దీక్ష పరీక్షలు (106)

 

దీక్ష పరీక్షలు



శివనందిని నిద్రలేచి స్నానానికి అని …..మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంటే… గాఢ నిద్రలో ఉన్న బాలగణపతిని నిద్ర లేపడం ఇష్టం లేక గది తలుపులు వేసి, ఘాటు వైపుకు బయలుదేరింది. అప్పుడు ఆమెకు మనసులో “ఈ రోజు నుంచి నాకు సన్యాస దీక్ష పరీక్షలు, మోక్ష సన్యాస దీక్షకి అర్హత ,యోగ్యత ,యోగం, ఉన్నాయో లేదో అనే యోగ పరీక్షలు…. జరుగుతాయని చెప్పడం జరిగింది కదా….! అంటే ఈ రోజు నుంచి సాధన పరీక్షలు మరియు యోగ పరీక్షలు ఉంటాయని” అనుకుంటూ …..అయినా కూడా పరమహంస పవనానంద ఏనాడో కపాల మోక్షం పుస్తకంలో చెప్పడం జరిగింది కదా !ఆశ, భయము ఆలోచన ,సంకల్పం ,స్పందన అనే ఐదింటిని మహామాయలుగా చెప్పటం జరిగింది. దీనికి లొంగకుండా ఎవరైతే ఉంటారో….. వారు మోక్ష సాధనకు అర్హత, యోగ్యత, యోగం సంపాదిస్తారని చెప్పటం జరిగింది కదా! అలాగే సన్యాస దీక్షకి నాకు తెలిసినంతవరకు ధన మాయ, పరపురుష మాయ లాంటి మాయలు ఏమైనా ఉండి ఉండవచ్చు…. అని అనుకుంటూ మణికర్ణిక ఘాట్ వద్దకు చేరుకుంది. ఘాట్ లో గంగా స్నానం చేసి బయటకువస్తుండగా ….ఏదో ఒక మెరుపు మెరిసినట్టుగా ఒడ్డున కనిపించింది దగ్గరికి వెళ్లి చూస్తే …..అది వజ్రాల హారం . ఇది నిజంగా వజ్రాల హరమా లేక గాజు హారమా ? అని పరిశీలిస్తూ తీక్షణంగా చూస్తూ ఉంటే…… రుద్ర స్వామి అక్కడికి వచ్చి 


రుద్ర స్వామి:- “ఏంటి తల్లి! అనుమానం లేదు. అది వజ్రాలహరమే… గాజుది కాదు . కావాలంటే తీసుకో….. ఎవరైనా నది స్నానం చేస్తూ ఉంటే జారీ పడిపోయి ఉంటుంది . నీ మెడకి ఇది బాగా సరిపోతుంది. ఇది నీ మెడలో వేసుకుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. కంఠహారంగా సరిపోతుంది. దీన్ని ఇంకా ఎవరూ చూడలేదు…. ఎవరూ చూడకముందే తీసేసుకో! అంటుంటే


 శివనందిని:- స్వామి! పరాయి వాళ్ళ సొమ్ము మనకెందుకు , వీటిమీద నాకు మోహ ,వ్యామోహాలు, మమకారాలు అన్ని ఏనాడో పోయినాయి. వాటి మీద నాకు ఆసక్తి లేదు. నాకు సంబంధించని విషయం గానీ, వస్తువు గాని నాకు వద్దు. నాది కానిది కోటి రూపాయలైనా నేను వదిలేస్తాను. నా కష్టార్జితం రూపాయి అయినా గాని నేను వదిలిపెట్టను . నాది కాని దానిని నేను పట్టించుకోను . ఎవరిదో ….ఏమో పాపం! 


 అని బట్టలు మార్చుకొని నది ఒడ్డున ఆ ఘాట్లోనే కూర్చుంది . ఇంతలో అక్కడికి ఒక పెద్ద మార్వాడి కుటుంబ సభ్యులు ఒక 10/15 మంది దాకా రుద్ర స్వామి దగ్గరికి వచ్చి….. మేము దశాశ్వమేధ ఘాట్ దగ్గర స్నానం చేస్తుంటే , మా ఆవిడ కంఠహారం గంగా నదిలో పడిపోయింది . అది వజ్రాలహరం. సుమారుగా 10 కోట్లు ఉంటుంది . అక్కడ ఉన్న స్వాములు …..“గంగానది తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటుంది . వద్దు అనుకుంటే ఈ ఘాట్ లోనే ఎక్కడో ఒకచోట మీకు కనిపిస్తుంది . గంగా నది తల్లి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ……ఏది పడితే అది తీసుకోదు. మాకు తెలిసి బంగారం కానీ వజ్రం కానీ ఆమె తీసుకోవడం మేమెప్పుడూ చూడలేదు… కాకపోతే మీకు ఏదైనా ఋణానుబంధం ఉందేమో! అమ్మ తీసుకోకపోతే ఈ 84 ఘాట్ లలో ఎక్కడో ఒకచోట దొరుకుతుంది” అని చెప్పారు. మేము ఇక్కడి దాకా వచ్చాము. మాకు ఎక్కడా కనపడలేదు .మాకు హారం కనపడేటట్లుగా దీవించండి …… అది వంశపారపర్యంగా వస్తున్న హారం…. అనగానే రుద్రస్వామి కళ్ళు మూసుకొని ఓ ఇది మీ హారమే అంటారా? సరే అయితే, అదిగో అక్కడ ఉంది చూడండి. అది మీదో కాదో చూడండి. అనగానే గబగబా ఆ హారం వద్దకు వెళ్లి ….శివ నందిని వద్దని వదిలేసిన హారాన్ని చూస్తూ ఆ స్వామి! ఇదే అని ఆనందపడిపోతూ …..తన భార్యకు చూపిస్తుంటే……“ ఆ…. అవునండి , ఇది మన హరమే” అంటూ గంగవైపుకు తిరిగి “అమ్మ! గంగమ్మ మా వంశ పరువు నిలబెట్టావు. నువ్వు సత్యతల్లివి ” అని …..గంగాదేవికి నమస్కారం చేసుకొని , అక్కడ ఉన్న రుద్ర స్వామికి నమస్కారం చేసుకొని, వాళ్ళందరూ వెళ్లిపోయారు. అప్పుడు ఇదంతా గమనించిన శివ నందిని కాస్త…..


శివ నందిని:- చూశారా స్వామి! అదికాస్తా నేను ఆశించి ఉంటే, వాళ్ళు నిరాశకి లోనయ్యేవారు కదా! వెతికి వెతికి వేసారి నిరాశకు లోనై వెళ్ళిపోయేవారు కదా! నాది కాని వస్తువును నేను తీసుకోవడం వలన వంశపారపర్యంగా కాపాడుతూ వస్తున్న వస్తువు పోయేది. ఈ క్షేత్రం మీద, ఈ దేవాలయం మీద నమ్మకం కూడా పోయేది . గంగానది మీద కూడా అప నమ్మకం పెరిగేది కదా ! నేను చేసిన చిన్న తప్పు వలన ఈ క్షేత్రానికి, ఈ క్షేత్ర దేవతలకు అవమానం జరిగేది కదా! నాది కానిది రూపాయి అయినా కూడా అక్కడే వదిలేసి ఉంచడం మంచిది. పోగొట్టుకున్న వాడు వచ్చి ఆ రూపాయి తీసుకుంటాడు. మనకి అది రూపాయే కావచ్చు….. వాడికది ఒక రోజు ఖర్చయి ఉండొచ్చు లేదా భోజనానికి సరిపడా ఖర్చైనా అయి ఉండొచ్చు…. కాబట్టి నాకు తెలిసినంతవరకు డబ్బులు కానీ, వస్తువులు కానీ, ఏవైనా విలువైన బంగారం అయినా కానీ …. మనది కానిది రోడ్డు మీద కనపడినా ….ఎక్కడ కనపడినా …..దానిని వదిలేస్తే పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి ఆ వస్తువులు తీసుకుంటారు . ఇది నా స్వా అనుభవం.….అనగానే , 


రుద్ర స్వామి:- మంచిదమ్మ! ఆశ మాయను దాటావు …..ఆశ పరీక్ష పెట్టారు…. అది నువ్వు దాటావు… నీకు బంగారం మీద, వజ్రాల మీద మోహం ,మమకారం ఉంటుందేమో! అని అనుకున్నట్టు ఉన్నారు…. ఆ పరీక్ష దాటావు! నువ్వు కనీసం తాకను కూడా తాకలేదు . చూసావు గాని చేతిలో పట్టుకోలేదు కదా! కాబట్టి నువ్వు ఒక పరీక్షలో జయం పొందావు అనేసరికి….. 


శివ నందిని:- ఇది కూడా పరీక్షే అంటారా స్వామి?


రుద్ర స్వామి:- అవునమ్మా! ప్రతిక్షణం ….అనగా సన్యాస దీక్ష తీసుకునేదాకా నీకు పరీక్షలు జరుగుతూనే ఉంటాయి . అది ఒక్క రోజు అవ్వొచ్చు…. పది రోజులు అవ్వచ్చు…. 10 నెలలు పట్టొచ్చు, ఒక సంవత్సరం పట్టొచ్చు. కాకపోతే 14 నెలల వరకు మాత్రమే లేదా 18 నెలల వరకు మాత్రమే పరీక్షలు పెడతారు. 12 ,14, 16, 18, నెలలు మాత్రమే పరీక్షలు పెడతారు. యోగసాధనకు, సన్యాస దీక్షకు సంబంధించినవి పెడతారు. ఒకటిన్నర సంవత్సరం పాటు నువ్వు ఈ పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది లేదా ఒక్కరోజులోనే అయిపోతుంది . అది నీ సాధనాస్థితి గతులను బట్టి , నీ మానసిక పరిస్థితిని బట్టి, నీ జన్మాంతర సాధన స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. చేతలు, చేతులు బట్టే నీ సాధన ఆధారపడి ఉంటుంది. ఒక్క రోజులోనే సన్యాస దీక్ష పొందవచ్చు. ఒక్కరోజులోనే మోక్ష సన్యాసానికి అర్హత ,యోగ్యత పొందవచ్చు…. లేదా ఒకటిన్నర సంవత్సరానికి పట్టవచ్చు. ఏది ఎప్పుడు జరగాలి అనేది విశ్వేశ్వరుడు విధాత రాసేసి ఉంటాడు కదా! మనం ఎదురు చూస్తూ ఉండడమే.. 


 అని సరేనమ్మా నేను ధ్యానం చేసుకుంటాను . నువ్వు కూడా కూర్చొని నీ గురు మంత్రం ఓం శివోహం ధ్యానం చేసుకో… అని చెప్పగానే శివ నందిని ధ్యానంలో కూర్చుంది . రుద్ర స్వామి కూడా ధ్యానంలో కూర్చున్నారు. 



ఇలా వీరిద్దరూ ఒక గంట సేపు దీర్ఘ ధ్యానం చేసుకున్న తర్వాత ….ధ్యాన భంగమై యథాలాపంగా ఇద్దరు కళ్ళు తెరిచారు . అప్పుడు రుద్రస్వామి శివనందిని కేసి చూస్తూ ….ఇప్పటివరకు నీ భోగ జీవితం గురించి నేను అడగలేదు. అసలు నీ వ్యక్తిగత జీవితం ఏంటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే ….


శివనందిని:- స్వామి! నా వ్యక్తిగత జీవితం ఏమంత బాగోదు ….చెప్పుకునే అంత విషయాలు, విశేషాలు ఏమీ లేవు ఏదో అందరి ఆడపిల్లల జీవితం లాంటిదే నాది కూడా. నేను లేకలేక మా వాళ్లకు పుట్టిన ఏకైక సంతానం . విజయవాడ కనకదుర్గమ్మకు మెట్ల పూజ చేయడంతో నేను పుట్టాను అని ….ఆవిడ పేరు కలిసి వచ్చేలాగా లక్ష్మి దుర్గా శివాని అని పేరు పెట్టారు . నేను అందరి ఆడపిల్లల లాగానే పెరిగాను. మాది మధ్యస్థ కుటుంబం. మా నాన్నగారు గుడిమాన్యం చేయడం మీద వచ్చే 125 బస్తాల ధాన్యంతోనే మేము సంసారం నడుపుకుంటాము. మా నాన్నగారు బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ అర్చకులు . మా అమ్మగారు గృహస్థాశ్రమం . వాళ్ళు పాతకాలంనాటి మనుషులు. ఆచార వ్యవహారాలు కలిగి ఉన్న వాళ్ళు అనేసరికి…


రుద్ర స్వామి…..మంచిది తల్లి! ఈ కాలంలో కూడా ఇలా ఉండే వాళ్ళు ఉండటం అరుదైన విషయం. సరే ఎంతవరకు చదువుకున్నావ్ అని అడిగితే …


శివ నందిని:- ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేశాను. ఆ తర్వాత ప్రైవేటుగా డిగ్రీ కట్టి రాసుకున్నాను . డిగ్రీ పూర్తయ్యాక నేను ఉద్యోగం చేయాలని ….స్కూల్ టీచర్ గా జాబ్ లో మా ఊర్లోనే చేరటం అయ్యింది . ఆ తర్వాత కొన్ని రోజులకి లెక్కలు కూడా చెప్పడం జరిగింది. జీవితం ఇలా నడుస్తూ ఉన్నప్పుడు… అనుకోకుండా ఒక వ్యక్తిని చూడడం జరిగింది. ఇక నాకు అదే తొలిచూపులు అనుకున్నాను . అతను తన మనసులో విషయాలు నాకు చెబుతూ ఉంటే నాతో కాదండి… మా అమ్మ వాళ్లకు చెప్పండి అనగానే …మా ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడారు . కాకపోతే మా ఇద్దరికీ కుల గోత్రాలు వేరు అని తెలుసుకొని….. మా నాన్నగారు ఒప్పుకోలేదు . అక్కడితో నేను మౌనంగా ఉండిపోయాను. కాకపోతే అతను పాఠశాల దగ్గరికి రాకపోకలు పెంచుతూ ఉండేవాడు. నాతో మాట్లాడాలని ,నాతో పరిచయం పెంచుకోవాలని తిరుగుతూ ఉండేవాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. అతను ఒక ఎల్ఐసి ఏజెంట్గా పని చేస్తూ ఉండేవారు. పాలసీలు అవి కట్టించుకోవడానికి మా ఊరు వస్తూ ఉండేవారని తెలిసింది . మా పాఠశాలలో ఒక విద్యార్థి వాళ్ళ బాబాయ్ అవుతారని తెలుసుకున్నాను. ఆ తర్వాత కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆరు నెలల పాటు తిరిగి తిరిగి ఇక ఆయన చనిపోతాను….. ఆత్మహత్య చేసుకుంటాను….. పెళ్లికి ఒప్పుకోకపోతే అని అనేసరికి, ఇక మా వాళ్లకి చెప్పి శతవిధాలుగా ఒప్పిస్తే ఇక నీ ఇష్టం అని మా వాళ్ళు అనేసరికి ……అదిగాక ఆ అబ్బాయి మీద మంచి అభిప్రాయం కలగడంతో , వెనకా ముందు ఆలోచించకుండా , అతని జీవితం ఏంటి అని ఆలోచించకుండా , అతనికి సరే అని చెప్పడంతో ఇక మేము అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకుని మా ఊరికి వచ్చేసాము . ఒక విధంగా చెప్పాలంటే మా ఇద్దరిదీ కులాంతర వివాహం అనే చెప్పవచ్చు . మరోవైపు ప్రేమ వివాహం అని కూడా చెప్పుకోవచ్చు . నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు. ఐదు సంవత్సరముల వరకు మాకు సంతానం కలగకపోయేసరికి మా వారసత్వం వచ్చింది అని….. మా అత్తగారు , మామగారు నన్ను వేధించడం మొదలుపెట్టారు . ఇక నీకు పిల్లలు పుడతారో లేదో అంటూ…. మా అత్తమామలు మానసికంగా, శారీరకంగా నన్ను బాధ పెట్టేవారు. కానీ మా వారు మాత్రం చూద్దాంలే…. కంగారు పడకు! నువ్వు పూజలు చేసుకుంటూ ఉంటావు కదా! మీ నాన్నగారు గుడి పూజారి కదా, ఆయన్ని కూడా అమ్మవారిని ప్రార్థించమని చెప్పు అని అనేవారు. మా అత్తగారింట్లో పూజాది కార్యక్రమాలు అనేవి ఉండేవి కాదు. కాకపోతే నేను చేసుకునే పూజలకి ఎవరు అడ్డు చెప్పేవారు కాదు. ఎక్కువ సేపు పూజలో ఉంటున్నానని., జపము ,ధ్యానములో ఉంటున్నానని….. మా అత్తగారు గోల చేస్తూ ఉండేవారు. సన్యాసంలో కలిసిపోతుంది…. సంసారం నిలబెట్టేది కాదు అని సనుగుతు…. గొణుగుతూ ఉంటుంది. అప్పటికి వైద్యుని దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాము. ఆ వైద్యులు కూడా పిల్లలు కలగడానికి అదేపనిగా కాకుండా, శరీరాలు మాత్రమే ఒకటయ్యేలా కాకుండా, మనసుతో శృంగారంలో పాల్గొనండి . కోరికతో అదేపనిగా ఉన్నంత మాత్రాన పిల్లల పుట్టాలని ఏమీ లేదు . మనసుతో కలిసి ఉండండి అని చెప్పేవారు. నిజానికి పెళ్లయిన కొత్తల్లో పిల్లల కోసమే ఉండేవాళ్లం. ఆ తర్వాత ఎంతకాలం అయినా నాకు పిల్లలు అందకపోయేసరికి మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను . నా బాధను చూసి ఆయన కూడా జూదానికి, తాగుడికి, అమ్మాయిల పిచ్చికి అలవాటయ్యారు. నా దగ్గర దొరకని సుఖం…. వేరే వాళ్ళ దగ్గర దొరుకుతుంది అని వెళ్లడం గమనించాను. అది మంచి పద్ధతి కాదు అని …..ఒకటికి పది సార్లు హెచ్చరించినా కూడా కావాలంటే విడాకులు తీసుకొని నన్ను వదిలేసేయి. సంతానం ఇవ్వలేని దానివి . లోకంలో ఉన్న వాళ్ళు నాకు మగతనం లేదు అని అంటున్నారు. లోపం ఎవరిది ఉందో అర్థం కావట్లేదు. నువ్వు గొండ్రాలివో…. నేను మగతనం లేని వాడినో అర్థం కావట్లేదు . ఎక్కడ ప్రశాంతత లేదు. ఇంట్లో లేదు. ఉద్యోగం చేసే దగ్గర లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు మానసిక సమస్యలు ఎక్కువైపోయాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి . బిడ్డ వచ్చిన వేళ ….గొడ్డు వచ్చిన వేళ అంటారు కదా! ఆ సామెత నిజమేనేమో! నువ్వు వచ్చాక నా జీవితం తలకిందులు అయిపోయింది . నాకు ఎక్కడ పడితే అక్కడ సన్మానాలు జరగాల్సిన చోట అవమానాలు జరుగుతున్నాయి. బంధువుల్లో కూడా విలువ లేకుండా పోయింది . నన్ను అదోలాగా చూస్తున్నారని అంటుంటే…. అది నా తప్పేలా అవుతుంది? నేను సంతానం కోసం సహకరిస్తూనే ఉన్నాను కదా! పరస్త్రీ వ్యామోహం లోకి వెళ్తున్నారు. నా దగ్గర దొరకనిది పర స్త్రీల దగ్గర ఏముంటుంది ….అది ఆలోచించుకోండి. లేనిపోని రోగాలు వస్తాయి ,నయం కాని రోగాలు వస్తాయి ,ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది . అంటే ….. నీకు అంతగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే సంతానం కను…..లేదంటే విడాకులు ఇచ్చేసి వెళ్లిపో అని ఒకటికి పది సార్లు అంటూ ఉండేసరికి నా మనసు విరిగిపోయి…. ఎక్కువ సేపు పూజలు, ధ్యానాలు వైపు మనసును మళ్ళించుకునేదాన్ని. నాకెందుకో శివుడు అన్నా ……శివలింగారాధన అన్నా విపరీతమైన కోరిక ఉండేది. అందుకని శివారాధన చేసుకుంటూ, శివ స్తోత్రాలు చేసుకుంటూ….. పూజలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ….. నమకం, చమకం చేసుకుంటూ….. ఇంకా ఎక్కువగా సంసార జీవితం నుంచి భక్తి మార్గంలోనే ఉండేదాన్ని. ఆయన రాత్రులు వచ్చేవాళ్ళు కాదు. అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాళ్లు. ఇక ఆయన పట్టించుకోవడం మానేశాను . ఇక ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు . తిన్నానా లేదా అని అడగటం కూడా మానేశారు. ఇక నేను ఎవరిని పట్టించుకోవడం మానేశాను. ఏదో బతకాలి కాబట్టి తినటమే అన్నట్టుగా ఉండేది. ఆయనకు నచ్చినట్లు రావడం చేస్తూ ఉండేవాడు. రాను రాను వారానికి ఒకసారి ….15 రోజులకు ఒకసారి రావడం….. ఇదే కాకుండా కొత్తగా మళ్లీ ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుని మగ పిల్లవాడిని కన్నాడని తెలిసింది. ఇక ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి….. నా మనసు విరిగిపోయింది. ఇక ఎలాగో విడాకులు తీసుకోవాలి అనే క్షణంలో నా కడుపులో కవల పిల్లలు ఉన్నారని రిపోర్ట్స్ వచ్చేసరికి మౌనం వహించాను. ఆ తర్వాత ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లవాడు పుట్టారు. ఇద్దరు కవలలు పిల్లలే . చూడటానికి ఒకేలా ఉంటారు. లింగ బేధం ఒకటే ఉంటుంది. ఇక ఈ పిల్లల్ని చూసి అయినా ఈ అమ్మాయిని వదిలిపెట్టేస్తాడేమో అనుకుంటే …. తను చిన్న భార్య, నేను పెద్ద భార్య అంటూ 20 రోజులు తనతో…. పది రోజులు నాతో ఉండటం మొదలుపెట్టేసరికి నాకు చిర్రెత్తుకొచ్చింది. నాతో సంసార సుఖం కావాలనుకుంటే…. తనతో వెళ్లొద్దని చెప్పేసరికి …..నన్ను ప్రేమగా చూసుకుంటుంది , నేనంటే ప్రేమ, గౌరవం ఉన్నాయి…. నాకు నీ దగ్గర ఏ సుఖాలు వద్దు…. నాకు తను దగ్గర అన్ని విధాలుగా సంతృప్తి దొరుకుతుంది అని చెప్పేవాడు. పిల్లల కోసం కూడా వచ్చేవాడు కాదు… పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు …మూడు నెలలకి ,ఆరు నెలలకి ఒకసారి వచ్చి ఒక పది రోజులు ఉండేవాడు. సమాజం కోసమే భార్యగా ఉండవలసి వచ్చేది. రానురాను నాకు బోగ జీవితం నరకప్రాయంగా ఉండేది. భోగ జీవితం, దాంపత్య సుఖం నరకంగా అనిపించేది. సంసారం మనిషితో చేస్తున్నానా? మానవ మృగంతో చేస్తున్నానా? అర్థం కాని అయోమయ స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే అతనికి కోరిక కలిగినప్పుడు పక్క ఎక్కాల్సిందే…. నేను ఏ స్థితిలో ఉన్నా …పనిలో ఉన్నా …..బలవంతంగా…. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒక జంతువుని అనుభవించినట్టుగా అనుభవించి వెళ్ళిపోయేవాడు. వయసుకు వచ్చిన పిల్లల ముందే గదిలోకి తీసుకువెళ్లి కోరికలు తీర్చుకునేవాడు. అతను వచ్చినప్పుడు 24 గంటల్లో 20 గంటలు అతని శృంగారం మాత్రమే చేస్తూ ఉండేవాడు. భోజనం చేసిన తరువాత, టిఫిన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు అప్పుడు అని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు…… కోరిక కలిగినప్పుడు….. ఇలా 24 గంటలు శృంగారం తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. ఇక రాను రాను ఇతని పైశాచికం నా మీద చూపించడం మొదలుపెట్టాడు. రక్కడం , బ్లేడ్ తో కొయ్యడం, చాకుతో కొయ్యడం సిగరెట్లతో వాతలు పెట్టడం, కూల్ డ్రింక్స్ లో మందు కలిపి శృంగారం చేయడం, గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా తనకి కోరిక కలిగితే…. అనుభవించడం ఇలా చేస్తూ ఉండేవాడు. పైగా వయసు వచ్చిన పిల్లల ముందు ఉండటం…. మనసొప్పక “ఇలా ఉండడం బాగుండదండి…. కరెక్ట్ కాదు అని అంటే, వాళ్ళు వయసుకు వచ్చారు కదా! వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు కదా! వాళ్ళు తెలుసుకుంటారులే! మన ద్వారా నేర్చుకుంటారు! తప్పేముంది…. అంటూ నన్ను బలవంతంగా అనుభవించేవాడు. నాకు ఇష్టం లేకుండా . ఒక రకంగా చెప్పాలంటే మానభంగం చేసినట్టుగా ఉండేది. ఇలాంటి జీవితం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనిపించేది. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసేదాన్ని. కానీ చేసుకునే సమయానికి పిల్లలు గుర్తుకు వచ్చేవారు, పిల్లల ముఖం చూసి …..సమాజం ముఖం చూసి, ఇక పిల్లలు అనాధలు అయిపోతారని ఆత్మహత్య ప్రయత్నాలు విరమించేదాన్ని. రాను రాను ఇతనిలో మానవత్వం పోయి క్రూరత్వం బాగా పెరుగుతూ ఉండేది . ఒక సైకోలాగా ప్రవర్తించేవాడు. పైశాచికత్వం పెరిగిపోయి అయినదానికి…. కాని దానికి …..ఏ కారణం లేకుండా కొట్టడం బెల్ట్ తీసుకొని కొట్టడం, అదేపనిగా జరుగుతూ ఉండేది . అతను వచ్చే రెండు మూడు నెలల్లో ఆ పది రోజులు కూడా నాకు నరకప్రాయంగా ఉండేది. నరక శిక్షలు ఎలా ఉంటాయో అని ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించేది. అతను రాకుండా ఉంటే బాగుండు…… చనిపోతే బాగుండు…… ఏదైనా యాక్సిడెంట్ అయితే బాగుండు…… ఆత్మహత్య చేసుకుని చనిపోతే బాగుంటుంది అని మనసుకి పదేపదే కోరుకునేది. తన నుంచి స్వేచ్ఛ పొందాలి అని ప్రయత్నిస్తున్నప్పటికి…… విడాకులు చచ్చిన ఇచ్చేవాడు కాదు. ఇక ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టి గృహహింస చట్టం కింద కేసు పెడితే, నా దగ్గరికి రావటం గాని…. ఇబ్బంది పెట్టడం తగ్గిస్తూ వచ్చాడు. ఇక నేను మాట్లాడటం మానేశాను. ఇలా రెండు సంవత్సరాలు గడిచింది. మా ఇద్దరి మధ్య మౌనం తప్ప ఏమీ ఉండేది కాదు. ఇక దానితో అతనికి పిచ్చెక్కి, నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి….. విడాకులు తీసుకుంటే తీసుకో అని చెప్పేసరికి ఇక పిల్లలు నాకే కావాలి నేనే పెంచుకుంటాను అని చెప్పడంతో….. ఇక పిల్లల్ని కూడా , ఆ బాధ్యతలు కూడా ఆయనకి అప్పజెప్పడం….. ఉంచుకున్న దానిని ఇంటికి తెచ్చుకోవడంతో అతని జీవితం నుంచి స్వేచ్ఛను పొంది….. ఆత్మహత్య చేసుకోవడానికి కాశీ క్షేత్రానికి రావడం జరిగింది . 


