ఆకాశ శరీరము (120)

 ఆకాశ శరీరము 


శివ నందిని తన ఆకాశ శరీర జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోవడానికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవ క్షేత్రమైన భీమాశంకర క్షేత్రమునకు సాధన కుటుంబంతో కలిసి విమానంలో ప్రయాణం చేస్తూ రావడం జరిగింది. ఈ విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు బాలగణపతి కాస్త…

బాల గణపతి:- అమ్మ!  మాకు భీమా శంకర స్థల విశేషం గురించి చెప్పవా ? 

అని అడిగేసరికి….. అప్పటికే శివ నందిని ఈ స్థల పురాణ విశేషం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని ఉండటంతో చెప్పడం ఆరంభించింది.

శివ నందిని:- నాన్న!  ఇది 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవ జ్యోతిర్లింగం. ఇవి మహా రాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల సమీపంలో ఉంటుంది. దీని స్థల పురాణం ప్రకారంగా కుంభకర్ణుడి కుమారుడైన భీమా శంకరుడు…. ఒక రోజు తన తల్లి ద్వారా విష్ణుమూర్తి అంశ అయిన శ్రీరాముడి అవతారం వలన తన తండ్రి మరియు పిన తండ్రి అయిన రావణబ్రహ్మకి,  రామునికి మధ్య యుద్ధాలు జరిగినాయని…  తమ వంశస్తులందరినీ వీళ్ళు సంహరించారని అలాగే తల్లి తరుపు బంధువులు మరియు కుటుంబ సభ్యులందరినీ శ్రీరామ సమీపంలో ఉండే మునులు సంహరించారని తెలియడంతో….. విష్ణుమూర్తిని సంహారం చేయాలని భీమాసురుడు బ్రహ్మ దేవుని కోసం ఘోర తపస్సు చేయడం జరిగింది.  బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు…. భీమాసురుడు అడిగిన వరములన్నీ కూడా ఇవ్వటం జరిగింది. భీమాసురుడు అమిత  గర్వాహంకార పూరితుడై ముల్లోకాలను పీడించడం ఆరంభించాడు. ఒకరోజు ఇతను కామరూపదేశాన్ని పరిపాలించే సుదక్షణుడు అనే రాజుని బంధించడం జరిగింది. ఈయన అపార శివ భక్తుడు కావడంతో…. ప్రతిరోజు తన ఆరాధనలో పార్థివ శివలింగం తయారు చేసుకుని…. ఎంతో భక్తితో…. ఆరాధించేవాడు.  ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు కాస్త చెరసాలకు వచ్చి…. అక్కడ ఉన్న పార్థివ శివలింగమును చూసి….ఇప్పుడు ఈ శివలింగ ఆరాధన చేయవద్దు.  ఒకవేళ నువ్వు చేసినట్లయితే…. ఈ ఖడ్గంతో ఖండన చేస్తాను అనేసరికి….. ఆయన శివలింగ ఆరాధన ఆపేది లేదు, నిత్య పూజలు చేసుకుంటూనే ఉంటాను అనేసరికి…. ఇప్పుడు ఈ శివలింగమును నా ఖడ్గంతో ఖండిస్తే, ఇందులో ఉన్న మీ శివుడు తనని తాను రక్షించుకుంటాడా? అసలు ఇందులో మీ శివుడు ఉన్నాడా?  అని శివలింగ భేదనం చేయబోతూ ఉండగా….. ఆ పార్థివ శివలింగం నుంచి ఉగ్రరూపంలో శివుడు బయటకు వచ్చి…. ఈ భీమాసుర రాక్షసుడిని సంహరించడంతో…ఈ విషయం తెలిసిన ఆ రాక్షసుని తల్లి…. శివుడి దగ్గరికి వచ్చి స్వామి!  నువ్వు ఈ క్షేత్రంలో నా కుమారుడైన భీమాసురుడి పేరుతో జ్యోతిర్లింగంగా వెలియాలి…అని చెప్పేసి వరం కోరుకోవటంతో…  శివుడు కాస్త భీమా శంకరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా, శివలింగంగా వెలియడం జరిగింది. భీమాసురుడి సంహారం జరిగిన తరువాత కొన్నాళ్లకి త్రిపురాసురుడికి తెలియడంతో…. భీమా శంకరుడు శివలింగంగా ఉన్న కామరూప రాజ్యాన్ని దండెత్తడానికి రావడం జరిగింది. అప్పుడు శివుడు కాస్త త్రిపురాసుర సంహారం చేయడంతో….బాగా అలసిపోవడంతో…. ఈ సహ్యాద్రి పర్వతాల మీద విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈయన చెమట బిందువులు కాస్త సహస్ర బిందువులుగా కారుతూ…. ఏకంగా భీమా నదిగా ఏర్పడడం జరిగింది. ఈ క్షేత్రంలో ఉన్న కొండ కాస్త రథాకృతిలో ఉండటం వలన…. ఈ క్షేత్రాన్ని రథచలం అని కూడా పిలుస్తారని స్థల పురాణం చెబుతుంది.  ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారంగా శాకిని, డాకిని శక్తులు, వివిధ రాక్షస గణాలు, రుద్ర గణాలు అన్నీ కూడా బీమాసురుడిని ఆరాధన చేసే విధంగా అను గ్రహించాడని స్థలపురాణం చెప్పడం జరిగింది.

బాల కుమారస్వామి:- అమ్మ!  నాకు ఈ మోక్షాలలో కొన్ని విషయాలను అర్థం కాలేదు. అంటే వ్యక్తిగత మోక్షం, పూర్ణ మోక్షం, విశ్వమోక్షం వీటిలో ఏది ఏ మోక్షము అనేది నాకు వివరంగా చెప్పగలవా? 

శివ నందిని:- ఇప్పుడు వ్యక్తిగత మోక్షం అనేసరికి ప్రకృతిలో రెండు రకాల స్థితి గతులు ఉన్నాయి. ఒకటి పురుష ప్రకృతి, రెండు స్త్రీ ప్రకృతి.  పురుష ప్రకృతిలో పురుషుడు ఉండి స్త్రీ మోక్షం పొందితే….స్త్రీ ప్రకృతిలో అమ్మవారు ఉండి పురుషుడు మోక్షం పొందడం జరుగుతుంది. అందువలన పురుష ప్రకృతిలో పురుషుడి ఆదిక్యతను, స్త్రీ ప్రకృతిలో స్త్రీ ఆధిక్యత ఉంటుంది.  ఈ పురుష ప్రకృతి మోక్షం పొందితే…. అది వ్యక్తిగత మోక్షం అవుతుంది. అదే విధంగా స్త్రీ ప్రకృతి మోక్షం పొందితే….. అది వ్యక్తిగత స్త్రీ ప్రకృతి మోక్షం అవుతుందన్నమాట!  అంటే మూల ప్రకృతిలో పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి అనేది ఉన్నాయి కదా!  ఇది వ్యక్తిగతంగా పురుష ప్రకృతి మోక్షం…. అదే స్త్రీ ప్రకృతి మోక్షం…. అదే వ్యక్తిగత మోక్షం అవుతుంది.  తర్వాత పూర్ణ మోక్షం అంటే మిగిలిపోయిన పురుష ప్రకృతిలో మనకి అమ్మవారు మిగిలిపోతుంది కదా!  అదే విధంగా స్త్రీ ప్రకృతిలో పురుషుడు మిగిలిపోతాడు కదా!  మిగిలిపోయిన ఈ స్త్రీ, పురుషులు కాస్త ప్రకృతిగా ఏర్పడి ఆ ప్రకృతి కాస్త మోక్షం పొందితే…. దాన్ని పూర్ణ మోక్షం అనడం జరుగుతుంది.  అంటే స్త్రీ, పురుష ప్రకృతులు అంతా ఏకమై…. మూల ప్రకృతిగా మారి… మోక్షం పొందితే అది విశ్వమోక్షం అవుతుందన్నమాట!  ఈ విశ్వ మోక్షంలో చూసేవాడు, చూపించేవాడు ఇంకెవరూ ఉండరు అన్నమాట!  అంటే ప్రకృతులలో మూల ప్రకృతి, స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి ఎలా ప్రకృతిలో మోక్షం పొందుతున్నాయి అనేది చూసేవాడు ఒకడుంటాడు…. వీళ్లంతా ఏ విధంగా మోక్షము పొందుతారో అని చూపించేవాడు ఒకడు ఉంటాడు.  చూసేవాడు, చూపించేవాడు అంటే జీవాత్మ ,పరమాత్మ అనేది…. దేవుడు, జీవుడు లేని స్థితి పొందటమే శూన్యం అవ్వటమే…. ఏమీ లేని స్థితికి చేరడమే. పూర్ణ శూన్య స్థితికి చేరడమే విశ్వ మోక్షం అవుతుంది..

అని చెప్పేసరికి…. అమ్మ!  ఇదంతా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. ఏదైనా గాని సాధన చేసి అనుభవం అనుభూతి పొందితే గాని మనకి విషయం అర్థం అవ్వదు. శబ్ద పాండిత్యంలో ఎంత చక్కగా చెప్పినప్పటికీ…. ఎంతగా విడమర్చి చెప్పినప్పటికీ…. కూడా అది  అర్థం కానట్టుగా ఉంటుంది.  కానీ మళ్ళీ అందులో పలు సందేహాలు వస్తాయి అని పిల్లలు అనడంతో…. అదే నాయనా!  శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న..  శబ్ద పాండిత్యంలో ఒకళ్ళు అనుభవాలు మనకు చెప్పడం జరుగుతుంది. అది నిజమా కాదా అని చెప్పేసి…. సాధన చేసి…. అనుభవ పాండిత్యంలోకి వచ్చేసరికి…. అవి అనుభవాలు వేరే విధంగా ఉంటాయి. ఒకే విధమైన అనుభవాలు ఉండే అవకాశం ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు శబ్ద పాండిత్యం ప్రకారం చూస్తే… కంఠంలో శివలింగం అమ్మవారు తీయటానికి కారణం ఏమిటి?  అని వివిధ పుస్తక గ్రంథాలలో విచారణ చేశారు అనుకో! అప్పుడు ఏం చెబుతుంది…?  గత జన్మలలో శివలింగ ఆరాధనలో దోషం చేసినా ….శివలింగమును ధరించకపోయినా…. శివలింగ ప్రతిష్ట చేయకపోయినా…. ఈ దోషాలు వస్తాయని, తద్వారా శివుడు ఊరుకున్నప్పటికీ… శివాని ఊరుకోదు కాబట్టి… ఒక పట్టు పట్టాలి అనే కంఠంలో ఉన్న శివలింగం తీసివేయడం జరుగుతుంది…. అని చెప్పేసి శబ్ద పాండిత్యం చెబుతుంది. కానీ అనుభవ పాండిత్యానికి వచ్చేసరికి….అది వేరే విధంగా ఉంటుంది.  అనుభవం పొందితే గాని, విషయం ఏమిటి అనేది మనకి తెలియదు.  అదే మనకి చిదంబర రహస్యం అవుతుంది. పదార్థం దాటితే గాని యదార్థ జ్ఞానం ఏమిటి అనేది తెలియదు. ఎవరికి వారే వ్యక్తిగత అభిప్రాయాలతో…. మిడిమిడి జ్ఞానంతో….సరియైన అనుభవాలతో, అనుభూతులు పొందకుండా…. ఊహించిన ఊహలనే మనకి శబ్ద పాండిత్యంలో చెప్పడం జరుగుతుంది.  యదార్ధంగా అనుభవ పాండిత్యంలోకి వచ్చేసరికి శబ్ద పాండిత్యం చెప్పిన జ్ఞానానికి …అనుభవం రూపంలో వచ్చిన జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. కానీ, ఎవరికి వారే సాధన చేసి తాము పొందిన స్వానుభవాల సారమే అనుభంవ పాండిత్యం … అదే సత్య జ్ఞానమును మనకి తెలుపుతుంది… అందుకోసమని బుద్ధుడు లాంటి వాళ్ళకి కూడా అనుభవాలన్నీ నమ్మాలని, సత్యమని నిరూపణ కావాలి అనుకుంటే… ఎవరికి వారే సాధన చేసుకోండి అని చెప్పటమే జరిగింది. కానీ నా పరంగా అది సత్యం కావచ్చును…యదార్థం కావచ్చును… మీ పరంగా అది నిజం కావచ్చును…. నిజం అవ్వటానికి సాక్ష్యం కావాలి కాబట్టి, సాక్షాదారాల కోసం మీ సాధన అనుభవాలు ఎవరికి వారే వ్యక్తిగతంగా సాధన చేసి అనుభవం పొందాల్సిందే అని బుద్ధుడు, పరమహంస లాంటి వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి వారే శబ్ద పాండిత్యమును ఆధారంగా చేసుకుని… అనుభవ పాండిత్యంలోకి వెళ్లి సాధన అనుభవాలను పొందటం చాలా మంచిది అని అంటూ ఉండేసరికి…. అప్పటికే పిల్లలు నిద్రలోకి జోగుతున్నారని…..  మీకు నిద్ర వస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమై అర్థం కానట్టుగా అనిపిస్తుంది అనేసరికి…అవును నిజమేనమ్మ! రేపు పొద్దున మాట్లాడుకుందాం!  అనేసరికి పిల్లలు విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోకి జారుకోవడం జరిగింది.  అప్పటికే గాఢ నిద్రలోకి మహాదేవి, రుద్ర స్వామి ఉండటం గమనించి….ఇక శివ నందిని కూడా ధ్యానం చేసుకుందాం!  అని చెప్పేసి అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది. కొద్దిసేపటికి అనుకోకుండా ధ్యాన దృశ్యంగా అమ్మవారి చేతులు  తన కంఠంలో నుంచి స్పటిక శివలింగం తీయాలి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా…. ధ్యాన అనుభవం అయింది. ఆవిడ ఖచ్చితంగా ఆదిపరాశక్తి అని అర్థమవుతుంది. ఎందుకంటే యోగాంబిక, కృష్ణస్వామి చేతులను తను స్పష్టంగా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. కానీ ఇక్కడ అమ్మవారి చేతులు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి చేతులు ఎందుకు కంఠంలోని స్పటిక శివలింగం తీయాలని ప్రయత్నం చేస్తుందో అర్థం కాలేదు. సరేలే ఇది తన ఆలోచనలను అలా తిరుగుతూ ఉండటం వల్లనే ధ్యాన దృశ్యం అయ్యిందేమో అనుకొని…. మళ్లీ కొద్దిసేపటికి…. ఆగి కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది. మళ్లీ యధావిధిగా అమ్మవారి చేతులు కాస్తా….తన కంఠం మీద పెట్టి స్పటిక శివలింగం తీయాలని ప్రయత్నం చేస్తూ ఉండేసరికి….. ఈమెకి  ఊపిరి ఆడక… ఈమెకి ఏం చేయాలో తెలియక, ఆ చేతులు తను ఎంత తీసివేయాలన్నా కూడా… తన భౌతిక శరీరం సహకరించట్లేదు… చేతులు, కాళ్లు కదలని స్థితిలో ఉన్నాయని చెప్పి…. తల కూడా కదలని స్థితిలో ఉంది. మాట బయటికి రాని స్థితిలో ఉంది అని చెప్పేసి శివ నందినికి అర్థం అయింది. తను స్తంభనంలో స్తంభించిపోయింది అని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. అప్పుడు తను నిత్యం జపం చేసుకునే ఓం శివోహం గురు మంత్రం చేస్తూ ఉండేసరికి…. చేతులు కాస్త మాయమై పోయి కంఠం నుంచి చేతులు విడిపోవడం జరిగింది.  ఎప్పుడైతే ఓం శివోహం మంత్రం ఆపడంతో మళ్ళీ అమ్మవారి చేతులు తన కంఠంలో ఉన్న శివలింగం తీయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండటం శివ నందిని కి ఆశ్చర్యం వేసింది. అసలు కంఠంలో ఉన్న శివలింగమును ఎందుకు తీయాలి?  అని పరమహంస గారికి ఇలా తీసింది అని ఆయన అనుభవం చెప్పింది సత్యమే అన్నమాట!  ఇక్కడ ఏకంగా ఆదిపరాశక్తియే కంఠంలో ఉన్న శివలింగం తీయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది అంటే….దీనికి ఏదో బలమైన కారణా కారకాలు ఉంటాయి.  ఇది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నది . ఆ విమాన ప్రయాణంలో దాదాపు ఒక 15 నుంచి 20 సార్లు ఇదే ధ్యాన దృశ్యంగా కనపడుతూ ఉండేసరికి…. ఏం చేయాలో అర్థం కాక దీనికి సరైన పరిష్కారం చెప్పేది శివ స్వామియే అని ధ్యానం నుంచి బయటకు వచ్చి హృదయ చక్రం మీద చేయి పెట్టగానే స్వామి!  స్వామి! అని పిలవగానే శ్రీశైలంలోనే విభూది మఠంలో ధ్యానంలో ఉన్న శివ స్వామి కాస్త కళ్ళు తెరిచి….

శివ స్వామి:- ఏమైంది దేవి! 

శివ నందిని:- నాకు ఇలా అమ్మవారు కంఠంలో ఉన్న శివలింగమును పదేపదే తీయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. దీనికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని తలుచుకోవడం జరిగింది. 

శివ స్వామి:- దీనికి ఆకాశ శరీరమే సమాధానం చెబుతుంది. ఇది నీకు గత జన్మ అనుభవం ఏమిటి అనేది సమాధానం చెబుతుంది.  నువ్వు భీమాశంకర క్షేత్రానికి వెళ్ళినప్పుడు…. నీకు ఆకాశ శరీరం జాగృతి అయినప్పుడు… విషయం నీకే అర్థం అవుతుంది.   నాకు తెలిసిన విషయం చెప్పినప్పటికీ కూడా అనుభవ అనుభూతితో తెలుసుకోవడమే మంచిది! 

శివ నందిని:- అలాగే స్వామి!  ఈ కంఠంలో శివలింగం ఎలా కాపాడుకోవాలి..?

శివ స్వామి:- నీ గురు మంత్రం చేసుకుంటూ ఉండు.. నువ్వు శివుడివే అని ఆమెకు  స్ఫురణ రావటంతో తన భర్త కంఠంలో శివలింగం తీయడం ఏమిటి? అని చెప్పేసి ఆవిడే ఆగుతుంది..

శివ నందిని:- నేను ఇలా చేస్తూనే ఉన్నాను.  ఈవిడ నేను ఆపినప్పుడల్లా వస్తూనే ఉంది. 

శివ స్వామి:- నువ్వు భీమాశంకర క్షేత్రానికి వెళ్లి నీ ఆకాశ శరీరం అనుభవం తెలుసుకునేదాకా…. ఆవిడ ఇలాగే చేస్తుంది.  ఎందుకు అంటే ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో…. అప్పుడు ఉన్న మాయ కాస్త మాయం అవుతుంది.

శివ నందిని:- అప్పటిదాకా… ఆ విషయం తెలుసుకునేదాకా మీ సహాయ సహకారాలు అందిస్తే నా కంఠంలో ఉన్న శివలింగం అమ్మవారు తెలియకుండా చూడండి. 

శివ స్వామి:- యోగం ఉంటే  ఎవరు తీయలేరు… తీయాలని రాసి ఉంటే ఎంతమంది ఉన్నాగాని తీయక తప్పదు.  మనకి పరమహంస గారి విషయంలో కూడా అదే జరిగింది కదా!  కాకపోతే శబ్ద పాండిత్యంలో చెప్పిన కారణాలు….అనుభవ పాండిత్యంలో చూసిన అనుభవాలకి… చాలా తేడా ఉంటుంది. 

శివ నందిని:- అవును…. అలాగే అనుభవ పాండిత్యానికి…  శబ్ద పాండిత్యంలో చూసేదానికి చాలా తేడా ఉంది… అనేది అర్థమయ్యింది.

శివ స్వామి:- సరే నీ ఆకాశ శరీరం నీకు ఏ జ్ఞానం ఇస్తుందో…. ఏ అనుభవం ఇస్తుందో… నువ్వే తెలుసుకో! 

అని చెప్పి అనేసరికి ఆయన కాస్త అదృశ్యం అయ్యేసరికి….. శివ నందిని కూడా గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగింది.


Part 2 

సాధన కుటుంబం కాస్త విమానం ద్వారా ముంబయ్ కి చేరుకోవడం ….మళ్ళీ అక్కడి నుంచి మహారాష్ట్రలో ఉన్న భీమశంకర క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. భీమాశంకర క్షేత్ర పరిసరాలలో ఉన్న హోటల్లో గది తీసుకోవాలని చెప్పేసి శివ నందిని అనుకుంటూ ఉండేసరికి అమ్మ!  ఇక్కడ ఉన్న ప్రకృతి చాలా బాగుంది.  కొండలు, సెలయేర్లు అంతా మాకు నచ్చింది. గుడి పరిసరాల్లోనే మనం డేరా వేసి ఉందాం అనేసరికి పిల్లల ముచ్చట ఎందుకు కాదనాలి అని రుద్ర స్వామి, శివ నందిని అనేసరికి సరే మీ ఇష్టం!  అని గుడికి వంద మీటర్ల దూరంలో, భక్తులకు ఇబ్బంది లేని ఏకాంత ప్రదేశంలో… వీళ్ళు డేరా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భీమా నదిలోకి వెళ్లి స్నానాధికాలు పూర్తి చేసుకుని భీమా శంకరుని దర్శనానికి వెళ్ళటం జరిగింది. కాకపోతే ఈ దేవాలయం కాస్త సహజంగా అన్నీ దేవాలయాలు కూడా కొండపైన ఉంటే… ఇది మాత్రం కొండల మధ్యలో, లోయలో ఉన్నట్లుగా… సుమారుగా 200 నుంచి 300 మెట్లు ఉన్నట్లుగా ఉండి కిందకి దిగిపోతే గాని మనకి శివలింగం ఆలయం దర్శనం కాదు అని శివనందినికి అర్థం అయింది. వీళ్ళు 200 మెట్లు కిందకి దిగిన తరువాత బీమా శంకర ఆలయం దర్శనం అయ్యింది. లోపల బీమా శంకర శివలింగం ఉన్నది. శివలింగానికి అభిషేకాల వలన దెబ్బతినకుండా వెండితొడుగు వేయడం జరిగింది. ఉదయకాలంలో సుప్రభాత సేవలో ఈ వెండితెడుగు తీసి…. అభిషేకాలు చేసేటప్పుడు ఈ శివలింగం యొక్క నిజరూప దర్శనం అవుతుందని అక్కడ ఉన్న పూజారులు చెప్పడంతో…. సరే రేపు ఉదయం సుప్రభాత సేవకు వద్దాము అని చెప్పి అందరూ అనుకున్నారు. అప్పుడు వెండి తొడుగు ఉన్న భీమశంకరుని తాకటం జరిగింది. ఆయనకి అభిషేకం చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత సాధనా కుటుంబం అంతా దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శనం చేసుకోవడం జరిగింది. వీటి వివరాలు శివ నందిని ముందుగానే ఇంటర్నెట్ లో చూసి తెలుసుకుని ఉండడం వల్ల వాటి గురించి వివరిస్తూ… అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది . 

మోక్షకుండ్ తీర్థం – భీమాశంకర్ ఆలయానికి సమీపంలోని పవిత్ర తీర్థం. ఇక్కడ స్నానం లేదా తీర్థసేవనం పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

భీమా నది ఉద్భవ స్థలం – భీమా నది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని భావిస్తారు. అందుకే ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది.

కమలజా మాత ఆలయం – పార్వతీదేవి కమలజా రూపంలో ఇక్కడ వెలసిందని విశ్వాసం. భీమాసురుడితో జరిగిన యుద్ధంలో అమ్మవారు శివుడికి సహకరించారని స్థలపురాణం చెబుతుంది.

సాక్షి వినాయకుడు – భీమాశంకర్ దర్శనానికి వచ్చిన భక్తుల యాత్రకు సాక్షిగా ఉంటాడని స్థానిక విశ్వాసం. అందుకే ప్రధాన దర్శనంతో పాటు ఈ వినాయకుడిని కూడా దర్శిస్తారు.

గుప్త భీమాశంకర్ – అడవి మార్గంలో ఉన్న ప్రశాంతమైన శివస్థలం. నీటి ప్రవాహం మధ్య లేదా సమీపంలో శివలింగ దర్శనం ఉండటం దీని ప్రత్యేకత.

గోరక్షనాథ్ ఆశ్రమం – నాథ సంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి. ధ్యానం, సాధనకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది.

నాగఫణి పాయింట్ – కొండ శిఖర ప్రాంతం. నాగుపాము పడగ ఆకారాన్ని పోలిన శిలారూపం కారణంగా ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి నుంచి సహ్యాద్రి పర్వతాల దృశ్యాలు అందంగా కనిపిస్తాయి.

భీమాశంకర్ వన్యప్రాణి అభయారణ్యం – పశ్చిమ కనుమలలోని పచ్చని అడవులతో ప్రసిద్ధి. అరుదైన వృక్షజాలం, పక్షులు మరియు మలబార్ జెయింట్ స్క్విరెల్ (షేక్రూ) వంటి వన్యజీవులను చూడవచ్చు.

అంజనీ మాత ఆలయం & హనుమాన్ సరస్సు – అంజనీదేవికి సంబంధించిన భక్తి ప్రదేశంగా భావిస్తారు. చుట్టూ ఉన్న ప్రకృతి, సరస్సు ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా మారుస్తాయి.

ముంబై పాయింట్ – కొండ ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్. చుట్టుపక్కల సహ్యాద్రి పర్వతాలు, లోయల విస్తృత దృశ్యాలను చూడటానికి అనుకూలం.

భోర్గిరి మహాదేవ్ ఆలయం – ప్రాచీన శైవ సంప్రదాయానికి సంబంధించిన ప్రాంతం. ఆలయం చుట్టూ ఉన్న కొండలు, అడవి వాతావరణం దీనికి ప్రత్యేక ఆకర్షణ.

అహుపే జలపాతం – వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఎంతో అందంగా కనిపించే ప్రకృతి ప్రదేశం.

కొంధ్వాల్ జలపాతం – వర్షాకాలంలో ప్రసిద్ధి చెందే జలపాతం. పచ్చని కొండల మధ్య జలధారలు పడే దృశ్యం ప్రధాన ఆకర్షణ.

కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం – శివునికి అంకితమైన ప్రశాంతమైన ఆలయ ప్రదేశం. ప్రకృతి మధ్య ఉండటం వల్ల ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. 

ఆ తర్వాత శివ నందిని కాస్త గదికి చేరుకుని…భోజనాదులు కానిచ్చేసుకుని తన ఆకాశ శరీర జాగృతి కోసం అని ఆకాశముద్ర అభ్యాసం చేస్తూ ధ్యానంలో కూర్చుంది. కానీ ధ్యాన దృశ్యంగా ఎలాంటి అనుభవాలు కలగకపోయేసరికి…. సరే అని  ధ్యానం చేసుకుంటూ సుమారుగా రెండు నుంచి మూడు గంటల పాటు ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత భోజనాల కోసం అని హోటల్ కి వెళ్ళటం…. భోజనాలు చేసుకుని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం…. సాయంత్రం పూట దేవాలయానికి రావటం…ధ్యానంలో కూర్చోవటం రుద్ర స్వామి, మహాదేవి కూడా ధ్యానంలో కూర్చుంటే… పిల్లలు కొంత సేపు ధ్యానం, కొంతసేపు ఆటలు రందిలో ఉండటం జరిగింది. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు శివ నందిని ఇదే దినచర్యలో ఉండి సాధన అభ్యాసం చేస్తూ ఉండేది. ఒకరోజు యధావిధిగా అమ్మగారు తన చేతులతో శివ నందిని కంఠంలో ఉన్న స్పటిక లింగం తీయాలని చెప్పి విశ్వ ప్రయత్నం  చేసే ధ్యాన దృశ్యం కనిపించేసరికి…. ఈవిడ ఎందుకు అంతలా కారాడుతోంది…. తపన పడుతుంది. ఎందుకు శివలింగం తీయాలని అనుకుంటుంది? అసలు శివలింగం ఉంటే ఏం జరుగుతుంది? కంఠంలో శివలింగం లేకపోతే ఏం జరుగుతుందో? తెలుసుకోవాలని కుతూహలం, ఆసక్తి కాస్త శివ నందినిలో కలిగింది. కానీ ఇది ఎవరు చెప్తారు అని అనుకుంది. కానీ అప్పటికే తనకి దూర శ్రవణ సిద్ధి ఉన్నది  కానీ…. తనకి కావాల్సిన ధ్యాన దృశ్యం చూసే యోగ స్థితి ఇంకా రాలేదు. కారణం ఆజ్ఞ చక్రంలో మనోనేత్రం తెరుచుకుంటుంది. ప్రస్తుతం తన సాధన విశుద్ధ చక్రంలోనే ఉన్నది. అసలు ఈ కంఠంలో ఉన్న శివలింగానికి సంబంధించిన విషయ జ్ఞానం తనకి ఎవరు ఇస్తారు అని అనుకున్నది. కానీ, రుద్రస్వామి, మహాదేవిని అడిగినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్థమయింది. సరే అని అలా రెండు మూడు రోజులు ఇదే ఆలోచనలో ఆవేదన పడుతూ…. ఆవేశపడుతూ…. మదన పడుతూ…. తన ప్రయత్న సాధన కొనసాగిస్తూనే ఉన్నది.అటు చూస్తే శివ స్వామి తెలిసినా చెప్పడు. ఇటు చూస్తే మహాదేవి, రుద్ర స్వామికి పూర్తిగా తెలిసినట్టు లేదు. ఇక ఏదైనా కానీ తనకు తానే అనుభవ అనుభూతి పొందక తప్పదు.  కానీ ఎలా పొందుతుంది… ఎలా తెలుస్తుంది? దీనిని భీమాశంకరుడే సహాయ సహకారాలు అందించాలి అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా తన కంఠంలో విశుద్ధ చక్రం నుంచి ఒక శరీరం  బయలుదేరి తన ఆజ్ఞ చక్రం ద్వారా బయటకు రావడం…. ఆ శరీరం తన రూపధారిగా ఉండి, తన ఎదురుగా కూర్చుని ధ్యానం చేయటం ఆరంభించింది.  అది స్త్రీ స్వరూపం. అంటే ఇదే తన ఆకాశ శరీరం అని చెప్పేసి శివ నందినికి అర్థం అయింది. కొంతసేపు అయిన తర్వాత ఈ ఆకాశ శరీరం తనతో రమ్మని సైగ చేయడంతో శివనందిని కూడా ఆ శరీరమును వెంబడించడం జరిగింది. శివ నందిని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మహాదేవిని పిల్లలకి కాపలా ఉండమని చెప్పి…. రుద్రస్వామి మౌనంగా శివ నందిని వెంట వెంబడించడం జరిగింది. శివ నందిని కాస్త తన ఆకాశ శరీరం ఎక్కడికి వెళ్తుందో అని తనని అనుసరించడం జరిగింది.. కొద్దిసేపటికి ఈ క్షేత్రంలో ఉన్న సందులు, గొందులు తిరుగుతూ ఒక పాడుబడిన ఇంటిలోనికి ఆకాశ శరీరం వెళ్లడం శివనందిని అలాగే రుద్ర స్వామి గమనించారు. అలాగే ఆ ఇంటి చుట్టూ పక్కల నరసంచారం లేదు అని చెప్పి అర్థం అయింది. సరే అని తలుపులు వేసి ఉన్న తాళం పగలకొట్టి శివ నందిని అలాగే రుద్రస్వామి ఆ ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. అప్పటికే ఆ ఇంటిలో తన ఆకాశ శరీరం కూర్చొని ఉండటం శివ నందిని గమనించింది. కానీ శివ నందిని యొక్క ఆకాశ శరీరం రుద్ర స్వామికి కనిపించడం లేదు. కేవలం ఒక్క శివ నందినికి మాత్రమే సుస్పష్టంగా కనపడుతుంది అన్నమాట! అప్పుడు శివ నందిని తనని గమనిస్తుందని తెలిసి ఆకాశ శరీరం కాస్త పూజా మందిరంలోకి వెళితే అక్కడ ఒక పెద్ద తెల్లరాతి శివలింగం మీద ఒక అస్తిపంజరం కౌగిలించుకొని పట్టుకున్నట్లుగా ఉంది.  ఆ పక్కనే సత్యాన్వేషి అనే గ్రంథం శివ నందిని కంటపడింది. ఇది ఏమిటి అని శివ నందిని తీసుకుంటూ ఉండేసరికి… సత్యాన్వేషి అనే గ్రంథం కింద మోక్ష సాధన అనుభవాలు అని చెప్పేసి రాసి ఉంది. సరే అని అది చదువుతూ ఉండేసరికి తన పేరు జ్ఞానేశ్వరి అని…. తను, తన భర్త యొక్క సాధన అనుభవాలు అన్నీ కూడా  రాసుకున్న గ్రంథం అని శివనందినీకి అర్థం అయింది.  సరే అని ఇక శివ నందిని కాస్త ఆకాశముద్రతో ధ్యాన అభ్యాసం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఏమిటి అని ఆకాశ శరీర జన్మ వివరాలు అన్నీ కూడా ధ్యాన దృశ్యంగా ఒక్కొక్కటి కనిపించటం మొదలైంది. అది జ్ఞానేశ్వరి పుట్టడం ,పెరగటం, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ జ్ఞానేశ్వరికి శివలింగ ఆరాధన అందులోనూ తెల్ల శివలింగ ఆరాధన అంటే అమితమైన ఇష్టం. పెళ్లి అయిన తర్వాత కూడా భర్త సహాయ సహకారాలతో తను ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఉండేది. ఎందుకు అంటే ఆయన కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉండే మనిషి. వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ వంశంలో మడి ఆచారాలతో ఉండటం జరిగేది. కాకపోతే జ్ఞానేశ్వరి కాస్త శివలింగ ఆరాధన చేస్తే…. ఈయన కాస్త శ్రీ చక్ర ఆరాధనతో లలితాదేవి ఆరాధన చేయడం జరిగేది. ఎవరి ఆరాధనలు ఎవరి పూజలు వారికే అన్నట్టుగా ఉండేవి. వీరిద్దరూ గృహస్త ఆశ్రమంలో ఉండి యోగ సాధన చేసుకుంటూ ఉండేవారు. వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు పుట్టడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరికైన సాధనా అనుభవాలు కలిగినప్పుడు ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని…. విచారణ చేసుకొని…. ఆ అనుభవాలను యధాతధంగా ఏమార్చకుండా పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాళ్లు. మాయలు వచ్చినప్పుడు ఏ చక్రంలో ఏ మాయలో వచ్చాయి? ఆ మాయలు ఎలా దాటాలి? వాటిని ఏ విధంగా దాటాము? ఏ దైవిక వస్తువులు వచ్చినాయి.  దానికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా వీళ్లు రాసుకోవడం జరుగుతూ ఉండేది. వీళ్ళ సాధన పటిమ ఎంతవరకు వచ్చిందంటే…. జ్ఞానేశ్వరి సాధన పరంగా శివుడు ధ్యానంలో కనిపించి తనకి సాధన విశేషాలు చెప్పే అంత స్థితిలోనూ అలాగే వాళ్ళ భర్త పరమాహంసకి స్వయంగా అమ్మవారు ధ్యాన అనుభవాలు చెబుతూ ఉండేది. వీళ్ళకేమైనా సమస్యలు వచ్చినా పరిష్కారాలు ఆయా దైవాలు చెబుతూ ఉండేవాళ్లు. భోగపరంగాను, యోగ పరంగాను వీళ్ళు దైవసహాయ సహకారాలు తీసుకుంటూ…. వీళ్ళు ఉన్నత స్థితికి వెళుతూ ఉండేవారు.  పేదలకి, మూగజీవులకి తమకున్న ఆర్థిక అవసరాలను బట్టి వాటికి సహాయ సహకారాలు చేస్తూ ఉండేవారు. ఏనాడు కూడా అహంకారానికి, కీర్తి ప్రతిష్టలకి లోనవ్వడం కానీ పాతివ్రత్య ధర్మం తప్పడం కానీ చేసేవారు కాదు.  భార్యాభర్తలు పిల్లలు కూడా ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో మెలుగుతూ ఉండేవారు.  ఈ విధంగా వీళ్ళ కుటుంబం సాగుతూ ఉండేది. పిల్లలు కూడా చిన్న వయసు  నుంచే ఆధ్యాత్మిక స్థితికి పూజలకి, పురస్కారాలకి అలవాటు చేయడం జరిగింది. అలా భక్తి మార్గంలో పడవేయడం జరిగింది. అలా కొంతకాలం జరుగుతూ ఉండేసరికి వీరిద్దరి సాధన విశుద్ధ చక్రమునకు రావడం జరిగింది. ఒకరోజు ఈ పరమహంస గారికి ధ్యాన అనుభవంగా ఆదిపరాశక్తి కాస్త తన కంఠంలో ఉన్న  స్పటిక శివలింగం తీసివేయడం జరిగింది. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది కదా! అని పరమహంస అనుకుంటూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత అమ్మవారి స్థానంలో శివుడు దర్శనం అయ్యేది. ఈయనకి విషయం అర్థం అయ్యేది కాదు.  శ్రీ చక్ర ఆరాధన చేస్తే అమ్మవారు కనపడాల్సింది పోయి…. అయ్యవారు అయిన శివుడు కనిపించడం ఏంటి? అని చెప్పి ఈయన మదన పడుతూ ఉండేవారు.  కానీ జ్ఞానేశ్వరి కంఠంలో శివలింగం తీసే ప్రయత్నం చేసినట్టుగా ధ్యాన అనుభవం కలగలేదు కాబట్టి…. తన కంఠంలో స్పటిక శివలింగం అలాగే ఉంది. దాని ద్వారా ఆమె శివలింగ ఆరాధన చేస్తూ ఉంటే… శివుడే దర్శనమిచ్చేవాడు కానీ, ఈయనకి ఏనాడూ అమ్మవారి దర్శనం ఇచ్చేది కాదు. కాకపోతే తనకి అమ్మవారికి బదులు శివ దర్శనం అవ్వడంతో అవటం ఏమిటో అనే కారణకారకాలు అర్థం కాలేదు. దానితో వీళ్ళిద్దరూ కూడా ఆలోచనలో పడ్డారు. విపరీతంగా మదనపడటం జరిగింది. అప్పుడు శబ్ద పాండిత్యానికి సంబంధించి శివపురాణం , లింగపురాణం చదవటం ద్వారా శివలింగ పూజలో లోపం  చేసిన వారికి లేదా శివ దోషం చేసిన వారికి లేదా శివలింగ ఆరాధన దోషం చేసిన వారికి లేదా శివలింగం ధరించని వాళ్లకి… శివలింగ ప్రతిష్ట చేయని వారికి… శివారాధకులకి… శివ భక్తులకి శివయోగులకి ఏదైనా అపరాధం చేసినా కూడా అది శివ దోషం అయినప్పుడు మాత్రమే… కంఠంలో ఉన్న శివలింగం అమ్మవారు తీసేస్తుంది అని శబ్ద పాండిత్యంలో చెప్పేసరికి…. తను గత జన్మలలో ఏనాడో ఎక్కడో శివనంద చేసి ఉంటాను…. శివనింద చేయడం వల్ల శివుడు పట్టించుకోక పోయినప్పటికీ…. అమ్మవారి పట్టించుకోవడంతో శివనింద దోషం చేయడం వలన అమ్మవారు కనిపించడం లేదని…. అమ్మవారి స్థానంలో శివుడు కనపడుతున్నాడు అని పరమహంస మదనపడటం జరిగింది. దీనికి ఏం చేయాలి..?  ఎలా దాటుకోవాలి అనేది ఆయన ఎన్ని శాస్త్ర గ్రంధాలు చదివినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండేది కాదు.  తనకి అమ్మవారి దర్శనం కావలసిన స్థానంలో శివ దర్శనం అవటంతో ఆయన తట్టుకోలేని పరిస్థితి వచ్చారు.  తనకు కలిగిన అనుభవాలన్నీ ఈ సత్యాన్వేషిలో రాసుకుంటూ ఉండేవాళ్లు.  రానుగాను  పరమహంసలో మధుర భక్తి కాస్త ఆవేదన భక్తిగాను, ఆవేశ భక్తిగాను, ఆక్రోషభక్తిగాను మారడం జరిగింది. అమ్మవారి విరహవేదనలో తట్టుకోలేని పరిస్థితికి వెళ్లారు. ఆయనకి చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే విపరీతమైన ప్రేమ మోహ వ్యామోహాలు ఉండేవి. అమ్మవారి సాంగత్యం పొందాలని రామకృష్ణ పరమహంస లాగా కాళీ మాతతో ఎలా అయితే ఆయన ప్రతినిత్యం మాట్లాడుతూ సాగంత్యం చేసేవారో… అలా ఆయన భక్తి ప్రపత్తులతో అలా ఉండాలని పరమహంస గారు అనుకుంటూ ఉండేవారు.  ఆయన భక్తి  తన కంఠంలో శివలింగం తీయనంతవరకు కూడా అమ్మవారి దర్శనం అలాగే ఉండేది.  ఆదిపరాశక్తి కాస్త తన కంఠంలో స్పటిక లింగం తీయడంతో శక్తి స్థానంలో శివ దర్శనం అవుతుంది.  కానీ యధావిధిగా తన భార్య జ్ఞానేశ్వరి కి మాత్రం శివలింగ ఆరాధన చేస్తే శివుడి దర్శనం అవుతుంది.  ఇది కాదు అనుకుని…. ఆవిడ చేత ప్రతి శుక్రవారం శ్రీ చక్ర ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ….కూడా ఆవిడకి కొన్ని రోజుల తర్వాత ధ్యాన అనుభవంలో శ్రీ చక్ర అది దేవతగా రాజరాజేశ్వరి, లలితాదేవి రూపాలు కనబడుతూ ఉండటం పరమహంసకి విపరీతమైన ఆనంద ఆశ్చర్యాలకు గురికావడం జరిగింది. అంటే కంఠంలో శివలింగం ఉంటే యదార్థ దైవ స్వరూపాలు దర్శనం అవుతాయని…. కంఠంలో శివలింగం లేకపోతే….. దైవ స్వరూపములు తారుమారు అవుతున్నాయని ఆయనకి అర్థం అయింది. 

రాను రాను పరమహంస మధుర భక్తి కాస్త ఆవేదన భక్తిగా మారింది.పూజ పునస్కారాలు తగ్గటం మొదలయ్యి…. ఆలోచనలు ఎక్కువ అవ్వటం జరిగింది. తను చేసిన గత జన్మ దోషాలు ఎలా నివృత్తి చేసుకోవాలా అని అదే ఆలోచనలో ఉండటం…పదేపదే ఆవేదన పడటం…. అమ్మవారి దర్శనం కోసం ఏడవటం, బాధపడటం, నిద్రాహారాలు తగ్గించటం, రానురాను పూజలు చేయడం తగ్గింది.  ఉద్యోగానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా తగ్గిపోయేసరికి…. ఉద్యోగం చేసే పరిస్థితి కోల్పోవడంతో… ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు వస్తూ ఉండటం… మరోపక్క పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉండేసరికి.. వాళ్ళ అవసరాలు ఖర్చులు పెరుగుతూ ఉండేసరికి… ఆయన కాస్త వైరాగ్యస్థితిలోనికి నెమ్మది నెమ్మదిగా వెళ్ళటం జ్ఞానేశ్వరి గమనించింది. దీనికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది కూడా ఆమెకే అర్థం కాని అయోమయ స్థితి. ఎందుకంటే తన సమస్యలకు సాధన సందేహాలకు తన భర్తే గురువుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ జ్ఞానబోధ చేస్తూ వచ్చిన మాయల్ని దాటించేవారు. ఇప్పుడు ఆయనే అర్థం కాని అయోమయ మహామాయలో పడటం జ్ఞానేశ్వరి కి అర్థం కాలేదు. తనకి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇదే విషయం తనకి ధ్యానంలో కనిపించే శివుడిని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పేవారు కాదు. మౌనంగా ఉండి అదృశ్యం అవ్వడం పదేపదే జరుగుతూ ఉండేది. అప్పుడు పరమహంస కూడా నువ్వు ఆరాధించే శివుడే సమస్యకి పరిష్కారం చేయనప్పుడు నా సమస్యకు పరిష్కారం చెప్పే అమ్మవారు నాకు పరిష్కారం చూపించినప్పుడు ఇక నేను సాధన చేయటం ఎందుకు? దేనికోసం చేయాలి.. ఎవరికోసం చేయాలి. నాకున్న ఇష్ట కోరిక అయిన అమ్మవారి సాంగత్యం పొందనప్పుడు… ఈ దేహం ఎందుకు?  ఈ దేహం ఉండటం అవసరమా?  నేను చచ్చిపోతాను… ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఒక విధమైన మానసిక క్షోభకు గురి అవ్వటం మొదలైంది. రాను రాను పూజ గదిలో ఉండిపోయి…. అమ్మ! నేను గత జన్మల్లో ఏదో తప్పు చేశాను. శివలింగ అపరాధము ఏదో చేశాను అని నా కంఠంలో ఉన్న శివలింగం తీసేసావు. అది మంచిదే…కానీ శివలింగం తీసివేయడం వలన మీ యొక్క సాంగత్యం కోల్పోతాను అనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు నీ సాంగత్యం కోల్పోవడంతో తల్లి లేని బిడ్డ పరిస్థితి అయిపోయింది.నావల్ల కాదు. భౌతికంగా నేను తల్లి ప్రేమ పొందలేకపోయాను.  చిన్న వయసులోనే మూడవ ఏటలోనే నా తల్లి చనిపోయింది.  నా తండ్రి రెండవ వివాహం చేసుకొని ఉన్నపటికీ .. నా చిన్నమ్మతో అంత సాంగత్యం పొందలేదు.  పేగు బంధం కన్నా పెంచిన బంధం గొప్పది కాదు కదా!  పేగు బంధంలో అనుభవం అనుభూతి పెంచిన బంధంలో వేరే విధంగా ఉంటుంది. అంతటి తల్లి ప్రేమ అనుభవ అనుభూతులను కూడా నీ దగ్గర చవి చూడడం జరిగింది. నీ బిడ్డను వదిలేసి నువ్వు అలా చేయడం మంచిది కాదు.  నువ్వు నాకోసం గత జన్మలో చేసిన శివలింగ దోషం తప్పును నివారణ చేయి. నీకు సాధ్యాసాధ్యాలు ఉంటాయా!  ఈ బిడ్డను నువ్వు పరీక్షిస్తున్నావా?  సుమారుగా నీ దర్శనం అయ్యి మూడున్నర సంవత్సరాలు అయింది. మూడు క్షణాలు కూడా నీ విరహవేదన భరించలేని వాడిని…. మూడున్నర సంవత్సరాల నుంచి కోరుతున్నాను అమ్మ!  కనిపించు. నీ సాంగత్యం ప్రసాదించు లేదా మరణమైన ప్రసాదించు అని అడుగుతున్నాను.  నువ్వు నాకు సహజ మరణం ఇవ్వటం లేదు.  అనాయాస మరణం కూడా ఇవ్వటం లేదు. ఇటు చూస్తే నీ దర్శనం ఇవ్వటం లేదు. నీ సాంగత్యము ఇవ్వడం లేదు.  ఇక నాకు ఆత్మహత్య యే శరణ్యం.  నా కుటుంబం భార్య పిల్లలు గురించి కూడా ఆలోచించుకునే స్థితిని కూడా నాకు పోయింది.  నాకు ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా… అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నా కూడా…. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. పిల్లల చదువులు ఆగిపోయినాయి. వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రాను రాను నా పిల్లలకి నేను తిండి పెట్టలేని పరిస్థితికి వచ్చినా కూడా నా భార్య మౌనంగానే భరిస్తూ నాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశతో ఉంటుంది.  రాను రాను నాకు, నా పిల్లలకి నీ సాంగత్యం కలుగుతుందని ఆశ కలగట్లేదు.  నిరాశ కలుగుతుంది.  తద్వారా నా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు.  ఈ విరహవేదన భరించే పరిస్థితి లేకపోవడం వలన…. తట్టుకోలేకపోవటం వలన నాకు నేనే ఆత్మహత్య చేసుకోవాలి గానీ… నా కోసం నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి నాకు తీసుకురానివ్వకు.  ఆ దోషాలన్నీ కూడా నీకే వస్తాయి. ఆలోచించుకో!  అని చెప్పేసి పరమహంస పదేపదే ఆవేదన పడుతూ ఉండటం జరిగింది. ఇలా ఆవేదన భక్తిలో ఉండేసరికి పరమహంసకి ఒకసారి ధ్యానంలో రెండు శివలింగాల మధ్య ఒక స్పటిక శ్రీ చక్ర బిందువు దర్శనం అయినట్టు… ఇందులో నీలం శివుడు ప్రకృతిని చూస్తున్నట్టుగా ధ్యాన అనుభవం అయింది.  ఆ తరువాత ఈ ప్రకృతిలో ఏం జరుగుతుందో అని చెప్పి పరమహంస చూస్తూ ఉండేసరికి…. అందులో అమ్మవారు సజీవ మూర్తిగా ఉన్నట్టు, శివుడు కాస్త లేనట్టుగా కనిపించడం జరిగింది. ఇదే ధ్యాన అనుభవాన్ని జ్ఞానేశ్వరి కి చెప్పేసరికి కొన్ని రోజులు తను కూడా ధ్యానంలో ఉండేసరికి శివుడు ఉన్నారు, అమ్మవారు లేరు అని చెప్పి ధ్యాన అనుభవం అయింది అని చెప్పి పరమాహంసకి చెప్పడం జరిగింది. అదేంటి నాకు శివుడు లేడు… అమ్మవారు ఉంది అని ధ్యాన అనుభవం అయితే, నీకు శివుడు ఉన్నాడు, అమ్మవారు లేరు అని ధ్యానం అనుభవం చెబుతుంది.  ఇందులో ఏదో మనకి తెలియని తిరకాసు ఉంది. మాయ ఉంది.  అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి పరమహంస అనుకోవడం జరిగింది.  అంటే కంఠంలో శివలింగం ఉంటే శివుడు ఉన్నాడు… అమ్మవారు లేరు అనే భావన కలుగుతుందని… కంఠంలో శివలింగం లేకపోతే శివుడు లేడు, అమ్మవారు ఉంది అని చెప్పేసి భావం కలుగుతుంది అని చెప్పేసి పరమహంసకి అర్థమయింది.  అప్పుడు ఒకరోజు పురాణ ఇతిహాస గాథలు చదువుతూ ఉంటే తారకాసురుడి కంఠంలో అమృత శివలింగం ఉండటం…. దానిని కుమారస్వామి విభేదనం చేయడంతో…అది పంచ ముక్కలుగా విడిపోయి పంచ రామములుగా వెలిశాయి అనే కథ విశేషం పరమహంసని ఆకర్షించింది.  అంటే వాళ్ళకి నిజంగా ఆదిపరాశక్తి కంఠంలో ఉన్న శివలింగం తీసేసి ఉండాలి.  కాబట్టి తను ఒక స్పటిక శివ లింగమును ధరిస్తే ఏం జరుగుతుందో చూడాలి అనే ఆలోచన రాగానే… తన కంఠానికి సరిపోయే శివలింగం తీసుకొని కంఠహారంగా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు యధావిధిగా కంఠంలో శివలింగం ఉంటే శివుడు ఉన్నట్టుగాను… అమ్మవారు లేనట్టుగాను భావన లోనికి రావడం జరిగింది. కంఠంలో ఉన్న శివలింగం తీసేస్తే శివుడు లేడు, అమ్మవారు ఉంది అనే భావన కలుగుతుంది.  అంటే నిజానికి అమ్మవారు లేరు, అయ్యవారు లేరు కానీ అమ్మవారు లేనిది ఉన్నట్లుగాను…. చూపించడానికి అని కంఠంలో ఉన్న  శివ లింగం తీసేస్తుంది.  తద్వారా అయ్యవారు లేరు… స్త్రీ ప్రకృతి ఉన్నది … స్త్రీ ఆధిక్యత ఉన్నది అని చూపిస్తుంది అని పరమహంసకి జ్ఞాన స్ఫురణ అందింది.  అసలు కంఠంలో శివలింగం ఉంటే ఏం జరుగుతుంది…. లేకపోతే ఏం జరుగుతుంది…. ఇందులో ఏదో తెలియని మరణం ఉంది అని ఆయన ఇంకా తీవ్రమైన ధ్యానంనిష్ఠ లోనికి… ధ్యాన తపస్సులోనికి వెళ్లిపోవడంతో ఇక జ్ఞానేశ్వరి కాస్త టీచర్ ఉద్యోగంలోకి వెళ్లి కుటుంబ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తన భర్త యొక్క ఆధ్యాత్మిక స్థితి కొనసాగించేటట్టుగాను, తన భోగ జీవితం యోగ జీవితం నడిపే బాధ్యత జ్ఞానేశ్వరి తీసుకోవడం జరిగింది.  ఈ విషయం తెలిసి తెలియనట్లుగా పరమహంస ఉండేవాడు.  కానీ తన ధ్యాననిష్ట అలాగే కొనసాగిస్తూ ఉండటం జరిగింది. కుటుంబ బాధ్యతలు అన్ని జ్ఞానేశ్వరి తీసుకోవడం…. ఇక ఈయన నిత్య ధ్యాన తపస్సులో పూజా గదిలో పరమహంస అంకితం అవటం జరిగింది. ఎప్పటికప్పుడు తనకు కలిగిన ధ్యాన అనుభవాలను, ధ్యాన దృశ్యాలను అన్నీ కూడా ఈ సత్యాన్వేషి అనే గ్రంథంలో ఆయన పొందుపరుస్తూ రావడం జరిగింది. ఆ అనుభవాలన్నీ కూడా వీలు దొరికినప్పుడు… సమయం దొరికినప్పుడు… సాధన సందేహాలు వచ్చినప్పుడు జ్ఞానేశ్వరి ఈ గ్రంథం తీసి సందేహనివృత్తి చేసుకుంటూ ఉండేది. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితికి రాను రాను తగ్గుతూ ఉండటం జరిగింది. ఈవిడ భోగంలోనూ, యోగంలోనూ ఈవిడకి ఉన్న సమయంలో ఉండిపోవటం… ఆయనకి ఉన్న సమయం అంతా కూడా ఆధ్యాత్మిక స్థితికి ధ్యానానికి అంకితం చేసేవాడు.  ఆయన పూజాగది దాటి బయటికి రావటం అనేది రెండు విషయాల్లోనే జరిగేది.  ఒకటి భోజన సమయంలోను… రెండోది ప్రకృతి కార్యక్రమాల కోసమే… ఆయన పూజ గదిని దాటి బయటకు వచ్చేవారు.  మిగతా సమయాలలో ఆయన కుటుంబ బాధ్యతలు కాని… వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ….పట్టించుకునే స్థితి ఆయనలో లేకపోయేది. ఇక భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య మౌనస్థితి ఎక్కువ కాలం ఉండేది. ఈ స్థితి నుంచి జ్ఞానేశ్వరి తండ్రి ప్రేమను కూడా తనే తీరుస్తూ వాళ్లకి కావలసిన అవసరాలు అన్నీ కూడా తనే తీరుస్తూ….వాళ్ళ చదువులకి తనే సహాయ సహకారాలు అందిస్తూ… కుటుంబ పోషణ బాధ్యతలు అన్నీ కూడా బాధ్యతగా నిర్వహిస్తూ ఉండేది. ఇలా కొంత కాలం గడిచిన తరువాత పరమహంసలో రానురాను భక్తి మీద వైరాగ్యం కలగడం జరిగింది.  దైవం మీద విరక్తి కలగటం మొదలైంది.  స్మశాన వైరాగ్యం కలిగింది.  శివ మాయ, దేవి మాయలను కూడా మహామాయలను కూడా దాటుకుని… పరమహంస ఒక విషయాన్ని తెలుసుకోవడం జరిగింది.  కంఠంలో ఉన్న శివలింగం లేకపోతే లేని అమ్మవారు ఉన్నట్లుగాను కంఠంలో శివలింగం ఉంటే శివుడు ఉన్నట్లుగాను భ్రమ బ్రాంతి కలిగిస్తున్నారని చెప్పి పరమహంసకి రాను రాను అర్థం అవటంతో…. దైవసాక్షాత్కారాల మీద స్మశాన వైరాగ్యం రావటం మొదలయ్యింది.  ఎంతలా అంటే శివుడు ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ…. అమ్మవారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చినప్పటికీ కూడా…. వారిని పట్టించుకునే స్థితిగతులలో లేడు. రానురాను ఆకార సాధన నుంచి నిరాకార సాధనా స్థితికి ఆయన నెమ్మది నెమ్మదిగా వెళ్లిపోవడం జరిగింది. అప్పుడు శివుడు కాస్త నిరాకార స్థితిలోకి వెళుతున్నట్టు…. అమ్మవారు కాస్త నిరాకార స్థితికి వెళుతున్నట్టు ఉండడం…. ఉన్నదంతా శూన్యస్థితియే అని అనుభవ అనుభూతి పొందుతూ…. అనుభూతిలోనికి వెళుతూ ఉండేసరికి…. ఆదిపరాశక్తి కాస్త తన మాయా ప్రభావాలను చూపించడం మొదలు పెట్టింది. కుటుంబంలో మనస్పర్ధలు కలిగేటట్లు చేయటం…. గొడవలు కలహాలు, నెమ్మది నెమ్మదిగా రావడం జరిగింది. ఎందుకు అంటే శివుడు లేడు అమ్మవారు లేరు అని పరమహంస అనుభవాలు చెబుతూ ఉండేసరికి…. జ్ఞానేశ్వరి నమ్మలేకపోయింది.  తను మాయలో ఉన్నాడు అని చెప్పేసి అనుకోసాగింది.  తనకి ప్రత్యక్షంగా శివుడు కనిపిస్తున్న కూడా…. శివుడు లేడని ఎలా చెబుతున్నాడో అని… ఈయన మాయలో ఉన్నాడు… ఈయన అజ్ఞానంలో ఉన్నాడు అని చెప్పి పరమాహంస మాటలే పట్టించుకోవడం మానేసింది.  ఆయనకి గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేసింది. తన శివుడు లేడు అనే విషయం జ్ఞానేశ్వరి తట్టుకోలేకపోయింది.  తను నిత్యం శివసాంగత్యం పొందుతూ ఉంటే అది ఎలా అసత్యం అవుతుంది..? ఎలా అబద్ధం అవుతుంది అని జ్ఞానేశ్వరి పదేపదే అనుకుంటూ ఉండేది.  ఈయన జ్ఞాన మాయలో పడ్డాడు.  శివలింగం తీసివేయడం వలన… ఆవేదన చెందడం వలన… మతి భ్రమణం చెంది… దేవుడు లేడు, శివుడు లేడు, అమ్మవారు లేదు అని చెప్పేసి అనుకోవడంతో…. ఆ భావాలే కలుగుతున్నాయని….సృష్టికర్త లేకపోతే, ఆదిపరాశక్తి లేకపోతే, శివుడు లేకపోతే ఈ సృష్టిలో సృష్టి,స్థితి,లయలు కారకాలు ఎలా కలుగుతాయి?  ఇవన్నీ కూడా అసత్యాలు. కనిపించని శూన్యాన్ని సత్యమని ఈయన ఏ విధంగా చెబుతున్నాడు?  ఇదంతా కూడా ఈయన మనోభ్రాంతి, మనోమాయ. ఆవేశంతో వచ్చినవి ఇవన్నీ…. తనకి నిత్యం శివుడు కనిపిస్తున్నారని…దీనిని ఇతను తట్టుకోలేకపోతున్నాడని…ఈర్ష్య, అసూయలకి గురి అవుతున్నాడని… తన మనసు మీద దెబ్బ కొడుతున్నాడని… జ్ఞానేశ్వరి నెమ్మది నెమ్మదిగా తన భర్త యొక్క ఆధ్యాత్మిక అనుభవాలను నమ్మటం మానివేయడం జరిగింది.  ఒకపక్క భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం కొరవడడం… ఆర్థిక సమస్యలు అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రావడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గటం, కలహాలు, గొడవలు, మాట పట్టింపులు రావడం…. శివుడు లేనప్పుడు, అమ్మవారు లేనప్పుడు, ఇంకా ధ్యాన తపస్సులో ఉండడం ఏమిటి?  ఉన్నదంతా శూన్యం అన్నప్పుడు…. అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం ఎందుకు?  అని ఇక జ్ఞానేశ్వరి పదేపదే మదనపడుతూ ఆయన ధ్యానం చేసుకునే అవకాశాలను కూడా తగ్గిస్తూ..  ఆయన్ని సంపాదనలో పడి వేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం పరమహంసకి అర్థమయింది.  ఇక దానితో వీరిద్దరి మధ్య కలహాలు తారాస్థాయికి చేరుకోవటంతో …ఇంక ఆయన సన్యాసం తీసుకుని ఇల్లు విడిచి సన్యాసం తీసుకుంటానని పరమహంస కాశీ క్షేత్రం చేరుకోవడంతో ….జ్ఞానేశ్వరి మాత్రం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ…. గృహస్థాశ్రమంలో పిల్లల బాధ్యతలు నిర్వహిస్తూ తన సాధన తన కొనసాగిస్తూ…. శివసాంగత్యంలో ఉండటం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానేశ్వరి కంఠంలో స్పటిక లింగం ఆదిపరాశక్తి తీసివేసేసరికి శివుడు లేడు…. అమ్మవారు ఉంది అనే ధ్యాన దృశ్యం పొందటం జరిగింది. అప్పుడు జ్ఞానేశ్వరికి విషయం బోధపడింది.  అంటే శివలింగం ఉంటే శివుడు ఉన్నాడు… అమ్మవారు లేరు అదే శివలింగం లేకపోతే శివుడు లేడు ,అమ్మవారు ఉన్నారు అని అనుభవం అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి తన భర్త పరమహంస చెప్పింది యదార్ధమని తెలుసుకునేసరికి….. పిల్లల బాధ్యతలు తీరిపోవడంతో…. వారికి వివాహాలు పూర్తి అయ్యి ఉద్యోగాలలో ఉండేసరికి…. ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టుగా వారి కుటుంబాలతో వేరే వేరే ప్రాంతాలలో ఉండటంతో…. ఇంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు తీరిపోవటంతో…. విషయం అర్థం అవ్వటంతో జ్ఞానేశ్వరి కాస్త కాశీ క్షేత్రంలో ఉన్న తన భర్త దగ్గరికి చేరుకొని క్షమాపణలు చెప్పుకొని…. ఆయన సాంగత్యంతో గృహస్థ ఆశ్రమం నుంచి వాన ప్రస్థంలో  ఉంటూ…. వీరిద్దరూ యోగ మిత్రులుగా ఉంటూ… సాధన చేసుకోవడం ఆరంభించారు.  దానితో పరమాహంస కాస్త…

పరమహంస:- అమ్మవారు నీకు కంఠంలో ఉన్న శివలింగంలో తీసివేయలేదు.  తీసివేస్తే ఏం జరుగుతుందో అనేది నాకు కలిగిన ధ్యానం అనుభవంలో నీకు కలిగే విధంగా నేను చేయించడం జరిగింది.

జ్ఞానేశ్వరి:- మంచిది స్వామి!  నాకు అనుభవంలోకి తెప్పించడం జరిగింది.  పదార్థం దాటితేనే కదా యదార్థ జ్ఞానం తెలిసేది.  ఇప్పుడు శివలింగం అమ్మవారు తీసివేయడం వలన లేనివాడు ఉన్నట్లుగా…. భ్రమ భ్రాంతి కలిగిస్తున్నారు కదా!  అసలు ఈ భ్రమ బ్రాంతి కలిగించే ఆదిపరాశక్తి శివలింగం తీసివేయకుండా చేయలేమా..?

పరమహంస:-  చేయచ్చు కాకపోతే…. ఆవిడ ఎందుకు తీస్తుంది? తీయాల్సిన అవసరం ఏంటి?  లేని ప్రకృతి ఉన్నట్లుగాను…. లేని శివుడు…. లేని అమ్మవారు ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు అనేది…. మనం అనుభవ అనుభూతులతో తెలుసుకోవాలి…

అని అనుకుంటూ సాధన చేయడం మొదలుపెట్టారు.  దానితో జ్ఞానేశ్వరి మరియు పరమహంస కాస్త స్పటిక శివలింగాలను వేసుకోవడం జరిగింది.  పరమహంసకి హరిద్వార్ క్షేత్రం నుంచి వచ్చిన స్పటిక శివలింగం వేసుకోవడం జరిగితే…. జ్ఞానేశ్వరి కాస్త అరుణాచలం నుంచి వచ్చిన స్పటిక శివలింగం ఆరాధన చేయడం జరిగింది. తన కంఠంలో శివలింగం యధావిధిగా ఉండటంతో… మెడలో శివలింగం వేసుకోకుండా స్పటిక శివలింగ ఆరాధన చేసుకోవడం జరిగింది.  ఇక దానితో పరమహంస కాస్త జ్ఞానేశ్వరి సహాయ సహకారాలతో ఆదిపరాశక్తికి మోక్షమాయ చేయాలని చెప్పేసి…. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడేటట్లుగా…. ఆదిపరాశక్తి కాస్త పరమహంస చేసిన మాయలో పడకపోగా… ఆదిపరాశక్తి కే సవాలు విసరడం జరిగింది. ఎంతగా అంటే తన ధర్మపత్ని అయిన జ్ఞానేశ్వరి చేత కదిలే స్త్రీ ప్రకృతిని స్థిరం చేసి…. పైగా నిశ్చలం చేసి…. శూన్యం చేసే సాధన శక్తివంతురాలిగా మార్చడం జరిగింది. ఈ మోక్ష సాధనలో వచ్చే ప్రతి చిన్న మాయను పరమహంస కాస్త పక్కనే ఉండి జ్ఞానేశ్వరి తన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ విషయం ఆదిపరాశక్తికి పంచభూతశక్తులకి, ఈమె ఏకాదశ దేహాలకి…. అలాగే ఈమె ఉన్న అష్టాదశ శక్తి పీఠానికి తెలియడంతో… జ్ఞానేశ్వరి మీద, పరమహంస మీద మంత్ర,తంత్ర,యంత్ర మాయ, విష, పిశాచ, రాక్షస, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ ఇలా ఎన్నో మాయా ప్రయోగాలను చేయటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు తెలుసుకున్న జ్ఞానం లోకానికి తెలియనివ్వకుండా…. వీళ్ళ జ్ఞానం అనుభవ అనుభూతిని పొందనివ్వకుండా …..ఆదిపరాశక్తి విశ్వ ప్రయోగాలు చేయడం జరిగింది. తన భర్త అయిన శివుడు లేడు అనే విషయం లోకానికి తెలియకూడదు అని చెప్పి ఆదిపరాశక్తి, పరమహంస మరియు జ్ఞానేశ్వరి మీద ప్రయోగాలు చేయడం జరుగుతూ వచ్చింది. దానితో పరమహంస కాస్త భయపడకుండా జ్ఞానేశ్వరి  చేత ఆమె కూడా  భయపడకుండా, బాధపడకుండా, దగ్గరుండి అన్నింటికీ సమయాన గుణంగా, కాలాను గుణంగా,విచక్షణా జ్ఞానమును, వివేక బుద్ధిని మాయ రహిత స్థితిని జ్ఞాన స్ఫురణలు ఇస్తూ ఆదిపరాశక్తికి వ్యతిరేక దిశలో సాధన చేయడం జరిగింది. తాడోపేడో తెలుసుకోవాలని చచ్చిన వాడికి చావు భయం ఉండదు కదా!  ఏం జరుగుతుందో కాల నిర్ణయం…శివాజ్ఞ అని వదిలేయాలని…. ఏదైనా శివలీల విన్యాసం బట్టి ఉంటుందని….భార్య అయిన జ్ఞానేశ్వరి చేత తన సాధన చేస్తూ ఉండేసరికి….. అనుకోని పరిస్థితిలో పరిస్థితిగా అనుకుని ప్రమాదంగా పరమహంస కుడి చేయి పడిపోవడం…. కంఠంలో సమస్య వచ్చి మాట్లాడలేని పరిస్థితి రావడం….. చూపు తగ్గిపోవడంతో…. తనకి ఇంక జ్ఞాన స్ఫురణలు చెప్పలేని స్థితి  తను వచ్చాను అని అర్థం అయింది. తనకి వచ్చిన అనుభవాలను విశ్లేషణ చేసి. చెప్పలేని అయోమయ స్థితికి జ్ఞానేశ్వరి సాధన స్థితి మారటం జరిగింది. 

అర్ధాంతరంగా పరమహంసకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడంతో…. కూర్చొని సాధన చేసే పరిస్థితికి శరీరం సహకరించకపోవడంతో…..తను చేసే సాధనలో వచ్చే అనుభవాలు, ధ్యాన దృశ్యాలు, విశ్లేషణను పరమహంస చెప్పలేని పరిస్థితికి రావటం జరిగింది. దానితో జ్ఞానేశ్వరికి ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోవడం జరిగింది. కొన్ని రోజులకి పరమహంస కాస్త కాశీ క్షేత్రంలో ఉన్న గంగా నదిలో స్నానం చేస్తూ ఉండగా…. అనుకొని ప్రమాదంగా గంగా నదిలో మునిగిపోవటంతో…. ఆయన దేహం కూడా దొరకలేని స్థితికి…. జ్ఞానేశ్వరి దైవమాయని దాటలేని పరిస్థితిలో ఉండటంతో….. అక్కడ ఉండలేక… కాశీ క్షేత్రాన్ని వదిలి తిరిగి సొంత ఇంటికి వచ్చి ….ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేక…. భర్త సాంగత్యం కోల్పోవడంతో…. లేని శివుని సాంగత్యం పొందడం మీద అంటే.. శివమాయ మీద నెమ్మదిగా వైరాగ్యం రావడంతో… కాశి క్షేత్రంలో ఇమడలేక తిరిగి కాశీ క్షేత్రం నుంచి  తమ సొంత ఇంటికి రావడం జరిగింది.  పిల్లలతో సంబంధాలు కోల్పోవడంతో…. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేని…. అసలు పట్టించుకోలేని…. ఆలోచన లేని స్థితిలో జ్ఞానేశ్వరి ఉండిపోయేది.  తన భర్తను అన్ని తెలిసిన శివుడే తీసుకువెళ్లిపోయాడు. తను లేడు.. తన భార్య లేదు అని అంటే, ఆదిపరాశక్తి లేదు అని తన భర్త తెలుసుకొని అనుభవ అనుభూతులు పొందుతున్న సమయంలో…. వాటిని పొందనివ్వకుండా అలాగే తను పొందనివ్వకుండా…..భర్త ఇచ్చే సహాయ సహకారాలు అందనివ్వకుండా….సాధనని అర్ధాంతరంగా ఆపేశాడు అని చెప్పి శివుడి మీద అమ్మవారి మీద ఒక రకమైన వైరాగ్యం పెంచుకోవడం జరిగింది. ఇక రానురాను తిండి తిప్పలు నిద్రాహారాలు మానేసి…. సత్యాన్వేషిగా తన పొందిన అనుభవాలన్నీ కూడా పుస్తక రూపంలో రాసుకుంటూ కాలం గడుపుతూ ఉండటం జరిగింది. కానీ అనుభవ పాండిత్యములో ప్రపంచానికి తన కంఠంలో స్పటిక శివలింగమును తీసివేస్తే ఏం జరుగుతుంది…. ఉంటే ఏం జరుగుతుంది…. తన అనుభవాలు లోకానికి చాటి చెప్పాలి అనే ప్రయత్నం విఫలం అవ్వటంతో మనోవేదనకి గురి అవ్వటం జరిగింది. తనకి కలిగిన అనుభవాలను విడమర్చి చెప్పే తన భర్త పరమహంస లేకపోవడం పెద్ద లోటుగా అయింది. తను ఎన్ని అనుభవాలు పొందినప్పటికీ….ఎన్ని ధ్యాన దృశ్యాలు చూసినప్పటికీ…. వాటిని విశ్లేషించే జ్ఞాన శక్తి తనకి లేకపోవడంతో ….మరో జన్మ ఎత్తైన సరే విశ్లేషణ శక్తిని పొంది….. స్త్రీ ప్రకృతిని స్తంభింప చేయాలి. తన సాధన కొనసాగించాల్సిందే ….తన భర్త అనుభవాల ప్రకారంగా పురుష ప్రకృతిని స్తంభింప చేస్తే ….తన సాధన అనుభవాల పరంగా స్త్రీ ప్రకృతిని స్తంభింప చేయాలి అని సంకల్పం పెట్టుకొని….. అదే ఆలోచనలతో నిరంతరం ఉంటూ…. నిద్రాహారాలు మానివేస్తూ…. ధ్యాన తపస్సులోకి వెళ్ళిపోతూ…. అనుకొని ప్రమాదంగా దీపారాధన నిప్పు చీరకి అంటుకొని దహనం అయిపోతూ ఉండేసరికి….తన యొక్క అనుభవాలు పొందనివ్వకుండా,లోకానికి తెలియనివ్వకుండా చావడంతో…. ఎలాగైనా తను అనుభవాలు పొందాలి అని చెప్పేసి సంకల్పంగా ఇష్ట కోరికగా జ్ఞానేశ్వరి శరీర త్యాగం చేయటం జరిగింది.  కానీ ఆ కోరిక ఇష్ట కోరికగా ఉండటం వలన…. ఆకాశ శరీరంగా ఆ ఇంట్లోనే ఉండటం జరిగింది. ఎందుకంటే మరణం సహజసిద్ధమైన మరణం కాకుండా…. అసహజ మరణం ఆత్మహత్యగా మారడంతో.. తన కోరిక తీరకపోతే ఆ కోరిక కోసం ఆకాశ శరీరధారిగా ఆ ఇంటిలోనే ఆవాసం చేస్తుంది అని చెప్పి తను మరుజన్మలో తనే   శివనందిని అని చెప్పేసి శివ నందిని కి జ్ఞాన స్ఫురణ అందడం జరిగింది. అంటే తనకి స్త్రీ ప్రకృతి యొక్క అనుభవాలు, అనుభూతులు కోరికకి మూల కారణం జ్ఞానేశ్వరియే తన ఆకాశ శరీరం అని చెప్పి శివ నందినికి ధ్యానభంగం అయిన తరువాత ఆత్మ విచారణ చేసుకోవడం జరిగింది. దానితో జ్ఞానేశ్వరి ప్రేతాత్మ కాస్త ఆత్మ స్వరూపంగా విశుద్ధ చక్రంలోనికి ప్రవేశించడం జరిగింది. కొన్ని క్షణాల తరువాత శివనందినికి తెల్ల శివలింగం ముందు వెండి కుంకుమ భరిణె ఉండటం గమనించింది.  ఆ కుంకుమ భరిణలో కుంకుమ తీసివేస్తే అందులో మధ్యలో ఒక తెల్లని శివ లింగం ఉండటం జరిగింది. అది తనకి మొదట వచ్చిన శివలింగం అని చెప్పేసి శివ నందిని తీసుకోవడంతో…. పెద్ద శివలింగం కాస్త చిన్న శివలింగంలా మారడంతో…. తెల్ల శివలింగమును దైవిక వస్తువుగా తనలో ఇముడ్చుకుని లేచి నిలబడే సరికి విషయం తెలుసుకున్న రుద్ర స్వామి కాస్త ఆ అస్థిపంజరం మీద నూనె పోసి దహనం చేయడంతో… అస్థిపంజరం కాస్త బూడిదగా మారడం జరిగింది. దానితో జ్ఞానేశ్వరి యొక్క ఇష్ట కోరిక తీరే మార్గం దొరకటంతో…. ప్రేతాత్మ శక్తి కాస్త ఆత్మ శక్తిగా మారి తన విశుద్ధ చక్రంలోనికి ప్రవేశించింది అని శివనందిని గ్రహించడం జరిగింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ మౌనంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి బీమా శంకర ఆలయానికి యధావిధిగా చేరుకొని…. అక్కడ ఉన్న పిల్లలకి, మహాదేవికి తన శివలింగం చూపించి… దాని వెనుక ఉన్న గాధ మహాదేవికి విడమర్చి చెప్పడం జరిగింది. ఇక దానితో ఆకాశ శరీరం యొక్క తత్వం పూర్తి అయ్యింది అని చెప్పేసి చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం కార్యక్రమం పూర్తి అయిందని…ఇక్కడి సాధన పరిసమాప్త అయిందని శివ నందిని చెప్పడంతో…. అమ్మ మరి!  ఆ తర్వాత వచ్చే ఏ క్షేత్రానికి మనం వెళ్ళవలసి ఉంటుంది అని  మహాదేవి అడిగేసరికి బాల కుమారస్వామి:-  నాకు తెలిసినంతవరకు శబ్ద పాండిత్యంలో ఆజ్ఞ చక్రానికి కాశీ క్షేత్రం అని చెబుతారు. బహుశా!  అది క్షేత్రానికి వెళ్లాలని ఆధారాలు చెబుతాయేమో!

బాల గణపతి:- బాలగణపతి కాస్త అవునా?  నిజమా?  మనం కాశీ క్షేత్రానికి వెళతామా?  ఎన్ని సంవత్సరాలు అయిందో.?  కాశీని చూసి… ఆ గంగను చూసి… ఆ ఘాట్ లని… ఆ మనుషులని చూసి… అయితే కాశి క్షేత్రం అయితే నేను వచ్చేస్తాను… వెళతాను…

రుద్ర స్వామి:- ఆగాగు!  సాధనా మూర్తి ఏ ఆధారాలు చూపిస్తుందో…. ఏ క్షేత్రానికి తీసుకు వెళ్తుందో…. ఎవరికి తెలుసు?

అని చెప్పి అనేసరికి… సరే అని  తెల్ల శివలింగం ఇవ్వమని చెప్పి  దానిని కుడివైపు ఉన్న పద్మంలో బాల గణపతి  తెల్ల శివలింగం అని పెట్టేసరికి… సాధన విగ్రహ మూర్తి భ్రుకుటి స్థానంలో ఉన్న ఆజ్ఞా చక్రం ఒక్కసారిగా తిరగటంతో…. అమ్మ ! ఈ చక్రం జాగృతి అయ్యింది…అనేసరికి ఆ ఆజ్ఞ చక్రం నుంచి ఒక  రాగి రేకు బయటికి రావటంతో…. ఆ రాగి రేకులోని ఆధారాలను చదవడం ఆరంభించారు. 


విశ్వానికి మధ్య బిందువుగా ఉంటాను. 

ఇద్దరు సతులతో ఉంటాను…

పంది రాత్రివేళ కాపలా కాస్తుంది …

 కుక్క క్షేత్రపాలకుడిగా ఉంటుంది ….

84 భాగాలతో ఉంటాను… 

ఇక్కడ మరణమే మోక్షక్షేత్ర మరణం.

నా దగ్గరికి చచ్చేవాళ్ళు, చచ్చిన వాళ్ళు వస్తారు. 

ప్రతినిత్యం దహనాగ్ని జరుగుతూనే ఉంటుంది. 

కనుబొమ్మల మధ్య చక్రవాసం. 

ఇది చదవగానే బాలగణపతి కాస్త…

బాల గణపతి:- అన్నయ్య నువు చెప్పింది నిజమే. విశ్వానికి మధ్య బిందువు కాశీయే కదా! అక్కడ ఉండేది ఇద్దరు సతులు అంటే, అన్నపూర్ణ…. విశాలాక్షి కదా ! పంది రాత్రిv వేళ కాపలా కాయడం అంటే…. వారాహి దేవి కాపలా కాస్తుంది.  కుక్క క్షేత్రపాలకుడు అంటే కాలభైరవుడు క్షేత్రపాలుకుడిగా ఉంటాడు కదా!  84 భాగాలు అంటే 84 ఘాట్ లు ఉంటాయి కదా!  ఇక్కడ మరణం సప్తమోక్ష పట్టణాలలో క్షేత్రమరణమే కదా!  అలాగే చచ్చేవాళ్ళు, చచ్చిన వాళ్ళు రావడం అంటే చచ్చిన వాళ్ళు పిండాల రూపంలో వస్తే…. చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో రావడం జరుగుతుంది కదా!  ప్రతినిత్యం దహనాగ్ని జరగడం అంటే ప్రతినిత్యం మణికర్ణిక ఘాట్ లోను, హరిశ్చంద్ర ఘాట్ లోను శవాలు దహనం అవుతూ ఉంటాయి కాబట్టి దహనాగ్ని అనుకోవచ్చును.. కనుబొమ్మల మధ్య చక్రవాసం అంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞ చక్రం ఉంటుంది కదా!ఆజ్ఞ చక్రంలోనే కదా కాశి క్షేత్రం ఉంటుంది…

అని చెప్పేసి బాల గణపతి, బాల కుమారస్వామి విశ్లేషణ చేస్తూ చెబుతూ ఉండేసరికి ….ఈ విషయం ఎప్పుడో పెద్దలు గ్రహించినప్పటికీ… కూడా పిల్లలు చెబుతారా లేదా?  అని ఆసక్తిగా చూడటం జరిగింది.ఇక  దానితో మళ్ళీ ఆఖరి దర్శనంగా భీమా నదిలో స్నానం చేసి భీమశంకరుని దర్శనం చేసుకుని ఆయన అనుమతి పొంది… శివ నందిని కాస్త ధ్యానంలో కూర్చోవడం జరిగింది . క్షణకాల ధ్యాన దృశ్యంగా కాశీకేత్రం, గంగానది ప్రవాహం, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, కనిపించేసరికి…. ఇక ఆజ్ఞా చక్ర సాధన కోసం కాశీ క్షేత్రం వెళ్ళాలి అని చెప్పేసి నిశ్చయం చేసుకోవడం జరిగింది. ఇక్కడే తన  ఆత్మ శరీరం కూడా జాగృతి, శుద్ధి, ఆధీనం అవుతుందన్నమాట!  మొదట్లో తాను ఏమీ తెలియకుండానే కాశీ క్షేత్రానికి చేరుకోవడం జరిగితే…. ఇప్పుడు ఆజ్ఞా చక్రం యొక్క జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం అలాగే ఈ చక్రం యొక్క శరీరమైన ఆత్మ శరీరం జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం సాధన చేసుకోవాలి అని అర్థం అవ్వటంతో… ఇక అక్కడ హోటల్ గది తీసుకోవాల్సిన అవసరం లేదు… ఎందుకంటే ఇప్పుడు తను సన్యాసి కావడంతో… ఆ ఘాట్లలో శుభ్రంగా పడుకోవచ్చు, తిరగవచ్చు, … ఆశ్రమంలో భోజన సదుపాయం ఉండనే ఉంటుంది.  అలాగే రుద్రస్వామి, మహాదేవికి ఈ క్షేత్రం కొట్టినపిండి కాబట్టి ఏ సమస్య ఉండదు అని శివ నందినికి అర్థం అయింది. ఇక అందరి ధ్యానాలు పూర్తి అయినాయని… టిఫిన్లు చేసుకుని గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం జరిగింది..ఇలా విశ్రాంతి తీసుకుని ఇంకా ప్రయాణానికి సమయం ఉంది కదా… మళ్ళీ నది స్నానానికి వెళదాము అని అనుకుంటూ ఉండగా …. శివ నందిని కాస్త గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటాను అని చెప్పడంతో… మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ నది స్నానానికి వెళ్ళటం జరిగింది. ఈ నది స్నానానికి వెళ్ళిన తరువాత స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత అనుకొని అవాంతరంగా కృష్ణస్వామి మరియు యోగాంబికా వచ్చి మహాదేవి, రుద్ర స్వామినీ, తమ మంత్రబలంతో దిబ్బందనం చేసి… పిల్లలని తాళ్ళతో బంధనం చేసి…. నలుగురిని కూడా తీసుకుపోవటం జరిగింది. గదిలో ఉన్న శివ నందినికి వీళ్లు ఎంతసేపటికి రాకపోయేసరికి… ఏదో అనుమానభయం కలిగి ధ్యానంలో చూసేసరికి ధ్యాన దృశ్యంగా ఒక కొండ గుహలో కృష్ణ స్వామి, మరియు యోగాంబిక వీళ్ళని దాచి ఉంచారని కనిపించేసరికి…. ఇన్నాళ్లు వస్తువులు ఎక్కడ ఉంచాం అనేది మాత్రమే కనిపించేది. ఇవాళ విచిత్రంగా వీళ్ళు ఎక్కడ బంధింపబడ్డారు.?ఎక్కడ బంధింపబడ్డారు?  ఏ విధంగా బందింపబడ్డారని కనపడుతూ ఉండేసరికి…. అదే విధంగా ఈ నలుగురు కూడా మాట్లాడుతూ ఉన్న మాటలు వినపడుతూ ఉండేసరికి… ఆశ్చర్యం వేసి తన మాటలు కూడా వీళ్ళకి వినపడతాయా అని అనుమానంతో…. వాళ్ళ ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడుతుందో… అదే విధంగా మాట్లాడిన మాటలు వినేసరికి అమ్మ ! నువ్వు కూడా వచ్చావా? నిన్ను కూడా బంధనం చేశారా? నువ్వు కనిపించడం లేదేంటి?  నిన్ను పక్క గదిలో పెట్టాడా? అని బాలగణపతి అనేసరికి… లేదు, నేను మన హోటల్ గదిలోనే ఉన్నాను.. మిమ్మల్ని బంధనం చేశారని ధ్యాన దృశ్యం కనబడుతుంది అనేసరికి… మేము బంధనం అయ్యామన్న విషయం నీకు ఎలా తెలుసు?  ఎలా కనపడుతుంది?  అనేసరికి…. ఈ విధంగా మిమ్మల్ని తాళ్లతో బంధనం చేశారు….కదా! అనేసరికి అవునమ్మా ! అంటే ఈ గదులు ఇలా ఇలా  ఉన్నాయి అని చెప్పేసరికి…. అవును!  ఈ గదిలో ఇలాగే ఉన్నాయి…నువ్వు చూస్తున్నది నిజమే!  అని చెప్పేసరికి అక్కడ ఉన్న కిటికీలో నుంచి చూస్తే కొండప్రాంతం కనబడుతుందా! చెట్లు కనపడుతున్నాయా? అనేసరికి ఆ కనపడుతున్నాయి… అని బాలగణపతి అనేసరికి, నేను మీ దగ్గరికి వస్తాను. మిమ్మల్ని రక్షిస్తాను అనేసరికి…. అయినా మా మాటలు నీకు ఎలా వినపడుతున్నాయి..?  నీ మాటలు మాకు ఎలా వినపడుతున్నాయో ?  మేము ఉన్న చోటు నీకెలా కనపడుతుందో.? అంటే శివ నందిని కాస్త తనకు ధ్యానంలో కనిపించిన ధ్యాన దృశ్యం ప్రకారంగా మనోజప సిద్ధితో  వాళ్ళు ఉన్న  ప్రాంతానికి చేరుకోవటం జరిగింది. గది బయట కృష్ణ స్వామి మరియు యోగాంబిక కూర్చొని ఉన్నారు. కృష్ణస్వామి చేతిలో ఖడ్గం, యోగాంబిక చేతిలో త్రిశూలం ఉండడం… శివ నందిని గ్రహించింది.  అప్పుడు శివ నందిని రాకని గమనించిన కృష్ణ స్వామి కాస్త ఉధృతుడై …

కృష్ణ స్వామి:- నీకెలా ఎలా తెలిసింది ఇది ,  నీకున్న సిద్దుల ద్వారా ఇక్కడికి రావడం జరిగిందా?  అందరిని కలిపి చంపేస్తాను.  ముందు నేను చంపితే ఆ ప్రాణ భయముతో వాళ్ళంతట వాళ్లే చచ్చిపోతారు.  ముందు  నిన్ను సంహారం చేయాలి!  ముందు నీ కంఠంలో ఉన్న స్పటిక శివలింగం పీకాలి… ఆదిపరాశక్తి ఊరుకోవట్లేదు… మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు.. వెంటాడుతుంది …వేటాడుతుంది… నీ కంఠంలో ఉన్న స్పటిక శివలింగం పీకేసి… దానిని  భేదనం చేయాల్సిందే!  దానిని ముక్కలు చేయాల్సిందే!  దానిని ముక్కలు చేసేదాకా నిద్రపోము…

అని కత్తితో దాడి చేసేసరికి… శివనందిని కాస్త లాఘవంగా తప్పుకొని….తనకి వచ్చిన సిద్దులతో సూక్ష్మతి సూక్ష్మంగాను మారిపోయేసరికి…. కృష్ణస్వామి మరియు యోగాంబికకి కనిపించకపోయేసరికి…. ఏమున్నది? అణువుగా మారింది అని తెలుసుకునే సరికి ….దానికేనా సిద్ధులు ఉన్నది?  దానికే నా శక్తులు ఉన్నది?  నాకు కూడా ఉన్నాయని చెప్పేసి కృష్ణస్వామి కూడా అణువుగా మారేసరికి… అణువుగా ఉండి శరీరాలు కొట్టుకునే పరిస్థితికి వచ్చేసరికి…. ఒక్కసారిగా శివ నందిని కాస్త ఉగ్రరూపంగా, రౌద్రరూపంగా తన శరీరాన్ని విశ్వరూపంగా మార్చేసరికి… అంతే విధంగా యోగాంబిక కూడా తన శరీరమును అదే విధంగా మార్చేసరికి…. రెండు పర్వతాలు కొట్టుకుంటున్నాయా అన్నట్టుగా, పర్వత శిఖరాలు యోగాంబిక, శివనందిని ముష్టి ఘాతాలతో కొట్టుకోవడం జరిగింది. ఈ లోపల కృష్ణస్వామి కూడా తన శరీరమును పర్వతాకారంగా పెంచి శివ నందిని మీద ఏకకాలంలో దాడి చేయడం చేసే సరికి…. ఆ దాడికి తట్టుకోలేక…. శివ నందిని కాస్త సహజ స్థితిలోనికి శరీరం రావటం జరిగింది. అప్పుడు రుద్ర స్వామి కాస్త…. అమ్మా! నీ దగ్గర ఉన్న డమరుకంతో నాదం చెయ్యి. ఆ నాదానికి భూత పిశాచాలు తట్టుకోలవు. ఆ శబ్ద నాదానికి ఏ శక్తులు నిలబడవు అని చెప్పి సలహా ఇవ్వటంతో… శివ నందిని తన శరీరంలో అదృశ్యంగా దాచుకున్న డమరుకాన్ని బయటకు తీసి…. విపరీతంగా మోగించేసరికి… ఆ శబ్దనాదానికి…. తరంగాలకు యోగాంబిక, కృష్ణస్వామి తట్టుకోలేక పిచ్చి పట్టినట్టు అరుస్తూ….. ఆ ఢమరుక నాదాన్ని ఆపు!  లేదంటే నిన్ను సంహారం చేస్తాము అంటూ….తన దగ్గరికి రావాలన్న శబ్ద తరంగాలకు రాలేక ….అవస్థలు పడుతూ తట్టుకోలేక….. తమ చేతిలో ఉన్న ఆయుధాలను వదిలివేసి… నేలమీద పడి విల విలలాడుతూ మా వల్ల కావడం లేదు!  ఏ శబ్దనాద తరంగాలు తట్టుకోవడం మాదేహం వల్ల కావడం లేదు…. నిన్ను ఏమీ చేయము… మమ్మల్ని వదిలిపెట్టు…. మాకు ప్రాణ బిక్ష పెట్టు అని వేడుకుంటున్న గాని …శివనందిని తీవ్రమైన ఆవేశానికి గురి అవుతూ…. ఢమరుక నాదాన్ని అలాగే మ్రోగిస్తూ ఉండేసరికి…. వీళ్ళిద్దరి చెవుల్లో నుంచి రక్తధారలు కారటంతో…. చెవులు మూసుకుంటున్నప్పటికీ కూడా తనకి శరీరంలోనికి ఈ నాద ప్రకంపనం తట్టుకోలేక…. అక్కడి నుంచి అదృశ్యం అవడం క్షణకాలంలో జరిగింది. ఆ తర్వాత శివ నందిని కాస్త యధావిధిగా అదృశ్య శక్తి తో డమరుకం శరీరంలో నిక్షిప్తం చేసుకొని… వీళ్ళకి బంధనం నుంచి విముక్తి చేసి…. రుద్ర స్వామి తో శివ నందిని:- అయ్యా ! మీకు తెలియని విద్య కాదు… కేవలం తాళ్లతో బంధించిన అంత  మాత్రాన మీరు బందీ ఎందుకు అయ్యారు?

అనేసరికి అప్పుడు రుద్రస్వామి కాస్త చిరునవ్వుతో….

రుద్రస్వామి:-అమ్మ నీకు విశుద్ధ చక్రంలోని ఆకాశ శరీర జాగృతి,శుద్ధి అయ్యింది కదా!  నీకు ఏ సిద్ది వస్తుందో….. తెలుసుకోవాలనిపించింది.  అందుకని సంకెళ్లతో బంధించినా ….తాళ్లతో బంధించినా ….. బందీ అయ్యి వచ్చాను ఏ సిద్ధి వచ్చిందో  తెలుసుకోవాలనుకున్నాను. ఈ శక్తితో దర్శనా సిద్ధి వచ్చిందని అవగతం అయింది.

శివ నందిని:- సిద్ధులు వచ్చాయో… లేదో తెలుసుకోవడానికి ఎంత ప్రాణం మీదకి తెచ్చుకునేవి చేయాలా?  ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యత వహించే వాళ్ళు….. మన వల్ల చిన్నపిల్లలు ఇబ్బంది పడకూడదు కదా!  మన వల్ల ప్రాణాలు పోకూడదు కదా!

అంటే అమ్మ మాకు కూడా ఎంతోకొంత సిద్ధులు ఉన్నాయి.  మేం కూడా మాయమయ్యే వాళ్ళము.  రుద్రయ్య చెప్పినట్టు నీకు సిద్ధులు ఏమి వచ్చాయో తెలుసుకోవాలనిపించింది.  ఈ సిద్దులు ఏం వచ్చినాయో….. వచ్చినప్పుడు మీకు చెబుతాను కదా! ఇలా సిద్దుల కోసం అని ప్రాణాల మీదకి ఇంక ఎప్పుడు తెచ్చుకోకండి…అనేసరికి… ఇక అందరూ అక్కడి నుంచి బయలుదేరి గదికి చేరుకున్నారు.ఇక అక్కడి నుంచి కాశీ క్షేత్రానికి బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత విమానయానంలో ఉన్నప్పుడు  ఈ కాశీ క్షేత్రం స్థలపురాణం గురించి…. ఇతిహాస పురాణాలలో ఏముందో చెప్పమని…. తనకు తెలియదని బాలగణపతి,బాల కుమారస్వామి అడిగేసరికి ఇక అప్పటికే ఈ విషయం జ్ఞానం శివనందిని పొందడంతో ఇక చెప్పడం ప్రారంభించింది


కాశీ క్షేత్ర విశేషాలు:- 

భారతదేశం అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. వాటిలో కాశీ క్షేత్రానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కాశీని వారాణసి, బనారస్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. గంగానది ఒడ్డున వెలసిన ఈ పవిత్ర నగరం వేల సంవత్సరాలుగా భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం కాశీ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రంగా భావించబడుతుంది. అందువల్ల దీనిని “శివుని నగరం”, “అవిముక్త క్షేత్రం”, “మోక్షనగరి” వంటి పేర్లతో భక్తులు గౌరవిస్తారు.

“కాశీ” అనే పదానికి ప్రకాశించే స్థలం అని కూడా చెప్పడం జరుగుతుంది.  ఆధ్యాత్మికంగా చూస్తే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని అందించే క్షేత్రంగా కాశీని చెప్పడం జరుగుతుంది.  పురాణాల ప్రకారం పరమశివుడు కాశీని విడిచిపెట్టని కారణంగా దీనిని అవిముక్త క్షేత్రంగా పేర్కొన్నారు. కాశీ గురించి అనేక పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు తరతరాలుగా ప్రజల్లో కొనసాగుతున్నాయి. కాశీకి ప్రధాన ఆరాధ్యదైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 7వ జ్యోతిర్లింగంగా పూజించబడే కాశీ విశ్వనాథుడు ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తాడు. “విశ్వనాథుడు” అంటే విశ్వానికి నాథుడు అని అర్థం. కాశీకి వచ్చే భక్తులు విశ్వనాథుని దర్శనాన్ని తమ యాత్రలో అత్యంత ముఖ్యమైన భాగంగా భావిస్తారు. ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయం 18వ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఆధ్వర్యంలో పునర్నిర్మించబడింది. తరువాత ఆలయ శిఖరాలకు బంగారు పూత సమర్పించబడింది. నేడు కాశీ విశ్వనాథ ధామ్ ఆలయాన్ని గంగానది తీరంతో అనుసంధానిస్తూ భక్తులకు అనుకూలంగా అభివృద్ధి చేయబడింది.

కాశీ మహిమలో గంగానది కి ప్రత్యేక స్థానం ఉంది. గంగానది భారతీయ సంస్కృతిలో పవిత్రతకు ప్రతీకగా భావించబడుతుంది. కాశీ గంగాతీరంలో ఉండటంతో గంగాస్నానం, గంగాదర్శనం, గంగాజలాన్ని ఇంటికి తీసుకెళ్లడం వంటి సంప్రదాయాలు ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందాయి. భక్తుల విశ్వాసం ప్రకారం గంగానది పవిత్రమైనది మరియు గంగాతీరంలో ప్రార్థనలు చేయడం శుభప్రదమైనదిగా భావిస్తారు.

కాశీ ఘాట్ లకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. గంగానది వైపు దిగే మెట్లను ఘాట్లు అంటారు. కాశీలో అనేక ప్రసిద్ధ ఘాట్లు ఉన్నాయి. వాటిలో దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, అస్సీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ముఖ్యమైనవి. దశాశ్వమేధ ఘాట్ సాయంత్రం జరిగే గంగా హారతికి ప్రసిద్ధి చెందింది. దీపాలు, ధూపదీపాలు, మంత్రోచ్ఛారణలు, గంటల ధ్వనులతో గంగమ్మకు హారతి సమర్పించే దృశ్యం భక్తులను ఆకట్టుకుంటుంది.మణికర్ణిక ఘాట్ కాశీలోని ప్రాచీనమైన ఘాట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే సంప్రదాయం ఉంది. పురాణ విశ్వాసాల ప్రకారం మణికర్ణికకు పరమశివునితో ప్రత్యేకమైన సంబంధం ఉంది. అందువల్ల దీనిని మోక్షంతో అనుసంధానించే ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. హరిశ్చంద్ర ఘాట్ కూడా అంత్యక్రియలకు ప్రసిద్ధి చెందిన ఘాట్. సత్యనిష్ఠకు ప్రతీకగా చెప్పబడే రాజా హరిశ్చంద్రుని కథతో ఈ ఘాట్ పేరు అనుసంధానించబడింది. కాశీలో కాలభైరవ స్వామి ఆలయానికి కూడా విశిష్టమైన స్థానం ఉంది. కాలభైరవుడిని కాశీ క్షేత్రపాలకుడిగా భక్తులు భావిస్తారు. అందువల్ల ఆయనను “కాశీ కోత్వాల్” అని కూడా పిలుస్తారు. కాశీకి వచ్చిన భక్తులు విశ్వనాథునితో పాటు కాలభైరవ స్వామిని దర్శించుకోవడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు.కాశీ క్షేత్ర రక్షణలో భైరవ ఆరాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాశీ సంప్రదాయంలో అష్టభైరవుల ఆరాధన ప్రసిద్ధి చెందింది. సాధారణంగా చెప్పే అష్టభైరవుల పేర్లు వరుసగా అసితాంగ భైరవుడు,రురు భైరవుడు,చండ భైరవుడు,క్రోధన భైరవుడు,ఉన్మత్త భైరవుడు,కపాల భైరవుడు,భీషణ భైరవుడు,సంహార భైరవుడు.

అన్నపూర్ణాదేవి ఆలయం కూడా కాశీ యాత్రలో ముఖ్యమైనది. అన్నాన్ని, ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తారు. పురాణ కథనాల ప్రకారం పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో జగత్తుకు అన్నాన్ని ప్రసాదించినట్లు చెబుతారు. అందువల్ల అన్నపూర్ణాదేవిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.కాశీ శైవక్షేత్రంగానే కాకుండా శక్తి ఆరాధనకు కూడా అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పురాణ సంప్రదాయం ప్రకారం, సతీదేవి దేహం అనేక భాగాలుగా భూమిపై పడిన ప్రదేశాలను శక్తిపీఠాలుగా భావిస్తారు. ఆ శక్తిపీఠాలలో కాశీలోని విశాలాక్షి అమ్మవారి క్షేత్రం కూడా ఒకటిగా పూజించబడుతుంది. అందువల్ల కాశీ ఒకవైపు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రంగా, మరోవైపు శక్తిపీఠంగా విశిష్టతను పొందింది.కాశీలోని విశాలాక్షి అమ్మవారిని జగన్మాత స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. శక్తి సంప్రదాయంలోని కొన్ని పురాణ సంప్రదాయాల ప్రకారం సతీదేవి యొక్క చెవి ఆభరణం లేదా కర్ణభూషణం పడిన ప్రదేశంగా కాశీని పేర్కొంటారు. అయితే శక్తిపీఠాల జాబితాలు, సతీదేవి అవయవాలకు సంబంధించిన వివరాలు వివిధ పురాణ మరియు తాంత్రిక సంప్రదాయాలలో కొంత భిన్నంగా కనిపిస్తాయి.విశాలాక్షి అమ్మవారి ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మీర్ ఘాట్ ప్రాంతంలో ఉంది. విశాలమైన దృష్టి, అపారమైన కరుణ కలిగిన తల్లిగా అమ్మవారిని భక్తులు భావిస్తారు. విశ్వనాథుడు శివతత్త్వానికి ప్రతీక అయితే, విశాలాక్షి అమ్మవారు శక్తితత్త్వానికి ప్రతీకగా భావించబడతారు. అందువల్ల కాశీలో శివ–శక్తుల ఆరాధన ఒకే పవిత్ర క్షేత్రంలో కలిసినట్లు భక్తులు భావిస్తారు.కాశీని దర్శించే భక్తులకు విశ్వనాథుని దర్శనం ఎంత ముఖ్యమో, విశాలాక్షి అమ్మవారి దర్శనం కూడా అంతే పవిత్రమైనదిగా భావించబడుతుంది. శివుడు మరియు శక్తి అవిభాజ్యమైనవారనే భారతీయ ఆధ్యాత్మిక భావనకు కాశీ ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది.కాశీలోని శ్రీ బిందు మాధవ స్వామి ఆలయం పంచగంగాఘాట్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఇది కాశీ యొక్క శైవ సంప్రదాయంతో పాటు వైష్ణవ సంప్రదాయ వైభవాన్ని కూడా తెలియజేసే ముఖ్యమైన ఆలయం.కాశీకి వచ్చే భక్తులు సంకటమోచన్ హనుమాన్ ఆలయం, దుర్గాదేవి ఆలయం, తులసీ మానస్ మందిరం వంటి ఇతర ప్రసిద్ధ ఆలయాలను కూడా దర్శిస్తారు. గంగానదిలో పడవ ప్రయాణం కూడా కాశీ యాత్రలో ఒక ప్రత్యేక అనుభవం. ముఖ్యంగా ఉదయం సూర్యోదయ సమయంలో గంగానదిలో పడవలో ప్రయాణిస్తూ ఘాట్లు, ఆలయాలు మరియు గంగాతీరంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.కాశీలో గణపతికి కూడా చాలా విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఢుండి గణపతి, సాక్షి వినాయకుడు వంటి ఆలయాలు కాశీ యాత్రలో ప్రాధాన్యం పొందిన దేవాలయాలు. ఇంకా కాశీలో 56 వినాయక క్షేత్రాలు అనే సంప్రదాయం కూడా ఉంది. వీటిని కాశీ క్షేత్రంలోని వివిధ దిక్కులు, ప్రాంతాలకు రక్షకులుగా భావిస్తారు.కాశీలో దుర్గాదేవి ఆరాధన కూడా ముఖ్యమైనది. కాశీ సంప్రదాయంలో నవదుర్గల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే నవదుర్గ స్వరూపాలను నవరాత్రి సందర్భాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు.కాశీ పితృకర్మలకు కూడా ప్రసిద్ధి చెందింది. గంగాతీరంలో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం, శ్రాద్ధం వంటి కార్యక్రమాలను కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. కాశీకి సంబంధించిన మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక విశ్వాసం మోక్షం. “కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది” అనే విశ్వాసం హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే కాశీని మోక్షనగరిగా భావిస్తారు.కాశీ పరిసరాల్లోని సారనాథ్ కూడా చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ప్రదేశం. బౌద్ధ సంప్రదాయం ప్రకారం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన మొదటి ధర్మోపదేశాన్ని సారనాథ్‌లో ఇచ్చాడు. అందువల్ల కాశీ యాత్రకు వచ్చే వారు సమయం ఉంటే సారనాథ్‌ను కూడా సందర్శిస్తారు.కాశీ కేవలం ఒక మతపరమైన క్షేత్రం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలు, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కూడా ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. శతాబ్దాలుగా అనేక మంది పండితులు, కళాకారులు, సాధువులు, భక్తులు కాశీని తమ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక జీవితంలో భాగంగా చేసుకున్నారు. కాశీ నగరంలో ఒకవైపు దేవాలయాల గంటలు, మరోవైపు గంగానది ప్రవాహం, ఘాట్లపై జరిగే పూజలు, సాయంత్రం గంగా హారతి, మరోవైపు జీవితం మరియు మరణం గురించి మనిషికి గుర్తుచేసే మణికర్ణిక ఘాట్—ఇవన్నీ కలిసి కాశీకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని ఇచ్చాయి. ఇక్కడికి వచ్చే వ్యక్తి కేవలం ఒక నగరాన్ని సందర్శించిన అనుభూతితో కాకుండా, జీవితం గురించి ఆలోచించే అనుభూతితో తిరిగి వెళ్తాడు అని భక్తుల విశ్వాసం గా చెప్పడం జరుగుతుంది అని శివ నందిని చెప్పడం జరిగింది. 

శుభం భూయాత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి