మూలాధార చక్రము (110)

 

మూలాధార చక్రము 

కంచి )




సాధన కుటుంబం అంతా కంచికి వెళ్ళడానికి తిరుపతి నుంచి కంచి బస్సు ఎక్కడం జరిగింది.  బస్సు ఎక్కాక ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. శివ నందిని పక్కన పిల్లలు ఇద్దరు కూర్చుని ఉంటే….. మహాదేవి మరియు రుద్ర స్వామి వేరే సీట్లలో కూర్చోవడం జరిగింది.  అందరూ కూర్చున్న తర్వాత కొంతసేపటికి శివ నందిని కాస్త మహాదేవి కేసు చూస్తూ…. 


శివ నందిని:- అమ్మ!  నాకు అష్టాదశ శక్తిపీఠాల గురించి వివరంగా చెప్పవా?  అసలు అవి ఎలా ఏర్పడ్డాయి…. ఏ విధంగా ఏర్పడ్డాయి…?  అన్నది కావాలి…. 


మహాదేవి:- ఏముందమ్మా!  ఇంటర్నెట్లో చూడు.. నీకు కావలసిన విషయం అంతా ఉంటుంది కదా! 


శివ నందిని:-  అలా కాదు… అవి రకరకాల కథనాలతో ఉన్నాయి.  నేను చూడవలసింది ఎటూ నేను ఇంటర్నెట్లో చూసి తెలుసుకుంటాను….


మహాదేవి:- నాకు తెలిసినంతవరకు , దక్షుడు మహా యజ్ఞం చేసేటప్పుడు… సతి దేవిని పిలవలేదని,  ఆ తర్వాత సతీ దేవిని పిలవకపోయినా ….తన తండ్రిదే కదా అని యజ్ఞానికి వెళ్ళటం,  తన భర్త అయిన శివున్ని అవమానించేసరికి ఆ అవమాన భారం తట్టుకోలేక …..ఆవిడ అగ్నికి ఆహుతి అవడం, ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న శివుడు కాస్త ధ్యానం నుండి బయటకు వచ్చి ఉగ్రరూపుడు అయ్యి దక్షుణ్ణి  సంహారం చేయమని వీరభద్రుడిని సృష్టించడం, వీరభద్రుడు కాస్త దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్లడం,  దక్షుని సంహారం చేయడంతో….ఆయనకి జ్ఞానం కలిగి, చేసిన తప్పును తెలుసుకొని ప్రాధేయపడడంతో…. మానవ శిరస్సుకి బదులు మేక శిరస్సును బ్రహ్మదేవుడు సృష్టించి ఇవ్వడంతో…. దక్షుడికి మేక శిరస్సు ఆనాటి నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత శివుడు కాస్త సతి దేవి భౌతిక దేహాన్ని అప్పటికే దహనం అవడంతో …..ఆత్మ శరీరం దహనం కాకపోవటంతో….. ఆత్మ శరీరమును భుజాన వేసుకొని లోకాలాన్ని తిరుగుతూ…. సతి దేవి విరహవేదనను అనుభవిస్తూ ఉండేసరికి….. ఈ విషయం గమనించిన మహావిష్ణువు సుదర్శన చక్రముతో సతీదేవి యొక్క ఆత్మ శరీరమును 18 భాగాలుగా ఖండన చేయడంతో,  ఆ 18 భాగాలు కాస్త 18 శక్తి పీఠాలుగా….. అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని చెప్పి శాస్త్ర ఉవాచ . కొంతమంది యాభై నాలుగు శక్తి పీఠాలని…. మరి కొంతమంది 108 శక్తి పీఠాలు ఏర్పడ్డాయని అంటారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది శాస్త్రీయమైన ఆధారాలు లేకపోవడంతో….. ఒకవేళ ఆదిలో 108 భాగాలతో క్షేత్రాలు ఉండి ఉండవచ్చు. కాల క్రమేణ అవన్నీ మరుగున పడిపోయి  ఉండవచ్చు.  ఆ తర్వాత ఇంకొన్ని మరుగున  పడిపోయి…. 18 క్షేత్రాలు మాత్రమే ఉండి ఉండవచ్చు.  16 క్షేత్రాలు మన దేశంలో ఉంటే, రెండు క్షేత్రాలు విదేశాలలో ఉన్నాయని చెప్పేసి స్థల ఉవాచ చెబుతున్నాయి…. అనగా ఈ అష్టాదశ శక్తిపీఠాలకి సూచనగా అష్టాదశ శక్తి పీఠముల స్తోత్రం కూడా ఉంటుంది.


దాని ప్రకారంగా చూసుకుంటే….మొదటగా శ్రీలంకలో ఉన్న శాంకరీ దేవి వస్తుంది..కొంతమంది ఇక్కడ తొడ భాగం ఉంది అంటారు.  మరి కొంతమంది హృదయ భాగం అమ్మవారిది పడింది అంటారు.  రెండోది కంచిలో ఉన్న కామాక్షి దేవి.  ఇది అమ్మవారి నాభి పడిన ప్రదేశం అంటారు.  ఇక మూడోది శృంఖలాదేవి.  ఇక్కడ అమ్మవారి కడుపు పడింది అని అంటారు.  ఇది ద్వారకాలో ఉంది అని కొంతమంది…..మరి కొంతమంది పశ్చిమ బెంగాల్లో ఉంది అని చెబుతారు.  ఇక నాలుగవది చాముండేశ్వరి.  ఇక్కడ అమ్మవారి కేశములు పడ్డాయని అంటారు. ఇది మైసూరులో ఉంటుంది.  ఆ తర్వాత అలంపురం జోగులాంబ.  ఇక్కడ అమ్మవారి దంతాలు పడ్డాయని… అందువల్ల ఈ క్షేత్రం ఏర్పడింది అంటారు. ఇక ఆరవది శ్రీశైలం అమ్మవారు భ్రమరాంబికా దేవి.  ఇక్కడ అమ్మవారి మెడ భాగం పడింది అంటారు.  ఏడవది కోల్హాపూర్ మహాలక్ష్మి.  ఇక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయని అంటారు. ఎనిమిదవది ముహూర్లో ఉన్న ఏకవీరా దేవి. ఇక్కడ కొంత మంది అమ్మవారి ఎడమ చేయి పడిందని మరికొంతమంది…. అమ్మవారి శిరస్సు పడింది అని అంటారు. తొమ్మిదవది ఉజ్జయిని మహాకాళి. ఇక్కడ అమ్మవారి పెదవులు పడ్డాయని అంటారు… కొంతమంది పై పెదవి పడిందని అంటారు.  ఇక ఆ తర్వాత పదవది….పిఠాపురంలో పురూహుతిక దేవి.  ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడింది అంటారు.  11వది గిరిజాదేవి …ఒరిస్సా ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కొంతమంది అమ్మవారి హృదయం పడిందని….మరికొంతమంది నాభి పడిందని…. కొంతమంది పొట్ట సగభాగం పడిందని అంటారు.  ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యంబాదేవి. ఇక్కడ అమ్మవారి ఎడమ చెంప పడిందని అంటారు.  ఆ తర్వాత 13వది గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని అంటారు.  ఆ తర్వాత 14వది ప్రయాగంలో ఉన్న మాధవేశ్వరి దేవి.  ఇక్కడ అమ్మవారి వేళ్ళు పడ్డాయని అంటారు.  15 వది హిమాచల ప్రదేశ్ లోని వైష్ణో దేవి.  ఇక్కడ అమ్మవారి నాలుక గాని…. తలభాగం గానీ పడింది అంటారు.  ఈవిడనే మనం జ్వాలాముఖిగా కూడా పిలుస్తాము.  16వది గయాలోని మాంగల్య గౌరీ ఇక్కడ అమ్మవారి వక్షోజాలు పడ్డాయని అంటారు.  17వది కాశీ క్షేత్రం ఇక్కడ విశాలాక్షి ఉంటుంది ఇక్కడ అమ్మవారి చెడిపోగులు పడ్డాయని కొంతమంది అంటే ……మరి కొంతమంది గొంతు భాగం పడింది అని అంటారు.   18వది కాశ్మీరు లోని శారదా దేవి శక్తిపీఠం….ఇది అమ్మవారి కుడి చెయ్యి పడిన ప్రాంతం అని అంటారు. ఇలా అమ్మవారి 18 శరీర భాగాలు, 18 శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని అంటారు.  ఇందులో  విదేశాలు చూస్తే మనకి శాంకరీ దేవి మనకి శ్రీలంకలో ఉంటుంది.  రెండోది సరస్వతి దేవి కాశ్మీర్లో ఉంటుంది…


శివనందిని:-  ఇప్పుడు మనం అమ్మవారి నాభి ఉన్న  కామాక్షి క్షేత్రమైన కంచికి వెళ్తున్నాం అన్నమాట! 


మహాదేవి:-  అవును తల్లి… ఈ విధంగా మనకి శక్తి పీఠాలు ఏర్పడ్డాయి.


శివనందిని:-  సరేనమ్మా!  ఇప్పుడు కామాక్షి దేవి శక్తిపీఠం గురిచి నీకు తెలిసింది నాకు చెప్పవా?  


మహాదేవి:- సరే!  నాకు తెలిసినంతవరకు,  పెద్దలు చెప్పినంత వరకు,  నేను విన్నది వరకు నీకు చెబుతాను.


కామాక్షి చరిత్ర:- 


శివుడు మరియు పార్వతీదేవి ప్రణయ సరసాలలో ఉన్నప్పుడు… పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసేసరికి,  విశ్వంలో ఉన్న అన్ని లోకాలు కూడా గాఢాంధకారంలోకి వెళ్లిపోవడం జరిగింది.  చిమ్మ చీకటిలో ఉండిపోయేసరికి జీవుల జీవచర్యలు దెబ్బ తినటం క్షణకాలంలో జరిగిపోయింది.  వెలుతురు లేకపోవడంతో ఆహార ఉత్పత్తి జరగదు కదా! సూర్యుని నుంచే కదా…. ఆహారం ముందు మొక్కలకి, మొక్కల నుండి జీవులకి ఆహారం అందుతుంది కదా!  ఆహార ప్రక్రియలు…. జీవ ప్రక్రియలు…. ఏవి జరగకపోయేసరికి అక్కడ క్షణకాలం కావచ్చు,  ఇక్కడ కొన్ని  వందల కోట్ల  సంవత్సరాలు భూమిమీద జరుగుతూ ఉంటుంది కదా!  శివుడు ఈ విషయం గమనించి క్షణకాలంలోనే మూడవ నేత్రమైన త్రినేత్రం తెరిచేసరికి…. ఈ నేత్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాలకి, లోకంలో ఉన్న జీవులు… వేడిమి బాధలు తట్టుకోలేకపోయేసరికి…. తను చేసిన తప్పేమిటో గ్రహించి, కళ్ళ మీద నుంచి చెయ్యి తీసివేసేసరికి… అప్పుడు శివుడు  “శివాని! నువ్వు తెలిసో తెలియకో తప్పు చేశావు.  నువ్వు చేసిన తప్పు వలన లోకవాసులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.  ఆ దోషం నీకు  ఏర్పడింది. వారి మనోవేదన నీకు దోషంగా ఏర్పడింది.  దోషపరిహారార్థం నువ్వు భూలోకమునకు వెళ్లి సాధన చేసుకో!  మళ్లీ తిరిగి నా దగ్గరికి రా!” అనేసరికి సరే స్వామి! మిమ్మల్ని ఆరాధన చేసి… మీ అనుగ్రహం పొంది… తిరిగి కైలాసానికి వస్తాను “అనేసరికి సరాసరిగా ఆమె కంచి క్షేత్రానికి చేరుకున్నట్లుగాను… ఆ కంచి క్షేత్రంలో శివుని ఆరాధన కోసం మట్టితో శివలింగాన్ని చేసి ఆరాధన చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేసరికి…. అమ్మవారి ఆరాధన స్థితిగతులు, మానసిక స్థితిగతులు సాధన స్థితిగతులు ఎలా ఉన్నాయి? తన యందు ఎలాంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయని తెలుసుకోవడానికి , ఆ మహాశివుడు కాస్త ఉన్నట్టుండి….ప్రళయ ప్రవాహం లాగా కంపా నది ఒప్పొంగేలా చేసేసరికి…. నదీ ప్రవాహానికి మట్టి శివలింగం కొట్టుకుపోతూ ఉండేసరికి.. నా శివుడు నా నుండి వెళ్ళిపోతున్నాడు, నేను తట్టుకోలేను, నావల్ల కాదు….. శివుడే లేనప్పుడు ఈ దేహంలో ఉండటంలో ఉపయోగం లేదు అని…. ఈ మట్టి శివలింగాన్ని తన వక్షస్థలంతో , చేతులతో గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకొని ఉండిపోయింది.  ఈమె భక్తి విశ్వాసాలకు మెచ్చిన శివుడు…. నీ సాధన పరిపక్వతలోకి వచ్చింది,  నీవు ఇక్కడి నుంచి  అరుణాచలం క్షేత్రానికి వెళ్లి సాధనలో ఉన్నత స్థితిని పొందమని చెప్పడంతో….. ఆవిడ ఆయన అనుమతి తీసుకుని…. ఈ క్షేత్రానికి వెళ్లడం జరిగింది. 


ఇలా అమ్మవారు కామాక్షిగా రావడం వెనుక మరో కథ కూడా ఉంది …పూర్వం  కాత్యాయనడు అనే ఒక ఋషి పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేసినప్పుడు …ఆ తపస్సుకు సంతుష్టుడైన శంకరుడు.. ఏం కావాలో కోరుకోమని అడుగగా… తనకి పార్వతీదేవియే తన కూతురిగా రావాలని వరం అడుగుతాడు.  సరే అని శంకరుడు అంతర్ధానమయ్యారు.  కొన్నాళ్ల తర్వాత ఆయన నిత్య అనుష్టానం చేసుకుంటున్నప్పుడు…. ఒక చిన్న పాప అతని ఒళ్లో చేయి పెట్టగానే…. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి…. ఆ పాప తేజస్సును చూసి… త్రిపుర సుందరి అమ్మవారే తనకి కూతురుగా వచ్చి తన ఒళ్లో ఆడుకుంటుందని గుర్తుపట్టారు.  మహదానందం పొందారు.  కాత్యాయనుడి కూతురిగా రావడం చేత.. ఈమెను కాత్యాయని అని పిలిచారు.  ఎంతో అల్లార ముద్దుగా కూతురు రూపంలో ఉన్న అమ్మవారిని పెంచుకోసాగారు. యుక్త వయసుకి రాగానే ఈమెకు పెళ్లి చేయాలనీ నిశ్చయించుకున్నారు. అయితే ఈమె అమ్మవారు కాబట్టి…. ఈమెను అయ్యవారి చేతిలోనే పెట్టాలని…. అది ఎలాగో అర్థం కాక సందిగ్ధంలో పడిపోయారు.  సరే అని కాత్యాయనిని పిలిచి… ఒక పులి చర్మం, సింహాసనం, గంగాజలం, పూర్ణకుంభం, కొంత ఇసుక, ఒక రుద్రాక్ష మాల, ఒక శివలింగాన్ని, ఇద్దరు పరిచారకులను, విసనకర్రను, ఒక పాము పడగని ,యోగ దండాన్ని, ఒక చిలుకని నీకు ఇస్తాను…. ఇవి తీసుకొని తపస్సుకు బయలుదేరు.  ఎక్కడైతే ఈ వస్తువులన్నీ కూడా వృక్షములుగా మారతాయో…. అక్కడ నీకు నీ భర్త దర్శనం జరుగుతుంది అని…. ఆ ప్రదేశంలో తపస్సు చేయమని చెప్పగా….. కాత్యాయని అలా నడుస్తూ వెళ్ళగా…. కాంచీపురం చేరగానే ఈ వస్తువులన్నీ వృక్షాలుగా మారేసరికి…. అమ్మవారు ఆవిడ చేతులతో స్వయంగా ఇసుకతో సైకత లింగాన్ని తయారుచేసి…. శివలింగార్చన చేసి…తపస్సు చేసుకునేది. ఒకానొక సమయంలో గంగానది పొంగి… నీటి ప్రవాహం ఉధృతి పెరిగి , శివలింగం మీదకి వస్తూ ఉండగా….తన పరిచారికలతో ఆపినప్పటికీ ఆగకపోగా…. ఫలితం లేకపోయేసరికి కంచిలో ఉన్న వరదరాజ స్వామిని ప్రార్థించే సరికి….శ్రీమహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని కట్టడి చేశాడు.  ఈలోగా తను  తయారుచేసిన సైకత లింగాన్ని కౌగిలించుకొని అలాగే ఉండిపోయింది.  ఆ లింగం నుంచి పరమశివుడు ఆవిర్భవించి…ఆమెను స్వీకరించడం జరిగింది. ఈ ప్రదేశంలో అమ్మవారు మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేది . నాలుగు వేదాలే నాలుగు కొమ్మలుగా…. ఒక్కొక్క కొమ్మ నుంచి కాచే ఫలాలు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటాయి. ఈ ప్రదేశంలో అమ్మవారు కాత్యాయని కాస్త కామాక్షిగా…… శివుడు కాస్త ఏకాంబరేశ్వరుడిగా ఇక్కడ పూజింపబడుతూ ఉన్నారు.



ఇప్పటికీ కంచిలో మూడు క్షేత్రాలు ఉంటాయి.  దేవీ కంచి, విష్ణుకంచి, శివకంచి.  ఈ శివకంచి లోనే అమ్మవారు మట్టితో చేసి పూజించిన ఏకాంబరేశ్వర శివలింగం ఉంటుంది.  ఇప్పటికీ ఈ శివలింగం మీద అమ్మవారి వక్షస్థల గుర్తులు, వేళ్ళ గుర్తులు, గోరు గుర్తులు ఉంటాయని స్థల పురాణం చెప్పడం జరిగింది. ఈ శివలింగం మట్టితో చేయడం వలన… అభిషేకానికి పనికి రాకపోవడంతో…. కేవలం తైలాభిషేకం మాత్రమే చేస్తారు. దీనికి బదులుగా నల్ల శివలింగం ఒకటి పెట్టి జలాభిషేకానికి వాడటం జరుగుతుంది. మనం ఈ ఏకాంబరేశ్వర  ఆలయానికి వెళ్ళినప్పుడు…. ఈ మట్టి శివలింగం కూడా దర్శనం చేసుకునే వీలు ఉంటుంది. కావాలంటే అర్చక స్వాములు …. ఈ శివలింగం మీద ఉన్న గుర్తులు కూడా చూపిస్తారు.  ఇప్పటికీ ఆ గుర్తులు శివలింగం మీద ఉన్నాయని చెప్పేసి…. స్థల పురాణం చెప్పడం జరుగుతుంది.


శివ నందిని:- అవునా!   కామాక్షి దేవి గురించి వివరించినందుకు కృతజ్ఞతలు!  


అని అనేసరికి పిల్లలు ఇదంతా వింటూ నిద్రలోకి జారుకున్నారు.  దానితో మహాదేవి కూడా,  నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను తల్లి…. అనేసరికి సరే మంచిది!  అని అనేసరికి…. నిద్ర మత్తులోకి అప్పటికే రుద్ర స్వామి వెళ్ళిపోగా…. మహాదేవి కూడా నిద్రావస్థలోకి వెళ్లిపోయింది.  శివ నందినికి నిద్ర పట్టక ఇంటర్నెట్లో కంచి కామాక్షి విశేషాలను సంబంధించిన వీడియోలు చూడటం మొదలుపెట్టింది.  ఆలయంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమిటో…. ఆకలింపు చేసుకుంది. అర్థం చేసుకుంది. గుర్తుపెట్టుకుంది. ఆ తర్వాత ఈ కంచి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలేమిటో తెలుసుకుంది. ఆ తర్వాత కంచి అమ్మవారి విశేషాలు తెలుసుకుంది.  ఇవన్నీ వీడియోలో చూసినంత మాత్రాన అనుభవ అనుభూతి ఉండదు కదా….. స్వయంగా ఎవరికి వారే వెళ్లి చూసి తెలుసుకోవాలి కదా!  అని సమయం చూస్తే, రాత్రి పదిగంటలు అయ్యింది అనుకోని…. నిద్రపోదాం అని అనుకుంటే… మనసులో ఏదో తెలియని ఆవేదన, ఒంటరితనం, ఏకాంతం, మానసిక క్షోభ, మొదలవడం జరిగింది.  ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండేసరికి…. ఉన్నట్టుండి శివ స్వామి గుర్తుకు వచ్చాడు. ఈయనకి చెప్పకుండా వచ్చాం కదా!  ఈయన ఏమైనా ఫీల్ అవుతాడా? ఏమైనా అనుకుంటారా ఏమిటి?  అని స్వామి!  మేము కంచి క్షేత్రానికి బయలుదేరుతున్నాము…. అని తన హృదయం మీద చేయి పెట్టి అనుకునేసరికి…. శివ నందిని కళ్ళ ముందు విభూతి మఠంలో ధ్యానంలో కూర్చున్న శివానంద కనిపించేసరికి అయ్యో!  స్వామి మీరు ధ్యానంలో ఉన్నారా? నేను గమనించలేదు…. నిద్రపోతూ ఉంటారేమో అనుకున్నాను… క్షమించండి…. మీకు ధ్యాన  భంగం కలిగించినందుకు… అనగానే లేదు


శివానంద:-  దేవి!  ఇప్పుడే ధ్యానం నుండి బయటకు వచ్చాను.  నీ మనోవేదన నా ధ్యానానికి ఇబ్బంది కలిగించింది.. ఏమైందని.. కళ్ళు తెరిచి చూస్తూ ఉండేసరికి….. నీ నుంచి ఆత్మ సందేశం వచ్చింది… 


శివనందిని:- ఏమి లేదు స్వామి!  ఏదో మీతో చెప్పుకోవాలి… మీతో ఉండాలి అని చెప్పి అనిపించింది.  మీతో అనుభవాలు చెప్పుకోవాలి.  మీతో మాట్లాడాలని అనిపించింది.  కానీ మీరు ధ్యానంలో ఉన్నారు కదా! 


శివస్వామి:- ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలా?  


(శివ నందిని కాస్త అంటే మోహమాటంగా ఆ …. ఆహా….)అని అనేసరికి


శివానంద:- వస్తున్నాను అని…. 


శ్రీశైలంలో విభూతి మఠం నుంచి ఈయన ఎలా వస్తాడో?  అనుకునేసరికి తన పక్కన శివానంద కనిపించేసరికి ….


శివనందిని:- అదేంటి స్వామి?  మీరు అలా ఎలా వచ్చారు……? 


శివానంద:- శ్రీశైలం ఎక్కడో లేదు కదా!  శివాని….. నీ హృదయ స్థానంలోనే ఉంది కదా!  నీ హృదయంలో తలుచుకునే సరికి…. నీ హృదయం నుంచి నేను బయటకు వచ్చాను. 


శివనందిని:- మీరు నాకు అర్థం కారు,  మీ చేష్టలు అర్థం కావు, మీ సిద్దులు అర్థం కావు… మీరు అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉంటారు….


( అనేసరికి మహాదేవికి మెలకువ వచ్చి శివ నందిని కేసి చూస్తూ….)


మహాదేవి:- ఎవరితో మాట్లాడుతున్నావు?  


శివనందిని:- ఇంకెవరు….!  జన్మాంతర పతి దేవుడితో…. శివ స్వామితో మాట్లాడుతున్నాను 


మహాదేవి:- నీ పక్కన ఎవరూ లేరు కదా!  ఖాళీగా ఉంది కదా!  నువ్వు కూర్చున్న ప్రాంతంలో పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చేసారు కదా!  


శివనందిని:-  అదేంటి నీకు శివ స్వామి కనిపించడం లేదా? 


మహాదేవి:-  నాకు ఎవరూ కనిపించడం లేదు!  


అనేసరికి శివ స్వామిని చూస్తూ…


శివనందిని:- అదేంటి స్వామి!  మీరు నాకు తప్ప ఎవరికీ కనిపించరా?  


శివానంద:- అవసరమైనప్పుడు కనబడతాను.  నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు కాబట్టి….. నీకు కనపడటం జరిగింది.  మిగతా వాళ్ళకి కనపడాల్సిన అవసరం ఏముంది?


శివనందిని:-  స్వామి!  సాధన అంటేనే పిచ్చి పట్టింది… అదోరకం…. అని సాధకుల్ని అంటారు.  ఇప్పుడు గాని మీరు కనపడకపోతే నేను గాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాను….పిచ్చి పట్టింది అనుకుంటుంది.  మెదడు భ్రమించింది అని రేపు పిల్లలు ప్రచారం చేస్తారు.  ఇప్పుడు అదంతా అవసరమా?  సాధనే పిచ్చి పట్టడం… మీరు కనిపించకపోతే ఇక పిచ్చి పట్టిందని రూడీ చేసుకుంటారు….. 


శివానంద:- ఇప్పుడు కనిపించక తప్పదా? 


శివనందిని:- ఇప్పుడు మహాదేవికి మీరు నా పక్కన ఉన్నారని కనిపించాలి 


అనేసరికి…. అప్పుడు ఆయన స్వప్న శరీరంతో కనిపించేసరికి…. అప్పుడు మహాదేవి


మహాదేవి :- ఓహో ! శివ స్వామితో ఉన్నావా!  అదృశ్య రూపంలో ఇప్పటిదాకా ఉన్నారా?  అయ్యో క్షమించండి…. ఏమీ అనుకోవద్దు…. నువ్వు గాలిలో మాట్లాడుతున్నావు అనిపించింది.  సరేలే!  మీరు మాట్లాడుకుంటూ ఉండండి…మీ ఏకాంతానికి నేను భంగం కలిగించను….


ఆవిడ గాఢ నిద్రలోకి వెళ్ళిన తరువాత….శివ నందిని కాస్త శివ  స్వామికేసి చూస్తూ…. 


శివనందిని:- అదేంటి స్వామి!  మీరు అన్ని తెలిసి కూడా ఇలా చేస్తే ఎలాగా? 


శివానంద:-నిన్ను ఆటపట్టించాలని అనిపించింది…… అందుకే అలా చేశాను ……


శివనందిని:- మీకు ఎప్పుడు ఆటపట్టించాలో,  ఎప్పుడు ఇది చేయాలో అంతా తెలుసు కదా!  


శివానంద:- అది కాదు దేవి!  ఇప్పుడు నన్ను ఎందుకు తలచుకున్నావు? 


శివనందిని:- ఏదో నా మనసులో తెలియని ఆవేదన, భాధ కలిగింది. మీతో పంచుకోవాలని అనుకున్నాను…. కాకపోతే నా హృదయంలో ఉన్నది మీరే కదా!  హృదయానికి చెబితే సరిపోతుంది అనుకున్నాను…..కాకపోతే మీరు ఇలా భౌతిక శరీరంతో ప్రత్యక్షంగా వస్తారని అనుకోలేదు.  తిరుపతిలో జరిగినవన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను.  అది నా బాధ్యత ! 


శివానంద:- దేవి!  నీకు కావలసినట్టుగా నువ్వు చెప్పు …..


అనడం జరిగింది . అప్పుడు శివ నందిని చెప్పడం ప్రారంభించింది.తిరుపతిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ….తిరుపతిలో అడుగు పూర్తి అయ్యేదాకా,  ఏం జరిగిందో పూసగుచ్చినట్టుగా ఏమార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసరికి….


శివానంద:- సరే దేవి!  నాకు ఇవన్నీ ధ్యానంలో కనబడుతున్నాయి.  నువ్వు మాయలు దాటతావా లేదా అని చూశాను. 


శివనందిని:- నాకు కృష్ణస్వామి మరియు యోగాంబిక వల్ల ప్రాణాపాయం జరుగుతుందేమో,. నా సాధన ఆగిపోతుందేమో అని ఒక సమయంలో అనిపించింది.  కానీ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను.  మీరు సాధన పరిసమాప్తి చేస్తారని మనోధైర్యంగా ఉన్నాను . ఆ తర్వాత రుద్ర స్వామి చెప్పాడు…. ఏం జరిగినా మన మంచికే అనుకో!  వాళ్ళు అపాయం చేసినట్టుగా కనిపించినప్పటికీ….మనకి మంచే జరుగుతుందని చెప్పడంతో నాకు ఎక్కడ లేని ఆనందం, ధైర్యం కలిగింది.  ఆ తర్వాత ఒక్కొక్క దైవిక శక్తి నాలో ప్రవేశించడం, ఆ తర్వాత నాలో తెలియని అహంకారం రావడం, ఆ తర్వాత ఆ అహంకార భేదన జరగటం, ఈ విధంగా… ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అనేక రకాలుగా నిజరూపాలలో కనిపించడం… ఇవన్నీ కూడా నాకు జరిగాయి అని మీకు చెప్పాలనిపించింది.  అవును స్వామి!  మీరు ఏమీ అనుకోకపోతే మీ ఒళ్ళో పడుకోవచ్చా?



శివానంద:-  పడుకో!  దానికేం అభ్యంతరం లేదు  దేవి…మన మధ్య గృహస్థాశ్రమంలో ఉండే దాంపత్య జీవితం ఉండదు. శరీరాలు కలవవు,  మనసులు కలవవు, సంయోగం మాత్రమే ఉండదు, శృంగార వాంఛలు ఉండవు, మనం వానప్రస్థావంలో ఉన్నట్టుగా యోగ మిత్రులుగా ఒకరినొకరు… సాధన అనుభవాలు పంచుకుంటూ చేసుకోవచ్చు.  


శివ నందిని:-సాధన అనుభవాలు మీకేం ఉంటాయి స్వామి!  మీ సాధన పరిసమాప్తి అయింది కదా!  నేను సాధన ఆరంభంలో ఉన్నాను.  మీరు అంతంలో ఉన్నారు.  మీరు ఇంకా సాధన ఏం చేయాలి?


శివానంద:-  నీ  సాధనలో నువ్వు ఎక్కడ దాకా వస్తావో… అనేది చూసుకోవడం నా బాధ్యత. ఎక్కడైనా ఆగిపోతే నీకు చెప్పాల్సి ఉంటుంది కదా!  నీకు తిరుపతి ఆరంభంలోనే చెప్పాను కదా!  ఏమాయలు వస్తాయి…. ఏ వస్తువులు వస్తాయని చెప్పాను కదా! ప్రత్యక్షంగా నువ్వు వాటన్నింటినీ దాటావు.  పరోక్షంగా నీకు ధ్యానానుభవాలు అయినాయి కదా!   


శివ నందిని:- మీరు కాస్త ముందస్తు సూచనలు ఇవ్వడంతో కొంతవరకు సులువుయింది. అది నిజమా కాదా? అనుకున్నాను.  నాకు అంత అర్హత, యోగ్యత ఉందా లేదా అనిపించింది.  అదే ఇప్పుడు నిలువు శరీరాల మోక్ష విధానం, అడ్డు శరీరాల మోక్ష విధానం నేను ధ్యానంలో చూడడం జరిగింది.  చక్రతీర్థం లో ఉన్నప్పుడు అది ప్రత్యక్షంగా కూడా చూడాలనిపించి ప్రాణాలకు తెగించి ….చూడడం జరిగింది.  నాకు ఏదైనా పరోక్ష ఙ్ఞానం  కన్నా ప్రత్యక్ష జ్ఞానం… అనుభవం పొందటం ఇష్టం స్వామి!  


శివానంద:- అదే కదా!  నీతో వచ్చిన చావు, ఇప్పుడు నేనైతే…. ఏదైనా నకిలీ వస్తువా? నిజమైన వస్తువా?అని ఆలోచించను …నకిలీ వస్తువు అయినా గాని నిజ వస్తువుగా భావన చేసుకుని….ఆవిధంగా నేను సాధన చేసుకుంటాను.  అంతెందుకు….సాధనలో ఒక సమయం వచ్చేసరికి కాలచక్రానికి ప్రతీకగా రోలెక్స్ వాచ్ రావాల్సి ఉంది. ఆ రోలెక్స్ వాచ్ ప్రారంభ ధర 7 లక్షల దాకా ఉంటుంది . నా భక్తురాలు నాకు అది కొనివ్వాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ…. అది సమయానికి అందుబాటులో లేక ఒక సంవత్సరం తర్వాత గాని అది రాదు అని చెప్పడంతో…. 2000 రూపాయలతో నకిలీ గడియారాన్ని తీసుకోవడం జరిగింది. ఆ నకిలీ గడియారాన్ని నేను రోలెక్స్ అని భావన చేసి నిజ దైవిక వస్తువుగా చేసి కాలచక్రమును దాటడం జరిగింది.  అదే నీ సాధన వచ్చేసరికి నిజంగా ఏడు లక్షల రోలెక్స్ వాచ్ కోని ధరిస్తే కానీ నువ్వు ముందుకు సాధనలోకి వెళ్ళలేవు.  నకిలీ వస్తువుని నిజ వస్తువుగా భావన చేయలేవు.  నిజ వస్తువును నిజ వస్తువుగానే చూస్తావు.  నకిలీ వస్తువుని నకిలీ వస్తువు గానే చూస్తావు.  అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సాధనలో వచ్చే ఇసుమంత తేడా. మగవాళ్లు ఉన్నదానితో సంతృప్తి చెందితే…. ఆడవాళ్లు అదే కావాలి అని పట్టుబడతారు. 


శివ నందిని:- అవును కదా స్వామి!  అనుభవించాలి అనుకున్నప్పుడు నిజమైన వస్తువులతోనే అనుభవించడం మంచిది కదా!  ఇప్పుడు తిరుపతి లడ్డు తినాలి అనుకున్నప్పుడు…. తిరుపతి లడ్డు తింటేనే అనుభవ అనుభూతి కలుగుతుంది.  మీరు బందరు లడ్డులోనే తిరుపతి లడ్డు తిన్నట్టు అనుభూతి పొందగలరు. నేను అలా పొందలేను. నాకు బందర్ లడ్డు బందర్ లడ్డు లాగానే కనబడుతుంది.  తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు లాగే కనబడుతుంది.  దాని రుచి వేరు, దీని రుచి వేరు . మీరు రుచులు చూడరు….లడ్డు తిన్నానా లేదా అనే చూసుకుంటారు.  నాకేంటంటే లడ్డూ తినాలని కోరిక కాదు…. తిరుపతి లడ్డుని తినాలని కోరిక ఉంది . ప్రత్యేకంగా అక్కడి నుంచి ఆ వస్తువు వస్తేనే సాధన పరిసమాప్తి అవుతుంది.  ఆ కోరిక తీరినట్లు అవుతుంది….. అనుకోవడంలో తప్పేముంది.  


శివానంద:- అదే మీరు తిరుపతి లడ్డుకి వస్తే… ఆ తిరుపతి లడ్డు తిని అనుభవ అనుభూతి పొందుతారు.  అదే నాలాంటి వాళ్లయితే.. బందర్ లడ్డునే తిరుపతి లడ్డు అనుకుంటాడు.  ఏదైనా ఒకటే కదా!  ఒకటే పదార్థంతోనే కదా తయారు చేసేది. బూందీనే కదా!  అక్కడ బూంది బూందీగా ఉంటే…. ఇక్కడ బూందీ తొక్కుడు చేసి బందర్ లడ్డు లాగా చేస్తారు.  అంతే కదా ! రెండు పదార్థాల భావం శనగపిండి కదా అని నాకు ఉంటుంది . మీరు ఏంటంటే ఆకారం, పదార్థాలు, రుచి , ఆ పదార్థంలో వాడిన వస్తువులలో కూడా తేడాలు చూస్తారు.  నేను ఆ తేడా చూడను.  కేవలం నేను లడ్డునే చూస్తాను.  అది తిరుపతి లడ్డునా బందర్ లడ్డునా అనేది చూసుకోను.  అదే ఇద్దరికీ వచ్చిన తేడా!  అది అందరికీ వస్తుందని నేను అనుకోను…స్త్రీలు కూడా ఏకత్వ స్థితికి రాగలరు.  వాళ్ళు తిరుపతి లడ్డూలోనే బందర్ లడ్డుని చూసుకునే వాళ్ళు ఉంటారు.  కాకపోతే తక్కువ మంది ఉంటారు. నూటికి ఎనభై శాతం మంది తిరుపతి లడ్డు తినాలి అనుకున్నప్పుడు తిరుపతి లడ్డునే తినాలని అంటారు….


శివ నందిని:- అందులో తప్పేం లేదు కదా! 


శివానంద:- తప్పేం లేదు,  ఆ తిరుపతి లడ్డు వచ్చేదాకా నీ సాధన పరిసమాప్తి కాదు.  మాకు లడ్డు వస్తే చాలు….. మా సాధన పరిసమాప్తి అవుతుంది….


శివనందిని :-;ఏమో స్వామి!  మీరు చెప్పేవన్నీ కూడా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటాయి.



ఇంతకీ నాదొక ధర్మసందేహం …అనగానే చెప్పు దేవి!  అంటే… 


శివ నందిని;- ఇప్పుడు మీరు ఏ క్షేత్రానికి వెళ్లినట్టుగా, ఏ దైవీక వస్తువు తెచ్చి సేకరించినట్టుగా, ఎక్కడా కనిపించలేదు.  మీ యోగ మిత్రుడైన జిజ్ఞాసి మీకు కావాల్సిన వస్తువులు తీసుకురావడం జరిగింది…అంటే ఫలానా క్షేత్రానికి ఆ అబ్బాయి వెళితే మీరు ఫలానా వస్తువు తీసుకురా అని చెప్పడం….  అతను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి రుద్ర స్పటిక శివలింగం ధ్యానంలో కనబడింది. అది మీరు హరిద్వార్ నుంచి జిజ్ఞాసి ద్వారా తెప్పించడం జరిగింది. అదే రుద్ర స్పటిక శివలింగం నేను ఆకాశ గంగలోకి వెళ్లి దూకి బయటకు తీసుకురావలసి వచ్చింది.  మన ఇద్దరికీ ఎందుకు వచ్చింది ఈ తేడా?  మీరు ఇంటి నుంచి బయటకి కదలకుండా…. ఎటు వెళ్లకుండా…. మీ సాధన పరిసమాప్తి చేసుకున్నారు.  నేనేమో…. అన్ని క్షేత్రాలకి తిరగాల్సి వస్తుంది.  అన్ని దైవిక వస్తువులు తీసుకురావాల్సి వస్తుంది.  ప్రయాస పడాల్సి వస్తుంది.  మీకు నాకు ఏం తేడా? నాకు అర్థం కావడం లేదు…. నేను కూడా గృహస్థ ఆశ్రమంలో ఉండి లేదా ఇంట్లోనే ఉండి సాధన పరిసమాప్తి చేసుకోలేనా? సాధారణ స్త్రీ మూర్తి లాగా నేను కూడా సాధన చేసుకోలేనా? ప్రతి సాధన స్త్రీ మూర్తి కూడా ఇలాగే సాధన చేయాలా? నాకు అర్థం కావడం లేదు..


శివానంద:- దేవి!  నీ సాధన స్థితి వేరు, ఇతర స్త్రీల సాధనాస్థితి వేరు.  అలాగే నా సాధనాస్థితి కూడా వేరే…. ఎలా అంటావా ?నా సాధన స్థితి సాధారణ స్థితిలో ప్రారంభమై…. రాను రాను ప్రకృతికి అనుసంధానమై…. అసాధారణ సాధన స్థితిలో ప్రకృతి మోక్షం  పొందిందా లేదా అని తెలుసుకునే అనుభవ స్థితికి వెళ్లడం జరిగింది. కానీ నీకు సాధన అంతా సరాసరి ప్రకృతితో అనుసంధానం అయిపోయి…. మోక్ష సాధనలో స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందా లేదా? అని తెలుసుకునే సాధనకి నువ్వు సరాసరి వచ్చావు.  ఇప్పుడు సాధారణంగా ఒక స్త్రీ మోక్షం పొందాలి అంటే….ఏ ఆశ్రమంలో ఉన్నా … అంటే గృహస్థాశ్రమంలో ఉన్నా , వాన ప్రస్తావంలో ఉన్నా , సన్యాసాశ్రమం లో ఉన్నా , బ్రహ్మచర్యంలో ఉన్నా… మోక్ష సన్యాసం తీసుకున్నా కూడా…. ఆమె సాధారణంగా ఒక ఇష్టదైవ ఆరాధనతో ప్రారంభిస్తుంది.  భక్తి మార్గంలో వెళుతుంది.  ఉదాహరణకి శివుడు అంటే ఇష్టం అనుకుంటే…..శివలింగ ఆరాధన చేసుకుంటూ ఉంటుంది.  ఆ శివలింగ ఆరాధన మట్టి లింగంతో ఆరంభమై…. ఇత్తడి, వెండి, బంగారం, రత్న, పాదరస, నల్ల ,తెల్ల ,అర్ధనారీశ్వర ,ఇష్ట లింగ ,స్పటిక, రుద్ర స్పటిక శివలింగ, నల్ల రుద్ర లింగ ఇలా లింగాలు మార్చుకుంటూ … తన సాధన పరిసమాప్తి చేసుకుంటూ వస్తుంది.  ఆమెకి  ధ్యానంలో దైవీక వస్తువులు కనబడతాయి… ఆ దైవీక వస్తువులు ఆమె ఏదైనా క్షేత్రానికి వెళ్లాలి అనుకున్నప్పుడు…. వెళితే… ఆ వస్తువు మీద మనసు పీకితే కొని తెచ్చుకుంటుంది.  లేదా తెలిసిన వాళ్ళ ద్వారా లేదా తెలియని వాళ్ళ ద్వారా  కానీ….ఆ క్షేత్రం నుంచి, ఆ వస్తువులు తెప్పించుకుంటుంది. దాని ద్వారా ఆ వస్తువులు రావడం ద్వారా…. ఆమె సాధన ముందుకు వెళుతుంది.  ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క స్థితికి ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది.  సాధారణంగా ఇది స్త్రీ, పురుషులు చేసే సాధన విధి విధానం.  నువ్వు ఇంట్లో ఉండి చేస్తున్నావా?  క్షేత్రంలో ఉండి చేస్తున్నావా?  అనేది అవసరం ఉండదు. కొంతమంది సన్యాసం తీసుకున్న వాళ్ళు క్షేత్రంలో ఉండి సాధన చేసుకుంటారు.  కొంతమంది సన్యాసం తీసుకోకపోయినా కాశీ ,శ్రీశైలం, ఉజ్జయిని వంటి క్షేత్రాలకు వెళ్లి కొన్ని రోజులు ఉండి సాధన చేసుకుంటూ…. సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు.  12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఆ క్షేత్రంలో ఉంటే….సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు.  ఇక్కడ నువ్వు క్షేత్రాలకు వెళ్లి సాధన పరిసమాప్తి చేసుకుంటున్నావా?  లేదా ఇంట్లో ఉండి సాధన చేసుకుంటున్నావా?  అనే దానికి కొద్దిగా తేడా ఉంటుంది. ఇంట్లో ఉండి సాధన చేసుకునేటప్పుడు…. ఒక్కో చక్ర జాగృతికి,  ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల దాకా పడుతుంది.  అంటే చక్ర జాగృతికి, శుద్ధి , ఆధీనం, విభేదనానికి అని  నాలుగు స్థితులు నువ్వు  పొందాలి అంటే….. నాకు తెలిసినంతవరకు 6 నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు పడుతుంది. అది సాధారణ స్త్రీ మూర్తి సాధన.  అదే స్త్రీ మూర్తి సాధన మోక్ష సాధన.  అయితే ఏదో తెలిసో తెలియకో…. మాయలో పడటం వలన ….లేదా దైవ శాపానికి,  సర్ప శాపానికి, స్త్రీ ,పురుష దేవతా శాపాలకు ,గురి అయ్యి సాధన ఆగిపోయిన జన్మలు ఉన్నవాళ్లు…. కారణజన్ములు…. ఇలాంటి వాళ్ళు మోక్ష సాధన తో ఆరంభిస్తారు.  అంటే వారి సాధన  అంతంతో ఆరంభం అవుతుంది. సాధారణంగా స్త్రీ సాధన లేదా పురుష సాధన అనేది…. సాధన ఆరంభంగా మొదలవుతుంది.  కారణజన్ముల యొక్క సాధన ఏమిటంటే మోక్ష సాధన అవుతుంది. అంటే సాధన అంత్యస్థితికి వెళతారు.అంతెందుకు …అరుణాచలంలో నా సాధన పరిసమాప్తి చేసుకునే సమయంలో నేను శివోహం స్థితి పొందిన తరువాత నువ్వు నాకు పరిచయం అయ్యావు.  అంటే ఏమిటి? నేను శివుడు అనే ధ్యాన అనుభూతి నేను అరుణాచల క్షేత్రంలో పొందడం జరిగితే…. నువ్వు నాకు పరిచయం అయ్యి నాలో శివుని చూడడం మొదలుపెట్టావు . అప్పటిదాకా ఎవరిలోనూ శివుడు కనిపించని నీకు,  నాలో శివుడు కనిపించడం మొదలైంది.  అంటే శివుడిని చూస్తున్నావు అంటే…. నీ సాధన శివాని స్థితికి అంటే, దేవ్యోహం స్థితికి వచ్చి ఉండాలి కదా!  శివుడిని చూడాలంటే శివుడై ఉండాలి లేదా శివాని అయి ఉండాలి.  అమ్మవారే కదా!  శివుని గుర్తుపట్టేది.  గమనించి తెలుసుకునేది.  మానవ మాత్రుల వల్ల కాదు కదా!  అంటే నీ సాధన ఆరంభంతో మొదలవలేదు అంతముతో మొదలైంది.  అందుకని సరాసరి నీకు ప్రకృతితో అనుసంధానం అయ్యింది.  స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందా లేదా అనేది ఇప్పుడు నీకు పరీక్షాకాలం అయింది. ఆ సాధనలో మోక్షం పొందిందో లేదో తెలుసుకోగలిగితే…. అది వ్యక్తిగత మోక్షం అవుతుంది.  ఆవిడకే మోక్షం ఇచ్చే స్థితిలో అంటే ఆవిడ, నువ్వు వేరు కాదు…. ఉన్నది ఆవిడే….ఆదిపరాశక్తియే అని నువ్వు తెలుసుకుంటే దేవ్యోహం స్థితి పొందగలిగితే….నీకు నువ్వే మోక్షం పొందగలిగితే…. అది విశ్వమోక్షం అవుతుంది.  ఆ విశ్వ మోక్షానికి పురుష ప్రకృతిలో ఉన్న నా శక్తి , స్త్రీ ప్రకృతిలో ఉన్న నీ శక్తి ఏకమై….అర్ధనారీశ్వర తత్వం పొంది…. ఆపై ఏకత్వ స్థితి పొంది, నామరూపాలు లేని స్థితి పొంది, ఆపై ఏకలింగ దేహమై…. ఆపై దహనమై….ఆ పైన అది కారుంగలి శివలింగంగా మారి…. ఆపై అది దహనం అయితే….అది విశ్వమోక్షం అవుతుంది.  కాబట్టి సాధారణ స్త్రీ సాధనాస్థితికి,  నీకు తేడా ఏమిటంటే…. నువ్వు అన్ని క్షేత్రాలకు వెళ్లి విశ్వ శక్తి కేంద్రాలలో ఉన్న శక్తినంతటిని సంపాదించుకోవలసి వస్తుంది. ఎందుకంటే స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందా లేదా అని అనుభవ అనుభూతిని పొందటానికి సాధనకి రావడం జరిగింది. కాకపోతే స్త్రీ మూర్తి కూడా ఇంట్లో కూర్చుని సాధన చేసుకున్నప్పటికీ…. నాకులాగానే కొంతకాలానికి అన్నీ మాయలు దాటుకొని వెళ్లగలిగితే…. ఎక్కడ ఆగకుండా సాధన పూర్తి చేయగలిగితే… ఆవిడ కూడా  స్త్రీ పరంగా అనుసంధానం అయితే…. ఆవిడ సాధన కూడా ఈ సాధన స్థితికి వస్తుంది.  కాకపోతే ఆవిడ నీ సాధన స్థితికి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత నీ సాధనాస్థితి,  ఆ స్త్రీ మూర్తికి ఆరంభం అవుతుంది. నీకేమిటంటే 6 నెలల్లోనే ఆరంభం అయింది… నీకు వాళ్ళకి తేడా అది. ఇప్పుడు మన మనసుని ఆధీనం చేసుకునే దాన్నిబట్టి ఉంటుంది.  ఒక్కొక్కరికి మనసు ఒక క్షణంలో స్థిరమవుతుంది…. ఇంకొంతమందికి ఇంకోన్ని రోజులు పడుతుంది…. ఇంకొంతమందికి ఆరు నెలలు పడుతుంది.. ఇంకొంతమందికి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు  ,16 సంవత్సరాలు పడుతుంది. 16 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనసు స్థిరం అవలేదు అంటే…..సాధన మాయలో ఉన్నట్లే అని గుర్తుపెట్టుకోవాలి. 


శివనందిని:- మనస్సు స్థిరపడడం అంటే ఏంటి స్వామి! నాకు అర్థం కాలేదు….! 


అనేసరికి దాని గురించి శివ స్వామి చెప్పడం ఆరంభించాడు.


శివానంద:- సాధన అంటే మనసుని స్థిరపరచుకోవటం.  ఆ మనసు లేకుండా చేయడమే సాధన పరిసమాప్తి. అంతకుమించి ఇంకేమీ లేదు అంటే….. మనసు ఒక కోరిక మీద స్థిరపడకుండా , ఒకే కోరిక 10 రకాలుగా తీర్చుకోవాలి అనుకుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కామకోరిక ఉంది…. కామకోరిక అనేది భర్తతో తీర్చుకుంటే పరవాలేదు. కాకపోతే పరపురుషుల వెంట పడితే మనసు తేడా వస్తుంది. ఉదాహరణకి ఒకడు అందమైన వాడు ఉంటాడు….. రెండవ వాడు ధనవంతుడు ఉంటాడు….. మూడవ వాడు జ్ఞానవంతుడు ఉంటాడు…. నాలుగవ వాడు ఉన్నత వ్యాపారి ఉంటాడు…. ఐదవ వాడు ఉన్నత బ్రహ్మజ్ఞాని అయి ఉంటాడు…. ఇలా రకరకాలుగా పదిమంది పురుషులు ఉన్నారనుకో!  నీ భర్తలోనే నువ్వు ధర్మంగా మనసును అదుపులో ఉంచుకొని…. ఈ పది రకాల భావాలు చూడగలిగితే,  అప్పుడు నీ మనస్సు స్థిరమైనట్టు.  అంతేగాని భర్తతో తప్పించి పదిమందితోను 10 రకాలుగా అనుభవాలు పొందాలి అని నువ్వు అనుకున్నప్పుడు….. నీ మనసు అస్థిరం అయినట్టే.  నీ కోరిక తీరనట్టే.  ఈ కోరిక అనేది మహాసముద్రం దగ్గరికి వెళ్తే.. కడవతో తెచ్చుకుంటావో?  చెంబుతో తెచ్చుకుంటావో?  అనేది ఎలా అయితే ఉంటుందో… ఇది కూడా అలాగే నీ కోరికను బట్టి నీ మనసు ఉంటుంది.  నీ మనసు తృప్తి పొందితే అది స్థిరమవుతుంది.  అది అసంతృప్తికి లోనయ్యే కొద్ది,  నీలో తెలియని కామ క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు వంటి అరిషడ్వర్గాలు మొదలవుతాయి.  కోపము ,ఆవేశాలు వస్తాయి.  మనోవేదన వస్తుంది.  బాధ కలుగుతుంది.  నా జీవితం వృధా అయిపోయిందని అనిపిస్తుంది. ఇలా ఒక కోరికలోనే 18 రకాల స్థితిగతులు ఉంటాయి.  ఆ 18 రకాల స్థితిగతులు తీర్చుకునేటప్పుడు…. మనసు సంతృప్తి పొందినట్లయితే 18 రకాలు నిన్ను ఏమీ చేయలేవు.  అదే 18 రకాలకు నువ్వు ఆధీనం అయ్యావు అని అంటే….. దాని నుంచి బయటకు రావడానికి నీకు జీవితకాలం సరిపోదు. మళ్లీ పునః జన్మలకి వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఒకే కోరికలోనే 18 రకాల స్థితులను ఒకే వ్యక్తిలో చూడగలిగితే…. అనుభవించగలిగి సంతృప్తి పొందేది ధర్మపత్ని అవుతుంది.  అదే భార్య వచ్చేసరికి….తన భర్తలో ఒక రకం మాత్రమే చూస్తుంది.  ఏక పురుషుడిలో…. మిగతా రకాలు అయిన 17 మందిలో 17 చూస్తుంది.  ఈ 17 మంది దగ్గరికి వెళ్లి సంయోగం చెందాలి… శృంగారం చేయాలి… అని విపరీతమైన కాంక్షతో రగిలిపోతూ ఉంటుంది.  నా భర్త ఉన్నాడు చూడు….టక్ వేసుకున్నా,సూటు బూటు వేసుకున్నా, అందంగా ఉండడు.  అదే రమేష్ చూడు…. సూటు బూటు వేసుకుంటే,  ఎంత అందంగా ఉంటాడో… అతని హెయిర్ స్టైల్ చూడు… నడిచే తీరు చూడు… ఎంత స్టైల్ గా ఉన్నాడో…. వీడు ఉన్నాడు. ఉపయోగం ఏముంది? అని ఒక భావన కలిగింది అనుకో!  ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? ఇతనితోనూ సంతృప్తిగా ఉండలేదు….అతని దగ్గరికి వెళ్లలేదు… పోనీ అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనిలో ఇంకొక లోపం కనిపిస్తుంది. ఆలోపం భర్తీ చేయడానికి అని చెప్పి ఇంకొకడు కనపడతాడు.  అంటే రమేష్ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్తే వీడు ఉండడానికి అందంగా ఉన్నాడు కానీ… వీడి మనసులో స్వార్థం ఎక్కువ, అనుమానం ఎక్కువ.  అదే సురేష్ ఉన్నాడు చూడు… అందంగా లేకపోయినా వాడి మనసు బాగుంటుంది.  నన్ను ఏనాడు అనుమానించడు,అవమానించడు. సౌమ్యంగా మాట్లాడతాడు. గౌరవంగా మాట్లాడుతాడు, వీడికి ఆడవాళ్లు అంటే గౌరవం లేదు. భార్య అంటే గౌరవం లేదు,  చులకనగా చూపుగా చూస్తాడు.హీనంగా మాట్లాడుతాడు. ఎప్పుడు కోపంగా మాట్లాడతాడు అని రమేష్ నుంచి సురేష్ వైపుకి మల్లుతుంది.  సురేష్ లో ఇంకొక లోపం కనబడుతుంది…ఆ లోపం తీర్చడానికి ఇంకొకడు కనపడతాడు.  ఇలా మనసు పరివిధాలుగా పోతుంది. ఒక్కటె కోరిక. ఉన్నది  ఏంటి? కామకోరిక. ఈ కామకోరికలో 18 రకాల స్థితులు ఉంటాయి.  ఈ 18 రకాల స్థితులకు వచ్చేసరికి… అనుభవించేసరికి….అందులో సంతృప్తి చెందరు.  సంతృప్తి చెందకపోయేసరికి చనిపోతున్న సమయంలో అరెరే! వీళ్ళందర్నీ కాదు, ఫలానా వాడి దగ్గరికి వెళ్లి ఉంటే నేను అన్ని అనుభవించే దాన్ని…. అని అనుకునేసరికి నీ మరణం వచ్చేస్తుంది. ఆలోచన కాస్త కారణం అయిపోతుంది.  ఆ కారణం కాస్త కోరికగా….. ఆ కోరిక కాస్త కర్మగా మారుతుంది.  కర్మ కాస్త జన్మగా మారుతుంది.  ఇదే  పునఃసృష్టికి కారణం అవుతుంది. అంటే భగవద్గీతలో మరణించే క్షణంలో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో…. ఆ ఆలోచన నీకు పునః జన్మకి కారణం అవుతుంది అని చెప్పింది ఇందుకోసమే….  అనేసరికి ఓహో!  ఒక్కరిలోనే అన్ని రకాల స్థితిగతులను అనుభవ అనుభూతి పొందగలిగితే …..అప్పుడు సంతృప్తి చెందితే అప్పుడు కోరికారాహిత్యం ఉంటుంది .  కోరికని పదిమందిలో చూస్తే…. మనసు అస్థిరమై కోరిక పెరగడమే గాని తరగడం అనేది ఉండదు. ఇక కోరిక తీరడం అనేది ఉండదు. ఇప్పుడు అర్థమైంది స్వామి….  మనస్సు స్థిరమవ్వటానికి, అస్థిర అవడానికి తేడా!  అంటే పురుషుడి మనసు స్థిరమవడం చాలా సులువు.  ఎందుకంటే వాడికి కావలసిందేమిటో వాడు ఒకదాంట్లోనూ చూడగలడు…పది రకాలుగా చూడగలడు… ఆ పది రకాల స్థితిగతులు భార్యలోనూ చూడగలడు… కానీ నూటికి 90% స్త్రీ, పురుషులు కూడా అస్థిరమై ఉన్నవాళ్లే.  ఎప్పుడైతే మనసు అస్థిరమైపోతుందో ……వాళ్ళు భోగ జీవితానికి వస్తారు.  అదే 80% మనసును ఆధీనం చేసుకొని ఉన్నవాళ్లు స్థిరమనస్సుతో ఉన్నవాళ్లు యోగ జీవితానికి వస్తారు. అంటే యోగ జీవితానికి ,భోగ జీవితానికి తేడా ఏమిటంటే …..భోగ జీవితంలో కోరికలు పెంచుకుంటూ వెళ్లిపోతారు. ఒక కోరికలోనే 18 రకాలను మళ్లీ ఆ 18 రకాలలో ఒక్కొక్కదానికి మరో 18 రకాలు…. ఇలా 18*18=324 ఇలా కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. అదే యోగ జీవితంలోకి వచ్చేసరికి 18 రకాల కోరికలు కాస్త ఏక కోరికగా మారుతుంది.  ఆ ఏకైక కోరికను ఒకే మనిషిలో చూస్తారు.  భోగ జీవితంలో,  ఒక మనిషిలోనే 18 రకాల భావాలు అన్నప్పుడు…. 18 మందితో అనుసంధానం అవుతారు. ఆ 18 మందితో సంతృప్తి చెందుతారు  అంటే అలా జరగదు మళ్లీ…. 18 మందిలో ఒక్కొక్కళ్ళకి 18 మంది అలా పెరిగిపోతూ ఉంటుంది. అదే యోగ జీవితంలోకి వచ్చేసరికి…. 18 రకాల కోరిక స్థితులను ఒక మనిషిలోనే చూడగలుగుతారు.  ఆ ఒక మనిషితోనే సంతృప్తి పొందుతారు.  అప్పుడు భోగ జీవితంలోను ఒకళ్ళతోనే అయిపోతుంది.  అంటే ఏమిటంటే…. ఒకటి నుంచి వెయ్యి అవుతుంది. 1000 కాస్త ఒకటి అవుతుంది.  ఇది చూసే దాన్ని బట్టి ఒకటిలో 1000 చూడగలిగిన వాడు స్థిర మనసు కలవాడు.  వెయ్యిలో ఒకటి చూడగలిగితే అస్థిరమనస్సు అన్నమాట.. 


శివ నందిని:- ఇప్పుడు అర్థమైంది స్వామి!  ఏకత్వంలో భిన్నత్వం చూడగలిగే స్థిర మనస్సు అంటే… భిన్నత్వంలో ఏకత్వం చూడగలిగితే అస్థిరమనస్సు అని అర్థం అవుతుంది.


శివానంద:- ఇప్పుడు దేహమే దేవాలయం అన్నారు…. ఈ దేహంలో లేని క్షేత్రం మీకు బయట ఎక్కడా కనపడదు …. అన్నీ క్షేత్రాలు…. అన్ని తీర్థాలు ఇందులోనే ఉన్నాయి. దేహమే విశ్వం అన్నప్పుడు దేహంలోనే నీకు లేనివి ఎక్కడ ఉంటాయి? ఉదాహరణకి ఆజ్ఞ చక్రం చూస్తే కాశీ క్షేత్రం కనబడుతుంది.  అదే పురుష సాధకుడు ఆజ్ఞచక్రం దగ్గరికి వెళ్లి…. కాశి క్షేత్రం చూసినట్టు అనుభవ అనుభూతి పొందుతూ ఉంటాడు.  కానీ నువ్వు ఏం చేస్తున్నావు?  ఆజ్ఞ చక్రంలో కాశీ క్షేత్రం కనిపించినప్పటికీ కూడా అనుభవ అనుభూతి పొందాల్సిందే!  అని బయట వైపు చూసుకొని ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వనాథుడు శివలింగము, అన్నపూర్ణ దేవిని ప్రత్యక్షంగా చూసి అనుభవ అనుభూతి పొందుతున్నావు.  తద్వారా ఏమవుతుంది…. అక్కడ మాయ పెరగవచ్చు, తగ్గవచ్చు.  మనసు అదుపులోకి రావచ్చు, అదుపు దాటచ్చు, ఏదైనా జరగొచ్చు.  అదే నేను కాశీ క్షేత్రాన్ని నా ఆజ్ఞ చక్రంలో చూశాను అనుకో!  నాకున్న మాయ, నాకున్న కోరిక తీరిపోతుంది.  ప్రత్యక్షంగా నేను చూడాల్సిన అవసరం లేదు. ఆ కోరికలు ఉండవు. ఆ కోరికలను ఎదుర్కోవలసిన అవసరము లేదు. ఇప్పుడు కాశీ నుండి రావాల్సిన పాదరస శివలింగం కాశీ నుంచి ఎవరో ఒకరు తీసుకువస్తారు. నేను ఇంట్లో కూర్చుని సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు….కానీ నువ్వేంటి?  అక్కడ ఉన్న దైవిక వస్తువు పాదరస లింగం కాదు….. పాదరసలింగానికి మూలం ఏది? అది ఎలా ఏర్పడింది….?  అని దానికి మూలమైన పదార్థం దగ్గరికి వెళ్లి నువ్వు తీసుకొని చూస్తే గాని….. ప్రత్యక్షంగా అనుభవిస్తే గాని….. సాధన పరిసమాప్తి చేసుకోవు.  అంటే నీ మనసు ప్రత్యక్ష అనుభవం పొందాలి అనుకుంటుంది.  నా మనసు పరోక్ష అనుభవం పొందిన చాలు అనుకుంటుంది.  ఇక ప్రత్యక్ష ,పరోక్ష అనుభవాలకి ఇది తేడా!  సాధనలో ఎలాంటి ఇది లేదు… కాకపోతే ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు పొందటానికి నువ్వు క్షేత్రానికి వెళ్లి అక్కడ ఉన్న మాయల్ని దాటి నీకు అర్హత, యోగ్యత ,యోగం ఉందా లేదా?  అని పరీక్షలు చేసుకుంటూ వచ్చిన తరువాతనే…..నీకు ప్రత్యక్ష అనుభవం చూపిస్తారు.. నిదర్శనాలు చూపిస్తారు… మాకు పరోక్ష అనుభవానికి ఎలాంటి మాయ పరీక్షలు ఉండవు. మా సాధన మేము ఆగకుండా చేసుకుంటూ ఆజ్ఞా చక్రం వరకు వస్తే ఖచ్చితంగా ఆజ్ఞా చక్రంలో కాశీ క్షేత్రం చూపించాలి. అది ప్రకృతి ధర్మం. కాకపోతే నా సాధన మూలధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు రావాలి.  ఆగిపోకూడదు…. ఎందుకంటే ఈలోగా మూలధార చక్రంలో వచ్చే కామ మాయ నుంచి విశుద్ధ చక్రంలో వచ్చే జ్ఞానమాయ ఇలా ఇవన్నీ మేము దాటుకోవలసి వస్తుంది. అది ప్రత్యక్షంగా ఆ మాయలు దాటుకుంటూ….మనసును అదుపు చేసుకుంటూ… రావాల్సి వస్తుంది. అది ఇంట్లో కూర్చుని చెయ్యొచ్చు.  క్షేత్రానికి వెళ్లి చేయాల్సిన అవసరం లేదు . కాకపోతే ఏంటంటే, నీకు క్షేత్రానికి వెళ్లి ఆ వస్తువుని తీసుకుని వస్తే గాని సంతృప్తి అవ్వవు. మనసు తృప్తి చెందదు.  అప్పుడు ఆ కోరిక తీరినట్టే అని అనుకోవాలి…


శివ నందిని:-  అది నిజమే… లడ్డు రుచి మీకు తెలుసు… లడ్డు ఎలా ఉంటుందో తెలుసు…. లడ్డు చూసేసి లడ్డు తినేసామని మీరంతటితో వెళ్లిపోతారు…. కానీ నేను ప్రత్యక్షంగా లడ్డూనే తినాలి.  నాకు అది తిరుపతి లడ్డు నే అయి ఉండాలి. తిరుపతి క్షేత్రానికి వెళ్లి ఆ తిరుపతి లడ్డు తింటే గాని నాకు కోరిక తీరదు.  మీరేంటంటే తిరుపతి లడ్డు బందర్ లడ్డులోనే చూసేసి కోరిక తీరింది అనుకుంటారు. మీకు నాకు అదే తేడా వస్తుంది. ఇప్పుడు ఈ తేడా అర్థమయింది.  అంటే ఏంటంటే….నా సాధన స్త్రీపరంగానే సాగుతుంది, కాకపోతే స్త్రీ ఇంట్లోనే ఉండి గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు.  కాకపోతే నేను క్షేత్రాలకు వెళ్లి వస్తువులను పొంది సాధనను ముందుకు తీసుకొని వస్తాను.  ఇక్కడ సాధారణ స్త్రీ ఏంటంటే తనకి ధ్యానంలో కనిపించిన దైవీక వస్తువులను కొనుక్కోవడం గానీ, కొనిపించుకోవడం గాని, లేదా ఏదైనా తెలిసిన వాళ్ళతో గాని పంపించడం అనేది ప్రకృతి చేస్తుంది.  అంటే ఇప్పుడు నాకు స్పటిక రుద్ర శివలింగం ఎలాగైతే వచ్చిందో….. ఆడవాళ్ళకి సాధనలో ఉన్నప్పుడు కాలానుగుణంగా తన సాధన స్థితిగతుని బట్టి స్పటిక రుద్ర శివలింగం వస్తుంది.  అంటే మీకు వచ్చినట్లుగానే అందరికీ వస్తుంది.  కాకపోతే నేను ప్రత్యక్ష  అనుభవ అనుభూతి కోసం….. ప్రత్యక్షంగా ఆకాశ గంగ లోపలికి వెళ్లి తీసుకురావలసి వచ్చింది. అదే మీరు గుడి పరిసరాలలో ఉన్న దుకాణాల  వద్దకు వెళ్లి మీకు  నచ్చిన స్పటిక రుద్ర శివలింగం కొనుక్కోవడం లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకురావడం జరుగుతుందన్నమాట! అంటే నా సాధనకి, సాధారణ స్త్రీ మూర్తి సాధనకి తేడా ఏమీ లేదు. అలాగే ఇప్పుడు సాధన విగ్రహం మూర్తి ఏంటంటే….. నా శరీరంలో జరిగే మార్పులు ఆ విగ్రహం లో ప్రత్యక్షంగా చూపిస్తారు. తర్వాత ఏ క్షేత్రానికి వెళ్లాలి….. అనే ఆధారాలు ఇవ్వటము జరుగుతుంది. అదే మాకు ధ్యానంలో కనబడుతుంది.మీరు వెళ్ళటం అన్నా జరుగుతుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆ దైవీక వస్తువులు తీసుకురావడం అయినా జరుగుతుంది. అంటే ఏంటంటే దైవీక వస్తువు రావటం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వస్తువు వస్తేనే సాధన ముందుకు వెళుతుంది. దైవిక వస్తువు రాకపోతే ఆ సాధన  అక్కడే ఆగిపోతుంది.  అంటే మీరేదో చక్రానికి సంబంధించిన మాయలో ఆగిపోయినట్లే. మాయలో పడ్డట్టే. ఆ మాయను దాటించే దైవీక వస్తువు రావాలి.  ఆ దైవీక వస్తువు పొందితే గాని ….మీ సాధన ముందుకి వెళ్లదు అని చెబుతున్నారు అన్నమాట!  మంచిది…. 


శివ నందిని:-  స్వామి!  నాకు ఇంకొక సందేహం ఉంది… 


శివానంద:- చెప్పు దేవి!  నీ సందేహాలు అన్ని తీర్చుకో!  సందేహాలు తీరేకొద్దీ సాధన ముందుకు వెళుతుంది …


శివ నందిని:- స్వామి!  నాకు ఉన్నట్టుండి సాధనలో ఉన్నప్పుడు మీ దగ్గర పడుకోవాలి…. మీ చెయ్యి మీద తల పెట్టుకుని పడుకోవాలి అనే భావాలు కలుగుతున్నాయి. ఇలా భావాలు రావడం తప్ప?  నాకు అర్థం కావటం లేదు . ఎంత ఆలోచన అదుపు చేయాలి అన్నా…. ఇలాంటి భావాలు కలుగుతున్నాయి.  నేను అదుపు చేసుకోలేక పోతున్నాను…


శివానంద:- ఇప్పుడు అన్నింటినీ పరిత్యాగం చేశాము….  కోరికలను అదుపులో ఉంచుకున్నాము…. కోరికల మీద ఆధిపత్యం వచ్చింది. ఇప్పుడు మన మధ్య శృంగార భావాలు కలుగుతాయి….. కోరికలు కలుగుతాయి…. ఆలోచనలు కలుగుతాయి…. ఆలోచనలకి, భావాలకి, కోరికలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆలోచనలు, భావాలు రావడం తప్పులేదు.  కోరికలు తీర్చుకోవాలి అంటే శరీరాలు కలవాలి. మనసులు కలవాలి. ఆత్మలు కలవాలి.  ఇది ఇలా కలవడం అనేది సన్యాస ఆశ్రమంలో విరుద్ధం. ఎందుకు అంటే ఒకసారి సన్యాసం అనేది సన్యాస ఆశ్రమంలో తీసుకున్న తర్వాత …..స్త్రీ గాని పురుషుడు గాని కలిసినా ,పురుషుడు గాని స్త్రీని కలిసినా …వాడు నరకంలో ఉన్న 21 శిక్షలను  దానికి 1000 రెట్లు అనుభవించాలని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది.  సన్యాసం తీసుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. అది పొందడం అంటే ఎంత కష్టమో….. నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం . ఇప్పుడు నకిలీ పీఠాధిపతులు , నకిలీ మఠాధిపతులు ఏర్పడటానికి కారణం ఏమిటి?  ఆ కామాన్ని జయించలేకపోయారు… ఎందుకు అని అంటే,  గత జన్మాంతరంలో ఉన్న భార్యలు ,ప్రియురాలు,  ఉంచుకున్న వాళ్ళు…. ఇలా వీళ్లంతా కూడా భక్తులుగా వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ కామ కోరికలు చెబుతారు. వాళ్ళ కామ కోరికలను చెప్పినప్పుడు స్పందించకుండా…. మంచిది తల్లి! అని,  ఆ సాధన కామం వైపు పెట్టకుండా దైవం వైపు పెట్టు…. నాలో దైవత్వాన్ని చూడు,  నగ్నత్వాన్ని కాకుండా నాలో దిగంబరతత్వాన్ని చూడు అని చెప్పగలిగిన వాడే నిజమైన గురువు.  నిజమైన యోగి, పీఠాధిపతి ,మఠాధిపతి, నిజమైన స్వామీజీ.  ఇలా అవ్వటానికి అవకాశం ఉంటుంది . కాకపోతే కొంతమంది విషయంలో ధర్మపత్ని అని చెప్పడం జరుగుతుంది…. లేదా భార్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది….ఇప్పుడు వాళ్ల దగ్గరికి వచ్చేసరికి కొంతమందితో శృంగారంలో పాల్గొనే పరిస్థితులు కూడా తీసుకురావలసి వస్తుంది…. అప్పుడు నువ్వు సన్యాసం తీసుకోకూడదు.  ఏదైనా దీక్షా ధర్మంగా గృహస్థాశ్రమంలోకి వెళ్లి…. ఆ యొక్క ఋణము తీర్చుకొని రావాల్సి ఉంటుంది. అది ఎంత కాలం పడుతుంది… ఏంటి?  అనేది చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకి ఒక అతను సన్యాసి దీక్ష తీసుకొని కాశీ క్షేత్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భిక్షా వృత్తి చేస్తూ ఉండేసరికి… ఒక వైధవ్యం పొందిన స్త్రీ…. ఈ సన్యాసి భిక్షాటనకి వస్తాడని తెలిసి  రోజు రుచికరమైన ఆహార పదార్థాలు,  ఆయనకి భిక్షగా వేయడం జరుగుతూ ఉండేది.  ఆ తర్వాత ఆమె మనసు ఆయన మీద లాగటం మొదలయ్యింది.  కామం మొదలైంది.  ఈ విషయం గ్రహించిన సన్యాసి…. ఈమె దగ్గరికి భిక్షకు వెళ్ళటం మానేశాడు.  కొంతకాలం తర్వాత ఈయన భిక్షకు రావడంలేదని….ఈయన ఎక్కడ ఉన్నాడు అని వెతికి,  అక్కడికి రావడం మొదలుపెట్టింది.  భిక్ష వేయడం మొదలైంది. ఈయనకి కావాల్సిన అవసరాలు తీర్చడం మొదలుపెట్టింది.  రాను  రాను ఈ సన్యాసికి  కూడా ఆవిడ మీద కృతజ్ఞతాభావం మొదలైంది.  జాలి కూడా మొదలైంది.  ఇలా ఈమెపై ప్రేమ, అనురాగం మొదలయ్యింది.  దాంతో వివాహం చేసుకున్నారు.దేవి దాసుడు అయిపోయాడు.  ఇక్కడతో ఆయన సాధన ఆగిపోయి ….. గంగపాలు పాలు అయ్యింది.  ఇక వాళ్ళిద్దరూ సంసారంలోకి వెళ్లి పిల్లల్ని కని భోగ జీవితంలో పడ్డారు . యోగ జీవితంలో సాధన పరిసమాప్తి కావలసిన వాడు….  మాయకు బలి అయ్యి అమోక్షం పొందడం జరిగింది. దీనికి కారణం ఎవరు? మనసే కదా!  మనసులో సంతృప్తిగా కామకోరికలు తీర్చుకోకపోవడం వలన ఇదంతా జరిగింది . సంతృప్తిగా కామ కోరికలు తీర్చుకొని ఉండి ఉంటే……. ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా! 


శివనందిని:-  అనేసరికి ఇప్పుడు నేను చేస్తున్న ఆలోచనలు తప్పా?


శివానంద:- నువ్వు  శరీర వాంఛ కావాలని  అడిగితే….. నేను ఇక్కడ దాకా రాను.  నీ మనసులో శరీర వాంఛ లేదు. కేవలం స్పర్శ యే…. నా భుజం మీద తల పెట్టుకుంటావు… నా ఒళ్ళో పడుకుంటావు….దీని వలన  నాకు ఎలాంటి కామ కోరికలు… కామ వాంఛలు కానీ రావు . ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు తప్పు చేసినట్టు మానసికంగా అయినా శారీరకంగా అయినా ఎలా అవుతుంది…. ఆ స్పర్శ నువు పొందితే నీకు మనసు సంతృప్తి పొందుతుంది. నా వాడు ఉన్నాడు…. నా మనిషి ఒకడు ఉన్నాడు…..నాకంటూ ఒకడు ఉన్నాడు…అని నీకు భావన కలుగుతుంది.  తద్వారా నీకు సాధన ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది.  ఒకవేళ నా శరీరం తాకితే ,  నా శరీరంలో  నగ్నత్వం చూస్తూ ఉన్నట్టయితే…. నీకు శరీర వాంఛలు కలుగుతుంది.  ఎప్పుడైతే  దిగంబర తత్వం చూసావో…. అప్పుడు నీకు ఉన్న వాంఛలు  కూడా రాను రాను తగ్గిపోతూ ఉంటాయి.  ఆ స్థితికి వస్తూ ఉంటే నీ మనసు అదుపులోకి వెళుతుంది.  మనసు అదుపు చేయలేని వాడి మనసు…. కోరికల వైపుకు వెళుతుంది.  అదుపు అయిన వాడి మనసు కోరికలు తగ్గించడం వైపుకే వెళుతుంది.  కోరికలు పెరుగుతూ ఉంటే….. అది భోగ జీవితానికి దారితీస్తుంది.  కోరికలు తగ్గిస్తూ ఉంటే…. అది యోగ జీవితానికి దారితీస్తుంది.  ఒకటి,  ఇక్కడ అలవాటు అవ్వకూడదు.  అలవాటు అవసరంగా మారుతుంది.  అది కోరికే అవుతుంది . ఆ కోరిక కాస్త అవసరంగా మారకుండా అదుపు చేసుకోగలిగితే ఏమీ ఉండదు.  మన మధ్య ఎలాంటి శారీరక వాంఛలు లేవు కాబట్టి….. మానసికంగా, శారీరకంగా  కామ  వాంఛలు,కోరికలు లేవు కాబట్టి…. స్పర్శ కావాలి కాబట్టి ….. అందులో ఎలాంటి తప్పులేదు. 


శివ నందిని:- దీనికి అనుమతి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు …


అని చెప్పి భుజం మీద తలవాల్చుకునే సరికి…. ఈ స్పర్శ కోసం,  ఈ స్వచ్ఛమైన ప్రేమ కోసం….నేను  ఎన్నో కోట్ల జన్మల నుంచి ఎదురుచూస్తున్నాను స్వామి!  అలాంటిది మీరు ఇప్పుడు వచ్చారు.  అసలు ఈ జన్మలోనే నాకు భర్తగా వచ్చి ఉంటే…. ఈ బాధలు ఉండేవి కాదు కదా!  అనేసరికి…. శివ స్వామి ఉన్నట్టుండి పెద్దగా పకపక నవ్వాడు.  అదేంటి!  అలా నవ్వుతారు అనేసరికి… అదే విషయం నీకు చెబుతున్నాను ఇప్పుడు. 


శివానంద:- ఆది జన్మలో ప్రతి జీవుడికి కూడా దైవాంశ జన్మే అవుతుంది. ఇప్పుడు మనిద్దరం శివుడు, శివాని అనుకుందాము …శివుడు మోక్షం పొందాలి అని చెప్పేసి….ఏకాంతంగా, ఒంటరిగా ఉండి ధ్యాన నిష్ఠలో ఉన్నారు. అప్పుడు శివుని చూస్తున్న అమ్మవారైన నీకు విపరీతమైన కామ వాంఛలు కలిగాయి.  కానీ ఆయనకి ధ్యాన భంగం కలిగించకూడదు అని….. మనసును అదుపుగా ఉంచుకోవాలి అని…. నన్ను కామ భావంతో….చూస్తూ, కామ వాంఛలతో, కామ భావనలతో, కామ ఆలోచనలతో సతమతమవుతు ….. దాంతో అదుపు చేసుకోలేక మానసికంగా శృంగారం చేస్తూ….. నన్ను చూస్తూ ఉండేసరికి…..నీకు స్వేద బిందువుల రూపంలో 64 స్వేద బిందువులు వచ్చినాయి.  మీ 64  స్వేద బిందువుల నుంచి 64 యక్షిణిలు వచ్చారు. వాళ్ళే యోగినీలు అంటారు.  ఈ యోగినీల యొక్క కామ కోరికలు తీర్చడానికి….. నేను మళ్ళీ 64 రుద్రులుగా అవతారం ఎత్తడం జరిగింది. అందులో ఒక రుద్రుడు మోక్షం పొందితే….మిగతా 63 రుద్రులు వివిధ రకాల కామ కోరికలను తీర్చే పనిలో ఉండిపోయారు.  వాళ్ళందరూ కూడా మోక్షమును  పొందాలి….ఈ కామ కోరిక అంతులేనిది…. ఇంకా పుట్టుకొస్తూ ఉంటాయి కానీ తరిగేవి కావు.  తీరేవి కావు…. అంతం అవ్వవు అని గ్రహించారు.  అమ్మవారు గ్రహించలేక పోయింది.  మీరు ఉండాల్సిందే ! మీరు లేకపోతే ఎలాగా?  అని  పురుష ప్రకృతిలో శివుడు మోక్షం పొందుతూ ఉంటే…..స్త్రీ ప్రకృతిలో అమ్మవారు ఆపడం జరుగుతుంది.  అమ్మవారు, అయ్యవారిని స్త్రీ ప్రకృతిలో బంధనం  చేయడం జరిగింది. అదే పురుష ప్రకృతిలో అమ్మవారు  మోక్షం పొందుతాను అంటే మోక్షమును పొందండి అని అనుమతి ఇచ్చేసింది. అంటే పురుష ప్రకృతిలో అయ్యవారు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.  ఇక్కడ స్త్రీ ప్రకృతిలో అనుమతి ఇవ్వలేదు. నువ్వు వెళ్లడానికి లేదు…. నువ్వు ఉండాల్సిందే!  నా కోరికలు తీర్చాల్సిందే!  నువ్వు వచ్చిందే దానికోసం…. అని బలవంతంగా బంధనం చేసింది.  ఆ బంధనాలే నువ్వు ఇప్పుడు విముక్తి చేయాలి……


శివ నందిని:-  స్వామి!  అమ్మవారికేనా కామ  కోరికలు ఉంటాయి…. అయ్యవారికి లేవా? 


శివానంద:- అయ్యవారు కామ కోరికలు అదుపులో ఉంచుకున్నాడు.  అణచి వేసుకున్నాడు…. ఆయనకీ ఉన్నాయి.  ఆయనకే కామ కోరికలు లేకపోతే 64 రూపాలు  ఎందుకు ఎత్తుతాడు….. అమ్మవారితో పాటు.  కాకపోతే ఒక శివుడు మనసుకు స్థిరం చేసుకున్నాడు.  మిగతా 63 మంది అస్థిరం చేసుకున్నారు.  అలాగే అమ్మవారు కూడా ఒక శరీరం మనసు స్థిరం చేసుకుంది. 63 శరీరాలు అస్థిరం చేసుకుంటుంది.  స్థిరమైన శరీరం ఎవరిది? ఆవిడ  మోక్షం పొందిందా?  లేదా?  అనేది మీ సాధన పరిసమాప్తిలో తెలియాలి. ఆవిడ మోక్షం పొందింది…. అంటే విశ్వమే లేనట్టు,  విశ్వ ప్రక్రియ లేనట్టు…. ఈ విశ్వమంతా భ్రమ , బ్రాంతీ అని చెప్పవచ్చు.  ఆధారాలతో నిరూపించవచ్చు…. ఇప్పుడు నేను సాధన చేస్తున్నప్పుడు పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు…. ఆదిపరాశక్తి మోక్షం పొందలేదు…. సజీవ మూర్తిగా ఉంది అని తెలుస్తుంది.  అదే నువ్వు సాధన పరిసమాప్తిలోకి  వెళ్ళినప్పుడు….. స్త్రీ మూర్తి మోక్షం పొందినట్లు, పురుషుడు మోక్షం పొందలేదు అని చెప్పడం జరుగుతుందేమో!  అప్పుడు మోక్షం పొందిన వాళ్లు ఒకవైపు…… మోక్షం పొందని స్త్రీ,  పురుషులు ఒకవైపు ఉంటారు.  అప్పుడు ఆ మోక్షం పొందని వాళ్లని మోక్షం పొందేలా చేయడమే…. మన సాధన పరిసమాప్తి అవుతుంది. అది చేయగలమా లేదా? అనేది కాల నిర్ణయమే చెప్పవలసి ఉంటుంది….


శివనందిని:-   ఇదంతా కూడా నాకు అర్థమై అర్థం కానట్టుగా ఉంది. ఏదైనా అనుభవ అనుభూతి పొందాల్సిందే.  స్వామి!  మీరు చెప్తున్నప్పటికీ కూడా తెలుసుకోవడం, చూడడం కాదు… దాని అనుభవించాలి. 


శివానంద:- అదే నీతో వచ్చిన చావు . కొంతమందికి చెబితే అర్థమవుతుంది…. కొంతమందికి కొడితే అర్థం అవుతుంది…. కాబట్టి నీకు  ప్రత్యక్ష అనుభవం పొందితే గాని నీకు నేను చెప్పలేను…. అనేసరికి 


సరే స్వామి!  మరొక  సందేహం అనగానే…. చెప్పు దేవి! అనగానే… 


శివనందిని:- ఇప్పుడు మనం ఆది జన్మలో దైవాంశ సంభూతులుగా శివ, శివాని అన్నారు బాగానే ఉంది….అందులో అమ్మవారు కామానికి లోనవ్వటం వలన… 64 యక్షిణిలుగా మారారని చెప్పారు.  ఆ తర్వాత ఏమైంది?  


శివానంద:- అప్పుడు నేను మనిషి జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో శివాలయ పూజారిగా పుట్టడం జరిగింది.  ఆ తర్వాత నువ్వు ఆ పక్కనే మరో బ్రహ్మణ దంపతులకు ఆడపిల్లగా పుట్టడం జరిగింది.  కాకపోతే మీ ఇంటికి , మా  ఇంటికి మధ్యలో 10 ఇళ్ల  దూరం  ఉండేది. యుక్త వయసుకు వచ్చాక నువ్వు అమ్మవారి భక్తురాలవి అయ్యావు….. నేనేమో శివాలయ పూజారిని అయ్యాను . నేనేమో శివలింగానికి పూజ చేస్తున్న సమయంలో…. నువ్వు ఇదే ఆలయానికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉండేదానివి.  అమ్మవారికి కావలసిన పళ్ళు , పూలు,నైవేద్యానికి కావలసినవి పెట్టి…. నాచేత అమ్మవారికి అలంకరణ చేయించుకుని….సంతృప్తి చెంది వెళుతూ ఉండేదానివి. పొద్దున,  సాయంత్రం గుడిలో మంచి నీళ్ళ కోసం వస్తూ ఉండేదానివి . మంచినీళ్ల కోసం వచ్చే సమయంలో….. పూలు కోసే సమయంలో….. అనుకోకుండా మనిద్దరికీ పరిచయం ఏర్పడింది.  చూపులు కలిసినాయి.మనసులు కలిసినాయి …భావాలు, ఆలోచనలు, మనస్సులు ,మాటలు కలిసినాయి.  ఆ తర్వాత ఇద్దరం యుక్త వయసులోకి వచ్చాక,  మన పెద్దలు మన ఇద్దరికీ వివాహం చేయడం జరిగింది. ఆ వివాహం తర్వాత ఇద్దరం…. వివాహ జీవితంలో అటు శృంగార కార్యక్రమాలలోను …. ఇటు దైవ కార్యక్రమాలలోను సమవుజ్జులుగా ఉండి చేసుకుంటూ ఉండేవాళ్లం. నైవేద్యానికి కావలసిన ప్రసాదాలు, భక్తులు చేసి పెట్టమన్న ప్రసాదాలు… అన్నీ కూడా ఒక ఇల్లాలిగా అన్ని చేస్తూ ఉండేదానివి. కాకపోతే నీకు దేవాలయానికి వచ్చినప్పుడు  ప్రసాదాలు చేసి పెట్టే భక్తులను చూస్తున్నప్పుడు…. నీ మనసు మారటం మొదలైంది. నాలో లోపాలు కనిపించడం మొదలయ్యాయి.  ఒక ధనవంతుడు వచ్చి వాడి  ఒంటినిండా బంగారం ఉండేసరికి….. బంగారు ఆభరణాలు వేసుకొని కనిపించేసరికి….నాలో ఇసుమంత బంగారం కనిపించకపోతే…. ఈయనకి కూడా బంగారం ఉంటే బాగుండేది కదా!  అని ఆలోచన మొదలైంది.  ఆ తర్వాత ఇంకో భక్తుడు కార్ లో రావడం చూసి ఈయనకి సైకిల్ కూడా లేదు….. ఈయనకి కూడా కార్ ఉంటే బాగుండేది కదా!  ఇంకొకతను శంకుస్థాపన కోసం గృహాన్ని కట్టుకునే ప్లాన్ అవి చూపిస్తూ ఉండేసరికి….. మనకి గుడిలో పూజారికి ఇచ్చిన పూరి గుడిసె ఉంది తప్పితే ….ఇంకేం లేదు, అదే చదువుకొని ఉండి ఉంటే…. ఈయన కోటీశ్వరుడు, విద్యావంతుడు అయ్యేవాడు కదా!  విలాసవంతమైన జీవితం ఉండేది కదా!  అని…. మనసు పరివిధాలుగా ఆలోచించడం మొదలైంది. నాలో లోపాలు, తప్పులు కనపడటం మొదలైంది.  నేను కేవలం వేదమంత్రాలు చదువుకున్నాను….అదే విజ్ఞానంలో మంచిగా చదువుకొని ఉండి ఉంటే…. ఉన్నతమైన మంచి జీవితం వచ్చేది. భోగ రూపంలో విలాసవంతమైన జీవితం ఉండేది అనుకుంటూ…. ఇలా భోగంలో విలాసవంతంగా ఉండే వాళ్ళని చూడటం మొదలుపెట్టావు. వాళ్లని నన్ను పోల్చడం మొదలుపెట్టావు….దాంతో సంతృప్తి చెందే దానివి కాస్త నీలో అసంతృప్తి ,మనోవేదన మొదలయ్యింది.  మనోవికారాలు మొదలైనాయి…. ఇలా కాదనుకొని ఆ భక్తులలో కొంతమందిని నీ మనసుకి నచ్చిన వారిని ఎంచుకొని….వారితో రహస్యంగా కామక్రీడలు చేయడం ఆరంభించావు. ఈ విషయం నాకు తెలిసి,  మన మధ్య పొరపత్యాలు వచ్చి మనం విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి వారే  యమునకు తీరే అన్నట్టుగా…. నేను వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోవడం…. ఆ తర్వాత నువ్వు నీకు కావలసిన పురుషులతో ప్రేమలో పడటం….. ఇలా జన్మలు పెంచుకుంటూ వెళ్ళటం జరిగిపోయింది.  ఇలా వందలు ,వేల జన్మలు ఎత్తడం జరిగింది. కాకపోతే నా జన్మ ఏమో శ్రీశైలంతో అంతం అయ్యింది.  నీ జన్మ ఏమో కాశీ క్షేత్రంలో అంతమయ్యింది.  ఆ అంతం అయ్యే సమయానికి పూర్ణ స్మశాన వైరాగ్యం ఈ జన్మలకి వచ్చినాయి.  ఆది జన్మలో కర్మ శేషం మిగిలిపోవడంతో….. అసంతృప్తితో నా దగ్గర నువ్వు సరియైన విధంగా కామానందం పొందకపోవడం అనే అసంతృప్తి మిగిలిపోవడంతో…..అసంతృప్తి కాస్త కర్మ శేషంగా మిగలడంతో…. నువ్వు నా ఆకాశరీరానికి ధర్మపత్నిగా, నీ మనో శరీరం గా మిగిలిపోవడం జరిగింది. ఇప్పుడు స్మశాన వైరాగ్యం రావటంతో ప్రకృతి మనల్ని కలపడం జరిగింది. మనకి ఉన్న కర్మ శేషమును పూర్తి చేసుకుంటే ఎవరికి వారే అది వ్యక్తిగత మోక్షం పొందటంలో పరిసమాప్తికి వచ్చింది.  కాకపోతే నాది వ్యక్తిగత మోక్షం పరిసమాప్తికి వచ్చింది…నీది సాధన ఆరంభ స్థితికి రావడం జరిగింది. కాకపోతే మనం ఆది జన్మలో భార్యాభర్తలం కాకపోతే…. నీలో కలిగిన మనోవికారాలకు తట్టుకోలేక మనసు పరివిధాలుగా పోవడంతో…. అదుపు తప్పడంతో…. నువ్వు అలా వెళ్ళిపోవడం…. నువ్వు వెళ్లిపోయావని విరహవేదన, పురుష అహంకారంతో వేరే స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది.  ఇప్పుడు మళ్లీ నేను కావాలి అని నీ మనసు కోరుకోవడం మొదలైంది.ఇప్పుడు మిగిలిపోయిన ఆ కర్మ శేషము అనుభవ అనుభూతులను పొందడం కోసం…. మన ఇద్దరినీ కలిపారు. కాకపోతే అప్పటికే నువ్వు ఒక స్త్రీ మూర్తివి ఉన్నావు అని….నేను సన్యాసం తీసుకుని దీక్షలో ఉన్న మూడున్నర సంవత్సరాల తర్వాత…. నేను శివోహం స్థితికి వచ్చిన తర్వాత….. నువ్వు ఈ ఆది జన్మ స్థితిగతులు, దైవిక అంశ, నీ ధర్మపత్ని యొక్క అంశలు….అన్నీ కూడా జ్ఞాన స్పురణ అందడం జరిగింది. సరే నీ సాధన పరిసమాప్తి పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నప్పుడే….. నీ సాధన పరిసమాప్తి స్త్రీ ప్రకృతికి సంబంధించినది అని చెప్పి అర్థం అయింది.  అది చేయగలుగుతావా లేదా?  అని ఎదురుచూస్తున్నాను…. 


శివానంద:-  స్వామి! నేను ఆ తప్పు చేయకపోయి ఉండి ఉంటే…. మీరు జీవితాంతం నాతో, నా భర్తగా ఉండేవాళ్ళు కదా!  దగ్గరుండి సాధన పరిసమాప్తి చేసేవాళ్ళు కదా!  నాకు కావలసినట్టుగా నేను ఉండేదాన్ని కదా! 


శివనందిని:- అది మన చేతుల్లో ఏమున్నది?  ఈశ్వరుడి ఆజ్ఞ కదా!  ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా!  కోరిక కలిగింది….. ఆ కోరికను అనుభవించడంలో తేడాలు వచ్చినాయి…. అదే చెప్తున్నాను, నాలోనే నువ్వు భిన్నభావాలు అన్ని చూసుకున్నట్లయితే సరిపోయేది.  కోటీశ్వరుని చూసి కారు లేదని, ఇల్లు లేదని, బంగారం లేదని, మనోవేదనకు గురి అయ్యావు.  కానీ వాటికి మించిన జ్ఞానం ఈయనకి ఉన్నది ….ఈయన యోగి … ఈయన జ్ఞాన గురువు…. సరస్వతీపుత్రుడు అని…. గాయత్రి ఉపాసకుడు అని మనసుని ఇటువైపు తిప్పుకొని ఉంటే  కథ  వేరే లాగా ఉండేది.  ఎప్పుడైతే మనసులు నిగ్రహించుకోలేకపోవడం వలన అంతం అయ్యే కథ కాస్త అంతులేని కథగా మారిపోయి…. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడు వాటి మీద మనోవికారాలు పోయి… అన్ని రకాల భోగాల మీద స్మశాన వైరాగ్యం పొందే స్థితికి రావడం జరిగింది. అందుకే నీకు దీక్ష పరీక్షలు పెట్టినప్పుడు…. నువ్వు గత జన్మలలో వేటి కోసమైతే కోరిక మాయలలో పడ్డావో …..వాటిని తిరిగి నీకు పరీక్షలు గా పెట్టడం జరిగింది.  కారణం లేనిదే కార్యము ఉండదు.  దైవం దృష్టిలో ప్రతిదానికి కూడా కారణం ఉంటుంది. ఊరికే పరీక్షలు పెట్టరు. మనసు నిగ్రహించుకుంటావా లేదా?  అని పెడతారు.  వజ్రాల హారం చూసి ఆనాడు నన్ను వదిలేసి వెళ్లావు….. ఇప్పుడు అదే వజ్రాల హారం చూసేసరికి….ఇది నాది కాదు, నాది కాని వస్తువు నాకెందుకు?  అని వదిలేశావు.  మరి అదే ఆది జన్మలో నువ్వు అది చేసి ఉంటే …..ఆవిడ ఎవరో వజ్రాలహరం ధరించిందని, ఆయన ఎవరో బంగారు ఆభరణాలు ధరించాడని అనుకుంటే… సరిపోయేది.  నాకు వజ్రాల హారం ఉంటే బాగుండేది…. నా భర్తకి బంగారు ఆభరణాలు ఉంటే బాగుండేది. ఈయన  చదువుకుని ఉంటే కోటీశ్వరుడు అయి ఉండేవాడు….విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవలసి వచ్చేది… అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాను అనుకున్నావు.  మళ్ళీ తిరిగి ఆ విలాసవంతమైన జీవితాన్ని పొందేసిన తర్వాత మళ్లీ అరకొర జీవితంలోకి…. ఒక గదిలోనే పచ్చడి మెతుకులలోనే సంతృప్తి జీవితానికి…. నువ్వు మళ్ళీ చేరుకోవడం జరిగింది.  ఆది జన్మలో నేను ఏదైతే పెట్టానో….. మళ్ళీ అంతం జన్మకి వచ్చేసరికి అదే స్థితికి రావడం జరిగింది.  ఆనాడు నువ్వు సంతృప్తి పొంది ఉంటే ఇదంతా జరిగేది కాదు.ఆనాడు అసంతృప్తి పొందడం వలనే ఇదంతా జరిగింది.  దానికి మనం శివనింద చేయడం, దేవినింద చేయడం ఎందుకు…!  దైవాలను నిందించడం ఎందుకు…!  కోరికలు అంతులేని కోరికలు అవడంతోనే ఇదంతా జరిగింది. ఆనాడే ఆ కోరికను అంతం చేసుకొని ఉంటే….ఇదంతా జరిగేది కాదు.  అప్పుడు మన మరణాలే మోక్షమరణాలు అయ్యేవి….


శివనందిని:- జరిగిందేదో జరిగిపోయింది స్వామి!ఇప్పుడు తెలిసింది కదా!  అయినా ఇప్పుడు మీరు చెప్పింది నిజం అని నేను ఎందుకు నమ్మాలి… నేను తప్పు చేశాను అని అంటారు.  మీరే తప్పు చేసి ఉండొచ్చు కదా!  మీరే నాకు సరిగ్గా కోరికలు తీర్చి ఉండి ఉంటే….ఈ బాధలు ఉండేవి కాదు కదా!  అప్పుడే వజ్రాల హారం కోరిక తీర్చి ఉంటే సరిపోయేది కదా ! మీరు బంగారు ఆభరణాలు ధరించిన కోరిక తీర్చి ఉంటే సరిపోయేది కదా?


శివానంద:- వేద పండితుడికి వజ్రాలహరం సంపాదించాలన్న ఆలోచన ఉండదు. భార్యకి ఎంతో కొంత బంగారం కొని ఇవ్వగలడు…. అప్పటికి నల్ల పూసలు బంగారంతో చేయించి ఇచ్చినప్పటికీ కూడా కోరిక సరిపోలేదు…. వజ్రాల హారం , బంగారు ఆభరణాలు కావాలని పట్టుకుని కూర్చున్నావు.  అది నేను తీర్చలేను అని ఇది కాకపోతే ఇంకొక కోరిక. . ఇంకొక కోరిక…. అనుకుంటూ,  పెంచుకుంటూ వెళ్లిపోయావు.  దానితో మనసు కోరికలు తీర్చే వాడి వైపు వెళ్ళిపోయావు.  అక్కడ సంతృప్తి చెందావా అంటే అక్కడ సంతృప్తి చెందలేదు.  వాడిలో లోపాలను చూపించి వేరే వాడి దగ్గరికి వెళ్లావు…. అంటే నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకోలేకపోయావు…. లోపాలను ఆధారంగా చేసుకుంటూ….. వేరే వాళ్ళని మార్చుకుంటూ అవతలి వాళ్ళ సంసారాలని నీ కోరిక కోసం నాశనం చేస్తూ….. నువ్వు సంతృప్తి పడుతూ….. అసంతృప్తి పొందినప్పుడల్లా ….వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పట్టుకుంటూ వెళ్లావు.  అదే నేను వచ్చాను…. ఒక స్త్రీ తోనే ఆ జన్మలో ఉన్నాను.  ఆ తర్వాత మరో జన్మ ఎత్తి మరో స్త్రీతో ఉండటం జరిగింది. ఒక్క జన్మలోనే నువ్వు 100 మందితో ఉన్నావు.  నేను ఒక్క జన్మలోనే ఒక్క స్త్రీ తోనే ఉన్నాను.  అందుకని నా సాధనలో  మనసు స్థిరమై సాధన పరిసమాప్తి అయ్యే స్థితికి వచ్చింది.  నీ మనసు అస్థిరం అవటం వలన నీ సాధన ఆరంభ స్థితికి వచ్చింది. 


శివ నందిని:- అయినా మీరు చెప్పింది నిజమని నేను ఎందుకు నమ్మాలి? 


శివానంద:- సరే ధ్యానంలో కూర్చొ…. నీకే తెలుస్తుంది 


అని అనగానే…  ధ్యానంలో కూర్చోగానే…..ఈమె భ్రుకుటి స్థానంలో వేలు పెట్టీ తిప్పుతూ ఉండేసరికి…. తన గత జన్మలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్న వివరాలు అన్నీ కూడా యధావిధిగా శివ స్వామి చెప్పినట్టుగా కనిపించేసరికి…… అంటే ఈయన చెప్పింది అక్షర సత్యమే అన్నమాట!  నేను గత జన్మలో కావాలని తప్పు చేయడంతో…..ఆయన మనసు ఆవేదన చెంది,  వేరే స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. నేను ఆ జన్మలో సుమారు 12 మందితో శృంగారం చేసినట్టుగా కనిపించేసరికి ….. కళ్ళు తెరిచి 


శివ నందిని:- స్వామి!  నన్ను క్షమించండి… అతి కామమే నా కొంపముంచింది అని అర్థమవుతుంది.  ఆనాడు చేసిన తప్పుకి ఈనాడు విరహవేదన పడాలన్నమాట!  అందుకే మీరు సన్యాస దీక్షకు వచ్చేశారు.సంసారంలో ఉండి ఉంటే నేను సంసార బాధ్యతలు నిర్వర్తించుకొని…. మీకు కావలసిన విధంగా నేను చేసి ఉండేదాన్ని..


శివానంద:- సంసారంలో నువ్వు ఉన్నట్లయితే సాధనకి పనికి వచ్చేదానివి కాదు….   సంసారంలో ఉంటూ సాధన చేయడం అసాధ్యం.  కాకపోతే అవసరాలు తీర్చుకునే భక్తి,  కోరికలు తీర్చుకునే భక్తి మాత్రమే ఉంటుంది.  అసలుసిసలైన మోక్ష సాధన అంటే సన్యాస ఆశ్రమంలో వచ్చే స్థితి. కొంతమంది మానసిక సన్యాసం తీసుకుంటారు….. కొంతమంది శారీరక సన్యాసం తీసుకుంటారు…  సన్యాసం అంటే తన జీవితం మీద కుతూహలం లేకపోవడం…. ఇతరుల జీవితాల మీద కుతూహలం లేకపోవడం అని అర్థం.  కాషాయం యొక్క అర్థం అది. 


శివ నందిని:-  అంటే సాధనకి సన్యాస దీక్ష తప్పనిసరిగా ఉండాలా ? 


శివానంద:- తప్పనిసరిగా ఉంటుంది.  వైకుంఠపాళీ ఆటలోనే 89లో సన్యాసం అని చెప్పడం జరుగుతుంది. ఆ గడికి ఒక నిచ్చెన ఉంటుంది… పరమపద సోపానం మహా వైకుంఠం అని చెప్పేసి ఉంటుంది.  ఇప్పుడు ఉన్న వైకుంఠపాళీ ఆటల్లో వైరాగ్యం అని చెప్పడం జరిగింది. కావాలంటే చూడు…. చిన్న ఆటలోనే మన యొక్క స్థితిగతులు చూడు…. ఇప్పుడు ఒకటి లోనే పాము తోక ఉంటుంది. 107 లో దాని తల ఉంటుంది. కోరిక రాహిత్య స్థితి పొందితే పరవాలేదు…. కోరిక మాయలో పడితే లేదా మోహమాయలో పడితే వాడి సాధనా స్థితి ఉన్నత స్థితి నుండి అధోగతి పాలయ్యి అధోస్థితికి వచ్చేస్తాడు.  నూట ఏడవ స్థితి నుంచి ఒకటవ స్థితికి వచ్చేస్తాడు అని చెప్పేసి ఆటలో చెప్పడం జరిగింది.  వైకుంఠపాళీ అంటేనే విశ్వ జగన్నాటకం యొక్క ఆట అన్నమాట!   నిచ్చెనలు ఎక్కటం, పాములు కోరల్లో పడటం… కోరికలకు స్పందించడం…. ఆనందాలు పొందడం అని చెప్పేసి చెప్పారు.   సూక్ష్మంలో  మోక్షంగా ఆటలోనే మనకి సాధన విషయం అంతా చెప్పడం జరిగింది.


శివ నందిని:- అవును స్వామి!  నేను వైకుంఠపాళీ ఆటలో చూశాను… గమనించాను…. 


అనేసరికి ఇంక  నన్ను వెళ్ళమంటావా దేవి!  అనేసరికి స్వామి ఇంకొక్క ధర్మ సందేహం!  అనగానే అడుగు దేవి!  అనేసరికి శివ నందిని అడగటం ప్రారంభించింది.


శివ నందిని:- ఇప్పుడు ఈ సాధన విగ్రహ మూర్తి కానీ… స్పటిక రుద్ర శివలింగం కానీ…. ఇలా వచ్చే దైవిక వస్తువులన్నీ సంచిలో పెట్టుకుని దాచుకోవడం…. తీసుకువెళ్లడం కష్టమవుతుంది.  బరువుగా ఉంటాయి కదా!  అలాగే మన శత్రువుల చేతిలో పడిన ప్రమాదమే కదా!  మరి దాన్ని ఎలా సంరక్షించుకోవాలి?


శివానంద:- వీటిని సూక్ష్మంలో మోక్షంగా చేసుకోవచ్చు. ఈ దైవిక  వస్తువులను ఈ శరీరంలో దాచుకోవచ్చు.  అవసరమైనప్పుడు కాలానుగుణంగా …సమయానుగుణంగా …. నువు ఎప్పుడైతే సంకల్పిస్తావో…. అప్పుడు బయటకు రావడం జరుగుతుంది.  కానీ సాధన విగ్రహ మూర్తి మాత్రం మీ శరీరానికి ప్రతిరూపం కాబట్టి… అది లోపలికి వెళ్ళదు.  అది మాత్రం బయట ఉంటుంది.  మిగతా వచ్చే ఆయా వస్తువులన్నీ కూడా నీ శరీరంలో భద్రపరచుకోవచ్చు .


శివ నందిని:- అది ఎలా సాధ్యం అవుతుంది స్వామి?


అనేసరికి. తన చేతిలో ఉన్న  కారుంగలి యోగ దండమును శివ నందిని కి చూపిస్తూ….. 


శివానంద:- చూడు!  నేను దీన్ని ఎలా నాలో ఇది   చేసుకుంటానో ….


అనేసరికి ఏదో మంత్రం సంకల్పించేసరికి…. అది కాస్త గాలిలో మాయమాయి పోయింది. అదృశ్యమైన దాన్ని తన భ్రుకుటి స్థానంలో చూపించేసరికి…..ఆ వస్తువు తన శరీరంలోకి వెళ్లిపోయినట్లుగా…. ఆ వస్తువు తన శరీరం లోపల ఉన్నట్లుగా….. ప్రత్యక్షంగా శివ నందిని చూడడంతో …..ఆ తర్వాత కొద్దిసేపటికి తన భ్రుకుటి స్థానం దగ్గర చేయి పెట్టగానే…. ఆ వస్తువు తిరిగి రావటంతో…. 


శివ నందిని:- ఓహో!  ఇలా కూడా సాధ్యపడుతుందా?  అయినా సిద్ధులకి సాధ్యం కానిది ఏముందిలే!  నేను మంత్రమును సిద్ధి పొందటానికి సమయం పడుతుంది. 12 సంవత్సరాలు పడుతుంది..


శివానంద:- ఆ  మంత్రం సిద్ధి పొందిన వాడిని నేను ఉన్నాను కదా! యోగిగా ఉన్నాను కదా!  నీకు ఇది క్షణకాలంలో సిద్ధింప చేస్తాను….. కాకపోతే ఏమిటంటే మంత్రం గుర్తుపెట్టుకో!  ఏ వస్తువైతే లోపలికి వెళ్లాలనుకుంటున్నావో …..ఆ వస్తువు మీద చెయ్యి పెట్టేసి చదివితే….. ఆ వస్తువు అదృశ్యం అయిపోతుంది.  ఆ వస్తువుని తీసుకువెళ్లి నీ భ్రుకుటి స్థానంలో పెట్టుకుంటే….. అది నీ శరీరం లోపల ఉండిపోతుంది.  


శివ నందిని:- సరే స్వామి!  నా దగ్గర ఉన్న ఈ రుద్ర స్పటిక శివలింగం ఉంది కదా!  దీనిని నాలో దాచుకోవచ్చా.?  


శివానంద:- దాచుకోవచ్చు…. అలాగే నీ చేతికి వచ్చిన కృష్ణ వేణువుని కూడా దాచుకోవచ్చు…. 


శివ నందిని:- సరే స్వామి!  వేణువు బయటే ఉంచండి…. అవసరమైనప్పుడు మనోవేదన కలిగినప్పుడల్లా నేను  దాన్ని వాయించుకుంటాను.  దైవిక వస్తువులు కదా!  


అనేసరికి సరే అని…. అరచేయి అంత ఉన్న స్పటిక రుద్ర శివలింగమును బయటకు తీసేసరికి…. ఆ దివ్య కాంతి ఆ బస్సు అంతా ఆవరిస్తూ ఉండేసరికి….. 


స్వామి!  ఎవరైనా గమనించి నా దగ్గర ఏదో వజ్రం ఉంది…. విలువైనది ఏదో ఉంది …అని వస్తారేమో! 


శివానంద:-  కంగారు పడకు దేవి! అది ఎవరికి కనపడదు.  ఒక యోగులకి , సాధువులకి మాత్రం తప్ప ఇంక ఎవరూ చూడలేరు … 


అని చెప్పేసరికి చెవిలో ఆ మంత్రమును చెప్పేసరికి…. స్పటిక శివలింగమును తన చేతిలో పట్టుకొని…. ఆ మంత్రం చదివేసరికి ఆ స్పటిక శివలింగం కాస్త కనపడకుండా గాల్లో అదృశ్యం అయినట్టుగా కనిపించింది. కాకపోతే చేతిలో ఏదో బరువైన వస్తువు ఉంది అనే భావన మాత్రం అలాగే ఉంది.  దాన్ని అలాగే తీసుకొని తన ఆజ్ఞచక్రమైన భ్రుకుటి స్థానంలో పెట్టుకునేసరికి…. ఆ వస్తువు తన లోపలికి వెళుతున్నట్లుగా…. తన కడుపులోకి వెళుతున్నట్లుగా…. ఒక మూట ఉన్నట్లుగా….  అనుభవం అవుతూ ఉండేసరికి….. 


శివ నందిని:- స్వామి!  ఇప్పుడు ఆ వస్తువు లోపల ఉండటం వలన శరీర భాగాలకు ఏమి ఇబ్బంది లేదు కదా!  


శివానంద:-  దానికి దీనికి సంబంధం లేదు.  ఈ వస్తువు ఒక రేణువు లాగా ఉండిపోతుంది.  రక్తంలో ఒక రక్త కణము లాగా ఉంటుంది.  అది కదలదు, మెదలదు.  అలాగే ఉండిపోతుంది….నువ్వు భయపడాల్సిన అవసరం లేదు… ఎప్పుడైతే సంకల్పిస్తావో!  మంత్రంతో ….అప్పుడు ఆ వస్తువు తిరిగి నీ దగ్గరికి వస్తుంది ……,  అంతేందుకు నా దగ్గర ఉన్న కామాక్షి దేవి విగ్రహమే ఉంది.  ఆ కామాక్షి దేవి విగ్రహ మూర్తి నా కడుపులో ఉంది…కావాలంటే చూడు….


అని ఆయన కడుపులో మూడు సార్లు చెయ్యి తిప్పుతూ మంత్రం  చెప్పేసరికి…. ఆయన అరచేయి అంత విగ్రహ మూర్తి కాస్త అరచేతిలో ప్రత్యక్షమయ్యింది.  అది చూసుకుని నమస్కారం చేస్తూ…. 


శివ నందిని:- ఇక్కడే కంచి కామాక్షి దేవి దర్శనం అయ్యింది. ఇక కంచికి వెళ్లాల్సిన అవసరం ఏముంది! మీరు విగ్రహం  నాకు ఇచ్చేయండి…. ఇక ఇది తీసుకుని నేను రెండో క్షేత్రానికి వెళతాను ….


శివానంద:- అమ్మ….. ఆ పప్పులేం ఉడకవు.  ఇది నా సాధనాపరంగా నాకు వచ్చిన అమ్మవారు.   నీకు కూడా శివధ్యాన మూర్తి రావాలి. నీలో ఉన్న శివుడు…..  నాలో ఉన్న శివాని కలిస్తే ఏమవుతుందో చూడాలి.  కలిసి ఏకత్వ శరీరానికి వెళితే ఏమవుతుందో చూడాలి… కలిసి వాళ్ళు ఏకత్వ శరీరమునకు వెళ్లగలిగితే అదే  విశ్వ మోక్షం అవుతుంది. లేదంటే నువ్వు ధ్యాన శివుని పొందగలిగే స్థితి వస్తే అది స్త్రీ మోక్షం  అవుతుంది.  అమ్మవారిని నేను పొందగలిగాను కాబట్టి పురుష మోక్షం వస్తుంది..


శివ నందిని:- మీరు చెప్పేవన్నీ అర్థమయి కానట్టుగా ఉంటాయి.  ఏదైనా గాని ఇప్పుడు నాకు శివుడు రావాలి . రుద్ర మూర్తి రావాలి.  శివ ధ్యానమూర్తి రావాలి అన్నమాట!  అది వచ్చేదాకా నాకు సాధన పరిసమాప్తి కాదు అన్నమాట!  అంతేలెండి….. మీకు ఎలా అయితే పద్మాసనంలో ఉన్న కామాక్షి దేవి వచ్చిందో….. నాకు కూడా అలాగే ధ్యానంలో పద్మాసనంలో ఉన్న శివమూర్తి రావాలి అన్నమాట!  వస్తాడులెండి…. అంతవరకు నా సాధన ఆగిపోకుండా జాగ్రత్తగా ఉండాలి….


(అనేసరికి మళ్ళీ యథాస్థానంలో అంటే నాభిలో కామాక్షి అమ్మవారిని పెట్టుకోగానే…. ) అవును స్వామి!  మీరు అమ్మవారిని  నాభిలో ఎందుకు ఉంచుకున్నారు…. అంటే కంచిలో కామాక్షి క్షేత్రంలో అమ్మవారి నాభి పడింది అనేసి అంటారు…. అంటే ఇక్కడ ఒక సందేహం!  కొంతమంది నాభి పడింది అంటారు… కొంతమంది కన్నులు పడ్డాయి అని అంటారు…. అందులో ఏది నిజం!


శివానంద:-  నాకు తెలిసినంతవరకు ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటంటే …..అమ్మవారి గుడిలో ఒక గణపతి దేవాలయం ఉంటుంది. ఆ గణపతికి నాభి ప్రాంతం ఖాళీగా ఒక రంధ్రం లాగా ఉంటుంది.  నాభి ప్రాంతం ఖాళీగా ఉంది అంటే…. అక్కడ అమ్మవారి నాభి  పడింది అని నేను గ్రహించాను.  ఇది ప్రత్యక్ష నిదర్శనం.  అక్కడ కొంతమంది కళ్ళు పడ్డాయి అనడానికి  నిదర్శనం ఏమిటంటే …..ఆవిడ చూపుతోనే కోరికలు తీరుస్తుంది కాబట్టి…. పైగా అమ్మవారి పేరు కామాక్షి కాబట్టి…. అక్షి అని ఉండటం వలన కళ్ళు పడ్డాయి అని అనుకుంటున్నారు… కానీ నిజానికి అక్కడ అమ్మవారి నాభి  పడింది.  దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నాభి  రంధ్రం ఉన్న గణపతి…


శివ నందిని:- సరే స్వామి!  ఇందాక వీడియోలో ఇలాంటి గణపతి విగ్రహం ఉన్నట్లుగా విన్నాను.  ప్రత్యక్షంగా చూస్తాను అనేసరికి…. 


శివానంద:- సరే దేవి!  ఇంక నేను ధ్యానం చేసుకునే సమయం ఆసన్నమైంది… ఇక నేను విభూతి మఠంలోకి  వెళ్తున్నాను. ఇంకేమైనా ధర్మ సందేహాలు ఉంటే నీకు ప్రత్యక్షంగా కనపడతాను….నువ్వు విశ్రాంతి తీసుకో! 


శివ నందిని:- స్వామి! నాకు మూలాధార చక్రం గురించి చెప్పరా? నాకు కొంతవరకు తెలుసు… మీ ద్వారా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 


శివానంద:- 

మూలాధార చక్రము

ఇడ, పింగళ, సుషుమ్న అనే ఈ మూడు నాడులు పుట్టుక మూలాధార చక్రములో ఉంటుంది. దీనినే "త్రివేణి" అందురు. ఈ చక్రం వెన్నుపూస క్రింద, గుదము, లింగమూలం వీటికి కొంచెం క్రిందుగా సుషుమ్ననాడిలో ఉంది. దీని ఆకారం అండాకారంలో ఉంటుంది. ఇది నాలుగు దళాలను కలిగి ఉంటుంది. ఇది నాలుగు దళాలను కలిగి ఉంటుంది. అలాగే త్రికోణాకృతిలో ఉంటుంది. ఇది భూమితత్త్వము కలది, దీని అధిష్ఠాన దైవం "గణపతి"గాను, 'శక్తి' 'ఢాకిని' గాను, అధిష్టాతృదేవత 'బ్రహ్మ' గా ఉంటారు. ఇది పీతవర్ణం కలది. ఈ చక్రానికి బీజాక్షరం "లం".

ఈ త్రికోణాకారంలో మధ్యలో, వెన్నుపూస దిగువ లోపలి భాగంలో ఒక లింగం ఉంది! అది పూవు మొగ్గలాగా ఉండి మధ్యలో చిన్న రంధ్రం కలిగి వుంటుంది! ఈ రంధ్రాన్ని సుషుమ్ననాడి ముఖం అంటారు! మొగ్గలాగా ఉండే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు! మొగ్గలాగా ఉండే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు! ఈ లింగాన్ని మూడున్నర చుట్లు చుట్టుకొని, మహతేజస్సుతో కూడి బంగారంలాగా మెరిసే జ్యోతి స్వరూపం ఒకటి. సర్పంలాగా, తన తోకను తన నోటిలో పెట్టుకొని, ఆ సుషుమ్ననాడి రంధ్రాన్ని కప్పి వున్నట్టి ఒక మహశక్తి వుంటుంది! దీనినే కుండలినీశక్తి లేదా సప్తకుండలిని అందురు! అనగా విశ్వాన్ని నడిపించే శక్తి విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ లేదా మహాకుండలినీ శక్తి అందురు! అదే జీవుడిని నడిపించే శక్తిని జీవశక్తి లేదా ప్రాణశక్తి లేదా కుండలినీ శక్తి అందురు! ఈ కుండలినీ శక్తి స్థానం ఈ మూలాధార చక్ర అడుగు భాగములో వుంటుంది కాబట్టి ఈ చక్రమును మూలాధార చక్రమందురు!.

శివ నందిని:- సరే స్వామి!  ఇంక నేను కాసేపు పడుకొని కంచి క్షేత్రానికి చేరాక మీకు విషయాలన్నీ చెబుతాను…. మీ సాధన చేసుకోండి… నా వలన మీరెందుకు ఆగిపోవడం…. ఇప్పటికే  మీరు సమయాన్ని కేటాయించినందుకు….. మీ అమూల్యమైన సమయాన్ని నాకోసం కేటాయించినందుకు….. కృతజ్ఞురాలని..


శివానంద:- అదేంటి దేవి!  అలా ఎలా పంపించేస్తున్నావు…..నీకు మీసాలు పీకాలి!  గడ్డాలు పీకాలి!  అనే కోరిక కూడా ఉంది కదా! 


శివ నందిని:- మీరు దొంగోల్లండి … మీకు మనసులో ఉన్న కోరికలు అన్ని తెలిసినా కూడా…. తెలియనట్టు ఉంటారు.  అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియనట్టు ఉంటారు.  అంటే నా మనసును అంత చదివేశారు….నాకు ఏం కోరికలు ఉన్నాయి… ఏం ఆలోచనలు ఉన్నాయి… ఏం భావాలు ఉన్నాయి ….అవన్నీ కూడా మీకు తెలుసు అన్నమాట!  అది నేను అడుగుతానా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు… నేను అడిగేదాకా ఓపిగ్గా సహనంగా కూర్చుంటారు.  నేనేమో మీరేదైనా అడుగుతారేమో అని చూస్తూ ఉంటాను…. నా కోరికలు మీకు చెప్తే ఎక్కడ కోప్పడతారో… ఎక్కడ తిడతారో 

….ఎక్కడ నీకు నాకు ఋణం తీరిపోయింది అని అంటారో అని అనుకుంటున్నాను…. 


శివానంద:- అదే చెప్పాను కదా! శరీర వాంఛలు,  మనసు వాంఛలు,  కామ వాంఛలు లేనంతవరకు మనం ఇద్దరం పవిత్రంగా ఉన్నట్టే! మన మనసులు,  శరీరాలు పరిశుద్ధంగా ఉన్నట్టే.  సన్యాక్ష దీక్షలో ఉన్నాం కాబట్టి మనం ఆ తప్పు చేయకూడదు…. మిగతావన్నీ చేసుకోవచ్చు… పెద్ద కోరికలు కాదు… ఇవన్నీ చిన్నపాటి ఆనందాలే. వాన ప్రస్థములో ఉన్నాం కాబట్టి…. స్పర్శానందం,  శరీరాన్ని తాకటం… మనసుకు నచ్చింది చేసుకోవడం… తప్పుకాదు!  ఇప్పుడు నాకు నీ చేతిలో అన్నం తినాలని ఉందనుకో…. నేనొచ్చి ప్రత్యక్షంగా నాకు కావలసిన ఆహార పదార్థాలు నీతో చేయించుకుని తింటాను… అలాగే నాతో ఏదైనా చేయించుకోవాలని… కావాలని అనిపిస్తే మోహమాటం లేకుండా చెప్పు… సాధ్యమైనంత వరకు నేను తీరుస్తాను… తీర్చకపోవడం వలన ఇదంతా జరిగింది.  ఆ కోరికలు తీర్చేసి ఉంటే,  ఈ జన్మలు ,ఈ తతంగం అంతా ఉండేది కాదు కదా!  


శివ నందిని:-  గతం గతః …..ఇప్పుడు మళ్ళీ దాని గురించి గుర్తు చేయకండి… నేను మర్చిపోయాను…. మర్చిపోయిన వాటిని గుర్తు చేసి ఎందుకు బాధ పెడతారు….కాకపోతే ఇప్పుడు నా మనసులో ఉన్న కోరికలు మీతో చెప్పుకోవచ్చు… తీర్చుకోవచ్చు.. ఒక శరీర వాంఛ తప్ప మిగతావన్నీ కదా! 


శివానంద:-  అవును అంటే…. శరీర వాంఛ మీద నాకు మమకారాలు పోయినాయి అండి.  ఆ ప్రేమలు  పోయాయి.  ఆ వాంఛలు  నాకు అవసరం లేదు. కాకపోతే చిన్నపాటి కోరికలు ఉండి ఉంటాయి.  మీకు అన్నం తినిపించాలని…  నా చేతులతో తినిపించాలి….  మీ భుజం మీద పడుకోవాలని…. అదే మీరు చెప్పినట్టు మీ గడ్డలు,  మీసాలు పీకాలని ఉంటుంది.


శివానంద:- అది తప్పేం కాదు… కోరిక తీర్చుకోవడం.  కోరిక తీరిపోతే నీకు సంతృప్తి కలుగుతుంది.  


శివ నందిని:- అంటే మీరు నిజంగానే పెద్ద దొంగోళ్లు . అన్నీ తెలిసిన వాళ్ళు మీరు….


 అనుకుంటూ మురిపెంగా ….ఆప్యాయంగా ఆయన మీసాలు మెలి పెట్టేస్తూ….. గడ్డం వేళ్ళతో పెనవేస్తూ…. జుట్టుని మెలిపెడుతూ సుమారుగా ఒక గంట సేపు అలాగే ఉండిపోయింది.  ఆయన ఏమాత్రం అడ్డుపెట్టకుండా…  శివ స్వామి ఆవిడ చేసే వాటిని కూడా చిన్నపిల్లల చేష్టలాగా చూసేసరికి…. ఆ తరువాత ఆయన హృదయం మీద ఉన్న ఒత్తైన జుట్టును కూడా సవరతీస్తూ  అలా ఉండిపోయింది.  అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు…. అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది.  ఆమె గాఢ నిద్రని ఇబ్బంది పెట్టకుండా శివానంద కూడా అలాగే ఉండిపోయాడు.  అలా కంచి క్షేత్రానికి దరిదాపులకు వస్తూ ఉండగా…. ఏదో అలికిడి అయ్యి ఒక్కసారిగా మెలకువ వచ్చేసరికి…. స్వామి అనగానే ….


శివానంద:- నేను ఉన్నాను దేవి ….ఇంక నేను బయలుదేరుతున్నాను…. ఇక మీరు కంచి క్షేత్రానికి దరిదాపుల్లోకి  చేరుకున్నారు… జాగ్రత్తగా ఇక్కడ ఉన్న మాయలు అన్నీ కూడా దాటుకోండి…. ఇక్కడ ఏమాయ వస్తుంది ఏంటి? అనేది మీకే తెలుస్తుంది.  నువ్వే తెలుసుకుంటావు… అమ్మవారు ఏ విధంగా అనుగ్రహిస్తుందో….జాగ్రత్త ……. ఇక నేను ధ్యానానికి విభూతి మఠానికి వెళ్తున్నాను… 


శివ నందిని:- సరే స్వామి కృతజ్ఞతలు… అనేసరికి 


ఆయన అదృశ్యమైపోయారు. ఆ తర్వాత బస్సులో ఉన్న కిటికీలో నుంచి పరిసరాలు చూస్తూ…..శివ స్వామి గురించి ఆలోచనలు చేస్తూ…. మనసు పులకించి పోతున్నట్టు….. ఏదో తెలియని ఆనంద సంతోషాలలో కాలం గడిచిపోతూ…. ముందుకు సాగింది.  ఆ తర్వాత కండక్టర్ వచ్చి కంచి క్షేత్రానికి చేరుకున్నారు…. అందరూ దిగండి…అనేసరికి నిద్రావస్థలో ఉన్న మిగతా వాళ్ళందర్నీ శివ నందిని గట్టిగా లేపి పిలిచేసరికి… ఇక అందరూ కూడా తమ తమ సామాన్లు సర్దుకొని కంచి బస్టాండ్లో బస్సు దిగారు.  ఆ తర్వాత అప్పటికే కంచి క్షేత్రంలో బస్టాండ్ దగ్గరిలో గదులు బుక్ చేసి ఉండటంతో… ఇక అందరూ కలిసి ఆ హోటల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ… హోటల్ గదికి చేరుకొని …..అందరూ ఇక ఆకలి వేస్తుందని  కాళ్ళు , చేతులు, ముఖాలు స్నానాలు పూర్తిచేసుకుని…. టిఫిన్లు చేయడానికి హోటల్ గది నుంచి బయటకు రావడం జరిగింది.


ఇలా  సాధన కుటుంబం అంతా కంచి క్షేత్రంలో ఉన్న కామాక్షి గుడికి వెళుతూ ఉండగా…. వీళ్ళందరిని ఉద్దేశిస్తూ… శివ నందిని కాస్త…


శివ నందిని:- నేను ఇంటర్నెట్లో ఈ క్షేత్రం గురించి వివరాలన్నీ తెలుసుకున్నాను. గుర్తుపెట్టుకున్నాను.  అవన్నీ మీకు చూపిస్తాను.  ఇప్పుడు మనకి ఈ క్షేత్రంలో మూడు గుళ్ళు ఉంటాయి.  ఒకటి దేవి కంచి, రెండు శివకంచి ,మూడు విష్ణు కంచి.  దేవి కంచిలో అమ్మవారు పద్మాసనం వేసుకొని కామాక్షిగా ఉంటుంది.  ఈవిడ పంచరూపాలతో మనకు కనపడుతుంది.  అలాగే ఈ గుడిలో మనం దాదాపుగా 30 ప్రదేశాలను చూడవచ్చు. అలాగే విష్ణు కంచికి వెళ్ళేసరికి అత్తి చెట్టు నుంచి తయారు చేయబడిన అత్తి వరదరాజస్వామి విగ్రహ మూర్తి కనపడుతుంది. ఇది 108 విష్ణు దివ్యదేశాలలో ఒకటి. ఇంకా  అతిశక్తివంతమైన విష్ణు దేవాలయం, వెంకటేశ్వర స్వామి, శ్రీ రంగం , వరదరాజస్వామి తో పాటుగా అతిశక్తివంతమైన విష్ణు దైవాలుగా కొలవబడుతున్నారు.  విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాలలో మొదటగా వీళ్ళ ముగ్గురు ఉంటారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేవి కంచికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివ కంచికి వెళ్లారు.  అక్కడ అమ్మవారు శివుడిని మట్టితో తయారుచేసిన విధంగా ఉండి…. దీనిని ఆరాధన చేయడం జరిగింది. దీనినే ఏకాంబరేశ్వర లింగం అంటారు.  అక్కడే ఆలయ విశేషాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం అమ్మవారు ఉన్న దేవి కంచికి దర్శనానికి వెళదాము… 


అనేసరికి అందరూ కూడా సరే!  అని, అమ్మ మేము నీ చేయి వదిలిపెట్టము. పట్టుకొనే ఉంటాము.  మాకు అన్ని దగ్గరుండి చూపించు…. అనేసరికి సరే!  అని ఇక ఆ రోజు శుక్రవారం అవడంతో….అమ్మవారి ఆలయం సుమారుగా…. కొద్దిగ రద్దీగా ఉండి….సుమారుగా 400 నుంచి 500 మధ్యలో భక్తులతో రద్దీగా ఉంది.  తిరుపతి రద్దీతో పోల్చుకుంటే…. ఇది చాలా తక్కువ అనిపించింది.  చాలా తక్కువలో తక్కువ అనిపించింది.  ఇక అందరూ అమ్మవారి దర్శనానికి క్యూలోకి వెళ్లారు.  కావలసిన అంతసేపు దర్శనం చేసుకునే అవకాశం అక్కడ సిబ్బంది ఇస్తున్నారు. అలాగే భక్తులు కూడా సహకరిస్తున్నారు అని శివనందిని గ్రహించింది.  సరే అని చెప్పి అమ్మవారి ఎదురుగా దర్శనం చేసుకుంటూ ఉండేసరికి…. ఉన్నట్టుండి శివ నందినికి మనసులో మూలాధార చక్ర జాగృతి సమయంలో మనకి కామ మాయ  వస్తుంది. ఆ  కామ మాయను దాటవలసి వస్తుంది. అప్పుడే మనకి ఈ చక్ర జాగృతి,శుద్ధి, ఆధీన, విభేదన శక్తి వస్తుంది. ఈ చక్రానికి ఉన్న యోగశక్తి కూడా వస్తుంది అని జ్ఞాన స్ఫురణ అందడంతో…. వెంటనే పద్మాసనంలో ఉన్న అమ్మవారిని చూస్తూ అమ్మ!  ఏదో నీ అనుగ్రహం వలన మూలాధార చక్ర జాగృతి,శుద్ధి , ఆధీనం, విభేదనం ఇక్కడే ఈ  క్షేత్రంలోనే…. నీ సమక్షంలోనే అవుతుందని జ్ఞాన స్ఫురణ అందడంతో….. నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చే కామమయను దాటించే శక్తిని నువ్వు నాకు అనుగ్రహించు….ఇవ్వు… నాకు ఈ చక్ర సాధన పరిసమాప్తి అయ్యేలా అనుగ్రహించు తల్లి! అని నమస్కారం చేస్తూ ఉండేసరికి….అక్కడ ఉన్న ఆలయ పూజారి కాస్త ఉన్నట్టుండి… అమ్మ! నువ్వు కొంచెం లోపలికి రా…. పరవాలేదు,  అమ్మవారిని దగ్గర నుంచి చూడవచ్చు… ఎందుకో నువ్వు అమ్మవారి అంశగాను… అమ్మవారి నిజ నిష్కామ భక్తురాలిగా… నిష్కామ కర్మతో ఉన్నట్టు ఉన్నావు. నువ్వేదో చిన్న వయసులో సన్యాస దీక్ష తీసుకుని…. మోక్ష సాధన చేస్తున్న మోక్షం పొందే దానిలా కనిపిస్తున్నావు అనేసరికి… మోక్ష సాధన చేయాలనుకుంటున్నాను, మోక్షమరణం పొందాలనుకుంటున్నాను, అనేసరికి మహాదేవి, రుద్ర స్వామి మరియు పిల్లలని లోపలికి పిలిచి అమ్మవారిని దగ్గరగా చూపించడం జరిగింది. అంటే అమ్మవారి సన్నిధానం లోపలికి వీళ్లంతా వెళ్లడం జరిగింది. అక్కడ అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే…. అమ్మవారి ముందు ఒక తొట్టి లాగా యంత్రం కనబడింది.  ఆ తర్వాత అమ్మవారి చేతిలో విల్లంబులపైన ఒక చేతిలో రామచిలుక, మరొక చేతిలో చెరుకు గెడ, రెండు చేతుల్లోనూ ఆయుధాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడింది. అమ్మవారి కళ్ళకేసి చూసేసరికి సజీవ మూర్తిగా ఉన్నట్టుగా అనిపించసాగింది.  అప్పుడు ఆలయ పూజారి అమ్మవారిని చూపిస్తూ….అమ్మ! ఇది ఎవరో చెక్కిన విగ్రహం కాదు… ఇది స్వయంభు గానే అమ్మవారు ఇక్కడికి వచ్చి నిలబడింది.  అది ఎలా అనేది నీకు చెబుతాను… భండాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలని ఇబ్బంది పెడుతూ ఉంటే…. దేవతలు అందరూ కలిసి ఆ మహా శివుని దగ్గరికి వెళ్లి… ఆ రాక్షసుడు నుంచి విముక్తి కలిగించమంటే…. అప్పుడు ఆయన,  ఇది నేను చేయవలసిన పని కాదు, ఆదిపరాశక్తి చేయవలసిన పని. ఆ శక్తి మనకి కంచి క్షేత్రంలో బిలాకాశంలో ఉండి సాధన చేసుకుంటుంది.  మీరు వెళ్లి ప్రార్థన చేసుకోండి… అనేసరికి ఆ బిలాకాశం దగ్గరికి దేవతలందరూ లోపలికి ప్రవేశించడానికి వెళుతూ ఉండేసరికి…. అమ్మవారి యొక్క సాధనా శక్తికి తట్టుకోలేక ప్రవేశం దొరకకపోయేసరికి…. ఏం చేయాలా …అనుకుంటున్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న మామిడి చెట్టు మీద అందరూ ఉండి రామచిలుకలుగా మారిపోయి….భండాసుర రాక్షసుడు యొక్క ఇబ్బందులను అన్ని కన్నీరు కారుస్తూ పక్షి భాషలో చెబుతూ ఉండేసరికి….. ధ్యాన నిష్టలో ఉన్న ఆదిపరాశక్తి అంశ అయిన  కామాక్షి దేవికి అది అర్థం అయ్యి…. బయటకు వచ్చి భండాసురుడు అనే రాక్షసుడుతో యుద్ధం చేసి,  అతని వధించి,  అతని శవాన్ని తీసుకువచ్చి ఇతని శవాన్ని గోతిలో పాతి పెట్టండి…. దీనికి గుర్తుగా ఒక ధర్మ స్థంభమును పాతి, మరొక రాక్షసుడు వీడినుంచి పుట్టకుండా స్తంభింప చేయండి అనేసరికి…. ఈమె అనుగ్రహించి మళ్లీ బిలాకాశంలోకి వెళుతున్న అమ్మవారిని…అమ్మ!  నువ్వు ఎలాగూ బయటకు వచ్చావు కాబట్టి… ఇదే రూపంతో నువ్వు ఇక్కడే సజీవమూర్తిగా మా అందరినీ అనుగ్రహిస్తూ ఈ క్షేత్రంలో ఉండిపో!  బయటే ఉండిపో!  బిలాకాశంలోకి వెళ్ళవద్దు అని చెప్పేసరికి…. దేవతలందరి కోరికను కాదనలేక అమ్మవారు పద్మాసనంలో ధ్యాన నిష్ఠలో ఉండిపోయింది. 


ఇలా నాలుగు వేదాలు నాలుగు గోడలు గాను…. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలు కాస్త 24 స్తంభాలుగాను….ఈ ముఖమండపం  ఏర్పడడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే…. ఏ విగ్రహమైనా కూడా పీఠానికి అనుసంధానం చేసేటప్పుడు పీఠం కింద త్రికోణాకారంలో ఒక పిడిని పెట్టడం జరుగుతుంది. ఈ పిడి విగ్రహానికి అలాగే పీఠానికి అనుసంధానం చేయబడి బిగించబడి ఉంటుంది.  కానీ,  మనకి ఈ విగ్రహ మూర్తికి పిడి ఉన్నట్టుగా సాక్ష్యం కూడా లేదు. కావాలంటే పీఠానికి అమ్మవారు కూర్చున్న దానికి అంగుళంన్నర ఖాళీ స్థలం ఉంటుంది.  కావాలంటే చూసుకోండి అనేసరికి…. ఆయన ఆ ఖాళీ స్థలం చూపించేసరికి అమ్మవారు ఆనుకోకుండా ఒక అంగుళంన్నర గాలిలోనే కూర్చున్నట్టుగా ఉండేసరికి…. నిజంగానే ఈవిడ విగ్రహ మూర్తి కాదు…. సజీవమూర్తిగా ఉంది ఇక్కడ అని వాళ్ళందరూ గ్రహించారు.  అమ్మవారిని చూస్తూ తన్మయత్వం చెందడం ఆరంభించారు.  ఆ తర్వాత అమ్మ!  మనకి ఇక్కడ కామాక్షి దేవి పంచరూపాలలో కనపడుతుంది….మొదటి రూపం ఈ సజీవ మూర్తి రూపంలో ఉండే కామాక్షి రూపం, రెండవ రూపం తపో కామాక్షి. అమ్మవారికి కుడి వైపున ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసుకుంటున్న భంగిమలో ఉన్నది చూడు…. ఈవిడే తపో కామాక్షి అంటారు. ఈవిడ ముందు నేను పూలతో అలంకరణ చేసి పెట్టాను చూసావా…. ఇది బిలాకాశ రంద్రం అన్నమాట!  దీని లోపలికి వెళితే మనకి అమ్మవారి నాభి పడిన ప్రదేశం కనబడుతుంది అని చెబుతారు.  ఇక్కడే ఆదిపరాశక్తి పార్వతీదేవి యొక్క నాభి పడిన ప్రదేశం.  భక్తులకు తెలియడానికి ఇక్కడ పూల గుర్తును చెప్పడం జరిగింది.  ఆ తర్వాత బయట ముఖ మండపం లోనికి వెళితే బంగారు కామాక్షి విగ్రహ మూర్తిని ఉంటుంది. ప్రస్తుతానికి అది లేదు.  తురుష్కుల  దాడిలో బంగారు కామాక్షిని ఎత్తుకు వెళ్ళిపోతారని ఓ మహా భక్తుడు దీనిని తంజావూరు తీసుకు వెళ్ళటం జరిగింది.  తంజావూరులో మనకి బంగారు కామాక్షికి ఆలయం కట్టించడం జరిగింది. తంజావూరు వెళితే మనకి బంగారు కామాక్షి కనపడుతుంది.  ఆ తర్వాత పరమాచార్యులు అయిన నడయాడే దేవుడు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు…. ఆ బంగారు కామాక్షికి బదులుగా అమ్మవారి పాదుకలు బంగారంతో చేసిపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం బంగారు కామాక్షికి బదులుగా బంగారు పాదుకులను దర్శనం చేసుకోవచ్చు అన్నమాట!  ఆ తర్వాత అంజన కామాక్షి కనపడుతుంది.  ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తొట్టి భాగంలో దుర్వాస మహాముని అమ్మవారిని శ్రీ చక్ర మహా యంత్రంతో బంధనం చేయడం జరిగింది. ఈ బంధనంలో మనకి కామాక్షి అంశ కనపడుతుంది.  దీనినే అంజనా కామాక్షి అంటారు.  ఆ తర్వాత మనకి ఉత్సవమూర్తి కామాక్షి అని చెప్పేసి ఉత్సవమూర్తిగా ఊరేగింపుకు ఉపయోగిస్తారు.  ఈ ఉత్సవమూర్తి కామాక్షికి కుడివైపున మహాలక్ష్మి, ఎడమవైపున మహా సరస్వతి ఉంటారు.  ఈ విధంగా మనకి కామాక్షి పంచమూర్తులు మనకి కనపడతాయి అనేసరికి …..వాళ్ళందరినీ చూసుకుంటూ ఆ గుడిలో ఉన్న తపోకామాక్షినీ , అమ్మవారికి ముందున్న అంజన కామాక్షిని యంత్రంలో చూడడం జరిగింది.  అంటే ఈ తొట్టిలో ఉన్నది దుర్వాస మహాముని చేసిన శ్రీ చక్ర యంత్రము అని అర్థమయింది.  సరే అని అందరూ నమస్కారం చేసుకొని వచ్చి కామాక్షి ముఖమండపంలో కామాక్షి ఉత్సవమూర్తిని చూడటం జరిగింది. ఆ తర్వాత అరూప లక్ష్మి అనగా….మహాలక్ష్మి నల్లగా ఉన్న రూపాన్ని చూసి,  ఇది అరూప లక్ష్మి అని దర్శనం చేసుకోవడం జరిగింది.  దాని తర్వాత అర్ధనారీశ్వర స్వరూపం, ఆ తరువాత చోర పెరుమాళ్ళు అనబడే లక్ష్మీ విష్ణువుల ఆలయం,  అన్నపూర్ణాదేవి ఆలయము, ఆ తర్వాత ఈ క్షేత్రపాలకుడైన అయ్యప్ప స్వామి ఆలయం అక్కడే ఉండేసరికి….పిల్లల ఇద్దరికీ ఆశ్చర్యం వేసి ఇదేంటి?  ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది… అనేసరికి, ఏమీ లేదు అని… శివనందిని చెబుతూ, శివుడు, విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో వీరికి జన్మించిన వాడే అయ్యప్ప స్వామి.  వీళ్ళు అవతారం చాలించుకుని అయ్యప్ప స్వామిని ఏకాంతంగా, ఒంటరిగా వదిలేసరికి వాడి ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉండేసరికి… మన కామాక్షి దేవి వాడికి చనుబాలు ఇచ్చింది.  ఆ చనుపాలు తాగటంతో అమ్మ!  నువ్వు ఆకలి తీర్చావు కాబట్టి…. నేను  నీ క్షేత్రానికి కాపలా ఉంటానని కంచి క్షేత్రానికి క్షేత్రపాలికుడిగా అయ్యప్ప స్వామి ఉండటం జరిగింది.  కావాలంటే యవ్వనంలో ఉన్న, యుక్త వయసులో ఉన్న అయ్యప్ప స్వామి ఉంటాడు చూడండి…. అనేసరికి ఆ తరువాత గణపతి ఆలయం చూస్తూ ఉండేసరికి…. బాలగణపతి ఉన్నట్టుండి


బాల గణపతి:- అమ్మ ఈ గణపతి విగ్రహంలో విశేషం గమనించావా?  


శివ నందిని:-  ఏంట్రా అది…. 


బాల గణపతి:- ఈ  నాభి ప్రాంతంలో ఒక చిల్లు లాగా కనబడుతుంది చూసావా! ఖాళీ ఉంది ఇతనికి నాభి లేదు అని నవ్వుతూ ఉండేసరికి…. 


శివ నందిని:- అలా నవ్వద్దు.  ఈ క్షేత్రంలో అమ్మవారి నాభి  ప్రాంతం పడిందని చెప్పడానికి…. మన పూర్వీకులు గణపతికి నాభి స్థానంలో రంధ్రం పెట్టడం జరిగింది…. 


అనేసరికి అవునా!  అని అందరూ నమస్కారం చేసుకొని… అక్కడి నుంచి మిగిలినవి చూద్దాం అని చూసేసరికి…. అక్కడ ఆదిశంకరాచార్య సమాధి కనిపించేసరికి ….అర్థం కాక 


రుద్రస్వామి:- ఇదేంటి ఈయన సమాధి ఇక్కడ ఉంది ఏంటి?  ఆయన సమాధి కేదార క్షేత్రంలో ఉంది అంటారు కదా! 


శివ నందిని:- అయ్యా! మనకి దేహంలో 11 శరీరాలకి మోక్షాలు ఉంటాయి కదా!  11 శరీరాలు ఉంటాయి కదా!  ఈయన భౌతిక స్థూల దేహమును ఇక్కడ విడిచిపెట్టి వెళ్లడం జరిగింది. మనము కేదారంలో చూసేది ఆత్మ శరీరం.  ఆయన ఆత్మ శరీరమును కేదారంలో నిక్షిప్తం చేసి…. కైలాసం వెళ్లిపోయి…. శివైక్యం చెందడం జరిగింది.  అక్కడ శివుడికి శంకరాచార్యుల వారికి భేదభావం లేదు కదా!  ఉన్నది ఆయనే కదా!  వచ్చింది ఆయన శంకరాచార్యుల రూపంలోనే కదా ! అమ్మవారిని ఆరాధించడానికి అయ్యవారు సాక్షాత్తు దుర్వాస మహర్షి గాను,  పరశురాముడిగాను, శంకరాచార్యులు వారిగాను రావటం జరిగింది అని స్థల పురాణంలో చెప్పడం జరిగింది….


అనేసరికి అవునా!  అని అందరూ ఆదిశంకరాచార్యుల ఆలయ దర్శనం చేసుకున్నారు.  ఉత్సవ కామాక్షి ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు.  అక్కడ మహాలక్ష్మి,  మహా సరస్వతి చెరో పక్క ఉండటం గమనించారు. ఆ తర్వాత స్వర్ణ కామాక్షి ఆలయంలో అమ్మవారి బంగారపు విగ్రహానికి బదులు బంగారు పాదుకలు ఉండటం గమనించి నమస్కారం చేసుకున్నారు.  ఆ తర్వాత దుర్వాస మహాముని ఆలయము, వారాహి దేవి ఆలయము, శ్యామలాదేవి ఆలయము, సంతాన స్తంభమును, ఆ తర్వాత రాజశ్యామలాదేవి ఆలయమును దర్శనం చేసుకున్నారు.  ఈ ఆలయంలో అమ్మవారు అష్టభుజాలతో ఉండటం గమనించారు. ఆ తర్వాత  భండాసురుని సమాధి చేసిన ప్రాంతంలో అమ్మవారికి ఎదురుగా ఉన్న ధర్మ స్తంభమును దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మూడవ ప్రాకారంలో కాశీ విశ్వనాథ ఆలయము,  ఆ తర్వాత పంచగంగా పుష్కరిణి, ఆ తర్వాత భూత నిగ్రహ స్వామి దేవాలయము …మామిడి చెట్టు వృక్షము ,ఆ తర్వాత మహిషాసుర మర్దిని, భైరవమూర్తి విగ్రహమూర్తులను….. ఆ తర్వాత అగస్త్య విగ్రహమూర్తులను దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా సుమారుగా 25 ప్రదేశాలను ఒక్కొక్కటి మిగిలిన వాళ్లందరికీ చూపిస్తూ…. వివరాలు చెబుతూ…. దగ్గరుండి అన్నింటిని దర్శించుకుని రావడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి ఎదురుగా ధ్యానంలో కూర్చుని ఉండేసరికి శివ నందినికి విపరీతమైన కామవాంఛ మొదలయింది. ఇదేముంది…. మూలాధార చక్ర జాగృతిలో వచ్చే మాయ కదా!  అని చెప్పి పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు.  అలాగే ఈ చక్ర జాగృతికి ఉపయోగించే పృథ్వి ముద్రను చేస్తూ అలా మూడు గంటలసేపు ధ్యానంలో ఉండిపోయింది.  ఆ ముద్రలో మూడు గంటలసేపు ఉండేసరికి…..విపరీతమైన కామవాంఛ మొదలవడం జరిగింది. అమ్మవారి కేసి చూసింది.  ఎదురుగా అమ్మవారు పద్మాసనంలో కనబడ్డారు.  తల్లి ఏమిటి!  నీ సమక్షంలో కూడా నాకు కామ వాంఛలు కలగడం ఏమిటి?  ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుంది… అని మనసులో అనుకుంటూ ఎంతసేపు ఉన్నా ఆ ఆలోచనలు వస్తూ ఉండేసరికి… ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ పురుషుడి మీద వాంఛలు రావడం లేదు.  మనసులో ఉన్న శివానంద గుర్తుకు రావడం లేదు.  విచిత్రం అనిపించింది.  కోరికలైతే కలుగుతున్నాయి కానీ,  మగవాడి మీద కోరికలు కలగడం లేదు కదా!  ఇదేమిటి విచిత్రంగా ఉంది.  కామ భావాలు కలుగుతున్నాయి కానీ…. ఆలోచనలు కలుగుతున్నాయి కానీ…. వ్యక్తి మీద కలగడం లేదు కదా!  అని గమనించింది.  ఇదేదో తేడాగా ఉంది అని అనుకుంటూ ఉండగానే…. మహాదేవి అప్పుడే తన పక్కన కూర్చుని ఉండేసరికి,  మహాదేవి నడుము వంపులు ఈమెను ఆకర్షించడం జరిగింది. ఆ తర్వాత వెనుక వైపు నడుము భాగం మహాదేవి యొక్క పిరుదులు ,వక్షస్థలం, స్థనాలు, కళ్ళు, ముక్కు చూసేసరికి…. విపరీతమైన కామ భావాలు కలిగేసరికి ….ఇదేంటి! ఒక ఆడపిల్ల అయి ఉండి మరో ఆడపిల్ల మీద కామ భావాలు రావటం ఏమిటి?  ఒకవేళ వెంకటేశ్వర స్వామి యొక్క నపుంసకతత్వం దర్శనం పొందడం చేత తనకి లేనిపోని నపుంసక లక్షణాలు వచ్చినాయా? హిజ్రా లాగా మారుతున్నానా?  ఒక ఆడపిల్ల మీద కామకోరికలు కలగటం ఏమిటి?  అనుకుంటూ ఉండేసరికి….. మహాదేవి కూడా శివ నందిని వైపు అదోలా చూస్తూ ఉండేసరికి…. మహాదేవి కాస్త శివ నందిని దగ్గరికి వచ్చి లోగొంతుతో శివ నందిని నీకు ఒక విషయం చెప్పనా? అని అనడం జరిగింది.  


శివ నందిని:- ఏంటి చెప్పు 


మహాదేవి:-  ఎవరికీ చెప్పొద్దు!  నాకు అమ్మవారిని చూసిన కళ్ళతో నిన్ను చూసిన దగ్గర నుంచి నీమీద నాకు విపరీతమైన కామ ఆలోచనలు, కామ వాంఛలు కలుగుతున్నాయి.  శృంగారం చేయాలనిపిస్తుంది… మనమిద్దరం శృంగారంలో పాల్గొంటే ఎలా ఉంటుంది?  అని ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాను.  పొద్దున నుంచి భలే ఇదిగా ఉంది. నా వల్ల కావడం లేదు అనేసరికి….


అదే ఆలోచనలు శివ నందిని కి వచ్చేసరికి అర్థం కాలేదు.  


శివనందిని:-  నాకు ఇలానే నీమీద విపరీతమైన కామ వాంఛలు కలుగుతున్నాయి.  నాకు అర్థం కావటం లేదు…. నాకు ఇప్పుడు మొదలైంది.  నీకు పొద్దున నుంచి మొదలైనాయా?  నీ ఆలోచనలు నామీద ప్రభావం చూపిస్తున్నాయా?  


మహాదేవి:- కాదు…. ఏదో జరుగుతుంది.  అది ఏంటో గమనించుకో, మనిద్దరికీ ఉన్నట్టుండి ఒకరి మీద ఒకరికి కామ వాంఛలు కలగడం ఏమిటి?  ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి!  స్త్రీకి,  స్త్రీ మీద ప్రేమ, వ్యామోహాలు కలగడం ఏమిటి? అది హిజ్రాల పని కదా!  నపుంసకస్థితి పొందిన వాళ్లు…. వాళ్లకి ఉన్నాయి అంటే అనుకోవచ్చు.  వాళ్లకి శరీరంలో హార్మోన్ అసమతుల్యత వల్ల జరగవచ్చు.  స్త్రీ పురుషుడిగా మారడం,  పురుషుడు స్త్రీగా మారడం జరుగుతుంది. మనమిద్దరం పూర్తి స్త్రీ మూర్తులమే కదా!  ఉన్నట్టుండి ఈ కామ ఆలోచనలు, కామ భావాలు అది కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు… అది కూడా ఒక స్త్రీ మీద మరొక స్త్రీకి కలగడం,  అది కూడా ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాతే కలుగుతున్నాయి. ఒకసారి ఆలోచించు… ఇదేమంత తేలికైన విషయం కాదు.  ఇదేమన్నా మాయేమో చూడు… అనేసరికి ఒకవేళ కామమాయ నీకు నపుంసక మాయగా మారిందేమో!  ఒక స్త్రీ మూర్తి మీద నిన్ను విపరీతమైన మాయలో పడేసి…. నీ మాయలో నన్ను పడేయడం , నా మాయలో నిన్ను పడేయడం జరుగుతుందేమో చూసుకో!


శివ నందిని కాస్త ఆలోచనలో పడింది. 


శివ నందిని:-   ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి… ఇప్పుడు కామమాయ అనేది పరమహంసకి స్త్రీ మీద కలిగింది. స్త్రీ జంతువు మీద కలిగింది. స్త్రీ జాతి మీద కలిగింది.. నాకు వచ్చేసరికి పురుషుల మీద కలగాలి కదా! కాకపోతే నేను ధర్మదీక్షలో పాతివ్రత్య ధర్మముతో ఉండటం వలన నేను ధర్మమును అతిక్రమించను అని చెప్పేసి….నాలో ఉన్న కామ మాయ కాస్త,  నీ మీద ప్రయోగించినట్టు ఉంది.  నాకు నీతో శృంగారం చేయంది నా మనసు ఆధీనంలోకి వచ్చేటట్టు లేదు. అదుపు తప్పేటట్టుగా ఉంది.  ఏం చేయమంటావు అమ్మ! 


 మహాదేవి:-  నా పరిస్థితి కూడా అలాగే ఉంది.  


శివ నందిని:- ఇప్పుడు గాని నాకు ఏకాంత గది కానీ దొరికితే నీతో శృంగారం చేసేదాకా తట్టుకోలేను.  నా వల్ల కావట్లేదు…. 


అని అనుకునేసరికి…. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఎవరికి చెప్పాలో….ఏం మాట్లాడాలో అర్థం కాక…. ఒకవేళ శివస్వామికి చెబితే ఆయన పగలబడి నవ్వుతాడేమోనని చెప్పేసి…. ఏంట్రా బాబు!  ఈ కామ  మాయ విచిత్రంగా స్త్రీ మూర్తి మీద మాయ , తనకి కూడా అలాగే కలగడం…. తను కూడా సరేనా అంటే సరే అనేటట్టుగానే ఉండేసరికి….ఏం చేయాలో అర్థం కాక… జుట్టు పీక్కునే అంత పని అయింది.  సరే ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసి…. అక్కడే ఉన్న పంచగంగా పుష్కరిణిలోకి వీళ్ళిద్దరూ కలిసి స్నానం చేసి మనస్సు సేద  తీర్చుకుందాం అని స్నానం చేస్తే కానీ,  కోరికలు అదుపులోకి వస్తాయి కదా! అని అనుకునేసరికి పుష్కరిణిలో   స్నానం చేసి బయటకు వచ్చినప్పటికీ…. కూడా కోరికలు తగ్గకపోగా విపరీతంగా కోరికలు పెరిగినాయి.  అప్పుడు గత జన్మలలో మనిద్దరం భార్యాభర్తలం అయి ఉంటాము…. నువ్వు పురుషుడు అయి ఉంటావు , నేను స్త్రీ అయ్యుంటాను లేదా నేను పురుషుడు నువ్వు స్త్రీ అయుంటావు.  అందుకే మనిద్దరి మధ్య ప్రకృతి ఈ విధంగా కామభావాల మాయ పెట్టిందేమో అనేసరికి…. పోయి పోయి ఇలాంటి కామమాయనా?  ఇప్పుడు నేను ధర్మం తప్పాను, పరపురుషుడి వైపు వెళ్ళాను అంటే ఒక అర్థం ఉంది, దానికి ఒక పరమార్థం ఉంది.  నా సాధన ఆగిపోయింది . మాయలో పడ్డాను అని…. దాని అర్థం తెలుసుకొని ఈ క్షేత్రానికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను.  కానీ ఇక్కడికి వచ్చేసరికి తల్లి వరస అయిన నీతో నేను మాయలో పడటం ఏమిటి? అది కామ మాయలో పడటమేమిటి?  అందులో ఒక స్త్రీ మూర్తితో కామమాయలో పడటం ఏమిటి? ఈ శరీరం మీద నాకు మోహ వ్యామోహము కలగడం ఏమిటి?  నీ నడుము చూడాలి, నీ వక్షస్థలము చూడాలి అని ఏంటిది? పురుషుడు శరీర భాగాలు చూడడం అంటే అది వేరు.  నా శరీర భాగాలు నీకు ఉన్నాయి కదా!  నీ శరీర భాగాల మీద నాకు కామ వాంఛలు కలగడం ఏమిటి?  అసలు ఏం జరుగుతుంది… నావల్ల కావడం లేదు… ఏం చేయాలి రా భగవంతుడా!  పోయి పోయి  ఈ విధంగా కామ మాయ పరీక్ష పెట్టావు అని అనుకుని దాదాపు ఇద్దరికీ అదే పరిస్థితి.  అటు తాంత్రిక సాధన పోయేటట్లు ఉంది… ఇటు ప్రారంభ సాధన మూలాధారంలోనే ఆగిపోయేటట్టు ఉంది అంటూ…. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీళ్ళతో ఏడుస్తూ తుడుచుకుంటూ ఉండేసరికి…. రుద్ర స్వామి వచ్చి


రుద్రస్వామి :- ఏం జరిగింది ? ఏంటి ఎవరైనా ఇబ్బంది పెట్టారా?  ఏమైనా ప్రమాదం జరిగిందా? ఏమైనా నెలసరి సమస్యల ఏంటి?  ఇద్దరికీ ఏమైందో చెప్పండి…. 


అనేసరికి కామమాయ గురించి మాట్లాడుతున్నాం అనేసరికి… అవును సహజసిద్ధంగా మూలాధార చక్రంలో కామ మాయ మొదలవుతుంది.  అంటే ఆ…..మొదలైంది అదొక విచిత్రమైన  మాయలే. చెప్పుకోలేం లే అనేసి…. అనేసరికి అందులో విచిత్రం ఏముంది! శివ నందినికి శివ స్వామి మీద కలుగుతాయి, ఇప్పుడు నాకు నీ మీద కలుగుతుంది కదా!  కామ భావాలు అలాగే శివానంద మీద శివ నందినికి కలుగుతున్నాయి… లేదంటే విడాకులు తీసుకున్న భర్త మీద కలుగుతున్నాయా ఏంటి? అనేసరికి నీకు చెప్పినా అర్థం కాదులే!  ఆడవాళ్ళ సమస్యలు… ఆడవాళ్ళకి ఉంటాయిలే… 


శివనందిని:- అయ్యా! మూలాధార చక్ర జాగృతి అయ్యేటప్పుడు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి… నాకు తెలుసుకోవాలని ఉంది..


రుద్రస్వామి:- 


మూలాధార చక్రం జాగృతి అయినప్పుడు కనిపించే లక్షణాలు….


ధ్యానంలో మలం వాసన రావడం…. చెడు వాసనలు రావడం…. వాంతి వచ్చినట్టుగా అనిపించడం…. జుట్టు కాలుతున్న వాసన రావడం…. చీము కారుతున్న వాసన రావడం…. ఇలా దాదాపుగా ధ్యానంలో ఇలాంటి వాసన ద్వారా మనకి మూలధార చక్ర జాగృతి ఆరంభం అవుతుంద అని చాలామంది యోగుల అనుభవాలు చెబుతున్నాయి….వీటితో పాటుగా ఈ మూలాధార చక్రంలో స్థానంలో  శక్తి సుడులు తిరుగుతున్నట్టుగా అనిపించడం… కామమాయ కలగటం…. విపరీతమైన శృంగారవాంఛలు కలగటం వంటివి జరుగుతాయి…


జీవుడిలో సాధారణంగా మూలాధార చక్రము జాగృతి అయినపుడు వివిధ రకాల వాసనాలను ఇష్టపడతాడు! అనగా సెంటులకు, పువ్వుల వాసనలకు, పౌడర్ వాసనలకు అలవాటు పడతాడు! అలాగే వీరు ఎపుడూ శరీరమును పరిశుభ్రంగా ఉంచుకొనుటకు ఇష్టపడతారు! శరీరమునకు, ముఖమునకు క్రీములు, లిపిస్టిక్లు, చర్మ సౌందర్య క్రీములు వాడతారు! అంటే వీరు ఎక్కువగా అందముగా ఉండటానికి ఇష్టపడతారు! అలాగే అందమును కాపాడుకోవటానికి కష్టపడతారు! ఇవన్నీ కూడా జాగృతికి శుద్ధికి మధ్యలో వచ్చే లక్షణాలు అనమాట….ధ్యానంలో వచ్చే వివిధ రకాల చెడువాసనలు అనేవి గత జన్మలలో చేసిన పాపకర్మ ఫలితాలు… ఇలాంటివి వచ్చినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ధ్యానభంగం కాకుండా కళ్ళు తెరవకుండా ధ్యానం చేసుకోవాలి.


మహాదేవి:- శివ నందిని ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు….ఇప్పుడు మనిద్దరం యోగంలో ఉన్నాము కాబట్టి…. మనం ఒకరికొకరం అర్థం చేసుకోవాలి. 


శివ నందిని:- ఏమోనమ్మా!  ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు.  కావట్లేదు కూడా… సరేలే!  ప్రకృతి ఎటు తీసుకువెళ్లాలి అనుకుంటే అటు తీసుకు వెళుతుంది.  నేనైతే ధ్యానంలో కూర్చుంటాను ….


మహాదేవి:- నేను కూడా ధ్యానంలో కూర్చుంటాను…


అని ఆ పుష్కరిణి పక్కనే ఉన్న మామిడి చెట్టు దగ్గరికి ఇద్దరు  వెళ్లారు.  వీళ్ళతో పాటు పిల్లలు కూడా వచ్చారు. పిల్లలు కాస్త ….అమ్మా!  ఈ మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటి? అంటే…ఇది సంవత్సరం అంతా కాపు కాస్తుంది.  మామిడి చెట్టు నాలుగు కొమ్మల్లోనూ నాలుగు రకాల పండ్లు కాస్తాయి…. ఒక్కొక్క పండు ఒక్కొక్క రుచిలో ఉంటుంది…


అనేసరికి….. ఇప్పుడు ఈ చెట్టుకి మామిడి పళ్ళు ఉన్నాయా? అంటే…. ఏమో తెలియదురా!  అనేసరికి మరి ఏం చేయాలి?  అంటే మీరు కూడా కూర్చొని ధ్యానం చేసుకోండి….. 


అనేసరికి సరే అని ఎవరికి వాళ్ళే మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానంలో కూర్చున్నారు. బాల  గణపతికి కాసేపటికి మామిడి పిందె లాంటిది దొరికితే…. అది అందరికీ చూపించి….. చిన్న చిన్న ముక్కలు చేసి ప్రసాదంలాగా అందరికీ పెట్టేసరికి బాగుంది… తీయగా ఉంది అనగానే…..ఆ తర్వాత బాల కుమారస్వామికి మరో కాయ దొరికింది.  అది చూసేసరికి పుల్లగా ఉంది.  ఇది చూసావా ఇందాక నా కాయేమో తీయగా ఉంది. అన్నయ్య కాయేమో పుల్లగా ఉంది అన్నారు. ఆ తర్వాత రుద్ర స్వామికి చేతికి అందుబాటులో మరో కాయ కనిపించేసరికి దానిని కొస్తే అది పులుపు తీపి కలిసినట్టుగా ఉంది. ఆ తర్వాత మహాదేవికి కూడా  చెట్టుకి కాయ కనబడింది. అది కోస్తే అది పూర్తిగా తీయగా ఉంది అనేసరికి….. ఇలా నలుగురికి నాలుగు రకాల కాయలు దొరికాయి అని చెప్పేసి నాలుగు కాయల ముక్కలను ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి వారే ధ్యానంలో కూర్చున్నారు. శివ నందినికి కామ మాయ మళ్లీ మొదలైంది.  చక్ర జాగృతికి ఆరంభంలోనే సాధన ఆగిపోతుందా?  అని ఏదైతే అది అయ్యింది…. ఏం జరిగితే అది జరుగుతుంది అని పృథ్విముద్ర చేసుకుంటూనే సాధన కొనసాగిస్తూ ధ్యానంలో ఉండిపోయింది. అలా ఒక గంట సేపు ఉండేసరికి ఉన్నట్టుండి పద్మంలో ఉన్న మహాగణపతి కనిపించేసరికి ఆయనకి నమస్కారం చేసుకొని…స్వామి ! మూలాధార చక్ర అధిపతిగా నువ్వు ఉంటావని చెప్పేసి అంటారు.  ఈ చక్రానికి మాయగా కామమాయ ఉంటుంది అని తెలిసింది.  కాకపోతే నాకు ఈ కామమాయ విచిత్రంగా ఒక స్త్రీ మూర్తి మీద తల్లి వరస ఉన్న స్త్రీ మూర్తి మీద వస్తుంది. దీన్ని ఎలా దాటాలో నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండేసరికి….. ఆ చక్రం ఉన్నట్టుండి ధ్యానంలో స్పష్టంగా కనిపించిందని ….నాలుగు కలువ రేకులతో ఉండి అప్పటిదాకా బయటే సంచరిస్తున్న కుండలిని శక్తి కాస్త ఒక పాము రూపంలో ఈ చక్రంలోకి ప్రవేశించడం మొదలు పెట్టింది.  అలా లోపలికి మొగ్గ ప్రాంతం దాకా తిరుగుతూ ఉండేసరికి…. చక్రం నెమ్మదిగా శుద్ధి అవుతూ ఉండేసరికి….. తన శరీరంలో నుంచి విపరీతమైన వేడిగాలులు రావడంతో వాటిని తట్టుకోలేకపోవడం….. కంపనాలు చెందడం మనసు అస్థిరం అవటం…. శరీరం పూనకం వచ్చినట్లుగా ఉండటం …లాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, కూడా కదలకుండా మెదలకుండా సాధ్యమైనంత వరకు శరీరాన్ని భూమికి అతికించినట్లు ఉంచాలి అనుకొని….. అలాగే అంటిపెట్టుకుంటూ పృథ్వి ముద్ర చేసుకుంటూ ఉండిపోయింది.  అలా కుండలిని శక్తి ఆ చక్రంలో అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నప్పుడు….. విపరీతమైన కామ వాంఛలు సవ్య దిశలో తిరుగుతున్నప్పుడు…… తనలో పాజిటివ్ శక్తికి కామ వాంఛలు  తగ్గుతున్నట్లుగా గ్రహించింది.  అంటే సృష్టిలో మొదట సృష్టి జరగాలంటే మొదటగా కామ భావం వాంఛ కలగాలి కదా!  ఆ  కామ వాంఛ కలగటానికి మూలాధార చక్రములో శక్తి ప్రవేశం జరగాలి. ఇది ప్రకృతి ధర్మం కాబట్టి…..ఇప్పుడు మనకి కామ వాంఛలు కలుగుతున్నాయి.  కాకపోతే పురుషుడి మీద కలగవలసిన వాంఛలు స్త్రీ మూర్తి మీద కలుగుతున్నాయి.  అది ఏదో ఎక్కడో తప్పు జరిగింది.  లేకపోతే తనకి పురుషుడి మీద కోరికలు పోయి స్త్రీ మూర్తిని సుఖ పెట్టాలని ఏదైనా జన్మలో అనుకుని ఉంటుంది..  ఆ కోరిక మిగిలిపోవడంతో ఇప్పుడు మహాదేవి మీద,  స్త్రీ మూర్తి మీద తనకి కామ భావాలు కలుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ….. దీనిని ఎలా అదుపు చేయాలో అనుకుంటూ…. అర్థం కాకపోయినా కూడా…. ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉండేసరికి ఈ చక్రంలోని ఈ శక్తి ప్రవాహం అటు ఇటు తిరుగుతూ లోపలికి నుంచి బయటకు, బయట నుంచి లోపలికి జరుగుతూ ఉండేసరికి….. సరే!  అనుకుంటూ అలాగే ధ్యానం చేసుకుంటూ…., ధ్యానంలో ఉండిపోయింది.  ఎవరికి వారే ధ్యానంలో ఉండిపోయారు.  


శివ నందిని కాస్త తనలో కలిగే విచిత్రమైన కామ వాంఛ తీరితే గాని ….ఈ జడము శుద్ధి కాదని, ఆ కోరిక ఎలా తీరుతుందో ….ఎలా తీరుస్తుందో…. కామాక్షికి వదిలేసి, అక్కడ ఉండలేక, ధ్యానం చేయలేకపోతున్నానని అక్కడ ఉన్న వాళ్లకు చెప్పేసి అందరూ కలిసి కంచి క్షేత్రం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలకి ఆటో మాట్లాడుకొని వెళ్లడం జరిగింది. మొదటగా ఊరికి దూరాన ఉన్న కైలాసనాథ శివలింగమును దర్శించుకోవడం జరిగింది… ఈ శివలింగం చూడడానికి ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నట్టుగా కనిపించింది. ఈ గుడిలో ఉన్న వివిధ రకాల ఉప ఆలయాలు శిల్పకలను చూస్తూ మైమరచిపోయారు….ఇవి ఏనాటి శిల్పకళలో… ఈ శిల్ప కళలు ఏవో రహస్యాలు చెబుతున్నాయి… ఇవి ఇతిహాసానికి సంబంధించినవి కావు అని శివ నందిని గ్రహించింది. వీటిని చూస్తూ ఎంతో కష్టపడి చెక్కి ఉంటారు కదా! అని అనుకుంటూ శివనందిని తనివి తీరా చూసుకుంటూ…. తాకుతూ…. తన్మయత్వం పొందుతూ ఉండిపోయింది. ఆ తరువాత గుడిలో ఒక ద్వారం దగ్గర అందరూ ఉండేసరికి…. అక్కడ వాళ్ళని దీని గురించి అడగగా…. ఈ ద్వారమును మోక్షద్వారము అంటారని ఇందులో ఏడుసార్లు లోపలికి వెళ్లి బయటకి వస్తే పునః జన్మ ఉండదని మోక్షం పొందుతారని స్థల పురాణం చెప్పేసరికి…. ఎందుకైనా మంచిది!  ఏ పుట్టలో ఏ పాము ఉందో… ఎవరి నమ్మకం వాళ్లది అనుకుంటూ…. ఈ తలుపు ద్వారా అందరూ ఏడుసార్లు లోపలికి, బయటికి రావటం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని విశ్వరూపం ఉన్న పాండవ దూత ఆలయానికి వెళ్ళటం జరిగింది.ఇక్కడ కౌరవులకి …పాండవులకి మధ్య శ్రీకృష్ణుడు దూతగా ఉండటం… మహాభారతంలో వినటం జరిగింది కదా! ఇదే ఈ కంచిలో చేసినట్టుగా ఈ స్థల పురాణం చెప్పడం జరిగింది. సింహాసనంలో కూర్చున్న శ్రీకృష్ణుడి విగ్రహం ఇల వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి సుమారుగా 40 అడుగులు ఉన్న విష్ణుమూర్తి యొక్క విశ్వరూప విగ్రహ మూర్తిని ఉండటం గమనించి….అందరూ నమస్కారం చేసుకొని… గుడి దర్శనం చేసుకుని… బయటకు వచ్చారు. ఆ తరువాత ఈ ఆలయం నుంచి బయటకు వచ్చి కంచి కామకోటి పీఠం దర్శనానికి వెళ్లడం జరిగింది. ఈ కామకోటి  పీఠాధిపతులు ఎవరెవరు ఉన్నారు…. ప్రస్తుతం ఎవరున్నారు ఏమిటి?  అని వారి వివరాలు… పూర్తి చరిత్రలు వాటికి సంబంధించిన ఫోటోలు….ఆ తర్వాత శంకరాచార్యులు తెచ్చిన ఒక శివలింగం, పీఠాధిపతి పూజించడం ఆ విధివిధానం అంతా కూడా ఈ సాధన కుటుంబం అంతా కూడా తనివి తీరా చూసారు. ఈ శంకరాచార్యులు ప్రతిష్టించిన శివలింగమును చంద్రమౌళీశ్వర శివలింగం అని అంటారు. దానికి ఉదయకాలంలో దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు దగ్గర ఉండి చూడడంతో… వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అక్కడ సజీవ మూర్తిగా ఉన్న నడిచే దేవుడు అయిన మహాస్వామి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారి దగ్గరకు వెళ్లి తన మనసులో బాధలు చెప్పుకుంటూ స్వామి!  మీరు పరమహంస గారికి సన్యాస దీక్ష ఇచ్చారని చెప్పేసి వినడం జరిగింది. మీరు ఆయనకి కుల గురువులు. మీకు వారి వంశంతో  అనుబంధం ఉంది అని విన్నాను.నాకు వచ్చే విచిత్రమైన కామ వాంఛ మాయను మీరే తొలగించాలి. అమ్మవారి చూపుతో నాకు ఈ మాయ జాగృతి అయ్యింది…మీ చూపుతో పోయే మార్గం అనుగ్రహిస్తారని మీ సన్నిధానానికి వచ్చాను.  స్వామి సాధన పరిసమాప్తిలో వచ్చే మాయలను దాటించే శక్తి గురువులకే ఉంటుందని వినికిడి కదా! మీ చూపుతో…. మీ అనుగ్రహంతో… ఈ మాయను పోగొడతారని అనుకుంటున్నాను… స్వామి అంటూ ధ్యానంలో కూర్చుండిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ పీఠంలో ఏమేమి ఉన్నాయి,  అని వివిధ రకాల ఫోటోలు చరిత్రలు ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నారు.  శివ నందిని ధ్యానంలో పృథివి ముద్ర వేసుకుని మూలధార చక్ర జాగృతి చేసుకుంటూ ఉండేసరికి… కామమాయ కలగటం అదేవిధంగా స్త్రీ మూర్తి అయిన మహాదేవి మీద కామ వాంఛ కలగటం విపరీతంగా ఉండేసరికి ఏడుపు తన్నుకు వస్తూ ఉండేసరికి…. ధ్యానం నుంచి బయటకు రాకుండా మనోవేదన పడుతూ స్వామి!  మహాస్వామి మీరే నాకు ఈ మాయ దాటించే దారి చూపించాలి. ఏ జన్మలోనో ఏ దోషమో చేసి ఉంటాను. అది కర్మ శేషంగా మిగిలిపోయి ఉంటుంది.  స్త్రీ వాంఛను కోరుకొని ఉంటాను.  ఆ వాంఛను ఎలా కోరుకున్నానో ఎందుకు కోరుకున్నానో…. కూడా  నాకు తెలీదు.కాబట్టి దోష నివారణ పరిహారం చూపించండి… ఈ మాయను దాటించండి అని అనుకుంటూ ఉండేసరికి….మహాస్వామి వారు సజీవ మూర్తిగా ధ్యానంలో కనిపించి కనిపించకుండా లీలామూర్తిగా ఏదో గుహలో ఉండి పీఠమునందు కూర్చుని ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండేసరికి…..స్వామివారికి మనసులోనే నమస్కారం చేసుకుంటూ….స్వామి!  మీ నిజ భౌతిక దర్శనం అనుగ్రహించారు.  నాకు ఈ కామ వాంఛ మాయను గురువుగా తీసివేయగలరు అనుకుంటున్నాను.  ఇది మానవమాత్రులైన నావల్ల మాత్రం కాదు . తనకి కూడా అదే విధంగా కామ వాంఛ కామమాయలు కలుగుతున్నాయి.  మేమిద్దరం కలిసి చెయ్యరాని తప్పు చేస్తే మా సాధన ఇక్కడితో ఆగిపోతుంది.  వెనక్కి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది.  ఆదిలోనే మా సాధన ఆగిపోయే ప్రమాదం ఉంది.  ఈ మాయను దాటించే పరిష్కార మార్గమును చూపించండి… నేను ఈ మాయలో ఉండదలుచుకోలేదు… ఆవిడ మీద నాకు ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి కానీ ఆవిడ శరీరాన్ని మోహించలేదు.. కామ వాంఛతో ఉండే అంత కోరిక ఇష్టం అయితే నాలో లేదు.  ఎందుకు ఈ చక్ర  జాగృతిలో అది కర్మ శేషంగా మిగిలిపోయిందో…. నాకు తెలియదు అని అనుకుంటూ ఉండేసరికి….శివ నందినికి ధ్యానంలో ధ్యాన దృశ్యాలు కనిపించడం మొదలుపెట్టాయి.  


శివనందినికి  ధ్యానంలో  తనలో నుంచి తన శరీరం బయటకు రావడం లీలగా కనిపించింది.  ఆ బయటకు వచ్చిన శరీరం స్థూల శరీరం కనిపించింది.  ఆ స్థూల శరీరం పురుష శరీరం కావడం విచిత్రంగా అనిపించింది.  చూడడానికి తన  శరీరంలో తన అంశ శక్తి జీవాత్మ పురుషునిగా ఉండటం వలన ఆ పురుషాత్మ మూలాధార చక్రంలో ఉన్న స్థూల శరీరంలో పురుషుడు ఉండటం వలన…. తనకి కామకోరికలు మహాదేవి మీద కలుగుతున్నాయని చెప్పేసి అర్థమయింది. ఈ మహాదేవి ఈ పురుషుడికి గత జన్మలో కోరికలను తీర్చే స్త్రీ లేదా రహస్య బంధం అని గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు.  అంటే తనలో ఉన్న పురుషుడికి శివ నందినికి అంటే తనలో ఉన్న పురుషుడికి కామకోరికలు స్త్రీ మూర్తి మీద కలుగుతున్నాయి…. అంటే తన దేహం చూడడానికి స్త్రీ దేహమైనా ……తన లోపల ఉన్న పురుషుడికి కామకోరికలు కలుగుతున్నాయి అన్నమాట!  అంటే పురుషుడిలో నుంచి స్త్రీ మీదకి మళ్ళుతుంది . సరే ఏదైతే అది అయ్యింది…. ఇప్పుడు తనకి కామమాయను దాటడం ఎలా?  అనుకుంటూ ఉండేసరికి…. ఏం చేయాలో సరే అని ధ్యానంలో అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ధ్యాన దృశ్యం ఏం కనపడుతుందా?  ఏమిటా?  అని ధ్యానం నుంచి బయటకు రాకుండా ఉండాలని పృథ్విముద్రతో చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని ధ్యానిస్తూ గురుదేవా ! కొంత వరకు నాకు ఈ మాయకి మూలం తెలిసింది. మరి ఈ మాయని ఎలా దాటాలో మీరే సెలవివ్వండి. కామ మాయలో నేను పడదలుచుకోవట్లేదు…నాలో ఉన్న పురుషుడికి కామం ఉండొచ్చు.  అతని కామమాయని నేను దాటించాలి. ఆ కోరికని పరిసమాప్తి చేయడం ఎలా అని మీరే చెప్పాలి. మీరు అనుగ్రహించండి అని అనుకుంటూ ఉండేసరికి….. ఉన్నట్టుండి ఆ పీఠంలో కొంతమంది భక్తులు, సభ్యులు హడావిడిగా ఆశ్రమం బయట ఉన్న గోశాల వైపుకు వెళ్తూ ఉండేసరికి… ధ్యానభంగం అయింది. 


ఏం జరిగిందా?  అని చెప్పేసి శివ నందిని ధ్యానం నుంచి బయటకు వచ్చి వీళ్లందరితో పాటు గోశాలకు వెళ్లేసరికి…. అప్పుడే నిండు గర్భిణిగా ఉన్న ఆ గోవు ఈనటానికి సిద్ధంగా ఉంది. ఆవు యొక్క యోని భాగం నుంచి దూడ బయటికి వస్తూ ఉండేసరికి దానిని చూస్తూ ఉంది శివ నందిని… ఈమె ముగ్గురు పిల్లల తల్లి అయినా కూడా…. తను ఏ విధంగా జన్మించింది అనేది తెలుసుగాని,  తనకి తానుగా చూసుకోలేదు.  ఎప్పుడు ఏ జంతువు కాన్పు కానీ మనిషి కాన్పు కానీ చూడలేదు.  అనుకోకుండా ఆవు యొక్క కాన్పును చూడాల్సి వస్తుంది…. అనేసి అసలు ప్రసవ వేదన అంటే తెలుసుగాని అదే అనుభవం అనుభూతి తెలుసు కానీ …..వేరే వాళ్ళు కాన్పుని తను చూడలేదు అనుకుంటూ…..యోని భాగం చూస్తూ అవును స్త్రీ యొక్క యోని భాగం, ఆవు యొక్క యోని భాగం ఒకటే కదా!  మనిషికి ఎందుకు స్త్రీ మీద కామ వాంఛ కలుగుతుంది.  ఆవు యోని భాగం చూసినప్పుడు ఎందుకు కలగడం లేదు.  స్త్రీని చూసినప్పుడు ఎందుకు కలుగుతుంది అంటే….. ఆవు జన్మలో ఎద్దుకి కామ భావం యోని  భాగం మీద కలుగుతుంది.  అదే మనిషి జన్మలో ఉన్నప్పుడు స్త్రీకి పురుషుని మీద, పురుషుడికి స్త్రీ మీద మర్మాంగాల మీద మోహం కలుగుతుంది.  ఇది సృష్టి కార్యం కోసం బ్రహ్మదేవుడు చేసి ఉండవచ్చు.  కానీ నిజానికి యోని భాగం అంతా ఒకటే…. ఇప్పుడు స్త్రీ పురుషుని మర్మాంగాలు, జంతువుల యొక్క మర్మాంగాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే శరీరానికి తగ్గట్టుగా మారతాయి. కానీ అవి చేసే పని సృష్టి కార్యమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి…. ఆశ్రమంలో లోపలకి ఒక నిండు గర్భిణీ భక్తురాలు వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండే సరికి నొప్పులు ఆరంభం అయ్యేసరికి….. అమ్మ! ఇది ఆశ్రమం కాబట్టి మీరు గోశాలలో కాన్పుకి ఏర్పాట్లు చేసుకోండి అవి గోశాలలో ఏర్పాటుచేసి…. అక్కడ దగ్గరలో ఉన్న వైద్యుని సమక్షంలో ఆయనను పిలిపించి ఇటు పశువు వైద్యుడు, అటు మనిషి వైద్యుడు ఏకకాలంలో ఒక స్త్రీ మూర్తి కాన్పు ,  మరొకవైపు గోవు కాన్పు ఏక సమయంలో చూస్తున్న శివ నందినికి ఒకసారిగా స్త్రీ యోని మీద తనకి కామ వాంఛలు ఎలా కలుగుతాయి అని ఆ కాన్పులు ఏకకాలంలో చూడటం జరుగుతుంది. ఇలా ఒకవైపు స్త్రీ కాన్పు మరొకవైపు గోవు కాన్పు చూసేసరికి ఒక విధమైన వైరాగ్యం నెమ్మదిగా మొదలైంది.  చూడటానికి రెండు కూడా యోని భాగాలే.  రెండు యోని భాగాలలో మనం ఆడతనం చూస్తున్నంతసేపు….. సృష్టికార్యం కామ  వాంఛ కనపడుతూ ఉంటాయి. ఈ యోని భాగంలో మనం నగ్నత్వం చూసి ఆ తర్వాత దిగంబరతత్వం చూస్తే వైరాగ్య భావాలు కలుగుతాయి అని చెప్పేసి….మార్చి మార్చి తనలో ఉన్న కామ వాంఛ మీద వైరాగ్యం కలగాలి. స్త్రీ మూర్తి మీద కూడా వైరాగ్యం కలగాలి అని చెప్పేసి రెండు యోనులను ఏకకాలంలో మార్చి మార్చి చూస్తూ ఉండేసరికి…. దాదాపు అలా ఒక గంట / గంటన్నర పాటు చూస్తూ ఉండేసరికి ఒక విధమైన వైరాగ్యభావం ప్రారంభం అయ్యింది.  తనలో ఉన్న పురుషుడికి కూడా యోని  జాతులు… ఒకటి స్త్రీ జాతి రెండు స్త్రీ జంతువు జాతి యోని భాగం చూసేసరికి తేడా కనిపించకపోయేసరికి…. తనలో ఉన్న పశు కామ వాంఛ నశించడం మొదలైపోయింది.  ఆ తర్వాత నెమ్మదిగా వైరాగ్యభావాలు రావడం…. తన మనసు నెమ్మదించడం…. తన శరీరంలో నుంచి శ్వేత బిందువులు బయటకు రావటం…. ఇవన్నీ కూడా గమనిస్తూ అలాగే ఉండిపోయింది.  ఆ తరువాత రెండిటికి కాన్పులు పూర్తి అయ్యేసరికి… ఒకటి ఆడ దూడ, ఒకరు ఆడపిల్ల పుట్టేసరికి అమ్మవారి సమక్షంలో పుట్టింది అని ఆడపిల్లకి కామాక్షి అని…. ఆవు దూడకి ఆశ్రమం వాళ్ళు త్రిపుర అని చెప్పేసి పేర్లు పెట్టడం జరిగింది.  రెండు కాన్పులు కూడా సకాలంలో పూర్తి అవ్వడంతో…. ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో కాన్పులు సుఖవంతం అవ్వడంతో….. ఇద్దరి జననాలు పూర్తి అవ్వడంతో ఇక శివ నందిని ఊపిరి పీల్చుకుంది.  హమ్మయ్య దేవుడి దయవలన, గురువుల అనుగ్రహం వలన కాన్పులు విజయవంతం అయ్యాయి అనుకుంటూ అప్పుడు ధ్యానంలో కూర్చునే సరికి ఆవు యొక్క యోని భాగం, అలాగే స్త్రీ మూర్తి యొక్క యోని భాగం ఒకేసారి తను చూసిన దృశ్యాలు పదేపదే కనిపిస్తూ ఉండేసరికి…. ఒక విధమైన వైరాగ్యం మొదలవుతూ మనసులో యోని భాగం మీద ఉన్న మోహమాయ విరిగిపోయేదాకా అలాగే ఉండాలని అనుకుంటూ ఉండగా ….. జ్ఞాన స్ఫురణగా ఇంద్రుడి శరీరం మీద ఉన్న యోనులు గుర్తుకు వచ్చాయి.


 గౌతముని భార్య అయిన అహల్య మీద ఇంద్రుడు కన్ను వేయడంతో…. గౌతమ మహర్షి వేషంలో వెళ్ళి రతిక్రీడలో పాల్గొని వస్తూ ఉండగా…. గౌతమ మహర్షి రావడము, ఆ తర్వాత తన దగ్గరికి వచ్చింది ఇంద్రుడని అహల్య తెలుసుకోవడం, ఆ తర్వాత గౌతమ మహర్షి, అహల్య చేసిన తప్పు తెలుసుకొని ఏ యోని భాగం కోసమైతే నువ్వు తపన తాపత్రయం పడ్డావో ……ఆ యోనులు నీ ఒంటిమీద వెయ్యి కన్నులు లాగా కనపడాలి అని చెప్పేసి గౌతమ మహర్షి కాస్త ఇంద్రుడికి శాపం ఇవ్వడంతో….. తన శరీరం మీద వెయ్యి కన్నులుగా స్త్రీమూర్తి యోనులు  వరశాపంగా తీసుకోవడం జరిగింది. అంటే తను కూడా స్త్రీ మీదనే కదా వ్యామోహం చెందుతుంది.  ఈ దెబ్బతో తనకి ఇంక వ్యామోహాలు పోతాయని అనుకుంటూ ఉండేసరికి….. ఆ సమయంలో ధ్యానం చేస్తూ ఉండేసరికి ఎదురుగా మహాదేవి కనిపించేసరికి తనకి మాతృత్వ భావమే కనిపించింది.  ఇప్పటిదాకా ఆడతనం, నగ్నత్వ భావాలు కాస్త అమ్మతనంగా మారింది. 


శివ నందిని:- అమ్మ!  నేను నీ కామ మాయని దాటడం జరిగింది..


మహాదేవి:-  నేను కూడా దాటాను తల్లి!  ఎప్పుడైతే ఆవు యోని భాగం స్త్రీ మూర్తి యోని భాగం నీ వెనకాలే ఉండి నేను కూడా చూడడం జరిగిందో….నాలో ఉన్న పురుషుడి భావమో…. స్త్రీ భావమో కర్మ శేషంగా, కామ వాంఛలు కూడా సమూలంగా నాశనం అయిపోయినాయి.  ఈనాడు నాకు కామ వాంఛ పూర్తిగా తీరిపోయింది..


ఈ కామమాయ మన గురుదేవుడైన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ప్రత్యక్ష దర్శనంతో…. దగ్గర ఉండి ఈ రెండు స్త్రీ జాతుల యోనుల ద్వారా మనకి స్మశాన వైరాగ్యం కలిగించి తీసేశారు.  ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని కంచి కామకోటి పీఠం నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత విష్ణుమూర్తి ప్రతిష్ట చేసిన కంచి విశ్వేశ్వర లింగమును, చిత్రగుప్త ఆలయము, వామనమూర్తి ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఈ వామనమూర్తి ఆలయం చూడటానికి 45 అడుగుల ఎత్తు ఉంటుంది అంటే వామనుడు బలిచక్రవర్తిని మూడు అడుగులు కావాలని కోరడంతో…. ఆకాశంలో ఒక స్థలం, భూమి మీద ఒక స్థలం, ఇంకొక అడుగు బలి చక్రవర్తి మీద పెట్టి ఆయనను పాతాళంలోకి తొక్కడం అనేది…. వామనావతారానికి విశేషతగా ఇక్కడ 45 అడుగుల విగ్రహం మూర్తిని ఏకశిలగా …ఒక అడుగు ఆకాశం కేసి, ఒక అడుగు భూమికి వేసి మనకి కనపడుతూ ఉంటుంది.  ఇక్కడ విష్ణుమూర్తి బ్రహ్మోత్సవాల సమయంలో చేసే ఉత్సవాలు కూడా బాగుంటాయని చెప్పేసి అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత  రుద్రాక్ష కమండలం ధరించి ఉన్న కుమారస్వామి ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడే స్కాంద పురాణం రచించడం జరిగిందని స్థల పురాణం చెప్పడంతో…. ఈ విషయం వాళ్ళందరికీ శివ నందిని చెప్పింది.  ఆ తర్వాత  వైకుంఠ పెరుమాళ్ళ గర్భాలయానికి వెళ్ళటం జరిగింది.  ఈ గర్భాలయం మూడు ప్రాకారాలుగా కనబడింది.  మొదటి ప్రాకారంలో నిలబడి ఉన్న విష్ణుమూర్తి, ఆ తర్వాత రెండవ ప్రాకారంలో పడుకుని ఉన్న విష్ణుమూర్తి, మూడవ ప్రాకారం లో కూర్చుని ఉన్న విష్ణుమూర్తి దర్శించుకోవడం జరిగింది. ఈ గర్భాలయంలోకి చూస్తూ ఉండేసరికి…..బాల గణపతి ఉన్నట్టుండి 


బాల గణపతి:- అమ్మ!  మనం పంచగంగా పుష్కరిణి దగ్గర భూత విగ్రహ స్వామి ఆలయం చూడటం జరిగింది కదా!  ఆ ఆలయంలో మూడు రూపాలు చూడటం జరిగింది కదా!  ఒకటి నిలుచున్న రూపం, రెండు పడుకున్న రూపం, మూడు కూర్చున్న రూపము కనపడింది కదా!  


శివ నందిని:-  అవును నాయనా…. అది గుడిలో ఆ రూపం,  ఇది గుడి బయట రూపం అని అనేసరికి….ఎందుకో నాకు ఈ మూడు రూపాలు నిల్చోని , పడుకొని,  కూర్చొని ఉన్న రూపాలు ఎందుకో చెక్కారు… ఇందులో ఏదో పరమార్థం ఉంది..


 శివ నందిని:- . సరే నాకైతే తెలియదు.  కాలమే చెబుతుంది …. 


బాల గణపతి:- ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?


శివ నందిని:-  5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు కంచికి వెళ్తున్నాం..


 అనేసరికి… అక్కడ అత్తి వరదరాజు గోవిందరాజు స్వామి వారి దేవాలయం ఉంది అని…. ఈ గుడిలో బంగారపు, వెండి బల్లులు ఉంటాయని… ఆ బల్లులు దాటితే బల్లి దోషాలు పోతాయని అంటారు అనేసరికి…. ఈయన ఎవరు,?  ఈయన గురించి నాకు చెప్పు అని బాల గణపతి అడిగేసరికి శివనందిని చెప్పడం ఆరంభించింది. 


ఈ ఆలయంలో 40 సంవత్సరములకు ఒకసారి మాత్రమే స్వామి వారు 48 రోజులు దర్శనం ఇస్తారు. ఈ స్వామివారిని అత్తి వరదరాజస్వామి అని పిలుస్తారు. మామూలుగానే ఈ కంచిని ఆలయాల నగరం అని అంటారు ….మనకి విష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ముఖ్యమైన వాటిలో… సప్త మోక్ష పట్టణాల్లో ఇది ఒకటి.  మనకి ఈ ఆలయంలోనే బంగారు బల్లి, వెండి బల్లి కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రాన్ని హస్తగిరి అని కూడా పిలుస్తారు.  దాదాపు 362 రాతప్రతుల  శాసనాలు కాకతీయులు మరియు తెలుగు చోళులవి ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతుంది. కృత యుగం నుంచి కలియుగం దాకా ఎంతోమంది ఈ స్వామి వారిని సేవించారు. సత్యయుగంలో ఒకానొక సమయంలో బ్రహ్మ దేవుడికి సరస్వతి కి మధ్య వివాదం ఏర్పడి…. ఆ వివాదంలో బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం ఒక యాగాన్ని తలపెట్టారు.  అయితే యాగం అంటే సతి సమేతంగా కూర్చోవాలి కదా!  మరి సరస్వతి దేవి విపరీతమైన కోపంతో ఉండడం వలన గాయత్రీ దేవిని కూర్చోబెట్టుకొని యాగం చేయడం ఆరంభించాడు.  ఈ విషయం తెలుసుకున్న సరస్వతీదేవి ఒక నదిలా మారిపోయి…. ప్రళయ ప్రవాహం లాగా ఈ యాగాన్ని….. యాగవాటికని ముంచివేయాలని ప్రయత్నించబోగా…. శ్రీమహావిష్ణువు సరస్వతీ నదికి అడ్డుగా పడుకొని ఆ ప్రవాహాన్ని అడ్డగించి  దాని దారిని మరలించాడట. అక్కడితో ఆ యాగాన్ని పూర్తి చేశారు . ఈ యాగం అనంతరం శ్రీమహావిష్ణువు బ్రహ్మ మరియు సరస్వతీల మధ్య వచ్చిన తగువుకు పరిష్కారం చూపించారట …ఇలా బ్రహ్మా సరస్వతీలా తగువును చల్లబరిచిన తరువాత దేవతలందరూ కలిసి శ్రీమహావిష్ణువును ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండమని ప్రాధేయపడగా స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు.  గజేంద్రుడి గురించి మీరు వినే ఉంటారు కదా!  గజేంద్రమోక్షం గురించి వినే ఉంటారు కదా! ఈ గజేంద్రుడు వాస్తవానికి అగస్త్య ముని శాపం వలన ఏనుగుగా పుట్టడం జరిగింది.  పూర్వజన్మ వాసన వలన శ్రీమహావిష్ణువుని నిత్యం పూలతో ఆరాధించడం…… ఆ తర్వాత ముసలి బారిన పడటం….. అప్పుడు శ్రీమహావిష్ణువుని శరణు వేడటం….. శ్రీమహావిష్ణువు గజేంద్రునికి మోక్షం ప్రసాదించడం…. ఇదంతా జరిగిన అనంతరం తన శరీరంపై కొలువు తీరమని కోరిన గజేంద్రుడికి వరమును ప్రసాదించగా స్వామివారు ఉండే ఈ కొండ కూడా ఏనుగు ఆకారంలో ఉండటం వలన…. దీనిని హస్తగిరి కొండ అని కూడా పిలవడం జరిగింది. కాలక్రమంగా ఈ హస్తి కాస్త అత్తి అయిందని మన పూర్వీకులు చెప్పడం జరిగింది.  తురష్కుల దండయాత్రలో ఈ ఆలయంలో దోపిడీలు జరిగేసరికి స్వామివారి విగ్రహానికి ఏమీ కాకూడదని ఈ పక్కనే ఉన్న ఆనందపుష్కరిణిలో నాలుగు కాళ్ల మండపం అడుగుభాగంలో ఒక వెండి పెట్టలో స్వామివారిని భద్రపరిచారు.  అలా భద్రపరిచిన అర్చకులు కొన్నాళ్లకు మరణించారు.  ఆ తర్వాత పూజారి వారసత్వపు వాళ్ళు ఎంత వెతికినా స్వామివారి ఆనవాళ్లు పుష్కరిణిలో కనపడకపోయేసరికి….. గర్భాలయంలో మరొక విగ్రహ మూర్తిని ప్రతిష్టించారు.  కొన్నాళ్ళకి స్వామివారి పుష్కరిణి ఎండిపోయినప్పుడు ఈ వెండి పెట్టె బయటపడింది. ఒకే ఆలయంలో రెండు విగ్రహాలు ప్రతిష్టించడం అనేది ఆగమ శాస్త్రానికి  విరుద్ధం అవటం చేత….. ప్రతి 40 సంవత్సరములకు ఒకసారి 48 రోజుల పూజించి తిరిగి మళ్ళీ కోనేరులో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుంది. మరొక కథనం ప్రకారం అయితే ఈ యాగం తర్వాత విశ్వకర్మ కాస్త అత్తి చెట్టు కాండంతో స్వామివారిని తయారు చేసి ప్రతిష్టించాడు. అలా ఇక్కడ స్వామి వారు కొలువు తీరారు అని చెబుతారు.అయితే ఈ యాగం జరిగేటప్పుడు ఈ దారు విగ్రహానికి మంటలు తాకితే దానికి పరిహారంగా స్వామి వారు ఏం చేయాలని అడిగినప్పుడు శ్రీమహావిష్ణువు కాస్త ఈ పుష్కరిణిలో భద్రపరచమని చెప్పడం జరిగిందని కూడా చెబుతారు. అంతేకాక 48 రోజులలో మొదటి 30 రోజులు పడుకొని మిగిలిన రోజులు నిల్చుని స్వామి వారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి పేరుందేవిగా వేగవతి నది ఒడ్డున ఉంటారు. ఈ అమ్మవారు ఆలయం నుంచి బయటకి అస్సలు రాకపోవడం చేత…. అమ్మవారికి జరిగే ఉత్సవాలు అన్నీ కూడా ఆలయంలోపలే జరుగుతాయి. ఈ ఆలయంలో అమ్మవారు, అయ్యవారు  దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో ఉన్న అనంత పుష్కరిణి పక్కనే నూరు కాళ్ళ మండపము మనకి కనిపిస్తుంది .ఈ ఆలయంలో రామాయణ మహాభారతలను చెక్కడం జరిగింది.


ఇక వీళ్ళందరూ విష్ణు కంచి నుంచి శివకంచికి వెళ్లారు.  అక్కడ అమ్మవారు మట్టితో చేసిన ఏకాంబరేశ్వర శివలింగమును…ఆ ఆలయమునకు వెళ్ళటం జరిగింది. ఆ ఏకాంబరేశ్వర క్షేత్రంలోకి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంది.  అక్కడ ఉన్న ఈ సాధన కుటుంబానికి ఈ శివలింగాన్ని చూపిస్తూ….. అమ్మ చూడండి…. అమ్మవారి వక్షస్థలం యొక్క గుర్తులు, అమ్మవారి చేతివేళ్ల గుర్తులు అని ఈ మట్టి శివలింగం మీద ఉన్న గుర్తులు అన్ని చూపించేసరికి….. ఇది మట్టి శివలింగం అవ్వడంతో…. ఇది అభిషేకానికి పనికిరాదని,  దీనికి తైలాభిషేకం చేస్తూ…. జలాభిషేకం కోసం పక్కనే మరొక నల్ల శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నామని…. ఆ శివలింగాన్ని కూడా చూపించడం జరిగింది. ఈ రెండు శివలింగాలు దర్శనం చేసుకున్న తరువాత…. ఈ గుడిలో అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టును చూడటం….. అలాగే ఆ చెట్టు కింద సోమస్కంధ మూర్తిని దర్శనం చేసుకోవడం…. అలాగే ఆ తర్వాత అక్కడే ఒకే  లింగంలో ఉన్న సహస్ర లింగాలను దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 100 మీటర్ల దూరంలో చంద్రశేఖర సరస్వతికి ఒకసారి ధ్యానంలో ఎవరి ఇంట్లోనో ….భూ గృహంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహ మూర్తి ఉన్నట్లుగా కనిపించేసరికి….. స్వయంగా ఈయనే ఆ ఇంటికి వెళ్లి, ఆ ఇంటి యజమానికి ఈ విషయం చెప్పేసరికి…. ఆయన ఎక్కడ అయితే  ధ్యానంలో చూశారో…. ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వేసరికి భూ గృహంలో తరతరాలు ఆరాధించిన అనంత పద్మనాభస్వామి విగ్రహం కనిపించడంతో….. దాన్ని వెలికి తీయించి… చిన్న గుడి కట్టించి ప్రతిష్టించడం జరిగింది…. అంటూ అక్కడ ఉన్న స్థల పురాణం చదివి అక్కడ ఉన్నవారందరికీ చెప్పడం జరిగింది. మూడు అడుగులు ఉన్న ఈ విగ్రహం మూర్తిని అందరూ దర్శనం చేసుకుని రావడం జరిగింది.  అందరికీ ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్లో భోజనాలు ముగించడంతో దేవికంచిలో ఉన్న హోటల్ గదిలో విశ్రాంతి తీసుకోవాలని అనుకొని అందరూ కలిసి ఆటో ఎక్కి అద్దెకి తీసుకున్న గది వద్దకు వెళ్లడం జరిగింది. గదికి వెళ్ళాక ఎవరికి వారు విశ్రాంతి తీసుకున్నారు.  సుమారుగా సాయంత్రం ఐదు గంటలకు మేలుకువ వచ్చింది. అందరూ మళ్లీ తిరిగి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలని పంచ గంగా పుష్కరిణిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని….. అమ్మవారికి ఎదురుగా ధ్యానంలో కూర్చున్నారు.  పిల్లలు గుడిలో ఆటలాడుకుంటూ తిరుగుతూ ఉండేసరికి….రుద్ర స్వామి మరియు మహాదేవి కూడా ధ్యానంలో కూర్చున్నారు.సాయంత్రం అయ్యేసరికి పిల్లలు ఆడుకుంటూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకో బాలగణపతికి ఉన్నట్టుండి సంతాన గణపతి బాగా ఆకర్షించాడు. పొద్దున చూసినప్పటికీ  మళ్ళీ సాయంత్రం ఎందుకో చూడాలనిపించి….. అన్నయ్య అయిన బాల కుమారస్వామిని తీసుకుని వెళ్లి ఆ గణపతి గుడి దగ్గర కూర్చుని ఉన్నారు.  గణపతి ఆలయంలో ఆలయ పూజారి ఎవరూ లేరు.  భక్తులు ఎవరూ లేకపోయేసరికి….చుట్టూ ఎవరూ లేకపోవడంతో గణపతి లోపలికి వెళ్లి ఈ గణపతి నాభి వద్ద చిల్లుని చూస్తూ…. అందులో వేలు పెట్టి చూసాడు. అందులో ఏమీ దొరకకపోయేసరికి 


బాల కుమారస్వామి:- .ఒరేయ్ వద్దురా!  గుడి లోపలికి ఎలా వెళ్తావు? ఎవరైనా చూస్తే బాగుండదు…. ఆలయ పూజారి వస్తే బాగుండదు…


బాలగణపతి :- .ఏం కాదులే అన్నయ్య! నాకెందుకో భలే ముచ్చటగా ఉంది.  ఈ విగ్రహం బాగా నచ్చింది.  ఈ నాభిలో వేలు పెడితే భలే ఆనందంగా ఉంది…


అని…. అది ఇది అంటూ ఉండేసరికి తన మెడలో అప్పటికే తిరుపతిలో దొరికిన ఏకముఖి రుద్రాక్ష కాస్త కింద పడిపోయేసరికి అయ్యో!  రుద్రాక్ష కింద పడిపోయింది.  తాడులో నుంచి ఊడి బయటకు వచ్చేసింది…..అని చేతిలోకి తీసుకుంటూ ఉండేసరికి,  ఏదో చిలిపి ఆలోచన వచ్చి ఈ బొడ్డులోకి ఈ రుద్రాక్ష పెట్టేస్తే ఈ నాభి చిల్లు ఉన్నట్టుగా ఎవరికీ కనపడదు కదా! అనే ఆలోచన రావటంతో….. కుమారస్వామి తనని గమనించట్లేదు అని చెప్పేసి అనుకుని యధాలాపంగా చిలిపితనంతో ఆ నాభిలోకి బలవంతంగా ఇరికించేసరికి అది ఇరుక్కుపోయేసరికి రుద్రాక్ష కాస్త గణపతి విగ్రహం కడుపులోకి వెళ్లిపోయేసరికి…. అయ్యో! ఇప్పుడు ఇది శివ నందిని అమ్మకి తెలిస్తే చంపేస్తుంది.  అయ్యో!  రుద్రాక్ష ఏమో ఈయన కడుపులోకి వెళ్లిపోయింది …..ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి? ఓరి దేవుడా! నన్ను చంపేస్తది…. వీడేమో మింగేసాడు… కడుపులో ఉంది. విగ్రహంలో నుంచి ఎలా తీయాలి అని దాన్ని కదపడానికి ప్రయత్నం చేసినప్పటికీ విగ్రహం కదలలేదు… మెదలలేదు…. కంగారు వచ్చేసింది.  ఏదో తెలియని భయం వచ్చేసింది.  ఏం చేయాలా అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక  ఆ నాభిలోకి వేళ్ళు పెట్టి తిప్పుతూ ఉండేసరికి…. వేలు కూడా ఇరుక్కుపోయేసరికి….. ఏం చేయాలా అని చెప్పి అమ్మ!  అమ్మ! అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటే 


బాల కుమారస్వామి:-  ఏమైందిరా!  


బాల గణపతి:- అన్నయ్య ఈయన నాభిలో నావేలు ఇరుక్కుపోయింది…..రావట్లేదు 


బాల కుమారస్వామి:-  వేలెందుకు పెట్టావురా!  


బాలగణపతి:- రుద్రాక్ష ఇందులో పెట్టాను…..రుద్రాక్ష తీసుకుందామని పెట్టేసరికి వేలు ఇరుక్కుపోయింద.


బాల కుమారస్వామి:- అసలు రుద్రాక్ష ఎందుకు పెట్టావురా!  పిచ్చా…వెర్రా …..ఇప్పుడు నీకు అమ్మ బడిత పూజ చేస్తుంది… 


బాల గణపతి:- రుద్రాక్ష సంగతి దేవుడెరుగు…. ముందు నా వేలు ఇరుక్కుపోయింది.  ఈయన పట్టేసాడు… ఇందాకేమో బానే దూరింది… బానే బయటికి వచ్చింది…. ఇప్పుడేమో రావడం లేదు…. ఏం జరుగుతుందో ఏమో….ముందు అమ్మని పిలువు,  వేలు మింగేస్తాడేమో… రుద్రాక్షలు మింగేసినట్టే వేలుని మింగేస్తాడేమో…. 


బాల కుమారస్వామి:- ఎక్కడ ఏది పెట్టాలో తెలీదు…. అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు…. ఇప్పుడు  ఏడువు…. నాకు సంబంధం లేదు ….


బాలగణపతి:- శివ నందిని అమ్మని పిలువు రా!  బాబు.  మహాదేవి అమ్మని పిలువు…. లేదంటే రుద్రయ్య అని పిలువు…. ఎవరో ఒకరిని పిలువు…. ఏదో ఒకటి చేస్తారు అనేసరికి…. 


ఏమైందిరా పిల్లలు ఏమైంది అని ఆలయ పూజారి వచ్చేసరికి…. మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు రా!  ఎవరి పిల్లలు రా మీరు? భయం భక్తి లేకుండా అలా ఎలా వచ్చారు? అనేసరికి…. 


బాల కుమారస్వామి:- ఏం లేదు స్వామి!  మా వాడి రుద్రాక్ష గణపతి నాభిలో పడిపోయిందట…. అది తీసుకుందామని వేలు పెడితే వేలు ఇరుక్కుపోయింది…. 


పూజారి:- వేలు ఇరుక్కుపోవడం ఏమిటి?  వేలు ఇరుక్కుపోతే సరిగ్గా తీయమను… అసలు ఇందులో నాభి రంధ్రం ఉందని ఎవరు చెప్పారు? ఇది ఎవరికీ తెలియదు కదా! 


బాలగణపతి:- స్వామి ఇప్పుడు అవన్నీ ఎందుకు?  నా వేలు ఇరుక్కుపోయింది…. అది బయటకు వచ్చేటట్టుగా చేయండి….. రుద్రాక్ష మింగేసినట్టు నా వేలు కూడా మింగేస్తాడేమో! ఈ గణపతి


 అని… పిల్లవాడు ఏడుస్తూ ఉండేసరికి…. కుమారస్వామి కాస్త ధ్యానం చేసుకుంటున్న శివ నందిని దగ్గరికి వెళ్లి …


బాల కుమారస్వామి:- అమ్మ!అమ్మ! బాలగణపతి వేలు విగ్రహ గణపతి మింగేసాడు… నాభిలో ఉంది…ఇరుక్కుపోయింది. రావడం లేదు… 


అని కంగారు కంగారుగా చెబుతూ ఉంటే…. శివ నందినికి అర్థం అయ్యి… అర్థం కాక తీరా చూసేసరికి!  ఆ నాభిలో వేలు ఇరుక్కుపోవటం…. లోపల రుద్రాక్ష ఉంది అని చెప్పడం….. చూసి 



శివ నందిని:- పోతే పోయింది రుద్రాక్ష అందులో వేలు ఎవరు పెట్టమన్నారు అని ఒక ముట్టికాయ వేసి బాలగణపతికి….ఆ వేలు ఎలా వస్తుంది.?


పూజారి:- అమ్మ ఇంతవరకు మా వెళ్లే పట్టలేదు . మా చిటికెన వెళ్లే సగం వరకు వెళ్లి వస్తుంది.  అలాంటిది చిన్న పిల్లవాడు కదా! వేలు పట్టింది.  ఇందాక వేలు పట్టలేదు అని ముందుకి వెనక్కి తీశాను అంటున్నాడు వాడే….ఇప్పుడు రుద్రాక్ష వేసిన తరువాత వేలు ఎందుకు పట్టింది…. అందులో ఏకముఖి రుద్రాక్ష ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ పిల్లవాడికి…. కారణం లేనిదే ఏమీ జరగదు.  ఏదో ఉంది…. మీకు సంబంధించింది… గణపతి చెప్పాలనుకుంటున్నారు… అని అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు సబ్బు కానీ కొబ్బరి నూనె కానీ….రాస్తే కానీ… వేలు బయటకు రాదు. నేను వెళ్లి సబ్బు నీళ్లు తీసుకుని వస్తాను..


అని ఆలయ పూజారి బయటకు వెళ్లేసరికి….భక్తులు అంత పెద్దగా ఉండకపోయేసరికి…. శివ నందిని కాస్త లోపలికి వెళ్లి గణపతి వేలు పరిస్థితి చూస్తే… గణపతి వేలు లోపల ఇరుక్కుపోయింది.  


శివ నందిని:- సరే! అది కదపడానికి వీలుగా ఉంటుందా!


బాలగణపతి:- కదపవచ్చు కానీ ఇరుక్కుపోయింది.  మధ్యలో ఏదో పట్టేస్తుంది…


శివనందిని;-  సరే అక్కడ ఏమన్నా నొక్కులు గాని ఏమైనా ఉంటే వేలుతో నొక్కు…


అనేసరికి…. ఆ వేలుతో చుట్టూ చూస్తే చేతికి ఏదో తాకుతూ ఉండేసరికి… ఏదో మెత్తగా తగులుతుంది అమ్మ! అని అంటే ఆ వేలితో దానిని నొక్కు అనేసరికి… ఆ వేలుతో అది నొక్కేసరికి…. బయట ఉన్న సంతాన స్తంభం కదలడం మొదలైంది. ఇదేమిటి ఉన్నట్టుండి సంతాన స్తంభం కాస్త కదలటం మొదలైంది ఇదేమిటి? అని అనుకుంటూ ఉండేసరికి…సంతాన స్తంభం కాస్త బయటకి నెమ్మదిగా రావడం జరిగింది. ఆ సంతాన స్తంభం కాస్త ఇవతలికి వచ్చింది. చూస్తే లోపల వైపుకు వెళ్లడానికి మెట్లు లాగా కనిపించాయి.  ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటూ ఉండగా…. 


బాలగణపతి:- అమ్మ రుద్రాక్ష ఈ గణపతి కడుపులో ఉండిపోయింది… మరి ఏంటి? 


శివ నందిని:- ఉండరా ముందు స్తంభం కదిలింది.  ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సమస్య మొదలయ్యింది.  ఈ ఆలయ పూజారి వచ్చేలోపుల ఇది సరి చెయ్యాలి… .అంటే లోపల ఉన్న నొక్కు మళ్ళీ నొక్కితే స్తంభం మూసుకుపోతుందేమో! 


బాలగణపతి:- లోపలికి వేలు పెట్టాలంటే మళ్ళీ ఇరుక్కుపోతుందేమో లేమ్మా…. ఎందుకు వచ్చిన బాధ… ఈ స్తంభం మనవల్ల జరిగిందని ఎవరికి తెలుసు? మనం వెళ్ళిపోదాం…..


శివ నందిని:- అసలు అలా కాదు, ఈ గణపతికి, ఆ స్తంభానికి ఏదో సంబంధం ఉంది. పైగా అది సంతాన గణపతి అంటారు… ఇదేమో సంతాన స్తంభం అంటారు అని చెప్పేసి అనుకొని… 


లోపలికి ఒక మనిషి మాత్రమే వెళ్ళటానికి ఉండేసరికి శివ నందిని లోపలికి వెళుతూ ఉండేసరికి…. బాలగణపతిని నువ్వు ఒక్కడివే లోపలికి వెళ్లి చూడు…. లోపలికి నువ్వు ఒక్కడివే పడతావు… చిన్నపిల్లాడివి… ఎవరైనా వచ్చేసరికి లోపల ఏముందో చూసి రా…! అని చెప్పేసరికి… సరే అమ్మ! అని లోపలికి వెళ్లేసరికి…. గణపతి కడుపులో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఖాళీగా ఉన్న గుహ మధ్య లో కనబడింది.  సరే అని ఆ రుద్రాక్షను తీసుకుందామని చూసేసరికి ఆ రుద్రాక్ష నేలకి అతుక్కుపోయి ఉండేసరికి…. విచిత్రంగా అనిపించింది.  ఏమిటా? అని  చూస్తే అది ఒక చిన్న గుంటలో రుద్రాక్ష ఇరుక్కుందని తెలుసుకున్నాడు . ఆ గుంటను తొలుస్తూ చూడగా…. అది ఒక గుంట కాదని….భూగ్రహం తలుపు అని తెలుసుకొని…. అందులో ఉన్న మట్టంతా తీసేసి ఆ ద్వారం తీసేసరికి… ఆ ద్వారం లోపల కాషాయం రంగులో ఉన్న ఒక అడుగు ఉన్న మహాగణపతి విగ్రహం కనపడింది.అది బంగారపు వర్ణంలో ఉన్న గణపతి… ఏకముఖంతో ఉన్న గణపతి.  ఇక ఎవరూ లేరు అని చెప్పేసి ఆ విగ్రహ మూర్తిని బయటకు తీసుకురాగానే…. రుద్రాక్ష కూడా చేతిలోకి వచ్చింది.  ఆ తర్వాత తలుపు యధావిధిగా మూసుకుపోయింది.  ఆ తర్వాత ఆ గణపతిని తీసుకొని బాలగణపతి మెట్లు ఎక్కుతూ పైకి రావడం జరిగింది.  అప్పటికి ఆలయ పూజారి రాకపోయేసరికి…. 


బాల గణపతి:- అమ్మ! అమ్మ! నాకు లోపల ఈ బంగారు గణపతి కనపడ్డాడు….


సరే నాయనా రా! అని చెప్పి ఆ గణపతిని తీసుకొని తన సంచిలో పెట్టుకునేసరికి…. స్తంభం కాస్త యధావిధిగా మూసుకుపోవడం…. అన్నీ క్షణకాలాలలో జరిగిపోయాయి. ఇది జరిగిన కొన్ని నిమిషాలకి…పూజారి వచ్చి సబ్బు నీళ్లతో పట్టుకొని….ఇంక సబ్బు నీళ్ళు అవసరం లేదా? వేలు వచ్చేసిందా? అనేసరికి…. వేలు కొద్దిగ రాసుకొని ఉండేసరికి… కాస్త పసుపు రాసేస్తే సరిపోతుంది…. ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చేయకు…. అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయేసరికి…. ఏమీ జరిగినట్టు… ఏమీ తెలియనట్టు…. వీళ్లంతా  బయటకు రావడం జరిగింది.  మహాదేవి ఉన్నట్టుండి…


మహాదేవి:-  మూలాధార చక్రానికి అధిష్టాన దైవం మహాగణపతి కదా! ఎప్పుడైతే నువ్వు కామమాయని దాటావో…. నీకు చక్ర శుద్ధి అయిపోయింది…


మూలాధార చక్ర శుద్ధి లక్షణాలు:- 

చాలామందికి ఈ మూలాధార చక్ర శుద్ధి సమయంలో ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నీళ్ల విరోచనాలు అవ్వడం…..శరీరం బాగా తేలికై గాలిలో ఎగురుతుందేమో అన్నట్లుగా అనుభవ అనుభూతి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి…ఇప్పటికే నువ్వు సన్యాస దీక్షలో ఉండి సాధన చేస్తూ కామమాయని కూడా దాటేవు కాబట్టి…. నేరుగా నీవు ప్రకృతితో అనుసంధానం అయ్యి ఉన్నావు కాబట్టి…..పూర్వజన్మ కర్మ వాసనలు తొలగుతూ ఉన్నప్పుడు మీ ప్రారబ్ధ కర్మల కి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు వస్తుంటాయి.తర్వాత వారి రుణాలు బంధాలు తీరుతూ ఉండేసరికి అప్పటిదాకా వాటిని మోస్తున్న నీ మూలాధార చక్రం శుద్ధి అవుతూ వచ్చినది. దానితో నీ చక్రం శుద్ధి జరిగిపోయింది…


చక్ర అధీన స్థితికి నువ్వు వచ్చినందుకు ఈయన వచ్చాడు.. అని చెప్పింది.  నువ్వేం దొంగతనం చేయడం కాదు… అది నీకు అనుగ్రహం… అనేసరికి ఆ స్తంభంలో ఆ గణపతి ఉండటం,  ఆయన చెప్పడం వల్లే సాధ్యపడింది కదా!  ఎక్కడో తిరుపతిలో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఇక్కడికి తీసుకురావడం…. ఈ రుద్రాక్ష తీసుకోవడం…. ఆయన అంతట ఆయనే బయటకు రావడం జరిగింది కదా! 


శివ నందిని:-  నాకు తెలిసి అమ్మవారి యొక్క శక్తి ఈ గణపతి అయ్యి ఉంటుంది.  ఈ గణపతి మాయని అమ్మవారు దాటలేదా?


మహాదేవి:- అయ్యుండొచ్చు.…. 


శివానందిని:- అమ్మవారికి గణపతి కంటే కుమారస్వామి అంటేనే ఇష్టం.  గణపతికి శివయ్య అంటే ఎక్కువ ఇష్టం కదా!  అని చెప్పేసరికి మొట్టమొదటివాడు గణపతి యే కదా! అమ్మవారు పిండితో తయారు చేసింది…. ప్రాణప్రతిష్ట చేసింది…. కూడా గణపతినే కదా! అందుకోసమని గణేశ పురాణంలో చూస్తే గణపతి అంటే బాగా ఇష్టం,  అదే స్కాంద పురాణం ప్రకారంగా చూస్తే కుమారస్వామి అంటే ఇష్టం.  ఎవరైనా కూడా ఇద్దరూ తమ పుత్రులే కాబట్టి… ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఉండదు.  కాలానుగుణంగా సమయాను గుణంగా ఇద్దరి మీద ప్రేమ, మోహలు ఉన్నాయి. ఇద్దరూ అంటే ప్రాణమే ఆవిడకి…ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తల్లి ప్రేమలో ఉండదు… 

 

బాలగణపతి:- అవును!  మా ఇద్దరినీ బాగా చూసుకునేది అని అంటూ ఉండేసరికి….


మిమ్మల్ని అమ్మవారు చూడడమేమిటిరా ! అదే అమ్మవారి లాంటి మీరు చూస్తున్నారు కదా!  తల్లులలోను నాకు అమ్మవారే కనిపిస్తుంది.  ప్రతి అమ్మలోనూ నాకు అమ్మవారే కనిపిస్తుంది అని బాలగణపతి అనేసరికి… వీళ్ళు చూడటానికి పిల్లలుగా కనిపిస్తారు కానీ…. వీళ్ళ మాటలు మనకి అర్థం అయి చావవు.  వేదాంతాలకి మించినవి అని అంటూ ఉండేసరికి…. సరే అని చెప్పేసి వచ్చిన విగ్రహ మూర్తిని ఎదురుగా పెట్టుకుని… శివ నందిని ధ్యానంలో కూర్చుని ఉండేసరికి…. ఉన్నట్టుండి ఒక 40 నిమిషాలు తర్వాత శివ నందిని కాస్త అలా గాలిలో నెమ్మది నెమ్మదిగా లేస్తూ ఉండేసరికి….. ఇదంతా గమనించిన రుద్ర స్వామి, బాలగణపతి బాల కుమారస్వామి, మహాదేవి ఆశ్చర్య ఆనందాలకు లోనవుతూ ఉండగా….. 


బాలగణపతి:-  అమ్మ నువ్వు గాల్లో లేస్తున్నావు, గాల్లో లేస్తున్నావు ….అలా గాల్లో లేచి వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్తావో…. వెళ్తూ ఉండు..


శివానందిని:- నేను గాల్లోకి లేవడం ఏమిటిరా? అని ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి…


కింద పడిపోయింది.  ఒక్కసారిగా రుద్ర స్వామి ఉన్నట్టుండి…


రుద్రస్వామి:-  నువ్వు భూచర సిద్ధి పొందావు.  నీకు భూమి మీద ఆధిపత్యం వచ్చింది. చక్రం ఆధీనం అయ్యింది. నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు స్థిర మనసు చేసుకోవాలి కదా !స్పందించకూడదు కదా! నువ్వు ఎందుకు స్పందించావు…. వాడు అరిచిన అరుపులకి ధ్యానభంగం అయ్యి  మాటలకు ఎందుకు స్పందించావు! సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఉండి… నువ్వు స్పందించావు అంటే…. నీ నిగ్రహ స్థితిని కోల్పోయి… అక్కడి నుండి పడ్డావు అంటే….ఇక మూత్రపిండాలు పాడైపోయి,శరీరం విచ్చన్నం అయిపోయి, పగిలిపోతుంది …ఏమనుకుంటున్నావు. ఒకవేళ ఈ భూ చర సిద్ధ అహం మాయలో నువ్వు పడిపోయావంటే నీ చక్రం బలహీనపడటం మొదలవుతుంది…..


మూలాన చక్రం బలహీన పడినప్పుడు కలిగే లక్షణాలు:-


మూలాధార చక్రం బలహీన పడుతున్నప్పుడు వచ్చే వాటిని ముందుగానే అదుపు చేయలేకపోతే….వీటిని ఇప్పుడే అదుపు చేయాలని లేదంటే మనకి ఎముకల వ్యాధులు,కీళ్ళ వాతము, నయంకాని కురుపులు, చర్మవ్యాధులు, కంటి చూపు తగ్గటం ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి….


మూలాధార చక్రం బలహీనపడితే అనేక మానసిక రుక్మతలు అనేక వ్యాధులు కల్గును! అవి తనను తాను రక్షించుకొనే స్వార్ధము, అతి భయమును కల్గి ఉండుట, మూర్ఖత్వంతో ఎదిరించడము లేదా మాట్లాడటం, అటవిక మనస్తత్వమును కలిగి ఉండుట, ప్రతిపనిలో నిదానము కలిగి ఉండుట, అలాగే సహన శక్తి తక్కువగా ఉండుట మున్నగు మానసిక రుగ్మతలు కల్గుతాయి! అలాగే కొందరు వారి శక్తికి మించి కష్టపడి, శారీరకంగా, మానసికంగా విశ్రాంతి లేక ఆందోళనకు గురి అవుతారు! మరి కొందరైతే ఇతరుల యందు తప్పులుపడుతూ, విమర్శిస్తూ, వారిపై అధికారము చెలాయిస్తూ ఉంటారు! మరికొందరిలో అయితే నిరంకుశ స్వభావమును కలిగి ఉంటారు. అనగా ఇతరులు వారి ఆజ్ఞలను పాటించాలని అనుకొంటూ ఉంటారు! మరికొందరిలో అయితే తమ భావాలను అణచి పెట్టుకుంటూ, విరక్తి చెందుతూ ఆదుర్దాను పెంచుకొంటూ ఉంటారు!


మూలచక్రము మరింత బలహీనపడితే అనేక వ్యాధులు కల్గును! అవి కీళ్ల వాతములు, వెన్నుపాముకు సంబంధించిన వ్యాధులు, గుండె వ్యాధులు కలగటం, మూల శంఖు, కంటిచూపు మందగించుట, ఎముకలు విరుగుట, కురుపులు త్వరగా మానకపోవటం, మూలవ్యాధి, పిస్టులా, ఫిషర్లాంటి వ్యాధులు రావటం, వ్రణాలు వాపు పెరగటం, శరీరం, మెదడులో సరిగా పెరుగుదల లేకపోవటం, ఎలర్జీలతో బాధపడటం, సైనస్, రొంప, మలబద్ధకం, నీళ్ల విరేచనాలు, కాళ్లకు అనారోగ్యములు, లింపు గ్రంధుల వ్యాధులు మొదలైన వ్యాధులు కల్గుతాయి! అదియుగాక మూలాధారచక్ర జంట అయిన ఆజ్ఞా చక్రము గూడ బలహీనపడును! గమనించండి! పైన చెప్పిన మానసిక రుగ్మతలుగాని, వ్యాధులుగాని సాధకుడిలో ఉంటే మూలాధార చక్రము బలహీనపడునట్లుగా భావించుకోవాలి! ఈ చక్రమునకు బలము చేకూరుతున్నట్లుగా భావనలు చేసుకోవాలి! లేదంటే ఏదైన పూల వాసనలు జ్ఞాపకముంచుకొని, ఆవాసనను అనుభవిస్తునట్లుగా సాధన చేయాలి! ఇలా రోజుకు అరగంటసేపు చొప్పున 6 నెలలపాటు చేయాలి! అపుడు మూలాధార చక్రమునకు బలము చేరును! అపుడు సాధకుడిలో దేనినైనా సాధించగల శక్తి, అతి శ్రద్ధ, ఆత్మ నిగ్రహము కలవారై, ఇంద్రియ నిగ్రహము కలవారై, మనో నిగ్రహము కలవారై, స్థిత ప్రజ్ఞత కలవారై ఉంటారు!.



అది మానవ శరీరం,  దేవతా శరీరం కాదు.  ధ్యానంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా!  ఆమాత్రం ఉండలేకపోతున్నావా? అనేసరికి….. నేను గాలిలో లేవడం ఏమిటి? 


శివనందిని:-నాకు అర్థం కాలేదయ్య…. అందుకని కంగారులో నేను గాల్లో లేచి ఉంటే… ఇప్పుడు గాల్లో నుంచి ఎలా కిందకి దిగాలి అని ఆలోచన రావడంతో…. కింద పడిపోవడం జరిగింది.  ఇప్పుడు నాకు అర్థం అయింది. ఇంక ఎప్పుడు మళ్ళీ ఎలాంటి తప్పులు చేయను…. 


అనేసరికి ఆ గణపతి విగ్రహం తీసుకొని రాత్రి సమయం అవ్వడంతో…. ఇక భోజనాలు ముగించుకొని…గదికి వెళ్లి…. విశ్రాంతి తీసుకోవాలని…. ఎవరికి వారే తోచిన విధంగా నిద్రావస్థకు చేరుకోవడం జరిగింది.


శివ నందిని కాస్త ఆదిపరాశక్తి అంశ అయిన  కామాక్షి దేవి… ఏ మామిడి చెట్టు కింద అయితే కూర్చొని తపస్సు చేసిందో… అదే మామిడి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంది.  అలా సుమారుగా ఒక గంట సేపు ధ్యానంలో ఉండగా…. ఆమెకు ధ్యాన దృశ్యంగా మొదట ఒక మట్టి శివలింగం కనిపించింది.  ఆ తర్వాత మరికొన్ని క్షణాలకి ఒక నల్లని శివలింగం కనిపించింది.పదేపదే ఈ రెండు శివలింగాలు కనిపిస్తున్నాయి.. ఎందుకు కనపడుతున్నాయో తనకి అర్థం కాలేదు.  సరే అది అలాగే చూస్తూ ఉండగానే… ఆ మట్టి శివలింగం అనేది దాని యొక్క పానవట్టం గుండ్రంగా కాకుండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండేసరికి…. అంటే ఇది స్త్రీ మోక్షలింగం అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు.  ఎందుకంటే మోక్షలింగానికి మాత్రమే పానమట్టం ఉండదు… అని పరమహంస గారు చెప్పారు. అయితే పానమట్టం గుండ్రంగా ఉండేది పురుష లింగం .దీర్ఘచతురస్రాకారంలో ఉంటే అది స్త్రీ లింగం అని ఆయన అనుభవాలలో స్త్రీ ,పురుష శివలింగాల భేదం గురించి చెప్పడం జ్ఞాన స్ఫురణగా శివ నందినికి గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత నల్ల శివలింగం మామూలుగానే చతురస్రాకారంలో ఉన్న శివలింగంలాగా కనపడుతుంది. అంటే తనకి సాధనలో అన్ని స్త్రీ శివలింగాలే వస్తాయని ఆమె గ్రహించింది. కాకపోతే ఇక్కడ మట్టి శివలింగం కనబడటం అలాగే నల్ల శివలింగం కనబడటం ఏమిటో అర్థం కాలేదు. ఏం జరుగుతుందో అని అనుకునేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది.  ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు..దర్శనం చేసుకోవడం ,కూర్చోవడం ,ప్రసాదాలను తినడం ఇలా ఉండటం గమనించి…. రెండు నిమిషాలు అలా వారి వంక చూసి పక్కనే కమండలంలో ఉన్న నీళ్లను కొద్దిగ తాగి…. తిరిగి ధ్యానంలో కూర్చునే సరికి యధావిధిగా మళ్లీ కొంత సేపటికి మట్టి శివలింగం, నల్ల శివలింగం కనిపించేసరికి అర్థం కాలేదు.  ఒకవేళ ఈ మట్టి శివలింగం ఏకాంబరేశ్వర శివలింగాన్ని సూచిస్తుందా?  ఈ ఏకాంబరేశ్వర శివలింగాన్ని పూజించలేరు కాబట్టి….పూజించటానికి వీలు లేదు కాబట్టి ….పక్కన నల్ల శివలింగం పెట్టడం జరిగింది కదా!  దానికి గుర్తుగా ఈ నల్ల శివలింగం కనబడుతుందా! అర్థం కాలేదు… ధ్యానంలో కనిపించే శివలింగాలకి ప్రత్యక్షంగా కనిపించే శివలింగాలకి చాలా తేడా ఉంది.  తనకి ధ్యానంలో కనిపించే మట్టి శివలింగం చూస్తుంటే పరమహంస గారికి తన తల్లి వారసత్వంలో ఒక సిద్ధుడు సృష్టించి ఇచ్చిన మట్టి శివలింగంలాగా కనపడుతుంది.  కాకపోతే పాన మట్టాలు తేడాగా ఉన్నాయి. పరమహంస గారికి వచ్చిన మట్టి శివలింగం గుండ్రంగా పానవట్టం ఉంటే,  తనకి కనిపించిన శివలింగం కాస్త చతురస్రాకారంలో ఉన్న పానవట్టంగా కనబడుతుంది.  కాకపోతే ఈ రెండు నీటి వంపు లేని మోక్షలింగాలు అని చెప్పి అర్థం అవుతుంది అని అనుకోవచ్చును…. పరమహంస గారికి పురుష మోక్ష లింగం దొరికితే,  నాకు స్త్రీ మోక్షలింగం దొరుకుతుంది. ఆయనకి వారసత్వంలో పురుష మోక్షలింగం దొరికింది… సరే బాగానే ఉంది.  తనకి వారసత్వమే లేదు కదా? తనకి ధ్యానంలో ఈ విధంగా కనిపించడం ఏమిటి? పైగా నల్ల శివలింగం కనపడడం ఏమిటి…. అర్థం కాలేదు. ఏం చేయాలో అనుకుంటూ ధ్యానభంగం అయ్యేసరికి,  అన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు…. అన్నీ తెలిసిన వాడి చిరునామా ఒకటి ఉంటే చాలు కదా ! అని , ఎటు మన జన్మాంతర  పతిదేవుడు ఉన్నారు కదా! ఎలాగో ఆయన పూర్ణ జ్ఞాని కదా!  ఆయన్ని మించిన జ్ఞాని ఎవరున్నారు! అటు శబ్ద పాండిత్యంలోనూ…..ఇటు అనుభవ పాండిత్యంలోనూ ఆరితేరిన వాడు.  మునిగి తేలేవాడు.  ఆదిజ్ఞానం తెలుసు…. అంత్య జ్ఞానము తెలుసు కదా! ఆయన్ని తలచుకుంటే సరిపోతుంది కదా!  ఏదో ఒక  పరిష్కారం చూపిస్తారు కదా!  అని చెప్పేసి హృదయం మీద చెయ్యి పెట్టుకుని….. స్వామి!  శివ స్వామి… మీతో మాట్లాడాలి అనేసరికి…. చెప్పు దేవి ! అంటే మీతో మాట్లాడాలని ఉంది… రండి ….అనగానే ఏంటి ఇప్పుడు రమ్మంటావా? అనగానే ఆ రమ్మనే కదా చెబుతున్నాను స్వామి!  అని అనేసరికి వస్తున్నాను అని క్షణకాలంలోనే తన పక్కనే భౌతిక శరీరంతో శివానంద కనిపించేసరికి…..


శివనందిని:-  నమస్కారం స్వామి! 


శివానంద:- చెప్పు దేవి!  ఏమైంది…


అంటే  తనకి ధ్యానంలో కనిపిస్తున్న మట్టి స్త్రీ మోక్ష శివలింగం అలాగే నల్లని స్త్రీ శివలింగం గురించి చెప్పేసరికి ఈయన కూడా ధ్యానంలో ఒక అరగంట కూర్చుని ఈ రెండు శివలింగాల గురించి నాకు వచ్చిన జ్ఞాన స్ఫురణ ప్రకారం… యథాతథంగా నీకు చెబుతున్నాను…


దేవి!  ఇందులో మట్టి శివలింగం అనేది పరమహంస గారికి వచ్చిన మట్టి మోక్షలింగం లాంటిదే….కాకపోతే ఇక్కడ  శివుడికి అమ్మవారు 14 బంధనాలు వేసింది అని అన్నారు కదా!  అందులో లింగ బంధనం తొలిగా మట్టితో శివలింగం చేసి ఆరాధన చేసిందని స్థల పురాణం చెప్పింది కదా! ఈ విధంగా మట్టితో చేసిన శివలింగంతో ఆవిడ తన భక్తి ప్రపత్తులతో లింగ బంధనం చేయడం జరిగింది.  అంటే ఈ శివలింగ బంధనం గురించి నీకు తెలుసు కదా! 


శివ నందిని:- అవును స్వామి!  మరి ఆ నల్ల శివలింగం  పరిస్థితి ఏమిటి? 


శివానంద:-  అది నీకు మూలాధార చక్ర జాగృతి అవుతున్నప్పుడు… స్థూల శరీర జాగృతి అవుతుంది కదా!  ఆ జాగృతి కోసం ఆ నల్ల శివలింగంను పొందవలసి ఉంటుంది.  ఈ నల్ల  శివలింగం వలన మనం అమ్మవారిని బంధనం చేయడానికి వీలు అవుతుంది.  ఒకటేమో మట్టి శివలింగం అయ్యవారిని బంధవిముక్తి చేసేది. నల్ల శివలింగమేమో అమ్మవారిని బంధనం చేయడానికి ఉపయోగపడుతుంది….


శివ నందిని:- మూలాధార చక్ర జాగృతికి కంచి తీసుకోవడం జరిగింది.  శరీర జాగృతికి మరో క్షేత్రం తీసుకోవాలా? స్వామి…. 


శివానంద:- అవును,  ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా….అవి మనలో ఏకాదశ దేహాలు జాగృతి, శుద్ధి,ఆధీనం చేస్తాయి.  అంటే ఈ శరీరంలో స్థూల, సూక్ష్మ, కారణ ఇలా 11 శరీరాలు ఉన్నాయని చెబుతారు కదా! ఇందులో స్థూల శరీరం అనేది నీ ప్రస్తుత శరీరం.  అది మూలాధార చక్రంలో ఆవాసం ఉంటుంది. ఈ శరీరంలో జన్మాంతరంలో చేసే తెలిసో తెలియక చేసిన పాపాలు కర్మలు, చెడు కర్మలు తప్పులు ఈ శరీరం అనుభవించవలసి ఉంటుంది.  అలాగే గత జన్మలో చేసిన పాపాలు కూడా అనుభవించవలసి ఉంటుంది.  ఈ చక్రంలో ఉన్న స్థూల శరీరం శుద్ధి, జాగృతి , ఆధీనం అవ్వటానికి నీకైతే ….నాకు తెలిసి ద్వాదశ లింగాలలో ఏదో ఒక లింగానికి వెళ్ళవలసి వస్తుంది. అందుకోసమని నువ్వు నల్ల శివలింగమును సంపాదించుకోవలసి ఉంటుంది. అలాగే మట్టి మోక్షలింగం కూడా ఎక్కడ ఉందో నువ్వు సంపాదించుకోవలసి వస్తుంది… 


శివనందిని:-; స్వామి!  మీరు అందరికీ కనబడుతున్నారా ?నాకు మాత్రమే కనపడుతున్నారా? 


శివానంద:-ఎందుకు వచ్చింది ఈ అనుమానం…?


శివనందిని:- అంటే ఇక్కడున్న భక్తులు నన్ను  వింతగా అదోలా చూస్తున్నారు… ఒకలా మాట్లాడుతుంటే అడిగాను…


శివానంద:- నేను నీకు తప్ప ఇంకేవరికి కనపడను కదా ! 


శివనందిని:- స్వామి…. నా దగ్గరికి వచ్చే ముందు నాతో కాకుండా అందరికీ కనిపించేలాగా చేయండి… లేదంటే నా కొంప కొల్లేరు అవుతుంది.  నేను పిచ్చిదాన్ని అనుకుంటారు. పిచ్చి పట్టిన దాన్ని అనుకుంటారు.  లేదా అవధూత స్థితి అనుకొని నేను అమ్మవారితో మాట్లాడుతున్నాను అని అనుకుంటారు . నాకు ఇక్కడ ఈ చెట్టు కింద గుడి కట్టేసి పూజలు చేసేస్తారు…


అనేసరికి… శివ స్వామి కాస్త పకపకా నవ్వుతూ 


శివానంద:- .ఏముంది…. విగ్రహారాధన కన్నా  వ్యక్తి యొక్క ఆరాధన ఎక్కువైపోయింది కదా! మాట్లాడని వాడి కన్నా మౌనస్వామిని ఆరాధన చేస్తారు…మాట్లాడే వారిని సరస్వతి పుత్రుడు అని ఆరాధన చేస్తున్నారు.  మతి ఉన్నవాడినేమో స్వామీజీ అని ఆరాధన చేస్తున్నారు.  మతిభ్రమణం చెందిన వాడిని అవధూత అని ఆరాధన చేస్తున్నారు.విగ్రహారాధన పోయింది….వ్యక్తిగతమైన వ్యక్తి ఆరాధన ఆరంభం అయ్యింది.  అన్ని తెలిసినవాడు అణిగిమణిగి ఉంటే…. ఏమి తెలియనివాడు జ్ఞాని అని చెప్పి ప్రచారాలు చేసేసి వాడికి పూజలు చేస్తున్నారు.  అంగాలు ఉన్నవాడు పూజకి అర్హుడే….అంగాలు లేని వాడు పూజకి అర్హుడే ….అలాగే నిన్ను పట్టుకొని నిన్ను ఆరాధన చేసి విగ్రహారాధనతో వ్యక్తిగత పూజ చేస్తారు …తప్పేముంది ? 


శివనందిని:-  స్వామి!  ఇది ఒకటా మళ్లీ….ఇది మనకి అవసరమా? ఏదో గుప్తంగా ఉండి గుప్తయోగినిగా మారి లుప్తం అయిపోవాలని అనుకుంటున్నాను. నన్ను ఏ దేవతలాగానో ఆరాధన చేయాల్సిన అవసరం లేదు.  నేను ఏదో గొప్ప యోగినిని అని, గొప్ప జ్ఞానిని అని ఆరాధన చేయాల్సిన అవసరం లేదు.  పూజించాల్సిన అవసరం లేదు.  ఇలాంటి ప్రసాద భక్తులు, ప్రచార భక్తులు ఓ 10 మంది తయారైతే చాలు.  అజ్ఞాని కూడా గురువైపోతాడు. తెలిసి తెలియని వాడు కూడా…. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు కూడా….  పరమగురువు అయిపోతాడు. ఇది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు.  అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది… ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. పరమహంస జీవిత చరిత్రలో నాకు అదే అర్థమైంది. అన్ని తెలిసి కూడా,  ఏమీ తెలియని వాడిగా…. అజ్ఞానిగా…. అమాయకుడిగా… సర్వం తెలిసి, సర్వ వ్యాపి అయినప్పటికీ…. తను శివుడు అయినా కూడా…. ఎక్కడ ఎటువంటి ప్రచారాలు లేకుండా…. అసలు ఉన్నాడో పోయాడో లేదో కూడా తెలియని గుప్త సాధనతో గుప్త యోగిగా మారి…. శివానుగ్రహంతో శివుడయ్యాడు.  జీవుడు కాస్త శివుడు అయ్యాడు.  ఇప్పుడు ఈ విధంగా ఎవరు సాధన చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు మీరే చెప్పండి? ఏదో కొద్దో గొప్పో తెలిసిన జ్ఞానముతో శబ్ద పాండిత్యమును పొంది ….తనను మించిన పండితులు లేరు, జ్ఞానులు లేరు, గురువులు లేరు, స్వామీజీలు లేరు, అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు.  అన్నీ తెలిసిన వాడేమో ఏమీ తెలియని ఏమరపాటులోనే గుప్తమై లుప్తమై పోవాలనుకుంటున్నారు. ఏమీ తెలియని వాడు మాత్రం ప్రచారంలోకి వచ్చేస్తున్నాడు.  ఇది నూటికి 90% ఇలాగే జరుగుతుంది.  10% ఎక్కడో వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును. నిజ ఙ్ఞానం పొందిన పండితులు…అయినా ఇవన్నీ నాకెందుకు…స్వామి!  అయినా ఇప్పుడు నాకు శివలింగాల గురించి చెప్పమన్నాను… చెప్పారు అర్థం అయింది.  ఇప్పుడు వాటిని పొందాలంటే నేను ఏమి చేయాలి? 


శివానంద:- . ఏముంది ….దేవి! నువ్వు కామాక్షి దేవి అనుగ్రహం పొందవలసి ఉంటుంది.  ప్రత్యక్ష దర్శనం పొందవలసి ఉంటుంది.  ఆవిడ ఇక్కడ ఐదు రూపాలలో సంచారం చేస్తూ ఉంటుంది.  బాలగా, లలితగా ,త్రిపురగా, సుందరిగా, దేవిగా…. ఈ కామాక్షి దేవి 80 సంవత్సరాల వృద్ధురాలిగా తిరుగుతూ ఉంటుంది. కోటీశ్వరుని బిడ్డ దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధురాలిగా అన్ని రూపాలు ఆవిడయే ….ఆ రూపాలలో ఏది నిజరూపము నువ్వు పట్టుకోగలిగితే…ఆవిడ అనుగ్రహం పొందగలిగితే ….నీకు ఆవిడలో ఉన్న శక్తులు ఏమిటి అనేది తెలుస్తుంది . అక్కడ నుంచి ఆవిడలో ఉన్న ఏకాదశ దేహాలు ఏమిటి అనేది తెలుస్తుంది.  ఈ దేహాలని బంధనం చేసే శివలింగాలు అన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. ఎవరిని బంధించాలి

… ఎవరిని ఇది చేయాలి అని చెప్పేసి.  నిజానికి అమ్మవారి అంశ  అయిన కామాక్షి దేవి పూర్ణంగానే ఉంది.  నిశ్చల స్థితిలోనే ఉంది.  కానీ ప్రపంచానికి మాత్రం ఆవిడ అనిశ్చలంగా కనపడుతుంది. దీనికి కారణం ఈవిడ 18 భాగాలుగా విడిపోయి ఉన్నది.  ఈ 18 భాగాలే 18 శక్తి పీఠాలుగా ఉన్నాయి.  ప్రతి శక్తిపీఠంలోనూ…. ప్రతిభాగంలోని ఆత్మశక్తి కాస్త అమ్మవారిగా రూపాంతరం చెందింది.  అంటే అమ్మవారిలో 18 రూపాలు ఉన్న అమ్మవార్లు కదులుతున్నాయి . వీటిలో 11 ఏకాదశ దేహాలు సహకారం చేస్తున్నారు… వీటిని పంచభూత సహితమైన పంచస్వరూపాలు అయిన కామాక్షి రూపాలు సహకారం చేస్తున్నాయి.  ఇదంతా నిజమా కాదా అని అందరికీ తెలియదు.  కొంతమంది యోగులకి… అమ్మవారి ఉపాసకులకు… ఈ లెక్కలు కనపడతాయి.  ఇది ఆవిడ అనుగ్రహం పొందిన నిజభక్తులకు మాత్రమే…. అమ్మ వారిలో ఉన్న శక్తి గతులు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కామాక్షి దేవి విగ్రహ మూర్తి వచ్చేటప్పుడు నాకు ఇవన్నీ కనిపించాయి.  నిజంగానే విగ్రహమూర్తులు చూడటం జరిగింది. ఇప్పుడు నువ్వు  ప్రత్యక్ష మూర్తిగా  ఆవిడలో చూడాలి. ఆవిడ అనుగ్రహం పొందాలి ….అని అంటే అనుగ్రహం పొందామని మనకు ఎలా తెలుస్తుంది అంటే…. దానికి కాలమే చెబుతుంది.  నీకు అనుభవ అనుభూతి వస్తుంది. అది ఇది అని చెప్పలేను. ఆవిడ చూపు తగిలినా ….ఆవిడ ఎంగిలి తగిలినా…. ఆవిడ చేతి స్పర్శ తగిలినా …..ఆవిడ వాడే వస్తువులు తగిలినా కూడా నీకు అనుభవం అనుభూతి కలుగుతుంది.  ఏ విధంగా ఆవిడ అనుగ్రహిస్తుందో…. ఇదిమితంగా ఇది అని చెప్పటానికి తెలియదు.  అది కాలమే నిర్ణయం చేయాలి.  అందుకు నీకు అర్హత, యోగ్యత, యోగం ఉంటే …ఆవిడే నీకు నిజరూప దర్శనం ఇస్తుంది.  కాబట్టి  ఆవిడ అనుగ్రహంతోనే నీకు అమ్మవారి స్థితిగతులు తెలుస్తాయి.  శివలింగాల యొక్క అవగాహన ఏమిటి అనేది…. ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది.  బాల గణపతి ద్వారా  మూలాధార చక్రానికి అధిష్టానం దైవమైన మూల గణపతిని నువ్వు ఎలా పొందావు .? అది ముందుగా చెప్పి రాలేదు కదా!  పరిస్థితుల వల్ల ….కాలానుగుణంగా నీ సాధన మూలధార చక్ర శుద్ధి అయిపోయిన తరువాత…. నీకు ఆధీనం అయిపోయిన తర్వాత….. మూలాధార చక్ర సాధనా పరిసమాప్తి అయిపోయిన తర్వాత…. ఆచక్ర  అధిష్టాన దైవమైన గణపతి  బాల గణపతి ద్వారా రావడం జరిగింది కదా!  అదేవిధంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది..


శివనందిని:- స్వామి! మీరేమో  పరమహంస యొక్క ఆకాశ శరీరం అని చెప్తున్నారు… నాదేమో మనో శరీరం అంటున్నారు.  నా మనో శరీరం ఆయనకి మనో శరీరమా? వేరే వాళ్ళ మనో శరీరమా? నాకు అర్థం కాలేదు. ఈ శరీరాల గురించి వివరంగా చెబుతారా? ఎందుకంటే నాకు ధ్యానంలో పదేపదే ఈ శరీరాల గురించి అర్థమయ్యి అర్థం కాక…. అవగాహన లోపం వలన నా ఆలోచనలు దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. …. 


అని అడిగేసరికి అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు.


శివానంద:-పరమహంస స్థూల శరీరానికి ….ఆకాశ శరీరంగా నేను ఉండడం అనేది నిజం. అలాగే నువ్వు కూడా ఆయన  ధర్మపత్ని మనో శరీరానికి స్థూల శరీరం అవుతావు. నిజానికి నేను నువ్వు స్థూల శరీరమే. కాకపోతే పరమహంస ప్రకారంగా చూస్తే….. నేను పరమహంస ఆకాశ శరీరం అవుతాను.  నా పరంగా పరమహంస గారిని చూస్తే ఆయన నాకు స్థూల శరీరం అవుతారు.  అంటే ఒక్కొక్క శరీరానికి మళ్ళీ ఒక 11 శరీరాలు ఉంటాయన్నమాట!  ఇప్పుడు నాకు 11 శరీరాలు ఉంటాయి. ఆయనకి 11 శరీరాలు ఉంటాయి. అలాగే నీకు  11 శరీరాలు ఉంటాయి. నీ స్థూల శరీరానికి కూడా 11 శరీరాలు ఉంటాయి.  నిజానికి నీది మనో శరీరం… నాది వచ్చేసరికి ఆకాశ శరీరం… నీ మనో శరీరం నీ స్థూల శరీరానికి మనో శరీరం అన్నమాట! నా స్థూల శరీరానికి ఆకాశ శరీరం నేను అన్నమాట! 


శివనందిని:-  మరి నా స్థూల శరీరం ఎవరు? 


శివానంద:- పరమహంస ధర్మపత్ని అయిన మహాదేవి… ఆవిడ ఆనంద భైరవి తంత్రంలో ఉంటుంది.  శ్రీశైల క్షేత్రంలో ఈవిడ సాధన చేస్తున్నట్టుగా ఆయనకి కనిపించింది.  ఆ తరువాత ఈయన దగ్గరికి వచ్చింది అని అనుభవంలో చెప్పడం జరిగింది..


శివనందిని:- ఆ విన్నాను …మహాదేవి అని విన్నాను.  మరి మహాదేవి మనో శరీరం అయినప్పుడు ఆ మహాదేవి స్థూల శరీరం ఎవరు… 


శివానంద: ఆ స్థూల శరీరం ప్రస్తుతానికి యోగసాధనలో ఉండి జ్ఞానమార్గంలో సాధన చేస్తుంది. ఆవిడ పేరు శివాని.


శివనందిని:-  అంటే ఏంటి? ఇప్పుడు మీరు నన్ను పిలుస్తున్నారు శివాని.! శివాని..! నన్ను  అని పిలుస్తూ ఉంటారు . ఇప్పుడు నన్ను గోకుతున్నారా?  ఆవిడని గోకుతున్నారా? 


శివానంద:- అమ్మ తల్లి! మహాతల్లి! నీకో దండం… నేను నిన్నే గోకుతున్నాను.  ఆవిడని గోకట్లేదు… ఆవిడ పరమహంస స్థూల శరీరానికి సంబంధించిన ధర్మపత్ని.  ఆవిడ పేరు శివాని . ఇప్పుడు నువ్వు నా ఆకాశ శరీరానికి ధర్మపత్నివి. అంటే నా స్థూల శరీరానికి ధర్మపత్నివి…. నా పేరు శివానంద, నీ పేరు శివ నందిని 


శివనందిని:-  అంటే ఇప్పుడు శివ నందిని అంటే నేనే కదా! శివాని అంటే నేనే కదా!  ఆవిడని గోకట్లేదు కదా !నిజమే కదా! ఖచ్చితంగా నే కదా! 


శివానంద:-  నీ ఒక్కదానితోనే వేగలేక చస్తున్నాను…. నాకు పదిమంది అవసరం లేదు.  నేను పాతివ్రత్య ధర్మంలోనే ఉన్నాను కదా! నువ్వు కూడా పాతివ్రత్య ధర్మంలోనే ఉన్నావు కదా! 


శివనందిని:- .ఈ శరీరాలు ఏంటో…. స్థూల శరీరం ఏమిటో…. ఆకాశ శరీరం ఏమిటో… మనో శరీరం ఏమిటో…. నాకేం అర్థం కావడం లేదు.  అర్థమై అర్థం కానట్టుగా ఉంది . అన్ని చెబుతారు. చెప్పలేదు అనటానికి లేదు చెబుతారు… నాకేమో అర్థమై చావదు…. ఏమిటో!  ఇప్పుడు ఈ శరీరాల గురించి తెలుసుకోవడం అవసరమా?


శివానంద:-  నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను.  ఇక్కడ విషయం అర్థమైతే సిద్ధాంతం…. అర్థం కాలేదు అంటే వేదాంతం…. అర్థమై అర్థం కాలేదు అంటే రాద్ధాంతం…. అని గుర్తు పెట్టుకో! ఇదంతా కూడా  నీకు అనుభవంలోకి వస్తే గాని ఈ శరీరాలు ఏంటి? ఇదేంటి అనేది అర్థం కాదు.  గుర్తుపెట్టుకో …కాకపోతే మన స్థూల  శరీరానికి మనం ఆకాశ శరీరాలను మనో శరీరాలు అవుతాము….మనకి వచ్చేసరికి వాళ్లు మన ఆకాశ శరీరాలు, మనో శరీరాలు అవుతారు.  మనం స్థూల శరీరం అవుతాము.  ఇక్కడ బింబం, ప్రతిబింబం లాగా శరీరాలు పనికి వస్తాయి.  అంతే…. ఎందుకో … పరమహంస గారు సాధన చేస్తున్నప్పుడు…. అంతిమములో ….తను మూడవ డైమెన్షన్ లో ఉండి మోక్ష సాధన పరిసమాప్తి చేసుకుంటే….. నాలుగవ డైమెన్షన్ లో వాడేమో చదువుకుంటున్నాడు…. ఐదవ డైమెన్షన్ లో వాడు ఉద్యోగాలు చేస్తున్నాడు….. ఆరవ డైమెన్షన్ లో వాడు వ్యాపారాలు చేస్తున్నాడు…. ఏడవ డైమెన్షన్ లోని వాడు హత్యలు, మానభంగాలు చేసేవాడిగా ఉన్నాడు.  ఇలా రకరకాలుగా కనబడుతున్నారు ఏమిటి?  అన్నప్పుడు ఈ విధంగా 107వ డైమెన్షన్ లో 107 లోకాలలో తనలాంటి వాళ్ళు ఉంటారు.  శరీరాలలో 11 దేహాలతో ఉంటారు.  ఒక్కొక్క డైమెన్షన్ లో 11 దేహాలతో ఉంటారు.  ఇలా 11*108=1188 దేహాలు  మోక్షం పొందవలసి ఉంటుంది.  అదే విశ్వమోక్షం అవుతుంది.  ఏ దేహం మిగిలిపోయిన కూడా అది మోక్షమే అవుతుంది….. అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా!  ఇప్పుడు భూలోకంలో వ్యక్తిగత ఆయన స్థూల శరీరంతో సాధన చేస్తున్నప్పుడు తన ఆకాశరీరం మోక్షం పొందలేదని గ్రహించాడు.  ఎందుకు అంటే తన కంఠంలో ఉన్న స్పటిక శివలింగాన్ని అమ్మవారు తీసివేయడంతో ఆ శరీరం మిగిలిపోయింది.  మిగతా శరీరాలు కూడా మోక్షం పొందినాయి… స్థూల శరీరం ఇంకా మోక్షం పొందలేదు.  ప్రస్తుతానికి అది అరుణగిరిలో గుప్తంగా ఉండి సాధన చేసుకుంటుంది.  ఇప్పుడు ఆకాశ శరీరానికి మోక్షం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని సాధన మొదలుపెట్టిన తరువాత….. ఈ ఆకాశ శరీరానికి ధర్మపత్ని అనే ఋణం మిగిలిపోయిందని చెప్పేసి తెలుసుకున్నాడు.  తన స్థూల శరీరానికి ఆరు ఋణాలతో పాటు ఏడవ ఋణం కింద ఇది ఉన్నదని తెలుసుకొని….. ఆరు రుణాలు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి గాని…. ఏడవ రణం తీర్చడానికి ఇంక అవకాశం లేదు కాబట్టి , ఆయన సాధన చేసుకొని….. ఈ భార్య, ధర్మపత్ని ఎవరు?  అని భార్యకి, ధర్మపత్ని కి ఉన్న తేడా ఏంటి? అని తెలుసుకొని భార్యతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకోవడం జరిగిపోయిందని…. ఆయన తెలుసుకొని ధర్మపత్ని అనేది ఆది జన్మలో దైవాంశ జన్మలో ఉన్నప్పుడు వచ్చే ఆవిడే ధర్మపత్ని అని చెప్పేసి ఆ తర్వాత ఆవిడ కాస్త శివ మోహ మాయలో పడి ఆ ధర్మపత్ని కాస్త 64 భార్యలుగా రూపాంతరం చెందడం జరుగుతుంది అని…. ఈ 64 భార్యలు కాస్త 64 యక్షిణిలుగా మారడం జరిగింది అని ….ఆ యక్షినీలే మోహ మాయాబంధానాలలో పడవేయడం జరుగుతుంది అని తెలుసుకున్నాడు.అరుణాచలంలో మోహిని యక్షిని బంధనం, కామిని యక్షిణి బంధనం అని చెప్పి 64 యక్షిణి బంధనాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. ఇదే విషయం లోకానికి చెప్పడము జరిగింది.  అదేవిధంగా ఇప్పుడు అరుణాచలంలో కిలిగోపురం కింద మోహిని యక్షిణిని బంధనం  చేయడం జరిగింది. దీనిని అరుణగిరి నాధర్ అనే యోగి చేయడం జరిగింది. దీనిని బట్టి యక్షిణిలు ఉంటాయని …. యక్షిణి బంధనాలు ఉంటాయని ….చెప్పేసి మనకి చెప్పడం జరిగింది.  అలాగే ఈ క్షేత్రంలో మూడు మాయలు ఉంటాయని,ఒకటి  మోహిని మాయ, రెండవది యక్షుడు మాయ, మూడవది అపస్మారక రాక్షసుడి మాయ అని చెప్పేసి…… ఈ మూడు కనిపించని మహామాయలు ఉంటాయని త్రివిధమాయలు దాటవలసి వస్తుందని చెప్పడం జరిగింది కదా! 


శివ నందిని:- ఆయన ఆఖరి అధ్యాయంలో ముగింపులో ఇవన్నీ చెప్పడం జరిగింది. నేను చదవడం జరిగింది… 


శివానంద:- కాబట్టి తన ఆకాశ శరీరానికి మోక్షం ఇవ్వాలి అని చెప్పేసి…అలాగే తన ధర్మపత్ని స్థూల శరీరానికి, మనో శరీరానికి మోక్షం ఇవ్వాలని…. ఈ రెండింటిని ధర్మపత్ని, ధర్మపతి అని ఉండటం వలన మన ఇద్దరినీ కలిపి అనుసంధానం చేసి సాధన చేస్తున్నారు. 

 

శివనందిని:-ఈలోగా సాధనలో పరమహంస గారు పురుష ప్రకృతి మోక్షం పొందింది అని ధ్యాన అనుభవం పొందారు.  అలాగే తన ధర్మపత్ని అయిన స్థూల శరీరం కూడా అనుభవాలు పొందాలి…. ధ్యానానుభవాలు పొందాలి ….నేను మనో శరీరంగా సాధన చేస్తే గాని నా స్థూల శరీర అంశ అయిన శివానికి అనుభవాలు అందవని అర్థం అవుతుంది…


శివానంద:- అవును తల్లి!  మన సాధన పరిసమాప్తి చేసుకోవాలి అని అంటే 11 దేహాలు కూడా ఏకధాటికి రావాల్సి ఉంటుంది.  ఈ 11 దేహాలు ఏకధాటికి రావాలి అంటే ఆ దేహంలో ఉన్న కర్మలు ఋణాలు అన్నీ కూడా సమూలంగా నాశనం చేసుకోవాలి. అలా నాశనం చేసుకోవడమే సాధన అవుతుంది. ఎందులో అయినా ఎక్కడైనా కర్మ శేషం మిగిలిపోయి ఉంటే….ఆ దేహం మోక్షం పొందదు. ఆ తర్వాత అది శూన్యం అవడం అనేది జరగదు.  కాకపోతే ఇక్కడ ఏంటంటే పరమహంస గారు ఆకాశదేహం మోక్షం పొందినా …పొందకపోయినా ఆయన వెళ్ళిపోవచ్చును.  కావాలంటే పురుష ప్రకృతి మోక్షం పొందింది అని తెలుసుకోవడంతో స్త్రీ ప్రకృతి కూడా మోక్ష ం పొందిందా లేదా స్త్రీ మోక్షం పొందుతుందా లేదా అని తెలుసుకోవాలనే ఉత్సుకతతో… ఉత్సాహంతో… ధర్మపత్ని అనే  ఋణం పేరుతో ఋణానుబంధం ఉంది అని కారణం చెబుతూ…. లేని ఋణాన్ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు.  ఆయనకి ధర్మపత్ని ఋణం మహాదేవి దర్శనంతోనే… మహాదేవి ఇచ్చిన శివుని విగ్రహం మూర్తులతోనే ఋణం తీరిపోయింది.  ఆ ధర్మపత్ని అయిన  మహాదేవి ఏ విధంగా సాధన చేసింది….ఏ విధంగా అరుణాచలంలో మోక్షం పొందింది. పొందుతుంది అని తెలుసుకోవాలనే ఉత్సుకతతో లోకానికి చెప్పాలని మోక్షం పొందిందా?  లేదా అలాగే స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందా ? లేదా?  అలాగే విశ్వము మోక్షం పొందిందా లేదా అని తెలుసుకోవాలని ఆయన సంకల్పించారు తప్ప…అంతకుమించి ఏమీ లేదు.  ఇప్పటికిప్పుడు మోక్షం పొందాలి అంటే నా ఆకాశ శరీరం క్షణాలలోనే మోక్షం పొందుతుంది.  కాకపోతే నీ మోక్ష సాధన కోసం నన్ను ఆపడం జరిగింది.  ఎందుకు అంటావా?  ఆకాశ శరీరం ఎక్కడ వస్తుంది….విశుద్ధ చక్రంలో వస్తుంది. అక్కడ ఆకాశంలో శివలింగం దర్శనం ఇవ్వడం జరిగింది.  అప్పుడు ఆ శివలింగం ఎలా విభేదనం చేయాలో తెలియక…ఆయన అక్కడితో ఆగిపోయి ముందుకు వెళ్లిపోయారు.  ఆత్మ శరీరంతో సాధనకి వెళ్లిపోయి అన్ని దేహాలు మోక్షం పొందడం జరిగింది.  ఎందుకంటే ఆకాశంలో శివలింగం చూడడం కాదు…. ఆకాశమే శివలింగంగా భావన చేయాలి. అది పూర్ణజ్ఞానికే తెలుస్తుంది అనే అనుభవ అనుభూతి ఆయన పొందారు.  తద్వారా ఆ కారణంతో ఆకాశమే శివలింగం అనుకున్న మరుక్షణమే నేను ఆకాశంలో కలిసిపోతాను…. …. ఆకాశంలో ఆకాశ శివలింగం చూడాలని భావంలో ఉన్నాడు.  అందువలన ఆకాశ శరీరంతో నేను ఉన్నాను… నిజానికి ఆకాశమే శివలింగం అనే భావనలోకి వస్తే నా శరీరం ఆకాశంలో కలిసిపోతుంది.  ఆకాశంలో శివలింగం ఉంది అని భావన చేయడం వలన….ఆకాశంలో నుంచి నేను ఆకాశ శరీరంగా కనబడుతున్నాను. నీకు నేను స్థూల శరీరంగా కనబడుతున్నాను అనేసరికి…. 


శివ నందిని:- స్వామి!  నాకు ఇప్పుడు కొద్దిగా అర్థం అయింది.  అది అనుభవం అనుభూతిలోకి వస్తే గాని నాకు అర్థం కాదు . ఇప్పుడు మీరు చెప్పినట్టు మొదట మట్టి శివలింగమును పొందాలి.  ఆ తర్వాత నల్ల శివలింగం పొందాలి.  ఈ రెండు పొందాలి అంటే నేను అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందాలి.  ఆవిడ అనుగ్రహం పొందాలి. 


శివానంద:- అవును దేవి! సరే శివాని… ఇంక నేను సాధనకి వెళ్ళాలి…. 


శివ నందిని:- .స్వామి మీరు శివాని అంటే స్థూల శరీరం గుర్తుకు వస్తుంది.  మీరు దాన్ని గోకుతున్నారేమో అని అనుమానభయంతో నేను సాధన చేయలేను.  ఇక ఆవిడతో అనుసంధానం అవుతారేమో అని భయం వేస్తుంది.  నేను ఆడదాన్ని.  నాకు ఈర్ష్య, అసూయలు ఎక్కువ.  నా అనుకున్నది ఎవరైనా పర స్త్రీలు పంచుకోవడం కానీ… మాట్లాడటం కానీ….ప్రేమించడం కానీ… ప్రేమ పంచడం కానీ… చేస్తే నేను తట్టుకోలేను.  నా కన్నతల్లి నా భర్తతో మాట్లాడితేనే నేను తట్టుకోలేను.  నా పిల్లలు నన్ను మించిన ప్రేమతో నా భర్తతో ఉంటేనే నేను తట్టుకోలేనిదాన్ని.  అలాంటిది మీరు శివాని అని పిలిస్తే మాత్రం నావల్ల కాదు.  నాకు ఆలోచన అటే పోతుంది… ఏకాగ్రత లోపిస్తుంది …సాధన చెయ్యలేదు… ఏదో చేస్తున్నాను… అంటే చేస్తున్నాను… అనుకుంటూ  ఉంటాను … 


శివానంద:- సరే దేవి!  అని పిలిస్తే సరేనా అంటే …


శివ నందిని:- ఆ దేవి అని పిలిస్తే పర్వాలేదు.  అయినా నా మనో శరీరానికి ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు కదా ! పిలవచ్చు కదా! 


శివానంద:- . మహాదేవి అని పిలిస్తే నీ పక్కన ఉన్న మహాదేవి పలుకుతుంది…. రుద్రయ్య లేచి వస్తారు నా మీదకి ….వాళ్ళు ఆవిడని నేను సైట్ కొడుతున్నాను అని ….


శివ నందిని:- అవును అది కూడా ప్రమాదం ఉందిలే…. మా ఇద్దరంలో ఒకేసారి పలకాలన్న కష్టమే సరే ఇప్పుడు నాకు  అరకొరగా అర్థం అయింది.  ఏదో ఒకటి పిలవండి… మీ ఇష్టం వచ్చిన పేరు పిలవండి….నెమ్మదిగా నేను కూడా భోగ జీవితానికి సంబంధించిన ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు కూడా వదిలిపెట్టాలి కదా! ఈ విధంగా నేను వదిలిపెడతానేమోలే కానివ్వండి…. సరే స్వామి! …


( అని అంటూ ఉండేసరికి….శివ నందినికి ఒక ధర్మ సందేహం వచ్చింది.  స్వామి ఒక్క నిమిషం ఉండండి ….అనేసరికి సరే చెప్పు దేవి! అనేసరికి ఇక శివ నందిని చెప్పడం ఆరంభించింది. )


స్వామి! ఇప్పుడు నాకేమీ గుర్తు రావట్లేదు… మీతో మాట్లాడుతూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది.  ఆ సందేహం అడగాలనుకున్నాను….మర్చిపోయాను… గుర్తుకు రావటం లేదు…


శివానంద:-  సరే దేవి ! గుర్తుకొచ్చినప్పుడు అడుగు. .మొదట నీకు ఆ సందేహానికి సమాధానం విశ్లేషణ చేసుకోవడం అలవాటు చేసుకో!  ఒక పది సమాధానాలు వెతుక్కో… ఆ పది సమాధానాలలో నీ ప్రశ్నకు సరిపోయే రెండు సమాధానాలు చూసుకో!  వాటిలో ఏది సరియైనది అనేది నేను నీకు చెబుతాను…. ప్రతిదీ కూడా విశ్లేషణ చేయాలంటే విశ్లేషణ జ్ఞానం కలగాలి.  వివేక బుద్ధి, వివేక జ్ఞానం కలగాలి.  ఎందుకంటే నువ్వు మాయలు దాటుతున్నప్పుడు వాటిని నీకు నీవే విశ్లేషణ చేసుకోవాలి. నాకు మాట్లాడే సమయం ఉండదు.


శివనందిని:- ఇప్పుడు గుర్తుకు వచ్చింది స్వామి! ఆత్మానుసంధానం అంటారు కదా!  ఇది ఎలా సాధ్యం.


శివానంద:- దీన్ని  ఇంగ్లీషు లో టెలిపతి విధివిధానం అంటారు.  ఇది అంత కష్టమైంది కూడా కాదు.  ఒకే సమయంలో ఇద్దరు ఒకే చోట ఉన్నా లేక వేరువేరుగా ఉన్నా కూడా…. ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఉదయం ఎనిమిది గంటలకి కూర్చుంటాము అనుకున్నప్పుడు ఎనిమిది గంటలకి ఇద్దరు ధ్యానంలో కూర్చోవాలి.  ఎక్కడ ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచనలు చేయాలి…. ఒకరి గురించి ఒకరు బాగా ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలు కూడా కాగితం మీద రాసి పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంటసేపు ఆలోచిస్తే… అవతల వాళ్ళ గురించి ఆ ఆలోచనలు కాగితం మీద రాసుకోవడానికి వీలు ఉంటుంది.  ఇప్పుడు 10 పాయింట్లు రాసుకుంటే ఎంత లేదన్న అవతలివాడి ఆలోచన శక్తి, వీడి ఆలోచన శక్తి సమతుల్యంగా ఉంటే పదికి 10 ఆలోచనలు సరిపోతాయి. లేదంటే ఏడు/ ఆరు /ఎనిమిది /మూడు… ఇలా కనీసం రెండు పాయింట్లు అయినా కలుస్తాయి.


శివ నందిని:- ఇది సాధ్యమా? అంటే కావాలంటే చూడు …


అనేసరికి వారిద్దరూ… ఎదురెదురుగా కూర్చున్నారు.  వీరిద్దరికీ మధ్య మీటర్ దూరం ఉంది.


 శివానంద:-  సరే దేవి!  నేను ధ్యానంలో కూర్చొని నీ గురించి ఆలోచిస్తాను… నువ్వు ధ్యానంలో కూర్చుని నా గురించి ఆలోచించు… మనకి వచ్చిన ఆలోచనలు నా గురించి వచ్చినవన్నీ గుర్తు పెట్టుకో! నేను గుర్తుపెట్టుకుంటాను… 


అనేసరికి సరే అని 45 నిమిషాల పాటు వాళ్ళు అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండిపోయారు.  ఆ తర్వాత శివ నందిని గురించి శివ స్వామి ఆలోచించడం …….శివ నందిని కాస్త శివ స్వామి గురించి ఆలోచించడం జరిగింది.  అలా ఆలోచిస్తూ…. ఉన్నట్టుండి కళ్ళు  ఏకకాలంలో  తెరిచేసరికి…..


శివ నందిని:- అదేంటి స్వామి!  నేను కళ్ళు తెరవాలి అనుకోగానే…. ఆ ఆలోచన నాకు వచ్చింది.  నా ఆలోచన నేను కళ్ళు తెరుస్తున్నాను స్వామి! అని మీకు సందేశం పంపించాను.  మీరు కళ్ళు తెరుస్తారు అని నాకు అనిపించింది.  నాకు మీ గురించి పది రకాల ఆలోచనలు వచ్చాయి …


శివానంద:- నాకు కూడా పది రకాల ఆలోచనలు వచ్చాయి.  అంటే వీటిలో 8 రకాల ఆలోచనలు సరిపోయేసరికి ఆశ్చర్యం వేసింది.  


శివానంద:- ఇలా కూడా ఉంటుందా? అంటే మరి యోగపరంగా అయితే ఎలా వీలవుతుంది ?


శివ నందిని:- నువ్వు ధ్యానంలో ఉంటావు,  నేను ధ్యానంలో ఉంటాను,  ఏకకాలంలో ఉంటాము.  అప్పుడు మనలో ఉన్న ఆత్మ శరీరాలు బయటకు వస్తాయి.  ఈ ఆత్మ శరీరాలు ఒక ప్రాంతంలో కలుస్తాయి… ఒకటై పోతాయి.  నీకున్న సిల్వర్ కార్డు ,నాకున్న సిల్వర్ కార్డు మన ఆత్మ శరీరానికి ఉన్న పేగు బంధం….స్థూల శరీరానికి ,ఆత్మ శరీరానికి ఉన్న పేగు బంధం నా స్థూల శరీరానికి నా ఆత్మ శరీరానికి ఉన్న పేగు బంధం…. ఈ రెండు కూడా కలిసిపోతాయి.  ఒక గొట్టం లాగా ఏర్పడిపోతాయి.  అప్పుడు నీకు కలిగే ధ్యానం అనుభవాలు…. నువ్వు చూసే ప్రత్యక్ష ధ్యాన దృశ్యాలు, ప్రత్యక్ష దర్శనాలు అన్నీ కూడా యధావిధిగా నేను చూడొచ్చు… చూసే అవకాశం ఉంటుంది . అలాగే నేను చూసే ధ్యాన అనుభవాలు, ధ్యాన దృశ్యాలు కూడా నువ్వు చూడవచ్చును.


శివనందిని :- ఇప్పుడు బొడ్డులో నుంచి ఒక సిల్వర్ కార్డు లాగా వస్తే అది కలుస్తుంది అంటున్నారు… ఈ సిల్వర్ కార్డ్ కలయిక జరిగాక దానిని ఇబ్బంది పెట్టేలా ఏమైనా జరుగుతాయా? అంటే పక్షుల వలన, విమానాల వలన… ఎందుకంటే ఇది ఆకాశంలో కలుస్తుంది కదా!


 శివానంద:- పక్షుల వలన, భౌతిక వస్తువుల వలన, ఈ సిల్వర్ కార్డుకి ఎటువంటి హాని అవ్వదు.  కాకపోతే ప్రేతాత్మలు, పిశాచాలు, ఆత్మలు, దయ్యాలు, భూతాలు, రాక్షసులు గణాలు దేవతాగణాలు యక్షినీలు, కిన్నెరలు ఇలా స్థూల శరీరం కాకుండా మిగతాదేహాలు ధరించే అన్ని ఆత్మలు కూడా…. ఈ ఆత్మ శరీరాల వలన ఈ సిల్వర్ కార్డు అనుసంధానాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.  కొంతమంది తెలుసుకోవాలని చెప్పేసి… ఈ సిల్వర్ కార్డును చెవిలో పెట్టుకొని ఏం వింటున్నారో అని కూడా తెలుసుకోవచ్చు.  ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు.  అంటే ఏమిటంటే…. ఒకరకంగా మనం ఫోన్ తో మాట్లాడితే సంభాషణ మూడవ వ్యక్తి వింటున్నట్లుగా జరుగుతుంది. జరిగే అవకాశాలు ఉన్నాయి.కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఆదిపరాశక్తి….అక్కడ సదాశివమూర్తి కదా!  శ్రీశైలంలో కాబట్టి… ఆదిరుద్రుడు మహాదేవుడు కాబట్టి ఇక్కడ ఉన్నది మహాదేవి కాబట్టి తొందరపడి మన జోలికి రారు. వీళ్ళు దైవ క్షేత్రాలలో ఉన్నారు… దైవాంశ స్థితిలో ఉన్నారు… యోగ సాధనలో ఉన్నారు….ఒకవేళ యోగ సాధనలో వీళ్ళని మనం ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ శాపాలకి గురి కావలసి వస్తుంది.  సన్యాస దీక్షలో ఉన్న వీళ్ళ శాపాలు అలాగే దైవ శాపాలు పొందాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు.  కాబట్టి వాళ్ళ  మన అనుసంధానం గొట్టానికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు.


శివనందిని:-అది కూడా మనం ఒక్కసారి ధ్యానంలో చూద్దామా? అది అనుభవం అనుభూతి పొందాలి …


శివానంద:- ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు.  అది కూడా త్వరలో జరుగుతుంది.  


శివనందిని:- అలా కాదు… అలా కాదు… ఈరోజు నేను అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నాను.  అమ్మవారి నిజరూప దర్శనం పొందాలను కుంటున్నాను.


శివానంద:- ముందు అమ్మవారి భౌతిక దర్శనం అవ్వాలి… తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఇచ్చినట్లుగా… నీకు తిరుపతిలో గోపాలస్వామి వచ్చి యోగముద్ర సాధన చెప్పారు కదా!  అలాగే అమ్మవారిది కూడా నీకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వాలి. ఆ తర్వాత నేను ఏదైనా చేయడానికి వీలవుతుంది 


శివనందిని:-  ధన్యోస్మి స్వామి! 


అనగానే ఆయన అంతర్ధానం అయ్యారు. ఆ తర్వాత అక్కడికి మహాదేవి, రుద్రస్వామి, పిల్లలు వచ్చేసరికి బాలగణపతి ఉన్నట్టుండి…

 

బాలగణపతి:- అమ్మ!  మాకు చెప్పకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? నువ్వు అదృశ్యం అయిపోయావు….మాయమైపోయావు…. అని నాకు ఏడుపు వచ్చేసింది… 


శివనందిని:- లేదురా!  మీరందరూ మంచి నిద్రలో ఉన్నారు.  గాఢ నిద్రలో ఉన్నారు.  ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఏదో సాధన చేసుకుందామని…. ధ్యానం చేసుకుందామనిపిస్తే…. ఇక్కడికి వచ్చాను.


నువ్వు స్నానం చేసావా?  అని బాల కుమారస్వామిని అనేసరికి ఆ…. చేశాను అమ్మ మేమంతా పంచ గంగా   పుష్కరిణిలో స్నానం చేసి వస్తాము… అనేసి వీళ్ళందరూ స్నానం చేసి వచ్చిన తరువాత….ఉన్నట్టుండి బాల కుమారస్వామి 


బాల కుమారస్వామి:- అమ్మ!  ఏమీ అనుకోనంటే నాదొక సందేహం… ఈ పంచగంగా  పుష్కరిణి గురించి నీకు తెలిసింది చెప్పవా?  ఎందుకంటే గంగా పుష్కరిణి అనాలి గాని పంచగంగా అని ఎందుకు పెట్టారు?  ఇక్కడ పంచగంగలు ఎలా ఏర్పడ్డాయి?  ఇక్కడ పంచ గంగలు ఉన్నాయా?  


అని అడిగేసరికి తనకి దీని గురించి తెలిసి ఉండటంతో శివ నందిని చెప్పడం ఆరంభించింది..బాల కుమారస్వామి అడిగిన పంచగంగా పుష్కరిణి గురించి చెప్పడం ఆరంభించింది.


శివ నందిని:- నాయనా!  ఇక్కడ గంగ ఒక రూపంలో ఉండదు.  పంచ గంగల రూపంలో ఉంటుంది.  దీనికి ఇతిహాస పురాణం ప్రకారం చూస్తే …..బండాసురుడి వధ జరిగిన తరువాత… వాడి శరీరం నుంచి రక్తబీజుడు లాంటి రాక్షసుడు వచ్చాడు.  వీడి శరీరం నుండి రక్తం ధారలుగా కారుతూ ఉండి….ఆ రక్తం చుక్కలు నేల మీద పడుతూ ఉంటే…. ఆ పడిన చోట మరో రక్తబీజుడులాంటి రాక్షసుడు పుట్టడం జరిగింది. ఇలా కొన్ని వందల్లో రక్తబీజ రాక్షసులు పుట్టడం క్షణంలో జరుగుతూ ఉండేసరికి…. వీడిని ఎలా సంహారం చేయాలో అర్థం కాక…. అందరూ శివుని దగ్గరకు వెళితే…. అప్పుడు శివుడు కాస్త ఆ రక్తం నేల మీద పడకుండా దేవతలంతా పట్టుకొని తాగేసేయండి….అప్పుడు వాడు శక్తిహీనుడు అవుతాడు. తద్వారా వాడిని సంహారం చేయడానికి వీలవుతుంది అనేసరికి….. సరే అని దేవతలందరూ కూడా ఆ రక్తబీజుడి రక్తం నేల మీద పడకుండా ఎవరికి వారే సేవించడం జరిగింది. ఆ తర్వాత అతడు శక్తిహీనుడు అయిపోయి…. ఈశ్వరుని చేత సంహారం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రక్తబీజుడు పాపాలన్ని దేవతలు సేవించడం వలన దివ్య తేజస్సుతో ఉండే తెల్లటి శరీరాలు కాస్త, నల్లగా పాపపు శరీరాలుగా….. మారేసరికి ఏం చేయాలో అర్థం కాక తిరిగి ఈశ్వరుడు దగ్గరకు వెళ్లేసరికి శివుడు ధ్యాననిష్ట నుంచి బయటకు వచ్చి దీనికి ఒకటే పరిష్కారం ఉంది.  ఒక్క గంగ మాత్రమే మిమ్మల్ని పరిశుద్ధం చేయగలదు.  నా జటాజూటంలో ఉన్న గంగని పంచధారలుగా భూమి మీదకి అనుగ్రహిస్తాను.  అది ఒక తటాకంగా ఒక పుష్కరిణీగా ఏర్పడుతుంది. అందులో మీరు స్నానం చేస్తే మీకున్న పాపాలన్నీ హరించకుపోయి మీ యదార్ధ దివ్య తేజస్సుతో… దివ్య కాంతితో మారతారు అనేసరికి… శివుడి జటాజూటం నుంచి పంచ పాయలుగా గంగాదేవి ఈ పుష్కరిణిలోకి ప్రవేశించడం జరిగింది. అందుకని దీనిని పంచగంగా పుష్కరిణి అంటారు.


బాలగణపతి:-కాశీ క్షేత్రంలో కూడా పంచగంగ ఘాట్ ఉంది కదా!  ఈ పంచగంగ ఘాటు, ఆ పంచగంగ పుష్కరిణీ రెండు ఒకటేనా?


శివనందిని:- ఇక్కడ పంచగంగ ఘాట్ లో ఉత్తరాది ప్రకారం దక్షిణాది ప్రకారంగానూ తేడాలు ఉన్నాయి.  ఉత్తరాది ప్రకారంగా అటు ప్రాంతాలతో చూస్తే పంచగంగలు అనగా గంగ, యమున, ధూమపాప, కిరణ, సరస్వతి అనే నదులను పంచగంగా అని పిలుస్తారు. అలాగే దక్షిణాదికి వచ్చేసరికి గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, పంచగంగలుగా పిలుస్తారు.


బాలగణపతి:- ఓహో!  ఇదన్న మాట విషయం…


రుద్రస్వామి:- ఇతిహాస పురాణాలలో చెప్పిన కథలన్నీ కూడా మనం తెలుసుకోవాలి.. కానీ దాని మూలార్ధం ఏంటి అనేది పిల్లలకి అర్థం కాదు…


శివ నందిని:-  అంటే ఏంటి అయ్యా!  అనేసరికి 


రుద్రస్వామి:-  భండాసురుడు అలాగే రక్త బీజుడు అని రాక్షసుల పేర్లు చెప్పడం జరిగింది కదా! వీళ్ళు సూక్ష్మంలో మోక్షంగా మన పూర్వీక మహర్షులు మన జీవిత విధానంలో వాటి గురించి చెప్పడం జరిగింది. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా అనుభవ పాండిత్యం ప్రకారంగా భండాసురుడు అని అంటే అమ్మవారు సంహారం చేసింది కదా!  ఇక్కడ కామాక్షి దేవి అని ఉంటుంది. కామాక్షి దేవి అంటే… చూపుతోనే కోరికలు తీర్చగలిగేది… అంటే మరో రకంగా కామము అంటే శృంగారం అంటారు కదా!  శృంగార ప్రక్రియ చేయాలి అని చెప్పడం అన్నమాట!  ఒక విధంగా భండాసురుడు అంటే భాండాగారం అని అంటే పెద్ద భూషాణం అని… నిండు గర్భిణీ యొక్క పొట్ట చూస్తే ఒక భాండాగారం లాగా ఉంటుంది కదా 


అనేసరికి….అవును!  అని అందరూ అన్నారు. ఇది వీర్యము నుంచి తయారవుతుంది.  వీర్యంలో ఏముంటాయి..? 84 లక్షల వీర్యకణాలు ఉంటాయి…. ఒక్క బొట్టు వీర్యం 40 రక్తపు బొట్టులతో సమానం అని సైన్స్ చెప్పడం జరిగింది. అంటే వీర్యంలో 84 లక్షల జీవజాతులను సృష్టించగలిగే వీర్యకణాలు ఒక బొట్టు రక్తంలో ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ఈ రక్త బీజుడు నుంచి రక్తం కారడం అనేది కారిన తరువాత వాడు మళ్ళీ ఇంకొక రక్తబీజుడిగా మారడం ఏంటంటే…. వీర్యంలో వీర్యకణాలకి 84 లక్షలలు ఉన్నాయని చెప్పకనే చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే రక్త బీజుడు ద్వారా పురుషుడు వీర్యశక్తి గురించి చెబితే భండాసురుడి ద్వారా అండం దాని యొక్క మార్పులు…. అది పిండంగా మారడం ఎలా ఏంటి అనేది చెప్పడం జరిగింది.  ఈ కథలన్నీ కూడా మన జీవితంలో జరగబోయే, రాబోయే మన జీవితంలో ఎదురయ్యే అంశాలనే చెప్పడం జరిగింది. సూక్ష్మంలో మోక్షంగా మనం ఆ మూలార్ధం తెలుసుకోవాలి.  అంతేకానీ ఈ భండాసురుడు , రక్త బీజుడులాంటి వాడు గురించి యదార్థంగా అవి జరిగిన సంఘటనలే ..! ఆ రాక్షసులు వీళ్ళకి పూర్వక మహర్షులే. అసలు విషయం ఏమిటి అనేది అర్థవంతంగా తెలియాలని చెప్పేసి ఆ పేరులోనే మొత్తం మూలార్ధం చెప్పడం జరిగింది. అది తెలుసుకుంటే మూలార్ధం ఉంటుంది.  పదార్థం తెలుసుకుంటేనే గాని యదార్థం తెలియదు. 


శివ నందిని:- అవును నువ్వు చెప్పింది నిజమేనయ్యా.  మూలాలు తెలుసుకోవడం చాలా కష్టం. అది అనుభవ పాండిత్యం పొందిన వాడికి మాత్రమే తెలుస్తుంది..


ఇంతలో ఒక సన్యాసి తన మత ధర్మ ఆచార వ్యవహారాల వస్త్రాలతో అక్కడికి రావడంతో రుద్రస్వామి కేసి చూస్తూ…


సన్యాసి :- స్వామి!  ఇంత అనుభవ పాండిత్యం పొందారు కదా!  రాక్షసులపేరులోనే ఉన్న మూలార్ధాన్ని తెలుసుకున్నారు… మరి సరాసరి దైవం ఉన్న సమక్షంలోనే చుట్ట తాగడం తప్పు కాదా?


 అనేసరికి…. అప్పుడే  చుట్ట కాల్చడానికి సిద్ధంగా ఉన్న రుద్రస్వామి కాస్త 


రుద్రస్వామి:- అయ్యా!  నువ్వు చెప్పింది సరి అయినదే ….దేవుడు ఉన్నచోట కాల్చొద్దు అన్నారు.  దేవుడు లేని చోటు ఎక్కడో చూపించు… అక్కడికి వెళ్లి నేను  చుట్ట కాల్చుకుంటాను..


అనేసరికి…. ఆ సన్యాసి ఆలోచనలో పడ్డాడు.  సరే అని చెప్పి  ఏమి మాట్లాడట్లేదు. అక్కడే ఉన్న శివ నందిని చేసి చూస్తూ ఇదిగో అమ్మ!  దైవ ప్రసాదం అని…. ఏదో ఇవ్వబోతుంటే….


 దైవ ప్రసాదం కానిదేది అని రుద్ర స్వామి అన్నాడు. దేవుడు గుడిలో ఉన్నదే దైవ ప్రసాదం…. గృహంలో నిత్యం తయారు చేసే ప్రసాదం దైవ  ప్రసాదం కాదా?  దైవ  ప్రసాదం కానిది ఏది?  అంతా కూడా ఈశ్వర సృష్టియే కదా!  అది ఆలోచించండి.  గుడిలో ఉండే ఆహారమునే దైవ  ప్రసాదం అని అనుకుంటే అది చాలా తప్పు…. అనేసరికి మీది మెట్ట వేదాంతం.  అది ఆచరణ యోగ్యమైనది కాదు. అనేసరికి అర్థమైతే సిద్ధాంతం…. అర్థం కాకపోతే వేదాంతం…. అర్థమై అర్థం కాకపోతే రాద్ధాంతం…. అని అంటూ ఉండేసరికి… శివ నందిని కేసి చూస్తూ 


సన్యాసి:- అమ్మ ! నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా !  దేనికోసం అంటే మోక్ష సాధన అనేసరికి స్త్రీలు ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు. మరో జన్మలో పురుష జన్మ ఎత్తిన తర్వాతనే ఆ పురుషుడు మాత్రమే మోక్షం పొందుతారని మా మత ధర్మం చెబుతుంది.  దానిని బట్టి నువ్వు సాధన చేసి ఉపయోగం ఏముంది?  పురుష జన్మ ఎత్తక తప్పదు కదా!  


శివనందిని:- అయ్యా శబ్ద పాండిత్యములో అలా ఉండొచ్చేమో!  కానీ అనుభవ పాండిత్యంలో అలా ఉండదు. ఎందుకంటావా నేను ఎక్కడి నుంచి పుట్టాను అని అనేసరికి…. నీ తల్లిదండ్రుల నుంచి పుట్టావు అనేసరికి…. తల్లితండ్రులలో ఎవరి నుంచి పుట్టాను అనేసరికి…. అంటే నీ తండ్రి యొక్క వీర్య కణం నుండి పుట్టావు… అంటే ఏంటి? మూలం ఎవరు? తండ్రి కదా! ఈశ్వరుడే కదా… నాలో ఉన్నది….. ఈశ్వరుడు నాలో ఉన్నాడు కదా!  అంటే పురుషుడిలోనే శివుడు ఉన్నాడు…. స్త్రీలోని శివుడు ఉన్నాడు…. ఇక్కడ తేడా ఏమిటంటే స్త్రీ, పురుషుల శరీరాల బేద భావం కలిగింది. మర్మంగాలలో తేడా ఉంది. మీకు వక్షస్థలం ఉండదు….మాకు వక్షస్థలం ఉంటుంది.  మాకు వక్షోజాలు పాల  తిత్తులు పసిపిల్లలకి ఆహారం కోసం ప్రకృతి ఉపయోగిస్తుంది.  మీకు అవకాశం లేదు.  అందుకని చెప్పేసి మీకు అలాగే స్త్రీకి తేడా మర్మాంగం లో వస్తుంది. పురుషుడికి బయటవైపు ఉంటే స్త్రీకి లోపల వైపు ఉంటుంది.  పురుషుడికి పుట్టించే శక్తి ఉంటే స్త్రీకి కనే శక్తి ఉంటుంది.  అంతే తేడా!  సాధనలోనూ మోక్షంలోనూ ఎలాంటి తేడా లేదు. నాలో ఉన్న శివుడు మోక్షం పొందుతున్నాడు…. నీలో ఉన్న శివుడు మోక్షం పొందుతున్నాడు… అంటే పురుషుడిలో ఉన్న శివుడు మోక్షం పొందుతున్నాడు.  స్త్రీ సాధన చేస్తే స్త్రీలో ఉన్న శివుడు మోక్షం పొందుతాడు.  కాకపోతే మళ్లీ స్త్రీ అనేసరికి స్త్రీ పునః జన్మ ఎత్తి పురుషుడిగా పుట్టాలి అని ప్రచారం చేశారు…. ఎందుకంటే పురుషాధిక్యత.  స్త్రీ ఆధిక్యతను తట్టుకోలేని వాళ్ళు ఆ ధర్మం పెట్టడం జరిగింది.  నిజానికి స్త్రీ, పురుషులు సాధన చేస్తే పురుషుడికి మరణమే మోక్షమరణం అయినప్పుడు… స్త్రీ మరణం కూడా మోక్షమరణం అవుతుంది. ఎందుకంటే స్త్రీ శరీరంలో కూడా ఉన్నది పురుషుడే…. శివుడే…. శివుడి నుండే అమ్మవారి వచ్చింది. అంటే  ఇప్పుడు అమ్మవారికి అయ్యవారికి తేడా ఎక్కడ ఉంది.  లేదు కదా!  అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్లేసరికి ఇద్దరు ఏకత్వస్థితికి వచ్చేస్తున్నారు కదా!  నువ్వు అమ్మవారు అయ్యవారు అని ఎలా చెప్పగలవు? ఏక శరీరంలోకి వచ్చి ఏకత్వంలోకి వస్తే నామరూపాలు లేని స్థితి కదా..!  అది ద్వైతంలోకి వస్తే అమ్మవారు అయ్యవారు అని చెప్పగలవు.


 అనేసరికి నమస్కారము చేస్తూ నీ వల్ల నాలో ఉన్న అజ్ఞానం పోయింది…..అలాగే రుద్ర స్వామి వలన నాలో ఉన్న జ్ఞాన అహంకారం పోయింది.  ఇంత చిన్న వయసులో ఇంత అనుభవ పాండిత్యం పొందావు అంటే…. అది అనితర సాధ్యమైనది కాదు.  ఏదో  జన్మాంతర సాధన అయి ఉంటుంది.  నువ్వు ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్ష సాధన చేసి మోక్షం జన్మ చేసుకుంటావు అని నా  అనుభవం మీద చెబుతున్నాను.  మోక్ష మరణం పొందుతావు… సాధన పరిసమాప్తి చేసుకుంటావు అనేసరికి ….దీవించి వెళ్లిపోవడం జరిగింది.  సరే స్వామి! మంచిది అని శివ నందిని అలా ఆయన వెళుతున్న దారి కేసి చూస్తూ ఉండిపోయింది.  మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. 


బాల గణపతి ఉన్నట్టుండి….


బాలగణపతి:-  అమ్మా!  ఇక్కడ విష్ణుకంచికి ఒక కిలోమీటర్ దూరంలో యథోత్కారి  అనే ఆలయం ఉందట.  ఆ గుడికి వెళ్ళాలి …..


శివనందిని:- ఎందుకురా!  ఆ గుడి ప్రత్యేకత ఏమిటి? 


బాలగణపతి:- అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది..


అని చెప్పేసి అనేసరికి….. అందరూ కూడా విష్ణు కంచికి దగ్గరలో ఉన్న ఆ గుడికి వెళ్ళటం జరిగింది. ఈ లోపల శివ నందిని గుడిలోని విశేషాలు ఏమిటి ? అంత ప్రత్యేకత ఏమిటి?  ఈ పిల్లవాడు అడుగుతున్నాడు అని…. ఆ వివరాలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. అది 64 మంది ఆల్వార్లలో ఒక ఆల్వార్ యొక్క అనుభవం అని అర్థం అయింది.  సరే అని ఆ గుడికి వెళ్లడం జరిగింది. గుడిలో ఉన్న రంగనాథ స్వామి వారు విచిత్ర భంగిమలో పడుకోవడం జరిగింది.  సహజంగా రంగనాథ స్వామి వారు మనకి ఎడమవైపున తలపెట్టుకొని కుడివైపున పాదాలు పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కుడివైపు తల పెట్టుకొని ఎడమవైపు పాదాలు పెట్టుకున్న భంగిమలో కనిపించేసరికి…. పిల్లలు ఇద్దరు ఆయన పడుకున్న భంగిమకు,  ఈయన పడుకున్న భంగిమకు తేడా ఉంది చూసావా?  ఈ తేడా ఎందుకు ఉంది అనేది నాకు తెలియదు గానీ…… ఉంది అని అమ్మవారి గుడిలో చెప్పుకుంటుంటే విన్నాను.  చూడాలనిపించింది అనేసరికి…. ఈ తేడాకు ఒక కారణం ఉంది.  దాని వెనకాల ఒక భక్తుడి కథ కూడా ఉంది అనేసరికి…. ఎవరు , ఏంటి?  అనేసరికి పిల్లలు ఇద్దరు అడిగేసరికి….. సరే అని శివనందిని చెప్పడం జరిగింది. 


శివానందిని:-  ఒకసారి  ఒక గురువుగారు, ఒక శిష్యుడు ఈ గుడికి దగ్గరలో గుడిసెలో ఆవాసం చేయడానికి వచ్చారు. ఈయనకి కావలసిన వాటిని దగ్గర ఉండి చూసుకోవటానికి ఒక వృద్ధురాలు సేవలు చేస్తూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది.  ఈమె భక్తి ప్రపత్తులకి మెచ్చిన గురువుగారు…. కాస్త అమ్మ నీకు ఏం వరం కావాలి? అని అడిగితే ఆ వృద్ధురాలు కాస్త నాకు నిత్య యవ్వనత్వ స్థితి ఉండేటట్టుగా కావాలని కోరుకునే సరికి….. అప్పుడు ఆయన ఆవిడకి నిత్య యవ్వనవతిగా మార్చేయడం జరిగింది.  అప్పుడు ఈ దేశపు పల్లవరాజు ఈమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి రాజు ముసలివాడు అవుతున్నప్పటికీ కూడా…. ఆవిడ వృద్ధురాలు కాకపోవడంతో ఆశ్చర్యం వేసింది.  అసలు కారణం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు….ఈ గుడికి దగ్గరలో ఉన్న గురువు గారి గురించి ఆమె చెప్పడంతో…. గురువుగారిని తీసుకురమ్మని రాజుగారు భటులను ఆదేశించడం జరిగింది.  తీరా ఈ ఆశ్రమానికి వెళ్లేసరికి గురువుగారు ధ్యాన తపస్సులో ఉండటం….. ఆ తపస్సు నుంచి ఆయన అంతటి ఆయనే బయటికి రావాలి తప్ప…. మనం కదిలించడానికి లేదు అని శిష్యుడు చెప్పేసరికి…. శిష్యుని పట్టుకుని రాజు గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు రాజు తనని యవ్వనవంతుడిగా మార్చమని అడిగేసరికి…. తనకి అంత జపశక్తి లేదు అని ….అది మా గురువుగారు తప్ప ఇంకెవరూ చేయలేరు అనేసరికి…. రాజుగారు కోపావేశాలకు గురి అయ్యి, నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నాను…. నీకు విద్య తెలిసినా కూడా అనుగ్రహించలేదు…. వరం ఇవ్వట్లేదు….అనేసరికి అతని అపార్థం చేసుకుని శిష్యుని దేశబహిష్కరణ చేశారు.  కొన్ని గంటల తర్వాత ధ్యాననిష్ట నుంచి బయటికి వచ్చి శిష్యునికి జరిగిన దేశ బహిష్కరణ శిక్షను గమనించి…..నువ్వు లేనప్పుడు నేను ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు…. మనం ఇద్దరం కూడా కలిసి దేశ బహిష్కరణ కింద వేరే ప్రాంతానికి వెళదాము అనుకునేసరికి…. వీళ్ళు ఊరు దాటి వెళుతూ ఉండగా…. ఈ ఆలయంలో ఉన్న సకల దేవతా స్వరూపాలు అన్నీ కూడా విష్ణువు, ఆదిశేషుడు, మహాలక్ష్మి దేవి, విశ్వక్సేనుడు ఇలా మిగతా దేవతా స్వరూపాలని కూడా వీరి వెంట నడుచుకుంటూ వెళ్లడం జరిగింది.  విగ్రహాలు మనుషుల్లాగా నడుచుకుంటూ వెళుతూ ఉండేసరికి ఊరు వదిలి వెళ్ళిపోతూ ఉండేసరికి ఊర్లో అందరూ ఆశ్చర్య ఆనందాలు భయభ్రాంతులకు లోనయ్యారు.  రాజుగారికి ఈ విషయం చెప్పేసరికి…. అప్పటికే  నది అవతల ఒడ్డుకు గురు శిష్యులు వెళ్లిపోయేసరికి…. రాజుగారు విషయం గమనించి ఈయన అతి సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తి ఈ గురువుగారు అని తెలుసుకొని…. గురువుగారి దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి స్వామి!  నన్ను క్షమించండి…. నేను దేశ బహిష్కరణ చేసింది మీకు కాదు…. శిష్యుడికి.  మీ శక్తి సామర్థ్యం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు తెలియ వచ్చాయి. మీరు వెళ్లిపోవడంతో మా గుడిలో ఉన్న దైవాలు కూడా మీ వెంట రావడం జరిగింది. క్షమించండి…. నాకు వరం ప్రసాదించండి… సహజసిద్ధంగా మీరు యధా స్థానంలో వచ్చి ఉండండి అని ఎంతో బతిమిలాడగా….. ఇక గురువుగారి మనసు కరిగిపోయి సరే రాజా!  నీ కోరిక మేరా మేము మళ్ళీ తిరిగి వస్తాము అనేసరికి ….వాళ్ళిద్దరూ యధావిధిగా ఆశ్రమానికి తిరిగి రావడంతో దేవతా విగ్రహాలు తిరిగి మళ్ళీ యధాస్థానంలోకి గుడికి చేరినాయి.  అప్పుడు రంగనాథ స్వామి కాస్త ఇది జరిగిన యదార్థ సంఘటన రాబోయే కాలంలో భక్తులకి తెలియాలి అని చెప్పేసి నిద్రా భంగిమను మార్చుకోవడం జరిగింది.  అంటే ఎడమవైపు పడుకోవలసిన వాడు కాస్త కుడివైపు తిరిగి పడుకోవడం జరిగింది అనేసరికి…. ఈ నిద్ర భంగిమ వెనుక ఇంత కథ ఉందా!  అని పిల్లలు అనేసరికి…. మరొక మారు నమస్కారం చేసుకుని భగవంతుడు అనుగ్రహిస్తే భక్తుడు కూడా భగవంతుడు అవుతాడని నిరూపించారు అని అనుకోని…. ఆ తర్వాత ఆ గురువుగారు 64 మంది ఆళ్వార్లలో సుదర్శన చక్ర అంశ అయిన నాలుగో వాడైనా భక్తిసారుడు ఆళ్వార్ అని తెలుసుకొని ఆయన విగ్రహ మూర్తికి సాష్టాంగ నమస్కారాలు పిల్లలు అందరూ చేశారు. ఆ తర్వాత వీళ్లంతా కూడా గుడి బయటకు రావడం జరిగింది. యధావిధిగా అమ్మవారి గుడి వైపుకు వెళుతూ ఉండేసరికి…. 


రుద్ర స్వామిని చూస్తూ అయ్యా! సాధన స్థితిని ఏ దైవారాధన స్థితిలో ఉందో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను శివారాధన  భక్తురాలినా లేకపోతే అమ్మవారి భక్తురాలినా అనేది ఎలా తెలుస్తుంది? 


రుద్ర స్వామి:- మంచి ప్రశ్న తల్లి…. అందరికీ సాధనలో వచ్చే అనుమానం ఇది.  ఏ విగ్రహ మూర్తిని చూస్తే నీ మనసు లయం అయిపోతుందో…. ఆగిపోతుందో… పనిచేయకుండా పోతుందో… మనసు లేని స్థితిని పొందుతావో…. అదే నీకు సాధనా విగ్రహం అవుతుంది.  అదే సాధన దైవరాధన అవుతుంది.  ఉదాహరణకి కొంతమంది శివలింగమును చూస్తే అమితంగా ఇష్టపడతారు…. కొంతమంది ఆ శివలింగాన్ని చూస్తే భయపడతారు…. కొంతమంది శివున్ని చూస్తే బాధపడతారు…కొంతమంది శివున్ని చూస్తే ఆనందపడతారు…. మరికొంతమందికి అమ్మవారిని చూస్తే ఆనందం వేస్తుంది… కొంతమందికి మహాలక్ష్మిని చూస్తే ఆ భయం మరిచిపోతారు…. కొంతమంది సరస్వతిని చూస్తే, గాయత్రీ ని చూస్తే, పిల్లలకి హనుమంతుని చూస్తే , గణపతి విగ్రహ మూర్తిని గాని,కుమారస్వామిని గాని, కాళికాదేవి మూర్తులను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విగ్రహం వచ్చి ఆకర్షిస్తుంది. ఏ విగ్రహ మూర్తి అయితే ఆకర్షిస్తుందో…. వాళ్ళు ఆ విగ్రహారాధనలో దిట్ట అయి ఉంటారు.  దైవ ఉపాసకులు అయి ఉంటారు.  దైవ ఉపాసనలో సిద్ధి పొంది ఉంటారు.  ఎవరైతే సిద్ధి పొందుతారో….. వాళ్ళకి ఆ విగ్రహం మీద ఆరాధన భక్తి, మనసులేని స్థితి, మనసు లయమయ్యే స్థితి ,ఆనంద భాష్పాలు కలగటం… చెప్పలేని అలవి కానీ ఆనంద స్థితి కలగటం అనేది జరుగుతుంది. అది ఎవరికి, ఎప్పుడు, ఎలా జరుగుతుందనేది చెప్పలేము.  ఏ విగ్రహ మూర్తిలో కలుగుతుందో కూడా చెప్పలేము…. కొంతమందికి అయ్యవారి విగ్రహం చూసినా ….అమ్మవారి విగ్రహ మూర్తి చూసినా కూడా సమాన స్థితిలో కలిగినప్పటికీ కొంతమేర ఒక విగ్రహ మూర్తి మీద ఎక్కువ ఉంటుంది.  అది ఏమిటి అనేది తెలుసుకోవాలి.  అదేమిటంటే ఇలాంటి వాళ్ళ సాధన ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలు శివుని ఆరాధన చేసి శివుడు అనుగ్రహించట్లేదని చెప్పేసి …..కొన్ని సంవత్సరాలు సాధన అమ్మవారిని చేసి, ఆమె అనుగ్రహించడం లేదని చెప్పి మరి కొన్ని సంవత్సరాలు గణపతిని ఆరాధన చేసి…. ఆయన అనుగ్రహించట్లేదని మరికొన్ని సంవత్సరాలకు హనుమంతుని ,ఆ తర్వాత నరసింహస్వామి ఆరాధన చేయటం ఇలా మార్చుకుంటూ ఒక విగ్రహారాధన చేయకుండా పలు విగ్రహారాధన చేయడం వలన….. తర్వాత జన్మలో పలు విగ్రహారాధన మీద మనసు పోతుంది.  కానీ ఒక విగ్రహం మీద మాత్రమే మనసు స్థిరమవుతుంది…. లయమవుతుంది….మనసు లేని స్థితి వస్తుంది. ఆ విగ్రహం ఏంటి? ఆరాధన ఏంటి? అని తెలుసుకుని ఒడిసి పట్టుకుంటే…. ఎవరు ఒడిసి పట్టుకుంటారో సాధన ఆరంభం అయినట్లే.


శివనందిని:-అంటే ఇప్పుడు నాకు శివుని చూస్తే విపరీతమైన ఆనందభాష్పాలు కలుగుతాయి…. సాక్షాత్ నాకు విగ్రహ మూర్తిలో సజీవ మూర్తిగా ఉంటాడు.  మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది.  కష్టాలు చెప్పుకుంటూ… ఆనందాలు చెప్పుకుంటూ… బాధలు చెప్పుకుంటాను…. ఏదో వచ్చిన శివ ప్రసాదంగా అనుకుంటాను… నాకు కష్టాలు ఇచ్చినా …సుఖాలు ఇచ్చినా ….నాకు పెద్దగా బాధ అనిపించదు. ఆయన సాంగత్యం పొందాలని… భౌతిక సాంగత్యం పొందాలని… శివసాంగత్యం పొందాలని పరి విధాలుగా కోరుతుంది.  కాబట్టి నా ఆరాధన శివారాధన అయి ఉండాలి. శివలింగ ఆరాధన అయి ఉంటుంది.  ఎందుకంటే నేను వివిధ రకాలలో శివలింగాలను పెళ్లి కాకముందు సేకరించడం జరిగింది. వివిధ రూపాలలో ఉన్న శివుడి రూపాలను ఆరాధించడం జరిగింది. అలాంటి స్థితిని ఇప్పుడు నేను కంచిలో ఉన్నప్పుడు అలాగే కలుగుతుంది. అమ్మవారిని చూసినా ఆ భావంలోనే కలుగుతుంది.  ఇప్పుడు నేను ఏ ఆరాధన స్థితిలో ఉన్నట్టు….!


రుద్రస్వామి:- అమ్మ!  నువ్వు శివుడిలో అమ్మవారిని చూసి ఉండవచ్చు… లేదా  అమ్మవారిలో శివుని చూసి ఉండవచ్చు.. అది ఏది అనేది ఖచ్చితంగా నీ మనసుకే తెలుస్తుంది.  అది 100 కి 80% నీది శివారాధన అయింది…20% దేవీ ఆరాధన ఉంది.  అందుకోసమని నీకు భక్తి భావాలు కలుగుతున్నాయి.  ప్రేమ ఆప్యాయత కలుగుతుంది . కానీ అమ్మవారి సాంగత్యం పొందాలని గాని అమ్మవారు లేకపోతే నువ్వు ఉండలేని స్థితి అయితే కాదు కదా ! శివారాధన లో నీకు  శివుడు లేకపోతే నేను లేను అనే స్థితిని పొందావు కాబట్టి…. నీ దైవారాధన శివునికి సంబంధించింది అవుతుంది.  ఇసుమంత తేడా ఉంది.  ఆ తేడా నువ్వు గమనించుకుంటే తెలుస్తుంది.  


శివానంద:- అవునయ్యా!  నువ్వు చెప్పింది అక్షర సత్యమే…. నాకు ఇప్పటికి తేడా తెలిసింది..


 అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి…. శివుడి గురించి శివారాధన గురించి, శివలింగం గురించి చెబుతూ ఉండేసరికి తన శరీరం కంపించడం ….మనసు లయ తప్పడం…. వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం…. ఇలాంటి లక్షణాలు కనిపించే సరికి…. శివ నందిని తనది నిజ శివలింగారాధన అన్నమాట!  అని గ్రహించి కృతజ్ఞతలు చెప్పి మౌనంగా ఉండిపోయింది.  ఇలా వీళ్లంతా తిరిగి దేవి కంచి లో ఉన్న అమ్మవారి గుడి బయటకు రావడం  జరిగింది . తర్వాత శివ నందిని కాస్త రుద్ర స్వామితో…….


శివనందిని:-  నాకు ఉదయం ధ్యానంలో మట్టి శివలింగం అలాగే నల్ల శివలింగం కనపడింది.  శివ స్వామిని అడిగితే ఆయన వివరాలు చెప్పడం జరిగింది. మట్టి శివలింగం అనేది ఆదిరుద్రుడిని శివలింగ బంధనము నుండి విముక్తి కలిగిస్తుంది అని…. అలాగే నల్ల శివలింగం అనేది మూలాధార చక్ర శరీర జాగృతికి ఉపయోగపడే శివలింగం అని…. అలాగే అమ్మవారి బంధనానికి శివలింగం ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది.  


రుద్రస్వామి:- సరే మంచిది తల్లి….మరి ఈ లింగాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా పొందాలి అని చెప్పారా?  


శివనందిని:-అమ్మవారి ప్రత్యక్ష దర్శనం అనుభవ అనుభూతి పొందాలంట..


రుద్రస్వామి:- ఏమిటి నువ్వు మాట్లాడేది!  ఎప్పుడో పురాణ కాలంలో అమ్మవారు సజీవ మూర్తిరూపంలో తిరిగేవాళ్లు అనేవాళ్ళు…. ఇతిహాస కథల అనుభవాలు చెప్పడం జరిగింది కదా… 


శివనందిని:- అప్పుడు జరిగిందని మనమెందుకు అనుకుంటాము? ఇప్పుడు మూకశంకరుడు అనే భక్తుడికి అమ్మవారు దర్శనం ఇచ్చిందని చెప్పుతున్నారు కదా..!  అలాగే కాళిదాసుకు కూడా అమ్మవారు దర్శనం ఇచ్చింది అన్నారు కదా! అమ్మవారు ఎక్కడైనా అమ్మవారే కాబట్టి ఆవిడ సజీవ మూర్తిగా తిరుగుతుంది.  సశరీరంతో తిరుగుతుంది అని చెప్పేసి నమ్ముతున్నాను…. 


రుద్రస్వామి:- కాస్త వాళ్ళ అనుభవాలలో జరిగినాయో లేదో ఎవరికి తెలుసు… వాళ్ళ మీద భక్తిని పెంచుకొని లేనిపోని కథలు చెబుతున్నారు. యదార్థం ఎవరికి తెలుసు!  ఇప్పుడు కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని ఒక యోగికి  అనుభవం అయింది.  ఆ యోగి శిష్యభక్తులకి ప్రచారం చేయడంతో…. కాశి క్షేత్రంలో మరణం మోక్షమరణం అని చెప్పడం జరిగింది. అది అందరికీ జరుగుతుందా లేదా అని ఎవరికి తెలుసు? 


శివనందిని:- ఇప్పుడు అరుణాచలంలో మరణం పొందితే మోక్షం అనడం అవుతుందని పరమహంస గారు చెప్పారు.  అరుణాచల క్షేత్రంలో ఉండి నివసించి జ్ఞానం పొంది కూడా మరణం పొందితే పునః జన్మ వెళ్ళే ముక్తి మరణానికి కారణం అవుతుందని తన అనుభవాలలో చెప్పడం జరిగింది కదా! ఒక యోగినీ కాస్తమొదట పక్షి రూపంలో…. ఆ తర్వాత పిల్లి రూపంలో….. ఆ తర్వాత కుక్క రూపంలో ….వచ్చినాయి.  మరణాలు పొందినాయి అని…. ఆయన చూసిన దానిని బట్టి చెప్పడం జరిగింది కదా!  జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఏ క్షేత్రం మరణం పొందినా కూడా అది  మోక్ష మరణం అవుతుంది ….అది ఆ క్షేత్రంలోనే పొందాల్సిన అవసరం లేదు.  బ్రహ్మజ్ఞాని ఎక్కడ మరణం పొందినా అది క్షేత్రమే అవుతుంది. అది ఎలా అంటే…. సింహం కూర్చున్న చోట సింహాసనం అవసరం లేదు. సింహం కూర్చున్న చోటే సింహాసనం అవుతుంది.  అది ఏ ప్రాంతమైన ఎక్కడైనా అది సింహాసనమే అవుతుంది. ఆ తేడా తెలుసుకోవాలి అనేసరికి…. అది నిజమే కావచ్చేమో కానీ…ఆవు శరీరం నుంచి పాలు వస్తున్నప్పటికీ, రక్తం రూపంలో పాలు ఉన్నప్పటికీ పొదుగు నుంచి  మాత్రమే పాలు ఎలా అయితే వస్తాయో…. ఒక్కో సాధకుడి యొక్క మరణం ఒక్కొక్క క్షేత్రంలో ప్రకృతి నిర్దేశించింది. అది శూన్యం అవ్వడానికి అరుణాచలంలోనే మరణం పొందాలని చెప్పేసి మరొక అనుభవంగా చెప్పడం జరిగింది కదా!  మిగతా క్షేత్రాలలో శివుడు తనలో ఐక్యం చేసుకుంటే….ఒక్క అరుణాచల క్షేత్రంలోనే శివుడు చేతుల మీదుగా శూన్యంలో ఐక్యం చేస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా!  కాబట్టి ఎవరి అనుభవాలు వారివి…. ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ అని చెప్పలేము… కాశీలో ఉన్నప్పుడు కాశీ యోగుల అనుభవాలు అక్కడిదాకా వచ్చినాయి.  కొంతమంది అనుభవాలు అంతకు ముందుకు వెళ్లేసి ఆ మాయను దాటి పూర్ణ జ్ఞానిగా అరుణాచల క్షేత్రమే మనకి పూర్ణ మోక్షం ఇస్తుంది అని చెప్పడం జరిగింది.  ఆ నిరూపణలు పరమహంస గారు ఇచ్చారు కదా!


రుద్రస్వామి:- ఇది అది అని మనం నమ్మలేము. ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి ఆరాధన వారిది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేము.. అవునని చెప్పలేము.. కాదని చెప్పలేము.  నాకు కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని చెప్పే నమ్మకం నాది, నీకు అరుణాచలంలో మరణిస్తే మోక్షం వస్తుందని నీ నమ్మకం నీది.  ఎవరి నమ్మకాలు వారివి.  ఎవరి ఆరాధన వారిది.  ఇదిమితంగా ఇది అని చెప్పలేము….


శివనందిని:-  ఏ క్షేత్రంలో  మరణం పొందాలో…. ఎలా పొందాలో…. ఎక్కడ పొందాలో మనం పుట్టకముందే ఏ చెట్టు యొక్క కట్టేతో చచ్చిపోవాలో ….కాల్చబడాలో… అని మన జాతకమే చెప్పేస్తుంది కదా అయ్యా!  అప్పుడు మన చేతుల్లో ఎక్కడ ఉంది… ఇప్పుడు మనం ఏ క్షేత్రానికి ఋణపడి ఉన్నామో …..ఆ క్షేత్రం మనల్ని పిలుస్తుంది.  అక్కడ మరణం పొందాలని రాసిపెట్టి ఉంటే… మరణం పొందుతాము.  కాకపోతే మోక్షపురాలలో…. మోక్ష క్షేత్రాలలో మరణం పొందితే మోక్షం వస్తుంది.  లేదంటే పునః జన్మకి వెళ్లే అవకాశాలు ఉంటే ముక్తులు వస్తాయి. అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు అని చెప్పలేము..వాటిలో ఉన్నతమైనవి మన సాధనకి అనుగుణంగా ఎంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అరుణాచల క్షేత్రం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు.  దానికి వెళ్ళటానికి ఒక అధికారం ఉండాలి.  శివ యోగి అయి ఉండాలి.  అప్పుడే వాడు అక్కడ ఆవాసం చేసుకుని మరణం పొందే అవకాశం ఉంటుందని పరమహంస గారు చెప్పడం జరిగింది. కాబట్టి కాశీలో నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు కాశీలో ఒక శరీరం మోక్షం పొందడం జరుగుతుంది.  అది ఇది అని ఇదిమితంగా చెప్పలేనుఏదైనా జరగొచ్చు ….ఇప్పుడు మనిద్దరం వాదోపవాదాలు చేసుకోవడం వలన ఉపయోగం లేదు.  ఎవరి నమ్మకం వాళ్లది.


రుద్రస్వామి:-  అది సరే కానీ.. ఇప్పుడు అమ్మవారు సజీవ మూర్తిగా కనపడుతుంది…. ఆవిడ కనపడితే ఆవిడ అనుగ్రహిస్తుంది… అని శివ స్వామి చెప్పాడా? ……నేను చూస్తాను… అమ్మవారు ఎలా కనపడుతుందో… ఏ విధంగా కనపడుతుందో… చూద్దాము.  నాకు కూడా చూడాలని ఉంది.  ఇంతవరకు పుస్తకాల్లోనూ, విగ్రహాల్లోనో చూడడం తప్ప సజీవ మూర్తిగా అమ్మవారిని చూడలేదు.. చూద్దాం అనేసరికి సరే!  ఆవిడ ఏ విధంగా అనుగ్రహిస్తుందో చూద్దాము.  నాకు కూడా తెలియదు కదా!


 అనేసరికి  వీళ్ళిద్దరూ ధ్యానంలో కూర్చున్నారు.  పిల్లలు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు…. మహాదేవి కూడా ఒక పక్కన కూర్చొని వీళ్ళ వాదోపవాదాలు వింటూ…. వాళ్ళు ధ్యానంలోకి వెళ్లేసరికి తను కూడా ధ్యానంలోకి వెళ్లిపోయింది.  ఇలా కొంతసేపు ఉండేసరికి ఒక ఐదు సంవత్సరాల పాప పట్టు పరికిణి లంగా జాకెట్ వేసుకొని నడుచుకుంటూ రావటంతో…. శివ నందిని కేసి చూస్తూ ధ్యానంలో ఉన్న శివ నందిని తడుతూ…. అమ్మ! అమ్మ! అనేసరికి ఎవరా అని చూసేసరికి…. ఐదు సంవత్సరాల పాప చూడముచ్చటగా ఆకర్షణీయంగా ఉండేసరికి పిల్ల ఏమైనా తప్పిపోయిందా అనిపించి…. కళ్ళు తెరిచి చూసేసరికి….


పాప:-  నేను తప్పిపోయిన దాన్ని కాదులే ! ఇక్కడ ఉండే పిల్లనే…. నాకు నీ ఒళ్ళో కూర్చోవాలని అనిపించింది.  అందుకే వచ్చాను.  నీ ఒడి కూడా చాలా విశాలంగా పెద్దగా కనపడుతుంది . అందుకే నీ ఒడిలో కూర్చోవాలి అనుకున్నాను.  నువ్వు ధ్యానంలో ఉన్నావని లేపాను….


శివనందిని:- నా ఒడిలోనే ఎందుకు కూర్చోవాలని అనిపించింది నీకు? 


పాప:- ఇక్కడ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు.  ఎవరి కోరికల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి అవసరాలలో వాళ్ళు ఉన్నారు… అందుకోసమని నీ ఒడి అయితే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది.  నీ ఒళ్ళో కూర్చోనా? 


అనేసరికి ఈ పిల్ల కూడా తనకి బాల గణపతి, బాల కుమార స్వామి లాగా… బాలాదేవి లాగా తనకి బంధనం అవుతుందా?అని అనుకునే సరికి 


పాప:-  నేను బంధనం అవ్వను, బాధ్యత అవ్వను, కొంచెం సేపు మాత్రమే నీ ఒళ్ళో కూర్చొని వెళ్లిపోతాను.  నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 


అనేసరికి…. తను మనసులో భావాలు చదువుతుందా అనిపించింది. ఇక్కడ ఎవరు పట్టుకున్నా కూడా పరీక్షలు అన్నట్టుగా ఉంది.  ప్రతివాడు కూడా సిద్ధ పురుషుడు , సిద్ధ యోగి లాగా ఉన్నారు. ఏ క్షేత్రంలో చూసినా…. తనకి ఇలాంటి అనుభవాలే కలుగుతున్నాయి. పసివాడి నుంచి ముసలివాడి వరకు కూడా యోగులే కనపడుతున్నారు. సిద్ధపురుషులే కనపడుతున్నారు.  ఇది ఏమి చోద్యమో అనుకుంటూ ఉండేసరికి…. ఆ పిల్ల ముఖం, పెదాలు బాగా ఆకర్షించాయి.  బాగా ఉబ్బెత్తుగా ఉన్నాయి . ఆ పెదవులు  కూడా ఎర్రగా ఉండేసరికి 


శివనందిని:- ఏంటమ్మా చాక్లెట్ తింటున్నావా? 


పాప:- చాక్లెట్ కాదు తాంబూలం తింటున్నాను…నాకు తాంబూలం అంటే మహా ఇష్టం…


శివ నందిని:-ఐదు సంవత్సరాల చిన్న పిల్ల తాంబూలం తినడమా? అది ఏంటమ్మా…! నీకు ఎవరు నేర్పారు …. చిన్న పిల్లలు తినకూడదు కదా!  


పాప:-  తాంబూలా సేవనం అనేది మహా పతివ్రత లక్షణం కదా!  అది నీకు తెలియదా…. అనేసరికి అయినా ధర్మదీక్ష తీసుకున్నావు కదా!  పాతివ్రత్య ధర్మం పాటిస్తానని అన్నావు కదా!  నీకు మహాపాతివ్రత లక్షణం ఏంటో తెలియదా!  ఆ మాత్రం తెలీదా! 


అనేసరికి చిన్న పిల్ల పెద్దదానిలా మాట్లాడుతూ ఉండేసరికి….. గడసరిగా మాట్లాడుతూ ఉండేసరికి మిగతా వాళ్ళంతా చోద్యం చూస్తూ ఉండేసరికి…. ఆ తాంబూలం పిడత నోట్లో నుంచి తీసుకోవాలని చెప్పి బలంగా అనిపించినా….. చీ…చీ చిన్నపిల్లల దగ్గర మనం తీసుకోవడమేమిటి? ఏదో చిన్న ఆకులో తాంబూలం పెట్టి ఉంటారు అనేసరికి….


పాప:-  మా నాన్నగారు, అమ్మగారు తాంబూర సేవనం చేయటం అక్కడి నుంచి నాకు తాంబూలం తినడం  అలవాటు ఉంది.  తాంబూలం లేకపోతే నేను ఉండలేను. ప్రతి పది నిమిషాలకి ఒక తాంబూలము సేవనం చేస్తూ ఉంటాను అనేసరికి….రుద్రస్వామి  కేసి చూస్తూ


ఏమయ్యో!  నీకు కావాలా తాంబూలం అనేసరికి…. 


రుద్రస్వామి:- వద్దులే తల్లి!  నీ చిన్ని నోట్లో ఉన్న తాంబూలం పిడత నాకేం సరిపోతుంది…. నాకు పెద్ద తాంబూలం కావాలి…. నీది నువ్వే తిను…


పాప:- అమ్మ ! నీకు కావాలా! 


శివ నందిని:- అవును…. నీది చిన్న బొజ్జ కదా!  చిన్న నోరు కదా! తాంబూలం నాకు సరిపోదులే…. నువ్వు తినులే…. నీకు ఉన్నదే కొద్దిగా…


పాప:-  మీకు ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తాను… ఇక నేను విశ్రాంతి తీసుకోవడం అయిపోయింది.  ఇక గుడి లోపలికి వెళ్ళాలి.  నాకోసం ఆలయ పూజారి ఎదురుచూస్తూ ఉంటారు.  నేను లేకపోతే వాడు ఏమీ తినడు…ఉపవాసంలో ఉంటాడు… 


రుద్ర స్వామి:-  నువ్వు ఇప్పుడు లోపలికి వెళితేనే పూజలు చేస్తారా?


పాప:-  పూజలే చేస్తాడో, పునస్కారాలు చేస్తాడో ,ఎవరికి తెలుసు…. అన్ని దగ్గర ఉండి చేయించుకుంటాను… చూస్తూ ఉంటాను… 


అనేసరికి ఈ పిల్ల వెంట వీళ్ళు కూడా ఏం జరుగుతుందో అని గబగబా వెళ్లేసరికి…. మహాదేవి కూడా వీళ్ళని అనుసరించింది.ఆ తర్వాత ఈ పిల్ల ప్రదక్షిణ చేస్తూ గుడి వెనక అంతర్ధానమైంది. వీళ్ళకి ఆశ్చర్యం వేసి …ఈ పిల్ల గుడి వెనక్కి వెళ్లి కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి బయటకి పారిపోయి ఉంటుంది…. పిల్లల వేగానికి మన ఎక్కడ ఆగుతాము…. అనేసరికి సరే ఈ పిల్ల భలే తప్పించుకుంది.  ఈసారి కనబడితే వదిలిపెట్టకూడదు అని చెప్పేసి…. ఆ పిల్లలో చాలా ఆకర్షణ ఉంది.  దివ్య తేజస్సు ఉంది.  మాటలతోనే గారడీ చేస్తుంది. మోహమాయలో పడేస్తుంది అనుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్లేసరికి… అమ్మవారి ఎదురుగా ముగ్గురు నించొని ఉండేసరికి… ఒక్కసారిగా అమ్మవారు కాస్త సజీవ మూర్తిగా కనిపించే సరికి అందరూ ఆశ్చర్యానందాలకు గురి అవుతూ ఉండేసరికి…. అమ్మవారు కాస్త ఆమెకి కనపడిన బాల రూపంలో కొన్ని క్షణాల పాటు ముగ్గురికి కనిపించేసరికి అప్పుడు విషయం అర్థమయ్యే లోపల ముగ్గురికి కంటి నుండి నీరు రావడం మొదలైంది.  ఒక పక్క ఆవేదన పడాలో…. ఒక పక్క ఆనందపడాలో అర్థం కాని అయోమయ స్థితిలోకి  ముగ్గురు వెళ్లిపోయారు.  ఎందుకంటే అమ్మవారు కామాక్షి దేవి స్వయంగా బాలా రూపంలో వచ్చి తనని అనుగ్రహించి మాట్లాడినందుకు ఆనందపడాలో….. ఆవిడని గుర్తించనందుకు బాధపడాలో… ఆమె ఇచ్చే  పిడత తీసుకోనందుకు బాధపడాలో… అర్థం కాలేదు.  మౌనం వహించారు.  ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం కదా!  అద్భుతమైన అవకాశం కదా!  అని ఏడుపు గొంతుతో ….


రుద్ర స్వామి:-  అమ్మ నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదు… అమ్మవారు సజీవమూర్తిగా తిరుగుతుంది అనేది వినలేదు… పట్టించుకోలేదు…. విని శ్రద్ధ పెట్టి ఉంటే నాకు అమ్మవారు బాల రూపంలో ఈ పిడత ఇచ్చేసి అనుగ్రహించేది . అది పురాణ గాథలే అని పట్టించుకోవడం మానేశాను…


శివనందినికి ఆమె పెదవులు బాగా ఆకర్షించేసరికి… ఆ పెదవులను చూస్తూ శ్లోకాలు చెప్పడం ఆరంభించేసరికి…. ఆ శ్లోకాలు మూక శంకరులు రచించిన… చిరునవ్వు మీద ఆయన చెప్పిన 100 శ్లోకాలలోని శ్లోకాలు చెబుతుంది… అని మహాదేవి గ్రహించింది. తర్వాత ఆ శ్లోకాలు అనర్గళంగా అలా చెబుతూ చెబుతూ కళ్ళు తిరిగి పడిపోయింది శివ నందిని. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తూ బాలమ్మ వెళ్లిపోయింది… బాలమ్మ దర్శనం ఇచ్చింది. మనం అవకాశం పోగొట్టుకున్నాము.  ఇక ఏ విధంగా అనుగ్రహిస్తుందో…. లేదో… ఆ తల్లి అని దండం పెట్టుకొని బయటకు వస్తూ ఉండేసరికి… 


మహాదేవి:- అమ్మవారిని చూసిన తన్మయత్వంలో బాలా రూపంలో చూసి ఆమె పెదవుల మీద కొన్ని శ్లోకాలు  చెప్పావు కదా…! ఆ శ్లోకాలు. మూక శంకరులు చెప్పిన అమ్మవారి చిరునవ్వు మీద చెప్పిన 100 శ్లోకాలలో కొన్ని శ్లోకాలు…


శివనందిని:-అవునా!  నేనప్పుడు వాటిని చదవలేదు… చూడను కూడా చూడలేదు… అని చెప్పేసి…. మూక శంకరుడు చెప్పిన మూక పంచశతిలో చిరునవ్వు గురించి చెప్పిన శ్లోకాలు కూడా తను కూడా చెప్పేసరికి….. ఆహా!  ఎంత అదృష్ట భాగ్యం.  ఆయన పిడతను సేవించడం వలన అనర్గళంగా చెప్పడం జరిగింది. నేను పిడత తీసుకోకపోవడం వలన… అప్పటికి అమ్మ ఇస్తా అన్న కూడా తీసుకోకపోవడం వలన అనుకోకుండానే శ్లోకాలు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటూ…. అమ్మవారు ఈ విధంగా అనుగ్రహించినందుకు శతకోటి నమస్కారాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. 


పిల్లల్ని పిలిచి తమకు  కలిగిన అనుభవాలు అన్ని చెప్పుకుంటూ ఉండగా… అమ్మ మమల్ని పిలవాల్సింది… బాలాదేవితో ఆడుకునే వాళ్ళం కదా…మమ్మల్ని పిలవకుండా మీరంతట మీరు ఇలా చేస్తే ఎలాగా?  మేము గుర్తుపట్టే వాళ్ళం కదా!  ఆ పిల్ల అమ్మవారిని చెప్పేవాళ్ళం కదా అని బాలగణపతి రుసరుసలాడుతూ ఉండేసరికిl….బాల కుమారస్వామి కాస్త ఏం చెప్తారు?  మనం ఉన్నామన్న విషయం వాళ్లు మర్చిపోయారు. బాల అటువంటిది… బాలరూపం  నీకు తెలియంది కాదు.. కదా!  ఆవిడ ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో… మోహనంగా ఉంటుందో… ముగ్ధ మోహన స్థితిలో పడేస్తుంది కదా!  అనేసరికి అవునులే…. అది నిజమేలే! అనేసరికి ఇక అక్కడ దగ్గరలో ఉన్న హోటల్ కి చేరుకొని కావలసిన భోజనాలు చేసి,  గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం చేశారు. 


శివ నందినికి బాధగా ఉంది. మనసు మనసులో లేదు.  ఏం చేయాలో అర్థం కావడం లేదు.  అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. అమ్మవారు బాల రూపంలో ఉండిపోవడం తను గుర్తించకపోవడంతో…. ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో తను గదిలో నిరుత్సాహంగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఆవేదనలో ఉండటం గమనించి…. 


మహాదేవి:-  అమ్మాయి!  అసలు నాకేం అర్థం కావడం లేదు… నువ్వు యోగ సాధన చేస్తున్నావా?  లేదా దైవిక వస్తువులు వెతకడానికి వచ్చినట్లుగా ఉంది.  యోగ సాధన పక్కన పెట్టినట్లుగా ఉన్నావు.  ఈ అమ్మవారి దర్శనాలు ఇవ్వాలి అనడమేమిటి….. శివలింగాలు దొరుకుతాయని అనటమేమిటి…..నాకు అర్థం కావటం లేదు.  అటు చూస్తే అమ్మవారేమో దర్శనాలు ఇవ్వవే తల్లి అంటే,  నేను ఉన్నానని నిదర్శనం చూపిస్తుంది.  దర్శనం ఇవ్వకుండా నేను ఉన్నానని నిదర్శనం చూపిస్తుంది.  మనకేమో అర్థమై చావటం లేదు.  తెలుసుకోలేకపోతున్నావు. ఇన్ని తంటాలు అవసరమా మనకి? వస్తువులు వెతకడానికి వచ్చినట్లుగా కనపడుతుంది …. అటు శ్రీశైలంలోను అలాగే చేశావు. ఇటు తిరుపతిలోనూ అలాగే చేశావు.  ఇక్కడ కంచిలోనూ అలాగే చేశావు… పిల్లలు వెతకని,  నువ్వు వెతకని, ఏదైనా చేయని…. దైవిక వస్తువుల వెతుకులాట లాగానే ఉంది కానీ…. యోగ సాధన లాగా లేదు.  సాధన అనుభవాలు పొందుతున్నట్టు అనిపించడం లేదు.  నాకు అర్థం కావడం లేదు…అని శివనందిని కేసి అనేసరికి…. 


శివ నందిని:- అలా ఎందుకు అనుకుంటావు అమ్మ!  ఇప్పుడు ధ్యానంలో కనిపించిన అనుభవాలు నిజమా కాదా? అని చెప్పేసి నేను వస్తువులు సేకరణ చేస్తున్నాను.  ఇప్పుడు సాధారణ స్త్రీ మూర్తి సాధన చేస్తే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్లకి ధ్యానంలో ధ్యానానుభవాలు కలుగుతాయి.  ధ్యానంలో మూలాధార చక్ర జాగృతి అయినప్పుడు… దైవీక వస్తువులుగా శివలింగం కానీ,  గణపతి గాని కనపడతారు.  అమ్మవారు కూడా కనపడతారు.  వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారో చెప్పలేము.  యద్భావం తద్భవతి.  వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఉన్న ఆరాధనను బట్టి ఉంటుంది. మూలాధార చక్రంలో అధిష్టాన దైవంగా గణపతి ఉంటారు.  ఆ తర్వాత సాకిని శక్తి ఉంటుంది.  కొంతమందికి శివలింగం దర్శనమవుతుంది.. మరికొంతమందికి అమ్మవారి దర్శనం అవుతుంది.  ఇప్పుడు వాళ్ళు గత జన్మలలో చేసిన ఆరాధనను బట్టి వీళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు మూలాధార చక్ర  జాగృతి చాలామంది కాణిపాకంలో జరగాలని ఉంటుంది.  కానీ నా ప్రకారంగా చూస్తే మూలాధార చక్ర జాగృతి నాకు కంచిలో కామాక్షి దేవి సమక్షంలో జరిగింది.  ఇది పూర్వ జన్మలో మనం చేసుకున్న అర్హతను బట్టి ….విగ్రహారాధనను బట్టి… దైవారాధనను బట్టి… దైవ ఉపాసనని బట్టి ఉంటుంది. కాకపోతే వాళ్లకి  నాకు తేడా ఏంటంటే ధ్యానంలో కనిపించిన దైవీక వస్తువులు చూసి గుర్తు పెట్టుకుంటారు. ఏదైనా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు…. దైవిక వస్తువులను సేకరించడం జరుగుతుంది. లేదా తెలిసిన వాళ్ళ ద్వారా తెలియని వాళ్ళ ద్వారా ఇంటికి దైవిక వస్తువులు వస్తాయి.  ఖచ్చితంగా దైవీక వస్తువులు వస్తాయి.  దైవిక వస్తువులు వచ్చిన తర్వాతనే… ఆ చక్రాన్ని దాటి మరొక చక్రానికి వెళ్లక తప్పదు .  ఇప్పుడు నాకు ధ్యానంలో కనిపించిన దైవిక వస్తువులు ప్రత్యక్షంగా చూస్తున్నాను. సేకరిస్తున్నాను.  ఆ సేకరించడం అనేది వాళ్ళు ఆ వస్తువులను దుకాణాలలో కొంటారు.   నేను ప్రత్యక్షంగా సేకరిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న దైవీక వస్తువులు శక్తుల సహాయ సహకారాలు అందించకపోతే…. ఆ దైవీక వస్తువులను నేను పొందడం కుదరదు కదా!  కాకపోతే ఏమిటంటే ఇది నా ప్రమేయం లేకుండా జరుగుతుంది.  నా సాధన కొనసాగుతుంది. నాకు సాధనలో  అనుభవాలు కలిగిన తర్వాతనే వస్తువులు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉన్నాయి? అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంతెందుకు ….సంతాన స్తంభం కింద మూలాధార చక్ర అధిపతి మూల గణపతి ఉన్నాడు అని నాకు ధ్యానంలో కనిపించింది.  అది పిల్లవాడు బాలగణపతి కాస్త తీస్తాడని ధ్యాన అనుభవం అయింది.  సరే అది నిజమా కాదా అనుకున్నాను. ప్రకృతి ఆ విధంగానే చేసి చూపించింది కదా! అప్పుడు ఆ మూల గణపతి బయటకు వచ్చాడు కదా! ఎలా వచ్చాడో నీకు తెలుసు కదా… అలాగే ఇప్పుడు మట్టి శివలింగం మనకి కావాలి.  ఆ మట్టి శివలింగం ఎక్కడ ఉంది,ఏంటి అనేది… మనం కామాక్షి దేవి అనుగ్రహం పొందితే కానీ తెలియదు… అని శివ స్వామి చెప్పాడు కదా!  ఇప్పుడు మిగతా ఆడవాళ్ళ సాధనలోకి వెళితే, ఆ దైవిక  వస్తువులు షాపుల్లో కొనుక్కోవడం…. లేదా షాపుల్లో నుంచి తీసుకురావడం జరుగుతుంది.  నేను లోపల నుంచి ఆ వస్తువులు ప్రత్యక్ష అనుభవాలతో బయటకు తీసుకు వస్తున్నాను. అంతే తేడా.  అంతకుమించి ఏమీ లేదు. 


మహాదేవి:- అది ఏమోనమ్మా. నాకైతే అర్థం అయ్యి అర్థం కానట్టు ఉంటాయి నీ చేష్టలు.. నీ పనులు.  శుభ్రంగా సాధన చేసుకోక ఈ దైవీక వస్తువులు…. ఇవి ఎక్కడ ఉన్నాయని వెతకటాలు ఇవన్నీ కూడా నాకు అర్థం కావడం లేదు.  అందరి ఆడపిల్లలాగా సాధన చేసుకోవచ్చు కదా!  ఇంట్లో కూర్చుని లేదా క్షేత్రంలో కూర్చుని సాధన చేసుకో… చక్రాలు జాగృతి చేసుకో… నువ్వు కూడా షాపుల్లో కొనుక్కో… నీకు కావాల్సిన దైవీక వస్తువులు. ఇప్పుడు లోపల నుండి బయటకు తీయడం ఎందుకు? 


రుద్రస్వామి:-అదేమన్న సామాన్య స్త్రీ అనుకుంటున్నావా?  మానవ మాత్రురాలు అనుకుంటున్నావా? దైవాంశ సంభూతురాలు…. సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశతో పుట్టింది.  దాని సాధన సాధారణ మానవ స్త్రీ సాధన లాగా ఉండదు.  దైవాంశ సంభూతురాలు సాధన లాగానే ఉంటుంది.  ఆదిపరాశక్తి ఆదిలో తను మరచిపోయిన దైవీక వస్తువులన్నీ కూడా…. భూమిలో ఉన్న విశ్వ కేంద్రాల నుంచి ఈమె ద్వారా బయటకు తీయాలని ఆదిపరాశక్తి అనుకుంటుంది . శివుడు చెబుతున్నాడు…. ఆదిపరాశక్తి చేస్తుంది. అందుకు ఈ శివ నందిని దేహం వాడుతున్నారు. వాహక వస్తువుగా వాడుతున్నారు.  అంతకుమించి ఏమీ లేదు…. 


మహాదేవి:-.ఇప్పుడు ఎవరిలో దైవత్వం లేదు….!  అందరిలోనూ దైవత్వం ఉంది కదా! ఈమెకి ఉన్న ప్రత్యేకత ఏమిటి?  దేవుడు కానీ వాడు ఎవడు!  జీవుడే శివుడు అంటారు కదా! 


రుద్రస్వామి:- జీవుడే శివుడు కానీ జీవుడే శివుడు అని తెలుసుకోవడానికి సాధన చేయమన్నారు.  ఆ శివుడు కూడా లేడు అని తెలుసుకోవడమే సాధన పరిసమాప్తి అవుతుందని అన్నారు.  మన శరీరంలో ఏడవ శరీరమైన సంకల్ప శరీరం దాకా జీవుడే ఉంటాడు.  ఎనిమిదవ శరీరమైన జ్యోతి శరీరంలో జీవుడే కాదు శివుడు ఉంటాడని తెలుసుకుంటారు.  తొమ్మిదవ శరీరం మనో శరీరానికి వచ్చేసరికి…. సాక్షాత్తు శివుడే ఉన్నాడు.  శివుడే సాధన చేస్తున్నాడు.  శివుడే చేసుకుంటున్నాడని తెలుసుకుంటున్నారు.  పదవదేహమైన పిండదేహానికి వచ్చేసరికి…. జీవుడు పోయి శివుడు మిగులుతాడు.  11వ దేహమైన లింగ దేహానికి వచ్చేసరికి ఆ శివుడు కూడా లేడని తెలుసుకుంటాడు.  ఇదంతా పరమహంస గారి ధ్యాన అనుభవాల్లో మనం తెలుసుకున్నాము కదా!  మరి పుస్తకాలు చదివి ఏం తెలుసుకున్నావు… మనలో ఉన్నది దైవత్వం అని తెలుసుకోవడానికి జీవుడు కాస్త సాధన చేస్తే శివుడు అవుతాడు.  శివుడు కాస్త శవమై శూన్యంలో కలిసిపోయాడు అని తెలుసుకోవడమే కదా!  యోగ సాధన పరిసమాప్తి.  ఇప్పుడు ఆ పిల్ల పుట్టుకతోనే దైవంశ సంభూతురాలు అయ్యింది.  సాధన పరిసమాప్తి కోసం ఆదిపరాశక్తి ఆదిలో దాచిన దైవిక  వస్తువులన్నీ కూడా బయటకు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు దుకాణాలలో కొన్ని దైవిక  వస్తువులు… వారి వ్యక్తిగత శరీరం మోక్షాలకి సంబంధించినవి అయితే,  ఇప్పుడు ఈ పిల్ల తీసే దైవిక వస్తువులు అన్నీ కూడా  విశ్వ ప్రకృతికి సంబంధించినవి.  అందులోనూ స్త్రీ మోక్షానికి సంబంధించిన దైవీక వస్తువులు.  అసలు నిజానికి ఆదిపరాశక్తి పూర్ణంగానే ఉంది. ఆవిడ మోక్షం పొందాలని అనుకుంటుంది… కానీ ఆవిడలో ఉన్న దైవీక శక్తులు అమ్మవారు మోక్షం పొందనివ్వకుండా ఆపుతున్నాయి.  ఆ తర్వాత ఆవిడ ధరించిన ఏకాదశ దేహాలు కూడా మోక్షం పొందకుండా ఆపుతున్నాయి.  ఆదిపరాశక్తి కామాక్షి దేవి మోక్షం పొందాలి అనుకున్నప్పుడు…. తనలో ఉన్న స్పందనలు,ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న శక్తి స్వరూపాలు చేస్తున్నాయి.  ఈ శక్తులు ధరించిన 11 దేహాలు చేస్తున్నాయి.  వీటిని కట్టడి చేయడానికి దైవీక వస్తువులు ఎక్కడెక్కడ ఉంచింది ఏంటి? అనేది శివుడికి మాత్రమే తెలుసు.  ఇప్పుడు శివ నందిని ద్వారా ఆదిపరాశక్తి యొక్క దైవీక వస్తువులను బయటకు తీయిస్తున్నాడు.  అంతకుమించి ఏమీ లేదు.  కావాలంటే ఈ క్షేత్రంలో ఉన్న షాపుల్లో వెతికితే మట్టి శివలింగం దొరుకుతుంది.  కామాక్షి దేవి విగ్రహ మూర్తి దొరుకుతుంది.  అలాగే మూలధార చక్ర గణపతి విగ్రహ మూర్తి దొరుకుతుంది.  అవి తీసుకున్న వాడు ఆ సాధన స్థితి పొందినవాడు ఆ శరీర మోక్షం పొందటము జరుగుతుంది…. లేదా వాడికి ఏ చక్రానికి సంబంధించిన దైవిక  వస్తువులు ఉపయోగపడతాయో….ఆ చక్రాలకు సంబంధించిన మోక్షమును పొందడం జరుగుతుంది. కాకపోతే ఈ పిల్ల సాధన అంతా కూడా స్త్రీ ప్రకృతికి సంబంధించిన సాధన కాబట్టి…. స్త్రీ ప్రకృతి మోక్షం పొందాలి కాబట్టి…. ఆదిలో ఆదిపరాశక్తి దాచిన దైవీక వస్తువులు, శక్తులు చూపిస్తున్నాయి.  ఇప్పుడు తిరుపతిలో సప్త కొండలు ఎక్కినప్పుడు… సప్త చక్రాల జాగృతి అయినప్పుడు… సప్త దైవిక శక్తులు ఈమెలోకి ఎందుకు ప్రవేశించాయి.  ఈమె దైవాంశ సంభూతురాలు… ఆదిపరాశక్తి అంశ అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా?  తెలిసే ఉంటుంది… 


మహాదేవి:-  కాస్త ఇప్పుడు కామాక్షి దేవి మామిడి చెట్టు కింద కూర్చోబెట్టి దేవతను చేసినట్టుగా… ఇప్పుడు దీనిని కూడా ఏదో ఒక వేప చెట్టు  చూపించి దేవతను చెయ్యి….  అందరూ పూజలు పునస్కారాలు చేస్తారు.


రుద్రస్వామి:- నీ బొంద, నీ బూడిద.. అందులో ఆమె జీవాత్మ ఉన్నది.  ఆదిపరాశక్తి అంశ అంటున్నాను.  నేను అమ్మవారిగా పూజ చేయమని అనడం లేదు.  తను చేసే సాధన అంతా కూడా ఆదిపరాశక్తి చేయిస్తుంది… ఆదిపరాశక్తి చేస్తుంది… తెలుసుకోమంటున్నాను. శివ నందిని మానవదేహాన్ని చూసి జీవాత్మ చేస్తుంది అనుకోవద్దు అని చెబుతున్నాను… అంతే… చేసేది చేయించేది అంతా కూడా ఆదిపరాశక్తి.  ఆదిపరాశక్తితో చేయించేది ఎవరు ఈశ్వరుడే .. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా!  ఈశ్వరుడు సంకల్పించాడు.  అమ్మవారు ఈమె చేత చేయిస్తుంది. ఆమె పొందిన దైవీక వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీయిస్తుంది.  ఈమె కావాలని చేయట్లేదు కదా!  ఆ వస్తువులు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు కదా! మరి అలాంటిది ధ్యానంలో ఫలానా దైవిక వస్తువు ఫలానా చోట ఉన్నాయని చూపించడం ఎందుకు? తీసేదాకా నిద్రపోనివ్వకుండా చేసేది ఎవరు? ఇదంతా కూడా శివ పార్వతులు కలిసి తనతో చేయిస్తున్నారు… ఇంకేమీ లేదు… దేవుడు కానీ వాడు ఎవడు.  దైవత్వం కానీ వాడు ఎవడు.  కాకపోతే తను జీవుడు కాదు దేవుడు అని తెలుసుకునేదాకా సాధన ఉంటుంది.  ఆ దేవుడు కూడా శూన్యం అయ్యాడు అన్న తర్వాతనే… సాధన పరిసమాప్తి అవుతుంది. అంతే… నేను చెబుతుంది అది మానవ మాత్రురాలు అయితే కాదు..


శివ నందిని:-  మీరు చెబుతుంటే నాకు గుర్తుకు వస్తుందయ్యా!  నేను కడుపులో పడకముందు విజయవాడ కనకదుర్గా దేవికి ఐదు సంవత్సరాలు వెళ్లి మొక్కుకున్న తర్వాత నాకు సంతానం పుడితే నీ పేరు పెడతామని అలా నాకు లక్ష్మీ దుర్గ శివాని అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారికి నేను కడుపులో పడే ముందు ఆయన పూజించే  బాలా త్రిపుర సుందరి విగ్రహరూపం నుంచి ఒక పసిపాప పాకుతూ మా అమ్మగారి కడుపులోనికి వెళ్లినట్లుగా అనిపించేసరికి…. అమ్మ నీ అంశతోనే ఆడపిల్ల పుడుతుంది. ఇంక నిన్ను బాలగా చూసుకుంటాను అని అనుకున్నారు అన్నది. ఆ తర్వాత నేను పుట్టిన నెల రోజులకి కామాక్షి దేవి కలలో కనిపించిందట.  అమ్మ నాకు సంతాన ప్రాప్తి కలిగించావు అని కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా అనేసరికి…. నేను నీకోసం రాలేదు.  నీ పాప కోసం వచ్చాను.  నీ పాపను ఆశీర్వదించాలని వచ్చాను.  నేను ఒక యవ్వనవతి స్త్రీగా అమ్మవారి ముందు కూర్చుని ఉన్నానట …..ఆవిడ నామీద చెయ్యి పెట్టి ఆశీర్వాదం చేస్తున్నట్లుగా….ఆ తర్వాత చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కూడా తనని ఆశీర్వాదం చేసినట్లుగా…. అమ్మవారి సమక్షంలో నేనొక పక్క …. ఆయన ఒకపక్క ఉన్నట్లుగా…. మా అమ్మకి కలలో వచ్చింది. 


రుద్రస్వామి:- ఇప్పుడు విను …ఇప్పుడు చెప్పు… ఇప్పుడు చెప్పు…. ఏమంటావో అనేసరికి…. అది ముగ్గురమ్మల అనుగ్రహం పొందిన పిల్లే కదా!  నేను ఈ విషయం ఏనాడో గ్రహించాను ….కాశీలో ఉన్నప్పుడు మానవ మాత్రులకి అసాధారణమైన రుద్ర యంత్రంలోనే ఈ పిల్ల రహస్యాన్ని విప్పినప్పుడే అర్థమైంది.  ఈ పిల్ల మానవ మాత్రురాలు కాదు….ఆదిపరాశక్తి అంశ…. దైవాంశ ….రుద్రుడు యొక్క తంత్రం అని తెలిసింది.  రుద్రునికి తప్ప ఎవరికీ తెలియదు అనేసరికి…. ఆనాడే గ్రహించాను. దీన్ని శక్తి సామర్ధ్యాల మీద విశ్వాసం, నమ్మకం కలిగి…. ఆ ఆదిపరాశక్తి స్వయంగా సాధన పరిసమాప్తి చేసుకోవడానికి మోక్షం పొందటానికి వచ్చిందని గ్రహించడానికి నాకు అట్టే సమయం పట్టలేదు.  అందుకని ఆ నమ్మకంతోనే…. ఆ విశ్వాసం తోనే దీని వెంట కాశీ క్షేత్రంలో మరణం పొందకుండా శివ నందిని వెంట రావడం జరిగింది.  సజీవ మూర్తి గా రుద్రమూర్తిని అమ్మవారు తప్ప ఇంకెవరు చూపించలేరు అని నాకు అర్థం అయింది.  ఇది చూడటానికి మానవ స్త్రీ కానీ  దీని లోపల ఉన్న దైవాంశ ఆదిపరాశక్తి ఉంది అని గ్రహించాను.  ఇప్పుడు ఎక్కడెక్కడో మూలాలలో ఉన్న దైవిక వస్తువులు….. ప్రకృతిలో విశ్వకేంద్రంలో ఉండి నడిపిస్తున్న దైవీక వస్తువులను…. బయటకు తీయడం జరిగింది. కారణం ఏమిటి అంటే అమ్మవారిలో ఉన్న  ఆదిపరాశక్తి రూపంలో ఉన్న కామాక్షి దేవి మోక్షం పొందాలి అనుకున్నప్పుడు…. మోక్షం పొందకుండా తనలో ఉన్న శక్తులు మోక్షం పొందనివ్వడం లేదు అని చెప్పేసి…. మాయలో పడటం వలన తను మాయలో పడుతున్నట్లుగా అనుభవ అనుభూతులు కలుగుతున్నాయని….. దానిని ఆపటానికి దైవీక శక్తులన్నీ కూడా ఒకటిగా బయటకు తీస్తుంది.  వీటి ద్వారానే మనం అమ్మవారిలో ఉన్న వివిధ దైవిక  వస్తువులను బయటకు తీసి వాటితో బంధనం చేయాల్సి ఉంటుంది . తద్వారా ఆదిపరాశక్తి పూర్ణ మోక్షం పొందుతుంది.  నిజానికి ఆదిపరాశక్తి పూర్ణ మోక్షం మోక్షం పొందిందని  చెప్పాలి. కారణం ఏమిటంటే…..అరుణాచలంలో అమ్మవారి ఒంటికాలు మీద తపస్సు చేసినట్లుగా… మనకి కోణలింగం దగ్గర కనబడుతుంది.  అదే కోణ లింగం తపో భంగిమ, తపో కామాక్షి లో  కనపడుతుంది చూడు…


మహాదేవి:- అవును… ఈ విషయం గమనించాను.  


రుద్రస్వామి:- ఆవిడ ఇక్కడ తపో కామాక్షిగా…. ఏ భంగిమలో  అయితే ఉందో….అదేవిధంగా  అరుణాచల క్షేత్రంలో కోణలింగం దాన్ని ఉసిలింగం అని అంటారు కదా!  ఆ ఉసిలింగం మీద ఆవిడ జ్ఞాన తపస్సు చేసిందని స్థల పురాణం చెబుతుంది. అంటే  ఏంటంటే….. ఆ తర్వాత ఆమె శివునిలో ఐక్యమైనట్టు ఆ తర్వాత అర్ధనారీశ్వర రూపం పొందినట్లుగా మనకి అరుణాచల స్థల పురాణం చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మవారు పూర్ణ మోక్షమును పొందింది.  కాకపోతే అది పొందిందా లేదా అని పరమహంస  గారికి అనుభవాలు చెబుతున్నాయి… కారణం ఏమిటంటే అమ్మవారిలో మిగిలిన దైవిక వస్తువులు అనగా 18 శక్తులు అయి ఉండవచ్చు.. ఏకాదశ దేహాలు అయి ఉండవచ్చు ….ఆయా దేవతలు మోక్షం పొందలేదు…. మోక్షం పొందకుండా బయటకు వచ్చేసాయి… అందులో ఆదిపరాశక్తి అయిన కామాక్షి దేవి మాత్రమే మోక్షమును పొందడం జరిగింది. అది కూడా రాజరాజేశ్వరి భంగిమలో పొందింది అని అరుణాచల స్థల పురాణం ప్రకారం చూస్తే… పచ్చయ్యన్ అమ్మవారే కామాక్షి దేవి…. కావాలంటే చూడు.  అక్కడ ఉన్న పచ్చయ్యన్ అమ్మవారి కూర్చుననే భంగిమ ….. ఇక్కడ కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలు ఒకే విధంగా ఉంటాయి.  రాజరాజేశ్వరి భంగిమ , దక్షిణామూర్తి భంగిమ ఒకే లాగా ఉంటుంది.  దీనికి వ్యతిరేకంగా లలితాదేవి భంగిమ  వేరుగా ఉంటుంది.  అంటే ఏంటంటే…..అమ్మవారు మాత్రమే  కామాక్షి అమ్మవారు మాత్రమే మోక్షం పొందింది. మిగతా ఆవిడలో ఉన్న 18 రకాల శక్తులు మోక్షం పొందలేదు.  అందులో ఆవిడ ధరించిన ఏకాదశ దేహాలలో 10 దేహాలు మోక్షం పొందకుండా బయటకు వచ్చినాయి.  అందుకు మనకి మోక్షం పొందినప్పటికీ….. సాధన పరిసమాప్తి అయిపోయినప్పటికీ……ఆదిపరాశక్తి లేకపోయినప్పటికీ…. శూన్యం అయినప్పటికీ…. లేనిది ఉన్నట్లుగా ఈ శక్తులన్నీ చూపిస్తున్నాయి… ఇప్పుడు ఈ శక్తులన్నీ కట్టడి చేయగలిగితే…  స్త్రీ మూర్తి కూడా మోక్షం పొందింది అని చెప్పేసి మనకి అనుభూతి అవుతుంది.  లేనిది ఉన్నట్లుగా ఈ శక్తులు చేస్తున్నాయి.  అది గ్రహించడానికి నాకు ఇప్పుడు అర్థం అయింది.


రుద్ర స్వామి మాటలు వీళ్లిద్దరికి అర్థమై అర్థం కానట్టుగా అనిపించి… 


మహాదేవి:- ఏమో నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు.  నువ్వు ఆదిపరాశక్తి మోక్షం పొందింది అంటున్నావు. ఆవిడలో ఉన్న శక్తులకు  మోక్షం పొందలేదు అంటున్నావు..అసలు ఆవిడలో 18 శక్తులు ఉన్నాయని…. 11 దేహాలలో ఎవరున్నారో ఎవరికి ఎరుక.  వీళ్లే ఉన్నారని మనం ఎలా చెప్పగలం? ఇది అంతా కూడా నీకు ఉన్న జ్ఞానంతో చెబుతున్నావు కాబట్టి…. ప్రతి దానికి నిజమా కాదా అని అనుభవం అనుభూతి కావాలి. అది నిజమో కాదో తెలుసుకోవాలి . 


రుద్రస్వామి:- నిజమని చెబితే ఎవరూ నమ్మరు.  దానికి సాక్షాధారాలు కావాలి అంటారు.  సత్యానికి వచ్చేసరికి…. వారి మనస్సాక్షి నిలబడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది నిజమే … నిజానికి సాక్ష్యాధారాలు కావాలి.  ఆధారాలు కావాలంటే ఎవరికి వారే ధ్యాన అనుభవాలు….. ధ్యాన దృశ్యాలు చూసి అనుభవం అనుమతి పొందితే గాని నమ్మరు… నమ్మలేరు… ఇదే విషయం పరమహంస గారు జీవిత అనుభవాలు కూడా చెబుతున్నాయి.  ఆయన ఒకపక్క దేవుడు లేడు అని చెప్పి ఆకారుడు కాస్త నిరాకారుడు అయ్యాడు అని చెప్పి సత్యాన్ని చెప్పినా కూడా…. ఎవరూ నమ్మలేదు.  అలా నమ్మకుండా ఎవరికి వారే సాధన చేసి తెలుసుకోవాలని చెప్పేసి మొదలుపెట్టారు.  అది తెలుసుకునే సరికి కాలాతీత స్థితి అవుతుంది.  మోక్షం పొందినవాడు ఇంకా మోక్షం పొందలేదని అనుభవ అనుమానభయాలతో ….సందేహాలతో పునః జన్మలకి వెళ్తూ ఉంటారు.  ఇదే కదా సృష్టి రహస్యం . పునః జన్మకి ఆధారం అని అనుకుంటూ 


రుద్రస్వామి మౌనం వహించేసరికి…..సరే అని ఎవరికి వారు నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడం జరిగింది. 



ఇలా సాధనా కుటుంబం అంతా కూడా ఒక్కొక్కరిగా నెమ్మదిగా మేలుకోవడం జరిగింది.  సమయం ఐదు గంటలు అవుతుందని…. ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని… పంచగంగా పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళాలని… అమ్మవారి గుడికి బయలుదేరారు.  అలా వెళ్తూ ఉండగా దారిలో కొండచరియల నుంచి బండరాళ్లు తీసుకువెళ్తున్న ఒక లారీ వీళ్లను దాటుకుంటూ వెళ్ళింది.  వీళ్లు దానిని చూశారు. చూశారుగాని పెద్దగా పట్టించుకోలేదు.  గుడి దగ్గరలోకి వస్తూ ఉండగా…. ఉన్నట్టుండి ఈ లారీల నుంచి రాళ్లు  దొర్లుతూ రోడ్డుపైకి వచ్చేసరికి….అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయపడి పారిపోవటం జరిగింది. ఈ విషయం గమనించిన రుద్రస్వామి కాస్త తప్పుకోండి… రోడ్డుకు అవతలి వైపు వెళ్లిపోండి. ఆ బండరాళ్లు మీదకి వచ్చి పడేటట్టు ఉన్నాయి.  పిల్లలు జాగ్రత్త అని మహాదేవితో అనేసరికి….మహాదేవి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పక్కన ఉన్న షాప్ లోకి వెళ్లడం….. రుద్ర స్వామి శివ నందిని చేయి పట్టుకునే లోపుల రుద్ర స్వామి చేయి జారిపోవడంతో…. శివ నందిని కాస్త రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. లేచి నిలబడబోతూ ఉండగా….అక్కడే నూనె మరకలు మీద కాలు వేయడంతో…. చీర అడ్డుపడి కుప్పకూలి పోయింది. రోడ్డుమీద లేచే పరిస్థితి లేకపోయేసరికి…. పెద్ద బండ రాయి ఈమె దగ్గరికి అతి సమీపానికి వస్తూ ఉండేసరికి….ఎంత  ప్రయత్నించినా లేవలేకపోయేసరికి….ఈ కొండ రాయి కాస్త తన కాళ్ళ మీద జారుకుంటూ వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇక కాలు ముక్కలు అయి చచ్చుబడిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండేసరికి…. అమ్మ కామాక్షి తల్లి ! నువ్వే రక్షించాలి అని ఆ శివ నందిని కాస్త పెద్దగా అరుస్తూ ఉండేసరికి…. ఏమీ చేయలేకపోయాను నేనే రక్షించలేకపోయాను అని రుద్ర స్వామి అనుకుంటూ…. దగ్గరికి వెళ్లే పరిస్థితి కాదు, రక్షించే పరిస్థితి కాదు అని అందరూ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉండేసరికి ….కొండ చరియ రాయి కాస్త శివ నందిని కాలు మీద నుంచి దాటుకుంటూ వెళ్లిపోయింది.  తీరా చూస్తే ఏమీ కాలేదు.  అంత పెద్ద రాయి మీద పడినా కూడా కాలికి ఇసుమంత గాయం కాకపోయేసరికి… అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.  కానీ రుద్రస్వామికి అప్పుడు గాని విషయం గుర్తుకు రాలేదు.  తనకి  భూచర సిద్ధి ఉండటం వలన భూమి మీద ఎలాంటి ప్రమాదం జరగదని…. ఎంత పెద్ద కొండ రాయి పడినా….ఎంత పెద్ద కొండ చరియలు పడ్డా… లేకపోతే చెట్లు పడినా…తనకి ఏ గాయం కాదు కదా అని అప్పుడు గుర్తుకు వచ్చి… ఓహో! తనకి భూచర సిద్ధి వచ్చింది కదా!  అని అనుకుంటూ గబగబా శివ నందిని దగ్గరికి వెళ్లి రుద్రస్వామి, మహాదేవి పిల్లలు వచ్చి…. అమ్మ! అమ్మ! నీకు ఏమైంది…. దెబ్బ తగిలిందా? అంటే ఏమీ కాలేదు కదా అమ్మ! అంటూ రుద్ర స్వామి కేసి చూస్తే….అయ్యా!  అనగానే ఏమీ లేదమ్మా!  నీకు భూచర సిద్ధి ఉండటం వలన…. ఆ పెద్ద కొండరాయి కూడా దూదిపింజలాగా మారి….బరువు లేకుండా దాటేసింది.  ఇది కావాలని జరిగిందో లేక యాదృచ్ఛికంగా జరిగిందో అర్థం కావడం లేదు.  ఎవరైనా కావాలని చేశారేమో ! ఇక్కడ కొండ ప్రాంతాలే లేవు కదా!  కొండ చరియలు రావడం ఏమిటి? నువ్వు దాటిన పది నిమిషాలకి కొండరాయి పడటం ఏమిటో…. నాకు అర్థం కాలేదు అంటూ ఉండేసరికి…. తను జారీ కింద పడిపోయేసరికి ……అప్పుడు చూస్తే నేలమీద తను పడిన చోట  నూనె పోసి ఉండేసరికి….ఇది కావాలని ఎవరో చేశారు తల్లి అని అంటూ ఉండేసరికి…. ఎవరో చేయడమేమిటి నేనే చేశాను.  అక్కడ పడాలి… ఆ బండరాయి కిందపడి చావాలి… అని యోగాంబిక చేతుల్లో నూనె డబ్బాలతో కనిపించేసరికి…. ఆ బండరాయి కూడా కావాలనే పడింది….బండరాయి పడేసింది కూడా వాడే అని అటుకేసి చూస్తే లారీ డ్రైవర్ గా కృష్ణస్వామి కిందకు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చారు.  అంటే వీళ్ళిద్దరూ కలిసి తనని బండరాయితో చంపాలి అనుకున్నారు అనుకోగానే… కృష్ణస్వామి వచ్చి ఏంటి ఇది చావలేదా? బండరాయి కిందపడి చావలేదా? అనేసరికి అది చావలేదు రా ! దానికి భూచర సిద్ధి వచ్చిన విషయం మనం గమనించలేదు.  ఆ సిద్దితో అది బతికి బయటపడింది అనేసరికి… అంత శక్తివంతురాలు అయిపోయిందా!  మూలాధార చక్రసిద్ధి కూడా పొందిందా!  సరే అయితే అమ్మవారిని అదుపు చేసే మట్టి శివలింగం….. అది కనబడకుండా చేస్తే సరిపోతుంది.   దీనికి ధ్యాన దృశ్యం రాకుండా చేస్తే సరిపోతుంది కదా!  అనేసరికి మట్టి శివలింగం ఉందని జ్ఞానం మాత్రమే అందింది కానీ, ఆ మట్టి శివలింగం ఎక్కడ ఉందో దీనికి ధ్యాన దృశ్యం అందలేదు.  అంటే ఇంకేముంది… దీని కళ్ళు పీకేస్తే సరిపోతుంది అనేసి అంటూ ఉండేసరికి… తన చేతి గోర్లతో కళ్ళు పీకాలి అన్నట్టుగా వస్తూ ఉండేసరికి శివ నందిని కాస్త ఉగ్రరూపంగా మారి  ఎవడివిరా నీవు? నువ్వు ఎవరి కళ్ళు తీయాలి అనుకుంటున్నావు? కామాక్షి సమక్షంలోనే ఉండి కామాక్షి అయిన నా కళ్ళే తీయాలనుకుంటున్నావా ? నువ్వు ఎవడివి రా… నువ్వు ఎంత…. నీ బతుకెంత అని ఉగ్రంగా ఉండేసరికి…. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు.  ఒక్కసారిగా నేల మీద కూర్చున్న శివ నందిని కాస్త నిలబడే సరికి… ఆ ఉగ్రరూపం లో మహాకాళిగా కనిపించింది.  అందరూ కూడా మహాకాళికను శివ నందినిలో చూశారు  నీల శరీరంతో పుర్రెల మాలతో కనిపించింది.  కాకపోతే ఆయుధాలు మాత్రం లేవు.  రెండు చేతులతో ఉన్న కాళికాదేవిని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమెకి దండం పెడుతూ ఉండేసరికి… శివ నందినిలో ఉన్న ఉగ్ర స్వరూపం కాస్త కృష్ణస్వామి,  యోగాంబిక  జుట్టులు పట్టుకొని… తలలు ఒకదానికి ఒకటి కొడుతూ నా సాధనకే మీరు అడ్డు వస్తారా? నా సాధన మోక్షానికే మీరు అడ్డు వస్తారా? అసలు మీరెవరు….. మీరు ఎందుకు వస్తున్నారు? మీకు శివ నందినికి సంబంధం ఏమిటి?  అని చెప్పేసి ఒకరి తలలు ఒకరికి కొడుతూ  అరుస్తూ ఉండేసరికి…. యోగాంబిక ఉన్నట్టుండి  ఒరేయ్ ! కృష్ణస్వామి… దీనిలో రుద్రరూపం వచ్చింది.  మహాకాళిక వచ్చింది. ఇప్పుడు మనల్ని చంపే దాకా నిద్రపోదు. జాగ్రత్తగా ఉండు… అనేసరికి తను నిత్యం ఆరాధించే కాళికాదేవి అడ్డుపడుతున్నప్పుడు నేనేం చేయగలను తల్లి!  నా వల్ల అయితే కాదు… నేనైతే వెళ్ళిపోతానని చెప్పేసి శివ నందిని చేతుల్లో నుంచి పట్టు తప్పించుకోవాలని ఇద్దరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ…. వీలుకాకపోయేసరికి…. ఇక  తల్లి మమ్మల్ని క్షమించు …. నువ్వు వస్తావని… ఉంటావని మేము అనుకోలేదు. మేము శివ నందినిని చంపాలని అనుకున్నాము.  శివ నందిని వలన లోక వినాశనం జరుగుతుందేమో అనుకున్నాము.  అలా అనిపించడంతో ఆ కార్యాన్ని ఆపాలనుకున్నాము అనేసరికి…. శివ నందిని ఎవరు అనుకున్నారు…. అది నా అంశ.  అది మోక్షం పొందాలని సాధన చేస్తుంది. అది విశ్వ మోక్షానికి వెళుతుంది.  స్త్రీ ప్రకృతికి మోక్షం ఇవ్వాలని…. తన ప్రయత్నం తాను చేస్తుంది.  అప్పుడు దానికి మాయలు కలిగించడం ఎందుకు? చంపాలని అనుకోవడం ఎందుకు? ఎంతమందిని ఇలా చంపుకుంటూ పోతారు?నాకు విశ్రాంతి ఇవ్వరా! నాకు మోక్షం కలగకుండా ఇంకా ఎంత కాలం చేస్తారు…. మీరు చేసే మాయలకి, ఇలాంటి సాధకులు బలి అవుతున్నారు కదా! ఆగిపోతున్నారు కదా!  నాకు మోక్షం అందనివ్వకుండా చేస్తున్నారు కదా!  ఇలాంటి వారందరినీ ముందు చంపేయాలి.  ఇలాంటి వాళ్లని నాశనం చేయాలి.  మీరు కదా లోకానికి వినాశనం కలిగించేది…. లేని దేవుణ్ణి ఉన్నట్టుగా చూపించాలని చేస్తున్నారు.. ఇక్కడ ఏమీ లేదని తెలుసు. కానీ మీరు నమ్మరు.  మీ నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.  లేని దాన్ని ఉన్నట్లుగా చూపించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సత్యాన్ని చెప్పే సత్యాన్వేషిని చంపాలని ప్రయత్నం చేస్తారు. నిజాన్ని మాత్రం లోకానికి తెలియకుండా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉండేసరికి….ఇక మహాదేవి కాస్త ఉండబట్టలేక  అసలు అమ్మవారి చేతికి ఒక కత్తిస్తే ఇద్దరిని చంపేస్తుంది.. అన్నీ తెలిసిన నువ్వు ఏమీ తెలియనట్టుగానే ఉంటావు.  శివ నందిని గురించి ఇందాకే చెప్పావు కదా!  అమ్మవారి అంశ అని ….కత్తి తీసుకురావాల్సింది ….అని రుద్రస్వామి కేసి చూసి అంటూ ఉండేసరికి… ఇదే పని నాకు , అమ్మవారికి అంశం ఉంది అన్నానే గాని…. దానికి కావాల్సిన కత్తులు కటారులు తీసుకురావాలి ….దానికి అవసరం పడతాయని నేను సంచిలో పెట్టుకుంటానా ఏంటి? నాకు ఇంక పని లేదా …నేనేమైనా పనిముట్లు తయారు చేసే వాడిని అనుకున్నావా…. పనిముట్లు మోసే వాడిని అనుకున్నావా…. అది ఇది అనేసరికి నీకు అన్ని తెలిసిన ఏమీ తెలియనట్లే ఉంటావు.  కత్తి ఏదో తీసుకువచ్చి ఉంటే… ఈపాటికి వీళ్ళిద్దరిని చంపేసేది కదా!  అన్నిటికీ నిదానమే ప్రధానమని అంటావు.  నీకు ఒళ్లంతా బద్ధకమే నీ బొంద, నీ బూడిద అని జరిగేది చూస్తూ…. వీళ్ళిద్దరూ కృష్ణస్వామి , యోగాంబిక, శివ నందిని చేతుల నుంచి తప్పించుకొని… తలోదిక్కు పారిపోవడం క్షణకాలంలో జరిగిపోయింది.  వెంటనే అప్పుడు మహాదేవి కాస్త దగ్గరలో ఉన్న షాపులో నుంచి కర్పూరం వెలిగించి తెచ్చి…. శాంతించు తల్లి… శాంతించు… నీలో ఉన్న ఉగ్రత్వం తీసేసేయి….శివ నందిని తట్టుకోలేదు అని చెప్పేసి…. కర్పూరం వెలిగించి….మూడుసార్లు తిప్పేసరికి శివ నందిని కాస్త శాంతమూర్తిగా అయిపోయి… ఏమీ తెలియనట్టుగా అమ్మ నాకేమైంది!  అని మహాదేవితో అనేసరికి.. ఏం లేదు తల్లి!  నీలో ఉగ్రరూపం అయిన మహాకాళికా దర్శనమిచ్చింది . కృష్ణ స్వామి మరియు యోగాంబికకి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసింది.  కానీ అవకాశం దొరకలేదు.  వాళ్ళని చంపే స్థితికి వచ్చింది కానీ ……ఆయుధం లేకపోయేసరికి వదిలేసింది.  ఆయుధం ఉండి ఉంటే వాళ్ళిద్దరు తలలు తెగిపడేవి. ఈరోజు వాళ్ళ చావు అందరూ చూస్తూ ఉండేవాళ్ళు అనుకుంటూ ఉండేసరికి….అవునా!  అంత పని జరిగిందా!  అంటే ఇప్పుడు నిన్ను చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అని వివరంగా చెప్పేసరికి ….ఏమో తల్లి!  నాకైతే ఏమీ తెలియదు.  నేల మీద పడిపోయాను.  రుద్ర స్వామి వచ్చి నన్ను లేపుతున్నప్పటికీ…. జారీ కింద పడిపోయాను.  ఆ విషయం గుర్తుంది.  ఆ కృష్ణస్వామి నా దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో చేయాలి అనుకున్నాడు.  ఆ తర్వాత ఇంక నాకు ఏమీ గుర్తులేదు.  అంటే ఆ తర్వాత నీలో ఉన్న రౌద్ర రూపిని మహాకాళిక బయటకు వచ్చింది. పిల్లల భయపడిపోయి….. నీ దగ్గరికి రావాలంటే భయపడిపోతూ ఉండేసరికి……అప్పుడు మహాదేవి కాస్త అమ్మ ఉగ్రరూపం తగ్గిపోయి శాంతంగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు అనేసరికి…. బాలగణపతి కాస్త నిజమా!  అని అనుమాన భయంతో శివ నందిని దగ్గరికి వస్తూ…. అమ్మ!  అమ్మ!  నువ్వు చాలా ఉగ్రంగా ఉన్నావు.  నీ కళ్ళు ఎర్రగా ఎరుపు ఎక్కిపోయాయి.  నీ చేతుల్లో అంత బలం ఉంది అని అనుకోలేదు.  వాళ్ళిద్దరి తలలు పట్టుకొని కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టావు.  నాకు చాలా భయం వేసింది.  వాళ్ళు నిన్ను ఏదో చేస్తారని అనుకున్నాను…. అనేసరికి ఏం లేదురా! బాబు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది.  ఆవేశం కొంది….భయపడాల్సిన అవసరం లేదు…. అనేసరికి బాల కుమారస్వామి కాస్త ఉన్నట్టుండి అవును భయపడాల్సిన అవసరం ఏముంది!  ఇప్పుడు సింహం చూడ్డానికి ఉగ్రంగా భయంకరంగా ఉంటుంది. కానీ పిల్లలకి తండ్రే కదా!  ఇప్పుడు సింహాన్ని చూసి సింహం పిల్లలు ఎందుకు భయపడతాయి…. భయపడాల్సిన అవసరం లేదు…. తమ్ముడు….! మన అమ్మ మనకే ఉంటుంది.  మన అమ్మ ఉగ్రరూపం చూసి మనం భయపడకూడదు.  అవతలి వాళ్ళు భయపడాలి.  చూడటానికి అమ్మ అలా కనపడుతుందిsomething చూపిస్తుంది.  అవునా నిజమే కదా!  భయం లేకపోతే అందరూ ఆడేసుకుంటారు… నువ్వు అలాగే ఉండు… నువ్వు అలా భయపెడుతూనే ఉండమ్మా. ఇంక నేను భయపడను… మేమిద్దరం ధైర్యంగా ఉంటాము… నిజమే కదా సింహమును చూసి సింహం పిల్లలు ఎందుకు భయపడాలి! మేము కూడా నీ పిల్లలమే…. మాకు ఉగ్రరూపాలే ఉంటాయి…. అప్పుడు అమ్మని చూసి ఎందుకు భయపడాలి… మేము భయపడము…నీతో ఉంటాం… అనేసరికి అందరూ చిరునవ్వు నవ్వి….  గుడిలోకి వెళ్లి పంచగంగా పుష్కరిణిలో స్నానం చేసి… మళ్లీ బయటకు వచ్చారు. బయటకు వచ్చి మామిడి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు.


ఇలా ధ్యానంలో ఉన్న శివ నందినికి మట్టి శివలింగం పదేపదే కనిపించడంతో… అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు.  అది ఉంది అని మాత్రం కనబడుతుంది.  అది ఎక్కడ ఉందో కనిపించాలి అంటే అమ్మవారి అనుగ్రహం పొందాలి కదా!  బాల రూపంలో వచ్చినా అమ్మవారి అనుగ్రహం మనం పొందలేకపోయాము. ఈసారి ఏ రూపంలో వస్తుందో…. ఏ పరీక్ష పెడుతుందో….. జాగ్రత్తగా ఈసారి మనం అమ్మవారి నిజరూప దర్శనం పొందాలి.  ఆవిడ అనుగ్రహమును పొందాలి అని చెప్పి అనుకుంటూ…. ధ్యానభంగం అయ్యేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి…. ఇంతలో ఒక పెళ్లి కానీ అమ్మాయి సుమారుగా 25 సంవత్సరాలు ఉన్న అమ్మాయి తెల్లని శరీరంతో, దివ్య తేజస్సుతో కాంతివంతమైన ముఖముతో, ఒత్తయిన జుట్టుతో ఎరుపు లంగా పసుపు వోణి వేసుకున్న ఒక అమ్మాయి…. నీటి బిందెను మోస్తూ వీళ్ళని దాటుకుంటూ వెళ్తూ…. ఓర చూపు చూడటం గమనించింది.


శివనందిని:-  ఆ చూపులో ఏదో గమ్మత్తు ఉంది… దివ్య తేజస్సు ఉంది… మోహనంగా ఉంది…. 


మహాదేవి:- అవును ఏదో తేడాగా ఉంది.  ఆ చూపులో ఏదో గమ్మత్తు ఉంది. నువ్వు గమనించావా?


శివ నందిని:- అవును… పైగా ఒక విషయం గమనించావా?  తాంబూల సేవనం జరుగుతుంది.  ఒకవేళ ఈ అమ్మాయి అమ్మవారు కాదు కదా!  


అని శివ నందిని అనేసరికి వీళ్ళ మాటల విన్న రుద్ర స్వామి కాస్త


రుద్రస్వామి:-  వెనకటికి ఎవరో ఎర్రకోక కట్టిందల్లా నా పెళ్ళాం అన్నాడట…. తాంబూల సేవనం చేసిన ప్రతిదీ అమ్మవారు అవుతుందా!  ఆ అమ్మాయి నీళ్ల బిందెతో వస్తుంది. గుడిలో నీళ్లు ఇంటికి తీసుకొని వెళుతుందేమో…. ఈ ఊరి పిల్ల అయి ఉంటుంది…

(అని కొట్టి పారేసేసరికి…)


ఇప్పుడు నీళ్లు బిందె గుడిలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది…. అంటే ఏమో అభిషేకానికి తీసుకువెళ్తుందేమో అనేసరికి…. ఇప్పుడు సాయంత్రం ఏడు గంటలు అయింది.  4:30 కి అభిషేకాలు చేస్తారు.  సాయంత్రం నాలుగున్నరకే అయిపోతాయి.  అభిషేకాలు పూర్తయ్యాక నీటి బిందె తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని మహాదేవి అనేసరికి…. ఏమో రేపు పొద్దునకి దాచి ఉంచుతారేమో అభిషేకానికి …..ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి గంగాళంలో నీళ్ళు పోసి రాత్రిపూట ఉంచుతారు కదా!  ఆ నీళ్లతో బ్రహ్మదేవుడు వచ్చి అభిషేకం చేస్తాడు స్వామివారికి అని స్థల పురాణం చెబుతోంది కదా!  అలాగే ఈ పిల్ల నీళ్లు కూడా గంగాళంలో పోసి ఉంచుతారేమో!  తీర్థంగా వాడటానికి ఉపయోగిస్తారేమో!  ఎవరికి తెలుసు అనేసరికి….. కాదు ఆ ఓర చూపులో తేడా ఉంది.  సాధారణ స్త్రీ మూర్తి చూపులా లేదు… అని అంటే…


రుద్రస్వామి:-  నాకు ఆ చూపులో ముఖాన్ని వశం చేసుకునే తత్వమే కనపడింది కానీ నాకు దైవత్వం, దివ్యత్వం కనపడలేదు.  పెళ్లికాని అమ్మాయి కాబట్టి కామ భావాలు కలిగి ఉంటాయి.  ఆ దృష్టితో చూస్తుంది అంతే…


మహాదేవి:- ముసలాడివి నీ మీద ఆ అమ్మాయికి దృష్టిపడింది అంటావా!


రుద్రస్వామి:-  ఏమో ఎవరికి ఎలా కనబడుతున్నానో…. ఈ ముసలాడిలో ఆ అమ్మాయికి ఏం కనపడిందో…. నాలో ఏం అందం ఆకర్షించిందో…. నాకు ముఖం ఆకర్షించచ్చు….. నా జుట్టు ఆకర్షించచ్చు…నా మీసాలు ఆకర్షించచ్చు…. నాకేం తక్కువ …..


రుద్ర స్వామి:- పడితే  ముసలాడి వెంటే పడాలి…..పైగా ఆ అమ్మాయి యవ్వనవతి ముసలాన్ని పెళ్లి చేసుకుంటుంది… ఏం మాట్లాడుతున్నావు అయ్యా!  వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు.  జ్ఞానం పెరగలేదు. వయసుకు తగ్గట్లుగా మాట్లాడు… పెద్దరికంగా ఉండు… ఇప్పుడు యవ్వన స్త్రీలు వచ్చి నిన్ను మోహిస్తారు అనుకుంటున్నావా!  ముసలి స్త్రీలు కూడా నిన్ను పట్టించుకోరు… ఏమనుకుంటున్నావు


శివనందిని:-  ఊరుకోండి… మీ ఇద్దరి గొడవేంటి?  అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం… 


అని శివ నందిని అనేసరికి గుడి లోపలికి వెళుతూ ఉండేసరికి…. శివ నందిని కాస్త మనం ఇద్దరం వెళ్దామా? ఆ అమ్మాయిని అనుసరిద్దాము అనేసరికి…. 


రుద్రస్వామి:- నేనైతే రాను, నాకు ఆ అమ్మాయిలో దైవత్వం కనబడట్లేదు.. అమ్మవారు కనపడట్లేదు… అంతా నాకు కామత్వమే కనబడుతుంది.  ఆ చూపులో ఏదో తేడా ఉంది… నన్ను వశపరుచుకుంటుందేమో!  నన్ను లేపుకెళ్లి  పెళ్లి చేసుకుంటుంది.  తర్వాత నువ్వు తండ్రిని కోల్పోతావు…భర్తగా మహాదేవిని నన్ను కోల్పోతుంది…. మీ ఇద్దరి జీవితాలు అన్యాయం అయిపోతాయి. నేను ఇక్కడే ఉంటాను.. 


మహాదేవి:- ఎప్పుడూ అవే మాటలు… అవే.. వీడి ఇంకేం పని లేదు…


అని విసుక్కుంటూ అనేసరికి మహాదేవి శివ నందిని వెళ్లేసరికి… అక్కడ ఆవిడ నీళ్ల బిందతో ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. సరే అని చెప్పేసి వీళ్ళు కూడా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసేశారు.  ఆవిడ అలా మూడు ప్రదక్షిణలు చేసేసరికి… నాలుగవ ప్రదక్షిణం చేస్తూ ఉండగా… ఆవిడ గుడి లోపలికి వెళ్ళిపోయింది.  సరే నీళ్ళ బిందె పూజారికి అందిస్తుందేమో అని చెప్పి అనుకొని… వీళ్ళు వచ్చి చూశారు.  ఆ గర్భగుడిలోకి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు.  కనపడలేదు.  ఆశ్చర్యం వేసింది.  ఏమైంది.. ఒకవేళ గుడి పూజారి లేదా గుడి ఏమైనా ఊడుస్తుందేమో లేకపోతే….వాడేసిన పూలు తీస్తుందేమో అని ఎదురు చూశారు.  ఎంత అప్పటికి రాకపోయేసరికి అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ గుడిలో పూజారి ఎవరు కనిపించలేదు.. ఎవరూ లేరు.  లోపలికి వెళ్ళిన అమ్మాయి ఏమైంది! తెలీదు.  అర్థం కాలేదు… అలాగే అని కాసేపటికి గుడిలో ఉన్న పూజారి వచ్చారు.  


పూజారి:- ఏంటమ్మా ఏమైంది!


శివ నందిని:- ఏం లేదు స్వామి… అక్కడ ఒక పెళ్ళికాని అమ్మాయి బిందె తీసుకొని లోపలికి వెళ్ళింది.  మళ్లీ తిరిగి బయటకు రాలేదు. కనిపించలేదు.  అదే ఆశ్చర్యపోతున్నాము. 


పూజారి:- ఏముందమ్మా!  ఆవిడ అభిషేకానికి కావాల్సిన నీళ్లు ఆవిడే తెచ్చుకుంటుంది. ఆవిడ ఎక్కడినుంచో వెళ్లి తెచ్చుకుంటుంది. అది అమ్మవారే! అలా తీసుకువస్తుంది. మాకు అప్పుడప్పుడు సర్వ సాధారణంగానే జరుగుతూ ఉంటాయి…


శివ నందిని:- నిజంగానా..?


పూజారి:- నీకు అనుమానంగా ఉందా!  అదిగో చూడు…. ఆ బిందె తో నీళ్ళు తెచ్చి ఉంటుంది కదా! 


శివ నందిని:- అవును స్వామి అని పక్కనే ఉన్న స్టీల్ బిందెను చూసి…. అవును ఈ బిందె నే తీసుకువచ్చింది.. 


పూజారి:- ఎరుపు లంగా పసుపు పరికిణి వేసుకుందా?


శివ నందిని:- ఆ అవును స్వామి..


పూజారి:- కాలికి పట్టీలు ఉన్నాయా. కాలి మువ్వల శబ్దం చేసినాయా…! 


శివ నందిని:- ఆ అవును స్వామి!  చేశాయి 


పూజారి:- గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందా!


శివనందిని:- ఆ చేసింది స్వామి ….


పూజారి:- ఇంకెవరు ఆ అమ్మాయి అమ్మవారే..! ఇక్కడ భక్తులకి ఆవిడ ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటుందో వాళ్లు వచ్చి నాకు చెబుతూ ఉంటే నేను విని ఊరుకుంటూ ఉంటాను.  మీకు అమ్మవారి దర్శనం అయింది.  


శివ నందిని:-నిజంగానే అమ్మవారే అంటారా!  


పూజారి:- నాకు కూతుళ్లు లేరు. నాకు సంతానమే లేదు. సంతానం వద్దు అనుకున్నాను. ఇంక మిగతా వాళ్ళు ఎవరికీ ఆలయ ప్రవేశం లేదు. మీరు కొన్నాళ్ళ నుంచి ఉంటున్నారు కాబట్టి… మీకు చెబుతున్నాను..


 అనేసరికి… సరే అని ఇది నిజమా కాదా అని అనుమానంతో శివ నందిని కాస్త ధ్యానంలో కూర్చునే సరికి… కామాక్షి విగ్రహ మూర్తిలో ఇందాక నీళ్ల బిందెలో తో వెళ్లిన పిల్ల సజీవ మూర్తిగా కనిపించేసరికి కళ్ల వెంట నీళ్లు  ధారగా కారుతూ ఉండేసరికి…మహాదేవికి విషయం అర్థమైపోయింది. మౌనంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకొని రెండోసారి నువ్వు దర్శనం ఇచ్చినా కూడా నువ్వు ఉన్నావని నిదర్శనం ఇచ్చినా కూడా నీ దర్శనం మాకు అర్థం కాలేదు తల్లి.  రెండో అవకాశం కూడా కోల్పోయాము అని మాకు అర్థమయింది అని చెప్పేసి వస్తూ ఉండేసరికి…. మహాదేవి కాస్త  ఉగ్రురాలై రుద్ర స్వామిని కొట్టేంత పని చేస్తూ…. నీ వల్లే రెండో అవకాశం కోల్పోయాము.


మహాదేవి:-  ఆ పిల్ల అమ్మవారే….లలితాదేవి అంశ 


రుద్రస్వామి:- ఏమో ఎవరికి తెలుసు! తాంబూలం సేవించినంత మాత్రాన అమ్మవారు అవుతుందా! అని మూక శంకరుడు చెప్పగానే చెప్పాడు కదా!  ఓర చూపు మీదనే వంద పద్యాలు చెప్పాడంటే ఆ చూపు ప్రభావం ఏంటో తెలుసుకోలేకపోతే ఎలాగా…


 మహాదేవి:- అప్పటికే నేను చెబుతూనే ఉన్నాను ఇది అభిషేకం చేసే సమయం కాదు…. నీళ్లు తీసుకెళ్లే అవకాశం లేదు… ఏదో తేడాగా ఉంది… చూపులో అని చెప్పేసి అంటే నువ్వేమో  ఆ ఓర చూపుని వంకర చూపుగా చెప్పావు.  మాకు వచ్చిన అనుమానాలు నివృత్తి చేయకుండా చేశావు.  అసలు నీ మాటలు నమ్మకుండా ఉండి ఉంటే…ఆమె పాదాలు పట్టుకుని ఉండి ఉంటే ….మాకు ఈపాటికి అమ్మవారి దర్శనం కూడా అయిపోయేది.  నిజరూప దర్శనం అయిపోయేది..


రుద్రస్వామి:- అదేదో నేను చేసినట్టు అంటారేంటి ! అయినా మీరు వెళ్లారు… మీరు వెళ్లేసరికి ఆమె అమ్మవారని అనుకున్నప్పుడు అనే పాదాలు పట్టుకోవాల్సింది కదా! ఆ పిల్ల పాదాలు పట్టుకోవడం ఏంటి…. పెళ్లి కాని అమ్మాయి పాదాలు పట్టుకోవడం ఏమిటి…. ఆవిడ అమ్మవారు కాదా అని పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష అయిపోయే లోపల నిదర్శనం ఇచ్చేసి దర్శనం కాస్త అదృశ్యం అయింది.  అది నా తప్ప…… నా తప్పు ఎలా అవుతుంది..


అని చెప్పేసి వీళ్లిద్దరూ వాదోపవాదాలు చేసుకుంటూ ఉండేసరికి….


శివనందిని:- ఆగుతారా! ఆ అవకాశం ఎటు చేజారి పోయింది కదా! మళ్లీ ఇప్పుడు రాదు కదా! మూడవ రూపంలో అయినా జాగ్రత్త పడండి. అవకాశం చేజారితే మనం ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. మనకి మట్టి లింగం ఎక్కడ ఉందో తెలియదు. అమ్మవారు 5 రూపాలలో వస్తుందని ఇప్పటికి రెండో రూపం అయిపోయింది.  ఇక మూడు రూపాలలో దర్శనం ఇవ్వవచ్చు. జాగ్రత్తగా ఉండాలి…


రుద్రస్వామి:- ఐదురూపాలలో వస్తుందో… నాలుగు రూపాలలో వస్తుందో… మూడు రూపాలలోనే రావచ్చు.  ఎప్పుడైనా ఆ దర్శనాలు ఆగిపోవచ్చు.  మనం ఖచ్చితంగా చెప్పలేము.  ఎన్ని రూపాలలో వస్తుందని…


శివ నందిని:- నాకు తెలిసినంతవరకు నాలుగు రూపాలలో ఖచ్చితంగా వస్తుంది.  ఎందుకంటే ఒకటి బాల గా, రెండు లలితగా, మూడు త్రిపుర సుందరిగా, దర్శనం ఇచ్చినట్టు ఆ తర్వాత కామాక్షి దేవిగా దర్శనం ఇచ్చినట్టు అమ్మవారు ఇక్కడ నాలుగు రూపాలలో నిజరూప దర్శనం ఇచ్చినట్టుగా స్థల పురాణం చెబుతుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు రెండు అవకాశాలే ఉన్నాయి. ఈ రెండు అవకాశాలు మనం అమ్మవారి పాదములు పట్టుకోవాలి. ఆవిడ అనుగ్రహం పొందాలి. ఒకవేళ ఆవిడ అనుగ్రహం కనుక మనం పొందకపోతే ఇక్కడితో మన సాధన ఆగిపోయింది… మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే…


రుద్రస్వామి:- ఏమో.!  ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక.  అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ మట్టి శివలింగం ఎక్కడ ఉందో తెలుస్తుంది.  ఆ మట్టి శివలింగం వస్తేనే మూలధార చక్ర జాగృతి సాధన పరిసమాప్తి అయినట్లే.. లేదంటే కానట్లే… 


అని తేల్చేసరికి సరే అని… ఎటు సమయం 8:30 అవుతుంది కదా! ఇక దేవాలయాలు మూసేస్తారు అంటూ ఉండేసరికి… ఉప దేవాలయాలన్నీ మూసేస్తూ అర్చకులు కనిపించేసరికి….  ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి రండి ఇంక….భోజనం చేసుకొని గదికి వెళ్దాం అనేసరికి సరే అని అందరూ ఇక దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్లి భోజనాలు ముగించుకొని నిద్రకి ఉపక్రమించారు.  కానీ ఎవరి ఆవేదనలో వారు ఉన్నారు. ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ ఏకాంతంగా ఒంటరిగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఇద్దరు ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటున్నారు. రుద్రస్వామి, మహాదేవి, శివనందిని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. శివ నందినికి ఏడుపు ఆగట్లేదు. రెండవ అవకాశం కూడా చేజారిపోయింది. హృదయం మీద చేయి పెట్టి స్వామి !స్వామి! అని పిలిచేసరికి…. 


శివానంద:- ఏమైంది దేవి…. ఏంటి? రమ్మంటావా!


శివ నందిని:- ఆహా…. అక్కర్లేదు స్వామి.  మేము గదికి వచ్చేసాము. మిమ్మల్ని ఇక్కడ చూస్తే బాగుండదు…. అనేసరికి ఏమైంది అనేసరికి మీకు తెలియంది కాదు కదా! 


శివానంద:-  ఆ రెండు రూపాలను అమ్మవారి దర్శనం అయినప్పటికీ నువ్వు గుర్తించలేదని ధ్యానానుభవాలలో తెలిసింది. కంగారు పడాల్సిందేమీ లేదు. భయపడాల్సిన అవసరము లేదు. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు కదా!  సాధన సాధ్యతే సర్వం సాధ్యం అన్నారు!  కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు… ఓర్పుగా ఉండు… సహనంగా ఉండు.. నమ్మకం కోల్పోవద్దు.. అతి నమ్మకం పెట్టుకోకు.. అతి విశ్వాసం పెట్టుకోకు… ఈసారి మళ్లీ అవకాశం ఉంటుంది. అమ్మవారు 4 రూపాలలో దర్శనం ఇచ్చినట్టుగా నాలుగు అవకాశాలు ఉంటాయి. చివరిదాకా నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. జయము అపజయము అనేది ఇక శివాజ్ఞ బట్టి ఉంటుంది. ఆవిడ నీ సహన శక్తిని పరిశీలించాలని అనుకుంటుందేమో!  నీ వివేక బుద్ధి విచక్షణ జ్ఞానంతో ఈసారి అవకాశాన్ని చేజార్చుకోకు..


శివ నందిని:- ఒకవేళ అమ్మవారి అనుగ్రహం పొందకపోతే ఇక మట్టి శివలింగం ఎక్కడ ఉందో మనకు తెలియదు కదా స్వామి! సాధన  ఆగిపోతుంది కదా!


శివానంద:- అన్నింటి గురించి నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు… ఏదో అయిపోతుంది… ఏదో జరిగిపోతుంది ….అని కంగారు పడుతున్నావు. భయపడుతున్నావు. ఎందుకు చెడుగా ఆలోచించడం.. మంచిగా ఆలోచించు… మంచి భావంతో ఉండు…ఏమో రేపే అమ్మవారు నీకు దర్శనం ఇవ్వవచ్చు. ఆమె అనుగ్రహం పొందవచ్చు . ఆ ఆలోచనతో ఉండు. ఏం జరగాలో ఎలా జరగాలో మన చేతుల్లో లేదు కదా!  మనం కేవలం పాత్రధారులమే.  సాధనకి ఉపయోగపడే దేహాలమే.  సాధన సిద్ధి పొందాల్సిన వాళ్లము..సాధన సిద్ధి పొందాల్సింది వాళ్లే… మోక్షమును పొందాల్సింది వాళ్లే… ఒకళ్ళు శివుడు జ్ఞానం ఇస్తూ ఉంటే, అమ్మవారు అందుకొని సాధన పరిసమాప్తి చేసుకోవాలి. సాధన ఆవిడ పరిసమాప్తి చేసుకోవాలి . అది నీ ద్వారా ఎంచబడింది. నీ దేహం అందుకు ఉపయోగపడుతుంది. అంతకుమించి ఏమీ లేదు. ఒకవేళ నీ దేహం సాధనకి పనికిరాదు అని ఆవిడ అనుకుని ఉంటే… నీ సాధన అంతటితో ఆగిపోతుంది. ఇక నువ్వు ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడు ఆలోచిద్దాం… అప్పటిదాకా ఎందుకు అతిగా ఆలోచించుకోవడం…ఆవేదన పడటం అవసరమా..!  నువ్వు ఈ బాధలన్నీటికి అతీతం అవ్వాలి… జరిగేది ఏదైనా మన మంచికే జరుగుతుంది అనుకో!  ఏమో ఆమె అన్ని రూపాలు నీకు నిజరూప దర్శనాలు ఇవ్వాలి అనుకుంటుందేమో…  తెలియదు కదా!  లోకంలో ఇలా ఈ రూపాలలో తిరుగుతుందని చెప్పకనే చెప్తుందేమో కదా! 


శివ నందిని:- సరే స్వామి!  మీ మీద నాకు నమ్మకం ఉంది.  అమ్మ మీద నాకు నమ్మకం ఉంది.  అమ్మవారి చూసుకుంటారు. అసలు నేను ఎక్కడ సాధన చేస్తున్నాను…. చేసేది చేయించేది అంత అమ్మవారే కాబట్టి….. అయితే ఆవిడ సాధన ఆగుతుంది… ఇంకో దేహంతో ఆవిడ సాధన చేసుకుంటుంది . ఇక దైవ నిర్ణయం…. కాల నిర్ణయం. మానవ మాత్రులమే కదా!  కృతజ్ఞతలు స్వామి!


 అని అనగానే  ఆయన అంతర్వాణి ఆగిపోయింది.  ఇక ప్రశాంతంగా ఎవరికి వారే నిద్రలోకి జారుకున్నారు. 



ఉన్నట్టుండి శివ నందినికి, రుద్రస్వామికి మరియు మహాదేవికి గాఢ నిద్ర నుంచి మెలకువ వచ్చేసరికి… కళ్ళు తెరిచి చూసేసరికి… అర్ధరాత్రి మూడు గంటలు అయింది.  అలా వాళ్ళకి నిద్ర పట్టలేదు.  ధ్యానం చేయబుద్ది కావడం లేదు.  పిల్లలు చూస్తే గాఢ నిద్రలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక 


రుద్రస్వామి:-  అమ్మ!  మనం అమ్మవారి సుప్రభాత సేవకి వెళ్దామా? అమ్మవారికి పూజ చేయొచ్చు..

 

ఇప్పుడు 4:30కి  కదా! సరే  సుప్రభాత సేవ అని అందరూ స్నానాదికాలు పూర్తి చేసుకొని బయలుదేరుతూ ఉండగా….  పిల్లలు లేస్తారేమో అని చూసేసరికి… వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారని గది తలుపులకు తాళం వేసి అందరూ కూడా సుప్రభాత సేవ కోసం గుడికి వెళ్లడం జరిగింది. గుడి తలుపులు తెరిచారు.  అర్చకులు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది.  ఒకవేళ ఎవరైనా ధర్మకర్తలు రావాలేమో అని అనుకునేసరికి… సుప్రభాత సేవకి ఇంకా సమయం పడుతుంది అప్పుడే కాదు…. 4:30 కి అనేసరికి మరో అరగంట ఉందని వీళ్ళందరూ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానం మీదకి మనసు పోవటం లేదు.  సరే అని చెప్పేసి 4:30 కి సుప్రభాత సేవ చూద్దామని కూర్చున్నారు. ఇంతలో ఒక పెద్దావిడ నిండు ముత్తైదువు లాగా పెద్ద బొట్టు పెట్టుకొని… నిండుగా పూలు పెట్టుకొని… మెడలో గజమాల వేసుకొని మామిడికాయ రంగు పట్టుచీర బంగారురంగు జరీ ఉన్న చీర కట్టుకున్న ఆవిడ గుడి లోపలికి రావటం వీళ్ళందరూ గమనించారు.  ఆవిడ చూడడానికి చాలా పెద్దావిడలాగా… పెద్ద ముత్తైదువు లాగా కనిపించింది.  నడకలోనూ, చూపులోను ఒక విధమైన అహం కనిపించింది.  మాట తీరు కూడా సౌమ్యంగా గౌరవప్రదంగా ఉంది.  ఆలయ పూజారి కాస్త ఈవిడకి ఎదురెళ్ళేసరికి …..ఈవిడ వీళ్ళ ముగ్గురిని ఓరకంట చూసి వీళ్ళు ఎవరు అని పూజారిని అడుగుతూ ఉండేసరికి…. పూజారి వీళ్ళు సాధన చేసుకోవడానికి ఇక్కడే కొన్నాళ్లు నుంచి ఉన్నారు తల్లి అనేసరికి ….అయితే వీళ్ళు రారా లోపలికి అని చూసేసరికి…. పూజారి కూడా అలా చూసేసరికి….ఈవిడ ఎవరు?అని  రుద్ర స్వామి అనుకుంటూ …ఈ ఆలయ ధర్మకర్త భార్య అయి ఉంటుంది. ఈవిడ కోసమే వీళ్ళు ఎదురు చూస్తున్నారేమో! అని అనేసరికి రూపం, మాటతీరు రాజ ఠివి అలాగే పెద్దావిడ లాగా ….పెద్దరికం లాగా సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయనుకుంటా!  ధర్మకర్త అయి ఉంటుంది… ఈవిడ పూజ అయిన తర్వాత  ఈవిడ సమక్షంలో సుప్రభాత సేవ చేస్తారేమో…. ఈవిడ పూజ అయిన తరువాత  సాధారణ భక్తులకి… దర్శనానికి అనుమతి ఇస్తారనుకుంట అనేసరికి…. అయ్యుండొచ్చు… ఈవిడ పూజ అయ్యాక మనం వెళ్దాం దర్శనానికి అని ఎవరికి వాళ్ళే ధ్యానంలో కూర్చున్నారు.  సుప్రభాత సేవలు, అభిషేకాలు జరుగుతున్నట్టుగా వీళ్ళకి ధ్యానంలో వినపడుతూ ఉండేసరికి…. ఈవిడ తిరిగి వెనక్కి వస్తుందేమో అని ఎదురు చూశారు.  దాదాపు ఒక గంట సేపు ఎదురు చూసినా కూడా ధర్మకర్త భార్య లోపలికి వెళ్లిన ఆవిడ వెనక్కి తిరిగి రాకపోయేసరికి…. ఏదో మూల అనుమానం వచ్చి…. ధర్మకర్త భార్య యేనా లేక ఇంకెవరైనా అని అనుకునేసరికి….సాధారణ భక్తులకి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.  అమ్మవారు  తలుపులు తీశారు అని దర్శనానికి వెళ్లి…… అక్కడ ఆలయ పూజారి కనిపిస్తే… స్వామి!  పొద్దున మేము సుప్రభాత సేవ సమయానికి వచ్చాము అనేసరికి….నేను ఇప్పుడే వస్తున్నాను అనేసరికి…. మీరు పొద్దున కనిపించారు కదా! ఇప్పుడు రావటం ఏమిటి ?అనేసరికి లేదమ్మా!  సుప్రభాత సేవకి నేను రాలేదు. మా వాళ్ళు వచ్చారు. సుప్రభాత సేవకి వేరే వాళ్ళు ఉంటారు.  ప్రధాన అర్చకులు.  ఆ తర్వాత నిత్య కైంకర్యాలకి వేరే అర్చకులు ఉంటారు అని చెప్పేసరికి…. ఏమో స్వామి మీరే కనిపించారు కదా!  అనేసరికి ధర్మకర్త భార్య కూడా వచ్చారు కదా! అనేసరికి…. ధర్మకర్త భార్య రావటం ఏమిటి? సుప్రభాత సేవ సమయానికి వాళ్ళు ఎప్పుడు రారు అనేసరికి…. ఆవిడ పోలికలు, ఆవిడ కట్టుకున్న చీర అంతా చెప్పేసరికి ఆలయ పూజారి పక్కపక్క నవ్వి… ఆవిడ ధర్మకర్త భార్య కాదు, సాక్షాత్తు అమ్మవారే ఆవిడ.  నిత్య సుమంగళీ దేవి రూపంలో త్రిపుర సుందరి దేవి అంశతో వస్తుంది. ఇక్కడ అమ్మవారు బాలగా ….పెళ్లి కాని యువతీ లలితా దేవి గాను…. పెళ్లయిన యువతిగా త్రిపుర సుందరిగాను….వృద్ధురాలుగా కామాక్షిగా దేవి గాను నాలుగు రూపాలలో సంచారం చేస్తుంది.  నిజరూప దర్శనాలు ఇస్తూ ఉంటుంది.  అలా ఆవిడ వచ్చి ఉండవచ్చు… ప్రతి శుక్రవారం పౌర్ణమి వేళలో ఇలా వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు.  నాకు ఆవిడ దర్శనం అవ్వలేదు అని చెప్పేసరికి…. ఆమె ధర్మ కర్త కాదు…. మూడవ రూపంలో ఉన్న అమ్మవారు ఈ విధంగా వచ్చింది అనుకునేసరికి కళ్ళు మూసుకునేసరికి కామాక్షి దేవి విగ్రహ మూర్తిలో బదులు ధర్మకర్త అనుకున్న ఆవిడ రూపం…. సజీవ మూర్తిగా కనిపించేసరికి…. అమ్మ నువ్వు ఇలా  ఆడుకుంటే ఎలా తల్లీ!  నువ్వు ఏ రూపంలో వస్తున్నావో కూడా తెలియనివ్వటం లేదు. అర్థం కావడం లేదు. ఆ గుర్తులు కూడా లేవు. గుర్తుపట్టలేకపోతున్నాము. నేను ఉన్నానని దర్శనం సాక్ష్యాధారాలు చూపిస్తున్నావు …..కానీ నీ దర్శన భాగ్యం మాకు అందనివ్వడం లేదు.  మీ పాదస్పర్శనం కలగనివ్వడం లేదు.  నీ అనుగ్రహం మాకు అందనివ్వడం లేదు.  మూడవ అవకాశం కూడా చేజారి పోయింది.మాకు ముందే మాకు మెలకువ తెప్పించావు…. సుప్రభాత సేవ చేయించుకోవాలి రమ్మని చెప్పావు …. నీ రూపంలో నువ్వు వచ్చావు… ధర్మకర్త భార్య అని భ్రమపడి పట్టించుకోలేదు. శ్రద్ధ పెట్టలేదు. నీ మూడవ రూపం కూడా గుర్తుపట్టలేని దీనస్థితిలో మేము ఉన్నాము. ఈ అవకాశం కూడా చేజారి పోయింది.  ఉన్నది ఒకే ఒక్క అవకాశం.  ఆ అవకాశం లో ఏం జరుగుతుందో కూడా తెలియదు.  ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి!  నేను మాత్రం సాధన చేయడం లేదు.  ఇది నా సాధన కాదు. నీ సాధన .. నువ్వు మోక్షం పొందావో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు…. ఆదిపరాశక్తిగా కామాక్షి దేవియే మూలం అని తెలుసుకున్నావు… నువ్వు మోక్షం పొందేవా లేదో తెలుసుకోవాలి. ఆ ధ్యాన జ్ఞాన అనుభూతులను పొందడానికి  ఈ దేహం ఉందని మాత్రం గుర్తుపెట్టుకో!  పొందేది నువ్వే….తెలుసుకునేది నువ్వే…. సాధించేది నువ్వే…. సాధన చేసేది నువ్వే…. దేహం మాత్రమే నాది.  ఈ దేహం చీర లాంటిది.  ఇది భూమి మీద రాలి వెళ్లిపోతుంది . ఈ దేహంలో ఉండి సాధన చేయాల్సింది… సాధించాల్సింది నువ్వే… అని మాత్రం తెలుసుకో!  నేను ఆగిపోతే… నా సాధన ఆగిపోతే… నీ సాధన ఆగిపోతుందని గ్రహించు.  నువ్వు కేవలం అర్హత, యోగ్యత, యోగం ఉందో లేదో అని పరీక్ష చేస్తున్నావేమో! నాకైతే తెలియదు.  నా అవివేక బుద్ధికి, అవిచక్షణ జ్ఞానానికి….నేను గ్రహించలేకపోతున్నాను. నువ్వు ఉన్నావని నిదర్శనాలు ఇస్తున్నావు కానీ….. నీ దర్శనం నాకు చూపించట్లేదు.  అనుభవ అనుభూతి, అనుగ్రహం ఇవ్వడం లేదు.  నా సాధన ఎలా ముందుకు వెళుతుంది.  మీ సాధన ముందుకు వెళ్లాలంటే నువ్వే అనుగ్రహించాలి.   నువ్వే మాయగా మారితే ఎలా తల్లి!  నావల్ల కావడం లేదు… సహనశక్తిని కోల్పోతున్నాను… అవకాశాలు చేయి జారిపోతున్నాయని బాధ ఒకవైపు, ఆవేదన ఒకవైపు ఉంది. ఏదైనా కానీ నా సాధన ఆగిపోతే నీ సాధన ఆగిపోయిద్దని గుర్తుపెట్టుకో!  నాకు జరిగే నష్టం ఏమీ లేదు.  ఈ దేహం కాకపోతే ఇంకొక దేహంలోకి వెళ్లి చేసుకుంటానని నాకు తెలుసు.  ఈ దేహంతో నీ సాధన పరిసమాప్తి చేయాలని తపన తాపత్రయాలు పడుతున్నాను.  కుతూహలంతో ఉత్సుకతలో ఉన్నాను.  ఎంతో మంది గురువులు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే కొంతమంది దైవశక్తులు కూడా నాలో ఉన్నారు.  అవన్నీ కూడా నీవే… నేను లేను… నేను అనేది లేదు…అని  నాకు అర్థం అవుతుంది.  నాలో నువ్వు ఉన్నావని నేను గ్రహించాను.. నేను కానీ నేనుగా నువ్వు ఉన్నావని అర్థం అవుతుంది.  కాకపోతే నీకు నువ్వే మాయలో పడిపోయి…. నువ్వే సాధన పరిసమాప్తి చేసుకోవాల్సింది పోయి…. సాధన ఆపేసుకుంటావని భయం నాలో రాను రాను పెరుగుతుంది.  ఎంతమంది మనోధైర్యం ఇచ్చినా… కూడా ధైర్యం చాలటం లేదు.  సహనశక్తి కోల్పోతున్నాను.  నీ ఇష్టం తల్లి.  ఇక నీ ఆఖరి దర్శనం  అనుగ్రహిస్తావో… ఆగ్రహిస్తావో ఇక నీ ఇష్టం అనేసరికి…. ఆవేదన చెందుతూ….. కళ్ళంట నీళ్లతో గుడి నుండి బయటకు వచ్చేసింది.  ఈ విషయం అర్థమై వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చారు.  అప్పటికే సమయం ఎనిమిది గంటలవుతుందని…. అమ్మ! పిల్లలిద్దరూ లేస్తారేమో మళ్ళీ మనం ఎవరం లేకపోయేసరికి వాళ్ళు భయపడతారేమో అనేసరికి…. సరే అని ఇక వాళ్ళు గదికి వెళ్ళటం జరిగింది.  అప్పటికి తలుపులు తెరిచి చూస్తే పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు.  వీళ్ళు ఏంటి ఇలా నిద్రపోతున్నారు అనుకొని….. సరే అని మనం ఈ లోపల టిఫిన్ లు చేసుకుని …..  పిల్లలకు టిఫిన్లు తీసుకోవద్దామనేసి వీళ్ళ ముగ్గురు టిఫిన్లు చేయడానికి బయలుదేరారు. 



సాధన కుటుంబం హోటల్ కి వెళ్లి భోజనం చేసుకుని ….పిల్లలకి టిఫిన్లు కట్టించుకుని తిరిగి గదికి వస్తూ ఉండగా…. లీలగా వేణుగానం వినిపించసాగింది.  అది విని….


రుద్ర స్వామి:-  ఆ….. మళ్లీ వచ్చాడు ……ఈ కృష్ణస్వామి.  మళ్లీ ఇప్పుడు ఏం తంటాలు తీసుకువస్తాడో ….ఏం పెంట పెడతాడో….


అనుకుంటూ ఉండేసరికి ఎదురుగా కృష్ణస్వామి మరియు యోగాంబిక కనిపించారు.  శివ నందిని  కేసి చూస్తూ…. 



కృష్ణస్వామి:- ఏంటి!  అమ్మవారు మూడు రూపాలలో వచ్చినా కూడా గుర్తుపట్టలేకపోయావంట… ఒక రూపమే ఉంది.  ఆ రూపం కూడా గుర్తుపట్టలేదనుకో! ఇక నీ సాధన ఆగిపోతుంది.  ఇక అమ్మవారి అనుగ్రహం దర్శనం పొందలేదు అనుకో ……మట్టి శివలింగం కనిపించి ,అది ఎక్కడ ఉందో తెలియకపోతే…. నీ సాధనం వల్ల ఉపయోగం లేదు.  నీ సాధన లోకానికి ఉపయోగపడితే ఏంటి?  లోక వినాశనం జరిగితే ఏంటి? ఇక నీ దేహం ఇంటికి వెళ్లడమే కదా! సాధన అర్థాంతరంగా ఆగిపోవడం కదా!  నాకు కావాల్సింది కూడా అదే.  ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నాను…


 అంటూ ఉన్న వీళ్ళిద్దరిని దాటుకొని…. ముందుకు వెళుతూ ఉండేసరికి…. 


మహాదేవి:- ఒకపక్క అమ్మవారి దర్శనం కాక చస్తుంటే…. ఒక పక్క వీడి పుల్లవిరుపు మాటలు వీడును….. అసలు ముందు వీడిని చంపేయాలి.  వీటిని బొంద పెట్టాలి. వీడిని పాతి పెట్టాలి. వీడిని ఇది చేయాలి అది చేయాలి….


 అంటూ ఆవేశపడుతూ ఉండేసరికి…. రుద్ర స్వామి కాస్త 


రుద్రస్వామి:- తల్లి ! ఇప్పుడు నువ్వు మహాకాళిక అవ్వమాకు.  వాడిని చూస్తే చాలు మీ ఇద్దరు చెర్రెత్తుకొస్తున్నారు.  మాయా స్వరూపాలు వాళ్ళిద్దరూ…. మనలో మాయ ఎలా ఉంటుంది… ప్రకృతి మాయ ఎలా చేస్తుంది…. అనేది వాళ్ళిద్దరి రూపంలో చూపిస్తున్నారు.  నిజానికి వాళ్ళిద్దరూ నిజం కాదు. వాళ్ళు మాయ అంశలు.  మనకి సాధన పరిసమాప్తికి  అర్హత, యోగ్యత, యోగం ఉందా లేదా? అని వాళ్ళు మనకి ఆ రూపంలో ఉండి పరీక్షలు పెడుతూ ఉంటారు.  ఆటంకాలు పెడుతూ ఉంటారు… అవాంతరాలు పెడుతూ ఉంటారు… మాయలు పెడుతూ ఉంటారు…. మర్మాలు పెడుతూ ఉంటారు…వాటిని దాటుకోవాలి.  వ్యక్తిగతంగా వాళ్లపైన పగ పెంచుకోవలసిన అవసరం లేదు.  కోపతాపాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.  ఇక్కడ మనకి ఎవరు మిత్రులు కాదు… ఎవరు శత్రువులు కాదు…



మహాదేవి:- ఇప్పుడు సరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు? పదా ఆలస్యం అవుతుంది. పిల్లలు నిద్ర లేస్తారేమో అనేసరికి…సరే అని అందరూ గదికి వెళ్ళటం జరిగింది. 


గది తలుపు తాళం తీసేసరికి పిల్లలిద్దరూ స్నానాధికాలు చేసుకొని ధ్యానం చేసుకుంటూ కనిపించారు. ఓహో …వీళ్ళకి కూడా ధ్యానం చేసుకోవాలనే ఆలోచన కూడా ఉందన్నమాట ! అనేసరికి పిల్లలిద్దరూ కాస్త వచ్చారా!  మీరు ఎటో వెళ్లిపోయారు అనుకున్నాము… అని అనేసరికి… ఏమీ లేదమ్మా మీకు ఆకలి వేస్తుందని టిఫిన్లు తీసుకురావడానికి వెళ్ళాము అని శివ నందిని అనేసరికి….మంచి పని చేశారు, అదే ఆకలి వేస్తుంది… తినటానికి ఏమీ లేదు అని అనుకున్నాము.  మీరు గుడికి వెళ్ళారేమో అని అనుకున్నాము అనేసరికి… పొద్దున గుడికి వెళ్లేసి వచ్చాము అనేసరికి…. అమ్మవారి దర్శనం ఏమైనా అయ్యిందా! అమ్మవారు నిజరూప దర్శనం ఇచ్చిందా!  అని అంటే 


శివ నందిని:- ఆ ధర్మకర్త రూపం లో దర్శనమిచ్చింది.  మేము ధర్మకర్త భార్య అనుకున్నాము …కానీ ఆవిడ అమ్మవారు త్రిపుర సుందరి రూపం అంట…


పిల్లలు:- ఈసారి కూడా గుర్తుపట్టలేకపోయారా? ఉండటానికి ముగ్గురు ఉన్నారు ….మూడు తలకాయలు సాధనలో ఉన్నాయి….ఈసారి కూడా గుర్తుపట్టలేకపోయారా ….ఇంకెందుకు మీకు వివేక బుద్ధి, విచక్షణ జ్ఞానం ఉండి ఏమి లాభం!  మీరేం సాధన చేస్తున్నారు!  అసలు అమ్మవారు వచ్చేటప్పుడు…. కాలి మువ్వల చప్పుడు వస్తుందని తెలుసు కదా!  నోట్లో తాంబూలం వేసుకుంటుందని తెలుసు కదా!  ఎరుపు చీర కట్టుకొని ఉంటుందని తెలుసు కదా! ఈ గుర్తులు  బట్టి చెప్పొచ్చు కదా!  ఆవిడ వస్తున్నప్పుడు సువాసనలు వస్తాయి కదా!  వాటిని పట్టుకొని గుర్తుపట్టొచ్చు కదా! 


మహాదేవి:- అయ్యా…..!  నువ్వు చెప్పడం బానే చెబుతున్నావు… అక్కడ ఆవిడ ముందు మోహ బంధనంలోకి వెళ్లిపోయి…. మేము గుర్తుపట్టడం లేకపోతున్నాము…ఒక పని చేయండి మీరు వచ్చి ఫలానా వాళ్ళు అని చెప్పండి.. మేము వాళ్ళో కాదో చెప్పండి …అప్పుడు చూద్దాము.  ఈసారి మీకే ఇస్తాను అవకాశం 


పిల్లలు:- మా ఇద్దరిలో ఎవరు ఉన్నా మేము గుర్తుపట్టేస్తాము… అమ్మను గుర్తుపట్టడం పిల్లలకి ఏమైనా పెద్ద ఇదా!  అది చాలా తేలిక…. తల్లిని గుర్తుపట్టడం పెద్ద ఇదేం కాదు…. తేలికగా గుర్తుపట్టేస్తాం.


మహాదేవి:- అందరూ చెప్పొచ్చేవాళ్ళే….అవసరానికి ఎవరు ఉపయోగపడరు…అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేము…. 


శివ నందిని:- సరేలే!  పిల్లలతో వాదోపవాదాలు ఎందుకు?  అని వాళ్లేదో ఉత్సుకతతో చెప్పాలనుకుంటున్నారు.  మన లోపాలు ఎత్తి చూపించాలి అనుకుంటున్నారు.. వాటిని మనం సరదాగా తీసుకోవాలి కానీ… కోపంగా తీసుకోవలసిన అవసరం లేదు…



మహాదేవి:-  నువ్వు పిల్లల్ని ఒక్క మాట అననివ్వవు …..నువ్వు పిల్లల్ని ఏమన్నా అన్నా గాని మేము ఏమీ అనకూడదు..


 అని మహాదేవి అలిగి మంచం మీద కూర్చుంది.  రుద్ర స్వామి కాస్త …


రుద్రస్వామి:- అది అంతేలే…. తను అనుకున్న పని జరగలేదు అనుకో… ఇలా ప్రతిదానికి అలిగి కూర్చుంటుంది.  ఎక్కడ అమ్మవారి దర్శనం కోల్పోతామో… ఎక్కడ మట్టి శివలింగాలను దొరకదేమో…. ఎక్కడ నీ సాధన అయిపోతుందేమో అని… దానికి మనోవేదన అయ్యి బీపీ ఎక్కువ అయిపోయింది.  దాని వలన అది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది.  దాని మాటలు పట్టించుకోవద్దు… బీపీ తగ్గితే మామూలు అయిపోయి, మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది ..దానికి పిల్లలు అంటే ఇష్టం.  పిల్లలు తల్లి కాబట్టి దానికి తెలుసు… 


శివ నందిని:- . ఏం లేదులే ఆ విషయం తెలిసిన దాన్ని కాబట్టి పక్కకి పంపించాను అయ్యా! 


రుద్రస్వామి:- సరే అన్ని అర్థం చేసుకునే దానివి…. నేనేం అనను ఆ విషయంలో… సరే పిల్లలకి టిఫిన్లు అవి పెట్టు ..


అని చెప్పేసి రుద్రస్వామి మహాదేవి కోపం  తగ్గించడానికి ఆమె దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఈలోపుల శివ నందిని కాస్త తన చేతితో పిల్లలకి టిఫిన్లు పెడుతూ….కబుర్లు చెబుతూ ఉండేసరికి…. టిఫిన్లు పూర్తయి….ఇక పిల్లలు కాస్త గుడికి వెళదామనేసరికి ఇక అందరూ అక్కడి నుండి అమ్మవారి గుడికి వెళ్లాలని నిశ్చయించుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు.


ఎవరికి వాళ్లే పిల్లలు యథావిధిగా ఆటల రందిలో ఉండిపోయారు.  ఆ తర్వాత పిల్లల కాసేపటికి ఆటలు ఆడకుండా…. విచిత్రంగా మామిడి చెట్టు కింద కూర్చుని ఉండేసరికి ఎందుకో అనుమానం వచ్చి….


శివ నందిని:- ఏమైందిరా!  ఆటలు ఆడకుండా ఏదో నిష్టగా ధ్యానం చేసుకుంటున్నారు…. ఏంటి!  


బాలగణపతి:-  నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న ఒక గమ్మత్తు జరిగింది… 


శివ నందిని:-. ఏమైందిరా..! 


బాలగణపతి:- మేము ఆటలు ఆడుకుంటూ ఉంటే ఒక పెద్దావిడ మా దగ్గరికి వచ్చి ఏంట్రా అమ్మని మర్చిపోయి ఆటలు ఆడుతున్నారు ….ఆటల రందిలో పడేసరికి అమ్మని మర్చిపోతారా… అనేసరికి….మేమిద్దరం అమ్మలతోనే ఉన్నాం కదా! ఇద్దరు అమ్మలతోనే సఖ్యంగానే ఉన్నాం కదా! వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు…. మేము ఆటలు ఆడుకుంటున్నాము… మాకు ధ్యానాలు చేయాల్సిన అవసరం ఏముంది… వాళ్లకేదో మోక్షం పొందాలని ధ్యానం చేసుకుంటున్నారు. మేమేమో ఆటలాడుకుంటున్నాము అని నేను అనేసరికి…. ఆటల రందిలో పడితే…. అమ్మని మర్చిపోతే ఎలాగూ…. అలా మర్చిపోతే అయ్యా మీకు కనిపించడు.  అయ్య కనిపిస్తేనే కదా ఆయన మోక్ష విధానం తెలుస్తుంది.  మీకు తర్వాత శూన్యంలోకి వెళ్ళిపోతారు.  ఇప్పుడు ఇక ఈ ఆటల మాయలో ఉండిపోతే…. పసితనంలోనే ఉంటే ఎలాగా!  ధ్యానం మీద ధ్యాస పెట్టండి.  అమ్మ మీద ధ్యాస పెట్టండి అని…. ఆవిడ తన రెండు చేతులు మా ఇద్దరి తలల మీద పెట్టి….ఇక్కడ ఉంది చూసావా..!  ఈ బొట్టు పెట్టుకునే దగ్గర,  తన బొటనవేలు మా ఇద్దరికీ పెట్టింది. వాడికేమో కుడి చెయ్యి నెత్తి మీద పెడితే… నాకేమో ఎడమ చేయి నెత్తి మీద పెట్టింది. తద్వారా మాకు ఏదో తెలియని శక్తి మాలో ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. పైన ఏదో చిన్న రంధ్రం పడ్డట్టు ఆనందంలో నుంచి ఏదో శక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించింది.  దానితో మాకు ఆటలరంది తగ్గిపోయింది.  జపము ధ్యానము ఎక్కువగా చేసుకోవాలని అనిపించసాగింది..


అవునా అని శివనందిని కాస్త ధ్యానంలో కూర్చునేసరికి…. వీళ్ళకి ధర్మకర్త భార్యగా కనిపించిన ఆవిడ…. నిన్న సాయంత్రం వాళ్లకి ముత్తయిదువుగా కనిపించి… వీళ్ళకి శక్తి జాగృతి చేసింది.  బ్రహ్మ రంధ్రం జాగృతి చేసింది అని….. వీళ్ళు ఇకనుంచి ఆటలరంది తగ్గించి ధ్యానం మీద ధ్యాస పెడతారు అని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  అప్పుడు శివ నందిని కళ్ళు తెరిచి రుద్రస్వామి కేసి చూస్తూ..


రుద్రస్వామి:-  అయ్యా!  అమ్మవారే వీళ్ళకి శక్తి జాగృతి చేసింది.  వీళ్ళని అనుగ్రహించింది.  వీళ్లు పసితనంలో ఉండటం వలన… తెలియడం లేదు.  వీళ్ళకి బ్రహ్మరంధ్రం  తెరుచుకునేటట్లుగా చేసింది.  విశ్వశక్తి వీళ్ళ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించేటట్లుగా చేసింది.  వీళ్లు ఇంక రాను రాను ప్రాపంచిక విషయాలను దాటి…. అవధూత స్థితిలోనికి వెళ్ళిపోతారేమో… అని చెప్పేసి వీళ్ళు ఇక యోగ సాధకులుగా, మోక్ష సాధకులుగా మారతారు. ఆడుకోవడం అనేది తగ్గిపోతుంది… పసితనం తగ్గిపోతుంది… యోగత్వం దైవత్వంలోనికి వెళ్ళిపోతారు అనిపిస్తుంది .


రుద్రస్వామి:- ఏముందమ్మా!  చిన్నతనంలో గోచికట్టుకొని సన్యాసం తీసుకుంటే మరీ మంచిది కదా!  ఎన్నోపునః జన్మలు ఎత్తుతూ జననం మరణాల చక్రాలలో తిరుగుతున్నారు కదా!  ఇప్పుడు వాళ్ళకి మోక్షం పొందాలని అమ్మవారు అనుగ్రహించి ఉండవచ్చు… వాళ్ళు పొందిన అనుగ్రహమును పొందలేకపోతున్నాము చూసావా!  ఎంత తేడానో…. పసివాడిలోనే దైవత్వం ఉంటుంది …బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని చెప్పేసి పసిపిల్లలు దైవంతో సమానం అని చెప్పేసి మన పెద్దలు చెప్పకనే చెప్పారు కదా!  వాళ్లే పసితనం అమ్మవారిని ఆకర్షించి ఉండవచ్చు.. అంతే కదా పసిపాప మనసులోనే పరమాత్మ ఉంటాడు అని చెబుతారు కదా!  అందులో ప్రాపంచిక విషయాలు దాటిన తరువాత…. వాళ్ళు కూడా అవధూత స్థితికి వస్తారు కదా!  పిల్లలలాగా మారతారు కదా!  బాలోన్మత్త పిశాచ అవస్థకు చేరతారు కదా!  అలాంటి స్థితికి పసితనంలోనే మార్చడానికి అమ్మవారు అనుగ్రహించింది. ఆవిడ అనుగ్రహించిన విషయం వీళ్ళకి  తెలియని కూడా తెలియదు. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి వీళ్ళు ధ్యానం చేసి ఉంటారు.  ఆ ధ్యాన ఫలితం….స్వయంగా ఆదిపరాశక్తి ఈ క్షేత్రంలో వీళ్ళకి అనుగ్రహించింది. అమ్మవారి అనుగ్రహం మనం పొందలేక అవస్థలు పడుతూ ఉంటే…. తెలిసి తెలియకుండానే…..తెలియని వయస్సులోనే వీళ్ళు అనుగ్రహం పొందారు.  సాధన చేయకుండానే ప్రకృతి ఇది చేసింది.  మనసు స్థిరమైపోయింది.  నాకు తెలిసి వీళ్ళు పసివయసులో ఉన్న సనకనాదులు అయ్యి ఉంటారు. గోచి కట్టుకొని వెళ్లిపోయిన మనం ఆశ్చర్య పోనక్కర్లేదు.


శివ నందిని:- ఏమో అయ్యా!  ఏం జరుగుతుందో మనకెందుకు…. వీళ్ళు సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా అన్నా గాని…. నేను శుభ్రంగా అనుమతి ఇస్తాను.  వాళ్ల సాధన జీవితం వాళ్ళది. వాళ్లకి యోగ జీవితం కావాలో….భోగ జీవితం కావాలో…. వాళ్లే నిర్దేశించుకుంటారు.  ఏ జీవితం అయినా గానీ సాధనలో మోక్షం వస్తుంది.  యోగంలో ఉన్నప్పటికీ మోక్షం వస్తుంది.  భోగంలో మోక్ష అనుభవాలు ధ్యాన అనుభవాలు కలగటానికి అస్థిరమనస్సు కాస్త స్థిరవటానికి కొంత కాలం పడుతుంది. అదే యోగ జీవితంలో ఉంటే మనకి. క్షణకాలంలో స్థిరమవుతుంది.something  వాళ్ళకి తెలియటానికి అట్టే సమయం పట్టదు.  అదే తేడా భోగ జీవితానికి మరియు యోగ జీవితానికి కాలయాపన తప్ప ఏమీ తేడా ఉండదు. అక్కడ భోగ జీవితంలో కోరికలను అనుభవిస్తాము.  యోగ జీవితంలో కోరికలను తగ్గించుకుంటూ వస్తాము.  ఆ కోరికలు అనుభవించి అనుభవించి వారికి వైరాగ్యం వస్తుంది.  కోరికలు లేక వీడికి వైరాగ్యం వస్తుంది….ఇద్దరికీ వైరాగ్యం వస్తుంది… ఒకళ్ళు అసంతృప్తి నుంచి సంతృప్తికి వస్తారు.  ఒకళ్ళు పరమ పరమ ప్రశాంత స్థితికి వస్తారు.  శాంతి పొందుతారు.  యోగ జీవితానికి భోగ జీవితానికి తేడా లేదు.  నాకు అర్థం అయింది ….తేడా ఉంది అనే ఆలోచన, భావన రావటం అది మాయ వల్లే అని తెలుస్తుంది.  మాయకి ద్వంద ప్రవృత్తి స్వభావం ఉంటుంది కదా! 


రుద్రస్వామి:- తల్లి… ఉన్నది ఒకటే అయినప్పటికీ ….ప్రకృతి ఆ ప్రకృతిలో మళ్ళీ స్త్రీ, పురుష ప్రకృతులు అని చెప్పేసి రెండు రకాల ద్వంద ప్రవృత్తిలో చూపించడమే మాయ కదా!  ఆ మాయ దూరం అయితే…. మాయమైతే ఇంక వాడు జ్ఞానీయే కదా…. అనేసరికి ఇక ఈ పిల్లలు ఇద్దరు కూడా జ్ఞానవంతులు అయి ఉంటారు 


అనేసరికి….సుమారుగా గంట పైనే ఉండేసరికి ఆశ్చర్య ఆనందాలు వేసింది . వీళ్ళందరికీ వీళ్ళు బాల సన్యాసులు అయ్యారని గ్రహించడానికి వాళ్ళకి సమయం పట్టలేదు. సరే వాళ్ళ ధ్యానాలు వాళ్ళ ఇష్టం. మనం  ఎందుకు భంగం కలిగించడం అని వీళ్ళు కూడా ధ్యానంలో కూర్చుండిపోయారు. 


ఇంతలో వీళ్ళకి గాలిగోపురం దగ్గర పండు ముసలావిడ నేత చీర ఆకుపచ్చ చీర కట్టుకొని ఉన్న ఆవిడ….. చేతిలో కర్ర పట్టుకొని…. తెల్లని జుట్టుతో వంగిపోయిన శరీరంతో….. ఎముకలు నరాలు కనబడుతున్న ఒక బక్క పలచని శరీరంతో…. వృద్ధాప్య ఛాయాలతో…. ముడతలు పడిన శరీరంతో…..ఒక ఆవిడ కనిపించింది. రుద్ర స్వామికి కేసి సైగ చేసి పిలిచేసరికి రుద్ర స్వామి కాస్త ఆవిడ దగ్గరికి వెళ్లేసరికి….


వృద్ధాప్య స్త్రీ:- నాయనా! ఇక్కడ ఉన్న మగవాళ్లలో నువ్వే బలిష్టంగా కనబడుతున్నావు.. కాస్త నేను నడవలేని స్థితిలో ఉన్నాను.  అమ్మవారి గుడి దాకా నన్ను ఎత్తుకొని లోపలికి తీసుకు వెళ్ళగలవా? అని అమ్మవారివి దర్శనం చేయించవా ! అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయించవా!   


రుద్రస్వామి:- అమ్మో నువ్వు చూడ్డానికి 85 సంవత్సరాల వయసు ముసలావిడ లాగా ఉన్నావు.  నేనేమో 50 ఏళ్ల ముసలాడిని.  నేను నిన్ను ఎలా మోస్తా అనుకున్నావు? నీకు నడుము వంగిపోయింది… నాకు నడుము వంగిపోయింది….నిన్ను ఎత్తుకోవడం నావల్ల అయితే కాదు. ఇంకెవరైనా చూసుకో!  అయినా ఈ వయసులో కృష్ణా రామా అని మూలన కూర్చోక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు…. అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటూ…


వృద్ధాప్య స్త్రీ:- నాకు ప్రతినిత్యం అలా అలవాటు.  ఇప్పుడు 85 సంవత్సరాలు నుండి 1000 పౌర్ణములు చూడడం జరిగింది…


రుద్రస్వామి:- నీ మనవడినో …మనవరాలినో తీసుకురాక పోయావా!


వృద్ధాప్య స్త్రీ :- వాళ్లు వచ్చి తీసుకుపోయేవాళ్ళు …అంటే ఇక్కడిదాకా బండి మీద వచ్చి మనవడు దింపి వెళ్ళాడు.  వాడికి ఏదో పనుంది అని వెళ్ళిపోయాడు.  కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు.  ఏముంది ఒక 50 అడుగులు వేసి తీసుకు వెళ్ళడానికి ఇంత ఇది చేస్తున్నావు….. నువ్వు కాకపోతే ఇంకొకరు తీసుకువెళ్తారులే!  ఇక పో…. నువ్వు వెళ్లి ధ్యానం చేసుకో.  స్థిరమనస్సు లేని వాడివి, సహాయం చేయలేని వాడివి, మానవత్వం లేనివాడివి, మనసు ఏమి స్థిరపడుతుంది నీకు… ఏం ధ్యాననిష్ట కలుగుతుందో నేను చూస్తాను…


రుద్రస్వామి:- ఇప్పుడు ఏంటి? నిన్ను తీసుకువెళ్లకపోతే శాపనార్ధాలు పెడతావా? నా ధ్యానం నాకు తెలుసు.  నా  మనసు ఏంటో…అది స్థిరమో …అస్థిరమో అనేది దైవమే చూసుకుంటాడు. నేనేమీ లేనిపోని దొంగ సాధనలు చేయడం లేదు.  నాకు తెలిసిన సాధన నేనేదో చేసుకుంటున్నాను.నిన్ను తీసుకువెళ్లను అన్నంతమాత్రాన  నా సాధన దొంగ సాధన అయిపోదు 


వృద్ధాప్య స్త్రీ:- ఇప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్తావా తీసుకువెళ్ళవా? అది చెప్పు 


రుద్రస్వామి:- నా వల్ల కాదు తల్లి!  నువ్వు ముట్టుకుంటే ఎముకలు బయటకు వచ్చేలా ఉన్నావు…ఇప్పుడు పొరపాటున నువ్వు కింద పడ్డావంటే….కోలుకోవడం ఉండదు.  ఇక ఈ గుడిలో చావు అవుతుంది లేనిపోనిది… నీ కుటుంబ సభ్యులు అంతా వచ్చి నా మీద దాడి చేస్తారు. నా వల్ల అయితే కాదు.


వృద్ధాప్య స్త్రీ:- సరే అయితే పో!  నువ్వు వెళ్లి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకో!  నేనేదో ఒకటి చేసుకుంటాలే ….నీకెందుకులే…. 


అనేసరికి  ఈయన రుసరుసలాడుతూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లడం జరిగింది.  శివ నందిని మరియు మహాదేవి విషయం అంతా తెలుసుకొని …..శివ నందిని వెంటనే అయ్యో!  పెద్దవాడి కదా అయ్యా! ఎత్తుకొని తీసుకొని వెళ్లి సహాయం చేస్తే తప్పేముంది..? అనేసరికి చూడ్డానికి  చాలా పెద్ద ఆవిడే కానీ దాని మాటలు చూసావా!  ఎంత పొగరు ఎంత అహంకారమో…. ఎంత గర్వంగా మాట్లాడుతుందో…. చూసావా! పొగరు తగ్గటం లేదు… పొగరు ఉన్న ఆడదాన్ని చూస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది. మాటల్లో సౌమ్యత, నమ్రతా లేదు …వినయం లేదు… సహాయం అడుక్కోవడంలో కూడా పొగరు తగ్గలేదు.  నేనెందుకు సహాయం చేయాలి? ఇప్పుడు ఎత్తుకుని తీసుకువెళ్తే పొరపాటున కాలుజారి కింద పడితే ఆవిడ కోలుకోవడం అనేది ఉండదు.  దానికి మరణం వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేనిపోని గొడవలు చేస్తారు అనేసరికి…. మహాదేవి కాస్త అవును అదే నిజమే నాకు  ఎందుకో….ఆవిడ చూడటానికి వృద్ధాప్యంతో కనిపిస్తుంది. పండుటాకు లాగా ఉంది.  ఎప్పుడు రాలిపోతుందో ….మన చేతుల్లో ఆవిడ ప్రాణాలు పోతే వాళ్ళ వాళ్ళు ఊరుకోరు అనేసరికి శివ నందిని కాస్త లేచి ఆవిడ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా…… 


రుద్రస్వామి:-  ఏంటి ఆవిడకి సహాయం చేయడానికి వెళుతున్నావా? ఆవిడ ఏమన్నా అమ్మవారు అనుకున్నావా? అమ్మవారికి ఉన్న గుర్తులు ఏమీ లేవు…. కాళ్ళకి పట్టిలు లేవు…. ఎరుపు చీర కట్టలేదు…. తాంబూలం నమిలే అంత పళ్ళు కూడా లేవు. ఒక పండు ముసలావిడ ఏ రకంగా చూసినా కూడా ఆవిడ అమ్మవారు కాదు 


శివ నందిని:- ఆవిడ అమ్మవారు అవునా కాదా అనేది కాదు…. నేను ఆ దృష్టితో సహాయం చేయాలనుకోవడం లేదు.  మానవతా దృష్టితో మానవ స్త్రీగా ఆవిడకి సహాయం చేయాలనుకుంటున్నాను.  ఆ పెద్దావిడకి అమ్మవారి దర్శనం సాధ్యమైతే, అమ్మవారికి దర్శనం చేయిస్తాను.. 


రుద్రస్వామి:- చూశావా!  ఆవిడ మగవాళ్ళనే సాయం అడుగుతుంది కానీ స్త్రీ మూర్తిని సాయం అడగట్లేదు.  అంటే తనకి తనని మోయగలిగే వాళ్ళు మగవాళ్లు అందులో నాలాంటి బలిష్టమైన శరీరం కలిగిన వాళ్లు అని అడుగుతుంది …..మీ సాయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు 


శివ నందిని.:- నా వంతు సాయం నేను చేస్తాను…. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతాను…. ఆవిడ ఒప్పుకుంటే చేస్తాను… ఒప్పుకోకపోతే ఇలాగే వెనక్కి తిరిగి వస్తాను… తప్పేముంది… అందులో నేను మానవత్వమే చూపిస్తున్నాను.  దైవత్వమే కనపడుతుంది. మా అమ్మమ్మ నానమ్మ ఉన్నారనుకో ….మనమరాలిగా నేను తీసుకువెళ్తాను కదా ! ఆవిడని మోసే అంత బలం అయితే నాకు ఉంది కదా ! 


రుద్రస్వామి:- సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి…నేను కాదనటం లేదు…


శివ నందిని కాస్త పెద్దావిడ దగ్గరికి వెళ్లి …


శివ నందిని:- అవ్వ ! నేను నీకు సహాయం చేస్తాను. నేను ఎత్తుకొని తీసుకువెళ్లి అమ్మవారి దర్శనం ఇప్పిస్తాను… 


వృద్ధాప్య స్త్రీ:- నీవల్ల కాదులే!  నీ అయ్య వల్లే కానిది నీవల్లే ఏమవుతుంది మనవరాలా!  


శివ నందిని:- ఏమో! నా ప్రయత్నం నేను చేస్తాను…. 


వృద్ధాప్య స్త్రీ:- నేను ఆడవాళ్ళని నమ్మను.  ఆడవాళ్లు అంత బలమైన వాళ్ళు కాదు.  మగవాళ్ళు అంటే ఏదో పొలం పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి… బలంగా ఉంటారు.  మీ అయ్యకి బలం ఉంది కాబట్టి…మీ అయ్యని రమ్మన్నాను… మీ అయ్యకి పొగరు అహంకారం ఉండటం వలన వాడు నన్ను తీసుకువెళ్లను అని అన్నాడు.  వాడు భయపడి ఉంటాడు.  నాకేమీ భయం లేదు అని అంటున్నావు.  నువ్వు నన్ను ఎత్తుకొని ఎక్కడ పడేస్తావో అన్న భయం నాలో ఉంది.


శివ నందిని:- నేను అలా చేయనులే అవ్వ! నేను జాగ్రత్తగా తీసుకువెళ్లి జాగ్రత్తగా దింపుతాను… నాకు ఆ నమ్మకం ఉంది.  ఆ అవకాశం ఇవ్వు అవ్వ..


వృద్ధాప్య స్త్రీ:- ఏమోనమ్మ నాకైతే ధైర్యం చాలటం లేదు.  ఇంకెవరైనా మగవాళ్ళు కనపడితే చూడు…. వాళ్ళ సహాయం తీసుకుని వెళ్దాము. 


శివ నందిని:- ఏమీ అక్కర్లేదు!   ఇప్పుడు నిన్ను నేను ఎత్తుకుంటాను…. నీకు నమ్మకం వస్తే తీసుకువెళ్తాను… నమ్మకం లేదని అనిపిస్తే చెప్పు…నేను ఇక్కడే దింపేస్తాను.  


వృద్ధాప్య స్త్రీ:- ప్రయత్నించి చూస్తాను అంటావు… ఒక అవకాశం ఇవ్వమంటావు ..!  సరే నీ అదృష్టం ఎందుకు కాదనాలి.! సరే ఎత్తుకో! నాకు నమ్మకం కలుగుతుంది కదా…. నువ్వు మోయగలవు అనిపిస్తే వస్తాను…. లేదంటే మాత్రం నేను ఇక్కడే ఆగిపోతాను.. 


సరే అవ్వా!  అనేసరికి జాగ్రత్తగా  ఒడిసి పట్టుకుని ఎత్తుకొనేసరికి అప్పుడు అవ్వకి నమ్మకం వచ్చి 


వృద్ధాప్య స్త్రీ:- మనుమరాలా …. భేష్ …భేష్! నువ్వు మోయగలిగావు.  నాకు నమ్మకం వచ్చింది.  జాగ్రత్తగా నన్ను తీసుకువెళ్ళు.. 


అనేసరికి…. చూడటానికి ఇవాళ రేపు ప్రాణాలు పోయేటట్టుగా ఉంది.  కానీ సుమారుగా ఈమె 150 కేజీల బరువు ఉంటుందని…శివ నందినికి  అనిపించ సాగింది. కొంత దూరం వచ్చేసరికి… శివ నందినికి ఎగశ్వాస రావటం గమనించి….


అప్పుడే ఆయాస పడిపోతున్నావు…ఒక పావుగంట నడిచావో లేదో….


శివ నందిని:- .లేదవ్వ .! నువ్వేం కంగారు పడమాకు… భయపడమాకు…. నేను జాగ్రత్తగానే తీసుకు వెళ్తాను…కాకపోతే ఎత్తుకొని తీసుకోవడం నాకు ఇదే మొదటిసారి..


వృద్ధాప్య స్త్రీ:- ఆ ముక్క ముందే చెప్పాలి కదా!  నువ్వు ఇంతవరకు ఎవరిని ఎత్తుకో లేదా! 


శివ నందిని:- పిల్లల్ని ఎత్తుకున్నాను….ఒక ఐదు సంవత్సరాల వరకు ఇలా  80 సంవత్సరాలు ఆవిడని నేను ఎత్తుకోలేదు..


వృద్ధాప్య స్త్రీ:- ఇప్పుడు వృద్ధురాలిని ఎత్తుకోవడం ఇదేనా….


 ఎక్కడ పడేస్తుందో అని రుద్ర స్వామి మరియు మహాదేవి కంగారుపడుతూ ఉన్నప్పటికీ…. శివ నందిని వాళ్ళకి సైగ  చేసి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు… మీరు ధ్యానం చేసుకుంటూ ఉండండి…. నేను గుడిలో దింపేసి వస్తాను అని చెప్పేసరికి…. వీళ్ళిద్దరూ ధ్యానంలో కూర్చుని ఉన్నారు.  పిల్లలు కూడా ధ్యానంలో అలాగే ఉండిపోయారు… ఈ అవ్వని తీసుకొని గాలిగోపురం దగ్గర నుంచి ధ్వజ  స్థంభం దాటించి లోపలికి వెళితే…. ఇక్కడ దించేసెయ్యి అనేసరికి లోపల ఎవరో దింపుతూ ఉండేసరికి…. చుట్టూ చూసింది. గుళ్ళో పూజారి కానీ, భక్తులు కానీ ఎవరూ లేకపోయేసరికి… ఆశ్చర్యం వేసింది.  ఈ సమయానికల్లా భక్తులు రద్దీతో ఉండాలి… శుక్రవారం కదా!  ఇదేంటి భక్తులు ఎవరూ లేరు..


వృద్ధాప్య స్త్రీ:- .అయ్యో ఎవరూ లేరే గుళ్ళో పూజారి కూడా లేరు…. ఇప్పుడు ఏకాంతంగా ఒంటరిగా ఉండాలా!  అసలే నాకు ఒంటరితనం అంటే భయం.


శివ నందిని:- సరే కూర్చో తల్లి!  నేను నీతో పాటు కూర్చుంటాను…. ఎవరైనా భక్తులు గాని, పూజారి కానీ వస్తారు కదా!  వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను… 


వృద్ధాప్య స్త్రీ:- సరే నువ్వు ధైర్యంగా ఉంటాను అంటే నాకేమైంది …( తన చేతి సంచిలో నుంచి ఒక డబ్బా తీస్తూ….) అమ్మ నాకు తాంబూలం వేసుకోవడం చాలా ఇష్టం . నువ్వు తాంబూలం చుట్టి ఇస్తావా!


శివ నందిని:- సరే అవ్వ….  అయినా ఈ వయసులో తాంబూలం వేసుకుంటే ఆరోగ్య సమస్యలు రావా!  


వృద్ధాప్య స్త్రీ:- లేదు….నాకు ఉన్న సమస్యలన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి.  మనసు హాయిగా ఉంటుంది… ప్రశాంతంగా ఉంటుంది… వేసుకోకపోతే అదేదో తిక్కలాగా కోపం, ఆవేశం ఎక్కువవుతాయి.  నాకు చిన్నప్పటి నుంచి వేసుకోవడం అలవాటు ..


అనేసరికి… సరే తల్లి!  అని ఆ తాంబూలం తయారు చేస్తున్నప్పటికీ…చేతిలోది నోటిలో పెట్టుకోలేని స్థితిలో ఉందని గ్రహించి….ఆమె నోటిలోకి తాంబూలం అందించేసరికి నమలటానికి పళ్ళు కూడా లేకపోయేసరికి …. 


శివ నందిని;- అమ్మ దంతాలు కూడా ఏమీ లేవు కదా! 

వృద్ధాప్య స్త్రీ:- .నెమ్మదిగా నములుతాను సాయంత్రం కల్లా జీర్ణం అవుతుంది… లోపలికి వెళ్ళిపోతుంది….రసం పిలుస్తూ ఉంటాను… పిప్పిని బయటపడేస్తాను…


శివ నందిని:- సరే అవ్వ!  నీ వయసెంత..!


వృద్ధాప్య స్త్రీ:- 85/ 95 సంవత్సరాలు అంటారు.  నాకు తెలిసినంతవరకు సుమారుగా నేను వెయ్యి పౌర్ణములు చూశాను…


శివ నందిని:- అంటే 85 సంవత్సరాలు దాటిన వాళ్లే చూస్తారు … నిండు పూర్ణములు వెయ్యి చూడటం అంటే సామాన్యమైన విషయం కాదు.  అది కూడా ముత్తైదువుగా చూడటం కష్టం.  నాకు నీ ఆశీస్సులు కావాలి తల్లి…. నిండు ముత్తైదువు వయోవృద్ధురాలు ఆశీస్సులు దొరకడం చాలా కష్టం.  ఏమనుకోకపోతే నీ పాదాలు నేను తాకుతాను. 


వృద్ధాప్య స్త్రీ:- ఆశీస్సులు తీసుకుంటాను అంటే నాకేముంది….. నాలో దైవత్వాన్ని చూస్తాను అంటే నాకేమైంది..


అనేసరికి…. ఆమె పాదాలు తాకుతూ ఉండేసరికి…. ఏదో తెలియని అనుభవ అనుభూతి కలుగుతూ ఉండేసరికి….


నీలో  అహంకారం పోయింది తల్లి!  సర్వస్య శరణాగతి అని చెప్పేసి నా పాదాల మీద పడ్డావు కదా!  ఇదిగో నా ఎంగిలి తింటావా? అని తాంబూలం పిడత తీయబోతుంటే….


శివ నందిని:- అంతకన్నా భాగ్యం ఏముంది తల్లి… ఒక నిండు ముత్తయిదువ  ఆశీస్సులు ఈ పిడత ద్వారా అందుతాయేమో అని నోరు తెరిచేసరికి….


వృద్ధాప్య స్త్రీ:- అదృష్టవంతురాలివి తల్లి… అడిగిమరీ నా ఎంగిలి తింటున్నావు. ఏమాత్రం ఆలోచించట్లేదు అని…. 


ఆ నోట్లో  పిడత వేసి వేయంగానే ఒక విధమైన యోగం మత్తు …. అలవికాని ఆనంద స్థితి…చెప్పలేని ఆనంద స్థితికి… వెళుతూ ఆమె పాదాలకు నమస్కారం చేస్తూ ఉండేసరికి….ఆ వృద్ధురాలి పాదాలు కాస్త యవ్వనవతి పాదాలుగా కనిపించేసరికి…. కాలి అందెలు కనిపించేసరికి… అప్పటిదాకా లేని కాలి అందెలు ఎలా కనిపించాయి అనుకునేసరికి…. ఒక్కసారిగా కళ్ళు పైకి లేపి చూసేసరికి…. సాక్షాత్తు ఆ ముత్తయిదువ అవ్వ కాస్త కామాక్షి అమ్మవారిగా సజీవమూర్తిగా కనిపించేసరికి…. అమ్మ వృద్ధ స్త్రీ రూపంలో ఆఖరి అవకాశం రూపంలో నువ్వు నన్ను అనుగ్రహించావా తల్లి..!  ధన్యోస్మి తల్లి..!  అంటూ ఉండేసరికి మొదట లలితాదేవి భంగిమలో కూర్చుని ఆశీర్వాదం ఇవ్వడం…. ఆ తర్వాత రాజరాజేశ్వరి భంగిమలో కూర్చుని ఆశీర్వాదం ఇవ్వడం…. ఆ తర్వాత కామాక్షి దేవి భంగిమలో కూర్చుని ఆశీర్వాదం ఇవ్వడం చేస్తూ….. ఇప్పటికి నువ్వు జయం పొందావు తల్లి!  నాలో దైవత్వాన్ని చూసావు.  నీలో అహంకారాన్ని తీసేసావు. ప్రతి మనిషిలోనూ మానవత్వాన్ని చూసి నాకు సహాయ సహకారాలు అందించావు అంటూ ఉండేసరికి…. ఆవిడ కాస్త ఆమెను గర్భగుడిలోకి తీసుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఈమెను చూస్తున్న మహాస్వామి కనిపించారు. అమ్మ!  నీ కోసమే ఎదురు చూస్తున్నాను . ఆ అమ్మాయిని కూడా తీసుకువచ్చావా! ఆ అమ్మాయికి నీకు పెద్దగా తేడా ఏమీ లేదు. నీ అంశ యే. నీ సాధనను ఈ అమ్మాయి చేత చేయించాలని అనుకుంటున్నావు… ఉన్నది ఒకటే కదా!  ఇద్దరు కాదు కదా!  నువ్వే ఈ పిల్ల రూపంలో సాధన చేస్తున్నావు… సాధన చేసేది శివుడే కదా!  శివుడు శివుడిని తెలుసుకుంటున్నాడు… నీలో ఉన్నది శివుడే కదా ! తెలుసుకోవాలి…. సాధన చేయాలి అనుకుంటున్నాడు అనేసరికి…. ఈ విషయం కూడా నీలో ఉన్న శివుడే కదా చెబుతున్నది అనేసరికి…. అవును తల్లి…. శివుడు కానిది ఎవరు?  అని మహాస్వామి అనేసరికి శివ నందిని వంక చూస్తూ…. పిల్ల!  నువ్వు సాధన పరిసమాప్తి చేయాలి. నేను పూర్ణ మోక్షం పొందినప్పటికీ…. నాలో నేను లేకపోయినప్పటికీ….నేను ఉన్నాను అని నాలో శక్తులు చూపిస్తున్నాయి.  లేనిది ఉన్నట్టుగా…. చూపిస్తున్నాయి అని నీకు  ఇప్పటికే రుద్ర స్వామి చెప్పాడు.  నాలో ప్రకంపనాలు ఇస్తున్నాయి. అప్రకంపనాలు నువ్వు ఆపాలి…ఆ శరీరాలని ఆపాలి. అది శివుడు నీ చేత చేయిస్తూ ఉంటాడు… శివ స్వామి ఎవరో కాదు… సాక్షాత్తు శివుడే… నీ చేత దగ్గర ఉండి చేయిస్తాడు… మీ ఇద్దరూ నాకు వేరు కాదు.  మీ ఇద్దరు నాలోనే అంశలే… నాలోని శివుడు శివ స్వామి అయితే…. నాలోని దేవి అంశ నువ్వు.  మీ ఇద్దరికీ తేడా లేదు… మీ ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం.  ఆయన సాధన పరిసమాప్తి చేసుకున్నాడు.  నువ్వు కూడా సాధన పరిసమాప్తి చేసుకో!  దానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను.  నాలో ఉన్న అతీంద్రియ శక్తులను మానవతీత శక్తులను గుర్తించు.  వాటిని దాటు.  వాటి శక్తిని నువ్వు పొందు అని చెప్పి అనేసరికి… ధన్యోస్మి తల్లి! నీ అనుగ్రహం ఉంటే సాధించనిది లేదు.  అయినా నేను సాధన చేయడం లేదు….సాధన చేసేది నువ్వే కదా!  ఈరోజు నుంచి నా జీవాత్మ పోయింది. నాలో ఉన్నది నువ్వే అని అనుభవ అనుభూతి నువ్వు స్థిరం చేయి అనేసరికి….. అప్పుడు కామాక్షి దేవి కాస్త తన నా నాభిలో ఉన్న ఆత్మశక్తిని శివ నందిని యొక్క బ్రహ్మ రంధ్రము తెరిపించి సహస్ర కమలంలో స్థిరపడేటట్లుగా చేసేసరికి ….అక్కడితో నేను అనే జీవం కాదు శివం అని చెప్పేసి అనుభవం అనుభూతి పొందడం  కనిపించింది.  అప్పుడు కామాక్షి దేవి కాస్త 18 భాగాలుగా విడిపోయినట్లుగా  లీలామూర్తిగా నిజరూప దర్శనం ఇచ్చింది. అనగా దంతాల్లో ఒక దేవత, వక్షస్థలంలో ఒక దేవత, తొడ భాగంలో ఒక దేవత, నాభి యందు కామాక్షి దేవి స్వరూపం, ఎడమ చేయిలో ఒక దేవత, కుడి చేతిలో ఒక దేవత, ఎడమ కాలిలో ఒక దేవత, కుడి కాలిలో ఒక దేవత, తలలో ఒక దేవత, కళ్ళల్లో ఒక దేవత, పెదవుల మీద ఒక దేవత, ముక్కులో ఒక దేవత, హృదయంలో ఒక దేవత, ఇలా 18 రకాల అష్టాదశ శక్తి రూపాలుగా …..అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నట్లు అంటే …మీఆత్మ శరీరం కాస్త 18 భాగాలుగా ఏర్పడటం…. ఆ 18 భాగాలు కూడా 18 ఆత్మలుగా మారడం అనేది ….ఈ 18 ఆత్మల స్పందన వల్లే ఈ అమ్మవారు కదులుతున్నట్లుగా లోకానికి కనపడుతుంది అని చెప్పేసి ఆమెకి అనుభవం అనుభూతి కలిగింది. 


 ఇంతలో అమ్మవారి శరీరం నుంచి ఏకాదశ దేహాలు ఒక్కొక్కటిగా రావటం మొదలయ్యింది.. మొదటగా అరుణాచల క్షేత్రంలో అపితకుచాంబికా దేవి బాలగా కనబడింది …రెండవది శ్రీశైలంలో త్రిపుర సుందరీ దేవి….మూడవది కాశీ క్షేత్రంలో విశాలాక్షిగా ….నాలుగవది ఉజ్జయిని మహాకాళి సజీవ మూర్తిగా …సజీవ మూర్తిగా ఆ తర్వాత  వారాహి తర్వాత హయగ్రీవి ,ఆ తర్వాత మధుర మీనాక్షి, శ్యామలాదేవి కనిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత లక్ష్మీదేవి, మహా సరస్వతి, మహిషాసుర మర్దిని,  భైరవి మూర్తి, అన్నపూర్ణాదేవి ఇలా 11 దేహాలలో 11 మంది సజీవ మూర్తులుగా కనిపించేసరికి ….అంటే అమ్మవారి యొక్క ఏకాదశ శక్తులు 11 ఏకాదశ దేహాలు….. అష్టాదశ శక్తులు 18 వీళ్ళందర్నీ బంధనం చేస్తే కానీ అమ్మవారు పూర్ణ మోక్షం పొందిందని లోకానికి తెలియదు.  అంతవరకు అమ్మవారు మోక్షం పొందలేదు.. స్త్రీ మూర్తి మోక్షం పొందలేదు అని అజ్ఞాన మాయలోనే శక్తులు ఉంచుతాయని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  ఆ తర్వాత ఉన్నట్టుండి అప్పటిదాకా ఉన్న చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు అదృశ్యం అయ్యేసరికి….అప్పుడు కామాక్షి దేవి కాస్త అమ్మాయి!  ఇంక  నీకు నాకు ఇసుమంత కూడా తేడా లేదు. సాధన చేసేది నేనే…. చేయించేది నేనే ……జ్ఞానం పొందేది నేనే….. సాధన పరిసమాప్తి చేసుకోవాల్సింది నేనే…. కాబట్టి నీకు విషయం అర్థమై ఉంటుంది.  దేహం మాత్రమే నీది. ఇప్పుడు నీ జీవాత్మ కాస్త నా అంశతో నా ఆత్మగా పరమాత్మగా మారిపోయింది.. అని అర్థమై ఉంటుంది. 


ఇక నువ్వు పొందవలసింది నా వంతు సహాయ సహకారాలుగా శివుడిని నేను తెలిసో తెలియకో మట్టి శివలింగంగా బంధనం చేయడం జరిగింది.  కానీ నిజానికి ఆయన మోక్షం పొందుతాను అని సాధన చేస్తూ ఉండేసరికి నాకు విపరీతమైన భాధ, భయం వేసింది.  సజీవ మూర్తిగా ఉండి మాయలో ఉంటూ… ఈ జగన్నాటకంలో ఉండవచ్చు కదా అనిపించింది.  ఆయనేమో సాధన చేసి శూన్యం అవ్వాలనుకున్నాడు.  హాయిగా బతికే ఉంటే బాగుండేది కదా అనిపించింది.  నేను కొన్ని వేలకోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాను.  ఆయన నా వల్ల రూపాంతరం చెందకుండా అలాగే ఉంటూ…..నేను రూపాంతరాలు చెందుతూ పునః జన్మలు ఎత్తుతూ ఎత్తిన రూపాలు ఎత్తుతూ…. చేసిన పనులే చేస్తూ మాయలు పొందుతున్నాను. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి చేసిన పనే చేస్తున్నాను… ఇన్నాళ్లు బ్రతికే ఉండడమే వరం అనుకున్నాను… ఇప్పుడు మరణం అనేది శాపం అని భావన చేశాను.  ఇప్పుడు అర్థమైంది…. మరణమే వరమని గ్రహించడానికి నాకు ఇంత సమయం పడుతుంది.  నిజానికి ఆదిరుద్రుడు చేసింది సబబే. ఆయన ఒక యుగం వరకు ఉండి ఇది అంతులేని కథ అవుతుందని…. కోరికలు ఎన్నటికీ తగ్గవు…. పెరుగుతూ ఉంటాయని…. ఆ కోరికల కోసం భావ శరీరాలు, స్వప్న శరీరాలతో రూపాంతరాలు చెందవలసిందే …. పునః సృష్టి చేస్తూ ఉండవలసిందే …. పునః కర్మ జన్మలు ఎత్తుతూ ఉండవలసిందదే…..ఈ జగన్నాటకంలో వేసిన పాత్రలు వేస్తూనే ఉండాలి…. వేసిన దృశ్యాలు చూస్తూనే ఉండాలి…. అనే అనుభవ జ్ఞానము పొందడంతో….నేను ఇమడలేను, నేను ఉండలేను… ఈ భావ ప్రపంచంలో నా వల్ల కాదు అని….ఆయన శూన్యం అవడం కోసం సాధన చేస్తూ ఉండేసరికి…. పురుష ప్రకృతిలో సరే స్వామి ! అని నేను అనుమతి ఇచ్చాను.  అదే నేను స్త్రీ ప్రకృతి పరంగా వచ్చేసరికి ఆయన్ని వదిలిపెట్టలేకపోయాను…. పిల్లల్ని వదిలిపెట్టలేకపోయాను…. మోహమాయలో పడిపోయాను…. చక్కగా హాయిగా సజీవ మూర్తిగా బతకకుండా మరణాలు పొందుతాను….. వెళ్ళిపోతాను అనేసరికి…. నాకు మరణం శాపం అనిపించింది మరణ భయం మొదలయ్యింది… మృత్యుమయం మొదలయ్యింది… చావు అంటే ఒక విధమైన భయం మొదలయ్యింది… ఆయన చస్తాను అంటే చావనివ్వకుండా 14 వస్తువులతో 14 బంధనాలు వేసేసి….. ఆయన్ని మోక్షం పొందనివ్వకుండా మీరు ధ్యానం చేసుకుంటూ నా కళ్ళముందు కనిపించండి అని చెప్పేసి…. 14 బంధనాలతో బంధించడం జరిగింది. 


ఆయన ఆనాటి నుండి స్థిరంగా ఉండి ధ్యాననిష్టలో ఉన్నాడు.  మోక్షాన్ని పొందలేదు.  నా పాటికి నేను రూపాంతరాలు చెందుతూ ఉన్నాను.  మార్పులు చెందుతూ ఉన్నాను.  ఎత్తిన రూపాలే ఎత్తుతున్నాను.  ఎత్తిన జన్మలే  ఎత్తుతున్నాను. ఎప్పుడు చూసినా అవే మోహమాయలు… అవే ప్రేమలు…. అవే ఆప్యాయతలు… అవే విరహవేదనలు…. అవే కష్టాలు… అవే సుఖాలు…. అవే లాభనష్టాలు…. అంతకుమించి ఇంకేమీ అనిపించలేదు.  నాకు కూడా రాను రాను ఎన్ని పదార్థాలుతిన్నా ….అదే రుచి ఉండటంతో రుచిలో మార్పులు లేకపోయేసరికి…. నాకు రానురాను వైరాగ్యం మొదలయ్యింది.  నాకు వైరాగ్యం వచ్చేసింది. నేను ఇప్పుడు మోక్షం పొందాలి అనుకుంటే నాలో ఉన్న దైవీక శక్తులు మోక్షం పొందనివ్వకుండా ఆపేస్తున్నాయి. ఎలాగోలా నేను పూర్ణ మోక్షం పొందే స్థితికి కంచి నుంచి అరుణాచలం దాకా వెళ్లడం జరిగింది. కానీ నేను పూర్ణ మోక్షం పొందిన విషయం లోకానికి తెలియనివ్వకుండా….నాలో ఉన్న ఇప్పుడు నువ్వు చూసిన శక్తులు అన్నీ కూడా…  ఏకాదశ దేహాలు అలాగే అష్టాదశ శక్తి పీఠాల శక్తులు…. నన్ను పూర్ణ మోక్షం పొందినప్పటికీ కూడా…. నేను శూన్యం అయినప్పటికీ కూడా….నేను శూన్యం కాలేదు. పూర్ణ మోక్షం పొందలేదు అని చెప్పేసి లోకానికి చూపిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆ విషయం నిజమా కాదా? ఏది సత్యమో  తెలుసుకోవలసి ఉంటుంది.  నేనైతే మోక్షం పొందాను అని నాకు తెలుసు.  నేను తెలుసుకోవడం జరిగింది. అందులోనూ శూన్యం అయ్యాను అని అనుభవం అనుభూతి పొందాను.  అది నా సత్యాన్వేషణలో కామాక్షిగా శివుడిలో ఐక్యమయిపోవడం జరిగింది….శూన్యంలో ఐక్యం అయిపోవటము జరిగింది. కాకపోతే ఇది  జరగలేదు…. అని నాలో శక్తులు ప్రకటితం చేస్తున్నాయి.  లేని దానిని ఉన్నట్లుగా భ్రమ, భ్రాంతి కలిగిస్తున్నాయి.  తద్వారా లోకంలో పునః సృష్టి జరుగుతుంది.  లేనిది ఉన్నట్లుగా పునః సృష్టి చేయటమే ఈ ప్రకృతి యొక్క లక్ష్యము అని నాకు అర్థం అవుతుంది. నాలో ఉన్న నా శక్తులే నాకు ఎదురు తిరుగుతున్నాయి. కాబట్టి ఆ శక్తులను ఎలా బంధనం చేయాలో ….అని చెప్పేసి నా రూపంలో ఉన్న పరమేశ్వరుని అడిగేసరికి…. నీ రూపంలో సహాయ సహకారాలు నాకు అందించటం జరిగింది. నీ దేహంలో నా సాధన పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.  నా దేహంతో సాధన పరిసమాప్తి అయింది.  అది లోకానికి తెలియాలి. నీ అనుభవ జ్ఞానంతో నేను పొందానో… లేదో నాకు తెలియాలి. చచ్చేవాడికి వాడు ఎప్పుడు చస్తాడో తెలుసు కానీ…. చచ్చిన విషయం తెలియదు కదా ! అలాగే నేను మోక్ష మరణం పొందే విషయం నాకు తెలియదు.  కానీ మోక్ష అనుభూతిగా నా మోక్షం మరణం  చూడడం జరిగింది.  కానీ అది లోకానికి చెప్పలేకపోయాను. అది చెప్పనివ్వకుండా నా శక్తులు నన్ను ఆపివేసినాయి. నువ్వు ఆ శక్తులన్నింటినీ కట్టడి చేసి ఎలా అదుపు చేయాలి…. ఎలా ఆపాలి…. అనేది నీలో ఉన్న శివుడు చెబుతాడు.  ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నేను పూర్ణ మోక్షం పొందాను అని చెప్పేసి…. నాకు అనుభూతి కలిగితే…. అది నేను పొందగలిగితే….. అప్పుడు నేను ఉన్నానో లేదో అనేది నాకు తెలుస్తుంది.  లోకానికి తెలుస్తుంది . అదే నువ్వు చేయవలసిన సాధన లక్ష్యం.  దీనికి ఈ శివలింగ బంధ విముక్తి చేయడానికి నీకు కావలసిన మట్టి శివలింగమును ఇస్తాను అని….ఇక్కడే కూర్చొ అని ఆ కామాక్షి దేవి కాస్త ఆ పక్కనే ఉన్న బిలాకాశం లోకి సూక్ష్మ శరీరంతో లోపలికి వెళ్ళిపోతూ ఉండేసరికి సశరీరంతో ఉన్న శివ నందిని కాస్త కల్లార్పకుండా ఆ రంధ్రం కేసి చూస్తూ నమస్కారం చేసేసరికి కొన్ని క్షణాల తర్వాత ఆవిడ ఒక మట్టి శివలింగంతో లోపలి నుంచి బయటకు రావటం జరిగింది. 


ఇదిగో తల్లి ….ఇదే నువ్వు కోరుకున్న శివలింగం . నేను ఆదిలో తెలిసో తెలియకో ఈ పరమేశ్వరుని నా  చేతులతో మట్టి శివలింగముగా చేసి…లింగ బంధనం చేయడం జరిగింది. ఈ సూత్రమును తెలుసుకొని కొంతమంది యోగులు అష్టదిక్కులలో అష్ట శివలింగాలు పెట్టి బంధనం చేయడం జరిగింది. ఇదంతా కూడా నా లీలా విధివిన్యాసమే… అంతెందుకు అరుణాచలంలో కూడా నువ్వు గమనించినట్లయితే, నేను చేతుల్లో శివలింగమును పట్టుకొని అగ్నిలోకి దూకిన అగ్నికామాక్షి దేవి ఆలయం ఉంటుంది.  అలాగే ఆయన గుడి చుట్టూ కూడా నేను అష్టదిక్కులలో ప్రతిష్టించిన అష్టదిగ్బంధన శివలింగాలు కూడా నువ్వు చూసి ఉంటావు.  అది నా అవివేక అజ్ఞానముతో మోక్షం పొందకుండా చేశాను. మరణమే శాపం అని నాకు అర్థం అయింది.  అదే వరమని ఇప్పుడు గ్రహించాను.  అందుకోసమని నాకు మోక్షమును ప్రసాదించు తల్లి…. మోక్షం పొందానని పూర్ణజ్ఞానం నాకు అనుగ్రహించు అని వేడుకోవడంతో…. అందుకు నీ శరీరానికి అర్హత, యోగ్యత, యోగం ఉండటంతో…. వివిధ దేవతలు, గురువులు నీకు పరీక్షలు చేసి…. నిన్ను ఇక్కడిదాకా తీసుకురావడం జరిగింది కాబట్టి… సాధన చేసేది నీ శరీరము సాధన చేయించేది…. స్థితిని పొందేది… నా శరీరం అనుకో ! నీకు  నాకు తేడా లేదు.  నా ఆత్మ శక్తి నీలో ప్రవేశించింది.  ఇక నువ్వు అంటూ ఉండదు… ఉన్నదంతా నేనే… సాధన చేసేది కూడా నేనే… నేను ఇక పొందుతానా లేదా అనేది కాల నిర్ణయం. విధి లిఖితం. అది శివాగ్నే.  శివుడు ఏం చేస్తాడో అనుకొని ఉండేసరికి …..తన చేతిలో మట్టి శివలింగం అపురూపంగా చూసుకుంటూ…ధన్యోస్మి తల్లి!  నేను కానీ నేను ఉన్నానని నాకు అర్థం అయింది.  నువ్వే ఉన్నావని నాకు అర్థం అయింది . జీవాత్మ కాస్త పరమాత్మగా మారింది.  ఇక ఇంతకన్నా భాగ్యం ఏముంది… ఇక సాధన గురించి నేను మనోవేదన పొందాల్సిన అవసరం లేదు.  ఏం చేయాలో… ఏం పొందాలో అనేది కాలమే నిర్ణయిస్తుంది.  నువ్వన్నట్లు పూర్ణ మోక్షం పొందినప్పటికీ నీకు తెలియకుండా లోకానికి తెలియకుండానే శక్తులు చేశాయని అర్థం అయ్యింది.  ఆ శక్తులను బంధనం చేయాలా…! ఎలా చేయాలో అనేది శివాజ్ఞ . శివుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేసి పెడతాను.  నువ్వు నీ జీవాత్మ శక్తితో భక్తులను అనుగ్రహిస్తూ ఉండు.  నీ ఆత్మ శక్తితో నేను సాధన చేసుకుంటూ …..మోక్ష అనుభవాలు నీకు ఎప్పటికప్పుడు అందేటట్లు జరుగుతూ ఉంటాయి… ఎందుకంటే నాలో ఉన్నది నువ్వే కాబట్టి…. నువ్వే ఏ విధంగా సాధన చేసుకోవాలో ….ఏ విధంగా అనుభవాలు పొందాలో…. ఈ సాధన శరీరం మీకు ఉపయోగపడుతుంది.  పరోక్షంగా నీ సాధన నువ్వే చేసుకుంటున్నావు.  ప్రత్యక్షంగా నువ్వు ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నావు అనేసరికి…. అలాగే చేస్తాను అని ఉన్నట్టుండి… ఆవిడ కాస్త సజీవ మూర్తి కాస్త విగ్రహ మూర్తిగా మారేసరికి… ఆమె పాదాలకి నమస్కారం చేసుకొని…. శివలింగం తీసుకొని శివ నందిని గుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న సాధనా కుటుంబానికి మట్టి శివలింగం చూపించేసరికి …..అమ్మ అనుగ్రహించిందా!  వృద్ధాప్య స్త్రీ మూర్తి అమ్మవారా!  అని మహాదేవి అనేసరికి అవును అని సైగ చేసింది. 


రుద్ర స్వామి:- అవునులే… నాలో ఇసుమంత గర్వ అహంకారము ఉన్నాయి.  లేశమాత్రంలో ఉండటం వలన… ఆవిడ నాకు దర్శనం ఇవ్వలేదు 


మహాదేవి:- మరి నాకెందుకు దర్శనం ఇవ్వలేదు…


రుద్రస్వామి:- నీలో  మృత్యుభయం  ఉంది.  చావు భయం ఉంది. ఆవిడ చూస్తే ఎక్కడ చచ్చిపోతుందో కుటుంబ సభ్యులు వచ్చి తిడతారు భయపెడతారు అని చెప్పేసి ఆలోచన చేశావు. శివ నందిని మాత్రం ఏం జరిగినా పర్వాలేదు అని విడిచిపెట్టింది.  తెగించిన వాడికి తెడ్డే గతి అని… అందుకనే దైవం వెంట ఉంది . పోతే ప్రాణాలు పోతాయి…. ఉంటే అమ్మవారి దర్శనం అవుతుంది…. అనే మానవతా దృష్టితో వెళ్ళింది అంతేగాని… ఆవిడేదో అది పరాశక్తి అని వెళ్లలేదు.  ఆ వృద్ధ ఆవిడ నానమ్మ, అమ్మమ్మ అనుకుని వెళ్ళింది.  ఆ మానవతా సేవ చేయడానికి నేను అహంకరించాను.  అందుకని మనకి దగ్గరలో ఉన్నా కూడా అమ్మవారి దర్శనం అవ్వలేదు.  తనకి మానవత్వం చూపించడం వలన అమ్మవారి దర్శనం ఇచ్చింది.  మానవత్వం దాటిన వాడికే కదా యోగత్వం, దైవత్వం వచ్చేది అనేసరికి…అర్హత, యోగ్యత, యోగం అంటే ఇదే కాబోలు.. అర్హత ఉన్నవాడికి స్మశానంలో కూర్చున్న కావలసిన వస్తువు కావలసిన వ్యక్తికి  వస్తాయి.  లేని వాడు మన పక్కన కూర్చున్నా కూడా అది గుర్తించలేము. అందుబాటులోకి రాదు… అని ప్రత్యక్షంగా అర్థం అయ్యింది.. అని చెప్పేసి మట్టి శివలింగమును అపురూపంగా అందరూ తాకి నమస్కారం చేశారు . 


రుద్రస్వామి:- అమ్మ ఈ మట్టి శివలింగం నీ శరీరంలో అంతర్దానం చేసుకో!  కృష్ణ స్వామి మరియు యోగాంబికకి ఈ విషయం తెలిస్తే పెను ప్రమాదం కలుగుతాయి …


శివ నందిని:- అప్పుడు శివనందిని కాస్త ఆ భయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.  కామాక్షి దేవి శక్తి స్వరూపం నాలోకి ప్రవేశించింది.  సహస్ర చక్రంలో నిక్షిప్తం అయింది .


రుద్రస్వామి:- తల్లి!  ఒక విషయం తెలియట్లేదు.  దైవం మానవ శరీరంలోకి వచ్చింది అంటే…. ఆమె మానవ స్త్రీగా ప్రవర్తిస్తుంది కానీ దేవతా స్త్రీగా ప్రవర్తించలేదు.  దైవిక శక్తులు, దైవిక శక్తులు ఆమెలో ఉండవు. ఒక సాధారణ స్త్రీ మూర్తి ఏ విధంగా కష్టాలు ,నష్టాలు పడుతుందో… అమ్మవారు కూడా మానవ శరీరం తీసుకుంటే అంతే కష్టనష్టాలు పడుతుంది. ఇప్పుడు శ్రీరాముడు కూడా దైవాంశసంభూతుడే… మానవ జన్మ ఎప్పుడైతే ఎత్తాడో…మానవుడి కష్టనష్టాలు ఆయన పొందాడు  కదా!  విరహవేదనలు పొందాడు కదా!  కన్నీళ్లు వచ్చినాయి కదా!  రాజ్యాధికారం పోయింది…. వనవాసం చేశాడు కదా!  ఇవన్నీ కూడా మానవ జన్మ ఎత్తితే అవన్నీ జరగాలి… బుద్ధికి అనుగుణంగా నడవాలి.  విధిరాతను దాటడానికి దైవానికి కూడా అధికారం లేదు అని చెప్పేసి అనేసరికి…. అవునా అంటే ఈ దేహంలో అమ్మవారి శక్తి ప్రవేశించింది. మానవ మాతృరాలుగా ఆవిడ మళ్ళీ సాధన చేస్తుంది.  తన మరిచిపోయిన సాధనను… మరిచిపోయిన జ్ఞాపకాలను… మరిచిపోయిన జ్ఞానస్పురణలను గుర్తు చేసుకుంటుంది.  అది లోకానికి చెబుతుంది.  తనలో సాధనలో వచ్చిన లోపాలు అన్నీ కూడా సరిచేసుకుంటుంది.  అంతేకానీ అంతకుమించి ఏమీ లేదు…ఉండదు… నాలో అమ్మవారు ఉందని మాయలు, మర్మాలు ఉండవు అనుకోవద్దు.  అహంకారంలోకి వెళ్ళకు. నిజానికి నీకు అమ్మవారికి తేడా లేదు.  కాకపోతే అమ్మవారు నీ దేహంలోకి ప్రవేశించింది.  నువ్వు మానవ స్త్రీ గా  గానే ఉన్నావు.  ఆమె కూడా మానవ స్త్రీగా మారింది.  ఆవిడ పరమాత్మ స్వరూపిణి కాస్త జీవాత్మగా మారింది. ఇక నీ జీవ శక్తికి,  ఆత్మ శక్తిని అనుసంధానం చేసింది.  అందుకని నేనే దేవత అని… నేనే దైవాన్ని అని…. అహంకరించకు.  తెలియకుండానే దైవాహంకార మాయలో పడతావు . నీ ద్వారా అమ్మవారి సాధన ఆగిపోతుంది.  ఇక్కడ అమ్మవారు లేదు… నువ్వు లేవు అని గ్రహించు.


శివ నందిని:- అర్థమయింది అయ్యా!  నేను సాధనలో చేస్తున్న తప్పేమిటో ఆదిలోనే అర్థమయింది.  చేసేది చేయించేది అమ్మవారే ….అనుభవించేది అనుభవాలు పొందేది కూడా అమ్మవారే అని అర్థం అయింది.  నేను అనేది ఉండదు…నేను కానీ నేను ఉంటుంది.  కాకపోతే  అమ్మవారు మానవ స్త్రీగా సాధన చేస్తుంది.  దైవిక శక్తులు ఉండవు అని అర్థం అయింది.


  సరే అని ఆ శివలింగమును తనలోనే మట్టి శివలింగం నిక్షిప్తం చేసుకోవాలని అనుకుంటూ ఉండేసరికి… తన చేతుల మీద ఒక పదునైన కత్తి కనిపించేసరికి… ఎవరా అని చూస్తే యోగాంబిక తన చేతులు నరకడానికి కత్తిని పెట్టింది…. అని  గ్రహించింది. రుద్ర స్వామి మరియు మహాదేవి నిశ్చేష్టులై ఉండిపోయారు.  శివ నందిని వాళ్ళని చూడగానే ఈ యోగాంబికా మరియు కృష్ణస్వామి వీళ్ళని స్తంభన చేశారు అని అర్థం అయింది. పిల్లలు ధ్యానంలో ఉండిపోయారు . భక్తులు ఎవరికి వాళ్లే నిల్చుండి పోయేసరికి…. అందరిని స్తంభన చేశారు… ఈ మట్టి శివలింగం తీసుకొని వెళ్ళటానికి  వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి…. ఇప్పుడు ఏం చేయాలో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు అమ్మ తల్లి!  కామాక్షి దేవి….నువ్వు ఇచ్చిన శివలింగమును తీసుకువెళ్లాలని నీలో ఉన్న వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి.నేను మానవ మాతృరాలిని.  నువ్వే ఈ శివలింగాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకునేసరికి….…. నాకు నీకు తేడా లేదు కాబట్టి… మీ మానవ ప్రయత్నం నువ్వు చెయ్యి… దైవ ప్రయత్నంగా నేను నీకు తోడు ఉంటాను.  అంతేగాని దీపం ఆరిపోకుండా నువ్వు చేతులు అడ్డు పెట్టాలి కదా!  మానవ ప్రయత్నం చేయాలి కదా!  ఏ ప్రయత్నం చేయకుండా నువ్వే కాపాడు తల్లి అంటే కుదరదు కదా!  అనేసరికి సరే తల్లి…. అనేసరికి  ఎదురుగా కృష్ణస్వామి గాల్లో నుంచి కనపడి…


కృష్ణస్వామి:-  ఈ శివలింగం కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.ఈ మట్టి శివలింగాన్ని ముక్కలు చేసేస్తాను …


అతను కాస్త పిడికిలి బిగించి …మట్టి శివలింగం మీద చేతులు వేస్తూ ఉండేసరికి….ఉన్నట్టుండి మట్టి శివలింగం కాస్త అదృశ్యం అయ్యేసరికి ఆశ్చర్యం వేసింది . ఏం జరిగింది అనుకునేసరికి…. శివ స్వామి చెప్పిన మంత్రమును క్షణకాలం ఆలస్యం చేయకుండా శివ నందిని చదువుతూ ఆ  మట్టి శివలింగమును తన శరీరంలో నిక్షిప్తం చేసుకున్న విషయం గ్రహించేసరికి…. కృష్ణస్వామి మరియు యోగాంబికా కాస్త దీనికి అదృశ్య సిద్ధి కూడా ఉన్నది.  వస్తువును తనలో నిక్షిప్తం చేసుకున్నది . ఇక ఆ వస్తువు తిరిగి రాదు.  దీనికి ఈ శక్తులు ఉన్నాయన్న విషయం మనం అంచనా వేయలేదు.  తక్కువగా ఆలోచించాము అనేసరికి చ…..దీనికి ఈ అదృశ్య శక్తి ఇచ్చింది ఎవరు?  అంటే ఇంకెవరు శ్రీశైల వాసి…తన దీక్ష గురువైన  శివ స్వామి ఇచ్చి ఉంటాడు అని…. యోగాంబిక అనేసరికి అవును ఆయనే ఇచ్చాడు.  ఈ అదృశ్య సిద్ధి ఇది పొందిన విషయమే నేను గ్రహించలేకపోయాను.  అబ్బా….. చేతులారా వచ్చిన అవకాశం పోయింది కదా!  ఇక మట్టి శివలింగం తన శరీరంలో నిక్షిప్తం చేసుకుంటుందని నేను ఊహించలేకపోయాను అమ్మ!  అని యోగాంబికతో అనేసరికి మనం దీనిని తక్కువ అంచనా వేసాము.  అయినా ఇప్పుడు మనం దీని శరీరాన్ని విభేదన చేయలేము.  కారణం కామాక్షి దేవి అదృశ్య స్వరూపంలో శక్తిగా సహస్ర చక్రంలో నిక్షిప్తం అయింది కనపడుతుంది కదా ! ఆవిడ చూపుకే మనం నాశనం అయిపోతాము… మనం దేనికి పనికిరాకుండా పోతాము… ఈసారి అవకాశం చేయి జారిపోయింది.  ఈసారి అవకాశం వచ్చినప్పుడు వద్దాము… ఏదో ఒకచోట సాధనలో తప్పు చేయకుండా ఉండదా!  దీనికి ఏదో ఒక లోపం…. ఏదో ఒక తప్పు జరిగినప్పుడు వచ్చి దీనిని లోబరుచుకుందాము….అమ్మవారు అయినా కూడా దీనికి భంగం  కలిగిస్తే అమ్మవారు, అయ్యవారు సహాయ సహకారాలు ఇవ్వరు కదా!  ధర్మమును పట్టుకుని ఉంటే కదా!  ఈశ్వరుడు, ఈశ్వరి పట్టుకునేది.  దీని ధర్మం తప్పిస్తే సరిపోతుంది… సాధన ఆగిపోతుంది….తర్వాత వచ్చేది  స్వాధిష్ఠాన చక్రం కదా చూద్దాం…. అనుకునేసరికి సరే!  ఈ అవకాశం చేజారిపోయింది కదా ! అని వీళ్ళిద్దరూ అదృశ్యం అయ్యేసరికి…. శివ నందిని చిరునవ్వు నవ్వి ఓహో!  ఇదే అనుకుంటా సమయానికి స్పురణ రావడం అనేది ….ఇదే వివేకబుద్ధి ,విచక్షణ జ్ఞానం…. సమయానికి అదృశ్య మంత్రం గుర్తుకురావడంతో….వీళ్ళతో పోరాడాల్సిన అవసరం రాకుండానే క్షణకాలంలో శివలింగాన్ని శరీరంలో నిక్షేప్తం  చేసుకోగలిగాను . లేకపోతే పెద్ద యుద్ధమే రాద్ధాంతమే జరిగేది అని అనుకుంటూ ఉండేసరికి….ఎప్పుడైతే వీళ్లిద్దరూ అదృశ్యం అయ్యారో అప్పటిదాకా స్తంభనలో ఉన్న వీళ్లంతా కూడా మామూలు స్థితికి వచ్చి… రుద్ర స్వామి మహాదేవి కాస్త ఏమైంది… ఏం జరిగింది? మేము గాల్లో అలా ఉండిపోయాము… నిలబడిపోయాము…. 


శివ నందిని:- మీ అందరికీ స్తంభన విద్యతో వీళ్ళిద్దరూ  వశపరుచుకున్నారు…


మహాదేవి:- ఓహో!  మోహన స్థంభన విద్య చేసి ఉంటాడు.  తంత్రంలో కూడా వీళ్ళకి సిద్ధులు ఉన్నాయన్నమాట! 


రుద్రస్వామి:-  సిద్ధ పురుషులకి తంత్రం ఏముంది… మంత్రం ఏముంది… యంత్రం ఏముంది …..అన్నిటిలోనూ సిద్ధి పొందిన వాళ్లే…….ఏదో ఒక తంత్రంలో విద్యను తెలుసుకున్న వాళ్ళే… మూలాలు తెలుసుకున్న వాళ్ళు…వాళ్ళకి నీకు చాలా తేడా ఉంటుందిలే!  వాళ్లకి తెలియని సిద్ధి అంటూ ఉండదు. 



ఇంతకీ ఏమైంది ఎలా చేశావు? ఎలా దాటుకున్నావు అనేసరికి శివ నందిని ఉన్నదంతా చెప్పేసరికి…. సరే యధావిధిగా నీ శరీరంలోనే ఉంచు. ఆ అదృశ్య శక్తి ద్వారా వస్తువులను తిరిగి తీసుకోవచ్చు . శివుడు ఎలా చేస్తే అలా జరుగుతుంది . 


శివ నందిని:- సరే ఇప్పుడు తక్షణ కార్యం ఏమిటి అయ్యా! 


రుద్రస్వామి:- ఏముంది తల్లి! ఇప్పుడు మన దగ్గరలో ఉన్న సాధనా విగ్రహ మూర్తి ద్వారా మూల గణపతిని ఎడమ చేయి ఉన్న పద్మములో పెడితే… ఆయన చెబుతాడు.  ఎక్కడికి వెళ్లాలి?  ఏమి చేయాలి? అని మరి నాకు కూడా తెలియదు కదా!  


బాలగణపతి:- నేను పెడతాను… నేను పెడతాను…. నాకే దొరికింది కాబట్టి ఆ విగ్రహ మూర్తి నేను పెడతాను….


అనేసరికి ఆ అడుగు ఉన్న విగ్రహ మూర్తిని శివ నందిని శరీరంలో నుంచి బయటకు తీసి బాలగణపతికి ఇచ్చేసరికి… తన చేతి సంచిలో నుంచి రుద్ర స్వామి విగ్రహ మూర్తిని ఇచ్చేసరికి….. దానిని మామిడి చెట్టు కింద పెట్టగానే బాలగణపతి కాస్త అడుగు ఉన్న గణపతి విగ్రహ మూర్తిని సాధనా మూర్తి ఎడమ చేతిలో ఉన్న పద్మములో పెట్టేసరికి….ఉన్నట్టుండి మూలధార చక్రం దివ్య తేజస్సుతో…దివ్య కాంతితో… మూడుసార్లు తిరిగి ఆగిపోయేసరికి… 


రుద్ర స్వామి:- అమ్మ!  నీ మూలాధార చక్రం జాగృతి, శుద్ధి, ఆధీనం అయ్యింది కానీ… విభేదనం కాలేదు కదా! విభేదనం పొందడం అంటే మోక్షమున పొందటమే కదా!  మోక్షం పొందే సమయానికి విభేదం అవుతుంది. విభేదం అవ్వాలి అంటే నీ మూలాధార చక్రంలో ఉన్న స్థూల శరీరం కూడా జాగృతి, శుద్ధి , ఆధీనం అవ్వాలి.  కోరికలతో తిరుగుతున్న నీ స్థూల శరీరం కాస్త… స్వాధీనం అయ్యి మోక్షమార్గం వైపు వెళ్ళాలి 


శివ నందిని:- ఇప్పుడు నా స్థూల శరీరం నేనే కదా! 


రుద్రస్వామి:- నీ ప్రస్తుత స్థూల శరీరం ఇది . గత జన్మలలో నీ స్థూల శరీరం  వేరై ఉండవచ్చు కదా!  అవన్నీ లెక్కలు కూడా శివుడికి తెలుస్తాయి.  శివుడు ఒకచోట మూల స్థూల శరీరాన్ని దాచి ఉంచడం జరిగింది.  అది ఒక శివలింగంలో ఉంచడం జరిగింది. ఇప్పుడు అది నీకు నల్ల శివలింగ రూపంలో ఉంచడం జరిగింది.  ఆ నల్ల శివలింగం పొందితే గానీ మూలధార చక్రంలో ఉన్న నీ స్థూల శరీరం ఈ స్థూల  శరీరం జాగృతి అవ్వదు. అప్పుడు ఆ స్థూల  శరీరం అప్పటివరకు తెలిసి తెలియక చేసిన తప్పులు దోషాలు, కర్మ ఫలాలు అన్ని కూడా సాధనలో పరిసమాప్తి చేసుకోవాలి. సర్వకర్మలు, కర్మ ఫలాలు, కర్మ బంధాలు, ఋణ బంధాలు, ఋణ శేషాలు,  కర్మ శేషాలు లేకుండా చేసుకోవలసి ఉంటుంది.  ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నీకు స్థూల శరీర జాగృతి కోసం ఎక్కడికి వెళ్లాలి ఏంటి అనేది చెప్పొచ్చేమో…. అనుకుంటూ ఉండేసరికి…


ఈ సాధన విగ్రహ మూర్తికి ఉన్న మూలాధార చక్రానికి వెనక వీపు భాగంలో ఉన్న నల్ల శివలింగం కాస్త బయటకు పొడుచుకు వచ్చినట్లుగా అనిపించేసరికి…. ఈ విషయం గమనించిన కుమారస్వామి కాస్త 


బాల కుమారస్వామి:- అమ్మ! అమ్మ!  వీపు భాగంలో నల్ల శివలింగం గుర్తు, మూలాధార చక్రానికి వెనక వీపు వైపు ఉన్నది… బయటకు వచ్చింది చూడు… 


అనేసరికి అవునా అంటూ అందరూ విగ్రహ మూర్తి వీపు భాగాన్ని తన వైపు తిప్పుకొని చూసేసరికి …..మూలాధార చక్రానికి వ్యతిరేక దిశలో అంటే మూలాధార చక్రానికి ముందు భాగంలో ఉంటే…. ఆ 14 శివలింగాలు గుర్తులు వీపు భాగంలో ఉన్నాయి కదా!  అందులో మూలాధార చక్రానికి సంబంధించిన స్థూల శరీరానికి సంబంధించిన నల్ల శివలింగం గుర్తు బయటకు పొడుచుకు వచ్చేసరికి…. బాలగణపతి ఉన్నవాడు ఊరుకోక….శివలింగాన్ని అటు ఇటు ఊపుతూ ఉండేసరికి….. అందులో నుంచి శివలింగం రెండు భాగాలుగా అయ్యి,  దాని లోపల నిక్షిప్తంగా ఉన్న రాగి రేకు బయటకు రావడం జరిగింది. ఆ రాగి రేకు లోపల ఏముందని గట్టిగా చదవడం ఆరంభించాడు. అది ఏమిటంటే..


ప్రతిరోజు 101 మట్టి శివలింగాలతో ఆరాధన చేసిన చోట…

చచ్చినవాడు బతికిన చోట….

పుత్ర శోకం విముక్తి పొందిన చోట….

సంతానం లేని వారికి సంతానం దొరికిన చోటు..

నా భక్తురాలి పేరుతో ….నా భక్తురాలి కోసం నేను వెలసిన చోటులో….

నల్ల శివలింగం రూపంలో….

 నీకోసం ఎదురు చూస్తున్నాను.


అని ఉండేసరికి… ఇక గబగబా శివ నందిని ఫోన్ తీసుకొని ద్వాదశ లింగాలలో ఈ యొక్క చరిత్రలను చదవటం ఆరంభించింది. ఒక్కొక్క లింగం యొక్క పురాణ ఇతిహాసాలలో చెప్పిన గాధలు వినడం ఆరంభించింది.  వాళ్ళకి ఒక్కొక్క శివలింగం గురించి ద్వాదశలింగాలు చెప్పుకుంటూ వస్తుంది. అందరూ శ్రద్ధ భక్తులతో విన్నారు. ఇలా వింటూ ఉండేసరికి…  ఘృష్ణేశ్వర్ శివలింగం పురాణ ఇతిహాసాలలో గురించి చదువుతూ ఉండేసరికి…. రుద్ర స్వామి కాస్త ఈ కథలోని అంశాలు మనకి ఇప్పుడు వచ్చిన ఆధార అంశాలతో సమానం అవుతున్నాయి అనేసరికి….. అది ఎలా అయ్యా అనేసరికి ఇప్పుడు ఈ స్థల పురాణం సంక్షిప్తంగా చెబుతాను.  


ఒక ఆయనకి  పెళ్లయింది కానీ సంతానం లేదు అని చెప్పి అన్నారు.  వాళ్ళ ఆవిడ సంతానం కావాలని పరితపిస్తుంది.  సంతానవతి కావాలని పరితపిస్తుంది. ఆయన మాత్రం సంతానం ఉన్నా లేకపోయినా శివుడు ఉన్నాడు కదా అని శివారాధనలో ఉండిపోయాడు.  కొంతకాలానికి ఆమెకి సంతానం ఉండదని చెప్పేసి… ఆమె చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సంతానం కోసం తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసింది.  రెండో ఆవిడకి ప్రతిరోజు 101 శివ మట్టి శివలింగాలతో శివారాధన చేయటం అలవాటు ఉందని…. పార్థివ శివలింగాలతో ఆరాధన చేసి…. అక్కడ పక్కనే ఉన్న సరస్సులో నిమజ్జనం చేస్తూ ఉండేది అని చెప్పడం జరిగింది కదా ! అలాగే ఈవిడ ఇలా మూడు సంవత్సరాలు చేసిన తరువాత కొడుకు పుట్టడం జరిగింది అని చెప్పారు.  ఆ కొడుకు కూడా మొదటి భార్యని కూడా అమ్మ అని పిలుస్తూ ప్రేమగా ఉంటూ ఉండేసరికి …. వివాహ వయసు రాగానే …. కొడుకుకి వివాహం చేయడం జరిగింది. ఆ కొడుకు భార్య తరపు బంధువులు కన్నతల్లి రెండో ఆవిడ కానీ… పెద్దావిడ కాదు కదా!  అల్లుడ్ని కన్నది రెండో ఆవిడ కదా అని పెంచింది ఆవిడైనా… కనింది రెండో ఆవిడ కదా అని… ఈ అమ్మాయి తరఫు వాళ్లు కూడా రెండో ఆవిడకే గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండేసరికి…. పెద్దావిడ ఇది నిజమే కదా!  నాకు పుట్టిన వాడు కాదు కదా!  చెల్లికి పుట్టిన వాడే కదా ! చెల్లెలికే గౌరవ మర్యాదలు ఇస్తున్నారు.  తనకి ఇవ్వట్లేదు.  ఈ కొడుకు పుట్టడం వల్లనే కదా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి …ఈ కొడుకుని చంపాలి అని చెప్పేసి కొడుకుని ముక్కలు ముక్కలుగా చేసి చంపడం పెద్దావిడ చేసింది అని చెప్పడం జరిగింది కదా!  ఈ శవం ముక్కలన్నీ తీసుకువెళ్లి నిత్య ఆరాధన శివలింగాలు కలిపే సరస్సులోనే…. ఆ శవం ముక్కలు వేయడం జరిగిందని చెప్పడం జరిగింది కదా! ఆ తర్వాత తన చెల్లెలు మట్టి శివలింగాలు ఆరాధన చేసుకోవడం…. కొడుకు చనిపోయాడని తెలిసినా కూడా బాధపడకుండా శివుడే ఇచ్చాడు… శివుడే తీసుకువెళతాడు… అన్నప్పుడు నాకెందుకు భయం.  యోగం ఉంటే చచ్చినవాడు బతికి వస్తాడు… చంపాలనుకున్న వాళ్ళు చంపారు…రక్షించాలి అనుకున్న వారు రక్షిస్తారులే అని ఆవిడ గుండె ధైర్యంతో…. నూట ఒక్క శివలింగాలు పూజ యధావిధిగా చేసుకుని… సరస్సు దగ్గరికి వెళ్లేసరికి… కొడుకు యొక్క శవం ముక్కలను చూసి బాధపడి అయ్యో!  అనతి కాలంలోనే చనిపోయావా! వివాహమై కొద్దికాలం కూడా కాలేదు.. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.  నీకు ఆయుష్షు తీరిపోయినట్టుంది.  శివుని లో ఐక్యం అయిపోయావు.  నువ్వు నా దగ్గర ఉంటే శివప్రసాదం అనుకున్నాను… ఆయన దగ్గరికి వెళ్లావు కాబట్టి శివార్పితం చేస్తున్నాను… ఈ విధంగా అయినా శివునిలో ఐక్యం అయ్యావు అన్నమాట అని చెప్పేసి…. ఆవిడ యధావిధిగా ఆవిడ పూజించిన శివలింగాలను సరస్సులో వేసి నమస్కారం చేస్తూ ఉండేసరికి….ఆమె  యొక్క గుండె ధైర్యానికి, అచంచలమైన భక్తి విశ్వాసాలకి, శివుడు సంబరమాశ్చర్యాలు చెంది…. ఇంతటి మహా భక్తురాలకి పుత్ర శోకం ఉండకూడదు అని ….సంతానం ఇచ్చి తనే సంతానం తీసుకోకూడదు అని… ఆ పిల్లాడి మాంసం ముందలన్నీటిని కలిపేసరికి …. పిల్లవాడు నదిలో నుంచి బయటకు వస్తూ…. అమ్మ! అమ్మ!  నేను వచ్చేసాను అనేసరికి… మంచిది నాయనా! పెద్దమ్మ నన్ను ముక్కలు ముక్కలుగా చేసింది… చంపింది అని గుర్తుంది.  నీ భక్తి ప్రపత్తులకి మెచ్చి శివుడు మళ్ళీ నన్ను పునః జీవితుడిని చేశాడు. నీకు పుత్ర శోకం లేకుండా చేశాడు అనేసరికి…. మంచిదేనయ్య నీకు శివైక్యం ఉంది.  ఆయనకి సాధ్యం కానిది ఏముంది…..చచ్చిన వాడిని బతికిస్తాడు… బతికిన వాళ్ళని చంపుతాడు…. బతికి ఉన్నప్పుడు ఆనందపడకూడదు… చనిపోయినప్పుడు బాధపడకూడదు…. ఏదైనా మన మంచికే జరిగింది…..ఏదైనా మనతో ఉంటే శివప్రసాదం,  మనది కానిది శివార్పితం అనుకోవాలి… అనేసరికి శివుడు సజీవంగా ఆ భక్తురాలికి కనిపించి… నీ భక్తికి మెచ్చాను తల్లి!  ఎవరైతే ఈ క్షేత్రంలో నన్ను దర్శనం చేసుకుంటారో …వారికి పుత్ర శోకం లేకుండా ఉంటుంది.  సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వరాలు ఇస్తున్నాను .. అనగానే స్వామి!  మీరు ఇక్కడే ఒక జ్యోతిర్లింగంగా నా పేరు మీదుగా ఉండాలి అని వరం కోరుకుంటున్నాను అనేసరికి…. శివుడు తధాస్తు తల్లి అని అనుగ్రహించాడు.  ఆ భక్తురాల పేరు మీదగా ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంగా 12వ జ్యోతిర్లింగంగా ఉద్భవించాడని చెప్పడం జరిగింది. 


నాకు తెలిసినంతవరకు ఇది చెప్పిన ఆధారాలలో ఉన్నవి అన్నీ కూడా….ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సూచిస్తున్నాయి… 


శివనందిని:-  అయ్యా!  మీ మాటకి అడ్డం వస్తున్నాను అని అనుకోవద్దు… ఎందుకంటే మూలాధార చక్రానికి స్థూల శరీరం ఉండాలి.  అక్కడ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఘృష్ణేశ్వర శివలింగమే అని మనం ఎలా చెప్పగలం 


అనేసరికి…. బాలగణపతి కాస్త పకపక నవ్వుతూ 


బాలగణపతి:- అమ్మ!  నీకు ఇంకా విషయం అర్థం కాలేదా?  


శివ నందిని:-  ఏంట్రా నీకు తెలిసింది…


బాలగణపతి:- అమ్మ కోపం తెచ్చుకోకు…. నీకు విషయం అర్థం అయ్యేటట్టుగా చెప్తాను…


మూలాధార చక్రం దేనికి సంబంధించింది 


శివ నందిని:- భూతత్వానికి సంబంధించింది…


బాల గణపతి:- మట్టిదే కదా!...


శివ నందిని:-  అవును…..


బాలగణపతి:- అక్కడ 101 పార్థివ శివలింగాలు ఒక భక్తురాలు నిత్యం పూజ చేసి నిమజ్జనం చేసేది అన్నారు కదా!  పార్థివలింగాలు అంటే మట్టి శివలింగాలే కదా!  అది మట్టి అనే కదా…అంటే అవును అనేసరికి…. రెండవ రకంగా అయితే మట్టి నుంచి పుట్టే వాళ్ళు ఎవరు జీవులే కదా!  మనలాంటి మట్టి శరీరం ఉన్నవాళ్లే కదా!  అక్కడ సంతానం కోసం పూజ చేసింది…  ఒకడు పుట్టాడు…. పుట్టిన వాడు చనిపోయాడు కదా ! అంటే ఏంటి దేహం పుడుతుంది… దేహం చస్తుంది అని చెబుతున్నారు కదా!  అంటే పుట్టి చనిపోయేది… స్థూల శరీరమే కదా!  మట్టితో పుట్టేది స్థూల శరీరమే కదా!  ఆలోచించు…మీ విషయం నీకే అర్థమవుతుంది… అంటే అక్కడ నీకు సాధనాపరంగా ఘృష్ణేశ్వర్ క్షేత్రం అనేది మూలాధార చక్రం యొక్క స్థూల శరీరానికి జాగృతి చేస్తుంది అని చెప్పకనే చెప్పారు కదా!  అక్కడ నీకు నల్ల శివలింగం దొరికితే… నీ చక్రసాధన పరిసమాప్తి అవుతుంది.  ఆ తర్వాత నువ్వు స్వాధిష్ఠాన చక్రానికి వెళ్లగలుగుతావు.  నాకు తెలిసినంతవరకు… లేదు అంటే మీ సాధన ఇక్కడితో ఆగిపోతుంది.  నాకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది  సరిగ్గా సరిపోయింది.  12వది ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము…


అనేసరికి ….సరే మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి అక్కడికే వెళదాము… ఆ క్షేత్రానికే వెళదాము… ఆ క్షేత్రం వివరాలన్నీ నేను తెలుసుకున్నాను…ఎక్కడికి వెళ్లాలి ….ఎంత దూరంలో ఉంది అని… అయితే రేపు ఉదయం మనం బయలుదేరుదాం అనేసరికి రుద్రస్వామి దిగులుగా ఉండేసరికి.. 


శివ నందిని:- ఏంటి అయ్యా


రుద్ర స్వామి:- ఏం లేదమ్మా!  నీకు అమ్మవారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. మా నలుగురికి ఇవ్వలేదు కదా!  అమ్మవారిని సజీవ మూర్తిగా దర్శనం చేసుకుని వెళ్లాలి అనుకుంటున్నాము..


శివ నందిని:- సరే ఏం చేద్దాం!  


రుద్రస్వామి:- అమ్మవారి దర్శనం మేము పొందాలి… ఎలా పొందాలి?  అనేది శివ స్వామిని అడుగుతావా!  లేకపోతే ధ్యానంలో కూర్చుని తెలుసుకుంటావా! 


శివ నందిని:- .సరే నేను ధ్యానంలో తెలుసుకున్నంత మాత్రాన ధ్యానంలో కనిపించే ధ్యాన దృశ్యాలు నాకు అర్థం కావు.  శివ స్వామిని అడుగుదాము ఆయనే చెబుతారు… 


అని హృదయం మీద చెయ్యి పెట్టేసరికి… ఆయన కాస్త ధ్యానము  నుంచి బయటకు వచ్చి చెప్పు దేవి!  ఏమైంది అనేసరికి…. జరిగిన విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసినప్పటికీ…. పొల్లు పోకుండా అన్ని ఆయనకి చెప్పేసరికి…


శివానంద:- మంచిది దేవి!  జయం పొందావు.  అమ్మవారే నీలోకి ఆత్మశక్తి రూపంలో ఆదిపరాశక్తి రూపంలో ప్రవేశించింది. ఇక నీ సాధన అంతా ఆవిడ చూసుకుంటుంది.  కంగారు పడాల్సిన అవసరం లేదు.  ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి? 


శివ నందిని:- ఇలా మిగిలిపోయిన నలుగురు కూడా అమ్మవారి దర్శనం పొందాలనుకుంటున్నారు…. 


శివానంద:- దానికి అర్హత, యోగ్యత ఉందో లేదో నాకు తెలియదు.  కాకపోతే అర్ధరాత్రి 12 గంటలకి అమ్మవారు బిలాకాశంలోకి వెళ్లి సాధన చేసుకుంటుందని నాకు ధ్యాన స్ఫురణ అందింది.  ఆ సమయంలో అమ్మవారిని నేను సజీవమూర్తిగా చూడటం జరిగింది.  ఆవిడ అనుగ్రహించిన విగ్రహ మూర్తి …నా దగ్గర ఉన్న కామాక్షి విగ్రహ మూర్తి.  కామాక్షి విగ్రహ మూర్తిలో లలితా, రాజేశ్వరి మిళితమయ్యారు. అలా మిగిలిన శక్తులతో ఆవిడ  దర్శనం ఇస్తుంది.  యద్భావం తద్భవతి.  ఎవరికి యోగం ఉంటే వారికి… కాకపోతే అర్ధరాత్రి 12 గంటలకి మీరు దేవాలయంలో ఉండేటట్లుగా చూసుకోండి.  పూజారి అనుమతి తీసుకోండి.  ఆ తర్వాత ఏం జరుగుతుందో కాల నిర్ణయానికి వదిలేయండి.   శివాజ్ఞ . ఆయన అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు..


 అనేసరికి… సరే స్వామి అనేసరికి…ఆయన  అదృశ్యం అయ్యారు . శివ స్వామి మాటలు విన్న వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి 12 గంటలకి మనం ఇక్కడ ఉండాలి అంటే… మనం ఆలయ పూజారి అనుమతి తీసుకోవాలి అనేసరికి… ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కూర్చొని విశ్రాంతి తీసుకుని… రాత్రి సమయానికి గదికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కాసేపు పడుకొని గుడి కట్టేసే సమయానికి అనగా 8:30కు ఆ ప్రాంతంలో అమ్మవారి గుడికి సాధన కుటుంబం అంతా చేరుకోవడం జరిగింది. 



ఇలా సాధనా కుటుంబం అంతా రాత్రిపూట అమ్మవారి నిజరూప దర్శనం కోసం అమ్మవారి గుడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న ఆలయ పూజారికి విషయం అంతా చెప్పి… మేము గుడిలో నిద్ర చేయాలనుకుంటున్నాము… మా సాధన పరిసమాప్తి అయిపోయింది.  వేరే క్షేత్రానికి వెళ్లాలి అనేసరికి… అమ్మ!  ఇక్కడ ఉండటానికి నా అనుమతితో పాటుగా ఆలయ ధర్మకర్తల అనుమతి కూడా తీసుకోవాలి. రేపొద్దున్న సమస్య వస్తే… నా పీకకు చుట్టుకుంటుంది అనేసరికి… ఆలయ ధర్మకర్త కి ఫోన్ చేసి నాకు తెలిసిన కుటుంబం అంటున్నావు… సంవత్సరం నుంచి చూసిన కుటుంబం అంటున్నావు… మంచి వాళ్ళు అంటున్నారు కాబట్టి ….మీరే దగ్గర ఉండి చూడండి.  మళ్లీ రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి… రేపు ఏదైనా సమస్య వస్తే మీకే ఇబ్బంది అవుతుంది. రాత్రిపూట వాళ్లతో పాటు మీరు కూడా ఉండండి. వాళ్ళేదో సాధన చేసుకుంటారు అంటున్నారు కాబట్టి …సాధన అంగీకరించాలి.  అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్లు కాబట్టి….  మాకు ఏమీ ఇది లేదు అనేసరికి…. విషయం ఇది… అని చెప్పేసరికి సరే స్వామి!  మీరు మాతో పాటు ఉంటాను అంటే మాకేమి ఇబ్బంది లేదు.  మంచిదే కదా!  మాకు రక్షణగా ఉంటుంది.  మాకు ధైర్యంగా ఉంటుంది అని శివ నందిని అనేసరికి…. సరే అని ఉపదేవాలయాలు… అన్ని తలుపులు మూసి వేయడం జరిగింది. రాత్రి 9 గంటలకి వీళ్లంతా అమ్మవారి గుడిలోనికి వెళ్లి కూర్చున్నారు.  ఆ కూర్చోవడం కూడా దేవి పంచాయతనం లాగా కూర్చున్నారు.  అనుకోకుండా అంటే మధ్యలో శివ నందిని కూర్చొని ఉంటే ముందు కుడివైపు రుద్రుడి అంశగా రుద్రస్వామి అలాగే విష్ణుమూర్తి అంశగా జగన్మోహిని అవతారమైన మహాదేవి…. ఎడమవైపున ఆ తర్వాత సూర్యుడి అంశగా కుమారస్వామి…. గణపతి అంశగా బాల గణపతి కూర్చుని….సజీవ మూర్తిగా దేవి పంచాయితనంలో కూర్చున్నట్టుగా కూర్చున్నారు అని చెప్పి పూజారి గ్రహించి మౌనంగా ఉండిపోయారు. ఎవరి ధ్యాన నిష్టలో వాళ్ళు ఉండిపోయారు.  ఉన్నట్టుండి అర్ధరాత్రి 12 గంటలకి ధ్యానంలో ధ్యాన దృశ్యంగా శివ నందినికి అమ్మవారి విగ్రహ మూర్తి కాస్త సజీవమూర్తిగా కనిపించేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి….అప్పటికే అందరికీ కూడా ధ్యానంలో అలా కనిపించిందని అర్థమైంది.  కళ్ళు తెరిచి శివ నందిని కేసి చూస్తూ ఉండేసరికి… ధ్యానంలో  ఉన్న శివ నందిని కాస్త లేచి… చిన్న సందు లాంటి రంధ్రం గుండా అమ్మవారిని చూసేసరికి…. అమ్మవారు కాస్త సజీవ మూర్తిగా కనిపించింది. అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి చూస్తూ ఉండేసరికి… ఆలయ పూజారి కూడా చూడాలని ఉత్సుకతతో చూసేసరికి… అక్కడ సాధారణ విగ్రహ మూర్తిగా కనిపించింది.  మిగతా వారికి  సజీవమూర్తిగా కనిపించింది. అందరికీ సజీవ మూర్తిగా కనిపించి తనకి మాత్రం సజీవమూర్తిగా కనిపించకపోయేసరికి తన భక్తి పరిపక్వత కాలేదు…. తన భక్తి కూడా ఇంకా అవసరాలు, కోరికల భక్తిలో ఉంది అని…. వీళ్ళ అందరికీ భక్తి… కోరిక అతీత స్థితిలో వీరి సాధనా భక్తి ఉన్నదని గ్రహించడానికి ఆయనకి అట్టే సమయం పట్టలేదు. సరే తల్లి!  నీ అనుగ్రహం ఉంటేనే ఏదైనా అవుతుంది.  ప్రతినిత్యం నీ అడుగుల సవ్వడి వినబడుతుంది.  కానీ నువ్వు సజీవ మూర్తిగా నాకు కనబడే సాధన శక్తి నాకు లేదని అర్థం అయింది.  నా భక్తి ఎప్పుడైతే కోరికా రాహిత్య స్థితికి వస్తుందో….పరిపక్వతకు వస్తుందో అప్పుడు సజీవ మూర్తిగా కనపడతావు. నేను విగ్రహ మూర్తిలో అమ్మవారిని చూడటం లేదు …విగ్రహాన్ని విగ్రహంగానే చూస్తున్నాను… వీళ్ళందరూ విగ్రహంలో కూడా అమ్మవారిని చూస్తున్నారు అని నాకు అర్థం అయింది.  నేను అమ్మ అనే పిలుస్తాను.  నిన్ను ఏదో విగ్రహ మూర్తిగానే చూస్తున్నాను.  ఏదో ఉద్యోగ ధర్మం చేస్తున్నట్లుగా చూస్తున్నాను అని నాకు అర్థం అవుతుంది అనేసరికి… మనసులో ఆవేదన చేస్తూ మీ అనుభవాలు మీరు పొందండి నాయనా..!  నేను అమ్మవారి జపం చేసుకుంటాను అని ఆయన అమ్మవారి జపం చేసుకునే సరికి …..మిగతా వాళ్ళు ఆ రంధ్రంలో నుంచి ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటే….అమ్మవారు కాస్త బిలాకాశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు…. మువ్వల చప్పుడు వింటూ ఉండేసరికి….అందరూ కూడా వినడం ఆరంభించారు.  అమ్మవారు భూగృహం కిందగా నడుస్తుంది అని…శివ నందిని  గమనించి ….ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే….గుడి దాటి …బయట  మామిడి చెట్టు దాకా వినిపిస్తూ ఉండేసరికి సరే అని చెప్పి అక్కడికి వచ్చి మువ్వల శబ్దం ఆగిపోయింది.  అంటే భూ గృహం ఇక్కడిదాకా 

ఉంది అని ….బిలాకాశం అడుగు భాగంలో ఇక్కడిదాకా ఉంది…. అని చెట్టు మొదలు భాగంలో అడుగున ఉండి ఉండవచ్చు.  ఇక్కడితో ఆగిపోయింది  అనుకుంటూ ఉండేసరికి అందరూ అక్కడ అరుగు మీద ధ్యానంలో కూర్చున్నారు. ఆలయ పూజారి కూడా అడుగుల సవ్వడి వింటూ ఆనంద పడుతూ…. ఎంతో కొంత తనకి అమ్మవారు తను ఉన్నానని నిదర్శనం చూపిస్తుంది అని… వీళ్ళతో పాటు ఆయన కూడా ధ్యానంలో కూర్చున్నారు.  శివ నందిని ధ్యానంలో కూర్చునేసరికి… ధ్యానంలో బిలాకాశంలో అమ్మవారు ఒక స్పటిక శివలింగం పట్టుకుని ధ్యాననిష్టలో ఉన్నట్టుగా…. పద్మాసనంలో ఉన్నట్టుగా…. లీలామూర్తిగా కనిపించేసరికి… అందరూ కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకోగానే అందరికీ ఇదే ధ్యాన దృశ్యం కనిపించిందని సైగ చేసేసరికి… అలాగే ధ్యానంలో ఉండేసరికి ఆవిడ ఎంతసేపు ధ్యాననిష్టలో ఉందో తెలియదు గానీ వీళ్ళు కూడా అలాగే ధ్యానంలో ఉండిపోయారు.  కొన్ని గంటల తరువాత ఆమె లేచి నడుస్తున్న కాలి మువ్వల చప్పుడు వినిపించేసరికి…. అమ్మవారు ధ్యానం నుంచి లేచి మళ్ళీ యధావిధిగా భూగర్భం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుందని అర్థం అయ్యేసరికి…. మళ్ళీ అమ్మవారు కాస్త యధా స్థానంలో గా ఖాళీగా ఉన్న ఆసనం మీద విగ్రహం మూర్తిగా మారి కూర్చునేసరికి ఆవిడ చేతిలో ఉన్న స్పటిక శివలింగం కాస్త అదృశ్యం అయ్యేసరికి…. ఆస్పటిక శివలింగమే చంద్రమౌళీశ్వర శివలింగం అనుకుంటా…. అమ్మవారి స్పటిక శివలింగారాధన చూసి ఆదిశంకరాచార్యులు కూడా చంద్రమౌళీశ్వర శివలింగమును ఆరాధనగా పెట్టడం…. తను కైలాసం నుంచి శివానుగ్రహంతో తెచ్చిన పంచ శివ లింగాలలో ఒక శివలింగమును ఇక్కడ అమ్మవారు స్పటిక ఆరాధన చేయడం గమనించి…. ధ్యాన అనుభూతి పొంది ఉండవచ్చు.  తద్వారా శంకరాచార్యులు ఇక్కడతను తను తెచ్చిన స్పటిక లింగము ఆరాధన ఏర్పాటు చేసి ఉండవచ్చు అని… గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు.  ఆ తర్వాత వీళ్ళందరూ కూడా యధావిధిగా అమ్మవారి గర్భగుడిలో దేవి పంచాయతనంలో కూర్చున్న భంగిమలో  కూర్చునే సరికి…. ఉన్నట్టుండి గర్భగుడి తలుపులు తెరుచుకునేసరికి ….విగ్రహ మూర్తిగా ఉన్న అమ్మవారు కాస్త సజీవమూర్తిగా లీలగా అందరికీ కనిపించింది.  అందరూ ధ్యానంలో కూర్చుని నమస్కారాలు చేసుకున్నారు. ఈ విధంగా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు… ఉన్నట్టుండి అమ్మవారిలో లలితాదేవి, రాజరాజేశ్వరిగా కనిపించి కామాక్షి విగ్రహ మూర్తిగా కనిపించడం…. ఆ విగ్రహ మూర్తి కాస్త శివ స్వామి చేతిలోకి కామాక్షిగా వెళ్లడం గ్రహించారు.  అంటే శివ స్వామి చేతిలోకి వెళ్లిన కామాక్షి విగ్రహ మూర్తిలో లలితా రాజరాజేశ్వరి ఉన్నట్టుగా గ్రహించడానికి సమయం పట్టలేదు.  ఉన్నట్టుండి అమ్మవారిలో బాలాదేవి మరియు అన్నపూర్ణేశ్వరి రూపాలు కనిపించాయి.  ఈ రూపం కాస్త కలిసి అమ్మవారి సజీవ మూర్తిగా వచ్చి బాల కుమారస్వామి చేతిలో తన కామాక్షి రూపాన్ని చేతికి ఇచ్చేసరికి….ఒకవైపు కామాక్షి మరొకవైపు అన్నపూర్ణాదేవిగా ఉండేసరికి ఆ రూపం అందుకున్న బాల కుమారస్వామి…. ధన్యోస్మి తల్లి!  అనేసరికి ఆ తర్వాత మళ్లీ ఆమెలో ఆసనంలో కూర్చోవడం లీలాగా అందరూ గ్రహించారు. ఆ తర్వాత పద్మాసనంలో కూర్చున్న కామాక్షి దేవిలో ఉగ్రంగా వారాహి మూర్తి , శ్యామలాదేవి రూపం లీలామాత్రంగా కనిపించేసరికి…. పిల్లలు ఇద్దరు కొంచెం భయపడ్డారు అయినా గాని మిగతా వాళ్ళు అలాగే ధ్యానంలో కూర్చున్నారు.  ఈ రూపం కాస్త బయలుదేరి విగ్రహ మూర్తిగా మారుతూ….మహాదేవి చేతిలో విగ్రహ మూర్తిగా పడటం జరిగింది. అంటే ఒక వైపు కామాక్షి దేవి మరొకవైపు వారాహి మూర్తి ఉండేసరికి తను తంత్రసాధనలో ఉండేసరికి ఉగ్రరూపం లో కామాక్షి కాస్త వారాహిగా వచ్చింది అని మహాదేవి గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  నీ అనుగ్రహం నా మీద చూపించినందుకు…. నువ్వు సజీవమూర్తిగా మాతోపాటు ఉన్నావని నిరూపణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు… శతకోటి నమస్కారాలు తల్లి ….అనేసరికి తిరిగి ఆవిడ యధాస్థానంలో పద్మాసనంలో కూర్చుని ఉండేసరికి…. కొద్దిసేపటికి ఈ కామాక్షి అమ్మవారిలో మహాలక్ష్మి దేవి మరియు మహా సరస్వతి రూపంతో ఉండేసరికి ఈ రెండు శక్తులు ఉన్న కామాక్షి దేవి కాస్త బాల గణపతి దగ్గరికి వచ్చి విగ్రహ మూర్తిగా మహాలక్ష్మి ఒకవైపు కామాక్షి ఒకవైపు ఉన్న విగ్రహ మూర్తి తన చేతిలో కనిపించేసరికి బాలగణపతి కాస్త అమ్మ!  నువ్వు నన్ను ఈ విధంగా అనుగ్రహించావా..!  బాల గణపతికి ఒకవైపు సరస్వతి మరొకవైపు లక్ష్మీదేవి ఉంటారు కదా ….ఈ విధంగా నన్ను అనుగ్రహించావా… నేను గణపతి అంశను కాబట్టి…. అదే విధంగా అనుగ్రహించావా!  అనుకుని ధన్యోస్మి తల్లి..!  ఈ విధంగా నువ్వు సజీవమూర్తిగా నాకు కనిపించి ఎల్లవేళలా నాతో పాటే ఉంటావని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెప్పేసరికి….. తిరిగి ఆవిడ పద్మాసనంలోకి వెళ్లి కూర్చున్న కొద్ది క్షణాలకి… అక్కడ ఉన్న కామాక్షిలో ఉన్నట్టుండి….అమ్మవారిలో మహిషాసుర మర్దిని రూపము ఆ తర్వాత భైరవి మూర్తి రూపం కనిపించేసరికి….ఈ విగ్రహ మూర్తిని రుద్ర స్వామికి అనుగ్రహించేసరికి ..ధన్యోస్మి తల్లి!  నా కోరిక తీర్చావు… నువ్వు సజీవమూర్తిగా ఉన్నావని నిదర్శనం ఇచ్చావు అనేసరికి….ఆ తర్వాత యధావిధిగా కామాక్షి దేవి వెళ్ళి కూర్చునేసరికి ఆకరి రూపం అన్నట్టుగా మీనాక్షి రూపం, కాశీ విశాలాక్షి రూపం రెండు కలిసి మిళితమైనట్టుగా…. కామాక్షి మూర్తిలో లీనం అయ్యి ఒకవైపు మీనాక్షి, ఒక వైపు కామాక్షి దేవితో ఉన్న విగ్రహ మూర్తి శివ నందిని ఒడిలో పడేసరికి ఓహో తల్లి ! నిలుచున్న దేవిగాను… కూర్చున్న దేవిగాను అనుగ్రహించావన్నమాట!  ఇప్పుడు నిల్చున్న ఆవిడను …. కదిలే ఆవిడని ….కదలని స్థితికి తీసుకురావాలి అని అర్థం అయింది.  నాతోపాటుగా సాధనా కుటుంబానికి దర్శనం ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు తల్లి… కృతజ్ఞతలు.  నా సాధన మూలాధార చక్రంలో ఉన్న వస్తువుల శరీర శుద్ధి, ఆధీనం కోసం నా స్థూల శరీరం ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర ఉన్నదని ఎరుకయ్యింది. 


 అది నిజమో కాదో నాకు తెలియదు అనుకుంటూ ఉండేసరికి….ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వాళ్ళ కళ్ళముందు కనిపించేసరికి… అప్పటికే ఈ లింగం గురించి వివరాలు ఈ లింగం రూపురేఖలు కూడా ఇంటర్నెట్లో తన చూసిన వాటితో సరిపోయేసరికి…. ఆ ఇచ్చిన ఆధారాలు ఆ క్షేత్రానికి సరిపోయాయి అని అర్థం అయ్యేసరికి ….అమ్మ తల్లి ! నువ్వు సత్యం చూపించావు. మేము మీ ఆజ్ఞ ప్రకారమే ఘృష్ణేశ్వర్ క్షేత్రానికి వెళ్లడం జరుగుతుంది. నువ్వు అనుగ్రహించిన పంచమూర్తులను పంచ కామాక్షి రూపాలను భద్రంగా సజీవంగా ఆరాధన చేసుకుంటూ… జీవితాంతం ఉంచుకుంటాం తల్లి . ఎప్పుడైనా ఏదైనా లోపం వచ్చినా…. వాటిని నువ్వు క్షమించి సరిచేసి సాధన పరిసమాప్తికి  అవకాశం ఇస్తావని ….మమ్మల్ని క్షమిస్తావని తప్పులను సరిచేస్తావని చెప్పేసి అనుకుంటున్నాము …నాకు మనోధైర్యం ఇవ్వు తల్లి!  నా సాధన పరిసమాప్తికి….అయ్యో కాదు… కాదు…. నా సాధన ఏంటి తల్లి!  నీ సాధన యే కదా!  నేను అనేది లేదు కదా.!  సాధనా పరిసమాప్తికి నీకు నువ్వే సహాయ సహకారాలు అందించుకో తల్లి… అనేసరికి ఉన్నట్టుండి గుడి తలుపులు మూసుకుపోయేసరికి…. తెల్లవారుజామున 4:30 గంటలు అయ్యిందని ఆలయ ప్రధాన అర్చకుడు సుప్రభాత సేవ చేస్తున్నాము ఆ సేవ చూసుకొని మీరు బయలుదేరండి అనేసరికి…. ఆ తరువాత ఆలయ ధర్మకర్తలు దగ్గరలో ఉన్న భక్తులు కొంతమంది వచ్చి…. సుప్రభాత సేవా కార్యక్రమంలో పాల్గొనేసరికి….సుప్రభాత సేవను కనులారా వీళ్ళు చూసి…. అక్కడ నుంచి సంతృప్తితో పంచగంగా పుష్కరిణిలో ఆఖరి స్నానం చేసి….మళ్లీ అమ్మవారిని దర్శించుకుని.. అక్కడి నుంచి తన్మయత్వంతో సజీవ మూర్తులను ఎవరి సంచిలో వాళ్ళు భద్రంగా దాచుకొని ….హోటల్ గదికి చేరుకొని….గది ఖాళీ చేస్తున్నామని చెప్పి కట్టవలసిన బిల్లులు అవన్నీ కట్టేసి…. ఆ తర్వాత భోజనం చేసి…. ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్న ఘృష్ణేశ్వర్ క్షేత్రానికి బస్సులో బయలుదేరడం జరిగింది.  బస్సుయాత్ర సుమారు మూడు రోజులు ఆ క్షేత్రానికి పడుతుందని తెలుసుకొని ….ఎవరికి వారే తమరికి తోచిన విధంగా తమ వ్యక్తిగత ఆలోచనలతో ఈ క్షేత్రానికి బయలుదేరడం జరిగింది.


శుభం భూయాత్ 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి