మణిపూరక చక్రము (115)

 మణిపూరక చక్రము 


ద్రాక్షారామ క్షేత్రం - మాణిక్యాంబ అమ్మ



సాధన కుటుంబం అంతా శ్రీలంక దేశం నుండి విశాఖపట్నం రావడానికి సముద్రయానం ద్వారా నౌకాయానం చేస్తూ రావడానికి…. సుమారుగా 20 రోజుల పైనే పట్టింది. ఆ తర్వాత వీళ్లంతా కూడా విశాఖపట్నం ఓడరేవుకి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని… రాజమండ్రి వెళ్ళటానికి విమానంలో వెళ్లాలని నిశ్చయం చేసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. విమానాశ్రయానికి చేరుకోగానే పిల్లలు అప్పటిదాకా విమానాలను బొమ్మ విమానాలు చూడటం… వాటితో ఆడుకోవడమే చేశారు. నిజంగానే విమానాలు తమకళ్ళ ముందే దిగటం… తిరగటం చూసి పిల్లలిద్దరూ ఆశ్చర్య ఆనందాలకి గురయ్యారు. రుద్ర స్వామి మరియు మహాదేవి అమ్మ ఇప్పుడు ఎందుకు అంత ఖర్చు పెట్టి విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది? ఏ బస్సుకో… ట్రైన్ కో వెళ్తే సరిపోతుంది కదా!  అంటే అయ్యా!  మనం కోరికలు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు…. ఆర్థిక ఇబ్బందులతో కోరికలు తీర్చుకోలేకపోయాము. కనీసం పిల్లల కోరికలైనా తీరుద్దాము. పిల్లలు ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ విమాన కోరిక తీరిస్తే సరిపోతుంది అని నాకు అనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏముంది…. ఒక గంటలో మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రి కి చేరుకుంటాము.  అదే బస్సు ప్రయాణంలో గాని రైలు ప్రయాణంలో కానీ చేస్తే ఒకరోజు పడుతుంది అనేసరికి…. రోజు పట్టిన పర్వాలేదమ్మా. ఇప్పుడు అంత ఖర్చు పెట్టడం అవసరమా? అనేసరికి డబ్బులు ఏముంది? ఇవాళ వస్తుంది…రేపు పోతుంది….ఉన్నప్పుడే మనతో పాటు పిల్లలు కూడా సంతోషంగా గడుపుతారు. వాళ్ళ ఆనందం చూడండి… ఇప్పటిదాకా బొమ్మలుగా చూసిన విమానాలను నిజంగా చూసేసరికి వాళ్లకి అలవికాని ఆనందం కలుగుతుంది…. ఆ ఆనందం చూడటానికి…. పొందటానికి మనం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన దొరకదు కదా!  అనేసరికి సరే తల్లి నీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి…!  పిల్లలు ముచ్చట నేను ఎందుకు కాదనాలి మీ ఇష్టం ….! విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రాజమండ్రి కి చేరుకోవడానికి విమానంలో వీళ్ళకి గంటన్నర సమయం పట్టింది. విమానంలో పిల్లలు కూర్చొని ఆకాశం కేసి విమానం యొక్క కిటికీల దగ్గర నుంచి  చూస్తూ…. దగ్గరగా మేఘాలు ఉండటం గమనించి… అమిత ఆనందాలు పొందారు.  అలాగే సూర్యోదయం దగ్గరగా చూస్తూ…. సూర్యుణ్ణి దగ్గరగా చూస్తున్న అనుభవం అనుభూతి పొందారు. మాటల్లో చెప్పలేని ఆనందం, సంతోషం పొందుతూ…. శివ నందినికి బుగ్గ మీద ముద్దులు పెట్టి పిల్లలిద్దరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. వీళ్లిద్దరి సంతోషాన్ని చూస్తూ అలవి కానీ అతీతమైన ఆనంద స్థితికి వెళ్ళిపోయారు.  ఆ తరువాత విమానం కాస్త రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుందని అనౌన్స్మెంట్ రావటంతో…. తామంతా కూడా సురక్షితంగా దిగటం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రికి మూడు గంటల దూరంలో ద్రాక్షారామం ఉందని తెలుసుకొని….బస్సు ప్రయాణం చేయడం జరిగింది. బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో బాలగణపతి కాస్త శివ నందినితో…


బాల గణపతి:- అమ్మ.!  మాకు  ద్రాక్షారామ క్షేత్రం గురించి మాణిక్యాంబ అమ్మవారి గురించి చెప్పవా ?


అని పిల్లలు అడిగేసరికి…. అప్పటికే ఈ క్షేత్రానికి సంబంధించిన వివరాలు, స్థల పురాణాలు, చూడవలసిన ప్రదేశాలు, వీటికి సంబంధించిన వివరాలు… శివ నందిని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని…. వాటిని గుర్తు పెట్టుకొని ఉండటంతో …శివనందిని వాటి గురించి చెప్పడం జరిగింది.


శివనందిని:- ద్రాక్షారామం మనకి పంచరామాలలో రెండవది అయిన భీమశంకరుని శివాలయం, అష్టాదశ శక్తిపీఠమైన 12వ దైన మాణిక్యాంబ దేవి ఆలయాలు ఉంటాయి.  దీనిని దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుంది. అయితే పంచరామాలు ఎలా ఏర్పడ్డాయి?  అని విచారణ చేస్తే పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.  ఇతడు శివుని ద్వారా రెండు వరాలు పొందాలి అని తీవ్రమైన ధ్యానతపస్సు  చేయటం జరిగింది. ఈ తపస్సుకు  శివుడు ప్రత్యక్షమై… వరం అడుగగా…. అతను మొదటి వరంగా తనకి అమృత లింగం ప్రసాదించమని…. తనకి మరణం శివుని యొక్క కుమారుని చేతనే జరగాలి అని కాకపోతే అయోనిజ అంటే… స్త్రీ గర్భంలో జన్మించని వాడి చేతనే తన మరణం జరగాలని చెప్పేసి వరం కోరుకోవడం జరిగింది. శివుడు తధాస్తు అని చెప్పి వరాలు ఇచ్చి అంతర్ధానం అవ్వడం జరిగింది.


ఈ వరాల ప్రభావంతో గర్వాహంకారాలకు లోనయ్యి… ఈ తారకాసురుడు దేవతలను, మునులను, ముల్లోకాలలో ఉన్న వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేసరికి… దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి కాస్త, తారకాసురుని మెడలో ఉన్న అమృత లింగమును భేదించాలి. ఇది జరగాలి అంటే శివుని యొక్క కుమారుని వలనే జరుగుతుంది. కాబట్టి శివునికి, పార్వతీదేవికి మధ్య సంతానం కలిగేటట్లుగా చేయాలి అని చెప్పేసరికి…. ధ్యాన తపస్సులో ఉన్న మహాశివుని మీద మన్మధుని సహాయంతో కామ వికారాలు కలిగించడం…. తద్వారా శివుడికి కోపానికి మన్మధుడు భస్మం అవడం…. ఆ తర్వాత అనుకొని పరిస్థితులలో పార్వతీదేవి మోహమాయకు శివుడు క్షణకాలం పాటు గురికావడంతో….. శివుడి యొక్క వీర్య స్ఖలనం జరగడం…. ఆ వీర్యం యొక్క శక్తిని పార్వతీదేవి భరించలేక పోవడంతో…. అది కాస్త భూమి మీద వదిలేస్తూ ఉండేసరికి…అగ్నిదేవుడు వీర్యమును తీసుకోవడం జరిగింది. అగ్నిదేవుడు కూడా ఆ వీర్యమును భరించలేకపోవటంతో… నీటిలో వదిలిపెట్టేయాలని అనుకునేసరికి… గంగాదేవి తీసుకోవడం జరిగింది. గంగాదేవి దగ్గరికి వచ్చేసరికి ఈ వీర్యం కాస్త పిండం గా మారింది. ఈ పిండమును కూడా ఆవిడ భరించలేక పోవడంతో… భూమి మీద వదిలేయడం జరిగింది. ఆ పిండం కాస్త కుమారస్వామి పసిరూపంగా మారడం జరిగింది. ఆ పిల్లవాడిని సప్తమాతృకలు పెంచి పోషించడం జరిగింది. ఈ విధంగా పెంచి పోషించిన పిల్లవాడే కుమారస్వామి అన్నమాట! ఈ విధంగా కుమారస్వామి జననం జరిగింది.  ఆ తర్వాత ఈ కుమారస్వామి దేవతలకు సైన్యాధ్యక్షుడిగా ఉండి తారకాసుడి మీదకి యుద్ధం చేయటంతో …. తారకాసురుడి దగ్గర ఉన్న అమృత లింగమును బేధన చేయడంతో….  అది కాస్త ఐదు ముక్కలుగా పడటం జరిగింది. ఆ ఐదు ముక్కలు కూడా పంచరామాలుగా ఏర్పడడం జరిగింది. విచిత్రం ఏమిటంటే….ఈ లింగాలు సుమారుగా 14 అడుగుల చొప్పున రెండు అంతస్తులలో ఈ పంచరామాలు ఉండటం జరిగింది. ఇప్పుడు మనం వెళుతున్న ద్రాక్షారామము రెండవ పంచరామం అన్నమాట!


ఇక్కడ ఉన్న శివలింగమును సూర్యుడు ప్రతిష్ట చేశాడు అని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఉన్న శివలింగంను భీమ శంకర శివలింగం అంటారు. చోళులలో భీముడు అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మానం చేయడం జరిగింది అని చెప్పేసి చెబుతారు. అలాగే ఈ శివలింగం మీద సూర్యకాంతి ప్రతిరోజు ఉదయం పడుతుంది. ఈ సూర్య కాంతి పడినప్పుడు…. ఈ శివలింగం మీద నల్లని చారికలు సుస్పష్టంగా కనపడతాయి. ఈ నల్లని చారికలు పులి చర్మం ధరించిన శివుని గుర్తు చేస్తాయి. ఎందుకు అంటే పులి చర్మమును ధరించి ఒక ఆటవిక యువకుని రూపంలో అర్జునుడికి దర్శనం ఇచ్చి… అతనితో యుద్ధం చేశారని  మనకి స్థల పురాణం చెప్పడం జరిగింది. ఇక్కడే మనకి, ఈ అడవుల్లోనే ,పులి సంహారం జరిగినప్పుడు దానిని ఆయన అంగ వస్త్రంగా పెట్టుకున్నారు అని చెప్పేసి స్థానికుల నమ్మకం. యోగులు సాధన చేసేటప్పుడు పులి యొక్క ధ్యాన అనుభవాలు, పులి సంహారం విధివిధానాలు… సుస్పష్టంగా ధ్యానఅనుభవాలు అవుతాయని చెప్పేసి కొంతమంది యోగ సాధకులు అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అలాగే సతీదేవి తండ్రి, మహాశివుడి మామగారైన దక్షుడు…. ఈ ప్రాంతానికి తన భోగ విలాసాల కోసం వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండటం జరిగిందని…. అందుకని దీనిని దక్షారామం అని అంటారని …..ద్రాక్షారామం కాదు అని నానుడి ఉన్నది. అలాగే ఇక్కడ సతి దేవి ఖండిత భాగాలలో ఎడమ చెంప పడింది అని…. ఇక్కడ ఉన్న అమ్మవారికి సంబంధించిన రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి అని….. ఒక బ్రాహ్మణ వితంతువు తన కూతురు చనిపోయిన తరువాత ఆమె జ్ఞాపకార్థం ఒక బంగారపు విగ్రహం చేయించుకొని దానికి పూజలు చేస్తూ ఉండేది. ఈ పూజ ఫలితం  వల్లనో ఏమో తెలీదు గాని ఈ విగ్రహ మూర్తి మాట్లాడడం జరిగింది.  ఈ విగ్రహ మూర్తికి ఆ బ్రాహ్మణ వితంతువు రత్నాలు, మణిమాణిక్యాలు ఆభరణాలుగా వేస్తూ ఉండేది. దానివల్ల ఈ విగ్రహ మూర్తి కి మాణిక్యాంబ అని పేరు పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉండేది. ఆ తర్వాత విషయం తెలిసి ఆ ప్రాంతంలోని ఆ రాజు విగ్రహాన్ని తనతో పాటు తీసుకువెళ్లి ఈ మాట్లాడే విగ్రహాన్ని తన కులదేవతగా పెట్టి ఆరాధన చేయడం జరిగింది.


ఈ ఆరాధన విగ్రహమే తర్వాత కాలంలో మాణిక్యాంబగా వెలసింది. ఈ కథ ఒకటి ప్రచారంలో ఉంది.  మరొక స్థల పురాణం ప్రకారం…. మాణిక్యంబాదేవి ఒక వేశ్య కూతురు. ఈమెతో భోగ విలాసాలు అనుభవించాలి అని చాలామంది విటులు వస్తూ ఉండేవాళ్లు… కానీ, ఈమె వాళ్లకి ఎలాంటి అవకాశం ఇచ్చేది కాదు.  ఎందుకు అంటే ఒకరోజు ఈమెకి భీమశంకరుడు సజీవ మూర్తిగా కనిపించేసరికి….. శివుడే తన భర్త అని…. శివసాంగత్యం కోసమే తన జీవితం ఉన్నది అని…. శివుడినే పెళ్లి చేసుకుంటాను అని…. శివుడికి నిత్య పూజలు చేస్తూ, తపస్సు చేస్తూ ఉండేది. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షంగా కనపడి….శివుడు ఆమెని వివాహం చేసుకోవడం జరిగింది అని…. అప్పటినుంచి ఆవిడ మాణిక్యంబాదేవిగా శివుడి భార్యగా ప్రచారం పొందింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి నిదర్శనంగా ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడ ఉన్న భీమశంకరుడిని పవళింపు సేవ అని కొండ ప్రాంతం నుంచి కాకుండా కింద ఉన్న వేశ్య వాటికకి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే…. భోగంలో కోరికలను అలాగే యోగంలో కోరికలను ఏకకాలంలో తీర్చగల క్షేత్రము అన్నమాట! అలాగే కామకోరికలు తీర్చుకుంటూ ఉండచ్చు…. అలాగే చిట్ట చివరికి మోక్షమును ఈ క్షేత్రం ఇస్తుంది అని చెప్పేసి వేద వ్యాసుడు,అగస్త్యమహాముని, సప్త ఋషులు లాంటి వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి ఆరాధన చేసి అనుభవాలు పొందడం జరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు….. అలాగే దాంపత్య జీవితంలో సమస్యలు మరియు పర స్త్రీ లేదా పర పురుష వ్యామోహం ఉన్నవాళ్లు…. ఇలాంటి వివాహ సంబంధ  దోషాలు ఉన్నవాళ్లు, ఈ క్షేత్రంలో ఉన్న భీమశంకరునికి అభిషేకం చేసిన యెడల అలాగే అమ్మవారిని దర్శించుకుని పూజ చేసిన ఎడల ఈ దోషాలన్నీ తొలగిపోయి…. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన జీవితం కలుగుతుంది.  భోగ జీవిత కోరికలు తీరుతాయని స్థల పురాణం చెప్పడం జరిగింది. 


అలాగే ఇక్కడ ఉన్న మాణిక్యంబాదేవి అమ్మవారి చూపు ఎడమవైపు ఉంటుంది. అమ్మవారి పాదము శ్రీ చక్రం మీద ఉంటుంది. ఇక్కడ పూర్వకాలంలో అమ్మ వారిని వామాచారంలో ఆరాధన చేసేవారు అని స్థల పురాణం చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న భీమశంకరుడు మనకి రెండు అంతస్తులలో కనపడతాడు. ప్రధమ అంతస్తులో పాదభాగం ఉంటుంది… రెండవ అంతస్తులు పై భాగం ఉంటుంది.  పైభాగం తెల్లగాను, పాదభాగం నల్లగానూ మనకి కనిపిస్తుంది. పాద భాగంలో పీఠ భాగం ఉంటే ….పై భాగంలో లింగభాగం ఉంటుంది.  దీనిలో ఈ పైన రెండో అంతస్తు నుంచి పూజాదికాలు, అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు.  ఈ పాద భాగంలో ఒక రహస్యం ఉన్నది. అది ఏమిటంటే….ఈ పాద భాగంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఒక స్తంభం కనబడుతుంది. ఆ స్తంభం మీద పంచపడగలు ఉన్న ఒక పాము కనిపిస్తుంది. దీనికి నాగ స్తంభం అంటారు. ఈ స్తంభం అనేది ఆలయ పూజారుల అభిప్రాయం ప్రకారం…. పునాది రాయిగాను., శంకుస్థాపన రాయిగాను చెప్పడం జరుగుతుంది. గృహ నిర్మాణ సమయంలో వచ్చే ఆటంకాలు, అవాంతరాలు అన్నీ కూడా ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ తొలగిపోతాయి అని…. నివారణ అవుతాయి అని స్థానికుల అభిప్రాయం. అలాగే కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ స్తంభానికి ఉన్న పంచముఖ నాగ పడగలను దర్శనం చేసుకున్నట్లయితే… అంటే తాకినట్లయితే… సర్ప దోషాలు, రాహుకేతు దోషాలు సర్పశాపాలు, సంతాన దోషాలు, విద్యా దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది అని కొంతమంది స్థానికుల అభిప్రాయం.   ఏదేమైనా ఈ చీకటి కోణం మనకి శివలింగం యొక్క పాదపీఠ భాగంలో ఉండడం ….అలాగే దీని గోడల పైన చిన్న చిన్న గుబ్బలుగా కనపడతాయి.  ఈ గుబ్బల ప్రాంతంలో ఇంతకుముందు దివిటీలు లేదా రత్నాలు, మాణిక్యాలు పెట్టడం….మణుల యొక్క స్పటికాలు గాని పెట్టి ఉండటం జరిగి ఉండాలి. వీటి యొక్క మణుల కాంతికి, చీకటి కోణం ప్రాంతం అంతా వెలుగుతూ ఉండి ఉండాలి. ఈ మణుల ప్రాంతంలో ప్రస్తుతానికి రాతి గుబ్బలుగా మారిపోయి ఉంటాయని స్థానికుల అభిప్రాయం. ఈ విధంగా ఆలయం యొక్క స్థల విశేషాలు మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనేసరికి…. మంచిదమ్మా అని పిల్లలు ఆనందపడ్డారు.


సాధనా కుటుంబం అంతా ద్రాక్షారామం చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ గుడికి దగ్గరలోనే హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది. అక్కడే స్నానాధికాలు టిఫిన్లు పూర్తిచేసుకుని…. ద్రాక్షారామం గుడికి రావడం జరిగింది. శివ నందిని చెప్పినట్లుగానే ద్రాక్షారామం గుడి రెండు అంతస్తులలో ఉండటం…. ఒక అంతస్తులో పీఠభాగం, రెండవ అంతస్తులో లింగభాగం ఉండటం….పీఠ భాగం నుంచి రెండవ అంతస్తుకు వెళ్ళటానికి వీలుగా మెట్లు ఉండటం గమనించారు. పీఠ భాగంలో ఉన్న చీకటి ప్రాంతంలో  శంకుస్థాపన స్తంభాన్ని వీళ్లంతా చూడటం జరిగింది. ఆ నాగ స్తంభం మీద ఉన్న పంచముఖ నాగ పడగలను చూడటం జరిగింది. దానిని తాకడము జరిగింది…అలాగే అక్కడే ఆ గోడల మీద గుబ్బల లాగా ఉన్న వాటిని చూసి ఆశ్చర్య ఆనందాలకు లోనవటం జరిగింది. అక్కడి  పీఠ భాగం నుంచి లింగభాగానికి రావడం జరిగింది. ఈ శివలింగం రెండు రంగులలో ఉండటం…. పీఠ భాగం నల్లగా ఉండటం, లింగ భాగం తెల్లగా ఉండటం…వీళ్లంతా గమనించారు.  ఇది అర్ధనారీశ్వర తత్వంలో చెప్పకనే చెప్తుంది అని గ్రహించారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని…. ఆ పక్కనే ఉన్న మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారు చూడముచ్చటగా, ఆకర్షణీయంగా ఉంది.  అమ్మవారి పాదాల దగ్గర శ్రీ చక్రం ఉండటం గమనించారు. అమ్మవారిని చూపు ఎడమవైపు ఉండటం మహాదేవి, శివ నందిని, రుద్ర స్వామి గమనించారు. నమస్కారాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఆలయంలోనే ఉన్న ఇతర ఉప ఆలయాలు చూడటం జరిగింది. అనగా అశ్వద్ధ నారాయణ గుడి, గణపతి గుడి, కాలభైరవ గుడి, త్రికోట గుడి శ్రీరాముని ప్రతిష్ట చేసిన  ఆలయం,   లక్ష్మీనారాయణ గుడి వెయ్యి స్తంభాల గుడి, 108 శివలింగాలు ఒకే పానమట్టం మీద ఉన్న 1008 శివలింగాల గుడి, ఆ తర్వాత విరూపాక్ష గుడి, నవగ్రహాల మండపము, అష్టదిక్పాలకుల గుడి, అష్టదిక్పాలకుల శివలింగాలను చూడడం జరిగింది.ఇలా ఈ దర్శనాలు అయిపోయిన తరువాత సంతానం ఇచ్చే అశ్వద్ధ నారాయణ వృక్షమును దర్శించుకోవడం జరిగింది. అక్కడ అన్ని కూడా సర్ప విగ్రహాలు, జంట పాములు, ఏక సర్పము ఉన్న వివిధ విగ్రహమూర్తులు కనిపించాయి. ఇక్కడ సంతానం లేనివారు 41 రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటే సంతానం కలుగుతుంది అని…. అలాగే సంతాన దోషం ఉన్నవారు, రాహు కేతువుల వలన సంతానానికి అవాంతరాలు…. దోషాలు…. ఉన్నవారు, సర్ప శాపాలు లేదా సర్ప దోషాల వలన సంతానానికి అవాంతరాలు కలిగితే…. ఈ వృక్షం దగ్గర ఉన్న రుద్ర లింగానికి పూజలు అలాగే ఇక్కడ ఉన్న వాసుకి సర్పానికి పూజాదికాలు చేస్తే సకల సర్ప దోషాలు నివారణ అవుతాయి….. సంతానం  కలుగుతుందని స్థల పురాణంలో చెప్పిన విశేషాలను పిల్లలకి చెబుతూ…. ఆ వృక్షమును చూపించడం జరిగింది. దీనిని సంతానం వృక్షం అంటారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. పిల్లలు, పెద్దలు కూడా ఈ వృక్షమునకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి అక్కడే గోదావరి ప్రవాహంతో ఉన్న సరస్సు చూపించడం జరిగింది. ఆ సరస్సులో ఉన్న నీటిని కొద్దిగ చల్లుకొని…. రేపటి నుంచి మనం ఈ కోనేరులోనే స్నానాదికాలు చేసుకొని…. స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరికి వారే ధ్యానాలు, జపాలు చేసుకోవడం జరిగింది. శివ నందిని కాస్త మూడవ చక్రమమైన మణిపుర చక్రం శుద్ధి కోసం అగ్ని ముద్ర అభ్యాసం చేయడం ఆరంభించింది. ధ్యానంలో ఏదో చక్రం కనిపించడం…. రకరకాల వర్ణాలతో ఉండటం…. ఈ చక్రానికి సంబంధించిన దైవం ఏదో కనిపించడం జరుగుతూ ఉండేది. ఇలా వారం రోజులు ఇదే ముద్రతో అభ్యాసం చేస్తూ…. తనకి కనబడుతున్న చక్రానికి సంబంధించిన విషయాలు రుద్రస్వామికి చెప్పేసరికి…రుద్రస్వామి కాస్త….


మణిపూరక చక్రము:-


నాభికి అంటే బొడ్డు వెనుక భాగంలో, వెన్నుపూసలో ఈ చక్రముంటుంది. ఇది పది రేకులు గల పద్మం! ఇది అగ్ని తత్వమును తెలిపేది. అలాగే అగ్నిలాంటి రంగు కలది. ‘భాను’ అనే పేరుగల రుద్రుని శక్తి పేరు ‘లాకిని’, దీని అధిష్టాన దైవం విష్ణువు! ఈ చక్రానికి ‘రం’ అనేది బీజాక్షరం! ఈ చక్రం సమాన ప్రాణ సంచారం చేయుతుంటుంది.

రుద్రస్వామి:- నీకు కలిగిన అనుభవాలను బట్టి చూస్తే…. ఇవి మణిపూరక చక్రం ధ్యానంలో కనబడతాయి. ఇది జాగృతి అయ్యింది…ఇక శుద్ధి ప్రారంభం చేసుకోవాలి అనేసరికి ఆ జాగృతికి సంబంధించిన లక్షణాలు నీలో మొదలవుతాయి.

శివ నందిని:- సరే అయ్యా! 

అని చెప్పేసి తను యధావిధిగా అగ్నిముద్రతో ధ్యానం చేసుకోవడం కొనసాగిస్తూ ఉండేది. వీళ్ళు సుప్రభాత సేవకి ఈ ఆలయానికి రావటం…. అయ్యవారిని, అమ్మవారిని సుప్రభాత సేవని దగ్గర ఉండి చూసుకోవడం…..ఆ తర్వాత 9 గంటల దాకా ధ్యానంలో ఉండడం…. 9 నుంచి 10 గంటల వరకు టిఫిన్లు కానిచ్చేసుకుని ఆ తర్వాత ఒంటిగంట దాకా ధ్యానంలో ఉండటం…. ఆ తర్వాత ఒంటిగంటకు భోజనాలు కానిచ్చేసుకుని…విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి పవళింపు సేవ దాకా సాధన కుటుంబం ఉండి ఎవరికి తోచిన విధంగా ధ్యానాలు,జపాలు చేసుకుంటూ ఉండేవాళ్లు.  ఇలా 15 రోజులు ఉండిపోవడం జరిగింది. ఒకరోజు ఇలాంటి ధ్యానస్థితిలో ఉన్న శివ నందినికి శక్తి జాగృతికి సంబంధించిన లక్షణాలు కలగడం జరిగింది. 

మణిపుర చక్ర జాగృతి లక్షణాలు:-  కుండలినీశక్తి మణిపూరక చక్రమును చేరుకుంటే మన ఇష్టదేవత సాక్షాత్కరించును! అనగా నీవు జపించిన మంత్రదేవత నీకు కనపడతాడు! ఉదా:- శివమంత్రమును జపిస్తే శివుడు, రామమంత్రమును జపిస్తే రాముడు కనపడతాడు! వీరి మనోరూపమును దాటుకోవాలి! లేదంటే సాధకుడు సాలోక్యముక్తిని మాత్రమే పొందుతాడు! ఇక్కడికి వచ్చిన కుండలినీ శక్తి ఎప్పటికి క్రిందకి ప్రవహించదు! అనగా మూలాధార, స్వాధిష్టాన చక్రాలకు చేరదు! ఈ మణిపూరక చక్రములోనికి కుండలినీశక్తి రావడానికి మాత్రము సాధకుడు కనకము, కాంత మహామాయలు దాటుకొని రావాలి! ఇవి దాటడం అంటే కత్తిమీద సాములాంటిదే!

తనకి కలిగిన లక్షణాలన్నీ శివ నందిని రుద్ర స్వామికి చెప్పేసరికి…

రుద్రస్వామి:- అమ్మా!  ఇవన్నీ శక్తి జాగృతి లక్షణాలు. ఇక చక్ర శుద్ధి ప్రారంభం అవుతుంది.

అనేసరికి సరే అని అలాగే సాధన కొనసాగిస్తూ ఉండేది. ఒక 15 రోజులు పాటు అగ్ని ముద్రలో మణిపూరక చక్రం శుద్ధి కోసం సాధన చేస్తూ ఉండగా…. శివ నందినికి ఎలాంటి అనుభవాలు లక్షణాలు ధ్యానంలో కనిపించలేదు. దానితో ఈమె కాస్త కోపావేశాలు, ఆవేదనకి గురి అయ్యేది. తన సాధనలో ఏదైనా లోపం ఉందా..! లేదా తెలియకుండా ఏదైనా మాయలో పడుతున్నానా ?అని చెప్పేసి పరిపరి విధాలుగా ఆవేదన చెందుతూ ఉండేది. ఒక రోజు ఇలా కాదనుకొని…. పిల్లలు కాస్త అమ్మ!  ఈ ఆలయం చుట్టూ ఎనిమిది ప్రాంతాలలో చంద్రుడు ప్రతిష్ట చేసిన సోమేశ్వర లింగాలు ఉన్నాయి అంటారు కదా! ఈ క్షేత్రానికి ఎనిమిది ప్రాంతాలలో ఉన్నాయంట. వెళ్ళి వీటి దర్శనం చేసుకుందామా!  అనేసరికి సరే.! పిల్లల ముచ్చట ఎందుకు కాదనాలి?  అని చెప్పేసి అష్ట శివలింగాలు ఉన్న ప్రాంతానికి సాధన కుటుంబం వెళ్లడం జరిగింది. దక్షిణ కాశీగా పిలవబడే ఈ ద్రాక్షారామంలో శివుడు శ్రీ భీమేశ్వర శివలింగంగా …. స్వయంభుగా అవతరించాడు. ఈ శివలింగం కింద సూర్య యంత్రం ఉంది అని స్థల పురాణం చెబుతుంది. ఈ శివలింగమును చల్లబరిచేందుకు ఈ శివలింగం చుట్టూ అష్టదిక్కులలో చంద్రుడు అష్ట లింగాలను ప్రతిష్టించాడు అంటారు ..కానీ ఈ శివ లింగాల కింద చంద్ర యంత్రాలను ప్రతిష్ఠ చేశారు… ఒక శివ లింగమును సూర్యుడు ప్రతిష్ట చేస్తే… మిగిలిన 7 శివలింగాలను సప్త ఋషులు ప్రతిష్ఠ చేశారు… ఈ అష్ట లింగాల కింద చంద్ర యంత్రాలు…భీమేశ్వర శివలింగం కింద సూర్య యంత్రం ప్రతిష్ట చేశారు… ఈ అష్ట లింగాలను దర్శించుకుని ఆ తర్వాత భీమేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు….అయితే ఇందులో ముందుగా 

1)తూర్పు దిక్కున కోలంక లో ఉమ సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు కేశవుడిగా…. వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఒరిల్లమ్మ, కొలపిల్లమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా మేష రాశి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు. 

2)  ఆగ్నేయ దిక్కున k. గంగవరం లో ఉమా పార్వతి,  సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని కశ్యపుడు ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు వేణుగోపాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. కట్లమ్మ, దారలమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా మీన రాశి ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

3) దక్షిణ దిక్కున కోటిపల్లిలో రాజా రాజేశ్వరి,  ఛాయ సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని అత్రి మహాముని ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు సిద్ధి జనార్ధన స్వామిగా పూజలందుకుంటున్నాడు. ముత్యాలమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా ధనిష్ఠ, శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

4) నైఋతి దిక్కున కపిలేశ్వర పురంలో రాజరాజేశ్వరి,  సోమేశ్వర స్వామి ఆలయం లోని శివలింగాన్ని భరద్వాజ మహర్షి ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు  జనార్ధన స్వామిగా పూజలందుకుంటున్నాడు. దొర్లమ్మ గ్రామదేవతగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

5) పడమర దిక్కున వెంటూరులో  పార్వతి,  సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని  విశ్వామిత్రుడు ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు కేశవస్వామిగా పూజలందుకుంటున్నాడు. మారెమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా తుల రాశి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

6)వాయువ్య దిక్కున సోమేశ్వరం లో బాల త్రిపుర సుందరి,  సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని గౌతముడు ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు వేణుగోపాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. బూరులమ్మ , బంతి బాపనమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా కన్య రాశి హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

7) ఉత్తర దిక్కున రామచంద్రాపురంలో బాల త్రిపుర సుందరి,  సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని వశిష్టుడు ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు వేణుగోపాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. పోలేరమ్మ గ్రామదేవతగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా కర్కాటక రాశి సింహ రాశిలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

8) ఈశాన్య దిక్కున పెనుమళ్ళలో ఉమా పార్వతి,  రాజ సోమేశ్వర ఆలయం లోని శివలింగాన్ని జమదగ్ని ప్రతిష్ట చేశాడు. ఇక్కడ విష్ణువు శ్రీరాముల వారిగా పూజలందుకుంటున్నాడు. పనుగుదాలమ్మ గ్రామదేవతలుగా ఉన్నారని సాధన కుటుంబం ఈ దర్శనాలు చేసుకుని తర్వాత ఆలయానికి బయలుదేరారు.ఇక్కడ ఎక్కువగా మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గ్రహ శాంతులు జరిపిస్తారు.

 ఆ తర్వాత మరుసటి రోజు యధావిధిగా సుప్రభాత సేవ సమయానికి సాధన కుటుంబం అంతా ద్రాక్షారామం గుడికి రావడం….  అమ్మవారిని,అయ్య వారిని దర్శనం చేసుకోవడం…. సుప్రభాత సేవా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత, ఎవరికి వారే ధ్యాననిష్టలో ఉండటం జరిగింది. శివ నందిని కాస్త ధ్యాననిష్ఠలో ఉండేసరికి…. తనకి ఉన్నట్టుండి కొన్ని లక్షణాలు, అనుభవాలు కలగటం మొదలయ్యాయి.

చక్ర శుద్ధి లక్షణాలు:-

ధ్యానము తీవ్ర స్థాయిలో ఉండగా బొడ్డు ప్రాంతములో విపరీతంగా నొప్పి రావటం మొదలైంది. దాని చుట్టూ వేడి ఆవిర్లు సుడులు తిరుగుతున్నట్లు అనిపించసాగింది.తల దిమ్ముగా ఉండటము ఆరంభమైంది.ఇలా కొన్ని వారాలపాటు ఇబ్బంది పడింది. తనకి వచ్చిన లక్షణాలన్నీ రుద్ర స్వామితో చెప్పేసరికి…

రుద్రస్వామి:- అమ్మ! గత జన్మలో చేసిన పాప కర్మలు పూర్తి అయ్యేవరకు మనకి బొడ్డు నొప్పి అలాగే కండరాల నొప్పులు, వేడి ఆవిర్లు తగ్గవని  అర్థమైనది. అందాక వీటిని మౌనముగా భరించాలి… నీకు చక్ర శుద్ధి ఆరంభమైంది. ఇప్పుడు ఈ చక్రశుద్ధికి సంబంధించిన మాయ ఏమిటో తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ మాయ దాటితేనే నీకు చక్రం ఆధీనం అవుతుంది. దానికి సంబంధించి నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది. 

అనేసరికి….. ఇంకొక 15 రోజులు పాటు ఇదే ధ్యాననిష్ఠలో శివనందిని ఉన్నది. ఒకరోజు ఉన్నట్టుండి… ధ్యానంలో తనకి తన దగ్గర ప్రాప్తి సిద్ది వల్ల వచ్చిన తన ఇష్ట దైవ స్వరూపమైన పాండురంగ విగ్రహ మూర్తి కనిపించడం జరిగింది. ఈ విగ్రహం పదేపదే చూడాలని మనసు కోరుకోవడంతో…. తన శరీరంలో అదృశ్య శక్తితో నిక్షిప్తం చేసుకున్న విగ్రహ మూర్తిని బయటకు తీసి చూడడం జరిగింది. సుమారు అడుగున్నర ఉన్న పాండురంగడు విగ్రహ మూర్తిని చూస్తూ శివ నందిని మైమరిచిపోతూ ఉండేది. నా స్వామి ఎంత అందంగా ఉన్నాడో కదా!  ఈయన్ని సజీవమూర్తిగా చూస్తే ఎంత బాగుంటుందో కదా!  అని చెప్పేసి సజీవ మూర్తిగా చూడాలి…. ఆయన సాంగత్యం పొందాలి…. తన చేతి వంట తినిపించాలి. ఇలాంటి ఆలోచనలు పదేపదే వస్తూ ఉండేసరికి…. రుద్ర స్వామికి ఏదో అనుమానం వచ్చి, ఏదో సందేహం  వచ్చిన వాడిలాగా….

రుద్రస్వామి:-  అమ్మ! నీ శరీరంలో నుంచి ఈ విగ్రహ మూర్తిని ఎందుకు తీశావు.?

శివ నందిని:- అయ్యా!  నాకు ఉన్నట్టుండి ఏదో తెలియని అపేక్ష,కుతూహలం, ప్రేమ ఈయన మీద కలుగుతున్నాయి. ఈయన్ని సజీవమూర్తిగా చూడాలి…ఈయనకి నా చేతుల మీదుగా ఆహారం వండి పెట్టాలి…తినిపించాలి అనిపిస్తుంది.

రుద్రస్వామి:-;అమ్మ !దైవసాక్షాత్కార మాయ అంటే ఇదే. దీనినే నువ్వు దాటాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ మాయకి అంకితమై సాధన పరిసమాప్తి కాకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.

శివ నందిని:- అవేం నాకు తెలియదయ్యా… నేను మాత్రం ఈ పాండురంగడు విగ్రహ మూర్తిని సజీవ మూర్తిగా చూడాలనుకుంటున్నాను.  పదేపదే నా మనస్సు కోరుకుంటుంది. అది మాయేమో తెలియదు.  ఆయన సన్నిధానంలో దేహం విడిచిపెట్టిన అదే పదివేలు. ఆయన సాంగత్యమే నాకు కావాలి. ఆయన సౌందర్యం చూసావా?ఎంత ముగ్ద మనోహరంగా ఉందో ….

అని అంటూ ఉండేసరికి… మహాదేవి కాస్త… రుద్ర స్వామితో…

మహాదేవి:- అమ్మాయి కాస్త పాండురంగడి మోహమాయలో పడిపోయింది. దైవసాక్షాత్కార మాయలో పడిపోయింది.  మరి ఏం చేయాలి అనుకుంటున్నారు?

రుద్రస్వామి:- మన చేతుల్లో ఏముంది…? కాలం నిర్ణయం ఎలా చేస్తే అదే జరుగుతుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా!  శివయ్య ఏం లీల చూపించాలి అనుకుంటున్నారో… మనకేం తెలుసు.  సాక్షి భూతంగా చూస్తూ ఉండటమే… ఒకవేళ ఈ పిల్ల దైవసాక్షాత్కార మాయ దాటకపోతే తిరిగి మనం కాశి క్షేత్రానికి వెళ్లి… అక్కడే మన సాధన చేసుకుందాము. ఈ పిల్లని ఇక్కడే వదిలేసి వెళదాము.  మనదేముంది ?

మహాదేవి:- నీకేం ఉంది? నీకు బంధాలు ఉన్నాయా? బంధనాలు ఉన్నాయా?  బాధ్యతలు ఉన్నాయా? ఏమీ అంటీఅంటున్నట్టుగానే ఉంటావు. తామరాకు మీద నీటి బొట్టు లాగానే నువ్వు ప్రవర్తిస్తావు. ఆ పిల్ల ఇప్పుడు రెండు చక్రాలు దాటి మూడవ చక్రమైన దైవమాయ దగ్గర ఆగిపోతే చూస్తూ ఉండటం సరైనదేనా? దానిని దాటించాలని నువ్వు ప్రయత్నం ఎందుకు చేయవు?

రుద్రస్వామి:- దాటించే ప్రయత్నం అయితే చేయగలను కానీ… చేయడానికి ఏముంది? తనకి ముందుగానే దైవమాయ వస్తుందని హెచ్చరించి చెప్పాను. ఆ మాయలో పడవద్దు… ఆ మాయని దాటాలి అని చెప్పాను.  కానీ ఆ పిల్ల కావాలని ఆ మాయలో పడతాను అంటే నేనేం చేయగలను. గుర్రాన్ని నీటిదాకా తీసుకురాగాలను గాని, ఆ నీటిని తాగాలా వద్దా అనేది ఆ గుర్రమే నిర్ణయం చేసుకోవాలి కదా!  ఇప్పుడు ఆ పిల్ల కావాలని దైవమాయలో పడుతున్నప్పుడు… ఆగుతుందో దాటుతుందో ఇంక పాండురంగడే నిర్ణయం చేయాలి. ఆ పాండురంగడిని నిర్ణయించేది ఈశ్వరుడే కాబట్టి… ఈశ్వరుడే నిర్ణయం చేయాలి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే…..పాండురంగడి కిరీటం మీద ఒక విగ్రహం ఉంటుంది.  నిజానికి అది కిరీటం కాదు.  శివలింగం…. దాని అగ్రభాగంలో శివలింగం కనబడుతుంది… కావాలంటే చూడు…

 అని శివలింగం ఉన్న పాండురంగడి ఫోటోని శివ నందినికి,మహాదేవికి చూపించడం జరిగింది. అంటే శివ నందిని:- నా పాండురంగడు మహాశివుని భక్తుడు అన్నమాట!  శివలింగాన్ని తల మీద భరించాడు అంటే ….ఇంతటి శివ భక్తుణ్ణి నేను ఎందుకు వదులుకుంటాను…

అని చెప్పేసి పాండురంగడు మీద విపరీతమైన మమకారం ప్రేమ మోహ వ్యామోహాలలో శివనందిని ఉండిపోవటం… వీళ్ళిద్దరూ గమనించి చూస్తూ ఉండిపోయారు. ఏం చేయలేని పరిస్థితి… అయోమయ పరిస్థితి….అర్థం కాని పరిస్థితి… కాలమే నిర్ణయం చేయాలని వదిలేశారు.  ఈ పిచ్చి లో 15 రోజుల పాటు శివ నందిని ఉండిపోయింది.


శివ నందిని కాస్త ఈ పాండురంగడు విగ్రహం తన పక్కనే పెట్టుకోవడం….తనతో మాట్లాడుతూ ఉండటం…. తను తినే ఆహార పదార్థాలు ఆయనకు పెడుతున్నట్లుగా చేస్తూ ఉండటం… ఆ పిచ్చిలోనే ఉండిపోయేది.  స్వామి వారు నాతోనే మాట్లాడుతున్నారు…. నా పక్కనే కూర్చున్నారు…. నా పక్కనే పడుకున్నారు అని రుద్ర స్వామికి, మహాదేవికి, పిల్లలకి చెబుతూ ఉండేసరికి రుద్రస్వామి కాస్త…. 

రుద్రస్వామి:- దీనికి దైవ మాయ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక దైవమే దీన్ని సరి చేయాలి మహాదేవి:-ఈ విషయం అంతా శివ స్వామికి చెప్పచ్చు కదా!  శివ స్వామి ఏదైనా చేస్తాడేమో! రుద్రస్వామి:- ఆయనకి తెలియని విషయమా ! ఆయన కూడా లీలామాత్రంగా చూస్తూ ఉన్నాడు.  ఈ అమ్మాయి బయట పడుతుందా లేదా అని గమనిస్తున్నాడు… సాక్షిభూతంగా ఉన్నాడు… శివ స్వామికి లేని దురద నాకెందుకు…. కందకి లేని దురద కత్తిపీటకెందుకు?  నాకు సంబంధం లేదు.  ఈ పిల్ల ద్వారా మనం ముందుకు వెళ్తే వెళ్తాము.  ఈ పిల్ల దైవసాక్షాత్కార మాయలో ఆగిపోతే… మనం ఏమీ చేయలేం.

ఒకరోజు ఉన్నట్టుండి శివ నందిని కాస్త అర్ధరాత్రి పూట లేచి పాండురంగడు నన్ను పిలుస్తున్నాడు… నేను వెళ్ళాలి అని గోల చేయడంతో…

రుద్రస్వామి:-  ఎక్కడికి వెళ్తావు తల్లి? 

శివనందిని:- పండరీపురం రమ్మంటున్నాడు… ఆ క్షేత్రానికి వెళ్లాలి. నేను ఉండలేను. నావల్ల కాదు… నేను పాండురంగడులో ఐక్యమైపోతాను.

అని అంటూ ఉండేసరికి… వీళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని స్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. 

రుద్రస్వామి:- సరే ఆ స్వామినే ఇక్కడికి రమ్మని చెప్పు. ఆ తర్వాత మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళవచ్చు. నీ భక్తితో స్వామివారిని ఇక్కడికి రప్పించు. సతీసక్కుబాయి కూడా తన విగ్రహ మూర్తి నుంచి పాండురంగడిని ఇంటికి రప్పించుకున్నది కదా! ఆ భక్తి పరివర్తన నీలో జాగృతి చేసుకో! పండరీపురం మనం వెళ్ళడం  కాదు…. ఆ పండరీపురం నాధుడే మన దగ్గరికి వచ్చేటట్టుగా నీ సాధన భక్తిని పెంచుకో.

శివ నందిని:- అవును కదా!  నేను ఆయన దగ్గరికి వెళ్లడం ఏమిటి? ఆయన నా దగ్గరికి రావాలి కదా! అందరి భక్తుల ఇళ్ళకి ఆయన వెళ్ళాడు కదా! నా దగ్గరికి ఎందుకు రాడు. అయ్యా!  నువ్వు చెప్పింది నిజమే. నా సాధన భక్తితో ఆయన్ని నా దగ్గరికి రప్పించుకుంటాను. ఆయనకు నేను సేవలు చేస్తాను…

అంటూ అదో లోకంలో ఉండిపోయేది. కాకపోతే అదృష్టం కొద్దీ ప్రతిరోజు మూడు గంటల పాటు ఈ మణిపుర చక్రానికి సంబంధించిన అగ్ని ముద్ర సాధన చేస్తూ ఉండటం వీళ్ళు గమనించారు. హమ్మయ్య!  పరవాలేదు ఈ చేతి ముద్ర సాధన మర్చిపోలేదు అని…  అది చేస్తూనే ఉంది అని…. కాకపోతే ఆయన సాక్షాత్కారం పొందాలని దైవ మాయలో ఉంది అని…. ఇది ఎలా తీరుతుందో ఆ దైవమే నిర్ణయం చేయాలి అని…. ఎవరికి వారే సాక్షిభూతంగా ఉండిపోయారు. రాను రాను శివ నందిని పిల్లల బాధ్యతలను, రుద్రస్వామి, మహాదేవి, శివ స్వామి గురించి ఆలోచించడం మానివేయడం ఆరంభించింది. ఎప్పుడు చూసినా… పాండురంగడు గురించి ఆలోచనలు చేస్తూ ఉండేది. నా పాండురంగడు ఇలా వస్తాడా..!  అలా వస్తాడా…! ఇలా ఉంటాడా..! నా పాండురంగడుకి ఈ వస్త్రాలు కొంటే బాగుంటుందా…!  నా పాండురంగడుకి ఈ ఆభరణాలు వేస్తే బాగుంటుందా..!  నా పాండురంగడుకి ఈ వంటలు చేసి పెడితే బాగుంటుందా అని….అందరిలోనూ పాండురంగడిని చూస్తూ ఉండేది. అంతా పాండురంగడి మయం అయిపోయింది. ఇలా జరుగుతూ ఉంది. ఈవిడ  భక్తి ప్రపత్తులు చూసిన స్థానిక భక్తులు పాండురంగడి దేవాలయం లేని చోట ఈవిడ పాండురంగడి భక్తురాలు ఎలా అయిందో ….ఎంత భక్తి ప్రపత్తులు పాండురంగడు మీద ఉన్నాయో అని… ఈమె భక్తికి అందరూ దాసోహం అవడం…. ఈమె చుట్టూ తిరగటం…ఈమెతో  కలిసి భజనలు చేయడం ప్రారంభించారు. కానీ వీటిని ఏమీ పట్టించుకునే స్థితిలో శివనందిని లేదు.  తన పాండురంగడి భక్తిలో ఉండిపోయింది. దైవ విగ్రహం కాస్త ధ్యానంలో నిజభౌతిక విగ్రహ మూర్తిగా కనిపించడం…. తనతో మాట్లాడడం…. తనతో సరసాలు ఆడుతున్నట్టుగా ఉండటం… సాంగత్యం చేస్తున్నట్లుగా ఉండటం…. ఏదో రకరకాల భావరూపాలు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉండేది. ఉన్నట్టుండి ధ్యానంలో నుంచి లేచి  పాండురంగడిలా నిలుచున్నట్టుగా నిల్చోవడం…. నడుం మీద చేతులు పెట్టుకొని నిల్చోవడం… అలాగే తనలో  పాండురంగడు ఉన్నాడు… నేను అనేది లేదు అని అనుకోవడం… చేస్తూ ఉండేది. విగ్రహమూర్తికి బట్టలు కట్టడం, ఆభరణాలు వేయటం, తోచిన విధంగా అలంకరణలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఈ దైవ మాయ ఎలా పోతుందో వీళ్ళకి అర్థం కాలేదు. 

ఒకరోజు ఉన్నట్టుండి పండరీపురం నుంచి పాండురంగడు విగ్రహ మూర్తి కాస్త సజీవ మూర్తిగా ధ్యానంలో పదేపదే శివ నందినికి కనపడుతూ ఉండేసరికి…. స్వామి..!  నేను పండరీపురం రాను, నేనే కావాలి, నా భక్తి కావాలి, నా ప్రేమ కావాలి అనుకుంటే…. నా మధుర భక్తి కావాలి అనుకుంటే…. నువ్వే నా దగ్గరికి రా.!  లేదంటే నేను నీతో మాట్లాడను… అని కోపం, అలక ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తున్న మహాదేవి మరియు రుద్ర స్వామికి పిచ్చి పట్టడం తప్ప వేరే మార్గం ఏమీ కనిపించలేదు. వాళ్ళు ఒకప్పుడు తమ ఇష్టదైవం పిచ్చిలో పడి ఇవన్నీ చేసి ఉండటంతో…. ఆ అనుభవం పొంది ఉండటంతో…. ఈ పిచ్చి ఎలా తగ్గుతుందో …. కాల నిర్ణయం చేయాలి అని… ఆ దైవమే నిర్ణయం చేయాలి అని అనుకునేవారు .ఇలా ఉండగా పండరీపురం నుంచి ఒక పాండురంగ భక్తుడు అనుకోకుండా ద్రాక్షారామం క్షేత్రానికి రావడం…ఈ భక్తురాలిని చూసి తన్మయత్వం చెంది తన దగ్గర పాండురంగడికి సంబంధించిన ఇటుక రాయి ఉంది అని … ఈ ఇటుకరాయి పండరీపుర నాథుడు తన ఇంటి ముందు ఈ ఇటుక రాయి మీద కూర్చున్నాడు అని …..ఆ ఇటుకరాయి చూపించేసరికి విపరీతమైన తన్మయత్వం పొందుతూ…. స్వామి నాకు ఈ ఇటుకరాయి ఇస్తారా ? పండరీపురం నుంచి నాకోసమే పంపించారనుకుంట….. అనేసరికి ఇది చాలా విలువైనది…. దీనికి నేను వెలకట్టలేను… సాక్షాత్తు పండరీనాధుడే నా భక్తి ప్రపత్తులకు సంతోషించి…. నాకు ఇలా ఇటుక రాయిని ప్రసాదించడం జరిగింది అనేసరికి….సరే స్వామి..!  మీ ఇష్టం.. మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. ఆ పాండురంగడిని అడుగుతాను.. మీకు ఇచ్చినవాడు నాకు ఇవ్వడా? అంటూ  పాండురంగడు కోసం సంకీర్తనలు చేయడం ఆరంభించింది. ఈ సంకీర్తనలు విని ఆ పాండురంగడి భక్తుడు తన్మయత్వం చెంది…. ఇదిగో దేవి.!  ఇది నీకు సంబంధించినదే. ఇదిగో… అని ఆ ఇటుకరాయిని ఒడిలో పెట్టి…. ఆ పాండురంగడు భక్తుడు కాస్త పండరీపుర నాథుడిగా సజీవ మూర్తిగా క్షణకాలం పాటు మారేసరికి… శివనందిని కాస్త తన్మయత్వం, ఆనందం పొందుతూ…. స్వామి!  మీరు భక్తుని రూపంలో ఇలా నాకోసం వచ్చారా?  సజీవమూర్తిగా వచ్చారా?  అని చెప్పేసి ఆయన పాదాల మీద పడుతూ ఉండేసరికి…. అందరికీ ఆయన భక్తుడిగా కనబడుతున్నాడు. కాకపోతే శివ నందినికి మాత్రం భౌతిక పాండురంగ నాధుడిగా కనపడటం…. రుద్రస్వామి మరియు మహాదేవి గమనించారు. వీళ్ళిద్దరూ కూడా భౌతిక సజీవ మూర్తికి హృదయపూర్వక నమస్కారాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబితే…. ఈమెని మహా భక్తురాలని చెప్పేసి, రాబోవు కాలంలో వ్యక్తిగత దేవతగా వ్యక్తిగత పూజలు చేస్తారేమో అని అనుమాన భయంతో విషయం చెప్పలేదు. కానీ ఈ విషయం గ్రహించి మినుకుండి పోయారు. ఆ తర్వాత స్వయంగా పాండురంగడు కూర్చున్న రెండు ఇటుక రాయి ముక్కలను… తన ప్రసాదంగా గ్రహించి…. నిత్యం తన దగ్గర ఉన్న పాండురంగడి విగ్రహం మూర్తి వద్ద పెట్టి ఆరాధన చేస్తూ కాలం గడపసాగింది.

ఇలా దాదాపు 3 నెలలు పైగానే గడిచిపోయాయి. తన దైవ పిచ్చి, దైవ మాయ సాక్షాత్కార పిచ్చి, పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. ఈ మాయ నుంచి ఎలా బయటపడుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. పిల్లలు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. శివ నందిని అమ్మలో ఏదో తెలియని మార్పు వచ్చింది అని… తమను పట్టించుకోవడం లేదు అని …..తమ ధర్మ సందేహాలు తీర్చే స్థితిలో లేదు అని….తన్మయత్వంలో ఏదో లోకంలో తన ప్రపంచంలో తాను ఉంటుంది అని అనుకునేవారు. శివ నందినికి పిచ్చి ఎలా ముదిరిపోయింది అంటే… తిండి నిద్రాహారాలు మానేసింది. ధ్యానం మానేసింది. ఎప్పుడు పాండురంగ అని చెప్పేసి గదిలో కూర్చోవడం… గుడిలో కూర్చోవడం లేదా నీటి ఒడ్డున కూర్చోవడం…. ఒక విధమైన సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండేది. బయట ప్రపంచం మర్చిపోతూ ఉండేది. తన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేదా? అని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. తనకి ఒంటిమీద వర్షం పడుతున్నా కూడా లేచి వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా చేయలేని స్థితిలో… శరీర స్పృహ కోల్పోతూ…. ఒక అద్వితీయమైన ఆనంద స్థితిలో ఉండేది. పాండురంగడు స్వయంగా తన దగ్గరికి వచ్చాడని తన భక్తి ప్రపత్తులకు మెచ్చి తనకి ఇటుక రాయిని ప్రసాదించాడని…. ఇంతటి సులభ దైవం తను ఇంతవరకు చూడలేదని…. పదే పదే పాండురంగడికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ….ఒక రకమైన పిచ్చిలో ఉండిపోయేది. ఒక రకంగా చెప్పాలంటే రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి మీద ఒక రకమైన పిచ్చి ఎలా అయితే ఉండేదో అదే సరి సమానమైన పిచ్చికి శివ నందిని పాండురంగడు మూర్తి మీద ఉండేది ఈ పిచ్చి ఎలా దాటుతుందో….ఎలా తగ్గించాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో రుద్ర స్వామి, మహాదేవి, శివ స్వామి ఉండిపోయారు. కాలమే నిర్ణయం చేయాలి… దైవమే ఆజ్ఞ ఇవ్వాలి అనుకునేవారు.  రాను రాను నిద్రాహారాలు  పట్టించుకోకపోవడం జరిగింది. స్నానాధికాలు కూడా చేయడం మానేసింది.  రెండు రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా 15 రోజులకి..లేదా  ఒకసారి గంటలు గంటలు స్నానాధికాలు చేయడం… లేదంటే నీటిలో ఉండటం… లేదంటే ఒక 15 రోజులపాటు స్నానం చేయకపోవడం అలా ఉండేది. ఈ పిచ్చి రాను రాను ఎలా తయారయ్యింది అంటే…. కనపడిన ప్రతి జంతువులోనూ పాండురంగడే ఉన్నాడని…. ప్రతి మొక్కలోనూ పాండురంగడే ఉన్నాడని…. ప్రతి జీవిలోనూ, మనిషిలోను పాండురంగడే ఉన్నాడని…. తను తింటున్న ఆహారం సమయానికి ఏ జంతువైనా లేదా మనిషైనా ఆ బిక్షకి వస్తే తను తినకుండా వాళ్లకే పెట్టేసి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండేది. ఉపవాసాలు చేస్తూ వాళ్ళ కడుపులు నింపుతూ ఉండేది. రాను రాను పాండురంగడు మయం అయిపోయింది.తను సాధన చేస్తున్నానని…. మోక్షం పొందాలని…. స్త్రీ ప్రకృతికి మోక్షం ఇవ్వాలని చెప్పేసి… దీనికి సంబంధించిన వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో తను లేని స్థితికి వెళ్ళిపోయింది.  రాను రాను పాండురంగడు తన పక్కనే ఉన్నట్లుగాను… తనతో మాట్లాడుతూ ఉన్నట్లుగాను… భావనలు చేస్తూ ఉండేది. ఆ భావనలకు కాస్త సజీవ మూర్తులుగా అందరికీ కనపడే పరిస్థితికి రావడం జరిగింది. ఎంతగా అంటే తను ఒక స్తంభం దగ్గర నిల్చుని రా….స్వామి!  నిన్ను ఈ స్తంభంలో చూడాలని ఉంది అని అనుకుంటే…. ఆ స్తంభంలో అందరికీ పాండురంగడు కనిపించే అంత భక్తిలో తనలో ఉండేది. పుట్టలోను… చెట్టులోనూ… జీవిలోనూ తను ఏదైనా పాండురంగడికి సంబంధించిన సంకీర్తన చేస్తే, శ్లోకం, మంత్రం చదివితే పాండురంగడు సజీవ మూర్తిగా కనపడేవాడు. తను పెట్టిన ఆహారం తింటున్నట్లుగా…అందరికీ కనపడేది.  ఇలా రాను రాను ఆ పాండురంగడి దైవసాక్షాత్కార మాయలో శివ నందిని ఉండిపోయేది. కానీ ఒక రకంగా చూస్తే…. ఇంతటి భక్తి ప్రపత్తులు కలగడం… ఇంతలా దైవంతో సాంగత్యం పొందడం… అనితర సాధ్యం. అది ఎన్నో లక్షల జన్మలు ఎత్తితే గాని…. తనకి ఇలాంటి మధుర భక్తి అలవడదు .కానీ ఈ  మధుర భక్తియే తనకి  మనోమాయ శాపం గాను, దైవమాయ శాపం గానూ ఉన్నది…. ఆటంకం అవుతుంది అని తెలుసుకోవాలనే తపన లేని స్థితిలో శివనందిని ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన రుద్రస్వామి, శివస్వామి, మహాదేవి ఏం చేయాలో…. ఎలా ఈమెను బయటకు తీసుకురావాలో…. తెలియని అయోమయ స్థితిలోకి వెళ్లడం జరిగింది. ఒకవేళ పండరిపురం తీసుకువెళ్తే…. ఏమైనా ఫలితం ఉంటుందా!  అని రుద్రస్వామి, మహాదేవి అనుకోసాగారు. కానీ ఆ క్షేత్ర వాసుడైన పండరీపురం నాదుడే…. భక్తుల రూపంలో ఇతర జంతువుల రూపంలో …..తన దగ్గరికి రావడం జరుగుతున్నప్పుడు, అక్కడికి వెళ్లినా ఏమి ప్రయోజనం ఉండదు అని చెప్పేసి వీళ్లిద్దరూ అనుకో సాగారు.ఈ  దైవసాక్షాత్కార మాయ శివ నందిని ఎలా దాటుతుందో అని కాల నిర్ణయానికి వదిలేసి అవకాశం కోసం అలా చూస్తూ ఉండిపోయారు. 

రుద్ర స్వామి, మహాదేవికి రాను రాను ఆవేదన కాస్త మనోవేదనగా మారింది. శివ నందిని దైవ సాక్షాత్కర మాయలో దాటుకోలేని పరిస్థితికి వెళ్ళింది అని….. దీనికి పరిష్కార మార్గముగా భీమశంకరుడు ఏదైనా మార్గం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి…. భీమశంకరుడి గుడి, మాణిక్యంబ గుడికి పదేపదే వెళ్తూ….. అమ్మ! తను పొందే మోక్షం విశ్వం మోక్షం అవ్వాలి. సాధన పరిసమాప్తి అవ్వాలి. తన సాధన ప్రారంభించింది.  అనుకోకుండా అనివార్య కారణాల వలన మణిపుర చక్రం దగ్గర వచ్చే దైవసాక్షాత్కార మాయను దాటలేక పోతోంది.  తను దాటాలి అని అనుకునే స్థితిలో కూడా తను లేదు.  తను మాయలో ఉన్నాను…. దైవమాయలో ఉన్నాను…. దానిని దాటాలి… దాని భేదించాలి అనే ఆలోచన కూడా చేయలేని స్థితిలో ఉన్నది.  కాబట్టి తనకి దైవసాక్షాత్కార మాయ గురించి…. జ్ఞాన స్ఫురణ అందే విధంగా అనుగ్రహించండి.  తన మరణమే మోక్షమరణం అయ్యేవిధంగా తన సాధన పరిసమాప్తి అయ్యే విధంగా అనుగ్రహించండి అని వీళ్ళిద్దరూ ఆ ఆదిదంపతులైన భీమశంకరుడు మాణిక్యంబాదేవికి పదేపదే వేడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వీళ్లు వేడుకున్నంత మాత్రాన అనుకున్నవన్నీ జరిగిపోతే… సమస్య ఏముంది!  కాలమే నిర్ణయం చేయాలి అని ఎదురు చూస్తూ ఉండేవాళ్లు. రాను రాను శివ నందినికి దైవమాయ పిచ్చి ముదిరిపోవడమే తప్ప తగ్గడం లేదు. ఇక ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు.  చిరిగిపోయిన వాటిని మార్చుకోవాలనే స్థితిలో కూడా లేదు. ఉన్నట్టుండి పాండురంగడు సజీవ మూర్తిగా కనపడకపోయేసరికి…. ఉన్మాదిలాగా, పిచ్చిదానిలాగా బట్టలు చింపుకోవడం… అరవడం…. శరీరం మీద గాయాలు చేసుకోవటం…. రా…, స్వామి!  రా…. స్వామి!  నా దగ్గర ఏం లోపం ఉందని అక్కడే ఉండిపోయారు. ఆ క్షేత్రంలోనే ఉండిపోయారు.  నా భక్తి మీకు నచ్చలేదా?  కావాలంటే నా భక్తిని చూడు.  నీ కోసం నేను ఏదైనా చేయగలను అని చేతులు కోసుకొని రక్తాన్ని చూపించడం… నువ్వంటే నాకు పిచ్చి …నువ్వు లేకుండా నేను ఉండలేను.  నా వల్ల కాదు…. నేను నీ క్షణకాల విరహవేదనని కూడా భరించలేను. నువ్వు నా వెంట ఉండాలి… నాతో పాటు ఉండాలి… నాతో మాట్లాడాలి…నువ్వు నా కోసమే ఉన్నావు. నువ్వు నాకే చెందిన వాడివి.. నువ్వు నా మనిషివి అని చెప్పేసి పలు విధాలుగా అరవటాలు, కోపాలు, అలకలు ఇలా గుడి పరిసరాల్లో చేస్తూ ఉండేసరికి….ఈమె భక్తి కాస్త పిచ్చిగా మారింది. ఇక ఈవిడని పిచ్చాసుపత్రిలో చేర్పించండి అనేసరికి… ఏమనాలో, ఏం చేయాలో ఎలా ఆపాలో ….అర్థం కాని అయోమయ పరిస్థితిలో రుద్రస్వామి, మహాదేవి ఉండిపోయారు. చేసేదేమీ లేక…. ఈ ఆదిదంపతులకు విన్నవించుకునే వాళ్ళు. వీళ్ళు కూడా జరగబోయే జగన్నాటకంలో… ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టుగా…  మినుకుండిపోయేవాళ్ళు. ఈమెలో ఇసుమంత మార్పు కనిపించేది కాదు, మార్పు రాకపోగా విపరీతమైన చేష్టలు పెరుగుతూ ఉండేవి. ఒక్కోసారి నీటిలో దిగి నా పాండురంగడు లోపలికి రమ్మన్నాడు…. నీటి లోపలికి రమ్మన్నాడు… అని దిగటం, మరోసారి తనలో ఐక్యం చేసుకుంటాడంట నన్ను చచ్చిపొమ్మని చెప్పి అంటున్నాడు అని అరవటం…. అర్ధరాత్రి పూట నిద్రలేచి పాండురంగడు స్మశానంలో నాకోసం ఎదురు చూస్తున్నాడంట… నేను వెళ్ళాలి అని స్మశానాల వెంట పరిగెత్తడం…. ద్రాక్షారామం పురవీధుల్లో స్వామి ! ఎక్కడున్నావు స్వామి! నీకోసమే ఉన్నాను… నువ్వు ఈరోజు  కనబడలేదు స్వామి అని అరవడం…. ఒక రకంగా చెప్పాలంటే యోగ పరంగా చూస్తే బాలోన్మత్త అవస్థ స్థితి అయితే…. భోగపరంగా చూస్తే పిచ్చి పట్టిన దానిలాగా శివనందిని ఉండిపోయింది. రానురాను ఈమె పిచ్చి పెరగడమే కానీ తగ్గటం లేదు అని అందరికీ అర్థమవుతుంది. మానసిక వైద్యులకు చూపించమని స్థానికులు, ఆలయ పూజారులు ఒకటికి పది సార్లు చెబుతూ ఉండేసరికి…ఈ పిచ్చి అమ్మాయిని హోటల్ లో ఉంచుకుంటే మిగతా వాళ్ళు రారు అని హోటల్ యజమాని పదేపదే చెబుతూ ఉండేసరికి…. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో సాధనా కుటుంబ సభ్యులు ఉండేవారు.  రుద్ర స్వామి , మహాదేవి, పిల్లలు …..శివ నందిని ని తీసుకొని ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి తిరిగి కాశీ క్షేత్రానికి వెళ్లిపోదాము…. శివ నందినిని అక్కడ వదిలేసి ఎవరికి వాళ్లే వెళ్లిపోయి సాధన చేసుకుంటూ కాలానుగుణంగా శరీరాన్ని వదిలి పెట్టాలని నిశ్చయించుకుని  శివ నందినిని తీసుకొని ఇక ఆ రాత్రికి క్షేత్రాన్ని విడిచి వెళ్లాలని అనుకున్నారు. కానీ తన నిర్ణయం శివ నందినికి చెప్పినా కూడా అర్థమై అర్థం కాని బిక్క మొహం వేస్తూ ఉండేది. 

ఓహో..!  నా స్వామి ఇక్కడి నుంచి కాశి క్షేత్రానికి వెళ్ళమంటున్నాడా!  కాశీ క్షేత్రంలో ఆయన నాకు కనపడతాడా..!  ఆయన నాతో పాటు ఉంటాడా..!  ఇక్కడ స్థానికులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కాశి క్షేత్రం అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా.! అక్కడ ఆయన నాతో సరసాలు ఆడతాడు అన్నమాట! ఆయన సాంగత్యం అక్కడ ఉంటుందన్నమాట!  సరే వెళదాం…. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళదాము.  ఏది చేయమంటే అది చేద్దాము. అనే ప్రపంచంలో ఉండిపోయింది.  తన సాధన ఏమిటి..?  తన స్థితి ఏమిటి..?  అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయింది.  దైవమాయ మాయమైతే గాని జ్ఞానం అందదు అని వీళ్ళకి తెలిసినా కూడా…. ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఆ రాత్రి ఒక ఆటో ఎక్కి బయలుదేరారు.  ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆటో చెడిపోవడంతో ఆగి పోవడం జరిగింది. ఆటో వాడు మరో ఆటో తీసుకువస్తా అని చెప్పేసి అనేసరికి….. సరే అని మధ్య రాత్రి ,అర్ధరాత్రి తిరిగి బస్టాండ్ కి వెళ్లే పరిస్థితి కూడా కాదు అని…. అక్కడే ఉండిపోవడం జరిగింది. ఏం చేయాలిరా భగవంతుడా..!  అని ఈ క్షేత్రం వదిలి వెళ్ళటం ఇష్టం లేదా?  ఈ క్షేత్రంలో ఉండే పరిస్థితి కాదు… వెళ్లే అవకాశం లేదు…. ఏం చేయాలో అని చెప్పేసి ఆ రోడ్డుమీద ఉన్న దిమ్మె మీద కూర్చుని ఎవరికి వాళ్లే ఆలోచనలు చేస్తూ ఉండేసరికి…. శివ నందిని కాస్త అయ్య!  మనం స్మశానానికి వచ్చామా ?శివుడు ఆవాసమైన స్మశానానికి వచ్చామా ? ఇక్కడ చూడండి…. స్మశానంలో శివుడు కనపడుతున్నాడు అంటూ ఉండేసరికి…. దీని పిచ్చి లో ఇది ఉంది… మనకు పిచ్చి పట్టేటట్టు చేస్తుంది. పిచ్చి తగ్గించే డాక్టర్ కే పిచ్చెక్కిచ్చేలా…. పిచ్చి పట్టేలా చేస్తే ఇంకేం చేయాలి.  అన్ని తెలిసినా కానీ…. ఏం చేయలేని అయోమయ స్థితిలో తను ఉన్నానని… రుద్ర స్వామి పదేపదే మదన పడుతూ ఉండగా…. అర్ధరాత్రి సమయంలో ఒక ఆటవీక యువకుడు వీళ్ళ దగ్గరికి వచ్చి

ఆటవిక యువకుడు:- అయ్యా!  ఏమైంది అమ్మాయికి… ఏమైనా పిచ్చి పట్టిందా ! మతి భ్రమణం చెందిందా?  స్మశానానికి వెళ్ళిపోతుంది…

రుద్రస్వామి:- ఏం చెప్పమంటావు స్వామి..! 

( ఇది విషయమని ఆ యువకుడికి చెప్పేసరికి…)

ఆటవిక యువకుడు:- అవునా..!  అదేం పెద్ద విషయం కాదు.  ఇలాంటి మతి భ్రమణం చెందిన వాళ్ళని నేను చాలామందికి తగ్గించాను అని చెప్పి…. ఇదిగో  అని ఒక చిన్న వనమూలిక లాంటిది ఇచ్చి…. ఆ పిల్లకి వాసన చూపించు. ఆ వాసనకి యధాస్థితికి వస్తుంది. 

 అని చెప్పేసరికి ఆ యువకుని తేరిపార మహాదేవి గమనించింది.  కేవలం అంగవస్త్రంతో పులి చర్మం చుట్టుకుని ఉన్నాడు.  చేతిలో విల్లంబులు మాత్రమే ఉంది.  జుట్టు ముడి వేసుకొని ఉన్నాడు. ఈకలు ఉన్నాయి.  ఇంకా చేతిలో కూడా ఏమీ లేదు. పోనీ ఇవేవి పెద్దగా అడవులు కూడా కాదు.గూడెములు కూడా లేవు . వాళ్లు వచ్చి ఆరు నెలలు అవుతుంది.  మరి ఈ ఆటవిక యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు?  అని చెప్పేసి అనుకునేసరికి…. ఏమోలే!  ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక అని చెప్పి… అనుమానంగా ఉన్న రుద్ర స్వామికి కేసి చూస్తూ…

మహాదేవి:-  అదేదో వనమూలిక వాసన చూపించమని చెబుతున్నాడు కదా!  ఈ యువకుడు.  పిలిచి చూపించండి..విషయం ఏమిటో తెలుస్తుంది. 

అనేసరికి యువకుడు కాస్త…

ఆటవిక యువకుడు:- మీరేం కంగారు పడొద్దు…. ఎలా వచ్చిందో అలా పోతుంది.. మాయ మాయమవుతుంది… తనకి అర్థం అవుతుంది.  తట్టుకోలేని పరిస్థితిలో తను ఉన్నది.  సహజ స్థితికి వస్తుంది . నా మాట నమ్మండి…

అని ఆ యువకుడు మూలిక ఇచ్చేసి…. తన దారిలో తాను వెళ్లిపోయాడు.  కొంత దూరం వెళ్ళాక ఆ యువకుడు అదృశ్యం అవ్వడం…. మహాదేవి గమనించింది. ఈయన  సామాన్యుడు కాదు.  స్థల పురాణం ప్రకారంగా ఆటవిక యువకుడి రూపంలో అర్జునుడికి కనిపించి యుద్ధం చేసిన శివుడే తనకి ఈ రూపంలో వచ్చి ఇచ్చాడా?  అని అనుకొని అప్పుడు  రుద్రస్వామికి చెప్పినా వినే పరిస్థితుల్లో లేకపోవడంతో…. రుద్ర స్వామి చేతిలో ఉన్న వనమూలికలు తీసుకొని…. అప్పటికే శివ నందిని స్మశానానికి చేరుకొని…. రంగా…. పాండురంగ ….నువ్వు స్మశానవాసివి… నువ్వే శివుడివి… నువ్వే విష్ణువు….నువ్వు శివుడు అంటే శివుడు ….నిన్ను అమ్మవారు అంటే అమ్మవారివి… అదే విష్ణువు అంటే విష్ణువువి…. నువ్వు ఎలా కావాలంటే అలా పలుకుతావు… కనపడతావు అని చెప్పేసి పదేపదే అరుస్తూ ఉండేసరికి…. అటవీక యువకుడు ఇచ్చిన వనమూలికను శివ నందిని ముక్కుకి తాకించగానే ఆ ఘాటుకి శివ నందినికి ఒక విధమైన మైకం ఆవరించి నిద్రపోయింది.  అలా దాదాపు రాత్రంతా స్మశానంలోనే వీళ్లంతా ఉన్నారు. గాఢ నిద్రలోకి వెళ్లిన శివనందిని ఉదయం 6 గంటలకు నిద్ర నుంచి లేచిన దానిలాగా లేచి …..

శివ నందిని:- ఏమైంది నాకు… నేను ఈ స్మశానంలో నిద్రపోవడం ఏమిటి?  నా దుస్తులు ఏంటి ఇలా పీలికలుగా ఉన్నాయి… చీకిపోయి వికారంగా ఉన్నాయేంటి.? నా జుట్టు ఏంటి ఇలా విరబోసుకుని ఉన్నాను…. ఏం జరిగింది? నాకు ఏమైనా పిచ్చి పట్టిందా!  దయ్యం పట్టిందా!  

అని రుద్రస్వామి కేసి ,మహాదేవి కేసి చూస్తూ అదోలా అనేసరికి…ఆమె సాధారణ స్థితికి వచ్చింది అని గ్రహించడానికి వీళ్ళకి అట్టే సమయం పట్టలేదు.  శివ నందినిని చూస్తూ పిల్లలు భయపడుతుంటే…. రారా చిన్న..!  రారా కన్నా..!  అని పిలిచిన కూడా వాళ్ళు శివ నందిని దగ్గరికి వెళ్ళటానికి భయపడి అయోమయంగా చూస్తూ ఉండేసరికి… తనకేదో జరిగింది… తను ఏదో అలౌకిక స్థితికి వెళ్ళిపోయాను అని చెప్పి అర్థం అయ్యి….మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, హోటల్ కి వెళ్ళిపోదాం అని చెప్పి వేరే హోటల్లో గది తీసుకోవటం జరిగింది. తర్వాత శుభ్రంగా ఒకటి, రెండు గంటల పాటు తల స్నానాధికాలు చేసుకొని…. ఆకలి వేస్తూ ఉండటంతో రుద్ర స్వామి కాస్త అందరికీ టిఫిన్లు తీసుకురావడం….ఆ టిఫిన్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది… తన జీవితంలో, అని వివరాలన్నీ తెలుసుకోవడం…తను పాండురంగడు పిచ్చిలో ఉండటం… ఆ పిచ్చిలో ఉండి తను చేసిన పనులన్నీ ఒక్కొక్కటి మహాదేవి ఫోన్లో వీడియోలు తీసి ఉండటంతో…. ఆ వీడియో ఒకటి చూపించడంతో…. విషయం  అర్థమైంది. ఆ తర్వాత ఒక ఆటవిక యువకుడు ఇచ్చిన మూలిక వలన తను మామూలు స్థితికి వచ్చిందని గ్రహించింది. ఆ ఆటవిక యువకుడు వీడియో తీసినప్పుడు అదృశ్యమైన విషయం కూడా చెప్పేసరికి…. నాకు తెలిసి అతను అటవీక యువకుడు కాదని….మహాశివుడు అని ఈ యువకుడు రూపంలో వచ్చి ఉండాలని అనేసరికి….…. సరే ఆయన నీకు ఆ పిచ్చి తగ్గించాడు.  లేదంటే ఆ ఆ పిచ్చి లోనే ఉండే దానివి అనేసరికి….

శివ నందిని:- దైవసాక్షాత్కారం కోసమే కదా!  సాధన చేయాల్సింది.  మరి అది పిచ్చి ఎలా అవుతుంది? మాయ ఎలా అవుతుంది?

రుద్ర స్వామి:- అమ్మ!  దైవాలు కూడా తాము మోక్షం పొందటానికి తమ సహాయ సహకారాలు అందించరు.  ఎందుకంటే దైవాలు వరాలు ఇచ్చే వాళ్ళు.  మనం తీసుకునే వాళ్ళం.  నిజానికి మనం దేవుళ్ళమే కానీ, మనం దేవుళ్ళమనే విషయం తెలిసేసరికి… మనకి పూర్ణ జ్ఞానం అందివ్వకుండా మనం మాయలో ఉన్న మాయా జీవులమని… మనం పాపాలు చేసిన వాళ్ళమని చెబుతారు.  వాళ్ళకి నిత్య నైవేద్యాలు, సేవలు ఇవన్నీ కూడా మన చేత చేయించుకుంటారు.  నిజానికి మనం కూడా ఆ పల్లకి ఎక్కే వాళ్ళమే.  పల్లకి మోసే వాళ్లు కావాలి కదా!  వాళ్ళు పల్లకి ఎక్కే వాళ్ళు… మనం వాళ్లకి మోసే వాళ్ళం అన్నట్టుగా చేస్తా ఉంటారు.  మనం నిజానికి పల్లకి మోసే వాళ్ళం కాదని…. పల్లకి ఎక్కే అర్హత, యోగ్యత, యోగం ఉన్న వాళ్ళమే అని….మనం కూడా బుద్ధ జీవులమని , దైవత్వాలకు మించిన పై స్థాయికి వెళ్లడం వాళ్లకి ఇష్టం ఉండదు. అందుకోసమని ఈ మణిపుర చక్రంలో దైవమాయగా…. దైవదర్శనం… సాక్షాత్కార మాయ పెట్టడం జరిగింది. ఇక్కడ సాధన ఆరంభించిన స్త్రీలకి గాని, పురుషులకి కానీ , 98% ఈ దైవసాక్షాత్కార మాయను దాటలేక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు అన్నమయ్య, రామదాసు విషయానికి వస్తే ….దైవసాక్షాత్కార మాయ ఎంతటిదో నీకు అర్థమవుతుంది . అంత్య కాలంలో వాళ్ళు ఇష్టదైవాలు సాక్షాత్కారం అయినప్పుడు…. ఆ దైవాలు కాస్త మోక్షలోకానికి మిమ్మల్ని పంపిస్తాం అన్నప్పుడు…. మీరు లేని మోక్షలోకం మాకెందుకు ? మీకు సేవలు చేస్తున్నప్పుడు కలిగే ఆనందం…. మీరు లేనప్పుడు కలిగే ఆనందం ఉండదు కదా!  మీ సేవలో ఉండి సేవలు చేసే భాగ్యం కలిగించాలి… మీ సమక్షంలోనే మమ్మల్ని ఉంచండి అని చెప్పేసి మోక్షమునకు వెళ్లకుండా వాళ్ళు దేవతలుగా ఉన్న లోకంలోనే వాళ్లకి సేవలు చేసే సేవకులుగా… వాళ్ళ గణాలలో ఉండిపోవడం జరిగింది. అలాగే కబీర్దాస్ కి శ్రీరాముడి సాక్షాత్కారం జరిగినప్పుడు…. రామా అని నిత్య రామనామ నామస్మరణ చేయడం వల్ల అయోధ్య రాముడు కనబడితే…. నువ్వు కేవలం రామ మంత్ర దైవానివే… కానీ మూలరాముడికి నామరూపాలు లేని స్థితి శూన్య స్థితి ఉంటుంది. శూన్య బ్రహ్మ అని చెప్పేసి రామసాక్షాత్కార మాయను కబీర్ దాస్ దాటడం జరిగింది. అలాగే రామకృష్ణ పరమహంస కూడా కాళికామాత యొక్క సాక్షాత్కార మాయను దాటించాలి అని ….తోతాపూరి అనే మహాయోగి గురువుగా వచ్చి రామకృష్ణ పరమహంసకి నుదుటి మీద గాజు ముక్కతో గాటు పెట్టడంతో…. అమ్మవారి పాదాలు రూప దర్శనం అంతా కూడా భ్రమ ,బ్రాంతి మాయ అని….. మనోమాయ కలిగి నిరాకార తత్త్వం అనుభవ అనుభూతి పొందడం జరిగింది.  ఆ తర్వాత ఆయన యధాస్థితికి వచ్చి అమ్మవారు ఆకారంలో ఉంటేనే నాకు ఆనందం.  నిరాకారంలో అమ్మవారు లేని స్థితిని నేను ఊహించుకోలేను.  నేను సజీవ మూర్తిగా ఉన్నట్లుగానే ….ఆవిడ కూడా ఉంది అని చెప్పేసి ఆకారతత్వంలోనే ఉండిపోతానని…. పాము కదిలితే ఆకారతత్వం, పాము కదలక పోతే నిరాకార తత్వం అని ఆయన కాళికా మాత అనుగ్రహం కోసం ఆకారతత్వంలో అలాగే ఉండిపోవడం జరిగింది.  ఇలా ఆకార నిరాకార తత్వాలు తెలిసినా…. అనుభవం అనుభూతి పొందిన వాళ్లు కూడా… ఈ దైవసాక్షాత్కార మాయను కావాలని కొంతమంది దాటలేకపోతే…. తెలిసో తెలియకో ఎలా దాటాలో అర్థం కాక ఆగిపోయిన వాళ్ళు కోకొల్లలు మంది ఉన్నారు.  నీకు ఈ దైవసాక్షాత్కార మాయ దాటించడానికి భీమశంకరుడే ఒక ఆటవిక యువకుడి రూపంలో వచ్చి వనమూలికను ఇవ్వటం జరిగింది. ఈ వనమూలిక యొక్క యోగమత్తు ఘాటువాసన వలన  అద్వితీయమైన స్థితిలో ఉన్న నీ కుండలిని శక్తి ప్రవాహం కాస్త….శరవేగంతో ఉన్నది కాస్త….నెమ్మదించి మామూలు స్థితికి రావడం జరిగింది ….

శివ నందిని:- అవునా..!  ఇంత జరిగిందా .! 

తనకి సాక్షాత్కార మాయను దాటించినందుకు భీమశంకరుడికి, మాణిక్యంబ దేవికి కృతజ్ఞతలు చెప్పడంతో…. ఆ రోజు నుంచి శివనందిని యధావిధిగా మణిపుర చక్ర శుద్ధి కోసం ….దైవసాక్షాత్కార మాయ దాటడంతో… అగ్ని ముద్రతో ధ్యాన  విధివిధానము చేయడం ఆరంభించింది.  ఈ విధంగా తన సాధనను కొనసాగించడం జరిగింది. 

శివ నందిని కాస్త రుద్ర స్వామితో…

శివ నందిని:- అయ్యా !  ఏదో ఆటవిక యువకుడు రూపంలో శివుడు వచ్చి… వనమూలికలు ఇవ్వటంతో… ఆ వనమూలికల ఘాటుకి సహజ స్థితికి రావడం జరిగింది.  అలాగే ఈ చక్రం మాయాలో వచ్చే సాక్షాత్కారమాయని మిగిలిన వాళ్ళు ఎలా దాటుతారు? దాటారని ఎలా తెలుసుకుంటారు?

రుద్రస్వామి:- ఈ మాయను దాటటానికి… అలాగే ఈ చక్రంలో వచ్చే విషయ వాంఛలని దాటడానికి…. విషయ వాసనలను దాటటానికి…. యోగులు గంజాయి, గుట్కాకి అలవాటు పడటం జరిగింది. అదే భోగంలో ఉన్న వాళ్ళు తాగుడికి అలవాటు పడతారు. జూదానికి, సప్త వ్యసనాలకి అలవాటు పడతారు.  మిగిలిన యోగులు వచ్చేసరికి జ్ఞాన వల్లి పేరుతో గంజాయిని సేవించడం జరిగింది.  అఘోర రూపంలో శివుడు గంజాయి సేవనం చేయడం జరిగింది . ఇక దత్తాత్రేయ అంశల గురువులైన గజాననమహారాజు, షిర్డీ సాయిబాబా, ఇలాంటి వాళ్ళు మధ్యాహ్నం భోజనానంతరం గుట్కాను సేవించడం జరిగేది అని ఆయన జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. ఇలా ఏదో ఒక దాంట్లో పదార్థ రుచికి అలవాటు పడి విషయ వాంఛలకు దూరంగా ఉండటం…. దైవమాయలకు దూరంగా ఉండటం… జరిగేది. అలాగే అమ్మవారు తాంబూల సేవనంతోనూ, మిగతా దైవాలు ఇష్టపదార్థాలతోనూ ఇక్కడే మాయలో పడటం ఆరంభం అవుతుందన్నమాట!  ఆ రుచుల మాయలో…. ఆ దైవసాక్షాత్కార మాయలను,  విషయం వాంఛలను, లోక విషయాలు….సంసారిక విషయాలకు దూరంగా అవటం జరుగుతుంది.  శరీరమే ఉంటుంది కానీ మనసు దైవం మీద ఉండేటట్టుగా వీళ్ళు చేయడం జరిగింది. అంతెందుకు నీ ఇష్టదైవాన్నే అడుగు.  ఆయన నీకు ఏ విధంగా పరిష్కారం మార్గం చూపించేవాడో తెలుస్తుంది.

శివ నందిని:- వామ్మో..!  ఇప్పుడు మళ్ళీ పోయి పోయి… తెలిసి తెలిసి దైవ సాక్షాత్కార మాయలో పడమంటారా? నావల్ల కాదు… 

రుద్రస్వామి:- మాయ మాయ అని తెలిసినంతవరకు అది మాయగానే ఉంటుంది… మాయ అని తెలిసిన తరువాత మాయ మాయమైపోతుంది. అది గ్రహించు. ఇప్పుడు దైవసాక్షాత్కారం కూడా ఒక మహా మాయ అని తెలుసుకున్నావు. ఇప్పుడు మాయలో పడమన్నా పడవు.  విషయం ఆయన్ని అడుగు… ఆయనే చెప్తాడు.

శివ నందిని:- నాకు తెలిసి ఇంక పాండురంగడు దర్శనం ఇస్తాడని నేను అనుకోను. ఒకవేళ ఇస్తే నేను మాయలో పడతానేమో… నావల్ల అయితే కాదు. 

దాంతో ఇక అందరితో గుడికి వెళ్లి ధ్యానం చేసుకుంటాను అనేసరికి….అందరూ గుడికి వెళ్ళటం జరిగింది. గుళ్లో చుట్టుపక్కల వాళ్ళు స్థానికులు, భక్తులు అందరూ కూడా… ఈమె మామూలు స్థితికి వచ్చిందని… పిచ్చి తగ్గిందని… చెప్పి గ్రహించి సరైన వైద్యం చేయించినందుకు రుద్రస్వామికి అభినందనలు చెబుతూ రావడం మొదలయింది. తన పిచ్చి వలన ఎంతోమంది భక్తులు ఇబ్బంది పడ్డారు గ్రహించి…మినుకుండి పోయింది. ఇలా ధ్యానం చేస్తున్న సమయంలో దైవసాక్షాత్కార మాయగా పాండురంగడు సజీవ మూర్తిగా కనిపించి…

పాండు రంగడు:- దేవి..!  నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీతో సాంగత్యం కావాలి…

శివ నందిని:- స్వామి..!  నువ్వు చేసిన లీలా విన్యాసం నాకు అర్థం అయింది. నేను గ్రహించాను. తెలుసుకున్నాను. ఆ మాయను దాటడం జరిగింది. అయినా మీరు ఎందుకు దైవసాక్షాత్కార మాయలో మమ్మల్ని పడేస్తారు.

పాండు రంగడు:- దేవి..!  మాకు భౌతికంగా భూలోకంలో మనుష్య జన్మలో ఎత్తాలని గాని… జంతు జన్మలు ఎత్తాలని అంటే ఒక విధమైన భయం. ఎందుకంటే మేము తిరిగి పునః జన్మలకి వెళ్లే మాయలో పడిపోతాము… అని చెప్పేసి కానీ మాకు కొన్ని ఇష్ట కోరికలు మిగిలిపోతాయి.  ఆ ఇష్ట కోరికలను మీలాంటి భక్తుల ద్వారా మేము తీర్చుకోవడం జరుగుతుంది. ఇలా సాక్షాత్కార మాయలో వరాలు ఇవ్వడంతోనూ… మీకు కావాల్సిన కోరికలు, వరాలు తీరుస్తూ…. మా కోరికలు, అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. నాకు ఇష్టమైన భోజ్య పదార్థాలు సుమారు 54 ఉన్నాయి.  అవి నేను పూరి జగన్నాధ క్షేత్రంలో ప్రతినిత్యం నేను శ్రీకృష్ణుని రూపంలో అక్కడే ఉండి భోజనం చేయడం జరుగుతుంది. అలాగే నాకు తిరుపతి లడ్డు ఇష్టం. అప్పుడు వేంకటేశ్వర స్వామిగా తిరుపతి లడ్డు, వడలు తినడం జరుగుతుంది. అలాగే నిత్య అభిషేకాలు కావాలనుకున్నప్పుడు శివలింగ రూపంలో నిత్యభిషేకాలు పొందటం… అలంకారాలు కావాలనుకున్నప్పుడు అమ్మవారి రూపంలోనూ,  విష్ణుమూర్తి రూపంలోనూ ఉండి నేను అనేక రూపాలలో… అనేక పేర్లతో…  నా అవసరాలు,  నా కోరికలు మీలాంటి భక్తుల చేత తీర్చుకుంటూ ఉంటాను. కాకపోతే నిజభక్తులకి, ప్రసాద భక్తులకి  తేడా ఏమిటంటే….నిజభక్తులకి కోరికలు ఏమి ఉండవు. వాళ్ల కోరికలు తీర్చాలని తపన, తాపత్రయం పడుతూ ఉంటాము. వాళ్ళకి కోరికలు అంటూ ఏమీ ఉండవు. వాళ్ల ద్వారా మా కోరికలు తీరుతూ ఉంటాయి. అదే ప్రసాద భక్తులు మాత్రం వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ… మా కోరికలను పక్కన పెట్టడం జరుగుతుంది. అందుకని మా కోరికలు తీర్చే నిజభక్తుల వెంట మేము పడడం జరుగుతుంది. ఆ విధంగా దైవ దర్శనాల రూపంలోనూ…. దైవసాక్షాత్కారాల రూపంలోనూ… భౌతిక దర్శనాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే దైవసాక్షాత్కారంలో ఉన్న నిగూఢ రహస్యం.

శివ నందిని:- సరే స్వామి..!  మరి మీ మాయను దాటడం ఎలా?

పాండు రంగడు:- అంత్యకాల స్థితి వచ్చేదాకా భక్తుడ్ని వదిలిపెట్టము. ఇక వాళ్ళు దేహం వదిలిపెట్టి నిర్యాణం చెందుతారు అనే సమయంలో…. వాళ్లకి మోక్ష అనుభవం ఇవ్వడం జరుగుతుంది. ఆ మోక్ష అనుభవ అనుభూతి పొందినప్పటికీ… మా దైవసాక్షాత్కార మాయలో ఉండటం వలన… కేవలం మా సేవలు చేయడం వలనే ఆనందం కలుగుతుంది అనే భ్రమభ్రాంతిలో పడటంతో…. మోక్షలోకానికి వెళ్లకుండా మాలోకంలో ఆవాసం చేస్తూ ఉంటారు. మా కోరికలు తీరుస్తూ ఉంటారు.  కోరికల కోసం అని చెప్పి వాళ్లకి కారణ, అకారణ జన్మలు ఇస్తూ పునః జన్మలో పడవేయడం జరుగుతుంది. కాలానుగుణంగా వారికి మణిపుర చక్రస్థితికి సాధన వచ్చేవరకు ఎదురు చూసి…. ఆ స్థితికి వచ్చిన తరువాత మేమే వాళ్లకి నిజమైన దైవాలుగా…. భ్రమ,భ్రాంతి మాయలు కలిగిస్తూ మా కోరికలను, వాళ్ల కోరికలుగా తీర్చుకుంటూ… వాళ్ళ అవసరాలు తీరుస్తూ ….మోక్షం వైపుకి వాళ్ళ మనసుని వెళ్ళనివ్వకుండా… ఆ జ్ఞానం అందనివ్వకుండా… మా మాయలో పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ భ్రమ,బ్రాంతి  మనోమాయ అని తెలుసుకుంటారో ….లేదు అంటే సద్గురువుల సహాయంతోనూ… లేదా భౌతిక గురువుల సహాయంతోనూ… ఆ జ్ఞానమును పొందడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు సాక్షాత్కర మాయ దాటడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే శివుడు సహాయంతో నా సాక్షాత్కారం ఆయన దాటావో….అలాగే భక్తులు కూడా ఆ సాక్షాత్కార మాయను దాటడం జరుగుతుంది. సాక్షాత్కర మాయను దాటే యోగం ఉంటే కాలానుగుణంగా పరిస్థితులకి అనుగుణంగా దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ మాయను దాటించడం జరుగుతుంది. కాకపోతే నిజానికి చెప్పాలంటే…. మీ ద్వారా మేము కూడా మోక్షమును పొందాలి అని అనుకుంటాము. మా దైవిక శక్తి, ఆత్మ శక్తి మీలోకి ప్రవేశించి…. మేము మోక్ష లోకమును పొందాలి అని అనుకుంటాము. సమస్య ఏమిటంటే…. మీరు మా దేహాల యొక్క దివ్యకాంతి, దివ్య తేజస్సు కి , ముగ్ద మనోహర దివ్య స్వరూపానికి…మాయలో పడిపోయి… మేము కాస్త మీ మాయలో పడటం… మీరు కాస్త మా మాయలో పడిపోవడంతో… పునః జన్మలకి దైవాలుగాను, భక్తులు గానూ ఎత్తడం జరుగుతుంది. మా కోసం మిమ్మల్ని పుట్టిస్తే…. మీకోసం మమ్మల్ని పుట్టించడం జరుగుతుంది. తద్వారా ఒకరికొకరు అవినాభావ సంబంధం కలిగి  మాయలో ఉండటం వలన…. ఒకరినొకరు భ్రమ భ్రాంతులలో పడి ఉండటం వలన…. మోక్షానందం పొందాలి ….మోక్షమునకు వెళ్లాలి అనే ఆలోచన రాని అనితర సాధ్యమైన దైవ అనుబంధమాయలో పడిపోవడం జరుగుతుంది. నిజానికి ఇక్కడ వాళ్లు పూజించే దేవుడు, వాళ్ళ భక్తులు కూడా ఒకరినొకరు మోహ మాయలో పడటంతో…. వాళ్ల సాధన పరిసమాప్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడ గురుశిష్యుల సంబంధం కూడా ఇలాంటివే. గురువు యొక్క వాక్ చాతుర్యానికి శిష్యుడు మాయలో పడతాడు. శిష్యుడు యొక్క క్రమశిక్షణ లేదా జ్ఞానపటిమకు గురువు మాయలో పడతారు. వీళ్లిద్దరూ కూడా మాయలో పడటం జరుగుతుంది. అలాగే భోగ జీవితానికి వచ్చేసరికి తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇలా భార్యాభర్త, బావ మరదలు, ఇలా భోగ మాయలో పడడం జరుగుతుంది. దేవుడు భక్తుడిగాను, గురువు శిష్యుడిగాను పడితే… భోగ జీవితంలో అలా పడటం జరుగుతుంది. ఎవరికి వారే ఆ మాయను దాటాలి అని ప్రయత్నం చేయాలి. తెలుసుకునే శక్తి, తెలుసుకోవాలని స్థితి ఆలోచన కూడా రానంతగా మాయ కలిగిస్తుంది. ఏదో కాలానుగుణంగా యోగం ఉంటే తప్పించి పరిస్థితుల వలన ఈ మాయను దాటాలనే జ్ఞానం మనకి గురువులకు సహాయంతో గాని… ఇతరుల సహాయంతో గానీ, ఇతర దైవాల సహాయంతో గాని దాటించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు నీకు నేను కావాలా? మోక్షలోకం కావాలా? అని అడిగితే నా మాయను దాటడం వలన నువ్వు సరాసరి మోక్ష లోకమే కావాలని చెప్పే స్థితిలో నీ సాధన ఉన్నది. కానీ, నేను.!  నువ్వు లేకపోతే ఇంకొకరు నా కోరిక తీర్చే వాళ్ళని వెతుక్కునే పరిస్థితిలో నా సాధన స్థితి ఉండటం జరిగింది. కాబట్టి ఇక్కడ దైవాన్ని మించిన భక్తుడు కాస్త భగవంతుడుగా మారే యోగము ఉంటుంది. ఒకప్పుడు హనుమంతుడు శ్రీరాముని భక్తుడు. ఇప్పుడు రామభక్తిని దాటిన హనుమంతుడు కాస్త భగవంతుడిగా మారడం జరిగింది కదా!  అందుకే భక్తుడు భగవంతుడుగా మారే అవకాశం మనకి రామాయణంలోనే హనుమ జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది అని…. ఈ మాయ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. దీనికి సమయం, సందర్భం విధివిధానం అంటూ ఏమీ ఉండదు. యోగం ఉంటే దాటించగలిగే వాడు సమయానికి వచ్చి దాటించటం జరుగుతుంది. దాటాలి అని అనుకోవడమే… వాడు దాటించే స్థితికి వచ్చినా గాని దాటలేని పరిస్థితిలో ఉండటం జరుగుతుంది అన్నమాట! ఇంక నాతో నీకు పని లేదని అర్థం అయింది. నీకు దైవమాయ మాయం అయ్యిందని గ్రహించాను.

అని చెప్పేసి ఆయన అంతర్దానం అయ్యేసరికి ఎలాంటి భావాలు వ్యక్తపరచకుండా…. మంచిది అనుకుంటూ శివ నందిని కాస్త అగ్నిముద్రతో ధ్యాననిష్ఠలోకి వెళ్లిపోవడం జరిగింది.

పిల్లలు కాస్తా శివ నందిని దగ్గరికి వచ్చి అమ్మ! అమ్మ!  ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా …?ఉంటే చూద్దాము అనేసరికి ఇంటర్నెట్లో వెతికితే జన్మ నక్షత్రాలకు సంబంధించిన 108 నక్షత్రాల….. 108 నక్షత్ర పాద శివాలయాలు ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకుని దానిని చూడడానికి వెళ్లడం జరిగింది. ఇక ఏ క్షేత్ర నక్షత్రాల వాళ్ళు ఈ దేవాలయాల దర్శనాలన్నీ అయ్యేసరికి… రాత్రి అవడంతో, ద్రాక్షారామానికి వచ్చి, భోజనాలు కానిచ్చుకొని గదికి వెళ్లి, విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత శివ నందిని కాస్త తన హృదయం మీద చేయి పెట్టుకొని స్వామి!  స్వామి!  అని పిలిచేసరికి…అటు నుంచి ఎలాంటి  సమాధానం రాకపోయేసరికి… మొదట కంగారు పడింది. తర్వాత ఆవేదన చెందింది. ఆ తర్వాత నెమ్మదిగా కంగారు పడాల్సిన అవసరం లేదు… ఆవేదన చెందాల్సిన అవసరం లేదు… ఆయన అంతట ఆయనే వస్తారు. ఆయన ఎక్కడ  వదిలిపెడతాను అని చెప్పలేదు కదా!  వెళ్ళను అని మాట ఇచ్చారు కదా! మరి ఇంకెందుకు కంగారు పడటం అని చెప్పి అనుకుంది. అంటే తనలో ఆవేదనలు, ఆవేశాలు, ఆలోచనలు, తగ్గుముఖం పడుతున్నాయని…. ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం విశ్లేషణ శక్తి పెరుగుతుందని శివ నందిని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు అని…. అనవసరమైన విషయాల గురించి అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి శివ నందిని అనుకుంటూ ఉండగా…. తన పక్కన సజీవ మూర్తిగా శివ స్వామి కనిపించేసరికి….

శివస్వామి:- ఈ జ్ఞానం నీకు అందిందా ! లేదా? అని కొన్ని క్షణాల పాటు నీకు దర్శనం ఇవ్వలేదు దేవి…

శివ నందిని:- కారణం లేనిదే మీరు ఆలస్యం చేయరు. ఏదో ధ్యానంలో ఉన్నారేమో అనుకున్నాను.

శివస్వామి:- కాదు…. నీకు విశ్లేషణ శక్తి పెరిగిందా లేదా విచక్షణ శక్తి పెరిగిందా లేదా అని తెలుసుకున్నాను.  నెమ్మదిగా నీలో శక్తి పెరుగుతుంది. అయినా నువ్వు పాండురంగడి విగ్రహం మూర్తి మాయలో ఉన్నావు కదా! మరి మాయని ఎలా దాటావు?

శివ నందిని:- మీరు దొంగోళ్ళు. మీకు అన్ని విషయాలు తెలుసు. తెలిసినా కానీ ఏమీ పట్టించుకోకుండా… నా మానాన నన్ను వదిలేశారు. నా చావు నన్ను చావమని.. అయినా మీరంతా ఉండి కూడా నన్ను ఆ మాయలో పడనివ్వడం ఏంటి? ఆ మాయలోనే నేను పడిపోయి సాధన అర్ధాంతరంగా ఆగిపోతే….నా జన్మ సాధన పరిసమాప్తి ఎలా అయ్యేది….! 

శివ స్వామి:- అమ్మ తల్లి! నువ్వు ఆ మాయలో పడతావని రుద్ర స్వామి ఎప్పుడో నీకు ప్రాప్తిసిద్ధి ద్వారా పాండురంగడు విగ్రహం మూర్తి వచ్చినప్పుడే చెప్పారు కదా!  అది దైవసాక్షాత్కార మాయ.  అది దైవదర్శన మాయ… ఆ మాయలో నువ్వు పడవద్దు… ఆ మాయని నువ్వు దాటాలి… అది మణిపురచక్రంలో వస్తుంది. దీనిని దాటడం నీ అంతట నువ్వే దాటాలి. మేము ఏమి చేయలేం అనేసరికి…. అదేమంత పెద్ద సమస్య కాదు ….ఆ సమయం వచ్చినప్పుడు దాటుతాను అని చెప్పి అన్నావు.  కానీ దైవసాక్షాత్కార మాయ అనుభవ అనుభూతిలోకి వచ్చేసరికి…. దాటలేక పిచ్చిదానిలాగా అవధూత స్థితిని పొందావు. దైవమాయ దాటతావో లేదో అని చెప్పేది నాకు కూడా అనుమానం వచ్చే అంతలాగా నీ స్థితి ఉండిపోయింది. నీకు ఏదో మూల అదృష్టం ఉండబట్టి….యోగం ఉండబట్టి…. భీమశంకరుడు కాస్త ఆటవిక యువకుడి రూపంలో వచ్చి వనమూలిక ఇవ్వటంతో… నువ్వు సాధారణ స్థితికి రావడం జరిగింది.

శివ నందిని:- నాకు ఇక్కడే ఒక విషయం అర్థం కాలేదు స్వామి! ఈ సాక్షాత్కార మాయ సాధారణ స్థితిలో ఉండే సాధకులు గాని, సాధకురాలు గాని దాటరనే విషయం ఎలా తెలుస్తుంది ?

శివ స్వామి:- ఇక్కడ దైవసాక్షాత్కార మాయ కాదు…. గురు సాక్షాత్కార మాయ కూడా వస్తుంది.  దైవం భక్తుడు, గురువు శిష్యుడు అని రెండు రకాల అనుబంధాలు ఏర్పడతాయి. అదే భోగ జీవితంలో వచ్చేసరికి తల్లి కొడుకు, తండ్రి కూతురు, భార్య భర్తలు అనుబంధాలు ఉండటం జరుగుతుంది.  నీకు ఈ విషయం పాండురంగడు చెప్పకనే చెప్పాడు… అంటే ఏమిటంటే… ప్రేమ అయినా… భక్తి అయినా…. కూడా అంత్యకాల స్థితికి…. చిట్ట చివరిస్థితికి చేరుకునేసరికి…. ఒక రకమైన తన్వయత్వం ఆనంద స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో అవతలి వాళ్ళ నుంచి ఆశించిన ప్రేమ దొరకకపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు మనసుకి దెబ్బ తగలడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతి రోజు నీకు పాండురంగడు కనిపించేవాడు. కొన్ని రోజులపాటు పాండురంగడు కనిపించకపోయేసరికి నీలో ఒక విధమైన అహం మొదలైంది.  నాలాంటి నిజభక్తులు, నిజ భక్తురాలు ఎవరైనా ఉంటారా? ఆయన సాంగత్యం కోసం నేను సాధన చేశాను కదా! నిత్యం ఆయన నా పక్కనే ఉండాలి….నాతోనే ఉండాలి… నా కోసమే ఉన్నాడు కదా!  ఇన్ని రోజులు కనిపించిన వాడు ఇప్పుడు కనిపించడం లేదు ఏమిటి? నాకు మించిన భక్తులు ఉన్నారా!  ఆయనకి నేను చేసిన సేవలు చేశారా? ఇలా నీలో తెలియని గర్వం, అహంకార బీజాలు మొదలై…. నీకు ఆయన దైవసాక్షాత్కార స్థితిలో కనిపించకుండా పునాదిరాయి వేయడం జరిగింది. ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నా కూడా ఆయన నీకు అనుగ్రహం ఇవ్వకపోయేసరికి…. నీలో ఒక విధమైన నిరుత్సాహం ఆవరించింది.

శివ నందిని:-  స్వామి!  మీరు చెప్పింది నాకు అర్థమై అర్థం కానట్టుగా ఉంది.  నాకు అర్థం అయ్యే భాషలో చెప్పరా!

శివ స్వామి:- నీకు లౌకిక భోగ జీవితంలో జరిగిన సాధారణ విషయం లాగానే చెబుతాను. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు ఉన్నారు. భార్యకి భర్త మీద అభిమానం, ప్రేమ ఉంటాయి. మొదట్లో ఉంటాయి. ఆయన ప్రేమను పొందాలని ఆయన కనుసైగల్లో ఉండాలని…. ఆయనకు అనుగుణంగా ఉండాలి అని అనుకుంటూ…. అలాగే భర్త కూడా ఆమెకు అనుగుణంగా ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కొంతకాలం ఎలా ఉంటారంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేమో అనే విధంగా ఉంటుంది. మూడు రోజులకు మించి విరహవేదన భరించలేని స్థితిలో వీరిద్దరూ ప్రేమ అనురాగాలు, ఆప్యాయత పంచుకునే  స్థితిలో ఉంటారు. రోజు మొత్తం మీద 24 గంటల్లో 20 గంటలు సాంగత్యం ఉన్నప్పటికీ కూడా తనివి తీరదు. ఇంకా కావాలి ఇంకా పొందాలి అనే అంత ప్రేమ ఆప్యాయతలలో సుమారుగా మూడున్నర సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటారు. అనుకోకుండా పురుషుడు గాని, స్త్రీ గాని పర స్త్రీ లేదా పరపురుషుడితో అనుబంధం పెట్టుకోవడం గాని…. ప్రేమను పంచుకోవడం కానీ…. స్నేహం చేయడం గానీ… సాంగత్యం పొందడం అనేది గాని వీరిద్దరి దృష్టికి వస్తే… వాళ్ళ మద్య ప్రేమ ఉంటుందా ఉండదా?

శివ నందిని:- ఈ ప్రేమ ఎందుకు ఉంటుంది… ఉండదు కదా!  ఆ ప్రేమ పునాదులకి దెబ్బ తగులుతుంది కదా!  దెబ్బతిన్నట్టే కదా!

శివస్వామి:- అప్పుడు ప్రేమ ఉండాల్సిన చోట ఏముంటుంది?

శివ నందిని:- ఆవేశం, కోపం,ఆవేదన ఉంటుంది. 

శివ స్వామి:- అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మునుపటి సాంగత్యం ఉంటుందా?

శివ నందిని:- సాంగత్యం ఉండదు…. బంధాలు ఉండవు…బంధనాలు మాత్రమే ఉంటాయి. మొదట మానసికంగా దూరమవుతారు. శారీరకంగా దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

శివస్వామి:-అలాగే దైవం విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది.  దైవమాయస్థితి అంత్యస్థితి దాకా వెళ్లేసరికి ఆయన ఉన్నట్టుండి కనిపించడం కానీ…. మాట్లాడటం కానీ…. అనుగ్రహం చూపించడం కానీ ….చేయడు.  ఒకప్పుడు మనం పిలిస్తే క్షణకాలంలో వచ్చేవాడు, గంటకు రెండు రోజులకు కనపడతాడు. మనం పెట్టినవి ఎప్పటికో తింటున్నట్టు… భ్రమ,బ్రాంతి కలిగించడం జరుగుతుంది.  అంటే ఆయనకి నీ మీద మోహ వ్యామోహాలైనా తగ్గాలి లేదా ఆయనకి ఆయన మీద నీకైనా  మోహం తగ్గాలి… లేదా భక్తి ప్రపత్తులు తగ్గి ఉండాలి.  ఎందుకంటే వీళ్ళకి మధ్యలో ఏదో తెలియని అనుమాన భయం మొదలవుతుంది. భక్తుడికి ఏమో ఈయనకి ఎవరైనా పరభక్తుడు ఉన్నారేమో…. నేను పిలిచినప్పుడు రావటం లేదు అని…. ఆయనకేమో ఇంకో దైవానికి ఏమైనా అనుసంధానం అయ్యిందేమో…. పూజలు చేస్తుందేమో…. ఆయనకి దగ్గర అవుతుందేమో… అని ఆయనకు అనుమానం ఉంటుంది.  ఇలా ఒకరినొకరు అనుమానాలు చెప్పుకోరు… తీర్చుకోరు…. కానీ అనుమాన భయాలు పెంచుకుంటూ పోతారు. ఆకర్షణ శక్తి కాస్త వికర్షణ శక్తిగా మారుతుంది. మానసికంగా దూరం అవుతారు. ఆ తర్వాత శారీరకంగానూ దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు…. అంత్యకాల స్థితిలో ఉన్నప్పుడు…. నీకు ఆఖరి సారిగా దైవసాక్షాత్కారం ఇచ్చి…. నీకు మోక్షమును ప్రసాదిస్తున్నాను. నీవు మోక్షలోకానికి వెళ్తావా?  అని అనేసరికి…. అప్పుడు మోక్షలోకానికి వెళ్లే వాళ్ళు ఉంటారు…. ఈయన మాయలో పడి కొట్టుకునే వాళ్ళు ఉంటారు.  అంటే ఏంటంటే, ఒక బంధం ఏర్పడాలి అంటే వాళ్ళ మధ్యలో ఆకర్షణ శక్తి ఉండాలి. ఆకర్షణ శక్తి ఒక స్థితికి వచ్చేసరికి….ఆకర్షణ శక్తి కాస్త వికర్షణ శక్తిగా మారిపోవడం జరుగుతుంది. ప్రేమగా ఉన్న భార్యాభర్తల మధ్య అనుమానభయాలు వచ్చి… విడిపోవడం ఎలా అయితే జరుగుతుందో…. దైవ భక్తుల మధ్య, గురు శిష్యులు మధ్య కూడా తెలియని అనుమాన భయాలు సందేహాలు వచ్చి విడిపోవడం అనేది తాత్కాలికంగా జరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే….అని చెప్పడం జరిగింది కదా!  అవి పెరిగేదాకా పెరిగి… విరిగేదాకా మాలాంటి వాళ్ళ గురువులు ఎదురు చూస్తూ ఉంటారు. పెరగడం జరిగింది …ఇక విరగటం ఆరంభం అయింది అని తెలుసుకుని యదార్థ స్థితికి తీసుకువచ్చే పరిస్థితులకి తీసుకువస్తాము. 

శివనందిని:- ఓహో!  కాలమే నిర్ణయం చేయాలన్నమాట! అంటే మీరు మాయ మాలో అంతముందే స్థితి వరకు ఎదురు చూస్తారు…. అంతమయ్యే స్థితికి మన మధ్య ఉండే అనుబంధం కాస్త వేదనగా, ఆవేదనగా మారి అనుమాన భయంగా మారి…. ఆకర్షణ శక్తి కాస్త వికర్షణ శక్తిగా మారుతుంది. తద్వారా మాయ కాస్త మాయమై పోతుందన్నమాట! ఇది మాయ ఎలా ఏర్పడిందో ఆ మాయ తిరిగి మాయ మాయం అయ్యేదాకా మనం ఎదురు చూడక తప్పదు అన్నమాట!  ఎలా వచ్చిందో అంతే సహజసిద్ధంగా అలాగే పోతుందన్నమాట!  ఇది ఎవరి ప్రమేయం లేకుండా జరగచ్చు…. లేదా ఎవరి ప్రమేయం అయినా ఉండి జరగచ్చు. అంతేలే…. భార్యాభర్తల మధ్య మూడవ స్త్రీ వచ్చినా ….దైవ భక్తుల మధ్య మూడవ వ్యక్తి వచ్చినా …..అనుబంధాలు ఏవి నిలబడవు కదా!  ఆ విధంగా అనుమానభయాలు ప్రారంభమవుతాయి… ఇలా అనుమానభయాలు ప్రారంభం అయినాయి అంటే… ప్రేమ కాస్త వేదన అయినట్టే.  ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా విడిపోవడం జరుగుతుంది. తద్వారా మాయ మాయం అవుతుందన్నమాట! 

శివ స్వామి:- ఇప్పుడు నీకు పూర్తిగా విషయం అర్థం అయింది.

శివ స్వామి:-  సరే స్వామి!  ఇంక నాకు ధ్యానం చేసుకునే సమయం అయింది. నేను ఇంక ధ్యానం చేసుకుంటాను… 

శివ నందిని:- సరే ఉంటాను దేవి! 

అని శివ స్వామి అంతర్ధానం అయ్యేసరికి…. మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారని తను అగ్నిముద్రతో  మణిపుర చక్రం  ఆధీనం కోసం ధ్యానం చేసుకుంటూ…. ఆ రోజుకి అలా ఉండిపోయింది. ఇలా ధ్యాననిష్టగా ఉండేసరికి…. ఉన్నట్టుండి ఒక పెద్ద పులి తన మీదకి వస్తున్నట్టుగా….తను ఉన్న హోటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా……ఆ పురవీధుల్లో తిరుగుతున్నట్టుగా….. ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నట్టుగా కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది. నిజంగానే తన ముందు పులి ఉన్నదా! అని ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి…. ధ్యాన అనుభవం అని తెలిసింది.  ఇదేంటి? పులి కనపడుతుంది అని పులి గురించి ఏమైనా ఆలోచనలు చేసిందా అని ఆలోచనలు చేస్తే తను ఎలాంటి ఆలోచనలు చేయలేదు కదా!  అని అనుకొని సరే నిద్ర పోదాం…. తెల్లవారాక రుద్ర స్వామిని అడుగుదామని…. ఆరోజు రాత్రికి శివ నందిని నిద్రలోకి జారుకోవడం జరిగింది.


శివ నందినికి ఉన్నట్టుండి నాలుగు గంటలకు మెలుకువ వచ్చి చూసేసరికి మిగతా వాళ్ళందరూ నిద్రలో ఉండేసరికి… తను ధ్యానం చేసుకుందామని ధ్యానంలో ఉండేసరికి…. రాత్రి కనిపించిన పులే తనకి ధ్యానంలో పదేపదే కనిపిస్తూ ఉండేసరికి…. ఆశ్చర్య ఆనందాలకు గురి అయ్యి…ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పులి ఉంది అన్నట్టుగా భ్రమ కలిగించేసరికి… ఒక విధమైన భయం వేసి పెద్దగా అరవడం జరిగింది. ఈవిడ అరుపుకి గాఢ నిద్రలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా లేచి రుద్రస్వామి కాస్త…

రుద్ర స్వామి:- ఏమైంది అమ్మ!  ఏమైనా పిడకల కన్నావా?

శివ నందిని:- లేదయ్యా…నాకు ఉన్నట్టుండి పులి కనిపించింది.  రాత్రి నుంచి పులి కనపడుతుంది ….ధ్యానంలో కూడా పులి కనపడి నా ఎదురుగా ఉన్నట్లు కనిపించేసరికి…ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూస్తే… పులి కనపడింది.

రుద్రస్వామి:- కంగారు పడకు తల్లి… శివుడి యొక్క బంధ విముక్తులలో పులిచర్మం అనేది కూడా ఒక బంధ విముక్తి కదా!  ఒకవేళ దానికి సంబంధించిన ధ్యాన అనుభవం అయి ఉంటుంది. సజీవ మూర్తిగా ఉన్న పులిని ఇక్కడ ఆటవిక యువకుడి రూపంలో ఉండి శివుడు ఆదిలో పులిని సంహారం చేసి ఉంటాడు. ఆ పులి చర్మమును తన అంగవస్త్రంగా కట్టుకుని ఉంటాడు.  పులి ఆసనం మీద ధ్యానం చేసుకుంటూ ఉండచ్చు.

శివ నందిని:- ఏమోనయ్యా…. ఆ పులి నన్నయితే చంపడానికి ప్రయత్నం చేయట్లేదు.  ఇక్కడ ఉన్నాను… ఇక్కడ సజీవమూర్తిగా ఉన్నానని చెప్పేసి పులి ఆత్మగా సంచారం చేస్తుంది.

రుద్రస్వామి:- అది కూడా అకాల మరణం పొందడం వలన ఇలా కోరిక ఆత్మగా తిరుగుతూ ఉండవచ్చు.  అది నీకు  ధ్యానంలో కనపడి ఉండచ్చు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి మార్గం ఏమిటి అనేది ఆయన చెప్తాడు.

అనేసరికి సరే అని చెప్పి సుప్రభాత సేవ సమయం అవుతుంది కదా!  అయ్యవారిని దర్శనం చేసుకుని వద్దాం…!  అని అందరూ కూడా స్నానాలు చేసుకొని సుప్రభాత సేవకు వెళ్లడం జరిగింది. సుప్రభాత సేవ అయిన తర్వాత శివ నందిని యధావిధిగా ధ్యాననిష్ఠలో ఉండేసరికి…. పులి సంచారం కనిపించేసరికి…. భయం వేసినప్పటికీ ధ్యానభంగం కాకుండా చూద్దాము…. అనేసరికి ఆ పులికాస్త చీకటి కోణం ఉన్న శివలింగం పాదపీఠంలోనికి వెళ్లి అక్కడ ఉన్న నాగస్తంభంలోకి ఆ పులి వెళ్లి అంతర్దానం అవ్వడం జరిగేసరికి…. ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యింది. నాగ స్తంభానికి, ఈ పులికి ఉన్న సంబంధం ఏమై ఉంటుందో అని అనుకుంటూ ఉండగా..   ధ్యానభంగం అయింది. తనకు కలిగిన ధ్యాన అనుభవం గురించి రుద్ర స్వామికి చెప్పేసరికి…

రుద్రస్వామి:- ఏమో తల్లి!  ఆ నాగస్తంభం దగ్గర పులికి సంబంధించిన విషయాలు తెలుస్తాయేమో!

అనేసరికి వీళ్లంతా చీకటి కోణం ప్రాంతం అయిన భీమ శంకర శివలింగం పాదపీఠం ఉన్న నాగస్తంభం దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ నాగ స్తంభం దగ్గర పంచముఖ నాగ పడగ లీలామూర్తిగా కనబడింది.

ఇది ప్రతిరోజు చూస్తూ ఉండేదే కదా!  అని బాలగణపతి అన్నాడు.  కాదు ఇందులో ఏదో తిరకాసు ఉంది…. అని బాల కుమారస్వామి ప్రత్యక్షంగా చూస్తూ…. 

బాల కుమారస్వామి:- అమ్మ!  ఇక్కడ చూశావా మధ్యలో ఉన్న పాము పడగకి మాత్రమే పైన మణి ఉన్నట్లుగా ఉంది.  మిగతా వాటికి మణి గుర్తు లేదు. ఒకవేళ  ఆ  మణి గుర్తుని తాకితే ఏదైనా విషయం తెలుస్తుందా?

అని అనేసరికి సరే ఏముంది తాకితే పోలా..!  అని వీళ్ళ అనుమతి తీసుకోకుండా బాలగణపతి ఉన్నట్టుండి…మణి లాగా ఉన్న ఆ రాతి ముక్కను తాకటం, నొక్కటం చేసేసరికి…. లోపలి వైపు శివలింగం పాదపీఠం భాగంలో ఉన్న పానమట్టం నుంచి ఒక వస్తువు బయటపడటం జరిగింది. ఆ వస్తువు ఏమిటా అని రుద్ర స్వామి చూసేసరికి…. అది అగ్గిపెట్టె అంత సైజులో ఉన్న ఇనుప పెట్టే అనేసరికి దాన్ని బయటకు తీసుకొని వచ్చి…. వీళ్ళు గుడిలో పక్కనే ఏకాంత ప్రదేశంలో ఆ పెట్టెను తెరవబోతుండగా బాలగణపతి  కాస్త…

బాల గణపతి:-  ఏముందిలే…!  మనకి ఏనుగు చర్మం పెట్టెలో దొరికినట్టుగానే…. ఇక్కడ బహుశా పులి చర్మం ఈ పెట్టెలో దొరకవచ్చు. అగ్గిపెట్టలోనే చీర పెట్టిన వాళ్ళు, ఈ పెట్టెలో పులి చర్మం దాచి ఉంచలేరా? ఏమైనా అంటే శివుడు సంహారం చేసిన పులి చర్మం అయి ఉంటుంది అని మనకి జ్ఞాన స్ఫురణ వస్తుంది….

శివనందిని:- ఆరిబడవ!  నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. అన్ని ముందే తెలిసిపోతే భవిష్యత్తులో కిక్కు ఉండదు.

అనేసరికి రుద్రస్వామి కాస్త ఆత్రుతగా పెట్టెను  తెరిచి చూడగానే పెట్టే లోపల ఒక చర్మం ఉండడం గమనించి…. అది పులి చర్మం అని తెలియడంతో ….

రుద్రస్వామి:- అమ్మాయి!  బుడ్డోడు  బాల గణపతి చెప్పింది నిజమే. ఈ పెట్టెలో పులి చర్మం ఉంది. ఇప్పుడు గాని మనం తీశాము అంటే పులిని వేటాడి చంపాము అని జనాలంతా వచ్చి మన మీద పడతారు.  విషయం తెలిసింది కాబట్టి, ఈ పులి చర్మంలో నీ దగ్గరే ఉంచుకో..! 

అని అంటే సరే అని తన చేతి సంచిలో శివ నందిని ఉంచుకొని…. సరే పదండి ధ్యానం చేసుకుందాం… అనేసరికి ధ్యాన నిష్ఠలో కూర్చోవడం జరిగింది. ఇలా ఉండగా శివ నందినికి ధ్యానంలో  శివుడు కాస్త సుస్పష్టంగా సజీవ మూర్తిగా…. లీలామూర్తిగా కనిపించడం జరిగింది. విచిత్రం ఏమిటంటే,  ఆయన పక్కన త్రిశూలం గాని…. ఆయన మెడలో నాగాభరణం కానీ….. ఆయనకి ఆభరణాలుగా రుద్రాక్ష మాలలు గాని…. ఆయన ఒంటిమీద ఏనుగు చర్మం కానీ కనిపించకపోయేసరికి…. ఆయనకి అంగవస్త్రం గానూ, సింహాసనముగా ధ్యానంలో ఉన్న పులి చర్మం కనబడింది.  అంటే త్రిశూల బంధం, నాగబంధం, రుద్రాక్ష బంధనం, ఏనుగు బంధం నుంచి విముక్తి పొందారు అని అనుకుంటూ ఉండేసరికి….. పులి చర్మం అదృశ్యం అవడంతో…… ఓహో! ఈ రోజుతో పులి చర్మం నుంచి కూడా బంధ విముక్తి పొందడం జరిగింది అని చెప్పి గ్రహించడానికి శివ నందినికి అట్టే సమయం పట్టలేదు.  ఎప్పుడైతే ఈ జ్ఞాన స్పురణ అందిందో…. ధ్యాననిష్ఠలో ఉన్న శివుని యొక్క రూపం అదృశ్యం అయింది. దాంతో శివనందినికి ధ్యాన భంగం అయింది.  

మహాదేవి:- ఏం జరిగింది తల్లి!  

అని అడిగేసరికి… తనకి కలిగిన ధ్యాన అనుభవం చెప్పేసరికి….. మనం ఆ బంధనాల కార్యక్రమాలు పూర్తి చేశాం కదా!  ఇవాళ పులి చర్మ బంధ విముక్తి నుండి ఆయన విముక్తి పొందాడు.

అనేసరికి సరే పన్నెండు గంటలవుతుంది… ఇక భోజనాలు చేసుకుని గదికి వెళ్దాం అనేసరికి సరే అని భోజనాలు చేసుకుని గదికి వెళ్ళటం జరిగింది.  గదిలో అందరూ విశ్రాంతి తీసుకుంటూ గాఢ నిద్రలోకి వెళ్లడం జరిగింది.  మళ్లీ సాయంత్రం ఐదు గంటలకి అందరికీ మెలకువ వచ్చేసరికి సాయంకాలం గుడికి వెళ్దాం అని చెప్పి భీమశంకరుడి గుడికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత శివ నందిని యధావిధిగా ధ్యానంలో ఉండేసరికి ఈసారి యధావిధిగా  శివ నందినికి పంచ పడగలు నాగాభరణం లో ఉన్న శివలింగం పదేపదే కనిపిస్తూ ఉండేసరికి….. ఈ శివలింగం కోసం మనం ఏ జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళాలో అనుకునేసరికి ధ్యాన భంగం అయింది.  ఇదే విషయాన్ని రుద్రస్వామికి చెప్పేసరికి…. ఎవరు గమనించట్లేదని తన చేతి సంచిలో నుంచి సాధనా విగ్రహం మూర్తిని బయటకు తీసేసరికి…. 

శివ నందిని:- ఈ విగ్రహ మూర్తి ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెబుతుంది….

రుద్రస్వామి:- పాండురంగడు విగ్రహ మూర్తిని పెట్టు… 

అనేసరికి ఎడమవైపు ఉన్న పద్మములో పెట్టేసరికి….. ఈసారి పిల్లలు కాదని మహాదేవి నేను పెడతాను… నేను పెడతాను…. అని మహాదేవి అనేసరికి…. పాండు రంగడు విగ్రహమూర్తిని శివ నందిని కాస్త మహాదేవి చేతికి అందించేసరికి….. మహాదేవి కాస్త సాధన విగ్రహ మూర్తి ఎడమవైపు తాకించి తాకించగానే మణిపుర చక్రం మూడుసార్లు తిరిగి దివ్య తేజస్సుతో…. దివ్యకాంతితో…..మెరుపులు మెరిసేసరికి….

రుద్రస్వామి:-  అమ్మ! నీ  ఈ చక్ర సాధన పూర్తి అయింది. ఈ చక్రం జాగృతి, శుద్ధి, అధీనం స్థితికి రావడం జరిగింది అనుకుంటూ ఉండేసరికి…. మణిపుర చక్రం వెనకవైపు నాగపడగలు ఉన్న శివలింగం గుర్తు బయటకు వచ్చింది.  అప్పుడు అందులో ఉన్న రాగిరేకును బయటకు తీసి…. ఆ ఆధారం మహాదేవి చదవడం ప్రారంభించింది.  


మహాదేవి కాస్త రాగి రేకులో ఉన్న ఆధారాలను చదవడం ఆరంభించింది. 


బ్రహ్మహత్యా దోషం కోసం దేవుడే గుడి కట్టాడు…. 

తన భార్యను అపహరించిన వాడిని సంహరించాడు….

కాశీ గంగతో అభిషేకం చేయాలి ….

ఇక్కడ మట్టిని అక్కడ నిమజ్జనం చేయాలి ….

రాంబంటు నన్ను అక్కడి నుండి తీసుకువచ్చాడు…… 

నన్ను మట్టితో ఆరాధన చేస్తారు….. 

21 బావుల నీటితో అందరూ శుద్ధి అవుతారు….. 

ఉప్పునీటి దగ్గర మంచినీరు ఉంటుంది….

ఈజిప్టు సమాధుల మాదిరిగా నా ఆలయం ఉంటుంది…..


అని ఆధారాలు చదవడం పూర్తి చేసింది. ఈ ఆధారాలు విని అందరూ తలో విధంగా ఆలోచన చేస్తూ ఉండిపోయారు.  రుద్ర స్వామి కాస్త ఉన్నట్టుండి….

రుద్రస్వామి:-  తన భార్యని అపహరించిన వాడిని సంహరించాడు…. దేవుడే గుడి కట్టాడు…. అంటే ఇది రాముడికి సంబంధించిన జీవిత చరిత్ర అయి ఉండాలి.  ఎందుకంటే రాముడే కదా ! తన భార్యని రావణాసురుడు తీసుకువెళ్లడంతో…. రావణ బ్రహ్మను చంపడం జరిగింది.  రావణ బ్రహ్మ బ్రహ్మహత్యా దోషం కింద గుడి కట్టడం జరిగింది కదా! 

అనేసరికి….సరే ఈ రెండు ఆధారాలు సరిపోయాయి… మరి మిగతా ఆధారాలు సంగతి ఏమిటి…?

బాల గణపతి:- ఏముంది..!  కాశీగంగతో అభిషేకం చేయాలి. ఇక్కడ మట్టిని అక్కడ  నిమజ్జనం చేయాలి అని చెప్పి…రామేశ్వరానికి, కాశీ క్షేత్రానికి ఉన్న అనుబంధం ఉండనే ఉన్నది కదా!  

రుద్రస్వామి:- అలాగే రాంబంటు నన్ను అక్కడి నుండి తీసుకువచ్చాడు.. అంటే రాంబంటు అంటే హనుమంతుడే కదా!  హనుమంతుడు కాశీ క్షేత్రం నుండి రామేశ్వరం తీసుకువెళ్లాడని స్థల పురాణం చెబుతుంది కదా!  అనేసరికి 21 బావుల నీటితో అందరూ శుద్ధి అవ్వటం అనేది ఉందని ….అక్కడ రామేశ్వరంలో 21 బావులు ఉన్నాయని …. ఆ బావుల నీటిలో స్నానాలు చేయాలని చెప్పడం అనేది స్థల పురాణంలో చెప్పడం జరిగింది కదా! అని మహాదేవి అనటం… ఉప్పునీటి దగ్గర మంచినీరు ఉంటుంది అంటే….. ఆ ఉప్పునీటి దగ్గరే మంచినీటి బావులు ఉండి ఉండాలి…

శివ నందిని:- ఈజిప్టు సమాధి మాదిరిగా ఆలయం ఉంటుంది అనంటే…. సమాధులు అనగానే మనకి పిరమిడ్లు గుర్తుకు వస్తాయి కదా!  పిరమిడ్ మాదిరిగానే రామేశ్వర ఆలయం కూడా ఉంటుంది అని చెప్పకనే చెప్పినట్టు ఉన్నారు…

ఆ ఆధారాలు అన్నీ కూడా రామేశ్వర జ్యోతిర్లింగాన్ని సూచిస్తున్నట్టుగా అనేసరికి…. అందరూ కూడా సరే అని ఇక్కడ నుంచి రామేశ్వర క్షేత్రానికి వెళ్లాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే అని అక్కడి నుంచి యధావిధిగా గుడికి వెళ్లి ధ్యానం, జపం దర్శనాలు చేసుకుందాం అని అందరూ గుడికి వెళ్లడం జరిగింది. యధావిధిగా శివ నందిని కాస్త ధ్యానం చేసుకుంటూ ధ్యాన నిష్ఠలో ఉండేసరికి రెండు మూడు గంటల తరువాత వాతావరణం లో మార్పులు వస్తున్నా కూడా గమనించని స్థితిలో తను ధ్యానంలో ఉండిపోయింది. అనుకోకుండా ఉరుములు, మెరుపులు వస్తున్న విషయం తెలుస్తున్నా ధ్యానం నుంచి బయటకు రావాలనే ఆలోచన ఉన్నా రాలేకపోయింది. అలా ధ్యానం చేస్తూనే ఉండాలి… వర్షం పడితే పడని… అని అనుకుంటూ ఉండేసరికి తను కూర్చున్న చెట్టు మీద అనుకోకుండా ఒక పెద్ద పిడుగు పడటం జరిగింది. ఆ పిడుగు  దాటికి అక్కడ ఎవరు ఉన్నా కూడా మాడి మసి అవ్వాల్సిందే.. కానీ, చెట్టు మాత్రమే కాలి బూడిద అయ్యింది.  ఆ చెట్టు కింద ఉన్న శివ నందినికి ఏమీ కాకపోయేసరికి విషయం అర్థమైందా! రుద్రస్వామి కాస్త మహాదేవితో సైగ చేసి తనకి తెలియకుండానే అగ్ని మీద ఆధిపత్యం వచ్చినట్టు ఉంది…. మణిపురాచక్రం అధీనం అయినట్టు ఉంది… ఈ చక్ర శుద్ధి అగ్నితత్వం మీద ఆధిపత్యం వస్తుంది కదా ! తనకి వచ్చింది….అని అనుకున్నారు. ఆ పిడుగు దాటికి దేవాలయంలోని భక్తులు అంతా కూడా  భయపడిపోయి అమ్మాయి సజీవ మూర్తిగా దహనం అయిపోతుందేమో…. అని అనుకుంటూ ఉండేసరికి, ఏమీ తెలియనట్లుగా ఏమీ పట్టనట్లుగా కళ్ళు తెరిచి శివ నందిని చూస్తూ ఉండేసరికి…. తన వెనుక అగ్నిదహనం అవుతున్న చెట్టును చూస్తూ… ఉండేసరికి  వేడి తగలకపోయేసరికి ఏదో అనుమానం వచ్చినట్లుగా లేచి నించుని ఆ మండుతున్న చెట్టు మంటల్లో చేయి పెట్టినప్పటికీ చెయ్యి దహనం అవ్వకపోవడంతో తనకి అగ్ని మీద ఆధిపత్యం వచ్చినట్టు ఉంది అని గ్రహించడానికి  శివ నందినికి అట్టే సమయం పట్టలేదు. తన ఓరచూపుతో ఇదే విషయాన్ని రుద్ర స్వామికి, మహాదేవికి కనుసైగ చేయగానే వాళ్ళు కూడా కనుసైగతో నీకు అగ్ని మీద ఆధిపత్యం వచ్చింది. సిద్ధి వచ్చింది అని చెప్పినట్లు అనిపించగానే…. చెయ్యి కాలుతున్నట్లు, ఒళ్ళు మండుతున్నట్లుగాను నటించడం మొదలు పెట్టింది. ఎందుకంటే తను సిద్ది పొందాను అనే విషయం భక్తులకి తెలిస్తే….. తనని ఎక్కడ పీఠాధిపతిని చేస్తారో…. మఠాధిపతిని చేస్తారో ….యోగినిగా మారుస్తారో…. అని భయంతో అరవటం ప్రారంభించింది.  అయ్యో! అయ్యో! నా కూతురికి ఏదో అయిపోతుంది….మంటలు దాటలేక పోతుంది…. వేడిని తట్టుకోలేక పోతుంది. ఇంకా నయం చెట్టు మీద పడింది పిడుగు… దీని మీద పడి ఉంటే దీని జీవితం అగ్గిపాలు అయ్యేది.  ఈ దేహం దహనం అయ్యేది అనుకుంటూ…. లేనిపోని ఏడుపులతో ఒకరిని మించి ఒకళ్ళు రుద్రస్వామి, మహాదేవి జీవించడం ప్రారంభించారు.  ఆ తర్వాత ఎవరో భక్తుడు వస్త్రం నీటితో తడిపి తెచ్చి పాపం శివ నందిని ఎక్కడ మంటలో దహనం అయిపోతుందో అనే భయంతో కప్పడం జరిగింది. అదేవిధంగా శివ నందిని కూడా నటించడం మానేసి జీవించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఉపశమనం పొందినట్లుగా ఆ మంటల నుంచి రక్షించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి… ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకుని…. అక్కడ నుంచి వెళ్లి భోజనాలు కానించుకొని… గదికి వెళ్ళడం జరిగింది.  ఎందుకైనా మంచిది అని గదికి వెళ్లి కొవ్వత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తి మంటల్లో చేయి పెట్టినప్పటికీ ….ఏమీ కాలడం కానీ మంట అనిపించకపోవడం కానీ జరగకపోయేసరికి తనకి ఈ సిద్ధి వచ్చింది అని గ్రహించింది. ఇక తనకి అగ్ని వల్ల ప్రమాదాలు జరగవని….. అగ్నిలో ఉన్న వాళ్ళకి రక్షించే అవకాశం ఉంటుంది అని శివ నందినికి తెలియడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ తర్వాత ఈ సిద్ధి ఎలా అయితే వచ్చిందో ఆ సిద్ది లోకానికి తెలియకూడదు అని తనలోనే అలా నిక్షిప్తంగా ఉంచేసుకుంది. ఆ తర్వాత యధావిధిగా ఎవరికి వారే మర్నాడు రామేశ్వరం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవాలి అనే  ఆలోచనలతో ఎవరికి వారే నిద్రలోకి ఉపక్రమించారు. ఇంతటితో శివ నందిని యొక్క మణిపుర చక్రం జాగృతి, శుద్ధి,ఆధీనం కార్యక్రమం పూర్తి అయ్యింది. ఆ తర్వాత ఈ చక్ర దేహమైన కారణ శరీర జాగృతి,శుద్ధి,ఆధీనం  సాధన కోసం రామేశ్వర క్షేత్రానికి వెళ్లాల్సి ఉందని శివ నందిని సాధన విగ్రహం ద్వారా తెలుసుకొని ఉండటంతో…. ఆ యాత్ర చేయడానికి సాధనా కుటుంబం అంతా సంసిద్ధం అయ్యారు. మరునాడు ఈ యాత్ర కోసం అని అక్కడి నుండి బయలుదేరడం జరిగింది.  అనగా ద్రాక్షారామం నుంచి రామేశ్వరం బయలుదేరడం కోసం రైలు మార్గమును ఎంచుకోవడం జరిగింది. తత్కాల్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుని… రామేశ్వరం సరాసరి వెళ్లే రైలు ఎక్కడంతో… మూడు రోజుల తర్వాత రామేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి సమయం పడుతుంది అని… ఇక అందరూ కూడా మూడు రోజుల పాటు రైలు ప్రయాణం చేయడానికి సిద్ధపడి రైల్వే స్టేషన్ కి వచ్చి రామేశ్వరం వెళ్లే రైలు ఎక్కడం జరిగింది. ఇక రామేశ్వర క్షేత్ర విశేషాలు స్థలపురాణం గురించి చెప్పమని పిల్లలిద్దరూ అడిగేసరికి ఇక శివ నందిని అప్పటికే ఇంటర్నెట్లో వెతకడం ఆరంభించింది. ఆ తర్వాత ఈ వివరాలన్నీ తెలుసుకొని పిల్లలకి ఈ రామేశ్వర స్థల పురాణ విశేషాలు వివరాలు చెప్పడం ఆరంభించింది. వీళ్లతో పాటు మహాదేవి మరియు రుద్ర స్వామి కూడా ఈ స్థల పురాణ విశేషాలను వినడం ఆరంభించారు. 


ఇంతలో వీళ్ళు ప్రయాణం చేస్తున్న రామేశ్వరం ట్రైన్ కరెంటు ట్రైన్ కావడం వల్ల భోగిలో తగలబడుతున్నాయి అని ట్రైన్ అర్ధాంతరంగా ఆపడం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందా అని మనసులో అనుకుంటూ ఉండేసరికి కళ్ళు మూసుకోగానే…. కృష్ణ స్వామి, యోగాంబిక కనిపించారు. అంటే వీళ్ళేదో తంత్రం చేశారు… కావాలనే ప్రమాదం సృష్టించారు. మనం రామేశ్వరం వెళ్లకుండా వీళ్ళు ఆపుతున్నారు  శివ నందినికి అర్థం అయింది. ఈ మంటలు  కాస్త శరవేగంతో మిగతా భోగిలకు పాకటంతో అందరూ తలోదిక్కు పరిగెత్తుతూ ఉండేసరికి…. ఇక రుద్ర స్వామి కూడా రుద్రస్వామి:- అమ్మ! మనం ఈరోజు ప్రయాణం చేయలేము.ఏదో అగ్నిప్రమాదం జరిగింది అంటున్నారు కదా!  ఇక మనం దిగి వెళ్ళిపోదామా? 

అనేసరికి….. సరే అని అందరూ దిగారు. కిందకి దిగాక రైల్వే సిబ్బంది కాస్త నీటితో ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరికి వారే ప్రాణభయంతో పరిగెడుతున్నారు. అప్పుడు శివ నందిని కాస్త రుద్ర స్వామితో 

శివ నందిని:- ఇదంతా కృష్ణస్వామి, యోగాంబిక చేశారని మనసుకి అనిపించి ధ్యానంలో చూస్తే వాళ్లే కనిపించారు..  

మహాదేవి:- అవునా! వీళ్ళ తంత్రమా.! వీళ్ళు ఇక్కడికి కూడా తగలబడ్డారా! 

శివ నందిని:-  అవును…. మనకేమైనా ప్రమాదం కలిగిస్తారేమో!  ఇప్పుడు ఏం చేద్దాం..

మన వెంట శివుడు రక్షకుడిగా ఉన్నాడు. ఏం చేస్తారో చూద్దాం అని అంటూ ఉండేసరికి…. అక్కడికి వెళ్లి వెనుక వైపునే కృష్ణస్వామి, యోగాంబిక పెట్రోల్ టిన్ తో వచ్చి వీళ్ళు కూర్చున్న ప్రాంతంలోనే పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉండేసరికి… ఇది గమనించిన 

బాలకుమారస్వామి:- అమ్మ!  ఎవరో ఆడమనిషి ఏదో నీళ్ళు పోసినట్టుగా నిప్పు అంటించినట్టు ఉన్నారు. నిప్పు మన వైపే వస్తుంది…

అని అంటూ ఉండేసరికి పెట్రోల్ వాసన గమనించిన మహాదేవి…

మహాదేవి:-  ఇది వాళ్ళ పనే… పెట్రోల్ పోసి మనల్ని తగలబెట్టాలి అని అనుకుంటున్నారు… 

అనేసరికి విషయం ఇలా తెలుసుకొనే సరికి శివ నందిని చీరకి నిప్పు  అంటుకుంది. ఆర్పే పరిస్థితి అవకాశం లేకపోయేసరికి…. రుద్ర స్వామి తో 

శివ నందిని:- అయ్యా!  మీరు ముందు పిల్లలని తీసుకుని వెళ్లిపోండి. చీరకు నిప్పు అంటుకుంది.  చీర తీయడానికి ఉండదు . అందరూ ఉన్నారు. నిప్పు ఆర్పుతాను… మీరు దూరంగా వెళ్లిపోండి… పిల్లల్ని తీసుకుని…

అని అంటూ ఉండేసరికి చీర ఆర్పాలి అనే ప్రయత్నంలో చీర కొంగుకి నిప్పు అంటుకోవటంతో…. ఇక తనకి  అగ్నిలో దహనం అవడం తప్ప ఏమీ లేదు అని అనుకుంటూ ఉండేసరికి…. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు అందరూ కూడా రైలు భోగి  మంటలు ఒక ఆవిడ దహనం చేసేస్తుంది అని చెప్పి పెద్దగా అరవటంతో…..నీళ్లు పోయాలి అని శివ నందిని మీద పోయడానికి ప్రయత్నం చేసినప్పటికీ…. నిప్పు ఆరకుండా… దహనం అవుతున్నప్పటికీ శివ నందిని ఏమాత్రం భయపడకుండా, ఆలోచించకుండా ధ్యానంలో పద్మాసనంలో వేసుకొని… ధ్యాననిష్ట లో ఉండిపోయింది. దాదాపు ఒక అరగంటసేపు అగ్ని దహనం అవుతున్నప్పటికీ…తనకి, తను కట్టుకున్న వస్త్రానికి ఏ విధమైన దహనం అవ్వకుండా యధావిధిగా ఉంటూ….. అగ్నిలో ఒక స్త్రీ మూర్తి సజీవంగా కూర్చుని ధ్యానం చేస్తున్నట్లుగా…. సజీవంగా ఉండటం గమనించేసరికి ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈవిడ అగ్నిస్తంభన విద్య నుంచి వచ్చి ఉంటుంది అని …..కొంతమంది ఈవిడకి అగ్ని మీద ఆధిపత్యం వచ్చి ఉండాలి అని…. అగ్ని ఈమెని ఏమీ చేయడం లేదు అని అనుకుంటూ ఉండేసరికి…. మరికొంతమంది ఈవిడని దేవత మూర్తిగా కొనియాడుతూ…. మనసులో కృతజ్ఞతలు చెబుతూ…. ఈవిడ ధ్యానంతో మంత్రసిద్ధి, యోగసిద్ధి పొంది ఉంటుంది అని అనుకుంటూ ఉండేసరికి….. ఒక 15 నిమిషాల తర్వాత ఆ జ్వాలాగ్ని కాస్త నెమ్మదిగా తగ్గుతూ ఎవరి ప్రమేయం లేకుండా….. అగ్నిదేవుడు కాస్త కోపావేశాలనుంచి శాంతమూర్తిగా మారి…..శివ నందినిని ఏమీ చేయకుండా యధావిధిగా ఆమె శరీరాన్ని, వస్త్రాన్ని సహజ స్థితిలో యధావిధిగా ఉంచడంతో…. అగ్ని బంధం నుంచి విముక్తి పొందిన శివ నందిని కాస్త మామూలుగా కళ్ళు తెరిచి లేచి కూర్చునే సరికి…. ఆ దృశ్యం చూసిన ప్రయాణికులు అంతా ప్రాణభయంలో కూడా ఈవిడకి నమస్కారం చేసి పాదాల మీద పడుతూ ఉండేసరికి…. మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి… నా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. మీ భక్తే నన్ను కాపాడింది అని కృతజ్ఞతలు చెప్పేసరికి…. ఈ విషయం తెలిసిన  కృష్ణస్వామి, యోగాంబిక ఎలాగైనా వీళ్ళని నాశనం చేయాలి…. రామేశ్వరం వెళ్తున్నారు కదా!  రామేశ్వరంలో ఆ సముద్రంలో ముంచేస్తే సరిపోతుంది. అక్కడ చంపేసి ఆ దేహాలను అక్కడ ఉన్న సొర చేపలకు ఆహారంగా వేస్తే ఎలాంటి సమస్య ఉండదు అని… ఒకరినొకరు అనుకోని వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు రామేశ్వరం వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం మరొక ట్రైన్ ను  రైల్వే సిబ్బంది ఏర్పాటు చేయడంతో… కాస్త ఆలస్యంగా ఈ యాత్ర మొదలైంది. రామేశ్వరం క్షేత్రానికి మరొక రైల్లో సాధన కుటుంబం అంతా కూడా… మిగతా ప్రయాణికులు అంతా కూడా… ఎక్కి యాత్ర కోసం వెళ్లడం జరిగింది. ట్రైన్ ఎక్కుతూ ఉండగా శివ నందిని కాస్త రుద్ర స్వామి తో

 శివ నందిని:- అయ్యా!  ఎందుకు ఇలా చేశారు?

రుద్రస్వామి:- నీకు అగ్ని మీద ఆధిపత్యం వచ్చిందా? రాలేదా? అని చెప్పేసి నిదర్శనం కోసం అయి ఉండాలి…. రెండోది రామేశ్వరం యాత్రకు వెళ్ళనివ్వకుండా వీళ్ళు ముందే ఆటంకం అవాంతరం ఏర్పాటు చేసి ఉండాలి… మూడవది నిన్ను కీర్తి ప్రతిష్ట మాయలో పడవేయాలని అనుకుని ఉండాలి…నీ చుట్టూ ప్రసాద భక్తులు అవసర భక్తులు చేరితే నిన్ను ఒక దేవతగాను, యోగినీగాను మార్చేస్తే ఇక నువ్వు సాధన చేసుకోవడానికి అవకాశం, సమయం ఉండదు అని వాళ్ళు ఆలోచన చేసి ఉండాలి. చమత్కారాలు చేస్తే గాని ఈ ప్రపంచం నమస్కారాలు చెయ్యదు కదా!  ఎలాగూ నీకు అగ్ని మీద ఆధిపత్యం ఉంటే నువ్వు సిద్ధ స్త్రీ, సిద్ధయోగినివి అని లోకానికి తెలుస్తుంది. లేదు ఆధిపత్యం పొందకపోతే …అగ్నికి దహనం అవుతావు. ఏ విధంగా చూసినా కూడా… నీ సాధన ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సాధన సిద్ధి పొందితే నువ్వు యోగినీగా లోకంలో ప్రచారానికి వస్తావు. అదే సాధనలో సిద్ధి పొందకపోతే…. అగ్నికి దహనం అవుతావు అని చెప్పేసి… వాళ్ళిద్దరూ తంత్ర, మంత్రాలు వేయచ్చు..

శివ నందిని:- జీవితాంతం సాధన పరిసమాప్తి అయ్యేదాకా…. వీళ్ళిద్దరిని ఎదుర్కోక తప్పదా ?

రుద్రస్వామి:- వాళ్లకి చావు లేదు. వాళ్ళు మనల్ని చంపే దాకా తీసుకెళ్తారు కానీ చంపలేరు. మనంతట మనం చావడం అన్నా జరగాలి… లేదా శివుడి చేతిలో అయినా చావాలి.కానీ, వాళ్ళకి అధికారం లేదు. ఆ పరిస్థితి వరకు తీసుకు వెళ్ళేటట్టుగా…. చేస్తారు. కాకపోతే దైవసాక్షాత్కార మాయలో… మోహ మాయలో… భక్తిలో పడిపోతావు అని వాళ్ళు గమనించి ఉంటారు.  నువ్వు ఆ భక్తి నుంచి వెనక్కి రావు అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ శివుడు వచ్చి నీకు యదార్థ జ్ఞానస్థితిని ఇవ్వడంతో వీళ్ళు వచ్చి ఉండాలి…

శివ నందిని:- మరి శాంకరి శక్తి పీఠానికి వచ్చి ఉంటారా?

రుద్రస్వామి:- రాకుండా ఎందుకు ఉంటారు?  అక్కడ చేయాల్సింది చేసి ఉండవచ్చు… మనం అక్కడ తెలుసుకోలేకపోయి ఉండవచ్చు…

అని అనుకుంటూ ఉండేసరికి… వాళ్ళు ఎలాంటి ప్రమాదం చేసినట్టుగా ఏమీ కనిపించలేదు… అనిపించలేదు…. ఏం జరిగిందా అనుకుంటూ గుర్తుకు రావట్లేదు అని ఆలోచనలు చేస్తూ ఉండేసరికి…. శివ నందినికి జ్ఞాన స్ఫురణగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. అదేమిటంటే తను శాంకరీమాత గుడిలో ఉన్నప్పుడు దర్శనం చేసుకుని బయటికి వస్తున్నప్పుడు…. ఒడ్డున సముద్రం దగ్గర ఉండి చూస్తున్నప్పుడు…. ఎవరో తనకి సముద్రంలో తోసేయడం జరిగిందని…. సముద్రంలో తను పడిపోవడంతో ఎవరో నాలుగు చేతులు ఆ సముద్రంలో నొక్కి పెట్టి ఉంచి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉండేసరికి…. అప్పటికే తనకి వచ్చిన జలచర సిద్ధి వలన శరీరం లోపలికి కొట్టుకు పోవాల్సింది కాస్త… తేలియాడుతూ ఊపిరికి ఎలాంటి సమస్య లేకుండా నెమ్మదిగా తీసుకోవడం జరిగింది అని… లీలామాత్రంగా అనిపించింది. తను ఎంతసేపటికి సముద్రంలోకి వెళ్లకుండా తేలుతూ ఉండేసరికి తనకి జలచర సిద్ధి వచ్చిందని గ్రహించి వదిలేయడంతో….. కళ్ళు తెరిచి చూసేసరికి…. వాళ్ళిద్దరూ కనిపించకపోవడంతో…. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పనా లేక ఎవరైనా చేశారా అని ఆ విషయం గమనించకపోవడంతో విచారించకపోవడం జరిగింది. అంటే వీళ్ళు కూడా మనతో పాటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తున్నారు అని చెప్పేసి శివ నందిని గ్రహించి….. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి…. జాగ్రత్తగా ముసులుకోవాలి….. లేదు అంటే తనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని…. అయినా వీళ్ళు మాయా స్వరూపాలు…. మనం మాయని దాటితే వీళ్ళు ఏమీ చేయలేరు కదా! అని చెప్పేసి మనో ధైర్యంతో ఉంటూ….అప్పటికే భోజనాల కార్యక్రమాలు పూర్తి చేయడంతో…. ఇక ఎవరికి వారే తమకు సంబంధించిన సీట్లలో నిద్రకి జారుకోవడం జరిగింది. రెండు రోజుల తర్వాత వీళ్లంతా రామేశ్వర క్షేత్రమునకు చేరుకోవడం జరిగింది. 


శుభం భూయాత్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి