స్త్రీ సాధకురాలైతే
కాకపోతే ఈ కపాల మోక్ష గ్రంథమును నువ్వు చదవటం వల్ల….. అనుభవ పాండిత్యం ద్వారా కాకుండా…. శబ్ద పాండిత్యం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమును పొందావు. ఈ పుస్తకంలో చెప్పిన ధ్యాన అనుభవాలు పొందాలి అంటే….. శబ్ద పాండిత్యం కన్నా నీకు నువ్వే సాధన చేసి…. ధ్యానస్థితి పొంది…. అనుభవ పాండిత్యమును పొందితే…అనుభవ అనుభూతిగా ధ్యానానుభవాలు పొందితే విషయం నీకే అర్థమవుతుంది. ఇప్పుడు మేము ఎంత చెప్పినా…. లేదా ఈ గ్రంథం ఎంత చెప్పినా…. నీకు అర్థమై కానట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే అనుమానం, భయం, సందేహాలు ఉంటాయి. ఇది నిజమా కాదా అని నీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఎంత చెప్పినా కూడా నీకు ఉపయోగం ఉండదు. ఎవరికి వారే సాధన చేసి…ఆ అనుభవాలు నిజమా కాదా…. ఆయా చక్రాలలో ఈ అనుభవాలు వస్తాయా లేదా…. అలాగే ఆ దేహాలు ఉన్నాయా లేదా…. ఇదంతా ఎవరికి వారే సాధన చేసి ధ్యానానుభవాలు పొందితే…. నిజమా కాదా అనేది తెలుస్తుంది. మా వైపు నుంచి ఎంత చెప్పినా కానీ…. అర్థమైనట్టు ఉంటుంది కానీ అనుమానం మాత్రం పోదు. ఆ అనుమానం పోవాలి అంటే…. ఆ నమ్మకం రావాలి అంటే ఎవరికి వారే సాధన చేసుకోవాలి అనగానే….
శివ నందిని…. మహాదేవితో….నువ్వు చెప్పింది బాగానే ఉంది…నాలాగే నువ్వు కూడా భోగ జీవితం నుంచి యోగ జీవితానికి వచ్చావని తెలిసింది.. అయితే
అమ్మా! స్త్రీమూర్తులు కూడా సాధన చేయవచ్చా..? స్త్రీ పురుషులకి సాధనలో ఏమైనా తేడా ఉంటుందా? ఇలా నాకు ఆధ్యాత్మికత విషయంలో సందేహాలు ఉన్నాయి. వాటికి నువ్వు సమాధానం చెప్పు అనగానే….. ఇంకేముంది మొదలుపెట్టారు ఆడోళ్ళ సోది…… ఆడవాళ్ళ కబుర్లు….. ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని రుద్ర స్వామి వెళ్లిపోయాడు.
ఇక మహాదేవి అక్కడే ఉన్న శివ నందిని కేసి చూస్తూ…అమ్మాయి! నీకు సాధన సందేహాలు ఉన్నా ….ధర్మ సందేహాలు ఉన్నా ….నన్ను అడుగు.. స్త్రీ పరంగా నేను అన్నీ కూడా చెబుతాను. దాన్నిబట్టి నీకు విషయం అర్థం అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పిన కపాలమోక్ష గ్రంథం అనేది పురుషుల సాధనా పరంగా…పురుష సాధన ప్రకారంగా…చెప్పారని నువ్వు అనుకుంటున్నావు…కానీ సాధనలో స్త్రీ పురుష భేదం లేదు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రమే బేధం కలిగిస్తాయి. ఎందుకంటే పురుషుడికి సంసార బాధ్యతల్లో కామ వికారం తప్ప ఇంకేమీ ఉండదు. అదే స్త్రీ మూర్తికి కామం తో పాటు సంతానము …. కుటుంబ సభ్యులు , పిల్లలు, వాళ్ళని చూసుకునే బాధ్యతలు, అనురాగము, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే సాధనకి స్త్రీ శరీరము అలాగే పురుష శరీరము ఒకే లాగా సహకరిస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే.. స్త్రీ మూర్తికి నెలసరి ప్రతినెల ఐదు రోజులు వస్తుంది. ఆ సమయంలో మనం విశ్రాంతి తీసుకోవాలి. అంతేగాని సాధన చేయడానికి వీలు ఉండదు. అంటూ ఉండగానే
శివ నందిని…అమ్మ నీ మాటకి అడ్డు వస్తున్నానని ఏమీ అనుకోవద్దు…ఇక్కడ నాకున్న సందేహానికి సమాధానం చెప్పు. స్త్రీలు నెలసరిలో ఉండగా సాధన చేయొచ్చా? అని అడిగింది.
ఇక్కడ సాధన చెయ్యచ్చా ? లేదా అనేది వాళ్ళ యొక్క మనస్తత్వ స్థితిని బట్టి ఉంటుంది…. ఎందుకంటే కొంతమంది స్త్రీలకి నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. మందులు వేసుకుని…విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. కొంతమంది స్త్రీలకి నొప్పి అనేది ఉండదు. కాకపోతే అసౌకర్యంగా, వికారంగా…కడుపులో తిప్పడం…వాంతులు అవుతున్నట్టుగా అనిపించడం…ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మనసు స్థిరంగా ఉండి సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తే సాధన చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది స్త్రీల అభిప్రాయం ప్రకారం చూస్తే….. ఈ నెలసరి సమయంలోనే విపరీతంగా ధ్యానం చేయాలని…. జపం చేయాలని…. మంత్ర ఉపాసన చేయాలని…. దైవ ఉపాసన చేయాలని…. విపరీతంగా కలుగుతుంది. అలాగే ఆ సమయంలో వాళ్ళ మనస్సు స్థిరపడి…స్థిరత్వం కలిగి ఉండి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఏకాగ్రతను పొందడం చాలామంది గమనించారు. కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే…. నెలసరి అంటే.. స్త్రీ గర్భాశయమును శుభ్రపరచి చెడు రక్తం బయటకు రావటం…గర్భాశయాన్ని శుద్ధి చేయడానికి ప్రకృతి ఈ విధంగా ఏర్పాటు చేసింది.. అందులో ఉన్న చనిపోయిన అండాలన్నీ ఈ నెలసరి సమయంలో బయటకు పోతాయి. ఆ సమయంలో మనం సాధన చేస్తే చెడు రక్తం మనకు కుండలిని శక్తి మార్గం ద్వారా…అంటే వెన్నుపాము మార్గం ద్వారా…. మన మెదడుకి చేరి, లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని…మన పూర్వీకులు గమనించి…ఆ సమయంలో స్త్రీకి విశ్రాంతి ఇవ్వాలి అని చెప్పి…అంటూ ముట్టు అని దూరంగా ఉంచడం…అన్ని పనులకి దూరంగా ఉంచడం జరిగింది. వంటలకి , బట్టలు ఉతకడానికి, ఇంటిలో ఉన్న బాధ్యతలు అన్నిటికీ కూడా మగవాడికి నేర్పడం కోసమని…మగవాడిని చేయమని చెప్పి ఐదు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ కాలానుగుణంగా స్త్రీలు కూడా ఈ అంటూ ముట్టు అనే వ్యవహారాన్ని పక్కన పెట్టేసి…అంతా కలుపుగోలు గా తిరుగుతున్నారు. కలిసిపోతున్నారు. ఆ నెలసరి వచ్చిన సంగతి ఆ స్త్రీకి తప్ప మరొకరికి తెలియకుండా నడిపేస్తున్నారు. కానీ ఆ సమయంలో విశ్రాంతి తీసుకోకపోవటం వలన ….. మనసు అస్థిరంగా మారటం…. మెదడు వికారాలు పొందడం ,పర స్త్రీలు పరపురుషుల యందు కామకోరికతో …మోహ వ్యామోహాలలో పడటం, లేని అందం కోసం ప్రయత్నాలు చేయటం, ఉన్న అందం పోకుండా చూసుకోవడం , శరీరం మీద మమకారాలు పెరగటం, కోపావేశాలకు లోనవటం, ఇలా వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి అన్న విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో .. ప్రస్తుతం స్త్రీ మూర్తులు ఉన్నారు. అలాగే నెలసరి సమయంలో ఇల్లంతా తిరగటం, దేవత విగ్రహాలను పట్టుకోవడం, అలాగే ఇంటి వస్తువులను పట్టుకోవడం, వంట సామాన్లను పట్టుకోవడం అలాగే బట్టలు తాకటం ఇవన్నీ ….కావాలని చేస్తున్నారో… తెలియక చేస్తున్నారో కానీ ….ఎందుకు పట్టుకోకూడదు అనుకుంటున్నారో ఏమో అర్థం కాదు కానీ…… మన పూర్వీకులు చెప్పిన ఆచార వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి మన పూర్వీకులు చెప్పిన దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది. అంతెందుకు ….పసుపు అన్నింటిలో వాడటానికి పూజా విధానంలో ప్రవేశపెట్టారు. పూజల్లో పసుపుని వాడతారు …వంటల్లోను పసుపును వాడే విధంగా పెట్టారు. పూజల్లోనే పసుపు గణపతి ఆరాధన విధానం ఏర్పాటు చేశారు . అదే వంటల్లో పసుపుతో పులిహోర చేయమని చెప్పడం జరిగింది. ఈ పసుపు అనేది యాంటీబయోటిక్. మనలో ఉన్న సూక్ష్మ క్రిములు ,బ్యాక్టీరియా, మనకి అనారోగ్యం కలిగించే జీవులను నాశనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి అనుకోకుండా జరిగిన గాయాల రక్తాన్ని ఆపటానికి ఉపయోగపడుతుంది . అనేక రకాల వైద్యవిలువలతో ఉన్న పసుపుని అటు యోగంలోనూ …..ఇటు భోగంలోనూ అంటే వంటల్లోను …..మన పూర్వీకులు ప్రవేశ పెట్టడం జరిగింది . ఆ విషయం తెలుసుకున్న జపాన్ శాస్త్రవేత్త కేమో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ విషయం తెలిసిన భారతీయులు దానిని ఆచరించడం మానేశారు. పట్టించుకోవడం మానేశారు. పసుపు తినటం ,తాకటం, వాడటం తగ్గించేశారు . ఉపయోగించడం తగ్గించేశారు . పిజ్జాలు ,ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటి ఆహారాలు తినడం మొదలుపెట్టారు. సాత్వికమైన ఆహారమైన పులిహోర ,దద్దోజనం ,చక్రపొంగలి వంటి వాటి స్థానాలలో….. బిరియానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినటం మొదలుపెట్టారు. ఆహారాన్ని మార్చుకోవటం మొదలుపెట్టారు. అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలు పడుతున్నారు.
అప్పుడు శివనందిని ….“అమ్మా! ఇక్కడ నీ మాటకి అడ్డు వస్తున్నాను అని ఏమీ అనుకోవద్దు…. నిజంగా అసలు నెలసరి సమయాల్లో అన్నిటికి దూరంగా ఉండాలా? తాకకూడదా? తాకితే ఏం అవుతుంది…” అన్నప్పుడు
మహాదేవి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. “అమ్మాయి! నేను చెప్పడం కాదు…1921 వ సంవత్సరంలో schiek (షీక్) అనే శాస్త్రవేత్త పరిశోధనలో… ఆడవాళ్లకి నెలసరి సమయంలో మోనోటెస్టాన్ అనే చెడు పదార్థం విడుదల అవుతుందని …..ఈ పదార్థం విడుదల అవటం వల్ల విపరీతమైన దుర్వాసన కలుగుతుంది అని…. ఈ పదార్థమును తాకిన గాలి వల్ల విచ్చుకున్న పువ్వులు కూడా వాడిపోతాయని…. 1921 మే 21న అమెరికా ప్రభుత్వం ఓ పత్రికలో చెప్పడం జరిగింది . దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో… ఆ రోజుల్లో….మనలో చెడు పదార్థం ఉంటుంది కాబట్టి…. ఆ చెడుగాలి వలన చుట్టుపక్కల పరిసరాల్లో మార్పులు వస్తాయని చెప్పి ….మన పూర్వీకులు ఏనాడో తెలుసుకొని అన్నింటికీ దూరంగా ఉంచేవాళ్లు.. అంటే బట్టలు తాకవద్దని…. విగ్రహాలు తాకరాదని, ఫోటోలు తాకరాదని, బంగారు ఆభరణాలు తాకరాదని ,వంట సామాన్లు తాకరాదని, అలాగే బయటకు వెళ్ళరాదని… జుట్టు విరబోసుకుని తిరగవద్దు అని …బయటకు వెళ్ళకూడదని చెప్పి ….నాలుగవ రోజు స్నానం చేసి ….ఆ తర్వాత కూడా జుట్టు విరబోసుకొని వెళ్లకూడదని…. ఆ జుట్టు యొక్క కొన చివర్లకు నూనె రాసుకుని వెళ్లాలని చెప్పడం జరిగింది. ఐదవ రోజు గుడికి వెళ్ళవచ్చునని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి కారణం అంటే …..ఆ సమయంలో చెడు రక్తంలో ఉండే పదార్థం పరిసరాల్లోనూ, మనలోనూ, మానసికంగా, శారీరకంగా మార్పులు కలిగిస్తాయని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు నెలసరి సమయంలో రోడ్డు మీద తిరిగితే… అప్పుడు శవం మీద పోసిన నీళ్లు తాకినా లేదా దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా దిష్టి తీసిన పదార్థాలు తాకినా …..శరీరం బలహీనంగా ఉండటం వల్ల ఆ నెగటివ్ శక్తి మన శరీరంలోకి జుట్టు ద్వారా ప్రవేశించే అవకాశాలు ఉంటాయని తంత్ర శాస్త్రం చెప్పడం జరిగింది. అంటే చనిపోయిన ఆత్మలు, ప్రేతాత్మలు, దయ్యాలు భూతాలు, పిశాచాలు మనలోనికి ప్రవేశించి… నానా ఇబ్బందులు కలిగిస్తాయని తంత్ర శాస్త్రం చెప్పడం జరిగింది. ఇది నిజమా? కాదా? అని చెప్పి పరిశీలన చేస్తే, నూటికి 90 శాతం మంది ఆడవాళ్ళు ఇలాంటి సమయంలో ప్రేత శక్తితో…. నెగిటివ్ శక్తితో బాధ పడ్డట్టుగా పరిశోధనలో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి పూర్వం వాళ్లు వేటిని తాకరాదని, వేటిని పూజించరాదని చెప్పడం జరిగింది” అనగానే…. ….. సరే! శాస్త్రవేత్తలు నిరూపించారు! మన పూర్విక మహర్షులు చెప్పినప్పుడు సత్యం ఉంటుంది. కానీ మనం సత్యశోధన చేసుకోవడానికి సమయం ఉండదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం వల్ల ఈ నెలసరి సమయంలో ఉన్న ఆచార వ్యవహారాలను పక్కన పెట్టడం జరిగింది. ఈ వ్యవహారాలు ఎప్పుడైతే పక్కన పెట్టారో…. వారిలో వారికే తెలియని శారీరక , మానసిక రోగాలకి గురి అవ్వడము ….అసంతృప్తికి గురవటము, అసహనానికి గురవడం ,చిరాకుకు గురవటం, అస్థిర మనసుతో ఉండటం… దేని మీద శ్రద్ధ భక్తి లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. నెలసరి సమయంలో కొంతమంది స్త్రీలకి సాధన చేసుకోవాలి అనిపిస్తుంది. మరి కొంతమందికి చేయాలని అనిపించదు. మానసిక స్థితిని బట్టి, శారీరక పరిస్థితిని బట్టి సాధన చేయకపోవడం మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సాధన చేయటం వల్ల మనలో ఉన్న చెడు రక్తం మెదడుకు చేరి ,మానసిక శారీరక సమస్యలను తగ్గించుకోవడం బదులు పెంచుకోవడం ఎక్కువవుతుంది . భవిష్యత్తులో ఈ విషయం తెలుస్తుంది . ప్రస్తుతానికి బాగానే ఉంటుంది . కానీ రాబోయే కాలంలో తీవ్రమైన అనర్ధాలు , పెను ప్రమాదాలు మనం చేసిన తప్పుల వల్ల జరిగిందని తెలుసుకునేసరికి సమయం దాటిపోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం! అందుకనే మన పూర్వీకులు చెప్పిన ఆచార వ్యవహారాల వెనుక అర్థం పరమార్థం ఉంటుంది . ఈ వ్యవహారం మన శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, శాస్త్రీయంగా నిరూపించి వాళ్ళు చెప్పింది నిజమే…. అని నిరూపణ చేస్తున్నారు . అంటే మన పూర్వీక మహర్షులు ఆలోచన ఇస్తే…. ఆ ఆలోచన నిజమా ? కాదా? అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి నిరూపిస్తున్నారు. అంతెందుకు ఆకాశ సిద్ధి ద్వారా ఎవరికి వారే ఆకాశంలో ప్రయాణం చేయవచ్చు. ఈ ఆలోచనను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు విమానాన్ని తయారు చేయడం జరిగింది. ఒకళ్ళకు బదులు 100 మంది ఆకాశంలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అదే పూర్వీకులు తమ యోగ శక్తితో తమ ఆకాశ సిద్ధితో ఎవరికి వారే ఆకాశ యానాలను చేసేవారు. అదే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు ఆ ఆలోచనను ఆధారం చేసుకుని యంత్రమును తయారుచేసి ….ఒకరు కాకుండా వందమంది ఒకేసారి వెళ్లే విధంగా ఆకాశయానం చేస్తున్నారు. దాని విమాన ప్రయాణం అంటారని మన వాళ్ళు పేరు పెట్టుకున్నారు . మన పూర్వీకులు దాన్నే ఆకాశయానం అని పేరు పెట్టారు. అంతే తేడా…. ఇక్కడ ఏంటంటే పేర్లు మారుతున్నాయి. పనులు అవే…. పూర్వకాలంలో ఆకాశయానం అన్నారు. ఇప్పుడు విమాన యానం అన్నారు…అంతే తేడా! నెలసరి సమయంలో వచ్చే విష పదార్థం పేరును మోనో టాక్సిన్ అని schiek అనే శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. శాస్త్రపరంగా నిరూపించడం జరిగింది. ఈ పదార్థం మన వలన వచ్చే చెడుగాలికి పూలు వాడిపోతాయని శాస్త్రీయంగా నిరూపణ చేయడం జరిగింది. దాన్నిబట్టి నువ్వే అర్థం చేసుకో.. సాధన చేయాలా? పూజలు చేయాలా? జపం చేయాలా అక్కర్లేదా అనేది నీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది అనగానే శివనందిని….“ వామ్మో! ఇంత తెలిసిన తర్వాత పూజలు ఎలా చేస్తాను…? ధ్యానాలు ఎలా చేస్తాను.. నేను చచ్చినా చేయను. కావాలంటే ఆ ఐదు రోజులు విశ్రాంతి తీసుకుంటాను. కావాలంటే ఏదో ఒక గ్రంథం చదవడం లేదంటే శరీరానికి కావలసిన విశ్రాంతిని, మనసుకు కావలసిన విశ్రాంతిని ఇస్తాను. ఈ విశ్రాంతి ఇవ్వకపోవడం వల్లనే…. నాలో మానసిక, శారీరక సమస్యలు వచ్చాయని నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.. కాబట్టి తెలిసిన తర్వాత ఆ తప్పు ఎందుకు చేయాలి? చెయ్యను…మన పూర్వీకులు చెప్పిన దానిలో అర్థం పరమార్థం ఉంది. అది శాస్త్రీయంగా ఈ కాలంలో మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ ఇంతమంది చెప్పిన తర్వాత కూడా తప్పు చేయడంలో అర్థం లేదు. ఉపయోగం లేదు కదా! సమస్యలు వస్తాయన్నప్పుడు ఆ తప్పు చేయడం ఎందుకు? ఐదు రోజులు అన్నింటికి దూరంగా ఉన్నంత మాత్రాన కొంపలేం మునిగిపోవు కదా! పైగా మన శారీరానికి , మనసుకి కూడా విశ్రాంతి దొరకడం వలన బడలిక దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా! పునః శక్తితో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా! ఆ సమయంలో మనకు తగినంత విశ్రాంతి దొరకటం వలన శారీరక మానసిక బాధలు కూడా తగ్గుతాయి. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధన చేసేందుకు…. భోగ జీవితంలో కుటుంబ పరమైన పనులు చేసేందుకు ఆసక్తి పెరుగుతుంది… అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఐదు రోజులు నేను చచ్చినా సాధన కాదు కదా! మంత్రం కాదు కదా! జపం కాదు కదా !దేవాలయ దర్శనాలు కూడా చేయను…ఇంటి నుండి బయటకి రాను. ఆ ఐదు రోజులు చక్కగా విశ్రాంతిగా పడుకుంటాను. నా మానాన…నా ఆలోచనలతో నేను ఏకాంతంగా ఉండిపోతాను. నువ్వు ఇవి చెప్పి మంచి పని చేశావు. నాకు అర్థం అయ్యేవిధంగా చెప్పావు. ఇది అందరి స్త్రీమూర్తులకి వచ్చే ధర్మ సందేహమే. కాకపోతే నువ్వు శాస్త్ర పరంగా చెప్పావు అని నాకు అర్థమైంది…. నేను ఆచరణ చేస్తాను.
అమ్మా! నాకు సాధనాపరంగా మరొక సందేహం ఉంది. స్త్రీలు సాధన చేస్తే మోక్షం పొందుతారా? మీ అభిప్రాయం ఏంటి అని అన్నప్పుడు….
“అమ్మాయి! నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మోక్షానికి స్త్రీ, పురుషులకు ఒకే రకమైన అర్హత యోగ్యత యోగం ఉంటాయి . ఒకరు మాయలో ఉండటం ….ఒకళ్ళు మాయలో లేకపోవడం అనేది లేదు. కాకపోతే ఏంటంటే ….పురుషుడికి భార్య ,సంతానం ,కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక బాధ్యత . అదే స్త్రీ పరంగా వచ్చేసరికి…. బాధ్యతతో పాటు ప్రేమ, మమకారం, ఆప్యాయత అనే మోహాలలో పడతారు. పురుషుడు ఎప్పుడూ కూడా సంపాదన, ఆర్థిక అవసరాలు తీర్చడమనే బాధ్యతలో ఉంటాడు . అదే స్త్రీ వచ్చేసరికి ఈ కుటుంబ సభ్యులను ,సంతానాన్ని సొంతవాళ్లుగా…. నా అనే దృష్టి భావంతో ప్రేమ ,ఆప్యాయతలు అందించడంలో ముందుంటుంది . దానివల్ల పురుషుడికి వచ్చేసరికి బాధ్యత అవుతుంది . స్త్రీ కి వచ్చేసరికి అది బంధనం అవుతుంది. బంధనం వలన మోహ మాయలో పడతాము. బాధ్యత వలన మోహ మాయ అంతగా ఉండదు. భర్తకి… భార్య ఉన్నంతవరకే ,సంతానం ఉన్నంతవరకే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి . అదే భార్యకి భర్త ఉన్న లేకపోయినా ,చనిపోయిన, దూరమైన ,పిల్లలు దూరమైనా కూడా తను చచ్చేదాకా భర్త మీద ,పిల్లల మీద, మమకార ,మోహ ,వ్యామోహాలు అలాగే ఉండిపోతాయి. పురుషుడికి మాయ వదిలించుకునే స్థితి ఉంటుంది . ఆడపిల్ల వదిలించుకోవడానికి సమయం పడుతుంది. మగవాడు చొక్కా మార్చినంత అంత తేలిగ్గా ఆడపిల్లని మార్చగలడు. కానీ ఆడవాళ్లు మగవారిని మార్చాలంటే జీవితకాల సమయం పడుతుంది. అందుకని వీరిద్దరికీ సాధనాపరంగా మోహమాయలో పడతారు . కాకపోతే ఆ మోహమాయలో ఒకరు త్వరగా బయటపడతారు…..ఒకరు లోతుగా లోతుల్లో ఉండిపోతారు. కొంతమంది బయటపడటానికి ప్రయత్నం చేస్తారు …అయినా కూడా పిల్లల ముఖం ,భర్త ముఖాన్ని చూసి , మోహమాయను దాటలేరు. దాటడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాటచ్చు. సాధనలో మోక్షం పొందటానికి…. ఇద్దరికీ కూడా ఒకే విధమైన అర్హత ,యోగ్యత ,యోగం ఉన్నాయి. అబ్బాయి మాయని వదిలించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోడు. అదే అమ్మాయి వదిలించుకోవడానికి 12 సంవత్సరాల సమయం తీసుకుంటుంది…తను మాయలో ఉన్నాను అని తెలుసుకోగలిగితే మాయ మాయం అవుతుంది. నాకు తెలిసి ఇదే తేడా ! అని” చెప్పగానే…..
శివ నందిని చిరు మందహాసం చేస్తూ ……
శివ నందిని :- నువ్వు చెప్పింది నిజమే
అమ్మ ! భర్తకి ప్రేమ,మోహ, వ్యామోహాలు అంతగా ఉండవు. భార్యకి ప్రేమ , ఆప్యాయత, మోహ వ్యామోహాలు ఉంటాయి. భర్త విషయంలో అది బాధ్యత అవుతుంది. భార్య విషయంలో అది బంధనం అవుతుంది. బంధనం కాకుండా చూసుకోగలిగితే సాధనలో స్త్రీ ,పురుషులు కూడా మోక్షం పొందుతారని అవగాహన వచ్చింది. ఇప్పుడు అర్థం అయింది . కాకపోతే ఇక్కడ ఇంకో ధర్మ సందేహం ఉంది …ఇప్పుడు స్త్రీమూర్తులు దక్షిణాచారంలో సాధన చేయడం సిద్ధి పొందడం అనేది చాలామంది యోగినుల ను చూశాము… అదే వామాచారంలోకి వచ్చేసరికి సిద్ది పొందుతారా? ఎందుకంటే మనకి ఆజ్ఞా చక్రంలో…. నాలుగు ఉపచక్రాలలో నాలుగు రకాలైన తంత్రసాధనలు ఉన్నాయని చెప్పడం జరిగింది కదా! మరి ఈ తంత్రసాధనలో స్త్రీ మూర్తులు సిద్ధి పొందుతారా ? ఎందుకంటే 80% పురుషులు తంత్రసాధనలో ఉన్నట్లు 20% మాత్రమే స్త్రీలు ఉన్నట్లుగా తెలుస్తుంది .అర్థం అవుతుంది . గ్రహించాను . మరి మీ సమాధానం ఏమిటి ?
అన్నప్పుడు మహాదేవి …….
మహాదేవి:- అమ్మాయి! సాధనలో దక్షిణాచారం, వామాచారం అని రెండు రకాలు ఉన్నాయి. ఇందులో దక్షిణాచారంలో శాంతమూర్తిని పూజ చేస్తాము . అదే వామాచారంలో ఈ సాత్విక దేవతలను ఉగ్రరూపంలో పూజిస్తాము . ఇక్కడ దక్షిణాచారంలో అరటిపండు పెడితే, వామాచారంలో మాంసం పెడతాము. పదార్థాలు మారుతున్నాయి . రూపం ఉగ్రం ,శాంతం అవుతుంది. అంతకుమించి ఏమీ లేదు . అంతకుమించి సాధనలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇప్పుడు వామాచారంలో తొందరగా సిద్ధి పొందుతారు . దక్షిణాచారంలో కోరికలు ఉంటాయి . ఆ కోరికలు తీర్చుకోవడానికి అని భగవంతుడికి ఆ కోరికలు చెప్పి జాతకాల ద్వారా అవి తీరేటట్టు చూస్తాం. అదే తంత్ర విధానంలో కోరికలు ఉండవు. ఉన్న కోరికలు తగ్గించుకోవడం ఎలాగో వామచారం చెప్తే ….ఉన్న కోరికలు తీరకపోగా కొత్త కోరికలు పెంచే వాటిని ఎలా తీర్చుకోవాలి అనేది దక్షిణాచారం చెప్తుంది. నిజానికి తంత్రసాధన సులువైన మార్గం. చూడటానికి మాత్రం అది భయంకరంగాను, చేయడానికి భయపడే విధంగానూ అందరూ చేసే విధంగా ఉండదు. కాకపోతే అందులోకి దిగితే భయం పోయి ఆనందం వస్తుంది . అలా అని చెప్పి ఎవరు పడితే వారు తంత్రసాధన లోకి రావడానికి లేదు. నిజ గురువు సమక్షంలో మాత్రమే మనం తంత్ర సాధన నేర్చుకొని సాధన చేయాల్సి ఉంటుంది. నకిలీ గురువు అయితే… మన శరీరం మీద వ్యామోహం పెంచుకొని ,మనల్ని మాయలో పడేసి వాళ్ళ సాధన పరిసమాప్తి చేసుకుని వెళ్లిపోతారు. అదే దక్షిణాచారంలో కూడా నిజ గురువు అవసరం పడుతుంది . నిజ గురువు దర్శనం కానంతవరకు ,అనుగ్రహం పొందనంత వరకు, మన సాధన ముందుకు వెళ్లదు. అందుకనే సాధన చేసేటప్పుడు మోక్షజన్మ అయి ఉండాలని …..దైవానుగ్రహం పొంది ఉండాలని …..గురువు అనుగ్రహం పొంది ఉండాలని …..శివ గీతలో చెప్పడం జరిగింది . కాబట్టి ఈ విషయంలో వామాచారంలో అయినా దక్షిణాచారంలో అయినా…. మనం పూజించే దేవతల అనుగ్రహం పొందాలి. దైవానుగ్రహం పొందాలి. అలాగే గురువుల అనుగ్రహము పొందాలి . అప్పుడే మన జన్మ మోక్షజన్మ అవుతుంది. తంత్రానికి, సాత్విక పూజా విధానానికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. రెండు సమాన ఫలితములనే ఇస్తాయి . ఎలా అంటే తంత్రసాధనలో ఒక దున్నపోతును బలి ఇస్తే ,అదే దక్షిణాచారంలో ఆ దున్నపోతుకు ఉన్న శక్తిని మూడు మినుములతో సమానమని చెప్పేసి తంత్ర శాస్త్రం చెప్పడం జరిగింది. దీనిని బట్టి నువ్వే అర్థం చేసుకో. అలాగే తంత్రంలో గుమ్మడికాయ దిష్టిగా వాడితే ,అదే దక్షిణాచారంలో గుమ్మడికాయతో పులుసు పెట్టుకొని తినటం ,వడియాలు పెట్టుకొని తినటం అలవాటు. దీనిని బట్టి ఏది ఎలా చేయాలి ……వాటిని ఉపయోగించే విధానాలు, వాటికి ఉపయోగించే పదార్థాల తీరు తేడా ఉంటుంది .తంత్రంలో ఉపయోగించే విధానం వేరు. అదే దక్షిణాచారంలో ఉపయోగించే విధానము వేరు. దానిని దీనిని కలపలేము. అంతెందుకు విద్యా గణపతిని దక్షిణాచారంలో సాత్విక పూజ చేస్తాము . అదే గణపతిని ఉచ్చిష్ట గణపతిగా తంత్ర శాస్త్రంలోనూ పూజ చేస్తాము . పూజా విధానాలు వేరుగా ఉంటాయి. స్వరూపాలు ఉగ్రము, శాంతము అని తేడా ఉంటుంది . పదార్థాలు మారతాయి. పూజా విధానాలు మారతాయి. ఆచార వ్యవహారాలు మారతాయి . ఇక్కడ నిజానికి తంత్రమైన ఒకటే …. యంత్రమైనా ఒకటే ……మంత్రమైనా ఒకటే. అది తేడా తెలుసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమస్య ఉండదు. అది గ్రహించు.
అంతెందుకు….శ్రీకృష్ణుడు తంత్ర ఉపాసకుడని చాలామందికి తెలియదు. ఆయన కాళీ తంత్రమును ఆరాధన చేశాడు. అలాగే రాధాదేవి యంత్రం ద్వారా రాధాదేవిని తంత్ర దేవతగా ఆరాధన చేశాడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుస్తుంది. అది కూడా తంత్రంలో సిద్ధి పొందిన తాంత్రిక వేత్తలుగా మాత్రమే తెలుస్తుంది లేదా తాంత్రిక గురువులకు సిద్ధగురువులకి మాత్రమే ఈ విషయం తెలుసు. కానీ లోకానికి ఈ విషయం చెప్పలేదు. సాత్వికంగా శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారు. కానీ తంత్రసాధన ఉపాసకుడని లోకానికి అంతగా తెలియదు. మనం పూజించిన దేవతలే తంత్ర శాస్త్రంలో ఉన్నారు . జ్ఞాన సరస్వతి కాస్త తంత్రంలో నీలం సరస్వతి అవుతుంది ….కాళికాదేవి తంత్ర దేవత …..చిన్నమస్తా దేవి కూడా తంత్ర దేవతయే .చాలామంది మన పూర్వీకులు ….మన దైవాలు ….మనం ఆరాధించే దేవతలు కూడా ఏదో ఒక సమయంలో తంత్రసాధన చేసి సిద్ధి పొందిన వాళ్లే .అలాగే ప్రకృతి కూడా మనకి ఆజ్ఞ చక్రంలో ఉన్న నాలుగు ఉపచక్రాలకు తగ్గట్టుగా మనకి తంత్ర సాధన విధివిధానాలు అనగా కాపాలిక ,అఘోర, భైరవి ,నాగసాధువు తంత్ర విధివిధానాలు చెప్పడం జరిగింది. అందులో కాలానుగుణంగా వాడి జన్మాంతర సాధన అనుగుణంగా…. పరిస్థితులను బట్టి తంత్ర విధానంలోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా తంత్రసాధన చేయాలి అని అయితే లేదు . ఈ నాలుగు ఉపచక్రాలకి వచ్చేసరికి….. వామాచారం చేయకుండా దక్షిణాచారంలో కూడా సిద్ధి పొందవచ్చును. ఈ విధంగా లాహిరి మహాశయుడు తంత్ర విధానం చేయకుండా…. దక్షిణాచారంలోనే ఈ నాలుగు చక్రాలు సిద్ధి పొందినట్లుగా ఆయన జీవిత చరిత్రలోనూ మనం చూడవచ్చును. ఇక్కడ శాస్త్రం లేదా ఆధ్యాత్మిక స్థితి ఇదే చేయమని ఇలాగే ఉండమని చెప్పలేదు. మన మనసుకు నచ్చిన విధంగా ఉండమని …..మనసుకు నచ్చిన విధంగా చేసుకోమని మాత్రమే చెప్పడం జరిగింది. నిజానికి ఈ నాలుగు ఉపచక్రాలు వచ్చేసరికి నా అభిప్రాయం ప్రకారంగా చూస్తే, తంత్ర సాధన చేయాలని అనిపిస్తుంది. కపాలమాలలు ధరించాలని అనిపిస్తుంది. కపాలాలు పట్టుకోవాలని అనిపిస్తుంది. స్మశానంలో కూర్చుని శవ దహనాలు చూడాలని అనిపిస్తుంది.అస్థిపంజరాలతో ఆడుకోవాలని, మాట్లాడాలని, పక్కన పెట్టుకోవాలని అనిపిస్తుంది. అస్థిపంజర యోగ దండాలను చేతిలో పట్టుకుని తిరగాలనిపిస్తుంది. మోచేయి మోకాలు ఎముకను పట్టుకొని యోగ దండంగా వాడుకోవాలని అనిపిస్తుంది. కపాలంలో భోజనం చేయాలని అనిపిస్తుంది. కపాలంలో తాగాలని అనిపిస్తుంది. చచ్చిన శవమును పీక్కు తినాలనిపిస్తుంది . రక్తమును తాగాలనిపిస్తుంది . ఇలా మానసికంగా మనకి ఎన్నో కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు తీర్చుకుంటే మనం పిశాచాలుగా ప్రేతాలుగా మారకుండా ప్రేతాలుగా మారకుండా, భూతాలుగా మారకుండా మన కోరికలు తీరిపోతాయి. ఆ కోరికలు పెట్టుకొని సాధన చేస్తే మనసు స్థిరంగా ఉండటానికి బదులు అస్థిరమై, ఉగ్రమై ,తట్టుకోలేని స్థితికి వెళ్లే ప్రమాదం ఉంటుంది . కాకపోతే తంత్రసాధనలోకి వెళ్లాలంటే నిజ తంత్ర గురువుల వద్ద మాత్రమే….. వారి సమక్షంలో మాత్రమే సాధన చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి తంత్ర సిద్ధ గురువులు దొరకటం లేదా తంత్రసిద్ధ యోగులు దొరకడం చాలా అరుదైన విషయం. ఏ కాశీ క్షేత్రంలోనో ,ఏ శ్రీశైలం క్షేత్రంలోనో ,ఏ హిమాలయాలలోనో , ఉజ్జయిని క్షేత్రంలోనో ఆ పరిసరాలలో చాలా అరుదుగా ఈ తంత్ర ఉపాసకులు కనపడతారు . హిమాలయ పరిసరాల్లో నాగ సాధువుల తంత్ర విధానం కనబడుతుంది. కామాఖ్య దేవి దగ్గర భైరవ సాధన కనబడుతుంది. అదే శ్రీశైలం పరిసర ప్రాంతాలలో మనకి కాపాలిక సాధన కనపడుతుంది . అదే ఇప్పుడు మనం ఉన్న కాశీ క్షేత్రంలో అఘోర సాధన కనపడుతుంది . అఘోర సాధనలో సిద్ధి పొందిన అఘోరాల దేవాలయాలు కూడా ఉన్నాయి. కావాలంటే నువ్వు అక్కడికి వెళ్లి వాళ్ళ సమాధులను కూడా దర్శనం చేసుకోవచ్చు . సాధన ఇలాగే చేయమని ……ఇలాగే సిద్ధి పొందమని ఏ గురువు చెప్పడు. ఏ దేవుడు మనకి చెప్పడు ..మనకి నచ్చిన విధానం ,మన పరిస్థితులను బట్టి, మన మనసు యొక్క స్థితిగతులను బట్టి, మనం సాధనను ఎంచుకోవలసి ఉంటుంది. అది దక్షిణాచారం అయినా…..వామాచారమైన మన మనసును బట్టి …ఇష్టాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది . ఇష్టం లేని పూజ చేసినా ….ఇష్టం లేని ధ్యానం చేసినా …..ఇష్టం లేని ఉపాసన చేసినా …..దేనికి ఉపయోగం లేదు . కాలాయాపన తప్ప నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎప్పుడూ కూడా ఏ పని అయినా ఇష్టపడి చేయాలి కానీ కష్టపడి చేయకూడదు . కష్టపడి చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. అదే ఇష్టపడి చేసిన పని తంత్రమైనా, మంత్రమైనా ,యంత్రమైనా కొద్దిగ చేసినా కూడా …….ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది . తంత్రంలో కొద్దిగ చేసి అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితం పొందవచ్చు. అదే దక్షిణాచారంలో సిద్ధి పొందటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతెందుకు దక్షిణాచారంలో అక్షర లక్షల గాయత్రి చేయడానికి 41 సంవత్సరాలు పడితే అదే వామాచారం లో అయితే అక్షర లక్షలు చేసిన ఫలితం పొందటానికి 41 రోజులు మాత్రమే పడుతుంది. ఎక్కడ 41 సంవత్సరాలు…… ఎక్కడ 41 రోజులు……. ! కాకపోతే మన సాధన ఇష్టపడి చేయాలి. కష్టపడి చేయకూడదు. భయపడి చేయకూడదు. తంత్రం భయం కలిగిస్తుంది. ఆ భయాన్ని పోగొట్టుకొని మనసుని మనోనిగ్రహంతో, ఇంద్రియ నిగ్రహంతో ,మనో నిబ్బరం తో ఉండగలిగితే …..తంత్రానికి మించిన సాధన స్థితి లేదు. అలా అని చెప్పి దక్షిణాచారం విధివిధానం తప్పు అని, తక్కువ అని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే దక్షిణాచారంలో కోరికలు పెరుగుతాయి. వామాచారంలో కోరికలు తగ్గుతాయి. సాధన అంటే ఉన్న కోరికలను తగ్గించుకుంటూ వెళ్లడమే కదా! ఆ కోరికలు తగ్గితే కోరికలు లేని స్థితిని పొందినప్పుడు వచ్చే స్థితియే నిశ్చల స్థితి . ఆ నిశ్చల స్థితియే కదా మోక్షస్థితి అని మన శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. ఏమంటావు నేను చెప్పింది నిజమో… కాదో… నువ్వే ఆలోచించుకో! నీకే అర్థం అవుతుంది. ఇందులో ఇదే చేయమని చెప్పి ఎవరో కూడా చెప్పరు . ఇలాగే ఉండాలి…..ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు. నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి . ప్రస్తుతం నువ్వు కుండలినీ శక్తి జాగృతి స్థితిలో ఉన్నావు. ఆజ్ఞ చక్రానికి నీ సాధనాస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలో….. ఎలా చేయాలో….. నీ మనసును బట్టి నిర్ణయం తీసుకో. ఇప్పుడే ఆలోచించుకొని భయపడి, బాధపడి, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చితే తంత్రసాధనలో ఆ నాలుగు ఉపచక్రాలు సాధన పూర్తి చెయ్యి. లేదు అనుకుంటే దక్షిణాచారంలో సాధన చేసి ఆ సాధన పూర్తి చేసుకో. ఇక్కడ ఆ నాలుగు చక్రాలకి ఈ రెండు విధివిధానాలు ఉన్నాయి కాబట్టి నువ్వు నీ యొక్క సాధన స్థితిని బట్టి, నీ మనస్సును బట్టి ,నీ సాధనను బట్టి ఏం కావాలి? ఎలా చేయాలి? అనేది నిర్ణయించుకో. విశ్వంలో ఉన్న పంచభూతాలు నీకు సహాయ సహకారాలు అందిస్తాయని గుర్తుంచుకో! తాంత్రిక సాధన అంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అందుకు నిదర్శనమే నా జీవితం. అది గుర్తుపెట్టుకో!
