అధ్యాయం 10

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....



ఆ చెరువులో చూస్తే

కపాల భోజనం దెబ్బకి భయమేసి ఆ గుహ నుండి బయటకు వచ్చి మా ఊరి వైపు వెళ్లే బస్సులు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను! ఎంత సేపటికి మా ఊరి బస్సులు రాలేదు! దాదాపుగా 350 కిలోమీటర్లు మా ఊరికి ప్రయాణం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు! ఇంతలో ఒక టాక్సీ వాడు ఒకటి వచ్చి ఈ క్షేత్రానికి ఉత్తర దిక్కులో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న “ఉమామహేశ్వరం” క్షేత్రానికి వెళ్తున్నానని…. ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉన్నారా” అని అడుగుతూ కనిపించాడు! వీడి బండి ఎక్కితే మా ఊరికి కొంత దూరమైనా వెళ్ళవచ్చు కదా అనుకుని…. అక్కడికి వెళ్లి మా ఊరి బస్సు ఎక్కవచ్చునని ఆలోచనతో ఈ బండి ఎక్కి నాను! నాతో పాటు మరో నలుగురు కూడా ఎక్కిన తర్వాత ఈ టాక్సీ బయలుదేరింది! రాత్రి పది గంటలకి ఈ ప్రాంతానికి చేరుకున్నాను! బస్టాండ్ లో మా ఊరికి వెళ్ళే బస్సు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది అని తెలిసి నాలో తెలియని విసుగు, చికాకు, అసహనం మొదలైంది! మళ్లీ రేపు పొద్దునే మా ఊరి బస్సు ఉందని తెలుసుకుని…. ఏమి చేసేది లేక ఆ రోజు రాత్రి బస్టాండ్ లో పడుకోవాలని నిర్ణయించుకుని… ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని ఆ బస్టాండ్ దాటి బయటికి వచ్చినాను! ఆ ఊరికి రావడం నేను అదే మొదటిసారి! పైగా ఇది బాగా పల్లెటూరు లాగా ఉంది! అక్కడ హోటల్స్ ఏమీ కనిపించలేదు! కనీసం తినుబండారాలు అమ్మే కొట్టులు అన్నీ మూసేసి ఉన్నాయి! అప్పుడు నాకు ఒక పెద్ద దేవాలయం కనబడింది! అది శివాలయం లాగా ఉంది! ఈ దేవాలయానికి పరిసరాలలో ఏదో మంచి నీరు ఉన్న చెరువు ఒకటి కనిపించింది! కనీసం ఇందులో ఉన్న నీళ్లు త్రాగి ఆకలి తీర్చుకోవాలని ఆ చెరువు దగ్గరకి వెళ్ళినాను!

ఈ చెరువు లో అడుగు పెట్టాను! అప్పుడు సమయం దాదాపుగా అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది! ఇంతలో నీళ్లలో ఏవో శబ్దాలు… ఏదో కదలతున్న నీటి సవ్వడులు లీలగా వినిపించాయి! ఏవో చేపలు నీటిలో కదులుతున్నాయని… చేతిలో చెరువులో నీళ్లు తీసుకోబోతుండగా… నాకు లీలగా వినిపించిన నీటి సవ్వడులు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వినిపించే సరికి… ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను! చూస్తే ఏమీ కనిపించలేదు! కనీసం చేపలు లేదా మొసళ్ళు లేదా నీటి పాములు కదులుతున్న దాఖలాలు ఏమీ కనిపించలేదు! కానీ ఏదో కారణం వల్ల నీళ్లు బాగా కదులుతున్నాయని బుడగల శబ్దాలు చేస్తున్నాయి! అది ఏమై ఉంటుందో నాకైతే అర్థం కాలేదు! ఏమీ లేదు అనుకుని మళ్ళీ నీళ్లు తాగటానికి చేతులు పెట్టే సరికి… ఈ సారి మళ్ళీ నీళ్లు బాగా పెద్ద శబ్దంతో వినిపించాయి! దీనమ్మ జీవితం! నీళ్లు లోనే చేతులు పెడుతుండగానే ఈ నీటి శబ్దాలు బాగా వినిపిస్తున్నాయని నెమ్మదిగా నేను గ్రహించాను! కొంపతీసి ఇందులో ఒకవేళ ఏమైనా ఉందా? ఇందులో ఒకవేళ కథలలో చెప్పే నీటి భూతమేదైనా వుందా?ఎవరికి తెలుసు? నా సామీ రంగా? ఇది ఇంత అర్ధరాత్రి కనబడితే నీటిలో దూకి చావడమే! అసలే పొద్దున మన కాపాలికుడు దెబ్బకి అన్నం మీద విరక్తి కలిగింది! దీని వల్లన జీవితమే అంతమవుతుందా… అసలే విపరీతంగా దాహం వేస్తుంది! ఏమి చేయాలి? ఊరికే ఏమీ లేని దానికి… నేను ఏదో ఊహించుకుని… అనవసరంగా కంగారు పడుతున్నాను అనుకుంటా? ఏమీ ఉండదు! కప్పలు కానీ చేపలు కానీ నీటి శబ్దాలు చేస్తూ ఉంటాయి! అనుకుని మళ్ళీ నీరు తాగాలని ప్రయత్నించాను! 

ఈసారి శబ్దాలు వచ్చే చోట పెద్ద సుడిగుండములాగా ఏర్పడి “ఎవర్రా అది! నా అనుమతి లేకుండా … నా చెరువులో నీటిని తాగడానికి వచ్చినది” అనే మాటలు వినేసరికి నేను గతుక్కుమన్నాను! వామ్మో ! నిజంగానే ఈ చెరువులో ఏదో దయ్యం ఉంది! ఈ చెరువుకి కాపలా కాస్తోంది అనుకుంటా! దీని అనుమతి తీసుకోవాలని తెలిస్తే ఇక్కడ దాక ఎందుకు వస్తాను? నేను ఊహించినట్లుగానే ఇదేదో నిజంగానే భూతమా? లేక నా భ్రమా? …అనుకుంటూ భయపడుతూ… కళ్ళు తెరిచి చెరువులో సుడిగుండంలాగా…. వచ్చిన చోట చూసేసరికి నేను నోరు వెళ్ళబెట్టి వలసి వచ్చింది! విచిత్రంగా ఆ చెరువులో నీళ్లతో ఉన్న ఒక చెయ్యి బయటికి వచ్చి… దాని పైన సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఎరుపు లంగా జాకెట్ లో ఉన్న ఒక పాప ఉగ్రరూపంగా కనిపించింది! అసలు నేను చూస్తున్నది నిజమా.. అబద్దమా.. అర్థం కాని స్థితిలో ఉండగా నాకు లీలగా …అమ్మోరు తల్లి సినిమాలో … కళ్ళ చిదంబరానికి కనిపించిన ఇలాంటి దృశ్యం లాగా నాకు కనిపిస్తోంది అనుకునేసరికి… నాలో తీవ్రమైన భయాందోళన వలన నాకు తెలియకుండానే… తీవ్ర భయంతో కళ్ళు మూతలు పడిపోతున్నాయి! ఆ తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాను! తెల్లవారి ఆ ఆలయ పూజారి అభిషేకానికి నీరు కోసం ఈ చెరువు దగ్గరికి వచ్చి…. అక్కడ ఒక శవం లాగా పడుకుని ఉన్న నన్ను చూసి… నా మీద నీళ్లు పోసి… నన్ను నిద్ర నుండి లేపినాడు! మెలుకువ వచ్చేసరికి… నా కళ్ళలో కనిపించిన భయం చూసి… రాత్రి జరిగిన విషయమంతా తెలుసుకుని… కన్నీళ్లు పెట్టుకుంటూ.. “నాయన! రాత్రి నువ్వు చూసిన దృశ్యం చూడాలని… ఎన్నో సంవత్సరాల నుండి నేను పరితపిస్తున్నాను…నువ్వు చూసిన దృశ్యం నిజమే! నువ్వు చూసిన పాప ఎవరో కాదు నాయనా… ఆ చిన్నారి బాల… నాయనా బాలాదేవి! ఆవిడే నిత్యం పూజించే నా భ్రమరాంబికాదేవి నాయన! ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తుందో ఆవిడకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు! నువ్వు నిజంగానే కారణజన్ముడువి! నీ ఈ జన్మ ధన్యమైనది! మా ముత్తాత గారికి ఒకసారి అమ్మ వారిని చూడాలని పరితపిస్తూ.. శ్రీశైలమునకు వెళుతూ… ఈ ప్రాంతము నందు అనుకోకుండా ఆగవలసి వచ్చింది! అప్పుడు ఆయన గుడి దగ్గర పడుకుంటే… రాత్రి కలలో ఒక చిన్న పాప కనిపించి “నన్ను చూడాలని ఉందా నీకు! అయితే ఈ గుడి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి రా” అన్నది! వెంటనే ఈయనకి మెలుకువ వచ్చింది! ఇది కలా… నిజమా అని ఆయనకు అర్థం కాలేదు! సరేలే అనుకుని ఒక్కసారి ఈ చెరువు దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో …చూస్తే పోలా అనుకుని వెళ్ళితే… అచ్చంగా రాత్రి నీకు కనిపించిన దృశ్యం… ఆయనకి కూడా కనిపించినది! ఆ తర్వాత మా వాళ్ళు ఇది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే నేను వినడము జరిగినది! ఎప్పటికైనా నేను కూడా ఈ మహత్తర దృశ్యం చూడలేక పోతానా అని ఎన్నో సంవత్సరాలుగా అమ్మకి సేవ చేస్తున్నాను! అది నిజమే రా నాయనా! నీకు అమ్మవారు అనుగ్రహం కలిగినది! అందుకే ఈ చెరువుకు భ్రమరాంబిక చెరువు అంటారని… ఆయన ఏదో ఆనంద పూరితమైన మాటలు మాట్లాడుతున్నారు! నాకైతే అసలు రాత్రి ఏమి జరిగినది? అది నిజమా… అబద్దమా అర్థం కాని స్థితిలో… అయోమయస్థితిలో … ఆ పూజారికి అలాగే ఆ చెరువుకి నమస్కారం చేసి జేబులో ఉన్న కొంత డబ్బులు దక్షిణగా చెరువులో నాకు తెలియకుండానే వేసి… అక్కడ నుండి మా ఊరికి వెళ్ళే బస్సులు కోసం మౌనంగా వెళ్ళి పోతుంటే… నాలో నా ముఖంలో ఏ మాత్రం కూడా ఆనందపూరిత భావాలు కనిపించక పోవడంతో… ఆయన అయోమయ స్థితికి గురై… ఆ పూజారి నేను అర్థం కాని స్థితిలో ఉన్నానని తెలుసుకుని… అభిషేకానికి నీళ్ల కోసం ఆ భ్రమరాంబిక చెరువులోకి దిగినాడు! 
నాకు కావలసిన బస్సు రావడంతో ఎక్కి సీటులో కూర్చుని ఉండగా నాలో ఆలోచనలు మొదలయ్యాయి! అనగా కపాల భోజనం దెబ్బకి అలాగే చెరువులో అమ్మవారు దర్శనం దెబ్బకి నాలో తెలియని భయం మొదలయింది! దేవుని చూడాలంటే ఆనాడు వయోవృద్ధులు నన్ను వండుకొని తినాలని చూసినారు! అలాగే ఆ తర్వాత నగ్న యువకుడు ఒక్కడు నన్ను కాల్చుకుని తినాలని చూశాడు! మొన్న కపాలములో భోజనం చేసే పరిస్థితి! నిన్న చెరువులో ఎవరో బాలిక బెదిరించడం? అవసరమా! దేవుడు చూడటానికి వెళ్తే అందరూ భయ పెడుతున్నారు! దేవుడు అంటే భయమా లేదా భక్తా నాకైతే అర్థం కాలేదు! వామ్మో! ఆధ్యాత్మిక జీవితం ఇంత భయంకరంగా ఉంటుం దా? దీనికన్నా బతికుంటే బలుసాకు తిని బ్రతక వచ్చు కదా ! హాయిగా బ్రతకకుండా… దేవుడు ఉన్నాడో లేదో వాడి మీద పరిశోధన చేయడం అంత అవసరమా? అనవసరమైన సమస్యలు…. లేనిపోని భయాలు కొని తెచ్చుకోవడము అవసరమా? ఇంకా వద్దు! దేవుడు ఉన్నాడా లేడా ఎవరికి కావాలి? నేను ఎవరికి చెప్పాలి? హాయిగా భోగ జీవితమే నాకు చాలా మంచిది! హాయిగా చీకు చింతా లేని భోగ జీవితము వైపుకి నా మనస్సు లాగడం నాకు తెలియకుండానే మొదలయ్యింది! ఆ తర్వాత ఏమి జరిగిందో మీకు తెలియాలంటే… ఏం చేయాలో మీకు తెలుసు కదా! అదేనండి! నాతో పాటు మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి! ఇప్పటిదాకా నా ఆధ్యాత్మిక విషయాలను చూశారు! ఇకపై నా భోగ జీవిత విషయ అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దురు రండి !

శుభం భూయాత్

పరమహంస పవనానంద

********************************

గమనిక: కొన్ని సంవత్సరాల తరువాత ఈ దైవ అనుభవం నిజమైనదని అనుటకు నిదర్శనముగా… దత్తావతారమైన సాయి ఖేడా నివాసి అయిన ధునివాలా దాదాజీ జీవిత చరిత్ర లో ఇలాంటి సంఘటన ఉన్నట్లుగా చదవడము జరిగినది! ఆయన ఆవాసం ఉండే నర్మదానది పరిసరాల్లో… భక్తులు కోరికలు అవసరాల కోసం.. ఆయన ఈ నది దగ్గరికి పంపించి… వారికి గావాలసినవి ఈ నది నుండి ఒక నీటి హస్తము బయటికి వచ్చి ఇచ్చి వెళ్ళుతుందని నేను తెలుసుకున్నాను! ఒక పేద భక్తురాలు తన కుమార్తె వివాహం కోసం డబ్బులు లేకపోతే ఈయన దగ్గరికి వస్తే….  ఈ నర్మదానది దగ్గరికి పంపిస్తే… ఆ నది నుండి ఒక నీటి హస్తము బయటికి వచ్చి…. డబ్బులు ఇచ్చినట్లుగా వారి జీవిత చరిత్ర లో నేను చదవడం జరిగింది!

 అలాగే కాపాలిక కపాల భోజనం వలన మరియు ఈ భ్రమరాంబిక చెరువులో వేసిన డబ్బులు వలన నాకు ఆహారము అలాగే ధనము యందు నాకు ఎలాంటి లోటు రాకుండా … ఈ క్షేత్రము నుండే మౌనయోగి అయినా పూర్ణానంద స్వామి వారి చేత మంత్రించిన అక్షయ బియ్యము అలాగే మంత్రించిన అక్షయ 5 రూపాయల నోటు నాకు మా గుడిలో వీరి ద్వారా నాకు ఇవ్వడం జరిగినది! రాబోవు అధ్యాయాలలో ఈ మహానుభావుడి గురించి మీకు తెలుస్తుంది! అలాగే ఈ చెరువులో బాల మంత్ర ఉపాసన సిద్ధి పొందిన వారికి ఇప్పటికీ అమ్మవారు బాలరూపంలో నాకు కనిపించినట్టుగానే కనిపిస్తుందని… వివిధ పూజారులు అనుభవాల ద్వారా అలాగే బాల ఉపాసకుల ద్వారా తెలుసుకున్నాను! గత జన్మలో నేను బాల ఉపాసకుడు కావడం వలన… ఆ జన్మలో అమ్మవారు దర్శనం బాకీ ఉండటం వలన … అది ఈ జన్మలో ఈవిధంగా తీరినదని నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకున్నాను! ఏది ఏమైనప్పటికీ అన్ని రకాల దృశ్యాలు కూడా భ్రమలే అనుకుని ముందుకు దాటుకొని ఎక్కడ ఆగకుండా  సాధనలోనికి వెళ్లి పోయాను! వీటితో ఆగిపోతే మన సాధన కూడా ఆగిపోతుంది కదా! 

ఇక్కడ మీకు ఒక చిన్న ధర్మ సందేహం వచ్చి ఉండాలి! ఈయనకి కలిగిన అన్ని రకాల దైవ అనుభవాలన్నీ కూడా ఎందుకు శ్రీశైల క్షేత్రం చుట్టునే జరిగినాయి? దీనికి సమాధానం ఏమిటంటే మేము పనిచేసే దేవాలయం పేరు కూడా భ్రమరీ బాల సుందరి సమేత శ్రీ మల్లికార్జున దేవాలయం! శ్రీశైలం లో ఉన్నది కూడా వీరే కదా! అది కాకుండా నేను పూజించే వారు పలకరు… ఉలకరు… పలకరు… స్పందించరు… ఉన్నారో లేదో కూడా తెలియదు! కాని ఇదే పేరుతో ఉన్న శ్రీశైలంలో మాత్రం నేను వాళ్ళు ఉన్నారో లేదో అని పరిశోధనలు చేయగానే…. గుయ్య మంటూ… భయపెట్టే దృశ్యాలతో భయంకరంగా భయపెట్టినారు! అది స్వయంభూ లింగం అయితే మేము పూజించేది ప్రతిష్ట లింగము అదే తేడా అని అనుకుంటాను! పైగా అర్థనారీశ్వర తత్వం లో ఇద్దరు కలిసి ఈ శ్రీశైలం క్షేత్రం నందు ఆవాసము చేస్తున్నారు గదా! మరి మహిమలు చూపించకుండా ఎలా ఉంటారు! అలాగే వీరిని ప్రశ్నించే వారిని…లేరని వాదించేవారిని… బాధించే వారిని భయపెట్టకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు ఉనికి కోసము మనల్ని ఉలికిపడేటట్లుగా అపుడపుడు చేస్తుంటారు! నిజమే గదా! 

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. aahaa!! meeku eeni darshanalu... ammavaaru ela kanipinchindi ani clarity ga chepparu...meeru kaarana janmule kadaa...chaala baaga chepthunnaru andi... thankyou andi...gatha janmalo baaki ee janmalo theeratam jarigindi... mee janmanthara gnanam valla thelsukoni maaku clarity ga theliyajesthunnaru...

    రిప్లయితొలగించండి
  3. క్షమించండి ఇలా అడుగుతునందుకు, ఎంతవరకు నిజం అండి, మీరు చెప్పే అధ్యాలు సినిమా stories లాగా ఉంది.కాని ఒకసారి పరిశీలిస్తే నిజం లాగే ఉంది. నేను మీతో స్వయం గా మాట్లాడి నోజం ఏదో తలుసుకోవాలి అనుకొంటునను అండి,నేను కూడా మంత్రం సాధన chasthunanu అండి నాకు నిజం తలుసుకోవాలి అని ఉంది కాని చెప్పేవాళ్ళు లేరు,మీతో మాట్లాడే అవకాశం ఇస్తారా అండి,na mail id:-omkkhaar@gmail.com

    రిప్లయితొలగించండి