బ్రహ్మ గ్రంథి విభేదనం
సాధన కుటుంబం అంతా గుజరాత్ లో ఉన్న సోమనాధ క్షేత్రం నుంచి నౌకాయానం ద్వారా శాంకరి దేవి ఆలయం ఉన్న శ్రీలంకకి సముద్ర మార్గం ద్వారా వెళ్లాలి అని నిశ్చయం చేసుకున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. భారత దేశ కరెన్సీని శ్రీలంక కరెన్సీ గా మార్చుకున్నారు. సుమారుగా సముద్ర మార్గంలో శ్రీలంకకి వెళ్లడానికి 20 రోజులు పడుతుందని….. వివరాలన్నీ కనుక్కొని…. ఒక పెద్ద నౌక ఎక్కి శ్రీలంకకు బయలుదేరారు. నౌక ఎక్కిన తర్వాత నౌకలో ఉన్న సౌకర్యాలను చూసి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్లుగా ఉండడం గమనించారు. ప్రత్యక్షంగా మూడు నుంచి ఐదు అంతస్తులతో ఉన్న నౌకను ఈ సాధన కుటుంబం చూడటం అదే మొదటిసారి అని….. ఒక వింతైన అనుభవ అనుభూతిని పొందారు. అలాగే ఆ నౌక నుంచి సముద్రమును చూసి ఆశ్చర్యపడ్డారు. సముద్రంలో అప్పుడప్పుడు పెద్దపెద్ద సొర చేపలు, తిమింగలాలు, పెద్ద పెద్ద తాబేళ్లు కనిపించడం గ్రహించారు. ఆ తర్వాత వీళ్ళకి సముద్రపు శంఖాలలో పురుగులు కదులుతూ వెళ్తూ ఉండటం గమనించి ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. అంటే శంఖాలలో కూడా పురుగులు ఉంటాయని గ్రహించారు. అలా వీళ్ళు సూర్యోదయ, సూర్యాస్తమయము సముద్రం నుంచి చూసి తెలియని చెప్పలేని అద్వితీయమైన ఆనందాన్ని పొందుతూ ఉండేవాళ్లు. పొద్దున, మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఎవరికి వారే నౌకలో కూర్చుని ధ్యానాలు, జపాలు క్రమం తప్పకుండా వేళతప్పకుండా చేసుకునేవారు. అలాగే అక్కడ ఉన్న ఆహారం సంతృప్తిగా తినేవారు. కావలసినట్టుగా ఉండేవారు. నచ్చినట్టుగా తినేవాళ్లు. దాదాపుగా 20 రోజులు నౌకా ప్రయాణం చేసి శ్రీలంకకి చేరుకోవడం జరిగింది. శ్రీలంకలో రైలు సహాయంతో శాంకరీ శక్తి పీఠం ఉన్న ట్రింకోమలి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. సుమారుగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆ తర్వాత సాధన కుటుంబం అంతా శాంకరీదేవి ఆలయానికి చేరుకోవడం జరిగింది.
కాకపోతే వీళ్ళు ఊహించినంత పెద్ద గుడి ఇక్కడ లేదు. కారణం ఏమిటి అంటే….పురాతనంగా ఉన్న గుడిని 80% ధ్వంసం చేయడం జరిగింది అని అక్కడ ఉన్న స్థలపురాణం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇంతలో బాలగణపతి కాస్త ఈ శాంకరిమాత యొక్క స్థల పురాణం గురించి చెప్పమని అడగగా….. రావణబ్రహ్మ పరమశివ భక్తుడే కాకుండా అమ్మవారి భక్తుడు కూడా కావడం విశేషం. ఆయన ధ్యాన తపస్సుకి మెచ్చి… అమ్మవారు ఇక్కడ వనశాంకరీగా ఆవాసం చేసింది అని….. ఆవిడ ఇక్కడ ఆవాసం చేసేటప్పుడు అమ్మవారు ఒక షరతు విధించింది అని…..ఆ షరతు ఏమిటంటే తన మాట వినని యెడల ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని…. రావణాసురుడు దగ్గర మాట తీసుకుంది అని….అంటే దానికి రావణబ్రహ్మ సరే అమ్మ! నీ మాట మీరినప్పుడు నువ్వు ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. దానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను అని చెప్పేసి అనడం జరిగింది అని… కాలానుగుణంగా సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకువచ్చినప్పుడు…. శాంకరీ దేవి పరస్త్రీ వ్యామోహంలో పడవద్దు…. తప్పుడు పని చేయవద్దు…. స్త్రీ దోషం నీకు తగులుతుంది… ఆ స్త్రీ యొక్క పాతివ్రత్య ధర్మ దోషం నీకు చుట్టుకుంటుంది…. యధావిధిగా రాముని వద్దకే సీతాదేవిని చేర్చమని చెప్పినా కూడా రావణబ్రహ్మ వినకపోవడంతో…. సీతాదేవి మీద ఉన్న విపరీతమైన కామకాంక్ష వ్యామోహంలో పడి ఉండటంతో… అమ్మవారి మాటను లెక్క చేయలేదు. ఇక అక్కడి నుంచి అమ్మవారు వెళ్లిపోవడం జరిగింది అని….. ఆ తర్వాత రావణ సంహారం జరిగిన తర్వాత ఋషుల కోరిక మేరకు మళ్ళీ యధావిధిగా ఇక్కడకి వచ్చి వన శాంకరీ దేవిగా స్థిరపడింది అని స్థల పురాణం చెప్పడం జరిగింది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని కొంతమంది……మొల భాగం పడిందని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు దేవాలయానికి వెళుతూ ఉండగా దేవాలయం చూడటానికి ఒక త్రిభుజాకారం కొండమీద ఉన్నట్లుగాను….. కొండకి మూడు వైపులా నీళ్లు ఉండటం…. ఇలా మూడు వైపులా నీళ్లు ఉండటం వల్లనే దీనిని ఇలా ద్వీపకల్పం అనడం జరిగింది అని…..పూర్వకాలంలో 1000 స్తంభాలతో గుడి ఉంటే పోర్చుగీసు దాడికి 80% స్తంభాలు, గుడి దెబ్బ తినడం జరిగింది.. ఒకే ఒక స్తంభం మాత్రమే ఉన్నది అని …..ఆ స్తంభం ఆధారంగానే శ్రీ శాంకరీ దేవి ఉన్నదని గుర్తుపట్టడం జరిగింది. ఆ పక్కనే శివాలయం ఉంటుందని…. ఈ శివాలయాన్ని త్రికోణేశ్వర స్వామి అని పిలుస్తూ చెప్పడం జరిగింది.
అలాగే ఈ ఆలయం ముందు వైపు సుమారుగా 40 నుంచి 60 అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో ఉన్న మహాశివుని యొక్క శివుని విగ్రహ మూర్తిని పిల్లలు చూసి ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆ పక్కనే రావణబ్రహ్మ తన పది తలలతో అమ్మవారి గురించి తీవ్ర తపస్సు చేసిన గుహ ఉంది. ఈ గుహలోపల లింగోద్భవ లింగం ఉండటం జరిగింది. ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే….మధ్య భాగంలో రుద్రుడు ఉంటే, పై భాగంలో బ్రహ్మదేవుడు హంస రూపంలో…. కింద భాగంలో విష్ణుమూర్తి వరాహరూపంలో… ఈ లింగంలో ఉన్నారు. అంటే త్రిమూర్తి స్వరూపం లింగోద్భవ లింగంలో కనిపిస్తుంది. ఇది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి జ్యోతిర్లింగ రూపంలో మొట్టమొదటిగా దర్శనం అయ్యింది అని చెప్పేసి…. ఆ లింగాన్ని మొట్టమొదటి జ్యోతిర్లింగం గాను, శివలింగం గాను చెప్పడం జరిగింది. అంటే ఈ జ్యోతిర్లింగం యొక్క ఆది అంతము చూడాలని చెప్పేసి విష్ణుమూర్తి వరాహరూపంలో భూ మార్గంలో వెళ్ళటం…. బ్రహ్మ హంస రూపంలో అంతరిక్ష మార్గంలోకి వెళ్ళటం జరిగింది అని…..వాళ్ళు ఆది అంతం తెలుసుకోలేక వెనక్కి తిరిగి రావడం జరిగింది అని…. మనకు శివపురాణంలో శివరాత్రి మహత్యం నాడు వచ్చే కథలో కనిపించే శివలింగమే ఈ శివలింగం అని చెప్పేసి రావణబ్రహ్మ ఆత్మ లింగంగా ఆరాధన చేసింది లింగోద్భవలింగం అవుతుందని అర్థమవుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆ పక్కనే పంచ పడగలు ఉన్న ఒక రాతి శివలింగం ఆరు బయట ఉన్నది. కానీ, దీనిని భక్తులు ఎవరు చూడకుండా కేవలం అర్చకులు మాత్రమే అర్చన చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణా కారణాలు వాళ్ళకి తెలియలేదు. సరేలే అని ధ్యానంలో ఎవరికి వారే కూర్చున్నారు. అలాగే సముద్రం ఒడ్డున చిన్నపాటి ఆలయం, ప్రశాంతమైన వాతావరణం…. ఏదో తెలియని ఆనందం, సంతోషం అక్కడ కనిపించ సాగింది. ఈ శాంకరీ దేవి యొక్క ఆరాధన తమలో ఉన్న రాక్షస గుణాలను అణిచివేసి…. ధర్మ గుణాలను సంరక్షిస్తుంది అని స్థల పురాణం చెప్పడం జరిగింది . అనగా మనలో ఉన్న అరిషడ్వర్గాలు అన్నీ కూడా కాలానుగుణంగా కర్మానుగుణంగా అదుపులోకి వచ్చి అణిచి వేయబడతాయని ఈ దేవత ఆరాధన యొక్క ప్రత్యేకత అని చెప్పి స్థలపురాణం చెప్పడంతో….శివ నందిని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది.
శివ నందిని ధ్యానంలో కూర్చుంది. ఈ క్షేత్రానికి రావడం తనలో ఉన్న బ్రహ్మ గ్రంధి విభేదనం కోసం రావడం జరిగిందని చెప్పేసి తెలిసింది. అప్పుడు బాలగణపతి కాస్త అమ్మ! గ్రంథుల గురించి చెప్పవా? అంటే అతి ముఖ్యంగా నాలుగు గ్రంధులు ఉంటాయి. మూలాధార చక్రానికి కింద అజ్ఞాన గ్రంథి ఉంటుంది. ఎవరైతే జ్ఞానమును పొందుతారో బ్రహ్మ జ్ఞానానికి, శివ మోక్ష జ్ఞానమును పొందటానికి ప్రయత్నం చేస్తారో….. వాళ్ళకి అజ్ఞాన గ్రంధి విభేదనం అవుతుంది. మూలాధార ,స్వాధిష్ఠాన చక్రాల పైన బ్రహ్మగ్రంధి ఉంటే మణిపూరక , అనాహత చక్రాల పైన విష్ణు గ్రంధి అలాగే విశుద్ధ మరియు ఆజ్ఞ చక్రం పైన రుద్ర గ్రంధి ఉంటాయి. బ్రహ్మ గ్రంధిలో బ్రహ్మదేవుడు…. విష్ణు గ్రంథిలో విష్ణువు, రుద్ర గ్రంధంలో రుద్రుడు ఆవాసం చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన దేవతా శక్తులు కూడా ఉంటాయి. ఈ మూడు గ్రంధులు కూడా ఆదిపరాశక్తి అధీనంలోనే ఉంటాయి. తద్వారా బ్రహ్మ సృష్టి చేయడం….. విష్ణు స్థితికారకుడిగాను….. రుద్రుడు లయకారకుడుగాను అమ్మవారి యొక్క మోహమాయలో పడి సృష్టి కార్యాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మాయలను అనగా ఆదిపరాశక్తి మాయను దాటాలి అంటే….. ఈ గ్రంథులను దాటాలి. మనం విభేదనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రంధి అంటే …బ్రహ్మ గ్రంధిలో 108 కళలు ఉంటే…. విష్ణు గ్రంధిలో 116 కళలు…. రుద్ర గ్రంధిలో 136 కళలు అంటే మొత్తం మూడు గ్రంధులలో 360 కళలు అంటే… మనకి 365 రోజులు ఎలాగో ఈ 360 డిగ్రీలు కోణంలో ఈ గ్రంధులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట! ఇవి ఇందులో మనం బ్రహ్మగ్రంధి విభేదనం కోసం ప్రకృతి నాకు ఈ శాంకరీ దేవి శక్తి పీఠాన్ని అనుగ్రహించడం జరిగింది అనేసరికి…. మరి ఈ గ్రంథులు ఎలా అధీనం చేసుకోవాలి అనేసరికి….చాలామంది జపము, ధ్యానము ద్వారా చేసుకోవాలి. అంటే బ్రహ్మ గ్రంధి విభేదనం కోసం సరస్వతి స్తోత్రాలు చదువుకోవాలి లేదా సరస్వతి మంత్రమును చేసుకుంటూ ఉండాలి…. విష్ణు గ్రంధికి వచ్చేసరికి లక్ష్మీనారాయణ స్తోత్రాలు, విష్ణుమూర్తి స్తోత్రాలు లక్ష్మీదేవి స్తోత్రాలు లేదా వీళ్ళ మూలమంత్రాలు చేసుకుంటూ ఉండాలి….. అలాగే రుద్ర గ్రంథి విభేదనానికి వచ్చేసరికి శివ స్తోత్రాలు, పార్వతీదేవి స్తోత్రాలు, వీళ్ళ మూల మంత్రము చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వీటికి ప్రత్యేకమైన హస్తముద్రలు లేవు. ఇప్పుడు బ్రహ్మగ్రంధి విభేదనం అవ్వాలి. అది ఎలా అవుతుంది ఏంటి? అనేది మన ఆదిపరాశక్తి అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది అనేసరికి….. సరే నేను దీనికి సంబంధించిన జపధ్యానాలలో కూర్చుంటాను. మీరు కూడా మీ జపం, ధ్యానం ఏదో మీకు నచ్చింది చేసుకోండి. ఈ స్థలం యొక్క శక్తి మనసు మీద ప్రభావం చాలా బాగా చూపిస్తుంది అనేసరికి….. పిల్లలు, పెద్దలు ఎవరికి వారే ధ్యానంలో కూర్చోవడం జరిగింది.
శివనందినికి బ్రహ్మ గ్రంధి ఎలా విభేదనం చేసుకోవాలో అర్థం కాలేదు. కారణం ఏమిటంటే సరస్వతి స్తోత్రాలు ఎప్పుడు చదివింది లేదు… అలాగని బ్రహ్మదేవుడికి సంబంధించిన మంత్రాలు లేవు. విగ్రహారాధన చేసింది లేదు. చేతి ముద్రలు లేవు. ఎలా జాగృతి చేసుకోవాలో…. ఎలా శుద్ధి చేసుకోవాలో…. ఎలా ఆధీనం చేసుకోవాలో… ఎలా విభేదనం చేసుకోవాలో తెలియలేదు. ఇక్కడ ఉన్న బ్రహ్మదేవుడు, సరస్వతీ మాయలను ఎలా దాటాలో అర్థం కాలేదు. ఏదైతే అది జరుగుతుంది అని మౌనంగా ఓంకారం చేసుకుంటూ ఉండేసరికి….. ఉన్నట్టుండి తనలో కుండలీని శక్తి స్వాధిష్ఠాన చక్రం నుంచి బ్రహ్మగ్రంధికి చేరినట్లు అనిపించసాగింది. అనుభవం కలిగింది. అనుభూతి కలిగింది. శక్తి ఒక పాము పాకినట్లుగా వెన్నుపూస వెనక వైపు పాకినట్లుగా అనిపించసాగింది. ధ్యానంలో చూస్తే కుండలిని శక్తి ఒక పొగ రూపంలో గ్రంధిలోకి చేరిందని అర్థం అయింది. ఇక్కడ నుంచి తన ఆట మొదలవుతుంది అని…. జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంది. ఇలా ఒక వారం పది రోజులు ఇదే స్థితిలో ఉన్నప్పటికీ…. ఎలాంటి మార్పు కనిపించలేదు. పదేపదే కుండలిని శక్తి బ్రహ్మ గ్రంధిలోనికి కదులుతున్నట్టుగా ఉన్నది కానీ….. అది శుద్ధి అవుతున్నట్లుగా….జాగృతి అవుతున్నట్లుగా…. లేకపోతే అధీనం అవుతున్నట్లు గాని…. విభేదనం అవుతున్నట్లుగాని…. ఎలాంటి అనుభవం అనుభూతులు కలగలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని శివ స్వామిని అడుగుదామని హృదయం మీద చేయి పెట్టుకోబోతుండగా….. యోగులు సముద్రం దాటకూడదు అంటారు కదా! మరి శివ స్వామి ఇక్కడికి వస్తారో! రారో. మనకి రాకపోయినా పర్వాలేదు. ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు…. మనకి సమస్యకి సమాధానం చెబితే చాలు అనుకొని….. అయినా దేశం కానీ దేశంలో సముద్రం దాటి ఉండటం వలన ఆత్మానుసంధానం అవుతుందో లేదో అని చెప్పేసి అనుమానభయంతో…. హృదయ చక్రం మీద చేయి పెట్టి పెట్టగానే….. స్వామి! స్వామి! అనగానే…. పిలిచి పిలవగానే…. వెంటనే చెప్పు దేవి! అనగానే
శివ నందిని:- స్వామి! నా సాధన బ్రహ్మ గ్రంథి దగ్గరకు వచ్చి ఆగింది. నేను శాంకరీ శక్తి పీఠానికి రావడం జరిగింది.
శివస్వామి:- నీ సాధన విషయాలు అన్నీ నాకు తెలుస్తున్నాయి. నువ్వు ఎక్కడున్నావు… ఏంటి? అనేది తెలుస్తుంది.
శివ నందిని:- మరి దేశం కానీ దేశంలో నేను సముద్రం దాటి వచ్చాను. మీరు ఆత్మానుసంధానం అవుతారో లేదో!
శివస్వామి:- నేను నీ పక్కనే ఉన్నాను కదా! (అనగానే ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచేసరికి ఆయన సశరీరంతో తన పక్కన ఉండేసరికి)
శివ నందిని:- స్వామి! యోగులు యోగ సాధకులు సముద్రం దాటకూడదు అని చెప్పేసి అంటారు కదా!
శివస్వామి:- అంటారు… అందులో కూడా నిజం ఉన్నది. భౌతిక శరీరంతో నేను సముద్ర యానం చేయలేదు కదా ! నా సాధన పరిసమాప్తి అయింది కాబట్టి… నేను ఎక్కడికైనా రావచ్చు, అంతరిక్షానికి వెళ్లచ్చు, ఏ లోకానికైనా వెళ్లచ్చు, నాకు విశ్వం మీద సర్వాధికారాలు ఉన్నాయి.
శివ నందిని:- అసలు యోగులు గాని… యోగ సాధకులు కానీ… సముద్రం ఎందుకు దాటరాదు?
శివస్వామి:- అందుకు మనకి రామాయణమే ప్రత్యక్ష సాక్ష్యం. హనుమంతుడు, రావణాసురుడు ఉన్న శ్రీలంకకి వెళుతున్నప్పుడు సముద్రం దాటడం జరిగింది కదా! ఆ సముద్రంలో నీడను పట్టుకుని తినే ఒక రాక్షసి మాయను దాటడం జరిగింది అని చెబుతారు కదా! అంటే సముద్రం దాటడం వలన మనలో ఉన్న కుండలిని శక్తి లేదా ఉపాసన శక్తి లేదా ధ్యానశక్తి ఏదైనా కానీ సముద్రం మొత్తం లాగేస్తుంది అని…. పూర్విక మహర్షుల అభిప్రాయం. అలాగే హనుమంతుని యొక్క శక్తిని అంతా లాగేయడంతో ఆయన కాస్త క్షణకాలం పాటు శక్తిహీనుడు అవ్వడంతో …..దీనికి కారణం నీడను లాగే రాక్షసి అని తెలుసుకొని….ఆ రాక్షసి శరీరంలోనికి నోటి ద్వారా లోపలికి వెళ్లి మళ్లీ యధావిధిగా లోపల నుంచి బయటకు రావడం జరిగింది. ఇలా తను పునః శక్తిని పొంది ఆ రాక్షసిని చంపకుండా వెళ్ళిపోవడం జరిగింది. అలా సముద్ర యానం చేస్తే అప్పటిదాకా వాళ్ళు చేసిన సాధన శక్తి అంతా హరించుకుపోతుంది అని చెప్పేసి మన పూర్విక మహర్షుల యొక్క అభిప్రాయం.
శివ నందిని:- ఇది నిజమేనా?
శివస్వామి:- మరి నిజమే…. హనుమంతుని జీవిత చరిత్రలోనే జరిగింది కదా! అంతెందుకు… బర్ముడా ట్రయాంగిల్ ఉంది. ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఆకాశంలో విమానాలు, ఓడలు ,ఏ వస్తువులైనా త్రిభుజాకారంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళగానే మాయమవుతున్నాయి కదా! అదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ త్రికోణంలో రాహువు ఉన్నాడని చెప్పేసి…. అదే ఇలాంటి బర్ముడా ట్రయాంగిల్ జపాన్లో మరొకటి ఉందని అక్కడ కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుందని…. రాహు కేతువులు నీడలను మింగే గ్రహాలని జ్యోతిష్య శాస్త్రం చెప్పడం జరిగింది కదా! కాబట్టి ఎవరి నమ్మకాలు వాళ్ళవి.. ఇది మాత్రం అక్షర సత్యం. దేశాలు దాటి వెళ్లిన వారి సాధన శక్తి అంతటితో హరించి పోతుంది అని….చెప్పి నమ్మకం ఉన్నది. అంటే వాళ్ళు చేసే ప్రతి 12 సంవత్సరాల సాధన శక్తి సముద్రం హరించి వేస్తుంది. తరవాత మళ్ళీ తిరిగి వాళ్ళు తమ శక్తిని పొందటానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాల సాధన చేయవలసి ఉంటుంది. అందుకని మన హిందూ ధర్మం ప్రకారం దేవత విగ్రహాలు కూడా సముద్రం దాటించి పంపించరు. ఎందుకంటే ప్రతిష్ట చేసిన విగ్రహాల యొక్క సాధనా శక్తి కూడా హరించుకపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు కదా!
శివ నందిని:- మరి ఇప్పుడు కొంతమంది విదేశాలలో పూజలు చేయడానికి విగ్రహాలను తీసుకువెళ్లడం…. కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు విదేశాలకి వెళ్లడం జరుగుతుంది కదా! మరి వాళ్ళకి పరిస్థితి ఏంటి?
శివస్వామి:- వాళ్ళకి శాస్త్రం తెలియక,లేదంటే ఏం జరిగితే అది జరుగుతుందనో…. లేక విదేశాలలో ఉండే భక్తులు ఇచ్చే డొనేషన్స్ కి ఆశపడో….ఏదో చేస్తున్నారు. కాకపోతే కారణం లేకుండా అయితే ఏదీ లేదు. మనకి రామాయణ ఇతిహాసంలో సాక్ష్యంగా చెప్పడం జరిగింది కదా! ఇలా దేశాల దాటి వెళ్లిన వాళ్ల సాధన శక్తి ఆగిపోవడం నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మోక్షమును పొందవలసిన చోట ముక్తి పొందిన అనుభవాలు నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి ఇది అక్షర సత్యం అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరి నమ్మకాలు వారివి. మనమేం చెప్పలేము.
శివ నందిని:- అంటే సాధనా పరిసమాప్తి అయ్యాక ఎవరైనా, ఎక్కడికైనా వెళ్ళవచ్చా ?
శివస్వామి:- సాధన పరిసమాప్తి అయిన తర్వాత వాడికి వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా! వాడు ఉన్నచోటనే వాడికి అన్నీ కనపడతాయి. ఉన్నచోటే కాశి అనుకుంటాడు. అరుణాచలం అనుకుంటాడు. శ్రీశైలం అనుకుంటాడు. తిరుపతి అనుకుంటాడు. అమెరికా అనుకుంటాడు. ఏదైనా అనుకోవచ్చు. వాడికి దానికి తగ్గట్టుగానే దృశ్యాలు కనబడతాయి. యద్భావం తద్భవతి. వాడు కదలాల్సిన అవసరం లేదు. ఏదైనా వాడు ఇంట్లో ఉండి నేను కాశీలో శివలింగానికి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు…. అక్కడ కాశీలో ఉన్నట్టుగానే దృశ్యం కనబడుతుంది. కాశీ శివలింగం ముందు కూర్చుని అభిషేకం చేస్తున్న అనుభవ అనుభూతి కలుగుతుంది. యోగికి సాధ్యం కానిది ఏముంది. సాధన పరిసమాప్తి చేసుకున్న వాడికి సాధ్యం కానిది ఏముంది. భావమే కదా! ఆ భావాన్ని రూపాంతరం చేయించడమే కదా! ఆ భావరూపాన్ని వాడికి కావాల్సినట్టుగా వాడు భావించుకుంటాడు. భావరూపం మారుతుంది. వాడు ఉన్న ఇల్లే కాశీ క్షేత్రంగా గుడిగా మారచ్చు…. శ్రీశైలం గుడిగా మారచ్చు….అన్ని క్షణాల్లో మారిపోవచ్చు. వాడికే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే విధంగా కనపడేలా చేయగలడు..
శివ నందిని:- యద్భావం తద్భవతి అన్నమాట! అవును స్వామి! నాకు ఈ బ్రహ్మ గ్రంధి విభేదనం గురించి చెప్పరా?
శివస్వామి:- అసలు ముందు నీకు బ్రహ్మ గ్రంధి జాగృతి, శుద్ధి, అధీనం అవ్వాలి. ఆ తర్వాత విభేదనం గురించి ఆలోచించు.
శివ నందిని:- నేను వారం రోజులుగా చేస్తున్నాను..
శివ స్వామి:- నీకు ఏ విధమైన లక్షణాలు కలగలేదా?
బ్రహ్మ గ్రంథి జాగృతి లక్షణాలు:-
శివ నందిని:- మొదట రెండు రోజులు ఎలాంటి అనుభవాలు కలగలేదు. మూడవరోజు వచ్చేసరికి నేను వేరు, నువ్వు వేరు అనే ఒక భావం కలిగింది. మరుసటి రోజు దేవుడు వేరు, జీవుడు వేరు అనే భావన కలిగింది. జీవాత్మ వేరు ,పరమాత్మ వేరు అనే భావన కలిగింది. పురుష ఆత్మ ,స్త్రీ ఆత్మ అనే భావం కలిగింది. ఆ తర్వాత పురుషాధిక్యత తట్టుకోలేను…. స్త్రీ ఆధిక్యత అనే భావం కలిగింది.
శివ స్వామి:- ఇలా నేను వేరు…. నువ్వు వేరు అనే ద్వంద్వ ప్రవృత్తి భావనలు కలుగుతుంది అంటే…. ఇవే జాగృతి లక్షణాలు. నాకు సాధన సమయంలో స్త్రీ ఆధిక్యతను తట్టుకోలేకపోయాను. అదే నువ్వు వచ్చేసరికి పురుషాదిక్యతను తట్టుకోలేకపోతున్నావు. అదే ప్రకృతి యొక్క నియమం. మూలాధార చక్రం అనేది పురుష ప్రకృతికి సంబంధించింది… అయితే స్వాధిష్ఠాన చక్రం అనేది స్త్రీ ప్రకృతికి సంబంధించింది. ఈ రెండు ప్రకృతులకు అంటే పురుష ప్రకృతి అనేది కొండలు, సముద్రాలు అంటే కదలని పదార్థాలతో ఉంటే…. స్త్రీ ప్రకృతి అనేది మొక్కలు, జంతువులు,మనుషులు ఇలా కదిలే వాటితో సంబంధం ఉంటుంది. ఇక్కడ స్త్రీ,పురుష ఆధిక్యతల గురించి మనకి పోరు జరుగుతున్నట్టుగా ఉంటుంది. పురుషుడు సాధకుడు అయితే…. స్త్రీ మీద అధిపత్యం పొందాలని చెప్పేసి…. బ్రహ్మ గ్రంధి వద్ద మనకి అనిపిస్తుంది. అదే స్త్రీ సాధకురాలు అయితే పురుష ప్రకృతి మీద ఆధిపత్యం పొందాలి అనిపిస్తుంది. అలాంటి భావం కలుగుతుందని నీ ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎవరు? జీవుడు వేరు, శివుడు వేరు అనే ద్వంద ప్రవృత్తులు కలుగుతున్నాయి కదా! ఈ దేహం నాది….ఈ సంసారం నాది…. వీళ్ళు నా వాళ్ళు అని మనకి ఆదిపరాశక్తి నాది అనే భావం ఈ బ్రహ్మ గ్రంధిలో కలిగిస్తుంది. ఎప్పుడైతే ఈ భావం, నీకు నేను దేహం కాదు…. నేను జీవాత్మ కాదు… నేను జీవుడు కాదు… నేను పురుష ఆత్మ కాదు…. నేను స్త్రీ ఆత్మని కాదు…. నేను పురుష ప్రకృతిని కాదు… నేను స్త్రీ ప్రకృతిని కాదు… నేను అనేది లేదు… ఉన్నది ఆయనే. శివుడే….దేవుడే అని ఏకత్వ స్థితికి రాగలుగుతావో….. అప్పుడు నీకు ఈ బ్రహ్మ గ్రంధి విభేదనం జరిగింది అనుకోవాలి. ఈ బ్రహ్మ గ్రంధి విభేదనానికి ఒక మూల మంత్రమును ఉంటుంది.
ఓం శ్రీ బ్రహ్మ గ్రంధి విభేదనాయనమః
అనే మూల మంత్రమును చేసుకుంటూ……. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి గ్రంధి విభేదనమవుతుంది. నీకు గ్రంధి విభేదనానికి సూచనగా బ్రహ్మ ఆవాసం ఉండే బ్రహ్మకమలం నీ దగ్గరికి దైవిక వస్తువుగా రావాల్సి ఉంటుంది. నాకు కూడా వెండితో చేసిన బ్రహ్మ కమలం రావడం జరిగింది.
శివ నందిని:- అలాగే స్వామి…
శివ స్వామి:- ఒకటి గుర్తుంచుకో! ఇది మాయాబీజం. ఆదిపరాశక్తి ఆధీనంలో ఉంటుంది. సంసారిక వాంఛలలోకి వెళ్తుంది. నా సంసారం… నా భర్త… నా పిల్లలు అనే మమకార మోహ వ్యామోహాలకి ఈ బ్రహ్మ గ్రంధి యే మూలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అంత తేలికైన విషయం కాదు బ్రహ్మ గ్రంథిని దాటడం అంటే….. నువ్వు స్త్రీ, పురుష ప్రకృతిలో ఉన్న విషయాలను దాటడం అంటే అది అనితర సాధ్యమని చెప్పలేను గాని సాధన చేస్తే సాధ్యపడుతుంది. కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఈ దేహం నేను కాదని…. ఆదిపరాశక్తి ఒకటే జ్ఞాన సత్యమని….జ్ఞానం కలగాలి అంటే, ఈ గ్రంథి విభేదనం ద్వారా ఈ దేహం నాది కాదని…. ఇది నేను కాదని…. పరాదేవి ఒకటే పరమ సత్యం… ఈ పరమేశ్వరుడు ఒక్కడే పరమ సత్యం అని… మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. ప్రకృతి సత్యమని… నిత్యమని…. భ్రమ బ్రాంతి కలిగించే అజ్ఞాన మాయలో ఈ గ్రంధి ఉంచుతుందని…. సాంసారిక విషయంలో ఈ గ్రంధి ఉంచుతుందని గుర్తుంచుకో…
ఒకటికి పది సార్లు చెప్తున్నాను. ఇక్కడ ఈ గ్రంథిని దాటడం అంటే నీ కుండలిని శక్తి మణిపుర చక్రంలోకి శాశ్వత స్థిర నివాసం చేసుకుంటుంది. ఆ తర్వాత నీకు అనుగుణంగా నీ ఆజ్ఞ ప్రకారంగా కుండలిని శక్తి మూలాధార చక్రం, స్వాధిష్ఠాన చక్రము వద్దకి నీ అనుమతి తీసుకోని వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటిదాకా దాని ఆధీనంలోకి మనం ఉంటాము. అంటే మాయ ఆధీనంలో మనం ఉంటాము. మాయని నీ అధీనంలోకి తెచ్చుకోవాలంటే…. ప్రకృతిని నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే…. కోరిక మాయలను నీ అదుపులోకి తెచ్చుకోవాలన్నా….నువ్వు ఈ బ్రహ్మ గ్రంథి విభేదనం చేయవలసి ఉంటుంది. నేను ఇచ్చిన మంత్రముతో విభేదనం గావించు. ఫలితం కనబడుతుంది. కాకపోతే శ్రద్ధతో, ఓపికతో సహాయంతో ఎదురుచూడు. ఆవేశ పడకు. ఆవేదన చెందకు. మాయలో పడకు.
అని ఒకటికి పది సార్లు చెప్పి ఆయన అదృశ్యం అవడం జరిగింది. సరే స్వామి మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని చెప్పి మనసులో అనుకొని…. శివ స్వామి చెప్పిన మంత్రమును మనసులో ధ్యానం చేసుకుంటూ శివ నందిని ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది.
తర్వాత శివ నందిని కాస్త ధ్యానం నుంచి బయటకు వచ్చిందని…..బాల గణపతి తన దగ్గరికి వచ్చి….
బాల గణపతి:- అమ్మ.. అమ్మ! నాకు ఒక సందేహం…. సమాధానం చెప్పవా?
శివ నందిని:- ఏంటమ్మా..?
బాల గణపతి:- ఇప్పుడు అమ్మవారు అయ్యవారిని బంధనం చేసింది కదా! ఆ తర్వాత శంకరాచార్యుల వారు కూడా అమ్మవారిని బంధనం చేశారు కదా! అదే మధురై మీనాక్షి అమ్మవారిని పాచికలు ఆడుతూ అమ్మవారి చుట్టూ శ్రీ చక్రం వేసి బంధనం చేశారు అంటారు కదా! అమ్మవారు శ్రీ చక్రబంధనం అయ్యిందని అంటారు కదా! ఇప్పుడు నువ్వు ఇంక ఎందుకు సాధన చేయడం? అమ్మవారి బంధనం అయిపోయారు… అయ్యవారు బంధనం అయిపోయారు….. మరి మనం సాధన చేయడం ఎందుకు?
శివ నందిని:- అది ఒక పురుష ప్రకృతిలో అమ్మవారు పురుషుడిని బంధనం చేయడం జరిగితే….. స్త్రీ ప్రకృతిలో అయ్యవారు అమ్మవారిని బంధనం చేయడం జరిగింది. ఇది ఎలా ఉంటుంది అంటే…. భార్య మాట జవదాటని భర్త ఉంటాడు…. అలాగే భర్త మాట జవదాటని భార్య ఉంటుంది కదా!
బాల గణపతి:- అవును…
శివ నందిని:- అలాగే భార్య మాట వినేవాడి ఇంట్లో భార్య ఆధిక్యత ఉంటుంది. అదే భార్య మాట వినని ఇంట్లో భర్త ఆధిక్యత ఉంటుంది. అంటే ఇప్పుడు బంధనమైన వాళ్ళు ఇద్దరు మోక్షమును పొందారు… బంధనం కాని వాళ్ళిద్దరూ మోక్షమును పొందలేదు. అందువలన ఈ సృష్టి జరుగుతుంది. బంధనం కాని వాళ్ళకి బంధనం వెయ్యాలి. అప్పుడు కదిలే ఇద్దరు కూడా కదలకుండా నిలబడగలిగితే…. స్థిరంగా ఉండగలిగితే…. మనకి విశ్వమోక్షం వస్తుంది అనే సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం నిజమా కాదా! అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు పరమహంస గారు తమ ధ్యాన అనుభవాల ద్వారా పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందాడు ……ఆదిపరాశక్తి అంశ అయిన కామాక్షి దేవి మోక్షం పొందలేదు అని చెప్పేసి తెలుసుకున్నారు. ఇప్పుడు నా సాధన ద్వారా స్త్రీ ప్రకృతిలో కామాక్షి దేవి మోక్షం పొందింది…. దక్షిణామూర్తి అంశ అయిన చిదంబర నటరాజు కదలడం వలన ఆయన మోక్షం పొందలేదు అనేది అనుభవం అనుభూతి పొందవచ్చు. అప్పుడు ఆ పురుష ప్రకృతిలో కదిలే కామాక్షి దేవిని, స్త్రీ ప్రకృతిలో కదిలే చిదంబర నటరాజు మూర్తిని కలిపితే ఏం జరుగుతుంది ? అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. అంటే రెండు కదిలేవి కలిస్తే ఏమవుతుంది అనేది ఇంతవరకు తెలియదు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే…. కదలనివి కదలవు. అది పూర్ణ మోక్షం… ఇది జరుగుతుంది. ఇప్పుడు కదిలే శివుడు, కదలని అమ్మవారు చూస్తే కదులుతుంది. కదలని అమ్మవారు, కదిలే శివుడు చూస్తే కదులుతుంది. అంటే ఏంటంటే….. ప్రకృతిలో ఒక పురుషుడు కదిలితే, స్త్రీ కదలడం లేదు. స్త్రీ కదిలితే పురుషుడు కదలడం లేదు. అసలు ఇద్దరూ కదలడం లేదనుకో…. ఏం జరుగుతుందో తెలియాలి. ఇద్దరు కదులుతూ ఉంటే…. ఏం జరుగుతుందో తెలియాలి. అందుకు నా సాధన ఉన్నది.
బాల గణపతి:- ఇప్పుడిప్పుడే నీ సాధన అర్థమవుతుంది. ఇప్పుడు ఒక శివుడు ఒక ప్రకృతి పరంగా చేసింది…. శంకరాచార్యుడు స్త్రీ ప్రకృతి పరంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మిగిలిన వాళ్ళని నువ్వు కలపాలి. అస్థిరంగా ఉన్న కదిలే వాళ్ళని కదలకుండా చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది అది విశ్వ మోక్షం అవుతుందా? లేదా వ్యక్తిగత మోక్షం అవుతుందా? అనేది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి..
శివ నందిని:- అవును, కాకపోతే మనం ఏ కోరిక మాయలో పడకుండా…. మన సాధన ఆగకుండా…. ఉండగలిగితే చాలు.
బాల గణపతి:- ఓహో అదన్నమాట! సరే, నీ సాధనకి ఒక అర్థం పరమార్థం ఉంది. ఇంక సాధన మిగిలి ఉంది. ఈ సాధనను సంపూర్తి చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు.
సరే …..అని పిల్లలు ఇద్దరు వెళ్లిపోవడంతో శివ నందిని ధ్యాననిష్ఠలోకి వెళ్లిపోయింది. శివ స్వామి చెప్పిన గ్రంధి విభేదన మంత్రమును చేసుకోవడం మొదలు పెట్టింది. అలా దాదాపు మూడు గంటలు చేసిన తరువాత ఈమెకి ఉన్నట్టుండి ఈ ప్రకృతి నాది, ఈ దేహం నాది, నేను సర్వశక్తిమంతురాలిని, నేను ఎవరికి అధీనం అవ్వాల్సిన అవసరం లేదు…. నా కిందే అందరూ ఉండాలి. నాకిందే అందరూ బానిసలుగా ఉండాలి…నేనే గొప్ప….నేనే విశ్వ మాతని…. నేనే విశ్వశక్తిని…. ఇలా విపరీతమైన భావాలు కలుగుతూ ఉండేసరికి…. వాటిని తట్టుకోలేక మాయలో పడే ప్రమాదం ఉంది అని…. శాంకరీ దేవి దగ్గరికి వెళ్లి అమ్మ! అని అమ్మవారి దగ్గర తన వేదనను, మనోవేదనను మొర పెట్టుకోవడం జరిగింది. ఆవిడ ముందే ధ్యానం చేయడం ఆరంభించింది. ఇలా చేస్తూ ఉండేసరికి…. ఇక మధ్యాహ్నం సమయం అవ్వడంతో ఇలా హోటల్ గదికి వెళ్లి కావలసిన భోజనాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలా అనుకొని అక్కడే దగ్గరలో ఉప ఆలయాలుగా ఉన్న భద్రకాళి అమ్మవారి గుడి, అమ్మన్ కోవెల గుడికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత కొంత దూరంలో ఉన్న రావణాసురుడి కోట, ఆ తర్వాత సీతాదేవిని బంధించిన అశోకవనం, సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన చోటును కూడా రామాయణ ఇతిహాస ప్రదేశాలు అన్నిటిని కూడా…. మూడు రోజులపాటు ఆయా ప్రాంతాలకు వెళ్లి…. సుమారుగా 10 ప్రాంతాలను సందర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత యధావిధిగా మళ్లీ ఈ బ్రహ్మ గ్రంధి విభేదనం కోసం తపన తాపత్రయాలతో శాంకరీ దేవి గుడికి వచ్చి….. శివ నందిని సాధన చేసుకోవడం ఆరంభించింది. కానీ, మనసు మనసులో లేదు. చక్ర జాగృతి అవుతుందని తెలుస్తుంది. విపరీతంగా నీది నాది అనే భావన, ఆధిక్యత కోసం తపన తాపత్రయాలు పడుతుంది కానీ, ఇవి ఎలా తగ్గుతాయో తెలియదు. ఇలా కాదు అనుకొని…. శివ స్వామి చెప్పిన మంత్రమును చదువుతున్నప్పటికీ…. ఇది నేను కాదు, నేను అనేది లేదు, నేను జీవాత్మ కాదు, నేను ఆధిక్యత కోసం పోరాడటం ఏమిటి? స్త్రీ ,పురుషులకి భేదం లేదు…. జీవుడికి ,దేవుడికి భేదం లేదు, ఉన్నది అమ్మవారే ….ఉన్నది శక్తి, శివుడే అనే భావంలోకి వెళుతున్న కొద్ది కూడా క్షణకాలం పాటు లేదా కొన్ని క్షణాలు ధ్యానం చేసిన అంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మళ్లీ యధావిధిగా ధ్యానం ఎప్పుడైతే ఆపేస్తుందో…. అప్పుడు నీదీ, నాది …నేను వేరు, నువ్వు వేరు అనే భావాలు, ఆధిక్యత భావాలు ….విచిత్రంగా విషయ వాంఛల మీదకి వెళ్లడం ఆరంభించింది. విశ్వం మీద ఆధిపత్యం పొందాలి…. వాటిని వశం చేసుకోవాలి… వాటిని పాదాక్రాంతులను చేసుకోవాలి…. దేవతల చేత సేవలు చేయించుకోవాలి. ఇలా విపరీతమైన కోపావేశాలు, భావాలు, ఆలోచనలు వస్తూ ఉండేసరికి…. తలనొప్పి వచ్చి తట్టుకోలేని పరిస్థితిలో సాధనను ఆపివేయాల్సి వచ్చేది. అంటే ధ్యానం ఆపేసే పరిస్థితికి వచ్చేది. విశ్రాంతిగా పడుకోవడం జరిగేది. గుడిలోనే ఒక మూలన పడుకోవడం ఆరంభించింది. వీటిని ఎలా ఆపాలో…. ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు రుద్ర స్వామిని దీని గురించి అడిగితే….
రుద్రస్వామి:- అమ్మ! వీటి గురించి నాకు ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా యోగ నిద్రలోనే సాధన చేసుకునేవాడిని.. ఏ చక్రాలు ఎలా జాగృతి అయినాయో….. ఏ చక్రాలు ఎలా శుద్ధి అయినాయో ……ఏ చక్రాలు ఎలా ఆధీనం అయినాయో….. ఏ చక్రాలు ఎలా విభేదనం అయినాయో…… వీటి గురించి నాకు తెలిసేది కాదు. నేను పట్టించుకునే వాడిని కాదు. నా సాధన అంతా రోజులో 20 గంటలు యోగ నిద్రలో ఉండిపోవడమే. కాకపోతే దేనికి ఆశపడే వాడిని కాదు. దేనికి భయపడేవాడిని కాదు….దేనికి స్పందించే వాడిని కాదు…. దేని గురించి ఆలోచించేవాడిని కాదు…. దేని గురించి పట్టించుకునే వాడిని కాదు….. దేని గురించి సంకల్పించుకునే వాడిని కాదు….. ఇది కావాలి, అది కావాలి… చక్రాలు జాగృతి కావాలి, చక్రాలు శుద్ధి కావాలి , ఆధీనం కావాలి…. విబేధనం అవ్వాలి….. ఆ చక్రాల యొక్క జ్ఞానం కూడా నాకు తెలియదు. ఈ గ్రంధుల జ్ఞానం కూడా నాకు తెలియదు. ఇప్పుడు సినిమా చూడాలనుకున్న వాడు ఆ సినిమా యొక్క రేటింగ్ ఎంత, ఎక్కడ ఉంది, ఏమిటి? అని వెళ్ళటం… ఒక ఎత్తు….సినిమా చూడాలనుకున్నవాడు ఏదో ఒక సినిమా చూసి ఆనందించడం ఒక ఎత్తు. నేను రెండో వాడిని. నాకు సినిమా చూడాలనిపించినప్పుడు థియేటర్ కి వెళ్లిపోయి సినిమా చూసేసి వచ్చేసేవాడిని. ఆ సినిమా హిట్టు, ఫ్లాపు, రేటింగ్ ఎంత, ఎలా ఉంది, ఆ డైరెక్టర్ ఎవరు, ఏంటి? అనే వివరాలు తెలుసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఆలోచనలు ఉండేది కాదు. ఇప్పుడు నీ సాధన ఎలా ఉంది అంటే…. వివరాలన్నీ తెలుసుకొని…. సాధన ఎలా చేయాలి? ఎలా ఆధీనం చేసుకోవాలి? ఏమేమి లక్షణాలు ఉంటాయి… ఎలా దాటుకోవాలి….? అక్కడ ఉన్న మాయల దాటుకుని,ఇలా ఒక వరుసక్రమంలో వెళుతున్నావు. నాకు వరుస క్రమం లేకుండానే జరిగిపోయింది. నేను సినిమా చూడటం జరిగింది. ఆనందం పొందటం జరిగింది. నువ్వు సినిమా చూస్తున్నావు. కాకపోతే ఆ సినిమా ఏంటి? ఎవరు తీశారు…. హీరో ఎవరు… హీరోయిన్ ఎవరు… దాని రేటింగ్ ఎలా ఉంది? దానికి సంబంధించినవి అన్నీ నువ్వు చూసుకొని ….ఏ థియేటర్లో ఆడుతుందో అవన్నీ తెలుసుకుని….ఆ ప్రాంతంలో ఉన్న ధియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నావు. నాకు సినిమాలో సంబంధం లేదు…. డైరెక్టర్ తో, హీరోతో, హీరోయిన్తో, నాకు సంబంధం లేదు. సినిమా చూశాను… మనసుకు నచ్చిందా లేదా? అనేది నేను చూసుకుంటాను. ఏ సినిమా అయినా నాకు మనసుకు నచ్చుతుంది. కాకపోతే నీకు ఫలానా సినిమా అయితేనే మనసుకు నచ్చుతుంది. ఆ ఫలానా అని పెట్టుకోవడం వల్లే నీకు ప్రతిదీ కూడా కొలబద్ధ ప్రకారంగా కాల క్రమేణా జరగాలి. నాకు ఈ జాగృతులతోనూ , శుద్ధుల తోనూ, ఆధీనాలతోను నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇన్ని చక్రాలు ఉంటాయని… ఇన్ని గ్రంధులు ఉంటాయని నాకు పరమహంస గ్రంధంలో విషయాలు తెలిసేదాకా తెలియదు. అలాగే దేహాలు కూడా ఇన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి…. శుద్ధి చేసుకోవాలి.. అధీనం చేసుకోవాలి…విభేదనం చేసుకోవాలని కూడా తెలియదు. అలాగే దైవిక వస్తువులు సేకరించాలని కూడా తెలియదు. కానీ నా సాధన లింగ దేహం దాకా వెళ్ళిపోయి…. దేహం దహనమై మోక్షం పొందడం అయితే జరిగింది. కాకపోతే కాశీ క్షేత్రంలో మోక్షం పొందాలి అని ఒక కోరిక ఉండేది. అందుకోసం అని నేను కాశీ క్షేత్రాన్నీ ఆవాసం చేసుకోవడం జరిగింది. కాకపోతే చనిపోయేముందు భౌతికంగా ఆది రుద్ర మూర్తిని చూడాలి అని చెప్పేసి అసంతృప్తి మిగిలిపోవడంతో….నా స్థూల శరీరానికి మోక్ష మరణం రావడంలేదని గ్రహించాను. ఆ కోరిక ఉండటానికి కారణం నా వారసత్వంలో కొన్ని తరాల వాళ్ళు ఈ రుద్రయంత్రమును వంశపారపర్యంగా తీసుకుంటూ రావడం…. ఆ రుద్ర యంత్రము నా దగ్గరికి రావడం….. నేనైనా ఈ జన్మలో రుద్ర మూర్తిని సజీవంగా చూడాలి అనే కోరిక ఉండటం వలన…. నా భౌతిక దేహానికి మరణం రావడంలేదని తెలిసింది. ఈ కోరికను తీర్చే వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ ఉండటం జరిగింది. అలా నువ్వు నాకు దర్శనం ఇచ్చావు… కనపడ్డావు… నీతో నేను సఖ్యత, స్నేహం పెట్టుకుని నీ ద్వారా సజీవ రుద్ర మూర్తిని చూడాలనుకుంటున్నాను. ఆ కోరిక తీరిన మరుక్షణం ఈ దేహం మరణం పొందుతుందని…. దోస చెట్టుకి దోసకాయ కాస్త పండు గా మారి తొడిమ నుంచి విడిపోయి చనిపోతుందని నాకు అర్థం అయింది. ఇదే కదా రుద్రుడు యొక్క మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం. అది ఎవరో ఏదో చేస్తారని కాదు… మనకి తెలియని కోరిక వల్ల కానీ తెలిసిన కోరిక వల్ల కానీ ఆ కోరిక తీరకపోవడం వలన మన దేహాలు మిగిలిపోతున్నాయని అర్థమయింది. అందులో నాకు స్థూల దేహం మిగిలిపోయింది. నా స్థూల దేహం యొక్క కోరిక సజీవ రుద్ర మూర్తిని చూడాలని, మా వంశస్థుల కోరిక కాస్త ఇష్ట కోరికగా మారి అది కోరిక మాయగా మారిందని…. నిన్ను చూసిన తర్వాత నాకు అర్థం అయింది. అది నీ వల్ల ఆ కోరిక సాధ్యపడుతుందని గ్రహించడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. ఇదే విధంగా మహాదేవికి కూడా ఇలాంటి కోరిక ఉండటంతో రావడం జరిగింది. ఇక పిల్లలు అంటావా..! వాళ్ళు కాలానుగుణంగా వాళ్ళ కోరికలు ఏంటో వాళ్లకి ఉంటాయి…. వాళ్ళు ఆ కోరికలు నీ ద్వారా తీర్చుకోవాలి అనుకుంట! వాళ్ల కోరికలు తీరిన తర్వాత మేము నలుగురం మోక్షం పొందుతాము.ఇప్పటికే మా నలుగురి సాధన మోక్ష ప్రాప్తి పొందింది…. కాకపోతే, ఏదో కోరిక…. ఇష్ట కోరిక అదికాస్తా తీరితే…. కేవలం వాళ్ళ స్థూల శరీరాలు మోక్షం పొందితే చాలు….ఇక మిగతా శరీరాలు మోక్షం పొందినాయి… నిజానికి మా నలుగురి సాధన కూడా పరిసమాప్తి అయిపోయింది. కాకపోతే ఎవరికి వారే సాధన ఇంకా మిగిలి ఉంది అని అనుకుంటున్నారు. పిల్లలు ఇద్దరి సాధన మా ఇద్దరి సాధన కూడా పూర్తయిపోయింది. కాకపోతే నీ సాధన ఇప్పుడు వెళుతుంది అనేసరికి…. ఈ విషయం అంతా విన్న తర్వాత శివ నందినిలో ఒక విధమైన భావం రావటం మొదలైంది. అంటే అందరి సాధన పూర్తయింది… కానీ తన సాధన పూర్తవ్వలేదు. ఇన్నాళ్లు తను వీళ్ళందరికీ జ్ఞానం ఇస్తున్నాను…. అనుభవాలు చెబుతున్నాను…. మోక్షమార్గంగా నిలబడ్డాను అని చెప్పేసి….ఒక విధమైన అహంభావం స్థితిలో ఉండేది. తను లేకపోతే నలుగురి సాధన గంగపాలు అయిపోయేది… ఆగిపోయేది అనుకుంటూ…. ఏదో గర్వం, అహంకారాలలో తెలియని స్థితిలో ఉండేది. ఇప్పుడు రుద్రస్వామి చెప్పిన మాటలలో తన సాధన మాత్రమే ఉన్నదని…. అందరి సాధన అయిపోయిందని…కేవలం ఒకానొక కోరిక కోసమే వాళ్ళు స్థూల శరీరంతో నిలబడ్డారు అని….ఆ కోరిక తన వలన తీరుతుందని…. కేవలం కోరిక అనేది తన వల్ల తీరుతుందని… కేవలం కోరికకు సంబంధించిన దానికి అనుసంధానం అవ్వడమే కానీ తన సాధన వలన వీళ్ళ సాధన అనేది జరగటం లేదు అని అర్థం అయ్యేసరికి…. ఒక విధమైన ఆవేశం,ఆవేదన, ఆక్రోషం ఇలా జరుగుతూ ఉండేసరికి….శివ నందినికి నాభి ప్రాంతంలో విపరీతమైన నొప్పి రావడం మొదలయింది. తట్టుకోలేకపోయింది… విలవిలడిపోయింది… ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రుద్ర స్వామికి విషయం అర్థమై మహాదేవికి… బ్రహ్మ గ్రంధి విభేదనం జరుగుతుంది…. నువ్వు దానిని తాకద్దు ఏమీ అవ్వదులే అనేసరికి…. పాము మరణం సమయంలో ఎలా అయితే కొట్టుకుంటుందో అలా నేల మీద పొర్లుతూ గట్టిగా అరుస్తూ శివ నందిని ఉండేసరికి ఏం జరుగుతుందా అని చుట్టు పక్కల వాళ్ళు వస్తూ ఉండేసరికి ఏం కాదులే… ఆమెకి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చే వ్యాధి ఉంది. అది అప్పుడప్పుడు ఇలా చూపిస్తూ ఉంటుంది. ఒక 10 -15 నిమిషాలకి సర్దుకుంటుంది. మీరు మీ పని చూసుకోండి అనేసరికి…. ఓహో! కడుపులో నొప్పా దానికి సంబంధించిన మందులు వాడుతున్నారా? అంటే వాడుతున్నాము అయినా గాని అప్పుడప్పుడు నెలకో….2 నెలలకో….ఇలా అరుదుగా వస్తుంది… అనేసరికి సరే అని అక్కడ ఉన్నవాళ్లు, దేవాలయ భక్తులు అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు వెళ్లిపోయారు. శివ నందిని మాత్రం ఈ నొప్పిని భరించలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి అమ్మా! అంటూ గిలగిలలాడుతూ ఉండేసరికి…కొంతసేపటికి ఉపశమనం కలిగింది. అప్పుడు లేచి కూర్చొనేసరికి ధ్యానం చేసుకోవాలి అనేసరికి… కుండలీని శక్తి కాస్త రుద్ర గ్రంధి విభేదనం జరిగి…. ఈ బ్రహ్మ కమలం లాంటిది కనపడి ఆ బ్రహ్మ కమలం ద్వారా కుండలినీ శక్తి పాము పొగ రూపంలో మణిపుర చక్రంలోనికి ప్రవేశించడం ఒక్క క్షణకాలం అనుభవం అనుభూతి దృశ్యంగా శివ నందినికి కనిపించింది.
అంటే తనకి బ్రహ్మ గ్రంధి విభేదనం అయ్యింది అని శివ నందిని ధ్యాన అనుభవం ద్వారా తెలుసుకుంది. ప్రకృతి మాయను దాటడం అంటే అసాధ్యమే…. కానీ సాధ్యం కాకుండా అయితే ఉండదు అని…. ఇదే శివ స్వామి చెప్పిన మాట అనుకుంది. ఎవరికి సాధ్యం కాదు కానీ….వాటిని అదుపు చేసుకోవాలి అని అలాగే మాయలను జయించడం ఎవరికీ సాధ్యపడదు, వాటిని అదుపు చేసుకోవాలన్నమాట! వాటిని అదుపు చేసుకునే శక్తి, నిగ్రహ శక్తి వచ్చింది అని శివనందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. సరే అని ధ్యానం చేసుకుంటూ ఉండే సరికి ఈసారి బ్రహ్మగ్రంధి స్థానంలో బ్రహ్మ కమలం, ఆ బ్రహ్మ కమలం మీద బ్రహ్మదేవుడు, ఆ తర్వాత మహా సరస్వతి ఆవాసం చేస్తున్నట్లుగా ధ్యానంలో పదేపదే కనిపిస్తూ ఉండేసరికి…. వీళ్లిద్దరికి కృతజ్ఞతలు నమస్కారాలు చేస్తూ ఉండేసరికి…. పద్మాసనంలో కూర్చున్న కామాక్షి దేవి బ్రహ్మ గ్రంధిలో కనిపించేసరికి…..ఓహో! ఆదిపరాశక్తి అంశ కాబట్టి ఈవిడ ఆధీనంలోనే కదా స్త్రీ, పురుష ప్రకృతి అనేవి ఉన్నాయి. ఈ రెండు కూడా మాయాబీజసహితంగా ఉన్నాయి. ఈ మాయాబీజ మాయ తను శివ స్వామి ఇచ్చిన మూల మంత్రములతో విభేదనం జరిగి ఉండాలి అని శివ స్వామీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ….. ఆదిపరాశక్తికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. ఈ మాయాబీజమును విభేదనం గావించినందుకు బ్రహ్మ దేవుడికి అలాగే సరస్వతీకి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉండేసరికి…. ధ్యాన అనుభవాలు అదృశ్యమైనాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రహ్మ కమలం అదే పనిగా ధ్యానంలో కనపడుతూ ఉండేసరికి…. ఇప్పుడు ఇది ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి ..అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి, అది ఎక్కడ ఉన్నది అనేది కనపడడం లేదు కానీ, అది ఉంది అని మాత్రం పదేపదే కనపడుతూ ఉండేసరికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసింది. ఆ తర్వాత శాంకరీ దేవి దగ్గరికి వెళ్లి, ఆవిడ అనుభవం చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకొని, తనలో ఉన్న రాక్షస గుణాలు అనగా అరిషడ్వర్గాలు,మాయని అణచివేసినందుకు అలాగే ధర్మ గుణము, సత్వ గుణము ,శుద్ధ సత్వ గుణాలను సంరక్షించినందుకు ఆ దేవతకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉన్న త్రికోణేశ్వర స్వామికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తనకి బ్రహ్మ కమలం వస్తే ఈ క్షేత్రమును వదిలిపెట్టి మరో క్షేత్రానికి వెళ్లడం జరుగుతుందని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. కాకపోతే అప్పటికే శరీరం విపరీతమైన బాధతో ఉండేసరికి…. ఇక తట్టుకోలేక విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పేసి ఇదే విషయాన్ని రుద్రస్వామికి చెబితే…. సరే అమ్మ! పదా. ఇవాళతో ఈ ధ్యానం ఆపేద్దాము. హోటల్ గదికి వెళ్లి తగినంత నిద్రపో అని చెప్పి అనేసరికి… సరే అని చెప్పేసి అందరూ హోటల్ గదికి వెళ్లడం జరిగింది. హోటల్ గదికి వెళ్ళిన తరువాత బాల కుమారస్వామికి ఒక సందేహం వచ్చి అమ్మ! అమ్మ! అని పిలిచేసరికి శివ నందిని మంచి నిద్రలో ఉంది అనుకుని…. మహాదేవి దగ్గరికి వెళ్లి
బాలకుమారస్వామి:- అమ్మ! నాకు ఒక ధర్మ సందేహం చెప్పగలవా?
మహాదేవి:- చెప్పు నాన్న ! చెబుతాను…. నాకు తెలిస్తే చెబుతాను.
బాలకుమారస్వామి:-విష్ణుమూర్తి బొడ్డు నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టాడు. ఒక మగవాడికి మరొక మగవాడు పుట్టడం సాధ్యపడుతుందా?
మహాదేవి:- అది విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం కదా! ఆ అమ్మవారి నుంచి బ్రహ్మదేవుడు పుట్టినట్టుగా చెబుతారు. నిజానికి అదే సృష్టికార్యం తల్లి బిడ్డ జననం గురించి పూర్వకాలంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. తల్లి కడుపున పుట్టిన బిడ్డ…. బొడ్డు ద్వారా పేగు బంధంతో అనుసంధానం అవుతాడు కదా! బొడ్డు ద్వారానే కడుపులో ఉన్న పిల్లవాడికి ఆహారం అందుతుంది కదా!
బాలకుమారస్వామి:- అవును…
మహాదేవి:- జీవుని పుట్టుక ఈ విధంగా ఉంటుంది అని విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి పుట్టుకను ఆ కాలంలో చిత్రాల ద్వారాను….బొమ్మల ద్వారా…. విగ్రహమూర్తుల ద్వారా లోకానికి తెలియజేయడానికి చెప్పడం జరిగింది. కాన్పు అయిన తర్వాత పిల్లాడి బొడ్డు కత్తిరించడంతో పిల్లవాడికి తల్లికి ఉన్న పేగు బంధం తీరిపోతుంది. ఆ పిల్లవాడు వేరు చేయబడి స్వతంత్రుడై తనకు తాను స్వతహాగా బతికే స్థితికి వస్తాడు.తల్లి మీద ఆహారం కోసం ఆధార పడాల్సిన అవసరం లేదు…. అంటే ఇప్పుడు తల్లి తిన్న ఆహారం పేగు బంధం ద్వారా పిల్లవాడికి వెళ్తుంది. ఆ తర్వాత తల్లిపాల ద్వారా కొంతకాలం ఆహారం ఇస్తుంది. ఆ తర్వాత ఆహార పదార్థాలను కలిపి వాడికి అన్నం పెట్టడం చేస్తుంది. ఆ తర్వాత వాడికి కొంత వయసు వచ్చిన తరువాత…. వాడు ఇష్టపడే పదార్థాలు వాడికి వాడే తినడం మొదలుపెడతాడు. ఇది ఐదు సంవత్సరాల వరకు జరుగుతుంది కదా!
బాల కుమారస్వామి:- అవును…
మహాదేవి:- ఈ విధి విధానం ఎలా..! ఏంటి? అనేది విష్ణుమూర్తి నాభి ద్వారా బ్రహ్మదేవుడు పుట్టినట్టుగా చెప్పడం జరిగింది. నిజానికి అక్కడ జగన్మోహిని రూపం….పురుషుడు ద్వారానే స్త్రీ గర్భవతి అవుతుంది. స్త్రీ గర్భం నుంచి పేగు బంధంతో సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే విష్ణుమూర్తిని అలా చూపిస్తారు. బొడ్డు ఉన్న వైపు అమ్మవారు ఉంటుంది. అది మనకి కనిపించదు. నిజానికి అక్కడ అమ్మవారి రూపము ముందువైపు విష్ణుమూర్తి…. వెనకవైపు అమ్మవారు ఉంటుందన్నమాట! వీపు భాగం మనకి కనిపించదు అన్నమాట!
బాల కుమారస్వామి:- ఓహో! ఈ చిత్రంలో ఇంత అంతరార్థం ఉందా! నీకు కూడా చాలా విషయాలు తెలుసమ్మా!
మహాదేవి:- ఏవో తెలిసిన విషయాలు చెప్పగలను…. తెలియని విషయాలు నేను చెప్పలేను కదా!
అనేసరికి అందరం విశ్రాంతి తీసుకుందాం…. బాగా అలసిపోయాం కదా! అనేసరికి సరే అని పిల్లలు ఇద్దరు ఆటల్లో పడ్డారు. పెద్దవాళ్ళు ఇద్దరు విశ్రాంతి తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇలా దాదాపు మూడు రోజుల నుంచి వారం రోజులపాటు లేవలేని స్థితిలో శివ నందిని ఉన్నది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కోలుకోవటం ఆరంభించింది. ఆ తరువాత ఇక ధ్యానం చేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది అని తెలుసుకొని నెమ్మదిగా ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టింది. బ్రహ్మ గ్రంధి విభేదనం అంటే ఆషామాషీ కాదు అని చెప్పి… ప్రకృతిలో స్త్రీ, పురుష ప్రకృతి మాయలను, విషయ వాంఛలను దాటడం, నేనే జీవున్ని… నేనే దేవున్ని… నేనే వేరు, నువ్వు వేరు… నేను పరమాత్మ, నేను, నాది అనే అహం భావాలను దాటడం అనేది అనుకున్నంత తేలిక కాదు అని చెప్పేసి శివ నందిని కి అనుభవం అయింది. ఏదో శివ స్వామీ ఇచ్చిన మూలమంత్రం వలన….. శాంకరీ దేవి అనుగ్రహం వలన….. తనకి ఈ బ్రహ్మ గ్రంధి విభేదనం అయ్యింది అని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆ తర్వాత యధావిధిగా వీళ్ళు ఈ శక్తి పీఠానికి వచ్చి శివనందిని అమ్మవారిని ధ్యానం చేసుకోవడం కోసమని ధ్యానంలో కూర్చోవడం జరిగింది. కాకపోతే ఏ ముద్రలు లేవు. కేవలం శివ స్వామి చెప్పిన “ఓం శ్రీ బ్రహ్మ గ్రంధి విభేదనాయ నమః” అని చెప్పేసి మూలమంత్రాన్ని చేసుకుంటూ ఉండేది. పదేపదే బ్రహ్మ కమలం కనిపించేది. కానీ అది ఎక్కడ ఉంది…. ఏ ప్రాంతంలో ఉంది అనేది మాత్రం తెలిసేది కాదు. ఆ బ్రహ్మ కమలం వస్తే గాని తదుపరి ఏ క్షేత్రానికి వెళ్లాలో తెలుస్తుంది అని అనుకుంటూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా బ్రహ్మకమలం అనేది రావణబ్రహ్మ తపస్సు చేసిన గుహలో లింగోద్భవ లింగం దగ్గర హంస రూపంలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర చేతిలో బ్రహ్మ కమలం ఉంది అని చెప్పేసి…. ధ్యాన అనుభవం అయింది. సరే అని ఈ శక్తిపీఠం ముందున్న రావణబ్రహ్మ తపస్సు చేసిన గుహలకు వెళ్లడం జరిగింది. ఆ గుహలో యధావిధిగా లింగోద్భవ లింగం కనిపించింది. కానీ అక్కడ లింగం పైన అగ్ర భాగం లో బ్రహ్మదేవుడు హంస రూపంలో ఉండి…. కింది భాగంలో విష్ణుమూర్తి వరాహరూపంలో ఉన్నట్టుగానే ఉన్నది. పెద్దగా ఏమీ లేదు. అర్చకులు అప్పటికే అర్చన చేసి వెళ్లిపోవడం జరిగింది. కానీ ఈ లింగంలో ఎక్కడ బ్రహ్మ కమలం ఎక్కడ ఉందో శివ నందిని,రుద్ర స్వామి ,మహాదేవికి అర్థం కాలేదు. రుద్ర స్వామి ఉన్నట్టుండి…. అయితే బ్రహ్మదేవుడు ఇక్కడ హంస రూపంలో ఉన్నాడు కదా! ఒకవేళ హంసని తాకు…. ఏమైనా విషయం తెలుస్తుందేమో! అనేసరికి చుట్టుపక్కల ఎవరూ లేరని… మహాదేవి అనేసరికి, శివ నందిని భయపడుతూనే, ఆలోచిస్తూనే , అనుమానభయంతో ఈ లింగోద్భవ లింగం అగ్ర భాగములో ఉన్న బ్రహ్మదేవుడి అంశ అయిన హంసను తాకి తాకగానే లింగం ఒక్కసారిగా పీఠం నుంచి పక్కకి జరిగింది. ఆ పీఠభాగంలో నుంచి లోపలికి అంతర్గత గుహ ఉందని…. ఆ గుహలోపల మెట్లు ఉన్నాయని….అనిపించేసరికి ఇదేంట్రా బాబు! అని సాధన కుటుంబం అంతా కూడా మెట్ల ద్వారా లోపలికి వెళుతూ ఉండేసరికి… ఆ లింగం యధాస్థానంలో మూసుకుపోవడం జరిగింది. సరే అని లోపలికి వెళ్లేసరికి… అక్కడ లోపల ఒక పెద్ద కొలను ఉన్నట్లుగాను… ఆ కొలను లోపల మధ్య భాగంలో బంగారపు వర్ణంలో ఉన్న బ్రహ్మ కమలం దివ్య తేజస్సుతో కనిపిస్తూ ఉండేసరికి….
శివనందిని:- ఇప్పుడు ఏం చేయాలి?
రుద్రస్వామి:- అమ్మ ! మనం ఆ బ్రహ్మ కమలాన్ని పెకిలించడానికి లేదు… దానంతట అదే నీ ఒడిలోకి రావాలి…
శివ నందిని:- సరే ఇప్పుడు ప్రాప్తి సిద్ది వచ్చింది కదా! ఆ సిద్ధిని ఉపయోగించితే…నా చేతికి వస్తుంది కదా!
రుద్రస్వామి:- సిద్ధులు ఉపయోగించి నువ్వు దైవిక వస్తువులు పొందటానికి లేదు. ధ్యానంతోనే దైవిక వస్తువులు నీ దగ్గరికి రావాలి.
అనేసరికి రావణబ్రహ్మ తీవ్ర ధ్యానంలో ఉన్నట్టుగా ఒక విగ్రహ మూర్తి గోడ మీద చెక్కి ఉన్నట్టుగా లీలగా కనిపించేసరికి….. ఓహో! రావణబ్రహ్మ అంతర్గత భూ గృహంలో తీవ్రమైన ధ్యాన తపస్సు చేసి ఉండాలి. ఈ తపస్సుకి మెచ్చి శివుడు అమ్మవారు ప్రత్యక్షమై ఉంటారు అని చెప్పి వీళ్లంతా గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అందరూ కూడా ఈ బ్రహ్మ కమలం కేసి చూస్తూ….ఎవరికి వారే ధ్యానంలో ఉండిపోయారు. సుమారుగా ఐదు నుంచి ఆరు గంటలు ధ్యానంలో ఉన్నారు. అనుకోకుండా ధ్యానంలో శివ నందినికికుండలిని శక్తి బ్రహ్మ గ్రంధిలోకి రావటం…. ఆ తరువాత మణిపుర చక్రం లోకి వెళుతూ ఉండగా…. బ్రహ్మ గ్రంధిలో బ్రహ్మ కమలం కనపడటం…. ఇదంతా యధావిధిగా జరుగుతూ ఉండేసరికి…. ఇది ఇప్పటికే చూసిన దృశ్యమే కదా! మళ్లీ ఎందుకు కనిపిస్తుంది ? అనుకుంటూ సహనంతో, ఓర్పుతో, నిష్టతో ఉండమని చెప్పిన శివ స్వామి మాటలు గుర్తుకువచ్చి…. ధ్యాన భంగం కాకుండా చూస్తూ ఉండేసరికి…. తన ఒడిలో ఏదో పడింది అని కళ్ళు తెరిచి చూసేసరికి…. ఆ సరస్సు మధ్య భాగంలో ఉన్న కమలం ఒడిలోకి వచ్చింది అనుకునేసరికి…. అప్పుడు కళ్ళు తెరిచి ఉన్న రుద్ర స్వామి కేసి చూసేసరికి….
రుద్రస్వామి:- అమ్మ! సుమారుగా నువ్వు ధ్యానం చేయబట్టి 5,6 గంటలు అవుతుంది. నీ ధ్యాన నిష్టకి బ్రహ్మ కమలం తనంతట అదే వచ్చి నీ ఒడిలో పడింది. ఈ బ్రహ్మ కమలం దైవిక వస్తువు జాగ్రత్తగా ఉంచుకో …నీలో నిక్షిప్తం చేసుకో ..,
అని చెప్పేసరికి ఆ బ్రహ్మ కమలానికి నమస్కారం చేస్తూ ఉండేసరికి …..బ్రహ్మ కమలం కాస్త శివ నందిని బొడ్డుకి తగిలి తగలగానే అప్పటిదాకా నొప్పితో ఉన్న బొడ్డు కాస్త నొప్పి తగ్గిపోయి పూర్తిగా ఆరోగ్య స్థితిని పొందడం గమనించింది. ఆ తర్వాత యధావిధిగా అదృశ్య శక్తితో ఆ వస్తువును తనలో నిక్షిప్తం చేసుకున్నది. ఆ తర్వాత బాలగణపతి ఉన్నట్టుండి…
బాల గణపతి:- అమ్మ! నువ్వు వస్తువులను నిక్షిప్తం చేసుకున్నావు బాగానే ఉంది… ఇప్పుడు సాధనా మూర్తికి ఆ వస్తువు చూపిస్తేనే కదా! తదుపరి క్షేత్రానికి వెళ్ళేది…
అనే విషయాన్ని గుర్తు చేసేసరికి అవును కదా! అని అనుకుంటూ ఉండేసరికి… రుద్రస్వామి తన చేతి సంచిలో ఉన్న సాధన విగ్రహ మూర్తిని బయటకు తీయడం జరిగింది. ఆ తర్వాత తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్న బ్రహ్మ కమలాన్ని అదృశ్య శక్తితో బయటకు తీయడం జరిగింది. ఈసారి బాల కుమారస్వామి నేను పెడతాను అని చెప్పేసి కుడివైపున ఉన్న పద్మంలోకి తాకించగానే ఈ విగ్రహంలో కుండలిని శక్తి ఒక పాము రూపంలో బ్రహ్మగ్రంధి నుంచి పైకి ప్రయాణిస్తూ…. మణిపుర చక్రంలోనికి చేరటం జరిగింది. ఇది అందరికీ కనపడింది. దివ్య తేజస్సు, దివ్య కాంతితో ఒక పాము మెలికలు తిరుగుతూ వెళితే ఎలా ఉంటుందో…. అలా వెళ్లి మణిపుర చక్రంలో స్థిరపడింది అని చెప్పేసి గ్రహించడానికి వాళ్ళకి అట్టే సమయం పట్టలేదు. ఆ తర్వాత మణిపుర చక్రం జాగృతి అవుతూ ఉండగా… ఒకసారి తిరిగి ఆగిపోయేసరికి…. దానిలో నుంచి ఒక రాగిరేకు బయటికి రావటం జరిగింది. ఆ రాగి రేకులో ఏముంది అని కుమారస్వామి చదవడం ఆరంభించాడు.
బాల కుమార స్వామి కాస్త వచ్చిన ఆధారాన్ని చదవడం ఆరంభించాడు…
నాగస్తంభమే నా గుడికి పునాది రాయి ..
మా ఆయన నల్లగా మరియు తెల్లగా ఉంటాడు..
14 అడుగుల ఎత్తులో మా ఆయన ఉంటాడు..
నాకు, మా అన్నయ్యకి ఏకకాలంలో వివాహం చేస్తారు….
108 లింగాలు ఒకే పానవట్టం మీద ఉంటాయి..
108 నక్షత్ర పాదాల ఆలయాలు మా చుట్టూ ఉన్నాయి….
నేను 12వ స్థానంలో ఉన్నాను …
నా ఎడమ చెంప తెగిపడింది ….
నా భర్తకి పులి చర్మ బంధనం జరిగింది …
నా చూపు ఎల్లప్పుడు ఎడమవైపే ఉంటుంది…
అని ఈ ఆధారాలు చదువుతూ ఉంటే ఎవరికి వారే ఆలోచనలో పడ్డారు. ఏ శక్తిపీఠం అయి ఉంటుందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి బాల గణపతి 12వ స్థానం అంటుంది కదా! 12వ స్థానం అంటే అమ్మవారి 12వ శక్తిపీఠం ఏమై ఉంటుందో అనేసరికి…. శివ నందిని తన ఫోన్లో చూసేసరికి 12వ శక్తి పీఠంగా ద్రాక్షారామం క్షేత్రంలో ఉన్న మాణిక్యాంబాదేవి అని తెలిసింది. కానీ అక్కడ ఆమె నాభి ప్రాంతం పడిందని స్థల పురాణం చెబుతుంది…. కానీ, ఇక్కడ ఎడమ చెంప తెగిపడింది అని చెబుతున్నారు కదా! అని అందరికీ చెప్పేసరికి రుద్రస్వామి ఉన్నట్టుండి ఆ గుడి విశేషాలు….. ఆ స్థల పురాణవిశేషాలు ఉన్న వీడియోలు చూడు… నీకే విషయం తెలుస్తుంది అనేసరికి…. గుడి విశేషాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండగా…. ఆ గుడిలో రెండు అంతస్తుల భాగం ఉంటుంది అని… కింద అంతస్తులో అనగా భీమశంకరుని పాదభాగం పీఠం ఉన్న దానిని చీకటి కోణం అంటారని….ఈ చీకటి కోణంలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నాగస్తంభం ఒకటి కనపడుతుందని…. ఆ స్తంభం మీద పంచపడగలు ఉన్న ఒక సర్పం ఉంటుందని…… దానిని పునాదిరాయిగా… శంకుస్థాపన రాయిగా చెప్పడం జరుగుతుందని స్థల పురాణం చెప్పడంతో రుద్ర స్వామి ఇంకేముంది…! నాగాస్తంభం ఆ గుడి పునాది రాయి అని మొదటి ఆధారం వచ్చింది కదా! బహుశా అదే అయి ఉంటుంది అనేసరికి…. భీమేశ్వర శివలింగం 14 అడుగుల ఎత్తులో ఉంటుంది అని పైభాగం తెల్లగాను, అడుగుభాగం నల్లగానూ ఉంటుంది అని…. ఇది అర్ధనారీశ్వర తత్వం అని స్థల పురాణం చెబుతుంది అనగానే…. రెండవ ఆధారం, మూడవ ఆధారం కూడా సరిపోయింది కదా! అనుకోగానే….మార్గ శుద్ధ పౌర్ణమి నాడు…. ఏకకాలంలో ఒకే వేదిక మీద శివపార్వతులకి అలాగే లక్ష్మీ నారాయణులకి, కళ్యాణం జరిపిస్తారు అని… స్థల పురాణం చెబుతుంది అని శివ నందిని అనేసరికి …. ఆ లెక్కన చూస్తే నాలుగవ ఆధారమైన నాకు, మా అన్నయ్యకి ఏకకాలంలో కళ్యాణం చేస్తారని సరిపోతుంది కదా! అనుకునేసరికి అలాగే ఈ దేవాలయ పరిసరాలలో ఒకే పానమట్టం మీద 108 శివలింగాలు ఉన్న గుడి ఉంది అని…. అలాగే ఈ క్షేత్రానికి 28 కిలోమీటర్ల దూరంలో 108 నక్షత్ర పాదాలు ఉన్న ఆలయాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అనేసరికి…. ఇది కూడా ఆధారాలు సరిపోతున్నాయి కదా! అలాగే ఈ శక్తిపీఠం 12వ స్థానం అని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది స్థల పురాణం ప్రకారం సతి దేవి ఎడమ చెంప పడింది అని…. మరి కొంతమంది సతీదేవి యొక్క నాభి ప్రాంతం పడింది అని చెప్పడం బట్టి…. మనకి వచ్చిన ఆధారాలలో ఎడమ చెంప తెగిపడింది అనేది సత్యమే కదా! అని రుద్ర స్వామి అంటూ ఉండేసరికి….. భీమశంకర శివలింగం ఉదయకాలంలో సూర్యకాంతి పడినప్పుడు ఈ లింగం పై భాగంలో మనకి నల్లటి చారిక కనపడుతుంది. ఈ చారికలు పులి చర్మం చారికలని స్థానికులకు నమ్మకం. అర్జునుడికి మహా శివుడు పులి చర్మం ధరించిన ఒక ఆటవికుడిగా ఇక్కడ దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి…. స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ పులి చర్మం బంధనం జరిగింది అని చెప్పేసి…. మనకి ఆధారం చెప్పడం సరిపోతుంది కదా! అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారు మాణిక్యాంబ చూపు వామాచారం ప్రకారంగా వామభాగంలో అనగా ఎడమవైపు ఉండటం జరుగుతుందని స్థల పురాణం చెప్పడం జరుగుతుంది అనేసరికి… అయితే ఇప్పుడు మనం పంచరామాలలో రెండవ రామం అయిన భీమశంకరుని ఆవాసం ఉన్న మాణిక్యాంబ శక్తి పీఠానికి వెళ్ళాలి అని చెప్పేసి రుద్రస్వామి రూడీ చేయడంతో…. ఇక అందరూ ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు శివనందిని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇందులో బాల గణపతి కాస్త ఉన్నట్టుండి అమ్మ! మనం ద్రాక్షారామం క్షేత్రానికి వెళ్లాలని తెలిసింది కదా! ఇప్పుడు మనం ఉన్న శాంకరీ శక్తిపీఠంలో రావణాసురుడి చేత తవ్వబడిన నీటి బుగ్గలు ఉన్న ప్రాంతమునకు వెళ్ళి మనం చూసేద్దాము అనేసరికి, అవును కదా! మనం ఆ ప్రాంతం చూడలేదు కదా! అని వెళదాము అని అందరూ నీటి బుగ్గలు ఉన్న ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తరువాత స్థల పురాణం ప్రకారం రావణాసురుడు నీటి కోసం ఏడుసార్లు తన ఖడ్గంతో కొట్టినప్పుడు… ఏడు వేడి నీటి బుగ్గలు ఏర్పడ్డాయని చెప్పి చెప్పడం జరిగిందని…. ఇక్కడే తర్వాత తల్లికి శ్రాద్ధ కర్మలు చేయడం జరిగిందని… అందుకనే పితృదేవతలకి చాలామంది ఇక్కడికి వచ్చి శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారని స్థల పురాణ విశేషంగా చెప్పడం జరిగింది అని… వీళ్ళకి చెప్పడం జరిగింది. చూడటానికి ఏడు బుగ్గలు ఉన్నాయి.. ఏడు బుగ్గలు కూడా పరిశుద్ధంగా, గోరువెచ్చగా ఉన్నాయి. సుమారుగా మూడు,నాలుగు అడుగుల లోతు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో శ్రాద్ధ కర్మలు చేస్తున్న వాళ్ళందర్నీ చూడటం జరిగింది. అక్కడ వీళ్ళందరూ కూడా ఏడు బుగ్గలలో ఉన్న నీటిని చల్లుకొని…. అక్కడి నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత యధావిధిగా అమ్మవారి గుడికి వచ్చి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. పిల్లలు ఆటల రందిలో మునిగిపోయారు. ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఆకలి వేయడంతో హోటల్ గదికి వెళ్లి భోజనాలు పూర్తి చేసుకొని…. ఆ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా…. శివ నందిని కాస్త అయ్యా! ఇప్పుడు ఏం చేద్దాం అనేసరికి…. ఏముంది ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం చేరుకొని…. అక్కడ నుంచి రాజమండ్రి చేరుకొని… అక్కడి నుంచి కోనసీమకు వెళ్లి….. ద్రాక్షారామం చేరుకోవాలి అని చెప్పి రుద్రస్వామి అనేసరికి…. పిల్లలు కాస్త మళ్ళీ మనం ఓడ ప్రయాణం ద్వారానే వెళ్దామా? అనేసరికి దానికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు. సుమారుగా ఏడు రోజుల తర్వాత ఈ శాంకరి శక్తిపీఠం నుంచి ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యంగా శక్తిపీఠం వైపుకు వీళ్ళు ఓడ ప్రయాణం ద్వారా సముద్ర యానం చేయడం జరిగింది. ఒక 20 రోజుల తర్వాత వీళ్ళు ప్రయాణించిన ఓడ కాస్త విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి బస్సు ప్రయాణం ద్వారా ద్రాక్షారామానికి బయలుదేరడం జరిగింది.
శుభం భూయాత్


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి