చక్ర జాగృతి
(తిరుపతి యాత్ర)
సాధనా కుటుంబం అంతా అర్ధరాత్రి 10 గంటలకి శ్రీశైలం బస్టాండ్ కి చేరుకున్నారు.ఎందుకంటే అక్కడి నుంచి సున్నిపెంటకి వెళ్ళాలని….బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో బాల కుమారస్వామి దగ్గర ఉన్న నాగాభరణం తీసుకుని శివ నందిని ధ్యానంలో కూర్చుంది. స్వామి! ఇప్పుడు మేము అనుకున్నది…. చక్ర జాగృతి కోసం తిరుపతి వెళ్లడం అనే ఆధారం నిజమా? కాదా? అనుకునేసరికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవాలయం….. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం….. కొన్ని క్షణాల పాటు ధ్యాన దృశ్యాలుగా కనిపించేసరికి…. అంటే తను అనుకున్న ఆధార ప్రాంతం తిరుపతి అనేది సత్యమేనని గ్రహించి, ధ్యానం నుంచి బయటకు వచ్చి యధావిధిగా నాగాభరణం కుమారస్వామికి ఇచ్చి జాగ్రత్తగా దాచుకో అని చెప్పింది. ఆ తర్వాత బాలగణపతి ఉన్నట్టుండి అమ్మ! ఇప్పుడు మనం సున్నిపెంటకి ఎందుకు వెళ్తున్నాం? అని అడిగేసరికి నా శక్తిపాత గురువైన పూర్ణానంద స్వామి వారి జీవ సమాధి ఆ సున్నిపెంట ప్రాంతంలో ఉంది. ఆయన ఆ ఆశ్రమంలో జీవ సమాధి చెందారట. ఆ జీవ సమాధి చూడటానికి వెళుతున్నాము అని చెప్పింది. ఇంతలో బస్సు రావడంతో అందరూ బస్సు ఎక్కారు. ఎవరికి వాళ్లే బస్సు ఎక్కి…. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. పిల్లల దగ్గర శివ నందిని కూర్చుంది. అప్పుడు బాల గణపతి కాస్త “అమ్మ! ఏం అనుకోకపోతే ఈ పూర్ణానంద స్వామి ఎవరు? ఆయన గురించి వివరంగా చెప్పవా! అసలు ఆయన ఎలా సాధన చేశాడు? ”అని అడిగాడు. అప్పటికే శివనందిని ఈయన గురించి సమాచారం ఇంటర్నెట్లో తెలుసుకొని ఉండటంతో…. పిల్లలకు అర్థం అయ్యేవిధంగా సరళ భాషలో పూర్ణానంద స్వామి గురించి చెప్పడం ఆరంభించింది .
పూర్ణానంద గారి గురించి చెప్పాలంటే….ముందుగా అతని గురువుగారైన రాఖాడి బాబా గారి గురించి చెప్పాలి. రాఖాడి బాబా గారు 1925 తమిళనాడుకి దగ్గరలో ఉన్న కలవై అనే ఊరిలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన సుబ్రహ్మణ్యం నాగమ్మ దంపతులకు ఆరవ సంతానం. వాళ్ళు చాలా నిరుపేద కుటుంబంలో జీవితం గడుపుతూ ఉండేవారు. ఈ రాఖాడి బాబా వారి అసలు పేరు మునిస్వామి. ఇతని అల్లరి చేష్టల వలన ఊరిలో అందరూ ఇతనినీ ….ఇతని కుటుంబ సభ్యులను నిత్యం ఏదో ఒక రకంగా ఈ మునిస్వామి ఇంటి మీదకి గొడవలు తీసుకువచ్చేవారు. ఓ రోజు తల్లి గారు ఇతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నేను ఉన్నంతవరకు బాగానే చూసుకుంటాను…. నా తర్వాత నీ జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా బెంగగా ఉంది. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుంచుకో… నీకు ఆకలి బాధ లేకుండా…. నీ ఆకలి తీర్చే ప్రతి ఒక్క స్త్రీ మూర్తిలోనూ కన్నతల్లిని చూడు అని చెప్పింది. ఇక ఊరిలో అందరూ అతని ఆకతాయి తనానికి తనకి పని ఇచ్చేవారు కాకపోవడంతో అతను బెంగుళూరు చేరుకొని అక్కడ ఒక మలయాళీ ఓనర్ ఉన్న హోటల్లో పనిచేస్తూ అక్కడ కూడా ప్రశాంతత లేదని ఇంటికి వెళ్లిపోయి… తిరిగి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మైసూర్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఒక బ్రాహ్మణుని దగ్గర ఉంటూ ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పురాణ వాంగ్మయాన్ని నేర్చుకొని… ఆ జ్ఞానాన్ని తనలో ఆపాదించుకొని.. ఒక సంవత్సరం పాటు ఏకాంత ధ్యానం చేయాలని అడవుల్లోకి వెళ్లిపోయారు. పంచాక్షరి చేస్తూ ధ్యానం చేసుకున్నారు. ఆ తర్వాత అలా మెల్లగా ఉజ్జయిని, హిమాచల్ ప్రదేశ్, ఇలా క్షేత్రాలను దర్శిస్తూ…. హిమాలయాలకు వెళ్లి అక్కడ కూడా కొన్నాళ్లు తపస్సు ఆచరించారు. ఇలా క్షేత్రాలు తిరుగుతూ 1000 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన గిరినార్ అనే క్షేత్రంలో చాలా కాలం పాటు ఉన్నారు. ఆ సమయంలో నిత్యానంద స్వామి వారు అక్కడికి రావడం జరిగింది. ఈ నిత్యానందని చూడగానే అతనిలో గురు సంబంధిత భావోద్వేగాలు మొదలయ్యాయి… ఎలాగైనా ఆ నిత్యానంద స్వామిని కలుసుకోవాలని అతను ఉన్న ప్రదేశాన్ని తెలుసుకొని… ఆ ప్రాంతానికి వెళ్లాలని దృఢనిశ్చయంతో రాత్రనకా పగలనకా చూసుకోకుండా అడవి మార్గంలో బయలుదేరాడు. ఇలా వెళ్తూ ఉండగా… చీకటిలో గాలి వర్షం లో అటవీ ప్రాంతంలో ఎటు వెళ్లాలి అనేది అర్థం కాక ఒకచోట కూర్చుండిపోయాడు. అప్పటికే విపరీతమైన ఆకలితో ఉన్న అతనిని ఒక ముసలావిడ వచ్చి… ఇంత వర్షంలో ఎక్కడకి వెళ్తున్నావు?నేను నా కొడుకు కోసం చూస్తున్నాను… వాడి కోసం వండిన ఆహారం అలాగే ఉంది… బహుశా వాడు ఇంక రాడేమో! నువ్వు వచ్చి ఆహారం తిని ఇక్కడే విశ్రాంతి తీసుకోని వర్షం తగ్గిన తర్వాత వెళ్ళు అని చెప్పింది. ఇక అలా భోజనం చేసి ఒక కునుకు తీసి లేచేసరికి తెల్లారిపోయింది . వెంటనే గణేష్ పురికి చేరాలని అక్కడ ఉన్న ముసలావిడకి నమస్కారం చేసి వెళ్దామని చూసేసరికి అక్కడ ముసలావిడ లేదు….ఆ చిన్న పూరి గుడిస లేదు….. అక్కడ కేవలం ఒక అమ్మవారి దేవాలయం కనిపించింది. రాత్రిపూట ముసలావిడ ఏ చీరలో అయితే కనిపించిందో అలాగే అమ్మవారి చీర కూడా కనిపించేసరికి… రాత్రి తన ఆకలి తీర్చడానికి వజ్రేశ్వరి అమ్మవారే స్వయంగా వచ్చిందని ఆ తల్లికి నమస్కారం చేసి…. కృతజ్ఞతలు చెప్పి…. తన గురువు కోసం బయలుదేరారు. ఇది కూడా తన గురువు మహిమగా భావించారు. మనసులో ఆయనకు నమస్కారం చేసుకుంటూ… నిత్యానంద ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ నిత్యానంద స్వామి చూడగానే రాఖాడి బాబాలో గొప్ప గురు భావన ప్రసన్నత శరణాగతి భావాలు కనిపించాయి. ఇతని దృష్టితరంగాలు నిత్యానందకు చేరాయి. ఎంత గుంపులో ఉన్నప్పటికీ కూడా…. అతనిని గుర్తించి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగారు. నేను నిరాకార తత్వాన్ని గ్రహించడానికి వచ్చానని సమాధానం చెప్పారు. అసలు నేను అంటే ఏమిటి? అని అడిగితే…. కరుడుగట్టిన ఈ శరీరంలో నిండిపోయిన అహంకారమే నేను అని రాఖాడి బాబా గారు చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితేఏదో ఒక చెట్టు పుట్ట చూసుకొని సాధన చేసుకోవడానికి అని చెప్పారు. అయితే నీకు పని ఏమైనా వచ్చా ? అంటే వంట వచ్చు అన్నారు… అయితే వంటవాళ్ళు ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వంట చేసుకుంటూ గురుసేవ చేసుకోమని చెప్పి ఒక మహా భాగ్యాన్ని కలిగించారు. అలా బాబా వారు అక్కడే ఉంటూ వంట చేస్తూ గురువుకి సేవలు చేసుకుంటూ పగలంతా పని రాత్రి ధ్యానం చేసుకుంటూ గడిపేవారు. కొన్నాళ్ళకి ఈ హోటల్లో జనాల రాకపోకల వల్ల తన ధ్యానానికి భంగం కలుగుతుందని….తమసా నదికి ఒకవైపు నిత్యానంద ఆశ్రమం ఉంటే మరొకవైపు నింబోలి గ్రామం ఉండేది. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు దాని కింద ఒక కుటీరం కనిపించింది.అక్కడ లక్ష్మమ్మ అనే యోగిని పక్కనే ఒక శివాలయంలో ఉండి ధ్యానానికి అనువైన ప్రదేశంగా అనిపించింది. ప్రతిరోజు ఈ రాఖాడి బాబా వారు ఈ శివాలయం దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. లక్ష్మమ్మ, ఇతను…. తల్లి కొడుకుల్లాగా వ్యవహరించేవారు. ఇదంతా గమనిస్తున్న నిత్యానంద బాబా వారు ఒక రోజు సాయంత్రం ఈయన ధ్యానానికి బయలుదేరగానే ఎక్కడికి వెళ్తున్నావు? నేను కాసేపు నీతో మాట్లాడొచ్చా అని అడగగానే…. నేను ధ్యానం చేసుకోవడానికి వెళుతున్నాను… కానీ మీరు నాతో మాట్లాడతాను , అంటున్నారు….మీరు నాకు సమయం ఇస్తున్నారు అంటే అది అమృతపానంతో సమానం.. అని అన్నారు. అప్పుడు ఈ నిత్యానంద బాబా వారు ఆయనకి రకరకాల ఆహార పదార్థాలను అందిస్తే వాటిని గురువు వద్ద నుంచి తీసుకొని పిల్లలకు పంచిపెట్టి సంతృప్తి చెందారు. కేవలం ఒక టెంకాయ చిప్పలో మాత్రమే ఆహారం పానీయం తీసుకునేవారు. ఇదంతా గమనించిన నిత్యానంద ఇతని వైరాగ్యానికి సంతోషించారు. ఇతని కోసం అనసూయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే మూడు గుండాలు ఉండేవి… ఒకటి సోమగుండం, చంద్రగుండం, సూర్యగుండం అని ఉండేవి. ఈ సూర్యగుండంలోని నీళ్లు స్నానం చేయడానికి అస్సలు అణువుగా ఉండేది కాదు. సలసల మసిలిపోతూ ఉండేవి. సోమగుండంలోని నీళ్లు చల్లగా ఉండేవి… అంటే ఇవి స్నానానికి అనువుగా ఉండేవి. చంద్రగుండంలోని నీళ్లు చాలా చల్లగా ఉండేవి. ఈ అగ్నిగుండంలో స్నానం చేసి ఒళ్లంతా విభూతి రాసుకొని రాఖాడి బాబా వారు అక్కడే కూర్చుని ధ్యాన తపస్సు ఆచరిస్తూ ఉండేవారు. ఒకరోజు నిత్యానంద గారు రాఖాడి బాబా పేరు మీదగా 11 ఎకరాలు స్థలాన్ని ఇస్తే, దానిని వారు ఒక రైతుకి దానం చేశారు. అప్పుడు నిత్యానంద వారు అతనిలో ఉన్న నిష్కామత్వమును గ్రహించారు. రోజుకి కేవలం ఒక గోధుమపిండి ముద్దను హోమగుండంలో వేసి ధ్యానానికి కూర్చునేవారు… ధ్యానం తర్వాత ఆ ముద్దను ఆహారంగా స్వీకరించేవారు… అపరిశుభ్రత ఉండటం కారణం చేత… భక్తులు రావాలన్నా వచ్చేవారు కాదు. మోహమాటం కొద్ది కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు. ఆయన ఆశ్రమంలో ఎన్నో రకాల జంతువులు వచ్చి సేద తీరుతూ ఉండేవి .
ఒకరోజు నిత్యానంద దగ్గరకు వెళ్లి నాకేం లేదా? అని దీనమైన మనసుతో ఆర్తిగా అడిగారు. దానికి నిత్యానంద బాబా వారు మౌనం వహించారు. ఎందుకంటే అప్పటికే రాఖాడి బాబా గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఒకానొక కార్తీక పౌర్ణమి రోజున నిత్యానంద బాబా వారు ఆశ్రమం నుంచి శరవేగంతో బయలుదేరి రాఖాడి బాబా ఆశ్రమానికి వచ్చి…. ధ్యానంలో ఉన్న రాఖాడి బాబాను హోమగుండంలోకి తోసేసి…. అతని చెవిలో ఓంకార ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేసి ఓంకారానందా దీక్ష నామాన్ని ఇచ్చి వెళ్లిపోయారు. ఇక మంత్రోపదేశం చేసిన వెంటనే నిత్యానంద బాబా గారు వెళ్లిపోవడం చూసి…అతనిని అనుసరించడం మొదలుపెట్టారు. అప్పుడు నిత్యానంద వారు నన్ను అనుసరించకు… నా మార్గాన్ని అనుసరించు అని చెప్పారు. ఇది విని వెంటనే మందాకిని పర్వతమునకు చేరి ఒక గుహలో ధ్యానంలో కూర్చుండి పోయారు. గురు మంత్రాన్ని స్మరణ చేస్తూ గడిపారు. మనకు మాట కంటే మౌనం….మౌనం కంటే ధ్యానం..ధ్యానం కంటే సమాధి గొప్పదని తెలుసుకొని…. ఎంతకాలం సమాధి స్థితిలో ఉండిపోయారో ఆయనకే తెలియదు. ఒకానొక రోజు రాఖాడి బాబా వారికి తమ గురువును చూడాలని తపన మొదలైంది. వెంటనే నిత్యానంద బాబా వారి కోసం బయలుదేరారు. సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి అప్పటివరకు తన గురువుకి కనీసం మాట కూడా చెప్పకుండా వచ్చినందుకు ఏమంటారో …అని అనుమానభయంతో గురువు మీద ఉన్న వాత్సల్యంతో సర్వస్వ శరణాగతి భావంతో అతనిని చూడాలని తపన తాపత్రయంతో కొండలు, గుట్టలు దాటుకుంటూ పగలు రాత్రి అని ఆలోచించకుండా తన గురువు దగ్గరికి బయలుదేరారు… అలా వెళ్ళిపోయి తన గురువుగారిని కలుసుకున్నారు… ఒకరినొకరు తన్మయత్వ ఆనందంతో చూసుకున్నాక కొన్నాళ్ళు ఇక్కడే సతి అనసూయ ఆశ్రమంలో ఉండమని చెప్పారు. అవి నిత్యానంద వారికి చివరి రోజులు ఆ విషయం ఆయనకు తెలుసు. నిత్యానంద వారు కొన్నాళ్ళకి శరీర త్యాగం చేశారు… నిత్యానంద వారు శరీర త్యాగం చేసిన కొన్నాళ్ళకి రాఖాడి బాబాకు తల్లి గారు కూడా చనిపోయారు… ఇక తల్లి అంత్యక్రియలు దగ్గర ఉండి నిర్వహించుకుని గురువు గారు చెప్పిన మాటలను గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు… అందులో ఒకసారి నిత్యానంద గారు ఒక మాట చెప్పారు…
“ఒక జ్యోతిని వెలిగించు.. అది కొన్ని కోట్ల మందికి మార్గనిర్దేశం చేస్తుంది” అని…. ఇక తన గురువు మాట ప్రకారం ఆ అన్వేషణలో పడ్డారు…. ఇలా తీర్థయాత్ర చేస్తూ…. తిరునల్వేలి దగ్గర కడియార్ వద్ద అగస్త్య జలపాతం చేరుకుని ఆ పరిసర ప్రాంతంలోనే తపస్సు చేసుకోవాలని అనిపించి.. అక్కడే తన భక్తుడు నిర్మించి ఇచ్చిన కుటీరంలో ఉన్నారు. ఆ భక్తుడితో ఈ దగ్గరలో ఎవరైనా సాధన చేసుకునే యోగ సాధకులు ఉన్నారా అంటే…. అతను చాలా సేపు ఆలోచించి…. ఈ దగ్గరలో ఉన్న బాణ తీర్థంలో ఒక బ్రాహ్మణ యువకుడు తపో దీక్షలో ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న బాబా గారి మనసులో ఆ వ్యక్తి గురించి అలజడి మొదలైంది.
ఇక బ్రాహ్మణ యువకుడి గురించి చెప్పాలంటే….. అతని పేరు కామేశ్వరన్…. ఈ కామేశ్వరన్ పూర్వీకులు అయిన తాతగారు, తండ్రి గారు కూడా ఆధ్యాత్మిక, శాస్త్ర పాండిత్యం నిష్ణాతులు. పరమ ఙ్ఞాన సంపన్నులు. ఈ కామేశ్వరన్ తల్లిదండ్రుల పేర్లు… సుబ్రమణ్య శాస్త్రి, పర్వత వర్దిని. కామేశ్వరన్ కన్నా ముందు నలుగురు సంతానం పుట్టి చనిపోవడం జరిగింది. అప్పుడు పర్వత వర్దిని నాన్నగారిని… బాధపడుతూ… తనకి సంతాన ప్రాప్తి గురించి అడుగగా… ఈ సారి నీకు పుట్టే సంతానం లోకోత్తరమైన…ఙ్ఞాన సంపన్నుడు… ఈశ్వరాంశ గా పుత్రుడు జన్మిస్తాడు… కారణ జన్ముడు పుడతాడు…. అని దీవించి పంపించిన కొన్నాళ్ళకి పర్వత వర్దిని గారు గర్భం దాల్చారు. 1939 nov1 వ తేదీన 5వ సంతానంగా కామేశ్వరన్ ఈ దంపతులను పుత్రుడుగా జన్మించారు. ఇతను పుట్టిన తర్వాత చాలాకాలం వరకు మాటాడలేదు. సరే ఏదైనా ఈశ్వర ప్రసాదం అని అందరూ కూడా పుత్ర వాత్సల్యంతో అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
ఇలా కొంతకాలం గడిచిన తరువాత సుబ్రమణ్య శాస్త్రి గారు ఒకరోజు ఈ కామేశ్వరన్ ను తీసుకొని మీనాక్షి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కోనేరులో తీర్జ జలం సేవించి మెట్లు ఎక్కి వస్తుండగా.. మొదటిసారి“ నాన్న….. గురువు అంటే ఎవరు?” అని అడిగారు. మొదటి సారి కొడుకు మాటలు విన్న తండ్రి మహదానంద పడుతూ… కొడుకుని దగ్గరికి తీసుకుని… ఆప్యాయంగా… స్పృశిస్తూ…. ”గురువు అంటే అంధకారాన్ని తొలగించేవాడు” అని అర్థం నాయనా… అంటూ… ఆ రోజు నుంచి… తండ్రి కొడుకులు కాస్త గురు శిష్యులుగా… నిత్యం శాస్త్రాధ్యాయం, ఆధ్యాత్మిక పరిశోధన చేస్తూ…. తన యొక్క శాస్త్ర పరిజ్ఞానమును కొద్ది కొద్దిగా తన కుమారుడికి ధార పోశారు.
కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత … పాఠశాలకు వెళ్ళమని అంటే …వేళ్ళను అని మొండికేశాడు. ఎలానో బుజ్జగించి పంపిస్తే… ఒకరోజు సంచిని బావిలో వేసి మీనాక్షి దేవాలయానికి వెళ్లిపోయి ధ్యాన నిమగ్నమై పోయారు. పిల్లాడు కనిపించడం లేదని ఊరంతా వెతికి తీరా ఒకతను మీనాక్షి గుడిలో ఉన్నారని చెబితే అక్కడికి వెళ్లేసరికి ధ్యాన నిమగ్నమై పుత్రుని చూసి ఆనందాశ్రువులతో… అతని చేరి.. కాసేపటి తర్వాత.. ఇంటికి తీసుకువెళ్ళి… ఆధ్యాత్మికత తో పాటు ఇది కూడా ఉండాలని.. బతిమాలి.. అర్థం అయ్యేలా చెప్పి అతనిని ఎలాగో పాఠశాలకు అలవాటు చేశారు…
ఒకసారి కామేశ్వరన్ తన స్నేహితులను తీసుకుని స్మశానానికి వెళ్ళి అక్కడ బూడిద లో నుంచి ఒక ఎముక ను తీసి ఇది స్త్రీ దా? పురుషునిదా? అంటూ… ఇక్కడ స్త్రీ పురుష పేద ధనిక అనే వ్యత్యాసాలు ఉండవు… ఇది శుద్ధ శివ స్థానం. కాబట్టి ఇది మహాదేవాలయం అయింది అని చెప్పేవారు.
ఇలాగే ఒకసారి ఒక వయోవృద్ధుడు ఇతనికి ఎదురై శ్రీ భువనేశ్వరి మహా విద్య అనే గ్రంథమును ఇచ్చి… మీరు ఆ తల్లి అంశ అని అర్థం అయింది. అందుకే మీకు ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అది సున్నిపెంట ఆశ్రమంలో శిథిలమై ఉంది.. దీన్ని మరొక కాపీ కూడా చేయించి ఉంచారు.
చిన్నతనంలోనే తన తండ్రిగారే మంత్రోపదేశం చేశారు. ఆసన, ప్రాణాయామం, విద్యలను బోధించేవారు. భావ సాధన అనేది తన తండ్రి అతనికి బోధించిన చివరి సాధన . భావయుక్తమైన సాధనే భగవంతునికి ప్రీతికరం అని బోధించారు. ఒకసారి బాల త్రిపుర సుందరి ఆరాధనలో చెరుకు గెడ తింటూ పాప , రూపంలో లోపలికి వచ్చింది. ఆ అమ్మకి నమస్కారం చేసుకున్నారు. ఇలా భావ యుక్తమైన పూజలను సుబ్రమణ్య శాస్త్రి గారు చేసి చూపించేవారు.
ఇలా కాలం గడుస్తూ ఉండగా … కామేశ్వరన్ తండ్రి గారు కాలం చేశారు. ఇంటి బాధ్యతలు కామేశ్వరన్ పైన పడ్డాయి. తండ్రి బలవంతం మీద sslc వరకు పూర్తి చేసిన కామేశ్వరన్ ⅘ ఉద్యోగాలు చేసి అందులోనూ నిలకడగా నిలబడలేక… మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు లో ఉద్యోగంలో చేరారు. ఇలా ఉన్న కొన్నిరోజుల తర్వాత … అతనికి ఒక జ్యోతి దర్శనం అయింది. ఆ జ్యోతిని చూడగానే నమస్కారం చేసి స్పృహ తప్పి పడిపోయారు. ఇలా ⅔ సార్లు జ్యోతి దర్శనం అవ్వడంతో…. తన జన్మ కర్తవ్యం లీలగా గుర్తొచ్చి ఇక సంసార బాధ్యతలు విడిచి సన్యాసం స్వీకరించాలని బలంగా అనిపించేసరికి… ఇలా కాదనుకొని ఒక దట్టమైన అరణ్యానికి చేరి దగ్గరలో ఉన్న బాణ తీర్థంలో వరుణ గుహలో 26 రోజుల పాటు ధ్యాన సమాధిలో ఉండిపోయారు.
ఇది రాఖాడి బాబా వారికి తెలిసిన ఆ బ్రాహ్మణ యువకుడి కథ . ఇతని గురించి వినగానే … బాబాగారు వెంటనే అతని కలవాలని సాయంత్రానికి బయలుదేరి పోయారు… ఆ వరుణ గుహను చేరుకోగానే … ఈ కామేశ్వరన్ సహజంగా బండరాయిలా ఉన్న రాతిమీద పద్మాసనంలో కూర్చుని…. సమాధి స్థితిలో ఉన్నారు. అతని ఎదురుగా హోమగుండం ఉంది. కామేశ్వరన్ ను చూడగానే బాహ్య స్పృహ కూడా లేకుండా.. ఆ సమాధి స్థితిలో ఉన్న కామేశ్వరన్ ను చూస్తూ ఉండిపోయారు. రాబోయే కాలంలో కాబోయే గురు శిష్యులు…. ఇతన్ని చూస్తూ ఆనందస్థితిలో తనని తాను మైమరచి పోయారు బాబావారు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న కామేశ్వరన్ కు భ్రుకుటి స్థానంలో జ్యోతి ప్రకాశం దర్శనమిస్తూ…. శరీరం పులకించినట్లుగా… ఒక అద్వితీయమైన భావన కలుగుతూ ఉండగా .. అప్పటివరకు తన శరీరంలో ఉన్న నీరసం కాస్త తొలగిపోయి…. సత్తువ వచ్చినట్టు ఉండడంతో… కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న బాబా వారిని చూసే సరికి బాబా గారు ఒక్క క్షణం లేచి నిలబడి… అతనికి అభయం ఇస్తున్నట్లుగా…. అతని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే.. ఇతనే నా సద్గురువు అని లేచి నిలబడి ఆసనమును సమర్పించారు. వాళ్లిద్దరి మధ్య మౌనం, చూపు తప్ప మాటల్లేవు. తన్మయత్వమే ఆవరించింది. ఆ తర్వాత బాబాగారు కామేశ్వరన్ కేసి చూస్తూ… ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే తపస్సు చెయ్యి అని చెప్పి అతనికి ఆకలిగా ఉంది అని స్వయంగా వంట చేసి పెట్టారు… నిన్ను కన్న కొడుకులా చూసుకునే గురువు దొరుకుతారు అని తన తండ్రి చెప్పిన మాటలు కామేశ్వరన్ కు లీలగా గుర్తుకువచ్చి… ఆనందంతో … కన్నీటిపర్యంతం అయ్యారు. ఆ అర్ధరాత్రి సమయంలోనే బాబాగారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇదంతా నిజామా? అనే ఆశ్చర్యంలోనే కామేశ్వరన్ ఉండిపోయారు.
వెళ్తూ గురుముత్తు అయ్యనార్ అతను ఉండే ప్రదేశమును చెప్పి వెళ్ళిపోయారు. అలా అప్పుడప్పుడు బాబావారిని చూడటానికి కామేశ్వరన్ వచ్చేవారు.. వచ్చి రాగానే దర్శనం అయింది కదా.. అని అనేవారు.. అంటే మరో రకంగా చూసావు కదా ఇక వెళ్ళు అని….. ఆ మాటల అంతరార్థం అర్థం అయ్యి…. బాధతో గురువు దగ్గర కాసేపు కూడా ఉండలేకపోతున్నానే అని అనుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ విషయం బాబా గారు గమనించినప్పటికీ…. కామేశ్వరన్ ను అన్ని రకాలుగా సాధనకు తీర్చిదిద్దాలని కాస్త కటువుగా వ్యవహరించేవారు. తనని చూడడానికి వచ్చిన వారిని బాణ తీర్థం వెళ్లి కామేశ్వరన్ ని దర్శించమని చెప్పి…. తిరిగి వచ్చిన వారి ద్వారా శిష్యుడిని పొగుడుతూ ఉంటే మురిసిపోయే వారు. కాకిలా 100 సంవత్సరాలు బతికే కన్నా .. తిరిగి జన్మలేని విధంగా సాధన చేసి… హంస లా కొంత కాలం బతికినా చాలు అంటూ… నీ సాధనకి మరింత బలం చేకూర్చమని …. కొన్నాళ్ళు పాప నాశనంకి వెళ్ళి సాధనా చేసుకోమని పంపారు. బాబా వారే ఈ కామేశ్వరన్ కి సన్యాస దీక్ష ఇచ్చి పూర్ణానంద అని దీక్షా నామం ఇచ్చారు. ఒకసారి ఈ పూర్ణానంద కి 5 రోజులు బిక్ష దొరకలేదు. అదే సమయంలో రాఖాడి బాబా వారికి కూడా దొరకలేదు. 6 వ రోజు ఒక వ్యక్తి పూర్ణానంద గారికి బిక్ష ఇవ్వగానే ముందు గురువుగారికి ఇవ్వాలని పరుగున వచ్చి గురువుకు సమర్పించారు. గురువు పట్ల అతనికి ఉన్న గౌరవం, భక్తి,ఆత్మ నివేదన చూసి పొంగిపోయేవారు. ఒకసారి నాగమణి నీ పలుమార్లు ఇచ్చి తీసుకోమని చెప్పినప్పటికీ… ఎన్ని సార్లు ఇస్తే అన్ని సార్లు దానిని తిరస్కరించారు. పశుపక్ష్యాదులు కూడా పూర్ణానంద గారి దైవత్వాన్ని గుర్తించేవి. అతనితో స్నేహ భావంతో మెలిగేవి. రాఖాడి బాబా వారు ఎన్నో రకాలుగా పూర్ణానంద గారి సాధనా స్థితిని పరీక్షిస్తూ…
అనేక పవిత్ర ప్రదేశాలు మరియు దేవాలయాలు దర్శించుకుంటూ…. దేశం నలుమూలలా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించి …తన గురువు ఆదేశానుసారం స్వామీజీ 1969 సంవత్సరంలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు.మొదట హాటకేశ్వరం లోనే స్వామివారు నివసించేవారు. స్వామీజీ దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వచ్చి… స్వామి వారి ఆశీస్సులు తీసుకునేవారు. ఇలా తన కీర్తి వలన క్షేత్రానికి… భక్తులకు ఇబ్బంది కలగకూడదని… ఎందుకంటే …..స్వామీజీ యొక్క స్వరూపంలో ఉన్న దివ్యతేజస్సు, చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రకాశం వలన వెతుక్కుంటూ వచ్చిన వారందరికీ ఆయన తన ఆశీస్సులను సమృద్ధిగా కురిపించి, వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించారు..1977లో స్వామీజీ తన శిష్య భక్తులతో….. సుండిపెంటలో.ఆశ్రమాన్నీ ఏర్పాటు చేసుకొని…..శాశ్వతంగా అక్కడే స్థిరపడినప్పటికీ హాటకేశ్వరానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. . అప్పటి నుండి ఆ ఆశ్రమం క్రమంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది . మరియు దూర ప్రాంతాల నుండి సాధకులను ఆకర్షించింది. ఆయన చెప్పినట్లే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం శ్రీశైలంలో ముగిసింది, అక్కడ ఆయన ఏప్రిల్ 6, 2000న 61 సంవత్సరాల వయసులో మహాసమాధి చెందారు.
ఆ తర్వాత ఈయన గురించి వివరంగా విన్న బాల గణపతి అమ్మ సాధన అంటే ఏమిటి? సాధన మనం ఎందుకు చేయాలి? అని అడిగేసరికి సాధన అంటే చాలామంది ఏదో అనుకుంటారు. ఏమీ ఉండదు… మనసును స్థిరపరుచుకోవడం, మనసుని అదుపులో ఉంచుకోవడం. ఇప్పుడు భోగ జీవితంలో ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా కోరికలవెంట,ఆశలవెంట,ఆశయంవెంట, సంకల్పాల వెంట,ఆలోచనలవెంట….. ఇంట్లో విషయాలు…. పక్కవాళ్ళ విషయాల గురించి….. బంధుమిత్రుల విషయాల గురించి…. సంతానం గురించి…. ఇలా రకరకాల ఆలోచనలు ఉద్యోగం,వ్యాపారం,ఆర్థిక సమస్యల గురించి… మానసికంగా,శారీరకంగా శ్రమలు పడుతూ…. రకరకాల ఆలోచనలు చేస్తూ…. ఏ రోజుకారోజు తన జీవ శక్తిని తగ్గించుకుంటూ ఉంటుంది. అదే మనసుని స్థిరపరచుకుంటూ….. కనీస అవసరాలను మాత్రమే చూసుకుంటూ…. మనసుని అదుపు చేసుకుంటూ….. కోరికలు,ఆశయాలు వెనక వెళ్లకుండా ఉన్నంతలో…. తక్కువలో…. తక్కువ కోరికలు ఉంచుకుని …..కోరికలు తగ్గించుకుంటూ, కోరికలు అదుపు చేసుకోగలిగితే దానినే సాధన అంటారు. అంటే మనసు యొక్క శక్తిని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే… అంత నిగ్రహ శక్తిగా నిలబడితే మన మనసు మనుష్యత్వం నుంచి మాధవత్వంలోకి…. మాధవత్వం నుంచి యోగత్వానికి…. అటు నుంచి యోగత్వం నుంచి దైవత్వం లోనికి మారుతుంది. ఇలా మనసును అదుపు చేయడాన్నే సాధన అంటారు.
ఇప్పుడు సాధన ఎందుకు చేయాలి? అంటే మనసు అదుపు చేసుకోవడానికి… అసలు మనసును ఎందుకు అదుపు చేయాలి అంటే…. మనం మరణించిన విషయం మన మనసు నమ్మదు. ఇప్పుడు నేను చనిపోయాననుకో! నేను చనిపోయిన తర్వాత, నా ఆత్మ నేను చనిపోయానా లేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నమ్మదు. నేను చనిపోలేదు అని నా శవం చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నా శరీరం దహనం చేసేస్తారో…. అప్పుడు దానికి అర్థమవుతుంది. ఓహో! నేను నిజంగానే చనిపోయి ఉంటాను… అని అలాగే మనం మోక్షం పొందామా లేదా అనేది మనసుకు సందేహం ఉంటుంది. అది అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. ఓహో! నేను మోక్షం పొందాను… నేను చనిపోయాను అని మనసు ఎప్పుడైతే నమ్ముతుందో…. అప్పుడు ఆత్మ శూన్యంలో కలిసిపోతుంది. దాని కోసం సాధన చేయాల్సి ఉంటుంది. అనేసరికి
అమ్మ ఇక్కడ మనసు అంటే ఏమిటి.? ఆత్మ అంటే ఏమిటి? అనేసరికి మనలో ప్రాణశక్తి మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి జీవశక్తిగాను… రెండు కుండలీని శక్తిగాను…. మూడు ఆత్మ శక్తిగాను ఉండేది. జీవ శక్తిగా ఉండేది మనసు రూపంలో ఉంటుంది. ఆత్మ శక్తిగా ఉన్నది ఆత్మ రూపంలో ఉంటుంది. మనసుని జీవాత్మ అంటారు. ఆత్మని పరమాత్మ అంటారు. ఆత్మ శివుడు అన్నమాట! మనసు అనేది జీవుడికి ఉండేది అన్నమాట! మనసు ఆత్మ వేరువేరుగా అనుకోకూడదు. ఎందుకంటే మనసు స్థిరపడితే పరమాత్మ, స్థిరంగా లేకపోతే అది జీవాత్మ అనుకోవాలి. ఇక కుండలినీ శక్తి అంటే… ఇడా పింగళ సుషుమ్న నాడులు అని మూడు నాడులు ఉంటాయి. ఈ సుషుమ్నా నాడిలోనికి ప్రవహించే శక్తి కుండలిని శక్తి అంటారు. ఈ కుండలిని శక్తి మనకి మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి బ్రహ్మ రంధ్రం దాకా వెళ్ళిపోతే…. మనసు, ఆత్మ అని రెండు స్థితులు ఉండవు. జీవాత్మ శివాత్మ అనే రెండు స్థితులు ఉండవు. ఏకత్వ స్థితి ఉంటుంది. ఏకత్వ స్థితికి వెళుతుంది ఇక్కడ ఇది వెళ్లే మార్గంలో మాయలు, మర్మాలు, ఆలోచనలు,సంకల్పాలు, స్పందనలు, ఆశలు ఇవన్నీ ఉంటాయి. నీకు బాగా అర్థం అవ్వాలి అంటే…. వైకుంఠపాళీ ఆటను చూశావు కదా! అంటే ఆ…. చూశాను…. 131 గదులు ఉంటాయి…. పెద్ద పాము ఉంటుంది…. ఆ తర్వాత చిన్న చిన్న పాములు…. నిచ్చెనలు ఉంటాయి…. అదే కదా ఆట! అంటే, అవును అన్నాడు. ఆ వైకుంఠపాళీ ఆటలో ఆశలు అనే నిచ్చెనలు ఉంటాయి… కోరికలు అనే పాములు ఉంటాయి…. అనుకో! ఇప్పుడు ఒక్కొక్కసారి పాము నోట్లో పడతాము, ఒక్కొక్కసారి నిచ్చెన ఎక్కేసి ముందుకు వెళ్ళిపోతాము. అది మన అదృష్టమును బట్టి… ఆడే ఆటను బట్టి ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. పెద్ద పాము ఎక్కడ ఉంటుంది అంటే , 107వ గడిలో ఉంటుంది.107 లో తల ఉంటే తోక ఒకటిలో ఉంటుంది. ఆ పాము నోట్లో పడితే… మళ్లీ మొదటికి వచ్చేయాలి కదా అమ్మ! అనేసరికి అవును…. ఇప్పుడు106 కి వచ్చాక వాడు 108 కి వెళ్లిపోయాడు అంటే …ఆట అయిపోయినట్టే. మధ్యలో పెద్ద పాము నోట్లో పడ్డాడు అంటే, మళ్ళీ ఒకటికి వచ్చేస్తాడు. అంటే పునః సృష్టికి వస్తాడు. ఏదో ఒక కోరిక పెట్టుకున్నావు… ఏదో ఒక ఆలోచన పెట్టుకున్నావు… ఏదో ఒక సంకల్పం పెట్టుకున్నావు… లేదంటే ఏదైనా ఆశపడ్డావు లేదా ఏదైనా భయపడ్డావు….ఇది కావాలి, అది కావాలి అని అనుకున్నావు… ఇది సాధించాలి, అది సాధించాలి అని అనుకుంటున్నావు… ఇది పొందాలి, ఇది చెయ్యాలి ఆనంద పడాలని అనుకున్నావు…. అనుకో! అప్పుడు ఆ కోరికకి తగ్గట్టుగా ఆ కారణానికి తగ్గట్టుగా మళ్లీ జన్మకి వెళ్తావు. అంటే పెద్ద పాము నోట్లో పడతావు. ఆ పెద్ద పాముని మహామాయ అంటారు. ఆ మహా మాయ ఆదిపరాశక్తి చేస్తుందన్నమాట! ఆట అయిపోయింది అనుకుని అంతంలోనికి వెళ్లేటప్పుడు కూడా నీకు మాయ పెడుతుంది.
ఆ మాయను తట్టుకొని నిలబడగలిగితే …..ఏమాయలేని స్థితికి 108వ గడిలోకి వెళ్తావు. లేదంటే 107వ గడిలో పెద్ద పాము నోట్లో పడ్డావు అంటే ఒకటికి వచ్చేస్తావు. మళ్లీ ఒకటి నుంచి 106 దాకా నువ్వే ఆడుతూ ఉండాలి. అది నిచ్చెనలోకి పడొచ్చు…. పాము నోట్లో పడొచ్చు…. చిన్న పాము నోట్లో పడితే పునః జన్మలు, నిచ్చెన ఎక్కితే ఉన్నత జన్మలు, ఉన్నత స్థితికి వెళుతూ ఉంటారు. అది నీ యొక్క సంకల్పమును బట్టి, నీ యొక్క కర్మఫలమును బట్టి, నువ్వు చేసిన కర్మ ఫలాల ఫలితములు బట్టి ఆధారపడి ఉంటుంది. ఆట నువ్వు త్వరగా పూర్తిచేసుకుని 108 కి వెళ్ళిపోయావు అనుకో! ఇంక నిన్ను ఎవరు ఏమీ చేయరు.
మోక్షం అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? అని బాల కుమారస్వామి అడిగేసరికి…. మోక్షం అంటే ఏ అనాది శూన్యం నుంచి నువ్వు వచ్చావో… ఆ అనాది శూన్యానికి తిరిగి వెళ్ళిపోవడాన్ని మోక్షం అంటారు. ముక్తి అంటే మన ఇష్ట దైవంలోకి ఐక్యం చెందటం…శివుడిలోనో… అమ్మవారి లోనో ….లేకపోతే ఆంజనేయస్వామి,విష్ణుమూర్తి ,గాయత్రి, బాల, దుర్గ ఇలా వాళ్లలో ఐక్యం అవ్వడాన్ని ముక్తి అంటారు. ఆ ముక్తి పొందిన వాళ్లు ఆ ముక్తిలో కూడా ఐదు రకాల ముక్తులు ఉంటాయని చెబుతారు. ఈ ఐదు రకాల ముక్తులు కూడా వరుసగా ఇలా ఉంటాయి. సాలోక్య , సామీప్య, సారూప్య, సాయుజ్య, సర్ష్టి. ఇలా ఈ పంచముక్తులు కూడా పునః జన్మలోకి కారణ, అకారణజన్మలకి కారణమవుతూ ఉంటాయి. అంటే లోకకళ్యాణార్థం జన్మలు తీసుకోవడాన్ని కారణజన్మలు… కారణం లేకుండా తీసుకునే జన్మలను అకారణజన్మలు అని అంటారు. అంటే ముక్తి పొందిన జీవి ఏదో ఒక కారణం చేత లేదా కారణం లేకుండా పునః జన్మ పొందే అవకాశం ఉంటుంది. అదే మోక్షం అంటే ఇక పునః జన్మలేని స్థితి అన్నమాట. అంటే శూన్యంలో కలిసిపోతాడు అన్నమాట! ఏ శూన్యంలో నుంచి వచ్చాడో… ఆ శూన్యంలో కలిసిపోతాడు అనగానే….. బాలగణపతి ఉన్నట్టుండి
అమ్మ శూన్యం నుంచి ఆది రుద్రుడు వచ్చాడని చెబుతారు. ఆది రుద్రుడు నుంచి మనం వచ్చామని చెబుతారు. మనం తిరిగి ఆది రుద్రుడులోకి వెళ్ళాలి గాని…. శూన్యంలోకి ఎలా వెళ్తాము? వెళ్ళము కదా? అంటే మనం ముక్తినే పొందుతాం కానీ… మోక్షం కాదు కదా! దానికి అవకాశం లేదు కదా! అనగానే నువ్వు చెప్పింది ఒకరకంగా అది కూడా నిజమే… కానీ అది సత్యం కాదు. ఎందుకంటావా! శివుడు ఏకత్వ స్థితిలో ఉంటే మనమంతా కలిసి ఆయనలోకి వెళ్లే పరిస్థితి. శివుడు ఏం చేశాడు….ఏకత్వస్థితి నుంచి భిన్నస్థితికి వెళ్ళాడు. ఒకటి నుంచి 64 గా మారాడు. ఆ 64 …64 కోట్లు…. ఆ 64 కోట్ల నుంచి కోటానుకోట్లు విభజన చెందాయి. ఈ విభజన చెందిన జీవులన్నీ కూడా ఒకదానికి ఒకటి స్వతంత్రంగా స్వేచ్ఛగా విడిపోయి… ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అందరూ శివుల్లే. మరి శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు. శూన్యం నుంచే వచ్చాడు కదా! అందరూ శివుళ్లు కూడా ఆయనలోనే ఐక్యం అవడం కాదు కదా! శూన్యంలోనికి ఐక్యం అవ్వాలి కదా! అందుకని మోక్షం అని చెప్పారు. అదే శివుడిలోకి ఐక్యం అయ్యారు అనుకో ! అది ముక్తి. ఓహో అవునా! అది నిజమే కదా…. శివునిలో ఐక్యమైతే ముక్తి. శివుడే శూన్యంలో ఐక్యం అయ్యేలా చేస్తే… అది మోక్షం అన్నమాట. అంటే ఇప్పుడు మనం మోక్షం పొందటానికి శివుడు సహాయ సహకారాలు అందిస్తాడా! అంటే శుభ్రంగా అందిస్తాడు. ఆయన తనలో ఐక్యం చేసుకోకుండా… శూన్యంలో ఐక్యం చేసే విధి విధానం మనకి అరుణాచలంలో ఉంది. అలా ఎందుకు అంటే…. మన పరమహంస గారే చెప్పారు కదా! ఆయన అనుభవాల్లో తన పిండ దేహాన్ని శివుడు దహనం చేసినట్టుగాను… ఆ తర్వాత లింగ దేహాన్ని విశ్వశూన్యంలో కలిపేసినట్టుగాను… కలిసిపోయినట్టుగా చెప్పడం జరిగింది కదా! అంటే ఏమోనమ్మా… నువ్వు చదివి ఉంటావు. నేను చదవలేదులే… నాకు అర్థం కాదు కదా! సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి అర్థం అయింది.ఒకటి ఆయన దహనం చేసేస్తాడు… రెండోది శూన్యంలో కలిసిపోయేటట్లుగా చేస్తాడు… అంటే మోక్షం మాత్రం మనకి అందుతుంది. ముక్తి పొందకూడదు… మోక్షం పొందాలి… అని చెప్పేసి అర్థమవుతుంది. సరే ఇప్పటికీ మోక్షానికి ముక్తికి తేడా తెలిసింది.
అవునమ్మా! అప్పుడు తన అనుభవాలలో దేవుడు లేడు… శివుడు లేడు అని చెప్పేసి అనుభవ అనుభూతి పొందానని లోకానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు నాలాంటి శివ భక్తులు ఉన్నారు. దేవుడు ఉన్నాడు… శివుడు ఉన్నాడని,నేను శివలింగారాధన చేస్తున్నాను. నా మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? లేడు అని చెప్తే? అని బాలగణపతి అనేసరికి….
శివనందిని:- నాయనా! ఆయన అనుభవం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ అనుభవం నిజమా కాదా అని ఎవరికి వారే అనుభవించి తెలుసుకోండి అని కూడా మళ్లీ చెప్పాడు. అంటే ఏంటంటే… ఆదిలో శివుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. అంతంలో దేవుడు లేడు. శివుడు లేడు అని ఆయన అనుభవ అనుభూతి పొంది చెప్పారు. ఆ అనుభవం అనుభూతి నిజమా? కాదా? అని మీరు వ్యక్తిగతంగా సాధన చేసి తెలుసుకోండి అని కూడా చెప్పారు. ఇది సత్యమా కాదా? అంటే నా వరకు…. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది సత్యం. అది నిజమా కాదా తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లే సాధన చేసి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన,.. నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే వేదం, నన్ను నమ్ముకుని మీరు అనుసరించండి అని చెప్పలేదు. తన అభిమతాన్ని మతంగానూ చెప్పలేదు. సిద్ధాంతంగానూ చెప్పలేదు. కాకపోతే ఇలా నేను అనుభవ అనుభూతి పొందాను…… మా తాతయ్య ఒకప్పుడు ఉన్నాడు….. ఇప్పుడు లేడు…. మా తాతయ్యని చూసిన వాళ్ళు ఉన్నారు….. అన్నది ఎలా అయితే సత్యమో ….దేవుడు ఒకప్పుడు ఉన్నాడు…. దేవుని చూసిన పూర్విక మహర్షులు, ఋషులు వీళ్ళందరూ ఉన్నారు.. వాళ్లు ఏ విధంగా ఆయన్ని చూసారో… ఏ విధంగా ఆయనతో మాట్లాడారు అన్నది కూడా మనకి ఇతిహాస పురాణాలలో చెప్పటం జరిగింది. కాబట్టి వాటి ఆధారంగా చూసుకొని శివుడు ఇలా ఉన్నాడు… శివుడు ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకొని సాధన చేశాడు. చేసి అంతంలోకి వచ్చేసరికి శివుడు లేడని గ్రహించాడు. కేవలం శివతత్వం మాత్రమే ఉన్నదని గ్రహించారు. దైవత్వమే ఉంది అని గ్రహించారు. అంటే ఆకారశివుడు నిరాకారుడు అయ్యాడు అని… తన ప్రత్యక్ష అనుభవాలతో, ప్రత్యక్ష నిదర్శనాలతో,ప్రకృతి ఇచ్చిన సాక్షాధారాలతో మనకి నిరూపించడం జరిగింది. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పూర్వం మన వేదాల్లోనూ, ఇతిహాసాలోనూ… సాకారశివుడు కాస్త నిరాకార తత్వంలో ఉన్నాడు అని చెప్పటమే జరిగింది. కానీ ఆకార శివుడు నిరాకారుడు ఎలా అయ్యాడు అనేది ఈయన అనుభవ పూర్వకంగా తెలుసుకొని మనకి చెప్పడం జరిగింది. లోకానికి చెప్పటం జరిగింది. అది నిజమా కాదా అనేది నువ్వు ప్రయత్నించి తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు లేడు అనేది ఆయన చెప్పాడు. అది నిజమా కాదా అనేది నువ్వు సాధన చేసి తెలుసుకో! అప్పుడు నువ్వే లేవని తెలుస్తుంది. నువ్వే లేవు అంటే దేవుడు లేనట్టే కదా! ఇప్పుడు వైకుంఠపాళీ లో 106 వరకు ఆట ఉన్నట్టుగా కనబడుతుంది. 107 లో నువ్వు మాయలో పడితే….మళ్లీ ఆట మొదలైపోతుంది. అదే 108లోకి వెళితే…. నువ్వు ఆడాల్సిన అవసరం లేదు కదా! నీ ఆట కనబడదు కదా! ఆట అయిపోయినట్లే కదా !
ఆయన 108వ గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నది ఏమీ లేని స్థితి… ఉందో లేదో తెలియని స్థితి… ఇక్కడ శివుడు లేడు… శివాంశ లేదు… నేను లేను… నేను కానీ నేను లేను… ఏమీ లేదు… ఏమి ఉన్నదో తెలీదు… ఏదో ఉంది… అది ఏంటనేది తెలీదు. దాన్నే పూర్ణ శూన్యం అనేది చెప్పడం జరిగింది. నువ్వు కూడా 108వ గడిలోకి వెళితే, నీకు అదే స్థితి వస్తుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది అని ఘంటా పదంగా చెబుతున్నాడు. నేను పొందిన అనుభవ అనుభూతిని అందరూ పొందారు. కాకపోతే అందరూ చెప్పలేదు. నేను చెబుతున్నాను అని లోకానికి చెప్పారు. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒకటవ గడి నుంచి ఆట మొదలు పెట్టు. అదృష్టం బాగుండి మహా మాయను దాటావు అంటే ….108వ గదిలోనికి వెళ్లిపోయిన తరువాత నువ్వే అనుభవ అనుభూతి పొందుతావు. నీకే తెలుస్తుంది. అదే సాధన పరిసమాప్తి. ఒకటవ గడిలో మొదలుపెడితే సాధన ఆరంభం అంటారు. 108లో వెళ్లి ఆగిపోయిన దాన్ని సాధన పరిసమాప్తి అంటారు. అంటే ఏంటి…. నేను చనిపోయాను… నేను అనేది లేదు…. నేను కానీ నేను అనేది లేదు…. దేవుడు లేడు…. శివుడు లేడు…. జీవం లేదు… అనే జ్ఞాన అనుభవ అనుభూతిని పొందుతావు. దాన్ని మనం సాధన పరిసమాప్తి అని చెప్పడం జరిగింది…అనగానే బాలగణపతి కాస్త ఒకటి నుంచి 108 దాకా పాములు ఉంటాయి కాబట్టి… ఆశలు, కోరికలు అన్నీ ఉంటాయి కాబట్టి…. ఈ లోకమంతా , ఈ ప్రపంచమంతా ఈ జగత్తు అంతా మనకి సత్యంగానే కనపడుతుంది. ఎప్పుడైతే 107వ మహామాయను దాటేస్తామో….అప్పుడు 108 లోకి వెళ్ళేసరికి మనకి ప్రపంచం కనపడదు… జగత్తు కనబడదు… ఏది కనపడదు. కనిపించేది అంతా అసత్యం అని, కనిపించనిది అంతా సత్యమని అంటారు. అంటే అక్కడికి వెళ్లేసరికి దేవుడనేవాడు, జీవుడనేవాడు ఉండడని… అనుభవ అనుభూతిలో తెలుస్తుంది అని… ఆయన తెలుసుకున్నాడు. మనం తెలుసుకోవాలి. ఇదే కదా సాధన పరిసమాప్తి అంటే….అనగానే అవును! అని శివ నందిని అనేసరికి…. ఇప్పుడు మహామాయ అనేది ఏమై ఉంటుంది? అని అంటే….వందకి 99% ఎంతోమంది చెప్పడం ఏమిటంటే, మహా మృత్యు
భయం వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత శాశ్వత మృత్యువు వస్తుంది. తద్వారా మన శరీరాలన్నీ నాశనం అయిపోయి… శూన్యం అయిపోతాయి అనే జ్ఞాన అనుభవ అనుభూతి పొందడం జరుగుతుంది. దానితో వందకి 99% మంది ఈ మృత్యువుకి భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అందులో ఆదిపరాశక్తి లాంటివాళ్ళు ఈ మృత్యు భయానికి భయపడిపోయి…మోహ మాయ అనగా నేను చనిపోతే నా సంతానం ఏమైపోతుందో అని వెనక్కి వచ్చి ఒకటవ గడిలో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా పునః సృష్టి చేసిన వాళ్ళు ఉన్నారు. లోక కళ్యాణార్థం వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు బుద్ధుడే ఉన్నాడు…. కోరికలే కష్టాలకి మూలం అని తెలుసుకొని…. కోరిక లేని సమాజం చూడాలని…. కోరికలతో మళ్లీ ఆయన పునః సృష్టికి వచ్చేసాడు .107వ గడిలో పాము నోట్లో పడ్డాడు. మహామాయకు గురి అయ్యాడు. మళ్ళీ ఆ చిన్న కోరిక కోసం ఒకటవ గడికి వచ్చిన వచ్చి. పునః సృష్టి చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతివాడు తెలిసి తెలియక ఏదో ఒక మాయలో పడిపోవడం…. స్పందించడం…. ఆశించడం… భయపడటం…. ఆలోచించడం…. సంకల్పించడం… ఇలా ఏదో ఒకటి చేస్తారు. దాన్ని మాయా అనొచ్చు. మహా మాయ అనొచ్చు. ఓహో! అంటే దేనికి స్పందించకూడదు…..
దేని గురించి ఆలోచించకూడదు… దేని గురించి భయపడకూడదు…దేని గురించి బాధపడకూడదు అంటావు….! అవును, ఇప్పుడు వైకుంఠపాళీ ఆట ఆడుతున్నావు.. పాము నోట్లో పడ్డావు …అయ్యో! అని ఆవేశ పడిపోతావు… ఆవేదనకు గురి అవుతావు…నిన్ను నువ్వు అరుచుకుంటావు… తిట్టుకుంటావు… అదే నిచ్చెన ఎక్కంగానే ఆనందపడతావు… సంతోషపడతావు… నా అంత అదృష్టవంతులు లేరని నీకన్నా పైకి నేను ఎక్కుతాను అని చెప్పేసి…. సంబరపడిపోతూ ఉంటావు. అహం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్లేసరికి ఆ అహాన్ని దెబ్బ తీసే పాము నోట్లో పడేసరికి…. అయ్యో! అనవసరంగా పందెం పడింది. అనవసరంగా పాము నోట్లో పడ్డాను. ఇది కాకుండా ఉంటే బాగుండేది అని ఆవేశపడతావు. కంగారు పడతావు. ఆలోచిస్తావు…ఏం చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ ఆట కొనసాగిస్తావు. ఇలా ఎలా అయితే ఆటలో నువ్వు ఎలా అయితే చేస్తున్నావో అలాగే ప్రకృతిలో ప్రతి జీవనాటకంలో కూడా ఆనందాలు పడుతూ ఉంటుంది.. బాధలు పొందుతూ ఉంటుంది… విరహవేదనలు, ప్రేమలు పొందుతూ ఉంటుంది. అంటే రెండు ప్రవృత్తులు ఉంటాయని తెలుసుకోవాలన్న మాట! ఇందులో ఏక ప్రవృత్తి అనే స్థితికి నువ్వు రాగలగాలి. అంటే దీనినే స్థితప్రజ్ఞత అంటారు. అంటే సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిని పొందడం అన్నమాట. ఆ స్థితిని పొందావు అంటే…. పిల్లవాడు పుట్టినా ఆనంద పడవు. వాడి అంత్యక్రియలకి బాధపడవు. ఆనందం, బాధ అనేది ఉండదు. ఒకటే స్థితి ఉంటుంది. అది ఏమీ తెలియని , ఏమీ అర్థం కానీ ఒక ప్రశాంతమైన స్థితి. ఇది అని చెప్పలేం. అది సంతోషమని చెప్పలేం. అది దుఃఖమని చెప్పలేం. అలా అని ఆనందం లేదా వేదన అని చెప్పలేం. ఒక విధమైన మనశ్శాంతి. ఒక విధమైన ప్రశాంత స్థితి. ఈ స్థితిని పొందటమే సాధన పరిసమాప్తి. దీనినే జీవన్ముక్తి అని కూడా అంటారు. అంటే బతికి ఉండగానే ప్రశాంత స్థితిని పొందగలిగితే ద్వంద ప్రవృత్తి అనే వాటికి దూరంగా ఉండి ఏకత్వంలో ఉండేవాడే జీవన్ముక్తుడు అన్నమాట! వాడిలో ఆనందం ఉండదు… దుఃఖము ఉండదు… ప్రేమ ఉండదు. అంతా కూడా సాక్షి భూతంగా చూస్తూ ఉంటాడు. అంతా గమనిస్తూ ఉంటాడు. పట్టించుకోనట్టుగా ఉంటాడు. అంతా పట్టించుకోనట్టు ఉంటాడు. ఎవరి గురించి ఆలోచించడు. ఇప్పుడు బిర్యానీ తినాలి అనిపిస్తే తిన్నాను అన్నట్టుగా ఉంటాడు . పచ్చడి మెతుకులు తినాలని ఉంటే పచ్చడి మెతుకులు తిని ఉంటాడు. బిర్యానీ తిన్నా అని ఆనందపడడు …పచ్చడి మెతుకులు తింటున్నా అని బాధపడడు. వాడికి కావలసిందల్లా ఆకలి తీర్చడానికి ప్రకృతి ఏమి ఏర్పాటు చేసిందో…. దానిని సంతృప్తిగా తినటమే. తింటాడు. తృప్తి పొందుతాడు. అంతేగాని రుచులకి పోడు. అయ్యో బిర్యానీ తింటున్నా అని కోరికలు కోరుకోడు. అయ్యో పచ్చడి మెతుకులు తినాల్సి వచ్చిందని బాధపడడు. ఇలాంటి పరిస్థితిని పొందడం అనేది….మనసుని ఆధీనం చేసుకోవడం అనేది….నిగ్రహించుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని ఇంద్రియనిగ్రహం అంటారు. మనోనిగ్రహం అంటారు. ఈ స్థితిని పొందడమే మోక్షం అవుతుంది. అదే జీవన్ముక్తి. ఇది బతికి ఉండగానే చాలామంది యోగులు పొందారు. పొందుతున్నారు. ఈ స్థితిని పొందడమే సాధన పరిసమాప్తి అవుతుంది. ఈ జీవన్ముక్తియే మోక్షం అని కూడా చెప్పవచ్చును.
అనేసరికి ఓహో! మోక్షం అంటే మనం బతికి ఉండగానే మరణం పొందే స్థితి అన్నమాట! మనం చనిపోయాక పొందే స్థితిని మనం బతికే ఉండగానే చూడడమే…. అనుభవ అనుభూతి పొందడాన్నే మోక్షం అని అంటారు. అంతేగాని మనకి ఏ కోరికలు ఉన్నాయి…. ఏ కోరికలు కోరికల్లో పడుతున్నాము…. ఏ మాయలో పడుతున్నాము…. ముక్తి పొందుతున్నామా? మోక్షం పొందుతున్నామా? అని చెప్పేసి చూడడమే… తెలుసుకోవడమే సాధన అవుతుంది. తెలుసుకోవడం పూర్తి అయితే సాధన పరిసమాప్తి అవుతుంది. అది సాధించేదాకా సాధన ఆపకుండా ఉండటమే మాయని జయించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా ఉంది…. ఆ సినిమాలో హీరో బతికే ఉంటాడా చచ్చాడా అనేది చూస్తూ ఉన్నాం అనుకో! విలన్ వాడిని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ…. నానా కష్టాలు పెడుతూ…. చివరిదాకా ఏమవుతుంది అనుకుంటూ ఉంటే…. చివరికి హీరో బతికే ఉంటాడు… అని తెలుసుకున్నావు అనుకో!ఆనందపడతావు. ఇక్కడ ఏంటంటే…. ఈ సినిమాని వాడు కదలకుండా మెదలకుండా మూడు గంటల సేపు చూడాలి. కానీ మనం కూడా ఏం చేస్తున్నాం…? మనం మోక్షం పొందేమా లేదా అని సాధన మొదలుపెట్టేటప్పుడు ఇదంతా కూడా ధ్యానానుభవం లాగా ఒక రికార్డు దృశ్యం లాగా కనపడుతూ ఉంటుంది. ఆ రికార్డు దృశ్యాన్ని మనం చూసి భయపడకూడదు…. బాధపడకూడదు… ఆశపడకూడదు… సాక్షి భూతంగా ఉండాలి. దాన్ని మార్చాలి… దాన్నేదో చేసేయాలి అని… స్పందించి ఏమీ చేయకూడదు. చివరిదాకా అంటే మనం మోక్షం పొందామా లేదా అని చూడాలంటే సినిమాని ఎలాగైతే మూడు గంటల పాటు చూస్తావో….అలాగే మనం మోక్ష సాధనా దృశ్యాన్ని… ఆ జగన్నాటకాన్ని కూడా చూస్తూ ఉండాలి. చూస్తూ చివరిదాకా ఉండగలిగితే చాలు. కానీ ఏంటంటే సినిమాని చూడకుండా ఆహార పదార్థాలు ఆపివేయవచ్చు.. సంతానానికి ఏమైనా సమస్యలు రావచ్చు…. కుటుంబ సభ్యులకి ఏదైనా సమస్యలు రావచ్చు…. మనకి ఏదైనా ఆర్థిక సమస్యలు రావచ్చు…. బంధు మిత్రులకు ఏదైనా సమస్యలు రావచ్చు…. లేకపోతే ఆ సినిమా చూడకుండా సినిమా హాలులో నుంచి బయటకు పంపించే విధంగా ప్రకృతి ఎన్నో రకాలుగా ఎన్నో మాయలు ఎలా అయితే పెడుతుందో…. పెట్టాలని అనుకుంటుందో…. చేసి చూపిస్తుందో…. అలాగే మనం మోక్ష సాధనకు కూడా ధ్యాన దృశ్యాలు చూడనివ్వకుండా…. ప్రకృతి చేస్తుందన్నమాట! అది ఆశలు పెడుతుంది …భయాలు పెడుతుంది… మాయలు పెడుతుంది… సంకల్పాలు పెట్టుకోమంటుంది… నువ్వు ఆ పాపం చేశావు… నువ్వు ఈ తప్పు చేశావు…. నీకు ఈ దోషం వచ్చింది…. నీకు మోక్షం రాదు… నీకు ముక్తే ఉంది… నీకు ముక్తి కూడా లేదు… నీది హీనమైన జన్మ… నీ బతుకు వృధా అని రకరకాలుగా ధ్యాన దృశ్యాలు చూపిస్తుంది. వాటిని కూడా నిగ్రహించుకొని, ఏం జరిగితే అది జరుగుతుందని….ఇదంతా రికార్డు దృశ్యమే, దీని ముందు ఏముంది, దీని తర్వాత ఏముంది?అని తెలుసుకునేదాకా నువ్వు ఓపిక పట్టాలి. అంతెందుకు? పరమహంస గారు ఉన్నారు. ఆయన 13వ ఏటా ధ్యాన దృశ్యాలు చూడటం మొదలుపెట్టారు. ఆయన 48 ఏళ్ళు వయసు వచ్చేసరికి ధ్యాన దృశ్యాలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే తనకి అసలు మోక్షం ఉందా లేదా? మోక్షం పొందానా? లేదా ? అని
ఆయన దాదాపు ఎన్నో రకాల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు… మాయలు…. అంతెందుకు ఆయన సంసార జీవితం నాశనం అయినా కూడా చలించకుండా ….ఆయన నిగ్రహించుకొని ధ్యాన దృశ్యాలు చూడటం జరిగింది. మోక్షం పొందా అని తెలుసుకున్నారు. లోకానికి చెప్పాడు .అంతే మనోధైర్యంతో ఆయన ఎదురుకున్న మాయలు ఏమిటి ?మర్మాలు ఏమిటి? సమస్యలు ఏమిటి? శారీరక ,మానసిక సమస్యలు ఏమిటి? ఏమి పరిత్యాగం చేశాడు? ఏ చక్రస్థితిలో ఏమీ వదులుకున్నాడు,... ఏం పొందాడు… ఏం చేశాడు… ఏంటి ?అనేది ఒక్కొక్క చక్రస్థితిలో వెతకగా….జరిగినవన్నీ … ఈ అనుభవాలు అన్నింటిని ఒక్కొక్కటి రాసుకుంటూ…. ఒక్కొక్క అధ్యాయంగా రాసుకుంటూవచ్చేసరికి….. కపాల మోక్షం పూర్తయింది. ఎక్కడ 13వ ఏట ?ఎక్కడ 48వ ఏట? ఆలోచించు…. మళ్ళీ అన్నేళ్లపాటు ఎక్కడ వదలకుండా ….ఆ ధ్యాన దృశ్యాలను చూస్తూ భయపడకుండా…. ఆశపడకుండా
……ఆశించకుండా…. ఏమీ పొందకుండా ….సంకల్పించకుండా ఇతర ఆలోచనలు చేయకుండా… దాన్ని సాక్షిభూతంగా తన మోక్షమరణం చూసేదాకా ఉన్నాడు. అంటే ఒకటవ గడి నుంచి మొదలుపెట్టి 108వ గడిదాకా ఆయన మధ్యలో ఎక్కడా ఆపకుండా ….ఆగకుండా ….ఆడుతూనే ఉన్నాడు. మోక్ష మరణమును పొందానని తెలుసుకున్నాడు. ఇదే విధంగా ప్రతి సాధకుడు కూడా చేయాలి .చేస్తే నాకు లాగానే మోక్షమరణం ఉందో లేదో తెలుసుకుంటారు. నేను పొందాను. నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకోండి. అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకు లాగానే సాధనలో ఎక్కడ ఆగద్దు. ధ్యాన దృశ్యాలకు భయపడవద్దు… ఏదీ ఆశించవద్దు….అని ఇవన్నీ చెప్పుకుంటూ రావడం జరిగింది. ఆయన మనకి మోక్షమార్గ దర్శకుడిగా మోక్షమార్గం చూపించడం జరిగింది. ఆయన మోక్షమార్గమును ఆసరాగా తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పురుష ప్రకృతిలో పురుషుడు ఏ విధంగా అయితే మాయలు మర్మాలు దాటుకొని ముందుకు వెళ్లాడో …… అదేవిధంగా ఆయన వెళ్లి చివరికి మోక్షం పొందడం జరిగింది. అదే విధంగా ఆది రుద్రుడు కూడా మోక్షం పొందడం జరిగింది అని సాక్షాధారాలతో నిరూపణ చేయడం జరిగింది. ఇప్పుడు నేను కూడా సాధన చేసి స్త్రీ ప్రకృతిలో స్త్రీ పరంగా స్త్రీ మోక్షం పొందిందా లేదా ? ఆదిపరాశక్తి మోక్షం పొందిందా లేదా? అనేది నేను తెలుసుకున్నాను అనుకో! స్త్రీ మూర్తులు కూడా సాధనకి పనికి వస్తారు .వాళ్లు కూడా మోక్షమును పొందుతారు. మోక్షం పొందటానికి అర్హత, యోగ్యత యోగం ఉన్నది . సాధన చేసి మోక్షం పొందటానికి స్త్రీ,పురుష భేదాలు లేవు అనేది లోకానికి తెలియజేయడానికి నన్ను స్త్రీ వ్యక్తిగత మోక్షం గురించి నా మరణాన్ని మోక్ష మరణంగా ఈ విశ్వం చేసి చూపించింది . అంతవరకు అంటే 108వ గడి వరకు నేను ఆట ఆడాల్సిందే .ఇప్పుడు నేను ఒకటవ గడిలో ఉన్నాను. 108వ గడి వరకు పరమహంస గారు ఎలా అయితే తన ఆటని ఆడారో…. ఎలా ఆపకుండా ఆడుతూ వెళ్లారో …నేను కూడా అలాగే ఆడగలిగితే 108 లో ఏముందో నేను తెలుసుకోగలిగితే ….అది స్త్రీ వ్యక్తిగత మోక్షం అవుతుంది. దానికోసమని సాధన మొదలుపెట్టాను. అదే మోక్ష సాధన అవుతుంది. ఇప్పుడు మోక్ష సాధన ఆరంభం అయింది… మోక్ష సాధన పరిసమాప్తి అవుతుందా లేదా అనేది కాల నిర్ణయం కాలమే చెప్పాలి అనేసరికి…. అది నిజమేలే అమ్మ ! ఇప్పుడు పరమహంస లాగా నువ్వు మోక్షం పొందావా లేదా అని వ్యక్తిగతంగా… సాధన చేసి తెలుసుకుంటావు . అనుభవ అనుభూతి పొందుతావు. ఆ రికార్డు దృశ్యంలో ఏముందనేది…. 108వ గడిలో ఏముంది అనేది తెలుసుకుంటావు ..తెలుసుకోవడం మంచిదే! కాకపోతే కొన్నింటిని వదులుకోవాలి… కొన్నింటిని పట్టుకోవాలి ….ఆ మానసిక స్థితి రావాలి. అది వస్తే సాధనలో పరిపక్వత వస్తుంది అనేసరికి ….
ఇలా ముగ్గురి మాటలు విన్న రుద్ర స్వామి అదిగో! మనం శ్రీశైలం నుంచి వెళ్ళిపోతున్నాం .కొండ చూడండి.. కొండ మొత్తం కనిపిస్తుంది అనేసరికి… ఆ కొండ ఘాట్ రోడ్డు రెండు వైపులా ఫ్లడ్ లైట్లు పెట్టి ఉండటంతో కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు స్పష్టంగా కనబడుతుంది. అందరూ చూస్తున్నారు.. ఆ ఘాట్ రోడ్డు చూడటానికి ఒక పాము మెలికలు తిరిగితే ఎలాగైతే కొండపైకి ఎక్కినట్లు కనపడుతుందో…. అనిపించింది. అదిగో అవునమ్మా! చూసావా? తల కనిపించట్లేదు గాని…. తోకచూడు ఎలా కనబడుతుందో ! అని బాలగణపతి సంబరపడుతూ…. నిజంగా ఒక పాము పాకితే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది…. కొండపైకి ఒక పాము పాకుతున్నట్టు ఉంది చూసావా….. అని పిల్లలు ఇద్దరు ఆనందపడిపోతూ…. సంబరపడిపోతూ …..అంటూ ఉండేసరికి అవును! అనగానే అంటే పాము తోక శ్రీశైలంలో, పాము తల తిరుపతిలో ఉంటుందన్నమాట! మధ్యభాగం అహోబిలం అన్నారని స్థల పురాణం చెబుతుంది అని శివ నందిని అనేసరికి….అహోబిలం అంటే ఎవరిది …. ఎవరి గుడి అని అడిగేసరికి…. నరసింహస్వామి గుడి అని చెబితే అదే సింహం తలతో ఉంటాడు… ఆయనా….!అని అనేసరికి సరే అని పిల్లలు ఇద్దరు సంబరపడిపోతూ నిద్రలోకి జారుకున్నారు . శివ నందిని మానసిక జపం చేసుకుంటూ కూర్చుంది .రుద్ర స్వామి మరియు మహాదేవి యోగ నిద్రలోకి జారుకున్నారు.శివనందిని మనసులోకి శివ స్వామి ఆలోచన రావడంతో స్వామి! మేము తిరుపతికి వెళుతున్నాము .చక్ర జాగృతికి తిరుపతి ప్రాంతం ఆధారం చూపించింది.అంటే అన్ని తెలుసు! అని అంతర్వాణి గా కనిపించేసరికి…. మీకు చెప్పకుండా ఇటు వచ్చేసాము.! అంటే నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది….నాకు తెలియకపోతే కదా! నాకు అన్నీ తెలుసు …జాగ్రత్త ! అంటే స్వామి !మరి మీరు రారా మాతో పాటు తిరుపతికి…. మాతో ఉండరా?అంటే నీకు నా అవసరం ఉంది అన్నప్పుడు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను…. ఈ సిద్దులతోనూ శక్తులతోనూ నీకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ కనపడతాను .నీకు ధ్యానంలోనూ సలహాలు ఇస్తూ ఉంటాను. అంతగా అయితే….నా భౌతిక శరీరంతో నేను ఆకాశయానం చేసి క్షణాల్లో నీ దగ్గరికి వస్తాను. మనసులో నువ్వు తలుచుకోగానే కనపడతాను. అదృశ్యం నుంచి దృశ్యం లోకి రాగలను .దృశ్యం నుంచి అదృశ్యం అవ్వగలను. నాకు అన్ని సిద్ధులు ఉన్నాయి ….అంటే స్వామి! ఇప్పుడు ఈ సిద్దులు నాకోసం ఉపయోగిస్తే మీరు మాయలో పడరా?అంటే…. లోక కళ్యాణార్థం ఇది. నా స్వార్థం కోసం కాదు కదా! నేను ఉపయోగించేది నేనేదో లోక వినాశనం కోరికలు మనసులో పెట్టుకొని చేయడం లేదు కదా! లోక విరుద్ధమైన ఆలోచనలు చేయట్లేదు కదా! లోకానికి తెలియని మహత్తర కార్యం ఏదో నీ ద్వారా తెలియాల్సి ఉంది. అది లోకానికి అందించడానికి సహాయ సహకారాలు ఇస్తున్నాను. తెలియజేస్తున్నాను. అంతే తప్ప వేరే వాటి గురించి కాదు కదా! నా సిద్ధులు కానీ, శక్తులు కానీ నా స్వార్థానికి దేనికైనా ఉపయోగిస్తే అది లోక విరుద్ధం అవుతుంది. లోక వినాశనం అవుతుంది.స్వామి! నా కోసం మీరు ఇబ్బంది పడకూడదు ….అంటే ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేవు. సాధన పరిసమాప్తి చేసుకుంటావా ?సాధన మాయలో ఆగుతావా? ఏంటి అనేది లోకానికి తెలియాలి . అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. జాగ్రత్తగా ఉండు. ఎక్కడికి వెళుతున్నారు? తిరుపతేనా?అంటే కాదు స్వామి! ఇక్కడ సున్నిపెంటలో దిగేసి శక్తి పాత గురువైన పూర్ణానంద స్వామి సమాధిని చూడాలనుకుంటున్నాను. అంటే సరే! అది మంచిదే ఆయన ఆశీస్సులు తీసుకోండి… తిరుపతి వెళ్ళాక నాకు ఒకసారి ధ్యానంలో విషయం చెప్పు… అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఏం చేయాలి ?అనేది నేను నీకు చెబుతాను.. అనేసరికి ….సరే స్వామి! అంటే జాగ్రత్తగా పడుకో !విశ్రాంతి తీసుకో! ఇంకో గంటలో సున్నిపెంట వస్తుంది అనేసరికి…. సరే స్వామి! అనగానే ఇంక ఉంటా అని అనే సరికి…. ధ్యానంలో ఈయన అదృశ్యం అవడంతో… ఈమెకి తేలికపాటి కునుకు పట్టింది .సుమారుగా ఒక గంటన్నర తర్వాత సున్నిపెంట వచ్చిందని బస్సు వాడు చెప్తే అప్పుడు బస్సు దిగారు. అప్పుడు సమయం చూస్తే అర్ధరాత్రి రెండు గంటలు అయింది.ఈ సమయంలో ఆశ్రమానికి వెళ్లడానికి కుదరదు …ఆశ్రమం తెరిచేసరికి ఉదయం 5:00 అవుతుంది కదా అని అందరూ బస్టాండ్ లోనే నిద్రకి ఉపక్రమించారు.ఉదయం 5 గంటల తర్వాత మెలకువ వచ్చి లేచి అక్కడే కాళ్లు, ముఖాలు కడుక్కొని …..స్నానాలు చేసే అవకాశం ఉందని స్నానాలు చేసి టిఫిన్లు కానిచ్చుకొని… ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమానికి చేరుకున్న తరువాత ఆశ్రమంలో పూర్ణానంద స్వామి గారి ఫోటోలు ,ఆయన జీవ సమాధి తర్వాత అక్కడ ఉన్నవాళ్లు ఆయన గురించి వివరాలు చెప్పడం….. ఆయన జీవ సమాధి చుట్టూ పిల్లలు పెద్దవాళ్ళు ప్రదక్షిణలు చేసుకొని ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి శివ నందిని ఏదో తెలియని యోగమత్తు లాగా వచ్చేసరికి అలాగే కూర్చొని ధ్యానంలోకి వెళ్లిపోయింది.ధ్యానంలో ఆయన సజీవ మూర్తిగా ఈమెకి దర్శనం ఇచ్చారు. అమ్మ శక్తి పాత సిద్ధితో నువ్వు కుండలినీ శక్తిని చక్రంలోకి జాగృతి చేశాను. అన్ని చక్రాలు కూడా జాగృతి అవుతాయి… నిద్రలేస్తాయి ….ఆ తర్వాత తిరుపతికి వెళ్లిన తరువాత నీ సప్తయోగ చక్రాలు కూడా జాగృతి జరుగుతుంది. ఈ చక్రాలు అన్నింటిలోకి కుండలినీ శక్తి జాగృతి అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కొండకి ఎక్కుతున్నప్పుడు…. నీకు ఒక్కొక్క చక్రం జాగృతి పొందిన అనుభూతులు కలుగుతాయి, ఏ విధంగా జరగాలి… ఎలా చేయాలి అనేది….నీకు స్వయంగా వెంకటేశ్వర స్వామి అంశతో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నీకు హితబోధ చేస్తారు. ఆయన చెప్పిన సాధన విధివిధానం నువ్వు అమలు చేసుకో! జయం పొందు !నువ్వు ఎక్కడ భయపడమాకు…
ఎక్కడా కంగారు పడమాకు! ఆందోళన చెందకు !దేనిని ఆశించకు…. స్వార్థానికి మాత్రం వెళ్ళకు …నిస్వార్ధంగా ఉండు… మోక్షం పొందుతావా? లేదా అన్నది పక్కన పెట్టు. నీకు ప్రకృతి ఇచ్చిన పని యోగ జీవితంలో జాగ్రత్తగా చేసుకో! మాయలో పడమాకు… మర్మాల్లో పడమాకు…. యోగ జీవితంలో ఏదైనా అర్థం కాని అయోమయంలో ఉంటే, నాలాంటి శివయోగులు నీకు సహాయ సహకారాలు అందిస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. కావాలని నీ అంతటి నువ్వే మాయలో పడిపోతే… తెలిసినా కూడా మాయలో పడితే మేము ఎవరం ఆపము… నీ స్వేచ్ఛకి నీకే వదిలేస్తాము. నీ నిర్ణయాలకి నీకే అవకాశం ఇస్తాము. నీ ఆలోచన నీకే ఇస్తాము .నువ్వు మాయలో పడ్డావు అని నీకు తెలియజేసి ఆ మాయను దాటడానికి కావలసిన జ్ఞానం ఇచ్చినా కూడా కావాలని ఆగిపోయావు అంటే… మేమేమీ చెయ్యం. నేను నిర్ణయానికి విలువ ఇచ్చి మేము తప్పుకుంటాము. ఇక నీకు ఆ క్షణం నుంచి మా శివయోగుల సహాయ సహకారాలు ఉండవు .నీకు తెలియకుండానే 108 మంది శివయోగులు కానీ శివ గురువులు గానీ సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడూ ఏ క్షణాన ఎలా ఉంటారు …..ఎలా వస్తారన్నది …తెలియదు.అది ప్రకృతి నిర్దేశిస్తుంది… ప్రకృతి నీకు సహాయ సహకారాలు అందిస్తుంది… కాబట్టి మేము పొందిన జ్ఞానం నిజమా? కాదా? అని అనుమాన భయాలు పెట్టుకోవద్దు. సందేహాలు పెట్టుకోవద్దు. మేము చెప్పింది శివాజ్ఞగా భావించుకొని… మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతి భావంతో మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తులతో చేయగలిగితే…. విశ్వాసంతో ఉన్నావంటే… నీ సాధన పరిసమాప్తికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. మేము వెనకంజ వెయ్యము.. అది మాత్రం గుర్తుపెట్టుకో!నీకు నువ్వే ఆగిపోతాను…. లేదంటే మృత్యు భయానికి,ఆశకి స్వార్థానికి పోతాను అంటే…. మేము ఏం హింసించము… బాధ పెట్టము… ఎవరి కర్మకి వారే గతి . కర్మానుసారం బుద్ధి అని ఎవరి కర్మలను వారే అనుభవించాలి అని స్వేచ్ఛను ఇచ్చేసి…వదిలేసి పంపించేస్తాము. మేము ఇంక పట్టించుకోము…అది మాత్రం గుర్తుపెట్టుకో !దేవుడి అనుగ్రహం గురువుల అనుగ్రహం పొందడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఏదో నువ్వు గత జన్మలో శివయోగినివి కాబట్టి… ఈ జన్మలో మోక్ష సాధనా జన్మ చేసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి…. మా తపన తాపత్రయాలు ఒక స్త్రీ పరంగా… స్త్రీ మూర్తి కూడా మోక్షం పొందడానికి అర్హత, యోగ్యత, యోగం ఉంది అని …నీ ద్వారా లోకానికి తెలియ చెప్పాలి అని….మేమంతా అనుకుంటున్నాము. నూటికి 99% మోక్షమును పురుషులే పొందుతున్నారు . కానీ స్త్రీ మూర్తులు మోక్షసాధనకి రావడం లేదు. వాళ్ల కోరికలే గాని….అవసరాలే గాని…మాయలే గాని…మోహమే గాని …కోరికలే గాని… అక్కడిదాకా వచ్చి ఆగిపోతున్నారు. అది ఆగిపోవడం కాదు ….తనకి ఉన్న భయం వల్ల కానీ, ఆశ వల్ల కానీ ,సంకల్పం వల్ల కానీ, ఏమీ జరగదనే అహంకారం వల్ల గాని, గర్వం వల్ల కానీ, ఏదైనా కానీ…
స్త్రీలు ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పురుషుడు బాధ్యతలలో పడితే… స్త్రీ మూర్తి బంధనాల్లో పడుతుంది. వాస్తవానికి ఇక్కడ పురుషుడికి, స్త్రీకి బంధనాలు బాధ్యతలు లేవు. కాకపోతే స్త్రీ బాధ్యతని కాస్త బంధనంగా మార్చుకుంటుంది . బంధంగా మార్చుకుంటుంది. ఆ బంధం కాస్త బంధనంగా అయిపోతుంది. అదే పురుషుడు వచ్చేసరికి…. బాధ్యతను బాధ్యతగానే అనుకుంటున్నాడు . కాబట్టి పురుషుడు తొందరగా మోక్షమును పొందుతున్నాడు. స్త్రీ మూర్తి మోక్షం పొందడానికి ఆలస్యం అవుతుంది . కానీ మోక్షం పొందే అర్హత, యోగ్యత, యోగం ఉంది . కానీ శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు చూస్తే… నూటికి 99% పురుషుడు మోక్షం పొందినట్టే చెప్పుతాయి. ఎక్కడా ..స్త్రీ మోక్షం పొందినట్టు… సాధన చేసినట్టుగా అతి కొద్దిమంది అతి తక్కువ మంది ఉంటారు. అంటే నూటికి 100 మంది పురుషులు ప్రయత్నిస్తే అందులో 80% మంది పురుషులు ఉంటారు 20% స్త్రీలు మాత్రమే ఉంటారు. మళ్ళీ ఆ స్త్రీలలో ఎంత మంది మోక్షం పొందుతారో కాలానికే తెలియదు . కాల నిర్ణయం కాబట్టి… నీ ద్వారా స్త్రీ మూర్తి కూడా మోక్షం పొందుతుంది అని లోకానికి చెప్పాలని మా అంతట మేము… శివగురువులం నీకు సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నాము. నీ సాధన ఫలితం నువ్వు పూర్తి చేస్తావా లేదా? అనేది ఇక దైవం మీద ఆధారపడి ఉంటుంది .కాలం మీద నిర్ణయం ఉంటుంది. శివాజ్ఞ మీద నిర్ణయం ఉంటుంది కాబట్టి శ్రద్ధ భక్తితో… అహంకార రాహిత్యంతో జ్ఞానమును పొందుతూ….కోరిక రాహిత్య స్థితికి వెళ్లి… సంకల్పరాహిత్యము ఇచ్చే స్థితికి వెళ్లి సర్వకర్మ రాహిత్య స్థితికి వెళ్లి… నువ్వు మోక్ష సాధన పరిసమాప్తి చేసుకుంటావని ఆశిస్తూ… ఆశీర్వదిస్తూ… శుభం భూయాత్ అని ఆయన అంతర్వాణిగా చెప్పి అంతర్దానం అయ్యారు. సరే స్వామి ! మీ ఇష్టప్రకారమే నేను మీలాంటి శివయోగుల సహాయ సహకారాలు అందిస్తున్నాం అన్నప్పుడు… నా సాధన నేను పరిసమాప్తి చేసుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు సాధనని నిష్కామ కర్మతో… నిస్వార్థంతోను.. ఆశ లేకుండా… భయం లేకుండా… భయపడకుండా… బాధపడకుండా… పరిసమాప్తి చేసుకుంటానని సంకల్పిస్తున్నాను. నేను అనుకుంటున్నాను… చేయగలనో ..లేదో ఇక ప్రకృతి నిర్ణయానికే వదిలేస్తున్నాను. మీ అనుగ్రహ భాషణం వలన నాకు ఎనలేని మనోధైర్యం కలిగింది. ఇది చాలు. ఇక అంతంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందో అన్నది కాల నిర్ణయానికి వదిలేద్దాము . నేను ఇదే జరగాలి ….ఇదే ఉండాలి అని ఆశించట్లేదు. ఆశించను కూడా…మోక్షం పొందాలని కోరిక కూడా ఉండకూడదు అని శాస్త్రవచనం కదా! కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. నా వంతు సహాయ సహకారాలు నా తప్పు లేకుండా… సాధన ఆపకుండా చేస్తాను అని అయితే చెప్పగలను అని…మనసులో అనుకునేసరికి… సమాధి మీద జ్యోతి స్వరూపం కనిపించేసరికి …గురుదేవుడు ఆశీర్వాదం ఇచ్చారు అని చెప్పేసి అనుకొని అదిగదిగో సమాధి మీద స్వయంభు జ్యోతి కనబడుతుంది అని ….పిల్లలు మరియు రుద్రస్వామి అక్కడ ఉన్న భక్తులు అనేసరికి… స్వామి వారు నిజరూదర్శనం నేను ఈ సమాధిలో ఉన్నానని జ్యోతి దర్శనం ఇస్తున్నారని ….అక్కడికి గబగబా కొంతమంది యువకులు వీడియోలు తీసే ప్రయత్నంలో ఉండేసరికి వీళ్ళందరూ… ఆయనకీ సమాధికి నమస్కారం చేసుకొని… ఇక అక్కడి నుంచి బస్టాండ్ కి వచ్చి తిరుపతి బస్సు ఎక్కటం జరిగింది .
ఇలా తిరుపతి బస్సులో గాఢ నిద్రలో ఉన్న సాధనా కుటుంబంలో శివనందినికి ఉన్నట్టుండి ..మెలకువ వచ్చింది. సమయం చూస్తే రెండు గంటలు అయింది. ఏంటా ఈ సమయంలో అనుకోకుండా మెలకువ వచ్చింది అనుకుంటూ తనకి వచ్చిన స్వప్నం వలన మెలకువ వచ్చిందని అనిపించింది . ఏంటా ఆ స్వప్నం అనుకున్నప్పుడు… శివానందకి ప్రేమభావాలను తెలుపుతున్నట్టుగా….కామ ఆలోచనలు అనేవి వచ్చినట్లుగా… అనిపించ సాగింది. మనసు ఎందుకు ఇలా పరి విధాలుగా చెడుగా కామం వైపు ఆలోచిస్తుందో అర్థం కాలేదు. ఇలాగే ఒకరోజు శ్రీశైలంలో ఉన్నప్పుడు అర్థరాత్రి పూట శివనందినికి విపరీతమైన కామ వాంఛలు శివానంద మీద కలిగాయి. అప్పుడు సమయం చూస్తే రెండు గంటలు అయింది. ఆ సమయంలో కామ ఆలోచనలు , కామ భావాలు తట్టుకోలేక శివ స్వామికి అనుసంధానం అయినప్పుడు… మిమ్మల్ని చూడాలని ఉంది. మనసు ఆగట్లేదు. నాకు విపరీతమైన కామకాంక్ష కలుగుతుంది . ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదు ….అంటే సరే అయితే విభూది మఠానికి రా! అంటే ఈ సమయంలో వస్తే ఎవరైనా చూసి మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కదా స్వామి! అంటే… ఎవరు రారు, ఎవరూ చూడరు ,చూసిన అపార్థం చేసుకోరు ,గురు శిష్యుల సంబంధం అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు . నేను ఎలాంటి వాడినో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు .సుపరిచితమే… నా గురించి ఎవరు తప్పుగా ఆలోచించరు ..అపార్థము చేసుకోరు… నీకు నామీద కామ భావాలు కలగటం అనేది ధర్మపతి అని అనుబంధం ఉండటంవలనే కామ వాంఛలు కలుగుతున్నాయి . దానిని ఎలా నిగ్రహించుకోవాలి? ఇంద్రియ నిగ్రహం పొందాలి అని నీకు అభ్యాసం ఇవ్వాలి. నన్ను చూస్తూ నువ్వు నేర్చుకోవాలి …తెలుసుకోవాలి …అనేసరికి సరే స్వామి ! నేను వస్తున్నాను . నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు… సమస్య లేదు… అంటే మాత్రం నేను వస్తాను ..అంటే రా నాకు ఎటువంటి సమస్య లేదు …ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు …అనేసరికి అందరూ దీర్ఘగాఢ నిద్రలో ఉన్నారని తెలుసుకొని నెమ్మదిగా పిల్లి లాగా అడుగులో అడుగు వేసుకుంటూ గది బయటకు వచ్చి…. గది తలుపులు దగ్గరికి వేసి… శివ నందిని విభూతి మఠానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు ఈ విషయాన్ని అంత గాఢనిద్రలో ఉన్నప్పటికీ….మహాదేవి మరియు రుద్ర స్వామి కళ్ళు తెరిచి చూసి
మహాదేవి:- ఏంటి ఈ పిల్ల మళ్ళీ కామ మాయలో పడుతుందా ఏంటి?
రుద్రస్వామి:- ఏమో ఏం చెప్పగలం.. ఎవరికి ఎరుక.. శివ స్వామి అయితే అలాంటివాడు కాదు. కామానికి కామ వాంఛలకి దిగజారే మనస్సు ఉన్నవాడు కాదు. ఆయన ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు . బోధ చేయాలని అనుకుంటున్నాడు… చూద్దాం ఏం జరుగుతుందో ..ఏమీ తెలియనట్లుగానే నువ్వు ఉండు అనేసరికి…
మహాదేవి:- సరే స్వామి
అని వీళ్ళిద్దరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలియని శివ నందిని ఎవరూ చూడట్లేదని నెమ్మదిగా విభూతి మఠానికి వెళ్ళింది. విభూది మఠానికి బయట వైపు శివానంద కనిపించాడు. అప్పుడు శివానంద శివనందినిని విభూతి మఠంలోకి తీసుకువెళ్లాడు.
శివానంద:- ఏమిటి దేవి! నీ సమస్య ఏమిటి?
శివ నందిని:- గత మూడు రోజుల నుంచి నెలసరి అయిపోయిన తర్వాత నుంచి మీ మీద విపరీతమైన కామ వాంఛలు కలుగుతున్నాయి.. మీతో శృంగారం చేస్తున్నట్టు.. మీ ఒళ్ళో పడుకున్నట్టు… మీకు ముద్దులు పెడుతున్నట్లుగా …పరి విధాలుగా పలుభావాలు కలుగుతున్నాయి. నాకు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఈ భావాలు కలుగుతున్నాయి.. ఎంత అదుపు చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నాను…
శివానంద :- సరే నీ సమస్య అర్థమైంది. నీ భోగ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు మనస్సు కామ వాంఛలు తీర్చుకోవడానికి అలవాటు పడింది కదా! ఇప్పుడు ఉన్నట్టుండి ఒంటరి జీవితంలోకి వచ్చేసరికి… కామ కోరికలు తీర్చుకోవడానికి అవకాశాలు దొరకట్లేదు. నువ్వు బలవంతంగా కోరికలను అణిచివేయటం వలన ఇలా ఒత్తిడికి గురై అది భావాలు కలిగిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైనదే …ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ లేదు.. భోగ జీవితంలో మనసుకి నచ్చినట్టుగా… మనసుకి నచ్చిన విధంగా కామ వాంఛలు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం ఉంది . కానీ యోగ జీవితంలో మనం ఇద్దరం సన్యాస ఆశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి… కామ వాంఛను తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మనసు శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అన్నిటినీ పరిత్యాగం చేసి ఈ స్థితికి వచ్చాము కాబట్టి… ఈ యోగ జీవితంలో నీకు కామ వాంఛలు కలుగుతున్నాయి అంటే శక్తి జాగృతి అవుతున్నట్లే.. ఈ శక్తి జాగృతిలో నువ్వు జాగ్రత్తగా నిలబడగలిగితే కామమాయను దాటగలిగితే సరిపోతుంది. కామ మాయలో పడ్డావంటే పరపురుషుడి మాయలో పడిపోతావు. తద్వారా ఇక తట్టుకోలేని స్థితికి వెళ్తావు…ఇప్పుడున్న ఈ కామవాంఛ వలన వెయ్యి మందితో శృంగారం చేసినా కూడా అది తీరదు. ఈ స్థితిలో ఉన్నప్పుడే 16,000 మంది స్త్రీమూర్తులతో శృంగారం చేసినా కూడా ఆయన తట్టుకొని నిలబడగలిగే స్థితికి వచ్చాడు. అది అనితర సాధ్యమైన స్థితి . కామమాయ అంటే శక్తి జాగృతి అయినప్పుడు విపరీతమైన కామ మాయ మొదలవుతుంది. కామ ఆలోచనలు కలుగుతాయి. ఆ యొక్క కామ ఆలోచనలతోనే చక్రాలలోనికి ప్రవేశిస్తుంది. మూలాధార చక్రం లోకి ప్రవేశించింది అంటే విపరీతమైన కామవాంఛ మొదలవుతుంది. అప్పటికి తెలిసిన వారి నుంచి తెలియని వారి నుంచి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. అతని మాటలకి… అతని చేష్టలకి… నీ మనసుకి దగ్గరై పోతాడు. మోహితురాలివి అయిపోతావు. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ సమ్మోహన స్థితికి నేను నీకు ఆధార భూతుడిని అయ్యాను. ధర్మపతి అనే భావంతో నువ్వు నాకు దగ్గరవుతున్నావు. నీ మనసు కోరుకుంటుంది నన్ను.. కాకపోతే ఇక్కడ నిగ్రహించుకోవాలి. ఇంద్రియ మనోవిగ్రహంతో ఉండాలి. ఇదిగో నా నగ్న శరీరం చూడు… నీకే తెలుస్తుంది .
అని ఆయన వస్త్రాలన్నీ తీసేసరికి…. ఆయన నగ్న శరీరం చూసేసరికి అప్పటిదాకా భోగ శరీరంలో భర్త నగ్న శరీరం అలా అలాగే కాశీలో దిగంబర స్వామి నగ్న శరీరం ఆ తర్వాత ఈయన నగ్న శరీరం చూసింది. ఆ నగ్న శరీరాన్ని చూసేసరికి… ఆమెకి విపరీతమైన కామ వాంఛలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా కోరికలు భావాలు తగ్గుతూ వస్తున్నట్లుగా అనిపించింది. అలా తీక్షణంగా ఒకరినొకరు చూసుకున్నారు.
శివస్వామి:- నాకు నీ శరీరం మీద ఎలాంటి మోహవ్యామోహాలు లేవు. నేను నీ శరీరం కోరుకోవట్లేదు. నీ మనసునే కోరుకుంటున్నాను. నీ ఆత్మనే కోరుకుంటున్నాను. అలాగే నువ్వు కూడా ఈ శరీరాన్ని కోరుకోవద్దు. నా ఆత్మను కోరుకో! నా శరీరాన్ని కోరుకోకు. మనం యోగ సన్యాస దీక్షలో ఉన్నాము. ఈ సన్యాస దీక్షలో ఉన్నప్పుడు మగతనం, నగ్నత్వం, దిగంబరతత్వం అని మూడు స్థితులు ఉంటాయి. ఈ మగతనం అనేది గృహస్థాస్త్రంలో భర్తగా కనబడుతుంది. నగ్నత్వం అనేది వానప్రస్థావంలో కనబడుతుంది. దిగంబరతత్వం అనేది సన్యాసాశ్రమంలో మనకి కనబడుతుంది. అలాగే నేను గృహస్థాశ్రమంలో భర్తగా ఉంటాను. వానప్రస్థావంలో గురువుగా ఉంటాను. సన్యాసాశ్రమంలో సన్యాసరూపంలో దేవుడిగా… శివుడిగా… యద్భావం తద్భవతిగా కనిపిస్తాను. ఈ మూడు స్థితులు నీకు కాలానుగుణంగా పరిస్థితులను బట్టి భావాలు కలుగుతూ ఉంటాయి. గృహస్థ ఆశ్రమం లోకి వచ్చేసరికి మనం శరీర వాంఛను తీర్చుకునే అవకాశం లేదు. కామ వాంఛలు తీర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఇప్పటికే సన్యాసంలోకి వచ్చేసాము. సన్యాస దీక్షలో ఉన్నప్పుడు స్త్రీ పురుషుల కలయిక కానీ…. కామ వాంఛను తీర్చుకోవడం అనేది ఉండదు. కాకపోతే ధర్మపతి - ధర్మపత్ని అని అనుబంధం ఉండటం వలన బంధం బంధనం కాకుండా బాధ్యతగా ఉందాము. ఈ మూడు ఆశ్రమ ధర్మాలు ఏకకాలంలో ఒకే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ నగ్న శరీరం చూస్తే నీకు ఏమనిపిస్తుంది?
శివ నందిని:- మొదట నాకు మగతనం కనిపించింది. ఆ తర్వాత నగ్నత్వం కనిపించింది. ఆ తర్వాత దిగంబరతత్వం కనిపిస్తుంది. మీరు పంచభూతాలనే వస్త్రంగా కప్పుకున్నట్టుగా అనిపిస్తుంది.
శివస్వామి:- ఎప్పుడైతే నాలో దిగంబరతత్వం చూస్తావో… నీలో ఇంద్రియ నిగ్రహం వచ్చినట్టు. మనోనిగ్రహం వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకో! ఎప్పుడైతే నాలో నగ్నత్వం చూస్తావో…. ఇంద్రియాలకి ఆధీనం అవుతున్నావని గుర్తుపెట్టుకో! ఈ శరీరం శాశ్వతం కాదు. మనసు శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతం . ఆత్మ దిగంబరతత్వంలో ఉంటుంది. మనసు కాస్త నగ్నత్వంలో ఉంటుంది. శరీరం మగతనంలో ఉంటుంది. ఈ మూడింటిలో నీకేం కావాలో చూసుకో.! దానిని బట్టి నీ సాధన స్థితిగతులు ఉంటాయి. ఇప్పుడు యవ్వనంలో ఉన్న శరీరం 85 సంవత్సరాలకి ముసలితనంలోకి వెళ్తుంది. అవయవాలు దేనికి పనికిరావు. శృంగారానికి పనికిరావు. శృంగారానికి పనికి వచ్చే మర్మాంగం కాస్త మూత్ర విసర్జనకి మాత్రమే పనికి వస్తుంది అని గ్రహించు. అందుకని నా మర్మాంగం లో నువ్వు మగతనం, నగ్నత్వం చూడకు. దిగంబరతత్వం చూడు. అప్పుడు నా మర్మాంగం శివలింగంలాగా దర్శనమిస్తుంది..
అనేసరికి ఇక మనసు దృష్టి దానిమీద పెట్టుకుని ధ్యానంలో అలాగే నిలబడిపోయింది. ఆయన నగ్నంగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయింది. మొదట మగతనం మీద ఆలోచన వచ్చినవి కాస్త… నెమ్మది నెమ్మదిగా నగ్నత్వంలోకి వచ్చింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దిగంబరతత్వం లోనికి వచ్చింది. ఆయన నగ్నంగా ఉన్నాడు అనే భావన నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. మర్మాంగం చూడాలనే కుతూహలం… తాపత్రయాలు ఏదో చేసేయాలి అనే భావాలు కూడా అంతరించిపోతూ వచ్చాయి. శాశ్వతమైన మనోనిగ్రహ స్థితికి, ఇంద్రియనిగ్రహ స్థితికి, దిగంబరతత్వమునకు వస్తుందని ఆమె గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. దానితో ఆమె అలా మూడు గంటలసేపు నగ్న శరీరాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ…మగతనం నుంచి నగ్నత్వం నుంచి దిగంబరతత్వానికి రావడం జరిగింది.
శివ నందిని:- స్వామి! మీరు వస్త్రాలు వేసుకున్న వేసుకోకపోయినా సంపూర్ణంగా కనబడుతున్నారు. కాబట్టి నేను ఇన్నాళ్లు పురుషాంగాలు, మర్మాంగాలు చూసి మోహమాయలో పడ్డాను అని నాకు అర్థం అయింది. ఇదే భోగ జీవితానికి…. మాయకి నాంది అని నాకు అర్థమైంది. కాబట్టి మీరు నా ఒంటి మీద చేయి వేసినా కూడా నాకు తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు రావు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరం లేము. ఒకళ్ళమే ఉన్నాము. ఏకైక ఆత్మగా ఉన్నాము. ఏకైక మనసుగా ఉన్నాము. ఏకైక శరీర తత్వంతో ఉన్నాము. అలాంటప్పుడు స్త్రీ, పురుష అంగాలు అనే భేదభావాలు ఉండవు కదా! మర్మాంగంమాత్రమే ఉంటుంది కాబట్టి… ఇది స్త్రీ అంగం… ఇది పురుషాంగం ఉండదు కాబట్టి… ఇక మనిద్దరిలో కూడా దిగంబరతత్వంలో ఆపాదించుకున్నాను అని అర్థమయిపోయింది. గ్రహించండి.. నన్ను క్షమించండి… నాలోని కామాభావాలను, కామ వాంఛలను, కామ ఆలోచనలను అదుపు చేసి ఒక నిజగురువుగా ఉండి… నన్ను ఇంద్రియ మనోనిగ్రహ స్థితిని పొందే విధంగా తీసుకువచ్చారు… నేర్పించారు…అదే నకిలీ గురువైతే నా శరీరం మీద …. నా ధనం మీద మనసు పడి ఏదో ఆశించేవారు. నా మాయలో పడేవాడు . నా చుట్టూ కుక్కపిల్లలా తిరిగేవాడు. నేను ఆయన చుట్టూ తిరిగేదాన్ని. కామ వాంఛను తీర్చుకుంటూ… మరో ప్రపంచంలో ఉండిపోయే వాళ్ళం. సాధన గురించి ఆలోచించే వాళ్ళం కాదు. కాకపోతే మీరు ఒక అడుగు ముందుకు వేసి… నా కామ కోరికలకి, మనోవాంఛలకి విలువనిస్తూ కొట్టిపారేయకుండా నా మనసు మీద దెబ్బ కొట్టకుండా… వాటికి విలువ ఇస్తూ… ఈ నగ్న శరీరం కొంతకాలం మాత్రమే ఉంటుంది…దీనిమీద యావగింపు తెచ్చుకో! వయసులో ఉన్న నగ్న శరీరం చూడకు! వృద్ధాప్యంలో ఉన్న నగ్న శరీరమును ఊహించుకుంటే మీకు విషయం తెలుస్తుంది అని చెప్పి…. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పారు. నాలో ఉన్న మనోవాంఛలు, కామవాంఛలు శాశ్వతంగా తీసేశారు. ఇది నాకు మీరు ఇచ్చిన తొలి గురుబోధ. దీనిని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాలో కామ వాంఛను అదుపు చేసే శక్తిని…ఇంద్రియనిగ్రహ శక్తిని ….అలాగే మనోనిగ్రహ శక్తిని కలిగించారు. ఇప్పుడు పరపురుషుడిని ఆ దృష్టితో చూడాలన్న ఇప్పుడు చూడలేను. అందరూ ఇప్పుడు నాకు దిగంబరులుగానే కనపడుతున్నారు. ఇన్నాళ్లు వాళ్లలో కామత్వం చూశాను. ఇప్పుడు దైవత్వం, యోగత్వం చూస్తాను. నాకు అర్థం అయింది… నా మనః స్థితికి కావలసిన దిగంబరస్థితిని ఇచ్చారు. నగ్నత్వాన్ని ఛేదించే స్థితిని ఇచ్చారు. ఇది నాకు తెలిసి అఘోరంలోనూ, కాపాలికంలోనూ, భైరవి తత్వంలోనూ వస్తుంది. ఈ మూడు సాధనలు ఏకకాలంలో చేస్తే ఎలాంటి స్థితి వస్తుందో… ఆ మూడు సాధనలు నాకు చూపించారు. కాపాలికంలో మగతనం చేదించే స్థితి వస్తుంది. అఘోరత్వంలో నగ్నత్వంను చేధించే స్థితి వస్తుంది. భైరవి లో ఆడతనాన్ని ఛేదించి దిగంబరతత్వం చూసే స్థితి వస్తుంది. అంటే నగ్నత్వమును చేదించి దిగంబరతత్వమును ఛేదించే స్థితి వస్తుంది అని మహాదేవి ద్వారా తెలుసుకున్నాను. తను సాధన చేసి అనుభవ అనుభూతి పొందింది. మీరు మూడు గంటల్లో ఈ సాధనను ఫలితాలను నా మనసుకి అనుభవపూర్వకంగా ఇచ్చారు. కారణం లేనిదే కార్యం ఉండదు. మీలాంటి నిజగురువులు దొరకడమే అదృష్టం. అలాగే నిజ శిష్యులు ఉండటం కూడా కష్టం. శిష్యుల యొక్క మానవమానాలు శరీరముల మీద ఆశపడకుండా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ….ఆశించకుండా మీరు క్షణకాల నిమిత్తముగా ఈ పిల్లకి ఎందుకు చెప్పాలి? ఈ పిల్లకి ఎందుకు బోధించాలని ఈ విధంగా ఎందుకు చేయాలి? ఆ అమ్మాయి వాంఛలను కోరుకుంటుంది… ఆ అమ్మాయి అంతట అమ్మాయి వచ్చింది కదా! శరీర వాంఛను తీర్చుకోవచ్చు కదా! అని మీకు మీరు మాయలో పడకుండా… నన్ను మాయలో పడనివ్వకుండా… అవకాశాలు, పరిస్థితులు నాకు అనుగుణంగా మారుస్తూ… ఇంద్రియ మనోనిగ్రహ స్థితిని మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతి భావంతో భావించి నాకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతలు. నేను మరొక్కసారి మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను. జీవితాంతం మీ గురించి తప్పుడు ఆలోచనలు రమ్మన్నారావు. నాకు అర్థం అయింది.
శివ స్వామి:- సరే దేవి! నీ సాధన కామ వాంఛలపరంగా పరిసమాప్తి అయింది. ఇక నుంచి నువ్వు దిగంబర తత్వాన్ని చూసే మనోస్థితిలో శాశ్వతంగా శ్వాసే స్థితి లాగా ఉండు…. అనేసరికి
శివ నందిని:- సరే స్వామి! మీ ఆజ్ఞ.
అనగానే ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆవిడ అక్కడ ధ్యానం చేసుకుంటూ అలాగే ఉండిపోయింది. ఈ విషయం తిరుపతి బస్ లో ఉన్న శివ నందినికి లీలగా గుర్తుకు వచ్చింది. ఙ్ఞాన స్పురణ అందింది. అవును కదా! మనసును అదుపు చేసుకోవాలి కదా! ఆయన నగ్న శరీరం చూసినా కూడా… మనసు చలించలేదు. మనసు చలించకుండా దిగంబరతత్వమును ఆపాదించారు. ఇప్పుడు మనకి కామ వాంఛలు, కామ ఆలోచనలు వస్తున్నాయన్న అంటే… మూలాధార చక్రం లోనికి జాగృతి అవుతుంది అని… ఈ చక్రంలో కామ మాయ ఉంటుందని పరమహంస గారు చెప్పారు కదా! అని అనుకుంటూ ఉండేసరికి… బాలగణపతి లేచి ఉన్నట్టుండి ….అమ్మ! అమ్మ !అనేసరికి వీడు నిద్రలో లేచినట్టు ఉన్నాడు అని …ఏమైందిరా చిన్న! అంటే నాకు నిద్ర పట్టలేదు. నువ్వు మెలకువగా ఉన్నావేమో అనిపించి కళ్ళు తెరిచి చూశాను. ఏదో ఆలోచనలో ఉన్నావని నేను ఏమీ మాట్లాడలేదు…. అని అంటే ఏం లేదు ఏంటి ఏమైంది పీడకల ఏమైనా వచ్చిందా? అంటే పీడకల ఏమీ లేదు… నాకు చిలిపి ఆలోచన వచ్చింది. పరమహంస గారి గురించి అనేసరికి…. ఏంట్రా ఆ ఆలోచన అనేసరికి వాడు నవ్వుతూ చెప్పడం ప్రారంభించాడు.
బాలగణపతి ముసి ముసి నవ్వులు నవ్వుతూ
బాల గణపతి:- పరమహంస గారు మూడవ డైమెన్షన్ లోనే… భూలోకంలోనే ఉన్నారు. ఆయన 108వ డైమెన్షన్ లో శివుడు లేడు… దేవుడు లేడు అని తన సాధన అనుభవాల ద్వారా.. తన సాధన శక్తి ద్వారా తెలుసుకున్నాడు . ఇప్పుడు ఈయన థర్డ్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నట్టు భావిస్తాడా? దేవుడు లేనట్టుగా భావిస్తాడా? ఇప్పుడు శివుడు ఉన్నట్టుగా భావిస్తాడా ?శివుడు లేనట్టుగా భావిస్తాడా? నాకు అర్థం కాలేదు…. ఎందుకంటే 108 లో శివుడు లేడు మూడో డైమెన్షన్ లో ఉన్నాడు ….అంటే 107 దాకా శివుళ్ళు ఉంటారని ఆయన అనుభవాలు చెబుతున్నాయి…. అని రాత్రి అన్నావు కదా!
శివ నందిని:- మూడవ డైమెన్షన్లో ఉన్నప్పుడు…. మూడవ డైమెన్షన్ కి తగ్గట్టుగా మానసిక స్థితి ఉంటుంది రా నాయన! ఇప్పుడు శివుడు ఉన్నాడు అని మూడవ డైమెన్షన్ లో సాక్ష్యం చూపిస్తుంది. ఆయన పిలిస్తే పలుకుతాడు.. కనపడతాడు… అంతా చేస్తాడు కదా! అలాగే మూడవ డైమెన్షన్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటాడు…108వ డైమెన్షన్ లో వెళ్ళినప్పుడు లేడు అని భావనలోకి వెళతాడు. ఇదే విషయం రామకృష్ణ పరమహంస గారికి కూడా సందేహం వచ్చింది. అదేమిటంటే…త్రైలింగస్వామి దగ్గరికి వెళ్లి, భగవంతుడు ఒకళ్ళ ఇద్దరా? అని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనే ఉంటాడు.. నువ్వు ఉండవు. నేను అనేది ఉండదు. నేను కానీ నేను ఉంటుంది. సమాధి స్థితి నుంచి మెలకువ వచ్చినప్పుడు… నువ్వు శివుడే… ఆయన శివుడే. ఎందుకంటే సాధకుడు శివోహం స్థితిని పొంది ఉంటాడు. అలాగే జీవుడు శివుడు అవుతాడు . శివుడు అప్పటికే ఉంటాడు . కాబట్టి సమాధి స్థితిలో ఉంటే ఏకశివుడు ఉంటాడు . సమాధి స్థితి బయటేమో ఇద్దరూ శివుళ్లు ఉంటారు. అలాగే మూడవ డైమెన్షన్ లో పరమహంస గారు ఉన్నప్పుడు ….శివుడు జీవుడు అన్నట్టు ఇద్దరు శివుడిలో ఉంటారు. 108వ డైమెన్షన్ లో ఆయన సాధన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు లేడు….ఉన్నదంతా ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్న పూర్ణ శూన్యమే… పూర్ణ శూన్యం అనే భావన లోనికి వస్తారు .
బాల గణపతి:- అమ్మ! దేవుడిని మనం చూడవచ్చా?
శివ నందిని:- ఇప్పుడు దేవుణ్ణి చూడటం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది. ఒకటి ఆకారం . రెండు సాకారం . మూడు నిరాకారం . ప్రత్యక్షంగా చూడవచ్చు …పరోక్షంగా చూడవచ్చు.. మన భక్తి మన సాధన స్థితిని బట్టి… మనం భావం బట్టి యద్భావం తద్భవతిగా మనకి కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆకార శివుడిగా ఎక్కడ కనపడతాడు అంటే… స్వప్నంలో కనబడతాడు. ధ్యానంలోనూ కనపడతాడు… మనిషి రూపాన కనబడతాడు… మనతో మాట్లాడుతున్నట్టు అంటే…. మన ఆత్మ శరీరం ఆయన ఉన్నచోటికి వెళ్ళినప్పుడు… ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు కనపడుతూ….మనకి స్వప్నంలో గాని ,ధ్యానంలో కానీ అనుభవాలు కనపడతాయి. కొంతమంది చెబుతూ ఉంటారు కదా! మాకు ధ్యానంలో శివుడు విగ్రహ రూపంలో శివుడు కనపడ్డాడు. అమ్మవారు కనపడ్డారు. మాతో మాట్లాడారు .ఫలానాచోట మేము విగ్రహ రూపంలో ఉన్నాము …ఫలానా పుట్టలో ఉన్నాము. ఫలానా మట్టిలో ఉన్నాము.. తీయండి …బయటికి తీయండి …అని చెప్పేసి ఆజ్ఞలు ఇవ్వడం లేదా చెరువులో ఉన్నాము… నీటిలో ఉన్నాము… నదిలో ఉన్నాము…విగ్రహ రూపంలో ఉన్నాము… అని స్వప్నాలలో చెబుతూ ఉంటారు కదా! కొంతమందికి ధ్యానంలో అనుగ్రహం ఇవ్వటం జరుగుతుంది . అంటే ఏంటి? మన ఆత్మ శరీరం ఆయన ఆత్మ శరీరానికి అనుసంధానమై చెప్పడం జరుగుతుంది. అది ఆకార స్వరూపం… సాకార స్వరూపం అంటే ఇప్పుడు పరమహంస లాంటి వాళ్ళకి అమ్మవారు మనుష రూపంలో వచ్చేసి ఈయన భోజన పదార్థాలు తిని విగ్రహంలోకి వెళ్ళే వారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయనకి అశరీరవాణిగా అంతర్వాణిగా కనబడి చెప్పేది. ఇది సాకార స్వరూపం. ఇక నిరాకార స్వరూపం అంటే ….ఆయన పరంజ్యోతి స్వరూపంలో కనపడతారు.
ధ్యానంలో కనపడుతూ ఉంటారు.. అది ఆత్మ జ్యోతి అనీ….జ్ఞాన జ్యోతి అని… కొంతమంది పరంజ్యోతి అంటారు. అలా కనపడుతూ ఉంటారు. ఇంకా ప్రత్యక్ష దర్శనం,పరోక్ష దర్శనం అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళటానికి నాకు అవకాశం లేదు… ఎందుకంటే నాకు వీసా లేదు. అమెరికా వెళ్ళిన వాళ్ళు…వెళ్లి వచ్చిన వాళ్ళు….అక్కడ ఉన్న విశేషాలు అన్నిటిని చెప్పడం విన్నాననుకో! నేను అమెరికా వెళ్ళకపోయినా అమెరికా చూసిన భావన నాలో కలుగుతుంది. అనుభవ అనుభూతి కలుగుతుంది కదా! అదేవిధంగా అది పరోక్ష దర్శనం అవుతుంది . అంటే మనం అమెరికా వెళ్లకపోయినా అమెరికా చూశాను అని వీళ్ళ మాటలు బట్టి ఊహించుకొని ఓహో! ఇక్కడ ఇది ఇలా ఉంటాయి…. అని భావాలు నాకు కలుగుతూ ఉంటాయి. దానిని బట్టి నేను చూడడం జరుగుతుంది. ఈ ప్రత్యక్ష దర్శనం అంటే సాక్షాత్తు ఇక శివుడు ఎలా ఉంటాడో మనకి తెలుసు కాబట్టి ఆయన రూపాన్ని మనుష్య రూపంలో చూడగలిగితే… అదే ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి మన భక్తి సాధన స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. సర్వస్య శరణాగతి భావంతో ఉంటే ఆయనకి కనిపించినది అనేది ఉండదు.
బాల కుమారస్వామి:- అమ్మ భక్తి మార్గానికి జ్ఞానమార్గానికి తేడా ఏమిటి?
శివ నందిని:- భక్తి మార్గంలో దేవుణ్ణి మనుష్య రూపములో పూజిస్తాము. అదే జ్ఞానమార్గంలో ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూడవచ్చు. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నవాడికి చెక్కిన రాయిలోనే భగవంతుడు కనపడతాడు. అదే జ్ఞానమార్గంలో ఉన్నవాడికి ప్రతి రాయిలోనూ దేవుడు కనపడతాడు. అది యద్భావం తద్భవతి. ఇప్పుడు భక్తి భావం అనేది విగ్రహారాధనకి మాత్రమే సంబంధించిందిగా ఉంటుంది.ఆయన పూజించే విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడని భావన చేస్తాడు . అదే జ్ఞానమార్గంలోకి వచ్చేసరికి అది విశ్వారాధన అవుతుంది. విగ్రహాన్ని దాటి ప్రతి జీవిలో ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ ప్రతి వస్తువులోను లేనిది లేదు…. ఆయన కానిది లేదు అని భావంతో చేస్తారు. అది విశ్వారాధన అవుతుంది. విగ్రహంలో ఆరాధన చేసినవాడు నిష్ణాతుడే…విశ్వారాధన చేసినవాడు నిష్ణాతుడే. అంటే విగ్రహారాధన చేసినవాడు అంతర్యామిగా చూస్తాడు. విశ్వారాధన చేసినవాడు భగవంతుడిని సర్వాంతర్యామిగా చూడడం జరుగుతుంది.
బాల కుమారస్వామి:- అమ్మా! ఇప్పుడు మనం భగవంతుని చూడవచ్చా ?
శివ నందిని:- చూడవచ్చు… చూడకపోవటం అనేది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు దేవుడు అంటే శివుడు ఉన్నాడు… నీకు శివుడంటే ఇష్టం . శివుని ఏ రూపంలో చూడాలనుకుంటున్నావు అనేది నీకు తెలియాలి. అది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను మీకు శివున్నీ చూపించగలను.. అతను శివుడు అని నువ్వు ఎలా గుర్తుపడతావు. ముందు నీకు తెలియాలి కదా! శివుడు అనేది నువ్వు గుర్తుపట్టడానికి శివుడికి ఏ లక్షణాలు ఉన్నాయి… ఏ ఏ గుర్తులు ఉంటాయి… ఏమి ధరిస్తాడు… ఎలా ఉంటాడు …ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది… మాట తీరు ఎలా ఉంటుంది…. ఇవన్నీ కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఆపాదించుకోవాలి …అప్పుడు నువ్వే శివోహం అవుతావు . నువ్వే శివుడనే జ్ఞానం పొందుతావు. శివుడు ఎక్కడా లేడు… జీవుడే శివుడు… అనే జ్ఞానం పొందుతావు.
అప్పుడు ప్రత్యక్షంగా శివుని చూడాలి అనే ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు నువ్వే శివుడివని తెలియడానికి ఆ శివుడు ఎలా ఉంటాడని తెలుసుకోవాలి కదా! నేను చూపించిన వ్యక్తిని… వీడే శివుడని నమ్మాలి అని గ్యారెంటీ ఏంటి? ఎలా నమ్ముతావు? నమ్మకం రావాలి కదా! విశ్వాసం రావాలి కదా! నువ్వు ఎవరినో బిచ్చగాడిని చూపించి వీడే శివుడు అంటే నేను ఎలా నమ్ముతాను అంటావు . మరి శివుడని ఎలా నమ్ముతావు.?
బాల కుమారస్వామి:- చేతిలో త్రిశూలం ఉండాలి …డమరుకం ఉండాలి… పులి చర్మం ఉండాలి… ఏనుగు చర్మం ఉండాలి… జటాజూటం ఉండాలి… రుద్రాక్షలు ఉండాలి… మనకి ఫోటోలో చూపిస్తారు కదా! శివుడు అలా ఉండాలి …అలా ఉంటేనే శివుడని నమ్ముతాను .
శివ నందిని:- కాబట్టి నువ్వు అలాంటి వాడిని శివుడని నమ్ముతావు. అంతేగాని ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఉన్నారంటే నమ్మవు. అంతేగా…
బాల కుమారస్వామి:- అవును! నేను నమ్మను. జీవుడిలో శివుడు ఉండొచ్చు.. కానీ ఆయనకి ఒక రూపం ఉంది .ఆ రూపంలో కనబడితేనే నేను నమ్ముతాను .నేను చెప్పిన లక్షణాలు ఉంటేనే నేను నమ్ముతాను. లేదంటే నాకు నమ్మకం కుదరదు.
శివ నందిని:- అలాంటి లక్ష్యమును ఏర్పరచుకొని ఫలానా శివుడు అంటే….
ఇప్పుడు ఒక హోటల్ కి వెళ్తే నీకు కావాల్సింది తిను అని అన్నాను అనుకో… ఉపయోగం లేదు. నీకు ఇష్టమైనది తిను అన్నాననుకో…నాకు ఇడ్లీ కావాలంటావు….నేను నీకు గారెని చూపించి… ఇడ్లీ అని చెప్పొచ్చు కదా ! అది ఇడ్లీ అని ఎలా నమ్ముతావు …గారె,ఇడ్లీ రెండు ఒకటే. రెండు మినప్పప్పుతోనే తయారు చేస్తారు. రెండింటికి తేడా ఏమిటంటే ఇడ్లీలో ఇడ్లీ రవ్వ కలుపుతారు …గారెలలో ఇడ్లీ రవ్వ కలపరు. అది తెలియాలి. ఇక్కడ శివుడికి ఉన్న తేడా కూడా అంతే .. గారె అనే ఇడ్లీ . నువ్వు ఇడ్లీ తినాలి అనుకున్నప్పుడు ఇడ్లీ యొక్క లక్షణాలు ఎలా అయితే తెలుసుకుంటావో….నువ్వు ఆరాధించే శివుడు కూడా ఏ విధంగా ఉండాలి అని ఆ రూపాన్ని మనసులో బలంగా పట్టుకో! పెట్టుకో! లక్ష్యాన్ని పెట్టుకో! అప్పుడు సహజ సిద్ధంగానే శివసాక్షాత్కారం అవుతుంది . నువ్వు నమ్మిన రూపమే నీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మీ మనసు చేసే మనోభ్రమణం. మనసు చేసే మాయా రూపం ….భ్రమభ్రాంతి. నువ్వు మనసులో ఏమైతే కోరుకుంటావో మనసే భావరూపాలకు తీసుకువస్తుంది. ఆ భావమే నీకు సహజ సిద్ధమైన రూపంగా చూపిస్తుంది. సాక్షాత్కారం ఇస్తుంది . ఇక్కడ నిజానికి మాట్లాడితే …జీవుడు లేడు, శివుడు లేడు. ఇదంతా మనసు చేసే మనో మాయ అన్నమాట !అది తెలియాలి అంటే… నీకు కొంత సమయం పడుతుంది .అర్థం చేసుకునే సాధన స్థితికి రావాలి. అది ఒక రోజులోనే రావచ్చు.. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు.. కొన్ని నెలలు పట్టొచ్చు. ఇప్పుడే అయిపోతుంది అని చెప్పలేం. ఒక్క క్షణంలోనే నీకు యద్భావం తద్భవతి అన్నట్టు శివసాక్షాత్కారం కలుగుతుంది. శివుడు దర్శనం ఇవ్వగలడు అంటే…. నీ మనసును ఏకరూపం మీద….ఏక నామం మీద… నువ్వు నిలబెట్టగలిగి స్థిరపరచుకోగలిగితే… ఆయన సహజ సిద్ధంగానే
నీ మనసుకు నచ్చిన రూపంలో సాక్షాత్కారం ఇస్తాడు . ఎందుకు అంటే ఇక్కడ పదార్థమే మారుతుంది. ఇక్కడ రెండు పదార్థాలు లేవు.. ఒక్కటే ఉన్నది . నువ్వే శివుడివి.. నీలో నుంచే శివుడు వస్తాడు . వేరేగా రాడు. నువ్వు బింబం అయితే ప్రతిబింబంగా శివుడు బయటికి వచ్చి కనపడతాడు . నీ నీడలాగా ఉంటాడు . అది మన సాధన పరిపక్వత స్థితిని బట్టి తెలుస్తూ ఉంటుంది. శివుడు నాలోనే ఉన్నాడు …ఓం శివోహం అని చెప్పడం జరిగింది. నేనే శివుడై ఉన్నాను …జీవున్ని కాదు …ఉన్నది ఆయనే, నేను కాదు అనే స్థితికి వెళితే…. అదే సాధన పరిసమాప్తి స్థితి అవుతుంది. అదే సాధన పూర్ణఫలం …పూర్ణజ్ఞానం.
బాల కుమారస్వామి:- ఆ స్థితిని పొందాలి అంటే చాలా కష్టం అమ్మ ! చేసే సాధనను బట్టి సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని నాకు అర్థం అయింది. మన సాధనను బట్టి దైవసాక్షాత్కారం, ఇష్టదైవ దర్శనం అవుతుందనేది తెలుస్తుంది .
శివ నందిని:- శివునితో …. అంటే మనం దైవంతో ముందు అనుసంధానం అవ్వాలి. అంటే దైవాన్ని పట్టుకోవాలి . ధర్మమును పట్టుకుంటే ఆయన మనల్ని పట్టుకుంటాడు. ధర్మాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టావో…. ఆయన మనల్ని వదిలేస్తాడు. ధర్మము ,అర్థము, కామము, మోక్షము అనేది చెప్పారు . ధర్మాన్ని పట్టుకో ! నీకు కావలసిన మోక్షం ఆయనే ఇచ్చేస్తాడు అని చెప్పాడు. ఆ ధర్మం అనేది ధర్మ సంపాదన అర్థం , కామం అంటే పాతివ్రత్య ధర్మంతో ఉండాలి. ఏకపత్ని , ఏకపతి ధర్మంతో ఉండాలి . పరస్త్రీలు ,పరపురుషుల వైపుకి వెళ్ళకూడదు . ఈ మూడు నువ్వు పాటించగలిగితే ……నీకు కావలసిన మోక్షం దానంతట అదే సహజ సిద్ధంగానే నీకు వస్తుంది అని చెప్పటం జరిగింది. ధర్మం కూడా ఎలా పట్టుకోవాలి అంటే… పిల్లి తన పిల్లల్ని నోటితో పట్టుకుంటుంది . అదే కోతి వచ్చేసరికి పిల్లలు తల్లిని పట్టుకుంటాయి. ఇక్కడ తేడా చూడు…. నువ్వు నా చేయి పట్టుకున్నావనుకో నువ్వు ఎప్పుడైనా చేయి వదిలేయొచ్చు. అదే నేను నీ చేయి పట్టుకున్నాను అనుకో ఎప్పటికీ నీ చెయ్యి నేను విడిచిపెట్టలేను.
బాల కుమారస్వామి:- అవునమ్మా! అది నిజమే నేను ఆటల రందిలో చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తూ… మీ చేయి వదిలిపెట్టేయొచ్చు. అదే నువ్వు నా చేయి గట్టిగా పట్టుకున్నావ్ అనుకో… నీ మనసు స్థిరంగా ఉంటుంది . కాబట్టి ఒకవేళ నా మనసు లయ తప్పుతున్నప్పుడు ..చెయ్యి ఊపి నన్ను జాగ్రత్తగా పట్టుకో ! చేయి వదిలేస్తున్నావని చెప్తావు . కాబట్టి నేను మార్జాలం లాగా… శివుని పట్టుకోవాలి . అంతేగాని మర్కటం లాగా నేను శివుని పట్టుకోకూడదు. అంటే ధర్మమును పట్టుకుంటే …ఈశ్వరుడు నన్ను పట్టుకుంటాడు. అంటే సూక్ష్మములో మోక్షం అన్నమాట ! అంటే నేను ఇంక ఏ సాధన చేయనక్కర్లేదు …
శివ నందిని:- ధర్మమును పట్టుకుంటే …నువ్వు ఏ సాధన చేయక్కర్లేదు.. కానీ ధర్మాన్ని పట్టుకునేటప్పుడు ఆ ధర్మాన్ని చివరి వరకు పట్టుకుంటావా లేదా? అని ప్రతిక్షణం ప్రకృతి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షలు తట్టుకొని నువ్వు నిలబడాలి. అప్పుడు నువ్వు తరించవచ్చు… ధర్మాన్ని పట్టుకొని నిలబడటమే సాధన అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు ఆ ధర్మాన్ని పట్టుకోకుండా వదిలిపెట్టే విధంగా ప్రకృతి చాలా పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలు నువ్వు తట్టుకొని నిలబడాలి. ఇది అంత తెలికైన విషయం కాదు… ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు…. సత్యపాలన ధర్మాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు పాతివ్రత్య ధర్మమును పట్టుకున్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు… అసత్యం చెప్పను అని ధర్మం పట్టుకున్నారు. వీళ్ళ ముగ్గురి జీవితాలు కావాలంటే చూడు. నానా కష్టాలు పడ్డారు… నానా ఇబ్బందులు పడ్డారు… ఆ ధర్మం అనేది సడలించాలని నానా విధాలుగా చూపించారు… అంతెందుకు శ్రీరాముడు ఉన్నాడు… ఆయన పాతివ్రత్య ధర్మంతో సీతాదేవి నా భార్య…అని ఏకపత్ని ధర్మంతో ఉంటానని అన్నాడు. సూర్పణక వచ్చి ఆయన మీద ప్రేమావేశాలు చూపిస్తే… నాకు పెళ్లయింది… నాకు సీతాదేవి తప్ప పరస్త్రీ తోబుట్టువులతో సమానం… తల్లితో సమానం అని అనేసరికి ఆమె “రాక్షస కాంతను… నీ మోహ సౌందర్యానికి వసురాలిని అయిపోయాను…నా కోరిక తీర్చలేని వాడివి నువ్వేo మగాడివి” అని అంటూ ఉండేసరికి… లక్ష్మణుడు చలించిపోయి తన అన్నను అసభ్యకరంగా మాట్లాడుతుంది ….రెచ్చగొడుతుంది…అని చెవి ముక్కు కోసేయడం జరిగింది. ఆ దెబ్బతో ఆమె తన అన్నయ్య అయిన రావణాసురుడి దగ్గరికి వెళ్లడం …….అక్కడి నుంచి రావణాసుర సంహారం జరిగింది. ఇక్కడ రాముడు ఇంద్రియనిగ్రహ పరీక్షలో నెగ్గాడు. కాబట్టి మానవ మాత్రుడు కాస్త దేవుడయ్యాడు. పాతివ్రత్య ధర్మాన్ని పట్టుకున్నాడు. అలాగే సత్యహరిశ్చంద్రుడు ఆయన చక్రవర్తి …..కానీ చివరికి సత్యపాలన కోసం ఆయన స్మశాన కాపరి అయ్యాడు. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ ఉన్నది కదా అనగానే…..
బాలగణపతి:- అవును ఉంది. హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు మీద ఘాటు ఉంది. అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది.
శివ నందిని:- ఒక చక్రవర్తి స్మశాన కాపరిగా మారినా కూడా….ఆయన సత్యపాలన మానలేదు. సత్యం మీదనే నిలబడ్డాడు. దానికి ఆయన ఎన్నో రకాల పరీక్షలు ఎన్నుకున్నాడు. ఎదుర్కొన్నాడు. ధర్మమును పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ధర్మం నువ్వు చివరిదాకా పట్టుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. పులి మీద స్వారీ లాంటిది. ధర్మాన్ని సడలించకుండా నువ్వు నిలబడగలిగితే…. అదే నీకు ధర్మార్థ కామమోక్షములు ఇచ్చేస్తుంది. అదే సాధన .ఆ ధర్మాన్ని జీవితాంతం అమలు చేయడానికి చేసేదే సాధన . దానికి వచ్చే రకరకాల మాయలు, మర్మాలు …అన్నింటిని కూడా మనసు పక్కదారులకు వెళ్ళనివ్వకుండా… నువ్వు పట్టుకున్న ధర్మాన్ని నువ్వు పాటించగలిగితే చాలు. నువ్వు పట్టుకున్న ధర్మమును బట్టి నీకు మాయలు, మర్మాలు ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు పాతివ్రత్య ధర్మాన్ని పట్టుకున్నావనుకో పర స్త్రీ పరపురుషుల వ్యామోహపరీక్షలు పెడుతుంది. సత్యమునే చెప్పాలి అని పట్టుకున్నప్పుడు సత్యాన్ని కలిగించే మాటలు తొలగించడానికి ఆటంకాలు కలిగిస్తుంది. ఇప్పుడు అంతెందుకు ధర్మరాజే ఉన్నాడు ఆయన అసత్యమును ఎన్నటికీ చెప్పను అని ధర్మ నియమం పెట్టుకున్నాడు. కానీ తన గురువైన ద్రోణాచార్యుని యుద్ధంలో సంహారం చేయాలంటే…. తన కుమారుడైన అశ్వద్ధామ చనిపోయాడని చెప్పాలి… అది ధర్మరాజు చెబితేనే ఆయన నమ్ముతాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు. ఆఖరి క్షణంలో అశ్వద్ధామ అనే గుర్రం చనిపోయింది అనే బదులు అశ్వద్ధామ నువ్వు మరణించావా ? అని అశ్వద్ధామ అనే గుర్రం చనిపోయింది అని మనసులో అనుకున్నాడు. ఆ అశ్వద్ధామ చనిపోయాడని తెలియగానే ద్రోణుడు తన విల్లంబులు వదిలేసరికి సంహారం జరిగింది. కాబట్టి విపత్కర పరిస్థితులు వస్తాయి… ధర్మమును పట్టుకొని ఉంటే వాటిని అధర్మంగా మార్చే పరిస్థితులు వస్తాయి… వాటిని తట్టుకొని నిలబడాలి. అది నిగ్రహించుకోవాలి. నువ్వు తెలివితేటలతో… సమయస్ఫూర్తితో… విచక్షణ జ్ఞానంతో ఉండి ఆ మాయని దాటుకోగలిగితే…. అప్పుడు ధర్మం నీ వెంట ఉంటుంది. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది సమయస్పూర్తికి….విచక్షణ జ్ఞానానికి సాధన చేసుకుంటూ రావాలి. అదే సాధన అంటే…. నువ్వు నీ సహజ స్థితిలో ధర్మమును పట్టుకొని నిలబడగలిగితే….అదే సాధన. ఆ సాధనలో నువ్వు చివరిదాకా నిలబడగలిగావు అంటే… ఫలితం సాధన పరిసమాప్తి అయిపోయినట్టే. ఆ సాధనని ధర్మం తప్పకుండా అధర్మం వైపుకి వెళ్లకుండా… నిలబడగలిగావు అంటే…. మీ సాధన పరిసమాప్తి అవుతుంది. అంతెందుకు …పరమహంస ఉన్నారు. పాతివ్రత్య ధర్మం పట్టుకున్నారు. ఆ ధర్మాన్ని పట్టుకున్నప్పుడు 148 మంది స్త్రీలు ఆయన్ని కామ వాంఛలో పడేయాలి….పర స్త్రీ వ్యామోహంలో పడేయాలి అని మానవ ,దేవత, రాక్షస, పిశాచ ,భూతాలు, ప్రేతాలు, యక్షినీలు, కిన్నెరలు, గంధర్వులు ఇలా వీళ్ళందరూ కూడా వివిధ జాతి స్త్రీలు ప్రయత్నం చేశారని ఆయన అనుభవంలో చెప్పడం జరిగింది కదా! అంటే ఆయన వివాహం అయిన 28వ ఏట నుంచి 48 వరకు ఆయన పాతివ్రత్య ధర్మం పట్టుకుని వచ్చారు.జీవితాంతం కొనసాగిస్తూనే వచ్చారు. ఎప్పుడైతే ఆయన పాతివ్రత్య ధర్మంలో నిగ్రహంగా నిలబడ్డాడో ….ప్రకృతి ఆయనకి పరీక్షలు పెట్టడం మానేసింది. ఎందుకంటే ఆయన ఇంక ఆ స్థితిని పొందేసాడు. ధర్మమును పరిపూర్ణంగా పట్టుకొని అలాగే నిలబడిపోయారు. అదే ఆయన సాధన పరి సమాప్తి చేయగలిగింది. మోక్షం పొందినట్టు ధ్యాన దృశ్యం అనుభవ అనుభూతిగా పొందడం జరిగింది. కాబట్టి ధర్మమును పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఆ ధర్మమును పట్టుకొనివ్వకుండా ప్రకృతి వివిధ రకాల పరీక్షలు, యోగ పరీక్షలు, సాధన పరీక్షలు, మాయా పరీక్షలు పెడుతుంది. వాటన్నింటినీ కూడా నిగ్రహించుకొని దాటుకుంటూ రావాలి. ఆ జ్ఞానం పొందడానికే… మనం సాధన చేయాలి.
బాల కుమారస్వామి:- అమ్మ ! ఇప్పుడు నాకు అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంది. కానీ మనసులో నువ్వు చెప్పింది యధాతథంగా ఉంచుకుంటాము.
శివ నందిని:- ఇప్పుడు ఇది మీకు అర్థం కాదు. వయస్సు చిన్నది. కాకపోతే అర్థం అయ్యే వయసు వచ్చేసరికి మీకు అర్థం అవుతుంది… ధర్మాన్ని పట్టుకోండి… ఆ ధర్మాన్ని మీకు నచ్చింది ఏదో ఒక ధర్మము నియమంగా పెట్టుకోండి. అది జీవితాంతం క్రమం తప్పకుండా …వేళ తప్పకుండా చూసుకోండి. ఆ నియమాన్ని దాటించాలని ప్రకృతి మీకు దానికి తగ్గట్టుగా పరీక్షలు పెడుతుంది. వాటిని మీరు దాటుకుంటూ రావాలి. ఒకటి మీరు పెట్టుకున్న నియమాన్ని జీవితాంతం పాటించేటట్లుగా పెట్టుకోండి. అంతే మీ సాధన. అంతకుమించి వేరే సాధన లేదు. ఎవరైతే ఆ నియమాన్ని జీవితాంతం పాటిస్తారో … వాళ్ళు సాధన పరిసమాప్తి చేసుకుంటారో…వారికి మోక్షం చూపించినట్టుగా అనుభవం అనుభూతి కూడా ఇచ్చేస్తుంది. ఇది సహజ సిద్ధమైన సాధన.
అమ్మ! మేమిద్దరం కూడా చెరొక నియమం పెట్టుకుంటాము. దాన్ని మేము ధర్మంగా పెట్టుకొని వెళ్తాము. చూద్దాం! ధర్మం పట్టుకొని వెళ్తే….ఏం జరుగుతుంది? నాకు ఈశ్వర ప్రత్యక్ష దర్శనం కావాలి అని ఇద్దరు అనేసరికి…. అది మీ యొక్క సాధన స్థితిగతులను బట్టి ఉంటుంది. అది ఇప్పుడే అవుతుంది అని చెప్పలేను ….అనేసరికి అక్కడితో వారి సంభాషణ పూర్తి చేశారు.
వీళ్ళ సంభాషణ అంతా వింటున్న మహాదేవికి మెలకువ వచ్చి
మహాదేవి :- అమ్మాయి శివ నందిని! నువ్వు సన్యాస దీక్ష తీసుకున్నాను అనుకుంటున్నావు కానీ…. గృహస్థాశ్రమంలోనే ఉన్నావన్న విషయం గమనిస్తున్నావా? పిల్లలు శివ స్వామి జన్మంతర భర్త మీ ముగ్గురి బంధనాలు బంధాలు, బాధ్యతలు పడ్డాయి కదా! సన్యాసం తీసుకున్నావు కానీ గృహస్థాశ్రమంలోనే ఉన్నావు గమనించావా?
శివ నందిని:- అమ్మ నువ్వు అన్నది నిజమే! కాకపోతే ఏంటంటే యోగ జీవితానికి, భోగ జీవితానికి చాలా తేడా ఉంది . భోగ జీవితంలో బంధాలు అనేవి బంధనాలుగా మారతాయి. ఇక్కడ యోగ జీవితంలోకి వచ్చేసరికి బంధాలు, బంధనాలు అనేవి ఉండవు. కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నంతవరకు, వాళ్లు ఉన్నంతవరకు మాత్రమే వాళ్లని చూసుకునే బాధ్యత ఉంటుంది . ఒకవేళ వీళ్ళు చనిపోయినా ….లేదా దూరం అయిపోయినా …బాధపడడం అనేది ఉండదు. వాళ్ళ సాధనకు తగ్గట్టుగా వాళ్ళు వెళ్లిపోయారు అని ….ఒక విధమైన వైరాగ్యభావ స్థితిలో నేను ఉంటాను. ఇప్పుడు శివ స్వామి అయినా… పిల్లలు అయినా …నాకు బాధ్యతలే. అదేంటి అంటే …జన్మంతర ఋణానుబంధాలు. ఆ ఋణాలు తీరిపోతే… వీళ్ళు ఉండమన్నా ఉండరు. ఉండలేరు. ఎందుకంటే ఋణానుబంధ రూపేనా పశు పక్ష్యాద్ సుతాలయ అని అన్నారు కదా! యోగ జీవితంలో మనకి వచ్చే బంధాలన్నీ బంధనాలు కావు. అవి బాధ్యతలే అవుతాయి . భోగ జీవితంలో వచ్చే కర్మానుసార బంధాలన్నీ కూడా బంధనాలుగా మారతాయి . ఇప్పుడు పిల్లలు నా వాళ్ళు… భర్త నా వాడు… నాకే చెందాలి …నాతోనే మాట్లాడాలి …నాతోనే ప్రేమగా ఉండాలి… అనే ఈర్ష్య రాగద్వేషాలు, గర్వ అహంకారాలకి, కోపావేశాలతో ఉండిపోతారు . వాళ్ళ పిల్లలకి ఏమైన అయినా …కట్టుకున్న వాళ్ళకి ఏమైనా అయినా ….అందులో తట్టుకోలేని పరిస్థితి వస్తుంది.
తీవ్రమైన మనోవేదన , కోపాలు వస్తాయి. కానీ దీనికి వచ్చేసరికి… స్మశాన వైరాగ్య స్థితిలో ఉండేసరికి….యోగ జీవితంలో కోపోద్రేకాలు కలిగాయి అంటే వాళ్లతో ఋణం తీరిపోయినట్టే. వాటి గురించి మనం పట్టించుకోము. కళ్ళ ముందు ఉన్నంతవరకే మనకి ఈ బంధాలు, బాధ్యతలు అనేది ఉంటాయి. కళ్ళ ముందు నుంచి దాటిన తర్వాత ఏమయ్యారు…. ఏంటి… అని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించము. అందుకని యోగ జీవితానికి, భోగ జీవితానికి అదే తేడా! ఈ భోగ జీవితంలో ఏమవుతుంది అంటే… బంధం బంధనం అవుతుంది. యోగ జీవితంలో బంధం బాధ్యత అవుతుంది. బాధ్యతకి బంధనానికి చాలా తేడా ఉంది. ఇవన్నీ కూడా నాకు బాధ్యతలే. ఎందుకు అంటే ఇవి మూలాలు. ఈ మూలాల వల్లనే కొన్ని కోట్ల పునఃజన్మలు ఎత్తడం జరిగింది. జన్మలకు మూల కారణాలు ఏంటి అంటే.. వీళ్ళే. వీళ్ళే నాకు భోగ జీవితంలో పిల్లలుగా పుట్టారు. ఇప్పుడు యోగ జీవితంలో వీళ్ళిద్దరూ బాల గణపతి బాల కుమారస్వామిగాను శివ స్వామిగా ధర్మపతిగా కనపడ్డారు . వీళ్ళ మోహమాయ దాటాలనే…. ప్రకృతి పునః జన్మలు ఇచ్చి కొన్ని కోట్ల కోట్ల జన్మలు తీసుకొని వెళ్ళిపోయింది. మళ్లీ నేను అంతానికి వచ్చేసాను.నా ఆది జన్మ ఏమిటి? అనే దానికి వచ్చాను. ఇప్పుడు నాకు బంధాలు ఏమిటి? ఈ బంధనాలు ఏమిటి …బాధ్యతలు ఏమిటి… అనేది యోగ జీవితంలోకి వచ్చిన తర్వాతే అర్థం అవుతుంది. తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నాను….. శివానంద నాకు కనిపించినా …కనిపించకపోయినా నేను బాధపడను …భయపడను… కంగారు పడను… ఆలోచించను… దాని గురించి ఆందోళన చెందను. అదే భోగ జీవితంలో ఉండేసరికి ఆయన ఏం చేస్తున్నాడు… ఎక్కడ ఉన్నాడు.. తిన్నాడో లేదో అని ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తూ… ఎప్పుడు వస్తారు ఏంటి అని ఫోన్ చేయడం… మాట్లాడడం… క్షేమ సమాచారం తెలుసుకోవడం… క్షేమ సమాచారాల గురించి ఆలోచించడం… పిల్లల గురించి ఆలోచించడం… ఇలా పలు రకాలుగా మనసు కొట్టుకుంటుంది. వాళ్ళకి సమస్యలు వచ్చినా… ఏదైనా ప్రమాదాలు జరిగినా… వాళ్ళు కోలుకునే దాకా మనసు పీకుతూ ఉంటుంది. లాగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు యోగ జీవితానికి వచ్చేసరికి…పిల్లాడున్నాడు… బాల గణపతి, బాల కుమారస్వామి శ్రీశైలంలో మల్లికా కుండంలో పడిపోయారు. మనం దర్శనం నుంచి వచ్చేసరికి నీటిలో పడిపోయారు. మునిగిపోయారు. ఆ విషయం తెలిసింది. నేనేమైనా కంగారు పడ్డానా? భయపడ్డానా! బాధపడ్డానా! వస్తారా లేదా? అని ఎదురు చూశాను. కాలమే నిర్ణయం చేస్తుంది అనుకుని వదిలేసాను. మనోనిగ్రహంతో నిలబడ్డాను. అది బాధ్యత. అదే బంధనంలో ఉన్నట్టుంటే… వాళ్ళు ఏమైపోయారు అని నేను దూకేసేదాన్ని …. భోగ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మల్లికా గుండంలో పడిపోతే ఆయన ఎక్కడ ఉన్నాడో పిలుస్తాను… ఆయన రాకపోతే నేనే దూకేసి… పిల్లల్ని పైకి తీసుకు వచ్చి కాపాడే దాన్ని. అది బంధానికి, బంధనానికి, బాధ్యతకి చాలా తేడా ఉంది.
మహాదేవి:- ఏమోనమ్మా!అన్ని అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటాయి. నువ్వు చెప్పేవన్నీ కూడా… అవన్నీ అనుభవంలో అనుభవించిన జ్ఞానాన్ని చెబుతున్నావని తెలుస్తుంది. కాబట్టి నువ్వు అన్నది నిజమే…. బంధనానికి, బాధ్యతకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నా పిల్లల గురించి నేను ఆలోచించట్లేదు. నా భర్త గురించి నేను ఆలోచించట్లేదు. భోగ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ల గురించి ఆలోచించాను. వాళ్లు ఒక్క క్షణం లేకపోతే నేను కంగారు పడేదాన్ని. వాళ్ళు లేకపోతే నాకు గడవక పోవటము జరిగేది. ఇప్పుడు వాళ్ళని చూసి 12 సంవత్సరాలు పైగా అవుతుంది. ఇవాళ వాళ్ళ గురించి ఒక్క క్షణం పాటు కూడా… వాళ్ళు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు? ఏంటి అని ఆలోచన చేయడం… కానీ ఏమీ లేవు. అదంతా నువ్వున్నట్టు నేను బంధనాలు నుంచి బాధ్యతలు కి వచ్చేసాను అన్నట్టుగా గ్రహించాను. కాబట్టి నువ్వు యోగ జీవితం లో… బాధ్యతనే నిర్వర్తిస్తున్నావు అని చెబుతున్నావు. మానసికంగా, శారీరకంగా నీకు బంధాలు కావు, బంధనాలు కావు అని చెప్తున్నావు… అంటే ఈ స్థితికి రావాలంటే ఎంతో ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహ స్థితి రావాలి. అది పొందడానికే సాధన చేయాల్సి వస్తుంది. అది పొందనినాడు సాధన పరిసమాప్తి కాదని పొందిన నాడు సాధన పరిసమప్తి అవుతుందని అర్థమయింది . అనేసరికి …
సరే తల్లి పడుకో! ఇప్పటికే మధ్య రాత్రిలో లేచావు. ఇంకా తిరుపతి రావాలంటే 6:00 పడుతుంది. సమయం ఇప్పుడు నాలుగు గంటలు అయింది. విశ్రాంతి తీసుకో! నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను. పడుకుంటాను అనేసరికి… సరేనమ్మా అని పిల్లలు మళ్లీ నిద్రలోకి వెళ్లారని గ్రహించి… తను కూడా నిద్రలోకి జారుకుని… అందరూ నిద్రలోకి జారుకున్నారు.బస్సు తిరుపతి వైపు యధావిధిగా ప్రయాణం సాగిస్తుంది .
మహాదేవికి ఉన్నట్టుండి… నిద్రలో మెలకువ వచ్చింది. సమయం చూస్తే ఆరు గంటలు అవ్వొస్తోంది . ఇక తిరుపతి 10 కిలోమీటర్ల దూరంలో ఉందని చుట్టుపక్కల ప్రదేశాలను బట్టి మహాదేవి గ్రహించింది. ఇంతలో శివ నందిని కూడా మెలకువ వచ్చి లేచి చూసేసరికి…
శివ నందిని:- అమ్మ తిరుపతి వచ్చిందా?
మహాదేవి:- ఇంకా రాలేదమ్మా! ఇంకొంత దూరం ఉంది. అయినా ఇప్పుడే ఎందుకు లేచావు? కాసేపు పడుకో పోయావా ?
శివ నందిని:- లేదమ్మా నిద్ర సరిపోయింది. ఎప్పుడైతే శక్తి జాగృతి అయ్యిందో….రోజు మొత్తం మీద రెండు గంటల నుండి నాలుగు గంటలు పడుకుంటే ఇక మూడు రోజులు పాటు నిద్ర అవసరం ఉండట్లేదు.
మహాదేవి:- అంటే నీ మనసు, శరీరం యోగ నిద్రకి అలవాటు పడుతుంది. ఇది సహజ సిద్ధంగానే నీకు వచ్చింది. ఇలాంటి యోగ నిద్రలో నాలుగు గంటల నిద్రపోతే … భోగ నిద్రలో మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు నిద్ర పోవాల్సిన అవసరం ఉండదు .
శివ నందిని:- అవునా! నాకు తెలీదు. ఏది యోగనిద్రో…. ఏది భోగ నిద్రో కూడా తెలియదు.
మహాదేవి:- ఏమీ తెలియకుండా ఉండటమే మంచిది. అహంకారం పెరుగుతుంది. నేను ఒక సిద్ధ పురుషుడిని …నేను ఒక బ్రహ్మ జ్ఞానిని అవుతున్నానని చెప్పేసి మనలో మనకి తెలియకుండానే మాయలు పెరుగుతాయి… అంటూ “శివ నందిని ..! నువ్వేమీ అనుకోకపోతే నువ్వు శివుడిని చూసావా?”
శివ నందిని:- శివుడు అంటే నీ ఉద్దేశంలో ఏంటమ్మా?
మహాదేవి:- అదే చెప్తారు కదా! రుద్రాక్ష మాలలు వేసుకున్నట్టు… మెడలో పాములు వేసుకున్నట్టు… ఏనుగు చర్మం వేసుకున్నట్టు…. విభూతి రాసుకొని ఉంటే ఆయన్ని శివ అంటారు కదా!
శివ నందిని:- ఇప్పుడు నువ్వు తాంత్రిక సాధన చేశావు కదా! నీ శివుడు నీకు కనపడలేదా?
మహాదేవి:- అది జరగలేదు కాబట్టే అడుగుతున్నాను…నాకు ఎప్పుడూ శివుడు ఉన్నట్టు జ్ఞాన అనుభవాలు… స్వప్నంలోనూ.. ధ్యాన అనుభూతులే వచ్చేవి. కానీ ప్రత్యక్ష దర్శనం నా పక్కనే ఉన్నాడు అనే స్థితిగతులు అయితే నాకు రాలేదు. ప్రత్యక్షంగా ఆయన్ని చూడాలని అనుకున్నాను. అఘోరా శివుడిని చూడాలని తపన తాపత్రయం పడ్డాను. కానీ నాకు ఏనాడు నాకు ఆ స్థితిగతులు ఇవ్వలేదు . ప్రత్యక్ష దర్శనం ఇవ్వలేదు. 12 సంవత్సరాల సాధన పరిసమాప్తి చేసుకుంటే కనపడతాడని తంత్ర గురువులు చెప్పారు. ఆయన ప్రత్యక్షంగా నా కోసం ఉన్నాడు అనే అనుభవ అనుభూతి కలగలేదు. పరోక్షంగా స్వప్నంలో కనబడటం… సాధనలో నేనేమైనా తప్పులు లోపాలు చేస్తే చెప్పడం…. ఇవన్నీ చేసేవాడు . అది తెలిసేది.
శివ నందిని:- ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఏమిటి?
మహాదేవి:- పరోక్షం అంటే స్వప్నంలో కనబడవచ్చు… ధ్యానంలో కనబడవచ్చు… నాకు అలా కాదు… మనిషి రూపేనా కనపడాలి. దానికోసం నేను అఘోరంలోకి అడుగు పెట్టాను. కానీ నా సాధనలో ఏదో లోపం ఉండి ఉంటుంది . నా భక్తిలో ఏదైనా లోపం ఉండి ఉండాలి… లేదా నేను ఏదైనా తెలిసో తెలియకో తప్పు చేసి ఉండాలి. అందుకనే నాకు ఆయన ప్రత్యక్ష అనుభవంలోకి రాలేదు ..
శివ నందిని:- నువ్వేం అనుకోను అంటే నీకు ఒక విషయం చెబుతాను . శివుడు లేనిది ఎక్కడ చెప్పు ?శివుడు కానిది ఎక్కడ చెప్పు? ఇప్పుడు నువ్వు అనుకున్న శివుడు ఏంటంటే రుద్రాక్షలు , పాములు వేసుకుంటే ఆయనే శివుడు అనుకుంటున్నావు. ఇప్పుడు రుద్రస్వామి నీకు శివుడు కాదంటావా? నేను శివుడిని కాదంటావా! నాలో శివుడు లేడు అంటావా? పిల్లలలో శివుడు లేడు అంటావా? పిల్లల్లో ఉన్న శివుడు బాలశివుడు…. నాలో ఉన్న శివుడు అమ్మవారు శివాని అయి ఉండవచ్చు…. రుద్ర స్వామిలో ఉన్న శివుడు వృద్ధ శివుడు అయి ఉండొచ్చు కదా! నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు…. జంతువులలో కూడా శివుణ్ణి చూడు. అంటే ఇప్పుడు కుక్క ఉంది… నువ్వు ఆరాధన చేసింది కాలభైరవుడిని. ఆ కాలభైరవుని ఆరాధనలో ఉన్నప్పుడు ఆయన కుక్క రూపంలో వచ్చాడు అనుకుని… నువ్వు భావన చేసుకోవచ్చు కదా! తెలుసుకోవచ్చు కదా! కాకపోతే నువ్వు కుక్కని కుక్కగానే చూస్తున్నావు… ఆ కుక్కలో దైవత్వాన్ని చూడలేకపోతున్నావు… శివుడంటే నువ్వు ఫలానా అని పెట్టుకోవడం వల్లనే ఇలా అయ్యింది.ఆభావంలో నువ్వు స్థిరపడలేకపోతున్నావు. ఇతర భావాలలోకి రాలేక పోతున్నావు. అందుకోసం శివుడంటే ఫలానా అనే భావంలో స్థిరపడిపోయావు. ఇప్పుడు పాలల్లో వెన్న ఉందా లేదా?
మహాదేవి:- ఎందుకు లేదు ఉంటుంది…
శివ నందిని:- మరి మామూలుగా పాలలో చూస్తే వెన్న కనపడుతుందా? కనపడదు కదా! ఎప్పుడు కనబడుతుంది..? పాలకి పెరుగు తోడైనప్పుడు… అది పెరుగుగా మారి…. అప్పుడు ఆ పెరుగుని చిలికినప్పుడు… వెన్న బయటకు వస్తుంది. వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది. నువ్వు ఏమంటున్నావంటే నెయ్యి కనపడితే శివుడని అనుకుంటున్నావు…. పెరుగుగా కనపడినా… వెన్నగా కనపడినా శివుడని ఒప్పుకోవట్లేదు.
మహాదేవి:- అవును! నా రూపం నెయ్యి కాబట్టి నెయ్యిగా కనబడితే చూడాలనుకుంటున్నాను. నెయ్యిగా నేను ఎందుకు చూడలేకపోతున్నాను ? అని అనుకుంటాను …
శివ నందిని:- నేను అనేది…. నీకు నెయ్యిగా కనపడితే ఆయన సాక్షాత్కారం కలిగితే… ఆ మాయలో నువ్వు ఉండిపోతావు. ఆ శివుని మాయను నువ్వు దాటడానికి నీవల్ల కాదు. ఎందుకంటే నీ మనసు అక్కడ ఆ రూపాన్ని కోరుకున్నది. మనసు శివ సాంగత్యాన్ని ప్రత్యక్షంగా కావాలని అనుకుంటుంది. ఎప్పుడైతే మనసు పరిపరి విధాలుగా ఒక కోరిక మీద నిలబడిపోయిందే అనుకో….. ఆ కోరిక కాస్త ఇష్ట కోరికగా మారుతుంది. ఆ ఇష్ట కోరిక గాని తీరకపోతే ఏమవుతుంది? ఆ ఇష్ట కోరికని తీర్చుకోవడానికి పునః జన్మలకి వెళ్ళిపోతుంది. ఆయన ఆ కోరికను తీర్చాడు అంటే…. శివుడి సాక్షాత్కారం అయ్యాడు అంటే… నువ్వు శివమాయలో పడిపోతావు. శివ రూపాన్ని నువ్వు మార్చాలన్నా మార్చుకోలేవు. ఏ మార్చాలన్నా మార్చలేవు . నువ్వు ఆయన మాయలో పడిపోయి ఆయన సాంగత్యం చేసుకుంటూ…. ఆయనతో ఉండిపోతావు. అలా ఆదిపరాశక్తి ఉండిపోయింది. బాల గణపతి ఉండిపోయాడు. బాలకుమారస్వామి ఉండిపోయాడు . అప్పుడు ఆయన 64 రూపాలు ఎత్తినా కూడా 64 యక్షిణులుగా మారి ఆయన రూపంలోకి వచ్చింది. ఎందుకంటే రూపమాయ అలాంటిది. మనసుకు నచ్చిన రూపము…. మనసుకి నచ్చిన రూప విధానంలో మనకి సాక్షాత్కారం జరిగితే ఆయన నీకు శివ మాయ అయిపోతాడు. మోక్షం పొందవలసిన చోట అమోక్షం పొందుతావు. ముక్తిని పొందుతావు. పునః జన్మలకి వెళతావు. అది తెలుసుకొని నీకు కావలసిన విధంగా…. నీ మనసుకి నచ్చిన రూపము… నీ మనసుకి నచ్చిన విధంగా ఆయన కనబడడు. కనపడితే ఏమవుతుందంటే తనే మాయగా మారతాడు. ఆ మాయ నుంచి దాటించలేని స్థితికి నువ్వు వెళతావని ఆయనకి తెలుసు. కాబట్టి ఆ కోరిక తీరలేదు అనుకో…. అందులోనే ఉండిపోతావా?
మహాదేవి:- అందులోనే ఉండిపోతాను కదా! ఆ కోరిక కోసం… అది తీరలేదు అని తిరిగి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి కదా!
శివ నందిని:- నిజమే నువ్వు చెప్పింది… సరి అయినది.. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు? ఆ కోరిక తీరలేదు… నెయ్యి రూపంలో నీకు కనిపించలేదు… అంటే నీ సాధనలో ఏదో లోపం ఉంది… ఏదో తప్పు ఉంది అని నువ్వు సాధనను ఇంకా చేయాలి అని పరిపక్వత స్థితికి వెళతావు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నీ సాధనలో వెళతావు. అదే నీకు కావలసినట్టుగా నీకు నచ్చినట్టుగా శివుడు కనపడితే శివుడి మాయలో పడిపోయి సాధన మరిచిపోతావు. ఆ ఉన్నత స్థితికి వెళ్లవలసిన దానివి… ఉన్న స్థితి నుంచి మద్యస్థం ఆ తర్వాత అదోస్థితికి వెళ్ళిపోతావు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న సాధనాస్థితి అంతా కూడా శివమాయవలన అధోగతి పాలవుతుంది. ఆయనకి తెలియదా? నీ మనసు ఎలాంటిది ….నీ మనసు ఎలా కోరుకుంటుంది అని….. మనసు కోరికను దాటలేదు… కోరిక మాయలో పడిపోతుంది… కోరిక లేదనుకో! ఆ కోరిక తీరలేదు అనుకో! మనోవేదనకు గురి అవుతుంది. ఆ కోరిక తీరింది అనుకో మాయలో పడుతుంది. మనోవేదన నుంచి బయటకు రావచ్చు కానీ ఆ కోరిక తీరిన తరువాత సాంగత్యం కావాలని కోరుకుంటుంది. అందుకోసం అని శివుడు తన సాక్షాత్కార మాయను తన భక్తురాలికి ఇవ్వకూడదు అని చెప్పేసి నువ్వు ఎన్ని విధాలుగా కోరుకున్నా….. నీకు ఆ కోరిక తీర్చడు. తన సాక్షాత్కారమాయే నీ సాధనకి అడ్డు రాకూడదు అని .. కానీ అలా అని చెప్పి నిన్ను వదిలి పెట్టేయలేదు కదా! నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకొని పాతివ్రత్య ధర్మాన్ని జీవితాంతం పట్టుకొని ఉన్నావు కాబట్టి….. ఈశ్వరుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. కాకపోతే నువ్వు ఆయన్ని గుర్తించట్లేదు. నీ మనసుకి తగ్గ రూపాల్లో ఆయన రావట్లేదు… వివిధ రూపాల్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆ వివిధ రూపాల్లో నీ మనసు కోరుకోలేదు. మనసు మాయలో పడలేదు… కానీ ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు. నీలోనే ఆయన ఉన్నాడు. శివుడు ఉన్నాడు. నీలోనూ శివుడు ఉన్నాడు… నీలో ఉన్న శివుడిని నువ్వు గుర్తించట్లేదు. అంతర్యామిగా నీలో ఉన్న శివుడిని నువ్వు గుర్తిస్తే ….అంతర్యామిగా ఉన్న శివుడు కాస్త సర్వం శివమయమే అవుతుంది.
ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడికి ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. స్వామి! ఎక్కడ చూసినా నీ పాదాలే కనిపిస్తున్నాయని… శ్రీరాముల వారితో అనేసరికి అవునా! హనుమ….. లక్ష్మణుడు నిన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాడు. పరీక్ష చేస్తాడు… అంటే సరే అని లక్ష్మణుడితో పాటు వెళ్తాడు. నీకు చెట్టును చూస్తే ఏం కనబడుతుంది అని అంటే …..నాకు అక్కడ చెట్టు కాదు, రామ పాదాలు కనిపిస్తున్నాయి అంటాడు. సరే అని ఒక పుట్టను చూపిస్తాడు. రామ పాదాలే అంటాడు… కొండని చూపిస్తాడు… రామ పాదాలే కనిపిస్తున్నాయి అంటాడు …చెరువుని చూపిస్తాడు….రామ పాదాలే అంటారు. సముద్రం, ఆకాశం, భూగోళం, అంతరిక్షం ఇలా ఎటు చూపించినా …ఏం చూపించినా ….రామ పాదాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అని అంటాడు. చివరికి రాముల వారి దగ్గరికి వచ్చేసరికి…అప్పుడు రాములవారు చెబుతారు… ఈ రామ పాదాలు అనేవి మనసులో నువ్వు ముద్రించుకున్న రూపం. ఎటు చూసినా అదే కనిపిస్తుంది. ప్రకృతిలో అదే కనపడుతుంది. నీ మనసులో నా పాదాలను ముద్రించుకోవడం వలన సర్వం రామ పాదం అయింది. సర్వం రామమయం అయ్యింది . అలాగే అమ్మ ! నీ మనసు కూడా శివమయం చేసుకో! శివుడు కానిది లేదు… లేనిది లేదు… శివుడు ఈ రూపంలోనే ఉంటే… ఈయనే శివుడు నుంచి శివుడు కానిది లేదు అనే స్థితికి వెళతావు. సర్వం శివమయం అవుతుంది. శివుడు ఈ రూపంలోనే ఉంటాడు అని నువ్వు కోరిక పెట్టుకోవడం వలన ఆ కోరిక నీకు మాయగా మారే అవకాశం ఉంటుంది. ఆ మాయలో పడేయకుండా ఉండటానికి అని కోరికను తప్పించి మిగతా రూపాలలో శివుడు మీకు కనిపిస్తాడు. నిదర్శనాలు ఇస్తాడు. సాక్షాత్కారాలు ఇస్తాడు. నాకు అప్పుడప్పుడు ధ్యానానుభవాలలోనూ… స్వప్నంలోనూ… నీలో శివుడు, రుద్రయ్యలో శివుడు కనపడటం జరిగింది. నాలో కూడా శివుడు ఉన్నట్టుగా కనబడింది. అంతర్యామిగా ఉన్నట్టుగా చూశాను. కాకపోతే ప్రత్యక్ష శివుడు నాకు కనపడ్డాడు అనుకున్నాను.
మహాదేవి :- నువ్వు అనుకున్నది కూడా నిజమే! నాకు మనసుకు తగ్గట్టుగా ఆయన కనపడ్డాడు అంటే ….ఆ రూపమోహ మాయలో ఆదిపరాశక్తి పడినట్టు నేను పడిపోవడం జరుగుతుంది. సాధన అదోగతి పాలవుతుంది. కాబట్టి మనం శివుడు ఇవ్వలేదు… శివుడు లేడు అనే భావం నుంచి బయటకు రావాలి . ఇందులో ఏం జరిగినా అది మన మంచికే…. అంతా మనమంచికే… జరిగింది అని అనుకోవాలి అన్నమాట! అంటే ఇన్నాళ్లు నాకు శివ సాక్షాత్కారం జరగలేదు అని నేను బాధపడుతున్నాను కానీ… ఈ రోజు నుంచి నాకు ఆ బాధ లేదు. శివుడు లేనిది లేదు. శివుడు కానిది లేదు…నీలోనూ శివుడు ఉన్నాడు… నాలోనూ శివుడు ఉన్నాడు… రుద్రాక్షలు ధరించిన వాడే శివుడు, నాగాభరణం ధరించిన వాడే శివుడు అని అనుకోవడం చాలా తప్పు… అని ఒకవేళ నేను అలా భావన చేస్తే ఆ భావమే నాకు కోరిక అయి… కోరిక మాయ అయ్యి… ఇష్ట కోరిక మాయ అయి మాయాబంధం అవుతుంది. ఆ బంధనం అవ్వకూడదు. బంధం అవ్వాలి , బాధ్యత అవ్వాలి అని చెప్పేసి నీ ద్వారా నాకు జ్ఞానబోధ జరిగినట్టు ఉంది. జ్ఞానోదయం అయ్యింది. నాకు సర్వం శివమయం అని నా మనసులో నేను చూసుకుంటే.. ఆ రుద్రాక్ష శివుడ్ని నా మనసులో పెట్టుకుంటే… ఉన్నదంతా కూడా నాకు రుద్రాక్ష శివుడే కనపడతారు. నేను పెట్టుకోలేదు కాబట్టి… నాకు రుద్రాక్ష శివుడు కనపడలేదు. నా మనసులోనే నాకు రూపం మీద ఇది లేనప్పుడు నాకు కనిపించాలనుకోవడం చాలా తప్పు. నా మనసు నిలకడగా లేదు… నా మనసు ఏకరూపం మీద నిలబడలేదు. నేను అనుకుంటున్నాను గాని చెయ్యట్లేదు. అంటే నేను ఎవరు అని అనుకుంటున్నాను గాని… నేను ఎవరో అని ఆత్మ విచారణ చేయట్లేదని నాకు అర్థం అయింది… నాకు ఆ కోరిక ఉంది… కానీ ఆ కోరిక రూపం ఉంది.. కోరిక రూపం పొందాలి… అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం అయింది.,ఆ కోరిక రూపం కనిపించట్లేదు అనుకున్నాను కానీ, ఆత్మ విచారణ చేయడం లేదు. దానికి తగ్గట్టుగా సాధనా చేయడం లేదు అని నాకు అర్థం అయింది. ఇప్పుడు సర్వం శివమయం. నా మనసులో ఏ రూపమైతే కావాలనుకుంటున్నానో….ఆ రూపం వస్తే అది కోరికగా మారదు. కోరిక మాయ అవుతుంది . అది ప్రత్యక్షంగా గాని , పరోక్షంగా గాని జరుగుతుంది. అది నా యొక్క సాధనా స్థితిని బట్టి… స్థితి గతులను బట్టి శ్రద్ధా భక్తులను బట్టి… నాకున్న భక్తి విశ్వాసాలను బట్టి… సాక్షాత్కారాలు ఉంటాయని నాకు అర్థం అయింది. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దైవం కనపడుతుంది… అనేది ఈరోజు నాకు అర్థం అయింది అని అనుకుంటూ ఉండేసరికి…
అమ్మ తిరుపతి బస్టాండ్ వచ్చేసింది . పిల్లలని లేపు! నేను రుద్రయ్యని లేపుతాను. ఇంక మనం కిందకి దిగాలి…అనుకుంటూ ఉండగా…కండక్టర్ తిరుపతి వచ్చింది…తిరుపతి వచ్చింది… దిగాల్సిన వాళ్లు దిగండి …బస్సు ఇక్కడే ఆగిపోతుంది… అనేసరికి వీళ్ళ పిల్లలను నిద్ర లేపటానికి శివనందిని ,రుద్ర స్వామిని నిద్ర లేపటానికి మహాదేవి ఉపక్రమించారు.
అందరూ కూడా తిరుపతి బస్టాండ్ లో బస్సు దిగారు. మహాదేవి ఉన్నట్టుండి…
మహాదేవి :- ఏంటి శివ స్వామి కూడా మనతోపాటు తిరుపతికి వచ్చాడా?
అని శివనందినిని అడిగేసరికి….
శివ నందిని:- లేదే! ఆయన అక్కడే శ్రీశైలంలో ఉన్నారు కదా! మనతో రాను అన్నారు కదా! ఇక్కడికి ఎలా వస్తారు?
అనేసరికి…. ఒక రాతి బెంచి మీద కూర్చొని ఉన్నది ఆయనే కదా చూడు… అనేసరికి అవునా ? అని అటు చూసేసరికి ….అక్కడ శివస్వామి కనిపించేసరికి ..ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణం ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యింది…ఒక్క క్షణం పాటు నమ్మలేని భావోద్రేకానికి గురి అయ్యింది. ఈయన నిజంగా ఆయనేనా? ఆయన అక్కడే ఉంటాను అన్నాడు కదా! శ్రీశైలంలోనే ఉంటా అన్నాడు కదా! తనతో పాటు రాను అన్నాడు కదా! ఏదైనా ఉంటే ధ్యానంలో కనపడతాను… స్వప్నంలో కనపడి సూచనలు చెప్తాను అన్నాడు కదా! మరి ఈయన ప్రత్యక్షంగా…. భౌతికంగా ఎలా ఈయన ఇక్కడికి వచ్చారు. అది కూడా మా కన్నా ముందే ఎలా వచ్చారు? ఈయనేనా లేక దూరం నుంచి భ్రమ పడుతున్నామా? అని చెప్పేసి వాళ్లతో మీరు ఇక్కడే ఉండండి… ఆయనో కాదో చూసి వస్తాను అని అంటే… సరే వెళ్లి చూసి రా! అని మహాదేవి అనేసరికి…. పరుగు లాంటి నడకతో ఆయన ఉన్న బెంచి దగ్గరికి వెళ్ళింది . వెనక నుంచే శివ నందినిని గమనించిన శివానంద కాస్త..
శివస్వామి :- కంగారు పడొద్దు దేవి! నేనే! ఎవరో కాదు…నేనే వచ్చాను… ఉండబట్టలేకపోయాను… చెప్పాను కదా! నీకు నా సహాయ సహకారాలు… నీకు అవసరం అయినప్పుడల్లా నేను నీకు భౌతికంగా కనపడతాను …ప్రత్యక్షంగా నీకు సశరీరంతో నీకు దర్శనం ఇస్తాను…అని . ఎందుకో చూడాలనిపించింది… నువ్వు తిరుపతికి క్షేమంగా చేరావా లేదా? ఎందుకంటే రాత్రి బయలుదేరారు కదా? అని చెప్పి అనిపించింది. నీకన్నా మనోవేగంతో ఆకాశ శరీర యానంతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు రావడానికి బస్సులు, వాహనాలు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాలు అవసరం లేదు ..
శివ నందిని :- యోగ సిద్ధులకు సాధ్యం కానిది ఏమున్నది! మీరు అవునా కాదా అనే ధర్మసందేహంలో ఇక్కడికి వచ్చాను. అదేంటి స్వామి ? మీరు నన్ను చూడాలనుకోవడం ఏమిటి? నా దగ్గరకు రావడం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉంది. కారణం లేనిదే కార్యము ఉండదు.. ఏదో నాకు చెప్పాలని చెప్పి నాకు అర్థం అవుతుంది..
శివస్వామి:- ఏమీ లేదు…. ఇక్కడ కూడా నీకు కొన్ని మాయలు మొదలవుతాయి.. వాటిని గురించి హెచ్చరించడానికి వచ్చాను.. నీకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి అంశగాని, ఆయన ప్రియ భక్తుడు సాధనా విధి విధానం…. అంటే నువ్వు యోగముద్రల ద్వారా సాధన చేయాలి, చక్రాలు జాగృతి చేసుకోవాలి అన్నావు కదా ! దాన్ని వివరించడానికి నీకు ఏదో ఒక కొండలో కనబడతారు. ప్రత్యేకంగా నీకు ముద్రల గురించి చెబుతారు. అవన్నీ కూడా శ్రద్ధాభక్తులతో ఆయన ఏ విధంగా సప్త చక్రాల జాగృతి కోసం ముద్రలు చెప్పటం జరుగుతుందో….ఆయన ఏ విధంగా ముద్రలు వేస్తున్నాడో…. నువ్వు కూడా మనసులో గుర్తు పెట్టుకుని అదేవిధంగా ముద్రలు చెయ్యి. గురు సమక్షంలో ముద్రలు చేస్తేనే ఫలితం వస్తుంది. అభ్యాసం కుదురుతుంది. తద్వారా నీకు చక్రాలు జాగృతి అవుతాయి. తద్వారా ఫలితం లభిస్తుంది. నాకు తెలిసినంతవరకు సప్త చక్రాల జాగృతి కోసం హస్తముద్రలు చెప్పడం జరుగుతుంది. ఆ సప్తముద్రలు నీకు కుదిరినాయా లేదా అనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించి… ఆ ముద్రలు సరిగ్గా వేస్తున్నావా లేదా అని ఒకటి నాలుగు సార్లు చూస్తారు. నేర్పిస్తారు… లోపాలు ఉంటే సరి చేస్తారు.. ఆయనకి సరిగ్గా చేస్తున్నావు అన్న తర్వాతే ఇంకొక ముద్ర గురించి చెబుతారు. ఇలా నాకు తెలిసి ఏడు ముద్రలు చెబుతారు. ఆ ఏడు ముద్రలు ఆకలింపు చేసుకొని అభ్యాసం చేయాలి . ప్రతినిత్యం జీవితాంతం 10 నుంచి 20 నిమిషాల పాటు నీ దినచర్యలో ఈ ముద్రలు ఉండాలి. అంటే ఈ 20 నిమిషాలు నువ్వు పెట్టుకుంటే 120 నిమిషాల పాటు ఏడు ముద్రలు చేయాల్సి వస్తుంది …
శివ నందిని:- సరే స్వామి! మీ ఆజ్ఞ. ఆయన చెప్పిన విధివిధానంతోనే నేను చేస్తాను. మరి ఆయన్ని గుర్తుపట్టడం ఎలా?
శివస్వామి:- ప్రకృతి నీ మనసుకు సూచనలు ఇస్తుంది. మనసుకు ఆ ఙ్ఞాన స్పురణ అందుతుంది. ఆయన్ని చూడగానే వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు చూస్తున్నాను అనే అనుభూతి కలుగుతుంది. అనుభవ అనుభూతి కలుగుతుంది. ఇక దానితో నువ్వు ఆయన్ని గురువుగా భావించుకొని నేర్చుకో..
శివ నందిని:- సరే స్వామి! అలాగే…
శివ స్వామి:- నీకు ఇక్కడే ఎక్కడో… ఒక ప్రాంతం నుంచి ఆకాశ శివలింగం కూడా వస్తుంది. అంతరిక్షంలో ఉండే స్పటిక రుద్ర శివలింగం వస్తుంది. ఇప్పుడు శ్రీశైలంలో పాతాళ శివలింగం ఉన్నట్లుగానే… ఆకాశంలో ఉన్నది స్పటిక రుద్ర శివలింగం. అయితే పాతాళంలో ఉన్నది రాతి శివలింగం. ఈ రెండింటి మధ్యలో అనుసంధానం అయ్యి ఒక స్పటిక బిందువు కానీ స్పటిక బాణ లింగం కానీ ఉంటుంది. దానిలో మనం ఈ జగన్నాటకమును రుద్రుడు చూస్తున్నట్లుగా జరుగుతుంది . కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ క్షేత్రం నుంచి ఈ అంతరిక్షంలో ఉండే ఆకాశ లింగం అయిన స్పటిక రుద్ర శివలింగం ఉంది. దానికి అర్హత ఉందో లేదో పరీక్ష పెడతారు. అందులో నువ్వు జయం పొందితే నీకు ఆ లింగం వస్తుంది. ఆ తర్వాత కాలానుగుణంగా పాతాళంలో ఉండే శివలింగం శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగలో ఉన్న శివలింగం నీ దగ్గరికి వస్తుంది. ఈ రెండింటిని అనుసంధానం కాలానుగుణంగా చేయవలసి వస్తుంది. అది ఎప్పుడు? ఏమిటి ? ఎలా అనేది ప్రకృతి నిర్ణయం చేస్తుంది. దానికి నువ్వు అర్హత పొందాల్సి ఉంటుంది. ఆ శివలింగానికి కూడా నువ్వు అర్హత పొందాల్సి ఉంటుంది. అక్కడ శ్రీశైలంలో ఉన్నది పాతాళ గంగలో ఉండేది పాతాళ శివలింగం అయితే ఇక్కడ ఆకాశగంగలో ఉండే శివలింగం ఆకాశ శివలింగం అవుతుంది. కాబట్టి దానికి నీకు అర్హత ఉందా లేదా అని చూస్తారు. దీనిని కూడా నువ్వు జాగ్రత్తగా అందుకోవాలి . అలాగే శ్రీశైల క్షేత్రంలో నిలువు శరీరానికి మోక్షమును పొందే అవకాశం ఉంటుంది. అలాగే తిరుపతిలో అడ్డ శరీరం మోక్షం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా అజ్ఞాన గ్రంధిని విభేదనం చేసుకునే క్షేత్రాలు కాబట్టి… నాకు తెలిసినంతవరకు ఈ రెండు శరీరాలు మోక్షం పొందే విధివిధానాలు చూపిస్తాయి. ఆ ధ్యానానుభవం కూడా నువ్వు పొందవలసి ఉంటుంది. అది నీకు అర్హత, యోగ్యత, యోగమును బట్టి ఎక్కడ జరుగుతుంది… ఎలా జరుగుతుంది అని చెప్పలేను. అంటే ముందు నువ్వు చేతి ముద్రలను పొందే గురువు అనుగ్రహం పొందాలి . రెండోది ఆకాశ శివలింగం అందుకోవాలి . మూడోది నీ తొలి శరీరాలు మోక్షం పొందాయా లేదా తెలుసుకోవాలి. ఈ మూడు నువ్వు పొందినట్లయితే అప్పుడు నీకు అసలు సిసలైన సాధన మొదలవుతుంది… అంటే సప్త చక్రాల సాధన మొదలవుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్లాలి ఏంటి అని తర్వాత నువ్వు మూలాధార చక్ర జాగృతికి శుద్ధికి ఆధీనం కోసం నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళాలో సాధనా మూర్తి నీకు ఆధారం చూపిస్తాడు. ఇక అక్కడి నుండి నీకు సాధన ఆరంభం అవుతుంది. బ్రహ్మ రంధ్రం దాకా నువ్వు ఇదే విధంగా క్షేత్రాలన్నీ తిరగాల్సి వస్తుంది. ఆ తర్వాత శరీర జాగృతి కోసం ద్వాదశ శివలింగాలైన జ్యోతిర్లింగాలకి తిరగాల్సి వస్తుంది. ఇది ముందే అనుకున్నాం కదా! ఇప్పుడు నువ్వు తిరుపతిలో చక్ర జాగృతి పరిపూర్ణం చేసుకొని మూలాధార చక్రం జాగృతి ఎక్కడ జరగాలనేది ప్రకృతి ఆధారం చూపిస్తుంది. తద్వారా నీకు సాధనామూర్తి విషయం చెప్తాడు.
శివ నందిని:- సరే స్వామి! మీరు నా వెంట ఉన్నారు. ప్రత్యక్షంగా నా వెంట ఉన్నారు అని నిరూపించారు… నాకు కావలసినప్పుడల్లా ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిన మాటని మీరు నిలబెట్టుకుంటారో …లేదో అని అనుమాన భయం నాలో ఉండేది. ఈరోజుతో ఆ అనుమానభయం తీరిపోయింది. నేను ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. మీరు చూడాలనుకున్నా….నేను చూడాలనుకున్నా….మీరు నాకు దర్శనం ఇస్తారని అర్థమైపోయింది. మనోధైర్యం ఇచ్చారు. మీరు నా వెంట ఉంటే చాలు. మిగతా వాటి గురించి కూడా నేను ఆలోచించను. నా సాధన పరిసమాప్తి చేసుకోవడానికి సహాయ సహకారాల కింద ఒకవేళ నేను మాయలో పడితే… మాయ నుంచి వెనక్కి తీసుకురావడానికి మీలాంటి నిజ అనుభవ భౌతిక యోగ సిద్దులు ఉన్నారు. నడయాడే శివుడే సాక్షాత్తు నా వెంట ఉన్నాడు. ఇక సహాయ సహకారాలు అందిస్తున్నాడని అన్నప్పుడు ఇంక భయపడాల్సింది లేదు… ఆలోచించాల్సింది లేదు… కాకపోతే శ్రీశైలం నుంచి బయలుదేరినప్పుడు ఇసుమంత అనుమానభయం నాలో ఉండేది. సందేహం పూర్తి అయ్యింది. మనోధైర్యం వచ్చింది… మీరు ఎక్కడికి రావాలన్నా రాగలరు.. ఏమి చేయాలన్నా చేయగలరు అని అర్థం అయింది. కాబట్టి మీరు నా అవసరాలను బట్టి నాకు తగ్గట్టుగా స్వప్నంలో కానీ, ధ్యానంలో కానీ , భౌతికంగా కానీ నా దగ్గరకు వచ్చి నాకు సహాయ సహకారాలు అందిస్తారని… అయితే రూడీ అయ్యింది .అయిపోయింది.. ఇది చాలు స్వామి… నాకు మనోధైర్యంతో ఎలాంటి భయాలు ఆలోచనలు లేకుండా పాతివ్రత్య ధర్మంతో సాధన పరిసమాప్తి చేసుకుంటాను. మీ సహాయం అయితే వందకు వెయ్యి శాతం బలంగా ఉంటుందని అనిపిస్తుంది. ధన్యోస్మి స్వామి! మీ అనుగ్రహం నామీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలి. ఇలాగే చూపిస్తారు అని అనుకుంటున్నాను…
అంటూ ఉండగానే ఆయన గాలిలో అదృశ్యమైపోయారు. ఇది గమనించిన మహాదేవి రుద్ర స్వామి మరియు పిల్లలు గబగబా రావడం జరిగింది.
బాలకుమారస్వామి:- ఆయన మా అయ్యే…శ్రీశైలంలో ఉంటాడు.. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చినప్పుడు ఆయన గాలిలో నుంచి అలా వచ్చి ధైర్యం చెప్పి ఓదార్చేవాడు… అదేంటి నన్ను పలకరించకుండా వెళ్లిపోయాడు ఏంటి? అదృశ్యం అయిపోయాడు… మళ్ళీ వస్తారా? అమ్మ!
శివ నందిని:- ఆయన ఎక్కడికి వెళ్లరు… మన చుట్టూనే ఉంటారు…మనకి నీడలాగా ఎప్పుడు మన వెంటే ఉంటారు ..
బాల గణపతి:- అమ్మ! ఈసారి నాకు ఆయన్ని పరిచయం చెయ్యి. నేను ఆయనతో మాట్లాడాలి .
శివ నందిని:- సరేనమ్మా! పరిచయం చేస్తాను.
ముందు మనం స్నానాధికాలు చేసుకొని… టిఫిన్లు చేసుకుని తిరుమల పైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందాం .. అనగానే మహాదేవి ఉన్నట్టుండి మరి పైన మనం ఉండటానికి గది ఏర్పాట్లు అనగానే…. అమ్మ! నేను శ్రీశైలంలో ఉండగానే ఆన్లైన్లో ఫోన్ ద్వారా గదులు బుక్ చేశాను. మనకి గది ఇవ్వటానికి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అద్దె అవి కూడా ఇచ్చేశాను. ఒక మూడు నెలల పాటు ఉండాలి అని చెప్తే దానికి వాళ్ళు ఉండడానికి కూడా అంగీకరించారు. దాని గురించి నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. కాకపోతే ఏంటంటే నేను మరియు రుద్రస్వామి కలిసి మెట్ల ద్వారా తిరుమలకి వస్తాము.. నువ్వు మరియు పిల్లలు కలిసి బస్సు ఎక్కి తిరుమల వెళ్ళిపోండి… అనేసరికి సరే తల్లి! నీ ఇష్టం నాదేముంది ….అనగానే రుద్ర స్వామి సరే! నేను సాధ్యమైనంత వరకు… వీలు ఉన్నంతవరకు ఓపిక ఉన్నంతవరకు నడుస్తాను… నాకేం ఇబ్బంది లేదు… నాకు ఏం సమస్య లేదు… మనం సాయంత్రం బయలుదేరుదాం! కొండపైకి వెళ్లేసరికి మనం తిరుమల చేరుకోవచ్చు…. అనేసరికి అందరూ కూడా స్నానాల గదులు ఉంటే స్నానాలు చేసుకొని.. బయటకు వచ్చి… టిఫిన్లు కానిచ్చుకొని తిరుపతిలో రుద్ర స్వామి మరియు శివ నందిని మెట్ల మార్గం ద్వారా తిరుమలకి బయలుదేరడం జరిగింది. మహాదేవి మరియు పిల్లలు బస్సు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరడం జరిగింది.
మహాదేవి,బాల కుమారస్వామి, బాల గణపతి బస్సులో తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లడం జరిగితే…. సాయంత్రం వేళ శివ నందిని మరియు రుద్రస్వామి కాస్త తిరుమల వెళ్లడానికి బయలుదేరారు. మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్ళటానికి బయలుదేరారు. అప్పుడు
రుద్రస్వామి:- అమ్మాయి! ఈ తిరుపతిలో ఏడు పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు వరుసగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి ,అంజనాద్రి, వృషభాద్రి, నారాయణద్రి, వెంకటాద్రి ఆఖరిది . ఈ సప్తగిరులకు సప్త నామములు ఉన్నాయి. ఇందులో శేషాద్రి అనేది ఆదిశేషుడు…. ఏడు తలల సర్పం… స్వామివారితో పాటు భూమి మీదకి వచ్చినప్పుడు ఆదిశేషుడు ఈ పర్వతం మీద నివాసం చేసుకోవడం వలన దీనిని శేషాద్రి పర్వతం అన్నారు. ఇక నీలాద్రి పర్వతం అనేది స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రాంతంలో జుట్టు రాకపోయేసరికి నీలాదేవి అనే భక్తురాలు ఆయనకి జుట్టుని సమర్పించడంతో….. మనం ఇప్పుడు తిరుమలలో తలనీలాలు ఇచ్చే ఆనవాయితి వచ్చింది. దానికి ఈమె అయ్యగారికి ఇవ్వటంతో జుట్టు మొలిచింది అని మనకి స్థల పురాణం చెబుతుంది. తన అంద చందాలను తన సౌందర్యాన్ని తగ్గించే విధంగా ఉన్నప్పటికీ…. తన జుట్టును మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతి భావంతో సమర్పించడంతో ఆయన నీలాదేవిని తన భక్తురాలిగా వెంకన్న స్వామి తీసుకోవడం జరిగింది. ఆమెకి గుర్తుగా ఈ నీలాద్రి అనే పర్వతమును ఈ సప్తగిరిలో ఒకటిగా ఇవ్వటం జరిగిందన్నమాట! ఇక గరుడాద్రి అంటే స్వామివారి వాహనమైన గరుత్మంతుడు ఈ పర్వతం మీద ఆవాసం చేయడంతో దీనికి గరుడాద్రి పర్వతం అంటారు. ఇక నాలుగవ పర్వతం అంజనాద్రి అంటే హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి స్వామి వారి కృపాకటాక్షాన్ని పొందటానికి ఈ పర్వతం పైన తపస్సు చేయడం వలన…..స్వామివారి అనుగ్రహం పొందడం వలన….. ఈ పర్వతానికి అంజనాద్రి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఐదవదైన వృషభాద్రి…వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అన్నమాట! ఈయన శివుడి గురించి మోక్షం పొందాలని ప్రతిరోజు హోమం చేసి తన తలన నరికి హోమానికి అర్పణ చేసేవాడు…. తర్వాత హోమ ప్రక్రియ పూర్తి అయిపోయిన తరువాత తల వెనక్కి వచ్చేది… శివుడు సాక్షాత్కారం పొందిన తర్వాత తనకి మోక్షం ఇవ్వమని వృషభాద్రి కోరుకున్నప్పుడు…. నాయనా! నీకు ఈ జన్మలో మోక్షం లేదు…. కేవలం నారాయణుడి వలన నీకు జీవన్ముక్తి కలుగుతుంది. ముక్తి ప్రసాదిస్తారు. ఆయన చేతిలో నీకు మరణం ఉన్నది అని చెప్పి అంతర్ధానమయ్యారు. కాలానుగుణంగా ఈయన విష్ణుద్వేషి కావడంతో విష్ణు మూర్తితో ద్వంద యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ ద్వంద యుద్ధంలో విష్ణుమూర్తి చేతిలో వృషభాసురుడు ఈ పర్వతం మీదే మరణం పొంది ముక్తి పొందడం జరిగింది. అప్పటినుంచి దీనిని వృషభాద్రి పర్వతంగా చెప్పడం జరిగింది. ఇక ఆరవది నారాయణద్రి పర్వతం.. ఇక్కడ నారాయణడు అనే ముని విష్ణుమూర్తి సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపస్సు చేయటం వలన….. ఆయన అనుగ్రహం పొందడం వలన విష్ణుమూర్తి నారాయణమూర్తిగా దర్శనం ఇవ్వటం వలన ఈ పర్వతాన్ని నారాయణాద్రి అన్నారు. ఇక ఆ తరువాత వెంకటాద్రి…. ఈ పర్వతం విష్ణుమూర్తి వైకుంఠం నుంచి లక్ష్మీదేవి కోసం మొట్టమొదట అడుగుపెట్టిన వెంకటాద్రి పర్వతం …..ఆయన నివాసం అవటం వలన ఈ పర్వతాన్ని వెంకటాద్రి పర్వతం అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న….
వెంకటేశ్వర స్వామి ఆవాసము ఉన్న స్థలమే వెంకటాద్రి పర్వతం అన్నమాట! ఇలా ఈ సప్త పర్వతాలు కూడా సప్తగిరిలో కూడా మనకి శరీరంలో ఉన్న మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత ,విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలకు ఈ ఏడు పర్వతాలు కూడా ప్రతీకలని చెప్పేసి యోగశాస్త్రం మనకి చెప్పడం జరిగింది. అంటే తిరుమల వెంకన్న స్వామి దర్శనం వలన సప్త చక్రాలు జాగృతి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట! అందుకే నీకు సప్త చక్ర జాగృతి కోసమని ఈ తిరుమల ప్రదేశమును ఎంచుకోవడం జరిగింది..
శివ నందిని:- సరే అయ్యా! మీరు చెప్పినట్లుగా మనం ముందు వెళదాము. మొదట వచ్చేది శేషాద్రి పర్వతం అనుకుంటా! అక్కడికి వెళ్లి ధ్యానంలో కూర్చుందాం
రుద్రస్వామి:- నీ ఇష్టం తల్లి!
అంటూ శేషాద్రి పర్వతానికి చేరుకోవటం జరిగింది. శేషాద్రి పర్వతం మీద ఒక ఎత్తైన రెండు బండల మీద కూర్చొని ఇద్దరూ కూడా తీవ్రమైన ధ్యానంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత శివనందినికి తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి ….సుమారుగా 9.5 అడుగుల ఎత్తు ఉన్న అజానుబాహుడు కనిపించేసరికి… ఒక్కసారిగా తుళ్ళిపడింది. కంగారు పడింది. ధ్యానం నుంచి బయటకు వచ్చి… కూర్చున్నది కాస్త ఒక్కసారిగా లేచి నిలబడింది. అప్రయత్నంగానే ఆయన్ని చూస్తూ ఉండగానే నమస్కారం చేసింది.
శివ నందిని:- స్వామి ! మీరు ఎవరో….! ఇంతవరకు నేను ఆరడుగులు లేదా ఏడు అడుగులు మనిషిని మాత్రమే చూడటం జరిగింది. మీరు సాక్షాత్తుగా ఈ కొండ రాయి మూడు అడుగులు… నేనొక ఆరడుగులు దేహం కలిపితే తొమ్మిది అడుగులు భూమిపై నుంచి పైకి చూస్తే అంతటికి నా తలను దాటి ఉన్నారు. అంటే సుమారుగా మీరు తొమ్మిదిన్నర అడుగులు ఉంటారని అనిపిస్తుంది. ఇంతటి ఆజానుబాహుడిని నేను చూడలేదు… మీరు సాక్షాత్తు ఆభరణాలు లేని వెంకటేశ్వర స్వామి లాగా కనపడుతున్నారు. మీరు ఎవరు స్వామి? మీ గురించి నేను తెలుసుకోవచ్చా ?
ఆజానుబాహుడు:- నా గురించి తెలుసుకోవడానికి నీకు సమయం పడుతుంది లే! నేను అందరివాడిని…..ఎవరికి అందని వాడిని…. అందరూ నన్ను చూస్తూ ఉంటారు… కావాలని కోరికల కోసం, అవసరాల కోసం, నా దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు. ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. కానీ నేనే కావాలి అనే వాడి కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటిది నా దగ్గరికి నువ్వు రాకపోయినా …..నేనే నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నీ మనసులో దైవత్వమును పొందాలి….. నేను ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి, నువ్వు ఏదో సాధన చేస్తున్నావని అనిపించింది. నీ ధ్యానంలో నిస్వార్ధం కనిపించింది. నిష్కామ కర్మగా కనిపించింది. కోరికలు లేవు. అవసరాలు లేవు. ఏం కావాలో… ఏం అడగాలో ….కూడా తెలియని స్థితిలో నువ్వు ఉన్నావని వరాలు తీసుకునే స్థితిలో లేని నీ నిష్కామ భక్తి , నన్ను కొండపై నుంచి కిందకు రప్పించేటట్టు చేసింది…
శివ నందిని:- స్వామి! మీ మాటలు నాకు అర్థమై అర్థం కానట్టు ఉన్నాయి. మీరు ఎవరైనా గాని నాకు అనవసరం. మీరు ప్రత్యక్ష వెంకన్న స్వామి లాగా కనపడుతున్నారు… మీ పాదాలను నేను తాకవచ్చా
అనేసరికి తధాస్తు! అనేసరికి వెనక ముందు ఆలోచించకుండా ఇక సాష్టాంగ నమస్కారం ఆయన పాదాలు తాకేసరికి….. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు తాకిన అనుభవ అనుభూతి… తన్మయత్వం…. అలవికాని ఆనంద స్థితికి కొన్ని క్షణాల పాటు శివ నందిని వెళ్లిపోయింది.మామూలు స్థితికి రావడానికి ఆమెకు కొన్ని గంటలు పడుతుంది అని అర్థమయ్యి..
రుద్రస్వామి:- శివ నందిని లేలే !ఇప్పటికే ఆలస్యం అయింది. స్వామి వారు వెళ్లే సమయం అవుతుంది. ఆయనకి చాలామంది భక్తులు ఉన్నారు….
అనేసరికి అప్పుడు రుద్రస్వామి మాటలకి మామూలు స్థితికి వచ్చి… స్వామి వారు వెళ్లడం ఏమిటి? అని రుద్ర స్వామి వంక కోపంగా బెరుగ్గా అపరిచిత వ్యక్తి చూసేసరికి….
రుద్రస్వామి:- క్షమించండి స్వామి! నేనేదో అలవాటులో పొరపాటుగా మీరు వెంకన్న స్వామి అనే భావనతోనే అలా అన్నాను. మీరు వేరు వెంకన్న స్వామి వేరు కదా! నేను తెలుసుకోలేకపోయాను… అయిన అక్కడ పరమాత్మ… మీరిక్కడ జీవాత్మ… మీరు ఇక్కడ జీవుడిగా ఉన్నారు… ఆయన అక్కడ పరమాత్మగా ఆత్మ శరీరంతో ఉన్నారు… గమనించలేకపోయాను… నన్ను క్షమించండి
ఆజానుబాహుడు :- ఏముంది లేవయ్యా! ఆయనకి నాకు తేడా ఏమీ లేదు… ఆయనేమో ఆభరణాలతో అక్కడ కూర్చొని ఉన్నాడు. నేనేమో ఆభరణాలు లేకుండా తిరుగుతూ ఉంటాను …తేడా ఏముంది! తేడా ఏమీ లేదు! ఆత్మ ఒకటే …అది జీవాత్మ అయినా …పరమాత్మ అయినా …ఏదైనా ఒకటే. ఇక్కడ జీవుడికి, శివుడికి తేడా లేదు అని తెలుసుకోవడమే కదా సాధన అంటే… జీవుడువేరు శివుడు వేరు అని అనుకుంటేనే సమస్య వస్తుంది. మాయ వస్తుంది. ఆ తేడా అన్నది తీసేస్తే ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. ఆ ఉన్నది ఏంటి అని తెలుసుకునేసరికి సాధన అయిపోతుంది. ఆ ఉన్నది ఏదో…. ఉందో లేదో తెలియట్లేదు… అది అర్థం అవ్వట్లేదు. నేను అలాగే ఉన్నాను… నేను గాని నేను అయిన ఆయన అలాగే ఉన్నాడు.. ఏమవుతుందో చూడాలి… తెలుసుకోవాలి… మీలాంటి వాళ్ల కోసమే కదా నేను ఉన్నది… ఇలా నిష్కామ భక్తితోను, కోరిక లేకుండా… అవసరాలు లేకుండా….నాకు నాకై నేనే కావాలని కోరుకునే భక్తితో ఉన్నవాళ్లు చాలా అరుదుగా కనపడతారు. కొన్ని వేలమంది రోజు నాదర్శనానికి వస్తారు. అందరూ కూడా వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా… కోరికలు తీర్చుకొని నాకు లంచం కింద దానికి అనుగుణంగా ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. ఎవరిని ఏమీ అనలేం… వాళ్ళు ఆ కోరిక ఆనందం తీరిపోయాక నేనే కావాలి అనుకునే స్థితికి వస్తారేమో అని ఎదురుచూస్తూ ఉంటాను . వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు…. పోయేవాళ్ళు పోతూ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రం నీలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి రాక తప్పలేదు.. నేను ఆయన ఒకటే. నేను వేరు ఆయన వేరు అనుకుంటే… నువ్వు వేరు, నేను వేరు. ఒకటే అనుకుంటే ఒకటే…
అనేసరికి శివ నందిని కి అర్థం కాక
శివ నందిని:- స్వామి ! మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆ వెంకటేశ్వరస్వామి మీరు ఒకటే అని అంటున్నాను. వేరువేరుగా ఉన్నారని అనుకోవట్లేదు. మీకు శంకు చక్రాలు, ఆభరణాలు కిరీటం, మెడలో సాలిగ్రామాలు ఇవి ఏమీ లేవు…. కాకపోతే తులసి మాలలు, తామరమాలలు ఇవన్నీ కనపడుతున్నాయి…. పైగా పల్లభాటి కింద పసుపు వర్ణంతో పంచకట్టుతో కనపడుతున్నారు. మీ పాదాలను తాకుతుంటే సాక్షాత్తు అష్టదళ పద్మములో ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలు తాకినట్టుగా అనుభవ అనుభూతి కలుగుతుంది…
ఆజానుబాహుడు:- యద్భావం తద్భవతి! నాలో ఉన్న దైవత్వం చూస్తున్నావు… నేను నీలోని భక్తితత్వం చూస్తున్నాను.. ఎవరి భావాలకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కువ కాదు… ఎవరూ తక్కువ కాదు… కాకపోతే నీ సాధన పరిసమాప్తి కావటానికి సప్త చక్రాలు జాగృతికి కావలసిన హస్తముద్రలు వాటి విధివిధానాలు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క ముద్ర నీకు వివరించి చెబుతాను. ఆ ముద్రలు నువ్వు చేసుకుంటూ ఉండు… ఒక్కొక్క ముద్ర 15 నుంచి 20 నిమిషాల పాటు నువ్వు ప్రతిరోజు చేసుకోవాలి. అనగా సప్త చక్రాల జాగృతి కోసం సప్తముద్రలు నువ్వు పొందవలసి ఉంటుంది. కాకపోతే నీకు అర్హత, యోగ్యత ఉందా లేదా అనేది నేను నీకు పరీక్ష పెట్టాలి. ఇంద్రియ నిగ్రహం,మనోవిగ్రహం లేనప్పుడు…. మనసు స్థిరం లేనప్పుడు ఏకాగ్రత కోల్పోయినప్పుడు… మనసు అస్థిరమై చంచలమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి….దానికి తగ్గ పరీక్షల్లో నువ్వు ఉత్తీర్ణురాలివి అయితే…. నీవు సప్త చక్ర జాగృతి కావలసిన హస్త ముద్ర విధివిధానమును చెప్పడం జరుగుతుంది. గురువుగా ఉండి నీకు గురుబోధ చేస్తాను. కాకపోతే నీకు అర్హత ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మోక్ష సాధనకు వెళుతున్నప్పుడు ప్రకృతి పెట్టే మానసిక, శారీరక పరీక్షలు తట్టుకునే మనోధైర్యం మానసిక స్థితి, మనోనిగ్రహ స్థితి మీకు ఉండాలి.
శివ నందిని:- సరే స్వామి! నాకు ఎలాంటి పరీక్షలు పెట్టినా ఇబ్బంది లేదు.
ఆజానుబాహుడు:- సరే ఏం జరుగుతుందో చూద్దాం… ప్రకృతి ఏ పరీక్షలు పెడుతుందో చూద్దాము…
శివ నందిని:- మీరు కాకుండా ప్రకృతి ఎవరున్నారు?
ఆజానుబాహుడు :- నా అంశంలో ఉన్న మహాలక్ష్మి దేవి ప్రకృతి అంశయే కదా! స్త్రీ పరంగా అవిడే నీకు పరీక్షలు పెడుతుంది. నీకు అర్హత ఉందా లేదా అనేది ఆవిడే నిర్ధారణ చేయాలి . ఆవిడ ఏం పరీక్ష పెడుతుందో నాకు తెలీదు. ఆవిడ పరీక్షల్లో నువ్వు జయం పొందావు అన్న తర్వాతే…. ముద్రల యొక్క బోధన చేయాల్సి ఉంటుంది… అందుకు ఆవిడ నియమాలు పెట్టడం వలన నేను దానికి ఒప్పుకొని నీ దగ్గరికి రావడం జరిగింది…
శివ నందిని:- అంటే మీ ఆవిడ పేరు కూడా మహాలక్ష్మి ఆ?
ఆజానుబాహుడు:- అమ్మ! నువ్వు నన్ను వెంకన్న అనుకుంటావో… వెంకన్న భక్తుడని అనుకుంటావో ….అనేది నీ యొక్క సాధనా స్థితి బట్టే ఉంటుంది. నువ్వు ఎలా అనుకున్న నాకు సంబంధం లేదు. నాకు ఇబ్బంది లేదు. నేను ఎవరో అనేది పక్కన పెట్టు. నేను బోధించే బోధకు నీకు అర్హత ఉందా లేదా? అనేది మాత్రం నువ్వు ఆలోచించు. దానికి సంబంధించింది ఏంటంటే ….మహాలక్ష్మి దేవి పెట్టే యోగ్యత పరీక్షను నువ్వు కొద్దిగ తట్టుకొని దాటుకొని రావాల్సి ఉంటుంది. అది ఏం జరుగుతుంది….. ఎలా జరుగుతుంది…. అనేది ఇప్పుడున్న ఆవిడే నిర్ణయం చేయాలి…
శివ నందిని:- సరే స్వామి! ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
ఆజానుబాహుడు:- ధ్యానంలో కూర్చుందాం… ఏం జరుగుతుంది… ఎలా జరుగుతుంది అనేది… నేను కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాను. ఓ రుద్రయ్య! నీకు తెలియదంటూ ఏదీ లేదు. నీకు అన్నీ తెలుసు. కాకపోతే నువ్వు కూడా మౌనం వహించి….సాక్షి భూతంగా చూడు . ఆవిడను సాధనా విద్యార్థిని అనుకో! ఆవిడ సాధనకి నువ్వు సహాయ సహకారాలు అందించకు . ఆవిడ మనం ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ సాధన పరిసమాప్తి చేసుకునే మనో ధైర్యం ఆవిడకి ఉందా లేదా అని పరీక్ష పెడుతున్నారు . ఆ పరీక్షల్లో ఆవిడ జయం పొందుతుందో… లేదో… చూద్దాము . సాక్షిభూతంగా చూద్దాము… నేను చూస్తూ ఉంటాను…
రుద్ర స్వామి:- సరే స్వామి …మీ ఆజ్ఞ! నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎవరో నేనెవరో…
అని రుద్ర స్వామి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లిపోవడంతో…. ఈ మధ్యవయసులో ఉన్న ఆయన కూడా కళ్ళు మూసుకొని ధ్యానములోకి తను కూడా వెళ్ళాక…. చేసేదేమీ లేక ఆయన వంక చూస్తూ… సాక్షాత్తు వెంకన్న స్వామిని చూస్తున్న అనుభూతి పొందుతూ ఉండగా…సమయం ఎంత సేపు గడిచిపోయిందో కాలానికే తెలియలేదు.
అప్పుడు ఉన్నట్టుండి..
శివ నందిని ఆ మధ్యవయసులో వచ్చిన ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయింది …దివ్య తేజస్సుతో ఉన్నాడని… కళ్ళు చాలా అందంగా ఉన్నాయని ….శరీరం కాంతివంతంగా ఉన్నది అని దైవపురుషుడై ఉండాలని…. లేదా వెంకన్న స్వామి ఉపాసకుడు అయి ఉండాలి.. తన ఉపాసన బలం శక్తితో సాక్షాత్తు వెంకన్న స్వామిగా మారిపోయాడని…. ఇలా పలు విధాలుగా చూస్తూ మురిపెంగా వెంకటేశ్వర స్వామి నా ఎదురుగా ఉన్నాడు అని…..నాతో ఉన్నాడు అని నిజరూపంగా, నిజస్వరూపంగా ఉన్నాడు అని మనసు పరి విధాలా కోరుకుంటూ…… ఆలోచనలు చేస్తూ….. ఆనందపడుతూ…. సంతోషపడుతున్న వేళ ఉన్నట్టుండి శివాని నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? ఇక్కడికి వచ్చావు ఏంటి? కాశీ వెళ్లావు అన్నారు కదా! నువ్వేంటి తిరుపతిలో ఉన్నావు…. అని మగ గొంతు వినేసరికి… ఈ లోకానికి వచ్చి చూస్తే…. అక్కడ తన మాజీ భర్త కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. ఈయన ఏంటి? ఇక్కడ ఉన్నాడేంటి? అనేసరికి …..వాళ్ళ అత్తమామలు, పిల్లలు కూడా మెట్ల మార్గంలోనే తిరుపతి దర్శనానికి ఆరోజు వచ్చారని ఈయన ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయింది. పిల్లలు ముగ్గురు కూడా గబగబా అమ్మ బాగున్నావా? చాలా రోజులు అయ్యింది ….సంవత్సరం అవుతుంది నిన్ను చూసి…. అని అనేసరికి ముగ్గురు కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేసరికి…. ఈమె పట్టిపట్టనట్టుగా వచ్చినందుకు ఆనందపడలేదు… బాధపడలేదు… ఏదో మాట్లాడాలి అని ముక్తసరిగా సమాధానాలు ఇచ్చింది. కానీ వాళ్ల క్షేమమాచారాలు ఏవి ఈ అమ్మాయి అడగలేదు. కేవలం వాళ్ళు చెబుతున్న వివరాలు వింటూ… ముక్తసరిగా సమాధానాలు చెబుతూ ఉండేసరికి…. భర్తకి కోపం వచ్చి ఏంటి ? మనం విడాకులు తీసుకొని విడిపోయినంత మాత్రాన పిల్లలకి తల్లి ప్రేమ దూరం చేస్తావా? ఆ కోర్టు ఆదేశం ప్రకారం నెలలో ఒకసారి రావాలి… చూడాలి… పిల్లల్ని చూసుకోవచ్చు అని చెప్పారు కదా! పిల్లలు నీ దగ్గరికి వచ్చే ఇది ఉంది. లేదా పిల్లల దగ్గరికి నువ్వు రావచ్చు కదా! పిల్లల చదువులు పాడైపోతాయని నేను పంపించలేదు. నేనేమన్నా తప్పు చేశానా? పిల్లలకి తల్లి ప్రేమ ఎందుకు దూరం చేస్తావు? అయినా నాకు నిన్ననే వివాహం అయ్యింది… అదిగో కొత్త ఆవిడ అని చెప్పేసి ఒక ఆవిడని చూపించి…. ఈవిడ పేరు సుభద్రా దేవి. మేము ఇద్దరం వెళ్లి పెళ్లి చేసుకున్నాం… ఆవిడకు కూడా భర్త లేడు. భర్త చనిపోయాడు…ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసరికి…. అవునా? మంచిది అని అంది. ఆవిడతో అయినా సఖ్యతగా ఉండండి…. అనేసరికి అత్తమామలు కూడా వచ్చి ఏంటి తల్లి! చాలా చిక్కిపోయావు.. చాలా ఇది అయిపోయావు… కళావిహీనం అయిపోయావు… ముఖంలో జీవకల లేదు. అసలు మేము వచ్చామని పిల్లల్ని చూసిన ఆనందం, సంతోషం కూడా నీ ముఖంలో కనిపించట్లేదు. మేము అంత కానీ వాళ్ళం అయిపోయామా ? అయినా విడాకులు తీసుకున్నంత మాత్రాన పిల్లలకి తల్లి ప్రేమ అందించకుండా దూరంగా ఉంచాలని ఎవరు అన్నారు? వాళ్ళు నీకోసం కలవరిస్తున్నారు…. ఏడుస్తున్నారు…. వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థితికి వచ్చినా కూడా నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. నువ్వు అందించలేకపోతున్నావు…. నువ్వు కాశీ వెళ్లి సన్యాస దీక్ష తీసుకున్నావని మీ వాళ్ళు చెప్పారు. నీ నంబరు మాకు ఇవ్వలేదు. నువ్వు కాశీలో ఎక్కడ ఉంటావని ఎంక్వయిరీ చేయద్దామని మావాడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు అయినప్పటికీ….అడ్రస్ ఇవ్వలేదు. ఫలానా రోజు ఫలానా ఘాట్లో ఉన్నావని…. ఇంకొక రోజు ఫలానా ఘాట్ లో ఉన్నావని రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదని ఇంక మేము వదిలేశాము. సంవత్సరం అయింది తల్లి,... ఎలా ఉన్నావు? అని మామగారు పలకరించేసరికి బానే ఉన్నాను…! అని ఆయనకు మాత్రం సమాధానం చెప్పింది. ఆయన ఎలా ఉన్నాడు? అత్తగారు ఎలా ఉన్నారు అనేది కూడా అడగలేదు. కానీ అన్నీ కూడా ముక్తసరిగా సమాధానం చెబుతూ ఉండేసరికి…. సరే జరిగిందేదో జరిగిపోయింది…. నువ్వు నాతో వస్తావా? పిల్లలకి తల్లిగా ఉండు…. నాకు భార్యగా ఉండాల్సిన అవసరం లేదు….నువ్వు వేరే ఇంట్లో ఉండు… నీకు కావాల్సినవి అన్నీ నేను ఏర్పాట్లు చేస్తాను… ధ్యానాలు సాధనలు కావాలంటే చేసుకో! సన్యాస దీక్షలో ఉన్నా ….నాకేమీ అభ్యంతరం లేదు. పిల్లలకు మాత్రం తల్లిగా ఉండు. నీ దగ్గరికి నేను రాను అనేసరికి….. వద్దు! నాకు మీతో పిల్లలతో ఋణానుబంధం తీరిపోయింది….వాళ్ళు నా పిల్లలు కాదు… మీ పిల్లలు… మీ వల్లనే నాకు పిల్లలు పుట్టారు. వాళ్ళు మీ వారసులు అవుతారు కానీ నా వారసులు కారు. ఇక కాలానుగుణంగా జరగాల్సింది జరిగిపోయింది…. ఋణానుబంధం తీరిపోయింది…ఇక ఎవరి గురించి నాకు ఇంక ఆలోచన లేదు ….అనేసరికి అయినా నీకు ఆస్తిలో సగం వాటా ఇవ్వాలనుకుంటున్నాను… దానికి నీ సంతకాలు కావాలి ….అనేసరికి నాకేమీ ఆస్తులు వద్దు ….అవసరం లేదు…. అది పిల్లల పేరు మీద చేసుకోండి… మీ పిల్లల బాగోగులు చూసుకోండి పిల్లలకి చదువులు చెప్పించడం అయ్యింది.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు చేయండి… వీలైతే గవర్నమెంట్ ఉద్యోగాలలో స్థిరపడేటట్లు చేయండి….ప్రైవేటు ఉద్యోగాల కన్నా ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడితే జీవితం బాగుంటుంది. జీతం తక్కువైనా వాళ్ళ జీవితంలో గ్యారెంటీ ఉంటుంది. నమ్మకం ఉంటుంది. ప్రైవేటు సంస్థలకు జీతం ఎక్కువైనా కానీ సుఖం ఉండదు. ప్రశాంతత ఉండదు…. అని చెప్పి అంటూ పిల్లలకేసి అలా తేరిపార చూసి జాగ్రత్తగా ఉండండి… ఆరోగ్యాన్ని కాపాడుకోండి…. తప్పుడు పనులు చేయకండి… ధర్మంగా ఉండండి.. ధర్మసాధన చేసుకోండి అనేసరికి అదేంటి! 100 కోట్లు ఆస్తులు వదులుకుంటానంటావేంటి? అనేసరికి నేను ఆస్తుల గురించి నేను విడిపోలేదు… విడాకులు తీసుకోలేదు…. భరణం కింద 100 కోట్లు ఆస్తులు ఇస్తారని నేను విడాకులు తీసుకోలేదు కదా! భర్త నుంచి నాకు కావలసిన ప్రేమ దొరకకపోయేసరికి పర స్త్రీల యందు ఆయన ప్రేమను చూసుకోవడం చేశాడు. నాలో…. నా ప్రేమలో ఎలాంటి లోపం చూపించలేదని ఆయన మనసుకు తెలుసు…. కావాలంటే ఆయన మనసు నిగ్రహించుకోలేక ఆయన కోరికలకు తగ్గట్టుగా పర స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. మీకు చెప్పాను… మా పుట్టింటి వాళ్లకు చెప్పాను ….ఎవరు పట్టించుకోలేదు…. 16 సంవత్సరాలు పంటికింద బాధను భరిస్తూ వచ్చాను… కానీ అనుకోని విధంగా నా మనసుకి ఇక బాధ వేసి విడిపోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాలో తప్పు ఉంటే….. మీవాడిలో తప్పు లేకపోతే విడాకులు రావు కదా! విడాకులు ఇచ్చారంటే మీ వాడిలో తప్పు ఉన్నట్టే కదా! ఆయన నుంచి స్వేచ్ఛను పొందే స్థితి కోర్టు వారు ఇచ్చారు అని అంటే మానసికక్షోభ నుంచి నాకు విముక్తి కలిగించినట్టే కదా! అని అనేసరికి….. జరిగిందేదో జరిగిపోయింది …..వచ్చి నీ పూజలు పునస్కారాలు చేసుకో! నీ పాటికి నువ్వు ఉండు…. పిల్లలకు తల్లిగా ఇప్పుడు పీటల మీద నువ్వే కూర్చోవాలి…. పెళ్లిళ్లు చేయాలి …..ఆ బాధ్యత నీకు ఉంది కదా! అని అంటే ఇప్పుడు ఎవరో కొత్తావిడ వచ్చింది కాబట్టి ఆవిడ చూసుకుంటుంది….నా పిల్లలైనా ఆయన పిల్లలే కదా! ఆయన నుంచే కదా నాకు వచ్చారు…. ఆయన పిల్లలని ఆ కొత్త ఆవిడ చూసుకుంటుంది. నేను చేయాల్సిన అవసరం లేదు… అయినా నేను సన్యాస తీసుకున్నాను…. సన్యాస దీక్ష తీసుకున్నాను అంటే ఇక భోగ జీవితం లేదు అన్నట్టే…. ఇక భోగంలో ఎవరూ లేనట్టే కదా! భర్త లేడు…. పిల్లలు లేరు… సంతానం లేరు అన్నట్టే…..ఇక భోగంలో ఎవరూ లేనట్టే! ఇక వాళ్ల గురించి నేను ఆలోచించ దలచుకోవట్లేదు. ఆ ఆస్తిలో నేను లేను…..నాకు భోగం కన్నా యోగం కావాలి…. యోగ సాధనలో వెళ్లాలనుకుంటున్నాను…. అందుకనే సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది…. అనేసరికి నీకు ఇప్పుడు డబ్బులు విలువ తెలియట్లేదు…. యోగంలో ఉన్నా కూడా స్థిరమైన సంపాదన లేకపోతే అడుక్కొని తింటూ బతుకుతావు …భిక్షాటన చేస్తూ బతుకుతావా? ఆకలి కడుపుతో సాధన చేస్తావా? ఆకలి తీరిన తర్వాతే సాధన చేయడానికి మనసు సహకరిస్తుంది….. దానికి తగ్గట్టుగా సంపాదన కావాలి కదా! 100 కోట్లు తీసుకుంటే ఏమైపోతుంది….అంటే అది 100 కోట్లయినా….పరుల సొమ్ము అది …. నాకంటూ ఒక రూపాయి కష్టార్జితం ఉన్నది… దాన్నుంచి వచ్చేది వస్తుంది. మీరు 100 కోట్లు ఇచ్చినా ….వంద రూపాయలు ఇచ్చినా… అది నాకు 100 పైసలు ఇచ్చినా…. అది నాకు ఒక్క రూపాయితోనే సమానం. నాది కాని సొమ్ము కోటి రూపాయలైనా నాకు అనవసరం…. నాదైన సొమ్ము ఒక రూపాయి అయినా వదిలిపెట్టను అని మీకు తెలుసు కదా! నువ్వు మొండి దానివి… మూర్ఖురాలివి…. ఎవరైనా 100 కోట్లు వదులుకుంటాడా! లాయర్ తో మాట్లాడిస్తాను…. నువ్వెక్కడున్నావో చెప్పు…. మీ అడ్రస్ చెప్పు…. నీ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అనేసరికి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి… మీ కష్టార్జితం మీ ఇష్టం.. నాకు అవసరం లేదు… మొత్తం ఆస్తి ఇచ్చినా… నేను ఆశించను. పట్టించుకోను…. అనేసరికి నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి… అందరూ ఉన్న మానసిక అనాధవి. మానసిక రోగివి. నీకేం జరుగుతుందో ఏంటో కూడా పట్టించుకోవట్లేదు… ఎవరైనా 100 కోట్లు వదులుకుంటాడా? సగం ఆస్తి నీకు ఇచ్చేస్తాను… సర్వ అధికారాలు ఇచ్చేస్తాను… కేవలం పిల్లల బాధ్యతలే కదా! చూసుకోవాల్సింది అయినా పిల్లలు చిన్న పిల్లలు కాదు కదా! ఎదిగారు కదా ….ఉద్యోగాల స్థితికి వచ్చారు కదా….. నీకు ఏమైంది అక్కడికి వచ్చి పిల్లల బాగోగులు చూసి ,పెళ్లిళ్లు చేసి మనవడు మనుమరాల్లో పుట్టిన తర్వాత ఈ సన్యాసం కావాలంటే తీసుకోవచ్చు…నీకు కావాల్సినట్టు నువ్వు ఉండు…. నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా! రానని చెబుతున్నాను కదా! నీ సొంత ఇంట్లో నీకు కావాల్సినట్టుగా నువ్వు ఉండొచ్చు. కారు, బంగళ సర్వ సుఖాలు ఏర్పాట్లు చేస్తాను…. నువ్వు నీ పిల్లలు అందులో ఉండొచ్చు…. నేనేమీ ఇబ్బంది పెట్టను.. నెలకొకసారి పిల్లల్ని చూడటానికి వస్తాను…. ఎందుకు కాదంటావు అది అని అది ఇది అనేసరికి…. ఏదైనా కాదు అనుకుని వచ్చేసాను… విడిపోయి విడాకులు తీసుకోవడం జరిగింది… యోగంలోకి వచ్చేసాను… సన్యాస దీక్ష తీసుకున్నాను… నాకంటూ భోగ జీవితంలో ఎవరూ లేరు… అందరూ చనిపోయారు….మానసికంగా, శారీరకంగా నాకు మనసులో ముద్ర పడింది. నాకు ఎవరూ లేరని… ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎవరు అంటే ఆదిదంపతులు… శివపార్వతులే అవుతారు. నా పిల్లలు ఎవరు అంటే బాల గణపతి, బాల కుమారస్వామి అని చెబుతాను . అంతకుమించి ఏమీ లేదు….దైవ కుమారులు, దైవ దంపతులే నాకు తల్లిదండ్రులు …పిల్లలు. అంతేకానీ నీవల్ల పుట్టిన వాళ్ళు…. భోగ జీవితానికి సంబంధించిన వాళ్ళు ఎవరు నాకు తల్లిదండ్రులు కాదు… పిల్లలు కాదు . నువ్వు నాకు భర్త వి కాదు అని కరాకండిగా చెప్పేసరికి…. ఏమనాలో… ఏమి మాట్లాడాలో …ఎలా మాట్లాడాలో… అర్థం కాక కొట్టే పరిస్థితి వచ్చినా కూడా…. తన మనసులో మార్పు రాకపోయేసరికి అందరూ కూడా మౌనంగా వెళ్ళిపోయారు . అమ్మ నీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు …నీ అడ్రస్ చెప్పు …మేము వస్తాము అనేసరికి రావద్దు …మీరు పెళ్లిళ్లు చేసుకోండి… మంచి వాళ్ళని ఎంచుకోండి….పిల్లల్ని కని సమాజానికి తోడ్పడండి… ఏదో కొంత సాధన చేసుకుంటూ ఉండండి. రోజు దైవ మంత్రం దైవధ్యానం మీకు నచ్చిన విగ్రహారాధన ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. ఇంతకుమించి నేను చెప్పేదేమీ లేదు ఏదైనా కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మయుతమైన జీవితం గడపండి. పర స్త్రీ పరపురుషుడి వైపు మీరు వెళ్ళకండి. వివాహం అయిన వాళ్లతోనే ఉండండి….గడప దాటకండి….తప్పుడు పనులు చేయకండి… అని చెప్పేసరికి అయితే ఇక నువ్వు మాతో ఉండవా? అని పిల్లలు ఆప్యాయంగా అడిగేసరికి …నేను ఉండను… ఉండలేను తల్లి! ఇక నా ప్రేమ నీకు ఉండొచ్చు…ఉండకపోవచ్చు… ఇక నా దర్శనం కూడా మీకు కలగొచ్చు… కలగకపోవచ్చు. నేను రాబోయే కాలంలో మరణమే పొందొచ్చు… ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు ….అనేసరికి ఇక ముగ్గురు కూడా శివ నందిని పాదాల మీద పడి నమస్కారం చేసుకుని మమ్మల్ని ఉన్నత స్థితికి వెళ్లే విధంగా దీవించు అని …కౌగిలించుకొని వాళ్ళు కన్నీరు పెట్టి ఏడుస్తున్నప్పటికీ కూడా శివ నందిని కంటి నుంచి ఒక్క బొట్టు కూడా రాలేదు. అలాగే వీళ్ళ అత్తమామల ప్రేమ, ఆప్యాయతలు, కోపావేశాలు, ఆవేదన చూసినా కూడా మనసు చలించలేదు. సరే అని ఇంక జీవితంలో మేము మీకు కనిపించనము…. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు… అని భర్తకోపావేశాలతో ముందుకు వెళ్లిపోవడంతో ….అత్తమామలు కూడా రండిరా! ఇక మీ అమ్మ లేనట్టే ….మీ అమ్మ చనిపోయింది… ఇక మీ అమ్మ గురించి మీరేమీ ఆలోచించవద్దు…. అంటే పిల్లల ముగ్గురు కూడా కడసారిగా ఆప్యాయంగా…. ఓర చూపుతో కన్నీటితో వీడ్కోలు పలికారు. దానితో ఈ శివ నందిని కూడా ఏం చలించకుండా….బండరాయిలాగా తనలో నిజంగానే ప్రేమ చచ్చిపోయిందా? పిల్లలు అంటే మోహావేశాలు పోయాయా? మమకారం లేదా అని అనుకుంటూ ఉన్నా కూడా…..తనకు ఎలాంటి అనుభవ అనుభూతి రాకపోయేసరికి… మనసు బండరాయిగా మారిపోయింది అనుకొని ….సరే గతం గతః అనుకోని ఈయన్ని చూసేసరికి ఈ మధ్య వయసులో ఉన్న వెంకన్న మూర్తి కనపడ పోయేసరికి ఆందోళన చెందింది. ఆవేదన పడింది. ఏమైందని అనుకుంది…. సరే కానీ! వచ్చేవాళ్ళు వస్తారు…. మనం ఏం చేస్తాం…. ఎలా వచ్చాడో అలా అంతర్దానం అయిపోయి ఉంటాడు . మహాలక్ష్మి ఏదో పరీక్ష పెట్టాలని చెప్పారు కదా! ఒక పరీక్ష జరిగిన తర్వాత వస్తాడేమో…. ఆ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలిని అవ్వాలి కదా! సరే ఆవిడ ఏం పరీక్ష పెడుతుందో… సరే కానీ ఎవరు ఎంతకాలం ఉంటారో….ఎవరు ఎప్పుడు కనపడతారో…. ఎప్పుడు పోతారో మనకేం తెలుసు. పోయిన వాళ్ల గురించి మనం ఆలోచించకూడదు… ఉన్న వాళ్ల గురించి మనం ఆలోచించాలి అని చెప్పేసి అనుకొని తిరిగి భర్త, పిల్లలు, అత్తమామల వైపు ఆఖరిసారి కడసారిగా కూడా చూడకుండా ….తిరిగి యధావిధిగా ధ్యానంలో కూర్చుంది. కొంతసేపు అయిన తర్వాత ఆయన సతీమణి పిలుపు వినపడే సరికి కళ్ళు తెరిచి చూసింది.
ఆజానుబాహుడు:- వెంకన్న రూప దారి కనిపించి….మా ఆవిడ పెట్టిన నిగ్రహ పరీక్షలో నిలబడ్డావు..జయం పొందావు…
శివ నందిని:-నాకు అర్థం కాలేదు స్వామి !
ఆజానుబాహుడు:- నీ జన్మ భర్త నువ్వు విడిపోయిన భర్తను పిల్లల్ని తీసుకువచ్చి చూపించింది. నువ్వేమన్నా స్పందిస్తావేమోనని …..వెనక్కి తిరిగి వెళ్ళిపోతావేమోనని….. ఆ వంద కోట్లు ఆస్తులకి వెళ్లిపోతారేమో…. అని బంధాలు బంధనాల గురించి ఆలోచిస్తావేమో ….అని చెప్పేసి ఆశపెట్టింది. కానీ నువ్వు వాటిని పట్టించుకోలేదు. వాళ్ళ దృష్టిలో నువ్వు చనిపోయినట్టుగా… నీ దృష్టిలో వాళ్ళు చనిపోయినట్టుగా చేశావు. నీ మనోధైర్యానికి మానసిక స్థితికి మా ఆవిడ సంతృప్తి పొందింది. నిన్ను కలవడానికి వచ్చింది….
శివ నందిని:- సరే అమ్మ నీ పరీక్షలో నేను జయం పొందాను అని అంటున్నావు కాబట్టి ….మీ వారి చేత మోక్ష సాధనకు ఉపయోగపడే సప్త చక్రాల జాగృతికి కావలసిన ముద్రలను గురుబోధగా పొందే అర్హత నాకు వచ్చినట్లే కదా!
మహాలక్ష్మి :- వచ్చినట్టే తల్లి ! నీకు మానసికస్థైర్యం ఉందా ? లేదా అని పరీక్షించాను. ఎందుకంటే సాధనలో రెండే రెండు ఆటంకాలు వస్తాయి…. ఈ కామ వికారాలు లేదా ధన అహంకారాలు కలుగుతాయి. , కామ వికారాలు అంటే…. భర్త వల్ల కానీ పరపురుషుల వల్ల కానీ కలుగుతుంది. భర్త వల్ల నీకు కామ వికారాలు కలగలేదు. అలాగే పరపురుషుడైన నా భర్త మీద మోహావేశాలు కలిగినప్పటికీ… నీలో కామ స్పందనలు కలగలేదు. ఉద్రేకాలు కలగలేదు. ఆయన మోహంలో పడ్డావు కానీ ….ఆయన గురించి చెడుగా భావన ఒక క్షణం పాటు కూడా ఆలోచించలేదు. అదే శివ స్వామి గురించి నువ్వు పలు రకాలుగా భావనలు చేశావు ….
శివ నందిని:-అమ్మ !నిజంగా చెప్పాలి అంటే… నాలో కామోద్రేకాలు… కామ వాంఛలు ఆయన చేసిన బోధతోనే తీరిపోయింది… ఎప్పుడైతే నాలో నగ్నత్వం గురించి ఆలోచన తీసేసి దిగంబరతత్వం గురించి నాకు బోధన చేశారో…..ఆ బోధనతో నాకు స్త్రీ పురుష భేదం లేకుండా పోయింది… ఉన్నది ఒక్కటే బ్రహ్మ పదార్థం . అనే జ్ఞాన స్థితికి రావడం జరిగింది. వారిలో పురుషతత్వం చూసినట్లయితే….నగ్నత్వం కానీ చూసినట్లయితే…. మీరు అనుకున్నట్లు కామంలో పడిపోయేదాన్ని. కామ వాంఛలో పడిపోయేదాన్ని. .కామ కోరికలో మాయలో పడిపోయేదాన్ని . దిగంబరతత్వంలో చూడడంతో పురుషుడు, స్త్రీ అర్థం కాని ఏకత్వ స్థితిని చూడడం జరిగింది. కానీ ఆయన పురుషుడు , నేను స్త్రీ అనే భావన భేదభావం ద్వంద ప్రవృత్తి నుండి ఏక ప్రవృత్తికి వచ్చేసాను. బ్రహ్మ పదార్థం ఉన్నది. బ్రహ్మం వేరు, పదార్థం వేరు అని అనుకోలేము కదా! అదే బ్రహ్మ పదార్థం అంటే ఏకపదార్థమే కదా! ఏకత్వస్థితికి స్థితియే కదా! ఇప్పుడు నాకు స్త్రీ,పురుష అనే భేదభావం లేదు. ఉన్నది ఒక్కటే. అది అర్ధనారీశ్వర తత్వం అనుకోవచ్చు .
ఆజానుబాహుడు:- మంచిది తల్లి !నీ సాధనకి అర్హత, యోగ్యత, యోగం సంప్రాప్తించింది. అలాగే ధన మాయలో పడతావేమో అని చెప్పేసి సగం ఆస్తి నీకు వంద కోట్లు ఇస్తామని వచ్చినా కూడా అది చిల్లిగవ్వతో సమానం అని ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. వెనక్కి తిరిగి వెళ్లకుండా ఉన్నావు కదా! ఆ స్థితి అవసరమవుతుంది సాధనకి . రెండే రెండు అవరోధాలు ఉంటాయి. ఒకటి కామము, రెండు ధనము. ఈ రెండిటిని దాటుకోగలిగిన వాడికి మోక్ష సాధనకి అర్హత ,యోగ్యత, యోగం పొందడం జరుగుతుంది. ఈ మాట నేను చెప్పడమే కాదు రామకృష్ణ పరమహంస లాంటి యోగులు కూడా చెప్పారు కదా! తన కాంతా మాయను, ధన మాయను సాధకులు దాటవలకి వస్తుంది అని చెప్పడం జరిగింది కదా! నువ్వు దాటతావా లేదా అని చెప్పేసి మీ భర్త ద్వారానో ….. నీ భర్త యొక్క ఆస్తి ద్వారా నీకు మానసికంగా ,శారీరకంగా పరీక్ష పెట్టడం జరిగింది. నీ పిల్లలు, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉన్నావో వెళ్లేటప్పుడు అలాగే ఉన్నావు. స్థిరమైన స్థిరబుద్ధితో ఉన్నావు. పిల్లల యొక్క ప్రేమ, ఆప్యాయతలకు నువ్వు లొంగలేదు. నీ భర్త యొక్క ధన, ఆశకి, కోపావేశాలకి నువ్వు స్పందించలేదు. అలా సౌమ్యంగానే సమాధానం చెప్పావు. కోపంగానూ సమాధానం చెప్పలేదు. ఎక్కడ దిక్కరించలేదు….ఎక్కడ అహంకరించలేదు…. అది నాకు బాగా నచ్చింది….అనేసరికి
శివనందిని:- సరే తల్లి ! జరిగింది ఏదో జరిగిపోయింది….అంతా మంచికే ఇది కూడా పరీక్ష అని ఇప్పుడే తెలిసింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలిని అయినందుకు….నా మోక్ష సాధనకు అర్హత వచ్చినందుకు…. నేను సంతోషపడుతున్నాను. అలా అని ఆనందపడట్లేదు…. బాధపడట్లేదు… నా జాగృతిలో నేను ఉన్నాను…నా ఎరుకలో నేను ఉన్నాను.. అని నేను గ్రహించాను.
ఆజానుబాహుడు:- సరే తల్లి ! నీకు ఇంకా హస్తముద్రల గురించి చెప్పడం మొదలు పెడతాను….
శివ నందిని:- సరే స్వామి! మీ ఇష్టం
అనేసరికి ఆయన చెప్పడం ప్రారంభించారు.
వెంకన్న స్వామి లాగా ఉన్న ఆయన పేరు నిజానికి గోపాలస్వామి అని…. తనకి తాను పరిచయం చేసుకొని…
గోపాలస్వామి:- నేను వెంకటేశ్వర స్వామి ఉపాసకుడిని . అందువల్ల నేను చూడడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాను. నా సప్త చక్రాలను కూడా యోగసాధనలో ముద్ర విధివిధానంతో జాగృతి చేసుకున్నాను. తద్వారా నాకు పంచభూతాలు ,కాలం కూడా ఆధీనం అయినాయి. ఇలాంటి ముద్ర సాధన అంతా కూడా గురువుల సమక్షంలో నేర్చుకుంటే చాలా మంచిది. ఎలా పడితే అలాగా ఆ పుస్తకాల గ్రంథాలలో ……ఇంటర్నెట్ లో దొరికిన వాటిని చూస్తూ చేస్తే
..ఉపయోగాలకు బదులు పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి వాయు ముద్రకి జ్ఞాన ముద్రకి చిన్న తేడా ఉంటుంది.. జ్ఞాన ముద్రలో చూపుడువేలు బొటనవేలు కొనను కలపాలి అలాగే వాయు ముద్రలో బొటనవేలు కింద చూపుడు పెట్టవలసి ఉంటుంది. ఇది పుస్తక గ్రంథంలో మనకి చెప్పినప్పటికీ….అనుభవంలోకి వచ్చేసరికి తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని తేలిగ్గా తీసుకొని ఎలా పడితే అలాకాకుండా…. అనుభవం పొందిన గురువుల సమక్షంలో చెయ్యకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఒక నరంలోకి ప్రవేశించాల్సిన శక్తి మరో నరంలోకి ప్రవేశించి తీవ్రమైన అనారోగ్య సమస్యలు పొందవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే సొంతంగా చేతి ముద్రలు జాగృతి చేయడం కానీ… అభ్యాసం చేయడం కానీ చేయరాదు. గురువుల సమక్షంలో సుమారుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు శిక్షణ తీసుకొని పరిపూర్ణంగా మీకు వచ్చింది అన్న తర్వాతనే…. ఎవరికి వారే వ్యక్తిగతంగా చేతికి ముద్రల సాధన చేయవలసి ఉంటుంది. తర్వాత కుండలినీ శక్తి జాగ్రతి చేసుకొని….సప్తచక్రాలు జాగృతి చేసుకోవచ్చు.. అది ఆ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ….
శివ నందిని:- అలాగే స్వామి! మీ సమక్షంలో ఈ సప్త చక్రాల ముద్రలు జాగృతి చేసుకుంటాను . మీరు వాటి యొక్క మెలకువలు చెప్పండి.. నేను నేర్చుకుంటాను… నేను చేసే ముద్రలలో ఏమైనా లోపాలు ఉంటే… తప్పులు ఉంటే….సరి చేయండి.
గోపాలస్వామి:- సరేనమ్మా !జాగ్రత్తగా విని నేర్చుకో…చూసి తెలుసుకో… నేను చేసినట్టుగానే నువ్వు కూడా చేసుకో….
అని చేతి ముద్రలు ఎలా చేయాలి అని ప్రారంభిస్తున్న సమయంలో…. ఒక మగగొంతు వినబడి స్వామి! ఆగండి స్వామీ! గోపాలస్వామి… ఆగండి! అర్హత ఉన్న వాళ్లకే యోగ సాధన నేర్పించాలి. ఆ పిల్లకి ఏ అర్హత ఉందని చెబుతున్నారు?ఇప్పుడు సప్త చక్రాలలో శక్తి జాగృతి చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఆమె తన శక్తిని లోక వినాశనానికి ఉపయోగిస్తుందో… లేక లోక కళ్యాణార్థం ఉపయోగిస్తుందో….ఎవరికి ఎరుక. ఇది ఏదో తను వ్యక్తిగత మోక్షమును పొందాలనుకుంట…. స్త్రీ ప్రకృతికి మోక్షం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని నా దృష్టికి వచ్చింది అంటూ ఉండేసరికి….ఎవరు అని వీళ్ళ ముగ్గురు అంటే శివ నందిని, గోపాలస్వామి, రుద్ర స్వామి తలతిప్పి చూసేసరికి…. కృష్ణస్వామి మరియు యోగాంబిక ఇద్దరూ కనపడ్డారు. రుద్ర స్వామి మనసులో అరే! ఈయనకి మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది. ఈ కృష్ణ స్వామి, యోగాంబిక వదిలిపెట్టరా! తమ మాయని చూపిస్తూనే ఉంటారా! శివ నందిని మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటారా! ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు? సరిగ్గా చేతి ముద్రలు అభ్యాసం ఆరంభించే సమయానికి…. అవాంతరాలు, ఆటంకాలు సృష్టిస్తారా ఏమిటి? అని అనుకుంటూ ఉండేసరికి…. గోపాలస్వామి వెంటనే కృష్ణస్వామిని గుర్తుపట్టి…
గోపాల స్వామి:- అయ్యో కృష్ణ స్వామి! ఏంటి నువ్వు ఇలా వచ్చావు ఏంటి? వీళ్ళు నీకు ముందే తెలుసా!
కృష్ణ స్వామి:- నాకు కాశీ క్షేత్రంలోనే తెలుసు. వీళ్ళని నేను అనుసరించి వస్తున్నాను….
గోపాల స్వామి:- వీళ్ళు లోక హితంగానే సాధన చేసేటట్టు అనిపిస్తున్నారు .నిస్వార్ధంగా, నిష్కామ కర్మతో, ధర్మగుణంతో సాధన చేసే వాళ్ళలాగా కనపడుతున్నారు. మరి నీ కంటికి ఎందుకు ఇలా వ్యతిరేక భావంగా ఉన్నావు. చెడుగా ఆలోచిస్తున్నావు.
కృష్ణ స్వామి:- ఎవరికి తెలుసు స్వామి! ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో …..ఎవరి సాధన దేనికి ఉపయోగిస్తారో …..ఎవరికి ఎరుక! మనసును బట్టి ఉంటుంది కదా సాధన ! వీళ్ళ మనసు నిస్వార్థం కోరుకుని ఉంటే పర్వాలేదు… వీళ్ళ మనసులో స్వార్ధపూరితమైన కోరిక ఉందనుకోండి…. పంచభూతాలు, కాలమును, విశ్వాధినేత పదవిని పొందాలని ప్రయత్నిస్తే ….వీళ్ళ స్వార్థానికి మనమంతా బలి అవ్వాల్సిందే కదా! ఈ విధంగానే కదా దేవతల నుంచి రాక్షసులు పుట్టింది…. రాక్షసుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము అనేది మీకు తెలియంది కాదు కదా! దైవ ఉపాసకులు మీకు తెలియంది కాదు కదా! విషయం అంతా తెలుసు…. ఎవరు ఎలాంటి వాళ్ళో ఎలా చెప్పగలము? ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేము కదా! పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల తోనే పోతుంది అంటారు కదా! ఈమెను నేను నమ్మలేను. ఈమె సాధన ఎటు తిరుగుతుందో…. ఇప్పుడు మోక్షం పొందాలి అనుకుంటే మోక్షం పొందవచ్చును. కానీ స్త్రీ మోక్షం పొందాలి… స్త్రీ ప్రకృతికి నాశనం చేయాలి అని ప్రయత్నం చేయడం ఏమిటి? గతంలో పరమహంస అని ఇలాగే చేసి వ్యక్తిగత మోక్షం పొందకుండా పురుష ప్రకృతికి మోక్షం ఇవ్వాలి. విశ్వానికి మోక్షం ఇవ్వాలి అని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అతని ప్రయత్నానికి నేను ఆటంకాలు కలిగించాను. అవాంతరాలు కలిగించాను. అయినా కానీ ఆయన దాటుకుని వచ్చారు. కాకపోతే గుడ్డిలో మెల్లగా విశ్వ మోక్షం మోక్షం కాస్త…. పురుష వ్యక్తిగత మోక్షం అయింది…ఇప్పుడు అదే దారిలో ఈ పిల్ల కూడా సాధన చేస్తుంది. ఆయనకి ప్రియ శిష్యురాలు అవ్వాలనుకుంటుందేమో! ఈమె కూడా ఇప్పుడు తన మోక్షం తాను పొందకుండా…. స్త్రీ ప్రకృతి వ్యక్తిగత మోక్షం పొందాలని చెప్పి అనుకుంటుంది . స్త్రీ ప్రకృతికి మోక్షం ఇచ్చే అంత సాధన స్థితి ఉందా? తన మోక్షం గురించి ఆలోచించకుండా ….విశ్వమోక్షం గురించి ఆలోచించాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వస్తుంది?ఆ సంకల్పం ఎందుకు పెట్టుకున్నారు? ఆ కోరిక ఎందుకు పెట్టుకున్నారు ?వీళ్ళ చావు వీళ్ళు చావచ్చు కదా! విశ్వం ఎందుకు చావాలి….విశ్వంలో ఉన్న వాళ్ళందరూ మోక్షం పొందాలి అని వీళ్లంతా ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు… ఆ పరమహంస, ఆయన కూడా అలాగే చేసుకుంటూ వెళ్లిపోయాడు … విశ్వం నాశనం చేయాలి అని…. విశ్వ ప్రయత్నాలు ఆయన చేశాడు. సగం వరకు జయం పొందాడు… ఈవిడ చూస్తేనేమో ఏకంగా స్త్రీ ప్రకృతి మోక్షం పొందాలి… స్త్రీలు కూడా మోక్షం పొందాలి అని చెప్పేసి …ప్రయత్న సాధన చేస్తుంది. ఈమె మోక్షం పొందాలి అనుకుంటే ఈమె చావు ఈమె చావచ్చు కదా! ఆయన మోక్షం పొందాలనుకుంటే ఆయన చావు ఆయన చావచ్చు కదా! విశ్వం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు…. ఎవరి చావు వాళ్ళు చావచ్చు కదా! అదే నా బాధ …అది ఆపాలనుకుంటున్నాను… ఇప్పుడు తన సాధన తాను వ్యక్తిగతంగా చేసుకొని తన చావు తాను చస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు . విశ్వ మోక్షం ఇవ్వాలి అని సంకల్పించి సాధన అంటేనే నాకు ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది . ముందువీళ్ళిద్దరిని చంపేయాలని ఉంది. అయన్ని చంపాలని ప్రయత్నం చేశాను. చంపే వరకు తీసుకువచ్చాను… ఎక్కడ భయపడలేదు… ఆశపడలేదు… యోగ సిద్ధులు ఇస్తాను …యోగశక్తులు ఇస్తానని చెప్పినా కూడా ఇది అవ్వలేదు. అదే బాటలో ఈమె కూడా నడుస్తుంది… ఈమె కూడా ఇప్పుడు కొంపతీసి స్త్రీ ప్రకృతికి మోక్షం ఇచ్చే విధివిధానములో వెళ్లిపోతే… స్త్రీ ప్రకృతి పోయి, పురుష ప్రకృతి పోతే ఇంక మనమంతా ఎందుకు ఉన్నట్టు… ఏం చేస్తున్నట్టు… ఇది లోక వినాశనం కాదా? లోక విరుద్ధమైన ఆలోచన కాదా! ప్రకృతికి విరుద్ధమైన ఆలోచన కాదా? మీరేచెప్పండి…. నా ఆవేదనలో నా ఆలోచనలో అర్థం లేదా?నేను ఎందుకు వీళ్ళని ఆపుతున్నానో ఆలోచించండి… వీళ్ళు ఆటలో ఉన్నప్పుడు వీళ్ళు ఆడుకోవాలి…మేము ఆడలేము మా వల్ల కాదు అని జగన్నాటకంలో ఈ పాత్రలు మాకు ఇష్టం లేదు, ఆసక్తి లేదు అనుకున్నప్పుడు తప్పుకోవాలి. అంతేగాని జగన్నాటకాన్ని ఆపాలని అనుకోవడమే తప్పు కదా! నేను అనేది అది. నా బాధ అది .
గోపాలస్వామి:- సరే జరిగిందేదో జరిగింది. అది వ్యక్తిగత మోక్షం అవుతుందో… స్త్రీ ప్రకృతి మోక్షం అవుతుందో… ఎవరికి ఎరుక . ఇప్పుడు జరగవలసిన దానిని జరగనివ్వు. అప్పుడు ఆ అమ్మాయిలో నిస్వార్థం పోయి స్వార్థం పెరిగిపోయింది…. విశ్వానికి కీడు చేస్తుంది …. వినాశనం కోరుకుంటుంది అనిపించిననాడు అప్పుడు ఆ అమ్మాయికి అవాంతరాలు, ఆటంకాలు కలిగించు.
కృష్ణ స్వామి:- ఎప్పుడో ఏదో జరుగుతుంది. ఏదో అయిపోతుంది… అది జరిగేదాకా ఎదురు చూస్తూ ఉండాలంటే… కుదరదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠురమే మంచిది. ఆదిలోనే ఆలోచన తీసేస్తే అంతం గురించి ఇంక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతం దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈమెకెందుకు స్త్రీ ప్రకృతి మోక్షం గురించి… విశ్వమోక్షం గురించి ఎందుకు ప్రయత్నాలు చేయాలి అనేది నా ఆరాటం… నా ఆలోచన. దీన్ని ఎలా అయినా అపాలనుకుంటున్నాను.. దయచేసి మీరు తనకి చేతి ముద్రలు సాధన గురించి చెప్పకండి. జ్ఞానం అందించకండి. దానిలో నిష్ణాతులని తెలుసు. పండితులు అని తెలుసు. అనుభవ పాండిత్యం పొందిన గురువులు అని తెలుసు. కేవలం చేతి ముద్రలతోనే మీరు కుండలిని శక్తి జాగృతి చేసుకొని…. ప్రకృతిని శాసించే స్థితికి…ఆధీనం చేసుకునే స్థితికి… ప్రకృతిని ఆపేస్థితికి మీరు వెళ్లారని నాకు తెలుసు. మీ సాధనకు నేను ఎప్పుడూ ఆటంకాలు, అవాంతరాలు కలిగించలేదు
చిన్నప్పటి నుంచి మీ మనసు ఏమిటో… మీ ఆలోచనలు విధివిధానం ఏమిటో నాకు తెలుసు. కాబట్టి మీకు మీరు మోక్షం పొందాలి అనుకుంటే ,ఏదో విధంగా మోక్షం పొందుతారు. ప్రకృతి మోక్షం పొందాలని విశ్వమోక్షం పొందాలని సాధన మొదలుపెట్టలేదు. మోక్షజ్ఞానం పొందాలి అని …విశ్వాధినేత అయ్యే అవకాశం ఉన్నా కూడా వదులుకున్నారు. కానీ మీలాంటి మనస్సు ఈ పిల్లకి ఉంటుందని నేను అనుకోను. కాకపోతే నా భయాలు నాకు ఉంటాయి కదా! నా అనుమానాలు నాకు ఉంటాయి కదా !
గోపాలస్వామి:- అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
కృష్ణస్వామి:- ఈవిడని చంపేయాలని అనుకుంటున్నాను… ఈవిడ సాధన నేను ఆపేయాలి అనుకుంటున్నాను. ఈవిడ సంకల్పం ఆలోచనలు మార్చుకోగలిగితే సరే, లేదు అంటే నేను ఉంచను… ఈవిడని నేను చంపేస్తాను అని శివ నందిని కేసి చూస్తూ ఉండేసరికి….
శివ నందిని:- నేనైతే మోక్షం గురించే ప్రయత్నం చేస్తున్నాను. అది స్త్రీ మోక్షమా… పురుష మోక్షమా? అది స్త్రీ ప్రకృతి పూర్ణ మోక్షమా? వ్యక్తిగత మోక్షమా ….అన్నది నాకు తెలియదు. అర్ధాలు కూడా నాకు తెలియదు… నా సాధన నేను ఆటంకం లేకుండా…. కంగారు పడకుండా… ఆపకుండా… నేను పూర్తి చేస్తానని… నా వంతు సహాయ సహకారాలు చేస్తానని… నా ఇష్ట దైవం శివుడి యందు నేను ప్రమాణం చేసి సాధన మొదలుపెట్టాను. దైవ నిర్ణయం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాల నిర్ణయం అది ఏం సమాధానం ఇస్తుందో నాకు తెలియదు. నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఇదే సాధన చేస్తూ ఉంటాను… మోక్ష సాధన కొనసాగిస్తూ ఉంటాను …ఎవరు ఏం చేసుకున్నా నాకు అనవసరం. ఈ శరీరాన్ని చంపుకున్న నాకు అనవసరం. ఈ ప్రాణాలు పోయినా నాకు అనవసరం. నేను అనుకున్న దానికి నేను నిస్వార్ధంగానే ఉన్నాను. లోకహితమైన సాధన చేయాలనుకుంటున్నాను. లోక విరుద్ధమైన ఆలోచనలు గాని, ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు గాని, ప్రకృతి వినాశనం కోరుకోవాలని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు.. నేను అలాంటి దానిని కాదని కూడా మీకు తెలుసు. అయినా కూడా మీరు నా సాధనని ఆపాలి…. నాకు ఆటంకాలు అవాంతరాలు కలిగించాలి…. అనుకుంటే మాత్రం నేను ఆపను… మీ ప్రయత్నాన్ని మీరు చేయండి.. నా ప్రయత్నాలు నేను చేస్తాను… జయం ఎవరికీ కలుగుతుంది అనేది కాల నిర్ణయమే చేస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీరు నా సాధన ఆపాలని ఒకవేళ శివుడే మీలో ప్రవేశించి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు… ఒక పక్కన నాలో ఉన్న శివుడు సాధన చేసి మోక్షం పొందాలని చేస్తూ ఉండవచ్చు…. మీలో ఉన్న శివుడు మీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు…. నాలోన శివుడు నా ప్రయత్నం చేస్తూ ఉంటాడు…. ఏ శివుడు గెలుస్తాడో… ఏ శివుడు జయం పొందుతాడో ఎవరికీ ఎరుక… నా మానాన నేను ఉంటాను. ఈ గోపాలస్వామి చేతి ముద్రల సాధన చెప్పినా ….చెప్పకపోయినా ప్రకృతి నాకు ధ్యానంలో చెబితే ఏం చేయగలరు…. ఎవరు ఆపగలరు…. నేను ప్రకృతికి అనుసంధానమై ఉన్నాను…. అప్పుడు ఎవరు ఇది చేయగలరు… మీరు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు…. నన్ను చంపడం వలన మోక్ష సాధన ఆగిపోతుంది అంటే అది చాలా భ్రమ . నాలాంటి వాళ్లు కొన్ని లక్షల మంది పుట్టుకొస్తారు… మోక్ష సాధనలోకి దిగుతారు…. మోక్ష సాధనలోకి వెళ్లాలని అనుకుంటారు…. అలాంటప్పుడు ఎంతమందిని చంపుకుంటూ వెళతారు… ఎంతమందిని ఆపాలని అనుకుంటున్నారు…. ఇక్కడ మోక్షం పొందాలనుకున్నప్పుడు మోక్షమును పొందనివ్వాలి…. మోక్షం పొందనివ్వకుండా ఆపివేయడం వల్లనే కదా మేము ప్రకృతికి విరుద్ధంగా మోక్ష సాధన చేయాలని అనుకుంటున్నాము…. అసలు స్త్రీ ప్రకృతి మోక్షం పొందిందా లేదా అని తెలుసుకుంటున్నాము…. ఆ జ్ఞానం పొందాలనుకుంటున్నాము…. స్త్రీ ప్రకృతిని ఆపాలని మేము అనుకోవడం లేదు…. ఇప్పుడు పరమహంస గారు ఉన్నారు… పురుష ప్రకృతిని ఆపాలని ఆయన ప్రయత్నం చేయలేదు… విశ్వమోక్షం ఇవ్వాలని ప్రయత్నం చేయలేదు… ఆయన మోక్ష ప్రయత్నంలో విశ్వమోక్షం పొందాలని సంకల్పించింది ఎవరు? అది విశ్వమోక్ష జ్ఞానం ఇచ్చింది ఎవరు… శివుడే కదా! శివుడే మోక్షం పొందమని చెప్పేసి… ప్రయత్న సాధన చేయమని చెప్పింది శివుడే… ప్రయత్నం చేసింది శివుడే… తెలుసుకుంది శివుడే… ఇక్కడ పరమహంస అని ఎవరున్నారు ? పరమహంస లో ఉన్నది కూడా శివుడే కదా! పొందింది ఎవరు శివుడే కదా! తెలుసుకున్నది ఎవరూ…. శివుడే కదా! తెలుసుకునేటట్టు చేసింది ఎవరు…. శివుడే కదా! తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎవరు శివుడే కదా ! ఉన్నదంతా శివుడే కదా…. శివుడు తను తెలుసుకున్న జ్ఞానమును అపస్మారక స్థితి వలన మర్చిపోవడం జరిగింది . ఆ అపస్మారక స్థితి నుంచి జీవుడిగా మారి….. ఆ జీవుడి నుండి శివుడిగా మారాడు. జీవుడి నుండి శివుడిగా మారే ప్రయత్నంలో చాలామంది మాయ దగ్గర ఆగిపోయారు. పరమహంస ఆ మాయలన్నీ దాటుకుంటూ వెళ్లారు. ఆయన చనిపోయారు అన్న విషయం తెలుసుకున్నారు… రుద్రుడు లేడు అని తెలుసుకున్నారు… ఆది రుద్రుడు లేరు అనే విషయం తెలుసుకున్నారు… అలాగే ఆ విధంగానే తన సాధన కొనసాగించాడు. అమ్మవారు ఆగిపోయింది…ఆయన మోక్షం పొందాడు. ఆదిపరాశక్తి మోహమాయలో పడిపోయింది. పడి ఆగిపోయింది అని తెలుసుకున్నాడు ….ఇప్పుడు ఇదే విధంగా నేను కూడా వెళ్తున్నాను…. ఆదిపరాశక్తి మోక్షం పొందిందో లేదో తెలుసుకుంటున్నాను…తెలుసుకుంటుంది ఎవరు ఆదిపరాశక్తి లోనే ఉన్నది ఎవరు…. శివుడే కదా! శివుడు నుంచే కదా! ఆదిపరాశక్తి ఎవరు శివుడే కదా! మూలంలోకి వెళ్ళండి… మూల జ్ఞానం పొందండి…. పదార్థం దాటితే గాని యదార్థం అర్థం కాదు… శరీరం స్త్రీ శరీరం కావచ్చు… లోపల ఉన్నది ఎవరు శివుడే కదా…. నేను స్త్రీ అవడం వలన నేను శివుడిని కాదని మీరు అనుకుంటున్నారు… నేను శివాని కాదు శివాని లో ఉన్నది శివుడే… అది మాత్రం గుర్తుపెట్టుకోండి… అది మాత్రం తెలుసుకోండి… ఆ జ్ఞానం పొందండి… శివుడే శివుడిని తెలుసుకుంటున్నాడు అని తెలుసుకుంటున్నారు. శివుడిని శివుడే చూస్తున్నాడు… శివుడే మోక్షం పొందుతున్నాడు…. శివుడని జ్ఞానం పొందుతున్నాడు…. శివుడే మోక్ష జ్ఞానమును అందుకుంటున్నాడు… తెలుసుకుంటున్నాడు… ఇక్కడ నేననేది, స్త్రీ అనేది లేదు, పురుషుడు అనేది లేదు ,కేవలం మా దేహాలు సాధనకు ఉపయోగపడే శరీర పరికరాలు మాత్రమే అని తెలుసుకోండి… గ్రహించండి… నీలో శివుడు మోక్షం పొందాలి అనుకోవడం లేదు… నాలో శివుడు మోక్షం పొందాలనుకుంటున్నాడు… ఇందులో ఎవరు జయం పొందుతారు? ఎవరు అపజయం పొందుతారు? ఆ శివుడే నిర్ణయం చేయాలి….దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను… నీ వంతు ప్రయత్నాలు నువ్వు చెయ్యి…. ఇందులో తప్పు ఒప్పులు లేవు …ఎవరి ప్రయత్నాలు వారివి ….ఒకరు ఆపాలనుకుంటున్నారు… ఒకలు సాధన చేయాలనుకుంటున్నారు… ఇప్పుడు గోపాలస్వామి లో విష్ణుమూర్తి ఉన్నాడు… వెంకటేశ్వర స్వామి లోను ఉన్నాడు …. ఈశ్వరుడిలో ఉన్నాడనుకుంటాను…. బ్రహ్మ పదార్థమే నాకు. ఆ బ్రహ్మ పదార్థానికి రకరకాల పేర్లు . ఒకళ్ళు అమ్మవారు…. ఒకళ్ళు అయ్యవారు….ఒకళ్ళు విష్ణువు… ఒకళ్ళు గాయత్రి… ఒకళ్ళు హనుమ… ఒకళ్ళు అయ్యప్ప స్వామి ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. నా దృష్టిలో ఉన్నది కేవలం ఏక బ్రహ్మ పదార్థం. అంతే. దానికి పలు పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి…. ఎవరు ఏం సాధించుకుంటారో సాధించుకుంటారు…. ఎవరు ఏ ఏది ఆపాలనుకుంటారో ఆపాలనుకుంటారు…. నా సాధన ప్రయత్నం నేను సాగిస్తాను…. మీ సాధనలో నన్ను ఆపాలనుకుంటున్నారు… అవాంతరాలు ఆటంకాలు ఇవ్వాలనుకుంటున్నారు…. నేనేదో స్వార్థానికి గురవుతాను….పంచభూతాలకు ఆధీనం చేసుకుని ఈ ప్రకృతిని నాశనం చేస్తానని అనుకుంటున్నారు…..అందులో సత్యాసత్యాలు ఏంటి అనేది కాలానుగుణంగా పరిస్థితులకు బట్టి సమయానుకూలంగా ప్రకృతి చెబుతుంది. మీ ప్రయత్నం మీరు చేసుకోండి…. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు …
అనేసరికి నీకు చాలా బాగా తలపొగరు ఎక్కువైపోయింది… అహంకారం ఎక్కువైపోయింది… నేను చేయలేను అని అనుకుంటున్నావు కదా! అని యోగాంబిక వైపు చూస్తూ నీ త్రిశూలంతో దాని పొడిచేసెయ్యి…. దాన్ని చంపేసెయ్యి ….ఏం జరుగుతుందో చూస్తాను అనేసరికి…. గోపాలస్వామి మరియు రుద్రస్వామి నిశ్చేష్టులై పోయారు… ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను రా! నాకు అవకాశం దొరికింది..వీళ్లిద్దరిని సమక్షంలోనే ఇక్కడే దీనికి మోక్షం చేద్దామని అంటూ ఉండేసరికి …..ఉండమ్మా ఆగు…. ముందు దీనిని భయపెడదాం… బాధ పెడదాం…. ఆ బాధకి తట్టుకోలేక ఇది అల్లాడిపోతుంది అని కృష్ణస్వామి తన చూపుతో శక్తిపాతం చేస్తూ…. శివ నందిని కేసి చూసేసరికి శివ నందిని శరీరం కాస్త స్తంభించిపోయింది. శరీర స్పృహ లేకుండా పోయింది ….కదలట్లేదు …. మెదలట్లేదు… ఎంత ప్రయత్నం చేసినా కాళ్లు చేతులు కదపాలన్నా కూడా కదపలేక…. తన శరీరం మీద 100 కేజీల బరువు గుండెల మీద పెట్టినట్లుగా కనిపించసాగింది. కూర్చున్నది కూర్చున్నట్లుగా స్తంభించిపోయే పరిస్థితికి ఏర్పడింది… తనమీద మంత్ర ప్రయోగం చేశాడని గ్రహించింది. కానీ ఏమీ చేయలేక పోతుంది… కానీ బాధ విపరీతంగా మొదలవుతుంది… ఉన్నట్టుండి 280 డిగ్రీల కోణంలో తల తిరగటం మొదలైంది ….ఆమె మెడ తిరుగుతూ ఉండేసరికి… తట్టుకోలేని బాధ వచ్చేసింది. విపరీతంగా అరవటం చేసింది…. అలా ఎడమ వైపుకి ఒకసారి… కుడివైపుకు ఒకసారి తిప్పేసరికి ……రుద్ర స్వామి అయ్యో పాపం! ఈమె తల తెగిపడుతుందా ఏమిటి? వీడు కృష్ణస్వామి మరీ రెచ్చిపోతున్నాడు….. అయినా అన్ని యోగ సిద్ధులు ఉన్న గోపాలస్వామి ఏమి చేయడం లేదు ఏమిటి? అలా చూస్తూ ఉండిపోయాడు ఏమిటి? గోపాలస్వామి కేసి చూస్తుంటే నాకేం సంబంధం లేదు అని సాక్షిభూతంగా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా ఆమెకేసి అలాగే చూస్తూ ఉండేసరికి …..ఏం చేయాలో అర్థం కాక మనోవేదన పడుతూ రుద్ర స్వామి అలాగే ఉండిపోయాడు . ఆ తరువాత చెయ్యి మెలికలు పెట్టేసరికి విపరీతంగా అరిచింది. ఆ తర్వాత కుడి చెయ్యి ,ఆ తర్వాత ఎడమ చేయి, ఆ తర్వాత రెండు కాళ్లు ,నడుము ఇష్టం వచ్చినట్లు ఆమె శరీరాన్ని మెలికలు తిప్పేసరికి…. ఆ మెలికల బాధ తట్టుకోలేక…. స్వామి !స్వామి! గోపాలస్వామి నన్ను రక్షించండి…. వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు…. ఒకసారిగా చంపేస్తే పర్వాలేదు…దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా చేస్తున్నారు. నా వల్ల కావడం లేదు… తట్టుకోవడం లేకపోతున్నాను… నన్ను రక్షించండి అనేసరికి ….. ఆయన కూడా నాకు వినపడట్లేదు…. నాకు అర్థం కావట్లేదు అన్నాడు…. విన్నపడుతున్నప్పటికీ కూడా ఆమె అరుపులు అర్థం అవుతున్నా కూడా గోపాలస్వామి మౌనంగా ఉండిపోయాడు. రుద్ర స్వామి ఆమె బాధను చూడలేక…తట్టుకోలేక
రుద్ర స్వామి:- అమ్మ !నువ్వు కంగారు పడమాకు… భయపడమాకు… చూస్తూ ఉండు… ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు.
శివ నందిని:- అయ్యా! ఇక నా వల్ల కావడం లేదు.. నాకు చచ్చిపోవాలని ఉంది.
అని అంటూ ఉండేసరికి ఈమె నడుముని కూడా వెనక్కి ముందుకి తిప్పుతూ ఉండే సరికి….. ఒక్కసారిగా ఈమె శరీరాన్ని గాల్లో పది అడుగుల పైనుంచి లేపి ఒక్కసారిగా కింద పడేశారు . ఆ రాయిపై గుద్దుకునే సరికి ఆమె తల పగిలిపోయిందేమో అన్నంత భయం రుద్ర స్వామిలో కలిగింది. ఈమెను చంపేదాక వీళ్ళు నిద్రపోరు అనుకున్నాడు. ఇక కాలమే వీళ్ళకి బుద్ధి చెప్పాలి…. మన చేతుల్లో ఏమీ లేదు…. ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా తనని చంపడానికి కూడా వెనకాడరు.. కాబట్టి తను శివ నందిని పోయినా కూడా ఇంకో స్త్రీ మూర్తికి సాధనా జ్ఞానం ఇవ్వటానికి తను బతికి ఉండాలని చెప్పేసి…. ఆ ఆలోచనతో రుద్రస్వామి మౌనంగా ఉండిపోయాడు. గోపాలస్వామి కూడా నాకేం సంబంధం లేదు అన్నట్టు చూస్తూ ఉండిపోయాడు.
కృష్ణ స్వామి మాత్రం…..తన కంటి చూపుతో శివ నందిని శరీరంతో ఆడుకోవడం చేస్తూనే ఉన్నాడు. పైనుంచి పడవేయడం, పక్కలకి పడవేయటం, బండరాయి మీద పడవేయటం, తర్వాత శరీర భాగాలను మెలికలు తిప్పటం…. ఎన్ని చేసినప్పటికీ కూడా తను మౌనంగా భరిస్తూ కృష్ణస్వామిని ఆపే శక్తి తన దగ్గర లేనందున అన్నిటినీ భరిస్తూ అరుస్తూ బాధతో విలవిలలాడుతూ ఉంది. మనసు కొట్టుకుంటుంది. అంత బాధలో కూడా శివ స్వామికి ఆమె గుర్తుకు వచ్చినా కూడా శివ స్వామిని రమ్మని…ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి అని అడగాలని కూడా అనుకోలేదు. ఈమెగాని అనుకున్నట్లయితే క్షణకాలంలో కృష్ణస్వామిని అదుపులో ఉంచేవాడు. కృష్ణస్వామికి బుద్ధి చెప్పేవాడు. కానీ వీళ్ళిద్దరికీ మధ్య వైరం వచ్చి వీరిద్దరూ ప్రాణాలు తీసుకునే పరిస్థితి తన వల్ల రాకూడదని….. మౌనంగా అంతా భరిస్తూ ఉంది. తట్టుకున్నంత సేపు తట్టుకోగలిగింది. తట్టుకోలేనప్పుడు విపరీతమైన అరుపులు అరిచింది. అర్ధరాత్రి పూట తిరుపతి చుట్టూ ప్రదేశాలన్నీ కూడా ఈమె అరుపులతో మారుమోగి పోయే అంత స్థితి ఉంది. ఈమె ఇక్కడ శేషాద్రి పర్వతం మీద అరుస్తూ ఉంటే….అక్కడ వెంకటాద్రి మీద వినపడే అంత ఇదిగా శివ నందిని ఆర్తనాదాలు చేస్తుంది. ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు…. అలాగే వెంకటాద్రి పర్వతం మీద ఆవాసం ఉన్న వెంకన్న స్వామికి కూడా తెలుసు. కానీ అందరూ మౌనంగా ఉండిపోయేసరికి ఏం అనాలో అర్థం కాక భరిస్తూ భరించలేనప్పుడు అరుస్తూ ఉండిపోయింది. ఇలా కాదమ్మ యోగాంబిక దేవి ! నీ త్రిశూలం తో దీన్ని చంపేసెయ్యి ….ఇది మన మాట వినేటట్టు లేదు….ఇది బాధలు అనుభవిస్తుంది… అరుస్తుంది….కానీ చావట్లేదు అనేసరికి యోగాంబిక వెంటనే తన చేతిలో ఉన్న త్రిశూలంతో గబగబా వచ్చేసి పక్కనున్న శివ నందిని మీద పొడవటం మొదలు పెట్టింది. మొదట మూలాధార చక్ర ప్రాంతంలోనూ, స్వాధిష్ఠాన చక్ర ప్రాంతంలోనూ….. తర్వాత నాభి ఉన్న మణిపుర ప్రాంతంలోనూ….. విశుద్ధ చక్రంలో ఉన్న కంఠము నందు…. ఆ తర్వాత నుదుటిన ఉన్న ఆజ్ఞ చక్రంలోనూ…. ఆ తర్వాత మెదడు ఉన్న సహస్రార చక్రంలోనూ….కావాలని చెప్పి ఆ చక్రాలను నాశనం చేయాలని చెప్పేసి…. ఆ చక్రబంధాలను నాశనం చేయాలని చెప్పేసి…. త్రిశూలంతో పొడవటం చేసింది. గాయాలు చేసింది. ఒరేయ్! ఇక దీని పని అయిపోయిందిరా…ఇక బతికినా ఉపయోగం లేదు… చక్రాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి…. ఇక ఇది సాధనకి పనికిరాదు… ఇది బతికినా కూడా యోగసాధనకి పనికిరాదు… అయిపోయింది… దీనికథ పూర్తయిపోయింది …వెంకటేశ్వరస్వామి మనకి సహాయ సహకారాలు అందించాడు. ఆయన సమక్షంలో ఇవన్నీ జరిగిపోయాయి.. అని వాళ్ళ కోపా వేశాలు తగ్గిపోయిన తర్వాత… వెంటనే స్వామికి కృతజ్ఞతలు చెబుదామని వీళ్ళిద్దరూ చిరు మందహాసం చేసుకుంటూ… వికటహాసం చేసుకుంటూ…. అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళ కనుచూపు దాటి వీళ్ళు వెళ్లిపోయారు అనుకున్న తర్వాత ….గోపాల స్వామి మామూలు స్థితికి వచ్చి అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగేసరికి….. రుద్ర స్వామి కోపావేశాలు తట్టుకోలేక ….
రుద్రస్వామి:- నీకు అసలు బుద్ధుందా? ఒక శిష్యురాలు ఇలా బాధపడుతూ ఉంటే ఎవరో వచ్చి హింసిస్తుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా ?నువ్వు సాధకుడివేనా? ఒక ఉపాసకుడివేనా ?నువ్వు మోక్షసాధనకి సహాయం చేసే వాడివేనా? సహాయ సహకారాలు అందించే వాడివేనా…. నిన్ను నమ్ముకొని ఉన్నదే ఆ పిల్ల?
గోపాల స్వామి:- మరి నువ్వేం చేసావు? నువ్వు కాశీ నుంచి తీసుకువచ్చావు కదా! తండ్రి…. అయ్యా అని తండ్రి అనుబంధంతో… మరి నీ కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేసావు… నువ్వు మౌనంగా ఉండి పోయావు. నేను మౌనంగా ఉండిపోయాను… మనం చేయలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి పడేసింది. సహాయ సహకారాలు అందించాలన్న చేయలేని పరిస్థితి… ఎందుకంటే కృష్ణస్వామి, యోగాంబిక ఎవరో కాదు…మాయకి ప్రేరణ కలిగిన వాళ్ళు. మహామాయకు ప్రతికలు. ఆదిపరాశక్తికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు…వాళ్ళని ఎదిరించి బతకడం అనేది ఉండదు. క్షణం పట్టదు వాళ్లకి, మనల్ని చంపడానికి… లిప్త కాలంలో చంపేస్తారు. మనకి శివ నందిని ముఖ్యం కాదు కదా! శివ నందిని లాంటి స్త్రీమూర్తులు మనకి ముఖ్యం. ఈరోజు శివ నందిని పోయింది. రేపు ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి మమోక్ష ఙ్ఞానం ఇవ్వాలి. కాబట్టి మనం బతికి ఉండాలి. కాబట్టి మనం ఇద్దరం కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయాము… తట్టుకొని నిలబడ గలుగుతుందా లేదా అనేది వదిలేశాము….. అర్హత, యోగ్యత ఉంటే ఆ అమ్మాయి బతుకుతుంది. లేదా చచ్చిపోతుంది… మన చేతుల్లో లేదు కదా! ఇప్పుడు మనం శివ నందినిని రక్షించాలన్న రక్షించలేము… మన ప్రాణాలు పోతాయి .ఆ అమ్మాయి ప్రాణాలు మిగిలితే ఏంటి లాభం? ఆ మోక్ష జ్ఞానానికి సహాయ సహకారాలు అందించే వాళ్లు లేకపోతే ఆ అమ్మాయి ఇంక సాధన ఎలా చేస్తుంది? ఈరోజు శివ నందినిని దృష్టిలో పెట్టుకుంటే…. మనం ఇక్కడికి రాలేదు కదా! మన సాధన ఇక్కడ ఇది చేయలేదు కదా! లోక కళ్యాణార్థం సాధనా జ్ఞానం పొందిన వాళ్ళం మనం… ఆ జ్ఞానమును పొందటానికి అర్హత ఉందా? అనే స్త్రీ మూర్తి కోసం నువ్వు కాశీ క్షేత్రంలో ఉన్నావు. సాధన విగ్రహ మూర్తిని యంత్ర సహాయంతో పొందావు. అర్హత ఆ అమ్మాయి పొందింది. ఇక్కడదాకా తీసుకు రాగలిగావు. తీసుకువచ్చావు. నువ్వు ఉన్నావు… నువ్వు తీసుకువచ్చావు…. అంటే ఆ అమ్మాయిలో ఏదో శక్తి ఉంది. ఏదో అర్హత ,యోగ్యత, యోగం ఉండి నేను రావడం జరిగింది. మరియు ఒక్కొక్కళ్ళ అనుగ్రహం పొందుతూ ఉంటే…. ఆ తర్వాత గురువులు వస్తారు. అనుగ్రహం పొందుతారు… ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని ఆపాలని చూస్తే మనమే పోతాము …అప్పుడు పరిస్థితి ఏమిటి? అది ఆలోచించు… ఈ అమ్మాయి మనకి ముఖ్యం కాదు….ఈ అమ్మాయిలాంటి వాళ్లు కొన్ని కోట్ల మంది పుట్టుకు వస్తూనే ఉంటారు…. వాటిని చూస్తూ ఉండాలి… ఈ అమ్మాయి బతికి ఉందో లేదో చూడు… తర్వాత వాదోపవాదాలు చేసుకుందాం… మన ఇద్దరం చేసింది కూడా తప్పు కాదు …
అనేసరికి గబగబా రుద్ర స్వామి శివ నందిని దగ్గరికి వెళ్ళేసరికి స్పృహ తప్పి పడిపోయి ఉంది. స్వామి నాకు తెలిసి ఈమె కోమాలోకి వెళ్ళిపోయిందేమో ….శరీరాన్ని విచ్ఛిన్నం చేశారు కదా! యోగ చక్రాలు అన్నీ కూడా విభేదనం చేసేసారు కదా! ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళు ఒక పిచ్చి మూర్ఖులు…మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లు… యోగ చక్రాలు ఉన్నా కూడా…. మన స్థూల శరీరంలో ఉండవు… సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరానికి విభేదనం చేయడం అనేది ఉండదు…
సూక్ష్మ శరీరం మోక్షం పొందుతుంది కానీ…. సూక్ష్మ శరీరమును ఏ అస్త్రము ,శస్త్రం నాశనం చేయలేవు. పంచభూతాలు నాశనం చేయలేవు… అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ఆత్మ అనుకోవచ్చు… అనేసరికి స్వామి! ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? అంటే ఆయన దగ్గరలో ఏవో వనమూలికలు ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నవి తీసుకువచ్చి…. ఆ పసరు చేసి ఆ పసరుతో ఈమె గాయాల మీద వేసేసరికి ఆ గాయాలు సహజ సిద్ధంగానే క్షణాల్లో మాయం అయిపోయినాయి. రస సిద్ధుడికి , సిద్ధ వైద్యుడికి సాధ్యం కానిది ఏది ఉండదు కదా! అని రుద్రస్వామి అనేసరికి….. ఈమె కాస్త నిద్రలో లేచినట్టుగా లేచి… స్వామి ! ఏం జరిగిందో నాకు గుర్తులేదు… నేను బండమీద ధ్యానముద్రలో ఉండాల్సిన దాన్ని నేలమీద పడుకుని ఉన్నాను…. అని అంటే ఏం లేదమ్మా ధ్యానముద్రంలో ఉంటూ….ఆ శక్తిని తట్టుకోలేక నువ్వు కింద పడిపోయావు అని…… రుద్ర స్వామికి కనుసైగ చేసి ఈమెకు ఏమి చెప్పవద్దు ….ఈమెకి ఏమీ గుర్తు లేకుండా చేశాను…. అనే సరికి మౌనం వహించాడు. ఆ తర్వాత గోపాలస్వామి కేసి చూస్తూ
శివ నందిని:- స్వామి! మీరు నాకు ముద్ర సాధన గురించి చెప్పాలి అన్నారు కదా! మరి మీరు నాకు ముద్ర సాధన గురించి చెబుతారా!
గోపాలస్వామి:- చెబుతానమ్మ! నువ్వు స్థిరంగా బండమీద కూర్చొని ధ్యానముద్రంలో కూర్చో…. పద్మాసనం వేసుకో… కుడి చేయి కింద ఎడమ చేయి పెట్టుకొని గుదస్థానంలో ఉంచు….
శివ నందిని:- అంటే సాధన విగ్రహం మూర్తి ఎలా అయితే ఉందో అలా కూర్చోవాలి. అవునా?
గోపాలస్వామి:- అవునమ్మా! అలాగే కూర్చో… ఒక్కొక్క చక్రం గురించి నీకు చెబుతాను ….ఒక్కొక్క ముద్ర గురించి జాగృతి చేస్తాను… చెబుతాను… కూర్చో….నేను ఎలా అయితే చెబుతున్నానో… అలా నువ్వు చేతివేళ్ళతో చెయ్యి . కాకపోతే నీ దినచర్యలో ఈ ముద్రాసాధన కొనసాగిస్తూ ఉండు…. ఎప్పటిదాకా అంటే ….ఈ చక్రాలు జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం అయ్యేదాకా నువ్వు ఈ ముద్రలో చేసుకుంటూ ఉండాలి. ఈ ముద్రల సాధన ద్వారానే మోక్షమును పొందాలి. చక్రాలు జాగృతి చేసుకోవాలని ఆదిలోనే ఎంచుకున్నట్టు ఉన్నావు కదా!
శివ నందిని:- అవును స్వామి! నాకు ఈ సాధన విధానం బాగా నచ్చింది.
గోపాలస్వామి:- ఎవరి ఇష్టప్రకారం వారు ….అంటే మనకి నచ్చిన సాధన విధానం ఎంచుకోవాలమ్మా! దానికి తగ్గట్టుగానే ప్రకృతి నన్ను నీకు అనుసంధానం చేసింది. నేను ఎదురు పడడం జరిగింది. కాబట్టి నువ్వు కూర్చో! అనేసరికి సరే స్వామి నేను కూర్చుంటాను అని….. బండమీద కూర్చుంది. ఇక అప్పుడు గోపాలస్వామి ఒక్కొక్క చక్రం గురించి దానికి సంబంధించిన ముద్ర గురించి చెప్పడం ఆరంభించాడు ….
గోపాలస్వామి:- అమ్మాయి శివనందిని…. ఇప్పుడు మూలాధార చక్ర శక్తిజాగృతి గురించి తెలుసుకుందాము… ఈ మూలాధార చక్ర జాగృతి కోసం పృథ్వి ముద్రను ఉపయోగిస్తారు… పృథ్వీ ముద్ర అంటే భూమికి సంబంధించిన ముద్ర అన్నమాట! ఇది భూతత్వానికి సంబంధించిన చక్రము. నువ్వు ఈ చక్రసిద్ధి పొందితే… నీకు భూ చర సిద్ధి వస్తుంది. తద్వారా నువ్వు భూమి మీద ఒక అడుగు ఎత్తులో నడిచి వెళ్లగలవు. భూమి మీద నడవకుండా ఒక అడుగు ఎత్తులో నడవ కలిగే స్థితి వస్తుంది. దీనికి అనగా ఈ చక్ర జాగృతి, సిద్ధి,ఆధీనం, విభేదనం కావాలంటే…. పృథ్వి ముద్ర చేయవలసి ఉంటుంది. రోజుకు 15 నుంచి 20 నిమిషాల వరకు చేయవలసి ఉంటుంది. ఇలా ఆరు నెలల పాటు ఈ చక్రముద్ర చేయవలసి ఉంటుంది. అప్పుడు ఈ చక్ర శుద్ధి ఆరంభం అవుతుంది…. మొత్తం నాలుగు పూర్తవుతాయి… ప్రతిదానికి నాలుగు స్థితులు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ పృథ్వి ముద్రలో శక్తి జాగృతి ఎలా చేయాలో చెబుతాను.. జాగ్రత్తగా చూడు… మొదట బొటనవేలి కొనను నీ ఉంగరం వేలుతో కలిపి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాచు…
అనేసరికి సరే అని చెప్పి ఆయన ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా తన బొటనవేలును ఉంగరం వేలుని కలిపి ముందు మూడు వేళ్ళను ముందుకు చాచింది. అలా చేస్తూ ఉండేసరికి మనసు స్థిరమటం గమనించింది… ఒక 20 నిమిషాల పాటు చేస్తూ ఉండేసరికి… మనసు స్థిరమవుతున్నట్టుగా గమనించింది. ఆందోళన తగ్గుతున్నట్టుగా అనిపించింది. మానసికంగా, శారీరకంగా ఏదో ఒక శక్తి తనలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపించింది. అనవసరమైన ఆందోళనలు తగ్గుతున్నట్టుగా అనిపించింది. ఓహో! ఈ ముద్ర వల్ల ఇలాంటి అనుభవాలు కలుగుతాయి అని అనుకొని….. తనలో కలిగిన అనుభవాలన్నీ కూడా గోపాల స్వామికి చెప్పేసరికి అదేనమ్మా! పృథ్వీ ముద్రను అభ్యాసం చేయడం వలన కలిగే ఉపయోగాలు అని అనేసరికి….. సరే స్వామి! అంటూ ఉండేసరికి….. మూలధార చక్ర రూపురేఖలు అవన్నీ లీలగా ధ్యానంలో కనపడేసరికి స్వామి! నాకు మూలాధార చక్రం లీలగా కనపడుతుంది అనేసరికి…. నాలుగు కమలాలు బీజాక్షరం కనపడేసరికి అమ్మ! నీకు మూలధార చక్రం యోగ పద్మం జాగృతి అయ్యింది.
రెండవ చక్రానికి సంబంధించిన స్వాధిష్ఠాన చక్రం గురించి చెబుతాను… అనేసరికి అలాగే స్వామి! అనేసరికి స్వాధిష్ఠాన చక్రం జాగృతి కోసం జలముద్రను లేదా వరుణ ముద్ర అనేది ఉపయోగిస్తారు… నువ్వు నీ శరీరానికి తగ్గట్టుగా జల ముద్ర అభ్యాసము చెయ్యి… దీనిని ఎలా చేస్తారు అంటే బొటనవేలుకి చిటికెన వేలి కొనను తాకిస్తూ…. మిగిలిన వేళలు నిటారుగా ముందుకు చాపు అని అనగానే కళ్ళు తెరిచి చూసి గోపాలస్వామి ఏ విధంగా అయితే చేశాడో….. ఆ విధంగా తను చేయడం ఆరంభించింది. ఒక 20 నిమిషాల పాటు ఈ ముద్రను చేస్తూ ఉండేసరికి….. తనలో భావోద్వేగాలు తగ్గుతున్నట్టుగాను…. తన భావాలను వ్యక్తీకరణ చేసే విధంగా ఉన్నట్టుగాను అనిపించింది. ఆలోచన శక్తి పెరుగుతున్నట్లుగా అనిపించింది… తనలో కామకోరికలు ఉదృతమవుతున్నాయి అనే భావన అనిపించింది. అలాగే అనవసరమైన భావోద్వేగాలు తగ్గుముఖం పడుతున్నాయని..ఏదో తెలియని ఆనందం కలుగుతున్నట్టుగా భావాలు కలిగేసరికి యధావిధిగా ఇవన్నీ గోపాలస్వామికి చెప్పేసరికి …..ఇవన్నీ కూడా ఈ జలముద్ర అభ్యాసం వలన కలిగే ఉపయోగాలు అనేసరికి…..అవునా స్వామి! అని అనుకుంటూ ఉండేసరికి స్వాధీష్ఠాన చక్రం కనబడటం మొదలుపెట్టింది. స్పష్టంగా చూడటం జరిగింది .. స్వామి! నాకు ఇలా కనపడుతుంది అనేసరికి మంచిది తల్లి అని ….
ఇప్పుడు మూడవ చక్రమైన మణిపూరక చక్రం . ఇది బొడ్డు స్థానంలో ఉంటుంది. ఈ మణిపూరక చక్ర జాగృతికి చాలామంది సూర్యముద్ర ఉపయోగిస్తారు. కొంతమంది అగ్నిముద్ర ఉపయోగిస్తారు. కొంతమంది రుద్ర ముద్రను ఉపయోగిస్తారు. మీ శరీరానికి తగ్గట్టుగా సూర్య ముద్ర ఉపయోగపడుతుంది. మణిపూరక చక్రం అనేది అగ్ని తత్వానికి సంబంధించింది. అదే స్వాధిష్ఠాన చక్రం అనేది జలతత్వానికి సంబంధించింది.నువ్వు స్వాధిష్ఠాన చక్రంలో జలం మీద నీకు ఆధిపత్యం వస్తుంది. అదే మణిపుర చక్రంలోకి వచ్చేసరికి అగ్ని నిన్ను నాశనం చేయలేదు… నిన్ను కాల్చలేదు… అగ్ని మీద నీకు ఆధిపత్యం వస్తే అగ్నిని నీకు నచ్చినట్టుగా సృష్టించగలవు. సృష్టి నాశనానికి ఉపయోగించగలవు….అగ్నితో దహనం అవ్వాలన్నా దహనం కాలేవు. ఎందుకంటే నీ శరీరమే అగ్నితత్వాన్ని పొందుతుంది అని చెప్పేసరికి….అది విని ఊరుకుంది. ఆ తర్వాత ఈ మణి పూరక చక్రం జాగృతి కోసం ఆ సూర్యముద్ర ఎలా చేయాలని చెబుతున్నాను …జాగ్రత్తగా చూసుకో! అని ఇప్పుడు బొటనవేలుని తీసుకొని బొటనవేలు అడుగుభాగం లో నీ ఉంగరం వేలుని మడిచిపెట్టు అని ఆయన చూపించేసరికి…. తను కూడా అలాగే చేసింది. అలా 20 నిమిషాల పాటు ఆ ముద్రలో ఉండేసరికి ఆకలిని పెంచుతున్నట్లుగా అనిపించింది. లివర్ కదులుతున్నట్లుగా అనిపించింది. తనలో ఆలోచనలు విపరీత భావాలు తగ్గుతున్నట్లుగా అనిపించింది. తనకేదో వ్యక్తిగత గుర్తింపు రావాలి అని తపన తాపత్రయం పడుతున్నట్టు అనిపించింది. తనలో ఎనలేని ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తీ పెరుగుతున్నట్టుగా గమనించింది. ప్రేరణ శక్తి పెరుగుతున్నట్లుగా అనిపించింది. ఆత్మ విశ్వాసం పెరుగుతున్నట్లుగా అనిపించింది. ఈ భావాలన్నీ కూడా చెప్పేసరికి ఇవి సూర్యముద్ర అభ్యాసం చేయడం వలన వస్తాయని చెప్పేసి….. మణిపూరక చక్రం నాభి స్థానంలో స్పష్టంగా కనిపించేసరికి…. అమ్మాయి! నీకు ఈ చక్రం కూడా జాగృతి అయ్యింది.
ఇప్పుడు వక్షస్థలం మధ్యలో ఉన్న అనాహత చక్ర జాగృతి కోసం వాయుముద్రను నీకు అభ్యాసం చేయడం నేర్పిస్తాను. ఇందులో ఇక్కడికి వచ్చేసరికి నీ శరీరానికి తగ్గట్టుగా వాయుముద్ర ఉపయోగపడుతుంది. చాలామంది ఇక్కడ అంజలి ముద్ర కూడా చేస్తారు. వాయు ముద్ర నీకు శరీరానికి సరిపోతుంది. ఈ వాయుముద్ర అభ్యాసం చేయడం వలన…. నీకు గాలి మీద అంటే వాయువు మీద ఆధిపత్యం వస్తుంది. గాలి వానను సృష్టించగలవు. వాయువు నిన్ను ఏమీ చేయలేదు.. సుడిగుండాల మధ్యలో నువ్వు చిక్కుకున్నా కూడా నిన్ను ఏమీ చేయలేవు. గాలి సుడిగుండాలు సృష్టించగలవు. ఏదైనా చేయగలవు…వాయువుతో నువ్వు ప్రకృతిలో మార్పులను తీసుకురాగలవు… అనేసరికి విని వినట్టుగా అవునా స్వామి! అని పట్టించుకోనట్లుగా ఉన్నది. ఆ తర్వాత ఈ వాయుముద్ర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడు. బొటనవేలుతో చూపుడువేలు కొనను తాకి ఉంచు. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా చాచి ఉంచు అనగానే…. అలాగే స్వామి అని బొటనవేలు తో చూపుడు వేలును అణిచిపెట్టి ఉంచింది. అప్పుడు ఈ ముద్ర చేస్తున్నప్పుడు కొనలు ఒక ముద్ర లో ఉంటాయి…. ఇంకొక ముద్ర లో వేలు ఇంకొక వేలు మీదకు వస్తుంది అని అర్థం అయింది ఒకటి ఒంపు ముద్ర లాగా వస్తుంది. ఈ తేడాలు గుర్తుపెట్టుకోవాలని మనసులో అనుకుంటూ…. ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసిన తరువాత….. తనలో శరీరంలో ఉన్న అధిక గాలి అపాన వాయువుగా బయటికి పోతున్నట్టుగా గ్రహించింది. అర్థం చేసుకుంది. అంటే చెడుగాలి పోతుంది. అంటే కీళ్ల నొప్పులు తగ్గుతున్నట్లుగా అనిపించింది. పద్మాసనంలో కూర్చోవడం వలన ఇందాక నుంచి కీళ్ల నొప్పులతో బాధపడుతుంది. ఆ నొప్పులు తగ్గుముఖం పడుతున్నాయని గ్రహించింది. ఆ తర్వాత మెడ నిటారుగా ఉండి ధృడత్వం కలిగినట్లుగా నొప్పి తగ్గుతున్నట్లుగా గ్రహించింది. ఆ తర్వాత కడుపు,చెవి, కళ్ళు, చర్మం, జుట్టు, గోర్లు…. వీటికి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని…. చెప్పేసి ధ్యానంలో ఉన్నప్పుడు విపరీతంగా ఇబ్బందులు కలుగుతూ ఉండేదని …..ఇప్పుడు ఇబ్బంది పెట్టడం లేదు అని ….తగ్గుముఖం పడుతున్నాయని… చెప్పేసి ఆలోచన రావడంతో ఇదే విధంగా యధావిధిగా చెప్పింది. అమ్మా! ఈ వాయుముద్ర వల్ల ఇవన్నీ ఉపయోగాలు. అనాహత చక్రంలో శక్తి శక్తి జాగృతి అవ్వటం వలన నీకు వాయువు మీద ఆధిపత్యం కలుగుతుంది. ఈ వాయుముద్రకి జ్ఞానముద్రకి తేడా గమనించు. వాయుముద్ర వచ్చేసరికి బొటనవేలు కింద చూపుడువేలు పెట్టడం జరుగుతుంది. అదే ఆజ్ఞ చక్రంలో వచ్చే జ్ఞాన ముద్ర వచ్చేసరికి బొటనవేలు కొనను చూపుడు వేలుతో కలపడం జరుగుతుంది. ఈ తేడాను గమనించు తెలుసుకో! నువ్వు వాయుముద్ర చేయాల్సిన చోట జ్ఞానముద్ర చేసినా …..జ్ఞానముద్ర చేయాల్సిన చోట వాయుముద్ర చేసినా తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి నేను చెప్పిన విధివిధానంగా ఒక్కొక్క ముద్ర చేసుకుంటూ రావాలి . అంతేగాని ఆజ్ఞ చక్ర జాగృతి సమయంలో వాయు ముద్ర గాని వేశావంటే కొంప కొల్లేరు అయిపోతుంది…. నీ సాధన ఆగిపోయినట్టే. ఇక నువ్వు ముందుకు వెళ్ళలేవు… చక్రాల తో శక్తి జాగృతి విషయంలో శ్రద్ధ భక్తులతో ఉండు. ఈ ముద్రల విషయంలో శ్రద్ధ భక్తులతో ఉండు అనేసరికి నాకు అర్థమైంది స్వామి! ఇందాకే ఈ విషయం గ్రహించాను. ఇప్పుడు మీరు చెప్పారు. ఇది చాలా జాగ్రత్తగా శ్రద్ధ భక్తులతో గుర్తుపెట్టుకుని నేను ఈ ముద్రలన్నీ చేస్తాను… చూస్తూ ఉండండి…. ముద్రలతో నేనేమైనా తప్పుగా చేస్తూ ఉంటే… చెప్పండి సరి చేసుకుంటాను… నేనేం అనుకోను…. నువ్వు ఏదో అనుకుంటావని నేను అనుకోను… నేను చెప్పవలసింది చెప్పాల్సిందే… చేయాల్సిందే…లోటుపాట్లు ఉంటే చెప్పాల్సినవి ఏవైనా ఉంటే నేను మొహమాటం లేకుండా చెబుతాను. సాధనలో నేను చాలా స్పష్టంగా…ఖచ్చితంగా ఉంటాను. తప్పు చేస్తే నేను ఒప్పుకోను అని అనేసరికి…. అలాగే స్వామి! మీ ఇష్టం అనేసరికి…. ఇక అనాహత చక్రం తన వక్షస్థలంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసరికి ….మంచిదమ్మా ! ఇప్పుడు అనాహత చక్రం జాగృతి అయిందన్నమాట! ఇప్పుడు విశుద్ధ చక్రానికి వెళదాము.
ఈ విశుద్ధ చక్రంలో రెండు ముద్రలు ఉంటాయి. ఒకటి ఆకాశముద్ర , రెండు శూన్య ముద్ర అంటారు. ఈ విశుద్ధ చక్ర జాగృతి వలన ఆకాశముద్ర మీద పట్టు వస్తుంది. అంటే ఆకాశయానం చేయగలుగుతావు… అనేసరికి స్వామి! శ్రీశైలంలో ఘంట మఠంలో ఆకాశ శుద్ధికి ఏర్పాటు చేశారని అంటారు . అది ఇదేనా….? ఈ ముద్రను అభ్యాసం చేయడం వల్ల ఈ శక్తి వస్తుందా? సిద్ధి వస్తుందా?
అంటే ఈ ముద్రణ సాధన చేయటం వలన అలాంటి సిద్ధి వస్తుంది . చక్ర జాగృతి జ్ఞానం లేని వాళ్ళ కోసం అలా పెట్టడం జరిగింది. దానికి ఆకాశ సిద్ధి వచ్చిందా లేదా అని సాధకులు స్వయంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ ఏర్పాట్లు చేశారు. సాధనలో సాధకులు ఆ సిద్ధికి ప్రయత్నం చేసే వాళ్ళు. ఎందుకంటే ఇదివరకు రవాణా సౌకర్యాలు ఏవి ఉండేవి కాదు కదా! కేవలం ఎడ్ల బండ్లు ఉండేవి. వాళ్ళు ఆయా క్షేత్రానికి వెళ్లడం అంటే…. కాటికి వెళ్లడం అన్నట్లు ఉండేది. అందుకోసం అని చెప్పేసి పక్షిలాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎగరాలని… ఆదిలో ఆది రుద్రుడు ప్రయత్నం చేశాడు. ఆకాశ సిద్ది పొందాడు. తద్వారా ఆకాశయానం భౌతిక సిద్ధి పొందడం జరిగింది. అది శ్రీశైలం ప్రాంతంలో ఆదియోగి మొట్టమొదట సిద్ధి పొందడం జరిగింది. కానీ ఏ విధంగా ఎలా సిద్ధి పొందాడు అనేది మనకి గంటా మఠంలో శిలాశాసనం ద్వారా చెప్పడం జరిగింది. అది నిజమేనమ్మా! ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించారు.. దానికి కూడా అర్హత ,యోగ్యత, యోగం ఉండాలి. నాలుగు చక్రాలు అధీనం అయినవాడికి… విశుద్ధ చక్రం ఆధీనం చేసుకోవాలనుకున్న వాడికి మాత్రమే ఆ సిద్ధి వస్తుంది. అంటే మొదటి నాలుగు చక్రాలు అధీనం చేసుకోకుండా….దాని గురించి ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వచ్చి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. తద్వారా నయం కానీ రోగాలతో అర్ధాంతర మరణాలు పొందవలసి ఉంటుంది. ఎంతో మంది ప్రయత్నం చేసి అలా రోగాల బారిన పడ్డారు…. అనేసరికి పరమహంస మేనమామ ఈ కారణం చేతనే కిడ్నీల వ్యాధితో మరణం పొంది ఉండవచ్చు అని ఆలోచన రావడంతో….. అమ్మ! నువ్వు పరపురుషుల గురించి….. వేరే ఆలోచనలు ఇప్పుడు చేయవద్దు. ముందు శ్రద్ధ భక్తులతో చక్రాల ముద్రల మీద శ్రద్ధ పెట్టు…. అనేసరికి ఈ లోకానికి వచ్చి క్షమించండి స్వామి! యథాలాపంగా ఆలోచన వచ్చింది. విశుద్ధ చక్రం ఆకాశముద్ర ఎలా చేయాలో చెప్పండి…అనేసరికి బొటనవేలు కింద భాగంలో మధ్య వేలు నిటారుగా పెట్టి ఉంచు. మిగిలిన వాటిని నిటారుగా ముందుకు చాపు అనేసరికి శివ నందిని కూడా అలాగే చేసింది. కొంతసేపటికి గొంతు సమస్యలు, చెవి సమస్యలు తగ్గుతున్నట్లుగా అనిపించింది. తనలో బహిరంగంగా మాట్లాడే భయం తొలుగుతున్నట్లుగా అనిపించింది. భావవ్యక్తీకరణ చేసే మనోధైర్యం వచ్చినట్లుగా ఉన్నది. ఆలోచనశక్తి భావవ్యక్తీకరణ శక్తి పెరుగుతున్నట్లుగా అనిపించింది. ఆలోచనలు జ్ఞాన స్ఫురణలు,అర్థాలు, పరమార్ధాలు, క్షణకాలం తెలుస్తున్నట్టుగా అనిపించింది. స్వామి ! నాకు ఇలా అనిపిస్తుంది అనగానే….. తన గొంతు భాగంలో కూడా విశుద్ధ చక్రం స్పష్టంగా కనిపించేసరికి గోపాలస్వామికి ఇదే విషయం చెప్పేసరికి అయితే విశుద్ధ చక్రం కూడా శక్తి జాగృతి అయ్యింది తల్లి …ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి వెళదాము…
ఈ ఆజ్ఞ చక్రము బొట్టు పెట్టుకునే భ్రుకుటి స్థానంలో ఉంటుంది. ఇది కాశి క్షేత్రానికి సూచిస్తుంది. దీనికోసం అని జ్ఞానముద్ర అని అంటారు. నీ శరీరానికి జ్ఞానముద్ర సరిపోతుంది కాబట్టి ఈ జ్ఞానముద్ర ఎలా చేయాలో జాగ్రత్తగా చూడు. ఈ జ్ఞానముద్ర ఇంచుమించు వాయు ముద్ర లాగానే ఉంటుంది …..కాకపోతే దానికి దీనికి తేడా ఉంటుంది . ఈ బొటనవేలును చూపుడువేలు కొనతో కలిపి ఉంచి మిగిలిన వాటిని నిటారుగా ముందుకు చాచు….. అనేసరికి ఆ..! తేడా తెలిసినది స్వామి! వాయుముద్రంలోనేమో బొటనవేలు కింద చూపుడువేలు ఉంచుతాము.ఇక్కడేమో ఈ జ్ఞానముద్రలో బొటనవేలు కొనను చూపుడువేలు కొనను కలుపుతాము… అర్థం అయ్యింది… ఇసుమంత తేడా.. అందుకేనా? మీరు గురువుల సమక్షంలో అభ్యాసం చేయాలి అన్నారు. మీరు చెప్పింది నిజమే…. పుస్తక జ్ఞానం …..శబ్ద పాండిత్యం ద్వారా తెలుసుకుంటే ఈ జ్ఞానం తెలిసేది కాదు…. అనుకొని ఈయన ఏ విధంగా అయితే చేశారో…. ఆ విధంగా చేసింది. అలా 20 నిమిషాల పాటు ఉండేసరికి అమ్మ! ఈ ఆజ్ఞా చక్రంలో జ్ఞాన ముద్ర పొందితే…. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం, విశ్వ రహస్యాలు తెలుసుకునే శక్తి వస్తుంది. కాలం మీద ఆదిపత్యం వస్తుంది. పంచభూతాలు నీకు ఆధీనమై నిన్ను అనుసరిస్తాయి…. అనేసరికి అవునా అని విని వినట్టుగా వదిలేసింది. వాటి గురించి పట్టించుకోలేదు…. ఆ తర్వాత తన మనోనేత్రం స్పష్టంగా తెరుచుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత తన శరీరంలోని అంతర్భాగాలు, ఎముకలు, నరాలు, స్పష్టంగా కనపడేసరికి…..మనోనేత్రం ద్వారా అంతర్ దృష్టిని చూసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించింది. ఆ తర్వాత విశ్వ రహస్య జ్ఞానాలు , మర్మ రహస్యాలు, జ్ఞానాలు, బ్రహ్మ జ్ఞానాలు, తత్వజ్ఞానాలు ఇలా పద్దెనిమిది రకాల జ్ఞాన తత్వాలు ఒక్కొక్కటిగా జ్ఞాన స్ఫురణ అందుతూ ఉండేసరికి…. విశ్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పెరుగుతుందన్నమాట! అని గ్రహించింది అని తనలో కలిగిన భావాలన్నీ చెప్పేసరికి…. అవును తల్లి! అనగానే నుదుటి భ్రుకుటి స్థానంలో ఆజ్ఞ చక్రంలో రెండు రేకులతో శివశక్తి స్వరూపం కనిపించేసరికి స్వామి! నాకు ఇలా కనపడుతున్నారు అంటే…..వాళ్లే కాశీ విశ్వనాథుడు, కాశీ విశాలాక్షి . ఈ ఆజ్ఞా చక్రానికి క్షేత్రం శివశక్తుల అధిపతి క్షేత్రం…. కాశీ క్షేత్రం అవుతుంది….అనేసరికి విశ్వానికి మూలం అజ్ఞచక్రం అన్నమాట! అని అనుకుంటూ ఉండేసరికి సరే తల్లి! ఇప్పుడు నీకు సహస్రార చక్రం జాగృతి గురించి చెబుతాను.
ఈ సహస్ర చక్ర జాగృతి వలన నీకు అంతరిక్షం మీద ఆధిపత్యం వస్తుంది. మూలాధార చక్రం వలన భూమి మీద ఆధిపత్యం వస్తే , సహస్రార చక్రం వలన విశ్వం మీద అంటే అంతరిక్షం ఉన్న సహస్ర నవగ్రహాల మీద విశ్వాధిలోకాన్ని కూడా అంటే సుమారుగా సహస్ర కోటి లోకాల మీద నీకు ఆధిపత్యం వస్తుంది. అక్కడ ఉన్న దైవము పైన ఆధిపత్యం వస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశ్వాధినేత నువ్వే అవుతావు. రాబోయే కాలంలో బ్రహ్మము నువ్వే అవుతావు…. అని చెప్పేసరికి విని విననట్టుగానే చూస్తూ ఉంది. సరే స్వామి! అనేసరికి అమ్మ…. దీనికి ప్రాణముద్ర ,పద్మముద్ర , కమల ముద్ర అని మూడు రకాలైన ముద్రలు ఉంటాయి. ఈ మూడు కూడా వేరువేరుగా చేయడం జరుగుతుంది. మీ శరీరానికి తగ్గట్టుగా ప్రాణముద్ర వెయ్యి. సహస్ర చక్ర జాగృతికి ఉపయోగపడుతుంది. సరే స్వామి! మీ ఇష్టం అంటే ఏ శరీరానికి ఏ ముద్ర సరిపోతుంది అనేది మీలాంటి ముద్ర సాధన పాండిత్యం ఉన్న గురువులకు మాత్రమే తెలుస్తుంది అన్నమాట! కాబట్టి ఇవి గురువుల సమక్షంలోనే నేర్చుకోవడం చాలా మంచిది. ఉత్తమమైనది…. మన శరీరానికి తగ్గట్టుగా ముద్రలు ఉంటాయి… ఇప్పుడు సహస్ర చక్ర జాగ్రతికి మూడు ముద్రలలో ఏముద్ర అయినా చేయవచ్చు…. కానీ మన శరీరానికి తగ్గట్టు చేస్తేనే సహస్ర చక్రం జాగృతి అవుతుందన్నమాట! అనేసరికి అమ్మ నీలో తేడా గమనించావా….. నీలో జ్ఞానం సహజ సిద్ధంగానే వస్తుంది.. నేను చెప్పకుండానే తెలిసిపోతుంది…
జ్ఞానముద్ర వలన నీకు క్షణకాలంలోనే ఎంతటి ఫలితం ఇస్తుందో చూడు…. అదే నువ్వు రోజు ఈ ముద్రలన్నీ రోజుకి 20 నిమిషాల పాటు నువ్వు చేస్తూ ఉంటే నీకు ఎంతటి ఫలితం వస్తుందో నువ్వే ఆలోచించు. రోజుకి మూడు గంటలు దీనికి కేటాయించగలిగితే….. నీకు సాధనలో గురువు సహాయ, సహకారాలు అందుతూనే సప్త చక్రాలు జాగృతి అవుతాయి… అని చెప్పేసి అనేసరికి అంతా మీ అనుగ్రహం స్వామి! నాదేముంది… మీరు చెప్పినట్టుగా చేయటమే… అనేసరికి ఇప్పుడు ఈ ప్రాణముద్ర ఎలా చేయాలో, చెబుతాను చూడు బొటనవేలు కొనకి ఉంగరము వేలు మరియు చిటికెన వేలు కొనలను తాకిస్తూ….మిగిలిన వేళ్లను నిటారుగా ముందుకు చాపు అనేసరికి…. ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసింది. ఈ ముద్రలలో ఈ రెండు వేల కొనలను తాకటం జరిగింది. మిగిలిన వాటిలో ఒక వేలు కొనను మాత్రమే తాకటం జరిగితే…. ఈ ముద్రలో 2 వేళ్ల కొనలను తాకటం జరిగింది అని…. ఆ తేడాను గ్రహించి…. ఆయన చూపించిన విధంగా తను చేయడం జరిగింది. 20 నిమిషాల తర్వాత కుండలినీ శక్తి ప్రవాహం అన్నీ చక్రాలలో సహస్రార చక్రం అంటే గుదస్థానం నుంచి మెదడు దాకా కుండలినీ శక్తి ఒక పాము రూపంలో ఒక ఆకారంలాగా మెలికల తిరుగుతూ…. జేగురు రంగులో ఒక శక్తి ప్రవహిస్తున్నట్టు అనుభవం అనుభూతి అందింది. ఇదే అనుకుంట కుండలనీ శక్తి ప్రభావం సప్త చక్రాలలో జాగృతి అవ్వటం వలన మూలాధారంలోని నిద్రావస్థలో ఉన్న ఈ కుండలినీ శక్తి పైకి ప్రవహిస్తూ రావడం జరిగింది. అంటే ప్రాణముద్రతో ఇది సాధ్యపడుతుందన్నమాట! తద్వారా శరీరానికి ఉన్న మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి….. శరీరానికి బలాన్ని ఇస్తున్నట్టు అనుభవ అనుభూతిని పొందడం జరిగింది. అలాగే విశ్వం యొక్క అంతరిక్షం లీలామాత్రంగా కనిపించేసరికి… ఓహో! ఇది విశ్వశక్తికి అనుసంధానం చేస్తుంది. మనలో ఉన్న కుండలినీ శక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తికి అనుసంధానం చేస్తుందని గ్రహించింది. ఆ తర్వాత ఆలోచనలో స్పష్టత కనబడింది. స్థిరమైన ఆలోచనలతో, నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిస్తోందని….తనలో కలిగిన ఆలోచన భావాలను యధావిధిగా చెప్పేసరికి….అదేనమ్మా! అనేసరికి తను మెదడు భాగం వెయ్యి కమలాలతో విచ్చుకున్నట్టుగా….. ఒక కమలం వెయ్యి రేకులతో విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేసరికి ఒక్కసారిగా శక్తి ప్రవాహం అందులోకి ప్రవేశించడం…….. ఆ తర్వాత ఆ శక్తి కొద్ది క్షణాలపాటు ఉండేసరికి….ఏదో తెలియని తన్మయత్వ….బ్రహ్మానంద స్థితిలో స్పృహ లేని స్థితిలో ఆమె వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్ళిపోయేసరికి….. గోపాలస్వామి మౌనం వహించాడు. ఆ ఆనందం తట్టుకోలేని స్థితిలో ఉంది. మాటల్లో చెప్పలేని స్థితికి వెళ్ళిపోయింది . బ్రహ్మానందం అనుభవిస్తున్నట్టుగా తన కళ్ళ ముందు ధ్యానంలో విశ్వం మొత్తం కనిపించేసరికి ఖగోళాలు, నక్షత్రాలు, కనపడుతూ ఉండేసరికి అంతరిక్షం కళ్ళ ముందు ఉందా! అని బయోస్కోప్ పెట్టి చూస్తే ఎలా కనబడుతుందో… స్పష్టంగా ధ్యానంలో కనపడేసరికి సూర్యుడు, నవగ్రహాలు, నవగ్రహాల గమనం కనబడుతూ…. పాల పుంతలు కనపడుతూ అంతరిక్షంలో ప్రతి రేణువు కనపడుతూ ఉండేసరికి…. నక్షత్రాలు, గ్రహ మండలాలు, లోకాలు, దేవతా లోకాలు అన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉండేసరికి….. ఆ ఆనందమును తట్టుకోలేని పరిస్థితికి వెళ్లిపోయింది. చెప్పలేని అలవికానీ స్థితికి వెళ్ళిపోయింది. మాటల్లో వర్ణించలేని స్థితికి వెళ్ళిపోయింది. అలా ఎంత కాలం ఉందో తెలియలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి… గోపాలస్వామి అక్కడ కనిపించలేదు. అక్కడే ఉన్న రుద్రస్వామిని చూస్తే అతని ధ్యానంలో ఉన్నాడు. గోపాల స్వామికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పి…. ఆయన చెప్పిన విధివిధానంతోనే చేతి ముద్రలను సాధన ఒక్కొకటిగా గుర్తుపెట్టుకుంటూ ఒకటవ ముద్ర నుంచి చివరి ముద్ర వరకు అభ్యాసం చేస్తూ మనసులో ముద్రలు గుర్తుపెట్టుకుంటూ అలా ఉండిపోయింది. అలా వీరిద్దరూ ఎంతసేపు ఉన్నారో తెలియలేదు. ఉన్నట్టుండి తనని ఎవరో గమనిస్తున్నారు అనిపించేసరికి ….శివ నందిని అలాగే రుద్ర స్వామి కళ్ళు తెరిచి చూశారు.
రుద్ర స్వామికి, శివ నందినికి ఒకేసారి ధ్యానభంగం అయ్యేసరికి…. ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచారు. తమకి ధ్యాన భంగం కలిగించింది ఎవరు అని చుట్టూ చూశారు? ఏమీ కనిపించలేదు… ఇంతలో ఏదో కదులుతున్న శబ్దం శివ నందిని చెవులకు అందింది. కళ్ళు విప్పార్చి చూసేసరికి గోపాలస్వామి కూర్చున్న రాయి మీద ఒక పాము కనిపించింది. రుద్ర స్వామి కేసి చూస్తూ మౌనంగా సైగ చేసేసరికి ఏమిటి? అంటే ….గోపాలస్వామి బండ వైపు చూసేసరికి సుమారుగా 100 అడుగులు ఉంటుందేమో అనిపించేటట్టుగా ఉంది. శ్వేత వర్ణంలో ఉన్న దేవతాపాము లాగా అనిపించింది …..ఎందుకంటే ఈ పాము పడగవిప్పి పైకి ఎత్తేసరికి సుగంధ వాసనలు రేగి ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇలా దేవతాపాములకు మాత్రమే ఉంటుంది. సుమారు 100 సంవత్సరాలు వయసు దాటిన పాములకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మానవమాత్రులు చూడకుండా…. మానవ స్పర్శ తెలియకుండా ఒక పాము 100 సంవత్సరాలు బతికితే….దానికి దైవత్వం వస్తుందని చెప్పేసి సర్పశాస్త్రంలో చెప్పడం జరిగింది. … అని రుద్రస్వామి మనసులో అనుకున్నాడు. ఆ సర్పం కంఠంలో ఒక మణి మెరుస్తున్నట్లుగా అనిపించింది. అది చూస్తే…. అప్పుడు రుద్రస్వామి నిజానికి ఇదే నాగమణి అనుకుంటాను…. అందరూ నాగమణి తల మీద ఉంటుంది అనుకుంటారు. కానీ కంఠంలో ఉంటుందన్నమాట! ప్రత్యక్షంగా చూడటంతో కృతజ్ఞతగా పాముకి నమస్కారం చేస్తూ ఉండేసరికి…. మణి యొక్క కాంతి వీళ్లిద్దరి మీద ట్యూబ్లైట్ కాంతి లాగా పడుతూ ఉండేసరికి కళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది. శివ నందినికి ఇది నాగమణి అనుకుంటా! దీని కంఠంలో ఉన్నది అని అనుకోని దేవతా సర్పం అయి ఉంటుందని చెప్పేసి దానికి కృతజ్ఞత పూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉండేసరికి….ఆపాము కాస్త ఏకతల ఉన్న పాము కాస్త….తల విదిలించేసరికి ఏడు తలల పాముగా కనిపించేసరికి… వీళ్ళు ఆశ్చర్య ఆనందానికి గురయ్యారు.
అంటే 7 తలల పాము అనేది ఉండడం సత్యం అన్నమాట! అంటే ఈ అడవుల్లో గుప్తంగా ….గుప్త శరీరంతో ఏడు తలలో పాములు ఉంటాయా అని అనుకుంటూ ఉండేసరికి….. ఈ ఏడు తలలు కాస్త అనేక తలలుగా లెక్కలేని తలలుగా మొత్తం కొండంత ఆవరించినట్టుగా కనిపించేసరికి….. అంటే సహస్ర తలలు సుమారుగా ఉండే సర్పము అనుకుంటా! అని ఈ పాము యొక్క విశ్వరూపాన్ని చూసి…. స్వామి! మీ విశ్వరూపాన్ని చూసి తట్టుకోలేక భయం వేస్తుంది. ఈ శేషాద్రి పర్వతం మీద నువ్వు నిజ శరీరంతో…. నువ్వు భౌతికంగా ఉన్నావని మాకు అర్థం అయింది. యధా స్థానంలోకి …..మామూలు స్థితికి వస్తే మేము భయపడకుండా ఉండగలుగుతాము. లేదంటే మా పై ప్రాణాలు పైనే పోతాయి అని శివ నందిని మరియు రుద్ర స్వామి మనసులో అనుకునేసరికి…. కొన్ని క్షణాల పాటు ఉగ్రరూపంలో ఉన్న వెయ్యి తలల సర్పం కాస్త ఏడు తరాల సర్పంగా మారి ఆ తర్వాత ఏకతల సర్పంగా మారింది. కారణం లేకుండా కార్యం ఉండదు స్వామి….. మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియదు. ఈ శేషాద్రి పర్వతం మీద మీరు ఆవాసం చేస్తున్నారని అయితే మాకు దర్శనం అయ్యింది…. అనేసరికి పాము నోట్లో నుంచి ఒక దివ్యమైన కాంతి శివ నందిని మీద పడేసరికి పాము యొక్క శక్తి కాంతి మార్గం ద్వారా తనలోకి ప్రవేశిస్తుందని గ్రహించేసరికి….. స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆ పాము అదృశ్యమై పోయింది. ఇప్పుడు అసలు సిసలైన కుండలినీ శక్తి జాగృతి అయ్యింది. ఈ పిల్లకి…. ఆదిశేషుని నాగశక్తి ఈమె శరీరంలోకి ప్రవేశించింది. శక్తి ప్రవాహం జరుగుతుంది . అది తట్టుకోలేక ఈ పిల్ల పడిపోయింది అని చెప్పేసి దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్ లో నుంచి నీళ్లు చల్లేసరికి…. కళ్ళు తెరిచి రుద్రయ్య! నేను ఎందుకు పడిపోయాను…. అనేసరికి పాము నాగు రూపంలో ప్రవేశించింది. ఆ నాగశక్తిని నువ్వు తట్టుకోలేకపోయావు… అంటే ఇప్పుడు నా శరీరంలో పాము ఉందా? అంటే పాము ఉండటం కాదు ఇప్పటికే కుండలినీ శక్తి పాము రూపంలో ప్రతివాడి శరీరంలోనూ ఉంటుంది. అది తన శక్తితో జాగృతి చేసింది. ఆ పాము శక్తి స్వరూపంగా శక్తి జాగృతి చేసింది. ప్రత్యక్షంగా ఆదిశేషుడే నీకు శక్తి జాగృతి చేసి తన సహాయ సహకారాలు అందించాడు….. అని అనేసరికి ధన్యోస్మి! అనుకుని ఆదిశేషుడు లేడా అనేసరికి లేడమ్మా …..ఆయన వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆయన వెళ్లిపోయాడు. నువ్వు ఎక్కడ భయపడతావో అని పరీక్ష పెట్టాడు. భయపడకపోయేసరికి తన శక్తిని ఇచ్చి వెళ్లిపోయాడు. అదేంటి విశ్వ రూపం చూసే కదా మనం క్షణకాలం భయపడ్డాము…. అంటే విశ్వరూపం చూసి నువ్వు ఇదయ్యావు…. పాము ఎక్కడ కాటు వేస్తుందో…. అని భయపడలేదు కదా! ఒకవేళ కాటు వేసేలా ఉన్నా….కాటు వేయడానికి నువ్వు స్థిరంగా ఉన్నావని …. మనసు బలంగా సంకల్ప ఆలోచనతో ఉంది. పాము కాటుకు నువ్వు భయపడట్లేదు.. పాము విశ్వ రూపానికి భయపడ్డావు. ఏకతలగా ఉన్నప్పుడు భయపడలేదు…. సహస్ర తలతో పాముగా విశ్వరూపం చూపించేసరికి…. నువ్వు కంగారు పడ్డావు. అది భయం కాదు. పాము కాటుకు భయపడినట్లైతే….. ఆయన బుసలకి నువ్వు భయపడినట్లయితే ….నీ సాధన ఆగిపోయేది.
ఇక్కడితో మన వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం…. నువ్వు ఎప్పుడైతే ఆ భయాన్ని దాటావో…. ఆ భయరాహిత్య స్థితి పొందావో …..మౌనంగా తన శక్తిని ఇచ్చేసి వెళ్లిపోయాడు…. అనేసరికి రుద్రయ్య అసలు ఏమనుకోవద్దు…. సాధనలో నిల్చున్నా కూర్చున్నా కూడా తప్పే అంటే ఎలాగూ.! ప్రతిదీ మాయా ….ప్రతిదీ పరీక్ష అంటే ఎలాగూ ! ఎలా చచ్చేది….. సాధకుడికి ఏది మాయ? ఏది పరీక్ష అనేది ఎలా తెలుస్తుంది. ఏదో నాకు అదృష్టం బాగుండి….మచ్చ ఉండి….. ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. నాకు అసలు ఏం జరుగుతుంది…. ఎలా జరుగుతుంది… ఏం మాట్లాడుతున్నానో…. నాకే అర్థం కావటం లేదు అని అంటే…… అది మాయ అని తెలిస్తే మాయ మాయమైపోతుంది కదా! మాయ అని తెలియనంత వరకే మాయ వెంటపడుతుంది….నువ్వు ఇది మాయ అని తెలుసుకున్నావు అనుకో…. ఆ మాయ ఉండదు…. తెలుసుకునే లోపల నిన్ను నువ్వు నిగ్రహించుకొని….. నువ్వు మనస్సుని నిగ్రహించుకోగలుగుతున్నావు… మాయ ఏంటి అనేది? నీ ఆత్మకు తెలుసు. భయపడాలా భయపడకూడదా…. అనేది నీ ఆత్మకు తెలుసు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? నీ బుద్ధికి జ్ఞానమును అందిస్తుంది… ఆ బుద్ధి ఏం చేస్తుంది? వివేక బుద్ధితో ఆలోచిస్తుంది… అది నీ మనసుకు అందిస్తుంది….నీ మనసు స్థిరమైతే మాయను చేదించగలవు. మనసు అస్థిరమైతే నువ్వు మాయలో పడిపోతావు. అందుకని మనస్సు స్థిరపరచుకోవడానికి ధ్యాస ధ్యానం మీద పెట్టాలి. ధ్యానం మీద నువ్వు నిలపగలిగితే అప్పుడు నీ పంచ ఇంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి అది జ్ఞానం అందిస్తుంది. తద్వారా నీ శరీరం భయపడకుండా నిలబడుతుంది. అప్పుడు నీవు మాయని దాటేస్తావు…. ఆ తర్వాత నీకు తెలుస్తుంది… అది మాయ పరీక్ష అని చెప్పి తద్వారా మాయ మాయమవుతుంది…. అని చెప్పేసరికి…. ఇదంతా నాకు అర్థం కావడం లేదు. ఏదైనా కానీ ఒక్కొక్క పరీక్ష ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది పరీక్ష…. ఏది మాయో అనేది మానవ మేధస్సుకి అర్థం కాదు…. అర్థం అయ్యేసరికి అది మాయ అని తెలిసేసరికి… అది దాటా లేదా దాటానా అనేది తెలుస్తుంది . ఒకవేళ నేను ఈ పాము కాటుకి భయపడి ఉంటే… నేను చచ్చిపోయేదాన్ని. మాయలో పడిపోయాను…. పునః జన్మలకు వెళ్లిపోవాలి…. నేను పాముకాటుకి భయపడలేదు కాబట్టి…. పాము ఆకారానికి భయపడ్డాను కాబట్టి….. పాము నాకు ఆధీనమై తన శక్తిని నాకు ఇచ్చి వెళ్లిపోయింది.. అని నాకు అర్థం అవుతుంది… అనేసరికి పదయ్యా! ఇప్పటికే సమయం మించిపోయింది… మనం నీలాదేవి భక్తురాలు ఉన్న నీలాద్రి పర్వతానికి వెళ్ళాలి …ఇక్కడే మనం ఆరంభ కొండలోనే ఉన్నాము. ఇంకా కొండలు దాటవలసి ఉంటుంది అనేసరికి…. సరే తల్లి ! పద….ఆవిడ ఏం పరీక్షలు పెడుతుందో ఎవరికి ఎరుక…. సాధన చేసుకుంటూ వెళ్ళిపోదాము …. మాయలో పడతామా …? మాయలు దాటతామా అనేది మన అర్హత, యోగ్యతను బట్టి కాలమే నిర్ణయిస్తుంది…. ఆ ఈశ్వరుడే నిర్ణయిస్తాడు…. మనలో స్వార్థం లేనంతవరకు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు…. దేనికి ఆశ పడాల్సిన అవసరం లేదు…. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు…. అని అనేసరికి సరే పదండి అయ్యా అంటూ నీలాద్రి పర్వతం కేసి వెళ్లడం ఆరంభించారు.
శివ నందిని రుద్ర స్వామి రెండవ పర్వతమైన నీలాద్రి పర్వతమునకు ఎక్కడం ఆరంభించారు.ఇంతలో శివ నందినికి ఒక ధర్మ సందేహం వచ్చింది….
శివ నందిని:- అయ్యా ! ఈయన సప్త చక్రాలు మాత్రమే జాగృతి చేశాడు కదా! మనకి 13 చక్రాలు ఉన్నాయి కదా! మిగతా ముద్రలు చెప్పలేదు. మిగతా 6 చక్రాలకి ముద్రల గురించి ఎవరు చెప్తారు? ఏమిటి? …..
రుద్ర స్వామి:- అమ్మ! శబ్ద పండిత్యం ప్రకారం మనకి సప్త చక్రాలు, సప్తదేహాలు ఉన్నాయని తెలిసింది. అదే అనుభవ పాండిత్యం ప్రకారంగా చూస్తే…. మనలో 13 చక్రాలు 13 దేహాలకి మోక్షం పొందడం జరుగుతుందని అజ్ఞాన గ్రంధిలో రెండు దేహాలు మిగతా వాటిలో 11 దేహాలు ఉంటాయని అవి మోక్షం పొందుతాయని చెప్పడం జరిగింది. ఇందులో ఆజ్ఞ చక్రంలో నాలుగు ఉపచక్రాలు ఉన్నాయి కదా! అవి కర్మ ,కాల, బ్రహ్మ,గుణ చక్రాలు కదా! ఇవి ఆజ్ఞ చక్రంలో ఉపచక్రాలు కాబట్టి ఆజ్ఞ చక్రంలో జాగృతిలో ఉపయోగించే జాగృతిని దీని అభ్యాసం చేస్తే ఈ నాలుగు ఉపచక్రాలు కూడా జాగృతి అవుతాయి. కాబట్టి నాలుగు ఉపచక్రాల గురించి ఆలోచించలేదు. మిగిలిన రెండు చక్రాల గురించి అంటే హృదయ చక్రము, బ్రహ్మ రంధ్రం జాగృతి గురించి ఎలాంటి ముద్రలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన శబ్ద పాండిత్యంలో సప్త చక్రాల వరకే ముద్రలను చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ముద్ర సాధనలు అంతవరకే ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానమునే ఆయన పొందడం జరిగింది. ఈ రెండు చక్రాలు జాగృతి అవ్వాలంటే…. సహస్ర చక్రం నుంచి జీవనాడి మార్గం ఉంటుంది. ఈ జీవనాడి అధిపతి అధిష్టానదైవం ఆంజనేయస్వామి అని చెప్పేసి మన పరమహంస గారు చెప్పారు కదా! పరమహంస గారు హనుమ అంశ అని చెప్పడం జరిగింది కదా ! హనుమంతుని అనుగ్రహం పొందితే….హృదయ చక్రం ఆ తర్వాత బ్రహ్మరంధ్రం అనుసంధానంగా బ్రహ్మనాడి ఉంటుంది . దీనికి అధిష్టాన దైవం ఉగ్ర నరసింహ స్వామి ఉంటారు. ఆ తర్వాత అమ్మవారిగా నరసింహస్వామి అంశయన ప్రత్యంగిరా మాత ఉంటుందని చెప్పడం జరిగింది కదా! వీరి అనుగ్రహం పొందితే …..మనకి బ్రహ్మ రంధ్రం జాగృతి, శుద్ధి ,ఆధీనం అన్నీ అవుతాయని తెలుస్తుంది. కాబట్టి వీటికి అభ్యాసం ముద్రలతో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే జీవనాడికి దేవతా అనుగ్రహమైన హనుమంతుడు నరసింహస్వామి అనుగ్రహం పొందితే సరిపోతుంది. దానికి వాళ్లే పరీక్షలు పెడతారు….ఆ పరీక్షలు మాయలు మనం తట్టుకోవాలి. ఇప్పుడు సహస్ర చక్రం దాకా సాధన పరిసమాప్తి చేసుకున్న తర్వాత….. ఏం జరుగుతుందనేది దైవాధీనం….కాలానికే వదిలేద్దాం. ఈశ్వరాజ్ఞ …
శివ నందిని:- సరే రుద్రయ్య నువ్వు చెప్పినట్టే సర్వస్య శరణాగతితో….శ్రద్ధ భక్తితో గోపాలస్వామి చెప్పిన చేతి ముద్రల అభ్యాసమును శ్రద్ధగా జాగృతితో చేయడం ఆరంభిస్తాను. ప్రతిరోజు ఒక్కొక్క ముద్రను కూడా 20 నిమిషాల కేటాయిస్తే సరిపోతుంది. ఒక మూడు గంటల పాటు అభ్యాసం చేస్తే సరిపోతుంది .
రుద్ర స్వామి:- ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి ఆ సమయాన్ని నీ దినచర్యలో దైవధ్యానంతో పాటుగా…. ఈ ముద్రల సాధన కూడా చేసుకుంటూ ఉండు. ఈ చక్రాలకు అనుగుణంగా అనుసంధానం అయితే …శారీరక , ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిస్తాయి. చక్రాలు బలహీన పడినప్పుడు ఏ ఆహారాలు తినాలి…. అనేది పరమహంస గారు మనకి యోగ దర్శనం పుస్తకంలో చెప్పడం జరిగింది. కాబట్టి చక్రాలు బలహీన పడినా కూడా… మనం ఈ ముద్రల సాధనలతో చక్రాలకి బలం చేకూర్చుకోవచ్చు… అలాగే ఆహార పదార్థాలు ఆ చక్రాలకు సంబంధించినవి తినటం వలన కూడా మనం బలం చేకూర్చుకోవచ్చు.
శివ నందిని:- సరే స్వామి! అన్నీ కూడా నేను మనసులో గుర్తు పెట్టుకుంటాను. ఒకవేళ ఏదైనా శరీర భాగానికి అనారోగ్య సమస్యలు వస్తే…. ఆ తత్వానికి ఏ చక్రం బలహీన పడుతుందో తెలుస్తుంది. అది తెలుసుకొని ఆ చక్రాన్ని బలపరచుకోవడానికి ఆహార పదార్థాలు అలాగే ఈ ముద్ర అభ్యాసం చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను..
రుద్ర స్వామి:- అవును తల్లి! మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు… భయపడాల్సింది ఏమీ లేదు… ఆ జ్ఞానం అంతా మనకి అందుబాటులో ఉంది. మనం సాధన చేయటమే ….అభ్యాసం చేయటమే… చేసుకుంటూ పోతూ ఉంటే జరిగేది జరుగుతూ ఉంటుంది. జరగనిది ఎన్నటికీ జరగదు. జరిగేదంతా మన మంచికే అని అనుకుంటూ వెళ్లిపోవాలి.. ఎక్కడ ఆగకూడదు …మనం అంతట మనం మాయలో పడిపోయి ఇక్కడ ఆగిపోవాలి. ఇక్కడే ఉండిపోయాము అనేదాకా సాధన గురించి ఆలోచించవద్దు… భయపడవద్దు… మాయలు వస్తూ ఉంటాయి… మాయలు పెట్టే వాళ్ళు వస్తూ ఉంటారు… వీటి గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు ఒక రకంగా కృష్ణ స్వామి మరియు యోగాంబిక గాని నీ సాధనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు..
శివ నందిని:- ఏం సహాయ సహకారాలు అందించారు స్వామి? ఆవిడ నన్ను త్రిశూలంతో పొడవడం సహాయం అందించడమా? ఆ తర్వాత కృష్ణస్వామి ఏమో …..శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు మెలికలు తిప్పేశాడు…. ఎంత నొప్పులు వచ్చాయో తెలుసా? భరించలేని నొప్పులు ఒకేసారి పదిమంది పిల్లలు కాన్పు అయితే ఎలా ఉంటుందో….అలా నాకు అనిపించింది. అసలు ఒక కాన్పు అవ్వడమే పునర్జన్మతో సమానం అలాంటిది. ఒక్కసారే పదిమంది పిల్లలు అంటే ఆలోచించు….. అసలు నాకు కృష్ణ స్వామి యోగాంబికని చూస్తుంటే గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి…
రుద్రస్వామి:- అమ్మ! ఒక రకంగా వాళ్ళు చేసింది తప్పులాగ కనపడుతుంది…. కానీ అందులో మంచి కూడా ఉంటుంది …కారణం లేనిదే ఈశ్వరుడు ఏ కార్యం చేయడు…ఈశ్వరుడు చేసే దాంట్లో చూడటానికి….తప్పులాగ కనపడుతుంది. అందులో కూడా మంచిని చూడాలి. ఆ మంచిని కూడా నువ్వు చూడగలిగితే స్థితప్రజ్ఞత అవుతుంది. మంచిలో ఎవరైనా మంచిని చూస్తారు… చెడులో కూడా మంచిదని చూడగలిగే స్థితిని నువ్వు పెంపొందించుకోవాలి. ఇప్పుడు కృష్ణస్వామి నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు…. తల తిప్పేశాడు, శరీర భాగాలు ఇష్టం వచ్చినట్లు వంపు చేశాడు, విపరీతమైన నొప్పులతో బాధపడ్డావు అన్నావు కదా! ఆయన ఏం చేశాడు…. నీ శరీరంలో ఉన్న నాడులన్నింటిని 72,000 నాడులు అన్నింటిని జాగృతి చేశాడు. ఆ నాడులతో అనుసంధానమైన చక్రాలను యోగాంబిక జాగృతి చేసింది. ఆ చక్రాలలో ఉన్న వాటిని కూడా చేధన చేసుకుంటూ… అందులో ఉన్న మాయలు, మర్మాలు, దాటుకుంటూ బయటకు తీసింది. తన త్రిశూలంతో పొడవడంతో చక్రాలు అన్నీ కూడా ఒక విధంగా ద్వారా బంధనాలు అన్నీ కూడా తెరుచుకోవడం అయ్యింది. ఒకరకంగా వాళ్ళు చెడు చేస్తున్నట్లుగా కనబడింది . వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకున్నట్లుగా కనబడుతుంది… కానీ, దాని వెనుక దైవ కార్యము ఉంది. అది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా వాళ్ళు చేసేది మన మంచికే అని తెలియదు. వాళ్ళు చెడు చేస్తున్నా కూడా ఈశ్వరుడి అనుగ్రహం వలన మనకది మంచిగా మారుతుంది…అని గ్రహించు. వాళ్ల మీద ఈర్ష్య ద్వేషాలు, అసూయలు పెంచుకోవద్దు. అపార్థం చేసుకోవద్దు… వాళ్లతో మిత్రులు గానే ఉండు… శత్రుత్వం పెంచుకోవద్దు… ఒకవేళ శత్రుత్వం పెంచుకున్నావంటేఅదే శత్రుత్వంగా మారి పునః జన్మకి వెళ్లే అవకాశం ఉంటుంది …కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండు.. ఏం తీసేసినా మన మంచికే జరుగుతుంది… మన మంచికే అనే భావంతో ఉండు. అంతేగాని వాళ్ల గురించి చెడుగా కూడా ఆలోచన చేయకు..
శివ నందిని:- సరే స్వామి! ఇప్పుడైతే వాళ్ళ మీద నాకు చెడుభావం ….ఉండేది .మీరు చెప్పాక నాకు అర్థం అయింది. చెడులో కూడా మంచినే చూడాలని అర్థం అయింది. నిజమే…. ఒకవేళ ఆ గోపాలస్వామి నాకు చేతి ముద్రలు చెబుతున్నప్పుడు…. ఆ అనుభవాలు కలిగే సమయంలో కామ వికారాలు , ఆ భావాలు వచ్చేవి కాదేమో! వీళ్ళు ముందుగా శరీరాన్ని శుభ్రం చేసి ఉండవచ్చు . చక్రాలను కూడా సిద్ధం చేసి ఉండవచ్చు. ఒకరకంగా వాళ్ళు నాకు సాధనకి ఉపయోగపడతారు. ఈ విషయంలోనూ…. అని నాకు అర్థం అయింది. ఇలా ప్రతిసారి జరగాలని కూడా ఉండదు.. కాబట్టి, ఏం జరిగినా మన మంచికే అనుకోవడం మంచిది కాబట్టి ….నిర్ణయం ఆయనదే… మనలో ఉన్న శివుడు సాధనకు తీసుకు వెళ్తున్నాడు…. వాళ్లలో ఉన్న శివుడు సాధనకు అడ్డుపడుతున్నాడు. ఈ విరుద్ధమైన ఆలోచన నాకు అర్థం కావట్లేదు. కాలమే నిర్ణయిస్తుంది.
రుద్రస్వామి:- దాని గురించి నువ్వేం ఆలోచించవద్దు…
శివ నందిని;- సరే స్వామి!
అనేసరికి వాళ్ళు నీలాద్రి పర్వతం చేరడం జరిగింది. అప్పటికే అక్కడ ఒక నీలం శరీరంతో ఉన్న స్త్రీ మూర్తి కొండ రాతి మీద ధ్యాన నిష్ఠలో పద్మాసనం వేసుకొని…. మోకాళ్ళ దాకా జుట్టు ఉన్న ఆవిడ కనపడేసరికి…. శివ నందిని రుద్ర స్వామి కేసి చూస్తూ…….అయ్యా ఆమె ఎవరు ? అనగానే ఆవిడ నీలాదేవి . వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇచ్చిన తొలి భక్తురాలు. అక్కడి నుంచే మనకి తిరుపతిలో జుట్టు ఇవ్వటం అనేది ఆచారం రావడం జరుగుతోంది… అనేసరికి ఈవిడ ఏమిటి ఇలా ప్రత్యక్షంగా భౌతిక శరీరంతో దర్శనం ఇచ్చారు..? అనేసరికి సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్త కాలం. రాత్రివేళల్లో యోగ శరీరాలతో ఉన్న యోగులు, యోగినీలు, యోగ సాధకులు ఏకాంతం కోసం ఏకాంతంగా ఒంటరిగా కొండల మీద సాధన చేసుకుంటూ ఉంటారు. మనకి అదృష్టం బావుండి ఈవిడ నిజరూప దర్శనం ఇవ్వడం జరిగింది. కారణం లేనిదే కార్యం ఉండదు కదా! ఈవిడ ఎందుకు అలా ఇచ్చిందో….చూద్దామని చెప్పి ఆవిడ అంతట ఆవిడ కళ్ళు తెరిచే వరకు చూద్దాం ధ్యానభంగం కలిగించవద్దు. ఈలోగా మనం కూడా ధ్యానంలో కూర్చుందాం…. అనేసరికి ఓహో! ఇది నీలాద్రి పర్వతం అనేసరికి …..అవును తల్లి! ఇది రెండో పర్వతం అనేసరికి బండ రాళ్లు చూసుకుని అవి కూర్చునే వీలుగా ఉండేసరికి… ఆ బండరాళ్ళ మీద ఎవరికి వారే ధ్యానం నిష్ఠ లోకి వెళ్లిపోయారు. పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేయటం ఆరంభించారు. అలా వాళ్ళు ఎంత సేపు ధ్యానంలో కాలం గడిచిందో తెలియలేదు. సుమారుగా గంట తర్వాత తనని ఎవరో చూస్తున్నారు అని చెప్పేసి రుద్ర స్వామి మరియు శివ నందిని కళ్ళు తెరిచి చూసేసరికి…. ధ్యానంలో నుంచి బయటకు వచ్చి వీళ్ళకేసి చూస్తున్న నీలా దేవి కనిపించింది. అప్పుడు ఆవిడకి వీళ్ళిద్దరూ కలిసి నమస్కారం చేసేసరికి….శేషాద్రి స్వామి దర్శనం అయినట్టు ఉంది కదా! అలాగే గోపాలస్వామి దర్శనం కూడా అయినట్టు ఉంది కదా ! ఈ రెండు దర్శనాలు అవ్వడం చాలా కష్టం. ఒక విధంగా మీరు దైవానుగ్రహం పొందిన వాళ్లే . గురువుల అనుగ్రహం పొందిన వాళ్లే. ఏంటి నా పర్వతం దగ్గరికి వచ్చారు…. ఏదైనా కోరిక కోసం వచ్చారా? అంటే అదేమీ లేదు తల్లి! వెంకటాద్రి పర్వతానికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామిని చూడాలనుకుంటున్నాము… ఆ దారిలో ఉండగా మీ నిజరూప దర్శనం అయ్యింది .. అనేసరికి మీకంటూ ఏం కోరికలు లేవా? అంటే ఏమీ లేవు….. అంటే మీరు ఏదైనా కోరుకుంటే నేను వరం ఇవ్వగలను…. అనేసరికి కోరికలు ఉంటే కదా! వరాలతో అవసరం ఉండేది… వరాలు తీసుకునే పరిస్థితుల్లో నేను లేను… అంటే వరాలు ఇచ్చే స్థితికి రావాలని అనుకుంటున్నావా? అంటే అలా కూడా లేదు. గుప్తంగా సాధన చేసుకొని గుప్తంగానే ఉండి లుప్తం అవ్వాలనుకుంటున్నాను. నాకు పేరు ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు తల్లి….నేనేదో గొప్ప యోగిని అని చెప్పేసి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు… నేను చేసే మంచి ప్రచారం అయితే చాలు. ఆ మంచి చేసే వ్యక్తి ప్రచారం అవ్వాలని నేను అనుకోను …..అనేసరికి నీ మంచితనం నాకు నచ్చింది. నీ కోరికలేని స్థితి నాకు నచ్చింది. నువ్వు కూడా నా అంతటి యోగ సాధకురాలివి అవ్వాలి…. యోగినిగా మారాలని చెప్పేసి దీవిస్తాను. ఆశిస్తాను ….అని చెప్పేసి అంటూ ఉండేసరికి శివనందిని లోకి తన సూక్ష్మ శరీరం ప్రవేశింప చేసే దృశ్యం రుద్ర స్వామి, శివ నందిని చూడడం జరిగింది. ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈమె నీలాదేవి సూక్ష్మ శరీర శక్తి శివ నందినిలోనికి ప్రవేశింప చేయడంతో ఆమెలోని సూక్ష్మశరీరం క్షణకాలంలో దీవిస్తున్నట్లుగా అదృశ్యం అయింది. ఆ దృశ్యం చూసి ఏదో తెలియని తన్మయత్వం ఆనందంతో…. శివ నందిని ఉండిపోయింది. ఈ స్థితి నుంచి తనంతట తాను బయటికి రావాలి కానీ… బలవంతంగా తీసుకురాకూడదు… అని చెప్పేసి రుద్ర స్వామి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అలా సుమారుగా ఒక గంట సేపు ఆవిడ అదే స్థితిలో ఉండిపోయింది. శివ నందిని ఆ తన్మయత్వంలో మాటలకు చెప్పలేని… దాయటానికి వీలు లేని ఆనందస్థితిలో ఉండిపోయిందని…. ఆ తర్వాత అయ్యా! నాకు ఏమైంది అనేసరికి ….ఏమీ అవలేదు తల్లి! నీలాదేవి ఆత్మశక్తి నీలోకి ప్రవేశించింది. కారణం లేకుండా కార్యం జరగదు… నాకు తెలిసినంతవరకు ఆదిశేషుడు పాము మూలాధార చక్రంలోనికి తన ఆత్మ శక్తిని ప్రవేశింప చేస్తే, నీలా దేవి తన ఆత్మ శక్తిని స్వాధిష్ఠాన చక్రం లోకి ప్రవేశింప చేసింది. వాళ్ళిద్దరూ నీ చక్రంలో స్థిరనివాసం చేసుకున్నారు… అంటే మరి ఆ చక్ర దైవాలుగా ఉన్న వారి పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళు ఉంటారు… వీళ్ళు ఉంటారు… వీళ్ళ ఆత్మ శక్తిగా ఉంటారు. వాళ్ళు అధిష్టాన దైవాలుగా ఉంటారు….అనేసరికి ఏమో ఈ శక్తులు ఏంటో? వీళ్ళు ఎందుకు వస్తున్నారో… నాకు అర్థం కావట్లేదు అనేసరికి…. ఒకవేళ నువ్వు మోక్షం పొందితే వీళ్లంతా విశ్వ మోక్షం పొందుతారు… వీళ్లంతా ఈ విశ్వంలో శక్తికేంద్రాలకు మూలమైన వాళ్ళన్నమాట! ఎవరు…. ఏమిటి…. ఎప్పుడూ నీ శరీరంలోకి ఆత్మ శక్తిగా ప్రవేశిస్తారో కాలమే చెబుతుంది. మనమేమి ఆత్మ శక్తి నాలోకి రావాలి…. ప్రవేశించాలి అని అనుకోలేదు కదా! కారణం లేనిదే కార్యం ఉండదు కదా! జరిగేది జరగక మానదు…. కాబట్టి ఇక్కడ ఎంతసేపు ఉండాలనుకుంటే… అంత సేపు ఉండు… అనేసరికి ధ్యానంలో కూర్చునే సరికి మహాలక్ష్మిదేవి దుర్వాసముని వైకుంఠానికి రావటం….. అక్కడ విష్ణుమూర్తిని వక్షస్థలము మీద కొట్టేసరికి మహాలక్ష్మి అలిగి భూలోకానికి రావడం….. ఆ తర్వాత ఈవిడని వెతుక్కుంటూ విష్ణుమూర్తి కాస్త శ్రీనివాసమూర్తిగా రావటం…. అక్కడ ఉన్న వరాహస్వామి దగ్గర తను వెంకటాచలంలో ఉండటానికి స్థలమును ఇవ్వమని అడగటం….. ఆ తర్వాత ఆయన స్థలమును కేటాయించడం…. వెంకన్న స్వామి కాస్త పుట్టలో ఉండి ధ్యానం నిష్ఠలో ఉండటం…… బ్రహ్మదేవుడు కాస్త ఒక గోవు రూపంలో వచ్చి ఆవులమందలో కలిసిపోయి ప్రతిరోజు వెంకన్న స్వామికి తన పొదుగు నుంచి పాలు ఆహారంగా ఇవ్వటం…. అది చూసిన పశువుల కాపరి ఆ గోవుని గొడ్డలితో కొట్టేసరికి…. ఆ గోవును రక్షించాలని ఉద్దేశంతో శ్రీనివాసులు పుట్టలో నుంచి బయటకు రావటం…. ఆ గొడ్డలి దెబ్బకి ఆయన నుదుటిమీద గాయం అవ్వటం….. తద్వారా జుట్టు ఊడిపోవడం…. ఆ తర్వాత ఆయనకి జుట్టు లేని ప్రాంతంలో గాయం మానినప్పటికీ….ఊడిపోయిన జుట్టు రాకుండా కొన్ని నెలలు అలాగే ఉండటం….. ఆ తర్వాత ఆయన ఒకరోజు చెట్టు కింద దీర్ఘకాల నిద్రలో ఉండగా….. ఆకాశంలో ప్రయాణిస్తున్న నీలాదేవికి జుట్టులేని వెంకన్న స్వామి కనిపించేసరికి….. స్వామివారికి జుట్టు లేకపోవడంతో …..తన అందానికి కారకమైన జుట్టు అంతా తీసేసి జుట్టుని సమర్పించడం….. ఆ నీలాదేవి యొక్క భక్తికి సంతుష్టుడై నేను ఒకవేళ ఈ వెంకటాచలంలో ఆవాసం ఉండే అవకాశం ఉన్నదా అంటే….. నీకు నువ్వు జుట్టు ప్రసాదించి జుట్టును అందించావు…. కాబట్టి నీ భక్తికి మెచ్చి నీకు నీలాద్రి అనే పేరుతో ఈ నా సప్తగిరిలో ఒక పర్వతమును ఇస్తున్నాను ….అంటే ఆదిశేషుడు నా అంశ కాబట్టి అతను మొదటి పర్వతమును ఆక్రమించుకోవడం జరిగింది…. తన ఏడు తలలే ఈ ఏడు గిరులుగా ఆవాసం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అందులో రెండవ తలలో నీలాద్రి పర్వతమును…. మీ భక్తికి మెచ్చి…. ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా నాకు జుట్టును ప్రసాదిస్తారు… అనేసరికి సరే స్వామి! నాకు మోక్షమరణం వస్తే చాలు. అంతకుమించి ఏమీ లేదు…. మీ నామస్మరణం చేస్తూ ఈ పర్వతం మీద నేను శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నాను…. అని చెప్పేసి నీలాద్రి పర్వతం మీద ఆవిడ స్థిర నివాసం చేసుకుని సాధన చేసుకుంటూ…. భౌతిక శరీరంతో ధ్యానంలో ఉండటం….. ఇదంతా కూడా ఒక ధ్యాన దృశ్యంగా కనిపించేసరికి….. పురాణంలో చెప్పిన నీలాద్రి కథ అంతా కూడా యదార్థం అని చెప్పి గ్రహించి….. ఆ తర్వాత నీలాదేవి కూర్చుని ఉన్న బండకేసి చూస్తూ…… అమ్మ ! నువ్వు నాలో ఏం చూసావో తెలియదు…. నీ ఆత్మ శక్తిని నాలో ప్రవేశింప చేసినావు….నా మరణమే నీకు మోక్షమరణం అవుతుందని చెప్పేసి అర్థం అవుతుంది. ఒకవేళ సాధన పరిసమాప్తి సమయంలో…. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసినా ….కావాలని మాయలో పడినా ….నా సాధన పరిసమాప్తి చేసుకోకుండా నేను ఆగిపోతే…… మరి నీ సాధన పరిసమాప్తికి భంగం కలగకుండా నీ శక్తిని నా శరీరం నుంచి వెనక్కి తీసుకునే వెసులుబాటు పెట్టుకో తల్లి….. నా మీద అంత నమ్మకం పెట్టుకొని, నాలో నువ్వు ఉన్నంతవరకు ఏ సమస్య లేదు…. నాకు కూడా మోక్షం మరణం వస్తుంది. నీకు మోక్షం ఇస్తున్నాను అనే గర్వాహంకారాలు నాకైతే లేవు. అలాగే స్త్రీ ప్రకృతికి మోక్షమిస్తున్నానని ఇది కూడా నాకు లేదు .నేను ఏం చేస్తాను…. ఎలా చేస్తాను? అసలు చేస్తానో లేదో అని అయోమయ స్థితిలో నా సాధన ప్రస్తుతానికి ఉన్నది. మీ నమ్మకాలు ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆదిశేషుడు నాలోకి ప్రవేశించాడు. తన ఆత్మ శరీరాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే నువ్వు ఏ నమ్మకంతో ఆత్మ శక్తికి నాలో ప్రవేశపెట్టావో…. కాకపోతే ఎలాంటి మాయలు పరీక్షలు పెట్టకుండా నామీద నమ్మకంతో మీ ఆత్మశక్తిని నాలో ప్రవేశపెట్టావు. అది కారణం నాకు తెలియదు. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు కృతజ్ఞురాలిని. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా… నేను సాధన పరిసమాప్తి చేసుకుంటాను …. అని మనోధైర్యాన్ని ప్రసాదిస్తావని ఆశిస్తున్నాను. ఆశీర్వాదాలు అనుగ్రహించు తల్లి…. నాలో గర్వ అహంకారం లేకుండా చేయి తల్లి…. అని అనిపించేసరికి ఎక్కడి నుంచో గంటా నాదం సుస్పష్టంగా వినిపించేసరికి….. అమ్మ అనుగ్రహించింది అనుకొని…. ఆ తర్వాత మూడవ పర్వతమైన గరుడాద్రి పర్వతం వైపుకి వీళ్ళిద్దరూ బయలుదేరడం జరిగింది.
రుద్ర స్వామి మరియు శివ నందిని కాస్త నీలాద్రి పర్వతం నుంచి మూడవ పర్వతమైన గరుడాద్రి పర్వతానికి బయలుదేరడం ఆరంభించారు. ఇంతలో అనుకోకుండా ఈ రెండు పర్వతాల మధ్య ఒక దివ్యమైన కొలను…. ఆ కొలనులో అర్ధరాత్రి వేళ పౌర్ణమి వేళ యందు దివ్యకాంతులు వెదజల్లుతున్న బ్రహ్మ కమలాలు కనిపించేసరికి …. శివ నందిని ఆశ్చర్య ఆనందాలకి గురైంది. కానీ రుద్ర స్వామికి ఏదో అనుమానం వచ్చి… తల్లి! తొందరపడమాకు ఇదేదో మాయ కల్పితం అనుకుంట… నీకు ఏదో మాయ పరీక్ష అని నాకు అనుమానంగా ఉంది. ప్రస్తుతం నీ సాధనా శక్తి మూలాధార చక్రం, స్వాధిష్ఠాన చక్రం దాటి బ్రహ్మ గ్రంధి దగ్గరకు వచ్చింది. ఈ బ్రహ్మ గ్రంధి దగ్గరకు వచ్చింది అనే సూచనకి దేవ పుష్పాలైన బ్రహ్మ దగ్గర ఉండే బ్రహ్మ కమలాలు దర్శనం ఇచ్చింది . అసలు ఇక్కడ కొలను ఉన్నట్టుగా నేను స్థలపురాణంలో చదవలేదు. చూడను కూడా చూడలేదు. కానీ విచిత్రంగా ఇక్కడ కొలను కనపడుతుంది. పైగా బ్రహ్మ కమలాలు దివ్య తేజస్సుతో కనపడుతున్నాయి… నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకవేళ మనం ఇందులో ఏమైనా ఆశపడినామో ….వీటికోసం వెళ్తే సాధన అధోగతి పాలవుతుంది… జాగ్రత్త సుమా! అనేసరికి రుద్రయ్య ఇవన్నీ నాకేం తెలుసు… మొట్టమొదటిసారి చూస్తున్నాను…. బ్రహ్మ కమలాలు ఇలా ఉంటాయా? దేవతా పుష్పాలు ఇలా ఉంటాయా? ఇలా దివ్య తేజస్సుతో రాత్రిపూట స్వయంప్రకాశంగా పెట్టినట్లుగా వెలుగుతున్నాయి… విచిత్రంగా ఉన్నాయి అని అనేసరికి… అవును తల్లి! ఇది అతి సున్నితమైన వివేక బుద్ధితో కలిగిన జ్ఞాన పరీక్ష వంటిది . బ్రహ్మదేవుడు బ్రహ్మజ్ఞానంతో సమానం కదా! ఇందులో ఏదో మర్మం ఉంది. కారణం లేనిదే ఏమీ ఉండదు. ఇది మాత్రం అభూత కల్పన, భ్రమభ్రాంతి. ఇది నిజమైన కొలను మాత్రం కాదు…. అని చెప్పి అనేసరికి అయ్యా! నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఈ కొలను దాటితే కానీ మనం గరుడాద్రి పర్వతాన్ని చేరలేము… ఆ విషయం అర్థమవుతుందా! అనేసరికి అవును తల్లి! ఈ కొలను మనకి అడ్డంగా సృష్టించారు….ఇది నాకు తెలిసి బ్రహ్మ గ్రంథితో సమానం కాబట్టి…. ధ్యానంలో కూర్చో! వాళ్ళే ధ్యాన దృశ్యాలు ఇస్తారో తద్వారా జ్ఞాన స్ఫురణ పొందు అనగానే…. అలాగే అయ్యా ! అని చెప్పేసి అక్కడ ఒక చిన్న గుట్ట రాళ్ళ మీద కూర్చుని పద్మాసనం వేసుకొని శివ నందిని ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఆ ధ్యానంలో యధావిధిగా బ్రహ్మ కమలాలు ఉన్న కొలను కనపడింది. సుమారు 108 కమలాలు ఉన్నట్లుగా ధ్యాన స్ఫురణ అందింది. అందులో నిజమైన బ్రహ్మ కమలం ఏంటి అనేది తెలుసుకోవాలి…. మిగతావన్నీ కూడా దానికి ప్రతిబింబాలే . నిజమైన బ్రహ్మ కమలం ఒక్కటే… మిగిలినవి దాని యొక్క మిగతా ప్రతిబింబాలని గ్రహించింది. అంటే నిజమైన బ్రహ్మ కమలం అనేది జపమాలకి మణిపూస లాంటిది…. అని 108వ పూస లాంటిదని గ్రహించింది. ఇప్పుడు మణిపూస లాంటి నిజమైన మణిపూస ఎదో సూక్ష్మతి సూక్ష్మంగా బ్రహ్మజ్ఞానంతో తెలుసుకోవాలి. తద్వారా మిగతావన్నీ భ్రమ , బ్రాంతి అయిన కమలాలన్నీ మాయమై పోతాయి. అంటే గంజాయి వనంలో తులసి మొక్క లాగా ఇప్పుడు నిజమైన బ్రహ్మ కమలం ఏదో వెతకాలి . లేదంటే….తన సాధన శక్తి బ్రహ్మ గ్రంథి విభేదనం అవ్వదని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. ఒకవేళ తప్పుడు కమలం తీసుకున్నట్లయితే ఇక తను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తన కుండలినీ శక్తి యధావిధిగా నిద్రావస్థకి వెళ్లిపోవడం లేదా అజ్ఞాన గ్రంధికి చేరడం జరుగుతుంది అని గ్రహించింది. ఒకవేళ బ్రహ్మగ్రంధిని దాటితే కుండలిని శక్తి ఇంకెప్పుడూ నిద్రావస్థకు చేరని స్థితిలో…. మణిపూరక చక్రస్థితిలోనికి చేరుతుందని ….జ్ఞాన స్ఫురణ అందింది. ఎప్పుడైతే కుండలీని శక్తి మణిపూరక చక్రంలోనికి చేరిందో …..ఆనాటి నుండి అది బ్రహ్మ గ్రంధిని దాటి…. కిందకి రాదు. తిరిగి మళ్ళీ అజ్ఞాన గ్రంధంలోకి వెళ్ళదన్నమాట.! అంటే అజ్ఞాన గ్రంధి యొక్క అజ్ఞానం బ్రహ్మదేవుని బ్రహ్మ జ్ఞానంతో విభేదం అవుతుందన్నమాట! మూలధార స్వాధిష్ఠాన చక్రాలు రెండు కూడా భోగ జీవితానికి సంబంధించిన ఇహపరమైన కోరికలు అనగా కామమాయను, ధన మాయను అన్నమాట! అంటే భ్రమభ్రాంతి పునః సృష్టికి కారకాలవుతాయి… అని జ్ఞానం పొందుతారు. అప్పుడు జీవుడు బ్రహ్మ గ్రంధి దగ్గరకు వస్తాడు… బ్రహ్మ గ్రంథిలో పొందిన విశ్వ జ్ఞానమును తన స్వార్ధమునకు ఉపయోగించకుండా….. సృష్టి వినాశనానికి వాడకుండా…. బ్రహ్మ పదవులు ఆశించకుండా ….వేటి గురించి భయపడకుండా…. స్థిరమైన మనసుతో…. స్థిరమైన బుద్ధితో…. ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కుండలినీ శక్తి మణిపూరక చక్రం లోనికి వెళ్లి స్థిరపడుతుంది అని గ్రహించింది. కళ్ళు తెరిచింది… తనకి అందిన జ్ఞాన స్ఫురణ అన్ని కూడా యథాతథంగా అక్కడే ఉన్న రుద్ర స్వామికి చెప్పేసరికి….. జాగ్రత్తగా గమనించు. ఇక్కడ అన్నీ కూడా కవల పిల్లల లాగా ఒకే విధంగా ఉన్నాయి. వీటిలో ఏది అనేది గుర్తించడం సాధారణ మానవునికి అనితర సాధ్యం. కాస్త వివేక బుద్ధిని ఉపయోగించు….మనో దృష్టితో చూడు…. నాకైతే తెలియడం లేదు… అనేసరికి సరే అయ్యా! అని చెప్పి ఒక కమలమును తాకపోతుంటే…. తాకవద్దు! ఏ కమలం అయితే నువ్వు తాకుతావో అక్కడితో అది నువ్వు ఎంచుకున్నది అయిపోతుంది.
కాబట్టి ముట్టుకోకూడదు…. చేతితో తాకకూడదు…. ఒక కమలం మాత్రమే ఇందులో నిజమైన కమలం. అది ఏమిటి అనేది నువ్వు గ్రహించాలి. మిగతా అన్ని చూడటానికి బ్రహ్మ కమలాలుగా ఉన్నప్పటికీ….ఒకే ఒక బ్రహ్మ కమలం మాత్రమే ఉన్నది. మిగతావన్నీ దానికి ప్రతిబింబాలు అనేసరికి అవును…. ధ్యానంలో నాకు అదే జ్ఞాన స్ఫురణ అందింది. అంటే ఇప్పుడు వీటిని ముట్టుకోకుండా కళ్ళతోనే సూక్ష్మాతి సూక్ష్మ దృష్టితో వీటి యొక్క నిజమైన బ్రహ్మ కమలం ఏదో గుర్తించాలి…. అని మనసులో అనుకొని… శివ నందిని తీక్షణంగా చూస్తున్నప్పటికీ తేడా తెలియలేదు. ఎంత పరిశీలించినా, పరిశోధించినా తేడా ఇసుమంత కూడా కనిపించకపోయేసరికి…. ఒక విధమైన నిరుత్సాహం, కోపం, విసుగు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఎక్కడో ఒకచోట తేడా ఉండాలి కదా! ఎక్కడ ఉంది… ఎలా ఉంది… అది ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఎన్ని సార్లు పరిశీలించినా…..అన్ని కూడా ఒకే విధంగా కనపడుతున్నాయి. ఒకే రంగులో కనబడుతున్నాయి…. చూడటానికి ఒకే దివ్య తేజస్సుతో ఉన్నాయి… ఇందులో ఒకటి మాత్రమే నిజమైనది…అది ఏమిటో అర్థం కావడం లేదు…. అనుకొని ఇలా కాదు అని చాలా దగ్గరగా ముట్టుకోకుండా చూస్తూ పరిశీలనగా చూస్తూ ఉండేసరికి…. ఒక కమలం మిగతా కమలాల కన్నా 0.5 mm ఎత్తులో ఉన్నట్టుగా గ్రహించింది. అది మధ్యలో ఉన్నది ….అంటే ఈ కమలాలన్నీ కూడా ఒక వృత్తాకారంలో ఉంటూ మధ్యలో ఒక కమలం దగ్గరికి చేరినాయి. ఆ కమలం సుమారుగా అన్ని కమలాల కన్నా 0.5 mm ఎత్తులో ఉందని గ్రహించింది. మధ్యలో ఉన్న కమలం కేసి చూపిస్తూ…అయ్యా! నాకు తెలిసినంతవరకు నా మనసుకు అందిన జ్ఞాన స్ఫురణ ప్రకారంగా చూస్తే , ఆ మధ్యలో ఉన్న కమలమే బ్రహ్మకమలం అయి ఉండాలి. అదే నిజమైన బ్రహ్మ కమలం అయి ఉండాలి… ఎందుకంటే మిగిలిన కమలాల కన్నా అది కొద్దిగా గోరంత ఎత్తులో ఉంది…. అనేసరికి మనస్పూర్తిగా చెబుతున్నావా? వెనక ముందు ఇక నిర్ణయాలు మార్చే ఇది లేదు కదా! అనేసరికి ఇక లేదు…. ఏదైతే అది అవుతుంది ….అనేసరికి ఇక నా మనసుకి ఆ కమలమే బ్రహ్మ కమలం అని అనిపించింది…. అనేసరికి అయితే వెళ్లి దాన్ని తాకు అనగానే….ఈదుకుంటూ వెళ్లి, దాని మీద చేతిని పెట్టేసరికి…. మిగతా కమలాలన్నీ కూడా ఆ కమలం లోకి వెళ్లిపోతూ ఉండేసరికి….ఆ కమలాలు కాస్త సహస్ర కమలం లాగా కనపడింది. అమ్మ నువ్వు ఎంచుకున్న కమలం నిజమైన బ్రహ్మ కమలం…. అనేసరికి ఆ బ్రహ్మ కమలంలో బ్రహ్మదేవుడు మరియు సరస్వతి దేవి సుమారుగా సజీవ మూర్తిగా ఉన్నట్లుగా కనిపించేసరికి…. నమస్కారం చేస్తూ ఉండేసరికి ఆ బ్రహ్మ కమలం కాస్త తనలోకి బ్రహ్మ గ్రంధిలో నిక్షిప్తమైనట్లు క్షణకాలం పాటు జ్ఞాన స్ఫురణ అందింది. అక్కడ కళ్ళు తెరిచి చూస్తే, బ్రహ్మ కమలం కనిపించలేదు… కొలను కనిపించలేదు…. తల్లి నువ్వు జ్ఞానపరీక్షలో ఉత్తీర్ణురాలివి అయ్యావు… నీ శక్తి బ్రహ్మ గ్రంధి లోనికి వెళ్ళింది. నీకు శక్తి మణిపుర చక్రం లోకి చేరిపోయింది. ఇక గరుడాద్రి పర్వతానికి దగ్గరికి వెళ్తున్నాము అనేసరికి అవునా! అనుకుంటూ ఉండేసరికి…. కుండలినీ శక్తి ప్రవాహం మణిపూరక చక్రం లోకి చేరిపోవటం బ్రహ్మ కమలం కాస్త బ్రహ్మ గ్రంధిలో విచ్చుకోవటం ఇక ద్వారం మూసుకుపోయినట్లుగా గ్రహించింది. అంటే మూలాధార, స్వాధిష్ఠాన చక్రాలకు….అవసరమైనప్పుడు తప్ప…. తను సంకల్పించుకున్నప్పుడు తప్ప వెళ్ళదు. ఇక కుండలినీ శక్తి ఎప్పుడూ జాగృతి స్థితిలోనే ఉంటుంది…. నిద్రావస్థలోకి పోదు అని గ్రహించింది. గ్రహించడానికి తనకి అట్టే సమయం పట్టలేదు… ఆ తర్వాత వీళ్ళు గరుడాద్రి పర్వతానికి చేరుకోవడం జరిగింది.
ఇలా వీరిద్దరూ గరుడాద్రి పర్వతం చేరుకున్నారు. ఇక్కడ ఎవరు కనిపించలేదు …ఆశ్చర్యం అనిపించింది… ఎవరైనా సాధన చేసుకుంటూ ఉన్నారేమో అయ్యా … మన కంటికి కనిపించని ఆత్మ శరీరంతోను , సూక్ష్మ శరీరంతోను, లేదా మిగతా శరీరాలతోనూ సాధన చేసుకుంటూ ఉన్నారేమో! అంటే…సరే ఇక్కడికి వచ్చాం కదా! కాసేపు ధ్యానంలో కూర్చో…. అనేసరికి సరే అని చెప్పి అనుకుంటూ ఉండగా…. ఒక పక్షి విజిల్ వేస్తున్నట్లుగా వినిపించేసరికి…. ఆకాశం వంక చూస్తే….. ఒక పెద్ద పక్షి గాలిలో గుండ్రంగా తిరుగుతూ ఉండడం గమనించింది. ఏమిటి ఆ పక్షి అనేసరికి…. ఏమో నాకేం తెలుసు! అని రుద్రస్వామి అనేసరికి…..బహుశా అది గబ్బిలం అయి ఉండాలి….లేదా గుడ్లగూబ అయినా అయి ఉండాలి…. ఈ రాత్రి వేళలో ఇవే కదా సంచారం చేసేది…. అని చెప్తూ ఉండగానే ఆ పక్షి భూమి వైపుకి కిందకి దిగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి…. అయ్యా గమనించావా! ఆ పక్షి మన వైపుకే వస్తున్నట్టుగా ఉంది…. చూసావా ! దాని రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో ….విచిత్రంగా ఉంది….. ఇంత పెద్ద పక్షి సుమారుగా ఒక 100 అడుగులు ఉంటుందేమో…. అంటే అయ్యుండొచ్చు! తల్లి ….నాకు తెలిసి ఇది గరుడ పక్షి అయి ఉండాలి. గరుత్మంతుడు అయ్యి ఉండాలి….సాధారణ భూలోక పక్షి మాత్రం కాదు.. గద్ద అయినా ….రాబందువైనా మహా అయితే పది అడుగులు ఉంటాయి. గద్ద అయితే రెండు అడుగులే ఉంటుంది. రాబందు అయితే ఒక 20 అడుగులు ఉంటుందేమో ….ఇది అంతకుమించి 100 అడుగుల పైనే ఉంది. ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పర్వతంతో సమానం అనేలా ఉంది…. అనేసరికి అది దగ్గరవుతున్న కొద్ది దాని రెక్కల శబ్దానికి గరుడాద్రి పర్వతం మీద ఉన్న చెట్లు ఊగిపోవడం….. సుడిగాలి వచ్చినట్లు చెట్లని విపరీతంగా ఊగుతూ ఉండేసరికి చూశావా! దాని రెక్కలు చేసే శబ్దం వేగానికి ఆ బండరాళ్లు ఎలా ఊగిపోతున్నాయో…. చూసావా! గమనించావా! అనేసరికి….అమ్మ !అమ్మ! కొంచెం దూరం వెళ్దాము అనేసరికి ….నేను వెళ్ళను స్వామి! నేను ఎందుకు భయపడాలి….అవి ఎంతటి పక్షి అయినా గాని గరుత్మంతుడు అయినా కావచ్చు. నేను స్థిరంగానే నిలబడతాను…. ఆయన గాలి దాటికి నేను తట్టుకోలేనప్పుడు ఇంకెందుకు ఈ వెధవ శరీరం అనేసరికి…. గరుడ పక్షి వస్తున్న మనోవేగానికి రుద్రస్వామి ఎక్కడో పడిపోయినట్టుగా గాలిలో ఎగరటం ప్రారంభించాడు. ఆయన నీలాద్రి పర్వతం మీద పడిపోయాడు. ఈ శివ నందిని మాత్రం కదలకుండా మెదలకుండా భూమికి అతుక్కుపోయినట్టు అలా నిశ్చలంగా తనకి వచ్చిన భూచర సిద్ధితో…. అలాగే భూమికి అతుక్కుపోయిన విధంగా స్థిర మనసుతో ,స్థిర బుద్ధితో, నిశ్చలంగా, మనోసంకల్పంతో అతుక్కుపోయి ఉండేసరికి…. గరుడ పక్షిగా వచ్చిన గరుత్మంతుడు కాస్త ఆనంద ఆశ్చర్యాలకు గురవుతూ….. తల్లి! స్వామి వారే ఏడుకొండలు దిగి వచ్చినప్పుడు…. నాకు అర్థం కాలేదు. నీయొక్క నిజభక్తి ఏంటి అనేది అర్థం అయింది. మీ మనో సంకల్పం ముందు నా రెక్కల చప్పుడు వేగానికి ఎగిరి ఎక్కడైనా పడతావేమో అనుకున్నాను…. కానీ నువ్వు స్థిరంగా నిలబడి పోయావు…. నా రెక్కల వేగం కన్నా నీ మనోవేగం ఎక్కువ బలమైనది అని చెప్పేసి నిరూపించావు. నీ మనోవేగం ముందు నా రెక్కల వేగం ఎందుకి కొరగాలేదు. నా పరీక్షలో నువ్వు నెగ్గావు తల్లి…. నీకేం వరాలు కావాలో కోరుకో! అనేసరికి నాకేం వరాలు వద్దు. నాకు ఏం కోరికలు లేవు… నాకు చావు భయం పోయిన దాన్ని ….చావాలని అనుకునే దానిని…. చచ్చేదానికి ఇంక ఏం కోరికలు ఉంటాయి….అని అనేసరికి భళా ! నచ్చావు తల్లి ..నీ భక్తికి మెచ్చాను. మీ మాటలు నాకు అర్థం కాలేదు స్వామి వారు రావడం ఏమిటి ….అనేసరికి అదా కాలమే నీకు సమాధానం చెబుతుంది… నా స్వామి వారు గోపాలస్వామి రూపంలో వచ్చారు అనుకున్నాను లే ! అనేసరికి అంటే గోపాలస్వామి వెంకన్న స్వామి ఒకటేనా స్వామి…. అని అంటే ఏమో తల్లి! ఇద్దరు చూడటానికి ఒకే విధంగా ఉంటారు. తేడా కనిపించదు. ఒకళ్ళేమో వెంకన్న భక్తుడు అంటారు… ఒకళ్ళేమో వెంకన్న మూర్తి అంటారు… నాకు ఆ తేడా ఇసుమంతా కూడా కనిపించదు… జీవాత్మ పరమాత్మ అని నాకు అనిపిస్తూ ఉంటుంది… అదే సమాధి స్థితిలో ఉన్నప్పుడు…. ఇద్దరు కాదు ఒకళ్ళే! ఉన్నట్టుగా కనిపిస్తారు. వెంకన్న మూర్తిగా కనపడతారు. అదే నేను సమాధి స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు జీవాత్మ గోపాలస్వామి పరమాత్మ వెంకన్న స్వామి గాను…. ఇద్దరు పరమాత్మలుగా కనిపిస్తారు. అనేసరికి అయి ఉండొచ్చులే స్వామి…. నిజభక్తులు దైవ ఉపాసన చేస్తారు కదా ఇప్పుడు శ్రీరామ ఉపాసన చేస్తే శ్రీరాముడులాగా…. అమ్మవారి ఉపాసన చేస్తే అమ్మవారికి లాగా…. రావడం శివార్చన చేస్తే శివుడి లాగా ఉండటం…. చాలా మంది భక్తులని చాలామంది దైవ ఉపాసకులు చూడటం జరిగింది. బహుశా స్వామి కూడా వెంకన్న స్వామికి పరమ భక్తుడు అయి ఉంటాడు. నిత్య నామస్మరణ చేయటం వల్ల వెంకన్న స్వామికి లాగానే ఈయన కూడా మారిపోయి ఉండవచ్చు….. అనేసరికి ఏమోనమ్మా! ఎవరికి ఎరుక…. అది దైవానికే తెలియాలి… వెంకన్న స్వామికే తెలియాలి…. ఆయన లీలలు మానవ మాత్రులకి, దైవమాత్రులకి కూడా అగమ్య గోచరం కదా! సరే తల్లి నీ సాధన పరిస్థితి ఎలా ఉంది…. అనేసరికి ఏమో తెలియదు స్వామి! సాధనలో ముందుకు వెళుతున్నానో …వెనక్కి వెళుతున్నానో …కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఏం జరుగుతుందో కూడా నేను పట్టించుకోదలచుకోలేదు…. సాధన ఎక్కడ ఆపకూడదు….ఏ మాయలో పడకూడదు…. నా అంతట నేను ఆగిపోకూడదు…. అని మాత్రమే నేను అనుకుంటున్నాను….నాకు ఆయన మనోధైర్యం అందిస్తే చాలు…. అంతకుమించి ఏమీ అక్కర్లేదు… అనేసరికి తధాస్తు తల్లి! నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు… అంత దూరం సాధన పరిసమాప్తికి వెళ్ళు. కాకపోతే ధర్మంగా వెళ్ళు… ధర్మయుతంగా సాధన చెయ్యి ….నిస్వార్ధంగా ఉంటూ నిష్కామ కర్మలు చెయ్యి.
లోక వినాశనం కోరుకోవద్దు.. లోక హితమైన పనులు చెయ్యి. ధర్మ విరుద్ధమైన పనులు, ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకు ..మనసుకు నచ్చని పనులు మాత్రం చేయకు… నీ మనస్సాక్షికి నమ్ముకో! అనేసరికి అలాగే అంటూ ఉండేసరికి గరుడ శక్తి కాస్త ఈమె మణిపురక చక్రంలోనికి ప్రవేశించినట్లుగా…. అనుభవం అనుభూతి పొందుతూ ఉండేసరికి…. గరుడ పక్షి మాయమయ్యింది. తీరా చూసేసరికి నీలాద్రి పర్వతం మీద రుద్ర స్వామి కనిపించేసరికి ….అయ్యా !అని పిలిస్తే…. అమ్మ! నేను ఇక్కడే ఉన్నాను… నేను రావడానికి ఇంకో గంట సమయం పడుతుంది. నువ్వు ముందుకు వెళ్ళు అనేసరికి లేదయ్యా! నువ్వు రా ఈలోగా నేను ధ్యానంలో కూర్చుంటాను…. అనేసరికి సరే నీ ఇష్టం తల్లి అనగానే సరే భయపడమాకు…. కంగారు పడమాకు అనగానే నాకు భయం లేదు, దైవ శక్తి వెంకటేశ్వర స్వామి వున్నాడు కదా! రక్షకుడిగా…. నేను భయపడట్లేదు అంటే సరే తల్లి! వస్తున్నాను అని రుద్రస్వామి అనేసరికి ఇంక ఆయన రావడానికి సమయం పడుతుందని…. ధ్యానంలో కూర్చునేసరికి…. మణిపూరక చక్రంలోకి గరుడ పక్షి శక్తి చేరగానే మూలాధార చక్రంలో ఉన్న ఆదిశేషుడు భయపడటం గమనించింది. తనలో ఏదో తెలియని మనోభయం మొదలైంది. గరుడ శక్తికి కుండలిని శక్తి భయపడుతుందని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు . గరుత్మంతుని ఉద్దేశిస్తూ స్వామి! మీ రాకను చూసి నాలో కుండలినీ శక్తి స్వరూపమైన ఆదిశేషుడు సర్పం భయపడుతుంది అనేసరికి అవునా …..అని ఆ కుండలినీ లో ఉన్న ఆది శేషునితో గరుత్మంతుడు కాస్త ….సందేశం పంపిస్తూ …..మనమిద్దరం అన్న తమ్ముళ్ళం… నా వల్ల నీకు ఎలాంటి ఆపద, భయము రాదు . నువ్వు యధేచ్ఛగా పైకి శక్తి ప్రవాహం గావించుకోవచ్చు…. ఈ శక్తి ప్రవాహంలోనికి నేను అడ్డు చెప్పను . నేను ఈ చక్రములో శక్తి జాగృతి కోసమని నా ఆత్మ శక్తిని ఇందులో ప్రవేశింపచేయడం జరిగింది. నా వల్ల నీకు ఎలాంటి హాని రాదు. మనిద్దరం యోగ మిత్రులం ….సాధనా మిత్రులము… భూలోకంలో మన ఇద్దరం శత్రువులం అయి ఉండవచ్చు …కానీ సాధన పరంగా యోగ పరంగా మిత్రులం అవుతాము ….అనేసరికి అప్పుడు ఆదిశేషుడు ఏడు తలల సర్పం కాస్త, ఏకతల సర్పంగా మారి …. జేగురు రంగు పొగ రూపంలో మూలధార చక్రంలో జాగృతి అయ్యి, స్వాధిష్ఠాన చక్రం….ఆపైన బ్రహ్మ గ్రంధి ….ఆపైన మణిపూరకం లో స్థిరపడింది. ఎప్పుడైతే శ్వాస మణిపూరక చక్రం లోనికి చేరిందో…. అప్పుడు బ్రహ్మ రంధ్రంలో ఉన్న బ్రహ్మ కమలం కాస్త పూర్తిగా విచ్చుకునేసరికి ద్వారబంధనం వేసినట్టుగా అనిపించింది. అప్పుడు గరుత్మంతుడు అమ్మ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు…. నీకున్న శక్తి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైనుంచి కిందకి కింద నుంచి పైకి యథేచ్ఛగా ప్రవాహం జరుగుతుంది. ఎప్పుడైతే స్థిర మనసుతో… స్థిర బుద్ధితో… నువ్వు నిలబడి ఉంటావో… ఇక ఇది మూలాధార చక్రం నుంచి ఆదిశేషుడు సర్పము శక్తి ప్రవాహం పైకి జరుగుతుంది. ఒక పాము ప్రవహించినట్టుగా శక్తి ప్రవాహం జరుగుతుంది… చాలామంది కప్పగంతులు వేసినట్లుగాను… చీమలు పాకుతున్నట్లుగాను ఉండటం జరుగుతుంది. కాకపోతే నీకు పాము పాకుతున్నట్టుగా… పాము కదులుతున్నట్టుగాను అనుభవ అనుభూతి అవుతూ శక్తి ప్రవాహం జరుగుతుంది అనేసరికి
అలాగే స్వామి! నాకేమీ ఇబ్బంది లేదు ….అని చెప్పి ధ్యానంలో కూర్చొని ….ఓం శివోహం అనే మంత్రమును చేస్తూ ఉండేసరికి…..ఆ లోపల ఉన్న శక్తులు తనలో ఇముడ్చుకున్నవి కూడా ధ్యాన నిష్ఠలో ఉండిపోయాయి. ఇలా ఎంతసేపు ధ్యానానిష్టలో ఉండిపోయిందో….తెలియలేదు. తనని ఎవరో చూస్తున్నారని అనిపించేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి శివ నందిని ఎదురుగా ఆపసోపాలు పడుతున్న రుద్ర స్వామి కనిపించారు. అయ్యా! వచ్చావా ….అనేసరికి ఆ వచ్చాను తల్లి! కాసేపు విశ్రాంతి తీసుకుంటాను… అలసిపోయింది శరీరం… కాబట్టి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నాలుగో పర్వతమైన అంజనాద్రి పర్వతం వైపుకు వెళ్దాం… అనేసరికి సరే అయ్యా! నీ ఇష్టం ఈ లోపు నేను ధ్యానంలో కూర్చుంటాను…. అనేసరికి మరో గంట సేపు ఇద్దరు ధ్యానంలో కూర్చున్నారు. ఆ తర్వాత రుద్ర స్వామి శరీరం శక్తిని పుంజుకోవడంతో వీరిద్దరూ కలిసి అంజనాద్రి పర్వతం వైపుకి ప్రయాణం చేయడం ఆరంభించారు.
ఎప్పుడైతే వీళ్ళు అంజనాద్రి పర్వతానికి వెళ్లేసరికి విపరీతమైన సుడులు తిరుగుతున్న గాలి మొదలైంది.. అనాహత చక్రం యొక్క తత్వము వాయు తత్వం కావడంతో గాలులు విపరీతంగా వేస్తున్నాయని చెప్పేసి…. ఈ గాలి దాటికి తను ఎక్కడ పడిపోతానో అని చెప్పేసి గట్టి కర్రలను పట్టుకొని రుద్ర స్వామి ఉన్నాడు. రుద్ర స్వామి అవస్థని చూసి పాపం అని… జాలి వేసి అయ్యా ! నా వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు… నా వల్లే మీకు ఇవన్నీ…. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళిపోండి. అనేసరికి లేదు తల్లి! నేను కూడా తాడోపేడో తెలుసుకోవాలని అనుకుంటున్నాను…. ఈ చక్రాల జాగృతి ఇంతవరకు నేను ధ్యాన అనుభవాలతోనే జాగృతి చేసుకున్నాను. అనుభవ అనుభూతి పొందాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ చక్రాల అనుభవాలు ఇప్పుడే చూస్తున్నాను…. అనేసరికి అదేంటి స్వామి! మనకి మణిపూరక చక్రంలోనూ, స్వాధిష్ఠాన చక్రంలోనూ అలాగే మూలాధార చక్రంలోనూ భూతత్వం కానీ జలతత్వం కానీ అగ్ని తత్వం కానీ ప్రభావం చూపించలేదు కదా! ఉన్నట్టుండి అనాహత చక్రంలోనికి వాయితత్వానికి ఎందుకు ప్రభావం చూపిస్తుంది అంటే….. ఇది అంజనాద్రి పర్వతం వాయు పుత్రుని తల్లి అయిన అంజనా దేవి ఇక్కడ మోక్ష సాధన కోసం విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి…. ఇక్కడే హనుమంతుడు పుట్టడం జరిగింది. ఆవిడ ఘోర తపస్సు చేసిన పర్వతం ఇది. విష్ణుమూర్తి అనుగ్రహం పొందడం జరిగింది. అంటే అవునా! అనేసరికి శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్ అంటూ శ్రీరామ నామం వినిపిస్తూ ఉండేసరికి….. ఎవరు చేస్తున్నారా ? అని చూసేసరికి సుమారుగా మూడున్నర అడుగుల ఎత్తు ఉన్న కోతి ధ్యాన నిష్ఠలో ఉండి…. తన చుట్టూ ఒక 100 అడుగుల తోకని చుట్టూ గీత లాగా పెట్టుకునేసరికి…. కోతి శరీరంతో ఏమో మూడు అడుగులు… తోక ఏమో 100 అడుగులు ఉండేసరికి ఆశ్చర్య ఆనందాలకు లోనై….అదేంటి స్వామి ! పర్వతం అంత తోక ఉన్నట్లుగా ఉంది… శరీరం మాత్రం మూడున్నర లేదా నాలుగడుగులు మించి లేదు కదా… అనేసరికి ఆయనేనమ్మ ! వాయు పుత్రుడైన హనుమంతుడు…. నీకు నిజరూప దర్శనం ఇవ్వటానికి ఆయన ఈ కోతి రూపంలో వచ్చారు… ఆయన అనుగ్రహం పొందితే కానీ నీకు నిజరూప దర్శనం రాదు…. అనేసరికి ఆయన దగ్గరికి చేరాలి అంటే ఈ తోకను దాటాలి కదా ! అంటే అవును తల్లి ! మహాభారతంలో భీముడికి పరీక్ష పెట్టాడు కదా! తోకని ఎత్తమని గుర్తుంది కదా…. అనేసరికి ఆ అవును ఉంది… ఇప్పుడు నీకు కూడా తోకని ఎత్తితే గాని ఆయన అనుగ్రహం కలగదేమో…. అనేసరికి 100 ఏనుగుల బలం ఉన్న భీముడి వల్లే కాలేదు….. మానవమాత్రురాలిని అయిన నా వల్ల ఏమవుతుంది అయ్యా! ఇది మరీ అన్యాయం ……అనేసరికి ఏమో తల్లి! భగవంతుడు లీలలు ఎవరికి తెలుసు….. వెంకన్న స్వామికి ఆయన భక్తుడైన రామభక్త హనుమంతుడితో లీలా విన్యాసం చేయాలనుకుంటున్నారేమో…. నిన్ను ఆటపట్టించాలని అనుకుంటున్నారేమో…. ఎవరికి తెలుసు….అనేసరికి ఇది చాలా అన్యాయం అనుకుంటూ…. అయినా స్త్రీ అబల కాదు సబల అని నిరూపిస్తారు. భీముడు ఎత్తలేనిది నేను ఎత్త వచ్చేమో…. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి…. దీనిని దాటితే కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేము…. పదార్థం దాటితే కానీ యదార్థం అర్థం కాదు.. యదార్థ జ్ఞానం తెలియదు… అనేసరికి తన చేతితో ఎంత ఎత్తినా కూడా ఒక అంగుళం కూడా కదిలించలేకపోయింది. శరీరం చెమటలు పడుతున్నాయి… ఎగ శ్వాస వస్తుంది… ఆయాసం వస్తుంది…. ఎంతలా విశ్వ ప్రయత్నం చేసినా కూడా…. కదలకపోయేసరికి ఇక నిరుత్సాహం కోపం, ఆవేశం, వస్తూ ఆయనే అనుగ్రహించ లేనప్పుడు… ఇంక మానవమాత్రురాలిని ….నావల్ల ఏమవుతుంది భీముడు వల్ల కానిది… నావల్ల ఏమవుతుంది…. అయినా నేను తెలివితక్కువగా ప్రయత్నించడం. ఇది ఈ ప్రయత్నాల వలన శరీరం సుష్కించుకుపోవడం… అలసిపోవడం తప్ప ఏమీ లేదు. ఇది దైవ సమానుడైన హనుమతోకను మానవ మాత్రులు ఎత్తడం అనేది అనితర సాధ్యం… అని చెప్పేసి అనుభవం అయ్యింది అనుకుంటూ ……అమ్మ తల్లి! హనుమ తల్లి అయిన అంజనదేవి..! నిన్ను వేడుకుంటున్నాను… ఈ సమస్యకి ఉపాయం నువ్వే చూపించు తల్లి…. అనేసరికి నడివయసు ఉండి, తెల్లని వస్త్రం ధరించిన ఒక ఆవిడ, జుట్టు విరబోసుకుని ఉన్న ఆవిడ కనిపించి…. అమ్మాయి! కంగారు పడమాకు… అపాయాన్ని దాటించే ఉపాయం ఏమిటో ఆలోచించు… నీకే తెలుస్తుంది . ఆ అంజనీ పుత్రుడిని ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను ఉపయోగించు… ఎంతటి శక్తి అయినా కూడా ఆ బలహీనత ముందు పని చేయదు. అప్పుడు నీకు నిజరూప దర్శనం ఇస్తాడు…. అనేసరికి ఈయనకి ఉన్న బలహీనత ఏమిటి…. అనుకునేసరికి సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచిస్తూ శివ నందిని కాస్త ఓ! ఈయనకి రామ మంత్రం ….శ్రీరామ మంత్రం శ్రీరామ నామం…. శ్రీ రామ రూపం అంటే ఈయనకి చాలా బలహీనత కదా! హనుమంతునికి శ్రీరామ అనుకుంటే సరిపోతుంది…. అనుకుని శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉండేసరికి అప్పటిదాకా భూమికి అతుక్కుపోయినట్టుగా ఉన్న తోక కాస్త దూది పింజలాగా తన చేతులతో గాలిలోకి లేచేసరికి….. గబగబా వానర మూర్తి కాస్త తల్లి దగ్గరికి వచ్చి …
అమ్మ! నా బలహీనతను అందరికీ చెప్పేస్తే ఎలా? నేను వాళ్లకి ఏమని మాయ పరీక్షలు పెట్టాలి… వాళ్ళ మాయలో నెగ్గాలి కదా! అంటే నాయనా…. నేనేమీ చెప్పలేదు… మూలమంత్రం తెలుసుకో బలహీనత పట్టుకో! అన్నానే గాని రామ మంత్రం చేయమని అనలేదు కదా! అంటే అవునవును…. ఈమెకి మనం మూలాతి మూలం తెలుసు కాబట్టి నా బలహీనత శ్రీరాముడు అని రామ మంత్రం చేసింది. సహజ సిద్ధంగా బరువైన నా తోకను కాస్త దూది పింజలాగా మారింది…. అనేసరికి అమ్మాయి l! నీ వల్ల నా తల్లి భౌతిక దర్శనం నిజరూప దర్శనం అయింది. ఇన్నాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కూడా రాలేదు. నేను ఉన్నాను…. నేను చూస్తూనే ఉన్నాను…. అని నాకు అంతర్వాణిగా సందేశాలు పంపిస్తుంది కానీ…. ఏనాడు నాకు ప్రత్యక్షంగా కనిపించదు. ఈరోజు నీవల్ల నాకు తల్లి దర్శన భాగ్యం కలిగించింది. మీకోసం నా తల్లి భౌతిక శరీరంతో వచ్చింది…నీకు ఏం వరం కావాలో కోరుకో అనేసరికి…. స్వామి! నాకేం వరాలు అవసరం లేదు… నా సాధన పరిసమాప్తి అయ్యే విధంగా ఎలాంటి మాయల్లోనూ పడకుండా…. ఎక్కడ ఆగకుండా…. సాధన పూర్తి అయ్యేటట్టు దీవించు…. తండ్రి! అనేసరికి తధాస్తు…. మీ సాధన పూర్తి అవ్వడానికి కావలసిన మనో ధైర్యము నా రూపంలో నీకు వస్తుంది…. అనేసరికి నా తల్లి అంజనా దేవి ఆత్మశక్తి నీలోకి ప్రవేశింప చేస్తున్నాను…. మనోనిగ్రహంతో…. ఇంద్రియ నిగ్రహంతో…. సాధన పరిసమాప్తి చేసుకో …..అనేసరికి అంజనా తల్లి ఆత్మ శక్తి కాస్త శివ నందినిలోకి ప్రవేశించి అనాహత చక్రంలోనికి ప్రవేశించింది. అప్పుడు ఉన్నట్టుండి హనుమ వానర రూపం కాస్త ఒక్క క్షణం హనుమ మూర్తిగా కనిపించి…. సుమారుగా 60 అడుగుల రూపంతో కనిపించి తల్లి! నా మాయ పరీక్ష నీకు పూర్తి కాలేదు. సహస్ర చక్రం దాటిన తరువాత వచ్చే నాడీలో నా నిజరూప దర్శనం పొందవలసి ఉంటుంది. నా మాయని దాటవలసి ఉంటుంది. పంచముఖ అనుగ్రహం పొందవలసి ఉంటుంది…. అని చెప్పి పంచముఖ హనుమ. లీలమూర్తిగా కనిపించేసరికి…. వీళ్లిద్దరూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసరికి…. ఆ దృశ్యం కాస్త అదృశ్యం అయింది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొంతసేపు అంజనాద్రి పర్వతం మీదనే ధ్యాననిష్ఠలో ఉండిపోయారు. ఆ తర్వాత వచ్చే వృషభాద్రి పర్వతం వైపు బయలుదేర పోతుండగా….. మళ్లీ యధావిధిగా ఒక నీటి కొలను కనిపించేసరికి ఇదేంటయ్యా ! ఇక్కడ విచిత్రంగా నీటి కొలను కనపడుతోంది ….అనేసరికి తల్లి! నీ సాధన మణిపూరక చక్రము మరియు అనాహత చక్రం పూర్తి చేసుకుంది. శక్తి జాగృతి పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు చక్రాలు దాటుకుంటే వచ్చే విష్ణు గ్రంధి కి అనుసంధానంగా ఈ నీటి కొలను అనేది వచ్చింది . ఇక్కడ విష్ణు గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథికి అధిష్టాన దైవం ఇక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి నీకు ఏదో లీలా మాయ పరీక్ష పెడుతున్నట్టు ఉన్నాడు . ఆయనను దాటితే కానీ నువ్వు ఈ గ్రంధిని దాటలేవు… చూడటానికి ఆ నీళ్లు స్వచ్చంగా ఉన్నాయి… నీళ్లలో ఎలాంటి పరీక్షలు ఉంటాయి. ఈ నీళ్ళని తాకకూడదా …ఈ నీళ్లను దాటాలా… ఎలా దాటాలి అనేసరికి నీకే తెలుస్తుంది…అనగానే స్వామి ! నాకు ఈ నీళ్లలో ఏవో చప్పుళ్ళు వినపడుతున్నాయి….అనేసరికి అక్కడ కొన్ని వందల సర్పాలు చేపల్లాగా నీళ్లలో ఈదుతూ ఉండేసరికి… ఇదేంటి స్వామి అనేసరికి ఇక్కడేదో గుప్త నిధులు ఉన్నాయి… తల్లి! నాగ బంధనం లో ఉన్నాయి
నీలో గరుడ శక్తి ప్రవేశించేసరికి…. దీనికి నాగబంధం విడిపోయినట్లు ఉంది…అని అంటూ ఉండేసరికి ఆ నీళ్లలో చూస్తూ ఉంటే ….ఒక పెద్ద బంగారపు భూషాణం ఉన్నట్లుగా లీలాగా కనిపించింది. రుద్రయ్య నువ్వు చెప్పినట్లుగానే ఇక్కడ సుమారు పది అడుగుల భూషాణం లాగా ఉంది . బంగారం తోను, రత్నాలతోనూ ఉన్నది…. అనేసరికి భూషాణమా ….అని ఆయన అందులోకి చూసేసరికి…. బంగారపు వర్ణంతో భూషాణం కనిపించేసరికి ….. అవును తల్లి….! ఈ భూషాణం చూసేసరికి… రుద్రస్వామి లో విపరీతమైన ధన వ్యామోహం కలిగి పిచ్చి పట్టినట్లుగా ఇంత బంగారం ఉన్న భూషాణం చూడటం ఇదే మొట్టమొదటిసారి…. అది కూడా రత్న కచితంగా నవరత్నాలతో నిర్మితమై ఉన్నది. ఎటు చూసినా ఇది ఎంత ఇదిగా ఉందో….. అని అనుకుంటూ ఉండేసరికి సహజసిద్ధంగా తలుపు తెలుసుకొనేసరికి…. రత్నాలు , మణులు , బంగారపు నిధులు, వజ్రాహారాలు లెక్కలేనంత బంగారపు గుప్తనిధి కనిపించేసరికి …..అమ్మ చూశావా! ఆ భూషాణములో ఎంత బంగారం ఉన్నదో ఈ బంగారం తీసుకుంటే మనం కోటీశ్వరులం అయిపోతాము… అని పిచ్చివాడికి లాగా అంటూ ఉండేసరికి…. ఏంటి స్వామి! నువ్వు చేస్తున్నది…. అన్నిటిని పరిత్యాగం చేసి సన్యాసిగా మారిన తరువాత రస విద్య తెలుసుకొని….బంగారం తయారు చేసే విద్యను తెలుసుకొని …బంగారంలా మారిన తర్వాత నీకు బంగారం మీద వ్యామోహం ఏమిటి? అనేసరికి బంగారం తయారు చేయడంలో ఉన్న ఇది ఏమీ లేదు…. తల్లి! ఇది సహజసిద్ధమైన బంగారం…. ఇంతటి బంగారం చూడడం అంటే సామాన్యమైన విషయం కాదు…. ఇది చాలా విలువైనది… నేను ఇంతవరకు రత్నాలను చూడలేదు… వజ్రాలను చూడలేదు… నవరత్నాలను చూడలేదు… చూశావా ఎంత మణి మయంగా ఉందో…. ఏ రాజు దగ్గర కూడా ఎంత గుప్తనిధి ఉండదు… అనంత పద్మనాభుడి దగ్గర ఉన్నట్లుగా చెప్పారే కానీ నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను… నాకు తెలిసి ఇవి తిరుపతి యొక్క వెంకన్న స్వామి గుప్త నిధులేమో …..ఒక భూషాణంలోనే ఇంత నిధి ఉందంటే…..ఈ కొలనులో ఇంకెంత బంగారం ఉందో….ఎంత గుప్త నిధులు ఉన్నాయో…. ఆదిశేషుని బంధనంలో బంధించి ఉంటారు…. ఇప్పుడు నీకున్న గరుడ శక్తితో ఆ బంధనం పోయి ఉంటుంది. వెళ్లి తీసుకుంటాను… కావాల్సిందే… పొందాల్సిందే అనేసరికి ఆగయ్య! నువ్వు తొందరపడమాకు…. ఇది అది అంటూ ఉండేసరికి…. ఏమాత్రం ఆలోచించకుండా కొలనులోకి దూకేసరికి ఆ బంగారం… ఆ భూషాణం… ఆ నిధులు చూపిస్తూ ….ఆ మణులు, రత్నాలు చేతిలోకి తీసుకుంటూ…. ఆ హారాలన్నీ తన ఒంటిపై వేసుకుంటూ…. అభిషేకం చేసుకుంటున్నట్లుగా….పిచ్చివాడిలాగా చూడు! నేను గుప్త నిధులు కనిపెట్టాను… అని తిరుగుతూ ఉండేసరికి… ఇదేమి లీలరా నాయనా! అనేసి ఏమాత్రం ఆలోచించకుండా ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి…. యధావిధిగా తనకేం సంబంధం లేదు…. తనకేం పట్టడం లేదు ….అన్నట్లుగా యధావిధిగా ధ్యానంలో కూర్చునేసరికి….ఆ గుప్తనిధి అదృశ్యం అయ్యేసరికి ఉన్మాదిగా….మారిన రుద్ర స్వామి కాస్త ఆ కొలను లో నుంచి ఈదుకుంటూ వచ్చేసరికి…..నువ్వేం చేసావు ….నువ్వు ఆశించినట్టు ఉంటే మనకి ఆ నిధి వచ్చేది. వెంకన్న స్వామికి మించిన ధనవంతులం అయ్యే వాళ్ళము… నువ్వు ఆశ పడకపోవటం వలనే….. ఆ గుప్త నిధుల భూషణం మాయమైపోయింది… అని అంటూ ఉన్నా కూడా ఈమె ధ్యానం నుంచి బయటకు రాకుండా ఉండేసరికి….కొంతసేపటికి కొలను కూడా అదృశ్యం అయిపోయింది…. ఎప్పుడైతే కొలను అదృశ్యమైందో…. అప్పుడు రుద్ర స్వామిలో యదార్ధ రూపం వచ్చి…. ఏంటి నేను క్షణకాలం ధన మాయ మోహంలో, వ్యామోహంలో పడ్డానా? ఇది అనుభవంలోకి రాలేదు… ధ్యానంలో ఇన్నాళ్లు గుప్త నిధులు చూడడమే…. కానీ ప్రత్యక్షంగా చూసేసరికి తను కూడా ధనమాయలో పడ్డట్టుగా అనిపించింది. ధన మాయలో పడ్డాను… ధ్యానంలో చూసి దాటితే అది పురాణం వైరాగ్యం అవుతుంది. ఎప్పుడైతే దాన్ని అనుభవంలోకి తెచ్చి దాటితే…. అది స్మశాన వైరాగ్యం అవుతుంది అన్నమాట! తను బంగారం తయారుచేసి బైరాగిగా మారినప్పటికీ…. ధనమాయ మహామాయలో ఎలా తను పడ్డాడో కానీ శివ నందిని పడకపోయేసరికి ఆనందపడుతూ….. తల్లి ! నువ్వు జయం పొందావు. నేను అపజయం పొందాను. అందుకనే నా సాధన ఆజ్ఞచక్రం దగ్గర ఆగిపోయింది…. గ్రంథుల విషయంలో నేను తప్పటడుగులు వేసినట్లుగా అనిపించింది. గ్రహించాను…. ఇన్నాళ్లు నా సాధనలో లోపాలు ఏంటి? అనేది తెలుసుకోలేకపోయాను. ఇందాక బ్రహ్మగ్రంధి దగ్గర మాయలో పడ్డాను. మళ్ళీ విష్ణు గ్రంధి దగ్గర మాయలో పడ్డాను. అందుకనే గరుడవేగానికి నా శరీరం తట్టుకోలేక వెనక్కి వెళ్ళింది. కుండలిని శక్తి మూలాధార చక్రం మరియు స్వాధిష్ఠాన చక్రంలోనే కొట్టుకుంటుంది…. గ్రంధిని దాటలేదని గ్రహించాను. అలాగే ఇప్పుడు రుద్ర గ్రంధి వరకే నా సాధన ప్రవాహం జరుగుతోందని గ్రహించాను. ఇన్నాళ్లు నా సాధన ఎంతవరకు ఉందో… ఏ స్థితిలో ఉందో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అయింది… గ్రంథి మాయలో నేను పడ్డాను… చక్రాల మాయలు దాటాను…నన్ను క్షమించు తల్లి…. నా వల్ల నువ్వు మాయలో పడే పెను ప్రమాదాన్ని దాటుకున్నావు… నువ్వు ఆశించలేదు…. అనేసరికి లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి బంగారు పద్మంలో లీలగా శివనందినికి ధ్యానంలో కనిపించేసరికి…. నమస్కారం చేస్తూ ఉండగా ధ్యానంలో కాదు ఇహంలోనే నిజరూప దర్శనం ఇచ్చారా ? అని కళ్ళు తెరిచి చూసేసరికి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి దర్శనం కనిపించేసరికి….. వాళ్ళిద్దరూ మహాలక్ష్మి కాస్త…తల్లి! నీకు పెట్టిన ధన మాయ, కనక మహా మాయను దాటగలిగినావు… గుప్తనిధుల మాయను దాటగలిగినావు…. నువ్వు లక్ష్మిని ఆశించలేదు…. కాబట్టి నీ సాధన పరిసమాప్తికి మహాలక్ష్మి మాయ కూడా నువ్వు దాటేసావు… అని చెప్పి నీ సాధన పరిసమాప్తికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాము… అనేసరికి వాళ్ళిద్దరూ ఏకమై ఏకశక్తితో తమ ఆత్మ శక్తితో విష్ణు గ్రంధిలోనికి ప్రవేశించడం జరిగింది. రుద్రస్వామి కల్లార్పకుండా చూస్తూ మొదటిసారిగా శివ నందినికి నమస్కారాలు చేస్తూ ఉండేసరికి….. సాక్షిభూతంగా శివ నందిని ఏమీ తెలియనట్టు…. ఏమీ పట్టించుకోనట్లుగా….అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కొంతసేపు అక్కడే ధ్యానం చేసుకుని…. ఆ తర్వాత వచ్చే వృషభాద్రి వైపుకి వెళ్లడం ప్రారంభించారు.
ఇలా వీళ్ళిద్దరూ విష్ణు గ్రంధి మాయను దాటుకొని…వృషభాద్రి పర్వతానికి చేరుకున్నారు…వృషభాద్రి పర్వతంలో ఎక్కడ ఎవరు కనిపించకపోయేసరికి…. ధ్యానంలో కూర్చున్నారు. ఉన్నట్టుండి గీం కార నాదం వినిపించేసరికి… వీళ్ళిద్దరూ ధ్యానం నుండి బయటకు వచ్చారు. ఒక రాక్షస స్వరూపం ప్రత్యక్షంగా…. వాళ్ళ ముందు కనిపించి…. హోమం చేస్తున్నట్లుగా కనిపించింది. వీళ్లిద్దరూ భయపడలేదు… రాక్షసుల ఆత్మ శరీరం భౌతికంగా చూడటం…శివ నందిని ఇదే మొదటిసారి చూడటం జరిగింది. ఈయన ఎవరో కానీ ….రాక్షస స్వరూపంతో హోమం చేస్తున్నారని వీరిద్దరికి అర్ధమయ్యి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ….. ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అని ….సాక్షిభూతంగా ఉండేసరికి ఆయన హోమ మంత్రాలతో పెద్దపెద్దగా చదువుతూ ఉండేసరికి…. శివ నందినికి ఇంతకుముందు ధ్యానంలో రాక్షస, ప్రేత ,భూత, స్వరూపాలను చూడటం జరిగింది ….కానీ ప్రత్యక్షంగా భౌతిక శరీరంతో నీలం స్వరూపంతో ఉగ్రస్వరూపంగా ఒక పది అడుగుల ఉండి మెలిపెట్టిన కండరాలతో చూడటానికి భయంకరంగా కోరలతో నెత్తిన ఎద్దు కొమ్ములతో…. ఉన్న స్వరూపాన్ని శివనందిని మొదటిసారి చూడటం జరిగింది. ఎవరైనా సామాన్య మానవ మాత్రులు అర్ధరాత్రి ఇలాంటి ఉగ్ర స్వరూపాన్ని చూసినట్లయితే…. భయంతో చచ్చిపోవడమో…. వెనక్కి తిరిగి పారిపోవడం…. జరిగి ఉండేది. కానీ మనోధైర్యం స్వరూపంలో హనుమాన్ ఆమెలోకి ప్రవేశించడంతో… ఆమెకు ఎక్కడా లేని మనోధైర్యం, నిగ్రహ శక్తి రావటం జరిగింది అని అర్థం అయింది . తనలో దైవిక శక్తులు ఉండటంతో తను మానవత్వం నుంచి దైవత్వం లోకి తన స్థితి మారుతుందని గ్రహించడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. సరే ఏం జరుగుతుందా అని పక్కనే ఉన్న కొండరాయి మీద కూర్చుని చూస్తూ ఉండేసరికి…… ఆ రాక్షసుడు ఉగ్రమైన రుద్రమంత్రాలను చదువుతూ….. స్వామి! నీకోసం హోమ తర్పణం కింద నా తలని ఇస్తున్నాను… అని చెప్పేసి పక్కనే ఉన్న కత్తిని తీసుకొని హోమ తర్పణం కింద ఆయన తలను నరికి…. హోమంలో వేసేసరికి హోమాగ్ని కాస్త ఆకాశాన్ని అంటుతుంది …..అన్నట్టుగా ఒకసారిగా ఉగ్ర జ్వాల చూపించేసరికి…. ఒక్క క్షణం అయోమయం స్థితిలోనికి వీళ్ళిద్దరూ పడ్డారు. రుద్ర స్వామి అయితే ఈ దృశ్యం చూశాక భయభ్రాంతుడు అయ్యాడు . కానీ శివ నందిని మాత్రం సాక్షిభూతంగా భయపడకుండా…. ఏం జరుగుతుందో అని ఏదో హర్రర్ సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ కూర్చుంది . ఆ రక్తపు ధారలు …మొండెం నుంచి బయటకు ఫౌంటెన్ లాగా కారుతున్నప్పటికీ ఏమీ స్పందించకుండా అలాగే ఉంది. తల వెళ్లి హోమాగ్నిలో పడిపోయి బూడిదలో కాలిపోతూ ఉన్న దృశ్యం చూసింది. ఒక మనిషి తల నరుక్కుంటే…. ఎలా ఉంటుందో భయపడకుండా ఏమాత్రం చలించకుండా… అలా చూస్తూ ఉండిపోయింది. కానీ మానవమాత్రులు అయితే స్పందించడమో… భయపడటం పారిపోవడమో చేసేవారు. కానీ శివ నందిని అలా చేయలేదు… నిగ్రహంగా నిలబడింది. ఆ తర్వాత కొంతసేపటికి హోమాగ్ని చల్లారిపోవడం హోమంలో నుంచి తల వచ్చి ఈయన శరీరానికి అతుక్కుపోవడంతో…. తలతో ఉన్న మొండెం గా మారడంతో ఇదంతా చూస్తున్న శివ నందినితో చూశావా! నా నిజభక్తి ఎట్టిదో…. నేను తలనే శివునికి అర్పించేంత నిజ భక్తి నాది. నా భక్తిని మించిందా నీది అని అంటూ ఉండేసరికి…. ఈయన తననే ఉద్దేశించి అంటున్నాడని….స్వామి! అదేమీ లేదు…నేను భక్తురాలి భక్తిలో అహంకారం ప్రదర్శించలేదు…. మీకున్న అహంకారం అనే తలని సమర్పించడంలో సర్వస్య శరణాగతి భావంతో మీరు వచ్చారు ….అనేసరికి నీకు భయం వేయలేదా? అని అడిగేసరికి దేనికి భయం స్వామి! ఇప్పుడు వీరశైవులు ఉన్నారు. వాళ్ళు నాలుక, శరీరం సమర్పిస్తారు…. ప్రాణత్యాగం చేస్తారు…. కాశీలో త్రైలింగ స్వామి ఉన్నారు…. ఆయన చెయ్యిని ఆయన చేసే హోమంలో సమర్పించే వాళ్ళు అని చెప్పి ….ఆయన చరిత్రలో విన్నాను. ఆ తర్వాత హోమం పూర్తి అయ్యాక… చెయ్యి తిరిగి వచ్చేది అని విన్నాను. అంతెందుకు రామాయణంలో రావణబ్రహ్మ తన ఏకాదశ రుద్రుల కోసం ఏకాదశ తలలు సమర్పించడం జరిగింది కదా ! అనేసరికి ఇన్నాళ్లు నేను శబ్ద పాండిత్యంలో అనుభవాలు చదివాను… ఇప్పుడు అనుభవ పాండిత్యంలో నిజరూపంగా చూస్తున్నాను. కాబట్టి చదివిన దానికి చూసిన దానికి పెద్దగా తేడా ఏమీ లేదని గ్రహించాను. కాకపోతే భయపడకుండా… చలించకుండా ఉండగలిగితే చాలు . మీ సాధన మీరు పరిసమాప్తి చేసుకోవాలి. అయ్యయ్యో ….మీరు తల నరుక్కోవడం ఏమిటి అని మిమ్మల్ని ఆపితే మీ సాధన ఆగిపోయేది . ఒకవేళ తల నరికిన తరువాత అయ్యో పాపం ఈయన తల తగలపడిపోతుంది…. ఈయనకేమైనా ఏర్పాట్లు చేయలేమో అని మీ శరీరాన్ని కాపాడాలని ప్రయత్నం చేసి ఉన్నా కూడా….. మీ సాధన ఆగిపోయేది. కాకపోతే మీరు మధుర భక్తితో
… ఈశ్వర అనురక్తితో ఆయనకి బిల్వ పత్రాలు, పుష్పాలు ఎలా అయితే సమర్పిస్తారో…. మీరు అలా మీ తలను… తలలో ఉన్న అహంకారాన్ని ఆయనకి సమర్పించారు అని నాకు అర్థం అయింది. ఆ తల ఆయన అనుగ్రహం పొందడంతో మీకు యధా స్థానంలోకి వచ్చేసింది అనేసరికి….. అప్పుడు ఆయన ఆ రాక్షస స్వరూపంలో ఉన్న వృషభాసురుడు ఒక పెద్ద ఎద్దులా కనిపించే సరికి ఇది శివుని వాహనం అయిన శివనంది ఏమో …….శివుడు వృషభ స్వరూపమేమో….. అనిపించేసరికి ఆ వృషభం తన శరీరంలోనికి ప్రవేశిస్తూ…. విశుద్ధ చక్రంలోనికి నిక్షిప్తమైనట్టుగా అనుభవ అనుభూతి శివ నందిని అనుకోసాగింది. అంటే విశుద్ధ చక్రంలోనికి వృషభ శక్తి నిక్షిప్తం అయ్యిందన్నమాట…. ఆ తర్వాత అక్కడే వాళ్ళు ధ్యానంలో కొంతసేపు ఉన్న తర్వాత అమ్మ! మనం ఇప్పుడు నారాయణద్రి పర్వతానికి వెళ్లాలి… వెళ్లాలి నాకు తెలిసినంతవరకు నీకు ఇది ఆజ్ఞ చక్రానికి అనుసంధానం అయ్యి ఉంటుంది అని చెప్పేసరికి….. ఈ నారాయణ అనే మహాముని విష్ణుమూర్తి సాక్షాత్కారం కోసం ఇక్కడ ఈ పర్వతం మీద తపస్సు చేశారని స్థల పురాణంలో చెప్పడం జరిగింది. అవునా స్వామి! అని వీళ్ళిద్దరూ నారాయణ పర్వతం వైపుకి వెళ్లడం జరిగింది .
ఇలా వీళ్ళిద్దరూ కలిసి నారాయణాద్రి పర్వతం మీదకి వెళుతూ ….ఉండేసరికి ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణం స్పష్టంగా వినబడుతూ ఉండేసరికి…. ఈ అర్ధరాత్రి పూట ఈ కొండమీద ఎవరు నామస్మరణ చేస్తున్నారా? అని అనుకునేసరికి….ఒక బండరాయి మీద పద్మాసనం వేసుకొని…. తీవ్రమైన ధ్యాననిష్ట లో ఉన్న మహర్షి కనిపించేసరికి ….ఈయనే నారాయణస్వామి మహర్షి అంటారు. ఈయన విష్ణుమూర్తి అనుగ్రహమును పొందడం జరిగింది. ఇక్కడే తీవ్రమైన ధ్యానము చేశారు. ఎలాంటి మాయా ప్రభావం చూపించని ప్రదేశాన్ని ఏకాంతమైన ధ్యానానికి అనువైన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మ దేవుని అడిగితే ….వెంటనే స్వామి ఆవాసమైన శేషాద్రి పర్వతాలలో ఈ పర్వతమును చూపించడం జరిగింది. దానితో ఈ నారాయణ మహర్షి విష్ణుమూర్తి కోసం తీవ్రమైన ధ్యాన తపస్సుకి చేయడం జరిగింది . ఈ తపస్సుకి ఈయన ఎలాంటి భంగం ప్రకృతి ద్వారా కలగలేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈయన విష్ణుమూర్తి నిజరూప దర్శనం పొందడం…. ఆ తర్వాత అక్కడ ఆయన చేసిన తపస్సు ఫలితంగా ముక్తిని పొందడంతో…. ఈ పర్వతంలో ఉండేటట్టుగా ….అనుగ్రహించమని విష్ణుమూర్తి దగ్గర వరం పొందడం జరిగింది అని స్థల పురాణం చెబుతుంది. సరే! అని అనుకుంటూ ఉండేసరికి…. అంత తీవ్ర ధ్యాననిష్ఠలో ఉన్న నారాయణద్రి స్వామి కళ్ళు తెరిచి… ఎవర్రా? మీరు…. నా ధ్యానానికి భంగం కలిగించకుండా…. బ్రహ్మ దేవుని ద్వారా వరం పొందిన వాడిని… నా ధ్యానానికి భంగం కలిగించడానికి మీరు ఎలా సాహసం చేశారు…. అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చారు? అని అంటూ ….మీ సంగతి నేను ధ్యానంలో చూస్తాను అని ధ్యానంలో చూసి శివ నందిని యొక్క సాధన స్థితిగతులు లీలామాత్రముగా చూసేసరికి…. ఓహో అవునా తల్లి! నువ్వా…. సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం పొందిన దానివి. మేమంతా కూడా ఆయన అనుగ్రహం పొందటానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు యుగాలు పడుతుంది. నువ్వు ఏనాడు చేసుకున్న పుణ్యఫలమో ……నిజరూప దర్శనంతో ఆయన వచ్చినా కూడా ఆయన గమనించకుండా…. పట్టించుకోలేని…. గుర్తించలేని అయోమయ స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ వెంకన్న స్వామియే గోపాల స్వామి రూపంలో వచ్చినా కూడా నువ్వు గమనించలేకపోయావు. ఆయన సాక్షాత్కారం ఇచ్చిన గుర్తుపట్టలేకపోతే ఇంకెందుకు తల్లి! నీ సాధనా. మాయలో నువ్వు ఉండిపోయినట్లు ఉన్నావు.. నా స్వామిని నువ్వు గుర్తించలేకపోయావు ….అనేసరికి అదేం లేదు స్వామి. ఆయన్ని నేను గుర్తించినా కూడా ఆయన భార్య మహాలక్ష్మి అని చెప్పినా కూడా…. ఆమెను చూపించిన కూడా… నాకు ఎక్కడో వెంకన్న స్వామిని చూసినట్టు అనిపించింది. అదే విషయం కూడా చెబితే ఆయన అదేం లేదు తల్లి! నేను కేవలం వెంకన్న భక్తుడిని…. వెంకన్న స్వామి ఉపాసకుడిని ….ఆయన ఉపాసన సిద్ధి పొందడం వలన నేను ఆయన రూపంలో పొందటం జరిగింది… అని నాకు మాయమాటలు చెప్పడం జరిగింది ….అనేసరికి ఆయన మాటలు నిజమని నమ్మితే ఎలా తల్లీ! ఆయన మాటలతోనే ఏ మార్చగలడు…. తనని గుర్తుపట్టకుండా చేసుకోగలిగాడు…. ఎక్కడ నువ్వు వెంటపడతావో అని ఆలోచించి ఉంటాడు…. అనేసరికి జరిగిందేదో జరిగిపోయింది స్వామి! మీరు ఆయన అనుగ్రహం పొందారు కదా ! ఆయన నిజరూప దర్శనం పొందారు కదా ! ఇలాంటి నిజ భక్తులని ఇప్పుడే చూస్తున్నాను….. ఇంతకంటే నాకు ఏం కావాలి….నా సాధనలో తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి. నేను పెద్దగా పట్టించుకోను…. నేను ఎక్కడా ఆగకూడదు…. ఏ మాయలోను ఆగకూడదు….నా సాధన పరిసమాప్తి చేసుకోవాలి. అదే నా వల్ల ఈ లోకానికి లోకకళ్యాణం జరుగుతుందని చెప్పేసి నేను సాధనలోకి రావడం జరిగింది అని మీకు తెలియనిది కాదు కదా! నా సాధన పరిసమాప్తికి కావలసి మనో ధైర్యం , మీరు ప్రసాదించాలి ….అలాగే ధ్యాన తపస్సుకి ప్రకృతి మాయ చూపిస్తుందని తెలిసి మీ సాధనకి ఎలాంటి మాయలు లేని ప్రదేశం కావాలని వరం అడగడంతోనే….. మీ విజ్ఞత, విషయ జ్ఞానం, సూక్ష్మాతి సూక్ష్మ స్థితి నాకు అర్థం అయింది….. అనేసరికి తల్లి! నా సాధనాస్థితి అయిన మాయలేని స్థితి నువ్వు పొందడం చాలా కష్టం. సాధనలో అడుగడుగునా మాయలు వస్తూ ఉంటాయి. వాటిని దాటుతూ ఉంటేనే నువ్వు ముందుకు వెళ్లగలవు. మాయలో పడిపోతే నీ సాధన ఆగిపోతుంది… ఇప్పుడు తపోలోకంలో నా సాధన ఉన్నది. నా తర్వాత వచ్చే ఆఖరి పర్వతమే వెంకటాద్రి పర్వతము. అది సహస్ర చక్రానికి అనుసంధానమైన పర్వతము…. అదే నీకు సత్య లోకము సత్యాసత్యము చూపిస్తుంది. ఏది సత్యము… ఏది అసత్యము…అనేది 14వ లోకం అయిన సత్య లోకంలో ఏం చూడగలుగుతాము…. ఏంటి అనేది వెంకటేశ్వర స్వామి ధ్యాన అనుభవాల ద్వారా దృశ్యాలు చూపించగలరు. కాకపోతే అందుకు నీకు అర్హత ,యోగ్యత ఉండాలి. నువ్వు సత్యాన్వేషిగా ధ్యాన అనుభవాలు పొందు. ధ్యాన సిద్ధి పొందు. నేను తపస్సు ద్వారా ఏ స్థితి అయితే పొందానో…. అంతిమంగా ఏ అనుభవాలు పొందానో …. ఆ అనుభవాలన్నీ కూడా సత్యలోక ఆవాసమైనా వెంకటాద్రి పర్వతంలో వెంకన్న స్వామి లీల మూర్తిగా నీకు అన్ని చూపిస్తారు…చూపించే అంత స్థితి నీకు రావాలని నేను కోరుకుంటున్నాను.. అనుగ్రహిస్తున్నాను…. నీ ద్వారా నా సాధనాస్థితి కూడా పరిసమాప్తి చేసుకోవాలనుకుంటున్నాను… కేవలం నేను ఇక్కడ ముక్తి పొందడమే జరిగింది… నేను శూన్యం అవ్వాలనుకుంటున్నాను…. ఎలా అయితే వచ్చానో…. అలా తిరిగి శూన్యం అవ్వాలనుకుంటున్నాను…. నా మరణమే మోక్షమరణం అవ్వాలనుకుంటున్నాను…. కాబట్టి నాలో కూడా ఒక విధమైన స్వార్థం ఉందని, నేను మోక్షం పొందాలని అనుకో…. నా మోక్షం నీ ద్వారా తీరుతుంది అని ప్రకృతి నీ ద్వారా జ్ఞానమును అందించడం జరిగింది. నా ఆత్మ శక్తితో నీలోనికి ప్రవేశించడం జరుగుతుంది. తద్వారా నీ ఆజ్ఞా చక్రమునందు నేను ఆత్మ శక్తి స్వరూపంతో ప్రవేశిస్తున్నాను… అనగానే సరే స్వామి నామీద మీకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు, మీరు పెట్టుకున్నప్పుడు నా సాధన పరిసమాప్తి కాకుండా నేను ఏదైనా మాయలో పడి… నా సాధన ఆగిపోతే మళ్లీ యధావిధిగా తిరిగి ఇక్కడికి వచ్చి ఈ పర్వతం మీద యధావిధిగా ధ్యాన తపస్సు చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోండి…ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా! ఈశ్వరుని అంతిమ నిర్ణయం తెలీదు కదా! అనేసరికి
సరే సంకల్ప రహితంగా……స్పందన రాహిత్యముగా నువ్వు ఉన్నావు. ఆలోచన రాహిత్యంగా నువ్వు ఉన్నావు. కోరిక రాహిత్యంగా నువ్వు ఉన్నావు… కాబట్టి నీకు ఎలాంటి మాయలు, మర్మాలు లేని స్థితిని నువ్వు పొందుతావు… తద్వారా మాయలు, మర్మాలు ఆవహించినట్లయితే వాటిని ఎలా దాటాలి ఏ విధంగా దాటించాలి అని నాకున్న అనుభవ జ్ఞానంతో…. బ్రహ్మజ్ఞానంతో…. నీకు జ్ఞాన స్ఫురణ అందిస్తాను….అనేసరికి ఈశ్వరాజ్ఞ అనుకునేసరికి ఆ నారాయణమూర్తి కాస్త ఆత్మశక్తి స్వరూపంతో శివ నందినిలోని ఆజ్ఞ చక్రం నందు స్థిరపడటం జరిగింది. అంటే భ్రుకుటి స్థానంలో ఉన్న ఆజ్ఞా చక్రం లోపలికి శ్వాస ద్వారా ప్రవేశించి…. శివ నందినిలోకి ప్రవేశించి స్థిరపడటం జరిగిందన్నమాట! ఇదంతా కూడా రుద్రస్వామి సాక్షిభూతంగా చూస్తూ లీలామాత్రంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆఖరిగా వచ్చే వెంకటాద్రి పర్వతం మీదకి వస్తూ ఉంటే యధావిధిగా మళ్లీ ఒక కొలను కనిపించేసరికి విషయం వీళ్ళిద్దరికీ అర్థమయింది… ఎందుకంటే తన సాధన శక్తి విశుద్ధ ,ఆజ్ఞా చక్రంలో దాటి ఆ తర్వాత వచ్చే రుద్ర గ్రంధి విభేదనం కోసం ఈ కొలను మాయను దాటవలసి వస్తుందని చెప్పేసి…. రుద్ర స్వామికి శివ నందినికి అర్థం అయింది. ఆ కొలను దగ్గరికి వెళ్ళటం జరిగింది. కొలనులో వీళ్ళిద్దరూ చూస్తూ కూర్చున్నారు…కానీ ఏమీ కనిపించలేదు. సరే! అని చెప్పి కొలనులో ఉన్న బండరాళ్ళ మీద చెరొకరాయి మీద కూర్చొని ధ్యాననిష్ట లో ఉండిపోయారు. ఉన్నట్టుండి కొలనులో విపరీతమైన అలజడులు, సుడులు తిరుగుతున్నట్టుగా కనిపించేసరికి….కళ్ళు తెరిచి చూశారు. నీళ్లు అకారణంగా ఎగసిపడుతున్నట్లుగా నీటిలో అగ్నిపర్వతం ఉన్నట్లుగా…. నీరు ఉడుకుతూ మసులుతున్నట్టుగా…..కొలను మొత్తం భయంకరమైన శబ్దాలు రావడంతో కదలకుండా ఏం జరుగుతుందా అని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఉన్నట్టుండి శివ నందిని తనలోకి దైవశక్తులు ప్రవేశించినాయని….తను నిజ భక్తురాలు కాబట్టి , తనలోనికి దైవశక్తులు వచ్చినాయి. దైవాలు ఆత్మశక్తి స్వరూపంలో తనలోకి ప్రవేశించారు… ఆదిశేషుడు ప్రవేశించాడు.. గరుడుడు ప్రవేశించాడు… వాయుదేవుని తల్లి అయిన అంజనా దేవి ప్రవేశించింది… ఎందుకంటే తనలో సాధనా శక్తి ఉండటం వల్లే కదా! గత జన్మలో తను చేసుకున్న పుణ్యం వలన ఇలాంటి దైవిక శక్తులు అన్నీ కూడా తనలోకి వచ్చినాయి…. అంటే తనెంత నిజభక్తురాలు అయి ఉంటుంది…. అంటే రావణబ్రహ్మ శివ భక్తులలోను విష్ణువు శివ భక్తులలోనూ ఉన్నప్పటికీ …..వాళ్లనే మించిన భక్తిని కలిగి ఉండటం వల్లనే ఈ దైవశక్తులన్నీ కూడా తనలోకి వచ్చినాయని అహంకారం నెమ్మదిగా తనని ఆవహించి అహం భావంలోనికి వెళ్ళటం ఆరంభించింది. చిన్న పురుగును చూసినట్టుగా చూస్తూ…. రుద్ర స్వామితో అయ్యా చూశావా! దాదాపు 40 సంవత్సరాలు బాటు కాశీ క్షేత్రంలోనే ఉన్నావు. నేను 9 నెలలు మాత్రమే కాశీ క్షేత్రంలో ఉన్నాను. నా సాధనా శక్తి ఎంత ఉన్నత స్థితికి వెళ్లిందో చూడు….నువ్వు ఆజ్ఞా చక్రంలోనే ఉన్నావు. నేను సహస్ర చక్రం లోకి వెళ్ళిపోతున్నాను….పైగా నువ్వు గ్రంధుల మాయలో పడిపోయి, నీలాద్రి పర్వతంపై పడిపోవటం…. మణుల కోసం ఆశపడటం… నేను చూసావా ఎంతటి మాయల్ని దాటానో…. మాయల్ని దాటుకొని దేవతాశక్తుల్ని ఆపాదించుకున్నాను. వాటంతట అవే వచ్చినాయి. నేను పిలవను కూడా పిలవలేదు… నా భక్తి తత్పరతకు దేవతా శక్తులు వశమైనాయి. వాటంతట వాళ్లే నాలోకి ప్రవేశించారు. ఎంత ఉన్నత స్థితిలో నా సాధన ఉందో గమనించు. నీ సాధన ఎంత అధోగతిలో ఉన్నదో గమనించు… తేడా తెలుసుకున్నావా? నీకన్నా నేను ఉన్నతురాలిని… అని ఇక రాబోయే కాలంలో వెంకటేశ్వర స్వామి కూడా నా ముందు పనికిరాడు ….ఈశ్వరుడు కూడా పనికిరాడు…. అమ్మవారు కూడా పనికిరాదు…. నేను విశ్వాధినేత కు వెళ్ళిపోతాను. విశ్వాన్ని శాసించగలిగే స్థితికి వెళ్ళిపోతాను ….విశ్వమే నా అధీనం అవుతుంది… విశ్వం నేను చెప్పినట్లుగా చేస్తుంది. విశ్వంలో సృష్టి స్థితి లయలను నేను చేస్తాను ….వేరే ఎవరో చేయడం ఏమిటి? ఈశ్వరుడు చేయటం ఏమిటి? ఈశ్వరి చేయటం ఏమిటి? వాళ్ళే నాకు దాసోహం అవ్వాలి. దైవాలే నా పాదక్రాంతులు అవుతున్నారు… ఇంక దైవశక్తులే నాకు దాసోహం అవుతున్నాయి అని అన్నారు…. ఇన్నాళ్లు ఈశ్వరుడైన శివుడే అందరినీ పాదక్రాంతులను చేసుకున్నాడని చెబుతున్నారు. ఈరోజు చూడు దాదాపుగా పదిదైవ శక్తులు గానూ తొమ్మిది శక్తులు నాలో ప్రవేశించినాయి…. నాలో ఎంత సాధనా శక్తి పొంది ఉండకపోతే….నా భక్తి తత్పరతకు దైవశక్తులు వశమవుతాయి…. చూశావా! అంటూ ఉండేసరికి రుద్ర స్వామి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కారణం ఈమె అహంకార మాయలోకి వెళ్లిందని గ్రహించాడు. రుద్ర గ్రంధి విభేదనం అవ్వాలంటే….అహంకారమాయే వస్తుంది. ఈ మాయను దాటగలిగితే సహస్ర చక్రం లోనికి వెళ్ళగలుగుతుంది. లేదంటే అహంకారంలోకి వెళ్ళిపోతుంది. 99.99% మంది సాధకులు గర్వ అహంకారం దాటలేక ఆగిపోవడం జరిగింది. మరి ఈ పిల్ల ఏం చేస్తుందో అని రుద్రస్వామి తల్లి ! నువ్వు అలా అంటావేంటి …..ఆజ్ఞ చక్రంలో కావాలని సాధన పరిసమాప్తి చేసుకున్నాను…. నీకన్నా ముందు నేను సహస్ర చక్రంలోకి వెళ్ళగలను… నువ్వు ఎంత….నీ బతుకెంత …..నీ సాధన ఎంత ……నువ్వు ఒక ఆడదానివి. నేను అనుగ్రహించడం వలన సాధనకు వచ్చావు. నేను బిక్షపెట్టడం వలన నువ్వు సాధనకి వచ్చావు… పురుషుడు నీకు గురువులుగా ఉండి సాధన ఇది చేసినారు అనేసరికి….. జ్ఞానబోధలు చేశారు… దీక్షలు ఇచ్చారు అనేసరికి…. శివ నందిని అలా అనకు… పురుషుడు పురుష దైవాలు ఎందుకు వచ్చారు? గత జన్మలలో నా సాధనా శక్తికి వశం అయ్యి వచ్చారు. ఊరికే వాళ్లు రాలేదు… వాళ్ళు పరీక్షలు పెట్టిన తరువాత అర్హత, యోగ్యత, యోగం పరీక్షలన్నీ నేను దాటాను. మాయ పరీక్షలు దాటగలిగాను… గురువుల మాయలు దాటగలిగాను …
దైవానుగ్రహ పరీక్షలు దాటగలిగాను…. అనుగ్రహాలు పొందాను ….ఈ విధంగా పొందిన స్త్రీమూర్తులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా! ఆదిపరాశక్తి మోహమాయను దాటలేక సంతానమాయ భక్తి మాయను దాటలేక ….అవస్థలు పడి పునః జన్మని పొందడం జరిగింది కదా! నేను భోగ జీవితంలో నా భర్తను, పిల్లల్ని వదిలేసాను కదా! నేను మోహమాయను దాటేసాను కదా! మోహమాయ దాటితే మోక్షమే కదా! మోక్షమును పొందటానికి నాకు అర్హత ఉంది కదా! అర్హతను సాధించాను కదా! ఆదిపరాశక్తి సాధించలేని అర్హత నాలో ఉంది. ఉన్నప్పుడు నేను ఎంత స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నానో ఆలోచించుకోండి …ఈ సృష్టి ,స్థితి, లయలు దాటేసి విశ్వాధినేత అవుతాను. ఇన్నాళ్లు పురుషులు విశ్వాధినేత ఉన్నాడు. ఈనాటి నుంచి నేనే విశ్వాధినేత…నేనే బ్రహ్మ…నేనే శివోహం స్థితి దాటి అహం బ్రహ్మాస్మిస్థితికి వెళతాను. నన్ను ఆపే వాళ్ళు లేరు. ఆపించే మాయలేదు.. నేనే మాయకు అది దేవతను…. నేనే మాయను సృష్టించగలను. నేనే మాయతో ఆడించగలను….నేనే మాయను అదుపు ఆజ్ఞలో పెట్టగలను…ఆ మాయ నన్నేమీ చేయలేదు అంటూ ఉండేసరికి…. ఏం చేయాలో ఏమీ అర్థంకాని అయోమయ స్థితిలో…. ఆమెను చూస్తూ ఉండిపోయాడు . ఇంతలో మధ్య వయసులో ఉన్న ఒక ఆటవిక యువకుడు విల్లంబులు ధరించి, ఓం నమశ్శివాయ…. ఓం నమశ్శివాయ…. అనుకుంటూ కొండపైకి ఎక్కుతున్నట్టుగా రుద్ర స్వామికి కనిపించేసరికి రుద్ర స్వామి ఆయనకేసి చూస్తూ…. ఎవరో ఆటవిక యువకుడు వస్తున్నాడు. వీళ్ళ గూడెం దగ్గరలో ఉందేమో! ఆహారం కోసం ఏదైనా జంతువు వేట కోసం వచ్చినట్టు ఉన్నాడు…జాగ్రత్తగా ఉండు తేడా వస్తే నిన్ను వాళ్ళ విల్లంబులతో సంహారం చేస్తారు అనేసరికి….. వీడెవడు నన్ను సంహారం చేయడానికి… వీడెంత ….వీడి బతుకెంత …..చూడటానికి ఆటవికుడి లాగా ఉన్నాడు…వీడు నన్నేం చేయగలడు…. అనేసరికి ఆ యువకుడు 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు లాగా వచ్చి …రుద్రస్వామితో అయ్యా ! నేను జింకను వేటాడుతూ ఇక్కడికి రావడం జరిగింది. జింక ఏమైనా ఇక్కడ కనిపించిందా? అంటే జింక ఏమి కనిపించలేదు స్వామి…. అనేసరికి ఆ కనిపించదులే ….మనసు అనే జింకను వేటాడటానికి వచ్చాను. కానీ మనసు అస్థిరమైనది… అహంకారానికి లోనయ్యింది. ఇప్పుడు నేను చంపితే గాని మనసు ఆధీనం అవ్వదు. అహంకార సహిత స్థితి నుంచి అహంకార రహిత స్థితి ….రాదు అని శివ నందిని కేసి చూసి ….. స్త్రీ కూడా ఒక మనసే కదా! మనసు అంటే జింక కదా! ఈశ్వరుడి చేతిలో జింక కొమ్ము , గొడ్డలి ఉంటాయి కదా ! ఇప్పుడు నా చేతిలో గొడ్డలి ఉంది…. కదా! అనేసరికి ఎవడివిరా నీవు..? నాలో తొమ్మిది శక్తులు ఉన్నాయి…. ఈ తొమ్మిది శక్తులు నీ మీద ప్రయోగం చేయగలను….పంచభూతాలు ఆధీనం చేసుకున్నాను…. కాలమును ఆధీనం చేసుకున్నాను…. ఈ ఆరింటితో నిన్ను నాశనం చేయగలను అని అహంకారపురితంగా శివ నందిని మాట్లాడుతూ ఉండేసరికి ….
అసలు రుద్ర స్వామికి ఏం జరుగుతుందో అర్థం కాక సౌమ్యంగా ఉండే శివ నందిని కాస్త ఇలా అహంకారపూరితంగా… ఎందుకు ఉన్నదో ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత…. అర్థం అయ్యాక రుద్ర గ్రంధిలో రుద్రుడికే అహంకారం ఉంటుందని… ఆ అహంకారం రుద్రుడికి దానం చేస్తే కానీ సహస్ర చక్రం లోకి వెళ్ళటానికి వీలు కుదరదని….స్వయంగా రుద్రుడే ఇలా ఆటవిక రూపంలో వచ్చాడని ….చెప్పేసి అని గ్రహించేసరికి, అయితే ఆ ఆటవిక యువకుడు కాస్త శివ నందినికేసి చూస్తూ…. నీ 9 శక్తులు నా మీద ప్రయోగించు. పంచభూతాలు, కాలం కూడా నా మీద ప్రయోగించు. ఈ బండమీద పెడుతున్న గండ్రగొడ్డలని కదపగలిగితే…. నీకు వచ్చిన నీలో ఉన్న దైవిక శక్తులతోనూ కదపగలిగితే నేను నీకు దాసోహం అవుతాను…. లేదంటే నువ్వు నాకు దాసోహం అవ్వాల్సి వస్తుంది… అనేసరికి అదెంతరా…. హనుమంతుని తోకనే ఎత్తగలిగాను…. శ్రీ రామ నామస్మరణతో… ఈ గండ్ర గొడ్డలిని కదపటానికి నా దైవిక శక్తిని ఉపయోగించడం ఎందుకు…. పంచభూతాలు ఉపయోగించడం ఎందుకు…. అని చెప్పి చేత్తో ఆ గండ్ర గొడ్డలి ఎత్తాలని ప్రయత్నం చేసినా కూడా…. ఆ బండరాయికి అయస్కాంతములా అతుక్కుపోయినట్లుగా అతుక్కుపోయి…. కదలకపోయేసరికి…. ఇదేదో అనితరసాధ్యంగా ఉంది అని చెప్పి….తనలో వచ్చిన ఆదిశేషుని బండ రాయిని కదపమని ఆజ్ఞాపించగా …..ఆదిశేషులు కూడా తన తోకతోను, తల తోనూ ఈ బండరాయిని కదపాలని ప్రయత్నం చేసినప్పటికీ…. అలా ఒక్కొక్క శక్తి, ఆ తర్వాత నీలాదేవి తన శక్తిని కదపాలని చూసినా కదపలేకపోయింది. ఆ తర్వాత గరుడ పక్షి తన రెక్కల శబ్దంతో గండ్ర గొడ్డలిని కదపాలని చూసినా కదపలేకపోయేసరికి…. ఆ తర్వాత అంజనీదేవి తన పుత్రుడైన హనుమంతుని కోరేసరికి హనుమంతుడు వచ్చి కదిపితే కొంతమేర ఒక అడుగు లేపగలిగాడు… కానీ భుజం మీద పెట్టుకోలేకపోయాడు. నావల్ల కావట్లేదు తల్లి! అని ఆయన వెళ్ళిపోయేసరికి…. ఆ తర్వాత వృషభాసుర రాక్షసుడు కూడా వచ్చినా ….ఆ తర్వాత నారాయణ మహర్షి వచ్చినా…. తన తపోశక్తితో ఆ గండ్ర గొడ్డలిని కదపలేకపోయేసరికి పంచభూతాలను అజ్ఞాపించినా కూడా…. ఆ గండ్రగొడ్డలి కదపలేక పోయేసరికి…. ఏం చేయలేకపోయేసరికి తన శక్తులు ఈ గండ్ర గొడ్డలిని ఇసుమంత కూడా కదపలేకపోయేసరికి… తనలో స్త్రీ అహంకార జ్ఞానం వల్ల….శక్తుల వలన వచ్చిన అహంకారం… కాస్త నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ స్వామి! నన్ను క్షమించండి ….స్వామి…. నన్ను క్షమించండి! మీరు ఎవరో ఆటవికుల రూపంలో వచ్చిన శివుని లాగా ఉన్నారు…. సాధారణ మానవులు అయితే కాదని నాకు అర్థం అవుతుంది… సాధారణ మానవుడి గండ్ర గొడ్డలికి నేను సరిపోతాను. నాలో ఉన్న దైవిక శక్తులు వచ్చినప్పటికీ…. పంచభూతాలు ప్రయోగాలు చేసినప్పటికీ….కూడా నేను ఇసుమంత కూడా కదపలేకపోయాను. నాలో ఉన్న సిద్ధులు, శక్తులు చూసి అహంకారానికి వెళ్లిపోయాను. నాలో ఉన్న అహంకారాన్ని మీకు దానముగా ఇస్తున్నాను… నన్ను క్షమించండి…. పురుషుని కన్నా స్త్రీ గొప్పది అని నిరూపించాలి అనుకున్నాను…. కానీ స్త్రీ గొప్పది పురుషుడు గొప్ప అనేది లేదు. ప్రకృతిలో ఇద్దరు సరిసమానమే…. సమశక్తి ఉన్నవాళ్లే…. సమ దృష్టి, సమదర్శనం చేసుకోవాలని చెప్పేసి ….స్త్రీ, పురుష అభేద్యమని నిరూపణ చేసినారు… అనగానే సత్యాన్ని తెలుసుకున్నావు తల్లి ! నిజాన్ని గ్రహించావు…. ఇప్పుడు నా గండ్ర గొడ్డలి అందుకో ….అనగానే దాన్ని కదిపేసరికి ఆ గండ్ర గొడ్డలి దూది పింజలాగా గాలిలోకి తేలింది. అప్పటిదాకా నువ్వు అహంకారపూరితమై ఉండటం వలన…. కలిగిన భక్తి అహంకారం మాయవలన గండ్రగొడ్డలి బరువైపోయింది. అదే ఎప్పుడైతే నువ్వు అహంకారము నుంచి బయటకు వచ్చావో….. నిజ జ్ఞానమును పొందావో…..అప్పుడు నీకు స్త్రీ అహంకారం పోయింది. పురుష అహంకారం పోయిన తరువాతనే నేనంటే ఏంటో తెలుసుకున్నాను….. ఇద్దరికీ భేదం లేదని తెలుసుకున్నావు…. ఇద్దరూ అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నప్పుడు….. ఒకరికి ఒకరు…. శరీరం ఒకటే …..మనసు ఒకటే….ఆత్మలు ఒకటే…. అనే పరిస్థితికి వస్తాము అని అనుభవం అనుభూతిని పొందావు…. తధాస్తు అని రుద్ర స్వామి కేసి చూస్తూ జింక చిక్కింది…. జింక చచ్చింది…. మనసు అనే జింకను వేటాడాను… అది చనిపోయింది…. ఇక ఈ జింక జాగ్రత్తగా సహస్రార చక్రం అధిష్టాన నా అంశ అయిన వెంకటేశ్వర అనుగ్రహం కోసం తీసుకొని వెళ్ళు. ఆయనే సత్య లోకంలో ఆవాసం చేస్తూ ఉంటాడు…. సత్యాన్వేషిగా సత్య లోకంలో ఏం చూడాలనుకుంటున్నారో…. ఆయన ఏం చూపిస్తాడో మీకే తెలుస్తుంది…తధాస్తు ఇంకెప్పుడు అహంకారంలోకి వెళ్ళకండి…. అహంకారాన్ని వదిలేయండి…. అనగానే ఇంకెక్కడ ఉన్నాయి స్వామి నాలో అహంకారాలు… జ్ఞానాహంకారం పోయింది… సిద్దుల అహంకారం పోయింది….శక్తుల అహంకారం పోయింది….ఇలా ఉన్న పద్దెనిమిది రకాల అహంకారాలన్ని కూడా తుడిచి పెట్టేశారు…నాశనం చేశారు… సర్వ నాశనం అయిపోయింది….ఇంక నాకు ఎలాంటి అహంకార స్థితి లేదు అని అర్థమైపోయింది.. ధన్యోస్మి ….
అని పాద నమస్కారం చేసేసరికి….. ఈ అటవీక యువకుడు కాస్త ఈశ్వరుడిగా క్షణకాలం పాటు కనిపించి…. అదృశ్యం అవటం జరిగింది. దానితో కళ్ళు తెరిచి ఈశ్వర కటాక్షం పొందడం జరిగింది. అంటే వెంకటేశ్వరునిలో ఈశ్వర తత్వం కూడా ఉంది…. ఈశ్వరుడు, ఈశ్వరి తత్వాలు కలిసి వెంకటేశ్వరుడు అయి ఉంటాడు..అంటే విష్ణుమూర్తి అమ్మవారు, అయ్యవారు తత్వం అన్నమాట! అందుకే వెంకన్న స్వామిని వెంకటేశ్వరుడు, బాలాజీ అని పిలవడం జరుగుతుంది అని గ్రహించి నమస్కారాలు చేసుకుంటూ….. ఆఖరి పర్వతమైన వెంకటాద్రి పర్వతమునకు వీళ్ళు బయలుదేరడం జరిగింది.
ఇలా వీరిద్దరూ వెంకటాద్రి పర్వతం మీదకి ఎక్కేసరికి….. కంటి చూపు మేరలో అల్లంత దూరాన…. ఆనంద నిలయం… సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి అంశ అయిన వెంకటేశ్వర స్వామి ఆవాసం ఉండే… ఇలవైకుంఠం అయిన ఆనంద నిలయం కనబడింది. ఈ ఆనంద నిలయం చూస్తూ శివ నందిని ఉన్నట్టుండి తీవ్రమైన ఆనంద ఉద్వేగాలు పొందుతూ….. అదిగో అల్లదిగో… శ్రీ హరివాసము….. పదివేల శేషుల పడగల మయము అంటూ అనుకుంటూ ….అన్నమయ్య సంకీర్తన చేయడం వినిపించింది. చెప్పలేని అలవి గాని ఆనంద స్థితి కలగసాగింది. ధ్వజస్తంభం ప్రాకారం, ఆలయ ప్రకారం, ఆలయ గోపురాల దర్శనం అవడం…… ఇదంతా కనిపిస్తూ ఉండేసరికి తాము వెంకటాద్రి పర్వతం మీదకి వచ్చేసాము అని తెలుసుకున్న తరువాత….. ఇక ఆలయం దగ్గరికి వెళ్ళబోతుండగా….. మహాదేవి మరియు పిల్లలు కనిపించారు. వాళ్ళని చూస్తూ తన్మయత్వం పొందుతూ అమ్మ ! వచ్చేసావా! అని బాల గణపతి అని….. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము…… నువ్వు రాత్రంతా నడుస్తూనే ఉన్నావా? రుద్రయ్య నువ్వు కూడా నడుస్తూనే ఉన్నావా? ఎక్కడ ఆగలేదుగా చూడండి….. కాలు ఎలా వాచిపోయినాయో అని….. అది ఇది అంటూ ఉండేసరికి….. అదేం లేదమ్మా! నడిచినప్పుడు అలాగే ఉంటుంది. 14 గంటల పైగా నడిచాను కాబట్టి అలాగే ఉంటుంది…. అనేసరికి మహాదేవి ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో ఆవేదనలో , కంగారుపడుతున్నట్లుగా అనిపించేసరికి….. ఏమైంది! రాత్రి ఏమైనా సమస్య వచ్చిందా? ఏంటి అని అనేసరికి …..మహాదేవి ఏం లేదు! ముందు మనం శ్రీవారి దర్శనం చేసుకుందాము …..అందరం కలిసి స్వామివారి దర్శనానికి వెళదాము…. అందుకే మీ రాక కోసం ఎదురుచూస్తున్నాము అనేసరికి ….రాత్రి నిద్ర పట్టలేదా ఏమిటి? అది ఇది అనేసరికి…… బాల కుమారస్వామి అమ్మ! నువ్వు ఏమీ అనుకోవద్దు…. ఇక్కడ మహాదేవి తప్పు చేయలేదు…. అనుకోకుండా జరిగిపోయింది అనేసరికి…. బాల గణపతి ఊరుకో అన్నయ్య….. చెప్పకు. వాళ్ళు ఇప్పుడేగా వచ్చింది…. ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా కంగారు పడతారు…. భయపడతారు…..బాధపడతారు అంటూ ఉండేసరికి…. మహాదేవి కేసి చూస్తూ…. అసలు ఏం జరిగింది ఏంటి ? చెప్పు అని రుద్రస్వామీ అనేసరికి…. ఆమె కాస్త భయపడుతూ…. బాధపడుతూ… మేము రాత్రి ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉన్నట్టున్నాము…. మా గదికి ముసుగు వేసుకున్న వాళ్ళు ఇద్దరు వచ్చి….. నా సంచిలో ఉన్న సాధన విగ్రహ మూర్తిని ఎత్తుకు వెళ్ళిపోయారు…. వాళ్ళు తీసుకువెళ్లి పోతున్నప్పుడు అలికిడికి మెలకువ వచ్చి చూసేసరికి …..వాళ్ళు తలుపు తీసుకొని పారిపోయారు… కాకపోతే ఒక ఆడ ,మగ అని ఖచ్చితంగా చెప్పగలను…. వాళ్ళు ఎవరనేది నాకు అర్థం కాలేదు… ఏం ఎత్తుకు వెళ్లారో కూడా అర్థం కాలేదు…. లేచి చూసేసరికి చేతి సంచిలో సాధనా విగ్రహ మూర్తి తీసుకువెళ్లారని గ్రహించాను. గబగబా బయటకు వచ్చేసరికి ….వాళ్ళు క్షణాల్లో చీకట్లో కలిసి పోయారు అనేసరికి ….ఒక్క క్షణం రుద్ర స్వామికి నోట మాట రాలేదు. ఇది ఎంత విలువైనదో తెలిసి కూడా….. అంత ఎమరపాటుగా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? అని చంప మీద దెబ్బ కొట్టేసరికి అయ్యా! ఆగాగు ఆవేశపడమాకు ….తప్పేం చేసింది…. ఏమరపాటులో జరిగే ఉండవచ్చు… నిద్రలో జరిగి ఉండవచ్చు కదా! అలసిపోయినప్పుడు సహజంగానే నిద్ర వస్తుంది కదా….. గాఢ నిద్రలోకి వెళ్లి ఉంటుంది. ఈమె గాఢ నిద్రలోకి వెళ్ళిన విషయం తెలుసుకొని… వారు దొంగతనం చేసి ఉంటారు. ఆడ మగ అంటున్నారు…. కదా! నాకెందుకో కృష్ణస్వామి మరియు యోగాంబిక చేశారేమో అనిపిస్తుంది …..వీళ్ళకి తప్ప మానవమాత్రులు ఎవరికి ఆ విగ్రహం గురించి…. వీళ్ళ దగ్గర ఉన్నదని గాని తెలియదు కదా ! కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరే చేసి ఉంటారు…. గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని ఉంటారు…. అంటే అయ్యుండొచ్చు ! వాళ్ళే తీసుకుని వెళ్లి ఉండవచ్చు…. ఇప్పుడు విగ్రహం పోయింది కదా…. విగ్రహ మూర్తి ఉండాలి. అది లేకపోతే నీ సాధన పరిసమాప్తి కాదు కదా…. అనేసరికి బాల గణపతి ఉన్నట్టుండి అమ్మ! రాత్రి ఒక విచిత్రం జరిగింది ….ఏంటో తెలుసా! సాధన విగ్రహ మూర్తి టేబుల్ మీద పెట్టి మేము ఎవరి పనుల్లో వాళ్ళం ఉన్నాము…. ఉన్నట్టుండి ఆ సాధన విగ్రహం మూర్తిలో కదలికలు కనిపించాయి …..మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా చక్రాలు అన్ని శక్తి జాగృతి అయినట్టుగాను …..మూసుకున్న పద్మాలన్నీ విచ్చుకున్నట్టుగాను….. కనిపించేసరికి మాకు ఆశ్చర్యం వేసింది. కాకపోతే అది గంట గంటన్నర తేడాతో…..ఒక్కొక్క చక్రం జాగృతి అయినట్టుగా అనిపించింది. అది ఏమైందో అని ఆశ్చర్యం వేసింది.. తర్వాత సహస్రార చక్రం దాకా వచ్చి ఆగిపోయింది . ఇంక ముందుకు వెళ్లలేదు…. హృదయ చక్రం బ్రహ్మ రంధ్ర చక్రం లోకి వెళ్తుందేమో అనుకున్నాము …..ఎంతప్పటికి వెళ్లకపోతే ఇక ఇది పనిచేయడం ఆగిపోయింది ….అని చెప్పి మళ్ళీ యధావిధిగా మహాదేవి అమ్మ సంచిలో పెట్టేసాము…. అనేసరికి నేను కూడా చూశాను…. సహస్ర చక్రం దాకా నీ సాధన శక్తి పూర్తి అయిందని గ్రహించాను. శేషాద్రి పర్వతం అనేది మూలాధార చక్రంతో…. వెంకటాద్రి పర్వతం అనేది సహస్రార చక్రంతోను సమానమని స్థల పురాణం ద్వారా నేను విన్నాను. అది పిల్లలకి తెలియదు కదా! నేను విన్నాను గ్రహించాను… కాకపోతే విగ్రహ మూర్తిని రక్షించడంలో అశ్రద్ధ వహించాను. నా తల దగ్గరే పెట్టుకున్నాను…. అప్పటికి తాళ్లతో కట్టేసి ఉంచుకున్నాను…. అయినప్పటికీ తాళ్లు కోసేసి సంచిలో నుంచి విగ్రహ మూర్తిని తీసేశారు. చాలా నేర్పుగా చేశారు… నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరూ కృష్ణ స్వామి మరియు యోగాంబిక అయ్యి ఉండాలి …ఆడమనిషి బొద్దుగా ఉండేసరికి అర్థమవుతుంది… నువ్వు చెప్పింది నిజమేనని అనేసరికి…. ఇప్పుడు వాళ్లు ఆ విగ్రహం మూర్తిని ఏం చేశారో ….పాడు చేశారో… పడేశారో …ఎలా తెలుస్తుంది శివ నందిని… ఇంత కష్టపడి నువ్వు చక్రాలు జాగృతి చేసుకొని వచ్చావు…. ఆ సిద్దులు శక్తులు పొందావు…. ఇప్పుడు వాళ్లు పెట్టుకున్న నమ్మకం అయిపోయినట్టే కదా! అని అనేసరికి
మన చేతుల్లో ఏముందయ్యా .! ఇప్పుడు ఆ విగ్రహ పూర్తి లేకపోతే మనం సాధన పరిసమాప్తి కాదు అని నాకు తెలుసు….. నన్ను ఏమీ చేయలేక విగ్రహాన్ని నాశనం చేయాలని వాళ్ళు అనుకుని ఉంటారు.కాల నిర్ణయం…. ఏం చేస్తుందో… దైవ నిర్ణయం ఎలా ఉందో…. అనేసరికి సరే! ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళదాము… లోపల ఏమీ చింతించవద్దు… ఆలోచించవద్దు దాని గురించి…. ఎలా పోయిందో అలా వస్తుంది అని రుద్రస్వామి అనేసరికి …..అవునులే తల్లి మనకి కావాల్సిన వస్తువు మనకి స్మశానంలో కూర్చున్న కూడా దక్కుతుంది. మనది కాని వస్తువు మన పక్కన ఉన్నా కూడా అందుకోలేము ….గుర్తించలేము…. పట్టుకోలేము….. అది దైవ నిర్ణయం. తర్వాత ఎలా ఉంటే అలా రాసిపెట్టి ఉంటుంది. మన వస్తువు అన్నప్పుడు అది ఎలా అయినా మన దగ్గరికి వస్తుంది . ఓర్పుతో , సహనంతో ఉండాలి. అసహనం ప్రదర్శించకూడదు…. ముందు శ్రద్ధ భక్తులతో శ్రీవారి దర్శనం చేసుకుందాము…. ఆ తర్వాత ఏం చేయాలి… ఎలా చేయాలి? అనేది చూద్దాము… అనేసి పుష్కరిణిలో స్నానం చేయాలని చెప్పి…. శ్రీవారి పుష్కరిణిలోకి దిగటం ఆరంభించారు . శ్రీవారి పుష్కరిణిలో మిగతా వాళ్ళంతా దిగేసరికి…. శివ నందిని ధ్యానంలో కూర్చుంది. ఉన్నట్టుండి పుష్కరిణిలో సుమారుగా 12 నదుల తీర్థాలు కలుస్తున్నాయని గ్రహించింది. ఆ నదులు ఎక్కడెక్కడ కలుస్తున్నాయని గుర్తులుగా పెట్టుకుంది. తర్వాత చూసేసరికి…. రుద్రస్వామి తో స్వామి ఈ పుష్కరణలో 12 నది తీర్థాలు కలుస్తున్నట్టుగా ఉన్నది…. అనేసరికి స్థల పురాణం ప్రకారం శ్రీవారి పుష్కరంలో విరజానది ,సరస్వతి నది, కుబేర నది, ఇలా సుమారుగా 12 తీర్ధాలు కలుస్తాయని చెబుతారు. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ పుష్కరిణి నీటిని పుష్కరిణి స్నానానికి ఉపయోగిస్తారు. శ్రీవారి స్నానానికి మాత్రం చక్ర తీర్థం నుంచి గాని….. ఆకాశగంగా నుంచి గాని ఉపయోగిస్తారు. ఇది పుష్కర సమయంలో ఈ పుష్కరిణిని వాడుతారు. అవి ఏంటనేది నీకు వివరంగా చెబుతాను అని అనేసరికి…. మీ పుష్కరిణీ గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో ఈ పుష్కరిణీ నీళ్లు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయనేది…. ఆయన చూపిస్తూ ఒకొక్క తీర్థ నది గురించి వివరంగా చెప్పడం ఆరంభించాడు….
పుష్కరిణీ తీర్థం:-
స్వామివారి పుష్కరిణిలో మొత్తం 12 ప్రదేశాలు పుణ్యతీర్ధములుగా చెప్పబడుతున్నాయి. స్వామి పుష్కరణే అంతులేని అనంత పాపరాశిని ధ్వంసం చేయగలదు. పుష్కరిణి తీర్థం ఒకటిగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో ఒక్కొక్క ప్రదేశంలో తీర్థం యొక్క మహత్యం అద్భుతంగా ఉంటుంది.
అందులో పుష్కరిణిలో
1)పుష్కరిణి మధ్య భాగంలో సరస్వతీ నది అంతర్గతంగా ఉంటుంది.
2)ఈ పుష్కరిణి లో…స్వామివారికి కింద నుంచి అంతర్గతంగా ప్రవహించే విరజానది కలుస్తుంది. ఈడ సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామి వారితో పాటుగా రావడం జరిగింది…ఈ విరజానది వైకుంఠంలో ప్రవహించే నదిమ తల్లి. కాబట్టి ఇందులో స్నానం చేయడం వైకుంఠ స్నానంతో సమానం..
3)ఆగ్నేయ భాగంలో ఉండే తీర్థమును…ఆగ్నేయ తీర్థం లేదా అగ్ని తీర్థం అంటారు ఇక్కడ స్నానం చేయడం వలన దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
4)పుష్కరిణికి దక్షిణాదిక్కుగా ఉండే తీర్థమును యమ తీర్థమని పిలుస్తారు ఇక్కడ స్నానం ఆచరించిన వారికి నరకమాతలు ఉండవని చెపుతారు.
ఇక్కడే మనకి ఎనిమిదవ మెట్టు యొక్క రహస్యం గురించి చెబుతారు…
స్వామివారి పుష్కరిణిలో ఈ యమతీర్థం దగ్గర…. ఎనిమిదవ మెట్టు మీద రెండు నుంచి పది నిమిషాల వరకు ఎవరైతే నిలబడడం గాని….. ఆ తీర్థజలాన్ని సంప్రోక్షణ చేసుకోవడం కానీ చేస్తారో….. వాళ్లకి ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని, నివారణ అవుతాయని స్థల పురాణం చెబుతుంది. సంఖ్యాశాస్త్రంలో ఈ ఎనిమిదిని శని గ్రహానికి సంకేతంగా చెబుతారు.
5)పుష్కరిణికి నైరుతి దిక్కున ఉన్న తీర్థమును వశిష్ట తీర్ధమని పిలుస్తారు. ఈ వశిష్ట తీర్థంలో స్నానమాచరించిన వారికి ఋణ బాధలు పోతాయి అని భక్తుల విశ్వాసం.
6)పుష్కరిణికి పశ్చిమ దిక్కున ఉన్న తీర్థమును వరుణ తీర్థమని పిలుస్తారు ఇక్కడ స్నాన ఆచరించినచో సకల పాపాలు తొలగిపోతాయి అని చెబుతారు.
7)పుష్కరిణి యొక్క వాయువ్య భాగంలో ఉండే తీర్థమును వాయువ్య తీర్థమని పిలుస్తారు. ఇక్కడే మనకు వరాహస్వామి దేవాలయం కనిపిస్తుంది. ఈ తీర్థములో స్నానం ఆచరించినచో మనకి మోక్షం వైపుకి తీసుకువెళ్తుంది అని భక్తుల విశ్వాసం.
8) ఈ పుష్కరిణికి పక్కనే మనకి కోనేటి గట్టు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఈ ఆంజనేయ స్వామి మూర్తి ఎదురుగా పుష్కరిణికి అవతల వైపున వరాహస్వామి ఆలయం కనిపిస్తుంది. సరిగ్గా ఈ వరాహ స్వామికి ఆంజనేయ స్వామి వారు నమస్కారం చేస్తున్నట్లుగా మలచడం జరిగింది.
9) అలాగే పుష్కరినికి ఈశాన్య దిక్కున గాలవ మహర్షి అనే అతను తపస్సు చేసిన గాలవతీర్థం కనిపిస్తుంది. ఇక్కడ స్నానమాచరించినచో దుఃఖ నాశనం అవుతుందని చెబుతారు.
10) ఈ పుష్కరిణికి పక్కనే మనకి వ్యాస రాయల మండపం కనిపిస్తుంది. ఈ పుష్కరిణితీర్థంలో నిత్యం స్నానమాచరించి తన తపశక్తితో ఈ ప్రదేశమును మరింత పుణ్యప్రదం చేశారు..
11) ఉత్తర దిక్కున ఉన్న తీర్థాన్ని కుబేర తీర్థం అంటారు. ఈ ప్రదేశంలో స్నానం ఆచరించడం వలన ధన సమృద్ధి కలుగుతుంది.
12) పుష్కరిణికి తూర్పు వైపున మార్కండేయ మహాముని తపస్సు చేసిన ప్రదేశము కావడం చేత దీనిని మార్కండేయ తీర్థం అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో స్నానం చేయడం వలన అభివృద్ధి భయం అనేది పోతుందని చెబుతారు.
ఈ పుష్కరిణి దగ్గర ఉన్న ఈ అశ్వత్థ వృక్షముకి ఒక ప్రత్యేకత ఉంది. వెంకటేశ్వర స్వామి వివాహ సమయంలో కుబేరుని దగ్గర 14 లక్షల రామ మాడలను అప్పుగా తీసుకున్నప్పుడు రాసిన ఋణపత్రమును ఈ చెట్టు కింద కూర్చుని రాశారని చెబుతారు. అప్పుడు ఈ అశ్వత్థ వృక్షమును సాక్ష్యముగా చెప్పేవారు. ఇప్పుడు ఆ వృక్షము పోయి దాని తాలూకు దానికి శాఖలుగా ఉన్న వృక్షం ఒకటి దర్శనం ఇస్తుంది.
ఆ తర్వాత అందరూ పుష్కరిణి స్నానం పూర్తి చేసుకున్న తర్వాత….. మొదటి దేవుడైన భూవరాహస్వామి దర్శించుకోవడానికి వెళ్లారు. వెంకటేశ్వర స్వామి దర్శించుకునే ముందు భూ వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే….తనని దర్శించుకోవాలని అతనికి వరం ఇవ్వడం జరిగింది… అని స్థల పురాణం చెప్పడంతో… అందరూ కూడా మొదటగా భూవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ స్వామివారు ఎవరు ఏంటి ? అని బాలగణపతి అడిగేసరికి రుద్ర స్వామి తిరుపతికి సంబంధించిన స్థల పురాణ విశేషాలు తెలిసి ఉండటంతో….. ఈ భూహరాహస్వామి ఎలా వచ్చారు…. ఏ విధంగా వచ్చారు…. అని చెప్పడం ఆరంభించాడు.
పూర్వం శ్రీమహావిష్ణువు నాభి నుంచి ఒక బంగారు రంగులో ఉండే పుష్పం పుట్టింది. అందులో నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు…. ఆయన విష్ణువుని తండ్రిగా భావించి అతనికి నమస్కారం చేయగా…. సృష్టి చేసే బాధ్యతలను ఇతనికి అప్పచెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి స్థితిలయలలో మొట్ట మొదటిదైన సృష్టి బాధ్యతలను స్వీకరించారు. ఈ సృష్టిలో కృతయుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాలు మొత్తాన్ని కలిపి ఒక మహాయుగంగా చెప్తారు. ఇలాంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకి ఒక పగలు మరియు రాత్రి పూర్తి అవుతాయి. తన కర్తవ్యంగా ఈ సృష్టి చేసే ప్రక్రియలో బ్రహ్మ లోకాలన్నీ సృష్టి చేస్తూ వస్తుంటే…. స్థితికారకుడుగా విష్ణుమూర్తి ఉండి ఈ సృష్టిని ముందుకు తీసుకు వెళ్తూ ఉండేవారు. అయితే ఇలా బ్రహ్మ యొక్క ఒక రాత్రి సమయంలో బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి….నిద్రలోకి జారుకున్నాడు. బ్రహ్మ ఇలా నిద్రలోకి జారుకునేసరికి….ఈయన సృష్టి చేసిన లోకాలన్నీ గతులు తప్పడం మొదలుపెట్టాయి.గ్రహాలు దిశలు మారటం … జల ప్రళయంలో భూమి మునిగిపోవటం….. ఇలాంటి దుర్భర పరిస్థితులు వస్తూ ఉండగా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూగోళాన్ని పాతాళానికి పట్టుకుపోయాడు అని….. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత…. బ్రహ్మకి పగలు కావడంతో…. మెలకువ వచ్చి చూసేసరికి…. జరిగిందంతా తన దివ్య దృష్టితో చూసి…..అప్పుడు ఏమి చేయాలో అర్థం కాక శ్రీమహావిష్ణువుని వేడుకోగానే….. శ్రీమహావిష్ణువు శ్వేత వరాహరూపుడిగా అవతరించి, ఆ జలంలో ఉన్న భూమిని బయటకు తీసే ప్రయత్నం చేయబోగా….. హిరణ్యాక్షుడు అడ్డుపడి అతనితో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి అతనిని సంహరించి తన కోరలతో భూమిని పైకి లేపుతారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మకి సృష్టి కార్యక్రమాలు చేయమని ఆజ్ఞాపిస్తారు…. అప్పుడు స్వామి వారు తనతో పాటు అక్కడే ఉన్న గరుత్మంతునితో…. గరుడ! భూదేవిని నేను ప్రళయ జలాల నుంచి కాపాడడం చేత ఆమె నన్ను భర్తగా స్వీకరించింది. దానికి నేను కూడా అంగీకరించాను…. కాబట్టి నువ్వు వైకుంఠము వెళ్లి లక్ష్మీ అమ్మవారిని ఇంకా క్రీడాచలాన్ని తీసుకురా! ఎందుకంటే కొన్నాళ్ల పాటు నేను ఇక్కడే ఉండి ఈ భూమి దీని బాధ్యతలు చూడాలి…. అని చెప్పి సువర్ణముఖి నది తీరంలో ఉత్తరదిక్కున వైకుంఠానికి ఉత్తర దిక్కున అణువుగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకున్నారు….. వైకుంఠంలో ఉండే క్రీడాచలం భూలోకంలోకి తీసుకువచ్చి….. ఈ క్రీడాచలాన్ని క్రీడాద్రిగా స్థాపించారు. గరుడ వైకుంఠానికి వెళ్లి జరిగింది చెప్పి ……అమ్మవారి మూల రూపాన్ని అక్కడే ఉంచి ఆమెలోని ఒక కళ అంశతో గరుడతో క్రీడాద్రితో కలిసి భూలోకానికి వచ్చింది. ఈ శ్వేత వరాహ స్వామి క్రీడా పర్వతాన్ని భూదేవితో కలిసి అధిరోహించి స్వామి పుష్కరానికి పడమటి గట్టున నిలిచారు.ఇక భూమి సంరక్షించడం కోసమని స్వామి వారు ఇక్కడే కొలువై ఉండటంతో….. దేవతలంతా కూడా స్వామివారిని కీర్తించి పలు రకాలుగా స్తుతించారు. దేవతలు కూడా ఈ తిరుమల కొండపై తలో దిక్కులో స్థిరపడిపోయారు. స్వామి వారు ఇక్కడే స్థిరంగా ఉండటానికి స్వామి పుష్కరిణీ …..పశ్చిమ తీరాన దివ్యకాంతులతో ప్రకాశించే దివ్య విమాన గోపురం ఉన్న భవనంలోకి వెళ్లిపోయారు.
ఈ వివరాలు విన్న తర్వాత బాలగణపతి మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రీవారి దర్శనం కోసమని క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. అలా వాళ్ళు క్యూలో వెళుతూ ఉండేసరికి…. వెండి వాకిలి, బంగారపు వాకిలి దాకా రావటం జరిగింది. ఏడు ద్వారాలు దాటుకొని వచ్చామని అందరూ గ్రహించారు. బంగారు వాకిలి ముందు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేసరికి….. అప్పుడు రుద్ర స్వామిలో లో గొంతుతో శివ నందినితో అమ్మా! ఇక్కడ మనకి స్వామి వారితో పాటు నాలుగు బేరమూర్తులు కూడా ఉంటారు… స్వామివారికి కుడివైపున, ఎడమవైపున ఉంటారు అని చెప్పి ఆ బేరమూర్తుల గురించి చెప్పడం జరిగింది.
బేర మూర్తులు:-
బేర అంటే ప్రతిమ లేదా విగ్రహం అని……
గర్భాలయంలో ఉన్న ఐదు బేర మూర్తులలో మొదటగా స్వామివారి పాదాల దగ్గర ఉన్న విగ్రహాన్ని చూపించి……ఈ విగ్రహాన్ని భోగ శ్రీనివాసమూర్తి అని…. దీనిని కౌతుక బేరం అంటారని…. ఇది స్వామివారి పాదాల చెంత ఉన్నట్టుగా చూపించారు. స్వామివారి దేవాలయం మరమ్మత్తుల సమయంలో స్వామి వారి దర్శనానికి అవకాశం లేకపోవడంతో ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆర్థిగా ఎదురుచూసేవారు…ఆ సమయంలో భక్తుల యొక్క బాధను చూడలేక పేరుందేవి అనే ఆవిడకు స్వప్న దర్శనం ఇచ్చి….. నా మూర్తిని ప్రతిష్టించమని చెప్పారు. అప్పుడు ఆమె వెండితో స్వామివారి విగ్రహం మాదిరిగా రెండు అడుగుల విగ్రహాన్ని తయారు చేపించి తీసుకువచ్చారు. ఈ మరమత్తుల సమయంలో స్వామివారి వెండి విగ్రహంలోనే దర్శనం భాగ్యం కల్పించి భక్తులను అనుగ్రహించేవారు స్వామివారు. మూల విగ్రహానికి ఈ విగ్రహానికి ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది…. గమనించు. ఈ వెండి విగ్రహానికి స్వామి వారి విగ్రహానికి అభేద్యం అన్నట్టుగా చెపుతారు. కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఈ మూల మూర్తికి అభిషేకాలు చేస్తారు. మిగిలిన అన్ని రోజుల్లో పవళింపు సేవతో కలిపి మొత్తం….. ఈ చిన్న విగ్రహానికే చేస్తూ ఉంటారు. ఈ విగ్రహాన్ని జీవస్థాన యంత్రం మీద పెట్టి ఉంచారు… కింద గమనించమని చూపించారు.
ఆ తర్వాత రెండవ విగ్రహాన్ని స్వామివారి కటి హస్తానికి దగ్గరగా ఉన్న విగ్రహాన్ని చూపించి….దీనిని కొలువు శ్రీనివాసమూర్తి అంటారని ….ఇది బలివేరం అని అంటారని ఈ విగ్రహ మూర్తిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి….. ఆరోజు తిధి ,వారం, నక్షత్రము …..ఆ రోజు స్వామివారికి వచ్చిన లావాదేవీల విషయాలు అన్నీ కూడా ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి చదువుతూ ఉంటారు. ఈ సింహాసనానికి పైన ఒక ఛత్రం కనిపిస్తుంది. ఆ చత్రాన్ని మైసూర్ మహారాజు ఇచ్చారు. ఈరోజు చేసే సేవలు ఏంటి? రేపు చేయబోయే సేవలు ఏంటి? ఈరోజు అన్నదానానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చారు… వారి పేర్లు ఇలా ప్రతిదీ కూడా నిద్ర లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకు స్వామివారి సన్నిధానంలో ఏమేమి జరిగాయి ….ఏమేం చేశారు…. ఏమేం చెప్పారు….ఇలా ప్రతీది కూడా అక్షరం పొల్లు పోకుండా ఈ స్వామి విగ్రహం వద్ద విన్నవిస్తారు.
ఆ తర్వాత మూల విగ్రహానికి కుడివైపు ఉన్న ఉగ్ర శ్రీనివాసమూర్తి దీనినే స్నపన బేరం అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహ మూర్తిని చూపిస్తూ… ఇతను సతి సమేతంగా మనకి దర్శనం ఇస్తారు. ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగించే విగ్రహ మూర్తి ఊరేగింపు కోసం అని బయటకు తీసుకురాగానే సూర్యరశ్మి తగలగానే అగ్నిపుట్టి.. తిరుమలలో చాలా ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దానితో బ్రహ్మోత్సవాలు ఆగాయి…మరి బ్రహ్మోత్సవాలు ఎలా పూర్తి చేయాలి అని అడిగేసరికి…స్వామివారు ఒక వ్యక్తి ద్వారా…. మణియప్ప కోణం వద్ద ఒక ప్రదేశాన్ని గురించి చెప్పి అక్కడ నుంచి స్వామివారి యొక్క ఆచూకీ అక్కడ ఉన్నది తెలిపి అక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్పారు. నీ విగ్రహాల్ని కేవలం క్షీరాబ్ది ద్వాదశి రోజున కృష్ణాష్టమి రోజున రాత్రివేళలో బయటకు తీసుకువచ్చి తిరిగి వెంటనే లోపలికి తీసుకువెళ్లి పోతారు. ఇందులో స్వామివారి ఉగ్రకలా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉగ్ర కళ సూర్యరశ్మికి ఉత్తేజితం అవుతుంది. అందువల్ల ఈ స్వామివారిని బయటకు తీసుకురావటాన్ని ఆపేశారు.
ఇక నాలుగవది మలయప్ప స్వామి అని ఉత్సవ బేరమని పిలుస్తారు. ఆరోజు బ్రహ్మోత్సవాలు ఆగిన సమయంలో ఈ మలయప్ప కోనకు వెళ్లి అక్కడ స్వామి వారు చెప్పిన ఆనవాళ్లు ప్రదేశానికి చేరుకొని అక్కడ తవ్వి చూస్తే మూడు అడుగుల స్వామివారి విగ్రహం సతి సమేతంగా దొరికింది. ఇక ఆరోజు ఆ విగ్రహం మూర్తులను తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను పూర్తి చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఉత్సవమూర్తులని మనకి బ్రహ్మోత్సవాలకు ఉపయోగిస్తున్నారు.
ఇక ఐదవది మనకి ఎదురుగా కనిపిస్తున్న మూలమూర్తి , ధ్రువ బేరం అంటారు. జాగ్రత్తగా గమనించి చూడు…అనగానే….
వాటిని విన్న తర్వాత వాటిని చూసింది… సుమారు 9.5 అడుగుల విగ్రహం మూర్తి అని చెబుతారు కానీ ……అది చూడడానికి ఐదున్నర లేదా ఆరడుగులు మించకపోయేసరికి…. అందులోనూ….తనివి తీరా చూసానని ఎన్నిసార్లు చూసినా అనుభూతి పొందకపోయేసరికి….. అయ్యా! నాకు ఎందుకో స్వామి వారిని చూస్తుంటే తనివి తీరట్లేదు….. ఇంకా పదే పదే చూడాలనిపిస్తుంది…. కానీ క్యూ భక్తుల తాకిడికి తట్టుకోలేకపోతున్నాను….. నేను ప్రశాంతంగా చూడలేకపోతున్నాను….. మరొకసారి దర్శనానికి రావాలి …..అంటే తల్లి ! నువ్వు తనివి తీరా చూడు….ఈసారి క్యూలో అలాగే అనిపిస్తే మళ్లీ ఇంకొకసారి దర్శనం చేసుకుందాం….. మనం ఇక్కడ కొన్నాళ్లపాటు ఉంటాము…. ఉన్నన్ని రోజులు నాతో పాటు నిన్ను తీసుకుని వస్తాను. దాని గురించి కంగారు పడకు…. స్వామివారి లీలా విన్యాసం అది…. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది ….ఆయన మోహనాంగుడు కదా! తన మోహన ఆకర్షణ శక్తితో మన మనసులకు ప్రశాంత స్థితిని ఇస్తాడు. ఆ ప్రశాంతత కోసం, ఆ ఆనందం కోసం…. మనసు పొందే ప్రశాంతత స్థితి కోసం….. ఆయన చూపు పదేపదే కోరుకోవడంలో తప్పులేదు . అందుకని దీనిని బ్రహ్మానంద స్థితిని ఇస్తుంది కాబట్టి ….ఆనంద నిలయం అని చెప్పడం జరిగింది…. అనేసరికి ఇలా కాదు ఈ విగ్రహ మూర్తి రూపంలో చూడటం కాదు….. ఆయనని నిజస్వరూపంగా సజీవంగా చూడాలనుకుంటున్నాను… అనేసరికి దానికి ఆయన అనుగ్రహం ఉండాలి తల్లి…..ఆయన నిన్ను అనుగ్రహించాలి…. అది మన చేతుల్లో ఏమున్నది….. అనేసరికి ఇంతలో వెనకనుంచి ముందుకు పదండి ….ముందుకు పదండి…. అని భక్తులు గోల చేస్తూ ఉండేసరికి…. ఇక అందరూ కలిసి చివరిసారిగా దర్శనం చేసుకుని బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆ దేవాలయం లోపల ఉన్న తీర్థమును ఒక పూజారి ఇస్తూ ఉంటే ఇది ఏం తీర్థం? దీని ప్రత్యేకత ఏమిటి ?అంటూ ఉండేసరికి….. ఇక్కడ ఆలయంలో మనకి 10 రకాల ప్రదేశాలు చూడాల్సి ఉంటుంది…. అందులో శంకుస్థాపన స్తంభం, త్రిభుజాకార గుర్తు, ఆ తర్వాత ఈ తీర్థం యొక్క మహత్యం, ఆ తర్వాత హుండీ యొక్క దర్శనం, ఆ తర్వాత అంటూ ఇలా ఒక్కొక్కటి చూపించుకుంటూ ……రుద్ర స్వామి మిగిలిన వాళ్ళందరికీ చూపించడం ఆరంభించాడు. వాటిని ఆసక్తిగా వినటం…. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ రావటం జరిగింది ….
స్వామి వారి అంతరాలయం:-
తీర్థం:- తిరుమలలో రాత్రి సమయంలో దేవాలయం తలుపులు మూసే ముందు ఒక పెద్ద పాత్రలో నీటిని మరియు మరొక పాత్రలో గంధమును పెట్టి తలుపులు మూసి వేయడం జరుగుతుంది. ఈ రాత్రి సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చి…స్వయంగా బ్రహ్మ తన చేతితో స్వామివారి కి ఈ నీటిని సమర్పించి ఈ గ్రంథమును అలదుతారు…స్వయంగా బ్రహ్మచేతినే స్పృశించిన జలం కావడం చేత దీనిని తీర్థంగా మనకి అందిస్తారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎడమవైపుగా ఈ తీర్థం మనకు ఇవ్వడం జరుగుతుంది.
విశ్వక్సేనుడు:- ఈ విశ్వక్సేనుడిని చూస్తే మనకి గణపతి గుర్తుకు రావడం జరుగుతుంది. కొంతమంది గణపతిని విశ్వక్సేనుడిగా చెబుతారు. ఈ విశ్వక్సేనుడి ఆలయం మనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం సేవనం అయిపోయిన తరువాత చుట్టూ తిరిగి స్వామివారి ఆలయానికి కుడివైపుకి రాగానే…. కనిపించే హుండీకీ వైకుంఠ ద్వారానికి మధ్యన ఒక చిన్న సందులో దర్శనమిస్తారు. ఇతను వెంకటేశ్వర స్వామికి సైన్యాధ్యక్షుడిగా పిలవబడతాడు.
హుండీ:-
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ కింద ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది అది ఏమిటంటే 1300 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు ఈ హుండీ కింద శ్రీ చక్ర ప్రతిష్టాపన గావించారు. ఈ శ్రీ చక్రానికి ఉన్న ఆకర్షణ శక్తి వలన.. నిత్యం ఈ హుండీకి అంతులేని ధన సమృద్ధి తో తులతూగుతుంది.
వరలక్ష్మి అమ్మవారు:-
మనం ఈ హుండీలో చేసే కానుకలను ఈ అమ్మవారు గమనిస్తూ ఉంటారు…స్వామివారి అనుగ్రహం చేత మన యొక్క స్థితిగతులు మన జీవితంలో సమృద్ధి వచ్చినప్పటికీ… మనం అతని పట్ల ఎంతటి భక్తి భావంతో విశ్వాసంతో మెలిగి ఉన్నాము అన్నది…మనం అర్పించే వాటిని ఈ తల్లి చూస్తూ ఉంటుంది….
తొట్టి తీర్థం:-
స్వామివారి కి అభిషేకం చేసినప్పుడు వచ్చే జలమును ఈ అన్నమయ్య భాండాగారానికి ఎదురుగా ఉన్న హుండీ కింద…. ఒక తొట్టి వంటి ప్రదేశమునకు చేరుతుంది…ఈ జలమును సంప్రోక్షించుకోవడం అనేది అనంత పుణ్యఫల ప్రదాయకమని చెబుతారు.
నరసింహస్వామి:-
ఆ తరువాత నైరుతి దిక్కులో అతి శక్తివంతమైన నరసింహస్వామి విగ్రహ మూర్తి దర్శనం ఇస్తుంది…ఈ విగ్రహ మూర్తికి సమీపంలో రామానుజాచార్యుల వారు ధ్యాన నిమగ్నమై ఉన్నట్టుగా కనపడుతుంది.
రామానుజాచార్యులు:-
రామానుజాచార్యుల వారు స్వయంగా స్పృశించిన మూర్తిని ఉత్సవమూర్తిగా ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి మోకాళ్ళ మీద రామానుజాచార్యుల వారు తిరుమల చేరుకున్నారు. ఎక్కడినుంచి అయితే రామానుజాచార్యుల వారు మోకాళ్లతో పైకి ఎక్కారో …..ఆ ప్రదేశాన్ని మోకాళ్ల పర్వతంగా పిలవడం జరుగుతుంది.
శంకుస్థాపన స్తంభం:-
దీనినే యోగ నరసింహస్వామి స్తంభం అని కూడా పిలుస్తారు. తిరుమల ఆలయాన్ని కట్టించేటప్పుడు వేసిన మొదటి శంకుస్థాపన స్తంభంగా దీనిని చెబుతారు. దీనిని కౌగిలించుకుంటే…. సొంతింటి కల నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.
త్రికోణాకారం:-
మనకి వెంకటేశ్వర స్వామి మరియు వరదరాజస్వామి ఇంకా రంగనాథ స్వామి ఆలయాలు త్రిభుజాకారంలో ఉంటాయి…ఈ మూడు మూర్తుల యొక్క శక్తి తరంగాలు మధ్యలో మనం స్వామివారి దర్శనము మరియు ఆలయ దర్శనము చేసుకొని బయటకు వస్తాము. దీనివలన మనకి ఆ ముగ్గురి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలుగుతాయి. త్రిభుజాకారము లో ఈ దివ్యమూర్తుల తరంగాలు ఇక్కడ ప్రసరిస్తూ ఉంటాయి.
మహాలక్ష్మి అమ్మవారు:-
మనకి ఆగ్నేయం వైపున వంటశాల కనిపిస్తుంది…. చాలావరకు అక్కడ ఉన్న అమ్మవారిని వకుళ దేవి అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు శ్రీవారి భోజనశాలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తారు.
వీళ్ళందరూ ఇలా ఈ పది రకాల వింతలు చూసుకుంటూ…..విశేషాలు వింటూ వచ్చేసరికి…. శివ నందినికి ఒక్కసారిగా ఆనంద నిలయానికి దగ్గరలో ఒక కోణంలో నేల మీద మూడు అడుగుల ఎత్తులో ఒక చిన్న అడుగు ఉన్న రామానుజాచారి విగ్రహం మూర్తి కనిపించింది. కనిపించేసరికి ఈయన ఏంటి ఇక్కడ ఉన్నాడు ఏంటి? ఈ మూలన ఉంచడంలో అంతరార్థం ఏమిటి? అనేసరికి ఆయన విగ్రహ మూర్తికేసి చూస్తూ…… అమ్మ ! ఈ విగ్రహ మూర్తి వెనకాల ఒక రంద్రం ఉన్నది. ఈ రంధ్రం ద్వారా అదిశేషుడు సర్ప రూపంలో లోపలికి వెళ్తూ వస్తూ ఉంటాడని స్థల పురాణం చెబుతుంది.
నిజానికి వెంకన్న స్వామి ఆదిలో విష్ణుమూర్తి స్వరూపమా? ఈశ్వరుని స్వరూపమా? అమ్మవారి స్వరూపమా? అని వాదోపవాదాలు జరిగినాయి. అప్పుడు రామానుజాచార్యులు కాస్త ఒక పని చేద్దాము…… ఈ విగ్రహ మూర్తి ఎవరు అని మనం తెలుసుకోవటానికి….. బంగారంతో తయారుచేసిన శంఖు చక్రాలను పెట్టేసి వెళ్దాము…. రాత్రి కల్లా శంఖు చక్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అంశ అయిన వెంకటేశ్వర స్వామి అనుకుందాము. లేదు అంటే ఈశ్వరుడు అనుకుందాము…. అనేసరికి సరే అని అందరూ శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఒకరికొకరు సరే అనుకుని వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో రామానుజాచార్యులు సూక్ష్మ శరీరధారియై లోపలికి ప్రవేశించి విష్ణు తత్వంతో లోకానికి తెలియజేయాలని బంగారపు శంఖు చక్రాలను పెట్టడం జరిగింది అని ……లోగుట్టు రహస్యం. అందుకని లోగోట్టు పెరుమాళ్ళ కెరుక అని చెప్పడం జరిగింది. ఈ విషయం గ్రహించిన కూడా శంకరాచార్యుల వారు ఏమాత్రం లోకానికి చెప్పకుండా…..తనలోనే ఉంచుకొని శ్రీ వెంకటేశ్వరుడు వెంకట+ ఈశ్వరుడు …ఈయనలోనే రెండు తత్వాలు ఉన్నాయి… హరిహర స్వరూపం అని నిర్ధారణ చేశారు. రామానుజాచార్యులు చేసిన పని తెలిసినా కూడా శంకరాచార్యుల వారు మౌనం వహించారు. లోకానికి చెప్పలేదు అనేసరికి…. మరి ఇది తప్పు కాదా అని అంటే… ఈశ్వరుడు, ఈశ్వరి అవచ్చు…. విష్ణువు అవ్వచ్చు…. ఆభరణాలు వేసుకుంటే విష్ణువు. ఆభరణాలు లేకపోతే శివుడు అని అనుకోవడంలో తప్పేముంది…. ఇక్కడ ఈయన ఆభరణాలు అనుభవించాలి…. స్వర్ణాలంకరణ సుఖ భోగాలు అనుభవించాలి… అనుకొని ఉండవచ్చు. ఈశ్వర తత్వమునకు స్త్రీ, పురుష తత్త్వం అని నిర్ధారణ చేయలేము కదా! అనేసరికి సరే ఈశ్వర తత్వంలో నపుంసకతత్వం ఉంది అంటారు కదా! స్త్రీ పురుష కానీ నపుంసకస్థితి ఉంది అని చెప్పనే చెప్పారు కదా! కాబట్టి మనం తప్పు పట్టడానికి లేదు…. మానవమాత్రులం మనమెంత….. భగవంతుడు భక్తులను ఏ విధంగా అనుగ్రహించాలో….ఆ విధంగా అనుగ్రహిస్తాడు అని అనుకొని…. అక్కడ ఉన్న రంధ్రం చూసి అలాగే చూస్తూ….. ఇప్పుడు ఈ సాధనా విగ్రహ మూర్తి ఏమైందా? అని దాని గురించి ఆలోచన అప్పుడు గుర్తుకు వచ్చింది.. అయ్యా! మరి ఇప్పుడు సాధనా విగ్రహం మూర్తి గురించి ఏం చేద్దాం ? అంటే సరే ఇప్పుడు మనం రాత్రంతా నిద్ర లేకుండా అవిశ్రాంతిగా వచ్చాము కాబట్టి….. ఇప్పుడు గదికి వెళ్ళాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకుందాము…. ….భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మెలకువ వచ్చిన తర్వాత స్వామివారి దర్శనానికి వద్దాము…. ఏం చేయాలి ఏంటి అనేది స్వామి వారే మనకి నిదర్శనాలు చూపిస్తారు…. ఇంత చేసిన వాడు అది చూపించలేడా? అని సరికి నాకెందుకో …..స్వామివారి నిజరూప దర్శనం పొందాలని బలంగా కోరికగా ఉంది . అసలు ఈయన ఈశ్వరుడా ఈశ్వరీ యా…..లేకపోతే అయ్యవారా ,అమ్మవారా, విష్ణువా తెలుసుకోవాలని ఉంది .
నీకు ఈ ఆలోచన ఇచ్చాడు అంటే ….కారణం లేకుండా కార్యం ఉండదు కదా… ఆలోచన ఉండదు…. ఏ రూపం అని తేల్చడానికి మనం సాయంత్రం వద్దాము…. రాత్రి మళ్ళీ దర్శనానికి వెళ్దాము…. విషయం ఏమిటి అనేది తెలుస్తుంది… అనేసరికి సరే! అని చెప్పేసి ఒకపక్క స్వామివారి దర్శనం అరకొరగా అయ్యిందని…. ఒకపక్క సాధనా విగ్రహ మూర్తి గురించి ఆలోచన, ఆందోళన పడుతూ ….మదన పడుతూ… ఆవేదన పడుతూ… ఏమీ చేయలేని అర్థం కాని అయోమయ స్థితిలో గదికి చేరుకోవడం జరిగింది. ఆ గదిలో వాళ్లకి కావలసిన ఆహారం తెప్పించుకొని తృప్తిగా అందరూ భోజనం చేసిన తరువాత… తలా ఒక దిక్కున ఎవరికి నచ్చినట్టు వాళ్ళు…. ఒకరు నేల మీద, ఒకరు మంచం మీద నిద్రలోకి ఉపక్రమించారు. అలసిపోయిన శరీరాలు అవడంతో అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. మెలకువ వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలు అయిందని తెలుసుకునేసరికి ……గబగబామళ్ళీ శ్రీవారి దర్శనానికి పుష్కరిణికి చేరి స్నానాధికాలు చేసుకొని…… శ్రీవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకునేసరికి….. పిల్లలు మహాదేవి గదిలో మేము ఉంటాము… కావాలంటే మీ ఇద్దరూ వెళ్లి దర్శనం చేసుకోండి. మేము నించునే పరిస్థితి కాదు అని పిల్లలు అనేసరికి… పిల్లలకి తోడుగా నేను ఇక్కడ ఉంటాను. నాకు సాధన విగ్రహ మూర్తి తిరిగి వచ్చేదాకా నా మనసు మనసులో లేదు. నేను ఆయన్ని చూస్తున్న కూడా సంతృప్తిగా చూడట్లేదు. ఆనందంగా చూడట్లేదు. మనసులో ఈ మనోవేదన మెదులుతుంది. ఇదే గుర్తుకు వస్తుంది. అందుకే ఆయన్ని మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నాను అని అనేసరికి….. శివ నందిని నీ బాధ నాకు అర్థమైంది అమ్మ! దాని గురించి కంగారు పడకు. బాధపడకు .ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. ఒకవేళ మనకి సాధన మూర్తి దొరకలేదు అంటే మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము… కాశి క్షేత్రానికి చేరుకుందాము… పిల్లలు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ క్షేత్రానికి చేరతారు.దాని గురించి ఎందుకు కంగారు పడతావు…. మనం ఏమైనా అనుకుని చేశామా …. అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. అనుకోనివి జరిగినప్పుడు కూడా మనం స్థిర మనసుతో, మంచి మనసుతో ఉండాలి. నువ్వు కావాలని చేయలేదు. నువ్వు అంత గిల్టీగా ఫీల్ అవ్వకు…. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు….నిన్ను నేను ఏమీ అనలేదు కదా! కాకపోతే రుద్రయ్య మాత్రం కాస్త భయపడ్డాడు….బాధపడ్డాడు… ఆవేదనపడ్డాడు…. ఆయన ఆవేశం మీకు తెలుసు కదా! తాటాకు మీద నిప్పులాంటిది. అది ఎక్కువ కాలం ఉండదు . ఆయన మనసులో ఏమనుకోడు…. బాధ్యతారహితంగా ఉన్నావని చెప్పేసి ఆయన ఇదయ్యాడు…. నా సాధన ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి భయపడ్డాడు…. ఎందుకంటే నా సాధన జాగృతి ఆయన దగ్గరుండి చూశాడు. చక్ర జాగృతి దగ్గరుండి చూడటంతో….దైవశక్తులు నాలో ప్రవేశించినాయి అని తెలుసుకున్నాడు. నేను అంత కష్టపడి ఈ స్థితికి వచ్చానో తెలుసుకున్నాడు. దానితో ఆయనకి బాధేసి, కోపం వేసింది. నిన్ను కొట్టడానికి వచ్చాడు… అంతే ఆయన భయం లోనూ బాధ్యత ప్రేమ ఉంది అని గ్రహించు. ఆయన్ని అపార్థం చేసుకోకు. నేను నిన్ను అపార్థం చేసుకోవట్లేదు. కావాలని చేశావని నేను అనడం లేదు…. అనేసరికి నీ మంచి మనసుకి నీ సాధన పరిసమాప్తికి నీ సాధనా విగ్రహ మూర్తిని ఆ వెంకన్న ఇస్తాడు అని నాకు బలంగా అనిపిస్తుంది.
కానీ నా మనసు మళ్లీ యధాస్థితికి రావాలంటే పోయిన సాధన మూర్తి మళ్ళి నా చేతికి రావాలి అనేసరికి….. సరే నీ సాధన నువ్వు ఇక్కడ కూర్చుని చేసుకో…..పిల్లలకి కావలసినవి ఏర్పాట్లు చెయ్యి…. పిల్లల్ని చూసుకుంటూ ఉండు…. నేను రుద్ర స్వామి మళ్ళీ శ్రీవారి దర్శనానికి వెళ్తాము ….అనేసరికి సరే తల్లి! నీ ఇష్టం… మీరు దర్శనాలు పూర్తిచేసుకుని రండి. తలుపులు కొడితే నేను తీస్తాను… అప్పటిదాకా తలుపులకు తాళం వేసి బిగిస్తాను… మళ్లీ ఏ వస్తువైనా తీసుకువెళ్లడానికి వీళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు…. కృష్ణస్వామి యోగాంబిక …ఈసారి వాళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి కూడా వెనకాడరు అనేసరికి…. సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు….అలా అని చెప్పి నిద్రపోకుండా కావలి కాయాల్సిన అవసరం లేదు….. గాఢ నిద్రలోకి కాకుండా నిద్ర మెలకువ కానీ స్థితి అయిన యోగ నిద్రలో ఉండు….అప్పుడు నీకు తెలిసిపోతుంది అనేసరికి అలాగే చేస్తాను…. తల్లి!మొన్న చేసిన తప్పును ఈరోజు చేయదలచుకోవట్లేదు…. పొద్దునంత నిద్రపోయి ఉన్నాను కాబట్టి ……మీరు వచ్చేదాకా నేను యోగ నిద్రా సాధన చేసుకుంటూ ఉంటాను…. అనేసరికి ఈలోగా పిల్లలు ఆకలేస్తుంది అనేసరికి….. అందరూ కిందకు వచ్చారు. స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని…. పుష్కరిణి స్నానం చేసుకుని…. భువరాహస్వామి దర్శనం చేసుకుని….. ఇప్పుడు కూడా ప్రశాంతంగా స్థితి ఉండేసరికి…..రాత్రి 9:30 అయ్యిందని ఆనంద నిలయం దగ్గర కూర్చున్నారు.. ఇప్పుడు రుద్రయ్య కేసి చూస్తూ అయ్యా! స్వామివారికి ఏం జరుగుతుంది అనేసరికి …..స్వామివారికి ఏకాంత సేవ జరుగుతుంది. పవళింపు సేవ చేస్తారు. ఇక తొమ్మిదిన్నరకి గుడి తలుపులు మూసేస్తారు ….. మళ్ళీ 2:30 కి గుడి తలుపులు తీస్తారు…. అది కూడా సుప్రభాత సేవతో తెరుస్తారు…. అనేసరికి సరే! ఇప్పుడు 9:30 నుంచి 2:30 గంటల వరకు మనం ఇక్కడ ఉండవచ్చా…? అనేసరికి అంగప్రదక్షిణ చేసేవారికి అవకాశం ఉంది. ఎవరైనా అడిగితే అంగప్రదక్షిణ మొక్కుబడి ఉంది…. అంగప్రదక్షిణ చేస్తున్నామని చెప్పవచ్చు…. అనేసరికి అంగప్రదక్షిణ అంటే తడి బట్టలతో ఆనంద నిలయం చుట్టూ పొర్లుతూ దండాలు పెట్టడం అనేసరికి….సరే నేను అది కూడా చేస్తాను…..అని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి ఇక్కడ ఉండి రాత్రంతా అంగ ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాము ….అనేసరికి వాళ్ళు అన్ని చెకింగ్ చేసి వీళ్ల దగ్గర ఎలాంటి మారణాయుధాలు లేవని గ్రహించి…. గుర్తించి… వారి వివరాలు ఆధార్ కార్డులు అన్నీ కాపీలు తీసుకొని ఉంచుకున్నారు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని… నిర్ధారణ చేసుకొని…. మీతో పాటు ఇంకొక 50 మంది కూడా ఇక్కడ అంగ ప్రదక్షిణ చేసుకుంటారు…. మీరు వాళ్ళతో పాటు ఉండండి…మీ వేషధారణ చూస్తే మీరు సాధన చేసే వారిలాగా ఉన్నారు. శ్రీవారి అనుగ్రహం పొందండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. మీకు ఏమీ అభ్యంతరం లేదు…. కాకపోతే మీ వల్ల ఇతరులకి….దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఏమైనా సమస్యలు వస్తే మాత్రం మా పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తారు. సమస్యలు తెచ్చుకోకుండా…. సమస్యలు పెంచుకోకుండా ఉండండి… అనేసరికి మా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని….. ఆ పోలీస్ అధికారితో అనేసరికి… సరే అని ఇక వాళ్ళు వెళ్లిపోయారు. ఇక ఆ తరువాత ఈ పుష్కరిణీ లో స్నానం చేసి 11 సార్లు అంగప్రదక్షిణం చేయాలని….. ఆనంద నిలయం చుట్టూ దొర్లుతూ…. అంగ ప్రదక్షిణం చేసింది. అంగ ప్రదక్షిణాలు అయిపోయిన తరువాత….ఇప్పుడు స్వామివారి నిజరూప దర్శనం పొందడం ఎలా? అయ్యా అనేసరికి…. దానికి ఒక మార్గం ఉన్నది తల్లి….. నీ చక్రాలలో శక్తి జాగృతి అయిపోయింది…అంటే… ఆత్మ శరీరంతో సూక్ష్మ శరీర యానం చేయవచ్చు. అంటే ఏంటంటే మీ శరీరంలో 11 దేహాలు ఉంటాయని చెప్పేసి తెలుసు కదా! అందులో ఆరవ దేహమైన ఆత్మ శరీరం ఉంటుంది. ఆ ఆరవ దేహంలో సూక్ష్మ శరీర యానం చేయవచ్చు ….అనగా అది నీకు ప్రేగు బంధం లాగా నీకు ఆత్మ శరీరానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ఆత్మ శరీరంలో నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలోకి…. అంతరిక్షంలోకి వెళ్ళవచ్చు. కాకపోతే నీ భౌతిక దేహం ఇక్కడే ఉంటుంది… ప్రాణ శక్తితో ఉన్న సూక్ష్మ అంశ అయిన ఆత్మ శరీరంతో ….. ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు గుడిలోకి నీ ఆత్మ శరీరం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అనుగ్రహం పొందవచ్చు…. కాకపోతే ఇప్పుడు పవళింపు సేవ కాబట్టి….ఆయన ఏకాంత సేవ కాబట్టి…. ఆ ఏకాంత సేవకు ఆటంకం వస్తే, దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామి ఒప్పుకుంటాడో… లేదో తెలియదు. కానీ ఆయన నిజరూప దర్శనం కావాలంటే…. ఆయన అనుమతి కావాలి అన్నాడు. అయితే ఆ అనుమతి ఎలా వస్తుంది? అంటే ఏమో నాకేం తెలుసు….ఆయన అనుమతి ఏ విధంగా చూపిస్తాడో …..ఆయన్ని ప్రార్ధించు అనగానే స్వామి! నేను మీ నిజరూప దర్శనమును చూడాలనుకుంటున్నాను….. మీ నిజ తత్వం ఏమిటో నాకు తెలియాలి….. నువ్వు ఎవరు ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను…. విగ్రహం మూర్తిగా నువ్వు కనపడినప్పటికీ….. సంతృప్తి పొందలేకపోతున్నాను. అయ్య ఏదో చెప్తున్నాడు….. ఆత్మ శరీరం, సూక్ష్మ శరీరం యానం…. నిన్ను చూడవచ్చునని… కాబట్టి నాకు నీ అనుగ్రహం, నీ దర్శనం చేసుకోవడానికి అనుమతిని ఇస్తావా? లేదు అంటే చెప్పు… స్వామి! నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను . నీ ఏకాంత సేవకి, పవళింపు సేవకి నా వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే…. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు నీ అనుగ్రహం ఉంది అని, అనుమతి ఉంది అని నిదర్శనం కావాలి… అని చెప్పి అనేసరికి…. ఉన్నట్టుండి ఈ ఆనంద నిలయంలో లోపల ఉన్న పెద్ద గంటలు ఒక్కసారిగా మోగేసరికి…. ఏదైనా ప్రమాదం జరిగిందా? లేదా ఎవరైనా మోగిస్తున్నారా…. లేకపోతే ఏంటి? అని సెక్యూరిటీ గార్డులు, ధర్మకర్తల సభ్యులు అంతా కూడా ఆ గంట మోగిన చోటికి శరవేగంతో పరిగెత్తేసరికి …..అప్పుడు మూడుసార్లు గంటలు అప్రమేయంగా మోగేసరికి…. ఏం కోరుకున్నావు తల్లి వెంకన్న స్వామి అనుగ్రహించాడు..అనుమతి ఇచ్చాడు …అనేసరికి ఏం లేదు అయ్యా! ఆయన ఏకాంతసేవ భంగం అవుతుందేమో అని భంగం కాకుండా నీ నిజరూప దర్శనం కావాలని… దానికి అనుమతి కావాలని… నిదర్శనం కావాలని…. అడగంగానే గుడిగంటలు మోగాయి… అనేసరికి, ఇక్కడ అసలు గుడి గంటలు మోగవు. ఎందుకు మోగాయో అప్రమేయంగా మోగాయి… కావాలని మోగినట్టుగా మోగాయి…. అనేసరికి ఎవరైనా ఈ అంగప్రదక్షిణ చేసే భక్తులు ఎవరైనా లోపలికి ప్రవేశించారు అంటే…. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ఎవరూ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకొని…. మరి ఏకాంత సేవలో ఉన్న స్వామివారి గుడిగంటలు ఎందుకు మోగాయా ? అని అనుకునేసరికి ఎవరికి వారే ఆలోచిస్తూ ఉన్నారు. ఆలయ పూజారులు ఆలోచన చేస్తూ …. ఆయన ఎవరినైనా అనుగ్రహించాలని అనుకుంటున్నారేమో ! ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారేమో! రేపొద్దున మనం చూద్దాము…. అప్పటిదాకా తలుపులు తీయడానికి లేదు…. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు…. కాబట్టి ఆలయంలోకి ఎవరూ వెళ్లలేదు కాబట్టి….. అది నిర్ధారణ అయింది కాబట్టి…. గుడి తలుపులు ఎవరు తీయలేదు…. అని నిర్ధారణ అయింది. కాబట్టి మనం ఎవరిని అనుమతించవద్దు… అనుమానించవద్దు…. స్వామివారు ఎవరైనా భక్తుని అనుగ్రహించాలని అనుకుంటున్నారో…. లేకపోతే ఆయన ఏమైనా చెప్పాలనుకుంటున్నారో…. మనం సుప్రభాత సేవలో రాత్రి రెండు గంటలప్పుడు తలుపు తీసినప్పుడు తెలుసుకుందాము…అంతదాకా మనం ఆయన ఏకాంత సేవను భంగం చేయకూడదు. ఆయన పవళింపు సేవలో ఉన్నారు…. స్వామివారిని నిద్ర లేపవద్దు…. అనేసరికి సరే ! అని ధర్మకర్తలు, ఆలయ ప్రధాన అర్చకుడు….. ఈ విధంగా చెప్పేసరికి…. మిగిలిన వారంతా పూజారి గారే చెప్పినప్పుడు….. మనం తలుపులు తీయడం అనవసరం. సుప్రభాత సేవలో తలుపులు తీసి విషయం ఏమిటో తెలుసుకుందామని చెప్పి మళ్ళీ స్వామివారికి యధావిధిగా నమస్కారం చేసుకొని వెళ్ళిపోయేసరికి…..లో గొంతుతో రుద్రయ్య. అమ్మ ! నీకు స్వామివారి నిజరూప దర్శనం ఇవ్వటానికి అనుమతిగా…. అనుగ్రహం ఇవ్వటం కోసం గంటలు మోగించడం జరిగింది. నీకు సూక్ష్మ శరీర విధానం ఎలా చేయాలో చెబుతాను అని అంటూ ఉండేసరికి……. ఆనందం నిలయం యొక్క బంగారు కలశం నుంచి ఒక దివ్య జ్యోతి బయటకు రావడం…..ఆ జ్యోతి గాలిలోకి అలా వెళుతూ ఉండటం గమనించి….. పక్కనే ఉన్న రుద్రస్వామికి చూపిస్తూ ఉండేసరికి…… ఏముందమ్మా ! మనం భూమి నుంచి ఏడు పర్వతాల ఎత్తులో ఉన్నాము…. 21 వేల అడుగుల ఎత్తులో మనం ఉన్నాము…. ఇక మరో మూడు వేల అడుగులు ఎక్కితే సాక్షాత్తుగా మహా వైకుంఠంలోనికి సశరీరంతో వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్లే అవకాశం మనకి లేనందున స్వామివారు….3000 అడుగుల ఎత్తులో ఉన్న నిజ వైకుంఠానికి స్వామి వారు వెళ్తున్నారు.
అక్కడ తమ సతులను కలవడానికి వెళుతున్నారు…. మళ్ళీ రెండు గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవకి వస్తారనుకుంటా! అనేసరికి…. 3000 అడుగుల ఎత్తు దగ్గర మనం ఆగిపోయామా? అనేసరికి ఇప్పుడు పిరమిడ్ కొనకి వెళ్లేసరికి….అది కూడా వేరే లోకానికి అనుసంధానం చేస్తుందని చెప్పి….ఆ లోకంలో పునః సృష్టి చేసే ఆత్మలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది కదా! అదే విధంగా వైకుంఠము ఎంత ఎత్తులో ఉంది అనేది పూర్వీకులు నిర్ధారణ చేసుకొని 21000 అడుగుల వరకు మానవ శరీరం వెళ్లి తట్టుకొని నిలబడగలుగుతుంది…. అని నిర్ధారణ చేసుకొని…..సుమారు 21 వేల అడుగుల ఎత్తులో ఆనంద నిలయం పెట్టి విష్ణుమూర్తి అంశ అయిన వెంకన్న స్వామిని పెట్టడం జరిగిందని…. అంటే వెంకన్న స్వామి స్వరూపం విగ్రహం కాదన్నమాట! సజీవ మూర్తిగా…. స్వయంభుగా విష్ణుమూర్తి అంశ అనుకోవచ్చా! అంటే అది విగ్రహం వచ్చి అమ్మవారా ….అయ్యవారా అనేది…. శివుడా అనేది కాల నిర్ణయమే చెబుతుంది. కాకపోతే అది స్వయంభు సాలిగ్రామం శిల అని కొంతమంది….. ఆయన స్వయంభుగా వెలశాడు అని అంటారు. ఇంకొంతమంది శ్రీకృష్ణుడి శరీరం ఇలా వెంకటేశ్వరస్వామిగా అవతారం పొందింది అని అంటారు…. కొంతమంది బాలాదేవి ఈ విధంగా వచ్చింది శిలా విగ్రహంలా ఏర్పడింది అని చెబుతారు…. కొంతమంది ఇందులో ఈశ్వరుడు ఉన్నాడు…. శివుడు ఉన్నాడు అని చెబుతారు…. యాత్భావమ్ తద్భవతి. ఎవరు ఏ విధంగా భావన చేస్తారో అది ఆ భావంతో ఏర్పడుతుంది…. అనేసరికి ……ఈయన ఇల వైకుంఠ వాసుడు. విష్ణుమూర్తి అంశ అని చెప్పేసి….పెద్దలు నిర్ధారణ చేయడంతో…. ఆ 14 లోకాలలో ఒకటైన వైకుంఠ లోకానికి అనుసంధానం చేయాలని చెప్పేసి మన వాళ్ళు ఏడుకొండలు…. ఏడు పర్వతాలు ఏర్పాటు చేయడం జరిగింది అని అర్థం అయింది అనేసరికి….. నిజమే అయ్యుంటుందయ్యా ! మహానుభావులు ఇంత ఎత్తులో ఊరికే విగ్రహ మూర్తిని పెట్టరు. అర్చనలు చేయరు. ఏడు పర్వతాల ఎత్తున పెట్టారు అంటే…. సాక్షాత్తు యోగదృష్టితో, మనోదృష్టితో ఇలవైకుంఠమును మహాలోకమైన మహా వైకుంఠమును సజీవమూర్తిగా చూడవచ్చు అనుకుంటూ ఉండేసరికి…. అలా గాల్లో వెళ్ళిన పరంజ్యోతి కాస్త తిరిగి మళ్ళీ ఆనంద నిలయం యొక్క బంగారు శిఖరంలోనికి ప్రవేశిస్తూ ఉండేసరికి…. అమ్మ! స్వామి వారు మహా వైకుంఠానికి వెళ్లి తిరిగి వచ్చినట్టు ఉన్నారు. నిజానికి రెండు గంటల 30 నిమిషాలకు రావాల్సిన ఆయన, నీకోసం నీకు దర్శనం ఇవ్వాలని తిరిగి వచ్చారు. నువ్వు సూక్ష్మ శరీర యానంతో ఆలయంలోకి ప్రవేశించి…. ఆయన దర్శనం చేసుకో ! అనేసరికి ఇది ఎలా సాధ్యపడుతుంది అనేసరికి…. దీని విధివిధానం చెబుతాను…. నువ్వు నిటారుగా శవాసనం వేసుకొని పడుకో!
శరీర భాగాలు అన్నిటికీ కూడా విశ్రాంతి ఇవ్వు. ఒక శవం పడుకున్నట్టుగా పడుకో. కాళ్ళు ,చేతులు కూడా కదల్చకుండా స్థిరంగా ఉండు. అప్పుడు నీ శరీరంలో ఉన్న ఆత్మ లెగుస్తుంది… ఆత్మకి నీ శరీరానికి ఒక పేగు బంధం లాగా ఒకటి అనుసంధానం అయ్యి ఉంటుంది. ఆ పేగు బంధం కానీ తెగిపోయింది అంటే మాత్రం…. ఇక ఆత్మ అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీలో నుంచి ఆత్మశక్తి వెళ్ళిపోయిందో….నీ దేహశక్తి పనిచేయదు. నీ దేహం నిర్జీవం అవుతుంది… నువ్వు భౌతిక మరణం పొందినట్లు అవుతుంది…అది మాత్రం గుర్తు పెట్టుకో! ఆ పేగు బంధం తెగిపోకుండా జాగ్రత్తగా చూసుకో…. అనేసరికి అవును నేను ఒక పుస్తకంలో ఈ ప్రయోగం చదివాను. ఈ పేగు బంధాన్ని సిల్వర్ కార్డ్ అని అంటారు. ఆయన సూక్ష్మ శరీర యానం ఎలా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. అది శబ్ద పాండిత్యంలో చదవడం జరిగింది. ఇప్పుడు అనుభవ పాండిత్యంలో నాకు నేనే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో చేస్తున్నానన్నమాట! నేను గ్రహించాను. సరే నేను ఇప్పుడు శవాసనంలో పడుకుంటాను అని… ఆవిడ శవాసనంలో పడుకుని కాళ్ళు చేతులు కూడా విశ్రాంతిగా వదిలిపెట్టేసరికి…. నెమ్మదిగా శరీరభాగాలు అన్నీ కూడా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాయి. మనసు విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. ఏదో తెలియని యోగమత్తు నెమ్మదిగా శరీరానికి మనసుకి ఆవరిస్తూ….శరీరం విశ్రాంతి తీసుకోవడం శరీరంలో నాడులు విశ్రాంతి తీసుకోవటం…. పాదాల నుంచి ఏదో శక్తి తనలోకి ప్రవేశిస్తుందని…. మర్మాంగం లోనికి ప్రవేశిస్తుందని ….ఆ తర్వాత మూలాధార చక్రం లోనికి ఆ తర్వాత స్వాధిష్ఠాన చక్రంలోనికి ఆ తర్వాత నాభి దగ్గర వచ్చేసరికి ఆగిపోయింది. ఆ బొట్టు ప్రాంతంలోకి ఆ యోగశక్తి ప్రవేశించింది. కుండలిని శక్తి ప్రవేశించి అంటే మణిపూరక చక్రము తెరుచుకునేసరికి ఆ బొడ్డు ద్వారా విపరీతమైన నొప్పి. కదల్లేదు… ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితి. శరీరం నెమ్మది నెమ్మదిగా కాళ్లు చేతులు కదలలేని స్తంభించిపోయే స్థితిలో…. శరీరం ఉంది అని గ్రహించింది. కదపాలన్నా కదపలేకపోయింది….ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు….ఉన్నట్టుండి ప్రాణ భీతి మొదలయ్యింది. ప్రాణం పోతుందేమో…..చచ్చిపోతానేమో అని ప్రాణ శక్తి అంతా కూడా లోపలికి పుంజుకోవటం మొదలు పెట్టింది. ఒకసారి ఊపిరి అంది అందినట్టుగా ఉన్న పరిస్థితి.. శ్వాస ఆడట్లేదు…. గుండెల మీద పది టన్నుల బరువు పెట్టినట్లుగా విపరీతంగా ఎవరో కూర్చుని తొక్కుతున్నట్టుగా అనిపించింది. మెదడుకి తగినంత ఆక్సిజన్ అందట్లేదని అర్థం అయ్యింది. గుండెకి కూడా రక్త సరఫరా అవ్వట్లేదని అర్థం అయ్యింది. ఏదో జరుగుతుంది. ఏం జరిగినా పర్వాలేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు…. అని బిగుసుకుపోతున్నా పట్టించుకోని స్థితిలో శివనందిని ఉండిపోయింది. శరీరాన్ని కదపాలన్నా కదపలేని స్థితికి సంపూర్ణంగా వెళ్లిపోయిందని గ్రహించి….. ప్రాణాలు తీస్తున్నట్లుగా అనిపించి ….విపరీతమైన వేడి సెగలు శరీరాన్ని ఆవరిస్తున్నా గాని …..వేడి వస్తున్నా కానీ …పోతే పోనీ వెదవ శరీరం… శ్రీవారి సన్నిధానంలో శరీరం పోతే ఇంతకన్నా భాగ్యం ఏముంది అని మనసులో చెప్పుకుంటూ….. ఉండేసరికి చూస్తుంది, ఎవరు మాట్లాడుతుంది ఎవరు? సమాధానం చెబుతున్నది ఎవరు అని….. అర్థం కాని అయోమయ స్థితిలో ఉండేసరికి……తన భౌతిక శరీరం లాంటి శరీరం నెమ్మదిగా బొడ్డులో నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపించింది. ఇది మొదట్లో మూడు అంగుళాలు కనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా గాలిలో పరిమాణం పెంచుకుంటూ ఆరడుగుల పరిమాణంలోకి మొత్తం తెల్లని శరీరంతో…. దివ్య తేజస్సుతో…. ఆరాశక్తిగా కనపడింది. ఇదే అనుకుంట., తన సూక్ష్మ శరీరం అచ్చుగుద్దినట్టుగా తనలాగే ఉంది. తన భౌతిక శరీరం బొడ్డు పేగు కి అనుసంధానం అయ్యేసరికి ఇదే సిల్వర్ కార్డ్ అనుకుంట! ఈ పేగు బంధం తెగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి…ఇప్పుడు ఇది ఎక్కడికి వెళుతుందో అని అనుకుంటూ ఉండేసరికి….. ఈమె కాస్త ఆనందనిలయానికి ఉన్న రంధ్రం గుండా లోపలికి ప్రవేశించడం జరిగింది. లోపలికి వెళ్ళేటప్పుడు సూక్ష్మతి సూక్ష్మంగా వెళుతూ…. మళ్ళీ లోపలికి ప్రవేశించిన తరువాత ఆరడుగుల శరీరంతో లోపలికి ప్రవేశిస్తూ ఆరడుగులు ఉండేసరికి….. లోపల తను భౌతికంగా చూసిన దృశ్యాలన్నీ కూడా తన కళ్ళ ముందు కనపడుతున్నవి….ధ్యానంలో కనబడుతున్నవి…. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా …. సుస్పష్టంగా కనబడుతూ ఉండేసరికి….శివ నందిని ఆశ్చర్య ఆనందాలకు లోనైంది. ఆ తర్వాత ఈ లోపలికి వెళ్ళిన సూక్ష్మ శరీరం కాస్త బంగారపు వాకిలి దగ్గర స్వామివారి అనుగ్రహం కోసం…. స్వామి! నేను వచ్చాను. మీ దర్శనం కోసం… మీరు అనుమతి ఇచ్చారు కదా! నాకు నిజరూప దర్శనం ప్రాప్తి కలిగించండి…మీ ఏకాంత సేవకు భంగం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి… మీ నిజస్వరూపమును నేను చూడాలనుకుంటున్నాను…. భౌతిక శరీరంతో వీలు పడదని అర్థం అయింది. అందుకని సూక్ష్మ శరీరంతో రావడం జరిగింది…. అనేసరికి బంగారపు వాకిలి తలుపులు ఉన్నట్టుండి తెరుచుకునేసరికి…. అక్కడ విగ్రహ మూర్తి అంటూ ఏమీ కనిపించలేదు. భౌతికంగా వెంకన్న విగ్రహమూర్తి ఇతర విగ్రహమూర్తులు ఏవి కనిపించలేదు. గదంతా ఏమీ లేని స్థితిలో గాఢాంధకార స్థితిలో కనిపించింది. ఆశ్చర్యం వేసింది. ఇది ఏమిటి అనుకుంటూ ఉండేసరికి…. ఒక స్వయంభు జ్యోతి పైనుంచి కిందకు గది మధ్యలో వచ్చినట్టుగా కనిపించింది. సరే ఆయన దర్శనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో చూద్దాం అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి….. ఆ జ్యోతి ఒకటి కాస్త రెండు భాగాలుగా విడిపోయింది…. కుడివైపు పురుష స్వరూపం, ఎడమవైపు స్త్రీ స్వరూపంగా రూపాంతరం చెందింది. అంటే ఆది పురుషుడు, ఆది స్త్రీ అనుకుంట అని శివ నందిని అనుకుంటూ ఉండేసరికి ఈ రెండు స్వరూపాలు కాస్త ….ఇలా పరంజ్యోతి రెండు సమభాగాలుగా విడిపోయి…. కుడివైపు భాగం పురుష భాగం గాను , ఎడమవైపు భాగం స్త్రీ భాగంగాను రూపాంతరం చెందుతూ….. పురుష భాగం కాస్త ఈశ్వరుడు, స్త్రీ భాగం కాస్త ఈశ్వరిలాగా అంటే ఈశ్వరుడు కాస్త ఆది రుద్రుడు గాను…. ఈశ్వరి కాస్త ఆదిపరాశక్తిగాను…. లీలా మూర్తిగా కనిపించేసరికి విడివిడిగా ఉన్న ఈ పురుష, స్త్రీ స్వరూపాలు కలుసుకునేసరికి ఏక అర్ధనారీశ్వర తత్వంలోకి రావటం జరిగింది. సగం పురుష శరీరం, సగం స్త్రీ శరీరంగా కనపడింది. ఇది నిల్చున్న ఆదిరుద్రుడు, ఆదిపరాశక్తి రూపం అని చెప్పకనే అర్థమయింది… ఉన్నట్టుండి ఈ ఆదిరుద్రుడు కాస్త తన ఎడమ కాలుని పైకెత్తి నాట్య భంగిమలో పెట్టేసరికి…ఈయన చిదంబర నటరాజమూర్తి స్వరూపం అని గ్రహించడానికి శివ నందిని కి అట్టే సమయం పట్టలేదు. అంటే ఇది పురుష ప్రకృతి అంటే పురుష ప్రకృతిలో పురుషుడు కదులుతున్నాడు… స్త్రీ మూర్తి కదలడం లేదు అని చెప్పకనే చెప్పారని గ్రహించింది. ఆ తర్వాత ఆదిపరాశక్తి కాస్త తన కుడి పాదమును పైకి ఎత్తి నాట్య భంగిమలో పెట్టేసరికి ఇది అమ్మవారి అంశ ఆయన స్త్రీ ప్రకృతి అనుకుంట…. ఇందులో అమ్మవారు కదులుతుంది… అయ్యవారు కదలడం లేదన్నమాట. అంటే ప్రకృతిలో పురుష, స్త్రీ ప్రకృతి ఉన్నాయని చెప్పి చెప్పకనే చెబుతున్నారు. అంటే కదిలే పురుష ప్రకృతిలో కదిలే శివుడు…. కదలని అమ్మవారు అయితే, స్త్రీ ప్రకృతిలో కదిలేది అమ్మవారు కదలనిది అయ్యవారు అని చెప్పకనే చెబుతున్నారు అని అనుకుంటా అనుకుంటున్న సమయంలో ఈ రెండు స్థితులు ఉన్నట్టుండి అమ్మవారు కాస్త విష్ణుమూర్తిగా లీలా రూపంగా కనిపించేసరికి అర్థం కాలేదు. అప్పుడు అర్థనారీశ్వర స్వరూపంగా కాస్త ఏకరూప అంశగా విష్ణుమూర్తిగా కనిపించారు. విష్ణు మూర్తి కాస్త ఉన్నట్టుండి వెంకటేశ్వర స్వామిగా… సజీవ మూర్తిగా లీలామాత్రంగా కనిపించేసరికి…. ఆశ్చర్య ఆనందాలకి లోనైంది. అంటే విష్ణుమూర్తి స్వరూపంలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు… వెంకటేశ్వర స్వామి లోనే ఆదిదంపతులు అయిన ఈశ్వరుడు, ఈశ్వరి ఉన్నారని చెప్పకనే చెప్పారు…. అని అనుకుంటున్న సమయంలో ఏక స్వరూపంగా ఉన్న విష్ణువు కాస్త స్త్రీ స్వరూపంగా మారడం జరిగింది. ఈసారి ఒకవైపు ఈశ్వరుడు, మరొకవైపు పురుషుడిగా విష్ణుమూర్తి లీలా మూర్తిగా శివకేశవుల అర్ధనారీశ్వర తత్వంగా కనిపించేసరికి…. ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యింది. ఆ తర్వాత విష్ణుమూర్తి కాస్త జగన్మోహిని రూపంలో రూపాంతరం చెందేసరికి అంటే అమ్మవారే విష్ణువుగా మారింది. మళ్ళీ విష్ణువే తిరిగి అమ్మవారిగా మారాడు అని శివ నందిని చెప్పకనే గ్రహించింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అర్ధనారీశ్వరుడు తత్వంలో ఈశ్వరుడు జగన్మోహిని రూపం ఉన్న విష్ణుమూర్తి అయిన అమ్మవారు కలిసి కూర్చున్న స్థితిలో కనిపించేసరికి అమ్మవారు ఎడమ పాదమును అయ్యవారు కుడి పాదమును మడత పెట్టుకున్న భంగిమలో కనిపించేసరికి….. ఇది అరుణాచలంలో అరుణగిరి లోపల కనిపించే దక్షిణామూర్తి అర్ధనారీశ్వర తత్వం కదా !
అనుకునే సమయంలో వీరిద్దరి తత్వాలు స్త్రీ, పురుష తత్వాలు కూడా చెప్పలేని…గుర్తించలేని…. ఎవరు పురుషుడు , ఎవరి స్త్రీ ? అని చెప్పలేని స్థితిలో ఏకత్వ స్వరూపంగా…. నామరూపాలు లేని స్థితిలో లయం అయ్యే సరికి ఉన్నట్టుండి అమ్మవారి పాదమును మడిచిపెట్టడం అయ్యవారి పాదమును మడిచిపెట్టడం ఏక స్వరూపంగా పద్మాసనములో ఉండేసరికి…. అంటే ఇది కాస్త పద్మాసన స్థితిలో నపుంసక శక్తి స్వరూపం… అంటే మన దగ్గరికి వచ్చిన సాధనా విగ్రహం రూపం యొక్క స్థితి ఇదే అన్నమాట! అనుకునేసరికి తన దగ్గర ఉన్న సాధన విగ్రహ మూర్తి లీలగా కనిపించింది. సజీవ మూర్తిగా కనిపించింది. కళ్ళంట నీళ్లు రావడంతో బంగారు తలుపులు మూసుకోవడంతో…. ఇక తనకు సమయం దాటిపోతుందని సిగ్నల్ రావటంతో తను యధావిధిగా సూక్ష్మ శరీరం కాస్త ఆనందం నిలయం యొక్క రంధ్రంగా బయటకు వచ్చి…. యోగనిద్ర ధ్యాన నిష్ఠలో ఉన్న శివ నందినిలోకి యధావిధిగా ఆత్మ శరీరం ప్రవేశించడం జరిగింది.ఇదంతా కూడా ధ్యానంలో రుద్ర స్వామి చూస్తూ తన్వయత్వం పొందుతూ…. ఈ పిల్ల వలన సజీవంగా అర్ధనారీశ్వర స్వరూపమును…. వెంకన్న స్వామి నిజరూపమును…. త్రిమూర్తి తత్వమును చూడటం జరిగింది కదా! అని అనుకొని తల్లి… లే! లే అని లేపేసరికి లేస్తున్నాను అయ్యా! తొందరపడమాకు… నేను అంతా చూశాను…. అంతా అనుభవం అనుభూతి పొందాను…. అని కళ్ళు తెరుస్తూ లేచి కూర్చొని….అసలు ఏం జరిగిందో…. ఎలా జరిగిందో తను చూసిన దృశ్యాలు అన్నీ కూడా యధావిధిగా పొల్లు పోకుండా రుద్రస్వామితో పంచుకోవడం జరిగింది . అప్పుడు రుద్రస్వామి మనకి చెప్పకనే చెప్పారు కదా నారాయణ మహర్షి…. నీకు 14వ లోకంలో ఏం జరుగుతుందో…. సత్య లోకంలో ఏం జరుగుతుందో నువ్వు సత్యాన్వేషిగా తెలుసుకో అన్నారు కదా! అంటే అర్ధనారీశ్వర తత్వంలో పురుష ప్రకృతి, స్త్రీ ప్రకృతి ఏ విధంగా ఉంది ఏంటి అనేది…. చెప్పకనే చెప్పారు కదా! కాబట్టి వెంకటేశ్వర స్వామి నువ్వు ఏం సాధించాలని… నీ లక్ష్యం ఏమిటి అని నిర్దేశించినట్లుగా నిజరూప దర్శనాలతో మీ సాధన ఎలా పరిసమాప్తి చేసుకోవాలో…. ఏం పొందాలో అని చెప్పి… చూచాయిగా చెప్పినట్లుగా ఉన్నది… కదా! వీటిని మనసులో గుర్తు పెట్టుకో. మనం ఏమి సాధించాలి…ఎలా సాధించాలి ….అని మనకి ఒక అవగాహన వస్తుంది అని అనేసరికి… జ్ఞాన స్ఫురణలు వస్తాయి…. అనేసరికి నేను నా మనసులో గుర్తుపెట్టుకుంటాను…. ఏ రూపాలు ఏ విధంగా పొందారు అనేది నాకు అవగాహన వచ్చింది… నాకు గుర్తుంది…. నేను మర్చిపోను…. మరిచిపోయేంత తేలికైన విషయం కాదు ఆ మధురస్మృతులు అని అనుకుంటూ ఉండేసరికి…. ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు… ఇంక మనం మన గదికి వెళ్ళిపోదాం అనగానే….. ఆ సాధన విగ్రహం మూర్తి చివరిలో కనబడింది కదా! మరలా ఆ కోల్పోయిన సాధన విగ్రహం మూర్తి ఎలా పొందాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండేసరికి…. స్వామివారి పుష్కరిణిలో ఉన్నటువంటి బంగారపు కాంతులు వెదజల్లుతున్నట్టుగా ఏదో కాంతి ప్రసారం పైకి వస్తున్నట్లుగా…. అనిపించేసరికి ఏముందా? అని స్వామివారి పుష్కరిణి దగ్గరికి వెళ్లి అక్కడ లోపల ఏదో బంగారపు వస్తువు ఉంది అని…. అది బయటకు రావాలి అని అనుకుంటుంది అని ….ఒకవేళ అది లోపలికి వెళ్లి చూద్దామని….రుద్రస్వామి అనేసరికి ఏమో అయ్యా! నేను ఇది అని ఇదిమితంగా చెప్పలేను…. నేను మళ్ళీ ఆ వస్తువు మీద ఆశపడ్డాను అంటే మళ్ళీ సాధన ఆగిపోతుందేమో…నేను ఏమీ ఆశించకూడదు. అనగానే
మనసులో నీకు ఆశించాలని ఉందా? అంటే నాకు ఆశించాలనే లేదు….అంటే మరి ఎందుకు భయపడుతున్నావు…లోపలికి వెళ్లి చూడు అది ఏంటో తెలుసుకో! ఒకవేళ నువ్వు ఆశించాలో వద్దో …తెలుస్తుంది కదా! స్వామివారి పుష్కరిణీలో బంగారపు వెలుతురు…. బంగారపు కాంతి ఎందుకు వచ్చింది? స్వామివారు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారేమో….. స్వామివారు నీకు ఏమైనా చూపించాలని అనుకుంటున్నారేమో కదా! అనేసరికి అంతేనంటావా అయ్యా! సరే ఏం జరిగితే అది జరుగుతుంది…. అని స్వామివారిని మనసారా తలుచుకుంటూ శబ్దం రాకుండా మెల్లగా పుష్కరిణిలోకి ప్రవేశించింది. ఆ పుష్కరిణీ అడుగు భాగంలోనికి వెళ్లేసరికి తను పోగొట్టుకున్న సాధనా విగ్రహ మూర్తి కాస్త బంగారు వర్ణంలో కనిపించేసరికి అలవి గాని ఆనందము శివ నందిని పొందింది. అంటే స్వామివారి పుష్కరిణిలో వీళ్ళిద్దరూ పడేసి ఉంటారు. ఎవరో స్నానం చేసే భక్తులు దీనికి తీసుకుపోతారని చెప్పేసి కృష్ణస్వామి మరియు యోగాంబిక అనుకుని ఉంటారు . వాళ్ళకి ఎవరికీ కనిపించకుండా నాకు కనిపించేటట్లు వెంకన్న స్వామి చేసి ఉంటాడు అనుకుని…. స్వామి! నీకు శతకోటి నమస్కారాలు స్వామి…. కృతజ్ఞతలు… ఒక పక్కన నిజ స్వరూపం చూపించినారు…. ఆ నిజస్వరూపానికి అర్హత, యోగ్యతగా, యోగంగా, నాకు ఈ సాధన విగ్రహం మూర్తి పోయిందని మనోవేదన కలిగించావు. కానీ నీ సమక్షంలో నేను అన్ని రకాల మనోవేదనలను పోగొట్టుకున్నాను… బాధపడలేదు… క్షణకాలం పాటు కూడా ఆలోచించలేదు… నేను చూసిన భౌతిక దృష్టి మీదనే నా మనోదృష్టిని పెట్టుకున్నాను. ఏకాగ్రతను పెట్టాను. దానితో నీకు నేను సాధనా విగ్రహ మూర్తి ఉన్నా లేకపోయినా నేను ముందుకు తీసుకొని వెళ్తానని నమ్మకం… నీకు వచ్చి ఉండాలి. నాకు పోయింది అనుకున్న వస్తువు వచ్చేలా చేశావు. నీ లీలలు అర్థం కావు. అర్థం అయితే నేను ఎందుకు ఉంటాను…. అని అనుకుంటూ ఒకటికి పది సార్లు కృతజ్ఞతలు చెబుతూ…. ఆ విగ్రహం మూర్తిని తీసుకుంటూ పైకి వచ్చేసరికి చేతిలో సాధనా విగ్రహ మూర్తిని చూసేసరికి రుద్ర స్వామికి నోట మాట రాలేదు. తన్మయత్వం పొందుతూ అమ్మ! మళ్ళీ సాధించావు అన్నమాట. ఇది స్వామి వారే నీకు పరీక్ష పెట్టి ఉంటారు. వారి అనుగ్రహం పొందావు… అనేసరికి ఆ విగ్రహ మూర్తి ఆయనకి ఇస్తూ…అయ్యా! నాకెందుకో ధ్యానం చేసుకోవాలి అనిపిస్తుంది . యోగముత్తు ఆవరిస్తుంది కాసేపు నేను ధ్యానంలో ఉంటాను అనేసరికి…కూర్చో తల్లి! ఆయన ఏమైనా చెప్పాలనుకుంటున్నారేమో…. ఈ విగ్రహాన్ని నేను కాపలా కాస్తూ ఉంటాను. ధ్యానంలో కూర్చోమని చెప్పేసరికి…. ఒక ఎత్తైన ప్రదేశంలో మట్టి మీద కూర్చొని స్వామివారిని మనసులో ఆ స్వరూపాన్ని తలుచుకుంటూ… చూసుకుంటూ… ధ్యాన నిష్ఠలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా 45 నిమిషాలు అలా ధ్యానంలో ఉండిపోయేసరికి…. ధ్యాన దృశ్యం లీలగా కనిపించడం ఆరంభం అయింది.
ధ్యాన దృశ్యంగా మొదట విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం… ఏదో కొలనులో పడినట్లుగా…. అది కూడా ఈ తిరుపతి పరిసర ప్రాంతాలలో పడినట్లుగా లీలగా కనిపించింది. అయ్యో స్వామి వారి సుదర్శన చక్రం కొలను అడుగుకి వెళ్ళిపోతుంది…. విచిత్రంగా ఉందే! అనుకుంటూ ఉండేసరికి…. ఆ చక్రం ఉన్నట్టుండి సుడులు తిరుగుతూ ఉండేసరికి…. ఒకవైపు చేపలను పోలిన జీవులు… మరొకవైపు తాబేలు ఆకారం పోలిన జీవులు….. ఈ చక్రం చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి… సుదర్శన చక్రంలో లయం అయిపోతూ…. ఉండి, ఆ తర్వాత సుదర్శన చక్రం మధ్యలో నుండి భయంకరమైన నాలుగు కోరలతో
.. నల్లని శరీరంతో…. బొచ్చుతో…. ఎత్తైన పొడవైన ఒక వరాహ స్వరూపం బయటికి శరవేగంతో తన మీదకి వస్తున్నట్టుగా అగుపించేసరికి….. ధ్యాన భంగం అయింది. ఇదేమిటి..! ఇది ఏం తీర్థం…. ఇందులో నుంచి వరాహమూర్తి రావటం ఏమిటి? చేపలు లాంటి జీవులు రావడం ఏమిటి? తనకి అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ…. ఆత్మ విచారణ చేసుకున్నా అర్థం కాలేదు…. సరే అని ఇలా కాదనుకొని….. మళ్ళీ ధ్యానంలో అలా ఒక అరగంటసేపు కూర్చునే సరికి …..మరొక ధ్యాన దృశ్యం లీలగా కనిపించ సాగింది. ఈసారి ధ్యానంలో ఆకాశం నుంచి వర్షం పడుతూ…. ఒక కొలనులో నీరు చేరుతున్నట్టుగా…. సుమారుగా ఒక పదివేల అడుగుల లోతులో స్పటిక శివలింగ ఆరాధన చేస్తున్న ఒక శివయోగి కనిపించేసరికి అర్థం కాలేదు . ఈ తీర్థం ఏంటా? అనుకునేసరికి…. ఇది తిరుపతి పరిసర ప్రాంతాలలోనే ఉండేసరికి…. ఈ తీర్థం చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇది ఆకాశ తీర్థం. . దీన్ని ఆకాశగంగా అంటారు… ఈ ఆకాశగంగా తీర్థంతోనే శ్రీవారికి అభిషేకాలు చేస్తారు అంటున్న మాటలు లీలగా వినిపించేసరికి…. ఓహో ఇక్కడ ఆకాశ గంగా తీర్థం ఉండి ఉండాలి…. అందులో ఆకాశ అంతరిక్షంలో ఉండే స్పటిక రుద్ర లింగం ఇందులో పడి ఉండాలి అని చెప్పేసి లీలామాత్రంగా చెప్పటానికి అని ధ్యాన దృశ్యం చూపించినారని అనుకుంటూ ఉండేసరికి….. ఇప్పుడు దీన్ని ఎలా పొందాలి అనుకుంటూ…. ఉండేసరికి ధ్యానభంగం అయ్యింది. సరే అని ధ్యానం నుంచి బయటకు వచ్చి రెండో ధ్యాన దృశ్యాన్ని విశ్లేషణ చేద్దామనుకుంటూ ఉండేసరికి తనకి ఎలాంటి స్ఫురణ రాలేదు. సరేలే అని తను కళ్ళు మూసుకొని….. కళ్ళ ముందు ఏదో ధ్యాన దృశ్యం కనబడుతూ ఉండేసరికి….. ఈసారి మళ్లీ ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది. ఈసారి మూడవ ధ్యాన దృశ్యంలో ఏదో మహర్షికి హనుమంతుడు నిజరూప దర్శనం ఇచ్చినట్లుగాను…. ఆయన అనుగ్రహం పొందితే గాని…. సహస్ర చక్రమును దాటి హృదయ చక్రానికి అర్హత, యోగ్యత, యోగం లభించదు…. అని చెప్పేసి, ఇదే అనుకుంటూ మనకి అంజనాదేవి పర్వతం మీద ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడే మనం పంచముఖ హనుమాన్ దర్శనం పొందాలనుకుంట…ఇదేదో తీర్థం లాగా ఉంది… అని అనుకుంటూ ఉండేసరికి… కొంతమంది భక్తులు మాటల ద్వారా ఇది జాబాలీ తీర్థం అని చెప్పేసి తెలుసుకుంది. సరే ఈయన అనుగ్రహం ఎలా పొందాలో….అని అనుకుంటూ ఉండేసరికి…. సరే అని కొంతసేపు అలాగే మౌనంగా కూర్చుంది. అక్కడే ఉన్న రుద్రస్వామి కేసి చూసింది. ఆయన మౌనంగా ఈమెకేసి చూశాడు. ఇద్దరు మాట్లాడుకోలేదు…. ఈమెకి ఏవో ధ్యాన దృశ్యాలు చూపిస్తున్నారు. వాటిని విశ్లేషణ చేసుకోవాలనుకుంటుంది…. కానీ రావట్లేదని గ్రహించి ఏమీ మాట్లాడకుండా…. తన చేతులతో సాధన విగ్రహ మూర్తిని పట్టుకొని…. ఈమె కేసి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు ఒకరినొకరు చూపులు కలిసినాయి . కానీ మాట్లాడుకోవడం లేదు….. ఆ తర్వాత ధ్యానంలో మళ్ళీ నాలుగవ ధ్యాన దృశ్యంగా ఆమెకు ఉన్నట్టుండి…. ఏదో తీర్థంలో తన దగ్గర ఉన్న నాగాభరణం ద్వారా మూలాధార చక్ర జాగృతికి అవసరమైన వస్తువు….. దానికి సంబంధించిన ఆధారం సాధనా మూర్తి ఇచ్చినట్టుగా…. ఆ వస్తువు ఏంటో…. ఆ ఆధారం ఏమిటో…. అర్థం కాక కళ్ళు తెరిచి రుద్ర స్వామికి అన్నీ కూడా నాలుగు ధ్యాన అనుభవాలు, ధ్యాన దృశ్యాలు యధాతధంగా చెప్పేసరికి….. నాకు తెలిసినంతవరకు మొదటి ధ్యానం అనుభవం అనేది…. చక్ర తీర్థానికి సంబంధించినది అయ్యి ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఒకటి తీర్థంలో పడింది అంటారు. అది చక్రతీర్థం అన్నారు. ఈ చక్రతీర్థంలోనే నిలువు శరీరాలు, అడ్డు శరీరాలకి మోక్షం పొందే విధివిధానం చూసి ఉండవచ్చు…. మూడవది వరాహం అనేది విష్ణుమూర్తి దశావతారంలో మత్యావతారం, కూర్మావతారం వరాహవతారం, వామనవతారం అని ఇలా దశావతారాలు ఉన్నాయి కదా! మనిషి యొక్క విజ్ఞానం వానరుడి నుండి నరుడికి వచ్చాడని ఆ వానరుడికి మూలం చేప అని చెప్పేసి మన వేదాలు శాస్త్రాలు చెప్పడం జరిగింది. అందుకని నిలువు శరీరాలు చేపల ఆకారంలోను, అడ్డు శరీరాలు తాబేలు ఆకారంలోను కనపడ్డాయి. అంటే ఇప్పుడు నేను ఆ చక్రతీర్థం లోనికి వెళ్లి ప్రత్యక్షంగా వాటిని చూడవచ్చా., అని అంటే ఏమో! మీ సాధన స్థితిని బట్టి చూడొచ్చేమో…. నీకు చూసే అవకాశం ఉంది….ఆ తర్వాత ఏంటి? అనేది నువ్వు తెలుసుకోవచ్చు…. అని అంటే ఈ నాలుగు దృశ్యాలు కూడా నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను…. పరోక్షంగా ధ్యాన అనుభవాలు అయినాయి. ప్రత్యక్షంగా అనుభవ అనుభూతి పొందాలనుకుంటున్నాను సరే ఇప్పుడు గదికి వెళ్ళిన తర్వాత స్నానాదికాలు చేసుకొని టిఫిన్లు కానించుకొని…. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎలా చేయాలి? ఏం చేయాలి అనేది చూద్దాము…. ఎందుకంటే మహాదేవి రాత్రంతా నిద్రహారాలు మానేసి….. సాధనా మూర్తి విగ్రహం గురించి ఏడుస్తూ కూర్చుంది…ముందు ఆమెకి ఉప శాంతి కలిగించాలి. లేదంటే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది…. అని అనేసరికి , వీళ్ళ బంధం ఏమిటో అర్థం కాదు….. ఎదురుపడితేనేమో కొట్టుకుంటూ ఉంటారు…. దూరంగా ఉంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు…. అని మనసులో అనుకుంటూ ….రుద్ర స్వామిని అనుసరిస్తూ గదికి వెళ్లడం జరిగింది. గదిలోకి వెళ్లేసరికి సాధనా మూర్తిని చూడగానే…. మహాదేవికి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. రుద్ర స్వామి చేతిలో ఉన్న స్వామివారిని చూస్తూ…. స్వామి వారు వచ్చారా…. తిరిగి వచ్చారా…. మనకోసం స్వామి వారు తిరిగి వచ్చారా…. అంటూ విగ్రహ మూర్తిని మురిపెంగా చూసుకుంటూ…. స్వామి ఇంక నేను మిమ్మల్ని వదిలిపెట్టను…. క్షమించండి…. నా అజాగ్రత్త వల్ల మిమ్మల్ని ఒకసారి పోగొట్టుకున్నాను…. ఇక జీవితాంతం నిన్ను కాపాడుకుంటూ ఉంటాను…. నేను మీలో లీనమైపోవాలి … నా జీవితం పరిసమాప్తి అయిపోవాలి. నువ్వు లేకపోతే నాకు పిచ్చి పట్టినట్లు అయింది…. నా వల్ల కాలేదు…. నావల్ల విశ్వలోక కళ్యాణం ఆగిపోతుందేమో… విశ్వ మోక్షం ఆగిపోతుందేమో అని భయం వేసింది. నా అజాగ్రత్త నే నా కొంపముంచింది. ఇంక ఎప్పడూ ఆ తప్పు చేయను… అని చెప్పి ఈ సాధనా మూర్తికి పరి విధాలా చెప్పుకునేసరికి…. బాలగణపతి, బాల కుమారస్వామి చప్పట్లు కొట్టుకుంటూ…. సాధించావమ్మా! తిరిగి సాధించావు! సాధన విగ్రహం మూర్తిని పొందావు….పొందుతావో లేదో అని అనుమాన భయం ఉండేది. అమ్మ ! నువ్వు ఎలాగైనా ఏదైనా సాధించగలవు… ఏదైనా చేయగలవు…. మనసు పెడితే నువ్వు సాధించనిది అంటూ ఏమీ ఉండదు…. అని మళ్లీ నిరూపించావు. మహాదేవి రాత్రంతా ఏడుస్తూనే ఉంది… మాకు నిద్ర పట్టలేదు… మేము నిద్రపోవడం లేదని ఇంకా బాధ పడుతుందని… నిద్రపోతున్నట్టుగా నటించాము. నటిస్తూనే మేము గాఢ నిద్రలోకి వెళ్లిపోయాము… ఏం జరిగిందో తెలియలేదు. పాపం మహాదేవి మాత్రం నిద్రపోకుండా బాధపడుతూ ఏడుస్తూనే కూర్చుంది. మేము లేచిన తర్వాత కూడా అలాగే ఉంది . మాకు ఆకలేస్తున్నా ఆటల రంధిలో ఉన్నామని ….ఆ విషయం మర్చిపోయేటట్టు చేసాము. మామూలు స్థితికి ఇప్పుడు మహాదేవి వచ్చేస్తుంది. మహాదేవికి మనశ్శాంతి కలిగింది. ఇప్పుడు తను చేసిన తప్పు తెలుసుకుంది…కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది… ఏమరపాటుగా ఉండదు… నువ్వు ఏమైనా సాధిస్తావమ్మా! అని పిల్లలిద్దరూ శివ నందినికి ముద్దులు పెట్టుకుంటూ…. సాధన విగ్రహ మూర్తిని తనివితీరా చూసుకుంటూ… ఆనంద పడుతూ ఉండేసరికి…. అమ్మ నువ్వు రాత్రంతా మెలకువగా ఉండి ఉంటావు కదా ! సాధనలో నువ్వు ఏం చేసావో చెప్పు…. అనేసరికి ఇక రాత్రి జరిగిన అనుభవాలన్నీ కూడా మహాదేవికి, పిల్లలకి కథలుగా వివరించేసరికి వీళ్లంతా తన్మయత్వంతో ఆకలి మరిచిపోయారు. ఆ తర్వాత ఆకలి వేస్తుందని… స్నానాధికాలు చేసుకుని ….టిఫిన్లు కానిచ్చుకొని…. విశ్రాంతి తీసుకోవడానికి ఎవరికి నచ్చిన చోట్ల వాళ్ళు గదిలో పడుకున్నారు. పిల్లలిద్దరూ లోపల ఆటల రందిలో లో ఉన్నారు… పెద్దవాళ్ళు మంచాల మీద నిద్రకి ఉపక్రమించి… గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. పిల్లలు కూడా ఆడుకుంటూ…. ఆడుకుంటూ నిద్రలోకి వెళ్లిపోవడం జరిగింది.
ఇలా గాఢ నిద్రలో ఉన్న సాధనా కుటుంబం మెలకువ వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు గ్రహించారు . సరే అని ఆకలి వేయటంతో కిందకి వెళ్లి సత్రంలో భోజనం చేసి…. ఇప్పుడు ఏం చేద్దాం అనేసరికి…ఈ తిరుపతి చుట్టూ చూడటానికి ఏడు ప్రదేశాలకి బస్సు ఏర్పాట్లు చేశారంట.. మహాదేవితో శివ నందిని….అమ్మ ! నాకు ధ్యాన అనుభవాలు కనిపించినాయి. కాబట్టి ఆ వస్తువులను చూడటానికి వెళతాను…. నేను రుద్ర స్వామి వెళతాము…. పిల్లలు నడవలేరు… కాబట్టి నువ్వు పిల్లలకి తోడుగా ఉండు. ఆ ఏడు ప్రదేశాలు వాళ్లకు చూపించేసి… నువ్వు గదికి వెళ్ళిపో! నేను రుద్ర స్వామి తో వెళ్ళి ఆ దైవీక వస్తువులను తీసుకొని వస్తాను అనేసరికి….. సరే అని చెప్పి కుమారస్వామి దగ్గర ఉన్న నాగాభరణం తీసుకుని…వీళ్ళు ఆ ప్రదేశాలకు చూడటానికి కాలినడకతో రుద్రస్వామి, శివ నందిని బయలుదేరారు. ఇలా వీళ్ళు వెళుతూ ఉండేసరికి ఇక్కడ తిరుపతిలో మనం చూడవలసిన ప్రదేశాలు …..అవి ఒకటి శ్రీవారి పాదాలు,రెండు శిలాతోరణం, మూడు చక్రతీర్థం, నాలుగు వేణుగోపాలస్వామి గుడి, ఇక్కడే హాథిరాం బాబా సజీవ సమాధి ఉంది. ఐదవది ఆకాశగంగ, ఆరవది పాపవినాశనం, ఏడవది జాబాలి తీర్థమని చెప్పి గైడ్ చెప్పేసరికి గైడ్ ద్వారా తెలుసుకొని మొట్టమొదట శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవాలని రుద్రస్వామి మరియు శివ నందిని బయలుదేరటం జరిగింది. ఆ తరువాత శ్రీవారి పాదాలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకోవడం జరిగింది. అక్కడ మొట్టమొదట వెంకటేశ్వర స్వామి కాస్త… ఈ పర్వతం మీద అడుగుపెట్టిన ప్రదేశం, తొలి పాదం కావడంతో ఇది శ్రీవారి పాదాలుగా ఖ్యాతి పొందడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న శిలా తోరణానికి వెళ్లడం జరిగింది. ఈ శిలాతోరణం అనేది మనుషులతో సంబంధం లేకుండా…. సహజ సిద్ధంగానే కొండ చరియలతో ఒక తోరణం లాగా ఏర్పడింది. విచిత్రం ఏమిటంటే…..ఈ తోరణం మీద అంతే సహజ సిద్ధంగా ఎవరూ చెక్కకుండ కొన్ని గుర్తులు ఏర్పడి ఉన్నట్లుగా వీళ్ళిద్దరూ గమనించారు. ఈ శిలాతోరణం మీద వీళ్ళిద్దరికీ వరద ముద్ర, అభయ ముద్ర, శంఖు చక్రము, నాగాభరణము, శ్రీవారి పాదాలు, గరుడ పక్షి, ఉన్నట్లుగా కనిపించారు. అంటే ఇవి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుర్తులుగా ఉండటం గమనించారు. ఈ ఏడు గుర్తులు కూడా ఏడు గిరులకు సంబంధించినవేమో అనుకొని నమస్కారం చేసుకుని…. అక్కడికి దగ్గరలో ఉన్న చక్రతీర్ధానికి బయలుదేరారు…. అక్కడికి వెళ్లేసరికి , మొట్టమొదట ధ్యాన దృశ్యం కనిపించింది. ఇది చక్రతీర్థం అని అందులోనే మొదట విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం పడిపోయింది అని చెప్పేసి రుద్రస్వామి ద్వారా తెలుసుకుంది. అప్పుడు రుద్ర స్వామితో అయ్యా ! ఈ చక్రతీర్థం లోనే చేపల వంటి నిలువు శరీరాలు….. తాబేలు వంటి అడ్డు శరీరాలు పడిపోయి….వరాహమూర్తి బయటికి రావడం అనేది చూశాను. ఇందులోకి దిగి దీని లోపల ఏం జరుగుతుందో చూడమంటావా? నువ్వు అనుమతిస్తేనే నేను చూస్తాను…. అనేసరికి, చూడు తల్లి! నువ్వు ఏదైనా ప్రత్యక్షంగా చూస్తే గాని నమ్ముతావు కదా! ధ్యానంలో అనుభవం అయింది ….నువ్వు నమ్మవని చెప్పేసి మొదటే చెప్పావు కదా! మరి నీకు ఈదటం వచ్చా? అంటే నాకు పెళ్లి కాక ముందు ఈత కొట్టడంలో నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నీ ఇష్టం తల్లి ! జాగ్రత్త ….ఎక్కువ లోతుకి వెళ్ళమాకు…. కొద్దిగ పరిధి వరకు వెళ్ళు…. నీకు కనపడకపోతే వెనక్కి తిరిగి వచ్చేసేయి. ఏనాడో ఆదిలో సుదర్శన చక్రం పడింది అన్నారు. ఇప్పుడు ఆ సుదర్శన చక్రం ఎక్కడుందో ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు కొంపతీసి అదే సుదర్శన చక్రం చూసి రావడానికి వెళ్తున్నావా ఏమిటి? అనేసరికి అసలు నాకు మొదట ధ్యాన దృశ్యం ఏమి చూపించింది… ఏంటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి అనిపించింది…. సరే అయితే! వెళ్లి చూడు జాగ్రత్తగా…. అని చెప్పి ఇక చుట్టూ జనాలు ఉన్నప్పటికీ కూడా….. చక్ర తీర్థంలోకి ఏమాత్రం భయపడకుండా….అనుమానం రాకుండా…. లోతుగా లోపలికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. చుట్టు ఉన్న భక్తులు ఈమె వెళ్ళింది అన్న విషయం కూడా గమనించుకోలేదు. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఎవరి రందిలో వాళ్ళు ఉన్నారు… సరే అని రుద్ర స్వామి ఏమీ తెలియనట్లుగా ధ్యానంలో కూర్చుని పోయాడు. ఈయన వేషధారణ చూసి ఈయన బిచ్చగాడు ఏమోనని ఆయనకి డబ్బులు వేయటం జరిగింది. ఆయనకి తెలిసినా కూడా….. చూసినా కూడా పెద్దగా పట్టించుకోకుండా….. తను ధ్యానంలో తాను ఉండిపోయాడు. ఇలా శివ నందిని కాస్త అడుగుభాగంలోకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి… శ్వాసకు ఇబ్బంది పడుతున్నానని తెలిసినా కూడా…. పోతే పోనీ ఎదవ ప్రాణం .. చక్ర తీర్థంలో ప్రాణాలు పోవాలని రాసి ఉంటే పోతుంది… అసలు ఇందులో పురాణం ప్రకారం చూస్తే , స్వామివారి సుదర్శన చక్రం ఉందని అంటున్నారు… ధ్యానంలో కూడా కనపడింది కదా! అది నిజమా కాదా? చూడాలి….అన్నట్లుగా సుమారు ఒక 10,000 అడుగుల కిందకి వెళ్లినట్లుగా గమనించింది. ఇంత లోతు మహాసముద్రం కూడా ఉండదేమో అనుకుంటూ ….ఇంక తనకి ఎక్కడా కూడా చక్రం ఏది కనిపించకపోయేసరికి….ఇంక తను చూసిన ధ్యానాలు నిజం కాదేమో? అని వెళ్ళిపోతుండగా….. నీటి అడుగున భాగానికి కనుచూపు మేరలో చేరినట్లుగా అనిపించేసరికి…. నీటి అడుగు భాగంలో మట్టి కదులుతున్నట్టుగా ఏదో వస్తువు పైకి ఊబికి వస్తూ ఉండేసరికి…. ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి అలాగే జలసిద్ధి మీద ఆధిపత్యం రావడంతో స్వాధిష్ఠాన ముద్ర వేసుకుంటూ జలదిగ్బంధన సిద్ధిని ….ఉపయోగిస్తూ పద్మాసనం వేసుకొని… నీటి అడుగుకు చేరి…. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి….అనుకుంటూ ఉండేసరికి, ఉన్నట్టుండి ఈ నీటి అడుగు భాగంలో ఉన్న ఇసుకలో నుంచి ఒక వస్తువు తిరుగుతూ తిరుగుతూ పైకి వచ్చేసరికి…. ఆ ఇసుక అంతా బయటకు పోయేసరికి…. సుమారు మూడున్నర అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఒక చక్రం లాంటిది…..సుడులు తిరుగుతూ బంగారు వర్ణంలో దివ్య తేజస్సుతో… కాంతితో ….వెయ్యి పద్మ రేకులు ఉన్న సుదర్శన చక్రం అనుకుంట…. తిరుగుతూ కనబడుతూ ఉండేసరికి…. ఇది ఇసుకలో కూడా తిరుగుతూ కనిపిస్తుంది. నీళ్లలో కూడా తిరుగుతూ కనిపిస్తుంది ….అని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి…. తను కూర్చున్న చోట కుడివైపు తిరిగి చూసేసరికి…త్రిశూలముద్ర ఉన్న ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారంలో నుంచి చేపల లాంటి శరీరాలతో జీవులు రావడం కనిపించింది. ఈ ద్వారం కేసి చూస్తూ ఉండేసరికి అల్లంత దూరాన శ్రీశైల క్షేత్రం లీలామాత్రంగా కనిపించేసరికి….. ఇదేంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్న గుడి కనిపిస్తోంది అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండేసరికి…. ఓహో! శ్రీశైలం క్షేత్రంలోని పాతాళ గంగలో నిలువు శరీరాలు ఉంటాయి కాబోలు…. ఈ నిలువు శరీరాలు చేపలను పోలి ఉంటాయి…. కానీ చేపలకు ఉండాల్సిన లక్షణాలు వీటికి లేవు… అని చెప్పి ఒక చేప వంటి శరీరం తన దగ్గరికి వస్తూ ఉండేసరికి… దానికి కేవలం చర్మం నున్నగా ఉంది. కదలడం లేదు… మెదలడం లేదు. మొప్పలు లేవు… రెక్కలు లేవు…కళ్ళు లేవు… కేవలం రెండు రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. నోరు ,ముక్కు కూడా లేదు… ఇది కేవలం ఇవి వాయు భక్షణతోనే ఇవి బతుకుతున్నాయి. ఇవి ఎందుకు బతుకుతున్నాయో….. వీటికి తెలియటం లేదు. వీటికి ఆ జ్ఞానం కూడా లేదు. ఆహారం సంపాదించుకోవాలి…ఆకలి తీర్చుకోవాలి అనే తపన తాపత్రయాలు కూడా ఏమీ లేవు. కేవలం ఇవి పాతాళం నుంచి పైకి వస్తున్నాయి…. నీటి ప్రవాహంతో కొట్టుకుంటూ వస్తున్నాయని గ్రహించింది…. కేవలం శ్వాసతో వాయుభక్షణంతో బతుకుతున్నాయి…. అలా కొన్ని శరీరాలు ఈ సుదర్శన చక్రంతో పాటుగా తిరుగుతూ ఉండేసరికి….. సరే అని ఎడమవైపు ఏదో శబ్దం అవుతుందని….ఎడమవైపు తిరిగితే లీలామాత్రంగా సుదర్శన చక్రం ఉన్న తలుపు తెరుచుకునే సరికి అందులో నుంచి తాబేలు ఆకారం లాంటి జీవులు బయటికి రావటం మొదలైంది… కానీ తాబేలు డొప్ప ,నాలుగు కాళ్లు ఉండటం… మనం చూస్తాం కానీ దీనికి డోప్ప లేదు కానీ…. వెడల్పాటి శరీరం ఒక తల మాత్రమే ఉన్నది. కానీ తాబేలు లక్షణాలు ఏమీ లేవు. నిలువ శరీరాలకి ముఖం లేదు… రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. అదే అడ్డు శరీరానికి వచ్చేసరికి తాబేలు ఆకారంలో ఉన్నప్పటికీ…. తల మాత్రమే ఉంది. ఇంకేమీ లేవు అని… ఇవి రెండో తరం జీవులు అనుకుంట…. అని అనుకుంటూ… ఉండేసరికి ఈ ద్వారం వెనక ఏముంది? అనేసరికి ఆనంద నిలయమైన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కనిపించేసరికి ….
ఓహో! రెండో తరం జీవులకి మోక్షం ఇక్కడ కలుగుతుంది అన్నమాట….అంటే నిలువు శరీరాలు మరియు అడ్డు శరీరాలు రెండు కలుస్తాయి. శ్రీశైలం పాము తోక అయితే…. తిరుపతి పాము తల అన్నమాట! ఒక విధంగా రాహుకేతువులు అన్నమాట! ఈ రెండు కలిస్తే సుబ్రహ్మణ్యస్వామి అన్నమాట… అంటే సంపూర్ణ పాము తత్వం ఏర్పడుతుంది అని జ్ఞాన స్ఫురణ అందడంతో….. సుదర్శన చక్రంతో ఒకటి వ్యతిరేక దిశలో తిరుగుతూ….. సుదర్శన చక్రం మధ్యభాగంలోకి వెళ్లిపోయి…. అంతరించిపోయేసరికి ఆశ్చర్యం వేసింది. సరే అని చెప్పి ఒక చేప లాంటిది తన దగ్గరికి రావడం…. తాబేలు లాంటి ఆకారం తన దగ్గరికి రావడంతో…. అప్పుడు తీక్షణంగా వీటికేసి చూసేసరికి….. ఇది తాబేలు ముఖంలో తన ముఖం గుర్తులు ఉండేసరికి…..ఇదేంటి అని అనుకుంటే నా అడ్డ శరీరం ఈ తాబేలు అన్నమాట ! ఈ నిలువ శరీరం నాదనుకుంట…. ఇప్పుడు ఇవి రెండు మోక్షం పొందుతున్నాయి అన్నమాట! అని అనుకుంటూ ఉండేసరికి…. తన చేతులతో ఈ రెండింటిని పట్టుకునేసరికి…. కుండలినీ శక్తి అజ్ఞాన గ్రంధిలో జీవులు పైకి వస్తున్నట్లుగా …..తన మూలాధార చక్రం లోకి నిలువు శరీరం, స్వాధిష్ఠాన చక్రంలోనికి అడ్డ శరీరమైన తాబేలు ప్రవేశించే ధ్యాన అనుభవం అవుతూ ఉండేసరికి…. ఈ రెండు కూడా ధ్యానంలో వ్యతిరేక దిశలో సుదర్శన చక్రం లోపలికి వెళ్లిపోయి…. చనిపోయి…. నిశ్చల స్థితి పొంది మరణం పొందేసరికి…. తనలో ఉన్న ఈ రెండు శరీరాలు కూడా ఆజ్ఞ చక్రం నుంచి శ్వాసల ద్వారా బయటకు వచ్చేసినట్లుగా…. మోక్షం పొందినట్లుగాను… అనుభవ అనుభూతి కలిగేసరికి ఈ రెండు శరీరాలు ఈ విధంగా అజ్ఞాన గ్రంధి నుంచి బయటకు వచ్చి…. ఈ చక్రాలలో మోక్షమును పొందుతాయన్నమాట ! అని అనుకుంటూ ఉండేసరికి….అయినా మూలధార చక్రంలో స్థూల శరీరం స్వాధిష్ఠాన చక్రంలో సూక్ష్మ శరీరం కదా మోక్షం పొందాలి….ఈ రెండు శరీరాలు ఎలా మోక్షం పొందినాయి అన్నప్పుడు…. స్థూల శరీరానికి మూలం నిలువ శరీరం, సూక్ష్మ శరీరానికి మూలం అడ్డు శరీరం… అని చెప్పి చెప్పకనే చెప్పారు… మూలాలు పోయినాయి… అంటే 11 దేహాలకి మూలాలు ఈ రెండు శరీరాలు. ఈ రెండు శరీరాలకు మోక్షమును పొందితే గాని…. మనకున్న భోగ జీవితం యొక్క కర్మబంధనాలు, ఋణానుబంధాలు, కర్మలు తీరవని చెప్పకనే చెప్పింది. ఈ శరీరాలు అన్నింటికీ మూలాలు నిలువు శరీరం, అడ్డు శరీరం . ఈ రెండు కూడా ఈ చక్రాలలో ఉండి ఈ రెండు చక్రాలు కూడా మోక్షముని పొందితే…..అప్పుడు అసలు సిసలైన బుద్ధి జీవులు అయిన భూలోకవాసులు ఉండే మూడవ డైమెన్షన్ యొక్క మానవ శరీరమైన స్థూల శరీరానికి మోక్షమును పొందే అర్హత, యోగ్యత , యోగం ఉండదని చెప్పి అర్థం అయింది . కాకపోతే ఈ రెండు శరీరాలను చూస్తున్నప్పుడు…. నిలువు శరీరం పిండదేహానికి, అడ్డు శరీరం లింగ దేహానికి సరిపోతుంది ఏమో అని ఒక జ్ఞాన స్ఫురణ అందింది. అందుకనే ఆదిలోను ఈ రెండు శరీరాలు ఉన్నాయి…. అంతంలోనూ ఈ రెండు శరీరాలు ఉన్నాయి… అందుకనే పరమహంస గారు ఈ రెండు శరీరాల గురించి అంతగా పట్టించుకోలేదన్నమాట!
ఇవి బుద్ధి జ్ఞానం లేని జీవులు కాబట్టి…. శరీరాలు సహజ సిద్ధంగానే ఎవరైతే జ్ఞానమును పొందుతారో బ్రహ్మ జ్ఞానానికి శివ మోక్ష జ్ఞానమును పొందటానికి ప్రయత్నం చేస్తారో….. వాళ్ళకి అజ్ఞాన గ్రంధి విభేదనం అవుతుంది. తద్వారా ఈ శరీరాలు చెప్పకుండానే మోక్షం పొందినట్లు అవుతుంది. అది తెలుసుకోలేక పోయినా పర్వాలేదు కానీ….. మూలాధార చక్రం నుంచి బ్రహ్మ రంధ్ర చక్రం దాకా వచ్చే 11 దేహాలు మోక్షం ఖచ్చితంగా పొందడం జరగాలని ….వాటి మీద ఈయన ఏకాగ్రత పెట్టి ఉంటారు.అవి ఏకాదశ రుద్రులకు సంకేతంగా ఏకాదశ దేహాలు మోక్షం పొందుతాయని…. ఆ మోక్ష విధివిధానం తను పొందిన….చూసిన ధ్యాన అనుభవాల ద్వారా లోకానికి చెప్పడం జరిగి ఉండాలి….. అని చెప్పేసి అనుకొని ప్రత్యక్షంగా నిలువు శరీరం, అడ్డు శరీరం మోక్ష విధివిధానాలు తెలిపినందుకు…. చూపించినందుకు……. అనుగ్రహించినందుకు వెంకటేశ్వర స్వామికి…. అలాగే సుదర్శన చక్రం చూపించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేసింది. కానీ సుదర్శన చక్రాన్ని తాకటానికి ఒక రకమైన భయం వేయడంతో…..తను సుదర్శన చక్రానికి నమస్కారం చేసేసరికి…. అది తిరిగి యధా స్థానంలోనికి భూమిలోకి వెళ్ళిపోతూ…. గుప్తమై లుప్తం అయ్యేసరికి…. సరే అని చెప్పేసి దానికి నమస్కారం చేసుకుంటూ…. కృతజ్ఞతలు చెప్పుకుంటూ….పైకి వచ్చేసింది. పైన ధ్యానంలో కూర్చున్న రుద్రస్వామి ఇదంతా ధ్యానంలో చూసి….. పైకి వస్తున్న శివ నందినికి చెయ్యి అందించి….. నువ్వు ఏం చెప్పక్కర్లేదు…. నేను అంత ధ్యానంలో చూశాను…. ఎలా నీ నిలువు,అడ్డు శరీరం ఏ విధంగా మోక్షం పొందినాయో గ్రహించాను. తల్లి మనం ఇక ఇక్కడినుంచి ఆకాశగంగ వైపుకు వెళదాము….. అనేసరికి అక్కడికి కాదు స్వామి! మనం వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఆయన అనుగ్రహం కూడా పొందాలి….. అనేసరికి వేణుగోపాల స్వామి అంటే కృష్ణస్వామియే కదా! ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం అడ్డం వేస్తాడో …..ఏం మాయ చూపిస్తాడో కదా! అనేసరికి…. సరే చూద్దాం… విషయం ఏమిటో తెలుస్తుంది కదా! అనేసరికి సరే నీ ఇష్టం తల్లి….నేనేమనను…. వేణుగోపాలస్వామి గుడికి వెళ్దాము… అనేసరికి వీరిద్దరూ వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళటం జరిగింది.
ఇలా శివ నందిని మరియు రుద్ర స్వామి కాస్త వేణుగోపాలస్వామి గుడికి వెళ్లడం జరిగింది. అక్కడ పక్కనే హాథిరాం బాబా జీవ సమాధిని కూడా చూడటం జరిగింది. అప్పుడు రుద్రస్వామి కేసి చూస్తూ… శివ నందిని అయ్యా! ఈయన ఎవరు ఈయన గురించి నాకు తెలియదు… అంటే ఈయన హథీరాం బాబా. వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈయనతో వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవకి ముందు వచ్చి పాచికలు ఆడేవాడు అని చెబుతారు. ఈయన మఠం మనకి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆనంద నిలయంలో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి తీసివేశారు అంటే…. నిజంగానే వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలు అడగడం జరిగిందా? అంటే పురాణాల ప్రకారం అయితే ఆడారని చెప్పటం జరిగింది . వాళ్ళిద్దరూ ఆట ఆడిన పాచికలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆటలో తన కంకణాన్ని పెట్టడం జరిగింది . ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది… ఆ కంకణం విగ్రహ మూర్తికి కనిపించకపోయేసరికి… ఆలయ అధికారి కాస్త రాజుకు ఫిర్యాదు చేయడం, విచారణ చేస్తే , హథీరాం బాబాజీ దగ్గర ఈ కంకణం దొరకటం…. ఆ తర్వాత ఇతనే దొంగతనం చేశాడని అతన్ని జైల్లో పెట్టించడం…. నిజంగా వెంకన్న ఇచ్చాడని నిరూపణ చేస్తే…. నిన్ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పటం…. అందుకోసం బండెడు చెరుకు గెడలు ఒకేరోజు రాత్రి తినమని పరీక్ష పెట్టడం….. అలాగే వెంకటేశ్వర స్వామి ఒక ఏనుగు రూపంలో వచ్చి రాత్రికి రాత్రే తినేయటం…. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విముక్తి పొందడం…. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కంకణం ఇచ్చాడని.. అప్పుడు లోకానికి తెలిసింది . ఈయనతో పాచికలు ఆడాడని అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటారని….ఈయన గెలుస్తూ ఉంటారని…. స్థల పురాణం చెప్పడం జరిగింది. అంటే నిజంగా దైవంతో ఆటలు ఆడటం దైవంతో సాంగత్యం పొందడం అందరికీ సాధ్యపడదు. ఆ మధుర భక్తి కూడా ఒకప్పుడు గొప్పదిగా కనిపించేది…కానీ ఆ మధుర భక్తి కూడా మహామాయే అని పరమహంస చెప్పడం జరిగింది. అది కూడా మాయ, దైవ మాయా కూడా మనం దాటాలి… జీవమాయలో అమ్మాయిని దాటుతున్నాము… దైవమాయలో అమ్మవారిని దాటలేకపోతున్నాము… అమ్మాయి, అమ్మవారు ఇద్దరూ మాయలే అని పరమాహంస చెప్పడం జరిగింది. కాబట్టి జీవమాయ, దైవమాయ రెండు దాటాలి. ఎందుకంటే మనం దేవుళ్ళమే… నిజానికి. కాకపోతే దేవుళ్ళు అంటే సాధనలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లంతా ఏం చేస్తున్నారంటే… మనల్ని జీవులుగా లెక్క కట్టి బానిసలుగా మారుస్తున్నారు. మనకి వాళ్లేదో వరాలు ఇస్తున్నాము అన్నట్టు చేస్తున్నారు. మనం కూడా వరాలు తీసుకునే స్థితి కాదు…. వారు ఇచ్చే జీవులం అని ….ఆ జ్ఞానం అందనివ్వకుండా దేవతలు ,దైవాలు, మాయలో పెట్టేస్తున్నారు .
నిజానికి మనం దైవాలకు మించిన శక్తి ఉన్నవాళ్లం. ఆ జ్ఞానం అందనివ్వకుండా చేస్తున్నారు… అని పరమహంస తన అనుభవాలలో చెప్పటం జరిగింది. అది సత్యం అని తెలుస్తుంది. ఎవరికి వారే గురువుల దగ్గర దేవుళ్ల దగ్గర ఆగిపోవడం చాలామంది సాధకులను చూడటం జరిగింది. గురుమాయ దాటలేక, దైవమాయ దాటలేక ఆగిపోయారు. దైవమాయలు, గురు మాయలలో వాళ్ళని ఆపివేయడం జరిగితే…. గురుదక్షిణ కింద గురువులు వాళ్ళని ఆపివేయడం కూడా జరిగింది . సాధన పరిసమాప్తి చేసుకోకుండా ఆగిపోయారు. దైవమాయ దాటుతున్నప్పుడు వారిలో వాక్బంధనం చేసి…..ఆ మాయా దాటనివ్వకుండా దైవాలు చేస్తూ ఉంటారు. వీటిని అనగా జీవ, దైవ, గురుమాయలు ఈ మూడు మాయలు దాటుకొని….పరమహంస తన తెలివితేటలతో, వివేక బుద్ధితో, విచక్షణా జ్ఞానంతో వీటన్నింటినీ దాటుకొని…. చివరికి సాధన పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. అలాగే నువ్వు కూడా నీ సాధన పరిసమాప్తి చేసుకోవాలి. అలాగే నువ్వు కూడా ఏ దైవ విగ్రహం దగ్గర ఆగద్దు…. అందులో దైవాన్ని జ్ఞాన మాయలో పెట్టి ఆపడంలో శ్రీకృష్ణుని మించిన వాడు లేడు. అందుకనే అరవింద యోగి అనీ ….. నీకు తెలుసు అనుకుంట…. ఆయన చెబుతాడు… సహస్ర చక్రంలో గుప్త జ్ఞానభూమికల్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు…నిర్వాణ శక్తితో ఆయన బంధనం చేస్తున్నాడు… ఆ జ్ఞాన శక్తిని మనం దాటాలి అంటే అంతకు మించిన నిర్వాణ శక్తి కావాలి…. ఆ నిర్వాణ శక్తిని దాటాలి… అప్పుడే మనం కృష్ణమాయని దాటగలం అని చెప్పడం జరిగింది. నిజానికి ఆయన సహస్ర చక్రం నుంచి హృదయ చక్రానికి వెళ్లాలి. హృదయ చక్రం మధ్యలో మనకి వచ్చే నిర్వాణ శక్తిని దాటించగలిగేది పంచముఖ హనుమంతుడు. మనం ఆయనకు దగ్గరికి వెళ్ళాలి. ఆయన అనుగ్రహం పొందాలి. ఆ అనుగ్రహం పొందనివ్వకుండా శ్రీకృష్ణుడు ఆపుతాడు అని…. తన మంత్ర గ్రంధమైన సావిత్రిలో చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు… సహస్ర చక్రంలో విష్ణు మాయ ఉంచి శ్రీకృష్ణ మాయ దాకా ఉంటుందని. దానికి దాటడం ఎలాగో తెలియదు. అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. అది కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా దాటాల్సి ఉంటుంది. అంతెందుకు… ఈ ప్రపంచం అంతా నిజం కాదు…మనం చూసేదంతా నిజం కాదు… అని యోగ వాశిష్టంలో ఒక కథ చెప్పడం జరిగింది. కానీ ఎవరు నమ్ముతున్నారు.,? ఎవరికి వారు సాధన చేసి అది నిజమా కాదా అని అనుభవ అనుభూతులు పొందుతున్నారు… ఒకళ్ళు చెప్పింది సత్యమని , అని సర్వస్య శరణాగతి భావంతో ఉన్నట్టుంటే ఈపాటికి విశ్వమోక్షం వచ్చేది. అసలు విశ్వం తన సహజ స్థితిలోనే…. మోక్షం పొంది స్థిరంగా ఉంది.పూర్ణంగా ఉంది . కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయరు…. కదులుతుంది.. పునః సృష్టి జరుగుతుంది… లోకాలు ఉన్నాయి…. జీవాలు ఉన్నాయి… ఇవి ఉన్నాయి… అవి ఉన్నాయి…అని భ్రమ , బ్రాంతి పడుతున్నారు.
పరమహంస లాంటి వారు సాధన చేసి…. అనుభవాలు పొందినా గాని వినరు. ఆయన అనుభవాలు పొంది ఉండవచ్చు…. అది నిజమా కాదా? అని సాధన చేసి అనుభవాలు పొందడం జరుగుతుంది. నువ్వు స్త్రీ ప్రకృతి పరంగా సాధన అనుభవాలు చెప్పావు….. ఏముంది? ఏం జరిగింది? అనేది తెలుసుకుంటావు…. తద్వారా స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి కాస్త స్థిరమో …..అస్థిరమో మోక్షం పొందినాయో లేదో అనే విషయం నిర్ధారణ అయిపోతుంది….తద్వారా రెండు కూడా మోక్షం పొందినాయి అంటే ఏకత్వంలోకి వెళ్లిపోయింది. తిరిగి శూన్యంలోకి వెళ్ళిపోయింది. విశ్వ మోక్షం పొందింది…. అని చెప్పడానికి మనకి ఆధారాలు నిర్ధారణకి అవకాశాలు ఉంటాయి…అందుకోసం అని నీ సాధన చెప్పటం జరిగింది. కానీ ఈ జ్ఞానం లోకానికి అందనివ్వకుండా నీకు ఏమైనా చేయొచ్చు. మాయలు పెట్టొచ్చు….ఎందుకంటే బుద్ధుడు లాంటి మహానుభావుడే అనుభవ పాండిత్యంలో సాధన చేసి కష్టాలకి కారణాలు కోరిక అని తెలుసుకున్నాడు. చింతామణి మణి మాయలో పడిపోయి….. కోరికలేని సమాజాన్ని చూడాలని కోరికతో మళ్ళీ సాధన చేయడం ప్రారంభించాడు. ఒకపక్క కోరికలే కష్టాలకు మూలాలు అని తెలుసుకొని….. కోరిక పెట్టుకుని….. సాధన చేయడం ఏమిటి….. కోరికల్లో పడటం ఏమిటి …….అంటే ఆయన చెప్పిన సిద్ధాంతం మీద ఆయనే నిలబడలేకపోయాడు కదా! అదే మాయ. మహామాయ. ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు ఇదంతా సత్యం కాదు…. నిజం కాదు… భ్రమ, భ్రాంతి అని నెత్తి నోరు కొట్టుకున్నా…..కూడా మనం తెలుసుకునే సమయానికి తెలుసుకొనివ్వకుండా చేస్తుంది . అసత్యమని చెప్పేసి ప్రచారం చేసేటట్టుగా కూడా మహామాయ పడవేస్తుంది. కాబట్టి మనం సాధనలో ఏమరపాటుగా ఉండాలి… జాగ్రత్తగా ఉండాలి… తేడాలు వస్తాయి…. తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది …..అని అంటూ ఉండేసరికి, సరే అని వాళ్ళు కిందకి వస్తూ ఉండగా 9, 10 సంవత్సరాల పిల్లవాడు నల్లని శరీరంతో కళగల్ల ముఖముతో…. జీవ కళతో దైవకళతో ఉన్న ఒక పిల్లవాడు గబగబా శివ నందిని దగ్గరికి వచ్చి అక్క! అక్క! ఈ వేణువు తీసుకుంటావా? అనేసరికి ఇదేమిటిరా…. అమ్మకానికా! అనేసరికి కాదక్కా! నేను నా ప్రియురాలి కోసం తయారు చేసుకున్నాను….ఆ అమ్మాయి చనిపోయింది ….దాని పేరు రాధాదేవి…. దానికోసమే నేను వేణువుని తయారు చేసుకుని వాయించడం జరిగింది. అది నా వేణు నాదానికి పడి చచ్చిపోయేది…. అది వేణువులు అమ్ముతూ ఉండేది. ఇక్కడ అనుకోకుండా ఒక రోజు దానికి మూర్చ వచ్చి ఈ గుడి ముందే చనిపోయింది. అందరూ వేణుగోపాలస్వామిలో వేణువులు అమ్ముతూ ఆయనలో ఐక్యమయ్యింది అన్నారు. ఆ తర్వాత ఇక దానికోసం వేణువులు తయారు చేసుకుని వాయించడం….. వేణువుతో సంగీతం అభ్యాసం చేశాను…. అది నా వేణునాదానికి పిచ్చిలో పడిపోయింది… రోజులో కనీసం రెండు నుంచి మూడు గంటలు నా వేణునాదం వినంది ఉండేది కాదు… నేను ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి రెండు మూడు గంటలు వేణు నాదం వినేది. తన దగ్గర ఉన్న వేణువులు నాకు నచ్చేవి కావు…అందుకని నేను స్వయంగా వెదురు బొంగులతో వేణువును తయారు చేసుకున్నాను.
అనుకోకుండా అది చనిపోవడంతో వేణునాదాన్ని మనస్పూర్తిగా వాయించలేకపోతున్నాను ……విరిచేయాలనిపిస్తుంది….కానీ, కష్టపడి తయారు చేసుకుంది. ఇది నా దగ్గర ఉంటే ఆ పిల్ల గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి…. మనసు ఏడుపులోకి వెళుతుంది. ఆవేదన భారంగా ఉంది. ఆమె గుర్తుగా ఇది ఎవరికైనా ఇవ్వాలనిపించింది… నా రాధాదేవి లక్షణాలు, ముఖ కవళికలు అన్నీ కూడా మీలో కనపడుతున్నాయి… అందుకు ఈ వేణువును మీకు ఇవ్వాలనుకుంటున్నాను… అనేసరికి ఒరేయ్! నాకు వేణువు వాయించడం రాదు…. అంటే నేను నేర్పిస్తాను అక్క…. అభ్యాసం చేస్తే అది వచ్చేస్తుంది…. అదేమంత కష్టం కాదు….అని చెప్పి ఆ వేణునాదం చేస్తూ పాట పాడుతూ…. ఉండేసరికి అక్కడున్న భక్తులతో పాటు శివ నందిని కూడా రుద్ర స్వామి కూడా మమేకం చెందారు. తన్మయత్వ స్థితి నుంచి బయటకు రావడానికి వాళ్ళకి గంట సేపు పైనే పట్టింది. అలా ఉండగానే ఆ పిల్లవాడు వేణునాధం ఎప్పుడు ఆపాడో…. కూడా తెలియని స్థితిలో ఉండిపోయారు. శివ నందిని ఒడిలో వేణువు పెట్టేసి పిల్లవాడు వెళ్ళిపోయాడు . కళ్ళు తెరిచి చూసేసరికి వేణు నాదం వింటూ చాలా సేపు ఉండిపోయానని గ్రహించి …. ఒడిలో వేణువు ఉండి…. చుట్టూ చూసినా పిల్లవాడు కనిపించకపోయేసరికి…. అక్కడ ఉన్న వాళ్ళను అడిగితే ….పిల్లాడ! ఎవరూ లేరే! ఎవరూ రాలేదే ? ఇక్కడ ఎవరూ వేణువులు అమ్మరు…. అని ఆలయ పూజారి అనేసరికి ఆశ్చర్య ఆనందాలకు లోనై రుద్ర స్వామి కాస్త దీర్ఘాలోచనలో నిట్టూర్చి…… నేను దైవమాయ గురించి చెబుతూ ఉండగానే….. కృష్ణుడు ఆ పిల్లవాడి రూపంలో వచ్చాడు. మనం గ్రహించలేదు. కావాలంటే గమనించి చూడు…. పిల్లాడి ప్రియురాలు పేరు రాధాదేవి అని చెప్పి అన్నారు కదా! శ్రీకృష్ణుని ప్రియురాలి పేరు కూడా రాధాదేవి కదా! అయినా తొమ్మిది పది సంవత్సరాల పిల్లాడికి ప్రియురాలు ఎక్కడినుంచి వస్తుంది…..పిల్లాడి రూపంలో శ్రీకృష్ణుడు రావడం జరిగింది. పైగా నల్లనయ్య అంటారు కదా …..స్వయంగా ఆయన వేణువును నీకే ఇచ్చినట్టు ఉన్నాడు …..అనేసరికి ఆ వేణువు దివ్య తేజస్సు కాంతితో ఉండేసరికి తుళ్ళిపడింది శివ నందిని. అయ్యా! ఇప్పుడు ఈ వేణువు ఇక్కడ వదిలేద్దామా! తీసుకు వెళదామా…. అనేసరికి నువ్వు తెలిసో తెలియకో అందుకోవడం జరిగింది….. ఇక అది నేను వదిలిపెట్టేది ఉండదు… పట్టుకొనే ఉంటుంది…. కావాలంటే నువ్వు దానిని మూలన పడేసేయి…. గాలిలో నీ దగ్గరికి రాకపోతే అప్పుడు అడుగు…. అంటే నిజమా కాదా? అని నేలమీద పడవేస్తే…. అది గాల్లో లెగుస్తూ ఒక మనిషి పట్టుకుని వస్తున్నట్టు వచ్చేసరికి….. ఆశ్చర్యం వేసింది. ఆ వేణువులో శ్రీకృష్ణుడు తన ఆత్మ శక్తిని పెట్టడం జరిగింది. ఈ విధంగా కూడా ఆయన నీ సాధన పరిసమాప్తి కాకుండా ఆపాలనుకుంటున్నాడో…. లేదా వేణు నాదంతో ఈ ప్రపంచాన్ని ఎలా మోహబంధం చేశాడో….. అలా నిన్ను కూడా తన వేణువుతో బంధనం చేయాలనుకుంటున్నాడో తెలియదు.. అని అనుకుంటూ ఉండేసరికి…… దీని ఎలా వదిలించుకోవాలయ్యా…. అనేసరికి తెలిసో తెలియకో నువ్వు పిల్లవాడి మాటలకు మాయలో పడ్డావు. అతడు తన వేణువును నీకు ఇచ్చి వదిలించుకుని వెళ్ళిపోయాడు. ఇక దైవ నిర్ణయం… కాల నిర్ణయం…. ఏమో అంటే ఇదేం కాదు…. అని అక్కడ ఒక ఆడపిల్ల కూర్చొని ఉంటే…..ఆడపిల్లకి వేణువు ఇచ్చేసరికి…. డబ్బులు లేవు… నా దగ్గర మా అమ్మానాన్న గుడికి వెళ్లారు…. అంటే అక్కర్లేదమ్మా ఇది ఉచితంగా తీసుకో… నేనేం అనుకోను…. అని నాకు ఉదటం రాదు అక్క అంటే నువ్వు ఊదు లేదంటే ఆడుకో దీంతో అనేసరికి అలా వెళ్లి కొంత దూరం వెళ్లిన ఓ అమ్మాయి ఏంటి? మా పిల్లకి ఏదో వేణువు ఇచ్చావు అంట…. దానికి ఊదటం రాదు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వు అని తల్లి వెనకనుంచి పిలిచేసరికి… ఇక ఈ వేణువును వదిలిపెట్టదులే అనుకొని తన చేతి సంచిలో పెట్టుకొని అక్కడి నుంచి ఆకాశగంగకు బయలుదేరడం జరిగింది
ఇలా వీళ్ళిద్దరూ వేణుగోపాలస్వామి గుడి దగ్గర నుంచి ఉన్న ఐదవ స్థలమైన ఆకాశగంగకు బయలుదేరారు… కొండలపై నుంచి నీళ్లు జాలువారుతు కొండ కింద కొలనులాగా నీళ్లు చేరడం వాళ్ళిద్దరూ గమనించారు. ఇదే ఆకాశగంగ ….దీనినే ధ్యానంలో తను చూసినట్టుగా…. ఈ ఆకాశగంగా లోపలే ఏదో స్పటిక శివలింగం ఉన్నట్లుగా…. ధ్యానానుభవం అయినట్లుగా గమనించి…. ఇదే విషయం రుద్రస్వామికి చెప్పేసరికి…. అవునా తల్లి! సరే అయితే…మంచిదే కదా ముందు మనం ఆకాశగంగ స్నానం చేద్దాము అని అనుకునేసరికి….వీళ్ళిద్దరూ ఆకాశగంగాలోకి దిగి స్నానం చేస్తూ ఉండేసరికి…. శివ నందినికి లోపలికి నీటిలోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించేసరికి…. నీటిలోకి వెళ్ళిపోతూ ఊపిరి అందనట్లుగా అనిపించేసరికి….ఒక్కసారిగా నీళ్ళంతా సుడులు తిరుగుతూ….. తనని లోపలికి తీసుకుంటున్నట్లుగా అనిపించేసరికి….. అయ్యా! అయ్యా! నన్ను రక్షించు…. నీటి సుడిగుండంలో పడిపోయాను. నీటి ఊబిలో పడిపోయాను….నన్ను రక్షించు…. రక్షించు…. అనేసరికి కంగారు పడకు… తల్లి ! ఏమీ అవదు… వస్తే ప్రాణాలతో వస్తావు లేదంటే ప్రాణాలు పోతాయి …నేను రక్షించడానికి నాకు అవకాశం లేదు…. నువ్వు నీటి సుడిగుండంలో పడిపోయావు….ఏం జరుగుతుందో ఆ దైవానికే వదిలేస్తాం…. శివాజ్ఞ అనేసి అంటూ ఉండేసరికి….. అర్ధాంతరంగా నన్ను చంపేస్తున్నావు… నన్ను రక్షించకుండా వదిలేస్తున్నావు….అయ్యా! నీ కూతురు ఇలా ప్రమాదంలో ఉంటే మెట్ట వేదాంతం చెప్తావు…. ఏమిటి? నా ప్రాణాలు రక్షించు…. అంటే సుడులు వేగం ఎక్కువైపోయి….నీటి వేగంలో కొట్టుకుపోయి… నీటి అడుగు భాగంలోకి వెళ్లిపోయింది. బహుశా ఆకాశ శివలింగం అందుకోవడం వెంకటేశ్వర స్వామికి ఇష్టం లేదనుకుంటా! అందుకే తనకి మరణం ఇక్కడే రాసిపెట్టి ఉన్నాడు…. అని రుద్ర స్వామి నీటి నుంచి బయటికి వచ్చి ఒడ్డున కూర్చుని….. ధ్యానంలో ఉండిపోయాడు. ఏం జరుగుతుందో చూద్దాం అని ధ్యానంలో ఉండిపోయాడు. నీటి అడుక్కి చేరుకున్న శివనందినికి ఊపిరి అంది అందని పరిస్థితిలో ఉండేసరికి….. ఇక జలము మీద ఆధిపత్యం ఉండటంతో….. ఏ ప్రమాదం ఉండదని గ్రహించి…. నీటి అడుగుకు చేరుకునేసరికి…. నీటి అడుగున మట్టిలో నుంచి బుడగలు రావటం గమనించింది. ఏమిటి? ఈ బుడగలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని…. బుడగలు వచ్చే చోటికి వెళ్లేసరికి….అక్కడ పగడాల దిబ్బలో నుంచి బుడగలు వస్తున్నాయని…. ఆ నీటిని నెడుతూ ఉండేసరికి…. దివ్య కాంతితో ఒక అడుగు ఉన్న స్పటిక రుద్ర శివలింగం కనిపించింది. ఆ స్పటిక శివలింగం చూసేసరికి స్వామి ! మీరా మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఇక్కడికి రప్పించారా…. అని అంటూ ఉండేసరికి… ఆ స్పటిక శివలింగం కాస్త నీటిలో తేలుతూ చేతిలోకి వచ్చింది. ఓహో! ఇదేనా అంతరిక్షంలో ఉండే రుద్ర శివలింగం అనుకుంటాను…. పరమహంస గారికి పాతాళంలో నల్లశివలింగం….అంతరిక్షంలో రుద్రస్పటిక లింగం… రెండు కనబడ్డాయని ఈ రెండింటి మధ్యలో ఒక స్పటిక బిందువులో జగన్నాటకం శివుడు చూస్తున్నట్టుగా చెప్పడం జరిగింది కదా! బహుశా అంతరిక్ష స్పటిక శివలింగం ఇదే అయ్యి ఉండాలి…. పాతాళ శివలింగం శ్రీశైలంలో ఉన్నది అయ్యి ఉండాలి…. అని అనుకొని ఆ శివలింగం తీసుకోగానే శరవేగంతో తన ప్రమేయం లేకుండా….నీటిలో తేలుతూ వచ్చేసింది. వచ్చేసరికి తన చేతికి వచ్చిన స్పటిక రుద్ర శివలింగాన్ని ధ్యానంలో ఉన్న రుద్ర స్వామిని పిలుస్తూ…. అయ్యా! ఇదిగో ఈ స్పటిక శివలింగం కోసమే నేను కిందకి వెళ్ళటం జరిగింది… ఊబి నన్ను లాగింది. సరే తల్లి! ఏదో నువ్వు ధ్యానానుభవం అయింది అన్నావు కదా ! అది ప్రత్యక్ష నిదర్శనం ఇదే…. అనేసరికి ఆయన అది తీసుకుని తన చేతి సంచిలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత శివ నందిని కాస్త పైకి వచ్చేసి….తడి బట్టలతోనే ధ్యానంలో ఉండిపోయింది. ఉండిపోయి…. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి అయ్యా! నాకు ప్రాణాలు పోయినంత భయం వేసింది. కానీ ఇంక ప్రాణాలు పోతాయి అని భయపడలేదు….బాధపడలేదు…. ఇక ఎవరూ గుర్తుకు రాలేదు…పోతే పోనీ వెదవ ప్రాణాలు ….తెగించిన వాడికి తెడ్డే గతి అని చెప్పేసి…. ఇక కారణం లేకుండా ఏదీ జరగదని మనో నిబ్బరంగా నిలబడిపోయాను… మనం చావు భయానికి మృత్యు భయానికి కూడా భయపడకూడదు…. ప్రాణభయానికి కూడా భయపడకూడదు అని….నాకు అర్థం అయింది. పరిస్థితులు చావు దాకా తీసుకువెళతాయి.. చంపవు… చంపేటట్టు చేస్తాయని గ్రహించాను… ఇక ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్లాలి…. రుద్రయ్య అనేసరికి మనం ఇక ఆరవ ప్రాంతమైన పాప వినాశనానికి వెళ్లాలి. అక్కడ గంగాదేవి ప్రవహిస్తుందని…. జన్మాంతర పాపాలన్నీ పోతాయని అంటారు అని….ఆ దగ్గరలో ఉన్న పాప వినాశనానికి వెళ్ళటం జరిగింది. పాప వినాశనం మెట్ల దగ్గర గంగానది దర్శనం చేసుకుని.,.. అక్కడ మెట్ల కిందకి దిగేసి… పాపవినాశనం తీర్థంలో… స్నానాలు చేసి….ధ్యానంలో కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆఖరిదైన జాబాలి తీర్థానికి బయలుదేరారు. ఈ జాబాలి తీర్థం గురించి రుద్ర స్వామి శివ నందినికి చెప్పడం ఆరంభించాడు…జాబాలి అనే మహర్షి దేవుడు సత్యం కాదు, జీవుడే సత్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రకృతి సత్యం అని చెప్పడం జరిగింది .అప్పటిదాకా దేవుడు సత్యం… జీవుడు అసత్యం అని చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా…. జీవుడు సత్యం… దేవుడు సత్యం కాదు… దేవుడు లేడు జీవుడు ఉన్నాడు… అని చెప్పడం జరిగింది . శ్రీరాముడు , శ్రీకృష్ణుడు కూడా జీవుని నుంచే దేవుడు అయ్యాడు… ఆ తర్వాత నిర్యాణం చెందారు. కాబట్టి దేవుడు ఉండడు… జీవుడే ఉంటాడు… జీవుడే సత్యం అని అనుభవ దర్శనాలను లోకానికి ప్రచారం చేయడం జరిగింది… అనేసరికి వాళ్ళు జాబాలీ తీర్థానికి చేరుకోవడం జరిగింది. జాబాలీ మహర్షి గురించి చెప్పండి… అనేసరికి ఆయన జాబాలీ మహర్షి చరిత్ర చెప్పడం జరిగింది….
జాబాలి మహర్షి
ఇతనినే సత్యకామ జాబాలి అని కూడా అంటారు. ఇతని గురించి మనకి పురాణ ఇతిహాస కథలలోనూ మరియు ఉపనిషత్తులలోనూ ఇతర గ్రంథాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతని గురించి మనం చాందోగ్య ఉపనిషత్తులో చూడడం జరుగుతుంది. జాబాలీ….. చిన్నతనంలో తనతో పాటు ఆడుకునే స్నేహితులు, గురువు దగ్గరికి వెళ్లి ఆధ్యాత్మిక వేద విజ్ఞానాన్ని పొందాలని వెళ్లేవారు. జాబాలికి కూడా చిన్నతనం నుంచి జ్ఞానార్జన మీద ఆసక్తి ఉండేది. అందుకని తన స్నేహితులతో పాటు ఇతను కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలని కోరిక కలిగి….. గౌతముడు అనే ఋషి వద్దకు వెళ్లి విద్యను నేర్పించమని అడిగాడు. అప్పుడు అతను నీ గోత్రనామాలు ఏమిటి అని అడిగేసరికి… ఇతను సమాధానం చెప్పకపోయేసరికి… తిరిగి తన తల్లి వద్దకు వచ్చి ఇదే విషయాన్ని అడిగితే…. యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఎంతో మందితో ఉన్నాను…. అందులో నీ తండ్రి ఎవరు అని నేను ఎలా చెప్పగలను? నా పేరు జాబాలా కాబట్టి నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వచ్చాను…. ఈ నిజాన్ని నిర్భయంగా నేను నీకు చెప్పినట్టుగా….నువ్వు చెప్పగలవని నమ్ముతున్నాను. ఇకనుంచి నువ్వు సత్యమునే పలుకు…. అంటూ సత్య కాముడు అనే పేరు కూడా ఆవిడ పెట్టి పంపించింది. ఇదే విషయాన్ని గౌతముడికి చెప్పగానే అతనిలో ఉన్న సత్యశీలతకు సంతోషించి….శిష్యునిగా గౌతముడు అంగీకరించాడు. గౌతమ మహర్షి మాత్రం ఎన్నో రకాల జ్ఞాన పరీక్షలు పెట్టి ఆ తర్వాత తత్వ జ్ఞానాన్ని…. జ్ఞాన సారాన్ని అందించాలని అనుకున్నారు. అందుకని కొన్ని ఆవులు ఆంబోతులు ఇచ్చి వాటిని అడవిలోకి తీసుకువెళ్లి మేపుతూ… కావలి కాస్తు ఉండమని…. ఇవి 1000 అయ్యేదాకా వీటిని అడవిలోనే ఉంచి 1000 అయిన తరువాత వీటిని తీసుకుని రమ్మని చెప్పి చెప్పగా….. గురువు ఆజ్ఞగా భావించి పశువుల మందను తీసుకుని అడవిలోకి వెళ్లిపోయాడు జాబాలి. ప్రకృతిని చూస్తూ చూస్తూ ప్రకృతి నుంచి జ్ఞానం పొందడం అలవాటు చేసుకున్నాడు…. అందులో అప్పుడే చిగురించిన చిగురుల నుంచి సుకుమార్తత్వాన్ని…… ఎండి వాడిపోయిన ఆకులను చూసి అందులో ఉన్న నిర్జీవ లయతత్వాన్ని…. స్థాణువులా నిలబడే కొండలలో స్థిరత్వాన్ని…. గలగల పారే సెలయేటిని చూసి సంతోషమును….ఇలా ప్రతిదాన్ని సూక్ష్మంగా సునిశితంగా పరిశీలిస్తూ… ప్రకృతి ద్వారా జ్ఞానార్జన చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఆవుల మందలో ఒక ఆవు ఇతని దగ్గరకు వచ్చి….. మా సంఖ్య వెయ్యి దాకా చేరింది. ఇక నువ్వు గురువు దగ్గరికి బయలుదేరాలి. దానికన్నా ముందు బ్రహ్మజ్ఞానంలోని నాలుగు పాదాలలో మొదటి పాదం….నేను నీకు చెబుతాను ఈ విశ్వంలో నాలుగు దిక్కులు బ్రహ్మ తత్వం యొక్క లోని జ్ఞానమే అని చెప్పగానే, ఒక నెమలి వచ్చి ఈ నాలుగు దిక్కులే కాకుండా పంచభూతాలు కూడా బ్రహ్మజ్ఞానమేనని….. సూర్య చంద్రాదులు, అగ్ని కూడా బ్రహ్మజ్ఞానమేనని హంస చెప్పి ఎగిరిపోయింది…ఇక ఒక నీటి పక్షి వచ్చి మానవుని పంచ ఇంద్రియాలు మాత్రమే కాకుండా జ్ఞానేంద్రియాలు కూడా బ్రహ్మజ్ఞానం అని చెప్పేసరికి వీటన్నిటిని అతను విశ్లేషించుకుని వాటి జ్ఞానాన్ని పొంది….ఆ జ్ఞాన సారాన్ని అనుభూతి చెంది బ్రహ్మ వర్చస్సుతో గురువు వద్దకు చేరాడు. ఆ బ్రహ్మ వర్చస్సుతో ….ఆ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న శిష్యుని చూసి నీకు నా అవసరం లేకుండానే అద్భుతమైన జ్ఞానాన్ని పొందావు….. అని చెప్పినప్పటికీ కూడా అతడు ఇసుమంతైనా అహంకారాన్ని ప్రదర్శించకుండా….. జ్ఞానానికి అంతులేదని మీ నుంచి కూడా జ్ఞాన సారాన్ని నేర్చుకోవాలని అనగానే…. అతనిలో ఉన్న సాత్విక స్వభావమునకు గురువు కూడా సంతుష్టుడై జ్ఞానసారాన్ని అందించాడు. ఇలా కొన్నాళ్ళపాటు నర్మదానది తీరంలో జాబాలీ మహర్షి ధ్యానం చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జబల్పూర్ అని పిలుస్తున్నారు….. అయితే తిరుమలలో కూడా ఈయన ఎంతో కాలం ధ్యానం చేయటం వల్ల ఒక తీర్థానికి ఇతని పేరు మీదగా జాబాలీ తీర్థం అని పేరు పెట్టడం జరిగింది….బ్రహ్మజ్ఞానం అనే పేరుతో జాబాలీ మహర్షి అందుకున్న జ్ఞానసారంలో సర్వం ఏకత్వ భావనలో కనిపించింది. అనగా ప్రతిదీ కూడా బ్రహ్మమే. బ్రహ్మ పదార్థమే…. అనే ధోరణిలో ప్రకృతిలో సర్వము బ్రహ్మమే… నరుడే నారాయణుడు…. జీవుడే దేవుడు…. అనే విధంగా ఇతని ప్రబోధనలు ఉండేవి. కాబట్టి చాలామంది ఇక ఇతనిని నాస్తికత్వ భావాలు కలిగినవాడిగా చెప్పుకునేవారు. ఎటువంటి గోత్రము నామము లేని జాబాలీ మహర్షి ఒక గోత్రానికి సార్ధకమయ్యాడు
ఆ తర్వాత జాబాలీ మహర్షికి హనుమంతుడు నిజరూప దర్శనం ఇవ్వటంతో….. ఆయన శిలా మూర్తిగా… విగ్రహంలా ఇక్కడ నిలబడ్డారు. …అని చెప్పేసి జాబాలి మహర్షికి కనిపించిన హనుమంతుని విగ్రహ మూర్తికి వీరిద్దరూ చూడడం జరిగింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ధ్యానంలో శివ నందిని కూర్చునే సరికి….. రకరకాలైన ధ్యాన స్ఫురణలు అందటం మొదలుపెట్టింది. తిరుపతి యాత్రలో మనకి సహస్ర చక్రం వరకు మాత్రమే….. సప్త చక్రాలు జాగృతి జరుగుతుంది. ఆ తర్వాత హృదయ చక్రానికి వెళ్ళాలి అంటే….. సహస్ర చక్రం నుంచి హృదయ చక్రానికి మధ్యలో ఉన్న జీవనాడికి అధిపతి…. అధిష్టాన దైవం ఈ హనుమంతుడు. ఈ హనుమంతులలో 9 రకాల హనుమంతులు ఉన్నట్టుగా ధ్యానానుభవం అయింది. ఆఖరికి పంచముఖ హనుమంతుడు ఉంటారని దైవ దర్శనం ధ్యానంలో కనిపించింది. దాస ఆంజనేయ స్వామి దగ్గర నుంచి పంచముఖ హనుమాన్ దాకా ఉన్న హనుమంతులను మనం దాటుకోవలసి ఉంటుంది…..అప్పుడే మనకి హృదయ చక్రంలో ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, ఇష్ట లింగం అనేది ఉంటాయి. ఈ ఇష్ట లింగం లేదా అర్ధనారీశ్వర ఆరాధన చేస్తే…. అక్కడ ఉన్న హృదయ గ్రంధి విభేదనం జరిగి…. అక్కడి నుంచి బ్రహ్మ నాడి ద్వారా మనం బ్రహ్మ రంధ్రానికి చేరుకోవచ్చు అని ఒక దివ్యమైన జ్ఞాన స్ఫురణ అందడంతో….జాబాలీ మహర్షి హనుమంతుని అనుగ్రహం పొంది…..హృదయ చక్రమునకు తన సాధన చేరుకోవాలని…. తపన తాపత్రయం పడి ఉంటాడు… కాకపోతే యోగసాధకులకి సాధన యోగులకు …సాధనా మహర్షులకి కూడా సహస్ర చక్రంలో శ్రీకృష్ణ మాయను దాటలేక ఆగిపోవడం జరిగి ఉండాలి. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముందు బేడీలతో బంధించిన ఆంజనేయ స్వామి మూర్తి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా హనుమంతుడు బంధింపబడి ఉండడు. ఈ తిరుపతిలో మాత్రమే ఆయన బేడీలతో బంధనం జరిగింది. అంటే మన సాధనా శక్తి సహస్ర చక్రం నుంచి జీవనాడిలోనికి ప్రవేశించకుండా ….హనుమంతునికి బంధనం చేయడం అనేది…. శివ నందిని కి అర్థం అయింది. జ్ఞాన స్ఫురణ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న హనుమంతుడికి బేడీ బంధనం తీసేస్తే…. అతను బంధ విముక్తుడైతే …..మన సాధనా శక్తి కూడా బంధ విముక్తి పొంది…. సహస్ర చక్రం నుంచి జీవనాడి ద్వారా…. హృదయ చక్రానికి ప్రవేశిస్తుందన్నమాట! అంటే మనలో ఉన్న జ్ఞానమాయని మనం దాటవలసి ఉంటుంది…. ఈ జ్ఞాన మాయ వల్ల వచ్చే జ్ఞానాహంకారాన్ని దాటితే జీవ మాయలో ఉన్న …హనుమంతుడు కాస్త దైవంగా మారడం జరుగుతుంది. జీవమాయలో ఉన్న హనుమంతుడు శ్రీరాముడే తనకి ప్రత్యక్ష దైవం అనే సాధనలో ఉంటాడు . ఎప్పుడైతే శ్రీరాముడు నిర్యాణం చెందాడో ….అప్పుడు భక్తుడు కాస్త దైవంగా మారడం జరిగింది. రామ భక్తుడు కాస్త రామ బంటుగా ఈయన హనుమగా మారడం జరిగింది. ఒక భక్తుడు భగవంతుడు అవ్వటం అనేది….మనం హనుమంతుని సాధన జీవిత చరిత్రలోనే చూడడం జరుగుతుంది. అంటే తాను జీవుడు కాదు… శివుడు అని తెలుసుకోవాలి . అంటే తనకి సహస్ర చక్రంలో వచ్చే జ్ఞానమాయను దాటగలిగితే…. దాని ద్వారా వచ్చే జ్ఞాన అహంకారమాయను వదిలించుకోగలిగితే…. అప్పుడు జీవుడు, శివుడు అవుతాడు అన్నమాట ! జీవుడు శివోహం స్థితిని పొంది…. శివుడు అవుతాడు అన్నమాట! అలాగే జీవత్వంలో ఉన్న హనుమ భక్తుడు కాస్త దైవత్వం అయిన హనుమ భగవంతుడిగా ఎలా మారాడో ….అలాగే జీవుడు కూడా శివుడిగా మారతాడు… అని చెప్పేసి జ్ఞాన స్ఫురణ అందడంతో…. ఇప్పుడు ఆ జీవమాయను మనం దాటవలసి ఉంటుంది . అది ఎప్పుడు ఎలా ఏంటి ? అనేది కాలానుగుణంగా….. పరిస్థితిలకు అనుగుణంగా చూపిస్తుంది. ఇప్పుడు సప్త చక్రాలు జాగృతి అయ్యాయి. ఆ సప్త చక్రాలను మొదట శుద్ధి చేసుకోవాలి …..ఆ తర్వాత అధీనం చేసుకోవాలి…..ఆ తర్వాత విభేదనం చేసుకున్న తర్వాతనే …. జీవనాడి ప్రవేశయోగం అర్హత,యోగ్యత, యోగం ఉంటుంది. తద్వారా హనుమంతుని అనుగ్రహం పొందగలిగితే హృదయ చక్రంలోకి వెళ్ళగలుగుతాము….దానికి హనుమంతుని యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది…. ఉపాసన చేయవలసి ఉంటుందో… ఏం చేయాలి… ఏంటి అనేది చూసుకోవాలి. ఇంకొకరకంగా చెప్పాలంటే హనుమంతుడు అంటే మనసుకి ప్రతికగా చెబుతారు… మనసు కోతి వంటిది, కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో…. ఎంత ఆనంద పడుతుందో…. గంతులు వేస్తుందో….. అలా మనసు స్వార్థంతో అస్థిరమైతే సాధన కూడా అధోగతి పాలవుతుంది…..అహంకార మాయలోకి ప్రవేశిస్తే మన సాధన అధోగతి పాలవటం లేదా సహస్ర చక్రము దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. శ్రీకృష్ణుని జ్ఞానమాయవలన నేను గొప్ప జ్ఞాని అని …….జ్ఞానాహంకారం రావచ్చు కాబోలు… తద్వారా దేవుడు కావలసిన సాధకుడు కాస్త జీవుడిగా మారి సహస చక్రంలోనే ఉండవచ్చు….లేదా అధోగతిపాలై మూలాధార చక్రం లోకి తిరిగి అజ్ఞాన గ్రంధిలోకి సాధన వెళ్ళిపోవచ్చు. ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము కాబట్టి….ఈ అహంకారమాయను దాటాలి. అందుకు ప్రతీకగా మనకి హనుమంతుని పెట్టడం జరిగింది. జాబాలీ మహర్షి మాత్రమే సహస్ర చక్రం నుంచి హృదయ చక్రం అనుసంధానంగా జీవనాడి ఉంటుందని…. ఆ జీవనాడి అధిష్టాన దైవం హనుమంతుడు అని…. మొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి జాబాలీ మహర్షి అని చెప్పేసి శివ నందినికి జ్ఞాన స్ఫురణ ద్వారా అర్ధమైంది. ఇక దానితో జాబాలీ మహర్షికి సహస్ర చక్రం దాటి ముందుకు వెళ్లే జ్ఞానాన్ని చెప్పినందుకు ….అందించినందుకు…. ప్రణామాలు చేస్తూ శివ నంది అక్కడ నుంచి బయలదేరారు…అప్పుడు శివ నందిని కి ఒక చిన్న సందేహం వచ్చింది…అయ్యా! కుండలిని శక్తి ప్రసారం చక్రాలలో జరుగుతున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలే అందరికీ కలుగుతాయా అని అడగగానే రుద్ర స్వామి…అమ్మ దాదాపుగా ఇలాంటి అనుభవాలే అందరికీ కలుగుతాయి….. ఇలాగే కలగాలి కూడా…. ఇది మాత్రమే కాకుండా కుండలిని శక్తి చక్రాలలో జాగృతి అవుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి…అవి నేను నీకు చెబుతాను…. …
కుండలిని శక్తి జాగృతి అయినపుడు సాధకుడిలో కలిగే స్థితులు:-
1)కుండలినిశక్తి జాగృతి అయినపుడు సాధకుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాడు! ఇది కొన్ని గంటలపాటు ఉండవచ్చును!
2)కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు అది స్థూల జగత్తునుండి సూక్ష్మ జగత్తులోనికి ప్రవేశిస్తుంది! అనగా స్థూలశరీరమునుండి అన్ని ప్రాణముల ప్రవాహము సుషుమ్నానాడి ద్వారా ప్రవహించటం ఆరంభమై, సూక్ష్మ శరీరములోనికి ప్రవేశించును!
3)అపుడు బయట ప్రవహిస్తున్న ప్రాణములతో కాళ్లు, చేతులు లాగి వేయబడతాయి! ఆ సమయంలో ప్రాణం కుంచించుకు పోతుంది! అపుడు సాధకుడు భయపడరాదు! సాధకుడు భయపడినట్లైతే అంతర్ముఖమవుతున్న ప్రాణము, ఇంద్రియాలు మరలా యధాస్థానానికి వస్తాయి! కాబట్టి ఈ సమయములో సాధకుడు ధైర్యంగా, సహనంగా ఉండాలి!
4)ఎపుడైతే సాధకుడు ధైర్యముగా, సహనముగా ఉంటే నీ మనస్సు స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరములోనికి పయనిస్తున్నట్లుగా నీకు ఆ సమయంలో అర్ధం అవుతూ ఉంటుంది! అనగా అన్నమయకోశమునుండి ప్రాణమయకోశము ద్వారా ఈ ప్రయాణము ఆరంభమవుతుంది!
5)కుండలినిశక్తి మొదట సుషుమ్నానాడిలో ప్రవేశించినప్పుడు ఆమె తన శక్తిని మూలాధార చక్రము మీద పని చేస్తుంది! మూలాధార చక్రములో తిరగటం ప్రారంభము చేస్తుంది!అపుడు మర్మాంగాలు ఉద్రేకము అగును! ఆ సమయంలో సాధకుడు మూలబంధాన్ని గట్టిగా వేసి ఉండాలి! లేకపోతే వీర్యపతనం, మూత్రం బహిర్గతం కావటం సంభవిస్తుంది! మూలబంధనము ఎలావేయాలో పుస్తక జ్ఞానముకన్నా అనుభవ సాధకుల దగ్గర నేర్చుకోవటం చాలా మంచిదని నా మనవి!
6)సాధకుడు మొట్టమొదట మూలబంధాన్ని సాధన చేయాలి! లేకపోతే కుండలినీ మహాశక్తి సంచారాన్ని తట్టుకోవటం చాలాకష్టం! సాధకుడు తట్టుకోలేకపోతే సాధకుడు ఆసనం నుంచి ముందుకు పడిపోతాడు! అనగా ప్రాణభయంతో పడిపోతాడు! కుండలినీశక్తి తట్టుకోవటం చాలా కష్టము అవుతుంది! గమనించండి! కుండలినీశక్తిని తట్టుకోవాలంటే సాధకుడు మూలబంధమును సాధన చేయాలి! మూలబంధసాధన అనగా పద్మాసనములో కూర్చొనుట! కుండలినీ శక్తి జాగృతి అయినపుడు సాధకుడికి విపరీతమైన ఒళ్లు నొప్పులుంటాయి! అలాగే శరీరమునకు విపరీతమైన వేడిని కలిగి ఉంటుంది! గ్రహించండి! ఈ ఒళ్లు నొప్పులను, ఈ వేడిని తగ్గించుకొనుటకు సాధకుడు ప్రయత్నించరాదు!
7)సాధకుడి సూక్ష్మశరీరంలో షట్చక్రాలు దర్శనమిచ్చును! అలాగే సాధకుడికి సూక్ష్మజగత్తులో పరిచయములేని, అత్యంత భయంకరమైన శబ్దాలు వింటాడు! అలాగే భయంకరమైన దృశ్యాలు కనపడతాయి! వీటికి సాధకుడు భయపడకూడదు! వీటికి భయపడితే కుండలినిశక్తి మూలాధార చక్రము క్రిందకి వస్తుంది! గ్రహించండి!
8)ఈ భయములన్ని కుండలినిశక్తి సాధకుడి భ్రూమధ్యము చేరుకొనేదాకా ఉంటాయి! అనగా కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రము మీద స్థిరమైనపుడు సాధకుడు నిర్భయుడవుతాడు!
9)అలాగే సాధకుడికి ధ్యానంలో పూర్వజన్మ సంస్కారాలు గోచరించును! తద్వారా ఈ జన్మవాసనలు వలన సాధకుడికి తెలియకుండానే తన నోటి నుండి విపరీతమైన శబ్దాలు వస్తాయి! ఉదా:- పులిగాండ్రింపులులాంటివి! ఇలాంటి వాటికి సాధకుడు భయపడరాదు!
10)సాధకుడికి ధ్యానమునందు చనిపోయినవారు, ఆత్మలుగాని, ప్రేతాత్మలుగాని కనపడును! అవి మనతో మాట్లాడుటకు ప్రయత్నాలు చేస్తుంటాయి! అయిన కూడ సాధకుడు ఎటువంటి పరిస్థితిలో భయపడరాదు!
11)అలాగే సాధకుడికి ధ్యానంలో అద్భుతమైన దివ్యలోకాలు, అలాగే నిధులు, నిక్షేపాలు కనిపించును! వీటికి సాధకుడు ఆశపడకూడదు! ఆశపడితే సాధకుడి సాధన అంతటితో ఆగిపోవును.. గమనించండి.
12)సాధకుడి ధ్యానంలో అప్సరస వంటి స్త్రీలు, దివ్యకాంతితో కూడిన దేవత స్త్రీలు, పురుషులు, దర్శనమిస్తూ ఉంటారు! వారందరి యెడల అనాసక్తుడై ప్రవర్తిస్తూండాలి!
13)కుండలినీశక్తి షట్చ్ క్రాలు ఆధీనము చేసుకొంటున్నప్పుడు ఒక్కొక్కరకమైన సిద్ధులు లభించును! అలాగే వాటికి సంబంధించిన యోగమాయలను సాధకుడు దాటుకోవాలి! దాటలేకపోతే షట్చ్ క్రాలు బలహీనపడును!
14)సాధకుడిలో కుండలినీ శక్తి జాగృతి అయినపుడు శరీరము విపరీతమైన వేడిని, తడి ఆరకపోవటం సంభవించును! ఈ వేడి మూలాధార చక్రములో మొదలై మణిపూరక చక్రమునకు వచ్చేసరికి యోగాగ్నిగా మారుతుంది! దీనివలన జన్మవాసనలు, విషయవాసనలు, కర్మవాసనలు ఈ యోగాగ్ని ధాటికి నశించిపోతాయి! అందుకే సాధకుడికి బొడ్డు ప్రాంతములో విపరీతమైన వేడి ఉన్నట్లుగా అనుభూతి కల్గును!
15)కుండలినీశక్తి మూలాధార చక్రము చేరుకుంటే మహాలక్ష్మీ తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన ధనకాంక్షను తాపత్రయ పడతాడు! అనగా కనకమునందు పరీక్షలు పెట్టును! దీనిని సాధకుడు దాటుకోవాలి!
16)కుండలినీశక్తి స్వాధిష్టాన చక్రము చేరుకుంటే మహాశక్తి అయిన పార్వతిదేవి తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన కామవాంఛలు కల్గించును! అనగా ధ్యానమునందు కళ్లు తెరచిన, మూసిన అప్సరసలాంటి దేవతా స్త్రీలు, పురుషులు, వారిద్దరి మధ్య జరిగే రతి క్రీడలు కన్పించును!
17)కుండలినీశక్తి మణిపూరక చక్రమును చేరుకుంటే మన ఇష్టదేవత సాక్షాత్కరించును! అనగా నీవు జపించిన మంత్రదేవత నీకు కనపడతాడు! ఉదా:- శివమంత్రమును జపిస్తే శివుడు, రామమంత్రమును జపిస్తే రాముడు కనపడతాడు! వీరి మహామాయను దాటుకోవాలి! లేదంటే సాధకుడు సాలోక్యముక్తిని మాత్రమే పొందుతాడు! ఇక్కడికి వచ్చిన కుండలినీ శక్తి ఎన్నటికి క్రిందకి ప్రవహించదు! అనగా మూలాధార, స్వాధిష్టాన చక్రాలకు చేరదు! ఈ మణిపూరక చక్రములోనికి కుండలినీశక్తి రావటానికి మాత్రము సాధకుడు కనకము, కాంత మహామాయలు దాటుకొని రావాలి! ఇవి దాటడం అంటే కత్తిమీద సాములాంటిది!
18)కుండలినీశక్తి అనాహత చక్రములోనికి ప్రవేశించినపుడు మహాకాళి తన యోగమాయను చూపించును! అనగా విపరీతమైన, భయంకరమైన దృశ్యాలు,ప్రేతాత్మలు గోచరించేటట్లుగా చేయును! అయిన వీటికి సాధకుడు భయపడరాదు! అవి నీకు ఎలాంటి హాని చేయలేవు! వాటంతట అవే తొలగిపోతాయి! అందువల్లన సాధకుడు భయము చెందవలసిన అవసరము లేదు! ఒక వేళ భయపడినట్లయితే కుండలినీశక్తి మణిపూరక చక్రములోనికి ప్రవేశించును! గమనించండి!
19)కుండలినీశక్తి విశుద్ధ చక్రములోనికి ప్రవేశించినపుడు మహాసరస్వతి తన యోగమాయను చూపించును! అనగా సాధకుడికి విపరీతమైన ఊహాశక్తి కల్గును! అలాగే స్వర విజ్ఞానము పెరుగును! వీటివలన సాధకుడు మహాగాయకుడిగా, మహాకవిగా ఖ్యాతి చెందుతాడు! తను జ్ఞాని అనే అహంకారములో ఉంటాడు! ఈ మాయను సాధకుడు దాటుకోవాలి! ఇక్కడే సాధకుడికి సమాధిస్థితి కలుగుతుంది!
20)కుండలినీశక్తి ఆజ్ఞా చక్రములోనికి ప్రవేశించినపుడు జీవుడు తన యోగమాయను చూపించును! అనగా తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు! ఎప్పుడైతే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడో, అపుడు ఆ సాధకుడికి సంప్రజ్ఞాత సమాధిస్థితి కలుగుతుంది! తద్వారా ఆత్మ జ్ఞానమును పొందుతాడు! అపుడు కూడ అహంకారము విడిచిపెట్టదు!
21)కుండలినీశక్తి సహస్రచక్రములోనికి ప్రవేశించినపుడు శ్రీ గురువు యోగమాయను చూపుతాడు! ఇక్కడ సాధకుడు బ్రహ్మజ్ఞానమును పొందుతాడు! ఇక్కడ సాధకుడికి అసంప్రజ్ఞాత సమాధిస్థితి కలుగుతుంది! ఇందులో కూడ అహంకారమును దాటుకోవాలి! ఈ సమాధిస్థితినే నిర్వికల్ప సమాధిస్థితి అనికూడ అందురు!
22)కుండలినీశక్తి బ్రహ్మరంద్రములోనికి ప్రవేశించినప్పుడు ఆనంద సమాధిస్థితి కలుగుతుంది! ఇందులో క్షణిక ఆనంద సమాధిస్థితిని పొందితే సాధకుడిలోని కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రము ద్వారా బయటకు పోయి, విశ్వములోని విశ్వశక్తి అనగా పరమాత్ముడు ఆత్మరూపములో తనలోనికి వస్తాడు! ఉదాహరణకు శిరిడి సాయిబాబాగారి విషయంలోను, జీసస్ విషయంలోను జరిగినది! ఎలా అనగా బాబావారు మూడు రోజులపాటు చనిపోయారని, ఆ తర్వాత తిరిగి బ్రతికినారని చెపుతారుగదా! అలాగే జీసస్ కూడ మూడు రోజులపాటు చనిపోయి, తరువాత బ్రతికినారని చెపుతారు గదా! వీరిద్దరి విషయంలో ఒకేరకమైన చర్య జరిగినది! అది ఏమిటంటే సాధకుడు క్షణిక ఆనంద సమాధిస్థితిని పొందితే ప్రకృతి కాలమాన ప్రకారము మూడు రోజులతో సమానము! ఎవరైతే క్షణిక ఆనంద సమాధి పొందుతారో, వారిలో బ్రహ్మరంధ్రము ద్వారా విశ్వశక్తి ప్రవహించునని అరవింద యోగి గారు సెలవిచ్చారు. విశ్వశక్తి అనగా పరమాత్ముడే కదా! అందుకే ఒక సన్యాసిని మాత్రమే పరమాత్ముడిగా భావించుకొని పూజలు చేస్తాము! ఎపుడైతే బాబాగారిలోను, జీసస్లోను విశ్వశక్తి ప్రవహించినదో,అపుడే వారు తిరిగి మూడు రోజుల తరువాత సమాధి స్థితి నుండి వచ్చినారు!అప్పటినుండి వారిని పరమాత్ముడిగా, దైవదూతగా భావించుకొని పూజలు చేస్తున్నాము!ఈ విషయాన్ని సమర్థిస్తూ పురాణాల యందు ఒక విషయము కనపడును!
విశ్వామిత్రుడు, వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి తనకి బ్రహ్మర్షి స్థానము కావాలంటే అందుకువశిష్ఠుడు ఎపుడైతే నీ శరీరమును సూర్యుడి శక్తితో ఆహుతి చేసుకొంటావో, అపుడేనీకు మహర్షి స్థానము ఇస్తానని చెపుతాడు గదా! అనగా సూర్యుడి శక్తి అనగావిశ్వశక్తిని తనలోనికి ఇముడ్చుకోవాలి! అదే విధంగా శరీరము దహనముచేసుకోవటంమంటే తన కుండలి శక్తిని బయటకు పంపించడం లాంటిది!గమనించండి! ఎవరైతే భౌతిక మృత్యువును జయిస్తారో, వారికి మాత్రమే దీర్ఘనిర్వికల్ప సమాధిస్థితి కలుగుతుంది! ఇట్టి స్థితిలో విశ్వరూప సాక్షాత్కారమును పొందుటకు అనగా తన సహస్రచక్రములోని 1000 దళాలు సంపూర్ణంగా వికాసము పొందుటకు, అలాగే సూక్ష్మ, కారణ కర్మలు లేశమాత్రము లేకుండా క్షయం
చేసుకొనుటకు సజీవ సమాధి చెందుతారు! ఉదా:- రాఘవేంద్ర స్వామి, పోతూలూరి వీర బ్రహ్మేంద్రస్వామి! వీరు సజీవ సమాధిలో ధ్యాన తపస్సు చేసుకుంటూ కైవల్య ప్రాప్తి అనగా మోక్షము పొందుటకు ప్రయత్నాలు చేస్తూంటారు.
23)ఎవరైతే కుండలిని శక్తితో ఆజ్ఞా చక్రము స్వాధీనము చేసుకొంటే వారికి ఆత్మజ్ఞానము కలిగి ఆత్మదర్శనానుభూతిని పొందుతాడు! అనగా తన స్వస్వరూప జ్ఞానమును పొందుతాడు! సారూప్యముక్తిని పొందుతాడు!
24)ఎవరైతే కుండలినీ శక్తితో సహస్ర చక్రమును స్వాధీనం చేసుకుంటాడో వారికి బ్రహ్మజ్ఞానము కలిగి పరమాత్మానుభూతిని లేదా ఆత్మానుభూతిని పొందుతాడు!అనగా సహస్ర శిరస్సులతో, సహస్ర బాహులతో పరమాత్ముడు దర్శనమిచ్చును!ఇక్కడ శరస్థి ముక్తిని పొందుతాడు!
25)ఎవరైతే కుండలినీశక్తితో బ్రహ్మరంధ్రమును స్వాధీనము చేసుకొంటే పరబ్రహ్మానుభూతిలేదా ఆనందానుభూతిని పొందుతాడు! తద్వారా విశ్వశక్తి తనలోనికి ప్రవేశించును!ఇక్కడ కైవల్య ప్రాప్తిని పొందుతాడు!
26)ఒకసారి కుండలినీశక్తి జాగృతి అయినంత మాత్రాన సమాధి స్థితి లభించదు!గమనించండి! పదే పదే సాధకుడు తన ధ్యాన నిష్ఠతో కుండలినీ శక్తిని జాగృతిచేసుకోవాలి! ఎపుడిదాకా అంటే సాధకుడు మూలాధార, స్వాధిష్ఠాన చక్రాలు ఆధీనం అయినంతవరకు కుండలినీ శక్తిని జాగృతి చేసుకోవాలి!ఎపుడైతే సాధకుడు ఆశకుగాని, భయమునకు గాని, యోగమాయలకుగాని లోనై అయితే కుండలినీ శక్తి నిద్రావస్థకు వెళ్లుతుంది! కథ మళ్లీ మొదటకు వస్తుంది! అందుకు సాధకుడు జాగ్రత్త వహించాలి!
28)సాధకుడిలో కుండలినీ శక్తి ప్రవాహము చీమలు ప్రాకినట్లుగాని లేదా పాము ప్రాకినట్లుగా గాని లేదా కప్ప గంతులు వేసినట్లుగా గాని ఉంటుందని యోగశాస్త్రాలు చెపుతున్నాయి! గమనించండి! ఇలాంటి అనుభూతులను సాధకుడు పొందుతాడు! ఇలాంటి అనుభూతిని సాధకుడు పొందితే ఆ శక్తి ప్రసారం క్రింది నుండి అనగా మూలాధారచక్రము నుండి పైకి అనగా సహస్రం వరకు ప్రవహించినట్లుగా అనుభూతిని పొందుతాడు! తర్వాత సహస్రం నుండి మూలాధారమునకు చేరుతుంది!
29)క్రిందకి చేరినపుడు అనగా మూలాధారమునకు చేరినపుడు సాధకుడు నిరంతరము ధ్యానమును చేసుకోవాలి! అపుడు మళ్లీ కుండలినీశక్తి జాగృతి అవుతుంది! ఇలా పదేపదే కుండలినీశక్తిని జాగృతి చేసుకొంటే సాధకుడు సమాధిస్థితిని పొందుతాడు! గమనించండి!
30)కాని సమాధిస్థితిని పొందాలంటే మనస్సు యొక్క స్థితి, శరీర ఆరోగ్య అవస్థ, హృదయ నిర్మలత్వము, సూక్ష్మత్వము, విచారము, పవిత్రముగా ఉండుట, పూర్ణ వైరాగ్యము కలిగియుండుట మున్నగు లక్షణాలు సాధకుడు కలిగియుంటే సమాధి స్థితి లభించును! వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కుండలినీశక్తి మూలాధారము క్రిందకు పోయి నిద్రామగ్నమవుతుంది! మళ్లీ నిద్ర లేచుటకు అనగా జాగృతికి 12 సం॥రాలు పట్టును! దీనికోసము తీవ్రమైన సాధన చేయవలసి వుంటుంది!
31)సాధకుడు చక్రాలు శుద్ధిగావించవలసిన సమయాలలో, చక్రాలు ఆధీనం చేసుకొంటున్న సమయాలలో, చక్రాలు జాగృతి అవుతున్న సమయాలయందు ఎలాంటి మాయలకు, ఆశలకు, భయాలకులోను కాకూడదు! లోనై అయితే కుండలినీశక్తి నిద్రావస్థకు చేరుతుంది! సాధకుడు మూలాధార, స్వాధిష్టన చక్రాల మహామాయలను అనగా కనకము, కాంతమును దాటుకోవాలి! వీటిని దాటితే కుండలినీశక్తి నిద్రావస్థకు వెళ్లదు! ఒకసారి ఈ కుండలినీశక్తి మణిపూరక చక్రమునకు చేరితే అక్కడనుండి అది సాధకుడికి ఆధీనమగును! అపుడు సాధకుడి ఇష్టానుసారముగా ప్రవహించును.
అని చెప్పుకుంటూ వీళ్లు బస్టాండ్ దగ్గరకి రావడం జరిగింది. అప్పటికే వీళ్ళ కోసం ఎదురుచూస్తున్న మహాదేవి మరియు పిల్లలు కనిపించారు… అమ్మ! ఇప్పుడు ఏం చేద్దాం అనేసరికి…. ఇప్పుడు మనం తిరుమల లోకి వెళ్లి పైన చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయని….రుద్ర స్వామి అనేసరికి…. ఇవాళ తిరుపతికి తిరుమలకి చుట్టూ ఉన్న ప్రదేశాలు చూసి వద్దాం…. అనేసరికి బాలగణపతి ఉన్నట్టుండి అమ్మ ! పాము అభరణం తీసుకుని వెళ్లావు కదా! నీకు తర్వాత ఏ క్షేత్రానికి వెళ్లాలో తెలిసిందా …..అనేసరికి అప్పటిదాకా ఆ విషయం గురించి గమనించని శివ నందిని కాస్త ఇంకా తెలియలేదు బాబు…. తెలిసే సమయం వస్తుంది…. నాకు ఆకాశ గంగలో స్పటిక రుద్ర శివలింగం దొరికింది …ఇదిగో అని చూపించచి…..ఆ తర్వాత మహాదేవికి చక్ర తీర్థంలో జరిగిన నిలువు, అడ్డ శరీరాలు ఎలా మోక్షం పొందుతాయని…. ఆ విషయాలు ప్రత్యక్ష అనుభవాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆకాశగంగలో దొరికిన స్పటిక శివలింగం చూపించేసరికి…. అందరూ సంబరపడిపోయారు…. దానిని తాకుతూ అందరూ అపురూపంగా చూసుకుంటూ….. పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రుద్ర స్వామి దానిని చేతి సంచిలో దాచుకున్నాడు…. ఆ తర్వాత వేణుగోపాలస్వామి గుడి దగ్గర పిల్లవాడు ఇచ్చిన వేణువుని చూపించేసరికి….. బాలగణపతి . ఉత్సుకత అమ్మ! అమ్మ! ఈ వేణువు నేను తీసుకుంటాను… వేణువు వాయించడం నాకు ఇష్టం…. నా కోసం కొన్నావా…. అంటే సరే నాయన తీసుకో….. అనేసరికి శ్రీకృష్ణుని జ్ఞాన మాయ బాలగణపతికి అందుతుంది… ఇక ఆ మాయ నన్ను పట్టుకోదు అని అనుకొని సరే! తన సాధనకి వచ్చే ఆటంకాలు అన్నీ కూడా మహాదేవి, పిల్లలు రుద్రస్వామి తీసుకోవడానికి వచ్చినట్టు ఉన్నారు…. సాధన కుటుంబంగా ఏర్పడ్డట్టు ఉన్నారు అని గ్రహించడానికి శివనందినికి అట్టే సమయం పట్టలేదు…. ఆ తర్వాత వీళ్ళందరూ బస్సు ఎక్కి తిరుమల ప్రాంతానికి చేరుకోవడం జరిగింది.
తీర్థాలు:-
ఈ తిరుమల క్షేత్రంలో మొత్తంగా మూడు కోట్ల తీర్థాలు ఉన్నాయని ప్రసిద్ధి. అందులో ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క రకమైన పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ తీర్థాలలో ధర్మరతిప్రదాలు అంటే ఈ తీర్థములలో స్నానం చేసినంత మాత్రము చేత మానవునికి ధర్మము యందు అనురక్తి కలుగుతుందని చెబుతారు. మరికొన్ని తీర్థాలు జ్ఞానప్రదాలు ఇవి 108 ఉన్నట్టుగా మనకి స్థల పురాణం చెబుతోంది. ఇవి మానవునికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మరికొన్ని తీర్థాలు భక్తి వైరాగ్య ప్రదాలు. వీటిలో స్నానం చేసినంత మాత్రము చేత సాధకునిలో వైరాగ్య భావాలు కలిగి మోక్షం వైపు నడిపిస్తాయని చెబుతారు. మరికొన్ని ముఖ్య ప్రధాన తీర్థాలు…..ఇవి 66 తీర్థాలుగా ఉన్నట్లుగా చెబుతారు.
అందులో కుమారధారా తీర్థం గురించి చెప్పాలంటే…. అసుర సంహారం తర్వాత కుమారస్వామికి కైలాసానికి వచ్చినప్పుడు అతనిని దేవతలకు సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. కానీ పదవి వ్యామోహం ఏమాత్రం లేని కుమారస్వామి శ్రీమన్నారాయణ ఆజ్ఞ చేత ఈ శేషాచలం ప్రాంతానికి వచ్చి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకానొక రోజు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై కుమారస్వామికి శక్తి అని ఆయుధాన్ని ఇచ్చారు ఈ శక్తి అనే ఆయుధాన్ని తీసుకొని ఆ తర్వాత కైలాసానికి వెళ్లిపోయారు. ఇలా కుమారస్వామి తపస్సు చేసిన ప్రదేశం కావడం చేత దీనిని కుమారధార తీర్థం అన్నారు.
ఆ తర్వాత సనక సనందన తీర్థమని ఒకటి ఉన్నది…. సిద్దులు సేవించిన తీర్థం కావడం చేత దీనిని సనకసనందన తీర్థం అని పిలుస్తారు. ఈ తీర్థం చాలా వరకు మనుషులు తెలుసుకోలేని విధంగా ఉంటుంది. మార్గశిర మాసంలో శుద్ధ ద్వాదశి నాడు ఉదయకాల సమయంలో మనోనిగ్రహంతో స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి…. త్రయోదశిన ఈ సనక సనంద తీర్థంలో స్నానం చేస్తే అన్ని యోగాలు సిద్ధిస్తాయని స్థల పురాణం చెబుతుంది.
ఆ తర్వాత పాపనాశన తీర్థంలో స్నానం సర్వపాపహరం అని అందరికీ తెలుసు కదా! అయితే ఏ మాసంలో అయినా శుక్లపక్షము లేదా కృష్ణపక్షంలో ఎప్పుడైనా సప్తమి ఆదివారం హస్తా నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చిన రోజున ఈ పాపనాశనం తీర్థంలో స్నానం చేస్తే కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ హరించకపోతాయని మనకి వరాహపురాణంలో చెప్పడం జరిగింది.
ఆ తరువాత తుంబుర తీర్థం. ఈ తుంబుర తీర్థాన్నే ఘోణ తీర్థం అని కూడా పిలుస్తారు. సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుణి నక్షత్రములో బ్రహ్మ ముహూర్త సమయంలో తెల్లవారుజామున పంచ తీర్థాలకు గర్భస్థానమైన ఈ తుంబుర తీర్థంలో స్నానం చేయడం వలన గర్భవాస దుఃఖం పోతుందని స్థల పురాణంలో చెప్పడం జరిగింది.
ఆ తర్వాత చక్ర తీర్థం. ఒకానొక సమయంలో ఒక గంధర్వుడు తన వందమంది సఖులతో కలిసి దిగంబరుడిగా కావేరి నదిలో జల క్రీడలలో ఉండగా…… అటుగా వశిష్ట మహర్షి తన ఇతర మునలతో కలిసి శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి వెళుతూ ఉండగా…..ఆ స్త్రీలు మహర్షిని చూసి ఒంటిపై వస్త్రమును కప్పుకున్నారు. కానీ గంధర్వుడు మాత్రం అలా చేయలేదు. అందుకు ఆగ్రహించిన వశిష్ఠుడు నేను చూస్తున్నానని తెలిసి కూడా నువ్వు దిగంబరిగానే ఉన్నావు నువ్వు రాక్షసుడిగా మారిపోమని శాపం ఇస్తాడు. దానికి చింతించిన తన సఖులు అందరూ కలిసి ఆ వశిష్ట మహర్షిని ప్రార్థించగా… 16 సంవత్సరాలు ఈ శాపమును అనుభవించిన తరువాత ఒక గొప్ప తపస్సంపన్నుడు పద్మనాభుడు అనే అతను ఇక్కడ చక్రతీర్థ సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో మీ భర్త అతన్ని మింగటానికి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు యొక్క చక్రము అతన్ని సంహరిస్తుంది. అప్పుడు అతనికి శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇలా ఈ ఘటన ఇక్కడ జరగటం వలన దీనిని చక్ర తీర్థం అన్నారు.
ఇవే కాక కపిల తీర్థము, పాండవ తీర్థము, జరాహార తీర్థము, దేవ తీర్థము, కామ రసాయన తీర్థము, పద్మసరోవర తీర్థము, శంకు తీర్థము, విశ్వక్సేన తీర్థము, సప్తర్షి తీర్థము ఇలా మొత్తంగా ఎన్నో తీర్థాలు ముక్తి ప్రదాలుగా ఉండి అనంత పుణ్యఫలమును అనుగ్రహిస్తున్నాయి.
సాధన కుటుంబం అంతా …. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలని వ్యాన్ మాట్లాడుకోవడం జరిగింది. సరే అని చెప్పి మొదట కళ్యాణ వెంకటేశ్వర స్వామి, గోవిందరాజు గుడి, పద్మావతి గుడి, కలకొండ, వకులా మాత గుడి కి వెళ్లి చివరికి కపిల తీర్థానికి చేరుకోవడం జరిగింది .
తిరుమల కింద చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు:-
సాధనా కుటుంబం తిరుమల కింద చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలను దర్శించడం మొదలుపెట్టారు. ఈ క్షేత్రాల గురించి రుద్ర స్వామికి తెలిసి ఉండడంతో మిగిలిన వారికి ఒక్కొక్క క్షేత్రం యొక్క మహత్యం చెబుతూ ఆలయాలను దర్శించుకున్నారు.
తిరుచానూరు లోని పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఇక్కడ ఆలయం ప్రాంగణంలో ఉన్న పద్మ పుష్కరిణిలో స్నానం చేసి, అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పుష్కరిణి స్వామివారే స్వయంగా తవ్వి ఇక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారని చెబుతారు అని రుద్ర స్వామి చెప్పగా సాధన కుటుంబం తెలుసుకున్నారు. ఇలా వెళ్తూ ఉండగా ఆలయ గోపురం పైన అష్టదిక్కులలో అష్టలక్ష్మి తత్వాల విగ్రహమూర్తులు ఉండటం శివ నందిని గమనించి మిగిలిన వారికి చెప్పగా వారు కూడా చూసి…ఆనందంతో నమస్కారం చేసుకున్నారు. ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు శుక మహర్షి ఆశ్రమం ఉండేదని ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు. ఇక్కడ బలరాముల వారి విగ్రహ మూర్తి కూడా కనిపిస్తుంది…. తీర్థయాత్రలు కానీ బయలుదేరిన బలరాముల వారికోసం శ్రీకృష్ణుడు వెతికి వెతికి ఈ సుఖ మహర్షి ఆశ్రమానికి చేరడం ఇక్కడే ఉంటే బలరాముని కలుసుకుంటావని అతను చెప్పడంతో స్వామి వారు అక్కడే ఉండటంతో కొన్నాళ్ళకి బలరాముడు రావటం జరిగింది. అలా వీరిద్దరూ కలిసినా ప్రదేశం కావడం చేత ఇక్కడ ఈ విగ్రహం మూర్తులను ప్రతిష్టించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆలయంలోనే చతుర్భుజములతో వెంకటేశ్వర స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఆలయానికి సమీపంలోనే సూర్యభగవానుని విగ్రహ మూర్తి కూడా స్వామివారి స్వయంగా ప్రతిష్టించారని స్థల పురాణం చెప్పడం ఇక్కడ ఆదిత్య హృదయం చదివితే అనంత పుణ్యఫలా ప్రధాయకమని ఆరోగ్యం సిద్ధిస్తుందని అక్కడ స్థానికులు చప్పగా తెలుసుకొని సూర్య భగవానుని నమస్కరించుకొని స్వామివారి అనుగ్రహం పొందారు. తిరుమలలో స్వామివారి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత కచ్చితంగా ఈ అమ్మవారి దర్శనం కూడా తప్పక చేసుకోవాలని చెబుతారు అని రుద్ర స్వామి చెప్పాడు.
గోవిందరాజ దేవాలయం
పూర్వం క్రిమికంఠుడనే చోళ రాజు విష్ణుద్వేషిగా ఉండి…. తన రాజ్యంలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాలను ధ్వంసం చేసి…. విగ్రహమూర్తులను సముద్ర జలాలలో కలిపే సమయంలో చిత్రకూటం చిదంబర అనే ప్రాంతంలో ఉన్న గోవిందరాజుల విగ్రహం సముద్ర జలాలలో పడవేసినప్పుడు…. ఉభయనాచినార్ అనే వ్యక్తి సహాయంతో దీనిని తిరుపతికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకువచ్చి…. తీసుకువచ్చి క్రిమికంఠుడికి తెలియకుండా పూజలు నిర్వహిస్తూ స్వామి వారిని అర్చించేవారు . ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజాచార్యుల వారు….ఈ విగ్రహంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని…. నూతన విగ్రహమూర్తులను చేయించి… ఈ విగ్రహ మూర్తులను కూడా ఆ ఆలయంలోనే వెనుక భాగంలో ఉంచి…. ఈ ఆలయ నిర్మాణానికి ఈ విగ్రహమూర్తుల ప్రతిష్టాపనకి ఎంతో కృషి చేశారు. తిరుమల లో వెంకటేశ్వర స్వామికి చేసే మాదిరిగానే ఈ గోవిందరాజుల వారికి కూడా నిత్య పూజా విధి విధానం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉన్నాయి అని….. స్థానిక భక్తులు చెప్పగా తెలుసుకున్నారు. ఈ గుడి మహత్యం తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్లి గోవిందరాజుల స్వామివారిని దర్శనం చేసుకొన…. ఆ పక్కనే ఉన్న పార్థసారధి ఆలయాన్ని, ఆండాళ్ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారిని, అనంత ఆళ్వార్, రామానుజాచార్య విగ్రహం మూర్తులను దర్శనం చేసుకుని…. నమస్కరించి… ఆ సన్నిధానంలోనే కాసేపు గడిపారు.
శ్రీనివాస మంగాపురం:-
ఆ తర్వాత శ్రీనివాస మంగాపురానికి చేరుకున్నారు. ఇక్కడ స్వామి వారు సతీసమేతంగా దర్శనం ఇచ్చారు. ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా దర్శనం ఇస్తుంది. స్వామివారు నారాయణ వనంలో అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా కాలం పాటు ఉండి ఆ తర్వాత తిరుమల క్షేత్రానికి చేరుకున్నారని చెబుతారు అని…. ఆలయ పూజారి చెప్పగా తెలుసుకుని ఈ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు.
గుడిమల్లం:-
తిరుపతి క్షేత్రానికి దగ్గరలోనే గుడిమల్లం అనే సుప్రసిద్ధమైన క్షేత్రం ఉందని తెలుసుకుని సాధనా కుటుంబం అక్కడికి బయలుదేరారు. స్వర్ణముఖి నది తీరాన ఈ గుడిమల్లం అనే క్షేత్రం ఉంది. మొట్టమొదట ఈ ఆలయంలోకి ప్రవేశించగానే నాట్య గణపతి దర్శనమిచ్చారు. 2600 సంవత్సరాల నాటి చరిత్ర ఈ ఆలయానికి ఉంది అన….. ఒకానొకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా అఖండ బిల్వకారణ్యంగా ఉండేది అని….. ఇక్కడ విచిత్రాల కొలను అని….. చిత్ర విచిత్రమైన పుష్పాలు పూచేవనీ….. తన తల్లి శిరస్సును ఖండించిన స్త్రీ హత్యాపాతకం పోగొట్టుకోవటానికి……ఈ క్షేత్రంలో శివలింగారాధన చేస్తూ……పరశురాముడు ఆ పువ్వులతోనే శివునికి అర్చన చేసేవాడని… పురాణ కథనం ప్రకారం గా తెలుస్తుంది. అలాగే కాకుండా బ్రహ్మయ్య సంరక్షణలో ఈ శివలింగం ఉండేదని చెబుతారు…భారత దేశంలోనే ఇది మొట్టమొదటి పురుషాంగాన్ని పోలివున్న శివాలయం అని…..అందులోను ఈ శివలింగం కింద భాగంలో బ్రహ్మ యక్షరూపంలో చిత్రసేనుడిగా కనిపిస్తారు అని….. మధ్య భాగంలో విష్ణుమూర్తి పరశురామ స్వరూపంలో దర్శనమిస్తూ….. ఆపైన పురుషాంగ రూపం లో శివుడు దర్శనమిస్తూ ఉంటారని……. ఈ శివలింగం నవపాషాణ నిర్మితమై…. ముదురు గోధుమ రంగులో ఉండి దక్షిణ ద్వార స్థానంలో ఉండడం చేత…. దక్షిణామూర్తి కూడా ఇదే దిక్కును చూస్తూ ఉండడం చేత…. మనం దీన్ని గురు భావంతో మేధా దక్షిణామూర్తిగా ……గురుదక్షిణామూర్తిగా భావించుకోవచ్చునని…. ఈ స్వామివారి దర్శన భాగ్యం చేత గురుగ్రహం శాంతిస్తుందని ఆలయ పూజారి చెప్పగా తెలుసుకున్నారు…..ఈ మానవ పురుష లింగం అనేది సృష్టి ఆవిర్భావానికి కారకమైన మొదటి లింగంగా మనకి అంతరార్ధాన్ని తెలియజేస్తూ ఉంటుందని….. ఇక్కడ అమ్మవారు ఆనందవల్లి అనే పేరుతో అభయహస్తంతో దర్శనమిచ్చారు. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి వల్లి దేవసేన సమేతంగా దర్శనమిచ్చారు…. ఇక్కడ సూర్యభగవానుని ఆలయం కూడా ఉండేసరికి…. ఆ సూర్యభగవానుడు కూడా తామర మొగ్గలు పట్టుకొని ఉదయకాలపు సూర్యుని స్వరూపములకు ప్రతీకగా కనిపిస్తారని…. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోనే తూర్పు వైపున 15 రంద్రాలు చూపిస్తూ…. దీని ద్వారా సూర్యకిరణాలు స్వామివారి మీద పడుతూ ఉంటాయి అని…. అది కూడా కేవలం జూలై 20 నుంచి 26 మధ్య ప్రాంతంలో స్వామివారిపై సహజసిద్ధంగా ఈ సూర్యకిరణాలు పడటం ఇక్కడ ప్రత్యేకత అని…. ఆలయ పూజారి చెప్పగా తెలుసుకుని…. కాసేపు అక్కడే ధ్యాన నిమగ్నం అయ్యారు…
ఇది మాత్రమే కాకుండా దీనికి దగ్గరలో ఉన్న నారాయణవనం, వకులాదేవి, ఆలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇస్కాన్ టెంపుల్, చంద్రగిరి లోనే కోదండ రామ స్వామి ఆలయము వంటి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకున్నారు….
కపిల తీర్థం:-
కృతయుగంలో కపిల మహర్షి పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కపిల మహర్షి తపస్సుకు సంతోషించిన పరమేశ్వరుడు…. పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిశారని చెబుతారు. కపిల ముని తపస్సు ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహించడం చేత దీనిని కపిలేశ్వర లింగమని పిలవడం జరుగుతుంది. ఇదే శివలింగాన్ని త్రేతాయుగంలో అగ్నిదేవుడు కూడా పూజించడం చేత దీనిని ఆగ్నేయ లింగం అని కూడా అంటారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి అమ్మవారితో కలిసి మనకి దర్శనం ఇస్తారు. వైష్ణవులు దీనిని ఆళ్వార్ తీర్ధమని…శైవులు దీనిని కపిల తీర్థమని పిలుస్తారు. శివ కేశవ అభేదమని చెప్పే ఈ కపిల తీర్థంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవడము సర్వ శుభప్రద మని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడు ఈ కపిల తీర్థంలో సర్వ తీర్థాలు వచ్చి చేరి నాలుగు గంటల పాటు కొలువు తీరతాయని ఆ సమయంలో ఈ క్షేత్రంలో జలమును సంప్రోక్షణ చేసుకున్నా….లేదా స్నానమాచరించినా అనంతమైన ఫలమని అక్కడ ఆలయ పూజారి చెప్పగా తెలుసుకుని ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాలను దర్శించుకున్నారు.
ఈ కపిలతీర్థం అనగానే కపిలేశ్వరుని గుడి ఉన్నట్లు శివ నందిని గ్రహించింది.. విష్ణు ఆలయంలో శివాలయం ఉండటం ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ ఇక్కడ అమ్మవారే వెంకటేశ్వర స్వామిగా బాల అంశగా పైకి తీసుకువెళ్లారా….. అని ఒక క్షణం అనిపించింది . ఏమో ఎవరికి తెలుసు…. అక్కడ వెంకన్న స్వామి ఉన్నారో ….అమ్మవారి తత్వం ఉన్నట్టుగా ధ్యానానుభవం అయినది కదా! మనం అది అర్ధనారీశ్వర తత్వంగా భావించుకోవడమే మంచిది. అమ్మవారి గుడి అని మనం నిర్ధారణ చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం కానీ చేయలేము…. అమ్మవారికి జరిగే దసరా పూజ సమయంలో బ్రహ్మోత్సవాలు జరగడం…. ఆనంద నిలయం పైన సింహం ప్రతిమలు ఉండటం… శివ నందిని గమనించింది . దానిని బట్టి చూస్తే ఎక్కడైనా నంది బొమ్మలు ఆలయ ప్రాకారాల మీద ఉంటే ..అది శివాలయం అని…. ఎక్కడైతే గరుత్మంతుడి విగ్రహమూర్తులు గాలిగోపురం మీద ఉంటాయో…. అది విష్ణువు ఆలయం అని చెప్పేసి…. ఎక్కడైతే సింహం బొమ్మలు గాలిగోపురం మీద ఉంటాయో …..అవి దేవి ఆలయాలు అని చెప్పేసి శిల్పకారులు ఈ మూర్తుల ద్వారా చెప్పడం జరిగింది. దీనిని బట్టి ఆనంద నిలయంలో సింహం బొమ్మలు ప్రతిమలు ఉండటం బట్టి…. అది అమ్మవారు అయ్యి ఉండొచ్చేమో…. అని క్షణకాలం అనుకుంది. అమ్మవారైనా, అయ్యవారైనా, అర్ధనారీశ్వర తత్వమైన…. దైవశక్తి భగవద్తత్వం…. ఉన్నది కదా! భగవంతుడిని మనం ఏ పేరుతో పిలిస్తే ఏముంది…. కొంతమంది కుమారస్వామిగా కనపడవచ్చును…. కొంతమందికి బాలగా కనపడవచ్చును…. కొంతమందికి వెంకటేశ్వర స్వామిగా కనపడవచ్చును…. కొంతమందికి శివుడిగా కనపడవచ్చును… కొంతమందికి విష్ణుమూర్తిగా కనపడవచ్చును…. యద్భావం తద్భవతి. మన ఆలోచనను బట్టి… మన దీనిని బట్టి ఉంటుంది… అని చెప్పేసి మనం రూప నామాలు లేని భగవంతుడిని…. ఇదే రూపంలో ఉన్నాడు… ఇదే నామంతో ఉన్నాడు అని…. ప్రచారం చేయటం అనుకోవడం మంచిది కాదు…. అని మనసులో అనుకుని….అక్కడే ఉన్న కపిల తీర్థంలో స్నానం చేసి దిగుతూ ఉండేసరికి…. తనలో కుండలిని శక్తి ప్రవాహం సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రానికి , మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి శరవేగంతో ప్రవహిస్తున్నట్లు అనిపించేసరికి….. స్నానం చేసి బయటకు వచ్చేసరికి…. కళ్ళు తిరుగుతూ ఉండేసరికి తట్టుకోలేక శరీరం పడిపోతుంది ఏమో అనే అనుమానభయంతో… సందేహంతో…. శరీరం కుండలినీ శక్తి ప్రవాహాన్ని తట్టుకోలేకపోయింది . దీనికి యోగాసనాలు వేయాలి…. అప్పుడే శరీరం దృఢత్వం పొందుతుంది. చేతి ముద్రల ద్వారా మనసు జ్ఞాన స్ఫురణ అందడంతో సరే అని ఒడ్డుకు వచ్చి ధ్యానంలో కూర్చుంది. కళ్ళు మూసుకొని ఉండిపోయింది…. పిల్లలు రుద్రస్వామి మహాదేవి యథేచ్ఛగా స్నానాధికాలు చేసుకుంటూ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు… వీళ్లేమో మెడలోతువరకు రుద్రస్వామి వెళ్లి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే….. మోకాళ్ళలోకి వరకు ఉండి మహాదేవి ధ్యానం చేసుకుంటుంది… పిల్లలేమో నీటిలో ఆటలు ఆడుకుంటూ…. మునుగుతూ ఈదుతూ ఆడుతున్నారు… శివ నందిని ధ్యానంలోకి వెళ్తూ ఉండేసరికి…. తన దగ్గర ఉన్న నాగాభరణం కాస్త ఈ లోపల కపిల తీర్థంలోకి వెళ్లిపోయి…. ఒక నిజం పాములాగా బంగారు వర్ణంతో…. ఒక అడుగు పాములాగా మారిపోయి…. తీర్థం అడుగులోకి వెళ్తున్నట్టుగా అనిపించేసరి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసింది…. తన చేతి సంచిలో నాగాభరణం తీసుకుని…. ఇక్కడ పెడితే ఏం జరుగుతుందో చూద్దాం ….అనేసరికి ధ్యానం నుంచి అప్పుడే కళ్ళు తెరిచి శివనందినినీ చూస్తూ రుద్ర స్వామి నీకు కనిపించిన ధ్యాన దృశ్యమే నాకు కనిపించింది…. ఆ పాము నాగాభరణానికి నీటిలో వదిలిపెట్టు…. దాన్ని వెంబడిస్తూ అది ఎక్కడికి వరకు వెళ్తుందో…. అక్కడి వరకు నేను వెళ్తాను అనేసరికి ….సరే అయ్యా! నీ ఇష్టం అని ఆయన ముందే పామును వదిలిపెట్టేసరికి….అది ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ…. సజీవ మూర్తిగా ఒక పాము పిల్లలాగా మారి పాకుతూ నీటిలో అడుక్కి వెళ్తూ ఉండేసరికి….. దానిని అనుసరిస్తూ రుద్రస్వామి కూడా వెళ్లడం జరిగింది. సుమారుగా ఒక 100 అడుగుల లోతుకి వెళ్లేసరికి….. పాము కాస్త ఆభరణంగా మారిపోయి స్థిరపడిపోయింది. ఇక్కడ ఏముంది అని అనుకొని….. దానిని అటూ ఇటూ కదిపి చూసేసరికి అక్కడ ఉన్న ఒక రాయి బయటకు వచ్చేసరికి….. ఆ ముద్ర ఉన్న రాయి బయటకు వచ్చేసరికి ….చూస్తే అది రాయి కాదని మంత్రయుక్తమైన ఒక బాక్స్ అని అర్థం అయింది. ఈ బాక్స్ చూడటానికి ఇటుక రాయి అంత పరిమాణంలో…. ఇటుక రాయి ఆకారంలో ఉండేసరికి…. పైన భాగంలో ఈ నాగాభరణం సరిపోయింది. …. తద్వారా ఈ మూత తెరుచుకోవడం జరిగింది… లోపల ఒక రుద్రాక్ష…. ఒక పెద్ద ఉసిరికాయ అంత రుద్రాక్ష కనపడింది ఇదేంటి రుద్రాక్ష ఉంది అని రుద్రాక్ష తీసుకునేసరికి ….ఇది ఏకముఖి రుద్రాక్ష అని దాని మీద శివలింగం, పాకుతున్న పాము ,ఓంకారం, త్రిశూలం ముద్రలు కనిపించాయి.ఇదే అసలు సిసలైన ఏకముఖి రుద్రాక్ష అనుకుంటాను…. ఇది తర్వాత ఏ క్షేత్రానికి వెళ్లాలో శివ నందినికి దారి చూపించే దైవిక వస్తువు అయి ఉంటుంది ….ఈ రుద్రాక్ష వలన శివునిలో రుద్రాక్ష బంధనం నుంచి విముక్తి పొందుతాడు అనుకుంటా…. అని అనుకుంటూ ఆ బాక్స్ నాగాభరణం రుద్రాక్ష తీసుకొని పైకి రావడం జరిగింది. రుద్రాక్షలు పట్టుకు వచ్చిన తరువాత బాక్స్ ఇచ్చేసరికి బాక్స్ తెరిచి చూసేసరికి….. అందులో ఏకముఖి రుద్రాక్ష ఉండడం ….ప్రత్యక్షంగా ఇంతవరకు ఎప్పుడు ఏకముఖి రుద్రాక్ష చూడని శివ నందిని…..ఒక విధమైన తన్వయత్వం పొందింది . అయ్యా ! ఇది మూడవ దైవిక వస్తువు అనుకుంటా…. చక్ర జాగృతికి మనం ఎక్కడికి వెళ్లాలి అనేది ఈ వస్తువు మనకి చెబుతుంది అనుకుంటా…. ఇది మనం సాధన మూర్తికి తాకించవలసి ఉంటుంది… అంటే అవును తల్లి …అని చెప్పేసరికి…. సరే అయితే ఇప్పుడు గదికి వెళ్ళి సాధనా విగ్రహ మూర్తికి పెట్టి చూద్దాము…. అనేసరికి ఇక పిల్లలు గది దాకా వెళ్లి చూడాల్సిన అవసరం ఏముంది…. ఇక్కడే చూసేద్దామని చాటు మాటుగా వెళ్లి చూద్దాము…. నాకు ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది కదా! ఆధారాన్ని దాని రహస్యాన్ని తెలుసుకొని చేదించాలి కదా అనేసరికి పిల్లలు ఉత్సాహాన్ని కాదనలేక…. సరే అని చెప్పేసి రుద్ర స్వామి… తన చేతి సంచిలో ఉన్న సాధనా విగ్రహ మూర్తిని బయటకు తీసి…. ఆ రుద్రాక్ష ఎక్కడ పెట్టాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండేసరికి….అమ్మ నాకు ఇవ్వు నేను తీసుకుంటాను ….అనేసరికి కాదు నువ్వు కాదు నేను పెడతాను…. నాకే వస్తున్నాయి ఆధారాలు…. అనేసరికి…. సరే అని బాలగణపతికి ఇచ్చే సరికి బాల గణపతి ఈ సాధనా మూర్తి ఎడమవైపు ఉన్న పద్మములో పెట్టినప్పటికీ ….కుడివైపు ఉన్న పద్మములో పెట్టినప్పటికీ…. ఏమీ జరగకపోయేసరికి అమ్మ ఏమీ జరగట్లేదు. ఇది నిజమైన రుద్రాక్ష కాదేమో… భద్రాక్షయేమో …రుద్రాక్షల కనిపించే భద్రాక్షయేమో…. ఇది నీటి మీద తేలుతుందో లేదో పరీక్ష చేద్దాము… నిజమైన రుద్రాక్షలు నీటి మీద తేలుతాయి అంట… పాలలో మునుగుతాయంట చూద్దాం…. అనేసరికి సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి… అనగానే వీడు తీసుకువెళ్లి కపిల తీర్థంలో వేసేసరికి…. అది నీటి మీద తేలుతూ ఉండేసరికి…. అమ్మ ! ఇది సజీవమైన రుద్రాక్ష. నీటి మీద తేలుతుంది అని మళ్లీ తీసుకువచ్చి దీనిని ఎక్కడ పెట్టాలి ఏంటి? అని అనుకుంటూ ఉండేసరికి …..బాల కుమారస్వామి కాస్త ఇది నాకు ఇవ్వు అని చెప్పి మూలాధార చక్రానికి తాకించగానే….. ఆ రుద్రాక్ష లోపలికి తీసుకునేసరికి…. ఉన్నట్టుండి సాధనా విగ్రహ మూర్తిలో మూలాధార చక్రం తిరగటం ఆరంభించింది . మూడుసార్లు కుడివైపు…. మూడుసార్లు ఎడమవైపు…. తిరిగేసరికి ఒక నాలుగు సార్లు అది మెరుస్తూ తిరుగుతూ ఉండేసరికి …..రుద్ర స్వామి అన్నాడు చూసావా అమ్మ! మూలధార చక్రంలో నాలుగు స్థితులు ఉంటాయని…. మెరుపుల ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఒకటి జాగృతి, రెండు శుద్ధి, మూడు ఆధీనం, నాలుగు విభేదనం అని చెప్పకనే చెబుతున్నారు అని ….అనేసరికి అవును స్వామి! అనేసరికి ఆ మూలాధార చక్రం నుంచి ఒక రాగి రేకు బయటకు వచ్చేసరికి… అమ్మ! అమ్మ! రాగి రేకు బయటకు వచ్చింది….ఆధారం బయటికి వచ్చింది….. అనగానే సరే చదువు అందులో ఏముంది.? అనేసరికి ఇక రాగి రేకును తీసి బాలగణపతి చదవడం ఆరంభించాడు…. ఆ రాగిరేకులో
నా కళ్ళు కామంతో చూస్తాయి… నేను పద్మాసనంలో ఉంటాను… నా చేతిలో ధర్మపక్షి ఉంది. ఏనుగుకి ఇష్టమైనది ఉంది. త్రిమూర్తుల్లో ఇద్దరు నాతో ఉంటారు. ఒకరు బల్లి రూపంలో ఉంటే , మరొకరు మట్టి రూపంలో ఉంటారు .కథ కంచికి వెళ్ళింది ఇంటికి వెళదాం అనే నానుడి నేను ఉన్న చోటు చెబుతుంది.
అనేసరికి ఒకటికి రెండుసార్లు చదివారు. అర్థమై అర్థం కాకపోవడంతో అందరూ బిక్క మొహాలు వేసుకున్నారు.. అప్పుడు రుద్ర స్వామి ఉన్నట్టుండి…. కళ్ళు కామంతో ఉంటాయి అంటే కామాక్షి అయి ఉండాలి . ఆవిడ కామంతో ఉంటుంది . కోరికతో ఉంటుంది అంటారు… చూపుతోనే కోరిక తీరుస్తుంది…. కామం అంటే శృంగారం కాదు… కామం అంటే కోరిక . కళ్ళతోనే కోరిక తీర్చగలిగే శక్తి కాబట్టి కామాక్షి అయి ఉండాలి …కథ కంచికి మనం ఇంటికి వెళదామంటే కంచిలోనే కామాక్షి ఉంటుంది . కంచి కామాక్షి గురించి చెబుతూ ఉండాలి…. చేతిలో ధర్మ పక్షి ఉంటుంది… అంటే ధర్మ పక్షి అంటే పాతివ్రత్య ధర్మమును పాటించే పక్షి…..పాతివ్రత్యం ధర్మమును పాటించే పక్షి చిలుక ఉంటుంది . అందుకే రాముడు పాతివ్రత్య ధర్మంతో ఉన్నాడు కాబట్టి రాముడికి అనుసంధానంగా రామచిలుక అనడం జరిగింది.. రామచిలుక కూడా పాతివ్రత్య ధర్మమును పాటిస్తుంది. తన జంటలో మగ పక్షి కానీ…. ఆడ పక్షి కానీ…. చనిపోతే ఇంకొక చిలకతో అవి జతకట్టవు. బతికినంత కాలం ఒంటరిగా ఉంటాయని పక్షి శాస్త్రం చెప్పడం జరిగింది. రామచిలక ఉన్నది కాబట్టి రాముడికి ప్రతీకగా చెబుతారు ….నాకు తెలిసి కామాక్షి అమ్మవారి చేతిలో రామచిలుక ఉంటుంది…. అలాగే మీనాక్షి చేతిలో కూడా రామచిలుక ఉంటుంది …దాంట్లో చూస్తే కదా కంచికి అంటే కామాక్షి అయి ఉండాలి అని అనుకుంటూ …..ఏనుగు కి ఇష్టమైనది ఉంది అంటే …ఈ ఏనుగుకి ఇష్టమైనది ఏమై ఉంటుంది….. అనగానే ఉండ్రాళ్ళు, చెరుకు గెడలు. ఉండ్రాళ్ళు గణపతి తింటాడు…. ఏనుగు ఏమో చెరుకు గెడలు తింటుంది…. కామాక్షి చేతిలో చెరుకు గెడ ఉంటుంది కాబట్టి…. అది చెరుకు గెడ అయ్యి ఉంటుంది… త్రిమూర్తులలో నాతో ఇద్దరు ఉంటారు అనేసరికి…. అక్కడ శివకంచి, దేవికంచి, విష్ణు కంచి అని చెప్పి మూడు కంచిలు ఉన్నాయి అనేసరికి అలాగే విష్ణు కంచిలో రెండు బల్లులు ఉంటాయి… వెండి బల్లి, బంగారు బల్లి. వీటిని తాకితే బల్లి దోషాలు పోతాయని స్థల పురాణం చెబుతోంది కదా! అనేసరికి….. అలాగే శివుడు ఏకాంబరీశ్వరుడు గా మట్టి రూపంలో ఉంటాడు…అందుకని ఇది దానికి సరిపోతుంది….. అనేసరికి పద్మాసనంలోనే అమ్మవారు ఉంటుంది కదా! అని చెప్పి అనేసరికి అవును ఇవన్నీ కూడా కంచి కామాక్షికి సరిపోతున్నాయి అనేసరికి….. అది నిజమా కాదా అని చెప్పేసి అప్పటికే ధ్యాన నిష్ఠలోకి శివ నందిని వెళ్లిపోయేసరికి ….ధ్యానంలో మొదట లలితాదేవి ఆ తర్వాత రాజరాజేశ్వరి వీరిద్దరూ కలిసిపోయి కంచి కామాక్షి దేవి పద్మాసనంలో కూర్చున్నట్టు కనిపించింది . అలాగే మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి కనబడి వీళ్ళిద్దరూ అనుసంధానం అయ్యి కంచి కామాక్షి కనిపించింది. చివరాఖరికి కనిపించేసరికి మొదటి వరుసలో మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి… ఆ తరువాత రాజరాజేశ్వరి, లలిత మధ్యలో కంచి కామాక్షి పంచమూర్తులుగా దేవి పంచాయితనంగా లీలగా కనిపించేసరికి….అనగా కామాక్షిలో ఈ నాలుగు శక్తిదేవతలు ఉంటారు… నిజానికి తనకి ధ్యానంలో మధుర మీనాక్షి దేవి, విశాలాక్షి దేవిని నించొని కనపడితే…. కూర్చున్న భంగిమలో లలితాదేవి, రాజరాజేశ్వరి దేవి కనిపించారు. అంటే కూర్చున్న ప్రకృతి నించున్న ప్రకృతి అనుసంధానం కంచి కామాక్షి చేస్తుంది. మూలశక్తి ఈ కంచి కామాక్షికి ఉన్నట్టు ఉంది…. అందుకనే మూలాధార చక్రం జాగృతికి ఈ కంచిని ప్రకృతి ఎంచుకున్నట్లుగా ఉన్నది…. అనుకునేసరికి ధ్యాన భంగం అయింది… తనకి కంచి కామాక్షి ఏ విధంగా కనపడిందో… అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసరికి సరే అమ్మ! ఇక మనకి మూలధార చక్రం జాగృతికి కంచి క్షేత్రం అని తెలిసింది కదా! ఇప్పుడు కంచి క్షేత్రానికి మనం బయలుదేరదాము… చివరాఖరిగా వెంకన్న స్వామి దర్శనం చేసుకుని…..ఆయన అనుమతి తీసుకుని… ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్దాము… అని రుద్ర స్వామి అనేసరికి సరే…. ఆఖరి దర్శనం కదా ! అని ఇంక శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి… భు వరాహస్వామిని దర్శనం చేసుకుని…. శ్రీవారి దర్శనానికి సాధనా కుటుంబం అంతా బయలుదేరడం జరిగింది…
ఇలా సాధనా కుటుంబం అంతా స్వామివారి దర్శనానికి అని క్యూలో నిలబడడం జరిగింది. ఆ రోజు క్యూలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అనుకున్నారు .దర్శనానికి సుమారుగా 12 గంటల పైగా పట్టింది. వెండి వాకిలి వచ్చేసరికి భక్తుల తాకిడికి ఊపిరి కూడా ఆడనంతగా ఒత్తిడిలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ కూడా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి దగ్గరికి వస్తూ ఉండగా….. ఆ భక్తులను దాటుకొని విడిగా కాస్త మూలగా ఉండి స్వామివారిని…. దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారి విగ్రహ మూర్తిని…. ధ్రువ మూర్తిని చూస్తూ అలా ఉండిపోయింది…. కళ్ళు మూసుకొని చూసేసరికి….. స్వామివారి విగ్రహ మూర్తి కాస్త సజీవ మూర్తిగా విష్ణుమూర్తిగా….. పురుషురూపం కనిపించేసరికి….. అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆయనలో శివుని రూపం కనిపించింది…. ఆ తర్వాత కొన్ని క్షణాలకి అమ్మవారి రూపం కనిపించింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మూడు తలలు ఉన్నట్టుగా ఒకవైపు కుడివైపు ఏమో శివుడి తల, ఎడమవైపు అమ్మవారి తల, మధ్యలో ఆయన ఉన్నట్టుగా త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయ స్వామిగా వెంకన్న దత్తగా కనిపించేసరికి….. కళ్ళు నలుపుకొని చూసుకునేసరికి…. ఆయన సజీవ మూర్తిగా మూడు తలలతో ఉన్నట్టుగా కనిపించేసరికి…. ఆశ్చర్య ఆనందాలు పొందుతూ….. అంటే తనలో శివతత్వం, విష్ణు తత్వం, అమ్మవారి తత్వం ఉందని చెప్పకనే చెబుతున్నారు…. అనేసరికి ఈ మూడు తత్వాలు కలిసి వెంకటేశ్వర స్వామిగా సజీవ మూర్తిగా కనిపించడం….. ఆ తరువాత ఉన్నట్టుండి సాధనా శివమూర్తిగా రూపం, నామం లేని సాధనా విగ్రహ మూర్తి సజీవ మూర్తిగా ధ్యానంలో కనిపించేసరికి….. పద్మాసనంలో వేసుకుని కూర్చున్నట్లుగా కనిపించింది…. అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పలేము… శివుడని చెప్పలేము…. విష్ణు మూర్తి అని చెప్పలేము…. అమ్మవారు అని చెప్పలేము …. పద్మాసనం వేసుకుని సాధన చేస్తున్న స్త్రీ పురుషులు కానీ స్థితిలో…. నామరూపాలు లేని స్థితిలో ఉన్న సజీవ మూర్తిగా ఆయన లీలామాత్రంగా కనిపించారు. ఉన్నట్టుండి జ్ఞానస్పూర్ణ అందుతూ ఉండగా ఉన్నట్టుండి ఆ పక్కనే ఉన్న అక్కడ జ్యోతి నుంచి ఒక నిప్పురవ్వ సజీవ మూర్తిని తాకి తాకగానే సజీవమూర్తి జ్వాలాగ్నిలో దహనం అవుతూ ఉండేసరికి పరమాహంసకి ధ్యానంలో చిట్టచివరి దేహం అయిన లింగ దేహం కూడా …..శివుడి యొక్క లింగ దేహం కూడా జ్వాలాగ్నిలో దహనం అయినట్టు… ఎలా కనిపించిందో, అలా సాధనా విగ్రహ మూర్తి కూడా లీనమవుతూ కనిపిస్తూ ఉండేసరికి…. సాధన శరీరం కాస్త కారుంగళి శివలింగంలాగా కనిపించింది…. దీనికి పానమట్టం ఉన్నట్లుగా కనిపించింది …ఉన్నట్టుండి ఈ శివలింగం కూడా తన చుట్టూ తాను తిరుగుతూ….. ఉండేసరికి పానవట్టం కాస్త విరిగిపోయి పానవట్టం లేని శివలింగంలాగా కనపడుతూ….. ఆ శివలింగం కూడా అగ్నికి దహనం అయిపోతూ విస్పోటనం చెందడం జరిగింది . అణువులుగా ,పరమాణువులుగా, రేణువులుగా వివిధ వర్ణాలు నలుపు, తెలుపు ,నీలం, పసుపు ,ఆకుపచ్చ వర్ణాలుగా….. కారుంగలి శివలింగం దహనం అయిపోతూ ఉండేసరికి ఇదంతా కూడా శూన్యంలో శూన్యం అయ్యింది. విశ్వశూన్యంలో అంతిమ దైవిక వస్తువు అయిన కారుంగలీ శివలింగం కూడా శూన్యం అయిపోవడం…. అక్కడ ఎలాంటి విగ్రహ మూర్తి కనిపించకపోయేసరికి….. లేని స్థితిగా కనిపించింది. అంటే ఇన్నాళ్ళు ఉన్నది లేనట్లుగా…. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది అని తెలిసింది. నిజానికి అక్కడ ఏమీ లేదని…. ఇదే సత్యం అని ఇదే నిత్యం అని ….జ్ఞాన స్పురణ శివ నందినికి అందింది. అంటే ఇన్నాళ్లు సజీవ మూర్తిగా ఉన్నట్లుగా భ్రమ, బ్రాంతి కలిగిస్తున్నది…. నిజం కాదన్నమాట! కనిపించనిది సత్యము… కనిపించేది అసత్యము… అని ఇదే నిజసత్య జ్ఞానం అన్నమాట… అని చెప్పేసి అనుకునేసరికి…. ఉందో లేదో తెలియని పూర్ణ శూన్య స్థితి… ఈ గది అంతా ఆవరించి ఉంది అన్నట్లుగా…. అది ఉందో లేదో కూడా మనం చెప్పలేము అని అనుకుంటూ ….ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి…. మళ్ళీ యధావిధిగా వెంకన్న స్వామి మూర్తి లీలగా కనిపించేసరికి స్వామి! నీ లీలా విన్యాసం ద్వారా మూలతత్వం ఏమిటి? అనేది నాకు అర్థమై అర్థం కానట్లుగా చూపించావు… నేను అనుభవ అనుభూతి పొందితే గానీ విషయ జ్ఞానం పూర్తిగా అర్థం కాదు… పదార్థం దాటితే కానీ యదార్థం అర్థం కాదు… యదార్థం తెలియదని చెప్పకనే చెప్పావు… జ్ఞానంతోనే నేను సాధన పరిసమాప్తి చేసుకోవడానికి మనోధైర్యం…. నీ ఆశీస్సులు నాకు ప్రసాదించు… అని అనుకుంటూ ఉండేసరికి వరద ముద్ర నుంచి ఒక దివ్య జ్యోతి తనలోకి భ్రుకుటి స్థానం ద్వారా సహస్రంలోకి ప్రవేశించగానే ….అప్పటిదాకా మూసుకొని ఉన్న సహస్ర కమలం కాస్త వెయ్యి రేకులతో విప్పుకొని…. అందులో మధ్య భాగంలోనికి ఈ దివ్య జ్యోతి ప్రవేశించేసరికి…. ఇదే పరంజ్యోతి దర్శనం అనుకుంటా సహస్ర చక్రంలో పరంజ్యోతి దర్శనం అవుతుందని…. పరమాహంస చెప్పింది దీని గురించే కాబోలు …..అని అఖిలాండకోటి బ్రహ్మాండనాయక….. రాజాధిరాజా యోగి రాజా ….శ్రీ వెంకటేశ్వర స్వామి పరంజ్యోతి స్వరూపంలో…. ప్రతి జీవుడి యొక్క సహస్రారంలో ఆవాసం చేస్తూ ఉంటాడని…. జీవుడే శివుడని…. జీవుడే విష్ణువని …జీవుడే అమ్మవారిని…. ఎవరి రూపం బట్టి వారు… ఎవరి భావం బట్టి వారు తెలుసుకోవాలని చెప్పేసి యద్భావం తద్భవతి అని గ్రహించడానికి… శివ నందినికి అట్టే సమయం పట్టలేదు . తనలోనికి వెంకన్న ఆత్మ కాస్త ప్రవేశించింది అని గ్రహించి…. కృతజ్ఞతలు చెప్పుకొని సజీవ మూర్తిగా ఉన్న వెంకన్న స్వామి విగ్రహం మూర్తిని మనసారా… హృదయపూర్వకంగా సర్వస్య శరణాగతితో పాదాభివందనాలు చేసుకొని…. నమస్కారాలు చేసుకొని…. ఇక నేను నా మూలధార చక్ర జాగృతి కోసం సాధనమూర్తి ఇచ్చిన ఆధారం ప్రకారం కంచి క్షేత్రమునకు వెళ్లడం జరుగుతుంది ….
ఈ తిరుమల క్షేత్రానికి…. మళ్ళీ వస్తానో …రానో కూడా తెలియదు. ఎక్కడ ఉన్నా ….వచ్చినా రాకపోయినా …నీ ఆశీస్సులు పరంజ్యోతి స్వరూపంగా ….నాలో నిక్షిప్తం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను… అందుకు ధన్యోస్మి స్వామి! నీ అపార కరుణ నాయందు చూపించావు… సాధన పరిసమాప్తికి మనోధైర్యం ఇచ్చావు…. ఇంకా నీ దగ్గర ఉన్న సప్త భక్తులు కూడా వారి వారి దైవిక శక్తుల అనుగ్రహంగా ప్రసాదించడం జరిగింది. ఇదంతా నీ లీలా విన్యాసం…. ఇది నాకు నీతో చెప్పడానికి వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు…. వర్ణాతీతం నాకు తెలియని అతీతమైన ఆనంద స్థితిని పొందుతున్నాను…. అని నీ దర్శనం పొందగానే తెలియని ఆనంద స్థితి కలుగుతుంది అని….. స్థల పురాణం చెప్పటం అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను…. అందుకే నువ్వు ఉండే నిలయమే ఆనంద నిలయం అని….స్థల పురాణం చెప్పిందనుకుంట… అనుకుంటూ ఆయన్ని పరి విధాలుగా కొనియాడుతూ ….ఇక సెలవు తీసుకుంటున్నాము స్వామి! ఈరోజు రాత్రి మేము అమ్మవారి క్షేత్రం అయిన కామాక్షి ఉండే కంచి క్షేత్రానికి బయలుదేరుతున్నాము….. ఇంక సెలవు స్వామి… ఉంటాను స్వామి…. నీ కృపను నామీద చూపించినందుకు ధన్యవాదాలు…అని చెప్పేసి మీ కరుణాకటాక్షాలు నామీద చూపించినందుకు కృతజ్ఞతలు స్వామి…. నీ అనుగ్రహం పొందినందుకు కృతజ్ఞతలు అని అనుకుంటూ…. ఉండగా స్వామి నిన్ను నిజరూప దర్శనం నేను పొందలేకపోయాను….అది ఒకటే నాకు బాధగా అనిపించింది …..నీతో సంభాషించాలి హాథిరాం బాబా లాగా మీ సాంగత్యమును పొందాలని …..మీకు స్పర్శ పొందాలని అనుకున్నాను…. కానీ ఆ ఒక్క లోటే నాకు తీరలేదు ….అది కూడా తీరిపోయి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉండేసరికి….. వెంకన్న విగ్రహ మూర్తి కాస్త గోపాలస్వామిగా సజీవ మూర్తిగా కనిపించేసరికి… నోట మాట రాలేదు. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే వెంకన్న స్వామిగా రూపం ఎత్తి నా దగ్గరకి వచ్చి చేతి ముద్రలు సాధనా విధి విధానం అభ్యాసం తన చేత స్వయంగా చేయించాడా….. అంటే గోపాల స్వామి యే వెంకటేశ్వర స్వామి యా…..అంటే ఆయననీ నేను సజీవ మూర్తిగా చూశానా…..అని అనుకుంటూ స్వామి ఈ కోరిక కూడా తీర్చావా…. మనసులో ఏ కోరిక అయితే ఉన్నదో…. ఆ కోరికను కూడా నువ్వు తీర్చేసావా…. నేను గ్రహించలేదా… నేను గుర్తుపట్టలేదా…. నేను ఎంత మూర్ఖురాలిని…. అవును స్వామి ! నువ్వు చెప్పావు నువ్వు గోపాలస్వామి అని చెప్పావు…. మీ భార్య పేరు మహాలక్ష్మి అని చెప్పావు…. ఆవిడ మాయ పెడుతుందని చెప్పావు….. కానీ నేను అలివేలు మంగతాయారు అను పద్మావతి అనే ఆలోచనలో ఉన్నాను… మీ పేరు వెంకటేశ్వర స్వామి కదా అనుకున్నాను… గోవిందుడు అని మీ పేరు ఉంటుంది అనుకున్నాను… కానీ బాలగోపాల స్వామి అన్న , వేణుగోపాల స్వామి అన్న, నీ అంశయే కదా…. నా మూఢ భక్తి, నా మూర్ఖత్వానికి, నా అజ్ఞానానికి తెలియలేదు స్వామి… అర్థం కాలేదు…. అర్థం అయ్యేటట్టుగా చేసి ఉంటే….. నేను స్పర్శానందాన్ని పొందే దానిని కదా స్వామి…. సరే స్వామి నీ పాదాలు నేను తాకాను…
ఆ స్పర్శ ఆనందాన్ని… కూడా నువ్వు అనుగ్రహించావు… ఇప్పుడు అంతా తెలుస్తుంది స్వామి…. నువ్వు నా వెంట ఉన్నావు. ఈ తిరుపతి యాత్ర మొదలైన దగ్గర నుంచి పూర్తి అయ్యేదాకా నువ్వు నా వెంట ఉన్నావు…. అని నాకు అర్థం అయింది . వివిధ శక్తులు రూపంలో నువ్వే ఉన్నావు… నువ్వు కానిది ఏదీ లేదు కదా! నువ్వు లేనిది ఏదీ లేదు కదా ! అండ పిండ బ్రహ్మాండాల….కి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివి…. నువ్వు కానిది ఏముంది…. యత్భావం తద్భవతి. శివుడు అంటే శివుడిగా ఉంటావు…. విష్ణువు అంటే విష్ణువుగా ఉంటావు… అమ్మవారి అంటే అమ్మవారిగా ఉంటావు…. గురువు అంటే గురువుగా ఉంటావు…. ఎలా కావాలంటే అలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పిలిస్తే పలుకుతావు… నువ్వు పిలిస్తే పలికే దైవం అని నిరూపణ చేశావు…. ధన్యోస్మి స్వామి…. ఉంటాను స్వామి అని ఆపుకోలేని ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ బయటకు వచ్చేసి ఉండబట్టలేక ఏడుస్తూ ఉండేసరికి….. ఈ విషయం గ్రహించిన రుద్ర స్వామి మహాదేవి మౌనంగా ఉండేసరికి పిల్లలు మాత్రం, అర్థం కాక వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ఆ తరువాత దాదాపు ఒక అరగంటసేపు వస్తున్న కన్నీటిధారలను ఆపుకుంటూ శివ నందిని మామూలు స్థితికి వచ్చింది. ఆ తర్వాత రుద్ర స్వామికి తనకి కలిగిన జ్ఞాన స్ఫురణ మహాదేవికి రుద్ర స్వామికి చెప్పేసరికి ……వాళ్లు కంటి వెంట కన్నీరు వచ్చింది. పిల్లలకి అర్థమై అర్థం కానట్టుగా ఉండి అమ్మ! నీకు వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం ఇచ్చారు… అది అర్థం అవుతుంది… మనం సాధనా విగ్రహ మూర్తి చెప్పినట్టు కంచి క్షేత్రానికి బయలుదేరుదాము… అనేసరికి సరే అని వాళ్ళు తిరుమల నుంచి కిందకు వచ్చి తిరుపతిలో బస్టాండ్ లో కంచి క్షేత్రానికి వెళ్లే బస్సు ఎక్కడం జరిగింది… తిరుపతి నుంచి కంచికి 80 కిలోమీటర్ల దూరం ఉంటుందని వీళ్ళు తెలుసుకున్నారు….ఆ తర్వాత వాళ్ళు కంచి బస్సులో ప్రయాణం చేయడం ఆరంభించారు.
శుభం భూయాత్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి