శుభవార్త:
మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
వెయ్యి తలలు నల్ల వాడు అగుపించాడు
(నా సహస్ర చక్ర అనుభవాలు)
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్ర దైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
సహస్ర చక్ర అనుభవాలు (నా డైరీలో):
జనవరి 7: ఈ రోజు నా ధ్యానమును సహస్రార చక్రము మీద చెయ్యటం ఆరంభించాను. అనగా మా గురుదేవుడు చెప్పినట్లుగా ధ్యానము నందు బాహ్య విషయాలు, శరీర స్పృహ, బాహ్య స్మృతి, బయట శబ్దాలు వినడం పూర్తిగా తగ్గిస్తూ ఏదో తెలియని తన్మయత్వం స్థితిలోని కి వెళుతూ ఉంటే ఈ చక్ర ధ్యానం అవుతుందని చెప్పటం జరిగినది. అనగా నెమ్మదిగా ధ్యాన స్థితిని గంటలనుండి రోజుల వరకు నాకు తెలియకుండానే వెళ్లి పోవాలి అన్నమాట.
జనవరి 10: ఈ రోజు నా మాడు ప్రాంతము విపరీత పోటుగా ఉంది. తలంతా బరువుగా ఉంది. ధ్యానమును శ్రద్ధగా చేయలేక పోయినాను.
జనవరి 16: ఈరోజు నా తల భాగంలో ఏదో ఉండలాగా బంతి లాంటివి కాస్తా మాడు మధ్య భాగం వైపు కొట్టుకుంటున్నట్లుగా ధ్యానము నందు అనిపించసాగింది.
జనవరి 20: ఈ రోజు నాకు చిన్నప్పటి బాధాకర సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. దానితో ధ్యానము చేయలేకపోతున్నాను.
జనవరి 21: ఈ రోజు నా జీవితంలో జరిగిన అవమానకర సంఘటనలు వరుసపెట్టి గుర్తుకు వస్తున్నాయి. కారణం తెలియదు.
P2:
జనవరి 26: ఈ రోజు ధ్యానము నందు చిన్నప్పటి బాగా గుర్తున్న సంఘటనలు గుర్తుకు రావటం మొదలైంది. దీనితో నాకు ధ్యాన భంగమైనది. కొన్ని గంటలలో ధ్యాన స్థితి నుండి బయటికి వస్తున్నాను.
ఫిబ్రవరి 5: ఈ రోజు ధ్యానము నందు ఆనందకరమైన సంఘటనలు లీలగా గుర్తుకు రావడంతో నా మనస్సు కాస్త ఆనందంలో ఉండిపోయింది. నాకు ధ్యానం భంగమైనది.
ఫిబ్రవరి 8: ఈ రోజు నన్ను శత్రువులుగా భావించే వారు ఎదురు పడినారు. బాధ అనిపించింది.
ఫిబ్రవరి 10: ఈ రోజు నేను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎదురుపడినారు. ఏమీ అనిపించలేదు.
ఫిబ్రవరి 15: ఈ రోజు నా వలన సహాయము పొందినవారు అనుకోకుండా కనపడినారు. ఆనందం వేసింది.
ఫిబ్రవరి 28: ఈ రోజు నా వలన బాధపడిన స్త్రీమూర్తులు అగుపించారు. ఆశ్చర్యము వేసింది.
P3:
మార్చి 5: నాకు కలిగే ధ్యాన అనుభవాలు అలాగే భావాల వ్యక్తుల గురించి నా గురుదేవుడిని అడిగినప్పుడు “సహస్రార చక్ర జాగృతి అయినప్పుడు ఈ జన్మలో చేసిన పాప పుణ్యకర్మల అనుభవాలు గుర్తుకు వస్తాయి అని చెప్పటం జరిగినది. అదే ఈ చక్రశుద్ధి అవుతున్నప్పుడు సాధకుడి యొక్క మలము వాసన దుర్గంధం తగ్గిపోతుంది. అదే ఆధీనం అయితే ఈ మలము కాస్త కర్పూరం వాసన వేస్తోంది. అలాగే శరీరము స్వయంగా కిరణజన్యసంయోగక్రియ ద్వారా తనకి కావలసిన శక్తిని సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటుందని… స్నానాలు చెయ్యకపోయిన శరీరము నుండి ఎలాంటి దుర్గంధ వాసనలు రాకపోగా సుగంధ విభూతి వాసనలు వస్తాయని” చెప్పడం జరిగినది. ఇది అన్నియు కూడా నా జీవితంలో జరుగుతాయా అనే సందేహం నన్ను వెంటాడింది.
మార్చి 18: నాలో ఉన్నటువంటి విపరీతమైన పోకడలు నా శరీరము గురికావటం మొదలైనది. అకారణముగా నా మనస్సు వ్యాకులత చెందుతుంది. కారణమో తెలియదు.
మార్చి 27: ఈ రోజు నా పుట్టినరోజు. అయినా ఆనందము లేదు. ఈరోజు ఎక్కువగా అవసరమైన ఆలోచనల కంటే అనవసరమైన ఆలోచనలు ఎక్కువైనాయి. ధ్యానము చేయ బుద్ది కాలేదు.
P4:
ఏప్రిల్ 10: ఈ రోజు నాకు ఈమధ్య ఏవీ కూడా సరిగ్గా స్పష్టంగా వినిపించడం లేదు అని గ్రహించాను. అలాగే వాసనలు కూడా తెలియటం లేదు. ఒకవేళ గ్రహణశక్తి వాసన శక్తి దొబ్బినాయా?
ఏప్రిల్ 25: ఈ రోజు నాకు విపరీతముగా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో మనస్సు కలత చెందింది. దానితో ధ్యానము చేయలేక పోయినాను. పైగా నిద్ర పట్టడం లేదు. నిద్ర లేమి వ్యాధి వచ్చిందా? ఏమో ఎవరికి ఎరుక.
మే 10: ఈ రోజు నాకు కలిగే ఆలోచనల వలన ఈ మధ్య నేను విపరీతముగా అలసిపోతున్నాను. ధ్యానము మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాను.
మే 15: ఈ రోజు అలవికాని లక్ష్యాలను సాధించాలని కంకణం కట్టుకున్నాను. ఇది ఏమీ సాధించలేం అని నా మనస్సు ఒక ప్రక్క ఘోష చేస్తోంది.
మే 18: ఈ రోజు మా అన్నయ్య ఇంటికి వెళ్ళినాను. అయినా కూడా అక్కడ ఉండలేక పోతున్నాను. వెంటనే ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది. ఈమధ్య నేను ఎవరి ఇంటికి వెళ్ళినా లేదా క్షేత్రానికి వెళ్ళినా లేదా ఫంక్షన్ కి వెళ్ళిన ఇదే మనః స్థితి కలుగుతుంది.
P5:
మే 20: మా గురు దేవుడికి నాకు కలిగే మనస్సు స్థితులు గురించి అడిగినప్పుడు వెంటనే ఆయన “నాయనా! ఇవి అన్నియు కూడా సహస్ర స్థితి అనగా షట్చక్రాలు ఏకకాలంలో బలహీనపడితే ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. కాబట్టి నీవు శూన్య ముద్ర అనే హస్తముద్ర ఆరు నెలల పాటు అభ్యాసం చేస్తే ఈ చక్రము స్థితి బలపడుతుంది. తద్వారా మిగిలిన చక్రాలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయని చెప్పడం జరిగినది. నా చేత ఈ ముద్ర అభ్యాసము చేయించడం జరిగినది.
మే 30: ఈ రోజు నాకెందుకో గత జ్ఞాపకాలు తగ్గుతూ అలాగే విపరీత ఆలోచనలు తగ్గటం ఆనంద బాధలకు అతీత స్థితి కలగటం గమనించాను. అలాగే ఈ రోజు అతి తీవ్రమైనా ధ్యానము నందు నాలాంటి రూపధారి మూడు అడుగుల పరిమాణములో కారణ శరీరంతో అగుపించాడు. అనగా వామనంత నా రూపధారి కనిపించాడు.
జూన్ 5: ఈ రోజు నా ధ్యానము నందు లీలగా మాత్రముగా ఓంకార నాదం పాంచజన్య శంఖ ధ్వనిలాగా వినబడినది. అనగా సహజముగా శంఖము ఊదకపోయిన దాని లోనికి ప్రవేశించే గాలి హోరు వలన జాగ్రత్తగా వింటే అది మనకి ఓంకారనాదం లాగా వినబడుతుంది. ఇది దక్షిణావృత శంఖాలలో చాలా స్పష్టముగా వినబడుతుంది. ఈ శంఖాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సముద్రాలు యందు, సరస్సులు యందు, కోనేరు లందు ఏర్పడతాయి.
P6:
జూన్ 20: ఈ రోజు మా ముత్తాత గారి పాంచజన్య శంఖం పాతకాలపు వస్తువులు నుండి బయటపడింది.
జూన్ 28: ఈ రోజు నరసింహస్వామి క్షేత్రము లో ఓంకార గణపతి శంఖము సముద్రపు ఒడ్డున దొరికినది.
జూలై 10: ఈ రోజు నాకు రామేశ్వర క్షేత్రము నుండి దక్షిణావృత శంఖము వచ్చినది. ఈ మధ్య అన్ని రకాల శంఖాలు నా దగ్గరికి చేరుతున్నాయి.
జూలై 15: ఈరోజు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖమునకు సంబంధించిన వీడియో చూడడం జరిగినది.ఈ శంఖము నాకు వచ్చిన శంఖాలలో ఒక శంఖమును అచ్చుగుద్దినట్టు గా ఉన్నట్లు గా అందరికీ అనిపించినది.
జూలై 20: ఈ రోజు ధ్యానము నందు అనాహతము సహజసిద్ధంగా ఓంకార నాదం చాలా స్పష్టముగా ఎవరో నాలో ఉండి చేస్తున్నట్లుగా అనిపించింది.
జూలై 22: ఈ రోజు నాకు ధ్యానమునందు లేత వంకాయ రంగు వెనక ఉండి లెక్కలేని బీజాక్షరాలతో దళాలతో నా మెదడు భాగంలో సహస్ర దళ పద్మం లీలా మాత్రంగా అగుపించినది.
జూలై 28: ఈ రోజు నాకు ధ్యానము నందు లీలా మాత్రంగా వెయ్యి తలలు ఉన్న శ్రీ కృష్ణుడి విరాట్ రూప దర్శనం అయ్యి ఆపై శూన్యము నందు లీనం అవటం కనిపించినది. అంటే ఈయన కూడా శాశ్వతము కాదని అర్థం అయినది.
P7:
జూలై 30: ఈ రోజు తల నరికే చిన్నమస్తా దేవి కనపడి నా తలను నరికినది. అప్పుడు నాకు చిలుక తల వచ్చినట్లుగా అగుపించినది. ఇది నిజమేనా? ఎవరికి తెలుసు. ఈ దృశ్యం కూడా శూన్యము నందు అదృశ్యమైంది.
ఆగస్టు 1: ఈ రోజు నాకు ధ్యానము నందు సజీవ మూర్తిగా శ్రీ మేధా దక్షిణామూర్తి అలాగే కైలాస పర్వతము నందు సజీవ మూర్తిగా ధ్యానం చేస్తున్న సదాశివమూర్తి లీలగా అగుపించి శూన్యము నందు లీనం అయినారు.
ఆగస్టు 3: ఈ రోజు నాకు ధ్యానము నందు వటపత్రశాయిగా బాల శ్రీకృష్ణుడు లీలగా కనిపించి ఒక రావి చెట్టు యొక్క చిట్ట చివరి ఆకు మీద పడుకొని ఆడుకుంటున్నట్లుగా లీలగా కనిపించడం జరిగినది. ఈ దృశ్యం కూడా శూన్యము నందు అదృశ్యమైంది. అంటే ఈయన కూడా శాశ్వతము కాదని అర్థం అయినది.
ఆగస్టు 5: నాలో అష్టసిద్ధులు కలుగుతున్నట్లు గా వాటికోసం సాధన చేయాలని నా మనస్సు విపరీతముగా ఆరాటపడటం మొదలైనది. నేను అణచడము ప్రారంభమైనది. ఇక నా ధ్యానము అంతా ఈ చక్ర ధ్యానముతో అయిపోయిందని నా మలము కాస్త కర్పూర వాసన రావడంతో నాకు అర్థమైనది. అలాగే ధ్యానము నందు సుమారుగా ఏకధాటిగా 11 రోజులపాటు ఉండిపోయాను. అనగా నిర్వికల్ప సమాధి స్థితి పొందటం జరిగినది.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకొండి!
1000 తలలు నల్ల వాడు అగుపించాడు( సహస్రార చక్రము):
బ్రహ్మ చక్రములోని శూన్య స్థితిని నేను పొంది శూన్య బ్రహ్మ గా మిగిలిపోయిన విషయము మీకు తెలుసు కదా. ఈ చక్రములోని మధ్య బిందువు అయిన జ్యోతి బిందువులో ఈ మహాశూన్యం యొక్క మూల శూన్యమైన పరమ శూన్యము ఉంటుందని దీనికి అధిష్టాన దైవముగా ఏకపాద శివమూర్తి ఉంటాడని దైవిక వస్తువులు పాదరస లింగం ఏక ముఖ రుద్రాక్ష ఉంటాయని కూడా తెలుసుకున్నారు కదా. ఈ రెండు వస్తువులు కూడా నా దరి రావటంతో నేను ఈ జ్యోతి బిందువు లోనికి అనగా పరమ శూన్యము లోనికి ప్రవేశించే అర్హత సంపాదించినట్లు అయినది. కానీ నేను ఈ బిందువు లోనికి ప్రవేశించాలి అంటే నాకు సవికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు త్యాగం చేస్తే శాంతి లభిస్తుందని చెప్పటం జరిగినది. కానీ మా ఇద్దరికీ అదే నాకు అలాగే మా జిజ్ఞాసికి ఏమి త్యాగం చేయాలో అర్థం కాలేదని విషయము కూడా మీకు తెలుసు కదా.అంటే మేము ఈ బ్రహ్మ చక్ర బిందువులోనికి ప్రవేశించాలంటే త్యాగము చేయాలి. నాకు అయితే ఏమి త్యాగము చేయాలో అర్థం అయి చావలేదు.కనీసం మన వాడైనా జిజ్ఞాసికి ఏమైనా అర్థం అయినదా అని సందేహంతో వారితో ఆత్మ అనుసంధానము అవుతుండగానే వాడు కాస్త “స్వామి! నేనే మీకు అనుసంధానము అవుతామని అనుకుంటున్నాను. లిప్త కాలములోనే నా సంకల్పమును అందుకని మీరే స్వయంగా అనుసంధానము అయిపోయినారు గదా. బాగుంది అంటుండగా వీరి రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయని దివ్యమైన బ్రహ్మాండమైన అమోఘమైన అద్వితీయ సమ్మోహన మహా శక్తి తో అఖండ బ్రహ్మతేజస్సు తో దివ్య ముగ్ధ మనోహర బ్రహ్మవర్చస్సు తో అగుపించాడు. సాక్షాత్తు అఘోరా శివమూర్తిని చూస్తున్నట్లుగా ఉంది. నాకే వారి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారము చేయాలని మహోన్నతమైన దైవత్వమును కలిగి ఉన్నాడని ఒంటి నిండా విభూతి ధారణతో చేతిలో డమరుకము ఉన్న త్రిశూలము ఉన్న నగ్నత్వం కాకుండా దిగంబర తత్వంతో ఉన్నారని అంటే సాధువుల లోకెల్లా మహోన్నతమైన సాధన స్థితి అయినా నాగ సాధువు స్థితి అయిన నాగ సాధువులు దీక్షలో ఉన్నారని నాకు అర్థమైనది. చూపులలో అమితమైన ప్రేమ వాత్సల్యం మాటలలో చేతలలో నిర్మలము చేతలు పసివాడి మనస్సు లాగా ఉన్నాయని అర్థం అయినది. అంటే మన వాడు కాస్త కాపాలిక అఘోర భైరవ సాధన స్థితినుండి నాగా సాధువు దీక్షకి చేరుకున్నాడని అర్థమైనది. ఇట్టి స్థితి దక్షిణాచారం లో పొందాలంటే 24 కోట్లు గాయత్రి మంత్రమును పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి కనీసము 48 సంవత్సరాల పైన పడుతుంది. అంటే మన వాడు ఈ స్థితిని కేవలము వామాచారం లో ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరములలో చేరుకున్నాడు అన్నమాట. ఈ ఆచారంలో వచ్చే మంత్ర దేవత మాయలు మర్మాలు దాటుకున్నాడు కదా .లేకుంటే మతి భ్రమణము లేదా చావు దెబ్బ తినటం లేదా కుక్కచావు పొందేవాడు.
నాగసాధువులు
అసలు నాగసాధువులు దీక్ష విధానం గూర్చి వారి మాటలలోనే విందాము. నిజానికి వీరంతా ఆధ్యాత్మిక సైనికులు. పూర్వ కాలంలో వీరు మన సనాతన ధర్మ పరిరక్షణకు సైనికులుగా పని చేసేవారట. వీరికి ఖడ్గము, గద, త్రిశూల ఆయుధ విద్యల యందు నైపుణ్యము కలిగేటట్లుగా శిక్షణ ఇస్తారట. వీరి శిక్షణ కేంద్రాలను ఆఖడాలు అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ కి చెందిన ఆఖడ శిబిరంలో చెందిన నాగసాధువులకి ఎక్కువ ప్రాముఖ్యత విలువను ఇస్తారట. వీరే మొదట కుంభమేళాయందు పవిత్ర నదీ స్నానము చేసిన తర్వాతనే మిగిలిన వాళ్లకి చెందిన సాధువులు స్నానాలు చేస్తారట. వీరంతా చేసిన తరువాత మిగిలిన తాంత్రిక యోగులైన కాపాలికులు, అఘోరాలు, భైరవులు, పవిత్ర స్నానాలు చేస్తారట. ఆ తర్వాత వివిధ మతాలు మఠాలు, పీఠాలకు చెందినవారు స్నానాలు చేయాలట. ఆ తర్వాత మిగిలిన వారు యోగులు, భోగులు స్నానాలు చేస్తారట. ఈ నాగసాధువులు దీక్ష అనేది ఎవరికి పడితే వారికి ఇవ్వరట. ఎవరైతే నాగా సాధువుగా మారాలని అనుకుంటారో వారికి ఇంద్రియ మనో నిగ్రహం పరీక్షలు పెడతారట. వీటిని తట్టుకున్న వారికి వారి పుట్టుపూర్వోత్తరాల వివరాలు తెలుసుకుని వీరి వంశం వివరాలను తమ మనోనేత్రం నందు చూసి వీరు సంతృప్తి పడితే అప్పుడే నాగా సాధువు దీక్షను ఈ ఆఖడాలులో ఉండే నాగ గురువులు ఇస్తారట. ఈసాధనకి పంచ గురువులు ఉంటారు. వీరందరి అనుగ్రహమును తో ఈ దీక్ష సాధకుడు పొందవలసి ఉంటుంది. ఇందులో ఎవరి ఆగ్రహానికి గురి అయితే ఆ క్షణమే ఈ నాగా సాధువు దీక్ష నుండి తప్పుకొని తనకి ఇష్టమైన తాంత్రిక దీక్ష అయిన కాపాలిక, అఘోర దీక్షలను పొందాల్సి ఉంటుందట. ఎప్పుడైతే ఈ పంచ గురువుల నుండి నాగసాధువులు దీక్ష పొందుతారో ఆరు నెలల నుండి 12 సంవత్సరముల దాకా వివిధ రకాల నాగ సాధన స్థాయిలను పొందాల్సి ఉంటుంది. అనగా మొదట నాగా సాధువు ఆ తర్వాత మహంత ఆపై శ్రీ మహంతా ఆపై జయతీయ మహంత, తమతీయ మహంత, పీఠ మహంత, దిగంబర శ్రీ, మహామండలేశ్వరుడు చివరికి ఆచార్య మండలేశ్వరుడు వంటి సాధన స్థాయిలు ఉంటాయి. ప్రస్తుతము నేను ఈ సాధన లో దిగంబరశ్రీ స్థాయిలో ఉన్నాను. ప్రతి సాధన స్థాయిలోనే ఎన్నో కఠినమైన సాధనలను ఇంద్రియ పరీక్షలను దాటి కోవాల్సి ఉంటుంది. వీరంతా శాఖాహారులుగానే జీవించాలి. ప్రతి రోజు 7 ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసి వచ్చిన భిక్షను శివ ప్రసాదముగా భావించుకుని తినాల్సి ఉంటుంది. స్త్రీలకి అలాగే స్త్రీ వాంఛలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీక్షలో దొరికినది తినాలి కానీ దొరకకపోతే అంటే ఎవరు భిక్ష అనగా ఈ ఏడు ఇళ్లల్లో ఎవరు కూడా భిక్ష వెయ్యకపోతే ఆ రోజు వీరికి ఉపవాసమే. అంతే గాని వేరే పదార్థాలు కానీ వేరే వారి బిక్ష గాని స్వీకరించ కూడదట. వీరు నిత్యము భస్మధారణతో పవిత్రస్నానంతో ఉంటూ అగ్ని ఆరాధన సాధన చేస్తూ ఉండాలి. నిత్య అగ్నిహోత్రము పూజ వీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వేశ్వరుడి ప్రథమ సాకార రూపమే ఈ అగ్ని స్వరూపం. పంచభూతాలలో అగ్ని తత్వం మొట్టమొదటిసారిగా మనకి స్వరూపముగా దర్శనం ఇచ్చినదని లోకవిదితమే కదా. అందుకే వీరు నిత్య సాధన లో అగ్ని సాధనగా ఉన్నది. అలాగే తమ సాధన స్థాయిలలో ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే వాటి ప్రాయశ్చిత్తము కోసం పంచాగ్నులు ఏర్పాటు చేసుకొని అగ్ని సాధన చేస్తారట. వీరు ఎప్పుడూ కఠినమైన బ్రహ్మచర్య దీక్షను కలిగి ఉండాలట. అలాగే ఇతరులకు సేవ చేసే గుణం కలిగి ఉండాలి. విభూది ధరించి ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. ఒకవేళ వస్త్రాలు ఉండవలసి వస్తే నారింజ రంగు వస్త్రము యొక్క పీలిక ధరించాలి. ఎల్లప్పుడూ నిరంతరముగా అగ్ని గుండం ధరించాలి. అలాగే రుద్రాక్ష మాలలు ధరించాలి. చేతిలో ఖడ్గం గాని త్రిశూలము గాని ఆయుధముగా ఉండాలి. ఏకభుక్తము. జుట్టును పూర్తిగా కత్తిరించు కోకుండా ఉండాలి లేదా గుండు గా ఉంచుకోవాలి లేదా జటాజూటము గా పెంచుకోవటం. ఎవరికి వారే ఆత్మ పిండము పెట్టుకోవాలి. నేల మీదనే నిద్రించాలంట. కమండలము నీళ్ళను త్రాగాలట. ఇంతా కఠోరమైన నియమాలని అలాగే ఈ నాగసాధువుల దీక్ష శ్రీ శంకరాచార్య ఆధ్వర్యంలో జరిగినది. పూర్వము భారతదేశంలో ఇతర మతస్తులు దాడిచేసి దేవాలయాలు అలాగే సనాతన ధర్మాలను నాశనం చేస్తున్నారని ప్రతి సాధకుడు కూడా ఉగ్ర శివుడిగా మారాలని అనే ఉద్దేశ్యంతో నాగసాధువుల పేరుతో ఆధ్యాత్మిక సైన్యమును తయారుచేసినారట. వీరి ఆవాసము ఎక్కువగా చలి ప్రాంతాలైన హిమాలయాలలో ఉండేదట. ఎప్పుడైనా హిందూ రాజులకు తమ అవసరం వచ్చినప్పుడు ఈ నాగసాధువులు గుంపులు గుంపులుగా వచ్చి అఖండమైన వీరికున్న ఆయుధ విద్యతో, సమ్మోహన శక్తులతో, తాంత్రిక సిద్దులతో శత్రు రాజు సైన్యమును నాశనం చేసి తిరిగి వారి ఆవాసాలకు ఆనందముగా వెళ్లిపోయారట. అందుకోసమే ఈ నాగసాధువులు దీక్ష అనేది ఏర్పడినదని నాకు అర్థమైనది. అలా నేను కూడా ఈ నాగసాధువులు దీక్షబూని నాకు నేనే ఆత్మ పిండమును పెట్టుకొని సంసార బంధాల నుండి వివిధ కర్మ బంధనాల నుండి వివిధ జన్మల బంధం నుండి విముక్తి పొందడం జరిగినది.అలాగే నాకున్న లింగ బేధము చేయించుకోవడం జరిగినది. దానితో కఠినమైన బ్రహ్మచారి దీక్షతో ఊర్ధ్వ రేతస్కుడుగా మారటం జరిగిందని వారు చెబుతుంటే నాకు తెలియకుండానే నా కళ్ళవెంట కన్నీరు వచ్చినది.ఈ దీక్షలో అన్ని నియమాలు బాగానే ఉన్నాయి కానీ ఈ లింగ ఖండన విధానమే నాకు నచ్చలేదు.కఠిన బ్రహ్మచర్య దీక్ష కోసం అలాగే మహోన్నతమైన వీర్యవృద్ధిని నాశనం కాకుండా తద్వారా శరీరం అలాగే మనస్సు బాగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇంతటి శిక్ష వేసుకోవడమే నాకు నచ్చలేదు. కానీ ఎంతటి వాడినైనా కామము క్షణాలలో నాశనం చేయగలదు కదా. అందుకే కామమే వారి దరిచేరకుండా ఏర్పాటును మన పెద్దలు ఏర్పాటు చేసి ఉంటారు. అంతెందుకు మన ఎద్దులకి కూడా వాటి వృషణాలను తీసేసి వాటి చేత గొడ్డుచాకిరి చేయిస్తారు కదా. వృషణాలు ఉన్న వాటిని ఆంబోతులుగా వదిలివేయటం జరుగుతుంది కదా.జంతువుల విషయంలోనే మన వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉంటే ఆధ్యాత్మిక సైన్యంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా. కానీ నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈయన ఎందుకు ఇంత కఠినమైన నాగసాధువు దీక్ష తీసుకున్నారో అర్థం కాలేదు. ఇంతలో తనకి అగ్ని సాధన ఆరాధన సమయము ఆసన్నమైనదని పూజ చేసుకోవటం ఆరంభించారు. సరే ఈ బ్రహ్మ యజ్ఞము ఎలా చేస్తారో చూడాలనిపించి అలాగే ఆత్మ అనుసంధానము ఆపకుండా కొనసాగించడము చేయసాగెను. హోమ గుండము ను ఏర్పాటు చేసి అందులో సమిధలు వేసి ఒక ముద్ద కర్పూరం మధ్యలో ఉంచి తన భ్రుకుటి స్థానము నుండి అగ్ని జ్వాలలను బయటకి తెప్పించి ఈ కర్పూరమును వెలిగించినారు. ఏవో మంత్రాలు చదువుతూ మంత్ర దేవతలకు ఆహ్వానం పలుకుతూ మధ్య మధ్యలో ఏవో శాఖాహారమైన నైవేద్యాలు పెడుతూ పూజ జరుగుతోంది. ఈ పూజ అంతిమ స్థాయికి వస్తున్న సమయంలో తన ఎడమ హస్తమును విరిచి హోమంలో వేసేసరికి అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకేమి అర్థం కాలేదు. కొన్ని క్షణాలు తర్వాత మోచెయ్యి ఆ తర్వాత భుజము తరువాత మోకాళ్లు తర్వాత మెడ తల మొండెము అగ్నిలో వేస్తున్నాడు. ఇంకా వెయ్యటానికి ఏమీ లేనట్లుగా ఈయన పరిస్థితి ఉంది. అంటే తన శరీరమును తొమ్మిది భాగాలుగా చేసి ఈ అగ్నిలో వేసినారని దీనిని నవ ఖండ సిద్ది అంటారని నేను పుస్తకములో చదివిన విషయం నాకు లీలగా గుర్తుకు వచ్చినది. ఈనాడు దీనిని ప్రత్యక్ష అనుభవంగా చూడటం జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఈయన శరీర భాగాలు యధావిధిగా మళ్ళీ పుట్టుక వచ్చినాయి. అయితే నేను ఏమాత్రం ఆశ్చర్యము చెందలేదు. పంచభూతాలు ఆధీనమైన వారికి ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహ భాగాలు పునరుత్పత్తి కలిగించటం ఏమంత పెద్ద విషయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ సాధన స్థాయి కూడా ఇట్టి స్థితికి వస్తే మీరు కూడా నాలాంటి అభిప్రాయము కలిగి ఉంటారు.
అంటే ఈయన ఈ విధమైన సిద్ది తో తనకి వచ్చిన వివిధ రకాల సిద్ధులను జన్మల కర్మల కర్మ ఫలితాలను అగ్నికి సమర్పిస్తూ త్యాగం చేస్తూ సర్వసంగ పరిత్యాగి గా మారుతున్నాడు అని నాకు అర్థమైనది. ఈ రోజు తనకి తాంత్రిక విధి విధానంలోవచ్చిన తాంత్రిక సిద్ధులను త్యాగము చేసినారు అని నేను తెలుసుకున్నాను. అనగా ఖేచర సిద్ధి అనగా గాలిలో ఎగరడం లేదా తాను అనుకున్న ప్రదేశానికి ఎగురుతూ వెళ్లి పోగలరు అలాగే భూచర సిద్ధి అనగా భూమి లోపల కి మరియు పర్వతాలు కొండలు గోడలు లోపలికి వెళ్లడం అనగా తన దారికి అడ్డంగా వచ్చే వాటి లోపల కి వెళ్ళటం జరుగుతుంది.అలాగే అంతర్ధాన సిద్ధి వలన తాము కోరుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా ఉన్నచోటి నుండి అదృశ్యం అవ్వగలరు. ఇంకా అంజన సిద్ధి అనగా పోయిన వస్తువులను వ్యక్తులను వశం చేసుకోవాలని దేవతలు నాగులు ప్రేతాత్మలు దైవిక వస్తువులు గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని వశపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఖడ్గ సిద్ది వలన శత్రువులు వారి ఖడ్గముతో వీరి మీద దాడి చేసినను ఏమి హాని జరగకుండా జరుగుతుంది. ఇంకా రసాయన సిద్ది వలన సోమరసము తయారు చేసుకొని వృద్ధాప్యంలో కూడా నవయువకులుగా ఉండటమో లేదా ఆయుష్షును పెంచుకొని వయస్సు యొక్క ఎదుగుదల ఆపివేసుకుని చిరంజీవితత్వమును పొందటం జరుగుతుంది. అలాగే పాదరసము లేదా ఇనుము వస్తువులతో ఈ విద్య ద్వారా బంగారంగా మార్చుకుంటారు. ఇక పాద లేపనం విద్యతో సిద్ది ద్వారా వనమూలికలతో ద్రవపదార్థము వంటి లేపనమును తయారు చేసుకొని వాటిని పాదాలకి పూసి అనుకున్న చోటికి చేరడం జరుగుతుంది. అంటే మనము పుస్తకాలలో ప్రవరాఖ్యుడు ఇటువంటి పాదాల లేపనముతోనే హిమాలయ సంచారం చేసినాడని నాకు అర్థమైనది. అలాగే పాతాళ సిద్ది వలన పాతాళ లోకంలో ఉండే వివిధ లోకాలలోని దేవతలు నాగులు ప్రేతాత్మలను వశపరచుకుని వీరికి కావలసిన విధంగా ఉపయోగించుకో గలరు. ఇలాంటి సిద్ధులను ఈరోజు ఈయన త్యాగం చేసినారని నాకు అర్థమైనది. అంటే నిజమైన తాంత్రిక సాధన అనగా కాపాలిక అఘోర బైరవి నాగా సాధువు దీక్షలు చేస్తే వీరికి అతీంద్రియ శక్తులు మానవాతీత శక్తులు వస్తాయని నేను గ్రహించాను. ఇలా ప్రతిరోజు ఈయన తనకి వచ్చిన వాటిని రోజు ఏదో ఒకటి త్యాగము చేస్తూ సాధన కొనసాగిస్తున్నాడు అని నాకు అర్థం అయ్యే లోపల నా నుండి ఆత్మ సంధానము తెగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ లెక్కన ఈయన ఏదో ఒకరోజు సమస్తము త్యాగము చేసి సర్వ పరిత్యాగి గా మారటం ఖాయం.
నేను చేసిన త్యాగాలు:
మరి నా పరిస్థితి ఏమిటి? అసలు నేను ఏమి త్యాగము చేయాలి? ఆయనకి అంటే సిద్ధులు ఉన్నాయి. త్యాగము చేసుకుంటూ పోతున్నాడు. మరి నాకు ఎలాంటి సిద్దులు లేవు. శక్తులు లేవు. మరి నేను ఏమి త్యాగము చేయాలి అనుకుంటూ అంటే నాకున్న బంధనాలు, కర్మ బంధనాలు, జన్మ బంధనాలు ఒక్కొక్కటి త్యాగం చేసుకుంటూ పోతే అనే ఆలోచన రాగానే… మానసికంగా ప్రహ్లాదుడు లాగా తండ్రి ని, భరతుని లాగ తల్లి ని… ఇలా నా తల్లిదండ్రులను త్యాగము చేశాను. ఆ తర్వాత విభీషణుడి లాగా నా తోబుట్టువులను త్యాగము చేశాను. నా బంధువులను త్యాగము చేశాను. నా మిత్రులను త్యాగము చేశాను. నా శ్రేయోభిలాషులను త్యాగం చేశాను. గౌతమ బుద్ధుడు లాగా నా కోరికలు త్యాగము చేశాను. నా ఆశలు, ఆశయాలు త్యాగం చేశాను. నా అనే వాళ్లను త్యాగం చేశాను. కబీర్దాస్ లాగా నా నిత్య దైవాలను త్యాగము చేశాను. నా ఇష్ట పూజలను త్యాగము చేశాను. వివిధ క్షేత్రాలలో దర్శనాలు త్యాగము చేశాను. వివిధ రకాల ఆలయ దర్శనాలు త్యాగమే చేశాను. జాతకబ్రహ్మ లాగా జాతకాలు చెప్పటం త్యాగము చేశాను. నా జాతక భక్తులను త్యాగము చేసినాను. భర్తృహరిలాగా నా భార్యను త్యాగమే చేశాను. నా భార్య తరపు బంధుమిత్ర కుటుంబ సభ్యులను త్యాగం చేశాను. అపరిమిత ధన సంపాదనను త్యాగము చేశాను. జంతువులు, పక్షులు, మొక్కలు వంటి జీవులను త్యాగము చేశాను. వివిధ రకాల ప్రేమ, మోహ, వ్యామోహాలు త్యాగం చేశాను. రాగ ద్వేషాలు త్యాగము చేశాను. మానవమానాలు త్యాగము చేశాను. స్పందనలు త్యాగము చేశాను. అస్థిర మనస్సు, అస్థిర బుద్ధి, త్యాగము చేసినాను.సంశయ బుద్ధి, అనుమానపు బుద్ధి త్యాగము చేశాను. ద్రోణాచార్యుడి లాగా నా పంచ శిష్యులను త్యాగము చేసినాను. శిష్యులను త్యాగము చేశాను. భీష్ముని లాగా గురువులను త్యాగము చేశాను. భక్తులను త్యాగము చేశాను. శుకమహర్షి లాగా జ్ఞానమును త్యాగం చేశాను. శ్రీరాముడి లాగా అధర్మమును త్యాగము చేశాను. యోగివేమన లాగా అతి కామమును త్యాగము చేశాను. అధర్మ సంపాదనను త్యాగము చేశాను. శ్రీరాముడి లాగా అధర్మ కోరికలు త్యాగము చేశాను. శ్రీరాముడి లాగా అధర్మ ప్రవర్తనను త్యాగము చేశాను. అమిత కోపము త్యాగము చేశాను. సప్త వ్యసనాలు త్యాగము చేసినాను. అహము, మదము, అహంకారమును త్యాగము చేశాను. లోప బుద్ధి త్యాగము చేసినాను. లోభము, స్వార్ధము, త్యాగము చేశాను. శ్రీరాముడి లాగా పరస్త్రీ వాంఛను త్యాగము చేశాను. దొంగతనం, దొంగ బుద్ధి త్యాగము చేశాను. కర్ణుడు లాగా అన్నిటి యందు అతి అనే దానిని త్యాగము చేశాను. నాకు ఉన్న అన్నిరకాల సిద్ధులు త్యాగము చేశాను. పలుకుబడి వ్యాప్తి, జాతి ఖ్యాతి త్యాగము చేసినాను. ఇక నాది అంటూ ఏమీ లేకుండా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మానసికముగా త్యాగము చేసుకుంటూ వచ్చినాను. ఇంకా నేను ఏమి త్యాగము చేయాలో అర్థం కాలేదు.ఇంతలో నేను ఒకరోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నాకు బ్రహ్మ చక్ర జ్యోతి బిందువు యందు ప్రవేశము జరిగినది. అందులోనికి ప్రవేశించిన ను ఇది కూడా మహాశూన్యం లాగానే నిశ్శబ్ద నాదముతో ప్రశాంతంగా ఉంది. అక్కడ నల్లగా ఉన్న ఆజానుబాహుడు వంటి వ్యక్తి ఉన్నట్లుగా లీలా మాత్రంగా కనిపించేసరికి ఈయన ఎవరు అని అనుకునే లోపల నాకు ధ్యాన భంగము అయినది. ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు ఇలాంటి దృశ్యమే తరచుగా ఈ మధ్య నాకు ధ్యానములో కనిపిస్తూ ఉండేది. ఈయన ఎవరు అనుకునే లోపల నాకు ధ్యాన భంగము అయ్యేది.
ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత నాకు తులసి చెట్టు నుండి తీసిన తులసి మాల అలాగే స్వామి మూర్తి రాఘవేంద్ర స్వామి మఠం నుండి రావడం జరిగినది. దీనిని చూడగానే నాకు అర్థమైనది. అంటే సాధన శక్తి సహస్రార చక్రము లోనికి ప్రవేశించినదని గ్రహించి ఈ చక్ర అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు అధిదైవముగా సదాశివుడు అధిదేవతగా కుమారస్వామి దైవ మాయగా శ్రీకృష్ణ మాయ ఉంటుందని శబ్ద పాండిత్యము పుస్తక జ్ఞానము ద్వారా తెలుసుకున్నాను. తులసి మాలలు ఆరాధన అనేది మహావిష్ణువుకి చేస్తారు అంటే ఈ లెక్కన నేను ఈ చక్రము లోనికి ప్రవేశించినాను కదా. అలాగే గురు సార్వభౌములు రాఘవేంద్రస్వామి నుండి ఈ మాల అంటే ఈ చక్రశుద్ధి కోసం పరమ గురువు అయిన మేధా దక్షిణామూర్తి అనుగ్రహమును పొందాల్సి ఉంటుందని సూచన ఇవ్వటం జరిగినది అని నాకు అర్థం అయింది. ఇది ఇలా ఉండగా నా దగ్గరికి వివిధ రకాల దక్షిణావృత శంఖాలు, ఉత్తరావృత శంఖాలు, శ్రీ లక్ష్మీ శంఖాలు, శని శంఖం, గణపతి శంఖం, శ్రీ చక్ర శంఖం ఇలా మున్నగు శంఖాలు వివిధ క్షేత్రాలను నుండి రావటం మొదలైనది. కాకపోతే వీటిలో పాంచజన్య శంఖం మాత్రము ప్రస్తుతానికి రాలేదు. ఇది వస్తే నేను శ్రీకృష్ణుడి మాయకి దగ్గర అయినట్లే అవుతుంది కదా. ఈ మిగిలిన శంఖాలు అన్నీ కూడా మహావిష్ణువుకి చెందినవే కావడం విశేషం.ఈ శంఖములు అన్నిటినీ నిత్యపూజలు పెట్టడం జరిగినది. రామేశ్వరము నుండి కన్యాకుమారి నుండి నరసింహమూర్తి నుండి ఇలా ఈ వివిధ రకాల శంఖాలు వచ్చినవి. ఇవి ఎందుకు వస్తున్నాయో అర్ధం కాలేదు. వచ్చిన వాటిని తీసుకుంటూ భద్రంగా దాచుకోవడమే నా బాధ్యత అనుకునేవాడిని. ఎవరికి తెలుసు. ఏ శంఖములో ఏమి ఉందో? అది ఎందుకు వచ్చిందో? దానికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు.
కొన్ని వారాల తరువాత రంగనాథ క్షేత్రము నుండి రంగనాథుడి విగ్రహమూర్తి వచ్చినది. దీనిని పూజ లో పెట్టుకొని ఆరాధన చేయటం ఆరంభించినాను. దానితో నాకు సహస్రార చక్ర జాగృతి ఆరంభమైనది అని అర్థం అయినది. ఒక రోజు అర్ధరాత్రి పూట నాకు ధ్యానములో పాదాల నుండి తలమాడు భాగము వరకు ఏదో తెలియని ఉత్తేజం ఆనంద స్థితి అనగా సంభోగంలో పొందే ఆనందం అలాంటిదానిని నేను పొందుతూ ఉండగా నా మెదడు మధ్య భాగంలో ఏవో తామర పువ్వు వెలుగుతున్న కాంతులతో విచ్చుకోవటం నా మనోనేత్రం నందు అగుపించింది. అంటే నా సహస్ర చక్రములోని సహస్ర కమలాలు విచ్చుకున్నాయి అని నాకు అర్ధం అయ్యే లోపల ఏదో తెలియని శంఖ ధ్వని లీలగా అది కాస్త ఓంకార ధ్వని లాగా లీలగా వినబడటం సాగినది.ఈ లోపల నా సహస్ర కమలము విచ్చుకుంది. అందులో అంగుష్ట పరిమాణములో నాకు వచ్చిన రంగనాథుడు సజీవమూర్తి గా ఉన్నట్లుగా కనబడుతుంటే ఈయన ఏమిటి? ఈ పద్మములో ఉండవలసినది మహావిష్ణువు గదా! అంటే ఈయన అలాగే ఆయన ఒక్కటేనా? వేరు వేరా? అనే అనుమానం వచ్చే సరికి నాకు ధ్యాన భంగమైనది.కానీ నాకు అర్థం కాని విషయము ఏమిటంటే ఆఙ్ఞాచక్ర స్థితిలోనూ ఓంకార నాదం వినబడిందనీ అలాగే ఈ సహస్రార చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఓంకార నాదం వినపడింది. మరి ఈ నాదాల కి ఏమైనా తేడాలు ఉన్నాయా అని లోతుగా ఆలోచన చేస్తే నాకు ఒక విషయము స్పురణ అయినది. ఖచ్చితముగా తేడా ఉంది అది ఏమిటంటే ఆజ్ఞాచక్రము లోని ఓంకారనాదం అనేది మనము శంఖముతో వచ్చే ఓంకారం లాగా ఉంటే అదే సహస్రార చక్రంలో అయితే శంఖము ఊదకుండానే దానినుండి సహజసిద్ధంగా వచ్చే ఓంకార నాదం ఉన్నదని ఈ ప్రపంచంలో ఇలాంటి సహజ ఓంకారనాదం కలిగి ఉన్న ఏకైక మహాశంఖము పాంచజన్య శంఖం అని శంఖు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది మూడు నదులు లేదా మూడు సముద్రాలు కలిసే చోట ప్రతి 12 సంవత్సరాలకు ఒకే ఒక పాంచజన్య శంఖం ఉద్భవిస్తుందని అది దొరికిన వాడు లేదా పొందినవాడు సాక్షాత్తూ మహావిష్ణువుతో సమానం అని శంఖు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది బాగానే ఉంది. మరి సహస్ర తామర పుష్పము ఎక్కడ నుండి నాకు దర్శనమిచ్చినదో అర్థం కాలేదు అంటే ఈ లెక్కన మహాశూన్యంలో జ్యోతి బిందువుగా అగ్ని తేజస్సు ఉంటే ఈ బిందువులోని శూన్యంలో తామరపువ్వు ఉన్నది అని నాకు అర్థం అయింది.
పరమ శూన్యము ప్రధమముగా సాకారము గా ఈ జీవ సృష్టిలో మొట్టమొదటిసారిగా సహస్ర రేకులు ఉన్న తామర పువ్వు ఉద్భవించిందని ఇది కూడా శ్రీమహావిష్ణువు యొక్క బొడ్డు ప్రాంతము నుండి ఉద్భవించిన ట్లుగా ఈ తామరపువ్వులో విధాత బ్రహ్మ ఉంటాడని మన హైందవ గ్రంధాలు చెబుతున్నాయి కదా. అంటే ఈ లెక్కన చూస్తే మూలప్రకృతి లో ప్రధమ సాకార రూపం అగ్ని తేజస్సు అయితే అదే జీవ ప్రకృతిలో ప్రధమ రూపం ఈ సహస్ర పద్మమని నేను గ్రహించాను. వీటిని అర్థం చేసుకోవటం చచ్చే చావులాగా ఉన్నది. ఏమి చేద్దాము. ఎంచుకున్న మార్గమే జ్ఞానమార్గము కావటం వలన అన్ని కూడా ధర్మ సందేహాలు వస్తాయి. వాటిని నివృత్తి చేసుకుంటూ ముందుకు పోవటమే ఈ సాధన విధి విధానము కదా. 1823 జనవరి 13 డైరీలో శ్రీ లాహిరి మహాశయులు కూడా తనకి సహస్ర కమల తామరపువ్వు దర్శనము తన మెదడు లోని సహస్ర చక్రములో జరిగినట్లుగా వ్రాసినారు. కొన్ని రోజుల తర్వాత నా మనస్సు అంతా పాంచజన్య శంఖం చుట్టూ తిరుగుతోంది. అది చూడటానికి ఎలా ఉంటుంది? దాని రూపురేఖలు ఎలా ఉంటాయి? దాని నుండి సహజ ఓంకారనాదం ఎలా వస్తుంది? దీనిని ఎలాగైనా సంపాదించాలి లేదా చూడాలి అనే వివిధ రకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టటం ఆరంభించినాయి. నేను ఈ శంఖము గూర్చి వెతకటం ఆరంభించినాను. కన్యాకుమారి, రామేశ్వరం, కాశీ, ప్రయాగ వంటి సముద్రతీరము నది పేరున్న క్షేత్రాలు అన్నింటిని చుట్టూ చుట్టి వచ్చినాను. ఎక్కడా కూడా నాకు ఈ మహా శంఖము కనిపించలేదు. ఉంటే దక్షిణావృత శంఖం కనిపించాయి. వీటిని ఊదటానికి పనికిరావు. కేవలం శంఖ పూజకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. పోనీ ఉత్తరావృత శంఖాలు అయితే ఊదటానికి ఉపయోగపడతాయి. ఇవి పూజకు పనికిరావు. వీటిని మనము ఎంతో కష్టపడి ఊదితే వందకి ఒకసారి మాత్రమే దీని నుండి ఓంకార నాదం వస్తుంది. పాంచజన్య శంఖము అంటే అది దక్షిణావృత శంఖం అయ్యి ఉంటుందని మొదట ఊదడానికి వీలుగా ఉండాలి మరియు దీని నుండి సహజసిద్ధంగా ఓంకారనాదం అనగా ఈ శంఖం చెవి దగ్గర పెట్టుకొని వింటే మనకి ఈ నాదము చాలా స్పష్టంగా సహజసిద్ధంగా వినబడుతుంది. మరి నాకైతే ఇలాంటి శంఖము ఎక్కడా కనిపించలేదు. అలాగే దొరకలేదు.
ఇది ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు ధ్యానములో వెలుతురు లేని చీకటి లేని కాంతి ఇలాంటి ప్రవృత్తి ఉన్న వాతావరణ స్థితి ఉన్న శూన్యము స్థితి కనపడ సాగింది. ఇదంతా ఒక సహస్ర రేకులు ఉన్న తామర పువ్వు లో ఉన్నట్లుగా కనపడ సాగింది. ఆ తర్వాత ఈ తామరపువ్వు చిన్నదిగా మారుతూ ఒక్కసారిగా ఈ రేకుల భాగము తిరగటం ఆరంభమైనది. దానితో నా మెదడులో ఏవో తరంగాలు తిరుగుతున్నట్లుగా, సుడులు తిరుగుతున్న ట్లుగా నా కళ్ళు తిరగటం ఆరంభమైనది. దీనెమ్మ లంజా ముండా. ఆపవే తిరగటం. ఆపవే. ఇక్కడ నా కళ్ళు తిరుగుతున్నాయి ఆపవే అంటూ తిరుగుతున్న తామరపువ్వులును తిట్టుకుంటూ ఉండగా ఈ రేకుల నుండి దివ్యతేజస్సు దివ్యమైన కాంతి రేఖలు కలుగుతూ దివ్య కాంతి అయిన ఒక చక్రం తిరుగుతూ పైకి వస్తుంది. అంటే సహస్ర రేకులు ఉన్న సుదర్శన చక్రం అంటే ఇదే కాబోలు అనుకుంటూ ఉండగానే ఈ పువ్వు నుండి వేరు పడి పైకి తిరుగుతూ కొన్ని క్షణాల పాటు సుదర్శన చక్రము దర్శనము అవుతుండగా నాకు ధ్యాన భంగమైనది. మర్నాడు టీవీలో దత్త దర్శనము సినిమా రావటం అందులో ఈ సుదర్శన చక్రము యొక్క రూపమే కార్తవీర్యార్జునుడు రూపము అని ఈయనకి 1000 బాహువులు ఉంటాయని నాకు తెలిసినది. అంటే నిన్న రాత్రి నాకు ధ్యానములో కనిపించిన చక్రము నిజంగానే సుదర్శన చక్రం అని నాకు అర్థమైనది. ఇలాంటి సుదర్శన చక్రం దర్శనము తనకి కలిగినదని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగినదని నేను తెలుసుకున్నాను.
మరి కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానం లో మనో నేత్రము నందు టెంపుల్ రన్ వే ఆట మొదలైనది. నా సూక్ష్మధారి ఎక్కడికో బయలుదేరినాడు అని నాకు అర్థం అయింది. కొన్ని క్షణాల తర్వాత చూస్తే ఏదో కొలను ప్రాంతంలో ఎవరో ఒక శంఖమును తీస్తున్న నాగా సాధువు వీపు మాత్రమే కనబడింది. దీని అయ్య. మనకి ఈ కొలను లో కనిపించిన శంఖము ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే ఆయన వెనక నుండి ఈ శంఖమును చెవి దగ్గర పెట్టుకోగానే దానినుండి సహజసిద్ధ ఓంకారనాదం నాకే చాలా స్పష్టముగా వినబడుతూ ఉండేసరికి అంటే ఈయనకు ఈ నాగ సాధువుకు ఏకంగా పాంచజన్య మహాశంఖము దొరికినది కదా.అమ్మ దీనమ్మ జీవితం అనుకుంటుండగా ఈయన వెనుక భాగంలో ఏదో గుడి లోనికి వెళ్లి అక్కడ ఉన్న శివ లింగ మూర్తి ముందు ఈ మహా శంఖమును పూరించి ఓంకార నాదం చేసి అక్కడ ఉన్న పూజారి చేతిలో పెట్టి ఓం నమః శివాయ అంటూ వెళ్ళిపోతున్న నాగసాధువును చూడాలనిపించగానే నవ్వుతూ వెనుతిరగగా నా యోగ మిత్రుడైన జిజ్ఞాసియే ఈ నాగా సాధువు అని తెలియగానే నాకు ఆనందము ఆగలేదు. నాకు ఈ శంఖము దొరకకపోయిన మనవారికి దొరికినది. కానీ దాని మీద ఆశ, మోహం, వ్యామోహము పెట్టుకోకుండా ఆ దేవాలయానికి సమర్పించి అదృశ్యమయ్యారు అని నాకు అర్థం అయింది. ఈ కొలను అలాగే ఈ గుడి వివరాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని నేను ఇంటర్నెట్లో అలాగే వివిధ పుస్తకాలలో తిరగవేస్తే ఒకచోట దీనికి సంబంధించిన వివరాలు దొరికినాయి. అది ఏమిటంటే తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చంగల్పట్టు పట్టణంలో ఈ మహత్తర కొలను ఉన్న తిరుకంజ కుండ్రం క్షేత్రము ఉన్నది. దీని పరిసరాలలో ఉన్న వేదాచలం అనే కొండ మీద ఉన్న ఆలయంలో ఈ కొలను ఉన్నది. ఇందులో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వయంభువుగా ఒక దక్షిణావృత శంఖముతో ఊదటానికి వీలుగా ఉన్న పాంచజన్య శంఖము కొలను ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. ఇది కొలను అడుగు నుండి బయటకి వచ్చే సమయానికి ఆ ఆలయ ప్రధాన పూజారికి ధ్యానములో కానీ స్వప్నంలో గానీ కనిపిస్తుంది. ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి స్వప్న దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆ పూజారి తనకి కలలో వచ్చిన ప్రాంతానికి వెళ్లి వెతికితే అక్కడ నిజంగానే ఈ మహా శంఖము కనబడుతుంది. దీనిని జాగ్రత్తగా తీసుకుని నిత్య పూజలో ఈ ఆలయంలో ఇప్పటికీ ఇలాంటి ఎన్నో మహత్తర శంఖాలు ఉంచడం జరుగుతుందని ఇలాంటి సమయంలోనే మన నాగా సాధువు కూడా ధ్యానము నందు శంఖం కనిపించడం వలన వీరే స్వయంగా వెళ్లి ఆ స్వయంభూ పాంచజన్య శంఖమును బయటికి తీసి ఆ పూజారి కి ఇచ్చి అదృశ్యమై నారని నాకు అర్థమైనది. ఎంతో అదృష్టము అలాగే విచిత్రము కదా. ఇప్పటికీ కూడా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ మహా శంఖము ఒడ్డుకి కొట్టుకొని రావటం జరుగుతుంది. ఆశ్చర్యమే కదా. ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తుండగా ఒక సముద్రపు ఒడ్డున ఒక యాత్రికుడుకి ఇలాంటి మహాశంఖము దొరుకుతుంది. దానిని వాడు చూపిస్తూ ఈ శంఖమును కొంతమంది ఓంకార నాదం చెవి ద్వారా వింటూ పూజచేస్తారు. కానీ నేను మాత్రం తింటాను అంటూ ఆ శంఖమును పగలగొట్టి అందులో ఉన్న ఒక పెద్ద సైజు పురుగు బయటకు తీసి తింటుంటే నాకు ఏడుపే తక్కువ. అసలు ఇలాంటి పాంచజన్య శంఖం దొరకటం చాలా చాలా అరుదు. అది తెలిసిన కూడా ఏమాత్రం ఆలోచించకుండా దానిని పగలగొట్టడం చూసేసరికి నాకు ఏడుపు ఆగలేదు. అడిగిన వాడికి ఇవ్వడు. విలువ లేని వాడికి ఇస్తాడు. దానితో నాకు పాంచజన్య శంఖం మీద ఆశ, మోహం, వ్యామోహాలు తొలగిపోయాయి. నాకు వచ్చే యోగం ఉంటే నేను స్మశానం లో కూర్చున్న అది వస్తుంది అనుకుని ఇంకా దానిని గూర్చి వెతకటం ఆపివేసినాను. పట్టించుకోవడం మానివేసినాను. ఇలాంటి పాంచజన్య శంఖ ధ్వని అలాగే ధ్యానములో దర్శనము అయినదని శ్రీ లాహిరి మహాశయుడు తన జీవిత డైరీలో రాసుకోవడం గమనించదగ్గ విషయం.
నాలో ఉన్నట్టుండి విపరీతమైన ధన కాంక్ష అలాగే విపరీతమైన పేరుప్రఖ్యాతులు పొందాలని తీవ్రమైన తపన మొదలైంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులు నా చుట్టు ఏర్పడటం మొదలైనది. నేను నా సాధన స్థాయి విశుద్ధ చక్రం స్థితిలో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలకి కొన్ని సంవత్సరముల తరువాత అవి జనాలలోకి వెళ్లి వారికున్న యోగ విజ్ఞానమును సరి కొత్త కోణంలో చూస్తున్నారని నా దృష్టికి వచ్చింది. హరిద్వార్, కాశీ, ప్రయాగ, రామేశ్వరం, రిషికేశ్, హిమాలయాలు, బద్రినాథ్, కాంచీపురం, బెంగుళూరు, కలకత్తా, అమెరికా, కెనడా, దుబాయ్, లండన్ ఇలా వివిధ దేశ ప్రాంతాల నుండి నాకు ఈ మెయిల్స్ రావటం వాళ్లు నన్ను తమ మాటల పొగడ్తలతో మాయలో ముంచటం జరుగుతోంది. ఇలాంటివి మరికొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రచనకి ఒత్తిడి చేయటం ఆరంభించారు. నేను వీటికి అడ్డంగా తల ఊపేసరికి లక్షల నుండి కోట్ల దాకా డబ్బులు ఇస్తామని వివిధ పెద్ద కంపెనీలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయని ఆవాటి ప్రొడక్ట్స్ లు మీ పుస్తకాల ద్వారా మార్కెటింగ్ చేయవలసి ఉంటుందని దానికి ప్రతి పుస్తకానికి కొంత శాతం డబ్బులు అదనముగా చెల్లిస్తారని ఇలా మీకు మంచి పేరు వస్తుంది. అలా మీ సంపాదన కోట్లలో పెరుగుతుంది. రచయితగా కోట్లు సంపాదిస్తున్న వారి లిస్ట్ కూడా వీళ్ళు చెప్పేసరికి నాకు నవ్వు ఆగలేదు. ప్రస్తుతం నా సాధన స్థితి మర్మాంగము మీద ఉన్న గోచిగుడ్డ స్థాయిలో ఉంటే మాయ దానిని తీయకుండా ఈ గోచిగుడ్డను కప్పడానికి కీర్తి అనే సూత్రం కోటీశ్వరుడు అనే హోదా కల్పించాలని ప్రయత్నించటం చూస్తుంటే నాకు ముచ్చట వేసింది. అన్ని అవసరాలు తీరిన వాడికి ఉన్న గోచిగుడ్డ కూడా వదిలేయడానికి సిద్ధపడే వాడికి భ్రమ, భ్రాంతులు మాయ ఉన్న ఈ లోకాలతో ఇంకా ఏమి పని ఉంటుంది. కాకపోతే మాయ అనేది ఎప్పుడూ కూడా మనకి నీడలా వెంట ఉండి సాధకుడు ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద శిక్షగా మార్చాలని తపన పడుతూనే ఉంటుందని నాకు అర్థమైనది. ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు నిజానికి నేను రచించలేదు. కేవలం ఈ విశ్వంలో ఉన్న విజ్ఞానమును నా మెదడు శక్తి అందుకని పది మందికి ఉపయోగపడాలని దానికి వాక్య రూపముతో ఈ పుస్తక గ్రంథాలు వ్రాయడము జరిగినది. ఈ విజ్ఞానమును అందించిన యోగులకి యోగ సాధకులకు భోగులకు భోగజీవులకు అందాలి. అన్ని వదిలేసి సాధనలు చేస్తూ తమకు వచ్చిన అనుభవాల అనుభూతులను తన మరణానంతరము తమ కపాలముల ద్వారా ఈ విశ్వములో తాము పొందిన విజ్ఞానమును మానవమాత్రుడుకి అందని డికోడ్- కోడ్ భాషలో పొందుపరుస్తూ వస్తున్న వారికి ఈ గౌరవ సత్కారాలు చెందాలి. దానిమీద లాభాలు వీరు పొందాలి. వీరు ఉంచినకోడ్ ను నేను మెదడుకి నా సాధన శక్తితో అందేటట్లు చేసుకొని ఈ కోడ్ను కాస్త డీకోడ్ చేసుకోవడం జరిగినది. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే రహస్యంగా దాచిన విజ్ఞానంలో నేను 0.001% మాత్రమే పొందినాను.పొందిన దానిని వారి అనుగ్రహము చేత రచించటం జరిగినది. తెలిసినది గోరంత తెలుసుకోవలసినది కొండంత ఉండనే ఉంది. మరి నేను ఖ్యాతి పొందటంలో వీటి మీద డబ్బులు సంపాదించడం న్యాయము కాదు గదా అని నిర్ధారణకు వచ్చి… ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చిన వచ్చిన కూడా చాలా సున్నితంగా తిరస్కరించడం మొదలు పెట్టినాను. కొన్నిరోజుల తర్వాత యోగసాధన ఆశ్రమము పెట్టాలని గుల మొదలైనది.దీనికి తగ్గట్లుగా మా శ్వేత యోగిని తన 250 గజాల తన ఇంటి స్ధలమును ఇస్తానని అనడము...నా శిష్యలంతా కలిసి సుమారుగా వారం రోజులలో కల్లా 50 లక్షలు విరాళాలు సేకరించగలమని అనేసరికి నా బుర్ర తిరగడం మొదలైంది.అనుకోని విధంగా ద్వారక సినిమా చూడటం జరిగినది.ఇందులో హీరో గూడ ఒక స్వామీజీ గా అవతారం ఎత్తి ఒక ఆశ్రమము పెట్టి నా నా చంకలు నాకడం చూసి...ఇక ఈ జన్మలో...ఏ జన్మలోను ఆశ్రమాలు పెట్టకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.ఈ చక్రమాయ దగ్గర అందరికి తాము ఏదో సాధించామని..అది ప్రజలకి చెప్పాలని ఆశ్రమాలు పెట్టడము జరుగుతుంది.నిజానికి ఇది గూడ ఒక మహామాయని వాళ్ళకి తెలిసేలోపుల వీరి సాధన ఆగిపోవడం నా స్వానుభవములో ఎందరో స్వామీజీలను చూడటం జరిగినది.దానితో నా ఆశ్రమ ఆలోచన విరమించుకోవడము జరిగినది.దానితో నేను కాస్త మహావిష్ణువు అలాగే మహాలక్ష్మి ల యోగమాయ అయిన కీర్తి వ్యాప్తి ఆకాంక్ష మాయను దాటుకోవడంతో నాకు నేపాల్ నుండి గండకీ నది లోని విష్ణు సాలిగ్రామము అలాగే కొల్హాపూర్ క్షేత్రమైన మహాలక్ష్మి నుండి సహస్ర కమల పద్మ బొమ్మ వచ్చినాయి. ఆ తర్వాత కొన్నిరోజులకి 108 బంగారు పూత పూసిన వెండి పద్మాలు కూడా పూజ కోసం రావడం జరిగినది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకి తరువాత నేను పూజల కోసం దేవుళ్ళు సేద తీర్చుకోవటానికి అని నా భక్తులు కొంతమంది నెమలి ఈకలు ఉన్న విసనకర్రలు ఇవ్వటం ప్రారంభించినారు. మరి కొంతమంది అయితే ఇంటిలోనికి బల్లులు రాకుండా ఉండాలని నెమలి ఈకలు పట్టుకొని వచ్చినారు. ఇలా వీటితో నాకు శ్రీకృష్ణ మాయ మొదలవుతుందని అప్పుడు తెలియలేదు.
నాకు కలిగిన నిజశ్రీకృష్ణ అనుభవ దర్శనం:
కొన్ని వారాల తరువాత ఒక కృష్ణాష్టమి రోజున వెండి ఉయ్యాలలో ఉన్న చిన్నపాటి వెండి శ్రీ కృష్ణుడి విగ్రహం రావటము జరిగినది. అంటే ఈ సహస్రార చక్రంలో శ్రీకృష్ణ మాయకి నాంది అని అప్పుడు గానీ నాకు అర్ధం అయ్యి చావలేదు.నాకు ఒక రోజు అర్ధరాత్రి నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం నందు టెంపుల్ రన్ ఆట మొదలైనది. నా భృకుటి ప్రాంతమునందు శ్వేత జ్యోతి బిందువు దర్శనం ఆపై భూలోక దర్శనము, చంద్ర దర్శనము, గ్రహాల దర్శనాలు, నక్షత్ర మండలాలు దర్శనాలు, వివిధ రకాల దైవ దర్శనాలు, సూర్య దర్శనం, ఆపైన త్రినేత్ర దర్శనము, శ్రీ చక్ర దర్శనము, జ్యోతి బిందువు దర్శనము, ఆపై పరమ శూన్య స్థితి దర్శనాలు అవుతూ వచ్చినాయి. వెలుతురు చీకటి లేని వాతావరణ స్థితి అనగా సంధ్యా కాల స్థితిలో నీడగా ఏదో ఆకార ఆజానుబాహుడు ఉన్నట్లుగా కనిపించసాగినాడు. ఆయన కదలడు. మాట్లాడడు. నిల్చొని నా కేసి చూస్తున్నాడు. ఊరికే నిలబడి ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. కనిపించే రూప ఆకారమును బట్టి 20 సంవత్సరముల వయస్సున్న శ్రీ కృష్ణుడి లాగా అగుపించాడు. మరి ఈయన ఒంటరిగా ఈ శూన్యంలో ఎందుకు ఉన్నాడు అనే సందేహము రాగానే నాకు ధ్యాన భంగమైనది. ఈ అనుభవమును బట్టి చూస్తే ఇప్పటికీ సజీవ మూర్తిగా కృష్ణభగవానుడు ఉన్నాడు. అందరికీ లాగా ఈయన శరీరము త్యాగం చేసి మరణము పొందలేదని నాకు అర్థం అయినది. అంటే ఇక నేను శ్రీకృష్ణ మాయ ఎదుర్కోవలసి వస్తుందని ఆయన ఎక్కువగా సమ్మోహన శక్తి యొక్క ప్రేమ మాయను పెడతారు అని నేను అనుకున్నాను. నేను ఎలాగైనా అన్నిటి యందు ప్రేమరాహిత్యం పొందితే వీరు పెట్టే ఈ ప్రేమ మాయ నేను అనగా శ్రీ కృష్ణ మాయని దాటుకోవచ్చు అనుకున్నాను.నేను అనుకున్నట్లుగా వస్తే అది మాయ ఎందుకు అవుతుంది? నేను అనుకున్న మాయ ఒకటి అయినది. నాకు వచ్చిన మాయ మరొకటి అయినది. అందుకే దీనిని శ్రీకృష్ణ మాయ అన్నారు. నాకు వచ్చే మాయ ముందే తెలిసిపోతే అది శ్రీకృష్ణ మాయ ఎందుకు అవుతుంది.అప్పుడే మాయ మాయమయ్యేది కదా. నాకోసం శ్రీకృష్ణుడు అందరికీ పెట్టినట్లుగా నాకు కూడా ప్రేమ మాయ పరీక్ష పెడతాడని అనుకున్నాను. ఆయన నా కోసం వేరే మాయా మార్గమును ఏర్పాటు చేసినారు అని నాకు అర్థమయి చావలేదు. అర్థం అయితే అది మాయ అయ్యేది కాదు కదా. ఇలాంటి శ్రీ కృష్ణ దర్శనము తనకి 1873 జనవరి 13డైరీలో సహస్ర చక్రము తామర పువ్వు లోని శూన్య స్థితిలో శ్రీకృష్ణుడు వంటి వ్యక్తిని చూశానని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగినది. ఇప్పటిదాకా నా దగ్గరికి వివిధ ప్రాంతాల నుండి బాలకృష్ణుడి విగ్రహ మూర్తులు వస్తే మా అమ్మగారు కాస్త రాధాకృష్ణులు ఉన్న విగ్రహ మూర్తిని నా కోసం తీసుకోవటం జరిగినది. అంటే రాధా శ్రీకృష్ణ మాయ మొదలు అవుతుందని నాకు అర్థమైనది. అనగా ప్రేమ మాయ మొదలు అవుతుందేమో అని నేను అనుకున్నాను. ఇంతలో ఒక రోజు అర్ధరాత్రి పూట నాకు ధ్యానములో నా మనోనేత్రంనందు బృందావనంలో రాధా శ్రీకృష్ణ గోపికల నాట్యాలు నృత్యము ఒక వీడియో లాగా కనిపించసాగింది.అది నిజమో అబద్ధమో తెలియని అయోమయ స్థితి. మనస్సులో ఏవో సినిమాలు చూసిన శ్రీకృష్ణ నృత్య దృశ్యాలు కనబడుతున్నాయి అంటే అది కాదు ఎందుకంటే శ్రీకృష్ణ పాత్రధారులుగా నాకు తెలిసిన సినిమా హీరోలు కనిపించటంలేదు అనగా నాకు కనిపించే దృశ్యం సినిమాలకి సంబంధించినది కాదని ఇది ఎక్కడో నిజంగానే జరుగుతున్నదని నృత్యము లాగా ఉన్నదని అనుకుంటుండగా శ్రీకృష్ణుడు మెడ నుండి ఒక దివ్య మణిహారం క్రింద పడిపోవటంతో నాకు ధ్యాన భంగమైనది.ఈ నృత్య దృశ్యము నిజమా కాదా లేదా నా భ్రమా అనుకుంటూ కొన్ని రోజులు గడిచి పోయినాయి.
వేణు నాదము
ఒకరోజు ఉన్నట్టుండి నాలో సహస్రార చక్రము నందు నుండి వేణు నాదము వినబడటం మొదలైనది. ఎవరో నా చెవుల దగ్గర వేణువును వాయిస్తూ ఉన్నట్లుగా ఈ నాదము అంత స్పష్టంగా వినబడుతూ వుండేది. ఈ నాదానికి వేళా పాళ ఉండేది కాదు. ఎప్పుడూ నా మనస్సు ఏకాగ్రత స్థితిలో ఆలోచనా రహితముగా ఉన్నదో ఆ క్షణమే ఈ వేణు నాదము వినబడుతుంది. చెవులు మూసుకున్న అది వినిపించకుండా ఆగేది కాదు. ఈ నాదము బయటనుండి అయితే వినిపించకుండా ఆగేది. నా లోపల నుండి ఈ నాదము వినబడుతూ వుండటంతో ఎలా వినకుండా ఆపాలో అర్ధమయ్యి చచ్చేది కాదు.కానీ వినసొంపుగానే ఉండేది. కాకపోతే కాలచక్రంలో మహాకాలుడు అలాగే ఈ సహస్రార చక్రంలో శ్రీకృష్ణుడు చేతిలో పడకూడదని వీరిద్దరి మోహ మాయలో పడితే అది కాస్త వ్యామోహముగా మారి తమ సాధన శక్తి బలి కావలసి వస్తుందని అప్పటికే వివిధ యోగుల అనుభవాలు చదివి ఉన్నాను. అందుకే నేను ఎక్కడ ఈ వేణు నాదానికి మోహము చెంది కృష్ణ భక్తుడిగా నా సాధనను పరిసమాప్తి చేసుకుంటాను ఏమో అని నా అనుమానం భయం. అలాగే ఆజ్ఞా చక్రములో శివ మాయ ఎలాగో సహస్రార చక్రంలో శ్రీకృష్ణ మాయ కూడా అలాంటిదేనని నా స్వానుభవం నాకు తెలుసు. అందుకే ఈ శ్రీకృష్ణ మాయకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను.ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు టీవీలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ప్రోగ్రాం ను నేను చూస్తున్నాను. అందులో ఆయన నేను రాత్రి పూట మధుర దగ్గరిలోని బృందావనంలో రాధా కృష్ణ గోపిక నిత్య నృత్య కేళి స్వయముగా చూడటము జరిగినదని ఎవరైతే నిజ కృష్ణ భక్తులుగా ఉంటారో వారికి ఇప్పటికీ ఈ ప్రాంతము నందు అర్ధరాత్రి పూట నృత్య శబ్దాలు కాలి అందెల శబ్దాలు వస్తాయి అని అలాగే నైమిశారణ్యంలో ఒక చోట ఉన్న వెదురు నుండి నేను స్వయంగా వేణు నాదము రావటము విన్నానని ఇప్పటికీ ఈ వెదురు చెట్టు నుండి ఈ నాదము వస్తోందని నాతో వచ్చిన వారంతా కూడా విని ఆనందపడినారు అని చెబుతుంటే నా గుండె వేగంగా కొట్టుకోవటం ఆరంభమైనది. ఇన్నాళ్లు నాకు ధ్యానములో కనిపించిన శ్రీకృష్ణ నృత్యాలు వేణు నాదము నా మనో భ్రాంతి అని శాంతముగా ఉన్నాను. అంటే ఇవి నా భ్రాంతులు కావని ఇవి అక్షర సత్యాలని ఈయన మాటలు బట్టి తెలుస్తోందని అనుకోగానే నా గుండెకాయ ఒక్కసారి ఆగి పోయినట్లుగా అనిపించే సరికి నాకు యోగ మత్తు ఆవరించినది. నిద్రపోయాను.
కొన్ని రోజులకు నన్ను ఒక పుస్తకం లోని విషయం బాగా ఆకర్షించింది. అది ఏమిటంటే మనకి వినాయక చవితి కథలో వినిపించే శమంతకమణి రహస్యం ఈ పుస్తకము వివరించినది. అవి ఇప్పటికీ ఈ భూమి మీద భద్రముగా రహస్య ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆధీన శక్తితో దాచబడినది. దానికి సంబంధించిన వివిధ రకాల పజిల్స్ తో గుర్తులు ఉన్నాయని… వీటి ఆధారంగా వీటిని సాల్వ్ చేసుకుంటూ పోతే… శమంతకమణి ఉండే చోటు తెలుస్తుందని అలాగే శ్యమంతకమణిని కూడా పొందవచ్చునని దీనితో ప్రతిరోజు బంగారమును పొందవచ్చునని చెప్పటం జరిగినది. సరే కదా అని నవలను ఆసక్తిగా చదవటం పూర్తి చేశాను. కానీ వీళ్ళకి ఈమణి దొరకలేదు. ఎక్కడో పొరపాటు చేసినారని ఏదో గుర్తు యొక్క పజిల్ ని సరిగ్గా సాల్వ్ చేయలేక పొరపాటుగా చేసినారు అని నాకు అర్థమైనది. ఇదంతా నేను ఒక కథ అనుకుని చదివాను. నిజానికి ఇది కథ కాదని ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారి రీసెర్చ్ పరిశోధన గ్రంథం అని కానీ నిజ కృష్ణ భక్తులు మాత్రమే అన్ని రకాల గుర్తులు పజిల్స్ ను సరిగ్గా పూర్తి చేయగలరని వారికి మాత్రమే ఈ గుప్త నిధి దొరుకుతుందని వారికి దొరికిన శాసనాలలో ఉన్నదని ముగింపులో వ్రాయడము జరిగినది. అంటే వీళ్లలో ఏదో ఆశించి ఏదో పొందాలని ఏదో అనుభవించాలని తపనతో ఆతృతతో తాపత్రయంతో ఈ గుప్త పరిశోధన చేసినారు కదా. వారికి దొరికిన ఈ పజిల్స్ గుర్తులను ఎక్కడో ఏదో పొరపాటు గా సాల్వ్ చేసి ఒక మార్గం లోనికి వెళ్ళవలసిన వారు కాస్త వేరే మార్గం లోనికి వెళ్లి ఉంటారని అందుకే వీరికి దొరకలేదు అని నాకు అర్థం అయింది. వామ్మో! వాయ్యో! ఈ లెక్కన చూస్తే ఇప్పటికీ ఈమణి ఉందా? అది శ్రీకృష్ణుడి ఆధీనములో ఉందా? ఈయన నిజ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. దీనమ్మ జీవితం. ఉన్నదో లేదో చూడాలంటే మనకి నిజ భక్తి ఉన్నదో లేదో పరీక్షించుకోవాలని నాకు అనిపించినది. మణి దొరికితే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని నాకు అనిపించినది. నాకు తెలుసు మణిని పొందాలనే పాడు ఆలోచన నాకు లేదు గాని మణి మార్గము నాకు తెలిస్తే నాకు నిజ భక్తి ఉన్నట్లే కదా. అది శ్రీకృష్ణుడే జగన్మాత కావచ్చును మహాదేవుడు మహాత్ముడు కావచ్చును నాకు నిజ భక్తి ఉందో లేదో తెలుసుకోవాలి అనే ఆలోచనతో నాకు తెలియకుండానే నేను కాస్త శ్రీ కృష్ణుడు కృష్ణ మాయలో పడిపోయినాను. ఇంకా మీకు అర్థం కాలేదా? ఈయన పెట్టిన మాయ ఈ శ్యమంతకమణి పరిశోధన అని అప్పుడు నాకు తెలిసి చావలేదు. నిజ భక్తి ఉందో లేదో తెలుసుకోవాలి అనే ఆలోచనే గాని ఇది శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్న మణి మాయ అని తెలుసుకోలేక పోయినాను.మళ్లీ ఈ పుస్తకమును చదువుతూ ఇందులో ఇచ్చిన పజిల్స్ గుర్తులు రాసుకుంటూ నా విశ్లేషణ శక్తితో పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ ఆరునెలలు గడిపేశాను. చివరికి శ్యమంతకమణి ఎక్కడ ఉందో ఎవరి ఆధీనంలో ఉందో అన్ని వివరాలు బయటికి వచ్చినాయి. దానితో మా అమ్మకి, మా శ్రీమతికి ఈ వివరాలు చెప్పినాను. కానీ మా శ్రీమతి వీటిని పట్టించుకోలేదు కానీ అమ్మకి బంగారం అంటే మహా పిచ్చి. దానితో నేను చెప్పిన వివరాలు నిజమో కాదో తెలుసుకోవాలని ఆ ప్రాంతానికి వెళ్లి రావడం జరిగినది. అది నిజమేనని తెలుసుకుని వచ్చిన తర్వాత “నువ్వు నిజంగానే మహామేధావి రా. నా కడుపున పుట్టినందుకు నా జన్మ ధన్యమైంది రా. నీ లాంటి మేధస్సు వృధాగా పోకూడదు. ప్రపంచానికి ఉపయోగపడే దానిని కనిపెట్టు. మణులు గూర్చి పరిశోధనలు ఇంకా ఆపివెయ్యి. లాభాలు కన్నా అనర్ధాలే వస్తుంది. అసలు నువ్వు ఈ పజిల్స్ చేస్తావో లేదో అని ఉత్సుకతతో ఇన్నాళ్లు ఎదురుచూశాను. నువ్వు వీటిని సాల్వ్ చేసి నీకు నిజ భక్తి ఉన్నది అని నిరూపించినావు. ఇది చాలు నాకు మరియు నీకు. నీలాంటి నిజ భక్తుడిని కన్నందుకు నా జన్మ ఇంతటితో పరిసమాప్తం చేయాలని ఆ కృష్ణ భగవానుడిని కోరుకోవడం తప్ప ఏమి చేయలేని” అంటూ ఆనందం బాధ మిశ్రమముతో ఏడవటం మొదలు పెట్టింది. ఆవిడ బాధలోనూ నిజం ఉంది. నేను ఎక్కడ ఈ మణి కోసం తాపత్రయపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాను ఏమోనని ఆవిడ ఆవేదన అని నాకు అర్థం అయింది. నాకు నిద్ర వస్తున్నదని పడుకున్నాను.నేను కూడా నేను అనే అహం పిసరంత కూడా నాలో మొదలైనది. నాకే తెలియని స్థితి. ఇది కాస్త నాలో 18 రకాల అహంకార మాయలు గా రూపాంతరం చెందిన కూడా నాలో నాకు తెలియని స్థితిలో నేను ఉన్నాను అంటే కృష్ణమాయ ఎలాంటిదో అర్థం చేసుకోండి.
కొన్ని రోజులకి నాకు ధ్యానములో కొన్ని వందల ఆవులు నన్ను మా ఆవిడని అలాగే మా అమ్మని పొడవటానికి రావటం జరిగినట్లుగా వాటి నుండి తప్పించుకోవటానికి మేము ముగ్గురము పరిగెత్తుకుంటూ పారిపోతున్నామని అయినా అవి మమ్మల్ని వదిలి పెట్టడం లేదని ఆ ఆవుల గుంపులు అరుచుకుంటూ గిట్టల శబ్దాలుతో ఇసుకను లేపుతూ శాంతముగా ఉండే ఆవులు కాస్త ఇలా ఎందుకు ఉగ్రంగా మారి మా ముగ్గురి మీదకి ఎందుకు దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదని అనుకోగానే నాకు ధ్యాన భంగము అయినది. ధ్యానము నుండి బయటకి వచ్చిన తరువాత విశ్లేషణ చేస్తే అంటే నేను నిజంగానే శ్యమంతకమణి దగ్గర కి చేరుకున్నాను అన్నమాట. ఈ లెక్కన నేను ఊహించినట్లుగానే నేను ఊహించిన ప్రాంతంలోనే ఈ గుప్త నిధి చాలా గుప్తముగా ఉండాలి. ఈ రహస్యం తెలిసిన వాళ్ళు మేము ముగ్గురమే కదా. అందుకే శ్రీకృష్ణుడు ఏకముగా మా ముగ్గురిని తన వేణు నాదముతో శాంతంగా ఉండే ఆవులను ఉగ్రముగా మార్చి మా మీదకి ఉసిగొల్పినారు అని నాకు అర్థం అయింది. అంటే ఒక మణి కోసము ఈయన మా ప్రాణాలు తీస్తాడు. అసలు మణితో నాకు పని లేదు. కేవలం నాకు నిజ భక్తి ఉందో లేదో పరీక్షించుకుందామని అనుకున్నాను. మణి ఉందో లేదో ఎవరికి కావాలి. నా ఖర్మ కొద్దీ నాకు తెలియకుండానే నేను ఈ మణి ఉన్న ప్రాంత పరిసరాలకి చేరుకుంటానని నాకు ఏమి తెలుసు. పజిల్ గుర్తు సాల్వ్ చేసుకుంటూ పోయాను. అది కాస్త ఈ గుప్త మణి దగ్గరికి చేరుస్తుందని ఎవరికీ తెలుసు. నేను ఏమైనా కల కన్నానా? అది నిజంగానే ఈ గుప్త మణి దగ్గరికి వెళ్లానని ఒకవేళ నేను ఈ మణి గూర్చి దీనిని పొందాలని అనుకుంటే నన్ను చంపే అధికారం ఉంటుంది. చచ్చిన వాడిని ఈయన బెదిరించటం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదని తిట్టుకుంటూ బాధపడుతూ కొన్నాళ్లు గడిపేసినాను.
ఇది ఇలా ఉండగా నేను ఒకసారి “కార్తికేయ” సినిమాను చూడడం జరిగినది. అందులో ఒక రోజు తన దగ్గర ఉన్న అద్భుతమైన మణి ఒక కుమార స్వామి విగ్రహం కింద ఉంచి పౌర్ణమి ఘడియలలో ఈ మణి మీద చంద్రుడి కాంతి పడేటట్లు చేసి ఆ వెలుగు ఊరంతా వచ్చేటట్లుగా ఏర్పాటు ఈ గుడిలో జరిగే టట్లుగా చేయడం అది కాస్త దైవ మహిమగా ప్రచారంలోనికి రావడం జరుగుతుంది. నాలాంటి వాడు అయిన హీరో గూడ ఈ గుడికి సంబంధించిన ఈ మణి రహస్యము చేదించడం జరుగుతుంది. ఇది జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోని వారు కొంత మంది పెద్దలతో చేతులు కలిపి ఈ మణి రహస్యం చేధించాలని మరోప్రక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ ఉందో తెలుసుకొనే సమయంలో ఈ డిపార్టుమెంటు వ్యక్తి ఎదురు పడటం వారిని రహస్యము తెలియకుండానే చంపటం జరుగుతుంది.ఇది టూకీగా కథ. అంటే నాకు తెలిసిన గుప్త మణి వివరాలు ఇలాంటి దుర్మార్గుల చేతిలో పడితే సృష్టి వినాశనానికి దారితీస్తుంది అని అందుకే నా మీదకి శ్రీకృష్ణుడు తన ఆవులను పంపించి చంపాలని చూసినారని మేము మంచి వాళ్ళమే కానీ మేము కనిపెట్టిన శమంతకమణి విషయము అంత మంచిది కాదు కదా! దాని వలన ఎన్నో అనర్ధాలు వస్తాయి కదా అని అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి మా ఆవిడకి అలాగే మా అమ్మకి ఏదో పూనకం వచ్చిన వారిలాగా నేను పరిశోధించి సాల్వ్ చేసిన పజిల్స్ కాగితాలు సుమారు 120 పేజీలు చిన్న ముక్కలుగా చేసి తగలబడుతున్న దృశ్యం చూసేసరికి బాధ అనిపించింది. కానీ గుప్త రహస్యముగా ఉన్న మణి రహస్యము వేరే వాళ్ళ చేతులకి పడకుండా ఆ దేవాది దేవుడు ఇలా చేసి ఉంటాడని విరక్తిగా నవ్వుకున్నాను.ఆ పుస్తకాన్ని కూడా నాకు అందకుండా నేను చూడకుండా నాకు తెలియకుండా ఎవరికో పుస్తక దానముగా ఇచ్చినారు అని కొన్ని నెలలు తర్వాత తెలిసినది. ఇలా నేను సాధించిన ఏకైక గుప్త రహస్యము కాస్త మరుగున పడినది. దానికి బాధ లేదు. నేను నిజ భక్తుడిని అని ఆనందంగా ఉన్నది. కాకపోతే ఏమిటి? వేదవ్యాసుడు కన్నా నిజ శ్రీకృష్ణ భక్తులు ఎవరుంటారు. ఎందుకంటే ఈయన కాస్త ద్వైపాయనుడు కదా. శ్రీకృష్ణ అంశ స్వరూపమే గదా. ఆయనకి ఆయన తన భక్తిని చూపించుకున్నాడు.
నాకు వచ్చిన అమెరికా డాలర్
ఇది ఇలాయుండగా కొన్నిరోజుల తర్వాత నాకు అమెరికా నుండి ఒక డాలర్ నోటు వచ్చినది. దాని వెనుక వైపున పిరమిడ్ గుర్తు దానిపైన త్రినేత్రం ఉన్న చిన్న పిరమిడ్ గుర్తు కనపడినది.అంటే విదేశీయులు ఎవరో శ్రీచక్రము లోనికి వెళ్లి చింతామణి శిలను చూసి వచ్చి ఉన్నారని దానిని కాస్త తమ దేశపు సింబల్ గా ఉంచుకున్నారు అన్నమాట. ఇప్పుడు చింతామణి వివరాలు కూడా నిజమేనని తెలిసినది. దీనమ్మ జీవితం! మణులు ఉన్నాయి. వాటికి మహత్తర మానవాతీత శక్తులు ఉన్నాయి. తొక్కలో ! నీ చేతికి ఉన్న నవరత్న ఉంగరం మనిషి ఆలోచనల మీద ప్రభావము చూపుతుంటే మహత్తరమైన అద్భుత దైవిక శక్తులు ఉన్న మణులుకి ఆ మాత్రం శక్తి ఉండదా? ఉంటుంది. అందుకే విదేశీయులు నమ్మి వాటిని తమ దేశపు ఆనవాళ్ల గుర్తులుగా అదే డాలర్ నోటు మీద ఉంచుతారు. మన వాళ్ళు నమ్మి చావటం లేదు. ఇలా కౌస్తుభమణి, బ్రహ్మమణి, రుద్ర మణి, నాగమణి, మరకతమణి, చింతామణి ఇలా 32 రకాల దివ్య మణులకి సంబంధించిన వివరాలు అర్థంకాని గుర్తుల రూపంలో నా మనో ధ్యానములో తరచుగా కనబడటం మొదలైనది.
అంతెందుకు అతిశక్తివంతమైన చింతామణి అనేది ద్వారకతిరుమలలో (చిన్నతిరుపతిలో) ఉన్నదని ఎందరికి తెలుసు. విచిత్రము ఏమిటంటే ఈ క్షేత్ర పేరులోనే గుప్తమణుల ఆధీనశక్తియున్న ద్వారకాధీశుడి పేరు ఉన్నదని గమనించండి. తెలిసినవాడు చెప్పలేడు.తెలియనివాడు తెలుసుకోలేడు!ఎవరికైన మోక్షం గావలంటే ఈ క్షేత్రానికి వెళ్ళిఅడగండి! అక్కడున్న చింతామణి ఈ కోరికను తప్పకుండా తీరుస్తుంది! అందుకు నా జీవితమే నిదర్శనం అన్నమాట! అంటే ఎవరో మహానుభావుడుకి ఈ చక్ర స్థితిలో ఉండగా శ్యమంతకమణి యొక్క గుప్త పజిల్స్ గుర్తులు కనిపించి ఉండి ఉంటాయి. వాటిని మనవాడు గుర్తుపెట్టుకుని ఒక పుస్తకంలో రాసుకుని వీటిని సాల్వ్ చేయలేక చతికిలబడి ఉంటాడు. లోకానికి ఏదో దైవ రహస్యము చెబుతున్నానని ఈ మణి రహస్య వివరాలు తనకు కనిపించిన పజిల్స్ గుర్తులు వివరాలు ఏదో పుస్తకం పురాణ గ్రంధము నందు నిక్షిప్తము చేసి ఉంటాడు. అది కాస్తా ప్రస్తుతానికి ఆధునిక మానవులకు దొరికి ఉండాలి. దాన్ని వాళ్లు సాల్వ్ చేయలేక సాల్వ్ చేసే వారికోసం ఇలా ఈ పుస్తక రూపంలో జనాల మీదకి వదిలి పెట్టి ఉండాలి. సాల్వ్ చేసిన వారికి ఏదో బహుమతి తప్పకుండా ఇచ్చి ఆ గుప్త మణి పొందాలని అనుకున్నారేమో ఎవరికి తెలుసు. అంటే ఈ లెక్కన చూస్తే శ్రీకృష్ణ మాయ అదే అన్నమాట. అందరికీ ప్రేమ మాయ పెడితే నాకు విచిత్రముగా మణుల మాయ పెట్టినారు అన్నమాట. ఇది కూడా స్త్రీ మాయ ఎందుకంటే కాంతామణి అంటారు కదా. ఏమీ కిక్ ఇచ్చినాడు. నాకు తెలియకుండానే నా చేత ఈ మాయలో నేను పడేటట్లు గా చేసినాడు. దీనమ్మ జీవితం. ఒకవేళ నాకు మణుల మీద ఆశ కలిగి ఉంటే అది కాస్త అత్యాశగా మారిపోయి వామ్మో నా సాధన అంతా గంగపాలు. అంతెందుకు. సాక్షాత్తూ ఈ శ్యమంతకమణి మాయకి శ్రీకృష్ణుడే లోను అయినాడు కదా. సత్రాజిత్తు మహారాజుకి సూర్యుడి అనుగ్రహము వలన ఈ మణిని పొందుతాడు అని తెలుసుకుని వారిని తన రాజ్యానికి పిలిపించి లోకకల్యాణార్థం తనకి ఇవ్వమని అడగటమే… దానికి ఈ రాజు కాదని చెప్పడం జరిగినది కదా. కొన్ని సంఘటనలు జరిగిన తరువాత తిరిగి ఈ రాజు కాస్త ఈ మణిని ఇవ్వటం జరిగిందని శ్యమంతకమణి కథలో ఉన్నారు కదా. చదివినారు అంటే ఈయన ఈ మణుల మాయను దాటలేక ఇలా 32 రకాల దివ్య మణులు సేకరించి వాటిని పరిరక్షించే పనిలో లోకకల్యాణార్థం కారణ వారసుడిగా ఈ అనంతవిశ్వములో శాశ్వత మరణమును పొందకుండా ఉండిపోవటం జరిగినది. తర్వాత అవతారముగా బుద్ధుడిగా జన్మ ఎత్తటం కూడా జరిగినది కదా. ప్రస్తుతానికి రాబోవుకాలంలో కల్కి అవతారము వస్తుందని విష్ణుపురాణము చెప్పకనే చెప్పినది కదా. తనకి లాగా ఈ కాంతామణి మాయలోనే అనగా రాధా మాయను దాట లేకపోవటంతో పరమాణువు ఉన్నవాడు కాస్తా వెయ్యి రేణువులుగా విడిపోయి విశ్వరూప దర్శనం పొందినారని ఎవరికీ తెలియని రహస్యం. నిజ యోగులకు మాత్రమే తెలిసే అక్షరసత్యం. చనిపోయిన కూడా సజీవ మూర్తిగా ఈ లోకంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడి అవతారంలో విలుకాడు బాణానికి శరీరత్యాగం చేసినాడని లోకవిదితమే. ఒకవేళ ఈయన శాశ్వతముగా చనిపోయి ఉంటే ఎలా బుద్ధుడిగా అవతరిస్తాడు. భగవంతుడికి చావుపుట్టుకలు లేవు. ఆయన మరణాతీతుడు అంటే అంటే శ్రీకృష్ణుడు అవతారంలోనే ఉండి పోవాలి కదా. అలా జరగలేదు కదా. ఆయన వచ్చిన పని అయిపోయింది అందుకే అవతారము చాలించారు. లోకకల్యాణార్థం మళ్లీ అవతారాలు ఎత్తుతూనే ఉంటాడు అంటారు కదా. పని అయిపోగానే అవతారాలు పరిసమాప్తి చేసుకుంటారు. నేను అనేది ఏదో ఒక అవతారములో స్థిరపడి పోయి అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు కదా. ఒకసారి నాకు లాగా మరొకసారి మీకు లాగా ఇంకొక సారి వేరే వారి లాగా అవతారాలు ఎత్తడం ఎందుకు. మనల్ని నా నా చంక నాకించడమెందుకు? మాయ మర్మం పరీక్షలు పెట్టడం ఎందుకు? ఏక మతము -ఏక రూపము -ఏక నామము -ఏక మంత్రము -ఏక దైవము -ఏక పరమాత్మ -ఏక అవతారము -ఏక ధ్యానము- ఏక విగ్రహమూర్తి -ఏక ధర్మము -ఏక గుణము -ఏక కర్మ- ఏక కాలము- ఏక బ్రహ్మ పదార్ధము -ఏక సాధన- ఏక పూజ- ఏక మాయ -ఏక నాటకము –ఏకపాత్ర ఉండి ఉంటే ఎంతో బాగుండేది కదా. ఈయన మాయలో పడి ఒక రూపము కాస్త విభిన్న రూపాలుగా ఎత్తటం జరిగినది కదా. దానితో విశ్వ వ్యాప్తి చెందటం జరిగినది కదా. నీటి బిందువుగా ఉన్న వాడు కాస్త విభజనలు చెందుతూ ఒక మహాసముద్రముగా మారిపోవడం జరిగినది కదా. నీటి బిందువు కాస్త నీటి బిందువుగానే ఉంటే గొడవ ఉండేది కాదు. ఈ మాయ శరీరాలు ఉండేవికావు. ఎవరిని తెలుసుకోవాలని అవసరం ఉండేది కాదు. సాధన చేయవలసిన అవసరమే ఉండేది కాదు. అసలు జగన్నాటకం ఆడవలసిన అవసరమే ఉండదు. సృష్టి- స్థితి- లయ అనేవి ఉండేవి కావు. త్రిమూర్తులు- త్రిశక్తి మాతలు ఉండేవి కావు. 36 కోట్ల దైవ స్వరూపాలు, 84లక్షల జీవరాసులూ స్వరూపాలు ఉండేవి కావు. అండ-పిండ- బ్రహ్మాండాలు ఉండేవి కావు. ఈ విశ్వమే ఉండేది కాదు. ఆయన మాయలో పడి ఒకడు కాస్త వెయ్యి గా మారి తను ఎవరో మర్చిపోయి ఒక అవతారములో జీవుడుగా మారిపోయి ఒక అవతారంలో పరమాత్మగా ఉండిపోయి ఒకటి నుండి 1000 దాకా ఎన్నో మాయ మర్మం పరీక్షలు పెట్టుకొని తనకి తానే మాయలు పడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, ఆనందపడుతూ, చస్తూ బ్రతుకుతూ ఇలా మీ శరీరాలుగాను నా శరీరాలుగాను వాడుకుంటూ నా నా చంక నాకడంలో ఉన్న ఆనందం ఏమిటో నాకైతే అర్థం అయ్యి చావటం లేదు. కనీసం మీకైనా అర్థం అయినదా? అర్థమవుతుందా? ఈయనే మాయలో పడింది అంటే ఈయన సృష్టించిన విధాతలు కూడా మాయలో పడి ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. ఈయనకి కారణ శరీరం ఉంది కదా. ఉంది అంటే దానికి కారణం ఉండి ఉండాలి కదా. కారణం లేనిదే కార్యము ఉండదు కదా. శరీరము ఉంది అంటే దానికి కారణమైన వాడు ఎవరో ఉండి ఉండాలి. ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. కృష్ణుడిని నేను తిట్టడం లేదు. నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నాను. నాలో ఉన్నది ఆయనే కదా. నేను వేరు. ఆయన వేరు కాదు కదా. నేను ఒకప్పుడు కృష్ణుడిని అయి ఉండాలి కదా. నేను తప్ప మరొకటి లేదు కదా. నేను కానిది నేను లేనిది మరొకటి లేదు గదా. ప్రస్తుతం ఈ చక్ర స్థితిలో నేను అలాగే శ్రీ కృష్ణుడు ఉన్నాము. నేనే శ్రీకృష్ణుడు- కృష్ణుడే నేను అనే ధ్యానస్థితిలో నేను ఉన్నాను. అందుకు శ్రీకృష్ణుని తిడితే నన్ను నేను తిట్టుకోవటమే అవుతుంది కదా. అనగా నాకు నేనే ఒకప్పుడు ఈ కాలచక్రంలో మాయలో పడినాను. ఇప్పుడు మణుల మీద వివేక వైరాగ్యాలు వచ్చినాయి. అందుకే ఈ విశ్వములో ఉన్న అన్ని రకాల మణులవివరాలు కోడ్ రూపంలో ఉన్నవి నాకు కనిపించినాయి. ఎందుకంటే ఒకప్పుడు నేనే శ్రీకృష్ణుడు గా ఉండి వీటిని సేకరించి వాటి వివరాలు కోడ్ రూపంలో నుంచి విశ్వములో విశ్వశక్తి లో నిక్షిప్తం చేసినాను. వీటిని ప్రస్తుతం నేను ఉన్న సాధన స్థితికి వచ్చినప్పుడు వాటిని డీకోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసి ఉంటాను. అందుకే వీటి వివరాలు సునాయాసముగా నాకు తెలుస్తున్నాయి. దాచిన వాడికి దాచిన వివరాలు తెలియకుండా ఎలా ఉంటాయి ఆలోచించండి. కానీ అందరికీ మీలాంటి వారందరికీ కూడా మీ సాధన స్థాయి ఈ చక్రము స్థితికి వచ్చినప్పుడు ఇప్పటికి మీ మనస్సు ఆశ, మోహ, వ్యామోహాలు మీద అనగా కాంత మణుల మీద పోకుండా వెళ్ళగలిగితే మీకు కూడా తెలుస్తాయి. ఎందుకంటే నాలోను అందరిలోనూ కారణ వారసుడిగా శ్రీకృష్ణ భగవానుడే ఉంటారని తెలుసుకోండి. మీ నామ దేహాలు ఉంటే సూక్ష్మ శరీరాలుగా మీ ఇష్ట దైవ స్వరూపాలు ఉంటే కారణ లోక వారసుడిగా కారణ శరీరముతో శ్రీకృష్ణుడు ఉంటాడు. ఈ చక్రములోకి వచ్చినవారు శ్రీకృష్ణుడే అవుతారు. శ్రీకృష్ణుడు అనుభూతి పొందుతారు. ఇలాంటి అనుభూతి శ్రీ లాహిరి, రామకృష్ణ పరమహంస, శ్రీత్రైలింగ స్వామి, రమణ మహర్షి యోగులు పొందినట్లుగా వారి చరిత్రలో చూడవచ్చును. అదెందుకు షిరిడి సాయిబాబా చరిత్ర చదివితే నానా చందోర్కర్ అను భక్తుడుకు పరిప్రశ్న అని వివరణ ఇస్తూ తానే శ్రీకృష్ణుడు అని తనకి తెలియని భగవద్గీత ఉండదని వారి జీవిత చరిత్రలో చూడవచ్చును కదా. ఇంతకన్నా మీకు ఏమీ నిదర్శనం కావాలి చెప్పండి. అంటే షిరిడి సాయిబాబా వారే శ్రీకృష్ణుడని శ్రీకృష్ణుడే సాయిబాబా అని చెప్పకనే తెలుస్తుంది కదా. ఇద్దరు కృష్ణులు ఉండరు కదా. ఎవరైతే తమ సాధన స్థాయి ఈ సహస్ర చక్రముకు వచ్చి ప్రేమ వ్యామోహం మాయలో పడకుండ ఉంటారో వారే శ్రీకృష్ణుడు అవుతారు.. ఒకవేళ కాంతా మణుల మాయలో పడితే వారు కాస్త నికృష్టుడు అవుతారు. ఏ స్థితి పొందాలన్న మీ సాధన స్థితిని బట్టి ఉంటుంది. ఇంతటితో 80% సాధన స్థాయి పూర్తి అయినట్లే అన్నమాట. కాకపోతే 80% మంది ఈ సాధన స్థితికి శ్రీకృష్ణ మాయకి గురి అవుతారని యోగుల అనుభవాలు చెబుతున్నాయి. మీరు కాస్త ఒక వేళ శ్రీకృష్ణ మాయలో పడితే అది కాస్తా వెయ్యి కోట్ల నికృష్ట జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని తెలుసుకోండి.
మణి కైలాస పర్వతం
మా జిజ్ఞాసి కూడా పరుసవేది మణి రహస్యాలు కనబడుతున్న దీని గురించి పెద్దగా పట్టించుకోలేదట. దానితో ఏకముగా ఆ మణి ఉండే మణి కైలాస పర్వతం మీద ఉన్న ఈ మణి ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడికి వెళ్లి రాధాష్టమి నాడు సూర్య కిరణాలు మణి మీద పడి అది కాస్త వెలుగులుతో ఉంటే ఈయన స్వయంగా చూసి “ఓం మణి పద్మాయై నమః” అంటూ నమస్కారము చేసి అక్కడ నుండి వెళ్లిపోయినాడు. దానితో ఈయన తన ఈ చక్ర స్థితిలో ఉండే శ్రీ కృష్ణ మాయను దాటి శ్రీ కృష్ణుడు అయినాడు అని అర్థం అయినది. ఇది ఎలా ఉంది అంటే ఖలేజా సినిమాలో హీరో కాస్త నేను ఈ మధ్యనే దేవుడిని అయినాను అంటాడు కదా. అలా ఉంది నా పరిస్థితి. మనిషి కాస్త దేవుడు అవటము ఏమిటి నా బొంద. నా బూడిద. అంటే ఉల్లిపాయ లోని పొరలు ఒక్కొక్కటిగా పోతుండటవలన ఇన్నాళ్లుగా దేవుడిగా ఉన్న నేను జీవుడిని అనే భ్రాంతి లో ఉన్నాను. కాని ఇప్పుడు మాయ పొర పోవటంతో “నేను దేవుడిని” అనే అనుభూతిని పొందటం జరిగినదని నాకు అర్థమైనది. నా పూర్వము అలాగే ఉంది. క్రొత్తగా పొందటం అనేది లేదని నేను ఎప్పుడూ దేవుడిని కానీ మాయ వలన నేను కాస్త జీవుడిని అనిపించేంతగా భ్రమ భ్రాంతిలో నేను ఇన్నాళ్ళు ఉన్నాను. దేవుడిని పూజిస్తున్నాను అని నాకు నేనే పూజ చేసుకుంటున్నానని విషయము ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. దానితో నేను మానసిక, శారీరక పూజలు చేయడం పూర్తిగా ఆపివేశాను. నా దగ్గరున్న అన్ని రకాల విగ్రహ మూర్తులు దైవిక వస్తువులు ఒక మూట కట్టి బీరువాలో ఉంచడం జరిగినది. ఎందుకంటే వాటికి పూజ చేస్తుంటే ఆ విగ్రహ రూపాలలో నా రూపం కనిపించి నాకు నేను పూజ చేస్తున్నట్లుగా అనుభవాలు కలగసాగింది. దానితో నాకు ఏదో తెలియని భయము నాలో మొదలైనది. నాకు పిచ్చి పట్టినట్టుగా ఉండేది. నా మెదడు సాధన శక్తిని తట్టుకోలేక విపరీతమైన మాడు నొప్పి వచ్చేది. తల వెనుక వైపు నొప్పి ఎక్కువగా వచ్చేది. మందులకి తగ్గేది కాదు.
ఇలాంటి చక్ర సాధన స్థితిలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస తన ఇష్టదైవమైన కాళీమాతను పూజించేటప్పుడు తీవ్ర స్థాయిలో పూజ ఉన్నప్పుడు అమ్మవారికి వేసే పువ్వులు కాస్త తనకి తెలియకుండానే తన మీద వేసుకునేవారని అమ్మవారి అర్చన చేస్తున్నానని తనకి తానే పుష్పార్చన చేసుకునేవారు. ఇది చూసిన వారు ఈయనకి మతి భ్రమణము చెందినదని భ్రాంతి చెందినారు. నిజముగా తనే దేవుడు అని తెలిసిన వారికి తట్టుకునే శక్తి ఉండాలి లేదంటే చెడు జరుగుతుంది.ఎప్పుడైతే సాధకుడి సాధన శక్తి తను తట్టుకోలేని స్థితిలో వెళుతున్నప్పుడో వారికి మాయ అడ్డు వస్తుంది. తద్వారా మాయలో పడిపోవడం జరుగుతుంది. అప్పుడు తిరిగి సాధకుడు మాయను దాటుకుని సాధన శక్తి తట్టుకొనే స్థితికి వస్తాడు. లేదంటే వాడి శరీరము ఇరవైఒక్క రోజులలో నాశనం అవుతుందని స్వయంగా శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పి ఉన్నారు. ప్రకృతి కూడా ఎవరు ఎంత తట్టుకోగలరో అంతే ఇస్తుంది. ఎవరైనా తట్టుకోలేని స్థితికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారో అప్పుడు మాయ దేవతగా మారి తానే వారిని తన మాయలో పడేటట్లుగా చేసి భరించలేని సాధకుడు సాధన శక్తిని తీసుకోవటం జరుగుతుంది. నిజానికి మాయ మనల్ని రక్షిస్తుంది. చాలామంది ఈ మాయ భక్షిస్తుంది అని అనుకుంటారు. ధర్మమును రక్షిస్తే ధర్మము రక్షిస్తుంది. ధర్మమును దాటితే భక్షిస్తుంది. అలాగే మాయ కూడా అని నాకు అర్థం అయినది. మాయలో పడినారు అంటే ఇంకా సాధన ఉన్న కూడా తన శరీరము సహకరించదని ఎవరికి వారే గ్రహించుకోవాలి. అంతేగాని బాధపడకుండా బాధపడుతూ శరీరత్యాగం చేయకూడదు. లేదని ముందుకి సాధన చేసుకుంటూ పోతే మీ కుండలిని శక్తి వేగానికి మీ శరీరం తట్టుకోలేక రోగాల బారిన పడి సర్వ నాశనం అవ్వడం ఖాయమని నా స్వానుభవం బట్టి చెబుతున్నాను. తీపి ఇష్టమని అతిగా తింటే ఎలా అయితే వాంతులు అవుతాయో మీరు ఇష్టపడి ఆనందం ఇచ్చే మాయలో సంతోషంగా ఉండండి. ఈ జన్మకి ఇది ప్రాప్తి అని ఆనంద పడుతూ ఆ మాయను మనస్పూర్తిగా అనుభవిస్తూ ఆ కోరిక తీర్చుకుంటే ఆనందపడుతూ శరీరానికి ఎంతో ఉత్తేజం శక్తిని పొందుతూ మరుజన్మలో ఈ మాయను దాటండి. అంతేగాని మాయలో పడిన తర్వాత ఆ మాయను దాటాలని ప్రయత్నించకండి. శ్రీకృష్ణుడికి తెలియదా? ఈ కాంత మాయలో ఉన్నానని. జగద్గురువుకి తెలియని జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. కాకపోతే శ్రీకృష్ణ జన్మ ఈ చక్రము వరకే తట్టుకుంటుంది. అంతకుమించి వెళితే శరీరము నాశనమవుతుంది. తద్వారా రాబోవు జన్మకి ఇలాంటి యోగ జన్మ దేహము లేకుండా పోతుంది. అందుకే అన్ని రకాల 32 మణులు 8 భార్యలు, రాధా పరస్త్రీ వ్యామోహం, పదహారు వేలమంది గోపికలు, ప్రేమ మోహ వ్యామోహాలు మాయల కోసము శ్రీకృష్ణజన్మకి అంకితము చేసినాడు. మరుజన్మలో వీటికి గల కారణాలు తెలుసుకోవడానికి బుద్ధుడి అవతారము ఎత్తి గృహస్థ మాయ మోహమును దాటి అనగా వివిధ రకాల స్త్రీ వ్యామోహం దాటి రాజ్య భోగాలు వదిలించుకొని అనగా రత్నాలు మణుల మాయలు పోగొట్టుకుని గోచిగుడ్డతో సాధనచేసి రావి చెట్టు వద్ద నిరాహారిగా ఉండి కఠోర దీక్షతో కఠోర శ్రమతో కఠోర సాధనతో మన శరీరములోని గత జన్మ పాప కర్మల ఫలితాలు నాశనం చేసుకుంటూ ఒక ఇష్ట కోరిక వలన ఈ మాయ మర్మాలు కారణమని బ్రహ్మ జ్ఞానము పొందినాడు.
అలాగే నా విషయానికి వస్తే శ్యమంతకమణి రహస్యాలు తెలిసిన వాడికి ఎందుకు దొరకలేదు.తనకు ఎందుకుదొరికినది అంటే వాడికి మణి దొరికితే దానిని స్వార్ధానికి వాడితే లోక వినాశనం జరుగుతుంది. సృష్టి ధర్మానికి అది విరుద్ధం కదా. అదే నేను గోచి గుడ్డతో ఉన్నాను. నాకు మణులతో, కాంతా మణులతో పని లేదు. వీరికి తెలిస్తే ఎలాంటి ఉపయోగము, భయము ఉండదు. కాబట్టి ప్రకృతి నాకు ఈ విజ్ఞాన రహస్యాలను ఇచ్చినది. నాకు ఎలాంటి స్వార్థం లేదు. మోసపూరిత కుట్రలు లేవు. కేవలము నాకు నిజ భక్తి ఉందా లేదా అనే తపన ఒక్కటే ఉంది. అందుకే ప్రకృతిమాత అంత ధైర్యంగా అన్ని వివరాలు ఇచ్చింది. అంటే నేను నా సాధన శక్తితో ఎలాంటి అపనమ్మకము, అవిశ్వాసము, సంశయ బుద్ధి, స్వార్థము, భయము, ఆశ, స్పందన లేకుండా కేవలం సహనము నిష్ట నియమాలు పెట్టుకోవడము జరిగినది. రాబోవు కాలంలో ఈ శరీరము ఎక్కడైనా తట్టుకోలేని పరిస్థితి వస్తే ఏదో మాయ వలన ఆగిపోవచ్చును లేదా సాధనను సంపూర్తిగా కొనసాగించవచ్చును. ఎవరికి తెలుసు? ఏమి జరుగుతుందో. ఆగవచ్చును ఆగక పోవచ్చును.
నాకు నిజ జగన్మోహిని రూప దర్శనానుభవం:
ఇది ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు ధ్యానములో టెంపుల్ రన్ ఆట మొదలైంది. శూన్య స్థితి దాకా అన్ని దృశ్యాలు కనబడుతూ నన్ను దాటుకుంటూ వెళ్లి పోయినాయి. ఈ శూన్య స్థితి లో మౌనముగా తిరిగే వ్యక్తి అదే శ్రీ కృష్ణుడు లాంటి వాడు మళ్ళీ నాకు కనిపించాడు. ఈసారి ఉగ్ర చూపులతో నన్ను చూస్తున్నాడని అనిపించినది. ఎందుకంటే ఆయనని నేను తిట్టినాను కదా. మీకు కూడా తెలుసు కదా. అందుకే అలా ఉన్నాడు ఏమో అనుకున్నాను.ఇంతలో ఆయన శరీరము వెనకనుండి రాధా పోలికలతో ఉన్న స్త్రీ మూర్తి బయటకి వచ్చి నృత్యం చేయడం ఆరంభించింది. ఇలా చాలా సేపు నృత్య కేళి అయిన తరువాత ఈమె కాస్త వెనుకకి వెళ్ళినది. దానితో ఈయన వెనక్కి తిరగ్గానే ఆడదాని నడుమ శరీర ఒంపులతో ఈయన వెనుకభాగం ఉన్నట్లుగా అనిపించినది.ముందువైపు పురుష భాగము వెనుక వైపు స్త్రీ భాగము అంటే ర్యాలీ క్షేత్రములోని జగన్మోహిని రూపమే స్వయంభూగా చూస్తున్నానని నాకు అనిపించగానే రాధాకృష్ణుడు జగన్మోహిని రూపమని అనుభూతి పొందుతూ ఉండగానే నాకు ధ్యాన భంగమైనది. దీనివలన నాలో బాల యొక్క మూడవ మాయ రూపమైన సుందరి మాయ మొదలైంది. ఇక ఆ వివరాలలోనికి వెళ్తే...
నేను కాస్త సుందరి మాయ దాటడం:
ఎపుడైతే నాకు ఈ జగన్మోహిని దర్శనానుభవముతో నామీద సుందరిమాయ మొదలైంది.నేను కాస్త జాతకాలు చెప్పడము ఆపే సమయానికి మాకు తెలిసిన వ్యక్తి ద్వారా నందిని అనే ఆవిడ వాళ్లాయన ఆరోగ్యసమస్య నివారణకోసము నా దగ్గరికి వచ్చినది.ఆవిడ వయస్సు సుమారుగా 68సం!!రాలు ఉంటుంది. సమస్యకి తగ్గ పరిహారము చేయించినాను.అనారోగ్యము నుండి ఆరోగ్యవంతుడైనాడు.ఆఖరిరోజు నా దగ్గరికి ఈవిడ వచ్చినది.అపుడు ఆవిడతో ఆంటీగారు...నిజానికి మీ ఆయన అనారోగ్యానికి కారణము జాతక గ్రహాలు కొంతమేర కారకమైతే...మీకున్న వివాహతేర అక్రమ సంబంధము వలన పాపభారము పెరగడము వలన మీఆయనకి అనారోగ్యసమస్య పెరిగినదని చెప్పగానే ఆవిడ మొహములో ఈ గుప్తసత్యము ఈయనకి ఎలా తెలిసినదని అర్ధముగాక అయోమయముగా,భయముగా,కంగారు ముఖము పెట్టినది. నేను వెంటనే ఆమెతో కంగారు పడకండి.నేను ఎవరికి ఏమి చెప్పను.గాకపోతే మీ ప్రవర్తన మార్చుకొంటే ఇలాంటి జాతక సమస్యలు రావు అనగానే...ఆమె వెంటనే “అయితే మీకు 143...నాకున్న కామకోరిక తీర్చండి. మీకు ఎంత డబ్బులు గావాలన్న ఇస్తాను” అనగానే నాకు నవ్వు ఆగలేదు!ఈమెతోనే నామీద సుందరి కాస్త కామమాయ ప్రభావము చూపింస్తోందని నాకు అర్ధమై...ఆవిడితో... “ఆంటీగారు..మీ వయస్సు 68సం!!..నా వయస్సు 32సం!!లు. మీకు ఈ వయస్సు ఉన్న కూతురు ఉన్నదని నాకు తెలుసు..ఆలోచించండి..కొడుకు వయస్సుతో ఉన్నవాడితో కామము తీర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చినదో నాకు అయితే అర్ధము గావడము లేదు.అసలు మీకు బుర్ర ఉన్నదా? లంజాముండా! ఎవరి దగ్గరికి వచ్చి ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా... నేను పెళ్ళికి ముందు శ్రీకృష్ణుడినే...పెళ్ళి అయినతర్వాత ఏకపత్ని ధర్మముతో శ్రీరాముడిని.నా ఈ ధర్మమును గంగపాలు చెయ్యడానికి నా దగ్గరికి దొంగబుద్దితో వచ్చినట్టు ఉన్నావు. కట్టుకున్నవాడికి అన్యాయం చేసినావు. ఇపుడు ఉంచుకున్నవాడికి గూడ అన్యాయము చెయ్యటానికి సిద్ధపడుతున్నావు?బుద్ది,సిగ్గు,శరము,మానవిలువ లేదు.సంసారాలు నాశనం చేసే నీలాంటివాళ్ళు ఇంక ఎందుకు బ్రతికిఉన్నారో తెలియదు.ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతాను” అనగానే ఆవిడ భయపడి మౌనముగా వెళ్ళిపోయినది.మాకు జరిగిన సంభాషణాలు అంతా చాటుగా విన్న మా శ్రీమతి కాస్త గదినుండి బయటికి నవ్వుతూ వస్తూ... “ఇంక ఏముంది..మరి ఆంటి గారికి ఎపుడు 143 చెపుతున్నారు” అనగానే “అది నీకు చెప్పి ఎంత తప్పు చేసిననో ఇపుడే గదా నాకు తెలుస్తోంది… ఇక్కడ అడుక్కొనేవాడికి గీరుకొనేవాడు అవసరమా...ఉన్న కర్మసంసారము ఈదలేక ఛస్తూంటే...కొత్తగా మరొక పాపసంసారము అవసరమా?” అనగానే బుంగమూతి పెట్టుకొని వంటగదిలోనికి వెళ్ళినది. ఇలా నేను కాస్త సుందరి కామమాయను దాటడము వలన ప్రకృతిమాత నాకు ఏమి బహుమతి ఇచ్చినదో తెలుసుకోవాలని ఉందా...అయితే ఆ వివరాలలోనికి వెళ్తే...
బుద్దభగవానుడు నామీద అనుగ్రహం చూపించడం:
కొన్ని రోజుల తర్వాత నేను బుద్ధగయ క్షేత్రానికి వెళ్ళటం జరిగినది. బుద్ధుడు తపస్సు చేసుకున్న రావి చెట్టు నుండి ఒక రావి ఆకు నామీద విచిత్రముగా పడినది. అది చూసి అక్కడ ధ్యానాలు చేసుకుంటున్న లామాలు ఒక్కసారిగా నా చుట్టూ చేరి నా చేతిని ముద్దు పెట్టుకుంటే నాకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. విచారణ చేస్తే ఇలా ఎవరి మీద అయితే ఈ చెట్టు రావి ఆకు పడుతుందో లేదా దొరుకుతుందో వారు నిజ బ్రహ్మ జ్ఞానులని… ఈవిధంగా తమ బుద్దభగవానుడు అనుగ్రహం చూపించడమని… మా పూర్విక గురువులు చెప్పినట్లుగా వారు చెప్పే సరికి అవునా? మంచిది. దీనిని భద్రముగా దాచుకోవాలని ఆ రావి ఆకు తీసుకోవటం జరిగినది. నిజమే కదా! కష్టాలకి మూలము ఇష్ట కోరిక కదా. అది నేను తెలుసుకున్నాను కదా. అందుకే నాకు నేను కావటం వలన అనగా తను నేను ఒకే సాధన స్థాయికి చేరటం వలన ఆయన సంతోషించి ఈ రావి ఆకు ప్రసాదించినాడు అని నాకు అర్థం అయింది. ఇంకా మీకు అర్థం కాలేదా? నేనే బుద్ధుడిని. నేనే దేవుడిని అయ్యాను. అదే ఆడవాళ్లు పెద్దమనిషి అయినట్లుగా ఈ మధ్య నేను దేవుడిని అయ్యాను నమ్మండి.
ఆ తర్వాత విష్ణుగయకి వెళ్ళాను. అక్కడ విష్ణుమూర్తి పాదముద్ర చూశాను. రాగి రేకు తో ఉన్న పాదముద్రలను తీసుకొని ఇంటికి చేరుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా శ్రీమతికి కూడా ఎడమ కాలు ముద్ర ఉన్న రాయి దొరికినది. దానిని పూజలో ఉంచుకుంది. అలాగే నా జిజ్ఞాసి కూడా అమ్మ వారు స్వయంగా కనిపించి తన ఎడమ పాదం ముద్ర ఉన్న రాయిని ఫలానా చోట నీటిలో ఉందని చెప్పే సరికి వెళ్లి తీసుకొని దానిని కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకుని అప్పుడు అమ్మవారు తన పక్కనే ఉన్నట్లుగా తనతో తిరుగుతున్నట్లుగా తన పక్కనే పడుకున్నట్టు దైవ అనుభవాలు కలుగుతూ ఉంటే జగన్మోహిని రూపమని…. సుందరి రూపమని.. ఈమె ఈ మాయ కాస్త ఈ పాదరాయి వలన వచ్చినదని తెలుసుకొని దానిని కాస్త పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసి ఆ మాయను దాటి ఉన్నాడని నాకు తెలిసేసరికి వామ్మో! అంటే నాకు ధ్యానం లో కనిపించిన రాధాకృష్ణుడు యొక్క జగన్మోహిని రూపము నిజమే అన్నమాట. అంటే అమ్మవారు కూడా తన సుందరి మాయ పరీక్ష అంటే పాదముద్రల రాళ్ళు రూపంలో పెడుతుందని నాకు అర్థమైంది. నేను విష్ణుగయ నుండి తెచ్చుకున్న రాగిరేకు పాదముద్ర చూస్తే దాని మీద దైవ చిహ్నాలు చూడగానే కథ అంతా అర్థమైనది.
అయ్యవారి గా శ్రీకృష్ణుడు మాయ పెడితే దానిని నేను దాటినాను అని తెలిసి ఇప్పుడు అమ్మవారిగా జగన్మోహిని రూపంలో ఈ పాదముద్ర మాయ పెట్టినది అని నాకు అర్థం అయినది. దానితో నాకు తెలియకుండానే నేను తీవ్ర ఒత్తిడికి గురి అవ్వటం తో నాకు యోగ నిద్ర మత్తు ఆవరించింది. అప్పుడు నాకు ధ్యానములో శూన్యం కనిపించినది. మహావిష్ణువు కనిపించాడు. ఈయన కాస్త శూన్యంలో కలిసి పోయినాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కనిపించాడు. ఒకసారి ఈయన కాస్త ఉగ్ర స్వరూపుడైన 1000 శిరస్సులు గా ఉన్న శ్రీకృష్ణుని అవతారంగా కనిపించాడు. భగవద్గీతలో అర్జునుడికి కనిపించినట్లుగా కాకపోతే ఇక్కడ అన్ని ముఖాలు కూడా శ్రీకృష్ణుడి ముఖాలే. వెయ్యి కళ్ళతో ఉగ్రరూపం ఏకకాలంలో నాకు కనిపించేసరికి లిప్త కాలము పాటు భయమంటే ఏమిటో తెలిసి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఒక్కొక్క శ్రీకృష్ణ ముఖము ఒక్కొక్క విశ్వ గోళముగా కనబడుతుంది. ప్రతి గోళములో అండ పిండ బ్రహ్మాండం కనబడుతున్నాయి. అందులోనే నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు, గుట్టలు, వాగులు వంకలు, గ్రహాలు గ్రహశకలాలు, నక్షత్రాలు, భూ మండలాలు, గ్రహణ మండలాలు, నక్షత్ర మండలాలు, దైవ లోకమండలాలు కనబడుతున్నాయి. అన్నింటిలో ఒక రకమైన విశ్వ మండలాలు పైకి కనబడుతున్న ప్పటికీ వాటిలో ఉండే జీవులు వేర్వేరుగా కనబడుతున్నాయి. ఒక్కొక్క గోళంలో కేవలం అడ్డంగా ఉండే జీవులు ఉంటే మరొక గోళంలో నిలువుగా ఉండే ఉంటే మరొక గోళం లోతుగా ఉండే జీవులు మరొక గోళం లో నిలువు అడ్డం లోతుగా ఉండే జీవులుగా ఉంటే మరొక గోళంలో 4D జీవులు గా ఉంటే ఇలా 5D,6D,7D, 8D, 9D, 10D, 11D నుండి 43D వరకు మాత్రమే నేను చూడగలిగాను. మిగతా గోళంలలో ఉండే జీవులను చూసే శక్తి నా మనోనేత్రం కూడా కనిపించని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఒక నల్ల చీమ నోటిలో ఆహారము ఉంటే ఎంత సైజులో ఉంటుందో అంత సైజు జీవులు 44D లో ఉన్నాయని నాకు అనిపించినది. అంటే ఈ లెక్కన శ్రీ కృష్ణుడు విశ్వరూపం కాలస్వరూపం అని ఈయన కాలానికి తగ్గట్లుగా ఈ విశ్వంలో స్థితులు పరిస్థితులు కలిగిస్తాడని అందుకే ఈయనని సర్వవ్యాపి అన్నారు. ఎందుకంటే కాలస్వరూపుడుగా అన్ని కాలాల్లో అన్ని రూపాలలో అన్ని విశ్వ గోళంలలో ఉండుట వలన సర్వ వ్యాపి అయినాడని నాకు అర్థమైనది. ఈ ఉగ్రరూపం కాస్త మళ్లీ ఏక రూపముగా మారి నన్ను దీవిస్తూ మహాశూన్యంలో కలిసిపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించినది. అంటే శ్రీ విష్ణువు శూన్యంలో కలిసిపోయి శ్రీకృష్ణుడు కూడా కలిసి పోతే మరి ఈ జగన్నాటకం ఎలా నడుస్తుంది. ఇంకా ఎవరున్నారు. దీనికి అంతటికి మూల కారకుడైన మూల పురుషుడు ఎవరు ఉండి ఉండాలి అనుకోగానే నాకు ధ్యాన భంగమైనది. విచారణ చేస్తే శ్రీ లాహిరీ మహాశయుడు శ్రీకృష్ణ దర్శనం అయినట్లుగా ఆయన విశ్వరూప దర్శనం చూపించినట్లుగా ఆయన మహాశూన్యంలో కలిసి పోయినట్లుగా వివిధ డైరీలలో కాలానుగుణ అనుభవాలు రాసుకోవటం జరిగినదని తెలిసినది. అంటే నాకు నిజంగానే శ్రీకృష్ణుడిని స్వరూప దర్శనము అవ్వటము నిజమేనని నాకు అర్థమైనది. వెయ్యి తలల ఆసామిగా శ్రీకృష్ణుడు అదే నల్లవాడి దర్శనం అయినది అని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందం వేసింది. ఇక ఎందుకు ఆలస్యం. మీరు కూడా ఈ ఆనంద స్థితి పొందండి.
నాకు కలిగిన నిజరూప అయ్యప్ప దర్శనానుభవం:
ఇది ఇలా ఉంటే...నాకున్నట్లుగా పరమేశ్వరుడికి గూడ సుందరి కామమాయ ఉన్నాదా? అనే సందేహము వచ్చినది. దీనికి సమాధానముగా ఒక రోజు నా తీవ్ర ధ్యానస్ధితిలో ఉండగా జగన్మోహిని రూపము లీలగా కనపడినది. ఈమెతో కలిసి సుందరి కామమాయకి మహాశివుడు గురియై మైధునం చేస్తున్నట్లుగా తద్వారా ఒక పసిపిల్లవాడికి జన్మ ఇచ్చినట్లుగా...ఈ పిల్లవాడు కాస్త 12 సం!!బాలుడిగా మారి నల్లటి వస్త్రధారిగా ఉండి...ఎలాంటి సుందరి కామమాయకి గురికాకపోవడము వలన ఈ పిల్లవాడు కాస్త అస్ఖలిత బ్రహ్మచారిగా మారిపోవడం...ఇంతలో అక్కడే ఉన్న మహవిష్ణువు మరియు మహాశివుడు కలిసిపోయి శివకేశవుడిగా మారడం ... ఆతర్వాత ఈ బ్రహ్మచారి నాకేసి చూస్తూ... “ఇపుడికైనా నేను ఎవరో గుర్తుకు వచ్చినానా?నా నల్లటి వస్త్రాలు చూసైనా నన్ను ఎవరైనా గుర్తుపడతారని అంటూ..అక్కడున్న శివకేశవుడిలో కలిసిపోవడం..”ఆతర్వాత ఒక దివ్యజ్యోతి ఏర్పడం ఏకకాలములో జరిగిపోయినాయి.దీనినే పరంజ్యోతి దర్శనం అంటారు కాబోలు..ఈ పిల్లవాడు అయ్యప్పస్వామి కాబోలు..అందుకే అయ్యప్పకి జ్యోతిదర్శనం ఏర్పడి ఉండి ఉండాలని అనుకుంటూండగా నా ధ్యానభంగమైనది.మర్నాడు నాకు ధ్యానములో కనిపించిన పిల్లవాడి పోలికలతో ఒక అయ్యప్పదీక్షధారి మా ఇంటికి భిక్ష కోసము రావడము జరిగినది.నాకు కలిగిన జ్ఞానస్ఫురణ నిజమేనని చెప్పటానికి ఈ పిల్లవాడు వచ్చినాడా అనిపించినది.ఆ తర్వాత కొన్ని రోజులకి నేను అలాగే మా శ్రీమతి కలిసి ఏగ్జిబిషన్ కి వెళ్ళడం జరిగినది.అక్కడ దేవత విగ్రహలు అమ్మే కొట్టులో మా ఇద్దరికి సజీవకళతో ఉన్న పంచలోహ అయ్యప్ప విగ్రహమూర్తి బాగా నచ్చినది.కాని దానిని నేను కొనలేదు.కారణం ఈయనను ఆరాధన చెయ్యాలంటే ఆయనకి లాగా నిత్య అస్ఖలిత బ్రహ్మచారి ఉండాలి.నాలాంటి గృహస్ధుడు అలా ఉండలేడు గదా అనిపించి ఆయనను చాలా బాధతో వదలుకోవడము జరిగినది.ఆతర్వాత ఈయన ఈ రూపములో రాకపోయిన ఈయన చేసే పనిని నాచేత ఈ చక్రస్ధితి యందు చేయించినాడు.అది ఏలాగో నేను చేసిన త్యాగాల పట్టిక చదివితే... ఇది ఎలా సాధ్యపడినదో మీకు తెలుస్తుంది.
నాకు కలిగిన ఆది సాంబశివమూర్తి నిజరూప దర్శనానుభవం:
మహావిష్ణువు శూన్యంలో కలిసిపోయినాడని ఆ తర్వాత వచ్చిన శ్రీకృష్ణుడు కూడా శూన్యం లో కలిసిపోయినాడని మీకు తెలుసు కదా. మరి ఈ విశ్వానికి మూల పురుషుడు ఎవరు ఉంటారు అని నాకు అర్థం కాలేదు. ఎవరు లేకపోతే కాస్త చైతన్య స్థితి నుండి అచేతన స్థితి లోనే ఉండేవి కదా. మరి అలా జరగటం లేదు కదా. ఎవరో మూలకారకుడు ఉన్నారని నాకు బలంగా అనిపించసాగింది.ఇలా కొన్ని వారాలు గడిచినాయి. ఒక రోజు అర్ధరాత్రి పూట నాకు సహస్రార చక్రము అనగా మెదడు నుండి బుడబుక్కలవాడు వాయించే ఢమరుక నాదం చాలా సన్నగా వినపడటం సాగినది. వామ్మో ఇది ఏమిటి క్రొత్తగా? ఇన్నాళ్ళు వేణు నాదముగా వినబడింది. అది పోయి ఈ ఢమరుకము నాదము వినపడుతుంది. అమ్మ వద్దు అంటే మూడు రోజుల నుండి తలస్నానము చేసినాను. నా చెవులలో నీరు చేరి ఉంటుంది. తద్వారా నీరు మెదడులోకి చేరి ఉంటుంది. అందుకే కాబోలు వేణు నాదము బదులుగా ఢమరుకం నాదము వినపడుతుంది. నా చెవులు కానీ మెదడు కానీ దెబ్బ తినలేదు కదా. ఏమో ఎవరికి తెలుసు. ఈ శబ్దము దెబ్బకి చెవులు ఎప్పుడో దొబ్బి ఉండి ఉంటాయి. కాకపోతే ఏమిటి? ఒక నాదము వినపడ వచ్చిన చోట వేరే నాదము వినపడుతుంది అంటే ఏదో దొబ్బి నట్లే కదా అనుకుంటుండగా మళ్లీ ఈ నాదమును మనస్సుపెట్టి ఏకాగ్రతగా జాగ్రత్తగా విన్నాను. అప్పుడు నిజంగానే ఇది ఢమరుక నాదం అని అర్థం అయినది. అంటే శ్రీకృష్ణుడు కాస్త శూన్యంలో కలిసి పోయినాడు కదా. అందుకే ఆ నాదమునకు బదులు ఈ నాదము వినపడుతుంది అని నాకు అర్థమైనది. ఈ నాదము మహా శివుడిదే కదా. అంటే సహస్రార చక్రము లోని మూడవ భాగంలో ఉన్న మహాశివుడు మొదలైనాడు అన్నమాట. సహస్రార చక్రంలో మొదటి భాగము శ్రీమహావిష్ణువు రెండవ భాగంలో శ్రీ కృష్ణుడు ఇలా మూడవ భాగంలో దక్షిణామూర్తి 4వ భాగంలో కుమారస్వామి ఉంటారని “తంత్ర సాధన మాల” గ్రంథము చెప్పటం జరిగినది. అనగా ఇప్పుడు ఈ సహస్ర చక్రములోని మూడవ భాగమైన దక్షిణామూర్తి వద్దకు చేరుకొని ఉండి ఉండాలి అని అనుకోగానే నాకు ధ్యాన భంగము అయినది. అప్పుడు లేచి వెంటనే ఇంటర్నెట్లో దక్షిణామూర్తి ఫోటోలు చూడడం జరిగినది. అందులో కుడి చేతిలో ఢమరుకం ఎడమ చేతిలో అగ్ని జ్వాల చుట్టూ ఎవరో ఉన్నట్లుగా ఫోటోలు ఉన్నాయి. అంటే నాకు వినిపించిన ఢమరుక నాదం ఈ మనిషిదే అని నాకు అర్థం అయింది.
కొన్ని వారాల తరువాత విచిత్రంగా నాకు శ్రీశైల క్షేత్రం నుండి ఒక ఢమరుకము రావడం జరిగినది. దానిని లయబద్ధంగా మ్రోగించటానికి చాలా కష్టపడవలసి వచ్చినది. ఇంత చిన్న స్వామి బుడ్డ దానిలో విశ్వమే ఉంచిన మహాశివుడికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఇంకా అర్థం కాలేదా? మనకి ఇంతకుముందు కాలచక్రంలో 2 మేరు శ్రీచక్రము అదే ఆకాశ శ్రీచక్రము, భూశ్రీచక్రము వచ్చినాయి కదా. ఈ రెండు శ్రీ చక్ర బిందువులను ఒకచోట కలిపితే వచ్చే ఆకారము ఢమరుకము ఆకారము. జాగ్రత్తగా మనస్సులో ఈ రూపాన్ని ఊహించుకోండి. నిజమే కదా. అందుకే మన పరమ గురువు గారైన శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి ధన్యవాదాలు చెప్పటం జరిగినది. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా వారికి ధన్యవాదాలు చెప్పేయండి ఒక పని అయిపోతుంది.ఇలా వచ్చిన ఢమరుకము వాయించుకుంటూ ఢమరుక నాదం ధ్యానములో వింటూ కాలం గడుపుతున్నాను. నా బ్రతుకు మరీ బుడబుక్కల వాడి పరిస్థితి లాగా తయారు అయినది. ప్రతి రోజూ గంట సేపు అయిన ఢమరుకము లయబద్దంగా మ్రోగించాలనే తపన తో వాయించటం అభ్యాసము చేస్తున్నాను. సహజ సిద్ధంగా ఉన్నట్లు ఢమరుక నాదమును చాలా స్పష్టంగా వినే స్థాయికి నా సాధన శక్తిని పెంచుకోవడంతో కొన్ని వారాలు గడిచి పోయినాయి. ఆ తర్వాత నాకు కాశీక్షేత్రం నుండి నల్లటి పాము బొమ్మ వచ్చినది. తెలుపు నలుపు మచ్చలు రబ్బరు బొమ్మ అన్నమాట. ఇది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సరేనని దానిని భద్రముగా దాచినాను. కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు అర్ధరాత్రి పూట నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది. అంటే నా సూక్ష్మ ధారి ఎక్కడకో బయలుదేరినాడు అని నాకు అర్థం అయింది. హిమాలయాలు కనిపించినాయి. వామ్మో! అంటే నా సూక్ష్మధారి హిమాలయాలకి చేరుకున్నాడా? ఇప్పుడు ఇక్కడ ఎవరిని కలుస్తాడు. ఏమో ఎవరికి తెలుసు చూస్తూ ఉండటం తప్ప. పెళ్ళామే నా మాట వినదు. వీడు నా మాట వింటాడా. వినడు కదా చూడాలి ఏమి జరుగుతుందో అనుకుంటూ ఉండగా ….
యతీశ్వరుడి
వీడు కాస్త తెల్లని శరీర బొచ్చుతో ఒక కొండముచ్చు అవతారంతో యతీశ్వరుడి లాగా ఒక తెల్లని మంచు కొండ పైన ఎగబ్రాకడము అప్పుడప్పుడు పెద్ద పెద్ద అంగలతో అడుగులు వేస్తూ కొండ శిఖరానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ కొండపైన ఏకముఖ తలతో నల్ల కాలనాగు మహా సర్పము అక్కడ ఒక కొండను చుట్టుకొని కాపలా కాస్తూ కనబడినది. ఇది అచ్చంగా నా దగ్గరికి వచ్చిన రబ్బరు బొమ్మలా గా ఉందని అనిపించసాగింది. వెంటనే ఈ యతి దగ్గరకి అది బుస కొడుతూ వస్తుంటే నా గుండెలు జారిపోయాయి. అప్పుడు యతి భయపడకుండా దానికి నమస్కారము చేయగానే అది ఇక శాంతముగా మారి… ఎక్కడికో వెళ్ళటానికి దారి ఇచ్చినట్లుగా నాకు అనిపించినది. కొన్ని క్షణాల తర్వాత ఈ వ్యక్తి ఒక మంచు ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటికి ఈ ద్వారం తెరుచుకోగానే యతి కనిపించలేదు గానీ దారి ముందుకు నన్ను దాటుకుంటూ వేగంగా వెళ్లి పోవడం జరుగుతుంది. ఇలా వేగంగా దారి వెళుతూ వెళుతూ చివరికి చీకటి గుహలోనికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు అక్కడ మంచు ముద్దులతో లింగాకారం లాంటి మంచు దిబ్బ కనబడసాగింది. కొన్ని క్షణాల తరువాత ఈ మంచు ముద్దలు ఒక ప్రక్కకు తొలగుతూ ఉండగా ముద్దలలో ఒక చెయ్యి కనపడినది. ఈ చెయ్యి ఎవరిది? ఈ ముద్ర దేనిది? అని అనుకోగానే నాకు ధ్యాన భంగము అయినది. బయటికి వచ్చి విచారణ చేయగా నేను హిమాలయాలలో ఉన్న కైలాస పర్వతము లోపల ఉన్న సాంబశివ మూర్తి అభయ హస్తమును ఆజ్ఞాచక్రములో చూడటం జరిగినదని హిమాలయ గురువులు చెప్పిన వారి అనుభవాల పుస్తకంలోని విషయాలను బట్టి నాకు తెలిసినది. ఈ విధముగా నాకు కైలాస పర్వత దర్శనం కలిగించినందుకు మహా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకా నేను ఏమి చేయగలను. అంతే కదా. ఎందరో కైలాస పర్వత దర్శనానికి అలాగే పరిక్రమణకు వెళతారు. కానీ అందరూ మహా ద్వార దర్శనము ద్వారా సాంబశివ మూర్తి స్వరూపాన్ని చేసే దర్శనము యోగము ఎందరికీ ఉంటుంది చెప్పండి. ఆయన అనుగ్రహం పొందిన బిడ్డలకి తప్ప. 27 సంవత్సరముల పాటు నేను చేసిన శివలింగ ఆరాధన ఫలితానికి ఈ విధముగా దర్శనము ఇచ్చినందుకు ఆయనకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకోవడము జరిగినది. శివపార్వతులు ఉన్న కైలాస పర్వతము దర్శనము అయినట్లుగా శ్రీ లాహిరీ మహాశయుడు రాసుకున్నారు. కైలాష్ పర్వత శిఖరము ఒక మహాశంఖములాగా ఉంటుందని ఎవరైనా గమనించారా?నేను గమనించాను!ఆ శంఖము ఏమిటో గూడ నా పరిశోధన ద్వారా తెలుసుకోవడము జరిగినది.ఇక దీనిని వివరాలలోనికి…. కైలాష్ పర్వత శిఖరము కాస్త హనుమంతు గద శంఖమును పోలి ఉంటుందని తెలుసుకున్నాను.ఆ తర్వాత మానససరోవరానికి తర్వాత కైలాస దర్శనానికి తీసుకుని వెళ్తామని ఆఫర్లు వచ్చినా కూడా చిరునవ్వుతో వాటిని కాదన్నాను. ఎందుకో మీకు తెలుసు కదా. మీకు చెప్పినాను కదా. గుర్తులేదా. గుర్తుకు రావటం లేదా. అయితే కాలచక్ర అనుభవాలు చదవండి. మీకే తెలుస్తుంది. వెనక్కి వెళ్ళే ఓపిక లేదా? కథ అనుభవం మంచి రసపట్టులో ఉంటే వెనక్కి వెళ్ళమంటే ఎవరికైనా కోపము వస్తుంది. సీరియల్స్ మధ్య యాడ్స్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా. ఏమీ లేదు. మహా ఉజ్జయిని, మానస సరోవరం, కైలాస పర్వతం, రామేశ్వరక్షేత్రం,బదరీనాధ్ క్షేత్రం మన సాధనశక్తిని ఆకర్షించుకుంటాయి అని… అందువలన సాధకులు ఎవరు కూడా ఈ క్షేత్రాలకి వెళ్ళకూడదు అని నా మనవి అందులో చెప్పటం జరిగినది. ఇప్పటికైనా గుర్తుకు వచ్చినది. మంచిది.
మర్మరహస్యాలు తెలిసినాయి:
నెమలి ఈక ఉన్న శ్రీ కృష్ణుడి రహస్యం:
ఒకరోజు ఎందుకో నెమలి ఈక ఉన్న శ్రీ కృష్ణుడి బాల రూపము ఫోటో నా దగ్గరికి వచ్చింది. అది నన్ను బాగా ఆకర్షించింది. కానీ నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే నెమలి ఈకకి అలాగే శ్రీకృష్ణుడికి గల సంబంధము ఏమై ఉంటుందని నాకు చిన్న సందేహం వచ్చింది. మరి మీకు ఎప్పుడూ కూడా ఈ సందేహమే రాలేదా? వచ్చినా కూడా ఎవరూ చెప్పలేదని పట్టించుకోలేదా? దానితో నేను పుస్తక గ్రంథాలు తిరగవేసినాను. కానీ నా మనస్సుకి తృప్తి కలిగించే సమాధానం లభించలేదు. కొంత నిరుత్సాహం కలిగినది. ఒకరోజు ధ్యానంలో ఉండగా నా మనోనేత్రం ముందు రెండు ఆడ మగ నెమలి సంతాన వృద్ధి కోసం సృష్టి యజ్ఞం చేస్తున్నాయి. అందులో నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. కానీ ఒక విషయము నన్ను బాగా ఆకర్షించింది. అది ఏమిటంటే మగపక్షి స్ఖలనము చెందకుండా సంయోగం పూర్తి చేస్తుందని అర్థమయ్యే సరికి మరి వీర్యస్కలనం చెందకుండా ఉంటే మరి ఆడపక్షి ఎలా గర్భవతి అవుతుందని అనే అనుమానం నాకు వచ్చేసరికి ధ్యాన భంగమైనది. దానితో జంతువుల పుస్తకాలు చదవటం ప్రారంభించాను. అందులో ఒకచోట ఈ ప్రపంచము లో వీర్య స్కలనం కాకుండా నెమళ్ళు మాత్రమే సంతాన ప్రాప్తి పొందుతాయి అని చెప్పటం జరిగినది. ఇది బాగానే ఉన్నది. మరి దీనికి శ్రీకృష్ణుడికి ఏమి సంబంధము. ఎనిమిది మంది భార్యలు, పదహారు వేలమంది గోపికలు, రాధా ప్రియురాలు ఉండనే ఉన్నారు గదా. వెంటనే దీని కోసము మహాభారతము చదవటం మొదలు పెడితే అందులో ఒకచోట ధర్మరాజుకి ఏదో క్రతువు కోసం జీవితకాల బ్రహ్మచారి అవసరమైతే వెంటనే ఆయన ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు దగ్గరికి వెళ్లి వచ్చిన విషయం చెబితే దానికి ఆయన నవ్వుతూ “నాయనా! నేను కేవలము స్త్రీతో శృంగారమైన సంబంధము లేకుండా నా జీవిత కాలమంత బ్రహ్మచారిగానే గడిపాను. కానీ నాకు ఏదో ఒక సమయంలో నిద్రలో వీర్యస్కలనం అయి ఉండవచ్చు కదా. నేను మానవమాత్రుడును. వీర్య స్కలనం అవుతూ ఉన్న వారిని బ్రహ్మచారి అన రాదని యోగ శాస్త్ర వచనము. కాబట్టి నీ పూజ కి నేను అర్హుడిని కాను. అందువలన అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అందుకు అర్హుడు” అనగానే వెంటనే ధర్మరాజుకి “తాత! ఆయన నిత్య శృంగార పురుషుడు కదా. మరి ఆయన అస్కలిత బ్రహ్మచారి ఎలా అవుతాడు“అనగానే దానికి ఈయన “నాయనా! శ్రీకృష్ణుడు తన భార్యలతో అలాగే తన ప్రియురాలితో సంభోగం జరిపిన ఎక్కడ కూడా వీర్య స్కలనం పొందలేదు. అంటే తన భాగస్వాములను సంతృప్తి పరుస్తూ తను మాత్రం తామరాకు మీద నీటిబొట్టులాగా ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా ఉన్నాడు. అందువల్లనే ఆయనే నిజమైన అస్కలిత బ్రహ్మచారి అని” చెప్పినాడు. ఈ కారణం చేతనే ఈయనకి నెమలి పింఛము తలకి పెట్టడం జరిగినది. అర్థమైనది. బాగానే ఉంది కానీ శ్రీకృష్ణుడు తనకు మగ సంతానం కోసం ఏకంగా మహా శివుడి కోసం 60 వేల సంవత్సరముల పాటు తపస్సు చేసి సాంబుడు అనే కుమారుడిని పొందినాడని తెలుస్తుంది. మరి ఈయనకు శివుడి అనుగ్రహము లేకుండా ఈయనికి స్వయంగా ఎందుకు సంతానం లేకపోయినదో ఆ సర్వేశ్వరునికే తెలియాలి.
రుద్రాక్షల రహస్యం:
మహాశివుడికి ఎందుకు రుద్రాక్షలు ఆభరణాలుగా పెట్టినారు అనే ధర్మసందేహం నాకు ఒక రోజు వచ్చినది. అప్పుడు ఈ ప్రపంచంలో పుచ్చిపోయిన విత్తనాలు నీటిమీద తేలుతాయి. కానీ ఆరోగ్యంగా ఔషధ గుణాలు ఉన్న విత్తనాలు కూడా ఉన్నవి రుద్రాక్షలు అన్నమాట. నీటిమీద తేలతాయి. అలాగే తేలే ఏక లక్షణం ఉన్న విత్తనాలే రుద్రాక్షలు అన్నమాట. నీటిలో మునిగే వాటిని భద్రాక్షలు అంటారు. వీటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. రుద్రాక్షలకి విద్యుత్ అయస్కాంత శక్తులు అలాగే జల సిద్ది ఉండుటవలన ఈ విత్తనాలు లోక ప్రసిద్ధి కావాలని మహాశివుడికి ఆభరణాలుగా చేసినారు. అలాగే ఈయనకి పాములను ఆభరణాలుగా నాగాభరణం చేయటంలో కూడా అర్థము ఉన్నది. అది ఏమిటంటే ఈ ప్రపంచంలో శ్వాసక్రియను ఊపిరితిత్తులతో కాకుండా కేవలం గుండె కాయతో శ్వాసక్రియను జరిపే ఏకైక జీవి పాము మాత్రమే. ఎప్పుడైతే యోగి తన సాధన శక్తి ఆజ్ఞాచక్రం స్థితికి వస్తుందో ఆ క్షణమే తన శ్వాసను ఊపిరితిత్తులతో కాకుండా గుండెతో తీసుకోవటం ఆరంభిస్తాడు. ఈ విషయం లోకానికి తెలియజేయటానికి శివుడికి నాగాభరణంగానూ, విష్ణువుకి శేషతల్పములాగ, అమ్మవారికి శిరో ఆభరణంగా పడగలాగ తల మీద పెట్టడం జరిగినది.వామ్మో! వాయ్యో! దీనమ్మ జీవితం. ఇప్పుడు నాకు దైవాలు అంతా కూడా ఏదో కొత్త కోణంలో కనబడుతున్నారు. ఈ లెక్కన 36 కోట్ల దైవాలకి ఏదో ఒక ప్రత్యేక లక్షణాలు ఉన్న వాటిని అనుసంధానం చేసి మన మానసిక శారీరక ఆరోగ్యం వృద్ధిని పెంచిన మన పూర్వ మహర్షులుకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. అంటే వీళ్లంతా ఒక్కొక్క విటమిన్ టాబ్లెట్ లాంటివారు అన్నమాట.
మనలో ఆక్సిజన్ శాతం తగ్గితే ఆవు మూత్రము కానీ గంగా నీళ్లు గాని తాగితే సరిపోతుంది. ఎందుకంటే ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే గంగానదిలో పరిశుద్ధమైన హిమాలయాల నుండి ఈ నది ప్రవాహం ఉండుట వివిధ ఔషధ గుణాలు ఏర్పడుట వలన 21% ఆక్సిజన్ ఈ నీటిలో మాత్రమే ఉంటుంది. అందుకే కాబోలు చచ్చిపోయే ముందు గంగ నీటిని నోటిలో పోస్తే ఆ నీటిలో ఉన్న ఆక్సిజన్ వలన ఆ జీవుడు బ్రతికే అవకాశాలు ఉంటాయని చెప్పి ఉండాలి. వామ్మో! వాయ్యో! ఇలా దైవానికి సంబంధించిన విషయాలు తెలిస్తే ఎవరైనా పూజలు చేస్తారా? ఇవి అన్నీ కూడా వాళ్లకి మందు బిళ్లలు లాగా శ్రీ చక్ర బిందువు, మందు గొట్టాలుగా శివలింగాలు, ఆయుర్వేద మొక్కలుగా వివిధ దైవ స్వరూపాలు కనబడతాయి. ఏమో ఎవరికి తెలుసు. లేదా ఈ విలువలు వారికి తెలియడం వలన ఈ దైవ విగ్రహరాధన వలన వచ్చే లాభాలు వలన తెలియటంతో మరింత శ్రద్ధగా పూజలు చేస్తారా? ఎవరికీ తెలుసు.
హనుమత్ కోతి రహస్యం
మనస్సు కోతి లాంటిది. ఇలా అస్థిర మనస్సుకి కారణము విభిన్న ఆలోచనలు విభిన్న భావాలు విభిన్న కర్మ ఫలితాలే కారణం అవుతాయి. ఈ మూడు కూడా త్రికోణము గా ఉండే ఆజ్ఞాచక్రం లో ఉంటాయి. దీనికి బరువైన వస్తువు పెడితే ఈ త్రికోణము స్థిరముగా ఉంటుంది. తద్వారా మనస్సుస్థిరము అవుతుంది. అంటే దీని కోసము పొడులులో బరువుగా ఉండే పొడి ఈ ప్రపంచంలో ఒక సింధూర పొడి మాత్రమే. దానిని ఆంజనేయస్వామి ఒంటికి పూసే విధానం కథను చెప్పి మనము నిత్యమూ బొట్టు పెట్టుకునే విధానం ఏర్పాటు చేసినారు. దీనితో వారికి స్థిర మనస్సు ఏర్పడి ఆలోచనలు భావాలు తగ్గి మనస్సు మనశ్శాంతి పొందటం జరుగుతుంది. దీనమ్మ జీవితం. నేను ఇన్నాళ్ళు దీనికోసమే హనుమాన్ చాలీసా తో పూజ చేసినది.
విచిత్రం ఏమిటంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా ఉంది అదే గాయత్రి మంత్రం. ఇందులో 24 మంత్ర దేవతలు 24 మంత్ర గురువులు 24 మంత్ర రుషులు 24 దైవిక శక్తులు 24 దైవిక ముద్రలు 24 అస్త్రాలు ఉన్నాయి. దీని ఆరాధన అనగా 12 నుండి 21600 దాక నిత్య మంత్రజపము చేస్తే 72 వేల నాడులు శుద్ధి అవుతాయి.13 యోగ చక్రాలు పరిశుద్ధి అవుతాయి. మనిషి ఆరోగ్యంగా దృఢంగా నిశ్చలముగా బుద్ధితో మనస్సుతో స్థిర ఆలోచనతో ఇలా 24 దైవిక గుణాలు అలవడి బ్రహ్మత్వం పొందుతాడు. అందుకే కాబోలు ఈ మంత్రాన్ని ప్రతి దైవానికి నిత్య నైవేద్య మంత్రముగా అనుసంధానము చేసినారు. ఈ లెక్కన ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక ప్రత్యేక గుణం ఉన్నది. ఆ గుణాలను మన పూర్వ మహర్షులు తెలుసుకొని వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి వీటిని ప్రతి నిత్యము మానవుడు అనుసంధానము పొందేటట్లుగా నమ్మకం కలిగించే విధానాలుగా కథనాలు అల్లి వారిచేత పూజలు చేయిస్తూ మానవుడిని కాస్త మాధవుడి గా మార్చే ప్రయత్నం గా అనగా విగ్రహరాధన నుండి విశ్వరాధన దాకా విగ్రహం నుండి నిగ్రహము దాక ప్రాణ శక్తి నుండి విశ్వశక్తి దాకా మార్చే ప్రయత్నాలు చేసిన కర్మ యోగులకి, భక్తి యోగులకి, జ్ఞాన యోగులకి, ధ్యాన యోగులకి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి.
శివుడినే తీసుకోండి. ఒక యోగి కి కావలసిన అవసరాలు ఏమిటో తెలుసుకొని యోగ స్థితులు వచ్చే మార్పులు ఏమిటో తెలుసుకొని యోగము వలన వచ్చే అనుభవ అనుభూతులు ఏమిటో తెలుసుకొని అనగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గాలలో మన పూర్విక యోగులు సాధనలు చేసి వారు పొందిన అనుభవం అనుభూతి విషయాలను ఒకరినొకరు అనుసంధానమై ఒక శివలింగం విగ్రహ మూర్తిగా లోకానికి తెలియ చేయటం అంత సామాన్యమైన విషయం కాదు కదా.బోడి మనకి ఒక విషయం అర్ధం అవటానికి ఒక జీవితకాలం పడితే ఇలా వీరంతా ఆహారం లేకుండా సరైన సౌకర్యాలు లేకుండా అడవుల వెంట అరణ్యాల వెంట తిరుగుతూ ప్రకృతిని అర్థం చేసుకుంటూ నిద్ర పోకుండా కఠినమైన సాధన చేస్తూ ప్రకృతి భాషను డీకోడ్ చేస్తూ ఎన్నో మహత్తర విషయాలను తెలుసుకొని లోకానికి తెలియజేస్తే మనము వాటిని ఎగతాళి చేసే స్థాయిలో ఉన్నాము.ఏనుగు తల ఉండటం, సింహము తల ఉండటం, గుర్రము తల ఉండటం దైవాలుగా వీరిని పూజించటం ఏమిటి అని అంటున్నారు. కానీ వీటి వెనుక ఉన్న అర్థం ఏమిటో ఎవరికి తెలుసు.
అడవులలో నరుడు ఒంటరిగా తిరిగితే ఏనుగు సింహము వలన ప్రాణాపాయం కలుగుతుందని మానవ శరీరానికి సింహము తల పెట్టడం జరిగినది. పూర్వము ఇప్పుడున్న సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు కదా! అడవులలోని గుహలలో ఈ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా సింహాల సంచారము ఉన్నదని తెలియజేయటానికి ఆ గుహలలో సింహ తల మనిషి శరీర బొమ్మలు చెక్కి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరిగింది. అది కొన్ని నెలలు తరువాత ఈ బొమ్మలను చూసి వీటిని నరసింహ స్వామి పూజలు చేయటం ఆరంభించారు. కావాలంటే మీరే గమనించండి. అన్ని నరసింహ స్వామి ఆలయాలు అన్నీ కూడా కొండలు పైన దట్టమైన అడవుల ప్రాంత పరిసరాలలో ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రహస్యాలను మన దేవతా విగ్రహలలో నిక్షిప్తం చేసి వాటిని దైవ రహస్యాలు గా ఉంచడం జరిగినది.
మన హిందూ దేవతలకి ఎందుకు జంతువులు తలలు ఉంటాయి?:
చాలామందికి మన హిందూ దేవతలకి తలలు మార్చి ఎందుకు ఉంటాయి అనగా గణపతి, హనుమంతుడు, నరసింహస్వామి, హయగ్రీవుడు, వారాహి కి ఇలా దేవతలకి ఎందుకు జంతువులు తలలు ఉంటాయి అని సందేహం రావచ్చు. ఇదే సందేహాన్ని నన్ను ఒక సాధువు కాశీ క్షేత్రము నందు ప్రశ్నించినప్పుడు అప్పుడు నాకు వచ్చిన జ్ఞాన స్పురణ సమాధానముగా చెబుతున్నాను దీనికి ఒక కారణం ఉన్నది. గణపతికి ఏనుగు తల పెట్టడం అంటే పునర్జన్మ కి అలాగే 84లక్షల జీవరాసులూ జన్మలు ఎత్తడానికి కారణం మనలో ఉన్న అహంకారము మదము అతి కామము పర స్త్రీ /పురుష వ్యామోహం బుద్ధికుశలత లేకపోవటం అతి పదార్థ రుచులకు మోహం చెందటం ప్రకృతిని నాశనం చేయటం మాట అదుపు లేక పోవటం ఇలా 84లక్షల అవలక్షణాలు అన్నియు కారణం అవుతాయి. ఈ లక్షణాలు అన్నీ కూడా మనకి వివిధ జంతువులలో కనబడతాయి. అనగా ఏనుగు పాము నెమలి సింహము ఎలుక ఇలా జంతువులలో కనిపించడం వలన అందులో ఏనుగుకి అధిక లక్షణాలు ఉండుట వలన గణపతికి ఏనుగు తల అమర్చటం పామును జంధ్యముగా మార్చటం ఎలుక నెమలి సింహం లాంటి వాటిని ఆయన 32 అవతారాలు వాహనాలుగా అమర్చడం జరిగినది. గణపతి నిమజ్జనం అనేది నీటి కాలుష్య నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే హనుమంతునికి కోతి ముఖము అమర్చటం అనేది మనస్సు స్థితిగతులు తెలియచేయటానికి అన్నమాట. కోతికి కొబ్బరికాయ దొరికితే అది ఎలాగంతులు వేస్తుందో మన మనస్సు కూడా అలా ఉంటుంది. మనస్సు మనకి ఆధీనము అయితే మాధవుడు అవుతాడని లేకపోతే వానరుడు అవుతాడని అని చెప్పకనే చెప్పినారు. అందుకే ఆయన వానరుడుగా నరుడిగా రామ భక్తుడిగా ఆంజనేయస్వామిగా గుర్తింపు పొందినాడు. అలాగే నరసింహ స్వామికి సింహము తల ఎందుకంటే మనిషిని చంపగలిగే సింహాలు ఇక్కడ సంచారము చేస్తున్నాయని అలాగే అగ్ని పర్వతాలు ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నాయి అని చెప్పటానికి మనకి ఆయన తలకి సింహము తల పెట్టి అడవులలో కొండ ప్రాంతాలలో నరసంచారము తక్కువగా ఉన్న ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాలలో ఈయన విగ్రహరాధన పెట్టడం జరిగినది. ఇక హయగ్రీవుడు విషయానికి వస్తే గుర్రము తల అనేది మనస్సు వేగానికి గుర్తుగా పెట్టడం జరిగినది. మనస్సు యొక్క వేగము జ్ఞానము వైపు ప్రయాణించాలని జ్ఞానమే లక్ష్యంగా ఉండాలి అని చెప్పటానికి ఈయనను జ్ఞాన ప్రదాతగా ఇచ్చే దేవుడిగా పూజించటం జరుగుతుంది. వారాహి అనేది అశుద్ధమైన మలము తినే పంది తల పెట్టడానికి కారణం మానవులు కూడా ప్రేమ మోహ వ్యామోహ అతి నిద్ర అత్యాశ స్వార్థము ఇలాంటి వాటియందు పడి పందిలాగా వాటియందు సంచారము చేస్తున్నారని అందువలన జ్ఞానమునకు దూరమవుతున్నారని మనకి తెలియటానికి ఇలా దేవతలకి ఆదిలో మన పూర్వ మహర్షులు తలలు మార్చి జంతువుల తలలను పెట్టినారు అని గ్రహించండి.
శాస్త్ర రహస్యాలు:
అంతెందుకు నవమి తిథి నాడు ప్రయాణము చేయరాదని శాస్త్ర వచనము. ఒకవేళ చేస్తే రెండు సార్లు చేసిన ప్రయాణం లేదా మొదలుపెట్టిన పని చేస్తాడని ఫలిత శాస్త్రం చెబుతోంది. అది అవునా కాదా అని నేను ఎన్నోసార్లు ఈ తిథినాడు చేసి దెబ్బ తిన్నాను. వెళ్లిన ఆస్పత్రికి రెండుసార్లు వెళ్ళడము, వెళ్ళిన దేవాలయానికి రెండు సార్లు వెళ్ళటం వెళ్ళిన చోటకి రెండుసార్లు వెళ్లడం ఇలా ఎన్నో సంఘటనలు రెండు సార్లు ఈ తిథినాడు నా జీవితంలో జరిగినది. అలాగే రాహుకాలంలో పని చేస్తే అది పూర్తి కాదని శాస్త్ర వచనము. ఇది నిజమా కాదా అని నేను కావాలని రాహుకాలములో ఏదో ఒక కొత్త పని చేయటం ఆరంభించాను. కానీ విచిత్రముగా అనుకున్నదాని కన్న విజయవంతముగా పూర్తి అయ్యేది. కానీ మా శ్రీమతికి చేస్తే మాత్రం అనుకున్న పని ఆగిపోయేది. నాకు పూర్తి అవ్వటము ఆవిడకి ఆగిపోవటం లో ఉన్న మర్మము అర్థము చేసుకోవటానికి జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు చదివితే తెలిసినది. అది ఏమిటంటే కొన్ని జన్మ రాశులకి రాహు గ్రహము మంచి చేస్తే మరికొన్ని జన్మరాశిలో ఈయన చెడు చేస్తాడని అలా లెక్కన చూస్తే రాహుగ్రహ కాలము కొందరికి శుభ యోగాలు ఇస్తే మరికొందరికి అశుభ యోగాలు ఇస్తుందని నాకు అర్థమైనది. ఈ విషయము తెలుసుకోకుండా నేను రాహుకాలంలో క్రొత్త పనులు పూర్తి చేశాను. మీ శాస్త్రాలు చెప్పిన విషయాలు తప్పు అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఎక్కువ శాతం మందికి రాహు గ్రహము అశుభ ఫలితాలను ఇస్తాడు. కొద్దిమందికి మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. అందువలన మన పూర్వీకులు ఈ విషయమును గమనించి ఎవరికి అనుగ్రహము ఎవరికి వ్యతిరేకము సామాన్యులు తెలుసుకోవటం కష్టం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని రాహుకాలములో క్రొత్త పని చేయవద్దు అని చెప్పటం జరిగినది. ఎవరో కొద్ది మందికి రాహుకాలంలో కలిసి వస్తే అది శాస్త్రము తప్పు అనటంలో ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. దీనికి గల కారణాలు విశ్లేషించుకోండి. అప్పుడు శాస్త్ర వచనాలలో తప్పులు ఉన్నాయేమో వెతకండి. అంతేగాని మిడిమిడి జ్ఞానం పొంది పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానము పొందిన వారిని విమర్శించ వద్దు. వారు పెట్టిన విధివిధానాలు అవమానించవద్దు.
మట్టి వినాయకుడి రహస్యం:
ఇది ఇలా ఉంటే ఈ విధానాలు అతిగా అర్థం చేసుకుని మెట్ట వేదాంతం జ్ఞానంతో తమకు తోచినట్లుగా చెప్పటం జరుగుతుంది. వినాయక విగ్రహలు నిమజ్జనము చేయరాదని వీటివలన చెరువులు నాశనము అవుతున్నాయని చెబుతున్నారు. అసలు మన పూర్వీకులు ఏమని చెప్పినారు. ఒక అడుగు ఉన్న రంగులేని మట్టి వినాయక విగ్రహమును అనగా పూడిక తీసిన మట్టితో చేసిన మట్టి విగ్రహలును ఇరవై ఒక్క ఔషధ పత్రాలతో నిండుగా పూజించి వాటిని మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా పదకొండు రోజుల తర్వాత నిమజ్జనము చేయమని చెబితే అది వదిలేసి ఏకముగా 20 అడుగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహలను హానికరమైన రంగులు వాడిన విగ్రహలు పత్రి లేని విగ్రహలు నీటిలో కలిపితే ఏమి లాభం. ఉన్న నీటి కాలుష్యం తగ్గకపోగా ఇంకా పదింతలు పెరుగుతుంది. అదే మన పూర్వీకులు చెప్పిన విధానము చేస్తే విగ్రహము తక్కువ పత్రి ఎక్కువ ఉండటం వలన ఈ మట్టికి కూడా ఔషధ గుణాలు చేరి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ నీటికి మట్టి తో కూడిన ఔషధగుణాలు చేరటం వలన నీటి కాలుష్యం పదింతలు తగ్గిపోతుంది. ఆరోగ్యమైన నీరుగా మారుతుంది. ఈ నీరే తిరిగి మనకి వర్షం రూపంలో పడితే మనము తినే మొక్కలకి పెంచుకొనే మొక్కలకి ఔషధగుణాలు చేరి మనము తినే ఆహారం మన చుట్టూ పరిసరాలు కూడా ఆరోగ్యంగా ఉండి మనల్ని ఆరోగ్యవంతులను చేస్తాయి. కానీ ఈ విధానము ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. అందరికీ తెలుసు. మరి చేసే వాళ్ళు ఎవరు. ఈ మధ్య కొత్తగా మట్టి గణపతి విగ్రహలను ఎవరికి వారే ఇంటిలో నిమర్జనము చేయ్యాలని ఒక విధానము వస్తోంది.ఇది కూడ తప్పుడు విధానమే.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహలకి ఈ విధానము మంచిదే.కాని మట్టి విగ్రహలకి ఈ విధానం మంచిది గాదు.ఎందుకంటే చెరువులు శుద్ధిగావు.ఇవి శుద్ధిగాకపోతే శుద్ధి వర్షాలు పడవు.అదే మట్టి విగ్రహలను సమీప చెరువులలో నిమర్జనం చేస్తే ఆ చెరువులు శుద్ధి అవుతాయి. తద్వారా ఈ చెరువు శుద్ధి నీరు మేఘాలుగా మారి సముద్రాలు శుద్ధి అవుతాయి.తేడా తెలుసుకోండి.మట్టి విగ్రహలు ఇంటిలో నిమర్జం చేస్తే ఆ చెట్టు మాత్రమే ఆరోగ్యంగా పెరుగుతుంది.అదే దీనిని చెరువులో నిమర్జనం చేస్తే ఊరు బాగుపడుతుంది.తద్వారా దేశమే బాగుపడుతుంది. ఆర్భాటాల కోసం మంది మార్బలం ముందు డబ్బు కోసమే యాంత్రిక పూజలు చేస్తున్నామే గానీ ఈ పూజల వలన మనకి అలాగే మన చుట్టూ ఉన్న ప్రకృతికి మనము తెలియకుండానే ఎంత హానిని చేస్తున్నామో గ్రహించండి. నేను పూజలు చేయ వద్దని అనటం లేదు. చేసే పూజా విధానాలు మన పూర్వీకులు చెప్పిన విధంగా చేస్తే కాస్త ఆరోగ్యంగా ఉంటుంది. అందులో ఉండే మనము ఆరోగ్యవంతులుగా ఉండటం జరుగుతుంది అని.
దీపావళి టపాసుల రహస్యం:
అంతెందుకు ఈ మధ్య ఒక కొత్త నినాదం వచ్చింది. దీపావళి రోజున టపాసులు కాల్చ రాదని దీని వలన విపరీతమైన శబ్దకాలుష్యం హానికరమైన మందుల వలన ప్రకృతి హాని జరిగి రోగాల బారిన పడుతున్నామని టపాసులు కాల్చవద్దు అని చెప్పడం జరిగినది. అసలు మన పూర్వీకులు చెప్పినది ఏమిటి? వీళ్ళు చేస్తున్నది ఏమిటి? నవంబరు- డిసెంబరు నెలలో చిన్న పురుగులు, దోమలు, ఈగలు, హానికరమైన క్రిమికీటకాలు తమ సంతానాభివృద్ధిని పెంచుకునే సమయాలు. ఈ కాలములో వీటిని అదుపు చేయకపోతే మనుషులకి ఇతర జీవులకు రోగాలు వస్తాయని తెలుసుకుని అప్పుడు మతాబులు, చిచ్చుబుడ్లు,అంతగా శబ్ధము లేని టపాసులు, కాకరపువ్వొత్తులు ఇలాంటి వాటిని కాల్చమని చెప్పడం జరిగినది. వీటి వలన ఆయా హానికరమైన జీవులు చనిపోతాయి. అసలే టపాసులు కాల్చ వద్దని చెబితే మొదటికే మోసం వస్తుంది కదా. దోమలు, ఈగలు క్రిమికీటకాలు పెరుగుతాయి కదా. వీటి కోసం ఎన్ని రకాల మందులు వాడినా, దోమ తెరలు వాడినా అంతగా ఉపయోగము ఉండదు కదా.గుడ్లు పెట్టకుండా చేస్తే సరిపోతుంది గాని పెరిగిన వాటిని చంపటం అంత తేలికైన విషయం కాదు కదా. కాబట్టి టపాసులు కాల్చాలని అది కూడా శబ్దం లేని టపాసులు హానికరమైన వాసనలు రాని టపాసులు ప్రకృతి పదార్థాలతో చేసిన టపాసులు రసాయనాలు లేని టపాసులు కొద్దిపాటి పరిమాణములో కాల్చండి. అంతేగాని అసలు కాల్చక పోయిన ప్రమాదమే. అదే రసాయనాల శబ్ద టపాసులు అతిగా కాల్చిన ప్రమాదమే. ఈ తేడాను గమనించండి. అంతా మీకే అర్థం అవుతుంది. మన పూర్వీకులు పెట్టిన ప్రతిదానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి అని తెలుసుకోండి. మూల అర్థము అది వాళ్లు గ్రహించిన సత్యాలని గ్రహించండి. ప్రస్తుతము నేను ఈ ప్రకృతి యొక్క మూల రహస్యాలు తెలుసుకొనే స్థితిలో ఉండటం జరుగుతోంది అని నాకు అర్థం అయింది. ఇలా నేను తెలుసుకున్న విషయాలు రాయాలంటే 36 కోట్ల పేజీల పుస్తకం అవుతుంది. ఎందుకంటే మనకి అన్నీ కూడా రహస్యాలను మన పూర్వీకులు తెలుసుకొని నిక్షిప్తం చేసినారు. అంటే మన వాళ్ల కష్టం గురించి ఆలోచించండి. ఈ పుస్తకం రాయటానికి నాకు అభ్యంతరం లేదు. చదివి అర్థం చేసుకునే వారు ఎవరు ఉంటారో చెప్పండి. విగ్రహ రూపాలలో నిక్షిప్తం చేసిన మనము చేయటం లేదు. పుస్తకం చదివి చేస్తారా చేయలేరు. చదివితే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మరచిపోవడం సహజం.
మన శరీర రహస్యాలు:
అంతెందుకు మన జుట్టులో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో మీకు తెలుసా? అలాగే మన శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో మీకు తెలుసా? ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి తెలుసో తెలియదో కానీ ఖచ్చితంగా మీకు తెలియదు అని నాకు తెలుసు. మొన్నటిదాకా నాకు కూడా తెలియదు. మన పూర్విక బ్రహ్మ జ్ఞానులకి అన్ని వివరాలు కూడా తెలుసు. మనిషి పుట్టుక అంతము కూడా తెలుసు. వారికి తెలియని విషయం గాని మర్మ రహస్యము గాని ఈ ప్రకృతిలో లేదంటే అతిశయోక్తి కాదు. మీరు మరీ చెబుతున్నారు. ఎక్కడైనా వెంట్రుకలు రోమాలు లెక్కించడం కుదురుతుందా అంటారా. అయితే ఒకసారి గరుడ పురాణము చదవండి. అందులో మన బ్రతుకు అంతా రాసిపెట్టి ఉంటుంది. మనము పుట్టటానికి కారణాలు, దోషాలు, శాపాలు, పాపాలు, రోగాలు, వ్యాధులు, మరణాంతరం తర్వాత స్థితిగతులు వాటికి నరక శిక్షలు అన్ని కూడా పూసగుచ్చినట్లు గా చెప్పడం జరిగినది. నేను ఎప్పుడైతే కాలచక్రం స్థితిలో నరకలోకం అదే రెండు నల్ల కుక్కలు ఒక ద్వారము వద్ద నిలబడి భీకరంగా అరుస్తూ ఉన్నట్లుగా అనుభవము అయినది అని చెప్పినాను కదా. గుర్తుకు వచ్చిందా. అదియే నరకలోక ప్రవేశద్వారం. నేను అయితే ఇందులో లోనికి ప్రవేశించిన లేదు కానీ పూర్వీకులు వెళ్లిన వారి అనుభవాల సారమే ఈ గరుడ పురాణం అని ఇది అక్షరసత్యం అని నాకు అర్థం అయింది. ఇందులో మనకి ఏడు లక్షల తలవెంట్రుకలు ఉంటాయని… మూడున్నర కోట్ల రోమాలు ఉంటాయని ఖచ్చితముగా లెక్కలు చెప్పటం జరిగినది. మన మాంసము, రక్తము, వీర్యము, క్రొవ్వు, ఎముకలు ఇలా అన్ని పరిమాణ వివరాలు కూడా చెప్పటం జరిగినది. మనకి ఏఏ పాపాలు చేస్తే ఏఏ రోగాలు, వ్యాధులు వస్తాయో చెప్పటం జరిగినది. ఇది చదివిన తర్వాతనే నాకు షుగర్ వ్యాధి రావడానికి గల కారణం ఏమిటో తెలిసింది. గత జన్మలలో తమ్ముడి భార్యతో సహా మైధునం అదే సంభోగము చేస్తే ఈ వ్యాధి వస్తుంది కదా. అది నా విషయంలో నిజమే కదా. ఇంకా అర్థం కాలేదా? నా సూక్ష్మశరీర అంశ ఎవరిది? వేద వ్యాసుడు. ఇదే కదా మరి ఈయన తన తల్లి కోరిక మేరకు సంతానాభివృద్ధి కోసం తమ్ముడు భార్యతో సంభోగము చేసి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడిని పుట్టించినారు కదా. ఆ పాపము కాస్త ఉండిపోయినది. అందుకే ఈ పాపపరిహారార్థం నాకు ఈ జన్మలో షుగర్ వ్యాధి వచ్చిందని అర్థం అయినది. నాకు జన్మాంతర జ్ఞానము వలన ఎక్కడ కూడా నేను ఏ గత జన్మలో నా తమ్ముడి భార్యతో సంభోగము చేయలేదని తెలిసినది. ఒక్క వేదవ్యాసుడు జన్మ లో తప్ప. నా ఆది మానవజన్మ ఈయన అంశ అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణము అయినది. కానీ మన పూర్వీకులు ఇలా ఇచ్చిన జ్ఞానము ఈ మధ్యలో వచ్చిన కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకొని తమకి తోచిన విధంగా భావాలతో, ఆలోచనలతో రచనలు చేసి జ్ఞానకాండమును కాస్త తమ స్వార్ధ అవసరాల కోసం కర్మకాండముగా మార్చి రాసినారు. పూర్వము ఎవరికి వారే స్వయంగా ఆత్మ పిండ ప్రధాన కర్మ విధి విధానము కావాలని కొంతమంది చెబితే స్వార్ధపరులు దీనిని కాస్త దశ దిన కర్మ ప్రధాన పేరుతో జనాల నుండి లక్షలు దాకా దశ దిన కర్మలు పేరుతో దశదానాలుతో చచ్చిపోయిన వారి మీద వ్యాపారాలు చేసే కర్మకాండ దుస్థితికి నాంది చేసినారు. యదార్ధ జ్ఞానమును పదార్థ జ్ఞానముగా మార్చి వారి అభిమతం కాస్త మతాలుగా ఆచారాలు వ్యవహారాలు కర్మలు గా మార్చి కర్మకాండను చేయటంలో జయము పొందినారు.జ్ఞానము తోనే వ్యాపారాలు చేసే దిగజారుడుతనానికి నాంది అయినారు.ఇదే నాకు బాధ కలిగించిన విషయం. నేనే కాదు. ఎవరైనా యదార్ధ జ్ఞానము చెప్పినా కూడా నమ్మలేని స్థితిలో ప్రస్తుతము మనము ఉన్నాము అంటే మిడిమిడి జ్ఞానం మెట్ట వేదాంతం మెట్ట ఆచారవ్యవహారాలు మెట్ట మతాలు మన మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. నా బాధ ఏమిటో మీకు తెలుస్తుంది. నేను ఎవరిని కించ పరచడం లేదు. యదార్థ జ్ఞానము తెలుసుకుని మాట్లాడండి. చెయ్యండి అని చెప్పటమే నా మనో ఉద్దేశ్యము. అన్యధా భావించకండి.
జంబూద్వీప దర్శనం:
ఇంతకీ మన సాధన విషయానికి వద్దామా? నేను ఎక్కడి దాకా నా ధ్యాన అనుభవాలు చెప్పినానో నాకే గుర్తుకు రావటం లేదు. అవసరమైనది అవసరమైనప్పుడు గుర్తుకు వస్తే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చేది. అది గుర్తుకు రాక గుర్తులేక మరిచి పోయిన విషయాన్ని తెలుసుకోవడానికి కోసమే గదా యోగసాధన ఉన్నది. ఈ మనమే పరమాత్మ అని మరిచిపోయి జీవాత్మ అనుకొని మర్చిపోయిన ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సాధన నేను చేస్తున్నాను కదా. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతివాడు వేదవ్యాసుడు అంశ కాదు. వారు ఏదో ఒక గత జన్మలో తమ్ముడి భార్యతో సంభోగం చేయడం వలన వారికి ఈ జన్మలో ఈ వ్యాధి వచ్చి ఉండాలి. నా విషయంలో వేదవ్యాస జన్మలో తప్ప మరి ఏ గత జన్మలో ఎలాంటి ఘనకార్యం చేయలేదని నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వలన తెలుసుకొని రూడీ చేసుకోవడం జరిగినది. ఇక నా ధ్యాన అనుభవాలలో మీకు కైలాస పర్వత దర్శనం అనుభవము దాకా చెప్పినట్లుగా గుర్తుకు వచ్చినది. నాది వేదవ్యాస జన్మని జ్ఞానము ద్వారా గుర్తుకు వచ్చినట్లుగా దైవ అనుభవ విషయము మీకు చెప్పినట్లుగా నాకు గుర్తుకు వచ్చినది. ఒకసారి నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైనది. నా సూక్ష్మ శరీర యానం మొదలైనది. హిమాలయాలు కనిపించాయి. ఒక అష్ట పద్మాకారపు హిమాలయాల మధ్యలో ఒక చోట నీలి వర్ణపు రంగుతో ఒక దివ్యమైన సరస్సు ఉన్నట్లుగా కనిపించినది. దీని మధ్యలో ఒక వింత అయిన వృక్షము ఉన్నట్లుగా కనిపించినది. విచిత్రముగా దీనికున్న పండ్లు ఈ నీటి మీద పడగానే నీటి అడుగుకు వెళ్లి అవి కాస్తా బంగారపు వర్ణముగా మారి నీటి మీదకి తేలడంతో ఇంతలో ఒక గుంపుగా ఆకాశమునుండి రాజహంసలు అలాగే అక్కడ ఉన్న పొద వద్దనుండి దివ్య శరీరం ఉన్న పాములు వచ్చి ఈ బంగారపు పండ్లు తిని దివ్యకాంతులతో వెనక్కి వెళ్లిపోవడం మిగిలిన బంగారపు పండ్లకోసం అక్కడే ఎదురు చూస్తున్న కొందరు బౌద్ధ లామాలు వీటిని తింటూ ఏదో జ్ఞాన అనుభూతి పొందుతూ చుట్టూ ఉన్న పరిసరాల అడవులలోనికి వెళ్లి వనమూలికలు సేకరించి వాటితో ఏవో ప్రయోగాలు చేస్తున్న దృశ్యం కనబడింది. ఇది దేనికి సంబంధించినది. ఇది నిజమా లేదా అబద్దమా అనుకొనే లోపల నాకు ధ్యాన భంగమైనది. ఆ తర్వాత ఈ కలకు సంబంధించి పుస్తక గ్రంథాలు తిరగవేస్తే ఒకచోట ఈ సరస్సు మానససరోవరం అని ఆ కనిపించిన వృక్షము కల్పవృక్షం అని దాని పండ్లు బంగారంగా మారటానికి కారణం ఈ నీటి అడుగు భాగంలో బంగారపు మహాలింగం ఉన్నదని అందువలన దీనిని తాకిన ప్రతి పదార్థము కూడా బంగారంలాగా మారుతుందని ఇది తెలుసుకున్న కొంతమంది దేశస్తులు ఈ సరస్సు దక్షిణ భాగంలో త్రవ్వకాలు జరిపితే బంగారపు గుప్తనిధులు ఉన్నాయని కాకపోతే వీరికి తీవ్రమైన మశూచి రావటంతో అందరూ చనిపోతూ ఉండటంతో ఈ నిధుల వేట కొనసాగించలేదని చిట్టచివరిగా వీరికి కుక్క రూపములో బంగారపు ముద్ద దొరికిందని హిందూ పురాణాలలో ఈ ప్రాంతాన్ని జంబూద్వీపంగా పిలుస్తారని సంకల్పములో వచ్చే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటే ఇదేనని నాకు అర్థమైనది. అంటే బౌద్ధ లామాలు ఈ దివ్య పండ్లు తినటం వలన వారికి వివిధ రకాల దివ్య జ్ఞానము కలగటంతో అవి ఉన్న చోటికి వెళుతున్నారు. ఎందుకంటే ఈ పర్వతాల చుట్టూ 100 దివ్య మూలికలు ఉన్నాయని మూలిక శాస్త్రం చెబుతున్నది. వీటిని ఉపయోగించుకొని చచ్చినవాళ్లు బ్రతకవచ్చు.ఉన్న వాళ్ళకి ఆకలి అధిక వేడిని నిద్ర లేకుండా చేసుకోవచ్చును. జంతువుల భయము చావు మరణాల భయాల నుండి తప్పు కొనవచ్చును. బంగారము తయారుచేయవచ్చును. సిద్ధులు పొందవచ్చును.
మూలిక విజ్ఞానము కూడా ఒక మహా మాయకి కారకము:
ఈ మూలిక విజ్ఞానము కూడా ఒక మహా మాయకి కారకము అవుతుందని నాకు ఒక యోగి స్వానుభవం ద్వారా తెలిసినది. చందోలు గ్రామవాసి అయిన బాలాదేవి ఉపాసకులు అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి అనుభవములో ఈయన ఈ సాధనకి వచ్చినప్పుడు సమస్త మూలికా వైద్య విజ్ఞాన వీచికలు ఈయన మెదడుకి చేరుతాయి. దానితో ఈయన వివిధ మూలికా వైద్య అనుభవాలను ధ్యానములో పొందడం జరిగినది. వీటిని అమలు చేసి రోగాలు వ్యాధులు తీవ్రతను ఇతరులకు తగ్గించడం చేసేవారు. ఇలా కొన్ని సంవత్సరములు దాకా జరిగినది. చివరికి ఈ మూలికా వైద్యంతో దేవతలను, దైవిక శక్తులు, తాంత్రిక శక్తులు, మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తులు విశ్వమును ఎలా వశపరుచుకోవచ్చు అనే దాకా వెళ్లి పోయినది. ఈయనకి ఈ విశ్వమును ఎలాగైనా వశపరచుకోవాలని జిజ్ఞాస విపరీతంగా కలిగినది. దానితో ఈ వేరుకి సంబంధించిన వివరాలు తన ధ్యాన అనుభవము ద్వారా పొంది ఆ వేరు కోసం ఒక కొండపైకి వెళ్ళి దాని కోసం వెతకడం ప్రారంభించే సమయానికి దత్తాత్రేయుడు చిన్న బాలుడి రూపంలో వచ్చి “అయ్యా! నీకు స్వయముగా అమ్మవారే పిల్ల రూపంలో మీ ఇంట తిరుగుతున్నప్పుడు ఈ ఆలోచన… ఈ కోరిక మీకెందుకు? అది నీకు అవసరమా? వెనుతిరిగి వెళ్ళిపో” అంటూ హెచ్చరించినా దానికి ఈయన “నాకు అమ్మ కనపడినది మంచిదే !కాని నాకు ఈ విశ్వ ఆధీన శక్తి గల వేరు కావాలి! అది ఎలాగైనా సంపాదించాలి” అంటూ వెతకటం ఆరంభించాడు. ఈ పిల్లవాడు ఈయనతో వాదించడంతో కావలసిన వెతకవలసిన ముహూర్త సమయము కాస్త గడచిపోయినది. దానితో ఆ వేరు కనిపించలేదట. ఈ పిల్లవాడి వలన ఇది అంతా జరిగినదని అనుకుంటే ఈ పిల్లవాడు అక్కడ కనిపించలేదట. ఇంటికి వచ్చి విచారణ చేసుకుంటే ఈ వేరుకి అధిపతిగా దత్తాత్రేయస్వామి ఉంటాడని ఆయనే స్వయంగా ఈ పిల్లవాడి రూపములో వచ్చి అడ్డుకోవటం జరిగినదని అర్ధమయ్యేసరికి ఆయనని గుర్తుపట్టకపోవటము ఈయనకి కన్నీళ్ళు రావడం జరిగినది. అంతా తనకి ఉన్న విశ్వము స్వాధీనం కోరిక మాయ వలన ఈ మహత్తర అవకాశం కోల్పోయినాను అని వారు గ్రహించినారు. ఆనాటి తో లోకానికి మేలు జరిగే మూలిక వైద్యం పొందే రోగులకు మూలికా వైద్యం చేయటం ఆరంభించారు. కొంపదీసి నాకు కూడా ఉన్న జ్ఞాన విజ్ఞానములు కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ మూలిక వైద్యం అందుతుందా ఏమో ఎవరికి తెలుసు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకోవాలి గాని ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రయోగాలు చేయరాదని చెప్పరాదని ఇవ్వరాదని బాగా నిశ్చయించుకున్నాను. తెలుసుకున్న జ్ఞానము క్రొత్తగా తెలుసుకోవటానికి ఏముంటుంది. మహామాయలో పడటానికి తప్ప ఏమి ఉపయోగం ఉండదు. మనకి ఎప్పుడు ఏమి కావాలో అన్ని అందేటట్లు గా మనకి మనమే విధాత బ్రహ్మగా మారి వివరాలతో అన్ని రాసుకుని వచ్చిన తరువాత కూడా భయపడటం ఎందుకు. అర్థం లేదని ప్రగాఢ నమ్మకం. దానికి తగ్గట్లుగా ఈ ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇంకా ఏమీ లేదని ఏమి పొందలేదని దిగులు పడటం అవసరమా? ఇంకా ఏదో పొందాలని అనుకోవటం నా దృష్టిలో అవివేక పని.ఇది నేను చేయదల్చుకోలేదు చేయను కూడా అనుకుంటూ కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానం లో వివిధ రకాల దివ్య శక్తులు ఉన్న మొక్కలు వాటి వేరు విజ్ఞానము తెలియడము ఆరంభమైనది. ఉదాహరణకి నాకు ఇలా వచ్చిన జ్ఞానముతో తేజ్ బల్ అనే చెట్టు కర్రను తీసుకొని మనము నిద్రపోయే చోట చుట్టూ ఒకసారి గుండ్రముగా రాస్తే పాములు, పులులు,సింహలు వంటి ఇతర జంతువులు, క్రిమికీటకాలు చివరికి ఈగలు, దోమలు కూడా ఈ గీత దాటి లోపలికి రాలేవు. తన చేతి కర్ర శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉపయోగించి తను కాపు కాసే ఆవులమంద చుట్టూ దీనితో గీత గీసి ఈయన ప్రశాంతముగా అక్కడ ఉన్న గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం గ్రంథం వ్రాసే వారట. ఈ కర్ర గీత దాటి ఆవులు బయటకి వచ్చేవి కావు. అలాగని వీటిని తినటానికి వచ్చే పులులు, సింహాలు ఈ గీత దాటి లోపలికి ప్రవేశించే కావు. ఇప్పటికైనా ఇది ఎవరి మహిమో అర్థం అయినదా? ఇటువంటి విచిత్ర సచిత్ర రహస్యాలు ఉన్న విజ్ఞానము పొందినవాడే దేవుడవుతాడు. ఎందుకంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఎందరో మహా వృద్ధులు, జ్ఞానులు, యోధులు ఉన్న కూడా రక్షించ లేకపోతే ఎక్కడో ఉన్న శ్రీకృష్ణుడు తనకున్న పరిజ్ఞానంతో రక్షించినాడు. ఇలా ఆపద సమయంలో రక్షించినాడు కాబట్టి ఈయన దేవుడు అయినాడు. అలాగే ఈ సభలో దీనిని అశ్వద్ధామ కొంతసేపు ప్రతిఘటించాడు కాబట్టి ఈయన చిరంజీవి తత్వం పొందినాడు. అలాగే శ్రీ లాహిరి మహాశయులు తనకి వచ్చిన ఈ వైద్య విజ్ఞానంతో రోగాలను నయం చేసే వారట. కొన్నిసార్లు తన మలమూత్రములు తీర్థం ఇచ్చి రోగాలు నయం చేసే వారని వారి అనుభవం డైరీలో రాసుకోవడం జరిగినది. పరిశుద్ధమైనప్పుడు కూడా మలమూత్రం కర్పూర వాసనలతో సుగంధ పరిమళాలతో ఉంటాయని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తీవ్రమైన రోగాలు వచ్చినప్పుడు తన మలమూత్రాదులు మందుగా వాడి క్షణాలలో ఆరోగ్య తీవ్రతను తగ్గించే వారు. యోగులు ఏది చేసినా తప్పుగాదు. భోగులు ఏమి చేసినా తప్పే అవుతుంది. చమత్కారాలు చేసేవారికే మన జనాలు నమస్కారాలు చేస్తారు కదా. నోటిలో ముందుగానే ఉంచుకొని అవసర సమయాలలో వాటిని తీసే లింగ బాబాలను నమ్ముతారు. నవపాషాణాలతో నిర్మితమైన ఇష్టలింగాలు తయారు చేసే సిద్ధ యోగులను నమ్మకపోవడం మనము చేసుకున్న దౌర్భాగ్యం. దురదృష్టము.
జిజ్ఞాసి కాస్త మౌన:బ్రహ్మగా మారడటం:
ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానములో ఉన్న యోగ మిత్రుడైన జిజ్ఞాసి సెల్ఫీ వీడియో కనిపించసాగింది. అంటే ఆయన నాగసాధువు దీక్షలో ఉండి చేసే పనులు ఒక వీడియో దృశ్యము లాగా నాకు కనిపించడం జరుగుతుంది. ఇదివరకటిలా గా ఈయన నాతో తన అనుభవాలను పంచుకోవటానికి టెలిపతి లోనికి రావడం పూర్తిగా మానివేసినారు. ఎందుకంటే ఆయన కాస్త శూన్య బ్రహ్మ స్థితి పొందటం వలన ఎవరితోనూ మాట్లాడడు మాట్లాడాలని అనిపించటంలేదు. ఎవరితోనూ ఏమి పంచుకోవాలని అనిపించటం లేదు. ఎవరికి కూడా కనిపించాలని అనిపించడం లేదని నాకు స్పురణ అయినది.అందుకే నేను కూడా వారిని పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. కాకపోతే ఎప్పుడైనా నాకు సాధన సందేహాలు వస్తే ఆయనకు ఈ స్థితి వచ్చిందా లేదా అని అనుకోగానే ఇలా నాకు లైవ్ కనపడటం మొదలుపెట్టిన దృశ్యాలు నేను చూస్తున్నానని గమనించిన ఆయన పెద్దగా స్పందించడం మానివేసినాడు. అంతా మౌనముగా అన్నిటికీ సాక్షీభూతంగా చిరునవ్వే సమాధానంగా ఉండటం నేను గమనించాను. నాకు కూడా ఈ విషయంలో ఆయన నాతో కూడా మాట్లాడటం లేదని బాధ అనిపించేది కాదు. పైగా ఆనందము వేసేది. పైగా నేను ఆయనకి అలాగే ఆయన నాకు కర్మ బంధం మాయ కాలేదని సంతోషపడుతూ ఉండేవాడిని. నాలాంటి వెర్రిబాగులవాడు మరొకడు ఉండడు కదా. అందుకే నన్ను శ్రీ దత్త స్వామి ఓరి వెర్రి వెంగళప్ప అనేవాడు. అది సరే గానీ మరి నాకు వస్తున్న మూలికా వైద్య విజ్ఞానం ఈయనకి వస్తుందా అనే సందేహంతో ఈయన వీడియోను నా ధ్యానములో చూడటం జరుగుతుంది. ఈయన మల విసర్జన చేయటం కనబడినది. తరువాత ఈయన లేచి తన మలమును ఒక పౌడర్ లాగా ఒంటికి పూసుకోవడం జరిగినది. దానికి నేను పెద్దగా ఆశ్చర్యము చెందలేదు. నిజమైన బ్రహ్మజ్ఞానికి ఆహారము అన్నా మలము అన్నా ఒకటే. ఈ రెండూ కూడా ఆకలి తీర్చేవే అని వారికి తెలుసు. నాకు తెలుసు. కానీ ఎందుకు అలా పూసుకుంటున్నాడు తెలుసుకోవాలనే తపన నాలో ఉంది. కొద్ది సేపు అయిన తరువాత ఎండలో ఒక బండ మీద ఒక శిలా విగ్రహము లాగా నాలుగు గంటల పాటు అలా కూర్చుని ఉండి పోయినాడు. మండు వేసవిలోని మిట్ట మధ్యాహ్నం ఎండ లాగా ఉంది. తిండి లేదు. ఫలాలు తినడం లేదు. ఇలా ఎండలో కూర్చుని లేచిన తర్వాత చూస్తే ఈయన పూసుకున్న మలము కాస్త తెల్లని విభూతిగా మారిపోవటం అలాగే ఇది కాస్త సుగంధ పరిమళాలతో కూడిన వాసన అనుభూతి నేను పొందటము జరిగినది. ఆ తర్వాత ఏవో మూలిక వేరులు నోటిలో పెట్టుకుని చప్పరించి ఊచివేయడం జరిగినది.అంటే ఈయనికి కూడా మూలికావైద్యం జ్ఞానము అందుతుందని నాకు అర్థమయ్యే సరికి ఈ వీడియో దృశ్యము కాస్త అదృశ్యం అయినది. ఎవరికైతే సిద్ద యోగులు తమ సహస్ర చక్రశుద్ధి అవుతుందో వారి మలము నుండి కర్పూర వాసన వస్తుందని వారి మలము కాస్త విభూదిగా మారుతుందని అలాగే వీరికి ఆహారము కూడా మొక్కల వలె సూర్యరశ్మితో కిరణజన్యసంయోగక్రియ ద్వారా చేసుకుంటారని యోగశాస్త్ర గ్రంథాలు చదివితే నాకు అర్థమైనది. దానితో నేను కూడా ఈ చక్ర స్థితి లోనే ఉన్నాను కదా. మరి నా మలము నుండి గూడ కర్పూర వాసన నాకు తెలియకుండా మొదలైందా అనే సందేహం వచ్చినది. ఆనాటి నుండి నా మలము వాసన చూసుకోవటం మొదలైనది. మలము వాసన ఎందుకు వస్తుంది. వస్తే ఈ బాధలు ఉండవు కదా. కాకపోతే చెడువాసన పరిమాణము కొద్ది కొద్దిగా తగ్గుతుందని తెలుస్తుంది. అలాగే నేను కూడా సూర్యరశ్మితో ఆహారం చేసుకోవాలని ఎండలో కూర్చోవటం ప్రారంభించాను. 20 నిమిషాలు కూర్చోగానే నాలో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి తద్వారా లోబీపీ మొదలై కళ్ళు తిరగటం ప్రారంభించే సరికి చాక్లెట్లు తినటానికి పరిగెత్తవలసి వచ్చినది. ఎందుకు వచ్చిన ఈ కష్టాలు. మరి ఇవి అవసరమా? తెలుసుకోవాలా? ప్రాణాల మీదకి తెచ్చుకోవాలా? మనకి యోగం ఉంటే అవి వచ్చే సమయంలోనే వాటంతట అవే వస్తాయి కదా అనుకొని ఇతర యోగులను అనుసరించటం అలాగే అనుకరణ చేయడము పూర్తిగా మానివేశాను. అందుకే మన పెద్దలు జ్ఞానిని అనుకరణ చేయరాదని అలాగే అజ్ఞానిని అనుసరించరాదు అని చెప్పినారు. వాడేమో నాగసాధువు దీక్షలో సిద్ధ జ్ఞానిగా ఉంటే నేనేమో గృహస్థ దీక్షలో జ్ఞాన మార్గంలో బ్రహ్మ జ్ఞానిగా ఉంటే మా ఇద్దరి సాధన స్థితి గతులలో తేడాలు ఉంటాయని జ్ఞానము నాకు లేకుండా పోయింది. ఆయన ఎండలో కూర్చుని ఆహారం చేసుకున్నాడని నేను మూర్ఖముగా ప్రయత్నిస్తే ఇలాగే ఫలితాలు వస్తాయి. శరీరము పోతే సాధన ఎలా మరి. కాబట్టి ముందుగా శరీర ఆరోగ్యమును చూసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అందుకే షిరిడి సాయి బాబా వారు ఉల్లి జీర్ణం చేసుకునే వాళ్లే దానిని తినాలి అని అంటుండేవారు. ఎవరి శరీరానికి తగ్గ సాధనలు ముందుగానే ప్రకృతి నిర్దేశించడము జరుగుతుంది. ప్రక్క వాడిని అనుసరిస్తే నానా కష్టాలు పడవలసి వస్తుందని నాకు అర్థమైనది. భగవద్గీతలో కూడా పరధర్మం కన్నా స్వధర్మము ఆచరించడం చాలా మేలు అని చెప్పకనే చెప్పినారు కదా. అప్పుడు అది చదువుతున్నప్పుడు అర్థమై చావలేదు. అనుభవము అయ్యి అర్థం కాకుండా ఉండలేదు.
జిజ్ఞాసికి ప్రత్యక్ష శ్రీకృష్ణ అనుభవ దర్శనం:
ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానములో వేణువు వాయిస్తున్న 24 సంవత్సరముల యువకుడైన పశువుల కాపరి కనిపించసాగినాడు. ఈయన ఎవరు ఎందుకు కనబడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఈ అనుభవము ఎక్కడిదాకా తీసుకొని వెళుతుందో చూద్దామని ధ్యానము ఆపకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను. ఈ వేణుగానానికి మేత మేస్తున్న ఆవులు కాస్త అతడి చుట్టూ చేరడం ఆరంభమైనది. ఇంతలో అక్కడికి నా జిజ్ఞాసి అయిన నాగసాధువు రావడం జరిగినది. వెంటనే యువకుడు “ఏమిటి స్వామి! మీరు కూడా నా వేణుగానానికి సమ్మోహనం చెంది ఇక్కడికి వచ్చినారా? అలా వచ్చినవి ఈ ఆవులమంద “అనగానే జిజ్ఞాసి వెంటనే “నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి వేణునాదం వాయిస్తున్నావు. నిన్ను దాటాలని అనుకుంటున్నాను” అన్నాడు. దానికి ఆ యువకుడు “అయ్యా నన్ను దాటాలని అనుకుంటే నేను వాయించే వేణుగానము యొక్క శక్తి దాటాలి. మీరే కదా కృష్ణ కృష్ణ అంటూ నన్ను నీ చైతన్యంలో కలుపుకో అంటూ ప్రార్థనలు చేస్తున్నారు కదా అందుకే వచ్చాను. ఇంకా నేను ఎవరో మీరు గుర్తు పట్టినట్టు లేదు” అనగానే జిజ్ఞాసి వెంటనే “నేను కృష్ణ అనేది నీ రూపధారి అయిన కృష్ణ స్వరూపం గురించి కాదు. నాకు కావలసినది శ్రీ కృష్ణ రూపం కాదు. కృష్ణచైతన్య పరబ్రహ్మము. నాకు నీతో పనిలేదు. నీ నాదము కన్న మా నాదము విను! నువ్వే సమ్మోహనము అవుతావు” అంటూ తన సహస్రార చక్రములో వినిపించే అంతర్గత వేణు నాదము బయటికి వినిపించేసరికి ఈ మాయ కృష్ణధారి అయిన యువకుడు క్షణాలలో అదృశ్యమయ్యాడు. అంటే ఈ లెక్కన నా జిజ్ఞాసికి కూడా ప్రత్యక్ష శ్రీకృష్ణ అనుభవం దర్శనం అయినది అని నాకు అనిపించగానే నాకు ధ్యాన భంగము అయినది.
నాకు నిజ దక్షిణామూర్తి దర్శనము:
ఒక రోజు నేను అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా సహస్ర చక్రమైన మెదడు భాగం లోనికి ఏవో అక్షరాలు గుర్తులు సంఙ్ఞలు ఎన్నో వందలు వేలు లక్షలు కోట్లు నా మెదడు లోనికి వెళ్ళి పోతున్నట్లుగా అనుభూతి కలగ సాగింది. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది ఎలా ఉంది అంటే కాళిదాసు సినిమాలో మహాకవి కాళిదాసు కి అమ్మవారు దర్శనము ఇచ్చి వారిని జ్ఞానవంతులు చేయటానికి ఏవో అక్షరాలు అతడి మెదడులోనికి వెళ్ళటం జరిగేటట్లు గ్రాఫిక్స్ రూపంలో చూపించడం జరిగింది. అలాంటి దృశ్యమే ఇప్పుడు నాకు అనుభవంలోకి జరుగుతోంది. ఈ అక్షర జ్ఞానము ఎవరు నాకు అందిస్తున్నారో అర్థం అవ్వక తికమక పడుతుంటే చిమ్మచీకటిలో శూన్య స్థితిలో ఒక వృక్షము లీలగా కనబడింది. దాని క్రింద నలుచదరపు ఒక పెద్ద రాయి కూర్చోవడానికి వీలుగా ఉంది. దీని పైన ఒక వ్యక్తి నల్లటి ఆకారంలో కూర్చుని వున్నట్లుగా ఎడమ కాలు మడిచి పెట్టుకొని కుడి కాలు నేల మీద పెట్టినట్లుగా ఒక చేతిలో ముద్ర మరొక చేతిలో తాళపత్ర గ్రంథం ఉన్నట్లుగా లీలగా కనిపించేసరికి వామ్మో ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తి సాక్షాత్కార అనుభూతి జరుగుతుందని నాకు అర్థమైనది. ఆయన అర్ధ నిమీలిత నేత్రాలతో ఉన్నాడు. మాట్లాడడు. మౌనంగా ఉన్నాడు. కదలడు. కూర్చొని ఉన్నాడు. ఈయన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంధం నుండి ఈ అక్షరాలు బయటికి వచ్చి నా మెదడుకి చేరుతున్నాయి అని నేను గ్రహించాను. కొన్ని క్షణాల తర్వాత ఆయన చేతిలో దైవిక వస్తువులు మారిపోయి వీణ జపమాల కనిపించినాయి. కొత్తగా వచ్చిన రెండు చేతులలో ఈ క్రొత్త వస్తువులు ఉన్నాయి అని గ్రహించాను. అంటే ఈయనకి నాలుగు చేతులు అన్నమాట. ఎప్పుడైతే వీణ ఈయన చేతిలో కనపడినదో అప్పుడు ఈయన దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథము నుండి సమస్త సంగీత జ్ఞానమునకు సంబంధించిన విజ్ఞాన గుర్తులు అక్షరాలు అన్ని నా మెదడుకు చేరుకున్నాయని అర్థం అయినది. అనగా ఈయన జ్ఞాన ప్రదాత కాబట్టి ఈ విశ్వ సృష్టిలో ఉన్న అన్ని రకాల సమస్త జ్ఞానము ఇప్పుడు ఈయన నాకు ప్రసాదిస్తాడు అని అర్థం అయ్యే లోపల ఈయన చేతులలో ఈసారి దైవిక వస్తువులు మారినాయి. వాటికి సంబంధించిన జ్ఞాన సంబంధ విషయాలు నా మెదడుకి చేరటం జరిగినది. ఇలా ఈయన 16 రూపాలలో రూపాంతరం చెంది సమస్త జ్ఞానమును 16 విధాలుగా అందించటం జరిగినది. అనగా జ్యోతిష్యశాస్త్రము, ఖగోళ శాస్త్రము, సంగీతము, నాట్యము, సమస్త వైద్యము, మంత్ర శాస్త్రము, తంత్ర శాస్త్రము, యంత్ర శాస్త్రము,మనోజ్ఞ శాస్త్రము,మోక్ష జ్ఞానము, త్రికాల జ్ఞానం, భాషా జ్ఞానం ఇలా 16 విధాలుగా అందించడం జరిగినది. ఆయన ఎదురుగా నేను ఉన్నాను. ఆయన నన్ను చూస్తున్నాడో లేదో తెలియదు. కేవలము మౌన భాషలో సమస్త జ్ఞాన విజ్ఞానము ఇవ్వటం నాకు ఆశ్చర్యము అనిపించింది. పైగా ఈయనని చూస్తుంటే తాండవము చేసి అలసిపోయిన చిదంబర నటరాజుగా అనిపించసాగింది. ఎందుకంటే ఆయనకి ఉన్న ఆయుధాలు ఈయనకి ఉన్నాయి. అలాగే ఆయన ఎడమ కాలు మడిచి ఎత్తితే ఈయన తన ఎడమ కాలు మడిచి కూర్చున్నారు. ఇద్దరూ కూడా కుడి కాలు క్రింద పాముతో ఉన్న ఒక చిన్న రాక్షసుడిని తొక్కుతూ ఉన్నట్లుగా ఉన్నారు. అంటే ఈయన నిజంగానే దక్షిణామూర్తి కాస్త నటరాజ స్వరూపం అని అనుకుంటుండగా ఈయన దగ్గర నుండి మౌన భాషలో 'త్యాగాత్ శాంతి అనంతరం' అని మౌనముగా వినబడసాగింది. అనగా త్యాగము వల్లే శాంతి లభిస్తుందని అర్థము. నాది అంటూ అన్ని త్యాగం చేశాను కదా ఇంకా నేను ఏమి చేయాలి అనుకుంటే అహంబ్రహ్మాస్మి అని మౌనముగా వినిపించినది. ఇంతలో నా ధ్యానభంగమైనది. ఇంతవరకు బాగానే ఉన్నది.
నా మెదడు లో ఈయన ఉన్నట్లుగా సజీవ మూర్తిగా ఈ భూలోకంలో ఎక్కడో ఒకచోట కనిపించాలి కదా అనే ధర్మ సందేహం వచ్చినది. ఈయనను సజీవ మూర్తిగా చూడాలనే తపన నాలో మొదలై తీవ్రమైన ధ్యాన తపస్సు చేయటం ప్రారంభించాను. మూడు నెలల తరువాత ఒక రోజు అర్ధరాత్రి పూట ఒక దివ్య ధ్యాన అనుభవం కలిగినది. అది ఏమిటంటే ఒక పర్వతము మీద ఒక దివ్య జ్యోతి దర్శనం అయినది. ఈ పర్వతం యొక్క అంతర్గత గుహ లోపలికి వెళ్ళడానికి ఒక సన్నని ఇరుకైన చీకటి ద్వారము ఒకటి కనిపించినది. అప్పుడు నా సూక్ష్మశరీరము ఇందులో లోనికి ప్రవేశిస్తున్న ట్లుగా అనిపించసాగింది. అప్పటికే అందులో కొందరు కాంతి దీక్షాపరులు, కాంతి సూక్ష్మశరీరధారులు, నల్లని కాంతి శరీరధారులు, అలాగే తెల్లని కాంతి శరీరధారులు ఇలా ఎందరో అటూ ఇటూ తిరుగుతూ ఈ దారి వెంట కనిపించారు. వీరిని నా సూక్ష్మశరీరము దాటుకుంటూ ముందుకు చీకటి మార్గంలో వెళ్ళ సాగినది. ఇలా సుమారుగా 5 కిలోమీటర్లు దాకా వెళ్ళిన తర్వాత వెలుగు తో కూడిన సుందర అడవి ప్రాంతం ఎంతో మనోహరంగా ఉన్నట్లుగా అగుపించినది. అశోక వృక్షాలు సుందరమైన చెట్లు దట్టమైన పొదలు ఉన్న చెట్లు గుబురు చెట్లు అగుపించటం మొదలైనవి. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత విశాలమైన చిన్నపాటి ఆవరణలో కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక నల్ల రాతి రాయి మధ్య భాగంలో కనబడినది. అక్కడ ఎవరో నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఇంతలో ఎవరినో చూసి వీళ్లు వినయంగా నిలబడటం గమనించగానే ఆ రాతి మీద తెల్లని తేజస్సుతో ఒక వ్యక్తి దివ్య రూపంతో దివ్యతేజస్సుతో కాంతి శరీరముతో కూర్చుని ఉన్నారని నాకు అర్థం అయ్యేసరికి ఈ నలుగురు వారికి నమస్కారము చేసి తిరిగి కూర్చొని ధ్యాన ముద్రలోనికి వెళ్లగా ఈ వ్యక్తి ఎవరా? అని నేను తేరిపార చూడగా నాకు వక్షస్థలము వరకు మాత్రమే శివుడు ముఖము ఉన్నట్లుగా ఒక చేతిలో అగ్ని ఉన్నట్లుగా మరొక చేతిలో జపమాల ఉన్నట్లుగా ఆ స్వరూప ఆకారం స్పష్టంగా అగుపించే సరికి వామ్మో దక్షిణామూర్తి నిజంగానే ఇక్కడే ఎక్కడో ఏదో గుహలో ఇప్పటికీ సజీవ మూర్తిగా ఉన్నారని నాకు స్పురణకు రాగానే ఆ ధ్యాన అనుభవము సంపూర్తి కాకుండానే నేను దానికి స్పందించడం వలన అది కాస్త అర్ధాంతరంగా ఆగిపోవటంతో నా స్థూల శరీరానికి ఎగశ్వాస రావటంతో నాకు ధ్యాన భంగమైనది.ఇది నిజమా కాదా అని పుస్తకాలు గ్రంథాలు తిరగవేస్తే అరుణాచలక్షేత్ర మహత్యంలో దీనికి సంబంధించిన వివరాలు తెలిసినాయి. నాకు ధ్యానంలో కనిపించిన పర్వతము అచ్చంగా అరుణాచల పర్వతమునే పోలి ఉండేసరికి నేను గతుక్కుమన్నాను. ఇందులోనే ఏదో మర్మము ఉన్నదని అనిపించగానే ఈ క్షేత్ర మహా మౌన ముని అయిన శ్రీ రమణ మహర్షి చరిత్ర చదవడము ప్రారంభించాను.
అందులో రమణ మహర్షికి అక్కడున్న ఇతర యోగుల అనుభవాల ద్వారా ఈ పర్వతము యొక్క అంతర్గత గుహలో ఉన్న మర్రిచెట్టు క్రింద సజీవమూర్తిగా దక్షిణామూర్తి ఆవాసము చేస్తున్నారని ఈయన తెలుసుకోవడము జరిగినది.దాంతో ఈయన ఒకసారి ఈ గుహలోనికి వెళ్ళి ఆ సజీవమూర్తిని చూడాలని కొంతమేర ఈ చీకటి గుహలొపలికి వెళ్ళడము అక్కడున్న భయంకరమైన అడవి తేనెటీగలు ఉన్న తుట్టె మీద ఈయన తెలియకుండా చిమ్మచీకటిలో కాలు వేసేసరికి అవి ఈయనని తీవ్రముగా కుట్టినాయట.ఆ బాధను ఎంతగానో ఓర్చుకొని మౌనముగా వాటి గూడులకు ఇబ్బంది కలిగించకూడదని నెమ్మదిగా వెనుతిరిగినాడట.ఆ సజీవమూర్తి దర్శనము గాకుండానే వెనుతిరిగినాడట.ఆ తర్వాత ఈయన ఈ గుహ నుండి బయటికి వచ్చేసరికి నడవలేని విధముగా కాలు విపరీతముగా వాచిపోయింది. అప్పుడు ఈయన శిష్యులు ఈ కాలికి గ్రుచ్చుకున్న తేనేటీగ ముల్లులు తీసినప్పటికి కూడ ఆజన్మాంతము ఈ కాలువాపు తగ్గలేదట. కొన్ని సం!!రాలకి ఈయనికి దక్షిణామూర్తియే ఒక ఙ్ఞాన జ్యోతిగా ఈ కొండ మద్యలో తాను సజీవమూర్తిగా ఉన్నట్లుగా తెల్లని గడ్డంతో సుమారు 80 సంవత్సరముల వయస్సు ఉన్న వయోవృద్ధుడు లాగా మౌన ధ్యానముద్ర ఉన్నట్లుగా సాక్షాత్కార మైనది అని వారి జీవిత చరిత్ర ద్వారా తెలుసుకోవడం జరిగినది. అంటే ఈ లెక్కన నాకు కలిగిన అనుభవం నిజమేనని గ్రహించాము. అలాగే ఇక్కడ ఉన్న 18 సిద్ధగురువులు ఈయన ఉన్న అంతర్గతగుహకి ఒక సొరంగమార్గం చేసినారు.ఒక అయనార్ ఈ మార్గము ద్వారా వెళ్ళి మేధాదక్షిణామూర్తి దర్శనము పొంది వారి అనుగ్రహమును పొందినాడని తెలిసినది. ఆతర్వాత ఇక్కడున్న రమణ మహర్షి వారు ఈ సొరంగ మార్గమును మూసివేసినారని తెలిసినది. కారణము లేనిదే కార్యముండదు గదా! ఇపుడికి ఈ క్షేత్రమునందు మూసియున్న ఈ సొరంగమార్గమును చూడవచ్చును.నాకు అరుణాచల కొండ అగ్రభాగములో ఉన్న ఈ రాతి మీద దక్షిణామూర్తి తన పరివారముతో
కూర్చునియున్నట్లుగా ధ్యానానుభవదర్శనం అయినది.విచిత్రము ఏమిటంటే నాకు ధ్యానములో కనిపించిన ప్రకృతి దృశ్యాలు అన్నిగూడ ఈ అరుణాచల కొండ అగ్రభాగానికి వెళ్ళుతున్నపుడు కనిపించినవేనని నేను వీడియోలు ద్వారా తెలుసుకున్నాను.అంటే పూర్వములో కొండమీద జంతువులభయము ఉండుటవలన కొండలోపుల అంతర్గత గుహ సొరంగమార్గమును ఏర్పాటుచేసుకొని కొండ అగ్రభాగానికి చేరుకొని ఉండాలి. ఎందుకంటే ఈ కొండ అగ్రభాగం మీద ఉన్న రాయి... నాకు ధ్యానములో దక్షిణామూర్తి తన పరివారముతో కూర్చునియున్నట్లుగా కనిపించిన రాయి ఒక్కటే గావడం విశేషం. బహుశా వీరంతా కారణశరీరధారులుగా ఉండుటవలన ఈ కొండ అగ్రభాగమున్న వాళ్ళు ఉన్న మనకి కనిపించడములేదు.నిజ యోగులకి,నిజశివభక్తులకి,నిజబ్రహ్మజ్ఞానులకి తప్పకుండా కనపడతారని ఈ నా నిజధ్యానానుభవమే అందుకు నిదర్శనమని గ్రహించండి.నేను ఈ విషయము అహముతో చెప్పడము లేదు.ఆత్మవిశ్వాసముతో చెపుతున్నానని గ్రహించండి.
కానీ దక్షిణామూర్తి ఏమి త్యాగము చేయమని చెబుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మరి నేను ఏమి త్యాగము చేయాలి.కానీ నాకు అర్థం కాని విషయం నా కంటూ ఏమీ లేకుండా నాది అంటూ ఏమీ లేకుండా సమస్తము త్యాగము చేసినాను కదా. మరి త్యాగము చేస్తే శాంతి లభిస్తుందని గురుదక్షిణామూర్తి యొక్క సందేశం మనకు అర్థం ఏమిటో అర్థం చేసుకోవాలని మేధా దక్షిణామూర్తి గూర్చిన పుస్తక గ్రంథాలు చదవడం ప్రారంభించాను. అప్పుడు దక్షిణామూర్తి దక్షిణభాగంలో ఉంటాడని ఈయనకి ఎడమవైపు అమ్మవారు లేని ఏకైక స్వరూపం శివస్వరూపము ఇదేనని ఒక చేతిలో ఢమరుకం మరొక చేతిలో అగ్నిగుండము ఒక చేతిలో చిన్ముద్ర మరొక చేతిలో తాళపత్ర గ్రంథం ఉంటుందని ఈయన కుడికాలి క్రింద ఉండే చిన్న రాక్షసుడు పేరు అపస్మారక అని ఈ పేరు అర్థం ఏమిటంటే తెలిసిన విషయమే మర్చిపోవటం అని ఈ చక్ర స్థితిలో ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తి ఇచ్చే సమస్త జ్ఞానము వలన జ్ఞాన అహంకార మహామాయ మొదలవుతుందని తద్వారా అపస్మారక స్థితిలో వెళ్ళి తను పరమాత్మ అనే విషయాన్ని మర్చిపోతాడని ఈ మహా మాయ దాటటానికి సంకేతముగా ఈయన లోకానికి చిన్ముద్ర చూపిస్తాడని ఈ ముద్రలో చూపుడువ్రేలు బొటనవ్రేలు కలిసి ఉండి మిగిలిన మూడు వ్రేళ్ళు వీటికి తాకకుండా పైకి తెరిచి ఉంటాయని ఇందులో చూపుడువేలు అనేది అహానికి సంకేతమని బొటనవ్రేలు అనేది విశ్వ చైతన్యమునకు సంకేతమని ఎప్పుడైతే అహమును ఈశ్వర విశ్వ చైతన్యముతో కలుపుతారో వారి మూడు శరీరాలు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నాశనము అవుతాయని ఇవి మిగిలిన మూడు వ్రేళ్ళు సంకేతం అని చెప్పటం జరిగినది. అహం మాయలో పడి అపస్మారక స్థితి లోనికి వెళ్లి తను పొందిన జ్ఞానమును మర్చిపోవటం జరుగుతుందని దీనిని గుర్తు చేసుకోవడానికి మౌనముగా చిన్ముద్ర తో శక్తిపాత సిద్దితో ఆది గురువు అయిన దక్షిణామూర్తి 16 రూపాలలో అనగా శుద్ధ, మేధ లక్ష్మి, హయగ్రీవ వాగీశ్వర,వటమూల, సాంబ హంస ,లక్కుట, వీర, వీర భద్ర, కీర్తి, బ్రహ్మ, శక్తి, సిద్ది, చిదంబర దక్షిణామూర్తిగా ఉండి తన ధారణా శక్తి తో శక్తి పాతము మౌనంగానే మరిచిపోయిన విషయాలు గుర్తుకు తెస్తారని తెలిసినది. ఇంతవరకు బాగానే ఉన్నది.
నేను ఏమి త్యాగము చేయాలి?
మరి నేను ఏమి త్యాగము చేయాలి. ఆజ్ఞాచక్రము లో జీవ మాయగా అహంకారము వస్తే దానిని త్యాగము చేసి దాటినాను కదా. మరి నేను క్రొత్తగా త్యాగం చేయడానికి ఏమి ఉంటుంది. ఇందులో ఏదో తెలియని చిదంబర రహస్యం ఉన్నది. అసలే ఈయన రూపాలలో చిదంబర దక్షిణామూర్తి రూపము ఒకటి వున్నది కదా అనుకుంటూ సుమారుగా దీని అంతు చూడాలని మూడు నెలలు పైగా కుస్తీ పట్టినాను.ఎన్నో పుస్తక గ్రంధాలు చదివినను ఎక్కడా కూడా నాకు నచ్చిన సమాధానాలు లేవు. వీడియోలు చూశాను. వెబ్ సైట్ లలో వెతికినా కూడా నాకు కావాల్సిన సమాధానం దొరకలేదు. దొరికితే అది చిదంబర రహస్యం ఎందుకు అవుతుంది.ఇలా తీవ్రమైన ఆవేదనలో అనగా ఏమి త్యాగం చేయాలో అర్థం కాని ప్రశ్న నా స్థిర ఏకైక ఆలోచన అయినది. రానురాను ఈ ప్రశ్నకి సమాధానం దొరకని స్థితి ఏర్పడ సాగినది. అప్పుడు తరచుగా నాకు ఆలోచన లేని స్థితిలో ఎక్కువగా గంటల నుండి మూడు రోజుల దాకా ఉండటం జరుగుతోందని గ్రహించాను. అనగా నాకు ప్రారంభ నిర్వికల్ప సమాధి స్థితి మొదలైనది అని అర్థం అయినది. అప్పటిదాకా నాకు నలభై ఎనిమిది నిమిషాలకు మించి ఆలోచన లేని స్థితి ఉండేది కాదు. అప్పుడు సవికల్ప సమాధి స్థితిలో ఉన్నాను అని గ్రహించాను. ఇప్పుడేమో ఏకంగా వరుసగా మూడు రోజులపాటు సమాధిస్థితిలో ఉంటున్నాను.ఇలాంటిది ప్రారంభ నిర్వికల్ప సమాధి అని యోగ శాస్త్రాలు చెప్పటం జరుగుతుంది. ఈ మూడు రోజులు సమాధిలో ఉన్నా కూడా నాకు మూడు నిమిషాలుగా మాత్రమే నేను సమాధిలో ఉన్నాను అని అనిపించేది. కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే మూడు రోజులు అయిపోయినాయి అని అనిపించేది. మరి ఈ మూడు రోజులు ఆఫీసుకి సెలవు పెట్టేవారా అనే సందేహం వచ్చిందా? నేను ఎప్పుడైతే ప్రారంభ సమాధి స్థితి అనగా విశుద్ధ చక్రం సాధన స్థితిలో జీవ ప్రకృతి నా శరీర పోషణకి కావలసిన ధనసంపాదన ఏర్పాట్లు చేసినది. వచ్చిన ధనమును అనగా F.D లు రూపంలో నెలకి పదివేలు వచ్చేటట్లుగా ఏర్పాటు చేసినాను. దానితో వేరే సంపాదన కోసం ఎలాంటి వ్యాపారాలు ఉద్యోగాలు చేయటం మానివేశాను. ఇంట్లో కూర్చొని యోగసాధన చేసుకోవటమే నా నిత్య పని. నిత్య పూజ నిత్య పనులు చేసుకోవటమే గాని ధనము సంపాదించవలసిన అవసరము ఎన్ని అవకాశ మార్గాలు వచ్చినా కూడా ధన మాయలో పడతాయని గ్రహించి మనకి ఎంత కావాలో ప్రకృతి మాత ఏర్పాటు చేసినప్పుడు మనము అత్యాశకు పోవటం అంత మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. దానితో నేను నా సాధన చేసుకోవటానికి ఎక్కువ సమయము కేటాయించే అవకాశం కలిగినది. అలా ప్రకృతిమాత నాకు ఏర్పాటు చేసినది.ఇలా నేను నిర్వికల్ప సమాధి స్థితిలో మూడు రోజులకు మించి ఉండని స్థితిలో ఉండే వాడిని. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడల్లా నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని పుస్తకాలు గ్రంథాలు చదవడం చేసేవాడిని. తీరా దొరకక పోయే పరిస్థితికి తీవ్రమైన ఆవేదన కలగటం మళ్లీ మూడు రోజులు నిర్వికల్ప సమాధి స్థితి లోనికి వెళ్లి రావటం తరచుగా జరుగుతూ ఉండేది. ఇలా వెళ్ళిన ప్రతిసారి “స్వామి! ఇంకా ఎంత కాలము నన్ను బాధ పెడతావు నేను నీ దగ్గరికి వచ్చినాను అని తెలుసు. అడుగు దూరంలో ఉన్నాం అని తెలుసు. కానీ నిన్ను అందుకోలేక పోతున్నాను అని నిన్ను పొందలేకపోతున్నాను అని నాకు తెలుసు. ఇలా నా చేత విలపింపచేయడం బాధపెట్టటం భావ్యమా? ఇంకెంతకాలం గురుదేవా! నీవైన చెప్పు ఏమి త్యాగం చేయాలి. చాలా దగ్గరగా వెళుతున్నాను కానీ సంతోషము అందుకోలేదని తెలిసినప్పుడు బాధ అని” నా జీవాత్మ విలపిస్తూనే ఉంది. ఇలా విలపిస్తూ విలపిస్తూ తీవ్రమైన మనస్థాపానికి గురై 11 రోజుల పాటు ఏకధాటిగా కదలకుండా మెదలకుండా దేవీనవరాత్రుల సమయంలో మొదలైన నా సమాధిస్థితి ఏకాదశినాడు మెలుకువ వచ్చింది. ఇది ఏ నేను పొందిన పరిపూర్ణ నిర్వికల్ప సమాధి స్థితి. ఆ తర్వాత మెలుకువ వచ్చి చూస్తే నా ప్రశ్నకు సమాధానము నాకు వచ్చినది.అది ఏమిటంటే భగవద్గీత దీనికి సమాధానం ఖచ్చితంగా చెబుతుందని నాలో బలంగా అనిపించి శ్రద్ధ పెట్టి చదవటం ప్రారంభించాను.
ఇలా 12వ అధ్యాయము- భక్తియోగము లోని 12 వ శ్లోకంలోని ఆఖరి అక్షరాలు వద్ద నా మనస్సు ఆగిపోయినది. ఈ శ్లోక ఆఖరి పదాలుగా త్యాగాత్ శాంతి అనంతరం అని ఉన్నాయి. అంటే కర్మ ఫల త్యాగం వలన శాంతి లభిస్తుందని శ్రీకృష్ణపరమాత్మ ఇందులో చెప్పడం జరిగినది. మరి నేను చేసే ప్రతి కర్మ యొక్కఫలితమును శివార్పణం తో చేస్తున్నాను కదా. మరి నాకు ఎందుకు శాంతి లభించటం లేదు. ఇక్కడ శాంతి అంటే అమ్మాయి అనుకునేరు కాదు. శాంతి అంటే మనఃశాంతి, పరమశాంతి అనుకుంటుండగా అహం బ్రహ్మాస్మి అని గుర్తుకు వచ్చినది. దీని అర్థము నేను బ్రహ్మమై ఉన్నాను అని …నేను అనే అహం వదిలి పెట్టాలని నాకు స్పురణకు వచ్చినది. ఇన్నాళ్ళు నాది అంటూ త్యాగం చేసినాను కానీ నేను అనేది నేను దేహ ఆత్మబుద్ధి త్యాగము చేయలేదు కదా. నేను అనే దానిని త్యాగము చెయ్యకుండా అన్ని త్యాగాలు చేసిన ఎట్టి ప్రయోజనము ఉండదు కదా. అసలు నేను ఎవరిని? నేను అనేది లేదు కదా. ఈ నేను- తను అనేది ఎక్కడ నుండి వచ్చినాయి. తనువు పరమాత్మ నుంచే కదా. అనగా జీవాత్మగా ఆయననుండే కదా వచ్చినది. జీవాత్మ కాస్త దేహాత్మగా మారినది. నేను అనేది దేహాత్మ కాదని విశ్వాత్మ అని తెలిస్తే గాని అనగా నేను అనేది త్యాగం చేస్తే వచ్చేది పరమశాంతి గదా అనగా నేను అనే అహం త్యాగం చేయాలని చిదంబర దక్షిణామూర్తి నాకు మౌన సందేశం ఇచ్చినారు. అప్పుడే నాకు పరమ శాంతి కలుగుతుంది అని చెప్పకనే చెప్పినారు అని నాకు అర్థం అయింది. నా కళ్ళవెంట కన్నీటి ధార రాసాగింది. నిజానికి నేను అనే అహం బ్రహ్మము లో లయము చేస్తేనే అహంబ్రహ్మాస్మి అని గ్రహించాను.
నా తల నరకబడినది :
కానీ నేను అనే దేహాత్మ భావమును ఎలా త్యాగము చేయాలో అర్థం అయ్యి చావటం లేదు. ఇప్పుడు నేను చచ్చి పోవాలి అంటే చచ్చిపోలేను కదా. అలా నేను అనేది త్యాగం చేయాలి అంటే అది త్యాగం కిందకి రాదు. మరి దీనిని ఎలా త్యాగము చేయాలి. కానీ మిగతా గుణాలు లాగా దీనిని త్యాగము చేయలేను. అనగా సప్తవ్యసనాలు, అరిషడ్వర్గాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అన్ని సిద్ధులు శక్తులు, మానవాతీత శక్తులు ఇలా అన్నీ కూడా మన అదుపాజ్ఞలలో ఉంచుకోవచ్చును, కాబట్టి స్మశాన వైరాగ్యంతో వీటిని త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను అనేది వీటి లాగా త్యాగము చేయలేమా? త్యాగము చేశాను అనుకుంటే అది త్యాగం క్రిందకి రాదు. త్యాగము చెయ్యకపోతే మనశ్శాంతి దొరకదు. మరి నేను ఎలా త్యాగము చేయాలో అర్థం అవ్వక కొన్ని వారాలు గడిచి పోయినాయి. అప్పుడు ఒక రోజు నాకు విజయవాడ నుండి దుర్గామాత రమ్మని అన్నట్టుగా ధ్యానంలో కనబడుతూ కనబడటం ఆరంభమైనది. బంధువుల ఇంట్లో ఉండి నిత్యపూజలు అక్కడే చేస్తూ ఒకసారి కృష్ణా నది స్నానానికి వెళ్లి బయటికి వచ్చి… నది ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా 45 సంవత్సరముల వయస్సు నుండి ఎరుపు చీర జాకెట్టు వేషధారణతో రూపాయి బిళ్ళంత ఎరుపు కుంకుమ పెట్టుకుని ఎర్రని గాజులు వేసుకున్న ఒక స్త్రీమూర్తి మా దగ్గరికి వచ్చి “అయ్యా! అమ్మను చూడటానికి వచ్చినావా? ఇదిగో ఇది తీసుకో. నాకు పది రూపాయలు ఇవ్వు. అమ్మకి ముత్తయిదువు వాయనము ఇవ్వు. మంచి జరుగుతుంది” అంటూ ఒక కవర్ చేతిలో పెట్టి పది రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది. సరే అని ఈ కవర్ తీసుకొని మళ్లీ ధ్యానములో చూసుకుంటే ఈ కవర్ అలాగే ఇది ఇచ్చిన స్త్రీమూర్తి కనపడ సాగింది. దీనమ్మ జీవితం. ఎక్కడ చూసినా… ఎక్కడ ఉన్న ఈ ఆడవాళ్ళు నన్ను వదిలి పెట్టరు కదా. అసలు నేను అనేది ఎలా త్యాగం చేసుకోవాలో అర్థం అవ్వక ఒక ప్రక్క చస్తుంటే మధ్యలో ఈ స్త్రీ మాయ ఆపటం ఆవిడలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండవచ్చును. ఏదో తెలియని ముఖ వర్చస్సు ఉండవచ్చును. ఆ మాత్రానికే చొంగ కార్చుకోవాలా. మనస్సు కాస్త కామమయంగా మారుతుందని ధ్యానం చేస్తే మళ్లీ ఇదే దృశ్యం కనిపించేసరికి చిర్రెత్తుకొచ్చి అసలు ఈ కవర్ లో ఏముంది అని చూడగానే …
అందులో ఒక నల్లని దుర్గమాత అంగుళ విగ్రహమును మంగళసూత్రాలు, నల్లపూసలు, గాజులు, ఎరుపు జాకెట్టు అమ్మవారి విగ్రహ మూర్తి ఫోటో ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చినాయో అర్థం కాకుండా ధ్యానములో కూర్చుంటే ఈ సారి వచ్చిన స్త్రీ మూర్తి ముఖము కాస్త దుర్గామాత విగ్రహ మూర్తి ముఖముగా మారి పెదవులు మాత్రం కదుపుతూ” నాయనా! నేనే వచ్చినాను. వీటితో నా దేవి నవరాత్రి పూజ చెయ్యి! అంతా మంచే జరుగుతుంది. నీవు వెతుకుతన్న మార్గము దొరుకుతుంది” అని చెప్పి అదృశ్యమయింది. ఇంతకముందు నాకు పంచలోహ మహిషాసురామర్ధని విగ్రహమూర్తి వచ్చినదని మీకు తెలుసు కదా! ఇలా వచ్చిన వాటిలో నా దగ్గర ఉన్న దుర్గా యంత్రమునకు ఈ నల్లని దుర్గమాత విగ్రహ మూర్తి ని కలిపి ప్రతి సంవత్సరము దేవీనవరాత్రులు చేయటం ఆరంభించే వాడిని. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ నవరాత్రులలో ఒకరోజు మాత్రం ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నా భార్యతో మైధునము చేసే వాడిని. దానితో ఆ సంవత్సరము దీక్ష ఫలితం దొబ్బేది.మళ్లీ దీక్ష తీసుకుని ఒక సంవత్సరం ఎదురుచూసి నవరాత్రి పూజ చేయడం మళ్ళీ దొబ్బే సమయంలో ఆమె కాస్త ఉగ్ర విలయతాండవం చేస్తున్న దృశ్యం నాకు ధ్యానములో కనిపించేది.మైల సమయాలలో లేదా నెలసరి సమయాలలో శుద్ధి చేయకపోతే ఇప్పటిదాకా మా వాటర్ ట్యాంక్ నుండి మంచినీళ్లు బైటికి పొంగి ఆమె ఉన్నచోట శుద్ధి చేసుకోవటం జరుగుతుంది. ఇలా ఈ పూజతో నిగ్రహశక్తి రావడానికి నాకు ఐదు సంవత్సరములు పైన పట్టినది.
నాకు కలిగిన నిజ చిన్నమస్తాదేవి దర్శనానుభవం:
ఆ తరువాత ఇంతలో ఒక రోజు అర్ధరాత్రి పూట నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం ముందు ఒక దివ్యమైన సరస్సు కనపడినది. దీని దగ్గరికి స్నానం చేయాలని పదహారు సంవత్సరముల వయస్సు ఉన్న నగ్న స్త్రీ మూర్తి రావటము జరుగుతోంది. మెడలో ఆభరణాలుగా పుర్రె ఎముకలు ఉన్నాయి. ఈమెకి తోడుగా ఈమెకి లాగానే 12 సంవత్సరముల వయస్సు ఉన్న ఇద్దరు నగ్న బాల స్త్రీమూర్తులు రావడం జరిగినది. వీరిద్దరూ ఒడ్డున ఉండగానే పదహారు సంవత్సరముల వయస్సు స్త్రీ మూర్తి కాస్త స్నానం చేయటానికి సరస్సులోని దిగగానే కామ ఉత్తేజం కలిగి కామ పూరిత ఆలోచనలు ఈమెను ఆక్రమిస్తున్నాయని ఈమె ద్వారా ముఖకవళికల ద్వారా నాకు తెలుస్తోంది. ఉన్నట్టుండి ఈమె శరీరం రంగు నల్లగా మారటం మొదలైంది.దానికి ఈమె కాస్త సిగ్గు పడి సరస్సు నుండి బయటకు వచ్చినది. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీ మూర్తులు తమ కి ఏదో కావాలని అడుగుతున్నారు అని నాకు అర్థం అయింది కానీ ఆడియో లేదు కేవలము వీడియోనే తెలుస్తుంది. అప్పుడు ఈమె దేని కోసమో వెతుకుతూ తన చేతిలో ఉన్న కొడవలితో తన తలను స్వయముగా తానే నరుకున్నది. వెంటనే ఈమె శరీరము నుండి మూడు ధారాలు రక్తం బయటికి చిమ్మింది. ఇలా వచ్చిన రక్త ధారలను ఈ ముగ్గురూ కూడా తమ తలలతో త్రాగడం ప్రారంభించే సరికి కొన్ని క్షణాలు ఏదో తెలియని భయం వేసింది. అంటే తన రక్తమును తానే తన తలతో పదహారు సంవత్సరముల స్త్రీమూర్తి తాగుతుంటే మిగిలిన రెండు రక్త ధారలను అక్కడున్న ఇద్దరు స్త్రీలకి త్రాగమని చెప్పి వారి ఆకలి తీరుతుంది అని నాకు అర్థం అయ్యేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించే సరికి ఎగశ్వాస నాలో మొదలయ్యే సరికి నాకు ధ్యాన భంగము అయినది. బయటకు వచ్చిన తర్వాత ఇంత క్రూరమైన స్త్రీమూర్తులు ఎవరు? ఒక స్త్రీ మూర్తి తన రక్తంని తానే త్రాగటం ఏమిటి? తన రక్తంతో ఇతరుల ఆకలి తీర్చడం ఏమిటి? వామ్మో ఒకవేళ ఎవరైనా తాంత్రిక యోగినులా వీళ్ళు లేదా మతి చెడిన యోగినులా ఏమో ఎవరికి తెలుసు. కుక్కలకి ఎప్పుడైనా తీవ్రమైన కామ తాపము కలిగినప్పుడు శరీరానికి గాయాలు చేసుకుని వాటి రక్తమును అవి త్రాగి సంతృప్తి చెందుతాయాని తెలుసు. మరి ఇంత దారుణంగా ఇలా తమ రక్తం తాగుతున్నారు అంటేనే నమ్మశక్యం కావటం లేదు. ఇందులో కూడా ఏదో మర్మం ఉంది అంటూ ఈ దృశ్యానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని పుస్తకాలు గ్రంథాలు తిరగ వేయడం ఆరంభించాను.
ఈమె గూర్చిన ఎన్నో పుస్తకాలు తిరగ వేయగా “నారద పంచా రాత్ర” పురాణములో ఈమె గూర్చిన వివరాలు ఇవ్వబడినాయి. ఈమెను చిన్నమస్తా దేవి అంటారని… ఈమె ప్రక్కనే ఉన్న వారిని జయ విజయులు గా పిలుస్తారని… వీళ్ళని డాకిని, వర్ణిని అని కూడా అంటారని… వీరిద్దరూ సేవకులు అని తెలిసినది. ఒకసారి మందాకినీ నదిలో స్నానం చేస్తుండగా లైంగిక వాంఛ కలగటం జరిగి సిగ్గు వల్ల ఈమె శరీరము నల్లగా మారినది. ఇంతలో వీళ్ళ సేవకులరాల్లకి ఆకలి తీర్చమని అడగడం తో ఆమె చుట్టుపక్కల వెతికిన తినడానికి ఏమీ దొరక్కపోవడంతో వీళ్ళ ఆకలి తీర్చడానికి తన తలని తానే స్వయంగా నరుక్కుని అందులో నుండి వచ్చిన రక్త ధారాలతో రెండు ధారలతో వీరిద్దరికి ఆకలి తీర్చి మూడవ ధార తన చేత ఖండించిన తన శిరస్సు నోటిలోనికి ప్రవహించి ఉన్నాయని చెప్పడం జరిగినది. అంటే బ్రహ్మమే బ్రహ్మమును తినడము అన్నమాట. ఈమె రతిక్రీడ చేస్తున్న రతీమన్మధుల మీద నిల్చొని ఉంటుందని మానవ కపాలం మాలలు వేసుకుందని, పదహారు సంవత్సరముల వయస్సు బాలికా రూపంలో నిత్యం నగ్నము గా ఉంటుందని… త్యాగానికి ప్రతీక అని ఈ మూడు రక్తధారలు కూడా జన్మ రతి మృత్యువుకు సంకేతాలని లైంగిక వాంఛకి గురి అయితే వారికి జన్మ వస్తుందని తద్వారా మృత్యువు కలుగుతుందని అదే ఎవరైతే ఈ కామ మాయ కారకమైన రతిని నేను అనే మనస్సును త్యాగము చేస్తారో వారికి జన్మరాహిత్యం కలిగి శాశ్వత మృత్యువును ప్రసాదిస్తుందని నాకు అర్థమైనది. అంటే 'నేను' అనే త్యాగ దేవత అని గ్రహించాను.ఈమె చేతిలో ఎవరైతే చంపబడతాడో వారికి జన్మరాహిత్యము కలిగి ఇచ్చా మరణమును అనగా అనుకున్నప్పుడు అనుకునే విధంగా తమ మరణమును పొందే సిద్ది పొందుతారని నాకు స్పురణకు వచ్చినది. అప్పుడే మనకు త్యాగము కలిగిన పరమశాంతి కలుగుతుందని అర్థం అయినది. హమ్మయ్య ! నేను అనేది ఎలా త్యాగము చేసుకోవాలో ఒక మార్గము దొరికినది. ఈమె చేతిలో నా పరమశాంతి ఉన్నదని నేను గ్రహించాను. ఇలా కొన్ని వారాలు గడిచినాయి. శ్రీ లాహిరి మహాశయుడు కూడా ఇలాగే చిన్నమస్తా దేవి దర్శనం అయినట్లుగా రాసుకోవటం జరిగినది.
ఒకరోజు నాకు ధ్యానంలో ఒక దృశ్యం విచిత్రముగా కనపడినది. ఒక విశాలమైన మైదానము కనబడినది. దీని మధ్య భాగంలో ఒక పెద్ద వేదిక ఉన్నది. ఈ వేదికలో ఒక చోట ఒక మనిషిని పోలిన బొమ్మ తెల్లని వస్త్రాలతో నడుముదాకా ఉన్నది. దాని పక్కనే సింధూరము పూసిన సజీవ హనుమాన్ విగ్రహం ఉంది.ఈయన కళ్ళు కదులుతున్నాయి. ఇది కూడా నడుము దాకా ఉంది. ఈ రెండు విగ్రహలు అనగా మనిషి మరియు హనుమాన్ విగ్రహలు రెండు కుర్చీలో కూర్చున్నట్లుగా ఉన్నాయి. ఈ హనుమాన్ విగ్రహం ప్రక్కనే ఒక పెద్ద కుర్చీ ఖాళీగా ఉంది. ఇంతలో వీటిని చూడటానికి కొంత మంది సాధకులు అనగా నగ్నంగా, దిగంబరంగా, గోచిగుడ్డ తో ఉన్న యోగులు అలాగే కాపాలికులు, అఘోరాలు, భైరవీలు, నాగసాధువులు, దక్షిణాచారపరులు, సమయాచారపరులు ఇలా పలురకాల దీక్షాపరులు క్యూ పద్ధతిలో ఒక వరుస క్రమంలో ఈ విగ్రహం మూర్తులను చూసుకుంటూ వెళుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఎప్పుడైతే ఎవరు ఈ హనుమాన్ విగ్రహనికి దగ్గరకి వచ్చేసరికి ఆయన ప్రక్కన ఉన్న కుర్చీలో ఈ సాధకుడి సద్గురువు ఉంటున్నాడు. హనుమాన్ ఆజ్ఞ ఇస్తే ఈ సాధకుడు అలాగే ఈ గురువు ముందుకి వెళ్లి ఈ మైదానం మధ్యలో ఏర్పరిచిన చిన్న వేదిక చేరుకోవడం జరుగుతుంది. సుమారుగా ఒక వెయ్యి మంది దాకా దర్శనాలకు ఎదురుచూస్తున్నారని నేను గ్రహించాను. మీకు గుర్తుందా? నేను కాలచక్ర సాధన స్థితిలో ఉన్నప్పుడు నాకు ధ్యానములో 477 సంఖ్య కనపడినది అని చెప్పినాను. గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు నాకు ఈ క్యూలో వెళ్ళటానికి 477 సంఖ్య నెంబరు బోర్డు నాకు తగిలించినారు. అలాగే నా యోగమిత్రుడైన నా జిజ్ఞాసి నాగసాధువుకి కూడా ధ్యానం నందు 480 కనబడినది అని చెప్పినాడు అని అన్నాను గదా. ఇతనికి కూడా ఈ నెంబర్ బోర్డు అతని మెడలో ఉన్నట్లుగా నాకు కనిపించినది. నా ముందు చాలా మంది సాధకులు ఉన్నారు. ఒక్కొక్కరుగా ముందుకు సాగుతున్నారు కానీ విచిత్రం ఏమిటంటే అతి బహు కొద్ది మంది మాత్రమే చిన్న వేదిక కి చేరితే చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళి పోతున్నారు. ఎందుకో నాకు అర్థము కాలేదు. వెయ్యి సూక్ష్మ లోకాలలో నుండి కేవలం ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి వెయ్యి మందికి మాత్రమే కారణ లోక ప్రాప్తి కలిగిస్తారు. అదికూడా హనుమద్ వారికి నచ్చితేనే. ఆయన వీరికి యోగ్యత ఉంది అనుకుంటేనే కారణం లోక వాసిగా అనుగ్రహిస్తారు. ఒకవేళ నచ్చకపోతే వెనక్కి తిరిగి వెళ్ళి పోవాలి. ఎవరికి వారే యమునా తీరే. అందరికీ అందరూ తెలుసు. కానీ పలకరించుకోరు మాట్లాడుకోరు. కేవలం మౌన భాష లోనే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరగటం నేను గమనించాను. చిన్న వేదిక కు చేరిన సూక్ష్మ లోక వాసులకి తల నరుకుతారట అది కూడా చిన్నమస్తా దేవి వచ్చి తల నరుకుతుందట. దానితో దీనికి భయపడి హనుమంతుని అనుగ్రహం పొందిన కూడా కారణ లోక వాసుడిగా ఉండలేక వెనుతిరిగి వారి సూక్ష్మ లోకాలకి సూక్ష్మలోక వాసుడిగా ఉండాలని నిశ్చయించుకొని వెళ్లి పోతున్నారట. వామ్మో! అంటే ఇప్పుడున్న సూక్ష్మధారి తల కూడా నరక పడుతుంది. చచ్చింది గొర్రే. అందుకే కాబోలు మహా శివుడి చేతిలో నరముఖ గణపతి కాస్త నరకబడి గజ ముఖ గణపతి అయినాడు. తల ఎందుకంటే మహా గణపతికి నారాయణ మంత్రము గాయత్రీ మహా మంత్రము మంత్రోపదేశము చేసినది ఆది గురువైన మహాశివుడే కదా.అలాగే మహావిష్ణువు కూడా హయగ్రీవుడుగా, నరసింహుడిగా, వరాహమూర్తి గా అనగా గుర్రం, సింహం, పంది తలతో కారణ లోక వాసుడిగా మారినాడు అన్నమాట. ఆంజనేయస్వామి కూడా మానవ తల మారి కోతి తల ఈ కారణం చేతనే వచ్చి ఉంటుంది. కాకపోతే తమ సూక్ష్మ శరీర అవసరాలు రాబోవుకాలంలో ఉన్నాయని గ్రహించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ సూక్ష్మ శరీరాలు కాకుండా భౌతిక దేహాలను త్యాగము చేసి ఉంటారు. ఒకవేళ సూక్ష్మ దేహాలను త్యాగం చేస్తే అలాంటి స్థూల శరీరాలు ఏర్పడవు. అంతెందుకు తమ సూక్ష్మ శరీర రక్షణ కోసం యోగులు జీవసమాధి చెందుతారు. అనగా శిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్త గురువులు శ్రీ త్రైలింగస్వామి ఇలా మున్నగువారు…అమ్మ వారు కూడా వారాహిగాను, హయగ్రీవగాను, నారసింహిగాను తమ తలలను మార్చుకొని జంతువుల తలలతో కారణ లోక వాసిగా మారినది. ఇలా తలలు మారిన వారంతా నేను అనేది త్యాగము చేసి సర్వ పరిత్యాగులుగా మారి పరమశాంతిని పొందే కారణం లోకవాసులు అవుతున్నారని నేను గ్రహించాను.
ఏసు ప్రభువు జీవిత గ్రంథములో తలలు మారటం అనేది ఉంది. 11:03 లో స్త్రీ ధర్మాలలో స్త్రీ తల పురుషుడుగాను, పురుషుడు తల ఏసు తల గాను, ఏసు తల కాస్త భగవంతుడి తలగా ఉందని చెప్పటం జరిగినది. ఈ యోగము లేనివారికి అపస్మారక స్థితికి వచ్చి తను పరమాత్మ అనే విజ్ఞానమును కోల్పోయి కారణ జన్ముడుగా భూలోకవాసులుగా జన్మించడం జరుగుతుంది. లేకపోతే ఏంటి? శ్రీరాముడికి చిన్నప్పుడు అద్దంలో చంద్రుడిని చూస్తే అది నిజమేనని నమ్మటం.. పోనీ అమాయకత్వంతో కూడిన బాల్యము అనుకుందాము. యవ్వనములో తన భార్య అడిగినది కదా అని బంగారు లేడి వెంట పడటం ఏమిటి? ఈ సృష్టిలో బంగారపు లేడి అనేది ఉండదని వారు గ్రహించలేని స్థితి మాయ ఉండి ఉండాలి కదా. తను పరమాత్మ అని మరిచిపోయి మానవమాత్రుడు ఇలాగా నానా కష్టాలు పడటం ఏమిటి? భార్య విరహవేదనను భరించలేక శరీర త్యాగం చేయటం ఏమిటి? ఇది అంతా మాయ కాదా? అపస్మారక స్థితి కాదా? తను పరమాత్మ అనే జ్ఞానమును మరిచి పోవటం వల్లనే ఇదంతా జరిగినది కదా. తను తిరిగి పరమాత్మ అనే జ్ఞానం ఆ అనుభూతి కోసం వశిష్టుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి తిరిగి జ్ఞానము పొందడం జరిగినది కదా. ఇన్ని కష్టాలుకి మూల కారణం తను అపస్మారక స్థితి పొందటమే కదా. నేను ఈ తప్పు చేయాలని అనుకోలేదు. చావటానికి వచ్చినప్పుడు భయపడడం దేనికి. సాధక యోగులంతా చావటానికి వచ్చేటప్పుడు బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని వచ్చి ఉగ్రమైన చిన్నమస్తా దేవి గురించి తెలియగానే ఉచ్చ పోసుకుని మరణ భయంతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని నాకు అర్థమైనది. ఇలా నా ఆలోచనలు సాగుతున్నాయి. నేను కాస్త హనుమత్ విగ్రహమూర్తి ముందుకు రాగానే ఆయన కళ్ళు అటు ఇటు తిప్పి నా ఓరకంట చూడగానే ఆయన ప్రక్కనే ఉన్న కుర్చీలో నా సద్గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారు కనిపించారు. హనుమాన్ వెంటనే నాకు యోగ్యత ఉన్నదని అనుమతి ఇవ్వగానే నేను వెంటనే చిన్న వేదిక కి చేరుకున్నాను. అప్పటికే 24 మంది దాకా చేరుకొని ఉన్నారు. నా స్వామిరంగా! నా ముందు 476 మంది వెళితే అందులో 24 మంది మాత్రమే అర్హత సాధించారు అంటే ఏ రేంజ్ లో పరీక్షలు పెట్టి నా నా చంక నాకించి ఉండి ఉంటారు కదా అనుకున్నాను. సరే నా జిజ్ఞాసి నాగసాధువు పరిస్థితి ఏమిటి? అని చూస్తుంటే… వాడు నా పక్కనే చిన్న వేదికలో కనిపించగానే ఆనందము వేసినది. అమ్మయ్య వీడు కూడా ఉన్నాడు అన్న మాట అనుకున్నాను. ఇక తల బలి చేసే చిన్నమస్తా దేవి కోసం ఎదురు చూడటం తప్ప ఇంకా ఏమీ పని లేదు అనిపించింది. ఇది ఇలా ఉండగా వెయ్యి మందికి గాను 177 మంది మాత్రమే కారణం వాసులుగా అర్హత సాధించారు అంటే నేను అనేది త్యాగము చెయ్యటానికి యోగ్యత సంపాదించుకున్నారని నేను గ్రహించాను. అనగా పది లక్షల మంది సాధన చేస్తే ఈ స్థితికి 177 మంది రావటం అంటే సాధనలో ఏ విధముగా చంక నాకీ వుండి ఉంటారు గదా. చావు భయము లేని మాకే చిన్నమస్తా దేవి వస్తుంటే ఏదో తెలియని తత్తరపాటు మా అందరిలోనూ మొదలైనది. వెంటనే తన చెలికత్తెలతో కలిసి ఒక్కొక్కరి దగ్గరికి రావడం తన పదునైన కొడవలితో సూక్ష్మధారి తల నరకడము విచిత్రముగా వారి శరీరాలు అచేతన స్థితి లోనికి వెళ్లి తల మాత్రం ఏదో ఒక జంతువు తలగా మారటం జరుగుతుంది అని గ్రహించాను. ప్రతి వాడి తల కూడా ఏదో ఒక జంతువు తలగా మారుతుంది. సూక్ష్మధారిగా ఉన్నప్పుడు ఆది మానవజన్మ ఏమిటో తెలుస్తుంది. అదే కారణ శరీరాలు గా ఉన్నప్పుడు ఆది జంతుజన్మ ఏమిటో తెలుస్తుంది. అదే సంకల్ప శరీరధారిగా ఉన్నప్పుడు ఆది బ్రహ్మ జన్మ ఏమిటో తెలుస్తుంది. ప్రస్తుతానికి కారణశరీరధారికి యోగ్యత లో ఉన్నాను కదా. నా తల నరికితే గాని నా ఆది జంతువు జన్మ ఏమిటో తెలియదు అనుకున్నాను. ఇది నిజమే కదా. నరుడి యొక్క ఆది జంతువు జన్మ వానరుడే కదా. అనగా మనిషి అనే వాడు కోతినుండి పుట్టినాడని డార్విన్ సిద్ధాంతం చెప్పినది కదా. అది ఇప్పుడు జరుగుతుంది. నా సూక్ష్మధారి యొక్క అనగా వేదవ్యాసుడు యొక్క కారణ జన్మ అనగా ఆది జంతువు జన్మ ఏమై ఉంటుందో చూడాలి .నా స్థూల శరీర ఆది మానవ జన్మ సూక్ష్మధారి అయిన వేదవ్యాసుడు ఇప్పుడు వేదవ్యాసుడు ఆది జంతువు జన్మ ఏమిటో చూడాలి. ఇది చూడాలి అంటే నా సూక్ష్మధారి తల నరకాలి అనుకుంటుండగానే చిన్నమస్తా దేవి చేతిలో ఉన్న తన పదునైన కొడవలితో నా సూక్ష్మధారి తల నరక వేయబడడం నా సూక్ష్మధారి నుండి పంచ రక్తధారలు రావటం ఇందులో మొదటిది అమ్మ సేవిస్తుండగా మిగిలిన నాలుగు రక్తధారలు రెండు ధారలతో భిక్షపాత్ర లో జయవిజయులు పట్టుకుంటూ మిగిలిన రెండు ధారలతో తమ నాలుకలతోనే జుర్రుకుంటూ ఆకలి తీర్చుకోవడం జరుగుతున్న సమయంలో ఖాళీ అయిన తల ప్రాంతంలో చిలుక తల మొలకెత్తడము జరగగానే వీళ్ళు నన్ను వదిలి మాకేమి సంబంధం లేదని మాకు ఏమీ తెలియదు అంటూ ముందుకు వెళ్ళిపోయినారు.
ఇప్పుడు నేను కారణలోకవాసుడుగా చిలుక ముఖముతో మానవ శరీరంతో ఉండాలి అన్న మాట. విచిత్రం ఏమిటంటే వేదవ్యాసుడు యొక్క నాలుగవ కుమారుడైన శుక మహర్షికి చిలక తల ఉంటుంది. అంటే దీనిని బట్టి నా ఆది జంతుజన్మ చిలుక అని…. నా పరమ శిష్యుడికి తల నరికితే అది కాస్తా పావురము తలగా మారింది. ఇది భలేగా ఉందే అనుకుంటూ ఉండగా నేను పూజించిన దుర్గామాత ఇలా చిన్నమస్తా దేవి రూపంలో వచ్చి నా తలను నరికి నట్టుగా చిన్నమస్తా దేవి రూపములో దుర్గామాత కనపడే సరికి నాకు అర్థమైనది.ఈ చిన్నమస్తా దేవిని మేము కాశీ క్షేత్రము నందు లలితా ఘాట్ యందు ఉన్న దేవాలయంలో చూడటము జరిగినది. నా ఆది జంతుజన్మ చిలుక అని నిదర్శనముగా నాకు ఒక రామచిలుక కీచైన్ రావడము జరిగినది. ఎప్పుడైతే నేను అహం అన్న స్పురణ మాకు మాయం అయినదో సముద్రంలోని నీటి బుడగలా ఉన్న నేను నీటిలో కలిసి పోయిన అనుభవ అనుభూతి కలగ సాగింది. పాశ బంధ విముక్తి కలిగి నా జీవాత్మ కి శివ సాయుజ్యము లభించినట్లు గా ఉన్నది. జీవాత్మ కాస్త శివాత్మగా జీవుడు కాస్త శివుడిగా అనుభూతి కలిగినది. ఇదంతా చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహ బలం అని నాకు అనుభూతి కలగ సాగింది. ఎన్నో కోట్ల సంవత్సరముల నుండి 84లక్షల జీవరాసులూ ఇన్ని లక్షల జీవరాశుల తో పాటుగా ఇన్ని లక్షల జన్మల పరంపరలో మరిచిపోయిన విషయాన్ని అదే నేనే పరమాత్మ అనగా అహంబ్రహ్మాస్మి స్థితి తిరిగి పొందుతున్న అనుభవ అనుభూతి కలగ సాగింది.
నా విశ్వరూప దర్శనానుభవం :
అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమై ఉన్నాను అని అనుకోగానే నేను కాస్త వివిధ రకాల సమస్త జ్ఞాన విజ్ఞానాలు 18 రకాల ఆనందాలు నా మెదడుకి సంపూర్తిగా చేరేసరికి నా మెదడు కాస్త నిద్రావస్థలో ఉన్నది కాస్తా జాగృతి అవ్వటము అనగా సహస్ర కమలములోని రేకులు విచ్చుక్కోవటం ఆరంభము అవుతుంటే నా సూక్ష్మశరీరము పెరుగుతూ రాసాగింది. నాకు కనిపించిన దక్షిణామూర్తి నా కన్నా చిన్నగా కనిపించడం ఆరంభమైనది. అంటే నేను పెరుగుతున్నాను అని గ్రహించాను. ఈయన వెనుక చెట్టులో పరమాణువు సైజులో విష్ణుమూర్తి కనిపించాడు. ఈ చెట్టు కాస్త నా ముందు చిన్నది అయినది. అప్పుడు ఈ చెట్టు యొక్క చివరి ఆకు పైన వటపత్ర శాయి రూపంలో బాలకృష్ణుడు తన నోటిలో తన కాలి బొటనవేలు వేసుకుని చీకుతూ కనిపించినాడు. అంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు సంపూర్తిగా శూన్యంలో కలుసుకోలేదని పరమాణువుల రూపంలో పరమాత్మునిగా ఉన్నారని నాకు అర్థం అయ్యే లోపల ఈ చెట్టు కాస్త చిన్న చుక్కగా మారిపోయినది. అనగా నా శరీరం అంతకు అంతా పెరుగుతుంది. భూలోకము కనిపించినది. అది కాస్త చిన్న రేణువుగా మారినది. చంద్రుడు కనిపించాడు. అది కాస్త పరమాణువుగా మారినది. కనిపించినా అది కాస్త రేణువుగా మారినది. అంటే నా సూక్ష్మశరీరము ఎదుగుదల ఈ గ్రహాల దాటి పెరుగుతుందని నాకు అర్ధం అవ్వసాగింది. గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు వివిధ రకాల పాలపుంతలు కూడా మొదట పెద్దవి కాస్త చిన్నదిగా కనబడుతూ మారిపోతున్నాయి. కొద్ది క్షణాల తర్వాత చూస్తే ఈ విశ్వమంతా ఒక నిమ్మపండు పరిమాణంలో కనబడినది. అప్పుడు నేను వెంటనే ఈ విశ్వంలోని సమస్త జీవరాసులు అన్నీ కూడా సుఖశాంతులతో జీవించాలని ఆశీస్సులు ఉండుగాక అని నేను దీవించడం జరిగినది. అనగా నా విరాట్రూపం విశ్వరూప దర్శనం అనుభూతి అయినది అని నాకు అర్థం అయ్యేసరికి మౌనముగా దక్షిణామూర్తి అదృశ్యమయ్యారు. ఇలా తనకి కూడా ఆదిగురువు దర్శనము తన సహస్ర చక్ర స్థితిలో జరిగినదని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగినది.
అహం బ్రహ్మాస్మి:
ఇన్నాళ్లు తను చూసే ప్రపంచమంతా నిజానికి నా స్వరూపమేనని ఇంతకాలం నేను అనే మాయ వలన వేరు అయినట్లుగా గోచరించినదని అనుభవ అనుభూతి కలగ సాగింది. ఇన్నాళ్లుగా నేను వేరు - భగవంతుడు వేరు. నేను వేరు- ఈ సృష్టి వేరు. నేను వేరు -నువ్వు వేరు అనే భ్రమ భ్రాంతి వలన కలిగిన దుఃఖము మొత్తము ఈ క్షణములో అంతరించి పోయిందని అనుభవ అనుభూతి కలిగింది. ఇన్నాళ్లుగా తనలో ఉన్న అంతర్యామి ప్రపంచంలో ఉన్న సర్వాంతర్యామి ఒక్కటేనని అనుభవ అనుభూతి కలగ సాగింది. ప్రకృతి కాస్త ఏకత్వ సిద్ధి అదే అద్వైత సిద్ధి కలుగుతుందని అనుభవ అనుభూతి కలగ సాగింది. బంగారము నగ వేరు కాదని రెండిటిలోనూ బంగారం ఉన్నదని అనుభవం అనుభూతి కలగ సాగింది. దానితో భౌతిక మృత్యువుకి శాశ్వత మృత్యువు సంభవించినట్లు అయినది. మానవుడైన వాడిని మాధవుడిని అయినాను. జీవుడు అయిన వాడిని శివుడైనాను. నరుడైన వాడిని నారాయణుడిని అయినాను. కాముడిని కాస్త రాముడిని అయ్యాను. జీవాత్మ పరమాత్మ అయినట్లుగా అనుభూతి కలగ సాగింది. అహం బ్రహ్మాస్మి అని పరిపూర్ణ అనుభూతితో పరమానందముతో నోటి నుండి బయటకు వచ్చింది. ఆ రోజు కార్తీక పౌర్ణమి. విచిత్రం ఏమిటంటే తల మార్చబడిన వారు మాత్రమే విశ్వరూపం దర్శనము లేదా స్వరూప దర్శనం అనుభూతి పొందుతారు. శ్రీకృష్ణుడు తన స్వరూప దర్శనము చూపించినప్పుడు మహావిష్ణువు తలతో చూపించడం జరిగింది. అనగా శ్రీ కృష్ణుడి తలమారి శ్రీ మహా విష్ణువు తల ఏర్పడినది. అందుకే ఈయనని శ్రీ మహావిష్ణువు అన్నారు. ఇప్పుడు మేము చిలుక తలతో విరాట్ స్వరూపం అనుభూతిని పొందడం జరిగినది. విశ్వరూపం దర్శనములో వెయ్యి తలలతో ఉంటే విరాట్ స్వరూపములో వెయ్యి కాళ్లు ఉంటాయని హైందవ గ్రంధాలు ఉవాచ.
నా అహం బ్రహ్మాస్మి: స్ధితి కష్టాలు
ఎప్పుడైతే ఈ స్థితిని మేము (మేము అంటే నేను అర్థం) పొందినామో ఆనాటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. శాంతి దేవుడెరుగు. నాలో తెలియని అశాంతి మొదలైనది. మేము పడిన కష్టాలు కూడా ఏ కుక్కలు కూడా పడి ఉండవేమో. ఎందుకు అంటారా? చదవండి. మీకే తెలుస్తుంది. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లి “స్వామి! నాకు ఎదుటివాడిలో నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసేటట్లుగా వరము ఇవ్వండి” అని అడుగుతాడు. దానికి స్వామి “నాయనా! అది తెలుసుకుంటే నీకు పేరులో ఆనందం తప్ప నీలో ఆనందం ఉండదు” అని చెప్పిన వినకుండా వరం పొందుతాడు. ఆ క్షణము నుండి మన వాడికి బ్రతుకు కుక్క బ్రతికే అవుతుంది. ఇంట్లో వారి మనస్సులోని విషయాలు బయట వారి మనస్సులోని విషయాలు ఆఖరికి గుమ్మం మీద చీమలు వీడి గురించి ఏమనుకుంటున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉండే సరికి మొదటిలో ఆనందము వేసిన రాను రాను వీడికి లేనిపోని దిగులు పడవలసి వస్తుంది.భావ విషయాలు వినలేక వరము ఇచ్చిన స్వామీజీ దగ్గరకు వెళ్లి వరమును తననుండి ఉపసంహరణ అయ్యేటట్లు గా చేసుకుంటాడు. నా పరిస్థితి కూడా ఇలాగే ఇంచుమించుగా తయారయింది. ఎలా అంటారా? ఒకరోజు నేను భోజనం చేస్తుండగా ఒక్కసారిగా నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. దానికి ఏమై ఉంటుంది అనుకోగానే నా మనోనేత్రం ముందు గ్లాసులో పడిన నల్ల చీమ ప్రాణభయంతో గిలగిల లాడుతూ చాలా జూమ్ గా కనపడినది. దీనమ్మజీవితం. ఇది ఇప్పుడు ఏ గ్లాసులో వుందో వెతుక్కోవాలి అనుకుంటూ చెయ్యి కడుక్కోవడానికి నా నీళ్ల గ్లాసు తీసుకుంటే అందులో ఈ చిన్న చీమ కనబడినది. సరే అని దానిని బయటికి తీస్తే గానీ నాకు దిగులు తగ్గలేదు.కంగారు తగ్గలేదు. ఆందోళన తగ్గలేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. అదే ఆశ్చర్యంగా ఉండేది. మరొకసారి రోడ్డు మీద ఒక కుక్క అందరినీ చూస్తూ మౌనంగా పడుకొని ఉంది. అది నేను గమనించిన కొద్ది సేపు అయిన తరువాత నాకు విపరీతమైన ఆకలి వెయ్యటం ప్రారంభించినది .ఇప్పుడే కదా తిన్నాను. అప్పుడే ఎలా ఆకలి వేస్తుందో అర్థమయ్యి చావటం లేదు. చచ్చింది గొర్రె. పొద్దున్నే కదా షుగర్ బిళ్ళ కూడా వేసుకున్నాను. మరి షుగర్ వలన వచ్చే పిచ్చి ఆకలి కాదని నిర్ధారణ చేసుకునే సమయములో నా కళ్ళముందు ఇందాక రోడ్డు మీద నేను చూసిన కుక్క కనిపించినది. అంటే ఈ ఆకలి నాది కాదు అని తెలుసుకొని అన్నము చపాతీలు బెల్లం ముక్క మూట కట్టి దాని దగ్గరికి వెళ్లి దానికి పెట్టగానే అది ఎంతో ఆత్రంగా తినటం జరుగుతుంటే నాకు వచ్చిన అధిక ఆకలి తీరటము మొదలైనది.ఒకసారి మేము నిత్యపూజ చేసుకుంటుంటే బాత్రూం లెట్రీన్ కుండీలో ఈగ పడినట్లుగా నాకు కళ్ల ముందు కనిపించే సరికి చేస్తున్న పూజ ఆపివేసి ఒక పుల్ల సహాయముతో దానిని బయటికి తీసేదాకా నా మనస్సులో మనస్సుగా లేదు. అమ్మ తిట్టింది. “పవిత్రంగా పూజ చేసుకుంటూ ఈగ కోసం పూజ ఆపివేసి స్నానం చేసి ఈ కుండీ ముట్టుకోవడానికి సిగ్గు అనిపించలేదా? రాను రాను నీకు మతి చెడుతుంది” అని తిట్టసాగింది. కానీ దాని బాధ తీరటంతో నా బాధ తీరినట్లు గా అనిపించసాగింది.
ఒకరోజు నేను మా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళడము జరిగినది.ఆతర్వాత మా అక్కతో కలిసి వాళ్ళ కొన్న కొత్త ఇంటిని చూడటానికి బయలుదేరినాము.ఇంతలో నాకు ఏదో జీవి మరణయాతన పడుతున్న అనుభూతి నాకు కల్గసాగినది. చచ్చింది గొర్రా... ఈ జీవి ఏదో తెలియదు. ఎక్కడ ఉన్నదో తెలియది.కాని మరణయాతన పడుతోందని మాత్రమే తెలుస్తోంది.నేను దానిని రక్షించటానికి సిద్ధమే...కాని అది ఎక్కడ ఉన్నదో తెలియాలి గదా అనుకుంటూ రోడ్డు మీద వెళ్ళుతున్నాను.ఒక చెట్టు పొద దగ్గరికి వచ్చేసరికి ఒక ముదుసలి పెద్ద ఎలుక ఏదో బంక ఉన్న అట్టముక్కకి అతుకునిపోయి నరకయాతన పడుతున్నట్లుగా నాకు కనిపించినది.వెంటనే నేనుకాస్త ఆ బంక అట్టనుండి ఈ ఎలుకను బయటికి తీసి దానిని జాగ్రత్తగా సురక్షిత ప్రాంతములో వదిలి పెట్టగానే కొన్ని క్షణాలు తర్వాత అది కోలుకొని అక్కడనుండి పారిపోవడము చూసిన తర్వాత కాని నాకు శాంతి కలుగలేదు.ఆ తర్వాత రాత్రి ఈ ఎలుక ముఖము మాత్రమే కనిపించి... నాకు ధ్యానమునందు కనిపించి... తాను బ్రతికి ఉన్నట్లుగా కనపడగానే ఏదో తెలియని ఆనందము వేసినది. నిజానికి ఆరోజు దీనిని రక్షించటానికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చినదని నాకు అర్ధమైనది.
ఒకరోజు అనుకోకుండా మా ఇంటికి కాకాజీ వచ్చినాడు.కారణము లేనిదే ఈ కర్మయోగి రాడని నా నమ్మకము.కొన్ని గంటలు తర్వాత నాలో మరణయాతన పడుతున్న జీవి యొక్క ఆలోచనాలు నన్ను మన:శాంతిగా ఉంచలేదు. నా ఆందోళన గమనించిన కాకాజీ వెంటనే నాతో జీజీ!మీకు ఏమి అవుతోంది.చాలా ఆదోంళనగా ఉన్నారు అడగానే నేను వాడితో నా విషయము చెప్పగానే వాడు వెంటనే క్రిందకి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా జీవికి ఏదైన ప్రమాదములో ఉన్నదని వాడు వెతకడము చేస్తూ...కరెంట్ స్తంభానికి ఉన్న గాలిపట మాంజ వలన ఒక పావురము ఇరుకొని మరణయాతన పడుతోందని గ్రహించి నాకు చెప్పగానే...నేను వెంటనే మారు అనకుండా ఆ పావురానికి ఉన్న మాంజను తెంపటానికి నేను వెంటనే పాత కర్టెన్ ఇనుపరాడ్లు కలిపి ఒక కర్రకి కట్టి మాంజను తెంపటానికి నేను అలాగే మా ఆవిడ ప్రయత్నము చేస్తున్నాము.ఈ హడావుడిలో మేము ఇనుమరాడ్లుతో కరెంట్ తీగలను తాకుతున్నామని గమనించేలోపుల పెద్దపెద్ద స్పార్క్ రావడముతో మాచేతిలో ఉన్న కర్ర రాడ్డును వదిలెయ్యడము అటుపై మా ఏరియాలో కరెంట్ పోవడము..ఏకకాలములో జరిగిపోయినాయి. అటు తర్వాత కరెంట్ బాగుచేసే వ్యక్తులు రావడము...తీగెలకి వ్రేలాడుతున్న పావురము వలన ఇది జరిగినదని మేము వాళ్ళకి చెప్పేసరికి ఒక వ్యక్తి ఆ కరెంట్ స్తంభమును ఎక్కి ఆ పావురమును రక్షించినాడు.
ఆ తర్వాత మొక్కలు కూడా ధ్యానము నందు కనిపించడము మొదలైనది. మల్లెచెట్టు ప్రక్కన గులాబి మొక్క కుండి ఉంది. ఈ మొక్క యొక్క ముళ్ళు కాస్త మల్లే ఆకుకి గుచ్చుకోవటం నా ధ్యానము నందు ఒక రోజు కనిపించే సరికి అది పడే బాధ చూడలేక వెంటనే గులాబీ మొక్క కుండి వేరేగా పెట్టేదాకా నా మనస్సులో ఆందోళన తగ్గలేదు. ఇలా మొక్కలు చెట్లు తమ బాధలను మౌన భాషతో నాకు కనిపించి చెప్పుకోవటం ఆరంభమైనదని నాకు అర్థమైనది. ఇలా ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కూడా మౌన భాషతో తమ బాధలు చెప్పుకోవటం ఆరంభమైనది. అంటే ఇంటి తలుపుకి ఏదో పురుగు రంధ్రం చేసి గుడ్డు పెట్టటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నాకు ధ్యానము నందు కనిపించినది. వెంటనే ఆ తలుపు దగ్గరికి వెళ్లి చూస్తే ఎక్కడ ఎలాంటి జాడ కనిపించలేదని నేను అనుకున్నాను. నాలో మొదలైన కంగారు తగ్గటం లేదు. సరే చూద్దాం అనుకుంటూ ఉండగా ఎక్కడనుండో ఒక నల్ల పురుగు వచ్చి తలుపు పైన అంచు నుండి లోపలికి యధావిధిగా రంధ్రము చేస్తున్నట్లుగా అనిపించేసరికి కుర్చీ వేసుకొని బయటికి త్రోలి ఆ రంధ్రమునకు లప్పమువేసి పూడ్చి పెట్టే దాకా నాకు మనశ్శాంతి కలగలేదు అంటే మీరు నమ్మగలరా. ఇలా మా ఇంటిలో సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, టీవీలు, ఏసీలు కూడా తమకి ఏమైనా హాని లేదా బాధ కలిగితే వెంటనే మౌన భాషలో నాకు ధ్యానము నందు కనిపించి వ్యక్తపరచడం చేస్తుంటే వీటికి సేవలు చేయటంతో నా జీవితం గడిచిపోయేది. ఇలా రోజుకి పది నుండి ఇరవై దాకా ఇలాంటి విచిత్ర పనులు చేయాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే ఈ అవసరాలు తీర్చుకుంటుంటే నాలో నాకే తెలియని మనశ్శాంతి కలుగుతూండేది.. దానితో నా బ్రతుకు ఇదం శరీరం పరోపకారము లాగా తయారైనది. పరమ శాంతి కలగ సాగినది. రానురాను మొక్కలలో మనుష్య రూపాలు, ఇసుక రేణువులు కాస్త శివలింగాలు, నీటి బిందువులు జల లింగాలుగా, ప్రాణములేని వస్తువులు అయితే సాధన చేసే వారి నిజ స్వరూపాలు కనిపించటం ఆరంభమైనది. వారికి అనగా వీటికి ఏమైనా ఇబ్బందులు సమస్య గాని హాని జరిగినా వెంటనే ధ్యానములో లేదా నా కళ్ళముందు కనిపించి మౌన భాషలో వాటి బాధను వ్యక్తపరచటం మొదలైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథమే చాలదు. రానురాను ఇలాంటి విచిత్ర అనుభవాలు అనుభూతులు కలగసాగింది. అంటే నాకు ఈ విశ్వంలో సమస్త జ్ఞానము అలాగే మౌన భాష చిదంబర దక్షిణామూర్తి అనుగ్రహము వలన శక్తిపాత సిద్ధ వలన సంప్రాప్తి అయినాయి గదా. నా చుట్టూ వాటి అవసరాలు తీరితే గాని నేను ప్రశాంతంగా శాంతముగా ఉండలేని పరిస్థితి రాసాగినది. వాటిలో ఉన్నది మేమే. నాలోనూ ఉన్నది అవే కదా. అందరిలో ఉన్నది చితాగ్ని స్వరూపం కదా. అందువలన ఎలాంటి టెలిపతి విధానము లేకుండానే నా పరిసరాలలో ఉన్నవి అన్నీ కూడా అలాగే నేను ఉన్న చోటులో నేను వెళ్ళిన చోటులో ఉన్నవి అన్నీ కూడా వాటి జ్ఞానముతో నా జ్ఞానముతో అనుసంధానమై మౌన భాష తో మాట్లాడుకోవటం జరుగుతుందని వారి సమస్యలు తీర్చితే గాని నాకు మనశ్శాంతి కలగటం లేదని నాకు అర్థం అయినది. అనగా ఇన్నాళ్లు మేము వరాలుపొంది స్థాయిలో ఉంటే ఇప్పుడు వరాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నామని గ్రహించాను. ఇదియే అహంబ్రహ్మాస్మి స్థితి లక్షణాలని నాకు అర్థమైనది. ఇంకా ఏముంది నా సాధన పరిసమాప్తి అయినది అనుకున్నాను. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి స్థితి పొందినట్లుగా వివిధ రకాల అనుభవ అనుభూతుల ద్వారా తెలుసుకోవడం జరిగినది. పైగా సాధన అంతా సహస్రార చక్రము వద్దనే ఆగిపోతుందని యోగ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కదా.
ఒకరోజు ఉన్నట్టుండి నాకు ఒక ధర్మసందేహం వచ్చింది. అది ఏమిటంటే నేను అనేది త్యాగం చేస్తేనే శాంతి ఎందుకు లభించినది. మిగిలిన వాటిని త్యాగం చేసిన లభించని శాంతి కేవలం నేను అనేది త్యాగం చేస్తే ఎలా లభించినది అనేది నా ప్రశ్న. నాకున్న జ్ఞాన స్థితి వలన స్పురణ కలిగి నా ప్రశ్నకి సమాధానం దొరికినది.ఒక నిండుకున్న నీళ్ల కుండలో క్రొత్తగా నీళ్ళని పోయలేము. పోస్తే కుండలో నీళ్లు బయటికి వస్తాయి కాబట్టి ఈ కొత్త నీళ్లు పోయడానికి ఉండదు. ఈ కొత్త నీరు పోయాలంటే కొంత కుండలో ఉన్న పాత నీరు తీయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కుండలోనికి కొత్త నీరు చేరే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ దేహంలో ఎన్నో లక్షల సంవత్సరాల నుండి ఎన్నో లక్షల జన్మల పరంపరలో ఎన్నో ఆనందాలు కర్మలు వాటి కర్మ ఫలితాలు ఆనందాలు బాధలు కష్టాలు సుఖాలు అనే వాటితో నిండి పోయినది. ఇప్పుడు కొత్తగా శాంతి అనేది ఈ దేహములో నింపటానికి ఖాళీ లేకుండా పోయినది. ఇది చేరకపోతే మిగిలినవి ఉన్నా ఉపయోగము లేదు. ఇది చేరితే మిగిలినవి లేకపోయినా పర్వాలేదు. దానితో నేను అనే దేహ బుద్ధి వలన అంటే నేనే ఈ కర్మలు చేశాను. నేనే ఈ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాను. నా వల్లనే ఆనందము కలిగినది. నేను కష్ట పడటం వలన విషయానందాలు కలిగినాయి. నేను లేకపోతే ఈ ఆనందాలు ఉండేవి కావు. నేను అన్నీ చేయబట్టి ఈ సుఖాలు కలుగుతున్నాయి. ఇలా ప్రతి దానికి కర్మకి నేను అనేది తగిలించుకుని మనము భావించుకుని కర్మ చేస్తున్నాము కదా. అప్పుడు మనకి తెలియకుండానే మన దేహంలో ఉన్న సమస్త విషయాలకి నేను అనే దానితో సంబంధం ఉన్నది కదా. అప్పుడు ఇందులో నుంచి నేను అనేది తీసేస్తే మిగతావి అన్నింటిని తీసేసినట్లే కదా. ఇంకా మీకు తేలికగా అర్థం కావాలంటే నేను అనేది రైలు ఇంజను అనుకొని బోగీలను ఏర్పాటు చేసుకుంటుంది. తనే ఈ రైలును నడిపినట్లు గా మన జీవిత బండిని కూడా నేను అనేది నడుపుతుంది అని అనుకుంటుంది. కానీ నిజానికి నేను అనేది రైలు ఇంజను కాదు బోగీల చివర ఉండే సెక్యూరిటీ గార్డ్ ఉండే బోగి అన్నమాట. అప్పుడు 'నేను' కి తన మాయ పోతే నేను ఇంజిన్ కాదు కేవలము సెక్యూరిటీ బోగిని. నా వలన జీవిత బండి నడపడం లేదని తెలుసుకున్నప్పుడు కర్మలు చేసేటప్పుడు కర్మ ఫలితాలు గురించి ఆలోచించరు. తద్వారా ఆందోళనలు తగ్గిపోతాయి. అనగా ఇన్నాళ్లు తనే పరీక్షలు రాసి కావలసిన పరీక్ష ఫలితాలు ఊహించుకొని అవి వస్తే ఆనంద పడటం రాకపోతే బాధపడటం ఫలితాలు వచ్చేదాకా ఆందోళన పడటం చేస్తోంది కదా. ఇప్పుడు నేను అనేది లేకపోతే పరీక్షలు రాసిన కూడా ఫలితాలు గురించి పెద్దగా ఆలోచించలేదు. పాస్ అయితే ఆనంద పడడం తప్పితే బాధపడటం అనేది ఉండదు. ఫలితాలు వచ్చే దాకా ఆందోళన చెందదు. కేవలము దీని దృష్టి కర్మలను బాధ్యతాయుతంగా చెయ్యటమే పని. కర్మ ఫలితాలను పట్టించుకోదు. తద్వారా అప్పుడు మనకి కలిగేది శాంతి కదా. అందువలన సాధనలో చివరి స్థాయిలో నేను అనేది త్యాగం చేస్తేనే తను దేహాత్మ కాదని పరమాత్మ అని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. రైలు బండి కి ఇంజన్ అలాగే సెక్యూరిటీ బోగి తప్పనిసరిగా ఎలా అయితే ఉంటాయో అలాగే జీవిత బండి ఇంజన్ లాంటి పరమాత్మ మరియు సెక్యూరిటీ గార్డ్ బోగి లాంటి జీవాత్మ తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే వచ్చిన చిక్కు అంతా నేను అనేది ఆత్మ సెక్యూరిటీ భోగి ఈ జీవితం బండిని నడుపుతున్నారని అనుకోవటమే వలన మనకి జీవిత బండి కదులుతుందని అనుభవ అనుభూతులు కలుగుతున్నాయి. నిజానికి రైలు బండి కదలదు. జీవిత బండి కూడా కదలదు. కేవలం కదులుతుంది వెళుతుంది అనే ఆలోచన భావాలు వలన అలా జరుగుతుంది. నేను కి ఉన్న మాయ తొలిగితే అసలు విషయం అర్థం అవుతుంది.అది చెప్పటానికి రాయటానికి ఉండదు. ఎవరికీ వారే స్వానుభవ అనుభూతి పొందాల్సి ఉంటుంది. భాగవతంలో ఒకచోట రెండు పక్షులు చెట్టుమీద ఉన్నాయని అందులో ఒక పక్షి ఎగరకుండా మౌనముగా అన్నింటికి సాక్షీభూతంగా ఉంటే మిగిలిన రెండవ పక్షి ఎగురుతూ ఉన్నట్లుగా అన్నీ తనే చేస్తున్నట్లుగా అన్నీ తనే పొందుతున్నట్లు గా ఆనందపడుతూ ఎగురుతుంది. నిజానికి మొదటి పక్షి యొక్క నీడయే రెండవ పక్షి. రూపము లేని మనస్సు రూపము ఉన్న వస్తువులని ఎలా అందుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మనమంతా కూడా నిశ్చల స్థితిలో ఉన్నా కూడా సకల బ్రహ్మ జ్ఞాన ప్రదాత స్థితిలో ఉన్నా కూడా మౌన బ్రహ్మముగా ఉన్న చిదంబరం దక్షిణామూర్తి యొక్క అంశ రూపాలే మనమే.ఇందులో ఎగిరే పక్షి మనము అయితే ఎగరకుండా నిశ్చలంగా ఉండే పక్షి ఎవరో ఈ పాటికి గ్రహించే ఉంటారు గదా. నిజానికి మనము ఏమీ చేయటం లేదు. ఆయన మౌనంగా ఉండి కదలకుండా మెదలకుండా తన మనస్సులోని సంకల్పాలను ఆలోచనలను భావనలను మనకి మౌన భాష రూపంలో అందించి (జ్ఞాన రూపం )మన చేత త్రివిధ కర్మలు చేయిస్తున్నాడు. ఇప్పటికైనా చేసేది చేయించేది ఒక్కడే. ఆడేది ఆడించేవాడు ఒక్కడే. ఆయన నుండి మనము క్రియలు చేయటానికి ఆయన ఇలా వచ్చిన జీవాత్మలే. కేకు నుండి విడిపోయిన కేకు ముక్కలమే. నిజానికి ఈ రెండిటికీ రుచిలో ఎలాంటి తేడా ఉండదు. ఏక పదార్థమే కదా. కానీ ఇలా విడిపోయిన కేకు ముక్క తను వేరు ఈ కేకు వేరు అనుకుని మాయలోపడి నా నా చంక నాకుతూ ఉంది. అలాగే పరమాత్మ నుండి బ్రహ్మము నుండి విడిపోయిన జీవాత్మ( బ్రహ్మ పదార్ధము) నేను అనే మాయలో పడి అన్నీ నా ప్రకారమే నేను చేస్తున్నాను అనుకుని నానా జన్మలు ఎత్తి నా నా చంక నాకి పోతుంది కదా. నిజానికి ఇవి అన్ని ఎవరు చేస్తున్నారు ఎవరి వలన చేస్తున్నారు పరమాత్మ వల్లనే కదా. చేసేది ఆయన పొందేది ఆయన. ఇంకా ఇక్కడ నేను కి ఏమి సంబంధం ఉంది లేదు కదా. నేను ఉన్నానని అనుకోవడమే నేను ఉన్న మాయ అని అర్థమైంది కదా.
నిజానికి అన్ని కూడా నేను వాడి ప్రకారమే జరిగితే పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూడటం ఎందుకు? అసలు పరీక్షలు రాయటం ఎందుకు? వాడి సంకల్పబలంతో వారికి కావలసిన ఫలితాలు ముందుగానే తెప్పించుకోవచ్చు కదా. ఎందుకు ఉద్యోగాలు చేయడం? ఎందుకు డబ్బులు కోసమే కదా. డబ్బు అవసరాలు తనే స్వయంగా సంకల్పంతో తీర్చుకోవచ్చు కదా. అలా చేయలేరు. కేవలం దానికి కర్మలు చేస్తూ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఆనందపడతాడు. తన కష్టము వల్లనే వచ్చిందని సంతోష పడతారు. ఒకవేళ ప్రమోషన్ రాకపోతే దేవుడికి పూజలు చేసిన దొంగ ముండా కొడుకు ప్రసాదాలు తిని ఫలితం ఇవ్వలేదు. నాకు ప్రమోషన్ ఇవ్వలేదు అని తిడతాడు. నిజానికి ఈ రెండు చేసేది ఆయనే కదా. ఆయనకి ఆయనే ప్రమోషన్ ఇస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో తెలుసుకొని ఆనందపడుతున్నారు. అలాగే ఆయనకి ఆయనే ప్రమోషన్ రాకపోతే ఎలాంటి బాధ కలుగుతుందో తెలుసుకొని ఆనందపడుతున్నారు. అది ఏమిటి ఆయన బాధ పడాలి కదా. ఆయనకి నా బొంద మాయ ఎక్కడ ఉంది? ఆయన మాయ రహితుడు కదా. అందువలన ఆయన రెండు భావాల ద్వైతము స్థితిలో ఉండడు. ఆయనకి బాధ ఆనందం అనే తేడాలు తెలియవు. కేవలము పరమానంద స్థితియే అన్నింటికి.హచ్ కుక్క లాగా అది అన్ని ఎక్స్ప్రెషన్ కి ఒకే ముఖ భావము పెట్టినట్లుగా ఈయన కూడా అన్నింటికీ ఏక భావ పరమానంద స్థితియే సమాధానము. మన జీవాత్మయే ద్వైత స్థితి వుండుట వలన ప్రతి దానికి రెండు భావాలు కలిగి ఉంటాడు. సుఖము- దుఃఖము. కష్టము- సుఖము, విషాదం- ఆనందం ఇలా ద్వైత భావాలలో ఉంటాడు. ఇదంతా జీవాత్మ కి నేను అనే మాయ ఉండటము వలన జరుగుతుంది. ఎప్పుడైతే నేను అనేది త్యాగము చేస్తుందో అంటే ఆనాడే దానికి ద్వైత స్థితి పోయి అద్వైత స్థితి అనగా అన్నిటి యందు ఏకతా భావ స్థితి అనగాతురియా స్థితి అదే పరమానంద స్థితి ఉండుట వలన ఈ ఆత్మను కాస్త పరమాత్మ అన్నారు. అదే ఏకైక ఆత్మకి మాయ ఉంటే జీవాత్మగా మాయ లేకపోతే నేను అనేది లేకపోతే పరమాత్మగా చెప్పటం జరిగినది. మాయ ఉంటే ద్వైత భావంలో ఉంటాము. మాయ లేకపోతే ఏక భావము అనగా అద్వైత స్థితిలో ఉంటామని ఇప్పటికైనా అర్థం అయినది కదా. ఈ ఏక భావ స్థితియే పరమశాంతి అన్నమాట. దీనినే ఆనందోబ్రహ్మమని సచ్చిదానందమని పరమానందమని, శాంతి, పరమ శాంతి అని వివిధ రకాలుగా పిలుసుకోవడం జరిగినది. అందుకే “నేను” త్యాగం చేస్తేనే పరమశాంతి లభిస్తుంది అని నాకు అర్థం అయింది.
నాకు సకల శాస్త్రజ్ఞానము కలగటం:
ఒక రోజు ఎందుకో ఖాళీగా కూర్చుని ఉన్న వాడిని ఊరుకోక అసలు నాకు నిజంగానే సమస్త విద్యల జ్ఞానమును (అదే చిదంబరం దక్షిణామూర్తి ఇచ్చినాడు) నేను పొందినానా లేదా అనే సందేహం వచ్చింది. మేము పెరిగిన వాతావరణం అనుకూలించినదో లేదా మేము ఎక్కువగా వాళ్ళ చుట్టూ తిరగటం వలన గాని నాకు జ్యోతిష్య శాస్త్ర జ్ఞానము పొందిన విషయం నిజమో కాదో తేల్చుకోవాలని అనిపించింది. మూలాధార చక్రంలో నా సాధన స్థితి ఉన్నప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్ర గ్రంధాలు పుస్తకాలు చదివిన ఒక పట్టాన అర్థం అయ్యి చావలేదు. ఎలా జ్యోతిష్యులు జాతక చక్రము గీసి జాతకాలు చెబుతారో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా భవిష్యత్తు సూచనలు గా నా జీవితంలో జరిగేది. అదే నాకు ఆశ్చర్యము అనిపించేది.దానితో ఈ జ్యోతిషము నేర్చుకోవాలనుకుంటూ ఎన్నోసార్లు ప్రయత్నించినా అర్థం అవ్వలేదు. గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఆరు నుండి ఎనిమిది లేదా పన్నెండు సంవత్సరముల పైన పడుతుంది అని తెలిసినది. అలాగని చేస్తున్న ఉద్యోగం మానేసి వెళ్లి నేర్చుకునే పరిస్థితి కాదు అనుకుని దీనిని గూర్చి పట్టించుకోవటం మానేశాను. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సహస్రార చక్రమునకు నా సాధన స్థాయి వచ్చినప్పుడు 16 రకాల జ్ఞానాలు నాకు అందినాయని తెలుసు కదా. అందులో జ్యోతిష్య జ్ఞానం కూడా ఉంది కదా. నేను ఏమాత్రం ఆలోచించిన జ్ఞానము పొందిన మౌనంగా ఉండమని చిన్ముద్ర ద్వారా హెచ్చరించిన మేము పట్టించుకోకుండా జ్యోతిష్య శాస్త్ర జ్ఞానమును పొందుట జరిగినది. దానితో ఈ శాస్త్రానికి సంబంధించిన ఏ విషయమైనా అవలీలగా అర్థమయ్యేది. గురువుతో సంబంధము లేకుండా అన్నీ కూడా చక్కగా అర్థమయ్యేవి. దానితో మేము ఉన్న వాళ్ళము ఊరుకోకుండా డబ్బులు తీసుకొని 18 మందికి ప్రత్యక్షంగా 52 వేల మందికి పరోక్షంగా ఉచితముగా వివిధ లకోటప్రశ్న విధానాల ద్వారా వారి జాతకసమస్యలు నివారించడము జరిగినది. నా నా చంకలు నాకటము జరిగినది. జాతకచక్రము గీయటం దగ్గర నుండి దేవుడిని అడిగి సమాధానం తెలుసుకునే దైవ ప్రశ్న దాకా మా ఈ శాస్త్ర జ్ఞాన శక్తి వెళ్ళిపోయింది. జాతకాలు గీయటం దగ్గర నుండి ఆ జాతక గ్రహస్థితి స్వయంగా ప్రత్యక్షముగా విశ్వములో ఆ గ్రహ స్థితులు చూసే స్థాయికి వెళ్ళటం జరిగినది. జాతక గ్రంథాలు చదవడం నుండి మేము స్వయంగా ఒక జాతక ప్రశ్న అనే గ్రంథం రాసే దాకా జ్ఞాన స్థితి వెళ్ళిపోయింది. దానితో మిగిలిన శాస్త్ర విద్య జ్ఞానాల మీదకి మేము ప్రయత్నించటం అవి కాస్త అందటంతో సర్వ పరిహారాలు అనే వార పత్రికను ఆన్లైన్ లో పెట్టేదాకా అంటే ఇందులో జ్యోతిష్య శాస్త్రము, కలల శాస్త్రము, వాస్తు శాస్త్రము, మానసిక శాస్త్రము,రత్న శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, యోగ విజ్ఞాన శాస్త్రము, ప్రశ్న శాస్త్రము, దైవ శాస్త్రము కోడి శాస్త్రం ఇలా 18 విభాగాలుగా బోధనలతో వార పత్రిక నడిపే దాకా అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా ఇవ్వటం జరిగినది. బహుశా నాకు తెలిసి ఈ పుస్తకము వ్రాయటం పూర్తి అయ్యేసరికి ఈ సైట్ అనగా ఈ వార పత్రిక ఆపి వేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రస్తుతానికి జ్ఞాన బ్రహ్మ స్థితిలో ఉన్నాము. కొన్నాళ్ళకి చిదంబర దక్షిణామూర్తిలాగా మౌన బ్రహ్మగా తప్పనిసరిగా మారి పోతాము. ఎందుకంటే ఒకప్పుడు మొదట జ్ఞాన బ్రహ్మగా ఉండి దీని వలన వచ్చే జ్ఞాన అహంకార మాయ వలన అపస్మారకస్థితిలోనికి అనగా వచ్చిన జ్ఞానము మర్చి పోయే స్థితిలో అందరూ వెళుతుంటే ఆయనకి విరక్తి కలిగి జ్ఞాన ప్రదాతగా ఉంటూ మౌనంగా మారి పోయి మౌన బ్రహ్మగా మారిపోయి మౌన స్థితి లో ఉంటూ మౌనంగా ఉంటున్నారు అని నాకు అర్థం అయింది.
జాతకబ్రహ్మ పదవి నుండి నేను తప్పుకున్నాను:
జాతకాలు చూడటము చెప్పటము పూజ పరిహారాలు చేయడము పూర్తిగా మానివేశాను. అలాగే వివిధ రకాల విద్యల జ్ఞానాలతో వచ్చిన వారపత్రిక వలన అలాగే జ్యోతిష్యుడుగా మారటం వలన కలిగిన కొన్ని బాధాకరమైన అనుభవం వలన వైరాగ్యము కలిగినది. దానితో నాకు జ్ఞాన అహంకార మాయ తొలగి పోయింది. అది ఎలా అంటారా? ఒకసారి పెళ్లి అయినా ఆరు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోతే వారికి నాగ దోష పరిహార పూజలు చేయిస్తే మొదటిగా ఆడపిల్ల సంతానప్రాప్తి కలిగినది. ఉన్నవాళ్లు కాబట్టి మరొక సంతానం కావాలి అంటే పూజలు చేసిన తర్వాత దోష పరిహారాలు జరిగి రెండవసారి గర్భవతి అయినది. అప్పుడు కడుపులో ఎవరు ఉన్నారో పరీక్షలు చేయటం ఆ దంపతులు ప్రారంభించినారు. మగ పిల్లవాడు పుడితే పెంచుకుంటామని మళ్లీ ఈ సారి కూడా ఆడపిల్ల పుడితే అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నామని మాతో చెప్పేసరికి నా బుర్ర తిరిగినది. ఆడపిల్ల పుడితే చంపేస్తారా? ఉన్న వాళ్ళే కదా? ఇద్దరు ఆడపిల్లలు అయితే నష్టం ఏమిటి? అంటే “మా ఆస్తులకు వారసుడు కావాలి కదా. అదే ఆడపిల్లలు అయితే అల్లుళ్లకు మా ఆస్తులు ధారాదత్తం చేయాలి కదా. అదే మగవాడు అయితే వాడికి మా ఆస్తులు అందుతాయి కాబట్టి గురువుగారు మాకు ఆడపిల్ల పుడితే దాని అబార్షన్ పాపము మీకే చెందుతుందని కాబట్టి మీకున్న శక్తితో ఒకవేళ నా కడుపులో ఆడపిల్ల ఉంటే మగపిల్లవాడిగా మార్చండి లేదా నాకు మగ పిల్లవాడు పుట్టేటట్లుగా ఏదైనా చేయండి” అని ఆ కన్నతల్లి ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లకు జన్మ లేకుండా చేస్తుంటే నా నోట మాట రాలేదు. అందుకే పరమేశ్వరుడు వీరికి సంతానం లేకుండా చేయాలని అనుకుంటే మేము ఏదో పెద్ద పోటుగాడిలా నాకున్న జ్యోతిష్య విజ్ఞానంతో వారికున్న పాప పరిహారాలు చేసి వారికి సంతానప్రాప్తి కలిగించటం ఎందుకు. ఇప్పుడు రెండవ సారి ఆడపిల్ల అయితే వచ్చే పాపభారము నాకే చెందుతుంది కదా అని ఒక విధమైన విరక్తి భావన నాలో మొదలైనది. అదృష్టం బాగుండి రెండవసారి మగపిల్లాడే పుట్టినాడు. ఇప్పుడు ఆ పిల్లలని సాక లేక ఆ దంపతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిసింది.కనటం తేలిక పెంచటం కష్టమని వీళ్లు గ్రహించే సరికి జరగవలసిన నష్టం జరిగినది కదా సంతానప్రాప్తి రూపంలో.
ఇది ఇలా ఉంటే మాకు వరుసకు తమ్ముడు అయినవాడికి జాతకం చూసి నీకు మతాంతర వివాహం యోగం ఉన్నది జాగ్రత్తలు తీసుకో. కొన్నాళ్ళపాటు ఆడపిల్లలకి దూరంగా ఉండు. నీకు ఈ వివాహము అయితే నీ తల్లిదండ్రులు బాధపడి చనిపోతారని వాడికి 5 సంవత్సరముల ముందునుంచి చెబుతూ జాగ్రత్తలు తీసుకోమని చెబితే విధి వ్రాత ఎలా ఉంటే అలా జరగక తప్పదు కదా. విధిరాతను ఎవరూ కూడా తప్పించుకోలేరు గదా. వీడు కూడా అంతే. తన వయస్సు ప్రభావము అటువంటిది. అనుకోకుండా అన్యమత స్త్రీలతో పరిచయాలు ప్రేమలు కలిగించాయి. అబార్షన్ దాకా వెళ్ళినారు. ఆమె కాస్త తనని వివాహం చేసుకోకపోతే తను ఎందుకు చనిపోయానో దానికి కారణమైన నీ పేరు కూడా వ్రాసి చస్తానని బెదిరించడం మొదలైనది. దానితో మన వాడికి భయము వేసి నాకు ఫోను చేసి “భయ్యా! ఇది నా పరిస్థితి” అంటే నేను నానా తిట్లు తిట్టి “నేను నీకు ముందుగానే హెచ్చరించాను. గత కొన్నాళ్ల పాటు ఆడపిల్లలకు దూరంగా ఉంటూ వారి జీవితాలు నాశనం చేయకుండా మీ జీవితం నాశనం చేసుకోకు” అని చెప్పినాను కదా అంటే “భయ్యా! ఏమి చేయమంటారు వయస్సు అలాంటిది. కోరిక అనేది స్త్రీ ని చూస్తుందే గాని వయస్సును మతమును చూడదు కదా. కొన్ని నెలలు అనుభవించి వదిలిపెట్టాలి అనుకున్నాను. అది ఏకు కాస్త మేకుగా మారి నాకు ఉరితాడుగా వస్తుందని నాకు ఏమి తెలుసు. అయినా మీరే చెప్పారు కదా! మతాంతర వివాహం ఉన్నదని అందుకే ఇష్టం లేకపోయినా అవకాశము లేకపోతే చేసుకోక తప్పదు కదా! నా జాతకంలో అది ఉంటే నేను ఏమి చేయగలను” అని వాడు అని ఫోన్ పెట్టేసినాడు. అసలు నాకు ఏమి అర్థం కాలేదు. వీడికి జాగ్రత్త పడతాడు అని మేము ముందుగా భవిష్యత్తు చెప్పి తప్పు చేశామని అనిపించినది. భవిష్యత్ వీడికి తెలియకపోతే పరిస్థితి మరోరకంగా ఉండేదేమో కదా. ఇప్పుడు నా జాతకంలో అలా ఉంటే చేసుకోక తప్పదు కదా అంటున్నాడు అనగానే నాకు ముందుగానే మార్చలేని భవిష్యత్తును తెలుసుకొని ఏమి లాభము అనిపించినది. మరి పూజలు చేస్తే ఫలితాలు ఎలా మారుతాయి అనుకున్న ప్పుడు నిజానికి ఫలితాలు మారవు. పూజలు చేయించుకుంటే ఒక రకమైన ఫలితాలు పూజ చేసుకోకపోతే మరో రకమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్లుగానే జాతక ఫలితాలు అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పూజలు చేయించుకున్న కొంతమందికి ఫలితాలు మారవు అని తెలుసుకున్నాను. గత జన్మలో చేసిన శాపాల కారణంగా అవి కాస్త ఇప్పుడు ప్రారబ్ద కర్మ ఫలితాలు ఏర్పడతాయని గ్రహించాను. వాటిని సాక్షాత్తు భగవంతుడు కూడా మార్చలేడు అని ఆనాడు మేము గ్రహించినాము. దానితో మాకు తెలియకుండానే వైరాగ్య భావనలు ఈ శాస్త్రం మీద కలగటం ఆరంభమయ్యాయి. వీరంతా భోగ జీవులు కాబట్టి మాయలో పడి పోతున్నారు అని గ్రహించి ఈసారి యోగ జీవులకు వారి సాధన మాయలు తొలగించటానికి పూజలు చెయ్యాలని సంకల్పించాను.
మోక్ష కుటుంబము పరిచయం:
నాకు సంకల్పానికి తగ్గట్లుగా ఒక మోక్షకుటుంబమే పరిచయము అయినది.ఏక్కడైనా కుటుంబములో ఎవరో ఒకరు మాత్రమే యోగసాధకుడిగా ఉంటారు.కాని ఈ కుటుంబములోని తండ్రి,తల్లి,కొడుకు,కూతురు అందరుగూడ విచిత్రముగా మోక్షకోసము తపనపడటం చూసేసరికి నాకు నోటమాటలేదు. భగవద్గీతను ఒక కుటుంబములాగా చూస్తున్నట్లుగా అనిపించినది.ఎందుకంటే తండ్రి కాస్త హనుమంతుడి మీద భక్తితో భక్తిమార్గములో ఉంటే... తల్లి కాస్త తన మాష్టారు సి.వి.రామన్ గురువు భక్తితో జ్ఞానమార్గములో ఉంటే...కొడుకు తనకున్న కామ,ధన సంబంధ కర్మనివారణ కోసం గృహస్ధధర్మముతో కర్మమార్గములో శివభక్తితో ఉంటే......కూతురు కాస్త శివభక్తితో ధ్యానమార్గములో ఉండటం ఆశ్చర్యమే గదా!అసలు నాకు యోగజీవులకి కర్మనివారణ చేయువచ్చు గదాని...నా సలహా ఇచ్చినది అలాగే నాకు ఆలోచన ఇచ్చినది ఈ కుటుంబ కూతురే అన్నమాట. ఆ వివరాలలోనికి వెళ్తే... ఈ కుటుంబము నుండి నా ప్రారంభ జాతకాలు చెప్పే సమయములో కూతురు ఫోన్లో పరిచయము అయితే...నేను కాస్త జాతకాలు చెప్పడం ఆపే సమయానికి తల్లిగారు ఫోన్లో పరిచయము అయినారు. ఈ మధ్య ఉన్న కాలసమయములో ఈ కుటుంబసభ్యులంతా గూడ మోక్షప్రాప్తికి తపనపడుతున్నారని నేను గ్రహించాను.నాకు ఆశ్చర్యమేసినది.ఒక మోక్షకుటుంబమును చూస్తున్నానని నాకు అనిపించినది. మొట్టమొదట ఈ కుటుంబ కూతురు ఏదో జాతక సమస్యతో నాకు ఫోన్ చెయ్యడము...ఈమెకి ఉన్న ఆ జాతక సమస్యను నివారణ చేసేసరికి...అసలు విషయము అనగా “తనకి మోక్షము గావాలంటే ఏమి చెయ్యాలి” అడిగినది. అపుడు నేను ఆమెతో... “ప్రారబ్ధకర్మల నివారణ అదిగూడ కర్మశేషము లేకుండా నివారణ చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతూందని” చెప్పేసరికి..ఆమె కాస్త.. “అయితే గురువుగారు...జాతకసమస్యలు నివారించినట్లుగా… మాకున్న కర్మనివారణలు చెయ్యించవచ్చుగదా” అనేసరికి నేను కాస్త ఆలోచనలో పడినాను.అవును ఇది నిజమే గదా!ఇపుడి దాకా జాతకసమస్య నివారణలే చేస్తున్నాము..ఏకంగా ఈమె చెప్పినట్లుగా కర్మనివారణలు నివారణ చేసే వీలుంటే చేస్తే మంచిదే గదా అనిపించినది.అపుడు మా గురువైన విచిత్రవేదాంతి గారిని కలిసినపుడు “ఎందుకు చెయ్యకూడదు?చెయ్యవచ్చును.ఇపుడు వాళ్ళకి ఉన్న జాతకసమస్యలు ఏర్ఫడటానికి కారణము గతజన్మల పాపకర్మఫలితాలే గదా!వాటిని మనము డబ్బులు తీసుకొని జపాలు,దానాలు,హోమాలు ద్వారా వీళ్ళికున్న పాపకర్మలు మనము తీసుకొని వాళ్ళకి పాపకర్మలనుండి విముక్తి కలిగించినట్లే ...ఈ సాధన కర్మనివారణలు నివారణ చెయ్యవచ్చు” అని చెప్పగానే...నాకు ఆశ్చర్యానందాలు కలిగినాయి.అపుడు ఈయనతో “జీజీ!అయితే మొదట నాకున్న సాధన కర్మనివారణలు చెయ్యండి.ఫలితానుభవాలు కలిగితే మిగిలిన వారికి చేయవచ్చును” అనగానే కొన్నివారాల తర్వాత మా జీజీ నా పేరు మీద సాధనకర్మనివారణ హోమాలు చేయించడం..అందులో ఫలితము కనిపించేసరికి...ఈ విషయము తెలుసుకున్న మా యోగమిత్రుడైన జిజ్ఞాసి గూడ ఈ సాధన కర్మనివారణ పూజలు చేయించుకున్న వారంరోజులకల్లా కర్మనివారణలు నివారణ అవ్వడం మొదలైనాయి. మోక్షప్రాప్తి పొందాలని అనుకుంటున్నాను అని చెప్పటం వారికి కావలసిన స్థూల సూక్ష్మ కారణ కర్మల నివారణ కోసం పూజలు చేయడం ప్రారంభించిన తనకి ఉన్న ఒక లక్షా 25వేల కర్మనివారణ పూజలు చేయించుకుని వాటిని దాటినట్లు గా అనుభూతి పొందిన తర్వాత సూక్ష్మ కారణాలు 37,000 దాకా ఉంటే అందులో 36000 కర్మలు మాత్రమే నివారణ చేయగలమని చెప్పటంతో 8 లక్షల జన్మల నివారణ కోసం వాటికి పూజలు చేయగా 36వేల కర్మలు పూర్తి అయినాయి. 1000 కర్మలు మిగిలిపోయినట్లుగా అనుభవ అనుభూతిని పొందడం జరిగినది. ఇంకా కారణ కర్మలు 1000 ఉన్నాయని దానికి 40 లక్షల జన్మలు ఉన్నాయి అని చెప్పి వాటి నివారణకు సిద్ధపడే సరికి మేము 12 సంవత్సరాలలో ఫలితం వస్తుంది అనుకుంటే ఇతనికి కేవలం మూడు నెలలులో ఫలితాలు వచ్చే సరికి తనకి నిజంగానే కారణ కర్మలు తీరి కారణ బ్రహ్మ అయినానా? అనే సంశయము బుద్ధి వలన సందేహము వచ్చినది. ఎందుకంటే 40 లక్షల కర్మలకి 12 సంవత్సరాలు పడతాయని చెబితే కేవలం మూడు నెలలలోపే పూర్తి అయినది అని వచ్చిన ధ్యాన అనుభవాలు అనుభూతులు కలిగిన కూడా నమ్మలేక పోయినాడు. దానితో కారణ బ్రహ్మ పదవి నుండి అనగా హృదయ చక్రం నుండి ఆజ్ఞాచక్రం సాధన స్థితికి చేరుకొని జీవ బ్రహ్మ అయినాడు. ఇప్పుడు మళ్లీ తను చేసిన పొరపాటు అదే సంశయము బుద్ధి నివారణ చేసుకోవటానికి ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఇతనికి ప్రతిది కూడా ప్రత్యక్ష అనుభవం కలిగితే గాని నమ్మలేడని ఇతనికి కర్మ నివారణ పూజలు చేయటం ఈ అనుభూతి వచ్చినా కూడా సంశయ బుద్ధి వలన అందుకోలేక పోతున్నాడు అని గ్రహించి అనుభవ పాండిత్యము కోసం స్వయంగా తనకి తానే సాధన చేసుకోమని చెప్పి పంపేసినాము. కపాలమోక్షప్రాప్తికి జిజ్ఞాసిగా ఈ గ్రంథములో ఒక సాధన పాత్రధారిగా మారి వారి సాధనానుభవాలు మనతో పంచుకుంటున్నారు.
ఇలా ఉండగా ఈ మోక్ష కుటుంబ కూతురు నుండి ఫోన్ వచ్చింది. నాకు మోక్ష ప్రాప్తి పొందాలంటే ఏమి కావాలో అది చేయించుకుంటాను అని ....50వేల దగ్గరనుండి రెండు లక్షల దాకా కర్మలు నివారణ చేయించుకొని తమ సాధన స్థాయిని మూలాధార చక్రము నుండి ఆజ్ఞాచక్రము దాకా వచ్చినది. అక్కడున్న జీవ మాయ వలన తన ఇష్టదైవమైన శివుడు కాస్తా ఈమె భర్తగా కనిపించటం ఈయనతో మైధునము చేస్తున్నట్లుగా అనుభవాలు అనుభూతులు కలుగుతుంటే సరికి నాలుగు ఉప చక్రాలు అయిన గుణ,కర్మ,కాల,బ్రహ్మ దాటటానికి చక్రాలు 15 లక్షల కర్మలు నివారణ చేయాల్సి ఉంటుందని చెప్పేసరికి తెలియకుండానే మేము ధనకాంక్షలో పడిపోతున్నానని తను కాస్త భ్రమలో పడి ఏవో పూజల పేరిట డబ్బులు గుంజుతున్నారని భ్రాంతి చెందటంతో ఆమెకి ఎక్కడా కూడా ధనము దొరకని స్థితి ఏర్పడినది. దానితో 15 కోట్లు శివకోటి అనగా పదిహేను వందల పుస్తకాలు రాయమని చెప్పటం జరిగినది. దానికి ఆమె కొన్ని అనారోగ్య సమస్యల వలన శరీరం సహకరించదు అని చెప్పేసరికి తనకున్న అనుమానపుసంశయ బుద్ధి నివారణ కోసం ఈ పదిహేను లక్షల కర్మలకి కారణమైన 15 వ్యక్తులు మీ ముందుకు తీసుకొని వస్తానని రాబోవు కాలంలో జరిగే సంఘటనలు అందుకు సాక్ష్యం అని టీవీలలో న్యూస్ పేపర్లలో ఆయా వ్యక్తుల వివరాలు బయటికి వస్తాయి అని ఆమెకి చెప్పి అవి వచ్చిన వాటిని ఆమెకి చూపించటం జరిగినది. దానితో ఈ పూజలు ఈ పదిహేను లక్షల కర్మ నివారణలు ఉన్నాయని తెలుసుకునే లోపల పూజా సమయం మించిపోవడంతో పూజలు చెయ్యలేక పోవటం జరిగినది. అసలు ఈ సమయంలో నాకు ఎందుకు అనుమానం కలిగినదో ఆ దైవానికి తెలియాలి. నివారణ చేయటానికి అనుభవ జ్ఞానము కావాల్సి వచ్చింది. దానితో 15 రకాల అనుభవాలు పొందటానికి సమయము తీసుకోవటం జరిగినది. ఇది నిజమా అని తెలుసుకునే లోపల పుణ్యకాలం కాస్త గడచిపోయినది. అది మాకు తెలియకుండానే జరిగినది. తనకున్న అనుమానపుసంశయ బుద్ధి వలన కర్మ నివారణ జరగలేదని మాకు అర్థమయింది. ఆతర్వాత కొన్నిమార్గాలు దొరకడముతో...ప్రస్తుతము తారాదేవి అను సంకల్పశరీర దీక్షనామముతో... ఇష్టలింగాధనతో హృదయచక్ర కర్మనివారణ చేసుకుంటోందని...అటుపై సాధనపరిసమాప్తి సమయములో వచ్చే అష్టవస్తువులు రావడముతో ఏకముగా సంపూర్ణ కపాలమోక్షప్రాప్తి పొందటానికి ఎలాంటి మాయలు,అవాంతరాలు,కర్మలు లేని స్ధితి పొందటానికి యోగ్యతను తను సంపాదించుకున్నది. కాని అర్హత సంపాదించుకొనే ప్రయత్నములో ఏమి జరుగుతుందో ఎవరికి ఎరుక. అంటే యోగ్యత పరీక్ష జయం పొందటం అంటే ప్రకృతిమాయలు ఉండవు.అర్హత పరీక్ష మాయ అంటే మనకి మనమే గావాలని మాయలో పడటం అన్నమాట. మరి ఈమె ఈ అర్హత పరీక్షలో జయం పొందినదో లేదో తెలియాలంటే ఈమె సాధన శక్తి హృదయచక్రమును దాటాలి.అపుడిదాకా ఎదురుచూడక తప్పదు.మరి ఈమె సాధన స్ధితి గూర్చి మనకి తెలియలంటే రాబోవు అధ్యాయమైన నా హృదయచక్ర సాధనానుభవాలు చెప్పే ఇష్టలింగము ఇంటికి వచ్చినది అనే అధ్యాయములో చూడాలి.
ఇలాంటి స్థితిలో ఉండగా సివి రామన్ గారి అమిత భక్తురాలు అయిన ఈ కుటుంబ తల్లి ఫోన్ చేసి “నాకు మా గురువుగారితో ఉండిపోవాలని ఉందని నాకు పునర్జన్మ లేకుండా చేయమని” అడిగింది. అప్పుడు సమస్త విద్య జ్ఞానాలలో మోక్ష విద్య జ్ఞానమును మేము పొంది పూజలు చేయటం ఆరంభించి వారికున్న మూడున్నర లక్షల కర్మలు తీసివేసి హోమం చేయగానే… అందులో రామచిలుక ఆకారము వచ్చినది. అంటే వీరి గురువు అయిన రామన్ రామచిలుక అనుగ్రహం పొంది ఉన్నారని నాకు అర్థమైనది. ఆ తరువాత ఈయన సందేశంతో ఉన్న పేపర్ కటింగ్ మా దగ్గరికి వస్తే వారికి అందించడం జరిగినది. దానితో ఈవిడ విషయంలో చేసిన కర్మ నివారణ పూజలు ఫలించినాయి అని అనడానికి గుర్తుగా దత్త స్వామి కలలోకి వచ్చి పొయ్యిమీద పాలు కాచి ఇవ్వడం జరిగినది. అది కూడా నాలాంటి పోలికలు ఉన్న వ్యక్తి లాగా రావటం విచిత్రం అన్నమాట. పాలు కాయటం అంటే ఆమెకి ఉన్న అన్ని కర్మలు భస్మము చేసి చిరంజీవి తత్వము కోసం అమృతము వంటిది పాలు ఇవ్వటం జరిగినది. ఎందుకంటే ఈవిడ తన ఆఙ్ఞాచక్రం స్థితిలో వచ్చే జీవ మాయ వలన ఏర్పడిన గురు మాయను దాటలేక పోయి వారి సన్నిధిలో నిరంతరముగా ఉండాలని పునర్జన్మ లేకుండా ఉండాలని అనుకుంటున్నారు కదా. కాబట్టి మేము చేసిన పూజల వలన భవిష్య జన్మలు నశించిన తద్వారా సి.వి.వి రామన్ ఉండే లోకానికి వీరి మరణానంతరం చేరుకోవడం జరుగుతుందని నిదర్శనంగా ఒకరోజు ఈమెకి ధ్యానములో ఒక పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని పెద్ద ముత్తయిదువ ఇంటి లోనికి వచ్చి (నీల ఎరుపు వస్త్రాలు వేసుకున్నదని) నవ్వుతూ కనిపించినట్లుగా మాతో చెప్పటం జరిగినది.అంటే ప్రకృతి మాత యొక్క మహామాయ అనగా పునర్జన్మలకి కారకమైన జీవ మాయ కూడా దాటుకున్నారని మాకు అర్థం అయినది. దానితో ఈమెకి పునర్జన్మలు లేని జన్మ రాహిత్య స్థితికి చేరుకుంటారని వారి గురువు సన్నిధికి చేరుకుంటారు అని మేము గ్రహించాము.
ఆతర్వాత ఈ కుటుంబ కొడుకైనా కాస్త తన సాధన కర్మనివారణ కోసం అలాగే తండ్రి కాస్త తన ఆరోగ్యకోసము...సాధన కర్మనివారణ పూజలు చేయవలసి వచ్చినది. ఈ పూజల కోసము ఏకముగా మా విచిత్ర వేదాంతి గురువుగారు వీరి ఇంటికి వెళ్ళి కర్మనివారణ పూజలు చేయించి..వీరు చేసిన హోమము నందు వీళ్ళకున్న సాధన ప్రారబ్ధకర్మనివారణ తగ్గట్లుగా హోమమునందు ఆయా దృశ్యాలు భక్తి దేవతలు అనగా తండ్రికి హనుమంతుడు హోమదర్శనదృశ్యం అవ్వడము అలాగే తల్లికి ఈ హోమమునందు చిలక దర్శనం అలాగే కుమారుడి కోసము లక్ష్మీదేవి దర్శనం అలాగే కుమార్తే కోసము శ్వేతార్క గణపతి అలాగే పాము కనిపించడము జరిగినది. అదియుగాక ఈ కుటుంబ తండ్రి గతజన్మములో గుప్తయోగిగా ఉండి సహస్రచక్రములోని శ్రీకృష్ణమాయను దాటుకున్నారని...ప్రస్తుత జన్మలో జీవనాడి మార్గములో ఉన్న హనుమంతుడి అనుగ్రహ భక్తిని పొందుటకు ప్రతిరోజు హనుమంత అంశమైన కోతులకి అరటిపండ్లు పెడుతూ...వాటి ఆకలి తీరుస్తూ...హనుమంతుడి అనుగ్రహామును పొందినారు.తద్వారా రాబోవు భవిష్యజన్మలో ఇష్టలింగమును పొంది తన హృదయచక్రమును శుద్ది చేసుకుంటారని తెలిసినది.అలాగే వీరి కుమారుడు గతజన్మ సాధనలో కాపాలిక సాధనలో కామగుణానికి స్ఫందించడము వలన ఈ జన్మలో త్రిపుర కామ మాయ నివారణలో ఉన్నాడని...అలాగే 144 సం!!రా లకి వచ్చిన కాశీ క్షేత్ర గంగా కుంభమేళాకి వెళ్ళి తనకున్న త్రిపుర కామమాయను నివారణ చేసుకున్నాడని...దీని వలన రాబోవు భవిష్యజన్మగా కాశీ యందు అఘోర యోగిగా జన్మించి కపాల మోక్షప్రాప్తి పొందుతాడని తెలిసినది. ఇలా ఇలాంటి పూజ విజయము పొందేసరికి కర్మ ఫలితం పూజలు చేయటం కన్నా కర్మ నివారణ పూజలు చేయటం మిన్న అని యోగ జీవుల పూజలు చేయటం మొదలు పెట్టినాను. అందుకే తన సాధనశక్తితో ఇలాంటి విచిత్రాలు ఇప్పటికి కొల్లాలు చూపించేసరికి మా జీజీని విచిత్రవేదాంతి అనడములో సత్యమున్నది గదా!
ఇలాగే ఒక వ్యక్తి వచ్చి సాధన కర్మనివారణ పూజలు చేయించుకోవడము జరిగినది.కాని ఇతనికి తనకున్న కర్మనివారణ ధ్యానానుభవాలు కలిగే దాకా సహనశక్తితో ఉండలేక అంటే కర్మల నివారణ పూజలు చేసినా కూడా వచ్చే ఫలితాలను అనుమానించడం జరుగుతుంది అని తెలియగానే యోగ జీవుల కోసం చేసే కర్మ నివారణ పూజలు మీద కూడా నాకు స్మశాన వైరాగ్యం కలగటం ఆరంభమైనది. ఫలితాలు ఆశిస్తారు అవి వస్తే తట్టుకోలేరని నాకు అర్థం అయినది. దానితో ఇలాంటి పూజలను ఆపివేయడం జరిగినది. కానీ నేను చేసిన తప్పిదం అదే నాకు నిజంగానే సమస్త విద్య జ్ఞానము నాకు నిజంగానే చిదంబర దక్షిణామూర్తి అందించాడా లేదా ప్రశ్నకి ఈ విధమైన ప్రత్యక్ష అనుభవాలు అనుభూతులు కలిగేసరికి మౌనముగా మారటానికి జ్ఞాన బ్రహ్మగా నాకున్న జ్ఞానమును ఇలా ఈ కపాలమోక్షం గ్రంథములో నిక్షిప్తం చేసి ఆ తర్వాత మౌన బ్రహ్మగా మారిపోవాలని నిశ్చయము చేసుకోవడం జరిగినది. దానితో జ్ఞాన బ్రహ్మ మౌనబ్రహ్మగా మారే దిశకు పరిస్థితులు మారిపోయాయి. కాకపోతే ఏమిటి కర్మ? జీవుల విధి వ్రాత మార్చలేని వారికి యోగ జీవుల అనుభూతులు నిజమని నిరూపించలేని వారికి ఇంకా జ్ఞాన అహంకారము ఎందుకు ఉండాలి? సంపాదించిన జ్ఞానం ఇతరులకు ఉపయోగిస్తూ ఉపయోగము లేనప్పుడు ఇంకా దేనికి అహంకారము ఉండాలో చెప్పండి. ఎప్పుడైతే ఎవరికైతే తను సంపాదించుకున్న జ్ఞానాలయందు ప్రేమ మోహం వ్యామోహాలు కలుగుతాయో వారికి తెలియకుండానే జ్ఞాన బ్రహ్మ అనే జ్ఞాన అహంకారము మొదలై అపస్మారక స్థితికి చేరుకొని పునః జీవుడుగా తిరిగి సాధనను కొనసాగిస్తారని రావణబ్రహ్మ కథనము చెబుతూనే ఉంది. ఈయన సకల శాస్త్ర విద్య పండితుడు అనగా జ్యోతిష్యం ,వాస్తు, శకునము ఇలా మనకు శాస్త్రాల ఆరితేరిన మహా పండితుడని సాక్షాత్తూ దైవమైన శ్రీ రాముడికి తెలిసి రావణ రామ యుద్ధానికి ఆయనచే ముహూర్తము పెట్టించడం జరిగినది అంటే రావణబ్రహ్మ ఎంతటి విద్య పండితుడో అర్థం చేసుకోవచ్చును. ఇలా వచ్చిన జ్ఞాన అహంకారము వలన రావణబ్రహ్మ అపస్మారక స్థితి పొంది జీవ బ్రహ్మగా మారి పరస్త్రీ వ్యామోహం చెందటం జరిగినది. చివరికి రాముడి చేతిలో మరణము పొందటం జరిగింది. కాకపోతే రావణబ్రహ్మకి ఉన్న అచంచలమైన శివ భక్తి శక్తి కారణంగానే తన మరణానికి సాక్షాత్తు పరంధాముడు శ్రీరాముడిగా అవతారం ఎత్తినాడు అంటే ఈయనికి ఉన్న అపార శివ భక్తికి జోహార్లు చెప్పక తప్పదు. రాముడు దేవుడే కావచ్చు కానీ తన భక్తితో ఏకంగా తన మరణానికి దైవాన్ని కిందకి దించడం అంత తేలిక అయ్యే విషయము కాదు కదా. మీరే ఆలోచించండి.ఇలా నాకు అబ్బిన వివిధ సకల విద్యల జ్ఞానాలు వలన వచ్చిన కర్మల జీవులు యోగ జీవుల ప్రత్యక్ష అనుభవాలు వలన నాలో జ్ఞాన అహంకారం నశించినట్లు అయినది. జ్ఞాన బ్రహ్మను కాస్త మౌన బ్రహ్మగా మారటానికి అనగా అపస్మారక స్థితి నుండి తప్పుకోవడం జరిగిందని నాకు అర్థమైనది. మౌన బ్రహ్మ అంటే ఇతరులతో మాట్లాడకుండా ఉండటం కాదు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు గా ఉండడం. దేనికి స్పందించ కుండా ఉండటం. దేని గురించి ఆలోచించకుండా ఉండటం. అతిగా దేని కర్మ ఫలితమును గూర్చి పట్టించుకోకుండా ఉండటం చేస్తుంటే ఇంకా ఇతరులతో మాట్లాడాలని సహజసిద్ధంగా అనిపించదు కదా. అది నిజమైన మౌన బ్రహ్మ స్థితి.నా బొంద మాట్లాడటానికి చెయ్యటానికి పొందటానికి ఇంకా ఏముంటుంది చెప్పండి. ఎవరితో మాట్లాడినా తనకి తానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ కూడా తానే ఉన్నాడు కదా. మరి వేరే రూపము ఉండదు కదా. అంతా తన రూపమే వివిధ దేహాలుగా తన రూపాలలో ఉన్నట్లుగా అంతా ఓకే తన రూపముగా కనబడుతుందని నా బొంద ఇంకా వేరే వారితో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది. ఆడ మగ లింగ భేదము కనిపించటం లేదు. నీది నాది అనే భావన ఉండదు. రాగద్వేషాలు ఉండవు. మోహ వ్యామోహాలు కలుగవు. వేరే వారిని చూడటం మాట్లాడాలని ఇంకా ఎందుకు అనిపిస్తుందో చెప్పండి. అంతట తనే ఉన్నప్పుడు అంతట తనే అయినప్పుడు తను లేనప్పుడు తను లేనిది లేనప్పుడు వేరే వాళ్ళు లేనప్పుడు ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి. ఎవరికీ జ్ఞానము ఇవ్వాలి ఎవరికి సేవ చేయాలి ఎవరికీ సహాయ సహకారాలు చెయ్యాలో చెప్పండి. ఇప్పుడు మౌన బ్రహ్మ స్థితి అనేది ఎలా ఉంది అంటే ఆ బ్రహ్మ నీకు అలా కష్టపడి అన్నం తినాలి అనుకున్నాను.ఇలా ఈ బ్రహ్మ సుఖ పడాలి అనుకున్నాము. అలా ఆ బ్రహ్మ పెళ్లి చేసుకొని నానా అగచాట్లు పడాలి అనుకున్నాము. ఇలా ప్రేమలో పడి ఈ బ్రహ్మము ఏదో తెలియని అనుభవాలు పొందాలని అనుకుంటున్నది. ఇలా ఇన్ని రకాల బ్రహ్మలలో ఉన్నది మేమే అనుకున్నప్పుడు ఇంకా ఏముంటుంది కిక్కు. నా బొంద నా బూడిద. తన్నులు తినేవాడు తన్నులు కొట్టేవాడు ఒకటే అయితే ఎలా ఉంటుందో చూడండి. అనగా సినిమాలో అంతా అన్నీ ఒకే హీరో పాత్రలు ఉంటే మీరు చూడగలరా. సినిమా చూస్తూ ఎంజాయ్ చేయగలరా చేయలేరు కదా. ప్రస్తుతం మాది అదే పరిస్థితి. ఈ విశ్వంలోని జగన్నాటకంలో అన్ని పాత్రలు పాత్రధారులు అన్నీ కూడా మేమే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఈ నాటకం చూడలేక అందుకే మౌన బ్రహ్మగా మారి అన్నిటికి సాక్షీభూతంగా ఉండటం తప్ప ఏమీ చేయలేము. ఈ స్థితి వద్ధు అనుకుంటే అపస్మారక స్థితి అనగా మనము పొందిన ఏక భావ స్థితి జ్ఞానము పరమాత్మ మనమే అనే జ్ఞానమును సంపూర్తిగా మర్చిపోతే అప్పుడు తిరిగి జీవాత్మగా మారి నామరూప దేహాలతో జన్మల పరంపరను కొనసాగిస్తూ తమకు తామే వేరు అనే భావనతో నా నా చంక నాకుతూ నానా కష్టాలు పడుతూ నానా ఇబ్బందులు పడుతూ జీవిత బండి నడుపు కోవాలి. మరి ఏ స్థితి మీకు మంచిదో మీరే నిర్ణయించుకోండి. ఇక్కడ ఈ సహస్రార చక్ర స్థితిలో దక్షిణామూర్తి ఒక ప్రక్క జ్ఞాన ప్రదాతగానే ఉంటూనే తట్టుకోలేని వారికి మాయా సహితమైన అజ్ఞానప్రదాతయైన అపస్మారక స్థితి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కేవలం మౌనబ్రహ్మగా ఉంటూ మౌన భాషలో మనకు శక్తిపాత సిద్ధి వలన అందించడం జరుగుతుంది. ఈయన మూల విరాట్ స్వరూపంతో వెయ్యి తలలతో వెయ్యి కాళ్లతో వెయ్యి చేతులతో వెయ్యి కోట్ల బ్రహ్మాండములను మౌన బ్రహ్మగా కారణ లోక శరీరముతో అన్ని రకాల జీవజాతులు లోని మెదడు మధ్యభాగంలోని పిట్యూటరీ గ్రంధి లోపల అంగుళ పరిమాణంలో ఎప్పుడు నిద్ర పోని స్థితిలో ఏకాంతముగా ధ్యాన ముద్రతో జ్ఞానముద్ర తో నిశ్చల స్థితిలో అర్థనిమీలిత నేత్రాలతో తన సంకల్ప భావాలతో తనకు తానే కోటానుకోట్ల జీవ స్వరూపాలుగా మారి తన జగన్నాటకం ఆడుతూ ఆడిస్తూ పాత్రధారిగా ఉంటున్నాడు. ఈ వివిధ నామ రూప శరీరాలే ప్రకృతిమాత గాను, త్రిమూర్తి గాను, త్రిశక్తి మాత గాను, మహావిష్ణువు గాను, మహా శివుడి గా, ఈశ్వరుడిగా, మహా దుర్గా, మహా గణపతిగా, మహారుద్రుడు, శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా, బుద్ధుడిగా అంతెందుకు….. మాకు లాగా నీకు లాగా ఈయన స్వరూపమే మన మెదడులో అంతర్గతంగా కారణ శరీరంతో ఉండి నడిపిస్తున్నారని ఆయనకి ఆయనే బాధపడుతూ ఆనందపడుతూ తిట్టుకుంటూ నవ్వుకుంటూ అవమానించు కుంటూ ద్వేషాలు పెంచుకుంటూ మోహాలు కలిగించు కుంటూ వ్యామోహాలు పెంచుకుంటూ వైరాగ్యము పొందుతూ జ్ఞానము తగ్గించుకుంటూ అజ్ఞానము పెంచుకుంటూ జ్ఞానము పెంచుకుంటూ అజ్ఞానము తగ్గించుకుంటూ లింగభేదాలు పెంచుకుంటూ సృష్టించుకుంటూ స్థితి కలిగించు కుంటూ భయముతో మరణాలు పొందుతూ జన్మలు ఎత్తుతూ నా నా చంక నాకుతూ జ్ఞానవంతులుగా ఖ్యాతి పొందుతూ ఇలా 36 కోట్ల భావాల పరంపర కోసం 84 లక్షల జాతులుగా వివిధ రకాల శరీరాలు ఎత్తుతూ వేసిన ఆటను వేస్తూ వైరాగ్యం కలిగి నప్పుడు నాశనం చేస్తూ మళ్ళీ అనిపించినప్పుడు మళ్ళీ కొత్తగా వేసిన నాటకం వేస్తూ విసుగు చెంది కొన్ని యుగాలకి చూసిన నాటకమే అని తెలుసుకొని వైరాగ్యం చెందుతూ మళ్లీ దానిని నాశనం చేస్తూ ఏకాకి గా మారిపోయి ఒంటరితనం భరించలేక ఏకత్వం నుండి తనకి తానే ఆయనను ఏర్పరచుకొని మాయను ఏర్పరచుకొని భిన్నత్వంగా మారి నేను వేరు అనేభావన పరంపరను మాయగా ఉంచుకొని ఇలా ఈ బ్రహ్మ చక్రమునందు జగన్నాటక సూత్రధారిగా ఈ మేధా దక్షిణామూర్తి ఉంటున్నారు. నిజానికి ఈయన ఏ పాత్రలో తాను స్వయంగా ఉండడు. వేయడు. కేవలము ఈయన మౌనముగా నిశ్చల స్థితిలో ఉంటే ఈయన సంకల్పాలు మాత్రమే సంకల్ప శరీరాలుగా కారణ శరీరాలు గా సూక్ష్మ శరీరాలుగా స్థూల శరీరాలుగా అవతారాలు ఎత్తుతాయి. చివరికి మళ్లీ అన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చి చేరి లయం అవుతాయి.ఒకటి మాత్రం లయం కాదు. అది ఏకైక ఆత్మ గానే మిగిలిపోతుంది. అది ఎందుకు లయం కాదో చెప్పండి. ఇంతకీ ఆ ఏకైక ఆత్మ ఎవరిదో చెప్పండి. ఇది చెప్పగలిగితే ఈ నా బాధ అంతా మీకు అర్థం అయినట్లే. ఊహించారా? అర్థం కాలేదా? ఇంకా ఎవరు ఈ దక్షిణామూర్తియే ఈ ఏకైక ఆత్మగా మిగిలిపోతారు. ఆయనకి ఆయన లయం కాలేడు కదా. ఆయనకి వేరే వాళ్ళు మరణం ఇవ్వటానికి ఆయన తప్ప ఎవరు లేరు కదా. ఆయనకి ఆయనే చనిపోవాలి అంటే శరీర త్యాగంతో ఆత్మహత్య చేసుకోవాలి. అలా చేసుకుంటే జ్ఞాన ప్రదాత కాస్త కర్మ ప్రదాత అవుతాడు. మళ్లీ పునర్జన్మల కి తగ్గ శరీరాలను సృష్టించుకోవడం జరుగుతుంది కదా. ఇది ఎలా ఉంటుంది అంటే మీకు మీరే చనిపోవాలి. చనిపోయిన విషయం మీకు తెలియాలి. మీకు తెలిస్తే చనిపోయినట్లు ఎలా అవుతుంది. ఆలోచించండి. ఇక్కడ ఉన్న తిరకాసు ఏమిటో. మీరు చస్తే మీరు చచ్చిన విషయము మీకు మీకే తెలియాలి. అంతవరకు మీకు మీరే చచ్చినారని నమ్మలేరు.చనిపోయినారని పోనీ నమ్మకం కలిగిస్తే మరణమునుండి జననం జరిగినట్లే కదా. అందుకే కాల్చిన శవమును నుండి వచ్చిన బూడిదలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. నిజానికి అది నిర్జీవ పదార్థం కాదు. సజీవ పదార్థమే. చచ్చిన వాడి ప్రాణశక్తి ఈ బూడిదగా మారినప్పుడు అందులో ప్రాణమున్న బూడిద అవుతుంది కదా. ఈ బూడిద నుండి జీవం పుడుతుంది కదా. అనగా మొక్కలకి ఆహారముగా వెళితే ఈ మొక్కలను మనము ఆహారంగా తీసుకుని వీర్యము ద్వారా మళ్ళీ పునర్జన్మల మనకి తెలియకుండానే జరుగుతున్న ప్రక్రియ కదా. మాంసాలు తిన్నా కూడా ఇదే పరిస్థితి.అవి మొక్కలు తినవా. కానీ ఇతరుల జంతువులను చంపి తిన్న వాటిని మీరు తింటారు కదా. అందుకే మనము తినే వాటిని పెంచుకోవాలి. కానీ మనల్ని తినేవాటిని పెంచుకోవద్దు అని పెద్దల ఉవాచ. పోనీ దక్షిణామూర్తి ఆది జన్మగా పుట్టి పెరిగి చనిపోయారా?చనిపోయిన శరీరమే కదలకుండా మెదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది కదా జీవ సమాధి చెందటం అంటే శరీరము త్యాగమే అవుతుంది కానీ శరీరము పాడు అవ్వదు. అలాగే ఎలా కూర్చుని ధ్యానస్థితిలో ఉండిపోయినారో వారికి కపాలమోక్షం కలిగినదా? ఆశ శరీరము కాస్త కదలకుండా మెదలకుండా నిశ్చల స్థితిలో పాడవకుండా ఉండిపోతుంది. మరి ఈయన మరణించిన విషయం ఈయనకి తెలియకుండా పోయిందా? మరి మనము ఎవరు? ఆయన శరీరము నుండి వచ్చిన ఏకైక ఆత్మ యొక్క స్వరూపాలు అయి ఉండాలి. ఈయన ఆది బ్రహ్మ జన్మ లో ఏకాకి గా ఉన్నప్పుడు తన ఒంటరితనము పోగొట్టుకోవటానికి కోసము అని రెండుగా విడిపోయి మాయను ఏర్పరుచుకొని ఈశ్వరుడు ఈశ్వరిగా రెండు పరమాత్మలు కాస్తా పరమాత్మగా ఆత్మగా మారినట్లు ఉండాలి. ఈ రెండు ఆత్మలు కూడా త్రిగుణాల మాయ వలన కామ మోహ ఆవేశానికి గురై పురుష ఆత్మ కాస్త త్రిమూర్తులుగా స్త్రీ ఆత్మ కాస్త త్రిశక్తి మాతలుగా విడిపోయి ఉండాలి. అనగా పరమాత్మ ఆత్మ జీవాత్మ గా సత్వ రజో తమో గుణాలుగా మారి ఉండి ఉండాలి. ఈ ఆరుగురు ఆత్మలు కలిసి జతలుగా మారి 36 కోట్ల దైవ స్వరూపాలుగా 84లక్షల జీవస్వరూప ఆత్మలుగా మారి ఉండి ఉండాలి. వీటిలో ఏ ఆత్మకో వివేక వైరాగ్యము కలిగి అన్నింటి ఆత్మలను తిరిగి తనలో కలుపుకుంటూ సాధన కొనసాగించి ఉండాలి. చివరికి ఏకైక ఆత్మ స్థాయికి అనగా పరిపూర్ణ శూన్య బ్రహ్మ స్థాయికి వచ్చి ఉండాలి. దానితో తను ఏకత్వము నుండి భిన్నత్వం గా మారటం వలన ఈ విశ్వ సృష్టి సృష్టి జరిగినదని జ్ఞాన అనుభూతిని పొందటం జరిగి ఉండాలి. కానీ తనకి ఉన్న ఏకైక ఇష్ట కోరిక మాయ వలన లేదా తను మరణమును పొందాలని మరణ భయము వలన మళ్ళీ ఏకైక ఆత్మ కాస్త ఏకత్వం నుండి భిన్నత్వంగా ఏక ఆత్మ కాస్త భిన్న ఆత్మలుగా తిరిగి మారిపోయి ఉండాలి. అనగా మళ్లీ విశ్వ సృష్టి సృష్టి జరిగి ఉండాలి లేదా ఇలా వచ్చిన ఏకైక శూన్య బ్రహ్మ ఆత్మకి తను చనిపోయిన విషయం అయినా తెలియక ఏకైక ఆత్మగా మారి ఒంటరిగా తిరుగుతూ తన ప్రేతము నుండి మరో ఆత్మ బయటకు వచ్చినట్లుగా భావనలు చేస్తుండాలి. అంటే నేను చెప్పేది చనిపోయిన వాడి శరీరమునుండి ప్రేతాత్మ అదే కోరిక ఉంటే ప్రేతాత్మ కోరిక లేదంటే ఆత్మగా అంటాము కదా. ఇప్పుడు ఇలా వచ్చిన ఆత్మకి తను చనిపోయిన విషయం తెలియక పోవడం జరుగుతుంది. దీనికి ప్రేత కర్మలు దశదినకర్మ చెయ్యాలని అప్పుడే ప్రేత శరీరానికి ఆహారము అంది పునర్జన్మ కి అర్హత వస్తుందని గరుడ పురాణము చెబుతోంది కదా. ఈ లెక్కన ఆది బ్రహ్మ జన్మ శరీరము చచ్చిపోయి ఉండాలి. అప్పుడే ఈ శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చి ఉండాలి. ఇది ఒంటరితనం భరించలేక తన గుణం భావము నుండి తన లాంటి మరో ఆత్మను తన నుండి తెప్పించాలి. అందుకే ఇలా ఏర్పడిన ప్రకృతి మిధ్య అని చెప్పటం జరిగి ఉండాలి. బ్రతికున్న వాడు చనిపోతే మిధ్యయే కదా. అందుకే మన దేవుళ్ళు అందరూ కూడా స్మశాన వాసిగా చితాగ్ని స్వరూపులుగా సమాధిగా చనిపోయిన వారిగా చెప్పటం జరిగినది. శివ అంటే లేనివాడు అని అర్థము.ఈ లెక్కన శివము కాస్త శవమై ఉండాలి. ఈ విషయము గమనించని ఆత్మ కాస్త శివానిగా మారి విశ్వాత్మగా పరమాత్మగా దైవ ఆత్మ గా జీవాత్మగా దేహాత్మ గా మారినట్లు ఉంది. అంటే ఈ లెక్కన చూస్తే చనిపోయిన ఆది బ్రహ్మ జన్మ సంకల్ప శరీరముతో ఆ తర్వాత వచ్చిన పరమాత్మ కారణ శరీరముతోను ఆ తర్వాత వచ్చిన దైవ ఆత్మ కాస్త సూక్ష్మశరీరముతో ఆ తర్వాత వచ్చిన జీవాత్మ కాస్త స్థూల శరీరంతో ఏర్పడి ఉండాలి. కారణ లోకము నుండి భూలోకము దాకా ఈ చనిపోయిన ఆత్మలు వివిధ రూపాల శరీరాలతో ఉండి ఉండాలి. గాలిలో పుట్టిన ఆత్మలు గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. అమృతం సేవించిన కూడా వీరు ఎందుకు మరణం పొందుతున్నారు. కాలకూట విషము సేవించిన పరమేశ్వరుడు చావకుండా ఎలా ఉంటాడు. నిజానికి ఆయన చచ్చే ఉండి ఉండాలి. అందుకే స్మశాన వాసిగా ప్రేతాత్మగా మారి ఉండి ఉండాలి. దానికి మనవాళ్లు మనము చనిపోతే స్మశానము బాధ పడకుండా ఉండటానికి తోడుగా ఉండటానికి ఆ పరమేశ్వరుడు అలా స్మశానం లో ఉన్నాడని కథనము అల్లినారు. నిజానికి మనము లేము. మనము చనిపోయిన జీవులమే. బద్ద జీవులమే. ఆయన కూడా చనిపోయిన జీవుడే.ఎందుకంటే మనము ఆయన స్వరూపాలు కదా. మనమే చనిపోతే ఆయన చావకుండా ఉంటాడా? ఆయన చనిపోతే మనము చావకుండా ఉంటామా ఆలోచించండి. శూన్య బ్రహ్మ ఆది దేవుడు లేడు. ఈయన నుండి వచ్చిన ఆత్మ స్వరూపాలు అయిన మనము లేము. ఉన్నది ఒక్కటే శూన్య స్థితి. ఇది ఉందో లేదో కూడా తెలియని స్థితి. ఇది ఆకాశ స్థితి.ఆకాశం ఉంది అంటే దానిని అందుకోలేము. లేదు అంటే అది కనిపిస్తూనే ఉంది. ఈ లెక్కన మనము చచ్చిపోయిన కూడా చావు అనుభూతి తెలియకుండానే పోయినది. ఇదియే మోక్షము. మోక్షప్రాప్తి పొందటం అంటే పొందినట్లు కాదని పొందలేదు అంటే పొందలేదని కాదని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి కదా. మనము మరణించాము అంటే మరణించినట్లు కాదని అలాగని జీవించినట్లు కాదని చెప్పకనే చెబుతున్నారు. అంటే మన స్థితి అటు మరణానికి జీవితానికి మధ్య ఉన్న కోమా వంటి విచిత్ర అవస్థ అని నాకు అర్థం అయినది. కోమాలో ఉన్న వాడు అటు జీవించినట్లు కాదు అలాగని మరణించినట్లు కాదు. శ్వాస తీసుకుంటాడు కానీ నిశ్చల స్థితిలో ఉంటాడు. ఏమి చేయడు. ఏమి చూడడు. ఏమి పట్టించుకోడు. దేనికి స్పందించడు. అచ్చంగా మౌన బ్రహ్మగా ఉన్న మన దక్షిణామూర్తి లాగా ఉంటాడు. ఈ లెక్కన చూస్తే నిజానికి ఆది మహా దేవుడైన దక్షిణామూర్తి అదే నిర్వికల్ప సమాధి స్థితి పొంది ఉండి ఉండాలి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు బయట ఉన్న వాటి శబ్దాలు వినబడతాయి కానీ వాటికి స్పందించడు. నిద్ర మెలుకువ మధ్య ఉండే స్థితి సమాధి స్థితి అని అలాగే మరణానికి జీవనానికి మధ్య కోమా స్థితి అని అనుభూతి పొంది పొందకుండా ఉండే స్థితి మోక్షప్రాప్తి అని వివిధ రకాల శాస్త్ర పరిజ్ఞానాలు చెబుతున్నాయి కదా. ఈ లెక్కన మనము అంతా నాణానికి రెండు వైపులా గుర్తులు ఉన్న వాళ్ళము. ఒక ప్రక్క జీవనము మరో ప్రక్క మరణం. పగలు గాను రాత్రిగాను ఏకకాలంలో అనుభవ అనుభూతి పొందుతున్న కోమా స్థితిలో ఉన్న జీవాత్మలని పరమాత్మలని దైవాత్మలని దేహాత్మలని ఇప్పటికైనా గమనించినారా. తెలుసుకున్నారా గ్రహించినారా.. అందుకే కొంతమంది దేవుడు ఉన్నాడని (ఆస్తికులు) అంటే మరి కొంతమంది దేవుడు లేడని (నాస్తికులు) ద్వైత భావ స్థితిలో మనము ఉంటున్నాము. అచ్చంగా కోమా స్థితిలో మోక్ష స్థితి లాగా అన్నమాట. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. దీనిని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దేవుడు అంటే ఇష్టమే లేదా ఏ మతమును ఉద్దేశించి వ్రాయలేదు. నా స్వానుభవం జ్ఞానము కలిగిన దానిని ఒక అభిప్రాయంగా మీతో పంచుకోవడం జరిగినది. మీ మనోభావాలను కించ పరచాలని బాధపెట్టాలని నా ఉద్దేశం కాదని గ్రహించండి. ఇది అర్థం అయితే సిద్ధాంతము. అర్థం కాకపోతే వేదాంతము. అర్థమై అర్థం కాకుండా ఉంటే రాద్ధాంతం అవుతుందని మనకి తెలుసు.
తొమ్మిది విషాలు ఉన్నవాడు కలిశాడు:
ఇక ఈ స్థితి తో నా సాధన అయిపోయినదని అనుకుంటున్న సమయంలో నా మనోనేత్రం నందు 12 సంవత్సరముల వయస్సు ఉన్న బాలుడు కనిపించి “ఇంకా సాధన అయిపోలేదు. నా దగ్గరికి రా నీకే తెలుస్తుంది” అంటూచెప్పి అదృశ్యమయ్యాడు. ఇదేమిటి గోల. సాధన అంతా సహస్రార చక్ర సాధనతో పరిసమాప్తి అవుతుంది కదా. ఈ పిల్లగాడు ఏమిటి? ఇంకా అవలేదు. నా దగ్గరికి రా అంటున్నాడు. ఈ పిల్లగాడు ఏమో ఇంకా సాధన ఉన్నదని చెబుతున్నాడు. అక్కడ సాధన చేయటానికి ఏముందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సముద్రము నుండి వచ్చిన నీటి బుడగ మాయ వలన తను వేరు సముద్రము వేరు అనుకుంది. ఎప్పుడు నేను అనేది త్యాగము చెయ్యడము జరిగినదో అప్పుడు పేలిపోయి నీటిలో కలిసి పోయినది. ఇంకా ఏముంటుంది సాధన చేయటానికి. మాయ కాస్త మాయం అయినది కదా. నీటిబుడగ కాస్త విశ్వ చైతన్యంలో కలిసి పోయినది కదా. శూన్యం నుండి విడిపోయి శూన్య బ్రహ్మగా నేను వేరు అలాగే శూన్యము వేరు అని బ్రతికినది. ఎప్పుడైతే నేను అనే మాయను త్యాగం చేసినదో అప్పుడు నేను అని శూన్య బ్రహ్మము కాస్త మహాశూన్యంలో కలిసి పోయింది. ఇంకా సాధన చేయటానికి ఏముంటుంది. ఇంకా సాధన చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. దేనికోసం సాధన చేయాలి అనేది నా ప్రశ్న. నిజానికి ఇంకా చేయటానికి సాధన ఉండదు కదా. మరి ఈ పిల్లగాడు ఏమో సాధన ఇంకా పూర్తి కాలేదు అంటున్నాడు. దీనమ్మ జీవితం.అనుకుంటూ తిట్టుకుంటూ పూర్తికాని సాధన ఏమై ఉంటుందో అర్థం కాక ఈ కనిపించే పిల్లగాడు ఎవరో తెలియక కొన్ని వారాలు గడిచి పోయినాయి.
ఇప్పటికైనా మీకు ఇంకా సాధన ఎలా మిగిలిపోయినదో గ్రహించినారా? మనకి ఎందుకు ఈ విచిత్ర అవస్థ అయిన ఆ స్థితి అదే తెలిసి తెలియని మోక్ష స్థితి భగవంతుడు ఉన్నాడా లేడా తెలియని స్థితి ఉంటే ప్రాణాలతో ఉన్నాడా చనిపోయి ఉన్నాడా తెలుసుకోవలసిన స్థితి ఒకటి ఇంకా మిగిలి ఉన్నది అని అందరికీ తెలుస్తుంది. కేవలం 10 లక్షల మందిలో తొమ్మిది మంది మాత్రమే ఈ స్థితి తెలుసుకోవటానికి యోగ్యత పొందుతారని ఆ పిల్లగాడు కనిపించి చెప్పేదాకా తెలియదు. ఆ పిల్లవాడు నాతో వాదించిన వాదోపవాదాలు ఇప్పుడు దాకా చదివిన సారాంశము. ఆ పిల్లవాడు ఎవరో కాదు పళనినివాసి అయిన నవపాషాణం నిర్మిత కుమార మంగళ స్వామి. ఆయన నాకు ఈ క్షేత్రంలో 12 సంవత్సరముల బాలుడిగా కనిపించి ప్రత్యక్షముగా నాతో ఈ వాదనలు చేయడం జరిగినది. మీకు ఇది చాలా గొప్ప విషయంగా కనిపించవచ్చు. ఎప్పుడైతే మౌన బ్రహ్మగా బ్రహ్మ తదాకారస్థితి పొందిన పరమయోగికి ఇది చాలా చిన్న విషయమే అవుతుంది. వారికి జీవాత్మ దేహాత్మ దైవ ఆత్మ పరమాత్మ అనే భేదభావం కనిపించదు. అంతా ఒక్కటే. అందరూ ఒక్కటే. సర్వమత సమ్మేళనం స్థితి కలుగుతుంది. అన్ని ఆత్మలు కూడా ఏకైక ఆత్మగా కనబడుతుంది. ఆయన వాదన ప్రకారం గా చూస్తే నీటి బుడగ కాస్త సముద్రంలో కలిసిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఏమైంది అది నిజంగానే పేలిపోయి నీటిలో కలిసి పోయింది అంటే కలవలేదు అంటాడు. బుడగ కాస్త రూపాంతరం చెంది నీటి బిందువులుగా ఆ సముద్రంలో కలిసిపోయిందని కొత్త వాదన బయటికి తీసుకుని వచ్చినాడు. ఇంకా నీటి బిందువు గానే ఆ సముద్రంలో వుండి పోయినదని ఆయన వాదన. ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే నాకు శూన్యము లోనికి మహావిష్ణువు అలాగే శ్రీకృష్ణుడు కలిసి పోయినట్లుగా మొదట కనిపించినారు కదా. అదృశ్యం అయినారు కదా. మాకు అలాగే శ్రీ లాహిరికి ఇలాంటి అనుభవాలే కలిగి ఉన్నాయి కదా. ఆయనకి ఆదిగురువు దర్శనం మాత్రమే కలిగినది. కానీ విరాట్ స్వరూప స్థితి అనగా విశ్వరూపము స్థితిని అనుభూతి పొందినట్లుగా ఎక్కడా కూడా తన డైరీలో రాసినట్లుగా అగుపించలేదు. కానీ మాకు విరాట్ స్వరూప స్థితి కలిగినప్పుడు చిదంబర దక్షిణామూర్తి వెనుక ఉన్న వృక్షములో పరమాణు పరమాత్మగా శ్రీమహావిష్ణువు ఉన్నట్లుగా అలాగే ఈ వృక్షం యొక్క చిట్టచివరి పత్రము పైన వటపత్రశాయిగా బాల రూపములో శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా మాకు కనిపించినది కదా. అంటే వీళ్ళ సూక్ష్మ శరీరాలు అనగా శ్రీ విష్ణు శ్రీ కృష్ణ నామ శరీరాలు శూన్యంలో కలిసినవి. వీళ్ళ కారణ శరీరాలు అలాగే ఉండిపోయినాయి కదా మాకు లాగా. నీటిబుడగ పోయిన నీటి బిందువులగా మా కారణ శరీరము కూడా వీళ్ళ లాగా అలా ఉండి పోతున్నారని కుమారస్వామి వాదన. అలా ఎందుకు ఉండిపోతున్నారో తెలుసుకోవాలి కదా. అంటే ఇంకా సాధన పరిసమాప్తి కానట్లే కదా. సముద్రంలో నీటి బిందువులుగా శూన్యము నందు పరమాణువు స్థాయి కారణ శరీరాలతో ఎందుకు ఉండి పోతున్నాము. నిజానికి మనము అంతము కావటంలేదు. రూపాంతరం చెందుతున్నాము. కారణ శరీరాలు ఎందుకు మిగిలిపోతున్నాయి. అలాగే చచ్చిపోయిన వాడికి వాడు చచ్చిపోతున్నాడు అని తెలుస్తుంది గానీ చచ్చిపోయిన విషయము ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాలి ఇంకా సాధన చేయాల్సి ఉంటుందని ఈయన గారి ఉవాచ. మరి మీరేమంటారు. ఇది నిజమే కదా. ఎంచుకున్న తొమ్మిది మందిలో నేను ఒక్కడినే అయినందుకు బాధ లేదు. ఆనందము లేదు. నాకు ఉన్నది అంతా సచ్చిదానందమే కదా. అంటే అపస్మారక స్థితి దాటి వచ్చిన వారు కేవలం 177 మందిలో తొమ్మిది మంది మాత్రమే ఉంటారు. అంటే సాధన మాయ అనగా పది లక్షల మంది కాస్త 9 కి చేరుకోవడం మీకు ఆశ్చర్యము కావచ్చును. నాకు ఏమంత విషయం కాదు. ముందుకు పోవటమే మన బాధ్యత.
నాకు ధ్యానములో ఒక పన్నెండు సంవత్సరముల పిల్లగాడు కనిపించి సాధన పూర్తి కాలేదు ఇంకా ఉంది అని చెప్పి అదృశ్యమైన వారం రోజుల తర్వాత …. కుమార స్వామి విగ్రహలు, ఫోటోలు, నాగ పడగలు దైవిక వస్తువులు రావటము జరిగేసరికి….ఆ పిల్లవాడు కుమారస్వామి అని అర్థం అయినది. కొన్ని రోజులకి నా పరమశిష్యుడు కాస్త పళని వెళుతున్నాడు అని తెలిసి కారణం అడిగితే …అక్కడ తొమ్మిది రకాల విషాలతో అనగా నవ పాషాణాలుతో భోగర్ అనే సిద్ధుడు కుమారస్వామి విగ్రహమూర్తి చేసినారని ఈ విగ్రహ జలము కలిపిన ప్రసాదము సేవిస్తే సకల దోషాలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి అక్కడికి వెళ్ళటం జరిగినది. ఆ తర్వాత అసలు ఈ భోగర్ ఎందుకు నవపాషాణం లతో ఈ విగ్రహమూర్తి చేయాల్సి వచ్చిందని సందేహము కలిగినది. దానికి నా సాధన స్థాయి ఈ సహస్ర చక్రములోని దక్షిణామూర్తి దర్శనము అయ్యేదాకా తెలియరాలేదు. ఈ నవవిషాలను మన శరీరంలోనికి తీసుకుంటే మహా నిర్యాణము కలిగించే నిర్వాణ శక్తి కలుగుతుందని ఈ శక్తి ద్వారా మనము అపస్మారక స్థితి పొంద కుండా తప్పించుకోవచ్చని భోగర్ సిద్ధుడు తెలుసుకుని సకల విద్య జ్ఞానసిద్ధి తో మూలికా వైద్య విజ్ఞాన శాస్త్ర విజ్ఞానంతో మూలికలు అలాగే పదార్థాలు అనగా నవ మూలికలు ఇంగుళీక, పాదరసము, జతి లింగం, గంధకము, ఆవునెయ్యి, రోమమస్తకం, నీలరస, శిలారస, గోభస్మం లాంటి తొమ్మిది రకాల విష పదార్థాలను తగుమోతాదులో కలిపి ఒక విగ్రహమూర్తి గా అదే పళని క్షేత్ర కుమార స్వామి విగ్రహం తయారు చేసినారట. దీనికి ప్రాణప్రతిష్ఠ గావించి కుమార స్వామినే స్వయంగా అందులో ఉండేటట్లుగా నాగ అష్టదిగ్బంధనం ప్రక్రియలో బంధనము చేసి భక్తుల అవసరాలను రోగాలను తగ్గించే దైవముగా ఉంచినారట. ఆయనకి ఇష్టం లేకపోతే ఈయన ఏమి చేయలేరు కదా. ఇలాంటి మహా నిర్వాణ శక్తి కోసమే తాను ఎదురు చూస్తున్నానని ఈ శక్తిని ఎలాగైనా పొందాలని అరవింద యోగి విశ్వ ప్రయత్నం చేసినట్లుగా దేహాత్మ జీవాత్మ లకి తాము పరమాత్మ జ్ఞానము అందనీయకుండా శ్రీకృష్ణుడు మహామాయ తో అడ్డుపడుతున్నాడని ఈ మాయ శక్తి దాటాలంటే మన దగ్గర నిర్వాణ శక్తి ఉండాలని అప్పుడే ఈ కృష్ణ మాయను దాటలేమని లేకపోతే ఈయనకి దాసోహం చేసే స్థితిలో ఉండిపోతామని ఇక ఎప్పటికీ శివోహము కాలేమని తను రచించిన మంత్ర శాస్త్ర గ్రంథమైన 'సావిత్రి' గ్రంథములో వివరించడము జరిగినది. ఈయనకి ఈ భోగర్ తయారుచేసిన నవపాషాణం పదార్థము దొరికి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. కానీ ఏమి చేయగలము. ఈయన సాధన ఒక మహా నిర్వాణ శక్తి కలిగిన దానిని పొందాలని మాత్రమే తెలుసుకొని ఈ సహస్రార చక్ర స్థితిలో వచ్చే అపస్మారక స్థితి పొందటం జరిగినది. ఇంకా భోగర్ అనే సిద్ధుడికి ఈ భావ సంకల్పాలు చేరి ఎలాగైనా నిర్వాణ శక్తి కలిగిన పదార్థాలను తయారు చేయాలని ఈ స్థితికి వచ్చినప్పుడు వచ్చే సకల విద్య జ్ఞానముతో విషాలతో కూడిన పదార్ధాల తయారీని కనిపెట్టి విగ్రహమూర్తి గా మార్చి లోకానికి అందించి అపస్మారక స్థితి దాటలేకపోయినాడు. అసలు వీరిద్దరికీ ఇలాంటి క్రియా ఆలోచనలకి మూలకారకుడు శ్రీ గౌతమబుద్ధుడు అన్నమాట. అపస్మారక స్థితి దాటాలంటే ఇష్ట కోరిక మాయ తెలుసుకోవాలి. దానిని తట్టుకోవాలి. అది అంత తేలికైన విషయం కాదని మహా నిర్వాణం కోసం మహా నిర్వాణ శక్తి కావాలని సంకల్పించుకుని ఈ ఏకైక ఇష్ట కోరికను దాటలేక అదే కోరిక లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవటం వలన ఈయన కూడా అపస్మారకస్థితిలో నికి వెళ్లిపోవటం జరిగినది. వీరి సంకల్పముతో విశ్వములో జ్ఞాన శక్తి గా మారటం ఈ ఇద్దరి యోగ సాధకులకు అదే అరవింద యోగికి భోగర్ కి చేరటం జరిగినది. దానితో నవపాషాణం విష పదార్థం తయారు అయినది అని నాకు అర్థం అయింది. నేను నా ధ్యానము ద్వారా సూక్ష్మ శరీర యానం చేసి పళని క్షేత్రానికి చేరుకోవటం అక్కడున్న బాల కుమారస్వామితో చర్చించడం జరిగినది. ఎందుకు మేమే ఆయన దగ్గరికి వెళ్ళాము ఆలోచించారా? ఆయన బయటికి రాలేరు కదా నాగ అష్ట బంధనం చేసినారు అని చెప్పినాను కదా. అప్పుడే మర్చిపోతే ఎలా? కథ మంచి రసపట్టు గా ఉంటే మధ్యలో ఇలాంటి తలతిక్క ప్రశ్నలు అడగడం అవసరమా అంటారా? ఏమీ లేదు మీ మెదడుకి విశ్రాంతి కలుగుతుందేమో అని అలా అడిగాను అంతే. మరి నాకు నవపాషాణం పదార్థ వస్తువు ఏమైనా వచ్చిందా అనే సందేహం కదా. యోగ్యత ఉన్నప్పుడు రాక చస్తుందా? అని మేము తెలుసుకున్నాము. అన్ని మేము తయారు చేసుకున్నాము కదా. మేము తయారు చేసిన దానిని మాకు చెందకుండా మా వద్దకు రాకుండా ఎలా ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈయనని కుమారషష్టి నాడు ఈ విగ్రహము నుండి పొడిని కొంత మేర బయటికి తీస్తారు. దానిని తాయెత్తులు గా పూసలుగా మార్చి అమ్ముతారాట. కొంతమంది వ్యాపారులు ఈ పొడిని వేలం పాటలో కొని రహస్యముగా యోగ్యత ఉన్నవారికి మాత్రమే దీనితో చేసిన వస్తువులు అమ్ముతారట. మా శిష్యుడికి ఎలాగో కష్టపడి వెతికితే ఒక వ్యాపారి దొరికితే వారి దగ్గరికి వెళ్లి ఎక్కువ ఖర్చు చేసి ఈ నవపాషాణం నాకు పంపించాడు. వాటిని నేను కొన్ని రోజులు పూజ లో పెట్టుకుంటే….నాకు పళని క్షేత్రము నుండి సజీవమూర్తి కుమారస్వామి విగ్రహమూర్తి వచ్చినది.ఆతర్వాత మరికొన్నివారాలకి… అది నిజమైన పాషాణం తాయత్తు కాదని ఇందులో భోగర్ సిద్ధుడు చెప్పిన పదార్ధాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి అని నేను గ్రహించి మౌనం వహించాను. ఇదంతా శ్రీ కృష్ణుడి లీల మాయ అని నాకు అర్థమైనది. ఈయనని ఎదిరించాలి అంటే మాకు మానవాతీత శక్తి కావాలి అని నాకు అర్థం అయింది. ఈ శక్తి వలన శ్రీకృష్ణుడు కాస్త మహామాయలో పడి నిద్ర వస్తే అదే యోగనిద్రకు చేరుకోవాలి గదా. ఇంటర్నెట్ లో దొరికే అన్ని రకాల నవ పాషాణాలు తాయతులు పూసలు అన్ని కూడా కల్తీలేనని నేను గ్రహించాను. ఇదంతా చదువుతుంటే ఒక సినిమా కథ లాగా ఉంది కదా. మీకే కాదు నాకు అలాగే అనిపించింది.
అది కాకపోతే అసలు ఏమిటో కారణము తెలుసుకోవాలి కదా. ఈ రహస్యమును యోగ రహస్యమును విభేదన చేయటానికి దైవ రహస్యముగా శ్రీకృష్ణుడే స్వయంగా అడ్డుపడుతున్నారు. దానిని మేము ఈయనకే తెలియకుండా మర్మ రహస్యము గా తెలుసుకోవాలని మా ప్రయత్నము. మీకు ముందుగానే చెప్పినాను కదా. కాలచక్రంలో మహాకాలుడు సహస్రార చక్రంలో శ్రీకృష్ణుడు మహామాయ గాళ్ళు అని. వాళ్ళు వెళ్లరు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. తాము చనిపోయిన విషయం మనకి తెలిస్తే ఎవ్వరు కూడా పూజలు చెయ్యరు కదా. గట్టిగా ప్రసాదాలు పెట్టరు కదా. సేవలు చెయ్యరు కదా. కోరికలు అడగరు కదా. వరాలు అడగరు గదా. పట్టించుకోరు గదా. పట్టించుకోకపోతే వీళ్ళ ఆకలి తీరదు కదా. ఆకలి బాధ మరణ బాధ వీళ్ళు తట్టుకోలేరని నాకు అర్థమైనది. మరి మీకు అర్థమైందా? మొదటిలో నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు. నేను శూన్య బ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఒక్కటే అయినప్పుడు ఈ విగ్రహల తో పని ఏమిటి అని వాటికి పూజ చేస్తుంటే నాకు నేను పూజ చేసుకున్నట్లుగా ఉంది అన్నాను కదా. గుర్తుకు వచ్చిందా. వచ్చే ఉంటుంది. ఎందుకంటే మీకు అపస్మారక స్థితి మాయ రాలేదు కదా. అప్పుడు నా దగ్గర ఉన్న అన్ని రకాల విగ్రహలను మూట కట్టి బీరువాలో ఉంచటం జరిగినది. మొదట నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా తీపి పదార్థము పెట్టు అంటూ నాకు ధ్యానములో పూరి క్షేత్ర వాసి అయిన పూరి జగన్నాధుడు విగ్రహమూర్తి గా కనిపించి అడిగినాడు. ఎందుకంటే నేను కట్టిన మూటలో ఈక్షేత్రం విగ్రహమూర్తి ఉంది. అదే నాకు ధ్యానములో కనిపించినది. అప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియక పోవటంతో పాపము ఈయనకి ఆకలి వేస్తుంది అని లడ్డూలు చేయించి నైవేద్యము పెట్టడానికి ఈ కట్టిన మూట నుండి పూరి విగ్రహమును బయటికి పెట్టి నైవేద్యం పెట్టినాను. అదే నేను చేసిన అతి పెద్ద తప్పు. పోనీ నైవేద్యము పెట్టిన తరువాత అయిన ఈ విగ్రహన్ని తిరిగి మూటలో పెట్టకుండా అలాగే పూజ సింహాసనము మీద ఉంచినాను.ఇలా ఈయన వచ్చిన రెండు రోజులకి అనంతపద్మనాభ విగ్రహం తర్వాత శ్రీ రామ విగ్రహం తరువాత హనుమాన్ విగ్రహం తర్వాత దుర్గామాత ఇలా శిరిడి సాయిబాబా విగ్రహలు దాక ఒక దాని తరువాత మరొకటి నాకు తెలియకుండా బయటికి రావడం జరిగినది. మళ్ళీ యధావిధిగా భక్తి నైవేద్యాలు జరగటం ఆరంభమైనది. కొన్నాళ్ళకి ఈ పూజల మీద వైరాగ్యం కలిగి అసలు మళ్లీ ఈ పూజలు చేయడానికి మూలకారణము పూరిజగన్నాధ్ శ్రీకృష్ణుడే అని తెలుసుకుని మళ్లీ అందరినీ మూట కట్టి నాను.నాకు సంసార ఆర్ధిక మానసిక శారీరక ఇబ్బందులు అనగా వాళ్లు మాయలు చూపించటం ఆరంభించే సరికి నా సాధన స్థాయి అన్నింటినీ త్యాగం చేసే స్థితికి రావటంతో అన్ని నేను మానసికముగా త్యాగము చేసేసరికి వీళ్ళు చూపే మాయలు నా మీద ప్రభావం చూపలేకపోయాయి. వాళ్లకి నాకు తినే యోగము ఉంటే వచ్చేవి వస్తాయి అనుభవించే యోగం ఉంటే అనుభవించవలసినవి అవే వస్తాయని నాకు అర్థం అయ్యేసరికి వీళ్ళు తమ మాయలు భ్రమలు భ్రాంతులు చూపటం ఆపి వేసినారు.ఎందుకంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మా శ్రీమతి చేసే పండుగ పూజలకు ప్రసాదాలు దొరకకుండా పోతాయని భయంతో నాకు ఎక్కడ కోపము వచ్చి వారిని గంగలో కలుపుతాను అనే భయముతో అదేదో సినిమాలో లాగా భయముతో కూడిన గౌరవమును నాయందు ప్రదర్శించడం మొదలు పెట్టినారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు. మేము వరాలు తీసుకొని స్థాయి నుండి వరాలు ఇచ్చే స్థాయికి వచ్చేసరికి పాపము వాళ్లు ఏ విధంగా నా మీద మాయలు చూపుతారు. అసలు చూపటానికి ఏముంది. ఇక్కడ ఎవరూ లేరు. అందరూ చచ్చిన వాళ్లే. చచ్చినవాళ్లు చచ్చిన వాడిని ఎలా చంపుతారు. ఎందుకు చంపుతారు. అసలు చంపటానికి ఏముంది. కానీ వీళ్లంతా చంపుతామని కేవలము బెదిరిస్తారు. పాములాగా బుసలు కొడతారు. ఈ బుస శబ్దానికి కర్మ జీవులు భయపడి వీరికి పూజలు ప్రసాదాలు పెట్టి సేవలు చేస్తారు. ఇది తప్పు కాదు. ఎందుకంటే ఆకలి కూడా తీరాలి కదా. మన కోరికలు కూడా తీరాలి కదా. నైవేద్యాలు ప్రసాదాలు తినాలి కదా. శివోహం కాస్త దాసోహం చేయవద్దు అంటాను. విగ్రహరాధనతో ఆపకండి. విశ్వ ఆరాధన చేయండి. విగ్రహనికి నైవేద్యాలు పెట్టండి. అదే విగ్రహం దగ్గర అడుక్కుంటున్న వాళ్ళకి ప్రసాదం పెట్టి వీళ్ళ ఆకలి వాళ్ళ ఆకలి మీ ఆకలి తీర్చుకోండి. నా బాధ అంతా ఇదే. అందరూ కూడా ఈ విగ్రహ మూర్తుల మాయలో విగ్రహనికి ఘనంగా పూజలు చేసి తమకు తెలిసిన వారికి అన్న సంతర్పణలు చేస్తారు గానీ అక్కడే ఆకలిగా ఎదురుచూస్తున్న బిచ్చగాళ్ళ జీవ బ్రహ్మలకి మౌన బ్రహ్మలకి మూగగా ఆసక్తిగా ఎదురు చూసే వివిధ జీవ బ్రహ్మలకు కాకులకి, పక్షులకి, కుక్కలకి, ఆ ప్రసాదము అన్నము పెడితే తప్పు ఏమిటో ఆలోచించండి. ఒక రోజు ఒక పూట అన్నము కడుపునిండా వీటికి పెట్టండి. తద్వారా మీకు ఎట్టి ఆనంద స్థితి కలుగుతుందో మీరే చూడండి. మూగజీవులు ఆప్యాయంగా అన్నం తింటున్న ఆకలిగా ఉన్నవాళ్ళకి అన్నం తింటుంటే ఒకసారి చూడండి. ఎంతటి ఆనందము వేస్తుందో. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టే వాళ్ళు లేక ఆకలి బాధ తట్టుకోలేక నీళ్లతో కడుపు నింపుకుని అది ఇమడక ఎన్నో బాధలు పడిన నాకు తెలుసు ఆకలి బాధ ఏమిటో. ఈ లోకంలో అన్ని కష్టాలకి కారణం అలాగే అతి కష్టము మన ఆకలి బాధ అని తెలుసుకోండి. అది జీవాత్మ లకి దైవాత్మకి ఒక్కటేనని తెలుసుకోండి. నైవేద్యాలు పెట్టేటప్పుడు అలాగే మీరు భోజనాలు పెట్టేటప్పుడు అన్నదానాలు చేసేటప్పుడు మీ పక్కనే ఉన్న మూగ జీవులకి జీవ బ్రహ్మలకి ఒక పూట అన్నం అందేటట్లుగా చేయండి. ఇది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అవుతుంది. ప్రతిరోజు మీ చుట్టూ ఉన్న పక్షులకి అదే కాకులు అయితే అన్నం… పావురాలు ఉంటే సజ్జలు… చిలుకలు ఉంటే జామపండ్లు… కోతులు ఉంటే అరటి పండ్లు… కుక్కలు ఉంటే అన్నము…ఆవులు ఉంటే పచ్చగడ్డి, కాయగూరలు, ఆకుకూరలు, బెల్లం, చపాతీలు పెట్టండి. చెట్లలను పెంచుతూ వాటికి నీళ్ళు పోయండి.ఇలా నేను పెంచిన చెట్ల పువ్వులతో మా ఇంటిలో మట్టి ప్రకృతి గణపతికి అలంకారణ చేస్తూఉంటాను.... మీ ఇష్ట దైవ ప్రార్థనలు చేస్తూ వాటికి నైవేద్యాలు పెడుతూ వీటికి కూడా ఆహారాలు ప్రసాదము పెట్టండి. ఎంతటి మనశ్శాంతి ఎంతటి ఆనందం కలుగుతుందో తెలుసుకోండి. మీరు పెడితేనే మళ్లీ మీకు తిరిగి పుడుతుంది అని తెలుసుకోండి.
ఇలా నేను గత 12 సంవత్సరాలుగా నా చుట్టూ ఉన్న వాళ్లకి పావురాలుకి సజ్జలు, మొక్కలకు నీళ్లు, కుక్కలకి భోజనాలు, కాకులకి దోమల కి ఈగల కి ఆహారము ఒక ముద్ద అన్నం పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఫలాన జీవులు తినాలి అని ఉద్దేశం లేదు. నేను తినే ఆహార పదార్థాలు ఒక చిన్న పళ్లెంలో తీసుకుని వాటిని బయట పెట్టడం మా శ్రీమతికి అలవాటు. వీటితోపాటుగా పండ్లు సజ్జలు కూడా వేసి ఉంచుతాము. కొద్దిసేపటికి పక్షులు వచ్చి తిని వెళ్లిపోతాయి. వీటి దాహార్తి కోసం గిన్నెలో నీళ్లు ఉంచుతాము. మనకి లాగా వీటికి ఆకలి బాధలు ఉంటాయి కదా. కొంతమేర అయినా వాటి ఆకలిని నా ఆర్థిక స్థాయిని బట్టి తీరుస్తాను. ఈ పద్ధతిని నేను షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర నుండి తెలుసుకున్నాను. ఆయన బిక్ష చేసి తనకు వచ్చిన వివిధ రకాల ఆహార పదార్ధాలు ఒక పాత్రలో పోసి ఒక మట్టి పాత్ర నీళ్ళు తీసుకొని ద్వారకమాయి బయట ఈ జీవ బ్రహ్మల కోసం ఉంచడము అలవాటు అని తెలుసుకున్నాను. బిక్ష చేసి మరీ ఆయన ఇతర జీవుల ఆకలి తీరుస్తూ ఉంటే భిక్ష చేయకుండానే మనకి వచ్చే ఆహారమును ఇతర జీవులకి పెడితే మంచిదే కదా. ఈ పద్ధతినే బాబా వారికి గురుదక్షిణగా ఇవ్వటం జరిగినది. వీటి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అనే సాధన స్థాయికి నా సాధన శక్తి భూతదయ జీవ దయ వల్లనే జరిగిందని మర్చిపోకండి. వీటికి ఆకలి తీర్చిన పుణ్యఫలము వల్లనే నేను ఈ రోజు అన్ని రకాల మాయలు దాటటం జరిగినది. కాకపోతే నా వలన ఇది అంతా జరిగేదా? ఎక్కడ 10 లక్షలు…. ఎక్కడ తొమ్మిది మంది అందులో నేను ఉండటం అంటే మాటలా ఆలోచించండి. కాబట్టి కనీసం ఈ రోజు నుంచి అయినా మీ చుట్టూ ఉన్న జీవ బ్రహ్మలకి తగ్గ ఆహారం, నీళ్లు ఏర్పాట్లు చేసి అమిత పుణ్యఫలము తో పాటుగా అమిత ఆనందమును పొందండి. విచిత్రం ఏమిటంటే నాతోపాటు వచ్చిన 177 మందిలో ఎక్కువగా భూత దయ లేకపోవటం వల్లనే వెనక్కి తిరిగి అనగా అపస్మారక స్థితి మాయకి గురి అయినారని మాకు అర్థం అయినది. సాధనకు మార్గం దయ అని…..అలాగే సాధన కి అడ్డు అహమని మన పెద్దలు చెబితే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలిసినది. అందుకే ఇంతగా నొక్కి చెప్పడం జరిగినది.
నాకు వచ్చిన ఈ చక్ర కీచైన్లుల విషయానికి వస్తే....
ఇది ఇలాయుండగా విచిత్రముగా నాకు వివిధ క్షేత్రాల నుండి నా యోగ మిత్రులు ద్వారా వివిధ రకాల కీచైన్ లు రావడం జరిగినది.అవి ఏమిటంటే చేప, తాబేలు, పంది, సింహము, గొడుగు, గొడ్డలి, బాణము,నెమలిఈక,రావిఆకు,గుర్రము వచ్చినాయి.వీటికి అలాగే నా సాధనకి ఏమి సంబంధమో నాకు ఒక పట్టన అర్ధము కాలేదు.మీకు ఏమైనా అర్ధమైనదా...అర్ధము కాలేదు గదా!పోని వీటిని తెచ్చినవారంతా గూడ సాధనయందు మంచి పట్టు ఉన్నవారే!కారణము లేకుండా ఇలాంటి పని చెయ్యరని అనిపించినది.ఈ 10 కీచైన్ లు నాకేదో చెపుతున్నాయని...వాటి కోడ్ భాషను నేను అర్ధము చేసుకోవడము లేదని రాను రాను నాకు బలముగా అనిపించసాగినది. ఒకరోజు “కల్కి” సినిమాను చూడటం జరిగినది. ఇందులో హీరో కాస్త విష్ణువు దశావతారాల ఆయుధాలు వాడి శత్రుసంహరము చేస్తూండగా ...ఈ దృశ్యాలను చూస్తూన్న నాకు ఒక ఆలోచన స్ఫురణ అయినది.దానితో నాకు ఇన్నాళ్లుగా మర్మరహస్యముగా ఉన్న కీచైన్లు వ్యవహరము తెలిసినది.ఇంకా అవి ఎందుకు వచ్చినాయో మీకు అర్ధము కాలేదా? అయితే నాకు వచ్చిన కీచైన్లు అన్నీగూడ విష్ణు దశావతారాలకి చెందినవే..ఎలా అంటారా... చేప, తాబేలు, పంది, సింహము, గొడుగు, గొడ్డలి, బాణము, నెమలిఈక,రావిఆకు,గుర్రము లను వరుసగా పెట్టిచూస్తే... మత్య,కూర్మ,వరహ,నరసింహ,వామనా,పరశురామ,శ్రీరామ, శ్రీకృష్ణ,బుద్ధ,కల్కి అవతారాలని సంబంధించినవే గదా!నిజమే గదా!ఆలోచించండి. వీటిలో ఉన్న మర్మము ఇదేనని తెలుస్తుంది. ఇది జరిగిన కొన్నిరోజులకి నా ధ్యానము నందు వరుసగా తమ ఆయుధాలు చూపిస్తూ శ్రీ విష్ణు దశవతారాలు కనిపిస్తూ...శూన్యము నందు లీనమైనారు. అంటే వీళ్లుగూడ శాశ్వతము గాదని నాకు అనిపించగానే ధ్యానభంగమైనది. ఆరోజు ఆయుధ పూజ అయిన దేవి అవతారాల శరన్న నవమి రోజు గావడము విశేషం.
నాకు కలిగిన సకల దేవతల - సకల గురువుల దర్శనాభవం:
ఒకరోజు నేను తీవ్ర ధ్యానస్ధితిలో ఉండగా...నాకు ధ్యానమునందు హిమాలయాలు కనిపించినాయి.అటుపై మానస సరోవరము కనిపించినది.విచిత్రముగా అక్కడే ఉన్న కైలాస పర్వతము నుండి రెండు దివ్యజ్యోతులు బయలుదేరి ఈ సరస్సు నందు దిగినాయి.కొద్దిసేపటికి ఆ చుట్టుప్రక్కల అలాగే ఆకాశము నుండి లెక్కలేని దివ్యకాంతితో నక్షత్రాలు ఈ సరస్సు నందు దిగినాయి.కొన్ని క్షణాలు తర్వాత ఈ నక్షత్రాలలో కొన్ని బయటకి వచ్చిరాగానే సుమారుగా మూడు అంగుళాల పరిమాణములో సకల దేవతలుగా రూపాంతరము చెందినారు.ఆ తర్వాత మిగిలిన నక్షత్రాలు ఈ సరస్సు నందు బయటకి రాగానే సకల గురుమూర్తులుగా రూపాంతరము చెందినారు. అంటే వీరందరు గూడ కారణలోకవాసులై ఉంటారని అనుకోనేలోపుల వీరంతాగూడ ఒక్కొక్కరిగా శూన్యము నందు అంతార్ధనమవ్వడము మొదలు పెట్టినారు.అంటే వీరందరు గూడ కారణశరీర కపాలమోక్ష ప్రాప్తి పొందినారని...మరి నా కారణశరీరము ఎపుడు ఈ స్ధితి పొందుతుందో అనుకోగానే నా ధ్యానభంగమైనది.ఇలా నాకు ధ్యానములో కనిపించినవారిని...నాకు బాగా గుర్తు ఉన్న దేవతలను అలాగే గురువులను అనగా సకలదేవతల ఫోటోను డిజైన్ చెయ్యడము జరిగినది. అలాగే సకల గురువుల ఫోటోను చూడటం జరిగినది.ఈ లెక్కన చూస్తే సకల దేవతలు అలాగే గురువులు కూడ శ్వాశతము గాదని తెలిసినది. మరి నా కారణశరీరధారి ఎవరో తెలుసుకోవాలని అనిపించినది.నా ధ్యానదృష్టి ఈ అంశము మీద పెట్టినాను.
నాలాంటి కారణశరీరధారి కనిపించాడు:
ఇది ఇలా ఉంటే ఒక రోజు అర్ధరాత్రి నాకు ధ్యానములో ఒక దృశ్యం కనిపించినది. యధావిధిగా టెంపుల్ రన్ ఆట మొదలైనది. శూన్య స్థితిని చూడటము జరిగినది. పాపము చిన్నమస్తాదేవి దెబ్బకి నా సూక్ష్మశరీరము అచేతన స్థితి లోనికి వెళ్లి పోయినది కదా. వెళుతూ దీని తల చిలుక తలగా మారినది కదా. మానవ దేహము చిలుక పక్షి తల అన్న మాట. అమ్మవారి దెబ్బకి మనవాడు కాస్త స్పృహ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్నాడు. మరి అచేతన స్థితిలో ఉంటే మేము ఎలా బ్రతికి ఉన్నామా అనే సందేహం వచ్చినదా?సూక్ష్మశరీరము అచేతనంలో ఉంటే నా కారణ సంకల్ప శరీరాలు చైతన్యంలో ఉండుట వలన నా స్థూల శరీరం ఇంకా బ్రతికే ఉంది.పాపము ఇలా అచేతన స్థితిలో పడి ఉన్న నా సూక్ష్మశరీరము చూస్తున్నాను. ఇంతలో అంత శూన్యం లో ఎక్కడ నుండి తొమ్మిది తలల నాగుపాము ఒకటి వేగముగా వచ్చి ఈ నా సూక్ష్మధారిని ఏక కాలంలో తన తొమ్మిది తలలతో తొమ్మిది రకాల విషాలతో కాటు వేసింది. దానితో కొద్దిసేపటికి ఈ సూక్ష్మశరీరములో చైతన్యము వచ్చినది. ఈ పాము కాస్త కుమారస్వామి గా మారి అదృశ్యమైనాడు. నాగేంద్ర స్వామి రూపంలో వచ్చినది కుమారస్వామి అని గ్రహించాను. ఈయన తన తొమ్మిది తలలతో తొమ్మిది రకాల విషాలను అనగా అనగా నవవిషాలను నా సూక్ష్మధారి శరీరములోనికి ఎక్కించి అనగా మహా నిర్వాణ శక్తితో అచేతన స్థితిలో ఉన్న వాడిని చైతన్యము చేసినారు. అనగా ఈ నవవిషాలను తగు మోతాదులో ఇచ్చి బ్రతికించాడు అన్నమాట. భూలోకములో క్యాన్సర్ వ్యాధి నివారణకి పాము విషము తగు మోతాదులో వాడి నయము చేస్తారని చాలా మందికి తెలియని విషయమే కదా. దానిని కీమోథెరపీ అంటారు. అంటే విషము కూడా వైద్యానికి ఉపయోగపడుతుంది. అదే విష మోతాదు ఎక్కువైతే మనిషిని చంపగలదు. ఇప్పటిదాకా నాకు నవపాషాణం తాయత్తులు తక్కువ మోతాదులో ఉన్నవి మాత్రమే వచ్చింది కానీ నాకు అధిక మోతాదులో ఉన్న వస్తువులు కావాలి. అది వచ్చే ఇచ్చే మానవాతీత శక్తి కోసం నేను ఈ చిలుక సూక్ష్మధారితో ధ్యానము చేయాలి అని అనుకుంటుండగా నా సూక్ష్మధారి మీద నవపాషాణం విషము పనిచేయటం ఆరంభమైనది. ఇది ఆరు అడుగుల నుండి మూడు అడుగుల పరిమాణము నల్లటి శరీరముగా మారిపోయినది. అనగా ఎనభై మూడు అంగుళాల నుండి మూడు అంగుళాల పరిమాణం స్థాయికి వచ్చినాడు అన్నమాట. చిలుక పక్షి తలతో మానవ శరీరంతో వామనుడి అంత పరిమాణంలో ఈ కారణ శరీరముగా రూపాంతరం చెందినది అని నాకు అర్థం అయినది. సూక్ష్మధారి కాస్త రూపము అంతము గాకుండా రూపాంతరం చెంది కారణశరీరం రూపధారిగా మారినాడు అన్నమాట. అప్పటి నుండి ఇది కాస్త నిద్ర లేని స్థితిలో ఉండి పోయినది. నిత్య మెలకువ స్థితి అన్నమాట. పతంజలి మహర్షి పాము తలతో మానవ శరీరంతో ఉంటాడని, రాహు గ్రహము కూడా పంచ పాము తలలతో మానవ శరీరము తో ఉంటాడని, హయగ్రీవుడు గుర్రము తలతో మానవ శరీరము తో ఉంటాడని, ఆంజనేయస్వామి పంచముఖ జంతువుల తలలతో ఉండే మానవ శరీరంతో ఉంటాడని, అంతెందుకు నరముఖ గణపతి కాస్త గజ ముఖ గణపతి గా ఉన్నారు కదా. అలా నా కారణ శరీరము కూడా చిలుక తలతో మానవశరీరము తో ఉంటుందని అనుకుంటూ ఉండగా నాకు ధ్యాన భంగమైనది. అంటే నా చిలుక కారణ శరీరము ఏర్పడటానికి కారణం నా సూక్ష్మ జ్ఞాన బ్రహ్మ కావటమే అది కాస్త మౌన బ్రహ్మ గా మారే సమయానికి చిన్నమస్తా దేవి పుణ్యము వలన చిలక తల వచ్చినది. బ్రహ్మజ్ఞానానికి సంకేతం రామచిలుక కదా. అందుకే శ్రీ రాముడి సమక్షంలో మధుర మీనాక్షి సమక్షంలో కంచి-కామాక్షి సమక్షంలో చిలుక ఉంటుంది.
చిలుక జ్ఞానము తెలిసిన మాట్లాడలేదు కదా. కానీ మౌన భాషతో చీటీలు తీసి భవిష్యత్తు సూచించగలదు. దానితో నా కారణశరీరం చిలుక కాస్త మౌన బ్రహ్మ గా మారినది. ఇది తెలిసే కాబోలు చిలక జ్యోతిష్యం చెప్పే విధానం భూలోకములోని కి వచ్చి ఉండాలి. ఆదిలో ఎవరిదో సాధన శక్తి ఇక్కడి దాకా వచ్చి వాడి కారణశరీరం చిలుక ఏర్పడే సరికి రామచిలుక కాస్త జ్ఞాన పక్షి అనుకొని భూలోకంలో ప్రచారం చేసి ఉండి ఉంటాడు. దానితో చిలక జ్యోతిష్యం ఏర్పడి ఉండాలి. వామ్మో! నాకు భలేగా అన్ని విషయాలు ఇలా తెలిసిపోతే ఎలా? దేవుడెరుగు నిజమో కాదో కూడా తెలియదు. నాకు వివేక బుద్ధి జ్ఞానము వలన కలిగిన ఊహా శక్తితో నా మెదడు యొక్క మేధస్సు పెరిగి ఇస్తున్న ఆలోచనలే ఇది అన్ని కూడా. ఇందులో నిజమో కాదో ఆలోచించి విచారించే సంశయ బుద్ధి నాకు లేదు. అలాగని ప్రతి దానికి ప్రత్యక్ష అనుభవం అనుభూతి పొందాలని తాపత్రయం లేదు. అనుమానం ఉంటే అనుభవము కావాలి. అసలు అనుమానమే లేనివాడికి అనుభూతితో కూడా పని ఉండదు. మూల ప్రకృతి లోని విషయాలు ప్రకృతిలోని విషయాలను తెలుసుకుంటాను. జీవ ప్రకృతిలోని విషయాలు తెలుసుకుంటాను. అంటే తెలుసుకోవటంతో విచారణ చేయటంతో స్పురణ చెందటంలో ఎలాంటి తప్పు లేదు కదా. ఇవి సత్యాలా లేదా అసత్యాలా కావాలంటే మీకు మీరే పరీక్షించుకునే స్థాయికి మీ సాధన శక్తిని పెంచుకోండి. నిర్ధారణ చేసుకోండి. అప్పటిదాకా వీటిని నమ్మేవాళ్ళు నమ్మండి. లేకపోతే నమ్మకపోండి. చెప్పటం నా వంతు. వినటం లేదా వినకపోవడం మీ వంతు.
ఇలా మేము ఎప్పుడైతే రామచిలుక కారణశరీరం పొంది మౌన బ్రహ్మ స్థితి పొందినామో మాలో మేము స్పందించడం ఆరంభమైనది. బయటనుండి స్పందించటం ఆగిపోయినది. అనగా మాట్లాడటాలు బోధలు చెయ్యటం మున్నగు నోటితో చేసే ప్రత్యక్ష ప్రక్రియలు ఆగిపోయినాయి. దానితో మేము మాకై మాలో స్పందించటం జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకి ఏమి చెప్పాలని మాట్లాడాలని అనిపించటం లేదు. దానితో మాలో మేము మాట్లాడుకోవటం చెప్పుకోవటం తిట్టుకోవటం చేస్తున్నాము. అంటే నేను అనేది వేదవ్యాసుడు అంశ అయితే నేను కానీ నేను అనేది రామచిలుక అంశ అన్నమాట. నేను అనేది సూక్ష్మధారి అయితే నేను కానీ నేను అనేది కారణశరీరధారి అన్నమాట. విశుద్ధ చక్రము నుండి మూలాధార చక్రాల స్థితులలో భూలోకము మరియు దీని క్రింద ఉన్న సప్త అధోలోకాలు అనగా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు వస్తాయి. ఆజ్ఞా చక్రము నుండి కాలచక్రము దాకా భూలోక ఊర్ద్వ సప్త సూక్ష్మ లోకాలు అనగా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకాలు వస్తాయి. ఇక బ్రహ్మ చక్రమునుండి సహస్ర చక్రము అనేది కారణ లోకము అవుతుంది. ఇందులో వెయ్యి కారణలోకాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా జ్ఞాన భూమికలు. అధిష్టాన దైవం శ్రీ కృష్ణపరమాత్మ జగన్మోహిని మాయలో జగత్ గురువు అనుగ్రహంగా ఉంటాడు. నిజానికి కారణ లోకము అనేది భౌతిక విశ్వాన్ని జీవ ప్రకృతి విశుద్ధ చక్రము అలాగే సూక్ష్మ విశ్వాన్ని ప్రకృతి ఆజ్ఞాచక్రము కలిపే ఈ రెండు విశ్వాలు కలిస్తే అనగా మనస్సు భౌతిక పదార్ధము మధ్య సరిహద్దుగా కారణ లోకము ఏర్పడుతుంది. అందుకే ఇందులో రెండు రకాల జాతులు కారణ లోకవాసులుగా ఆవాసం చేస్తుంటాయి. అనగా మనిషి శరీరము జంతువు తల ఉన్న జాతి జంతువు శరీరము మనిషి తల ఉన్న జాతి అన్నమాట. ఇందులో జంతు శరీరం మనిషి తల ఉన్న జాతి శాశ్వతముగా కారణ లోక వారసుడిగా అపస్మారకస్థితిలో మాయలో ఉండిపోతే జంతు తల మనిషి శరీరము ఉన్న జాతి అపస్మారక స్థితి నుండి తప్పుకొని ఒకవేళ శ్రీ కృష్ణుడి జగన్మోహిని రూప మాయ కూడా దాటకలిగితే ఈ కారణ లోకము నుండి విముక్తి చెంది విముక్తి ఆత్మగా సాధనలో ముందుకి వెళ్ళగలడు. అది ఎక్కడికి అనేది రాబోవు అధ్యాయాలలో మీకే తెలుస్తుంది. తొందర ఎందుకు. విచిత్రం ఏమిటంటే విశుద్ధ చక్రం స్థితిలో భూలోక కర్మ వాసనలు అనగా మాకున్న 1,25,000 కర్మలు ప్రారంభ సమాధిస్థితి ద్వారా స్థూల శరీరముతో నాశనం చేసుకోవడం జరిగినది.అలాగే మాకున్న 37 వేల సూక్ష్మ కర్మలను ఆజ్ఞా చక్రము నందు సవికల్ప సమాధిలో ఉండి నాశనం చేసుకోవడం జరిగినది. ఇప్పుడు చిలుక కారణ శరీరంతో సహస్రార చక్రంలో ఉన్న 1000 కారణ కర్మలు నాశనం చేసుకోవటానికి నిర్వికల్ప సమాధి పొందాలి. తనతో ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం తెలిసిన జ్ఞానము పంచాలని తపన తాపత్రయం లేకపోవటంతో మా జ్ఞాన పక్షి( చిలుక తల) కాస్త మౌన పక్షిగా మౌన బ్రహ్మగా మారడం జరిగినది. దానితో సమాధిస్థితిలో గంటలనుండి రోజులు దాటి నెలలు ఆపై సంవత్సరాలు ఉండే స్థితికి నెమ్మది నెమ్మదిగా ఈ చిలకకి కారణ శరీరము తనకున్న వెయ్యి కారణం నాశనం చేస్తూ నిర్వికల్ప సమాధి స్థితికి పొందటానికి ధ్యాన తపస్సు చేస్తుంది అని మేము గ్రహించాము. ఇలా తీవ్రమైన తపస్సు లో వుంటే ఇక్కడ మా స్థూల శరీరము కూడా నిర్వికల్ప సమాధి స్థితి అనుభవ అనుభూతులు పొందటం మొదలుపెట్టినది. ఇలా ఈ శరీరము వెయ్యి కారణ కర్మలలో 957 కర్మలు (477+ 480) నాశనము చేసి మిగిలిన 43 కర్మలు నాశనం చేస్తుండగానే అమితమైన పరమానంద స్థితిని పొంది దానిని తట్టుకోలేక అచేతన స్థితిలో నికి వెళ్ళిపోవటము కొన్ని నెలల తర్వాత మేము మా చక్ర ధ్యానంలో గమనించి మౌనం వహించినాము. ఈ మిగిలిపోయిన 43 కర్మలకి ఇంకా ఎలా ముందుకు వెళ్లి సాధన చేయాలో అర్థం కాక కొన్నాళ్ళు మౌన బ్రహ్మగా ఉండిపోయాము. ఈసాధన కి మహా నిర్వాణ శక్తిఉన్న నవపాషాణం నిర్మిత వస్తువు రావాలని అంతదాకా దాని కోసమే ఎదురు చూడాలని ఒక రోజు మాకు స్పురణ అయినది. అందుకు మేము జీవనాడిలో ఉండే హనుమంతుడి అనుగ్రహమును పొందాలని తెలుసుకున్నాము.
ఈ క్షేత్రాల దర్శనానికి వెళ్ళితే....
ఇది ఇలా ఉంటే చెయ్యకూడని క్షేత్రాల దర్శనం వలన మా దీక్షాదేవి సాధన ఈ సహస్ర చక్రము వద్ద అనగా ప్రస్తుత ఈమె సాధన జన్మ కారణ శరీర కపాలమోక్షం స్ధితి వరకు వచ్చి ఎలా ఆగిపోయినదో తెలుసుకోండి. యాత్రలు వలన పుణ్యం లభిస్తుంది. కానీ కొన్ని యాత్రల వలన మనలో ఉన్న యోగశక్తిని దెబ్బతీస్తాయని మా శ్రీమతి దీక్షా దేవి సాధన అనుభవాలు చెబుతున్నాయి. మీరు ఆమె చేసిన యాత్రల వివరాలు ఇతమిద్ధముగా ఈ పాటికే విశుద్ధ చక్రము అనుభవములో వినేవుంటారు. ఈమె చేసిన యాత్రలు వివరాలు వారి సాధన శక్తి ఎలా దెబ్బ తిన్నదో వివరంగా రాయాలి అని అనిపించి ఇది రాస్తున్నాను. నా దృష్టిలో సాధకుడు ఎన్నటికీ ఉజ్జయిని, రామేశ్వరము, కైలాస పర్వతము, రుషికేష్, కేదార్ నాథ్- బద్రీనాథ్, హరిద్వార్ యాత్ర చేస్తే యోగసాధనశక్తి సన్నగిల్లి మాయలో పడటం లేదా సాధన అర్ధాంతరముగా ఆగిపోవడము జరుగుతుంది. ఈ క్షేత్రాలలో ఉన్న వాళ్ళు మన యోగశక్తిని తమలోకి లాక్కొని నిక్షిప్తం చేసుకునే ప్రాంతాలని గ్రహించండి. నేను వద్దని ఎంత మొత్తుకున్నా దీక్షా దేవి “మనిషి జన్మ ఉన్నది పుణ్యమును సంపాదించుకోవడానికి. యాత్రలు వలన ఇది వస్తుంది అని తెలిసినప్పుడు యాత్రలు వలన మన యోగశక్తి దెబ్బతింటుందని మీరు అనుకుంటే మీరు విశ్లేషణలు చేస్తే సరిపోదు కదా. దానిని నిరూపించే సాక్ష్యాలు కావాలి. ఆధారాలు ఉండాలి. అప్పుడే మీ విశ్లేషణ మీద నమ్మకము ఏర్పడుతుంది. యాత్రలు అయితే చేయవద్దని అన్నారు. నేను మా అమ్మతో కలిసి చేయాలని ఎప్పుడో నిశ్చయించుకున్నాను. మీరు ఈ విషయాలు నాకు చాలా ఆలస్యంగా చెబుతున్నారు. అంతే తేడా. చేస్తాను ఏమి జరుగుతుందో చూద్దాం…. నడిపించేవాడు పైవాడు అంతా. నేను మా శివయ్యను నమ్ముతున్నాను. వారు ఏమి చేస్తే ఏమి ఇస్తే అది తీసుకోవడం తప్ప మనము ఏమి చేయలేము కదా. తలరాతను మార్చలేరు గదా” అనగానే నేను వెంటనే “తలరాతను మార్చలేక పోవచ్చు కానీ ఈ రాత యొక్క తీవ్రతను తగ్గించవచ్చును. నువ్వు ఈ యాత్రలు చేసే బదులుగా మిగిలిన క్షేత్రాలలో యాత్రలు చెయ్యి. దాని వలన నీ యోగశక్తి నాశనము అవ్వదు. పైగా నీకున్న ప్రారబ్ద కర్మలు తీరుతాయి. యాత్రలు తిరగాలని విధి వ్రాత చెబుతుంది. ఏమి చేయాలన్నది మన వివేక విచక్షణ బుద్ధి బట్టి ఉంటుంది. ఈ యాత్రలు చేస్తే రోగికి సేవ చేయవలసిన చోట నువ్వే రోగిగా మారతావు. అదే నా బాధ. చూస్తూ చూస్తూ నీ చేజేతులారా… అన్ని తెలిసిన వ్యక్తిగా నేను పక్కన ఉండగానే నీవు తప్పు యాత్ర మార్గమును ఎంచుకోవటం నాకు బాధ కలిగిస్తోంది. చెప్పటం నా వంతు. వినటం నీ వంతు. ఏది ఎలా చేయాలని అనుకుంటున్నావో అలా చేసుకో. ఆ తర్వాత కలిగే ఫలితమును గూర్చి నన్ను అడగవద్దు. సాధన పరిసమాప్తి చేసుకోవలసిన చోట కావాలని నీవు ఈ యాత్రలు చేస్తున్నావు. దీనివలన సాధన అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించు. ఆఖరిసారిగా ఆలోచించు. ఇలాంటి సాధన జన్మ అంత తొందరగా రాదు. దీనికోసం మళ్ళీ వెయ్యి కోట్ల మానవ జన్మ ఎత్తాలి. నీ ఇష్టం” అని ఊరుకున్నాను. నెత్తిన శనీశ్వరుడు ఉన్నప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు. మనము చెప్పిన దానికి వ్యతిరేక దిశలో ఆలోచించి ఈ యాత్రలు చేయడం ఆరంభించింది.
మొదట ఉజ్జయిని యాత్రకు బయలుదేరినది. అక్కడ జరిగే భస్మము అభిషేకానికి చీర కట్టుకొని వెళ్ళాలి అనే నియమము ఈమెకి తెలియకపోవటం అక్కడున్న సిబ్బంది ఈమెను ఆపి అక్కడ చీరలు అద్దెకు దొరుకుతాయి. మీరు వేసుకున్న ఈ పంజాబీ డ్రెస్ మార్చుకొని చీర కట్టుకొని రమ్మని చెప్పటం అభిషేకమును చూడాలనే తపనతో రాజస్థానీ అద్దె చీరను వేసుకోవటం జరిగినది. ఈ అభిషేక గుంపులో రాజస్థానీ గుంపు ఉండటంతో ఈమెను కూడా రాజస్థానీ గా తమ గుంపులో కలుపుకోవటం ఏక కాలంలో జరిగినాయి. అంటే ఈ క్షేత్ర మహాకాలుడు రాజస్థాన్ స్త్రీమూర్తి జన్మ నిర్ధారణ చేసినాడని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. ఎందుకంటే ఈ క్షేత్రము నవగ్రహాలకి పుట్టినిల్లు. జ్యోతిష్య శాస్త్రము నకు ఆది. కుజగ్రహ జన్మస్థానము. అంటే స్థూల శరీరానికి మహాకాలుడు మహాకాళిక యొక్క రతి సంయోగ కారకమని వీరిద్దరు కూడా ఈ క్షేత్ర అధిదేవతలని లోకవిదితమే కదా. అంటే రాబోవు రాజస్థానీ స్త్రీమూర్తి స్థూల శరీరమును ఈమెకి వీరిద్దరు ఏర్పరచినారని అర్థం అవుతుంది కదా.
ఇక కొన్నాళ్ళకి రామేశ్వర యాత్ర కి బయలుదేరినది. కాశీ క్షేత్రం నుండి తెచ్చుకున్న కాశీ గంగను ఈ రామేశ్వర క్షేత్రములో కలపటానికి వెళ్ళినది. ఈ క్షేత్రంలో దేవాలయం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుందని గ్రహించండి. అంటే జీవశక్తి పునరుత్పత్తి చేసే కేంద్రమని అలాగే అధిక జీవశక్తిని తనలో ఇముడ్చుకొనే యంత్ర భాగమని గ్రహించండి. రామేశ్వరమునకు చేరుకున్నాక అక్కడున్న ఇరవై ఒక్క బావులలో స్నానము చేసినారు. కాశీ గంగను అక్కడున్న సముద్రంలో కలిపినారు. ఈ క్షేత్రంలో ఉన్న కొంత మట్టిని సేకరించి ఈసారి ఎప్పుడైనా కాశీ యాత్రకు వెళితే అక్కడ ఉన్న గంగలో ఈ మట్టిని కలిపితే అంతటితో కాశీ రామేశ్వర యాత్ర పరిసమాప్తి అవుతుందని లోక నానుడి ఉన్నది కదా. దానితో ఈ క్షేత్ర మట్టిని సేకరించినది. ఇక్కడే ఒక విషయమును గమనించారా? సహజముగా మనము అస్థికలు కాశీ గంగలోకలుపుతాము కదా అంటే ప్రాణశక్తి ఈ గంగలో ఉన్నట్లే కదా. అంటే ఈమె కాస్త తన కాశీ గంగానదిని తీసుకునివెళ్ళి రామేశ్వరం సముద్రం లో కలపటం వలన ఉజ్జయిని క్షేత్ర యాత్ర వలన ఏర్పడిన రాజస్థానీ స్త్రీమూర్తి స్థూల శరీరానికి ప్రాణశక్తి ఇచ్చినట్లే కదా. జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే ఈ రామేశ్వర క్షేత్రము మట్టిని తీసుకొని కాశీ గంగా క్షేత్రములో కలపటం వలన ప్రాణ శక్తి ఉన్న సూక్ష్మ శరీరము ఏర్పడినట్లే కదా. ఈ యాత్ర వలన ఈమెకు అనగా రామేశ్వర క్షేత్రము వలన సూక్ష్మశరీరము ఏర్పడినదని గ్రహించండి. కొన్నాళ్లకు కాశీ గంగకు కుంభమేళా పుష్కరాలు రావటం తను రామేశ్వరము నుండి తెచ్చుకున్న మట్టిని ఈ కుంభమేళా యాత్రకు వెళ్లి కాశీ క్షేత్రములోని గంగానదిలో కలపడం జరిగినది. ఇక దానితో ఈమెకి రాబోవు జన్మ సూక్ష్మశరీరము ఏర్పడినది.
ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమె కాస్త కైలాస యాత్ర కి బయలుదేరినది. అక్కడ తను పూజించే నిత్య దేవత అర్చన సామాగ్రి కూడా తీసుకొని వెళ్ళినది. కైలాస పర్వతము పాద పీఠము వరకు వెళ్ళినది. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసినది. అప్పుడు ఈమెకి ధ్యానములో తను పూజించే దైవిక వస్తువులు ఒక్కొక్కటి అక్కడ ఉన్న కైలాస పర్వతము వైపుకి వెళ్ళుతూ కనిపించసాగింది అన్ని వస్తువులు చేరినాయి.కానీ తను పూజించే బాణ లింగము తనతో పాటుగా సమాధి చేయాలని అక్కడున్న వారికి చెప్పాలని అనుకుని ఈ జన్మ సూక్ష్మశరీరము అనుకోవటంతో ధ్యాన భంగము అయినది. నా బొంద. నా బూడిద. సాక్షాత్తు కైలాస నాధుడే తన గుహలోని పిలుస్తున్నప్పుడు బోడి లింగము ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఆ మాత్రము ఆలోచించుకోవద్దు.ఈమె ఈ బాణలింగం కోసం ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉంటే ఈమె ఊపిరి ఆగిపోయేది. ఎందుకంటే అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళు ఈమె ఊపిరి కోసం పడే ఇబ్బందులు చూసి యాత్ర గైడ్స్ బ్రతుకుతుంది అని నమ్మకం వదిలేసినారు. ఒకవేళ ఇలా చనిపోతే ఈ శవమును ముక్కలుగా చేసి అక్కడున్న రాబందులకు ఆహారంగా వేయడం ఆనవాయితీ. తీవ్రమైన మంచు ప్రాంతము పైగా ఆక్సిజన్ అందని స్థితి. శ్వాస తీసుకోలేని పరిస్థితి. వైద్యం అందని స్థితి. ఏమిచేస్తారు. అలాంటి స్థితిలోకి దీక్షాదేవి చేరుకుంది. కాకపోతే దీని ఖర్మ. ఒక బాణ లింగము తనతో పాటుగా సమాధి చేయాలని అక్కడున్న సిబ్బందికి చెప్పాలని తిరిగి రావడం జరిగినది. వీళ్ళ అమ్మ అయితే ఈమె తిరిగి బ్రతుకుతుంది అని ఆశ కూడా వదిలి పెట్టేసి ఉన్నది కూడా. అంతటి స్థితి నుండి మా శ్రీమతి ఒక లింగం కోసం తిరిగి పునః జీవితము అయినది. దీనికి ఒక కారణం ఉన్నది. నేపాల్ లో ఒక చిన్నపాటి సాలగ్రామ సుదర్శన చక్రమును కొని ఈ కైలాస పర్వత యాత్ర చేయడము జరిగినది.ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. ఇంకా అర్థం కాలేదా? నా బొంద. ఏముంది. సుదర్శన చక్ర అధిపతి ఎవరు? శ్రీమహావిష్ణువే కదా. ఈయన లోకపాలకుడు. స్థితికారకుడు కదా. గతములో ఈమెకి అప్పటికే రాజస్థానీ స్థూల శరీరము ఏర్పడినప్పుడు కైలాస పర్వత గుహలోకి ఎలా వెళ్ళనిస్తాడు. ఈమె నిజానికి ఈ యాత్రలు చేయకుండా అదే శరీరము ఏర్పరచుకుకోకుండా ఉండి ఉంటే సాక్షాత్తు కైలాసనాథుడు మోక్షప్రాప్తిని ఇచ్చేవాడు. ఇది ఇవ్వకుండా సుదర్శన చక్ర రూపంలో శ్రీమహావిష్ణువు అడ్డుకుని అపమృత్యువు నుండి బయటకి పంపించినాడు. మోక్ష ప్రాప్తి కలుగకుండా చేసినాడు. కారణము ఈమెకి రాబోవు జన్మల ప్రారబ్ధ కర్మలు ఏర్పరచుకొని ఉన్నది కదా. అమలుపరచాలి కదా. దానితో ఆయన పని ఆయన చేసినాడు. ఇక దానితో ఈవిడ ప్రాణశక్తితో రాబోవు జన్మ ప్రారబ్ధకర్మ కోసం రాబోవు జన్మ కారణశరీరమును ఏర్పరచుకొని వెనుతిరిగి రావడం జరిగినది.
ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమె కాస్త కేదార నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, రుషికేష్ యాత్రలకు బయలుదేరినది. యధావిధిగా కేదార నాథ్ బద్రీనాథ్ యాత్ర ముగించుకొని అటుపై రిషికేష్ చేరి అక్కడున్న హనుమాన్ దేవాలయం చూసి శివ శక్తి అయిన ద్విముఖి రుద్రాక్ష, నాకోసం ఒక స్పటిక లింగము తీసుకొని హరిద్వార్ కి చేరుకున్నారు. అక్కడ విచిత్రముగా మాయాదేవి, మానసా దేవి, చండీమాత ఆలయాలు ఉంటాయి. అనగా చితాగ్ని దేవతలైన దీపదుర్గ(మాయాదేవి) దీప కాళిక(మానసా దేవి) దీప చండి(చండీమాత ) ఆలయాలు ప్రతీకలు అన్నమాట. అలాగే ఈ క్షేత్ర పరిధిలో రుద్రప్రయాగ యందు నిత్యము మండే హోమము ఉంటుంది. ఇది బ్రహ్మరంధ్ర చితాగ్నికి ప్రతీక అన్నమాట. మానసా దేవిని చూసి ఆపై చూసే ఓపిక లేక చండీమాతను దర్శించుకోలేకపోయినది. ఒకవేళ చండీమాతను దర్శించుకుని ఉంటే చితాగ్ని దేవత అయిన ఈమె కాస్త దీక్షా దేవికి మోక్షప్రాప్తి కలిగించేది. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. అది ఏమిటంటే ఈమె కాస్త మానసాదేవి దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక నాగా సాధువు బాబా ఈమె దగ్గరికి వచ్చి భిక్ష అడిగి తీసుకుని వెళుతూ ఈమె చేతిలో “అమ్మా! ఇది ఉజ్జయిని క్షేత్రమైన మహాకాలుడు యొక్క రుద్రాక్ష” అంటూ ఈమె చేతిలో పెట్టడము జరిగినది . ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అంటే ఈమెకి ఈ జన్మలోనే కపాల మోక్షం ప్రాప్తించే యోగం ఉన్నది. కానీ తన అవివేక బుద్ధి వలన ఈ యాత్రలు చేయటం వలన సంపాదించుకున్న యోగశక్తిని ఈ క్షేత్రాలు హరించి వేయడం వలన ప్రారబ్ద కర్మలు ఏర్పడుతున్నాయని గ్రహించే ఉంటారు కదా. కాకపోతే ఏమిటి? హరిద్వార్ క్షేత్రంలో ఉజ్జయిని క్షేత్ర రుద్రాక్ష పొందటము ఏమిటి ఆలోచించండి. ఈవిడ సాధన శక్తి పతనమైన చోటు ఉజ్జయిని క్షేత్రం నుండి ప్రారంభమైనది అని మీకు తెలుసు కదా. మరి సాధన పరిసమాప్తి క్షేత్రమైన చితాగ్ని ఆవాసమైన హరిద్వార్లో అంతే ఖచ్చితముగా ఉజ్జయిని క్షేత్ర రుద్రాక్ష లభించటం ఏమిటి? ఆలోచించండి. నా ఆలోచన సరియైనదే కదా. అందుకే దయచేసి యోగ సాధకులు పైన చెప్పిన ఈ క్షేత్రయాత్రలు చేయరాదని మనవి. చెయ్యడము వలన మీ యోగ శక్తి ఈ క్షేత్రాలు తీసుకొని అపుడికే వివిధ రకాల భక్తుల పాప కర్మల ఫలాలు తీసుకొని ఉండుటవలన మీ పుణ్య సాధన శక్తి తో వీటిని నివారణ అయ్యేవిధముగా ఈ క్షేత్ర ఆలయాలు మనకి కనిపించని పిరమిడ్ ఆకారాలలో నిర్మించి మన సాధనశక్తిని తీసుకొనే విధముగా ఏర్పరచినారని ఎందరికి తెలుసు. ఎందుకు ఈ పంచక్షేత్రాలలో ఈ పిరమిడ్ నిర్మాణ ఏర్పాటు చేసినారు అంటే మన పంచశరీరాలు ఈ క్షేత్రాలలోనే ఏర్పడతాయి అన్నమాట.అనగా ఉజ్జయినిలో స్ధూలశరీరము ఏర్పడితే...రామేశ్వరములో సూక్ష్మశరీరము ఏర్పడితే…. కైలాస పర్వత ప్రాంతములో కారణశరీరము ఏర్పడితే... కేదార నాథ్, బద్రీనాథ్ ప్రాంతములో సంకల్ప శరీరము ఏర్పడితే… రుషికేషి క్షేత్రమునందు ఆకాశ ఏర్పడుతుందని తెలుసుకోండి. ఈ క్షేత్రాలు పున:కర్మలకి అలాగే పున:కర్మ జన్మలకి కారకమయ్యే విధముగా ప్రకృతిమాత ఏర్పరచినది.మరి ఈ విశ్వసృష్టి నడవాలి గదా.అందుకు ఎక్కడో ఒకచోట పున:సృష్టి జరగాలి గదా.అదే ఈ పంచ క్షేత్రాలు అన్నమాట. విచిత్రము ఏమిటంటే ఈ పంచశరీర ప్రారబ్ధకర్మలను కర్మశేషము లేకుండా నివారణ అయ్యే విధంగా కాశీక్షేత్రములో పంచక్రోశ ప్రాంతమును ఈ ప్రకృతిమాత ఏర్పరచినది. కాని ఈ క్షేత్రములో ఈ ప్రాంతాలలో మరణించకపోతే...కేవలము స్ధూలకర్మల నివారణ మాత్రమే అయ్యేటట్లుగా ఏర్పాటున్నదని గ్రహించండి.కాని యుగానికి ఒకడు మాత్రమే ఈ కాశీ పంచక్రోశ ప్రాంతములో మరణమును పొంది సంపూర్ణ కపాలమోక్షస్దితిని పొందేవిధముగా ఏర్పాటు చెయ్యబడినదని ఎందరికి తెలుసు.
పిరమిడ్ నిర్మాణాలు పున:జీవశక్తి తీసుకుంటాయని...అందుకే మన బ్రహ్మరంధ్రములో 36 కపాలధారియైన సదాశివమూర్తి కపాలములు గూడ ఒక పిరమిడ్ ఆకారనిర్మాణములో ఉంటాయని అలాగే ఆదిపరాశక్తికి సంకేతముగా మనము నిత్యం పూజించే శ్రీచక్ర నిర్మాణము గూడ ఒక పిరమిడ్ అని తెలుసుకోండి. తెలిసి చేసిన లేదా తెలియక చేసిన ఈ యాత్రవలన ఏమి జరుగుతుందో సాధకులకి ఒక అనుభవ యాత్ర గురించి చెప్పటం జరిగినది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే హరిద్వార్ క్షేత్రము అనేది మూలాధార చక్ర క్షేత్రమని లోకవిదితమే కదా. అంటే మా శ్రీమతి సాధన శక్తి తిరిగి మూలాధార చక్రమునకు చేరుకున్నదని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. మరి మీరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. దానితో ఈమె ఆధ్యాత్మిక ప్రయాణం నాతో ప్రయాణించడము ఈ సహస్ర చక్రము వద్ద ఆగిపోయినది. దీనికి నిదర్శనముగా ఈ అంశము వ్రాసేసమయములో మా శ్రీమతి దీక్షాదేవి కాస్త కాశీయాత్రలో ఉన్నారు. విచిత్రము ఏమిటంటే ఈవిడకి ఆది నుంచి దైవవిగ్రహలు కాస్త సాకారముగా మానుష్యరూపేణ ధ్యానము నందు కనపడి మాట్లాడటం ఉండేది.అలాగే ఈవిడ కాశీలో ఉండగా కాశీవిశ్వనాధుడు, విశాలాక్షి, అన్నపూర్ణ వారాహి,శ్రీకాలభైరవుడు,శ్రీతైలింగస్వామి,ఇలా వీళ్ళు ఈమె ధ్యానమునందు ఒక్కొక్క సమయములో ఒక్కొక్కరిగా సాకారమై... “నువ్వు ఎవరు?ఎందుకు వచ్చావు?నీకేమి గావాలని” అడగానే దానికి ఈవిడ కాస్త “నాకేమి వద్ధు!మోక్షం ప్రసాదించండి చాలు” అనగానే వీళ్ళంతాగూడ చిరునవ్వు నవ్వి అంతర్ధానమైనారట.కారణము తెలియరాలేదు.మరి మీకైనా తెలిసినదా...ఇంక తెలియలేదా...అంటే ఈమెకి ఈ జన్మలో కారణశరీర కపాలమోక్షం మాత్రమే కలుగుతుందని...ఇంకా సంకల్ప,ఆకాశ శరీర కపాలమోక్షస్ధితులు ఇంక మిగిలే ఉన్నాయని తెలుసు కాబట్టి ఈవిడిని “తధాస్తు” అని దీవించకుండా...చిరునవ్వు నవ్వి మాయం అయినారు అన్నమాట. పైగా ఈవిడికి కాశీ ఓంకార శంఖనాద సాధన చేసుకొమ్మని అనుజ్ఞ ఇవ్వడము జరిగినది.ఎందుకంటే సహస్రచక్ర శ్రీకృష్ణ మాయను దాటటానికి ఈ క్షేత్ర శంఖ సాధన ఉపయోగపడుతుంది అన్నమాట. ఈమెది రాబోవు భవిష్యజన్మ రాజస్ధాని వాసి యని తెలుసుగదా.ఈ ప్రాంతములోని పుష్కర్ క్షేత్రములో బ్రహ్మదేవుడు కాస్త ఓం మంత్రదేవత అయిన గాయిత్రిమాతతో ఉంటాడు గదా. ఈ లెక్కనచూస్తే...శంఖసాధన అలాగే పుష్కర్ క్షేత్రం సరిపోయినది గదా! ఇపుడికేకాకాజీ యాత్ర(మూలాధార చక్ర కామగుణ మాయవలన) మరియు యోగిరమణ యాత్ర (మణిపూరకచక్ర ఇష్టదైవ వెంకన్న సాక్షాత్కార మాయ వలన) ఆగిపోయినాయి. ఇక మిగిలిన శ్వేతాదేవి మరియు జిజ్ఞాసి నాతో పాటుగా ఈ సాధన ఆధ్యాత్మికయాత్ర ఎంతవరకు చేస్తారో చూడాలి మరి. అంతదాకా నాతో ముందుకి ప్రయాణించండి.
శుభం భూయాత్
పరమహంస పవనానంద
***************************************
గమనిక: ఈ చక్ర స్థితిలో దైవిక వస్తువులుగా తులసి మాలలను, దక్షిణావృత శంఖాలను, పాంచజన్య శంఖం, విష్ణు సాలిగ్రామాలు, నెమలి ఈకలు, విష్ణు మూర్తి విగ్రహలు, లక్ష్మీ దేవి విగ్రహలు, శ్రీ కృష్ణుడు విగ్రహలు, పాదముద్రలు కనిపిస్తాయి. వస్తాయి. అలాగే మాకు ఈ చక్రములో ఉండే సకలదేవతల,కారణలోక మాయలను దాటినందుగాను ఈ చక్ర అధిష్టాన దైవాలు ఆది విష్ణువు స్వరూపమైన సూర్యాంశ ఆది సూర్యనారాయణ మరియు ఆది మహా లక్ష్మీ స్వరూపమైనచంద్రాంశ అయిన లక్ష్మీదేవి ల స్వరూపమైన సూర్యచంద్రకాంత బాణలింగము మాకు హిమాలయాల నుండి వచ్చినది.ఈ లింగము మీద అర్ధచంద్రాకార గుర్తు ఉండటం...అలాగే దీనికి అభిషేకము చెయ్యగానే బంగారపు తళుకులు లాగా మెరవడం విశేషమే గదా!
అలాగే నేను చెప్పిన క్షేత్రాలకి వెళ్ళితే నా జీవితానుభవముగా ఏమిజరిగినదో దానిని యధాతముగా నా వ్యక్తిగత అభీప్రాయముగానే చెప్పడము జరిగింది.ఇది అందరికి వర్తింస్తుందని ఖచ్చితముగా చెప్పలేము.కాని మోక్షము పొందేవారు ఈ క్షేత్రాలకి ఓకటి పది సార్లు వెళ్ళితే మనకి ఉన్న 800 రుణానుబంధాలలో ఒకటైన క్షేత్రరుణబంధం మాయలో పడి ఈక్షేత్రాలలో ఆవాసము చేసి మరణము పొందితే మోక్షము పొందవల్సినచోట ముక్తి పొందడము జరుగుతుంది.ఇది నాస్వానుభవముగా ఎంతోమంది ఇలాంటి స్ధితి పొందిన యోగులను చూశాను. ఎందుకంటే ఈ క్షేత్రాలు అన్నిగూడ పున:కర్మ-జన్మాలుగా యోగ-దైవ జన్మాలిచ్చే ముక్తిక్షేత్రాలు గావడము విశేషము.ఇది వద్దు మోక్షము గావాలనేకోనేవారు ఈక్షేత్ర దర్శనానికి వెళ్ళి అక్కడ జీవితాంతము ఆవాసము పెట్టుకొని మరణము పొందాలి అనే పని పెట్టుకోకుండా దర్శనాలు చేసుకొని వెనక్కి తిరిగి అదిగూడ మూడు లేదా అయిదు సార్లు మించకుండా వెళ్ళితే చాలు.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇక నా సాధన పరిసమాప్తి సమయములో నేను కాస్త నాకు ధ్యానములో కనిపించిన పాంచజన్య శంఖము కోసము ద్వారక క్షేత్రానికి వెళ్ళడము జరిగినది.అక్కడ ఒక శ్రీకృష్ణభక్తుడు దిగులుతో కనిపించినాడు. విచారణ చేస్తే “స్వామి!అందరు నన్ను అహంకారి అంటున్నారు.నేనేమో అది ఆత్మవిశ్వాసమని అంటున్నాను.అసలు నిజానికి అహంకారానికి అలాగే ఆత్మవిశ్వాసానికి ఉన్న తేడా ఏమిటి” అనగానే నేను వెంటనే “నాయన!కృష్ణ స్వామి!నేను చెయ్యగలను అంటే ఆత్మవిశ్వాసము.. నేను మాత్రమే చెయ్యగలను అనే అతివిశ్వాసమైనా అహంకారమవుతుంది.దీనికి విరుగుడు సర్వస్య శరణాగతిని కలిగి ఉండాలి. దీనికోసము నిరంతర ఓంకారనాదము చేసుకోవాలి.అపుడే అహంకార స్ధానములో అణుకువ ఏర్పడుతుంది. పొగడ్తల మాయల వలన మనలో అహంకారము ఏర్పడితే...అందరికి తన తోచిన సేవలు చెయ్యడము వలన మనలో ఉన్న అహం పోయి శుద్ధగుణము కలుగుతుంది. అని నేను అనగానే.... అతను కాస్త తనకి ఆరోజు ఇక్కడున్న నదీ పరిహరప్రాంతములో దొరికిన పాంచజన్యశంఖమును తన చేతిసంచి నుండి బయటి తీస్తూ... “స్వామి!ఈ శంఖమును ఆ గుడిలో ఉన్న స్వామివారికి ఇవ్వడము కన్నా మీకే ఇవ్వడము మంచిదని నాకు అనిపించి ఇది మీకు ఇస్తున్నాను అని ఇస్తుండగా...నేను వెంటనే... “ఆ గుడిలో ఉన్న ఆస్వామి...మీ రూపములో నాముందర ఉన్నాడని ఆమాత్రము నేను గ్రహించలేనా...నాలో ఏమైన అహంకార మాయ ఉన్నదో లేదో మీ కృష్ణమాయపెట్టినారు.నా సమాధానికి సమాధానపడి మీ శంఖము నాకు ఇస్తున్నారు గదా” అనగానే...నువ్వు నిజముగానే అసాధ్యుడివి రా...హనుమంతుడి ముందు ఇక గుప్పిగంతులు వెయ్యడము అవసరమా...అని ఆ కృష్ణస్వామికాస్త చిరునవ్వుతో అంతర్ధానమైనారు. నేను ఆ గుడి లోపులకి వెళ్ళకుండా వెనుతిరిగి మా ఊరుకి బయలుదేరినాను. మీరైనా ఒక విషయము గమనించారా?ఇపుడిదాకా నా వివిధ చక్ర సాధనపరిసమాప్తి అనుభవాలు నేను చెప్పేటపుడు ఎక్కడ ఎవరినిపేరు పెట్టి పిలువలేదు.ఈ చక్ర సాధన స్ధితిలో బాధపడేవారిని నేను కాస్త పేరు పెట్టి పిలువడము జరిగినపుడే మన గురుడు ఈయన ఎవరో గ్రహించినాడని మీరు గ్రహించాలి గదా!
ఇక మా శ్రీమతి సాధన విషయానికి వస్తే...ఈవిడికున్న సంపూర్ణ కపాలమోక్ష మనో సంకల్పమునకు జగత్ గురువైన ప్రకృతిమాత స్పందించి...వీరికున్న పాతివ్రత్యధర్మమునకు సాధన పరీక్షలు పెట్టడముతో వాటిని ఈమె ఎన్నో మానసిక,శారీరకపరీక్షలు తట్టుకోవడముతో... ఈమెకున్న సంకల్పమును తీర్చుటకు ఈమెకి కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద స్వామి సమక్షములో జరిగే సువాసనిపూజ కార్యక్రమములో ఈమె పాల్గోనుట ద్వారా ఈమెకి ఈయన పరమగురువు అయ్యి ఈమె సాధన పరిసమాప్తి చేస్తారని అనుభవమైనది.అంటే మాకు ఈమెతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధనము తీరడముతో ఇన్నాళ్లుగా ఈమెకి గురువుగా ఉన్న మేము కాస్త శ్రీ పవనానంద స్వామి నుండి శ్రీ సిద్దేశ్వరానంద స్వామికి గురువుగారికి ప్రకృతిమాత మార్చడము జరిగినది. అంటే స్త్రీమూర్తి సాధకులకి ధర్మ,అర్ధ,కామ పురుషార్ధాలను ధర్మజీవితముతో ఆచరిస్తే వీరికి తప్పకుండా నాలుగ పురుషార్ధామైన మోక్షము తప్పకుండా పొందుతారని వీరి సాధన జీవితము నిదర్శనముగా నిలుస్తున్నాయి.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmanam chesina paapa punya karmalu manaki gurthukuraavatam,malamu karpuravasana,
రిప్లయితొలగించండిraavatam ee chakra aadhenam ayyindi ani,shatchakralu balaheenapadite shunya mudra abhyaasam cheyatam
nagasaadhuvula deeksha entha katoranga untundo...
meeru anni thyaagam chesaka meeku daivika vasthuvulu raavatam,aagna chakram lo omkaram cheyali ikkada sahajanga
vinipisthundani...maaya mana venta undi chinna thappuke pedda shiksha veyalani prayathnisthundani, meeru anni offer
lu vadulukovadam...meeku srikrishnudu maaya manirupamlo raavatam,sundari maaya datatam,meeru aadavaallu peddamanishi ayinattu
ga nene devudini ayyanu ante navvu aapukolekapothunna....mee kailasaparvatha darshananubhavam,daivika vasthuvula rahasyalu theliyatam
aahaa!! enni kashtalupadi "nenu" anedi thyaagam chealani....
chinnamasthadevi scene chaala tension ga undi,mee vishwarupa darshanam jarugatam antha nimmapandu sizelo kanipinchatam..
nak ee adhyaayam lo raaddantam, siddantam,vedantam ane line baaga nachindi ade nijam...ika deekshadevi gaaru cheyakudani
kshetra darshanalu chesi saadhaana shaktini kolpovatam, malli kurthalam baba vaariki anusandhaanam avvatam...last lo
krishnude meeku ahankaara pareeksha petti meeku kaavalsina shankhamunu ivvatam, ee chakra anubhavalu rendu chotla vollu
gaggurlu podichela chepparu okati chinnamastha devi inka nishiddha kshetrala gurinchi.
శ్రీకృష్ణుడు తనకు మగ సంతానం కోసం ఏకంగా మహా శివుడి కోసం 60 వేల సంవత్సరముల పాటు తపస్సు చేసి సాంబుడు అనే కుమారుడిని పొందినాడని తెలుస్తుంది. మరి ఈయనకు ఎందుకు సంతానం లేకపోయినదో ఆ సర్వేశ్వరునికే తెలియాలి
రిప్లయితొలగించండిఈ వాక్యము ను వ్రాస్తూన్న సమయంలో స్వామి వారు మాయాచకిత మానవులైనిలిచారు.
స్వామి..శ్రీకృష్ణుడికి మగ సంతానము ఉన్నదని నేను గూడ చెప్పాను గదా..శివుడి అనుగ్రహము వలన ఈయనకి సంతానము కల్గిందని అందరికి తెలుసు.కాని శివుడి అనుగ్రహము లేకపోతే ఈయనకి మగ సంతానము కల్గేది కాదు గదా అని నా ఉద్దేశ్యము.అది అర్ధము చేసుకోకుండా నేను మాయలో పడ్డానని విమర్శించి మీరు మాయలో పడ్డారు గదా.నేను ఎక్కడ గూడ దేవుడని చెప్పలేదు.ఆ అనుభూతి కల్గిందని చెప్పాను అంతే..
తొలగించండి