అధ్యాయం 65


నరసయ్య ఎదురుచూస్తున్నాడు:
(నా బ్రహ్మనాడి సాధనానుభవాలు)

 అసలు కపాలమోక్షం ఎక్కడ జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు. అంటే శాస్త్రవేత్తలు మానవ మెదడులోని పిట్యూటరీ గ్రంధి విభేదము జరిగితే అదియే కపాలమోక్షం అని ఇది సహజంగా శవ దహన సంస్కారం పరిసమాప్తి సమయంలో టప్ మనే శబ్దంతో జరుగుతుందని ఇది విన్న తర్వాత ఈ శవము తాలూకు వారు స్మశానము వదిలిపెట్టి వెళతారని చెప్పటం జరిగినది. అదే యోగులు అయితే కపాలమోక్షం అనేది బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న అంగుళ పరిమాణం ఉన్న మూల కపాలం  విభేదనమే అసలు సిసలైన కపాలమోక్షం అవుతుందని వారి వాదన. మరి ఈ రెండు వాదనలలో ఏది నిజమో తెలుసుకోవాలి అనేది నా తపన. ఇది ఇలా ఉండగా శవదహనంలో జరిగే పిట్యూటరీ గ్రంధి విభేదనము అనేది కారణ శరీరమునకు సంబంధించిన కపాలమోక్షం అని నేను గ్రహించాను. అంటే ఈ లెక్కన మనలో అంగుళ పరిమాణం ఉన్న సంకల్ప శరీరము అలాగే రేణువు పరిమాణం ఉన్న ఆకాశ శరీరము ఇంకా మిగిలే ఉంటాయి అని గ్రహించాను. ఇక యోగుల వాదనను చూస్తే బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న మూల కపాల మోక్షం విభేదనము సంకల్ప శరీర కపాలమోక్షం అవుతుందని తద్వారా ఇంకా ఆకాశ శరీరము సజీవంగానే ఉంటుందని నా పరిశోధన స్పురణతో తెలుసుకున్నాను. ఈ మూల కపాలంలోని 36 కపాలధారి యొక్క 11, 9, 7, 5, 3, 1 రూప కపాలాలలో ఏక మూల కపాలంలో చితాగ్ని యొక్క బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలము నందు ఈ పంచ శరీరాలను అనగా స్థూల- సూక్ష్మ- కారణ- సంకల్ప- ఆకాశ శరీరాలను ముక్కలుగా చేసుకొని విభూది రేణువులుగా మార్చుకుంటారో అదియే సంపూర్ణ కపాలమోక్షం అవుతుందని నాకు స్పురణ అయినది. మరి అక్కడికి ఎలా వెళ్లాలి. ప్రస్తుతము మేము హృదయ చక్రం వద్ద ఇష్ట లింగ ఆరాధనతో ఇష్ట కోరిక మాయను దాటినాము. మరి ఆది మూల కపాలము ఉన్న బ్రహ్మరంధ్రము వద్దకి ఎలా చేరుకోవాలో నాకు అర్థము కాలేదు. నిజానికి శ్రీ రమణ మహర్షి అనుభవం ప్రకారము హృదయ చక్రం వద్దకు వస్తే అంతటితో యోగసాధన పరిసమాప్తి అవుతుందని ఈయన కాకుండా స్వయంగా భగవద్గీత కూడా చెప్పటం జరిగినది. మరి ఇక్కడేమో అంగుళము ఉన్న సంకల్ప శరీరము పరమాత్మగా ఉన్నది. శూన్య బ్రహ్మగాను ,ఆత్మలింగంగాను, హృదయాకాశ లింగంగాను, ఆకాశలింగంగాను, దీనికి పేర్లు ఉన్నాయి. అంటే నిజానికి ఇక్కడితో కూడా సాధన ఆగిపోదు. ఎందుకంటే ఈ హృదయ చక్రంలో మనకి ఆనంద సమాధి స్థితి... ఆలోచన – సంకల్పము- స్పందన అనే గుణాలు… అంగుళ పరిమాణ సంకల్ప శరీరము వాయుతత్వం మిగిలే ఉన్నాయి కదా. ఈ లెక్కన చూస్తే ఇంకా సాధించవలసినది ఏదో ఉంది. ఇంకా సాధన మిగిలి ఉంది. 
 
ఎలా వెళ్లాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు అయితే అర్థం కాలేదు. కొన్ని రోజులు గడిచినాయి. ఒక రోజు నేను శ్రీ లాహిరీ మహాశయుడు యొక్క ధ్యాన అనుభవాల గ్రంథమును చదువుతూ ఉండగా అందులో హృదయ గ్రంధి విభేదన మాట వినబడింది. అంతవరకు నాకు బ్రహ్మ- విష్ణు- రుద్ర గ్రంధుల గురించి మాత్రమే తెలుసు. పైగా ఈ హృదయ గ్రంధి విభేదనము జరిగితే బ్రహ్మరంధ్రము వరకు వెళ్లేమార్గము అయిన బ్రహ్మనాడి మార్గము కనబడుతుందని అది సన్నని వెలుగు కాంతి మార్గమని దానిని నేను చూడటము జరిగినదని ఆయన అనుభవాలను చదివితే నాకు అర్థమైనది. అంటే హృదయ గ్రంధి విభేదనము జరిగితే కానీ మనము బ్రహ్మరంధ్రము వరకు చేరుకోలేము అని అర్థం అయినది. మరి ఈ హృదయ గ్రంధి విభేదనము జరగాలి అంటే ఏమి చేయాలని మళ్లీ గ్రంథము పుస్తకాలు పఠనము ఆరంభించినాను. అందులో ఒక చోట అర్గళా స్తోత్రము చేస్తే హృదయ గ్రంధి విభేదనము జరుగుతుందని తెలుసుకున్నాను. దానిని ప్రతి రోజు ఎనిమిది సార్లు చేసుకుంటూ పోయినాను. విచిత్రము ఏమిటంటే ఈ అర్గళా స్తోత్రము అనేది రెండు విధాలుగా ఉన్నది.ఒకటి శివబోధ అయిన శ్రీ మార్కండేయుడు ఆర్గళా స్తోత్రము కాగా రెండవది విష్ణు బోధ అయిన దేవిసప్తశ్లోకి అయిన ఆర్గళా స్తోత్రమని గ్రహించాను.ఈ రెండు స్తోత్రాలలో మార్కేండయుడి స్తోత్రమును మనము ఇష్టలింగారాధన చేసే హృదయచక్రము నందు చెయ్యడము జరిగితే...ఇపుడు బ్రహ్మరంధ్రము ఉండే ఆదిపరాశక్తి అనుగ్రహమును పొందుటకు దేవీ ఆర్గళా స్తోత్రము చెయ్యాలని నేను గ్రహించడముతో….ఇలా ఈ మంత్ర ఆరాధన కొన్ని నెలలు పాటు జరిగినది. 
 
అర్గలాస్తోత్రం
 
మార్కండేయ ఉవాచ-
ఓం జయ త్వం దేవి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తు తే || ౧ ||
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || ౨ ||
మధుకైటభవిధ్వంసి విధాతృవరదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౩ ||
మహిషాసురనిర్నాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౪ ||
ధూమ్రనేత్రవధే దేవి ధర్మకామార్థదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౫ ||
రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౬ ||
నిశుంభశుంభనిర్నాశి త్రైలోక్యశుభదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౭ ||
వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౮ ||
అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౯ ||
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౦ ||
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౧ ||
చండికే సతతంయుద్ధేజయంతి పాపనాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౨ ||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౩ ||
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౪ ||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౫ ||
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేఽబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౬ ||
విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౭ ||
దేవి ప్రచండదోర్దండదైత్యదర్పనిషూదిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౮ ||
ప్రచండదైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౧౯ ||
చతుర్భుజే చతుర్వక్త్రసంసుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౦ ||
కృష్ణేనసంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౧ ||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౨ ||
ఇంద్రాణీపతిసద్భావపూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౩ ||
దేవి భక్తజనోద్దామదత్తానందోదయేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౪ ||
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౫ ||
తారిణి దుర్గసంసారసాగరస్యాచలోద్భవే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || ౨౬ ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభమ్ || ౨౭ ||
|| ఇతి శ్రీమార్కండేయపురాణే అర్గలాస్తోత్రం సమాప్తమ్ ||
 
దుర్గాసప్తశ్లోకీ
 
శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||
దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||
ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |
ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||
దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || ౩ ||
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౪ ||
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౫ ||
రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా |
 
 

నాకు వచ్చిన నరసింహ విగ్రహామూర్తి
అపుడు మాదగ్గరికి పంచలోహ లక్ష్మీనరసింహస్వామి విగ్రహమూర్తి వచ్చినది.ఇది ఎందుకో అర్ధమైచావలేదు. ఈ విగ్రహారాధనను చేసుకుంటూ కొన్ని నెలలు గడిచిపోయినాయి. 
 
 

నేను సేకరించిన 786 నోట్లు - నాకు వచ్చిన డబుల్786 నోట్
 
ఇది ఇలాయుండగా నాకు ఉన్నట్టుండి డబ్బులనోట్ లలోని నెంబర్స్ చివర 786 నెం ఉన్న నోట్లు సేకరించడము మొదలు పెట్టినాను.ఇది ఎందుకో కూడ తెలియదు.సుమారుగా అన్ని రకాల 786 నోట్లు సేకరించాను. అలాగే విచిత్రముగా నరసింహ స్వామి క్షేత్రాలకి అనగా యాదగిరిగుట్ట,వేదాద్రి,పానకాల నరసింహస్వామి,ధర్మపురి నరసింహస్వామి దేవాలయాలకి వెళ్ళడము జరిగినది. అలాగే యాదగిరిగుట్ట యందు నాకు డబుల్ 786 నెం!! ఉన్న 20 రూ!!ల నోట్ దొరకడం నాకు ఆశ్చర్యానందము వేసినది.అంటే ఈ నోట్లు సేకరణ అనేది మహలక్ష్మీ కి సంకేతమని ఆనాడు నాకు జ్ఞానస్పరణ అయినది. అలాగే మాకు అంతర్వేది నరసింహ క్షేత్రానికి వెళ్ళినపుడు ఇక్కడ ఉన్న సముద్రము ఒడ్డున మాకు అక్కడ ఓంకార గణపతి శంఖం దొరికినది.అంటే ఈ నాడిమార్గప్రవేశానికి అర్హత లభించినట్లేనని నాకు అర్ధమైనది.

మా ధ్యానము నందు ఉగ్ర నరసింహ స్వామి దర్శనానుభవం:

ఇది ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి పూట ధ్యానమునందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. అది అన్ని యోగ చక్రాలను దాటుకుంటూ చివరికి శూన్య స్థితి కూడా దాటుకుంటూ హృదయ చక్రం యొక్క లింగము దగ్గరకి వచ్చినట్లుగా అనిపించినది. ఇంతలో చిమ్మచీకటిలో ఏదో టప్ మని శబ్ద నాదము వినపడటంతో ఏదో చాలా సన్నని దివ్యకాంతి మార్గము లీలగా అగమ్యగోచరంగా కనపడినది. నాలాంటి రూపధారి అందులోనికి ప్రవేశిస్తున్నట్లుగా లీలగా కనిపించినది. అప్పుడు మాకు ఉగ్ర నరసింహ స్వామి తన ఉగ్ర ముఖమునుండి అగ్నిజ్వాలలు మా మీదకి ఉసిగొల్పుతున్నట్లుగా.. ఒక క్షణం పాటు భయభ్రాంతులకు గురి అయ్యే సరికి మాకు ధ్యాన భంగమైనది. ధ్యానము నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అనుభవం విశ్లేషణ చేసుకుంటే మాకు హృదయ గ్రంధి విభేదము జరిగినదని ఆ వెలుగు మార్గం బ్రహ్మనాడి మార్గమని తీసుకొని వెళ్లే మార్గం అని జీవనాడికి ఎలా అయితే హనుమంతుడు ఉంటాడో ఈ బ్రహ్మనాడికి ఈ జ్వాలా నరసింహస్వామి ఉంటాడని నాకు అర్థమైనది. భయపడకుండా ఉండి ఉంటే కథనము వేరే లాగా ఉండేదని బ్రహ్మరంధ్రమునకు చేరుకోవటం జరిగేదని మాకు అర్థమైనది.ఇలా మరి కొన్ని రోజులు గడిచినాయి. ఇది ఇలా ఉండగా ఒక రోజు మళ్ళి అర్ధరాత్రి పూట మాకు ధ్యానమునందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. అన్ని యోగ చక్రాలు దాటుకుంటూ హృదయ చక్రమునకు ఆపై హృదయ గ్రంధి దగ్గరకి ఆపై జ్వాలాముఖి ఉగ్ర నరసింహస్వామి దాకా వెళ్ళినది. ఈసారి ఈయనను చూసి నేను భయపడకుండా భక్తితో అనురక్తిగా శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన శ్రీ నృసింహస్వామి అష్టకమును చదవడము ఆరంభించినాను. అలాగే ధ్యానములో స్థూల శరీరము నోటి నుండి బయటికి స్తోత్రాలు రావటం జరుగుతుంది. కొద్దిసేపటికి ఆయన అభయమిస్తూ అంతర్ధానం అయినారు. అంటే ఈ లెక్కన మన ఆదిశంకరాచార్యుడు తన సాధనను ఇక్కడిదాకా తీసుకొని వచ్చినారని ఆయనను చూసి వీరిని శాంత పరచడానికి అష్టకము అనర్గళంగా చెప్పి ఉంటారని నాకు అనిపించినది. 
 
ప్రత్యంగిరా మాత దర్శనానుభవం:
ఇంతలో ఆ సన్నని మార్గము అటు చివర ఒక ఉగ్ర దేవత కాలు క్రింద కపాలమును పెట్టుకొని నాలికను బయటపెట్టి ఉగ్ర చూపులతో భయంకరముగా అది కూడా విచిత్రముగా సింహం తలతో ఉన్నట్లుగా మాకు అగుపించినది. ఈమె ఎవరో మాకు తెలియ రాలేదు.అనుకోని విధముగా మా నోటి నుండి అప్రయత్నంగా అర్గళాస్తోత్రం ఆరంభించిన వెంటనే ఈ కాలి క్రింద ఉన్న కపాలము యొక్క నోరు తెరుచుకోవడం ఆరంభమైనది. నా స్వామిరంగా! విఠలాచార్య సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్ లు ఉండి ఉండవు. నా బొంద. సప్తసముద్రాలు దాటి ఏదో గుహలో మాంత్రికుడి ప్రాణం ఉన్నట్లుగా పన్నెండు చక్రాలు దాటి బ్రహ్మరంధ్రము గుహలో నా పంచ శరీరాల ప్రాణం ఉన్నది అని నేను అనుకుంటున్న లోపలే నాకు ధ్యాన భంగమైనది. మరి నేను నా బ్రహ్మరంధ్రము స్థావరమునకు చేరుకున్నానో లేదో తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఎందుకు ఆలస్యం. ముందుకు నాతో ప్రయాణించండి. 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

************************************

గమనిక: ఈ ధ్యాన అనుభవాల తర్వాత విచారణ చేస్తే బ్రహ్మనాడి మార్గానికి ఒకవైపు ఉగ్ర జ్వాలాముఖి నరసింహస్వామి ఉంటారని మరొకవైపు అమ్మవారు సింహముఖి రూపిణిగా ప్రత్యంగిరా మాతగా ఉంటారని తెలుసుకున్నాను. వీరిద్దరు భయము అనే మాయను కల్పిస్తారని ఇది ఒక రకంగా మరణ భయం అని నాకు అర్థం అయినది. ఈ భయమును దాటుకున్న వారికి మృత్యుంజయుడై ఇచ్చా మరణ సిద్ధితో ఈ మార్గమును దాటతాడు అని గ్రహించాను. ఎప్పుడైతే ప్రత్యంగిరా మాత యొక్క కాలు క్రింద ఉన్న బ్రహ్మకపాలం యొక్క మార్గము తెరుచుకుంటుందో అప్పుడే మనము మన మూల కపాలము వుండే బ్రహ్మరంధ్రమునకు చేరుకోవడం జరుగుతుందని గ్రహించాను.
 

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. asalu kapalamoksham ekkada jaruguthundani itu shastraparanga atu yogula paranga cheppi andulo aakaasha shareeram migilipothundani... eka moola kapalamlo pancha shareeralanu vibudhi renuvulugaa maarchukunte adiye sampurna kapalamokshamani... hrudaya grandhi vibedhamu jarigi brahma randram cheralante argalastothram chadavalani adi rendu vidhaalani hrudayamlo-maarkandeyudidi, brahmarandramlo devi argala cheyalani... meeru mahalakshmiki sankethamaina notela sekarana,brahmanaadi vadda jwaala narasimha swamy darshanam valla bhayapadatam, nrusimha ashtakam chadivi anurakthitho ikkadi daaka raavatam, prthyangiraa ammavaaari darshanam aame kaali krinda rakshasudi noru therchukovadam emi jariginda ani...marana bhayanni daatukuntune noru therchukoni anduloki praveshinchagalam ani...

    రిప్లయితొలగించండి