మా ఇద్దరి తొలి సాధన అనుభవాలు:
నేనేమో జ్ఞానమార్గం ద్వారా మోక్షగామి అయితే జిఙ్ఞాసి అయితే సిద్ద మార్గము ద్వారా మోక్షప్రాప్తికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు.నా యోగ సాధన కుండలిని జాగృతికి జ్ఞాన దీక్ష గురువు దర్శనం లభించి వారి శక్తి పాత సిద్ధి ద్వారా నాలో కుండలిని శక్తి కదలికలు ఏర్పరచినారని మీకు విదితమే కదా. అలాగే జిఙ్ఞాసికి వారి సిద్ధ గురువు యొక్క శక్తి పాత సిద్ధి వలన వాడిలోని కుండలిని మాత కదలికలు ఏర్పడినాయని మీకు విదితమే కదా. నేనేమో యోగ శక్తులు అలాగే యోగసిద్ధులు అలాగే పంచభూత ఆధీనాలు వైపు వెళ్లకూడదని మోక్షఙ్ఞానం పొందాలని నా యోగసాధన ఆరంభమైతే మా జిజ్ఞాస కి యోగసాధనలో అసలు ఏ ఏ యోగ శక్తులు వస్తాయి వాటి ద్వారా వచ్చే యోగసిద్ధులు ఏమిటి వాటిని పొందితే వచ్చే పంచభూతాల శక్తులు ఎలా ఆధీనాలు అవుతాయని ప్రత్యక్ష అనుభూతి అలాగే ప్రత్యక్ష అనుభవాలు పొందాలని వాడేమో సిద్ధ మార్గంలో ప్రయాణించడం జరిగినది. అంటే నేను జ్ఞానసిద్ధుడుగా వాడేమో యోగ సిద్ధుడుగా యోగ సాధన ప్రారంభమైనది అన్నమాట. మాకు వచ్చిన టెలిపతి విధి విధానం ద్వారా ఒకరికొకరు తమ తమ అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. వాడేమో శ్రీశైల క్షేత్రం లో కూర్చుని తన సాధన శక్తితో పన్నెండు చక్రాలు జాగృతి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేనేమో చక్రాలు జాగృతి అవుతున్న సమయంలో కనిపించే బీజాక్షరాలు సాధన చేస్తే వచ్చే మంత్ర దేవతలు చూపించిన ఆయా క్షేత్రాలకు వెళ్లి చక్రాల జాగృతి చేసుకోవాలని అనుకున్నాను. ఒక దివ్య ముహూర్తం చూసుకొని వాడేమో కర్మ సన్యాసిగా ఏకాకిగా మోక్ష ప్రాప్తి కోసం సిద్ధ మోక్షగామిగా శ్రీశైలం వెళ్లిపోయినాడు. నేనేమో గృహస్థ ఆశ్రమ ధర్మము లో మోక్ష ప్రాప్తి కోసం మానసిక సన్యాసిగా జ్ఞాన యోగిగా ఇంటి వద్దనే ఉండి యోగ సాధన చేసుకుంటూ చక్రాల జాగృతి కోసం ఆయా క్షేత్రాలు తిరిగి రావాలని అనుకున్నాను.ఇలా మా ఇద్దరి యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనము అయిన తర్వాత విభేదనం సమయానికి ఒకరికొకరు ఎదురుపడాలి అని అప్పటిదాకా మాట్లాడుకోవడం అన్ని కూడా టెలిపతి ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాము.
ఈ రాబోవు అధ్యాయములలో మా ఇద్దరి అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్క దానికి అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము ఒక వరుసక్రమంలో వస్తాయి. జ్ఞాన యోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో సిద్దయోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో వ్రాయటం జరిగినది. ప్రస్తుతానికి ఈ అధ్యాయంలో ప్రారంభ కుండలినీశక్తి అనుభవాలు మూలాధార చక్ర జాగృతి లో మా ఇద్దరి అనుభవాలు రాస్తున్నాను. తికమక పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి. ఇలాంటి అనుభవాలు మీకు కల్గినాయో లేదా కలుగుతున్నాయో లేదో మీరు పరీక్షించుకోండి సుమా.జిజ్ఞాసి తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మొట్టమొదటగా శ్రీశైల క్షేత్రమునకు చేరుకున్నాడు. వాడి సిద్ధ దీక్ష గురువును తలచుకుని తన గురు మంత్రమును ఏకాంతంగా కూర్చుని తీవ్రంగా చేసుకోవడం ప్రారంభించాడు. తనకి దాహం అయినప్పుడు త్రాగటానికి ఒక ఇత్తడి చెంబు నీళ్ళుతో పెట్టుకుని సాధన చేయడం ఆరంభించాడు.కళ్ళు మూసుకొని మంత్ర సాధన చేస్తుండగా అతడికి ఇత్తడి చెంబు మీద మనస్సు పోవటం ప్రారంభమైనది. నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుండగా ఎవరైనా దొంగతనం చేస్తే తనకి నీళ్లు త్రాగటానికి చాలా ఇబ్బందులు వస్తాయి కదా అంటూ మధ్యమధ్యలో కళ్ళు తెరిచి చెంబు ఉన్నదా లేదా అనిచూసుకుని మళ్లీ కళ్ళు మూసుకోవడం కొన్ని క్షణాలు అనగా 15 నిమిషాల తర్వాత మళ్ళీ చెంబును చూసుకోవడంతో ఆ రోజంతా చెంబుతో మంత్ర ధ్యానము గడిచిపోయింది. ఆకలిగా వేయడంతో గుడిలోని భోజనాలు పెట్టే చోటికి వెళ్లి భోజనం చేసి రావడం జరిగినది. గుడి బయట ఉన్న గదులులాంటి స్థలాల్లో నిద్ర పోవడం జరిగినది. మరుసటి రోజు గాని కూడా ఉదయం నాలుగు గంటలకు లేచి పాతాళగంగ దగ్గరికి వెళ్లి స్నానాదికాలు పూర్తిచేసుకుని విభూది పెట్టుకొని శ్రీ మల్లన్న భ్రమరమ్మ దర్శనం చేసుకొని ఈసారి సాక్షి గణపతి ఆలయము నకు వెళ్లి అక్కడ ఉన్న గుడి బయట వైపున ఒక బండరాయి మీద కూర్చొని గురు మంత్రమును కళ్ళు మూసుకొని తీవ్రంగా చేయడము, మధ్యాహ్నానికల్లా వాళ్ల తల్లిదండ్రులు గుర్తుకు రావటం వారితో గడిపిన విషయాలు గుర్తుకు రావడంతో ధ్యానానికి విపరీతమైన అడ్డంకులు వచ్చేసరికి దానితో మనస్సు లేని ధ్యానం చేస్తే ఏమి లాభం అని దీనికి ప్రాయశ్చితంగా ఆ రోజు అన్నం తినకుండా కేవలం రెండు అరటి పండ్లు తిని నిద్ర పోయినాడు. ఎప్పటికో మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. దాంతో ఇప్పటికైనా ధ్యానం చేయగానే కుదురుతుంది ఏమో అని ధ్యానం చేయగానే ఈసారి బంధుమిత్రులు గుర్తుకురావడం పనికిమాలిన విషయాలను మనస్సు ఎందుకు గుర్తుకు చేసుకుంటుందో అర్థం కాక దానిని తిట్టుకుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ ప్రక్కనే ఉన్న కొలను వైపు వెళ్ళినాడు. ఇలా వీడు సుమారుగా నెల రోజులపాటు ధ్యాన సమయంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల విషయాలతో వారిని మర్చిపోలేక దృష్టికి రాకుండా చేసుకోలేక గుర్తుకి రాకుండా ఎలా ఆపాలో అర్థం కాక అనవసరంగా శ్రీశైలం వచ్చినాను అని అనుకుంటూ తిరిగి వెనక్కి వెళ్లి పోతే బాగుంటుందేమోనని అనుకుంటూ ఆ ఆలోచన కొనసాగిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా నేను కూడా ఇదే ముహూర్తానికి మా గుడిలో మల్లన్న శివ లింగ మూర్తి ఎదుట కూర్చుని సాధన చేయటం ఆరంభించాను. గురు మంత్రారాధన చేస్తుండగా నాకు మొదటి రోజు విపరీతంగా ఆవలింతలు వచ్చేవి. ఆపుకోలేక పోయేవాడిని. దిష్టి తగిలినట్లుగా ఆగకుండా ఆవులింతలు వచ్చేవి. ఏమి చేయాలో అర్థం కాక వీటిని ఎలా ఆపుకోవాలో అర్థం కాక ఇంటికి వెళ్లి మిగిలిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాను. రాత్రికి తీరికగా ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ పోవడం మొదలు పెట్టగానే ఆవలింతలు మళ్లీ మొదలయ్యాయి. దీనెమ్మ జీవితం!తొక్క జీవితము ఆవలింతలుకే ఆ యోగ బ్రతుకు ఆగిపోతుందా? ఏమి చేయాలి దేవుడా! నువ్వు కనిపించవు నువ్వు ఎలా ఉంటావో చూడాలని నా ప్రయత్నం. దిక్కు మొక్కు లేకుండా నడుస్తుందని అనుకుంటూ ఇలా వారం పది రోజుల పాటు ఆవలింతలతో నడిచి పోయినది. ఆ తర్వాత నిద్ర దేవత మొదలైనది. జపము చేస్తుండగా నిద్ర రావటం మొదలయింది. రాత్రి రమ్మన్న వచ్చేది కాదు. కేవలం ఏదో శాపంలాగా మంత్రజపము చేసుకునే సమయంలో విపరీతమైన నిద్ర వచ్చేది . సుమారుగా మూడు లేదా నాలుగు గంటలు నిద్ర పట్టేది. ఇది సరిగ్గా నేను ఎంత సేపు జపము చేయాలని అనుకునే వాడినో అంత సమయంలో ఈ నిద్రాదేవత ఆవహిస్తుందని తెలియగానే అడ్డంకులు ఎలా కలుగుతాయో నాకు అర్థమయ్యేసరికి మరో 15 రోజులు గడిచిపోయాయి. మొత్తం మీద 15 రోజులు నిద్ర మత్తు, ఆవలింతలుతో అలాగే గడిచి పోయినాయి. అసలు నా పరిస్థితి ఇలా ఉంటే మరి శ్రీశైల క్షేత్రంలో ఉన్న జిఙ్ఞాసి పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ వాడికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో లేవో తెలియదు. ఒకవేళ ఉంటే ఎలాంటివి వచ్చినాయో నాకు తెలియదు. ఒకవేళ రాకపోతే వాడు అయినా సాధనలో ముందుకు వెళతాడు కదా అనుకుంటూ రాత్రికి వాడితో టెలిపతి సిద్ధితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్లి నిద్రకి ఉపక్రమించాను. కానీ మనకి అవసరమైనప్పుడు నిద్ర వస్తే దాని విలువ ఏముంటుంది కదా. నాకు వద్దు అనుకున్న సమయానికి రావాలి కదా అనుకుంటూ ఎటూ నిద్ర రావటం లేదు గదా. టెలిపతి ద్వారా ఏకాగ్రతతో జిఙ్ఞాసి గురించి ఆలోచించడం ఆరంభించాను. సుమారు ఒక గంట తర్వాత వాడి నుండి నాకు ఆలోచనలు రావటం మొదలయ్యాయి.
వాడి వివరాలు తెలుస్తున్నాయి. నా వివరాలు వాడితో చెప్పాను. దాంతో “భయ్యా! నాకేమో ఇత్తడి చెంబు గురించి ఇంటి వారి గురించి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి. నీకేమో నిద్రమత్తు ఆవలింతలు వస్తున్నాయని తెలుస్తుంది. సాధన ఆరంభంలోనే ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా? నాకు ఏమి చేయాలో అర్థం కావడంలేదు. పోనీ నీ సాధన ముందుకు వెళుతుందని అనుకుంటే నీవు కూడా ఇబ్బందులు పడుతున్నావు అంటే ఏమి చేయాలి. దీనికి ఏమైనా ఆలోచించు అని టెలిపతి ద్వారా వాడు మననము చేసిన విషయాలు నాకు అందసాగినాయి. వెంటనే వాడితో “సిద్ధా! చెంబు అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ముందుగా ఆలోచించడం తగ్గించుకో. నీవు ఇంటికి దూరంగా ఉన్నావు కాబట్టి సహజంగా వారికి గూర్చిన ఇలాంటి ఆలోచన రావటం సహజం. ఇంటికి వెనక్కి మాత్రం వస్తే ఇలా ఎన్నో కోట్ల జన్మలు ఎక్కడ ఆగిపోయావో అక్కడే ఆగిపోతుంది.మరి ఎప్పుడు ముందుకి వెళతావు? ఒక్కసారి ఆలోచించు ఈ బంధాలు కూడా పూర్వజన్మ కర్మ వాసనలే కదా. ఇది శాశ్వతంగావని తెలుసుకో” అని వాడికి నా మననము ద్వారా ఈ సూచనలు పంపడం జరిగినది. ఆ తర్వాత వాడి నుండి “నిజమే భయ్యా! మరి మీరు కూడా ఆవలింతలు అలాగే నిద్ర మత్తు నుండి తప్పుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించుకోండి. నాకు తెలిసి మీరు చాలా ఏకాగ్రతతో కసిగా పట్టుదలగా ఆవేశంగా జపము చేస్తున్నట్లు గా ఉన్నారు.దాని వలన మెదడుకు తగినంత ఆక్సిజన్ మీకు అందటం లేదు. దాని వలన నిద్ర మత్తు ఆవలింతలు రావడం మొదలైనట్లు గా ఉంది కాబట్టి హడావుడిగా జపము సంఖ్య పూర్తిచేయాలని వేగంగా చేయకండి. నెమ్మదిగా ఆసక్తిగా తగినంతగా ఆక్సిజన్ తీసుకుంటూ ధ్యానం చేయండి” అని వాడు మననము చేసిన ఆ విషయాలు నాకు చేరినాయి. విశేషం ఏమిటంటే ఒకరికొకరు గురువులు అలాగే శిష్యులు అన్నమాట. ఒకప్పుడు నేను వాడికి గురువుగా ఉంటే వాడు నా విషయంలో నాకు గురువు గా ఉంటాడని నాకు అర్థం అయ్యే సరికి ఏమిటో ఈ లీల అని అనుకుంటూ నిద్ర వచ్చేసరికి నిద్రాదేవత కి స్వాగతం పలుకుతూ నాకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగినది.మరుసటి రోజు నేను జిజ్ఞాసి చెప్పినట్లుగా జపము గురించి పట్టించుకోకుండా మంత్ర జపం చేసుకోవడం ప్రారంభించాను. ఒక గంట తర్వాత ఆవలింతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలియగానే నాకే తెలియని ఆనందం తో కూడిన చిరునవ్వు నా మొహంలో మొదలైంది.
అలాగే జిజ్ఞాసి కూడా ఆలోచనలు చేస్తున్నాడు. గత జన్మ వాసనలు వలన వాళ్ళని గురించి ఈ తలంపులు వస్తుంటాయి. ఇత్తడి చెంబు విలువ 500 రూపాయలు లేదు. 500 రూపాయలు పోతాయి అని ఈ చెంబు గూర్చి ఆలోచన చేస్తే సాధన ఆటంకం ఏర్పడుతుంది. ఈ మానవ జన్మ యొక్క సాధన శక్తి 500 రూపాయలా?ఛీ! పాడు బ్రతుకు! వెధవ రూపాయల కోసం ఆలోచనలే దాటలేకపోతే రాబోవు మాయ పరీక్షలు ఎలా దాటగలను. రాములు వారు సీతాదేవి జడ చూసి ఈ శివధనస్సు ఎత్తలేకపోతే మరి సీత జడను ఎలా ప్రక్కన పెట్టగలను అనుకొని శివధనస్సును ఎత్తినాడని ఎక్కడో చదివిన విషయం లీలగా ఇతనికి గుర్తుకు వచ్చింది. అలాగే తల్లిదండ్రుల గురించి ఆలోచన దాటాలంటే ఒక రకంగా వాళ్లను నేను వదిలి వచ్చినాను అంటే వాళ్ల దృష్టిలో నేను చచ్చిపోయాను కదా. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగి పోయి ఉంటే వాళ్లకు కనీస సమాచారం అందే అవకాశం లేదు కదా. నేను ఇల్లు వదిలి వెళ్ళడం నా తల్లిదండ్రులకు ఒక పెద్ద బాధ గానే మిగిలిపోతుంది కానీ నేను చచ్చిపోయి ఉంటే పడే బాధ కన్నా ఈ బాధ చాలా పెద్దది ఏమి కాదు.కానీ ఏమి చేయగలను? ఎవరికి వారే యమునా తీరే. వాళ్లంతా ఈ ప్రపంచమే నిజమని బ్రతుకుతున్నారు.నిజంలాంటి కలలో ఉంటున్నారు. జీవిస్తున్నారు. ఈ భ్రమ భ్రాంతి మాయా మోహితమైన ఈ నాటక ప్రపంచము నుండి నేను విముక్తి పొందాలని మరి మోక్షగామిగా వచ్చినాను. ఉన్నది నేను ఒక్కడినే. కాకపోతే దానిని నేను మర్చిపోయాను.దానిని గుర్తు చేసుకోవడానికి ఈ అవతారం ఎత్తవలసి వచ్చినది. ఉన్నది నేనే అయినప్పుడు మరొకరు లేనప్పుడు నాలోన శివుడు నీలోన శివుడే అయినప్పుడు ఉన్న ఒక్క శివుడు మరో శివుడి కోసం ఏడవటం ఏమిటి? బాధపడటం ఏమిటి? మాయ అంటే ఇదే కదా.మాయ లేని వాటిని ఉన్నవాటి గాను ఉన్నవాటిని లేని వాటి గా మార్చి చూపిస్తుంది. మరి ఈ మాయ స్వరూపమును దాటితేగాని స్వస్వరూపం ఏమిటో తెలియదు కదా. అంటే మనకున్న మాయ మాయము అవ్వాలి కదా. అందుకు నేను ఎంచుకున్న మార్గమే సిద్ద యోగ సిద్ధుడు గావటమే కదా. మరి ఇత్తడి చెంబు, తల్లిదండ్రుల గురించి ఆలోచనలు అనవసరమే కదా. లేనివారిని ఉన్నవారుగా ఆలోచించడం ఏమిటి అని వైరాగ్య భావాలు వస్తూఉండేసరికి క్రమేపీ వస్తువు ఆలోచనలు తగ్గి ధ్యానములో మనస్సు కుదురుగా కూర్చోవటం ఆరంభమైనది. అలా కొన్ని గంటలు గడిచాయి.జిఙ్ఞాసికి మోక్షం కోరి సాక్షాత్తుగా తన మాయాపూరిత తల్లిదండ్రులను వదిలి వస్తే ఒక ఇత్తడి చెంబు మీద ఉన్న ఆపేక్ష వలన మోక్ష కాంత తనని వదిలి పెడితే ఈ బంధము వలన ముక్తి కాంత తనని అసహ్యించుకొని వదిలి పెడితే..ఛీ! నా బ్రతుకు అనుకుంటూ నారు పోసిన వాడు నీరు పోస్తాడు.పోసే నీరు కోసం చెంబు అవసరం లేదు. చేతులు ఉన్నంత వరకు మనకి దేనికి దిగులు అనుకుంటూ దానిని అక్కడే వదిలేసి నీళ్లు తాగాల్సి వస్తే చేతులు లేదా భక్తులు ఇచ్చిన కొబ్బరి చిప్పలతో నీళ్లు త్రాగటం అలవాటు చేసుకున్నాడు అని నేను టెలిపతి ద్వారా తెలుసుకున్నాను. నెలలో రెండు రోజులు మాత్రమే అనగా సాధనలో అవాంతరాలు వస్తే అమావాస్యరోజు అలాగే సాధనలో పురోభివృద్ధి వస్తే పౌర్ణమి రోజు టెలిపతి లోకి రావాలని మేమిద్దరం అనుకొని సాధన కొనసాగిస్తున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు…. మీరు కూడా ఈ రోజులలో మాతో టెలిపతి లోనికి రండి. మరి ముందుకు వెళదాము. ఏమి జరుగుతుందో చూడాలని లేదా. మరి ఆలస్యం దేనికి బయలుదేరండి.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
******************************************
గమనిక: నిజానికి నాకు కర్మ, భక్తి, జ్ఞాన, కుండలిని మార్గాలు నా వంటికి సరిపడటం లేదని ఈపాటికే తెలుసుకున్నారు కదా. అప్పుడు నేను ఒకసారి నాలో వచ్చేనాదం వంటి శబ్దాలు వింటుంటే అది కూడా ఏ మంత్రం లేకుండా ఎలాంటి ప్రక్రియలు చేయకుండా కేవలం ఏకాగ్రతతో నా మనస్సుతో ఆ శబ్దం వినేటట్లు గా చెయ్యగానే నాలో కుండలిని శక్తి కదలికలు ప్రారంభమయ్యాయి. అనగా శక్తిపాతం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అప్పుడు నేను శివ మహా పురాణం చదివితే మహా శివుడు చేసే శబ్దబ్రహ్మ నాదయోగమని అలాగే వేదవ్యాసుడు కూడా నాదయోగం ద్వారా యోగసిద్ధి పొందినాడు అని తెలుసుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా 20 నిమిషాల నుంచి 48 నిమిషాల పాటు శవాసనంలో పడుకొని అర్ధరాత్రి పూట నాలో వచ్చే శబ్ద నాదమును భౌతిక చెవులతో కాకుండా మనస్సుతో వినటం అభ్యాసం చేసినాను. చెవులలో బయట శబ్దాలు ఏమీ వినిపించకుండా దూది లేదా చూపుడు వేలు లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని (బయట శబ్దాలు వినిపించకుండా చేసే వాటిని) సాధన చేసినాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన పాటలు వింటూ ఊపు వస్తే చిందులు వేస్తూ గంతులు వేస్తూ ఉండే వాడిని. బాబా హారతులు విన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని కదలికలు ప్రారంభమయ్యాయి. ఇలా నా కుండలినీశక్తి జాగృతి చేసుకుంటూ మూలాధార చక్రము నుండి బ్రహ్మ చక్రం వరకు అనగా తుమ్మెదల నాదం నుండి నిశ్శబ్ద నాదం వరకు ఉన్న 13 రకాల శబ్దాలు వినటం అభ్యాసం చేసినాను.ఈ యోగము ద్వారా సిద్ది పొందినాను. అదే జిఙ్ఞాసి అయితే సిద్ద గురువు సహాయంతో కుండలినీ మార్గం ద్వారా వారి కుండలినీ శక్తిని జాగృతం చేసుకొని ప్రకృతిని జగద్గురువుగా భావించుకొని ఆత్మ జ్ఞానము ద్వారా సిద్ధి పొందాడు.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిOkaru gnyna maargam okaru siddha maargam lo prayathnam modalupetti elanti kashtalu
రిప్లయితొలగించండిpadinarani jignyasi gaaru chembu, family kosam aalochanalu cheyatam meeru aavalinthalu, nidra
devatha tho ibbandi padatam telepathy iddaru em chesukovalo ani salahalu ichukoni meeru oxygen
andela japam cheyatam, jignyasi gaaru chembu mida dhyasa theeseyatam ila sadhakudiki edo oka
aalochana osthundani ela athikraminchalo baaga chepparu.... Gamanika: Shabdhamulu vini
saadhana chesi mooldaram nundi Brahma chakram varaku anni shabdhalu vini saadhana
cheyatam...