విశుద్ధ చక్రము (119)

 విశుద్ధ చక్రము 

సాధన కుటుంబం కాస్త కాశ్మీర్ క్షేత్రంలోని శారదా దేవిని దర్శించుకోవడానికి విమాన మార్గం ద్వారా ప్రయాణించడం జరిగింది. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని ఉండగా…. ఉన్నట్టుండి శివనందిని నవ్వడం ఆరంభించింది.  మహాదేవి గమనించి…

మహాదేవి:-  ఎందుకు నవ్వుతున్నావు? 

శివ నందిని:- రుద్రస్వామి చేసిన పనికి నవ్వొచ్చింది…

మహాదేవి:- ఏం పని చేశాడు…. ఏమన్నా కొంపలు కూల్చే పని ఏమైనా చేశాడా?  లేక ఆడదానితో తప్పుగా ప్రవర్తించాడా?  ఈ విమానాశ్రయంలో…..

శివ నందిని:- చ చ …. అలా కాదు …నిజానికి మనం కాశ్మీర్లో ఉన్న శారదాదేవి ఆలయాన్ని దర్శించడానికి అనుమతి కావాలి.

మహాదేవి:- ఎందుకు అనుమతి తీసుకోవడం…?

శివ నందిని:- అది పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి వెళ్ళటం జరిగింది.  పాక్ అధికారుల అనుమతి కావాలి…. అని నాకు ఇంటర్నెట్ ద్వారా తెలిసింది.  దానితో నేను పాక్ అధికారులకి అర్జీ పెట్టుకోవడం జరిగింది. దానికి వాళ్ళు ఎన్నిసార్లు అనుమతి అడిగినా ఏమి ఇవ్వకపోయేసరికి…. ఏమి చేయాలో అర్థం కాలేదు.  ఈ విషయం రుద్ర స్వామికి చెప్తే…

సరే అమ్మ!  నువ్వు నాతో పాటు రా!  అధికారులతో నేను మాట్లాడతాను అనేసరికి… నేను, రుద్ర స్వామి వెళ్లడం జరిగింది. రుద్ర స్వామి కాస్త ఎంత అడిగినా కూడా అధికారి అనుమతి ఇవ్వలేదు. దానితో రుద్రస్వామి ఏవో మంత్రాలూ చదువుతూ అతని వంక తీక్షణంగా చూసేసరికి…. అతను కాస్త స్తంభన అయిపోయి…. రుద్రస్వామి చెప్పినట్లుగా అనుమతి పత్రాల మీద వాళ్ళ దేశముద్ర వేయడంతో అనుమతి దొరికింది. ఆ పత్రాలు తీసుకుంటూ ఇతను 48 నిమిషాలు మాత్రమే నా స్తంభనంలో ఉంటాడు…. ఆ తర్వాత యథాస్థితికి సహజస్థితికి వస్తాడు… అప్పుడు గొడవలు జరుగుతాయి… ఈలోగా మనం వెళ్లిపోవాలి అని చెప్పేసి మేమిద్దరం ఒక విధంగా ఆ అనుమతి కాగితాలు తీసుకొని ఆఫీసు నుంచి బయటకు రావడం జరిగిన కొద్ది క్షణాలకి,  నేను అనుమతి ఇవ్వలేదు…. వాళ్లేదో నా మీద ప్రయోగం చేశారు. వెంటనే వాళ్ళని అరెస్టు చేయండి అని అధికారుల మాటలు మాకు వినపడటంతో… మేము ఆటో ఎక్కేసి వచ్చేసాము. ఆ తర్వాత మాకు వాళ్ళ నుంచి ఎలాంటి సమస్య రాలేదు. మేము మంచికే చేశాము,  కానీ వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. రుద్ర స్వామి మంత్ర ప్రయోగం వలన అనుమతి దొరికింది. ఆ సంఘటన గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది….

అనేసరికి ఇదంతా వింటున్నా పిల్లలు కాస్త… అమ్మ ఇప్పుడు శారదాదేవి ఆలయం పాకిస్తాన్లో ఉన్నదా? అంటే…. నిజానికి అది మన భారత దేశంలోనే ఉంది. భారతదేశంలో విభజన కార్యక్రమంలో 76 సంవత్సరాల క్రితం అది పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది. Pok ప్రాంతంలోకి వెళ్ళింది అనేసరికి…. ఇప్పుడు మరి అక్కడ పూజలు జరుగుతున్నాయా?అని బాల కుమారస్వామి అనేసరికి…. 70 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు జరగట్లేదు. అక్కడ ఆలయం ఉండి గోడలు మాత్రమే ఉన్నాయి. విగ్రహ మూర్తి కూడా లేదు. ఏమైందో కూడా ఎవరికీ తెలియదు అని చెప్పేసి అనేసరికి…. మాకు ఆ స్థల పురాణ విశేషాల గురించి చెప్పవా? అని అడిగేసరికి నిజానికి స్థల పురాణంలో విభిన్న కథలు కనపడటం జరుగుతుంది.  కానీ అక్కడ కాశ్మీర్ పండితుల అభిప్రాయం ప్రకారంగా చూస్తే….అక్కడ సరస్వతీ ఉపాసన చేసిన యోగుల అభిప్రాయం ప్రకారంగా చూస్తే…. వాళ్ళకి ధ్యాన అనుభవాలలో కనబడిన దృశ్యాల ఆధారంగానే నేను చెప్పడం జరుగుతుంది. నిజానికి దుర్వాస మహాముని ఒకసారి బ్రహ్మ లోకానికి వెళ్లి సరస్వతీదేవి సమక్షంలో వేద ఉచ్చారణ చేస్తున్నప్పుడు… ఉచ్చారణ దోషం జరగడంతో, సరస్వతీదేవి పకపకా నవ్వడం జరిగింది. దానికి కోపోద్రిక్తుడైన దుర్వాస మహర్షి కాస్త సరస్వతి దేవిని శపిస్తూ నువ్వు భూలోకంలోకి వెళ్లి మానవులు చేసే ఉచ్చారణ దోషాలను, రాత దోషాలను సవరిస్తూ ఉండిపో!  అని శపించడం జరిగింది. అప్పుడు సరస్వతీదేవి కాస్త నాయనా!  మరి నాకు శాప విముక్తి ఎప్పుడు కలుగుతుంది అనేసరికి…. అక్కడ ఉన్న సర్వజ్ఞ పీఠమును అధిరోహించే అర్హత, యోగ్యత ఎవరైతే పొందుతారో… అధిష్టానం చేస్తారో…. అతని వల్లనే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో….సరస్వతీ దేవి కాస్త శారదా దేవిగా ఈ కాశ్మీర్ ప్రాంతంలోకి రావడం జరిగింది. నీలం, మధుమతీ నదుల మధ్య సంగమం వద్ద ఈ శారదా దేవి పీఠం ఉంటుంది. ఆ తరువాత కాశ్మీర్ పండితులు ఈ సరస్వతిని శారదా దేవిగా కొలవడం ఆరంభించారు. ఆవిడ ముందు వేద ఉచ్చారణ , మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఉచ్చారణ దోషం కలిగితే….వాళ్ల వాక్కు బంధనం జరుగుతూ ఉండేదట. ఆ తర్వాత ఎవరైనా గ్రంథాలను రాసి ఆ గ్రంథాలను రాత్రిపూట అమ్మవారి సమక్షంలో పెట్టి… ఇందులో రసజ్ఞత  సారం ఉంది అంటేనే అంగీకరించు… లేదంటే నీ ఇష్టం అని ఆ తాళపత్ర గ్రంధాలను ఆవిడ సమక్షంలో పెట్టేసి వెళ్లేవారట.  ఆ తాళపత్ర గ్రంథాలు పెట్టిన చోట యధావిధిగా అలాగే ఉంటే… అమ్మవారి అనుగ్రహం పొందినట్టు,  చల్లాచెదురుగా తాళపత్ర గ్రంథాలు ఉంటే అమ్మవారి ఆగ్రహం పొందింది అని చెప్పేసి తెలుసుకునే వాళ్ళట. అలాగే ఉచ్చారణ దోషాలు సవరించుకున్న తరువాత చేస్తే కంఠస్వరంలో మార్పులు మళ్ళీ యథావిధిగా ఉండేవట.  అంటే వాళ్ళ ఉచ్చరణ దోషాలు లేకుండా…. అలాగే గ్రంథంలో రాత దోషాలు లేకుండా ఉండేటట్లుగా….మహా సరస్వతి కాస్త శారదా దేవిగా ఉండి ఈ పీఠంలో అనుగ్రహించడంతో…. ఇది శారదా పీఠంగా ప్రసిద్ధి చెందడం జరిగింది. శారదా దేవిలో త్రిశక్తులు అనగా శారదా దేవి విద్యకు దేవతగాను …..సరస్వతి దేవి జ్ఞాన దేవతగాను ……వాగ్దేవి వాక్కుకు దేవతగాను ……మూడు శక్తుల సంగమం ఈవిడలో ఉన్నాయి అని చెప్పేసి…. కాశ్మీర్ పండితులు గ్రహించి…. శ్రద్ధ భక్తులతో ఆరాధన చేయడం జరిగింది. ఆవిడ ఆ విధంగానే అందరికీ అనుభవం, అనుభూతులు ఇవ్వడం జరిగేది. ఈ కాశ్మీర్ పండితులకు ప్రధాన ఆలయాలలో శారదా దేవి ఆలయము అలాగే అనంతనాగ్ లోని మార్తాండ సూర్యదేవాలయము.. అలాగే అమర్నాథ్ లోని మంచు శివలింగము దర్శనీయ ఆలయాలుగా ఉండేవి. కాకపోతే ఎప్పుడైతే శారదా దేవి శక్తిపీఠం కాస్త పాక్ ఆక్రమిత ప్రాంతం అయిందో…. అక్కడ ఉన్న కాశ్మీర్ పండితులందరిని దాదాపుగా ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ పండితులు కాస్త భారత ప్రాంతంలో పంచలోహ సరస్వతి విగ్రహ మూర్తిని పెట్టుకుని శారదా దేవి ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు….అక్కడ ఉన్న కొన్ని శక్తివంతమైన రాళ్లను తీసుకువచ్చి…. ఇప్పుడు కొత్తగా పెట్టిన సరస్వతి ఆలయంలో ప్రతిష్టించడం జరిగింది.  నిజానికి కాశ్మీర్ నుంచి శారదా దేవి శృంగేరి రావటం జరిగింది. అది ఎలా అంటే ఆదిశంకరాచార్యుడు సర్వజ్ఞ పీఠం అధిరోహించడానికి అర్హత,యోగ్యత, యోగం ఉందో లేదో అని పరీక్షించుకోవడానికి అని చెప్పి…. ఆ కాశ్మీరు క్షేత్రానికి రావడం జరిగింది. అక్కడ ఉన్న కాశ్మీర్ పండితులతో ఏడు రోజులు వాతోపవాదాలు చేసి వాళ్ళందరిని తన వాదనతో ఓడించడంతో… ఈయనకి సర్వజ్ఞ పీఠమును పొందటానికి అర్హత, యోగ్యత ఉంది అని చెప్పేసి కాశ్మీర్ పండితులు చెప్పి ఆ సర్వజ్ఞ పీఠం ఆయన పొందడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న శారదా దేవి శాప విముక్తి పొంది అక్కడి నుండి యధావిధిగా బ్రహ్మ లోకానికి సరస్వతిగా వెళ్ళిపోతూ ఉండేసరికి….. అక్కడ ఉన్న శంకరాచార్యుడు కాస్త అమ్మ!  నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు.  దుర్వాస మహాముని శాపం లోక కళ్యాణార్థమే నీకు ఇచ్చాడు.  ఇక్కడ నువ్వు ఉండి లోకవాసులకు ఉచ్చారణ దోషాలు అలాగే రాత దోషాలను నువ్వు సవరించవలసి ఉంటుంది.  యధావిధిగా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించవలసి ఉంటుంది అని చెప్పి కోరేసరికి…. నాయనా! నేను ఇక్కడ ఉండలేను… నేను శాపముక్తి పొందాను… నేను నా లోకానికి వెళ్ళిపోతాను అనేసరికి… అప్పుడు ఆయన వన దుర్గ మంత్ర ఉచ్చారణతో అమ్మవారిని బంధనం చేసి అక్కడ ఉంచడం జరిగింది.  కానీ ఆయనకి ధ్యాన అనుభవంగా అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ ఉండటానికి అవకాశం ఉండదని…. విదేశీయుల దాడుల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన ఈ సర్వజ్ఞ పీఠం విచ్ఛిన్నమవుతుంది అని చెప్పేసి… ధ్యాన అనుభవం పొందడంతో…. అమ్మ!  నువ్వు ఇక్కడ ఉండవద్దు.  నా వెనకే రా!  నాకు ఎక్కడ నిన్ను ప్రతిష్ట చేయాలనిపిస్తే…. అక్కడ నేను ప్రతిష్ట చేస్తాను అని చెప్పేసి…. తనకి కలిగిన ధ్యానం అనుభవాలన్నీ కూడా యధావిధిగా చెప్పేసరికి… సరే నాయన! కాకపోతే నాదొక షరతు.  నా కాలి గజ్జెల శబ్దం వినపడుతున్నంతవరకు నువ్వు ముందుకు వెళుతూ ఉండు.  ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరుగుతావో…. అక్కడే నేను ఆగిపోవడం జరుగుతుంది.  అదే నా నివాస స్థలం అవుతుంది అనేసరికి…. సరే తల్లి ! అని కాశ్మీర్ పండితులకి తనకి కలిగిన అనుభవాలన్నీ చెప్పేసరికి అయ్యా!  అమ్మవారిని భూలోకంలో ఉంచడమే మా ప్రాధాన్యత.  ఎక్కడ ఉన్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో…. అమ్మవారిని తీసుకుని శంకరాచార్యులు రావటం జరిగింది. ఆమె కాలి అందెలు వినపడుతున్నాయి.  శంకరాచార్యుడు ముందుకు వెళుతూ ఉన్నాడు.  ఒక చోటికి వచ్చేసరికి ప్రసవ వేదన పడుతున్న ఒక కప్పకి పాము పడగ ఇవ్వటం గమనించి… ఆయన ఆశ్చర్య ఆనందాలకు గురయ్యారు.  ఎందుకంటే పాము కప్ప శత్రువులు.  పాము కప్పను చూస్తే వదిలిపెట్టదు. అలాంటిది శత్రువులు కాస్త మిత్రులుగా ఉన్నారంటే….ఇక్కడ ఎవరో ఉన్నారు… ఇక్కడ సాధకుల సాధనా శక్తి ఉంది.  మహర్షుల సాధన శక్తి ఉంది అని గ్రహించేసరికి…. అక్కడ పూర్వకాలంలో ఎంతోమంది మహర్షులు సాధన చేసిన శక్తి అని జ్ఞాన స్ఫురణ అందడంతో అక్కడికి వచ్చేసరికి….ఆ సమయంలో అమ్మవారి కాలి అందెల శబ్దం వినపడకపోయేసరికి…యథాలాపంగా వెనక్కి తిరిగి చూడడం జరిగింది. అక్కడితో నేను ఇచ్చిన షరతు ప్రకారంగా నువ్వు ఓడిపోవడంతో…. నేను ఇక్కడే స్థిర నివాసం చేసుకుంటాను అని అమ్మవారు అనేసరికి….సరే తల్లి! నువ్వు ఇక్కడ  ఉన్న వాసమే రాబోయే కాలంలో శారదా పీఠంగా పేరు ప్రఖ్యాతలు పొందుతుంది అని చెప్పేసి అమ్మవారి రూపమును గంధపు చెక్కతో చేయించి….ఈవిడ శక్తిని ప్రవేశింప చేయడం జరిగింది. తర్వాత శృంగేరి శారదా దేవి పీఠంగా ప్రసిద్ధికి ఎక్కింది.


అంటే శంకరాచార్యుడు అమ్మవారిని గంధపు చెక్కలలోనికి ఆమె శక్తిని ఆపాదించి… ఆవిడని శ్రీ చక్రంలో బంధనం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో గంధపు చెక్కల విగ్రహ మూర్తికి అభిషేకాలు చేస్తే పాడైపోతుందని గ్రహించి…. విద్యారణ్య స్వామి వారు ఈ బంగారు పంచలోహాలతో ఎక్కువ శాతం బంగారం ఉండేటట్టుగా…. పంచలోహ సరస్వతీ మూర్తిని తయారుచేసి…. దానిలోనికి శ్రీ శారదశక్తిని ఆపాదించడం జరిగింది. ఇప్పుడు మనం శృంగేరి క్షేత్రంలో శారదా దేవిని పంచలోహ విగ్రహ మూర్తిగా చూడటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది.  కాశ్మీర్లో శారదా దేవి పీఠం పక్కనే సతీదేవి కుడి చేయి పడిందని కొంతమంది…..కాదు నాలుక పడింది అని కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు వస్తున్నాయి.  స్థల పురాణం ప్రకారంగా చూస్తే అమ్మవారి కుడి చెయ్యి పడింది అని నిర్ధారణ అయింది. కొంతమంది అభిప్రాయం ప్రకారం సతీదేవి శారదా దేవిగా మారి స్థిర నివాసం చేసుకుంది అని చెప్పేసి స్థానికుల అభిప్రాయం. ఎందుకంటే ఆదిపరాశక్తి లోనే మహాకాళిక, మహాసరస్వతి, మహాలక్ష్మి త్రిశక్తులు ఉంటాయి కదా!  దాని ప్రకారంగా చూస్తే…. ఆదిపరాశక్తి మహా సరస్వతిగా ఇక్కడ నివాసం చేసుకుంది అని చెప్పేసి స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా మహా సరస్వతియే శారదా దేవి గాను…. వాగ్దేవి గాను…. సరస్వతిగాను ఈ కాశ్మీర్ ప్రాంతంలో అనగా పాక్ ఆక్రమిత పిఓకే ప్రాంతంలో ఉండేది. కాలక్రమంగా దీనికి పూజాదికాలు జరగకపోవటంతో ఆ విగ్రహమూర్తి విదేశీ దాడులలో విచ్ఛిన్నం అవ్వడంతో…. ప్రస్తుతానికి అక్కడ మొండి గోడలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది అని పిల్లలకు చెప్పేసరికి అయ్యో!  అనుకున్నారు. ఆ తర్వాత బాలగణపతికి ఉన్నట్టుండి ఒక ధర్మ సందేహం రావడం జరిగింది. 

బాల గణపతి:- శివుడు ఎవరిని పూజిస్తాడు?  అమ్మవారు ఎవరిని పూజిస్తారు?

శివ నందిని:- యోగుల అభిప్రాయం ప్రకారం అమ్మవారు శివుడిని…. శివుడు అమ్మవారిని ఆరాధన చేస్తారని చెప్పడం జరిగింది అని అన్నది.

బాల గణపతి:- మరో సందేహం…. వైకుంఠ ఏకాదశి నాడు,  వైకుంఠ ద్వారంలో నుంచి దూరితే మోక్షం వస్తుంది కదా!  మరి అలాంటప్పుడు మోక్ష సాధనకి ఈద్వారం నుంచి వెళ్తే అయిపోతుంది కదా!   అని అడిగేసరికి…. దీనికి ఏం సమాధానం చెబుతుందా? అని మహాదేవి, రుద్ర స్వామి చూస్తూ ఉండగానే…. శివ నందిని కాస్త చిరునవ్వు నవ్వి….

శివ నందిని:-;నిజానికి వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం నుంచి వెళితే మోక్షం వస్తుంది. కానీ దానికి ఒక షరతు ఉంది. ఆ వైకుంఠ ద్వారం దగ్గర ఇద్దరు రాక్షసులు ఉంటారు. మధుకైటభులు అంటారు.  మధు అంటే తేనె అనుకుంటే…. కైటభము అంటే కీటకము అనుకుంటే…. దాని యోగ పరంగా తీసుకుంటే….మధువు అనేది నేను కైటభుడు అనేది నాది అనే భావం కలిగించే వాళ్ళు.  నేను,నాది అనే భావం ఎప్పుడైతే పోతుందో…వాళ్ళు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళితే మోక్షం పొందుతారు.  నేను, నాది అనే మమకార వ్యామోహాలు పోవడానికి యోగ సాధన పెట్టడం జరిగింది. మనసు తను చనిపోయాననే విషయం నమ్మదు. అది అనుభవ అనుభూతి ద్వారా నమ్ముతుంది. ఆ అనుభవ అనుభూతిని పొందటం కోసం యోగ సాధన ఉద్దేశించి చెప్పడం జరిగింది. యోగ సాధన ద్వారా ఆఖరి దేహమైన బ్రహ్మ రంధ్రంలో ఉన్న లింగ దేహానికి సాధనను తీసుకొని వెళితే…. ఆ లింగ దేహం కాస్త దహనం అయినప్పుడు…. ఇంక శరీరాలు ఏమీ లేవు,  ఆత్మ శరీరాలు ఏమీ లేవు అని… ఆత్మ కూడా మోక్షం పొందడం జరుగుతుంది. అప్పుడు ఆ అభ్యున్నతిని పొందడం జరుగుతుంది. అంటే శూన్యం నుంచి వచ్చిన ఆత్మ తిరిగి శూన్యం అవుతుంది. ఈ నిత్య అనుభవ అనుభూతి కోసమే యోగ సాధన పెట్టడం జరుగుతుంది. వైకుంఠ ద్వారం నుంచి నేను నాది అనే రాహిత్య స్థితి ఎవరైతే పొందుతారో వాళ్లు మాత్రమే మోక్షం పొందుతారు. అందరూ కూడా దర్శనం చేసుకున్నంత మాత్రాన మోక్షం పొందే అర్హత,యోగ్యత,యోగం ఉండదు. కాళిదాసు కూడా మోక్షం ఎప్పుడు వస్తుందని రాజు అడిగినప్పుడు నేను చచ్చిపోయినప్పుడు వస్తుంది అని అంటే అందరూ ఫక్కున నవ్వడం జరిగింది. ఆ తరువాత తన విశ్లేషణ చెప్పటం జరిగింది. ఇక్కడ నేను అనేది చనిపోయినప్పుడు మాత్రమే అంటే నేను అనే భావం పోయినప్పుడు మాత్రమే మోక్షం వస్తుందని విడమర్చి చెప్పడంతో….అందరూ కూడా కాళిదాసు యొక్క విజ్ఞతకు, జ్ఞానత్వానికి చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే నేను,నాది మనది అనే త్రిభావాలు పోయినప్పుడు మాత్రమే…… ప్రేమా మోహ వ్యామోహాలు పోయినప్పుడు మాత్రమే… మనం మోక్షమును పొందడం జరుగుతుంది. దానికోసం యోగ సాధన తప్పనిసరిగా చేయవలెను.  ఇవి ఎప్పుడు పోతాయి అంటే,  ఇవి అంతా కూడా భ్రమ, బ్రాంతి,  మాయ అని మనసు తెలుసుకున్నప్పుడే ఆత్మస్థిరమై… మనో చాంచల్యం పూర్తిగా పోయి…. మనసు స్థిరమై…. ఆత్మగా రూపాంతరం చెంది….ఎలాగైతే పూర్ణ శూన్యం నుంచి వచ్చిందో అలాగే శూన్యం అవుతుంది. ఆ జ్ఞానమును పొందడానికే మనం యోగ సాధన చేయాల్సి ఉంటుందని..

చెప్పేసరికి…..ఇదంతా వింటున్న మహాదేవి,రుద్ర స్వామి ఆనందంతో… సంతోషంతో…. చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తరువాత బాలగణపతికి మరో సందేహం వచ్చి…

బాల గణపతి:- అమ్మ!  వరాహ అవతారాలలో నీటిలో ఉన్న భూమిని ఆయన పైకి తీసుకు వచ్చారని చెబుతారు. నిజానికి భూమి మీదే సముద్రం ఉంటుంది కదా! సముద్రంలో భూమి ఎలా వెళ్ళింది. ఇది నాకు అర్థం కాలేదు. ఈ తిరకాసు ఏమిటి?  అనగానే…..

వీడు వ్యంగంగా అడుగుతున్నప్పటికీ ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవి అడుగుతున్నాడు అని అందరూ కూడా శ్రద్ధ భక్తులతో శివనందిని ఏం చెబుతుందా అని చూసేసరికి…. శివ నందిని చెప్పడం ప్రారంభించింది.

శివ నందిని:- నాయనా!  ఆదిలో ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. వాయువు నుంచి అగ్ని ఏర్పడింది. అగ్ని నుంచి నీరు ఏర్పడింది. నీటి నుంచి ఘన పదార్థం అయిన భూమి ఏర్పడటం జరిగింది. ఆ తరువాత ఔషధాలు ….ఆ ఔషధాల నుంచి అన్నం ….అన్నం నుంచి పురుషుడు ఏర్పడ్డట్లుగా మనకి వేదం చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా చూస్తే నీటి నుంచి భూమి ఏర్పడినట్టు తెలుస్తుంది. నీరు ద్రవ పదార్థం అయితే భూమి ఘనపదార్థం అని అర్థం అవుతుంది. ఆ రాక్షసుడు కాస్త కాలాన్ని వెనక్కి తిప్పి ద్రవపదార్థమైన నీటిగా  మార్చాలని చెప్పేసి….  భూమిని కాస్త నీటిలో పడ వేయడం జరిగిందన్నమాట!  అప్పుడు విష్ణుమూర్తి కాస్త వరాహ రూపం ఎత్తి కాలాన్ని మళ్లీ యధావిధిగా సహజ స్థితికి తీసుకువచ్చి…. ఘనపదార్థమైన భూమిని మామూలు స్థితికి తీసుకురావడం జరిగింది.  అంటే ఆ రాక్షసుడు ఏమో కాలాన్ని వెనక్కి తిప్పితే…. విష్ణుమూర్తి కాలాన్ని సహజ స్థితికి తీసుకురావడం జరిగింది. ఇది కాల మార్పు వలన ఈ తేడా కనిపిస్తుంది. ఈ కాల మార్పు వలన నీటిలో నుంచి భూమి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది అనేసరికి….. అంతెందుకు….ఇప్పుడు శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడని యశోదమ్మ నోరు తెరిచి చూపించమని అడగడం జరిగింది కదా!  అప్పుడు ఆయన నోటిలో భూమండలం కనబడింది అని అంటారు కదా!  భూమి మీద ఉండి మరి శ్రీకృష్ణుని నోటిలో భూమిని ఎలా చూడడం జరిగింది..?

బాల గణపతి:- అవును కదా!  ఇది నిజమే కదా!  మరి ఎక్కడ నుండి చూడగలిగింది?

శివ నందిని:- ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండి సినిమా చూస్తున్నావు కదా!  నీకు కావలసిన సినిమా నువ్వు చూస్తున్నావు కదా!  అలాగే ఆయన నోటిలో విశ్వము యొక్క వీడియోలు చూపించడం జరిగింది.ఆ దృశ్యమును చూసి అండ,పిండ బ్రహ్మాండాల నాయకుడే తన కుమారుడు అని ఆమె గ్రహించడం జరిగింది. దానికి ఆమె భూమి మీద ఉండి అంతరిక్షమునకు సంబంధించిన వీడియోను చూడటం జరిగింది.

ఓహో…! ఇదా అంతర్గతంగా ఉన్న దీని రహస్యం అని చెప్పేసి పిల్లలు చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత బాల గణపతి ఉన్నట్టుండి…

బాల గణపతి:- అమ్మ! గణపతి తొండంతో తింటాడా?  చేతితో తింటాడా? 

శివ నందిని:- నువ్వేం అనుకుంటున్నావు? 

బాల గణపతి:- రెండిటిని ఉపయోగించి తింటాడు అనుకుంటున్నాను…

శివ నందిని:- నిజంగానే రెండింటిని ఉపయోగించి తింటాడు.. తొండంతో చెరుకు గెడలను…కాయలను… ఫలాలను తింటే, చేతితో అన్నము, ద్రవపదార్థాలు తినడం జరుగుతుంది. నువ్వు అడిగేవి వ్యంగంగా ఉన్న కూడా అందులో చాలా జ్ఞానం ఉన్నది. దానిని అర్థం చేసుకోవాలి.

బాల గణపతి:- ఆయన తొండం ఉపయోగించి తింటాడు…. చేతిని ఉపయోగించి తింటాడు అన్నమాట!  అంటే చెరుకు గెడల వంటి ఘన పదార్థాలకి తొండము…. ద్రవపదార్థాలు అంటే ఆహారం, ఉండ్రాళ్ళ కోసం చెయ్యి ఉపయోగించుకుంటున్నాడు అన్నమాట! 

అని చెప్పేసి బాల గణపతి అనేసరికి సరే మాకు నిద్ర వస్తుందని అనేసరికి…. ఇక అందరూ విశ్రాంతి తీసుకోవడం జరిగింది.

సాధన కుటుంబం కాస్త కాశ్మీరు క్షేత్రంలో ఉన్న శారదాపీఠమునకు వెళ్లడం జరిగింది. పాక్ ఆధారిత పిఓకే ప్రాంతానికి 130 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుందని తెలుసుకోవడంతో సరస్వతీ పీఠమునకు దగ్గరలో ఉన్న హోటల్లో గది తీసుకొని… స్నానాధికాలు… ఆ తర్వాత టిఫిన్లు పూర్తి చేసుకొని… పిఓకే ప్రాంతంలో ఉన్న శారదా దేవి ఆలయానికి అందరూ వెళ్ళటం జరిగింది. అక్కడ పాక్ అధికారులకి అనుమతి పత్రం చూపించడంతో, ఆలయానికి దర్శనానికి  అనుమతి ఇవ్వడం జరిగింది. అక్కడ చిన్నపాటి దేవాలయంలో  శివలింగ ఆకార స్తంభం మాత్రమే ఉన్నది. దాని చుట్టూ కూడా నది నీరు ఉన్నట్టుగా గ్రహించింది. ఇది నీలం నది నీరు అని అనుకున్నారు. దాని పక్కనే నీలం నది మరియు మధుమతి నదుల సంగమం చూడటం…. ఆ పక్కనే ఉన్న పర్వతాలను చూడటం జరిగింది. గుడి లోపల ఎలాంటి విగ్రహ మూర్తి లేకపోవడం…. గోడలు కూడా మొండి గోడలు సగానికి పైగా పగిలిపోయి ఉండటం…. వీళ్ళకి బాధగాను, ఆశ్చర్యంగాను అనిపించింది. సరే అని చెప్పి ఇంతలో మహాదేవి కాస్త అక్కడ ఉన్న మట్టిని, రెండు నదుల తీర్థమును సేకరించడం జరిగింది. తర్వాత ఎవరికి వారే వ్యక్తిగతంగా ధ్యానాలు, జపాలు చేసుకోవడంలో మునిగిపోయారు.అప్పుడు శివ నందిని ధ్యాన అనుభవంలో విశుద్ధ చక్రం జాగృతి కోసం ఆకాశముద్రతో సాధన చేయటం ఆరంభించింది. ఈ శారదాపీఠం సమక్షంలోనే విశుద్ధ చక్రం జాగృతి కోసం శివ నందిని కాస్త ఆకాశం ముద్రతో సాధన చేయడం జరిగింది. సుమారుగా ఇలా మూడు గంటల పాటు ఉండేసరికి…. కంఠమునందు విశుద్ధ చక్రం లీలగా కనిపించింది. 

విశుద్ధ చక్రము లక్షణాలు:-

కంఠము అంటే గొంతు మొదట్లో, మేరు దండంలో ఉండే సుషుమ్న నాడిలో ఉంటుంది ఈ చక్రము. ఈ చక్రమునకు 16 దళాలుంటాయి. ఇది ఆకాశ తత్వమునకు ప్రతీకగా ఉంటుంది. శబ్దం అంటే స్వరం దీని గుణము. ఈ చక్రము యొక్క రంగు నీలం. ఈ చక్రము యొక్క శక్తి పేరు 'శాకిని', అధిష్ఠాన దైవం 'సదాశివుడు'. ఈ చక్రాన్ని బ్రహ్మద్వారం అంటారు. ఈ చక్రానికి బీజాక్షరం 'హం'! ఈ చక్రము ఉదానమనే ప్రాణాన్ని నడుపుతుంది. మృత్యువును జయించే శక్తి ఈ విశుద్ధ చక్రంలోనే ఉన్నది. అందుకే ఈ చక్రమునకు అమృతకళ అని కూడా పేరు గలదు!

ఆ తరువాత మరో రెండు గంటల పాటు అదేవిధంగా సాధన చేస్తూ ఉండేసరికి…..ధ్యాన దృశ్యంగా పరమహంస గారి కంఠం నుంచి ఆదిపరాశక్తి తీసిన శివలింగం శివ నందినికి గుర్తుకు రావటం జరిగింది. దానితో ధ్యానభంగం అయింది. అప్పటికే రుద్రస్వామి, మహాదేవి ధ్యానం నుంచి బయటకు వచ్చి కబుర్లు ఆడుకోవడం గమనించి…. శివ నందిని కాస్త రుద్ర స్వామితో…

శివ నందిని:- అయ్య!నాకు పరమహంస గారి కంఠం నుంచి అమ్మవారు స్పటిక శివలింగం తీసివేసినట్లుగా ధ్యానం అనుభవం అయింది.  దీని అర్థం ఏమిటి? 

రుద్ర స్వామి:- ఆయన ప్రమేయం లేకుండా ఆదిపరాశక్తి అలా చేయడం జరిగింది. ఆ తర్వాత అలా ఎందుకు చేసిందో…. అనేది ఆయనకి అర్థం కాలేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ విశుద్ధ చక్రం అనేది జ్ఞానానికి సంబంధించింది. ఇక్కడ ఆవిడ ఎందుకు తీసిందో….. దీని యొక్క విశ్లేషణ మనం చేయవలసి ఉంటుంది. అలాగే నీ కంఠంలో ఆ స్పటిక శివలింగం పోకుండా నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్పటిక శివలింగం తీసేస్తే ఏమవుతుంది…. ఉంటే ఏమవుతుంది?  అనేది నువ్వు జ్ఞాన స్ఫురణ పొందాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ జ్ఞాన అహంకారం మాయ వస్తుంది.నీ విశ్లేషణ శక్తితో వచ్చే జ్ఞాన అహంకార మాయను నువ్వు దాటుకోవలసి ఉంటుంది…

శివ నందిని:- ఇప్పుడు శివలింగం ఉంచడం వలన ఉపయోగం ఏమిటి?  తీసివేయడం వల్ల నష్టం ఏమిటి?  అనేది మనకు ఎలా తెలుస్తుంది..?

రుద్రస్వామి:- ఇది ఎవరికి వారే వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఉంటే ఏం జరుగుతుంది …..లేకపోతే ఏం జరుగుతుంది అనే విశ్లేషణ శక్తికి నువ్వు అర్హత,యోగ్యత,యోగం పొందవలసి ఉంటుంది. నువ్వు సాధనను అలాగే కొనసాగించు….మనకి ఇక్కడ మూడు రోజులు మాత్రమే ఉండటానికి అనుమతి ఇచ్చారు. నీ సాధన నువ్వు చేస్తూ ఉండు.  కాలం ఏం చేస్తుందో…..ఆ శివయ్య ఏం చేస్తాడో…. చూద్దాం..ఒకటి మాత్రం గుర్తుంచుకో!  కృష్ణస్వామి మరియు యోగాంబిక కూడా ఈ క్షేత్రానికి వచ్చే ఉంటారు. వాళ్ళు నీ కంఠంలో ఉన్న శివలింగం తీసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పరమహంస కంఠంలో ఉన్న శివలింగం తీసుకోవడంతో….ఆయన పొందిన జ్ఞానం ఏమిటి అనేది తెలుసుకోవాలి. కంఠంలో శివలింగం ఉంటే పొందవలసిన జ్ఞానం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవాలి. నీ కంఠంలో శివలింగం పోకుండా చూసుకో! అది నీ బాధ్యత ..

అనేసరికి ఇక శివ నందిని యధావిధిగా ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ధ్యానంలో కూర్చునేసరికి తన కంఠంలో నుంచి శివలింగం తీయాలి అని చెప్పి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని ధ్యాన దృశ్యం అవ్వడంతో కళ్ళు తెరిచింది.ధ్యాన భంగం అయ్యింది.  ఇప్పుడు ఏం చేయాలా అని అనుకుంటూ ఉండేసరికి…. వీళ్ళు కూర్చుని ధ్యానం చేస్తున్న చోటికి నలుగురు స్త్రీ మూర్తులు రావడం జరిగింది. ఏకాంతంగా ఉన్న చోట ఈ స్త్రీమూర్తులు ఎవరా అని అనుకునేసరికి ….మేము తెలుగు వాళ్ళమే…. దర్శనం కోసం అనుమతి తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా తెలుగు వాళ్ళ లాగానే కనబడుతున్నారు. పాపం శారదా దేవి పీఠం ఆక్రమిత ప్రాంతానికి వెళ్ళిపోయి పూజాదికాలు జరగకుండా పోయింది. ఇక్కడ ఉన్న విగ్రహం ఏమైందో కూడా మాకు అర్థం కావడం లేదు. తెలియటం లేదు. ఎంత మహిమాన్వితమైన శక్తిపీఠం… సర్వజ్ఞ పీఠం…. శారదా దేవి పీఠం ఉండేది. శారదా దేవి కోసమే శారదా లిపి అని ఒక ప్రత్యేకమైన లిపిని కాశ్మీర్ పండితులు ఏర్పాటు చేసుకున్నారు…. అంటే ఆవిడ మీద ఎంత భక్తి ప్రపత్తులు చూపించి ఉంటారో….!  విదేశీ దాడుల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన శారదా దేవి విగ్రహ మూర్తి మనకి లేకుండా పోయింది అని నలుగురు బాధపడుతూ ఉన్నారు.  ఇలా వారు అంటూ ఉండేసరికి రుద్ర స్వామి కాస్త…

రుద్రస్వామి:- జరిగిందేదో జరిగిపోయింది…. మానవులకి అర్హత, యోగ్యత ,యోగం లేదనుకుంట!  అయినా కూడా ఇక్కడ ఉన్న శారదా దేవి శక్తిని శంకరాచార్యుల వారు శృంగేరి శారదా మూర్తిలో నిక్షిప్తం చేయడం జరిగింది కదా! అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే శారదా దేవి దర్శనం చేసుకున్నట్టే..

అనేసరికి బాలగణపతికి ఎందుకో సందేహం వచ్చి మీ నలుగురి పేర్లు ఏమిటి?  అని అనేసరికి గాయత్రి, సరస్వతి, వాగ్దేవి, శారదా అని చెప్పేసరికి… ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యం ఉంది అని… శివ నందిని కేసి చూస్తూ…

బాల గణపతి:- అమ్మ చూశావా!  ఇక్కడ ఉన్న శారదా దేవి శక్తిపీఠంలో మనకి మూడు శక్తులు ఉంటాయి అన్నావు కదా!  ఒకటి శారదా దేవి, రెండు వాగ్దేవి, మూడు సరస్వతి గానూ, బ్రహ్మదేవుడికి గాయత్రీ కూడా ఒక భార్యని చెబుతున్నావు కదా! వీళ్ళు కూడా నలుగురు శక్తుల పేర్లతో ఇక్కడికి రావడం విచిత్రంగా ఉంది.

అనేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుమానంగా వాళ్ళకేసి చూసేసరికి…. మా పేర్లు మొదటి నుంచే వచ్చినాయి…యథాలాపంగా ఈ శక్తి పీఠానికి సరిపోయినాయి అని చెప్పేసి ఎవరికి వాళ్లే వీళ్ళకి ఎదురుగా ఉన్న దిమ్మె మీద కూర్చుని ధ్యానంలో ఉండిపోయారు. శివ నందిని కూడా విషయం పెద్దగా పట్టించుకోలేదు.  తను కూడా ధ్యానంలో కూర్చునేసరికి….మిగతా వాళ్ళందరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో ఉన్న శివ నందిని కాస్త ధ్యాన దృశ్యంగా యధావిధిగా తన కంఠంలో ఉన్న స్పటిక శివలింగం ఎవరో  తీసివేయాలని ప్రయత్నిస్తూ ఉండేసరికి… ఏం జరుగుతుందా అని అనుకుంటూ ఉండేసరికి…. ఈ వచ్చిన నలుగురు కూడా ఆవిడని ఆపాలని ఆవిడ చేతులు తీసి వేస్తూ ఉండేసరికి…. ఇదేమిటి?  ఇలా జరిగింది. కొంపదీసి ఇలా నలుగురు దేవతలా ? మనుషులు కాదా?  అని శివ నందినికి ధ్యాన భంగమై…. కళ్ళు తెరిచి చూసేసరికి…. వీళ్ళ నలుగురు కూడా మనుష్య రూపంలో యధావిధిగా ధ్యానంలో ఉండేసరికి….తనకి ఎందుకు ఇలా ధ్యానం అనుభవం అయింది అనుకొని…. రుద్ర స్వామికి చెబుదాం అనుకునేసరికి….రుద్ర స్వామి ధ్యాననిష్టలో ఉన్నాడని తెలిసి, ఇబ్బంది కలిగించడం ఎందుకు,  అని అనుకుంటూ ఉండేసరికి…. ఈసారి పురుషుడి చేతులు కాస్త తన కంఠంలో ఉన్న స్పటిక శివలింగం మీద శివలింగం తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉండేసరికి…. ఈ నలుగురు ఆడవాళ్లు అతని నుంచి ఈమెను రక్షిస్తున్నట్లుగా కనిపించేసరికి…. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి….. నలుగురు కూడా యధావిధిగా ధ్యానంలో ఉన్నారు. ఇది ఏమిటి….  ఈ సచిత్ర విచిత్రాలతో ఈ అనుభవాలు కలుగుతున్నాయి….. వీళ్ళు దేవతలా?  మనుషులా?  అని శివ నందిని కి అర్థం కాలేదు.  అందులో అక్కడికి కృష్ణస్వామి మరియు యోగాంబిక రావటం గమనించింది. వీళ్ళలో మొదట ….యోగాంబిక కాస్త

యోగాంబిక:- తన కంఠంలో ఉన్న శివలింగం తీసేస్తే…. తను పొందవలసిన జ్ఞానం పొందదు. వెళ్లవలసిన ప్రకృతికి వెళ్ళదు…

కృష్ణ స్వామి:- ఆ ప్రయత్నం నువ్వు చెయ్యి.

అని కృష్ణస్వామి అనేసరికి ఉన్నట్టుండి కూర్చున్న శివ నందినినీ కాస్త కాలితో తన్ని పడుకోపెట్టి…. కంఠమును నొక్కుతూ….. త్రిశూలంతో పొడిచి స్పటిక లింగం తీసే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి…. శివనందిని ఎంత అరవాలన్నా అరవ లేకపోవడంతో….తన చేతులు, కాళ్లు ఎంత కదపాలన్నా కదపలేకపోవటంతో…. తనకి స్తంభన విద్యతో స్తంభనం చేశారు అని అనుకుంటూ ఉండేసరికి…..తన కంఠంలో ఉన్న స్పటిక లింగం తీయాలని… ఎందుకు తపన తాపత్రయం పడుతున్నారా?  అని ఆలోచనలో ఉంటూ ఉండేసరికి…. ధ్యాననిష్ట లో ఉన్న ఈ నలుగురు స్త్రీమూర్తులు కూడా యోగాంబిక చుట్టూ చేరి తనని లాగి పడవేయడంతో…. శివ నందిని కాస్త లేచి కూర్చొని నిలబడింది.  నిలబడే సరికి యోగాంబిక కాస్త దేవాలయం గోడకి గుద్దుకొని కిందపడిపోయింది. ఈ విషయం గమనించిన కృష్ణ స్వామి కాస్త శివ నందిని మీద పడి కంఠంలో ఉన్న శివలింగం తీసే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి…. నలుగురు ఆడవాళ్లు కలిసి కంఠంలో ఉన్న శివలింగమును తీయనివ్వకుండా కృష్ణస్వామిని కూడా పక్కకి లాగుతూ ఉండేసరికి….

కృష్ణ స్వామి:- మీకు అర్థం కావటం లేదా?  శివలింగం కానీ తీయకపోతే….. మీరంతా చచ్చిపోతారు.  చచ్చిన ప్రకృతిని చూడాల్సి వస్తుంది. అదే శివలింగం తీసేస్తే బతికి ఉన్న ప్రకృతిని చూడాల్సి వస్తుంది. మనమంతా బతికే ఉంటాము. ఈ విషయం తెలిసినా కూడా తెలియనట్టు ఉంటారు..

స్త్రీ మూర్తులు:- నిజంగా లోకానికి తెలియాలి. మేము చచ్చామో …. బతికామో తెలియాలి.  అందుకోసం అని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ ఇద్దరూ వస్తారు ….శివలింగం తీయాలని ప్రయత్నం చేస్తారు అని ముందుగానే తెలుసుకోవడం జరిగింది. ఈవిడకి రక్షణ మేమంతా ఉన్నాము. మీరు ఆమెని ఏమీ చేయలేరు.  ఆమె కంఠంలోని శివలింగం తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం  లేదు..

అని చెప్పి కృష్ణస్వామిని విసరగానే…కృష్ణ స్వామి కాస్త ఆలయ స్తంభానికి గుద్దుకొని…. దొర్లిపడుతూ కృష్ణ స్వామి:- మీకు అర్థం కావట్లేదు.. ఆదిపరాశక్తి చేసే ప్రయత్నాన్ని మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారు.  ఆవిడకి సహాయంగా ఉండాల్సిన  మీరే…. ఆవిడకి సహాయం చేయకపోతే ఎలాగా?  రక్షణగా ఉండవలసిన వాళ్ళు భక్షిస్తే ఎలాగా?  ఇంక ఎవరిని నమ్మాలి?  ఎవరిని ఇది చేయాలి? నేను రక్షించే వాడిని భక్షకుడిని అయ్యాను. నిజానికి మీరు రక్షించాలి. మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నాను. ఆ…..తప్పకుండా చేస్తామని… ఈ నలుగురు స్త్రీమూర్తులు కాస్త కృష్ణస్వామి మీద కలయపడి పిడి గుద్దులు గుద్దేసరికి…. కృష్ణస్వామి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు.  ఈ విషయం అర్థం కాక అయోమయ స్థితిలో ఉండగా…. ఆ నలుగురు కాస్త దిమ్మి మీద కూర్చొని శివ నందిని కేసి చూస్తూ…. 

స్త్రీ మూర్తులు:- అమ్మ!  నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు.  మేము నీకు రక్షణగా రావడం జరిగింది. ఇక్కడ కంఠంలో ఉన్న శివలింగమును తీసేయడం వల్ల జరిగింది ఏమిటి ?అనేది…. అసలు ఏం జరుగుతుంది అనేది?  తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చో. విషయం నీకే అర్థమవుతుంది…

అనేసరికి అందరూ అభయ ముద్ర చూపిస్తూ ఉండేసరికి ఆ అభయ ముద్ర నుంచి వచ్చిన దివ్య కాంతి కాస్త శివ నందిని యొక్క భ్రుకుటి స్థానంలోకి ప్రవేశించడంతో…. యోగ నిద్రలో ధ్యాన నిష్ట లోకి వెళ్లడం జరిగింది. ధ్యాన దృశ్యంగా మొదట నల్ల శివలింగం…. ఆ తర్వాత స్పటిక శివలింగం…. మధ్యలో స్పటిక బిందువు…. ప్రకృతిలో జరిగే జననమరణ దృశ్యాలను సృష్టి,స్థితి,లయలను చూస్తున్నట్లుగా నీలం శివుడు కనిపించాడు. కొద్దిసేపటికి మేరు శ్రీ చక్ర బిందువు భూచక్ర బిందువుల మధ్యలో ఒక శివలింగం ఉన్నట్లుగాను….. ఆ శివలింగంలో లలితాదేవి కాస్త ప్రకృతి సృష్టి,స్థితి,లయలను చూస్తున్నట్టుగాను…. జగన్నాటకం చూస్తున్నట్టుగాను….ధ్యాన దృశ్యం కనిపించడం జరిగింది. ఈ రెండు ధ్యాన దృశ్యాల విశ్లేషణ ఏంటి అనేది శివ నందినికి అర్థం కాలేదు. అప్పుడు తనలో తాను విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టింది. అదేమిటంటే మొదటి ధ్యాన దృశ్యంలో నీలం శివుడు కాస్త శ్రీ చక్ర బిందువులో ప్రకృతిని చూడడం జరిగితే…. రెండవ ధ్యాన దృశ్యంలో శివలింగంలో అమ్మవారు కాస్త ప్రకృతిని చూడటం జరిగింది. ఇందులో ఏదో తిరకాసు ఉన్నదని గ్రహించింది. ఏదో తెలియని మర్మ రహస్యం ఉందని గ్రహించింది. అంటే చక్ర బిందువు అంటే అమ్మవారి శ్రీ చక్ర బిందువు.  బిందు స్థానం అనేది స్త్రీ ప్రకృతికి సంబంధించింది.  అంటే శివుడు కాస్త ఈ చక్ర  బిందువును చూస్తూ ఉన్నాడు… అంటే శివుడు స్త్రీ ప్రకృతిని చూస్తున్నాడు అన్నమాట!  నిజానికి పురుషుడు పురుష ప్రకృతిని చూడాలి… స్త్రీ ప్రకృతిని చూడాలి కదా!  ఇప్పుడు ఇక్కడ వ్యతిరేక దిశలో జరుగుతుంది. అంటే అమ్మవారు కాస్త శివలింగంలో పురుష ప్రకృతిని చూస్తుంది. శివుడు కాస్త శ్రీ చక్ర బిందువులోకి చూస్తున్నాడు.  నిజానికి పురుషుడు పురుష ప్రకృతిని….. స్త్రీ స్త్రీ ప్రకృతిని చూడాలి….. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు,  కంఠంలో ఉన్న స్పటిక శివలింగము తీసివేయడం వలన జరుగుతుంది అని శివ నందినికి జ్ఞాన స్ఫురణ అందింది. అంటే కంఠంలో ఉన్న స్పటిక శివలింగం ఉన్నట్లయితే…. పురుషుడు పురుష ప్రకృతిని, స్త్రీ స్త్రీ ప్రకృతిని చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే కంఠంలో ఉన్న స్పటిక లింగం తీసివేస్తే…. పురుషుడు స్త్రీ ప్రకృతిని, స్త్రీ పురుష ప్రకృతిని చూడడం జరుగుతుంది. ఈ కంఠంలో శివలింగం ఉంచడం వలన….పురుషుడు పురుష ప్రకృతిని చూడటం వల్ల నష్టం ఏమిటి?  స్త్రీ స్త్రీ ప్రకృతిని చూడడం వల్ల నష్టం ఏమిటి? అనే అనుమానం శివనందినిలో వచ్చింది. ఆ తర్వాత ఆత్మ విశ్లేషణ చేసుకుంటే ప్రకృతి రెండు రకాలు…. స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి,  మళ్లీ నకిలీగా చూస్తే స్త్రీ ప్రకృతి ,పురుష ప్రకృతిని …. ప్రకృతి ఏర్పాటు చేయడం జరిగింది అని గ్రహించింది.  అంటే రెండు ప్రకృతులు కాస్త నాలుగు ప్రకృతులుగా మారినాయని గ్రహించింది.  ఇందులో ఈ నాలుగు ప్రకృతుల గురించి శివనందిని విశ్లేషణ చేయడం ప్రారంభించింది.

ఆ నాలుగు ప్రకృతులు ఏమిటి అన్నప్పుడు.. పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి మొదటి పురుష ప్రకృతిలో స్త్రీ మోక్షం పొందితే….పురుషుడు జీవిస్తాడు.  ఇక రెండవ స్త్రీ ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందితే స్త్రీ జీవించి ఉంటుంది. ఇప్పుడు మూడవ పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందితే… స్త్రీ బతికే ఉంటుంది.  అంటే నాలుగవ స్త్రీ ప్రకృతిలో స్త్రీ మోక్షం పొందితే పురుషుడు బతికే ఉంటాడు. అంటే ఈ రెండు ప్రకృతులలో పురుషుడు బతికి ఉండి స్త్రీ చనిపోవడం జరిగితే…. రెండు ప్రకృతులలో స్త్రీ బతికి ఉండి పురుషుడు చనిపోవడం జరుగుతుంది అన్నమాట!  ఇందులో కంఠంలో శివలింగం తీసేయడం వలన అమ్మవారు బతికి ఉన్న రెండు ప్రకృతులను చూసేటట్లుగా… ధ్యాన దృశ్యం అనుభవం అయ్యేటట్టు ఆదిపరాశక్తి చేస్తుంది. తను బతికి ఉన్న రెండు స్త్రీ ప్రకృతులను మాత్రమే…. మనం రెండు ప్రకృతులను మాత్రమే మనం ధ్యాన దృశ్యంగా చూసే విధంగా అమ్మవారు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే తను బతికి ఉన్న పురుష ప్రకృతి అలాగే స్త్రీ ప్రకృతిని మాత్రమే మనం ధ్యాన దృశ్యంగా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పురుష ప్రకృతిలోనూ స్త్రీ ప్రకృతిని చూసినప్పుడు పురుషుడు మోక్షం పొందినట్లు స్త్రీ బతికి ఉన్నట్లు ధ్యాన అనుభవ అనుభూతి ధ్యాన దృశ్యం కలుగుతుంది. అలాగే ఉంచినట్లయితే అమ్మవారు ఒక ప్రకృతిలో మోక్షం పొందితే…. మరొక ప్రకృతిలో శివుడు మోక్షం పొందడం జరుగుతుంది. నిజానికి అమ్మవారు మోక్షం పొందినప్పటికీ కూడా… తను మోక్షం పొందలేదు, బతికే ఉన్నాను అని చెప్పేసి ఇలాంటి జ్ఞానం కంఠంలో ఉన్న శివలింగం తీసేయడం ద్వారా ఇవ్వడం చేస్తుంది అని శివ నందిని గ్రహించడానికి సమయం పట్టింది.  అంటే పరమహంస గారు నిజానికి పురుష ప్రకృతిని చూడాలి. కానీ స్త్రీ ప్రకృతిని చూశారు. ఆ స్త్రీ ప్రకృతిలో కూడా పురుషుడు మోక్షం పొందినట్లు, స్త్రీ బతికి ఉన్నట్లు చూడటం జరిగింది. ఎందుకంటే తన కంఠంలో శివలింగం తీసివేయడం వలన పురుష ప్రకృతిని చూడవలసిన వాడు కాస్త స్త్రీ ప్రకృతిని చూడడం జరిగింది. అదేవిధంగా ఆయన బ్రహ్మ రంధ్ర చక్రం వద్ద రెండు స్పటిక లింగాల మధ్యన ఒక స్పటిక గోళంలో నీలం శివుడు ప్రకృతి దృశ్యాలను చూసినట్టుగా…. ధ్యాన అనుభవం పొందడం జరిగింది కదా!  అదేవిధంగా రెండవ ధ్యాన అనుభవం ప్రకారంగా చూస్తే…. రెండు శ్రీ చక్ర బిందువుల మధ్య ఉన్న శివలింగంలో అమ్మవారు కాస్త పురుష ప్రకృతిని చూడటం జరుగుతుంది.  అసలు నిజానికి పురుషుడు పురుష ప్రకృతిని, స్త్రీ స్త్రీ ప్రకృతిని చూడాలి.  తద్వారా పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందినట్టుగాను… స్త్రీ ప్రకృతిలో స్త్రీ మోక్షం పొందినట్లుగాను… ధ్యాన అనుభవ అనుభూతిని పొందడం జరుగుతుంది.  ప్రకృతిలో ఉన్న ఆది దంపతులు మోక్షం పొందినట్లుగా జ్ఞానం పొందాలి. కానీ ఎప్పుడైతే తన కంఠంలో ఉన్న స్పటిక శివలింగమును తీయడం వలన…ప్రకృతి తారుమారు అయ్యి పురుషుడు కాస్త స్త్రీ ప్రకృతిని…. స్త్రీ కాస్త పురుష ప్రకృతిని చూడడం…. అందులో పురుషుడు మాత్రమే మోక్షం పొందినట్లుగాను…. స్త్రీ బతికి ఉన్నట్లుగాను…. అనుభవాలు పొందుతున్నారని, నిజానికి ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మోక్షం పొందారని ఆ మోక్ష జ్ఞానం లోకానికి తెలియనివ్వకుండా శివుడు మాత్రమే మోక్షం పొందినట్లుగాను… తను మాత్రం బతికే ఉన్నట్లుగా  భ్రమ,భ్రాంతి కలిగిస్తుందని…. ఇదంతా కూడా తన కంఠంలో ఉన్న శివలింగంలో తీసివేయడం వల్ల ఇలా జరుగుతుందని…. తన కంఠంలో ఉన్న శివలింగం కాపాడుకోవాలని జ్ఞాన స్ఫురణ అనుభవం అనుభూతి కలగడంతో శివనందినికి కాస్త ధ్యాన భంగమై కళ్ళు తెరవటం జరిగింది. అప్పుడు కామాక్షి దేవి కూర్చున్న భంగిమలో శారదా దేవి కూర్చున్నట్లుగా లీలామూర్తిగా అక్కడ శారదా దేవి సజీవ మూర్తిగా కనిపించడం జరిగింది. అంటే నిజానికి పూర్ణజ్ఞానం ఏమిటి?  అంటే పురుషుడు పురుష ప్రకృతిని స్త్రీ స్త్రీ ప్రకృతిని చూసినట్లయితే…పురుష ప్రకృతిలో పురుషుడు మోక్షం పొందినట్లు. స్త్రీ ప్రకృతి లో స్త్రీ మోక్షం పొందినట్లు… జ్ఞాన స్ఫురణ అనుభవం,  జ్ఞాన అనుభూతి  పొందితే ఇక తను శూన్యం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ జ్ఞానం అందనివ్వకుండా ఆదిపరాశక్తి చేస్తుందని చెప్పి జ్ఞాన స్ఫురణ అందడంతో తను వచ్చిన పని పూర్తి అయింది అన్నట్లుగా….. శారదా దేవి భౌతికంగా కొన్ని క్షణాల పాటు సజీవ మూర్తిగా కనిపించి అదృశ్యం అవటం జరిగింది. అంటే శివలింగంలో పురుష ప్రకృతిని పురుషుడు చూడాలి… శ్రీ చక్ర బిందువులో ఉన్న స్త్రీ ప్రకృతిని అమ్మవారి చూడాలి.  ఈ లింగాలు తీసేయడంతో లలితాదేవి పురుష ప్రకృతిని అలాగే అయ్యవారు శ్రీ చక్ర బిందువును….స్త్రీ ప్రకృతిని చూడడం జరుగుతుంది అని చెప్పేసి శివ నందిని కి అర్థం అయ్యి…. తన జ్ఞాన విశ్లేషణ అనుభవాలు విషయాలన్నీటిని కూడా రుద్ర స్వామి, మహాదేవికి చెప్పడం ఆరంభించింది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా విషయం తెలుసుకొని సరే అయితే నీ కంఠంలో శివలింగం పోలేదు కాబట్టి…. ఇప్పుడు స్త్రీ ప్రకృతిని స్త్రీయే చూస్తుంది అని చెప్పేసి అర్థం అయింది.  కాబట్టి అమ్మవారు మోక్షం పొందిందో లేదో నీ అంతిమ అనుభవాలు ధ్యాన దృశ్యాలు చెప్పాలి అని చెప్పేసి అనేసరికి ..అది చూడాలి అనుకుంటూ ఉండేసరికి…. ఈలోగా కృష్ణస్వామి మరియు యోగాంబికా స్పృహలోకి వచ్చి…. శివ నందిని కేసి చూస్తూ కొరకొర చూస్తూ క్షణకాలంలో అదృశ్యం అవడం జరిగింది. పరమహంస గారికి అనుకోని విధంగా తన ప్రమేయం లేకుండానే ఆదిపరాశక్తి తన కంఠంలో ఉన్న స్పటిక శివలింగమును తీసివేయడంతో…. పురుష ప్రకృతిని చూడవలసిన వాడు కాస్త స్త్రీ ప్రకృతిని చూడడం జరిగింది అని చెప్పేసి అంటే నిజానికి పురుష ప్రకృతిలో అమ్మవారు మోక్షం పొంది అయ్యవారు బతికే ఉంటారు.. అలాగే స్త్రీ ప్రకృతిలో అయ్యవారు మోక్షం పొంది అమ్మవారు బతికి ఉంటుంది. ఇప్పుడు తను సాధన అనుభవాల ద్వారా నిజ ప్రకృతి విషయ జ్ఞానం బయటకు వస్తుంది.  ఎందుకంటే ఆదిపరాశక్తి చేసిన ప్రయోగాలు కృష్ణస్వామి, యోగాంబిక చేసిన ప్రయోగాలను… ఈ నలుగురు స్త్రీమూర్తులు విఫలం చేయడంతో… కంఠంలో స్పటిక శివలింగం అలాగే ఉండటం జరిగింది. నిజానికి తారకాసురుడు కంఠంలో ఉన్న శివలింగమును విభేదనం చేయడం వలన పంచరామాలు ఏర్పడడం జరిగింది.  అంటే ఆ కంఠంలో శివలింగం ఉంచుకున్నట్టు అయితే వాళ్లకి కూడా అమ్మవారు మోక్షం పొందినది అనే జ్ఞానం అందేది. ఇదే తీసివేయడం వలన అమ్మవారు కాస్త మోక్షమును పొందలేదని అమోక్షం పొంది సజీవ మూర్తిగా ఉంది అని భ్రమ, బ్రాంతి మాయలో పడుతున్నారనే జ్ఞానం అందడం జరిగింది. ఇదే విధంగా పురుషులందరికీ కూడా ఎవరికైతే కంఠంలో స్పటిక శివలింగం పోయిందో…. వారికి నిజ జ్ఞానం అందలేదని… శివ నందిని గ్రహించింది.  దానితో ఇది  ఎవరికీ తెలియని మర్మ రహస్యంగా ఉన్నది అని తనకు తెలియడంతో ఒక విధమైన జ్ఞాన అహంకారం మొదలవడం జరిగింది. తనలో తనకి తెలియకుండానే జ్ఞానహంకారం మొదలైంది అన్నమాట!తను అహంకార మాయలో పడుతున్నానని తెలుసుకోలేని… తెలియని స్థితిలో శివనందిని వెళ్ళటం జరిగింది. ఎందుకంటే  పరమహంస వంటి యోగి యొక్క మర్మ రహస్యాన్ని ఛేదించడంతో శివలింగమును ఆయన కాపాడుకోలేకపోవటం వలన ఆయన పురుష ప్రకృతిని చూడవలసిన వాడు కాస్త స్త్రీ ప్రకృతిని చూసేటట్లుగాను అమ్మవారు మోక్షం పొందిన చోట అమోక్షం పొందినట్టుగా ధ్యానానుభూతి కలిగించేటట్టుగా ఆదిపరాశక్తి చేసింది అనే  మర్మ రహస్యాన్ని తను తెలుసుకున్నాను అని కించిత్ జ్ఞాన గర్వ అహంకారాలలో పడిందన్నమాట! దానితో తనలోని శారదా ఆత్మశక్తి ప్రవేశించడంతో తన జ్ఞానానికి ఇక అంతులేదు అని…. ఇది కూడా  ఒక విధంగా అహంకారానికి తొలిమెట్టు ఆరంభం అయ్యింది.  శివ నందినిలో కలిగే అహంకారం తాలూకా విషయాలు రుద్రస్వామికి జ్ఞాన  స్ఫురణ అయినప్పటికీ మినుకుండి పోయాడు. జరిగేది జరగక మానదు కదా! ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా సాక్షిభూతంగా ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి పిఓకే ప్రాంతం నుంచి తిరిగి యధావిధిగా ప్రస్తుత భారత ప్రాంతంలో ఉన్న పంచలోహ విగ్రహ మూర్తి రూపంలో ఉన్న శారదా దేవి విగ్రహ మూర్తిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అక్కడ కూర్చొని శివ నందిని కాస్త ధ్యానం నిష్ఠలోనికి వెళుతూ ఉండేసరికి  ఆ లక్షణాలు రుద్రస్వామిని కూడా అడగకుండా ఇవన్నీ కూడా విశుద్ధ చక్రా లక్షణాలే అని చెప్పేసి తనకి బ్రహ్మజ్ఞానం అందింది కాబట్టి…. తను ఇంకొకరిని అడిగి నిర్ధారణ చేసుకోవాల్సిన పనిలేదు అని చెప్పేసి…. తనకి అందిన జ్ఞానమే నిజ జ్ఞానం అని ఒక రకమైన జ్ఞాన అహంకారంలోకి రావడం జరిగింది.

విశుద్ధ చక్ర జాగృతి లక్షణాలు:- 

కుండలినీశక్తి విశుద్ధ చక్రములోనికి ప్రవేశించినపుడు మహాసరస్వతి తన యోగమాయను చూపించును! అనగా సాధకుడికి విపరీతమైన ఉత్సాహ శక్తి కల్గును! అలాగే స్వర విజ్ఞానము పెరుగును! వీటివలన సాధకుడు మహాగాయకుడిగా, మహాకవిగా ఖ్యాతి చెందుతాడు! తను జ్ఞాని అనే అహంకారములో ఉంటాడు! ఈ మాయను సాధకుడు దాటుకోవాలి! ఇక్కడే సాధకుడికి సమాధిస్థితి కలుగుతుంది!

ఆ తర్వాత కొన్ని రోజులకి ఆకాశముద్రతో ధ్యానం చేస్తూ ఉండేసరికి విశుద్ధ చక్రం యొక్క శుద్ధి లక్షణాలు ప్రారంభం అయ్యాయి.  ఇక్కడ 

విశుద్ధ చక్రం శుద్ధి లక్షణాలు:-

విశుద్ధ చక్ర అధీనము కొరకు సాధకుడు తన శ్రోత్రేంద్రియమును దృష్టిని పెడుతూ మనలో వినబడే వివిధరకాల శబ్దాలను వినుటకు ప్రయత్నాలు చేయాలి! అనగా మన శరీరంలో నుంచి సముద్ర అల సవ్వడులు, నీటి సవ్వడులు, గాలిహోరు, మున్నగు శబ్దాలు వినబడతాయి! ఇలా కొన్నాళ్ళు సాధన చేస్తే విశుద్ధ చక్ర ఆకృతి, దీని దళాలు, దీని బీజాక్షరాలు, అలాగే ఈ చక్ర దేవత అయిన సదాశివుడు కనపడును! అపుడు ఈ చక్రము అధీనమగును! కొంతమంది సాధకుడికి ధ్యానమును బాగా విపరీతంగా చేయాలని తీవ్రమైన వాంఛ కలుగుతుంది! ఈ కోరిక చాలా అంటే చాలా బలీయముగా ఉంటుంది! అంటే అప్పుడు విశుద్ధి చక్రము శుద్ధి అవుతున్నట్లుగా భావించుకోవచ్చును! కుండలిని శక్తి విశుద్ధచక్రంలో నున్నప్పుడు సాధకుడికి సమాధిస్థితి కలుగును! అలాగే ధ్యానంలో కూర్చోన్నపుడు విపరీతమైన శబ్దాలు వినపడును! ఉదాహరణకు సముద్రఘోష, గాలిహోరు, నీటి సవ్వడి, అలలు శబ్దాలు మున్నగునవి వినపడుతూ ఉంటే విశుద్ధ చక్రము శుద్ధి అవుతున్నట్లుగా భావించుకోవచ్చును!

విశుద్ధ చక్రము అధీనం లక్షణాలు:-

విశుద్ధ చక్ర అధీనము లో ఉండగా వచ్చే మహా సరస్వతీ యోగమాయను సాధకుడు దాటుకుంటే ఈ చక్రము అధీనమగును! తద్వారా సాధకుడికి మనోజవిత్వ అనే సిద్ధి లభించును! ఈ సిద్ధివలన సాధకుడు మనోవేగముతో వెళ్ళాలనుకొన్న చోటుకి వెళ్ళగలుగుతాడు! అదియుగాక ఆకాశతత్వము (ఆకాశం) వశమగును! ఈ చక్రములోనే సాధకుడికి సమార్ధిశీత సమార్ధిశీలి లభించును! ఈ చక్రములో ఉండగా కలిగే ముక్తిని సామీప్యముక్తి అందురు!

విశుద్ధి చక్రము బలహీనపడినప్పుడు ఎలర్జీలు, ఆస్త్మా, టి.బి., చర్మవ్యాధులు, గుండెనొప్పి, ఉబ్బసరోగం, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్, పారానాయిడ్, వినాళగ్రంథుల వ్యాధులు, గొంతు వ్యాధులు, మాటసరిగ్గా రాకపోవటం, గొంతు బొంగురు పోవటం, మొదలగు వ్యాధులు కలుగుతాయి! అలాగే మానసికముగా వ్యాధులు కలుగుతాయి!

ఈ చక్ర శుద్ధి కార్యక్రమంలోనే తనకి తెలియకుండా స్పటిక శివలింగం అలాగే ఉండిపోయింది అని చెప్పేసి ఆదిపరాశక్తి కూడా ఏమీ చేయలేక మినుకుండి పోయింది అని చెప్పేసి ఒక విధమైన అహంకారం మొదలవడం ఆరంభించింది. అది జ్ఞానహంకారమని తనకు తెలిసినా కూడా తను పట్టించుకోని స్థితికి వెళ్లడం జరిగింది. దానితో తనకు మించిన జ్ఞాని ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని… తనే నిజ జ్ఞాని అని నిజ జ్ఞానం లోకానికి చెప్పాలి అని…. అలా చెప్పే స్త్రీ మూర్తి తనే అని ….లోకంలో తనే మొట్టమొదటి స్త్రీ మూర్తి అని చెప్పేసి ఒక విధమైన గర్వహంకారాలకి జ్ఞాన అహంకారానికి లోనవటం జరిగింది.  తను ధ్యాననిష్ఠలో ఆకాశముద్రతో ఉండంగా తన కంఠంలో స్పటిక శివలింగ దర్శనం స్పష్టంగా విశుద్ధ చక్రం మధ్యలో  ఉన్నట్లుగా కనిపించింది.  దానిని చూస్తూ ఒక రకమైన గర్వహంకారాలకు లోనవటం ఆరంభం అయింది. వాగ్దేవి శక్తి ప్రవాహం వలన తన మాటలో వాక్సుద్ధి జరగటం ఆరంభం అయ్యింది.తన వాక్కు కాస్త దైవవాక్కుగా రావడం ఆరంభం అయ్యింది. ఈ దేవాలయ భక్తులను చూస్తూ యథాలాపంగా నీకు ఫలానా ఇది జరుగుతుంది… నీకు మూడు రోజుల్లో ఇది జరుగుతుంది. మూడు రోజుల్లో ఈ ప్రమాదం జరుగుతుంది. ఈ సమస్య వస్తుంది… ఈ సమస్యకి పరిష్కారం ఇది…. అని చెప్పి అడిగి అడగకముందే వాళ్ళ మోహం చూసి యధాలాపంగా అన్ని చెబుతూ ఉండేసరికి….మూడు రోజుల్లో జరిగేవి వాళ్లకి చెబుతూ ఉండేసరికి…. తన వాక్కు దైవవాక్కుగా అయ్యింది అని చెప్పి శివ నందిని గ్రహించి కించిత్ గర్వం లోనికి వెళ్లడం జరిగింది. రుద్ర స్వామి మరియు మహాదేవిని తన ముందు చిన్న పురుగుల్లాగా చూడటం ఆరంభం అయ్యింది.  వీళ్లిద్దరూ కూడా ఈ విషయం గమనించి మినుకుండి పోయారు. ఆ తర్వాత తనలోకి జ్ఞాన శక్తి అయిన సరస్వతి శక్తి ప్రకటితమవుతూ ఉండేసరికి…. నిగూఢ రహస్యాలకు సంబంధించిన జ్ఞానం కూడా అందటం జరుగుతూ ఉండేది.  అక్కడికి వచ్చిన వేద పండితులకి అర్థం కాని విషయాలను కూడా తన వాక్పటిమతో అర్థం అయ్యేలా విడమర్చి చెబుతూ ఉండేది. వాళ్ళు అది సత్యం అని ఈమెని అందరూ పొగుడుతూ ఉండేసరికి…. నెమ్మది నెమ్మదిగా ఈమెలో జ్ఞాన అహంకారం పెరగటం ఆరంభమయ్యింది.  అందరూ కూడా ఈమెకి వేద పండితులు, పురాణ పండితులు కూడా పాద నమస్కారాలు చేస్తూ ఉండటం…ఈమెను ఒక సరస్వతీ పుత్రికగా అనుకోవటం చేయటం జరిగింది. మహాదేవి:- ఆ అమ్మాయి సాధన కాస్త జనాలకు వెళుతుంది.  తను కీర్తి ప్రతిష్ట మాయలోకి వెళ్తుంది. అవసర భక్తులు, ప్రసాద భక్తులు చేరుతున్నారు. ఇక్కడ సరస్వతి పుత్రిక పీఠం పెట్టేస్తారేమో…ఆపండి.

రుద్రస్వామి:- నేను చేసేది ఏమీ లేదు.  ఇదంతా శివయ్య లీల.  ఆదిపరాశక్తి ఏం చేయాలనుకుంటుందో…. ఆవిడ ఇష్టం.  ఆవిడ మోక్షం పొందాలనుకుంటుందో… లేదో… ఆవిడ మోక్షం పొందాలి అనుకున్నప్పుడు ఆవిడ చేయాల్సింది ఆవిడ చేయాలి.  శివయ్య చేయాల్సింది శివయ్య చేయాలి.  నాకేం సంబంధం… నేను కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను.  ప్రకృతిలో జరిగే మార్పులను చూస్తూ ఉండటమే తప్ప… నేనేమీ మార్చను. వేటిని మార్చను.. నాకు అవసరం లేదు.  ఎవరు ఎలా పోతే నాకేంటి?  ఎవరి చావు వాళ్ళు చావటమే…

అని మినుకుండిపోయారు.  దానితో మహాదేవి కాస్త మహాదేవి:-  అమ్మాయి!  ఇవన్నీ నీకు అవసరమా? నీకు వాక్సిద్ది వచ్చింది నిజమే. ఈ వాక్సిద్ధితో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు  నెమ్మదిగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి.  దానికి తోడు నిగూఢ  జ్ఞాన రహస్యాలు తెలుసుకునే శక్తి కూడా నీకు వచ్చింది.  దానితో వేద పండితులకే అర్థం కాని మర్మ రహస్యాలు గురించి విశ్లేషణ చేసి చెబుతున్నావు.  కీర్తి ప్రతిష్టలు వస్తాయి.  నీ చేత పీఠం పెట్టిస్తారు..

అనేసరికి మహాదేవిని చిన్న చూపుగా చూస్తూ..

శివ నందిని:- నీకు జ్ఞానం అందలేదు అని చెప్పి, రుద్ర స్వామికి జ్ఞానం అందలేదు అని చెప్పి ఈర్ష్య , అసూయ, రాగద్వేషాలకు గురి అవుతున్నట్టు ఉన్నారు. మీరు పొందలేని జ్ఞానం నేను పొందుతుంటే తట్టుకోలేకపోతున్నారు. వేదపండితులంతా నన్ను సరస్వతి పుత్రిక చూస్తూ పాదనమస్కారాలు చేస్తున్నారని మీకు తెలియని అసూయను బయట పెడుతున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థితిని మార్చను.  ఈ స్థితి నాకు కావాలి. నేను నిజంగా ప్రపంచానికి చెప్పాలి. నేను ఒక జ్ఞాన యోగిని అని చెప్పి ప్రపంచానికి తెలియాలి.

 అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక శివ నందిని జ్ఞాన అహంకార మాయలో పడిపోయింది… ముంచడమో… తేల్చడమో… ఆదిదంపతులు తేల్చాలి. మన చేతుల్లో ఏమీ లేదని మినుకుండి పోయింది.

శివ నందినిలో  శారదా దేవి అనగా విద్యకు సంబంధించిన శక్తి ప్రకటితమవడం ప్రారంభం అయింది.  అనగా శాస్త్ర విషయాలలో…వేదాలలో లేని అంతర్గత విషయాలలోని అర్థం పరమార్థం ఒక్కొక్కటి జ్ఞాన స్ఫురణ అందడంతో… అది అక్కడ ఉన్న పండితులకి, సామాన్యులకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పగలిగే అంత జ్ఞాన స్థితిని పొందడం జరిగింది. అంటే సకల విద్యల జ్ఞానం అందడం జరిగింది. అలాగే ధ్యాన అనుభవాలు, స్వప్నాలు విశ్వదృశ్యాలకి సంబంధించిన జ్ఞానం సరస్వతీదేవి నుంచి పొందితే…. తన మాటే శాసనం అన్నట్టుగా దైవవాక్కు వాగ్దేవి ద్వారా పొందడంతో… ఇక ఈవిడని సాక్షాత్తు శారదా దేవియే భౌతిక రూపంలో శివనందినిగా మన మధ్య తిరిగి వచ్చింది అని అక్కడ ఉన్న పండితులు కూడా ఆరాధన పూర్వకంగా చూడటం… గౌరవించడం జరిగింది. దానితో ఈ త్రిశక్తుల యొక్క మాయ వలన తెలియకుండానే జ్ఞానహంకారాలు, గర్వాహంకారాల మాయలోకి శివనందిని వెళ్లిపోవడం జరిగింది. తనని శారదా దేవి అంశంగా అందరూ తనని కొలవటముతో తనలో ఆనంద స్థితిని, తన్మయత్వ స్థితిని పొందడం జరిగింది. ఇదే విషయాన్ని శివ స్వామికి చెప్పాలి అని శివ నందిని హృదయం మీద చెయ్యి పెట్టుకుని ఎంత ప్రయత్నించినప్పటికీ శివ స్వామి కనిపించకపోయేసరికి….ఈయనకి అహం మీద దెబ్బ కొట్టి ఉంటుంది. పరమహంస యొక్క తప్పును తాను దాటడం వలన శివ స్వామికి కోపం వచ్చి ఉండాలి.  ఎందుకంటే శివ స్వామి యొక్క స్థూల శరీరమే కదా! పరమహంస…అని చెప్పేసి స్త్రీ ఆధిక్యతను పురుషులు అంగీకరించలేరు కదా!  శివ స్వామి కూడా పురుషులే కదా!  అందుకే తన ఆధిక్యతను అంగీకరించట్లేదు అని ఒక రకమైన స్థితిలోనికి వెళ్లడం జరిగింది. అర్థాలు కాస్త అపార్ధాలుగా మారడం ఆరంభం అయ్యింది అన్నమాట!  నిజానికి శివ స్వామికి విషయం తెలిసినప్పటికీ…. తనకే తెలియని గర్వ అహంకార జ్ఞానమాయలు ఉందని గ్రహించి ఉండటం వలన…తను ఈ స్థితి నుంచి బయటికి రావాలని….ఒకవేళ తను కనిపిస్తే తనలో అహంకారాలు తగ్గకపోగా…. పెరుగుతాయని చెప్పేసి గ్రహించి ఆయన కనబడకుండా మినుకుండి పోయాడు.  ఆయన చేసిన పనిలో అర్థమును గ్రహించలేని లోతైన జ్ఞానమును పరమార్థమును గ్రహించలేనంత జ్ఞానమాయలో శివనందిని ఉండిపోయింది. దీనికి తోడుగా దేశవిదేశాల నుంచి కూడా పండితులు రావడంతో… వాళ్లతో వాదోపవాదములు చేయడం… తన వాదనలు నిజమని,సత్యమని తనకున్న త్రిశక్తులతో వాళ్ళని ఓడించడం…. శివనందిని చేయడం ఆరంభించింది. దానితో వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ఈవిడ శారదా అంశతో వచ్చిన ఆవిడ అని చెప్పి ఒక్కొక్క వేద పండితులు అంగీకరిస్తూ….ఈవిడకి పూజలు చేసే పరిస్థితికి రావడం జరిగింది. విగ్రహ పూజలు కాస్త వ్యక్తిగత పూజలు కిందకి రావడం జరిగింది. దీనికి ఎలాంటి అభ్యంతరాలు శివనందిని పెట్టలేదు.తనలో శారదా దేవిని చూస్తున్నారు అంటే… తను శారదా దేవి అన్నమాట!  అంటే తను దేవ్యోహం స్థితికి వచ్చేసాను అని మిడిమిడి జ్ఞానం…జ్ఞానమాయలో ఉండటం జరిగింది. ఎందుకు అంటే  అజ్ఞ చక్రం శుద్ధి అయిన తర్వాతనే…. శివోహం స్థితిని పొందడం జరుగుతుంది. కానీ ఈమె విశుద్ధ చక్రంలో ఉండగానే శివోహం స్థితిని పొందాను… తను శారదా దేవి అని భ్రమ బ్రాంతి మాయలో ఉన్నాను అని తెలుసుకోలేని స్థితికి శివనందిని వెళ్లడం జరిగింది. ఇదే జ్ఞాన అహంకార మాయ అని రుద్రస్వామి, మహాదేవి అనుకోసాగారు. రాను రాను పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం, లాలించడం మానేసింది. ఆ తర్వాత పెద్దల్ని గౌరవించడం అనగా మహాదేవి, రుద్రస్వామిని గౌరవించడం తగ్గించేసింది. మాటలు తగ్గించేసింది. వీళ్ళని దూరంగా పెట్టడం గమనించి నలుగురు మినుకుండి పోయారు.  కాలమే నిర్ణయం చేస్తుంది అన్నట్టుగా ఉండిపోయారు. రాను రాను తనకి సర్వం తెలిసింది అని తను సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించే శంకరాచార్యుని తర్వాత శివ నందినికి అంతటి అర్హత యోగ్యత ఉంది అని అక్కడ పండితులు ఒకటికి పది సార్లు పొగడ్తల రూపంలో చెప్పేసరికి….శివ నందినికి ఇక తను రాను రాను సర్వజ్ఞ పీఠాధిపతిని అయ్యాను అనే భ్రమ, భ్రాంతిలో శివ నందిని ఉండిపోసాగింది. ఇక రాను రాను దేవతలు దైవాలు కూడా పలికే పరిస్థితికి రావడం జరిగింది. ఎందుకంటే తనకి ధ్యానంలో బంగారం సరస్వతి విగ్రహం పదే పదే కనిపిస్తున్నప్పటికీ…. దాని గురించి ఆలోచించడం ఆ దైవీక వస్తువులు తీయాలి… దానిని పొందాలి… అనే ప్రయత్నం చేసే పరిస్థితిలో శివ నందిని లేకపోయింది. అలాగే ధ్యానంలో ఢమరుక నాదం వినిపిస్తున్నప్పటికీ కూడా…. దానిని విని సాధన చేయాలి…. నాదంలోకి వెళ్ళాలి అని అనుభవం వచ్చినప్పటికీ కూడా… శివ నందినికి ఉన్న జ్ఞాన అహంకారం మాయ వలన… దాని గురించి పట్టించుకోవడం మానేసింది.  తనే వాగ్దేవి అయినప్పుడు…శారదా దేవి స్థితిని పొందినప్పుడు తను ఇంకా వీటి గురించి ధ్యాన అనుభవాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది.. ఈ క్షణాన మరణం కావాలి అని అనుకుంటే.. అది వచ్చేది మోక్షమరణమే అవుతుంది కదా!  స్పటిక శివలింగం ఉన్నంతవరకు దానికి ఉన్న జ్ఞానం ఇస్తూనే ఉంటుంది.  ఇది కాపాడుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉండసాగింది.  అలాగే ధ్యానంలో తెల్ల శివలింగం కనపడుతున్నప్పటికీ కూడా దానికోసం వెతికే ప్రయత్నం కానీ చేయలేదు.  ఇలా తనకి కలిగిన ధ్యాన అనుభవాలు ఇదివరకు రుద్ర స్వామికి,మహాదేవికి చెప్పేది. కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహాలు తీసుకునే స్థితిలో తను లేదు.  తనంతట తను విశ్లేషణ చేసుకునే స్థితికి తను వచ్చాను… ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు… అనుకోసాగింది. తనకి కలిగిన అనుభవాలలో శివస్వామి, రుద్ర స్వామి, మహాదేవికి కూడా కలిగినాయి.  కానీ జ్ఞాన అహంకారమాయని సాధనలో ఉన్న వాళ్ళు నూటికి 98% దాటడం అనేది జరగదు.దీనివల్ల వారు ఆకాశ శరీరంతోనే మిగిలిపోవడం జరుగుతుంది. ఇప్పుడు శివ నందిని  మోక్షం పొందుతుందా లేదా అనేది శివనందిని ఈ మాయను దాటిన దానిని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ శివలింగం కానీ తను కోల్పోయినట్టు అయితే….తను చూడవలసిన స్త్రీ ప్రకృతిని కాస్త పురుష ప్రకృతిగా చూడడం అనే తప్పిదం జరుగుతుంది..  శివలింగాన్ని కాపాడుకోవాలి…అలాగే జ్ఞాన అహంకారమాయను దాటాలి. ఇది దాటుతుందా లేదా అనేది ఇక ప్రకృతి నిర్ణయానికి వదిలేయాలి… అని చెప్పి ఇంక ఎవరికి వారే మినుకుండి పోయారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా ఆపాలి?  అనేది అర్థం కాని అయోమయ స్థితిలో వీళ్ళు ఉన్నారు.  కానీ అర్థం చేసుకునే స్థితిలో శివ నందిని లేదు.  మంచి చెప్పినా కూడా అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నది.  దానితో అనుబంధాలు కాస్త విరిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి….అందరికీ అర్థం అయింది.  పెరుగుట విరుగుట కొరకే అని… తను ఎంతవరకు జ్ఞానం అహంకారంలోకి వెళ్తుందో…. అంతవరకు తనని వెళ్ళనివ్వాలి.  ఆ తర్వాత శివయ్య లీల.. ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దాం అన్నట్టుగా ఎవరికి వారే మౌనంగా ఉండిపోవడం జరిగింది.  వీళ్ళ యొక్క మౌనాన్ని చేతకానితనంగా భావించి వీళ్ళకన్నా తన ఆధిక్యత ఎక్కువగా ఉందని చెప్పేసి రానురాను అహంకారం తగ్గించుకోవాల్సింది పోయి… అహం, జ్ఞాన అహంకార మాయలో శివ నందిని పడిపోవడం జరిగింది. ఇక సాధన చేయడం మానేసింది. ధ్యానం చేయడం తగ్గించేసింది. రాను రాను ప్రజల యొక్క ఈతి భాదలను…పండితుల యొక్క జ్ఞాన సమస్యలను…. వేదాల యొక్క రహస్యాలను వెతికే ప్రయత్నంలోనూ… చెప్పే ప్రయత్నంలోనూ…. తను గడపడం జరుగుతుంది.. అని గ్రహించారు.  అది గ్రహించి సాధన చేసుకోమని మహాదేవి ఎంత చెప్పినప్పటికీ… సాధన చేయాల్సిన అవసరం ఏముంది?  నేనే దేవతనయ్యాను… నేనే జ్ఞాన దేవతని… నేనే శారదాంబని… నేనే సరస్వతిని… నేనే వాగ్దేవిని… నన్ను మించిన వాళ్ళు ఎవరు? నేను బ్రహ్మకి భార్యని అని …చెప్పేసి తనే సాక్షాత్తు మహా సరస్వతిగా భావనలు చేసుకునే స్థితికి తను వెళ్ళిపోవడం జరిగింది అని….ఈ మాయ ఎలా ముగుస్తుందో అనే ఆలోచనలో మహాదేవి ఉండిపోయింది.

రాను రాను శివ నందిని యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం ఆరంభం అయింది.  రాష్ట్రాల నుంచి… దేశాల నుంచి…. విదేశాల నుంచి… భక్తుల రాకపోకలు తాకిడి ఎక్కువ అయ్యేది.  ప్రత్యక్షంగా శారదా దేవియే శివ నందిని రూపంలో వచ్చింది అని చెప్పేసి అందరూ కూడా ఆరాధనలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతలా అంటే వేద పండితులు ఆమె దగ్గర కూర్చుని మంత్ర దోషాలను సవరించుకొని ఎలా పలకాలో తెలుసుకొని నేర్చుకునేవారు. ఆ విధంగానే గ్రంథ రచయితలకి కూడా తమ గ్రంథాలను మొదటి కాపీగా శివ నందినికి అందిస్తే ఈమె వాటిని చూసి అందులో ఉన్న వ్రాత దోషాలను భావాలు అన్నింటిని కూడా విడమర్చి ఎలా మార్పు చేయాలో ఏ విధంగా చేయాలో కూడా చెప్పే స్థాయికి వెళ్లిపోవడముతో ఇక అందరూ కూడా శివనందినీని కాస్త శారదా దేవిగా ఆరాధన స్థితికి రావడం జరిగింది. ఇది ఇలా ఉండగా…ఒకరోజు శివ నందిని కాస్త అమ్మవారి సమక్షంలో ఉండి ఎవరికో గ్రంథానికి సంబంధించిన విశ్లేషణ చేస్తూ ఉండగా…. వీళ్ళు అద్దెకు తీసుకున్న హోటల్ యజమాని కాస్త ఈమె దగ్గరికి వచ్చి మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి… గదిలో మీ వాళ్ళు ఉన్నారని టిఫిన్ అందించడానికి వెళితే వాళ్ళందరూ కూడా చచ్చిపడి ఉన్నారు.  ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి.  వాళ్ల శరీరాలకు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు.  పోలీసులకి చెబుదామని అనుకొని కూడా… మీ దగ్గర అనుమతి తీసుకుందాము అని వచ్చాను అనేసరికి…. పోలీసులకి చెప్పడం ఎందుకు?  అసలు ఏం జరిగిందో చూద్దాం అని శివ నందిని కాస్త హోటల్ గదికి వెళ్ళటం జరిగింది. హోటల్ గదిలో మధ్యలో హోమం జరిగినట్లుగాను… రుద్రస్వామి, మహాదేవి కాస్త ఒక్కొక్కళ్ళు 9 ముక్కలుగా విడిపోయినట్లుగాను…. పిల్లలు ఇద్దరు కూడా మూడు మూడు ముక్కలుగా విడిపోయినట్లుగాను శివ నందిని గ్రహించింది.  ఏం జరిగిందా? అనుకుంది.  ఎక్కడా కూడా రక్తపు మరకలు గాని, రక్తం కారిన సూచనలు గాని లేకపోయేసరికి.. ఒక విధమైన ఆశ్చర్య ఆనందాలకు లోనవుతూ ఎవరో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తొమ్మిది ముక్కలుగా, మూడు ముక్కలుగా ఖండించినట్టు కనపడుతుంది. కానీ రక్తపు మరకలు ఎక్కడా కనిపించకపోయేసరికి…. ఇదే విషయాన్ని హోటల్ యజమానికి చెప్పడం జరిగింది. అతను కాస్త ఏమోనమ్మా! నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది పోలీసులకి ఈ విషయం అందచేద్దాం అనేసరికి… పోలీసుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదండి…ఏదో విషయం జరిగింది… విషయం ధ్యానంలో తెలుసుకొని మీకు చెబుతాను…. అందాక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు… మీరు వెళ్లిపోండి అనేసరికి… చుట్టుపక్కల వాళ్ళందరూ హోటల్ యజమానితో సహా కిందకి వెళ్లిపోవడం జరిగింది. శివ నందినికి విషయం అర్థం కాలేదు. ఏమైనా అంటే కృష్ణస్వామి కానీ యోగాంబిక కానీ వచ్చి వీళ్ళని సంహరించారా? చంపినట్లైతే రక్తం పడాలి కదా! గోడల మీద ఎక్కడ రక్తం పడలేదు. శరీర భాగాల నుండి కూడా ఎక్కడా రక్తం వస్తున్నట్లు గానూ లేదు. అసలు ఏం జరుగుతుంది.? అనుకుంటూ వుండగానే రుద్రస్వామి,మహాదేవి కాస్త శరీర భాగాలన్నీ అతుక్కొని మామూలు రూపాలలోకి రావడం… ఆ తరువాత పిల్లలు కూడా శరీర భాగాలు అన్నీ అతుక్కుని మామూలు స్థితికి రావడం…. శివ నందిని గ్రహించింది. అప్పుడు బాల గణపతి కాస్త 

బాల గణపతి:- నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది యోగంలో ఒక భాగం. నేను అన్నయ్య ఏమో త్రిఖండ సాధనా సిద్ధి పొందితే…. మహాదేవి, రుద్రస్వామి నవఖండ సాధనా సిద్ధిని పొందాము… ఇది సిద్ధ మార్గంలో ఒక ఉన్నతమైన సాధన స్థితి.

శివ నందిని:- ఓహో ! అలాగా! నేను ఇంకా కృష్ణస్వామి, యోగాంబిక కానీ చంపేశారా అని కంగారు పడ్డాను. హోటల్ యజమాని భయపడ్డాడు.  అయినా మీరు చెప్పాలి కదా!  అయినా సిద్ధ మార్గం కన్నా జ్ఞానమార్గమే ఉన్నతమైంది. జ్ఞానమార్గంలో ఉన్నత స్థితికి వెళ్లకుండా అనవసరంగా శరీర భాగాలను ఖండించుకోవడం వలన ఉపయోగం ఏమిటి? దీనివలన జరిగే ఉపయోగం ఏముంది.. చూసేవాళ్ళు భయపడడం తప్ప ..

రుద్రస్వామి:-  ఎవరి సాధన వాళ్లకి గొప్పది. నీ జ్ఞానమార్గం నీకు గొప్పదైనప్పుడు, మా మార్గం మాకు గొప్పది.అమ్మవారు 18 ముక్కలుగా విడిపోవడం కూడా ఖండ యోగ సిద్ధితోనే జరిగింది. విష్ణుమూర్తి సుదర్శన చక్రం వలన అమ్మవారి శరీరం ముక్కలైందని స్థల పురాణం చెప్తుంది.  కానీ ఆవిడ శరీరాన్ని 18 భాగాలు లేదా 108 భాగాలుగా విభజన చెందించుకొని ఒక్కొక్క భాగం నుంచి శక్తి స్వరూపంగా మారడం జరిగింది.  శక్తి దేవతగా ఏర్పడడం జరిగింది. అదే శక్తి పీఠాలకు నువ్వు దర్శనానికి వెళ్లి అనుభవ అనుభూతులకు పొందుతూ జ్ఞానమార్గంలోకి వెళ్ళటం జరిగింది. మొదట వచ్చింది సిద్ధ మార్గం. సిద్ద మార్గం నుంచి జ్ఞానమార్గంలోకి వెళ్ళింది. సిద్ద మార్గంలో శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, నాడులను శుద్ధి చేసుకోవడం, కండరాలను శుద్ధి చేసుకోవడం, ఎముకల్లో ఉన్న జన్మాంతర పాపాలను శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. నీకు జ్ఞానం అందుతుంది.  ఇప్పుడు నువ్వు చేసే చేతిముద్రల వలన యోగ నాడులు ఉత్తేజితం పొంది అవి నీకు మెదడుకి జ్ఞానం అందించడం జరుగుతుంది.ఆ జ్ఞాన స్ఫురణలు నువ్వు పొందడం జరుగుతుంది. అదే మేము ఖండయోగంలో చేస్తున్నది . మొదట ఖండ యోగ సిద్ధి పొందిన తరువాతనే…. సిద్ధ మార్గంలోకి వెళ్లడం జరుగుతుంది.

శివ నందిని:-  జ్ఞానమార్గం కన్నా ఖండ సిద్ధి మార్గమే గొప్పదా?

అనేసరికి ఇక బాలగణపతి కాస్త శివ నందిని కి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయం తీసుకొని…

బాల గణపతి:- అమ్మ! నువ్వు జ్ఞానమార్గం గొప్పది అంటున్నావు.. నిజమే, నీకు ఒక విషయం వివరంగా చెబుతాను… నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?. ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఆలోచించావా? 

శివ నందిని:-  ఆ నలుగురు స్త్రీ మూర్తులు రావటం వలన….. ఆ నలుగురు అమ్మవార్లు  వచ్చి ఇది చేయటం వలన…. వాళ్ళ శక్తులు నాకు ఇవ్వటం వలన…. నాకు జ్ఞానం వచ్చింది.  నేను సంపాదించుకున్నాను. 

బాల గణపతి:- ఆ నలుగురు శక్తిమాతలు అక్కడికి రావాలి.. వచ్చేటట్టుగా ఎవరు చేశారు?ఆలోచించు…

శివ నందిని:- ఎవరు చేస్తారు?  నాకు అర్హత, యోగ్యత, యోగం ఉండబట్టి చచ్చినట్టు వచ్చారు.  భూలోకంలోకి.

బాల గణపతి:- అంటే మిగతా వాళ్ళకి అర్హత, యోగ్యత, యోగం లేదా?  మీ దగ్గరికే రావాలా వాళ్ళు? 

శివ నందిని:- అంటే ఏంటి?  

బాల గణపతి:- నీకు అర్హత ,యోగ్యత, యోగం వచ్చే విధంగా ఎవరు చేశారో అది ఆలోచించు. నీకు యోగ్యత ఏ విధంగా వచ్చిందో… ఎవరు వచ్చేలా ఎవరు చేశారో… అది ఆలోచించు.  నీకు యోగం ఉండేటట్లుగా ఎవరు చేశారో అది ఆలోచించు. విశ్లేషణలో మూలం నీకే తెలుస్తుంది. ఇక్కడ ఈ నలుగురు శక్తి మాతలు ఉన్నట్లుగా నీకు తెలియదు. వాళ్ళ నలుగురిని కాస్త ఏక స్థితికి తీసుకువచ్చింది ఎవరు? ఆ జ్ఞానస్థితి నీకు ఇచ్చింది ఎవరు?

శివ నందిని:- ఎవరో ఏమిటి?  నా అంతట నాకే వచ్చింది. 

బాల గణపతి:- నీ అంతట నీకే ఎలా వస్తుంది?  అలా రావాలనుకుంటే ఇక్కడ కాదు… నీకు ఆరంభంలోనే రావాలి. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ నలుగురు శక్తిమాతలు నీకు కనపడిన తరువాతనే…. అసలు వాళ్ళు శక్తి దేవతలు అనే విషయం నీకు తెలియదు. సాధారణ స్త్రీ మూర్తులే అనుకున్నావు. శక్తిమాతలు అనే జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం నీకు ఆపాదించే శక్తి నీకు ఎలా వచ్చింది? అందులోనూ నువ్వు విశుద్ధ చక్రంలో ఉండగా బ్రహ్మ రంధ్రంలో కలిగే జ్ఞాన అనుభవాలు నీకు ఎవరిచ్చారు? మూలం నువ్వే ఆలోచించు.. నీకే తెలుస్తుంది..అయినా ఒక్కొక్క చక్ర జాగృతికి ఎంత సమయం తీసుకుంటారో తెలుసా?  12 సంవత్సరాలు పడుతుంది.  ఒక్కొక్కరికి ఒక జన్మ పడుతుంది. అలాంటిది నీకు మూడు నెలల్లోనే చక్రం జాగృతి, శుద్ధి, ఆధీనం ఎలా అవుతుంది.  అదైనా ఆలోచించావా?  ఇదంతా జరగటానికి మూల కారణం పరమహంస.  భూలోకంలో ఉండి తన అనుభవ అనుభూతులు అన్నింటిని… జ్ఞాన బోధతో విశ్లేషణ చేస్తూ ఉండటం వలన.. తన ధ్యానానుభవాలు విశ్లేషణ చేసుకోవడం వలన…జ్ఞాన విచారణ  చేసుకోవడం వలన… నీవు ఈ స్థితికి రావడం జరిగింది. తను తన కంఠంలో ఉన్న శివలింగం ఎందుకు పోయింది?  ఆ శివలింగం ఎందుకు ఆదిపరాశక్తి తీసింది?  ఇందులో ఉన్న తిరకాసు ఏమిటి?  ఇందులో ఉన్న మర్మ రహస్యం ఏమిటి?  అని చెప్పేసి నువ్వు ఈ క్షేత్రానికి రాకముందు మూడు రోజుల క్రితమే మదనపడటం జరిగింది. ఆ మదన పడటం లోనే శివుడు శ్రీ చక్ర బిందువులోని ప్రకృతిని చూస్తున్న జ్ఞాన స్ఫురణ పొందిన విషయం గుర్తుకు  రావడం జరిగింది.  అదేవిధంగా ఆయన దగ్గరికి లలితాదేవి విగ్రహ మూర్తి వచ్చినప్పుడు… ఆ విగ్రహ మూర్తి యొక్క పాద భాగంలో శ్రీ చక్ర బిందువు స్థానంలో భూచక్ర బిందువు, మేరు శ్రీ చక్ర బిందువుల మధ్య ఉన్న శివలింగంలో అమ్మవారు ఒక ప్రకృతిని చేస్తుంది అని చెప్పేసి…. జ్ఞాన స్ఫురణ పొందడంతో ఈ రెండు రకాల అనుభవాలు ఏమిటి? అని ఈయన రాత్రింబవళ్లు కూర్చొని నిద్రపోకుండా నిద్రాహారాలు మానివేసి విశ్లేషణ చేయడంతో… ఆయనకి పురుషుడు అనగా నీలం శివుడు కాస్త స్త్రీ ప్రకృతిని చూస్తున్నాడు అని…. నీలాదేవి అయిన అమ్మవారు అనగా శారదా దేవి కాస్త పురుష ప్రకృతిని చూస్తుందని…. ఈ జ్ఞానం కంఠంలో ఉన్న స్పటిక శివలింగం తీసివేయడంతో… తను పురుష ప్రకృతిని చూడవలసిన వాడు కాస్త స్త్రీ ప్రకృతిని అనుభవ అనుభూతులకు చూడడం జరిగింది అని…  అదేవిధంగా నువ్వు కూడా నీ యొక్క జ్ఞాన లింగమును తీసివేస్తే… స్త్రీ ప్రకృతిని చూడవలసింది కాస్త పురుష ప్రకృతిని చూస్తావు అనే జ్ఞాన స్ఫురణ పొందడంతో…. శారదా దేవిని వేడుకుని తల్లి!  కాపాడాల్సింది నువ్వే… శివ నందిని అయినా కనీసం పొందేటట్టుగా చెయ్యి… అని ఆయన వేడుకోవడం జరగడంతో… ఆయన అనుగ్రహం మేర ఆ నలుగురు కూడా నీ దగ్గరికి రావడం జరిగింది. నీకు రావాల్సిన జ్ఞానమును అందించడం జరిగింది.  అలా ఆయన మదన పడకపోయి ఉన్నట్టయితే…. ఆయన జ్ఞానం గురించి అనుభవాల గురించి ఆలోచన చేయకపోయి ఉంటే… అది శివ స్వామికి అందకపోయి ఉంటే…. శివ స్వామి నుంచి నీకు రాకపోయి ఉంటే… ఈ శక్తి మాతలు నీ దగ్గరికి వచ్చి ఉండే వాళ్ళు కాదు…నీకు ఈ శక్తి అందేది కాదు.  నీకు ఒకప్పుడు అసలు మోక్షం అంటే ఏంటో తెలీదు.  ఎన్ని రకాల మోక్షాలు ఉంటాయో కూడా తెలియదు. ఎన్ని దేహాలు ఉంటాయని కూడా తెలియదు.  అందరూ కూడా సప్త చక్రాలు, సప్త మోక్షాలు, పురాణ ఇతిహాస గ్రంధాలు చెబితే అవన్నీ సత్యమైనప్పటికీ… అనుభవ పాండిత్యంలో ఇంకా ఉన్నాయి అని ఆయన సహస్ర చక్రం నుంచి జీవనాడి  మార్గం ద్వారా హృదయ చక్రానికి చేరుకొని… హృదయ చక్రం నుండి బ్రహ్మనాడి మార్గం ద్వారా ప్రయాణించి…. బ్రహ్మ రంధ్రం చేరుకొని అక్కడ శరీరాలు మోక్షం పొందుతాయని… 11 శరీరాలు మోక్షం పొందుతాయని…ఈ 11 కూడా ఏకాదశ రుద్ర శరీర మోక్షాలు పొందుతాయని చెప్పి… ఆయన తెలుసుకోవడం జరిగింది. మోక్ష మార్గమునకు సులువుగా సూక్ష్మములో మోక్షంగా మనకి చెప్పడం జరిగింది.  ధర్మార్థ కామ మోక్షాలను చెప్పే విధంగా మనకి మోక్షమార్గం చెప్పడం జరిగింది.  సహస్ర చక్రం దాటి ఎవరు వెళ్ళలేని స్థితి.  అలాంటిది జీవనాడిలో ఉన్న హనుమంతుడి మాయను దాటుకుని…. హృదయ చక్రానికి చేరుకుని యోగ నరసింహ స్వామి, ప్రత్యంగిరా మాయలు కూడా దాటుకుని… బ్రహ్మ రంధ్రం నకు చేరి…. అక్కడ ఉన్న జ్యోతి, మనో, పిండ, లింగ దేహ మోక్ష విధివిధానాలు ఉన్నాయని… తను తెలుసుకోవడం జరిగింది.  మనకి ఆ జ్ఞానం అనుభవం అనుభూతులను ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్న మాయలు మర్మాలు అన్నీ కూడా లోకానికి చెప్పడం జరిగింది. తను ఎంతో నిగూఢంగా ఉన్న  రహస్యాలను కూడా చేదించడం జరిగింది. అంటే ఒక్కో చక్రం సాధనలోకి వచ్చినప్పుడు నీకు వచ్చే మాయలు, మర్మాలు అవి ఏమిటి?  అవి ఎలా దాటాలి? అనే జ్ఞానమును పొంది…. ఆయన  అనుభవాలన్నీ కూడా ఏ మార్చకుండా…. ఏమీ మార్చకుండా… యధావిధిగా చెప్పడం వలన…. ఆ జ్ఞానమంత  నువ్వు పొందడం జరిగింది.  నీకు మూల జ్ఞానం ఇచ్చింది ఎవరు?  పరమహంసయే కదా!  పరమహంస లేకపోయి ఉంటే…. నువ్వు శబ్ద పాండిత్యం పొంది… సహస్ర చక్రం దాకా వచ్చి…. కింద మీద పడుతూ…. ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వచ్చేది.  అలాంటిది నీకు ఈ జన్మలోనే నిజ జ్ఞానం అందించే స్థితికి తీసుకువచ్చిe జన్మని మోక్ష జన్మ  చేశాడు అంటే… దాని వెనుక పరమహంస పడ్డ శ్రమ ఏమిటి?  అనేది నువ్వు ఆలోచించు.. ఆయనని మించిన యోగి,  ఈ భూప్రపంచంలో రారు.. రాబోరు.. తెలుసుకోలేరు.  అంతెందుకు… అనుభవ పాండిత్యం పొందిన బుద్ధుడు కూడా… మణిద్వీపంలో చింతామణి మాయలో పడిపోవడంతో…. ఆయనకి అనుభవ గురువుగా భావించిన పరమహంస కూడా ఆ బుద్ధుడిని దాటి ఆ మణులను దాటి వెళ్లడం జరిగింది. అంతెందుకు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు కూడా శమంతక మణి మాయలో పడిపోయి ఆగిపోవడం జరగలేదా!  మరి ఈయనకు మణులు దొరకలేదా…. మణులను దాటి …శివలింగాలలో స్త్రీ, పురుష శివలింగాలలో  భేదము, అలాగే శంఖాలలో స్త్రీ, పురుష శంఖాలలో భేదము…  ఇన్ని తేడాలను తెలుసుకొని ….ఇందులో మర్మ రహస్యాలను తెలుసుకొని… సహస్ర చక్రం  దగ్గర సాధన ఆగిపోదు అని… దానికి ఒక జీవనాడి మార్గం ఉందని… హృదయ చక్రం దాకా వెళ్లాలి అని…. దానికి బ్రహ్మనాడి మార్గం ఉన్నదని…. ఆ తర్వాత బ్రహ్మ రంధ్రం దాకా వెళ్లాలని చెప్పారు.  అందరు కూడా శబ్దపాండిత్యంలో సహస్ర చక్రం యొక్క రంధ్రమే బ్రహ్మ రంధ్రం అని చెప్పడం జరిగింది. కానీ సహస్ర చక్రానికి బ్రహ్మ రంధ్రానికి…0.5mm చెప్పడం జరిగింది తేడా ఉంది అని… ఆ తేడాను చెప్పగల ఘనుడు ఎవరు…? పరమహంసయే కదా!  పరమహంస 45 సంవత్సరాలు పాటు,  ఎన్నో వేల జన్మలు ఎత్తి తను పొందిన జ్ఞానమును, ఋణాణుబంధంగా  కర్మ శేషములను వదిలించుకుని,సంసార జీవితంలో కూడా అవస్థలు పడి, విడాకులు తీసుకొని, విడిపోయే పరిస్థితి వచ్చినా కూడా…. ఏమాత్రం చలించకుండా…. తన సాధన పరిసమాప్తి చేసుకోవాలని, తన ద్వారా విశ్వానికి ఏదో ఙ్ఞానం అందించాలనీ ..అష్ట కష్టాలు పడుతూ….. ఆర్థిక ఇబ్బందులు పడుతూ…. ఈతి బాధలు పడుతూ…. ఆనందం లేకపోయినా, శారీరక సుఖం లేకపోయినా, వీటి గురించి ఆలోచించకుండా… వేటికీ స్పందించకుండా…. దేని గురించి పట్టించుకోకుండా….24 గంటలు నిద్రాహారాలు కూడా మానివేసి….తనే శివుడిగామారినా కూడా….ఇసుమంత గర్వహంకారాలు ప్రదర్శించకుండా…. తనే శివయోగి, శివజ్ఞాని అయినా కూడా మోక్ష బ్రహ్మజ్ఞానం పొందినా కూడా…. గుప్తంగా ఉంటూ… ఆ విషయాలన్నీ కూడా లుప్తం చేసుకుంటూ…. గుప్త సాధనలో ఉండి…. సాధన చేసుకుంటే ఆయన సాధనం ముందు నీ సాధన ఎంత ? ఆయన పెట్టిన జ్ఞానబిక్షనే ధ్యానం ద్వారా పొంది …..నాలుగు చక్రాలలో శక్తిమాతల అనుగ్రహం పొందడం జరిగింది. ఆయన ఆనాడు జ్ఞానభిక్షను వేయకపోయి ఉంటే…. నువ్వు ఏ జ్ఞానం పొందే దానివి అది ఆలోచించు.  ఇక్కడ స్త్రీ ఆధిక్యత, పురుష ఆధిక్యత అనేది లేదు. ఇద్దరు సమాన శక్తివంతులే. ఇద్దరు కూడా మోక్షమును పొందటానికి అర్హత, యోగ్యత, యోగం ఉన్నది అని చెప్పి ఖరాఖండిగా ఆయన చెప్పి… తన ద్వారా స్త్రీ మూర్తి కూడా మోక్షం పొందే అర్హత, యోగ్యత ఉంది అని చెప్పి… లోకానికి చాటి చెప్పారు.  అంతటి మహా పురుషుడిని కూడా లెక్కచేయని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు ఎంతటి జ్ఞానాహంకార మాయలో ఉన్నావో నువ్వే ఆలోచించుకో… మేము ఎవరం కూడా ఏ విషయంలోనూ తక్కువ కాదు.  రుద్రస్వామి, మహాదేవి మేమంతా కూడా సిద్ధ మార్గంలో ఖండ యోగంలో మా సాధనలో మేము ఉన్నత స్థితిలో అంతిమ స్థితిలో మేము ఉన్నాము. మీ సాధనలో నువ్వు జ్ఞానమార్గంలో మద్యస్థ స్థితిలో ఉన్నావు.. ఆలోచించుకో!  నువ్వు కేవలం విశుద్ధ చక్రంలో ఐదవ స్థానంలోనే ఉన్నావు.  మేము ఏకంగా బ్రహ్మ రంధ్రంలో అంతిమ స్థితిలో లింగ దేహస్థితిలో మేము ఉన్నాము.  ఎక్కడ విశుద్ధ శరీరంలో ఉన్న ఆకాశ శరీర సాధన, ఎక్కడ బ్రహ్మ రంధ్రంలో ఉన్న సాధన స్థితిగతులు… ఎక్కడ ఆలోచించుకో ! సాధనలో మేము ముందున్నామా! … నువ్వు ముందున్నావా? నువ్వే ఆలోచించుకో… నీకు బ్రహ్మ జ్ఞానం రాలేదు.  కేవలం విజ్ఞానం మాత్రమే వచ్చింది. నీకు వచ్చిన పిసరంత విజ్ఞానంతో ఆకాశమంత జ్ఞానం పొందాను అని చెప్పి అనుకోవడంలో ఉపయోగం లేదు.  తెలుసుకోవాల్సింది కొండంత… తెలుసుకుంది గోరంత అని మాత్రం గ్రహించు.  ఇంతకంటే నేను చెప్పవలసింది ఏమీ లేదు…

అని బాలగణపతి తన ఆవేశం తగ్గించుకొని మౌనం వహించడం జరిగింది.  తన చేసిన తప్పు ఏమిటో… జ్ఞాన అహంకార మాయలో పడి తను చేసిన తప్పులు ఒక్కొక్కటి గుర్తుకు రావటంతో కళ్ళ వెంట నీళ్లు రావడం మొదలైంది.  ఈ విషయం గ్రహించిన మహాదేవి, రుద్రస్వామి కాస్త తనలో అహంకారం పోయి పశ్చాత్తాపమునకు వస్తుందని గ్రహించారు.  అప్పుడు శివ నందిని కాస్త పెద్దగా బోరున ఏడుస్తూ ఉండేసరికి… వీళ్ళు ఎవరు కూడా ఆపలేదు.  కారణం ఏమిటి అంటే… తనలో ఉన్న అహంకారం, ఆవేదన, బాధ తను పొందిన స్థితిగతులకు మూలం పరమహంస అని చెప్పేసి తను తెలుసుకోలేని స్థితిలో ఉన్నది కాబట్టి…. బాల గణపతి ద్వారా తను తెలుసుకుంది కాబట్టి… విషయం తనకి అర్థమయింది అని చెప్పి ఎవరికి వారే మౌనంగా ఉండటం జరిగింది. కొద్దిసేపటికి శివ నందిని కాస్త సహజ స్థితికి వచ్చి బాలగణపతితో….

శివ నందిని:- ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా!నాయన!  నువ్వు చెప్పింది అక్షర సత్యమే. పరమహంస గారి జ్ఞానబిక్ష వలనే నేను ఈ స్థితిని పొందాను అనే విషయం…. నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నీ ద్వారా తెలుసుకున్నాను.  ఆదిలోనే చెప్పేసి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా!  అంత్యంలో చెప్పడం వల్ల నాకు ఈ స్థితి కలిగింది. నావల్ల మీరు ఎన్నో అవమానాలు, పరాభవాలు పొందారు.  నన్ను క్షమించండి… 

రుద్ర స్వామి:- అమ్మ ఇది జ్ఞాన అహంకారమాయ.  ఈ మాయలో పడిన వాళ్ళు తనకు మించిన జ్ఞానులు లేరు అని చెప్పి అనుభవ అనుభూతిలోకి వెళతారు.  ఎప్పుడైతే అహంకారానికి విరుగుడు ఓంకారం అని చెప్పి తెలుసుకునే స్థితికి వస్తారో… వాళ్ళ మాయ మాయమైపోతుంది.  అది పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి నువ్వు శారదాంబ స్థితికి వెళ్లాను అనుకొని… మూలస్థితికి వెళ్లాను అనుకొని…. అనుభవ అనుభూతిలోకి వెళ్తూ ఉండేసరికి… ఆ శారదాంబ స్థితికి తీసుకువచ్చిన పురుషుడు ఎవరు అని చెప్పేసి నీకు తెలియ చెప్పాలి అని చెప్పడం జరిగింది. దానితో పెరిగిన అహంకారం నీలో విరిగిపోయింది.  సాధారణ స్థితికి రావడం జరిగింది. ఇది సాధనలో సర్వసాధారణంగా జరిగే విషయమే.  నీ గురించి మేము ఎప్పుడూ ఆలోచించము.. బాధ మేము నిన్ను అనుమానించము… బాధపడము… కాకపోతే తెలుసుకుంటావా! లేదా? అని ఆలోచన స్థితిలో మాత్రమే మేము ఉంటాము.  తెలుసుకుంటే పర్వాలేదు…. తెలుసుకోలేకపోతే ఆ మాయలో ఉండి అహంకారానికి లోనైపోతావు..  తిరిగి మేము కాశి క్షేత్రానికి వెళ్లిపోయే వాళ్ళం.  కాకపోతే ఎవరు మాయలో పడతారు…ఎవరు మాయ నుంచి బయటికి వస్తారు… మాయా సహితం నుంచి మాయా రహిత స్థితికి ఎవరు వస్తారో… వారి సాధన పరిసమాప్తి అవుతుంది. నీకు ఇలా మాయలు వస్తాయని తెలిసినా కూడా మాయలో పడవేయటమే ఆదిపరాశక్తి మహామాయ…

అనేసరికి ఇక పేరుపేరునా శివ నందిని కాస్త కాళ్ళ మీద పడి క్షమించమని అడగటం జరిగింది. అంతటితో అందరూ కూడా ఈవిడ  సహజ స్థితికి వచ్చేసింది అని చెప్పి గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు.  ఇక దాంతో శివ నందిని యధావిధిగా పిల్లలకి భోజనం తన  చేతులు మీదుగానే తినిపించి ఇక విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఇక సాయంత్రం విశుద్ధ చక్రం శుద్ధి కోసం చేస్తున్న ఆకాశముద్రలో అభ్యాసం చేయడం ఆరంభించాలని… ఇన్నాళ్లు జ్ఞాన అహంకారం మాయవలన తను ధ్యానం చేయలేదని గ్రహించింది.  యధావిధిగా ధ్యానముద్రతో సాధన చేయడం ఆరంభించింది.  తన చేసిన తప్పు తెలుసుకోవడంతో… అహంకారం పోయి అణుకువ మొదలయ్యింది.  అహంకారమాయ మాయమైంది.

శివ నందిని కాస్త యధావిధిగా శారదా దేవి ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూర్చుని ….ధ్యానం చేస్తూ ఉండగా… వేద పండితులు, గ్రంథ రచయితలు తన దగ్గరికి వస్తూ ఉండేసరికి… అయ్యా! ఇన్నాళ్లు నాకున్న జ్ఞాన అహంకార మాయవలన, నేనేదో పెద్ద పండితురాలినీ అని ….. నేనేదో చేస్తానని… మీలో ఉన్న ఉచ్చారణ దోషాలను, రాత దోషాలను కనిపెట్టే అంత స్థితిలో ఉన్నాను అని, జ్ఞానాహంకార మాయలో ఉన్నాను.  ఆ స్థితిగతులను నాకు అమ్మవారి అనుగ్రహించింది. కాబట్టి ఆ అమ్మవారి సమక్షంలోనే ఉచ్చారణ దోషాలు సరిచేసుకోండి.  ఉచ్చారణ దోషం వస్తే అమ్మవారు వాక్బంధనం చేసేస్తుంది.  తద్వారా మంత్రం యొక్క ఉచ్చారణ దోషం నివారణ చేసుకున్నట్లయితే…మీ వాక్కు తిరిగి వస్తుంది. అదే విధంగా ఈ వ్రాత దోషాల కోసం మీకు గ్రంథాలు ఉంటే…. ఆ గ్రంథాలలో దోషాలు ఉంటే ఆ అమ్మవారు వాటిని చెల్లాచెదురు చేసేస్తుంది.  ఒకవేళ ఆ గ్రంథసారం నుండి వ్రాత దోషాలు లేకుండా ఉంటే మీ గ్రంధాలు యధావిధిగా చెల్లాచెదురు కాకుండా ఉంటాయి అనేసరికి…. సరే తల్లి!  ఇక నీ ఆజ్ఞ అని అనేసరికి… అలాగే తన దగ్గరికి సమస్యలతో వచ్చే వారికి సమస్యలకి పరిష్కారం చెప్పకుండా అమ్మ! ఈరోజు నుంచి మౌనము వహిస్తున్నాను. సమస్యలు కూడా అమ్మవారికి చెప్పుకోండి.  నేను కేవలం అమ్మవారి భక్తురాలిని… అమ్మవారిని కాదు అని సవినయంగా అందరికీ….తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చెబుతూ…. తన ప్రాబల్యం తగ్గిస్తూ…. శారదా దేవి ప్రాబల్యం పెంచడం జరిగింది. శివ నందిని లో వచ్చిన మార్పుకి సాధనా కుటుంబం అంతా సంతోషించారు.  ఎవరికి వారే ఆనంద స్థితిలో ఉంటూ…. ధ్యానాలు జపాలు చేసుకోవడం ఆరంభించారు.  తనకి బంగారపు సరస్వతి విగ్రహం లీలా మూర్తిగా కనిపిస్తూ ఉండేసరికి…. అది కూడా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న శారదా పీఠం ప్రాంతంలో మహా సరస్వతి కనపడుతూ ఉండేసరికి…. ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో వీళ్లు ఉండిపోయారు.  మళ్ళీ దర్శనానికి అనుమతి కావాలి అని అర్జీ పెట్టుకోవడంతో….అప్పటికే ఒకసారి వెళ్లి వచ్చారని తెలుసుకొని…. అప్పుడు ఎలాంటి ఉపద్రవము, ప్రమాదము వీళ్ళ వలన జరగలేదని, అధికారులు గ్రహించడంతో…. అధికారులు వీళ్ళకి రెండోసారి అనుమతి ఇవ్వటం జరిగింది. ఈసారి అనుమతి తీసుకుని మూడు రోజులపాటు అక్కడ ఉండి…. ధ్యానం చేసుకోవడం జరిగింది. ఒకరోజు శివ నందినికి ధ్యానంలో చూసినప్పుడు…. అక్కడ ఉన్న స్తంభాకార శివలింగంలా ఉన్న దాని మధ్య భాగంలో  ఏదో ఉన్నట్టుగా గమనించి…దానిని గట్టిగా కదిపేసరికి  ఖాళీగా ఉన్న మధ్యభాగంలో ద్వారం తెరుచుకునేసరికి… లోపల మెట్లు ఉండేసరికి… సరే అని లోపలికి వెళ్లడం జరిగింది.  లోపలికి వెళ్లేసరికి అక్కడ విచిత్రంగా గాయత్రీ దేవి, సరస్వతి, వాగ్దేవి, శారదా దేవి బంగారు విగ్రహమూర్తులు ఒక అడుగు పరిమాణంలో ఉన్నవి కనిపించేసరికి శివ నందిని ఆశ్చర్య ఆనందాలకు లోనైంది. ఇందులో ఏ విగ్రహం తీసుకుంటే ఏం జరుగుతుందో అనే అయోమయ స్థితిలో ఉన్నది.  కానీ ఇందులో కేవలం 3 విగ్రహాలు జ్ఞాన అహంకారాలు కలిగిస్తాయని…. ఒక విగ్రహం మాత్రం అహంకారాన్ని కలిగించదు అని చెప్పేసి శివ నందినికి జ్ఞాన స్ఫురణ అందింది. కానీ ఏం తీసుకుంటే ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలోనికి వెళ్ళింది.  తనకి ధ్యానంలో మహా సరస్వతి విగ్రహం కనపడింది. కాబట్టి ఆ మహా సరస్వతి విగ్రహం తీసుకుందాం అంటే ఇక్కడ మహా సరస్వతి విగ్రహం నించుని ఉన్నది.  వాగ్దేవి విగ్రహం కూర్చొని ఎడమకాలు కింద పెట్టి, కుడికాలు మడత పెట్టి ఉన్నది.  గాయత్రీ కాస్త కుడికాలు కింద పెట్టి, ఎడమ కాలు మడత పెట్టి ఉంది. అదే శారదా దేవి విగ్రహ మూర్తికి వచ్చేసరికి…. రెండు కాళ్లు మడత పెట్టి…. పద్మాసనంలో కూర్చున్నట్టుగా ఉన్నది. ఇక్కడున్న ఏ విగ్రహ మూర్తి తీసుకోవాలా అని చెప్పి శివ నందిని ఆలోచనలో ఉండి… మహాదేవి, రుద్ర స్వామిని అడిగేసరికి మాకు తెలియదు. అది నీ ఎంపిక.  నువ్వు ఏం తీసుకుంటే అదే.. కానీ నువ్వు ఒకసారి తీసుకుంటే మిగతా మూడు విగ్రహాలు మాయమైపోతాయి.  ఒకవేళ అది కానీ జ్ఞాన అహంకారాన్ని కలిగిస్తే… నీలో ఉన్న శివలింగం బయటికి వస్తుంది.  అప్పుడు నువ్వు చూడవలసిన ప్రకృతులు మారిపోతాయి.  ఆ విషయం మాత్రం నాకు అర్థమవుతుంది అని రుద్రస్వామి అనేసరికి… ఏం చేయాలో అర్థం కాక ధ్యానంలో కూర్చుంది.  ధ్యానంలో కూర్చునే సరికి మొదట వాగ్దేవి, సరస్వతీ కనిపించారు. నిలుచున్న సరస్వతీ కాస్త వీణ వాయిస్తున్నట్టు మొదట సరస్వతిగా కనిపించింది.  సరస్వతీ కాస్త కూర్చున్నట్టుగా బ్రహ్మ కమలాలలో ఉండి వీణ వాయిస్తున్నట్టుగా వాగ్దేవిగా కనబడింది.  అంటే ఈవిడ బ్రహ్మ సరస్వతి అని గ్రహించింది.  బ్రహ్మ సరస్వతి నుంచి గాయత్రీ దేవి రావటం జరిగింది. ఒక పక్క గాయత్రి, మరొకపక్క బ్రహ్మ సరస్వతి కూర్చున్నట్టు ఉన్న భంగిమ చూస్తుంటే… సోమస్కంధ మూర్తి భంగిమ లాగా ఆదిదంపతులు కూర్చున్నట్టుగా కూర్చున్నారు.  ఈ రెండు విగ్రహాలు కలిసి ఏకమైనప్పుడు పద్మాసనంలో కూర్చున్న శారదా దేవి కనిపించింది. అంటే ఇది కదిలే స్థితి, కదలని స్థితి కలిసి…. నిశ్చల స్థితి శారదా దేవి అని చెప్పేసి జ్ఞాన స్ఫురణ అందటంతో ఇంక ఏమాత్రం ఆలోచించకుండా…. పద్మాసనంలో కూర్చున్న శారదా దేవి విగ్రహ మూర్తిని తీసుకునేసరికి… తనలో జ్ఞానాహంకారం పోయి, స్పటిక లింగం దివ్య తేజస్సుతో కంఠంలో కనిపిస్తూ ఉండేసరికి…ఇక తన తీసుకున్నది సరి అయినదే అని….ఇక తను నిశ్చల స్థితిలో జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి.. శివ నందిని గ్రహించింది.  ఆ విధంగా శివ నందిని ఆ విగ్రహ మూర్తిని తీసుకొని బయటకు వస్తూ ఉండేసరికి….కృష్ణస్వామి, యోగాంబిక పాక్ సైనికులతో కనిపించేసరికి… చూశారా!  చూశారా!  వీళ్ళు గుప్తనిధులను తవ్వటానికి వచ్చిన వాళ్ళే…చూడండి…. ఆవిడ చేతిలో విగ్రహాలు ఉన్నాయి.  అది శారదా దేవి బంగారు విగ్రహం మూర్తి.  దీనిని మాకు ఇచ్చేయండి.  మా దేశానికి తీసుకుపోతాము అని కృష్ణస్వామి అనేసరికి… పాక్ అధికారులు కాస్త విగ్రహ మూర్తిని అందుకోవాలి.. తీసుకోవాలి అని అనుకుంటూ ఉండేసరికి… రుద్ర స్వామి సైగ  చేయడంతో శివ నందిని కాస్త అదృశ్య శక్తితో ఆ విగ్రహ మూర్తిని కాస్త మట్టి విగ్రహం మూర్తిగా బంగారు పూత ఉన్నట్లుగా క్షణకాలంలో మార్చేసింది.  అప్పుడు పాక్ అధికారులు దగ్గరికి వచ్చే సరికి ….అయ్యా ! ఇది బంగారపు విగ్రహం కాదు.  మట్టి విగ్రహమునకు బంగారపు పూత పూసి ఉండటంతో…. పిల్లలు ముచ్చటపడి ఇక్కడ కొనుక్కోవడం జరిగింది అని చెప్పి చెప్పేసరికి…. కాదు, కాదు… అది నిజమైన విగ్రహము.  బంగారపు విగ్రహము.  వీళ్ళు అబద్ధం చెపుతున్నారు అని యోగాంబిక అనేసరికి….అప్పుడు పోలీసు అధికారి కాస్త ఆ విగ్రహమును పరిశీలించి చూసి… ఆ పక్కనే ఉన్న గోడకేసి కొట్టేసరికి.. అది బంగారపు పూత పూసిన మట్టి విగ్రహం అని చెప్పి గ్రహించి…ఇది కేవలం మట్టి విగ్రహమే, బంగారు పూత పూశారు అని ఆ ముక్కను కృష్ణ స్వామికి చూపించేసరికి… కృష్ణస్వామి కాస్త మట్టి విగ్రహంగా తనకి వచ్చిన సిద్ధితో క్షణకాలంలో మార్చేసింది అని చెప్పేసి విషయం గ్రహించారు. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి…. అయినా ఈ భూ గృహంలోకి ఎందుకు వెళ్లారు?  అని అనేసరికి అయ్యా ! మేము భూ గృహంలోకి వెళ్లలేదు.  ఈ పీఠం ఖాళీగా ఉంది ఏంటి! అని పైకెక్కి చూస్తూ ఉండగానే…మీరంతా వచ్చారు. ఇక్కడ భూగ్రహం ఏమీ లేదు అనేసరికి పోలీసులు ఎందుకో అనుమానం వచ్చి… నేల మీద కొట్టి చూసేసరికి ఎక్కడా కూడా భూగృహ ద్వారం ఉన్నట్లుగా అనిపించకపోయేసరికి… ఇక్కడ ఏమీ లేదు, రాతి దిమ్మె తప్ప…అని చెప్పి నిర్ధారణ చేసేసరికి…ఇక మీరు ఉండద్దు,మీకు ఇచ్చిన సమయం పూర్తయిపోయింది… మీరు వెళ్లిపోండి లేదంటే…మిమ్మల్ని అరెస్టు చేయాల్సి వస్తుంది… లేదంటే కాల్చివేయాల్సి వస్తుంది అని ఉన్నత అధికారి చెప్పేసరికి… అయ్యా!  మేము వచ్చిన పని అయిపోయింది.  మేము వెళ్తాము అనేసరికి..

కృష్ణస్వామి:-  వీళ్ళని అరెస్టు చేసి జైలో  పెట్టండి.. వీళ్ళు గారడీ చేశారు.. కనికట్టు చేశారు… వాళ్ల దగ్గర ఉన్నది నిజమైన బంగారపు విగ్రహమే.  ఆ శారదా దేవి విగ్రహం దేశం దాటి వెళ్ళకూడదు.  కనీసం మీ దేశంలో అయినా ఉంచుకోండి.

అనేసరికి మేము హిందూ దేవతలని ఆరాధన చేయము.  వాటి గురించి పట్టించుకోము.  అది వాళ్ళకి సంబంధించిన విగ్రహం కాబట్టి వాళ్ల దగ్గర నుంచి తీసుకునే అధికారం మాకు లేదు అని చెప్పి అనేసరికి…. కృష్ణస్వామి మరియు యోగాంబిక ఎంత నెత్తినోరు కొట్టుకున్న అధికారి వినకపోగా…. ఏదైనా తేడా చేస్తే నీ ఇద్దరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది.  మీ ఇద్దరు బంగారపు విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్తున్నారని చెప్పడం జరిగింది. తీరా చూస్తే అది మట్టి విగ్రహం అని చెప్పి…. మీరు తప్పుడు విషయం, సమాచారం ఇచ్చారని మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది… జైలుకు వెళ్తారా?  లేదంటే వాళ్లతో పాటు వెళ్తారా?  అనేసరికి

కృష్ణ స్వామి:-మేము ఎందుకు జైలుకి వెళ్తాము? మేము కూడా వాళ్లతో పాటే వెళ్తాము.  మేము కూడా భారతీయులమే…. 

అని వీళ్లు కూడా  సాధన కుటుంబంతో పాటు వెళ్తూ… ఈసారి మీరు తప్పించుకున్నారు.. ఎక్కడో ఒకచోట దొరకకపోరు. సాధనలో ఎక్కడో ఒకచోట తప్పు చేయకుండా పోరు.  అప్పుడు నా తడాఖా ఏంటో చూపిస్తాను… అని చెప్పేసి వీళ్లిద్దరూ పోలీసులు చూడట్లేదు… తమను వదిలి పెట్టేసారు అని చెప్పేసి అదృశ్యం అవడం జరిగింది. ఆ తర్వాత ఈ సాధన కుటుంబం కాస్త భారత విభాగంలో ఉన్న సరస్వతి దేవి గుడికి రావడం జరిగింది. శారదా విగ్రహ మూర్తిని యధావిధిగా తన శరీరంలోనికి అదృశ్య శక్తిగా నిక్షిప్తం చేయబోతూ ఉండేసరికి…. అమ్మ ఉండండి… ఇప్పుడు మీ సాధన పరిసమాప్తి అయింది కాబట్టి…. ఇప్పుడు నీకు ధ్యాన అనుభవంగా ఇంతకుముందే తెల్ల శివలింగం దర్శనం అయ్యింది కదా!  ఈ తెల్ల శివలింగం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి… ప్రయత్నం చేయాలి కదా! అనేసరికి… 

రుద్ర స్వామి:- ఇప్పుడు తనకి చక్ర అధీనము కదా అయింది… అలాగే శివ బంధ విముక్తి కలిగించే వస్తువు కూడా రావాలి..

మహాదేవి:- అసలు ఎవరిని బంధవిముక్తి చేస్తున్నారు…  ఏ శివుణ్ణి బంధ విముక్తి చేస్తున్నారు.. 64 మంది రుద్రులు ఉన్నారని అంటారు కదా!  ఎవరిని బంధ విముక్తి చేస్తున్నారు? శివ నందిని:-  ఏమో!  నాకు కూడా తెలియదు… బంధ విముక్తి వస్తువులు వస్తాయని రుద్ర స్వామి అనడం జరిగింది…

అనేసరికి రుద్ర స్వామి కాస్త ధ్యానంలో కూర్చుని…..

రుద్రస్వామి:- మనకి ఏకాదశ రుద్రులలో విలోహిత రుద్రుడు ఉంటాడు.  ఈయన 14 చేతులతో ఉంటాడు.  ఈ 14 చేతులు 14 వస్తువులతో ఉంటాయి. ఇవన్నీ 14 రకాల బంధనాలతో బంధించడం జరిగింది. ఎందుకు అంటే ఈయన బాడవాగ్నికి అధిపతి.  నీటిలో కూడా ఈయన దహనం చేయగలడు.  ఈయనకి దహన శక్తి ఉన్నది.  ఈ అపారమైన దహన శక్తితో సృష్టి, స్థితి, లయలలో ఉన్న అండ,పిండ,బ్రహ్మాండాలను క్షణకాలంలో భస్మం చేయగలడు.  ఈయన ఒంటరిగా ఉంటాడు.  ఈయన 14 చేతులను, 14 రకాల శక్తులతో అమ్మవారు బంధనం చేయడం జరిగింది. తద్వారా ఈ బడవాగ్ని కాస్త గృహ అగ్నిగా గృహ చండీగా మారటం జరిగింది. ఈయన్ని బంధ విముక్తి చేస్తే విశ్వంలోని అండపిండ బ్రహ్మాండాలు దహనం అయిపోతాయి.  తద్వారా విశ్వమే  లేని ప్రమాదం ఉంది.  ఆ ప్రమాదాన్ని ఆది పరాశక్తి అంశ అయిన జోగులాంబ తీసుకోవడం జరిగింది. ప్రళయ కాలంలో ఆ జోగులాంబ త్రిమూర్తులు, త్రిశక్తులు నాశనం కాకుండా ఆపడం జరుగుతుంది. మనకి అది జోగులాంబ అమ్మవారి దర్శనంలో ఈ విషయం తెలుస్తుంది. ఆవిడ విలోహిత రుద్రుడు యొక్క అగ్ని శక్తిని…. ఆదిశక్తి  కాస్త జోగులాంబగా మారి అదుపులో ఉంచడం జరుగుతుంది. ఈ 14 బంధనాల నుండి ఆయనకి విముక్తి కలిగించినట్టయితే…. ఆయన్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఆదిపరాశక్తికి కూడా ఉండదు అని చెప్పి శివుడు ఆ విషయం గ్రహించి… నా అంశా రూపమైన విలోహిత రుద్రునికి విముక్తి కలిగించాలని… చెప్పి బంధ విముక్తి కలిగించటం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రంలో మనకి నాదం నుంచే కదా!  అక్షర జ్ఞానం పొందడం జరిగింది. ఆ నాదానికి ప్రతీకయయే కదా ఢమరుకం. ఆ ఢమరుకం నుంచే 72 అక్షరాలు వచ్చినాయని అక్షర జ్ఞానం కలిగింది… అని సకల శాస్త్రాలు, వేదాలపరంగా జ్ఞానం ఇదంతా ఈ ఢమరుక నాదం నుంచే వచ్చాయని చెప్పేసి… శాస్త్ర వచనం కదా!  మనకి డమరుకం రావాలి.

 అని చెప్పేసి అనేసరికి ఈ విషయంని అన్ని  వినే స్థితిలో శివ నందిని లేకుండా… యోగమత్తు ఆవరించి… ధ్యాన  స్థితిలోనికి వెళ్ళటం జరిగింది. ధ్యాననిష్ఠలో తను ఉన్న మహా సరస్వతి బంగారం విగ్రహం కింద పాదభాగంలోనే శివుడి డమరుకం ఉన్నదని…ధ్యాన దృశ్యం పొందడం జరిగింది. అప్పుడు కళ్ళు తెరిచి… శివ నందిని కాస్త రుద్రస్వామి కేసి చూస్తూ అయ్యా!  ఇప్పుడు మనం ఉన్న ఆలయంలోనే అమ్మవారి పాదపీఠం కింద డమరుక్ ఉన్నది అని…. అది కూడా ఆది శివుడు ఉపయోగించిన డమరుకం అనేసరికి అవునా?  అని చెప్పేసి… అయితే అది తీసుకోవడం ఎలా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి… అనేసరికి శివుడే చెప్పాలి… శివాజ్ఞ మన చేతిలో ఏముంది?  అనేసరికి ఎవరికి వారే ఇక ధ్యానంలో ఉండిపోవడం జరిగింది.

ఇదిలా ఉండగా రాత్రిపూట శివ నందినికి ధ్యానంలో శారదా దేవి చేతుల మీదగా…ఢమరుకము ఇచ్చినట్లుగా అనుభవ అనుభూతి వచ్చేసరికి… ధ్యానభంగం అవ్వడంతో… నిద్రలో ఉన్న రుద్ర స్వామిని లేపి…

శివనందిని:- అయ్యా!  మనకి ఢమరుకము…అందే అవకాశం కనబడుతుంది.  అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఉన్నచోటికి వెళ్లి ఢమరుకము తెచ్చుకుందాము..

శివ నందిని:- ఈ అర్ధరాత్రి పూట గుడికి వెళితే లేనిపోని అనుమానాలు, భయాలు వస్తాయి.  సమస్యలు, ప్రమాదాలు వస్తాయేమో!

రుద్రస్వామి:- శారదా దేవి చూసుకుంటుంది. ఏదేమైనా మనం అక్కడికి వెళ్దాము. మనం చేసేది ఏమిటి?  మన చేతుల్లో ఏమీ లేదు కదా!

అని అనుకుంటూ ఉండేసరికి సరే తల్లి!  పిల్లలు కూడా నిద్రలో ఉన్నారు.  మహాదేవి కాపలా ఉంటుందిలే! అనేసరికి వీళ్ళిద్దరూ కిందకి రావడం జరిగింది.  కిందకి వస్తూ ఉండగానే దారిలో ఒక ఆవిడ కనపడి ఏంటి?  అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నారు?  అనేసరికి…. ఏదో పనిమీద వెళుతున్నాం లే ! అనేసరికి… ఆ పని ఏదో నాకు తెలుసులే! శబ్ద నాదం కోసమే కదా వెళ్లేది!  అనేసరికి….. ఈ విషయం తెలిసిన నువ్వు ఎవరు?  అనేసరికి… నేనెవరో తనకి తెలుసులే!  అంటే ఆవిడ శారదా దేవి అని శివ నందిని రుద్ర స్వామికి సరిగా చేసేసరికి… రుద్ర స్వామి మౌనం వహించాడు.  ఆవిడని అనుసరించడం జరిగింది. వాళ్ళు సరాసరిగా సరస్వతి ఆలయానికి వెళ్ళటం జరిగింది. సరస్వతీ బంగారు పీఠం ఉన్న పాదభాగం నుంచి ఈ స్త్రీ మూర్తి కాస్త చెయ్యి పెట్టి శివుడు ఉపయోగించిన ఢమరుకం బయటికి తీయడం జరిగింది. ఆ ఢమరుకం గాలిలోకి వెళ్ళుతూ ఉండేసరికి….ఈ ఢమరుకం సహజసిద్ధంగానే మోగడం ప్రారంభమయ్యింది. అందులో నుంచి బీజాక్షరాలు… భాష అక్షరాలు… వేద జ్ఞానం, శబ్ద పాండిత్యం అందించిన సంగీత నాదాలు, సంగీత వాయిద్యం పరికరాలు, సరిగమలు ఒక్కొక్క నాదం శబ్దానికి వస్తూ ఉండటం గమనించి… ఆ ఢమరుకానికి సాష్టాంగ నమస్కారం చేసేసరికి… అమ్మ! ఇది శివుని యొక్క బంధ విముక్తికి ఉపయోగపడే వస్తువు అని నాకు అర్థం అయింది.  ఇప్పుడు నాలో ఇన్నాళ్లు జ్ఞాన శక్తికి మూలమైన ఈ శక్తిని నీకు ఇవ్వడం జరుగుతుంది.  ఇక ఇక్కడి నుంచి నాకు బంధ విముక్తి కలుగుతుంది.  నేను యధావిధిగా బ్రహ్మ లోకమునకు వెళ్ళిపోవడం జరుగుతుంది.  శంకరాచార్యులు చేసిన బంధనం నుంచి నేను విముక్తురాలని అయ్యాను అనేసరికి… సరే తల్లి!  అనుకుంటూ ఉండేసరికి నాలో ఉన్న సరస్వతి కాస్త బ్రహ్మలోకానికి వెళుతుంది. నాలో ఉన్న శారదా కాస్త నీలో ఆత్మ శక్తిగా విశుద్ధ చక్రం లోకి వెళ్లి స్థిరపడుతుంది. నేను మోక్ష ప్రాప్తి పొందాలనుకుంటున్నాను. శూన్యం అవ్వాలని అనుకుంటున్నాను. దానికి అంత అర్హత, యోగ్యత, యోగం నీ సాధన శరీరానికి ఉంది అని జ్ఞాన స్ఫురణ అందడంతో… ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పేసరికి…సరే మీ ఇష్టం తల్లి!  అనేసరికి తనలో ఉన్న వాగ్దేవి శక్తి కాస్త సరస్వతిలో లీనమై… సరస్వతి కాస్త ఊర్ధ్వ లోకాలలో ఉన్న బ్రహ్మ లోకానికి వెళ్తున్నట్టుగా ఉండటం… శారదా దేవి అంశ ఆత్మ శక్తి కాస్త శివ నందిని లోని విశుద్ధ చక్రంలోనికి ఆత్మ శక్తిగా ప్రవేశించడం.. లీలా దృశ్యంగా రుద్ర స్వామి గమనించాడు.  శివ నందిని అనుభవ దృశ్యం పొందడం జరిగింది. ఈ విధంగా తన చేతికి వచ్చిన ఢమరుకమును బంధవిముక్తి వస్తువు కింద తనలోనికి నిక్షిప్తం చేసుకుంది. ఇక ఏమీ తెలియనట్టు… ఏమీ జరగనట్లు… అక్కడి నుంచి గదికి వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. మరునాడు తనకి కలిగిన ధ్యాన అనుభవం గురించి అలాగే తనకి దైవిక వస్తువుగా వచ్చిన ఢమరుకం గురించి మహాదేవికి, పిల్లలకి చూపించడంతో వాళ్లంతా ఆనందపడ్డారు.  అమ్మ ఇక ఇక్కడితో నీ విశుద్ధ చక్రం జాగృతి, శుద్ధి ,ఆధీనం అయిపోయాయి కదా!  ఇక నీకు రావాల్సింది.. ఈ చక్రంలో ఉన్న ఆకాశ శరీర జాగృతి, శుద్ధి, అధీనం …. అది ఏ క్షేత్రంలో ఉందో తెలుసుకుందామా ? అనేసరికి అప్పుడు రుద్ర స్వామి సంచిలో నుంచి సాధన విగ్రహ మూర్తిని బయటకు తీయడం జరిగింది. అప్పుడు శివ నందిని కూడా తన శరీరంలో నిక్షిప్తం చేసిన శారదా దేవి విగ్రహ మూర్తిని బయటకు తీయడంతో… మహాదేవి కాస్త నేను పెడతాను… సాధనా విగ్రహం మూర్తిని నేను తాకిస్తాను అని ఎడమవైపు ఉన్న పద్మంలోకి తాకించేసరికి అది కాస్త సాధన విగ్రహ మూర్తిలో కుండలిని శక్తిలోనికి ప్రవేశించి విశుద్ధ చక్రం మూడుసార్లు తిరిగేసరికి… అమ్మ!  ఈ విశుద్ధ చక్రం యొక్క జాగృతి,శుద్ధి, ఆధీనం అయ్యాయని చెప్పకనే చెబుతుంది కదా!  అనేసరికి అవును అని అందరూ అనేసరికి… అప్పుడు ఈ విశుద్ధ చక్రానికి వ్యతిరేక దిశలో ఉన్న తెల్ల శివలింగం విగ్రహం వీపు భాగం నుంచి బయటకు రావడంతో… అందులో నుంచి వచ్చిన ఆధారం రాగిరేకును బయటకు తీసి ఇందులో ఏదో ఆధారం ఉంది చదవమంటారా!  అని బాలగణపతి అనేసరికి చదవమని అనగానే చదవటం ఆరంభించాడు. 

బాల గణపతి ఆధారాలు చదవడం ఆరంభించాడు. 

ఇక్కడ రెండు పేర్లతో ఉంటాను…

భీమాసురుడు సంహారం కోసం వచ్చాను… త్రిపురాసుర సంహారం తర్వాత విశ్రాంతి తీసుకున్నాను….

 నా చెమట బిందువులే నదిగా మారిన చోటు… అర్ధనారీశ్వర రూపంతో లింగంగా వెలిశాను… డాకినీ, శాకిని శక్తులతో ఆరాధన జరుగుతుంది. రాక్షస గణాలతో పూజలు అందుకుంటాను…

భూత ప్రేత పిశాచాల రాక్షసుల నుండి

 విముక్తి కలిగిస్తాను….

 నా ఆవాసం రధాకృతిలో ఉంటుంది. 


ఈ ఆధారాలను చూస్తూ ఉండేసరికి… ఇది ఏ లింగం గురించి చెబుతుందో ఒక పట్టాన అర్థం కాలేదు. అప్పుడు రుద్ర స్వామి కాస్త భీమాసురుడు అంటే కుంభకర్ణుడికి కొడుకై ఉండాలి. అప్పుడు ఈ భీమాసురుడి సంహారం ఎక్కడ జరిగిందో ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతుంది అని శివనందినితో అనేసరికి…. ఆవిడ దానికోసం వెతకగా… అది భీమశంకర శివలింగానికి సంబంధించినది అని.. ఇది మహారాష్ట్రలో ఉంటుంది అని.. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవ శివలింగం అని చెప్పేసి శివ నందిని చెప్పేసరికి…. అయితే స్థల పురాణ విశేషాలకు సంబంధించిన వీడియోలు చూడు అనేసరికి… దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనకి వచ్చిన ఆధారాలకు సంబంధించిన విషయాలకు సరిపోతుందో లేదో చూడు అనేసరికి… అప్పుడు ఆ స్థల పురాణ విశేషాలను వినడం ఆరంభించింది. ఇక్కడ భీమశంకరుడు రెండు పేర్లతో ఉంటాడని… భీమాసురుడు సంహారం జరిగిందని త్రిపురాలను సంహరించిన తరువాత ఇక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నాడని… ఆయన చెమట బిందువులే భీమా నదిగా ఉద్భవించింది అని… ఆ తర్వాత ఈయన అర్ధనారీశ్వర రూపంతో ఉంటాడని…. ఇక్కడ రాక్షస గణాలు డాకినీ శాకిని శక్తులతో ఆరాధన జరుగుతూ ఉంటుందని… ఈ శివలింగం వెలసిన కొండ రథ ఆకృతిలో ఉండటం వలన రథాచలం అని కూడా అంటారని స్థలపురాణం చెప్పడం జరిగింది అని చెబుతూ ఉండేసరికి…. ఇవన్నీ కూడా ఆధారాలు సరిపోయినాయి కాబట్టి భీమశంకర ద్వాదశ జ్యోతిర్లింగానికి వెళ్ళవలసి ఉంటుంది అని  రుద్రస్వామి నిర్ధారణ చేసేసరికి…. శివ నందిని కి ధ్యాన అనుభవంగా భీమశంకరుడు లీలా మూర్తిగాను, సహ్యాద్రి పర్వతాల దృశ్యం లీలగా కనిపించడంతో…ఇక తన విశుద్ధ చక్ర శరీరమైన ఆకాశ శరీరం కోసం ఈ క్షేత్రానికి వెళ్ళాలి అని గ్రహించింది. ఇంతలో బాల గణపతికి ఒక ధర్మ సందేహం వచ్చి….

బాల గణపతి:- అసలు ఆకాశ శరీరానికి మనం వెళ్లవలసింది చిదంబరం కదా!  అక్కడ ఆకాశ శివలింగానికి ప్రతిరూపంగా మోక్షలింగమైన స్పటిక లింగం ఉంటుంది కదా!  మనం ఆ క్షేత్రానికి వెళ్లవలసిన వాళ్ళం ఈ క్షేత్రానికి వెళ్తున్నాం ఏమో!   తప్పుగా వెళుతున్నామేమో!

శివ నందిని:- సంస్కృత భాషలో భీమా అనే పదానికి పర్యాయపదంగా ఆకాశం అని ఉంది. అందుకనే ఆదిపరాశక్తి సాధన మూర్తిగా ఈ ఆకాశరీర జాగృతి, శుద్ధి, ఆధీనం కోసం ఈ భీమశంకరుని క్షేత్రమును ఎంచుకోవడం జరిగింది.

అని చెప్పేసరికి ఇక అందరూ భీమశంకర క్షేత్రానికి అనగా మహారాష్ట్రకు వెళ్లాలని నిర్ధారణ చేసుకొని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉన్న నీలా నదిలో స్నానం చేసి ఆఖరి సారిగా అయ్యవారిని అమ్మవారిని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి……   శివ నందిని మరియు రుద్ర స్వామి, మహాదేవి, పిల్లలు ఎవరికి వారే ఇక ఈ నదిలో  స్నానాధికాలు పూర్తి చేసుకుని దర్శనాలు చేసుకొని ఎవరికి వారే ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ఇలా శివ నందిని ధ్యాననిష్ఠలో సుమారుగా మూడు గంటల పాటు ఉండటం వీళ్లంతా గమనించారు. సాధనలో ఎవరికి వారే ఉన్నారు. ఉన్నట్టుండి శివ నందిని శరీరం కాస్త గాలిలో తేలుతూ 21 అడుగులు దాటి ఆకాశమార్గంలోకి వెళుతూ ఉండటం మహాదేవి, రుద్ర స్వామి, పిల్లలు గమనించి చప్పట్లు కొట్టడం జరిగింది. తనకి ఏం జరుగుతుందో అర్థం కాక ఏదో అవుతుందని అంత ధ్యాన నిష్ఠలో నుంచి శివ నందినికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి…. తను భూమి మీద లేదని… అలాగే గాలిలో కూడా లేదని….అలాగే ఆకాశంలో ఉందని గ్రహించింది.  అంటే తనకి విశుద్ధ చక్రం ఆధీనం అవ్వడంతో…. తనకి ఆకాశం మీద ఆధిపత్యం వచ్చిందని గ్రహించింది.  అప్పుడు పైనుంచి అంతరిక్షంలోకి నెమ్మదిగా వెళుతూ ఉండేసరికి…. అక్కడ ఉన్న అమ్మవారి శక్తి పీఠం ఉన్న శారదా దేవి గుడి కాస్త చిన్నదిగా అవ్వడం… ఆ తర్వాత కాశ్మీర్ రాష్ట్రం కనపడటం….ఆ తర్వాత అన్ని రాష్ట్రాలతో ఉన్న భారతదేశం కనపడటం…. అన్నీ దేశాలు ఉన్న ఖండాలుగా కనబడటం…. నెమ్మదిగా భూమి కనబడుతూ ఉండేసరికి…. తను ఆకాశగమనం ద్వారా అంతరిక్షంలోకి వెళుతుందని గ్రహిస్తూ…. ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండేసరికి…సముద్రాలు భూమి అలా కనబడుతూ ఉండేసరికి…. మేఘాలు, వాతావరణం,సూర్యుణ్ణి అతి సమీపంలో చూడటం ఒకరకంగా చెప్పాలంటే విమాన ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో…. ఇప్పుడు తన విమాన ప్రయాణం చేస్తున్నట్లుగా ఆకాశయానం చేస్తున్నట్లు శివ నందిని గ్రహించింది. ఆ తరువాత కొన్ని క్షణాల పాటు అలా  ఉండి మూలాధార చక్రం మీద ధ్యానం చేయడంతో….ఇక ఆకాశ శుద్ధి కాస్త భూచర సిద్ధిగా మారడంతో తన శరీరం బరువుగా మారుతూ ఉండేసరికి…. మళ్ళీ యధావిధిగా దిగి కొన్ని క్షణాల తర్వాత తను ధ్యానం చేసుకునే స్థితికి రావడం చూసేసరికి…. పిల్లలు అంతా చప్పట్లు కొట్టడం జరిగింది.  అమ్మ నువ్వు ఆకాశ సిద్ధిని పొందావు.. నువ్వు విమానం లాగా ఆకాశంలోకి ఎగరటం మాకు బాగా నచ్చింది… కానీ అలా కదలకుండా ,మెదలకుండా కూర్చుని ఉన్నావు. నీకు భయం వెయ్యలేదా?  అని అడిగేసరికి భయం ఎందుకు?  ఎక్కడి దాకా తీసుకు వెళుతుందో తెలుసుకున్నాను… పైపైకి తీసుకు వెళ్తూ ఉండేసరికి ఇక లోకాలు కూడా చూపిస్తుందేమోనని… అనుమానంతో అనుమానభయం కలిగి మూలాధార చక్రం మీద ఏకాగ్రతతో ధ్యానం చేసేసరికి… భూ చర సిద్ధితో తను మళ్ళీ రావడం జరిగింది అని చెప్పేసరికి… అమ్మ! మాకు కూడా ఆకాశగమనం చూపించవా?  విమానంలో కిటికీలో నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందా?  అనేసరికి విమానం అనేది యంత్రం కాబట్టి మాకు అనుభవ అనుభూతి పొందలేము.  విమానం మేఘాలలో నుంచి వెళ్తుంది. కానీ మా శరీరాలు మేఘాన్ని తాకలేదు కదా!  ఈ ఆకాశయానం ద్వారా మా శరీరాలు మేఘాలను తాకుతాయి అనేసరికి మేమిద్దరం కూడా నీతో వస్తాము అని…తనకి చెరోపక్క కూర్చుని తను ఆకాశముద్రలతో విశుద్ధ చక్రం మీద ధ్యానం చేస్తూ ఉండేసరికి… తను నెమ్మది నెమ్మదిగా ఆకాశంలోకి వెళ్ళటం… మేఘాలలోకి ప్రవేశించి బయటకు రావటంతో …పిల్లలు కేరింతలు, ఆనందాలు పడుతూ భలే ఉంది ..ఇంకోసారి ఇంకో మేఘం లోకి వెళ్దాం… అనేసరికి అలా మేఘాలలోనికి వెళ్తూ బయటికి వస్తూ ఉండేసరికి….భూభాగం అంతా కూడా ఒక చిన్న గుండ్రని బంతిలా కనపడుతూ ఉండేసరికి…. వీళ్ళు ఆశ్చర్య ఆనందాలకి లోనవుతూ చప్పట్లు కొడుతూ మేఘాలను ముట్టుకుంటూ…. పిల్లలు ఆనంద పడుతూ ఉండేసరికి… ఇక కొంతసేపు అలా ఉండి చూస్తూ ఉండేసరికి…. శివ నందిని కాస్త ఇక చాలు ఈ శక్తిని ఉపయోగించే కొద్దీ నాలో ఉన్న సాధనా శక్తి తగ్గిపోతూ ఉంటుంది.  నా సాధన శక్తి తగ్గిపోతే నేను ఈ సిద్దుల మాయలో పడిపోవడం జరుగుతుంది అనేసరికి… అమ్మ ఇక చాలు! అని పిల్లలు అనేసరికి…. ఇక మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేసరికి,  తిరిగి యధాస్థితికి భూమి మీదకి రావడం జరిగింది.  పిల్లలు ముచ్చట పడుతూ మహాదేవి, రుద్ర స్వామికి  ఉన్న విషయం అంతా చెబుతూ ఉండేసరికి… మీరు కూడా అమ్మ సహాయం తీసుకుంటే అనుభవం అనుభూతిలోకి వస్తుంది అనేసరికి…. మహాదేవి కాస్త ఈయనకి ఎప్పుడో అనుభూతి అయింది.  ఒకసారి ఇలాగే కాశి క్షేత్రంలో ఉండి దర్శనానికి తీసుకువెళ్ళు అంటే మాటల్లో ఉండగానే మేఘాల మధ్యలో,  నక్షత్రాల మధ్యలో, అర్ధరాత్రి పూట కాశీ విశ్వనాధుని శివలింగం దర్శనం చేయించాడు. ఆ దెబ్బతో నేను సిద్దుల గురించి… శక్తుల గురించి….యోగ శక్తులు చూపించమని రుద్ర స్వామిని అడగలేదు.  అయితే మీ ముగ్గురు కూడా ఆకాశ గమనం చేస్తే చూడాలని పిల్లలు గట్టిగా ఒత్తిడి చేసేసరికి…. శివ నందిని అలాగే రుద్రస్వామి, మహాదేవి కూడా ధ్యానంలో కూర్చుని తమకి వచ్చిన ఆకాశ సిద్ధితో భూమి నుంచి గాలిలోకి…ఆ తర్వాత గాలిలో నుంచి ఆకాశంలోకి వెళుతూ ఉండేసరికి… పిల్లలకేరింతలతో చప్పట్లు కొడుతూ ఉండడం జరిగింది .అలా కొంతసేపు ఆకాశగమనంలో సంచారం చేసిన తరువాత ఇక కిందకి వచ్చిన తర్వాత అమ్మ!  ఈ ఆకాశగమన మార్గం లోనే మనం మహారాష్ట్రలోని ద్వాదశ లింగం అయిన భీమ శంకర శివలింగం దగ్గరికి వెళ్లి పోదామా? మీ ముగ్గురు కూడా ఆకాశ సిద్ధి వచ్చిన వాళ్లే కదా!  మేము నీ తొడల మీద కూర్చుంటాము.  మేము పడిపోకుండా నువ్వు పట్టుకుంటావు కదా!  అనేసరికి అలా చేస్తే మన వెంట భక్తులు, ప్రసాద భక్తులు, అవసర భక్తులు వెంటపడి మనం మళ్ళి యోగినీలుగా, యోగులుగా మార్చేస్తారు.  పూజలు పునస్కారాలు చేసేస్తారు.విగ్రహారాధన కాస్త వ్యక్తిగత ఆరాధనకి వచ్చేస్తారు.  అయినా కూడా మనం సాధన ఎప్పుడు గుప్తంగా చేసుకోవాలి.  సిద్ధుల కోసం…. యోగశక్తుల కోసం కాదు కదా!  అనేసరికి మనకి సిద్ధి వచ్చిందా! లేదా?  అని తెలుసుకోవడం మాత్రమే మనం గమనించాలి.  అది వచ్చాయని తెలిసిన తరువాత వాటిని ఉపయోగించుకోవటానికి లేదు.   లోక కళ్యాణార్ధం ఉపయోగించుకోవాలి. అది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించుకోవాలి.  లేదు అంటే సాధన శక్తి కోల్పోవాల్సిన ప్రమాదం వస్తుంది.  చక్రం బలహీన పడుతుంది. చక్ర శుద్ధి కోసం మనం మళ్ళీ సాధన చేయాల్సి వస్తుంది… అనేసరికి ఇలా ఎంత కాలం చేసుకుంటూ ఉండాలి…అనేసరికి సహస్ర చక్రం దాటి హృదయ చక్రమునకు వచ్చిన తరువాత విశ్వం మీద మనకి ఆధిపత్యం వస్తుంది. అప్పుడు ఇంక మనం శక్తిని కోల్పోయే ప్రమాదం ఉండదు. యోగసిద్ధులు ,శక్తులు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు.  అప్పుడు భూమి మీద ఉండవలసిన మాయలు మన మీద ప్రభావం చూపించవు…. అనేసరికి అంటే ఇప్పుడు నీ సాధన హృదయ చక్రం లోకి వచ్చేదాకా యోగ సిద్ధులు వచ్చినా కూడా వచ్చాయో లేదో అనే ప్రయోగాలకు మాత్రమే సరిపోతుందన్నమాట! సరే అప్పటిదాకా నిన్ను ఇబ్బంది పెట్టములే. యోగ సిద్ధులు , శక్తులు చూపించమని అని పిల్లలు అనేసరికి….. ఇక మనం విమానం ఎక్కి ముంబై రాష్ట్రానికి చేరుకోవాలి… భీమశంకర క్షేత్రానికి చేరుకోవాలి అని టికెట్లు బుక్ చేసుకునే పనిలో శివ నందిని పడింది.  పిల్లలు ఆటలు ఆడుకునే రందిలో పడ్డారు. రుద్రస్వామి, మహాదేవి ముచ్చట్లలో పడ్డారు.

శుభం భూయాత్ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి