లలు పీచు, బాధలు, ఉద్యోగాలు అంటూ పనికి మాలిన పనులలో పడితే నా మనస్సు  ఆధ్యాత్మికత వైపుకు సంపూర్తిగా వెళ్లకుండా ఉంటుంది. ఎలాగో నేను అనేది తెలుసుకోవడానికి జిఙ్ఞాసి ఉండనే ఉన్నాడు ఎలాగో సమాధి ముందు నా దగ్గరకి వస్తాను” అన్నాడు! కాబట్టి వాడిని అడిగి ఆ 13 యోగ చక్రాలు ఎలా జాగృతి ,శుద్ధి,ఆధీనం విభేదనం చేసుకోవటానికి ఎవరిని పూజించాలి? ఏఏ క్షేత్రాలకు వెళ్ళినాడో? తెలుసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే… ఈ మహాతల్లి నా జీవితాన్ని మార్చడానికి వచ్చినట్లుంది. కామేశ్వరి కామేశ్వరుడు లాగా భోగ మాయలో ఉండాలనుకుంటే ఈశ్వరి ఈశ్వరుడు లాగా యోగములో ఉందామని అంటుంది. వామ్మో! నా జీవితం చంక నాకి పోయింది. 

పైగా బాబా వారు తన ప్రశ్న పుస్తకంలో “మీకోసం గౌరీ ఎదురుచూస్తుందని వివాహం చేసుకో” అని చెప్పి నా దగ్గరకు పంపించాడు అనుకుంటే ఇది ఏకంగా పార్వతి గా మారి నేను తెలుసుకోవాలి అని అంటున్నారు. వామ్మో! కామమే లేకపోతే ఎలా?  పైగా ఇప్పుడు తెలిసో తెలియకో చక్రాల జాగృతి అంటూ ప్రయోగాలు మొదలు పెట్టాను. అదేదో చక్రమునందు కామమాయ బలీయంగా పెరుగుతుందని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి.ఇది ఇచ్చిన షాక్ కి అసలు ఆ చక్రం పేరు గుర్తుకు వచ్చి రావటం లేదు. వామ్మో! నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నా కామ కోరిక గాల్లో కలిసిపోతుంది. పెళ్లి అయినా బ్రహ్మచారిగానే చచ్చిపోవాలా. ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు. అది ఇచ్చే మూడు నిమిషాల సుఖం కోసమే కదా. వామ్మో! చాలా కష్టం! ఇప్పటికే నా జీవితం సగం బాత్ రూమ్ కి అంకితమైనది. ఇక మిగిలిన జీవితం బాత్ రూమ్ కే అంకితం అయితే ఇంకా పెళ్లిఎందుకు? పెళ్ళాము ఎందుకు?  అంటూ దాని వైపు దీనంగా చూస్తూ “అవును దీక్షా! చిలక పలుకులు బాగానే చెప్పావు.  కామిగాని వాడు మోక్షగామి కాదు అన్నారు కదా.  కాబట్టి మనము ఈ జన్మలో భార్యాభర్తల గా ఉండి సంసార సుఖాలు అనుభవిస్తూ కామవాంఛలు తీర్చుకున్న కూడా మోక్షం వస్తుంది కదా” అనగానే వెంటనే అది “ఎప్పుడు వచ్చిందో చెబుతారా? మాకు కడుపులు చెయ్యడానికి వస్తారు గానీ కడుపుకు కారణమైన దానిని అంతు చూడాలని అదే కామ మాయ దాటాలని మాత్రము చూడరు కదా. పంది ఎప్పుడు అశుద్ధము ఎలా అయితే ఇష్టపడుతుందో ఇన్ని తెలిసిన మీరు కూడా అశుద్ధము వైపు కి వెళితే ఎలా? కొత్తగా ఆలోచించండి. కొత్త మార్గం వైపు వెళ్ళండి. ఏదో ఒక విషయం తెలుసుకోండి. అంతేగాని చేసిన పని చేస్తూనే మురికి గుంటలో పడిపోతారని అంటున్నారు. మీరు సేకరించిన పుస్తకాల్లో కామ శాస్త్రాలు ఉన్నాయి అలాగే వాటిని దాటడానికి ఉపయోగపడే యోగి వేమన సూక్తులు ఉన్నాయి. మీరు అనుభవించి దానిని దాటగలరని మీ నమ్మకం. అది నిజం కాదని నా నమ్మకం. ఒకసారి అలవాటు పడితే అది అవసరమై వ్యసనంగా మారుతుంది. దానిని దాటటం అనేది ఉండదని  సంసారం మాయ అనేది  తీయని దురద అని గోక్కుంటే పుండు పుడుతుంది కాకపోతే జిల పుడుతుంది.ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అని కామిగాని వాడు మోక్షగామి అనేది నాకు తెలిసి కామి అంటే కామం ఒక్కటే అని కాదు కోరిక అని కూడా. అది సంసారసుఖం కావచ్చును లేదా మరే ఇతర కోరిక కావచ్చును. మరి మీరు ఎందుకు ఈ  కామ కోరిక గా తీసుకుంటున్నారు”అనగానే వెంటనే నా మనస్సులో “పెళ్లి చేసుకున్నాను కదా! అందుకే నేను కామమును కామ కోరికగా తీసుకున్నాను తల్లి! దీనమ్మ! నాకు గడ్డాలు మీసాలు వచ్చే సమయం నుండి నాలో నాకే తెలియని భావాలు రావడం ఏమి జరుగుతుందో అర్థం కాక కంగారు పడే సమయంలో ప్యాంట్లులో ఏదో తెల్లని జిగురు పదార్థంతో తడిసి పోవడం చూసేసరికి  ఇంకా వాటిని ఎవరైనా చూస్తే తిడతారు ఏమో అని చాటు మాటుగా ఉతకలేక కడుక్కోలేక నేను పడిన అవస్థలు నాకే తెలుసు తల్లి. మహాతల్లిగా ఉండి బాగానే కథలు మాటలు చెబుతున్నావు. పడే వాడికి తెలుసు ఆ బాధలు. దాని గూర్చి నానా బాధలు సంకలు నాకి అన్ని పుస్తకాలు తిరగేసి అది శృంగారమని అది చేస్తే ఆనందం వస్తుందని దానికి వివాహం అనే ప్రక్రియ ఉంటుందని తెలుసుకునేసరికి పెళ్లి వయస్సుకు వచ్చాను. వెంటనే పెళ్లి చేస్తారు అని అనుకుంటే ఇప్పుడే చదువు పూర్తి అయినది. మంచి జీతం మంచి ఉద్యోగం సంపాదించుకోమని మా వాళ్ళు చెబితే తొక్కలో ఉద్యోగానికి అన్ని రకాల ఇంటర్వ్యూ లకు వెళ్లి అవమానాలు పొంది ఏదో చివరికి ఒక ఉద్యోగంలో స్థిరపడితే అది కాస్తా పోయి భవిష్యత్తు అర్థం కాక పిచ్చి వాడిగా మారుతున్నానేమోనని పిచ్చి మార్గము నుండి మార్చుటకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటే మంచి జీతం ఉద్యోగాలు లేవని అవన్నీ వెనక్కి పోతుంటే ఏదో బాబాగారు చూపించారు కదా అని దీనిని కష్టపడి పెళ్లి చేసుకుంటే వామ్మో ఇది పెళ్లయిన ఆరు రోజులకే చుక్కలు చూపిస్తుంది కదా? అంటే నా ఆనంద సుఖ బ్రతుకు కేవలం రోజులేనా. మిగిలిన భవిష్యత్ అంతా ఇంకా బాత్రూమ్ నేనా. అది సుఖము ఉండదు ఆనందం ఉండదు. చేసుకోకపోతే మనస్సు స్థిరంగా ఉండదు. వామ్మో అది తలుచుకుంటే భయమేస్తోంది అనుకుంటుండగా….

“ఏవండీ! ఏవండీ! ఏమి ఆలోచిస్తున్నారు? అని ఆవిడ గొంతు విని ఈ లోకానికి వచ్చి “దీక్షా! ఏమీ లేదు! పెళ్లి అయి పిల్లలు పుట్టకపోతే నాలోను అలాగే నీలోను ఏదో లోపం ఉన్నదని లేదా నాకు మగతనం లేదని, మీకు సంతానం లేదని, లోకులు కాకులై పొడుస్తారు! పెళ్లిళ్లకు,పేరంటాలకు పిలవరు! నిన్ను ఒక గొడ్రాలు గా చూస్తారు! అంత సీన్ మనకు అవసరమా ?ఒకరో ఇద్దరో పిల్లల్ని కని వారి బాగోగులు చూసుకుంటూ… నిత్యం దైవారాధన చేసుకుంటూ… ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం! “నేను తొక్క” అంటూ తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు! ఆ సాధన శక్తిని మనం తట్టుకోవాలి లేకపోతే అంగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కగా పెళ్లి పిల్లల బాధ్యతలు పంచుకుందాం. ఆనందాలు పంచుకుందాం కష్టాలు దాటుకుందాం” అనగానే అది వెంటనే “స్వామి! మీకు కామశాస్త్ర పాండిత్యము అలాగే మీకు తెలిసిన శృంగార భంగిమలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు కదా! మీరు సంసార సుఖం లో అరేబియన్ గుర్రము అయితే నేనేమో పంచకల్యాణి గుర్రంలాంటి దానిని మీరే చెప్పారు కదా! మీకున్న శృంగార శక్తి నేను తప్ప మరో స్త్రీ తట్టుకోలేదని నాకు తెలిసేటట్లు చేసినారు కదా! ఉదృతంగా పరమానంద అనుభూతిని ఇచ్చినారు కదా! మీకు నాకు సంతాన యోగం జాతకం అని మీకు తెలుసు కదా! కాకపోతే దానికి పరిహారంగా సంతానప్రాప్తి మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని నాకు కావాలంటే ఉంటుందని లేదంటే ఉండదని మీరే కాదు నా చిన్నప్పుడునేను జాతకం చూపించుకున్న ఒక జ్యోతిషవేత్త చెప్పాడు. మహత్తర అవకాశం మనకు ఉన్నప్పుడు మనము శృంగార జీవితం అనుభవిస్తూ పిల్లలు లేని సంసారజీవితం ఇద్దరం కలిసి ఆనందంగా అనుభవిద్దాము. కామ ఉధృతమును తట్టుకోవాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ కామమును అనుభవిద్దాము. దాని ద్వారా వచ్చే సంతాన మాయలో పడొద్దు అని నా ఆలోచన. ఒకరికి ఒకరు కలిసి ఉంటూ నేను అనేది మన సాధన స్థాయిని పెంచుకుంటూ అది ఎక్కడి దాకా తీసుకొని వెళితే అక్కడి దాకా మనం వెళ్దాము. ఒక చిరు ప్రయత్నమే మహా ప్రయత్నం గా మారి అది విజయవంతం కావచ్చు కదా. మనకు కావలసిన జ్ఞానప్రాప్తి పొంది తద్వారా వచ్చే మోక్ష ప్రాప్తి పొందవచ్చు. పిల్లలు, బాధ్యతలు తర్వాత  దైవం గురించి 60 సంవత్సరముల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటాము. ఆ వయస్సు వచ్చేసరికి శరీర ఆరోగ్యం సహకరించదు. అంత కష్టపడి కని పెంచిన పిల్లలు సహకరించరు.ఇంకా ఎందుకు కష్టపడటం. ఇన్నాళ్లు తెలియక మాయలో పడింది చాలు. తెలిసిన తర్వాత కూడా పడితే అది ఎప్పుడు అవుతుందో మీరు చెప్పగలరా? అనగానే నా మనస్సు కొంతమేరకు కుదుటపడి దానితో  “దీక్షా! అయితే సంసార సుఖం ఉండాలిగానీ సంతానం వద్దు అనుకుంటున్నావు. మనస్ఫూర్తిగా ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయం మన ఇద్దరిదీ కాదు. రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు కావాలంటే పిల్లలు పుడతారు. ఇక ఆ తర్వాత మన సాధన స్థాయి పెరుగుతున్న కొద్దీ అన్నిటి మీద మనకి మనకే తెలియకుండా వైరాగ్య భావాలు పెరుగుతూ వస్తాయి. బహుశా సంసారసుఖం మాయగా వస్తుందని అది దూరమే కావచ్చును. అప్పుడు నేను అలాగే నువ్వు ఏక పత్ని ఏక పతి ధర్మము దాటరాదు. ఉంటే సుఖాలూ నేను నువ్వు పొందాలి.  కామ మాయ ఏ పరీక్ష చేయటానికి సిద్ధపడితే ఆ మాయ పరీక్షలు తట్టుకోవడానికి మనమిద్దరం సిద్ధపడాలి. ఒకవేళ కామ పరీక్ష మొదలు పెడితే నాకు ఎవరి మీదనైనా చెడు భావాలు కలిగితే నీకు చెబుతాను మీకు ఎవరి మీద అయినా చెడు భావాలు కలిగితే మొహమాటం లేకుండా, భయపడకుండా, ఉన్నది ఉన్నట్లుగా నాతో ధైర్యంగా, ఏకాంతంగా, ఒంటరిగా చెప్పు. అప్పుడు మనం ఇద్దరం కలిసి దానిని దాటి పోవటానికి అలాగే దానిని తట్టుకోవటానికి ఏమి చేయాలో విధివిధానాలు తెలుసుకుందాం. మనోధైర్యంతో ధర్మం తప్పకుండా ప్రయాణించి ముందుకు వెళదాం. ఇది ఎలాంటి కామ మాయో మీ అత్తమామల జీవితాలే అందుకు ఉదాహరణ కాబట్టి మనమిద్దరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పాతివ్రత్యం ధర్మమును దాటవద్దు. తప్పించుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మనలో ఈపాతివ్రత్యధర్మ గీతను దాటినారో తెలిస్తే మరుక్షణం వారు తమ జీవితం నుండి వెళ్ళవలసి ఉంటుంది. పాప కర్మచేస్తే ప్రాయశ్చిత్తం కూడా అంతే విధముగా నా దృష్టిలో ఉండాలని నా సిద్ధాంతం. అలాగే నాకు నా తల్లి ప్రేమ మాయ మాత్రమే నన్ను ఆపగలిగేది. ఈ భోగ ప్రపంచంలో నన్ను ఉంచేది. ఎందుకంటే నేను ఒకసారి అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా షిరిడి పారిపోతే “పిచ్చిమొహం! అది మాత్రమే నాకోసం తిండి నిద్రాహారాలు మాని వేసి దీక్షా చేసి గుమ్మం కేసి చూస్తూ ఎదురుచూస్తూ నిరాహారిగా ఉండిపోయింది. తల్లి మనస్సు అలాగే తల్లి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు తెలిసినవి. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఆనాటి నుండి మనస్సులో ఆమె నా కోసం ఇంత ప్రాణ త్యాగానికి సిద్ధపడితే ఆమె జీవితాంతం అవసరమైతే నేనే బాగోగులు చూసుకోవాల్సి వస్తే మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించాలి! ఎలాంటి ఇతర మోహ, వ్యామోహంలో పడి దానిని నా నుండి దూరం చేసుకోకూడదని, అది నా నుండి వేరు అయితే ఒక మృత్యుదేవత వేరు చేయాలని సంకల్పించాను. మా అయ్య అయితే నా కోసం ప్రయత్నాలు చేస్తే దొరికితే మంచిదే దొరకకపోతే నాలుగు రోజులు బాధపడి ఈ జన్మకి ఇంతే అని నేను వచ్చేదాకా ఎదురుచూడకుండా తన భోగ ప్రపంచంలో క్షణిక ఆనందాలుకు వ్యామోహం చెందేసరికి అన్ని బంధాల మీద  వైరాగ్యం చెందిన కూడా ఈ పెళ్లి కూడా మా అమ్మ అలాగే నాకు ఇష్టమైన బాబా గారు చెప్పినారు కాబట్టి చేసుకున్నాను. చేసుకున్న ఇప్పటికి నాకు అర్థమైంది.

నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాయ స్త్రీ కాదని మాయను దాటడానికి వచ్చిన యోగిని అని నాకు అర్థమయ్యే సరికి ఇంత కాలం పట్టింది. ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉండవు కదా. నాకున్న గతజన్మలలో కొద్దిపాటిగా మిగిలిపోయిన వివాహ జీవిత కర్మఫలం పూర్తి చేసుకోవడానికి నీవు వచ్చినట్లుగా ఉన్నావు. అది పూర్తయ్యేసరికి నేను అనే దానిని వెతుక్కునే స్థాయిలో నువ్వు ఉంటావని నాకు ఇప్పుడు అర్థం అయింది. అలాగే మా అమ్మగారు మరణం తర్వాత నేను ఎట్టి పరిస్థితులలో భోగ ప్రపంచంలో ఉండను. నాకు ఇష్టమైన యోగ ప్రపంచం నాంది అయిన మహా కాశి క్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా మహా మాయలో పడి నాతో రాకపోతే నువ్వు ఎవరికోసమైనా ఎట్టి పరిస్థితుల్లో అయిన ఇరుక్కుపోతే నేను మాత్రం ఒంటరిగా అయినా కాశీవాసం చేయటానికి వెళ్ళిపోతానని నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. అలాగే నువ్వు కూడా అన్ని రకాల మాయలు దాటుతుంటే నేను కూడా నిన్ను నాతో పాటుగా కాశీలో ఉండటానికి తీసుకుని వెళ్తాను. మహా యోగి శ్రీ శ్యామా చరణ్ లాహిరి లాగా నేను సంసార బాధ్యతలు చేస్తూ వారి లాగా పిల్లలు వద్దు అని అంటున్నావు కాబట్టి పిల్లలు లేకుండా నేను గృహస్థ ఆశ్రమ ధర్మం తో మోక్షగామిగా మారటానికి ఈ రోజు నుండే నా ప్రయత్నాలు మొదలు పెడతాను. అలాగే నేను కూడా నీకు అన్ని విధాలుగా యోగ సాధనలో సహకరిస్తూ నీకు తెలియని వాటిని నేను నేర్చుకుంటూ నీకు అర్థమయ్యే విధంగా చెబుతూ నా భర్త మాయ అలాగే సంసారం మాయ అనేది సాధ్యమైనంతవరకు  నీకు కలగకుండా నా వలన నీ సాధనకు ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు పడతానని నీకు మాట ఇస్తున్నాను. కానీ నీవు మా అమ్మ లాగా నన్ను నాకు ఇష్టము లేని భోగ ప్రపంచంలో ఉంచుతావేమోనని భయము నన్ను ఇన్నాళ్లు వెంటాడేది. నన్ను నడిపించే వాడు శివయ్య కాబట్టి ఆయనే ఏదో మార్గం చూస్తాడని నా గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఆయన నీ మాటలను బట్టి చూస్తే వమ్ము చేయలేదని నాకు అర్థం అయింది అనగానే దీక్షాదేవి నా కాళ్ళ మీద పడి “నన్ను ఈ రోజు ఒక ప్రక్క భార్యగాను మరొక ప్రక్క మోక్షగామిలా చూస్తూ నన్ను మీరు మాయా భోగ ప్రపంచం నుండి విముక్తి కలిగించడానికి  మరల జన్మ లేని స్థితి కి నన్ను తీసుకుని వెళ్లడానికి మీరే సహకరిస్తారని స్వయంగా చెప్తుంటే ఇంతకంటే నాకు ఏమి కావాలి. ఇన్నాళ్ళు నేను చూసిన ప్రపంచం వేరు.మీరు చూపించే సత్య ప్రపంచం వైపు అసలుసిసలైన సత్యాన్వేషిగా నా ప్రయత్నాలు నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అలాగే నేను ఎట్టి పరిస్థితులలోను ఏకపతి ధర్మమును దాటను. ఎందుకంటే మోక్షం కావాలంటే ధర్మ, అర్ధ, కామ పురుషార్థాన్ని పాటించాలని నాకున్న కొద్దిపాటి జ్ఞానము ద్వారా తెలుసు. ఒకవేళ నేను ఈ ధర్మం దాటితే కాశీ క్షేత్రంలో ఉన్న పవిత్రమైన గంగలో నా అపవిత్రమైన దేహమును త్యాగం చేయడానికి వెనుకాడని నేను మీకు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.అలాగే ఎవరికి వారే కామ మాయ పరీక్షలు వస్తే పరస్త్రీ/పురుష వ్యామోహంలో పడే పరిస్థితులు వస్తే తగిన జాగ్రత్తలు తగిన హెచ్చరికలు ఒకరికొకరు తీసుకుంటూ వాటిని దాటాలి అని నా మనవి. అంతేగాని శారీరక వ్యభిచారం చేస్తే తెలుస్తుందని పర స్త్రీ/ పర పురుషులతో మానసిక వ్యభిచారం చేసిన కూడా పాతివ్రత్యం ధర్మం నాశనము చేసినట్టేనని మనం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మన ఇంటి పెద్ద కుటుంబ సభ్యులు ఈ కామ మాయ దాటలేక అందులో పడి సంసార జీవితానికి నాంది అయ్యారని మీరు వ్రాసుకొన్న డైరీలలో చూస్తే నాకు అర్థమైనది .మీరు వాళ్లు చేసిన తప్పు మనం చేయకూడదని  అలాగని వాళ్లను తక్కువగా చులకనగా చూడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అంత స్థాయి సాధన శక్తిని పెంచుకున్నవారు వారిద్దరు. ఎంత కష్టపడి ఉండి ఉంటారు కదా. ఒకరు రాతి శివలింగం మూర్తిని ఆరాధిస్తే మరొకరు మట్టి శివలింగం ఆరాధించి ఆ స్థాయికి వచ్చేసరికి ఏక పత్ని ధర్మానికి కట్టుబడి ఉండలేకపోయారు. పెళ్లి చేసుకున్నరాధ  పెళ్ళికాని శ్రీకృష్ణునిని ప్రేమించలేదా? కామించ లేదా? కామము ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. విశ్వామిత్రుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడు పంపించిన దేవత పరిచారిక స్త్రీల మోహంలో పడలేదా.ఆలోచించండి.కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు. ఒప్పుకోవటానికి లేదు.త్రాగుడికి అలవాటు పడినవాడు త్రాగటానికి ఏదో ఒక కారణం చెబుతాడు. వీళ్ళిద్దరూ చేసిన తెలిసి తెలియక చేసిన మహా ఘోరమైన తప్పు మీరు భోగ జీవితం నుండి శాశ్వతంగా యోగ జీవితం వైపు మీ ఈ మనస్సును ఎలా మార్చేసుకున్నారో దానికి ఎంత కష్టపడవలసి వచ్చింది మీకు తెలుసు. మీ వ్యక్తిగత పుస్తకాలు చదివిన నాకు తెలుసు. వీరు భోగం నుండి యోగానికి మారటానికి కారకులే వీళ్ళిద్దరినీ తెలుసు.

కానీ లోకానికి దానిని తెలియనీయకుండా మీకు మీరే శిక్ష వేసుకుంటూ పరీక్షలు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు చచ్చిపోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసిన విధానాలు నాకు తెలిసినాయి. మీ హృదయము దెబ్బతినే సరికి అన్నిటియందు వైరాగ్యం ఏర్పడినది. అదియే మీ యోగ ప్రస్థానానికి నాంది అయినది.  వారి కామ మాయే అంతర్గతంగా మీలో ఉన్న కామమును చంపేసింది.అది వాళ్లకు జరగాలి కానీ మీకు జరిగేటట్లు చేసినది.మీ యోగ మిత్రుడైన జిఙ్ఞాసి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం వారు శ్రీశైల క్షేత్రం నందు యోగసాధన చేస్తున్నారని తెలిసి ఆనంద పడుతున్నాను. ఈ జన్మ వృధా చేసుకోకుండా మోహ మాయలో పడకుండా తనకున్న మాయలను మాయం చేసుకోవటానికి ఆయన చేస్తున్న ఒక మంచి యోగ ప్రయత్నానికి నా వైపు నుండి ఎప్పుడు కృతజ్ఞత పూరిత ద్వారాలు తెరిచే ఉంటాయి. వాడు నాకు దేవుడిచ్చిన దత్తపుత్రుడు అని అనుకుంటూ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడిన ఒక బిడ్డ తన తల్లిని పిలిచినట్లుగా అమ్మా!అమ్మా! అంటూ ప్రేమపూరితంగా మాట్లాడటం నాకెంతో ఏదో తెలియని పుత్ర ఆనందం కలిగించేది.  అందరూ కూడా ఆడ దానిలో ఆడతనం చూస్తే ఆయన మాత్రం అమ్మతనాన్ని చూస్తున్న నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి బహుశా ఆయనేమో కావచ్చును. అతను నాకు చిన్నవాడైన యోగంలో నాకన్నా పెద్దవాడు  కావటం వలన అతనికి బదులుగా ఆయన అనేది వస్తుంది. అలా నన్ను కూడా మీ యొక్క మిత్రుడుని ఎలాగైతే యోగం వైపుకి నీ వలన ప్రయాణింపచేసినారో అలా నన్ను కూడా యోగంలోకి తీసుకుని వెళ్ళండి. అందుకు ఏమి చేయమన్నా ఎలా చేయమన్నా ఏమీ త్యాగం చేయమన్న ఎక్కడికి వెళ్ళమన్న వెళతాను! నాకు ఈ జన్మ వృధా కాకుండా చూడండి. పతి దేవా! గురుదేవా” అని నా కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసే సరికి మా ఆవిడ కళ్ళల్లో యోగానికి వెళ్లడానికి ఉన్న ఆతృత,ఆర్తీ గమనించే సరికి నా మనస్సు ద్రవించి “దీక్షాదేవి! నీవు ప్రస్తుతము నేను పూజించి ఆరాధించే బాబా వారి సజీవ విగ్రహమూర్తి విగ్రహారాధన వాటి విధి విధానం గురించి చెబుతాను.నీ యోగ భక్తితో ఎలాంటి భోగ కోరికలు ఆయనను కోరకుండా కేవలము యోగ పరిసమాప్తి కి కావలసినవి ఇవ్వమని మొదటగా మంత్ర గురువు ప్రసాదించమని అడిగి వారి అనుగ్రహ ప్రాప్తి ని ముందు పొందు. ఆ తర్వాత ఏమి జరగాలని మనకి రాసి ఉంటే అదే జరుగుతుంది. నీకు యోగం ఉంటే యోగినీ  కాకుండా ఎవరు ఆపలేరు కదా.ఈ యోగము నీవు ఉపయోగంగా మార్చుకుంటావో నిరుపయోగంగా మార్చుకుంటావో నీ చేతలను బట్టి ఉంటుందని చెబుతూ అప్పటిదాకా నేను ఆరాధించే బాబా విగ్రహ మూర్తిని ఆమెకి సంతోషంగా ఇచ్చినాను. నా దైవం గా నా గురువు గా అమ్మ ఇచ్చిన మట్టి లింగేశ్వర స్వామిని నాటినుండి భావించుకోసాగాను. ఈ అధ్యాయం నుండి ఒకస్త్రీ మూర్తి తన సాధనతో యోగినిగా ఎలా పరివర్తన చెందినదో మా ఇద్దరి అనగా నావి అలాగే జిఙ్ఞాసి అనుభవాల మధ్య దీక్షాదేవి అనుభవాలు కూడా జతకూడుతున్నాయి అని తెలుసుకోండి. మరి అంత దాకా సెలవా మరి. నాకు నిద్ర వస్తోంది. మా ఆవిడకి పరమానందముతో నిద్ర దూరమవుతుంది. మీరు ఏం చేయగలరు కదా. పదండి ముందుకు. నేను ఈ లోపల చిన్న కునుకు తీసి మీతో కలుస్తాను. ఉంటాను. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నాకు చేసిన శక్తిపాతసిద్ధి వలన అది నామీద ఎలాంటి ప్రభావాలు చూపినదో తెలుసుకోవాలని ఉందా? 

*********************************
గమనిక:ఈ అధ్యాయము రాసే సరికి మా శ్రీమతి అయినా దీక్షా దేవి సహస్ర చక్ర జాగృతి చేసుకుని శుద్ధి చేసుకోవడం కోసం దీని క్షేత్రమైన మానససరోవర సహిత కైలాస పర్వతానికి చేరుకోవడం జరిగినది.అక్కడ అర్ధరాత్రి పూట నుండి తెల్లవారుజామున ఆకాశం నుండి వచ్చే ఉల్కల రూపంలో ఉన్న కొన్ని దివ్య జ్యోతుల వెలుగులు సరోవరం వైపు దూసుకొని వస్తూ నీటిలో దిగి నీటి శబ్దం చేసుకుంటూ (స్నానాలు చేయడం) మళ్లీ ఆ వెలుగులు ఆకాశం వైపు వెళ్లే విధానము ప్రత్యక్ష అనుభూతిగా చూడాలని అలాగే కైలాస పర్వత దర్శనంతో స్వయంభూ పరమేశ్వర స్వామిని చూడటానికి ఆదేశం రావడంతో అక్కడికి బయలుదేరింది. మరి ఈవిడ కి అక్కడ ఎలాంటి దైవ అనుభవాలు కల్గినాయో కల్గలేదో నేను చెప్పలేను.ఎందుకంటే నాకే తెలియదు. ఆవిడ వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవం కలిగినదో తెలుసుకుని మీతో చెప్పటానికి ఎక్కడైనా రాబోవు అధ్యాయాల్లో వ్రాయగలను.ఆ శివయ్య ఎక్కడ వ్రాయమని ఆదేశిస్తే అక్కడ వ్రాస్తాను. ఆయన ఆజ్ఞ లేనిదే చీమ అయినా నడవదు కదా. నేను కూడా ఒక బుల్లి చలిచీమనే కదా. కాదా. మీరే ఆలోచించుకోండి. ఆమె తన సాధనలో ఇంతటి ఉన్నత స్థాయికి చేరింది అంటే మరి నా సాధనస్థాయి ఏమిటో అనే సందేహం మీకు వచ్చినదా?అబ్బా ఆశ దోశ అప్పడం కాదు. నేను ఏ విధంగా నా నా చంక నాకి ఎలాంటి స్థాయికి చేరుకున్నానో మీకు తెలియాలంటే నాతో పాటుగా మీరు కూడా నా ఆధ్యాత్మిక యాత్ర లో ప్రయాణించక తప్పదు. మా శ్రీమతి తన ధ్యానఅనుభవాలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా  నేనే వ్రాస్తున్నాను. ఎందుకంటే అసలు వాళ్ళు యోగ సాధనకి స్త్రీమూర్తులు అసలు పనికిరారని వాళ్ళు తమ యోగ మాయను దాటలేరని చాలామంది యోగ ప్రబుద్ధులు అనుకుంటున్న సమయంలో మా ఆవిడను తన ఇష్ట కోరిక మేర యోగము వైపు మళ్ళించి అనతి కాలంలో ఉన్నత స్థితి వైపు ప్రయాణింప చేసి ఈ లోకంలో దేనికి గూడ స్త్రీ మూర్తులకు పురుషులకు ఎలాంటి భేదం ఉండదని తెలియజేయాలని నా విశ్వ ప్రయత్నం.అలాగే ఆమెకి కల్గిన ధ్యాన అనుభవాలు అలాగే స్త్రీ పరంగా ఆమెకి వచ్చిన యోగ శక్తులు ఎదురైన యోగమాయలను యధాతధంగా మీకు తెలిస్తే రాబోవుకాలంలో ఈమెను చూసి కనీసం పది మంది ఆడపిల్లలు సాధన వైపు దృష్టి పెడతారని ఆశతో ఈ అధ్యాయములో అనుభవాలు వ్రాయడం జరిగింది.మీరు కూడా ఒక ఇష్టకామేశ్వరి దేవి లాగా, అక్కమహాదేవి లాగా, ఒక సతీసక్కుబాయి లాగా, ఒక మీరాబాయిలా వారిలో ఉన్న మోక్షకాంక్ష ను బయటకు తీసి వారిలాగా మోక్షగామి గా మారి మోక్ష ప్రాప్తి పొందడానికిప్రయత్నించగలరు అని ఆశిద్దాం. నేను వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి వెళుతున్నాను. మరి మీరు నాతో ఈ విషయం లో రాలేరు కదా. కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి. నేను ఆ బజ్జీలు సంగతి చూసి వస్తాను. దానికి ఏదైనా అర్థం కానీ ఆధ్యాత్మిక విషయం వచ్చినప్పుడు నా శ్రీమతి ఇలా నా ఇష్టమైన కోరిక బలహీనతను అడ్డుపెట్టుకుని బజ్జీలు వేసి అవి నా చేత తినిపిస్తూ ప్రేమగా తన ధర్మ సందేహాలు తీర్చుకొంటుంది.మగవాడి బలహీనతలు ఆడపిల్లలకు తెలిసినంతగా బ్రహ్మకే తెలియదు! ఏమంటారు నిజమే కదా! మీకు నా విషయంలో వచ్చిన సందేహానికి డైరెక్టుగా నా సాధన స్థాయి చెప్పటం రాయటం జరిగితే అది ఎక్కడ ఉందో తెలిసిన అర్థంచేసుకునే స్థితిలో మీరు ఉండరు అని నాకు తెలుసు . అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితానికి నా స్వానుభవం ప్రకారం చూస్తే పురుష జన్మ కంటే స్త్రీ జన్మ శ్రేష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పురుషులపై ఉన్నంతగా మాయ ప్రభావం స్త్రీ మూర్తిపై ఉండదు.ఎలా అంటే పురుషులు కాలం అంతా గృహ బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో, ధన సంపాదనతో వివిధ రకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. కానీ అదే స్త్రీల విషయానికి వస్తే భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్ కి వెళ్తే వీరికి కావాల్సినంత సమయం ఉంటుంది. పైగా వీరికి బయటకు సంబంధించిన ఉద్యోగ, వ్యాపార, వృత్తి విషయ వాంఛలు అస్సలు ఉండవు. పైగా పూజలు ఎక్కువ చేయడం వలన కావలసిన పవిత్రత అలాగే సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీరికి విచారణ చేయడానికి కావలసిన సూక్ష్మాతిసూక్ష్మ బుద్ధి అదే వివేక బుద్ధి బాగుగా అభివృద్ధి చెందుతుంది. దీని వలన వీరికి అంటే పురుష సాధకుల కంటే తొందరగా దైవ అనుభవాలు పొందుతారు. అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని కూడా తొందరగా ఆకళింపు చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వివేక బుద్ధి వలన వీరికి సహజసిద్ధంగా ఏకాగ్రత కూడా అలవడుతుంది. నన్ను కూడా ఒక స్త్రీ మూర్తి పరమ గురువుగా చేసినది. దైవ పరంగా చూస్తే వేద మాత గాయత్రి దేవి అయితే వ్యవహారిక పరంగా మా అమ్మగారు గాయత్రి అన్నమాట. నాకు వచ్చిన మంత్రోపదేశం కూడా మహా గాయత్రి మంత్రమే. మరి ఈ లెక్కన చూస్తే స్త్రీమూర్తులు కూడా బ్రహ్మజ్ఞానం మోక్షప్రాప్తి పొందగలరు అని తెలుస్తుంది కదా. 

 మనస్సులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ఇష్టదైవ మంత్రము మీ తల్లి తండ్రి లేదా ఇంటి పూజారి నుండి లేదా మీ కులదైవం పూజారి నుండి  మూడు సార్లు ఆ మంత్రము చెప్పించుకుని మననం చేసుకోండి. ఒకే ఇష్ట దైవాన్ని కొలవండి. ఆ దైవానికి ఒకే నామమును పొందండి. ఆ దైవానికి ఒకే మంత్రంను తీసుకోండి. ఏక కాలంలో పలు కోరికలు కోసం దైవాలను  కొలవకండి.ఒక గురువు అలాగే ఒక దైవమును మీరు మనస్పూర్తిగా విశ్వాసంతో నమ్మి ఎంచుకోండి. వారిని ఎన్నటికి మార్చండి. దైవాలను మార్చవద్దు. మీ మనస్సులో మీ ఇష్ట దైవం రూపం ఉండాలి. మీ నాలుక మీద ఆ దైవానికి సంబంధించిన మంత్రం అజప జపం మాత్రమే ఉండాలి. మీ ఇష్ట దైవం లో అన్నిటిని అందరినీ అన్ని దైవాలుగా చూడండి. ఉదాహరణకు మీకు దత్త స్వామి దేవుడైతే శివుడిని చూసినప్పుడు శివ దత్తుడిగా, విష్ణువును చూసినప్పుడు విష్ణు దత్తుడిగా,బ్రహ్మను చూసినప్పుడు బ్రహ్మదత్తుడిగా అమ్మవార్లను చూసినప్పుడు దేవి దత్తుడిగా అదే ఇతర గురువులను చూసినప్పుడు గురు దత్తుడిగా ఒకే దేవుడిలో ఇలా అన్ని రకాల రూపాలను చూడాలి.ఉదాహరణకు ఒక కుండలో నీరు, ఒక గ్లాసులో నీరు,చెంబులో నీరు ఇలా వివిధ రకాల పాత్రలు ఉన్నప్పటికీ వాటిలో ఉండే నీరు ఒకటే కదా. అలా మీ ఇష్ట దైవ స్వరూపంలో మీరు చూడబోయే వివిధ రకాల దేవతల రూపాలు ఒకే విధంగా చూడండి. అదియే మంత్రసిద్ధి అవుతుంది. ఇది సాధించిన కొన్ని నెలలకి స్వయంగా మీ ఇష్ట దైవముఏదో ఒక రూపంలో మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు. అలా రప్పించుకునే శక్తి మీ సంకల్పశక్తి మీద మీ అచంచల భక్తి విశ్వాసాలు యోగ భక్తి మీద ఆధారపడి ఉంటుంది అని గ్రహించండి.వేదాలు సృష్టించిన గాయత్రి ఒక స్త్రీ మూర్తి అని తెలుసుకోండి. ఆవిడ ఇచ్చిన బ్రహ్మ జ్ఞానము స్త్రీమూర్తులు ఎందుకు పొందకూడదో ఒకసారి ఆలోచించండి.అది ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి. అమ్మ ఇచ్చిన జ్ఞానానికి అమ్మాయిలు ఎందుకు పొందకూడదో ఒకసారి ఆలోచించండి. అన్ని మీకే అర్థం అవుతాయి. మీరు ఎంతటి మాయలో మిమ్మల్ని ఎంతటి మాయ మోహావేశంలో ఉంచినారో మీకే తెలుస్తుంది.తద్వారా మీరు మోక్షగామిగా మారితే నీ మాయ మాయం అవుతుంది. ఈ జన్మ అయినా వృధా కాకుండా జీవన్ముక్తికి ఉపయోగపడుతుంది. ఏమంటారు నిజమే కదా. నిజాన్ని నిజం అని చెప్పటానికి ఒప్పుకోవటానికి నేను ఎవరిని మీరు ఎవరు.

నా మీద ప్రభావాలు:

యుక్త వయస్సు ఉన్నవారు అందరికీ లాగానే నా మీద సినిమాలు, పుస్తకాలు, వీడియోలు, వీడియో గేమ్స్ ప్రభావం చూపడం మొదలు పెట్టాయి. అందరికీ లాగే నడిస్తే నేను ఎందుకు ఇలా ఉంటానో చెప్పండి. ప్రేమదేశం, ప్రేమికుల రోజు, తొలిప్రేమ సినిమాలు నడుస్తున్న కాలంలో నేను వీటితోపాటుగా ఆధ్యాత్మిక సినిమాలు అయిన అన్నమయ్య, యోగివేమన, భక్తతుకారామ్, త్యాగయ్య లాంటి సినిమాలతో పాటు గా  ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, గమ్యం, మేము, మాయాబజారు, పరమానందయ్య శిష్యుల కధ ఇలాంటి సినిమాలు కూడా చూసేవాడిని. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, పుస్తకాలు చదివేవాడిని. మీరు ఏమి చూస్తే మాకెందుకు అంటారా! ఒక్క నిమిషం ఆగండి. నాకు దీక్షగురువు చేసిన శక్తిపాతము పుణ్యమా అని మాములుగా చూసే సాంఘిక సినిమాలలో గూడ నాకు ఆధ్యాత్మిత భావాలే కనిపించేవి.నిజగురువు హస్తస్పర్శవలన నాకు ఈ మాయాపూరిత ప్రపంచముకాస్తా పరబ్రహ్మ స్వరూపముగా కనపడే భాగములో నేను చూసిన సినిమాలలో నాకు అంతా ఆధ్యాత్మికమే కనపడేది!అది ఎలా ఉంటుందో మీకు తెలియచెయ్యలనే తపనతో దీనిని వ్రాయడము జరిగినది!నేను చూసిన లేదా చదివిన వాటిలో నాకు ఆధ్యాత్మిక భావాలు కనిపించేవి.నేను అందరి లాగానే సినిమాలు చూసిన వాటిలో నాకు కొత్తగా ఆధ్యాత్మికత కనబడేది. అంతెందుకు సుస్వాగతం( పవన్ కళ్యాణ్) సినిమా చూద్దాం. అందులో ప్రేమికుడు తన ప్రేమకోసం పడే తపన తాపత్రయం ఉంటే అది నాకు ఒక యోగి లేదా సాధకుడికి స్త్రీ వ్యామోహం ఎలా ఉంటుందో చెప్పినట్లుగా అనిపించేది. అంటే నా దృష్టి అంతా నాకు తెలియకుండానే ఆధ్యాత్మికత వైపు వెళుతూ ఉండేది. అలా నేను ఏ సినిమాలో లేదా పుస్తకంలో నాకు ఏమీ భావాలు కలిగిన మీతో చెప్పాలని అనిపించింది అందుకే ఇది వ్రాయటం జరిగింది.

అన్నమయ్య (నాగార్జున): ఈ సినిమా అంతా ఆధ్యాత్మికమే. అందులో మాకు సృష్టి చేయడానికి తల్లిదండ్రులు పడే వ్యధ, ధన కాంత అనే మాయలు, మరదళ్ళును వదిలించుకున్న సాధకుడు ఒక నిజ భక్తుడికి ఏమి కావాలో ఏమి వదిలించుకోవాలో ఏమి పొందుతాడు. దైవానికి భక్తునికి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో, కీర్తి ,ధన, కాంత వ్యామోహాలలో పడితే సాధకుడికి వచ్చే కష్ట నష్టాలు సుఖభోగాలు ఎలా ఉంటాయో, తన భక్తితో ఇష్టదైవమే వచ్చి తన మాయా మోహం లో ఎలా పడతాడో, ఆయనకు సేవలు చేయాల్సిన చోట ఆయన సేవలు ఎలా చేస్తాడో, తన భక్తుని కోసం ఒక దైవము ఏ విధంగా తపన తాపత్రయం పడతాడో నాకు కనబడింది. మీకు ఇలాగే కనబడినదా లేదు కదా! ఇలాంటి రివ్యూలెక్కడా కూడా చదివి ఉండరు కదా.


పరమానందయ్య శిష్యుల కథ( రామారావు): ఈ సినిమాలో నాకు ఒక అంశం బాగా నచ్చింది. అదేమిటంటే అప్పటిదాకా ఒక స్త్రీమూర్తిని కామ దృష్టితో చూసిన  వక్షస్థలంలో శివలింగ ఆరాధన సమయం  కల్లా హీరో కి కాస్త ఆ వక్షస్థలంలో శివలింగము చూడటం దానినే పూజించటం ఎందరికి సాధ్య పడుతుందో ఒక్కసారి ఆలోచించండి.అలాగే మానసికంగా కూడా స్త్రీ భావనలు చెయ్యని రుషులకు కూడా శాపాలు రావడం చూస్తుంటే సాధకుడు ఎంతటి జాగ్రత్తగా ఉండాలో తెలిసినది. అలాగే క్రమం తప్పని,వేళ తప్పని శివ పూజ చేస్తే ఎలాంటి పూజా ఫలితం కలుగుతుందో తెలిసినది. పూజకు కావలసినది దేహశుద్ధి కాదని మనస్సు శుద్ధి ప్రధానమని అందుకే స్త్రీ వక్ష స్థలము ఒక లింగమూర్తిగా భావించుకుని కథానాయకుడు చేసిన పూజ కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కి చేరిన విధానం చూస్తుంటే నాకు అర్థమైనది.

ఆ నలుగురు (రాజేంద్రప్రసాద్): ఈ సినిమాలో కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో చెప్పటం జరిగినది. వాటిని కేవలం బాధ్యతగా నిర్వహించాలని లేదంటే వారిని ప్రేమించిన లేదా మోహించిన లేదా వారి యందు ప్రేమ ఆప్యాయతలతో వ్యామోహం చెందితే ఆ తండ్రి పడే తపన కష్టాలు ఎలా ఉంటాయో తెలిసినది.వేటియందు కూడా అతిగా ఉండరాదని కేవలం బాధ్యతగా సాక్షిభూతంగా ఆధారభూతంగా చూడాలని తెలిసినది. 
యోగివేమన( నాగయ్య): ఈ సినిమా ద్వారా సాధకుడికి స్త్రీ వ్యామోహంలో పడితే వచ్చే బాధలు, రసవిద్య ద్వారా బంగారం తయారు చేసి బైరాగి గా మారటం, తన అన్నయ్య కూతురు చనిపోతే స్మశాన వైరాగ్యం కలగటం, గురూపదేశము ద్వారా సిద్ధి పొందటం,  సిద్దులయందు కూడా ఎలా వైరాగ్యం కలిగి ఉండాలో చెప్పటం, నిజమైన బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో ఎలా తింటాడో ఎలాంటి తత్వాలు చెబుతారు వివరంగా చూపించడం జరిగింది. 

ఘోర(ఏయన్నార్): ఈ సినిమాలో భక్తి పారవశ్యం ఎలా ఉంటుందో, భార్యల విరహవేదనలు ఎలా ఉంటాయి. నిజ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు, అహంకారం పోయిన భక్తుడు నామ దేవుడికి బుద్ధి చెప్పడం, యోగ శక్తులు ఎలా ఉంటాయో జ్ఞాన దేవుడు ద్వారా చూపించటం, నిజ గురువు ఎలా ఉండాలో చూపించటం చాలా బాగుంది.
భక్త తుకారాం(ఏయన్నార్): ఈ సినిమాలో ఒక సాధకుడు తన నిజ భక్తి లోకి ప్రవేశించినప్పుడు వచ్చే కష్టాలు, మాయలు,మర్మాలు, కీర్తి, పరస్త్రీ వ్యామోహం పరీక్షలు, ఇతరుల అసూయ ద్వేషాలు, కుటుంబ బాధ్యతలు, తపన, తాపత్రయం, స్పందన లేని స్థితి ఎలా ఉంటుందో నాకు తెలిసింది.

విప్రనారాయణ(ఏయన్నార్): ఎంతటి మహా భక్తుడైన రవ్వంత స్త్రీ వ్యామోహం కలిగితే వచ్చే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అలాగే నవ విధ భక్తి విధానాలలో అర్చన భక్తి ఎలా ఉంటుందో కూడా గ్రహించాను.

అభినందన( కార్తీక్): ఒక స్త్రీని ప్రేమిస్తే వచ్చే ప్రేమ విరహ వేదన ఎలా ఉంటాయో ఈ సినిమా పాటల ద్వారా చాలా తెలుసుకున్నాను.

సంసారం ఒక చదరంగం (గొల్లపూడి): ఉమ్మడి కుటుంబంలోని కష్టనష్టాలు వారి మధ్య ఏర్పడే సున్నిత భావాలు,సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడం జరిగినది.

 ప్రేమిస్తే( భరత్): కులాంతర వివాహం చేసుకుంటే ఆ ప్రేమికులకి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను.

 దీర్ఘ సుమంగళీభవ( రాజశేఖర్): భార్యాభర్తల సంసార జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేను తెలుసుకున్నాను.

బాబా( రజినీకాంత్): ఒక యోగి సాధనలో సిద్ధులు వచ్చినప్పుడు వాటిని తన స్వార్ధానికి ఉపయోగించకుండా లోకకళ్యాణార్థం ఎలా ఉపయోగించాలో సిద్ధులు  వచ్చినా కూడా అహం లేకుండా తన సహజ స్థితి లో ఎలా ఉండాలో హిమాలయ గురువులు ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉంటారో తెలుసుకున్నాను. అరుణాచలం(రజనీకాంత్): విపరీతమైన ధనకాంక్ష కలిగి ఉంటే అధిక ధనం వస్తే వచ్చే కష్టనష్టాలు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకున్నాను.

 ముత్తు( రజనీకాంత్): యజమాని అయిన సేవకుడు ఎలా ఉంటాడు. వివిధ రకాల వ్యామోహంలో పడి వైరాగ్యం చెందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకున్నాను.

మాతృదేవోభవ: ఒక తల్లి ప్రేమ బంధం దాని విలువ ఏమిటో తెలుసుకున్నాను.

దశావతారాలు( కమలహాసన్): ఒక వ్యక్తి ఏ విధంగా పది అవతారాలు ఎత్తితే ఎలా ఉంటుందో ఈ సృష్టిలో ఏకైక ఆత్మ కూడా అలాగే వివిధ దైవ,జీవ స్వరూపాలలో విశ్వాత్మ గా ఉండి జీవాత్మగా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను
.
 ఇలా చెప్పుకుంటూ పోతే నేను చూసిన సుమారుగా 200 సినిమాలు పైగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపి వేయడం జరుగుతుంది.

ఇక పుస్తకాల విషయానికి వస్తే:

జయం (మల్లాది వెంకట కృష్ణమూర్తి): యోగ సాధకుడు అంటే ఎవరు? ఎలా సాధన చేయాలి? సాధన చేస్తే వచ్చేసిద్ధులు స్థితులు, పరిస్థితులు చదివి నేను కూడా ఎలాగైనా యోగి గా మారాలని నిశ్చయించుకున్నాను .దీని ఫలితమే ప్రస్తుతం మేము జ్ఞాన యోగిగా మౌనముగా మారడం జరిగినది.

పురాణపురుష( శ్యామా లాహిరి): ఈయన సాధన అనుభవాలు చదివిన తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా నిజమేనని నమ్మకం కలిగినది. ఆయనకి లాగానే నేను కూడా డైరీలో రాసుకోవడం మొదలు పెట్టినాను. ఈ డైరీల ఫలితమే యోగ దర్శనం గ్రంథము,కపాల మోక్షం గ్రంథం రాయటం జరిగినది.

నీ సహజ స్థితి లో ఉండు( రమణ మహర్షి): సాధన లో ఉన్నప్పుడు సాధకునికి వచ్చే సాధన సందేహాలు  సాధన స్థితి అనుభవాలు మౌనబ్రహ్మ స్థితి పొందిన వారి అనుభవాలు చదువుతున్నప్పుడు మేం కూడా ఇలాంటి పరిస్థితి ఎలాగైనా ఎప్పుడైనా పొందాలని నిశ్చయించుకోవటం జరిగినది. కొన్ని సంవత్సరాలకి దానిని పొందడం జరిగినది.

 గీతామకరందము( విద్యాప్రకాశానందగిరి): ఈ గ్రంథం చదివితే  18 రకాల యోగాల స్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది.

ఋభు గీత( రమణ మహర్షి): బ్రహ్మ తదాకార స్థితి ఎలా ఉంటుందో తెలిసింది. నిజ సమాధి స్ధితి పొందినవారి స్ధితి ఎలా ఉంటుందో తెలిసినది!

 దత్త గురువుల చరిత్ర: దత్త స్వామి, శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్ కోట స్వామి. షిరిడి సాయిబాబా, తాజుద్దీన్ బాబా మహారాజ్, ధునివాలా బాబాజీ, టెంబే స్వామి, శ్రీత్రైలింగ స్వామి ఇలా వీరి చరిత్రలను చదవటం వల్లే నిజ గురువులు అంటే ఎవరు? ఎలా ఉంటారు?ఎలా ఉండాలో తెలిసినది. నేను కూడా ఎప్పటికైనా ఇలాంటి స్థాయికి చేరుకోవాలని అనుకున్నాను. పరమ గురువుగా మారిపోయాను. సాధన అంటే ఏమిటో తెలియని నా చేత సరికొత్త సాధన విధానం పవనానంద నవబ్రహ్మ యోగము,శూన్యబ్రహ్మ యోగ  సిద్ధాంతము విధి విధానము జ్ఞాన అనుభవ అనుభూతులు తెలుసుకొని రచన చేయడం జరిగినది.

అధినేత( రమేష్ చంద్ర మహర్షి): ఒక వ్యక్తి ఎలా కాలంలోని అన్ని డైమన్షన్స్ కి వెళ్ళవచ్చునో దీనిని చదివిన తర్వాత తెలిసింది. అప్పుడు దీనిని చదువుతున్నప్పుడు ఒక కథలా తోచిన ఇప్పుడు అది కథ కాదని నిజమేనని నా సాధనలో కాలచక్ర స్థితికి వచ్చినప్పుడు 46 డైమన్షన్స్ లో 14 డైమన్షన్స్ కి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది. 

యోగుల చరిత్ర: శ్రీ రామకృష్ణ, శారదా దేవి,వివేకానంద, భక్తతుకారం, నామ దేవుడు,జ్ఞాన దేవుడు, నిత్యానంద బాబా( గుజరాత్), శ్రీ చంద్రశేఖర సరస్వతి యోగులు,ఒక యోగి ఆత్మకథ ఇలా ఎందరినో జీవిత చరిత్రలు చదవడం జరిగినది.ఉత్తేజం పొందడం జరిగినది. ఎలాగైనా యోగి కావాలని నిశ్చయించుకోవటం, యోగి కావాలని యోగం ఉంటే అవ్వక తప్పదు.

తాంత్రిక ప్రపంచం( శ్రీ సిద్దేశ్వర స్వామి): ఇందులోవామాచార, దక్షిణాచార విధి విధానాలు, వివిధ తాంత్రిక విధానాలు ఎలా ఉంటాయి. చేస్తే ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో తెలుసుకున్నాను.చేసి ఇబ్బందులు పడ్డాను.

మంత్ర పుస్తకాలు: శ్రీ లలితా దేవి సహస్ర నామాలు భావాలు తెలుసుకొని సాధన అంటే ఏమిటి? దాని స్థితులు పరిస్థితులు షట్చక్రాలు అంటే ఏమిటి? దాని స్థితులు ఏమిటో అవి బలహీన పడితే  ఏమి నైవేద్యాలు తినాలి? మణిద్వీప వర్ణన తెలుసుకున్నాను. మా సాధనలో ఇవి అన్నియు కూడా అక్షర సత్యమని తెలుసుకోవడం జరిగినది. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం ఎలా సాధకుడు ఉండాలో తెలుసుకున్నాను.అర్గళా స్తోత్రం ద్వారా మన హృదయంలోనికి మాయలు,మర్మాలు, కోరికలు, బంధాలు రాకుండా ఎలా నిరోధించుకోవాలో తెలుసుకున్నాను. నిత్య గాయత్రి మంత్రం అనుష్టానం వలన వచ్చే స్థితులు, సిద్ధులు, శక్తులు 24 అస్త్రాలు 24 దేవతల శక్తులు  24 గురువుల అనుగ్రహం గురించి తెలుసుకోవడం జరిగినది. 

ఇలా నేను చదివిన  పుస్తకాలు గురించి 477కు పైగా చెప్పవలసి ఉంటుంది. అందువలన కొంతమేర వీటిని గురించి చెప్పడం జరిగినది. యోగ సాధన కి ఉపయోగపడే పుస్తకాల జాబితాను ఉపయుక్త గ్రంధాలు పేరుతో ఇవ్వడం జరిగినది. వాటిని చూడండి. చదవండి. స్ఫూర్తి పొందండి.ఏదో ఒకటి సాధించండి. అప్పుడే ఆ పుస్తకాలు రచించిన మాలాంటి గ్రంథకర్తలకు ఉత్సాహం కలుగుతుంది. మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని కొత్త గ్రంథాలు రాసే అవకాశం కలుగుతుంది.తద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు మీకు కలుగుతాయి. పుస్తకాలు చదవండి. జ్ఞానము పెంచుకోండి. ఆధ్యాత్మికమైన, సాంఘికమైన, నవలైనా ఏదో ఒక దానిని చదవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా అందులో మీకు తెలియని ఏదో ఒక విషయం ఉంటుంది. దానిని తెలుసుకోండి. జ్ఞాన స్ఫూర్తి పొందండి. 

ఇపుడు మన జిజ్ఞాసి పారిపోయినాడని...అదే తన నిజ గురువు కోసం వెళ్ళిపోయినాడని ఈపాటికే తెలుసుకున్నారు గదా!ఆరు నెలలు తర్వాత తన తల్లి కోరికమేర కాశీ నుండి ఇంటికి తిరిగి వచ్చినాడు!నాతో మాట్లాడటానికి వచ్చినాడు!వాడిని చూస్తే బాధవేసినది!దర్జగా సూట్ బూట్ లో ఉండవలసినవాడు ...చిరిగిపోయిన కాషాయవస్త్రముతో...చాలా ఓత్తుగా పెరిగిన గడ్డముతో,చింపిరి జుట్టుతో... బాగా పీక్కుపోయిన మొహముతో...కాని కళ్ళలలో ఏదో తెలియని ఒక విధమైన సమ్మోహనశక్తితో నాకు ఎదురుపడినాడు!మాటలలో నిదానం...చూపులలో ప్రశాంతత...నిర్మల మనస్సుతో..ఆవేశము,అహంలేని స్ధితిలో తన అనుభవాలు నాతో పంచుకోవడము ఆరంభించినారు.మరి మీరు గూడ వినాలంటే ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

 శుభం భూయాత్

పరమహంస పవనానంద

**********************************

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. mee pelli babavare swayamuga nischayinchatam meeru prema vivahamu
    chesukovatam, ikkada janalu kakunda devathalu kuda kamamuga kanipinchatam prarambhamaindi
    annaru kada dhanni ela niladokkukunnaru? jignyasi gaaru meeku yoga jeevithame kakunda bhoga
    jeevithamulo kuda sampoorna sahayakulu ga unnaru. adi mee luck alanti okaru dorkatam. ante pelli
    chesukoni pillalni kane vallantha na na chankalu naakali antaru.....? last lo eddaru yoga jeevithaniki
    ankitham avdam ani nirnayinchukovatam bagundi eddariki eddaru lucky.

    రిప్లయితొలగించండి