అని చెప్పి విపరీతమైన ఏడుపు వచ్చేసరికి……. రుద్ర స్వామి విని మౌనంగా ఊరుకున్నాడు. ఇంతలో మహాదేవి అక్కడికి వచ్చి ….


మహాదేవి:- యోగం ఉంటే యోగి కాక తప్పదు. నీకు సన్యాస యోగం ఉంది. కాబట్టి నిన్ను సంసార బాధ్యతల నుంచి తప్పించారు . ఈ విధంగా విడాకుల పేరుతో స్వేచ్ఛ పొందావు. ఇక నీ జోలికి అతను రాడు అంటున్నావు . అందరూ కూడా ఏదో రకంగా సంసార జీవితంలో ఇబ్బందులు పడిన వాళ్లే . ఆడవాళ్లేమో మగవారి వల్ల ఇబ్బంది పడితే, మగవాళ్ళు ఆడవాళ్ళ చేత ఇబ్బంది పడ్డారు. అంతెందుకు మన రుద్రస్వామి జీవితమే చూడు…… అతని భోగ జీవితం గురించి ఎప్పుడైనా అడిగావా? 

 అని చెప్పేసరికి కళ్ళు తుడుచుకుంటూ…..


 శివ నందిని :- ఆయనకి పెళ్లయిందా ?


మహాదేవి:- ఆయన కూడా 16 సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉండి, ఆ తర్వాత సంసార జీవితం మీద విరక్తి కలిగి కాశీ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తంత్రంలో ఏముందీ ? అని తంత్రసాధన చేయడం జరిగింది. ఆయన భోగ జీవితం నుంచి యోగ జీవితంలోకి రావడం జరిగింది.


 “ నా చరిత్ర చెప్పవద్దు” అని రుద్ర స్వామి ఉరిమి ఉరిమి మహాదేవి కేసి చూస్తే…..


మహాదేవి:- ఏముంది స్వామి ? చెప్తే తప్పేముంది….! మగవారి వల్ల ఆడవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు….. ఆడవారి వల్ల మగవారు ఇబ్బంది పడుతున్నారు కదా! మీరు ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పేసి లోకానికి తెలుస్తుంది ….తప్పేముంది…. మీరు మౌనంగా కూర్చోండి…. 


అని రుద్ర స్వామి కేసి చూస్తూ అన్నది. 


రుద్ర స్వామి:- “మీ కర్మ…. నాకేం సంబంధం లేదు” అన్నట్టు ……ఆయన ధ్యానంలో కూర్చున్నారు.


  మహాదేవి కాస్త శివ నందిని వైపు చూస్తూ


మహాదేవి: -“ అమ్మాయి! రుద్ర స్వామి కాస్త ms.phd శాస్త్రవేత్త . ఆయన అవేవో రాకెట్లు తయారు చేసే దాంట్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. తన మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . భార్యాభర్తలు మొదటి మూడేళ్లు బాగానే ఉన్నారు. ఈయన మొదటి నుంచి ఆధ్యాత్మిక సాధన, ధ్యానాలు, జపాలు చేయడం ఉండేది. ఇది చూసి వచ్చిన అమ్మాయి కూడా నచ్చి పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేది. సాధనకి సంతానం అడ్డు వస్తుందని వీరిద్దరూ కలిసి పిల్లలు వద్దు అనుకున్నారు . సరే అని చెప్పి అలాగే సంసార జీవితం కొనసాగిస్తూ ఉండేవాళ్లు. కాకపోతే ఈ అమ్మాయికి పుట్టింటి వాళ్ళు అంటే మమకారం ఎక్కువ . మెట్టింటి వాళ్ళని బాగానే చూసుకుంటుంది. పుట్టింటి వారిని బాగానే చూసుకుంటుంది . కానీ రోజులో 10 గంటలు పుట్టింటికి వెళ్ళటం అనవాయితీగా పెట్టుకునేది . వారంలో ఐదు రోజులు పుట్టింట్లో ఉండేది. రెండు రోజులు ఇతనితో ఉండేది. రాను రాను ఇతను…. “పుట్టింటి వారితో అంత చనువుగా ఉండొద్దు ….కావాలంటే అవసరం ఉన్నప్పుడు వెళ్ళు” అని చెబుతూ ఉండేవాడు. ఈయన మాటలు ఆవిడకి ఏ మాత్రం రుచించేది కాదు. “ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మీ అనుమతి కావాలా ఏంటి ? మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నా అనుమతి తీసుకుంటున్నారా! అదేం లేదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు…… మీ అమ్మ వాళ్ళని చూస్తున్నారు కదా! అలాగే నేను నా తల్లిదండ్రుల దగ్గరకు, మా అక్క వాళ్ళ ఇంటికి , అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళతాను! ఆపడానికి మీరెవరు, వద్దనటానికి మీరెవరు? మీకు రక్తసంబంధీకులు ఉన్నప్పుడు …..నాకు రక్తసంబంధీకులు ఉంటారు, బంధువుల ఇళ్లకు వెళతాను, ఇలా ఆపటానికి లేదు” అంటే ……“వెళ్ళు….. నేనేమీ కాదనటం లేదు. అవసరం ఉన్నప్పుడు , కావలసినప్పుడు వెళ్ళు, నాకు రక్తసంబంధీకులు ఉన్నారు, మా తమ్ముడు దగ్గరికి, మా అక్క దగ్గరికి , మా అన్నయ్య దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు నేను వెళ్ళను కదా! ఆరు నెలలకి ఒకసారి వెళ్లి….. అందర్నీ పలకరించి ఎలా ఉన్నారు, ఏంటి అని చూసి వస్తాను. నువ్వు రోజులో సగం పుట్టింట్లోనే ఉంటున్నావు…. ఒక బంధంలో మూడవ వ్యక్తి అనేది ఉండకూడదు…. ఏదో మంచో, ఏది చెడో మనిద్దరమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి! మూడో వ్యక్తి నా జీవితంలోనూ, నీ జీవితంలోనూ ప్రవేశించకూడదు….. అది తల్లైనా అవ్వచ్చు , తండ్రి అయినా అవ్వచ్చు ……అన్న అయినా అవ్వచ్చు…… తమ్ముడైన అవ్వచ్చు …..ఇంకా ఎవరైనా అవ్వచ్చు , నీకు సంబంధించిన వాళ్ళు కానీ….. నాకు సంబంధించిన వాళ్ళు కానీ….. ఎవరు మూడో వ్యక్తి రాకుండా ఉండాలి. నీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తున్నారు. నీ తల్లిదండ్రులు మాట నువ్వే వింటున్నావు! వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు! వాళ్ళని నేను కాదనను, చెప్పటంలో తప్పులేదు…. కాకపోతే నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా, అంతా అయిపోయాక ….నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు! నేను అది కొన్నాను, నేను ఇది కొన్నాను, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని …..పెళ్లయిన కొత్తల్లో ప్రతిదీ నాకు చెప్పి చేసేదానివి…. ఇప్పుడు ప్రతిదీ మీ అక్క వాళ్ళకి, మీ అన్న వాళ్లకి, మీ కుటుంబ సభ్యులకు చెప్పినవి చేసుకుంటూ వస్తున్నావు… అది నాకు నచ్చట్లేదు…. నేను ఒక భర్త అనే ఒక స్టాంపు గా ఉండదల్చుకోవట్లేదు . భర్తగా నువ్వు నాకు గౌరవ మర్యాదలు ఇవ్వాలి” …..అంటూ వాళ్ళిద్దరి మధ్య మాటల్లో విభేదాలు మొదలయ్యాయి . దానితో ఆమె మాటలు తగ్గించడం మొదలు పెట్టింది. దానితో ఈమె సంసార సుఖం తగ్గించడం మొదలుపెట్టింది. యోగంలో ఉన్నారు…. యోగిగా మారాలనుకున్నారు….. మీకు కామమాయ ఉండటం ఏమిటి? సంసారం మాయ ఉండటం ఏమిటి? వీటన్నిటిని వదిలించుకోండి అని చెప్పి ఈయనకి లేనిపోని వైరాగ్యభావాలన్నీ ఆమె కలిగిస్తూ ఉండేది. ఇతన్ని దూరంగా ఉంచేది. ఆమె తల్లిదండ్రులకు ఎక్కువ గౌరవం మర్యాదలు ఇస్తూ….. వాళ్ళముందే ఈయన పరువు తీస్తూ ఉండేది. అయినా కూడా ఈయన మౌనం వహించేవాడు. పెద్దగా పట్టించుకునేవాడు కాదు. చెప్పవలసినప్పుడు ఈయన చెప్పినా గాని…. వినకపోయేసరికి , సరే వినకపోతే నాకెందుకులే… అని నెమ్మదిగా పట్టించుకోవడం మానేశాడు. ఎప్పుడైతే పట్టించుకోవడం మానేసాడో ……ఈవిడ రెచ్చిపోతూ అహంకారానికి వచ్చింది. వీళ్ళ దాంపత్య జీవితం ఇలా ఉంటుండగానే ….అమ్మాయి తరపు తల్లిదండ్రులు రాకపోకలు ఎక్కువయ్యి , నువ్వు ఆ అబ్బాయితో అలా ఉండటం ఏంటి ? ఇలా ఉండటమేంటి? నువ్వు ఉద్యోగం మానేసేయి….. ఆ అబ్బాయే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. నువ్వు పోషించాల్సిన అవసరం లేదు అని …..చేస్తున్న ఉద్యోగం మానిపించడం మొదలుపెట్టారు . ఆ తర్వాత ఈ అమ్మాయి ఆటోలకి వాటికి ఇబ్బంది పడుతుందని కార్లు, బైకులు కొనడం మొదలుపెట్టారు . ఇవన్నీ తీసుకోవద్దు అని చెప్పినా కానీ …..ఈయన మాట వినడం మానేసింది. “ నా తల్లిదండ్రులు నాకు ఇస్తున్న బహుమతులను నేను ఎందుకు తీసుకోకూడదు ….తీసుకుంటాను” అంది . దానికి ఈయన …“అవి మన స్థాయిని పెంచేవి, దాని వలన లాభం కన్నా నష్టమే ఉంటుంది…. కావాలంటే నేను ఆటోలకి డబ్బులు ఇస్తాను , ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆటోలో వెళ్ళు” …. అంటే “నాకేం కర్మ పట్టింది …నేను కోటీశ్వరుని బిడ్డని …ఆటోను కొనుక్కునే స్థాయిలో మా వాళ్ళు ఉన్నారు… కావాలంటే కారు కూడా కొనిస్తానని అన్నారు …మా నాన్నగారి pf డబ్బులతో నేను కారు కొనుక్కున్నాను ..” అంటే “ పిఎఫ్ రావడం ఏంటి? ఇవ్వటం ఏంటి ” అంటే అప్పుడు విషయం చెప్పింది. తన తల్లిదండ్రులు తనకి ఆస్తులన్నీ ఇచ్చారని…. దాదాపు 5కోట్లు ఈ అమ్మాయి పేరు మీద ఆస్తులు ఇచ్చారని తెలిసింది. ఓహో…. ఈ ఆస్తులు తీసుకున్న విషయం నాకెందుకు చెప్పలేదు అంటే….. నా ఆస్తులు , నా ఇష్టం , నేను తీసుకుంటాను ,అనుభవిస్తాను ,నా పుట్టింటికి సంబంధించినవి, మీకు సంబంధించినవి కాదు ….ఇది నా వ్యక్తిగతమైనవి… అంటే ఇక్కడ నీవి…. నావి ఉన్నాయా? ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఇచ్చినా కూడా అధికారం నాకే ఉంటుంది కదా! అంటే …..మీకు ఎలాంటి అధికారం ఉండదు, అది మా పుట్టింటి వాళ్లది …అనగానే, నీ సొమ్ము అంటున్నావు కాబట్టి , నీ సొమ్ము నువ్వే జాగ్రత్తగా కాపాడుకో. నేను ఒక్క పైసా కూడా ఆశించను, తీసుకోను, నాకు అవసరం లేదు . అంటే మీరు అడిగిన కూడా నేను ఇవ్వను…. నా సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను…. ఇప్పుడు నాకు నెలకి 50,000 వస్తున్నాయి…. మీరు నాకు నెలవారీ ఇచ్చే డబ్బులు కూడా నాకు అవసరం లేదు…. మా అమ్మ వాళ్లు ఇచ్చిన డబ్బులతోనే బతికేస్తాను…. కావలసినట్టు తింటాను…. కావలసినట్టు ఉంటాను….“ ఇంకెందుకు నువ్వు నాతో ఉండటం…..మీ పుట్టింటికి వెళ్లి మీ అమ్మానాన్నలతోనే ఉండు, అక్కడే ఉండి చూసుకుంటూ ఉండు, ఇక్కడ నీకు మెట్టింటి వాళ్ళతో సంబంధం ఏముందిలే! ఇక నా గురించి నువ్వేం ఆలోచిస్తావులే ! ” అనేసరికి….. ఉక్రోషం , కోపం వచ్చి…. ఒక వారం పది రోజుల వరకు పుట్టింటి నుంచి రాలేదు. ఎప్పుడు వస్తావు ఏంటి అని ఈయంతట ఈయనే…. ఫోన్ చేసి అడిగితే “వస్తున్నాను…. ఇప్పుడు గుర్తుకొచ్చానా? మీరు ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళండి…. మీరే నన్ను తప్పు పట్టారు. మీరే నన్ను మాటలు అన్నారు కదా ” !అనేసరికి సరే అని ఆమెను పుట్టింటి నుంచి తీసుకువచ్చారు . ఇలా నెలకి , రెండు నెలలకి ఏదో ఒక పని మీద అలగడం, వెళ్ళటం జరిగేది. ఒకసారి ఈయనకి అనుకోకుండా సంపాదన పెరగటంతో డబ్బులు దాయడం మొదలుపెట్టాడు. నెల నెలా దాచిన డబ్బులు మీద కూడా తనకి అధికారం ఉంటుందని చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు . అదేంటి నీకు వచ్చిన సొమ్ము మీద నీకు అధికారం ఉంది…నాకు అధికారం లేదన్నావు ….నాకు వచ్చిన సొమ్ము మీద నీకు అధికారం ఎలా ఉంటుంది ….అంటే ఇది మనది. మీరు నా భర్త. భర్త సంపాదనలో ప్రతి రూపాయి భార్యకే చెందుతుంది . అది నా పుట్టింటి వాళ్ళ సొమ్ము. నా పుట్టింటి వాళ్ళ సొమ్ము మీద మీకు అధికారం ఉండదు అని… కరాకండిగా చెప్పేసరికి… ఈయనకి బుర్ర తిరిగింది. పుట్టింటి వాళ్ళ సొమ్ము మీద నీకు అధికారం ఉంటుంది. నా సొమ్ము మీద కూడా నీకు అధికారం ఉంటుంది . నా డబ్బులు నీవే… పుట్టింటి వాళ్ళ డబ్బులు నావి కావు…. అవి మాత్రం ఈ వ్యక్తిగతం అన్నమాట! అంటే …అవును, మీరు సంపాదించే ప్రతి రూపాయి నాది. దాన్ని ఖర్చు పెట్టుకున్నా….ఏం చేయాలన్నా ….ఏం కొనాలన్నా నాకు చెప్పి చేయాలి . నాకు ఇష్టమై చేయాలి. మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా కూడా నాకు చెప్పాలి . అదే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసా కూడా మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏదైనా ఖర్చు పెట్టుకుంటాను. ఏదైనా కొనుక్కుంటాను ….ఏదైనా చేసుకుంటాను…. దాని గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే మీరు సంపాదించిన వాటిని నేను లెక్కలు కడతాను…. మీరు లెక్కలు చెప్పాలి…. నాకు వచ్చిన దానికి మీరు లెక్కలు అడగవద్దు… మీరు అడిగినా నేను చెప్పను. నా సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను… అందులో నుంచి ఒక రూపాయి కూడా మీకు ఇవ్వను. అదే మీరు సంపాదించిన సంపాదనలో…. ఒక్క రూపాయి బయటకు పోయినా నేను ఊరుకోను అని ….ఖరాఖండిగా చెప్పేసింది. అనుకోకుండా ఈయనకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి . ఇక ప్రాణాపాయ పరిస్థితి …బతుకుతాడో లేడో ….ఇక దేవుడిపైనే భారం అని చెప్పేసరికి ….అప్పుడు ఆస్తులు ఏమేమి ఉన్నాయని భార్య ఆరాలు చేయడం మొదలు పెట్టింది . ఈయన కేవలం 10 లక్షల మాత్రమే తన పేరు మీద ఉంచాడని…..మిగిలినవి తన కుటుంబ సభ్యుల పేరు మీద బినామీగా ఉంచారని తెలుసుకునేసరికి…. ఈమె గతుక్కుమన్నది. అదేంటి! దాదాపు కోటి రూపాయలు పైగా సంపాదించి దాచిపెట్టుకున్నారు కదా! అలాంటిది కేవలం 10 లక్షల మాత్రమే ఈయన తన పేరు మీద పెట్టడం ఏంటి? ఒకవేళ ఈయన చనిపోతే కోటి రూపాయలు వస్తాయని అనుకున్నాను, ఆ సొమ్ము తన పేరు మీద మార్చుకొని …..తన అనుభవించినంతకాలం అనుభవించి తన తదనంతరం తన పుట్టింటి వాళ్ళ పేరు మీదకి మార్చాలని అనుకుంది. ఈ విషయం గ్రహించిన ఈయన, తన పేరు మీద ఉన్న కోటి రూపాయలు కూడా ఈయన కుటుంబ సభ్యుల పేరు మీదకి ఈయన మార్చిన విషయం ఈమె తెలుసుకొని సమయం మించిపోయింది . ఎప్పుడైతే ఈమె తెలుసుకుందో…. ఇక ఉగ్ర ఆవేశాలు మొదలయినాయి . డబ్బుతోనే వీరి మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఆరోగ్య సమస్యల గురించి బయటపడేసరికి చచ్చిపోతాడు అనుకున్న వాడు కాస్త , బతికి వచ్చేసరికి ఈమె, ఈమె కుటుంబ సభ్యులు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మాట మాట పెరగడం , మనస్పర్ధలు పెరగడం జరిగింది . సంసార సుఖాలు ఇవ్వడం మానేసింది. ఇలా ఎనిమిది సంవత్సరాలు లేదా పది సంవత్సరాల పాటు సంసార సుఖాలకు దూరంగా పెట్టినప్పటికీ… ఈయన పట్టించుకోలేదు. పర స్త్రీ వ్యామోహం లో పడలేదు. ఏకపత్ని పాతివ్రత్యం లోనే ధర్మంగా ఉన్నాడు. భార్య సుఖం ఇచ్చినా, ఇవ్వకపోయినా పర స్త్రీ వైపుకి చూడాలని కూడా అనుకోలేదు . పర స్త్రీలు రాలేదా అంటే? వచ్చారు , కవ్వించారు ,కామం చూపించారు, కోరిక తీర్చమని బెదిరించారు ….ఎన్ని చేసినా కూడా , ఈయన పట్టించుకోలేదు. ప్రతి విషయం కూడా అంటే…. ఈవిడ ఇలా ఉంది ….ఆవిడ అలా చేస్తుంది అని భార్యకి చెప్తూ ఉండేవాడు. ఇక ఈయన భార్య ఈయన మనస్తత్వాన్ని తెలుసుకున్నది కాబట్టి ….ఈయనని పెద్దగా అనుమానించలేదు …అవమానించలేదు . కాకపోతే ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి తన భర్త దగ్గరికి రావద్దు అని దూరంగా ఉంచేసేది. ఇలాగే తన భార్యకి సమస్యలు లేదా బెదిరింపులు వచ్చిన ఈమె ఈయనకి చెప్పేది. అన్నింటిని విని అవతలి వాళ్ళకి ఫోన్ చేసి నా భార్యని ఇబ్బంది పెడితే , పోలీస్ స్టేషన్లో పెడతానని బెదిరించడం …అంటే ఇలా అన్యోన్య జీవితం గా వాళ్ల జీవితం ప్రారంభంలో ఉండేవాళ్లు . పెళ్లయిన ఏడు సంవత్సరాల వరకు ఇలాగే ఉన్నారు. ఆ తర్వాత ఏడు సంవత్సరాలు నుంచి వీళ్లకు మనస్పర్ధలు రావడం మొదలైంది. ఆ మనస్పర్ధలు కూడా డబ్బులు విషయంలోనే రావటం మొదలు పెట్టింది. అది కూడా ఆమెకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీద మమకారం ఎక్కువగా ఉండేది. తను సంపాదించిన వాటి మీద అధికారం ఉండేది. అది ఈయనకి నచ్చేది కాదు. కాకపోతే పుట్టింటి సొమ్ముని ఈయన ఎప్పుడూ ఆశించలేదు, ఖర్చు పెట్టలేదు , ఇది కావాలని అడిగే వారు కాదు, కాకపోతే ప్రతిదానికి లెక్క చూసుకో ! జాగ్రత్తగా చూసుకో! డబ్బు రూపంలో ఉంటే ఖర్చు అవుతుంది. ఆస్తులు కొనుక్కొ అని సలహాలు ఇచ్చేవాడు. నా ఇష్టం…. నాకు నచ్చినట్టుగానే ఉంచుకుంటాను…. నాకు నచ్చినట్టుగానే ఖర్చు పెట్టుకుంటానని ….భోగ వస్తువులు ,విలాసవంతమైన వస్తువులు కొనుక్కుంటూ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేసరికి ఈయనకి నచ్చేది కాదు. ఆయన పెద్దగా పట్టించుకునే వాడు కాదు. రాను రాను మాటలు తగ్గించి, సంసార సుఖం తగ్గించేసరికి, ఇక ఈయన కూడా నెమ్మది నెమ్మదిగా వైరాగ్యంలోకి వెళుతూ పూజాది కార్యక్రమాలు పక్కన పెట్టి ఎక్కువసేపు ధ్యానంలో ఉండటం మొదలుపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ వల్లే ఈయన తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాడు అని చెప్పవచ్చును . సుఖాలు ఇస్తూ భోగ జీవితంలో ఉంచితే, ఇప్పుడు ఈయన మనకి గురువుగా వచ్చి ఉండేవాడు కాదు . యోగం ఉంటే యోగి అవ్వక తప్పదు కదా! అని ఈయనకి రాసిపెట్టి ఉంది . ఇంట్లో ఉన్నప్పుడల్లా ఈయన కూర్చున్నా, నించున్నా, అదేదో మహా తప్పు ….పాపం లాగా సైకో లాగా ప్రవర్తించేది. ప్రతిదానికి అయినదానికి , కాని దానికి ,అరుస్తూ… అకారణంగా ఏడుస్తూ…. గొడవలు పడుతూ ఉండేది. ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా అనే పరిస్థితికి ఈయనని తీసుకువచ్చేది. ఈయన ఇంట్లో ఎప్పుడు ఉండకుండా పోతాడా ? ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళతాడా అని పొమ్మన కుండా పొగ పెట్టినట్లుగా చేసేది. అయినా కూడా అన్నీ తెలిసినా కూడా….. బంధం లేకపోతే పోయింది భర్తగా ఆవిడని చూసుకోవాలి …..ఆవిడకి ఎవరుంటారు , ఏమైనా ఆర్థిక, అనారోగ్య సమస్యలు వచ్చినా భర్త నే కదా చూసుకోవాల్సింది…. అని చెప్పి, పంటి కింద నొప్పిని, బాధని భరిస్తూ…. ఆయన ఉండాలని అనుకున్నాడు. కానీ రాను రాను ఈమెకి పుట్టింటి వాళ్ళ పిచ్చి ముదిరిపోయిందని …..చేసేది ఏమీ లేక ఏం చేయాలో…. అర్థం కాక మౌనంగా ఉండేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తనకి ఈయన నుంచి స్వేచ్ఛ కావాలని చెప్పి విడాకులు కావాలని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసరికి …..ఈయన ఆలోచనలో పడ్డాడు . మనస్ఫూర్తిగా విడాకులు తీసుకుంటున్నావా? కావాలనుకుంటున్నావా? అని అడిగితే …..అవును అంది. 10 లక్షలు భరణం , ఇంటి ఆస్తులు కావాలని అడిగేసరికి ఈయన విని ఊరుకున్నాడు. ఆలోచించడానికి ఒక గంట మాత్రమే తీసుకొని సరే నీకు విడాకులు కావాలంటే విడాకులు తీసుకో! నువ్వు కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నావన్నమాట! ఆయన బంగారం లాగా, ప్రాణపదంగా పెంచుకున్న కుక్కను కూడా వదులుకోవాల్సి వచ్చింది . నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు అన్నమాట! ఒక సంవత్సరం క్రితం అది వెళ్లిపోయింది . ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావ్ ! నేనేదో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను ….బాధ పెడుతున్నాను…. స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నావ్ కాబట్టి , నేను నీ స్వేచ్ఛకి అడ్డుపడను . అడ్డగించను. నీకు ఏ విధంగా కావాలో ….ఆ విధంగా చేసుకో ! నన్ను మాత్రం అపరాధిని చేయొద్దు . ఈ విషయంలో నీకు నువ్వే నిర్ణయం తీసుకో. నువ్వే ఆలోచించుకో . అయితే ఈ నిర్ణయంలో అటు నీ కుటుంబ సభ్యులు, ఇటు నా కుటుంబ సభ్యులు వద్దు …..మనమిద్దరమే ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాం . ఎందుకంటే మనిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. పెద్దలకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. అలాగే ఒకరికొకరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాం. నీ ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటాను . నీతో సంసారం చేయడానికి , నీతో ఉండటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేదు నాతో ముగింపు కావాలి అనుకున్నా కూడా నేను మనస్పూర్తిగా ఒప్పుకుంటాను. ఆ తర్వాత జీవితంలో ఎదురుపడటం, చూసుకోవడం అనేవి లేవు . ఒకసారి బంధం తెగింది అంటే తర్వాత అతికించుకోవాలి అనుకోవడం పెట్టుకోవద్దు. ఒకటికి పది సార్లు ఆలోచించుకో అనేసరికి నేను బాగా ఆలోచించుకున్నాను…. నేను మీతో వేగలేను… ఉండలేను ….నాకు కావాల్సినట్టుగా నేను ఉండలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛ కావాలి…. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను. నాకు కావాల్సింది నేను తింటూ ఉంటాను….. అనేసరికి నేను నీకు ఏనాడు ఏ విధంగా లోటు చేయనేలేదు . నీకు కావలసినట్టుగా నీకు స్వేచ్ఛను ఇచ్చాను. ఆ స్వేచ్ఛ నా నుంచి నువ్వు పూర్ణంగా కావాలని అనుకుంటున్నావు…. కాబట్టి నీకు ఇస్తాను అని చెప్తుంటే… ఈ రుద్ర స్వామి కంటివెంట కన్నీరు కారుతుంటే…. ఆ కన్నీరు చూసి…. ఇలా చాలామందిని చూశాంలే ….ఇలా ఏడ్చే మగవాళ్ళని అసలు నమ్మకూడదని శాస్త్ర వచనం ఉంది కదా! ఈ భావోద్వేగాలు ఏవి కూడా నాకు లేవు . నేను పట్టించుకోను . అనేసరికి ఒకప్పుడు నాకోసం నువ్వు ఏడ్చావు…. నేను లేకపోతే ఉండలేను అని దానివి …. నేనే అంతా అనేదానివి…నువ్వే అంతా అని నా చుట్టూ తిరిగిన దానివి . ఇప్పుడు నువ్వు ఎంత అనే స్థితికి వచ్చావు. దీనంతటికీ నీ పుట్టింటి వాళ్ళు నీకు ఇచ్చిన ధన అహంకారం మాయలో పడ్డావు . నీ తల్లిదండ్రుల మాయలో ఉన్నావు . ఋణం తీరిపోయింది నీతో…. భార్య రుణం ఈరోజుతో తీరిపోయింది అనుకుంటాను.నీకు నువ్వే విడాకులు అడుగుతున్నావు ….నీకు నువ్వే నా జీవితం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నావు. కాబట్టి , నీకు విడాకులు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నీకు నువ్వే అడిగి తీసుకుంటున్నావు కాబట్టి…. నీకు భరణం ఇవ్వడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అడుక్కునే దానికి భిక్ష వేశాను అనుకుంటాను. ఇన్నాళ్లు నా మనసులో భార్య స్థానం ఉండేది. ఎప్పుడైతే జైల్లో పెట్టిస్తా అన్నావో ….అప్పుడే నాకు భార్య అన్న గౌరవం కూడా పోయింది. మర్యాద పోయింది. నువ్వు నాకు ఇంక చచ్చిన దానితో సమానం. ఇప్పుడు నువ్వు ఉన్నా కూడా….. చచ్చిన శవంతో సంసారం చేస్తున్నట్టు ఉంటుంది. ఇక నా మనసు విరిగిపోయింది . నువ్వు నా దానివి కాదని…. మూడు సంవత్సరాల క్రితమే అర్థం అయిపోయింది. భార్య బంధాన్ని, భార్య బాధ్యతగా తీసుకోవాలని భరిస్తూ వచ్చాను. నీకు నువ్వే స్వేచ్ఛ కావాలనుకుని నీకు నువ్వే నా జీవితం నుంచి వెళ్ళిపోతున్నావు . వెళ్లిపోవాలి అనుకుంటున్నావు ….వెళ్లిపోయావు కూడా…. ఇక నీకు కావలసిన విడాకుల ఏర్పాట్లు నీకు నువ్వే చేసుకో. నీకు కావలసినవి నువ్వే చూసుకో. నీకు సహాయ సహకారాలు అందిస్తాను. ఒకసారి విడిపోయి ,విడాకులు తీసుకున్నాక…. నువ్వెవరో, నేనెవరో.. అది మాత్రం గుర్తుంచుకో ! నా కర్మ బాగుండక ఎదురుపడినా ….నువ్వు నాకు అపరిచితురాలవి అవుతావు. నేను నీకు అపరిచితుడినే అవుతాను. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకసారి చేయి వదిలిపెట్టిన తరువాత, ఇల్లు దాటిన తరువాత నువ్వెవరో… నేనెవరో. నువ్వు నాకు చచ్చిన దానివి . గడప లోపల ఉన్నంతవరకు ఒకటికి పది సార్లు ఆలోచించుకో ! నువ్వు లేకపోయినా నేను బతుకుతాను . నేను లేకపోయినా నువ్వు బతుకుతావు . ఇబ్బంది లేదు…. పెళ్లికాకముందు మనిద్దరం బతికే ఉన్నాం కదా ! పెళ్లయ్యాక 16 సంవత్సరాలు కలిసే ఉన్నాము…. కానీ రాను రాను మీ కుటుంబ సభ్యుల ప్రభావం నీ మీద పడి వాళ్ళెక్కడ అన్యాయం అయిపోతారో…. వాళ్ళు ఎక్కడ ఒంటరి వాళ్ళు అనాధలు అయిపోతారని …..నా జీవితంలోకి ప్రవేశించి, నా జీవితాంతం ఉంటానని మాట ఇచ్చి ….ఇప్పుడు అర్ధాంతరంగా 40 ఏళ్ల వయస్సులో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నావు . సరే నీ ఇష్టం. నా జీవితంలోకి నీకు నువ్వే వచ్చావు…. నేను వెంట పడలేదు ….నువ్వు ఎవరో నాకు తెలియదు. నేను జాతకాలు చెబుతున్నానని నా ప్రవృత్తి తెలుసుకొని నువ్వు నా దగ్గరికి వచ్చావు . నువ్వే నీ జాతకం తెలుసుకోవడానికి వచ్చి…. నువ్వే పరిచయం పెంచుకొని …..నా జీవితంలోనికి ప్రవేశించి ….మన ఇద్దరికీ ఆస్తిపాస్తులలో వృత్తులలో తేడాలు వస్తాయండీ అని చెప్పినా …..జాతకాలు కూడా కలిశాయో లేదో చూడకుండా…. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నది మీరే! మీరు చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను…. మీరు నా జీవితంలోకి రావాలి అని …..అన్నాగాని జాతకంలో విడిపోయే యోగం ఉంది విడాకులు తీసుకునే యోగం ఉంది …..16 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటాము అన్నా గాని….. ఎప్పుడో ఏదో జరుగుతుందని ముందే భయపడుతూ కూర్చుంటామా ! ఆలోగా మన మధ్య మనస్పర్ధలు వచ్చినా, గొడవలు వచ్చినా, మన ఇరుకుటుంబ సభ్యుల పెద్దలు కూర్చుని సమస్యని పరిష్కరిస్తారు ….సర్ది చెప్తారు. అప్పుడు మనం విడిపోయే అవకాశం ఉండదు లేండి! ఇప్పుడు 16 సంవత్సరాలు అయినా కలిసి సుఖంగా ఉండొచ్చు కదా ! అని బలవంతంగా ఆనాడు , నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావు. నేను విడాకులు ఇవ్వను అని చెప్పినా ……నువ్వే నా నుంచి విడాకులు కావాలని ,నీకు నువ్వే విడాకులు కావాలని నా జీవితం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నావు . నిన్ను నమ్ముకొని ఉండటం వలన…. నువ్వు చేసిన ఈ నమ్మకద్రోహం వలన ….నా జీవితం ఏదో ఆగిపోతుంది అని మాత్రం అనుకోకు. నీ జీవితం ఆగదు. నా జీవితం ఆగదు. కాకపోతే ఒకరికొకరం తోడు ఉండవలసిన వాళ్ళం కాస్త, విడిపోయి ఎవరి బతుకులు వాళ్ళం బతుకుతాము . ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. జరిగేది జరగక మానదు కదా! జరగనిది ఎన్నటికీ జరగదు కదా! నాకు మోక్ష యోగం ఉన్నట్టుంది. సన్యాసం యోగం ఉన్నట్టు ఉంది . దాన్ని ఎవరు తప్పించలేరు. యోగం ఉంటే యోగి కాక తప్పదు. కాబట్టి నీ ఋణం తీరిపోతే నాకు సన్యాసయోగం వస్తుందేమో చూద్దాం ! సన్యాసం తీసుకుంటానేమో! వానప్రస్థంలో కూడా నువ్వు నాతో ఉండాలి అనుకున్నాను. కాశి క్షేత్రంలో నాకోసం ఒక భక్తురాలు ఇల్లు కట్టించి ఉంచింది. ఆ ఇంట్లో మనిద్దరం కలిసి ఉందాం అనుకున్నాను…. ఆ ఇంటి గురించి నీకు విషయాలు తెలిసినా కూడా పట్టనట్టు ఉన్నావు ….అనేసరికి “మీరు ఏనాడు నాకు ఆ ఇంటి గురించి చెప్పలేదు కదా” అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు . ఇల్లు పూర్తి అయిన తరువాత ఇద్దరం కలిసి అక్కడ ఉండాలి అనుకున్నాను…. అంటే “మీరు అనుకుంటే సరిపోతుందా! నేను అనుకోవద్దా” ! అంటే …పెళ్లికి ముందే చెప్పాను ….. అంత్య కాలంలో ఏదో ఒక క్షేత్రంలో ఉంటాను . ఆ క్షేత్రంలో ఉండి సాధన చేసుకోవాల్సి వస్తుంది . నా 48 సంవత్సరాల వయస్సులో వెళ్లి పోవాల్సి వస్తుంది. అప్పటికి నువ్వు సిద్ధపడు…. కాశీ క్షేత్రం అనుకున్నాం కదా! కాశీ క్షేత్రంలో మనిద్దరం కలిసి 41 రోజులు ఉన్నాము. అక్కడ ఉండలేని పరిస్థితి, అనారోగ్య సమస్యలు తీవ్రమైనాయి . అలాగే మన ఇద్దరికీ కాశీ మరణం ఉందని కాశీ యోగులు చెప్పారు కదా! ఇంక అలాంటప్పుడు అక్కడ ఉండటం సమంజసమే అని తెలుసుకున్నాను! అనుకోకుండా కాశి క్షేత్రం నాకు అనుసంధానం అయ్యింది . ఒకటికి పది సార్లు కాశీ క్షేత్రానికి వెళుతున్నానని కూడా తెలుసు కదా ! ఊహించని విధంగా నా భక్తురాలు అక్కడ నా కోసం ఇల్లు కూడా కట్టిస్తుందని నీకు తెలుసు కదా ! ఇన్ని తెలిసినా కూడా….. మనిద్దరం కాశీ క్షేత్రంలో ఉండి సాధన చేసుకోవచ్చు కదా! అనేసరికి అప్పుడు నా మనసు పరిస్థితి వేరు, అప్పుడు నా శరీర స్థితి వేరు ,పరిస్థితులు వేరు, స్థితిగతులు వేరు….. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు అనాధలుగా చేసి నేను రాలేను…. నావల్ల అయితే కాదు,, నేను ఉండలేను , ఇమడలేను. నాకు కావలసినవి అవసరాల తీర్చేవి ఏవి ఉండవక్కడ ….. ఇక్కడైతే అంతా సిటీ లైఫ్ ….అది పల్లెటూరి వాతావరణం…. నాకు నచ్చదు . నాకు అనుకూలం అవ్వదు . నేను ఇక్కడ సిటీ లైఫ్ కి అలవాటు పడ్డాను అని తెలుసు. నేను ఈ ఇంట్లో ఉండి నేను ధ్యానం చేసుకుంటాను ….మీరు క్షేత్రానికి వెళ్లి ధ్యానం చేసుకోండి . మీకు కావలసినట్టు ఉండండి. మీ నుంచి స్వేచ్ఛను ఇవ్వండి అంటే …..విడాకులే కాదు కదా! విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది! కావాలంటే 15 రోజులు ఇక్కడ 15 రోజులు క్షేత్రంలో ఉంటాను . అంటే…..ఇట్లాంటి రాకపోకలు నాకు నచ్చదు. ఉంటే పూర్తిగా నా దగ్గరే ఉండండి. లేదా పూర్తిగా క్షేత్రంలోనే ఉండండి. కాకపోతే పూర్తిగా నా దగ్గరే ఉండమని నేను చెప్పను…. ఎందుకంటే సన్యాస జీవితం అనేది …..సాధన జీవితం అనేది యోగం ఉంటే తప్ప ఎవరికి రాదు. ఇప్పుడు నా వల్ల మీకు మాయా రాకూడదు. మీ వల్ల నాకు మాయ రాకూడదు. ఇక మనం గృహస్థాశ్రమానికి స్వస్తి పలికి వానప్రస్థంలో ఉందాం అనుకున్నా…కూడా మీరు క్షేత్రానికి వెళ్లాలి అంటున్నారు. అనుకుంటున్నారు. ఇంట్లో ఉండరు అని చెప్పి అంటున్నారు. నాకు రానురాను మీ మీద అకారణ కోపాలు, ద్వేషాలు కలుగుతున్నాయి . కారణం తెలియదు. మీరంటే ఒక విధమైన చిరాకు ,యావగింపు ,కోపం, వస్తున్నాయి. కారణం…. మన ఇద్దరి మధ్య ఉన్న ఋణ పాశం తీరిపోయినట్టు ఉంది. ఎప్పుడైతే ఋణానుబంధం తీరుతుందో….. అప్పుడు వారి మధ్యన గొడవలు, మనస్పర్ధలు వస్తాయని చెప్పేసి …..ప్రాంతాలు మారతారని చెప్పి ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు. కాబట్టి మన మధ్యన మనస్పర్ధలు మొదలయినాయి. నా కుటుంబ సభ్యుల పరంగా మొదలైనాయి అని నాకు అర్థం అయింది . మీరు మీ వివేక జ్ఞానంతో ఆలోచించుకోండి. మళ్ళీ నా సాధనా జీవితాన్ని నాశనం చేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా సాధన జీవితానికి మరియు నా తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇస్తాను. ఒకప్పుడు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి , నా దగ్గరకు వచ్చావు …..తిరిగి నీ తల్లిదండ్రుల దగ్గరికే చేరుతున్నావు…. కాకపోతే ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా ! అంటే “మీరు ఏమైనా చేసుకోండి …..ఏదైనా అనుకోండి …..నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను…..” అంటే , నీ స్వార్థానికి నా జీవితాన్ని బలి చేస్తున్నావన్నమాట! ఇప్పుడు నాతో జీవితాంతం ఉంటా అని మాటిచ్చావు! నేను అనుకోకుండా కాశీలో స్థిరపడాలని అనుకున్నాను. కాకపోతే నీతో కలిసి వెళ్లి స్థిరపడాలి అనుకుంటే …..ఇప్పుడు నువ్వేమో రానని చెబుతున్నావు . ఏ అమెరికాలో లేదా ఏ రష్యానో వెళ్తా అంటే వచ్చేసే దానివి కదా! అంటే వచ్చేదాన్నేమో….. రాకపోయేదాన్నేమో ….ఎవరికి ఎరుక! అయినా కూడా డబ్బులు వస్తున్నాయంటే ఎవరు వదులుకుంటారు . మంచి స్థితి పొందుతున్నాము అంటే…… నీ ఆధ్యాత్మిక సాధన నాతో చేస్తానని చెప్పి….. ఇప్పుడు భోగ జీవితం మీద మమకార వ్యామోహం మొదలైంది ….భోగ జీవితం అంటే ఆసక్తి పెరిగింది . యోగ జీవితం అంటే విసుగు వచ్చేసింది. పూజలు, పునస్కారాలు, ధ్యానాలు అంటే ఆసక్తి పోయింది. ఇప్పుడు డబ్బులు కావాలి…. కనకాలు కావాలి ….వజ్రాలు కావాలి …..సుఖాలు కావాలి…. విలాసవంతమైన జీవితం అనుభవించాలి. రుచికరమైన పదార్థాలు తినాలి….. అంటావు. సరే నీ భోగ జీవితాన్ని నువ్వు అనుభవించు. నా యోగ జీవితాన్ని నేను అనుభవిస్తాను . ఎలాగో నీ నోటి నుండి విడాకులు కావాలని నువ్వే నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు . తధాస్తు. శుభం భూయాత్ ! అనేసరికి ఆ రోజు వంట చేస్తున్న ఆవిడ కాస్త చేయకుండానే మధ్యలో వెళ్లిపోయింది. ఇక పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒకటికి పది సార్లు…. ఈయన ఫోన్ చేసినా కూడా పట్టించుకునేది కాదు ….ఏంటి అని అన్నట్టు ఏవగింపుగా…. అంటీ అంటున్నట్టుగా మాట్లాడేది. ఇలా మూడు నెలలు మాట్లాడుతూ ఉండేసరికి ఈమెలో మార్పు రాదు …..ఈమె ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందిలే ! ఇక కాల నిర్ణయానికి వదిలేద్దాంలే! అని మౌనం వహించాడు. ఆ తర్వాత విడాకుల పత్రాలు పంపించడం….. ఆ తర్వాత కోర్టులో అర్జీ పెట్టుకోవడం చేసింది. అయినా కూడా ఆయన అన్నిటికి సహకరించాడు. ఇక ఆయన అక్కడ ఉండలేక , తన వాటాగా వచ్చిన సామాన్లన్నీ సర్దుకొని ఇక కాశీ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. 


ఆరు నెలల తర్వాత కోర్టు ద్వారా విడాకులు పొందడం జరిగింది. ఇలా ఈయన జీవితం కాశీ క్షేత్రానికి అంకితం అయింది .ఆ తర్వాత ఈయన ఇక్కడ సన్యాస దీక్ష తీసుకోవడం…… ఆ తర్వాత అఘోరంలో తంత్ర యోగిగా మారారు. అఘోరసిద్ధి కూడా పొందారు. ఆ తర్వాత యతి ధర్మం నుంచి…… అఘోరస్థితి నుంచి…… అవధూత స్థితికి వచ్చి ఉన్మాదిగా మారి, తనకి నచ్చినట్టుగా ఎక్కడికి కావాలనిపిస్తే అక్కడికి …..ఎలా కావాలంటే అలా ఉంటూ….. రుద్ర స్వామి ఇక్కడ ఉండిపోయారు . ఇది ఆయన భోగ జీవితం ….చూడు శివ నందిని! నీ భోగ జీవితంలోను, నా భోగ జీవితంలోను భర్తల వల్ల బాధలు పడ్డాము. భర్తల వల్ల మనం మానసిక క్షోభ పొందితే, పురుషుడి పరంగా ఆయన భోగ జీవితంలో స్త్రీ వల్ల బాధలు పొందడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు అంటావు? ఋణానుబంధాలు అంతే కదా! ఆ రుణం తీరిపోయినట్టుంది…… అందుకని ఎవరికి వారే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాకపోతే ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చెప్పలేము. కాకపోతే కలిసి ఉండవలసిన వారు విడిపోయి…… ఎవరికి వారే ఉండేసరికి, తట్టుకోలేని పరిస్థితి….. ఉండలేని పరిస్థితి అయిపోయింది. ఇక భోగ జీవితానికి ఎవరికి వారే స్వస్తి పలికి యోగ జీవితానికి రావడం జరిగింది. యోగ సన్యాసులుగా మారటం జరిగింది. ఇక ఇక్కడి నుంచి నువ్వు మోక్ష సన్యాస దీక్ష తీసుకోవాలి అంటే….. అనుకుంటే….. నీకు పరీక్షలు మొదలయ్యాయి కదా! ఇప్పటికే పొద్దున్న జరిగిన వజ్రాలహరం పరీక్ష నేను ధ్యానంలో చూశాను. నువ్వు తీసుకుంటావా లేక ఏం చేస్తావని చూశాను ……నువ్వు దాని మీద ఆశపడలేదు ,సరే అని వదిలేశాను. ఎవరి భోగ జీవితాలు ఎలా ఉంటాయన్నది చెప్పలేము! భోగ జీవితంలో కలిసి ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సమాజం కోసం భార్యాభర్తలు గా కలిసి ఉండేవాళ్లు నటించే వాళ్ళు ఉన్నారు. నూటికి 99.99% అలా నటించే వాళ్లే ఉన్నారు. నటనతో జీవించే ఉన్నారు. పూర్తిగా భార్యాభర్తలు కలిసి ఉండరు…. ఉండలేరు . ఏదైనా భార్యాభర్తల ఋణానుబంధం ఏడేళ్లు లేదా 14 ఏళ్ళు …..ఆ తర్వాత రుణం తీరిపోతుంది. శ్రీరాముడు అంతటివాడే వనవాసం చేశాడు. భార్యని తీసుకొని వెళ్ళాడు. 14 సంవత్సరముల తర్వాత రావణాసురుడు వచ్చి తీసుకువెళ్లడం జరిగింది. ఇలా సంసార జీవితంలో ఏదో ఒక మాయ పెడతాడు. ఆ మాయని దాటలేక మాయలో పడిపోయి, జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది యోగ జీవితానికి నాంది అవుతుంది. ఏం జరిగినా ఇక మన మంచికే అనుకోవాలి . సరే! ఇక నీ భర్త గురించి నువ్వు ఆలోచించకు. నీ సంతానం గురించి ఆలోచించకు. నువ్వు పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ రాతల్ని నువ్వు కనలేవు కదా! రాత రాసిపెట్టిన విధాత ఉన్నాడు కదా! ఏం జరగాలో, ఎలా జరగాలో, వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఉన్నా లేకపోయినా…. వాళ్ళ జీవితానికి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రావు. నువ్వు ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది…… నువ్వు ఉంటేనే వాళ్ళ జీవితం నడుస్తుంది అనుకోవద్దు. ఉన్నట్టుండి ఏదైనా ప్రమాదంలోనో చనిపోయావే అనుకో…… పిల్లల జీవితాలు ఆగిపోతాయా! ఆగిపోవు కదా! అంతే ఇంక వాళ్ళ జీవితంలో నువ్వు చచ్చిపోయావు అనే స్థితికి వాళ్ళు వచ్చేసారు . నీ దృష్టిలో కూడా పిల్లలు లేరు అనుకోని…. ఇక ఆ బంధాలు పోయినాయి అనుకొని …….నువ్వు వాటి గురించి ఆలోచించడం మానేసి …….. నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించు. ఇప్పుడు ,ఈరోజు నుంచి పెట్టే సాధనా పరీక్షలు ఎలా దాటాలో ఏకాగ్రతగా ఆలోచించుకొని దాటు. ఒకవేళ దాటలేని పరిస్థితిలో ఉండి సన్యాస దీక్ష తీసుకునే అర్హత లేకపోయినా….. ఈ కాశీ క్షేత్రం నుంచి ఎటు పోకుండా ఈ కాశి క్షేత్రంలోనే ఉండి సాధన చేసుకుంటూ స్థిరవాసం చేసుకో. ఇక్కడే మోక్షమరణం పొందు. ఏదో ఒక శరీరం మోక్షం వస్తుంది కదా! అది ఆత్మ శరీరం మోక్షం వస్తుంది…… ఈ క్షేత్రంలో మరణం పొందితే అని పరమహంస చెప్పారు కాబట్టి ……..రాబోయే కాలంలో ,రాబోయే జన్మల్లో, విశ్వ మోక్షానికి ప్రయత్నం చేయవచ్చు . ఆలోగా అర్హత ,యోగ్యత యోగం సంపాదించుకోవచ్చు. దాని గురించి నువ్వు ఏం కంగారు పడవద్దు . భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించవద్దు. భోగ జీవితం గురించి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఆలోచనలు రావు అని నేను అనను. వస్తూ ఉంటాయి ……కాకపోతే అవి అదుపులో ఉంచుకో. దానిమీద పట్టు సాధించు. మర్చిపోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉండు. ఆలోచనలు పెరిగే కొద్దీ నీ మానసిక స్థితి బలం తగ్గిపోతూ ఉంటుంది . మానసిక ఆందోళన ఒత్తిడికి గురవుతావు. ఇది నీ యోగ జీవితానికి మంచిది కాదు. భోగ జీవితం గురించి అతిగా స్పందించకు. అందరి ఋణాలు తీర్చుకున్నావు. గడప దాటి వచ్చేసావు. అలాగే ఉండు . ఇక భోగ జీవితంలోకి తిరిగి వెళ్ళటానికి అవకాశాలు వస్తాయి….. వాటిని వాటికి విలువ ఇవ్వకు. ఆలోచనలకి బలం ఇవ్వకు. ఇక నా సాధనకి నా సమయం ఆసన్నమైంది….


 అని మహాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ రుద్ర స్వామి కళ్ళు తెరిచి…..


రుద్రస్వామి:- “ ఇక నా భోగ జీవితం సోదంతా విన్నావు కదా! ఇప్పుడు ఏం జరిగింది! ఇది ఏది చెప్పినా విని చావదు! నా మాట వినదు. నా పెళ్ళాం లాంటిదే ఇది కూడా! అది నా మాట వినకుండా పోయింది ….ఇది ఉన్నా కూడా నా మాట అసలు పట్టించుకోదు! ఇదేమో నా గత జన్మ పెళ్ళాం ….అదేమో ప్రస్తుత జన్మ పెళ్ళాం. ఇప్పుడు ఇద్దరూ పెళ్ళాలు పోయారు….. సంసార సుఖం లేకుండా పోయింది . ఇది నా జీవితం…. నా జీవితం తెలుసుకొని నీకేంటి లాభం! చెబితే వినరు కదా! సరే, నీ ధ్యానం నువ్వు చేసుకో అని….. 


కళ్ళు మూసుకుంటూ ఉండగా….. ఒక బైరాగి ఈమె దగ్గరికి రావడం గమనించాడు. సరే ఇది ఏమైనా పరీక్ష ఏమో అని ఆ బైరాగి వైపు కళ్ళు విప్పార్చి చూసాడు ……ఆ బైరాగి శివ నందిని దగ్గరకు వచ్చి 


బైరాగి:- అమ్మ! అమ్మ! నా దగ్గర బంగారం ఉంది తీసుకుంటావా అన్నాడు! 


అదేంటి బంగారం అమ్మటమేంటి? అన్నట్టుగా చూసింది


బైరాగి:- నేను సిద్ధపురుషుడిని….. రససిద్ధితో నేను బంగారం తయారు చేయగలను ……కానీ ఆ బంగారం అమ్మటానికి ఒప్పుకోరు, వర్తకులు మావద్ద కొనరు. మేము కనికట్టు చేయడం వల్ల బంగారంలా కనపడుతుందని….. మేము వెళ్ళిపోయాక మట్టి ముద్దలా మారుతుందని భయం . కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇదిగో నేను తయారు చేసిన బంగారం ముద్ద అని సుమారుగా 100 గ్రాములు ఉన్న బంగారపు ముద్దను శివ నందిని చూపించాడు . దీన్ని ఎంతో కొంతకి అమ్మి సగం డబ్బులు ఇస్తే చాలు. కావాలంటే మన మధ్య సఖ్యత కుదిరింది అంటే…… రోజుకి రెండు కేజీలు లేదా మూడు కేజీలు బంగారం తయారు చేయగలను. ఆ బంగారాన్ని బంగారం దుకాణం లో అమ్మేసి నాకు సగం డబ్బులు ఇస్తే చాలు. మిగతా సగం నువ్వు తీసుకో!  


అన్నట్టుగా ఆఫర్ పెట్టేసరికి అసలు ఇతని ఏం మాట్లాడుతున్నాడు అని ఒక క్షణం పాటు శివనందినికి ఏమీ అర్థం కాలేదు. అసలు బంగారం తయారు చేయడం ఏంటి? బంగారం ఇలా కూడా తయారు చేస్తారా? అదేదో అన్నం వండినట్లుగా నేను బంగారం తయారు చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇది నిజమేనా అని….. అదే మాట అన్నది. దానికి రస సిద్ధుడు నవ్వుతూ…..


బైరాగి:- బంగారం తయారు చేయచ్చమ్మా. కావాలంటే తయారు చేసి చూపిస్తాను. చూపించమంటావా?  


శివ నందిని:- వద్దులే…… నీ మాట మీద నాకు నమ్మకం ఉంది . కానీ నేను అలాంటి దాన్ని కాదు . నేను బంగారం అమ్మి సొమ్ము చేసుకునే పరిస్థితి నాకైతే లేదు. నా సొమ్ము నాకు ఉంది . నీ సొమ్ము మీద నాకు ఆశ లేదు. వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకో కావాలంటే….


బైరాగి:- నువ్వు నన్ను నమ్మట్లేదు కావాలంటే చూడు అని ఒక కేజీ ఉన్న బంగారపు కడ్డీని చూపించేసరికి ఇలాంటి కడ్డీలు మా ఇంటి దగ్గర 10/ 15 ఉంటాయి. కావాలంటే నీకు ప్రతిరోజు ఈ కడ్డీని తీసుకువచ్చి ఇస్తాను. నువ్వు నాకు అమ్మిపెట్టు. లక్షలు సంపాదించవచ్చు ఒక నెలలో….. నీకు తెలియట్లేదు, డబ్బు లేకపోతే ప్రపంచం నడవదు. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచమంతా ధనం చుట్టూ తిరుగుతుంది. డబ్బు ఉంటేనే నిన్ను గౌరవిస్తారు. నువ్వు సన్యాసం తీసుకున్నా , నువ్వు మంచి ఆభరణాలు వేసుకుంటేనే….. మంచి దుస్తులు వేసుకుంటేనే నిన్ను గౌరవిస్తారు. నువ్వు వేసుకునే రుద్రాక్ష తోడుగులకి బంగారం ఉంటేనే నిన్ను గౌరవిస్తారు. నువ్వు మంచి బట్టలు ధరిస్తేనే నిన్ను హోటల్ కి రానిస్తారు. గదులు ఇస్తారు . విలువ ఇస్తారు. ఒక మనిషిగా చూస్తారు కాకపోతే నువ్వు చింపిరి జుట్టుతోనో….. దారంతో ఉన్న రుద్రాక్షలు వేసుకొని తిరిగితే, ఎవరూ నీకు విలువ ఇవ్వరు . గౌరవం ఇవ్వరు ….. అనేసరికి 


శివనందిని:- నాకు ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా శివయ్య ఇస్తారు . ఆ శివయ్యే చూసుకుంటాడు నన్ను ఎలా ఉంచాలి? ఏ విధంగా చూసుకోవాలి అని శివయ్యకే తెలుసు. నాకు శివయ్య ఇచ్చింది చాలు . శివాంశలైన మీలాంటి వాళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకోను… పట్టించుకోను…. నాకు అవసరం లేదు. నాకు బంగారం మీద ఎలాంటి మోహ వ్యామోహాలు లేవు. అవసరం కూడా లేదు. దాన్ని అమ్మి సొమ్ము చేస్తే లక్షలు కాదు, కోట్లు వచ్చినా నాకు ఉపయోగం లేదు. నేను పట్టించుకోను. చావాలనుకున్న దానికి చచ్చేదానికి బతకడానికి ఏర్పాట్లు అన్నట్టుగా ఉంది. అవసరమే లేదు. నేను మానసికంగా ఏనాడో చచ్చిపోయాను శారీరకంగా ఏదో మోక్ష సాధన చేసుకోవడానికి బతికున్న శవంలాగా ఉన్నాను. దీనిని కూడా శవం చేస్తున్నాను. ఒక్కొక్కటి పరిత్యాగం చేస్తున్నాను. నాకు అవసరం లేదు. 


బైరాగి:- ఒకటికి పది సార్లు ఆలోచించుకో! అమ్మ! భూ ప్రపంచంలో నాలాంటి రసవిద్యలు తెలిసిన వాళ్ళు దొరకడం చాలా కష్టం. చాలా తేలిక పద్ధతిలో బంగారం తయారుచేసి ఇస్తున్నాను. కేజీలు కేజీలు తయారు చేస్తున్నాను. కిలోలు కిలోలు ఇస్తాను. నువ్వు అమ్ముకునే కొద్ది డబ్బులు వస్తాయి. కోటీశ్వరాలవి అవుతావు. నా దగ్గర ఇప్పటికే ఇలా బంగారం అమ్మి సొమ్ము చేసినవి 10 లక్షలు దాకా సొమ్ము ఉంది. ఈ సంపాదన నాకు నెల రోజుల సంపాదన. అదే ఆడపిల్ల బంగారం అమ్మడం మొదలుపెడితే…… నెలలో 50 లక్షలు సంపాదించగలరు. మంచి అవకాశాన్ని వదులుకుంటున్నావు. రేపు మీ దేవుడు శివయ్య కూడా ఆర్థిక అవసరాల్లో తీర్చాలి అంటే డబ్బు సంపాదించే అవకాశాలు చూపించాను ఆనాడు….. నువ్వు వదిలేసావు అని ఆయన తప్పుకుంటాడు . ఇవన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకో!  


శివనందిని:- శివయ్య ఇచ్చినా ….ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు. శివయ్యని నమ్ముకుంటే శనగలుతినైనా బతకచ్చు. బంగారమే తిని బతకాల్సిన అవసరం లేదు…


 అని కరాకండిగా చెప్పి , అతని కొట్టి అక్కడి నుంచి పంపించే అంత పని చేసింది . ఆ బైరాగి రుద్ర స్వామి వంక అదోలా చూస్తూ….. నా బంగారం పరీక్ష అయిపోయింది… ఈ అమ్మాయి ఉత్తీర్ణురాలైంది ..జయం పొందింది అని సైగ భాషలో చెప్పి వెళ్లిపోయాడు. ఇది తెలుసుకున్న రుద్రస్వామి మనసులో నవ్వుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా ….శివ నందిని కేసి చూస్తూ …..


రుద్రస్వామి:- అతను చెప్పింది నిజమే కదా ! అమ్మ ఆ బంగారం అమ్ముకుంటే నీకు కోట్లు రాకపోయినా వేలైనా వచ్చేవి కదా! 50 లక్షలు / 1,00,000 వచ్చేవి కదా! ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదు కదా! నీ ఆర్థిక అవసరాలు తీరేవి కదా! ఎందుకు వదిలి పెట్టుకున్నావు ! శివుడే ఆ విధంగా వచ్చి ఇచ్చాడేమో …..


శివనందిని:- స్వామి! మీరు కూడా నన్ను పరీక్ష చేస్తున్నారా? నాకు బంగారం మీద మమకారం ఉందేమో అని పరీక్ష పెట్టారా? నాకేమైనా ఉందా? నేనేమైనా ఆశపడ్డానా? బంగారం అమ్ముకొని బతకాల్సిన అవసరం నాకేంటి? నాకున్న కష్టార్జితం నేను సంపాదించుకున్నాను. ఏదో ఉద్యోగం చేసుకొని ఎఫ్డి చేసుకున్నాను. ఖర్చు పెట్టుకుంటాను. లేనినాడు భిక్షాటన చేసుకొని బతుకుతాను. నాకేం బంధాలు, బాధ్యతలు ఏమీ లేవు కదా! నేను ఒక్కదాన్నే కదా ! నా జీవితాన్ని భిక్షాటనతో అయినా గడిపేస్తాను. ఏమీ దొరకనినాడు నీళ్లు తాగి కడుపు నింపుకుంటాను. అంతేగాని రసవిద్యల మీద, ఇతర బంగారపు వస్తువుల మీద నేను ఆధారపడను . నాకు రసవిద్యలు ,యోగశక్తుల మీద ఆసక్తి లేదు . నన్ను వదిలేయ స్వామి! అనేసరికి ఆయన మౌనం వహించాడు. 


శివనందిని కి ఉన్నట్టుండి ఒక ధర్మ సందేహం వచ్చింది.


శివనందిని:- స్వామి ! నిజంగా జాతకాలు నమ్మొచ్చా? జాతకాల్లో చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా!


రుద్రస్వామి:- మన తలరాతలు….. విధాత ఒక విధిరాత రాస్తాడు అంటారు కదా! ఆ విధిరాత యొక్క కోడ్- డీకోడ్ ఏ జాతకం. మన జాతకం, పుట్టిన , తేదీ , సమయం, ప్రదేశం బట్టి చూస్తే……మనకో జన్మ లగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం ఆధారంగా 12 గదులు, 12 అంశాలు మన గ్రహస్థితులు. ఆ గడుల్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంటే ఏంటంటే శరీర ఆరోగ్య సమస్యలు ఒక గడి చూపిస్తే, మరొక గడి ఆర్థిక సమస్యలు ,ఇంకొకటి మన వివాహ వ్యవస్థ, ఇంకొకటి సంతానం……ఇంకొకటి తల్లిదండ్రులు ,ఇంకొక గడి మన సాధనా స్థితిగతులు ఎలా ఉన్నాయనేది చూపిస్తుంది. ఇంకొకటి మన బంధుమిత్రులు మనతో ఎలా ఉంటారు అనేది చూపిస్తుంది. ఇంకొకటి మన విదేశాల ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇలా రకరకాలుగా ఈ 12 గడుల్లో చూపిస్తారు . ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గ్రహం 120 భావాలను చూపిస్తుంది. ఈ 120 భావాల్లో మనకి దగ్గరగా అనుసంధానమైన భావం చెప్పగలిగినవాడు…. పట్టుకుని జ్ఞాన స్ఫురణ తో చెప్పగలిగిన వాడు నిజమైన జ్యోతిష్యుడు అవుతాడు. అలా చెప్పే జ్యోతిష్యులు ఈ కాలంలో నూటికి పది మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా 10 లేదా 20 పాయింట్లు చెబితే ఒకటి లేదా రెండు సరిగ్గా జరుగుతాయి . అదే నిజ జ్యోతిష్యుడు చెబితే అది వేదంలాగా వాళ్ళ మాటకి తిరుగు ఉండదు. వాళ్ళ వాక్య దైవవాక్కు, దైవ శాసనం అవుతుంది. వాళ్ళు చెప్పిన పది పాయింట్లకి పది జరుగుతాయి . జరగక మానదు. మనకి గ్రహాల యొక్క స్థితిగతుల వలన రాబోయే సమస్యలకి, కాలంలో వచ్చే సమస్యలకి ,ప్రమాదాలకి మనల్ని సిద్ధం చేస్తుంది. మానసికంగా, శారీరకంగా ఈ సమస్య వస్తుంది……దాటాలి అని చెబుతామే గాని ఇలానే చేయమని ఇలానే ఉండమని గ్రహాలు శాసించవు. రోగి కావలసిన వాడు రోగికి సేవ చేసి ఋణం తీర్చేసుకోవచ్చు. దానితో అనారోగ్యం పొందవలసిన వాడు ఆరోగ్యం పొందుతాడు. జాతకంలో దోషాలు ఉంటాయి. దోషాలకు తగ్గ పరిహారాలు ఉంటాయి. ఇది 80% మాత్రమే జరుగుతుంది. 20% జరగదని బ్రహ్మ ఏనాడో జ్యోతిష్య శాస్త్రానికి శాపం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళామంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది కాబట్టి….. జ్యోతిష్యాలకి 80% అది కూడా నిజ జ్యోతిష్కుడు చెప్పిన దాన్ని మనం నమ్మొచ్చు. ఆ నమ్మిన దాన్ని ఆధారంగా మనం చేసుకోవచ్చు. జ్యోతిష్యంలో జాతకంలోనూ మీరు విడాకుల పొందాలి లేదా సంతానం పొందాలి లేదా వివాహం ఉంది… ఫలానా చోట పెరుగుతావు…. ఫలానా చోట ఉద్యోగం చేస్తావు… సన్యాసయోగం మీకు ఉంది…. ఇలా ప్రతి సెకండ్ నువ్వు పుట్టిన దగ్గరనుంచి నువ్వు చచ్చిపోయేదాకా ప్రతిదీ కూడా జ్యోతిష్యంలో ఉంటుంది. అలా తెలుసుకుని చెప్పగలిగే వాళ్ళు మాత్రము చాలా అరుదుగా ఉంటారు. వేళ్ళ మీద లెక్కేసి చెప్పవచ్చును. జ్యోతిష్యాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. అదే ఖగోళ శాస్త్రంతో సమానమైనది. ఒకప్పుడు అది జ్యోతిష్య శాస్త్రం . ఇప్పుడది ఖగోళ శాస్త్రంలో వినియోగిస్తున్నారు….. గ్రహణాలు చెబుతుంది….పౌర్ణమి, అమావాస్య తిధులు చెబుతుంది. పంచాంగము చెబుతుంది. జ్యోతిష్యంలో మనకి చెప్పనిదంతా జరగాలని ఉండదు. కాకపోతే దాన్ని మనం మార్చలేము. ఏ మార్చలేము. ఉన్నది తెలుసుకొని ఆచరణలో పెట్టడం తప్ప దాన్ని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా ఆపలేము. కాకపోతే కొంతమేర మార్పు చేయగలము. అది కూడా నీ జాతకంలో ఉంటే మార్పు చేయగలవు…. ఉదాహరణకి నీ జాతకంలో సంతానయోగమే లేనప్పుడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా,దేవుడే ప్రత్యక్షమైనా గురువుల అనుగ్రహం పొందినా కూడా నీకు సంతానం కలగదు. అదే విధంగా సంతానం రాసిపెట్టి ఉంటుంది …కాకపోతే నీ జాతకంలో సంతానయోగం ఉండి, దానికి పరిష్కార మార్గాలు చేసుకుంటే ఆటంకాలు తొలగి నీకు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అంతే అది కూడా నీ జాతకంలో ఆ పరిష్కార మార్గం కూడా రాసిపెట్టి ఉండాలి .పరిహార యోగం రాసిపెట్టి లేకపోతే నువ్వు ఎన్ని పరిష్కారాలు చేసుకున్న ఫలితం ఉండదు. ఉపయోగము ఉండదు. దేవుడు తను రాసిన రాతను ఏనాడు మార్చడు …..మార్చలేడు….. ఆయన కూడా మార్చాలని అనుకోడు విధికి, విధాతకి ,విధిరాతకి దేవుడు ఏనాడు దాటడు…..దాటలేడు….దాటాలని కూడా అనుకోడు. దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. దానికి అనుగుణంగానే జీవిస్తాడు. అందుకే నరుడు నారాయణుడు అయ్యాడు. ఇప్పుడు శ్రీరాముడు తను భగవంతుడి అవతారం అని తెలిసినా కూడా …మానవ మాత్రుడు ఏ విధంగా కష్టాలు పడతాడో, అలా విధిరాత ప్రకారంగా కష్టాలు పడ్డాడు కదా! విధిరాత ప్రకారమే నడుచుకున్నాడు కదా! ఈతి బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, మానసిక కోభ అనుభవించాడు, భార్య విరహ వేదలను అనుభవించాడు,పిల్లల వేదనను అనుభవించాడు, పిల్లల దూరం అయ్యారని బాధపడ్డాడు, ఆ తర్వాత పిల్లలని దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత భార్య అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ……మానవ భోగ జీవితంలో ఏవైతే ఉంటాయో….. ఆయన కూడా శ్రీరామ జీవితంలో అనుభవించాడు. అలాగే శ్రీకృష్ణుని జీవితంలో ఇంచుమించు తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లిపోవడం, మేనమామల చేత బాధపడటం, కంస వధ, ఇతర రాక్షసుల రాజుల వల్ల ఈతి బాధలు పడటం …..ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు. మానవుడు పరిధి దాటి దైవంగా…. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లారు. అంతేగాని జీవుని నుంచి శివుడు వచ్చాడు . శివుడు తిరిగి శివమాయలో పడి జీవుడిగా మారారు. ఇది సృష్టి కార్యంలో నిత్యం జరిగే విధి విధానం కాబట్టి ….ఇది ఇలాగే జరుగుతుంది… ఇలాగే ఉండాలి అని ఉండదు. విధిరాతను ఎవరూ మార్చలేరు… ఏ మార్చలేరు…. జరిగేది జరగక మానదు …..జరగనిది ఎన్నటికీ జరగదు అని మాత్రం గుర్తు పెట్టుకో! ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటే జ్యోతిష్యం మీద ఆధారపడి చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది మనకి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది…. దాన్ని మార్చాలి అనుకుంటే అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మారదు. మారలేదు. అది మాత్రం గుర్తు పెట్టుకో! జరగబోయే దానిని ముందే తెలుసుకొని అనర్ధాలను, పెను ప్రమాదాలను కొంతమేర తగ్గించుకునే అవకాశం మనకి జ్యోతిష్యం కలిగిస్తుంది. అది కూడా నీకు ఆ యోగం ఉంటేనే …….నువ్వు పరిహారాలు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది . అందుకని జ్యోతిష్య శాస్త్రాన్ని మన పూర్వీకులు పెట్టడం జరిగింది. అలా అని దానిమీద పూర్తిగా ఆధారపడాలని అనలేదు. పట్టించుకోకుండా ఉండలేము. అది మాత్రం గుర్తుపెట్టుకో! ఏదైనా గాని నిజ జ్యోతిష్కుడు మీద మన జీవితం ఆధారపడి ఉంటుందని మాత్రం తెలుసుకో! 



రుద్ర స్వామి జాతకం గురించి జ్యోతిష్యం గురించి చెబుతూ ఉండగా ఒక అందమైన యువకుడు సూటుబూటు ధరించి ఈమె దగ్గరకు రావటం జరిగింది…


యువకుడు :- క్షమించండి! మీ పేరు ఏంటో నాకు తెలియదు 


శివనందిని :-శివనందిని


యువకుడు:- నందిని నాకు ఇక్కడ విశేషాలు, విషయాలు ఏమీ తెలియవు. ఈ క్షేత్రానికి రావటం ఇదే మొదటిసారి. మీరు నాకు దగ్గర ఉండి చూపిస్తారా! నేను మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను …..


శివ నందిని:- నేను అలా చెప్పే గైడ్ ని కాదు. సాధన చేసుకోవడానికి వచ్చాను . ఇక్కడ నేను సాధన చేసుకునే సన్యాసిని….. 


యువకుడు:- మీరు చూడటానికి సన్యాసి లాగా ఏమీ కనిపించడం లేదు . ఏదో సాధారణమైన స్త్రీలాగా ఉన్నారు. ఉద్యోగం చేసుకునే దానిలాగా కనిపించారు అందుకని మీ దగ్గరికి వచ్చాను . మీరు రూపురేఖలలో కూడా నా అంత అందంగా కనబడుతున్నారు. నేను మిస్టర్ ఇండియా ని…. మీరు మిస్ ఇండియా లాగా కనిపించారు. సిగ్గుతో తలవంచుకుంది . 


ఒక పరపురుషుడు తన అందం గురించి చెప్పేసరికి…. శివ నందిని కి బుగ్గ సొట్టలు పడ్డాయి. ఇదంతా గమనించిన రుద్రస్వామి ఈమెకి కామమాయ పరీక్ష మొదలైంది అనుకొని…. 


రుద్రస్వామి :- ఏమి తెలియదు అని చెబుతోంది కదా ! తను గైడ్ కాదు అని రాను అని చెప్తుంది కదా! ఎవరో ఒకరు చెప్తారు లే ..! ఈ క్షేత్రం గురించి…. ఇక్కడి నుంచి వెళ్ళు ….


యువకుడు:- రుద్ర స్వామి వంక చూసి మీరు తండ్రి లాంటి వాళ్ళు ….మీరు అలా అనడం ఏంటి! నాకు అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఈ క్షేత్ర విశేషాలు తెలీదు …..చెప్పండి…. చూపించండి…. అని గైడ్ అనుకొని ఆమె దగ్గరికి వచ్చాను . గైడ్ కాదని అన్నారు కదా! ఇక నా దారిన నేను వెళ్ళిపోతాను . ఆ అమ్మాయి అందంగా ఉంది అనిపించింది…. 


 రుద్రస్వామి:- ఆమె అందమైనది కాదు ….పెళ్లయి ముగ్గురు పిల్లల తల్లి కూడా ఏమనుకున్నావ్? ఏమైనా పెళ్లి కాని అమ్మాయి లాగా కనబడుతుందా నీ కంటికి….. 


యువకుడు:- అవునా ! నాకు అలా కనిపించలేదే ……మీకు పెళ్లయిందా? పిల్లలు కూడా ఉన్నారా? అలా లేరే…… ఇప్పుడే వయసుకు వచ్చిన అమ్మాయి లాగా ఉన్నారే !


 అనేసరికి ఆ మాటల విన్న శివనందిని మొహం విప్పారిపోతూ ఉన్నది . కానీ శివ నందిని మనసులో ఇతని మీద ఒక విధమైన అభిప్రాయం ఏర్పడింది. చూడ్డానికి శ్రీకృష్ణ మోహనాంగుడిలాగా ఉన్నాడు. మనసు తిప్పుకోలేకపోతున్నాము. మనసు లయ తప్పుతుంది అనుకుంటూ ఉన్నది. 


యువకుడు:- సరే మీరు వస్తారా ! మీరు వస్తే ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నాకు చూపించినందుకు…. నాకు ఉచితంగా ఏమీ చెప్పక్కర్లేదు. 


ఒక అడుగు వేద్దాం అనుకునే లోపల రుద్రస్వామి కేసి చూసి రుద్ర స్వామి మౌనంగా ఉండేసరికి …..అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది అని అతనికేసి చూసింది . 


శివ నందిని:- నేను రాను లేండి….మీకు ముందుకు వెళ్తే ఎవరో ఒకరు చెప్పే వాళ్ళు దొరుకుతారు . మీరు వెళ్ళండి అని అడుగు వెనక్కి తీసుకుంది…


యువకుడు:- ఎటు నాతో బయలుదేరాలి అనుకున్నారు కదా! నాతో బయలుదేరండి. తప్పేముంది ….నేనేమీ తప్పుడు పనులు చేయను . తప్పుడు ఆలోచనలు చెయ్యను. తప్పుగా ప్రవర్తించను. నావల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనిద్దరం ఒకే విధమైన అందచందాలను కలిగి ఉన్నాము అని అనిపించింది.. నాకు మనసుకి దగ్గరగా ఉన్నారు అనిపించింది ….శరీర అందానికి దగ్గరగా ఉన్నారు అనిపించింది …ఒకప్పుడు నేనే ప్రపంచంలో అందమైన వాడిని అనే అహం ఉండేది . ఆడపిల్లలు కూడా నా అందానికి సరిపోరు అనే మన్మధుని రూపం నాకు ఉన్నది. మీరు నాకు రతీదేవి లాగా కనిపిస్తున్నారు. నా అంత అందం మీలో కూడా ఉంది…. మీరు విభూతి పూసుకోవడం వల్ల తెలియటం లేదు. మీరు మంచి కామత్వం తెలిసిన స్త్రీమూర్తులు అని కళ్ళల్లోనే అర్థం అవుతుంది. మీ కళ్ళల్లోనే కామం కనపడుతుంది .


అనేసరికి …..ఇతను ఏంటి మరి చనువు తీసుకొని ఏవేవో మాట్లాడుతున్నాడు అని……


శివ నందిని:- మీరు నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా ఇప్పుడే మీ బుద్ధి బయటపడింది …..నా అందము గురించి మాట్లాడుతూ …..నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు . నా అందానికి నేను లొంగేదాన్ని కాదు. కావాలంటే నీకు ఈ చర్మం కావాలంటే చెప్పు ఒలిచి ఇస్తాను అనేసరికి ….


.అతను భయపడిపోయి కొంపతీసి నిజంగానే చేసినా చేసి పెడుతుందేమో అని భయపడుతూ ఆ యువకుడు వద్దొద్దు….. అలాంటి పనులు చేయకండి…. లేనిపోని గొడవవుతుంది. ఇప్పుడు పోలీస్ కేస్ అవుతుంది . నేను వెళ్ళిపోతున్నాను అని అతని వెళ్ళిపోయేసరికి …..


రుద్రస్వామి:- అదేంటమ్మా! అతను డబ్బులు ఇస్తా అన్నాడు . నీ అందం గురించి పొగుడుతున్నాడు ….బయలుదేరబోయావు…. బయలుదేరాల్సింది ఏముంది! ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్ని చూపించి వచ్చేసరికి నాలుగైదు గంటలు అయ్యేది. 


శివనందిని:- స్వామి ! అతను నా అందం గురించి పొగిడాడు అని నేను అనుకోలేదు. అతనికి తెలియదు అన్నాడు . అతని అందానికి నేను మోహవశమయ్యాను. అతను మాట తీరుకి నేను వశమయ్యాను… ఉన్న మాట చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. కాకపోతే ఆ మనసు చలించింది . ఆ మనసు నేను అదుపులో ఉంచుకున్నాను. దాన్ని ఇంద్రియ నిగ్రహంతో నిగ్రహించుకున్నాను . ఎవరో పరాయి పురుషుడితో నేను ఎందుకు వెళ్లాలి ….నాకేం సంబంధం …..అతనికి తెలుసుకోవాలి అనే యోగం ఉంటే తెలుసుకుంటాడు లేదా వీడియోస్ లో చూసుకొని తెలుసుకుంటాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక విధంగా కామమోహ మాయ ఏమో …..నాకు తెలియదు చూద్దాం …..మాయ ఉందనో ,మాయా పరీక్షలు ఉన్నాయనో, నేను వెళ్లకూడదు అని అనుకోలేదు. కాకపోతే ఎందుకో మనసు ఆగిపోయింది. మనసు అదుపులోకి వచ్చింది . ఆధీనం తప్పిన మనసు నాకు స్వాధీనం అయింది. మనం పర పురుషుడి వైపు నమ్మి వెళ్ళటానికి లేదు అని చెప్పి ఆగిపోయాను ……


రుద్రస్వామి:- నీ ఇష్టం తల్లి ! నువ్వు ఏం కావాలనుకుంటే అలా చేసుకో ….ధ్యానం చేసుకుంటూ ఉండు …..నేను కాసేపు యోగ నిద్రలోకి వెళతాను అనేసరికి ….


సరే అని శివనందిని ఓం శివోహం మంత్రం చేసుకుంటూ ధ్యానంలో ఉండిపోయింది. యోగ నిద్రలోకి రుద్ర స్వామి వెళ్ళిపోయాడు. తీవ్ర ధ్యాననిష్ట లో ఉన్న శివనందినిని ఎవరో చూస్తున్నారని అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నగ్నంగా ఉన్న యువకుడు కనిపించాడు. సుమారుగా 32 సంవత్సరాల వయసు ఉన్న యువకుడిలా కనిపించాడు. , జటా దారి ఒంటినిండా విభూతి రాసుకొని ఉన్నాడు. ఏదో సన్యాస దీక్షలో ఉన్నట్టుగా ఉంది….. కాకపోతే ఒంటిమీద కాషాయ వస్త్రాలు లేవు. అలా అని అఘోరుడు అని అంటానికి లేదు…అఘోర తత్వాలు లేవు. సాధారణమైన వాడిలా కాకుండా అసాధారణం అయిన వ్యక్తిలా అనిపించింది. ముఖంలో దివ్య తేజస్సు ఉంది. కళ్ళల్లో మోహనాకర్షణ శక్తి ఉండేసరికి…. ఇతన్ని చూసేసరికి….. మనసు నెమ్మదిగా లయ తప్పడం మొదలైంది. అతని పురుషాంగము….. మర్మాంగం చూసేసరికి విపరీతమైన కామ వాంఛలు మొదలైనాయి. మనసు అదుపు చేయడం కష్టం అయ్యేసరికి …… కూర్చున్నది కాస్త ఉవ్వెత్తున లేచి నిలబడింది. ఈ లేచి నిలబడిన శబ్దానికి యోగ నిద్రలో ఉన్న రుద్ర స్వామి కళ్ళు తెరిచి ఏం జరిగిందని కళ్ళు తెరిచి చూశాడు . ఎదురుగా నగ్నంగా ఒక యువకుడు ఉండేసరికి ఆ యువకుడ్ని చూసేసరికి ఓహో…… ఏకంగా దత్త స్వామి నగ్నంగా వచ్చాడన్నమాట! ఈ పరీక్ష దాటితే సన్యాస దీక్షకి అర్హత వస్తుంది. కాబట్టి మౌనంగా ఉండి ఏం జరుగుతుందో అని వీళ్లిద్దరి కేసి చూస్తున్నాడు…. 


నగ్న యువకుడు:- ఏందమ్మా! ఏంది! నన్ను చూసి భయపడి లేచావా ఏంది? నిన్ను నేను ఏమైనా చేయడానికి వచ్చాను అని అనుకుంటున్నావా ?నిన్నేమైనా చేయాలని అనుకుంటున్నానా ?నీ దగ్గర విభూది ఉందేమో అని అడుగుదామని వచ్చాను. నువ్వేదో కళ్ళు మూసుకొని పెదాలు కదుపుతూ ఉన్నావు కదా! నువ్వేదో గొనుక్కుంటున్నావు కదా! గోనుగుడు అయిపోయిన తర్వాత లేపుదాంలే అని కూర్చునే లోపల….. లేచి కూర్చున్నావు…. నీకు లేచింది…. నాకు లేచింది…. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు …..


అనేసరికి ఆవిడకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది.  


నగ్న యువకుడు:- నీ దగ్గర విభూతి ఉందా? లేదా? అదేదో ఒంటినిండా విభూతి రాసుకొని కూర్చున్నావు కదా! నీ దగ్గర ఉందేమో చెప్పు….. రాసుకొని రాసుకొని నా దగ్గర ఉన్న విభూతి అయిపోయింది . ఇస్తావా?


 తన చేతి సంచిలో నుంచి తీసి ఇచ్చింది. ఆయన చేతి స్పర్శ తగిలేసరికి విపరీతమైన కామ స్పందనలు ఈమెలో కలగడం మొదలైంది. మనసు లయం తప్పుతుంది. కళ్ళల్లో ఒక విధమైన మైకం వస్తుంది…. ఇతన్ని హత్తుకోవాలని…. కౌగిలించుకోవాలని….. తన కౌగిలిలో బిగించేయాలని చెప్పేసి తన పురుషాంగాన్ని యోనిలో ప్రవేశింప చేయాలనే తీయని దురద తనలో మొదలైంది. అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. పక్కన రుద్ర స్వామి ఉన్నాడన్న విషయం తెలిసినా కూడా …….ఏం జరిగితే అది జరుగుతుందని ఆమెలో విపరీతమైన కామకాంక్ష మొదలవుతుందని తెలిసి….. ఈమెను గమనించిన నగ్న యువకుడు …


నగ్న యువకుడు:- ఎందమ్మాయ్ ….. నీ శరీరంలో ఆ మార్పులు ఏంది ?రకరకాలుగా మారిపోతున్నావు ? రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నావు? నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు. నేను ఎట్లా కనబడుతున్నాను ….నీ కామ కోరిలో తీర్చేవాడు ఇలా కనబడుతున్నానా? నీకు కామ కోరికలు కలిగించేలా ఉన్నానా? అయినా కోరికలు తీర్చేవాడిని వదిలేసి నన్ను పట్టుకుంటావేంటి ? నా వెంట పడతావ్ ఏంటి? నీ దగ్గర ఉన్న విభూతి ఇచ్చావు….. తీసుకో …..అయిపోయింది. 

 తన ఆలోచనలన్నీ ఇతను చదివేస్తున్నాడని….. ఇతనే చదువుతున్నాడు అంటే తన పక్కన ఉన్న రుద్ర స్వామి కూడా చదివేస్తాడని తలవంచుకొని తన మనసుని అదుపులోకి ఉంచుకుంటూ……. 


శివ నందిని:- క్షమించండి! స్వామి! మనసులయం తప్పుతుంది. శరీరం అదుపు తప్పుతుంది. నాకు కామకోరికలు తీర్చుకోవడం కొత్తకాదు . దానిమీద వైరాగ్యం వచ్చింది…. కానీ ఇప్పుడు అర్థం అయింది…. నాకు వచ్చింది పురాణం వైరాగ్యం అని ….నిజమైన స్మశాన వైరాగ్యం రాలేదని అర్థం అయ్యింది. ఇంతవరకు నేను నా భర్త నగ్నత్వం తప్ప పర పురుషుని నగ్నత్వం నేను ఇంతవరకు చూడలేదు. ఏ వీడియోలోను , ఫోటోలోనూ చూడలేదు . మొట్టమొదటగా పరపురుషుని నగ్నత్వం మీలో చూశాను . దానితో నా మనసు లయ తప్పింది . మీ దగ్గర పాజిటివ్ శక్తి బాగా ఉంది. మీరు చేసే ధ్యానశక్తి వలన మీ ముఖంలో ఉన్న దివ్య తేజస్సుకి , మీ కళ్ళల్లో ఉన్న తేజస్సుకి ….ఆకర్షణ శక్తికి మనసు లయ తప్పింది . నేను ఇప్పుడిప్పుడే కదా ! సాధనలోకి వస్తున్నాను. సాధనలో అడుగుపెడుతున్నాను. మీరు సాధనలో అంతంలో ఉన్నారు. నేను ప్రారంభంలో ఉన్నాను . కాబట్టి నా మనసు లయ తప్పడం తప్పు కాదు . కాకపోతే ఆ లయ తప్పే మనస్సును, నేను అదుపు చేసుకుంటున్నాను . ఇంకో కొన్ని క్షణాలు నా ముందు నిలబడి ఉంటే నా మనసు అదుపు తప్పి మిమ్మల్ని ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టను….. ఇక ఆ తర్వాత మీ ఇష్టం …..


నగ్నయువకుడు:- అమ్మ! నాలో ఉన్న నగ్నత్వం చూస్తే నీకు నేను పశుపతి గానే కనపడతాను. నగ్న పురుషుని గానే కనపడతాను. నాలో నగ్నత్వం బదులు దిగంబరతత్వం చూడు …విషయం నీకే అర్థం అవుతుంది అనేసరికి …..


సరే ! అని శివనందిని ఆ నగ్న యువకుడిని ఆపాదమస్తకం అంటే…. కాళ్ళ నుంచి తల వరకు కళ్ళతో చూడటం… మనసుతో చూడటం మొదలుపెట్టింది . చూస్తూ ఉండేసరికి మానవ శరీరము…. ఎలా అయితే నగ్నత్వంతో ఉందో …..అలాగే ఉంది కదా! కాకపోతే ఈ శరీరం దివ్య తేజస్సుతో ఉంది. ఆకర్షణ శక్తితో ఉంది. అంతేగాని తన భర్త భోగము వదిలిపెట్టి యోగంలోకి వస్తే, ఇంతటి సాధనాస్థితి పొందుతాడు కదా! ఈయన చెప్పింది నిజమే ..నగ్నత్వాన్ని వదిలిపెట్టాలి, దిగంబర తత్వాన్ని చూడాలి. అప్పుడు మనకి మర్మాంగం స్థానంలో కోరిక పుట్టదు. ఆశ కలగదు. శరీరం మీద మమకార వ్యామోహాలు తొలగిపోతాయని చెప్పేసి అనుకొని 


శివనందిని:- స్వామి! క్షమించండి! నా మనసు నేను అదుపు చేసుకున్నాను. నగ్నత్వం మీద నాకు మమకార వ్యామోహాలు పోయినాయి. అదుపులోకి వచ్చినాయి. మీలో దిగంబరతత్వం చూస్తున్నాను. మీ దిగంబరతత్వంలో మీ అందం నాకు కనిపించట్లేదు. మీ శరీరం ,ఆకర్షణ శక్తి కనిపించట్లేదు. మీ కళ్ళల్లో మోహకాంక్ష కనిపించట్లేదు. అంతా దైవత్వమే కనిపిస్తుంది . నాలో మనుష్యత్వం తగ్గి, యోగత్వం ప్రవేశించింది అనిపించింది. కాబట్టి మనుష్యత్తం ఉన్నంతవరకు మీలో నగ్నత్వం చూశాను. నాలో దైవత్వం లేదా యోగత్వం ప్రవేశించిన దగ్గర నుంచి దిగంబరతత్వంగా కనబడుతున్నారు. మీకు ఆకాశమే వస్త్రం అని నాకు అర్థం అయింది. అందుకని దిగంబరతత్వం ఇదే అని గ్రహించాను. నా మనసు లయ తప్పినందుకు, నా మనసు అదుపు చేసినందుకు… మీకు శతకోటి కృతజ్ఞతలు చెబుతున్నాను. నన్ను క్షమించండి! మనసా వాచా కర్మేణ సర్వస్య శరణాగతి కోరుకుంటున్నాను . మీరు సాక్షాత్తు నడయాడే శివుడి గాను, దత్తాత్రేయ శివుడని నాకు అనిపిస్తుంది. ఎవరైనా ఒకటే కదా! రూపాలు వేరు, నామాలు వేరు ,తత్వాలు ఒకటే ఉంటాయి కదా!  


అని పాదాలు అందుకోపోతుంటే 


నగ్నయువకుడు :- తల్లి ! ఎప్పుడైతే నువ్వు నాలో నగ్నత్వం బదులు దిగంబరతత్వమును చూసావో…. ఆనాడే నీలో ఉన్న కామం నశించింది . నీవు దిగంబరతత్వమును పొందావు. యోగత్వము లేదా దైవత్వమును పొందటానికి అర్హత సంపాదించావు…. అని దీవిస్తూ …..తధాస్తు! ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు 


అని వెళ్ళిపోతూ ఉండగా….. రుద్రస్వామి “ ఆయన్ని పట్టుకో! ఆయన సాధారణమైన వ్యక్తి కాదు! దత్తాత్రేయ స్వామి! దత్తాత్రేయ పాదాలను పట్టుకో ! ఎవరి వెంట పడడు….. నీ వెంట పడటానికి వచ్చాడు! అందరూ ఆయన వెంటపడుతుంటే ఆయన నీ వెంట పడ్డాడు. ఈయన్ని వదిలి పెట్టుకోకు. ఈయన దర్శనం కలగడం అనేది …..మానవ జన్మకి అసాధ్యం. కొన్ని లక్షల జన్మల పుణ్యఫలం ఉంటేనే జరుగుతుంది. “ 

అవునా స్వామి! ఆయన దత్తాత్రేయ స్వామి ఆ ….నిజంగా …..దిగంబర స్వామి అని వెళ్లబోతూ ఉండగా ఆగమ్మాయి…. ఆగాగు….. ఆయన వెంటపడుతున్నావ్ ….ఆగాగు అని ఒక ఆడ గొంతు వినిపించేసరికి ఆయన వెంట వెళుతున్న శివ నందిని కాస్త వెనక్కి తిరిగి తనని పిలిచిన ఆవిడ వైపు చూసింది. ఆవిడ చూడటానికి అమ్మవారి అంశ లాగా కనిపించింది . ముఖంలో దివ్య కళ….దివ్య తేజస్సు ఉన్న సాధకురాలుగా కనిపిస్తుంది. కాకపోతే కాషాయ రంగు చీర దానికి ఆకుపచ్చని రంగు అంచు కనపడింది. ఈ చీరని చూసేసరికి శివ నందిని మనసు వికలమైంది. ఏదో తెలియని ఆలోచనలో పడిపోయింది. దత్త స్వామిని ఆలోచించడం మానేసి …..ఈ చీర ఆలోచనలో పడిపోయింది . కారణం ఏమిటంటే కాషాయం రంగు చీరకు ఆకుపచ్చ రంగు అంచు ఉన్న చీరని చూడాలని…. భోగ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసింది . ఎన్నో షాపుల్లో వెతికింది. ఇంటర్నెట్లోనూ వెతికింది. ఐదారు సంవత్సరాల వెతికినా కూడా అలాంటి చీర కనిపించలేదు . దాంతో ఆ చీర మీద ఉన్న ఇష్ట కోరికను చంపుకోలేక ఎప్పటికైనా ఆ చీరను పొందాలని ఇష్ట కోరిక అలాగే ఉండిపోయింది. అలాంటిది ఈమె తన మనసులో ఉన్న ఇష్ట కోరికకు తగ్గట్లుగా ఈమె కనిపించేసరికి మనసు ఆగిపోయింది . ఈమె వైపు ఆ చీర వైపు తేరిపారా చూసి….. ఆ తర్వాత దిగంబర స్వామి వెళుతున్న వైపు చూస్తే….. ఆ స్వామి కనిపించలేదు. తన కనుచూపు దాటి వెళ్లిపోయాడు లేదా అదృశ్యమై ఉంటాడు అనిపించి …..అయ్యో ఒక చీర మీద ఉన్న మమకారంతో ఆయన్ని వదిలిపెట్టేసానే అయినా ఈవిడెంటి నాకు ఇష్టమైన ఇష్ట కోరికతో మిగిలిపోయిన ఈ చీర కట్టుకొని ఎలా వచ్చింది? అసలు ఈవిడ ఎవరు అని…. ఆగి ఆవిడకేసి చూసింది.  


స్త్రీ మూర్తి:- అమ్మ! నేనెవరో, నువ్వు ఎవరో తెలుసుకునే స్థితిలోనే మనం ఉన్నాము. నేను తెలుసుకున్నాను . నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు. అంతే తేడా! ఇక ఈ చీర సంగతి అంటావా….. ఈ చీర కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశాను. ఒక భక్తురాలు నాకు పెట్టింది. నా మనసుకు నచ్చింది. ఇంకొక చీర కావాలని అడిగాను… ఎందుకో నాకు తెలియదు . సరే ! నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దాం అని ఉంచుకున్నాను . ఇదిగో నా చేతి సంచిలో ఉంది. ఇదిగో కావాలంటే చూడు. నేను కట్టుకున్న లాంటిదే . ఈ చీర కూడా కవల పిల్లలు లాంటి చీర అంటూ అచ్చు గుద్దినట్టు ఉన్న ఒక చీరను తన చేతిలో సంచిలో నుంచి తీసి ఆ చీర చూసేసరికి…. 


ఆవిడ ఒంటి మీద ఎలాగైతే ఉందో ,అలాగే చీర రంగులో ఉండేసరికి మనసు పీకింది .చీర తీసుకోవాలనిపించింది… కానీ సన్యాస దీక్ష తీసుకోవాలి అనుకున్నప్పుడు చీరలు ఇవన్నీ అవసరం లేదు కదా అని ఒకపక్క….. ఇది తను సన్యాసం తీసుకున్న కాషాయ వస్త్రం ధరించాలి కాబట్టి….. ఇది కూడా కాషాయ రంగు కదా ! తీసుకుంటే తప్పేముంది అని మరొక పక్కా ….మనసు పీకడం మొదలైంది . ఏం చేయాలో అనే అయోమయ స్థితిలో ఉంటే …..


స్త్రీమూర్తి:- అమ్మ! మనకి ఎందుకు వచ్చింది ఈ సన్యాసం ,గొడవలు…. హాయిగా సంసారం చేసుకోక ! ఇప్పుడు మా ఆయన ఉన్నాడు చూడు….. నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్లిపోయి ఏకాంతంగా ఒంటరిగా కూర్చోవాలి అనుకుంటాడు. నేనేమో ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాక నేను ఒక దాన్ని ఉన్నాను…. నా గురించి ఆలోచించు …..నేను నీ గురించి ఆలోచిస్తాను …..నువ్వు నన్ను పట్టుకో. నేను నిన్ను పట్టుకుంటాను ….నేను నిన్ను వదిలిపెట్టను… నిన్ను ఎక్కడికి పోనివ్వను అంటూ నా వైపు లాగుతూ ఉంటాను. ఆయన నా వైపు ఉన్నట్లుగానే ఉంటాడు .ఒకరోజు నా వైపు ఉంటూ…. ఇంకో రోజు ధ్యానం అంటూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు .తనకి మరణం పిలుపు ఎప్పుడొస్తుందా అని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు . మరోపక్క నేను చచ్చిపోయాను. నేను చచ్చిన శవాన్ని…. చచ్చిన శవాన్ని లాక్కొని తింటావా అని నన్ను అంటాడు. నేను అంటాను…… నువ్వు చచ్చిపోయావా! చచ్చిపోయావని ధ్యాన అనుభవం పొందావు అని అంటావు కాకపోతే నువ్వు బతికే ఉన్నావని ప్రత్యక్షంగా నా వెంట ఉన్నావని నేను అంటాను….. ఆయనేమో నమ్మడు. నాలో లింగ దేహం పోయింది అంటాడు… నేను చచ్చిపోయా అంటాడు… అదేమంటే మోక్షం పొందాను …శరీరం మోక్షం పొందాను… అలా చచ్చిపోయాను…. నీ ఋణం తీరిపోయింది అంటాడు. నీతో కూడా ఋణం తీరిపోయింది కాబట్టి నిన్ను వదిలేస్తా అంటాడు. ఇలా ఏడిపిస్తూ ఉంటాడు ….నవ్విస్తూ ఉంటాడు….. కవ్విస్తూ ఉంటాడు…. మాటలతో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటాడు. నన్ను వదిలేయ్ అంటాడు…. అయినా కూడా నేను పట్టించుకోను. చిన్న పిల్లవాడి మనస్తత్వం అనుకుంటాను. చూస్తూ ఊరుకుంటాను. నవ్వేసి ఊరుకుంటాను. ఏడిపించాల్సిన విధంగా ఏడిపిస్తాను . నవ్వించాల్సిన విధంగా నవ్విస్తూ ….అనుక్షణం యోగ పరీక్షలు పెడుతూ ఉంటాడు . నాలో ఉన్న లోపాలు దోషాలు తీసేసి, నా సాధన ముందుకు తీసుకు వెళుతున్నాడని మాత్రం నాకు అర్థం అయింది. గ్రహించాను. ఆయన ఏదో చేస్తాడు ….నాకు ఏదో మోక్షం ఇస్తాడు అని ఆయన్ని పట్టుకోవట్లేదు. కాకపోతే ఆయన సాంగత్యం పొందాలని మనసు పీకుతూ ఉండేది. ఆయనతో ఉంటేనే నా జీవితం పరిసమాప్తి అవుతుంది. నాకు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆయనతో ఉండాలి అనుకున్నాను . కానీ ఉండలేకపోతున్నాను అని తెలుసుకున్నాను. అందుకనే ఆయన సంసారం వదిలిపెట్టి… సన్యాసి అయినా కూడా వదిలిపెట్టకుండా ఆయన చేయి పట్టుకొని ఉన్నాను . ఆయన నా చేయి వదిలించుకోవాలి….. నన్ను వదిలించుకోవాలి అని శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు . అవి ఎప్పుడూ మనస్ఫూర్తిగా చేయడని నాకు తెలుసు . మాటలతోనే అంటాడు . చేతలతో చేస్తున్నట్టుగా అనిపిస్తాడు. నటిస్తాడు. నన్ను వదిలిపెట్టి ఆయన ఉండడని నాకు తెలుసు. ఆయనని వదిలిపెట్టి నేను ఉండనని ఆయనకి తెలుసు. అన్ని కూడా గమనిస్తాడు…. ఏమీ గమనించినట్టుగానే ఉంటాడు. నా మనసంతా చదివిన వాడే ….అన్నీ తెలిసిన వాడే… ఏమీ తెలియని అమాయకుడిలా ….అజ్ఞానిగాను ఉంటాడు . ఆయన పరిపూర్ణ జ్ఞాని అనే విషయం నాకు తెలుసు అని ఆయనకీ తెలుసు. ఆయన పట్టించుకోడు. నేను పొగిడితే పోగించుకుంటాడు.. అరిస్తే అరిపించుకుంటాడు.. అరిచేటట్టు చేసుకుంటాడు . అరవాలని…. నా ఏడుపు చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదో విధమైన సైకో లాంటి వాడు. అతను అదో టైప్ లే . మా ఆయన గురించి నీకెందుకులే గానీ ….నీకు ఈ చీర కావాలంటే చెప్పు ,తీసుకో! నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు… ఉచితంగానే ఇస్తాను…. చాలా అరుదైన చీర. ఈ చీర దొరకడం చాలా కష్టం. ఒకసారి ఆలోచించుకో అని చీర చేతిలో పెడుతూ ఉంటే ….


శివ నందిని ఉన్నట్టుండి చేతులు వెనక్కి తీసేసుకుంది. 


శివనందిని:- అమ్మ! భోగ జీతం లో ఉన్నప్పుడు ఈ చీర కావాలని అనుకున్నాను. ఈ చీర మీద ఆశ పెంచుకున్నాను. ఇష్ట కోరికగా మార్చుకున్నాను. కానీ నా భర్త నా దగ్గర లేనప్పుడు నాకెందుకు? ఆయన ముందు ఈ చీర కట్టుకొని తిరగాలని అనుకున్నాను. ఇప్పుడు ఆయనే లేనప్పుడు ఈ చీర తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు . ఈ చీర నా బదులు ఇంకెవరికైనా ఇవ్వండి. నాకు ఈ చీర మీద మమకారాలు లేవు. ఆభరణాల మీద మమకారాలు లేవు . ఏదో చావాలని వచ్చాను …చావలేకపోయాను ……ఏదో నా మరణం లోకానికి ఉపయోగపడుతుంది…. మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది అని ….ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పారు. ఏదో చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏవేవో యోగ పరీక్షలు, సాధన పరీక్షలు పెడుతున్నారు. అవన్నీ జయం పొందుతానా? అపజయం పొందుతానా? అన్నది నాకు తెలియదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నాకు చీరల మీద, నగల మీద కోరికలు లేవు. వ్యామోహాలు లేవు. వాటిని ధరించాలని లేదు . వాటిని ధరించి ,భరించే శక్తి నాకు లేదు. నన్ను వదిలి పెట్టేసేయ్…. 


తల్లి అనగానే…..


స్త్రీ మూర్తి :- అదేంటి ? మీ మావిడాకులు, విడాకులు అయినాయా? నీ భర్త నిన్ను వదిలిపెట్టేసి వెళ్లిపోయాడా ? అయినా భార్య భర్తలు అన్నాక గొడవలు వస్తాయి…. సర్దుకుపోవాలి …..పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మా ఆయన ఉన్నాడు….. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సవతి పోరు తీసుకువచ్చాడు. మొదట్లో బాధ వచ్చింది. ఏడుపొచ్చింది. కోపావేశాలకు గురి అయ్యాను . వదిలి పెట్టేస్తే వదిలి పెట్టేసేయ్ ….వెళ్ళిపో ….అన్నాడు . సరే! వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని మూడు నెలలు పుట్టింటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళని చూశాను . భర్తను వదిలిపెట్టి వచ్చిన స్త్రీ పుట్టింటి వాళ్ళు ,ఇరుగుపొరుగు…. సమాజం ఏ విధంగా చూస్తారో నాకు అర్థం అయింది. దాంతో మళ్లీ మెట్టింటికి వచ్చాను. సరే నా చెల్లెలి నే కదా ఆయన చేసుకుంది అని ఇద్దరం సర్దుకుపోయాం. అయినా మా ఇద్దరినీ బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒక ఆరు నెలలు ఆవిడ దగ్గర ఉంటాడు …..ఆరు నెలలు నా దగ్గర ఉంటాడు. ఇద్దరికీ పొర పత్యాలు లేకుండా ఇద్దరినీ బాగా చూసుకుంటాడు. ఆయన ఏదో తప్పు చేశాడని….. నేను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగూ….. ఆయన నన్ను వదిలించుకోలేదు . నన్ను పట్టుకునే ఉన్నాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు . నీ భర్తకు ఇద్దరు భార్యలు ఉండొచ్చు . 10 మంది భార్యలు ఉండొచ్చు…. అర్ధాంతరంగా వదిలేసి వస్తావా? అలా చేయడం తప్పు కదా? పైగా నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు…… పిల్లలు వదిలిపెట్టేసి వస్తావా? నువ్వు సంతానం శివుడు ఇవ్వకపోయినా సంతానం కావాలని చెప్పేసి నీ శివ పూజతో ఆయన అనుగ్రహం పొంది, ముగ్గురు సంతానాన్ని పొందావు. ముగ్గురు నిన్ను నమ్ముకొని నీ గర్భంలోకి ప్రవేశించారు . వాళ్ళని అర్ధాంతరంగా వదిలిపెట్టేసి వస్తావా ? సంసారంలోని భర్త మీద కోపంతో పిల్లల్ని అన్యాయం చేస్తావా? పిల్లల బాగోగులు చూసుకోవా? పిల్లల జీవితాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టేస్తావా ? నీ భర్త తప్పు చేశాడు.. అతని పట్టించుకోవడం మానేశావు… వదిలేసేయి. నీవు నీ మెట్టింటికి వెళ్లి నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా ! ఈ సంసారం వదిలిపెట్టి మోక్ష సాధనలేమిటి ? సన్యాసం తీసుకోవడం ఏంటి ? భర్తే పతిదేవుడు అంటారు కదా ! అనగానే …..


శివనందిని:- అమ్మ ! ఇప్పుడు నా భర్త మీద నాకు మమకారాలు లేవు. సంతానం మీద మోహన వ్యామోహాలు లేవు. ఎవరు ఎప్పుడు ఎలా పోవాలో అలా పోతారు . ఎప్పుడు ,ఎవరికీ ఎలా జరగాలో అలా జరుగుతుంది. వాళ్ల గురించి ఆలోచించే మానసిక స్థితి నాకు లేదు . బాధపడే స్థితి లోనూ లేను. ఆవేదన చెందే స్థితిలోనూ లేను . వాళ్ళని గుర్తుకు చేసుకునే పరిస్థితి కాదు …గుర్తు చేసుకునే సన్నివేశాలు లేవు…. ఎవరికి ఏది ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి …..అదంతా విధిరాత కాబట్టి నేను పిల్లల్ని కన్నాను. వాళ్ళ రాతల్ని నేను కనలేదు. వాళ్ళు నా దగ్గర ఉన్నా కూడా నా రాతలో దూరంగా ఉండి పెరగాలని రాసిపెట్టి ఉన్నప్పుడు ….చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ,దేనికోసమో దూర ప్రయాణాలకు వెళ్లి, దూర దేశాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తే ,ఉద్యోగాలు చేయవలసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు నేను వాళ్ళ దగ్గర లేనట్లే కదా ! నా దగ్గర ఉన్న లేనట్లే అవుతుంది కదా! కాబట్టి నేను సాధనలోకి వచ్చేసాను. వాళ్ళు ఉద్యోగం కోసం చదువుల కోసం దూర దేశాలకు వెళ్లారని మనసులో అనుకుంటాను. నేనేమీ తప్పు చేయలేదు వాళ్లతోను ,నా భర్తతోను రుణాలు బంధం తీరిపోయింది. ఏదో జన్మాంతర ఋణ పాశం ఉండటం వల్ల…. వాళ్ళు వచ్చారు . వచ్చిన వాళ్ళు వెళ్లిపోయారు… వచ్చారు …వెళ్లారు… మధ్యలో నాకేం సంబంధం ఉంది . వాళ్ళ కర్మానుసారం నా కడుపులో పుట్టారు. పెరిగారు. చదువులు ,ఉద్యోగాలు చేసే స్థితికి వచ్చారు. కాలానుగుణంగా పెళ్లిళ్లు చేసుకుంటారో ….. పిల్లల్ని కంటారో ….. సంసారులవుతారో ….. సన్యాసులు అవుతారో….ఎవరికి ఎరుక. ఎవరి గురించి ఎవరు పట్టించుకోవాలి? ఒకవేళ నేను చనిపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవు కదా! వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతారు కదా! నేను ఉన్నా లేకపోయినా విధిరాత ప్రకారమే జరుగుతుంది కదా ! నాకెందుకు …..ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడో ….ఇంకోదాన్ని తెచ్చుకొని వాళ్ళకి అమ్మనే చేస్తాడో ….లేదా మా అత్తమామలే చూసుకుంటారో…..వాళ్లకి కావలసిన వంశ వారసులు. వాళ్ళు నా వంశ వారసులు వాళ్ళు కాదు . కేవలం నేను కనడం వరకే …వంశాలు చూసుకునేది వాళ్ళు. బాధ్యతలు చూసుకునేది వాళ్లు …ఆయన పిల్లల్ని చంపుకుంటాడో… ఉంచుకుంటాడో ….దత్తకి ఇస్తాడో ….లేదా అనాధ శరణాలయంలో పడేస్తాడో ….నాకు సంబంధం లేదు. నేను పట్టించుకోదలచుకోవట్లేదు ..వాళ్లతో ఋణం తీరిపోయింది. అందరితోనూ ఋణం తీరిపోయి ఋణ పాశాలు తీర్చుకొని…. చావు దాకా వెళ్ళి ….వెనక్కి వచ్చిన దాన్ని . చావు భయం లేని దాన్ని…. ఇంకెందుకు నాకు ఇది ….


స్త్రీ మూర్తి:- అమ్మాయి! నీ మాటలు చూస్తుంటే….. నువ్వు పైరాగ్యం బాగా చెందావు…. ఇప్పుడు నీకు ఎవరి మాటలు అర్థం కావు. పట్టించుకోవు అని అర్థమయింది. ఇది పురాణ వైరాగ్యం కాదు… స్మశాన వైరాగ్యమే అని అర్థమయింది . నువ్వు చావు దగ్గరికి వెళ్లావు అంటే ఇక నిన్ను ఎవ్వడు ఆపలేడు. చావు భయం పోయింది. సరే! నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది . యోగం ఉంటే యోగినీ కాక తప్పదు…. అనే శాస్త్ర వచనం ఉంది కదా! నీ రాతలో అది రాసిపెట్టి ఉంది . నీకు ఎన్ని చెప్పినా నువ్వు మారతావని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు ….ఎవరో బలవంతంగా ఏదో సాధించాలని, ఏదో పొందాలని అయితే నువ్వు సాధన లోకి రాకు . ఏదీ ఆశించొద్దు…. ఆశించి పడ్డావంటే ధ్యానభంగం అవుతుంది. నీ సాధన జీవితం వ్యర్థమవుతుంది. కాబట్టి మోక్షం పొందాలి అనే కోరిక కూడా వదిలిపెట్టు. అందుకే భగవద్గీతలో 18 వ అధ్యాయంగా మోక్ష సన్యాస యోగం చెప్పడం జరిగింది. మోక్షమును కూడా వదిలిపెట్టే అంత మానసిక పరిస్థితి ఉండాలి. ఎందుకు అంటే బుద్ధుడు జీవిత చరిత్ర చూడు. కోరికలే కష్టాలకు మూలం అని తెలుసుకొని చివరకు ఆయన సాధన పరిసమాప్తి చేసుకునే సమయంలో, కోరికలేని సమాజాన్ని చూడాలనే కోరిక పెట్టుకున్నాడు . కోరిక కోసం ఆయన మరణం పొందకుండా ఇప్పటికీ బుద్ధగయలో నిత్య చిరంజీవిగా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉన్నాడు అని ….బౌద్ధ లామాలు చెప్పడం జరుగుతుంది . బుద్ధ పౌర్ణమి నాడు వాళ్లకి ధ్యానంలో దర్శనం ఇస్తూ ఉంటాడని చెప్పడం కూడా ఉంది. కాబట్టి మోక్షం పొందాలి అనే కోరిక కూడా నువ్వు పెట్టుకోవద్దు. కోరికకి అతీతమైన స్థితిని పొందు. నీ ఇష్ట కోరిక గా ఉన్న చీర కనిపించినా కూడా దాన్ని వదిలేసే మానసిక పరిస్థితికి వచ్చావు కాబట్టి…. నువ్వు కోరికలు నెమ్మది నెమ్మదిగా వదిలించుకుని కోరిక రాహిత్య స్థితిని పొందు. ఇంతకంటే నేనేం చెప్పను. మా ఆయన వెళ్ళిపోతున్నాడు…. పట్టుకోవాలి ….లేదంటే దొరకడు అని…. దిగంబర స్వామి వైపు శరవేగంతో వెళ్ళిపోతుంది.  



శివ నందినికి చీర ఇవ్వకుండా తన సంచిలోనే వేసుకుని వెళ్ళింది. ఇదంతా ఓరకంట గమనించిన శివ నందిని అసలు వీళ్లంతా ఎవరు..,, ఎందుకు వస్తున్నారు? నిజంగా నాకు సాధన పరీక్షలు, యోగ పరీక్షలు అంటే ఇవేనేమో ! అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయేమో! ఇవన్నీ కూడా పరీక్షలు అయి ఉంటాయి…. కాకపోతే నా కోరికలకు తగ్గట్టుగా వీళ్ళు వస్తువులు తీసుకోని రావటమేంటి? ఆభరణాలు తీసుకొని రావడమేంటి? ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యం ఉంది …అన్నీ తెలిసిన రుద్ర స్వామి ఏమీ చెప్పడు…. మౌనం వహిస్తాడు. ఏమీ తెలియని దాన్ని తెలుసుకోవాలంటాడు. జ్ఞానం విజ్ఞానం తనకి సాధన ద్వారా వస్తుందని మౌనం వహిస్తాడు అని రుద్రస్వామి కేసీ అదోలా చూసి …..మళ్ళీ ధ్యానంలో కూర్చుంది. ఓహో అమ్మవారి అంశ అయిన దత్తాత్రేయుని భార్య అయిన అనఘా దేవి నా ఈవిడ …..ఈవిడ కూడా శివ నందినిని చీర మాయలో పెట్టి.. పరీక్ష చేసిందని అర్థం చేసుకొని ఈమెకి వస్తు మాయ లేదని అర్థం చేసుకొని రుద్రస్వామి గ్రహించి మౌనం వహించి… తన యోగ నిద్రలోకి తాను వెళ్ళిపోయాడు.


ధ్యానంలో ఉన్న శివనందినికి ఉన్నట్టుండి తనకి ఇష్టమైన ఆహార పదార్థాల రుచులు వాసన ముక్కుకి తగిలేసరికి ధ్యానభంగం అయింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి….. ఎదురుగా భిక్షాటన చేసుకునే భార్యాభర్తలు భోజనాలు చేస్తూ కనిపించారు. వాళ్లు తనకి ఇష్టమైన ఆహార పదార్థాలు ఉన్న బాక్సులు తెరుస్తున్నారు. అంటే వీళ్ల దగ్గరలో ఉన్న ఒక హోటల్లోనో …ఆశ్రమంలోనో ….భిక్షాటన చేసి ఆహార పదార్థాలు తెచ్చుకున్నట్టు ఉన్నారు . కాకపోతే విచిత్రం ఏమిటంటే….. అవన్నీ తనకి ఇష్టమైన ఆహార పదార్థాలే! ఆ ఆహార పదార్థాలు కావాలని హోటల్లో ఆర్డర్ చేసుకొని తిని మరి సంతృప్తి పడేది. లేదంటే ….తనే వండుకొని తిని సంతృప్తి చెందేది. అది వీళ్ళ మనసుకి తెలిసినట్టుగా …..అవే పదార్థాలు తెచ్చుకొని తినటం చూసేసరికి తనకి ఏమి అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది….. ఒక్క క్షణం చూసింది ఈమె కళ్ళు తెరిచి చూసిన విషయం ఆ బిక్షకులు చూసి …


బిక్షకులు:- అమ్మ! ఇది మేము అడుక్కుని తెచ్చుకున్నది కాదు …..ఎవరిదో పెళ్లి బంతి భోజనం అనుకుంటా ! మిగిలిపోయింది అని తీసుకువచ్చారు. ఇవన్నీ మాకు ఎవరు పెడతారు? అడుక్కున్నా కూడా ఎవరూ ఇవ్వరు కదా! పెళ్లి భోజనం అని మాకు కూడా తీసుకువచ్చారు. అందరం కలిసి తినవచ్చు…. శుభ్రంగా సరిపోతుంది. కావాలంటే చెప్పు …..ఇది అడుక్కుంటే వచ్చింది కాదు ! అనుకోకుండా వచ్చిన పదార్థం…. బాగున్నాయి…. చాలా రుచిగా ఉన్నాయి… ఇప్పుడే వేడివేడిగా తయారు చేసినట్టున్నారు… 


అని అంటూ ఉండేసరికి….. ఆ వాసన కూడా గుమాలించి కొట్టేసరికి దాదాపు సంవత్సరం అవుతుంది . తను మసాలా ఆహారం తిని…. ఈ కాశి క్షేత్రానికి వచ్చిన తరువాత పులిహోర , దద్దోజనం, చెక్కర పొంగలి, లేదా ఇడ్లీ, దోశ ,చపాతి లేదంటే పెరుగు అన్నం తినటం ఆనవాయితీగా పెట్టుకుంది . బిర్యాని మసాలా పదార్థాలు తినడం మానేసింది …అది భోగ జీవితం కదా! భోగ పదార్థాలు మనకెందుకు అని….. యోగ జీవితానికి వచ్చాను కాబట్టి దానికి తగ్గట్టుగా సాత్విక ఆహారం తినడం అలవాటు చేసుకుంది. ఎందుకంటే ఆహారాన్ని బట్టి మనసు ఉంటుంది . మనసును బట్టి ధ్యానం ఉంటుందని చెప్పి శాస్త్రవచనం ఉన్నది కదా! మనసుకి ,ధ్యానానికి శరీరం సహకరించాలి కాబట్టి …..సాత్విక ఆహారం తీసుకుంటే శరీరం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. మెదడుకు ఎక్కువగా శ్రమ పడదు. మనం ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది అని తెలుసుకొని సాత్విక ఆహారం మాత్రమే చేయడం మొదలుపెట్టింది. భక్ష్యభోజ్యాలు, మసాలాలు తనకి ఇష్టమైన పదార్థాలు… ఎవరో తన మనసులో ఉన్న పదార్థాలు అని తెలుసుకొని అందులో వీళ్ళకి చేతికి ఇచ్చి పంపించాడు అన్నట్టుగా ఉంది . అన్నింటినీ తేలిపార చూసింది. నీళ్ళూరాయి. అందులోనూ కొత్త ఆవకాయ పచ్చడి కూడా ఉంది. మిరపకాయ బజ్జీలు ఉన్నాయి ….మరోపక్క బిర్యాని, మరోపక్క కోడిగుడ్డు పులుసు, చేపల పులుసు, చికెన్ వేపుడు ఇలా రకరకాల పదార్థాలు ఊరిస్తూ ఉండేసరికి కళ్ళు మూసుకున్నప్పటికీ, ధ్యానంలో శివుడు కనిపించడం బదులు ……పదార్థాలు కనిపించేసరికి ఇలా కాదనుకొని వెళ్లిపోదామని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే …..“ఆహార పదార్థాల రుచినే దాటలేని దానివి…… నువ్వేం సన్యాసానికి పనికి వస్తావు” అంటూ ఉంటే ఈ మాట ఎవరన్నారు అని చూసేసరికి రుద్ర స్వామి ధ్యానంలో కనబడ్డాడు. ఎక్కడ నుంచి మాట వినపడిందో అర్థం కాలేదు. తన మనసులో నుంచి ఈ మాట వచ్చింది అనుకొని….. నిగ్రహించుకోవాలని చెప్పి, వాళ్ళు వెళ్లేదాకా తను ఏమీ ఆశించకుండా ఉండాలని చెప్పి ,కూర్చొని …..వాళ్ళు తింటూ ఉన్నంతసేపు చూస్తూ, మనసుని నిగ్రహించుకుంటూ….. పదార్ధ రుచులు పట్టించుకోకూడదని….. వాసనలు పీలుస్తున్నప్పటికీ కూడా మనసుని అదుపు చేసుకుంటూ అలాగే ఉండిపోయింది . దాదాపు వాళ్లు ఒక గంటసేపు పైగా ఈ ఆహార పదార్థాలు తిని పీల్చి పిప్పిచేసుకుని…… ఖాళీ డబ్బాలు, చేతి సంచిలో పెట్టుకొని ఈ బిక్ష దంపతులు వెళ్లిపోయారు . అప్పటిదాకా తనని తాను చాలా నిగ్రహించుకుంది. తమాయించుకుంది. నిలబడింది. ఇవాల్టితో పదార్ధ రుచి మాయలు దాటడం అయ్యింది . పదార్థాలు తన ముందుకి వచ్చినా కూడా స్పందించవలసిన అవసరం లేదు . స్పందనలు ఆగే స్థితికి వచ్చింది. మనసు పదార్థా ల రుచి మాయ దాటడం…. ఇది హృదయ చక్రం దగ్గర ఇష్ట కోరిక మాయ ఉంటుందని చెప్పేసి పరమహంస గారు ఎప్పుడో చెప్పారు కదా! ఆయనేమో మిరపకాయ బజ్జీలు దాటలేక ఇబ్బంది పడ్డారని తెలిసింది . ఇప్పుడు నాకు ఐదు రకాల పదార్థాల ఇష్టపదార్థాలు చూపించడం మొదలుపెట్టాయి. వాటన్నింటినీ మానసికంగా శారీరకంగా దాటుకోవడం ఎలా అనేది తెలుసుకోగలిగింది. దాటానని గ్రహించింది . ఇష్ట కోరిక అయిన కాషాయ రంగు ఆకుపచ్చ అంచు ఉన్న చీర కోరికను కూడా దాటగలిగింది. అంటే ఒక విధంగా ఇవి కూడా పరీక్షలై అన్న మాట! ఈ పరీక్షలు మనం నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ వస్తున్నాం…. సరే అని ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసుకుంటూ ఉండగా…


 అమ్మ నన్ను వదిలిపెట్టేసి వెళ్లిపోయావా ? నన్ను వదిలి పెట్టేసి వచ్చేసావా? నేను నిద్రపో పోయినప్పుడు లేపచ్చు కదా! అని గొంతు వినపడేసరికి బాలగణపతి గొంతు అని గ్రహించి కళ్ళు తెరిచి


శివనందిని:- అలా ఏం లేదురా! నాన్న! నువ్వు మంచి నిద్రలో ఉన్నావని ఎందుకు లేపడం అనిపించింది. అయినా నీకు ఆకలేస్తే తినడానికి ఉండ్రాళ్ళు చేసి పెట్టి వచ్చాను కదా! 


బాలగణపతి:- ఆ ! మంచి పని చేశావు. నా ఆకలి తెలిసిన తల్లి కదా! నా మంచి అమ్మవి కదా! భైరవికి కూడా దానికి కావలసిన అన్నం పెట్టేసి దాన్ని కూడా తీసుకువచ్చాను. కాకపోతే భైరవి కాలభైరవ గుడికి వెళ్ళిపోయింది. సరే ! అని దాన్ని వదిలేసి వచ్చాను . నువ్వు ఇక్కడ ఇక్కడే ఉంటావని ఇక్కడికి వచ్చాను. ఏంటి? ఏం చేస్తున్నావ్? ధ్యానం చేసుకుంటున్నావా? నేను నిద్రలో ధ్యానం చేయడం మర్చిపోయాను…. అయినా నా నిద్ర యోగ నిద్రలే… తిండి తినడం వలన వచ్చిన నిద్ర అంటారు గానీ ,నాది మాత్రం యోగనిద్రే . గురక పెట్టి యోగ నిద్రపోతున్నాను…. అనుకున్నా అనుకో….. భోగ నిద్ర కాస్త యోగనిద్ర అయిపోతుంది కదా! యద్భావం తద్భవతి అంటారు కదా! అమ్మ ! అంతే… సూక్ష్మంలో మోక్షం. మనం భోగ నిద్ర అంటే భోగ నిద్ర… యోగనిద్ర అంటే యోగ నిద్ర ….ఏది కావాలంటే అదే… ఏది తినాలనిపిస్తే అది తినాలి ….ఏది మనసుకు చేయాలనిపిస్తే అది చేయాలి…. మనసుకి నచ్చినట్టు ఉండాలి…. సరేలే! నువ్వు ధ్యానం చేసుకో. నేను అట్టా గుళ్ళు గోపురాలు, ఘాట్లు వైపు తిరిగేసి వస్తాను… సాయంత్రం తింటానికి నీ దగ్గరికి వస్తాను . నాకు ఉండ్రాళ్ళు చేసి పెట్టి ఉంచు. అయినా నేను నీకు చెప్పక్కర్లేదులే… బిడ్డ ఆకలి తల్లికి తెలియదా! నేను బయట ఎంత తిన్నా కూడా బయట నుంచి వచ్చి ఉండ్రాళ్ళు తినాల్సిందే ! నువ్వు ఉండ్రాళ్ళు చేయాల్సిందే! తప్పదు…. నన్ను భరించాల్సిందే! తల్లికి బిడ్డ భారం కాదులే ! నాకు తెలుసులే .!


అని అంటూ….. శివ నందిని ఏం మాట్లాడుతున్నదో వినిపించుకోకుండా శరవేగంగా మణికర్ణిక ఘాటు నుంచి పంచగంగా ఘాటు వైపుకి పరిగెత్తి వెళ్ళిపోయాడు . వాడిని అలా తేరిపారా చూస్తూ వీడు నిజంగా భోగ జీవితంలో ఉంటే పుత్ర వ్యామోహం కలిగించేవాడు. యోగ జీవితంలో ఉన్నాను…. కాబట్టి దాటుకునే మనసు మానసిక స్థితి ఆ శివుడు ఇస్తున్నాడు అనుకుని…. ధ్యానంలో కూర్చుంది . కూర్చునే సరికి రుద్ర స్వామి కళ్ళు తెరిచాడు. ఇప్పుడు ఈయనకి ధర్మ సందేహం వచ్చిందా ధ్యానభంగం అయిందా? కళ్ళు తెరిసాడు అనుకునేసరికి…..


రుద్రస్వామి:- ఏంటి! బాలగణపతి వచ్చి వెళ్ళిపోయాడా….


శివనందిని:- అవును స్వామి! వచ్చి వెళ్ళిపోయాడు. వాడితో ఏమైనా పనుందా?


రుద్రస్వామి:- వాడితో నాకేమీ పనిలేదు ….ఈమధ్య వాడు నా దగ్గరికి రావడం మానేసాడు… మహాదేవి దగ్గరికి వెళ్ళటం మానేశాడట! ఎప్పుడైనా ఆహారం కోసం వెళ్లేవాడు . ఇప్పుడు ఆవిడ దగ్గర కూడా వెళ్ళటం లేదట! నా దగ్గరికేమో కబుర్లు చెప్పడానికి వచ్చేవాడు. నా దగ్గర కూడా రావట్లేదు… ఏంటి అని అడుగుదామని అనుకున్నాను . అయినా వాడు నీ సమక్షంలో నీ దగ్గర సుఖంగా ఉన్నాడు కదా! మీ ఇద్దరి మధ్య పొరపత్యాలు లేవు కదా! ఇబ్బందేమీ కలిగించట్లేదు కదా!


శివనందిని:- అలా ఏమి లేదు స్వామి! వాడు నాకు తోడు ఉండడం చాలా మంచిగా అయింది. నేను బాధపడుతున్నప్పుడు, ఏకాంతం ఒంటరితనంగా అనిపించినప్పుడు…. వాడు తోడు ఉండటం వల్ల మానసిక సంఘర్షణలు తగ్గిపోతున్నాయి. ఇక వీడి ముద్దు ముద్దు మాటలు వీడు చేసే చేష్టలకి మనసుకి సంతృప్తి కలుగుతుంది.  


రుద్రస్వామి:- సరే జాగ్రత్తగా ఉండండి …నేను అన్నం తినడానికి వెళ్తున్నాను….నువ్వు కూడా అన్నం తినేసి మధ్యాహ్నం రా ! నీ సాధన పరీక్షలు యోగ పరీక్షలు దాటుకుంటూ ఉండాలి కదా! ఈ ఒక్క రోజుతోనే అయిపోతుందో…. 6 నెలల లేదా సంవత్సరం పడుతుందో….. ఎవరికి ఎరుక. ఇప్పటివరకు జరిగినది అన్నీ కూడా సాధనా పరీక్షలే ! యోగ పరీక్షలే! అవన్నీ గుర్తుపెట్టుకో! అవన్నీ నీ శరీరానికి, నీ మనసుకి, నీ బుద్ధికి సంబంధించిన పరీక్షలు. వీటన్నింటిలో జయం పొందావు . నీకు మానవ మాత్ర గురువులు పరీక్ష పెట్టడం లేదు. ఏకంగా దైవాలే మనుష్య రూపంలో వచ్చి పరీక్షలు పెడుతున్నారు అని నాకు అర్థం అయింది . ఎప్పుడు ఏ క్షణాన, ఎలాంటి పరీక్ష పెడతారో తెలియదు అని అంటూ ఉండేసరికి ….


సుమారు 50 అడుగుల పాము గబగబా శివ నందిని వైపు రావడం గమనించి…. అది విష సర్పం, కాలసర్పం, దాని విషం గాలికే మనం చచ్చిపోతాము….. కాటు వేయాల్సిన అవసరం కూడా లేదు. దాని నుంచి వచ్చే గాలికే మనం చచ్చిపోతాము. ఇది చాలా శక్తివంతమైన సర్పము. గంగా నదిలో ఉంటుంది. ఎప్పుడు రాదు .రాత్రిపూట వస్తుంది .ఇది నాగ లోకంలోకి వెళుతుంది అంటారు .అలాంటి శ్వేత వర్ణంలో ఉన్న సర్పం నీవైపు వస్తుంది. తప్పుకో ! తప్పుకో ! నిన్ను కాటు వేస్తుందో….. చంపేస్తుందో…. లే! లే! అని అనేసరికి ……


శివనందిని:- స్వామి! పామును చూసి భయపడితే ఎలాగా! అది దేనికోసం వస్తుందో తెలీదు. ఇప్పుడు నేను భయపడి… దాన్ని భయపడితే… అది కూడా భయపడితే …నన్ను కాటు వేయాలని …చంపాలని చూస్తుంది . ఏ కారణం చేత అయినా గాని, అకారణంగా అయినా గాని జంతువులు మనకి హాని చేయవు. జంతువులకి మన వలన ప్రమాదాలు కలుగుతాయి అని భయపడి మనకి హాని కలిగిస్తాయి. వాటి మానాన వాటిని వదిలేస్తే మనల్ని ఇబ్బంది పెట్టవు. దాని దారిన అవి వెళ్లిపోతాయి. కాకపోతే అవేదో హాని చేస్తాయని వాటిని భయపెడతాము. తద్వారా అవి భయపడతాయి. ఎందుకు మనం నిర్మలంగా, ప్రశాంతంగా, మానసిక ప్రశాంతతతో ఉంటే అవే వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుక్కల్ని చూస్తే భయపడుతున్నామా ? పాములు చూస్తే ఎందుకు భయపడాలి! భయపడాల్సిన అవసరం లేదు. నేను లేవను…. అది ఏం చేస్తుందో చూస్తాను అని వెనక్కి తిరిగి చూస్తే, ఆ పాము శరవేగంతో వచ్చింది . అలాంటి తెల్లని పామును తాను ఇంతవరకు చూడలేదు. సుమారుగా 50 అడుగుల పాము అంటే సామాన్యమైన పొడుగు కూడా కాదు . మహా అయితే తన జీవితంలో 10 లేదా 12 అడుగుల పామును చూసింది . ఇది ఏకంగా 50 అడుగులు ఉంది అనేసరికి…. ఎంత ఉంటే ఏమైంది లే! అది ఎందుకు వస్తుందో…. ఇది దేనికైనా భయపడి వస్తుందా! ఎక్కడైనా ఆహారం ఉందని వెతుక్కోవడానికి వెళ్తుందా! లేకపోతే ఎక్కడైనా రక్షణ దొరుకుతుందేమో అని వెళుతుందో అని అనుకునేసరికి….. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంది.  


రుద్ర స్వామి ఏం జరుగుతుందా! అని చూస్తూ ఉన్నాడు . సరే ఏం జరిగినా మన మనకేం సంబంధం లేదులే! అని ….ఆయన కళ్ళు తెరిచి ఆ పాముకేసి చూస్తున్నాడు. ఈ శివ నందిని ఏమో నాకేం సంబంధం లేదు…. నాకేం పట్టదు అని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండిపోయింది . ఆ పాము కాస్త శివనందిని దగ్గరికి వచ్చింది.ఈ పాము కాస్త శివ నందినిని దాటి వెళ్ళిపోతుందని రుద్ర స్వామి అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఈ పాము శివనందిని శరీరం మీద పాకుతూ మెడని చుట్టుకుంటూ మిగతా శరీరం అంతా తిరుగుతూ తన చీరలోనికి చొప్పించుకుంటూ …..దాక్కుంటూ ఉండేసరికి…. శివ నందిని ఆ అలికిడికి కళ్ళు తెరిచి చూసింది . తన మెడకి పాము చుట్టుకుని ఉందని గ్రహించింది. తన చావు ఈ పాము చేతిలో రాసిపెట్టి ఉందేమో….. సరేలే! పాము చేతిలో చావాలని ఉందేమో! నేను ఎలాగూ చావాలనుకున్నా కానీ చావలేకపోయాను. కనీసం ఈ పాము చంపితే మంచిదే కదా ! చావు ఎలాగైనా రావచ్చు కదా! ఇది అనాయాస మరణం. పాము కాటు వలన చనిపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎవరి చేత సేవలు చేయించుకోకుండా…..మంచం మీద పడకుండా అనాయాస మరణం పొందవచ్చు. ఇంతకన్నా సులువైన మరణం రాదు కదా! యోగం ఉంటే ఇలాంటి మరణం వస్తుంది అని ఈ పాముకాటు వేస్తుందా? ఏం చేస్తుంది! అని కదలకుండా, మెదలకుండా చచ్చిన శవంలాగా అలాగే ఉండిపోయింది. పాము ఉన్నచోట ఉండకుండ…. శరీరమంతా తాకుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఈ పాము యొక్క స్పర్శ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఆ పాము స్పర్శకు శరీరంలో గగుర్పాటు….మనసులో అదోలా అనిపించడం…. ఏదో తెలియని భయం మొదలయ్యింది.మనసును అదుపు చేస్తూ వచ్చింది. శివుడి మెడలోనే నాగాభరణం ఉంది. పాములే నాగాభరణం గా ఉంటాయి. పాములేసుకునే వాడికే భక్తురాలిని …. నా మెడలోకి పాములు వచ్చినంత మాత్రాన భయపడడం ఎందుకు? ఇది కాటు వేసినా మంచిదే, కాటు వేయకపోయినా మంచిదే! ఏది జరిగినా కాల నిర్ణయానికి వదిలేద్దాం. ఆ కాల శివుడికి వదిలేద్దాం. కాలభైరవుడికే నిర్ణయం వదిలేద్దాం. ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటూ కూర్చుంది. 


 దాదాపు 30 నిమిషాల దాకా ఆ పాము అలాగే ఉండిపోయింది. ఆ పాము తన శరీరం అంతా పాకింది. అయినా తను విదిలించుకోవడం…. తొలగ తోలడం లాంటివి ఏమీ చేయలేదు. అలాగే ఉండిపోయింది . కదల్లేదు… మెదల్లేదు… ఎంతసేపు చూసినా ఆ పాము ఏమీ చేయకపోయేసరికి ….సరే! ఇది తనని కాటు వేయదని గ్రహించి…. మౌనంగా ఉండిపోయింది . కొంతసేపు తర్వాత ఆ పాము శివ నందిని శరీరాన్ని వదిలిపెడుతూ…. కిందకి పాకుతూ తన కళ్ళముందే గంగా నదిలోకి వెళ్లిపోయింది . ఇదంతా కూడా రుద్ర స్వామి కల్లార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఆయనకి పాములు అంటే భయం ఉన్నట్లుగా నటిస్తాడు…. నిజంగా భయమో ఏమో తెలియదు. ఆ పాము గంగా నదిలోకి వెళ్లిపోయాక…


రుద్రస్వామి:- అమ్మో! నాకు పాములంటే చాలా భయం. పాముల్ని ముట్టుకోవాలంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది. వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. నువ్వేంటే తల్లి ! ఏకంగా ఆ పామును నాగాభరణం లాగా ఒంటిమీద పాకించుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకు శివనాగిని లాగా కనిపించావు ఒక్క క్షణం పాటు…. అంత పెద్ద పాము 50 అడుగుల పాము నీ శరీరాన్ని అంతా చుట్టేసింది . అయినా కానీ నువ్వు కదలకుండా ,మెదలకుండా శిలా విగ్రహం లాగా ఉండిపోయావు. నువ్వు పాము భయంతో చచ్చిపోయావేమో అనుకున్నాను. శరీరం బిగిసుకుపోయిందేమో అనిపించింది. నువ్వు బతికావ్ అయినా పాము కాటేస్తే నువ్వు ఏం చేసే దానివి …దాన్ని విదిలించొద్దా ?ఏం చేయవా?


శివనందిని:- చావాలనుకున్న దాన్ని స్వామి! పాము కాటు వలన నాకు అనాయాస మరణం వస్తుంది అనుకుంటే… అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు కదా! పాము కాటు వేయాల్సిన చోట కాటు వేయకుండా నాలో పాజిటివ్ శక్తిని చూసి నేను హాని కలిగించను అని ….నా శరీరంతో ఆటలాడుకొని పుట్ట అని భావించుకొని…. చాలాసేపు ఉన్నది. ఆ తర్వాత నా శరీరంలో శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉండేసరికి …ఇది పుట్ట కాదు అని. ఇది ఒక శరీరం అని గ్రహించి, నాతో ఉంటే ఎప్పటికైనా ఆపద కలుగుతుందేమో అని ఆలోచించి పాము వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుంది . 


రుద్రస్వామి:- నువ్వేమైనా పాముల శాస్త్రం చదివావా? నువ్వేమైనా పాములు పట్టే దానివా ? పాముల దగ్గర అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా? చావాలనుకుంటే పాము కాటుతో చస్తావా? ఆ కాటు వేసినప్పుడు ఆ విషము వల్ల వచ్చే నొప్పి శివుడంతటివాడే భరించలేకపోయాడు. సాగరం మథనంలో వచ్చిన హాలాహలమును సేవించి….. పది లక్షల శక్తిని తట్టుకోలేక అల్లాడిపోయి గిలగిలలాడిపోతూ ఉంటే….. తన భార్యగా ఉన్న ఆదిపరాశక్తి కాస్త తారా దేవిగా వచ్చి చనుబాలు ఇచ్చి ఆయనకి విషాగ్ని నుంచి విముక్తి కలిగించింది. నువ్వేమనుకుంటున్నావు విషాన్ని భరించడం అంటే! అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? విషయం విషమించకుండా ఉండాలి …..విషమించి ఉంటే పాము కాటు వేసేది . చచ్చేదానివి…. కుక్క చావు చచ్చేదానివి. ఇలాంటి ప్రయత్నాలు చెయ్యమాకు…. ఎప్పుడైనా పాములొస్తే తోలేసేయ్! వదిలేసేయ్ దూరంగా ఉండు. యోగ పరీక్షలు, భోగపరీక్షలు అనుకుంటూ ఇది కూడా ఏదో ఒక పరీక్ష అనుకొని లేనిపోనివి పెట్టుకోమాకు! లేనిపోని సమస్యలు తెచ్చుకోమాకు! పాము కాటు వేస్తే అద్దాంతరంగా నువ్వు చస్తావు! కోరిక తీరక రుద్ర పిశాచంగానో …. దయ్యం గానో…. భూతం గానో పునః జన్మలకి వెళ్తావు. ఎందుకు ఇవన్నీ అవసరమా? సహజ సిద్ధమైన మరణం రావాలి గాని….. అర్ధాంతర చావు ఎందుకు పొందాలి అనుకుంటున్నావు! అది పాము కాటయినా గాని…. ఇంకో జంతువు కుక్క కాటు అయినా గాని… పిల్లి కాటయినా గాని…. అది ఏదైనా గాని అర్ధాంతర చావును కోరుకోవద్దు . అర్ధాంతర చావును పొందాల్సి ఉంటుంది అనాయాస మరణం పొందాలి అనుకో! అదే నీకు మోక్షమరణం అవుతుంది. అంతేగాని తప్పుడు ఆలోచనలు చేయమాకు! తప్పుడు నిర్ణయాలు తీసుకోమాకు!  


అని చెప్పి నా గదికి నేను వెళ్తున్నాను. నీ గదికి నువ్వు వెళ్ళు. వాడు సాయంత్రం వస్తాడు లే! నీ దగ్గరికి…. దారిలో కనబడితే చెప్తాను వాడికి! నీ దగ్గరికి వెళ్ళమని…. అనేసరికి 


సరే స్వామి! నేను వెళ్తున్నాను అని దారిలో హోటల్లో భోజనం చేసి ఉపశమించడానికి తన గదికి వెళ్ళింది . ఇలా గదిలోకి వెళ్లి మంచం మీద నిద్రపోతున్నప్పుడు….. తనకి పెట్టిన ఒక్కొక్క పరీక్షను లెక్కేసుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టింది . వజ్రాల హారం పరీక్ష పెట్టారు…. అంటే తనకి వజ్రాల మీద ఆశ ఉందా లేదా అని చూశారు. ఆశ లేదని గ్రహించారు. ఆ తర్వాత బంగారు రససిద్ధుడు వచ్చి బంగారం పరీక్ష పెట్టాడు….. ఆ తరువాత బంగారం మీద మమకారం లేదని గ్రహించారు…. ఆ తర్వాత ఒక నగ్న స్వామి దిగంబరంగా వచ్చాడు… నగ్నత్వ పరీక్ష పెట్టాడు. పురుష నగ్నత్వం మీద తనకి మోహ, వ్యామోహం కోరిక లేదని తెలుసుకున్నారు. ఆ తరువాత ఇష్ట కోరిక అయిన చీర పరీక్ష పెట్టారు . భోగ జీవితానికి అవి అంకితం అయిపోయినాయి అవన్నీ…. పరిత్యాగం చేశానని తెలుసుకున్నారు ఆఖరికి పాము రూపంలో చావు భయం పరీక్ష పెట్టారు . నేను భయపడక పోయేసరికి చావుభయ రాహిత్య స్థితి పొందినానని గ్రహించి ఉంటారు. ఇంకా ఇలాంటివి ఎన్ని పరీక్షలు ఉన్నాయో? అయిపోయి ఉంటాయా ? అయిపోయాయా ? ప్రకృతి ఏం చేస్తుందో ఏమోలే! అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయింది . ఉన్నట్టుండి మధ్యాహ్నం మూడు గంటలు కి మేలుకో వచ్చింది. లేచి చూస్తే పక్కన బాలగణపతి వచ్చి పడుకున్నట్టుగా కనిపించింది . వీడికి సాయంత్రానికి ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి కదా ! అని ఉండ్రాళ్ళు చేద్దామని చేసి పెట్టింది. ఆ ఉండ్రాళ్ల వాసనకి గాఢ నిద్రలో ఉన్నవాడు లేచి…. 


బాలగణపతి:- అమ్మ! ఉండ్రాళ్ళు చేసావా? ఇప్పుడు తింటే రాత్రి ఆకలేస్తుందిగా…. సర్లే ఒకటో రెండో తింటాను. మిగిలినవి రాత్రి తింటాను.


 అవునమ్మా! నీకేమో పరీక్షలు పెట్టారని రుద్రయ్య చెప్పాడు . ఏమిటా పరీక్షలు …సాధనా పరీక్షలా….నాకు పెట్టారు… ఏవో దిక్కుమాలిన పరీక్షలు. నాకు ఉండ్రాళ్ళు చూపించేసరికి నేను విజయం సాధించలేకపోయాను . నా ముందు ఒక ఆవిడ, ఒక ఆయన వచ్చి ఉండ్రాళ్ళు తింటూ ఉన్నారు. నాకు పెట్టకుండా ఆశ చూపిస్తూ తింటావా ? తింటావా? అని ఉండ్రాళ్ళు తింటున్నారు. నాకు తిక్కరేగి వాళ్ళ దగ్గర ఉన్న ఉండ్రాళ్ళు తీసుకొని… మొత్తం తినేసాను. తిన్న తర్వాత వాళ్లు మాయం అయిపోతూ …..నువ్వు ఈ పరీక్షలో అపజయం పొందావు. ఈ ఉండ్రాళ్ళు తింటూ కోరిక తీర్చుకో ! అప్పుడే నీకు మోక్షం వస్తుంది ….నీ మరణమే మోక్షమరణం అవుతుంది…. అని దీవించి వెళ్ళిపోయారు. అదేమంటే అన్నపూర్ణేశ్వరి విశ్వనాథుడు అని రుద్రయ్య అన్నాడు. అన్నపూర్ణమ్మ నీకు ఆహార పరీక్షలు పెట్టింది అన్నాడు. నీకు కూడా పెట్టి ఉంటారులే! నీకు కావలసిన ఇష్టమైన బిర్యానిలు, అవి పెట్టేసి ఉంటారు . అవి నువ్వు దాటేసి ఉంటావు. నేను చిన్నపిల్లవాడిని కదా! ఆకలికి తట్టుకోలేక ఉండ్రాళ్ళు తినేశాను . అయినా నీ సాధన వేరు….. నా సాధన వేరు…. నీదేమో భోగ నిద్ర సాధన… నాదేమో యోగనిద్ర సాధన… ఏమనుకుంటున్నావ్! నేను పోయేది యోగనిద్ర . తిండి కూడా సాధనే… ప్రతిదీ కూడా సాధనే… సాధన అంటే కూర్చొని ధ్యానం చేయడమే సాధన కాదు. తిండి కూడా సాధనే…. వండటం కూడా సాధనే ! అన్ని సాధనే ! 


వీడి తిండి పిచ్చి వీడు అని అనుకుంటూ…. బట్టలు సర్దుకొని స్నానానికని మణికర్ణిక ఘాట్ కి బయలుదేరింది. ఈమెతో పాటు తోకలాగా బాల గణపతి బయలుదేరాడు . వీడికి తోకలాగా భైరవి కుక్క కూడా బయలుదేరింది. ముగ్గురు కలిసి మణికర్ణిక ఘాటుకి బయలుదేరారు.తీరా ఘాట్ దగ్గరికి వెళ్లేసరికి రుద్ర స్వామి ,మహాదేవి ఎవరికో పిండ ప్రధాన కార్యక్రమం చేసే విధంగా పూజారిని కూడా పక్కన పెట్టుకుని కూర్చొని ఉన్నారు . తీరా దగ్గరికి వెళ్లి చూస్తే , ఆ ఫోటో తన ఫోటోనే అని దండ వేసి ఉండడం గమనించేసరికి…. ఏం జరుగుతుందో అర్థం కాక రుద్రస్వామి కేసి చూసింది.  


రుద్రస్వామి:- అమ్మ! నువ్వు సాధనా పరీక్షల్లో, యోగ పరీక్షల్లోనూ జయం పొందావు . పొద్దున నుంచి ఇప్పటివరకు జరిగినవన్నీ యోగ పరీక్షలే. …. నీకు సన్యాస దీక్ష ఇవ్వాలి అని చెప్పి కాశీ విశ్వనాధుని నుంచి నాకు అనుజ్ఞ వచ్చింది. కాబట్టి సన్యాసం తీసుకోవాలి అంటే ఎవరికి వారే ఆత్మపిండ ప్రదానం చేసుకోవాలి. ఇది నీ కార్యక్రమం. అందుకని నీ ఫోటో పెట్టడం జరిగింది. ఆత్మ పిండం నీకు నువ్వే పెట్టుకుంటే ….ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఉంటే నరకానికి వెళ్లి అక్కడ పాపప్రక్షాళన చేసుకుని…. సుఖాలను కూడా అనుభవించి…. ఉన్న ఋణానుబంధాలు కూడా తీర్చేసుకుని…. పాపాల వల్ల వచ్చిన ఋణాలు… పుణ్యాల వల్ల వచ్చిన ఋణాలు తీరిపోయిన తర్వాత…. అప్పుడు నీ ఆత్మకి , నీ సాధనాస్థితిని బట్టి మోక్షం వస్తుంది. ఇక్కడ ఏకాదశ దేహముల మోక్షం రావాలి కాబట్టి …..నీవు చచ్చిపోయిన తరువాత ఆత్మ ఆహారం కోసం ఎదురు చూడకుండా ఉండాలి . అలాగే నీకు పిండ ప్రదానాలు చేసేవాళ్ళు….. చచ్చిపోయిన విషయం తెలుసుకున్న వాళ్ళు…. తెలుసుకునేవాళ్ళు…. ఎవరు ఉండరు. కాబట్టి నీకు పిండ ప్రధానము చేసే వాళ్ళు ఎవరూ లేరు . మోక్ష సన్యాసం తీసుకోవాలి….. అనుకున్నప్పుడు ఎవరికి వారే ఆత్మ పిండ ప్రధానం చేసుకోవాలి. దీనికి విష్ణుగయలో ఈ పిండ ప్రధానం చేస్తారు . కాకపోతే తల్లిదండ్రులు ఉన్నంతవరకు ఆత్మ పిండ ప్రధానం పెట్టుకోడానికి అర్హత లేదు. కాకపోతే సన్యాస యోగానికి అర్హత ఉంటుంది. దైవమే సన్యాస యోగం ఇచ్చినప్పుడు….. మానవ మాతృలం …మనమేం చేయలేము కదా! ఇప్పుడు నీకు తల్లిదండ్రులు ఉన్నారో… లేదో ….నేను తెలుసుకోలేదు. మీకు తల్లిదండ్రులు ఉన్నా కూడా లేనట్లే అవుతారు. కాబట్టి మీ తల్లిదండ్రులే నిన్ను కాశీ క్షేత్రానికి పంపించారు కాబట్టి …మీకు సన్యాసం తీసుకోవడానికి అర్హత ఇచ్చినట్టే! కాబట్టి గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు సన్యాసం తీసుకోవాలంటే భార్య అనుమతి ఇవ్వాలి. బ్రహ్మచర్యంలో దీక్షలో ఉన్నప్పుడు తల్లి అనుమతి ఇవ్వాలి అని శాస్త్రవచనం. అలాగే భార్య సన్యాస వీక్ష తీసుకున్నప్పుడు భర్త ఇవ్వాలి అని శాస్త్ర వచనం ఉన్నది లేదా తల్లి ఇవ్వాలి అని ఉన్నది. కాకపోతే నీ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే మరణించారు. గతించారు. ఆ విషయం నాకు ధ్యానంలో కనబడింది. నువ్వు బాధ పడతావని చెప్పలేదు కానీ ఇప్పుడు నీకు అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియనట్లే…. స్తంభించిపోతున్నావు. స్పందనారాహిత్య స్థితికిలో ఉన్నావు. కాబట్టి ఆ విషయాన్ని నేను గ్రహించి , సాధన పరీక్షలు తట్టుకునే మానసిక స్థితి మీకు ఉందా లేదా అని చెప్పి పరీక్షల్లో జయం పొందుతావా లేదా అని ఈ మూడు రోజులు ఎదురు చూశాను . కాకపోతే నువ్వు అన్నింటినీ దాటుకొని వచ్చావు. అన్ని పరీక్షల్లోనూ జయం పొందావు. కాబట్టి నీవు మోక్ష సన్యాసానికి అర్హత ,యోగ్యత, యోగం ఉన్నది. అలాగే మోక్ష సాధనకి కూడా నీకు అర్హత ఉంది. కాబట్టి స్నానం చేసి వచ్చి ఈ ఆత్మపిండ ప్రధాన కార్యక్రమం పూర్తి చేసుకో…. అనగానే సరే స్వామి ! అనగానే ఆమె స్నానం చేసి ఆ తడి బట్టలతోనే పూజారి చేత తన ఆత్మ పిండ ప్రధాన కార్యక్రమం చేసుకుంది. మూడు పిండాలను కూడా గంగా నదిలో నిమజ్జనం చేసింది. నువ్వులు ,బియ్యం కలిపిన వాటిని ఒక్కొక్కళ్ళ పేరు చేత తర్పణం ఇప్పిస్తూ…. తన కుటుంబ సభ్యుల చేత, తన భర్త పేరు చేత, తన సంతానం పేరు చేత తల్లిదండ్రుల పేరు చేత, తన అత్తమామల పేరు చేత ఎవరైతే తన మదిలో ఉన్నారో వాళ్ళ అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే…… నువ్వులతో తిలోదకాలు ఇస్తూ వచ్చారు. అందరితో భవ బంధాలు పోతున్నాయని…. ఆవేదన తగ్గుతుందని….. మనసుకు సంతృప్తి కలుగుతుందని …..తెలియని ఆనందానికి దగ్గరవుతున్నానని…. శివనందినికి అనిపించ సాగింది . ప్రధాన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత , స్నానం చేసి వచ్చి, తడి బట్టలను తీసేసి పొడి బట్టలు వేసుకుంది. ఆ తర్వాత ధ్యానంలో కాసేపు ప్రశాంతంగా కోసం కూర్చుంది. ఎందుకో తెలియదు…. ఏదో తెలియని ఆవేదన కలిగేసరికి…. కళ్ళనుండి నీరు కారడం, రావడం బాల గణపతి ,రుద్ర స్వామి గమనించారు. సరేలే! ఋణానుబంధాలు పోతున్నప్పుడు ఆవేదన కలగడం సహజమే కదా! ఆవేదనలు, ఆవేశాలు కలుగుతున్నాయి ….అవి పోతున్నట్టు ఉన్నాయిలే! అని ఎవరికి వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత స్వామి! ఏమీ అనుకోకండి ….నాకు భోగ జీవితం గత జన్మ అయింది కదా ! కాబట్టి గత జన్మ జ్ఞాన స్పురణలు నాకు గుర్తుకు వచ్చాయి. వాటిని వదిలించుకున్నాను. ఇక నుంచి వాటిని మనసులోకి రానివ్వను ….నేను చచ్చిపోయాను కదా! చచ్చిపోయిన దానితో సమానం కదా! ఇంక చచ్చిన శవంతో సమానం కదా! చచ్చిన దానికి ఏం ఆలోచనలు ఏముంటాయి…. స్పురణలు ఏమీ ఉంటాయి…. చచ్చా అని అనుభవం అనుభూతి పొందాల్సి ఉంటుంది…. కాబట్టి, సాధన చేయాల్సి ఉంటుంది అని అంటూ ఉండేసరికి…. అమ్మ సూర్యాస్తమయం అవుతుంది. మీకు సన్యాస దీక్ష ఇవ్వాలి. నా సంచిలో కాషాయ వస్త్రాలు తీసుకువచ్చాను. అవి ధరించు …అంటే కాషాయం రంగులో ఉన్న కాటన్ చీర, లంగా, జాకెట్ చూసేసరికి మహాదేవి చెప్పి ఉంటుంది. ….. నా శరీర కొలతలు, అందుకనే ఈ విధంగా తీసుకోవచ్చారు అని గ్రహించి….. ఆ వస్త్రాలు ధరించబోతూ ఉండగా…. అమ్మ! సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు, నగ్నంగా మారాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నగ్నంగా మారి మాత్రమే ఈ వస్త్రాలను ధరించు. నీకు దీక్ష నామం ఇవ్వడం జరుగుతుంది. ఈ దీక్షాన మంత్రంతో సాధన కొనసాగించాల్సి ఉంటుంది అనేసరికి ….చుట్టుపక్కల చూసేసరికి, చుట్టూ కూడా చాలామంది జనాలు ఘాట్ చుట్టూ ఉన్నారు. అబ్బాయిలు ,అమ్మాయిలు ,వయసులో ఉన్నవాళ్లు, వయసు పైబడిన వాళ్లు ఉన్నారు. దాదాపు ఒక 50 మంది దాకా వీళ్ళకేసి చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారని కొంతమంది వీడియోలు కూడా తీస్తున్నారు. సుమారు 20 అడుగుల దూరంలో ఇదంతా గమనిస్తున్నారని చుట్టూ చూసింది…. కానీ ఏ మాత్రం ఆలోచించకుండా వీడియోస్ తీస్తున్నారని గ్రహించినా కూడా తన ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఒక్కొక్కటిగా తీస్తూ ఉండేసరికి రుద్రస్వామి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమెని వీడియోస్ లో బంధిస్తున్నారని…. ఆమె చూస్తున్నారని తెలిసి నా మనసును అదుపు చేసుకుంటూ సిగ్గుపడకుండా ,భయపడకుండా…. చచ్చిన శరీరం మీద మమకారం ఎందుకు? మోహము ఎందుకు అంటూ….. వస్త్రాలు ఒక్కొక్కటిగా తీసేసి….. లోదుస్తులు కూడా తీసేసి పూర్తిగా నగ్నంగా మారింది. అలా కొన్ని నిమిషాల పాటు నగ్నంగా ఉండిపోయింది. ఆ తర్వాత కాషాయ వస్త్రాలు ధరించడం మొదలు పెడితే, రుద్ర స్వామి సంకల్పాలు చెబుతూ ఉంటే….. ఆ మంత్రాలు తగ్గట్టుగానే తను కూడా సంకల్పాలు చదవడం ఆరంభించింది . గోత్రనామాలతో చెబుతూ ఉండేసరికి …. వస్త్రాలన్నీ వేసుకున్నాక, తనకి ఇష్టమైన శివుని విగ్రహం మూర్తిని బయటకు తీసి….. పక్కన పెట్టి, ఆయన సమక్షంలోనే దీక్ష తీసుకుంటున్నానని…. భావన చేసుకోవడం మొదలుపెట్టింది . చుట్టూ చూసేసరికి ఎవరు కనపడక పోయేసరికి….. ఇప్పటిదాకా సుమారు 50 మంది దాకా ఉన్నవాళ్లు ఎవరూ కూడా కనబడకపోయేసరికి ఆశ్చర్యం వేసి….. రుద్ర స్వామికి కేసి చూసింది. అమ్మ వాళ్ళు నిజమైన మానవ మాత్రులు కారు. ఇక్కడ కోరికలతో చనిపోయిన రుద్ర పిశాచాలు . ఈ దీక్షకి నువ్వు నగ్నంగా మారతావా? లేదా అని పరీక్ష పెట్టడానికి వచ్చిన వాళ్ళు… వాళ్ళు ఏం పనులు చేస్తున్నా కూడా, నువ్వు పట్టించుకోకుండా నగ్నంగా కనిపించేసరికి…. వారు అంతర్దానం అయ్యారు. నువ్వు గమనించలేదు. నీవు శరీరం మీద సిగ్గు, భయం , లజ్జ ,గౌరవం, మోహం ,మమకారాలు లేవని వాళ్ళు గ్రహించే సరికి అదృశ్యం అయ్యారు. నిజంగా నిజానికి ఏమీ జరగలేదు ….ఏదో జరిగింది అనే భ్రమ, బ్రాంతి మాత్రమే కలిగించారు. నీ మనో నిగ్రహమే నీ సాధనకి ఉపక్రమించింది. సాధనకి తీసుకురాగలిగింది అనేసరికి ……ఓం శివోహం అని సాధన మంత్రాన్ని గురు మంత్రముగా మూడుసార్లు బోధించేసరికి…. తనలోకి కుండలినీ శక్తి లాగా ఏవో కదలికలు కదిలినట్టుగా అనిపించింది. ఇన్నాళ్లు సాధన మాత్రం చేసినా కూడా…. ఎప్పుడూ కదిలినట్టు అనిపించలేదు. అందుకేనేమో గురు మంత్రం తీసుకోవాలి… గురువు ఉపదేశం చేసిన మంత్రమును చేస్తే కానీ కుండలినీ జాగృతి కాదు అని అంటారు. అంటే తన వెన్నుపూస కింద ఏవో కదలికలు జరుగుతున్నట్టుగా బలంగా అనిపించేసరికి…. ఇదేనేమో కుండలినీ కదలిక …. ఇదేనేమో శక్తి జాగృతి అంటారు. కాకపోతే ఇది ఈ మంత్ర ప్రభావానికి మాత్రమే లేస్తుంది అనుకుంటా! ఇంకా పరిపూర్ణంగా జాగృతి అవ్వలేదు అని అర్థం అయింది . కానీ శక్తి లేవటం …లేచి పడుకోవడం…. జాగృతి అవడం, శుద్ధి అవ్వడం…. నిద్రలోకి పోవటం చేస్తుందని గ్రహించింది. అంటే గురువు ఉపదేశం వలన కుండలినీ శక్తి లేస్తుంది. గురు ఉపదేశ మంత్రం సాధనా మంత్రం అవుతుంది. ఈ సాధన మంత్రం వలన తన శరీరం శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఈ గురు మంత్రం వలన కుండలినీ శక్తి జాగృతి అయ్యి స్థిరపడితే…. అప్పుడు చక్రాల జాగృతి మొదలవుతుంది అని శివ నందిని గ్రహించింది. మూడు సార్లు చెప్పిన గురు మంత్రాన్ని ఆవిడ పదేపదే అనుకోవడం చేసింది. గురువు రావడం వలన వచ్చే శక్తిని ఆ శక్తి ప్రసారాన్ని అనుభవం అనుభూతి పొందింది. ఏదో ఒక 10 మంది వ్యక్తులు తన మీద పడి తన లోకి ప్రవేశిస్తున్నట్లుగా….. ఆ వ్యక్తి తనలోకి వస్తున్నట్లుగా అనిపించ సాగింది. అయినా పడిపోకుండా శరీరాన్ని నిలబెట్టుకొని ,అలాగే ధ్యానంలో కూర్చొని ఉంది . అయినా కూడా నిగ్రహించుకొని నిలబడింది. ఏం జరిగితే అది జరుగుతుంది…. శరీరం పడిపోతే పడిపోతుంది….. చచ్చిపోతే చచ్చిపోతుంది …. గురువు మంత్రాన్ని మనం వినవలసిందే …. చేయవలసిందే…గురు శక్తిని మనం ఆస్వాదించాల్సిందే, అనుభవించాల్సిందే, తెలుసుకోవాల్సిందే అని నిలబడిపోయింది. అలా ఆయన మూడుసార్లు చేసేసరికి ……ఒక పదకొండు సార్లు చేసుకో తల్లి ! అని చెప్పి…. అమ్మ! ఈరోజు నుంచి నీకు దీక్ష నామం కూడా శివ నందిని గానే ఇస్తున్నాను. ఎందుకంటే మీ పేరు గతంలో జీవితంలో శివాని, నువ్వు పరమహంస పవనానంద పేరుని ఆసరాగా తీసుకొని…. ఆయన పవనానంద అయ్యారు…. కాబట్టి నువ్వు శివ నందిని అవ్వాలని చెప్పి నువ్వే నిశ్చయించుకున్నావు…. ఆ పేరుని దీక్ష నామంగా ఇస్తున్నాను. ఇకనుంచి నీ యోగ దీక్ష నామం ఏమిటి అని అడిగితే శివ నందిని అని చెప్పు. వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పేసి ఓం శివోహం అనే సాధన మాత్రమే గురు మంత్రంగా ఇచ్చాను. నువ్వు శివుడై ఉన్నావు. ఆ శివుడు ఏ స్థితిలో ఉన్నాడు…. బతికే ఉన్నాడా? చనిపోయాడా? అనేది మీ సాధన పరిసమాప్తి నీకు నువ్వే తెలుసుకోవలసి ఉంటుంది . అది తెలుసుకొని నువ్వు లోకానికి చెప్పవలసి ఉంటుంది . అది ఏంటి అనేది తెలుసుకోవడమే నీ లక్ష్యం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాన్ని నీకు దీక్ష వస్త్రంగా ఇస్తున్నాను …..ఈ దీక్ష వస్త్రము ధరించి ఎల్లవేళలా దీక్ష నామంతో, దీక్ష వస్త్రముతో ,దీక్ష మంత్రంగా చేసుకుంటూ ….. నీ సాధన పరిసమాప్తి చేసుకో …శుభం భూయాత్ …. ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు…. అని చెప్పి దీవించేసరికి…. ఆయన మంత్ర గురువు కావడంతో ఏమాత్రం ఆలోచించకుండా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ తర్వాత ఆయన దీవించి తనమానాన తను వెళ్లిపోయాడు. దీక్ష తీసుకున్న తర్వాత గురువు ఇచ్చిన గురు మంత్రం చేస్తూ ఉండేసరికి …..ఎదురుగా అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న గంగా నదిలో ఒక్కసారిగా ఉన్న అలలు శబ్దం పెరుగుతూ ఉండేసరికి…. తన మంత్ర ఉచ్చారణ వలన గంగా నదులో కదలికలు పెరుగుతున్నాయని ……. అలలు ఎగురుతున్నాయని గ్రహించింది. అంటే తనలోకి సాధన శక్తి ప్రవేశించింది. అయినా కూడా ఏదో తెలియని ప్రశాంత స్థితి వస్తూ ఉండేసరికి…. గురు మంత్రమును ఏకధాటిగా చేసుకుంటూ అలాగే ఉండిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆకలి వేస్తుందని దగ్గరలో ఉన్న హోటల్ లో వెళ్లి భోజనం చేసుకుని ఉపశమించడానికి గదికి వెళ్ళిపోయింది. ఇలా శివనందిని గదిలోకి వెళ్లేసరికి భైరవి కుక్క గది బయట ఉండటం గమనించింది. అంటే బాలగణపతి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ….“అయ్యో పాపం! వీడికి ఆహారం చేసి పెట్టాలి కదా! ఉండ్రాళ్ళు చేసి పెట్టాలి కదా! తన సాధనా దీక్షలో హడావిడిలో పడిపోయి ఈ విషయం గమనించలేదు కదా! అని అనుకుంటూ….” లోపలికి వెళ్లేసరికి వాడు ఉండ్రాళ్ళు తింటూ ఉండేసరికి ఆశ్చర్యం వేసి


శివనందిని:- “ఏంటి !నాన్న !కన్నా! నేను రావటం లేదని చెప్పి నీకు నువ్వే ఉండ్రాళ్ళు చేసుకున్నావా? అయ్యో పాపం! బిడ్డని ఆకలితో కష్టపెట్టాను…. ఆకలి తీర్చలేకపోయాను”…


 అని అంటూ ఉండేసరికి…. 


బాలగణపతి:- అదేం లేదమ్మా! ఇవాళ నువ్వు పనిలో ఉంటావని తెలిసే …. డూండీ గణపతి దగ్గరికి వెళ్లాను . అమ్మకి ఇవాళ చాలా పనుంది …..మీతో సాధనాదీక్ష తీసుకోవాలంట! అదేదో నువ్వు ఇప్పించాలని అనుకున్నాను…. నువ్వేవో పరీక్షలు పెడతావంట ….ఆ పరీక్షలో జయం పొందాలి అంట…. అవన్నీ ఆలోచిస్తూ ఆ ఆలోచనలో ఉంది. నా గురించి పెద్దగా ఆలోచించట్లేదు. నా ఆకలి గురించి కూడా ఆలోచించదు. ఆలోచించకుండా నేను చేస్తున్నాను. కాబట్టి నా ఆకలి నువ్వే తీర్చాలి! కాబట్టి అమ్మని పనిలో ఉంచావు కాబట్టి …నా ఆకలి నువ్వే తీర్చాలి . అమ్మకి ఏ పని లేకుండా విరామం ఉండి ఉంటే….. నా ఆకలి తీర్చేది! అన్ని చూసుకునేది ! ఆవిడని పనిలో నిమగ్నం చేసావు …కాబట్టి నువ్వే తీర్చు అని అడిగాను …వేధించాను… అలా వేధించేసరికి ఎవరో ఒక ఆవిడ …వచ్చి… “నా ఒక కోరిక తీరింది….. ఆ కోరిక తీరితే ఒక భిక్షువుకి ఉండ్రాళ్ళు చేసిపెడతా అన్నాను…. అదేంటో నువ్వు బాలభిక్షువులా కనిపించావు…. కాబట్టి నీకు ఇస్తున్నాను అని” నాకు ఇచ్చింది. ఆ ఉండ్రాళ్ళు ఇంటికి తెచ్చుకొని తింటున్నాను…. ఇంతలో నువ్వు వచ్చావు… ఏంటమ్మా తెల్ల చీర కాస్త కాషాయం చీర గా మారింది… ఓహో ! ఇది దీక్ష…. ఈ దీక్ష కోసం పొద్దున్నుంచి అన్ని వదిలేసుకొని వచ్చావన్నమాట! అంతేనా …..సరేలే పేరు మార్చాడా? ముసలోడు…. అదే రుద్రస్వామి! ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక దీక్షను అంటగడతాడు…. తాళ్ళు అంట కడతాడు….. మాలలు అంటగడతాడు…. వాళ్లకి నచ్చిన పేర్లు మార్చేసి ఈయనకి నచ్చిన పేర్లు పెట్టేస్తాడు. అదేంటంటే దీక్ష నామాలు అంటాడు ….అది నాకు ఇష్టం లేదురా బాబు! అన్నా కూడా….. నేను పెట్టిందే దీక్ష నామం చేసుకో! నేను ఇచ్చిన మంత్రమే చేసుకో! నేను ఇచ్చిన బట్టలే కట్టుకో! అని వారి ప్రాణం తీస్తాడు. నా వెంట కూడా అట్లాగే పడ్డాడు. నా పేరు మారుస్తాను…. నా రంగు వస్త్రాలు మారుస్తాను అని కూర్చున్నాడు. నాకు నీ దీక్ష వద్దు… నువ్వు వద్దు…. నాకేం దీక్షలు వద్దు. నాకేం మోక్షం అక్కర్లేదు…. ఇక్కడ నేను ఆహార పదార్థాలు రుచుల్లో ఉండ్రాళ్ళు తినేసాను కదా! నేను పరీక్షలో జయం పొందలేదు కదా ! నేను తప్పా కదా! అంటే దానిది దానిదే! నువ్వు దీక్ష తీసుకొఅని నా వెంటపడేవాడు …..నాకు విసుగు వచ్చి కర్ర పట్టుకొని కొడతా! అని బెదిరించాను. ముసలోడు…. రుద్ర స్వామి ఏం తక్కువోడు కాదు…. అన్ని చేస్తా ఉంటాడు! మనకు ఇష్టం లేనివి కూడా చేస్తా ఉంటాడు! నాకు ఇష్టం లేనివి .,..మనసుకి విరుద్ధమైనవి చేస్తే నేను చచ్చిన వాళ్ళతో ఉండలేను. వాళ్ళ దగ్గర ఉండలేను . అక్కడ ఉండలేను…. నాకు కోపం వచ్చేస్తది. నువ్వు కూడా అలాగే చేశావనుకో ,నాకు ఇష్టం లేని పనులు… నా మనసుకు నచ్చని పనులు….. నిన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతా! నాకేం లేదు…. నాకు లోకంలో ఎంతో మంది తల్లులు ఉన్నారు. ఉండ్రాళ్ళు పెట్టే వాళ్ళు ఉన్నారు. తినిపించే వాళ్ళు ఉన్నారు. చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళని వెతకడమే నాకు సమయం పడుతుంది. ఒకసారి వెతికాను… పట్టుకున్నాను ….వాళ్లు నా మనసుకి నచ్చారు…. అంటే వదిలిపెట్టను. అయినా నువ్వు అందరి అమ్మ లాంటివి దానికి కాదులే! నాకు అర్థమైపోయింది ….నేను నిజంగానే నీ కొడుకుని .. నువు గత జన్మలోనో ….ఏదో జన్మలోనో… ఆది జన్మలోనో నీకే పుట్టి ఉంటాను. ఆ ఋణానుబంధం తీర్చుకోవాలి అనుకుంటాను……! అందుకని నువ్వు కొట్టినా, తిట్టినా వదిలిపెట్టకూడదని అనుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లాలనుకున్నాను . జీవితాంతం నీతో ఉండాలని అనుకున్నాను. సరేలే! నీకు ఇష్టమైన మంత్రం, నామం, ఇచ్చాడా? బలవంతంగా ఏమైనా చేశాడా? చెప్పు ! ఒకవేళ బలవంతం చేస్తే, చెప్పు ….వెనక్కి వెళ్లి రుద్ర స్వామి మీద గొడవ పడదాం! వాడికి పని పాట లేదు…. మనకు ఏమీ పని లేదు అని అంటాడు….. మళ్ళీ మనకి చెబుతాడు…. మనం ఒక పక్క చచ్చిన వాళ్ళ అంటాడు…. బతికినట్టుగా ఉండమంటాడు… వాడి బొంద…. వాడు ఎప్పుడు ఏం చెప్తాడో ….వాడికే అర్థం కాదు. ఒకసారి ఉందంటాడు… ఒకసారి లేదంటాడు…. ఆయనని ఏమీ అనటానికి లేదు…. వయసులో పెద్దవాడు అని గౌరవిస్తున్నాను ….లేకపోతే ఎప్పుడో నా చేతిలో చావు దెబ్బలు తినేవాడు అనేసరికి ……


శివనందిని:- అరేయ్ చిన్న! పెద్ద వాళ్ల గురించి అలా తప్పుగా ఆలోచించకూడదు. తప్పుగా మాట్లాడకూడదు. వయసులో పెద్దాయన.. 80 సంవత్సరాలు ఉన్నాయన… ఆయన ఏదో మంచి చేయాలి అనుకుంటున్నాడు.. మన గురించే ఆలోచిస్తున్నాడు కదా ! మన గురించి క్షేమ సమాచారాలు తెలుసుకొని ……కావాల్సింది చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు ? ఏ బంధమో …..ఏ ఋణాను బంధమో తెలీదు. ఆయన నాకు దొరికాడు. అట్లాగే నీకు దొరికాడు…. ఏదో కాలానుగుణంగా భగవంతుడు మనకిచ్చిన ఆత్మబంధువు అనుకోవాలి. పెద్దాయన…. చాదస్తం ఎక్కువే…. కాదనను…. కాకపోతే ఆయన చాదస్తాన్ని మనసులో పెట్టుకోవాలి. ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. బాధ పెట్టకూడదు .ఆయన బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా భరించాలి. చిన్నపిల్లలం కదా! ఆయన ముందు మనం చిన్న వాళ్ళమే కదా! ఎంత వయసు వచ్చినా ఆయన ముందు చిన్న వాళ్ళలాగే ఉండాలి. అమాయకుల్లాగే ఉండాలి. అమాయకుల్లాగానే ప్రవర్తించాలి. ఏమీ తెలియనట్టుగానే ఉండాలి ….అన్ని తెలుసుకుంటూ ఉండాలి …అది గుర్తుంచుకో ! అనేసరికి 


బాలగణపతి:- సరేనమ్మా! నువ్వు ఏం చెప్తే అది.. నువ్వు చెప్పింది కాదనను…. నువ్వు ఆలోచించి అంటావ్! నీకు అసలు కోపం రాదు . నేను కోపం తెప్పించే పనులు చేసినా ,బాధపెట్టే పనులు చేసిన నువ్వు బాధపడవు…. కోపం పెంచుకోవు… గట్టిగా ఏమైనా అంటే నెమ్మదిగా ఇలా చెబుతావు. సరే నీ దగ్గర నాకు ఇదే నచ్చుతుంది. సరేలే ! పోనీ లే! పడుకుంటాను…. నువ్వు గబగబా తినాల్సింది తినేసి రా …


అంటే నేను తినేసే వచ్చాను….. గబగబా పడుకోవాలి అని ….. అంటే……సరే పడుకో! నీ గుండెల మీద పడుకుంటాను అని చెప్పి గుండెల మీద పడుకుని ఇద్దరు ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటూ…… ఇద్దరు ఎప్పుడూ నిద్రలోకి వెళ్లారో …..తెలియని గాఢ నిద్రలోకి వీళ్లిద్దరూ వెళ్లిపోయారు. ఇలా శివ నందిని మోక్ష సన్యాస దీక్షాంకం పరిసమాప్తి అయింది.


శుభం భూయాత్ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి