కర్మ చక్రము - కాపాలిక సాధన(122)

 కర్మ చక్రము - కాపాలిక సాధన




బాలగణపతి కాస్త ఆధారాన్ని చదవటం ఆరంభించాడు..


ఇక్కడ నా విగ్రహారాధన ఉండదు…..

 నా ఆరాధనగా ఉయ్యాలనే ఆరాధన చేస్తారు…

 ఒకప్పుడు శ్రీరాముడు నన్ను ఆరాధన చేశాడు….

 అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు ఎన్నో యాగాలు చేయడం జరిగింది…..

ఇక్కడ నేను రెండు పేర్లతో పిలవబడుతాను…

 మూడు నదుల కలయిక ప్రాంతంలో

 నేను ఉన్నాను…

 ఇక్కడ నా చేతి వేళ్ళు పడిన ప్రాంతం. 


అని ఉండేసరికి శివ నందిని కాస్త ఇదంతా విని చేతివేళ్లు పడిన ప్రాంతం ఏది అని ఇంటర్నెట్లో వెతికేసరికి….. అది ప్రయాగలో ఉన్న మాధవేశ్వరి శక్తిపీఠం అని తెలుసుకుంది.  అక్కడ ఉన్న స్థలపురాణం విశేషాలు తెలుసుకుంటూ ఉండేసరికి…. అక్కడ విగ్రహానికి బదులుగా ఉయ్యాల ఆరాధన చేస్తారని….. అలాగే శ్రీరాముడు ఆరాధన చేశారని….. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఎన్నో యాగాలు చేశారని…. అమ్మవారిని అలోపి దేవిగాను, మాధవేశ్వరి దేవి గాను పిలుస్తారని…. అలా రెండు పేర్లు ఆవిడకి ఉన్నాయి అని, గంగా యమునా సరస్వతీ కలయిక అక్కడ ఉంటుందని…. ఇది 14వ శక్తిపీఠం అని చెప్పి స్థల పురాణాన్ని బట్టి చెబుతూ ఉండేసరికి, ఈ ఆధారాలన్నీ సరిపోవటంతో ఇక కర్మ చక్ర జాగృతి కోసం శుద్ధి, ఆధీనం కోసం  ప్రయాగ క్షేత్రానికి వెళ్లాలి అని చెప్పి…. శివ నందిని కి అర్థమయింది. ఈ క్షేత్రం కాశీ నుంచి సుమారు 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని…. వీడియోల ద్వారా తెలుసుకోవడంతో, ఒక అవగాహన వచ్చి, ఇక ఆ క్షేత్రానికి దర్శనానికి కారులో వెళ్లాలని నిశ్చయించుకుంది. ఇక తను హోటల్లో ఉండకుండా స్మశానాలలో ఆవాసం చేస్తూ సాధన చేసుకోవాలి కాబట్టి, కాపాలిక సాధన ప్రయాగక్షేత్రంలోని చేసుకోవాలని, మహాదేవి శివ నందినితో చెప్పేసరికి సరే అని తనకి వచ్చిన కపాలం తీసుకుని ఈ ప్రయాగ క్షేత్రంలోనే కాపాలిక సాధన చేయాలి అని శివ నందిని నిశ్చయించుకోవడం జరిగింది. ఇక దానితో వీళ్ళు కాశీ క్షేత్రం వదిలి కారులో ప్రయాణించి, ప్రయాగ చేరుకోవాలని రాత్రి ప్రయాణం చేయాలని….అందరూ ఈ ప్రయాగ క్షేత్రానికి బయలుదేరడం జరిగింది. ఉదయం కల్లా  ప్రయాగ క్షేత్రానికి సాధన కుటుంబం చేరుకోవటం జరిగింది. 


అక్కడ ఉన్న త్రివేణి సంగమాలలో స్నానాధికాలు పూర్తి చేసుకుని, ఈ ఆలయ దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ స్థల పురాణం ప్రకారంగా అమ్మవారి విగ్రహ మూర్తికి బదులుగా ఉయ్యాల ఉండటం అందరూ గమనించారు.ఇక్కడ ఈ ఉయ్యాలనే శక్తి మాతగా భావించి పూజ చేస్తున్నారని, ఆ ఉయ్యాల ఊపుతూ నమస్కారం చేసుకోవడం జరిగింది. ఇంతలో బాల గణపతి కాస్త శివ నందినితో…. అమ్మ! నువ్వు కర్మ చక్రానికి వామచారంలో కాపాలిక సాధన చేయాలని ఇక్కడికి రావడం జరిగింది కదా…! ముందు మనం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడే చూసి వద్దాము… అనేసరికి… పిల్లల ముచ్చట ఎందుకు కాదనానిలే అని ఇక అందరూ ఆ చుట్టూ పక్కల ప్రదేశాలు చూడడానికి వెళ్ళడం జరిగింది… శివ నందిని ఒక్కొక్క ఆలయ విశేషం గురించి చెబుతూ ఆ ఇటు పక్కలో ఉన్న ఆలయాలు అన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంతలో బాల కుమారస్వామి ఇక్కడ అమ్మవారిని ఉయ్యాలగా ఎందుకు ఆరాధన చేస్తున్నారు అని అడగడం జరిగింది. దానికి శివ నందిని కాస్త చెప్పడం ఆరంభించింది..ఈ ప్రయాగ్‌రాజ్‌లోని అలోపీ శంకరీ/మాధవేశ్వరీ సంప్రదాయంతో అనుసంధానించబడిన ఆలయంలో చెక్క ఉయ్యాలను అమ్మవారి స్వరూపంగా పూజించడం వెనుక ప్రధానంగా ఒక స్థానిక శక్తిపీఠ కథ ఉంది. ఈ 

కథనం ప్రకారం, సతీదేవి దేహాన్ని శివుడు తీసుకుని తిరుగుతున్నప్పుడు, విష్ణువు సుదర్శనచక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించడం జరిగిందని తెలుసు కదా! అప్పుడు ఈ ప్రయాగ ప్రాంతంలో ఆమె శరీరభాగం పడిన తర్వాత అది అక్కడి నుంచి “అలోపం” (అదృశ్యం) అయిందని స్థానిక గ్రంధాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ సాధారణంగా కనిపించే విగ్రహం లేకుండా, దేవి అదృశ్య శక్తికి ప్రతీకగా ఒక చెక్క ఊయల/డోలీని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభమైందని చెబుతారు.

అంటే ఈ ఉయ్యాల “అమ్మవారి విగ్రహం” కంటే “అమ్మవారి అదృశ్య శక్తికి ప్రతీక” అనే భావనతో పూజించబడుతుంది. భక్తులు ఆ ఉయ్యాలను దేవి సన్నిధిగా భావించి పూజలు, కుంకుమార్చన, నైవేద్యాలు చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. హనుమంతుడు ఈ క్షేత్ర పాలకుడిగా ఉండడం విశేషం. దానితోపాటుగా ఆ పక్కనే ఉన్న ఆ నవదుర్గ సన్నిధిలో తొమ్మిది మంది అమ్మవారిల స్వరూపాలను దర్శనం చేసుకోవడం జరిగింది. వివిధ పాటుగా ఆలయాలుగా ఉన్న గణేశుడు కార్తికేయుడు శివుడు భైరవనిగా ఉన్న భవ భైరవుడి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. వీటితోపాటుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న రామజానకి ఆలయాన్ని, త్రివేణి సంగమం వైపు ఉన్న సిద్దేశ్వర మహాదేవ ఆలయాన్ని,  దగ్గరలోనే ఉన్నకిడ్గంజ్/కోట ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శివాలయం దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ఆలయానికి దగ్గరలోనే లలితాదేవి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. స్థానికుల వాదన మరియు ఇతర సాంప్రదాయ ఇతిహాసాల ప్రకారం అమ్మవారి యొక్క చేతి వేళ్ళు ఈ ప్రదేశంలోనే పడ్డాయని అంటారు కానీ అది ఎంతవరకు నిజమో అనే నిజం నిర్ధారణ ఇప్పటికీ ఎవరికి లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దారాగంజ్ ప్రాంతంలో ఉన్న నాగ వాసుకి మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరిగింది. క్షీర సాగర మథనంలో మంథర పర్వతం చిలికినప్పుడు వాసుకి శరీరం అంతటా గాయాలతో నిరసించి పోయినప్పుడు విష్ణుమూర్తి ఆదేశం మేరకు సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ నది సమీపంలోనే ఒక సేదతీరి తర్వాత పాతాళానికి వెళ్లడం జరిగింది. అదే ఈ ప్రదేశమని శివ నందిని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ నాగ–శైవ–తీర్థ సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయం అని స్థానిక పూజారి చెప్పగా తెలుసుకున్నారు. ఆ తరువాత అక్బర్ కోటలోని అక్షయ వట వృక్షాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మర్రిచెట్టు అని భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించిన తరువాత సీతారాములు అరణ్యవాసం సమయంలో ఈ వృక్షం వద్దకు వచ్చి చాలా కాలం పాటు ఉన్నారని పురాణ విశేషంగా చెప్పడం జరిగింది . ఆ తర్వాత 20 అడుగుల సైనభంగిలో ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే ఈ కాశీ నుంచి ప్రయాగ వచ్చే మార్గంలో జంగిగంజ్ జంక్షన్ వద్ద సీతాదేవి శరీరం విడిచిపెట్టిన సీతామర్హి అనే ప్రాంతానికి వీళ్ళు వెళ్ళటం జరిగింది. ఈ ప్రదేశంలోనే సీతాదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి భూమాత తో పాటు వెళ్లిపోయినట్టుగా స్థల పురాణం చెప్పడం జరిగింది.  ఇక్కడ 108 అడుగుల హనుమాన్ యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా చుట్టుపక్కల ఉన్న ఆలయాలు కోటలు దర్శనం చేసుకుని తిరిగి ప్రయాగ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. 


శివ నందిని ఈ క్షేత్రంలో ఉన్న సత్రంలో మిగిలిన వారి కోసం హోటల్ రూమ్ బుక్ చేద్దాం అని ఒక్క సత్రంలో గది తీసుకోవడం జరిగింది..  త్రివేణి  ఘాటుకి దగ్గరగా ఉండటం వల్ల స్నానాధికాలు కి…. సాధనకి ఇబ్బంది ఉండదని అక్కడ తీసుకోవడం జరిగింది.  రుద్రస్వామి కాస్త త్రివేణి సంగమం ఉన్న ఘాటు వద్ద కూర్చుని రుద్ర స్వామి ధ్యాననిష్టలోకి వెళితే….. పిల్లలు ఆటల రందిలో పడిపోవటం జరిగింది. 


శివనందిని కాపాలిక సాధన విధి విధానం 





శివ నందిని కాస్త తన కర్మ చక్ర సాధన కోసం ఆ క్షేత్రంలో ఉన్న ప్రధాన దేవాలయం దగ్గరికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ముందుగా శివలింగానికి ఎదురుగా ఉన్న నంది దగ్గరికి వెళ్లి… ఆయన మీద గరిక పెట్టి స్వామి!  ఒక మూడు నిమిషాల పాటు మీకు, మీ పరమేశ్వరునికి మధ్య నేను అడ్డుగా రావడం జరుగుతుంది. నేను ఆయనకి ఒక నివేదన చెప్పుకోవాలి.  అందుకని నీ అనుమతి కావాలి అని చేతిలో ఉన్న గరిక నంది మీద పెట్టి ప్రార్థించగానే కొన్ని క్షణాల తర్వాత ఒక గరిక నేల మీద పడేసరికి…. నందీశ్వరుడు అనుగ్రహించాడు అని ఆనందపడుతూ….. ఆ గరికను తీసుకొని ఎదురుగా ఉన్న శివలింగం కేసి చూస్తూ శివలింగానికి, నందికేశ్వరునికి మధ్యలో శివ నందిని కూర్చుంది. స్వామి! నా సాధనలో నేను కర్మ చక్రం జాగృతి,శుద్ధి,ఆధీనం విభేదన చేసుకోవడానికి ఈ క్షేత్రమునకు రావడం జరిగింది. కాకపోతే నేను ఈ సాధనని తాంత్రిక సాధనలో సిద్ధి పొందాలి అని  అనుకోవటం జరిగింది. అంటే వామాచార పద్ధతిలో ఈ సాధన పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. నిజానికి నీ అనుగ్రహం ఉంటేనే నా సాధన పరిసమాప్తి అవుతుంది. అలాగే ఈ కాపాలిక సాధన పరిసమాప్తి చేయడానికి…. కాపాలిక గురువుని అనుగ్రహిస్తావని ఆశిస్తున్నాను అని చెప్పి,  ఆవిడ లేచి… శివలింగాన్ని తాకి నమస్కారం చేసుకుని…. గుడి నుంచి బయటకు వచ్చి ఆ గుడి పరిసరాల్లో ఉన్న వీరభద్రుడు దేవాలయానికి వెళ్లి స్వామి!  నేను ఈ కర్మ చక్ర సాధన సిద్ధి కోసం మీ అంశ అయిన భద్రకాళీ దేవిని ఆరాధన చేయాలని అనుకుంటున్నాను. కాళీగా ఉపాసన చేసిన తాంత్రిక గురువుని నాకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నా సాధన పరిసమాప్తి కూడా చేయగలిగేలా అనుగ్రహించగలరని కోరుకుంటున్నాను అని వీరభద్రుడికి నమస్కారం చేసుకొని… బయటకు వచ్చి, తన కాపాలిక సాధన పరిసమాప్తి చేసే యోగినీ గురువు కోసం తపన తాపత్రయంతో ధ్యాననిష్ట లోకి వెళ్లడం జరిగింది. ఇలా కొన్ని గంటల పాటు ధ్యాననిష్ఠలో ఉండగా….. ఆవిడకి ఒక స్మశానంలో ఉన్న భూ గృహం లోపల తాంత్రిక స్త్రీ మూర్తి సాధన చేస్తున్నట్టు ఆరడుగుల కాళి విగ్రహ మూర్తి ఉన్నట్లుగా…. ఆమెకి ధ్యాన దృశ్యం అయ్యేసరికి, ధ్యాన భంగమై శివ నందిని కళ్ళు తెరిచిచూసింది.  ఆ పక్కనే ఉన్న రుద్రస్వామి, మహాదేవికి ఈ విషయం చెప్పగానే…. రుద్ర స్వామి ఆవిడ పోలికలు చెప్పు తల్లి!  అంటే శివ నందిని ఆ తాంత్రిక యోగిని పోలికలు చెప్పేసరికి…. ఆవిడ నాకు తెలుసు తల్లి!  ఆవిడ ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఒక స్మశానంలో ఆవిడ భూ గృహంలో ఉంటుందని వినికిడి. నేను ఎప్పుడూ చూడలేదు. కాకపోతే ఆవిడ వివరాలన్నీ నాకు తెలుసు. ఆవిడ గొప్ప కాళికామాత ఉపాసకురాలు. ఆవిడకి నిత్యం కాళికామాత దర్శనం అవుతుంది అని విన్నాను. ఆవిడ గొప్ప తంత్రసాధకురాలు. కాకపోతే ఆవిడ ఎవరికి పడితే వాళ్లకి తంత్ర సాధన విధివిధానం చెప్పదు అని వినికిడి కూడా ఉంది. నేను కూడా చాలా సార్లు ఆవిడ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తే… స్మశానంలోకి వెళ్ళటానికి కూడా అర్హత లభించలేదు. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తుందో లేదో నాకైతే తెలియదు. నీ యొక్క సాధన శక్తిని బట్టి ఆవిడ అనుగ్రహించింది అంటే… ఈ చక్రసాధన పరిసమాప్తి అవుతుంది. లేదు అంటే…. నువ్వు కూడా నాకు లాగానే వామాచారం వదిలిపెట్టి, దక్షిణాచారంలో సాధన చేయవలసి ఉంటుంది అనేసరికి…. అవును తల్లి!  రుద్ర స్వామి చెప్పింది నిజమే…. ఆ స్మశానవాసిని కాళికామాత ఉపాసకురాలు. ఆవిడ కనపడదు… అనుగ్రహించదు అని నేను కూడా విన్నాను అని మహాదేవి అనేసరికి, అప్పుడు శివ నందిని కాస్త ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కదా!  మనం ప్రయత్నం చేయడం మంచిది. ఇంత దూరం వచ్చాక వెను తిరగడం ఎందుకు? ఒక అడుగు దూరంలో మనం ఉన్నాం కదా! ఆవిడ అనుగ్రహిస్తేనే మనం తంత్ర సాధనలోకి వెళదాము… లేదు అనుకుంటే దక్షిణాచారంలోనే సాధన పరిసమాప్తి చేసుకుంటాను. కానీ, నా మనసు ఎందుకో తంత్రసాధన వైపుకు వెళ్లి సాధన చేసుకోవాలని మనసు పీకుతుంది. ఆవిడ అనుగ్రహిస్తుందని మనసు బలంగా చెబుతుంది. దైవ నిర్ణయం ఎలా ఉందో తెలియదు కదా!  జరిగేది జరగక మానదు…జరగనిది ఎన్నటికీ జరగదు కదా!  కాబట్టి విషయం ఏమిటో మనం తెలుసుకుందాము…. అని ఆవిడ తాంత్రిక యోగినీ దగ్గరికి వెళదామని ఆ స్మశానానికి చేరుకోవడానికి బయలుదేరడం జరిగింది. కానీ, అనుకొని సమస్యగా వాతావరణంలో పెను మార్పులు వచ్చి ఈదురు గాలులు…. విపరీతమైన వర్షం, పిడుగులు పడే పరిస్థితికి వచ్చేసరికి అసలు అకస్మాత్తుగా వాతావరణం లో ఈ అకాల మార్పులు ఎందుకు వస్తున్నాయి అని శివ నందిని అనుకుని ఓహో! బహుశా తాంత్రిక యోగిని తన దగ్గరికి రానివ్వకుండా చేయడానికి ఈ విధంగా పరీక్షలు పెడుతుందేమో అని శివనందిని అనుకుని ఎలాగైనా సరే తను ఇలాంటి నిజ శక్తి ఉన్న తాంత్రిక యోగినీ దగ్గరికి వెళ్లి తాంత్రిక గురువుగా ఎంచుకొని సాధన చేయాలనే మనో నిశ్చయంతో శివ నందిని బలంగా అనుకుంటూ బయలుదేరసాగింది. కానీ రుద్రస్వామి, మహాదేవి పిల్లలు కూడా…. ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి భయపడి తల్లి! మేము రాలేము…. మా వల్ల కాదు, ఇక్కడ ఉన్న సత్త్రానికి వెళ్లిపోతాము. నువ్వు మనోధైర్యంతో ముందుకు వెళితే… వెళ్ళూ.  లేదంటే మాతోపాటు వెనక్కి తిరిగి రా! అని అంటూ ఉండగానే…. ఒక అడుగు దూరంలోనే ఒక ఎండిపోయిన చెట్టు మీద పిడుగు పడి చెట్టు దహనం అవుతూ ఉన్న దృశ్యం క్షణకాలం చూసేసరికి…. మిగతా వాళ్ళందరూ భయపడి పోయి ఇక మా వల్ల కాదు తల్లి!  సత్రానికి వెళ్లిపోతాము.  ఆవిడ అనుగ్రహించేటట్టుగా లేదు, మనం సత్రానికి వెళ్ళిపోదాం అంటూ ఉండేసరికి…. శివ నందిని కాస్త ఇది ప్రకృతిలో జరిగే విపత్తు లాంటిది….ఇది సహజ సిద్ధంగానే జరుగుతుంది.  వర్షం అన్నాక పిడుగులు పడక మానదు… ఎండిపోయిన చెట్టు మీద పిడుగు పడితే అది కాలకమానదు.. అలా అని చెప్పి మనం సాధనలో వెనక్కి వెళ్లిపోవాలి ….భయపడాలి అనుకుంటే ఎలాగా? మనం ఇప్పుడు కాపాలిక సాధన చేసేది…మృత్యు భయం దాటడానికే కదా!  నేను మృత్యుకి ఎదురు వెళ్తానా లేదా భయపడతానా లేదా అని ఆవిడ పరీక్ష చేస్తుంది. నాకు మృత్యు భయం లేదు అని నిరూపించుకోవాలి. ఉంటే ప్రాణాలతో తిరిగి వస్తాను…. లేదు అంటే ఆవిడ చేతుల మీదుగానే నేను ప్రాణాలు కోల్పోతాను.  ఉంటే నా సాధన ఇక్కడే ఆరంభం అవ్వాలి… లేదు అంటే ఇక్కడే నా సాధన అంతం అవ్వాలి. ఏం జరుగుతుందో చూస్తాను,  బతికి ఉంటే రేపు పొద్దున నీతో కలుస్తాను… లేదు అంటే నా శవాన్ని చూడండి అని మనో నిగ్రహంతో… మనో నిబ్బరంగా ఆ క్షేత్రంలో ఉన్న స్మశానం వైపుకి వెళ్లడం జరిగింది. ఇక దానితో శివ నందిని మొండి పట్టు పడితే వదలదు…. ఇక ఆవిడని పట్టుకోవడం అసాధ్యం అనుకుని…. వీళ్ళందరూ వెనక్కి తిరిగి సత్రానికి వెళ్లిపోవడం జరిగింది. శివ నందిని కూడా ఏమాత్రం భయపడకుండా… చేతి కర్రను ఆధారంగా చేసుకుని ఆ స్మశానంలోకి వెళ్ళగా… ఒక వైపు నక్కలు, కుక్కలు విపరీతమైన గీంకార ధ్వనులు… గబ్బిలాలు, గుడ్లగూబల అరుపులు, అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా స్మశానంలోకి అడుగు పెట్టింది. వీటి శబ్దాలకి అరుపులకి మనసులో కొద్దిగా భయం వేసినా కూడా… భయపడకుండా, బెదరకుండా స్మశానం మధ్యలో వెతుకుతూ…. ఈవిడ ఉన్న భూ గృహం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉండేసరికి…. ఒకపక్క చితిమంటలలో కాలుతున్న శవాలు, ,ఆ శవాల యొక్క వాసనలు….. ఏవేవో శబ్దాలు… చితిమంటలలో మండుతున్న శవాల కదలికలు…. ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా, ఆలోచించకుండా ముందుకి సాగుతూ…. ఈవిడ ఉన్న భూగృహం వెతకడం ఆరంభించింది. ఎంత సేపు వెతికినప్పటికీ ఈవిడ ఉన్న భూగృహం ఆనవాళ్లు కనిపించకపోయేసరికి… ఒక విధమైన నిరుత్సాహం, భయం, ఆందోళన, కోపం, చిరాకు ఆవరించాయి. ఓర్పుతో ఉండాలి… సహనంతో ఉండాలి అని మళ్ళీ తిరిగి వెతకడం ఆరంభించింది. ఒక చోటికి వచ్చేసరికి కర్ర, నేల మీద డొల్లుగా మోగుతూ ఉండేసరికి…. ఆవిడ అక్కడ ఉన్న చెత్తని, మట్టిని అంతా తీసేసరికి… అదొక భూగృహం లోపలికి వెళ్ళటానికి పైన చెక్కతో చేసిన ద్వారం ఉన్నట్లుగా గ్రహించింది. అప్పుడు ఆ ద్వారం తెరవగానే…. భూ గృహంలోకి వెళ్లడానికి మెట్లు కనపడ్డాయి. చిమ్మ చీకట్లో ఆ మెట్లను తడుముకుంటూ…. శివ నందిని ఏమాత్రం ఆలోచించకుండా….భూగృహం అవునా కాదా అని కూడా ఆలోచించకుండా… లోపలికి వెళ్ళటం జరిగింది. అలా లోపలికి వెళ్లేసరికి… సుమారు వంద అడుగులు ఉన్న సొరంగం లాగా కనిపించింది.  ఆ సొరంగం లోపలికి వెళ్తున్న కొద్ది గాలి అందని పరిస్థితి.  చిమ్మ చీకటి, గబ్బిలాల శబ్దాలు, పుర్రెలు, తర్వాత శవాల వాసన, జంతువుల వాసన కుళ్ళిపోయిన మాంసం వాసన, ఇలా ఏం కనపడినా…. ఏవి వస్తున్నా కూడా…. వాటిని కర్రల సహాయంతో చెదురు  మొదరు చేసుకుంటూ…. దాటుకుంటూ…. ముందుకు వెళ్ళ సాగింది.  అక్కడ కొంత దూరం వెళ్లిన తరువాత…. ఒక విధమైన చిన్నపాటి కాగడా వెలుతురు కనిపించేసరికి…. ఇక్కడ ఈ సమయంలో ఈ కాగడా ఎందుకు వెలుగుతుంది అని ఆ దిక్కుకు వెళ్లేసరికి…. సుమారుగా ఒక 20 అడుగుల నిలువెత్తు ఉన్న కాళికామాత విగ్రహం ఉగ్రరూపం లో బీభత్సంగా నగ్నంగా కనిపించేసరికి…. శివ నందిని దానిని చూసి అదిరి బెదిరింది. ఒక క్షణం పాటు దానిని చూస్తూ ఇది విగ్రహమా లేక నిజంగానే  కాళికా మాత ఉన్నారా?  ఈ యోగిని ఎంతటి ఉపాసకురాలో …..అమ్మవారిని విగ్రహంలో నిక్షిప్తం చేసింది. చూస్తుంటేనే భయానకంగా ఉన్నది.  కానీ ఇంత ఉగ్రరూపం లో ఉన్న కాళి శాంత రూపంలో ఉన్నట్టుగా కనపడుతుంది.  కాకపోతే తలలో నుంచి వచ్చే రక్తము… ఆ రక్తం పట్టుకునే పాత్రని చూస్తుంటే నిజంగానే సజీవ మూర్తిగా ఉన్నట్టుగా కనబడుతుంది.  ఇంతటి సజీవ మూర్తిని సాక్షాత్కరింప చేసుకున్న ఆ తాంత్రిక యోగినీ మాత ఎవరు?  అనుకుంటూ ఉండేసరికి ఏంటి..?బాలకా!  ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అని భీకరమైన శబ్దం వినిపించేసరికి శివ నందిని ఒక్కసారిగా అదిరిపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి…… నల్లటి వస్త్రాలతో, చేతిలో కపాలమాల…. యోగ దండంతో విరబోసిన జుట్టుతో సుమారుగా 6 అడుగులు ఉండి నగ్నంగా ఉన్న ఆజానుబాహురాలు…. ఒక స్త్రీ మూర్తి కనిపించింది.  ఈవిడ మెడలో అన్ని కపాల మాలలు ఉండేసరికి బహుశా ఈవిడే అనుకుంట తనకి ధ్యానంలో కనిపించిన తాంత్రిక యోగిని…. అనుకుంటూ నమస్కారం మాతాజీ!  అంటే..

తాంత్రిక యోగిని:- ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు…. ఇక్కడికి రావడానికి నా శక్తులు ఎలా అనుగ్రహించాయి? 

శివ నందిని:- అమ్మ!  నేను సాధనలో ఉన్నాను.  కర్మ చక్రసాధనలో వామాచారంలో కర్మ, గుణ,కాల బ్రహ్మ చక్రాలను పరిసమాప్తము చేసుకోవాలని చెప్పేసి….. తాంత్రిక గురువు కోసం వెతుకుతూ…. నీ అనుగ్రహం కోసం రావడం జరిగింది. నాకు ధ్యానంలో నీ దర్శనం కలిగింది. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే నాకు ప్రకృతి మాత అన్ని రకాల పరీక్షలు పెట్టింది.  వాటిని తట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది.

తాంత్రిక యోగిని:- అవునా?  ప్రకృతి మాత పెట్టిన పరీక్షలు కాదు…. అసలు నువ్వు తాంత్రిక సాధన లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు? నువ్వు కాపాలిక సాధన ఎందుకు చేయాలనుకుంటున్నావు?



శివ నందిని:- కాపాలిక సాధన అనేది…. మృత్యు భయం దాటించడానికి ఉపయోగపడుతుందని…. మా గురువుగారు పరమహంస పవనానంద గారు చెప్పడం జరిగింది.  అందుకోసం అని నేను కాపాలిక సాధన ఎంచుకోవడం జరిగింది. 

తాంత్రిక యోగిని:- ఇప్పుడు మృత్యువును జయించి…. ఏం సాధించాలి అనుకుంటున్నావు?  

శివ నందిని:- నేను మృత్యువును జయించాలని అనుకోవట్లేదు తల్లి! మృత్యు భయం జయించాలి అనుకుంటున్నాను…

తాంత్రిక యోగిని:- ఈ రెండింటికీ తేడా ఏమిటి?

