అధ్యాయం 60

రహస్య గ్రామము నాకు కనపడినది.

( మా కాలచక్రానుభవాలు )

నాలుగు ఉప చక్రాలలో మొదటిదైన గుణ చక్రము గుణాతీత స్థితి ద్వారా అలాగే రెండవ చక్రమైన కర్మ చక్రమును కర్మాతీత స్థితి ద్వారా ఆధీనము చేసుకున్నానని మీకు విదితమే కదా. ఇక ఇప్పుడు మూడవ చక్రమైన కాలచక్ర ఆధీనము కోసం పరమశివుడులాగా కాలాతీత స్థితిని పొందాలి అని నాకు అర్థం అయింది. దీని కోసము శ్వాస ప్రశ్వాస యొక్క ఉచ్చ్వాస నిశ్వాసలు అనే చేపలు తినాలని శ్రీ లాహిరీ మహాశయుడు చెప్పి ఉన్నారు గదా. దీనమ్మ జీవితం. నిజముగా కొరమేను, బొచ్చ చేపలు తినమంటే తినగలను కానీ ఇలా శ్వాస ప్రక్రియలు చేపలుగా ఎలా తినాలో నాకైతే అర్థం కాలేదు. ఈ చక్ర సాధన ఎలా మొదలు పెట్టాలో ఏ విధంగా చేయాలో అర్ధం అవ్వటం లేదు. ఎంచక్కగా వామాచారంలో అయితే చేపలు తింటూ ఈ చక్ర స్థితి అయిన కాలాతీత స్థితి పొంద వచ్చును కానీ అదే దక్షిణాచారం లో అయితే శ్వాస ప్రక్రియని చేపలలాగా ఎలా తినాలో నాకైతే అర్థం కాలేదు. ఎంచక్కగా మసాలా దినుసులతో వండిన చేపల కూర తినక శ్వాసప్రక్రియ చేపలు కూరగా తినమనడంలో అర్ధం ఏమిటో నాకైతే అర్థం అయి చావడం లేదు. మద్యపానము లో అలాగే మాంసభక్షణలో  ఖేచరీ ముద్ర ద్వారా వచ్చే అమృత పానం చేస్తే సరిపోయేది. అనుభూతి కలిగినది. దీనమ్మ! శ్వాస ప్రక్రియ ఎలా తినాలి. ఎలాంటి అనుభూతి కలుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు.

ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒక బోర్డు మీద "శ్వాస మీద ధ్యాస పెట్టు. అదియే నీ నిత్య సాధన చేసుకో. నీ జన్మ సార్థకత చేసుకో" అని కనిపించినది. ఎందుకో ఈ బోర్డు మీద కొటేషన్ నన్ను బాగా ఆకర్షించింది. ఇందులో ఈ శ్వాసప్రక్రియలో నాకు తెలియని మర్మ రహస్యం ఉండి ఉండాలని అనిపించి యోగ శాస్త్రాలు చదవటం ప్రారంభించాను. మనము ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస ప్రక్రియలు జరుపుతామని అలాగే మన శ్వాస వేగం ముక్కు నుండి బయటికి 8 నుండి 15 అంగుళాల దాకా వ్యాపిస్తుందని… ప్రతిరోజు ఉదయము కుడి ముక్కు రంధ్రం నుండి ఎక్కువ శ్వాసను రాత్రిపూట ఎడమ ముక్కు రంధ్రం ఉండి ఎక్కువ శ్వాసను పీల్చడం జరుగుతుందని ఈ రెండు ముక్కు రంధ్రాల్లో సమ శ్వాస  ప్రక్రియలు ఉదయము సాయంత్రము సంధ్యాకాలాలలోను జరుగుతాయని దీనిని గమనించి మన పూర్వ మహర్షులు ఈ కాలంలో సంధ్యావందన ప్రక్రియ విధానాలు ఏర్పరిచినారు అని తెలియగానే ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి పెరగసాగింది. దాంతో నా ముక్కు మీద నా శ్వాస మీద ప్రయోగాలు చేసుకోవటం ఆరంభించాను. యోగశాస్త్రము చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలని గ్రహించాను. అంటే ఈ లెక్కన మన ధ్యాస అంతా శ్వాస మీద పెడితే అది జరిపే శ్వాసక్రియలో సంఖ్య అలాగే అది వ్యాపించే పరిధి తగ్గుతుందని ఇలా శ్వాసలు 365 దాకా రావాలని పరిధి మూడు అంగుళాల దాకా రావాల్సి ఉంటుందని నాకు అర్థం అయినది. ఈ కాల చక్రానికి అధిదైవాలుగా కాలభైరవుడు కాలభైరవి కాలచక్రము త్రిప్పే దైవాలుగా ఉంటే అదే ఈ కాలచక్రంలోని త్రికాలాలు హరించే అనగా నాశనం చేసే దైవాలుగా మహాకాలుడు మహా కాళిక ఉంటారని  ఇదియే ఉజ్జయిని మహా క్షేత్రమని చెప్పటం జరిగినది.

శ్రీ లాహిరీ మహాశయుడు ఉవాచ

కానీ విచిత్రం ఏమిటంటే శ్రీ లాహిరీ మహాశయుడు ఒక డైరీలో ఎవరు కూడా ఈ చక్రం యొక్క మహాకాలుడు మహా కాళిక వైపు చూడరాదని వారు నాశన కర్తలని జాగ్రత్త వహించాలని ఒకవేళ చూడటం జరిగితే మిమ్మల్ని కూడా నాశనం చేస్తారు అని చెప్పటం జరిగినది. అది ఎందుకు అలా వ్రాసినారో అప్పుడు నాకు తెలియ రాలేదు. కానీ కొన్ని భయంకర అనుభవాలు నాకు తెలియటంతో అవి నిజమేనని నాకు అర్థమైనది. దయచేసి సాధకులు ఎవరు కూడా మహాకాలుడు మహా కాళికా నివాసమైన మహా ఉజ్జయిని క్షేత్రానికి అలాగే మానససరోవర కైలాస పర్వత దర్శనానికి, రామేశ్వర క్షేత్రానికి వెళ్ళవద్దు .వెళ్ళిన వారు తమకి తెలియకుండానే మాయకి గురై త్రిగుణాల మాయలోపడి తద్వారా కలిగే అరిషడ్వర్గాలమాయలోపడి  కర్మ, జన్మ, పునః జన్మలు ఎత్తటం నా స్వానుభవంలో చూశాను. తస్మాత్ జాగ్రత్త. 

అది ఎలాగా అంటే ఈ క్షేత్రాల యందు అనగా ఉజ్జయిని మహా క్షేత్రము నందు పాంచజన్య శంఖం యంత్రము పైన మహాకాలుడు లింగ ప్రతిష్ట జరిగినది. ఈ యంత్రము జీవ సృష్టి చేసేది అనగా స్థూల శరీరాలను సృష్టించేది. ఎందుకంటే పాంచజన్య శంఖం శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉంటుంది. ఏకైక ఆత్మగా చివరిలో శాశ్వత మరణము పొందకుండా తానే వెయ్యి కోట్ల జీవులుగా సహస్రార చక్రము విశ్వ రూపధారిగా అవతారము ఎత్తి అండపిండ బ్రహ్మాండాలను ఏర్పరిచి లేని అసత్యమైన భ్రమ భ్రాంతి మాయ మర్మాలు ఉన్న ఈ జగన్నాటకం నడుపుతున్నాడు. నిజానికి ఈ నాటికను ఆడే వాడు… ఆడించే వాడు ఆయనే అన్నమాట. కాకపోతే మాయ కోసం నామ రూపాలతో వెయ్యి కోట్ల శరీరాలుగా ఎత్తి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వేసిన నాటకంను తనే వేస్తూ, తనే నటిస్తూ, తనే ఆపివేస్తూ, సృష్టి- స్థితి- లయలు అండ- పిండ- బ్రహ్మాండాలు ఏర్పరుస్తున్నాడు. అంటే సముద్రం ఒడ్డున ఒక చిన్న పిల్లవాడు ఇసుకతో మట్టి గుడులు కట్టుకుంటాడు. వాటితో ఆడుకుంటాడు. కొంతసేపటికి వాటిని నాశనం చేస్తాడు. ఇది ఎలా అయితే జరుగుతుందో అలాగే శ్రీకృష్ణుడు వటపత్ర శాయి గా బాలుడి రూపంలో రావి ఆకు మీద ఉంటూ తన నోటిలో కాలు చీకుతూ ఈ సృష్టిని సృష్టిస్తాడు. చేతులు కదుపుతూ ఈ సృష్టిని ఆడిస్తాడు. అదే కాళ్లను ఆడిస్తూ ఈ సృష్టిని నాశనం చేస్తాడు. మధ్యమధ్యలో నవ్వుతాడు. ఏడుస్తాడు. నిద్రపోతాడు.ఇలా నవరసాలు చేస్తూ నవరస పాత్రలుగా తానే మారి తనకి తానే నటిస్తాడు. జీవిస్తాడు. మరణిస్తాడు. ఇలా ఈయన తనకి తానే మాయ స్వరూపాలుగా మారేటప్పుడు గతంలో తనుగా మారిన సూక్ష్మ శరీరాలు వాడుకోవటం జరుగుతుంది. వీటిని హిమాలయాలలోని కైలాస పర్వత పరిసరాల ప్రాంతమైన దేవభూమి అయిన శంబల గ్రామమునందు జాగ్రత్తగా ఉంచుకుని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా శాశ్వత మరణం లేదు కదా. కేవలం జీవుడు పొందే భౌతిక మరణాలు అలాగే దేవతలు పొందే అశాశ్వత మరణాలే పొందినాడు కదా. ఇలా భద్రపరిచిన శరీరాలలో మీవి నావి కూడా ఉండవచ్చును. 

ఒకసారి మనము ఎత్తిన జన్మలను మళ్లీ మన చేత పునః జన్మలుగా ఎత్తించి వారికి కావలసిన విధంగా కర్మ చక్రమును మన ముఖం మీద విధి రాతగా రాయించి 14 లోకాల్లోకి పంపించడం జరుగుతుంది. అంటే ఏక కాలంలో మన లాంటి శరీరాలు నిజానికి 7 కాదు 14 ఉంటాయి. కాకపోతే మన పూర్వ మహర్షులు ఊర్ధ్వలోకాలు గా ఉన్న ఏడు లోకాలలో మాత్రమే మన ఏడు శరీరాలు చూడడం జరిగినది. కానీ అధోలోకాలు అయిన ఏడు లోకాలలో ఉన్న సప్త శరీరాలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కర్మలు చేస్తూ కర్మ ఫలితాలు మనము అనుభవిస్తుంటే ఆయన మన లో ఉండి వాటిని చూస్తూ ఆనంద పడుతూ ఉంటాడు. మన స్థూల శరీరము ఒకవేళ ఆనందంగా ఉంటే ఈయన తట్టుకోలేడు. వెంటనే ఏదో ఒక మాయ ఇస్తాడు. ఆ మాయలో పడి మనము బాధపడుతూ ఉంటే ఈయన ఆనందపడుతూ సంతోషంగా ఉంటాడు. కానీ నిజానికి పాత్రలు వేసే వాడు ఆడించేవాడు ఏకపాత్రధారి అని మనము మరిచిపోతాము. వాడు మరిచిపోతాడు. సినిమాలో విలన్ లేకపోతే ఆ సినిమా ఎలా అయితే జనాలకి నచ్చదో అలా ఈ జగన్నాటకం నందు శత్రువులు లేకపోతే ఈ నాటకం రక్తి కట్టించదని అరిషడ్వర్గాలు, సప్తవ్యసనాలు, నవరసాలు, అష్టవిధధన మాయలు, అష్ట దరిద్రాలు, పంచ పాపాలు, పంచబ్రహ్మ హత్య పాతకాలు ఇలా మున్నగు మాయలు పాపాలు సృష్టించి మన శరీరాల చేత నానా రకాల పాపకర్మలు చేస్తూ వాటికి వివిధ రకాల శిక్షలు వేయిస్తూ నాశనం చేస్తుంటారు. ఈయనకి మన స్థూల శరీరము దొరకకుండా ఉండాలంటే మనము ఈ మహాకాలుడు ఉండే ఈ క్షేత్రానికి వెళ్ళకుండా ఉండాలి అన్న మాట. ఒకవేళ వెళ్తే మీ పునర్జన్మ మీకు మీరే వారికి అనుమతి ఇచ్చినట్లు అవుతుంది. ఈ క్షేత్రంలో స్థూల శరీరానికి కారణమైన  నవగ్రహాలు వీటి ద్వారా వచ్చే కర్మ జీవితాలు కర్మ ఫలితాలు ఇచ్చే విధి వ్రాత ఏర్పడటం జరుగుతుంది. ఇక్కడే నవగ్రహాలు గురించి తెలిపే జ్యోతిష్యశాస్త్రం ఏర్పడినది. అనగా భూమి మీద స్థూల శరీరము ఏర్పడటానికి కారక గ్రహమైన కుజుడు (కుజ గ్రహము) అనగా భూమి పుత్రుడు కూడా ఇక్కడే పుట్టినాడు. అంటే మన స్థూల శరీరాలు మనకి మనమే ఏర్పాటు చేసుకుంటున్నామని అర్థం కదా. మన స్థూల శరీరాల కపాలాలు అవి కూడా ఈ మహాకాలుడు మహా కాలిక మెడలో 108 కపాలమాలగా ఉంటాయి. వీరిద్దరూ రతిక్రీడ చేస్తూ ఏ కపాలము అయితే తమ చేతిలో ఉంచుకుంటారో వారి పునర్జన్మ యొక్క స్థూల శరీరాలు ఈ భూలోకం నందు జన్మిస్తాయి. 

ఇక రామేశ్వర క్షేత్రానికి వెళితే మన సూక్ష్మ శరీరాలు పునర్జన్మ పొందుతాయి. ఎందుకంటే ఈ దేవాలయం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పిరమిడ్ గొప్పతనము ఏమిటంటే చనిపోయిన వాటి నుండి జీవశక్తిని సంగ్రహించి పునః జన్మ చేసేటట్టుగా చేయగల శక్తి వీటికి ఉండటంవలన పూర్వము ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం జరిగినది. ఆయా రాజుల సమాధులు వీటియందు భద్రపరచటం అలాగే తైవాంగ్ అను రాజు సమాధి నుండి ఇప్పటికీ శబ్దాలు మూలుగులు వినపడుతున్నాయి అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. శ్రీరాముడు తన భార్య విరహవేదనను భరించలేక సరయూ నదిలో శరీరత్యాగం (ఆత్మహత్య) చేసుకున్నారు కదా. కోరిక వలన ఈ స్థూల శరీరము కాస్త సూక్ష్మశరీరము దైవ ఆత్మ గా మారినది. జన్మల కు కావలసిన సూక్ష్మశరీర ఆనవాలుగా ఈ క్షేత్రము నిలబడినది. 

కాశీ క్షేత్రములో మరణము పొందితే ఈ సూక్ష్మ శరీరాలకి విముక్తి కలుగుతుంది. కాని విచిత్రం ఏమిటంటే కాశి క్షేత్రం లో ఉన్న నీళ్లు రామేశ్వరం లో కలపాలని అదే విధముగా రామేశ్వరంలోని అదే సముద్రపు మట్టిని కాశీ క్షేత్రములో కలపాలని ఈ రెండు క్షేత్రాలు కలిపే ప్రయత్నం వంటి ఆచారం ఒకటి ప్రచారం చేసినారు. ఎందుకంటే కాశీక్షేత్రంలో స్థూల శరీరము యొక్క సూక్ష్మ శరీర ప్రాణ శక్తి అయిన బూడిద కాశీ గంగ లో కలపటం జరుగుతుంది కదా. అంటే సూక్ష్మ ప్రాణశక్తి గంగానదిలో ఉన్నట్లే కదా. ఈ నీటిని రామేశ్వర మునకి తీసుకొని వెళితే అక్కడ ఉన్న ఈ దేవాలయం పిరమిడ్ కాస్త ఈ సూక్ష్మ శరీరం యొక్క సూక్ష్మ ప్రాణశక్తిని సూక్ష్మ శరీరముగా మారుస్తుంది. వీటిని కాస్త మట్టిగా మార్చబడి సముద్రంలోనికి మట్టిగా మారుతుంది. ఈ మట్టిని తీసుకుని కాశీ క్షేత్రానికి వెళితే అది కాస్తా సూక్ష్మశరీర ఆత్మ గా రూపాంతరం చెంది అది కాస్తా అక్కడ ఎవరైతే పిండ ప్రధానం చేస్తారో వాటియందు ప్రవేశించి వారి లేదా ఈ క్రతువు చేసిన వారి గర్భాలయం లోనికి చేరడం జరుగుతుంది. నిజానికి కాశీక్షేత్రంలో చనిపోయినవారికి పిండప్రదానము చేయకూడదని శాస్త్ర వచనము కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే కాశీ క్షేత్రానికి చచ్చిన వాళ్లు అస్థికలు రూపంలో వస్తే చచ్చే వాళ్ళు వృద్ధుల రూపంలో వస్తారు అని అంటే అస్థికలు కాస్త సూక్ష్మ శరీరాలుగా ప్రతీకగా అనుకుంటే వృద్ధులు కాస్త స్థూల శరీరానికి ప్రతీకలుగా ఉంటారు. మన సూక్ష్మ శరీరాలు ఈ రామేశ్వరంలో తయారు అయితే ఈ కాశీ క్షేత్రం నందు స్థూల శరీరాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాశీ క్షేత్రంలో మరణించిన వారికి విముక్తి కలిగి మోక్షం కలుగుతుందని చెబుతారు కదా. మరి ఈ క్షేత్రములోనే మరణించిన మా తాంత్రిక సద్గురువు అయిన శ్రీ త్రైలింగ స్వామి వారికి ఎందుకు మోక్ష ప్రాప్తి కలుగ లేదు. ఆయన ఎందుకు ఇంకా ఇప్పటికి సూక్ష్మశరీరధారిగా ఎందుకు సంచరిస్తున్నారో చెప్పండి. ఆయన ఇంకా ఈ శరీరముతో ఉన్నారని చెప్పడానికి ప్రత్యక్ష అనుభవం పొందిన ప్రత్యక్ష సాక్షిని నేనే. అందుకే ఈ కోణం నుండి ఆలోచిస్తూ లోతుగా పరిశోధనలు చేస్తే పైన ఉన్న మర్మ రహస్యాలు నా మనో దృష్టికి వచ్చినాయి. 

అలాగే హిమాలయాలలోని మానస సరోవరం కైలాస పర్వతము కూడా కారణ శరీరం పునర్జన్మలకి కారణమవుతుంది. ఏదో ఒక కోరిక వలన కారణ శరీరము మరణము పొందకుండా అలా ఉండి పోతుంది. ఈ మరణ శరీరాలు అన్ని కూడా నక్షత్రాలు రూపంలో నక్షత్ర మండలాలలో నిక్షిప్తం అవుతాయి. ఎప్పుడైతే ఈ క్షేత్రాలను ఎవరు దర్శించుకుంటారో వారి కారణ శరీరాలు వాటి ఇష్ట కోరికకు గురి అయ్యినట్లేనని అర్థం చేసుకోండి. ఇక్కడ మోక్షము పొందాలనే కోరిక ఉన్నా కూడా తప్పే. అది కాస్త ఇష్ట కోరికగా మారితే మీరు ఈ క్షేత్రానికి వెళ్తారు. ఎందుకంటే కైలాస పర్వతము దైవ నిర్మిత పిరమిడ్. వెంటనే ఇది కాస్తా మన కారణ శక్తిని సంగ్రహించి కారణశరీరం శక్తిగా మార్చుకుంటుంది. మీ శరీర నిర్మాణమునకు సహాయం పరిచే నీళ్ళు ఆ ప్రక్కనే మానస సరోవరం రూపంలో ఉంటాయి. ఈ కారణ శరీరం శక్తి కాస్త ఒక నక్షత్రముగా మారి ఈ నది స్నానాలు చేయడం అది కాస్త రామేశ్వర క్షేత్రానికి సూక్ష్మశరీరధారిగా చేరడము అది కాస్తా కాశీ క్షేత్రానికి చేరి పిండప్రధానంలో చేరి మహా ఉజ్జయిని క్షేత్రానికి చేరి స్థూల శరీరము అంటే కారణం సూక్ష్మ శరీరాలతో ఒక ఏకైక ఇష్ట కోరిక తీర్చుకోవడానికి కర్మలు ఏర్పరుచుకోవడానికి అనగా గ్రహ మండలంలోని జన్మలగ్న ఆధారముగా గ్రహస్థితులను ఏర్పరిచి విధి రాతగా రాసుకోవటం జరుగుతుంది. ఈ కర్మలు చేయడానికి జన్మలు పునర్జన్మలు ఎత్తడం జరుగుతుంది. ఇలా మనకి జరగకుండా ఉండాలంటే స్థూల శరీరాలు చేసే ఈ క్షేత్రానికి సూక్ష్మ శరీరాలు చేసే రామేశ్వర క్షేత్రానికి కారణ శరీరాలు చేసే కైలాస మానస సరోవరమునకు మనము వెళ్ళకుండా ఉండాలి. ఇది జరగాలంటే మీ ఇష్ట కోరిక ఏమిటో తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే మీ సాధన స్థాయి మీ హృదయ చక్రానికి చేరుకోవాలి. అక్కడ మీరు దేనికి బాగా స్పందిస్తున్నారో తెలుస్తుంది. అదే ఏకైక ఇష్ట కోరిక అవుతుంది. ఈ కోరిక దాటటానికి మీకు నవపాషాణం నిర్మితమైన ఇష్ట లింగము రావాల్సి ఉంటుంది. దీనిని ఐదు లేదా ఎనిమిది లేదా పన్నెండు సంవత్సరముల పాటు నిత్య ధ్యానం చేస్తుంటే గానీ మీ ఇష్ట కోరిక మాయ నుండి తప్పించుకోలేరు. ఈ స్థితికి నేను వచ్చిన తర్వాత నా ఇష్ట కోరికగా బ్రహ్మ జ్ఞానమును పొందాలనే కోరిక అని తెలిసినది. ఇది తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని ఇష్ట కోరికగా నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి ఉన్నాడు అని తెలిసినది. ప్రస్తుతానికి నేను తెలుసుకొన్న ఆది నుండి అంతం వరకు ఉన్న సాధన స్థాయిలు అలాగే నేను పొందిన అనుభవాల అనుభూతులు దైవ రహస్యాలు అన్నీ కూడా మా జిజ్ఞాసి ఇష్ట కోరిక కోసం ఈ కపాల మోక్షం పేరుతో ఈ గ్రంథమును ప్రస్తుత రచించడము జరుగుతుంది. అదికూడా మూలాధార గణపతి నుండి సహస్రార చక్ర శ్రీకృష్ణుడి వరకే సాధన చెప్పినారు కానీ అంతటితో ఆగిపోదు అని ఇంకా చాలా ఉందని నేను పొందిన శబ్ద అనుభవ పాండిత్య జ్ఞానము ద్వారా అలాగే వివిధ గ్రంథాలలో సప్తచక్రాలు ఉన్నాయి కానీ 13 చక్రాలు ఉన్నాయని మోక్షప్రాప్తి గూర్చిన వివరాలు అన్నీ కూడా తెలుసుకున్న అక్షర సత్యం విజ్ఞానము సాధకులకు తెలియజేయాలని ఈ గ్రంథ రచన చేయడం జరుగుతుంది. వీటిని నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం. నా స్వానుభవం లో జరిగిన వివిధ రకాల సంఘటనల ద్వారా అనుభవ అనుభూతుల ద్వారా నేను స్వయంగా పొందిన వాటిని యథాతథంగా మీకు ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామకర్మ తో నిజబ్రహ్మజ్ఞానముతో అందజేయటం జరుగుతోంది. 

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న సాధన స్థాయి ఈ కాల చక్రము వద్ద శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ మీద ఉన్నదని తెలుసుకున్నారు కదా. శ్వాస మీద ధ్యాస కోసమని ప్రాణాయామాలు చెయ్యటం ఆరంభించాను. ఏ గురువు సహాయం లేకుండానే కేవలం పుస్తక జ్ఞానం తో ఈ విధానము చేయడం జరిగినది. కొన్ని నెలల తర్వాత చూస్తే నాకు చెవిటితనము రావడం జరుగుతుందని నాకు అర్థమై దీని అంతటికీ ప్రాణాయామ విధి విధానం లోపమని తెలుసుకుని దానిని ఆపివేయడం జరిగినది. తర్వాత ఒకరోజు భగవద్గీత చదువుతుండగా శ్వాస మీద ధ్యాస రావాలంటే నాసికాగ్రం మీద దృష్టి పెట్టి సాధన చేస్తే సరిపోతుంది అని తెలియగానే నేను ముక్కు రంధ్రాలు ఉన్న వైపు నా దృష్టిని అంటే నాసికాగ్రం అంటే ఇదే అనుకుని సాధన చేసిన మూడు నెలలకి నా కనులకి మెల్లకన్ను గా మారుతుందని తెలిసేసరికి నిజానికి నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అని అనగా భ్రూమధ్యం(మన బొట్టు పెట్టుకునే) ప్రాంతమని అక్కడ దృష్టి పెట్టాలి అని అంటే రంధ్రాలు ఉన్న ముక్కు చివర కాదని తెలియగానే అంతటితో ఈ సాధన ప్రక్రియ కూడా ఆపివేయడం జరిగినది. అప్పటికీ నాకు ఇంకా వివాహం కాలేదు. పోయి పోయి ఈసాధన ప్రక్రియలో సాధన చేస్తే నిజంగానే మెల్లకన్ను వస్తే ఏ అమ్మాయి నన్ను వివాహం చేసుకోదని భయము వేసి ఈ సాధన ప్రక్రియ ఆపివేయడం జరిగినది. అన్ని ఉంటేనే ఇక్కడ ఏమి జరగటం లేదు. ఇంకా మెల్లకన్ను ఉంటే నా స్వామిరంగా ఉంటుంది. నా గరిటె నేనే త్రిప్పుకోవాల్సి వచ్చేది. నాకు నేనే కొట్టుకోవాల్సి వచ్చేది.అందుకే లేనిపోని అర్ధాలతో భగవద్గీత చదువరాదని నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అని ముక్కు చివర కాదు అని నాకు అర్థం అయ్యే సరికి నాకు చాలా రోజులు పట్టింది. ఇక ఈ చక్ర ధారణ ధ్యానము ఎలా చేయాలో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. చాలాసార్లు ఈ శ్వాస చేపలు తినలేమని నిజంగానే వామాచారం లోనికి వెళ్లి చేపలు తింటే సరిపోతుంది కదా అనిపించేది. కానీ నాకున్న ఆచారాలు నన్ను అటువైపు వెళ్ళనీయకుండా ఆపివేశాయి. చేపలు ఎలా తినాలో అర్థం అయి చచ్చేది కాదు. అటు చూస్తే భౌతిక చేపలు తినాలని ఉన్న తినలేని పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉండగా నేను ఒకసారి శ్రీకాళహస్తి క్షేత్రమునకు వెళ్లటం జరిగింది. అక్కడ ఉండేది వాయు లింగం.ఆయన చుట్టూ ఉన్న దీపాలు ఎవరో తమని తాకుతున్నారు అన్నట్లుగా ఎప్పుడు అనిశ్చల స్థితిలో కదులుతూనే ఉంటాయి.ఈ గుడిలో ఎవరో ఉపన్యాస కార్యక్రమం జరుగుతుందని మైకు శబ్దమును బట్టి తెలుస్తోంది. వారి ప్రవచనం ప్రకారం చూస్తే మన శ్వాస అనేది 'సో' అని లోపలికి తీసుకుంటూ 'హమ్' అని బయటకి వదిలిపెడతామని ఈ రెండు శబ్దాలు కలిసి సోహం అనే శబ్దం మన శ్వాస క్రియ గా 21,600 మంత్రము ఈ శ్వాస నిత్యముగా కర్మ చేస్తూనే ఉంటుందని ఎవరైతే ఈ శబ్దాలు వినటానికి తాపత్రయపడతారో వారు ముముక్షువు అని ఎవరైతే వినటానికి తాపత్రయ పడతారో వారే పరమ యోగులు అవుతారు అని చెబుతుండగా ఇది ఏదో భలేగా ఉంది. మన శ్వాస లో ఈ రెండు శబ్ద నాదాలు ఉన్నాయా? వాటిని కలిపి ఏక నాదంగా సోహం అని వినబడుతుందా? వామ్మో! ఇన్నాళ్లు మనకి ఈ విషయమే తెలియలేదే ఈ శబ్దం వింటే శ్వాస మీద ధ్యాస కలిగి శ్వాస ధ్యానంగా మారే అవకాశాలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఇంటికి ప్రయాణించాను.

శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇది చేసే శబ్దాలు వినటానికి ప్రయత్నిస్తుంటే నా ధ్యాస వేరే ఆలోచనలు ఉండటం ఉదా: మా బాస్ అలా తిట్టడం… ఈ అమ్మాయి ఇలా ఎందుకు చూసింది…. నేను అలా ఎందుకు ఉన్నాను. ఇలా పలు ఆలోచనలతో పలుమార్లు నా మనస్సు ఆ ధ్యాస మీద ఉంటే ఈ శ్వాస ధ్యాస గాలి లోనికి వెళ్ళి పోయేది. శబ్దాలు వినడము దేవుడెరుగు. లేనిపోని ఆలోచనలు ఎక్కువ అవ్వటం మొదలైంది. ఇది శ్వాస మీద ధ్యాస అనేది అంత తేలికైన విషయ సాధన  కాదని ఈ సాధనను కొనసాగించాను.కొన్నివారాల తర్వాత నా చెవులయందు బూరతో ఊదిన శబ్ధనాదము వినపడసాగినది. ఇది ఇలాయుండగా నా ధ్యానము తీవ్రస్ధాయిలో ఉండగా నా కుడి చెవి నుండి శృంగనాదం అనగా కొమ్ముబూర నాదము లీలగా వినబడసాగినది.ఆ తర్వాత కొన్నిరోజులకి చాలా స్ఫష్టంగా ఈ నాదము వినబడసాగింది. నాకు ఈ నాదము స్ఫురణకు వస్తుండగా నా మనో దృష్టి ముందు శ్రీచక్రము కనపడ సాగింది. ఈ మేరు శ్రీచక్రము అసలు ఈ కాల చక్రానికి గల సంబంధం ఏమిటో నాకు ఏమీ అర్థం కాలేదు. ఇలా తరచుగా ఈ దృశ్యమే కనబడుతుంది. ఈ రెండింటికి గల సంబంధము మాత్రము నాకు అర్థమయ్యి చచ్చేది కాదు. దీని కోసము లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుతూ దాని భావం అర్థం చేసుకోవటానికి నాకు అర్ధం అవటానికి మరి కొంతకాలము పట్టినది. కొన్నివారాలకి నాకు లలితాదేవి క్షేత్రమైన నైమిశారణ్యము నుండి పంచలోహ లలితాదేవి విగ్రహము అలాగే వెండి శ్రీచక్ర యంత్రము రావడం జరిగినది.

ఇది ఇలా ఉండగా నాకు బుద్ధగయ నుండి బుద్ధుడి విగ్రహం మూర్తి రావడం జరిగింది. అలాగే నా స్నేహితుడి ద్వారా పంచలోహ శ్రీమేరు  శ్రీ చక్రం రావడం జరిగినది. ఇలా ఈ బుద్ధుడికి అలాగే ఈ శ్రీమేరు  శ్రీ చక్రంకి గల సంబంధం ఏమిటో ఈ కాల చక్రానికి గల సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు. బాగా విశ్లేషణ చేయగా ఒకవేళ శ్రీమేరు చక్రము అలాగే బుద్ధుడు ప్రతిపాదించిన కాలయంత్రం కాస్త కాలచక్రం కాదు గదా అని అనిపించసాగింది. లలితాదేవి అలాగే బుద్ధుడు ఈ చక్ర స్థితిలో ఉండగా కాలచక్రము ను చూసి వీరు శ్రీచక్రము ప్రతిపాదించలేదు గదా.ఖచ్చితముగా దీని వెనుక ఏదో తెలియని మర్మ రహస్యము ఉండి ఉంటుందని నాకు బలముగా అనిపించసాగింది. ఒక విషయము మీరు గమనించారా! 18 నెలల పాటు ఆయా చక్రాలు ఆధీనం అయితే కేవలం ఈ చక్రం వద్ద ఎలా సాధన చేయాలో తెలియడానికే నాకు 18 నెలలు పైన పట్టినది అంటే దీని క్రింద ఉన్న మిగిలిన చక్ర సాధన అంతా గత జన్మలలో పూర్తి చేసుకొని ఈ జన్మలో శ్రీమేరు శ్రీ చక్ర సాధనతో మొదలైనదని నాకు అవగతము అవసాగింది. అంటే మన సాధనలో ఏ చక్ర సాధన అయితే మనల్ని నా నా చంకలు నాకిస్తుందో అదే ఈ జన్మ సాధనగా ప్రారంభించ బడుతుంది అని గ్రహించండి. ఏ చక్రాలు అయితే త్వరగా ఆధీనము అవుతాయో అవి అన్నీ కూడా గత జన్మల సాధన ఫలితమని గ్రహించటానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. నాకు క్రిందటి జన్మలో ఏదో ఒక కర్మ వాసన కాస్త ప్రారబ్ద కర్మ గా మారి ఈ జన్మకి కారకం అయినట్లు ఉంది. అది కాస్త తీరటంతో ఈ చక్రం పైన ఉన్న కాల చక్రమునకు నా సాధన స్థాయికి చేరుకుని ఉండి ఉండాలి. గత జన్మలో ఈ చక్ర దేవత అయిన మహాకాలుడు లేదా మహాకాళి నోటికి ఆహారమై ఉండి ఉండాలి.

ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి గుర్తుకు వస్తుంది. ఇద్దరు యోగసాధకులు కాళీమాత సాక్షాత్కారం కోసం తీవ్ర సాధన చేస్తుండగా ఆమె ప్రత్యక్షమై దర్శనానికి వచ్చే కాలి అందెలు శబ్దాలకు అందులో ఒకడికి మతి భ్రమణం చెంది పిచ్చివాడు అయితే మరొకడికి కాళీమాత సాక్షాత్కార దర్శనము అయినది. అప్పుడు వాడు అమ్మతో “తల్లి! మేమిద్దరం కలిసి నిన్ను చూడాలని ధ్యానం చేసినాము. కానీ వాడికి ఫలితం దక్కలేదు. నాకు మాత్రమే ఎందుకు” అని అనగానే “పిచ్చివాడా! నీవు కూడా ఎన్నో కోట్ల జన్మలు వాడిలాగా పిచ్చివాడిగా మారిన తర్వాత నీకు నా సాక్షాత్కారము కలిగినదని” చెప్పి అదృశ్యమయింది. అలా ఈసాధన స్థితికి గతజన్మలో జరిగి ఉండాలి. అందుకే మహాకాలుడు లేదా మహాకాళి నోటికి దొరక కూడదు అని నాకు గత జన్మ జ్ఞాన స్మృతిగా ఉండి ఉండాలి. అందుకే వీరిద్దరిని ఎవరు కూడా దర్శించుకోవద్దు అని మనవి చేయటం జరుగుతుంది అని చెప్పకనే చెప్పకుండానే నాకు తెలిసినది.నాలాగే శ్రీ లాహరి మహాశయుడు కూడా వీరిద్దరిని చూడరాదని తన డైరీలో రాసుకోవడం గమనించదగ్గ విషయం. ఇది ఇలా ఉండగా నాకు శ్వాస మీద ధ్యాస పెరగటం మొదలైనది. శ్వాస నిశ్వాస ఉశ్వాస మీద నా మనస్సును పెట్టి ఏకాగ్రతగా శ్వాసక్రియ గమనిస్తూ ఉండేవాడిని. అలాగే శబ్ద నాదాలు వినటానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత శ్వాస శబ్దము కూడా నాలో వినబడ సాగినది. ఆ తర్వాత కొన్ని వారాలకి 'సో' మంటూ వినపడి సాగినది. మరి కొన్ని రోజులకి 'హం' అంటూ వినబడ సాగినది. ఇలా మరి కొన్ని వారాలకు సోహం అంటూ వినబడ సాగినది. అంటే శ్వాస సంయమ సిద్ధి కలుగుతుంది అని అర్థం అయినది. ఆలోచనలు దాదాపుగా తగ్గిపోయినాయి. చేసే మంత్రాలు ఆగిపోయేవి. కేవలం నా మనస్సు అంతా కూడా ఈ శ్వాస మీద ధ్యాసగా ఉండేది. 

ఇలా మరి కొన్ని వారాలు గడుస్తుండగా నాకు ఒక రోజు ధ్యానము నందు ఒక తెల్లని గుర్రము నిల్చున్నట్లుగా కనబడసాగింది. ఇది దేనికి సంకేతమో అర్థం కాలేదు. మరి కొన్ని రోజులకి చాక్లెట్ రంగులో ఉన్న గుర్రము నిలుచుని ఉన్నట్లుగా కనపడినది. ఇది కూడా అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత విశ్లేషణ చేస్తే ఒకవేళ ఈ గుర్రాలు అనేవి హయగ్రీవుడు సంకేతం కాదు కదా అని స్ఫురణకు వచ్చినది. లలితా సహస్రనామాలు ఈ లోకానికి హయగ్రీవుడు (గుర్రం తల ఉన్న దేవుడు) ద్వారా తెలిసినాయి అంటే నిజముగానే కాలచక్రము అలాగే శ్రీ మేరు శ్రీచక్రానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి ఉండాలని అనిపించింది. నేను ఒకరోజు తీవ్ర ధ్యాన స్థితిలో వుండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ వే ఆట మొదలైంది. అంటే ఎక్కడికో ప్రయాణం చేయటానికి నా సూక్ష్మ శరీరం సిద్దం అవుతుంది అని తెలియగానే నా కళ్ళముందు భూమి కనపడ సాగింది. ఇది ఏమిటో నాసా ఫోటో లాగా ఎంత చక్కగా కనబడుతుంది అనుకుంటూ ఉండగా ఈ భూమి కాస్త పెద్దదిగా అవుతూ నన్ను దాటినది ఆ తర్వాత నీలి రంగు ఆకాశం గ్రహాలు, గ్రహశకలాలు, దుమ్ము ధూళి తీసిన విశ్వమునకు సంబంధించిన ఒక వీడియో చూస్తున్నట్లుగా అంత చక్కగా కనబడుతుంది. ఇంతలో పూర్ణచంద్రుడు గ్రహము కనపడినది. ఇది నెమ్మది నెమ్మదిగా నా దగ్గరకు వస్తూ నన్ను దాటినది. 

త్రినేత్రం:

కొద్దిసేపటికి చీకటి అలాగే వెలుతురు లేని లాంటిది కనబడుతూ వుండగా ఒక అడ్డంగా ఉన్న ఒక పెద్ద నేత్రం కనపడినది.దీనికి కను బొమ్మ గాని కను రెప్ప గాని లేదని గమనించాను. చాలా పెద్దదిగా ఉండి దీని చుట్టూ ఉండే తెల్లని భాగము ఉండి లేనట్లుగా కనబడుతుంది. నిజానికి మన భౌతిక కన్నుల్లో అయితే తెల్లని భాగము ఎక్కువగా ఉండి గుడ్డు భాగము తక్కువగా ఉంటే దీనికి మాత్రం వ్యతిరేక స్థితిలో ఉన్నట్లు గా గమనించాను. గుడ్డు కదులుతున్నట్లు గా అనిపించలేదు. కానీ చూపు మాత్రం అటు ఇటు తిరుగుతుంది .ఇది ఏమి కన్ను? దేనికి సంకేతము. ఒకవేళ ఇది త్రినేత్రమా? త్రినేత్రం అయితే నిలువుగా ఉండాలి కదా. ఇలా ఇంట్లో ఉన్న దైవ పటాలలోని శివుడికి, అమ్మవారికి, గణపతికి నిలువుగా త్రినేత్రం ఉన్నట్లుగా ఉంది కదా. మరి నాకు కనిపించే ఈ నేత్రము అడ్డంగా ఉంది అనే సందేహము రాగానే నాకు ధ్యాన భంగమైనది. ఇలా ఈ కన్ను గుడ్డు దర్శనం కోసం టెంపుల్ రన్ ఆట కొన్ని వారాలపాటు నడిచినది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఈ అడ్డు కన్ను గుడ్డు భాగము కాస్త దివ్య కాంతులు ఉన్న సూర్య బింబము లాగా కనపడ సాగింది. బాగా మండుతున్న అగ్నిగుండములాగా కనబడుతూ వచ్చినది. అప్పుడు ఇది కాస్త లోపలికి వెళ్లడానికి దారి లాగా కనపడ సాగింది. ఈ నిలువు చీలిక చూస్తే నిలువుగా ఉన్న త్రినేత్రం లాగా ఉండి రెప్ప తెరిచినట్లుగా అనిపించసాగింది. అంటే అడ్డముగా కనిపించిన నేత్రము కాల నేత్రముగాను ఇందులో ప్రవేశించే మార్గము త్రినేత్రంగాను ఈ గుడ్డుయే మనము భూమిమీద నిత్యము దర్శించుకునే సూర్యుడు అని నాకు అర్థం అయ్యే లోపల ధ్యానము భంగమైనది. ధ్యానము నుండి బయటికి వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని నేను అనుకుంటూ మా ఆవిడతో అంటే “ఎందుకు నిజము కాదు. నిజమే అయి ఉండాలి. ఎందుకంటే పిల్లి కన్ను చూడండి. దాని కన్ను నిజానికి అడ్డముగా ఉంటే దాన్ని గుడ్డు మాత్రమే నిలువుగా తెరుసుకొని ఉంటుంది ఒక త్రినేత్రం లాగా. అలా మీకు ఈ దైవ అనుభవ దృశ్యము కనబడి ఉండవచ్చు కదా” అని చెప్పగానే పిల్లి కన్నురాయి అని కేతుగ్రహానికి వాడే వైఢూర్యమునకు పేరు ఉన్నది కదా అనుకుంటూ నా నిత్య కర్మలు చేయడానికి వెళ్ళిపోయాను. మరి కొన్ని రోజుల తర్వాత ఇదే స్థితి నాకు ధ్యానములో కనిపించి ఈ సారి లోపలకి నేను వెళ్తుంటే అక్కడ 12 సూర్య బింబాలు చుట్టూ ఉన్నట్లుగా ఒక తొమ్మిది ఆవరణాలు ఉన్న ఒక మహారాజు కోట నిర్మాణం కనబడసాగింది. శ్రీచక్రము లాగా ఉంది. ఈ కోటపైన ఎవరో చాలా మంది కాపలా కాస్తున్నట్లుగా పరిరక్షణ చేస్తున్నట్లుగా కనిపించసాగింది. ఈ కోట అంతా ఏదో సముద్రం మధ్యలో ఉన్నట్లు గా అనిపించసాగింది. చుట్టూ నీలి రంగు నీళ్ళు పరిశుభ్రముగా పరిశుద్ధముగా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏవో హంసలు లాంటివి అటు ఇటు సంచారం చేస్తున్నాయి. ఏవో సువాసన భరితమైన వాసనలు ఇచ్చే బ్రహ్మకమలాలు తామరపువ్వులు కనిపించినాయి. చుట్టూ ఉన్న ఈ సూర్యబింబాల వలనే ఈ కోటకి వెలుగులు వస్తున్నాయని వీళ్ళే ద్వాదశ ఆదిత్యులు అనుకుంటూ అనుకోగానే నాకు ఈ మహత్తర కోట దృశ్యము అదృశ్యమైంది. ధ్యాన భంగమైనది. కొన్ని వారాల వరకు నాకు ఎలాంటి కోట దృశ్యము కనిపించలేదు. నా ధ్యాన ప్రక్రియగా శ్వాస సంయమనము చేస్తుండగా ఒకరోజు నాకు ధ్యానములో నా ఇడా పింగళ నాడులు ఒకదానికి ఒకటి 8 అంకె(ఎనిమిది) లాగా కలిసి పోయినట్లుగా ఈ అంకె ఆకారంలో కనపడ సాగింది. నిజానికి ఈ ఆకారం రెండు చేపలలాగా కూడా కనబడుతోంది. అందుకే దక్షిణాచారం లో ఈ శ్వాస సిద్ధి సంయమ సిద్ధి కావలసినట్లుగా చేస్తే శ్వాస మీద ధ్యాసకి మత్స్యము అని పేరు పెట్టినట్లు గా ఉన్నదని స్ఫురణకు రాగానే నాకు ధ్యాన భంగము అయినది. అంటే నేను నిజంగానే శ్వాస అనే చేపలను తినే మత్స్య సాధకుడిని అయినందుకు నాకే తెలియని ఆనందం రెప్పపాటు కాలం పాటు వేసినది. 

శ్రీచక్ర-శ్రీకాలచక్రాలు గూర్చి:

ఆ తర్వాత అసలు శ్రీ చక్రం గురించి తెలుసుకోవాలని పుస్తకాలు చదవటం ప్రారంభించాను. చాలామంది శ్రీచక్రము అనేది శివుడు- శివాని సంయోగ సృష్టి చక్రం అని…. కొంతమంది గ్రహ మండలాలు వివరించే చక్రం అని….. మరికొంతమంది ఇది సహస్రార చక్రం అని…. మరికొంతమంది శివుడు- అమ్మవారి సంయోగ విధానం అని ఇలా వాళ్ళ అభిప్రాయాలు చెప్పటం జరిగినది. ఉన్నది ఒక్కటే. కనిపించే అనిపించే భావం బట్టి దాని ఆలోచనలు కలుగుతాయి అని నాకు అర్థమైనది. కాలచక్రమే కొందరికి శ్రీచక్రము మరికొంతమందికి కాలయంత్రం మరికొంతమందికి సంయోగ యంత్రం మరికొంతమందికి సహస్రార చక్రము విశ్వసృష్టి చక్రం ఎవరి భావాలకు తగ్గట్టుగా వారికి ఇది కనపడి ఉండి ఉండాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. మరి నాకు ఈ కాలచక్రం ఏవిధంగా దర్శనము ఇవ్వాలని అనుకుంటుందో వేచిచూడాలి అనుకుంటుండగా నాకు నిత్యకర్మలు చేయటానికి బయలుదేరినాను. వివిధ పుస్తక జ్ఞానం ద్వారా ఈ చక్ర నిర్మాణము వారి దేవతలను గూర్చి పరిశోధనలు చెయ్యడం ప్రారంభించాను. దీనికోసం చాలా కష్టపడవలసి వచ్చినది. కొందరు శ్రీ చక్ర దేవతగా బాలా త్రిపుర సుందరి అని మరి కొందరు శ్రీలలితాదేవి అని మరి కొందరు రాజరాజేశ్వరి దేవి అని మరి కొందరు కామేశ్వరి కామేశ్వరుడని  శ్రీదేవి అని ఇలా రకరకాలుగా చెప్పటం జరిగినది. దానితో కొంత అయోమయంలో నేను పడటం జరిగినది. 

ఇది ఇలా ఉంటే శ్రీ మేరు చక్రములో 3 రేఖలతో చతురస్రాకారంగా ఉన్నదానిని త్రైలోక్య మోహనము లేదా భూపం అని… 16 రేకులు ఉన్న వృత్తమును సర్వ ఆకార పరిపూరకము అని…. 8 రేకులు ఉన్న వృత్తమును సర్వ సంక్షోభం అని…. 14 త్రిభుజాలు సర్వ సౌభాగ్య దాయకమని…. 10 త్రిభుజాలు సర్వార్ధ సాధకాలని… 10 త్రిభుజాలు సర్వరక్షకాలని…. 8 త్రిభుజాలు సర్వరోగహరమని…. మధ్యనున్న ఒక త్రిభుజము సర్వసిద్ధి ప్రదమని… ఈ త్రిభుజములో ఉన్న బిందువును సర్వానందమయమని అందురు. ఇలా 14, 10, 10, 8,1 త్రిభుజాలు కలిపి మొత్తం 43 త్రిభుజాలు ఉన్నాయని… వీటిలో నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వ ముఖంగా ఉండి శివశక్తి సూచిస్తే మిగిలిన ఐదు సమ బాహు త్రిభుజాలు అధోముఖముగా ఉండి స్త్రీ శక్తి సూచిస్తాయని కావున శ్రీచక్రంలో ఇలా 9 సమద్విబాహు త్రిభుజాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా సంగమించే దివ్యశక్తుల సంగమం అనిఈ నవ త్రిభుజాలు  ఆవరణాలు కలిపి నవ ఆవరణాలుగా పిలుస్తారని ఇవి నవగ్రహాలకి సంకేతమని అనగా వజ్ర కోట శుక్రగ్రహానికి…. వైఢూర్య కోట కేతుగ్రహానికి…. గోమేధిక కోట రాహుగ్రహానికి… నీలకోట శనిగ్రహానికి… ముత్యపుకోట చంద్రగ్రహానికి…. మరకతకోట బుధ గ్రహానికి…. పగడపుకోట కుజగ్రహానికి…. కెంపుకోట సూర్యగ్రహానికి… ఇక ఆఖరిది అయిన పుష్యరాగంకోట గురుగ్రహానికి సంకేతాలుగా చెప్పడం జరిగినది. ఆకాశ తత్వమును వజ్ర కోట యందు…. పృధ్వి తత్వమును వైఢూర్య కోటయందు…. వాయుతత్వంను గోమేధికం కోటయందు… జల తత్వమును నీల కోట యందు…. అగ్ని తత్వమును ముత్యపు కోటయందు…. మాయ తత్వమును మరకత కోట యందు…. శక్తి తత్వమును మాణిక్య లేదా పగడ  కోట యందు…. సర్వ శక్తి తత్వమును  కెంపు కోట యందు స్థాపించడం జరిగింది.నాకు కలలో కనిపించిన కోటయే మేరు శ్రీ చక్ర కోట అని దీని లోనికి అర్హత ఉంటే ప్రవేశం పొందవచ్చు అని నాకు అర్థం అయింది. ఒక్కొక్క కామ్య సిద్ధి పొందుటకు పరమేశ్వరుడు ఒక్కొక్క తంత్ర శాస్త్రమును చెప్పటం జరిగినది. అంటే సర్వ కామ్య సిద్ధి కోసం 64 తంత్రాలు చేయవలసి వచ్చినది అన్నమాట. ఇది కష్టసాధ్యమని పరమేశ్వరుడు తిరిగి సులభ మార్గంగా శ్రీవిద్యోపాసన శ్రీచక్రార్చన ఆరాధన చెప్పడం జరిగినదని ఇందులో 12 సత్ సంప్రదాయాలను అనుసరించి శ్రీ చక్రరాధన జరుగుతుందని నాకు అవగతమైనది. అందుకే ఈ చక్రము యద్భావం తద్భవతిగా వివిధ రకాల భావపరంపరలు వచ్చినాయని అవగాహన కలిగినది. 

అలాగే శ్రీచక్రము లోని మొదటి ఆవరణ అయిన భూపము నందు ఉన్న మూడు వరుసలలో మొదటి వరుసలో 10 దేవతలు అనగా అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, పశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే సర్వ కామ్య సిద్ధి  దేవతలుగా ఉండగా రెండవ వరుసలో ఎనిమిది మంది దేవతలు ఉంటారు. అనగా బ్రాహ్మి. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, చాముండి, చండిక ఉంటారు. వీరిని అష్టమాత్రుకలు అంటారు వీరు అష్టభైరవులు భార్యలు గా ఉంటారు. ఒక రకంగా వీరే అష్ట బైరవి అన్నమాట. అనగా బ్రాహ్మి- అసితంగ బైరవ, మహేశ్వరి-రురు భైరవ, వైష్ణవి- క్రోధ భైరవ, కౌమారి-చండ భైరవ, వారాహి-ఉన్మత్త భైరవ, నరసింహి- కపాల భైరవ, చాముండి-భీష్మ భైరవ, చండిక -సంహార భైరవలతో కలిసి ఉంటారు.వామాచారమును పాటించేవారు ఈ అష్ట భైరవ లలో ఏదో ఒక రూపాన్ని ఆరాధించడము జరుగుతుంది ఇక మూడవ వరుసలో సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశఙ్కరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశే, సర్వఖేచరి,సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖణ్డే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ దేవి ఉంటారు. అంటే మొత్తం మీద మొదటి ఆవరణలో మూడు వరుసలలో 30 మంది దేవతలు ఉంటారని అర్థమైనది.వివిధ ఆవరణ దేవతలు వరుసగా

ప్రధమావరణ దేవతలు:

అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, పశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే,సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చామున్డే, చండిక (మహాలక్ష్మి),సర్వసఙ్క్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశఙ్కరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశే, సర్వఖేచరి,సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖణ్డే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,

ద్వితీయావరణ దేవతలు:

కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గన్ధాకర్షిణి, చిత్తాకర్షిణి,ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,

తృతీయావరణ దేవతలు:

 అనఙ్గ కుసుమే, అనఙ్గమేఖలే, అనఙ్గమదనే, అనఙ్గమదనాతురే, అనఙ్గరేఖే, అనఙ్గవేగిని, అనఙ్గాఙ్కుశే, అనఙ్గమాలిని, సర్వసఙ్క్షోభణచక్రస్వామినీ, 

గుప్తతరయోగినీ, 

చతుర్ధావరణ దేవతలు:

సర్వసఙ్క్షోభిణీ, సర్వవిద్రావిని, సర్వాకర్షిణి, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తమ్భినీ, సర్వజృమ్భిణీ, సర్వవశఙ్కరి, సర్వరఞ్జనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసమ్పత్తిపూరిణీ,సర్వమన్త్రమయి, సర్వద్వన్ద్వక్షయఙ్కరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సమ్ప్రదాయ యోగినీ,

పంచమావరణ దేవతలు:

సర్వసిద్ధిప్రదే, సర్వసమ్పత్ప్రదే, సర్వప్రియఙ్కరి, సర్వమఙ్గలకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ,సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణీ, సర్వాఙ్గసున్దరి, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ, 

షష్థావరణ దేవతలు:

సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఙానమయి, సర్వవ్యాధివినాశినీ, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే,సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామినీ, నిగర్భయోగినీ, 

సప్తమావరణ దేవతలు:

వశినీ,కామేశ్వరీ, మోదిని, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌలినీ, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ, 

అస్టమావరణ దేవతలు:

బాణినీ, చాపినీ, పాశినీ, అఙ్కుశినీ, మహాకామేశ్వరీ,మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,

నవమావరణ దేవతలు:

 శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానన్దమయ చక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ, 

నవచక్రేశ్వరీ దేవతలు:

త్రిపురే, త్రిపురేశి, త్రిపురసున్దరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురసిద్ధే, త్రిపురామ్బ, మహాత్రిపురసున్దరి, 

శ్రీదేవి విశేషణ నామాలు:

మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానన్దే, మహామహాస్కన్ధే,

మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి, నమస్తేనమస్తే నమస్తే నమః .

అంటే ఈ లెక్కన చూస్తే శ్రీ చక్రములోని నవావరణ మొత్తం దేవతలు కలిపి 30 +19+11+17+12+12+14+5+3=123 దేవతలు ఈ మేరు శ్రీచక్రము దేవి స్వరూపాలుగా ఉంటారని నాకు అవగాహన అయినది. ఈ శ్రీచక్రము లోని 43 త్రిభుజాలు కాలము యొక్క 43 డైమన్షన్ గా పేర్కోవటం జరుగుతోంది. ప్రస్తుతానికి మానవుడి మేధాశక్తి కాలము యొక్క 14 డైమన్షన్ వరకు మాత్రమే కనుక్కో గలిగింది. ఇంకా తెలుసుకోవాల్సిన 29 డైమెన్షన్స్ ఉన్నాయి అన్న మాట. పూర్వీక భారతీయ మహర్షుల మేధాశక్తితో మొత్తము ఈ కాలము యొక్క 43 డైమన్షన్ చేరుకోవటం జరిగి ఉండాలి. ఈ కాలం డైమన్షన్స్  ఉన్న ఈమేరు శ్రీ చక్ర కోటలోనికి యోగ్యత సంపాదించుకొని ప్రవేశించి ఉండి ఉండాలి. ఈ కోట అసలు ఉందా? ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానములు హైగ్రీవ ఉపదేశం అయిన శ్రీ లలితా సహస్రనామాలు సమాధానం ఇచ్చినాయి. అమృత సముద్రము మధ్యలో మణిద్వీపము ఉందని… దీనిలో కల్పకోద్యానము ఉన్నదని… దీని లోపల నీపోవనము ఉన్నదని… దీని మధ్యలో చింతామణి గృహము ఉన్నదని… ఈ గృహం లోపల నాలుగు కోళ్ళు ఉన్న మంచము ఉన్నదని… బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు ఈ మంచము నాలుగు కోళ్ళు గా ఉన్నారని… పంచబ్రహ్మ స్థితిలో సదాశివుడు పడుకొని ఉండగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈయన మీద కూర్చొని ఉన్న స్వరూప దర్శనము కలుగుతుందని చెప్పటం జరిగిందని నాకు అవగతమైనది. పైగా కాలస్వరూపిణి అయిన కామేశ్వరి ఈ శ్రీచక్రానికి అధి దైవముగాఉంటుందని లలిత నామాలలో చెప్పకనే చెప్పినారు. అంటే ఈ లెక్కన చూస్తే శ్రీ చక్రం అనేది కాలచక్రం అని ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే వామాచారం పరముగా చూస్తే బుద్ధుడు ప్రతిపాదించిన కాలయంత్రం కూడా శ్రీ చక్ర పురమునే అనగా కాల చక్రమునే చూపిస్తోందని చెప్పకనే అర్థమైనది. పూర్వీకులు చెప్పిన అమృత సముద్రము అంటే ఈ కాలంలో మానస సరోవరము అయి ఉండాలని… మణిద్వీపము అంటే అష్టదళ పద్మము హిమాలయ పర్వత పంక్తి అయి ఉండాలని... నాకు స్ఫురణకు వచ్చినది. అలాగే కల్పకోద్యానము అంటే శంబల గ్రామ పరిసరాలు అయి ఉండాలని ఈ రహస్య గ్రామ పరిసరాలలో ఎవరైతే యోగ్యత కలిగి ఉన్నారో వారికి మాత్రమే సుగంధ పరిమళాలు సువాసనలు వస్తాయని ఎవరు అయితే అర్హత లేకుండా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారో వారికి కాలకూట ప్రభావము ఉన్న వాసనలు వస్తాయని వీటిని పీల్చినవారికి మతి భ్రమణం చెందటం లేదా పిచ్చివాళ్లు కావడంగాని జరుగుతుందని నేను వివిధ పుస్తకాల జ్ఞానము ద్వారా తెలుసుకోవడం జరిగినది. అంటే శ్రీచక్రము అనేది దేవతలు ఆవాసమైన శంబల గ్రామమును చూపించే మార్గం విధానం అని తెలుస్తోంది. పైగా హిమాలయ పరిసరాలలో అంతర్భాగంలో రహస్యముగా ఏకముగా స్వయంభు స్పటిక శ్రీ చక్రము ఉన్నదని దీని లోపలకి యోగ్యత ఉన్న లామాలు ప్రవేశించి భవిష్యత్ సంఘటనలు తెలుసుకుని బయటికి వస్తారు అని ఒక రహస్య గ్రంథము ద్వారా నేను తెలుసుకోవడం జరిగినది. బుద్ధుడు ప్రతిపాదించిన ఈ శ్రీచక్రము 43 భుజాలను కలిగి ఉంటుంది కాకపోతే 14 త్రిభుజాలు 14 తిధులుగా 10 త్రిభుజాలు అంటే పది చంద్రమాసాలుగా మరొక 10 త్రిభుజాలు అంటే దశావతారాలు తొమ్మిది త్రిభుజాలు అంటే తల్లి గర్భంలోని జీవుడి నవ మాసాలుగా కాల సంబంధిత వ్యవహారంగా చెప్పడం జరుగుతుందని నాకు అర్థమైనది. 8 దళాలు అంటే జీవుడికి శరీరములో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అని అలాగే 16 దళాలు అంటే చంద్రుడి యొక్క 16 కళలు అని చెప్పకనే చెబుతున్నారు. 

నిజ శ్రీచక్ర కోట దర్శనం: 

ఇది అంతా నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గాని శ్రీ చక్ర కోట యందు అర్హత ఉన్నవారు ప్రవేశించవచ్చు అనే మాట నన్ను ఆకట్టుకుంది. అంటే నాకు ఈ యోగ్యత ఉన్నదో లేదో తెలుసుకోవాలని తీవ్రమైన ఆకాంక్ష నాలో మొదలైంది. కోట ఉన్నమాట నిజమే. భౌతికంగా అయితే హిమాలయ పరిసరాలకు వెళ్లాలి. కానీ కైలాష్ దైవ నిర్మిత పర్వతము కాస్త మన సాధన సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని నాకు తెలియటంతో ప్రత్యక్షంగా వెళ్ళడము కన్నా పరోక్షంగా అంటే సూక్ష్మ శరీర యానం ద్వారా శ్రీ చక్ర కోటను దర్శించుకోవాలని నిశ్చయించుకొని ఆ దిశగా సాధన చేయటం ఆరంభించాను. ఇప్పటికే చాలామంది పూర్విక యోగులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ శ్రీ చక్ర కోట కి వెళ్ళటం జరిగినదని వివిధ గ్రంథాల ద్వారా చదివి తెలుసుకోవడం జరిగినది. కానీ నాకు వెళ్ళటానికి అర్హత ఉన్నదా లేదా అని తెలుసు కోవాలని ఆకాంక్ష. ఒకవేళ ఉంటే వెళ్లి రావాలని తపన నాలో విపరీతముగా పెరగసాగింది. అది కూడా నా సూక్ష్మ శరీర యానం తో ప్రత్యక్ష అనుభూతిని పొందాలని అనిపించసాగింది. శాస్త్రాలలో గ్రంథాలలో చెప్పిన ఈ విషయాలు నిజమా కాదా అని తెలుసుకొని అనుభవ పాండిత్యము పొందాలని రోజు రోజు కీ పెరగసాగింది. అందరూ కూడా కైలాస పర్వత పరిక్రమణ చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే నేనేమో శ్రీ చక్ర కోట పరిక్రమణ చేయటానికి ప్రయత్నిస్తున్నాను. అది ఖచ్చితంగా ఉంది. కాకపోతే యోగ్యత ఉన్న వారికి మాత్రమే ఈ శ్రీ చక్ర కోట కనబడుతుంది. ఎవరికీ కనిపించని కోటని చూసి వస్తే నా స్వామిరంగా! వచ్చే కిక్ ఎలా ఉంటుందో చూడండి. కిక్కే కదా. డబ్బులు పెడితే కనిపించే కైలాస పర్వత పరిక్రమణ చేసి రావచ్చును. డబ్బులు పెట్టిన కనిపించని శ్రీ చక్ర కోట పరిక్రమణ చేయడమే నిజమైన కిక్ ఇస్తుందని నాకు బలంగా అనిపిస్తుంది. ఇక కాలమే నిర్ణయించాలి. ఈ పరిక్రమణకి అర్హత ఉందో లేదో అని అనుకుంటూ నిత్యకర్మలు చేసుకోవటానికి బయలుదేరినాను.

నా సాధనలో శ్వాస సంయమ సాధన ప్రక్రియ చేసుకుంటూ కొన్ని వారాలు గడిచి పోయినాయి. ఇంతలో ఒక రోజు నాకు తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా మేరు శ్రీ చక్ర కోట త్రీడీలో కనబడసాగింది. అది కూడా టెంపుల్ రన్ ఆట మొదలైన చాలాసేపటికి ఎక్కడెక్కడో నా సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత చివరికి ఈ శ్రీ చక్ర కోట కనబడినది. మేరు శ్రీ చక్ర కోట నాలుగువైపులా ద్వారాలు ఉన్నట్లుగా మూడు వైపులా ద్వారాలు మూసినట్టుగా ఒక ద్వారము మాత్రమే తెరిచి ఉన్నట్లుగా కనపడ సాగింది. ఇది అంతా నాకు విచిత్రమైన అనుభవం తోస్తోంది. నేను ఏమిటి? ఈ మేరు శ్రీ చక్ర కోటను చూడటము ఏమిటి? పాతకాలపు కోట లాగా కనబడుతుంది. ఇది అంతా నాకు విచిత్ర మైన అనుభవంగా తోస్తోంది. దీని లోపల చిన్న చిన్న గాలిగోపుర కట్టడాలు కారిడార్లు ఉన్నట్లుగా బయటనుండి లీలగా కనబడుతోంది. కింద నుండి కోట పైభాగం అంతా బయటనుండి డ్రోన్ కెమెరా ద్వారా చూస్తున్నట్లుగా కనబడుతుంది. కోట లోపల అంతా అలాగే కోట కారిడార్లో ఎంతో మంది కాపలాదారులు ఉన్నట్లుగా కోట లోపల ఎన్నో మార్గాలు ఉన్నట్లుగా ఎన్నో గదులు ఉన్నట్లు గా నాకు నెమ్మది నెమ్మదిగా కనబడుతుంది. ఒక్కసారిగా ఆజ్ఞాచక్రము మాయా దేవత అయిన సిద్ధా దేవి సాక్షాత్కార దర్శనము అయ్యేసరికి నాకు గుండె ఆగినంత పని అయింది. వామ్మో! ఇప్పుడు ఏ మాయ పరీక్షను ఎదుర్కోవాలి అంటే ఈ చక్ర కోట లోనికి వెళ్ళడానికి ఏమైనా మాయను దాటాలా అని నేను అనుకునే లోపల నాకు ధ్యాన భంగము అయినది. బయటికి వచ్చిన తర్వాత నాకు ఏడుపు శరణ్యము అయినది. అంటే ఈ కోట ప్రవేశానికి అర్హత లేక ఈ కాలచక్ర మాయ ఏమైనా పరీక్షలు ఉన్నాయా అని నాకు ఏమీ అర్థం కాలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు ధ్యానములో ఒకరోజు ఒక నల్లకాకి కనబడసాగింది. ఇది దేనికి సంకేతమో అర్థము కాలేదు. ఎందుకంటే బయట ఇంటి పైన కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని నానుడి ఉంది. మరి కలలో నల్లకాకి వస్తే నాకు తెలియలేదు. దానితో కలల శాస్త్రములను చదువుట ప్రారంభించాను. వాడు ఒక కాకి మీదనే 20 పేజీల ఫలితాలు చెప్పేసరికి వాటిలో దేనిని దీనికి అన్వయించుకోవాలో నాకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత నల్లకాకి కనిపించిన కొన్ని క్షణాలకే ఒక నల్లటి ఆకారం కనిపించసాగింది. ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు అనుకుంటుండగా నాకు ధ్యాన భంగమైనది. అప్పుడు నాకు అసలు కాకి అనేది ఎవరికీ వాహనము అని అనుకోగానే అది శనీశ్వరుడి వాహనము అని జ్ఞాపకం రాగానే ఆ రోజు శని త్రయోదశి కావటముతో నా బుర్ర తిరిగినది. అంటే శనీశ్వరుడు ఎందుకు కనబడుతున్నాడు. ఈయన కర్మ ప్రదాత, ఆయు: కారకుడు, మృత్యు కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఈ కాల చక్రానికి ఈయనకి ఏమి సంబంధం ఉంది లేదా ఈ చక్ర దేవతలైన మహాకాలుడు అలాగే మహా కాళికకు ఏమైనా సంబంధం ఉన్నదా నాకేమీ అర్థం కాలేదు. దీనితో పుస్తకాలు తిరగేయడం మొదలు పెట్టినాను. 

చివరికి ఎన్నో గ్రంథాలు తిరగ వేయగా ఆఖరున “మార్తాండ భైరవ తంత్రం” అనే గ్రంథంలో మహాకాలుడు అంటే నలుపు రంగులో ఉండే గొప్పవాడని… ఈయన కాలానికి ప్రభువు అని… నాలుగు చేతులు మూడు నేత్రాలు ఉంటాయని… మూడో నేత్రమే కాలనేత్రమని… కోటి కాలాగ్నుల తేజస్సు కలిగి ఉంటాడని… ఈయన ఎప్పుడు 8 స్మశానముల మధ్యలో 5 మృతదేహాల మీద 8 కపాలాలున్న మాల ధరించి చేతులలో శూలము,డమరుకము, ఖడ్గము,కర్పను కలిగి ఉంటాడని… శరీరం నిండా చితాభస్మంతో ఉంటాడని… ఎల్లప్పుడు ఈయన తన సఖి అయిన మహా కాళికతో శృంగారము జరుపుతూ ఉంటాడని… ఈ సమయాలలో రాబందులు నక్కలు తోడేళ్ళు భయంకరముగా పెద్దగా అరుస్తాయని… ఈయన శరీరము ఇంద్రనీల శరీర ఛాయను కలిగి ఉండుట వలన ఈయనకు శనీశ్వరుడుగా అనగా శని దేవుడికి ప్రతీకగా ఉంటాడని…. ఈయన మేరు పర్వతం యొక్క శిఖరం మీద కూర్చొని ఉంటాడు అని… ఈయనను పూజించిన వారికి శత్రు భయము, మృత్యు భయము, అకాల మృత్యు భయాలు తొలగిస్తాడని శాస్త్రము చెప్పడం జరిగినది. అంటే దీనిని బట్టి చూస్తే మహాకాలుడు ఏకముగా శనీశ్వరుడు అన్న మాట. అంటే ఇప్పుడు నాకు మహాకాలుడు మాయ మొదలైందా? చచ్చింది గొర్రే! శ్రీ చక్ర కోట ప్రవేశం లోనే విఘ్నము కలిగినదా? వామ్మో! వాయ్యో! ఏమి చేయాలి అనుకుంటూ మాయకి చస్తే ఈ కాలుడు నోటికి ఆహారము అవుతాను లేదంటే ఈయనకి ఆధీనం అవుతాను ఏమి జరుగుతుందో కాలమే నిర్ణయించాలి అనుకుంటూ ఈ గ్రంథము చదవటం ఆపివేసి నిత్యకర్మలు చేసుకోవటానికి బయలుదేరినాను. 

కొన్ని రోజులకి మహా ఉజ్జయిని- ఓంకారక్షేత్రం దర్శనాలకి రమ్మని అవకాశాలు వచ్చినాయి. నేను వెళ్ళలేదు. మా శ్రీమతి దీక్షా దేవి వెళ్ళినది. ఈ అవకాశము వచ్చేసరికి అంటే మహాకాలుడు నిజంగానే శనీశ్వరుడికి సంకేతమని అర్థమైనది. ఆయన నన్ను తినటానికి నా సాధన శక్తిని తనలో ఇముడ్చుకోటానికి నన్ను రమ్మంటున్నాడు అని నాకు అర్థమై అవకాశము వచ్చిన వెళ్ళలేదు. మా ఆవిడకి చెప్పినా వినకుండా దేనికైనా ప్రాప్తం వుండాలి ఆయనకు చేసే చితాభస్మం అభిషేకమును కళ్ళారా చూడటమే అదృష్టమని ఈయనకు చేసే ముఖలింగ అలంకారము సంధ్య హారతి చూస్తే సాక్షాత్తు మహాకాలుడు ఉన్నాడా అనిపించక పోదు అని అంటూ తన ఆనంద స్థితిలో చెప్పుకుంటూ పోతుంది. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఈ అవకాశమును వదులుకోను. నేను ఖచ్చితంగా వెళ్లి తీరుతాను అని మంకు పట్టు పట్టింది. అప్పటికే ఈమె తన ఆజ్ఞ చక్రం మాయ అయిన శివుడును తన భర్తగా ఊహించుకుని విపరీత ధోరణి స్థితిలో ఉండటం వలన నేను ఏమి చెప్పినా ఏమీ ఈమెకి ఎక్కడం లేదు. చచ్చేవాడిని ఎవరు ఆపగలరు. మాయలో పడేవాడిని ఎవరు రక్షించగలరు. అదృష్టవంతుడిని ఎవరూ నాశనం చేయలేరు. అలాగే దురదృష్టవంతుడిని ఎవరు కూడా బాగుపర్చలేరు కదా అంతే అనుకుని నేను చెప్పవలసినది చెప్పాను. తరువాత నీ ఇష్టం అని ఊరుకున్నాను. మాయ బలీయమైనది కదా. ఆమె నేను వద్దు అన్న కూడా మహా ఉజ్జయిని కి వెళ్ళింది. ఇదే ఆమె సాధనను ఈ జన్మకి పరిసమాప్తి చేసుకోవటానికి ప్రథమ అడుగు పడినట్లు అయింది. తలరాతను ఎవరు తప్పించగలరు కదా. మహాకాలుడు నోటికి ఆహారము కావాలని ఉంటే దానిని ఎవరు మాత్రం తప్పించగలరు. అలా వెళ్ళిన మా శ్రీమతి రాబోవు జన్మలో రాజస్థాన్లో పుట్టటానికి కావలసిన గ్రహగతులు స్థూల శరీర నిర్మాణం చేసుకుని వచ్చినది. తల్లి మాయను దాటకపోవటం వలన ఈ చక్ర మాయ దాటలేకపోయినది. ఆ తర్వాత కొన్ని నెలలకి కైలాస పర్వతానికి చేరుకొని ఈ జన్మ సాధన శక్తి అంతా ఆయనకు సమర్పించి ఇష్ట కోరికగా శివ సాధనను ఎంచుకొని కారణ శరీరానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని వచ్చినది. అలాగే ఈ జన్మ యొక్క అంతిమ కోరిక కోసం కాశిక్షేత్రంలో ఉండాలని మేము అనుకుంటున్నాము. ఒకవేళ రాకపోతే రామేశ్వర క్షేత్రానికి ఈమెకున్న మాయ తీసుకొని వెళ్లి సూక్ష్మ శరీర నిర్మాణమునకు కావలసిన ఏర్పాట్లు చేస్తుందని ప్రకృతిమాత లీల నాకు అర్థమైనది. నాకు వచ్చిన ఈ మహా ఉజ్జయిని క్షేత్రదర్శనానికి వెళ్లకపోవడంతో ….

నాకు షిరిడి దగ్గర ఉన్న శని సింగనాపూర్ నుండి శని వస్తువులు అయిన గుర్రపు నాడ, ఒక నల్లగుడ్డు బొమ్మ ఇంకా ఏవేవో వస్తువులు రావడం జరిగినది. దానితో నేను ఈ క్షేత్రానికి వెళ్లి శని దేవుడికి నువ్వులతో నూనెతో అభిషేకము చేసి “దేవా! నువ్వే మహాకాలుడు అంశ రూపం అని నాకు తెలిసినది. కాబట్టి ఈ యోగమాయను నన్ను దాటించే శక్తి నీవే నాకు ప్రసాదించు” అని వేడుకుని ఇంటికి వచ్చిన కొన్ని వారాలకే నాకు కలలో ఒక అంగుళ పరిమాణంలో ఉన్న నల్లని రంగు ఉన్న ఇంద్రనీల శిల ఒకటి నా మనోనేత్రం ముందు కనపడ సాగింది. విచిత్రం ఏమిటంటే దీనికి ఒక వైపు శనిసింగాపూర్ శనీశ్వరుడు మూర్తి ఆకారము అలాగే మరొక వైపు నిలుచుని ఉన్న ఒక నల్లని కాకి రూపము ఉన్నట్లుగా కనిపించసాగింది. కొన్ని క్షణాల తర్వాత ఈ శిల మా ఇంటి రోడ్డు మీద ఉన్నట్లుగా అగుపించే సరికి నాలో తత్తరపాటు మొదలైనది. ప్రస్తుతం ఇంద్రనీల శిల మా ఇంటి ముందు ఉందా అనే ఆలోచన రాగానే నాకు ధ్యాన భంగమైనది. గబగబా నేను ఇంటికి వెళ్లి రోడ్డు మీద వెతకగా అక్కడ రోడ్డు మీద మారుమూల ప్రాంతంలో అతిగుహ్యముగా ఇంద్రనీల కనబడేసరికి నా ప్రాణాలు పైకి పోయినట్లుగా అనిపించసాగింది. అంటే మహాకాలుడు ఈ శని శిల రూపంలో వస్తున్నాడని అనిపించగానే ఏదో తెలియని ఆనందం వేసింది. ఎందుకంటే నేను కాస్త ఈ చక్ర మాయ మహాకాలుడు మాయను దాటానని చెప్పటానికి ఈ శిల వస్తుందని అర్థం అయినది. ఈ శిలను తీసుకొని ప్రతి శని త్రయోదశి నాడు నువ్వులనూనెతో అభిషేకాలు చెయ్యటం ఆరంభించాను.ఇలా జరిగిన కొన్ని వారాలకు నేను ఒకసారి ఎగ్జిబిషన్ కి వెళ్లడం జరిగింది. అందులో నాకు కావలసిన వస్తువులు తీసుకుని ఇంటికి వస్తే నేను తీసుకున్న వస్తువుకి బదులుగా రెండు నల్ల శాలిగ్రామాలు వచ్చినాయి. అంటే ఇవి మహాకాలుడు మహా కాళిక సంకేతాలని నాకు అర్థమయ్యే సరికి నేను ఈ ఇద్దరి నుండి తప్పించుకున్నానని తెలియగానే ఎగిరి గంతులు వేశాను.ఈ చక్ర దేవతలను దాటుకోవటం అంటే అంత తేలికైన విషయం కాదు. వీరిద్దరిని 100 కోట్ల సంవత్సరములు ఆరాధన చేస్తే ప్రస్తుతము నాకు వచ్చిన ఫలితం అని నాకు అర్థం అయింది. 

నిజ కాలభైరవి కుక్కరూపములో నా ఇంటికి రావడము:

నేను తిరిగి ఈ చక్ర సాధన అయిన శ్వాస సంయమము చేస్తుంటే ఒకరోజు నాకు ధ్యానములో మళ్ళీ సిద్ధాదేవి కనపడినది. వామ్మో! దీనమ్మ జీవితం. నన్ను వదిలి పెట్టదా అయినా ఈ చక్ర దేవతలు అయిన మహాకాలుడు మహాకాళిక మాయను దాటినాను కదా. మరి నాకు ఇంకా ఏమాయ ఉంది? నా బొంద. నా బూడిద. ఈమె కనబడితే చాలు నా కొంప కొల్లేరు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అసలు ముందు ఈవిడని చంపాలి.అప్పుడే గాని ఈ సృష్టికి మాయ దేవత ఉండదు అనుకుంటూ నాలో నేను తిట్టుకోవటం ప్రారంభించే సరికి ఈమె స్థానంలో రెండు నల్లని భయంకరముగా పోలీస్ కుక్క లైన ఆల్శేషియన్ కుక్కల మాదిరిగా రెండు కుక్కలు భయంకరముగా పెద్దగా అరుస్తూ తన కోరలతో పొడవైన నాలుక బయట పెట్టి భయంకరముగా నాకేసి అరుస్తుంటే నాలో తెలియని భయం మొదలైనది. దానితో నాకు ధ్యాన భంగమైనది. ఈ రెండు కుక్కలు దేనికి సంకేతమో అర్థం కాలేదు. మళ్ళీ పుస్తకాలు చదవడం ప్రారంభించాను. అప్పుడు ఈ రెండు కుక్కలు కాలభైరవుడు- కాలభైరవికి సంకేతాలని ధర్మరాజు దగ్గర ధర్మదేవత పేరుతో ఒక కుక్క వచ్చినదని దత్త స్వామి దగ్గర నాలుగు వేదాలకు సంకేతాలుగా నాలుగు కుక్కలు వచ్చినాయని శిరిడి సాయిబాబా దగ్గర వ్యాఘ్రేశ్వరుడు అనే కుక్క ఉండేదని అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా దగ్గర వాకి అనే కుక్క ఉండేదని ఇంద్రుడి దగ్గర దేవశూన అనే కుక్క ఉంటుందని తెలిసింది. ఎవరైతే ఈ చక్ర దేవతలైన మహాకాలుడు మహా కాళిక మాయలు దాటుతారో వారి దగ్గరికి ఈ చక్ర దేవ స్వరూపాలైన కాలభైరవుడు భైరవి స్వరూపాలుగా కుక్క వస్తుందని దానిని పెంచుకుంటే ఈ కాలచక్రము దాటవచ్చని నాకు అర్థమైనది. ఇట్టి చక్రస్ధితి ఉన్న సాధకుడి యదార్ధ అనుభవమును చెపుతాను.జాగ్రత్తగా వినండి.

ఒకసారి ఒక సాధకుడు ఇట్టి చక్ర స్థితిలో ఉన్నప్పుడు అతను అన్ని వదిలేసి అందరిని వదిలేసి సన్యాసదీక్ష లో ఉన్నాడు. అతను బద్రీనాథ్ క్షేత్రంలో భిక్షాటన చేస్తూ తన సాధనను కొనసాగిస్తున్నాడు. అతనికి తెలియకుండా ఇతని సాధన శక్తి ఈ చక్రం లోనికి ప్రవేశించినప్పుడు ఇతని దగ్గరికి వచ్చి కుక్క కాపలా కాయడం మొదలు పెట్టింది. ఇతను మొదటిలో పెద్దగా దీనిని గూర్చి పట్టించుకోలేదు. కాకపోతే ఇతను ఎక్కడికి వెళితే అక్కడికి ఇతనిని వెంబడించి కాపలా కాస్తుంది. ఇతను ఏది పెడితే అది తింటూ ఇతడి దగ్గర ఉన్న కొద్దిపాటి వస్తువులకి అలాగే ఆయనకు రక్షణగా ఉండేది. మొదటిలో ఈయనకి ఇది అంటే ఇష్టంగా ఉండేది. రానురాను తనకి తిండి దొరకని పరిస్థితి వచ్చింది. తను అంటే ఏదో రకంగా నీళ్లు త్రాగి పొట్ట నింపుకోవడం జరుగుతుంది.తన వలన ఒక మూగ జీవికి ఆహారం పెట్టకపోతే అది పాపము గా మారుతుందని భయముతో దానిని తరిమి కొట్టడం ప్రారంభించాడు. అది కాని వాడిని వదిలేది కాదు. చాలా రోజులు ఓపిక గా చూసి సహనము కోల్పోయి దానిని ఒక రోజు బాగా కొట్టినాడు. అయినా వాడిని అది వదిలి పెట్టకుండా మూడు రోజులపాటు ఉంది. చివరకి మన వాడు కాస్త దానితో “నువ్వు నన్ను గాని వదిలి పెట్టకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఒక సాధువుని చంపిన పాపం నీకు వస్తుంది” అనగానే దానికి ఏమీ అర్థం అయిందో గాని ఆ కుక్క వాడిని వదిలి పెట్టి వెళ్లి పోయినది. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మన వాడికి ఆ కుక్క కనిపించలేదు. మరి కొన్ని రోజుల తర్వాత దొంగలుపడి మన వాడి దగ్గర ఉన్న కొద్దిపాటి వస్తువులు దోచుకోవటం జరిగినది.బిక్ష కూడా దొరకని పరిస్థితి ఎదురయ్యే సరికి ఒక విద్య ఉన్న జ్ఞాని దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకోగానే “ఏమిరా! సాక్షాత్తూ బదరీ నారాయణుడే స్వయంగా నీ దగ్గరికి కుక్క రూపంలో వచ్చినాడు నీకు మోక్షమును ప్రసాదించాలని. నీ నిష్కామ కర్మ భక్తికి ఆయనకి నచ్చి వస్తే నువ్వు చస్తావని బెదిరించి పంపుతావా? నీలాంటి పాపాత్ముని చూడటం మాట్లాడటం కూడా మహాపాపమేరా.వెళ్ళు ఇక్కడ నుంచి అంటూ పెద్దగా అరిచి పంపి వేసినాడు. మన వాడికి అసలు అక్కడ ఏమి జరిగిందో అర్థం కాక బిక్క మొహంతో తిరిగి తన బిక్ష స్థానానికి వచ్చి నిద్రలోనికి జారుకోగానే వాడికి తను తిట్టి పంపించిన కుక్క కనపడినది. ఆ తర్వాత బద్రి నారాయణ విగ్రహమూర్తి కనిపించేసరికి అంటే ఆ సిద్ధ స్వామి చెప్పిన విషయం నిజమేనని తెలుసుకునేసరికి మన వాడికి కన్నీళ్లు ఆగలేదు. స్వయముగా నా స్వామి వస్తే తరిమి కొట్టినందుకు వాడు చాలా బాధపడినాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. చార్ధామ్ యాత్ర లో ఉన్నప్పుడు నా స్నేహితుడికి ఈ కుక్కసాధువు కనిపించి చెప్పిన యదార్థ సంఘటన అని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు మనము కొనకుండా మన దగ్గర కి ఒక కుక్క వస్తుందని తెలుసుకోండి. ఎందుకంటే నా దగ్గరకి కాలభైరవ రూపంలో ఒక ఆడ కుక్క వచ్చింది కదా అందుకే చెప్పటం జరిగినది. 

నేను ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉన్నప్పుడు సిద్ధా దేవి కనిపించి నాయనా! నీవు కోరుకున్నట్లుగా నీ ఇంటికి నీ కూతురు గా వస్తాను. కానీ నీకు సంతాన యోగం కలిగించవద్దని చెప్పినావు కాబట్టి కాలభైరవ రూపములో కుక్కగా నీ దగ్గరికి వస్తాను. నన్ను గుర్తించడానికి వీలుగా మూడు రంగులతో అనగా నలుపు-తెలుపు మట్టి రంగు లో ఉంటానని… భ్రూమధ్య స్థానములో బొట్టు గుర్తు ఉంటుందని… మెడ భాగంలో నాగ పడగ గుర్తు ఉంటుందని గుర్తులు చెప్పినది. అంటే ఈమె నా కూతురుగా ఒక ఆడ కుక్క రూపములో వస్తుంది అని అనుకొని ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక రోజు ఇలాంటి గుర్తులు ఉన్న నాలుగు నెలల వయస్సు ఉన్న ఒక కుక్క మా కారు క్రింద పడటం అప్పటికే నాకు అలాగే మా ఆవిడకి కుక్కలు అంటే పిచ్చి ఉండటం వలన దీనికి ఏమైనా అయినదేమో అని భయంగా కంగారుపడుతూ కారు ఆపి క్రిందకు వచ్చి చూస్తే కారును దాటుకుంటూ నా వంక అదోలా చూస్తూ తోక ఆడిస్తూ ఉండేసరికి నేను అప్పటికే కర్మానుసారముగా నాలుగైదు కుక్కలు పెంచడం జరిగింది కానీ ఏ కుక్క నన్ను ఆకర్షించలేకపోయినది. అనుబంధమును పెంచుకోలేకపోయినది. దీనిని చూసిన క్షణంలో ఏదో తెలియని బంధము మాయ నన్ను పట్టి వేయడంతో ఏ మాత్రం ఆలోచించకుండా దీనిని చేతిలోనికి తీసుకొని మా ఇంటికి వస్తావా నిన్ను నా కూతురు లాగా చూసుకుంటాను పెంచుకుంటాను అనగానే దానికి ఏమీ అర్థం అయిందో నాకు తెలియదు గానీ కళ్ళల్లో మెరుపులతో కూడిన ఆనందం వేగంగా ఉత్సాహంతో తోక వూపడం ప్రారంభించే సరికి ఇంటికి తీసుకుని వచ్చాను. వచ్చిన రెండు గంటల తర్వాత గానీ నాకు అర్థం కాలేదు. ఇది సామాన్య కుక్క గాదని దైవాంశ కుక్కయని. దీనికున్న లక్షణాలు గుర్తులు అన్ని కూడా సిద్ధాదేవి చెప్పినట్లుగా అగుపించే సరికి నేను గతుక్కుమన్నాను. వామ్మో కాలభైరవి ఈ కుక్క రూపంతో వచ్చిందా? అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. పెంచుకోవాలి అని నిశ్చయించుకొని మా ఆవిడతో దీక్షా! ఈ కుక్క గురించి నీకు తెలియదు. కానీ సామాన్యమైనది కాదు అని చెప్పగలను కాకపోతే ఇది ఏడ్పించే విధానానికి నేను ఎప్పుడైనా వదిలి పెట్టాలని అనుకుంటే నువ్వు మాత్రం దానిని పెంచుకోవాల్సిన దేనని మొండి వాదము పెట్టుకో .ఆ బైరవి పెట్టే యోగమాయ పరీక్షలు నేను తట్టుకో లేక పోతే ఆమె నన్ను వదిలి వెళ్లే ప్రమాదముంది. అప్పుడు నా సాధన కూడా ఈ చక్రం వద్ద ఆగి పోయే ప్రమాదం ఉంది. నన్ను వదిలించుకోవాలని ఆమె నన్ను రకరకాల మాయలు పెట్టినను వదిలి పెట్టకూడదని నిశ్చయించుకొని పెంచుకోవటం ఆరంభించినాను.దానితో నా బ్రతుకు కుక్క బతుకు అయిపోయింది. దీనిని ఒంటరిగా వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. దీని ఆహారం కోసం ఆరోగ్యం కోసం ప్రకృతి కార్యాల కోసం నన్ను వాడుకోవటం మా ఆవిడతో ఆటలు ఆడుకోవటం చేయడం ఆరంభించింది.  దీనిని ఎప్పుడైనా కోపంలో తిట్టిన లేదా రెండు దెబ్బలు వేస్తే ఆక్రోషం వచ్చి అన్నం తినకుండా అలగటం నాకు టెలిపతి లోనికి వచ్చి దాని సూక్ష్మ శరీరంతో కనిపించి నన్ను నానా తిట్లు తిట్టడం జరుగుతోంది. ఎప్పుడూ నేను ఎన్నో కుక్కలు పెంచాను కానీ అవి ఎప్పుడూ నా టెలిపతి లోనికి రాలేదు. కానీ ఈ పొట్టి ముండ మాత్రము టెలిపతి లోనికి వచ్చి నన్నే తిట్టడం చేస్తోంది. దానితో నాకు కోపం వచ్చి దీనిని బయటికి తీసుకుని వెళ్లి వదిలిపెట్టాలని ఎన్నో సార్లు అనుకున్న ప్రతిసారి నాకు మానసికంగా లేదా శారీరకంగా ఏదో తీవ్ర సమస్య వచ్చే అవకాశాలు కనిపించేసరికి భయము వేసి నిన్ను వదిలిపెట్టను అని దానితో చెప్పగానే ఆ సమస్యలు నా దగ్గరికి చేరకపోవడం నాకే ఆశ్చర్యం వేసేది. మా ఆవిడ మాత్రము నేను ఎన్నిసార్లు బయటకు పంపించాలని చూసిన కూడా చాలా ఓర్పుగా సహనంతో నన్ను ఓదార్చి దానికి చెప్పవలసిన చెప్పి నన్ను మార్చేది. అప్పుడప్పుడు అది మమ్మల్ని కరిచిన పెద్దగా స్పందించని స్థాయికి మేము చేరుకొన్నాము. అది మా సహన శక్తిని పరీక్షిస్తుందని మాకు అనిపించగానే అది కాస్త అల్లరి చేయకుండా, కరవకుండా, బాధపెట్టకుండా నిర్మలము గా ఉండేది. ఇది వచ్చిన తర్వాత మా శ్రీమతి అలాగే నాకు శ్రీ దత్త స్వామి యొక్క ప్రత్యక్ష దర్శన అనుభవాలు, శ్రీశైలము నందు బాలాదేవి ప్రత్యక్ష దర్శన అనుభవము, నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి నా ప్రారబ్ద కర్మలు తీరుతూ ఉండటం నా సాధన స్థాయి పెరగటం లాంటివి శుభాలు  కలిగించినది. ఇది నిజంగానే దైవాంశ నాగ కాలభైరవ అని చెప్పకనే చెప్పినది. కాబట్టి ప్రతి సాధకుడికి/సాధకురాలికి ఈ చక్ర స్థితి కోసము కాస్త వెనుక లేదా ముందుగా ఒక కుక్కను పెంచుకునే అవకాశం ఈ ప్రకృతిమాత ఇస్తుంది. కానీ మన అజ్ఞానముతో ఈ మహత్తర అవకాశం కోల్పోతే మాత్రమే ఈ భైరవమూర్తి ల శాపానికి కుక్క శాపానికి గురై మరో వంద కోట్ల సంవత్సరములు ఈ కుక్క జన్మ ఎత్తవలసి వస్తుంది అని పుస్తక పఠనం ద్వారా నేను తెలుసుకున్నాను. విచిత్రం ఏమిటంటే అమెరికాలో శ్వేతాదేవి అనే యోగిని తను స్కూల్ విద్య చదువుతున్నప్పుడు ఇలాంటి ఒక కుక్కను పెంచుకునే అవకాశం వచ్చిందట. అది ఇంటికి తెచ్చుకొని కొన్ని రోజుల పాటు ఉంచుకొని పెంచుకుంటే తన తల్లి కాస్త ఈ తెచ్చిన కుక్క ను ఇంటికి దూరంగా వదిలిపెట్టి రాకపోతే అసలు మీ ఇద్దరికీ (అన్నాచెల్లెళ్లకు) ఇంటికి రానియ్యను అని మొండిపట్టు పట్టేసరికి వీళ్ళకి కూడా తెలిసీ తెలియని వయస్సులో ఉండి అజ్ఞాన మాయ వలన వీరిద్దరికి ఇష్టం లేకపోయిన అమ్మ మాట భయానికి భయపడి ఆ కుక్కను ఊరి చివర వదిలిపెట్టి వస్తే అది వీళ్ళని ఒక కిలోమీటర్ దాకా వెంబడించి ఆయాసం వచ్చి ఆగిపోతే వీళ్ళు బాధతో ఏడుపుతో ఆటోలో ఇంటికి రావడం జరిగిన యదార్థ సంఘటన. ఇది జరిగిన కొన్ని సంవత్సరముల తరువాత వీరిద్దరూ కూడా తమ సాధనను ఈ చక్ర స్థితికి వచ్చినప్పుడు వీళ్లు చేసిన పొరపాటు వలన వీళ్ళు వదిలిపెట్టి వచ్చిన కుక్క దాదాపుగా మూడు నెలలపాటు బాధతో, ఆవేదనతో ఏడుస్తూ ఏమీ తినకుండా చనిపోయింది. ఇది వీళ్ళ కోసము పడిన నరకయాతన కాస్త వీరిద్దరికీ శాపంగా మారిందని నాకు ఇప్పుడు అర్థం అయినది. దానితో వీరిద్దరి సాధన ఆగిపోయినది. శ్వేతాదేవి ఈ సాధన దాటటానికి సమయానికి డబ్బులు దొరకకపోవటం వీళ్ళ అన్న కాస్త అతడికి వున్న అమిత కామమాయను దాటలేకపోవడంతో వీరి సాధన స్థాయికి ఈ జన్మలో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది అని అర్థం అయినది. వీరికున్న ఈ కుక్క శాప విముక్తి అయితే గాని వీరి సాధన ముందుకి కొనసాగదని అని నేను ఈ చక్ర సిద్ధికి వచ్చినప్పుడు నాకు అర్థమైనది. లేదా కాలభైరవ క్షేత్రమైన కాశీ క్షేత్రము నందు వీరిద్దరు మరణమును పొందితే గాని ఈ కుక్క శాపము నుండి విముక్తి కలగదని నేను గ్రహించినాను. కాశీ క్షేత్రంలో మరణించడం అంటే మాటలా. దానికి కాలభైరవ అనుగ్రహం ఉండాలి. అది వీరిద్దరికీ లేదు. ఈ కుక్క కాస్త ఈ యోగినికి భైరవ నాధ్ రూపంలో కుమారుడిగా పుట్టడం జరిగినదని గ్రహించాను. వీడికి సేవలు చేస్తూ కొంతమేర ఆ వదిలిన కుక్క వలన ఏర్పడిన కాలభైరవ శాపము నుండి విముక్తి కలగాలని దేవుడిని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అన్న కంటే ఈమె కాస్త నిజంగానే బాధపడే సరికి ఈ కుక్క కాస్త ఈమెకి కొడుకుగా పుట్టడం జరిగినది. నా దగ్గరికి ఆనందముగా కర్మ బంధ విముక్తి కోసం ఈ కుక్క కాస్త వస్తే ఆమె కోసం కొడుకుగా కర్మ బంధం గా కాలభైరవుడు వచ్చినాడు అని నాకు అర్థమైన ఏమీ చేయలేని పరిస్థితి. చూస్తూ ఊరుకోవడం తప్ప. కుక్కలు పెంచిన ప్రతి వారు కూడా ఈ చక్రశుద్ధి కి వచ్చిన వాళ్ళు కాదని గ్రహించండి. ప్రారబ్ద కర్మలు కోసం మీ పితృదేవతలు కుక్కలు, పిల్లులు, పక్షులు రూపంలో మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనము ఎక్కడ కొనకుండా అది మనకి నచ్చి దానంతటదే వచ్చే ఏ జీవి అయినా ఈ చక్రశుద్ధి కోసమే తప్పనిసరిగా రావలసి ఉంటుంది. అంతెందుకు నేను కూడా గత జన్మలో ఒక కుక్కను నానారకాలుగా హింసించినానని ఈ శాప విముక్తి కోసం సిద్ధాదేవి ఈ కుక్క అవతారంలో నా దగ్గరకు వచ్చి తొక్కిపెట్టి నాతో సేవలు చేయించుకుంటుంది అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రారబ్ద కర్మను అనుభవించక తప్పదు కదా. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు చెప్పి ఉన్నారు కదా. కాబట్టి ఇట్టి చక్ర స్థితి ప్రారబ్ద కర్మగాఒక కుక్క వస్తుంది. దీనిని పెంచుకోండి. కర్మను తీర్చుకోండి.దీనికి సంకేతముగా నాకు ఒక స్త్రీ మూర్తి నుండి రెండు కుక్క బొమ్మలు వచ్చినాయి. పూజ లో చేరినాయి. అంటే ఈ చక్ర స్థితి కోసం మొత్తము నాలుగు కుక్క బొమ్మలు అనగా రెండు కాలుడికి సంబంధించినవి అయితే మరి రెండు భైరవుడికి సంబంధించినవి అన్నమాట. దానితో నాకు ఈ చక్ర ఆధీన శక్తి వచ్చినట్లు అయినది. 

శ్రీచక్ర కోట యందు నా పరిక్రమము :

ఇక నాకు శ్రీ చక్ర కోట పరిక్రమమునకు ఎలాంటి యోగ మాయ విఘ్నాలు ఉండవని కానీ ఇక్కడ ఉండే ప్రవేశ మార్గం దేవత అయిన సేకీరు అనుమతి తీసుకోవాలని ఆమె పెట్టే జ్ఞాన పరీక్షలో నెగ్గితే యోగ్యత లభిస్తుందని నేను శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాను. దానితో నాకు యోగ్యత ఉన్నదో లేదో చూసుకోవాలి అని తీవ్ర స్థాయిలో ధ్యానం చేయటం ఆరంభించాను. అలాగే నా నిత్యపూజలు ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు వచ్చిన నాలుగు నల్లపాటి సాలగ్రామాలు అలాగే శనీశ్వరుడి ఇంద్రనీల శిలను పూజించడం ఆరంభించాను. ఏమి జరుగుతుందో కాలమే  నిర్ణయించుకోవాలని సాధన చేస్తున్నాను. ఒకరోజు అర్ధరాత్రి పూట నేను ఈ చక్ర సాధన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు ఉన్నట్టుండి టెంపుల్ రన్ వే ఆట మొదలైంది. అంటే నా సూక్ష్మశరీరము ఎక్కడికో ప్రయాణించటానికి బయలుదేరుతుంది అని నాకు అవగతమవుతుండగా భూమండలము కనిపించి దానిని దాటటం జరిగినది. ఆ తరువాత నక్షత్ర చంద్ర మండలాలు దాటటం జరిగినది.తర్వాత అడ్డంగా ఉన్న కాల నేత్రము దర్శనం అయినది. దీని లోపలకి నా సూక్ష్మశరీరము ప్రవేశించడం జరిగినది. అప్పుడు నేను సూర్యమండలం లోనికి ప్రవేశించినట్లు అనుభవము అవుతుండగా నాకు 3D డైమన్షన్ లో తిరిగి శ్రీ చక్ర కోట నిర్మాణం చాలా స్పష్టంగా కనపడ సాగింది. అంటే నా సూక్ష్మశరీరధారి తనకి ఈ శ్రీచక్ర కోటను చూసే యోగ్యత ఉన్నదో లేదో పరీక్షించుకోవటానికి వెళుతుందని నాకు అర్థమైనది. ఏమి జరిగితే అది జరుగుతుందని జరిగే దానిని సాక్షీభూతంగా నా స్థూల శరీరము తన మనోనేత్రం ద్వారా మౌనముగా చూడటం ఆరంభించింది. అప్పుడు నా సూక్ష్మశరీర ధారిఈ చక్రానికి ఉన్న నాలుగు ద్వారాల లో అన్ని ద్వారాలు కలిఉంచే ఏకైక మార్గం ద్వారమైన మోక్ష ద్వారం వద్దకు చేరుకోవడం జరిగినది. ఎందుకంటే మేరు శ్రీచక్రము లో నాలుగు మార్గాలు ఉన్నప్పటికీ ఒక మార్గం లోనే అన్ని కోణాలు కలుస్తాయని తెలుసుకోండి. మిగిలిన మార్గాలలో పంచభూత కోణాలలో ఏదో ఒక కోణము కలవదు. జాగ్రత్తగా లోహ మేరు శ్రీచక్రమును పరీక్ష చేస్తే అర్థం అవుతుంది. నాకు దీనిని గూర్చి తెలిసినది కాదు. మా అయ్యా నాకు ఈ చక్రమును ఎలా పెట్టి పూజించాలి అమ్మవారి ముందు ఉన్న వెండి లోహ శ్రీ చక్ర అర్చన చేసేటప్పుడు నాకు ఈ ఒకే ఒక మార్గం లో అన్ని కోణాలు కలుస్తాయని నాకు చూపించటంతో నాకు తెలిసినవి. ఎప్పుడైతే నా సూక్ష్మధారి ఇలా అన్ని త్రిభుజాలు కోణాలు కలిసే ఏకైక మార్గం ద్వారమునకు చేరుకున్నదో అప్పుడు ఈ చక్రం ప్రవేశానికి అనుమతి కావాలని అక్కడ ఉన్న కాపలా దేవతలను అడగటం అందులో ఒకరు లోపలికి వెళ్లి సెకీరు దేవత రావడం జరిగినది.ఈమె నాకు ఈ యోగ్యత ఉన్నదో లేదో పరీక్షిస్తుంది అని నాకు అర్థమైనది. ఇంతలో ఈమె ప్రశ్నలు అడగటం ప్రారంభించింది.

1.చచ్చినా ప్రాణము ఉండేది ఏది?

 చితాభస్మం (బూడిద గా మారిన చచ్చిన వాడి ప్రాణశక్తి ఉంటుంది)

2. ప్రాణం ఉన్న కదల లేనిది ఏది?

గ్రుడ్డు

 3.అన్నం పెడితే బ్రతుకుతుంది నీళ్లు త్రాగితే చస్తుంది అది ఏది?

 అగ్నిహోత్రము (హోమములో నెయ్యి వేస్తే మండుతుంది. అదే నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా)

4. దేనిని పలికితే అది పోతుంది?

 శాంతి 

5.ఎప్పుడు పలికిన అది తప్పు గానే ఉంటుంది?

 తప్పు అనే పదము 

6.మానవ స్పర్శ లేని జలము ఏది?

 కొబ్బరికాయలో ఉండే నీళ్లు 

7.మాయ అంటే ఏమిటి?

 మోహ,వ్యామోహము కల్గించేది.

8.భూమిని సృష్టించటానికి పూర్వము ఎవరున్నారు?

 పంచభూతాలు, కాలం, ఈశ్వరుడు, శూన్యం,పరమ శూన్యం 

9.మనిషికి మిత్రుడు అలాగే శత్రువు ఎవరు?

 అతని ఇంద్రియాలే 

10.లోకులకు అర్థము కానిది తెలియనిది ఏది?

 స్త్రీ మనస్సు ,స్త్రీ చరిత్ర

11.జన్మించిన వారెవరు?

 తిరిగి జన్మించవలసిన అవసరం లేని వారు 

12.చనిపోయిన వారు ఎవరు? 

తిరిగి రావలసిన అవసరం లేని వారు 

13.దుఃఖమునకు మూలము ఏది? 

మాయ 

14.ఏది తెలిసిన తరువాత మరేమీ తెలుసుకోనక్కరలేదు?

 స్వస్వరూప జ్ఞానం 

15.చంచలమైనవి ఏవి?

 మనస్సు ,ధనము, బలము, ఆయువు 

16.చేయకూడని పని ఏది?

 పాపకార్యాలు 

17.ఈశ్వరుడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది?

 నేను ఉంటే ఆయన ఉన్నట్లు నేను లేకపోతే ఆయన లేనట్లే.

18. ఆకారము లేని వాడిని ఎలా తెలుసుకోవాలి?

 ఆకారం లేని మనస్సు బుద్ధి అహంకారం మాయ…. గాలి ఎలా తెలుసుకున్నామో అలా 

19.ఈశ్వరుడు యందు భక్తి-,సాధన ఎందుకు చేయాలి?

 మనము మన సంతానము యందు ఎందుకు భక్తిగా ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నామో అందుకోసమే

20.మహామృత్యువు అంటే ఏమిటి?

 నేను ఆత్మ అని మరచిపోవుట

21.పరమేశ్వరుడు పూజించే లింగము?

ఇష్ట లింగము 

22.మహామాయ అంటే?

 తన ఏకైక ఇష్ట కోరిక తెలుసుకుని దానిని దాట లేకపోవటం 

23.కామికానివాడు మోక్షగామి కాడు అంటే అర్థం ఏమిటి?

 కామము మోక్షము అని రెండు అనుభూతులు పొందాలంటే తప్పనిసరిగా శరీరము ఉండాలని అర్థం 

24.పూజనీయుడు ఎవరు?

నాలాంటి శబ్ద అనుభవ నిజ పాండిత్యంతో స్వస్వరూప జ్ఞాన అనుభూతి ఆత్మానుభూతి ఉన్న బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి 

అనగానే వెంటనే సెకీరు ఈ మోక్ష ద్వారం నుండి నన్ను లోపలికి పంపించడానికి అనుమతి ఇవ్వటం జరిగినది. దీనితో నా సూక్ష్మ ధారి ఈ శ్రీ చక్ర కోట లోనికి ప్రవేశించినాడని నాకు అర్థం అయింది. ఈ కోట లోపల పశ్చిమానికి తిరుగుతూ ఉత్తరానికి వెళ్లి అక్కడ నుండి పశ్చిమానికి వస్తే ఒక చిన్న త్రోవ కనిపించినది. ఈ త్రోవలో గుండా వెళితే అది కాస్త ఉత్తరం వైపుకి తిరగటం ఆరంభించింది. అక్కడ నుండి మళ్ళీ పశ్చిమానికి తిరిగితే అక్కడ రెండు చిన్న దారులు కనిపించాయి. ఇందులో ఒక దారి పూర్వ దిక్కుకి చూపిస్తుంటే మరోదారి పశ్చిమదిక్కుకు చూపిస్తుందని నాకు అర్థమైనది. ఇక్కడ ఏ వైపుకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఇందులో ఒక మార్గము లోపలికి తీసుకొని వెళితే మరో మార్గం మాయ లోనికి దింపి అక్కడే ఉంచేస్తుందని నాకు అనుభూతి కలగ సాగింది. అక్కడ ఉన్న అష్టవసువులని అడిగినా ప్రయోజనం ఉండదు. వాళ్లు ఉలకరు.పలకరు.మౌనముగా ఉంటారు. స్థిర మనస్సులకు మాత్రమే ఇందులో ని నిజ త్రోవ తెలుస్తోంది. అస్థిర మనస్సులకి అయితే ఖచ్చితంగా మాయ త్రోవలోకి వెళ్ళటం జరుగుతుంది.  అప్పుడు నా సూక్ష్మధారి తన ఏకాగ్రత మనస్సుతో పూర్వ దిక్కున త్రోవ లోనికి ప్రవేశించడం నాకు అనుభూతి కలిగింది. అప్పుడు అక్కడ ఒక మహా ద్వారము కనబడినది. ఈ ద్వారం లోపల గోముఖ తీర్థం అనే పుష్కరిణి కనబడినది. ఈ పుష్కరిణిలో స్నానం చేయటానికి నా సూక్ష్మధారి ఇందులోనికి దిగుతూ ఉండటం అనుభవము గా కనబడుతోంది.ఇలా స్నానము చేసి వచ్చిన నా సూక్ష్మధారికి స్థిరబుద్ధి నిజ జ్ఞాన బుద్ధి కలిగి ఉన్న వివేక బుద్ధి ఏర్పడినట్లు గా అనుభూతి పొంద సాగింది. దానితో ఇది కాస్త ఉత్తర దిశకి వెళ్ళటం ప్రారంభించినది. అప్పుడు మరల పూర్వ దిక్కుకి వెళితే అక్కడ మరల రెండు త్రోవలు కనిపించినాయి. ఇక్కడ ఏ దారిలో వెళితే ఏమి వస్తుందో అర్థంకాక సతమతమవుతుంటే అక్కడ ఉన్న ఏకాదశ రుద్రులు ఉలకరు.పలకరు. దానితో స్థిరబుద్ధితో దక్షిణ దిక్కు ఉన్న ద్వారం దారి వైపు కి వెళ్ళటం జరిగినదని నాకు అర్థమైనది. ఎందుకంటే వివేక బుద్ధి వలన ఉత్తర దిక్కుకి వెళ్లితే నక్షత్ర మండలాలు నక్షత్రాలు కనబడతాయని ఇది ఒక మాయా ప్రపంచం అని అనుభూతి కలిగేసరికి ఆ దిశ వైపు వెళ్ళకుండా దక్షిణ దిశకి వెళ్లడం జరిగింది అని నాకు అర్థం అయింది. అప్పుడు ఒక చిన్న సోపానము కనిపించింది. ఇందులో 16 మెట్లు కనబడతాయి. ఈ చిన్నగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉండగా అక్కడ ఒక వృత్తాకార మైన త్రోవ కనబడసాగింది. అంటే శ్రీమేరు చక్రములో ఈ 16 మెట్లు కాస్త 16 రేకుల పద్మం అని నాకు అర్థం అయినది. ఈ వృత్తాకార మార్గము గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక మహాద్వారం కనిపించినది. మళ్లీ ఈ ద్వారము వద్ద రెండు చిన్న దారులు కనిపించినాయి. అందులో ఒకటి పశ్చిమ దిక్కుకి వెళితే మరొకటి పూర్వ దిక్కుకి వెళుతుంది.  ఇక్కడ అష్టభైరవులు కనబడతారు. కానీ వాళ్లు ఉలకరు. పలకరు. వివేక బుద్ధి వలన ఆలోచన చేస్తే పూర్వ దిక్కుకి వెళ్ళితే ఈసారి స్వర్గ  భవనము కనబడుతుందని ఇందులో అతి గుప్తమైన చింతామణి, శమంతకమణి, కౌస్తుభమణి, రుద్ర మణి ఇలాంటి నవ మణులు,నవ రత్నాలు సుందరమైన విగ్రహలు ఉంటాయి. వీటిలో అష్ట సిద్ధులను ఇచ్చే మాయా దేవతలు ఆవాసము చేస్తూ ఉంటారని చచ్చినా కూడా ఈ సుందర భవనం లోనికి వెళ్లకూడదని నా సూక్ష్మధారి నిశ్చయించుకొని పశ్చిమ మార్గం వైపు ప్రయాణించడం జరిగినదని నాకు అనుభూతి కలగ సాగింది. నూటికి 80% మంది యోగసాధకులు ఇక్కడ అష్టసిద్ధులు మాయలో పడి తమ సాధనను పరిసమాప్తి చేసుకుని అక్కడే నిలబడి పోతారని అనుకుంటూ నా సూక్ష్మధారి ముందుకి కొనసాగినది. ఇలా వెళ్ళుతుండగా ఇక్కడ చిన్న సోపానము కనిపించినది. అందులో 8 మెట్లు కనిపించినాయి. ఈ మెట్లు చూస్తుంటే నాకు శ్రీమేరు శ్రీ చక్రములోని 8 రేకులు ఉన్న పద్మము లాగా కనపడినది. ఈ త్రోవ గుండా వెళితే అక్కడ మనకి ద్వాదశాధిత్యులు కనపడసాగుతారు.వీళ్లు కూడా ఉలకరు. పలకరు అనుకుంటూ నా సూక్ష్మధారి అక్కడ ముందుకి కనిపించే త్రోవ లోనికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద సోపానం కనిపించింది. అందులో 14 మెట్లు కనిపించినాయి. వీటిని చూస్తుంటే నాకు శ్రీ మేరు శ్రీచక్రము లో నాలుగవ ఆవరణలో ఉన్న 14 త్రిభుజ కోణాలకి సంకేతం అని నాకు అర్థం అయింది. వీటిని ఎక్కడము చాలా కష్టమని శ్రమపడి ఎక్కవలసి ఉంటుంది అని నా సూక్ష్మధారి పడే బాధను చూస్తుంటే నాకు అర్ధం అవసాగింది.తీరా ఎక్కి చూస్తే నీలాకాశం చాలా విశాలమైన ఒక చక్ర ద్వారమైన వస్తువు ఉన్నట్లుగా కనబడుతుంది. ఇందులో జలదేవత ఆవాసము చేస్తుంది. దీనిని నీలకోట గా పిలవడం జరుగుతుంది.ఈ దేవత అనుగ్రహము వల్లనే మనకి జలాలు వర్షాలు కలుగుతున్నాయని నాకు అర్థమైనది. అప్పుడు దీనిని దాటుకుంటూ వెళ్ళితే మనకి ఒక చిన్న సోపానం కనబడుతుంది. ఈ సోపానము లోపల 10 చిన్న మెట్లు కనిపించినాయి. వీటిని ఎక్కితే ఒక వృత్తాకార మైన రెండు దారులు కనబడతాయి ఇక్కడ అగ్ని దేవత ఆవాసము చేసే ముత్యపు కోట కనబడుతుంది. ఈయన వద్ద దగ్ధశక్తి, నిగ్రహశక్తి, అగ్నిస్తంభన శక్తి సాధకునికి ఇవ్వటం జరుగుతుంది. ఈ పది మెట్లు చూస్తుంటే శ్రీ మేరు శ్రీచక్రములో పంచమ ఆవరణలో ఉన్నట్లుగా నాకు అనిపించసాగింది.ఇక్కడ ఉన్న పన్నెండు దేవతలు మనకి దర్శనము ఇస్తారు. వీళ్లు ఉలకరు. పలకరు.కాబట్టి మన వివేక బుద్ధిని ఉపయోగించుకుని నైఋతి దిక్కున ఉన్న మార్గం వైపుకి వెళ్లాలి. అక్కడ మళ్ళీ చిన్న సోపానము కనబడుతుంది. ఈ సోపానంలో మనకి తిరిగి పది మెట్లు కనబడతాయి. ఈ మెట్లు చూస్తుంటే మనం శ్రీమేరు శ్రీ చక్రములోని ఆరవ ఆవరణము లోనికి ప్రవేశించినట్లుగా నాకు అర్థమైనది. మళ్ళీ ఇక్కడ రెండు దారులు కనబడతాయి. ఇది మరకత కోట అని నాకు అవగతమైనది. ఇందులో మాయ దేవత ఆవాసము చేస్తోంది. ఇక్కడ మనకి 12 మంది దేవతలు కనబడతారు కానీ వీళ్లు కూడా ఉలకరు. పలకరు అన్నట్లుగా ఉంటారు. మన చావు మనమే చావాలి. ఇక్కడ కనిపించే దారులలో ఒక దారి ఉత్తరానికి వెళితే మరొక దారి దక్షిణానికి వెళ్ళుతుంది. ఇది దక్షిణ మార్గంలోనే మాయ సుందరి ఆవాసమైన మరకత కోట ఉంటుంది. ఇక్కడ అమ్మ వారు కాస్త సుందరి రూపములో అతి సుందరమైన స్త్రీ మూర్తిగా దర్శనం ఇస్తుంది.ఈమెకి భువన సుందరి అని పేరు ఉంది. ఈమె మోహమాయకి చిక్కిన వారు ఇక్కడ ఈ కోటను దాటి ముందుకు వెళ్ళలేరు. అక్కడితో ఆగిపోవాల్సి ఉంటుంది. ఈమె  దగ్గర ప్రపంచ గమన మాయ శక్తి ఉంటుంది.ఈమె  చెప్పినట్లుగానే అసత్యముగా ఉండే ప్రపంచము కాస్త మాయ వలన మనకి సత్య ప్రపంచంగా కనబడుతుందని నాకు అర్థమైంది. తప్పనిసరిగా ప్రతి సాధకుడు అలాగే సాధకురాలు ఈ కోట మార్గంలోనే ప్రవేశించాలి. ఈ మోహ మాయను దాటి పోవాలి. ఈమెను దాటుకుని వేళ్తే ఉత్తర మార్గంవైపుకి వెళ్లే మార్గము కనబడుతుంది. అక్కడ మౌనముగా ఉండే చతుర్ముఖ బ్రహ్మ లు కనబడతారు. వీరి అనుగ్రహమును పొంది ముందుకు వెళితే మనకు చిన్న సోపానము కనబడుతుంది. అందులో 8 మెట్లు కనబడతాయి. వీటిని చూస్తుంటే శ్రీ మేరు శ్రీ చక్రములోని ఏడో ఆవరణలో ఉన్న ఎనిమిది త్రిభుజ కోణాలు అని అర్ధం అవసాగింది. ఇక్కడ మనకి 14 మంది దేవతలు అగుపడతారు. ఇక ఇక్కడ నుండి మనము మెట్లు ఎక్కవలసిన పనిలేదు. అవి పైకి తీసుకుని పోతాయి. ఎందుకంటే ఈ విశ్వ ప్రపంచములో ఉన్న నానావిధ రకాల మహామాయలను మనము దాటటం జరిగినది కదా. ఎలా అంటే ఇక్కడ మనకి మాణిక్య కోట ఉంటుంది. ఇందులో శక్తి దేవత ఉంటుంది. ఈమె అనుగ్రహము మనము పొందినట్లయితే అపారమైన ప్రపంచ శక్తి మన స్వాధీనంలోకి వస్తుందని నాకు అర్థం అయినది అలాగే నా సూక్ష్మధారికి కూడా అనుభూతి పొందటము జరిగినది. ఈమె అనుగ్రహము వలన సూక్ష్మధారి ముందుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాడికి కెంపు కోట కనబడినది. ఈ కోట లోపల సర్వశక్తి దేవత ఉన్నట్లుగా ఈమె అనుగ్రహము పొందితే మనకి ఈ లోకంలో భావాతీత స్థితి పొంది విభిన్న భావాలను ఏక భావ స్థితికి చేరుకోవడం జరుగుతుందని ఇది శ్రీమేరు శ్రీచక్రము లోని అష్టమ ఆవరణము క్రిందకి వస్తుందని నాకు అర్థమైనది. ఈ ఆవరణలో మనకి పంచ దేవతలు కనబడతారు. వీరు కూడా ఉలకరు.పలకరు. వీరి అనుమతి తీసుకుని నా సూక్ష్మధారిముందుకి వెళ్ళడం జరుగుతుందిఅని నాకు అర్థమైనది. అప్పుడు వాడికి ఒక చోట అది కాస్త త్రికోణాకారంలో ఉంది. ఇందులో అమృత సముద్రము ఉన్నట్లుగా నా సూక్ష్మధారి అనుభూతి పొందుతూ ఉండగా ఈ అమృత సముద్రము మధ్యలో ఒక బిందువు ప్రాంతము ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇది శ్రీమేరు శ్రీచక్రంలో అష్టమ ఆవరణలో ఉన్న త్రికోణము అని నాకు అర్థమైనది. ఆ కనిపించే బిందువు కాస్త నవమ ఆవరణలో మేరు శ్రీ చక్ర బిందువు అని అర్ధమయ్యేసరికి నా సూక్ష్మధారి ఈ అమృత సముద్రములో కనిపించే బిందువు వైపుకి ఈదుకుంటూ వెళుతున్నాడు అని నాకు అర్థం అయింది. అంటే శ్రీ చక్ర పరిక్రమణ చిట్ట చివరి అంకానికి చేరుకుందని నాకు అర్థం అవుతుండ గా మనవాడు కాస్త ఈ బిందువు దగ్గరికి చేరుకోవడం జరిగినది. అక్కడ కోటి పరమాత్మలును 36 కోట్ల మంది దైవ స్వరూపాలు 13 కోట్ల వివిధ రకాల దైవ జాతులు 84 లక్షల జీవజాతులు ప్రతినిధులు కనిపించి వరుసగా కారణ లోకము, సూక్ష్మ లోకాలు, సహస్ర లోకాలు, గ్రహలోకాలు గురించి అందులో ఉండే సుఖభోగాలు గూర్చి లోక పాలకులు వివరించడం జరుగుతుంది. ఒకవేళ మనము ఇక్కడ ఏమైనా ఆశిస్తే మనకి కూడా ఒక బ్రహ్మ పదవిని ఇచ్చి మన కోసం ఒక లోకమును సృష్టించి ఇవ్వడం జరుగుతుంది అని పతంజలి మహర్షి అలాగే శ్రీ లాహిరీ మహాశయుడు చెప్పిన విషయాలు నాకు లీలగా గుర్తుకు రావడం జరిగినది. నా సూక్ష్మధారి వీరు చూపించే ప్రలోభాలకి ఆశలకి అలాగే నన్నే గదా స్వయంగా సిద్ధగణాలు ఆహ్వానించారని ఇసుమంత గర్వం లేకుండా మౌనముగా భావ రహితముగా స్పందన రహితముగా ఉండేసరికి అమృత బిందువు లోపలకి అనుమతి మన వాడికి కలిగినదని నాకు అర్థమైనది. ఈ బిందువు లోపల ఒక మణిద్వీపము ఉన్నట్లుగా అందులో ఒక మనోహరమైన ఉద్యానవనము ఒకటి ఉన్నట్లుగా దీని లోపల ఒక ముగ్ధ మనోహరమైన సుగంధపరిమళాలు విరజల్లే ఒక వనము ఉన్నట్లుగా దీని లోపల ఒక గృహము ఉన్నట్లుగా ఈ గృహం లోపల నాలుగు కోడులు ఉండి త్రిభుజాకారముగా ఉన్న ఒక మంచము ఉన్నట్లుగా ఈ మంచము మీద బ్రహ్మ తదాకార స్థితిలో మహాశివుడు యోగ నిద్రలో ఉండగా శ్రీ రాజరాజేశ్వరీ మాత ఈయన మీద కూర్చుని ఉన్న ముగ్ధ మనోహర దృశ్యం కనిపించి అనుభూతి పొందుతూ ఉండగా అమ్మవారు పలికే పలుకులు నాకు వినిపించడం లేదని నా స్థూల శరీరానికి సందేహము రాగానే నా మనోనేత్రం నందు శ్రీ మేరు శ్రీ చక్ర కోట పరిక్రమణ దృశ్యము అంతర్ధానమైంది. అంటే నేను ఈ శ్రీచక్రము పరిక్రమించానని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందము వేయసాగింది. ఇలాంటి పరిక్రమములు ప్రతి సంవత్సరము దేవీనవరాత్రుల సమయంలో తనే ఒక అమ్మవారిగా అలంకారము చేసుకుంటూ ఆయా ఆభరణాలను ఆయా అలంకారాలు చేస్తూ ఈ నవరాత్రులలో నవఆవరణలను దాటుతూ అమృత బిందువుకి చేరుకుని ఏకైక పరబ్రహ్మ స్వరూపమని జ్ఞానము పొందుతారని తన జీవిత చరిత్ర లో చెప్పిన మైసూర్ పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చెప్పిన అనుభవాలు అక్షర సత్యమని నాకు ఈ శ్రీ చక్ర పరిక్రమణ అనుభవము అయ్యేదాకా నేను కూడా నమ్మలేదు. దానితో ఈ కాల చక్రము ఇచ్చే కాలాతీత స్థితికి చేరుకోవడం జరిగినది. కొన్ని రోజులకి నాకు రాజరాజేశ్వరిదేవి పంచలోహ విగ్రహమూర్తి వచ్చినది.విచిత్రము ఏమిటంటే చూడటానికి లలితాదేవి అలాగే రాజరాజేశ్వరి అమ్మవార్లు ఒకటిగానే ఉంటారు.

త్రికాలజ్ఞానము వలన నాకు కల్గిన జన్మాంతర అనుభవానుభూతి:

కాలములో అత్యంత అల్పమైన విభాగము క్షణం. క్షణం తరువాత మరొక క్షణం రావటాన్ని క్రమము అంటారు. దీనిని కాల ప్రవాహం అంటారు. అంటే ఒక క్షణం సుదీర్ఘంగా ఉంటే మరొక క్షణము స్వల్పంగా ఉంటుంది. ఈ రెండు క్షణాల మధ్య ఉండే ప్రవాహమే కాల ప్రవాహం అన్నమాట. అనగా కాల విభాగమైన క్షణములోను అలాగే ఈ క్షణాలలో ఉండే క్రమంలో మనము సంయమము చేసినప్పుడు కలిగే స్థితి కాలాతీత స్థితి అవుతుంది. దీని ద్వారా మనకి వివేకము వలన జనించే త్రికాల జ్ఞానం కలుగుతుంది. అంటే ఇట్టి వివేక జ్ఞానము త్రికాలజ్ఞానము అన్నమాట. దీనివలన మనకి ఈ విశ్వంలో సమస్త వస్తువుల భేద రూపాలకి కారణాలు అన్ని విధాల కాలాలలో జరిగే వస్తువు సంబంధిత విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. అట్టి వానిని సర్వజ్ఞాని అనడము జరుగును. అనగా ఈ శరీరము యొక్క వర్తమాన విషయానికి ఇది ఏర్పడడానికి గల మూల కారణము ఏమిటి అది ఏ విధంగా ప్రస్తుత స్థితిలో పరివర్తనం చెందుతుంది ఎంతకాలం ఈ స్థితికి చేరుకుంటుంది భవిష్యత్తులో ఇది ఏ విధంగా మార్పు చెందుతూ ఎంత కాలానికి మళ్ళీ తిరిగి తన యదార్ధ కారణంలోనికి చేరుకుంటుందో అంటే ఈ దేహము ఎన్నాళ్ళు క్రితము పుట్టినదో ఏ కారణం కోసం పుట్టినదో ప్రస్తుతము దీని స్థితి ఏమిటో రాబోవుకాలంలో దీని రాబోవు అవతారాలు ఏమిటో ప్రతిదీ స్పష్టముగా తెలుస్తాయని పతంజలి యోగశాస్త్రం చదివితే అర్థం అయినది. మరి నాకు ఈ చక్రం ఇచ్చే త్రికాలజ్ఞానము వచ్చినదో లేదో తెలుసుకోవటానికి నా జన్మ వివరాలు తెలుసుకోవడం ఆరంభించాను. అప్పుడు నాకు ధ్యానములో నా మనోనేత్రం నందు పరమ శూన్యము కనబడసాగింది. అందునుండి ఒక శూన్య బ్రహ్మ వచ్చినట్లుగా ఆయన కాస్త వెయ్యి బ్రహ్మలుగా విడిపోయినట్లు గా అందులో నాలాంటి ఆకారం ఉన్నవాడు కాస్త జ్ఞాన బ్రహ్మ పదవి పొందినట్లుగా నాకు అనుభూతి కలగసాగింది. ఈ జ్ఞాన బ్రహ్మ కాస్త స్వానుభవంతో బ్రహ్మజ్ఞానము పొందాలని ప్రయత్నిస్తూ యోగ సాధన చేయటం జరిగినది. ఈ సాధన మాయ వలన చిలుకగా మారినాడు. ఈ చిలుక నుండి తిరిగి 84 లక్షల జీవజాతులుగా మారినట్లుగా అనుభవం అవసాగింది. ఆ తర్వాత మానవ జన్మ వచ్చినప్పుడు యోగసాధనతో సిద్ధి పొంది విష్ణుమూర్తి అంశతో భగవాన్ వేదవ్యాసుడుగా మారినాడు. దీనితో ఈయన తిరిగి జ్ఞాన బ్రహ్మగా పొందినాడు. ఈయన కాస్త ఉండకుండా తను పొందిన జ్ఞానము లోకానికి తెలియజేయాలని వేదవ్యాసుడు కాస్త వేదాలు పురాణాలు ఇతిహాసాలు భాగవతము మహాభారతము రచించడము జరిగినది. కానీ వీటి అన్నింటి లోనూ భగవంతుడు మహా విష్ణువు అని పరమాత్ముడు ఆకార స్వరూపం అని చెప్పటంతో కాశీ క్షేత్రములో నందీశ్వరుడితో వాదనలో ఓడిపోయి మహాశివుడే అందరికి మహాదేవుడని గ్రహించినాడు. కాశీక్షేత్రంలో ఆకలి సహన శక్తిని భరించలేక కాశీ క్షేత్రమును నిందించటం జరిగినది. ఇదే కాకుండా కాశీ క్షేత్రానికి దీటు అయిన వేద కాశీ నిర్మించటానికి ప్రయత్నించడం అలాగే తల్లి కోరిక మేర తమ్ముడి భార్యలతో సంగమించి ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు సంతానముగా ఇవ్వటం శుకమహర్షికి జన్మ తండ్రి కావటం ఇలా శివనింద, కాశీ  నింద, స్త్రీల నింద, దేవి నింద శాపాలు పొందటం జరిగింది అని నాకు అవగతమైనది. ఈ శాపాల నివారణ కోసం కొన్ని పునఃజన్మలు ఎత్తుతూ ప్రతి 48వ మానవ జన్మలో యోగ సాధన చేస్తూ కర్మఫలాలు తగ్గించుకుంటూ మిగిలిన జన్మలో కర్మలు పెంచుకుంటూ వెయ్యి కోట్ల సంవత్సరాలు నడవటం జరిగినదని నా మనో దృష్టికి వచ్చింది. ఆది జన్మ కారణాలు ఈ ప్రస్తుత జన్మ వివరాలు తెలిసినాయి అని అనుకుంటూ ఇక రాబోవు భవిష్య జన్మలున్నాయా అనే సందేహం రాసాగింది. ఇంతలో ఎవరో నాతో చెబుతున్నట్లుగా నా రాబోవు భవిష్యత్ జన్మ కనపడ సాగింది. అది అమెరికాలోని లాస్ వేగాస్ లో ఉన్న ప్రాంతమని అది ఒక చెక్క ఇల్లు నిర్మాణంలో నాలుగు బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు కనపడ సాగింది. నా తల్లిదండ్రులుగా జోసెఫ్- జెన్నిఫర్ గా ఉన్నారని నా పేరు మైఖేల్ అని పిలువ సాగినారు. అచ్చంగా వీడు ప్రస్తుతం నా పోలికలతో ఉండేసరికి నాలో భయం అనుమానం మొదలైనది. ఆర్కిటెక్చర్ జాబ్ చేస్తున్నాడు అంటూ నా భార్య సంతానం వివరాలు ఇలా మున్నగు విషయాలు అంటే ప్రస్తుతం ఆ జన్మ తర్వాత వచ్చే జన్మ వివరాలు ఇంత స్పష్టంగా కనబడుతుంటే అసలు ఏమి జరుగుతుందో నాకేమీ అర్ధం అవ్వటం లేదు. అంటే రాబోవు జన్మలు కూడా ముందుగానే నిర్దేశించబడినాయి అని నాకు అవగతమయ్యేసరికి నా స్వామి రంగా! నా బొంద. నా బూడిద. ఇంకా సాధన చేయటం ఎందుకు అనిపించసాగింది. ఇంతలో ఇంకా భవిష్యత్ జన్మలు ఏమీ కనిపించక పోయేసరికి అంటే ఈ జన్మలో ఏదో ప్రారబ్ద కర్మ వలన నా భవిష్య జన్మ అమెరికాలో ఉంటుందని అనిపించసాగింది. ఆ జన్మ నా తల్లిదండ్రులు చాలా స్పష్టంగా కనబడేసరికి నోటి మాట రావటం లేదు. ఈ భవిష్య జన్మకు కారణం ఏమై ఉంటుందని అనుకుంటూ ఉండగా ప్రస్తుత జన్మలో నేను కాస్త అమెరికా వాసులు అయిన మన వాళ్ళకి జాతక సమస్యలు పరిష్కారాలు తీర్చడం వారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలా 91 మందికి సేవ చేయటం వలన వారిలో కొంతమంది ఈయన అమెరికాలో వచ్చి స్థిరపడితే బాగుంటుంది గదా అంటూ నన్ను అడగటం నేను సరే అనడము నాకు లీలగా గుర్తుకు రాసాగింది. అంటే వీరి మనో సంకల్ప బలం నాకు ప్రారబ్ధకర్మ గా మారి మైఖేల్ జన్మకు కారణం అవుతుందని అర్ధం అవసాగింది. అంటే నా సాధన శక్తితో ఈ భవిష్యత్ జన్మ కారకమైన ప్రారబ్ధకర్మ నివారణ చేసుకునే అవకాశం ఉన్నదని అవగాహన రాసాగింది. అంటే రాబోయే జన్మలు తమ సాధన శక్తితో నాశనము చేసుకోవటానికి యోగసాధన అవసరమవుతుందని స్ఫురణకు రాసాగింది. అలాగే ఈ భవిష్యత్ జన్మ అయిపోతే మళ్ళీ వెయ్యి సంవత్సరాల వరకు జన్మ అనేది ఉండదని మళ్లీ నేను దేనికో స్పందించడం వలన 2323 సంవత్సరానికి మానవజన్మ మొదలై 2424 వరకు అనగా వెయ్యి సంవత్సరముల వరకు కొనసాగుతాయని అంటూ ఆదిత్య 369 సినిమాకి లాగా 2424 సంవత్సరముల వరకు నేను ఎత్త బోయే భవిష్యత్ జన్మలు టకటక మంటూ వరుసగా కనబడుతూ ఉండేసరికి నా కళ్ళు తిరగటం ప్రారంభించినది. వామ్మో! వాయ్యో! అసలు నా ప్రమేయం లేకుండా వెయ్యి సంవత్సరములు విశ్రాంతి కలిగిన తరువాత మరో వెయ్యి సంవత్సరముల పాటు నా భవిష్యత్ జన్మలు ఎవరు ఇలా ఉండాలని నిర్దేశం చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటూ ఉండగా అసలు నిజంగానే నా భవిష్యత్ జన్మ అనేది ఉన్నదా అనే సందేహము రాగానే నాకు ధ్యానము భంగము అయినది. అనుకోకుండా నేను కాశీ క్షేత్రమునకు వెళ్ళినప్పుడు వేద కాశి ప్రాంత దర్శనము చేసుకుంటున్న సమయంలో నా భవిష్యత్ జన్మ తాలూకు తల్లిదండ్రులు తారస పడటం వాళ్లు కాస్త నాకు అమెరికా వాసుల రూపంలో అది కూడా లాస్ వెగాస్ ప్రాంతం నుండి కావటము  నాకు మతిపోయింది. వారి మాటలు బట్టి చూస్తే భారతీయ ఆధ్యాత్మికత అంటే వీరికి చాలా ఇష్టమని కనీసం రాబోవు జన్మలోనైనా ఒక యోగికి జన్మ ఇవ్వాలని అనుకుంటున్నారని నాలాంటి జ్ఞాన గురువులు తమకి పుత్రుడిగా పుట్టాలని ఏకంగా వాళ్ళే నన్ను అడిగి నా కాళ్ళ మీద పడేసరికి నేను యధాలాపంగా తధాస్తు అని దీవించడం జరిగినది. ఆ తర్వాత నేను చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకొని పరమశివుడు కాస్త నా గొయ్యి నాచేతే  తీపించినాడని వారి కడుపున నా అనుమతితో భవిష్య జన్మ కలిగేటట్లుగా చేసినాడని తెలిసేసరికి గతుక్కుమన్నాను. ఆ తర్వాత ఏదో తెలియని దిగులుతో మనోవేదనతో ఇంటికి చేరుకోవడం జరిగినది. ప్రస్తుత రాబోవు నా భవిష్య జన్మను ఎలా అంతము చేసుకోవాలో అర్థం అవటం లేదు. లేదంటే మళ్లీ ఈ ఒక జన్మకి ఆశపడితే మరో వెయ్యి సంవత్సరములు వరకు జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఆ తర్వాత ఉండనే ఉన్నాయి కదా మళ్ళీ వేయి జన్మలు. కాబట్టి మనకు విశ్రాంతి అంటే వెయ్యి సంవత్సరములు కలగాలంటే ఏకైక భవిష్య జన్మను అంతము చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. తద్వారా నాకు వెయ్యి సంవత్సరముల పాటు యోగ నిద్ర మత్తు విశ్రాంతి దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చే 2323 సంవత్సరం నుండి వచ్చే భవిష్యత్తు జన్మలు  ఎవరిచేత నిర్మిస్తున్నారో తెలుసుకోవాలని ఆకాంక్ష మొదలైనది. కారణము లేకుండా కార్యము జరగదు కదా. ఈ భవిష్య జన్మలు ఇలా ఉండాలని ఈ కాలచక్రంలో ఎవరో నిర్మిస్తున్నారని నాలో బలంగా అనిపించసాగింది. అది ఎవరు అని అనుకుంటుండగా నాకు ధ్యానం చేసుకోవాలని బలంగా అనిపించసాగింది. 

శంబల గ్రామం - నా దర్శనానుభూతి:

నేను చక్ర సాధన ధ్యానంలో ఉండగా నా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ వే ఆట మొదలైంది. నా సూక్ష్మధారి యాత్రకు బయలుదేరినాడు అని నాకు అవగతమవుతుంది. టకటక మంటూ దృశ్యాలు కనిపిస్తూ నన్ను దాటుతూ అవి ఏమిటో నేను తెలుసుకుని లోపల 3D డైమెన్షనల్ కనపడ సాగింది.మేరు శ్రీ చక్ర కోట ఈసారి విచిత్రముగా రెండు చక్రాలు డైమండ్ ఆకారంలో ఒకటి ఆకాశమువైపు ఉంటే మరొకటి క్రింద వైపు భూమి లోపల ఉన్నట్లుగా కనపడ సాగింది. అంటే మేరు శ్రీ చక్రాలు 2 అని అనుకుంటుండగా డైమండ్ అనగా నేను పైన ఉన్న శ్రీచక్రం లోనికి ప్రవేశించినానని భూమి లోపల ఉండే శ్రీ చక్రములోనికి ఇంకా ప్రవేశించలేదు అని అనుకుంటూ ఉండగా పైన ఉన్న శ్రీ చక్ర బిందువు నుండి లోపలికి ఒక సొరంగ మార్గం క్రిందకి వెళుతున్నట్లుగా కనపడ సాగింది. అంటే పిరమిడ్ కి అలాగే శ్రీ చక్రమునకు అయిదవ ముఖము ఉంటుందని అది ఆకాశంకేసి చూస్తుందని ఏదో పుస్తకంలో చదివిన విషయం గుర్తుకు వచ్చే సరికి నా సూక్ష్మధారి సొరంగ మార్గంలోనికి ప్రవేశించటం అది కాస్త కొన్ని క్షణాలకి క్రింద ఉన్న బిందువు ప్రాంతానికి చేరుకోవడం జరిగినది. ఈ బిందువులో గిరగిరా తిరుగుతూ ఒక నల్లని శిల కనపడతూండగా అది కాస్త పైకి లేవటం  నా సూక్ష్మధారి అందులోనికి దిగడము అది కాస్త అష్టదళ పద్మ దళ ఆకృతిగా ఉన్న హిమాలయ పంక్తి చేరుకోవడం అంతా నాకు ఒక కలలాగా ఒక ఇంగ్లీష్ సినిమా లాగా కనపడ సాగింది. అక్కడ నాలుగు ద్వారాలు ఉన్న ఒక విచిత్రమైన గ్రామ సరిహద్దులు కనపడటం నా దృష్టిని ఆకర్షించింది. అక్కడ నుండి ఏవో సుగంధపరిమళాలు రావటం ఇదే శంబల గ్రామమని ఇందులోనే సకల జీవరాసులు జీవసృష్టి విధివిధానాలు జరుగుతాయని ఎవరో అంటున్న మాటలు నాకు లీలగా వినబడుతూ ఉంటే సుగంధ పరిమళాల వాసనకి నా సూక్ష్మధారికి యోగమత్తు ఆవరించగా నిద్ర మత్తు ఆవరించినది. మూడు రోజుల తర్వాత కానీ మెలుకువ రాలేదు. అంతా ఒళ్ళు నొప్పులు. ఎవరో ఏనుగు పెట్టి త్రొక్కినట్లుగా కండరాలు నరాల బాధ నన్ను పీడించసాగినాయి. అంటే శంబల గ్రామం అనేది ఉన్నదని ఇందులో ఉన్న వారే భవిష్యత్ జన్మలు నిర్మాణాలు చేస్తున్నారని ప్రస్తుతం వారి దగ్గరికి వెళ్లడానికి నా సాధన శక్తి సరిపోవటం లేదని నాకు అర్థమైనది. ఇది నిజమా కాదా అని పుస్తకాలు తిరగేస్తుంటే ఒక శంబల ప్రభువు గురించి చెప్పే పుస్తకంలో హిమాలయాలలో డైమండ్ ఆకారంలో రెండు కలిసి ఉన్న స్పటిక శ్రీ చక్ర నిర్మాణము ఒకటి ఉన్నదని అది ఎవరికి సామాన్యముగా కనిపించదని దివ్య దృష్టి ఉన్న యోగులకు మాత్రమే ఇది కనిపించునని దీనికున్న ఐదవ ముఖము ద్వారా లోపల ఉన్న సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి గలిగితే సకల దైవ స్వరూపం ఆవాసమైన శంబల గ్రామం దర్శనము కలుగుతుందని దీనికి గుర్తుగా అక్కడ సుగంధ పరిమళాలు వస్తాయని వీటి మత్తు తట్టుకుని లోపలికి వెళ్లగలిగిన వారికే ఈ గ్రామ ప్రవేశ యోగ్యత ఉంటుందని వ్రాసిన విషయము చదవగానే నా కళ్ళవెంట సన్నగా  కన్నీరు రాసాగింది. అంటే నిన్న రాత్రి నేను ధ్యానములో చూసిన దృశ్యాలు అక్షర సత్యాలని నాకు అర్థం అయ్యే లోపల నా మనో దృష్టి యందు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి సూక్ష్మశరీరము కనపడసాగడము మొదలైనది. 

మా జిజ్ఞాసి అనుభవాలు:

అంటే ఇప్పుడు వీరు వారి ఈ కాలచక్ర అనుభవాలను తనతో పంచుకోవాలని అనుకుంటున్నాడని నాకు అర్థం అయినది. కాలజ్ఞాని! నేను శంబల గ్రామం లోనికి వెళ్లి అక్కడ ఉన్న వారిని పలకరించి బయటికి వస్తుంటే ఈ గ్రామపరిసరాలలో యోగ మత్తులో ఉన్న మీ సూక్ష్మ శరీరం కనబడినది.దానిని లేపకుండా నేను తిరిగి వచ్చేసాను. మీరు మీ తెలివితేటలతో శనీశ్వరుడి అనుగ్రహము వలన ఈ చక్ర కాలుడు నోటికి అందకుండా తప్పించుకోవటం నాకే భలేగా ఆశ్చర్యం అనిపించింది. కానీ పాపము మా అమ్మ అయిన దీక్షాదేవి సాధన కాస్త ఈ కాలుడు చేతికి చిక్కడమే కొంత బాధగా అనిపించినది. ఏది ఏమైనా కానీ మీ దక్షిణాచారం పద్ధతి శ్వాస అనే చేపలు తింటూ ఈ కాలచక్రము దాటుకుంటూ మీరు శ్రీ చక్ర కోట పరిక్రమము చేయటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చినది. మీ సాధన అంతా నేను ఎప్పటికప్పుడు నా మనోనేత్రం ద్వారా చూస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ మీరే నన్ను చూడటం లేదు. ఎక్కడ సిద్ధులు ఉపయోగించుకుంటే సిద్ధ మాయలో పడతారని మీకు భయం గదా. అందుకే అమృతబిందువు వద్ద సిద్ధగణాలు మీకు బ్రహ్మ పదవి ఇస్తానని చెప్పిన మౌనము వహించి ఉన్నారు కదా. నాకు ఎంతగానో నచ్చినది. మీ నిగ్రహ శక్తికి నా జోహార్లు. తద్వారా మీరు వివేక బుద్ధి జ్ఞానం పొంది కాలాతీత స్థితి పొందటం సంతోషంగా ఉంది. ఇక నా సాధన విషయానికి వస్తే నేనేమో ఈ చక్రంలో వచ్చే అష్టభైరవులు దీక్షలో కపాల భైరవమూర్తి దీక్ష తీసుకుని చేపలు తింటూ అర్ధరాత్రులు స్మశానమందు దీనికి సంబంధించిన క్రతువు విధివిధానాలు చేసుకుంటూ గడప సాగినాను. ఈ దీక్షలో ఒక బైరవి స్త్రీమూర్తిని గురువుగా ఎంచుకుని సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు నాకు నరసింహ స్వామి ఉపాసకురాలైన నరసింహ బైరవి దీక్ష తీసుకున్న స్త్రీమూర్తి నాతో జత కలిసినది. ఈమెను నగ్నముగా మార్చి స్త్రీ గురువుగా ఎంచి కన్నె పూజలు చేయటం ఆమెకి నైవేద్యముగా వివిధ రకాల చేపలు పెట్టడం జరిగినది. ఇలా పన్నెండు నెలలు పాటు ఆమెను అర్చించినాను. ఈ నగ్న దేహం అలాగే ఈమె నగ్నత్వం నన్ను నిగ్రహంలోనికి రానీయకుండా చేయలేకపోవడంతో అంటే నాకు ఇంద్రియ మనో నిగ్రహము స్థితికి వచ్చేసరికి హిమాలయాల్లోకి వెళ్లి దత్త భైరవుడి అనుగ్రహమును పొంది తద్వారా స్పటిక శ్రీ చక్ర దర్శనం పొంది దానిద్వారా శంబల గ్రామం దర్శనము పొందమని నా భైరవ గురుదేవుడు ఆజ్ఞాపించేసరికి నేను హిమాలయాలకి వెళ్లడం జరిగింది. హిమాలయాలలోని రహస్య ప్రాంతమైన స్మశానమునందు ఆనంద భైరవి సాధన జరుగుతుందని నా మనో దృష్టి యందు కనిపించేసరికి అక్కడికి వెళ్ళడము జరిగినది. అక్కడ ఎంతో మంది భైరవులు భైరవీలు తమ దీక్షలతో ఉండటం నేను గమనించాను. అలాగే నిత్య యవ్వనం లో ఉన్న బైరవీలు అలాగే ముసలి వయసులో ఉన్న భైరవులు ఉన్నట్లుగా గ్రహించినాను. ఇంతలో అక్కడికి పెద్ద జడలతో బాగా పెరిగిన వికృత గోర్లతో నడుముకి ఎర్రని మనిషి చర్మము ఒకటి ధరించి చేతిలో మానవ కపాలం పట్టుకొని పాటలు పాడుతూ ఒక వ్యక్తి లోపలికి రావడం జరిగినది. ఈయన రావటము చూసి మిగిలిన వారంతా తమ తమ స్థానాల నుండి లేచి వారికి అభివాదం చేస్తూ ఉంటే ఈయన వీళ్ళకి ఆశీర్వాదము చేస్తూ అక్కడ ఏర్పరిచిన వేదిక మధ్యలో చేరుకుంటూ ఈయన ఈ భైరవులు అందరికీ మహా గురువు అని నాకు అర్థం అయింది. ఆ తర్వాత ఒక 16 సంవత్సరాలు వయస్సు ఉన్న ఒక బైరవీని ఈ వేదిక మీదకు తీసుకుని రావడం జరిగినది. ఈమె చక్కటి దేహ సౌందర్యంతో ముగ్ధ మనోహర నవ్వుతో ముట్టుకుంటే మసిబారే శరీర రంగులో మాయలకే మహా భువనసుందరిలాగా ఉన్నది అని నాకు అర్థం అయింది. కొన్ని క్షణాలలో మహా గురువు ఈమె దగ్గరికి వచ్చి ఈమె నుదుటిమీద త్రినేత్రం చిత్రీకరిస్తూ ఈమెకి గంధ లేపనము అత్తరు పుయ్యడము సుగంధ వాసనలు వచ్చే పువ్వులు పెట్టడం ఇలా షోడశోపచార విధి విధానములలో ఈమెను బైరవి గా పూజించడం జరుగుతోంది. ఇంతలో ఈయన మిగిలిన భైరవుల వైపు తిరిగి ఈ ఆనందభైరవి కోసం ఆనంద భైరవుడు ఎంపిక జరుగుతుంది. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అక్కడ ఉన్న ఒక పెట్టెలో నుంచి ఒక పాముని బయటకు తీస్తూ ఇది ఈరోజు ఎవరి మెడలో పడితే వారే ఈరోజు ఆనంద భైరవుడు అవుతాడు అంటూ పాము మా మీదకి విసరడము జరిగినది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనిని చూసి భయపడలేదు. ఇంతలో ఈ పాము నన్ను చేరి నా మీద ఎక్కింది. వెంటనే ఈ మహా గురువు నా దగ్గరికి వచ్చి అందుకే ఈ ఆనంద భైరవికి తగ్గ ఆనందభైరవుడివి నీవే అంటూ నన్ను ఆ వేదిక మధ్య లోనికి తీసుకొని వెళ్లి నన్ను కూడా షోడశోపచార విధి విధానాలతో పూజించి నా నుదిటి మీద త్రినేత్ర బొట్టు గీసినారు. ఆ తర్వాత మా ఇద్దరిని ఆనంద భైరవుడు బైరవిగా ప్రకటించి మిగిలిన వారందరినీ మాకు నమస్కరించమని ఆజ్ఞాపించారు. అప్పుడు మహాగురువు నా దగ్గరికి వచ్చి యోనిముద్రలతో చేస్తూ మంత్రాలు చదువుతూ వీర్యస్కలనం కాకుండా జాగ్రత్త పడుతూ ఈమెతో మైధునము ప్రక్రియ ఎలా చేయాలో నా చెవిలో రహస్యంగా చెప్పడం జరిగినది. ప్రస్తుతానికి నా సాధన స్థాయి చేపల నుండి యోనిముద్ర పూజ వరకు మాత్రమే ఉన్నదని మిగిలిన మైదున ప్రక్రియ ఈమెతో నేను చేస్తానని వారు నాతో చెప్పి ఆమె చేత లింగముద్ర నా చేత యోనిముద్ర విధి విధానాలతో పూజలు చేస్తూ మధ్య మధ్యలో మద్యము,చేపలు, పంచ మాంసాలు నైవేద్యాలు పెడుతూ మా చేత వీటిని త్రాగిస్తూ తినిపిస్తూ మా ఎంగిలి పదార్థాలను భైరవి ప్రసాదాలుగా అక్కడ ఉన్న మిగిలిన వారికి పెట్టడము నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మహా గురువు ఒక శవము మీద కూర్చుని యోనిముద్రలో పూజ చేస్తూ ఈ భైరవిని పూజిస్తూ శవ సాధన చేస్తున్నారని నాకు అర్థం అయింది.  ఇలాంటి ఆరాధనను శ్రీ రామకృష్ణ పరమహంస తన సహ యోగిని అయిన బ్రాహ్మణ బైరవితో కలిసి యోనిముద్రతో ఒక శవం మీద కూర్చుని కన్నె పూజ చెయ్యటము జరిగినదని వారి చరిత్ర లో చదివిన విషయము గుర్తుకు వచ్చినది. ఇంతలో మహా గురువు తన దగ్గర ఉన్న ఆనందభైరవితో మైదున ప్రక్రియ పూర్తి చేసినారని నాకు అర్థం అయ్యే లోపల అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతా మాయగా ఉంది. కనిపించినది నిజమా అబద్దమా అని అనుకొని నేను అనుకునే లోపల ఈ స్మశానము బయట ఉన్నాను. 

బుద్ధుడి కాలచక్ర కోట యందు మా జిజ్ఞాసి యానం:

ఎదురుగా ఒక దివ్య పర్వతం మంచు గడ్డలతో కప్పి ఉన్నది. కానీ నిజానికి అవి మంచుగడ్డలు కావని ఈ గడ్డలు స్పటిక పలకలు అని సూక్ష్మ దృష్టి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఓహో! ఇది శ్రీ స్పటిక మేరు శ్రీచక్రం అయి ఉండాలని అనిపించి లోపలికి ప్రవేశానికి వెళుతుంటే ఒక ద్వారము వద్ద ఉన్న ఒక ఆవిడ నన్ను ఆపి లోపలికి వెళ్ళాలి అంటే నువ్వు యోగ్యతా పరీక్ష దాటుకోవాలి అంటూ నన్ను ప్రశ్నలు అడగటం ప్రారంభించింది.

1. జీవుడు అంటే ఎవరు?

 ఆత్మయే గాని దేహము కాదు 

2.జీవుడికి దేనియందు అధికారము కలదు?

 కర్మ చేయుట యందు మాత్రమే గాని కర్మ ఫలితమును ఆశించుట యందు ఉండదు.

3. జీవుడికి ఎప్పుడు మోక్షము లభించును?

 బుద్ధి ఎప్పుడు స్థిరబుద్ధిగా మారి అన్ని విషయముల యందు పరిపూర్ణ స్మశాన వైరాగ్యం కలిగి దేనికి ఆశించని దేనికి స్పందించని స్థితి పొంది ఆత్మ ధ్యానమందు ఎల్లప్పుడూ మనస్సు ఉండునో అట్టివానికే మోక్షప్రాప్తి.

4.మోక్ష అనుభూతి పొందటం జరుగుతుందా? 

మరణించిన వాడికి తను మరణించిన విషయము ఎలా అయితే తెలియని స్థితియో అలాగే మోక్షప్రాప్తి పొందిన వారికి తెలియని విచిత్ర అవస్థ. మోక్షము పొందినాము అంటే పొందనట్లు. పొందలేదు అంటే పొందకపోవడం కాదు అన్నమాట. 

5.మోక్షగామి లక్షణాలు ఏమిటి? 

మనస్సునందు కోరికలు జయించుట, నిరంతరము ఆత్మయందు సంతృప్తి పడుట,దుఃఖ రహితుడు, మోహ రహితుడు, ఆశ భయము లేనివాడు, అభిమానము లేనివాడు,అహం లేనివాడు, ఇంద్రియ మనో నిగ్రహము కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచువాడు, నాలుక అదుపులో ఉంచువాడు, సంశయములు లేనివాడు 

6.సాధకుడు ఎప్పుడు మోక్షమును పొందుతాడు? 

ఏ క్షణమున మనస్సు సంపూర్ణ నిర్మల స్థాయికి (అనగా పసివాడి మనస్తత్వంలాగా మారటం) చేరుకుంటుందో ఎప్పుడైతే అన్నిటి యందు ఏకత్వ భావ స్థితి  కలుగుతుందో ఎప్పుడైతే మనస్సు యందు సమదృష్టి సమస్థితి కలుగుతుందో ఆ క్షణమే మోక్షము కలుగును 

7.మోక్షమును పొందటానికి కావలసిన లక్షణాలు ఏవి?

 పాపరాహిత్యం, కర్మ రాహిత్యము, గుణ రాహిత్యము,ఫల రాహిత్యము,స్పందనా రాహిత్యం, ఇంద్రియనిగ్రహము, సంశయం రాహిత్యం,  మనోనిగ్రహము ,భయ రాహిత్యము, ఆశ రాహిత్యము, బాహ్య శుద్ధి, అంతర శుద్ధి, అహింస, సత్యము పలుకుట, త్యాగబుద్ధి, భూతదయ, శాంత స్వభావము, స్థిర స్వభావము, ఓర్పు, సిగ్గు వలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం, దానగుణము,విషయ లోలత్వం లేకుండా ఉండుట, మృదు స్వభావం, నాలుక అదుపు, మనో ధైర్యం కలిగిఉండుట, అసూయ లేకుండుట, కపటం లేకుండుట, ద్రోహ చింతన లేకుండుట, దొంగతనము బుద్ధి లేకుండుట,  ఇతరులను ఆవేశములో తిట్టకుండా ఉండుట, పర స్త్రీ /పర పురుష కామత్వము దృష్టి లేకుండుట, శ్రద్ధ కలిగి ఉండుట, నమ్మకము కలిగి ఉండుట ఇలా ఎన్నో దైవిక లక్షణాలు ఉండాలి.

8.మోక్షప్రాప్తికి అడ్డంకులు ఏవి?

 ఏకైక తీరని కోరిక,ఇష్ట కోరిక, తీర్చే కోరికలు, తీరని కోరికలు, కామము, ఆశ, భయము, అహం, బుద్ధి, మనస్సు, విషయ చింతన, విషయాసక్తి, సంశయము, అరిషడ్వర్గాలు, సప్తవ్యసనాలు, దశ ఇంద్రియాలు, అశ్రద్ధ, అపనమ్మకం, బద్ధకము, అలసత్వము, జ్ఞానము లేకపోవడం 

9.దేని వలన సాధకుడు పతనం అవుతాడు? 

కామము యొక్క ప్రేరణ వలన. ఇక్కడ కామము అంటే కోరిక కావచ్చును లేదా రతిక్రీడ కావచ్చును. దీనికి కారణము దశ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, విషయ చింతన వలన సాధకుడు తన సాధనను పరిసమాప్తి చేసుకుంటాడు.

10. కామమును జయించటం ఎలా? 

మొదట మన దశ ఇంద్రియాలు జయించి చంచల మనస్సుని ధ్యాన ప్రక్రియలతో స్థిర మనస్సుగా మార్చుకొని మన అస్థిరబుద్ధిని మన సాధన విధి విధానాలతో స్థిరబుద్ధిగా మార్చుకునట్లయితే కామత్వము తగ్గి యోగత్వం పెరిగి ఆపై దైవత్వంలోనికి దారితీయును. ఇది మోక్షప్రాప్తికి మార్గము.

ఇలా నేను చెప్పిన సమాధానానికి సమాధానపడి నన్ను భూగృహ శ్రీచక్ర ప్రవేశ పరిక్రమానికి అనుమతి ఇచ్చింది. అప్పుడు నేను ఎలా అయితే భూమిపైన ఉన్న శ్రీ చక్ర ప్రవేశము చేశానో అలా జిజ్ఞాసి కూడా ఈ స్పటిక శ్రీ చక్ర పరిక్రమము చేస్తూ మెట్లు దిగుతూ ఎక్కుతూ పైకి కిందకి అంటూ దిగి చివరికి అమృతబిందువు చోటుకు చేరుకున్నాడు అని నాకు అర్థమైనది. కానీ విచిత్రం ఏమిటంటే ఇతనికి ఎక్కడా కూడా ఎటువంటి దైవాలుగాని మాయలు గాని కనిపించలేదు. అగుపించలేదు. ఒక పెద్ద పంపర పనసకాయ సైజులో కోటి సూర్యుల కాంతి ఒక లక్ష చంద్రకాంతి కలిసి వేల కిరణాలతో తేజస్సు విరజిమ్ముతూ ఒక దివ్య శిల తిరుగుతూ నాకు కనిపించింది. పైగా ఈ శిల నుండి ఏడు రంగులు అనగా ఎరుపు, నీలం, పచ్చ,కాషాయము, తెల్లగా, లేత పసుపు రంగు, నల్ల రంగులో దర్శనము ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క రంగు ప్రజ్వలన ఈ లోకాలలో దీని ప్రభావము కనబడుతుందని నాకు అర్థమైనది. అంటే నలుపు రంగు కనబడితే కరువుకాటకాలు కలగటం, పసుపు వర్ణము కనబడితే ఎవరో దివ్య పురుషుడి దర్శనం ఇలా ప్రతి రంగు దర్శనానికి ఒక ప్రతిచర్య జరుగుతుందని నా మనో దృష్టికి వచ్చినది. ఇదియే చింతామణి శిల అని మరి కొందరు దీనిని కాలగర్భ చింతామణి అని అందురు. దీనికి పంచామృత అభిషేకము చేసి ఆ జలం తీర్థము సేవించిన వారికి ప్రపంచ త్రికాలాలలో జరిగిన జరుగుతున్న జరగబోయే భూత వర్తమాన భవిష్యత్తు కాలజ్ఞానము తెలుస్తుందని ఇలా తెలుసుకున్న దలైలామాలు ఈ బిందువు ప్రక్కనే ఉన్న నాలుగు పలకల గదిలోనికి వెళ్లితే అక్కడ గంధపు చెక్కతో చేసిన ఒక పెద్ద బోషాణం కనిపించినది. కాకపోతే దీనిని అర్హత ఉన్నవారు తీస్తే గంధపు వాసన లు వస్తాయని లేనివారు తీస్తే విషపు గంధపు వాసన వచ్చి వారిని చంపి వేస్తాయని అక్కడున్న శిలాఫలకం చూడగానే నాకు అర్థం అయినది. ఏమి జరిగితే అది జరుగుతుందని నేను ఆ బోషాణం పెట్టేకు ఉన్న ఏనుగు తొండము లాంటి గడియను గట్టిగా పైకి ఎత్తే సరికి ఒక పెద్ద శబ్దంతో ఈ బోషాణం తెరుచుకుంది. అందులో రంగురంగుల సిల్క్ దారాలతో చేసిన గుడ్డలతో చుట్టినదస్తావేజులులాంటి తాళపత్ర గ్రంధాలు కనిపించినాయి. అంటే చింతామణి యొక్క పంచామృత అభిషేక తీర్ధం సేవించిన మహాత్ములకు త్రికాల జ్ఞానం కలిగి రాబోవుకాలం అనుభవాలు భవిష్యత్తు గా కనబడుతుండేది. వాటిని కాలజ్ఞాన పత్రాలుగా ఈ బోషాణంలో పెడుతున్నారని నాకు అర్థం అయినది. అప్పుడప్పుడు ఇక్కడిదాకా కొంతమంది దలైలామాలు వచ్చి భవిష్యత్ దర్శనం దృశ్యాలు పొంది రాబోవు కష్టసుఖాలు తెలుసుకొని భూలోకములోని వారికి సందేశాలు ఇవ్వటం జరుగుతుందని నాకు అర్థమైనది.విచిత్రం ఏమిటంటే అర్హత లేని వారికి ఈ మహత్తర గ్రంధాలు కనిపించకుండా అక్కడ ఉన్న సిద్ధ పురుషులు చేస్తారని మంచు పలకలుగా మారుస్తారని ఎవరైనా దలైలామా ముసుగుతో స్వార్ధానికి వీటిని ఉపయోగించుకోవాలని అనుకునేవారికి ఇలాంటి దుస్థితి కలుగుతుందని నిస్వార్థ యోగులకి వారికి కావలసిన వివరాలు ఉన్న గ్రంథము కాస్త ఈ మంచుగడ్డ నుండి నీటి ఆవిరి లాగా ఈ గ్రంథాలు సాక్షాత్కరిస్తాయని నా మనోనేత్రం నందు అవగతమైనది. ఏవో ఏవో దృశ్యాలు నా కళ్ళముందు సినిమా రీలు లాగా కనబడుతుంటే నవ్వి ఊరుకున్నాను. ఇప్పుడు ఈ కాలజ్ఞాన సిద్దితో వీటిని తెలుసుకుని ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు.ఇదే ఈ చక్ర స్థితి ఉన్నప్పుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కూడా తనకి అబ్బిన త్రికాలజ్ఞాన సిద్ధితో 2500 సంవత్సరముల దాకా జరగబోయే కొన్ని విషయాలు తన మనోనేత్రం ముందు చూసి కాలజ్ఞానం గ్రంథం దర్శించడం జరిగినదని నా మనో దృష్టికి వచ్చింది. శివ జ్ఞాని! నాకు ఒక విషయం అర్థం కాలేదు. మన మనో దృష్టికి త్రికాలజ్ఞాన దృశ్యాలు ఎలా కనబడుతున్నాయి అంటే ఆ దృశ్యం నిర్మాణాలు ఎవరో ముందే చేసి ఉంచారా? మన భవిష్యత్తు ముందుగానే ఎలా నిర్దేశింపబడి ఉంటుందా? దానిని ఎవరు నిర్దేశిస్తున్నారు? ఎందుకు ఎలా నిర్దేశిస్తున్నారో నాకు అర్థం కాలేదు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు అని అనుకునే లోపల ఈ గది కున్న ఒక రహస్య సొరంగ మార్గంనకు ద్వారము పెద్ద శబ్దం చేసుకుంటూ తెరుసుకునేసరికి అందులోనికి ప్రవేశించాను. అప్పుడు నాకు సంతానం పటము నేస్తున్న ఇద్దరు స్త్రీలను అలాగే ద్వాదశ చక్రమును త్రిప్పుతున్న ఆరుగురు కుమారులు శంఖు చక్రం ధరించి ఉన్న ఒక దివ్యపురుషుడును నేను చూడటం జరిగినది. ఇదియే కాలయంత్రం అని నాకు అర్థం అయినది. ఈ కాలయంత్రం తిరుగుట వలన మనకి కాలాలు తిరుగుతున్నాయి. ఈ కాలాలు లో ఉన్న వివిధ జీవరాశి పుట్టుక జీవన విధివిధానాలు అలా ఆ ఇద్దరు వేస్తున్న సంతాన పటమునందు లిఖించబడుతుంది అని అర్థం అయ్యే లోపల నన్ను ఎవరో ఈ యంత్రం లోనికి తోసినారు. అప్పుడు నాకు వివిధ రకాల ఉప చక్రాల వంటి కాలచక్ర స్థాయిలు ఎన్నో ఉన్నట్లుగా ఇందులో కనిపించినాయి. అంటే సుమారుగా నలభై మూడు డైమెన్షన్స్ అన్నమాట. నేను మొదటి డైమన్షన్ లోనికి వెళ్లినప్పుడు నాకు పొడవుగా ఉండే జీవులు కనిపించినాయి. ఇవి మాత్రమే ఉన్నాయి. చేపలు దగ్గర నుండి తిమింగలాలు దాకా అన్నమాట. ఆ తర్వాత నేను రెండవ డైమన్షన్ లోనికి వెళ్లినప్పుడు నాకు పొడవు లోతు ఉండి వెడల్పు లేని జీవజాతులు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత నేను 3D లోనికి వెళ్ళినప్పుడు భూలోకంలో ఉన్న వివిధ రకాల జీవజాతులు కనిపించినాయి. వీటికి పొడవు వెడల్పు లోతు ఉన్నట్లుగా గమనించాను. అలాగే నేను 4D లోనికి వెళ్లినప్పుడు నాకు కాల జ్ఞానమునకు సంబంధించిన త్రికాల దృశ్యాలు ఉన్న దివ్య లోకాలు దైవ లోకాలు గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు అనగా సమస్త విశ్వము కనపడ సాగింది. ఇక 5D లో అయితే నాకు మనలాంటి భూలోకము అంటే భూమి వంటి గ్రహాలు 1700 దాకా ఉన్న మరో పాలపుంత కనిపించసాగింది. ఇక 6D లో అయితే పాలపుంతలోని గ్రహస్థితులు నక్షత్ర స్థితులు పాలపుంత స్థితిగతులు వాటి పుట్టుక కారణాలు మనకు తెలుస్తాయి. ఇక 7D లో అయితే ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ఒకేరకమైన పాలపుంతలు మనకి కనబడతాయి. ఇక 8D లో అయితే ఈ విశ్వ సృష్టి యొక్క ఆరంభం అంతం స్థితిగతుల విశ్వ మూల రహస్యం తెలుస్తుంది. ఇక 9Dలో అయితే ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల పాలపుంతల స్థితిగతుల వివరాలు సంపూర్ణముగా మనకి తెలుస్తాయి. ఇక 10D లో అయితే సమస్త విశ్వము ఏర్పడటానికి గల ఏకైక ఇష్ట కోరిక ఏమిటో మనకి తెలుస్తుంది. ఇక 11 D లోనికి నా జిజ్ఞాసి ప్రవేశించినాడు కానీ మనస్సు బుద్ధి లేని స్థితి పొందటం వలన అక్కడ జరిగే దృశ్యాలు కనిపించే దృశ్యాలకి సాక్షీభూతంగా ఉంటూ ఇలా 43 డైమెన్షన్స్  చేరుకున్నాడని నాకు అర్థం అయింది.వాడు నాకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వాడి నోటి నుండి వాక్ బయటికి రావటం లేదని నాకు అర్థమైనది. వాడు అన్ని డైమన్షన్స్ చూసినాడు గానీ లోకానికి చెప్పలేనివాడు అయినాడు. నాకు తెలిసి 11 D లో ఉన్న శంబల గ్రామానికి మన వాడు వెళ్ళినాడట. ఈ గ్రామము నందు చావులేని ఆత్మలు శాశ్వత మరణమును పొందటానికి సాధన చేస్తూ కనబడతాయట. జ్ఞాన దృష్టితో అన్ని చూస్తుంటారు. వీరికి రాని భాష అనేది ఉండదు. వీరికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న వీటిని ఉపయోగించుకోవటం అనేది ఉండదు. ఇక్కడ ఉన్న వారికి జనన మరణాలు ఉండవు. కేవలము కారణ కర్మలు తీర్చుకోవటానికి వస్తారు. ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రతి వారికి భూలోకంలో అలాగే మిగిలిన పధ్నాలుగు లోకాలలో ఉన్న దైవ స్వరూపాలు ఎవరితో ఒకరితో తప్పకుండా అనుసంధానమై ఉంటారు. మన జీవ జన్మలకి దైవ జన్మలకి కారకులు వీరే అన్నమాట. మన పుట్టుపూర్వోత్తరాలు మన త్రికాలాలలో జరిగే ప్రతి విషయము మనము వాడే ప్రతి వస్తువు మనతో ఉండే ప్రతి జీవి వివరాలు వీరికి తెలిసే ఉంటుందట. అంటే వీరి కను సైగలే మన జీవితాలలో సుఖదుఃఖాలు అంటే నీవే ఆలోచించుకో. కానీ ఇక్కడున్న వారికి అసలు పని ఉండదు కానీ ఎప్పుడూ మనల్ని రక్షించడానికి తప్పు చేస్తే శిక్షించడానికి మనము తప్పు చేసే పరిస్థితులు కల్పించడం లాంటి వాటిని చూడటమే వీరికి ఉన్న ఏకైక పని. అంటే మన భూలోక జీవితాలు అన్నియు కూడా ఎలా ఉండాలో మనము ఏమి తినాలో ఎలా పడుకోవాలో ఎవరితో ఎక్కడ పడుకోవాలో ఇలా ప్రతి చిన్న అంశం కూడా వీరి కనుసైగలతో నే నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదని నేను గ్రహించాను. నిజానికి మన విధిరాత అంటే తలరాతను వీరే వ్రాస్తారని నాకు అర్థమైనది. అలాగే వీరిలో కొంతమంది యోగులు ఏవో ప్రయోగాలు చేస్తూ వారి పరిశోధనలలో ఉండటం నాకు కనిపించినది. అంటే వీరు చేస్తున్న ప్రయోగాలలోని ఉత్తమ ఫలితాలు మనవారి మేధస్సుకు అందేటట్లు గా చేస్తారు. అంటే మన భూలోక వాసులకు లభించే వివిధ రకాల జ్ఞానాలు అనగా తత్వము, ఆత్మ, బ్రహ్మ, కాలజ్ఞానములు అనేవి వీరి సొంతం అన్నమాట. మన సాధన శాస్త్రీయ ప్రగతి వీరు మనకి పెట్టిన జ్ఞాన బిక్ష అన్నమాట. ఇక్కడ ఉన్న వారంతా ఒక రకంగా సర్వజ్ఞులు. సర్వజ్ఞానులు. వీరికి తెలియని దైవ రహస్యాలు అనేవి ఉండవు కానీ శాశ్వత మరణమును పొందడానికి వీరంతా వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే మనము చనిపోయిన విషయము మనము తెలుసు కోవాలని తాపత్రయం తపన అన్నమాట. తెలుసుకుంటే చావు ఉండదు కదా. తెలుసుకోకపోతే మరణము పొందినట్లుగా ఉండదు కదా. ఇదే వీరికి అర్థము కానీ సమస్యగా మారినది. ఈ సమస్యకి పరిష్కారం కోసం కోటి మందికి పైగా కారణ లోక వాసులు36 కోట్ల మంది సూక్ష్మ లోక వాసులు 84 లక్షల స్థూల శరీర వాసులు ఈ ప్రయోగాలు చేస్తున్నారని నాకు అర్థమైనది. 43 డైమన్షన్ లో ఉన్న ఏకైక భగవత్ స్వరూపం బ్రహ్మకపాలం చితాగ్ని యొక్క ఆది సంకల్పము కాస్త 42 డైమన్షన్ లోని ఇష్టలింగ యొక్క కామిని కామేశ్వరి కాస్త ఇద్దరు స్త్రీ మగ స్వరూపా లకి చేరి అది కాస్త భావముగా మారుతుంది.  వీరి భావాలు కాస్త 41D చేరి త్రిముఖ ఈశ్వరుడు త్రిముఖ ఈశ్వరి అక్కడున్న మూడు స్త్రీ-పురుష దేహాలకి చేరి ఆలోచనలు గా మారుతాయి.  40 D లో ఈ ఆలోచనలు చేరి అక్కడున్న నాలుగు తలల ఆసామి ఉన్న కారణ బ్రహ్మలకు చేరతాయి. వీరికి చేరిన ఆలోచనలు క్రియారూపాలుగా మారతాయి. ఇక్కడ నుండి మిగిలిన డైమన్షన్ లోఈ క్రియలు కాస్త ఇచ్చా క్రియలు స్థితి క్రియలు లయ క్రియలు జ్ఞాన  క్రియలుగా ఇలా 112 క్రియావిధానాలుగా మారటం వీటిని చెయ్యటానికి వెయ్యి కోట్ల ఉన్న 84 లక్షల జీవరాశులలో 13 వందల కోట్లు ఉన్న 13 కోట్ల దైవ జాతులు నాలాంటి శరీరము పోలికలు ఉన్న నా పోలికలు ఉన్న ఏడు రకాల శరీరాల వెయ్యి రకాల శరీరాలు ఏర్పరచటం జరుగుతుందని వివిధ రకాల కోటానుకోట్ల సమస్త విశ్వము లోని విశ్వ మండలాలు వీరి సంకల్పబలంతో అసత్యమునే సత్యముగా చూపిస్తున్నారు.ఇలా 3Dలో సృష్టి యంత్రము దాకా వీరి క్రియలు పనిచేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదని నాకు అర్థమైనది. విచిత్రం ఏమిటంటే 11D నుండి 43D వరకు ఉన్న వివిధ రకాల జీవ జాతి స్వరూపాలు ఆకలి వేస్తే అన్నము తినరు. దాహం వేస్తే నీళ్లు త్రాగరు. కేవలము వీరంతా కాంతిని తింటారు. వెలుగు జలమునే త్రాగుతారు. శ్వాసతో బ్రతుకుతారు. శ్వాస లేకపోతే వీరికి చావులేని బ్రతకలేని విచిత్రమైన మరణావస్థ అంటే కోమా లాంటి అవస్థలు పొందుతారు. అందుకే నవనాథులు తాము పొందిన వాయుతార్షణాస్త్రమును ప్రయోగించి వీరందరిని వశము చేసుకోవడం జరిగినది.ఈ అస్త్రము ప్రత్యేకత ఏమిటంటే ఇతరుల శ్వాస గమనమును స్తంభింప చేస్తుంది. దానితో వాయుస్తంభన లోకి వెళ్ళిపోయి ఇతరులకు వశం అవుతారు. సకల దైవ స్వరూపాలు అన్నీ కూడా ఈ అస్త్రముకి బానిస కావడం విశేషం. 

శంబల గ్రామం యందు మా జిజ్ఞాసి యానం:

మరొక విశేషం ఏమిటంటే 11D లో ఉన్న శంబల గ్రామ వాసులు అయిన ఆత్మ స్వరూపాలు తమకి తాముగా సంతానము పొందాలని అనుకోరు. ఎవరికైనా భూలోకము మీద వివిధ సూక్ష్మలోకాల యందు జన్మించాలని కోరిక కలిగితే ఆ ఆత్మ స్వయంగా తనకి కావలసిన తల్లిదండ్రుల రెండు ఆత్మలను ఎంచుకొని వారితో కొంతకాలం ఉన్న తర్వాత వీరికి నచ్చితే ఈ రెండు తల్లిదండ్రులు ఆత్మల సంయోగం చెందే టప్పుడు నీలిరంగు వలయాకారంలో ఈ పిల్ల ఆత్మ వారి లోనికి చేరుతుంది. కొన్ని క్షణాల తర్వాత వీరి కడుపు నుండి ఒక పసుపు వర్ణం ఒక అండము బయటికి వస్తుంది.ఈ అండంలో లోపల పిల్ల కారణ శరీరం ఆత్మ ఉంటుంది అని తెలుసుకున్నాను. ఈ అండమును భూలోక వాసులకు స్త్రీ పురుష గర్భాశయంలోనికి ఆహారం రూపంలో అందించబడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ భూలోక తండ్రికి తనకు సత్ సంతానం కావాలని భూలోక స్త్రీ దగ్గరికి చేరటం వారితో సంయోగం చెందటం గర్భందాల్చి సంతానం కలగడం జరుగుతుంది. బిడ్డ ఏడో నెలలో ఉండగా తన త్రికాల జ్ఞానముతో తను వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటుంది కానీ ఎప్పుడైతే తన తల్లి నుండి వేరు చేసినారో ఆ క్షణమే ఈ బిడ్డకి మాయ తగులుకొని వచ్చిన పని మరిచిపోయి లేని పని కోసం పాకులాడటం చేస్తూ ఉంటాడు. అదే కారణజన్ముడుకి మాత్రమే తను వచ్చిన కారణము గుర్తుంటుంది. మిగతా వారికి అసలు కారణం మర్చిపోయి లేని కారణాలతో తను ఏ కారణం కోసం వచ్చినానో అర్థం అవ్వక పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదియే సృష్టి రహస్యం అని నాకు అర్థమైనది. అక్కడ నాకు తీవ్రమైన శ్వాస గమన ఇబ్బంది వస్తుంటే ఉండలేని స్థితి లోనికి నేను వెళుతున్నానని గ్రహించి లిప్త కాలంలోనే నేను శంబల గ్రామ పరిసరాలలో నుండి బయటికి వచ్చేసాను. ఎలా వచ్చినానో నాకైతే అర్థం కాలేదు. ఈ లోపల మీ సూక్ష్మ శరీరం అక్కడ కనిపించే సరికి నమస్కరించి దీవించి అక్కడ నుండి బ్రహ్మ చక్ర సాధన కోసం పుష్కర్ క్షేత్రమునకు బయలుదేరుతూ మీకు ఈ విషయ అనుభవాలు చెప్పటం జరిగినది. వామాచారంలో భైరవి స్త్రీ గురువుతో మైధున ప్రక్రియ చేస్తూ యోగముద్రలు వేస్తూ అస్కలిత బ్రహ్మచారి గా ఉంటూ నీల సరస్వతి దేవి అనుగ్రహము పొందితే బ్రహ్మ చక్రం ఆధీనము అవుతుందని నాకు స్పురణకు వచ్చినది. స్వామి! అందుకే ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను ఉంటా అంటూ వారు నా ఆత్మ సంధానము నుండి తప్పుకోవడం జరిగినది. అప్పుడు నాకు అయితే మన వాడు ఏకముగా కాలచక్రము 43D కి వెళ్లి రావటం భూ గృహ శ్రీ చక్ర పరిక్రమణం చేయటం శంబల గ్రామ దర్శనము, చింతామణి దర్శనము, కాలజ్ఞాన తాళపత్రాలు దర్శనము పొందటం, త్రికాల జ్ఞాన సిద్ధి పొందటం చూస్తుంటే నాకే తెలియని చిరుపాటి ఆనందం కలిగింది.అలాగే భూ శ్రీ చక్ర త్రికోణాకారము ఆకాశ శ్రీచక్ర యంత్రమును కలిపి ఒక డైమండ్ ఆకారంలో (తెర వేసిన డమరుకం లోని త్రికోణాలు) ఉండటము వలన మన పూర్వ మహర్షులు తమ లలితా సహస్రనామాలలో దీనిని మణిద్వీపము గా (డైమండ్ అనగా రత్నము లేదా మణి) చెప్పటం జరిగిందని నాకు అర్థమైనది. అలాగే కాలాతీత స్థితి అంటే వివేకజ్ఞానము  అని కూడా అర్థం అయినది. వివేక జ్ఞానము వలన మనకి త్రికాలములు లో జరగబోయే జరిగిన జరుగుతున్న విషయాల జ్ఞానము తెలుస్తుందని దీనినే త్రికాల జ్ఞానం అంటారు అని నాకు అర్థం అయింది. మహాకాలుడు మహాకాళిక నోటికి (మాయకి) చిక్కనందుకు నాకు కాశీ క్షేత్రము నుండి కాలభైరవుడి రూపమూర్తి మరియు కాలాధిపతి అయిన సూర్యభగవానుని రూపమూర్తి రావడముతో ...నాకు ఈ చక్రసాధన పరిసమాప్తి అయినదని నిదర్శనము ఇచ్చినందుకు ఆ సర్వేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ యుండగా బ్రహ్మ చక్రంను దక్షిణాచారమైన మైథున ప్రక్రియ అంటే తారక రామ శబ్దం వినటమే ఈ మైధున ప్రక్రియని దీనికోసం 10 యోగముద్రలు అభ్యాస సిద్ది పొందాలని అలాగే ఏకపాద శివ మూర్తిని ఆరాధన చేయాల్సి ఉంటుందని నాకు స్పురణకు వచ్చినది.ఇక ఎందుకు ఆలస్యం. ఇక నాతో ముందుకి బయలుదేరండి. తారక'రామ'మును చేద్దాము.

 శుభంభూయాత్

పరమహంస పవనానంద

****************************************

గమనిక: ఈ కాలచక్రంలో మాకు జరిగిన వింత వింత అనుభవాలు అందరికీ జరగాలని ఉండదు. కేవలము రెండు లేదా ఒక నల్ల సాలగ్రామములు వస్తాయి. లేదా కుక్క బొమ్మలు వస్తాయి లేదా కుక్కను పెంచుకొనే పరిస్ధితి వస్తుంది. ఒకవేళ మీకు నల్ల శివుడి విగ్రహం లేదా నల్ల కాళికా విగ్రహం కానీ వస్తే మీ సాధన ఈ చక్రంలో పరిసమాప్తి అయినట్లేనని గ్రహించండి. 

మా శ్రీమతి దీక్షా దేవికి వచ్చిన మహాకాలుడు:

మా శ్రీమతి దీక్షా దేవికి ఒక అడుగున్నర ఎత్తున్న మహాకాలుడు నల్ల శివుని విగ్రహము ఇంటికి రావడం…. కొన్ని రోజులకి మహాకాలుడు నివాస క్షేత్రమైన ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళడము జరిగినది. దానితో రాబోవు దర్జీ జన్మకి ఏర్పాట్లు చేసుకోవడం జరిగినది కదా. కాబట్టి వీటి యందు బహు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ కాల చక్రంలోని శ్రీ చక్ర పరిక్రమము అలాగే శంబల గ్రామం దర్శన అనుభవాలు నిజమే. ఎందుకంటే ఇంత వరకు మేము ఎన్నో పుస్తకాలలో కాలానికి సంబంధించిన వివిధ రకాల డైమెన్షన్స్ ఉంటాయని అలాగే దేవతలు ఉండే ఒక రహస్య గ్రామము అనేది హిమాలయాలలో ఉంటుందని అదియే శంబల గ్రామము అని మేము ఎన్నో పుస్తకాలలో గ్రంధాలలో చదివినా కానీ నిజానికి అవి ఈ కాల చక్రంలో ఉంటాయని మాకు ఈ సాధన స్థాయికి వచ్చే దాకా తెలియదు. చాలా మంది యోగుల కి ఈ శ్రీ చక్ర కోట పరిక్రమణ అలాగే శంబల గ్రామం దర్శన అవకాశాలు వచ్చినను వెళ్లకుండా వెనక్కి వచ్చిన వారిని నా స్వానుభవం లో చాలామంది హిమాలయ సాధకులను చూడటము జరిగినది. ఎందుకంటే శ్రీ చక్ర అలాగే శంబల గ్రామం మహామాయలో పడితే తమ సాధన ఆగిపోతుందని వారికి ఉన్న భయం వలన వాళ్ళు వెళ్ళటానికి ఇష్టము చూపించలేదని నాకు అర్థం అయినది. 

అలాగే శ్రీ లాహిరి మహాశయులు తనకి దశ విద్యా మహా దేవతలు దర్శనమిచ్చి ఉన్నారని అష్టభైరవీలు అష్టభైరవులు ఒక్కొక్కరిగా దర్శనం ఇచ్చినట్లుగా వారి అనుభవ డైరీలో రాసుకోవడం జరిగినది. అంటే వీరు కూడా శ్రీ కాల చక్రమైన శ్రీ చక్ర పరిక్రమము చేసి ఉండాలి. అలాగే ఒక డైరీలో వీరికి అమృత సముద్రము దర్శనం కలిగినదని దానిని ఈదుతూ వెళ్లేసరికి ఒక బిందువు దర్శనం జరిగినదని కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది అని కూడా వ్రాయడము జరిగినది. ఈ అనుభవాలు చూస్తే వీరు ఈ శ్రీ చక్రములోని బిందువు దర్శనం పొందినట్లుగా అవగతమవుతోంది కదా. మేము క్రొత్తగా ఈ అనుభవాలు పొందలేదని గ్రహించండి. మా కంటే ముందు ఎంతో మంది యోగులు సశరీరాలతో ఈ రెండు రకాల శ్రీ చక్ర శంబల గ్రామం స్వానుభవాలు పొందినారు. ఇప్పటికీ పొందుతున్నారు. వారిలో మేమిద్దరమూ కూడా ఒకళ్ళము అన్నమాట.  మరి మా అనుభవాలు మా ఇద్దరికీ నిజము లాంటి కల. ఈ లోకము లాగా అన్నమాట. ఎవరికి వారికి ఇలాంటి స్వానుభవాలు అయ్యేదాకా నమ్మలేరు. నమ్మకము వచ్చిన తర్వాత ఇక అనుభవాలతో పని ఉండదు. కాలచక్ర సాధనను దక్షిణాచారం లో అయితే శ్వాస సంయమము సిద్ది ద్వారా అయితే అదే వామాచారం లో అయితే  వివిధ రకాల చేపలు (మత్స్యము) తిని భైరవి సాధన ద్వారా సిద్ది పొందడము జరుగుతుంది. ఈ రెండు సాధనలు చేయలేని వారికి సమయాచారము ద్వారా కామము ద్వారా అనగా మీ ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని బాధపెట్టకుండా ఎవరిచేత బాధపడకుండా మీ కోరికలు తీర్చుకుంటూ 12 సంవత్సరాలు ఉండగలిగితే దాని వలన ఈ కాలచక్ర సాధన స్థితులు కలిగి మీకు కాలాతీతమగు వివేక జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ ధర్మము పాటించటం అంత తేలికైన విషయం కాదని గ్రహించండి. కానీ అసాధ్యం కాదు. అలాగని సుసాధ్యము కాదు. సాధన సాధ్యతే సర్వం సాధ్యమే.

ఈ చక్ర సాధనలో ఉన్నప్పుడు నాకు ధ్యానము నందు నల్ల మరియు తెల్లని అశ్వములు దర్శనం అయింది అని చెప్పినాను కదా. కొన్ని సంవత్సరముల తరువాత ఈ రెండు అశ్వములు తెల్ల అశ్వము అనేది హైగ్రీవ సంకేతమని నల్ల అశ్వము అనేది కాలాశ్వమని ఇది సూర్యుడి రధానికి ఉన్న ఏడు గుర్రాలలో ఉండే ఏకైక నల్ల గుర్రము ఇదేనని నాకు తెలిసినది. ఆ నాటి నుండి నాకు ప్రత్యక్ష సూర్యభగవానునిలో సూర్యనారాయణుడిగా హైగ్రీవ ముఖము (తెల్లని గుఱ్ఱము ముఖము) కనబడసాగింది. పైగా నేను ఈ చక్ర స్థితిలో జాగృతి సమయంలో వచ్చిన వివేక జ్ఞాన శుద్ధితో త్రికాలజ్ఞాన జాతకాలు చెప్పటం ఆరంభించి ఈ చక్ర ఆధీనము అయ్యే సమయానికి జాతకాలు చెప్పటం పూర్తిగా ఆపివేయడం జరిగినది. త్రికాల జ్ఞానము వలన ముందుగానే భవిష్యత్తు దృశ్యాలు ఒక సినిమా రీలు లాగా కనబడతాయి. వాటిని చూసి తట్టుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం మనోధైర్యం ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈసాధన చివర స్థితికి వచ్చేసరికి నా దగ్గరికి 2 కుక్క బొమ్మలు రెండు గుర్రాలు అనగా నలుపు-తెలుపు గుర్రాల బొమ్మలు రావడం జరిగినది. పాపము నాకు గుర్రాలను పెంచే ఆర్థిక స్థాయి లేనందున ఇవి కాస్త బొమ్మల రూపంలో వచ్చినాయి అని నాకు అర్థం అయింది. అది ఒకవేళ నిజంగానే ఈ రెండు రంగుల గుర్రాలు వచ్చి ఉంటే నా పరిస్థితి గుర్రాల బ్రతికే అయ్యేది. వాటిని మేపలేక చచ్చేవాడిని.నా పరిస్థితి తెలుసు కనుకనే పాపము కాల స్వరూపుడైన కాలభైరవి ఒక కుక్క రూపంలో సజీవ మూర్తిగా వచ్చి నా చేత నానా అడ్డమైన చాకిరీలు చేయించుకుంటూ నన్ను నానా చంక నాకిస్తుంది. ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదు కదా. ఏ జన్మలో ఈ మహా తల్లిని నిర్లక్ష్యంగా చేసి ఉంటాను. ఇప్పుడు ఈ కుక్క రూపములో వచ్చి తొక్కిపెట్టి నా చేత సేవలు చేయించుకుంటుంది. విధి లిఖితము.ఎవరూ దాటలేరు. ఎవరు మార్చలేరు.

పైగా లాహిరి మహాశయుడు ప్రతి ఆదివారము కాశికాలభైరవుడి గుడికి మాత్రమే వెళ్ళడం విచిత్రముగదా!

*********************

 హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని నగరం ఉందని ఎంతమందికి తెలుసు ?

దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు..అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబల నగరం..ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వికులు చాలామంది చెబుతారు. కాని ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ఇక హిట్లర్ ఈ ప్రదేశం గురించి వెతికి వెతికి అలిసిపోయారట.. శంబల నగరంపై కొన్ని నమ్మలేని నిజాలు మీకిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

కొన్ని పరిశోధనలు, అలాగే కొన్ని భారతీయ గ్రంధాలు, ఇంకా బౌద్ధ గ్రంధాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని దానిపేరు శంబల అని తెలుస్తోంది. దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు.

వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్యులు చెబుతున్నారు.

అదొక పవిత్రమైన ప్రదేశమని...అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది.

అంత సీక్రెట్ గా దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పణంగా పెట్టి సేకరించగలిగారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది.

ఆ ప్రదేశం అణునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని అక్కడ నివసించేవారు నిరంతరం సుఖసంతోషాలతో జీవిస్తుంటారని వారికి బాధలన్నవే తెలియవని కూడా చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంధాలు సైతం చెబుతున్నాయి.

ఇక పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని "ది ఫర్బిడెన్ ల్యాండ్" అని " ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కుడా శంబల నగరం గురించి తెలుసు.

పురాతన గ్రంధాల ప్రకారం లోకంలో పాపం అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

శంబాలలో నివసించే వారు మహిమాన్వితులు అని తెలుసుకున్నరష్యా ఆ నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలటరీ ఫోర్సును పంపి పరిశోధనలు కూడా చేయించింది. ఇది 1920లో జరిగిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది.

అప్పుడు శంబల కి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని..అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని కూడా ఆ ఆధారాలు చెబుతున్నాయి.

అద్భుతాలు అంటే ఇష్టపడే నాజి నేత హిట్లర్ కూడా 1930 లొ శంబల గురించి తెలుసుకొవడానికి దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడట.

దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబలకు పయనం కట్టాడని అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అంటారు.

పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లెవట్ స్కీ  ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వ మానవులు అంతా షాక్ తిన్నారు.అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబల అధ్యాత్మిక వేత్తలు పడనివ్వలేదు.దానితో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనకకి తిరిగాడని ఆమె తెలిపారు. 

వాటిల్లో నిజమెంత అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతే కాక ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ శంబల నగరంలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు.

ఇదంతా ఓ ఎత్తయితే...గోభి ఎడారికి దగ్గరిలో ఉన్న శంబలనే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రములో రాసాడని మరికొంతమంది అంటారు. దీన్నే పాశ్చాత్యులు "plaanets of head center గా పిలుస్తారు.

ఫ్రాన్స్‌ చారిత్రక పరిశోధకురాలు , బౌద్ద మత అభిమాని, రచయిత్రి డేవిడ్ నీల్ కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ళ వయస్సులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారు ఆశీస్సులు పొందిందని అందువల్లనే ఆమె ఏకంగా 101 years బ్రతికింది అని అంటారు.ఆమె oct 24 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8 , 1969 లొ మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లొ కాలుమోపిన తొలి యూరప్ వనిత ఆమేనని కూడా తెలుస్తోంది.

ఇక షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోనిన్ కూడా శంబల అనేది భువి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు.

అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితొ నైనా సంభాషించగలరని , ఎక్కడ జరుగుతున్న అభివృద్ది అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు.వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యుర్ డో న్డప్ చెప్పిన దాని ప్రకారం శంబల వయస్సు అర మిలియన్ సంవత్సరాలని తెలుస్తోంది. శంబల ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని తెలుస్తోంది. వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా వారికుందని పురాతన గ్రంధాలు సైతం చెబుతున్నాయి.

మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఎవ్వరికీ తెలియని మిస్టరీనే.. చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోభి ఎడారి వస్తుందని..దీనికి అంతు దరి ఉండదని దాన్ని దాటిన తర్వాత ఈ నగరం కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హిమాలయాల నడిబొడ్డులో హిమవన్నాగాల మధ్య మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంధాలు చెబుతున్నాయి.

కొంతమంది పరిశొధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబల టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు. ఆ శంబలనే " శ్వేత దీపం" అని ధ్రువ లొకం అనే పేర్లతో పిలుస్తారని వారు చెబుతున్నారు.

మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటివరకు రహస్యమే.. అంతే కాదు ఆ ప్రదేశమనేది ఉందా అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి చారిత్రక పరిశోధకులు ఆ నగరాన్ని బయటి ప్రపంచానికి అందిచే రోజు కొరకు వేచి చూడాల్సిందే.

*********************

నా సాధన పరిసమాప్తి సమయములో

నా సాధన పరిసమాప్తి సమయములో నేను కాస్త కాశీలోని కాలభైరవుడి దర్శనార్ధము వెళ్ళుతుండగా ఒక సాధువు మంచి వీర్రావేశములో ఉండి కాలభైరవుడి విగ్రహమును చూస్తూ... “స్వామి! నీకు ఏమి పని లేదా?ఒకసారి ఆనందమును ఇస్తావు...మరొకసారి బాధను ఇస్తావు...ఇదింతా నీవు తిప్పే కాలచక్రమాయ వలనే గదా ఇదింతా జరుగుతుంది...అందరికి ఆనందాలే ఇవ్వవచ్చు గదా...బాధలెందుకు పెట్టినావు?” అక్కడే ఉన్న నేను వెంటనే ఆయనతో “స్వామి!ఈ స్వామి ఆపని చెయ్యకపోతే నువ్వు ఈ లోకములో బ్రతకలేవు!ఎపుడు ఆనందాలున్న అనుభవించలేవు.అలాగే ఎపుడు కష్టాలున్న భరించలేవు.కాబట్టి నీ గతజన్మల ప్రారబ్ధకర్మను  బట్టి అపుడపుడు ఆనందాలు అలాగే కష్టాలు ఒకదానితర్వాత ఒకటి మనకి అందిస్తూ ఆనందము విలువ అలాగే కష్టము విలువ తెలిసేటట్లుగా కాలచక్రమును తిప్పుతున్నాడు.పైగా ఆనందాలు ఎక్కువకాలము గుర్తు ఉండేటట్లుగా చేస్తూ బాధలు తక్కువకాలములో మర్చిపోయేటట్లుగా చేస్తున్నాడు.పైగా నీ గతజన్మలు ఏవియు నీకు గుర్తులేకుండా మరుపు ఒక వరముగా ఇచ్చాడు. లేకపోతే గత జన్మలో నువ్వు గజ్జి కుక్కవని తెలిసినదో...నువ్వు ఈ లోకములో బ్రతకగలవా?ఆలోచించు. కాలమాయ విలువ ఏమిటో తెలుస్తోంది అని చెప్పి వాడి మనోనేత్రమును కొన్నిక్షణాలుపాటు తెరిచి ఉండేటట్లుగా చేసి కాలభైరవుడి దర్శనానికి వెళ్ళిపోయినాను.కొన్ని నిమిషాలు తర్వాత మళ్ళీ వీరి దగ్గరికి వెళ్ళినపుడు ఆయన వెంటనే “స్వామి!నా గతజన్మలు చూసుకొని తట్టుకోలేకపోతున్నాను.కాలచక్రమాయ విలువ తెలిసినది. తెరిపించిన నా మనోనేత్రమును నాయందు దయ ఉంచి మూసివెయ్యండి.తట్టుకోలేకపోతున్నాను.నా తప్పు తెలిసినది.ఈ సృష్టిలో ప్రతి కార్యానికి ఒక కారణమున్నదని ఇపుడే తెలిసినది అంటూండగానే వారి త్రినేత్రదర్శనప్రాప్తిని ఆపివేసి మౌనముగా బయటికి బయలుదేరినాను.


2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. unit 60:
    shwaasa ni chepalugaa thinalani so ani peelichi ham ani vadalalani ee shabdalu vinapadalani, ee kaala chakram lo unna
    kali,kaaleshwarudu notilo padite punah janma oasthundani rameshwaram, kailasaparvatham,ujjaini laanti kshetra drshanalu
    chesukunte moodu shareeralu thayaaru kavataaniki saadhakudu punaadhi vesukunnatte ani mana laanti vallu 14 lokallo 14 mandi
    untarani asalu moodu rakaala shareeralu ela nirmithavuthayi ani clear ga chepparu,shanaishwarude maaakaludani, srihakra
    darshanam alage ujjaini kshetra darshananiki vellakapovadamtho meeku shanishinganapur nundi konni vasthuvulu raavatam,
    ee chakra sthithilo kukka osthundani dhanni penchukokapothe shaapanga maari malli vanda kotla janmalu ethalani...vammo!
    srichakram etaina okkate anukunna okka vaipu anni kalusthayi migatha vaipu panchabhuthallo edo okati missing untadani
    thelisindi..srichakra parikramana,shambala graama vivarana adhurs..mee raabovu janma alage vishranthi tharvatha 1000 janmala
    vivaralu thelukovatam..jignasi gaari srichakra parikramana anubhavalu,bhairava saadhana vaamaachaaramlo, dakshnachaaramlo
    ela ee chakranni daatinaaro cheppatam bagundi, vammo! okka shmbala graamaniki enni perlu,enni powers enthomandi parishodhanlani
    kuda theliyajesaru.

    రిప్లయితొలగించండి