ముందు మాట (103)

 03-12-2025


కార్తీక దీపోత్సవం ~ అరుణ జ్యోతి దర్శనం


ముందు మాట 


ఇది కథ కాదు. ఇది ఒక నిజ సాధకురాలి ఆధ్యాత్మిక అనుభవాల ఆత్మ కథ. ఒక అమ్మాయి తను భోగ జీవితంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడి, ప్రేమించి ,పెళ్లి చేసుకుని 16 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత… ఆ అబ్బాయి అధర్మ ప్రవృత్తిలో ఉండి ,తన మనసుకు, తన ఉనికికి విలువ లేకుండా చేసి ,మగ అహంకారంతో తన మాంగల్యాన్ని కూడా ఇంకొకరితో పంచుకోవాలంటూ… భార్యతో మాత్రమే బతకడం ,జీవితాన్ని పంచుకోవడం తన నైజానికి విరుద్ధం అంటూ… మానసికంగా ,శారీరకంగా ముళ్లపాన్పు లాంటి జీవితాన్ని ఇచ్చి, తన నుంచి స్వేచ్ఛ కావాలని ,విడాకులు కావాలని వెళ్ళిపోయిన తరువాత ఈమెకి భోగ జీవితం మీద స్మశాన వైరాగ్యం కలిగి ,ఆత్మహత్య చేసుకోవాలని…. కాశీ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది . ఎందుకంటే ఈ క్షేత్రంలో మరణమే మోక్షమరణం అవుతుంది అని శాస్త్రవచనం కదా ! అప్పుడు ఈమె ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న మణికర్ణిక ఘాటు యందు గంగానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంలో ఉండగా నడయాడే కాశీ విశ్వనాథుడైన శ్రీ త్రైలింగ స్వామి , ఆత్మ స్వరూపం నుండి భౌతిక దేహంతో ఈమెకి దగ్గరికి వచ్చి , గురుబోధ చేయడం ఆరంభిస్తారు . అక్కడి నుండి ఆమెలో ఆధ్యాత్మిక చింత మొదలయ్యి…. 

మోక్ష సన్యాసిగా మారి , 

తను తెలుసుకున్న శివ మోక్ష బ్రహ్మ జ్ఞానమును ఏ విధంగా తెలుసుకుందో…. 

ఎలాంటి మాయలు దాటిందో ….

చివరికి ఆమె ఏం అయ్యిందో …..

అనేది ఈ ఆత్మకథ సారాంశం.

 ఈమె అనుభవాలు దాదాపుగా నిజ సాధకుల అనుభవాలతో 80% సరిపోతాయి. ఒక జీవుడు తను జీవమాయను దాటి, శివోహం స్థితిని పొంది ,పరిపూర్ణ మోక్షం పేరుతో శివ శవ దహనం ఎలా పొందాడో…. ఈమె సాధన అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చును. ఇది కథ కాదు ……అని జీవిత సత్యం అని మీరు తెలుసుకోండి . గ్రహించండి. ఈమె ఆధ్యాత్మిక అనుభవాలతో పాటుగా మనం కూడా ఆధ్యాత్మిక అంతిమ ప్రయాణం చేరుకోవడానికి మాతో పాటుగా మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాము . ఇందులో చెప్పిన పాత్రలు, పాత్రలు పొందిన అనుభవాలు, పాత్రలు చెప్పిన అనుభవాలు అన్నీ కూడా సత్యమే…… 

కానీ కథానుగుణంగా పాత్రల పేర్లను మార్చడం జరిగింది. అలాగే ఈ పాత్రలు తెలుసుకున్న ధ్యాన అనుభవాలు అన్నీ కూడా నిజమైనప్పటికీ , వీరు తెలుసుకున్న మర్మ రహస్యాలు ,విషయాలు మాత్రం కధానుసారంగా కల్పితం చేయడం జరిగింది. నిజానికి ఒక నిజ సాధకుడు తన సాధనా స్థితిలో మూలాధారం నుంచి బ్రహ్మ రంధ్ర చక్రం వరకు పొందిన ధ్యాన అనుభవాలు ,మర్మాలు, మర్మ రహస్యాలు ,జ్ఞానము, మాయలు వాటిని దాటుకోవడానికి చేసిన ప్రయత్నాలు అన్నింటిని ఈ ఆత్మ కథలో దైవ రహస్య చేదన ఛేదించే దేవుడి ఆటగా చేర్చడం జరిగింది . ప్రేక్షక దేవుళ్ళకు అర్థమయ్యే విధంగా సులువుగా చెప్పడం జరిగింది.

ఇందులో చెప్పబడిన రాగి రేకు రుద్ర యంత్రము అలాగే సాధనా విగ్రహమూర్తి… దీనికి సంబంధించిన మర్మ రహస్యాల విశ్లేషణ అంతా కూడా కథ పరంగా కల్పితంగా చెప్పడం జరిగింది. కానీ ఈ విగ్రహమూర్తి రూపము.. సాధకుడి సాధన శరీరంతో సమానమని తెలుసుకోండి. సాధకుని సాధన శరీరం విగ్రహమూర్తి గురించి కల్పిత అంశాలతో…కల్పితంగా ఊహించి చెప్పడం జరిగింది. నిజానికి ఈ సాధన విగ్రహ మూర్తి లేదు. సాధకుని శరీరంలో జరిగే మార్పులను మనం అర్థం చేసుకోవడానికి ఈ విగ్రహ మూర్తిని ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది. చాలా కోరాలిగా వచ్చే దైవిక వస్తువులు, దైవిక లింగాలు, సత్యమని తెలుసుకొని …పొందే ధ్యాన అనుభవాలు అక్షర సత్యం అని తెలుసుకోండి. ఇవి సాధనలో 80% శాతం సరిపోతాయి. కేవలం విగ్రహ మూర్తి గురించి చెప్పిన అంశాలన్నీ కూడా కల్పిత అంశాలని… నిజాలు కావని ….దీనికోసం చెప్పిన ప్రాంతాల్లోనూ వెళ్లి …అక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని… చెయ్యకూడదని …చేసిన ఉపయోగం లేదని గ్రహించండి. ఇదంతా కూడా కల్పిత అంశాలే కాకపోతే సాధకురాలు పొందిన ధ్యాన అనుభవాలు, మర్మ రహస్యాల చేదన, మా ఆయన దాటడం అన్నీ కూడా అక్షరసత్యాలే. కానీ స్త్రీ ప్రకృతికి మోక్షం ఇచ్చి తన మరణం కాస్త విశ్వమోక్షంగా మార్చిందో లేదో తెలుసుకోవాలంటే ఈమెతోపాటు సాధన చేసి జయం పొందుతారని ఆశిస్తూ…… దీవిస్తూ….


శుభం భూయాత్





1 కామెంట్‌:

  1. రాత్రి కళలో శివయ్య లింగ రూపంలో దర్శనం ఇచ్చిన తరువాత ఇ రోజు కపాల మోక్షం గ్రంథం సడన్ గ చూద్దాం అనిపించింది...100 అధ్యాయం ఉంటాయి కద అనుకొని... ఇవి కొత్తగా ఏమిటి అని చూసాను చాల సంతోషంగా అనిపించిందే... ఓమ్ నమః శివాయ ఓమ్ శ్రీ మాత్రే నమః..మీకు నమస్కారం తండ్రి

    రిప్లయితొలగించండి