అధ్యాయం 39

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
హెచ్చరిక:నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....


బాబా ఫోటో రావడం

గురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునే సరికి మేమిద్దరం గతుక్కుమన్నాము.ఎందుకంటే మానవమాత్రునికి ఇలాంటి లక్షణాలు ఉండవని ఉండలేరని మాకు తెలుసు.దానితో గురువులను మేము వెతుక్కోవటం కంటే మనకు యోగం ఉంటే వారే మా దగ్గరకు వస్తారని లేదంటే వారి దగ్గరికి మమ్మల్ని రప్పించుకుంటారని మాకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రలో తన ప్రథమ శిష్యుడిని సిద్ధయ్యను ఎలా తనకి దగ్గరకు రప్పించుకున్నారో తెలుసుకున్నాము. అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఆయననే ఆయన గురువు వెతుక్కుంటూ ఎలా వెళ్ళినారో తెలుసుకున్నాం.  అలాగే వివేకానందుడు ఇప్పటికే 48 మంది గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని గురువుగా ఎంచుకొని గురువుగారు అనుగ్రహమును ఎలా పొందినారో తెలుసుకున్నాము! దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహం నిత్యం మంత్రధ్యానం చేయటం అలాగే నిజ గురువు దర్శనం  కోసం గురు చరిత్ర పారాయణం చేయడం ప్రారంభించాము. అప్పుడు ఒకసారి మా ఊరికి మా అమ్మమ్మ గారు రావడం జరిగినది. ఆమె నిత్యము ఏదో గ్రంథ పారాయణం చేయటం అలాగే ఎవరో సిద్ధ విగ్రహాన్ని పూజ చేయడం చూస్తుంటే సరికి నాకు ఆశ్చర్యమేసింది. అది ఎందుకంటే ఇప్పటిదాకా నేను వివిధ దేవతా విగ్రహాలను చూడటమే జరిగినది. ఒక మనిషి లాంటి వ్యక్తిని ఆరాధించే మొట్టమొదటిగా అమ్మమ్మ ని చూస్తున్నాను. పైగా అప్పటిదాకా నేను భగవద్గీత, గురు చరిత్ర గ్రంధ పారాయణాలు చేయటమే తెలుసు కానీ ఈవిడ దగ్గర షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనే గ్రంథమును పారాయణం చేస్తుంది! ఎవరు? ఈ మనిషి లాంటి సిద్ధపురుషుడు విగ్రహము అని సందేహం వచ్చింది. అమ్మమ్మ ను అడిగితే దానికి ఆమె వారు “మహాయోగి అయినా షిరిడి సాయి బాబా వారని … గొప్ప సద్గురువు అని… 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిన వారని,అక్కడ వారంతా వీరిని నడయాడే పరమాత్మగా కొలుస్తారని…. సర్వమత స్థాపకుడని ఇలా షిరిడి సాయి బాబా గూర్చి చెప్పడం జరిగినది. 

అప్పటినుండి బాబా గురించి తెలుసుకోవాలని తపన ఉండేది. మా ఊరిలో గాని ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో బాబా గుడి లేదు. అప్పట్లో జనాలకి వీరి గూర్చి అంతగా తెలియదు. దీనితో మాకు కూడా పూర్తిగా ఆయన గూర్చి తెలియకుండా పోయింది. ఒకసారి వేసవి సెలవుల కోసం అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళటం జరిగినది. ఒక గురువారం ఆమె బాబా గుడికి వెళుతూ నన్ను కూడా తీసుకొని వెళ్ళింది. 




ఇక్కడ మూడు అడుగుల తెల్లని పాలరాతి విగ్రహం రాతి మీద కూర్చున్న భంగిమలో ఎదరు  సిద్ధ పురుషుడి విగ్రహం ఉన్నది. ఆయనే బాబా అని అమ్మమ్మ చెప్పేదాకా నాకు తెలియదు. ఎదుట ఉన్న విగ్రహమూర్తి ని చూడగానే సజీవంగా చూస్తున్నట్లుగా అనిపించసాగింది.! వామ్మో ఇంతటి మహత్తర సిద్ధ మహనీయుడిని  ఇంక ఎన్నటికీ వదలి పెట్టకూడదని నాలో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో నా యోగ జీవితమును నడిపించే నావికుడు అని బలముగా చూసిన మొదటి రోజున అనిపించింది. చూపులు కలిసిన శుభవేళ శుభముహూర్తం మా ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. తాతా-మనవడులో తాతగా ఉంటాడని అనిపించింది . లింగమూర్తిని ఆరాధించిన కూడా నాకు ఇలాంటి ఆర్తి ఆయన విషయంలో కలగలేదు. ఈయన విషయంలో లో మాత్రం కలగకుండా ఉండలేదు.ప్రతిరోజు అక్కడ ఉన్నన్నాళ్ళు బాబా గుడి కి వెళ్ళడము జరిగింది. ఒకరోజు నేను బాబా గుడికి రాగానే పాము కరిచిన వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చి “బాబా !వైద్యులు ఇతడిని బ్రతికించలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దైవాన్ని నమ్ముకోమని చెప్పి వెళ్లిపోయారు. మా దృష్టిలో నిన్ను మించిన దైవము ఎవరూ లేరు కదా! బాబా! మా వాడిని రక్షించు రక్షించు” అంటూ దీనాతిదీనంగా బాబా కి హారతి ఇస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాడి ప్రార్ధన అలాగే పాముకాటు బాధ పడుతున్న ఆవేదన చూసి నా కళ్ళవెంట నీళ్ళు రావడం ప్రారంభమైనది. ఇంతలో ఆలయ పూజారి వచ్చి బాబా దగ్గరున్న ధుని ఊది ఈ పాము కాటు వద్ద రాసి… నోటిలో  కొంత ఊది వేసి… బాబా వైపు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సుమారుగా మూడు గంటల తర్వాత పాము కాటు బాధితుడు పునర్జీవితుడయ్యాడు అని అమ్మమ్మ నాకు చెప్పేసరికి నా ప్రాణం వచ్చినంత ఆనందం వేసింది. ఈ అద్భుత సంఘటనతో ఆయన మీద మా తాతయ్య మీద గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు పెరిగినాయి. నా సెలవులు పూర్తి కావడంతో ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నము అయ్యేసరికి బాబాని వదిలి వెళ్తున్నందుకు నా మీద నాకే కోపం, బాధ కలిగినాయి.  కానీ ఏమీ చేయలేము కదా! అప్పుడు మా అమ్మమ్మ నా చేతికి షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర గ్రంథం అలాగే బాబా వారు చెప్పిన జవాబులు పుస్తకమును నా చేతిలో పెట్టడం జరిగింది. వీటిని కనిపించని బాబా తాతయ్య ప్రసాదంలాగా దాచుకొని మౌన వేదన తో ఇంటికి రావడం జరిగినది. కానీ నా నుండి బాబా ఆలోచనలు పూర్తిగా పోయేవి కావు. బడిలో, గుడిలో లో జరిగిన సంఘటనలు అన్నీ బాబాకి చెప్పేవాడిని. ఆయన అన్ని వింటున్నాడని భావించేవాడిని. నన్ను చూసే వాళ్లకు నాలో నేను ఏకాంతంగా మాట్లాడుకోవడం మాత్రమే కనిపించేది. ఆ జిఙ్ఞాసి కనపడని సమయంలో నేను బాబాతో అన్ని విషయాలు చెప్పుకునేవాడిని ఎలా అంటే రామకృష్ణ పరమహంస తన కాళీమాత తో ఎలా చెప్పుకునేవాడో అలాగన్నమాట.కానీ నాకు బాబా వారు సజీవమూర్తిగా కనిపించేవారు కాదు అన్న మాట. ఇది ఇలా ఉండగా నాకు తెలియకుండా నేను బాబా చరిత్ర పారాయణము ఆరు నెలలు పూర్తి చేసినాను. 

                                                           మా   బాబా  సజీవమూర్తి ఫోటో 

ఒకరోజు మా అన్నయ్య నాకోసం శ్యామ కర్ణ ఉన్న గుర్రం అలాగే వాఘే కుక్క కూర్చున్న సజీవమూర్తి ఉన్న బాబా వారి రెండు అడుగుల ఉన్న ఫోటో నాకు పుట్టినరోజు బహుమతి గా  ఇచ్చినాడు. అది 1993వ సంవత్సరంలో అన్నమాట. బాబా  సజీవమూర్తి ఫోటో చూడటం అదే మొదటిసారి. అలాగే ఇలాంటి ఫోటో నేను ఇంతవరకు మరి ఎక్కడ చూడకపోవడం మరీ విచిత్రం అన్నమాట. ఆ ఫోటో ఇప్పటికీ నా ప్రాణ ప్రదంగా నా దగ్గరే ఉన్నది. అది ఉంటే బాబా నాతో ఉన్నట్లే ఉండేది.  ఇక ఆరోజు నుండి ఈ ఫోటో తో మాట్లాడుకోవడం ఆరంభించాను.ఒక ప్రక్క బాబా పారాయణాలు,హారతులు జరుగుతున్న సమయంలో నాకు ఏదైనా సమస్యలు వచ్చినా బాబా సూక్తులు పుస్తకము చూసేవాడిని.అందులో లో బాబా చెప్పిన మాటలు 777 సూక్తులు ఇవ్వబడినాయి. అందులోంచి కళ్ళు మూసుకొని ఒక నెంబరు లేదా పేజీని తాకి నాకు వచ్చిన సమస్యకు పరిష్కార సమాధానము ఖచ్చితంగా వచ్చేది నాకు ఎంతో ఆశ్చర్యం వేసేది. దానిని స్వయంగా బాబా ఆజ్ఞ అని భావించి ఆయన చూపించిన సమాధాన సూక్తిని అనుసరించేవాడిని. పాటించేవాడిని. ఆచరించేవాడిని. ఇప్పటిదాకా బాబా ఆజ్ఞలన్నియు ఈ పుస్తకం ద్వారా నాకు వచ్చేవి. ఇప్పటికి కూడా వాటిని పాటిస్తున్నాను.

గమనిక: బాబా వారు దేవుడా? దెయ్యమా? గురువా? లేదా జ్ఞాని? అజ్ఞాని? హిందువు? ముస్లిం? అనే చెత్త విషయాలు పక్కన పెట్టి సర్వమత సమ్మేళనం కోసం పాటుపడిన సిద్ధ మహాత్ముడు అని గుర్తించండి.ఎన్నో సం!!రాలుపాటు సిద్ద యోగ మార్గంలో సాధన చేసి ఎన్నో రకాల యోగమాయలను దాటుకుని పరిణతి చెందిన పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అని గుర్తించి…. మన కళ్ళముందు జీవించి మరణించిన నడయాడే పరమాత్ముడని గ్రహించి ఆరాధించండి. మీకు కావలసిన యోగము లేదా భోగము ఆయనే అందిస్తాడని విశ్వాసంతో విశ్వసించి విశ్వ ఆరాధన చేయండి.

సమాధానాలు చెప్పే బాబా పుస్తకము


సమాధానాలు చెప్పే బాబా పుస్తకము

కొన్ని రోజుల తర్వాత ఆనంద వదనంతో ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంతో నా దగ్గరికి జిఙ్ఞాసి వచ్చినాడు. ఈసారి మనస్సులో గురువుకు సంబంధించిన ప్రశ్నలు పెట్టుకొని బాబా ప్రశ్న జవాబు పుస్తకం ఇచ్చే సమాధానాలు చూడటానికి వచ్చినాడు.

1.               సాధనకి గురువు అవసరమా? అనే ప్రశ్న  అడగగా  బాబా పుస్తకము జవాబుగా  “గురువు సహాయము లేనిదే ఎవరికి కానీ ఆత్మసాక్షాత్కారము పొందుట చాలా కష్టం” అని వచ్చింది. 

2.               సాధనకు గురు మంత్రో పదేశం అవసరమా?  అన్నప్పుడు బాబా పుస్తకము జవాబుగా “ఉపదేశాలు కొరకు,  మంత్ర యంత్రాల కొరకు,  ప్రయత్నాలు చేయకు! మీ ఆలోచనలో నన్ను గుర్తించు” ( నెం.83) అని వచ్చింది .

3.               బాబా మీకు గురువులు ఏదైనా మంత్రోపదేశం చేశారా? అన్నప్పుడు బాబా పుస్తక జవాబుగా “నా గురువు చాలా గొప్ప యోగి. దయామయుడు. ఆయనకు చాలా కాలం సేవించినను నాకు ఎటువంటి మంత్రం ఉపదేశించలేదు!”( నెం.275) అని వచ్చినది. 

4.               బాబా నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం ఇస్తారా? అని అడగగా బాబా పుస్తక జవాబుగా “నేను చెవిలో మంత్రాలు ఉపదేశించను! నా పద్ధతి వేరు!              ( నెం.406) అని వచ్చింది. 

5.               బాబా! గురు సేవ చేయడం అవసరమా? అన్నప్పుడు జవాబుగా “నిజమైన సాధువు పాదాల మీద పడితే… మీరు చేసిన పాపాలు తప్పక తొలగిపోతాయి!        ( నెం.535) అని వచ్చినది. 

6.               బాబా!మరి నిజ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “నీవు నన్ను సరిగా గుర్తించడం లేదు! కానీ నేను నిన్ను గుర్తించి మీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను! ( నెం.757)  అని వచ్చింది. 

7.               బాబా! మరి నకిలీ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పతనాన్ని చాటుకునే కపట గురువులు ఈ మధ్య చాలామంది తయారు అయ్యారు” ( నెం.194)  అని సమాధానం వచ్చింది.

8.               బాబా! నిజ గురువు తన శిష్యులు నుండి  ఏమి ఆశిస్తాడు? అని అన్నప్పుడు దానికి జవాబుగా “నా గురువు నా నుంచి నమ్మకము, శ్రద్ధ తప్ప ఇంకేమీ ఆశించలేదు! ( నెం.470)  అని వచ్చింది. 

9.               బాబా! ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఏమి చేయాలి? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “బ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఐదింటిని వదిలివేయాలి! అవి పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి,అహంకారం” ( నెం.145)   అని వచ్చింది.
  
10.         బాబా! మీరు ఎందుకు అవతరించారు అని ప్రశ్నించినప్పుడు 840 సంఖ్య కోరుకొని చూడగానే దానిలో “మంచి వారిని కాపాడుతూ చెడ్డ వారిని మారుస్తూ ధర్మాన్ని నిలకడగా ఉంచటం దేవుడు నాకు అప్పగించిన పని” అని వచ్చింది.

11.         బాబా! మీరు దేవుడా లేదా గురువా? అని ప్రశ్నించినప్పుడు 366 కోరుకుని చూడగానే “మీరంతా నన్ను దేవుడిగా పూజిస్తున్న నేను మాత్రం దేవుడిని సేవిస్తాను! ఆయనను నేనెప్పుడూ మరువను” అని వచ్చింది.

12.         బాబా! అ మా ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు? అని ప్రశ్నించి మనస్సులో 377 నెంబరు అనుకుని పుస్తకంలో చూడగా దానిలో “అతడు పరిణతి చెందిన భక్తుడు! నువ్వు ఇంకా అంత పరిపక్వత చెందిన లేదు” అని వచ్చినది. 

13.         బాబా! నేనెందుకు పరిణతి చెందిన లేదని ఆవేదనతో జిఙ్ఞాసి ప్రశ్నించి 556 నెంబర్ పుస్తకంలో చూడగా “మీ తెలివితేటలు మీదనే ఆధారపడి ఉన్నావు! దానితో నీవు తప్పు దారి పట్టినావు!  చిన్నధైన పెద్ద విషయమైనా సరైన దారి చూపుటకు గురువు తప్పక అవసరం” అని వచ్చినది.

14.         మరి బాబా! నాకు నిజ గురువు దొరుకుతాడా? అని ప్రశ్నించి 72 అనుకొని పుస్తకము తీసి చూడగా “బ్రహ్మ సాక్షాత్కారం పొందుటకు కొన్ని అర్హతలు కావాలి”! అని వచ్చింది దానితో మన వాడికి కోపం వచ్చింది! ఇప్పటి దాకా అన్ని సరైన సమాధానాలు వచ్చినాయి కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు.

       నాకు గురువు పొందటానికి అర్హత లేదా ఇంకా ఏమి అర్హతలు కావాలి అని నన్నే ప్రశ్నించాడు. వాడి ముఖం చూసి నేను నవ్వు ఆపుకోలేక పోయాను. వెంటనే వాడు “భయ్యా! ఇక చిట్టచివరి ప్రశ్నను అడుగుతాను! దీనికి బాబా జవాబు ఏమి వస్తుందో చూద్దామని “బాబా! ఇప్పటిదాక మీరు చెప్పిన జవాబుల సమాధానాలు నిజమేనా? అని ప్రశ్నించి 274 అనుకొని ఆ నెంబరు సమాధానం చూడగానే వాడి ముఖం వాడి పోయే సరికి నాకు నవ్వు ఆగలేదు. ఇంతకీ వాడికి వచ్చిన సమాధానం ఏమిటంటే “ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు” అని వచ్చింది! నాకైతే నవ్వు ఆగటంలేదు. వాడి ముఖంలో రంగులు మారడం ఆగలేదు. దానితో మేము పుస్తకం ద్వారా బాబాని విసిగించడం మానివేసి పుస్తకం మూసి వేసి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి బయటికి వెళ్ళాము. 

గమనిక:ఇవన్నియు కూడా అక్షర సత్యాలే! అమ్ముల సాంబశివరావు గారు రాసిన “శ్రీ షిరిడి సాయి సూక్తులు” చిన్నపాటి పుస్తకములో సుమారుగా 888 దాకా బాబా సూక్తులు ఉన్నాయి.వాటిని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా అర్థము కానీ స్థితి వచ్చినప్పుడు మనస్సులో ప్రశ్న అనుకొని మనస్సుకు తోచిన నెంబర్లు అనగా 1 నుండి 888 మధ్యలో ఒక నెంబర్ అనుకొని మీ పుస్తకంలో ఆ నెంబర్ ఎదురుగా ఉన్న సమాధానం బాబా వారి జవాబుగా భావించుకోవాలి. ఇలానే పైన అడిగిన ప్రశ్నలకు బాబా పుస్తకం సమాధానాలు అలాగే మేము కోరుకున్న ప్రశ్న నెంబర్ కూడా ప్రక్కనే వ్రాసినాను. కావాలంటే మీరు కూడా ఈ మహత్తర పుస్తకం కొనుక్కుని మీ ప్రశ్నలకి బాబా జవాబులు గా సరైన సమాధానాలు వస్తున్నాయో లేదో ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేకుండా పరీక్షించుకోండి. తెలియని ఆనందాలు పొందండి. భౌతిక బాబా వారిగా చిరు పుస్తకం ఉంటుందని నా స్వానుభవాలు చెబుతున్నాయి. అన్నీ కూడా అక్షరసత్యాలే అవుతాయి. అందులో ఎలాంటి ఢోకా లేదు! ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా 1993 సంవత్సరం నుండి ఇప్పటిదాకా 2019 నాకు వచ్చిన ఎన్నో సమస్యలకు ఈ బాబా పుస్తకమే ఎన్నో సలహాలు, సూచనలు, సలహాలు, ఓదార్పులు, తిట్లు సమాధాన జవాబులుగా ఇచ్చినది. ఏమి వచ్చిన బాబా ఆజ్ఞగా భావించుకుని వాటిని చేసేవాడిని. భావించేవాడిని.ఎదురుచూసే వాడిని. ఆనందపడే వాడిని. బాధపడే వాడిని అన్నమాట.

షిరిడి కి పారిపోవడం

ఇంటికి దూరంగా ఉన్నత చదువుల కోసం మళ్లీ నేను మరో ఊరికి వెళ్లడం జరిగింది. అలాగే జిఙ్ఞాసి కూడా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళినాడు అని మీకు తెలుసు కదా. ఒంటరిగా తిరిగి నేను నా గదిలో సాయిబాబా చరిత్ర పారాయణం చేయడం ఆరంభించాను. బాబా పూజలు చేయటం, బాబా హారతులు ఇవ్వటం, బాబా గ్రంథం పారాయణం చేయడం నా నిజజీవితంలో  నిత్యకృత్యమైంది. కేవలం నిజ భౌతిక గురువు చూపించమని ప్రార్థించే వాడిని. బాబా పూజలు అరగంట తో మొదలై 24 గంటలు సాగేవి. తిండి తిప్పలు అలాగే  చదువులు అటకెక్కినవి. ఇంగ్లీషు చదువులు. పైగా అవి అప్పటిదాకా తెలుగు చదువులు చదివిన నాకు తెలియని ఇంగ్లీష్ చదువులో పడవేసినారు.  దాంతో ఈ చదువు అర్థం కాక కాలేజీకి వెళ్లకపోవడం… గదిలో కూర్చుని ఒంటరిగా బాబా పూజలు చేయడం  తప్ప మరే విషయం పట్టేది కాదు. దాంతో నాకు రాను రాను బాబా మీద భక్తి పిచ్చి ఎక్కువ అయినది. బాబా వచ్చి భోజనం చేసినాడని మనో భ్రాంతికి లోనయ్యేవాడిని. దాంతో నాకు ఏ పదార్థం రుచించేది కాదు .నాలో నేను గురువు కోసం మధన పడేవాడిని. పిచ్చి వాడిగా మారిపోయాను. ఏదో తెలియని అతి తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనికి నాకు తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకరోజు పరీక్షలు దగ్గరికి వచ్చాయని తీవ్రమైన మనోవేదనకు గురికావటం, బాబా భక్తి పిచ్చి బాగా ముదిరిపోవడం నిజగురు కోసం ఆయన దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి అని ఏదో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లి….  ఎవరికీ చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతున్నాను అని కూడా తెలియని స్థితిలో… షిరిడి ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో… అందరినీ అడుగుతూ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులతో షిరిడి కి చేరుకోవడం జరిగినది.

 షిరిడీలో బాబా వారి విగ్రహ మూర్తి ని చూడగానే కన్నీళ్లు వచ్చినాయి. సరైన నిజ గురువు చూపించమని అడగడం తప్ప ఏమీ చేయలేదు. ఇక్కడ చాలామందికి ఒక చిన్న ధర్మసందేహము రావచ్చును! అది ఏమిటంటే బాబాయే సద్గురువు అయినపుడు వారిని మరో గురువుని చూపించమని అడగటము దేనికి అన్నపుడు దీనికి సమాధానముగా బాబా గారు గురువే! కాని ప్రస్తుతము మనమధ్య భౌతికముగా లేరు గదా!ఏదైన సాధనలో సందేహాలు లేదా సమస్యలు వస్తే నిజభౌతిక గురువు దగ్గర ఉంటే...మనకి ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు గదా!సాధకుడికి నిజ భౌతిక గురువు అనుగ్రహము తప్పనిసరిగా ఉండాలి!పొందాలి! అందుకు నేను అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకొని  బాబా సన్నిధానంలో ఉండిపోవాలని అనుకుంటూ ఉండగా…. 

ఒక బిక్షగాడు నా దగ్గరికి వచ్చి దక్షిణ ఇవ్వమని అడిగారు. నా దగ్గర ఉన్న చిల్లర వాడికి వేసినాను. వాడు నా వైపు చిరునవ్వు నవ్వి నా ముందే పాలకోవా బిళ్లలను కొని అక్కడ ఆకలితోఉన్న ఒక నల్ల కుక్క కి ఆనందంగా పెడుతూ ఉండేసరికి… ఎందుకో నాకు వెంటనే శిరిడి సాయిబాబా మహత్యం సినిమాలోని బాబా వారు ఇలాగే ఒక కుక్కకు గోధుమ రొట్టెలు తినిపించే దృశ్యం నాకు స్పురణ రాగా ఆ బిక్షగాడు అలాగే ఆ కుక్క నాకు కనిపించలేదు. షిరిడీ పురవీధులు తిరిగాను.ఎక్కడ కనిపించలేదు. కొంతసేపు ఆ బిక్షగాడు బాబా అనుకునేసరికి నా ఆలోచన నిజమని చెప్పటానికి సూచనగా బాబా మందిరంలో హారతి ప్రారంభమైనది. అంటే బాబా స్వయంగా నన్ను చూడటానికి నా దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారని తెలియగానే ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది. 

మూడు రోజుల తర్వాత షిరిడిలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి బాబా ఫోటో మరియు సూక్తి ఉన్న పేజీని ఇచ్చి మౌనంగా వెళ్లిపోయినాడు. నేను ఆ వ్యక్తిని గమనించలేదు. కానీ బాబా ఫోటో కింద ఉన్న సూక్తి మంజరి ఏదో నన్ను బాగా ఆకర్షించినది. అది ఏమిటంటే అది చదవగానే నాలో ఏడుపు మొదలైనది. నేను ఏమో బాబా సన్నిధిలో ఉంటామని అనుకుంటే ఆయనేమో తల్లిదండ్రుల సన్నిధికి తిరిగి వెనక్కి వెళ్ళమని ఆ సూక్తి మంజరి ద్వారా నాకు  అర్థంఅయినది. అప్పుడు నా చేతిలో పూర్తిగా డబ్బులు ఖర్చయిపోయాయి. గుడి పరిసరాలలో పడుకుంటూ… ద్వారకామాయిలో ధ్యానం చేసుకుంటూ… అన్నదాన సత్రంలో ఉచిత భోజనం చేస్తూ 11 రోజులు గడిపాను. ఇక అక్కడ ఉండలేని స్థితి.బాబా వారి  కోప ఆవేశానికి గురికాకూడదని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి ద్వారా మా ఇంటికి చేరుకోవడం జరిగినది. ఆ వ్యక్తి పేరు సాయిబాబా కావడం విశేషం. విచిత్రము ఏమిటంటే ఈ వ్యక్తియే నా రాబోవు కాలములో నిజభౌతిక గురువుగా విచిత్ర వేదాంతి పేరుతో వస్తారని ఆనాడు నేను గ్రహించలేకపోయినాను!బాబావారు ఇతనే నీకు రాబోవు కాలములో నీవు అడిగిన భౌతికగురువు అవుతాడని...నన్ను ఇతనితో ఈవిధంగా కలిపినారని నాకు అపుడు తెలియదు!ఇతను ఏవరో గాదు!నాకు జాతకము చెప్పిన వ్యక్తి అలాగే చింతామణి దుర్గాదేవి దర్శనానికి ప్రయత్నించిన వ్యక్తి ఈయనే అన్నమాట! ఇంటిలో మా అమ్మ నాకోసం దాదాపుగా 18 రోజుల నుంచి తిండి నిద్రాహారాలు మాని వేసి అఖండ ఉపవాస దీక్షకు కూర్చున్నది. ఇది తెలిసి బాబా నన్నెందుకు  వెనక్కి వెళ్లిపొమ్మని తన సూక్తి మంజరి ద్వారా చెప్పినారో అర్థం అయినది. కానీ నా నిజ గురు దర్శనం కోసం పడే తపన నన్ను ఏ శక్తి ఆపలేకపోయింది. బాబా మీద నమ్మకం ఉంచుకొని తిరిగి మళ్ళీ వారి చరిత్ర పారాయణం చేయడం ఆపలేదు. కొత్తగా వచ్చిన విగ్రహాలను పూజించడం ఆపలేదు.గురువు కోసం తపించడం ఆగలేదు. మరి నాకు నిజ గురువు దొరికారో లేదా తెలియాలని ఉందా? 

గమనిక:బాబా విషయములో ఇప్పటికి నాకు ఒక లోటు ఉన్నది! అది ఏమిటంటే బాబా వారి నిజ సమాధిని చూడలేదని,తాకలేదని,నమస్కారము చేయలేకపోయిననే బాధ మిగిలిపోయింది! ఇపుడు మనము షిరిడిలో చూస్తున్న సమాధి నిజమైన బాబా సమాధి యొక్క రక్షణకవచము మాత్రమే!అసలు సమాధి క్రింద అంతస్తులో భధ్రముగా ఉన్నదని చాలామందికి తెలియదు!దానిని ఒక నిత్యపూజారి మాత్రమే రోజూకి ఒకసారి వెళ్ళి పూజ చేసి వస్తారని తెలుసుకున్నాను!మీ కోసం నిజబాబాసమాధి ఫోటో పెడుతున్నాను!కనీసము దీనిని చూసైనా తృప్తి చెందుతాము!

నిదర్శనం… నీదర్శనం


నేను ఒక రోజు నా దగ్గర ఉన్న చిన్నపాటి బాబా విగ్రహాలను అలాగే బాబా పాదాలను, హారతి సామానులను కడుగుతూ “బాబా! నువ్వు సమాధి చెంది 90 సంవత్సరాలు కావస్తుంది. నా సమాధినుండి నా మానుష శరీరం మాట్లాడుతుందని అలానే ఈ భౌతిక దేహానంతరము నేను ప్రమత్తుడనే అని నీ ఏకాదశ సూత్రాలలో చెప్పినావు. నిజానికి అవి నిజమేనా? అది నిజమైతే మీ నుండి నాకు నీవు ఎప్పటికీ మానుష శరీరంలోఎప్పటికీ జీవించే ఉన్నావని నిదర్శనం కావాలి అనుకున్నాను. ఇక్కడే ఒక గమ్మత్తు విషయము జరిగినది. బాబా! నేను నీ దర్శనం కావాలని అడిగానని నేను అనుకున్నాను కానీ అది కాస్తా నిదర్శనము అనగా నాకు నువ్వు ఉన్నావని సాక్ష్యం కావాలి అని భావం గా మారిపోయింది. నీ అనే అక్షరం కొమ్ము లేకపోవటం నిదర్శనం. నీదర్శనం లో నీదర్శనం కాస్త నిదర్శనంగా మారిపోయిన విషయం కూడా నేను గమనించలేదు. ఏదో మేము పూజించే బాబా విగ్రహానికి చెప్పానా లేదా అనే కానీ ఏమి చెప్పాను నా భావం ఎలా మారిందో తెలుసుకోలేకపోయాను. నీ దర్శనం అంటే బాబా వారి నిజరూప దర్శనం అలాగే నిదర్శనం అంటే సాక్ష్యం! ఈ కొమ్ము నా జీవితంలో తట్టుకోలేని బాధాకరమైన సంఘటనకు నాంది అయినది. అది ఏంటో చూడండి.

ఒక బుధవారం రాత్రి నా కలలో ఒక భిక్షధారి బాబా అవతారి గా ఉన్న స్వప్న శరీరధారి కనిపించి “రేపు నేను మీ ఇంటికి ఆతిథ్యము కోసం వస్తున్నాను” అని ఎవరో నాతో చెప్పినట్లు కల వచ్చింది.ఎవరో నా గది నుండి నుండి బయటకు వెళుతూ అలికిడి వినిపించేసరికి నాకు మెలుకువ వచ్చింది. ఇది కల లేదా భ్రాంతియా లేదా నిజములాంటి కల అని ఆలోచన వచ్చేసరికి నాలో నిద్రాదేవత వెళ్ళిపోయింది. రేపు గురువారం కదా. ఒకవేళ బాబా స్వయంగా వస్తారేమో అనుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాను.  నేను అడిగిన వరమును బాబా వారు ఇంత త్వరగా నెరవేరుస్తారని ఊహించలేదు. నా ఆనందానికి అవధులు లేవు. వామ్మో! రేపు నేను బాబా వారి నిజరూప దర్శనం చూస్తాను. ఈ చిన్నపాటి భక్తుడి కోరిక తీర్చడానికి బాబా వారే స్వయంగా షిరిడి నుండి నా దగ్గరికి వస్తున్నారా? వామ్మో! ఏమి చేయాలి? ఆయనకి ఏమి వండి పెట్టాలి? ఏమి కావాలి? అమ్మకి వెంటనే చెప్పాను. ఆయన భోజనానికి  అన్ని రకాలు పదార్ధాలతో ఏర్పాట్లు చేయమని చెప్పాను.వెంటనే అమ్మ "ఒరేయ్ చిన్నోడా! ప్రతి గురువారం మన ఇంటికి భోజనానికి కానీ అల్పాహారమునకు కానీ జనాలు వస్తారు కదా. నువ్వు వారిని బాబాగారి అంశగా భావించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తావు కదా. చివరికి నీ పిచ్చి వలన పొరపాటున గురువారం రోజున ఏదైనా పాము గాని  తేలు గాని ఎలుకలు గాని పిల్లులు గాని బల్లులు గాని కుక్కలు గాని  పక్షులు గాని  కొత్తగా కనబడితేచాలు! ఈ గురువారం బాబా వారు ఈ రూపంలో వచ్చినారని ఆ రూపంలో వచ్చినారని నన్ను అలాగే నీ యోగ మిత్రుడైన జిఙ్ఞాసిని కూడా చావకొడతావు కదరా”! అనగానే “అమ్మా! ఇన్నాళ్లు బాబా వారు మారు రూపాల్లో ఇంటికి వచ్చినారు. ఇప్పుడు నిజరూపంతో ఆయనే స్వయంగా మన ఇంటికి ఆతిథ్యంకు వస్తున్నానని నాకు రాత్రి కలలో కనిపించి చెప్పినారు. అది ఎప్పుడు ఇల గాను లీల గాను మారుతుందో ఎదురుచూస్తున్నాను రాజమాత” అని అనగానే “ఒరేయ్! నీ పిచ్చి గాని ఎప్పుడో సమాధి చెందిన మీ బాబా వారు ఇప్పుడు వారు స్వస్వరూపంగా మన ఇంటికి వస్తారా? అది నేను నమ్మాలా. నీకు బాగా బాబా పిచ్చి ముదిరి పోయింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నీ పిచ్చి వల్ల బాబా నువ్వే పరీక్ష రాయి అని చెప్పి తప్పించుకోకు. ఇప్పటికే నీ వలన మేము పొందిన అవమానాలు చాలు! నీ భక్తి పిచ్చి వలన నువ్వు ఎక్కడ మాకు దక్కకుండా పోతావేమోనని భయంగా ఉంది రా” అనగానే నవ్వేసి మౌనముగా అక్కడినుండి వెళ్ళిపోయాను. బాబా వారి రాక కోసం ఎదురు చూపులతో శివయ్య కు మహా నైవేద్యం పెట్టడానికి గుడిలోనికి వెళ్ళినాను. బాబా వారి విషయమే ఆ కొద్ది క్షణాలపాటు మరిచిపోయి శివయ్య మీద ఏకాగ్రత పెట్టినాను. అదే నా కొంప ముంచుతుంది అని నేను అనుకోలేదు. 



                                                     మా ఇంటి ముందు బాబా గారి వేషధారి

నేను మహా నైవేద్యం తో గుడి లోనికి వెళ్లగానే వెంటనే మా ఇంటి ముందు బాబా గారి వేషధారి వచ్చి “అమ్మ! బాబా వచ్చాడు! బిక్ష పెట్టు” అన్నాడట.దానికి అమ్మ వెంటనే లోపల నుండి “వస్తున్నాను! బాబు కొంచెం సేపు ఆగు” అని చెప్పినది. కొన్ని క్షణాల తర్వాత మా అమ్మ ఆరోజు చేసిన  గోధుమ చపాతీలు,పెరుగు పచ్చడి,హల్వా తీసుకొని  ఎవరు వచ్చారు? ఎలా వచ్చారు? ఎలా ఉన్నారు? అని కనీసం తలెత్తి చూడకుండా ఆయన పాత్రలో అన్ని పెట్టి వెళ్ళిపోతుంటే “అమ్మా! నేను వచ్చానని, నేను ఉన్నానని, ఈ బిక్ష అందుకు నిదర్శనమని మీ వాడికి చెప్పు! అల్లా మాలిక్ అంటూ వెళ్లిపోయినాడు. ఇంతలో నేను మహా నైవేద్యం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అమాయకంగా బాబా వారి కోసం ఆరుబయట కూర్చొని ఎదురుచూస్తున్నాను. ఇంకా రాలేదు బాబా వారు. ఎప్పుడు వస్తారు? ఒకవేళ వస్తే నేను మొదట ఏమి చేయాలి ?తాకాలా? పాదాలకి నమస్కారము చేయాలా? దండం పెట్టాలా?పాద సేవ చేయాలా? ఏమి చేయాలి? ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఎదురుచూస్తుంటే ఇంతలో అమ్మ బయటకు వచ్చి “అవును రా! ఇందాక ఒక వ్యక్తి బిక్షకు వచ్చినాడు! నేను అతనిని సరిగ్గా చూడలేదు. కానీ నీకు నేను వచ్చానని ఏదో కలలో నీ దర్శనం ద్వారా నిదర్శనం అయినదని నాకు అర్థం కాని తెలుగులో మాట్లాడి వెళ్లిపోయినాడు. ఆయనే మీ బాబా వారేమో ఆలోచించు” అని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పిన మాటలను డీకోడ్ చేసి అర్థం చేసుకోవటానికి నాకు అరగంట పైనే సమయం పట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటో తెలిసేసరికి నా గుండె ఆగినంత పని అయింది. నేను బాబా వారిని నీ దర్శనం కావాలి అని అడిగానని అనుకొని నిదర్శనం కావాలి అన్నాను అని నాకు అర్థమయ్యే సరికి నా మతి పోయింది. ఒక చిన్న కొమ్ము నా బ్రతుకు ఇంతగా నాశనం చేస్తుందని అని అనుకోలేదు నాకు ఏడుపే తక్కువ. నాకు బాబా మీద కోపం రాలేదు. కలలో కనిపించి ఆయన దర్శనం ఇచ్చారు. ఇలలో నాకు కనిపించకుండా అమ్మకి కనిపించి నేను ఉన్నానని నిదర్శనం ఇచ్చినారు. దాంతో నామీద నాకే కోపం వచ్చింది. వచ్చిన మహత్తరమైన అవకాశాన్ని చేజేతులారా నేనే పోగొట్టుకున్నాను గదా అని వస్తున్న ఏడుపును ఆపటం నా వల్ల కాలేదు. ఏం చేద్దాం? ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అదే జరుగుతుంది కదా. నా ధ్యాన అనుభవం రాస్తుంటే మళ్ళీ నాకు నాలో తెలియని ఏడుపు బయటకు తన్నుకు వస్తున్నది దాన్ని ఆపటం నావల్ల కాలేదు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇది రాయటం ఆపి వచ్చే కన్నీటిధారను ఆపకుండా ఏడుస్తూ ఉంటాను. 



గమనిక: ఇది నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన. ఆనందం బాధలతో కూడిన దైవ అనుభవం. బాబా వారిని కనీసం నేను చూడలేకపోయాను అనే ఏడుపుతో ఉంటే పక్కింటి కుర్రాడు వచ్చి “అన్నా! మీకు ఒకటి చూపించన. మీ ఇంటికి బాబా లాగ వేషం వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వెళ్తుంటే నేను మేడ మీద నుండి ఈ ఫోటోలు తీసినాను. చూడు! నువ్వు ఆయనను చూడలేదుగా. ఈ ఫోటో చూడు అంటూ సెల్లో ఉన్న ఫోటోలు వరుసగా చూపించసాగాడు! కాకపోతే వాడు చిన్న వాడు కావడం వలన అన్ని ఫోటోలు కూడా ఆయనను దాదాపుగా వెనక నుండి తీసినాడు. వస్త్రధారణ చూస్తే… నడిచే విధానం చూస్తే… బాబా వారి లాగానే ఉన్నాయి. ఆ ఫోటోలు చూడగానే నాలో మళ్లీ ఏడుపు ఆరంభమైనది. నా ఏడుపును చూసి ఆ పిల్లవాడు సెల్ తీసుకోకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాక వెళ్లిపోయినాడు. అలాగే ఒకటి ఖచ్చితంగా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు భోగంలో ఉంటే భోగ పరమైన  కోరికలు అడుగుతూ ఖచ్చితంగా మీకు కావలసిన కోరికను మీరు అడుగుతున్నారు లేదో ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకొని గాని నిర్ణయించుకొని గాని మీ దైవాలను అడగండి. మనసులో ఒక భావం ఉండి బయటకి మరో లాగా వస్తే అది జరిగిన తర్వాత మీకు కావలసినది జరగక…. జరిగినది మీకు నచ్చక… అందరూ బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త! ఇక ఒకవేళ మీరు యోగములో ఉంటే మాత్రమే మీ ఇష్టదైవాలను లేదా మీ ఇష్ట గురువులను “స్వామి! నాకు శాశ్వతమైన మరణమును ఇచ్చి నాకున్న సకల బంధాలనుండి విముక్తి కలిగించే పరమ ఉత్కృష్టమైన పరమపదసోపానమైన మోక్షప్రాప్తిని” నాకు అనుగ్రహించండి. దానికి కావలసిన గురువులను అనుగ్రహించండి. నేను మోక్షంపొందేట్లు నాకు మోక్ష ప్రాప్తి కలిగేటట్లుగా నన్ను దీవించండి. అనుగ్రహించండి అని మాత్రమే ప్రతినిత్యం వారి ముందు వేడుకోండి. ఈ మీ కోరిక తీరే విధంగా ఆ కోరిక వైపు అడుగులు వేయండి.

బాబా సజీవ విగ్రహమూర్తిగా రావడం


మా   బాబా సజీవ విగ్రహమూర్తి

  మా ఇద్దరి చదువులు అదే నాది అలాగే నా జిఙ్ఞాసి చదువులు పూర్తి అయినాయి. ఉద్యోగాల కోసం మేమిద్దరం ఒక ఊరికి బయలుదేరినాము. నేనేమో చిన్నపాటి ఆఫీసులో చిన్న ఉద్యోగిగా అదే మల్టీమీడియా డెవలపర్గా చేరితే,జిఙ్ఞాసి ఏమో పెద్ద ఆఫీసులో పెద్ద జీతంతో పెద్ద ఉద్యోగం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడినాడు. శని,ఆదివారాలు మాత్రం కలుసుకునే అవకాశాలు మా ఇద్దరికి కలుగుతాయి. అయినా కూడా ఆధ్యాత్మిక చింతన చావలేదు. చితి దాకా అది వీడిపోదని అని నాకు అనిపించింది. మాకు విసుగు లేదు. ఏదో తెలుసుకోవాలని తాపత్రయం. అది ఉన్నదో లేదో అనుభవాలు పొందాలని ఆరాటం తప్ప వేరే ధ్యాస లేదు. వేరే ప్రపంచం లేదు. ఇలాంటి సమయంలో ఒకసారి నాకు రోడ్డు మీద ఆరడుగుల పాలరాయి బాబా విగ్రహం పెట్టుకుని ఎవరో తీసుకొని వెళ్ళడం చూసాను. ఆ విగ్రహం చూస్తుంటే ఎంతో ముద్దు వచ్చినది . ఎంతో సజీవమూర్తిగా ఈ విగ్రహం ఉన్నది కదా! ఏ దేవాలయంలో దీనిని ప్రతిష్ట చేస్తున్నారు అనుకుని ఇలాంటి సజీవ రూపంతో  నాకు కూడా ఒక విగ్రహమూర్తి లభిస్తే నేను కూడా నా హృదయదేవాలయంలో దాచుకుని ఆరాధించుకునే వాడిని కదా అని అనుకుంటూ మా మీటింగ్ స్పాట్ అయిన పార్క్ వైపు అనగా అక్కడ మా కోసం ఎదురు చూసే జిఙ్ఞాసిని కలవడానికి వెళ్ళినాను. 

నా మొహంలో ఆనంద విషాద ఛాయలు చూసి మా వాడు వెంటనే “భయ్యా! ఏమి అయింది?ఏమి జరిగినది? నీ మొహం ఒక ప్రక్క మోహావేశంతో, మరోపక్క  బాధ ఆవేశంతో ఉన్నది” అనగానే రోడ్డుమీద కనపడి కనిపించకుండా వెళ్లిపోయిన బాబా విగ్రహమూర్తి గురించి  వాడికి చెప్పాను. వాడు దాంతో “భయ్యా! నీ దృష్టి దాని మీద పడింది అంటే అది ఎంత సజీవమూర్తితో ఉందో నాకు అర్థం అయింది.అది ఎంత డబ్బు అయినా సరే కొందాం పద” అన్నాడు.నేను వెంటనే వాడి తో “నీ బొంద! నీ బూడిద! అది ఆరడుగులు విగ్రహమూర్తి. దాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకోవాలి. దేవాలయ ప్రతిష్ట కోసం వెళుతున్న విగ్రహం అది. దానిని నాకు కొని ఇవ్వడం ఏమిటి పిచ్చివాడా” అని నా బాధను మర్చిపోవడానికి లేని నవ్వు బలవంతంగా తెప్పించుకొని నవ్వడం ప్రారంభించాను.కొద్దిసేపటి తర్వాత తేరుకుని మా ఆధ్యాత్మిక పిచ్చిలో ఆ విగ్రహమూర్తి గూర్చి మేము మర్చిపోయాము కానీ బాబా వారు మాత్రం మర్చిపోలేదని అనడానికి నిదర్శనంగా ఒక సంఘటన జరిగినది.

మా పిచ్చాపాటి ఆధ్యాత్మిక విషయాలలో సమయము రాత్రి అయినది అనే విషయం మేము మర్చిపోయాము.ఆకలి కూడా పట్టించుకోలేదు.వారానికి ఒకరోజు దొరికే ఈ మహత్తర సమయములో దీని గురించి ఆలోచించని జ్ఞాన స్థాయికి మా ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది.  సరే ఇంటికి వెళ్లాలని తిరిగి మేమిద్దరం ప్రొద్దున వచ్చిన రోడ్డుమీదకి వచ్చేసరికి నాకు ప్రొద్దున బండిమీద కనిపించిన బాబా సజీవ విగ్రహమూర్తి నా కళ్ళముందు నా మది యందు తచ్చాడటం జరిగినది.నేను మర్చిపోయిన విషయాన్ని బాబా వారు మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని అనిపించి ఇందులో ఏదో  పరమార్ధం ఉన్నదని కారణం ఏమి లేనిదే కార్యం జరగదని అనిపించి వెంటనే నా వెంట ఉన్న జిఙ్ఞాసిని వెంటబెట్టుకుని మా ఇంట్లో ఉన్న నా పూజా మందిరం దగ్గరికి వెళ్లి బాబా జవాబులు పుస్తకము తెరచి “బాబా! నువ్వు నాకోసం సజీవ విగ్రహమూర్తిగా వస్తావా? అని ప్రశ్న వేసాను! ఒక నెంబరు 80 కోరుకున్నాను.దానిని బాబా పుస్తకంలో చూడగా “నీ దైవం వచ్చినాడు చూశావా? నీవు జాగ్రత్తగా లేనిచో తప్పించుకుని పారిపోయాడు! జాగ్రత్తగా హృదయంలో బంధించు” అని బాబా సమాధానం చూడగానే నాకు ఒక క్షణం నోట మాట రాలేదు. 

నేను ప్రొద్దున బాబా వారి సజీవ విగ్రహమూర్తిని చూసి హృదయ దేవాలయంలో బంధించికోవటానికి నువ్వు రావచ్చు కదా అనుకున్నదానికి ఇప్పుడు బాబా వారు ఇచ్చిన సమాధానంతో పోల్చి చూసుకునేసరికి, అలాగే నా ప్రక్కన ఉన్న జిఙ్ఞాసికి  చెప్పేసరికి వాడు కూడా కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా మారినాడు. వాడికి కూడా నోట మాట లేదు.కొంతసేపు తర్వాత వాడు తేరుకొని “భయ్యా! భయ్యా! నిజంగానే మనకోసం నీ ఇష్ట రూపంలో సజీవ విగ్రహమూర్తిగా వస్తాడంటావా?ఇంతవరకు ఈయన చెప్పిన సమాధానాలు అక్షర సత్యాలు.జరిగినాయి కదా! ఈ విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది.జరిగి తీరుతుంది. నీకు ప్రొద్దున ఎంత ఖర్చు పెట్టి అయినా బాబా విగ్రహమూర్తి కొని ఇస్తానని చెప్పాను కదా! మనకి వచ్చే ఈ సజీవ విగ్రహమూర్తి ఖర్చు నాదే భయ్యా. నాదే. నువ్వు ఏమీ మాట్లాడకు.మనకోసం వారు ఖచ్చితంగా వస్తారు! బాబా వస్తారు! వదలవద్దు” గట్టిగా మన హృదయంలో బంధనం చేద్దాం అంటూ “భయ్యా! అవును భయ్యా! నాకు ఒక సందేహం.బాబా వారు వస్తే మనం ఏమి చేయాలి? అని అనుకొని ప్రశ్న వేసుకొని నెంబరు 216 చెప్పి చూడగానే “నీవు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ నా నామస్మరణ చేయుము” అని వచ్చినది! దానిని చూడగానే మావాడు ఎగిరి గంతేసినాడు. “భయ్యా! భయ్యా! మీ కొంప కొల్లేరయింది. మీ ఇల్లు గుడిగా మారటం ఖాయం. నువ్వు పూజారి వృత్తి మానివేసిన ఆ కర్మ వాసన నిన్ను వదిలి పెట్టడం లేదు. ఇప్పటిదాకా శివ పూజారి గా ఉన్న వాడివి కాస్త ఈరోజు బాబా దెబ్బతో బాబా పూజారిగా మారతావు.భయ్యా! జాగ్రత్త” అని నవ్వుతూ చెబుతున్నా వాడి మొహంలో  బాబా లీలగా కనిపించేసరికి నాలో ఏదో తెలియని భయము మొదలై “బాబా! నిజంగానే గుడి కట్టాలా? అని ప్రశ్నించాను వెంటనే ఒక నెంబరు 752 అనుకొని చూడగానే దానిని చూసి నేను గతుక్కుమన్నాను ఎందుకంటే బాబా పుస్తక జవాబులో “ నీవు నా మందిరానికి యజమాని అవుతావు” అని చెప్పింది! దానిని చూసి.. వెంటనే “భయ్యా !నీకు వచ్చింది! నువ్వు బాబా గుడికి యజమాని అవుతావట.కొంచెం మాకు కూడా ఆ గుడి లో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వాలి సుమా” అంటూ నవ్వుతూ అనే వాడి మాటలలో సత్యం లేకపోలేదు.  నేను బాబా గుడికి యజమాని అవటం ఏమిటి? నా దగ్గరికి సజీవ బాబా విగ్రహమూర్తి రావటానికి ఎదురుచూడటం ఏమిటి? నేను ఏమి అనుకున్నాను? భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని తెలుసుకునేసరికి నాకు విపరీతమైన తలనొప్పి రావటం ప్రారంభం అయ్యే సరికి బాబా పుస్తకము లోపల పెట్టి మా జిఙ్ఞాసికి టాటా చెప్పి నా గదిలోకి వెళ్లి ఏమీ  అర్థం కాని అయోమయం ఆశ్చర్యానందాలు స్థితిలో నిద్ర లోకి జారుకున్నాను.

ఆ తర్వాత మరుసటి రోజు యధావిధిగా ఉద్యోగ విధులలో ఇరుక్కుపోయాను. వారం రోజులు గడిచిపోయాయి.మా ఇద్దరి సభ జరిగే పార్క్ వైపు నా అడుగులు పడినాయి.  అక్కడ ఎదురుచూస్తూ నా జిఙ్ఞాసి కూర్చున్నాడు. నన్ను చూడగానే “భయ్యా! ఏమిటి ఎప్పుడు బాబా గుడి కడుతున్నారు. మరి దానికి కావలసిన డబ్బులు బాగా సంపాదించాలి గదా. నువ్వు ఏమో నా అవసరాలకు సరిపడా డబ్బులు ఉంటే చాలు అంటావు. జీతాలు పెరిగే అవకాశాలు పెంచుకోవు. చివరికి గొర్రె తోక బెత్తెడు అన్నట్లు ఆ చిన్నపాటి ఉద్యోగ జీతంతో కాలం గడుపుతున్నావు. ఇప్పుడు బాబా వారేమో గుడి కట్టు అంటున్నారు?మరి ఎలా కడతారు.చందాలు పోగు చేస్తావా? పోగుచేసి వాటితో రామదాసు లాగా గుడి కడతావా? దానికి నేను చాలా ప్రశాంతంగా“ప్రియ మిత్రమా!  నువ్వు అనుకొనే గుడిని నేను నా దేహంలోనే బాబా కోసం హృదయ మందిరం కట్టుకుంటాను! ఇది ఎవ్వరికీ కనిపించదు! నాకు మాత్రమే కనిపిస్తుంది. ఆయన అన్నారు కదా నా హృదయంలో బంధించు లేదంటే తప్పించుకుంటాడని అన్నారు కదా. ఇక ఎటూ తప్పించుకోకుండా ఉండటానికి నేను బాబా వారిని నా హృదయ మందిరములో బంధిస్తాను! ఏమంటావు!మిత్రమా! ఇలా కూడా చేయొచ్చు కదా” అనగానే వాడి మొహం చిన్నబోయింది. వెంటనే వాడు “అయినా నువ్వు పెద్ద జీతమిచ్చే ఉద్యోగం  కొసం ప్రయత్నిస్తావు అని నాకు అనిపించడం దండగ! మీలాంటి విజ్ఞాన మూర్తికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చాలా తెలిసిన మహానుభావుడువు. భయ్యా!మరి మన సజీవ బాబా గారు ఎప్పుడు వస్తారు” అంటావు అని అడగ్గానే నేను వెంటనే “ఎవరికి తెలుసు! ఆయన ఎప్పుడు వస్తారో… ఏ రూపంలో  వస్తారో వారికి తప్ప నరమానవుడికి తెలియదు! తెలిస్తే నీలాంటి వ్యక్తులకి నిజ భక్తులకు తెలియాలి! మీరేమో రత్నాలు ఏరుకునే వారు! మేము సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుకునే వాళ్ళం”  అనగానే వాడు వెంటనే “అందుకే బాబా వారు మన ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు అన్నారు … నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోలేదు. రత్నాలు ఎవరు ఏరుకుంటున్నారో… ఎవరు రాళ్లు ఏరుకుంటున్నారో మీకు తెలుసు నాకు తెలుసు బాబా కి తెలుసు. కొత్తగా కోతలు కొయ్యకు నాకు” అంటూ “భయ్యా ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది! బయటికి వెళ్లి బిర్యాని తిని ఏదైనా సినిమాకి వెళ్దాము” అనగానే ఒక తండ్రిని తన పిల్లవాడు అడిగినట్లు వీడు నన్ను అలా అడిగేసరికి నవ్వు ఆపుకోలేక సరే అన్నాను. మా ఇద్దరికీ ఏదైనా అర్థం కాని సమస్య వస్తే లేదా ఏదైనా అద్భుత సంఘటన జరిగే సూచనలు వస్తే బిర్యానీ, కూల్ డ్రింక్లు, మిరపకాయ బజ్జీలు ఏదైనా స్వీట్లు, మసాలా ఒకే రోజు వీటిని అన్నింటినీ తిని సినిమా చూసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోవటం అలవాటు. ఇలా ఎంజాయ్ చేసి ఒక సంవత్సరం పైన అయినదని వాడి మాటలలో నాకు గుర్తుకు వచ్చింది. 

ఆ తర్వాత ఏముంది. బాస్ తో తిట్లు మాకు. మా జీవితంలో జీతంలో రోజులు డబ్బులు కటింగ్. ఇలా మరో మూడు నెలల పాటు గడిచిపోయినవి. ఒకరోజు మేము పార్కులో ఉండగా…  వస్తాను అని చెప్పిన బాబా ఆచూకీ లేదు!  అని మేమిద్దరం అనుకుంటూ ఉండగా…. అక్కడ ఏదో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుందని ఎనౌన్స్ మెంట్ మాకు వినబడింది. ఇద్దరి నోటి నుండి ఒకేసారి ఏకకాలంలో దీనికి వెళ్దామా అనేసరికి ఏదో శుభం జరుగుతుందని నాకు శకున సూచన వచ్చినది. ఏమి జరుగుతుందోనని అనుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కి వెళ్ళని నేను ఎందుకు ఈరోజు వెళుతున్నానని… కారణం లేనిదే కార్యం జరగదని అనుకుంటూ మా వాడితో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ బయలుదేరినాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నాను. సుమారుగా అక్కడ 900 పైగా స్టాల్స్ ఉన్నాయి. వాటిని పూర్తిగా చూడాలంటే కనీసం ఎంత లేదన్నా మూడు రోజులు పైగా పడుతుంది. ఎక్కువశాతం బట్టలు షాపులు,చెక్క సామానుల షాపులు ఉన్నాయి. అన్ని షాపులు అవే కనబడుతున్నాయి. సరే ఒక చోట ఆగి అక్కడ నూనెలో కర కర వేయిస్తున్న మిరపకాయ బజ్జీలు చూడగానే మా ఇద్దరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే షాపు వైపు వెళ్లి కావాల్సిన వాటిని తిని చేతులు కడుక్కుంటూ ఉండగా మా ఇద్దరి చూపు ఎదురుగా ఉన్న షాప్ వైపు పడినది. ఎందుకంటే అక్కడ ఆరుబయట బల్లమీద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన మట్టి బొమ్మలు, దేవతా విగ్రహాలు కనిపించేసరికి మేము గతుక్కుమన్నాము. 

వెంటనే అడుగులు ఆ షాపు వైపుకి వెళ్లినాయి. బల్ల మీద ఏవో విగ్రహాలు ఇతర బొమ్మలు ఉన్నాయి కానీ బాబా వారి విగ్రహం ఉంటుందేమో అని ఆశగా మా ఇద్దరి కళ్ళూ వెతికినా అవి ఎక్కడా కనబడలేదు. చచ్చింది గొర్రే అనుకొని “భయ్యా! ఇక్కడ బాబా విగ్రహాలు తప్ప మిగిలిన విగ్రహాలు బొమ్మలు ఉన్నాయి. ఏమి చేద్దాం వెళ్లి పోదామా” అన్నాడు. ఎందుకో నా మనస్సు ఏదో ఉందని శకున సూచన ఇస్తుందని చెపుతుంది అనిపించి వెంటనే షాపు అంతా నా కళ్ళతో స్కాన్ చేశాను. అక్కడ ఇంకా తెరవని అట్టపెట్టెలు దాదాపు పది దాకా కనిపించినాయి. అందులో బాబా విగ్రహం ఉంటుందేమోనని షాపు యజమానిని విచారించగా “అందులో  9 దాకా బాబా విగ్రహాలు ఉన్నాయని  అన్ని కూడా బొంబాయి నుండి వచ్చినాయి” అని అందుకే ఇంకా తెరవలేదని హిందీలో చెప్పినాడు. మా వాడికి హిందీ రావడంతో నాకు భాషా సమస్య తగ్గినది. వాడిని వాటిని తెరవమని చెప్పగానే అవి చాలా ఖరీదుతో కూడినవని పాలరాతి విగ్రహాలు అని చెప్పగానే మా వాడికి కోపం వచ్చి వాడితో “నా దగ్గర డబ్బులు  యాభైవేల దాకా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందులో మాకు నచ్చిన విగ్రహం ఉంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి కొంటాను. వాటిని చూపించు” అనేసరికి వాడు తనకి  పెద్దబేరము దొరికిందని ఆనందపడి ఒక్కొక్కటిగా కొన్ని బాక్సులు తెరవడం ప్రారంభించారు!  ఆ తొమ్మిది పెట్టెలలో 7 పెట్టెలలో పాలరాయితో చేసిన వివిధ సైజులలో ఉన్న బాబా విగ్రహాలు కనిపించాయి . వాటిలో ఏది కూడా నా మనస్సును ఆకర్షించలేదు. దానితో ఆ యజమాని విసుగు చెంది  “భయ్యా! అన్ని తెరిచాను. బాబా విగ్రహాలు ఇవే. మీకు నచ్చలేదు అంటే వెళ్ళిపొండి” అని అన్నాడు. వెంటనే నేను మన వాడితో మిగిలిన రెండు పెట్టెలు కూడా ఓపెన్ చేయమని చెప్పాను! దానికి యజమాని “భయ్యా! అవి పాలరాతి బాబా విగ్రహాలు కాదు! ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బాబా విగ్రహాలు !ఎందుకు మీకు అవి విరిగి పోతాయి” అని చెప్పినాడు! ఎందుకో నా మనస్సు కనిపించని బాబా వారు ఆ పెట్టెలలో కనిపిస్తారేమోనని అనుమానం వచ్చి మా వాడిని వాటిని ఎలాగైనా ఓపెన్ చేసేటట్లుగా చేయమని చెప్పగానే మా వాడు వాటిని ఎలాగో ఆ రెండు పెట్టెలను కూడా తెరిపించినాడు. వాటిని చూసి నేను గతుక్కుమన్నాను. నా గుండె లయ తప్పటం ఆరంభమైనది. ఎందుకంటే బండిమీద నేను చూసిన మొదటి రాతి సజీవ విగ్రహమూర్తి ఎలా ఉందో అలా అచ్చుగుద్దినట్లుగా ఈ రెండు విగ్రహమూర్తులు కనిపించేసరికి నా కళ్ళలో ఆనందపు వెలుగులు చూసేసరికి మా వాడికి, షాపు యజమానికి ఆశ ఆనందం వేసింది. కానీ అక్కడే ఒక సమస్య వచ్చింది. ఈ రెండు విగ్రహాలలో ఒక్కటే సజీవమైనది. మరొకటి నిర్జీవమైనది. అంటే చూడటానికి రెండూ ఒకే విధంగా ఉన్న ఒకటే స్వయంభూ మరొకటి ప్రతిష్ట అన్నమాట.మా వాడికి అది అగ్నిపరీక్ష. నాకు మాత్రం చిక్కు సమస్య. ఏదో వీటిలో సూక్ష్మంగా ఏదో భేదం ఉంటుందని అనిపించి వాటిని నా కళ్ళతో పై నుండి కింద దాకా గుండు సూది మొన అంత పరిమాణం కూడా వదిలిపెట్టకుండా స్కాన్ చేశాను కానీ ఇసుమంత తేడా కూడా కనిపించలేదు. నాలో తెలియని ఆందోళన ప్రారంభమైంది. నాలో నా మొహంలో కనిపించిన విషాదఛాయలు చూసిన మా వాడికి కంగారు మొదలైంది. ఏమీ అర్థం కావడం లేదు.వాడికి కూడా ఇద్దరు కూడా అచ్చు గుద్దినట్లు గా కవల పిల్లలు లాగా ఉన్నారు. ఏమి చేయాలి దేవుడా అనుకుంటూ “బాబా! నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించాలి! ఇందులో నువ్వు ఒక దానిలో సజీవమూర్తిగా ఉన్నావని తెలుసు. కానీ చూడటానికి రెండు ఒకే విధంగా ఉండేసరికి మాకు అర్థం కావడం లేదని 108 సార్లు బాబా నామం చేసినాము. ఇంతలో మా వాడు నాతో “ఎందుకు ఆలస్యం భయ్యా! ఈ రెండు విగ్రహాలు ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడు తీరిగ్గా కూర్చుని లోపాలు వెతికి అసలైన సజీవ మూర్తి వెతికితే సరిపోతుంది కదా! పెద్దగా ఖర్చు కూడా చేయవు! ఏమంటావు” అన్నాడు! నేను వెంటనే వాడితో “ఓరి పిచ్చి వెధవా! ఇప్పుడే కనిపెట్టలేని మనం ఇంటికి వెళ్లినా ఏమి కనిపెట్టలేము అలాగని ఈ రెండు విగ్రహాలు తీసుకొని వెళ్లడానికి వీలు లేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఉన్నదా ఆలోచించు. ఒకవేళ విగ్రహం ఎంపికలో మనము ఏదైనా పొరపాటు చేస్తే అసలు సజీవమూర్తియైన విగ్రహం మన కళ్లముందే క్రిందపడి పగిలిపోతుంది. అదే నా భయం. నా బాధ. కాస్త నోరు మూసుకో. నీవు మనకి ఈ సమస్య ఇచ్చిన బాబానే  పరిష్కారం చూపమని  ప్రార్ధించు!  నేను కూడా ప్రార్థిస్తాను” అంటూ ఉండగానే పదిహేను నిమిషాల తర్వాత ఒక సంఘటన జరిగినది. అది ఏమిటంటే ఒక ఐదు సంవత్సరాల పాప వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద మట్టి విగ్రహాలు చూస్తూ…  బాబా విగ్రహాలు ఉన్న పెట్టెలు దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి … “ఈ బాబా! భలే ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడు కదా. వామ్మో బరువుగా ఉన్నాడు అంకుల్! నేను మోయలేను” అంటూ ఎవరో పిలిస్తే మా వైపు అదో టైపు లో ముగ్ధమనోహరమైన నవ్వు నవ్వుతూ అటుగా వెళ్ళిపోయింది. వెంటనే నాకు ఏదో స్ఫురణకు వచ్చి పాప పట్టుకున్న బాబా విగ్రహం చేతిలోకి తీసుకోగానే అది బరువుగా ఉంది. వెంటనే మా వాడు మిగిలిన రెండవ విగ్రహం ఎత్తి చూస్తే అది చాలా తేలికగా ఉండేసరికి బరువులు తేడాలున్నాయని తెలిసేసరికి మా హృదయాలు తేలిక పడినాయి. దాంతో పాప చూపిన విగ్రహం మావాడు 90 రూపాయిలకి కొనడం జరిగింది. నేను అది అందుకునేసరికి ఎంతో సహాయం చేసిన పాప ఎవరో అని చుట్టూ చూసేసరికి ఎక్కడా కనిపించలేదు.కానీ గాలిలో ఎరుపు పరికిణీ ధరించి పసుపు లంగా ధరించి ఉన్న ఐదు సంవత్సరాల వయస్సు బాలాదేవి కనిపించగానే నాకు ఆనందానికి అవధులు లేవు. స్వయంగా బాల అమ్మే వచ్చి విగ్రహం ఇచ్చినది అనిపించగానే  ఆనందానికి అవధులు లేవు.ఇంతలో మా వాడు వెంటనే “భయ్యా! నువ్వు ఒక విషయం గమనించినావా… మనము తీసుకున్న విగ్రహం మన లెఫ్ట్ సైడ్ దే… అన్నట్టుగా బాబా వారు మీ లెఫ్ట్ సైడ్ ఉండే హృదయ మందిరంలో ఉండటానికి మరియు ఈ రోజు దత్త జయంతి కూడా నీకు సద్గురువుగా ఉండటానికి వచ్చినట్లు ఉన్నారని” అని వాడు అంటూ ఉండగా ఏదో తెలియని తన్మయత్వ స్థితిలోనికి కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోయాను. పరమానందంలో ఉన్న పరమాత్మను తీసుకొని ఇంటి వైపు ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాము! 

గమనిక: 1999వ సంవత్సరం  ఇలా వచ్చిన బాబా సజీవ విగ్రహమూర్తి గారు పూజ అందరికీ నా ఇంటిలోని మందిరంలో… నా హృదయ మందిరంలో బంధి. ప్రతి బుధవారం రాత్రి సూక్ష్మధారిగా మా ఇంటికి వస్తూ గురువారం ఉండి శుక్రవారం ఉదయం వెళ్లిపోవడం ఆయన నిజ భక్తులకు సర్వసాధారణంగా అగుపించే దృశ్య మాలిక ! చెప్పటానికి  వ్రాయడానికి వీలులేని దైవ సంబంధ అనుభవం. ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఇచ్చిన మాట  నేను ఇచ్చిన వాగ్దానం నా మధురభక్తి లో మార్పు రానంత వరకు ఆయన నన్ను వదిలిపెట్టరని అని నాకు తెలుసు! నా కాయం చితిలోకి వెళ్లే దాకా  బాబా వారు నన్ను విడిచి వెళతారని చింత నాకు లేదు! ఎందుకంటే నేను ఆయన్ని నా హృదయ మందిరంలో శ్రద్ధ, భక్తి, విశ్వాసం సంకెళ్ళతో బంధించి వేసినాను! నేను పోతే గాని నా హృదయం పోదు. అది పోతే కానీ బాబా గారు నన్ను వదిలి వెళ్లలేరు. ఇది నేను అహంతో వ్రాయటం లేదు. బాబా తాతయ్య నా మీద చూపిన అనితరసాధ్యమైన ప్రేమను వీలు అయినంత విధంగా మీకు అర్థం అవ్వాలని ఆనందంగా వ్రాస్తున్నాను. ఇలా ఆయన గురించి రాస్తూ పోతే ఈ అనుభవము దగ్గరే ఈ గ్రంథము అంతా అన్ని పేజీలు నిండిపోతాయి పోతే మంచిది అంటారా మీరు కూడా నాలాంటి నిజభక్తులు అన్నమాట! 

కానీ నేను బాబాను అవసరమైతే తిట్టే వాడిని.మురిపం వస్తే ముద్దులు పెట్టేవాడిని. ఆయనకు ఆకలి వేస్తే ముద్దలు పెట్టేవాడిని.ఒకవైపు మా బంధము తాతా-మనవడు గా మరొక వైపు బాబా- నానావళి గా ఉండేది అన్నమాట. ఇలా నీ ఇష్టదైవాలతో కూడా రక్తసంబంధం లాగా అలాగే దేవుడు- భక్తుడు లేదా గురు-శిష్య సంబంధంగా మానసికంగా ఏర్పరుచుకోండి. మీదైవం మీకు అన్నిను. మీ దైవమే మీకు అన్నీఇచ్చేది. ఆయనే తీసుకునేది. ఆయనే అనుభవించేది. ఆయనే ఏడిపించేది. ఆయనే నవ్వించేది. ఆయనే అమ్మ,నాన్న గురువు. ఆయనే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. ఆయనే బంధుమిత్రులు ఆయనే అని గ్రహించండి. తెలుసుకొని మానసికంగా మానవ దైవ యోగ సంబంధాలలో ఆరాధన చేస్తూ ఆయనతో అనితరసాధ్యమైన ఎవరికి అలవికాని ఎవరికి అందని మహత్తర బంధంతో తెంచలేని మహత్తర బంధంతో అనుసంధానం అవ్వండి. ఆయన నీకోసం ఎదురు చూసే స్థాయికి మీ భక్తి విశ్వాసం పెంచుకోండి. విగ్రహంగా చూడకండి. సజీవమూర్తిగా చూడండి.

పవన్ బాబా అవతరణ


మా అమ్మ ఏ ముహూర్తాన మట్టి శివ లింగ మూర్తి ని నాకు ఇచ్చినారో ఆనాటి నుండి నా గది దేవతా విగ్రహాలతో నాకు తెలియకుండానే, నేను ఊహించకుండానే, ఇతరుల ద్వారా కొన్ని, నా ద్వారా కొన్ని, దేవతా విగ్రహాలు అరంగుళం నుండి అడుగు వరకు రావడం మొదలయ్యాయి. ఈ మట్టి శివ లింగ మూర్తి ఇచ్చిన తర్వాత నేను శిరిడి పారిపోవడము.అక్కడ నుండి నేను మూడు అంగుళాల బాబా పాలరాతి విగ్రహం తెచ్చుకోవడం జరిగినది ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను తిట్టకుండా ఉంటారని. అంతవరకు నా దగ్గర బాబా ఫోటోలు ఉన్నాయి. పూజించుకోవడానికి బాబా విగ్రహాలు లేకపోవడంతో తెచ్చుకోవడం జరిగినది. ఇటు శివారాధన అటు బాబా ఆరాధన చేసుకుంటూ ఒకరిని దైవంగా మరొకరిని గురువుగా భావించుకుంటూ నిత్య పూజలు చేసే వాడిని. ఇది ఇలా ఉండగా నాకు బాబా సజీవ విగ్రహమూర్తి కొత్తగా వచ్చి  ఈ గ్రూపులో చేరినది. ఈయన ఎలా వచ్చినారో అంతకుముందు అధ్యాయంలో చూశారు కదా. ఇక ఆనాటి నుండి నా జీవితం నా చేతుల్లో లేదు. అంతా బాబా చేతుల్లోకి  వెళ్లిపోయినది. చెప్పేది ఆయన అయినా చేసేది నేను.చేతలు మాత్రం నావి గా ఉండేవి.తిట్లు నాకు… ఆయనకి ప్రసాదాలు, పూజలు హారతులు. అన్నింటికీ ఆయన కనిపించకుండా నన్నే కనిపించేటట్లుగా చేసేవాడు.  ఇది ఇలా ఉంటే బాబా సూక్తులు పుస్తకము ఉన్నది కదా అదే సమాధానాలు ఇచ్చిన పుస్తకం వలన నేను అందరికీ సమస్యలు వస్తే పరిష్కారాలు సూచించడం మొదలు పెట్టాను. గురువారం వస్తే మా ఇంట్లో సమస్యలతో ఉన్న మనుష్యులు ఉండేవారు.  హారతి పూర్తికాగానే వారు ఎందుకు వచ్చినారో తెలుసుకొని ప్రశ్న వాళ్లని నెంబర్ చెప్పమంటే దానికి బాబా పుస్తకం నుంచి సమాధానాన్ని నా వాక్సిద్ధి వలన వారికి వారి సమస్యకు అది ఎలా పరిష్కార మార్గం అవుతుందో అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పేవాడిని.దానితో వారికి నా మీద అలాగే బాబా మీద అనితర ప్రేమ గౌరవమర్యాదలతో పాటు ఏదో తెలియని ఆప్యాయతతో, ఓదార్పు మాటలతో ఆత్మ  బంధుత్వం ఏర్పడేది. నేను డబ్బులు ఆశించే వాడిని కాదు. వారిచ్చినా తీసుకునే వాడిని కాను. కానీ ఒకవేళ బాబా అడిగితే మాత్రం తొక్కిపెట్టి వారి నుండి వసూలు చేసే వాడిని. ఇచ్చిన డబ్బులు అన్ని ప్రోగుచేసి అన్నదానం కింద షిరిడి లో పవన్ బాబా పేరు మీద కట్టేవాడిని. అంటే ఎలా పవన్ బాబా పేరు మీద అనే సందేహం ఇంకా రాలేదా అని అనుకుంటున్నాను. 



సరే మా ఇంటికి ఒకసారి ఒక మూడు సంవత్సరములు పిల్ల భక్తుడు  వీలున్నప్పుడల్లా ప్రతి గురువారం వాళ్ళమ్మతో రావటం చేస్తుండే వాడు. ఏదో ఒక ప్రసాదం లేదా పువ్వులు లేదా పండ్లు తెచ్చేవాడు. బాబాకి సమర్పించేవాడు. వాడి చిన్న వయస్సుకి వాడికి ఉన్న భక్తికి మేమంతా సంతోషించే వాళ్ళం. విచిత్రం ఏమిటంటే షిరిడి సాయి బాబా అనుగ్రహం వలన వీడు పుట్టినాడు. అందుకే వాడికి బాబా భక్తి. అలాగే బాబా పేరు వచ్చేలాగా సాయి కృష్ణ చైతన్య గా నామకరణం చేసినారు. మా ఇంట్లో వీళ్ళకి సజీవ బాబా ఉన్నాడని తెలియడంతో ప్రతి గురు వారము బాబా గుడి కి వెళ్ళే వాళ్లు కాస్తా మా ఇంటికి వచ్చేవారు. వీలుంటే హారతి చూసుకునే వాళ్ళు లేదంటే బాబాకు నైవేద్యం పెట్టించి వెళ్లేవాళ్లు. ఇది ఇలా ఉండగా కొన్ని వారాల పాటు ఈ పిల్ల భక్తుడు మా ఇంట్లో పూజకి రాలేదు. ఒక వారం అకస్మాత్తుగా వచ్చి “పవన్ ! నీ పవన్ బాబాకి నేను తెచ్చిన ప్రసాదం పెట్టమని” నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వాడి మాటలు ఉద్దేశ్యం గురించి ఆలోచిస్తే “పవన్ చేత పూజిస్తున్న బాబా కాబట్టి మా సజీవ బాబా మూర్తికి వీడు పవన్ బాబా” అని నామకరణం చేసినాడు. ఎందుకంటే షిరిడి బాబా ,ద్వారకామాయి బాబా, లెండి బాబా అనే పేర్లు ఉన్నాయి కదా.  అలా మన వాడికి వాడి చిన్న బుర్రలో నా పేరు అలాగే బాబా పేరు కలిపి పవన్ బాబా అని నామకరణం చేశాడు. వాడి పుట్టుకకు కారణమైన షిరిడి బాబా వారు తమ పిల్ల భక్తుడు చేత  ఇలా నామకరణం పవన్ బాబాగా పిలుచుకోవటం అలవాటు అయింది. 

ఇది ఇలా ఉండగా దుష్ట శక్తుల నుండి హనుమ రక్షిస్తాడని హనుమాన్ విగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షిస్తుందని లక్ష్మి విగ్రహం, వాక్ శక్తి పెరుగుతుందని దుర్గా విగ్రహం, ధర్మ గుణం అలవాటు అవుతుంది అని శ్రీరాములు విగ్రహం, పిలిస్తే పలుకుతాడని పాండురంగడు విగ్రహం, అన్ని రకాల ఆటంకాలు తొలగిస్తాడని గణపతి విగ్రహం,సర్ప బాధ తొలగిస్తాడని సుబ్రహ్మణ్య విగ్రహము, కుమారస్వామి నాగేంద్ర స్వామి పడగలు ఇలా నాకు తెలియకుండా వివిధ రకాల చిన్న దేవతా విగ్రహాలు వారి వాహనాలతో 84 విగ్రహాలు 3 అంగుళాలలో,  36 విగ్రహాలు 1 అంగుళాలలో చేరినాయి. అంటే 84 జీవజాతులకు 36 దేవతలకు ప్రతీకలు అన్నమాట. 

దాంతో వీరందరినీ ఒకే గూటిలో ఉంచేందుకు ఒక చిన్నపాటి బీరువాని కొనవలసి వచ్చింది. బీరువా అడుగు భాగంలో వీరి అందరిని ఉంచి పై భాగంలో పూజకు కావలసిన వస్తువులు అనగా గంటలు, హారతులు, ప్రమిదలు, అగర్బత్తీలు, కర్పూరం ,విభూతి, ప్రసాద పళ్ళాలు ,పసుపు, కుంకుమ, గంధం పూలు బుట్టలు.  బాబా గుడిలో ఉండే సర్వ సమస్త వస్తువులు చేరినాయి. ఇక పై భాగంలో గ్రంథాలు, పురాణాలు, గీత, యోగుల చరిత్రలు, పూజ హారతి క్యాసెట్లు, బాబా వారి వస్త్రాలు చేరినాయి. ఎవరికీ అనుమానం రాని దేవాలయంగా ఉండేది. ఈ బీరువాను ప్రతిరోజు పూజకు కూర్చునే సమయంలో తలుపు తెరిచి పూజ, ఉపాసన, ధ్యానము, ఆరాధన పూర్తి అయిన తరువాత తలుపులు మూసేసి తాళం వేసే వాడిని. ఎవరు కూడా అది నా పూజ మందిరం అని కలలో కూడా ఊహించే వారు కాదు. ఇలా కూడా పూజలు చేయ వచ్చు నా అని అనుకున్నారు.బట్టలు పెట్టవలసిన చోట బాబాను పెడుతున్నారే అనుకునేవారు లేకపోలేదు. అప్పుడు పూజ మందిరం కొనే ఆర్థిక స్తోమత లేక అలాగే నా గదిలో ఖాళీ లేక ఊరుకున్నాను. అప్పుడప్పుడు నా యోగ మిత్రుడైనజిఙ్ఞాసి కూడా వచ్చి బాబా హారతులు చూసి  వెళుతూ “బీరువా బాబా జాగ్రత్త “అని చెప్పి వెళ్ళాడు. మీరు కూడా నవ్వుకుంటూ ముందుకు నాతో బయలుదేరండి.

శుభం భూయాత్

పరమహంస పవనానంద

****************

 గమనిక: మన శాస్త్రాలలో చెప్పిన వివిధ సమస్యలకు పరిష్కారం ఆధారంగా వివిధ రకాల దేవతామూర్తులను సేకరించడము జరిగినది. చిన్నాచితక మొత్తం కలిపి 120 దాకా తేలినాయి. వీటికి అధిపతిగా పెద్ద సజీవ బాబామూర్తి మధ్యలో సింహాసనం మీద ఉండేవారు. మిగిలిన వారంతా రక్షణగా, పరిచారకులుగా, గణాలుగా, సేవకులుగా అమరినారు. యోగ శాస్త్రాలు చెప్పిన అరిషడ్వర్గాల మాయలు, సప్త వ్యసన మాయలు, అష్టలక్ష్మీ మాయలు, మృత్యు భయం వీటిని అన్నింటిని నిగ్రహించుకోవాలి అని ఈ విగ్రహాలు సేకరించడం జరిగింది. కానీ మేము ఒకటి అనుకున్నది. జరిగింది మరొకటి. ఈ విగ్రహారాధన కొంతవరకు మాత్రమే నిగ్రహారాధన కలిగిస్తాయని తెలిసేసరికి ఇద్దరికీ అనగా మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి కూడా సుమారు వారి దేవతార్చన ఆధారంగా 36 దాకా విగ్రహాల సేకరణ చేయడం జరిగినది. 

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. baba vaari darshanam, vaari gurinchi modati saari thelsukunnappudu mee anubhuthi, samaadhaanala book naaku asal thelidu ee sari nenu konukkovali..ayna pakkana vallu kopam tho udukuthunnappudu meeku kadupubba navvatam alavaate kada...
    baba vaaru inka kukka maayam ayyarante baadha kaligindi....sukthi bagundi...baba vaari nija samaadhi gurinchi theliyajesaru...
    chaala baadhapettesaaru kaani atleast cellphone lo photos ayna chudagaligaru...baba vigraham selection lo meeku baala ammavaaru help cheyatam..meeru cheppatam easy ne kaani sajeeva murthiga chudalante chaala kashtapadali ante manasu lagnam avvali...mee baba naamakarana ela ayyindi, mee vigrahaala sekarana gurinchi cheppatam anniti kante highlight biruva lo puja good idea... biruva baba jagratha...

    రిప్లయితొలగించండి
  3. Anni adhyatmika sandehalaki ekkada samaadaanaalu dorikaye.Meeku danyayadalu

    రిప్లయితొలగించండి