శివ నందిని:- మృత్యు భయం అంటే మృత్యువు ఎప్పుడు వస్తుందా ? ఎప్పుడు వెళ్ళిపోతానో…. ఎప్పుడు ఈ దేహాన్ని వదిలిపెడతానో…అని ఈ దేహం మీద మమకార వ్యామోహాలు కలుగుతూనే ఉంటాయి.అదే మృత్యు భయం నేను దాటాను అంటే…. ఈ దేహం మీద నాకు మమకారం మోహ వ్యామోహాలు ఉండవు. దాన్ని దాటడానికి కాపాలిక సాధన ఉపయోగపడుతుంది.  ఎందుకంటే చేతిలో కపాలము ఉండటం వలన మనిషి ఆఖరి స్థితి కపాలం స్థితియే కదా!  అని చెప్పి స్పూరణ కలుగుతుంది.  అందుకని తాంత్రిక సాధనలో ప్రముఖమైన కాపాలిక సాధన ఎంచుకోవడం జరిగింది.  కాపాలిక సాధన తర్వాత అఘోర సాధన,  ఆ తరువాత భైరవ సాధన, ఆ తర్వాత నాగ సాధువు సాధన వస్తాయని తంత్ర విధి విధానంలో చెప్పడం జరిగింది.  కాబట్టి ఈ మహా మృత్యు భయం వదిలించుకోవాలి అనుకుంటున్నాను. 

తాంత్రిక యోగిని:- శభాష్! నువ్వు తంత్రవిద్య యొక్క పూర్ణజ్ఞానం పొందావు సరే ఇప్పుడు మృత్యు భయం దాటాలి అంటే నువ్వు అనుకున్నంత తేలికైన విషయం కాదు.  ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తితే గాని మృత్యువు మీద నీకు సిద్ధి రాదు…

శివ నందిని:- అందుకే కదా!  తల్లి…. దక్షిణాచారంలో కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాల్సి వచ్చింది.  అదే వామాచారంలో 41 రోజులలో ఈ సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు అనే విషయం కూడా నాకు తెలుసు..

తాంత్రిక యోగిని:- అంటే సూక్ష్మంలో మోక్షంగా 41 రోజుల్లో మృత్యు భయం దాటాలి అని చెప్పి కాపాలిక సాధనలోకి వచ్చావా? 

శివ నందిని:- అవును తల్లి!  ఈ కాపాలిక సాధనలో సిద్ధి పొందితే…. నాకు మృత్యు భయం దాటే స్థితి వస్తుంది. ఆ తర్వాత నేను మిగతా సాధనలు పూర్తి చేసుకోవాలి. ఈ నాలుగు రకాల సాధనలు పూర్తి చేసుకోవడానికి నేను దాదాపు నాలుగు లక్షల 77 వేల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.  అదే నేను 41 రోజుల్లో ఈ కాపాలిక సాధన పూర్తి చేసుకుంటే…. మిగతా సాధనలు అనగా సుమారు 100/120 రోజుల్లో పూర్తి చేసుకుంటే…. ఇన్ని జన్మలు ఎత్తడానికి అవకాశం ఉండదు కదా!  

తాంత్రిక యోగిని:- మృత్యు భయం దాటడం అంటే అంత తేలికనుకుంటున్నావా?

శివ నందిని:- ఆ విషయం నాకు తెలియదు తల్లి..!  ఇప్పటివరకు నేను మృత్యు భయం స్వానుభవం పొందలేదు.  కాకపోతే శబ్ద పాండిత్యంలో చెప్పిన పుస్తక గ్రంథాలను చదవటం వలన మృత్యు భయం దాటవచ్చు అనే విధివిధానం అయితే ఉందని తెలుసుకున్నాను.  అందుకే మృత్యువును దాటినవాడు కాబట్టి మృత్యుంజయుడు అయ్యాడు అని మహాశివుడి గురించి చెబుతారు కదా! ఆ మహా శివుడి అనుగ్రహం పొందాలని నేను తంత్రసాధనలో ఈ కాపాలిక సాధనకు రావడం జరిగింది…


తాంత్రిక యోగిని:- నీ మృత్యు భయం దాటగలవా?  లేదా?  అనేది నీ యొక్క సాధన పరిపక్వతను బట్టి ఉంటుంది.  నువ్వు అనుకోని అతిథిగా వచ్చావు…. అందులోను మాధవేశ్వరీమాత నువ్వు ఇక్కడికి వస్తున్నావని విషయం నాకు ఆరు నెలల క్రితమే చెప్పడం జరిగింది.  కాకపోతే ప్రకృతి మాత నీకు పరీక్షలు పెట్టింది అన్నావు కాబట్టి …..నువ్వు ఆ పరీక్షలు తట్టుకొని వచ్చావు అంటున్నావు కాబట్టి…. ఇక సాధనలో నువ్వు కాపాలిక మాత పెట్టే పరీక్షలో కూడా నువ్వు నిలబడాలి. ఈ కాపాలిక సాధన 41 రోజులు చేయవలసి ఉంటుంది.  అది మిట్ట మధ్యాహ్నం లేదా అర్ధరాత్రి చేయవలసి ఉంటుంది. అలాగే పాల అన్నం సేవిస్తూ ఉండాలి. అలాగే మైథునం ఉండకూడదు. అలాగే వేప చెట్టు నుంచి చేసిన చెక్క మీదనే నిత్యం కూర్చుని ఉండాలి. అలాగే 41 రోజులు ఈ సాధన చేసేటప్పుడు ఈ కాపాలిక దేవత చూపించే ప్రమాదములను నువ్వు చూసి భయపడకూడదు. వాటిని ఆ దృశ్యాలను సాక్షిభూతంగా నువ్వు చూడగలిగే మనోనిగ్రహం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు చూసి భయపడతావో…. అక్కడితో నీ సాధన ఆగిపోతుంది. మరుసటి రోజు నువ్వు భయపడకుండా, బాధపడకుండా, ఏ మార్చకుండా నువ్వు చూడగలిగితే, నువ్వు సాధన పరిసమాప్తి చేసుకోగలుగుతావు.  అక్కడి నుంచి 41 రోజులు మొదలవుతుంది… ఒకవేళ నువ్వు ఈ సాధనలో భయపడ్డావంటే మాత్రం నీ మృత్యువును నువ్వు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మృత్యు భయమే వచ్చి నువ్వు చనిపోయిన చనిపోవచ్చు.  కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని చేయవలెను.  ఈ సాధన యొక్క నియమాలు ఏంటంటే…. మొదట 108 చిరుమువ్వలు నడుముకి చుట్టూ చుట్టుకోవాలి లేదా ఒక పదకొండు రాగి  నాణాలు మాలని నడుము చుట్టుకోవాలి.  ఈ రాగితో చేసిన మువ్వలు లేదా రాగితో చేసిన నాణేలను ధరించడం వలన స్మశానంలో నీ చుట్టూ తిరిగే భూతప్రేత పిశాచాలు ఆ మువ్వల శబ్ద నాదానికి భయపడి నీ దగ్గరికి రావు. కాకపోతే ఇక్కడ 41 రోజులపాటు ఏవో ఒక  ఒక భ్రమ,బ్రాంతి కలిగిస్తాయి.ఆత్మలే కావచ్చు…. దైవిక శక్తులే కావచ్చు… ప్రేతాత్మలే కావచ్చు…భూతాలే కావచ్చు… విపరీతమైన అరుపులు చేయచ్చు… శబ్దాలు చేయచ్చు… ఆత్మఘోష ఏడుపులు వినిపించవచ్చు.. ఏం జరుగుతుంది ఏంటి?  అనేది ఇదిమితంగా చెప్పలేము.  కాకపోతే ఇవన్నీ కూడా నువ్వు సాధనలో మంత్రసిద్ధి చేసేటప్పుడు…. ఏకాగ్రతను దెబ్బతీయటానికి మాత్రమే ఇవి జరుగుతాయని మనసులో ఉంచుకో! నువ్వు కళ్ళు తెరిచి చూసినప్పటికీ కూడా…. వాటిని సాక్షిభూతంగా చూస్తూ ఉండగలిగితే పరవాలేదు.  వాటికి భయపడి బాధపడ్డావు అంటే మాత్రం,  ఇక ఆ రుద్ర గణాలు నిన్ను చంపుకొని తింటాయి.  అది మాత్రం జాగ్రత్తగా మసులుకో!  నీ చుట్టూ అష్టదిగ్బంధనం చేసుకోవాల్సి ఉంటుంది.  అష్టదిక్కులలో వేప చెక్కతో చేసిన మేకుల లాంటి కర్రలను భూమిలో పాతి పెట్టవలసి ఉంటుంది. అలాగే వాటి మీద ఒక కోడిగుడ్డు, మూడు రాగి నాణేలు, అన్నం ముద్ద కలిపి వాటికి బలిహారం కింద పెట్టవలసి ఉంటుంది. ఇలా ప్రతిరోజు నువ్వు చేయవలసి ఉంటుంది.  అలాగే ప్రతిరోజు మహా నైవేద్యం కింద భూత బలి కింద అటుకులు కలిపిన బెల్లం ముక్కను పెట్టవలసి ఉంటుంది.  ఇది ప్రతినిత్యం 41 రోజులపాటు చేయవలసి ఉంటుంది.  ఈ 41 రోజులపాటు మనసుకి విపరీతమైన భయభ్రాంతులను, మనోభ్రాంతులు ఇవన్నీ కలిగించే స్థితి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం భయపడకుండా…. బాధపడకుండా… ఆలోచించకుండా నీ సాధన నువ్వు కొనసాగించవలసి ఉంటుంది.  కాళికామాతకు సంబంధించిన సాధనా మంత్రం నీకు చెబుతాను…. అది మనసులో గుర్తుపెట్టుకుని…. దానిని బీజాక్షరాల సహితంగా చేయవలసి ఉంటుంది. చెప్పి మరి వీటన్నింటికీ సిద్ధపడతావా?  సిద్ధపడి 41 రోజులు సాధనాలు చేయగలుగుతావా?  లేదా అనేది నువ్వే ఆలోచించుకో…

శివనందిని:- అమ్మ!  ఇంత దూరం సాధన చేసుకోవడం కోసం వచ్చాను. సాధన పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.  అయితే సాధన పరిసమాప్తి అవుతుంది…. భయానికి గురి అయితే ఆ తల్లి సమక్షంలోనే నేను మృత్యు ఒడి చేరతాను.  ఏం జరుగుతుందో …ఎలా జరుగుతుందో…. కూడా కాల నిర్ణయమే చేయాలి కదా!  నా వరకు నేను దేనిని ఆలోచించకుండా….దేనికి స్పందించకుండా… సాక్షి భూతంగా సాధన పరిసమాప్తి చేసుకుంటాను అని చెప్పి మనో సంకల్పంతో… మనో నిబ్బరంతో…. మనో నిశ్చయంగా ఉన్నాను.

తాంత్రికయోగిని:- సరే అయితే…. నువ్వు మొదట ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని నా దగ్గరికి రా!  పక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసిరా…. నీకు కాళికామాత మంత్ర ఉపదేశం చేస్తాను.  ఆపై నీ అభీష్టం తీరుతుందో లేదో కూడా తెలియదు. ఇది అంతా కూడా నేను సాక్షి భూతంగా చూస్తాను.  ఎంతోమంది సాధకులు ఇక్కడికి వచ్చి సాధన చేయడానికి వచ్చి…. సాధనలో బలి అయ్యి ….దారిలో వచ్చిన పుర్రెల లాగా మారి కాళికామాతకు బలి అయిన వాళ్లే. అది ఒకటికి పది సార్లు ఆలోచించుకో… చూస్కో… లేదు అనుకుంటే ఇక్కడ నుంచి వెనుతిరిగి వెళ్ళిపో…

శివ నందిని:- అమ్మ! ఆ తల్లి మృత్యు భయం చూపిస్తుందో లేదో తెలియదు కానీ, నువ్వు మాత్రం నీ మాటలతో నన్ను వెనక్కి తిరిగి పంపించాలని… నాలో భయాన్ని కలిగించి వెనక్కి పంపించాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది.  నాకు ఇద్దరు లేరు  కాళికామాత నువ్వు వేరని నేను అనుకోవట్లేదు.  నువ్వే కాళికామాత అనే భావంలోనే ఉన్నాను.

తాంత్రిక యోగిని:- భేష్ తల్లి!  శభాష్ సగం విజయం సాధించావు.  ఈ సాధన పరిసమాప్తి ప్రతి అవ్వటానికి నీ సాధనా శక్తి సరిపోతుంది అనిపిస్తుంది.  ఇదే ఇంద్రియ నిగ్రహంతో నువ్వు నిలబడి సాధన పరిసమాప్తి చేసుకో…

అని చెప్పి స్నానం చేసిరా!  అనగానే….శివ నందిని కాస్త దగ్గరలో ఉన్న కోనేరులోకి వెళ్లి స్నానం చేసి రాగానే…. తాంత్రిక యోగినీ కాస్త ఆవిడకి తాంత్రిక గురు మంత్ర ఉపదేశం కాపాలికాదేవి అనుగ్రహం సిద్ధించే మంత్రమును ఉపదేశం చేయడం జరిగింది.  ఆ ఉపదేశం మంత్రమును రోజుకు పదివేల సార్లు తక్కువ కాకుండా చేసుకోమని చెప్పి 41 రోజుల పాటు చేసుకోమని అన్నది. ఒంటిమీద ఉన్న వస్త్రములు అన్ని తీసేసి శివ నందిని కాస్త నగ్నంగా మారి కాళికామాత దగ్గర కూర్చొని సాధన చేసుకోవాలి అని ప్రారంభం చేసింది. అలాగే తాంత్రిక యోగినీ కాస్త నగ్నంగా మారి శివ నందిని శరీరానికి 108 మువ్వలు నడుముకి మొలతాడు కట్టినట్లుగా కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎనిమిది వేపకొమ్మలు ఒక అడుగు ఉన్న మేకులను ఇచ్చి…. ఇవి నువ్వు ఒక సమాధి ఎంచుకొని ఆ సమాధి వద్ద కూర్చొని ఆ సమాధికి ఎనిమిది దిక్కులలో ఈ మేకులను పెట్టు.  అక్కడే కోడుగుడ్డు అటుకులు బెల్లం వాటిని నైవేద్యంగా పెడుతూ ఉండు.  నువ్వు 41 రోజుల పాటు నువ్వు క్రమం తప్పకుండా కోడిగుడ్డు నైవేద్యం ఈ అష్టదిక్కులలో దేవతలకి నైవేద్యంగా పెడుతూ ఉండు.  ఇక్కడ జరిగే వాటిని వచ్చే ఆత్మ ప్రేతాత్మ ఘోషకి నువ్వు బెదరకు, భయపడకు, ఆలోచించకు, అని చెప్పిన తర్వాత… శివ నందిని కాస్త అక్కడ ఉన్న ఒక మహాయోగి యొక్క సమాధి వద్ద ధ్యానంలో కూర్చునే ముందు తాంత్రిక యోగిని చెప్పిన అష్టదిక్కులలో అష్ట వేప ముక్కలతో చేసిన మేకులను గుచ్చటం….. వాటి మీద కోడిగుడ్లు మూడు రాగి నాణేలు అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టిన తరువాత….. ఆ మహాసమాధిమీద నగ్నంగా కూర్చుని తాంత్రిక యోగిని చెప్పిన కాపాలిక మంత్రమును ఉచ్చారణ చేయడం ఆరంభించింది.  మొదటి రోజు వచ్చేసరికి శివ నందినికి సంబంధించిన పూర్వ తరాల యొక్క ఆత్మలు అంటే తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, తన తోబుట్టువులు, తరాల వారు, మేనమామలు, మేనత్తలు ఇలా ఆత్మలన్నీ కూడా ఒక్కొక్కటిగా కనిపించడం మొదలు పెట్టింది. వీళ్ళు ఆత్మలా ! నిజంగానే వచ్చారా?  అని కళ్ళు తెరిచి చూసింది. అలా కళ్ళు తెరిచి చూసేసరికి….. వాళ్ళు మనుషుల లాగే ఆత్మల రూపంలో కనిపించేసరికి…. వీళ్ళు ఆత్మలా ? మనుషులా! ప్రేతాత్మలా? అనుకునేసరికి తనకి ఇష్టమైన మేనత్త ఆత్మ కనిపించేసరికి ఆవిడ పిలిచిన పిలుపుకి శివ నందినిలో ఏదో తెలియని మమకారం మొదలయ్యి పైకి లేవబోతూ ఉండగా…. నడుముకి కట్టిన మువ్వ శబ్దానికి మేనత్త ప్రేతాత్మ కాస్త భయపడి పారిపోతూ ఉండేసరికి…. అప్పటికి గాని శివనందిని కి విషయం అర్థం కాలేదు.  తను చూస్తున్నది నిజం కాదు…భ్రమ, బ్రాంతి కలిగించే ప్రేతాత్మ అని,  నిజానికి మేనత్త రాలేదు. ఆవిడ చనిపోయి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. చనిపోయిన ఆవిడ ఎలా వస్తుంది? ఆ మాత్రం ఆలోచించ లేకపోతే ఎలాగా?  సాధన ఆరంభంలోనే విఘ్నం మొదలు అయ్యిందా?  అనుకుని అనేసి చ…… తను ఇంత బలహీనంగా ఉందా!  అనుకుంటూ ఆ బలహీనతను పొందితే ఎలాగా!  అని తనని తాను నిగ్రహించుకోవాలని…. సాధన చేయడం ఆరంభించింది.  అలా దాదాపు ఆ మంత్రంను ఐదువేల సార్లు ఎంతో మనోనిగ్రహంతో పూర్తి చేస్తూ ఉండేసరికి….. ఈసారి తల్లిదండ్రులు ప్రేతాత్మలు, మేనమామలు, అత్తమామలు, ప్రేతాత్మలు కనిపిస్తూ ఉండేసరికి… తండ్రి పిలుపుకి శివ నందిని ఆర్తిగా కళ్ళు తెరిచి చూసేసరికి…. ఎదురుగా తన తండ్రి కనిపించేసరికి…. నాన్నగారు నన్ను క్షమించండి!  అమ్మ నాన్న అని మాట్లాడాలి అని అనుకుంటూ నోరు పెకిలించేసరికి…. నోట్లో నుంచి మాట రాకపోతూ ఉండేసరికి వాగ్బంధనం అయింది అనుకుంటూ ఉండగా….. వాళ్ళు చూసే చూపులకి వాళ్ళు నిజంగానే మనుషుల రూపంతో ఉండేసరికి కళ్ల వెంట నీరు వస్తూ ఉండగానే ఈసారి మొలకి ఉన్న గజ్జల శబ్దానికి వాళ్లంతా అదృశ్యం అయ్యారు.  తన సాధనలోనే ఆరంభ శూరత్వం లాగా విఘ్నము దాటలేక పోతుంది.  అవకాశాలను దాటలేక పోతున్నాను అని చెప్పి శివ నందిని కి అర్థం అయ్యి….. ఎలా అయినా సరే సాధన చేసుకోవాలి అని తెరిచిన కళ్ళు కాస్త…. కళ్ళు మూసుకొని సాధన చేసుకోబోతూ ఉండేసరికి…. జప సంఖ్య 8000 అవుతూ ఉండేసరికి …..తన చుట్టూ దైవిక శక్తులు, ప్రేతాత్మ శక్తులు, అరుచుకుంటూ, కొట్టుకుంటున్నట్టు, విపరీతంగా అరుపులు గీం కార శబ్దాలు, దాడులు యుద్ధం జరుగుతున్నట్లుగా ఉండగా శివ నందిని ఏమాత్రం చలించకుండా… భయపడకుండా….ఆలోచించకుండా కళ్ళు తెరవకుండా…. జరిగేది జరగనివ్వు, ఏం జరిగితే అది జరుగుతుంది అని…. తన నడుముకి ఉన్న గజ్జల శబ్దం ఉన్నంతవరకు భయపడాల్సిన అవసరం లేదు… చిత్తభ్రాంతికి లోను కాకూడదు… మనోభ్రాంతికి చెందకూడదు…. అని చెప్పేసి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఆ జపాన్ని పూర్తి చేసుకునే సరికి ఎలాంటి శబ్దాలు లేని ప్రశాంత స్థితికి పొందటంతో మొదటి రోజు పూర్తి అయ్యింది. ఆ తర్వాత శివ నందిని కాస్త సమాధి మీద  నుంచి బయటకు వచ్చి అప్పటికే సిద్ధం చేసిన పాల అన్నమును ఆహారంగా తీసుకొని, వేప చెక్కతో చేసిన మంచం మీద విశ్రాంతి తీసుకోవడం ఆరంభించింది.  ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేని తాంత్రిక యోగిని తన నిత్య కృత్యాలలో తీవ్రమైన ధ్యాన నిష్ఠలో ఉండిపోయింది.  శివ నందిని కాస్త గాఢ నిద్రలోకి జారిపోవడం జరిగింది.  ఇలా మొదటిరోజు సాధన పరిసమాప్తి అయింది.  మొదటి రోజు నుంచి ఐదవ రోజుకి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు యొక్క ఆత్మలు పిశాచాల రూపంలో రావడం, ఇబ్బంది పెట్టటం, మనోవికారాలు కలిగించాలని విశ్వ ప్రయత్నాలు చేయడం, కోరికలు తీర్చాలని అంతం లేని తమ కోరికలను చెప్పడం చేస్తూ ఉండేసరికి…అప్పుడు కూడా శివ నందిని ఏమాత్రం ఆలోచించకుండా, పట్టించుకోకుండా, నామామాత్రంగా అప్పుడప్పుడు వాళ్ళ మీద ఉన్న మమకారాలతో కళ్ళు తెరిచి చూసినప్పటికీ…. సాక్షిభూతంగా చూస్తూ ఐదు రోజుల సాధన పరిసమాప్తి చేసుకుంది.  ఐదవ రోజు సాధన పరిసమాప్తి వద్దకు వచ్చేసరికి….. ఉన్నట్టుండి యముడు యొక్క వాహనమైన దున్నపోతులు ఎర్రని కళ్ళతో రావటం చూసి…. ఇదేంటి!  ఉన్నట్టుండి దున్నపోతులు వస్తున్నాయి ఏంటి?  అని ఒక్క క్షణం కలవరపడింది.  అయినా కూడా ఏదైతే అది అవుతుంది…. సమాధి దగ్గర నుంచి బయటకు కదిలే పనిలేదు అని అలాగే కూర్చుని ఉండేసరికి…. ఆ దున్నపోతులు కాస్త ఈమె  ఉన్న సమాధి చుట్టూ చేరి తమ శరీరాలను ఈ సమాధి గోడలకేసి రుద్దుతూ ఉన్నప్పటికీ కూడా దున్నపోతుల యొక్క స్పర్శ శివ నందిని కి తెలుస్తున్నప్పటికీ కూడా…. శివ నందిని ఏమాత్రం భయపడకుండా ఆలోచించకుండా అవి ఏం చేసుకుంటాయో చేసుకొని…. అని కళ్ళు మూసుకుని ఆ రోజు పూర్తి చేయవలసిన పదివేల జపమును పూర్తి చేసుకున్నప్పటికీ…. దున్నపోతులు చేసే  గీం కారాలు, అరవటాలు ఎన్ని చేసినప్పటికీ కూడా… శివ నందిని ధ్యాననిష్టను కోల్పోవడం జరగలేదు. ఇలా శివ నందిని కాస్త ధ్యానం కొనసాగిస్తూ…. ఏడవ రోజు నుంచి 11వ రోజుకి రావడం జరిగింది. 


యధావిధిగా శివ నందిని కాస్త ధ్యాననిష్ఠలో కూర్చుని సమాధి వద్ద కాపాలిక సాధన చేస్తూ 8000 జపం పూర్తి అవుతూ ఉండేసరికి…. ఉన్నట్టుండి ఆరోజు 11వ రోజు కావడంతో, విపరీతమైన శంఖ నాదాలు ఘంటానాదాలు, డమరుకం నాదాలు, రకరకాల శబ్దనాదాలు వినిపించడం ఆరంభించినాయి.  ఆ నాదాలకి చెవులకి ఎక్కడ చిల్లు పడి రక్తం వస్తుందో అని చెప్పి చిన్నపాటి మనోభాయానికి శివ నందిని గురికావడం జరిగింది. అయినప్పటికీ….ఏం జరిగినా ఈ శబ్దనాదాలకి భయపడాల్సిన అవసరం లేదు. ఈ శబ్దనాదాలకి భయపడితే….తను సాధనా నిష్టని కోల్పోవడం లేదా ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుంది  అనుకుని ఎలాగైనా ఈ శబ్దాలను దాటాలి అని మనోనిగ్రహంతో సాధన కొనసాగిస్తూ తన పదివేల జపం పూర్తి చేసింది.  ఆ పదివేల జపం పూర్తి చేసుకున్న తరువా… యధావిధిగా సమాధి మీద నుంచి బయటకు వచ్చి…. వేప మంచం మీద పడుకొని…  యోగ నిద్రలోకి వెళ్లిపోవడం జరిగింది.  ఇదంతా ఓరకంటగా తాంత్రిక యోగిని కూడా మౌనంగా ఉండి ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్టుగా  చూస్తూ ఉండసాగింది. ఆ తర్వాత మూడు రోజులపాటు ధ్యాననిష్ఠలో ఉన్నప్పుడు ఎలాంటి అరుపులు గాని శబ్దాలు కానీ లేకుండా నిశ్శబ్ద సాధన తో సాధన చేస్తూ ఉండగా…. ఆ నిశ్శబ్ద సాధన కూడా శివనందిని తట్టుకోలేని…. పరిస్థితికి శివ నందిని వెళ్లడం జరిగింది. ఉన్నట్టుండి అరుపులు గోలలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో….. ఇప్పటిదాకా విపరీతంగా అరుపులు గోలలు ఉన్నా ప్రేతాత్మలు చేసే గోలలు గాని, శబ్దనాదాలు కానీ, ఇవన్నీ లేకపోయేసరికి ఉన్నట్టుండి…. అతని నిశబ్దంగా  ఉండేసరికి ఈ నిశ్శబ్దనాదం కూడా శివ నందిని తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది.  అయినా కూడా జపం చేయడం ప్రారంభించింది. పూర్తి చేయడం జరిగింది.  అంటే నాదం నుంచి నిశ్శబ్దనాదం కూడా మనసు భరించాలి అని మానసికంగా అనుకుంటూ…. సమాధి వద్ద నుండి బయటకు వచ్చి యధావిధిగా యోగ నిద్రలోకి  జారుకోవడం జరిగింది. ఆ తర్వాత 15వ రోజు సాధనలో ఒక విచిత్రమైన అద్భుతం జరిగింది.  ఒక పరదేవత తనకి దర్శనం ఇచ్చినట్లుగా….. అనుభవ అనుభూతిని పొందడంతో…. శివ నందిని కాస్త కళ్ళు తెరిచి చూసింది.  ఆవిడ చూడటానికి మానవ శరీరంతో ఉన్న దేవతా స్త్రీ మూర్తి లాగా కనిపిస్తుంది అని అర్థం చేసుకున్నది. సరే ఈవిడ ఎవరు అని అనుకుంటూ ఉండేసరికి…. ఆవిడ కాస్తఅమ్మ నా పేరు నిషాశక్తి. నేను కాపాలిక అంశ యొక్క  శక్తిస్వరూపిణిని.  నీ శరీరం నుంచి వచ్చే సౌగంధ వాసనకి మైమరచి నీ దగ్గరికి రావడం జరిగింది. నీ శరీరం తాకాలి స్పర్శించాలి….అని నా మనసు పరి విధాలుగా ఉవ్విళ్లు ఊరుతుంది అనుకుంటూ ఉండేసరికి…. అప్పుడు గాని శివ నందినికి విషయం అర్థం కాలేదు. ఈవిడ స్పర్శ వలన ఆమెలో మృత్యు భయం, కామకోరికలు కలుగుతాయి.  ఆ మాయలో పడినట్లయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుని…. ఏం జరిగితే అది జరుగుతుంది అనుకుని ఏమీ జరగనట్లుగా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుని సాధన చేయడం  కొనసాగించడం మొదలుపెట్టింది.  ఇక తన మాటలకి ఈమె ప్రలోభ పడట్లేదు అని ఆ నిషాశక్తి కాస్త శివ నందిని శరీరాన్ని తల నుంచి పాదం వరకు తన రెండు చేతులతో స్పర్శిస్తూ ఉండేసరికి…. ఆ స్పర్శకి శివ నందినిలో ఏదో తెలియని మధుర అనుభూతి అనుభూతులు కలగసాగాయి.  అంటే మూలాధార చక్రంలో తను సాధనలో ఉన్నప్పుడు మహాదేవి మీద ఎలా అయితే కామ కోరికలు కలిగినాయో…. అలాగే ఈ నిషా దేవి మీద విపరీతమైన శృంగార వాంఛలు కలిగి కామకోరికలు కలుగుతూ ఉండేసరికి…. శివ నందిని కి ఎలా మనసుని అదుపులో ఉంచుకోవాలో…. ఏం చేయాలో అర్థం కాక కళ్ళు తెరిచి చూస్తూ సాక్షిభూతంగా అలా ఉండిపోయింది. తన మనసు కాదు కదా తన శరీరం కూడా మాట వినట్లేదు అని శివ నందిని కి అర్థం అయింది.  ఉన్నట్లుండి శరీరంలో మార్పులు రావడం యోని భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగటం…. నడుము దగ్గర స్పర్శను కోరుకోవడం, వీపు భాగం స్పర్శను కోరుకోవటం, మెడ భాగంలో స్పర్శ కావాలని కోరుకోవడం, చెవులు స్పర్శ కావాలని కోరుకోవడం, బుగ్గలు సిగ్గుతో ఇదవటం తొడలు, కాళ్లు పాదాలు కూడా స్పర్శ కావాలని కోరుకోవడం…. ఇక తహతహలాడుతూ ఉండేసరికి…. తనలో ఇన్నాళ్లు నిగ్రహంతో ఉన్న కామశక్తి, శరీరం కామ భావాలను సుఖాలను కోరుకుంటుంది అని శివ నందినీకి అర్థం అయ్యి….. అమ్మ తల్లి!  నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు నిషాశక్తి అంశ అంటున్నావు.  కాబట్టి నాలో నువ్వు కామ నిషాను  పెంచడానికి వచ్చావని అర్థం అయింది.  కాబట్టి నీతో నేను సంభోగించాలి అని అనుకోవట్లేదు. ఈ శరీరం మనసు అస్థిపంజరంతో సమానం అని చెప్పేసి జ్ఞానం అనుభూతిని పొంది ఉన్నదానిని.  తోలు శరీరం నువ్వు ఏం చేసుకుంటావు? నీకు ఈ శరీరం ఆహారంగా ఉపయోగపడటం తప్ప, ఈ దేహం నీకు పనికిరాదు అని తెలుసుకో తల్లి!  నాకు నీతో సంభోగించాలి…. శృంగారం చేయాలని వాంఛ ఉన్నప్పటికీ కూడా…. మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకుని…. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాను.  ఇంద్రియ లోలతకి నేను పడను.  నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నాను.  తను అనుగ్రహించు తల్లి అనేసరికి…. తధాస్తు అని ఆ నిషాశక్తి కాస్త మాయం అయ్యేసరికి…. ఈరోజు  నా సాధనకి అడ్డంకిగా నిషాశక్తి మాయ వచ్చిందని చెప్పి…. దానిని దాటించినందుకు కాళికామాతకు పరిపరి విధాలుగా మనసులోనే ప్రణామాలు చేస్తూ… నమస్కారాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తన మంత్రం 10000 పూర్తి చేయడం జరిగింది. ఆ తరువాత యధావిధిగా 15వ రోజు నుంచి 26వ రోజుకు వచ్చేసరికి శబ్దాలు అరుపులతోనే సాధన కొనసాగించింది.  కానీ మునుపటిలాగా శివ నందిని భయపడలేదు.  వాటిని పట్టించుకో పట్టించుకోలేను లేదు వాటి గురించి ఆలోచించకుండా ఎంత పెద్ద శబ్దాలు వచ్చినా…. పిడుగులు పడుతున్న మేఘనాధాలు వచ్చినా….. ఏ మాత్రం చలించకుండా కళ్ళు తెరవకుండానే, ప్రతిరోజు కూడా 10000 జపమును పూర్తి చేసుకోవడం పూర్తి అయ్యింది.  ఇలా 25వ రోజుకు వచ్చేసరికి ఒక విచిత్రమైన అనుభవం శివ నందిని పొందడం జరిగింది. ఉన్నట్టుండి కాళికామాత దర్శనం అయ్యి…. తన చేతిలో ఉన్న ఖడ్గంతో తన తలను నరికివేసే ప్రయత్నం ఉండేసరికి…. శివ నందిని కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.  తను ఇప్పుడు అమ్మవారి చేతిలో బలి కాబోతుందా?  తను ఏ మాయలోను పడలేదు కదా! తనని ఎందుకు అమ్మవారు బలి తీసుకోవాలని అనుకుంటుంది…. నరబలి కింద చంపాలనుకుంటుందా? చంపితే సాధన పూర్తి కాదు కదా?  ఇక్కడితో తన సాధన ఆగిపోతుందా!  మరుజన్మల ఎత్తాలా? ఏంటి?  అని పరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది. సరే ధ్యానంలో ఈ అనుభవం అవుతుంది కాబట్టి…. కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతుందో! అని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కాళి మాత ఉగ్రరూపంలో తన చేతిలో కత్తి పట్టుకొని తన మీదకి దూసుకు వస్తున్నట్లుగా…. ఆ కత్తితో తన తలను నరకాలి అని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించేసరికి…శివ నందినికి ఒక విధమైన మృత్యు భయం ఆవరించడం మొదలయ్యింది.  అమ్మో! ఇప్పుడు నేను చచ్చిపోతానా?  నన్ను చంపేస్తుందా అమ్మవారు…. అర్ధాంతరంగా నేను చనిపోవడం జరుగుతుందా…. నా సాధన ఆగిపోతుంది ఇప్పుడేం చేయాలి ఏంటి? అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ తల్లి!  నన్ను చంపొద్దు… అర్ధాంతరంగా నా సాధన ఆగిపోతుంది… మళ్ళీ నేను ఈ సాధన జన్మ ఎత్తాలంటే,  కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.  అంత ఓపిక నాకు లేదు.  పునః కర్మ జన్మ రాహిత్య స్థితి పొందాలి అనుకుంటున్నాను… కాబట్టి నన్ను అనుగ్రహించు తల్లి!  అని చెప్పేసి భయపడుతూ, ఆలోచిస్తూ ఆ ఖడ్గమునకు తన తల అందకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేసరికి….. ఇదంతా చూస్తున్న అక్కడే ఉన్న తాంత్రిక యోగిని పెద్దగా నవ్వుతూ ఉండేసరికి…. శివ నందిని కి అప్పటికి గాని విషయం అర్థం కాలేదు.  తను ఇన్నాళ్లు మృత్యుభయం ఎలా ఉంటుందో పుస్తకాల్లో చూసింది కానీ, తన చావును తానే ఇప్పుడు చూసేసరికి…. తనకి నిజంగానే మృత్యు భయము మొదలయ్యింది అని తన స్థితి అర్థం అయ్యేసరికి…. ఏం చేయాలో అర్థం కాక మృత్యు భయం అంటే ఇదే కాబోలు అని అనుకుంటూ ఉండేసరికి… కాళికాదేవి అదృశ్యం అయ్యేసరికి…. ఆరోజు పదివేల జపం పూర్తి కాలేదు. 25వ రోజు సాధనలో ఆ మృత్యు భయం ఎలా దాటాలో అర్థం కాకపోవడంతో…మృత్యు భయానికి భయపడటంతో… ఆరోజు సాధన అటకెక్కింది.  సాధన ఆగిపోయింది. దానితో సమాధి నుంచి బయటకు వచ్చిన తరువాత…. అక్కడే ఉన్న తాంత్రిక యోగినీని అడిగేసరికి…

తాంత్రిక యోగిని:- ఏం పిల్ల!  మృత్యువు గురించి చదివాను అన్నావు… మృత్యువు గురించి తెలుసుకున్న అన్నావు.  నీ విషయానికి వచ్చేసరికి… మృత్యువు నిన్ను కబలించేసరికి తట్టుకోలేకపోయావా?

శివ నందిని:- అమ్మ!  నాకేం తెలుసు…. ఉన్నట్టుండి అమ్మవారు నన్ను చంపడానికి వస్తుందని అనుకోలేదు.  తను అనుగ్రహించడానికి ప్రత్యక్షమైనది అనుకున్నాను.  నన్ను చంపడానికి అనుకోలేదు.  అర్ధాంతరంగా చనిపోతే…. నా సాధన ఆగిపోతుందేమో అనుకున్నాను..

తాంత్రిక యోగిని:- చనిపోతే ఏమవుతుంది…?

శివ నందిని:- ఏముంది తల్లి! మళ్ళీ సాధన కోసం, మోక్షం కోసం మళ్లీ జన్మలు ఎత్తాలి కదా! పునః జన్మలు ఎత్తాలి… నావల్ల కాదు..

తాంత్రిక యోగిని:- ఒకటి గుర్తుంచుకో అమ్మ!  మోక్షం పొందాలనే కోరిక కూడా…. సాధనలో ఉండకూడదు.  మోక్షం పొందాలని కోరిక ఉన్నప్పుడు…. మోక్షం పొందాము లేదో అని అనుమానభయం మొదలవుతుంది.  అప్పుడు నువ్వు మోక్షమును పొందినప్పటికీ కూడా… పొందావో లేదో అనుమానంతో…. మళ్ళీ వెనక్కి వచ్చి పునః కర్మ జన్మలు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి…ఈ క్షణం నుంచి… మోక్షం పొందాలని కోరిక మాత్రం పెట్టుకోవద్దు. ఇది నేను చెప్పింది కాదు… గీతలోనే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మోక్షమును కూడా వదిలిపెట్టిన వాడే నిజమైన సన్యాసి. మోక్షం పొందాలని కోరికను కూడా వదిలి పెట్టాలి.  కోరిక ఉన్నంతవరకు నువ్వు మోక్షమును పొందవు…కామి కానీ వాడు మోక్షగామీ కాలేడు అంటారు.  నిజానికి కామి కాని వాడు కాదు….కామము లేనివాడు అంటే కామిలేని వాడు మోక్షగామి అని చెప్పడం జరిగింది.  అంటే కామం అంటే శృంగారం కాదు…. కోరిక.  కోరిక లేని వాడే మోక్షమును పొందడం జరుగుతుంది. ఆ కోరికను మీరు ఆశకి, భయానికి, ఆలోచనకి దేనికైనా నువ్వుభయపడితే….ఆలోచిస్తే….స్పందిస్తే….సంకల్పిస్తే, ఆశయాలు పెట్టుకుంటే, ఆ కోరికలు భోగపరమైన కావచ్చు… యోగపరమైన కావచ్చు…. కాబట్టి ఆ కోరిక బలం వలన, కోరిక కర్మవాసన ఏర్పడి అది కాస్త కర్మగా ఏర్పడి…పునః కర్మ జన్మలలో… పునరపీ జనన మరణ చక్రాలలో తిరుగుతూ ఉంటావు.  ఆ విషయం గ్రహించు.  ఇప్పటికైనా మోక్షం పొందాలనే కోరికను పక్కనపెట్టి మోక్షమును పొందాలని తపన తాపత్రయం కుతూహలం నిత్యం పెట్టుకో. ఇది ఎలా పెట్టుకోవాలంటే…. సముద్రం మీద అలలు ఎలా అయితే వస్తూ ఉంటాయో…. నిత్యం మోక్షం పొందాలి అని తపన, తాపత్రయం, కుతూహలం పెట్టుకో అంతేగాని మోక్షం పొందాలని కోరిక మాత్రం పెట్టుకోకు.  కోరిక పెట్టుకున్నావు అంటే కర్మజన్మ వస్తుంది.  అదే పునఃజన్మకి తీసుకువెళ్తుంది. తర్వాత ఆశ, భయం, స్పందన ,ఆలోచనలు ఇవి ఈ పంచమాయలు నిన్ను చుట్టుముడతాయి.  కాబట్టి నువ్వు ఈ రోజు చావు భయాన్ని దాటలేకపోయావు.  కాబట్టి రేపటి నుంచి నువ్వు సాధన మొదలుపెట్టుకో. ఇక 25 రోజులు సాధన అటకెక్కినట్టే.  కాబట్టి మళ్లీ మొదటి నుంచి సాధన మొదలుపెట్టు.  25వ రోజు ఇలాగే మృత్యు భయం వస్తుంది.  ఈ మృత్యు భయమును నువ్వు మనోధైర్యంతో దాటు.  ఈ శరీరం పోతే పోనీ… నా ఆత్మస్థిరము.  ఆత్మతో సాధన చేస్తున్నాను… ఆత్మని ఏ ఆయుధం నాశనం చేయలేదు… పంచభూతాలు నాశనం చేయలేవు… కాలము నాశనం చేయలేదు… అనేసి గీతలో చెప్పిన విషయం గుర్తుపెట్టుకో!  నువ్వు శరీరం అనుకున్నంతవరకు…. నీకు మృత్యు భయం ఉంటుంది.  నువ్వు ఆత్మ అనుకున్న తర్వాత నీకు ఎలాంటి మృత్యు భయం ఉండదు.  ఎందుకంటే ఆత్మకి చావు లేదు… పుట్టుక లేదు… అది మాత్రం గుర్తుపెట్టుకో!  శరీరాలకు మాత్రమే చావు పుట్టుకలు ఉంటాయి.  అవి కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా పుడుతూ ఉంటాయి.  పోతూ ఉంటాయి. నువ్వు శరీరం అనే భ్రమ,భ్రాంతి నుంచి తప్పుకో . ఆలోచన ను దాటు.  నువ్వు కేవలం ఆత్మ నిష్ఠతో ధ్యానంలో ఉన్నాను అనుకో! నేను ఒక చనిపోయిన ప్రేతాత్మని…. నేను ఒక చనిపోయిన పుణ్యాత్మని అని సాధన చేసుకో!  తాంత్రిక సాధనా లేదా సన్యాసి అంటేనే ఆత్మ పిండ ప్రధానం చేసుకున్న వారు మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకో!  

శివ నందిని:- అమ్మ! ఇప్పుడు నాకు విషయం అర్థమైంది.  ఆ మృత్యు భయం ఎలా దాటాలో అర్థం అయింది. ఇకనుంచి మళ్లీ 25వ రోజు వరకు కూడా వచ్చిన అనుభవాలన్నీ దాటుకొని మృత్యు భయం స్థితికి వస్తాను..

అనుకుంటూ…. పాలన్నం ఇద్దరూ కలిసి భుజించడం జరిగింది.  ఇక అంతటితో 25వ రోజు సాధన అర్ధాంతరంగా ముగియటంతో…. మళ్లీ శివ నందిని కాస్త మొదటి రోజు నుంచి సాధన మొదలుపెట్టడం జరిగింది. 

ఆ తర్వాత శివనందిని కాస్త మొదటి రోజు నుంచి ఐదవ రోజుకి ప్రేతాత్మ అరుపులు, తన బంధుమిత్రుల అరుపులు, బంధువుల కుటుంబ సభ్యుల ఆత్మలు రావటం సాక్ష్యముగా చూస్తూ  కళ్ళు తెరవకుండా సాధన చేయడం ఆరంభించింది. అలాగే ఏడవ రోజుకు వచ్చేసరికి…. దున్నపోతుల దర్శనాన్ని చూసి కూడా ఏమాత్రం భయపడకుండా సాధన కొనసాగించడం జరిగింది. 11వ రోజు వినపడే విపరీతమైన శంఖ నాదాలు, ఘంటానాదాలు, మేఘ గర్జనలు ,పిడుగుల శబ్దాలను కూడా విని వాటికి అతీతంగా ఉంటూ వాటిని సాక్షిభూతంగా చూస్తూ…. వాటిని అసలు అనుకోకుండా జపసంఖ్యతో ధ్యాననిష్ట లో పడిపోయింది. ఆ తర్వాత 15వ రోజు యధావిధిగా నిషాశక్తి దేవత కనిపించినప్పటికీ కూడా ఆవిడ చేసే చేష్టలు అన్నీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉన్నది. ఈసారి ఎలాంటి కామ వికారాలు తన మనసు అలాగే శరీరం పొందట్లేదని చెప్పేసి శివ నందిని గ్రహించింది.  తను ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా శివ నందిని లో కామ వాంఛలు కలగకపోయేసరికి నిషాశక్తి దేవత యధావిధిగా అదృశ్యం అవ్వడం జరిగింది.  ఆ తర్వాత 15 నుంచి 20వ రోజు వరకు విపరీతమైన అరుపులు, శబ్దాలు, ఏడుపులు ఆత్మఘోషలు వినిపిస్తున్నప్పటికీ కూడా…. శివ నందిని ఏమాత్రం పట్టించుకోకుండా యధావిధిగా తన సాధనను కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత 25వ రోజు తన సాధనా స్థితికి వచ్చేసరికి కాళికామాత కనిపించి ఈసారి తన తల మీద కత్తి దూసినప్పటికీ కూడా….. శివ నందిని ఏమాత్రం ఆలోచించకుండా…. అమ్మ! నా శరీరంతో నీ ఆకలి తీరుతుంది అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు… నాకు ఎలాంటి భయము లేదు… నీ ఆకలి తీరితే నాకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు.  అమ్మ ఆకలికి ఒకరోజైనా నేను బలి అయ్యి, ఆకలి తీర్చాను అని చెప్పి కృతజ్ఞతా భావం కలుగుతుంది.  ఆ అదృష్టం నాకు కలిగింది అని నాకు మనసులో గుర్తుండిపోతుంది అని అనుకుంటూ ఉండేసరికి…. తన కత్తితో తలనరికే దృశ్యం చూసి ఆ తలకాస్త తన చేతిలో చూసినప్పటికీ కూడా శివ నందిని ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే అక్కడ శివ నందిని శరీరం పోయి ఆత్మ స్వరూపంతో ధ్యాననిష్ఠ లో ఉండటం జరిగింది.  ఇదంతా కూడ ఓరకంటతో తాంత్రిక యోగిని చూస్తూ…. ఈ పిల్ల ఏం పిల్ల! ఈ అమ్మాయి ఏ మాత్రం భయపడకుండా మృత్యు భయం లేకుండా అమ్మవారికి ఏకంగా తన శరీరం అర్పించింది. 25వ రోజు సాధన స్థితిని దాటడానికి తనకి 450 సంవత్సరాలు నుండి నిత్యం చేస్తున్నప్పటికీ కూడా 25వ రోజు సాధన స్థితిని దాటలేకపోయింది.  ఈ పిల్ల రెండవసారి మృత్యు భయం దాటి అమ్మవారికి ఏకంగా తన తలని ఏకంగా బలిహారంగా ఇచ్చింది  అంటే ఈమె  సామాన్యమైన స్త్రీ మూర్తి కాదు, ఈమె లోకానికి ఏదో చెప్పాలని…. లోకంలో ఏదో తెలుసుకోవాలని…లోకొద్ధరణ కోసం వచ్చిన కారణజన్మురాలు అని చెప్పేసి అని అనుకుంటూ ఉండేసరికి…. ఆవిడ కాస్త కాళికామాతను ప్రార్థిస్తూ అమ్మ!  నీకు తెలియని విషయం కాదు, నువ్వు తమోగుణానికి లోనయ్యి ఇచ్చా మరణ సిద్దితో ఈమెని చంపడం జరిగింది. ఈవిడకి మృత్యు భయం ఉందా లేదా అని యోగ పరీక్ష పెట్టావు.  నీ పరీక్షలో ఈ పిల్ల నెగింది.  కాబట్టి నెమ్మదిగా ఈవిడ శరీరమునకు తల అతికించి…. పునః జన్మను ప్రసాదించు తల్లి!  కారణ జన్ములు ఊరికే ఈ లోకంలోకి రారు.  లోకొద్ధరణ కోసం ఈ అమ్మాయి ఏదో సాధన చేయాలి… తెలుసుకోవాలి… ఏదో పొందాలి అని లోకానికి చెప్పవలసినట్టుగా ఉంది. ఆ కర్మ పరిసమాప్తి చేయించు… అనేసరికి కాళికామాత విరగబడి నవ్వుతూ…. తన ప్రియ భక్తురాలు కోరికమేరా శివ నందిని తలను శరీరానికి అతికించగానే….. శివ నందిని తిరిగి పునః ప్రాణం రావడం జరిగేసరికి…. అమ్మ!  నీ ఆకలి తీరిందా అనేసరికి కాళికామాత ఏం మాట్లాడకుండా తన మెడలో ఉన్న ఒక 108 కపాలమాలను శివ నందిని మెడలో వేసేసరికి….. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న తాంత్రిక యోగిని భల! కూన …నువ్వు విజయం సాధించావు.  దాదాపు 480 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ స్మశానం లో ఉండి సాధన చేస్తున్నాను 25వ రోజు వచ్చే దేవత ఇచ్చే మృత్యుభయము  దాటలేక…. నా సాధన ఆగిపోతూ వస్తుంది.  ప్రతిసారి ఏదో ఒక కారణం చేత…. ఏదో ఒక భయానికి లోనైపోతూ…. ఈ మృత్యుభయానికి లోనయ్యి… ఆగిపోవడం జరుగుతుంది. ప్రతిసారి నేను ఒకటవ రోజు నుంచి 25వ రోజుకి రావడం చేసిన అది పూర్తికాలేదు. కానీ తాంత్రిక ప్రపంచ గ్రంథంలో చెప్పిన విధి విధానంలో కాళికామాత ఎప్పుడైతే కపాలమాల అనుగ్రహిస్తుందో…. అప్పటితో వాడు మృత్యుభయం దాటే శక్తి వస్తుంది అని చెప్పటం జరిగింది. ఆ కపాలమాల ఆవిడ చేతుల మీదగా పొందాలి అని నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే ఐదు, ఏడు ,పదకుండు, 25వ రోజు గానీ అమ్మవారికి బలి అయిపోయి ప్రేతాత్మలకు నరబలి అయ్యి సాధన ముగించుకోవడం జరిగింది.  కాకపోతే 25వ రోజు నీ  మృత్యుభయం నువ్వు దాటి సాధన పూర్తి చేశావు.  అమ్మవారి అనుగ్రహంతో కపాలమాల పొందావు. నిన్ను మించిన తాంత్రిక సాధకురాలు ఈ భూ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని దీవిస్తూ…. నీకు తాంత్రిక సాధనలో ఎలాంటి సహాయ సహకారాలు కావలసినప్పుడల్లా…. మనసులో మూడుసార్లు నా గురించి తలుచుకున్నప్పుడు…. సశరీరంతో నీ మూడు నీ ముందు ప్రత్యక్షమై, నీకు కావలసిన సలహాలు సహాయం అందిస్తాను అని చెప్పేసి అనుగ్రహవరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాళికామాత అప్పటికే అదృశ్యమై పోతూ…. పదివేల జపం పూర్తి అవ్వటంతో శివ నందిని కాస్త సమాధి మీద కూర్చుని బయటకు వచ్చి యధావిధిగా ఏమాత్రం పట్టించుకోకుండా… దేనికి చలించకుండా తాంత్రిక యోగినీకి కాళికామాతకు కృతజ్ఞతలు చెప్పి పాలన్నం సేవించి….ఆ పక్కనే వేప చెక్కతో చేసిన మంచం మీద నిద్రకి ఉపక్రమించింది.  తనలో ఉన్నట్టుండి విపరీతమైన వేడిమి పెరుగుతూ ఉండేసరికి…. జ్వరం వచ్చిందేమో అని ఆలోచనలో పడింది.  అప్పటికే ధర్మామీటర్ తో  ఉష్ణోగ్రత చూసుకుంటే 106 డిగ్రీలు ఉంది.  అప్పుడు దీనికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు…. అప్పుడు దానికి తాంత్రిక యోగినీ కాస్త ఏమాత్రం భయపడకు, అమ్మవారు కపాలమాల ఇచ్చింది కదా!  ఈ కపాల మాల నీ శరీరం మీద ఉండటం వలన, మీ శరీరం విపరీతమైన వేడికి గురి అవుతుంది. ఈ వేడి తగ్గించుకోవడానికి ఎటువంటి మానవ ప్రయత్నాలు చేయమాకు… మందులు వాడకు…. వేడిని సాధ్యమైనంత వరకు భరించు.  ఇలా 41 రోజులపాటు ఈ వేడిని శరీరంలో ఉంటుంది, ఈ వేడిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తే, నీ సాధన ఆగిపోతుంది. ఇక మళ్లీ వెనక్కి వెళ్లి సాధన చేయడానికి కుదరదు.  ఈ జన్మలో సాధన ఇక్కడితో అయిపోతుంది.  అంటే వామాచారం నుంచి దక్షిణాచారంలోకి వెళ్లి నీ సాధన పరిసమాప్తి చేయాల్సి వస్తుంది… అనేసరికి, వద్దు వద్దు అయితే నేను వేడిని తట్టుకుంటాను అనుకుంటూ….. సాధన కొనసాగిస్తూ ఉండేసరికి….మరుసటి రోజు వేడిని తట్టుకోలేక, నోట్లో శరీరం మీద కురుపులు, పుండ్లు ఏర్పడటం…. వాతపు నొప్పులు, శరీరమంతటా నొప్పులు రావడం, కాళ్లు చేతులు పనిచేయక బిగుసుకుపోయే లాగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా….. శివ నందిని  41 రోజు దాకా సమాధి మీద కూర్చుని అంతటి జ్వరం అంత వేడిలో కూడా ఆపకుండా యధావిధిగా ధ్యాన నిష్ఠలో ఉండి….మంత్ర జపం ఏ రోజుకి ఆరోజు పదివేల జపం పూర్తి చేసింది. ఈ పిల్ల వేడి చూసి ఈ అమ్మాయి బతుకుతుందో లేదో అని తాంత్రిక యోగిని భయపడినప్పటికీ కూడా…. శివ నందిని భయపడలేదు, బెదరలేదు…పోతే పోనీ….. ఈ జ్వరంతో ఎంతోమంది పోతూ ఉంటారు కదా!  పోయే పరిస్థితిని వస్తే ఎవరు ఆపలేరు.  వస్తే ఎవరూ ఆపగలరు… ప్రాణం రాకడ, ప్రాణం పోకడ ఎవరికి తెలుసు అని….. శరీరం మీద మమకారాలు వదిలేసి…. శరీరం గురించి ఆలోచించడం మానేసి…. యధావిధిగా పదివేల జపం ఏ రోజుకి ఆ రోజు పూర్తి చేసుకుంటూ వచ్చింది.సరిగ్గా 41వ రోజు వచ్చేసరికి… ఈసారి కాళికామాత యధావిధిగా దర్శనం ఇచ్చి మౌనంతో ఉండి కపాల మాల మీద మేలిమి రత్నాలతో చేసిన జపమాల చేతికి ఇచ్చేసరికి… శరీరం ఉష్ణం అంతా తీవ్రం తగ్గిపోయి సాధారణ స్థితికి రావడం గమనించింది.  కష్టం ఇచ్చేది అమ్మే ! సుఖం ఇచ్చేది అమ్మే!  అని చెప్పేసి మనసులోనే కృతజ్ఞతలు చెప్పేసరికి…. కాళికామాత అదృశ్యం అవ్వడం జరిగింది. కాళికామాత తన సాధన 41 రోజులు వస్తుందని గ్రహించి 41వ రోజు తన సాధన పరిసమాప్తి చేసుకుంటే….. తను మృత్యు భయం దాటే స్థితికి వస్తుంది.  తన కర్మ చక్రం సాధన పరిసమాప్తి అవుతుందని చెప్పేసి….. ఆ రోజు యోగ నిద్రలోకి ఉపక్రమించడం జరిగింది. మరుసటి రోజు యధావిధిగా స్నానాధికాలు పూర్తి చేసుకొని…. యధావిధిగా ఉపవాస దీక్షతో అష్టదిగ్బంధనంలో ఉన్న యోగి సమాధి మీద కూర్చొని…. మంత్రసాధన జపం చేయడం ఆరంభించింది. ఎలాంటి ఇబ్బంది, అరుపులు, ఎలాంటి సమస్యలు ఎలాంటి శబ్దం లేకుండా ఆత్మఘోష, ఆత్మ శక్తులు ప్రేతాత్మ శక్తులతో ఇబ్బంది లేకుండా…. యథావిధిగా పది వేల జపం పూర్తి అవుతున్న సమయంలో…. ఉన్నట్టుండి కాపాలికాదేవి ప్రత్యక్షమై అమ్మ ! నీ సాధన పరిసమాప్తి అయింది.  నేను కాళికామాత అంశ స్వరూపిణి.  నువ్వు కాపాలిక సాధన పూర్తి చేసుకున్నావు.   నన్ను కాపాలిక దేవత అంటారు.  నా చేతిలో నిత్యం కపాలం ఉంటుంది.  ఆ కపాలం ఎవరిదో కాదు…. నన్ను ఎవరైతే సాధన చేస్తారో, ఆ అంతిమ దేహం అయిన కీర్తి దేహం కపాలం  నా చేతిలో ఉంటుంది.  ఆ కపాలం అనుగ్రహించాను  అంటే…. వాడి సాధన పరిసమాప్తి అవుతుంది.  ఆ కపాలానికే మోక్షం పొందితే…. అదే కపాల మోక్షం అవుతుంది.  అంతిమదేహమైన కీర్తి దేహ కపాలం మోక్షం పొందితేనే….. కర్మ జన్మ రాహిత్య స్థితిని పొంది….. సర్వకర్మ నుంచి సర్వకర్మ బంధనాల నుంచి విముక్తి పొంది…. జీవన్ముక్తుడు అవుతాడు.  మోక్ష అనుభవ అనుభూతి పొందడం జరుగుతుంది. ఆ కపాల మాల ఎవరికి పడితే వారికి అనుగ్రహించదు. ఎవరికైతే కపాల మోక్షం పొందే స్థితికి వెళతారో వాళ్లకి మాత్రమే నేను దర్శనం ఇస్తాను. ఇదిగో నీ యొక్క అంతిమదేహం కీర్తి దేహం యొక్క కపాలం అని ఒక కపాలం చూపిస్తూ ఉండేసరికి….. కపాలం కూడా తన స్థూల శరీరమునకు కావలసిన కపాలంకు కోరికలు ఉండేసరికి ….ఓహో!  ఇది తన కపాలమే అనుకుని అంటే తను చనిపోయాను అనే విషయాన్ని అమ్మవారు చెబుతుంది అనుకుంటూ ఉండేసరికి….ఆ కాపాలిక దేవి కాస్త తన స్థనము నుంచి పాలు పితికి ఆ కపాలంలో పోసి ఇవి తాగుతల్లి…. నీకు అపమృత్యు దోషాలు, మృత్యు దోషాలు ఇలాంటివేవి లేకుండా…. ఇచ్చా మరణ సిద్ధితో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు యోగాగ్నితో మోక్షమరణం పొందవచ్చును అని వరం అనుగ్రహిస్తూ….. అమ్మవారు స్వయంగా కపాలంలో పితికి ఇచ్చిన పాలను సేవించడంతో….తను మృత్యుంజయ మంత్రసిద్ది పొందాను అని అనుభవం అనుభూతి కలుగుతూ ఉండగానే….. స్పృహతప్పి యోగ మత్తులోకి వెళ్లిపోవడం జరిగింది.  దానితో కాపాలిక దేవి దీవిస్తూ…. అదృశ్యం అవడం జరిగింది. ఇదంతా ఓరకంటతో గమనిస్తున్న తాంత్రిక యోగిని….కన్నీరు పెట్టుకుంటూ…. ఇంతటి మహాభాగ్యం నాకు ఏనాడు కలుగుతుందో… ఇంతటి చిన్న వయసులోనే ఈ పిల్ల విజయం సాధించింది.  కాపాలికాదేవి అనుగ్రహం పొందింది.  కపాలం పొందడం జరిగింది.  నిజమైన కాపాలిక సాధకురాలిగా…. ప్రపంచ ప్రఖ్యాతి  పొందుతుంది.  ఇప్పుడు ఉన్న కాపాలికులు అందరూ కూడా స్మశానంలో దొరికిన కపాలం ధరించి కాపాలికుని ప్రఖ్యాతి పొందుతున్నారు.  కానీ వీళ్ళందరూ కూడా నిజ సాధకులు కాదు… గుప్తసాధకులు చేసే వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఉంటారు.  స్మశానంలో భూ గృహంలో ఉంటారు.  వాళ్లకి కాళికామాత అనుగ్రహం లేదా కాపాలిక మాత అనుగ్రహం పొందితే కానీ…. కపాలం అందుకోవటం జరగదు.  నిజ కాపాలకులు మాత్రమే ఇలా అమ్మవారి ద్వారా తమ అంతిమదేహకపాలం పొందుతారు అన్నమాట!  అనుకొని యోగ మత్తులో ఉన్న శివ నందినినీ మంత్రంతో నిద్రలేపి…. తల్లి!  ఈ సాధన పరిసమాప్తి అయింది. ఇక నీ గుణ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదనం కోసం….. నువ్వు భూమి మీదకు వెళ్లి… నీ సాధన పరిసమాప్తి చేసుకో…..నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకో!  నేను నీకు అనుగ్రహించిన వరం గుర్తుపట్టుకో!  అలాగే కాళికామాత అనుగ్రహం పొందాననే గర్వాహంకారాలు నీలో ఏమాత్రం పెట్టుకోకుండా….. మిగిలిన సాధన పరిసమాప్తి చేసుకో…. స్త్రీమూర్తులు అందరూ కూడా ….సాధనలో, తాంత్రిక సాధనలో కూడా  పనికి వస్తారని సిద్ధ హస్తులు అవుతారని…. నీ ద్వారా లోకానికి తెలియజేయాలని ఆదిపరాశక్తి అనుకుంది.  కాబట్టి నువ్వు మిగతా తాంత్రిక విధివిధానాలలో కూడా  మనో బ్రాంతులు, భయాలు దాటుకుంటూ…. స్త్రీ సాధన పరిసమాప్తి చేసుకుని… విశ్వశూన్యంలో శూన్యం అయ్యి….. పూర్ణ శూన్యం మోక్షం పొందుతావని ఆశిస్తున్నాను….ఇదిగో నేను ఆరాధన చేసే కాపాలిక మాత విగ్రహ మూర్తి…ఆవిడ అనుగ్రహం నువ్వు పొందావు… దీనిని పొందే అర్హతగా నీకు ఉంది అని 3 అడుగుల కాపాలిక విగ్రహ మూర్తిని శివ నందినికి ఇచ్చే సరికి….. శివ నందిని ఆ కాపాలిక విగ్రహాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మంచిది తల్లి అని అనుగ్రహించినందుకు ధన్యవాదాలు అంటూ ఉండేసరికి… కళ్ళు తెరిచేసరికి…. శివ నందిని కాస్త స్మశానం బయట వైపు ఉండటం, ఆ తర్వాత తనకి సాధనలో 90 రోజులు అనగా… మూడు నెలలు  సాధన కొనసాగింది అని గ్రహించి.. నెమ్మదిగా రుద్ర స్వామి మహాదేవి పిల్లలు ఉన్న సత్రం వైపుకి తన చేతిలో ఉన్న కపాల యోగ దండంతో…. కాపాలిక సిద్ధహస్తురాలిగా ఆ సత్రం వైపు ఆనందంతో ప్రయాణించటం జరిగింది.


సత్రమునకు చేరిన శివ నందినిని చూసి రుద్రస్వామీ, మహాదేవి, పిల్లలు అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలకు గురి అయ్యారు. శివ నందిని తన చక్ర సాధన ఎలా పూర్తి చేసుకుందో…. తనకి వచ్చిన కపాలం, కాపాలిక దేవి విగ్రహ మూర్తిని చూపించే సరికి శివ నందిని మానసిక ధైర్యానికి ,సాధన పూర్తి చేసుకునేందుకు మృత్యు భయం కూడా  లెక్కచేయని తన గుండె ధైర్యానికి అందరూ తనని మెచ్చుకోవడం జరిగింది…అవునయ్యా అయితే నాకు ఒక చిన్న సందేహం…. ఇప్పుడు నేను కర్మ చక్ర సాధన కోసం మహాదేవి చేత తంత్ర సన్యాస దీక్ష తీసుకుని స్మశానంలో కూర్చుని సాధన చేయడం జరిగింది దీని ద్వారా నేను కర్మ చక్ర సాధనను వామాచరంలో పూర్తి చేసుకోవడం జరిగింది…మరి దక్షిణాచారంలో సాధన చేసే స్త్రీమూర్తులు దీనిని ఏ విధంగా ఆచరిస్తే వాళ్ళు ఈ చక్రాన్ని దాటుకోగలుగుతారు. నేనంటే తంత్రసాధనలో పూర్తి చేసుకున్నాను…అందరూ తంత్రసాధనలోకి వచ్చి ఈ సాధన చేసుకోవడం అంటే కష్టం కదా! అందరికీ అలాంటి వెసులుబాటు ఉండదు కదా.! మరి అలాంటప్పుడు మిగతా స్త్రీ మూర్తులు ఏ విధంగా ఈ చక్రసాధన పూర్తి చేసుకుంటారు అని అడిగేసరికి రుద్ర స్వామి చెప్పడం ఆరంభించాడు. 


దక్షిణాచారంలో పరమహంస గారు ఈ కర్మ చక్ర సాధనలో ఉన్నప్పుడు జ్ఞాన స్ఫురణగా ఈ కర్మ చక్రంలో ఉన్న  కర్మలలో ….27 మందికి దీక్ష గురువుగా, ఐదుగురికి సద్గురువుగా, ఒకరికి పరమ గురువుగా ఉండి మోక్ష ప్రాప్తి కలిగించాలని తెలియడంతో….. పంచ శిష్యుల వేట అన్నట్టు ఆయన తనతో పాటుగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న తన శిష్యులుగా…ఈయన్ని గురువుగా భావించే కాకాజీ, స్వాతి నటరాజన్, స్వాతి విశ్వనాథన్, శ్వేతా దేవి, జిజ్ఞాసి, దీక్షా దేవి వారిని అనేక మాయ పరీక్షలతో వారిలో నిజశిష్యులు ఎవరో తెలుసుకొని…. వారితో ఆయనకి ఉన్న కర్మ నివారణలు పూర్తిచేసుకుని…. ఏకైక శిష్యుడికి పరమ గురువుగా ఉండే అవకాశం జిజ్ఞాసి మాత్రమే చివరికి ఉండటం…. ఇలా తన కర్మలను నివారణ చేసుకుంటూ రావడం జరిగింది.  ఈ చక్రానికి వచ్చినప్పుడు పరమహంస గారు దక్షిణాచారంలో చేసిన సాధనయే ప్రతి స్త్రీ మూర్తి సాధనకు వర్తిస్తుంది. ఈయన గురువు వద్ద ఖేచరి ముద్ర తీసుకొని సాధన చేసేవారు.  నాలుకను వెనక్కి మడిచి కొండనాలుక నుంచి వచ్చే అమృత ధారను సేవిస్తూ ఉండేవారు.  ఈ చక్రసాధనలో ఉన్నప్పుడు ఆజ్ఞా చక్రంలో  తన మనోనేత్రం వద్ద బాణం వేసినట్లుగా…. అది ఆయన మీదకి వస్తున్నట్లుగా అనిపించదని, ఆయన కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ బాణ దర్శనం అనేది కొన్నాళ్ళకి రామబాణం అని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు సీతారాముల కళ్యాణం, నవమి పూజలు చేయడం కుటుంబ కలిసి అయోధ్యకు వెళ్ళినప్పుడు సరయు నది జలాన్ని తీర్ధంగా తీసుకున్నప్పుడు… శ్రీరాముని సీతావియోగం అనుభూతి చెందడం …..ఆ తర్వాత 48 సంవత్సరాల యువకుడు నీటి మధ్యలో జల సమాధిలో ఉన్నట్టుగా కనిపించడం జరిగింది.   వాస్తవానికి చక్రసాధనలో ఉన్నప్పుడు ఆయనకి స్పటిక లింగం దర్శనం అయ్యింది.  సూర్యగ్రహ దేవత శ్రీ రాముడైతే….. ఈ గ్రహ అధిపతి యొక్క రత్నం కెంపు, దీని ఉపరత్నం స్పటికమవుతుంది. అందుకే మనకి ఈ కర్మచక్రంలో దక్షిణాచారంలో చూస్తే కర్మ చక్ర అధిపతి శ్రీరాముడు…. ఉంటే వామాచారంలో చక్రధైవంగా అఘోర మూర్తి ఉంటాడు. అందుకే దక్షిణాచారంలో ఇక్కడ సాధన చేసే వారికి స్పటికముకు సంబంధించిన వస్తువులు రావడం జరుగుతుంది. ఈ సమయంలోనే ఆయనకి వారసత్వ స్పటిక లింగం రావటం తర్వాత మళ్లీ అది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగిఈ చక్ర స్థితిలో మనకి శ్రీ రాముడి విగ్రహాలు, శుద్ధ స్ఫటిక లింగము,ఒక స్ఫటిక మాల,యోగదండము, నిజరూప శ్రీరామ దర్శనాలు అదే దక్షిణాచారం చేస్తే కలుగుతాయని నాకు అర్థం అయినది. అలాగే తప్పకుండా ఏదో ఒక శ్రీరామ క్షేత్రానికి వెళ్లి వారి నిజరూప దర్శనం అనుభూతిని పొందటం జరుగుతుంది. కోల్పోయిన స్ఫటిక లింగము తిరిగి అతని సాధన శక్తి కాస్త బ్రహ్మరంధ్రమునకు చేరుకున్నపుడు రుషికేశి క్షేత్రము నుండి రావడము జరినది.అంటే దానితో ఆయనకి స్ధూలశరీర 48 లక్షల కర్మలు అదిగూడ కర్మశేషం లేకుండా పూర్తి అయినాయని  జ్ఞానస్ఫురణ అయినది. కొంత మంది నాదయోగంలో శబ్దనాదంగా కాంస్య నాదం వినడం జరుగుతుంది. ఈ శబ్దమును సాధనలో ఉన్నప్పుడు పరమహంస గారు కూడా వినడం జరిగింది. కాకపోతే సాధన లో మనం దైవీక వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు.ఇది మాత్రం అసలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ దైవిక  వస్తువుల విషయంలో ఎవరి స్వార్థం లో వాళ్ళు ఉండాలి.  ఒకరి మాయా మోహాలలో పడి వస్తువులు ఇతరులకు ఇవ్వడం చేయకూడదు. 


అయితే … కర్మను పూర్తిగా విడవటము అనేది ఈశ్వరుడి వల్లనే కాలేదు. ఇంక మన వల్ల ఏమి అవుతుంది. ఆసక్తి లేకుండా చేయాలి. ఆ ఆసక్తి వలన మనలో కోరిక పుడుతుంది. దీనివలన త్రిగుణాలు నిద్రలేస్తాయి. దీని వలన మన మనస్సు చంచలమౌతుంది. ఈ చంచల స్థితి మనం తీసుకునే ప్రాణశక్తి శ్వాసల మీద ఆధారపడుతుంది. అదే స్థిర మనస్సుగా మారితే మనము చేసే కర్మలు కాస్త నిష్కామ కర్మ గా మారితే మన మనస్సు నిశ్చల స్థితిలో ఉంటుంది. చంచల మనస్సు ద్వారా ఆసక్తి ని పూర్తిగా విడవడము సాధ్యం కాదని గ్రహించాలి. ప్రాణము చంచలము గా ఉన్నంత వరకు మన మనస్సు కూడా చంచలము గానే ఉంటుంది. మనస్సు చంచలంగా ఉన్నంతవరకు మనకి ఆసక్తి ఉంటుంది. అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆకలి, దాహం, నిద్ర, సోమరితనం, బద్ధకం, అలసట, చిరాకు, చింత, బాధ, ఆనందం, దుఃఖము, ఆసక్తి , ప్రేమ, దేహ బుద్ధి ఇలా ఎన్నో మానసిక శారీరక ప్రవృత్తులు అనగా ఆలోచన తరంగాలు అన్నీ కూడా చంచల మనస్సు లోనివే గదా. అంటే నువ్వు చేయవలసిన కర్మలను చెయ్యాలి. కర్మను బొత్తిగా చేయకుండా ఉండకూడదు. ఉండలేరు. ప్రతిఫలాపేక్ష లేనిది ఇష్టదైవ అర్పణముతో చేసే ప్రతి కర్మ కూడా తనకి నిష్కామ కర్మ అవుతుంది. అంటే కర్మ ఫలము ఆశించని కర్మయే నిష్కామ కర్మ అంటారు. అనగా పరీక్షలు రాయటం నీ కర్మ. నువ్వు నీకు కావలసిన ఫలితాలు రావాలని అనుకోవటం కామి కర్మ అవుతుంది. ఫలితాలు దైవానికి అర్పించడం నిష్కామకర్మ అవుతుంది. ఫలితాలు ఆశించే కర్మ కాస్త అది నీకు బంధనముగా మారుతుంది. నువ్వు అనుకున్న మార్కులు వస్తే ఆనందపడటం రాకపోతే ఆవేదన అనే పరిస్థితులు కలుగుతాయి. ఎట్టి ఫలితాలతో సంబంధం లేకుండా నువ్వు ఉండగలిగితే ఏమి వచ్చిన నీకు ఆనందం అలాగే బాధ ఉండదు. ఇదియే నిష్కామ కర్మ ఫలితము.అందులో ఇట్టి కర్మ నీకు ఎన్నటికీ కర్మబంధము కాదు. పైగా కర్మ విముక్తి కలుగుతుంది. మొదటివాడు తను అనుకున్న మార్కులు రాలేదని మళ్ళీ పరీక్ష రాస్తే రెండవవాడు తనకు వచ్చిన మార్కుల తో సంబంధం లేకుండా ఉండటం వలన అది వీడు మళ్ళీ పరీక్ష అనగా కర్మ చేయని స్థితి అనగా కర్మ విముక్తి పొందుతాడు అన్నమాట. దైవ అర్పణ తో చేసే ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మ అవుతుంది. ఇలాంటి కర్మ చేయటం వలన మనస్సుకి బాహ్యశుద్ధి అలాగే అంతరశుద్ధి కలుగుతాయి. మంచి ఆలోచనలు కలిగి వివేక బుద్ధితో మంచి కర్మలు చేయడానికి ఆసక్తి కలుగుతుంది. చెడు కర్మలు చెయ్యటానికి మనస్సు విముఖత చూపడం వలన సగము దాక కర్మలు వాటికి కర్మఫలితాలు తగ్గించుకోవటం జరుగుతుంది. మనకి నువ్వు చేసే కర్మను బట్టియే కర్మ ఫలితం కలుగుతుంది. తగ్గుతుంది. మంచి కర్మ చేస్తే మనకు మంచి ఫలితాలు అలాగే చెడు కర్మ చేస్తే మనకి చెడు ఫలితాలు కలుగుతాయని లోకవిదితమే కదా. కర్మ లేకుండా ఏది లభించదని చివరికి మనకి ఈశ్వర ప్రాప్తి కలగాలన్న మనము నిష్కామ కర్మ అనగా శ్వాస ప్రక్రియ నిరంతరము జరుగుతున్నట్లుగా చేస్తే గాని మనకి ప్రాప్తి కలగదని తెలుసుకోండి. ఈశ్వరప్రాప్తి కోసం చేసే నిష్కామ కర్మ ఏకైక కర్మ అని పరమహంస తన అనుభవాలలో చెప్పడం జరిగింది.


భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక కర్మ సన్యాస యోగములో కూడా  కర్మ యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. జన్మ వస్తే అది జన్మలకి అవసరాలను ఏర్పరుస్తుంది. అదే కర్మ లేకపోతే జన్మ ఉండదు. పునర్జన్మలు ఉండవు. ప్రారబ్ద కర్మలు చేసే స్థాయిలో ఉన్న వాడికి అనగా కర్మాతీత స్థితి పొందిన వారికి మాత్రమే కర్మ చేయలేని స్థితి కలుగుతుంది. తద్వారా వచ్చే కర్మరాహిత్యం వలన జన్మరాహిత్యం కలుగుతాయి. ఇలాంటి ప్రారబ్దకర్మ స్థితిలో ఉన్న వాడికి ప్రకృతిమాత వాడి జీవనానికి కావలసిన జీవిత చక్రము నడుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయక తప్పదు కదా అలా అన్నమాట. కాకపోతే వీడికి కావలసిన విధంగా ఫలితాలు ఉండవు. ప్రకృతి ఏది ఇస్తే అది తీసుకొనే స్థితి ఉండాలి. నిజమైన కర్మాతీత స్థితి పొందినవాడికి బిర్యానీ వచ్చిన ఆవకాయ అన్నము దొరికిన ఎంగిలి మెతుకులు దొరికిన ఒక్కటే స్థితిలో ఉంటారు. దేహ ఆకలికి ప్రకృతి ఇచ్చిన మహత్తర అవకాశం గా ప్రకృతి ప్రసాదంగా తీసుకుంటారు. ఇలాంటి వాడినే కర్మ సన్యాసి అయిన కర్మ యోగి అనాలి. అంతేగాని సంసార బాధ్యతలు చేయలేక ఉద్యోగ బాధ్యతలకు భయపడి వాటిని చేయలేక భార్య పిల్లల పోషణ బాధ్యతలు భయపడి పారి పోయే వాడిని ఇలాంటి వారిని కర్మసన్యాసి కాదు కదా కర్మ సన్నాసి అందురు. ఇలాంటి వారే మిడి మిడి జ్ఞానాలతో సన్యాసి దీక్షలు తీసుకుని ఆకలి బాధను భరించలేక నానా అవస్థలు పడి దొరికినది తినలేక దానికోసం తిప్పలు పడలేక వెనక్కి తిరిగి రాలేక ఆ సన్యాసిగా ఉండలేక సన్నాసులు గా మారిన వారిని నా స్వానుభవం లో చాలామందిని చూడటం జరిగినది. కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. కర్మ చేయాలని అనిపించకపోవటం కర్మ చేసే అవకాశాలు లేక పోవటం నిజమైన కర్మసన్న్యాసయోగము అవుతుంది. బలవంతముగా కర్మలు ఉన్నా కూడా చేయకుండా తప్పించుకొని తిరగటం లేదా పారిపోవటం కర్మ సన్యాసం కాదని కర్మ సన్నాసి అవుతారని గ్రహించండి. ప్రతిఫలాపేక్ష లేని కర్మ లే బంధరహిత కర్మలుగా అదే శాస్త్రీయ కర్మలు అవుతాయి. ఎప్పుడైతే మన కర్మల నుండి ఫలాలు ఆశించటం మొదలవుతుందో ఆ కర్మలు కాస్త బంధహేతు కర్మలు అవుతాయి. ఎవరైతే ఆత్మానందము నందు ప్రీతి కలుగుతుందో ఎవరైతే  ఆ ఆత్మతృప్తి కోసం తహతహలాడుతారో వారికి భౌతిక కర్మలతో పనిలేదు. చేయాల్సిన అవసరమే ఉండదు. ఇట్టివారు కర్మలు చేసిన చేయకపోయినను ఎట్టి ఫలితాలు ఉండవు. కర్మరాహిత్యం పొందటం జరుగుతుంది. నిజానికి కర్మ అనేది సత్వ రజో తమో గుణ త్రయ మాయవలన చేస్తున్నానని జీవుడు అనుకుంటాడు. అట్టివాడు చేసే ప్రతి ఒక్కటి కూడా వీరికి కర్మబంధము అవుతుంది. అదే తను చేయటంలేదని చేసేది భగవంతుడని ఆ కర్మ ఫలితమును ఆయనకే అర్పణం చేస్తూ చేసే కర్మలు కాస్త కర్మబంధ విముక్తి అవుతాయి. నిష్కామ కర్మ అవుతుంది. ఈ కర్మ చేసుకుంటూ పోతే ప్రారబ్ద కర్మలు మారి వాళ్ళు కర్మసన్యాస యోగులు అవుతారు. కర్మరాహిత్యం స్థితి పొంది జన్మ రాహిత్యమును పొందుతారు. ఇట్టి వాడే నిజమైన కర్మయోగి అవుతాడని స్వయంగా శ్రీకృష్ణుడు తన గీతలో చెప్పకనే చెప్పి ఉన్నారు.ఇతరులు యందు రాగద్వేషాలు లేకుండా అసూయ చెందకుండా దోషాలు ప్రకటించకుండా ఇతరుల దోషాలు చూడకుండా ఇతరులకి చెప్పకుండా కేవలం ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కర్మఫలము దైవానికి ఇచ్చేవాడు పుణ్య పాపకర్మల నుండి విముక్తుడౌతాడు.అరిషడ్వర్గాలును సప్త వ్యసనాలను దూరముగా ఉంచి కర్మలు చేయు వాడు కూడా కర్మరాహిత్యం స్థితి పొందుతాడు అని తెలుసుకోండి. తను చేసే ప్రతి కర్మయందు తను చేసే ప్రతి వస్తువు ల యందు పదార్థాల యందు తను రుచి చూసే వాటి యందు వాసన చూసే ప్రతి వాటియందు తను తినే ప్రతి వాటియందు తను విన్న ప్రతి విషయమునందు తను నడిచే ప్రతి చోటా యందు తను మాట్లాడే ప్రతి పనియందు తను వదిలే మల మూత్ర విసర్జన యందు కూడా తన ఇష్ట ఏకైక దైవ స్వరూపం చూడగలిగిన వాడికి కళ్ళు మూసినా తెరిచినా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుపోతున్నాయి అని వాటిని నేను అనేది నామమాత్రమేనని అనుభూతి కలుగుతుంది. ఇట్టివాడు కర్మలు చేస్తున్న కూడా తామరాకుమీద నీటిబొట్టులాగా వీళ్ళు కర్మల నుండి విముక్తులవుతారు. సంసార విషయాలు వీరిని సంసార కామ మాయ వీరిని తమ ఆధీనంలో ఉంచలేవు. ఇట్టివాడు ఇంద్రియాలు జయించి జితేంద్రియుడు అవుతాడు. ఇట్టి వాడిని ఆత్మారాముడు అని అందురు.త్రిగుణ రాహిత్యమును పొందితేగాని కర్మ రాహిత్యమును పొందలేరు. ఇలా పొందినవాడు ఆత్మారాముడు కావటం వలన వారిని ఈ కర్మ చక్ర దైవముగా శ్రీరాముడు మనకి ఆదర్శం గా ఉంచడం జరిగిందని నాకు అవగతమవుతుంది.ఈ చక్ర స్థితిలో మనకి శ్రీ రాముడి విగ్రహాలు, శుద్ధ స్ఫటిక లింగము,ఒక స్ఫటిక మాల,యోగదండము, నిజరూప శ్రీరామ దర్శనాలు అదే దక్షిణాచారం చేస్తే కచ్చితంగా వస్తాయని చెప్పాలని కపాల మోక్ష గ్రంథంలో చెప్పడం జరిగింది. . అలాగే తప్పకుండా ఏదో ఒక శ్రీరామ క్షేత్రానికి వెళ్లి వారి నిజరూప దర్శనం అనుభూతిని పొందటం జరుగుతుంది.  అంటే దానితో నాకున్న స్ధూలశరీర 48 లక్షల కర్మలు అదిగూడ కర్మశేషం లేకుండా పూర్తి అయినాయని నాకు జ్ఞానస్ఫురణ అయినది. 


మనస్సు యందు కోరిక కలగటంతో చక్ర జాగృతి అయితే ఈ కోరిక హితమైతే పాపం అయితే చక్రం శుద్ధి అలాగే ఈ కోరికను మీ అదుపులో ఉంచుకుంటే ఆ చక్రము స్వాధీనం అయినట్లే. లేదంటే ఆ కోరికే మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటే చక్ర మాయకు గురి అవుతున్నారు అన్నమాట. జన్మలకి కారణము కర్మలు. వీటికి కారణం త్రిగుణాల మాయ. దీనికి కారణము స్థిర మనస్సు స్థిర బుద్ధి లేక పోవటం అన్నమాట. ఇట్టి కర్మరాహిత్య స్ధితి కోసము సాధకులు తమ కర్మచక్ర ఆధీనము కోసం ఇక వామాచారం అయితే పంచ మాంసభక్షణ అదే దక్షిణ ఆచారము అయితే ఖేచరీ ముద్ర సాధనతో నాలుక యొక్క వాక్యం భక్షణ చేయాలని తెలుసుకో! మరి ఈ రెండూ కూడా చేయలేని వారు ఈ కర్మ చక్ర స్థితుల కోసం అర్ధ పురుషార్థము అనగా ధర్మ సంపాదన కలిగి ఉంటే చాలు. మీ కష్టమే మీ సంపాదనగా జీవించాలి. అనాలోచితంగా వచ్చిన డబ్బు మీద ఆశ పడకూడదు. ఇతరుల నుండి వచ్చిన ఆస్తులు సంపాదన మోసముతో, స్వార్థంతో, వారి నుండి ఆశించకూడదు. లాక్కోకూడదు.ఇతరుల నుండి ఉచితంగా ధనము ఆశించకూడదు. ప్రలోభాలతో మోసాలతో ఇతరుల సొమ్మును దొంగతనం  చేయకూడదు. దొరికిన ఎవరిదో వారికి ఇవ్వాలి లేదంటే సంబంధిత కార్యాలయాలలో నిజాయితీగా ఇవ్వాలి. అంతే గాని మీకు మోసపోతూ ఇతరుల ధనం కోసం మోహము చెందరాదు. డబ్బులు సంపాదనే జీవిత పరమావధి కాకూడదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతే దానిని నిజాయితీగా ధర్మయుతంగా సంపాదించుకోవాలి. ధనము కొంతమేర మనల్ని రక్షిస్తుంది. దాని పరిధి దాటి మీరు సంపాదిస్తే దానిని మీరు రక్షించే పరిస్థితి అవుతుంది. గడ్డివాము దగ్గర కుక్క కాపలాగా ఈ అధికధనముకి కాపలా కాయాలి. కుక్క ఈ గడ్డిని తినలేదు. వేరే వారిని తిననీయదు.సంపాదించిన డబ్బు ఖర్చుపెట్టి అలాగని దాచుకోలేదు. రాజు సొమ్ము రాళ్లపాలు అవ్వక తప్పదు కదా. వాడికి పనికిరానట్లుగా అధిక ధన సంపాదన కూడా ఒక మాయగా మారుతుందని మన పూర్వీకులు గ్రహించి సాధకులు తమకు ఎంత అవసరమో అంతే సంపాదన ధర్మయుక్తముగా సంపాదించు కలిగితే ఈ కర్మ చక్ర స్థితులు కలుగుతాయని  గ్రహించగలగాలి.

ఈ విధంగా పరమహంస గారి సాధనా అనుభవాలు అనుభూతులు అన్నీ కూడా యోగ సాధనలో ఉన్న ప్రతి స్త్రీ మూర్తికి అలాగే పురుషులకు కూడా వర్తిస్తాయి.  ఈ విధంగా దక్షిణాచారంలో పరమహంస గారు చెప్పిన సాధన విధి విధానం చేసుకుంటూ కర్మ చక్ర సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు అని రుద్ర స్వామి చెప్పడం జరిగింది.


శుభం భూయాత్ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి