నా జాతకము – జీవితము
ఇలా నేను ప్రేమలో… అర్థం కాని అనుభవాలతో… అయోమయ పరిస్థితిలో ఉండగా… నా ప్రేమ ఏమవుతుందో… నా చదువులు ఎలా ముందుకు సాగుతాయి అని జాతకాలు చెప్పే జ్యోతిష్కునిని తొలిసారిగా కలవడం జరిగింది! నాకు చదువులో ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవాలి అని అనిపించింది! ఈయన జాతకాలు బాగా చెబుతారని… బంధు మిత్రుల ద్వారా తెలుసుకుని.. ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది! వారిని కలిసి… వచ్చిన విషయం చెప్పగానే ఆయన నా జాతక చక్రం వేసి ఏవో గణింతాలు వేస్తూ...ఏవో గ్రహదశలు వేసి … మధ్య మధ్యలో12 గవ్వల తీసుకుని పంట వేస్తూ… మధ్యమధ్యలో… నన్ను నాకిష్టమైన అంకెలు, పూలు ,పండ్లు, రంగులు, అడుగుతూ… ఏదో చేసి చివరికి నా వైపు దీనంగా తిరిగి “ నాయనా నువ్విచ్చిన జాతకం ప్రకారంగా చూస్తే నువ్వు ఫలానా సబ్జెక్ట్ లో తప్పుతావు అని…నీకు ఫలానా మార్కులు వస్తాయని” చెప్పడంతో నా మెదడు మొద్దు బారి పోయింది! ఏమిటి స్టేట్ ర్యాంక్ రావలసిన చోట నాకు పాస్ మార్కులు కూడా రావా? అసలు వీడికి జాతకం తెలుసా? భవిష్యత్ చెప్పడము వచ్చా? అయినాగానీ…. గ్రహాలు చూసి….. వాటి స్థితి చూసి…. నోటికి వచ్చినట్టుగా చెప్పే సోది… జాతకం అయిపోతుందా? అది జరుగుతుందని నమ్మకం ఏంటి? అని అనుకుంటుండగానే “ నాయనా నీ లోని ధర్మసందేహాలు తీరుస్తాను! నువ్వు ఐఏఎస్ కావాలని అనుకున్నావా లేదా” అని అడిగాడు ! “అవును” అన్నాను! అలాగే “ప్రస్తుతం నువ్వు ఫలానా పేరుతో ఉన్న అమ్మాయి ప్రేమలో ఉన్నావా లేదా” అని అడిగాడు! దానికి నేను ఆశ్చర్యపోతూ “అవును” అన్నాను! అలాగే “నీకు ఫలానా సబ్జెక్ట్ అంటే ఇష్టం… ఫలానా మార్కులు వస్తాయని” అని ఖచ్చితంగా చెప్పే సరికి గతుక్కుమన్నాను!
అప్పుడు నువ్వు అదే ఐఏఎస్ (IAS)కావాలి అనుకుంటున్నావు !కానీ దానిని తిరగేస్తే వచ్చే ఎస్.ఏ.ఐ (S.A.I) సాయి అవుతావు! ఏ జ్యోతిష జ్ఞానము తక్కువగా చూసినావో అది నీకు భుక్తిగా ఇచ్చే వృత్తిగా మారుతుంది! ఏ దేవతల కోసము తపన పడుతున్నా వో వారిని హోమ దేవతలుగా చూస్తావు! నువ్వు ఏమి గావాలని అనుకుంటున్నావో అది అవ్వవు! ఏది వద్దు అని తపనపడుతున్నావో దానిగా మారిపోతావు! ఇది సత్యం! నా వాక్కు బ్రహ్మ వాక్కు ! విధి లిఖితం! నీ విధి రాతను ఏనాడో ఆ బ్రహ్మ లిఖించి నాడని తెలుసుకో! కొత్తగా చేయడానికి… నువ్వు కొత్తగా తెలుసుకోవడానికి ఈ లోకంలో ఏమీ లేదని గ్రహించే సమయం త్వరలో ఆసన్నమవుతోంది! కామి కాస్త మోక్షగామి గా మారుతావు! త్వరలో నువ్వు లేనివాడివి నువ్వే అని తెలుసుకుంటావు! చెయ్యని వృత్తి అంటూ ఉండదు! సర్వ సుఖాలు, సర్వభోగాలు అనుభవించే కారణజన్మ యోగివని త్వరలో గ్రహిస్తావు! దైవమే నీ మాట వినే స్థాయికి వస్తావు! నీ వాక్కు శాసనంగా మార్చుకుంటావు! మంత్ర, తంత్ర, యంత్ర సిద్ధి పొందుతావు! శ్రీ చక్ర ఆరాధకుడువి అవుతావు! శారీరిక యోగి కన్నా మానసిక యోగిగా మర్కట సన్యాసమును తీసుకుని నీ నామమును సార్థకం చేసుకుంటావు!అన్ని రకాల యోగసిద్ధులు పరిశీలిస్తావు! అన్ని రకాల అనుభూతులు పొందుతావు! దైవ శక్తులను కనుక్కుంటావు! దైవ శక్తులను ఆధీనం చేసుకుంటావు! వీటిని మీ స్వార్థం కోసము ఉపయోగించవు !అన్ని రకాల దైవిక వస్తువులను, మహత్తర వస్తువులను పొందుతావు !వాటిని పట్టించుకోవు! వాటిని ఉపయోగించే లేని స్థితికి చేరుకుంటావు! మూలాలు తెలుసుకుంటావు! మాయల దగ్గర బోల్తా పడతావు! మాయల రహస్యాల దగ్గర తల ఒగ్గి దాటుతావు! తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటూ నీటి బొట్టు లాగానే నశించిపోతావు! కోరికలు అనుభవిస్తావు! సంతాన తాపత్రయాలు ఉండవు! ఇక సంతానమే ఉండదు! వివాహ యోగం ఉన్నది! ప్రేమ వివాహము చేసుకుంటావు! లేచి పోయే వివాహము చేసుకుంటావు! ప్రస్తుతము నీవు ప్రేమించే అమ్మాయి నిన్ను వివాహాము చేసుకోదు! కోరిక వాసనలు పడవు! కోరికలో పడ్డామని లోకానికి చెబుతావు… చూపిస్తావు…అందరిని మాయలో ముంచి…. మీరు మాయ నుండి బయటపడతావు! లోకానికి తెలియకుండానే నీ సాధన స్థాయి పరమ గురువు స్థాయి దాకా వెళుతుంది! అయినా లోకానికి మాత్రం ఏనాడూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటావు! కర్మలు చేసే స్థాయి నుండి ఆ కర్మలు ఆడించే వాటిని నాశనం చేసే మనో యోగ సాధన స్థాయికి చేరుకుని పరిపూర్ణ జ్ఞానిగా మారి సంపూర్ణంగా అంతరించిపోతావు! మోక్షప్రాప్తికి కొత్త సాధన విధానమును కనిపెడతావు! నవ బ్రహ్మలను కలుపుతావు! బ్రహ్మ తదాకార స్థితి గల బ్రహ్మ సిద్ధాంతమును లోకానికి తెలియజేస్తావు!త్వరలో మోక్షగామిగా మారతావు! త్వరలో జరిగే ఈ విద్యా పరీక్ష యందు తప్పి ఆవేదన చెంది భోగి కావాల్సిన వాడి కాస్త యోగిగా మారకపోతే ఇక నేను నా జీవితంలో ఎవరికి జాతకం చూడను! చెప్పను!
తన వాగ్దాటి నా ముందు ప్రదర్శించే సరికి వాటిని నమ్మాలా వద్దా? నమ్మితే జరిగే వాటిని చూసి నవ్వాలా.. ఏడవాలా.. నా బతుకు ఇంత చిందరవందరగా ఉంటుందా? చక్కగా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని పెళ్ళాం పిల్లలతో గడపవలసిన వాడిని… గృహస్థాశ్రమం చేస్తూ సంతానము లేకుండా మర్కట సన్యా సిగా జీవించడమా? ఐఏఎస్ కావాల్సిన వాడిని కాస్త తిరగేసి సాయి గా మారుతానా? ఇవన్నీ జరిగే సంఘటనలనే? నా బొంద! జాతకాలు అని లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లుగా ఉందే? అయినా భవిష్యత్తు ముందే తెలిస్తే కిక్ ఇంకేముంటుంది! కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో! జాతకాలు నమ్మని వాడిని జాతకాలు చెప్పి బ్రతకడమా? ఏమిటి … వామ్మో నా జీవితం ఏమిటి? వీటిని నమ్మాలా వద్దా? అయినా ముందు పరీక్షలు జరగని! అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన వాటిని చూసి నిర్ణయం తీసుకుందాం! అప్పటిదాకా వీటిని నమ్మ కూడదు అనుకుంటూ… వారికి నమస్కారం చేసి …అర్ధం కాని అయోమయంలో అక్కడి నుండి ఇంటి వైపు అడుగులు వేశాను! ఏమిటి ఆలోచిస్తున్నారా? ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు నా జీవితంలో జరిగినాయా లేదా? …. అయితే వాటిని తెలుసుకోవాలంటే ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !
శుభం భూయాత్
పరమహంస పవనానంద
**************************************
గమనిక:ఇలా ఈయన నాకు చెప్పిన జాతకము అంతాగూడ పొల్లుపోకుండా యధావిధిగా నా జీవితములో జరిగినాయి.ఇలా నా జాతకమును చెప్పినవారు ఎవరో గాదు...మా భౌతిక గురువైనా విచిత్ర వేదాంతి అన్నమాట. ఈయన ఎవరో ...వీరి వివరాలు ఏమిటో మీకు రాబోవు “విచిత్ర వేదాంతి” అనే అధ్యాయములో చెప్పడము జరిగినది.గమనించగలరు.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmee jaathakam cheppinayana evaro kaani mee laanti vaare okkati maatram pakka migathavi anni jarigayi kaani "andarini maayalo munchi meeru maaya nundi bayata padathaaru....inka mokshaprapthiki kotha saadhana vidhaanamu kanipedatharu..." modatidi pakka andarini maayalo munchi meeru maayam avvatam... naa raatha ela undo meeku thelsu kaani naaku thelidu.... meeku evarito pani ledu mee saadhana kosame unnaru..."
రిప్లయితొలగించండిSwathi garu meeru jatakam cheppatam modalu pettaru
రిప్లయితొలగించండి