అమ్మా ! నీ అనుభవం ప్రకారంగా….. సాధనకి ఏ విధి విధానం మంచిది అనుకుంటున్నావో చెప్పు అని శివ నందిని అడిగేసరికి…… మహాదేవి ఆమెకేసి చూస్తూ…….
మహాదేవి:- సాధన అనేది మన మనసును బట్టి ఉంటుంది. మనసు అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది . ఆహారమును బట్టి మన మనసు….. మన మనసును బట్టి ధ్యానము ఉంటుంది. ఇక్కడ ఇదే విధివిధానంలో సాధన చేయాలి అనే లాగా ఎక్కడా కూడా చెప్పలేదు. కాకపోతే మనసుకి నచ్చిన విధివిధానం ఎంచుకోవాలి. మన మనసుకు ఈ విధివిధానం ఇష్టతను చూపించాలి. ఇప్పుడు కొంతమందికి విగ్రహారాధన అంటే ఇష్టం . కాబట్టి చెక్కిన విగ్రహాలతో సాధన చేసుకుంటారు. అదే కొంతమందికి విశ్వారాధన అంటే ఇష్టం. ప్రతి రాయి లోను దేవుని చూస్తారు . ఇక్కడ చూసేదానిని బట్టి చేసే దానిని బట్టి ఇష్టతను బట్టి మన సాధన ఉంటుంది . సాధనను బట్టి మనసు ఉంటుంది . మనసును బట్టి ధ్యానం ఉంటుంది అని తెలుసుకో! ఇక్కడ మనకి భగవద్గీత లో 18 రకాల విధివిధాన సాధనలు చెప్పడం జరిగింది. అందుకే 18 యోగములుగా చెప్పడం జరిగింది. ఇది కర్మయోగంతో మొదలుపెట్టి 18వ యోగంగా మోక్ష సన్యాస యోగంగా పూర్తి చేయడం జరిగింది. అంటే భగవద్గీత ప్రకారంగా చూస్తే కర్మ, భక్తి , జ్ఞాన,ధ్యాన , లయసిద్ధి, ఆత్మ సిద్ధి ఇలా విధివిధానాలు ఉన్నాయి . అదే పతంజలి ప్రకారంగా చూస్తే ….., అష్టాంగ యోగాలు ఉన్నాయి. అదే బుద్ధుడు ప్రకారంగా చూస్తే అష్టాంగ యోగాలు చెప్పడం జరిగింది. అదే శివుని అనుభవం ప్రకారంగా చూస్తే 112 విధి విధానాలతో సాధన చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ లెక్కన ఏది నీ మనసుకు నచ్చుతుందో….. ఏది నీ మనస్సు ఇష్టతను కోరుకుంటుందో……. ఏది నీ శరీరమును కోరుకుంటుందో……. నీ శరీరానికి తగ్గట్టుగా సాధన విధి విధానాన్ని నీకు నువ్వే ఎంచుకోవలసి ఉంటుంది. నువ్వు ఎంచుకున్న సాధన విదివిధానాన్ని బట్టి నీ చక్ర శుద్ధి, జాగృతి ,సిద్ధి, ఆధీనం, విభేదనం ఉంటాయి. అలాగే దానికి సంబంధించిన దైవీక వస్తువులు, దైవదర్శనాలు దానికి సంబంధించిన దైవ గురువులు….. ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఎంచుకున్న సాధనా విధివిధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఒక సాధనా విధివిధానాన్ని ఎంచుకుంటే, జీవితాంతం అదే సాధన విధానం చేయాల్సి ఉంటుంది . ఉదాహరణకు నా పరంగా వచ్చేసరికి పరమహంస పవనానంద ఎంచుకున్న యోగనిద్ర సాధన నేను చేస్తాను. అది తంత్ర విధానంలో అయినా అదే సాధన చేస్తాను. దక్షిణాచారమైన నేను అదే విధి విధానమే చేస్తాను. తంత్ర విధానంలో అఘోర విధి విధానాలు ఆచారాలు చేసి ఎక్కువసేపు యోగనిద్రలో సాధన చేసి ధ్యాన అనుభవాలు పొందేదాన్ని. అదేవిధంగా అది అందరికీ నచ్చాలని లేదు . ఎందుకంటే యోగ నిద్రకి , భోగ నిద్రకి ఉన్న తేడా తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది . యోగనిద్ర సాధన చేస్తే భోగ నిద్రకి అవకాశం ఉండదు . అది గురువు సమక్షంలో లేదా మనకి మనమే ఆ తేడా తెలుసుకొని సాధన చేయవలసి ఉంటుంది. భోగ నిద్రలో ఎన్ని గంటలు నిద్రపోయినా …..అంటే ఎనిమిది లేదా 10 లేదా 12 లేదా 14 గంటలు నిద్రపోయినా తృప్తి ఉండదు . అదే యోగ నిద్రలో 20 నిమిషాల నుంచి నాలుగు గంటల నిద్రపోతే మూడు లేదా వారం రోజులు నిద్ర భోగ నిద్ర అవసరం ఉండదు. అది యోగనిద్ర యొక్క గొప్పతనం. కాబట్టి యోగనిద్ర , భోగ నిద్ర యొక్క తేడా తెలుసుకొని సాధన చేయవలసి ఉంటుంది. దాని విధి విధానం ఉంటుంది. ఈ యోగనిద్ర ద్వారా మన శరీరం అనగా సూక్ష్మ శరీరమును ఆకాశయానం ద్వారా పంపించవచ్చును . దానినే సూక్ష్మ శరీర యానం అంటారు. దానిని పంపించి గ్రహాంతయానం చేయవచ్చును. అంతరిక్షంలో ఉన్న దేవి దేవతల లోకాలు కూడా చూడవచ్చును . ఇది నా విధివిధానము…ఇది అందరికీ సరిపోవాలని లేదు. కొంతమంది విగ్రహారాధన చేస్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గానే ఉన్నారు…… ఆయన కాళికాదేవి ఆరాధన చేసి ఆ విగ్రహం లోనే అమ్మవారి సజీవ మూర్తిగా ఉందని ధ్యాన అనుభవాలు పొందడం జరిగింది. అదే ఈయన గురువుగారైన తోతాపురి నిరాకార సాధన చేశాడు .అంటే విశ్వారాధన చేశాడు అంటే ….. అమ్మవారు లేరు ….అయ్యవారు లేరు…. దేవుడు లేడు…… ఉన్నదంతా శూన్యమే అని చెప్పి నిరాకార సాధన చేశారు. ఆయన విధి విధానం ఆయనది . ఈయన విధానం ఈయనది.. ఎవరి విధివిధానం వారివి. ఇలాగే సాధన చేయాలి అని ఎవరో పాటించిన సాధన విధానాన్ని అనువదించుకోవాల్సిన అవసరం గానీ అనుకరణ చేయడం వలన గాని ఎటువంటి ఉపయోగం ఉండదు. మనకి నచ్చిన విధివిధానం చేయాలి . కొంతమందికి ధ్యానంలో కూర్చుంటే ధ్యాన అనుభవాలు కలుగుతాయి. కొంతమందికి జ్ఞానమార్గంలో వెళితే జ్ఞాన స్ఫురణలు కలుగుతాయి. కొంతమందికి భక్తి మార్గంలోకి వెళ్తే దైవదర్శనాలు , దైవ అనుభూతులు కలుగుతాయి. కొంతమందికి కర్మయోగంలో కర్మ మార్గంలో ఉండి సమాజంలో ఉన్న జీవులకి నిష్కామంగా ఇతరులకు సహాయ సహకారాలు అందించడం వల్ల ఉన్న లోకాల నుండి ఉన్నత లోకాలకు వెళ్లే ప్రాప్తి కలుగుతుంది. …..ఏ విధానములో వెళ్లినా కూడా …..మనసా వాచా కర్మణా భయపడకుండా బాధపడకుండా కష్టపడకుండా ,సులువుగా ఉండే విధివిధానమును మనమే ఎంచుకోవాలి. మనం ఎంచుకున్న విధివిధానం జీవితాంతం పాటు…… దాన్నే చేస్తూ ఉండాలి. విధి విధానం ఒక్కసారి ఎంచుకున్న తరువాత దానిని మార్చకూడదు. ఇష్టమైనా , కష్టమైనా దాన్నే అనుసరించాలి . అలా కాకుండా సాధన విధివిధానాన్ని మార్చుకుంటూ వెళితే, విశ్వంలో కూడా మార్పులు వస్తాయి. పొందాల్సిన ఙ్ఞానం కూడా అందదు. ఒక సాధనా విధివిధానములో మనం వెళ్ళవచ్చు. అంతెందుకు ……..యోగివేమన రాజయోగ విధివిధానంలో సాధన చేసి సిద్ధి పొంది యోగ సిద్దుడయ్యి ,జ్ఞాని అయ్యాడని ఆయన జీవిత చరిత్ర చెబుతుంది . కొంతమంది విగ్రహారాధనలో సిద్ధి పొందారు. కొంతమంది విశ్వారాధన లో సిద్ధి పొందారు. కొంతమంది జ్ఞానమార్గంలో సిద్ధి పొందితే, కొంతమంది ధ్యానమార్గంలో సిద్ధి పొందారు. కొంతమంది ఆత్మలయ సిద్ధిలో సిద్ధి పొందారు. కొంతమంది హఠయోగంలో…. ఇంకొంతమంది యోగ ఆసనాలలో ఆసన సిద్ధి …..ఇంకొంతమంది మంత్రాల ద్వారా…. దేవత ఉపాసనల ద్వారా …..జపము ద్వారా….. జ్ఞానము ద్వారా….. తాంత్రిక విధి విధానాల ద్వారా ……యంత్రాల ద్వారా….. మంత్రాల ద్వారా సిద్ధి పొందారు . ఇక్కడ ఎవరు ఎలా సిద్ధి పొందారు అనేది చెప్పడం చాలా కష్టం. తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాళ్లేదో సిద్ధి పొందారని, మనం అదే చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళకది ఇష్టమని చేశారు. మనం వాళ్ళని అనుసరించడం వలన …..ఇష్టం లేకపోయినా చేయడం వలన కష్టపడి చేసినట్టు అవుతుంది. అందుకని మనం ఎంచుకునే సాధన విధి విధానం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నిర్ణయించుకుని సాధన చేసుకోవడం మంచిది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చేసరికి తల, మెడ ,శరీరం ఒకే స్థితిలో ఉండాలి. అదే యోగ నిద్రలోకి వచ్చేసరికి ఆ తల ,మెడ ,వెన్నుపూస పడుకున్న స్థితిలో ఉంటుంది . కూర్చొని సాధన చేస్తే అది ధ్యానం అంటారు. శవాసనంలో పడుకుని సాధన చేస్తే దానిని యోగ నిద్ర సాధన అంటారు. ఏమైనా గానీ….. మన శరీరం , బుద్ధి, ఆత్మ అలాగే మెడ, తల ,వెన్నుపూస సాధన కు ఉపయోగపడే ఉప అంగాలు . వీటిని ఏక స్థితిలో, సమస్థితిలో, ఒకే స్థితిలో…. ఏ విధి విధానం ద్వారా ఎంచుకొని సాధన చేస్తే బాగుంటుందో తెలుసుకొని చేస్తే మంచిది. అంతేగాని ఎవరో చెప్పారని… ఎవరో చేశారని నీ సాధన విధివిధానమును ఎంచుకోవద్దు. నీకు ఏది నచ్చుతుందో …..నీ శరీరానికి ఏది వీలు ఉంటుందో …..ఏది అనుకూలంగా ఉంటుందో….. నువ్వే చూసుకొని నిర్ణయించుకో. ఏది చేసినా ఇష్టపడి చెయ్యి….కష్టపడి చేయొద్దు . అది మాత్రం గుర్తు పెట్టుకో”.
ఇదంతా విన్న తర్వాత …..
శివనందిని:- అమ్మా ! ఇక్కడ నీ మాటలకి అడ్డు వస్తున్నా అని అనుకోవద్దు. సాధనలో ముద్రలతో సాధన చేస్తే మనలో కుండలినీ శక్తి ,చక్రాలు, జాగృతి అవుతాయని చెప్పడం జరిగింది. అది నిజమేనా!
మహాదేవి :- “తల్లి! ఏ విధానం అయినా నువ్వు సాధన చేస్తే….. సాధనా సాధ్యతే సర్వం సాధ్యమని గుర్తుపెట్టుకో! ఆ విధి విధానం నీకు ఇష్టమైందా…. కష్టమైందా…. అనేది తెలుసుకో! ఇక్కడ అది తంత్ర విధానమా… యంత్ర విధానమా…. మంత్ర విధానమా…. అన్నది కాదు . చేతి ముద్ర ద్వారా మనం చక్రాలు. జాగృతి చేసుకోవచ్చు.శుద్ధి చేసుకోవచ్చు, ఆధీనం చేసుకోవచ్చు. విభేదనం చేసుకోవచ్చు . అలాగే కుండలినీ శక్తి జాగృతి చేసుకోవచ్చు . ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది . కాకపోతే ఆయా చక్రాలకి ఆయా ముద్రలు ఉంటాయని తెలుసుకోవాలి. ఆ చేతి ముద్రలను తెలుసుకొని…… వారు చెప్పిన విధివిధానాలు తగ్గట్టుగా చేసుకోవచ్చును. అది కష్టమైన పని కాదు ….చాలా తేలికైన పని కూడా అవుతుంది . శరీరానికి కష్టపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ చేతి ముద్రల సాధనా విధివిధానం చేయటం వలన మన శరీరంలో మార్పులు వస్తాయా? చక్రాలు జాగృతి అవుతాయా అని …..? అనుమాన భయాలు కలుగుతాయి. ఎందుకంటే కేవలము 15-20 నిమిషాలు మాత్రమే ఆ చేతి ముద్రలు చేయడం జరుగుతుంది . కానీ ఒక్కొక్క చేతి ముద్ర కూడా శరీరంలో 72,000 లో ముఖ్యమైన నాడులను ఉత్తేజితం చేస్తాయని తంత్ర శాస్త్రంలో చెప్పడం జరిగింది . ఎందుకంటే తంత్ర శాస్త్రంలో పంచమకారాలు చెప్పడం జరిగింది. అంటే మాంసం, మద్యం, మగువ, మైదునం, ముద్ర అని కొంతమంది చెప్పడం జరిగింది. ఇందులో ముద్ర అనేది తంత్ర విధానంలో ఉంటుంది. అలాగే దక్షిణాచారంలో కూడా చేతిమూద్రలు లేదా హస్తముద్రలు అంటారు. హస్తముద్రలలో ….మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగించుకోవడానికి వివిధ రకాల ముద్రలు ఉంటాయి. అలాగే యోగ పరంగా గాయత్రి మాత ఆరాధనలో ఉన్నప్పుడు 24 ముద్రలు చెప్పడం జరిగింది. అది సంధ్యావందనం చేసే గాయత్రీ ఉపాసకులు….. గాయత్రి చేసినప్పుడు ప్రతిరోజు చేస్తారు . ఈ ముద్రల వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం లేదా మనసు అదుపులో ఉండటం లేదా ఉన్న అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. అంటే హస్త ముద్రల విధివిధానంలో మానసిక, శారీరక అనారోగ్య సమస్యల గురించి చెప్పడం జరిగితే….. యోగపరంగా చక్రాల శుద్ధి, జాగృతి, సిద్ధి , ఆధీనం కోసం , విభేదనం కోసం కొన్ని రకాలుగా చెప్పడం జరిగింది. నీకు ఆ ముద్రలకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి లేదా ఆ ముద్రలు రుద్ర స్వామిని అడిగినా కూడా చెప్తాడు. మన రుద్ర స్వామి ముద్ర విధివిధానం ద్వారా సిద్ధిపొందితే , నేను యోగనిద్ర సాధన ద్వారా సిద్ధి పొందాను అని చెప్పడం జరిగింది. ఈ రెండింటిలో లోతుపాతులు ,కష్టనష్టాలు చెప్పగలము. దాన్నిబట్టి నీకు నచ్చిన విధివిధానం చూసుకో ”.
అనగానే…
శివనందిని:- “అమ్మా ! హస్త ముద్రల ద్వారా దక్షిణాచారంలో, వామాచారంలోనూ సిద్ధి పొందే విధి విధానాలు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు కాబట్టి….. నేను నా మనసుకు నచ్చింది….. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను.అదేమిటంటే , దక్షిణాచారంలో ముద్ర విధానం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆజ్ఞా చక్రంలో వచ్చే నాలుగు ఉపచక్రాలను, తంత్ర విధానంలో పూర్తి చేయాలని అనుకుంటున్నాను . ఈ విధంగా సాధన చేయాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి రుద్ర స్వామి దగ్గర సకల హస్తముద్ర విధి విధానం నేర్చుకొని….. నాకున్న అనారోగ్య సమస్యలు పెరగకుండా, అలాగే యోగ పరంగా, భోగపరంగా ఉన్న ముద్రలు అన్నీ కూడా శ్రద్ధ భక్తితో…. సాధన చేసుకోవాలని అనుకుంటున్నాను . ప్రత్యక్ష గురువుగా మన రుద్ర స్వామీ ఉంటాడు కాబట్టి ……ముద్రలలో నేను చేసే విధానంలో లోపాలు ఉంటే ఆయన అందులో వచ్చే సమస్యలు పరిష్కారాలు చెప్తాడు. కాబట్టి హస్త ముద్రల ద్వారా కుండలినీ శక్తి జాగృతి, శుద్ధి ఇవన్నీ కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ విధివిధానంతోనే సాధన పరిసమాప్తి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే తంత్ర విధి విధానంలో నీ సహాయ సహకారాలు నాకు అందిస్తే ….ఆ నాలుగు ఉపచక్రాలను కూడా సాధన చేసి దానిని పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నా సాధనా విధానం నా ఇష్ట కోరిక ప్రకారమే , నా ఇష్ట ప్రకారమే నేను చేయగలను అనే విశ్వాసంతోనే, నమ్మకంతోనే ఈ విధి విధానం ఎంచుకోవడం జరిగింది . కాకపోతే ఇది ఎలాగా, ఏమిటి? అనేది మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తే నేను వీటిని పూర్తి చేయగలను. స్త్రీ ప్రకృతి పరంగా అది విశ్వమోక్షం అవుతుందా? వ్యక్తిగత మోక్షం అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. నేను దాని గురించి కూడా ఆలోచించట్లేదు. నేను మోక్షం పొందుతానా? నా మరణం మోక్షమరణం అవుతుందా? నా మరణం విశ్వమోక్షమరణం అవుతుందా? ఇవన్నీ కూడా నేను ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే కోరిక ఉంటే పునః జన్మకి వెళ్తారని….. కోరిక లేని స్థితికి వెళితే మోక్షం పొందుతారని ….నాకు కపాల మోక్షం ద్వారా అర్థం అయింది. అలాగే దేవతా దర్శనాలు, దైవసాక్షాత్కారాలు, ఆత్మ దర్శనాలు, ఆత్మ సాక్షాత్కారాలు, గురు మాయ, దైవమాయలు, దేవతా మాయలు, యక్షిని మాయలు, భూతమాయలు, పిశాచ మాయలు ఇలా ఎన్నో మాయలు, మర్మాలు దాటుకుని వెళ్ళాలి అని అవగాహన వచ్చింది. కానీ పరమాహంస గారికి ఎలాంటి మాయలు వచ్చాయో….. అవే మాయలు నాకు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పలేను అని అర్థం అయింది . ఎందుకంటే ఆయనకి కామ పరమైన భావాలు, మాయలు రావచ్చు . నాకు ధన పరమైన మాయలు రావచ్చు. నేను ఏ కోరిక తీసుకొని ఈ జన్మ తీసుకున్నానో నాకు తెలియదు కదా ! అది తీర్చుకునేటప్పుడు ఎలాంటి మాయలు వస్తాయో …..ఎలాంటి మర్మాలు వస్తాయో….. ఎలాంటి రహస్యాలు చేదించాల్సి ఉంటుందో…. నాకైతే తెలియదు. కాకపోతే నన్ను విశ్వ మోక్షానికి ప్రకృతి ఎంచుకున్నది కాబట్టి ……నా సాయ శక్తుల మనసా వాచా కర్మణా శ్రద్ధ భక్తితో, ఆత్మవిశ్వాసంతో ఈ మోక్ష సాధనను పరిసమాప్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫలితం మాత్రం కాలానికే వదిలేసాను. దైవం ఉన్నదో లేదో నాకు తెలియదు. గురువుల సహాయ సహకారాలు ప్రకృతి అందిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. విశ్వసిస్తున్నాను. నా భోగ జీవితం ఇక్కడితో పరిసమాప్తి చేసుకోవాలనుకుంటున్నాను. నా యోగ జీవితం యొక్క సాధన, నా ఆధ్యాత్మిక స్థితి, నా ఆధ్యాత్మిక జ్ఞానం పొందే విధివిధానం అంతా మీ ఇద్దరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ….ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు ఇద్దరు సహాయ సహకారాలు అందిస్తారని నేను భావిస్తున్నాను. మీ ఇద్దరూ ఏ విధంగా చెప్తే , ఆ విధంగా సహాయ సహకారాలు నేను తీసుకుంటాను. కానీ నాకు నచ్చిన విధి విధానంలోనే నేను ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను . ఇందులో మీరిద్దరూ కూడా ఏమీ అనుకోవద్దు. నేను చెప్పిన విధి విధానం మీకు నచ్చకపోవచ్చు …..మీకు నచ్చిన విధి విధానం నాకు నచ్చకపోవచ్చు . అది నాకు అర్థమైంది. నా మనసు , నా శరీరము, పరిస్థితులను బట్టి నాకు నచ్చిన విధివిధానం మీ ఇద్దరి దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఏవైతే నాకు నచ్చుతాయో ….ఏదైతే నాకు సరిపోతుందో ….అవి మాత్రమే అది కూడా నా మనసుకి నచ్చితేనే చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు తప్పుగా భావించవద్దు. తంత్ర గురువుగా మీరు ఉంటే….. దక్షిణాచార గురువుగా రుద్ర స్వామిని ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది! ఏంటి? అనేది ప్రకృతి ఏం చేయాలనుకుంటుంది …..అనేది కాల నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఈరోజు నుంచి నా భోగ జీవితానికి… స్వస్తి పలికి, యోగ జీవితం వైపు వెళ్ళాలని బలమైన మనో నిశ్చయంతో నిర్ణయించుకున్నాను. దానికి ఏం చేయాలి? ఎలా చేయాలి అనేది…… మీరు నాకు చెబితే నేను దాన్ని అలా చేస్తాను ” అని అనేసరికి….
మహాదేవి కాస్త ….
మహాదేవి:- అమ్మాయి! నీకు నచ్చిన సాధనా విధివిధానం నువ్వు ఎంచుకున్నావు. అది నీ ఇష్టం. దాంట్లో సిద్ధి పొందుతావా లేదా అనేది మాకు అనవసరం. సిద్ధి పొందే విధంగా కావలసిన ఏర్పాట్లు, పరిస్థితులు, మాయలు ,అవరోధాలు అన్నింటిని మేమిద్దరం కలిసి సహాయ సహకారాలు పరిహార దోషాలు ఇవన్నీ చెప్పగలము. కాకపోతే చేయాల్సింది నువ్వే. సిద్ధి పొందాల్సింది నువ్వే. మేము గుర్రాన్ని నీటి దాకా తీసుకురాగలం…. కానీ నీరు తాగాలా వద్దా అనేది ……నీ వ్యక్తిగత సాధన మీద ఆధారపడి ఉంటుంది . నీకు ఫలానా మాయలు వస్తాయి ….మర్మాలు నువ్వే తెలుసుకోవాలి….. అని వచ్చే ప్రమాదాల గురించి చెప్పగలము. వాటిని చేదించి ,తెలుసుకొని ఆ మాయలను తట్టుకొని ,దాటుకొని నిలబడగలిగేది….నీ యొక్క వ్యక్తిగత సాధన ను బట్టి …..నీ మనసు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది . అది నువ్వు చేస్తావా …..లేదా అన్నది కాల నిర్ణయమే. అది నిజమే ……కానీ దానిమీద ఆధారపడి నువ్వు ఏదో చేస్తావని, నువ్వేదో పొందాలని ఒత్తిడి మాత్రం మేము తీసుకురాము. నువ్వు విశ్వ మోక్షం పొందుతావా ? వ్యక్తిగత మోక్షం పొందుతావా? లేదా భౌతిక మరణం పొందుతావా? అనేది నీ చేతలు బట్టి, నీ చేతుల్లో ఉంటుందని గుర్తుంచుకో ! నీకు సాధనా విధివిధానాలకి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో! నీ సాధన పరిసమాప్తి అయితే గాని…. మా సాధన పరిసమాప్తి అవ్వదని మాకు అర్థం అయింది. కాబట్టి నీ జీవితాంతం మేమిద్దరం గురువులుగా ఉంటామా…. తల్లిదండ్రులుగా ఉంటామా…. నువ్వు మాకు దత్తపుత్రికగా ఉంటావా…. అనేది కాలం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఈ సాధన విధి విధానము చేయడానికి సర్వ పరిత్యాగి అయిన మోక్ష సన్యాస దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది . ఆ దీక్ష విధివిధానం ఏంటి అనేది ….మన రుద్ర స్వామి చెప్తాడు . ఎందుకంటే నాకు తాంత్రిక సన్యాసి యోగినీ దీక్ష ఇచ్చింది కూడా రుద్ర స్వామి కాబట్టి. రేపు పొద్దున్న రుద్ర స్వామిని అడిగి ఆయన చెప్పిన ముహూర్తం సమయానికి ఏ విధంగా చేయాలి… ఎలా చేసుకోవాలి …..అనేది చూద్దాం. ఇప్పటికీ సమయం మించి పోతుంది. నేను సాధన చేసుకోవడానికి స్మశానానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు నీ గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుని…. ఒకటికి పది సార్లు ఆలోచించుకో! నీ సాధన విధి విధానం ఏంటి అనేది తెలుసుకో! నీకు కావలసిన విషయాలు, వివరాలు అన్నీ కూడా నీ ఫోన్లో తెలుసుకో… నేర్చుకో! ఏదైనా సందేహాలు ఉంటే మేమిద్దరం తీరుస్తాము. మేమిద్దరం జీవితాంతం నీకు తోడుంటామని మాత్రం గుర్తుంచుకో! నువ్వు మాకు శివుడిచ్చిన దత్త పుత్రిక అని గుర్తుంచుకో! నీ సాధన వలన విశ్వానికి ఏదో కార్యం ఉంది . నీ సాధన వలన మా ఇద్దరి సాధనలు కూడా పూర్తవుతాయి. ఒకవేళ నువ్వు సాధనలో విఫలం అయినా కూడా…. మా సాధన మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరి సాధన వారిదే .. ఎవరి చావు వారిదే … ఎవరి మోక్షం వారిదే అని గుర్తుంచుకో! కాబట్టి ఎవరి సాధనా విధానం వారికి నచ్చినట్టు ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకో ! మేము సలహాలు ఇస్తాము. సలహాలు పాటించమని ఒత్తిడి చెయ్యము . నువ్వు పాటించడం లేదని మా ఇద్దరికీ నీ మీద కోపతాపాలు ఉండవని గుర్తు పెట్టుకో! నువ్వేదో సాధనలో ఉన్నత స్థితికి వెళ్తున్నావని ఈర్ష్య, రాగద్వేషాలు పెంచుకుంటామని నువ్వు అనుకోవద్దు. గత జన్మ సాధన స్థితిని బట్టి ప్రస్తుత జన్మ సాధన ఉంటుందని తెలుసుకో! నా తాంత్రిక సాధనకి సమయం అవుతుంది . కాబట్టి నేను మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న స్మశానానికి వెళ్లి సాధన చేసుకుంటాను. నువ్వు గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో . నీకు కావాల్సిన విధి విధానాన్ని ఆలోచించుకో ! శుభం భూయాత్…..”
అని మహాదేవి అక్కడి నుంచి మణికర్ణిక ఘాట్ వైపుకు వెళ్ళిపోయింది. ఆవిడని చూస్తూ ఇక చాలు అనుకొని శివనందిని కూడా గదికి వెళ్లడం జరిగింది.
ఇలా గదిలోకి వెళ్లిన శివనందిని…… మంచం మీద పడుకుని ఆలోచన చేయడం ఆరంభించింది . అంటే సాధనకి స్త్రీ పురుషుల భేదం లేదని , ఇద్దరు కూడా సాధన చేసి సిద్ధి పొంది మోక్షం పొందవచ్చు అని అనుకుంది . కాకపోతే తన సాధనా విధివిధానంలో హస్త ముద్రలు తీసుకోవడానికి బలమైన కారణం ఉంది . ఎందుకంటే తన తమ్ముడికి ఉపనయనం చేసిన తరువాత…..తన తండ్రి , గాయత్రీ మంత్రమును, సంధ్యావందనమును చెప్పి ఆ సంధ్యావందనంలో 24 మంత్రాలకు 24 ముద్రలు చేయించడం చూసింది. తండ్రి లేని సమయంలో తమ్ముడు ద్వారా గాయత్రి ముద్రలను చేయడం ఆరంభించింది. ఈ విషయం తల్లి ద్వారా తెలుసుకున్న తండ్రి కాస్త , ఈమెను తిట్టి ఆడవాళ్లు గాయత్రీని ఉపాసన చేయకూడదు….. గాయత్రి మంత్రం చేయకూడదు…. గాయత్రి ఆరాధన చేయకూడదు….. సంధ్యావందనం చేయకూడదు…… వినకూడదు ……అని ఆంక్షలు పెట్టి, బలవంతంగా తన చేత గాయత్రి ముద్రలు మానిపించేదాకా నిద్రపోలేదు. తనని నిద్రపోనివ్వలేదు . కాలానుగుణంగా ఎందుకు అలా చేశారన్నది అర్థం కాలేదు. వేదాలకు అధిపతిగా గాయత్రి మాతని పెడతారు ….జ్ఞానానికి అధిపతిగా జ్ఞాన సరస్వతిని పెడతారు. కానీ ఆడవాళ్ళను మాత్రం వేదాలు, శాస్త్రాలు చదవడానికి అధికారం లేదు అని అంటారు. వేదాలు, శాస్త్రాలు చదివితే ఆడ వారికి వైరాగ్యం కలిగి, వాళ్ళకి సంసార సుఖాలు ఇవ్వకుండా , సంతానం ఇవ్వకుండా…. సంసారం వదిలి పెట్టి సన్యాసం తీసుకుంటారని పురుషులు గ్రహించి, పురుషాధిక్యత కోసం అని చెప్పి స్త్రీ ఆధిక్యతను తగ్గించడానికి…. శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోను పురుషుడే దేవుడు అన్నట్టుగాను , స్త్రీ దేవుడికి భక్తురాలుగానూ చెప్పడం జరిగిందని గ్రహించింది . నిజానికి సాధనలో స్త్రీ పురుషులకి ఒకే విధమైన అర్హత ,యోగ్యత ,యోగం ఉందని అర్థం అవుతుంది. కాకపోతే శరీర పరిస్థితులను బట్టి ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు ఇస్తే మగవాడికి ఆర్థిక సమస్యలు ఇవ్వడం జరిగింది. ఈ నెలసరి సమస్యలను మగవాళ్ళకి లేకపోవడంతో వారు పురుషాధిక్యతను పెంచుకోవడం జరిగింది. అదే ఆడవాళ్ళకి ఇలాంటి నెలసరి సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకపోతే మగవాడితో జీవించాల్సిన అవసరం ఆడవాళ్ళకి ఏ కోశానా ఉండదు. ఆడవాళ్ళకి ఉన్న ఆర్థిక సమస్యలకి ఆధారం కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, చదువులు మాన్పించడం…. ఉద్యోగాలకు వెళ్ళకుండా చేయడం….. చదువులు చదువుకునే సమయంలో పెళ్లిళ్లు చేయడం…. సంసార బాధ్యతల్లో పడవేయటం….. ఎక్కడ కూడా స్వేచ్ఛని ఇస్తున్నట్లుగా గాని ,స్వేచ్ఛను పొందనీయకుండా ,అందనీయకుండా మగవాడు ఏర్పాటు చేశారని ఒక్కొక్కటిగా శివనందినికి అర్థం అవుతూ వచ్చింది. ఇప్పుడు సంసార బాధ్యతల నుంచి సన్యాసిగా మారుతున్న సమయంలో……తనకి నచ్చిన విధానంగా, తనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చని గ్రహించింది. ఇక దానితో తనకి చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న హస్తముద్ర విధివిధానమునే ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలని గట్టిగా ….మనసా వాచా కర్మణ ……సర్వస్య శరణాగతితో నిర్ణయం తీసుకుంది. మనో నిశ్చయం చేసుకుంది. మనో సంకల్పం పెట్టుకుంది .కాకపోతే ఆధ్యాత్మిక సాధనలో ఏదో చేయాలి…. ఏదో పొందాలి అని అయితే ఆధ్యాత్మిక సాధన చేయట్లేదు. ఎందుకంటే పరమహంస పవనానంద ఏదో ఉందని సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవడమే అంతిమ సాధన పరిసమాప్తి అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఉన్నాడని సాధన చేస్తే, దేవుడు లేడని తెలుసుకున్నాడని కాబోలు….. ఏమో చెప్పలేం! ఎవరి అనుభవం వారిది . ఈ అనుభవం కూడా వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు లేదా అనుభవం కావచ్చు . అది నిజమా… కాదా… అని ఎవరికి వారే వ్యక్తిగతంగా తెలుసుకుంటే అర్థం అవుతుంది. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది ,కొంతమందికి కొడితే అర్థం అవుతుంది, ఇంకొంతమందికి చూస్తే అర్థమవుతుంది ,కొంతమందికి తిడితే అర్థమవుతుంది, నాకైతే ప్రత్యక్షంగా చూస్తే గాని అర్థం కాదు. నాకు ధ్యాన అనుభవాలు కలిగినంత మాత్రాన, దైవదర్శనాలు పొందినంత మాత్రాన, దైవసాక్షాత్కారాలు కలిగినంత మాత్రాన, నాకు ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైంది. నా మనసు నమ్మదని నాకు అర్థమైంది . కాబట్టి మనసు నమ్మాలి అంటే ఏదైనా కూడా ప్రత్యక్ష అనుభవం పొందడం మంచిది. ఎక్కడో ఉన్న అమెరికా గురించి తెలుసుకోవడం కన్నా .. . అమెరికాకి వెళ్లి చూడడం ఎలా అయితే ఉంటుందో ,అదే విధంగా నాకు కూడా ధ్యాన అనుభవాలు పొందడం వల్ల జ్ఞాన స్పురణలు పొందడం వల్ల …..ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి, అది ఉందో లేదో నాకు వచ్చిన సాధనా సిద్ధులను ఉపయోగించుకొని….. నా సాధనా శక్తిని ఉపయోగించుకుని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే ఈ సాధన శక్తులను లేదా సాధన సిద్ధులను వ్యక్తిగతంగా ఉపయోగించుకోకుండా ……మనకి వచ్చిన అనుభవాలు నిజమా? కాదా? అని ప్రత్యక్ష దర్శనాలను పొందటానికి వాడితే వచ్చిన నష్టం ఏమీ లేదని ఈమె గ్రహించింది . కాకపోతే పరమహంస గారు ఎందుకు భయపడ్డారు…. ? ఎందుకు అనుమానపడ్డారు….? ఒకవేళ సిద్దులు ఉపయోగిస్తే ,సిద్దమాయలో పడిపోతే సాధన పరిసమాప్తి కాకుండా మధ్యలో ఆగిపోతుందని ,ఆయనకి అనుమాన భయం ఉండి ఉండవచ్చు. ఇక్కడ నాకైతే చావు భయం లేదు. ఎందుకంటే అన్ని తెగించిన వాడికి తెడ్డే గతి అంటారు కదా! ఇక్కడ సాధనలో ఏదో వస్తుంది …ఏదో పొందాలి అని అయితే నాకైతే లేదు. కానీ ప్రకృతి మాత్రం నేనేదో లోక కళ్యాణార్థం కార్యం చేయాలని చెప్పింది. నా వ్యక్తిగత మరణము….. నాకు భౌతిక మరణము విశ్వమోక్ష మరణము అవుతుంది అని చెప్తుంది . వ్యక్తిగత మోక్షము పొందుతానో …..విశ్వమోక్షం పొందుతానో లేదో కూడా నాకు తెలియదు. దానిమీద ఆశ లేదు, భయం లేదు ,సంకల్పం లేదు, స్పందన లేదు. కాకపోతే నేను చేసే సాధన అంతా కూడా మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతి భక్తీ విశ్వాసంతో శ్రద్ధ భక్తులతో ఖచ్చితంగా ఏమార్చకుండా, ఏమీ మార్చకుండా చేయాలి. యధావిధిగా అనుభవాలు పొందాలి . మాయలు దాటాలి .మర్మాలు తెలుసుకోవాలని అయితే నాకు అర్థమైంది. నిర్ణయం తీసుకున్నాను . నిశ్చయించుకున్నాను. కాకపోతే ఇది కోరికగా పెట్టుకోలేదు. మోక్షం పొందాలని ఆలోచన లేదు. కోరిక లేదు . ఏం జరుగుతుందో కాల నిర్ణయానికి వదిలేయడం మంచిది అని ……రేపు రుద్రస్వామి కనపడితే ఆయన దగ్గర మోక్ష సన్యాస దీక్ష తీసుకోవడం, అలాగే చక్రాల సాధన విధివిధానాలు ఏంటి అనేది? ముద్రల విధివిధానాలు ఏంటి అనేది తెలుసుకోవడం మంచిది అనుకుంటూ….. నిద్రలోకి జారుకుంది.
గాడ నిద్రలో ఉన్న శివ నందినికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది…. ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే సమయం మూడు గంటలు అవుతుంది. ఈ సమయంలో ఎందుకు మెలుకువ వచ్చిందా? అని ఆలోచిస్తూ కూర్చుంది. కానీ నిద్రలో ఆమెకి వీర్యస్ఖలనం జరిగిందని గ్రహించడానికి ఆమెకి అట్టే సమయం పట్టలేదు. ఇదేంటి మగవాళ్ళకి నిద్రలో వీర్యస్ఖలనం జరుగుతుందని విన్నాను. ఆడవాళ్ళకి కూడా జరుగుతుందా? చ …చ…ఇది ఇబ్బందికరంగా ఉంది. విడాకులు ఇచ్చి ఆరు నెలలు కాలేదు . ఇలాంటి తప్పుడు ఆలోచనలు రావడం ఏంటి…. తప్పుడు భావనలు రావటం ఏమిటి? కామ భావాలు రావడం ఏమిటి? తనకి ఈ 16 సంవత్సరాలలో ఎప్పుడు కూడా నిద్రలో ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అయింది…. ఆడవాళ్లకు కూడా ఇలా అవుతుందా? అది కూడా నిద్రలో అవుతుందా? ఆడవాళ్ళకి వీర్యస్ఖలనం కాకపోతే పిల్లలు ఎలా పుడతారు? కాకపోతే రతి సమయంలో ఎప్పుడో…. ఆరు నెలలకో సంవత్సరానికో వీర్యస్ఖలనం అవుతుంది అలాంటిది నిద్రలో వీర్యస్ఖలనం అవడం ఏమిటి? నాకు చెడు ఆలోచనలు కూడా రాలేదే …! భర్త మీద శృంగార భావాలు వచ్చినట్టుగా కూడా కలలో ఎక్కడా కూడా కనిపించలేదే ! తను కామకోరికల గురించి ఆలోచన చేసినట్టుగా అనిపించలేదు. మరి ఇది ఎందుకు ఇలా జరిగింది. చి…. చండాలంగా ఉంది . చిరాగ్గా ఉంది….. అని స్నానం చేసి వచ్చి మంచం మీద కూర్చుంది. తనకి ఈ విధంగా కలగడానికి కారణం ఏంటి….. అని తనకి మెలకువ రావడానికి కారణం ఏమిటి…… అని ఆలోచనలు చేస్తూ ఉండగా…… తనకి ఒక స్వప్నం వచ్చినట్టుగా అనిపించింది . ఎక్కడో? ఏదో ఒక కొండ…… నల్లగా ఉన్న కొండ కాస్త బంగారు కొండగా మారింది. ఆ బంగారపు కొండ నుంచి నీలం రంగు శివుడు త్రిశూలంతో జటాధారిగా బయటకు వస్తూ ఉండగా….. ఎవరో ఒక స్త్రీ మూర్తి నాకు తెలిసి అమ్మవారేమో.? ఆమె చీర ముద్దమందారం రంగులో ఉండి చేతిలో త్రిశూలం పట్టుకొని ఆయనని వెళ్ళనివ్వకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా….. ఆ కొండ నుంచి మరో కొండకి వెళ్తున్నట్టుగా స్వప్న దర్శనం వచ్చింది. ఆ స్వప్నంలో అమ్మవారు త్రిశూలం తో నా మీద దాడి చేస్తున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకి అలా వెళ్తున్న శివుడు కాస్త ఎక్కడో ఆగి….. తన వైపు చూసి ఉన్నట్టుండి ఒక యోగ సాధకుడిగా సన్యాస దీక్ష తీసుకుని ఉన్న ఒక వ్యక్తిగా రూపాంతరం చెందాడు . ఆ వ్యక్తి తనకేసి చూసి నవ్వుతూ….. ఓ శివ నందిని! నీకోసం ఎదురు చూస్తున్నాను . నువ్వు నా దగ్గరికి రావాలి. మనిద్దరం కలిసి సాధన పూర్తి చేసుకోవాలి. అప్పుడే నీకు మోక్షం వస్తుంది. నేను ఈ క్షేత్రానికి వచ్చి ఉన్నాను . నా సాధనా పరిసమాప్తి అవ్వటానికి నీ సాధన పరిసమాప్తి అవ్వటానికి మనం సాధన చేయాల్సి ఉంటుంది. రా…. నువ్వు నా గత జన్మ ధర్మపత్నివి. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి అదృశ్యం అయ్యాడు . ఆ గొంతు వినగానే చాలా బాగుంది. తన మనసులో ఏదో తెలియని ఆనందం, సంతోషం విరిసినట్టుగా కనిపించింది. ఇదేంటి! అని అనుకుంటూ ఉండగా….. అతని గొంతుకి, నాకు ఏదో జన్మాంతర అనుబంధం ఉన్నట్టు ఏదో భర్త భావం ,దేవుడు భావం, గురు భావం ఆయనతో నిండి ఉన్నట్టుగా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉండగా ఆయన సాంగత్యం లో శృంగారం తీర్చుకున్నట్టుగా…… భావన కలగడం తో తనకి మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి తనకి నిద్రలో వీర్యస్ఖలనం జరిగింది అని గ్రహించింది. అయినా ఈ గొంతు ఎవరిది? ఈ గొంతు మీద తనకి ఇలాంటి పాడు ఆలోచనలు రావటం ఏమిటి ? ఆ గొంతు ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు…. ఎక్కడ ఉంటాడో తెలియదు…. కాకపోతే నీలం శివుడి అంశ అని మాత్రం అర్థం అవుతుంది. ఇంతకీ ఈ నీలం శివుడు ఎవరు ? అమ్మవారు ఎందుకు ఆపుతుంది? అమ్మవారు ఎందుకు తనని త్రిశూలంతో పొడిచింది. ఇలా పిచ్చిపిచ్చి ఆలోచనలు ఆమెను వెంటాడినాయి. ఇలాగే వివిధ రకాల ఆలోచనలతో ఆమె సతమాతమవుతుంది . అమ్మవారు తనని పొడవడం ఏంటి? ఈయన ఎవరో వచ్చి ధర్మపత్ని అని చెప్పడం ఏమిటి? తను 16 సంవత్సరాల పాటు ఒకరికి భార్యగా ఉండి ….వివాహ వ్యవస్థలో గృహస్థాశ్రమం లో భార్యగా ఉండి వచ్చిన తనకి …ఈయన ధర్మపత్ని అంటున్నారు. అసలు ధర్మపత్నికి, భార్యకి ఏమైనా తేడా ఉంటుందా? అయినా విడాకులు తీసుకున్నాను . గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాస ఆశ్రమము లోకి అడుగుపెట్టి సన్యాస దీక్ష తీసుకుంటున్న నాతో ధర్మపత్ని అని చెప్పడం ఏమిటి? ఈయనకి నాకు ఏ విధమైన సంబంధం ఉంది.. కానీ నాకు ఈ గొంతు వింటుంటే, మనసులో ఏదో తెలియని ఆనందం ,ఉద్వేగం పొందడం, శరీరం పులకరించటం ,ఆత్మ తృప్తి కలగడం…. ఏదో తెలియని భావాలు ….ఏదో తెలియని సంతోషం…. ఎన్నో సంవత్సరాల నుంచి నా ఆత్మ ఎదురు చూస్తున్నట్టుగా భావాలు కలగటం…… ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే మనోభావాలు కలిగాయి. ఈయన ఎవరు? ఈయన ఎవరి కోసం ఉన్నారు? ఎలాంటివాడు? నిజంగానే నేను అతని ధర్మపత్ని నా? గత జన్మలో నేను ఆయనకి భార్యగా ఉన్నప్పుడు ….ఈ జన్మలో వేరే వారిని ఎందుకు పెళ్లి చేసుకోవడం… అతనితో విభేదాలు చెంది విడాకులు తీసుకోవడం ఎందుకు? ఇతని చేసుకోవచ్చుగా. ఇతనితోనే కాపురం చేసుకుని ఉండవచ్చుగా…మరి ప్రకృతి ఎందుకు చేయలేదు. అయినా స్వప్న దర్శనం ఇచ్చి ధర్మపత్ని అంటాడేంటి ఏకంగా.. ఎవరో , ఏంటో పరిచయం లేదు . నేనెవరో ఏంటో తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఏకంగా ధర్మపత్ని అంటాడేంటి? అది కూడా జన్మాంతరంలో ధర్మపత్ని అంటాడు . గృహస్థానంలో విడాకులు తీసుకున్న ఒక స్త్రీకి , ఒకరికి భార్యగా ఉన్న స్త్రీకి ….ఈయన ఎవరో వచ్చి ధర్మపత్ని అంటాడేంటి, ఏ మాటకామాట చెప్పాలి …..ఆ గొంతులో ఏదో తెలియని మత్తు ఉంది. ఆ స్వరంలో ఏదో తెలియని మోహమాయ ఉంది . ఏదో తెలియని సంతృప్తినిస్తుంది . గొంతుకే ఇంత శక్తి ఉంటే…. మనిషిని చూస్తే తను ఖచ్చితంగా తనలో కామవికరాలు కలిగిస్తాడు అనడంలో ఎలాంటి ధర్మసందేహాలు లేవు. కొంపతీసి ఈయన నాకు కామ మాయ అవుతాడా? పరమహంస గారు చెప్పారు కదా ……ఏదో చక్రంలో కామ మాయ వస్తుందని…. ఆ …..గుర్తుకొచ్చింది. మూలాధార చక్రంలో కామ మాయ మొదలవుతుందన్నారు కదా! ఇప్పుడు కొంపతీసి కామమాయ ఇతనితో మొదలవుతుందా? సాధన ఆరంభం లోనే విఘ్నం మొదలైందా? ఆటంకం మొదలైందా? అవాంతరం మొదలైందా ? మాయ మొదలైందా? ఏం జరుగుతుంది. ఏదో చద్దామని ప్రయత్నించినా చావనివ్వలేదు. యోగ పరంగా చావాలనుకుంటుంటే….. ఇక మాయలు మొదలుపెట్టాయిగా….. అమ్మవారు త్రిశూలంతో పొడవటం ఏమిటి ? అంటే ఏంటి…. ఈయన దగ్గరికి నేను వెళ్తున్నానా ? లేక ఆయన నా దగ్గరికి వస్తున్నాడా? లేదా నీలం శివుడు ఆ కొండ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడనా? నీలం శివుడు క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇతను కారణమా? అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది స్వప్నమా లేక నిజమా లేదా రాబోయే కాలంలో ఇది జరుగుతుందా? అయినా నేను శివుడి గురించి ఎప్పుడూ ఆలోచనలు చేయలేదే..! శివున్ని ఆరాధన చేశాను. వెండి శివలింగ ఆరాధన చేశాను. అంతే…..సమయానికి కోరికలు, సమస్యలు వస్తే ఆయనకి చెప్పుకునేదాన్ని. ఆయన కొన్ని తీర్చేవాడు. కొన్ని తీర్చేవాడు కాదు. తీర్చే వాటిని ప్రసాదంగా భావించుకునే దాన్ని. తీరని వాటిని జరిగేది జరగక మానదు అని వదిలేసేదాన్ని. దాని గురించి పట్టించుకునేదాన్ని కాదు. మరి ఈయన ఏంటి? అసలు ఈ నీలం శివుడు ఏంటి? ఏ క్షేత్రం నుంచి వస్తున్నాడు. .. ఏదో కొండ మాత్రం కనబడుతుంది. ఆ కొండ ఉన్నట్టుండి బంగారపు కొండగా ఎందుకు మారింది,...? ఆ బంగారపు కొండ నుండి నీలం రంగు శరీరంతో ఉన్న శివుడు ఎందుకు వచ్చాడు. అమ్మవారు ఎందుకు ఆపింది. ఏమీ అర్థం కావట్లేదు ఇది. ఈ విషయాలన్నీ తెలియాలంటే రుద్ర స్వామిని అడగాలి. ఆయన ఈ ఘాట్ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతాను. గుర్తుపెట్టుకోవాలి . ఈ స్వప్న దర్శనం గురించి ఏంటో ఆ గురుడెవరో….వాడెవడో స్వప్నంలో ప్రేమ ప్రతిపాదనలు పెట్టడం ఏమిటో? నేను వాడికి ధర్మపత్ని అనడం ఏమిటో? నాకు ఏమీ అర్థం కావట్లేదు చూద్దాం …..ఒకవేళ ఇది కామానికి సంబంధించిందేమో అడుగుదాం? మళ్ళీ రుద్ర స్వామి కి ఇలాంటి ధర్మ సందేహం గురించి చెప్తే…. నన్ను తప్పుగా ఆలోచిస్తారా? తప్పుగా భావన చేస్తారా? పోనీ మహాదేవిని అడుగుదాం..! ఆవిడ కూడా సాధాకురాలే కదా ! అఘోరంలో సిద్ధిపొందింది కదా! ఆవిడ కూడా చెప్తుందేమో అడుగుదాం! అయినా అన్ని వదిలేసిన వాడు… దేని గురించి పట్టించుకోని వాడు …..దేని గురించి ఆలోచించని రుద్రస్వామి నా గురించి చెడుగా ఆలోచిస్తాడు అని నేను అనుకోను. చెడులో కూడా మంచిని చూసే రకం ఆయన. మరి ఆయన చెడుగా ఆలోచిస్తాడని…. చెడుగా అనుకుంటాడని ఎందుకు అనుకోవాలి. ఆయన ఈరోజు నుంచి మనకి గురువు గారు. తండ్రితో సమానం. తండ్రికి అని చెప్పుకోవచ్చు కదా! తల్లికి అన్నీ చెప్పుకోవచ్చు కదా! ఇంకా ఏదైనా నెలసరి సమస్యలు, స్త్రీకి సంబంధించిన రోగాలు, అనారోగ్య సమస్యలు, సాధన సందేహాలు, మహాదేవిని అడుగుదాం! ఇలాంటి స్వప్నాల గురించి…. ఇలాంటి మాయల గురించి ఎవరు చెప్తారు? గురువుగారు అయితే అన్ని తీరుస్తారు కదా! గురువు గారి దగ్గర మోహమాట పడితే ఎలాగా ? మోహమాటానికి పోతే కడుపు వచ్చినట్టు…. ఎందుకు మన సమస్యలు పెంచుకోవడం . మొదట్లోనే సమస్యలు తెచ్చుకోవడం. అసలు ఈ స్వప్న దర్శనం ఇచ్చిన గురుడి గురించి ఆలోచించాలి… ఏమో కానీ అతని గొంతు వింటుంటే మాత్రం ఎక్కడో విన్నట్టుగా….ఆ గొంతు కోసం ఎన్నో సంవత్సరాలుగా పరితపిస్తున్నట్లుగా…. ఆత్మఘోష అయితే ఉంది. యే మాటకామాట చెప్పుకోవాలి….. ఆ గొంతులో ఏదో మత్తుంది….ఆయన ఎవరో ఆయన సంగతి ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ….. ఇలా కాదనుకొని ఆలోచన తగ్గించుకోవడం కోసం ఓం శివోహం మంత్రమును చేస్తూ ధ్యాననిష్టలో ఉండిపోయింది.
ఆ తర్వాత ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, ఘాట్ వద్ద స్నానం చేయాలని ఒక జత బట్టలు పెట్టుకొని…. ఫోను ని గదిలో పడేసి డబ్బులున్న పర్సుని చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక బాలుడు ఎలకలకి ఆహారం పెడుతూ దర్శనం ఇచ్చాడు . ఈ బాలుడు చూడడానికి బొద్దుగా…. లావుగా బాల గణపతి లాగా అనిపించాడు. అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకుంటుంటే…. వీడేంటి విచిత్రంగా ఎలకలని పెంచుతున్నాడు. పైగా తను తింటున్న పళ్లెంలోనే ఉండ్రాళ్ళు తింటుంటే ఏమీ అనకుండా కనపడుతున్నాడు ఏమిటి? అని చూస్తే ఆ పక్కనే గణపతి ఆలయం ఉందని తెలిసింది. ఎవరో గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు పెట్టి ఉండాలి. ఆ గుళ్లో పూజారి పిల్లాడికి ప్రసాదంగా ఇచ్చినట్టున్నాడు. ఈ ప్రసాదాన్ని వాడు తింటూ ఎలకలను కూడా పెడుతున్నట్టు ఉన్నాడు…. అయినా ఎలకలకు పెట్టడం ఏంటి? కుక్కలకి పెట్టొచ్చు….. ఆవులకి పెట్టొచ్చు….. పిల్లులకు పెట్టచ్చు……అయినా ఈ పిల్లోడు ఏంటి విచిత్రంగా ఎలకలకి పెడుతున్నాడు .. మతి భ్రమించిందా అంటే బానే ఉన్నాడు . మానసికంగా ….శారీరకంగా! అయినా ఈ పిల్లోడ్ని ఎక్కడో చూశాను అనుకుంటూ ఉండగా….. కాశీ విశ్వనాధుని దర్శనానికి వెళ్తున్నప్పుడు డూండీ గణపతి దగ్గర అక్కడ కూడా ఉండ్రాళ్ళు తింటూ ఎలకలికి పెడుతున్న విషయం గుర్తుకు వచ్చింది . అవును కదా! అక్కడ చూశాను కదా ! అయినా అసలు వీడు ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘాట్ లో తారస పడుతూనే ఉన్నాడు ఉండ్రాళ్ళు తప్ప ఏమీ తినే వాడు కాదు…. వేరే ఏదైనా తింటున్నట్టు కనిపించలేదు. పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి కానీ ఏది తినట్టుగా కనిపించలేదు . ఉండ్రాళ్ళు మాత్రమే తింటున్నట్టు కనిపించేవాడు . అప్పుడప్పుడు ఎలకలకి మాత్రం ఉండ్రాళ్ళు పెడుతూ కనిపించేవాడు. నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. మనకెందుకు….. ఎవరో? ఏంటో? తెలియనప్పుడు. అయినా అసలే ఈ కాశి క్షేత్రం తనకి కొత్త ….ఎవరు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో తెలియదు. ఆ పిల్లాడి వెనకాల ఎవరున్నారో తెలియదు. కానీ ఆ పిల్లోడు చూడడానికి బొద్దుగా, ముద్దుగా ఉన్నాడు. తను నవ్వుతుంటే పదేపదే చూడాలనిపించేది . ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఆ పిల్లాడిలో దైవ శక్తి ఉంది . ఆకర్షణ శక్తి ఉంది . మోహన శక్తి ఉంది. ఈ పిల్లాడి నుంచి చూపు తిప్పుకోలేము. ఏదో తెలియని కొడుకు భావన ….. ఈ పిల్లోడు మీద పుత్ర వ్యామోహం కలుగుతుంది. అని అర్థమైంది . కానీ మనసుని అదుపు చేసుకుంది . ఈ పిల్లాడ్ని చూసినప్పుడు, తనకి పుట్టిన పిల్లాడు గుర్తుకు వచ్చేవాడు. ఏం చేస్తున్నాడో…? ఎలా ఉన్నాడో అనుకునేది. ఈ పిల్లాడి వల్ల మర్చిపోయిన జ్ఞాపకమైన తన పిల్లవాడి గురించి జ్ఞాపకాలు వస్తున్నాయని….. పిల్లవాడి గురించి పట్టించుకోలేదు. కానీ ఈ పిల్లవాడు మాత్రం తనని గమనిస్తున్నాడని…, ఓరచూపుతో తెలుసుకునేది. మాటల్లేవు…. చూపులు కలిసేవి. కానీ ఎల్లప్పుడూ పలకరించాలని ఆలోచన లేదు. సరే …వీడి సంగతేంటో తెలుసుకుందాం….. అని , ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళింది.
శివనందిని:- నాయనా! నీ పేరేంటి ….
బాలుడు:- అమ్మా! నాకంటూ పేరు ఏమి లేదు… నా ఆకారాన్ని బట్టి నేను తినే ఉండ్రాళ్ళను బట్టి అందరూ బాల గణపతి అని పిలుస్తూ ఉంటారు . నా పేరు నిజానికి గణపతి శాస్త్రి అని కొందరు అంటూ ఉంటారు. గణపతి శర్మ అని పిలుస్తారు. గణపతి ముని అని పిలుస్తారు. యేవో రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరెలా పిలిస్తే, అలా పలుకుతాను . నాకంటూ పేరు లేదు. ఊరు లేదు. తల్లిదండ్రులు లేరు…..
శివ నందిని :- అదేంటి! మీ నాన్న , మీ అమ్మ లేరా ?
బాల గణపతి :- ఉన్నారు…. కాశీ విశ్వనాథుడు నా తండ్రి , కాశీ విశాలాక్షి నా తల్లి.
శివ నందిని :- వాళ్ళు దేవుళ్ళు కదా !
బాల గణపతి:- మీకు దేవుళ్ళేమో ..! నాకు తల్లిదండ్రులు. ఏం చేయను… భౌతిక తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు .నన్ను ఎందుకు కన్నారు… ఎందుకు వదిలిపెట్టేసారో కూడా తెలియదు. ఏదో ఇక్కడ ఈ ఘాట్లో నేను కనిపించాను అంట… అదే రుద్రస్వామి అని ఒకాయన ఉంటాడు కదా ! అఘోరుడు …… ఆయనకి నేను కనిపించినంట….ఆయన నన్ను పెంచాడంట ….మహాదేవి అని ఒక ఆవిడ ఉంది కదా! అఘోరిని ఆవిడ డబ్బా పాలు పట్టి పెంచిందంట, ఏదో నా ఆకలి బాధ తట్టుకోలేక ……ఆవిడ పెట్టే తిండి సరిపోక ……. ఇట్టా గుళ్ళలోనూ ఘాట్ ల దగ్గర ఆహారం పెడితే తింటూ ఉంటాను.
శివ నందిని:- అదేంటి మహాదేవి, అఘోర స్వామి రుద్ర స్వామి కూడా తెలుసా?
బాలగణపతి:- వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరమ్మా! వాళ్ళకి అందరూ తెలిసిన వాళ్ళే…. రుద్రస్వామి నాకు అయ్యా…. మహాదేవి నాకు అమ్మ….. కానీ వాళ్ళకి నేను పుట్టలేదు. వాళ్ళు నన్ను కనలేదు. కాకపోతే పెంచిన వాళ్ళు అనుకోవచ్చు….. వాళ్ళిద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటారు…. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గా లేరు. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు …..వర్షాలు వచ్చి పడుకునే తావు లేనప్పుడు…… రుద్రస్వామి ఉండే గుహ కి వెళ్లి పడుకుంటాను. మహాదేవి అమ్మతో ఉండ్రాళ్ళు చేయించుకొని తింటాను . ఒక రకంగా వాళ్ళు నాకు భౌతిక తల్లిదండ్రులు అనుకో! అయినా…, నువ్వు ఎవరు? నువ్వు నా గురించి ఎందుకు అడుగుతున్నావ్?
శివనందిని:- ఆ….. అంటే నేను ఇక్కడికి సాధన చేసుకోవడానికి వచ్చాను.
బాలగణపతి:- సాధన చేసుకోవడానికి వచ్చావా? చచ్చిపోవడానికి కదా వచ్చింది….. చచ్చిపోవాలని మూడు సార్లు ప్రయత్నించావుగా! చావలేకపోయావుగా….. ఎవరికి చెప్తావు? నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని…. నాకు అన్నీ తెలుసు. నాకు అన్ని అర్థమవుతాయి. నిజం చెప్తావా! అబద్ధం చెప్తావా! అని మాత్రం చూస్తా. నువ్వు నా దగ్గరే నిజం చెప్పలేనప్పుడు ఎలా మరి….! అది తప్పు కదా అమ్మ,... తల్లి బిడ్డకు అబద్దం చెప్పకూడదు కదా!
శివనందిని:- అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు కదా! నీకెందుకులే చెప్పటం అని….
బాలగణపతి:- నేనెవరో నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు….. కానీ నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదా ! అబద్ధం ఎందుకు చెప్పడం ….
శివనందిని:- నేను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చా అంటే నువ్వు అర్థం చేసుకుంటావా ?
బాలగణపతి:- అసలు కాశీ వచ్చే వాళ్లంతా కూడా చచ్చేవాళ్ళు…. చచ్చిన వాళ్లే కదా !
శివనందిని:- అర్థం కాలేదు నాకు.
బాలగణపతి:- చచ్చిన వాళ్ళు అస్తికల రూపంలో కుండల్లో వస్తారు. ఆ అస్తికలు గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే ఏంటి వాళ్ళు చచ్చిన వాళ్లే కదా! చచ్చేవాళ్ళు అంటే వృద్ధులు . మరణం కోసం ఈ క్షేత్రానికి చేరుకుంటారు . అంటే ఈ క్షేత్రానికి చచ్చేవాళ్ళు….. చచ్చిన వాళ్ళు వస్తున్నట్టే కదా!
శివనందిని:- నీకు అంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా?
బాలగణపతి:- ఆ ….జ్ఞానం పక్కన పెట్టులే నాకేదో తెలిసిన విషయం నీకు చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా! చూస్తున్నాను కదా! అది …..
శివనందిని:- అవునా.! రుద్ర స్వామికి ఎక్కడ కనపడ్డావు ?
బాలగణపతి:- డూండీ గణపతి దగ్గర చిన్న పిల్లాడి లాగా కనిపించానని అంటారు. కొంతమందేమో రాత్రికి రాత్రి డూండీ గణపతి లో నుంచి బయటికి వచ్చాను. రుద్ర స్వామి నన్ను పెంచుకోవడానికి తీసుకువెళ్లాడని అంటారు ఎవరికి తెలుసు…. నేను విగ్రహం నుంచి వచ్చానో ….నిగ్రహం కోల్పోయిన దంపతులకు వచ్చానో….నాకు తెలియదు. కాలమే చెప్పాలి. అయినా …నేను దాని గురించి పెద్దగా ఆలోచించను…
శివనందిని:- మరి తల్లిదండ్రులు లేరని బాధ, భయం నీకు లేదా?
బాలగణపతి:- ఎవరికి ఎవరు తల్లిదండ్రులు.. ఈ జన్మలో తల్లిదండ్రులు. గత జన్మలో ఎవరో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ జన్మ తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు. ఎవరు ఎంత కాలం ఉంటారో తెలియదు. రుణానుబంధ రూపేనా పసుపక్ష్యాద్ సుతాలయ అని… ఆ ఋణం ఉంటే తల్లిదండ్రులు, అక్క, అన్నా ,చెల్లెలు, బంధాలు బంధుమిత్రులు అంటూ చాలామంది కలుగుతారు. కలుస్తారు. అదంతా భోగ ప్రపంచం. అదే యోగ ప్రపంచం లోకి వచ్చేసరికి సాధన గురువులు, ఇతర సాధకులు, మన సాధనా అనుభవాలు, దీక్షాపరులు వస్తూ ఉంటారు.
శివనందిని:- మరి నీవు యోగ సాధన చేసావా?
బాలగణపతి:- అసలు యోగ సాధన అంటే ఏమిటి? సన్యాసం తీసుకుంటేనో ….అన్ని వదిలిపెట్టి వస్తేనో….చెట్టు కింద కూర్చుంటేనో …..సాధన కాదు. మనం చేసే ప్రతి పని కూడా సాధనే . ప్రతి పని కూడా దైవారాధన యే. చెట్టు కింద కూర్చొని గదిలో ఒక మూల కూర్చుని చేస్తే అది ధ్యానం కాదు . మనం చేసే ప్రతి పని కూడా ధ్యానమే. ఎందుకంటే ప్రాణాయామం ప్రకారం ఉచ్ఛ్వాస నిచ్వాస లను అదుపులో ఉంచితే అది ప్రాణాయామ సిద్ధి కలుగుతుంది అంటారు కదా! మరి ఆ ఉచ్ఛ్వాస నిచ్వాసలను మనం నిత్యం చేస్తూనే ఉంటాం కదా! రోజుకి 21 వేల సార్లు అంటే మన మనం ప్రతిరోజు చేస్తున్నట్టే కదా ! ఉచ్ఛ్వాసలో శబ్దం నిచ్చ్వాస శబ్దం రెండింటిని కలిపి శివోహం అంటారు కదా ! ఓం శివోహం మంత్రం నువ్వు చేస్తున్నావు. నేను శ్వాసతో చేస్తున్నాను. నువ్వు నోటితో చేస్తున్నావు.
శివనందిని:- వామ్మో! వీడు పెద్ద గడుగ్గాయ్ లా ఉన్నాడే….. నేను చేసే మంత్రం కూడా తెలుసా ! అంటే తన జీవిత చరిత్ర కూడా తెలుసా!
బాలగణపతి:- ఇక్కడ తెలియనిది అంటూ తెలియనివి అంటూ, తెలియనివాడు అంటూ ఏమీ ఉండదు. కాకపోతే అపస్మారక స్థితి వలన తెలుసుకున్న జ్ఞానమును మరిచిపోయి జీవమాయలో పడతారు. శివుడు కాస్త జీవ శివుడిగా మారతాడు . ఆ జీవ శివుడు కాస్త దైవ శివుడని జ్ఞానం పొందితే…. అదే సాధన. ఇప్పుడు నాకేమీ మాయలు లేవు …నాకేమీ మర్మాలు లేవు…. ఏ కోరికలు లేవు …ఏ అవసరాలు లేవు…. దేనికి పుట్టానో …. తెలియదు. దేనికి చస్తానో తెలియదు. ఉన్నంతకాలం నాకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నాను… నాకు నచ్చిన ఆహారం తింటాను. నాకు నచ్చినట్లుగా పడుకుంటాను… నాకు ప్రపంచంతో ఏ సంబంధం ఉంది చెప్పు.
అయినా నాకు ప్రపంచంతో సంబంధం ఏమిటి? అవసరాలు ఉన్నవాడికి ,కోరికలు ఉన్నవాడికి…. దేవుడితో అవసరం ఉంటుంది. మనదంతా అవసర భక్తి లేదా ఆర్థిక భక్తి కదా! ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావంటే ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక తీర్చమని కోరుకుంటావు. అడుక్కుంటావు. బిచ్చం ఎత్తుకుంటావు. ఆ కోరిక తీర్చినందుకు మొక్కుబడిగా ధనం ఇస్తావు . అంటే అవసర భక్తి, ఆర్థిక భక్తి ఉన్నది. అలాగే భోగంలో ఉండే సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే,.... అవసర సంబంధాలే. యోగంలో కూడా అంతే. నువ్వు గుడిలోకి వెళ్లి దేవుడ్ని అడుగుతావు… ఈ కోరిక తీర్చు…. ఈ మోక్షం ఇవ్వు అని అడుక్కుంటావు. మేము గుడి బయట నుండి మిమ్మల్ని అడుక్కుంటాము. నాకు బిక్ష ఇవ్వమనో , తినడానికి ఇవ్వమనో అడుక్కుంటాం. అందరం కూడా ఒక రకంగా బిచ్చగాళ్ళమే. నువ్వు దేవుడిని అడుక్కుంటూ ఉంటే, నేను నిన్ను అడుక్కుంటాను.. అంటే అడుక్కునే వాళ్ళ దగ్గర గీరుకోవడం. అన్నమాట! అని తెలుసుకుంటున్నాం.
శివనందిని:- అబ్బా! ఇంత చిన్న వయసులోనే నీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?
బాలగణపతి:- జ్ఞానం అనేది అనుభవాలను బట్టి, ప్రకృతి అవసరాలను బట్టి అన్ని నేర్పిస్తుంది. మన అవసరమే మనకి అన్ని నేర్పిస్తుంది . ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది …..ఏం చేయాలి? మహాదేవి దగ్గరికి వెళ్లాననుకో ఎప్పుడు చూసినా ఆ కపాలాలో , పుర్రెలో వేసుకుని తిరుగుతుంది. ఆమెకి రుచి , తిండి, తిప్పలు గురించి ఆలోచించదు. ఏదైనా అడిగానే అనుకో….. మండుతున్న కట్టె ముక్క తెచ్చి ఇదిగో నీకు కావాల్సిన ఆహారం అని ఉండ్రాళ్ళు చేసి ఇచ్చేస్తుంది. పదార్థాన్ని మార్చి ఇచ్చినప్పుడు కట్టెను తింటున్నానో తెలియదు….. ఉండ్రాళ్ళు తింటున్నానో అర్థమై చావదు. ఏం చేయమంటావు…. నాకేమో ఒక్కొక్కసారి కట్టెను ఉండ్రాళ్ళుగా చేసి తింటున్నానేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పుర్రెలు చూపించి ఒక పెద్ద ఉండ్రాయిగా మార్చి ఇస్తుంది. నేను పుర్రెను తింటున్నానో తెలియదు. ఉండ్రాళ్ళు తింటున్నానో తెలియదు. నాకు అర్థం అవ్వదు. సరే అని రుద్ర స్వామి దగ్గరికి వెళ్లి ఉండ్రాళ్ళు పెట్టు ఆహారంగా అన్నానే అనుకో….. “ నాకే దిక్కులేదు…. నాకు వండి పెట్టే వాళ్లే లేరు…. నా దగ్గరికి వచ్చి ఉండ్రాళ్ళు కావాలి. పాయసం కావాలి… దద్దోజనం కావాలి….. అవి కావాలి ….ఇవి కావాలి అని అడుగుతావేంట్రా? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు లేదని ఒకడు ఏడ్చినట్టు ఇక్కడ నాకే వండి పెట్టే వాళ్ళు లేరు అంటే….. నాకు ఈ వంటకాలు కావాలి, ఆ వంటకాలు కావాలి…. అని అడిగి చస్తావెందుకు? ఆ అడుక్కునేదేదో రోడ్డు మీదకెళ్ళి అడుక్కో…. గుళ్ళ దగ్గర అడుక్కో.. వాళ్లే నీకు చేసి పెడతారు. విగ్రహాలకు ఎలాగూ నైవేద్యాలు చేసి పెడతారు కదా! గుడిలో పూజారిని మంచి చేసుకొని ఆ నైవేద్యం నువ్వే తిను. వాళ్ళు చేసి పెడతారు అంటాడు. నాకు అన్ని ఆహార పదార్థాలు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు…. గారెలు పెడతారు, దద్దోజనం పెడతారు, చక్ర పొంగలి పెడతారు, పులిహార చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఉండ్రాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వినాయక చవితి రోజు మాత్రమే పెడతారు. అదే నాకు నచ్చట్లేదు. నాకేమో చెరుకు గెడలు, ఉండ్రాళ్ళు తినాలని ఉంటుంది. నాకేమో ఉండ్రాళ్లు అంటే పిచ్చి. గరిక మీద పడుకోవాలి అనిపిస్తుంది. గరిక ఎక్కడ దొరికితే అక్కడ పడుకోవాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటావు?
శివనందిని:- ఆ గణపతి నుంచే పుట్టావు కదా! ఆ గణపతి లక్షణాలు నీకు వచ్చి ఉంటాయిలే…. దాని గురించి ఎందుకు ఆలోచించడం… నీకు కావాల్సింది ఉండ్రాళ్ళ ముచ్చటే కదా! ఈ క్షేత్రంలో 56 గణపతి ఆలయాలు ఉన్నాయి కదా…! ఎక్కడో ఒకచోట ఏదో ఒక రోజు ఉండ్రాళ్ళు చేసి పెడతారు కదా! ఆ ఉండ్రాళ్ళు చేసి పెట్టే దగ్గరికి వెళ్ళు. ప్రతిరోజు ఏ గుడిలో ఏమేం పెడుతున్నారో ఆ గుడిలో అడిగి తెలుసుకో! ఎక్కడ ఫలానా రోజు ఉండ్రాళ్ళు పెడుతున్నారో తెలుసుకొని, ఆ ముచ్చట తీర్చుకో! అయినా ప్రతి రోజు ఒకటే ఆహారం తీసుకుంటే నీకు విసుగు అనిపించట్లేదా?
బాల గణపతి :- ఆ ….ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు… ఆయన లడ్డు కోసమే భూమి మీద ఉండిపోయాడు. అయినా ఈ లోకంలో ప్రతి వాడికి ఏదో ఒక ఇష్ట పదార్థం ఉంటుంది. కొంతమందికి మిరపకాయ బజ్జి అంటే ఇష్టం. కొంతమందికి జిలేబి అంటే ఇష్టం. కొంతమందికి పులిహోర అంటే ఇష్టం. కొంతమందికి చక్కెర పొంగలి అంటే ఇష్టం. ఇంకొంతమందికి వాళ్ళ ఇష్టపదార్థాలు ఉంటాయి. ఇష్టపదార్థాల మాయలో పడి ఆగిపోయిన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారన్న విషయం, మీకు తెలియంది కాదు! అది లోక విధితమే కదా… నేను ఉండ్రాళ్ళ కోరికలో పడిపోయాను. ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ భూమి మీద జన్మించి ఉండవచ్చు కదా! ఆ కోరిక తీరుతుందేమో చూడొచ్చు కదా…. కోరిక తీర్చుకుంటే నాకు మోక్షం వస్తుందేమో! నేను చచ్చిపోతానేమో! ఎవరికి తెలుసు. కాకపోతే మహాదేవి అమ్మ దగ్గరికి వెళ్తేనేమో చెక్క ముక్కలు, రాయి ముక్కలు, కపాలాలు వీటన్నింటినీ మార్చి నాకు కావలసిన ఉండ్రాళ్లుగా మార్చి ఇస్తుంది . నేను వేటిని తింటున్నానో ….నాకు అర్థమై చావదు. పోనీ రుద్రయ్య దగ్గరికి వచ్చి అడిగితే నాకు చేసి పెట్టే వాళ్లే లేరు …. ఇల్లాలే లేదు…. నీకు ఎక్కడ చేసి పెట్టను అని అంటాడు. అంటే అడుక్కోమని ఈ విధంగా చెప్తాడు. నాకు అడుక్కోవడం పెద్ద సమస్య కాదు. అన్ని తెగించిన వాడికి తెడ్డే గతి అన్నట్టు….. బిక్షాటన చేత బతకాలని రాసిపెట్టి ఉంటే, అలాగే బతుకుతాను. ఆకలి తీరుతుంది. కాకపోతే నాకు కావాల్సిన ఉండ్రాలు దొరుకుతాయా లేదా అని అనుమానం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న గణపతుల్లో 56 గణపతులకి ఏదో ఒక గణపతికి పెడతారు కదా! ఆ గణపతి దగ్గరకి వెళ్లి నాకు కావలసిన ఉండ్రాళ్ళ ఆకలి తీర్చుకుంటాను. సరేలే నువ్వు చెప్పినట్టే చేస్తాలే! ఇలానే నేను కూడా ఉండ్రాళ్ళు ఉన్నచోటికి వెళ్లి తింటూ అప్పుడప్పుడు ఇదిగో, నీకు ఇలా కనపడుతున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన రెండు రోజుల నుంచి నువ్వు నాకు ఫలానా ఘాట్ లో కనపడ్డావ్…. ఆ తర్వాత ఇంకో ఘాట్ లో కనపడ్డావ్ ….ఆ తర్వాత ఇంకొక ఘాట్ లో కనపడ్డావ్……నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను ఓరకంట చూసి గమనించి పట్టనట్టుగా వెళ్ళిపోయావు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకు ఉండ్రాళ్ళు చేసిపెట్టే అమ్మలాగా కనబడుతున్నావ్! నాకు ప్రతిరోజూ ఉండ్రాళ్ళు వండి పెడతావా! అయినా నీకు ఎవరు తోడు లేరు కదా! ఏకాంతంగా ,ఒంటరిగా ఉంటున్నావు కదా! నన్ను నీకు దత్త పుత్రుడిగా భావించుకోవచ్చు కదా! నీ కొడుకు గణపతిగా చూసుకోవచ్చు కదా! ఏమంటావు ? నన్ను రమ్మంటావా.? నీతో ఉండమంటావా?
అనగానే……మొదటి పరిచయంలోనే ఇంత చనువుగా మాట్లాడతాడని శివ నందిని ఊహించలేదు. కానీ చూడటానికి వీడు అమాయకుడిలా ఉన్నా కూడా జ్ఞానిలా ఉన్నాడు. పొట్టోడు గట్టోడే అన్నట్టు అనిపిస్తున్నాడు. నిజమే కదా! తను కూడా చెప్పింది…. తనకి తోడుగా ఉంటాడు. వీడు తన పక్కన ఉంటే తన పిల్లాడు తన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది… అనుకొని “ శుభ్రంగా చేసి పెడతాను…. ఉండ్రాళ్ళే కదా! వినాయక చవితినాడు చేసే ఉండ్రాళ్ళు ప్రతిరోజు నీకు చేసి పెడతాను. నాకు నువ్వు బాల గణపతి లాగా కనబడుతున్నావు. తప్పకుండా ఉండ్రాళ్ళు చేసి పెడతాను. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నా దగ్గర ఉంటానంటే …..కాకపోతే నా దగ్గర నువ్వు ఉన్నప్పుడు, ఇంకెవరి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేయకూడదు. ఇలా ఘాట్ ల దగ్గర, గుళ్ళ దగ్గర బిక్షాటన చేయకూడదు.
బాల గణపతి :- నాకు కావాల్సిన ఉండ్రాళ్ళు…. మనస్ఫూర్తిగా, ఆప్యాయంగా, ప్రేమగా 21 ఉండ్రాళ్ళు చేసి పెడితే చాలు. ఆ 21 ఉండ్రాళ్ళ తోనే నాకు కడుపు నిండిపోతుంది. కాకపోతే ఏదో కోరికలతో, అవసర భక్తితోనో ఇలా చేయడం వలన ఎన్ని తిన్నా నాకు సరిపోదు. నువ్వు ప్రేమగా నాకు తల్లిలాగా చేసి పెడతాను అంటే…. నాకేం అభ్యంతరం లేదు. 21 ఉండ్రాళ్ళు అంటే నీకేం పెద్ద సమస్య కాదు. నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు కదా! నా వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఉండవు కదా! నీకు నేను తోడుగా ఉంటాను . నీకు కాపలాగా ఉంటాను. నీకేమైనా సమస్యలు వచ్చాయి అంటే పరిష్కారాలు చూపిస్తాను. నాకున్న తెలివితేటలతో …..
అని అంటూ ఉండేసరికి…. శివనందినికి ఒక అనుమానం వచ్చింది. తనని ఇంట్లో ఉంచుకోవడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థిక సమస్యలు లేవు. ఆహారంగా రోజుకి 21 ఉండ్రాళ్ళు అంటున్నాడు. కాకపోతే వీడి మాటలకి వీడి చేష్టలకి, తను వాడి పుత్ర వ్యామోహం లో పడిపోయి, సాధనలో ఆగి పోతుందేమో అని అనుమానం మొదలైంది. ఇందాక స్వప్నంలో వాడెవడో వచ్చి, ధర్మపత్ని అని చెప్పి…. కామ మాయని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు కనిపించి బాలగణపతి అని పుత్ర వ్యామోహం లో పడేస్తారా? అవసరమా మనకి ఇవన్నీ ….వాడి మానాన వాడు ఉంటాడు. స్వేచ్ఛగా ఉంటాడు. వాడు పుట్టకముందే వాడు ఎలా ఉండాలి…. ఎలా చావాలి… ఏ చెట్టుతో దహనం అవ్వాలి అని విధాత రాసే ఉంటాడు కదా! ఎందుకు మనం అతని బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత కాస్త బంధం అయిపోతే, తన సాధన ఆగిపోతే….. ఏదో లోక కళ్యాణార్థం అని తన మరణమే విశ్వ మరణం అని యోగ సాధన చేసుకోమని, చక్రాలు శుద్ధి చేసుకోమని దేహాలన్నీ దహనం చేసుకోమని ,తన మరణమే విశ్వ మోక్ష మరణం అని గురువులు స్వయంగా చెబుతూ ఉంటే……తను కావాలని లేనిపోని వాటికి స్పందించి, బాధ్యతలు తీసుకొని వాటిని బంధాలుగా మారుస్తున్నానేమో అని అనుకుంది . ఈ పిల్లవాడితో మనకెందుకులే …..ఈ పిల్లవాడు బంధం అయితే మళ్లీ కష్టం . ఎందుకంటే అమ్మవారు పుత్రమోహ మాయా దాటలేదని…. భర్త మోహమాయ దాటలేదని అప్పటికే కపాల మోక్షం పుస్తకంలో పరమహంసగారు చెప్పకనే చెప్పారు కదా! ఇప్పుడు కూడా ఆ స్వప్నంలో కనబడిన వాడిని కామమాయగాను, ఈ పిల్లవాడిని పుత్ర వ్యామోహం లోను పడే ప్రమాదం ఉందేమో…! ఇవి కూడా యోగ పరీక్షలేమో! ఎందుకు స్పందించడం….. స్పందించాల్సిన అవసరం ఏముంది! వాడు ఎలా బతకాలో అలా స్వేచ్ఛగా బతుకుతాడు. నా దగ్గర ఉన్నంత మాత్రాన చక్కగా బతుకుతాడు….. ఆరోగ్యంగా ఉంటాడు….. అనుకోకూడదు. మన స్వార్థం కోసం చూసుకుంటే, అది మాయగా మారితే, మన సాధనకి అడ్డం వస్తుంది. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టు అవుతుంది . ఒక పక్క సహజ మరణం రావట్లేదు. ఒక పక్క మోక్షం మరణం పొందటానికి నాకు నేనే బంధనాలు ఏర్పాటు చేసుకుంటున్నానేమో అనిపించింది. వెంటనే ….
శివ నందిని:- వద్దులే బాబు! నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఏ క్షేత్రంలో ఉంటానో తెలియదు. ఏ ప్రాంతంలో ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లు ఇక్కడ ఉంటాను. వెళ్లిపోవాలనిపిస్తే వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు నా వెంట రాలేవు కదా! పుట్టుక ఇక్కడే ఉంది కాబట్టి….. చావు కూడా ఇక్కడే ఉండాలి . కాశీలో మరణం అతి శ్రేయస్కరమైన మరణం అని, మోక్షం ఇస్తుందని అంటారు కదా! ఎందుకు నా వలన నీకు మోక్షం మరణం కాకుండా పోవడం…. ఏం అక్కర్లేదు! నువ్వు నాకు బాధ్యత అనుకుంటే బంధనంగా మారావనుకో….. నువ్వు ఆగిపోతావు, నేను ఆగిపోతాను . మాయలో పడతాము. ఇది అవసరమా,? ఆలోచించు . వద్దులే….. నువ్వు స్వేచ్ఛగా నీకు కావాల్సినట్టుగా బతుకు. నీకు కావలసిన విధంగా తిను. ఎందుకు ఒకళ్ళ అధీనంలోకి వెళ్లి వాళ్లకి తగ్గట్టుగా ప్రవర్తించడం …ఇంట్లో కుక్కని కట్టేసి పెంచడం వల్ల ఉపయోగం లేదు కదా! ఆ కుక్కని స్వేచ్ఛగా వదిలేస్తే మంచిది కదా! తనకు తగినట్టుగా ఉంటుంది…..
బాలగణపతి:- అమ్మ! ఆశపెట్టి వదిలేయడం మంచిది కాదు.. నా బాధ్యత బంధనంగా మారుతుందేమో….. పుత్ర వ్యామోహం మాయగా మారుతుందేమో అని భయం కదా! నాకు ఎంతో కొంత జ్ఞానం తెలుసు. నేను నీకు ఎలాంటి వ్యామోహాలు, బంధనాలు, మాయలు కలిగించను. నా ఇష్ట కోరికగా రోజుకి 21 ఉండ్రాళ్ళు చేసి పెడితే చాలు. నేను నీకు కుక్కలాగా కాపలా కాస్తాను . కుక్కలాగా బాధ్యతగా ఉంటాను. కాకపోతే నాకు కావలసినప్పుడు కావలసినట్టుగా ఉంటాను. వెళ్ళిపోతాను…ఎక్కడికి వెళ్లాను…. ఏం చేశాను అనేది నువ్వు నన్ను అడగవద్దు… చేయవద్దు…. నాకు ఎవరి దగ్గరికి వెళ్లాలి అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళతాను. కాకపోతే నీతో పాటే ఉంటాను. నీ దగ్గరే తిరుగుతూ ఉంటాను. రాత్రులు ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే వెళతాను. ఎక్కడైనా స్నానం చేయాలనిపిస్తే అక్కడ స్నానం చేస్తాను. నువ్వు ఈ క్షేత్రంలో ఉన్నంతకాలం ఈ క్షేత్రంలో ఉంటాను. నువ్వు ఇంకొక చోటికి వెళ్ళిపోతే నీతో పాటే వస్తాను. నాకు మోక్షం కావాలనో , మోక్షం పొందాలనో కోరికలు ఏమీ లేవు. ఉన్నంతవరకు సంతోషంగా ఉండాలి. కావాల్సింది తినాలి. నచ్చినట్టు బతకాలి. నచ్చినట్టు చచ్చిపోవాలి. ఏమో! నీ చేతుల్లో చచ్చిపోవాలని ఉందేమో! ఒక తల్లి నన్ను కన్నది. ఇంకో తల్లి నన్ను పెంచుతుంది. ఇంకో తల్లి చేతుల్లో నాకు మరణం రాసిపెట్టి ఉందేమో! నాకు నువ్వు గత జన్మాంతరాలలో ఏదో ఒక జన్మలో తల్లివై ఉండవచ్చు. తల్లి గానే నాకు కనబడుతున్నావు. నీకు ఎలాంటి పుత్ర వ్యామోహాలు కలిగించను. నువ్వు ఉన్నంతవరకు మనం తల్లి కొడుకుల్లాగా ఉందాము. నీ సాధన నువ్వు చేసుకో! నేనేం అభ్యంతరాలు పెట్టను. నీకు సాధనా సందేహాలు ఏమైనా వస్తే, నాకు తోస్తే….. సందేహాలకు సమాధానాలు చెప్తాను. పరిష్కరిస్తాను. ఇక నేను నీకు అండగా ఉంటాను. ఇప్పుడు ఆడపిల్ల ఒంటరిగా ఉంది అంటే….. ఎవరైనా ఏదైనా చెడు దృష్టితో చూడవచ్చు. చెయ్యి వెయ్యాలని అనుకోవచ్చు. లేకపోతే నిన్ను చెడగొట్టాలని అనుకోవచ్చు. నిన్ను చెడ్డదానిగా ప్రచారం చేయవచ్చు. నువ్వు చెడిపోయినట్టు ప్రచారం చేయవచ్చు. ఏదైనా చేయవచ్చు. నేను నీకు కొడుకుగా ఉంటాను. కొడుకుగా నీకు రక్షణగా ఉంటాను. నీకు రక్షణ కవచంగా ఉంటాను. నీకు కావాల్సిన సాధన నువ్వు చేసుకో.! నా మీద ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. నేనేం దొంగతనం చేయను. నీ డబ్బులు నాకు అవసరం లేదు. నా వల్ల నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నువ్వు చేయవలసింది ఏంటంటే ….. కేవలం 21 ఉండ్రాళ్ళు చేసి పెడితే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఒక కొడుగ్గా తల్లికి చేయాల్సింది చేస్తాను. ఏమో భోగపుత్రుడితో నీకు ఋణం తీరిపోయింది…. యోగ పుత్రుడితో ఏదో ఋణం ఉంటుంది కదా! ఋణం తీర్చుకుందాం! ఋణం తీర్చుకుంటే , మళ్లీ జన్మలో మనం కలిసి జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు కదా! ఆలోచించు. నువ్వు రమ్మన్నా వస్తాను….నువ్వు వద్దన్నా నేను వస్తాను… నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వే నన్ను మొదట పలకరించావు! నన్ను చూసావు ….కాబట్టి నీకు నాకు జన్మాంతరంలో ఏదో తల్లి ఋణానుబంధం ఉన్నది అనిపించింది. నాకు ఉండ్రాళ్ళు పెట్టే తల్లివి నువ్వే అని అనిపించింది. కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు వద్దన్నా నీ వెంట పడుతూనే ఉంటాను.
అనగానే శివనందినికి…. ఉన్నట్టుండి భయం వేసింది. వీడేంటి ఇప్పుడు అన్నంత పని చేస్తాడా ఏంటి కొంపతీసి…… వీడు ఇప్పుడు నా వెంట పడతాడా ఏంటి, ఒకపక్క సంతానమాయ ఉండకూడదు…… భర్త మాయ ఉండకూడదు….. దాంపత్యమాయ ఉండకూడదు….. అని గృహస్థాశ్రమం నుంచి అనుకోని పరిస్థితుల వల్ల విడాకులు తీసుకొని వచ్చేసి తను చావాలి అనుకున్నప్పుడు…… చావనివ్వకుండా ఏదో మోక్షమరణం ఉందని చెప్పి, ఆధ్యాత్మిక సాధనలో పడేస్తే….. లేనిపోనిది ఇప్పుడు వీడేమో యోగ పుత్రుడు అంటూ నా వెంట పడుతున్నాడా ఏంటి? వీడు కాస్త బంధనంగా మారితే నా పరిస్థితి ఏంటి? అసలే పుత్ర మోహమాయాలో అమ్మవారు ఉన్నారని చెప్పారు. మోహ మాయలో పడటం వలన ఆమెకి మోక్షం రాలేదని చెప్పారు. ఏమీ వద్దు….. ఏమీ లేవు అంటూనే …..ఇప్పుడు తన ఇంట్లో ప్రవేశిస్తాడా? అమ్మో! ఇంట్లో పెట్టుకోకూడదు. చనువిస్తే అతుక్కుపోయేలాగా ఉన్నాడు….. చనువిస్తే నెత్తికెక్కేలాగా ఉన్నాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. వీడిని వదిలించుకోవాలి…. లేదంటే గుదిబండ లాగా తయారవుతాడు అని అనుకొని సరే అని గబగబా కేదార్నాథ్ ఘాటువైపు స్నానానికి అని బయలుదేరింది. కానీ ఈ బాలగణపతి అనుసరిస్తూ వెంటపడుతున్నాడు . వెంటపడుతున్నాడని శరవేగంతో ఆటో ఎక్కేసి కేదార్నాథ్ ఘాటు వైపుకి వెళ్ళిపోయింది. ఆటోలో నుంచి బయటకు చూసి…. పిల్లవాడు వెంట పడట్లేదు అని గ్రహించి… హమ్మయ్య! ఎలాక్కోలా వదిలించుకున్నాను. వీడు జిడ్డు లాగా ఉన్నాడు .చూడటానికి పిల్లాడే…. కానీ ఘటికుడు . పిల్లాడి రూపంలో ఉన్న ఆగస్త్యమునిలా కనబడుతున్నాడు. వామ్మో! వీడికి జన్మాంతర సాధన జ్ఞానం ఉన్నట్టుంది. జన్మాంతర బ్రహ్మ జ్ఞానం ఉన్నట్టుంది. వీడు బ్రహ్మ జ్ఞాని…. అజ్ఞాని లా కనపడుతున్నాడు. పిల్లాడిలా కనబడుతున్నాడు. అయినా పూర్వజన్మ సుకృతం లేకపోతే కాశీలో ఎందుకు పుడతాడు…. కాశీలో ఎందుకు నివసిస్తాడు… శివపుత్రుడు అయి ఉంటాడు. కాబట్టే కాశీ విశ్వనాథుడు తన సమక్షంలో ఉంచుకున్నట్టు ఉన్నాడు. కాబట్టి వీడిని మనం వదిలించుకోవడం మంచిదైంది . అమ్మో! వీడిని మళ్ళీ పలకరించకూడదు. చూసినా కూడా చూడనట్టు తెలియనట్టే ఉండాలి . మనలో స్పందన కలగకూడదు. మనలో స్పందన కలిగిందంటే అది బంధనంగా మారుతుంది. బాధ్యతగా మారుతుంది .అమ్మో! మన వల్ల కాదు అనుకుంటూ ఉండగా….. అమ్మ కేదార్నాథ్ ఘాటు వచ్చిందని ఆటో వాడు అంటూ ఉండగా ……అప్పుడు ఈ లోకంలోకి వచ్చి, ఆటో వాడికి డబ్బులు చెల్లించేసి ఘాట్ లో దిగి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని కూర్చొని ఉండగా ….అక్కడికి రుద్ర స్వామితో పాటు మహాదేవి కూడా కలిసి రావటం గమనించి….. అయినా వీళ్లేంటి కలిసివస్తున్నారు. అయినా నేను ఏ ఘాట్ దగ్గర ఉంటే, ఆ ఘాట్ కి వీళ్ళిద్దరూ వస్తున్నారా? లేదా వీళ్ళిద్దరూ ఉన్న ఘాటుకి నేను వెళ్తున్నానా? రోజు మణికర్ణిక ఘాట్ లో కదా స్నానం చేయాల్సింది! బాలగణపతి దాటికి తట్టుకోలేక మణికర్ణిక ఘాట్లో చేయాల్సిన స్నానం కాస్త ఈ కేదార్నాథ్ కి వచ్చానని గమనించింది. అయినా ఈ గంగా నదిలో 84 ఘాట్లు ఉన్నాయి. ఏ ఘాట్లో చేసిన గంగా స్నానం చేసినట్లే కదా! కానీ చూద్దాం ఇప్పుడు ఏమైంది…. పుణ్యఫలం కాదు కదా! గంగలో స్నానం చేయడం వల్ల గంగలో 21% ఆక్సిజన్ ఉండటం వలన….. మన శరీరానికి విశ్రాంతి దొరికి మనోవేదన తగ్గుతుంది. తెలిసి తెలియక చేసిన తప్పుడు పనుల వలన, పాపాల వలన మనలో నెగిటివ్ శక్తి వచ్చినప్పుడు ఈ గంగలో ఉన్న ఆక్సిజన్ శాతంతో పాజిటివ్ శక్తిగా మారుస్తుంది కదా! అందుకే గంగా స్నానం పవిత్రమైందని చెప్పి చెప్తారు. ఏ ఘాట్ లో స్నానం చేసినా…. అదే ఫలితం వస్తుందిలే అనుకుంటూ వీళ్ళిద్దరికీ నమస్కారం చేసింది.
తన దగ్గరికి వస్తున్న రుద్ర స్వామి, మహాదేవీలను చూసి ....శివ నందిని, మీ ఇద్దరికీ నా పాదాభివందనాలు , నా మనో నమస్కారాలు అంటూ నమస్కారం చేసింది. అప్పుడు ఇష్టకామ్యా సిద్ధిరస్తు, పూర్ణ మోక్ష ప్రాప్తిరస్తు అని దీవిస్తారు . ఇంతలో ….
మహాదేవి:- పూర్ణ మోక్ష ప్రాప్తిరస్తు అని అన్నారు కదా! విశ్వమోక్ష ప్రాప్తిరస్తు అంటే సరిపోతుంది కదా! అలా దీవించొచ్చు కదా!
రుద్రస్వామి:- అంటే సాధనలో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక . ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా! అలాంటిది 12 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు సాధనలో ఈ పిల్ల సాధన జీవితం ఏం జరుగుతుందో నేను ఎలా చెప్పగలను?
మహాదేవి:- మీకు తెలియనిది అంటూ ఏమీ ఉండదు . అన్నీ తెలుసు . కానీ ఏమీ తెలియనట్లుగా ,పిచ్చివాడిలాగా, అజ్ఞానిగా, అమాయకుడిగా ఉంటారని నాకు తెలుసు అనగానే....
శివ నందిని ఉన్నట్టుండి…
శివనందిని:- మీ ఇద్దరు తర్వాత కొట్టుకోండి. స్వామీ ! నాకు కొన్ని సాధన సందేహాలు ఉన్నాయి. వాటిని తీరుస్తారా ?
అని రుద్రస్వామి కేసి చూడగానే .....
రుద్రస్వామి:- అమ్మ! సందేహం తీర్చుకునేంత వరకే అది సందేహంగా ఉంటుంది . అది తీర్చుకున్నాక సమాధానం అవుతుంది .అప్పుడు నీ మనసు కుదుటపడుతుంది. తెలియనంత వరకు ఏదీ తెలియదు. తెలుసుకున్న తర్వాత అంతా తెలుస్తుంది. అయినా నీ సాధన సందేహం ఏంటో చెప్పు. నేను తీరుస్తాను .
శివనందిని:- స్వామి! జైనధర్మం ప్రకారంగా చూస్తే స్త్రీ జన్మకి మోక్షం రాదని, ప్రస్తుత స్త్రీ మూర్తులంతా కూడా పునః జన్మ గా పురుష జన్మ ఎత్తిన తర్వాతే మోక్షం వస్తుందని అంటున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం గా చూస్తే, స్త్రీకి మోక్షం రాదా?
అనగానే .... దానికి
రుద్రస్వామి:- తల్లి! సాధనలో స్త్రీ పురుష లింగ బేధం లెేదు. అలాగే జంతు జన్మలకి మోక్షం రాదని చెప్పడానికి లేదు. ఫలానా కారణం చేత , ఫలానా తప్పు వల్లనో, ఇంకా ఏదైనా కారణం చేత మోక్షం రాదని చెప్పలేము . వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, పురుష ప్రకృతిలో స్త్రీ పురుషులు సాధన చేస్తే స్త్రీ మోక్షం పొందదు . పురుషుడు మోక్షం పొందుతాడు. ఇదే విషయం మనకు పరమ హంస గారు చెప్పారు కదా! ఆయన పురుష ప్రకృతిలో పురుష దేవుడైన ఆదిరుద్రుడు మోక్షం పొందినట్టుగాను, ఆదిపరాశక్తి శక్తి మోహమాయలో పడి మోక్షం పొందనట్టుగా చెప్పారు కదా! ఇప్పుడు స్త్రీ ప్రకృతిలో సాధన చేస్తే పురుషుడు మోక్షం పొందడు , స్త్రీ మాత్రం మోక్షం పొందుతుంది అని వస్తుంది. ఆ లెక్కన స్త్రీ జన్మ గొప్పదా? పురుష జన్మ గొప్పదా అనేది ఎలా చెప్పగలవు? ఇక్కడ ప్రకృతి రెండు విధాలుగా ఉంది. ఒకటి స్త్రీ ప్రకృతి , మరొకటి పురుష ప్రకృతి .పురుష ప్రకృతిలో స్త్రీ మోక్షం పొందదు .పురుషుడు మోక్షం పొందుతాడు. స్త్రీ ప్రకృతిలో స్త్రీ మోక్షం పొందితే ,పురుషుడు మోక్షం పొందడు. ఈ మోక్షం పొందని వాళ్ళు భోగ మాయలో పడి పునః సృష్టి చేస్తారు . అక్కడ స్త్రీ మూర్తి, పురుషుడు వీళ్లిద్దరూ కలిసి మళ్ళీ ఇంకో ప్రకృతిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళలో మళ్లీ స్త్రీ ,పురుష ప్రకృతి ........పురుష, స్త్రీ ప్రకృతి అని ఇలా ఆగిపోతారు. ఇదే పునః సృష్టికి కారణం అవుతుంది. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం ప్రకారం, ఒక విధంగా చూస్తే నిజమే అనిపిస్తుంది. మరో విధంగా చూస్తే ,అది అసత్యం . సాధనకి స్త్రీ, పురుష అనేది లేదు . మోక్షానికి స్త్రీ , పురుష అనే బేధం లేదు. ఎవరైనా మోక్షం పొందవచ్చు భక్తిని బట్టి గురువు అనుగ్రహం బట్టి, సాధనను బట్టి , మన చేతలను బట్టి ,మన చేతులను బట్టి మన సాధనా మోక్షం ఆధారపడి ఉంటుంది .
అనగానే దానికి శివనందిని .......
శివ నందిని:- సాధనకి గురువు అవసరమా ?
రుద్రస్వామి:- అమ్మా ! మోక్ష సాధనకైతే తప్పనిసరిగా గురువు అవసరం ఉంటుంది. అది కూడా పంచ గురువుల అవసరం, అనుగ్రహం ఉంటుందని పరమహంస తన కపాల మోక్ష గ్రంధంలో చెప్పడం జరిగింది. మంత్ర గురువు ,దీక్ష గురువు, శక్తిపాత గురువు ,సద్గురువు, పరమ గురువు అని ఆ తర్వాత ఆది గురువు వస్తాడని చెప్పడం జరిగింది. అదే మోక్షజన్మ కాకుండా , గృహస్థాశ్రమంలో ఉండి భోగ కోరికలు, సమస్యలు పరిష్కారం చేసే ప్రసాద భక్తులకి.... గురువుల అవసరం ఉండదు. ఎవరైతే వాళ్ళ జన్మను మోక్షజన్మ, సాధనా జన్మ చేసుకుంటారో, వాళ్ళకి మాత్రమే ప్రకృతి ఈ పంచ గురువులను ఇస్తుంది. ఆ గురువులను బట్టి వాళ్ళ సమక్షంలో సాధన చేస్తే, లోతుపాతులు, మాయలు దాటడానికి అవకాశాలు ఉంటాయి. సాధన స్థితిని బట్టి, ప్రకృతి ఆయా కాలాలలో ….ఆయా పరిస్థితులను బట్టి ఆయా గురువులను పంపిస్తుంది. గురువులను మనం వెతకవలసిన అవసరం లేదు. గురువుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. మన సాధన ఇంట్లో కూర్చుని చేసినా గురువులు వస్తారు. అదేవిధంగా మన సాధన అడవిలో కూర్చుని చేసినా స్వప్న దర్శనంలో కానీ, ధ్యానంలో కానీ గురువులు వచ్చి వారి గురు బోధ చేసి చెబుతారు . ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకి మన సాధనా స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మన సాధనలో నిస్వార్థం ఉండి , నిష్కామ కర్మగా ఉంటే పంచభూతాలే పంచ గరువులుగా మారి మన సాధనను పరిసమాప్తి చేస్తాయని తెలుసుకో! కాబట్టి పంచ గురువుల అవసరం అవుతుంది .
శివనందిని:- సరే స్వామి! మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు సాధనలో ఉండగా మాంసం తినవచ్చా?
రుద్రస్వామి:- అమ్మ! ఇక్కడ మాంసం తిన్నావా? దుంపలు తిన్నావా? అనేది నీ వ్యక్తిగత స్థితిని బట్టి, మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఏనుగు, పాము ఉన్నాయి.... ఏనుగు శాకాహారమైన గడ్డి తింటుంది. అదే పాము మాంసాహారమైన కప్పల్ని తింటుంది . మరి ఈ రెండింటికి చివరికి శ్రీకాళహస్తిలో మోక్షం వచ్చింది కదా! ఆహారం అనేది మన జన్మ యొక్క స్థితి గతులను బట్టి ఉంటుంది . తీసుకునే ఆహారం బట్టి మనసు ఉంటుంది . మనసును బట్టి మన ధ్యానస్థితి ఉంటుంది. అదే నువ్వు మాంసాహారం తీసుకుంటే.... అరగడానికి జీర్ణం అవడానికి.... ఎక్కువ సమయం తీసుకుంటుంది. మనసు, శరీరం అలసిపోతుంది. అప్పుడు భోగనిద్ర ఎక్కువవుతుంది. అదే శాఖాహారం తీసుకుంటే తక్కువ శ్రమ పడుతుంది. మనసు ఉత్తేజం పొందుతుంది. ఆహారం జీర్ణం చేసుకోవడానికి శ్రమపడదు. తక్కువ నిద్ర వస్తుంది. ఆ తక్కువ నిద్రే యోగనిద్రగా మారుతుంది. మాంసం తినేవాడికి భోగ నిద్ర వస్తే ,శాఖాహారం తినేవాడికి యోగ నిద్ర వస్తుంది. ఇక్కడ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది . ఉల్లిపాయ అరాయించుకునే శక్తి ఉంటే ఏదైనా ఒకటే . ఉల్లిపాయ కొంతమందికి తింటే అరగదు. పడదు . కొంతమందికి తొందరగా అరుగుతుంది. అది చెప్పలేం ....అది వాళ్ళ శరీర తత్వమును బట్టి ఉంటుంది . శ్రీరాముడు మాంసం తిన్నాడు. శ్రీకృష్ణుడు మాంసం తిన్నాడు. మరి వాళ్ళు దైవాలు అవ్వలేదా ? ఇప్పుడు బుద్ధుడు వచ్చేసరికి మాంసాహారం వద్దు…. శాఖాహారమే తినమని చెప్పాడు. కొంతమందికి అహింసగా చచ్చిన వాటిని తినండి ....బతికి ఉన్న వాటికి చంపి తినకండి... అది హింస అవుతుంది అన్నాడు. ఇక్కడ ఆహారం అనేదాన్ని బట్టి మన సాధన ఉంటుంది . మనం అరాయించుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది. నీకు మాంసాహారం త్వరగా అరిగింది అనుకో .... నువు మాంసాహారం తినవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను .... నరమాంసం తింటాను! కోడి మాంసం తింటాను! దుంపలు తింటాను! దానికి సంబంధించిన పప్పు దినుసులు తింటాను! నాకు ఏదైనా ఒకటే! ఏదైనా తొందరగా అరుగుతుంది . ఎందుకంటే నేను ఆహారం గురించి పట్టించుకోను, రుచుల గురించి పట్టించుకోను, కేవలం ఆకలి తీరిందా లేదా అని చూస్తాను. అది ఒక దుంపతో తీరొచ్చు... ఒక మాంసం ముద్దతోనో తీరిపోవచ్చు.... ఈ రెండింటిని తిని నేను అరాయించుకుంటాను. అంతెందుకు ....పాదరసం తిని కూడా ఆరాయించుకుంటాను. ఇదంతా ఎలా జరిగిందంటావు ! నేను ఆకలి చూసుకున్నా కానీ తినే పదార్థం యొక్క రుచిని చూసుకోలేదు. ఎప్పుడైతే నువ్వు రుచిని చూసావో ఆహారం మారుతూ ఉంటుంది .అన్నం కాస్త పులిహోర ,పులిహోర కాస్త బిర్యాని అవుతుంది .అంతే .....అదే అన్నాన్ని నువ్వు కావాల్సినట్టుగా తినగలిగితే సరిపోతుంది. నువ్వు పచ్చడితో సంతృప్తి పడ్డావు అనుకో... సరిపోతుంది . కూర ముక్కలు తిని సంతోష పడ్డావనుకో...సరి పోతుంది. నీకు ఏది సంతృప్తిని ఇస్తుందో.... ఏది ఆకలి తీరుస్తుందో ....ఆహారం అరిగేదాన్ని బట్టి నీ మనసు ఉంటుంది .నీ మనసును బట్టి నీ ధ్యాన స్థితి ఉంటుంది. దాన్నిబట్టి నీ సాధన నిలబడుతుంది. అంతేగాని ఫలానా ఆహారం తినకూడదు.... ఫలానా ఆహారం తింటేనో సాధనకి పనికి వస్తాం అనేది ఏదీ లేదు.
శివనందిని:- స్వామి! ఒక స్త్రీమూర్తి గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేస్తే మోక్షం పొందే అవకాశం ఉందా?
రుద్రస్వామి:- స్త్రీ మూర్తి,పురుష మూర్తికి సాధనలో నాలుగు ఆశ్రమ ధర్మాలు చెప్పడం జరిగింది. 1)బ్రహ్మచారి 2) గృహస్థము 3) వానప్రస్థం 4) సన్యాసం. ఇందులో మోక్షమును పొందాలంటే ఖచ్చితంగా ఆ సాధకుడు గాని ,సాధకురాలు గాని సన్యాస స్థితిని పొందక తప్పదు . అవసర భక్తి లేదా ప్రసాద భక్తి పొందాలంటే మిగిలిన మూడు ఆశ్రమాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడు ఆశ్రమాల్లో నువ్వు సిద్ధి పొందిన తరువాత నాలుగో ఆశ్రమం అయిన సన్యాస దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మచారిలో కామ వికారాలు కలుగుతాయి. గృహస్థంలో ఆ కామ వికారాలు అనుభవించడం జరుగుతుంది. వానప్రస్థానికి వచ్చేసరికి కామ వికారాలు పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుడు వైరాగ్యం స్థితి వస్తుంది. ఆ వైరాగ్యస్థితి పురాణ వైరాగ్యమా లేక స్మశాన వైరాగ్యమా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది . ఎప్పుడైతే స్మశాన వైరాగ్యానికి వెళ్లిందో .....అదికాస్తా సన్యాస దీక్షకు వెళ్ళిపోతుంది . అది మోక్షజన్మకి వెళ్తుంది. ఆ మోక్ష జన్మే అంతిమ సాధనా పరిసమాప్తి చేసుకుంటే నువ్వు శూన్యం అవ్వచ్చు. ఒకవేళ ఈ మోక్ష సాధన జన్మలో , తెలియక మాయలో పడితే .....వ్యక్తిగత మోక్షం అవుతుంది. ముక్తి పొందడం అవుతుంది. అంతకుమించి ఏమీ జరగదు. ఒకవేళ నీ ఇష్ట కోరిక ఏంటో తెలుసుకొని .....ఆ కోరిక మాయను అనుభవించాలని..... అనుకుంటే అది తిరిగి పునః జన్మకి వెళ్ళటానికి నీ చేతుల్లోనే ఉంటుంది . అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు . ఇక్కడ మనసుని నాలుగు విధాలుగా స్థితులుగా మార్చడానికే నాలుగు రకాల ఆశ్రమాలను పెట్టడం జరిగింది. మనలో ఉన్న అన్ని రకాల కోరికల కర్మలను తీర్చడానికి ఈ నాలుగు విధివిధానాలు ఉన్నాయి. మొదటి మూడు విధి విధానాల్లో స్త్రీ,పురుషుడు చేసినప్పటికీ, ఈ జన్మ మోక్షజన్మ చేసుకోవాలని ఎవరైతే బలంగా అనుకుంటారో..... వారికి మాత్రమే సన్యాస దీక్ష పొందటానికి అర్హత,యోగ్యత, యోగము ఉంటుంది. ఈ మూడు ఉండటానికి ఆ సన్యాస దీక్షకి ప్రకృతి పరీక్ష పెడుతుంది . ఆ పరీక్ష తట్టుకొని నిలబడిన వారికే ఈ జన్మ మోక్ష జన్మ చేసుకునే అర్హత ,యోగ్యత, యోగం ఉంటుంది . ఇకపోతే బ్రహ్మచారిగా అంటే వివాహం కానంతవరకు వాళ్ళు చేసిన పూజలు కర్మానుసారం జరుగుతాయి. అంటే అవసరాల కోసం ,కోరికల కోసం లేదా చదువులో మంచి మార్కులు రావాలని లేదా మంచి ఉద్యోగం రావాలని ,చదువులో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ఇలా దానికి సంబంధించిన దీక్షలలో బ్రహ్మచారి దీక్ష సరిపోతుంది . అదే గృహస్థాశ్రమానికి వచ్చేసరికి వివాహం చేసుకొని సంతానం కోసం ,భర్తకి ఆర్థిక సమస్యలు వస్తే అవి తీర్చాలని ,ఉద్యోగంలో నిలకడగా ఉండాలని ,లేకపోతే తను చేసే వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని, పిల్లల ఆయురారోగ్యాల కోసం ఇలా పలు రకాల గృహ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే మన ఇష్ట దైవానికి పూజలు చేస్తూ.... అభిషేకాలు చేసి ఆ విగ్రహానికి పూలతో, విభూతితోను ,గంధంతోనూ, అలంకరణలు చేసి ......ఆ తర్వాత విగ్రహ మూర్తికి బెల్లం లేదా పటిక బెల్లం, నైవేద్యాలు పెట్టి నివేదన చేసి పది నిమిషాలు ఆ దైవమంత్రాలు ,శ్లోకాలు ,స్తోత్రాలు ,ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ....గృహస్థాశ్రమం గడిచిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసుకొని సంతానం పొందితే ,అప్పుడు భార్య భర్తలు ఇద్దరూ మంచి స్నేహితులై .....ఆధ్యాత్మిక స్థితిలో ఎవరికి వారే విడివిడిగా ఉంటూ...... విడిపోకుండా ఉంటూ, వారికి నచ్చిన పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ..... తీర్థయాత్రలు చేస్తూ .....కాలాన్ని గడుపుతూ .....తమకు తోచిన విధివిధానాలలో సాధన చేసుకుంటూ...... జపము ,తపము, ధ్యానము, మంత్రము, ఉపాసన ఏదో వాళ్ళకి తోచింది చేసుకుంటూ ఉంటారు . ఇంతవరకు పురుషుడైన , స్త్రీ అయినా చేయొచ్చు. ఇది అంతా కూడా భోగపరంగా చెప్పడం జరిగింది. అదే యోగ పరంగా వచ్చేసరికి బ్రహ్మచారి అనగానే ఎప్పుడు బ్రహ్మముతో రమించే వాడిని బ్రహ్మచారి అంటారు. అలాగే స్త్రీ మూర్తి వాసన, స్త్రీ స్పర్శ లేకుండా ఉండేవాడిని .....బ్రహ్మచారి అంటారు. సుఖాల,కష్టాల గురించి ఆలోచించడం మానేస్తాడు. సుఖ భోగాల గురించి ....ఉద్యోగం వచ్చిందా ,రాలేదా అనేది ఉండదు. వస్తే చేస్తాడు, లేదంటే చేయడు . కర్మ నివారణ కోసం మాత్రమే అతను సాక్షి భూతంగా కర్మ చేస్తూ గృహస్థాశ్రమం లోకి అడుగుపెడతాడు . అలాగే ఆ గృహస్థ ఆశ్రమంలో వచ్చే భార్యని కానీ భర్తని కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్లనే ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి నిత్య పూజలు చేసుకుంటూ, నిత్య ఆరాధన చేసుకుంటూ, నిత్య ఉపాసనలు చేసుకుంటూ ,నిత్యం జప , ధ్యానాలు చేసుకుంటూ, ఒకరికొకరు తమకి కలిగిన ధ్యాన అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ ,అభిప్రాయాలు పంచుకుంటూ, సాధన సందేహాలు తీర్చుకుంటూ.... గురువుల అనుగ్రహం పొందుతూ …దైవ అనుగ్రహాలు పొందుతూ.... సాధనలో ముందుకు పోతూ .....తనకి పుట్టిన సంతానానికి కూడా భోగ జీవితానికి కావలసిన భోగ అవసరాలు తీరుస్తూ..... వాళ్ళని చదువులో ఉన్నత స్థితికి తీసుకువెళ్లి , ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తూ .,.వాళ్లకి చిన్నప్పటినుంచి భోగ జీవితంతో పాటు యోగ జీవితాన్ని కూడా అలవాటు చేస్తూ..... ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు . ఇక్కడ నూటికి 90% మంది గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేసేవాళ్లే . సంతానం ఉండదు. ఒకవేళ దైవానుగ్రహం వలన ,గురువుల అనుగ్రహం వలన, జ్యోతిష్యాల పరిహార దోషాలు తీర్చుకుంటే వారికి సంతానం కలిగే అవకాశం ఉంది . వీరికి అనగా భార్యాభర్తలు ఇద్దరికీ సంతానం మీద మోహ, వ్యామోహాలు ఉండవు . పుడితే ఆనందపడతారు. చస్తే బాధపడరు. అంటే అన్నప్రాసన చేస్తారు.... అంత్యక్రియలు చేస్తారు.... ఒకే దృష్టితో వీళ్ళు సమదర్శనంతో , మానసికంగా యోగులుగా.... యోగత్వంతో దైవత్వ సాధన చేస్తూ ఉంటారు . వీరు యోగంలో ఉన్నారని చాలా కొద్ది మందికి అనగా బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత వాన ప్రస్థావంలోకి వచ్చేసరికి .....పిల్లలు వస్తే సాధనా జీవితంలో ఏదో ఒక క్షేత్రంలో స్థిరపడిపోయి.... వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు . లేదంటే వాళ్లు భోగాలన్నీ అనుభవించి పురాణ వైరాగ్యం నుంచి స్మశాన వైరాగ్యం పొందుతారో.... అప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక క్షేత్రానికి వెళ్లిపోయి... ఆ క్షేత్రానికి సంబంధించిన దైవీక వస్తువులు , లేకపోతే దైవ అనుభవాలు పొందుతూ... వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ తల్లిదండ్రులుగా మారిన భార్యాభర్తలు కూడా తాము పిల్లల యొక్క బాధ్యతలను తీరిపోవడంతో , వీరు కూడా తమకి నచ్చిన ఏదో పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఇద్దరు చేరుకొని అక్కడే స్థిర నివాసం చేసుకొని , వారిద్దరి మధ్య దాంపత్య జీవితం లేకుండా .....విడివిడిగా ఉంటూ ......విడిపోకుండా ఉంటూ, ఏకాంతంగా , ఒంటరిగా ఎవరికి వారే వారికి తోచిన విధంగా జపము, ధ్యానము ప్రాణాయామము లేదంటే..... వారి విధివిధాన సాధనను బట్టి , వారి సాధనను బట్టి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు . ఇక్కడ కర్మ, భక్తి , జ్ఞాన, ధ్యాన మార్గాలలో ఏదో ఒక మార్గంలో ఇద్దరు కలిసి సాధన చేసుకుంటారు . ఎవరి సాధనా విధానం వారిది. ఎవరి మోక్షం వారిది. ఎవరి చావు వారిది . ఎప్పుడైతే ఇలా వానప్రస్థావంలో ఉన్న భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే ......వారు సన్యాస దీక్ష తీసుకోవడానికి ఆ యోగం ఉంటుంది . ఇకపోతే వాళ్లు ఈ జన్మ మోక్ష సాధన చేసుకొని , మోక్షము... అమోక్షము ఏది పొందుతారు అనేది ప్రకృతి నిర్ణయం చేస్తుంది. ఇకపోతే వాళ్ళు వాన ప్రస్థావంలో ఉండగా భార్య అనుమతి తీసుకుని భర్త, భర్త అనుమతి తీసుకొని భార్య కూడా సన్యాసిని, సన్యాస దీక్ష తీసుకొని సాధన చేసుకోవచ్చు. వారు ప్రస్తుత జన్మను అంతిమ జన్మ లేదా మోక్షజన్మగా మార్చుకోవచ్చు. అది ఎలా ? ఏమిటి? అనేది.... వారి యొక్క మానసిక స్థితిని బట్టి శరీర ఆరోగ్య స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. యోగం ఉంటే యోగిని లేదా యోగి కాక తప్పదు . అది మాత్రం గుర్తుంచుకో ! అదే అడవిలో అయినా , ఇంట్లో అయినా కూడా మన రాతలో యోగి కావాలని రాసిపెట్టి ఉంటే యోగిని లేదా యోగి అవ్వక తప్పదు. అది గుర్తుపెట్టుకో!
శివనందిని:- స్వామి ! ఇక్కడ మరో సందేహం. ఒక స్త్రీ గృహస్థాశ్రమంలో ఉండి మోక్షం పొందవచ్చా ?
రుద్ర స్వామి:- అమ్మ! ఇందాక చెప్పాను కదా! స్త్రీ మూర్తి అనేది.... గృహ అవసరాల కోసం , అవసర భక్తితో ఉంటే ఎప్పటికీ మోక్షం రాదు. గృహస్థాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యంలో ఉన్నా , వానప్రస్థంలో ఉన్నా , మోక్ష సన్యాసం తీసుకున్నా .....కూడా అది వ్యక్తిగత అవసరాల కోసమో, కోరిక కోసమో ....చివరికి మోక్షం పొందాలనే కోరిక ఉన్నా కూడా మోక్షం రాదు. ఎప్పుడైతే కోరిక రాహిత్య స్థితిని పొందుతావో , కోరికలతో నీకు అవసరం ఉండదో , కోరికలతో అగచాట్లు ఉండవో.... ఆ జన్మ నీకు మోక్ష జన్మ అవుతుంది. అన్నిటినీ వదిలి పరిత్యాగి చేయడమే కదా మోక్షము అంటే.... నీకు ఉన్న బంధాలన్నింటిని వదిలి పెట్టేస్తే .....మిగిలేది ఏమీ లేని స్థితి. అదే పరమహంస అన్నారు కదా! ఏదో ఉందని సాధన చేస్తే, ఏమీ లేదు అని తెలుసుకోవడమే సాధన పరిసమాప్తి అని చెప్పడం జరిగింది కదా ! అంతెందుకు, మనకి 14 వ లోకం సత్య లోకమని చెప్తారు కదా.... కొంతమంది దానిని బ్రహ్మలోకం అని చెప్తారు . సత్యలోకం అంటే ఏమిటి? అక్కడ ఉన్న సత్యం ఏమిటి అనేది చూపించే దాన్ని సత్యలోకమని అంటారు కదా ! అక్కడికి వెళ్లిన తరువాత ఆఖరి దేహమైన లింగ దేహం దహనం అయితే ఏమీ లేని స్థితి శూన్య స్థితి .....ఉన్నదో లేదో అనే శూన్యము తప్ప ఏమీ ఉండదు అనే సత్యాన్ని తెలుసుకోవడమే..... ఆ సత్యాన్ని తెలుసుకునే లోకమునే సత్య లోకమని చెప్తారు. బ్రహ్మము అంటే ఏమిటి? శూన్యమే కదా ! అదే పూర్ణ శూన్యం. శూన్యం అంటే ఏమిటి, అది ఒకటి ఉంది అనీ .....లేదు అని సందేహం వస్తుందని చెప్పేసి ......మన పెద్దలు ఉందో లేదో అనే ధర్మ సందేహాలు పక్కన పెట్టండి అన్నారు.......పూర్ణ శూన్యం అంటే అది ఇక చెప్పడానికి లేని స్థితి , అది నిరాకార స్థితి ,ఇక ఉందో లేదో అనే మీమాంస ఉండదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే లోకాన్ని సత్య లోకమని అంటారు అన్నారు . నిజానికి అది ఎలా ఉంటుందంటే.... గది బయట ఉన్న వాడు గదిలోపల ఏదో ఉందని తెలుసుకోవాలని లోపలికి వెళ్ళాడు . ఆ గదిలో ఏమీ లేదు. చూడటానికి ఏమీ లేదు . కాకపోతే అక్కడ చూసేవాడు ఉండడు. చూడడానికి ఏమీ ఉండదు. చూసేవాడు ఉండడు . అంటే ఏమిటి , గది బయట ఉన్న వాడు గది లోపలికి వెళ్లేసరికి ఏమీలేని స్థితిని పొందుతారు . అదే గది బయట ఉంటే నేను ఉన్నానని స్థితిని పొందుతాడు. గది లోపలికి వెళ్తే నేను లేని స్థితిని పొందుతాడు. ఈ స్థితిని పొందడానికే సత్యలోకం అనేది ఉంది. 14వ లోకం ఉంది . మనలో 13 దేహాలు సాధన పరిసమాప్తి చేసుకుంటే 14వది అయిన నేను లేని స్థితిని పొందుతాము . 13 దేహాల వరకు నేను ఉంటుంది. 14వ దేహము అనేది నేను లేను అని ఉంటుంది. అదే పూర్ణజ్ఞాన స్థితి. అదే పూర్ణ సాధన స్థితి. అదే పూర్ణ సాధన పరిసమాప్తి స్థితి అవుతుంది. దానినే సత్య లోకం లేదా బ్రహ్మలోకం అని అంటారు. అంటే ఏమీ లేని స్థితి ఉన్న లోకము లేదా గది లాంటిది అని చెప్పడమే సత్య లోకం. ఈ స్థితిని పొందడమే పూర్ణ మోక్షం. ఈ స్థితిని స్త్రీ పొందితేనేమో స్త్రీ ప్రకృతి అంటారు . అదే పురుషుడు పొందితే పురుష ప్రకృతి అంటారు. ఈ స్త్రీ, పురుష మిళితమై ....ఏకమై ఏమీ లేని స్థితిని పొందితే అదే విశ్వమోక్షం అవుతుంది. ఇప్పుడు పరమహంస ప్రకారం సత్య లోకానికి వెళ్తే నేను లేని స్థితిని పొందాడు. అదే నువ్వు నీ సాధన ప్రకారంగా ఈ సత్యలోకానికి వెళ్తే ....నేను లేని స్థితిని నువ్వు పొందగలిగితే.... నేను + నేను కానీ నేను, రెండు పోతాయి . అప్పుడు సంపూర్ణంగా... పరిపూర్ణంగా ఏమీ లేని స్థితిని పొందుతావు. ఏమీ లేని స్థితిని పొందితేనే పూర్ణ మోక్షం వస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏంటంటే .....నేను లేను అనే స్థితిని పొందిన వాడికి నేను మిగిలింది అని చెప్తారు. అదే నేను కానీ నేను లేని స్థితి పొందిన వాడికి నేను ఉన్నానని చెప్తారు. ఇది ఎలా అవుతుంది అంటే ఒకరు స్పందిస్తే మరొకరు స్పందించరు. మరొకరు స్పందిస్తే ఇంకొకరు స్పందించరు . ఇక్కడ పురుష ప్రకృతిలో పురుషుడు స్పందించడు, స్త్రీ స్పందిస్తుంది. అదే స్త్రీ ప్రకృతిలో స్త్రీ స్పందించదు, పురుషుడు స్పందిస్తాడు . అంతెందుకు గృహస్థాశ్రమంలో భార్య భర్తలే ఉన్నారు అనుకుందాం! భార్యకి కామకోరికలు కలిగినప్పుడు పురుషుడికి కామకోరికలు కలగవు. అదే పురుషుడికి కామకోరికలు కలిగితే భార్యకి కామ కోరికలు కలగవు. వీరిద్దరికీ కామకోరికలు కలిగినప్పుడే సంతానం కలుగుతుంది . అదే ప్రకృతి ధర్మం . ఇది అర్థం అవ్వాలి అంటే...... నువ్వే సాధన చేసి తెలుసుకోవలసి ఉంటుంది. ఇకపోతే గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీ మూర్తికి మోక్షం వస్తుందా అని అడుగుతున్నావు! రావడానికి సత్యాసత్యాలు ఉన్నాయి. ఎందుకంటే స్త్రీ మూర్తి గాని లేదా పురుషుడు గాని పాతివ్రత్య ధర్మమును పాటించాలి. అంటే భార్య తప్ప పరస్త్రీ జోలికి భర్త వెళ్లకూడదు. భార్య వచ్చేసరికి భర్త తప్ప పరపురుషుడి జోలికి వెళ్ళకూడదు. అంటే తన భర్తనే దైవంగా భావించాలి. అలాగే భర్త తన భార్యనే దేవతగా భావించాలి. ఇలా పాతివ్రత్య ధర్మంతో ఉండగలిగితే, ధర్మపత్నిగాను ధర్మపతి గానూ ఉండగలిగితే చాలు . ధర్మం పట్టుకుంటే ఈశ్వరుడు నిన్ను పట్టుకుంటాడు. ధర్మాన్ని ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది. అందుకే ధర్మం ,అర్థం, కామం, మోక్షం అని సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ధర్మాన్ని పాటిస్తే సహజసిద్ధంగా మోక్షం వస్తుంది. బ్రహ్మచర్యంలోనూ వస్తుంది . గృహస్థాశ్రమం లోనూ వస్తుంది . వాన ప్రస్థావంలోనూ వస్తుంది . మోక్ష సన్యాసంలోనూ వస్తుంది .కాకపోతే మోక్ష సన్యాసం అనేది, అనుభవ అనుభూతి ఇస్తుంది. మిగతా వాటిలో అనుభవాలు ఇస్తుంది . ఈ అనుభవాలు నిజమా? కాదా? భ్రమా భ్రాంతి అని మనోభయాలు మనకి కలిగిస్తుంది . నాకు కలిగినవన్నీ సత్యాలు అని నువ్వు ఎలా అయితే నమ్ముతావో...... అప్పుడు శాశ్వతంగానే అది మోక్షజన్మ అవుతుంది. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో స్త్రీ మూర్తి, పురుషుడు ఏక భర్త, ఏక భార్య గా ఉండగలిగితే సాధన చేసినా, చేయకపోయినా..... నిత్య పూజ చేసుకుంటూ, నిత్య మంత్రాలు చేసుకుంటూ, సాధన చేసిన చాలు. వాళ్ళు చేసిన పాపాలు, పుణ్యాలు , కర్మలు, కర్మ శేషాలు, కర్మఫలాలు అన్నీ కూడా .......ప్రకృతి ఒక్కొక్కటిగా తీసివేస్తూ పురాణ వైరాగ్యాన్ని కాస్త స్మశాన వైరాగ్యం కలిగిస్తుంది. వాళ్లకి మానసిక సన్యాసం పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు సహజ సిద్ధంగానే వారికి అది మోక్ష జన్మ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు .....భార్య ధర్మంతో ఉండి భర్త ధర్మంలో ఉండకుండా పర స్త్రీ వ్యామోహంలో ఉంటే..... ఆ స్త్రీ మూర్తులకి మోక్షం వచ్చే అవకాశం లేదు . ఎందుకంటే భర్త పర స్త్రీలతో సంయోగం చెంది, శృంగారం చేసి .....వారి యొక్క పాపాలను..... ఆ స్త్రీ మూర్తి దోషాలు ,పాపాలు, కర్మ ఫలాలు అన్నిటిని కూడా భార్యతో సంయోగం చెంది వీళ్ళకున్న కర్మ దోషాలతో పాటు పర స్త్రీ పాపాలు కూడా తమలో కలవడం జరుగుతుంది. ఇప్పుడు నీలో ఉన్న పాపాలే వదిలించుకోలేక .....కింద మీద పడుతూ ఉంటే ,అక్కడ ఉన్న స్త్రీ మూర్తి కర్మ ఫలాలు ,పాపాలు కూడా తీసుకొని సాధన చేస్తావు. దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఎప్పటికప్పుడు మీ సాధనలో పూజలు చేసింది ....ధ్యానాలు చేసింది.... ప్రార్థనలు చేసింది..... నిత్య ఆరాధనలు చేసింది.... విగ్రహారాధనలు చేస్తే వచ్చే కొద్దో గొప్పో... సాధనా శక్తి ఈ దోషంతో పాటు పర స్త్రీ దోషాలు తొలగించడానికి సరిపోతుంది . కాబట్టి భార్యా /భర్త పర స్త్రీ వ్యామోహంలో పడకుండా పాతివ్రత్య ధర్మంలో ఉన్న దంపతులు ....వాళ్ళు పుణ్య దంపతులు అయి , మోక్షం పొందే అర్హత, యోగ్యత ,యోగం ఉంటుంది . అందుకనే ధర్మం, అర్థం ,కామం, మోక్షం అని చెప్పడం జరిగింది. అప్పుడు పాతివ్రత్య ధర్మాన్ని పట్టుకుంటే వారి సంపాదన ధర్మపరంగా ఉంటుంది . వారి కామం కూడా ధర్మపరంగా ఉంటుంది. సహజసిద్ధంగా మోక్షం వస్తుంది . ఇప్పుడు నాలుగు అడుగుల కర్ర తీసుకున్నావ్ అనుకో.... దాన్ని ఒక ముక్క తీశావు , అప్పుడు మూడు అడుగుల ముక్క మిగులుతుంది. ఇంకొక ముక్క తీస్తే రెండు అడుగులు మిగులుతుంది. ఒక అడుగు తీసేసరికి.... సహజసిద్ధంగా నాలుగవ అడుగు ముక్క మిగిలిపోతుంది కదా ! అలాగే గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీ మూర్తి లేదా పురుషుడు భార్య భర్తలుగా కలిసి ధర్మం, అర్థం, కామం పాటిస్తే ......సహజసిద్ధంగానే మోక్షం వస్తుంది. అది ఏ ఆశ్రమ ధర్మంలో అయినా సహజసిద్ధంగా సాధ్యపడుతుంది . కాకపోతే ఇక్కడ ధర్మం మీద నిలబడి ఉండాలి . ధర్మపాలన చేయాలి . సత్యపాలన చేసిన హరిశ్చంద్రుడి పరిస్థితికి ఏం జరిగిందో చూసావా ? చక్రవర్తి కాస్త స్మశానవాసిగా మారాడు. స్మశాన కాపలా ఉండే కాటికాపరిగా మారాడు. అయినా ఆయన సత్య పాలనను వదిలిపెట్టలేదు. సత్యమును నమ్మాడు. అందుకే సత్యము అనగా హరిశ్చంద్ర పేరు చెప్తారు. అంతటి సత్యపాలనా ధర్మమును పాటించబట్టి మహావిష్ణువు శ్రీరాముడిగా ఆ వంశంలో పుట్టడం జరిగింది. ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఈశ్వరుడు నిన్ను పట్టుకుంటాడు . ఆ ధర్మం ఏమిటి అనేది మీ ఇష్టం. మొత్తం 112 ధర్మాలు ఉన్నాయి. ధర్మం అంటే ఒక నియమం. ఆ నియమాన్ని పట్టుకొని చచ్చే వరకు ఉండటం.... ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు, ఆయన పాతివ్రత్య ధర్మం ఏకపత్ని ధర్మం తీసుకున్నాడు. ఆ ఏకపత్ని ధర్మం తీసుకున్నప్పుడు రావణాసురుడు చెల్లెలు వచ్చి ఈయన మీద మోహ వ్యామోహాలు పడి, ప్రేమ చూపిస్తే..... లక్ష్మణుడు ఆమెకి ముక్కు, చెవులు కోసి పంపించాడు కదా! అయినా శ్రీరాముడు చలించలేదు కదా! సీతాదేవి నాకు భార్య అని పాతివ్రత్య ధర్మం లో ఏకపత్ని ధర్మంలో ఉండిపోయాడు . భార్య భూస్థాపితం అయినా కూడా సీతాదేవి బంగారు విగ్రహం చేయించుకొని పూజాది కార్యక్రమాలు యాగాలు చేసుకున్నారు కానీ.... ఇంకో వివాహం చేసుకోలేదు. అంటే పాతివ్రత్య ధర్మం లోకి ఆయన వెళ్ళాడు. విజయం సాధించాడు . జయం పొందాడు. ఇక్కడ అదే శ్రీకృష్ణుడికి వచ్చేసరికి తనతో అష్ట భార్యలను ఉంచుకున్నాడు. 16,000 మంది గోపికలతో సరసాలు ఆడాడు . రాధాదేవితో కూడా ప్రేమకలాపాలు సాగించాడు. ఇక్కడ ఈయన పాతివ్రత ధర్మం పాటించలేదు . కానీ ఈయన ధర్మం పాటించింది ఎక్కడ అంటే ....ధర్మంగా ఉన్న వాళ్ళని రక్షించాడు . ధర్మమును పాటించే వాళ్లను రక్షించి అధర్మంగా ఉన్న వాళ్ళని చంపేశాడు. అదే కురుక్షేత్ర యుద్ధం యొక్క అర్థం . కురుక్షేత్రంలో 36 లక్షల మందిని ఆయన పంచపాండవుల చేత చంపించాడు . యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది . ఈ 18 రోజుల్లో 18 మంది యోధులు మిగిలారు. ఈ 18 మంది యోధులు కూడా ధర్మం వైపే ఉన్నారు . అధర్మం వైపు ఉన్న వారంతా కూడా తన భక్తులైనా కూడా బతికించకుండానే చంపివేయడం జరిగింది . అంతెందుకు..... తన పరమ భక్తుడైన భీష్మాచార్యుని చూసుకుందాం. ఆయన దుర్యోధనుడి వైపు ఉండి ధర్మ మార్గంలో ఉండవలసిన వాడు కాస్త .....అధర్మ మార్గంలో ఉండిపోయాడు. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు...... ఆయన్ని అధర్మ మార్గంలోనే శిఖండి ద్వారా చంపడం జరిగింది. అలాగే తన పరమ భక్తుడు కావడం వల్ల అంపశయ్యగా బాణాల మంచం ఏర్పాటు చేశాడు. ఆ అంపశయ్య మీద ఆయన 18 రోజుల పాటు ఉండి ఆ బాణాలు గుచ్చుకోవడం వలన వచ్చిన ఈతి బాధల వలన ఆయన చేసిన పాపాలు, కర్మలు, కర్మ ఫలాలు ఈ పద్దెనిమిది రోజుల్లో నాశనం అవ్వడంతో…. ఈ శ్రీకృష్ణుడే స్వయంగా తన కృష్ణ పథమును, గోకులంలో స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ సాధకుడు ధర్మాన్ని పట్టుకుంటాడా? అధర్మాన్ని పట్టుకుంటాడా ? అనే దాన్నిబట్టే మన సాధనాస్థితి ఉంటుంది. ఇక్కడ సాధనలో నిస్వార్ధంగా ఉంటే ధర్మం పట్టుకున్నట్టే . స్వార్థం గా ఉంటే అధర్మంలో ఉన్నట్టే . అంటే ఏంటంటే….. ప్రకృతి ఇచ్చే యోగ సిద్ధులు, యోగ శక్తులు వాటిని ఉపయోగించి… ప్రకృతి విరుద్ధమైన ఆలోచనలు, ప్రకృతి విరుద్ధమైన కర్మలు చేస్తే, స్వార్థపూరితమై అధర్మం కిందకి వెళుతుంది. ప్రకృతిలో ఇచ్చిన సిద్దులను కానీ ప్రకృతి ఇచ్చిన శక్తులను కానీ తనకి వచ్చినాయా లేదా అని పరీక్ష చేసుకొని సాక్షిభూతంగా వాటిని ఇతరుల కోసం, తనకోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ఐశ్వర్యం కోసం, లేదా పదవుల కోసం ఉపయోగించకుండా…. తనకి శక్తులు, సిద్ధులు ఉన్నాయన్న విషయం మరిచిపోయి ,వాటిని పట్టించుకోకుండా, ఆలోచించకుండా ఉండగలిగితే అదే సాధన పరిసమాప్తి అవుతుంది. లేదు అంటే వీటిని ఉపయోగించినవాడు….. అధర్మానికి వెళ్ళిపోతాడు. మోక్షం పొందవలసిన చోట అమోక్షం పొందుతూ …..పునః జన్మలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధనలో ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నారన్నది పక్కన పెట్టి…. వాళ్ళు పట్టుకున్న ధర్మమును జీవితాంతం పాటిస్తున్నారా లేదా అన్నది ప్రకృతి పరిశీలిస్తుంది. ఆ ధర్మము మీద మీరు ఎంతవరకు నిలబడ్డారు …..ఎంతవరకు ఆచరిస్తున్నారు అనేది,... ప్రతిరోజు, ప్రతిక్షణం ప్రతినిత్యం, ఏదో రకంగా, ఏదో విధంగా ఆ ధర్మ నియమం ఉల్లంఘించేలా ప్రకృతి ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటుంది. అంటే చచ్చేదాకా ప్రతి జీవుడికి మాయా పరీక్షలు ఉంటూనే ఉంటాయి. చచ్చినా కూడా ఉంటాయి. ఎందుకంటే మిగతా శరీరాలు మిగిలితే వాటికి సంబంధించిన మాయలు ఉంటాయి. ఎప్పుడైతే సాధకుడు తనకున్న దేహాలన్నింటిని నాశనం చేసుకుంటాడో….. సర్వకర్మ బంధ విముక్తి పొందుతాడో అదే పూర్ణం మోక్షం అవుతుంది. శూన్యంలో నుంచి ఎలా అయితే వచ్చాడో అదే శూన్యంలో శూన్యమైపోతాడు. లేదు అంటే మోక్షం బదులు ముక్తి పొందటమో , కర్మ జన్మలు , కారణజన్మలు, అకారణజన్మలు ఎత్తడమో జరుగుతుంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఈశ్వరుడు పట్టుకొని ఉన్నట్టే. ఈశ్వరుడు అయినవాడు శివోహం స్థితికి వచ్చినవాడే. అది ఒక్కటే . అందుకే ధర్మ ,అర్ధ ,కామ, మోక్షాలను ఆధారం చేసుకుంటే మూడవ మార్గంలోకి వెళ్లినా కూడా …. మనం ఏ మార్గంలోకి వెళ్ళినా కూడా…. మనకి మోక్షం వస్తుంది. మనం పాటించే ధర్మాన్ని బట్టి మన చేతల్ని బట్టి ,మన చేతుల్ని బట్టి మన సాధన స్థితిగతి ఉంటుంది. కాబట్టి ఇలా బాధ్యతగా ధర్మములు పాటించే భార్యకి భర్త దొరికాడు అంటే…. ఆ భర్త కాస్త పతిదేవుడు అవుతాడు. ఆ పతి దేవుడికి కావలసిన అవసరాలు, సేవలు అన్ని యధావిధిగా భార్య తీర్చగలిగితే, దేవుడికి సేవ చేసినట్టుగానే అంటే సజీవ మూర్తిగా దేవుడికి ఎలా అయితే సేవలు చేస్తామో…. అలా పాతివ్రత్య ధర్మం పాటించే భర్తకు సేవలు చేయడంతో సమానం. పతి సేవ చేస్తే ఆ స్త్రీకి మోక్షం వస్తుందని శాస్త్రవచనం. ఇలా పాతివ్రత్య ధర్మమును పాటించిన స్త్రీలు ఎందరో మోక్షమును పొందారు . అంతెందుకు ....ఆత్రి మహాముని ,అనసూయమాత ఉన్నారు.... త్రిమూర్తులు అనసూయ మాత పాతివ్రత్య ధర్మమును పరీక్షించడానికి ఆమె ఇంటికి వెళ్లి ,నగ్నంగా మారి భోజనం వడ్డించమని తమ కోరికను చెబుతారు . దానికి ఆవిడ వంటింట్లోకి వెళ్లి తన భర్తని మనసులో తలుచుకొని .....స్వామి! నాకు అనుకొని పరిస్థితుల్లో సాధనా మాయగా నా పాతివ్రత్య ధర్మమును పరీక్ష పెట్టడానికి ముగ్గురు యతీశ్వరుడు వచ్చారు . నాకు చూడటానికి త్రిమూర్తులు లాగా కనిపిస్తున్నారు . కాకపోతే వారికి నేను నగ్నంగా ఉండి వడ్డన చేయాలని చెప్తున్నారు. సాద్వి అయిన స్త్రీ మూర్తి, తన భర్తకి తప్ప ఇంకెవరికి తన నగ్నదేహమును చూపించకూడదు . చూపించరాదు అని .... ఒకవేళ చూపించినట్లయితే పాతివ్రత్య ధర్మమును కోల్పోయినట్లు అవుతుంది.... అని శాస్త్రవచనం ఉంది . ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను పాతివ్రత్య ధర్మంలో ఉన్నట్లయితే ,మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతితో .....స్వప్నంలో కూడా.నేను పర పురుషుడిని తలచుకోని దాన్ని అయితే ......మిమ్మల్ని తప్ప ఇంకెవరిని తలుచుకొని దాన్ని అయితే..... ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపిస్తారని..... నా పాతివ్రత్య ధర్మమే దానికి సమాధానం ఇస్తుంది అనుకుంటూ .... ఆహార పదార్థాలు అన్ని తీసుకొని వంటగదిలో నుంచి బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చి చూసేసరికి నడివయసులో ఉన్న యతీశ్వరులు కాస్త, పసిపిల్లలుగా మారేసరికి నగ్నంగా మారి తన చనుపాలు ఇవ్వడం జరిగింది. అంటే ఆలోచించు.... ఎక్కడో తపస్సు చేసుకుంటున్న భర్తకు తెలియకుండా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో శృంగార కార్యక్రమాలు చేయవచ్చు. లేదా ముగ్గురి తోనూ ఉండచ్చు ….. కానీ అనసూయ మాత అలా చేయలేదు. తన పాతివ్రత్య ధర్మాన్ని దాటకూడదు అని నిలబడింది. అందుకే త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు వారి కడుపున పుట్టడం జరిగింది. అది పాతివ్రత్య ధర్మం యొక్క గొప్పతనం. ఆమె ధర్మాన్ని పట్టుకుంది కాబట్టి ఈశ్వరుడే ఆమె కడుపున పుట్టడం జరిగింది. అలాగే పాతివ్రత్యమును పాటించకుండా ఉన్న అహల్య జీవితం చూడు.... గౌతమ మహర్షికి అహల్యకి వివాహం అయ్యింది . అహల్యకి గౌతమ మహర్షిని పెళ్లి చేసుకోవడం ఏ కోశానా ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ఆవిడని చూడడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడి యొక్క అందచందాలు, ఐశ్వర్య భోగాలు ,ఇంద్ర పదవి, దేవతలకి అధిష్టానం ఇలాంటివి ఉండటం వలన ....అహల్య మనసు పడింది . కానీ తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం ఇష్టం లేని గౌతమ మహర్షిని వివాహం చేసుకోవడం జరిగింది. అయినా కూడా ధర్మముగానే గౌతమ మహర్షితో అడవులకు వెళ్లి ఆశ్రమ జీవితం అనుభవిస్తూ..... ధర్మయుతంగా సంసారం సాగిస్తూ ఉన్నది. ఈమె మీద కోరిక ఉన్న ఇంద్రుడు కాస్త గౌతమ మహర్షి లేని సమయంలో అతడు నదీ స్నానానికి వెళ్లిపోయిన తరువాత ,ఈయన రూపం ధరించి ఆమె దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి తన భర్త గౌతమ మహర్షి రాలేదని .....గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు వచ్చాడని అహల్య గ్రహించింది. కానీ తనకి ఇంద్రుడి మీద కోరిక ఉండటం వలన , ఇంద్రుడు రూపంలో ఉన్న గౌతమ మహర్షి కామకోరికను కాదనకుండా తీర్చింది. అన్నీ తెలిసినా కూడా పాతివ్రత్య ధర్మమును గంగపాలు చేసి , ఇంద్రుడితో సుఖ భోగాలు అనుభవించింది . ఈ లోగా నది స్నానానికి వెళ్లిన గౌతమ మహర్షి రావటం .....తన రూప దారిగా ఉన్నవాడిని చూడటం...... తన రూపంలో ఉన్నది ఇంద్రుడని తెలుసుకోవడం...... తనకి తెలిసినా కూడా అహల్య తప్పు చేయటం.. పాతివ్రత్య ధర్మమును పాటించకపోవడంతో ఆయన కోపావేశాలకు లోనయ్యి .....ఆమెను బండరాయిగా మారిపోమని శ్రీరాముడి పాద స్పర్శ చేత పునఃరూపం పొందుతావని చెప్పడం జరిగింది. అలాగే ఇంద్రునికి ఏ యోనికోసమైతే ఆశపడ్డావో..... ఆ స్త్రీ యోనులే నీ శరీరమంతటా 1000 భాగాలుగా మారి 1000 కన్నులుగా ఉంటాయని చెప్పడం జరిగింది. నిజానికి ఇంద్రునికి 1000 కళ్ళు ఉంటాయంటారు. వెయ్యి కళ్ళు కాదు... 1000 యోనులు ఉంటాయి. ఈ విషయం అనుభవ పాండిత్యం పొందిన వాళ్లకే తెలుస్తుంది. అదే శబ్ద పాండిత్యంలో మర్మంగాలు అని చెప్పకుండా కన్నులు అని చెప్పడం జరిగింది. ఇక్కడ పాతివ్రత్య ధర్మం పాటించిన అనసూయ జీవితం చూడు ..... పాతివ్రత్య ధర్మం పాటించని అహల్య జీవితం చూడు. నీకే అర్థమవుతుంది . ఎవరు మోక్షం పొందారు..... ఎవరు అమోక్షం పొందారో నీకే అర్థమవుతుంది . కాబట్టి ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామన్నది పక్కన పెడితే...... ధర్మమును పట్టుకున్నామా లేదా ఆ ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే మాయలు, మర్మాలు దాటుకొని నిలబడగలిగామా లేదా అనేది తెలుసుకోగలిగితే చాలు . ఈ సాధన పరిసమాప్తి అవుతుంది.
శివనందిని:- స్వామి ! సాధనకి కులమతాలు ,గోత్రాలు ఇలాంటివి అడ్డు వస్తాయా?
రుద్ర స్వామి:- అమ్మ తల్లి! సాధన అనేదానికి ఇవేవీ అడ్డం రావు . కాకపోతే ఈ కులమతాలు అనేవి పుట్టుకను బట్టి వచ్చినవి కానీ ......నిజానికి శరీరానికి సంబంధించినవి కానే కాదు . ఇప్పుడు బ్రాహ్మణ కులం ఉంది . బ్రాహ్మణ కులం అంటే ఏమిటి , నిత్యం బ్రహ్మంతో సంచరించే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు . పూజాదికాలు చేసుకుంటూ ...........నిత్యం కూడా బ్రహ్మంతో ఉంటూ ... పూజారులుగాను, దేవాలయ అర్చకులుగాను ఉంటారు . అందుకని వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. ఇక్కడ ప్రస్తుత కాలంలో కలి ప్రభావం వలన కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? నిజానికి బ్రాహ్మణుడు ఉల్లిపాయ, చిన్నుల్లి పాయ,బంగాళదుంప ఇవేమీ తినకూడదని శాస్త్రవచనం . కానీ దీనిని మించి బ్రాహ్మణులు మాంసం, మద్యము , మగువ అని చెప్పి పరస్త్రీ వ్యామోహంలో పడిపోతున్నారు. చేసేది శివ పూజలు...... దూరేది దుంపసాని కొంపలు అవుతుంది . బ్రహ్మచర్యంతో ఉండరా నాయనా.... అంటే ఆ బ్రహ్మచర్యాన్ని గాలికి వదిలేసి .....గృహస్థానంలో ఉన్న పాతివ్రత్య ధర్మాన్ని గాలికి వదిలేసి.... అధర్మమైన పరస్త్రీ వ్యామోహంలో పడి... చేయకూడని పనులు చేస్తున్నారు. వీటన్నింటికి కారణం ఏంటి? కలియుగంలో ఉన్న కలి ప్రభావం అనుకోవచ్చు . అంతెందుకు ....సాధనకు ఉన్నతమైన బ్రాహ్మణ వంశంలోనే పుడితేనే మోక్షం వస్తుంది అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు.... యాదవ కులంలో పుట్టాడు....జగద్గురువు కాలేదా ? శ్రీరాముడు ఉన్నాడు... మరి ఆయన రాజుల కులంలో పుట్టాడు . మరి ఆయన అందరికీ దైవంగా మారలేదా? ఇక్కడ పుట్టుక అనేది విషయం కాదు. గుణమును బట్టి కులము, మతము నాలుగు విధి విధానాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. కానీ పుట్టుకను బట్టి అని ఎక్కడా చెప్పలేదు. మన యొక్క గుణమును బట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో కాకుండా, ఇతర కులంలో పుట్టిన వాడైనా కూడా..... బ్రహ్మంతో నిత్యం ఉండేలా.... అంటే నిత్యశివారాధన ,విష్ణు ఆరాధన, దేవి ఆరాధన చేసుకుంటూ ఉన్నాడనుకో..... వాడి సాధన పరిసమాప్తి చేసుకుంటే ..... వాడిది మోక్ష జన్మ అవుతుంది . వీడు ఫలానా కులంలో పుట్టాడు ... ఫలానా గోత్రంలో పుట్టాడు.... ఫలానా మతంలో పుట్టాడు.... వీడికి నేను మోక్షం ఇవ్వను అని ఎక్కడ చెప్పలేదు. అంతెందుకు ..... ఫకీరులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే తాయత్తు మనలో ఉన్న భూతప్రేత పిశాచాలని బయటకు తీసేస్తుంది . అంటే ఈ ఫకీర్ బాబాలో మహత్యం లేదంటావా? ఉంది . వాళ్ళ యంత్ర, మంత్ర , తంత్రములు కూడా నెగిటివ్ శక్తి అయిన భూత ప్రేత పిశాచాలను వదిలించడానికి ఉపయోగిస్తారు. మన హిందూ మతంలో స్మశానవాసిగా ఈశ్వర తత్వం ఎలా అయితే ఉందో వాళ్లకి ఉంది. ఇప్పుడు క్రైస్తవ ధర్మంలోకి వెళ్తే వాళ్ళు క్యాండిల్స్ ఉపయోగించి జ్యోతులు వెలిగిస్తారు. ఇక్కడ పదార్థమే మారుతుంది . జ్యోతి అనే జ్ఞానం అయితే ఉన్నది . ఇక్కడ ఒకళ్ళ కులం గొప్ప, ఒకళ్ళ మతం ఎక్కువ , ఒకళ్ళ మతం తక్కువ అనేది లేదు . దేవుడు దృష్టిలో కులాలు, మతాలు లేవు. అందరూ సమదృష్టితో , సమదర్శనంగా ఏకత్వం ఉంటుంది. అంతెందుకు .....దత్తాత్రేయుడు సర్వమత సంపన్నుడు. ఒకప్పుడు మహమ్మదీయుడుగా కనపడతాడు... ఒకప్పుడు ఫకీరు గా కనపడతాడు . ఒక్కొక్కసారి సాధువుగా కనపడతాడు . ఒక్కొక్కసారి అవధూతగా కనపడతాడు. అంతెందుకు..... షిరిడి సాయిబాబా ఉన్నారు . ఆయన రెండు విధివిధానాలు చేశారు. ఒకప్పుడు ఫకీరు దగ్గరికి వెళ్లి సాధన చేశారు. మరొకసారి వెంకూసా అనే ఆయన దగ్గరికి వెళ్లి సాధన చేశారు . ఇప్పుడు ఆయన సర్వమతములు ఆరాధించే గురువు అయ్యారు. దేవాలయంలో ఉండకుండా మసీదులో ఉండి తులసి చెట్టును పెంచడం జరిగింది. దీపారాధన చేయటం జరిగింది. ఇటు రంజాన్ చేశారు ...అటు శ్రీరామనవమి చేయించారు . ఎక్కడా కూడా మతాలు అనేవి లేకుండా ఏకమతంలోకి వచ్చాడు. అక్కడ వాళ్లకి అల్లాగా కనపడ్డాడు... యేసుగా కనపడ్డాడు .... గురునానక్ గా కనబడ్డాడు. కృష్ణుడిగా కనబడ్డాడు. కుమారస్వామిగా కనపడ్డాడు . అమ్మవారిగా కనబడ్డాడు. శివుడిగా కనబడ్డాడు . దత్తాత్రేయుడుగా కనబడ్డాడు. యద్భావం తద్భవతి. తనలో అన్నీ ఉన్నాయని నిరూపించాడు. ఇప్పుడు ఆయనకు కూర్చున్న భంగిమ చూడు . దక్షిణామూర్తి కూర్చున భంగిమ ఇది ఒకలాగే ఉంటుంది . ఆయన రాతి మీద కూర్చున్న భంగిమ.... దక్షిణామూర్తి రాతి మీద కూర్చున్న భంగిమ ఒకటే ఉంటుంది. భంగిమలో తను దక్షిణామూర్తి అవతారమని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు అవతార పురుషుల గురించి వాళ్ళు ఏ కులం, ఏ మతం ఇవన్నీ అనవసరం. ఆ అవతారం ఏం చెప్పాలనుకుంటుంది.... ఏం చేయాలనుకుంటుంది .....ఏం చెప్తుంది .....ఏం చేస్తుంది .....ఏం చేసిందో అనేది తెలుసుకోవడం ముఖ్యం. దాని నుంచి మనం తెలుసుకుని మనలో మార్పును పొంది ఆచరణలో పెట్టడం చేయాలి. ఇప్పుడు హిందూ ధర్మం లో మొత్తం 33 కోట్ల దేవతలు ఉన్నారని చెబుతారు . నిజానికి 33 మంది దేవతలు ఉన్నారు . భయానికి శివుని పెట్టుకుని పూజలు చేస్తారు . భోగాలకి విష్ణువుని పెట్టుకుంటారు. ధైర్యానికి హనుమంతుని పూజ చేస్తారు... విజ్ఞానానికి సరస్వతిని పూజ చేస్తారు. ధనానికి లక్ష్మీదేవిని పూజ చేస్తారు. ఇలా పలు రకాలు .... పలు దైవాలు ....యద్భావం తద్భవతి అన్నట్టుగా ఒకే దైవంలో చూడకుండా వివిధ రూపాలలో మనసుకు నచ్చినట్టుగా.... మనసుకు తగ్గట్టుగా ఆరాధన చేయడం అనేది హిందూ ధర్మం చెప్పింది . ఇక్కడ హిందూ మతం అనేది లేదు.... ఎక్కడ ఏ మతాలు లేవు ....అన్నీ కూడా ధర్మాలే ...హిందూ ధర్మం ,బుద్ధ ధర్మం ,జైనధర్మం ,క్రైస్తవ ధర్మం, మహమ్మదీయ ధర్మము అని చెప్పడం జరిగింది. ధర్మాలే ఉన్నాయి.... మతాలు లేవు ....మతం అనేది మిడిమిడి జ్ఞానులు ....తమ అభిమతాలను మతాలుగా మార్చడం వలన.....గొడవలకి కారకులు అవుతున్నాయి. మా మత ధర్మం గొప్పది అంటే.... మా మత ధర్మం గొప్పది అని .....మా కులం గొప్పది అంటే మా కులం గొప్పది అని ..... ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. పంచభూతాలకు లేని కులమతాలు..... పంచభూతాలతో ఏర్పడిన మనుషులకి ఎక్కడి నుండి వస్తుంది? హిందూ నీరు ,మహమ్మదీయనీరు ,క్రిస్టియన్ నీరు... అని ఎక్కడైనా ఉందా ? ఉన్నది మంచినీరు, బురద నీరు, కలుషితనీరు అంతే . స్వార్ధంగా ఉంటే నీ మనసు కలుషితమవుతుంది . నిస్వార్ధంగా ఉంటే నీ మనసు శుద్ధి అవుతుంది అంతే. దీనికి ఎక్కడ కులమతాలు ఉన్నాయి . కులమతాల అవసరం ఏముంది ? మన కోరికకు తగ్గట్టుగా ....మన భావానికి తగ్గట్టుగా ....దేవతలు ఉన్నారని మన హిందూ ధర్మం చెబుతుంది . అదే క్రిస్టియన్ ధర్మం వచ్చేసరికి ఏకధర్మం, ఏక దైవం , యేసు ప్రభువు అని చెప్తుంది. మహమ్మదీయ ధర్మం వచ్చేసరికి నామరూపాలు లేని నిరాకార శూన్యతత్వమును చెబుతుంది . ఈ తత్వానికి వెళ్ళటానికి గురునానక్ సాంప్రదాయం ప్రకారం గురువుగా ఉండి గురువును ఆరాధన చేస్తే ఆ సాంప్రదాయం ఉపయోగపడుతుందని గురునానక్ సిద్ధాంతం చెబుతుంది . అదే జైనధర్మానికి వచ్చేసరికి, సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని.... సాధన సాధ్యతే సర్వం సాధ్యమని సర్వ పరిత్యాగి ఎవరైతే చేస్తారో వారు నగ్నంగా మారే స్థితికి వెళతారు అని జైనులు చేసి చూపించడం జరిగింది. తనలో ఉన్న సాధన శక్తిని విశ్వశక్తికి ఎలా అనుసంధానం చెయ్యొచ్చు .....శూన్యంలో ఎలా శూన్యం అవ్వాలో అనేది బుద్ధుడి ద్వారా బౌద్ధమతం చెబుతుంది. ఇక్కడ ప్రతిదీ మనం లోతుగా ఆలోచించాలి గాని .....వాళ్లు ఏం పొందారు? ఏ అనుభవాలు పొందారు? ఏ అనుభవాలు లోకానికి ఇచ్చారు? అనేది ఏ మార్చకుండా .....ఏమీ మార్చకుండా చెప్పగలిగితే .....తెలుసుకోగలిగితే ఆచరించగలిగితే ....చాలు. గొర్రెల కాపరికి యేసయ్య .....గోవుల కాపరికి కృష్ణుడు. . వీళ్లిద్దరూ కూడా నిజానికి ఒకే తత్త్వం కలిగి ఉన్నారు. కానీ ఆయన్ని విభజించి చూడడంతో తేడా వచ్చింది. ఇప్పుడు పంచ మత ధర్మాలు కాస్త పంచభూతాలే . కాలం నుంచి వచ్చిన పంచభూతాలని విడగొట్టడం వల్ల పంచ మతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కాలం ప్రకారంగా చూసుకుంటే పంచభూతాలు కలిస్తే కాలము. కాలం విడిపోతే పంచభూతాలు ఏర్పడతాయి. మత ధర్మం ఒకటే . మతం అనేది లేదు . పుట్టుక అనేది మతానికి సంబంధించింది కాదు. కులానికి సంబంధించింది కాదు .గుణానికి సంబంధించింది ...... గుణమును బట్టి మత ధర్మాలు అనేవి ఉంటాయి. అంతే ....ఇక్కడ ఒకరి కులం ఎక్కువ.... ఒకరి కులం తక్కువ.... ఒకరి మతం ఎక్కువ ....ఒకరి మతం తక్కువ ....అనేది ఏమీ లేదు . వాడి పుట్టుక ఏమిటి? వాడి గుణం ఏమిటి? అనేది ....వాడు పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలాలను బట్టి ఆధారపడి ఉంటుంది . అంతేకానీ సాధనకి కులమతాలతో ఎలాంటి సంబంధం లేదు. .అంతెందుకు ....మన హిందూ ధర్మంలోకి వెళ్లేసరికి దేవాలయంలో విగ్రహ మూర్తిని చూసేసరికి , ఈయన ఉన్నాడు, ఈయనకి మన కష్టసుఖాలు చెప్పుకోవాలి .మన ఈతి బాధలు చెప్పుకోవాలి. మనం నిత్యం చేసే దీపారాధనలు ,అర్చనలు ,నైవేద్యాలు ,విగ్రహారాధనలు ద్వారా ఆయన ఉన్నాడు.... మనకి తోడుగా ఉంటాడు ....మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు ....మన సమస్యలకి మార్గం చూపిస్తాడు ....మనం చేసిన పాపాలన్నీ తొలగిస్తాడు.... మనకి పుణ్యఫలితాలు ఇస్తాడు ....తెలిసో తెలియక చేసిన దోషాలు తీసేస్తాడు ....చెడు కర్మ ఫలితాలు తీసేస్తాడు.... పుణ్యకర్మ ఫలాలు పెంచుతాడు అని ఇష్టదైవ ఆరాధన చేస్తాము . అదే క్రిస్టియన్ మత ధర్మానికి వెళ్లేసరికి, ఆ చర్చి ఫాదర్ ప్రత్యక్షంగా ఉండి ....వాళ్ళ యొక్క ఈతి బాధలు అన్నీ కూడా విని.... వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా విని ....దోషపరిహారార్థం ఏం చేయాలనేది చెబుతారు . ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగా ....ప్రత్యక్షంగా ఉండి ఎలా ఆ పరిహారాలు చేసుకుని , సమస్యల నుంచి బయట పడాలో చెప్తారు. అలాగే సిక్కు మత స్థాపకుడైన గురునానక్ గురించి తీసుకుందాం.... ఆయన భోగ సంబంధ విషయాలు, అలాగే యోగ సంబంధ సాధన సందేహాలు, ప్రత్యక్షంగా ఎవరి సమస్యలకు తగ్గట్టు వాళ్లకి పరిష్కారాలకు చెప్తూ ఉండేవాడు . పరోక్ష దేవుడ్ని ప్రత్యక్ష గురుస్థానంలో ఉండి సాధన చేసుకోవచ్చు..... భావించుకొని ఆరాధన చేసుకోవచ్చు అని..... మనకి సిక్కు మత ధర్మం ద్వారా తెలుస్తుంది. అలాగే జైన మతం ఉంది. జైన మతంలో సర్వపరీత్యాగి అనగా మోక్ష సన్యాసి ఎలా ఉండాలి? ఏ విధంగా ఉంటాడు? ఏ విధంగా సాధన చేయాలి? మనలో ఉన్న కోరికలు ఎలా ఉంటాయి? అరిషడ్వర్గాలను ఎలా జయించి అదుపు చేయాలి, సప్తవ్యసనాలను ఏ విధంగా వదిలించుకోవాలి ....ఎలా అణచి వేసుకోవాలి అనేది జైన ధర్మంలో చెప్పడం జరిగింది. అలాగే బుద్ధ అవతారంలో మనసు మీద ఆధిపత్యం పొందటం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం పొందటానికి..... అదుపులో ఉంచుకోవడానికి..... సాధన విధివిధానాలు చెప్పడం జరిగింది. ఇక మహమ్మదీయ మతంలో మనలో నెగిటివ్ శక్తి భూత, ప్రేత పిశాచాల వలన యక్షిణిల వలన వాటి నుంచి ఈతి బాధలు తగ్గించడానికి మసీదులు, మసీదులో ఉన్న ఫకీర్లు, బాబాలు, తన వంతు సహాయ సహకారాలు ఎలా అందించాలి .....విశ్వంలో ఉన్న నెగటివ్ శక్తిని పాజిటివ్ గా ఎలా మార్చాలి అనేది మహమ్మదీయ ధర్మం చెప్పడం జరిగింది. ఇక్కడ పంచ మత ధర్మాలు కూడా నిస్వార్ధంగా ఉంటే అవి మనకి ఉపయోగపడతాయి. కానీ నిజానికి అవి నిస్వార్ధంగానే ఉన్నాయి. వీటిని ఆచరించే మానవుడు స్వార్థానికి లోనై వాటిని అధర్మంగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. గొర్రెల కాపరికి గోవుల కాపరికి ఏం తేడా లేదు. ఇప్పుడు నీళ్ళని హిందీలో పాని అంటారు ,ఇంగ్లీషులో వాటర్ అంటారు, తెలుగులో మంచినీళ్లు అంటారు . ఇక్కడ నీళ్లు మారలేదు.... నీళ్ల పేర్లు మారినాయి . దైవం పరబ్రహ్మం ఒక్కటే . పరబ్రహ్మాన్ని చూపించే పంచభూతాలు కాస్త పంచ ధర్మాలుగా మారాయి. చూసేవాడిని బట్టి ఉంటుంది . చూసేవాడు నిస్వార్ధంగా ఉంటే ధర్మంగా కనపడుతుంది . చూసేవాడు స్వార్ధపూరితంగా ఉంటే ధర్మ నియమాలు కాస్త అధర్మంగా కనిపిస్తాయి. వాటితో పాటు లోక వినాశనం అవుతుంది. ఈ మత ధర్మాన్ని చెప్పే పీఠాధిపతులు, మఠాధిపతులు, ఫకీర్ బాబాలు ,చర్చి ఫాదర్లు ,గురువులు వీళ్ళందరూ కూడా నిస్వార్ధంగా ఉండి .... గురు బోధ చేసినప్పటికీ అర్థం చేసుకునేవాడు ....సాధన చేసుకునేవాడు .....స్వార్థపూరితంగా మారితే, వాళ్లు మాత్రం ఏం చేయగలరు ఏమీ చేయలేరు కదా! అందుకోసమే సాధనకి మనం నిస్వార్ధంగా ఉన్నామా? స్వార్థంగా ఉన్నామా? అనేది ఉంటుంది. నిస్వార్ధంగా ఉంటే మన సాధన ధర్మపరంగా వెళుతుంది. అదే స్వార్థంగా ఉంటే మన సాధన అధర్మంగా వెళుతుంది. ఏ మతం చెప్పినా కూడా...... ఏ మత ధర్మం అయినా కూడా..... ఏ మత ఆచారాలైనా కూడా..... నిస్వార్ధంగా ఉంటూ నిష్కామ కర్మ చేసుకొని, ఇతరులను ప్రేమించమని, ఇతరులను గౌరవించమని చెప్పడం జరుగుతుంది. అంతకుమించి ఇంకేమీ లేదు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవడం కన్నా అపార్థం ఎక్కువగా చేసుకుంటున్నారు. నిస్వార్థం కాస్త స్వార్థపూరితమై , జ్ఞానం పొందవలసిన చోట అజ్ఞానమును పొంది.... తన మతం గొప్పది అంటే తమ మతం గొప్పది అని.... తమ కులం గొప్పది అంటే తమ కులం గొప్పది అని.... పురాణ ఇతిహాసాలలో ఉన్న లోటుపాట్లను ఆధారం చేసుకుని చిన్న తప్పును పెద్ద తప్పుగాను, పెద్ద తప్పును చిన్న తప్పుగా చేసి తమ మత ధర్మాలను గొప్ప అని చెప్పడంతోనే మానవ సమాజం ఉండిపోయింది. దీనికి కారణం .....ఇది కలియుగం . కలి ప్రభావం.... ఏం చేయగలం ....ఏం చేయలేం ...చూస్తూ ఉండడం తప్ప. అంతెందుకు.... తను చేసిన తప్పులు ఇంట్లో వాళ్లకి చెప్పుకోలేక ,కుటుంబ సభ్యులకి చెప్పుకోలేక, బంధుమిత్రులకు చెప్పుకోలేక ....కొంతమంది స్త్రీ మూర్తులు చర్చి ఫాదర్ కి చాటుగా ఉండి చెప్పడం జరుగుతుంది. నిజమైన చర్చి ఫాదర్ అయితే , ఎవరికీ చెప్పకుండా తనకి తోచిన పరిహార దోషాలు చెప్పి ....ధైర్యం చెప్పి పంపిస్తారు . అదే స్వార్ధపూరితమైన చర్చి ఫాదర్లు ఈమె వ్యక్తిగత విషయాలన్నింటినీ ఇతరులకు లేదా తన కుటుంబ సభ్యులకు చెప్తానని బెదిరించి ....ఆవిడ శరీరం మీద, ఆవిడ డబ్బులు మీద పడిపోయి ఆమెను దోచుకుని బతుకుతున్నారు. కొంతమంది అలాగే లామాలు ఉన్నారు. గోమూత్రం ఎంత పవిత్రమైందో మా మూత్రం కూడా అంతే పవిత్రమైంది అని చెప్పి..... ఆ మూత్రాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించేవారు ఉన్నారు. అంతెందుకు.... భక్తిని వ్యాపారంగా చేసి.... సుమారుగా ఒక 25 కంపెనీలు పెట్టిన గురువులు ఉన్నారు. కోటానుకోట్ల సంపాదించిన వాళ్లు ఉన్నారు. నిజానికి ఈ ఆస్తిపరులు భోగ జీవితంలో ఉండేవాళ్లు కాదు. యోగ జీవితంలో ఉండే భక్తి వ్యాపారం చేసే పీఠాధిపతులు ,మఠాధిపతులు ,నకిలీ గురువులు, నకిలీ పీఠాధిపతులు, ఎంతోమంది ఉన్నారు. అసలు సుమారుగా 100 కోట్ల నుంచి పదివేల కోట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తిని వ్యాపారంగా చేయబట్టి ....ఏదో ఒక మఠం ,ఆశ్రమము, పీఠమో పెట్టి ... ఈతి బాధలన్నీ తీరుస్తామని చెప్పి..... వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ రూపంలో సేకరించి..... వాళ్ళు రహస్యంగా చెప్పిన మాటలు అన్నింటిని కూడా బహిర్గతం చేస్తామని బెదిరించి ,భయపెట్టి, బాధపెట్టి ....వారి మానాలను ఆస్తులను చేజిక్కించుకున్న వాళ్లు ఎంతోమంది నకిలీ మతమ గురువులు ఉన్నారు. నమ్మకాన్ని అమ్మకం చేసేవాళ్లు నకిలీ గురువులు, నకిలీ యోగులు, నకిలీ పీఠాధిపతులు, మఠాధిపతులు ,మత ధర్మ పాఠకులు ఉన్నారని అందరికీ తెలుసు. మోసపోతున్నామని తెలుసు.... మోసం చేస్తున్నారని తెలుసు. అయినా కూడా నమ్మి మోసపోతూ ఉంటారు . చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని మన పెద్దలు ఉవాచ ఉండనే ఉన్నది కదా ! ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే..... అన్నింటిని వదిలేశారు..... అన్నింటిని వదిలేసిన వాడు , మమకారం వదిలేసిన వాడు, ధనం మీద ఆశ వదిలేసిన వాడు, కామం మీద ఆశ వదిలేసిన వాడు ,ఒక మత ధర్మం ఎంచుకొని..... దాన్ని తన అభి మతంగా మార్చుకొని .... మఠమో , పీఠమో పెట్టేసి ....మళ్ళీ వీటన్నింటినీ ఆచరించడం మొదలుపెట్టారు . అన్ని వదిలేసినవాడు.... అన్ని ఆశించడం ఏంటి? డబ్బు అవసరం లేదు అని ఆశ్రమానికి అధిపతిగా ఉన్నవారు కాస్త భక్తుల యొక్క డొనేషన్లు తీసుకోవడం మొదలుపెడతాడు. అక్కడి నుంచి, ఆ తర్వాత ఇచ్చేదాకా వేధించడం మొదలు పెడతాడు . ఈ డబ్బులు దేనికి అంటే ఇది ఆశ్రమ అభివృద్ధి కోసం అని చెప్తాడు. ఒక ఆశ్రమము నుంచి 100 ఆశ్రమాలు ...ఇలా సంస్థానాలు పెట్టుకొని ఏం సాధిస్తున్నారు. ప్రేమగా భక్తుల విరాళాలు తీసుకోవడం మానేసి , బలవంతంగా ఆస్తులు రాయించుకొని ,అన్నదానాలకి ఆశ్రమాన్ని అభివృద్ధికి అని బికారులుగా ఉన్న ఆశ్రమ అధిపతులు.... కాస్త కోటీశ్వరులు అవుతున్నారు. కోటీశ్వరులుగా మారుతున్నారు . భక్తుని యొక్క ధనమానాలను అపహరించి .....అపర కుబేరులుగా మారుతున్నారు. ఇది అంతా ఎందుకు ? చెట్టు కింద కూర్చుని ..... జ్ఞానబోధ చేస్తే వినరా? పుస్తకం రాసి చెప్పాల్సింది రాసి చెప్తే వినరా? అంతెందుకు మన పరమహంసనే ఉన్నాడు.... ఆయన గుప్తయోగిగా మారి గుప్తసాధన చేస్తున్నాడు . తను పొందిన అనుభవాలన్నీ కూడా సత్య అనుభవాలని ప్రకృతి నిదర్శనాలు చూపించిన అన్నింటినీ కూడా ఏ మార్చకుండా, ఏమీ మార్చకుండా.... ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటూ వచ్చారు. ఆ పుస్తకం ఎంత మందికి అర్థం అవుతుంది.... మంచిగా అర్థమవుతుందా? చెడుగా అర్థం అవుతుందా? వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు. గౌరవ అగౌరవాల గురించి గానీ..... అర్థం అవుతుందా లేదా ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు . తనకి సంబంధం లేదు అనుకున్నాడు. నాకు అవసరం లేదు అనుకున్నాడు. తన పొందిన ధ్యాన అనుభవాలన్నీ యధావిధిగా ఒక పుస్తకంలో రాసేసి ...లోకానికి ఇచ్చేసి... పరమ పరమహంస కాస్త పరమపదించాడు. ఆయన పుస్తకం అమ్మాలనుకుంటే 10 లక్షల లేదా 10 కోట్లకైనా అమ్మొచ్చు. కానీ ఆయన దాన్ని వ్యాపారంగా చేసుకోదలుచుకోలేదు కదా ! ఇప్పుడు ఆయన కావాలనుకుంటే భక్తులు పదుల నుంచి లక్షల్లో ఉండొచ్చు. ఆయనకి పీఠం పెట్టాలి ....ఆశ్రమం పెట్టాలి ... మఠం పెట్టాలి అని.... ఆయన…….ఏనాడు,అనుకోలేదు. నిస్వార్ధంగా, గుప్తంగా ఉండి తను తెలుసుకున్న విషయాన్ని ఉచితంగా పుస్తక రూపంలో.. మాధ్యమాల్లో పెట్టేసి ఆయన వెళ్లిపోయాడు. అందాల్సిన వాళ్లకి అందుతుంది ....తెలుసుకొనే వాళ్ళు తెలుసుకుంటారు.... అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది.... అర్థం అయినా అర్థం కాకపోయినా తనకి సంబంధం లేదు అనుకుని.... తను చెప్పవలసింది చెప్పేసి ....మౌనంగా ఉండి గుప్తయోగిగా వెళ్లిపోయారు. అలా ఎందుకు చేయరు? ఆయనేమీ మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు పెట్టలేదే! అనుకుంటే చెయ్యొచ్చు ....పెట్టొచ్చు.... వందల్లో ,లక్షల్లో , కోట్లల్లో ఏర్పడతారు భక్తులు.... పరమహంసగారు ఇంకా బతికి ఉండి ఉంటే ....ఈపాటికి పీఠము లేదా మఠం ...నకిలీ భక్తులు ,ప్రసాద భక్తులు ఏర్పాటు చేసేవారు . అవసర భక్తులు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని, ఆ అవకాశాలను తోచిపుచ్చారు. నాకు ఈ పీఠాలు ,మఠాలు అక్కర్లేదు . నేను తెలుసుకున్నది సత్యమా కాదా అనేది తెలియాలి. సత్యం అని ప్రకృతి నిరూపించాలి అనుకున్నాడు . ఆ సత్య జ్ఞానాన్ని యధావిధిగా ఆయన రాసుకుంటూ వెళ్లి .....లోకానికి అందించాడు. ఎవరిని విమర్శించలేదు . ఎవరిని దూషించలేదు . తను పడిన ఈతి బాధలు.... తను పొందిన అనుభవాలు.... తను పడిన కష్టాలు.... తను ఏ విధంగా మాయలో పడ్డారు.... ఏ విధంగా మళ్లీ లేచారో .....తన అనుభవాలన్నీ యధావిధిగా చెప్పారు . ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా.... రాబోవు కాలంలో కూడా... ఈ విధంగా మోక్ష అనుభవాలు ఎవరూ పొందలేరు. పొందరు కూడా.... పొందిన రాయలేరు... రాసినా అర్థం కాదు... ఇక మొదటివాడు మరియు ఆఖరివాడు పరమహంస మాత్రమే అని నా మనసు బలంగా నమ్ముతుంది . అలా నిస్వార్ధంగా ఉండి వెళ్ళిపోవాలి కదా ! ఆయన అభిమతాన్ని మతంగా ఎప్పుడూ చెప్పలేదు . సర్వమత సమ్మేళనాన్ని అనుసరించాడు. ఈ మతం గొప్పది ... ఆ మతం గొప్పది కాదు.....ఈ కులం గొప్పది ...ఆ కులం గొప్పది ... అని ఎక్కడా చెప్పలేదు . ఆ మతాలు, ఆ కులాల వెనక ఉన్న అర్థం... పరమార్థం ఏమిటో లోకానికి చెప్పాడు. అంతెందుకు! ఇప్పుడు నీకు వచ్చే సాధన సందేహాలు అన్నీ కూడా ఆయన రాసిన యోగ దర్శనంలో 600 ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెప్పడం జరిగింది. వాటినే నువ్వు ఇప్పుడు తిప్పితిప్పి అడుగుతున్నావు. కాకపోతే ఇప్పుడు వీటికి నేను ఎందుకు సమాధానం చెప్తున్నాను అంటే ....ఒక స్త్రీమూర్తి సాధకురాలు అయితే ....ఎలాంటి సందేహాలు ,సమస్యలు వస్తాయో నాకు తెలియదు. అవి నీ పరంగా.... నీకేమైనా ఆటంకాలు సమస్యలు వస్తే అవి ఎలా ఉంటాయో నేను తెలుసుకోవడానికి .....నీకు ఆ సమస్యల సందేహాలు తీర్చడం జరుగుతుంది. అసలు అడిగేవాడు ఎవడు ....ప్రశ్నించేవాడు ఎవడు? దానికి సమాధానం చెప్పేవాడు? ఎవరు లేరు....ప్రశ్నించేది మనసే ....సమాధానం ఇచ్చేది మనసే ....సంతృప్తి పొందేది మనసే ....అలాంటప్పుడు ప్రశ్నించి సమాధానం తెలుసుకోవడానికి ఏముంది? ఏదో ఉంది , ఏదో తెలుసుకోవాలి అనుకోవటమే మాయ . ఏమీ లేదు అని అనుభవ అనుభూతి పొందటమే సాధన పరిసమాప్తి. అసలు నీలో ప్రశ్నించేది ....సమాధానం వెతకమని చెప్పేది ఎవరు? నీ మనసే కదా ! ఈ మనసు చేసే మనోమాయలు.... జ్ఞాన మాయలో ఎందుకు పడుతున్నావు ? ప్రశ్నలు వెతకడం మొదలుపెడితే ....సమాధానాలు వస్తూనే ఉంటాయి. అసలు ప్రశ్న లేకపోతే సమాధానమే లేదు . ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ప్రశ్నలు లేనిదే సమాధానము లేదు . సమాధానం లేనిదే ప్రశ్న లేదు. కాబట్టి ఇవి సాధనా సందేహాలు అవ్వచ్చు.... ధర్మసందేహాలు అవ్వచ్చు.... ఏవైనా కొంత వరకు తెలుసుకో . తెలుసుకునే కొద్ది అంతులేని కథగా ఇవి వెళ్లిపోతూనే ఉంటాయి. ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా సాధన చేయాలి ? అనేది నీ చేతుల్లో లేదు. నిజానికి నువ్వు కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు . కొత్తగా పొందేది ఏమీ లేదు . ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు . ఆ ఏదో ఉందని తెలుసుకోవాలని చివరికి ఏమీ లేదని తెలుసుకుంటావు . పరమహంస కూడా సాధనకు ముందు .....ఏదో ఉందని సాధన చేశాడు . చివరికి ఏమీ లేదు ఉన్నదీ శూన్యమే అని తెలుసుకున్నాడు. మనకి శాస్త్రాలలో శివుడు ఒక పక్క సాకార స్వరూపం అని చెప్తారు. మరొకవైపు నిరాకార బ్రహ్మం శూన్యం అని చెప్తారు. కానీ పరమహంస కాస్త..... శబ్ద పాండిత్యం కన్నా, అనుభవ పాండిత్యం మిన్నా అని ఆకారుడు కాస్త నిరాకారుడు ఎలా అయ్యాడో తెలుసుకున్నాడు. అనుభవ అనుభూతి పొందాడు . ఆ అనుభవాలు యధావిధిగా రాశాడు . చెప్పాడు.... అదే నువ్వు కూడా స్త్రీ పరంగా సాధన చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది . సాధన సందేహాల దగ్గర, ధర్మసందేహాలు దగ్గర సాధన ఆగిపోతే నువ్వు ఏం తెలుసుకుంటావు ? అసలు నువ్వు ఎలా ముందుకు వెళ్తావు ? ప్రశ్నించేందుకు.... తెలుసుకునేది ఎందుకు .....అసలు నువ్వే సాధన చేసి తెలుసుకో ....అప్పుడు ప్రశ్నించేది ఎవరో తెలుస్తుంది . సమాధానం చెప్పేది ఎవరో తెలుస్తుంది. అన్ని నువ్వే ....విడిగా కనపడుతున్నాము కాబట్టి మేము ఉన్నామని అనుకుంటున్నాము. వాస్తవానికి ఉన్నది నువ్వే. నువ్వు శివున్ని ఆరాధన చేస్తే అంతా శివమయంగా కనిపిస్తుంది. ఏమీ లేదు సర్వం శూన్యం అని ఆరాధన చేస్తే అంతా శూన్యంగానే కనిపిస్తుంది. నువ్వు కూడా ఉండవు . నేను కూడా ఉండను. ఉన్నదంతా శూన్యం అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళు . అప్పుడే నీ సాధన పరిసమాప్తి అవుతుంది . సాధనా సందేహాల దగ్గర కూర్చుంటే ఏంటి ఉపయోగం?
శివనందిని:- సరే స్వామి! ఈరోజు నుంచి నేను ఎలాంటి సాధన సందేహాలు అడగను .. ఒకవేళ నాకు సాధన సందేహాలు వస్తే, నేను సాధన చేసి ధ్యానఅనుభవాలు పొంది.... నాకు నేనే సమాధానం వెతుక్కుంటాను . వాటితో విచారణ చేసుకొని సంతృప్తి పడతాను . మీరు చెప్పింది కూడా నిజమే ! మీరు చెప్పిన సమాధానాలకి నేను సంతృప్తి చెందాల్సిన అవసరం కూడా లేదు. ఏమో ! మీరు తెలుసుకున్నది నిజమో కాదో నాకు ఎలా తెలుస్తుంది ? నా అంతట నేను సాధన చేసి తెలుసుకుంటే..... అర్థం చేసుకుంటే..... ఆ సమాధానాలతో సంతృప్తి దొరుకుతుంది . సందేహాలు వచ్చేకొద్దీ పెరుగుతున్నాయి తప్ప ,తగ్గట్లేదు . ఒక కోరిక కి 100 కోరికలు ఎలా అయితే పుడతాయో..... అలా ఒక సందేహానికి 100 సందేహాలు కలుగుతూ.... పెరుగుతూనే వస్తున్నాయి. నిజంగా ఒక అంతులేని కథలాగే ఉంది . నిజమే ....నాకు అర్థం అయింది. కాకపోతే నేను సాధనకి వెళ్లేటప్పుడు సాధన పరిసమాప్తి చేసుకునేటప్పుడు స్త్రీ పరంగా ఎలా ఉంటాయి? వాటిని ఎలా పరిష్కారం చేయాలి అని తెలుసుకోవాలని నా మనసు కోరుకుంది . కానీ నేను కూడా పరమహంస సాధనా స్థితిలో ఎలాంటి ధర్మ సందేహాలు పొందారో ....ఎలాంటి అనుమాన భయాలు పొందారో.... నేను కూడా అలాగే పొందుతాను అని నాకు అర్థం అయింది . ఈ భయాలన్నీ తీసి పక్కన పెట్టాలని అర్థమైంది. గ్రహించాను . తెలుసుకున్నాను . అసలు నాకు ప్రశ్నించేది ఎవరు? దీనికి సమాధానం వెతకమని చెప్పేది ఎవరు? ఆ సమాధానానికి సంతృప్తి పడేది ఎవరు? నాకు అర్థమైనంత వరకు మనసు అని తెలుస్తుంది. అది ఎక్కడుంది.... ఏమిటి? “నేను” ఎక్కడుంది? నేను అంటే ఏమిటి? నేను కానీ నేను ఏంటి అనేది.... నేనే సాధన చేసి తెలుసుకోవాలి అనుకుంటున్నాను . కాబట్టి నాకు మోక్ష సన్యాస దీక్ష ఇవ్వండి. ఈ దీక్షలో నాకు గురు మంత్రమును ప్రసాదించండి . అంతకుమించి మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు ...
రుద్రస్వామి:- అమ్మ ! మోక్ష సన్యాస దీక్ష ఇవ్వాలి అనుకుంటే ... అందుకు నీకు అర్హత, యోగ్యత, యోగం ఉన్నాయా ? లేవా? అనేది .....ప్రకృతి పరీక్షలు పెడుతుంది . అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు ఖచ్చితంగా పరీక్షలు పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ,అమ్మవారు సాధనకి ఆటంకాలు.... అవాంతరాలు... మాయలు కలిగించే వారు. ఎందుకంటే ఎవరైతే సాధన పరిసమాప్తి చేసుకొని విశ్వ జగన్నాటకం నుండి తమ పాత్రను తీసి వేసుకుంటారో .....అలా చేసే వాళ్లంటే అమ్మవారికి , శ్రీకృష్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు. ఎవరికి వారు ఇలా పూర్ణజ్ఞానం పొంది వెళ్ళిపోతే ఈ జగన్నాటక పాత్రలు తగ్గిపోతాయి. నాటకం ఆడే వాళ్ళు ఉండరు . ఆడించే వాళ్ళు ఉండరు . అందుకని వీళ్ళకి అసలు మోక్షం పొందే అర్హత, యోగ్యత ,యోగం ఉందా.... లేదా..... అని ఒకటికి పది సార్లు ప్రకృతిగా అమ్మవారు, శ్రీకృష్ణుడు పరీక్షలు పెడతారు. వీరిద్దరూ కలిసిన రూపమే జగన్మోహిని రూపం. కాబట్టి నిజానికి అమ్మవారికి, విష్ణుమూర్తికి ఎలాంటి బేధం లేదు . అమ్మవారి తర్వాత అమ్మవారే విష్ణుమూర్తిగా మారింది అంటారు. విష్ణుమూర్తి అంశయే శ్రీకృష్ణుడిగా చెబుతారు కాబట్టి పరమహంస జీవితంలో శమంతకమణి గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు ....ఆవులు వచ్చి ఆయన్ని పొడిచి ఇబ్బంది పెట్టాయని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆయనకి సాధనా శత్రువు శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత శివుడు మోక్షం పొందుతున్నప్పుడు అమ్మవారు దశ దిక్కులలో ఉండి ...దశమహావిద్య దేవతలుగా మారి, ఆయన సాధన ఆపడం అనేది పలు రకాలుగా అనుభవాలు పరమహంస పొందడం జరిగింది. అమ్మవారు సాధన చేయటానికి ,మోక్షం పొందటానికి ఇష్టం చూపించలేదని ఆదిపరాశక్తి మోక్షం పొందే వాళ్ళని ఆపుతుందని తెలుసుకున్నారు . అంటే సాధనకి వీరిద్దరూ మాయలు పెడుతూ ఉంటారు. అలాగే దత్తాత్రేయుడు వీరు యోగసాధానికి పనికి వస్తారా ? లేదా? అని యోగ పరీక్షలు పెడతారు. ఈ ముగ్గురు కూడా అంటే శ్రీకృష్ణుడు కాస్త ఈ క్షేత్రంలో బిందు మాధవుడిగా ఉండి పూజలు అందుకుంటూ ఉంటాడు . అదే అమ్మవారి కాస్త వారాహి రూపంలో ఉండి సాధన పరీక్షలు పెడుతుంది. అలాగే దత్తాత్రేయుడు సజీవ మూర్తిగా వచ్చి ఉదయకాల స్నానం చేసి వెళ్ళటం పరిపాటి . కాబట్టి ఆయన సజీవమూర్తిగా ఉండి..... మనకు యోగ పరీక్షలు పెడతారు. ముందు వీళ్ళు పెట్టే సాధనా పరీక్షలు, యోగ పరీక్షలు నువ్వు తట్టుకొని నిలబడగలిగితే ....అప్పుడు నీకు మోక్ష సన్యాసం ఇవ్వాలా? అక్కర్లేదా? గురు మంత్రం ఇవ్వాలా? అక్కర్లేదా? అనేది ....ఆ కాశీ విశ్వనాథుడు నిర్ణయం చేస్తాడు. ఆయన నిర్ణయం ఏంటి అన్నది నాకు తెలియజేస్తాడు. దాన్ని బట్టి నేను నీకు మంత్ర గురువుగా ఉంటానా? లేనా? అనేది..... ప్రకృతి నిర్ణయం చేస్తుంది. దానికి నువ్వు పరిస్థితులకి తగ్గట్టుగా పరిశుద్ధమై ఉండాలి . ఎప్పుడు ?ఎక్కడ? ఎలాంటి పరీక్ష పెడతారో తెలియదు. దేనికి సంబంధించిన పరీక్ష పెడతారో తెలియదు. కానీ పరమహంస అనుభవాల ప్రకారంగా చూస్తే ....ఆశకీ ,భయానికి, ఆలోచనకి, స్పందనకి , సంకల్పానికి సంబంధించిన యోగ పరీక్షలు.... సాధన పరీక్షలు ఉంటాయి. వీటిని ఏ విధంగా ఈ ముగ్గురు కలిసి నీకు పరీక్షలు పెడతారో తెలియదు. ఆయనకి కూడా ఈ ముగ్గురే పరీక్షలు పెట్టారు . ఆ పరీక్షల్లో ఈయన నిష్ణాతులు అయ్యారు కాబట్టే ....ఆయన మోక్ష సన్యాస యోగిగా మారాడు. అలాగే ఇప్పుడు నువ్వు మారాలి అంటే .....ఆ పరీక్షలు తట్టుకొని నిలబడాలి. ఆ పరీక్షలు ఏమిటి? ఎలా ఉంటాయనేది..... ముందు ప్రకృతి ఎప్పుడు పెడుతుంది అనేది తెలియదు కాబట్టి.... మోక్షసన్యాస దీక్ష తీసుకోవాలి అంటే ....ఇప్పుడే ఒకటికి పది సార్లు ఆలోచించుకో! భోగ జీవితంలోకి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి నీకు అవకాశం ఉంది. యోగ జీవితంలోకి వెళ్లిపోతే ...నానారకాల ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి.... నానా రకాల పరీక్షలు పెట్టి .... నానారకాలమర్మ రహస్యాలు పెట్టి ....వాటిని చేదించుకొని బయటకు రావాల్సి ఉంటుంది. ఇది ఒక శోధన అని గుర్తుంచుకో . యోగ సాధన అనేది కత్తి మీద స్వారీ లాంటిది . అలాగే పులి మీద స్వారీ లాంటిది. ఎప్పుడైతే నువ్వు పులి మీద నుంచి కింద పడతావో ....పులి నిన్ను తినేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో ! కత్తి మీద సాము అంటే ....కత్తి చాలా పదునుగా ఉంటుంది ...దానితో ఏదైనా తేడా జరిగితే అదే మనల్ని చంపేస్తుంది . కాబట్టి సాధన అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మూడు ముక్కలు కాదు . సాధనా సాధ్యతే సర్వం సాధ్యం. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో! సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదు . అన్ని పొందవచ్చు. అన్ని తెలుసుకోవచ్చు . మోక్షం కూడా పొందవచ్చు . కాకపోతే దానికి అర్హత, యోగ్యత, యోగం ఉందా! లేదా అనేది ఆలోచిస్తారు . అంతెందుకు... ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే... ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ మూడు ఉంటాయి. దీనికి అర్హత ఏంటి డిగ్రీ..... డిగ్రీ పొందితే ఎలా నువ్వు ఇవన్నీ సాధిస్తావో..... అలాగే ఈ సాధనకి మోక్ష సన్యాసికి ఈ మూడు రకాల పరీక్షలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది . ఏ విధంగా పెడతారు ...ఎలా పెడతారు..... అనేది తెలీదు. ఒకవేళ నువ్వు ఆ పరీక్షలో తప్పితే ,మాకు చెప్పకుండానే మాకు తెలియకుండానే, నువ్వు కాశీ నుంచి వెళ్ళిపోతావు. ఎక్కడికైనా వెళ్లవచ్చు.... భోగ ప్రపంచంలోకి వెళ్లొచ్చు.... మరో యోగ ప్రపంచంలోకి వెళ్ళచ్చు.... కాకపోతే నువ్వు వెళ్లే ప్రపంచం ఎలాంటిది ....ఏంటి అనేది తెలీదు. అది నకిలీ ప్రపంచం అవ్వచ్చు.... నకిలీ గురువులూ లేదా నకిలీ మనుషులు .....నకిలీ ప్రేమలు ఉన్న ప్రపంచం అవ్వచ్చు . చెప్పలేం ....కాబట్టి శ్రద్ధ భక్తితో ఎప్పటికప్పుడు.... అనుక్షణం బహు జాగ్రతతో ఉండు . నీకు నువ్వే మోక్ష సన్యాస దీక్ష కావాలనుకుంటున్నావు కాబట్టి ....దానికి తగ్గట్టుగానే ప్రకృతి పరీక్ష ఎప్పుడు ఎలా పెడుతుంది అనేది నాకే తెలియదు. కాకపోతే పరీక్ష పెడుతుందని మాత్రం తెలుసుకుంటాను . ఆ పరీక్షలో నువ్వు విజయం పొందుతావా ?ఓడిపోతావా ? అనేది నీ వివేక బుద్ధిని బట్టి ....మనస్సును బట్టి ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు .
అని అంటూ ఉండగానే ఒక పిల్లవాడి గొంతు వినపడింది . “అమ్మ ! నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? చెప్పకుండా పారిపోయి ఈ ఘాట్ కి వచ్చేస్తే ఎలాగా ? ” అని ఏదో గొంతు వినపడగానే .....ఆ ముగ్గురు కలిసి ఆ గొంతు ఎవరిదని తిరిగి చూడగానే ....అక్కడ బాల గణపతి కనపడతాడు. వీడిని చూడగానే శివ నందిని మొహం మాడిపోయింది.
రుద్రస్వామి:- వీడేంటి? ఇక్కడున్నాడేంటి ? వీడు నీకు తెలుసా...!
శివనందిని:- పొద్దున్నే డూండీ గణపతి దగ్గర కనిపించాడు స్వామి. అక్కడ పట్టుకున్నాడు. వదిలిపెట్టడం లేదు. అయినా.... నేను ఇక్కడ ఉన్నానని వీడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉండగానే .....
రుద్రస్వామి:- ఆ వీడు పట్టుకుంటే వదిలిపెట్టడు. వీడికి ఉండ్రాళ్ళు చేస్తానని మాట ఇచ్చావా ఏంటి ? ఉండ్రాళ్ళంటే వీడికి ప్రీతికరం . ఉండ్రాళ్ళు ఎవరైనా చేసి పెడితే జీవితాంతం వీడు వాళ్ళకి సేవలు చేస్తూ అలాగే ఉండిపోతాడు . ఉండ్రాళ్ళు చేయడం మానేసి, ఎప్పుడైతే నైవేద్యం పెట్టడం మానేస్తావో..... ఆ ఇల్లు వదిలేస్తాడు. ఆ మనుషులని వదిలేస్తాడు. ఎదురుపడ్డా కూడా పట్టించుకోడు. ఒకవేళ వీడికి నువ్వు ఉండ్రాళ్ళు చేస్తాను అని మాట ఇచ్చి ఉంటావు. వీడి ఆకలి గురించి నీకు తెలియదు.... వీడి ఆకలి 21 మందితో సరిపోతుంది. మహాదేవే....వీడి ఆకలి తీర్చలేక అవస్థలు పడింది . నేను కూడా వీడి ఆకలి తీర్చలేక నానా అవస్థలు పడి భిక్షాటన చేసి ఆకలి తీర్చుకోమని చెప్పాను. అయినా వీడు నీకు ఎలా దొరికాడు ...ఎలా కనపడ్డాడు ....వీడు ఒక పట్టాన ఎవరికి కనపడడే ? చూడ్డానికి అచ్చం వీడు గణపతిలా ఉంటాడని నేనే వీడికి బాల గణపతి అని పేరు పెట్టాను. వీడికి గరిక మీద పడుకోవడం ఇష్టం . ఉండ్రాళ్ళు తినడం తప్ప , ఏమి చేయడు . కానీ వీడికి వచ్చే సందేహాలు మాత్రం అర్థవంతంగా ఉంటాయి. నవ్వు తెప్పించేవిగా ఉంటాయి .... ఒరేయ్ బాల గణపతి ! నీకు వచ్చిన ధర్మ సందేహాలలో ఒకటో రెండో మీ కొత్త అమ్మ అయిన శివ నందినిని అడుగు ....ఏం చెబుతుందో చూద్దాం .
బాలగణపతి:- అడుగుతా! మీరు చెప్పలేని సమాధానాలు కొత్త అమ్మ చెబుతుందేమో.... అమ్మ ! ఆదివారం చ్యవన ప్రాష్ తినొచ్చా తినకూడదా?
శివనందిని:- తినొచ్చు ....దాందేముంది? అది ఆయుర్వేదం మందే కదా! తినొచ్చు .
బాలగణపతి:- వెంటనే తినకూడదమ్మా.... ఎందుకంటే చ్యవన ప్రాష్ లో ఉసిరికాయ పొడి కలుపుతారు . ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదని చెబుతారు కదా ! అలాంటప్పుడు చ్యవన ప్రాష్ ఎలా తింటాం ....ఉసిరి కలిపిన చ్యవన ప్రాష్ తినకూడదు కదా!
అనగానే అప్పటిదాకా ఆవేశంగా ,కోపంగా ఉన్న శివనందిని.... ఆపుకోలేని నవ్వు వచ్చింది. మరి నాకు ఇంకొక సందేహం ఉంది చెబుతావా అని అడిగాడు . తెలిస్తే చెప్తాను అడుగు అంది.
బాల గణపతి:- శివుడు ఉన్నాడా ? లేడా?
శివనందిని:- అది మాత్రం నాకు తెలియదు రా ! కొంతమంది ఉన్నాడని చెప్తున్నారు . కొంతమంది లేడని చెప్తున్నారు. కొంతమంది ఆదిలో ఉన్నాడు ,అంతంలో లేడు అని చెబుతున్నారు .
బాలగణపతి:- అవన్నీ కాదమ్మా..... శివుడు ఉన్నాడా? లేడా? నేను చెప్పనా దానికి సమాధానం... శివుడు అర్ధనారీశ్వరునిగా మారారు అంటున్నారు. ఆయన సగం శరీరం అమ్మవారికి ఇచ్చారు కదా! అలాగే హరిహరుడిగా మారారు కదా! అంటే శివ కేశవులుగా మారారు కదా! ఇప్పుడు విష్ణుమూర్తి ,అమ్మవారు కలిసి ఆయన శరీరాన్ని రెండు సగభాగాలుగా తీసుకున్నారు కదా ! అప్పుడు శివుడు లేనట్టే కదా.
ఇది వినగానే శివ నందిని కి నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేసింది .
శివనందిని:- వారి బడవా! చూడ్డానికి చాలా పరిహాసంగా ఉండే నీ ప్రశ్నలకు అర్థవంతంగా సమాధానాలు ఉన్నాయి రా ! చాలా జాగ్రత్తగా లోతుగా నీకు సమాధానాలు చెప్పాలి . దీనిని నేను సమాధానం చెప్పడం కన్నా మీ నాన్న అయిన రుద్ర స్వామి సమాధానం చెప్తాడేమో కనుక్కో!
బాలగణపతి:- ఆయన ఏనాడు సమాధానం చెప్పడు. నవ్వేసి ఊరుకుంటాడు . చిరు మందహాసం చేస్తాడు. నువ్వే తెలుసుకో రా అంటాడు .
శివ నందిని:- నేను సమాధానం చెప్పనా!
బాలగణపతి:- నువ్వు సమాధానం చెప్పమ్మా! నాకు సమాధానం కావాలి. కానీ నువ్వు చెప్పిన సమాధానం సరి అయిందో కాదో నాకు తెలియాలి కదా !
శివనందిని:- శివుడు మొదట శివశక్తితో అర్ధనారీశ్వర తత్వాన్ని పొందాడు. అప్పుడు అమ్మవారికి తన అర్థ భాగం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైంది ....ఏకరూపంలోకి వెళ్లిపోయాడు. ఆది రుద్రుడిగా మారిపోయారు. కొన్నాళ్లకి అమ్మవారు కాస్త విష్ణుమూర్తిగా రెండవ అవతారం ఎత్తింది . మళ్లీ అర్ధనారీశ్వర తత్వంలో శివ కేశవుడిగా మారింది. అంటే శరీర అర్ధ భాగాన్ని ఇచ్చాడు. మళ్లీ ఏకత్వస్థితిలోనికి వెళ్లి ఆది రుద్రుడిగా మారిపోయాడు . ఇక్కడ అమ్మవారి శరీరంలో అర్ధ భాగం ఇచ్చాడు. మళ్లీ విష్ణుమూర్తికి ఇచ్చేటప్పుడు మిగిలిన అర్ధ భాగంలో కాకుండా పూర్ణ భాగంలోనికి నుంచి ఇచ్చాడు. అది అక్కడ తేడా! పూర్ణ శరీరంలో ఒక భాగం విష్ణువుకి ఇచ్చాడు. మళ్లీ పూర్ణంగా మారాడు. ఆ తరువాత పూర్ణ శరీరంలో అమ్మవారికి సగభాగం ఇచ్చాడు. మళ్లీ తిరిగి పూర్ణంగా మారాడు . అంతే ఇక్కడ తన శరీరాన్ని ఒకేసారి రెండు భాగాలుగా ఇవ్వలేదు .రెండు శరీరాల్లో రెండు భాగాలు ఇచ్చారు. పూర్ణ శరీరంలో ఒక భాగం విష్ణుమూర్తికి..... తిరిగి మరలా పూర్ణ శరీరంలో ఒక భాగం అమ్మవారికి ఇచ్చాడు. శివుడు ఉన్నాడు ....ఒకప్పుడు ఉన్నాడు , ఇప్పుడు లేడు . అంటున్నారు. అది నిజమో కాదో సాధన చేసి ఇప్పుడు నేను తెలుసుకోవాలి .
బాలగణపతి:- అమ్మ ! నువ్వు నిజంగా సాధన చేస్తావా ?
శివనందిని:- చావటానికి ఇక్కడికి వచ్చాను. నా చావు వీళ్ళకి ఉపయోగపడుతుంది అని తెలిసింది . ఆ చచ్చేదేదో సాధన చేసి చద్దాం అనుకున్నాను. ఇక్కడ దానికి తగ్గట్టుగా సాధన సందేహాలు వచ్చాయి. సాధన పరీక్షలు వస్తాయి. వాటిలో నెగ్గితే ,సాధన చేస్తే ఏంటి అనేది తెలుస్తుంది.
బాలగణపతి:- అమ్మ! నేను నిన్ను వదిలిపెట్టను. నీ సాధన పరిసమాప్తి అయ్యేదాకా నన్ను నీ దగ్గరే ఉంచుకో. నాకు కేవలం ఉండ్రాళ్ళు పెట్టు చాలు . ఏమీ ఇబ్బంది పెట్టను . బాధ పెట్టను. నా వల్ల నీకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. అనగానే
శివ నందిని ఒక్కసారిగా రుద్రస్వామి కేసి చూస్తూ.....
శివనందిని:- స్వామి! మీరు ఏమీ అనుకోనంటే ఒక సందేహంను తీర్చండి . వీడి వలన నేను పుత్ర వ్యామోహం లో ఏమైనా పడతానా ? వీడ్ని చూస్తుంటే .... నా కొడుకు గుర్తొస్తున్నాడు . నాకు భోగ జీవితంలో ఉన్న కుమారుడు వీడికి లాగానే బొద్దుగా ముద్దుగా ఉంటాడు .
రుద్రస్వామి:- వీడి వలన నీకు ఎలాంటి పుత్ర వ్యామోహం ఉండదు. అలాగే నీ స్వప్నంలో దర్శనం ఇచ్చిన వాడి వల్ల వ్యామోహం ఉండదు.
అనగానే శివ నందిని మొహం చిన్న పుచ్చుకొని అంటే .....ఈయనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నాకు స్వప్నంలో జరిగిన తప్పు కూడా ఈయనకి తెలిసే ఉంటుంది .
శివనందిని:- స్వామి! నన్ను క్షమించండి . అది అనుకోకుండా జరిగిన తప్పు .
రుద్రస్వామి:- అమ్మ! అది ప్రకృతి సిద్ధమైన తప్పు ప్రకృతిలో నెలసరి ఎలా వస్తుందో ....కామం కూడా అలాగే వస్తుంది. అయితే అది స్వప్న కామమా? భౌతిక కామమా అనేది నేను మీ మనసును బట్టి ,శరీరస్థితిని బట్టి ఉంటుంది . తప్పు చేయనివాడు ఈ సృష్టిలోనే లేడు. బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు సృష్టించలేదు . బలహీనతను దాటుకొని వెళ్లగలిగితేనే సాధన పరిశ్రమాప్తి అవుతుంది. ఆ బలహీనత నూటికి 99% కామంతోనే మొదలవుతుంది . అందుకని అరిషడ్వర్గాలలో మొదటగా కామం, క్రోదం , లోభం మోహం ,మదం, మాత్సర్యము అని చెప్పడం జరిగింది . కాబట్టి మొదట సృష్టి అనేది కామంతోనే మొదలైంది. శూన్యం నుంచి వచ్చినవాడు తనకి తోడు కావాలని అనుకోవడంతోనే తన నుంచి స్త్రీ మూర్తి స్వరూపాన్ని వచ్చింది . అది తోడు అనేది కామ భావం వల్ల ఏర్పడింది . అంటే జ్ఞానం అనేది కామం తోనే మొదలైంది . ఇక్కడ కామం అనేది తప్పు కాదు. ఎప్పుడూ తప్పుకాదు. పాతివ్రత్య ధర్మం పాటించేంతవరకు కామం తప్పుకాదు. ఎప్పుడైతే పాతివ్రత్య ధర్మం తప్పి, పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం లో పడతారో .....అప్పుడు పవిత్రమైన కామం కాస్త మాయ అవుతుంది . మాయా బంధనం అవుతుంది. ధర్మంగా ఉన్నంత వరకు యే మాయ ఏమీ చేయలేదు. అంతెందుకు.....పరమహంస పెళ్లయిన తర్వాత పాతివ్రత్య ధర్మం పాటించాడు. ఆయన జీవితంలో 148 మంది స్త్రీమూర్తులు అంటే మానవ స్త్రీ మూర్తులు, దేవతా స్త్రీ మూర్తులు, రాక్షస స్త్రీ మూర్తులు , యక్షిని, కిన్నెర, గంధర్వ, భూత , ప్రేత పిశాచ...ఎంతోమంది స్త్రీ మూర్తులు ఆయన దగ్గరికి స్వప్నంలోనూ, భౌతికంగానూ వచ్చే నగ్నంగా కనపడినప్పటికీ కూడా. నా భార్య తప్ప నాకు మిగతా ఆడవాళ్ళంతా పరస్త్రీ. నేను పరస్త్రీ వ్యామోహంలో పడను . ఎందుకంటే నేను పాతివ్రత్య ధర్మం పాటిస్తున్నాను అని నిలబడ్డారు. జలంధరునికి కూడా ఆయన పాతివ్రత్య ధర్మంలోనే ఆయుష్షు ఉన్నది . ఈ విషయం తెలుసుకున్న విష్ణు మూర్తి .... జలంధరుని రూపంలోకి మారి ఆయన భార్య అయిన తులసి పాతివ్రత్య ధర్మమును చెడగొట్టడంతో..... జలంధరుడు మరణం పొందడం జరిగింది. తన భార్య పాతివ్రత్య ధర్మంలో ఉన్నంత వరకు..... జలంధరుడిని ఈశ్వరుడు కూడా ఓడించలేకపోయేవాడు. కాకపోతే జలంధరుడు శివాంశ అయినప్పటికీ , అధర్మంగా ఉండటంతో .....ఆయన్ని ఆధర్మంగానే చంపక తప్పలేదు . ఆ పాతివ్రత్య ధర్మంల తప్పు చేయడం వలన , తులసీమాత విష్ణుమూర్తిని గండకీ సాలిగ్రామం శిలలుగా మారమని శపించడం జరిగింది. అంటే ధర్మమును పట్టుకుంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు. యే ధర్మమైన అవ్వచ్చు. నిజానికి మన వాళ్ళందరూ కూడా.... దైవాలను ,దేవుళ్ళను చెక్కిన విగ్రహాల్లోనూ, ఎవరో చెక్కిపెట్టిన విగ్రహాలను చూస్తున్నారు . ఇప్పుడు ఇక్కడ దశాశ్వమేధ ఘాట్కా లో కాలభైరవ దేవాలయం ఉంది. ఆయన వాహనం కుక్క అని చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు నేను కుక్క రూపంలో మీ ఇంటి దగ్గర కుక్కలాగా ....కాపలా కుక్క రూపం లో ....కాపలా కాస్తున్న అని చెబుతున్నాడు . కానీ కుక్కకి అన్నం పెడతారా ? పెట్టరు . కాలభైరవ దేవాలయానికి వెళ్లి మాత్రం భక్షభోజ్యాలు పెడతారు. అక్కడ తిరుగుతున్న..... మన ఇంటి ముందు తిరుగుతున్న..... ఆహారం కోసం తిరుగుతున్న కుక్కల గురించి అసలు పట్టించుకోరు. దేవుడు నేను కుక్క రూపం లోనూ ...ఆవు రూపంలోనూ ....జంతువుల రూపంలోనూ నీ చుట్టూ, నీ పరిసరాల చుట్టూ ,ఎప్పుడూ రక్షణ కవచంగా ఉండి తిరుగుతున్నానని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఆవులు కనపడితే చంపి ఆవు మాంసం తినే వాళ్ళు ఉన్నారు. కోడి కనపడితే కోడి ని చంపి కోడి మాంసం తినేవాళ్లు ఉన్నారు. నేను వాళ్ళని మాంసం తినొద్దని చెప్పడం లేదు . చచ్చిన వాటిని తినమని చెప్తున్నాను. కానీ చంపి తినాల్సిన అవసరం ఏముంది... అవి ఏవో కర్మలు తీర్చుకో వడానికి ,చేయడానికి వచ్చాయి. అంతెందుకు.....ఆవు గాయమై నరకయాతన పడుతుందని.... తుపాకీతో దానిని చంపేశారు. ఏ తుపాకీ గుళ్ళతో అయితే ఆవులు చంపేశారో .....అవే తుపాకీ గుళ్ళకి ఆ వంశంలోని వారంతా మరణం పొందుతున్నారు. ఇది ఎలా జరిగింది? ఆయన ఆరోజు ఆవును చంపకుండా ఉండి ఉంటే..... ఆ ఆవు దోషం జరిగేది కాదు . మరణం దోషం జరిగేది కాదు. ఆ ఆవు, ఆ గాయంతో దాని కర్మ దోషం నివారణ చేసుకునేది. ఆ కర్మ దోషం నివారణ చేసుకోకుండా అది ఈతి బాధలు పడుతుంది అని.... దాని ఈతి బాధలు చూడలేక దాన్ని చంపేశాడు. అంటే ఏంటి ? దాని బాధకి ఈయన స్పందించాడు. స్పందించి దాని పాప నివారణ దోషాలు..... ఈయన తీసుకోవడం జరిగింది. దానితో ఈయన వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తుపాకీ గుళ్ళకి బలవుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది.... ఎలా జరుగుతుంది.... దేనివలన జరుగుతుంది. ఇది నేను చెప్పాననుకో...... అందరూ నన్ను గాందేయవాదులు అందరూ కూడా నన్ను కొట్టడానికి వస్తారు . ఇక్కడ నిజం ఎవరూ నమ్మరు . నిజం తెలుసుకుంటే ఎవరికి వారే మౌనం వహిస్తారు.
కాబట్టి పదార్థం మారితే యధార్థం ఏమిటో తెలుస్తుంది. ఆ యదార్థ జ్ఞానం పొందటానికి సాధనా జీవితంలోకి అడుగు పెట్టాలి. అంటే కనిపించేదంతా అసత్యం..... కనిపించనిది సత్యమని అనుభవం అనుభూతి పొందాలి. శబ్ద పాండిత్యంలో చెప్పేవాళ్లు, ఎంతోమంది యోగులు చెప్పే వాళ్ళు ఉన్నారు . .చూసిన వాళ్ళు ఉన్నారు. పరమహంస తను పొందిన ధ్యాన అనుభవాలు ,సాధన అనుభవాలు నమ్మమని ఎక్కడ చెప్పలేదు. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. ఎవరికి వారు వ్యక్తిగత సాధన చేసుకొని ఇవి పొందారా ? లేదా? అనేది తెలుసుకోండి . పరిశీలించండి... పరిశోధించండి ....విషయం మీకే అర్థమవుతుంది. విషయ జ్ఞానం మీకే అర్థమవుతుంది. ఆయా జ్ఞాన స్పురణలు పొందండి . కాకపోతే ఆ చక్రాలలోకి వచ్చినప్పుడు ఎలాంటి మాయలు వస్తాయి..... ఆ మాయలు దాటడానికి నేనేం చేశాను..... అనేది తెలుసుకోండి. అప్పుడు ఆ మాయలు దాటటం సులభం అవుతుంది . తేలిక అవుతుంది . ఆ మాయ దాటేస్తే సరిపోతుంది . కేవలం నేను మోక్షం మార్గ నిర్దేశకుడిని. నేను వెళ్ళిన మోక్ష మార్గం మీకు నిర్దేశించడం జరిగింది . అదే విధంగా ఆ మార్గంలోనే ప్రయాణించండి .... నేను ఎలాగైతే శూన్యం అయ్యానో , మీరు కూడా శూన్యం అవ్వండి. అవుతారు. నేను మాత్రమే శివుడని చెప్పడం లేదు. అందరూ శివుల్లే . కాకపోతే నేను శివుడు అని ఙ్ఞానం పొందాను . నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలుసుకోండి. ఎవరికి వారే తెలుసుకొని అనుభవ అనుభూతి పొందండి . అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది... అప్పుడు సత్యం ఏమిటో తెలుస్తుంది . సత్యాన్వేషిగా మారండి . విషయ జ్ఞానం పొందండి. ఈ సృష్టిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి అని ....ఆయన చెప్పాడు. ఏం లేదో తెలుసుకోమని చెప్పాడు. లేనిది ఉన్నట్లుగా.... ఉన్నది లేనట్లుగా .....ఉన్నది ఏదో తెలుసుకోమన్నాడు. ఇవన్నీ కూడా అనుభూతి పొందమన్నాడు. శబ్ద పాండిత్యం లో ప్రతి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఒక పుస్తకాన్ని చదవండి. అర్థం చేసుకోండి. అర్థం అయ్యేవరకు ఒకటికి పది సార్లు చదవండి. తెలుసుకోండి. ఆ చెప్పిన అనుభవాన్ని ఆచరణలో పెట్టండి. అనుభవ అనుభూతి పొందండి. ఎక్కడ ఆగుతున్నారో తెలుసుకోండి . ఏ మాయ దగ్గర ఆగుతున్నారో తెలుసుకోండి. ఎలా దాటాలో తెలుసుకోండి . వ్యక్తిగత మోక్షమా పొందుతారో .... విశ్వ మోక్షం పొందుతారో ....ఎవరికి ఎరుక అని ఆయన నిక్కచ్చిగా చెప్పేసాడు. అంతేగాని, నా విని విధానాలు అనుసరిస్తేనో, నా అనుభవాలు పొందితేనో .....నేను సంపాదించిన దైవిక వస్తువులు మీరు సంపాదిస్తేనో మీకు మోక్షం వస్తుందని ఎక్క డా చెప్పలేదు . కేవలం తన ఎంచుకున్న సాధన విధివిధానంలో తాను పొందిన సాధన అనుభవాలు, ఆయనకు వచ్చిన మాయలు, ఆ మాయలు దాటడానికి వచ్చిన దైవక వస్తువులు, సేకరించి సాధనను ముందుకు తీసుకు వెళ్తూ .. దానికి సంబంధించిన దైవిక వస్తువులను సాధిస్తూ..... శరీరానికి తగ్గట్టుగా చక్రాలను జాగృతి చేసుకుంటూ...... చివరికి చక్రాలను విభేదనం చేసి ,చక్రాలను శూన్యం చేసి... పూర్ణ మోక్షం పొందాడు. అలాగే ప్రతి సాధకుడు చేయాలని చెప్పాడు. కాకపోతే ఇక్కడ జరిగిందేంటంటే సాధన చేయకుండానే ఒకడు మోక్షం పొందితే, అందరూ మోసం పొందే అవకాశం ఉందా లేదా అని, ఆయన విశ్వమోక్షం కోసం ప్రయత్నించాడు. ప్రకృతి చేసిన తప్పు ఆయనకి తెలియకపోవటం వలన .... విశ్వమోక్షం కాస్త వ్యక్తిగత మోక్షం అయింది . అలాగే ఇప్పుడు ఆయన పురుష ప్రకృతి పరంగా మోక్షం పొందాడు . ఇప్పుడు స్త్రీ ప్రకృతి పరంగా నువ్వు వ్యక్తిగత మోక్షం పొందుతావా ? విశ్వమోక్షం పొందుతావా అనేది దైవ నిర్ణయం . ఏం జరుగుతుందో.... ఏమిటో..... ప్రకృతి నిర్ణయిస్తుంది . దానికోసం ముందే ఎందుకు తపన తాపత్రయం పడటం...
అనగానే బాలా గణపతి ఉన్నట్టుండి...
బాలగణపతి:- నాయనా! ఇప్పుడు నా పుట్టుక ,నా చావు, నా సాధన అంతా విధిరాతలో రాసిపెట్టి ఉంది అని అంటారు కదా ! విధి ప్రకారంగా లేదా రాతప్రకారంగా జరుగుతూ ఉన్నప్పుడు.... ఇంకా నేను ఎందుకు సాధన చేయడం ...నేనెందుకు సాధన చేయాలి? నేను ఎందుకు జపాలు చేయాలి ....అని అడిగాడు.
రుద్ర స్వామి:- ఒరేయ్.. బాలగణపతి! నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది . నువ్వు సమాధాన పడ్డావు. ఇక్కడ ఈ జగన్నాటకంలో జరిగే ప్రతీది కూడా.... జరిగిపోయిన దృశ్యమే. ఇప్పుడు మనమంతా , మన భవిష్యత్తు అంతా కూడా గతం అయిపోయి , అది ప్రస్తుతంగా కనబడుతుంది . నిజానికి ఇక్కడ ఎవరూ సాధన చేయట్లేదు. మోక్షం పొందిన వాళ్ళు ఉన్నారు. మోక్షం పొందని వాళ్ళు ఉన్నారు. మోక్షం పొందామా లేదా అన్నది మాత్రమే మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మోక్ష జన్మగా తెలుసుకొని సాధన చేస్తున్నాము . ఇక్కడ ఏనాడో ఆది రుద్రుడు తను చనిపోతూ..... రికార్డ్ చేసి పెట్టేసాడు. ఈ విశ్వ జగన్నాటకంలో మనం పాత్రలుగా ఉన్నాము . నువ్వు ఇక్కడి నుంచి ఇంకొక ఘాట్ కి ప్రయాణం చేశావనుకుంటున్నావు ....వాస్తవానికి నువ్వు ప్రయాణం చేయలేదు. అది ఎలా ఉంటుందంటే ...నువ్వు ఒక ప్రదేశం నుంచి మన ప్రదేశానికి రైల్లో వెళ్లావు నువ్వు ప్రయాణించావా? రైలు ప్రయాణించిందా? నిజానికి నువ్వు ప్రయాణించలేదు ....రైలు ప్రయాణించింది. నువ్వు కూర్చున్నావ్ అంతే ...కాకపోతే నువ్వు ప్రయాణించావని అనుకుంటున్నావు. కాకపోతే ఇక్కడ నువ్వు చేసింది ఏమీ లేదు ....అలాగే నువ్వేదో సాధన చేస్తున్నావు.... నువ్వేదో తెలుసుకుంటున్నావు అని అనుకుంటున్నావ్? ఇక్కడ చేసేది ఏమీ లేదు.... తెలుసుకునేది ఏమీ లేదు. ఇప్పుడు మూడు గంటల సినిమా ఉంది . ఒక గంట భోగ జీవితం.... ఒక గంట ఒక యోగ జీవితం... ఒక గంట మోక్ష జీవితం ఉంది అనుకో .....ఒక గంటకు భోగ జీవితం అయిపోతుంది. ఆ తర్వాత యోగ జీవితం కాలం సినిమా చూస్తున్నారు.... ఏం జరిగింది ? ఏంటి అని తెలుసుకుంటాము. మోక్ష జీవితం భాగం వచ్చేసరికి.... మోక్షం పొందామా లేదా అనేది ఆ సినిమా చెప్తుంది. మోక్షం పొందలేదు అంటే.... ఇంకో సినిమా రికార్డు రెడీ అవుతుంది. అది అలా వెళ్ళిపోతుంది. ఆ జన్మలో అది చూస్తావు ....చేసినట్టుగా చూస్తావు. ఇదంతా ఒక నాటకం నడుస్తుంది . ఈ నాటకం అంతా రికార్డింగ్.... రికార్డు అయిపోయింది . దాన్ని ఎవడు మార్చలేడు. ఏమీ చేయలేడు . ఆదిలో నువ్వు ఏ విధంగా తప్పు చేశావో.... తప్పు చేసి అమోక్షం పొందావో ....ఆ తప్పును సరిచేయకుండా మాయలో పడ్డావా ....ఏ మాయలో పడి అమోక్షం పొందావు అనేది ఆ రికార్డు దృశ్యం చెబుతోంది. ఇప్పుడు మీ కొత్త అమ్మ ఉంది... శివ నందిని.... భోగ జీవితం కాస్త ఏమైంది.... పెళ్లి కాస్త పెటాకులు. అయ్యింది . విడాకులు తీసుకుని వచ్చింది . ఇది ఎందుకు జరిగింది.... తన భర్త పర స్త్రీ వ్యామోహంలో పడటం వల్ల ఈమెకు కోపం వచ్చి విడిపోయింది అని చెబుతోంది. కానీ లోకానికి తెలియని పర పురుషుని మాయలో ఈ అమ్మాయి పడిందని ఈమె కు తెలుసు.... నాకు తెలుసు..... లోకానికి మాత్రం తెలియదు . ఈమె భర్త చేసిన విషయం మాత్రం లోకానికి తెలిసింది . అతను పర స్త్రీ వ్యామోహంలో ఉన్నాడని ఈ అమ్మాయి వచ్చేసింది . కానీ లోకానికి తెలియని పర పురుషుని మాయలో ఈ అమ్మాయి పడిందని నాకు తెలుసు. అప్పుడు ఈ అమ్మాయి తప్పు చేసినట్టు కాదా? అమ్మాయి చేస్తే తప్పు కాదు ......అబ్బాయి చేస్తే తప్పయింది..... ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని తెలుసు ..... పిల్లని కన్నాడని తెలుసు .....వాళ్ళని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది . కానీ అవన్నీ సఫలీకృతం కాలేదు. ఎవరికి వారే సర్దుకుపోమని చెప్పారు. తనకి పుట్టిన ఇద్దరు ఆడపిల్లల కోసం, ఒక మగపిల్ల వాడి కోసం సర్దుకు పోయింది. కానీ ఎప్పుడైతే తనకి మనసు వైరాగ్యం లోకి వెళ్లి , పూజలు, ఆరాధనలు కాస్త యోగ పరంలోకి వెళ్లిపోయాయో ....శివుడితో సాంగత్యం పొందాలని... శివుడే తన భర్త అని ....శివుడే ప్రత్యక్షంగా ఉన్నాడని... తెలుసుకొని అన్ని గ్రహించి ....అవునా కాదా అని ఒకటికి పది సార్లు చూసుకుని..... తన భర్తకి విడాకులు ఇచ్చి, ఈ జీవితానికి అడుగు పెట్టింది . ఇప్పుడు ఆయన చేసిన తప్పు లోకానికి తెలిసింది. ఈమె చేసిన తప్పు లోకానికి తెలియలేదు. కావాలంటే మీ అమ్మని అడుగు చెప్తుంది.....
అనగానే శివ నందిని తప్పు చేశానని తలవంచుకుని చెప్పకనే చెప్పింది . ఈ విషయం గ్రహించిన బాల గణపతి .... అమ్మ! నువ్వే బాధపడకు. నువ్వేదో తప్పు చేసావ్ అని నేను అనుకోను. అయ్య అట్లాగే అంటాడు. నీ భర్త చేసిన పనులకి నీ మనసు విరిగిపోయి .....ఎవరి దగ్గరో సానుభూతి పొంది ఉంటావు. ఆ సానుభూతి ఆసరాగా తీసుకొని వాడు నీ శరీరాన్ని కోరుకునే ఉంటాడు. వీడి దగ్గర భర్త ప్రేమ దొరుకుతుందేమో అని దగ్గర అయి ఉంటావు. కానీ శరీరాన్ని ఆశించి వదిలేసి ఉంటాడు . అంతే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఏదో నీ భర్త శివుడు అంటున్నాడు కదా ! నీ భర్తే శివుడని చెప్తున్నాడు కదా! మనసా, వాచా ,కర్మణా నేను నమ్మాను అంటున్నావు కదా! గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ వదిలేసేయ్ అమ్మ..... నువ్ వాటి గురించి ఆలోచించకు. నీ భర్తని వదిలేసి వచ్చావు. అలాగే పరపురుషులను కూడా వదిలేశావు . మనసులో నీకు ఎలాంటి ఇది లేదు. గంగా స్నానం చేస్తున్నావు . గంగలో స్నానం చేస్తే ఎలాంటి దోషాలైనా పోతాయి . గురు మంత్రం తీసుకున్నావు . ఆరాధన చేస్తున్నావు. దానివల్ల తెలుసుకో తెలియక చేసిన తప్పులన్నీ కూడా పోతాయి . ఇవన్నీ నేను కాదు మా అయ్య చెప్పాడు.... అవునా? కాదా? అని రుద్ర స్వామి కేసి చూడగానే ......నేను చెప్పేది ఏముంది నాయనా! నీ నోటి నుంచి వచ్చేవి అక్షర సత్యమే కదా! నీ వాక్కు దైవ వాక్కు కదా! ఆమె ఏనాడు అయితే వచ్చిందో ఆనాడే ఆ గంగ స్నానం చేసి ...కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకుని, వరాహి దర్శనం చేసుకుని ,ఇక్కడ దేవతల అనుగ్రహం పొందిందో .... ఆనాడే ఆవిడ చేసిన పాప పుణ్యాలన్నీ పోయినాయి. ఇలా ఎవరైనా ఏ క్షేత్రానికైనా వెళ్ళవచ్చు.... కొంతమంది శ్రీశైలం వెళ్లి పరిశుద్ధి అవ్వచ్చు .. కొంతమంది కాశీ క్షేత్రం వెళ్లి పరిశుద్ధము అవ్వచ్చు. కొంతమంది అరుణాచలం వెళ్లి పరి శుద్ధి అవ్వచ్చు .. హరిద్వార్ లోకి వెళ్లి పరిశుద్ధము అవ్వచ్చు . సప్త ముక్తి క్షేత్రాలలోనూ , సప్తముక్తి పురాలలోనూ అష్టాదశ శక్తి పీఠాలలో..... 108 వైష్ణవ ఆలయాలలోనూ ......ఎక్కడైనా, ఎవరైనా వారి మతానుసారం, కర్మానుసారం ధర్మం ప్రకారంగా ఆచార వ్యవహారాలను బట్టి వెళ్లొచ్చు . ఆయా క్షేత్రాలకి వెళ్లి పరిశుద్దము కావచ్చు. కాకపోతే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే వారు ధర్మము గా ఉన్నట్టే. అంతకుమించి ఇంకేమీ లేదు . కాబట్టి విధి రాత అనేది... నువ్వు పుట్టకముందే నీ గత జన్మ కర్మానుసారంగా జరిగిపోయింది. ఇది ఇప్పుడు జరుగుతుంది కూడా రికార్డు దృశ్యమే. అంటే మన భవిష్యత్తు గతమయ్యి ....అది వర్తమానంగా నడుస్తుందని తెలుసుకో. ఇప్పుడు మనం చేయాల్సిందేమీ లేదు. చేస్తున్నాం అని అనుకుంటున్నాం . కాకపోతే ఆనాడు ఏం తప్పు చేశాము ...ఎక్కడ తప్పు చేసాము.... ఏమిటి అనేది మాత్రమే మనం తెలుసుకుంటాము. దానినే మనం యోగ సాధన అంటాము . అదే మాయలో పడితే భోగ సాధన అంటాము. కోరికలు పెంచుకుంటూ పోతే ....భోగ జీవితం. కోరికను తగ్గించుకుంటూ పోతే యోగ జీవితం. నిజానికి ఈ రెండిటికీ ఏం తేడా లేదు . నిజానికి రెండు రికార్డు దృశ్యాలే . ఒక సినిమానే రెండు భాగాలు .....నిజానికి మూడు భాగాలు ....భోగభాగం, యోగ భాగం ,మోక్ష భాగం. అందులో మోక్షం పొందామా లేదా ఈ జగన్నాటకంలో పాత్ర ఆగిపోయిందా.... లేదా ఇంకా రికార్డు దృశ్యం ఉందా? అని తెలుసుకోవడం తప్పితే ఏమీ లేదు. అంతెందుకు ....శివ నందిని పుట్టకముందు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టలేదని ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్లారు. ఆయన భార్యాభర్తల జాతకాలు చూసి మీకు త్వరలో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల డాక్టర్ చదువుతుంది. ఆమెకి వివాహం అవుతుంది. వివాహం అయ్యాక ముగ్గురు పిల్లలు పుడతారు. ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి పుడతారు. ఆమె 16 సంవత్సరాల పాటు భర్తతో దాంపత్య జీవితం పొంది..... ఆ తర్వాత భర్త నుంచి విడిపోతుంది. సంతానానికి దూరం అవుతుంది . ఏదో ఒక శివ క్షేత్రానికి వెళుతుంది. మోక్ష సన్యాసం తీసుకుంటుంది . మోక్ష సాధన చేస్తుంది. తద్వారా ఈమె వలన లోక కళ్యాణార్థం జరగవలసిన కార్యం ఏదో జరుగుతుంది . ఆ కార్యం జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి నాకు జ్ఞాన స్ఫురణ అందటం లేదు అని చెప్పాడు. ఈమె పుట్టకముందే.... ఈమెకి పెళ్లవుతుంది.... ఎంతమంది పిల్లలు పుడతారు..... ఏ ఉద్యోగం చేస్తుంది? ఏ విధంగా స్థిరపడుతుంది.... ఈమె భర్తకు విడాకులు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. శైవ క్షేత్రానికి చేరుతుందని చెప్పాడు. మరి కాశీ క్షేత్రానికి వచ్చిందా? మరి భర్తతో విడాకులు తీసుకొని వస్తుందని చెప్పారా? పిల్లల పుట్టారు కదా! అందర్నీ వదిలిపెట్టేసి వచ్చింది కదా! ఇప్పుడు సన్యాసం తీసుకోవడానికి సిద్ధమవుతుందా! ఆ సన్యాసం తీసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి ....ఆ పరీక్షలకు సిద్ధపడు అని చెప్తున్నాను. అంటే ఇదంతా విధాత ప్రకారం జరిగింది కదా! కర్మానుసారం జరిగింది కదా ! ఈవిడ పుట్టకముందే అన్ని ఎలా జరిగాయి .....అంటే ఎలా సత్యమైనాయి . ఆ జ్యోతిష్కుడు నిజ జ్ఞానం పొంది రికార్డు దృశ్యం చూశాడు... చెప్పాడు... అది అక్షర సత్యం అయింది . అలా చెప్పే వాళ్ళని ప్రపంచంలో వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు . ఇప్పుడు నువ్వు పుట్టకముందే ఏ చెట్టు ఎండిన కర్రతో దహనం చేస్తారో కూడా రాసిపెట్టి ఉంటుంది . ఇదంతా ఎలా రాయగలిగారు..? అంటే ఈ చావు పుట్టకలు అనేవి.... మోక్షం అనేది మన రికార్డు దృశ్యంలో రికార్డు అయి ఉంటుంది. అందుకని ఆ యోగం ఉంటేనే యోగి అవుతాడు. నీకు మోక్షయోగం ఉంది అని, నీ రాతలో రాసిపెట్టి ఉంటే..... నువ్వు మోక్షం పొందుతావు. అదే రికార్డు దృశ్యం అవుతుంది . ఆ యోగం లేకపోతే మోక్షం పొందాల్సిన చోట అమోక్షం పొందుతావు. అక్కడ మళ్ళీ రికార్డు దృశ్యం ఉన్నట్టే . మళ్లీ ఇంకో కొత్త జన్మ ఉన్నట్టే . అంతే . దేవున్ని పూజించాలి అన్నా .... దేవున్ని తిట్టాలన్నా......దేవుడు లేడు అన్నా కూడా అదంతా రికార్డు దృశ్యమే ప్రతిదీ కూడా రికార్డు దృశ్యమే . ఏమి రికార్డు అయింది అని తెలుసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. అదేవిధంగా, ఆ విధాత రాసిన విధిరాతలో మోక్షం పొంది బయటకు వచ్చామా? లేదా? తెలుసుకోవడమే మోక్ష సాధన. ఆ పాత్రను కొనసాగిస్తూ ఉంటే అదే ఆ భోగ పాత్ర. భోగ జీవితం భోగ సాధన . యద్భావం తద్భవతి. దానితో రుద్ర స్వామి చెప్పిన సమాధానాలకు సమాధాన పడిన ముగ్గురు కూడా ....అంటే మహాదేవి , బాలగణపతి, శివ నందిని కూడా రుద్ర స్వామికి నమస్కారం చేసి.... శివ నందిని రుద్రస్వామితో స్వామి ఇంక నేను గదికి వెళతాను. ఈ బాల గణపతి ఇకనుంచి నాతోనే ఉంటాడు అని శివ నందిని చెప్పగానే .....మంచిది ! చాలా సంతోషం అమ్మ! వీడిని జీవితాంతం నీ దగ్గరే ఉంచుకో. వీడు నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించడు. కాకపోతే ఆకలి బాధ తట్టుకోలేడు . సమయానికి ఆహారం అందించేలా చూసుకో . అది ఒక్కటే . అది కూడా 21 ఉండ్రాళ్ళు ప్రేమగా , తృప్తిగా చేసి పెడితే చాలు. అంతకుమించి నిన్ను వేదించడు. బాధించడు. రోజు మొత్తం మీద 21 ఉంగరాలు పెడితే , వాడి ఆహారం సరిపోతుంది . ఇంక వాడు ఆరోజు మొత్తం ఏమీ తినడు... ఏమీ తాగడు.... నిన్ను ఇబ్బంది పెట్టడు ...కాకపోతే వాడు ఏం చేస్తున్నాడు? ఏమిటి ? అని వాడి వెనకాల శోధించకు... పరిశీలించకు.. ఇబ్బందుల్లో పడతావు. సమస్యలు వస్తాయి. వాడు ఉన్నంతవరకు నీ సాధనకు ఎటువంటి డోకా ఉండదు. ఏదన్న సమస్యలకి , పరిష్కారాలకి , మర్మ రహస్యాల చేధనకి ప్రకృతి వీడిని నీ దగ్గరికి పంపించింది అనుకుంటాను ......చూద్దాం, ఏం జరుగుతుందో! నీ ఏకాగ్రత మొత్తం మోక్ష సన్యాస దీక్ష కోసం వచ్చే యోగ పరీక్షలు, సాధన పరీక్షలు దాటుకొని నిలబడాలి అనే దానిపై పెట్టు . దేనికి కంగారు పడకు... దీనికి భయపడకు, ఏమాత్రం ఆవేశ పడొద్దు, అన్నింటిని సాక్షిభూతంగా చూస్తూ ఉండు.... ఎక్కడ ఆశకి లోనవ్వకు ..భయానికి లోనవకు, స్పందనకు గురికాకు... అర్థమయిందా! ఆశించకు ,ఆశపడకు, భయపడకు. ఈ జాగ్రత్తలు తీసుకో. వాళ్ళు ఎప్పుడూ ఏ పరీక్ష పెడతారో.... దానిని పరీక్షగా భావించి, మౌనం వహించి, నీ వివేక బుద్ధితో ఆలోచించి.... ఆ సమస్యకి పరిష్కారం చూసుకో . ఆలోచించుకో . నీకు దానంతట అదే జ్ఞాన స్ఫురణ వస్తుంది. ఏదైనా సందేహం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ వీడు నీ పక్కన ఉండి వాడికి తోచిన విధంగా సలహా ఇస్తాడు . ఆ సలహా విను . అందులో అర్థం పరమార్థం తెలుసుకో . అదే పాటించమని చెప్పట్లేదు. కాకపోతే వాడు చెప్పిన సమాధానం లో నుంచి ఆధారం తీసుకో. దానికి నీకు జ్ఞాన స్పురణ అందుతుంది. అప్పుడు వీడి ఆలోచన విధానంతో నువ్వు ఆలోచించు . అప్పుడు విషయం ఏంటి అనేది నీకు అర్థం అవుతుంది. అలా నీకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. వీడు మూలధార చక్రంలో ఉండే గణపతి లాంటివాడని నేను గ్రహించాను. ఆ డూండీ గణపతి అంశ నుంచి వీడు పుట్టాడు. వీడిని బాలగణపతిగానే నీ పక్కన ఉంచుకో. కావాల్సింది చేసి పెట్టు . వాడు నిన్ను చూసుకుంటాడు . రాత్రి పగలు నీకు కాపలా కాస్తూ ఉంటాడు. నీకు కావాల్సింది చూస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు! ఏంటి అనేది అడగద్దు. పట్టించుకోవద్దు. వాడి మానాన వాడిని వదిలేసేయ్యి . వాడే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో తల్లిలాగా ఉంటాడు. అలా ఇలా అని ఎలాంటి గొడవలు తీసుకురాడు. సమస్యలు తీసుకురాడు. వీడి వల్ల నీకు ఎలాంటి సమస్యలు రావు ..సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు. తన అమాయకత్వపు ప్రశ్నల ద్వారా నీకు మాత్రం స్పురణ కలిగిస్తాడు. సాధనకి వీడు ఉపయోగపడతాడు . ....కానీ బాధ పెట్టడు. బాధపడనివ్వడు. నీ ఏకాంతం , ఒంటరి నుంచి బయటకు తీస్తాడు. అంతేగాని పుత్ర వ్యామోహంలో నువ్వు పడవు. స్వప్నంలో దర్శనం ఇచ్చిన వాడి కామమాయలోనూ నువ్వు పడవు . ప్రకృతి పరీక్షలు పెడుతుంది . భర్త వ్యామోహంలో పడతావా? పుత్ర వ్యామోహం లో పడతావా? అనేది పరీక్ష పెడుతుంది. అతను నీ స్వప్నంలో వచ్చినవాడు ఆకాశ శరీర ధారి . నీ గత జన్మ భర్త . వాడికి నువ్వు ధర్మపత్నివి . ఇన్నాళ్లు నువ్వు భోగ జీవితంలో అనుభవించిన వాడికి .....నీ భర్తగా ఉన్నవాడికి నువ్వు భార్య మాత్రమే . ధర్మపత్నివి కాదు. భార్యకి ధర్మపత్ని కి తేడా ఉందని తెలుసుకో! ధర్మపత్ని అంటే భోగ జీవితంలో భార్య చేయవలసిన వన్నీ చేసి..... అనగా సంతానాన్ని ఇవ్వటం , కోరికలు తీర్చడం , సపర్యలు ఇవన్నీ భార్య చేస్తుంది. అదే ధర్మపత్ని వీటన్నింటితో పాటు పూజలోనూ, యాగాల్లోనూ, హోమాల్లోనూ భర్తతో పాటు పాల్గొని అన్ని చేస్తుంది. భార్యకి యజ్ఞ యాగాది క్రతువులలో పక్కన కూర్చునే అధికారం లేదు . కేవలం ధర్మపత్ని కి మాత్రమే అధికారం ఉంటుంది . భార్య అనేది పాతివ్రత్యం పాటించదు. కానీ ఎవరైతే పాతివ్రత్య ధర్మమును పాటిస్తారో.. వారు ధర్మపత్ని అవుతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే , ఆది జన్మ గా నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తిగాని , అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్లకి ధర్మపత్ని లేదా ధర్మపతి అవుతారు . ఆ తర్వాత జన్మలలో వాళ్లంతా కూడా భార్యలవుతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రియురాలు అవుతారు. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లంతా కూడా ఉంపుడుగత్తెలవుతారు. ఇలా ప్రకృతి రకరకాల దశల్లో రకరకాల విధి విధానాల్లో ఏర్పాటు చేసింది. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే.... అంతులేని కథ అవుతుంది. దీని బట్టి నీ సాధనా ధర్మపతి . స్వప్నంలో ఉన్నవాడి సాధనా ధర్మపత్నిగా పాతివ్రత్య ధర్మం పాటించి ఆది జన్మలో ఉన్నారు. వాడితో కలిసి మీ శరీరాలు ఏకమై , అర్ధనారీశ్వర తత్వమును పొందితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నిజానికి ఏం జరుగుతుంది అనేది ఇదంతా రికార్డ్ దృశ్యం కాబట్టి తెలిసిపోతుంది. భవిష్యత్తు ముందే తెలుసుకుంటే మజా ఉండదు. తెలుసుకోకుండా.... తెలియకుండా ముందుకు వెళుతూ ఉంటే ఆ వచ్చే అనుభవాలు, అనుభూతులు , మాయలు చేధిస్తూ ఉంటే మనలో మనకే తెలియని మజా వస్తుంది. ఆ మజాను అనుభవిస్తూ వెళ్ళాలి . ముందే భవిష్యత్తు తెలుసుకొని ఏదో అయిపోయింది అని ....చెప్పేసి ఇది అవ్వలేదు... అది అవ్వలేదు ....అని బాధపడితే ఉపయోగం లేదు. అవుతుందా లేదా అని మనం తెలుసుకుంటూ వెళ్ళటం..... అవ్వచ్చు అవ్వకపోవచ్చు . అయిందంటే జయం పొందుతావు. అవలేదు అంటే అపజయం పొంది, పునర్జన్మకు వెళ్తావు లేదా విశ్వమోక్షం పొందవలసిన చోట వ్యక్తిగత మోక్షమును పొందుతావు. లేదు అంటే ముక్తిని పొందుతావు. లేదు అంటే పునర్జన్మలకు వెళతావు . ఆదిలో నువ్వు చేసిన సాధన ఏమిటి అనేది 12 సంవత్సరాల లో తెలుస్తుంది . నేను ఇప్పుడు చూసి చెప్పొచ్చు . దానివలన ఆనందం ఉండదు. ఒక్కొక్కటి తెలుసుకుంటూ , ఒక్కొక్కటి అనుభూతి పొందుతూ , ఒక్కొక్క రహస్యాన్ని చేధిస్తూ వెళ్తూ ఉంటే .....ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. దాని గురించి ఎందుకు కంగారు పడటం. రాబోయే కాలంలో , రాబోయే రోజుల్లో మీ మోక్ష సన్యాసానికి అర్హత , యోగ్యత యోగం ఉందా లేదా అనేది ఆ ముగ్గురు పెట్టి పరీక్షలను బాల గణపతి సహాయంతో చేధించు . దాటు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించు . జయం పొందు . అప్పుడు నా దగ్గరికి రా! అప్పుడు మోక్ష సన్యాస దీక్ష ఇస్తాను. నీకు మంత్ర గురువువై... గురు మంత్రం ఉపదేశం చేస్తాను. అలాగే అతి గుప్తమైన రుద్ర యంత్రమును కూడా నీకు చెబుతాను . నీకు ఇంతకుముందే నా గత జన్మ ఆలి అయిన మహాదేవి రుద్ర యంత్రం గురించి నీకు చెప్పే ఉంటుంది .కాకపోతే ఆడదాని నోట్లో నూనె గింజ దాగదు కదా! నీకు చెప్పేదాకా దానికి ఆత్రం ఆగలేదు.
శివ నందిని:- ఆ...అవును స్వామి ....అదేదో రుద్ర యంత్రం ఉందని మహాదేవి చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఏంటి రుద్ర యంత్రం. ఏముంటుంది అందులో....
రుద్ర స్వామి:- అమ్మ! రుద్ర యంత్రం అంటే అదేదో శక్తి యంత్రము, రుద్రుడు యంత్రము, శివుడి యంత్రము కాదు ...నిజానికి మన సాధన శరీరంలో ఉన్న యోగ చక్రాలు ,యోగ శరీరాలు, కుండలినీ శక్తి జాగృతి అయితే ....యోగ చక్రాలలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది.. అదే మనలో ఉన్న ఏకాదశ దేహాలలోనికి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అనేది... ఈ యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యంత్రంలో ఉన్న కోడ్ ని రహస్య విధివిధానాలలో భద్రపరచడం జరిగింది. ఈ యంత్రంలో వచ్చే ఆధారాల ఆధారంగా ఆయా చక్రాలోనికి వెళ్లొచ్చు. ఆ చక్రం ఎక్కడ జాగృతి అవుతుంది. ఎక్కడ శుద్ధి అవుతుంది? ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ చక్రం దైవిక వస్తువుల ద్వారా తెలుసుకోవాలి. ఆ దైవీక వస్తువులు ఇస్తే ఈ యంత్రం ముందుకు వెళ్లడం జరుగుతుంది . అంటే మూలధార చక్రం ఎక్కడ జాగృతి అవుతుంది అని ఒక ఆధారం ఇవ్వడం.... అంటే దాని జాడలను తెలుసుకునేలా ఆధారం చూపిస్తుంది. ఆ క్షేత్రానికి మనం వెళితే అక్కడ ఆ దైవీక వస్తువులు ఇస్తారు. ఆ దైవిక వస్తువులు ఇస్తే , అది జాగృతి ,శుద్ధి ,ఆధీనం, విభేదనం ఇస్తుంది. ఆ తర్వాత ఆ దేహానికి సంబంధించిన ఆధారం ఇస్తారు. ఈ రెండు కలిస్తే అప్పుడు ఈ చక్రం మరియు దేహం శుద్ధి అయినాయని మనకి నిరూపణ చూపిస్తుంది. ఆ తర్వాత రెండవ చక్రం ఎక్కడ ఉంది... ఏంటి అనేది చూపిస్తుంది. ఇలా మన దేహమే దేవాలయంగా ....మన సాధన ఎలా జరిగింది అనేది ప్రత్యక్షంగా ఆ యంత్రం ద్వారా తెలుస్తుంది. నిజానికి ఆరుద్ర యంత్రం ఎలా ఉంది... ఏంటి అని నాకు తెలియదు . కాకపోతే అది ఎలా పని చేస్తుంది? ఈ విషయాలు తెలుస్తాయి అని తెలుసు . ఒక విధంగా చెప్పాలంటే మన సాధన శరీరంలో ఉన్న యోగ చక్రాలు ,సాధన శరీరాల యొక్క స్థితిగతులు ఆధీనం అయినాయా, స్వాధీనం అయినాయా ? మోక్షం పొందాయా లేదా అనేది రుద్ర యంత్రం ప్రత్యక్షంగా చెబుతుంది. ఆ రుద్ర యంత్రం అనివార్య కారణాలవల్ల అదృశ్యం అయింది అంటే ఈ చక్రస్థితి వద్ద ,ఆ శరీరం వద్ద నీ సాధన ఆగిపోయినట్లే. ఈ జన్మకి సాధన ఆగినట్లే. ఒకవేళ ఆరుద్ర యంత్రం మార్పు చెంది.... ఏదో ఒక రూపంగా మారితే విషయం ఏంటో తెలుస్తుంది. నిజానికి నాకు అందిన విషయ జ్ఞానం ప్రకారం. ఆ రుద్ర యంత్రం ఏంటంటే... రుద్రుడు ఈ విశ్వంలో ఏదో ఒక కొండ లోపల సజీవమూర్తిగా 85 సంవత్సరాల సిద్ధ పురుషుడిగా ఉన్నాడు. ఆయన్ని మనం ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు. మనకి కనపడేవన్నీ ప్రత్యక్ష దైవ దర్శనాలు కావు. స్వప్నంలో గాని , ధ్యానంలోగాని అనుభవాలు ఇస్తారు. నేను ఉన్నాను అన్నట్టు .....కానీ ఆది రుద్రుడు సజీవమూర్తిగా ఏదో ఒక కొండలో ఉన్నాడని , అది ఎక్కడ అనేది యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు . ఆ రుద్ర యంత్రం ద్వారా మనం తెలుసుకోవాలంటే.... ఆ రుద్ర యంత్రంలో ఉన్న సాధనా చక్రాలు అంటే మన శరీరంలో ఉన్న సాధనా చక్రాలు,... శుద్ధి , సిద్ధి , ఆధీనం , విభేదనం అవ్వాలి. అలాగే ఆ చక్రాల్లో ఉన్న శరీరాలు కూడా మోక్షాలు పొందాలి . ఎప్పుడైతే మోక్షమును పొందుతాయో . .. ఆది రుద్రుని దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుంది . అది నాకు తెలిసి ఆ దేవరకొండ పంచ శిఖరాలతో ఉందని తెలుసు. అది ఈ విశ్వంలో ఎక్కడ ఉంది ....ఎలా ఉంది తెలియదు. అంటే ఈ కలియుగంలో కూడా ఆది రుద్రుడు సజీవ మూర్తిగా.... సిద్ధ పురుషుడిగా ఆ కొండలో ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ కొండ ఏంటి అనేది ఇతిమితంగా నాకు తెలియదు. ఎప్పుడైతే ఈ రుద్ర యంత్రం ద్వారా సాధన పరిసమాప్తి చేసుకుంటావో ....ఆ సమయంలో ఆ రుద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది.... ఆ యంత్రం చూపిస్తుంది. అప్పుడు మీతో పాటు మేము కూడా ఆది రుద్రుడిని దర్శనం చేసుకోవచ్చు.... అనే ఆశ కొద్ది ఆ కర్మ మిగిలిపోయింది. మాకు ధ్యాన అనుభవాలలో, స్వప్న దర్శనాలలోనూ దైవదర్శనాలు కలుగుతున్నాయి. ప్రత్యక్షంగా ఆది రుద్రుడ్ని చూడాలని చెప్పేసి మహాదేవికి ...నాకు ....బాలగణపతికి ....కోరిక ఉంది. అందుకని ఆ దర్శనం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఆ రుద్ర యంత్రమును జాగృతి చేసే వాళ్ళు ఉన్నారా అని ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం .....అనుకోకుండా అనుకోని విధంగా నువ్వు రావడం జరిగింది. నిజ ఆది రుద్రుడి భౌతిక దర్శనం అవుతుందని నిర్ధారణ అయింది. అవుతుందో లేదో తెలియదు . ఎందుకంటే నీ సాధనం ముందుకు వెళుతుందా లేక అనివార్య కారణాలవల్ల తెలిసో తెలియకో తప్పు చేయటం వల్ల ఆగిపోతుందా అనేది తెలియదు. అయితే నిజ రుద్రుడు దర్శనం అవుతాడు .....లేదంటే లేదు. ఇక ఆ తర్వాత మళ్లీ వెనతిరిగి రావడం లేదా అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మోక్షం పొందటము అవుతుంది. అయితే నీ సాధన పరిసమాప్తి అయ్యేదాకా నీ సాధన ఆగిపోయేదాకా మేమిద్దరం జీవితాంతం ఉంటాం. మేము ముగ్గురం నీతో ఉంటాం . వదిలిపెట్టి వెళ్ళము. కోపావేశాలకు గురై నిన్ను వదిలిపెట్టడం అనేది మా ముగ్గురి ద్వారా జరగదు. మా ముగ్గురి ద్వారా నీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉండవు ....అనగానే ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అంటూ కన్నీరు పెట్టుకొని , శివ నందిని ఒక్కసారిగా రుద్ర స్వామి కాళ్ళ మీద పడిపోయింది. అమ్మ! నువ్వు నా కూతురు లాంటి దానివి. కాళ్ళ మీద పడకు ....లే ....నువ్వు ఈరోజు నుంచి సాధనా జీవితాన్ని ఆరంభించు. రాబోయే రోజుల్లో మోక్ష సన్యాస దీక్షలో వచ్చే పరీక్షల్లో జయం పొందు... అని చెప్పి ఆయన అక్కడి నుంచి మరో ఘాట్ వైపుకు వెళుతూ ఉండగా.... ముగ్గురు కూడా ఆయనకు నమస్కారం చేసి ....ఎవరి దారిన వాళ్ళు.... అంటే మహాదేవి స్మశానం దారి పట్టడం... బాలగణపతి శివనందిని కలిసి గదికి వెళ్ళడం జరిగింది. బాలగణపతికి 21 ఉండ్రాళ్ళు చేసి పెట్టాలని మానసికంగా అనుకుంటూ గదికి వెళ్ళింది.
శుభం భూయాత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి