అధ్యాయం 80


శుభవార్త:

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx








కామి గాని వాడు మోక్షగామి కాలేడు

ఎవరైతే ఇష్ట పదార్థం మాయను అలాగే ఇష్ట కోరిక మాయను దాటుతారో అనగా ఇష్టలింగ కామేశ్వరుడు కామేశ్వరి స్థితిని దాటుతారో  అలాగే ఓంకారనాదం మరియు తుంకార నాదము స్థితిని దాటుతారో వారు కాస్త ఇష్ట లింగేశ్వరుడుగా మారతారు అని వీరినే కపాల లింగేశ్వరుడుగా పిలుస్తారని నాకు జ్ఞాన స్పురణ అయినట్లుగా కిందట అధ్యాయములో చదివినారు కదా. అంటే నా ఇష్ట పదార్థంగా మిరపకాయ బజ్జీలు అలాగే నాకు ఇష్ట కోరికైన శృంగారం మాయలను నేను దాటడం జరిగినది. అలాగే ఓంకారనాదం మరియు తుంకార నాదము దాటి నిశ్శబ్ద నాదమునకు అనగా విశ్రాంతి ఆలోచన స్థితికి చేరుకోవడం జరిగింది. అప్పుడు విచిత్రంగా నాకు శ్రీశైల క్షేత్రం నుండి ప్రకృతి సిద్ధమైన శివలింగ దొండ కాయ విత్తనాలు అయిన శివలింగాకృతుల మాల రావడం జరిగింది. అలాగే నాకు శ్రీ కాశి క్షేత్రం నుండి కపాలమాల రావడం జరిగినది. అలాగే రుషికేశ్ నుండి స్పటిక మాల రావడం జరిగినది.కొన్నాళ్ళకి మాకు రుద్రప్రయాగ క్షేత్రం నుండి ఒక లింగాకార పానమట్టం ఉన్న స్పటిక లింగం వచ్చినది. మరికొన్ని రోజులకు నేపాల్ ప్రాంతంలోని గండకీ నది నుండి అంగుళం పరిమాణంతో ఉన్న సాలిగ్రామం వచ్చింది. ఇలా వచ్చిన వస్తువులు ఏమి చేయాలో ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఇదివరకైతే చక్రాలలో ఉంటే ఆ చక్ర దైవిక వస్తువులు వచ్చేవి. ప్రస్తుతం మేము అంతిమ సాధన స్థితిలో అనగా బ్రహ్మరంధ్రములో ఉన్న సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రమునందు ఉన్నాము. ఇక్కడ ఏమీ వస్తువులు వస్తాయో ఎవరికీ తెలియదు. వస్తాయని కూడా తెలియదు. ఎందుకంటే ఈ చక్ర స్థితిలో సాధకుడు తన ఇష్ట కోరికైనా కామాన్ని జయించి అసంకల్పిత బ్రహ్మచారిగా ఉండగలగాలి. అప్పుడు ఈ బ్రహ్మాండ చక్రం ఆధీనం అవుతుంది. తద్వారా అది మనకి అతిశక్తివంతమైన సుదర్శన ఆయుధం గా మారి విశ్వాధినేతని చేస్తుంది.లేదంటే బాలోన్మత్త పిశాచ అవస్థలు ఇచ్చి పరమ అవధూతగా మారుస్తుంది. అంటే కామాన్ని జయించ లేనప్పుడు అనగా సంసారికి లేదా బ్రహ్మచారికి ప్రకృతి నియమం ప్రకారము 3వ 5 వ 7 వ 9 వ 11 రోజులు ఆపై ప్రతి నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి తొమ్మిది నెలలకు ఒకసారి 11 నెలలకు ఒకసారి ఆపై వరుస గా 1, 3, 5, 7, 9, 11 సంవత్సరాలు పాటు కామము లేని అనగా శృంగారము లేని స్థితికి నెమ్మది నెమ్మదిగా సాధకుడు చేరుకుంటే అప్పుడు ఈ సాధకుడు వీర్యం కాస్తా రక్తముగా మారకుండా మెదడు భాగము లోనికి చేరి మేధో సంపత్తి నాడికి బలమును ఇచ్చి పీనియల్ గ్రంథిలో ఉన్న నిద్రలేని అవస్థలో ఉండే కారణ శరీరానికి ప్రశాంతతను కలిగించి యోగ నిద్రను కలిగిస్తుంది. తద్వారా సాధకుడు నిశ్చల మనో స్థితిని పొందుతాడు. ఒకవేళ ఈ విధానంలో సాధకుడు తట్టుకోలేక పోతే ఉన్మాద స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అకారణముగా కోపావేశాలు విసుగు చికాకులు ఏమీ చెయ్యబుద్ధి కాదు అలాగని ఏమీ చేయకుండా ఉండలేకపోవడం ఏమీ అనకుండా ఉండలేకపోతారు.ప్రతిక్షణం అకారణముగా ఏదో తెలియని స్థితిలో ఉంటాడు. అంతెందుకు సంసారిక మూడవరోజు శృంగార సుఖం అందకపోతే ఎలాంటి అసహనశక్తి పొందుతాడో లోకవిదితమే కదా. మరి 11 సంవత్సరాలపాటు సంసార సుఖము అనగా శృంగార భావాలు కలిగిన వాటిలో అనుభూతి పొందకుండా ఆలోచన లేని స్థితికి మనస్సును తీసుకునివెళ్ళటం అంత తేలికైన విషయం కాదని ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. 
 
అంతెందుకు నా పరంగా చూస్తే ఎప్పుడైతే మా శ్రీమతి దీక్షాదేవి హిమాలయాల్లోని కైలాస పర్వత దర్శనమునకు వెళ్లిన సమయంలో మాకు హృదయ చక్రం ఉపాసన నవపాషాణం ఇష్ట లింగం రావడం జరిగినది. దానితో మా ఇద్దరిలోనూ ఒక తాపత్రయం సంపూర్తిగా తగ్గడం ఆరంభమైనది. అప్పుడప్పుడు నాకు మా దీక్షాదేవి మీద కామ కోరికలు కలిగినాయి. ఆ సమయంలో ఆమెకి దగ్గరకు చేరిన ఆమె మీద అప్పటిదాకా ఆమె మీద ఆలోచనలు ఉండేవి కాస్త “శృంగారం అవసరమా? ఈ అస్థిపంజర దేహముతో రతి సుఖం ఏమిటి?” అని వైరాగ్య భావాలు వచ్చేవి. ఆమెకి కూడా ఇలాంటి ఆలోచనలు కలిగేవి. అంటే శరీరము కోరుకుంటుంది కానీ మనస్సు కోరుకోవడం లేదని మా ఇద్దరికీ అర్థమైంది. మనస్సు లేని కోరికతో ఎంత సంసారం చేసిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే భావప్రాప్తి కలిగిన అందులో తృప్తికి బదులు అసహనం తో కూడిన అసంతృప్తి కలుగుతుంది. ఇంకా అలాంటప్పుడు శరీరాలు కలవడం ఎందుకు? ఇబ్బందులు పడటం ఎందుకు అనిపించేది. తృప్తి ఇవ్వలేని దాంపత్య సుఖమునకు మేమిద్దరము దూరమవుతూ వచ్చాము. కాని ఈ ప్రకృతి కలిగించే కామ ఆలోచన నుండి దూరం కాలేక పోయాను. శరీరాలు కలవకపోయినా కూడా సహనంగా ఉన్నాను కానీ కామ ఆలోచన వచ్చినప్పుడు దానిని తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. కానీ భార్య దగ్గరికి వెళ్లాలనిపించేది కాదు. అలాగని కామ భావాలు తగ్గేవి కావు. నా సామిరంగా. నా పరిస్థితి ఇది ఏమనాలో అర్థం అయ్యేది కాదు. తినాలనిపిస్తుంది. తినలేను. అంటే గడ్డివాము దగ్గర కుక్క కాపలా లాగా ఉంది. అంటే ఇది గడ్డి తినదు. తినే వాటిని దగ్గరికి చేరనివ్వదు. అలాగే నా పరిస్థితి అన్నమాట. కామ భావాలు విపరీతంగా కలుగుతాయి కానీ వాటిని తీర్చుకోలేను. భార్య సహకారం ఉన్నా కూడా తీర్చుకోలేని స్థితి. ఇలాంటి విచిత్ర స్థితి ఒకటి ఉంటుందని ఈ చక్ర స్థితివచ్చే దాకా నాకు తెలియదు. ఏమి చేయాలో అర్థం కాని స్థితి. ఆలోచించండి. తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో శృంగార దృశ్యాలు వీడియోలు చూసి భావ ప్రాప్తి పొందటం అలవాటయింది. కానీ ఇది కొంతమేర తృప్తినిచ్చేవి కానీ సంపూర్తిగా తృప్తినిచ్చేవి కావు. దీనితో దీనికన్నా భార్యతో సంసారసుఖం అనుభవించవచ్చు కదా అనిపించేది. కానీ దగ్గరికి వెళితే వైరాగ్య భావాలు కలిగేవి. నా సామిరంగా.అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి. అలాగని ఉండలేని స్థితి. నామీద నాకే అసహ్యం వేసేది. నా పరిస్థితి ఇలా ఉంటే యోగ మిత్రుడైన జిజ్ఞాసి కాస్త బ్రహ్మచారి గా ఉన్నాడు కదా. కానీ ఇది వరకు వారికి నెలకు ఒకసారి ఎప్పుడైనా కామసంబంధ వీర్య స్కలనము స్వప్నము నందు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోయేది. దానితో వారు పెద్దగా దీని గురించి ఆలోచించేవాడు కాదు. పైగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైతే మన వాడు కూడా ఈ చక్ర స్థితికి వచ్చినాడో అప్పుడు ప్రతి మూడు రోజులు ఒకసారి విపరీతమైన కామ ఆలోచన కలిగేవి.దానితో మనవాడు శృంగార వీడియోలు చూస్తూ భావప్రాప్తి పొందిన కూడా సంతృప్తి కలిగేది కాదు. వాడికి కూడా ఏమి చేయాలో అర్థం కాని స్థితి. ఈ చక్ర స్థితిలో కలిగించిన కోరికైనా శృంగార ఆలోచన భావ స్థితికి సంసారికి అలాగే బ్రహ్మచారికి ఒకే విధంగా ఉంటాయని నాకు అర్థమైనది. వాడికి భార్య లేదు. నాకున్నా ఉపయోగం లేదు. దానితో మా ఇద్దరికీ ఏమిచేయాలో ఎలా చేయాలో అర్థం కాని స్థితి. ఇలా కాదనుకుని మేమిద్దరము కూడా శృంగార దృశ్యం వీడియోలు చూడటం ఆపివేశాము. దానితో నా సామిరంగా. విపరీతమైన అసహనంకు గురి అయ్యేవాళ్ళం. అకారణముగా కోపావేశాలు కలుగుతూ ఉండేవి. సహన శక్తిని పెంచుకోవడం అంటే ఇదేనని మాకు అర్థం అయినది. 

ఇలా కామముతో ఉండకూడదని కుమారస్వామి లాగా ఉండాలని మనస్సుకు చెబుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ ప్రపంచంలో కామానికి మూలము అందము గదా.ఈ ప్రకృతిలో అందమైన పక్షులలో నెమలి ప్రధమస్ధానములో ఉంటుంది.ఈ అందమాయను దాటితే మనలో కామము పోతుంది.18సం.రాలు వయస్సు ఉండే శరీర అందము 80 సం.రాలు వయస్స వస్తే అపుడికేదాకా అందముగా కనిపించిన ఈ శరీరము కాస్త వడిలిపోయి అందహీనముగా ఉంటుంది గదా.అందుకే నెమలి చూడటానికి చాల అందముగా అధ్భతముగా కనపడుతుంది.కాని ఈ అందము దానికి శాశ్వతము కాదని తెలియదు.అలాగే మన శరీరాల అందాలు శాశ్వతము గాదని ఇవి అందాల మాయ అని మనకి చెప్పటానికి   అలాగే శ్రీ కృష్ణుడి నెమలి పింఛను తల మీద పెట్టుకునే స్థాయికి అనగా అందము వలన వచ్చిన శృంగార భావాలు కలిగినప్పుడు మాత్రమే భావప్రాప్తి పొందటానికి సంసార సుఖములో ఉండేవాడు. అదే కుమారస్వామి అయితే ఆధీనము చేసుకుని వాహనముగా మార్చుకున్నాడు.అనగా ఈయన అందము మీద అలాగే కామము మీద స్మశాన వైరాగ్యము పొందాడు. అంటే ఈయన సంపూర్తిగా శృంగారము మీద పట్టు సాధించి దానిని ఆధీనము చేసుకుంటే శ్రీకృష్ణుడు మాత్రం దానిని అదుపులో ఉంచుకునే వాడు.అనగా కుమారస్వామి శృంగారం అనేది ఒకటి ఉన్నది అనే ఆలోచన లేని స్థితి అనగా స్త్రీ పురుషాంగాల తేడా తెలియని దిగంబరత్వం తత్వమునకు చేరుకుంటే శ్రీకృష్ణుడు మాత్రము మనస్సుకు శృంగార ఆలోచన వచ్చినప్పుడు దానిని అదుపులో ఉంచుకుని శృంగారంలో పాల్గొన్న కూడా వీర్యప్రాప్తి చెందకుండా ఉండేవాడు అన్నమాట. అంటే ఈయనికి స్త్రీపురుష బేధం ఉండేది, కుమారమంగళంకి ఈ భేద భావం ఉండేది కాదు. నేను ఇదే స్ధితిని పొందాలి అని నాకు అర్థం అయింది. సంసార సుఖానికి అలవాటైన మనస్సు కాస్త మాంసం తిన్న పులికి గడ్డి పెడితే తింటుందా? తినదు కదా. అలాంటిదే నా పరిస్థితి. కాకపోతే నా విషయంలో శ్రీ కృష్ణుడి లాగా కామము అదుపులో ఉంచుకునే స్థితిని పొందవచ్చును. అదే జిజ్ఞాసి బ్రహ్మచారి అయితే సాధన చేస్తే నిలకడ కలిగితే కుమారస్వామి లాగా కామ ఆధీనమును పొందవచ్చును. ఎందుకంటే బ్రహ్మచారికి ఆడ శరీర వాసన ఉండదు కదా. కేవలము మనస్సు కలిగించే కామ ఆలోచనలు మాత్రమే కలుగుతాయి.వీటిని అదుపులో ఉంచుకోగలిగితే కుమారస్వామి అవుతాడు. లేదంటే నికృష్టుడు అవుతాడు. విపరీతమైన కామవాంఛకి  బలి అయి సంసార సుఖం ప్రాప్తి పొందడానికి నానా చంకలు నాకడం ఆరంభిస్తాడు. తప్పుగా ఇలా దాదాపుగా ఇలా శృంగార భావాలు తట్టుకోలేక నాశనం అయిన వారిలో ఒక పీఠాధిపతి, ఒక మఠాధిపతి, ఒక పరమ గురువు, ఒక పరమహంసను నేను నా స్వానుభవంలో చూడటం జరిగింది. పాపం వాళ్ళని ఏమి అనలేము. అడుగు దూరంలో సాధనా పరిసమాప్తి సమయంలో కలిగించే విపరీత ఉధృత శృంగార భావాలను ఆయన తట్టుకోలేక శిష్యులు మానాల మీద ఆశ పడటం మొదలు పెట్టినారు. ఆ మాయలో పడిపోయి సంయోగము నుండి సమాధికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ మోక్షగామి కాస్త కామిగామిగా మిగిలిపోయి పునర్జన్మలకి అలాగే ప్రారబ్ద కర్మలు పెంచుకుంటున్నారని తెలియని స్థితిలో ఉన్నారని నాకు అర్థమైనది. కారణం సన్యాసికి సంసారం ఉండకూడదు అని చెప్పినారు కానీ ఎందుకు అని ఎవరూ చెప్పలేకపోయారో మాకు ఈ చక్ర స్థితికి వచ్చే దాకా ఇలాంటి విచిత్ర శృంగార భావ స్థితి కలిగేదాకా అర్ధం కాలేదు. అది అన్నీ ఉన్నా కూడా అనుభవించలేని స్థితి. అలాగని ప్రశాంతత ఉండలేని స్థితి ఉంటుందని తెలియరాలేదు. ఈ స్థితి గురించి ముందే మన పూర్వీకులు మహర్షులు చెప్పి ఉంటే అసలు సాధనకు వచ్చే వాడిని కాను. కాకపోతే ఏమిటి. ఆకలి వేస్తుంది ఏమి తినకూడదు. తిన్నా కూడా ఆకలి తీరదు అంటే ఏమి చేయాలో చెప్పండి. ఇంకా ఆ బ్రతుకు ఎందుకు. నా బొంద. నా బూడిద. ఉంటే ఆకలి వేయకూడదు. ఆకలివేస్తే తీర్చుకోవాలి. కానీ ఆకలి వేస్తుంది కానీ ఆకలి తీరదు అంటే ఏమనాలి. నా బొంద. 
 
 
విచిత్రమేమిటంటే సాధన ప్రారంభంలో మూలాధార చక్రము నందు శృంగార భావాలతో సాధన ఆరంభమవుతుంది. అదే విధంగా సాధన పరిసమాప్తి సమయంలో బ్రహ్మాండ చక్రములో శృంగార భావాలు తట్టుకొనే స్థితి పొందే సాధన స్థితి ఉంది. తట్టుకోలేని వాడు తిరిగి మూలాధార చక్రము నందు చేరుకుంటాడు కదా. అంటే విశ్వాత్మ కాస్త తిరిగి జీవాత్మగా మారిపోతుంది అన్నమాట. అలా నా నా చంకలు నాకి అన్ని రకాల యోగమాయలను దాటుకుని చివరికి సప్త సముద్రాలు దాటి ఇంటి వెనక ఉన్న మురుగు కాల్వలో పడి చనిపోయినట్లుగా మళ్లీ తిరిగి ఉధృతమైన శృంగార మాయలో పడి చావడం ఏమిటి నా బూడిద.నా బొంద.ఇలాంటి విచిత్ర శృంగార స్థితి ఒకటి ఉన్నదని లోకానికి తెలియనివ్వలేదు. దీనిని ఎలా తట్టుకోవాలో కూడా ఎవరూ కూడా చెప్పలేని స్థితికి కూడా అర్థం కాని స్థితి. కుమారస్వామి కూడా శ్రీ వల్లి సమేత దేవసేన వివాహం చేసుకున్నాడు కదా. అధీనము చేసుకున్నా కూడా దానిని అదుపులో ఉంచుకో లేని స్థితిని పొందుతాడు. ఒక క్షణం చాలు పట్టు తప్పటానికి. ఇలాంటి సాధన స్థితికి రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల జన్మలు పడితే ఇట్టి సాధన మాయలో పడటానికి కొన్ని క్షణాలు చాలు కదా అనిపించేది. 

అంతెందుకు నిత్య బ్రహ్మచారి అయిన హనుమంతుడు కూడా ఒక అవతారంలో ప్రసన్నాంజనేయ సమేత సువర్చలా దేవిని వివాహం చేసుకోక తప్పలేదు కదా. అలాగే పాతాళ లోకము నందు ఒక రాక్షస స్త్రీ మూర్తి కి తమ చెమట బిందువు ద్వారానే సంతానము కలిగించినాడు కదా. మైరావణుడు అనే రాక్షసుడిని చంపినప్పుడు ఈయనికి కొడుకు ఉన్నాడని ఆయనకు అప్పుడు తెలిసింది కదా. అంటే చివరికి సాధకుడికి చెమట బిందువులే వీర్యము అవుతుందని ఎవరికి తెలుసు. ఎందరికీ తెలుసు. ఆలోచించండి. అంటే సాధకుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు శృంగార భావనలకు గురి అయితే విపరీతమైన భావ ఆవేశానికి గురి అయి శరీరం నుండి చెమట బిందువులు ఏర్పడి అది కాస్తా వీర్యస్కలనము కలిగించే భావ ప్రాప్తి కలుగుతుందని మాకు అర్ధం అయ్యేసరికి మా  బ్రహ్మాండ చక్రము లాగా మా బుర్రలు తిరగడం ఆరంభించినాయి. ఇన్నాళ్లు వీర్యకణాలు ఎలాగైనా ఆపడానికి ప్రయత్నం సాధన ద్వారా సాధించవచ్చుననే నమ్మకం ఉండేది. కాకపోతే హనుమంతుని చరిత్ర చదివేసరికి మనస్సు కూడా దొబ్బింది. చెమట బిందువులే వీర్యస్కలనము అంటే ఎలా చచ్చేది. అసలే షుగరు …ఆపై బిపి… ఇంకా చెమట పట్టకుండా ఎలా ఉంటుంది. నా బొంద. నా బూడిద. కామికానివాడు మోక్షగామి కాలేడు అన్నారు. నిజానికి కామము లేని వాడు మోక్షగామి కాలేడు అన్నమాట. ఎలా అంటే పని లేని మంగలి వాడు పిల్లి తల గొరిగినట్లు అని అంటారు. నిజానికి పని లేని మంగలి పిలిచి తల గొరిగాడు అన్నమాట.ఇందులో పిలిచి కాస్త మిడిమిడి జ్ఞానంతో పండితులు కాస్త పిల్లిగా మార్చినారు. అలాగే కామి కానివాడు కాదు కామి లేనివాడు అన్నమాట. ఇక దానితో మాకు ఈ చక్ర స్థితిలో వచ్చిన వివిధ రకాల వస్తువులు అనగా లింగ దొండ కాయ విత్తనాలు,డొప్ప ఉన్న విష్ణు సాలగ్రామము,స్పటిక శివలింగము, కపాలమాల రుద్రాక్ష మాల వచ్చినాయి కదా. వీటిని అనగా ఒక వైపున రుద్రాక్షలు అలాగే లింగదొండ కాయలు మరొకవైపు చిన్న స్పటిక మాలగా వేసి లాకెట్ గా డొప్ప ఉన్నవిష్ణుచక్రం అమర్చుకుని దీని పైన ఒక స్పటికలింగమును ఉంచటం కన్నా ఏక బ్రహ్మకపాలం ఉంచటము మేలని ఎందుకంటే సాకార దైవ స్వరూపాలు అన్ని కూడా అంతరించి చివరికి బ్రహ్మకపాలం గా మారినట్లుగా కనబడినారని తెలుసు కదా. దానితో నేను ఈ మాలకి స్పటిక లింగమును బదులుగా ఏక బ్రహ్మకపాలం అమర్చుకుని దీనిని నిత్యమాలగా ధరించడం మేమిద్దరం ఆరంభించాము. అదేమీ చిత్రమో గాని మరుసటి రోజు కల్లా ఇంటర్నెట్ లో ఒకే రోజు 850 దాక శృంగార వీడియోలు చూసే సైట్లను ఆపేసినారు. అంటే మేము తయారుచేసుకున్న కపాలలింగమాల సరైనదని మాకు సరిగా ఉన్నదని ఇలా వెబ్సైట్ల బ్లాక్ తో అర్థం అయినది.
 
అంటే నేనేమో శ్రీకృష్ణుడు లాగ శృంగారంలో అదుపులో ఉంచుకునే స్థితిని అలాగే మా జిజ్ఞాసి కుమారస్వామి లాగా శృంగారం ఆధీనంలో ఉంచుకునే స్థితికి చేరతాం అని మాకు దీని ద్వారా అర్థము అయినది. అందుకే అంత వివరంగా దీనిని రాయడం జరిగినది. ముసలోడికి దసరా పండుగ. ఈ స్థితికి వచ్చేసరికి నాకేమో 40 సంవత్సరాలు. మా జిజ్ఞాసికి 39 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు కామకోరికలు ఏమిటి? నా బొంద. నా బూడిద. అంటే పుస్తకంలో పేజీలు తిప్పడములాగా మా శృంగార భావస్థితి ఉంటుంది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా. కాకపోతే మాకు శృంగార భావాలు కలుగుతాయి కానీ వాటి ఆధీనములో మేముండము. మా ఆధీనములో మా అదుపులోకి ఆ కామ ఆలోచనలు ఉంటాయి. విశ్రాంతి ఆలోచన స్థితి పొందకుండా అలాగే సహజంగా వచ్చే ఓంకారనాదం అదే తుంకారనాదం వినకుండా మనస్సుని మాయలో పడేయటానికి మూల ప్రకృతి ఈ కామ ఆలోచన కలిగిస్తుందని వీటిని అదుపులో ఉంచుకుంటే శ్రీకృష్ణుడు అవుతాము. లేదంటే నికృష్టుడు అవుతాము. కాకపోతే మా కపాలమోక్షం దృశ్యాలు నాకు బ్రహ్మరంధ్రము నుండి వీర్యం బయటకు వచ్చినట్లుగా అదే మా జిజ్ఞాసికి తన బ్రహ్మరంధ్రము నుండి రక్తం బయటకు వచ్చే దృశ్యాలు కనిపించాయి. అంటే నాకేమో సూక్ష్మశరీర కపాలమోక్షం స్థితి అలాగే జిజ్ఞాసికి  స్థూల శరీర కపాలమోక్షం స్థితిని పొందడం జరిగినది. నిజానికి సంపూర్ణ కపాల మోక్షం పొందాలంటే సాధకుడు చిన్నప్పటినుండి అసంకల్పిత బ్రహ్మచారి గా ఉండాలని మాకు జ్ఞాన స్పురణ అయినది. అది జరిగే పనేనా అనిపించింది. కాకపోతే యుక్తవయస్సు వచ్చేవరకు కామ భావాలు ఉండవు కదా. మరి ఈ వయస్సు వచ్చే లోపల ఎంతో మంది చిన్నారులుగా పిల్లలగా వయస్సు వచ్చే సమయంలో అకారణంగా చనిపోతున్నారు కదా. మరి వీరందరికీ ఎందుకు కపాల మోక్షం కలగడం లేదని ఒక రోజు నాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. సందేహం వచ్చింది. మూడు రోజుల తర్వాత నేను అనుకోకుండా మా ఫ్లాట్ టెర్రస్ పై కి వెళ్లడం జరిగింది. అక్కడ చూసిన దృశ్యం చూసేసరికి తల తిరగటం ఆరంభమైంది. అక్కడ ఐదు సంవత్సరాల మగపిల్లవాడు ఆరు సంవత్సరాలు ఆడపిల్ల నగ్నం గా మారి అమ్మానాన్న ఆటతో శృంగార భంగిమలు చేసుకుంటూ కనిపించేసరికి అక్కడ ఏమి జరుగుతుందో లిప్తకాలం నాకు అర్థం కాలేదు. ఈ వయస్సులో కూడా వీరికి శృంగార భావాలు ఎలా కలిగినాయో నాకైతే అర్థం కాలేదు. పాపం వాడికి అది సృష్టి యఙ్ఞము అని కూడా తెలియని చిన్న వయస్సులోనే కామ భావ మాయ ఈ ప్రకృతి వీళ్ళకి ఎలా కలిగించిందో అని తెలుసుకునే సరికి నా బుర్ర తిరగటం పనిచేయడం ఆగిపోయింది. అందుకే చిన్నగా ఉన్నప్పుడు మరణించినా కూడా సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందడం జరగడం లేదని ఎందుకంటే పిల్లకాయలులో గత జన్మలో శృంగార భావాలు మిగిలిపోవడం ప్రారబ్ద కర్మ గా మారిపోవడం జరుగుతోందని ఈ అనుభవం ద్వారా సాక్షీభూతంగా నిరూపణ అయినది. పాపం వీళ్ళని ఏమీ అనలేము. అది ఏమిటో తెలియని పసి పాప మనస్సు వాళ్లది. వీళ్లు నిద్రపోతున్నారు అని వీళ్ళ తల్లిదండ్రులు వారు పక్కనే ఉండగానే శృంగారం జరిపి ఉంటారు. వీళ్లు కళ్ళు తెరిచి చూస్తున్నారని ఆ తల్లిదండ్రులు గమనించి ఉండలేదు. యావ శరీరాల కలయిక మీద ఉన్నప్పుడు ఈ కలయిక వల్ల ఏర్పడే సంతానం మీద ఆలోచన వారికి రాదు కదా. ఈ పిల్లకాయలకి ఇదేదో ఆట లాగా ఉందని అమ్మానాన్న ఆట ఏ కారణంగా ఆడుతున్నారని వాళ్లకు తెలియదు. ఆడకూడదని వీళ్ళకి తెలియదు. తెలిసినవాడు చెప్పలేడు. తెలియనివాడు తెలుసుకోలేడు అనుకుంటే ఈ పిల్లల సంగతి వాళ్ళ పెద్ద వాళ్లకి చెపితే వాళ్లు విచక్షణ జ్ఞానమును కోల్పోయి కొడతారు. వాళ్లకేమో వీళ్ళు చేస్తే తప్పు లేనప్పుడు మేము చేస్తే ఎందుకు తప్పు అయినదో పిల్లలకు అర్థం కాని స్థితి. వాళ్లకి అర్థం అయ్యే విధంగా చెప్పలేని పరిస్థితి తల్లిదండ్రులది. అందుకే జ్ఞాని మాట్లాడడు. మౌన భాషలో చెపుతాడు అది అర్ధమైన వాడు మరో బ్రహ్మ జ్ఞాని అవుతాడు. లేకపోతే అజ్ఞానిగా మిగిలిపోతాడు.దానితో నేను విశ్రాంతి ఆలోచన స్థితిలో ఉండి మౌనంగా ఉండి తుంకార నాదము వింటూ ఆ వచ్చే రికార్డు కపాలమోక్షం దృష్టి అనుభూతి కోసం వయస్సు పైబడి పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూ మౌన సాధన చేస్తున్నాము. ఇక చేయటానికి పొందటానికి ఏమీ లేదు. కేవలం శృంగార భావన ఆలోచనలకి మా మనస్సులు స్పందించకుండా ఉంచుకుంటూ ధ్యాననిష్ఠతో మౌన సాధనతో మౌన బ్రహ్మ గా మారిపోయాము. ఎపుడైతే మాకు సహజంగా వినిపించే నాదము వినిపించటం ఆగిపోతుందో మా హృదయం పనిచేయటం ఆగిపోతుందో అదియే మా కపాలమోక్షం అవుతుంది. ఇది మేమిద్దరము పొందిన కూడా మేము తెలుసుకోలేము కదా.ఈ విచిత్ర స్థితిని అదే మా కపాలమోక్షం రికార్డ్ దృశ్యము కోసము నీలి ఆకాశం కేసి చూస్తూ ఎదురుచూస్తూ మౌనముగా ఆలోచనతో అన్నిటి యందు సాక్షీభూతముగా స్థితప్రజ్ఞతగా ఉంటూ ఆనంద రహితముగా ఉంటూ కాలం గడుపుతున్నాము.
 

ఇది ఇలాయుండగా ఒకరోజు నాకు అంటే సంసారికి అలాగే బ్రహ్మచారికి ఏలా...ఏవిధంగా సంపూర్ణకపాలమోక్షస్ధితి కలుగుతుందని నాకు ధర్మసందేహము కలిగినది.ఒకరోజు నేను చేసే జ్ఞానతపస్సు వలన జ్ఞాన స్ఫురణ కలిగినది. అది మీరు ఎపుడైనా ఓంకారం వంపు ఉన్న ఆవృతములో పిసరంత ఖాళీ ప్రాంతము ఉండి ఆవృతమును పూర్తిగా కలుపదు. ఎందుకంటే ఈ ఆవృతములో  అనగా బ్రహ్మాండ చక్ర స్థితిలో సాధకుడికి వచ్చే ఉద్రిక్త శృంగార భావం నుండి సాధకుడు దాటుకోవాలని చెప్పడం అన్నమాట. శృంగారము అనేది ఈ ఆలోచన సంకల్పం స్పందన బట్టి ఉంటాయని ఈ ఓంకార చిహ్నములో మూడు అంకె పెట్టడం జరిగినది. అలాగే ఎవరైతే ఈ శృంగార భావరహిత స్థితిని పొందుతారో వారికి మణికర్ణిక వంటి తుంకార నాద స్థితిని పొందుతారని అనగా మనస్సు కాస్త మనో నిశ్చల స్థితిని పొందడం జరుగుతుందని సూచనగా ఓంకారం చిహ్నములో అర్ధ చంద్రుడిలో ధ్రువతార పెట్టడం జరిగినది. అర్థచంద్రుడు అంటే సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అన్నమాట. ఇది వెలుగులు విరజిమ్ముతూ కాంతిని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. కాబట్టి దీనికి సంకేతంగా ఓంకార చిహ్నములో వెలుగులు చిమ్మే అర్ధచంద్రుడు పెట్టడం జరిగినది. అలాగే సాధకుడి పంచ శరీరాలు కూడా విభూది రేణువుగాను ఆపై త్రస్యరేణువుగా మారాలని సూచనగా ఓంకార చిహ్నములో అర్ధ చంద్రుడు పైగా ధ్రువతారగా డైమండ్ ను పెట్టడం జరిగింది. త్రస్యరేణువు అంటే ధ్రువతార స్థితి అన్నమాట.ఈ ధ్రువతార ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎలాంటి మార్పులు పొందకుండా నిశ్చల స్థితిలో ఆకాశంలో ఉత్తరదిక్కులో ఎప్పుడు నిశ్చలస్థితిగా ఉండి కనపడుతుంది. ఈ నక్షత్రమును బట్టి ఉత్తరదిక్కు ఏ వైపు ఉన్నదా అని అంచనా వేయడం జరుగుతుంది అన్నమాట. పంచ శరీరాల పంచ కపాలమోక్షం స్థితిని పొందడం జరుగుతుందని కపాల మోక్షం అంటే అనే అధ్యాయంలో ఈపాటికి మీరు తెలుసుకున్నారు కదా. కాకపోతే ఈ పంచ కపాలమోక్షం స్థితిలో మొదటిది ఆకాశ కపాలమోక్షం గాను ఆపై సంకల్ప శరీర కపాలమోక్షం గానూ ఆపై కారణశరీరం కపాలమోక్షం గానూ ఆపై సూక్ష్మశరీర కపాలమోక్షం గాను ఆపై స్థూల శరీర కపాలమోక్షం అవుతుందని నేను ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు నాకు ధ్యాన స్పురణ పొందడం జరిగింది. అంటే దహన అగ్నితో శరీరంలో నాశనము చేసే స్థితి ఆకాశ కపాలమోక్షం స్థితి(శుక మహర్షి) మొదట గానూ ఆపై నీలి జ్యోతి దర్శనం స్థితి అనేది సంకల్ప శరీర కపాలమోక్షం గాను(రమణ మహర్షి) మూడవది కపాలము మీద చితాగ్ని దర్శనము అనేది కారణ శరీరం కపాలమోక్షం గానూ(కావ్య కంఠ మహాముని) నాలుగవది బ్రహ్మరంధ్రం నుండి వీర్యం బయటకు రావడం అనేది సూక్ష్మ శరీర కపాలమోక్షంగాను(రాఘవేంద్ర స్వామి మఠాధిపతి) అది చివరిది ఆఖరిది అయిన బ్రహ్మరంధ్రం నుండి రక్తము లేదా రక్తము చారిక బయటకు రావడం అనేది స్థూల శరీర కపాలమోక్షం (అరవింద యోగి)అవుతుందని మాకు ధ్యాన స్పురణ అయినది. అంటే సాధకుడు చిట్టచివరి స్థితిగా మనందరం నుండి రక్తం బయటికి వచ్చేది రికార్డు దృశ్యము సాధకుడు చూడగలిగితే వారి ముక్తికి జీవన్ముక్తి అవుతుంది.
 
ఎందుకంటే ఈ స్థితిని నిజమైన బ్రహ్మచారి సన్యాసికి మాత్రమే కలుగుతుంది. మా జిఙ్ఞాసికి ఇట్టి స్థితిలో అనగా స్థూల శరీర కపాలమోక్షం స్థితి ఆఖరి సాధన పరిసమాప్తి చేసుకున్నాడు. నాకు మాత్రం భార్య లేదా తల్లి యొక్క కర్మ బంధం ఏర్పడటం వలన గృహస్థాశ్రమంలో ఉండుట వలన సాధన చేసిన అడుగు దూరంలో తన బ్రహ్మరంధ్రం నుండి రక్తమునకు బదులుగా వీర్యం బయటకు వస్తుంది. అంటే మేము స్థూల శరీర కపాలమోక్షం స్థితికి బదులుగా సూక్ష్మ శరీర కపాలమోక్షం స్థితిని పొందడం జరిగినది. ఎందుకంటే సంసారికి సంసార బంధం ఉంటుంది. బ్రహ్మచారికి బ్రహ్మమే బంధంగా ఉంటుంది. అదే ఒక సంసారికి సంసారంతోపాటు బ్రహ్మము బంధంగా ఉంటుంది. అందుకే మా కర్మ యోగి అయిన మా అన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు “ఒరేయ్ చిన్నోడా! సంసారికి ముక్తి మాత్రమే లభిస్తుంది. బ్రహ్మచారికి మాత్రము మోక్షం లభిస్తుంది” అని చెప్పేవారు. అప్పుడు నాకు అది అర్థం అయ్యేది కాదు. సంసారికి కర్మబంధము ఉంటే బ్రహ్మచారికి కర్మ రహిత స్థితి ఉండుటవలన మోక్షమును పొందుతాడు. ఎప్పుడైతే సంసారి సాధకుడు కూడా బ్రహ్మచారిగా అనగా అస్ఖలిత బ్రహ్మచారిగా మారిపోతాడో ఆనాడే కపాల మోక్షం పొందుతారని మాకు గురు దేవుడైన విచిత్ర వేదాంతి చెప్పడం జరిగినది. దానితో విచిత్రంగా నాకు నా భార్య బంధం కాలేదు గాని నా కన్నతల్లి బంధన మాయగా నా విషయంలో ఉండిపోయింది. అది ఏమిటంటే మా తల్లిగారి అంతిమ సంస్కార యాత్రలో సమయంలో నేను ప్రాణాలతో ఉండాలని నా చేతుల సమక్షంలో జరగాలని ఆమె తన చివరి కోరిక అడగటంతో మేము ఆలోచించకుండా సరేనని అనటం నిజానికి నా సన్యాసదీక్ష పొందకుండా మా అమ్మగారు అడ్డుకున్నారు. దానితో బ్రహ్మచారిగా కావాల్సిన చోట సంసారి అయినాను. ఇప్పుడు పెళ్లయిన బ్రహ్మచారి అయినాను. 

 
దీనికంతటికీ కారణం మా అమ్మ గారైన గాయత్రి మాత గారే కదా.అలాగే  నా మంత్ర దేవత కూడా గాయత్రి మాత అయితే నా కామమాయ కూడా గాయత్రి దేవి కావడం విశేషం అన్నమాట. అంటే సర్వం గాయత్రి మయం అయినది. కాకపోతే త్రి మాత గాయత్రులలో కామ గాయత్రిని అలాగే మంత్ర గాయత్రి మాతని దాటటం జరిగినది. కానీ భౌతిక గాయత్రి మాత అయిన మా అమ్మను దాటాలి అన్నమాట. అలాగే గాయత్రీ మాత అంటే ఓంకార స్వరూపిణీ కదా. మా అమ్మ గారికి చాలా ఇష్టమైనది కూడా ఓంకార చిహ్నము అలాగే ఓంకారనాదమే అన్నమాట. నాకు తనకి వచ్చిన ఓంకారం పంచ లోహ చిహ్నమును అదికూడా లింగాకృతిలో ఉన్న చిహ్నమును ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగినది. అంటే ఆనాడు సాధన ప్రారంభంలో మట్టి మోక్ష లింగమును ఇస్తే ఈనాడు సాధన అంతిమములో పంచలోహ ఓంకార శివలింగము మూర్తిని ఇవ్వడం జరిగినది. కాకపోతే నేను సన్యాస దీక్ష తీసుకుని పోకుండా అనుమతి ఇవ్వలేదని బాధ మాత్రం ఈమె విషయంలో నాకు ఉండిపోయింది. కాకపోతే ఈ నిబంధన ప్రారబ్ధకర్మ మాయ నాకు ఉండటం వలన మా అమ్మ అంతిమ సంస్కారం యాత్ర జరిగిన ఎనిమిది నెలలకు అనగా మా అమ్మమ్మ గారి అంతిమయాత్ర జరిగిన ఎనిమిది నెలలకు మా వాసు మావయ్య చనిపోయినట్లుగా మేనమామ వారసత్వము మేనల్లుడికి నాకు ఈ విషయంలో వస్తుందని నాకు అర్థం అయినది. కాకపోతే సజీవ మూర్తి అయిన మా తల్లి అయిన గాయత్రి మాత మాయను 2019 సంవత్సరం దాకా దాట లేకపోవడంతో మార్చి 11 మహాశివరాత్రి నాడు మాకు వీర్య కపాలమోక్షం స్థితి అనగా సూక్ష్మ కపాలమోక్షం స్థితి దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత మేము మానసికంగా మా అమ్మ అలాగే భార్య బంధన మాయను దాటటము వలన పెళ్లైన బ్రహ్మచారి గా ఉండి ఇష్టలింగ శివ లింగ దీక్షతో కపాల లింగధారిగా ఉండటంతో రాబోవు కాలములో మా కపాలము బ్రహ్మ రంధ్రం నుండి రక్త చారిక బయటకు రావడం ఆ పై నల్లటి స్త్రీమూర్తి నల్లటి వస్త్రముతో నల్లటి జుట్టుతో వయో వృద్ధురాలిగా వెకిలి నవ్వుతూ అంతిమ కపాలమోక్షం ప్రాప్తి ఇచ్చే శాశ్వత మరణావస్థ ఇచ్చే ఆదిపరాశక్తి మాకు లీలా మాత్రంగా దర్శనమిచ్చి మా మూల కపాలమును ఆమె చేతిలోకితీసుకుని కపాల భేదన గావించే రికార్డ్ దృశ్యమాలిక మా ధ్యానము నందు కనపడటంతో అంటే ఈ జన్మలో 2019వ సంవత్సరంలో సూక్ష్మ శరీరాన్ని కపాలమోక్షం కలిగితే అదే రాబోయే కాలంలో స్థూల శరీరాన్ని కపాల మోక్షం కలుగుతుందని అది అంతిమ సంపూర్ణ కపాలమోక్షం స్థితి అవుతుందని మాకు అర్థమయింది. అలాగే 10 లక్షల 11 మిలియన్ల కోట్లు సంవత్సరాలకి మా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కూడా సంపూర్ణముగా అంతరించి పరమశూన్యముగా మారి పోతుందని అప్పటిదాకా ఇలా పుట్టుక నుండి జీవసమాధి దాకా రికార్డయిన దృశ్యాలు అందరికీ కనపడుతూ ఉంటాయని నాకు అర్ధం అవ్వటంతో ఒక విధమైన తృప్తి కలగడంతో ఈ జన్మలో 48వ మానవజన్మ సాధన వృధా కాలేదని పరిసమాప్తి అయినది అని ఆత్మతృప్తి కలగటంతో ఇంతటితో నా ఆధ్యాత్మిక తుఫాన్ ధ్యాన దృశ్యాలు సంపూర్తి అయినాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మా నేత్రము నందు నల్లటి గుండ్రని రూపమే కనబడుతోంది అనగా పరమశూన్య రూపమే కనపడుతోంది. ఇందులో నా నుండి సహజసిద్ధంగా వినిపించే ఓంకార నాదమైన తుంకార నాదము వినపడుతోంది. రాబోయే కాలంలో ఏదో ఒక సంవత్సరంలో ఏ రోజు నాదము వినిపించదో అదే రోజు హృదయ స్పందన ఆగిపోతుంది. అదియే నా సజీవ సమాధి అవుతుంది. అప్పుడు నా బ్రహ్మరంధ్రము నుండి రక్త చారిక బయటికి రావడం జరుగుతుంది. ఇదేనా సంపూర్ణ కపాలమోక్షం స్థితి అన్నమాట.
 
ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం కలిగింది. అది ఏమిటంటే ఇప్పుడు మన సాధన అంతా కూడా ఆదిలో 27 మహాయుగములో రికార్డయిన దృశ్యాలు చూస్తున్నాము కదా. అలాగే రాబోవు కాలంలో జరగబోయే భవిష్య జీవసమాధి రికార్డు దృశ్యాలు నేను చూడటం జరిగింది కదా. మరి ప్రతి మన్వంతరములో 71 మహాయుగాలు ఉంటాయి. ఈ 27 మహాయుగములో నా జీవన దృశ్యాలు మళ్ళీ 27 మహాయుగములో కనబడతాయా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాండ కృష్ణబిలం అంతరించి పోవాలంటే కోట్ల కోట్ల లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందని తెలిసింది. అప్పటి దాకా మా జీవసమాధి అలాగే నా సాధన రికార్డ్ దృశ్యాలు తిరుగుతూనే ఉంటాయా లేదా అనే సందేహం వచ్చింది. తిరిగితే ఇంకా ఏమి ఉపయోగం ఉంటుంది. సాధన చేసిన వాడికి అలాగే సాధన అయినవాడికి ఇంకా తేడా ఏముండదు కదా. దీనికి సమాధానం కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను కాని సరియైన జ్ఞాన స్పురణ  కలగలేదు. అప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కాని స్థితి. అప్పుడు మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసిని ఈ సందేహము అడిగితే వాడు వెంటనే “అదేంటి స్వామి! ఇన్నాళ్ళు మా సాధన సందేహాలను తీర్చినావు. నీ సాధన సందేహాలు నువ్వే తీర్చుకోలేవా లేదా నిజం చెప్పండి? నన్ను పరీక్షిస్తున్నారా ?”అన్నాడు. దానికి నేను వెంటనే నువ్వు చెప్పింది నిజమే. మీ సమస్యలకు అలాగే నా సమస్యలకు పరిష్కార మార్గాలు జ్ఞాన స్పురణ కలిగేది. కానీ ఈ మధ్య నాకు స్పురణ భావాలు తగ్గటం ఆరంభించాయి. అలాగే ధ్యానమునందు ఆధ్యాత్మిక జ్ఞాన దృశ్యాలు కనిపించడం తగ్గినాయి. కారణం తెలియడంలేదు. నేను ఏ మాయలో లేను. ఏ సాధన స్థితిలో నేను లేను. నాలో అహము లేదు. కానీ నాకు జ్ఞాన స్పురణ భావాలు తగ్గుతున్నాయని నాకే తెలుస్తుంది అనగానే …..

జిఙ్ఞాసి వెంటనే “స్వామి! మీరు మౌనంగా మారిపోతున్నారు అన్నమాట. మీ జ్ఞానపరమైన భావాలు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మీరు నోటితో సమాధానాలు చెప్పలేరు. మౌన భాషతో మౌనంగానే సమాధానాలు ఇస్తారు”…. అంటే మేధా దక్షిణామూర్తి లాగా మౌనబ్రహ్మఙ్ఞానిగా మీరు మారిపోతున్నారు అని నాకు అర్థం అవుతోంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు కలిగిన స్పురణ భావన మీకు చెప్పగలను. అది ఏమిటంటే 2012 యుగాంతం సినిమా ప్రకారంగా చూస్తే అందులో చిట్టచివర అత్యంతిక జలప్రళయము వలన దాదాపుగా 80% విశ్వ సృష్టి నాశనమవుతుంది. మిగిలిన 20 శాతంలో ఉన్న జీవులు నెమ్మదినెమ్మదిగా పరిణితి చెందుతాయి. అంటే 80 శాతం చనిపోయిన జీవుల రికార్డు దృశ్యాలన్నీ కూడా బ్రహ్మరంధ్రములో ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు పడి నశించిన ఇందులో పడినది ఏది కూడా వెనక్కి తిరిగి రాదని మన శాస్త్రవేత్తలు చెప్పడం బట్టి చూస్తే మన జీవ సమాధి రికార్డు దృశ్యాలు మనము చూడటంతో మన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు మన పంచ శరీరాల నాశనమయ్యే సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొంది రికార్డు దృశ్యము మనము భవిష్య రికార్డు దృశ్యముగా చూశాము కదా. అంటే మా అమ్మ కూడా సినిమాలోని 80% నశించిన జీవుల్లో ఒకరు అయినట్లే కదా. ఆదిలో 27 మహాయుగాలు పాటు రికార్డయిన దృశ్యాలు సంపూర్తిగా కృష్ణ బిలము నందు పడినట్లే కదా. అంటే మన రికార్డ్ దృశ్యాలు ఉండవు కదా. మన డేటా లేనప్పుడు మన రికార్డ్ దృశ్యాలు ఉండవు కదా. మిగిలిన 20 శాతం మంది అనేవాళ్ళు అనగా సినిమాలో ఆఖరికి అత్యంత ప్రళయం వచ్చి అయిపోయిన తర్వాత బతికున్న జీవులు అంటే సాధన చేయని సాధకులు అన్నమాట. అంటే 80 శాతం మంది చనిపోయారు అంటే సాధన చేసిన సాధకులైతే 20 శాతం సాధన చెయ్యని సాధకులు అన్నమాట. ఈ మిగిలిన 20 రికార్డు సాధన దృశ్యాలు వారికి కనపడే దాకా రికార్డు దృశ్యాలు తిరుగుతూ ఉంటాయి. నశించిపోయినా సాధన చేసిన సాధకులు రికార్డ్ దృశ్యాల తిరిగి కనిపించవు అని వాడు నాతో అంటుండగానే ఇది నిజమైనదేనని శివాలయం గుడి గంటలు మ్రోగినాయి. 

ఇదిలావుండగా నాకు ఇంకో చిన్న సందేహం వచ్చింది. అదేమిటంటే సాధకుడు ఎందుకు బ్రహ్మచర్య దీక్ష చేపట్టాలి అలాగే ఎందుకు అస్ఖలిత బ్రహ్మచారిగా ఎందుకు ఉండాలో నాకైతే అర్థం కాలేదు. దీనికోసం పుస్తక గ్రంధాలు తిరగడం ఆరంభించాను. ఒకచోట పరమశివుడు తన సతీ అయిన పార్వతీదేవితో “ఓ దేవీ! ఏ వ్యక్తి అయితే తన వీర్యాన్ని స్ఖలించకుండా నిగ్రహించుకుంటాడో ఆ మనిషికి ఆత్మ సిద్ధిస్తుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో సాధించలేనిది ఏమీ ఉండదు. అష్ట సిద్ధులను, పంచభూతాలను తన అదుపులో ఉంచుకుంటారు. బ్రహ్మచర్యానికి మించిన తపస్సు లేదు” అని చెప్పినట్లుగా ఉంది. అదే ప్రాచీన గ్రంధాలలో ఈ వీర్య స్తంభన గురించి మనిషి శరీరంలోని ప్రతి కణం లోనూ వీర్యము అనేది అత్యంత సూక్ష్మస్థాయిలో ఉంటుంది. వీర్యస్ఖలనం అతిగా చేయటం వలన ఈ వీర్యము పలచబడి ఆరోగ్యం క్షీణిస్తోందని తద్వారా వృద్ధాప్య ఛాయలు, ముసలితనము, అనారోగ్య సమస్యలు, నయంకాని దీర్ఘ వ్యాధులు, ఉన్మాదము, పిచ్చి, అకాల మరణం, సహజ మరణం త్వరగా వస్తుందని చెప్పడం జరిగినది. శివ సంహిత అనే గ్రంథంలో చూస్తే పూర్వక మహాయోగులు నిద్రలో కూడా స్కలనం కాకుండా అతి జాగ్రత్తలు తీసుకునే వారట.అనగా సమస్త పరిస్థితుల్లోనూ, సమస్త ప్రదేశాలలోనూ, ఏకాంతపు మాటలు అలాగే మానసికంగా, శారీరకంగా ఏ విధమైన శృంగారపు ఆలోచనలు భావాలు కలగకుండా ఉండేవారట. దీనికోసమే సాధన చేసేవారట. అలాగే శివుడి వీర్యమే పాదరసమని ఇందులో చెప్పడం జరిగింది. ఇంకా ఆయుర్వేద గ్రంథాల్లో అయితే వీర్యం అనేది అమృతం కన్నా అతి శక్తివంతమైన ఔషధమని దీనిని కాపాడుకోవడం వలన శాంతి తేజస్సు ఆరోగ్యం బ్రహ్మజ్ఞానం జ్ఞాపకశక్తి ఆత్మజ్ఞానం మనోధైర్యం శరీర బలము కలుగుతాయని చెప్పడం జరిగినది. పైగా మానవుడు తీసుకునే ఆహారం మొదట జీర్ణమై రసంగా మారుతుందని ఆపై రక్తముగాను ఆపై మాంసముగాను ఆపై కొవ్వుగాను ఆపై ఎముకలుగాను ఆపై ఎముక మజ్జుగాను తయారవుతుంది.  దీనినుండి వీర్యం తయారవుతుంది. అంటే రక్తం- మాసం- ఎముక - కొవ్వు - గుజ్జు - వీర్యం అన్నమాట. ఇలాంటి వీర్యం తయారవటానికి జీవుడికి ఐదు రోజుల కాలం పడుతుంది. అంటే 32 కేజీలు ఆహారంగా తీసుకుంటే 800 గ్రాముల రక్తము తయారయితే ఇది కాస్త వీర్యముగా మారేసరికి 20 గ్రాములు ఉంటుంది. ఒక పురుషుడి శరీరంలో ఒక నెలకి కేవలం 15 గ్రాములు మాత్రమే వీర్యము తయారవుతుంది.అలాగే ఇటువంటి వీర్యమును కాపాడుకునే వారిలో ఒక విధమైన ఓజస్సు పెరుగుతుంది. ఈ  ఓజస్సు కాస్తా తేజస్సు గా మారుతుంది. ఇలాంటి వారు ప్రసంగాలు చేసినను రచనలు చేసినను వీటిని విన్న వాళ్లు లేదా చదివిన వాళ్ళు ఆకర్షితులై పాఠకులు, శ్రోతలు ఒక మరొక కొత్త లోకములోనికి వెళ్లిపోతారని చెప్పడం జరిగినది. ఇంతటి దివ్యౌషధమని వీరిలో మానవుడు కష్టానికి శారీరక సుఖం కోసం అదే ఒక క్షణంలో జరిగే రెండు కండరాలు ఒత్తిడి కోసం వృధా చేస్తున్నారు కదా. దీనివలన వీరిద్దరూ కూడా బాగా అలసి పోతారు. తద్వారా పదిరోజులపాటు మానసిక శారీరక శ్రమ ఉపయోగపడే శక్తిని ఈ మైధున ప్రక్రియ ద్వారా నాశనం చేసుకుంటున్నారు. సృష్టిలో కామము అనేది కొత్త జీవి పుట్టుక కోసమే మాత్రమే శృంగారం జరపడం ప్రకృతి ధర్మము. ఆపై గృహస్థుడు కూడా బ్రహ్మచారిగా ఉండాలి. ఇలాంటి వారి గృహస్థుడు అయిన బ్రహ్మచారి అవుతాడు. అంతెందుకు సింహాలు, పులులు, గుర్రాలు, ఏనుగులు ఇలాంటివి భారీ జంతువులు కూడా ఇలాంటి శృంగార ప్రక్రియ కొన్ని రుతువుల్లో మాత్రమే సంయోగమునకు సిద్ధపడి ఆపై అవికూడా బ్రహ్మచర్యమును పాటిస్తాయి కదా. 

కామము అనేది ఎలాంటిదంటే ఒక సన్యాసి ఒక పెండ్లి ఊరేగింపు చూడడం జరిగినది. గుర్రం మీద వెళుతున్న పెళ్ళి కుమారుడికి ఆరోజు శృంగార వైభవ దినమని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఈ సన్యాసి నడుచుకుంటూ వెళ్ళి పోతూ పాడుపడ్డ శివాలయంలోని ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించాడు. నిద్రలో ఈ సన్యాసికి పెళ్లి అయినట్లుగా తనకి శృంగార రోజు ఏర్పాట్లు చేస్తున్నట్లు గా కల కనడం జరిగినది. కలలో భార్య ఇతను ఒకే మంచం మీద పడుకున్నారు. ఇంతలో అతని భార్య అతనిని కొంచెం జరగమని అడిగింది. అతను జరిగాడు. మరి కొంత సేపు ఆగి ఇంకొంచెం జరగమంది. జరిగాడు. ఇదంతా కల అయినప్పటికీ నిజంగానే భార్య చెప్పిన విధంగానే ఈ సన్యాసి పడుకొన్న వాడు కాస్త పక్కకు జరగడం మొదలు పెట్టినాడు. అలా జరిగి జరిగి చివరికి ఢమాల్ మన్న శబ్దం అయ్యేసరికి నిజంగానే బావిలో పడ్డాడు. మెలుకువ వచ్చి తను బావిలో పడినాను అని గ్రహించిన వాడై కేవలం కలలోకి వచ్చి ఒకసారి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని జరిగి జరిగి నిజంగానే బావిలోనికి తోసింది. అదే నాకు నిజంగా భార్యగా ఉండి ఉంటే ఈపాటికే ఎక్కడికే తోసేస్తుందో ఆ దేవానికే తెలియాలి కదా అనుకుని బతుకు జీవుడా అనుకుంటూ బావి గట్టుకు చేరుకున్నాడు. 

అదే అతిగా వీర్యస్ఖలనం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక తోటమాలి ఎంతోకాలం శ్రమించి తన తోటలో మల్లెలు, గులాబీ పువ్వులు, జాజిపూలు లాంటి అద్భుత సువాసనలిచ్చే పుష్పాలను పూజించి ఆ తర్వాత వీటి సారాన్ని తీసి ఒక అద్భుత శక్తిగా తయారుచేసిన తర్వాత దీనిని ఒక మురికి కాలవలో పడేస్తే ఎలా ఉంటుందో అలా అతిగా వీర్యస్ఖలనం చేసుకునే వారి పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది. వీర్యం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే సాధన ఉంటుందని నాకు అర్థం అయినది. కానీ యోగ సాధన లో మనకి వచ్చే బలహీనతను దాటలేమా అనే నా ధర్మసందేహమునకు సమాధానము తెలుసుకోవాలని ఉందా?ఇంకా ఎందుకు ఆలస్యము. నాతో పాటు ముందుకు ప్రయాణించండి. 

శుభం భూయాత్

పరమహంస పవనానంద
**********************************

గమనిక: ఇటీవలి కాలంలో అతిగా వీర్యస్ఖలనం చేసుకున్న కూడా అనారోగ్య సమస్యలు ఉండవని ఈమధ్య అలోపతి వైద్యులు చెప్పడంతో వయస్సులో ఉన్న యువకులు యువతులు పెడదారి పడుతున్నారు. బ్రహ్మచర్య దీక్ష అనేది స్త్రీ పురుషులకు సంబంధించినది అని గ్రహించండి .పురుషుడు లో రక్తం ద్వారా వీర్యం తయారీ అయితే అదే స్త్రీ మూర్తి లో రక్తము ద్వారా అండాలు తయారవుతాయని గ్రహించండి. కాబట్టి యువత వీర్య స్తంభనయందు అమిత ఆసక్తి కలిగి ఉండాలి. బ్రహ్మచర్యము అంటే కామాన్ని అణచివేయడం కాదని కామాన్ని అదుపులో ఉంచుకుని మనస్సు నుండి దానిని విడిచి పెట్టమని గ్రహించండి. మైధునంలో పాల్గొన వద్దని చెప్పటం లేదు కానీ అతిగా పాల్గొనవద్దు.

 
 అది గృహస్థులు అయితే నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మైధునంలో పాల్గొనాలి. బ్రహ్మచారి అయితే తనకి వివాహం అయిన తర్వాతనే సంయోగములో పాల్గొనాలి. వివాహం కాని బ్రహ్మచారి అయితే నెలకు ఒకసారి మాత్రమే స్వయంతృప్తి తో భావప్రాప్తి పొందాలి. అప్పుడే వీర్యము కాస్తా తేజస్సు గాను ఆపై ఓజస్సుగాను మారుతుంది. తద్వారా ఈ వీర్యములో అతిశక్తివంతమైన పదార్థాలు మరలా రక్తంలో కలిసి రక్తం ద్వారా శరీరం నాడులలోనికి ప్రవేశించి మనోధైర్యము మానసిక శారీరక ఆనందం పొందడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి. మనలో కలిగే భావాలను మనము బలవంతంగా ఇలా కామాన్ని అణిచివేయడం వలన అది కాస్తా అంతకంతకు బలవత్తరమై మనిషిని తప్పుడు మార్గాల్లో తొక్కిస్తుంది.అక్రమ సంబంధాల వైపు దారి తీస్తుంది. ఇలాంటి బలవంతపు బ్రహ్మచర్యము పాటించేవారికి నిద్రలో విశృంఖలమైన శృంగారపరమైన స్వప్నాలు వచ్చి అతిగా కలలోనే వీర్య స్కలనం జరిగే ప్రమాదం ఉంది. ఇలాగే అతిగా జరిగితే నరాల బలహీనత, ఉన్మాదము, పిచ్చి, అతి కోపం, ఆవేశాలునయం కాని వ్యాధులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందువలన కామము అదుపులో ఉంచుకొని మనస్సులో విపరీతమైన ఆలోచనలు బాగా ఒత్తిడి చేస్తే నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే భావ ప్రాప్తి పొందండి. ఇది కూడా చేసుకోకపోతే ఖచ్చితంగా ఉన్మాదులుగా మారతారు అని గ్రహించండి. అలాగే అతిగా నిద్ర లోనూ మరియు బలవంతంగా అతిగా స్వయంతృప్తి చేసుకోవద్దు. ఏది అతిగా చేసిన మనకే ప్రమాదమేనని మితంగా చేసుకుంటే మంచిదని గ్రహించండి. కామం అనేది ఒక తీరని దాహం అని అది ఎడారిలో కనిపించే ఎండ మావులు లాంటిదని కామము అనేది ఎన్నటికీ మనిషికి నిజమైన దీర్ఘకాలిక తృప్తి ఇవ్వదని కేవలం క్షణిక తృప్తిని అదికూడా అసంతృప్తితో కూడిన క్షణిక తృప్తిని ఇస్తుందని గ్రహించండి.

నా సాధన పరిసమాప్తి సమయములో ఈ శూన్యబ్రహ్మ అంతిమ స్థితిలో ఎందుకు మళ్ళీ కామమాయ వస్తోందో తెలిసినది. ఎందుకంటే పరమశూన్యము నుండి ప్రారంభములో శూన్యబ్రహ్మ వచ్చినపుడు...ఈయన కాస్త తన లాంటిసహచారిణి గావాలని సంకల్ఫించుకున్నాడు గదా.ఇలా వచ్చిన ఆది పరాశక్తిని చూసి మాయలో పడి మోహము చెంది..అటుపై వ్యామోహము చెంది...సంయోగము చెంది విశ్వసృష్టి చేసినారు కదా!అంటే ఆదిలో కామమే ప్రారంభ ప్రారబ్ధకర్మ గావడము వలన మళ్ళీ సాధకుడు ఇట్టి శూన్యబ్రహ్మ సాధన స్ధాయికి వచ్చినపుడు కామమాయలో పడతాడేమోనని పరమశూన్య సాధన పరీక్ష పెడుతుంది.ఇది గృహస్ధ లేదా ఆజన్మబ్రహ్మచారియైన వారిని గూడ వదిలిపెట్టదు.ఇక్కడే సాధకుడు ఎంతో నిగ్రహముగా ఉండాలి.దీనికోసమే మనకి విగ్రహరాధన పెట్టినది.విగ్రహము దాటితే నిగ్రహము వస్తుంది. తద్వార దశేంద్రియాలు మనకి అదుపులోనికి రావడముతో మనము కాస్త జితేంద్రియులు అవుతాము. తద్వారా మాయారహిత స్ధితికి చేరుకుంటాము.మాయ మాయం అవుతుంది.
 

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి