మా కపాలమోక్షం విధానం
మా కపాలమోక్షం విధానం మాకు జరగబోయే జీవ సమాధి స్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆలోచన వచ్చింది. నిజానికి మా జాతకరీత్యా 2032 జీవ సమాధి యోగ స్థితి ఉన్నదని మాకు తెలుసు. కాకపోతే మా త్రినేత్రం ద్వారా భవిష్యత్ దృశ్యాలు చూసే అవకాశం ఉండటం వలన జరగబోయే మా జీవసమాధిని చూడాలని తెలుసుకోవాలనే తపన మాలో 2019 ఏప్రిల్లో వచ్చిన శ్రీ రామ నవమినాడు కలిగినది. దానితో మేము ధ్యాన తపస్సులోనికి ఆరోజు వెళ్లడం జరిగింది. దాదాపుగా 16 గంటల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం లో ఉన్నాము. ఇంత సమయం ధ్యానములో ఉన్నావని మాకు తెలియదు. అలా ధ్యానములో ఉండగా మేము శవాసనములో పడుకుని మా స్థూల శరీరము సమాధి స్థితిలో ఉన్నట్లు గా మా త్రినేత్రమునందు సదృశ్యం అయినది. అదికూడా కాశీక్షేత్రంలో పంచగంగా ఘాట్ పరిసర దృశ్యాలు మాకు కనిపించాయి. అంటే మా సద్గురువైన శ్రీ త్రైలింగస్వామి వారి సమక్షంలో మా సజీవ సమాధిస్థితి కలుగుతోందని మాకు అర్థం అయినది. ఇంతలో మా బొడ్డు ప్రాంతం నుండి ఒక పెద్ద శబ్దం పెద్దగా వినబడుతూ ఉండటం ఆపై కుండలిని శక్తి ప్రవాహం ధాటికి మా శరీరంలో ఉన్న అన్ని యోగ చక్రాలు అలాగే గ్రంధులు విభేదనము చెందుతూ ఒక్కొక్క చక్రానికి రావడం జరుగుతోందని అటుపై ఇక్కడ ఉన్న చిట్టచివరిది నా హృదయ గ్రంధి కూడా విభేదనము చెందటంతో ఇప్పటిదాకా ఉన్న 84 అంగుళాలు ఉన్న శరీరం కాస్త రేణువు పరిమాణంలోకి మారిపోవడంతో అటుపై సూర్యనాడి ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకోవడంతో అటుపై చితాగ్ని దహనశక్తిని సుమారు 48 నిమిషాల పాటు అనగా ఐదు లక్షల శక్తిని తట్టుకుని ఆపై ఒక లిప్త కాలం పాటు సహన శక్తి కోల్పోవటంతో తిరిగి రేణువు వంటి ఆకాశ శరీరము కాస్త సూర్యనాడి ద్వారా హృదయ చక్రానికి చేరుకొని అటుపై ఒక అంగుళ పరిమాణంగా మారి నీలి ఆకాశం జ్యోతి గా మారి హృదయ గ్రంధి విభేదనము నుండి త్రినేత్రం ద్వారా బయటకు వచ్చి నీలి ఆకాశంలోకి నీలి రంగు జ్యోతి ప్రయాణించటం అటుపై మా స్థూల శరీరం నుండి రక్తం బయటకు రావడంతో విచిత్రంగా కాశీ విశ్వేశ్వర లింగం లోనికి ప్రవేశించకుండా దూరాన ఉన్న శ్రీశైల క్షేత్రం లోని మల్లన్న అయిన మల్లిఖార్జున లింగము యందు నా ప్రాణ జ్యోతియైన నీలి రంగు జ్యోతి విలీనమయ్యే దృశ్యాలు నా మనోనేత్రం ముందు కలిగినాయి. దానితో మాకు ధ్యానభంగం అయినది. ఈ విధంగా నా జీవసమాధి కలుగుతుందని తెలుసుకొని మౌనం వహించాను. సాక్షి భూతంగా చూసినాను. అంతా సాక్షీభూతంగా చూసి మౌనం వహించినాము.
మా జిజ్ఞాసి కపాలమోక్షం విధానం:
నిజానికి ఇతనికి జాతకరీత్యా 2036 జీవ సమాధి యోగ స్థితి ఉన్నదని మాకు తెలుసు. కాకపోతే మా త్రినేత్రం ద్వారా భవిష్యత్ దృశ్యాలు చూసే అవకాశం ఉండటం వలన జరగబోయే మా జీవసమాధిని చూడాలని తెలుసుకోవాలనే తపన మాలో 2019 నవంబర్ల్లో వచ్చిన కార్తీకమాస కార్తీకపౌర్ణమినాడు కలిగినది.మా యోగ మిత్రుడైన మా జిజ్ఞాసి నాగాసాధువు యొక్క శరీర త్యాగం చేసే రోజు రానే వచ్చింది. మా ప్రియశిష్యుడు ఆయన సన్నిధానంలో ఉన్నట్లుగా మనో దృష్టిలో కనిపించసాగింది. జడలు కట్టిన జుట్టు ఉన్న శరీరముతో ఎక్కడా కూడా చెంచాడు మాసం లేని ఎముకలు పైకి కనిపిస్తున్న గూడా ఎముకల బలముతో గట్టి శరీరముతో దిగంబరముగా ముఖములో బ్రహ్మవర్చస్సుతో మెడలో కపాలమాలతో చేతిలో మానవ కపాలముతో కపాల రుద్రుడిలాగా మా జిఙ్ఞాసి మాకు అగుపించాడు. ఇంతలో ఆయన చుట్టూ సుమారుగా 35 మానవ కపాలాలు చుట్టూ చేరి తిరుగుతుంటే ఈయన వాటికేసి చిరునవ్వు నవ్వుతూ వాటికి శెనగలు పెడుతూ ఉంటే అవి కాస్త వీటిని కరకర నములుతూ ఉంటే మన ప్రియశిష్యుడు బిక్కమొహం వేస్తూ ఉంటే ఈ కపాలాలన్ని కూడా గత జన్మలో వీరు పొందిన కపాలమోక్షం కపాలాలని ప్రస్తుతం కపాలమోక్షం కోసం ఈ జన్మ ఎత్తి యోగసాధన చేసినారు అని మాకు అర్థమయింది. ఇంతలో
మనో బుద్ధి అహంకార చిత్తములు నేను కాదు….
శ్రవణ జిహ్వలు కాని నేత్ర గ్రహణములు గాని నేను కాదు…..
పంచభూతాలు నేను కాదు నేను శాశ్వత ఆనందమగు సచ్చిదానందమును……
అట్టి వాడిని నేనే శివుడిని నేనే శివోహం…..
అంటూ మా జిజ్ఞాసి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. ఆ తర్వాత మూడు సార్లు ఓంకారనాదం ఆపై తుంకార నాదం చేస్తూ తనలో తారక రామ బ్రహ్మ శబ్దము చాలా పెద్దగా చాలా స్పష్టంగా బయటికి వినబడుతూ ఉండగా ఈయన భృకుటిలో నిలిచి ఉన్న ప్రాణవాయువు ఒక బుల్లెట్ లాగా పైకి వెళ్లి దశమ రంధ్రము అయిన మాడు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రంని ఛేధించుకుని బయటికి వెళ్లి పోయినది. దానితో చితాగ్ని రావాల్సిన చోట కొద్దిగా రక్తము రావడం జరిగినది. ఈయన శరీరము పక్కకి వంగి పోతూ ఉండగా ఈయన కపాలము నుండి అగ్ని తేజస్సు బయటికి వచ్చి శరీరమును దహించడం ఆరంభమైనది. యోగాగ్ని తో ఈయన దహనం అవుతున్నారని మేము గ్రహిస్తుండగా ఈయన దహాగ్ని నుండి ఒక దివ్య జ్యోతి వెలుగు ఈశాన్య దిశ వైపు ప్రయాణిస్తూ ఆకాశ మార్గం లోనికి వెళ్లి ధ్రువతారగా నిలబడిపోవటం గమనించే సరికి ఈయన దహాగ్ని అగుపించలేదు. శరీర విభూతి కూడా అగుపించలేదు. ఆ ప్రియ శిష్యుడు అక్కడ ఇదంతా చూసి ఆనందంతో కూడిన సంతృప్తితో ఆ ప్రాంతంలో ఉన్న జ్వాలాముఖి దేవాలయం దర్శనానికి బయలుదేరడంతో ధ్యానభంగం అయినది. మాకు కూడా ఆనందంతో కూడిన సంతృప్తి కలిగింది. ఒక జీవి యొక్క జీవితం వృధా కాలేదని సంతృప్తిగా ఒక దేహ జన్మకి విముక్తి కలిగింది కదా. ఎందుకు అంటే సర్వేంద్రియాలు నిగ్రహించి మనస్సును హృదయమునందు స్థిరముగా నిలిపి అట్లు వశమైన స్థిర మనస్సు ద్వారా ప్రాణ శక్తిని హృదయ చక్రం ముందు నిలిపి సర్వేశ్వరునియందు ఎంతో ధ్యానంలో నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్ఛరిస్తూ నిర్గుణ పరబ్రహ్మమైన నన్ను చింతించుచూ దేహత్యాగము మొనర్చువాడు పరమగతిని పొందును. ఇట్టి పరమ సిద్ధిని పొందిన మహాత్ముడు నన్ను చేరిన పిదప దుఃఖాలకు మూలమైన నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరని స్వయంగా శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది కదా. అంటే వరి గింజ పైన ఉన్న ఒక పొర తొలిగితే ఎలా అయితే బియ్యపు గింజగా ఉంటుందో ఇక ఆ బియ్యపు గింజ తిరిగి వరి గింజగా ఎలా మారదో అలా అజ్ఞాన పొర తొలగిన వారికి మా జిజ్ఞాసి జన్మరాహిత్యము పొందినారు అర్థం అయినది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు మా ఇంటి యందు సత్యనారాయణ స్వామి పూజ చేస్తుండగా ఒక సాధువు భిక్షువు మా ఇంటికి వచ్చి మాకు బాగా ఆకలిగా ఉంది అన్నం పెడతారా? అని సైగలు చేయగానే ఇంకా పూజ పూర్తి కాకపోయినా ఇలా పిలవకుండా వచ్చిన అతిథి స్వయంగా శ్రీమన్నారాయణుడే అని తలంచి మా అమ్మగారు వారికి కడుపునిండా భోజనం పెట్టడం జరిగినది. ఇలా భోజనము తిని వెళ్ళిపోతున్న సాధువును చూసి మా ఏకైక పరమశిష్యుడు ఆశ్చర్యము చెందుతూ “స్వామి! మీరు ఇలా…. ఎలా మీకు కపాలమోక్షం జరిగింది కదా” అంటూ వారి కాళ్ళ మీద పడగానే “సర్వేజనా సుఖినోభవంతు” అని మౌనంగా దీవించి వెళ్ళినారు. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత వచ్చిన వారు జిజ్ఞాసి అని మేము గ్రహించాము. ఎందుకంటే
ఆత్మ శాంతి పొందినవాడు
సకల సంసార బంధాల నుండి
విముక్తి పొందుతారు.
విముక్తి పొందిన వారు ఇతరులకు
బంధనాల నుండి విముక్తి చేయుటకు
వివిధ రూపాలలో వచ్చి ప్రయత్నిస్తూనే ఉంటారని
మేము గ్రహించినాము. ఎందుకంటే వీరికి మూల కపాలమోక్షం జరిగేదాకా ఇలాగే చేయకతప్పదని మాకు స్పురణ అయినది. అంటే కృష్ణ బిల్వము అయిన బ్రహ్మాండ చక్రము సంపూర్తిగా నశించిపోవాలి అన్నమాట.అపుడే సాధకుడికి సంపూర్ణ కపాలమోక్షం స్థితి కలుగుతుంది. అప్పటిదాకా ఇలా ఎప్పుడైనా మీకు నన్ను చూడాలనిపిస్తే ఏదో రూపంలో వచ్చి భోజనం చేసి అందర్నీ దీవించమని వేడుకోవడం తప్ప మేము ఏమీ చేయలేక పోయాము. శాశ్వత మరణమైన జీవన్ముక్తి కోసం నీలి ఆకాశం కేసి మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఇంతకి మా కాశీయాత్ర కైవల్య సాధన గూర్చి తెలుసుకోవాలని ఉందా?దానికి మీరు ఏమి చెయ్యాలో తెలుసు కదా.
శుభంభూయాత్
పరమహంస పవనానంద
***********************************
గమనిక:ఇపుడిదాకా మీరు చదివిన మా జీవ సమాధి వివరాలు అన్నిగూడ మా ఆది సమాధి దృశ్య వివరాలని తెలుసుకోండి.అంటే ఆదిలోనే నేను లేను.కాని ఈ శాశ్వత మరణ జ్ఞానానుభూతిని నేను పొందకపోవడము వలన నేను మరణించిన విషయము గ్రహించకపోవడము వలన రేణువు వంటి మా ఆకాశ శరీరము కాస్త అంగుళ పరిమాణ సంకల్ప శరీరముగా రూపాంతరము చెందినది.అటుపై ఇక్కడగూడ మరణించిన విషయము గ్రహించకపోవడము ఈ అంగుళ శరీరము కాస్త మూడు అంగుళాల కారణ శరీరముగా రూపాంతరము చెందినది. అటుపై ఇక్కడగూడ మరణించిన విషయము గ్రహించకపోవడము ఈ మూడు అంగుళాల కారణ శరీరము కాస్త 83 అంగుళాల సూక్ష్మ శరీరముగా రూపాంతరము చెందినది. అటుపై ఇక్కడగూడ మరణించిన విషయము గ్రహించకపోవడము ఈ 83 అంగుళాల సూక్ష్మ శరీరము కాస్త 84 అంగుళాల స్ధూల శరీరముగా రూపాంతరము చెందినది. అటుపై ఇక్కడగూడ మరణించిన విషయము గ్రహించకపోవడము ఈ 84 అంగుళాల స్ధూల శరీరము కాస్త మళ్ళీ తిరిగి 83 అంగుళాల సూక్ష్మ శరీరముగా రూపాంతరము చెందినది. అటుపై తిరిగి మళ్ళీ కారణ, సంకల్ప చివరికి రేణువు వంటి మా ఆకాశ శరీరముగా రూపాంతరము చెందినది. మరణించిన విషయము గ్రహించకపోవడము మళ్ళీ అక్కడనుండి తిరిగి సంకల్ప, కారణ, సూక్ష్మ, స్ధూల శరీరముగా రూపాంతరము చెందినది. నేను కాస్త బలహీనత మాయకి గురిగావడము వలన అపస్మారక స్ధితిని పొందూతూ ఉండుట వలన ఇలా కొన్ని కోట్లాను కోట్ల సం!!రాలుపాటు ఈ చేస్తున్న పనినే చేస్తుంది.కాని ప్రస్తుత సాధన జన్మ వలన మా ఏక మూలకపాలం నందు నేనులేను అని స్వానుభవానుభూతిని పొందడముతో తద్వారా మాకున్న వివిధ శరీరాల బలహీనతల మహామాయలు దాటడముతో మా ఆకాశ శరీరమునకు కపాలమోక్షస్ధితి అనగా శాశ్వత నిశ్చలస్ధితిని పొందడము జరిగినది. దానితో మాకు మిగిలిన నాలుగు శరీరాలైన సంకల్ప,కారణ,సూక్ష్మ,స్ధూల శరీరాలకి మరణస్ధితి జ్ఞాన అనుభూతిని ఇచ్చేవారు లేకపోవడముతో వీటికి మా ఇచ్ఛా మరణసిద్ధితో వరుసగా మా 42,46,48,54 సం!!రాలలో అనగా రాబోవు 12సం!!రాల కాలములో ఈ సం!!రాలలో ఈ నాలుగు శరీరాలకి అనగా విష జ్వరమువలన,నయంకాని సుగర్ వ్యాధివలన,గుండెవ్యాధి వలన,కిడ్నీలు వ్యాధివలన ఇచ్ఛామరణము కలుతుంది.అదే విధముగా మా జిజ్ఞాసికి గూడ రాబోవు 12సం!!రాల కాలములో ఎపుడైన ఎలాగైన తన నాలుగు శరీరాలకి గూడ ఇచ్ఛామరణ సిద్ధి ద్వారా శరీర త్యాగము చేస్తాడు అన్నమాట. ఇక దానితో మా ఇద్దరికి మా పంచశరీరాలకి పంచకపాలమోక్షస్ధితిని పొందడము వలన మాకు సంపూర్ణ కపాలమోక్షం జరుగుతుంది. తద్వారా మేము కాస్త శూన్యము నందు శూన్యమైపోతాము. ఇదియే అసలు సిసలైన మా సంపూర్ణ కపాల మోక్షస్దితి అన్నమాట.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండి