17, ఏప్రిల్ 2020, శుక్రవారం

ముందు మాట




శుభవార్త:

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


పాఠకులకి నా విన్నపము...

హెచ్చరిక:  నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము అందరికి ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....

ఆన్ లైన్లో 999 రూ.లకి దొరుకుతున్న  నకిలి "కపాలమోక్షం" గ్రంథము  యొక్క ఇమేజీలు పెట్టడము జరుగుతోంది.


My FAKE BOOK

ఈ పుస్తకములో సంపూర్తిగా బ్లాగ్ కంటెంట్ లేదని తెలుసుకొండి.కావలంటే ఈ నకిలి పుస్తకము లోని ఆఖరి పేజి మేటర్ చూడండి.అలాగే ఈ బ్లాగ్ ఆఖరి కంటేంట్ చూడండి. 


మీకే తేడా ఏమిటో తెలుస్తుంది.ఈ నకిలి పుస్తకములో పేరుకి అన్నీ అధ్యాయాలు (బ్లాగ్ లింకులు) ఉన్నప్పడికి అందులో ఉండవలసిన కంటెంట్ పూర్తిగా లేకుండా ఈ నకిలి పుస్తకములో కొన్ని అధ్యాయాలలో కొంత భాగము తీసివెయ్యడము జరిగింది.  దయచేసి ఈ నకిలి పుస్తకము కొని మోసపోవద్దని మరొకసారి మనవి చేస్తున్నాము. 

మరియి కపాలమోక్షం పేరుతో ఈ అధ్యాయాల పేరుతో సుమారుగా 1300 దాకా వీడియోలున్నాయని మా అందరి దృష్టికి వచ్చింది.పైగా వీటిలో గూడ కంటెంట్ పూర్తిగా చదవడము లేదని వారికి ఇష్టమైన భాగాలు ఇష్టము వచ్చినట్లుగా చదువుతున్నారని మాకు అర్ధమైంది.వీటికి మాకు ఏలాంటి సంబంధము లేదు.

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.                              

                               xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

 ఈ గ్రంథమును చదివిన  వేలమందిలో కొంతమంది యోగసాధకులు నన్ను వ్యక్తిగతముగా కలిసి మాట్లాడాలని,నా వ్యక్యిగత సమాచారాలు గావాలని నన్నే తమ కామెంట్స్ లలో పెట్టి ఇబ్బంది కల్గిస్తున్నారు.నాకు ఎవరిని వ్యక్తిగతము కలిసి మాట్లాడము అలాగే నా వ్యక్తిగత సమాచారము మీతో పంచుకోవడము నాకు ఇష్టము లేదు.నేను గూడ మీ లాంటి మనిషేనని గాకపోతే నేను ఏవరో తెలుసుకున్నాను..మీరంతా తెలుసుకొనే ప్రయత్నములో ఉన్నారు అంతే తేడా..అలాగే నాకు శిష్యులుగా ఉండాలని,నా చేత ఆశ్రమాలు పెట్టించాలని కొంతమంది భక్తులు ఉన్నారు.నాకు ఇలాంటివి ససేమిరా ఇష్టము లేదు.నా పేరు మీద ఆశ్రమాలు లేవని ముందు తెలుసుకొండి.నేను ఒక స్వామీజీ గా,ఒక మఠాథిపతిగా,ఒక పీఠాధిపతిగా భావించుకోవద్దు.నేను కేవలము ఎలాంటి గుర్తింపు లేని గుప్తయోగి.

ఇలా ఒక ఆత్మయోగిగా నేను పొందిన సాధన స్వానుభవాలు మీతో పంచుకొంటే పదిమందికి ఉపయోగపడతాయని ఉద్దేశ్యముతో..ఇలా ఒక ఆత్మయోగిగా ఎలాంటి ఆభిమతము,మతము,సంప్రదాయము,ఆశ్రమము లేకుండా వచ్చాను.

.......................................................





పరమహంస పరమపదించారు.

##########################

గమనిక: ఈ రోజు అనగా 1-3-2022 ..మహా శివరాత్రి తిధి నాడు మన ఆత్మయోగి పరమహంస గారు అరుణచల క్షేత్రములో ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ.."స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు" అంటూ..తట్టుకోలేని గుండె నొప్పి రావడముతో అక్కడక్కడే పరమహంస పరమపదించారు.అపుడు ఈయన కపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటికి వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణాగిరి యందు  ఆత్మజ్యోతిగా శివైక్యము చెందిన కొన్ని క్షణాలకి ఈ గిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికి కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది.దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యము చెందడము జరిగింది..ఈ విధివిధాన వివరాలు ఆఖరి అధ్యాయమునందు ఇవ్వబడటము జరిగింది.గమనించగలరు.

మా యోగమిత్రుడైన పరమహంస పొందిన ధ్యానానుభవాలను సాధనలోకానికి ఆయన జ్ఞాపకార్ధముగా అందించాలని ఆయన స్నేహ సాహచర్యం పొందిన కొంతమంది యోగమిత్రులు కలిసి ఈ బ్లాగ్ పెట్టడము జరిగింది.ఇందులో మార్పులు,చేర్పులు పూర్తి అయ్యాయి.మనస్సు పెట్టి మీకు అర్ధము అయ్యేనంతవరకు చదవండి.దానితో మీకు ఎలాంటి గురువుతో, దైవముతో, జ్ఞానముతో, సాధనతో ఆఖరికి మోక్షముతో పని ఉండదు.ఎందుకంటే ఈ గ్రంధరాజమే అన్ని ఇస్తుంది.తీరుస్తుంది.ఈ గ్రంధము చదివి అర్ధము చేసుకోవడమే అసలు సిసలైన పూర్ణ మోక్షమవుతుంది.ఎందుకంటే ఈ స్వానుభవముగా అనుభవ అనుభూతి పొందిన పరమహంస మా కళ్ళ ముందే పూర్ణ మోక్షస్ధితి పొందడము జరిగింది గదా.ఇంతకన్నా నిదర్శనం ఇంకా ఏమి గావాలో మీరే ఆలోచించండి.అలాగే ఈయన పొందిన అనుభవాలు అన్నిగూడ అక్షర సత్యమే.లేకపోతే విశ్వ ఆదిగురువైన అరుణాచల వాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వయంగా తన అరుణాగిరి లోపలకి పరమహంస జ్ఞానలింగమును తనలో ఎందుకు ఐక్యము చేసుకొంటారో ఒకసారి ఆలోచించండి.మీరు గూడ పరమహంస లాగా జ్ఞానహంసగా మారి పూర్ణమోక్ష స్ధితిని పొందటానికి "అరుణాచల శివ" నిత్య నామస్మరణ చేసుకుంటూ ఉండండి.ఈయన అనుగ్రహము మీరు పొందకల్గితే మీకు మోక్షమే.ఎందుకంటే ఈయనే విశ్వానికి మోక్షమిచ్చే ఆదిగురుదేవుడు-ఆది అరుణాయోగి అని స్వానుభవ అనుభూతి పొందండి.ఈయన అనుగ్రహము పొందడము వలన పరమహంస కాస్తా అరుణాయోగిగా మారి పూర్ణమోక్షము పొందడము జరిగింది.ఇలా ఈ గ్రంధమును చదివి అర్దము చేసుకున్నవారంతా గూడ మోక్షస్ధితికి చేరుకుంటారని ఆశిస్తూ... 

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.


ఇంతటితో ఒక నిజపూర్ణ జ్ఞాని శకము ముగిసింది.

*********************************************************************************



కపాలమోక్షం విధివిధానము



నేను అంటే ఎవరు? నేను అనేది ఏమిటి? నన్ను సృష్టించింది ఎవరు? నేను ఎవరి చేత సృష్టించబడినదో ఎవరైనా చెప్పగలరా? నేను కానీ నేను ఎవరు? నేను కి  నేను కానీ నేను కి గల సంబంధం ఏమిటి?కర్మ ప్రదాత అంటే ఏమిటి? విధి వ్రాత అంటే ఏమిటి? వీటిని రక్షించేది ఎవరు? వీటిని పాటించేది ఎవరు?ఇలాంటి సాధన ధర్మసందేహాలు నా మనస్సులో ఎన్నో ఉన్నాయి.

 సాధన అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి ?మోక్షం అంటే ఏమిటి? యోగ మంటే ఏమిటి?ఈ జీవుడు ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు జీవిస్తున్నాడు? ఎందుకు మరణిస్తున్నాడు? విధాత అంటే ఎవరు?ఇలాంటి సమస్యలను నా మనస్సులో ఎన్నో సంవత్సరాల నుండి  వేధిస్తున్నాయి! 

దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు ఉన్నాడా?ఉంటే కొంతమంది ఉన్నారని… మరికొంతమంది లేరని ఎందుకు వాదిస్తున్నారు? అసలు దైవ సంప్రదాయాలు ఎందుకు ఏర్పడినాయి? గురువంటేఎవరు ? సాధనలో గురు పాత్ర ఎంత? గురువే దైవమా… దైవమే గురువా ? యోగసిద్ధులు ఉన్నాయా ? అష్ట సిద్ధులు అంటే ఏమిటి?ఇలాంటి సాధనా సందేహాలు నన్ను వెంటాడేవి!

అసలు నేను ఏ చక్ర తత్వంలో ఉన్నానో తెలియదు? అసలు ఉన్నానో లేదో తెలియదు? ఒకపక్క ఎలాంటి యోగసిద్ధులు రావడం లేదు ? కానీ సాధన ఆగటంలేదు? మాయా మర్మాలు తెలియటం లేదు ? మాయలో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు? సాధన లో నేను ఉన్నానో లేదో నాకు తెలియటం లేదు? కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యానమార్గాలలో ఏ మార్గం లో ఉన్నానో నాకు తెలియటం లేదు ? ఇలా నాకు సాధనలో ఉన్నప్పుడు అనేక అనేక ధర్మ సందేహాలు, అనుమానాలు,అవమానాలు జరిగినాయి! ఇవి ఎందుకు ఎలా జరిగినాయో! అప్పుడు నాకు తెలియలేదు ! ఇలా నాకు సాధనలో శబ్ద పాండిత్యంలో అలాగే అనుభవ పాండిత్యంలో నాకు వచ్చిన ప్రశ్నలకు నాకు నేనే సమాధానాలు వెతుకులాట చేసుకోవలసి వచ్చింది! నాకు నేనే పరిప్రశ్న అయ్యి నాకు నేనే పరిపూర్ణ జ్ఞానిగా మారవలసి వచ్చింది !

నాలాంటి మోక్షగామికి ఎదురైన ఆటుపోట్లు, ధర్మసందేహాలు,సాధన సందేహాలు, సాధన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, దైవ అనుభవాలు, ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు, దైవిక వస్తువులు అనుభవాలు, సాధన స్థితిగతులు అన్నిటినీ ఒక వరుస క్రమంలో పూసగుచ్చినట్లుగా అమర్చి ఒక రుద్రాక్షమాలను తయారుచేయాలని సంకల్పం వచ్చినది!ఈ గ్రంధ రచన వలన నాలాంటి వారికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను !

మూలాధార గణపతి నుండి మూల కపాలము ద్వారా వరకు సాగిన నా  సాధన ప్రస్తావన మీరే చదవండి ! మీరు మీ సాధనలో ఎక్కడ ఉన్నారు? ఏ మాయ లో ఉన్నారు? దానిని ఎలా దాటాలో? తెలుసుకుని ముందుకు సాగండి! ఈ నా సాధన అనుభవాలు ఆసేతు హిమాచలం 591 మహాయోగులు అనుభవాలతో477 మహాయోగులు అనుభవాలతో అనగా 80 శాతం సరిపోయినాయి మిగిలిన 20 శాతం వారికి నాకు అనుభవాలలో తేడాలు కనిపించాయి! కానీ అనుభవాలు వేరు కావచ్చు కానీ అందరికీ అనుభూతి ఒకటే అవుతుంది కదా!

శివుడిని పూజించిన ఈ జీవుడు కాస్త శివుడు  ఎలా అయినాడు… శవం కాస్త శివం ఎలా అయినదో…. కోరికలే మాయలని తెలుసుకుని కోరిక లేని సమాజం చూడాలని కోరిక …. లేదా ఇష్ట కోరిక కోసం….తీరని కోరిక కోసం లేదా తీర్చే కోరిక కోసం… లేదా ఇతరుల కోరిక కోసం… శివుడు కాస్త జీవుడుగా ఎలా అయినాడు! మోక్షగామి కాస్త కామిగాను….కామివాడు కాస్త మోక్షగామి గాను ఎలా ఎందుకు మారాడో తెలుసుకోండి! అనుభవాలు తెలుసుకోండి! అనుభూతి పొందండి!

భగవంతుడు లేడు…. ఎక్కడో లేడు…ఎవరికి వారే స్వానుభవానుభూతి ద్వారా తానే దేవుడని తెలుసుకోండి! అది మరిచి పోయిన జ్ఞాపకం అని గ్రహించండి! లేనివాడు ఉన్నట్లుగా …ఉన్నవాడు లేనివాడు గా …. ఉండి లేనివాడిగా ఉండేది తానేనని తెలుసుకోండి! ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన నిజము లాంటి కలని అనుభూతి పొందండి! పుట్టడం, పెరగడం, మరణించడం…మంత్రం, తంత్రం, మంత్రం…ఇచ్ఛాశక్తి ,క్రియాశక్తి, జ్ఞాన శక్తులు…సత్వ, రజో, తమో గుణాలు… ఇష్ట కోరిక, తీరని కోరిక, తీర్చే కోరిక…ఇలాంటి వాటి మాయా మర్మాలు తెలుసుకోండి! సాధన సాగించండి ! సాధనను కొనసాగించండి ! మోక్ష అనుభూతిని పొందండి! జయం పొందండి!

ఈ సాధన అనుభవాలలో కొన్ని నిజానికి దూరంగాను… కల్పితానికి దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తాయి! కానీ ఎవరికి వారే స్వానుభవానుభూతి పొందితే తప్ప… ఎవరికి వారే స్వయంగా స్వానుభవం ద్వారా తెలుసుకుంటే తప్ప అవి కల్పితాలు కావని నిజాలని తెలుసుకోలేరు! మీకు ఏదో ఇవ్వాలని… ఏదో ఒకటి చెప్పాలని…మా సాధన అనుభవాలు మీతో పంచుకోలేదని గ్రహించండి! యోగులు అలాగే యోగ సాధకులు తమ సాధన అనుభవాలను బయటికి చెప్పటం ఇష్టపడటం లేదని… ఎందుకంటే తమలో వారికే తెలియని అహం పెరుగుతుందని భయంతో చెప్పటం లేదని…. మరికొంతమంది తమ సాధన అనుభవాలు చెప్పటానికి ప్రయత్నించే సరికి వారి ఇష్టదైవాలు వాక్ బంధనం వలన చెప్ప లేదని  రామకృష్ణ పరమహంస…రమణ మహర్షి … శ్రీ శంకరాచార్యులు… అనుభవ చరిత్రలో నాకు తెలిసింది! కాకపోతే కాశీక్షేత్ర నివాసి శ్రీ లాహిరి మహాశయులు తన సాధనానుభవాలు డైరీలు రాసి పరమపదించిన…వాటిలో కొన్ని 26 డైరీలను “పురాణపురుష” గ్రంధముగా మనకి వారి వారసులు అందించినారని తెలిసి ఆ గ్రంథమును చదివి నేను వ్రాసుకున్న నా సాధన అనుభవాల డైరీల ఆధారంగా ఈ మహత్తర గ్రంధమైన”కపాలమోక్షం” నా ఇష్ట లింగేశ్వరుడు ఆజ్ఞ మేరకు రాయడానికి పూనుకోవడం జరిగినది! ఇదంతా శ్రీ చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహము వల్లనే జరిగినది! ఆయన పెట్టిన జ్ఞాన భిక్ష వలన నేను జ్ఞాన భిక్షువుగా మీ ముందు ఈ గ్రంథం రాయడానికి పూనుకోవడం జరిగినది! ఇలా 1989 నుండి 2019 దాకా జరిగిన వివిధ రకాల నా సాధన అనుభవాలు పదిమందికి ఉపయోగపడి…వారు కూడా జీవన్ముక్తుల అవుతారని ఆశిస్తూ…..

పాఠకులకు విజ్ఞప్తి

ఈ గ్రంథంలో చెప్పబడిన అన్ని రకాల విషయాలు, అభిప్రాయాలు, భావాలు,
అనుభవాలు అన్నీ కూడా మేము దైవ అన్వేషణలో ..సత్యాన్వేషణలో ఉన్నప్పుడు 
శాస్త్రీయ దృక్పథంతో నాలో నేను ప్రశ్నించుకున్నప్పుడు….  
నాకు స్ఫురణకి వచ్చిన వ్యక్తిగత అభిప్రాయాలు అని గ్రహించండి ! 
అంతేగాని ఇది ఒక వ్యక్తిని లేదా ఒక మతమును లేదా ఒక దైవానికి సంబంధించి 
విమర్శించిన భావాలు కాదని విజ్ఞప్తి చేస్తున్నాను! 
ఇందులో ఎలాంటి వాద - ప్రతివాదాలు తావులేదని, విమర్శ- ప్రతివిమర్శలు ఉండరాదని, కోర్టు వ్యవహారాలు జోక్యం ఉండరాదని విజ్ఞప్తి చేస్తున్నాను!

మీ జ్ఞాన భిక్షువు
పరమహంస పవనానంద 
(ఆత్మయోగి)

*********************************

ఈ గ్రంథ సారాంశము:

ఈ చిత్రములో 1.హనుమంతుడి ముఖము 2.హంస 3.మండే పాము 4. మండుతున్న బ్రహ్మాండ చక్రము 5.దివ్యతార అను పంచభాగాలున్నాయి! వీటిలో తార అనేది ఆకాశమునకు,హనుమంతుడు వాయువుకు,మండే బ్రహ్మాండ చక్రము అగ్నికి,హంస అనేది జలమునకు,పాము అనేది భూమికి అనగా పంచ భూతాలకి సంకేతము అన్నమాట! ఇక నల్లటి చీకటి ప్రాంతము పరమశూన్యమునకు సంకేతమని గ్రహించండి! దీనిని ఆధ్యాత్మికపరంగా చూస్తే...మనకి పరమశూన్యము నందు తార వంటి చితాగ్ని దర్శనమవుతుంది!ఇది ఏర్పడటానికి మూలకపదార్ధము ఆక్సిజను కారకమైనది! వీటి పరిధి మన బ్రహ్మాండ చక్ర కృష్టబిలమంతా ఉంటుంది! ఇది నశిస్తే అన్ని గూడ నశించి చిట్టచివరికి నల్లటి కటిక చీకటియైన పరమశూన్యముంటుంది!

ఇక దీనిని సాధనాపరంగా చూస్తే...మనము హనుమంతుడిలాగా(హనుమంతుడి ముఖము) సంపూర్ణ యోగసాధన చేసి...పరమహంసలాగా(హంస) బ్రహ్మజ్ఞాన సిద్ధుడై...జాగృతి చేసుకున్న యోగాగ్ని(మండే పాము) కుండలీనిశక్తితో...ఎవరైతే తమ బ్రహ్మరంధ్రమున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము(మండుతున్న చక్రము)నందు నిప్పురవ్వ(దివ్యతార)లాగా మారి నశించుతారో వారే అవిముక్త జీవుడవుతాడు! అంటే ఈయన వాయువుకి పుట్టి...చివరికి అదే వాయువులో వాయుపుత్రుడిగా కలిసిపోయి...అవిముక్తి జీవుడై(ఏట్టి బంధము లేనివాడై)భవిష్య బ్రహ్మ అయినాడు! అంటే మనమంతా గూడ గాలిలో పుట్టి అదే గాలిలో అంతరించిపోవడమే అనగా మనకి శ్వాస ఆడితే జననం - అదే శ్వాస ఆడకపోతే మరణం గదా! మనోనిశ్చలస్ధితి పొంది...పరమశాంతిని అందుకున్నాడు! తద్వారా జీవన్ముడైనాడు! ఇదియే జీవన్ముక్తి..అదియే సంపూర్ణ మోక్షం!

నాకు ఆదర్శమూర్తి అయినాడు!ఈయన మన మనస్సుకి సంకేతము!మనస్సు ఆధీనమైతే మాధవుడిని చేస్తుంది!ఆధీనమై..ఆధీనము గాకుండా ఉంటే మానవుడిని చేస్తుంది!అసలు ఆధీనము కాకపోతే వానరుడిని చేస్తుంది! ఒకప్రక్క శ్రీరామ భక్తుడిగా ఉంటూనే...చిరంజీవితత్వముతో వేటియందు బంధి గాకుండా అన్నింటయందు బంధవిముక్తుడై..భవిష్యబ్రహ్మ అయినాడు!ఒక భక్తుడు కాస్తా దైవమైనాడు!అలాగే సాధన సంపూర్ణముగా పరిసమాప్తి చేసుకున్న నామరూప దేవుడు ఈయనే గావడము విశేషము! అంతిమ సత్యము ఏమిటంటే...ఈ విశ్వసృష్టి అనేది త్రస్యరేణువు అనే నిర్జీవ పదార్ధమునుండి ఏర్పడినది!ఇదియే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రమని గ్రహించండి! దీనినే మనశాస్త్రవేత్తలు కృష్ణబిలము అని అన్నారు!రెండు నిర్జీవపదార్థాల కలయక నుండి జీవపదార్ధము ఏర్పడినది!అనగా యురియా ఏర్పడినట్లుగా అన్నమాట! ఇక జీవపదార్ధము అంటే మండే నక్షత్రమైన ధ్రవతార అని...నిర్జీవపదార్ధము అంటే కాంతిహీనమవుతున్న నక్షత్రమైన కృష్ణబిలమని గ్రహించండి! మనపూర్వక మహర్షులు వీటికి అనగా జీవపదార్ధమును ప్రకృతిగాను..ఆదిపరాశక్తిగా…ఆత్మగా...పిలిస్తే… అదే నిర్జీవపదార్ధమును ప్రకృతిపురుషుడిగా..ఆదిదేవుడిగా…పరమాత్మగా… పిలిస్తే..ఇపుడు వీటినే మనశాస్త్రవేత్తలు అణువుగాను,పరమాణువుగా పిలుస్తున్నారు!ఈ విశ్వసృష్టి అనేది త్రస్యరేణువులు కలిసి న్యూట్రానుగా..ఆపై ప్రోటాన్లుగా..ఆపై ఏలక్ట్రాన్ గా రూపాంతరము చెందినది!ఈ మూడింటినే మన పూర్వీక మహర్షులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ,విష్ణువు,మహేశ్వరుడిగా అలాగే వీటిలో ఉండే శక్తులని త్రిమాతలుగా అనగా సరస్వతి,లక్ష్మీ,పార్వతిగా పిలవడము జరిగినది! ఈ త్రస్యరేణువును మన శాస్త్రవేత్తలు దైవకణమని పిలవడము జరిగినది! ఈ రేణువు స్వయంభూ అని తెలుసుకొండి! మూడు త్రస్యరేణువులు కలిసి పరమాణువుగాను..ఆపై ఇవి కలిసి అణువుగా..ఆపై ఇవి కలిసి జీవపదార్ధముగా రూపాంతరము చెందినాయని తెలుసుకొండి! అనగా 36 మూలకాలతో రేణువు పరిమాణములో మూలజీవపదార్ధము ఏర్పడినది! ఈ 36 మూలకాలే…36 మూలబ్రహ్మకపాలాలుగాను...36 భగవత్తత్వాలుగా చెప్పడము జరిగినది! ఆదిమూలబ్రహ్మపదార్ధమే…మన నామరూప సదాశివమూర్తియని తెలుసుకొండి!ఈ జీవపదార్ధములోని మూలక అణువుల మార్పులవలన వివిధరకాల జీవపదార్థాలుగా రూపాంతరము చెందినాయి! ఈ విశ్వములో ఏ పదార్ధము సృష్టించబడలేదు!నాశనము చెయ్యబడలేదు! కేవలము ఒక పదార్ధము నుండి మరొక పదార్ధముగా రూపాంతరము చెందుతున్నాయని తెలుసుకొండి! పూర్ణం కాస్త పూర్ణం గానే ఉంది!పూర్ణం నుండి పూర్ణం తీసివేసిన..పూర్ణం అవుతుంది! ఈ వివిధరకాల జీవపదార్థాలను మన పూర్వీకులు 36కోట్ల దైవాలుగా పిలిస్తే...ఇపుడు మనవాళ్ళు మూలకాలని పిలుస్తున్నారు! అంటే మన పూర్వీకులు వీటికి ప్రాణమున్నట్లుగా, శరీరములున్నట్లుగా భావనలు చేస్తే...ఇపుడు ఉన్నవారు వీటిని కేవలము ప్రాణము లేని మూలకాలుగా చూడటము జరిగినది! అంతెందుకు సల్ఫర్ తీసుకుంటే మనవాళ్ళు "S" అంటే మనపూర్వీకులు శివుడు అన్నారు! శివుడి(Shiva) పేరు "S" తో మొదలవుతుందని గ్రహించండి! ఇక బ్రహ్మ అంటే "B" అనగా బోరాన్...విష్ణువు అంటే "V" అనగా వెకాడియం...బాలాదేవి అంటే "B"భాస్వరము,చంఢీ అంటే "C" కార్బన్...విచిత్రము ఏమిటంటే ఈ మూలకాలకి ఏ లక్షణాలు ఉంటాయే అవే లక్షణాలు ఆయా దేవతలకి ఉంటాయి! అనగా "S" తీసుకుంటే సల్ఫర్ గదా! దీనికి నిరంతరము మండే గుణముంటుంది గదా!అలాగే మన శివుడు,శివాని లకి నిరంతరముగా కోపావేశాలతో ఏదో కారణానికి రగులుతూనే ఉంటారు గదా! జాగ్రత్తగా ఆలోచించండి! మన పేరులోని మొదటి అక్షరమును తీసుకుంటే...అది మన మూలకమేదో తెలుస్తుంది!దాని లక్షణాలు మన జీవపదార్దమునకు ఉంటాయి! అంటే మూల మూలకాలకి పూర్వమువారు కేవలము దైవాల నామాలు,వారి రూపాలు మాత్రమే పెట్టడము జరిగినదని తెలుస్తోంది గదా! ఈ లెక్కన చూస్తే విశ్వసృష్టి అనేది భగవంతుడు చెయ్యలేదని...కేవలము మూలకాలే చేసినాయని తెలిసినది గదా! ఈ లెక్కన భగవంతుడు అనేవాడు ఆదిమానవులలో బాగా పరిణితి చెందిన మానవుడేనని తెలుస్తోంది గదా! అంతెందుకు భగవద్గీత యందు ఏవరైతే గుణరహితముగా ఉందురో వారే పరమాత్మయని...ఏవరైతే కర్మఫల త్యాగము చేస్తారో వారే యోగి అని చెప్పడము జరిగినది గదా!అంటే పరిణితి చెందిన మానవుడే మాధవుడు... పరిణితి చెందిన జీవుడే శివుడు.. పరిణితి చెందిన ఆదిస్త్రీమూర్తియే ఆదిపరాశక్తి యని తెలుసుకొండి! ఇదియే అసలుసిసలైన అహ:బ్రహ్మస్మి...ఇదియే తత్వమసి...ఇదియే శివోహం...ఇదియే సంపూర్ణ అదైత్వస్ధితి.. అనగా నేనే దేవుడిని...నేనే భగవంతుడిని...నేనే శివుడిని...నేనేయున్నాను! చివరికి ఈ నేను గూడ అంతరించిపోయి...సర్వం ఏమిలేదని...సర్వము శూన్యమేనని తెలుసుకుంటారు! అన్ని మతములలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీభత్సాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . అమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదని , ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షలు లేని దేవుడు ఉన్నట్లుగా...వివిధ వేద,శాస్త్ర,పురాణ,ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడము జరిగినది!  నమ్మకమే జీవిత నావకు దిక్చూచి. నిజానికి ఈ విశ్వము విశ్వాసముతోనే నడుస్తోంది!  ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనస్సులు ... మనిషి మనిషి కి తేడా , మనస్సు మనస్సు కి తేడా ఉంటుంది . మనస్సు + శరీరము కలిస్తేనే మానవ జీవి . ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికి తెలియదు . తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు!తెలియనివాడు తెలుసుకోలేడు! ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తాను బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున.
 
 
 ప్రస్తుత విషయానికి వస్తే... జీవపదార్ధమునకు ఆక్సిజన్ గావాలి...అలాగే నిర్జీవ పదార్ధమునకు  హైడ్రోజన్ గావాలి! అనగా బ్రతికించేది ఆక్సిజన్ అయితే నాశనము చేసేది హైడ్రోజన్ అన్నమాట! బంధము కలిగించేది “O” అయితే బంధవిముక్తి కలిగించేది “H” అన్నమాట! ఇందులో బంధము కలిగించేది మూలధారచక్రమైతే...బంధవిముక్తి కలిగించేది బ్రహ్మాండ చక్రము అని గ్రహించండి! మూలాధార చక్రము నందు ఉండే స్ధూలశరీరానికి  “O”  గావాలి! అదే బ్రహ్మాండ చక్రము నందు నశించటానికి ఆకాశశరీరానికి “H”  ఉండాలని గ్రహించండి! అలాగే భగవద్గీత యందు ఈ చక్రము నా చేత నడుపడుచున్నదని చెప్పడము జరిగినది! కృష్ణుడు అంటే "K" అనగా Kalium – పొటాషియం! అంటే ఈ చక్రము పొటాషియము అణువుల హెచ్చుతగ్గుల చేత తిరుగుతోందని తెలుస్తోంది గదా!దీని గుణము ఆక్సిజన్ తో కలిసి తెల్లని పొటాషియంపైరాక్సైడ్ గా మారి సెకన్స్ లలో పెద్ద విస్ఫోటనకారిగా మారుతుంది! కాబట్టి ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము నిరంతరము మండుతూనే ఉంటుంది! అలాగే అసలైన కృష్ణ వస్తువు లాగ యిది ఏ మాత్రము వెలుతురుని తిరిగి బయటకు వదలదు! దీని యొక్క మధ్యలో గురుత్వాకర్షణ ఏకత్వం  అనేది ఉంటుంది! ఇదియే అద్వైత సిద్ధాంతము! కృష్ణబిలము నందు “H”   ఉంటుందని మన శాస్త్రవేత్తలు కనిపెట్టినారు గదా!ఇక “H” అంటే హనుమంతుడు(Hanuman) గదా! అంటే మన హనుమంతుడు హైడ్రోజన్ (H) మూలక పదార్ధమని గ్రహించండి! అలాగే ఈయన వాయుపుత్రుడు గావడముతో ఆక్సిజన్  ప్రతీక అయినాడు! దానితో ఈయన అవిముక్తి జీవుడై(ఏట్టి బంధము లేనివాడై)భవిష్య బ్రహ్మ అయినాడు! అనగా జీవపదార్ధము నుండి నిర్జీవ పదార్ధముగా మారడమే యోగసాధన అని...మారితే అదియే సంపూర్ణమోక్షమని..మారకపోతే అది మాయని తెలుసుకొండి! ఇది అంతతేలిక అయిన విషయము గాదని గ్రహించండి! కామదేహము గావాలా...భగవత్ తత్వము గావాలా అని నిరంతరము జగత్ గురువైన జగత్ మనకి నిరంతర యోగపరీక్షలు చిట్టచివరిదాకా పెడుతూనే ఉంటుందని తెలుసుకోండి! వీటిని సహనముతో,శ్రద్ధతో,భక్తితో,అచంచల ఏకగ్రతతో దాటినవారికి వారి మాయ మాయం అవుతుంది! 
 
ఇక నా పరంగా చూస్తే...నా మర్కటనామధేయముతో పవనా (హనుమంతుడి ముఖము )...నా మర్కట సన్యాసిదీక్ష- జ్ఞాన: దీక్షతో (మండే పాము)...మర్కట బ్రహ్మజ్ఞానియై పరమహంస (హంస) లాగా… మౌన:బ్రహ్మ(దివ్యతార) స్ధితిని పొంది… అవిముక్తి జీవుడై… బ్రహ్మాండ చక్రము కృష్ణబిలము (మండుతున్న చక్రము) నందు మా పంచశరీరాలను తునాతునకలు చేసుకుంటూ విభూతిరేణువులుగా మారడము జరిగినది! ఎలా అంటే...మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు ఉన్న పంచభూతాల శక్తి అయిన జీవప్రకృతిని దాటలేమని అన్నారు...మేము దాటినాము...ఇక ఆఙ్ఞాచక్రము వద్ద దైవసాక్షాత్కారాలు దాటలేమని అన్నారు!మేము దాటినాము!ఇక సహస్ర చక్రము వద్ద అంతిముగా ఆత్మ ఉంటుందని...ఇది ఆత్మసాక్షాత్కారానుభూతిని ఇస్తుందని చెప్పడము జరిగినది! దీనిని మేము దాటితే శూన్యము కనపడినది! ఈ శూన్యమును దాటటానికి మా సాధనను హృదయచక్రము వద్దకు వెళ్ళితే పరమ శూన్యం కనపడినది! ఇందులో ఏముంటాయని ముందుకి అనగా బ్రహ్మరంధ్రము వద్దకు వెళ్ళితే… ఒక మూల కపాలము దర్శనమిచ్చినది! ఇందులోనికి వెళ్ళితే… మూలకపాల యొక్క మండుతున్న చితాగ్ని దర్శనమైనది! ఇదియే పరంజ్యోతిగా అందరు దీనిని భావించినారని మాకు అర్ధమైనది! ఈ చితాగ్ని అధిదైవముగా 85సం!!రాల వయోవృద్ధురాలిగా ఆదిపరాశక్తి కనపడినది!ఈమెను సహనశక్తితో దాటినపుడు మాకు అధి దేవతలుగా దీపదుర్గ,దీపకాళి,దీపచంఢి కనపడినారు! వీరిని దాటినాము!అపుడు మాకు ఈ మూలకపాలములో ఏముంటుందని వెళ్ళితే...అందులో 36 కపాలాలుండి ధ్యానముద్రలో ఉన్న ఒక అస్ధిపంజరము దర్శనమైంది! ఈ కపాలాలు గూడ ఒక పిరమిడ్ ఆకారములో 1,3,5,7,9,11 లలో ఆరువరుసలతో… అమరి ఉన్నట్లుగా అగుపించినది!ఈ కపాలాలలోని అంతిమ ఏకకపాలము దగ్గరికి వెళ్ళితే...ఈ కపాల బ్రహ్మరంధ్రము వద్ద మాకు పిసరంత అగ్నిశిఖ కనపడినది! ఈ శిఖలో సుడులు తిరుగుతూ తనలో అన్నింటిని ఇముడ్చుకుంటున్న బ్రహ్మతేజస్సుతో ఉన్న...బ్రహ్మాండ చక్రము దర్శనమైనది! దీనినే మన శాస్త్రవేత్తలు కృష్ణబిలమని అన్నారని తెలుసుకున్నాము! ఇందులో ఏముంటుందని విశ్లేషణ చేస్తే … హైడ్రోజన్ వాయువు ఉండి...తన పరిధిలో ఉన్న అగ్నిశిఖలాంటి ధ్రవతారలను  అన్నింటిని నాశనము చేస్తూ..తనలోనికి కలుపుకుంటూ...వెనక్కి తిరిగి రానీయ్యకుండా చేస్తూ… ఎపుడైతే తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు పూర్తిగా అయిపోయినపుడు వీటి నూట్రాన్లలోని కాంతి తగ్గుతూ కాంతిహీనమై...చీకటిలోనికి అంతరించిపోతాయని మేము తెలుసుకున్నాము!దానితో మన బ్రహ్మాండ చక్రము అంతరించిపోతుందని... ఇదియే మరణానికి శాశ్వతమరణమైన సంపూర్ణ మోక్షమని గ్రహించినాము!అనగా జీవపదార్ధము కాస్తా నిర్జీవపదార్ధముగా అనగా "O" నుండి"H" గా మారిపోతుంది!దానితో జీవన్ముక్తి పొంది పరమశాంతిని పొందడము జరిగినది! గాకపోతే ఇది అంతాగూడ ఆదిలో జరిగిన మా జీవపాత్ర దృశ్యాలు అలాగే మా యోగసాధన యొక్క రికార్డ్ దృశ్యాలు ఇపుడు చూస్తున్నామని... చూశామని…తెలుసుకొనేసరికి మా బుర్ర కాస్తా బ్రహ్మాండ చక్రములాగా తిరగడము మొదలైంది! ఇలా మేము పొందిన స్వానుభావాల  ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాల సమాహారమే నా సాధన ఆత్మ కథ అయిన ఈ మహత్తర గ్రంథరాజమని గ్రహించండి! 
 
మాకు అలాగే మా చక్ర నామరూప దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడినది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అనిమేము అనుకుంటుండగా మా 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువైన కాశీ వాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి “మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని” ఆదేశం ఇవ్వటం,   మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తక డైరీలు యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. అలాగేఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగము ధరించి అది ఇచ్చే ఇష్ట కామ్య సిద్ధితో ఎవరి యోగసాధన దేనివలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించటం జరిగినది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వడంతో మంత్ర శక్తి,,చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వడంతో యంత్ర శక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతా శక్తులు, దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వటంతో దైవికశక్తి, గురువును గూర్చి చెప్పడంతో శక్తి పాతం, యోగుల అనుభవ వివరాలు చెప్పటంతో యోగశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది .అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటో కి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీ తోడు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి  ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి ,మధుర భక్తి,,నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు.కేవలం మోక్ష కాంక్ష మాత్రమే తీర్చును.  అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారికి మాత్రమే. వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది.అది ఏమిటంటే ఏదో ఒక దైవం మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని  అలాగే మీ ఇష్ట  గురువుగా భావించుకోండి.వారి బీజాక్షర మంత్రము గురు మంత్రంగా భావించి, మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజూ క్రమం తప్పకుండా, వేళతప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానంనందు స్థిరపడి  విశ్లేషణ శక్తి పెంపొందించుకుని వివేకబుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన  శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు లేదా మీ ఇష్ట దేవతను గురువు గావించుకుని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవము గురువుగా గురువే దైవము గాను మారుతుంది .కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తాపడి తమ యోగసాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయను చేధించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూసాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకూడదు. అది ఏమిటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్టభర్త/ఇష్ట భార్య గా భావించకూడదు. ఇది నా మనవి. మాకు లాగా ఈ గ్రంథము ద్వారా వివిధ రకాల సాధన యోగసాధకులు అంతిమ సత్యమేదో తెలుసుకొని...వారి సాధనను పరిసమాప్తి చేసుకొని...దాని యందు జయం పొందాలని.. ….ఆశయముతో...ఆశతో...ఆశిస్తూ…ఆశీస్సులు… ఆశీర్వచనాలతో… 

                                             - పరమహంస పవనానంద

                         ****************************************************


దివ్యాశీస్సులు

సహయోగి శ్రీ పరమహంస పవనానంద స్వామీజీ కి …
నా ఆశీస్సులు… మీ మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథమైన “యోగ దర్శనము” చదవటము జరిగినది. అందులో మీరు చెప్పిన విషయాలు అలాగే ఈ గ్రంథరచనకు కావలసిన విషయాలు సేకరించి పెట్టటం… ప్రారంభ సాధకుడికి వచ్చే అన్ని రకాల సాధన సందేహాలకు సమాధానాలు రూపంలో ఈ గ్రంధము నందు చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పటం జరిగినది. అలాగే మీ రెండవ గ్రంథమైన ఈ “కపాల మోక్షం” కూడా అంతే దీటుగా ఉన్నది అని చెప్పటానికి మాకు ఎలాంటి సందేహము లేదు. మొదటి గ్రంథము మీ శబ్ద పాండిత్యమునకు సూచన అయితే ఈ రెండవ గ్రంథము మీ అనుభవ పాండిత్య జ్ఞానమునకు అద్దము పడుతుంది. ఈ గ్రంథము లోని సాధన అనుభవాలు చదువుతుంటే స్వప్న లోకంలో స్వప్న శరీరంతో స్వప్న సాధన మేము చేస్తున్నట్లుగా మాకు అనుభూతిని ఇవ్వసాగింది. ఎవరు కూడా ఎక్కడా కూడా అలాగే యోగి కూడా తన అనుభవాలను యధాతధంగా నిక్కచ్చిగా నిజాయితీగా భయపడకుండా బాధపెట్టకుండా మార్చకుండా నిజాలతో యధాతధంగా చెప్పటము చాలా అరుదైన విషయమేనని చెప్పాలి. చాలామంది యోగ సాధకులకు తమ ధ్యాన అనుభవాలు లోకానికి అందించే ప్రయత్నం లో ఉన్నప్పుడు వాక్కు బంద్ అవ్వటం లేదా తమ గురువుల కోసమో లేదా తమ ఇష్టదైవాల కోరిక మేర అనుభవాలు లోకానికి చెప్పలేదని నా స్వానుభవంలో ఎంతోమంది యోగులను, గురువులను, స్వామీజీలను, పీఠాధిపతులను, మఠాధిపతులను చూడటము జరిగినది. అలా మీరు ఎవరి మాయలోను, దేని మాయలోను, దేనికి స్పందించకుండా, దేనిని గూర్చి ఆలోచించకుండా, నిజ మూల జ్ఞానము ఏదో తెలుసుకొని యోగనిద్ర సాధన చేసి “సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము. నేను లేను” అనే బ్రహ్మ జ్ఞానమును ఒక నిజ సత్యాన్వేషికుడిగా మీ స్వానుభవ అనుభూతి పొంది అదే విషయ జ్ఞానమును ఈ కపాలమోక్షం గ్రంథము ద్వారా లోకానికి యధాతధంగా అందించిన మీ మనోధైర్యానికి నా జోహార్లు. పైగా మీకు కలిగిన అన్ని రకాల ధ్యాన అనుభవాలు ప్రకృతిమాత మీకు ఇచ్చిన దైవిక వస్తువులు వివరాలు… వివిధ గ్రంధాలలో ఉన్న యోగుల అనుభవాలను సాక్ష్యాలుగా నిదర్శనంగా చూపించటం సాహసంతో కూడిన పని. కాసులకి కక్కుర్తిపడకుండా...కీర్తిప్రతిష్టలను ఆశించకుండా మీ అభిమతాలను మతముగా మార్చకుండా...ఉన్నది ఉన్నట్లుగా యధాతముగా లోకానికి చెప్పటానికి మీరు పడిన తపన వేదన ఈ గ్రంథమునందు చాలా స్ఫష్టంగా కనిపించినాయి.
 
వివిధ దైవసిద్ధాంతములోని లోపాలను చాలా చక్కగా సరియైన ఆధారాలతో...కారణాలతో ఎత్తిచూపి ఈ లోపాలను సరిచేస్తూ ...యదార్ధ జ్ఞానమును మార్చకుండా...ఏమార్చకుండా భయపడకుండా మీరు పొందిన జ్ఞానసత్యమును ఇదివరకే అందరు పొందినారు కాని కొన్ని బలహీనతలకి వాళ్ళు గురిగావడము వలన అసలు సత్యజ్ఞానము లోకానికి అందలేదని.. అందించలేకపోయినారని...దానితో మీరు కలత చెంది ఈ యదార్ధ జ్ఞానమును సరికొత్తగా సంపూర్ణ అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన విధానము అలాగే సాధన విధివిధానములో ఉన్న అష్టాంగయోగంలోని లోపాలను సరిచేస్తూ...నవబ్రహ్మయోగమును ప్రతిపాదించి...లోకములో అంతగా గుర్తింపు లేని బ్రహ్మముడి ఒకటి ఉన్నదని...దానిని మీ వివేకజ్ఞాన బుద్ధితో ముడి విప్పి ఏకంగా మోక్షమాలను తయారుచేసి...దీని సహాయముతో అంతిమముగా వచ్చే బలహీనత మాయను దాటించి చూపించి …. దేవుడిని దాటిన జీవుడిగా మారిన విధానమును బట్టి చూస్తే...మీరు సాధనయందు ఎంతటి జగమొండిగా ఉన్నారో...వచ్చే మాయలను ఎంత నేర్పుగా దాటుకున్నారో...అందరికి మీరు పడిన  సాధన శ్రమ తెలుస్తోంది. సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని గుర్తింపు లేని గుప్తయోగిగా మారి నిరూపించినారు.మాయను దాటకూడదని..దానిని మీ అదుపులో ఉంచుకొని మాయ మాయం చేసుకుంటూ మీరు చేసిన సాధన విధానము బట్టి చూస్తే దాని వెనుక ఉన్న మానసిక శారీరక శ్రమ చెప్పకనే చెప్పినారు.
 
అలాగే ఏనాడో అంతరించిపోయే స్ధితికి చేరుకున్న భయపెట్టే సాధకుల భయంకర తాంత్రిక సాధన దీక్షలైన కాపాలిక, అఘోర,భైరవి,నాగసాధువు దీక్షల గూర్చి చెపుతూ లోకములో వీటి మీద ఉన్న అపోహలు తొలగిస్తూ ... మీ సహచర యోగి అయిన జిజ్ఞాసి ఈ అన్ని రకాల దీక్షలు చేసిన విధానమును ఏమార్చకుండా,భయపడకుండా,సిగ్గు పడకుండా,యధార్ధ అనుభవాలు ఈ లోకమునకు అందించడానికి చేసిన మీరిద్దరి కృషికి నా అభినందనలు. అలాగే ఈ వామాచార విధివిధాన సాధన దీక్షలను ఎలా దక్షిణాచార విధివిధానముతో చెయ్యవచ్చునో తెలుసుకున్న లాహిరి మహశయుడి అనుభవ జ్ఞానమును మీరు అందుకొని మీ చక్రసాధన పరిసమాప్తి చేసుకున్న  విధానము చూస్తుంటే అభినందించక తప్పదు.
 
దేవుడు ఉన్నాడు అంటూ మొదలుపెట్టి దేవుడు లేడని పూర్తి అవ్వటం అలాగే నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతో మొదలై నేను లేను అని సమాధాన సాధనతో పూర్తిగా పూర్తి చేయటం చాలా బాగున్నది. ఆది ఏమిటో తెలిసుకొని చెప్పినారు. అలాగే అంతమేదో అనుభవం పొంది ముగింపు ఇవ్వటం బాగుంది. నాకు వివిధ చక్ర సాధన స్థాయిలలో ఉన్నప్పుడు కనిపించిన వివిధ రకాల దృశ్యాలకి ఈ గ్రంథము పూసగుచ్చినట్లు సమాధానములు ఇచ్చినట్లుగా నాకు అనిపించినది. మన సాధన స్థితి ఎక్కడ ఉన్నదో ఎలాంటి స్థితిలో ఉన్నదో ఏమాయలో ఉందో దీనిని ఎలా దాటాలని మనకి మనమే తెలుసుకునే విధంగా మీ అనుభవాలతో మా అందరి అనుభవాలు తెలుసుకునే టట్లుగా గ్రంథ రచన చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అది ఒక్క ఆదిమూల బ్రహ్మజ్ఞాని అయిన వేదవ్యాసుడుకి మాత్రమే సాధ్యపడుతుందని వీరి అంశ అయిన మీకు సాధ్యపడటంలో ఎలాంటి సందేహం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. అలాగే మీరు చేసిన సాధన విధానము గూర్చి అనగా మీ యోగనిద్ర సాధన గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అందరిని ఒక లిప్తకాలము పాటు బుర్ర పనిచెయ్యకుండా చెయ్యడములో మీరు జయం పొందినారని చెప్పడములో ఎలాంటి అనుమానము లేదు.అలాగే ఎంతో మనోధైర్యముగా మీ సూక్ష్మశరీర యాన అనుభవాలు,గ్రహలోకా సంచార అనుభవాలు, దైవలోక దర్శనానుభవాలు, సర్వకర్మనివారణ అనుభవాలు చదువుతూంటే అవి కాస్త మా కళ్ళ ముందర ఈ మహత్తర దృశ్యాలు కదలాడేటట్లుగా మీరు చెప్పిన విధానము అమోఘం. పైగా ఈ గ్రంథంలో చెప్పిన జ్ఞానము అక్షరసత్యాలు అనుటకు నిదర్శనంగా ఈ ముగింపు వచ్చే సరికి మీరు మౌన బ్రహ్మగా మారిపోవటం పంచభూత సాక్ష్యంగా నిలిచిపోవడముతో … మీ సత్యస్వప్న ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాల సమాధిగీతయైన ఈ కపాలమోక్షం గ్రంథము అచిరకాలము నిజసాధకుల హృదయములో పదిలముగా నిలిచిపోతుందని ...నిలిచిపోవాలని ...అలాగే అందరుగూడ మీకులాగానే సాధనయందు జయం పొందాలని...నిజసత్యాన్వేషణలో గుర్తింపు లేని గుప్తయోగిగా ఉండి మీరు అందుకున్న మోక్షపధమును అందరు అందుకోవాలని...అందుకుంటారని ఆశిస్తూ...ఆశీస్సులు ఇస్తూ...

                                                 -       శ్రీ పీతాంబర యోగి, హరిద్వార్.

***********************************************************************************
                         all copy rights (C) PARAMAHAMSA PAVANANDA (writer)