అధ్యాయం 1


హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....


నా ఏడుపే నా తొలి సాధన – గురువు

 అది 1977వ సంవత్సరంలో …ఒకసారి దివిసీమ ఉప్పెన వచ్చినపుడు నేను పుట్టలేదు...మళ్ళీ రెండవసారి వచ్చినపుడు నాకు 12 సం!! రాల వయస్సులో అనగా   అది 1990వ సంవత్సరంలో   మే నెలలో 4  - 10 తేదిలలో  … మళ్ళీ దివిసీమ తుఫాను భీభత్స రోజులు…. చీకటి రోజులు….. అన్నమును పండించే అన్నదాతలు అన్నం కోసం పరితపించే భయంకర రోజులు…… బయటకి వెళ్లిన వారు కాడికి కి వెళ్తున్న రోజులు … అన్నం కోసం, పాడిపంటలు, పశువులు కోసం పరితపించే లాగా మారిన రోజులు… ఇలా 7 రోజులు 7 యుగాలుగా గడిపిన రోజులు ….మా నాన్న పని చేసిన శివాలయంలో అన్నదాతల అన్నం కోసం ప్రయత్నాలు ఒక పక్క…. నా అనే వాళ్ళు పోతున్నారని బాధ మరోపక్క …. మరోప్రక్క ఆస్తులు పోతున్నాయని…. జీవన ఉపాధి మార్గాలు మూసుకుని పోతున్నాయని… బతుకులు గల్లంతవుతుందని ఆర్తనాదాలు …. ఇలాంటి ఆవేదనల ఆర్తనాదాలు మధ్య నాకు శివాలయంలో 12 సంవత్సరాల వయస్సులో చిన్న పూజారిగా ప్రవేశ మార్గం ఏర్పడింది! 

గుడిలో ఉన్న శివలింగం మాట్లాడదు ! ఎందుకు ఈ జలప్రళయము జరిగిందో తెలియదు? తెలియని వయసులో ఏదో తెలియని తపన మొదలైంది! ఏదో చెయ్యాలని…. ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది! శవాలుగా మార్చేసిన శివయ్య మీద శివతాండవం మొదలైనది! మా నాన్న ఒక చీపురుకట్ట చేతికిచ్చి గుడిని శుభ్రం చేయమని మొట్టమొదటి పనిగా అప్పగించారు! శుభ్రం చేయవలసినది గుడి ని కాదని గుడిలో ఉన్న లింగమూర్తి ని అని సంకల్పించాను! దైవంగా చెప్పుకుంటున్న.... పూజలందుకుంటున్న… పుష్టిగా నైవేద్యాలు తింటున్న ….శివలింగ మూర్తిని ప్రశ్నించాలని నాలో నేను ఎదురు తిరిగాను! ఏ పాపం చేశారని ఇంతమందిని బాధ పెట్టినాడు? సృష్టించడం ఎందుకు? నాశనం చేయడం ఎందుకు? మమ్మల్ని సృష్టించమని అడిగామా ? నన్ను సృష్టించమని అడిగానా ? నన్ను బాధ పెట్టమని చెప్పామా? జననాలు మరణాలు ఇవ్వమని అడిగానా?  నాశనం చేసే కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించావు? నీకు కళ్యాణ మహోత్సవాలు …మాకు బాధలు నరకయాతనలు…. నా నా చంకలు నాకి మేము కష్టపడి సంపాదించిన వాటిని నేనే ప్రసాదించాను కదా… నాకు ఇవ్వమని అడగటం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అడుక్కునే వాడిదగ్గర గీరుకునేవాడివి నువ్వు… మనస్సులేని రాయి నువ్వు ….చలనములేని బండరాతివి నువ్వు…. అందుకే నిన్ను శిలగా తయారుచేసి  శిలువ గా బంధించి శిలాఫలక సమాధులు చేసినారు కదా! నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేని మౌన బ్రహ్మం గా ఉన్నావు! ఏమీ తెలియనట్లుగా ఏమీ జరగనట్లుగా ఉండటానికి మౌన ముద్ర లో ఉండి ఎవరిని ఉద్ధరించాలి ! ఉద్ధరణ చెయ్య లేని వాడికి  …. లేనివాడికి… గుడిలో ఎందుకు పూజలు? ఎందుకు ప్రసాదాలు? ఎందుకు నువ్వు లేని కాడికి మమ్మల్ని కాడికి పంపించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అసలు నన్ను సృష్టించింది ఎవరు ?ఎందుకు సృష్టి? సృష్టి నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు?

ఏమయ్యా! శివయ్య ! నాకన్నా ఎన్నో కోట్ల మందిని సృష్టించావు! వారికి నవరసాలు… నవ భక్తులు… నవ సిద్ధులు… నవమాసాలు ఇచ్చి లాలించి పాలించి చేసినావు కదా! మళ్ళీ ఏదో కొరతగా నన్ను ఎందుకు సృష్టించావు? ఇంతకుముందు చేసిన పని నేను చేసినదే కదా! చేసిన పనిని ఎన్నాళ్ళు చేస్తావు! చూస్తావు! ఆనంద పడతావు! మేము బాధలో ఉంటే ఆనందపడతావు! మేము సుఖాల్లో ఉంటే బాధ పడతావు! బాధల్లో గుర్తుకు వచ్చేలాగా చేసుకుంటావు! ఆనందంలో మరిచిపోయేలా చేస్తావు! అసలు నీవు చూసిన నాటకం ఎన్ని సార్లు చూస్తావు! దేవయ్య ..జంగమయ్య.. నీకు విసుగు అనిపించదా? విరక్తి కలగడం లేదా? అయినా నా పిచ్చి గాని నీకు నిజంగా వైరాగ్యం ఎప్పుడు వచ్చినది! మన్మధుడు ని చంపి కామముని జయించావు అంటావు! అమ్మ కనపడితే మోహం కలిగింది అని అంటావు! నీలాంటి చపలచిత్తుడుని నేను ఇంతవరకు చూడలేదు! నువ్వు గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేసే వాడివి! నువ్వు ఓ పక్క నీతులు చెబుతావు! మరొక పక్క వాటికి గోతులు తీస్తావు! అసలు నువ్వు ఉన్నావో లేదో తెలియని వారితో వాదించి కూడా దండగ! నీకు దండాలు పెట్టటం.. దండలు వేయటం కూడా దండగ ! పనికి మాలిన ధర్మాలు పెట్టించి జ్ఞాన కాండను కాస్త కర్మకాండ గా… దీనిని భక్తి కాండ గా మార్చి వేసుకుని నీకు నీవే విధాత గా… విలయ కర్తగా… లోకానికి ప్రచారం చేసుకున్నావు! చేసుకునే విధంగా ప్రచారం చేసుకుంటున్నావు! అడిగిన వాడిని రాక్షసుడు అంటావు! అడగని వాడిని భక్తులు అంటారు! ఇంకా ఎన్నాళ్లు సాగుతాయో నీ నాటకాలు నేను చూస్తాను కదా అంటూ ఆవేదన కన్నీళ్ళ రూపంలో శివ లింగ మూర్తి మీద నా కన్నీటి ధార కాస్త లింగ ధార గా అభిషేకం చేయబడినాయి! నా ఆవేదనే నా ఏడుపే…. నా ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి ఆనాటి నుండి నాంది అయినాయి! సమాధానం లేని ప్రశ్నలు వెంటపడి ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు అయినాయి! నా ఏడుపే నన్ను ఓదార్చి సమాధానం లేని ప్రశ్నలు… ప్రశ్న లేని సమాధానం చూడాలనే తపన కసి నాలో తొలి గురువు గా ప్రోత్సహించినది! సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నాకు హితబోధ చేసింది! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

11 కామెంట్‌లు:

 1. Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job

  రిప్లయితొలగించు
 2. mana edupe mana saadhanaki guruvu ani meeavedhana theliyajesaru....saadhakudu ilaanti prashnalu konni vesukuntadani mee aavedana lo prema undani....

  రిప్లయితొలగించు
 3. SVRamana comment as:
  "Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job." -- SVRamana

  రిప్లయితొలగించు
 4. నమస్కారం స్వామీజీ. దయచేసి తమరి కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలరు నేను తమరితో మాట్లాడాలి స్వామీజీ.

  రిప్లయితొలగించు
 5. నమస్కారం గురువు గారు ...మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వమని నా ప్రార్థన

  రిప్లయితొలగించు
 6. Pranamam Guruvugariki, Kapala Moksham book ekkada dorukutundi dayachesi vivaarinchagalaru..

  రిప్లయితొలగించు
 7. Thankyou so much Sir...Book kanipinchakapoyesariki chala bhada vesindi...malli pedatahrani prati roju open chesi chusthune vunna..youtube lo pettina videos anni nenu chadivesanu...mimmalni kalise avakasam devudu anugrahinchalani korukuntunnanu swami

  రిప్లయితొలగించు