అధ్యాయం 9

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కపాల భోజనం

 ఆ బిచ్చ కాపాలికుడు తో నేను వెళ్లడం…  భైరవ సేల లోనికి అంతర్గతంగా ఉన్న చిన్నపాటి చీకటిలో గుహలోనికి నన్ను తీసుకుని వెళ్లడం జరిగింది! ఆ గుహ లోపల కపాలము ధరించిన ఆరడుగుల కాలభైరవ విగ్రహము కనబడినది! దానిని చూడగానే నమస్కారం చేయాలని అనిపించలేదు! నాకు లాగానే అగుపించని లింగమూర్తి నేను ఆరాధన చేస్తున్నట్లుగానే … కానీ వీరు కూడా కనిపించని కాపాలిక దైవాన్ని కాపాలికుడు ఆరాధన చేస్తున్నారని నా మనస్సుకు అనిపించింది! 

నా మనస్సులోని భావాలు చదివినట్లుగా ఆ కాపాలికుడు వెంటనే “ మీ జీవితంలో జరిగిన అనుకోని ఒక సంఘటన ఆధారంగా చేసుకుని…  భయోత్పాత (తుఫాను)సంఘటనను ఆధారంగా చేసుకుని….. ఈ సృష్టికి ఆధారభూతమైన నాథుడు లేడని అనుకుంటున్నావా…. ఉన్నాడని నేనంటే …. నువ్వు లేవని అంటావు …అంటావా… ఎవరి విశ్వాసం బట్టి వారికి ఈ విశ్వం కనపడుతుందని గ్రహించు ! ఎందుకంటే ఈ విశ్వమును విశ్వాసమే నడిపిస్తోంది గదా! లేనివాడు ఉంటే…. ఉన్నవాడు లేకుండా పోతాడు అని…. కనిపించేది అసత్యమని...కనిపించనిది సత్యమని…. రాబోవు కాలంలో ఈ సాధన అనుభవాల ద్వారా తెలుసుకుంటావు ! అందాక మేము చెప్పిన… వినే స్థితి కానీ…  నీకు అర్థం చేసుకునే పరిస్థితి కానీ… నీకు ఉండదు అని నాకు తెలుసు! దెబ్బ తగిలిన తర్వాత నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది! సమ్మెటపోటు తర్వాతే బంగారమునకు వన్నె వస్తుందని గ్రహించు! నీకు బాగా ఆకలి వేస్తోంది అని నాకు తెలుస్తోంది! నిజముగానే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఆకలి మొదలైంది! ఈయనకి ఈ విషయము ఎలా తెలిసినది అనుకుంటుండగా... 

“ఇదిగో ఈ భోజనం తిని ఆకలి తీర్చుకో!” అంటూ ఒక సగం ఉన్న మానవ కపాలము చేతికిచ్చినాడు! అందులో పురుగులున్న పసుపు,ఎరుపు రంగుల ఆహారమున్నది! పైగా పురుగులు కదులుతున్నాయి! నాకు భయం వేసింది! ఇక్కడ ఈ కపాలంలో భోజనం చెయ్యాలా? ఇక్కడ పచ్చటి అరటి ఆకులు గాని విస్తరాకులు కాని దొరకవా? పోయి పోయి చచ్చినవాడి యొక్క కపాలంలో భోజనమా? పైగా పురుగుల ఆహారమా? వామ్మో దీనిని చూస్తుంటే వాంతి వచ్చేటట్లుగా ఉంది! ఇంకా ఇది తింటే నా గతి అధోగతి అవుతుందేమో … వామ్మో…  ఏం చేయాలో?  నేను తినను అంటే వీరు శాపం ఇస్తారేమో …  తింటే ఏం జరుగుతుందో… ముందు గొయ్యి … వెనుక నుయ్యిలా గా ఉంది….  వామ్మో ఇప్పుడు ఏం చేయాలి?  ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకుంటున్న గానే…..

“ఏం స్వామి?  కపాల భోజనం అంటే భయమేస్తుందా…. భోజనం మీద విరక్తి కలుగుతుందా…  జీవితం మీద అనురక్తి పోయిందా… పైగా పురుగుల ఆహారము చూస్తే ఆకలి చచ్చిపోయిందా… నీ పొట్టలో బోలెడు పురుగులున్నాయి! బయట వున్న ఈ కొద్దిపాటిని తింటే ఏమి అవదులే! ఎంత చేసిన కూటికే…. ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే ! మనిషి చచ్చిపోయిన తర్వాత మిగిలేది కపాలమే కదా! ఈ కపాలాభివృద్ధి కోసమే… జీవుడు జానెడు పొట్ట కోసం… నానా అగచాట్లు పడి చచ్చి కపాలంగా మారిపోతున్నాడు! అలాంటి పవిత్రమైన కపాలమును తక్కువగా చూడకు… చూడమాకు! ఇక ఈ కపాలములో మన పాపాలు దహించి వేసే చితాగ్ని ఉంటుంది! ఇదిగో చూడు! ఇక్కడ… ఇక్కడ అగుపించని చిన్న రంధ్రం ఉంటుంది… దీనినే బ్రహ్మరంధ్రం అంటారు! ఇందులోనే చితాగ్ని అని ఉంటుంది! ఇది చింతల వల్లనే చితికిపోయిన నీ దేహ చితికి ఈ చితాగ్ని కాల్చటానికి ఉపయోగపడుతుంది! ఈ అగ్ని వెలుగు వలన ….నువ్వు … నేను… కనబడుతున్నాము! ఈ ప్రపంచమంతా… ఈ విశ్వమంతా ఈ వెలుగులో ఉంటుంది! అందరూ సూర్యుడి వల్ల కాంతి వెలుగు వస్తుంది అని అనుకుంటారు! కానీ ఆ సూర్యుడికి కాంతిని ఇచ్చేది ఏమిటో తెలుసా? ఈ కపాలము లోని బ్రహ్మరంధ్రం లోని చితాగ్ని… స్వామి… నన్ను నమ్ము…  నేను చెప్పింది అర్థం అయితే సిద్ధాంతం…  అర్థం కాకపోతే వేదాంతం…  అర్థమై అర్థం కానట్లుగా ఉంటే రాద్ధాంతం… ఒకటి గుర్తుంచుకో! నువ్వు ఉంటే దేవుడు ఉన్నట్లే! నువ్వు లేకపోతే దేవుడు లేనట్లే! నువ్వు ఉన్నావో లేవో నువ్వే తెలుసుకో! నీకు నువ్వు ఏమిటో తెలుసుకో… నేనంటే ఏమిటో గ్రహించు! నువ్వంటే ఏమిటో తెలుసుకో! నీకు నువ్వే పరిభ్రమించు… పరిక్రమించే…. వెతుకు… విచారించు… ఆలోచించు… వేదన అనుభవించి… అనుమానించు… నువ్వు తెలుసుకో… దేవుని తెలుసుకున్నట్లే! దేవుడు ఎక్కడో లేడు… నీలోనే ఉన్నాడు! నీ హృదయంలో హృదయ కమలం మీద ఉన్నాడు! నీకోసం ఎదురు చూస్తున్నాడు! నీవే వాడు… వాడే నువ్వు! వాడికి అడుగు దూరంలో ఉన్నావు! GOD NO WHERE….GOD NOW HERE.. రాసి… నాకు తెలియని భాష…. తెలియని మనిషి… తెలియని మనస్సు లేదు…  తెలియని ఆలోచన లేదు… నేనే నువ్వు నువ్వే నేను…. స్వామి! నేను తెలుసుకున్నాను! నువ్వు ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు! నా దృష్టిలో నాకు కపాలభోజనము అయిన… కంచంభోజనము అయిన… ఒక్కటే! నాకు ఈ రెండు కూడా ఆహారమును తినే పాత్రలు మాత్రమే! పాత్రలు మారిన పాత్రధారి ఒకటే అని తెలుసుకోవడమే కాపాలిక సంప్రదాయము! ఆహారము- మలము అలాగే మంచినీళ్లు - ఉచ్చ నీకు బేధాలు కనబడితే…  మాకు అవి ఒకటిగా … ఆకలి తీర్చే పదార్థం గాను…  దాహం తీర్చే దాహార్తి గాను ఉపయోగపడతాయి” అంటూ తన మూత్రమును తను తినే కపాల భోజనములో కలుపుకుని ఈ రెండిటిని ఎన్నో సంవత్సరాల పాటు ఆహారము, నీరు లేని వాడికి లాగా… ఒకసారి ఈ రెండు కనపడితే ఎంతో ఆర్తిగా, ఆప్యాయతగా,ప్రేమగా,అబగా తింటూన్న ఈ కాపాలికుడుని చూసేసరికి….

నా కడుపులో ఏకకాలంలో గ్రైండర్… మిక్సీలో వేసి తిప్పినట్లుగా తిప్పి అతడి మీద వాంతి చేసుకున్నాను! మూడు రోజులపాటు తిన్న ఆహారమంతా జీర్ణం కాక … అరగక ముందే బయటకు వస్తే…  దానిని కూడా ప్రేమగా నాకుతున్న కాపాలికుని చూడగానే నాకు నోట మాట రాలేదు! నాలో చెప్పలేని భయము, వణుకు మొదలైనది! “స్వామి! నీ వాంతి ఆహారం చాలా బాగుంది! రుచికరమైన ఆహారం ఇచ్చినావు! పెట్టినావు! నాకు చాలా సంతోషంగా ఉంది!” అని ఆ కాపాలిక స్వామి అంటూండగానే … నేను కాళ్ళకు బుద్ధి చెప్పి… పరిగెత్తుతూ…  ఎందుకో…  వెనక్కి తిరిగి చూడగానే…  


ఆ కాపాలికుడు వెనుక భాగము అనగా వీపు భాగం మూడు తలలు ఉన్న ఆ స్వామి అనగా దత్తాత్రేయ స్వామి యొక్క నీడ లాంటి ఆకారం కనిపించటంతో…  నాలో తెలియని భయంతో…  బయటికి పరిగెత్తిన…  గుహ బయటికి ఎదురుగా మళ్ళీ ఈ కాపాలికుడు కనిపించి చిరునవ్వు నవ్వుతూ చేతితో ఆశీర్వాదం చేస్తున్నట్లుగా కనిపించింది! నేను మౌనంగా ఆయనకి నమస్కరించి… అక్కడి నుండి మా ఊరి వైపు ప్రయాణం కొనసాగించాను! మీరు భయపడకండి! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

*****************************

గమనిక: నేను ఇంటర్ ఫస్టియర్ లో జరిగిన యదార్థ సంఘటన! నా సాధన శక్తి ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే  అతను కాపాలికుడు కాదని…  ఆయన దత్తాత్రేయుడిని … మనలో భయం పొగొట్టడానికి …  మనకి భయరాహిత్యమును ఇవ్వడానికి… ఆయన ఇలాంటి యోగ పరీక్షలు పెడతాడని…  వాటిని తట్టుకొనేవారికి …కపాల మోక్షప్రాప్తి ఇస్తాడని... ఒకవేళ నేను ఆ కపాలభోజనము చేసి ఉంటే మళ్ళీ కపాల జన్మ లేని కపాల మోక్షప్రాప్తి కలిగేదని తెలుసుకొని బాధపడటం నావంతు అయినది! గాకపోతే నేను తినవలసిన కపాలభోజనము నేను తినలేకపోతే ... నాకోసము ...నా సాధన పరిసమాప్తి కోసము...నాకు కపాలమోక్షప్రాప్తి కోసము ... ఆయనే స్వయంగా నేను చేసుకున్న వాంతి తిని… నాకున్న  ప్రారబ్ధకర్మల పాపాలు తొలగించినారని నేను గ్రహించాను! ఎంతైన భక్తులకోసం ఉండే దైవమని నిరూపించారు! నా కోసము ఎదురుచూశారు! నాకోసము ఇలా ఎన్నో విషయాలలో సహాయము చేసినందుకుగాను వారికి నా గురుదక్షిణగా “శ్రీ విశ్వగురు చరిత్ర” అను గ్రంథమును ఆయనానుగ్రహాము వలన రచించడము జరిగినది! 


ఇలాంటి యోగ పరీక్షను అనగా చచ్చిన పామును అలాగే కుక్క నుండి తీసిన పాలు మరియు పాచిపోయిన రొట్టెలు కలిపిన ఆహారమును తినమని మాణిక్యప్రభుకి శ్రీ దత్తస్వామి ఒక బైరాగి రూపములో వచ్చి పరీక్ష పెడితే… ఆయన … దీన్ని భయపడకుండా... సంతృప్తిగా తినడముతో.. ఆ నాటి నుండి మాణిక్య ప్రభు కాస్తా దత్త గురువుగా ఖ్యాతి చెందినారని వారి జీవితచరిత్రలొ ఉన్నది!అలాగే పాండురంగ ప్రియభక్తుడైన ఏకనాధుడి జీవితములో గూడ ఇలాగే దత్తస్వామి మారురూపాలలో వచ్చి యోగపరీక్ష పెట్టినారని వారి జీవితచరిత్రలో వున్నది!

బాధాకరమైనా విషయము ఏమిటంటే ప్రస్తుత కాలములో ఈ సత్ కాపాలిక సంప్రదాయమును పాటించే కాపాలికులు ఎవరుగూడ ఈ గుహ యందు లేరు!

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeru cheppina kapaala bhojanamu chaala depth ga undi.... meeru great kabatti dattatreya swamy vaaru mimmalni vadalakunda kapalamoksham ichinaaru... chaala santhrupthi ga undi vivarana, bagundi vedantam,siddhantam,raadhantham baaga chepparu ade nijam.... mana chithagni tho kapaalaanni kaalcheyadam appudu ee nenu ledani...aahaa!! adhurs... ekanadhudu,manikyarabhuvu gaari gurinchi meeru cheppinadi vinnanu eppudu chupincharu...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. miru follow avtu unte naku 2 pustakala vivaralu kavali help cheyara oka sri sailam shikara darshanam book inkoti శ్రీ విశ్వగురు చరిత్ర e pustakala vivaralu dorikithe chepandi.

      తొలగించండి