అధ్యాయం 57

శుభవార్త:

మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్ 

            Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్ 

https://youtube.com/@kapalamoksham


యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న   Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe  లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham   యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు. 

https://youtube.com/@kapalamoksham


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


హెచ్చరిక:  నా అనుమతి లేకుండా ఒక పెద్ద పబ్లిషర్స్ సంస్ధ మేము అందరికి ఉచితముగా ఇచ్చిన ఫస్ట్ వర్షన్ కంటెంట్ ను యొక్క ఫీ.డి.ఫ్ ను ఒక పుస్తకముగా ప్రింట్ గా చేసి దానికి రేటు పెట్టి అమ్మకానికి పెట్టారని మా దృష్టికి వచ్చింది.కావున ఈ పుస్తకమునకు నాకు ఏలాంటి సంబంధము లేదు.ఈ పుస్తకాలలో ఉన్న కంటెంట్ పూర్తిగా లేదని  అలాగే పూర్తి కంటెంట్ మీకు ఈ బ్లాగ్ల్ లో తప్ప ఎక్కడ లభించదని గ్రహించి ఇలాంటి నకిలి కంటెంట్ పుస్తకాలు కొని మోసపోవద్దు.మరియు ఈ నా కంటెంట్ ఎక్కడగూడ మీకు అమ్మకపు పుస్తకాల రూపములో దొరకదని తెలుసుకొండి.ఒకవేళ అది మీకు అమ్మకానికి దొరికితే అది నకిలి పుస్తకము అని తెలుసుకొంటారని మా వంతు ప్రయత్నము చేస్తున్నాము.అలాగే నాకు జ్ఞానము అమ్ముకోవడము ఇష్టము లేకనే ఇలా ఉచితముగా ఈ జ్ఞానము అందాలని ఈ బ్లాగ్ లో నా కంటెంట్ ఉంచడము జరిగినదని అందరు గ్రహిస్తారని ఆశిస్తూ.....

ఆన్ లైన్లో 999 రూ.లకి దొరుకుతున్న  నకిలి "కపాలమోక్షం" గ్రంథము  యొక్క ఇమేజీలు పెట్టడము జరుగుతోంది.


My FAKE BOOK

ఈ పుస్తకములో సంపూర్తిగా బ్లాగ్ కంటెంట్ లేదని తెలుసుకొండి.కావలంటే ఈ నకిలి పుస్తకము లోని ఆఖరి పేజి మేటర్ చూడండి.అలాగే ఈ బ్లాగ్ ఆఖరి కంటేంట్ చూడండి. 


మీకే తేడా ఏమిటో తెలుస్తుంది.ఈ నకిలి పుస్తకములో పేరుకి అన్నీ అధ్యాయాలు (బ్లాగ్ లింకులు) ఉన్నప్పడికి అందులో ఉండవలసిన కంటెంట్ పూర్తిగా లేకుండా ఈ నకిలి పుస్తకములో కొన్ని అధ్యాయాలలో కొంత భాగము తీసివెయ్యడము జరిగింది.  దయచేసి ఈ నకిలి పుస్తకము కొని మోసపోవద్దని మరొకసారి మనవి చేస్తున్నాము. 

మరియి కపాలమోక్షం పేరుతో ఈ అధ్యాయాల పేరుతో సుమారుగా 1300 దాకా వీడియోలున్నాయని మా అందరి దృష్టికి వచ్చింది.పైగా వీటిలో గూడ కంటెంట్ పూర్తిగా చదవడము లేదని వారికి ఇష్టమైన భాగాలు ఇష్టము వచ్చినట్లుగా చదువుతున్నారని మాకు అర్ధమైంది.వీటికి మాకు ఏలాంటి సంబంధము లేదు.

దయచేసి ఈ అరుణాయోగి పరమహంస పవనానంద పేరుతో కాని అలాగే ఈయన పొందిన జ్ఞానానుభవాల కంటెంట్ తో కాని భక్తి వ్యాపారాలు చెయ్యవద్దని మనవి చేసుకుంటున్నాము.


నాలాంటి రూపధారి కనిపించాడు
(నా ఆజ్ఞా చక్ర అనుభవాలు)

ఆజ్ఞా చక్ర అనుభవాలు (నా డైరీలో)

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.

అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.

 డిసెంబరు 6:ఈ రోజు నుండి ఆజ్ఞా చక్ర ధ్యానం చేయటం ఆరంభించాను.నా దృష్టి అంతా భృకుటి స్థానం మధ్యలో వుంచి ధ్యానం చేయమని నా గురుదేవుడు చెప్పినారు. 
డిసెంబర్ 12: అనుకున్నంతగా నేను ధ్యానం చేయటం లేదని నాకు సరియైన ఏకాగ్రత కోసం నా నాసికాగ్రము మీద దృష్టి ధ్యానము చెయ్యమని మా గురుదేవులు చెప్పారు. 
డిసెంబర్ 18: ఆయనేమో నాసికాగ్రం మీద ధ్యానము చేయమంటే నేను నాసికా రంధ్రాలు ఉన్నచోట దృష్టి పెడుతున్నాను అని అది తప్పు అని నాసికాగ్రం అంటే ముక్కు మొదలు అయిన భృకుటి స్థానం అని మా గురువులు చెప్పేదాకా నాకు తెలియ రాలేదు.
డిసెంబర్ 25: ఈ రోజు ఉన్నట్టుండి నాకు విపరీతమైన కామోద్రేకం కలిగినది. కారణం తెలియరాలేదు. ఈ రోజంతా ప్రతి చిన్న విషయానికి నా మర్మాంగం ఉద్రేకము చెంది ఇబ్బంది పెడుతూనే ఉన్నది.

P2:
డిసెంబరు 27: మూలాధార చక్రములో ఎలా అయితే అధిక కామోద్రేకాలు కల్గినాయో అలాంటివి కలుగుతున్నాయని నాకు అనిపిస్తుంది.నా సాధన ముందుకి వెళుతుందా క్రిందకి వెళుతుందా ఎవరికి ఎరుక. 
డిసెంబరు 28: ఈరోజు నాకు అంగుళమున్న వెండి శివలింగము వచ్చినది.ఏ మాయ పరీక్షలు పెట్టడానికి వచ్చినదో ఎవరికి ఎరుక.
జనవరి 1: ఈ రోజు ధ్యానమందు నగ్నంగా ఉన్న కాంతి శరీర దేవతలు కనిపించి నన్ను కవ్వించడం మొదలుపెట్టినారు.
జనవరి 10: నా బొంద నా బూడిద.  ఈ నగ్న దేవతలు కనిపించడం కవ్వించడం ఆపటం లేదు. ఏమి చేయాలిరా బాబు వీటిని ఆపటానికి.
జనవరి 12: ఈ రోజు నా ధ్యానమందు  వివిధ దివ్య లోకా లలో వివిధ రతిభంగిమలు సంయోగ ప్రక్రియలు చేస్తున్న కాంతి శరీర స్త్రీ పురుషులు కనిపించారు వీటివలన కాషాయం ధరించిన కోరికలు కలగకుండా ఉంటుందా. నా బొంద.
జనవరి 18: ఈరోజు నాకు ధ్యానంలో పాములు కాపలా కాస్తున్న గుప్తనిధులు కనిపించాయి. అవి నిజమేనా. ఏమో ఎవరికి తెలియాలి. ఇలా ఉండగా 27 రుద్రాక్షలున్న జపమాల నాకు సంప్రాప్తి అయినది.

P3:
జనవరి 20: ఈ రోజు నాకు ధ్యానంలో గుప్తనిధుల కాపలా కాస్తున్న తాంత్రిక దేవతలు కనిపిస్తున్నారు. కారణం తెలియదు.
జనవరి 22: ఈ రోజు నాకు మణులు మణికాంతులను ఇస్తున్నఒక పెద్ద భోషాణము లీలగా విచిత్రంగా ధ్యానమునందు కనిపించినది. ఇది నిజమేనా?
జనవరి 25: నాకు కలిగే అనుభవాలు గూర్చి గురుదేవునిని అడిగినప్పుడు “నాయనా! ఇవి అన్నియు కూడా ఆజ్ఞా చక్ర జాగృతి అనుభవాలే. అలాగే వీటి మాయలో అనగా కామమాయ, ఐశ్వర్యమాయ, గుప్త నిధులు మాయలో నీ మనస్సు పడుతుందా లేదా అని ప్రకృతి నీకు యోగ పరీక్షలు పెడుతుందని గ్రహించు. అలాగే ఈ చక్రమునకు అనుసంధానంగా మూలాధార చక్రం ఉంటుందని గ్రహించు. అందులో మానవ సంబంధాలు ఉన్న నగ్న స్త్రీలు కామమాయ పెడితే ఈ చక్రము నందు నగ్న దేవతా స్త్రీలు అనగా రంభ, మేనక, ఊర్వశి, లజ్జా గౌరిఇలాంటి వారు కామ మాయ పరీక్షలు పెడతారని గ్రహించు. వీరిని చూస్తూ కలలో కూడా నీవు వీర్యస్కలనం కాకుండా చూసుకోవాలి. లేదంటే నీ కుండలినీ శక్తి మణిపూరక చక్రము దగ్గరికి వెళ్లి పోతుందని గ్రహించు.  దీనికి ఈ చక్ర నిగ్రహశక్తి కోసం మనం ఒక యంత్రమును
పూజించాలి. ఇలాగే శ్రీకృష్ణుడు కూడా రాధాదేవి యంత్రమును రామకృష్ణ పరమహంస శ్రీ కాళీమాత యంత్రమును అలాగే మహాశివుడు తన ఉజ్జయిని క్షేత్రమునందు శంఖు యంత్రమును పూజించి ఆరాధించినారని తెలుసుకో.కాబట్టి నీకు త్వరలో వీటి మాయలో పడకుండ ఉండగలిగితే ఒక దివ్య యంత్రము వస్తుంది. ఇది రాలేదంటే ఈ చక్ర మాయలో నీవు పడినట్లే” అన్నారు.

P4:

మార్చి 5: ఈ రోజు నా ముత్తాతలు తయారుచేసి ఆరాధించిన బాల దుర్గా దేవి యంత్రము పూర్తి వివరాలు తెలిసినాయి. ఈరోజు ఈ యంత్రం యొక్క మూలబీజాక్షరాలు తెలిసినాయి. దీనిని ఇన్నాళ్ళు ఎలా పూజించాలో తెలియరాలేదు.ఈరోజే సంపూర్తిగా తెలిసినది.
మార్చి 8: ఈ బంగారపు రేకు యంత్రము పూజ లో పెట్టినాను. ఇందులో దైవశక్తి ఉన్నదో లేదో చూడాలనే తపన మొదలైనది. అసలు యంత్రాలకు దైవ శక్తి ఎలా బంధీ అవుతుందో తెలుసుకోవాలి.

మార్చి 16: ఈ రోజు రాత్రి మేడ మీదకి వెళ్ళి పడుకోగానే ఉగ్ర స్వరూపముగా నా గుండెల మీద త్రిశూలముతో పొడుస్తున్న ఒక దివ్య దేవతా స్వరూపము కనపడినది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజే ఈ దుర్గ యంత్రము మెరుగు పెట్టడానికి బయటికి తీసుకుని వెళ్ళటం జరిగినది. 

P5:

మార్చి 18: ఈరోజు విచిత్రంగా ఎవరి ప్రమేయం లేకుండా మా నీళ్ల ట్యాంకులోని నీళ్లు బయటకి వచ్చి పూజ గదిని శుద్ధి చేసినాయి. చేసిన కారణాలు తెలియరాలేదు.
మార్చి 22: ఈ రోజు ఎందుకో దుర్గా యంత్రమును పూజ చేస్తుంటే నా భృకుటి స్థానము నుండి వేడి వేడి ఆవిర్లు బయటికి వస్తున్నట్లుగా విపరీతంగా అనిపించసాగింది.
మార్చి 25: ఈ యంత్రం ఆరాధన చేస్తుంటే నా మనస్సు స్థిరమైన ప్రశాంతతను పొందుతుంది. ధ్యానములో సమయమే తెలియటం లేదు. నాలుగు గంటల నుండి ఆరు గంటల దాకా ధ్యానం లో ఉండే స్థితికి వచ్చాను. ఆలోచనలు కూడా తగ్గటం ఆరంభించాయి.
ఏప్రిల్ 10: ఈరోజు విచిత్రంగా నా శరీరము నుండి వేడి వేడి ఆవిర్లు తో నా శరీరము ఉడికిపోయింది.యంత్ర శక్తిని నా శరీరము తట్టుకోలేకపోతుందా ఏమో.
ఏప్రిల్ 15: ఈరోజు జ్వరం తగ్గించే టాబ్లెట్లు పది వేసుకున్న కూడా నాకున్న వేడి ఆవిర్లు తగ్గటం లేదు. పైగా నోటిలో తెల్లని పొక్కులు కూడా వస్తున్నాయి. మాట స్పష్టంగా రావడం లేదు. గొంతు నొప్పిగా ఉంది. విపరీతమైన తలపోటుగా ఉంది.

P6:

 వైద్యులకే అర్ధం కానీ రోగము నాకు వచ్చినదా ఏమో ఎవరికి తెలుసు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది.ఈ చక్ర శుద్ధి కోసము యంత్ర ఆరాధన చేస్తే ఉన్నది పోయి కొత్త రోగాలు వస్తున్నాయా? వామ్మో! ఇప్పుడు ఏమి చేయాలి.
ఏప్రిల్ 18: ఈరోజు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర సినిమా చూడటం జరిగింది.ఆయనకి కూడా విపరీతమైన శరీర నొప్పులు, జ్వరము, అధిక వేడితో బాధపడినట్లుగా ఎన్ని చల్లటి గుడ్డలు తలకు చుట్టుకున్న కూడా తగ్గకపోవటం దృశ్యాలు చూసేసరికి నా కథ అర్థమైంది. కాకపోతేఈ నొప్పులు తగ్గించటానికి ఆయనకి బ్రాహ్మణ భైరవి అనే ఒక తాంత్రిక స్త్రీ గురువు వచ్చి ఆయనకి గంధం పూసి ఒక పూల మాల వేసేసరికి ఆయనకి నొప్పులు తగ్గటం ప్రారంభించినట్లుగా చూపించడం జరిగింది. అంటే నాకు తాంత్రిక స్త్రీ మూర్తి వచ్చేదాకా ఈ నొప్పులు తగవా? ఏమో గురు దేవుడిని అడగాలి.
ఏప్రిల్ 20: ఈరోజు నాకున్న శరీరం ఈతి బాధలు గురించి మా గురుదేవులుకి చెప్పేసరికి “నాయనా!ఈ శరీర నొప్పులు ప్రారంభమైతే నీకు శుద్ధి ఆరంభమైనట్టే. గత జన్మలో నీవు చేసిన పాప కర్మల వలన ఈ 

P7:

ఈతి బాధలు కలుగుతాయి. వీటి నివారణ కోసం శరీరానికి విభూది లేదా గంధము బాగా పట్టించాలి. మల్లెపూలు వాడాలి లేదా సుగంధ పువ్వుల మాల వేసుకోవాలి. పంచలోహ నిర్మిత కడియము వేసుకోవాలి. స్వచ్ఛమైన స్పటిక మాలలు ధరించాలి. అప్పుడే ఈ ప్రకృతిలోని పంచభూత శక్తులు నీ మీద ప్రభావం చూపటం తగ్గిస్తాయి. వీటి ఆధీనము కోసము వీటి ప్రభావము నీ మీద ఉండకుండా ఉండటానికి నీవు నాలుగు ఉప చక్రాలు అయిన గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రంల సాధనను తాంత్రిక విధానంలో చేయాల్సి ఉంటుంది. దీనికి తాంత్రిక స్త్రీ మూర్తిని ఒక గురువుగా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఈమెకి నీవు యోని పూజ చేస్తే ఆమె కామమాయ దాటితే ఉప చక్రాలు ఆధీనమై ఈ ప్రకృతి మాత సాక్షాత్కారమవుతుంది.ఆపై ఒక సద్గురువు దర్శనము పొందాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఏమిటి అనేది ఆ స్త్రీ  వచ్చినప్పుడు నీకు చెబుతాను. అప్పటిదాకా విభూది పూసుకో” అని చెప్పినారు. మందులకి తగ్గని రోగము విభూది రాసుకుంటే తగ్గుతుందా. నా బొంద. 

P8:

ఏప్రిల్ 21: మా గురుదేవులు చెప్పినట్లుగా ఒంటినిండా విభూతిని రాస్తున్నాను. గుణం కనిపిస్తుంది. వేడి ఆవిర్లు తగ్గుతున్నాయి. నాకు ఉపశమనం కలుగుతుంది. నాగ సాధువులు లాగా అఘోరలాగా  విభూది పూసుకున్నాను.
ఏప్రిల్ 25: ఈ రోజు నాకు విచిత్రంగా కాశీ క్షేత్రము నుండి శుద్ధ స్పటిక మాల, డమరుకం, ఒక నల్లని పాము బొమ్మ వచ్చినాయి. ఆశ్చర్యం అనిపించింది. స్పటిక మాల వేసుకోగానే వీటి చల్లదనానికి నా శరీరం చల్లబడినది కానీ ఇవి వేడెక్కటం ఆరంభించాయి.ఈ వేడికి ఇవి పగిలిపోతాయేమో అని అనిపించింది.
ఏప్రిల్ 28:ఈ రోజు నాకు ధ్యానమునందు ఉండగా నోటి నుండి పులి గాండ్రింపు శబ్దం రావడం గమనించాను. విచిత్రంగా అనిపించింది.
మే 2: ఈ రోజు కూడా నా నోటి నుండి జంతువుల అరుపులు వచ్చినాయి. ఎందుకో. 
మే 10: ఈ రోజు కూడా నా నోటి నుండి జంతువుల అరుపులు వచ్చినాయి.ఈ శబ్దాలకి నాకు ధ్యానము భంగం అవుతోంది.ఈ మధ్య తరచుగా నా నోటి నుండి జంతువుల అరుపులు వస్తున్నాయి. కారణము తెలియరాలేదు.

P9:

మే 18: ఈ జంతువుల అరుపులుకి నా చుట్టూ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. అచ్చముగా వాటిలాగానే నేను అరుస్తున్నానని నాకు చెబుతుంటే నాకు సిగ్గు, భయం కలుగుతున్నాయి.
మే 20: ఈ రోజు మా గురుదేవుని కలిసి నా నోటి నుండి వచ్చే జంతువుల అరుపులు గూర్చి అడగగా... “అవియు నా గత జన్మ సంస్కారాలని ఆయా జన్మలు అంతరించి పోయేటప్పుడు ఇలాంటి శబ్దాలు రూపంలో వస్తాయని వాటి గూర్చి కంగారు పడవద్దు” అని చెప్పినారు.
మే 25: జంతువుల అరుపులు ఆగటంలేదు. నా ధ్యానము ఆగటంలేదు. విచిత్రంగా ఉంది.
మే 28: దుర్గా యంత్ర ఆరాధన చేస్తున్నాను.ఎందుకో ఈ రోజు ఈమెకు ముత్తైదువ వస్తువులు సమర్పించడం జరిగినది.
మే 30: ఈ మధ్య తరచుగా తలపోటు విపరీతంగా వస్తోంది. ఒకవేళ మైగ్రేన్ నొప్పి కాదు కదా. వామ్మో! ఏమి చేయాలి.

P10:
జూన్ 5: ఈ రోజు కారణము లేకుండా బాగా మానసికంగా శారీరకంగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.
జూన్ 8: ఈ రోజు అన్ని విషయాలయందు ఏకాగ్రతను కోల్పోతున్నాను. నా మనస్సు దేనియందు నిలబడలేక పోతున్నది. కారణమో తెలియదు.
జూన్ 10:ఈ మధ్య నాకు అన్నిటి యందు సందేహాలు, అనుమానాలు, అవమానాలు కలుగుతున్నాయి.
జూన్ 15: ఈమధ్య ప్రతిదానికి నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నాను. ప్రతి చిన్న సమస్యని కూడా పరిష్కరించలేక పోతున్నాను. కొంపదీసి ఈ దుర్గా యంత్ర శక్తి నా జీవశక్తిని లాక్కుంటుందా. ఎవరికి తెలుసు. 
జూన్ 18: ఈ రోజు నా గురుదేవుడుని నాకున్న సమస్యల గురించి అడిగితే దానికి ఆయన వెంటనే “ఇవి అన్నీ కూడా ఈ చక్రము బలహీనపడినప్పుడు వచ్చే స్థితులని ఈ చక్రము బలము కోసం తరచుగా పులిహార అన్నము తినమని అలాగే జ్ఞానముద్ర, ప్రాణ ముద్ర, అంజలి ముద్ర,అగోచరీ ముద్ర అనే హస్త ముద్రలు వెయ్యటం అభ్యాసము చేయమని” చెప్పటం జరిగినది.

P11:
జూన్ 30: ఈ ముద్రలు వేయడం వలన నాకున్న మానసిక సమస్యలు తగ్గుతున్నాయి. ఏకాగ్రత పెరిగినది. ఆందోళన తగ్గినది. ఆలోచించే స్థితి పెరిగినది. 
జూలై 5: నాకు జాతక సమస్యల కోసం పరిచయమైన ఒక స్త్రీ మూర్తి నా తాంత్రిక స్త్రీ  గురువు అని నా గురుదేవుడు చెప్పినాడు. కాకపోతే ఆమెకి గతం గుర్తు లేదని చెప్పటం జరిగినది.
ఆగస్టు 15: ఈరోజు నాకు ధ్యానంలో విచిత్రంగా నేను పూజించే దుర్గా యంత్రం కనిపించినది. అందులోనుంచి ఒక మూడు సంవత్సరముల ఒక బాలిక రూపంలో బయటికి వచ్చి నా తొడ మీద కూర్చున్నట్లుగా అనిపించింది. కనిపించినది. కాకపోతే ఎవరో నా తోడ మీద కూర్చుని ఉన్నట్లుగా అనిపించినది. ఏదో తెలియని అనుభూతి కలిగింది.

P12:
ఆగస్టు 20: ఈ రోజు నాకు ధ్యానములో ఎరుపు జాకెట్టు పసుపు రంగు లంగా వేసుకున్న 8 సంవత్సరముల బాలిక రూపంలో నవ్వుతూ నా దగ్గరకు వచ్చినట్లుగా అనిపించినది. ఇది నిజమా లేదా కలలాంటి అనుభవమా నాకు అయితే అర్థం కాలేదు.
సెప్టెంబర్ 10: ఈ రోజు దుర్గాష్టమి. దుర్గా యంత్రము పూజ చేస్తున్నాను. పైగా దేవీ నవరాత్రుల దీక్షలో ఉన్నాను. సుమారుగా 28 నుండి 32 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక స్త్రీ మూర్తి యంత్రము నుండి బయటికి వచ్చి

P13:
 అటు ఇటు తిరుగుతూ మళ్లీ ఈ యంత్రం లోనికి వెళ్లిపోవడం నా కనులారా సజీవమూర్తిగా చూడడం జరిగినది. మొదట నాకు ఆశ్చర్యం వేసినది. ఆ తర్వాత భయము వేసినది.
సెప్టెంబర్ 25: ఈ రోజు నాకు ధ్యానములో అలాగే మా ఇంటికి 45సంవత్సరముల వయస్సు ఉండి నల్లని చీరతో ఒక ఆవిడ వచ్చింది. మా అమ్మ దగ్గర ఉన్న నల్లని చీర అడిగి తీసుకుని వెళ్ళినది అని అమ్మ చెప్పింది.ఈ మధ్య ఈ దేవతా స్త్రీ మూర్తులు నా వెంట ఎందుకు తిరుగుతున్నారో మా గురు దేవుడిని అడగాలని అనుకున్నాను. 
సెప్టెంబర్ 28: నాకు కలిగే స్త్రీ  మూర్తి దేవత అనుభవాలు గూర్చి చెప్పినప్పుడు ఆయన పెద్దగా నవ్వి “నాయన! ప్రకృతి మాత అయిన బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపాలు నీవు చూసిన మూడు సంవత్సరములు బాలిక బాలా, ఇరవై ఎనిమిది సంవత్సరములు త్రిపుర ,45 సంవత్సరములు సుందరి, 80 సంవత్సరములు దేవి --  రూపాలు అని చెప్పటం జరిగినది.ఈమె సాక్షాత్కార మాయలో నిన్ను ఉంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని గ్రహించు. నిన్ను తన ప్రకృతి మాయ అయిన జీవ మాయ దాటకుండా చేస్తోందని గ్రహించు. నేను ఇప్పటిదాకా ఈమె మాయను కూడా దాటలేకపోయినాను. 

P14:
అలాగే రామకృష్ణ పరమహంసకి కాళీ మాత అనే ప్రకృతి మాత మాయను దాటించడానికి తోతాపురి అనే సద్గురువు వచ్చినారని తెలుసుకో. సద్గురువు అంటే ఆత్మ సాక్షాత్కారమును పొంది ఇతరులకు శక్తి పాత సిద్ది ద్వారా అనుగ్రహించే గురువు అని గ్రహించు. కాకపోతే ఇలాంటి మీ సద్గురువు కోసం మీకు ఈ చక్రం యొక్క 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ,కాల, బ్రహ్మ చక్రములను దాట వలసి ఉంటుంది. అది కూడా తాంత్రిక విధి విధానంలో అనగా పంచ మకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము అనే ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.వీటికి నా తల్లి అనుమతి ఇవ్వకపోవడంతో వీటిని చేయలేకపోవడంతో ఈ ప్రకృతి మాయను దాటలేకపోయినాను  అని ఆయన నిజాయితీగా చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు. నా స్వామిరంగా. గొర్రె చచ్చింది అన్నమాట అనుకున్నాను. 
అక్టోబర్ 10: ఈరోజు పురాణపురుష అయిన శ్రీ లాహిరి మహాశయులు జీవిత అనుభవాలు గ్రంథము చదవటము జరిగినది.ఈ నాలుగు ఉప చక్రాల కోసం తాంత్రిక విధానమే కాకుండా దక్షిణాచారం లో కూడా విధి విధానాలు ఉన్నాయని చెప్పడం జరిగినది. అనగా మన కొండ నాలిక యందు స్రవించే అమృతమును సేవించుట మద్యపానం అని అలాగే ఖేచరీ ముద్ర సిద్ది పొందటమే మాంసభక్షణ అని అలాగే ఆజ్ఞాచక్రము లోని త్రికోణంలోని

P15:
త్రినది సంగమ స్థానం అనగా గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం అని ఇందులో సంచరించే శ్వాస ప్రశ్వాస అనే చేపలు తినటం మత్స్యము అని అలాగే చిన్ముద్ర సాధన సిద్ది ముద్ర అని మణిపూరక చక్రంలోని  'ర'  అనే బీజాక్షరము మరియు ఆజ్ఞా చక్రములోని 'మ' అనే బీజాక్షరము అనుసంధానించడమే మైధునం అని చెప్పటం జరిగినది. ఈ విధముగా దక్షిణాచారంలో సాధన చేసి ఈ నాలుగు ఉప చక్రాలను దాటవచ్చునని చెప్పటం జరిగినది.
అక్టోబర్ 15: కానీ నాకున్న దుర్గాదేవి దైవ సాక్షాత్కారం మహామాయ దాటలేకపోతున్నాను.ఏమి చేయాలో అర్థం కావటం లేదు. నా గురు దేవుడికి తనకి అంత శక్తి లేదని చెప్పినారు. ఇప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో ఎలా దాటాలో...

అక్టోబర్ 18: ఈ రోజు నా కుడి చెవి నుండి ఏదో నాదము లీలగా వినపడుతుంది.కానీ అది అర్థం కావటం లేదు. కానీ వినాలని నా మనస్సు తాపత్రయపడుతోంది.
అక్టోబరు 28: ఈ రోజు నా కుడి చెవి నుండి చాలా స్పష్టంగా ఓంకారనాదం వినబడ సాగినది. ఆశ్చర్యమేసింది. ఆనందం వేసింది. 

P16:

నవంబరు 10: ఈ రోజు నా భ్రుకుటి స్థానము నందు ఏదో మిలమిల మెరుస్తూ ఒక ధ్రువతార కనపడినది. బొట్టు ఉండవలసినస్థానము నందు నక్షత్రం ఉండటం ఏమిటో నాకైతే అర్థం కాలేదు.

నవంబర్ 22: ఈ రోజు నాకు కనిపిస్తున్న ధ్రువ తార కాస్త పెద్దది అవుతూ కోడి గుడ్డు ఆకారము అంత పరిమాణంలో కనపడినది. నాకు ఆశ్చర్యము వేసే సరికి నాకు ధ్యానము భంగమైనది.

నవంబర్ 23: ఈ రోజు నాకు ముదురు వంకాయ రంగులో ఓం మధ్య బీజాక్షరము గా ఉన్న రెండు దళాలు ఉన్న పద్మము లీలగా కనిపించసాగింది.

నవంబర్ 25: ఈ రోజు అర్ధరాత్రి నా శరీరము నుండి నాలాంటి రూప ధారి తెల్లని శరీరం బయటికి వచ్చి తిరిగి ఆ తర్వాత నా శరీరము లోనికి ప్రవేశించడం నా భౌతిక నేత్రములు ద్వారా చూడటం జరిగినది. ఆశ్చర్యము, భయం వేసింది .
నవంబరు 28: పుస్తకాలు చదివితే అది సూక్ష్మశరీరం అని తెలిసినది. అది ఎవరో ఏమిటో తెలుసుకుంటే అదియే ఆత్మ సాక్షాత్కారము అవుతుందని గ్రహించాను. కాకపోతే దీనికి సద్గురువు అనుగ్రహం ఉండాలని అలాగే దైవ సాక్షాత్కారం మాయలను దాటాలని చెప్పటం జరిగినది.

P17:
డిసెంబరు 5: నా చుట్టూ అలాగే నా ఇంటి చుట్టూ దైవ శక్తి తిరుగుతుందని నా చుట్టూ ఉన్న వారు గ్రహించటం మొదలుపెట్టినారు. దీనిని ఇంతటితో ఆపకపోతే నన్ను ఒక దైవ భక్తుడుగా చేసి పూజలు చేయటం చేస్తారు.

P18:
డిసెంబర్ 12: ఈ రోజు నా తాంత్రిక స్త్రీ గురువుతో మాట్లాడటం జరిగింది. ఆమె సహాయ సహకారాలతో దక్షిణాచారంలో నా 4 ఉప చక్రాలు అయిన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలను దాటాలని నిశ్చయించుకున్నాను.  (గమనిక: ఈ నాలుగు ఉప చక్రాలు జాగృతికి,శుద్ధికి మాకు నాలుగు సంవత్సరముల పైన పట్టినది అని గ్రహించండి.)
ఫిబ్రవరి 10: ఇంతటితో నా నాలుగు ఉప చక్రాలు గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాలు జాగృతి, శుద్ధి అయినాయి.

P19:
ఫిబ్రవరి 29: ఎన్ని చేసినా కూడా నాకు కలిగే దుర్గాదేవి సాక్షాత్కార మాయను దాటి లేకపోయినాను. ఆమె నన్ను వదలటం లేదు. ఏవో సిద్ధులు శక్తులు ఇస్తానని గోల చేస్తోంది. యంత్ర ఆరాధన ఆపివేసిన కూడా ఈమె కనబడటం మానలేదు. నేను కూడా మా గురు దేవుడిలాగా ఈ దైవ సాక్షాత్కారం మాయను దాటలేనా? ప్రకృతిని దాటలేనా. 
మార్చి 10: ఈ రోజు ధ్యానము అంతా కూడా గుణ చక్రము మీద పెట్టినాను. ఈ చక్ర దైవమైన శ్రీ దత్త దర్శనం పొందటం జరిగినది. ఇదే సమయంలో దుర్గాదేవి కాస్త బాల రూపంలో మూడు సంవత్సరముల పాప గా కనిపించి కవ్వించడం మొదలు పెట్టింది.
మార్చి 27: ఈరోజు ధ్యానము అంతా కూడా కర్మ చక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవం అయిన శ్రీ రామ దర్శనం అయినది. ఇదే సమయంలో దుర్గాదేవి మంచి సౌందర్య యవ్వనవతిగా నగ్నముగా లజ్జా గౌరిగా దర్శనము ఇచ్చినది. కవ్వించడం మొదలుపెట్టినది. నవ్వి ఊరుకున్నాను.

P20:
ఏప్రిల్ 10: ఈ రోజు ధ్యానము అంతా కాలచక్రం మీద పెట్టినాను. ఈ చక్ర దైవమైన కాలభైరవ స్వరూప దర్శనం అయినది. ఆ తర్వాత దుర్గాదేవి 45సంవత్సరాలు ఉండి సుందరి రూపంలో తన స్థనాలు నగ్నంగా చూపుతూ కనబడినది. నవ్వేసి ఊరుకున్నాను. ఆ తర్వాత ఈ మధ్య నేను పెంచుకుని చనిపోయిన షాడో కుక్క కనిపించి పైగా పునర్జన్మ తో మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది.
ఏప్రిల్ 25: ఈ రోజు అంతా కూడా నా ధ్యానం బ్రహ్మ చక్రం మీద పెట్టినాను. విచిత్రంగా ఏకపాదుడు అనే రూపము కనిపించినది. ఆపై దుర్గాదేవి 80 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తిగా ముదురు ఆకుపచ్చ రంగు చీరలో కనిపించి దీవించి శూన్యము నందు అదృశ్యమైంది. ఆయా చక్ర దేవతలు చివరికి శూన్యము నందు లీనం అవటం కూడా జరిగినది.
మే 10: ఈ రోజు నాకు కలలో భవిష్యవాణి సూచన అనుభవాలు కలిగాయి. అవి నిజమేనా అన్నట్లు చనిపోయిన నా కుక్క పునర్జన్మ యొక్క కుక్క రూపము లీలగా కనిపించినది.
మే 13: నాకు కలలో కనిపించిన భవిష్య అనుభవాలు నిజమేనని తెలుస్తోంది .వామ్మో! ఇది ఏమిటి. ఈరోజు నాకు ధ్యానములో కనిపిస్తున్న కుక్క ఇలలో నాకు కనపడి మా ఇంటికి తీసుకొని రావటం అయినది.
మే 18: నాకు జరగబోయే భవిష్యత్ దృశ్యాలు కలలో ధ్యానములో కనబడుట ఆరంభమయ్యాయి. అవి నిజమవుతూ వస్తున్నాయి. వామ్మో! ఇదే త్రికాల జ్ఞాన సిద్ధి కాబోలు.

P21:
మే 20: దీనికి సంబంధించిన పుస్తకాలు చదివితే ఇదియే త్రికాలజ్ఞాన సిద్ది అని మనం త్రినేత్రం యందు జరగబోయే భవిష్యత్తు దృశ్యాలు లీలగా కనబడతాయని వీటిని చూస్తూనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం వ్రాసినారు అని తెలుసుకున్నాను. అంటే ఈ చక్రం లో ఉండే త్రినేత్రం తెరుచుకుందా? తెరుచుకుంది కాబట్టి నాకు దైవ సాక్షాత్కార దర్శనాలు తెలిసినాయి అని నాకు అర్థమైనది.  
జూన్ 10: నిజ సద్గురువు కోసము నాలో తపన మొదలైనది. దైవ సాక్షాత్కారమును దాటించాలి. నా మనస్సును కాస్త ఆత్మయందు లీనమైనట్లు చేయాలంటే సద్గురువు దర్శనము కావాలి అని తెలిసినది.
ఆగస్టు 5: ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు మొట్టమొదటిసారిగా దర్శించుకోవటానికి బయలుదేరినాను.
ఆగస్టు 6: ఈరోజు కాశీలో నేను మానస సరోవరం ఘాట్ నందు ధ్యానం చేస్తూ ఉండగా నా మనోనేత్రం నందు ఎవరివో పెద్ద పాదాల దర్శనం అయినది. ఇది ఎవరివో అర్థం కాలేదు.
ఆగస్టు 7: ఈ రోజు ఈ పాదాలు ఉన్న వ్యక్తి మోకాళ్ళ వరకు దర్శనమిచ్చి ఏదో గుడికి వెళుతున్నట్లుగా ధ్యానములో కనిపించినది. ఇదే రోజు మేము కాశీ విశ్వనాథ శివలింగ దర్శనం చేసుకోవడం జరిగినది. 

P22:
ఆగస్టు 8: ఈ రోజు అనేక తలలు ఉన్న ఒక పాము ఒక నల్లటి శివలింగ మూర్తిని నీటిలో ఉంచి తన చుట్టూ మధ్య ఉంచినట్లుగా ధ్యాన దర్శనం అయినది. ఈ లింగము నిజమైన విశ్వనాధ లింగమని ఎవరికి తెలుసు.
ఆగస్టు 10: ఈ రోజు ఈ పెద్ద పాదాలు ఉన్న వ్యక్తి ఏదో మెట్లు ఎక్కి పైకి వెళుతున్నట్లుగా దర్శనం అయినది.ఎక్కడివో ఈ మెట్లు ఈ ఘాట్ ఏమిటో నాకు తెలియ రాలేదు.
ఆగస్టు 11: ఈ రోజు గయయాత్ర చేయడం జరిగినది. బుద్ధగయ లో బుద్ధుడు జ్ఞానము పొందిన బోధి వృక్షము చూడటము జరిగినది. అలాగే అక్కడ జపధ్యానాలు చేస్తున్న లామాలు కనిపించారు.విచిత్రముగా అందరూ చూస్తుండగా ఈ రావి చెట్టు నుండి ఒక ఆకు నా నెత్తి మీద పడినది.అక్కడున్న లామాలు ఈ ఆకును పవిత్రముగా తాగుతూ బుద్ధ భగవాన్ అనుగ్రహం మీకు కలిగినదని అంటూ నన్ను దీవించారు. నాకు ఆశ్చర్యం ఆనందం వేసింది. ఆ రావి ఆకు అక్కడ నుండి తెచ్చుకోవటం జరిగినది.

P23:
ఆగస్టు 12: ఈరోజు అయోధ్య యాత్ర చేయడం జరిగినది. శ్రీరాముడు నివసించిన ఇల్లు, సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలు, వారి  దుస్తులు ఇలాంటివి చూడటం జరిగింది. వివాదాస్పద అయోధ్య మసీదు ప్రాంతం కూడా చూడటం జరిగింది. అలాగే రాబోవు కాలం రామ మందిరం నిర్మాణ కట్టడాలు చెక్కుతున్న శిల్పాలు చూడటం జరిగినది.
ఆగస్టు 13: ఈరోజు నైమిశారణ్య యాత్ర చేయడం జరిగినది. లలితాదేవి దర్శనము, బ్రహ్మ చక్ర దర్శనము, రుద్రవనము,సూత ముని ఆశ్రమం అక్కడే శ్రీ వేదవ్యాస భగవానుని అనుగ్రహ దర్శన ప్రాప్తి పొందడం జరిగినది.
ఆగస్టు 14: ఇలా తొమ్మిది రాత్రులు కాశీ నందు పూర్తి అయ్యేసరికి ఈరోజు వెనుతిరగడం జరిగినది.కానీ నాకు ధ్యానంనందు  కనిపించిన ఆ పాదాలు ఎవరివో తెలుసుకోలేక పోయానని బాధ మాత్రం ఉన్నది.
సెప్టెంబర్ 10 ఈరోజు స్వాతి వార పత్రిక యందు నాకు కాశీలో ధ్యానములో కనిపించిన పాదముద్రలు ఉన్న శ్రీ త్రైలింగ స్వామి చరిత్ర కథనం చదవటం జరిగింది. అంటే ఈయనే నాకు సద్గురువు అని నాకు అర్థం అయింది. ఎవరికైతే ఆజ్ఞా చక్రం జాగృతి, శుద్ధి ఆధీనం కోసం ఈ చక్ర క్షేత్రమైన కాశీ యాత్ర చేస్తారని తెలుసుకున్నాను. 

P24:
నవంబర్ 20: ఈ రోజు మా అన్న తో కలిసి రెండవసారి కాశీ యాత్రకు బయలుదేరినాను. కాశీ కి చేరుకున్నాను.
నవంబర్ 21: ఈ రోజు నాకు ధ్యానం నందు పాదాలు కనిపించాయి.ఈసారి శ్రీత్రైలింగ స్వామి వారి మఠం దర్శనం చేసుకోవడం జరిగినది.
నవంబర్ 22: ఈ రోజు త్రివేణి సంగమం ప్రయాగ చేరుకోవటం జరిగినది. మునకలు వేయడం జరిగినది.

నవంబర్ 23: ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు రాత్రి దశాశ్వమేధ ఘాట్ యందుకార్తీక దీపారాధన చేయాలని మేమిద్దరం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఒక పెద్ద వానరము మా గదికి వచ్చినది. దానిని చూడగానే హనుమంతుడి లాగా అనిపించింది. అరటిపండు నేను ఇచ్చినాను అది కొంత తిని కొంత వదిలి పెట్టి వెళ్లి పోయినది. అనుకోకుండా ఈ రోజు అర్ధరాత్రి హనుమాన్ గుడి ముందు కార్తీక దీపారాధన చేయడం జరిగినది. మర్నాడు తిరుగు ప్రయాణం చేసినాము. 
అక్టోబరు 19: మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి తో కలిసి మూడవ సారి నలభై ఒక్క రోజుల పాటు ఉండే విధంగా కాశీయాత్ర చేయటం జరిగినది.
ఈరోజు కాశీకి చేరుకోవడం జరిగినది.

P25:
 నవంబర్ 9: ఈరోజు శ్రీ త్రైలింగ స్వామి మఠం చేరుకున్నాను. నా గాయత్రి మంత్ర ధ్యానం చేసుకుంటున్న సమయంలో నా ధ్యానం నందు తిరిగి దుర్గాదేవి దర్శనాలు అవ్వటం మొదలైంది. నాలో దిగులు మొదలైంది. అంటే ఈమెను నేను ఇంకా దాటలేదని ఆవేదన నాలో మొదలైంది. చచ్చిపోవాలని ఒక విధమైన నిరాశ నిస్పృహ నన్ను ఆవరించింది. ఇంతలో శ్రీ స్వామివారు ఉన్న గదికి మా ఇద్దరిని లోపలికి పంపించినారు. అక్కడున్న చిన్నపాటి సమాధి లాంటి దాని మీద నా తల బాదుకోవడం ప్రారంభించాను. నుదుటికి గాయమైంది. రక్తం చిమ్మింది. దుర్గాదేవి సాక్షాత్కారం ఆగిపోయింది. ఆపై నా మనస్సు కాస్త ఆత్మయందు లీనమైనట్లుగా అనుభవం అవుతుండగా ఆత్మ కాస్త శ్రీ వేదవ్యాసుడిగా రూపాంతరం చెందేసరికి “పవనానంద! పరమహంస పవనానంద! లే లే! నేనే నీవు నీవే నేను” అనే మాటలు లీలగా వినిపిస్తుండేసరికి నాలో నాకే తెలియని మగత ఆవరించింది.సుమారు మూడు గంటల పైగా నేను మామూలు స్థితికి రాలేదు. అంటే నా ఆత్మ వేదవ్యాస అంశ అని నాకు అర్థం అయిం.ది ఈరోజు పరమహంస పవనానంద దీక్ష నామమును పొందటం జరిగినది. 
నవంబర్ 11: కోడిగుడ్డు ఆకారం పరిమాణం దివ్య జ్యోతి లో ఈ రోజు నాకు ధ్యానము నందు నా సూక్ష్మ శరీరము నీలి వర్ణంలో కనిపించినది. గత జన్మల ఆపై స్మృతులు స్పురణకి రావటం

P26:
మొదలైంది. వివిధ జంతు వృక్ష మానవజన్మ లు అనగా సుమారు 27 దాకా లీల గా కనిపించాయి. ఆ తర్వాత భవిష్యత్ జన్మలుగా మరో 27 దాకా కనిపించినాయి. వామ్మో! సాధనలో విఫలమైతే భవిష్య జన్మలు ఉంటాయి అనే ఆలోచన రాగానే నాకు ధ్యానం భంగమైనది. అంటే నాకు రుద్రగ్రంధి విభేధనం అయినదని గ్రహించాను.
నవంబర్ 15: ఈ రోజు కాశీ యందు నా భవిష్యత్తు జన్మ అయిన అమెరికాలోని లాస్ వేగాస్ లోని  ఆర్కిటెక్చర్ జన్మ యొక్క తల్లిదండ్రులు నాతో పాటుగా వేద కాశి యాత్ర చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గత రాత్రి ఈ ఇంగ్లీషు దొర దంపతులు నా రాబోవు జన్మకి నా కన్న తల్లిదండ్రులు అని కలలో కనిపించారు. ఉదయానికల్లా ఇల లో కనిపించారు.
నవంబర్ 18: ఈ రోజు కాశీ యందు నా గతజన్మల కర్మ శేష నివారణ కోసం జపము చేయటము ప్రారంభించాను.
నవంబర్ 22: ఈరోజు కాశీ యందు రాబోవు జన్మల కర్మ శేష నివారణ కోసం జపం చెయ్యడం ప్రారంభించాను.ఇప్పటికీ కాశీకి వచ్చి 30 రోజులు కావస్తోంది. నవంబరు 25: నేను ఈరోజు ధ్యానములో 16 గంటలపాటు నిర్విఘ్నముగా ఉండిపోయాను. అంటే సవికల్ప సమాధి స్థితిని పొందినాను అని నాకు అర్థం అయింది.

P27:
నవంబర్ 30: అక్కడున్న కార్తీకమాస చలి తీవ్రతకి నా శరీరం తట్టుకోలేక పోయినది. శ్వాస సమస్యలు మొదలయ్యాయి. చర్మం మీద దద్దుర్లు,దురదలు మొదలైనాయి. ఇక అంతటితో శ్రీ కాలభైరవ దర్శనము చేసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము.
డిసెంబర్ 5: ఈ రోజు నాకు సంపూర్తిగా దుర్గాదేవి దర్శనాలు ఆగిపోయాయని నేను ప్రకృతి మాత మాయను దాటినానని నాకు సవికల్ప సమాధి స్థితి కలిగినదని మా గురుదేవులు చెప్పడం జరిగినది. అలాగే ఒకసారి పంచభూత ధారణ ముద్రలు వేస్తే నాకు పంచభూతాలు అనగా భూమి, జలము, అగ్ని వాయువు,ఆకాశము ఆధీనమై ప్రకృతి నేను చెప్పినట్లుగా వింటుంది అని చెప్పటం జరిగినది. ఇలా ఈ చక్రము నందు పంచభూతాలు తన ఆధీనంలో ఉంచుకుని ఆజ్ఞాపించే స్థితికి సాధకుడు వస్తాడని అందుకే ఈ చక్రమును ఆజ్ఞాచక్రము అంటారని చెప్పటం జరిగినది. అసలు నిజంగానే పంచభూతాలు ఆధీనం అవుతాయా అనే చిన్నపాటి సందేహము నాలో మొదలైనది.సాధన మొదలైనది. 
డిసెంబరు 25: ఈ ప్రకృతిలో నాకు చాలా బాగా ఇష్టమైనది ఏది అనగా స్పటిక శ్రీ చక్రం నా చేతిలో సృష్టించబడినది. వామ్మో! 

P28:
ఇలా కోరికలు కోరడం మొదలైతే వాటికి అంతం ఉండదు అనిపించి కోరికలు కోరడం ఆపేసాను. అలాగేపంచభూత ఆధీన సాధనలు చెయ్యటం ఆపివేసి ఆపై వచ్చే సహస్రార చక్రము మీద దృష్టి పెట్టడం ప్రారంభించాను.

డిసెంబర్ 28:ఈ రోజు ధ్యానము నందు ఈ చక్ర దైవాలైన శివకుంటుంబము కనపడినది.ఆ తర్వాత అర్థనారీశ్వర తత్వం శివశక్తి సజీవ స్వరూపము లీలగా కనిపించి ఆపై శూన్యము నందు లీనమైనది. అంటే నామ రూప శివశక్తి కూడా శాశ్వతము కాదని నాకు అర్థమైనది. దానితో సహస్రార చక్ర ధ్యానం చేయడం ప్రారంభించాను.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!

ఆజ్ఞా చక్ర మా సాధనానుభవాలు:

ఇప్పుడు ఆరవ చక్రమైన ఆజ్ఞా చక్రం అనుభవాలు చూడండి. ఈ చక్రానికి మరో నాలుగుఉప చక్రాలు అనగా గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రాలు ఉంటాయి. దీనిపైన సహస్రారచక్రము కమలం ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవతగా అర్ధనారీశ్వర స్వరూపం ఉంటుంది.దీనికి అధి దైవముగా శ్రీ దత్త స్వామి వారు ఉంటారు. ఈ చక్రములో జీవ మాయ ఉంటుంది.ఈ మాయను దాటితేగాని జీవుడికి తన స్వస్వరూప జ్ఞాన అనుభూతి అనగా ఆత్మానుభూతి కలుగదు. అలాగే ఈ చక్రము నందు జన్మాంతర జ్ఞానము అనగా ప్రస్తుతము గతము రాబోవు జన్మల వివరాలు దివ్య దృష్టి అనగా త్రికాలాలలో భూత,భవిష్యత్ వర్తమాన కాలాలలో జరగబోయే జరిగిన జరుగుతున్న వివిధ రకాల సంఘటనలు తెలియటం అలాగే మనకి కావలసిన వ్యక్తుల వివరాలు దృశ్యాలు ప్రాంతాలు సంఘటనలు చూడగలిగే శక్తి రావటము పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ల మీద ఆధిపత్యము వచ్చి మనకి తగ్గట్లుగా ప్రకృతి ఉండేటట్లుగా ఆజ్ఞాపించే శక్తి రావడం లాంటివి జరుగుతాయి. ఈ చక్రం జాగృతి శుద్ధి ఆధీనమునకు తప్పనిసరిగా భౌతిక సద్గురువు లేదా జీవ సమాధి చెందిన సద్గురువు అనుగ్రహం పొందవలసి ఉంటుంది. నాకు జీవ సమాధి చెందిన శ్రీ త్రైలింగస్వామి వచ్చినారు. ఇక్కడ ఇలాంటి చక్ర స్థితిలోనే శిరిడి సాయి వారికి వెంకుసా సద్గురువుగా వచ్చినారని వారి చరిత్రలో తెలుస్తోంది. 
అలాగే ఆజ్ఞ, గుణ, కర్మ,కాల, బ్రహ్మ అను ఈ పంచ చక్రాలు కూడా శ్రీ దత్త స్వామి వారి ఆధీనంలో ఉంటాయని గ్రహించండి. వీటి జాగృతి శుద్ధి ఆధీనము కోసము మనము శ్రీ దత్త స్వామి అనుగ్రహమును పొందాల్సి ఉంటుంది. ఈ చక్రానికి అధిష్టాన దేవత దేవతలుగా అనగా ఆజ్ఞా చక్రానికి అర్ధనారీశ్వరుడు, గుణ చక్రానికి శ్రీ త్రిముఖ దత్తుడు లేదా త్రిముఖ ఈశ్వరుడు లేదా త్రిముఖ ఈశ్వరి అదే కర్మ చక్రానికి శ్రీరాముడు- సీతాదేవి, అదే కాల చక్రానికి కాలభైరవుడు-భైరవి, అదే బ్రహ్మ చక్రానికి ఆది బ్రహ్మదేవుడు అధిష్టాన దైవాలుగా ఉంటారు. ఈ నాలుగు  ఉప చక్రాలు గూర్చి అంతగా ప్రచారంలోనికి రాలేదు. కారణం ఈ చక్రాల సాధన అంతా తాంత్రిక సాధన విధి విధానంకు సంబంధించినది. అనగా గుణ చక్రానికి కాపాలిక సాధన, కర్మ  చక్రానికి అఘోర సాధన, కాల చక్రానికి భైరవి సాధన, బ్రహ్మ చక్రం నాగ సాధువులు సాధన అను తాంత్రిక సాధన చేయాల్సి ఉంటుంది.

కాపాలిక సాధన
కాపాలిక సాధన వలన మన యందు త్రిగుణాలు అనగా సత్వ రజో తమో గుణాలు తారతమ్యాలు వలన మనకి స్త్రీ పురుష బేధాలు ద్వంద్వ ప్రవృత్తి భావాలు అనగా ప్రతిదానిలోనూ రెండు భావాలు అంటే కష్టము సుఖము, మంచి చెడు, పాపము పుణ్యము, చీకటి వెలుతురు ఇలా ద్వంద్వ భావాలు పోయి అన్నిటి యందు ఏక భావము కలగటానికి కాపాలిక సాధన ఉపయోగపడుతుంది. 

అఘోర సాధన
అలాగే అఘోర సాధన వలన మనం చేసే త్రి కర్మలు అనగా స్థూల సూక్ష్మ కారణ కర్మల వలన ఏర్పడే పాపాలు క్షయము చెందుతాయి.అనగా వివిధ రకాల పదార్థాలు మాయలు తొలగిపోయి ఏక పదార్థ జ్ఞానము అనగా ఉన్నది ఏక బ్రహ్మ పదార్థం అని జ్ఞానము కలుగుతుంది. దానితో వీరికి మలము,ఆహారము ఒకేరకంగా అనుభూతి కలుగుతుంది. 

భైరవ సాధన
భైరవ సాధన వలన స్త్రీ పురుషులు నగ్నత్వమునకు బదులుగా దిగంబర తత్వం అలవడుతుంది. కామ తత్వం నుండి దైవ తత్వం అలవడుతుంది. 

నాగ సాధువులు సాధన
ఇక నాగ సాధువులు సాధన వలన వీరు మరణ చావు మృత్యువు భయాల నుండి విముక్తి చెంది కావలసినప్పుడు కావలసిన విధంగా మహా మృత్యువును తమ అగ్ని సాధన ద్వారా సంపాదించుకుంటారు. ఇలా ఈ సాధనలు గూర్చి రాయటం చాలా తేలిక. చేసే సరికి మనకి చుక్కలు కనిపిస్తాయి. పైగా వీటికి అధిష్టాన దైవంగా శ్రీదత్తుడు ఉంటాడు. ఈయన తన పరీక్ష మాయలు పెట్టి మనల్ని నానా చంకలు నాకించి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు అని గ్రహించండి. ఈ విషయ జ్ఞానం అంతా కూడా నా దగ్గరకు వచ్చిన శ్రీ దత్త స్వామి విగ్రహ మూర్తి  ఆరాధన వలన తెలిసినది.అక్కడనుండి నా గుండెకాయ దబా దబా కొట్టుకోవటం ప్రారంభమైనది. ఎందుకంటే తాంత్రిక సాధన అంటే ఆషామాషీ కాదు అని గ్రహించండి. అసాధ్యం కాదు కానీ అంత సాధ్యం కాదని గ్రహించండి. ఎన్నో మాయలు, మర్మాలు ,మాయ దేవతలు, మంత్ర దేవతలను దాటాలి. ఒక్కొక్క చక్రంలో దాటడానికి మనకి కనీసం 12 నుండి 48 సంవత్సరాలు పడితే ఈ తాంత్రిక విధానంలో ఆరు నెలల నుండి 2 సంవత్సరాలు పడుతుంది. 24 కోట్ల గాయత్రి శక్తిని (48 సంవత్సరాలు పడితే) వీరికి ఈ తాంత్రిక యోగులకు కేవలం నలభై ఒక్క రోజులలో సంపాదించగలరు. అందుకే తాంత్రిక విధి విధానము ప్రఖ్యాతి చెందినది. కానీ దీనిని ఆచరించాలంటే ఎంతో గుండె ధైర్యము, మనోనిబ్బరం, ఆశ లేకుండా, భయమూ లేకుండా, స్పందించకుండా ఉండాలి.తాంత్రిక సాధన అంతా అర్ధరాత్రి పూట స్మశానాలలో 12 నుండి 4 గంటల మధ్యనే జరుగుతోంది. ఏకాకిగా నగ్నముగా ఒంటరిగా ఈ సాధనలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ తాంత్రిక సాధనను చాలామంది మరుగు పరిచారు. కానీ ఈ సాధన చేయకపోతే ఆజ్ఞా చక్రము నుండి సహస్ర చక్రాల మధ్య ఉండే నాలుగు ఉప చక్రాలు అనగా గుణ, కర్మ,కాల, బ్రహ్మ చక్రాలు శుద్ధి కావు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. గృహస్తులు ఈ తాంత్రిక సాధన చేయరాదు. పోనీ తెగించి చేసిన వాటి సాధన మాయలు తట్టుకోవాలి. లేదంటే మతి భ్రమణం చెంది పిచ్చి వాడు కావడం ఖాయం.ఇలా కాపాలికులు  శ్రీశైలము నందు, అఘోరాలు కాశీ నందు,భైరవులు ఉజ్జయిని నందు, నాగా సాధువులు హిమాలయ పరిసర ప్రాంతాలలో తమ నిర్దేశిత సాధనలు చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడుఈ చక్రాల సాధన గూర్చి తర్వాత వివరిస్తాను. ప్రస్తుతానికి ఆజ్ఞా చక్ర సాధన విషయాలు తెలుసుకోండి.

ఆజ్ఞాచక్రము జాగృతి: 


మైసూరు దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నాకు ఇచ్చిన పంచలోహ శ్రీ దత్త స్వామి విగ్రహ మూర్తి, స్ఫటిక శ్రీచక్రము అలాగే నాకు వచ్చిన వెండి శివలింగమూర్తి , బంగారు బాలదుర్గ యంత్రము విషయం మీకు విదితమే కదా. ఇలా ప్రతి రోజూ వీటిని కూడా నిత్య పూజలో ఉంచడం జరిగినది. నేను ఆజ్ఞాచక్రం ధ్యాన సాధన చేస్తుండగా విచిత్రంగా వివిధ రకాల శబ్దాలు తగ్గుతూ వివిధరకాల వాయిద్యాల శబ్దాలు స్పష్టముగా వినబడసాగాయి. ఆ నాద కచేరి విన్న దగ్గర నుండి ఈ వాయిద్య శబ్దాలు అనగా మృదంగము, వేణువు, హార్మోనియం, తబలా వంటి శబ్దాలు వినబడసాగాయి. నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎవరో ఏదో ఒక వాయిద్యమును మ్రోగిస్తూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలా నాకు స్పష్టంగా ఎవరు వాయించకపోయినా వినబడసాగింది.ఈ శబ్ద నాదాలకి నా చెవులలో చిల్లులు పడతాయి ఏమోనని భయము పెరగసాగింది. దానితో నాకు ధ్యాన భంగము అయిపోయేది.ఈ శబ్దాలు నేను ధ్యానం ఆపిన ఆగిపోయేవి కావు. నిరంతరం ఏదో ఒక వాయిద్యం లయబద్ధంగా శాస్త్రబద్ధంగా తాళబద్ధంగా మ్రోగడము నేను గమనించాను.ఈ వాయిద్య శబ్దానికి నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగేది. దానితో నృత్యాలు చెయ్యటం లేదా తాళానికి తగ్గట్లుగా కాళ్లు చేతులు కదపటం ఆరంభమైనది.ఇలా కొన్ని నెలల పాటు కొనసాగింది. ఈ వాయిద్యం శబ్దము ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు అంతమవుతుందో నాకు తెలిసేది కాదు. కాకపోతే మనస్సు స్థిర మనస్సుగా మారి ఏకాగ్రత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ వాయిద్య నాదం వినబడేది.రాను రాను నేను ఈ వాయిద్య  శబ్ద నాదములకు అలవాటు పడిపోయి ఏదో తెలియని ఆనంద స్థితిని పొందటం తరచుగా జరుగుతూ ఉండేది. ఇలా ఉండగా 27 రుద్రాక్షలున్న జపమాల నాకు సంప్రాప్తి అయినది. ఇది మెడలో వేసుకొని నా శివధ్యానము సాధన చేయడం ప్రారంభించినాను.  

ఆజ్ఞా చక్రం శుద్ధి: 

ఇలా వివిధ రకాల వాయిద్య శబ్దాలు నెమ్మది నెమ్మదిగా ఒకేసారిగా వినబడసాగాయి. అయినా నేను నా ధ్యాన ప్రక్రియను ఆపేవాడిని కాను. ఏమి జరుగుతుంది. బీపీ పెరుగుతుంది. గుండెదడ మొదలవుతుంది. చెవులనుండి రక్తం కారుతోంది. ఏమి జరిగితే అది జరగని అని తెగించి తీవ్రంగా ఈ వాయిద్య శబ్దాలు వినటం ఆరంభించాను. ఇలా మరి కొన్ని వారాలు గడిచి పోయినాయి.అలాగే శ్రీ దత్త స్వామి, శ్రీ చక్ర పూజలు కూడా ఆగలేదు. ఇలా నేను ఒక రోజు తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా వివిధ రకాలఈ శబ్ద నాదాలు కలసి మిళితమై ఓంకార నాదం లాగా వినపడసాగింది.చాలా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మనస్సు చెవులు పెట్టి వింటే గాని ఈ ఓంకార నాదం వినబడేది కాదు. ఎందుకంటే ఈ ఆఙ్ఞా చక్రశుద్ధి సమయములో మనకి ఓంకార నాదం వినబడుతుంది అని యోగశాస్త్రం చెబుతోంది. దానితో ఆనందం వేస్తూ ఉండేది. కానీ ఈ ఓంకార నాదం అంత స్పష్టంగా వినబడేది కాదు. చాలా కష్టపడవలసి వచ్చేది. రోజు మొత్తం మీద 16 గంటలు పాటు ఈ చక్రం ధ్యానం చేస్తే కేవలం ఎనిమిది నిమిషముల మించి ఓంకార నాదం వినబడేది కాదు. అయినా నిరుత్సాహ పడటం షరా మామూలే. కానీ ఈ ధ్యాన ప్రక్రియలో ఈ ఓంకార నాదం వినటానికి మనస్సుకు ఏకాగ్రత అలవాటు చేయసాగినాను. ఇలా కొన్ని నెలలు గడిచినాయి. రానురాను ఓంకారనాదం స్పష్టంగా వినబడ సాగినది. నా ప్రమేయం లేకుండా చెవుల యందు ఈ ఓంకార నాదం వినబడుతూ ఉంటే అప్పుడప్పుడు కొండ నాలుక చివరినుండి ద్రవము కారుతుండేది. అదే అమృతం అని మీకు తెలుసు కదా. ఈ ద్రవమును సేవిస్తూ వచ్చే ఓంకారనాదం వింటుంటే మనస్సు అలాగే శరీరము కూడా ఏదో తెలియని చెప్పటానికి అలవి కాని తన్మయత్వ స్థితిలోనికి  నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయేది. ఇట్టి స్థితి పొందటానికి ప్రతిరోజు తపించడమే నాకు అలవాటైంది. ధ్యానము ధ్యాస, ఏకాగ్రత పెరగసాగింది. మనస్సు కాస్త స్థిర మనస్సుగా  పెరుగుతూ ఆలోచనలు పరిసమాప్తి అవుతూ ఆలోచనా రహిత స్థితికి వెళుతుంది అని నాకు అర్థం అయింది. ఇది ఇలాయుండగా నాకు శ్రీశైలము నుండి శివశక్తి బాణలింగాలు వచ్చినాయి.ఇవి వచ్చిన మరుసటిరోజు నేను అలాగే మా ఆవిడ కలిసి అనుకోకుండా స్వామివారి సుభ్రాతసేవకి వెళ్ళడము...సుమారుగా నాలుగు గంటలు పాటు స్వామివారి సేవలో గడపడము జరిగినది. ఆరోజే నిజబాలదర్శన అవ్వడము జరిగినది. ఆ ఆనందానికి అవధులు లేవు.దీనికి కారణము మాకు వచ్చిన శివశక్తి బాణలింగాలే అన్నమాట. వీటిని యధావిధిగా పూజలో పెట్టి ఆరాధించడము ప్రారంభించాను. కొన్నివారాలకి నాకు అంతర్వేది క్షేత్రము నుండి ఓంకార గణపతి శంఖము వచ్చినది.అలాగే కాణిపాక క్షేత్రము నుండి లోహ ఓంకార లాకెట్ వచ్చినాయి.


ఇలా కొన్నిరోజుల తర్వాత నాకు ఇంతలో తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా రెండు దళాలు ఉన్న ఓం బీజాక్షరం వున్న పద్మము నా భ్రూమధ్యము బొట్టు పెట్టుకునే ప్రాంతములో కనపడసాగింది. అక్కడ నుండి ఈ ఓంకార నాదం చాలా స్పష్టంగా వినపడసాగింది.ధ్యానంలో కూర్చున్న 48 నిమిషములకే ఈ శబ్దం వినబడుతుంది అని నేను గ్రహించాను. ఇలా మరి కొన్ని వారాలు గడుస్తుండగా ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా భ్రూమధ్య స్థానములో ఒక తెల్లని దివ్య జ్యోతి కనపడ సాగింది. నీలి వర్ణంలో బంగారపు వర్ణ కాంతి వెలుగులతో తెల్లని కాంతి ఈ దివ్య జ్యోతి దర్శనం కాసాగింది. ఇది ఎలా నా భ్రుకుటి స్థానంలో కనబడుతుందో నాకు అర్థమయ్యేది కాదు. ధ్యానములో 4 గంటలు దాటిన తరువాత ఈ దివ్య జ్యోతి దర్శనమిచ్చేది. మొదట చాలా లీలగానే కనపడేది. రాను రాను స్పష్టముగా నాకు కనపడ సాగింది. మొదట చిన్న బిందువు లాగా కనపడేది కాస్త ఒక కోడిగుడ్డు పరిమాణ ఆకారం దాకా కనపడసాగింది. నాకు ఏమి జరుగుతుందో నాకే అర్థంకాని స్థితి. కానీ యోగశాస్త్రం ప్రకారం చూస్తే ఎవరికైతే తమ ఆజ్ఞా చక్ర శుద్ధి ప్రక్రియ పరిసమాప్తి అవుతుందో వారికి ఈ దివ్య జ్యోతి దర్శనం కలుగుతుందని చెబుతున్నాయి. దీనినే జ్యోతి బిందువుగా లేదా ఆత్మ జ్యోతి ఇలా పలు పేర్లతో పిలవడం వివిధ గ్రంథాల ద్వారా తెలిసినది. కానీ విచిత్రంగా ఈ దివ్య జ్యోతి మూడున్నర అంగుళాల పరిమాణంలో నీలి వర్ణంలో నల్ల నీడ లాంటి మనిషి ఆకారం ఒకటి తరచుగా కనబడుతోంది. అటు ఇటు కదులుతున్నాడు. ఆయన ఎవరో, ఆ ఆకారం ఎవరిదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఓంకార నాద శబ్దం ఆగలేదు. ఈ విచిత్ర వ్యక్తి దర్శనం అయ్యేసరికి నాకు ధ్యాన భంగము అయిపోయేది. కళ్ళు తెరిచిన వెంటనే ఈ కనిపించీ కనిపించని ఆ నీలి నల్ల ఆకార వ్యక్తి ఎవరో అర్థం కాక ధ్యానము ముందుకు సాగేది కాదు. 

ఇతను ఎవరో అర్థం అయ్యే లోపల నాకు తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు తెలియకుండానే నా నోటి నుండి వివిధ రకాల జంతువుల అరుపులు రావటం మొదలైంది. అంటే కుక్క అరుపు,పిల్లి అరుపు, పులి గాండ్రింపు, సింహ గర్జన, ఎద్దు గాండ్రింపు, దున్నపోతు అరుపు, నెమలి అరుపు, గ్రద్ద అరుపు, చిలుక అరుపు, పావురము అరుపు, కోతి కిచకిచలు ఇలా సుమారుగా 84 జంతువుల అరుపులు వచ్చినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క జంతువు అరుపుతో నాకు తెలియకుండానే నేను ధ్యానములో అరుస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయటం అలవాటు అయినది. ఈ జంతువుల అరుపులు ఎందుకు వస్తున్నాయో ఆ కనిపించే వ్యక్తి ఎవరో నాకు అర్థమయ్యేది కాదు. ఎవరు చెబుతారో తెలిసేది కాదు. ఏమిచేయాలో అర్థంకాని అయోమయ స్థితి. నా నోటి నుండి వచ్చే జంతువుల అరుపులు వలన నాకు ధ్యాన భంగము అవ్వటం పరిపాటి అయినది. ధ్యాన సమయము ముందుకు సాగటం లేదు. ధ్యానంలో కూర్చుని 15 నిమిషములకు ఏదో ఒక జంతువు అరుపు తీవ్రస్థాయిలో నా నుండి రావడం అంతటితో ఆ రోజుకి నా ధ్యానం సమాప్తి  చేసుకునే పరిస్థితికి వచ్చేసరికి నాకు ఏడుపు ఆగేది కాదు. ఇలాఈ జంతువుల అరుపులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. ఈ జంతువుల వలన ఇంటి చుట్టుపక్కల వారికి జూ నుండి ఆ జంతువులు బయటికి వచ్చినాయి అని భయపడే స్థితికి నా ధ్యాన జంతువుల అరుపులు ఉన్నాయి అంటే నా పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. ఈ జంతువుల అరుపులు మిమిక్రీ చేసే వారికన్నా చాలా స్పష్టంగా నా నోటి నుండి విచిత్రంగా వచ్చేవి. అలాగని ధ్యానము అయిన తరువాత నేను ఏదైనా జంతువు అరుపుతో అరచిన  ఆ జంతువు శబ్దము వచ్చేది కాదు. కానీ విచిత్రంగా ధ్యాన స్థితిలో మాత్రమే ఆ జంతువుల శబ్దాలు చాలా స్పష్టంగా వచ్చేవి. ఆ కనిపించే నల్లని వ్యక్తి ఎవరో అర్థం అయ్యేది కాదు. ఆనాటి నుండే ఈ జంతువుల అరుపులు మొదలైనాయి. ఇలాంటి విచిత్ర స్థితిలో మరి కొన్ని నెలలు గడిచి పోయినాయి.

నా సద్గురువు త్రైలింగస్వామి దర్శనం: 

ప్రస్తుత నా ధ్యానస్థితి దీన స్థితి నుండి బయటపడవేసే సద్గురువుని చూపించమని శ్రీ దత్త స్వామిని వేడుకోవటం తప్ప ఏమి చేయలేకపోయాను. ఇలా కొన్ని రోజులు గడిచాయి. యధావిధిగా జంతువుల అరుపులు రావటం అలాగే నల్లని నీడ వ్యక్తి ఆకారము దర్శనం ఇవ్వటం జరిగిపోయాయి. ఇంతలో ఒక లావుపాటి వ్యక్తి యొక్క పాదాలు మాత్రమే దర్శనం ఇవ్వడం మొదలైనది.అది కూడా సజీవ పాదాలు అన్న మాట. ఈ పాదాలు ఎవరివో ఎందుకు కనబడుతున్నాయో మొదట నాకు అర్థం కాలేదు. విచారణ చేసి చూసుకోగా ఒకవేళ ఈ పాదాలు సద్గురువువి అయి ఉండాలి అనిపించింది. కాని ఇవి ఎవరి పాదాలు, ఎవరా సద్గురువు నాకేమీ అర్థం కాలేదు. కానీ విచిత్రం ఈ పాదాల సద్గురువు గూర్చి స్వాతి వీక్లీ పత్రికలు అలాగే ఈయన చరిత్ర పుస్తకాలు నాకు చేరినాయి. కానీ వాటిని నేను పట్టించుకోలేదు. ఒకరకంగా వీటిని చూడలేదు. చదవలేదు. ఒకసారి అనుకోకుండా నేను మొదటిసారిగా కాశీ యాత్రకు వెళ్లటం జరిగింది.మూడు రోజుల తర్వాత నాకు మానస ఘాట్ వద్ద తిరిగి ఈ సజీవ పాదాలు నాకు ధ్యానమునందు కనిపించినాయి. అంటే ఈ పాదాలకి ఈ క్షేత్రానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈయన ఇక్కడ నివసిస్తున్న యోగినా లేక గురువా? ఈయన సజీవంగా ఉన్నాడా? ఆయన సజీవ సమాధి చెందిన గురువా? నాకేమీ అర్థం కాలేదు.మరో రెండు రోజుల తర్వాత ఈ పాదాలు కాస్త మోకాళ్ళ వరకు కనిపించటం ప్రారంభమైనది. ఈ మోకాళ్ళ వ్యక్తి  చాలా లావుపాటి శరీరం ఉన్న వ్యక్తి లాగా నాకు అనిపించసాగింది. మరి ఈ మోకాళ్ళ పాదాల వ్యక్తి ఎవరో నాకు ఏమీ అర్థం కాలేదు. ఇలా సగం సగం ఎందుకు కనబడుతున్నాడో అర్థమయ్యేది కాదు. విచారణ చేసుకోగా నా ఆఙ్ఞా చక్రశుద్ధి పరిసమాప్తి అయితే గాని ఆయనను సంపూర్తిగా చూసే సాధన స్థితికి నేను రాలేను అని నాకు అర్థం అయింది. ఈ మోకాళ్లను పట్టుకొని నా ధ్యాన స్థితి అదే జంతువుల అరుపులు నల్లని ఆకార వ్యక్తి నీడ గూర్చి చెప్పటం అంతా మనస్సులోనే జరుగుతోంది. ఈ మోకాళ్లు పాదాలు వ్యక్తి ఎవరో తెలియదు. అలాగే కోడిగుడ్డు జ్యోతిలో కనిపించే వ్యక్తి ఎవరో తెలియదు. దీనమ్మ జీవితం. కనిపించీ కనిపించకుండా వీరిద్దరు నాతో ఎందుకు ఆటలు ఆడుతున్నారో తెలియదు. మరుసటి రోజు ఈ మోకాళ్లు పాదాలు కాస్త ఏవో ఘాట్లోని ఇరుకైన సందుల్లో ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళటానికి వీలు ఉన్న మెట్ల మీద ఎక్కుతూ కనపడసాగింది.పోనీ ఆ ఘాట్ వివరాలు కూడా తెలియవు. కానీ ఖచ్చితంగా ఈ పాదాల వ్యక్తి కాశీ క్షేత్రవాసి అని నమ్మకమైన సూచన వచ్చినది అని గ్రహించాను. మరుసటి రోజు నిన్నటి రోజు లాంటి దృశ్యమే కనిపించసాగింది. దానితో ఇలా కాదనుకుని గంగ ఒడ్డున ఉన్న అస్సీ ఘాట్ నుండి మొదలుపెట్టి 64 ఘాట్లు అనగా చివరిదైన పంచ గంగ ఘాట్ దాకా చేరుకోగానే అక్కడ నాకు ధ్యానములో కనిపించిన మెట్ల సందు కనిపించేసరికి నాకు గుండెలో దడ మొదలైంది. ఇన్నాళ్లుగా అర్థంకాని పజిల్ గా ఉన్న పాదాల రహస్యం విడిపోతుందని అనిపించగానే నాలో ఏదో తెలియని ఆశ్చర్యం, ఆనందం, భయాలు నన్ను చుట్టుముడుతుండగా నేను కూడా ఈ మెట్ల పైకి ఎక్కుతూ పైకి చేరుకోగానే అక్కడ ఉన్న శ్రీ మఠ ద్వారము దర్శనమిచ్చింది. సరే కదా అని లోపలికి వెళ్లి విచారించగా అక్కడ ఒక పుస్తకంలో పాదాలు ఉన్న  బొమ్మ చూడగానే అచ్చం ఈ పాదాలు నాకు ధ్యానంలో కనిపించిన పాదాలు అని నేను రూడీ చేసుకోగానే అక్కడ ఒక స్త్రీమూర్తి లోపలికి వచ్చి నన్ను పలకరించి ఎందుకు వచ్చినానో తెలుసుకున్నది. అప్పుడు ఆమె వెంటనే ఆనంద పడుతూ “స్వామి! మీకు కనిపించినవి మా గురు మూర్తి పాదాలు అయిన శ్రీ త్రైలింగస్వామి వారివి. ఆయన ప్రతిరోజూ గంగ స్నానానికి నేను వచ్చిన ఘాట్లో క్రిందకి వెళ్లి స్నానాదికాలు పూర్తి చేసుకుంటారని” అంటూ ఆయన విగ్రహ మూర్తి ని అలాగే వారు వాడిన వస్తువులు చూపించ సాగినారు. ఇంతలో ఒక పని మనిషి అక్కడున్న క్రింద గదిలోనికి వెళ్ళటం నా ఓరకంట గమనించాను.అప్పుడు ఈమెను అడిగితే అది మా గురుమూర్తి నిత్యం ధ్యానం చేసుకునే గది క్రింద ఉంటుంది. అది ఎప్పుడూ మూసి ఉంటుంది. మా గురుమూర్తి సజీవ సమాధి చెందే ముందుగా కొన్ని మల్లెపువ్వులు గా మారిపోయినారు. ఈ పువ్వులను ఆయన గుర్తుగా ఆ గదిలోనే పెట్టి దానిపైన ఒక సమాధి లాంటిది కట్టినారు. ఆ గదిలోనికి వెళ్లడానికి ప్రస్తుత మఠాధిపతి అనుమతి కావాలని ఆయనకి మీరు నచ్చితేనే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారని ఆవిడ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. 


ఈలోపల మేము ఆయన పూజించిన అతిపెద్ద నల్ల శివలింగమును అలాగే ప్రత్యక్షమయ్యే మంగళా దేవి విగ్రహం మూర్తిని దర్శించుకుని ఆయన విగ్రహమూర్తి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని మా ధ్యానము నేను చేసుకుంటుండగా కొద్దిసేపటికి ప్రస్తుత పీఠాధిపతి అయిన ఒక లావుపాటి వ్యక్తి పైజమా లాల్చీ వేసుకొని లోపలికి వచ్చి తన ఆసనం పరుపు మీద కూర్చొని ధ్యానము చేసుకోవటం నా ఓరకంటి నుండి తప్పుకోలేదు. నాది అలాగే మా శ్రీమతి దీక్షాదేవి ధ్యానాలు పూర్తి గావస్తుండగా ఆయన మమ్మల్ని రమ్మని పిలవడం జరిగింది. మేము ఇద్దరమూ వెళ్ళాము. ఆయన హిందీలో మాట్లాడినాడు. నాకు హిందీ రాదు. మా శ్రీమతికి వచ్చిన హిందీలో ఆయనకు తను సమాధానాలు ఇస్తూ ఉంటే నేను మౌనం వహించాను. కొన్ని క్షణాలు పూర్తి అయిన తర్వాత ఆయన ఒక తాళం చెవి ఇస్తూ “మీరిద్దరూ కూడా శ్రీ స్వామివారు ఉన్న చిన్న గదిలోనికి వెళ్ళిరండి” అని అనుఙ్ఞ ఇచ్చినారు.మేమిద్దరము సంతోషంతో ఆ క్రింద ఉన్న చిన్న గది వైపు అడుగులు వేశాము. ఆ చిన్న గది లోనికి ప్రవేశించాము. అక్కడ చిన్న రాతి పలకలతో నిర్మితమైన ఒక పెట్టె వంటి నిర్మాణం కనబడింది. అందులోనే శ్రీ స్వామివారు తను సమాధి చెందిన తర్వాత ప్రసాదించిన మల్లెపూలు ఉంచినారని నాకు అవగతమైనది.ఆ గదికి మూలలో గోడకు ఉన్న చిన్న రంధ్రం నుండి స్వామివారు తన దగ్గరికి వచ్చిన భక్తుల కోసం వస్తువులు తీసి ఇచ్చేవారని గమనించి ఆ రంధ్రంలో లో నేను చెయ్యి పెట్టి చూస్తే ఏమీ లేదు. ఖాళీగా ఉంది అనిపించింది. 

తర్వాత గదిలో కూర్చున్న క్షణములో నుండి నాలో తీవ్ర ధ్యానస్థితిలోకి నా మనస్సు వెళ్ళిపోయింది. తీవ్రమైన ఏకాగ్రతతో కూడిన స్థిర మనస్సు గా మారినది. ఇంతలో నా నోటి నుండి యధావిధిగా నెమ్మదిగా తక్కువ స్థాయి శబ్దంతో జంతువుల అరుపులు ఒక్కొక్కటిగా రావటం మొదలైంది అని నాకు అవగతమైనది.చచ్చింది గొర్రే. ఈ జంతువుల అరుపులు వింటే నన్ను ఖచ్చితంగా బయటికి పంపుతారని తెలియని భయము మొదలైనది. ఏమి జరిగితే అది జరుగుతుంది అంతా నా సద్గురు శ్రీ త్రైలింగస్వామి  వారు మీద భారం వేసి మౌనంగా ఈ వచ్చే శబ్దాలు గమనిస్తూ ఉన్నాను. ఇంతలో నా భ్రూమధ్యం ప్రాంతములో కోడిగుడ్డు జ్యోతి లో యధావిధిగా నీలి వర్ణ నల్ల వ్యక్తి ఆకారం అగుపించటం ఆరంభమైనది. నా స్వామి రంగా. వీడు కూడా ఇప్పుడే రావాలా. మన ఖర్మ కాకపోతే. అన్ని కట్టగట్టుకుని నా మీద కక్ష గట్టి మరి వస్తున్నాయని నాలో నేను తిట్టుకుంటూ ఉండగా 

ఎవరో అశరీరవాణితో “పవన్ బాబా! కంగారు పడకు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మీ ఆది జన్మ సూక్ష్మ శరీర మైన ఆత్మ స్వరూపం. ఈ జంతువుల అరుపులు కూడా నీ గత జన్మల అవతారాలే. ప్రస్తుత చక్ర స్థితి వలన మీ సాధన శక్తి వలన గత జన్మల రాబోవు జన్మల పరంపరలు నువ్వు తగ్గించుకుంటున్నావు. గత జన్మ కర్మ వాసనలు ఈ జంతువుల అరుపులతో సంపూర్తిగా నాశనమయ్యాయి. ప్రస్తుతము నేను ఎవరో తెలుసుకో.నీ ఆది జన్మ ఎవరిదో గ్రహించు. అదియే నీ స్వస్వరూప జ్ఞానం అని గ్రహించు.అదియే ఆత్మ సాక్షాత్కార అనుభూతిని గ్రహించు. నీవు ఎవరివో నీవే తెలుసుకోవాలి. నేను కానీ నేను ఎవరో నీవే తెలుసుకోవాలి. అప్పుడే మీ రుద్రగ్రంధి ప్రవేశం జరుగుతుంది. ముందుగా నువ్వు ఎవరో తెలుసుకో పవనానంద సరస్వతి అని” ఎవరో నా చెవులలో చెప్పినట్లుగా అనిపించింది. కళ్ళు తెరవ లేకపోయినాను. విచిత్రముగా జంతువుల అరుపులు సంపూర్తిగా ఆగిపోయినాయి. కానీ నా మనోదృష్టి ముందు నీలి వర్ణ నల్ల ఆకార వ్యక్తి మరుగున పడలేదు. అలాగే నీడ లాంటి ఆకారం లో అటూ ఇటూ కదులుతూ అగుపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలియదు. నేను ఎవరో తెలియదు. దీనమ్మ జీవితం. జంతువుల అరుపులు తగ్గించుకోవటానికి నేను కాశీ కి వచ్చానా? లేక నేను ఎవరో నేను కానీ నేను ఎవరో అర్థంగాక మతిభ్రమణము పొందటానికి వచ్చినానా?చచ్చింది గొర్రే. జంతువుల అరుపులకి కారణాలు తెలిశాయి. బాగానే ఉంది. మరి ఈ ఇద్దరి వ్యక్తుల పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి ఏమిటి? అయోమయ అర్థం కాని పరిస్థితి అని తలచుకోగానే నాకే తెలియని ఏడుపు నాలో మొదలైంది.కళ్ళ వెంట ఏకధాటిగా కన్నీరు రావటం ఆరంభమైనది. ఇక చావే శరణ్యమని నా కర్ధమై ఇక చావాలని నిశ్చయించుకొని  ఆ చిన్న పెట్టె వంటి నిర్మాణం మీద నా తలను బాదుకోవడం ప్రారంభించాను. ఏమి జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంతో తెగింపు నాలో మొదలైనవి. చచ్చినా పర్వాలేదు. మా సద్గురువు సమాధి సమక్షంలో చావడం కన్నా ఇంకా ఏముంటుంది అని నాలో బలంగా అనిపించసాగింది. అసలు నాకు ఏమి జరుగుతుందో అర్థం కాక బిత్తర చూపులతో మా శ్రీమతి నన్ను ఓరకంటితో గమనిస్తూనే ఉంది అని నాకు అర్థమైన అర్థంకాని స్థితి. 

నా ఆదిజన్మ వేదవ్యాసాంశ

ఇది ఇలా ఉండగా నేను నా తలను సద్గురువు సమాధికి తీవ్రముగా కొట్టుకునే సరికి తల చిట్లి రక్తం కారసాగింది. అయినా ఆపలేదు.నేను ఎవరో నా ఆది జన్మ ఎవరిదో తెలియాలని తలంపు ముందు ఈ రక్తపు దెబ్బ పెద్దది కాదు. బాధగాను అనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత నాకు తెలియకుండానే యోగ మత్తు నెమ్మది నెమ్మదిగా ఆవరించసాగింది. శరీరము, మనస్సు తూలుతున్నాయి.అప్పుడు నా భ్రూమధ్య స్థానములో దివ్య జ్యోతి యందు నా స్థూలశరీరము కనిపించినది.నాకు ఆశ్చర్యము వేసింది. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుగా అనిపించసాగింది. ఆ తర్వాత అది కాస్త అష్టపదులు రాసిన జయదేవుడిలాగా మారిపోయింది. ఆ తర్వాత రామకృష్ణపరమహంసలాగా మారిపోయింది. ఆ తర్వాత ఇక నేను గుర్తుపట్టలేని వివిధ రకాల వ్యక్తులు ఆకారాలుగా మారుతూ వివిధ రకాల జంతువులు పక్షులు ఆకారాలుగా మారుతూ ఉంటే ఇవన్నీ గత జన్మల  జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని నాకు అర్థమైనది. ఏమి జరిగితే అది జరుగుతుందని అంత బాధలోనూ అంత నొప్పిలోనూ కళ్ళు తెరవకుండా నా మనోనేత్రం ముందు కనబడే వివిధ రకాల ఆకార జన్మల దృశ్యాలను ఏదో వీడియో చూసినట్లుగా చూస్తున్నాను ఇలా సుమారుగా 112 ఆకారాలు దాకా వచ్చినట్లుగా గుర్తు. ఆ తర్వాత త్రైలింగ స్వామి వారు కనిపించారు. మహాభారతంలో భీష్ముడుగా మారిపోయారు. అంటేఈయన కాస్త ఈయన ఆది జన్మ భీష్ముడు అని నాకు అర్థమయ్యే లోపల నాకు మొదటి లో కనిపించిన నీలి వర్ణ నల్ల వ్యక్తి అగుపించాడు. ఈ వ్యక్తి కాస్త అచ్చము నాకు లాగానే అనిపించసాగాడు. అంటే ఇది నా సూక్ష్మశరీరం అని నాకు అర్థమైనది. ఈ  నా సూక్ష్మశరీరమును తీసుకొని శ్రీ త్రైలింగస్వామి వారు ఎక్కడో ఒక చీకటి గుహ యందు తీసుకొని వెళుతున్నట్లుగా నాకు కనిపించసాగింది అంటే కలలాంటి నిజమా లేక నిజము లాంటి కల అని నాకు అర్థం కాలేదు. కానీ ఏమి జరుగుతుందో చూద్దామని అలాగే కళ్ళు తెరవకుండా చూస్తున్నాను. నేను ఎలా చూస్తున్నానో నాకేమీ అర్థం కావడం లేదు. చూసేది ఎవరు? చూడబడేది ఎవరు కూడా నాకు అర్థం కాలేదు. సినిమా చూసినట్లుగా చూస్తున్నాను అంతే. ఇంతలో గుహ లోపలికి వెళితే అక్కడ ఒక రాతి దిమ్మ ఉన్నది. ఆ పక్కనే రుద్రాక్ష మాలలు, కమండలం ఉన్నది. నా సూక్ష్మ శరీరము నవ్వుతూ ఆ దిమ్మ  మీద కూర్చోగానే అది కాస్త వేదవ్యాసుడుగా రూపాంతరము అవతారముగా కనపడసాగింది. అంటే నా ఆది జన్మ వేదవ్యాసుడు అంశ అనగానే నాకు మెలకువ వచ్చింది.ధ్యాన భంగమైనది. 

ఇంతలో సమయము మధ్యాహ్నం 3:00 గంటలు పైగా కావస్తుందని తెలిసినది. ఉదయము 10.30కి ఈ గదికి వచ్చినట్లుగా బాగా గుర్తు. నాకైతే మూడు నిమిషములు మాత్రమే అయినట్లు అనిపించినది. నేను వేదవ్యాసుడు అంశ ఏమిటి? నేను ఏమైనా కల కన్నానా? నా మతిభ్రమణము కానీ చెంద లేదు కదా. వామ్మో!వాయ్యో!  నేను ఏవో గ్రంథాలు రాసినంత మాత్రాన వేద వ్యాసుడిని అవుతానా? వామ్మో! నాకేదో జరిగినది. తల చిట్లడము వలన నా చిన్న మెదడుకి మతిభ్రమణము చెందినట్లుగా ఉంది. వామ్మో! వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ కి చూపించుకోవాలి అంటూ ఆ గది నుండి బయటకు వచ్చాను. ఇంతలో అక్కడున్న మఠాధిపతి వచ్చి “నాయనా నువ్వు వచ్చిన పని పూర్తి అయినది. మీరు వస్తారని మూడు నెలల క్రితమే నా స్వామి వారు తెలియజేసినారు. వేదవ్యాస! ఇదిగో ఈ గ్రంథమును మీకు ఇవ్వమన్నారు” అంటూ ఒక పుస్తకము నా చేతిలో పెడుతుండగా ఆ పుస్తకమును చూసిన నా శ్రీమతి వెంటనే నాతో “ఈ పుస్తకము మన దగ్గర ఉంది” అని చెప్పగానే నేను ఏది వినే స్థితిలో గాని పట్టించుకునే స్థితిలో గాని లేను. నన్ను నేను పట్టించుకునే స్థితిలో లేను. వామ్మో! ఈయన పెద్ద కిక్కు ఇచ్చారు. బుర్ర తిరుగుతోంది. వామ్మో! నా ఆది జన్మ గురించి ఎవరికైనా చెబితే నన్ను ఒక పిచ్చివాడి క్రింద జమ కడతారు. అసలు అది నిజమో కాదో కూడా తెలియదు. ఏదో మత్తు ఆవహించటంవలన నాలో మెదడులో అప్పటిదాకా ఉన్న జ్ఞాపకాలు బయటికి వచ్చి ఉంటాయి అంతేగాని నా ఆది జన్మ అంతటి మహాత్ముడిగా కావటం కలలో మాట. మా శ్రీమతికి చెప్పినా కూడా అది పెద్దగా స్పందించ లేదు. “నిజమే కావచ్చు. అందులో ఆశ్చర్యం ఏముంది” అని ఊరుకుంది. వామ్మో! దీనికి నేను కూడా లోకువ అయ్యానా లేక నాకు నిజంగానే మతి గాని చెడిందా. జంతువుల అరుపులు శబ్దాలకి నా మెదడు దెబ్బతిని ఏవో దృశ్యాలు నాకు చూపించినట్లుగా ఉంది అనుకుంటూ అక్కడినుండి నేను ఉన్న ఘాట్ వైపుకి వెళ్ళిపోతున్నాను.

నిజరూప శ్రీ దత్త దర్శనం: 

ఇంతలో ఒక ఆజానుబాహుడు చామన ఛాయగా తెల్లని చింపిరి జుట్టుతో, పెరిగి గడ్డంతో విభూది ధరించిన ఒక పిచ్చివాడి మాదిరిగా ఉన్న వ్యక్తి నన్ను అనుసరించటం నా ఓరకంటి చూపు నుండి తప్పుకోలేదు. పైగా త్రాగినట్లు ఉన్నాడు. తడబడుతూ తూలుతూ ఏవో పనులు చేస్తూ ఆకాశం కేసి, నా కేసి పిచ్చి చూపులు చూస్తూ మధ్యమధ్యలో తనకి బాగా పసుపు పచ్చ గార పట్టిన పళ్ళతో వెర్రి నవ్వులు నవ్వుతూ నన్ను అనుసరించే సరికి నాలో తెలియని భయము దడ మొదలైంది. పైగా ఇంటి అమ్మాయి కూడా నాతో (మా శ్రీమతి) కూడా ఉంది. వాడి వాలకం చూస్తే నన్ను గాని దానిని గానీ ఏదైనా చేసేదాకా వదిలేటట్లు గా లేకపోవడంతో మా తమ్ముడుని పిలిపించి వాడితో మా శ్రీమతిని మేమున్న ఆశ్రమానికి పంపించడం జరిగినది. నేను ఈయనగారి సంగతి చూడాలని నిశ్చయించుకొని పంచగంగ ఘాట్ దగ్గర ఆగిపోయినాను.అతను ఆగిపోయాడు. నేను నడిచినప్పుడల్లా నన్ను అనుసరిస్తున్నాడు. నేను వాడి కేసి చూస్తే అది గమనించి వాడు ఆకాశం కేసి చూస్తాడు. నేను చూపు ప్రక్కకి తిప్పుకోగానే నా కేసి వెర్రి చూపులు, ఓరచూపులు, క్రోధ చూపులు చూస్తాడు. మధ్యమధ్యలో ఎవరినో తిడుతూ అరుస్తూ ఉంటాడు. కేకలు వేస్తూ ఉంటాడు. ఒకరకంగా మతిభ్రమణము చెందిన మాదిరిగా పిచ్చివాడి మాదిరిగా నన్ను అనుసరించటం చూస్తే నాకే చికాకు భయం పట్టుకున్నది. నాకు భయం మొదలైంది. వాడు నన్ను ఏమైనా చేసి చంపితే ఎవరు లేకుండా దిక్కు మొక్కు లేకుండా ఈ ఘాట్ లో నేను చనిపోయానని నాకే తెలియని చావు వీడి వలన వచ్చేటట్లుగా ఉంది అని అనిపించసాగింది. ఇంతలో అతను నన్ను సమీపించి ఎక్కడికి ప్రయాణం తమ్ముడు అన్నాడు. నేను వెంటనే వల్ల కాడికి అన్నాను. వాడు నా కేసి అదోలా చూసి అవునా అందరూ చివరికి చేరవలసిన చోటు అదే కదా. నువ్వు తొందరగా కళ్ళు తెరిచినావు.పద బాబు అక్కడికే వెళదాం పద అంటూ నన్ను లాక్కొని వెళుతున్నాడు. దాంతో నాకు వామ్మో వీడు ఏమిటి నిజంగానే నన్ను స్మశానానికి తీసుకొని వెళుతున్నాడు. మాటవరసకి వల్లకాడు అంటే వీడు ఏకంగా నన్ను అక్కడికే తీసుకొని వెళ్ళేటట్లుగా ఉన్నాడని భయము వేసి వాడి నుండి తప్పించుకొని పారిపోతుండగా వాడు నా కేసి చూసి 

నవ రంధ్రాలు ఉన్న దేహము రా ఇది
నవరసాలున్న గాలి తిత్తు రా ఇది 
తుమ్మితే నశించే దేహము రా ఇది 
మూడునాళ్ళ ఆయుష్షు తీరితే 
చేరునురా స్మశాన వాటికకి రా

పెళ్ళాం ఉంటే కష్టం 
పెళ్ళాం లేకపోతే కష్టం 
పిల్లలు ఉంటే కష్టం 
పిల్లలు లేకపోతే కష్టం 

ధనము ఉంటే కష్టం 
ధనము లేకపోతే కష్టం 
ఈ దిక్కుమాలిన ప్రపంచంలో 
అన్ని కష్టాలేరా తమ్ముడు 
ఆవగింజంత శాంతి కూడా 
లేదు రా తమ్ముడు 

నాతో పాటుగా నా ఆవాసమైన 
స్మశానానికివచ్చేయరా తమ్ముడు 
అక్కడ చచ్చినవాళ్లు చచ్చేవాళ్లు 
మాత్రమే ఉంటారు తమ్ముడు 
ఈ సంకటి కష్టాలలో ఉండలేక 
నేను వల్లకాడు లోనే బస పెట్టినాను రా తమ్ముడు 
అంటూ తత్వాలు పాడుతూ నా వెంట పడినారు.
అసలే నేను ఎవరో అని సరిగ్గా అర్థం కాక నాది వ్యాస అంశ జన్మ నిజమో కాదో అవునో కాదో అర్థం అవ్వక నేను చస్తుంటే మధ్య వీడి గోల ఏమిటో నాకేమీ అర్ధం కాక వాడితో ….
నేను: నాయనా నువ్వు ఎవరివి?
వాడు: నాకేం తెలుసు వెకిలిగా నవ్వుతూ 
నేను: మరి నా వెంట పడతావెందుకు?
వాడు: నువ్వు నా వెంట పడితే నేను నీ వెంట పడ్డాను. 
నేను: నేను ఎవరో అర్థమై అర్థం కాని అయోమయ స్థితిలో నేను ఉంటే మధ్య నీ గోల ఏమిటి. 
వాడు: గోల కాదురా తమ్ముడు. ఇది నా లీల. మతిపోయినవాడే నిజముగా మతిమంతుడు.అలాగే మతిమంతుడు అనుకున్నవాడే నిజముగా మతిపోయిన వాడు. తలక్రిందులుగా చూస్తే కానీ తత్వం బోధపడదు రా తమ్ముడు.
నేను: నాయనా! తండ్రి! అన్న! నీ వెర్రిమొర్రి వేదాంత ధోరణి తో నాకు కూడా వెర్రి ఎక్కువ చేయకు. అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో ఏమి తెలుసుకున్నానో అర్థం అవ్వక చస్తున్నాను. నీకో నమస్కారం. నన్ను వదిలేయి తండ్రి.
వాడు: నాకు నమస్కారాలు పెట్టే వాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు రా తమ్ముడు. నేను ఊరుకుంటే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? ఈ మాయ జగత్తు నిన్ను వదిలి పెడుతుందా. వాళ్లు పట్టుకోరూ. తమ్ముడు రా వెళ్దాం.

 వెర్రి మొర్రి గంగ వెర్రి ఎత్తినప్పుడే
వెర్రి మొర్రి వేద విద్య తెలియును రా 
వెర్రి లేనివాడు వేదాంతిగాడయ్యా 
వెర్రి వెంగళాయా పరమహంస పవనానంద సరస్వతి 
నేను: వెంటనే నా దీక్షా నామము మీకు ఎలా తెలుసు 
వాడు: నీ నామాలే కాదు. నీ జన్మలు కూడా తెలుసు రా. సృష్టించిన వాడికి తెలియని వారు ఉండరు రా తమ్ముడు. అదిగో నీ నా అనే నామరూపాలు నిన్ను నన్ను దూరం చేస్తున్నాయిరా. అందరూ కలిసి పోయే ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోదాం రా తమ్ముడు రా.
నేను: ఎక్కడికి స్వామి? 
వాడు: మళ్లీ ఎక్కడికి అంటావ్ ఏమిరా. నీవు తిరిగి మాయలో పడుతున్నావు రా.ఇందాక వచ్చి ఎక్కడికి అంటావే. అక్కడికే వెళదాము రా తమ్ముడు రా 
నేను: ఎక్కడికి అంటే చెప్పవే పద అంటే ఎక్కడికి వెళ్లాలి ఎక్కడికి రావాలి మీతో…. 
వాడు: ఎక్కడైతే నీవు నేను ఒక్కటై దిక్కులన్నీ ఏకమైన చోటులో నా నామ రూప భావాలన్నీ ఏకమైన చోటులో అది శివసాయుజ్యము ఇచ్చే చోటు. ధ్యానమే చేయూత. జ్ఞానమే చేయూత. అజ్ఞానమే ఎదురీత. మొహమాటం ఎందుకు తమ్ముడు వల్ల కాడికి పదరా తమ్ముడు పద

నేను: నేను మాటవరసకి వల్లకాడు అంటే నువ్వు ఏకంగా అక్కడికి నిజంగానే తీసుకుని వెళతావా? నువ్వు వెర్రివాడివా వేదాంతివా.
వాడు: నన్ను చాలా మంది చాలా రకాలుగా చాలా పేర్లతో చాలా భావాలతో చాలా రూపాలతో చూస్తుంటారు. పిలుస్తుంటారు. నా సంగతి నీకెందుకు. ఎక్కడికి వెళదాము అంటావ్ ఏమిరా.వల్ల కాడికి వెళదాము పదరా
 వల్లకాడు వద్దు అన్న నిన్ను 
వదలదు రా తమ్ముడు
కల కాదు రా నా మాట వినరా నమ్మరా 
ఇదే నిజమని తెలుసుకో తమ్ముడు 

పుట్టిన జీవులు కడలికి 
చేర్చుకొనే పుణ్యక్షేత్రమే 
ఈ కాశి క్షేత్రమని అదియే 
మహా స్మశానం అని తెలుసుకో తమ్ముడు 

ఈ మాయా ప్రపంచం ఝంఝాటంలో 
ఎక్కడికి తిరిగిన చిట్టచివరికి 
నా నివాస స్థలమైన స్మశానమైన
ఈ క్షేత్రానికి రావాలని తెలుసుకో వేదవ్యాస పవనానంద సరస్వతి 
పవన్ బాబా వెర్రి వెంగళాయా అనగానే 

కాశీ క్షేత్రములో మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్న శ్రీ దత్తస్వామి పాదుకుల మందిరం
నేను: నాకు వెంటనే నా మనోనేత్రం ముందు ఈయన ఎవరో తెలుసుకోవాలని అనిపించి చూడగా శ్రీ దత్త స్వామియే నన్ను పరీక్షించడానికి ఇలా మారురూపంలో వచ్చినారు అని 

తెలియగానే నేను వెంటనే “స్వామి! నన్ను క్షమించండి. మీరు ఎవరో పోల్చుకోలేక పోయాను. నా అజ్ఞానాన్ని మన్నించండి” అంటుండగా ఆయన చిరునవ్వుతో ఒక లిప్త కాలము పాటు ఏక ముఖముతో నిజరూప దర్శనం ఇస్తూ అప్పటికే మేము చేరుకున్న మణికర్ణికా ఘాట్ వద్ద ఆయన పాదముద్రలు ఉన్న గుడిలో ఆయన స్వరూపము నడుచుకుంటూ వెళ్లి పోయింది. అంతర్ధానమయ్యారు. నాకు చాలా బాధ వేసింది. ఆయనతోపాటు స్మశానానికి వెళ్లి ఉంటే బాగుండేది కదా. ఆయన అవకాశం ఇచ్చిన నేను నా అజ్ఞానంతో వదులుకున్నాను. ఇంకా ఈ శరీరము మీద మోహ, వ్యామోహాలు ఉన్నాయి అనుకుంటా. చావాలి అనుకున్న వాడు బ్రతకడానికి ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్లుగా ఉంది నా పరిస్థితి. మోక్షము పొందటానికి అదే శాశ్వత మరణం పొందాలని యోగ సాధన చేయడం ఎందుకు? చావుకీ భయపడటం ఎందుకు? చావాలని నాకే లేదు. కేవలం చావాలి అని అనుకుంటున్నాను. చచ్చేవాడికి ఈ చావు భయమెందుకు ఉండాలి. అంటే నా సాధనలోనే అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఇకనుంచి నా సాధన జీవితంలో జరిగే ప్రతి వాటికి అనుమానించకుండా అవమానించకుండా నా ధ్యాన అనుభవాలు కలిగిన వాటిని నమ్ముకుంటూ పోవాలి అని నాకు అర్థమైనది. అలాగే దత్తస్వామి వారు స్వయంగా ఈ క్షేత్రము నందు శివలింగ ప్రతిష్ట చేసినారు. ఇది విశ్వనాధ లింగమున్న గుడికి ఎడమ వైపు ఒక సందులో ఈ మందిరమున్నది. ఇప్పటికి ఈయన సూక్ష్మశరీరముతో ఈ శివలింగమునకు నిత్యపూజ చేస్తున్నారు.అలాగే మారువేషముతో ప్రతినిత్యం ఉదయం ఈయన మణికర్ణక ఘాట్ వద్ద నిత్యగంగా స్నానము చేస్తున్నారు.

ఈచక్రం ఆధీనము:

ఇంతలో నాకు ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే నా మనోనేత్రం ముందు నేను సంకల్పించగానే ఈయన నిజరూప దర్శనం ఎలా కనపడింది. అంటే ఇప్పటి వరకు రాని దివ్యదృష్టి అనే సిద్ధి వచ్చినది. దీనివలన మనము ఎవరిని కలవాలని అనుకున్న ఎవరిని చూడాలి అనుకున్న ఈ మనోనేత్రం ముందు చూడవచ్చును. ఇప్పటిదాకాఈ మనోనేత్రం ముందు చూపించిన దృశ్యాలే చూడటము జరిగినది. అంటే ఇప్పుడు కూడా మనకు కావలసిన సమాచారమును మనకి తగిన విధముగా ఈ మనోనేత్రం ద్వారా ఈ దివ్యదృష్టి సిద్ది ద్వారా చూడవచ్చునని నాకు అర్థమైనది.అంటే ఆజ్ఞా చక్ర సాధనలో వచ్చే జన్మాంతర జ్ఞానసిద్ధి అనగా ఎవరివైనా గత వర్తమాన పూర్వజన్మల వివరాలు అవలీలగా తెలియటం అలాగే ఈ దివ్యదృష్టి ద్వారా ఎవరినైనా ఏమైనా సమాచారం చూడవచ్చునని ఈ రెండు సిద్ధులు నాకు వచ్చిన తర్వాత తెలిసింది. అలా లెక్కన చూస్తే ఈ చక్రములో పంచభూతాలను ఆజ్ఞాపించే శక్తి కూడా రావాలి కదా.అందుకే దీనిని ఆజ్ఞాచక్రం అని అన్నారని యోగశాస్త్రం చెబుతోంది అంటే ఈ లెక్కన నాకు పంచభూతాలుఆధీనం అవుతాయా ఆధీనమైనాయా. ఎవరికి తెలుసు. ఒక చిన్న పరీక్ష పెడితే సరిపోదా. బాబా సినిమాలో లాగా హీరో పెట్టినట్లు మంత్ర పరీక్షలు లాగా నేను కూడా ఈ పంచభూత పరీక్ష పెడితే తప్పు ఏమిటని అనుకుంటూ ఎండగా ఉన్న ఈ సమయంలో చిన్నపాటి వర్షం పడాలి అని సంకల్పించుకున్నాను. నా బొంద. వర్షము కాదు కదా. చిన్న మేఘము కూడా అగుపించలేదు. ఇంకా ఎండవేడిమి ఎక్కువ అయింది. వామ్మో! లేనిపోని భ్రమలతో నేను నా సాధన గూర్చి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నానని నాకు ఏమిటి? ప్రకృతి ఆధీనమవ్వడమేమిటి? పంచభూతాలు ఆధీనమవ్వడము నమ్మటానికి హద్దులు ఉండాలి. అది అసాధ్యం. మాలాంటి వెర్రి వెంగళప్పకి కూడా ఈ పంచభూతాలు ఆధీనం అయితే ఇక ఈ ప్రకృతి గతి సంగతి ఏమి కాను. నాలో నేను నవ్వుకుంటూ అక్కడనుండి ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న నేను నివాసముగా ఉన్న హోటల్ వైపుకి ప్రయాణించటం మొదలు పెట్టినాను. నేను ఒక గంట తర్వాత ఇక్కడికి చేరుకుని లోపలికి వెళుతుంటే అప్పటిదాకా ప్రకృతిలో వచ్చే మార్పులు గమనించకపోవడం వలన వర్షం టప టపా అంటూ చిరు జల్లు పడేసరికి నేను గతుక్కుమన్నాను.వామ్మో! ఈ వర్షము నా వలన పడిందా లేక అది కావాలని పడిందా. ఏమో ఎవరికి తెలుసు. నా వలన పడి ఉంటే అప్పుడే పడాలి కదా. సుమారు గంట సమయం తీసుకుంటుందా. పోనీ దానంతట అది పడి ఉంటే అది వర్షాకాలం కాదు. పైగా ఎండాకాలం. అది కూడా నేను కోరుకున్నట్లుగా చిన్నపాటి వర్షం పడి ఆగిపోయింది. అంటే నా వలన పడిందా. వామ్మో! నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎవరో తెలిసీ తెలియని అయోమయ స్థితి. నాకు పంచభూత సిద్ధి వచ్చిందో రాలేదో తెలియని అయోమయం. వామ్మో! ఈ సిద్ది ప్రయోగం ఇంతటితో ఆపివేయాలి. ఇంకా సిద్దులు పరీక్షించుకుంటూ పోతే సిద్దుల మాయలో పడి సాధన అదో గతి అవుతుంది. వస్తే సంతోషం. రాకపోయినా బాధ లేదు. వచ్చినా రాకపోయినా మనకి ఎలాంటి ఉపయోగం లేదు. వర్షం పడిన పడకపోయినా ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఉపయోగం లేదు. దాంతో తెలుసుకోవాలని పరీక్షించాలని అనే ఆలోచనలు ఆపివేసి నాను. 

           దానితో నాకు చాలా అరుదుగా 12సం!!రాలకి ఒకసారే ఏర్పడే నేపాలి గుండ్రని ఏకముఖి రుద్రాక్ష వచ్చినది.ఒకరకముగా చెప్పాలంటే నాకు రుద్రాక్షలు అంటే మహా పిచ్చి అన్నమాట.కాని నేను ఎన్ని ప్రయత్నాలు  చేసిన గూడ భద్రాక్షలే దొరికేవి.నేను ఎపుడైతే ఈ చక్రస్ధితికి వచ్చినానో అపుడు నాకు నిజమైన రుద్రాక్షలు దొరకడం ఆరంభమైనాయి.అలాగే అరుదుగా దొరికే ఏకముఖి రుద్రాక్ష గూడ నాకు లభించేసరికి నా ఆనందానికి అవధులు లేవు.కాని మన జిజ్ఞాసికి తన సాధన ప్రారంభించకముందే ఏకముఖిరుద్రాక్ష వచ్చినది.కాని గాకపోతే నా రుద్రాక్షకి వాడి రుద్రాక్షకి తేడాలున్నాయి.నాకు వచ్చిన దానిమీద ఎలాంటి రుద్రచిహ్నాలు అనగా శివలింగము,నాగపడగ,ఓంకారము,త్రిశూలము లాంటివి లేవు.వాడి దానిమీద ఇవి ఉన్నాయి.ఇందులో ఏది నిజమైన ఏకముఖి రుద్రాక్షయో నాకు అర్ధము కాలేదు. వీటిమీద  పరిశోధనలు   చేసిన గూడ ఈ రెండు నిజమేనని తెలింది.


కాని నేను ఈ చక్రస్ధితికి వచ్చినపుడు  72సం!!రాల ఒకసారి చాలా అరుదైన ఏకముఖి రుద్రాక్ష నేపాల్ ప్రాంతములో చాలా అరుదుగా ఏర్పడుతుందని...అది ఆ దేశ మహారాజుకికానుకగా ఇస్తారని తెలిసినది.దీనివిలువ కోట్లలలో ఉంటుందని చాలా ఆశ్చర్యమేసినది.కాని జిజ్ఞాసికి వచ్చిన రుద్రాక్షమీద ఈ రుద్రచిహ్నాలు చెక్కినారని... అదే నిజ ఏకముఖి రుద్రాక్షమీద ఇవి సహజసిద్ధముగా ఏర్పడతాయని తెలిసినది.అంటే మాకు వచ్చిన ఈ రుద్రాక్షలు అసంపూర్ణ నిజ రుద్రాక్షలని తెలిసినది. సంపూర్ణమైన నిజ నేపాలి ఏకముఖి రుద్రాక్ష ఫోటోలు సంపాదించడము జరిగినది.వాటిని మీకోసం పెడుతున్నాను చూడగలరు. 

ఈ  చక్ర సాధన నాకు పరిసమాప్తి అయినదని సూచనగా నాకు ఒక పెద్ద నల్లని శివలింగము వచ్చినది.అలాగే కంచి కామాక్షి నల్లని విగ్రహాము వస్తే దానిని నేను వెనక్కి పంపించడము జరిగినది. ఎందుకంటే ఆ సమయములో అమ్మవారు నాకు లజ్జాగౌరిగా  కనపడి నగ్నపరీక్షలు పెడుతున్న సమయములో ఈ విగ్రహామూర్తి రావడము జరిగినది.అమ్మవారిని నగ్నముగా చూసేస్ధితిలో నా సాధన ఉండేసరికి దానితో దీనిని యధావిధిగా వెనక్కి పంపించడము జరిగినది.

జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు

అసలు మన వాడైనా యోగ మిత్రుడైన సిద్ధ రామ జిజ్ఞాసికి ఈ ఆజ్ఞాచక్ర అనుభవాలు టెలిపతి ద్వారా తెలియజేయాలని నేను అనుకున్న సమయంలో నా మనోనేత్రం ముందు వాడి సూక్ష్మశరీర దర్శనం ఇవ్వటం జరిగినది. అంటే వాడు ఏకంగా వాడికున్న మనోజప సిద్ధి( అనాహత చక్రము) ద్వారా తన సూక్ష్మ శరీరంతో నా దగ్గరికి వచ్చినాడు అని నాకున్న దివ్య దృష్టి సిద్ది ద్వారా తెలిసినది. ఇది భలేగా ఉంది. వీడియో ఫోన్ కాల్ అన్నమాట. దీనమ్మ జీవితం. దీనికోసమా మేము ఇన్నాళ్లుగా సాధన చేశామా. ఛీ.దీనమ్మ జీవితం.నేను వారికి కనబడున్నాను నాకు వాడు కనబడుతున్నాడు అని మా ఇద్దరికీ అర్థం అయినది. నా ఆజ్ఞాచక్ర అనుభవాలు రోబో సినిమా రోబో రజనీకాంత్ చూసినట్లుగా నేను వాడిని చూస్తూ అన్ని విషయాలు చెబుతుండగా వాడు మధ్యలోనే ఆపి అన్ని విషయాలు నాకు తెలుసు వేదవ్యాసా అనగానే నేను గతుక్కుమన్నాను. నా ఆది జన్మ వివరాలు వీడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉండగా అతను నా వైపు తిరిగి స్వామి మీకు దత్త దర్శనం అలాగే నిజ భౌతిక సద్గురువు దర్శనం శ్రీత్రైలింగ స్వామి దర్శనం వర్షాలు పరీక్షలు తత్వాలు రావటం అన్ని కూడా నాకు తెలుసు. నా ఆఙ్ఞా చక్రఅనుభవాలే ఇంకా మీకు తెలియవు. మేముఆజ్ఞా చక్ర ధ్యాన స్థితిలో ఉండగా వింత వింత జంతువుల శబ్దాలు అరుపులు నా నోటి నుండి విచిత్రంగా రావటం మొదలైనవి. ఒకసారి పాము బుస బుస శబ్దాలు మరొకసారి పులి గాండ్రింపు మరొకసారి ఎలుగుబంటి అరుపులు, నక్క అరుపులు, కుక్క అరుపులు వివిధ రకాల పక్షుల అరుపులు రావటం మొదలైనవి.

 మొదట ఇవి ఎందుకు వస్తున్నాయో నాకు ఏమీ అర్థం కాలేదు. విచారణ చేయగా అవి గత జన్మ వాసనలు అని ఆ అరుపుల ద్వారా ఆ జన్మ కర్మలు నాశనం అవుతున్నాయి అని నాకు అర్థం అయింది. కానీ నా కేమో ఈ జంతువుల అరుపులు శబ్దాలు వలన పిచ్చి ఎక్కుతుంది ఏమో అని అనిపించింది. మరొకసారి అంతా మన మంచికే. దైవ ధ్యానంలో ఎలాంటి ఏ చెడు జరగదని అనిపించేది. ఒకొక్కసారి శరీరం లోపల ఏదో తగలబడి పోతున్నట్లుగా చిటపట శబ్దాలు వినిపించేవి. బయటికి తెలియకపోయినా బొడ్డు ప్రాంతమంతా చాలా వేడిగా ఉండేది. విపరీతమైన జ్వరం వచ్చిన వాడిలాగా నా శరీర స్థితి ఉండేది. ఈ విపరీత వేడిని వలన చలి కూడా నాకు తెలిసేది కాదు. ఈ అధిక వేడిమి వలన నా శరీర కండరాలు నరాలు ఎంతో నొప్పికి గురి అయ్యేవి. నాకు చాలా బాధగా ఉండేది. ఈ బాధంతా కూడా పంటిబిగువున భరించేవాడిని. సాధనను ఆపే వాడిని కాను. ఏమి జరిగితే అది జరుగుతుంది. సాధన మధ్యలో పోతే ఈ శరీరము నాశనం అవుతుంది. అంతే కదా. చచ్చేవాడికి చావు భయం ఎందుకు. నవ రంధ్రాలు ఉన్న ఈ దేహం మీద మమకారం మోహ వ్యామోహాలు ఎందుకు అని తీవ్రంగా అనిపించేది. అలాగేనని సాధనను కొనసాగించేవాడిని. జరిగే వాటిని కర్మ సాక్షిగా సాక్షీభూతంగా చూస్తూ ఊరుకోవడం తప్ప దేనినీ పట్టించుకునే వాడిని కాను. అలాగే అనవసరంగా మోహాలు తాపాలు కోపాలు చికాకులు కలుగుతుండేవి. నా మీద ద్వేషభావము పెంచుకున్న వ్యక్తులు నాకు గుర్తుకు వచ్చేవారు. అవి గుర్తుకు రాగానే నాలో తెలియని కోపావేశాలు కలుగుతూ ఉండేవి. కొద్ది సేపు అయిన తరువాత నాకు నేనే మనశ్శాంతి పొంది వీళ్లంతా మాయా ప్రపంచం లో అరిషడ్వర్గాలు మాయలకు లోనైన మనుషులు కాబట్టి వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకుని ఉండి ఉంటారు కానీ నేను కూడా అప్పటిలో మాయలో పడటం వలన వీరి మీద కోపము ఆవేశం ప్రదర్శించాను.ఛీ.నేను ఎంత తప్పు చేశాను. మౌనంగా వాళ్ళు పెట్టిన మానసిక శారీరక బాధలను భరించకుండా ఎందుకు తిరగబడి వాళ్లని మరింతగా బాధించాను. వాళ్ళ మాయలో ఉన్నారు. నేను కూడా మాయలో పడి అలా చేయటం ఎంతో తప్పు కదా. ఒకవేళ వీళ్ళు కనబడితే వెంటనే వాళ్లని క్షమించమని అడగాలని నా మనస్సులో విపరీతంగా తపన మొదలైంది. అంటే నాలో అహంభావం చచ్చిపోతుందని నాకు అర్థమైనది. ఎదుటివారిని క్షమించమని అడగటమే అలాగే వారికి సర్వస్య శరణాగతి అహమునకు స్వస్తి. అహంకారానికి విరుగుడు ఓంకారమని అనే సామెత ఉంది కదా. ఈ ఓంకార నాదం మనకి ఆజ్ఞాచక్రము లోనే వస్తుంది కదా. అలాగే ఈ చక్రంలో జీవ మాయ ఇచ్చే అహంకారము మాయ కూడా ఉంటుంది కదా.

దేవుడికి జీవుడికి మధ్య ఉన్న ఏకైక సన్నని పొర ఈ అహంకారమే అని మనకి ఎప్పుడో షిరిడి సాయిబాబా వారు సెలవు ఇచ్చారని మీకు తెలుసు కదా. అంటే నాలో అహము చచ్చిపోయి అనగా మానవత్వం నుంచి దైవత్వం వైపుకి నా యోగసాధన కొనసాగుతుందని తెలియగానే నాలో నాకే తెలియని ఆనందం మొదలైనది. హమ్మయ్య.నా సాధన ప్రగతి సాధిస్తుందని తెలిసి నా కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇలాంటి సమయంలో నా భ్రుకుటి ప్రాంతంలో మిలమిల మెరిసే చిన్న బిందువులాంటి జ్యోతి కొన్ని క్షణాలు అగుపించి మాయం అవ్వటము నా మనో దృష్టికి వచ్చింది. ఇదియే ధ్యాన అనుభవ జ్యోతి అని అనగా ఆత్మ జ్యోతి లేదా దివ్య జ్యోతి అని నాకు అర్థం అయ్యే లోపల అది కాస్త అదృశ్యం అయ్యేది. కానీ అప్పుడప్పుడూ తరచుగా ఈ జ్యోతి బిందువు దర్శనం ఇస్తూ ఉండేది. ఈ ధ్యానము వలన నాకే తెలియని తన్మయత్వం పెరుగుతూ వచ్చింది. ఏదో తెలియని మనశ్శాంతి పొందటం అనుభూతిగా రాసాగింది. క్రమేపీ ధ్యానములో నాలో కలిగే ప్రశాంతత పెరగసాగింది. తరచుగా ధ్యానస్థితిలో నాకు కనుబొమ్మల మధ్య వెలుగు బిందువు కనిపిస్తూ ఉండేది. దాంతో కనుగ్రుడ్డులు పైకి బొట్టు పెట్టుకునే ప్రాంతము భ్రుకుటి వైపుకి నా ప్రమేయం లేకుండా వెళుతూ ఉండేవి. ధ్యానములో సుమారు 5 గంటలు పైగా కదలకుండా కూచోవటం అలవాటు అయింది. ధ్యానము అయిన తర్వాత లేచి చూస్తే నా శరీర బరువు లేనట్లుగా దూదిపింజలా గా ఉండే భావనలు నాకు కలుగుతుండేవి. ఇదివరకటిలాగా నా ప్రమేయం లేని ఆసనాలు, ముద్రలు వేయటం దాదాపుగా పూర్తిగా తగ్గిపోయాయి. స్థిరముగా వజ్రాసనంలో లేదా పద్మాసనంలో లేదా స్థిర ఆసనంలో లేదా శవాసనంలో ధ్యానం చేస్తూ ఉండే వాడిని. ఇలాంటి ధ్యాన స్థితిలో ఉండగా నాకు మొదటిగా కుడి చెవిలో నుంచి తర్వాత ఎడమ చెవిలో నుంచి తర్వాత రెండు చెవుల నుండి ఓంకార నాదం స్పష్టంగా వినబడసాగినది. అంతకుముందు వివిధ రకాల సంగీత వాయిద్య శబ్దాలు అనగా మృదంగం, మురళి, వీణ,తబలా లాంటివి తరచుగా వినబడేవి. ఇవి క్రమేపి క్రమేపి ఈ వాయిద్య శబ్దాలు అన్నియు కలిసిపోయి ఇప్పుడు ఏక నాదముగా ఓంకార నాదముగా వినబడుతున్నాయని నాకు అర్థమైనది. అంటే ఈ నా ఆజ్ఞా చక్రము శుద్ధి అవుతుందని నేను గ్రహించాను. ఈ ఓంకార ధ్వని స్థాయి అధికంగా పెరిగే సరికి నాలో శ్వాసలు నిమిషానికి రెండు లేదా మూడు సార్లు మించి జరగటం లేదని నాకు అర్థమైనది. 

 జిఙ్ఞాసి యొక్క సద్గురువు మౌన:ముని భగవాన్ రమణ మహర్షి 

ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ఆకస్మాత్తుగా ధ్యానము నందు లీలగా మౌన:ముని భగవాన్ రమణ మహర్షి  గారి సూక్ష్మ శరీర దర్శనము అయినది. ఆయన నన్ను చూస్తుండగా నేను వారికి నమస్కరించి “స్వామి! మీరే నా జన్మకి ఈ ఆజ్ఞాచక్రము దాటించే సద్గురువు అని నాకు అర్థమైనది. స్వామి! నేను ఈ జన్మలోనే ముక్తి సాధించగలనా?” అని అడిగాను. దానికి శ్రీ స్వామి వారు చిరునవ్వు నవ్వి “నాయనా  దిగులు పడకు. ఇదివరకే నీవు సాలోక్య ముక్తి సాధించావు. ఈ జన్మలో జీవన్ముక్తి పొందుతావు. ఇప్పటికే చాలా మంది యోగులు ముక్తి లోకంలో ఎదురు చూస్తున్నారు. నీ వల్ల లోకానికి ఒక మహత్తరమైన కార్యము జరగవలసి ఉంది. శాస్త్ర ప్రకారం చూస్తే ముక్తి లో నాలుగు దశలు ఉన్నాయి.అవి మూలాధారము నుండి అనాహత చక్రములో  సాలోక్యముక్తి గానూ, విశుద్ధ చక్రంలో కలిగే ముక్తిని సారూప్యముక్తి గానూ, ఆజ్ఞా చక్రము నందు సామీప్యముక్తి గానూ ,సహస్రార చక్రములో జరిగే ముక్తిని సాయుజ్య ముక్తి గానూ చెప్పటం జరుగుతుంది. ఇక్కడి దాకా చాలా మంది యోగులు తమ సాధన స్థాయికి ఈ ముక్తి పొందిన కూడా పరమ శాంతిని పొంద లేకుండా పోతున్నారు. ఏదో తెలియని ఏకైక కోరిక కోసం పునః జన్మ చక్రం లోకి అడుగుపెడుతున్నారు. అది ఎందుకు జరుగుతుంది. ఎలా జరుగుతుందో నీవు తెలుసుకోవాలి. స్వానుభవాలు పొందాలి. జీవన్ముక్తి కలిగించే యదార్ధ జ్ఞానము మాకు తెలియాలి. చాలామంది సహస్రార చక్రముతో తమ యోగసాధన అయిపోయిందని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు ఎందుకంటే నా అనుభవాలను బట్టి చూస్తే సహస్రార చక్రము అక్కడున్న జీవనాడి ద్వారా ఈ హృదయ చక్రమునకు ఇంకా చేరుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగినది.

పైగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన ఆఖరి అధ్యాయమైన మోక్షసన్న్యాసయోగము నందు చివరి శ్లోకమునందు 

ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన సర్వభూతాని యంత్రారూఢని మాయయా!!

త మేవ శరణం గచ్చ  సర్వ భావేన భారత !
తత్ప్రసాదాత్పరాంశా నింస్ధానంప్రాస్స్యసి శాశ్వతం!!

 అనగా యంత్ర రూపమైన శరీరము పై ఉన్న సమస్త భూతములను సర్వేశ్వరుని తన యొక్క త్రిగుణాత్మికం మాయ చేత భ్రమింపజేస్తూ సర్వభూతముల యొక్క హృదయ ప్రదేశము నందు విలసిల్లుతున్నాడు. అట్లు ఈ హృదయ కమలమునందు ఉండే సర్వేశ్వరుని సర్వ ప్రకారముగా నీవు శరణం పొందు. అట్టి భగవంతుని అనుగ్రహం వలన ఉత్తమమైన పరమ శాంతి కలిగి శాశ్వతమైన మోక్షము పొందగలవు అని సెలవిచ్చి ఉన్నారు కదా.అంటే ఈ లెక్కన చూస్తే మన సాధన సహస్రార చక్రము నందు ఆగదని శ్రీకృష్ణుడు బోధించినట్లుగా హృదయ చక్రం దాకా కొనసాగితే కానీ మనకి జీవన్ముక్తి కలగదని మా అందరికీ అర్థమైంది. కానీ మేమంతా కూడా మాకే తెలియని రవ్వంత మాయలో ఉన్నాము. అనగా బుద్ధుడికి కోరికల వలన మాయ ఏర్పడుతుందని తెలిసిన కూడా కోరిక లేని సమాజం చూడాలని ఎలా అనుకొన్నాడో అలా మేమందరము మా సూక్ష్మ, కారణ, సంకల్ప శరీరాలతో ఏదో తెలియని ఇసుమంత మాయలో ఇరుక్కొని ఉన్నామని మాకు అర్థం అవుతుంది.కానీ దానిని మేము చేధించలేక పోతున్నాము. కాబట్టి నీవు నీ సాధనను సహస్రార చక్రము దాటి హృదయ చక్రం దాకా తీసుకొని వెళ్ళు. ఎలాంటి మహా మాయ లకు లోను కాకు. గురికాకు. తధాస్తు. నువ్వు తరించు. మమ్మల్ని తరింప చేయి.సుఖీభవ” అంటూ ఆయన అంతర్ధానము అయినారు. 

ఇన్నాళ్ళు నేను కూడా నా సాధన కూడా సహస్రార చక్రము దాకా వెళితే సరిపోతుంది. అదే చిట్టచివరి స్థితి అని అనుకున్నాను. కానీ అది నిజం కాదని సహస్రార చక్రము కాకుండా హృదయ చక్రం దాకా వెళ్లాల్సి ఉంటుందని నాకు అర్థమైనది. సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదని ఆ మోక్షపతి అయిన సర్వేశ్వరుడి అనుగ్రహమును తప్పకుండా పొందాలని నిశ్చయించుకొని ఇలాంటి గురుబోధ చేసినందుకు మా సద్గురువైన భగవాన్ రమణ మహర్షి  గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా యోగసాధనను కొనసాగించాను. ఇది ఇలా ఉండగా నా ప్రమేయం లేకుండా జరిగే ఆసనాలు, ముద్రలు,అరుపులు పూర్తిగా ఆగిపోయినాయి. కొన్ని గంటల పాటు లేవకుండా స్థిర ఆసనంలో ధ్యానం చేసుకునే స్థితికి చేరుకున్నాను. కాళ్ల నొప్పులు కూడా రావడం లేదు. తలనొప్పి కూడా రావడం లేదు. కానీ ఏదో తెలియని అద్వితీయమైన ఆనంద స్థితి మాత్రం కలుగుతుండేది. ఇప్పుడు ఎలా కూర్చుంటేఅలా స్థిర ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నాలో ఏకాగ్రత తీవ్రంగా పెరగసాగింది. ఆలోచనలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఉచ్ఛ్వాసనిశ్వాసలు తగ్గుతూ వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే నా శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా భృకుటి ప్రాంతంలో ఆగిపోవటం నేను గమనించే సరికి నాకే ఆశ్చర్యమేసింది. శ్వాస తీసుకోకుండా నేను ఎలా బ్రతుకుతున్నాను. నాకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు బ్రతకము. బ్రతుకుతున్నాను కదా. ఈ విశ్వములో ఊపిరితిత్తుల ద్వారా కాకుండా గుండె ద్వారా శ్వాసక్రియను జరిపే పాములు బ్రతికే ఉన్నాయి కదా. ఖచ్చితంగా నేను కూడా బ్రతుకుతాను. శ్వాస తీసుకోవటానికి ఏ భాగం అయిన ఒకటే కదా. ఒక యోగి చరిత్ర పుస్తకములో సూక్ష్మ లోకవాసులు వివిధ అంగాలు ద్వారా అనగా చెవితో గాని ముక్కుతో గాని చర్మంతో గాని చూపులతో చూడటము జరుగుతుందని అలాగే కంటితో లేదా నాలికతో కానీ లేదా చర్మముతో చూడగలరని వినగలరని చెప్పకనే చెప్పినారు కదా. మరి నాకెందుకు కంగారు. నా శ్వాస ఊపిరితిత్తులలోకి వెళ్లకపోతే నా భృకుటి లోనికి వెళుతుంది కదా అని నాకు నేను సమాధాన పడ్డాను. నేను తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ధ్యానానికి కూర్చుంటే నా ఆజ్ఞాచక్రంలో కనుబొమ్మల మధ్యలో ప్రస్ఫుటంగా మెరుస్తూ జ్యోతి బిందువు కనపడసాగింది. అలాగే నా రెండు చెవులలో అంతే స్పష్టంగా ఓంకార నాదం కూడా వినబడసాగినది. దానితో నాకు నిద్ర మెలుకువ కాని మగత వంటి ప్రారంభ సమాధిస్థితిని అనుభవించసాగాను.  అప్పుడు మూలాధార చక్రం నుంచి కుండలిని శక్తి ప్రవాహం మొదలై అది శరీరమంతా ప్రవహించి విద్యుత్ కాంతితో ఆజ్ఞాచక్రము వరకు రాసాగింది. ఏదో చీమలు పాకుతున్నట్లుగా దీని ప్రవాహ వేగముంది. క్రమేపీ నా మనస్సులో ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి.ఇలా కొన్ని వారాలు జరిగినది. రాను రాను నాకు ధ్యానమందు తీవ్రమైన కాంక్షతో పాటుగా మనశ్శాంతి పొందటం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ప్రతి రోజూ కనిపించే చిన్న దివ్య జ్యోతి బిందువు కాస్త ఒక కోడిగుడ్డు ఆకారపు పరిమాణందాకా నెమ్మది నెమ్మదిగా పెరగసాగింది.అప్పుడు దీని నుండి జ్యోతి కిరణాలు వెలువడి నా శరీరం నుండి బయటకు ప్రసరిస్తున్నట్లుగా అనుభూతి కలగ సాగింది. కానీ నా శివ పంచాక్షరి మంత్ర మననము అన్నివేళలా జరుగుతూ ఉండటం నేను గమనించాను. కానీ మనస్సు ఓంకార నాదం మీద జ్యోతి బిందువు మీద మంత్రం మీద తప్ప మరే ఆలోచనలకి వెళ్లడం లేదు. అనగా ఈ ప్రక్రియలు కలిసి ధ్యాస ధ్యాన ధ్యాత అన్నట్లుగా త్రికోణముగా సాగింది. ఇంతలో ఈ కోడిగుడ్డు ఆకారంలో నీలి వర్ణముతో నల్లని ఆకారము కనపడసాగింది. అది ఒక శరీర ఆకారముగా కనపడసాగింది. అది ఎవరో ఎందుకు కనబడుతుందో నాకేమీ అర్ధం కాలేదు. ఇలా మరి కొన్ని రోజులు గడిచిపోయాయి. 

అప్పుడు నా లాంటి ఆకారం ఉన్న ఒక తెల్లని శరీరం నా నుండి బయటికి రావడం జరిగేది. నాకు ఆశ్చర్యం వేసింది. అచ్చము నాలాగా మరొక వ్యక్తి నా శరీరం లో ఉన్నాడా? మరి ఈయన ఎవరు? ఈయనను ఎవరు చూస్తున్నది. నాకేమీ అర్థం కాలేదు. కొన్ని క్షణాల తర్వాత నా శరీరము లోనికి బయటికి వచ్చిన తెల్లని శరీరం బయటికి వెళ్ళి పోయేది. లోపలికి వచ్చేది. అది ఎక్కడికి ఎలా వెళుతుందో నాకేమీ అర్ధం అయ్యేది కాదు. ఇలా కొన్ని వారాలు జరుగుతున్న సమయంలో నా విశ్లేషణ శక్తి వలన అది నా సూక్ష్మశరీరం అని అది మెదడు మధ్యభాగంలో ఉండే పిట్యూటరీ గ్రంధి లోపల దీని ఆవాసమనీ దీని ప్రక్కనే ఉన్న మరో పీనియల్ గ్రంథి అయిన త్రినేత్రం ద్వారా స్థూల శరీరము దీనిని ఈ సూక్ష్మ శరీర ధారిని చూస్తోందని నాకు అర్థమైనది. ఒకరోజు నేను కాశీ విశ్వనాథుడు లింగమూర్తిని చూడాలి అనిపించి గుడి కి వెళ్ళినాను. కానీ నా అవతారం చూసి వాళ్లు భయపడి నన్ను ఒక పిచ్చివాడి కింద జమకట్టి నన్ను గుడిలోనికి పంపించలేదు.కించిత్ బాధ వేసింది. ఆయనే నాకు దర్శనము ఇవ్వకూడదని అనుకున్నాడని అనుకుని మౌనంగా వెనక్కి తిరిగి వచ్చి నా ధ్యానం లో కూర్చున్నాను. కానీ నా ధ్యానము కుదరలేదు.మనసంతా ఆ విశ్వనాధుని పైనే ఉండిపోయింది. ఆ రోజంతా మనోవికలము అయినది. నిద్ర లేదు. ఆకలి లేదు. ఆనందమూ లేదు. ధ్యాస లేదు. ధ్యానము లేదు. మౌనము. ఏదో తెలియని వేదన, ఆవేదన. తండ్రి నన్ను అనుగ్రహించలేదని బాధ. ఇలా అర్ధరాత్రి సమయంలో ఉండగా నా శరీరం నుండి నా సూక్ష్మశరీరము బయటికి వచ్చి కాశీ విశ్వనాధుని లింగ మూర్తిని దర్శించి పూజించి పువ్వులు, పూలమాల సమర్పించి రావటం అది అంతా నా యొక్క త్రినేత్రం నందు ప్రస్ఫుటంగా కనపడ సాగినది. అంటే ఒక వీడియోలాగా చూస్తున్నట్లుగా చూడటము జరిగినది. అది నిజమా లేదా అబద్దమా లేదా భ్రాంతియా లేదా భ్రమ అని తెలియని అయోమయ స్థితి.ఎటూ తేల్చుకోలేని స్థితి. సరే కొన్ని క్షణాల తర్వాత తను చూసిన అపూర్వ దృశ్యం అదృశ్యమైంది. సరే అని నేను నిద్ర లేచి ఘాట్ వద్ద స్నానాదికాలు చేసుకుందామని వెళ్ళగానే దశాశ్వమేధ ఘాట్ వద్ద ఇదిగో స్వామి! ఈరోజు విశ్వనాథుడికి అలంకరించిన పువ్వులు. ఇవి చాలా పవిత్రమైనవి. మీలాంటి పవిత్రమైన వారికి వీటిని ఇస్తేనే వాటి పవిత్రత మరింతగా పెరుగుతుందని ఆ రాత్రి నాకు నిజంలాంటి కలలో నేను నా సూక్ష్మ శరీరంతో ఏ ఏ పువ్వులతో ఆ కాశీ విశ్వనాధునిని అర్చించినానో వాటిని నా చేతిలో ప్రత్యక్షంగా చూసేసరికి నా శరీరము కొంతసేపు అచేతనము గా మారినది. నా మనస్సు ఆనంద స్థితిలోనికి వెళ్ళినది. ఏమి జరుగుతుందో అర్ధం గాక ఆ భక్తుడు నాకు నమస్కారము చేసి భయపడుతూ వెళ్లిపోయాడని నాకు అర్థము కానీ అర్థమైన స్థితిలోనికి అనగా ప్రారంభ సమాధి స్థితిలో ని కి వెళ్ళినాను. కొన్ని క్షణాల తర్వాత సాధారణ స్థితికి వచ్చి గంగ స్నానాదికాలు పూర్తిచేసుకుని విచారించగా అది నాకు మనోజప సిద్ధి కలిగినదని అనగా సూక్ష్మ శరీరంతో ఎక్కడికి ఏ చోటుకి వెళ్లాలనుకున్న వెళ్లి రావటం అన్నమాట. అంటే ఇన్నాళ్ళు స్థూల శరీరంతో చేసిన అన్ని యానాలు కూడా సూక్ష్మ శరీర యానాలు ద్వారా చేయవచ్చని గ్రహించేసరికి అలా నిన్న రాత్రి విశ్వనాధునిని దర్శించుకోవటం జరిగినదని తెలియగానే నాలో తెలియని ఆవేశ, ఆనందాలు కలిగినాయి.

ఇంతలో ఒకరోజు నేను తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగాఈ నీలి వర్ణ వ్యక్తి ఆకారము కాస్త గురుదేవుడు భగవాన్ రమణ మహర్షి  లాగా అగుపించింది. తర్వాత మరొక ఆకారము అనగా విశ్వ గురువైన శ్రీ దత్త స్వామి లాగా కనపడింది ఆ తర్వాత అది కాస్త ఒక మహర్షిలాగ రూపాంతరము చెందినది.ఇదియే నా ఆది జన్మని స్మృతికి వస్తుండగా ఆ మహర్షి ఎవరో కాదని నైగేమయుడని నాకు అర్థమైనది. ఆ మహర్షి కాస్త నా ప్రస్తుత స్థూల జన్మ ఆకారముగా రూపాంతరం చెందినది.అవును. తను జ్యోతే. ఇంతకాలమూ ఇంకేదో అని కలగనటము జరిగింది. తన సహజ స్థితి స్వస్థితి సరిగ్గా ఇదే అని అదే నేను అని నాకు ఆత్మానుభూతి కలిగినది.ఇదియే యోగ శాస్త్రాలు చెప్పిన ఆత్మసాక్షాత్కార అనుభూతిని చెప్పకనే చెప్పకుండానే తెలిసిపోయింది. నా పెదవుల మీద పరమానందము తో కూడిన చిరునవ్వు మెరుస్తుండగా నా అంగిట్లో నుంచి ఆనందానికి కారణమైన అద్భుతమైన అమృతరసం కారుతుందని నాకు అవగతమైనది. దానితో నేను ఖేచరి ముద్రలో సహజసిద్ధంగా నా నాలుకను వెనక్కి మడిచి దాన్ని అందుకుంటూ పరమానందము పొందటం ప్రారంభించాను. దానితో నాకు నా జన్మాంతరాలు అలాగే ఇతరుల జన్మాంతరాలు తెలిసిపోయే జన్మాంతర జ్ఞానసిద్ధి కలిగినది. అలాగే ఈ చక్ర సిద్ధి అయినా దూరదృష్టి కూడా అబ్బినది.ఇలా అంటే నేను తీవ్ర ధ్యానంలో ఉండగా ఎప్పుడైనా ఎవరైనా స్మరిస్తే వాళ్ళు ఉన్న ప్రస్తుత స్థితి నా త్రినేత్రం అయిన మనోనేత్రం ముందు దర్శనం అవసాగింది. తల్లిదండ్రులు ఓదార్పులు నిట్టూర్పులు, బంధుమిత్ర విరహ వేదనలు ఆవేదనలు సంతోషాలు నా కళ్ళముందు తరచుగా అగుపించేవి. కానీ నేను వాటికి మానసికంగా అలాగే శారీరకంగా స్పందించటం ఇలాంటి స్పందనలు నాలో కలగలేదు. అలాగే ఈ సిద్ది పరీక్షించాలని అని కూడా అనిపించలేదు.

ఒకరోజు నాకు నా గత జన్మలలో వరుసగా ఇరవై ఏడు జన్మలు గుర్తుకు వస్తున్నాయి. వాటిని నేను పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. అలాగే నా రాబోవు ఇరవై ఏడు జన్మల దాక అగుపించాయి. అంటే ఈ జన్మకి కారణము ప్రస్తుత జన్మ యొక్క ప్రారబ్ధ కర్మల ఫలితం అని నాకు అవగతమైనది. జన్మలు పోవాలంటే నేను ప్రస్తుతం నాకున్న ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకుంటే నా రాబోవు జన్మలు నశిస్తాయని నాకు అవగతమైనది. ఇది ఇలా ఉండగా నాకు ఒక రోజు ధ్యానములో శ్రీ అరుణాచల క్షేత్రం అగుపించే సరికి ఈ ఆజ్ఞాచక్రము పంచభూతాల ఆధీన శక్తి సాధన సిద్దికి వెళ్ళే సమయం ఆసన్నమైనదని నాకు అనిపించింది. అక్కడికి చేరుకొని సిద్ధ గురువుల సమక్షంలో యధావిధిగా విధి విధానాలతో 36 నెలల పాటు సాధన కొనసాగించిన తర్వాత నాకు పంచభూతాల  మీద ఆధిపత్యం వచ్చినది.ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నాకు విపరీతమైన ఆకలి వేసింది. ఇంతలో ఒక భక్తుడు ఇది అమ్మవారి ప్రసాదం అని ఒక మామిడి పండు చేతిలో పెట్టాడు. దానిని తృప్తిగా తిన్నాను. నా ఆకలి తీరలేదు. ఇలాంటిదే మరో మామిడి పండు దొరికితే బాగుండును అనుకోగానే నా చేతుల్లో ప్రకృతి చేత సృష్టించబడిన మరో మామిడి పండు అగుపించినది. ఇది అచ్చము ఇందాకటి మామిడిపండు లాగానే ఉండటం నాకే ఆశ్చర్యం వేసింది. రుచి చూశాను. అలాగే ఉంది. ఇది భలేగా ఉంది.అంటే మనకి  ఏమి కావాలన్నా అది ప్రత్యక్షం అవుతుంది అని అనుకుంటూ నాకు ఇష్టమైన తీపి పదార్థాలు ఏవి అనగా సున్ని ఉండలు, మైసూర్ పాక్ లు వచ్చినాయి. వామ్మో! భలేగా ఉంది. నిజమే. ఈ రెండు పదార్థాలు నాకు చాలా ఇష్టమైనవి అనుకుంటూ ఆవకాయ పచ్చడి అన్నము కావాలని అనుకోగానే ఆవకాయ అన్నము ఉన్న పళ్లెము అగుపించింది. దానిని ప్రక్కన పెట్టి నాకు ఇష్టమైన ఆహారము ఏది అనగానే గోంగూర పచ్చడి అన్నము ప్రత్యక్షమయ్యేసరికి నాకే నిజంగానే అవి అతి ఇష్టమని వీటికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. అసలు ఈ వస్తువులు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. వెంటనే తన రెండు  అరచేతులు ముందుకు చాపి తనకి ఏది అతి ఇష్టమైనది నాకే తెలియదు దానిని ప్రసాదించమని కోరగా అది కాస్త అతి సుందరమైన శ్రీ మేరువు స్ఫటిక శ్రీ చక్ర యంత్రం ప్రత్యక్షం అయింది. దాన్ని చూసి నేను చాలా తన్మయత్వం చెందినాను. నాకు అయ్యవారి కన్నా అమ్మవారు చాలా చాలా ఇష్టం. నాకు శివలింగము కన్నా శ్రీచక్రమే చాలా ఇష్టమని ఆ సర్వేశ్వరుడికి తెలుసు కాబట్టి నా చేతుల్లో స్ఫటిక శ్రీచక్రం ఉంచడం జరిగినది అని నాకు అర్థమైనది. ఇంతటితో నా కోరికలు ఆపి వేసుకోవాలని లేదంటే నా సాధన ప్రగతి ఈ సిద్దుల మాయలో పడిపోయి ఆగిపోతుందని నాలో తెలియని భయం మొదలైంది. ఆ తర్వాత ఈ వస్తువులు ఎలా వచ్చాయో విచారణ చేసుకోగా నాకు స్మరణకి వచ్చింది. అది ఏమిటంటే మూలాధార చక్రము నుండి భూతత్వం, స్వాధిష్ఠాన చక్రము నుండి జలతత్త్వము, మణిపూరకము నుండి అగ్ని తత్వము, అనాహతము నుండి వాయుతత్వము, విశుద్ధి చక్రము నుండి ఆకాశతత్త్వం అనగా ఈ పంచభూతాలు కలిసి ఆజ్ఞాచక్రంలో నా ఆధీన స్థితిలో ఉండుట వలన నా కోరికలు తీర్చడానికి పంచభూతాలతో తయారైంది. పంచభూత పదార్థాలను నా చేతుల్లోపెట్టి నాయని నాకు అవగతమయ్యే సరికి నా మొహంలో చిరునవ్వు కనబడినది. నాకు పంచభూతాలను ఆజ్ఞాపించే శక్తి వచ్చినది అని తెలియగానేఈ ఆజ్ఞాచక్రము ఆధీనము అయినదని నాకు అవగతమైనది. నా చేతుల్లో సృష్టించబడినఈ స్పటిక శ్రీచక్ర యంత్రమును ఎవ్వరికీ ఇవ్వాలని అని అనుకుంటూ ఉండగా ఒక దేవీ భక్తుడు నా దగ్గరికి వస్తూ “స్వామి! నాకు ఇంతవరకు అమ్మ అనుగ్రహం కలుగలేదు.నా సాధన లోపం ఏమిటో నాకు ఏమీ అర్థం కావడం లేదు” అనగానే నేను వాడి ముఖం కేసి తీక్షణముగా చూడగా నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వలన వాడి జన్మలు తెలుసుకుంటూ వాడి చక్ర సాధన స్థాయిలలో చూడగా వాడితో “నాయనా! నీవు గతజన్మలో మూలాధార స్వాధిష్ఠాన చక్రములు దాటినావు. నీవు ఈ జన్మలో బ్రహ్మ గ్రంధి విభేదము చేసుకొని ముందుకు వెళితే మణిపూరక చక్రం దైవమైన నా ఇష్ట దైవమైన బాలా దేవి దర్శనం ఇస్తుంది. రాబోవుకాలంలో ఇది సిద్ధింప చేసుకుంటావు. అందులకు ఈ స్పటిక శ్రీ యంత్రం నీకు సహాయపడుతుంది. దీనికి ప్రతి శుక్రవారము మనుష్య స్పర్శ తెలియని జలముతో అభిషేకము చేసుకో! నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సకల ఆయుఃఆరోగ్యాలు యోగాలు ధనప్రాప్తి కలుగుతుంది” అనగానే వెంటనే వాడు కాస్త “స్వామి! నన్ను అనుగ్రహించినందులకు చాలా కృతజ్ఞతలు. కానీ మీరు చెప్పిన జలము ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి” అనగానే నేను వెంటనే “కొబ్బరికాయలో” అని చెప్పగానే వాడు వెంటనే నా కాళ్ళ మీద పడగానే నాకు వాటి స్పర్శ తగలగానే నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు బాధ కలిగింది. అంటే వీడి పాద నమస్కారం స్పర్శ వలన వాడు చేసిన పాప కర్మలు నాకు కొంతమేర సంప్రాప్తి అయింది అని నాకు అర్థమైనది. దానితో నేను ఎవరిని తాకకుండా, నన్ను ఎవరూ తాకకుండా జాగ్రత్త పడటం అలవాటు చేసుకున్నాను. నా శరీరము కూడా ఒక విద్యుత్ అయస్కాంతంలాగా మారి ఇతరులకి షాక్ కొట్టడం నా స్వానుభవం లో చూశాను.ఇలా ఇతరుల నుండి వచ్చిన పాపకర్మలను నాశనము చేసుకోవడానికి మరికొంత ఎక్కువ సమయం ధ్యానానికి కేటాయించి వాటిని నాశనం చేసుకోవడం ప్రారంభించాను. అలాగే ఇతరుల నుండి నాకు సరిపడని వస్తువులు అలాగే పదార్థాలు ఆశించటం మానివేశాను. అలాగే నా చక్ర సాధన స్థితులు అనుభవాలు సిద్ధులు గూర్చి నాతోటి సాధకులు, గురువులకి, యోగులకు తెలియకుండా యోగి చేయమని ఆ సర్వేశ్వరుడిని ప్రతి నిత్యము ప్రార్ధించటం అలవాటు చేసుకున్నాను. ఇక ఈ ఆఙ్ఞా చక్రఉప చక్రాలైన గుణ, కర్మ, కాల, బ్రహ్మ చక్రాల జాగృతి,శుద్ధి,ఆధీనము కోసము అలాగే రుద్రగ్రంధి విభేదనం కోసం నేను శ్రీ దత్త స్వామి అనుగ్రహమును పొందాల్సి ఉంటుంది. అందులకు గుజరాత్ రాష్ట్రంలోని దత్త క్షేత్రం అయిన గిరినార్ ప్రాంతమునకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆయన పెట్టే మాయ పరీక్షలు తట్టుకొని వారి అనుగ్రహము పొంది తాంత్రిక విధివిధానాలతో ఈ నాలుగు ఉప చక్రాలను భేదనం చేయాలని అనుకున్నాను. మీకు దత్త దర్శనం అయిందని దత్తమూర్తి మీ ఇంట ఉన్నాడని నాకు అవగతమైనది. శీఘ్రముగా దత్త స్వామి అనుగ్రహం పొందిన మీరు ధన్యులు. ఇక రాబోవు సాధన అంతా తాంత్రిక విధానాలతో జరగటం వలన నేను తాంత్రిక యోగిగా అవతారము ఎత్తవలసి ఉంటుంది. ఇక మరి మీ ఈ నాలుగు చక్రాలను మీరు ఏ సాధన విధానంతో దాటుతారో ఆలోచించుకోండి. ఉంటాను. సెలవంటూ” తన టెలిపతి నా నుండి విడగొట్టారు. దానితో ఇక నా జిజ్ఞాసి కూడా  ఆజ్ఞా చక్ర ఆధీనస్థితి పూర్తి చేసినాడని తెలియగానే ఆనందం వేసింది. 

కానీ వాడు చెప్పిన తర్వాత నాలో తెలియని భయం మొదలైనది. ఇంతవరకు నా సాధన అంతా శాస్త్రీయంగా దక్షిణాచార పద్ధతిలో జరిగినది. ఇప్పుడేమో ఈ వచ్చే నాలుగు ఉప చక్రాలు అయిన గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రాల సాధన స్థితి కోసం వామాచారం అనగా తాంత్రిక విధానం చేయాలి అంటే ఏదో తెలియని భయము నన్ను ఆవహించి సాగినది. ఈ తాంత్రిక విధి విధానంలో పంచ మకారాలు అనగా మద్యము, మాంసము,మత్స్యము, ముద్ర, మైధునము అనేవి ఉంటాయని తాంత్రిక శాస్త్ర గ్రంధాలు చెప్పకనే చెబుతున్నాయి. వామ్మో! వీటిని ఎలా చేయాలి. ఎలా జయించాలి.ఏ విధంగా సిద్ది పొందాలో నాకేమీ అర్ధం అవ్వటం లేదు.చచ్చింది గొర్రే. నేను చూస్తూ చూస్తూ ఈ వామాచారం లోనికి వెళ్లి సాధన చేయలేను. ఖచ్చితముగా నా మనస్సు అలాగే నా శరీర స్థితి తెలుసు. ఖచ్చితముగా మతిభ్రమణము చెందటం లేదా మనో వికలత్వం పొందటం జరుగుతుందని నాకు తెలుసు. మరి ఈ సమస్య కి ఆ దత్త స్వామి ఎలాంటి పరిష్కారం మార్గమును చూపుతాడో ఆయనకే వదిలి వేయాలని ఊరుకున్నాను. అవకాశం లేదంటే ఈ జన్మకి ఈ ఆజ్ఞాచక్రము ఇచ్చే సామీప్య ముక్తి పొంది కైలాసము చేరుకోవటం తప్ప ఇంకా ఏమి చేయలేనని మరు జన్మలో తాంత్రిక యోగిగా అవతరించి సాధనను కొనసాగించాలని అనుకున్నాను. ఏమి జరుగుతుందో ఎవరికీ ఏమి తెలుసు. 

నాలో నాలాంటి వాడు బయటకి వచ్చాడు :

 ఇక ఆజ్ఞాచక్రము లో ఉన్న చతుర్ధ గుహ యందు ఉండే మొదటి ఉప చక్రమైన గుణ చక్ర సాధన ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వామాచారంలో తాంత్రిక విధివిధానములో కాపాలిక సాధన చేయాలి. తేడాలు వస్తే మతిభ్రమణము తప్పటం ఖాయము. పైగా నాకు ఇంతకు ముందే శ్రీశైల క్షేత్రము నందు కాపాలికులతో జరిగిన అనుభవాలు మీకు తెలుసు కదా. దానితో వారి విధి విధానాలు ఉన్నా నాలాంటి దక్షిణాచారుడు చేయలేడు అని నాకు అర్థం అయింది. కానీ ఏమి చేయాలి. నలభై ఎనిమిది సంవత్సరములు పడుతుంది. పోనీ వామాచారానికి వెళ్లే మనో ధైర్యం నాకు లేదు. పైగా నిన్ననే మా యోగ మిత్రుడు సిద్ధ రామ అదే జిజ్ఞాసి తన గుణ చక్ర సాధన కోసం శ్రీశైల క్షేత్రమునకి చేరుకొని అక్కడ ఉన్న భైరవకోనకి వెళ్లి కాపాలిక సాధన విధివిధానాలు తెలుసుకొని ఆరంభించటానికి సిద్ధపడుతున్నారని ఆత్మ అనుసంధానం ద్వారా తెలియ చేసినాడు. వాడు తన సాధనను ముందుకు కొనసాగిస్తూ ఉండగా నేను ఏమి మాయలో పడక కేవలము నా మనో ధైర్యం లేక పోవటం వలన నా సాధనను ఎలా ముందుకి పోనిచ్చుకోవాలో అర్థమయి చావటం లేదు. ఇది ఇలా ఉండగా నాకు రాను రాను నేను కానీ నేను అనేది ఎవరో తెలుసుకోవాలని తలంపు రావటం మొదలైంది. ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందిన తరువాత నాకు స్థూలదేహము మీద ప్రేమ మోహ వ్యామోహాలు తొలగిపోయాయి. నేను అనేది ఒక ఆత్మ స్వరూపమని అది కూడా వేదవ్యాసుడి అంశ అని నాకు అర్థమైనది. కానీ దీని కోసము ప్రత్యక్ష అనుభవాల ద్వారానే నిరూపణ అయితే నేను నమ్మాలి అనుకునేవాడిని.

కాశీ క్షేత్రములో శ్రీ దత్త స్వామి మారువేషములో వచ్చి చెప్పినను అలాగే నా యోగ మిత్రుడైన సిద్ధ రామ చెప్పినను నాకు నమ్మకం కలగటం లేదు. కారణం ఏమిటో తెలియదు. అలాగని నా మనో నేత్రములందు సత్యాలే చూపిస్తుందని ఎన్నో విషయాల అనుభవాలు తెలుసు. కానీ నాకు నమ్మకం రావటం లేదు. ఒకరోజు తెనాలి రామకృష్ణుడుకి (శ్రీకృష్ణదేవరాయ ఆస్థాన వికటకవి) దర్శనం ఇచ్చిన కాళికా దేవి మాత విగ్రహం ఒక గుడిలోని ధ్వజస్తంభం దగ్గర దొరికిన దానిని పునః ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని తెలిసి ఆ మాతను చూడాలని అనుకున్నాను. కానీ వీలుపడలేదు. ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ వచ్చినాయి. ఇక నేను నా సొంత ప్రయత్నాలు మానుకున్నాను. అమ్మ ఆజ్ఞ ఇచ్చేవరకు ఆమెను చూడటానికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను. ఈ గుడికి ఒక పీఠమును ఏర్పరచి తాంత్రిక ప్రపంచం విజ్ఞాన విషయాలను లోకానికి తెలియజెప్పటానికి గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి పదవి విరమణ అయిన తరువాత సన్యాసి పదవి చేపట్టి కుర్తాళం పీఠాధిపతి అయిన శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు రచించిన వివిధ తాంత్రిక విధివిధానాల గ్రంథాలు నా చేతికి వచ్చినాయి.దానితో నాకు తాంత్రిక ప్రపంచం యొక్క విలువ ఏమిటో తెలిసి వచ్చినది. దానిమీద భయము తొలగి లేనిపోని అపోహలు పోయి ఆసక్తి పెరిగింది. ఈయన ప్రత్యేకత ఏమిటంటే అన్ని రకాల తాంత్రిక విధివిధానాలు తన మీద ప్రయోగాలు చేసుకుంటూ వాటిలో ఈ లోకానికి విలువైనవి దగ్గర ఫలితాలు చూపే కలిగించే వాటిని లోకానికి తెలియజేయడమే కాకుండా తనకి ఉన్న జన్మాంతర జ్ఞానసిద్ధి తో ఎంతో మంది యోగసాధకులకు వారి ఆది జన్మలు చెప్పడం జరుగుతుందని వారి చరిత్ర ద్వారా తెలుసుకున్నాను. కానీ వారిని నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు. చూడాలని అనే ఆలోచన ఉండేది కానీ తపన లేదు. కారణం తెలియదు. వీరిని అడిగి తన జన్మ వేదవ్యాస అంశ అవునా కాదా అని నా ధర్మసందేహము తేల్చుకోవాలని ఉండేది .ఆయన మహా పీఠాధిపతి స్థానంలో ఉన్నారు. పైగా మంది మార్బలం ఉండే ఉంటుంది. చివరకి ఆయనని కలుసుకోవటానికి ఎంత చమురు వదిలించుకోవాలో తెలియదు. ఎంత శ్రమపడాలో తెలియదు. నా సాధన శక్తి ఉంటే ఆయన నోటి నుండే అమ్మవారు కలిగిస్తుందని నా ప్రగాఢ నమ్మకం.టీవీలలో వచ్చే ఆయన కార్యక్రమాలు అప్పుడప్పుడూ చూడటము జరుగుతూ ఉండేది.ఇలా కొన్ని నెలలు గడిచి పోయినాయి. ఒకరోజు నేను ఉన్న ప్రాంతంలో గుడి దగ్గర తన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి కాశీక్షేత్రము నుండి రావడం జరిగినది. ఈయన అప్పటికే అన్నిటియందు వైరాగ్యము చెంది కేవలము స్థూల శరీరంతో పీఠాధిపతి అనే మాయ పదవి బాధ్యతలను మోస్తున్నారని మహా స్మశానమైన కాశీ క్షేత్రము నందు శాశ్వత మరణము పొందాలని తపిస్తున్నారని నాకు తెలిసి ఆయన మీద మరింతగా గౌరవ మర్యాదలు పెరిగినాయి. ఈయన అందరిలాంటి సన్యాసి అలాగే పీఠాధిపతి కాదని నాకు అర్థమైనది. సరే అని కుటుంబ సభ్యులంతా గుడి కి వెళ్లాలని పట్టుబట్టడంతో నాకు ఇష్టం లేక పోయినా వెళ్ళక తప్పలేదు. కనుచూపుమేరలో ఒక స్టేజి మీద ఈ స్వామివారి ప్రసంగము జరుగుతోందని మైకు శబ్దము బట్టి నాకు తెలిసినది. అలాగే నేను గుడిలోని ప్రధాన ద్వారం దాటగానే నా మనోనేత్రం ముందు ఆయన స్వరూపము దర్శనము అయినది. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఉపన్యాసము వినాలని ఆసక్తి చూపలేదు. దైవ దర్శనం పూర్తి చేసుకుని గుడి నుండి బయటికి వెళ్ళి పోతుంటే మైకు నుండి ఎవరికి తెలుసు నాయనా! మీలో మీకే తెలియని వేదవ్యాసుడు ఉండవచ్చును. ఒక కాళీ భక్తుడు ఉండవచ్చును ఒక దేవి భక్తుడు ఉండవచ్చును. పరమశివుడు ఉండవచ్చును. ఆ నారాయణుడే ఆవాసమై ఉండవచ్చును కదా. అది మీకు మీరే స్వానుభవ అనుభూతి అయ్యేదాకా తెలుసుకోలేరు. నమ్మలేరు. అయిన తరువాత కూడా నమ్మలేని వారు కూడా ఉంటారు. వారు నా దగ్గరకి వచ్చి ఆ వ్యక్తి దర్శనము అయినదని నాకు చెప్పే లోపల నాకున్న జన్మాంతర జ్ఞానము వలన నువ్వు ఫలానా అని ఆది జన్మ నువ్వు ఫలానా మహర్షి అంశ అని వాళ్ళకి చెప్పే వాడిని. ఎందుకంటే నా ఆది జన్మ ఏమిటో నేను సంపూర్తిగా తెలుసుకున్నాను. నమ్మిక ఉంచినాను అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగానే నా కళ్ళ వెంట కన్నీళ్లు టప టపా మంటూ రాలటం ఈయన చెప్పినది అక్షర సత్యం అని నిరూపణ కోసం ఆకాశమునుండి వర్షపు జల్లు టపటప అంటూ ఆరంభం అయ్యే సరికి ఇక ఆయనని స్వయముగా నేను అడిగినట్లుగా ఈయన నోటివెంట పలికించినారు అని నిర్ధారణ చేసుకొని అపనమ్మకము లేకుండా పరిపూర్ణ నమ్మకంతో నాది వేదవ్యాస అంశ ఆది జన్మ అని నిరూపణ అయినందులకు ఏదో తెలియని సంతోషంతో ఇంటి వైపుకి ప్రయాణించాను.

నాకు ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కార అనుభూతి కలిగిందో  ఆనాటి నుండి నాలో వింత వింత అనుభవాలు కలగటం ఆరంభమైనాయి. నేను అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా నా భ్రుకుటి స్థానము నుండి ఒక సన్యాసి తెల్ల వస్త్రములు ధరించి ఉన్న వ్యక్తి బయటికి వచ్చి నా ముందే అటు ఇటు తిరుగుతూ కనపడేవాడు. వీడు ఎవడు? మనిషా? దెయ్యమా? పిశాచమా? ప్రేతాత్మ అనే అనుమానాలు భయాలు కలిగేవి. నా నుండి ఎలా వచ్చినాడు అనుకునే లోపల ఎలా వచ్చినాడో అలా మామూలుగా ఏమీ తెలియని వాడిలా గా వెళ్ళిపోయేవాడు. ఇదే మీ గోలరా. ఎవరికి కూడా చెప్పుకోలేను. చివరికి మా శ్రీమతికి కూడా చెప్పుకోలేను. నాకు గాని పిచ్చి పట్టలేదు కదా. ఒకవేళ నిజంగానే పిచ్చి పడితే ఎవరిని గుర్తుపట్టలేను కదా. ఏమి తినలేను. నేను ఏమి చూడలేను కదా. పిచ్చి వాగుడు పిచ్చి తూలుడు ఉండాలి కదా. మరి అవేమీ నాలో లేవు కదా. పోనీ మతిభ్రమణము చెందినదా అంటే అది ఏమీ లేదు. అన్నింటిని గుర్తు పడుతున్నాను. అందరినీ పలకరిస్తూ ఉన్నాను. యధావిధిగా నా గృహ బాధ్యతలు నేను చక్కగా నిర్వహిస్తూ ఉన్నాను. మరి ఈ వ్యక్తి ఎవరో కానీ నాలో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ ఉండే వాడిని. నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాడు బయటికి రాకుండా ఉండే వాడు కాదు. నేను వాడికి భయపడకుండా ఉండే వాడిని కాను. నా భయము నాకు ఉంది. వాడి ధైర్యము వాడికి ఉంది. ఎవరికీ చెప్పుకోలేను. ఏమీ అనలేను. ఏమీ తిన లేను. నేను తింటున్నానో నాలో వాడు ఉండి తింటున్నాడో నాకు అర్థం అయి చచ్చేది కాదు. నేను తప్పు చేస్తున్నానో వాడు నాలో ఉన్న వాడు తప్పు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. అంటే వాడి చేతలకు నా స్థూల శరీర చేతులు ఉపయోగించుకుంటున్నారని నాకు నెమ్మది నెమ్మదిగా అర్థం అయినది. కానీ వాడు ఎవడో తెలిసేది కాదు. వాడి పోలిన ఆనవాళ్లు కూడా అంత స్పష్టంగా కనపడేది కాదు. ఇది ఇలా ఉంటే ఒక రోజు నేను నా తీవ్రమైన ధ్యానస్థితిలో మా ఇంట్లో ఉంటే ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మమ్మ గారి ఇంటికి నా పోలికలు ఉన్న ఒక వ్యక్తి ఆమె దగ్గరకి వచ్చి ఏవో ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడట. ఎలా అంటే నేను ఒక రోజు అమ్మమ్మ ను చూడలేదని ఆమెను చూడటానికి వెళ్ళితే ఆమె వెంటనే మళ్లీ వచ్చినావు ఏమిరా. మూడు రోజుల క్రితం నన్ను చూడటానికి వచ్చి నీ ఓదార్పు మాటలతో నాలో ఉన్న దిగులు తీసేసి నావు గదా అంటుంటే నా మతి పోయింది. నేను రావటం ఏమిటి? ఈమెతో మాట్లాడటం ఏమిటి? నాలుగు సంవత్సరముల తరువాత మొట్టమొదటిసారిగా నేను రావడం ఇదే మొదటిసారి. ఈమె కాస్త మూడు రోజుల క్రితం నేను వచ్చాను అంటుందేమిటి? అమ్మో! నా లాంటి వ్యక్తి మరొకరు ఉన్నాడా? తిరుగుతున్నాడా? అసలు ఈ లోకములో మనుషులను పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారు అంటారు గదా. అందులో వీడు ఒకడా? నాకేమీ అర్థం కాలేదు. భయము అనుమానము మొదలై అక్కడ ఎక్కువ సేపు ఉండలేక ఇంటికి వెళ్ళిపోయాను. నేను చేయాల్సిన పనులు నా లాంటి వ్యక్తి ఎవరో చెయ్యటము మొదలైనదని నాకు ఆనాడు తెలియ రాలేదు. తెలుసుకొనే స్థితి కూడా లేదు. అనుమానము భయము తప్ప ఏమీ లేదు. ఇంకా నయం.నాలాంటి వాడు డబ్బులు అడగలేదు. ఈమెను మోసం చేయలేదు. మంచివాడు అయి ఉంటాడు అనుకుని ఇంటికి చేరుకున్నాను. 

ఇలా కొన్ని రోజుల తరువాత నా సహచర మిత్రుడు నేను అప్పటికే రచించిన యోగ దర్శనము గ్రంథమును చదివి మిడిమిడి జ్ఞానమును పెంచుకొని అపరిపక్వ మనస్సుతో ఏవేవో ఊహించుకొని కనీసం కుటుంబ సభ్యులకి అలాగే బంధుమిత్రులకి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రే ఇంటి నుండి ఉద్యోగం వదిలేసి పారిపోయాడు. మూడు రోజుల తర్వాత ఇంట్లోని వారికి ఈ విషయం తెలిసి నన్ను నిలదీయటానికి గుడికి వచ్చినారు. వీళ్లు వచ్చి నన్ను అడిగే దాకా మనవాడు జంపు అయ్యాడని నిజానికి నాకు తెలియదు. నాకు ఏమి చేయాలో అర్థం అవ్వటం లేదు. వాడు ఎక్కడికి పోయాడో తెలియదు. నేను ఒకసారి ఇలాగే ఎవరికి కూడా చెప్పకుండా షిరిడి చేరుకున్నట్లుగా ఏదైనా క్షేత్రానికి వెళ్లి ఉంటాడు. ఏ క్షేత్రానికి వెళ్ళినాడో కనీసము ఎవరికీ తెలియదు. ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఏమీ అర్థం కాని స్థితి. ఈ పుస్తకం రాసి పెద్ద తప్పు చేశానని జీవితంలో మొట్టమొదటిసారిగా అనిపించసాగింది. ఒక తల్లికి తన బిడ్డ యొక్క కడుపుకోత మిగిల్చాననే భయం మొదలైంది. చేతికి వచ్చిన కొడుకు కళ్ళముందే మాయం అయితే ఎలా ఉంటుంది. ఎవరు తట్టుకోగలరు. ఆ తల్లి మనోవేదనను ఎవరు తీర్చగలరు. ఇలా పలువిధాలైన ఆలోచనలతో నా మనస్సు ఉండేది. అలాగే నా ధ్యానసాధన ఆజ్ఞా చక్రము నందు కొనసాగిస్తూ ఉండేవాడిని. ఇది ఇలా కాదనుకొని నాకు ఇష్టం లేకపోయినా ఒక తల్లి పడే ఆవేదనను చూడలేక నాకున్న దూరదృష్టి సిద్ధితో వాడు ఎక్కడ ఉన్నాడో చూడాలని నా మనో నేత్రంతో చూస్తే హరిద్వార్ ప్రాంతంలో ఉన్నట్లుగా మరొకసారి రిషికేశ్, మధుర, బృందావనం, దేవ ప్రయాగ,మణి కైలాష్ వంటి క్షేత్రాల దర్శనాలు ఒక్కొక్కటిగా కనబడుతూ ఉండేవి. అప్పటికే మనవాడు జంపు అయ్యి ఆరు నెలలు పైగా కావస్తోంది. అంటే నా మనోనేత్రం ముందు కనిపించే క్షేత్రాలలో మనవాడు సంచారం చేసినాడని చేస్తున్నాడు అని నాకు అర్థమయింది. మూడు రోజులకు మించి ఏ క్షేత్రములో ఉండటం లేదు. పోనీ వీళ్ళకి వాడి అడ్రస్ అంటే ఫలానా క్షేత్రంలో ఉన్నాడని చెబితే వీళ్లు అక్కడికి వెళ్లి వెతికే సరికి మనవాడు జంపు అవుతాడేమోనని ఎందుకంటే వీడు మూడు రోజులకు మించి ఎక్కడ లేడు అనిపించింది. వీడు ఎక్కడో ఒక ప్రదేశములో కానీ క్షేత్రములో కాని స్థిర పడేదాకా మనము ఏమి చెయ్యలేమని నాకు అవగతమైనది. ఇది ఇలా ఉండగా నేను ఇలా వీడి కోసం తీవ్ర ఆవేదన చెందుతూ ధ్యాన స్థితిలో ఉండగా యధావిధిగా నాలో నుంచి వచ్చే ఆ వ్యక్తి బయటికి వచ్చి నా ఎదురుగా నాకు లాగానే కూర్చొని “కంగారు పడకు. వాడిని నేను కాశీక్షేత్రంలో పట్టుకుంటాను. వాడు అక్కడికే చివరికి వస్తాడు. ఆ విషయము నాకు తెలుసు. నీకు తెలియదు. కంగారుపడకు. వాడి వివరాలు నీకు తెలియజేస్తాను” అంటూ విచిత్రంగా అదృశ్యమైనాడు. ఇన్నాళ్లు నాతో మాట్లాడే వాడు కాదు. అలాగే ఎలా వచ్చినాడో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. వామ్మో! ఇది ఏమిటి? ఈ రోజు కొత్తగా. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. మా వాడు ఉన్న ప్రాంతానికి వెళ్లి వస్తాను అని వాడి వివరాలు చెబుతానని ఓదార్పునిచ్చే వెళుతున్నాడు. ఇతగాడికి నా స్నేహితుడు ఎలా తెలుసు? వీరిద్దరూ కూడా ఎక్కడా కలిసి కూడా మాట్లాడినట్లుగా గుర్తుగా లేదు. అసలు వీడిని చూడటమే ఈ మధ్యన మొదలైనది కదా. వీడి సంగతి వాడికే తెలియదు. అసలు నాకే తెలియదు. వామ్మో! వీడు కానీ దెయ్యము కాదుగదా. ఒకవేళ నన్ను పూర్తిగా కర్ణపిశాచి( కర్ణ పిశాచి అనుభవాలు) వదిలి పెట్ట లేదా. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు ఈ కర్ణపిశాచి కనబడుతోంది. అయినా అది చెవిలో కనిపించకుండా లోక రహస్యాలు చెప్పేది. కానీ వీడు ఏకముగా నా ఎదురుగా నాకు లాగా కూర్చుని అన్ని విషయాలు చూసినట్లుగా తెలిసినట్లుగా చెబుతున్నాడు. ఏమో ఎవరికి తెలుసు. అన్నింటా మునిగిపోయిన వాడికి తెగించిన వారికి తెడ్డే గతి అని కదా. చూద్దాం ఏమి జరుగుతుందో అని అనుకుంటూ ఉండగా అదృశ్యమైన ఈ వ్యక్తి కాస్త సాదృశ్యముగా నా కళ్ళముందు కనిపించేసరికి భయం వేసింది. దడ మొదలైనది. వాడు ఏమి విషయాలు చెబుతాడో విని తట్టుకునే పరిస్థితి నాకు ఉందా అనే అనుమానము పడుతూ ఉండగా వాడు కాస్త “అమ్మయ్య! మీ వాడి అడ్రసు దొరికినది. వాడు కూడా నీకు లాగానే కాశీక్షేత్రంలో ధ్యానము చేసుకుంటున్నాడు. వాడికి కనిపించి వచ్చి వాడు నన్ను గుర్తుపట్టి పిలిచే లోపల పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేశాను. వాడు ఉన్న అడ్రస్ మరో వారం రోజులలో నీకే తెలుస్తుంది. కంగారు పడకు. ధైర్యంగా ఉండు. నేను ఉండగా నీకు భయం ఎందుకు” అని అంటూ వాడు యధావిధిగా భృకుటి ప్రాంతంలోని కి దూరిపోయినాడు. అసలు నాకేమీ జరుగుతుందో వీడు ఎవరిని చూసి వాడు అనుకున్నాడో నాకు అర్థం అయ్యే లోపల నిద్రాదేవత ఆవహించినది. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. పారిపోయిన మా స్నేహితుడు నుండి విచిత్రముగా నాకు ఫోన్ కాల్ వచ్చినది. కారణము వాడికి ఉండటానికి తినటానికి డబ్బులు అవసరం పడినాయి. ఒక 5000/- M.O చేయమని వాడు ఉన్న అడ్రస్ తో సహా నాకు చెప్పటము నేను వెంటనే మా అయ్య ద్వారా వాళ్ల వాళ్లకి ఈ అడ్రస్ వివరాలు చెప్పటం జరిగిపోయాయి. వెంటనే మూడు రోజులకే వాళ్లు వీడిని కాశీక్షేత్రంలో కలవటం కొన్ని నెలల తరువాత వీడు తన ప్రారబ్ద కర్మలు తీర్చుకోవడానికి తిరిగి ఈ భోగ ప్రపంచంలోనికి రావటం యధావిధిగా జరిగిపోయినాయి. వచ్చిన తరువాత వీడు ఒక రోజు నా దగ్గరకి మా ఇంటికి వచ్చి “నువ్వు ఆరోజు నా దగ్గరికి రాకపోయి ఉంటే నేను నీకు ఫోన్ చేసే వాడిని కాను” అని వాడు చెబుతుంటే నాకేమీ అర్థం కాలేదు. నేను వెంటనే వాడితో “నేను నీ దగ్గరికి రావడం ఏమిటి? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో…ఎక్కడికి వెళ్లావో నాకే తెలియదు. మీ వాళ్ళకి తెలియదు. నువ్వు నాకు ఫోన్ చేసేదాకా నీ వివరాలు మాకు తెలియవు. మరి నీవు మరి నేను నీ దగ్గరికి ఎలా వస్తాను” అనగానే వాడు వెంటనే “అదేమిటి అలా అంటావు. నేను కాశీలో మణికర్ణికా ఘాట్ వద్ద ధ్యానము చేసుకుంటూ ఉండగా నీవు కనిపించి నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి నేను నిన్ను పిలుస్తున్న కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి పోయావు కదా. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇక్కడ ఉన్నాను అని నీకు ఎలా తెలిసిందా అని.కనీసము నేను పారిపోతున్నాను అని చెప్పనే చెప్పలేదు కదా అనుకున్నాను. నాకు అనుకోకుండా డబ్బులు అవసరం పడటంతో నీవు నాకు కనిపించగానే ధైర్యంతో నీకు ఫోన్ చేయడం జరిగిందని” వాడు చెబుతుంటే నాకు నోట మాట రాలేదు. నేను నా ఇంటి నుండి గత మూడు సంవత్సరముల నుండి ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళలేదు. వాడేమో ఏకంగా కాశీకి నేను వచ్చినాను అని చెబుతున్నాడు. ఇందులో ఏదో తెలియని మర్మము ఉంది. అమ్మమ్మ నన్ను చూశానని చెప్పడము వీడు కూడా నన్ను చూశానని చెప్పటం అలాగే నాలో ఉన్న వ్యక్తి వారం క్రితం పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చినాను అని చెప్పడంతో అంటే వీరిద్దరికీ నాలోని వ్యక్తి నా లాగా ఉన్నాడు అని నాకు అర్థం అయింది. అంటే ఈ నా లోని వ్యక్తి ఎవరో కాదు నా స్థూల శరీరమును పోలిన సూక్ష్మ శరీరధారి నా ఆత్మ స్వరూపము. నా సూక్ష్మ శరీరము అంటే నా ప్రమేయం లేకుండా నా అవసరం ఉన్న చోట తెలిసి తెలియకుండా నా సూక్ష్మ శరీరము యానము అదే ప్రయాణం చేస్తుందని అని నాకు స్పురణకు రాగానే నా గుండెకాయ గతుక్కుమంది. వామ్మో! నా స్థూల శరీర ప్రయాణాలు ఎవరైనా చేస్తారు. ఇలా నా సూక్ష్మ శరీరము కూడా ప్రయాణాలు చేయటం మొదలు పెడితే వామ్మో వాయ్యో! నా పరిస్థితి ఏమిటి? దీనిని ఎలా ఆపాలి అనుకుంటూ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను తిరగ వేసి చూస్తుండగా ఆయన కూడా తీవ్ర ధ్యానంలో ఉండగా ఆయన నుండి ఒక సన్యాసి బయటకి వచ్చి ఎదురుగా కూర్చొని తన ధర్మ సందేహాలు తీర్చేవాడు అని ఈయన ప్రశ్నలు అడగటం ఆయన సమాధానాలు చెప్పడం జరిగిన తరువాత ఈ సన్యాసి యధావిధిగా మళ్ళీ లోపలికి తిరిగి ప్రవేశించి మాయమయ్యేవాడు అని ఇలా కొన్ని నెలలు తర్వాత ఇలా వచ్చే సన్యాసి తానే అయినట్లుగా అంటే తన సూక్ష్మశరీరం అని గ్రహించినారని వారి చరిత్రలో చదివేసరికి నా గుండెకాయ గతుక్కుమంది. అంటే ఇలా నాకు బయటకు వచ్చేవాడు నిజంగానే నా సూక్ష్మశరీరం అని నాకు నిరూపణ అయినది. ఇక దానితో నా సూక్ష్మ శరీరధారికి భయపడటం మానివేసి వాడి కోసము ఎదురు చూడటం మొదలు పెట్టినాను. నాకు ఏవైనా విపత్కర సమస్యలు లేదా అర్థము కానీ ధర్మసందేహాలు వచ్చినప్పుడు నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా ఈ నా సూక్ష్మశరీరము బయటికి వచ్చి నాకు సమాధానాలు చెబుతూ ఉండేది. ఇలాంటి దృశ్యాలు మా శ్రీమతి కంటి నుండి తప్పించుకోలేక పోయింది. నేను నా స్థూల శరీరము మంచము మీద ఉండగానే నాలో శరీరములో నుంచి నా లాంటి ఆకారం ఉన్న తెల్లని శరీరం నా పడకగది నుండి బయటకి వెళ్లి రావటం అలాగే అది ఇంటి లోని వివిధ గదులలో తిరుగుతూ ఉండటం కొన్నిసార్లు అది అదృశ్యం అవటం గదులలో పడుకునే వారికి నా సూక్ష్మ శరీరము కనిపించడం షరా మామూలు అయిపోయినది. 

కానీ నాకు మా శ్రీమతికి తప్ప మిగిలిన వారందరికీ రాత్రి మగత నిద్రలో నా స్థూల శరీరము చూశారని వాళ్ళ నమ్మకం. అదే అది నా ఆత్మను చూశారు అంటే ఖచ్చితంగా గుండె కాయలు వీళ్ళకి ఆగిపోతాయని మనో భయముతో నేను అలాగే మా శ్రీమతి ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ నిజానికి వాళ్లు చూసినది నా సూక్ష్మశరీరం అని నాకు మా శ్రీమతికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మొట్టమొదటిసారిగా మా శ్రీమతి నా సూక్ష్మ శరీర యానం గూర్చి తెలియక అది చూసి నా లాంటి రూపమున్న ప్రేతాత్మ గదిలో తిరుగుతుంది అని భయపడి నాతో చెప్పలేక ఎవరికీ చెప్పలేక వారం రోజులపాటు మంచాన పడినది. విషయము నాకు అర్థమయ్యి అసలు విషయమైన నా సూక్ష్మ శరీర యానం గూర్చి చెప్పినా అది కూడా నా స్థూల శరీరము లాంటిదేనని ఈ శరీరము నిలబడటానికి ఆ సూక్ష్మ శరీరము కావాలని హితబోధ చేశాను. అప్పటికి తనకి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు తన సూక్ష్మ శరీరము కూడా యానము చేసే స్థితిలో ఉండే సరికి తనకి పూర్తిగా ఈ విషయం అనుభవం అర్థం అయినది. అలాగే మా నిత్య దైవాలు అయినా దుర్గ మల్లికార్జునుడు షిరిడి సాయి బాబా వారి సూక్ష్మ శరీరాలు అలాగే కోరిక తీరని ప్రేతాత్మ సూక్ష్మ శరీరాలు మా ఇద్దరికీ మామూలుగా షరామామూలుగా మా మనోనేత్రం ముందు అగుపించిన కూడా పెద్దగా స్పందించడం లేదు. వాటి పని అవి చేసుకోవటం మా పని మేము చేసుకోవాలని మేము స్థూల కర్మలు చేస్తే వారు వాటి సూక్ష్మ శరీరాలతో ఈ విశ్వములోసూక్ష్మ కర్మలు చేస్తున్నాయని మాకు అవగతమైనది. కోరికలు ఉన్నవాడు, కోరికలు తీరని వాడు, ఇష్ట కోరికలు ఉన్నవాడు, ఇతరుల కోరికలు తీర్చే వారు ఇలా సూక్ష్మ కారణ శరీరాలుతో చేస్తుంటారని వారిని మనము ఆత్మలుగా ప్రేతాత్మలుగా దైవాలుగా పరమాత్మగా కొలుస్తున్నామని అదే సైన్సు వీళ్ళని తమ భాషలో గ్రహాంతర వాసులు గా పిలుస్తుందని ఎవరికి వారే ఆత్మసాక్షాత్కార అనుభవము అయ్యే అంతవరకు నమ్మలేరు అని మాకు స్పురణకు వచ్చినది. దానితో నేను మౌన బ్రహ్మ గా మారిపోయినాను. ఇలా ఉండగా ఈ నాలుగు ఉప చక్రాలను దాటడానికి ఏమైనా సహాయం పడుతుందేమోనని నా సూక్ష్మశరీరధారిని అడిగాను. దానికి నవ్వుతూ “మీకు తెలియని రహస్యాలు చెబుతాను. జాగ్రత్తగా విను. ఈ నాలుగు ఉప చక్రాల సాధనకి దక్షిణాచారం అలాగే వామాచారంలో విధి విధానములు ఉన్నాయి. మనస్సు పెట్టే స్థితిని బట్టి మీ సాధన సమయము ఆధారపడుతుందని గ్రహించు. నీ చక్రాల సాధన ఒక నిమిషంలో అయిపోవచ్చు లేదంటే పది లక్షల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. వెయ్యి కోట్ల మానవ జన్మలు కూడా పట్టవచ్చును. ఇదంతా మనస్సు స్థిరత్వమును బట్టి ఉంటుంది. ఈ మనస్సు స్థిరత్వము కాస్త నీవు తీసుకున్న ఆహారం బట్టి ఉంటుంది .ఆహారమును బట్టి నీ సాధన మనస్సు ఉంటుంది అన్న మాట. ఒక విషయము. స్థూల శరీరము తో యోగ సాధన ఆజ్ఞాచక్రం వరకే వస్తుంది. ఎప్పుడైతే జీవ మాయ ఇచ్చే అహంకారమాయ వదిలించుకుంటే అప్పుడు నీలో ఉన్న నాలాంటి శరీరధారి అయిన మనస్సు సూక్ష్మ శరీర రూపంలో బయటికి వస్తుంది. అక్కడ నుండి ఈ సూక్ష్మ శరీరధారియే తన యోగ సాధనను ఈ నాలుగు ఉప చక్రాలు అనగా గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రాలను అలాగే సహస్రార చక్రము వరకు సాధన చేస్తుంది. అప్పుడు మనస్సు అంటే సూక్ష్మ శరీరము చలనరహితంగా మారి నిర్వికల్ప సమాధి లోనికి వెళుతుంది.ఆ తర్వాత నా నుండి అంగుళ పరిమాణం ఉన్న కారణ శరీరం వ్యక్తి బయటికి వచ్చి సాధనను కొనసాగిస్తాడు. కారణశరీరవాసి అన్నమాట. సహస్ర చక్రము నుండి జీవ నాడి ద్వారా హృదయ చక్రమునకు చేరుకుని దేనికి స్పందించకుండా బ్రహ్మ తదాకార స్థితి పొంది కోమా వంటి స్థితికి చేరుకుని యోగ మత్తులో కారణశరీరము చలన రహితంగా మారుతుంది. అప్పుడు దీని శరీరము నుండి పిండి రేణువు లాంటి పరిమాణముతో సంకల్ప శరీరము బయటికి వచ్చి ఈ హృదయ చక్రంలో ఉన్న హృదయ గ్రంధిని విభేదన చేసుకుని అక్కడ ఉన్న మార్గము ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వరి గింజ ముక్కు పరిమాణంలో ఉన్న చితాగ్నిలో ఈ సంకల్ప శరీరం దహనం అయితే అంతటితో పరిపూర్ణ యోగసాధన పరిసమాప్తి అవుతుంది. కానీ ఇది ఇంత వరకు జరగలేదు. 80% సాధకులు ఆజ్ఞాచక్రము దగ్గర ఆగిపోతే మిగిలిన 10% సహస్రార చక్రము దగ్గర మిగిలిన 8% హృదయ చక్రం దగ్గర మిగిలిన 2% ఈ బ్రహ్మరంధ్రము దగ్గర కనపడే దీప దుర్గ మాయకి బలి అయ్యి సహన శక్తిని కోల్పోయి తిరిగి సహస్రార చక్రానికి ఈ పిండిరేణువు చేరి సహస్ర ముక్కలు అవ్వటం ఇంతవరకు జరుగుతోంది. ప్రస్తుతానికి నువ్వు అలాగే మీ జిజ్ఞాసి కూడా 80% వద్ద అనగా ఆజ్ఞాచక్రం మాయను దాటినారు. ఇక ముందు మీ సాధన ఎలా జరుగుతుందో చూడాలి. ఆదియోగి ఆదిశంకరుడికి ఈ సాధన సంపూర్తి కాలేదని తెలుసుకో. ఎవరో ఒకరు ఒక చోట తప్పకుండా ఏదో ఒక మాయలో ఆగిపోతున్నారు. కాస్త వెనుక ముందు అంతే తేడా. చావులు కూడా కాస్త వెనుక ముందు ఉన్నట్లుగా ఈ సాధన ఆగిపోవటం జరుగుతోందని తెలుసుకో. కాకపోతే నువ్వు ఈ జన్మలో ఏ చక్ర స్థితిలో ఆగిపోయావో తెలుసుకో.ఏ ముక్తి స్థాయి పొందినావో తెలుసుకో. అదియే నిజ సాధన అని గ్రహించు. ప్రారంభ సమాధి స్థితి వద్ద సాధన ఆగిపోతే అనగా మణిపూరక చక్రము వద్ద ఆగిపోతే సాలోక్య ముక్తి అదే విశుద్ధ చక్రం వద్ద ఆగిపోతే సారూప్య ముక్తి అదే ఆజ్ఞా చక్రము వద్ద కలిగే సవికల్ప సమాధి స్థితిలో ఉండగా నీ సాధన ఆగిపోతే సామీప్య ముక్తి కలిగితే సహస్రార చక్రమునందు కలిగే నిర్వికల్ప సమాధి స్థితిలో మీ సాధన ఉండగా మీ సాధన ఆగిపోతే సాయుజ్య ముక్తి కలుగుతుంది. ఇక హృదయ చక్రంనందు తురీయాతీతమైన సమాధి స్థితిలో ఉండగా మీ సాధన ఆగిపోతే శరస్థి ముక్తి కలిగితే బ్రహ్మరంధ్రము నందు సంకల్ప శరీరము సహన శక్తి తో  తొంభై ఆరు నిమిషాల పాటు ఉండగలిగితే చిట్టచివరికి అయినా ఉత్కృష్టమైన అన్ని రకాల భౌతిక అశాశ్వత మరణాలుకి శాశ్వత మరణము ఇచ్చే జీవన్ముక్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ ముక్తి లో ఆది జన్మ కపాల విభేదనము కోసం అధిదేవత దీప దుర్గ జ్యోతి ఉంటే ఆది బ్రహ్మకపాల విభేదనము కోసం ప్రత్యంగిరా దేవత ఉంటుందని ఈ మధ్యనే నాకు స్వానుభవము అయినది. ఇక్కడికి వచ్చే 2% సాధకులు తమ కపాల విభేదనము చేసుకునే సమయంలో తమ సహన శక్తి కోల్పోయి బ్రహ్మకపాల మోక్షమును పొందలేక పోవటంతో ఈ నిజము లాంటి కల వంటి ఈ విశ్వము అలాగే జగన్నాటకం ఇంకా కొనసాగుతోంది.ఈ బ్రహ్మకపాల మోక్ష ప్రాప్తి కోసం వెయ్యి కోట్ల యోగులు తమ స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలతో ఇట్టి సాధ్య ప్రాప్తి కోసం ఈ విశ్వంలో ఉన్న వెయ్యి కోట్ల లోకాలలో ఆవాసం చేస్తూ సాధన కొనసాగిస్తున్నారని తెలుసుకో. మన లాంటి వారికి అన్ని రకాల బంధనాల విముక్తి కలిగించే కపాల మోక్షం ముక్తి కోసం అగచాట్లు పడుతున్నారు. మరి నీ సాధన శక్తి ఎంత వరకు వచ్చి ఆగుతుందో తెలుసుకోవాలి అంటూ ఈ నాలుగు చక్రాల స్థితులను కాశీ యోగి అయిన గృహస్థ ఆశ్రమ వాసి అయిన శ్రీ లాహిరీ మహాశయుడు దక్షిణాచార విధి విధానాలతో దాటినారని గ్రహించు. వారి చరిత్ర చదివితే నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. నీవు పొందే జ్ఞానము ద్వారా నేను ఈ చక్ర సాధన చేయాల్సి ఉంటుందని గ్రహించు” అంటూ తిరిగి నా సూక్ష్మ శరీరధారి నా శరీరం లోని భృకుటి మధ్య ప్రాంతంలోనికి వెళ్లిపోయినాడు.దానితో నా సాధన ఇంకా ఆగిపోలేదని దక్షిణాచార సాధనలో ఈ నాలుగు ఉప చక్రాలను చేసుకోవచ్చునని తెలియగానే ఎగిరి గంతు వేశాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా వాడు అన్నయ్య కాస్త నా చేతిలో నా సూక్ష్మ శరీరధారి చెప్పిన శ్రీ శ్యామ్ లాహిరి అనుభవ గ్రంథమైన “పురాణపురుష యోగి రాజా శ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకమును నా చేతిలో పెట్టి దీనిని చదివితే అసలు సిసలైన అనుభవ సాధన అంటే ఏమిటో తెలుస్తుంది” అని చెప్పినాడు. నాకు కావలసిన ఈ పుస్తకము ఇదే. నేను తెలుసుకోవలసిన జ్ఞానము ఇదేనని అనుకుంటూ చదవటం ప్రారంభించాను.

 ఆజ్ఞాచక్రము ఇచ్చే జీవ మాయ అయిన అహంకారం మాయను ఎవరు దాటుతారో వారికి వారి సూక్ష్మశరీరము దర్శనం ప్రత్యక్ష అనుభవం గా మీ స్థూల శరీర పోలికలతో ఖచ్చితముగా కనబడుతుంది. అది శరీర యానము కూడా చేస్తుందని మీకు తప్పకుండా ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయని గ్రహించండి. మీ మనస్సు యొక్క ప్రతి రూపమే మీ సూక్ష్మ శరీరం అని గ్రహించండి. ఈ శరీర దర్శనము చూసి కంగారు పడి పోకండి. భయపడకండి. లేనిపోని అనుమానాలు భయాలు పెంచుకొని మతి భ్రమణాలు పొందకండి. ఇవి సాధన లో ఒక భాగమని గ్రహించండి. మనోధైర్యంతో ముందుకు అడుగు వేయండి. లాహిరి మహాశయుడు 1873 సంవత్సరంలో డిసెంబర్ 7న తన డైరీలో నా ఈ శరీరము లోపల మరొక శరీరం ఉంది. దీనికి లాగానే ఉంది కానీ నలుపుగా ఉంటుంది. అద్దానికి ఎదురుగా నిల్చుంటే మన శరీర బింబము కనిపించినట్లుగా ఈ శరీరం ఉంది. దీనిని సూక్ష్మ శరీరము అంటారు.దీని దర్శనము స్వస్వరూప దర్శనం లేదా ఆత్మ దర్శనం అని అంటారు ఈ అనుభూతిని ఆత్మసాక్షాత్కార అనుభూతిని చెప్పటం జరిగిందని రాసినారు. అదియునుగాక ఈ సూక్ష్మ శరీరము 83 అంగుళాలు ఉంటే ఈ శరీరము లోపల అంగుళమంత పరిమాణంలో మన రూపం మనకే కనబడుతుంది. దీనినే కారణ శరీరము అంటారు. అనగా స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము దీని లోపల కారణ శరీరము ఉంటాయి. మనము నిద్రపోయిన సమయములో స్థూల సూక్ష్మ శరీరాలు ఇంద్రియాల విషయములను వదిలిపెట్టి నిద్రపోతుంటాయి. కానీ కారణశరీరము ఎప్పటికీ నిద్రపోదు. అది ఎప్పుడూ మెలకువగానే ఉంటుందని రాసుకున్నారు. మరొక డైరీలో ఈ స్థితి గూర్చి ప్రాణ కర్మ సాధన వలన మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రము వరకు ఉన్న ఈ ఆరు చక్రాలను కమలదళముల వికసించిన పుష్పంలో నిరాకార నిరామయ ఈశ్వర్ మహిమ అభివ్యక్తం అవుతుంది. అప్పుడు తనకు తానే కనిపిస్తాడు. తన స్వస్వరూప స్థితి పొందినప్పటికీ ఇంకా స్వయంభూ రూపుడైన తన స్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారమును పొందటమే తరువాయి అంటే నేను ఇంకా ఇప్పటికి స్వయం రూపుడైన భగవంతుడిని కాలేదన్నమాట. దైవ స్థితి లోనే ఉన్నాను. అద్వైత స్థితి పొందాల్సి ఉంటుంది. అంటే స్వయంభు భగవాన్ అంటే తామే భగవంతుడు అనే స్థితిని పొందాల్సి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరధారి యొక్క ఆది జన్మ ఏమిటో స్వస్వరూప దర్శనము అనగా ఆత్మసాక్షాత్కార అనుభూతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస తన ఆది జన్మగా కాస్త అష్ట పద కవి అయిన జయదేవుడు అలాగే శ్రీ త్రైలింగ స్వామి వారు ఆది జన్మగా శ్రీ భీష్మాచార్యులని అలాగే శ్రీ లాహిరి మహాశయులు తన ఆది  జన్మగా కబీరు అని వారి చరిత్రలో చూడవచ్చును.అలాగే షిరిడి సాయిబాబా వారి ఆది జన్మగా శ్రీ హనుమత్ అంశ అని వారి జీవిత చరిత్రలో సూక్ష్మముగా అంతర్గతముగా ఉంటుంది.ఇలా ఎవరికైతే తమ జీవన మాయ అయినా అహము సంపూర్తిగా తొలగిపోతుందో వారికి తప్పకుండా ఆత్మానుభూతి కలిగి వారి యొక్క ఆది జన్మ ఏమిటో సూక్ష్మ శరీరం యొక్క ఆది జన్మ ఏమిటో వారికి స్పురణకు వస్తుందని వివిధ యోగుల చరిత్రలను ద్వారా అలాగే వివిధ రకాల అనుభవాలు ద్వారా నా స్వానుభవం లో తెలుసుకోవడం జరిగినది.

ఇది ఇలా ఉండగా ఈ ఆజ్ఞాచక్రం ఇచ్చే జీవ మాయ అయిన అహంకార మాయ నాలో ప్రవేశించటం నాకే తెలియకుండానే జరగటం ఆరంభమైనది. నాకున్న దూరదృష్టి, జన్మాంతర జ్ఞాన సిద్దుల వలన అడిగినవారికీ, అడగనివారికి వారి కర్మ జన్మలు వివరాలు చెప్పటం మొదలు పెట్టినాను. అలాగే గత వారం రోజులు రహస్యంగా వారు చేసిన పాపపు పనులు అలాగే రాబోవు మూడు రోజులలో చేసే పనులు ముందుగానే నా దూరదృష్టి సిద్దితో నా మనోనేత్రం ద్వారా చూసి వారితో చెప్పటంతో అవి నిజాలు అవడంతో వారి పొగడ్తల మాయలలో పడిపోయి నాలో జ్ఞానఅహంకారము మొదలైనది ఇది కాస్త 18 అహంకారాలుగా రూపాంతరం చెందినది. ఇలా ఉండగా ఒకరోజు అమెరికాలో ఉన్న శ్వేత అనే అమ్మాయి నాకు ఫోను చేసి వాళ్ళ అన్నయ్య యొక్క సాధన విషయాలు చెబుతుండగా వెంటనే నేను ఆమెతో “ఏమండీ! మీ అన్నయ్య కి వివాహం అయిన పర స్త్రీ కాంక్ష ఇంకా పోలేదు. వాడు గాడి తప్పుతున్నాడు. వాడు గాడికి వచ్చేదాకా వాడి సాధన దారికి రాదు” అని చెప్పగానే వెంటనే ఆమె “ఛ! ఛ! మా అన్నయ్య అలాంటివాడుకాడండి. మీరు పొరబడుతున్నారు. వాడు ఏక పత్ని ధర్మపరుడు” అని చెప్పగా “అవునా! అయితే వాడి కామ లీలలు మీరే చూడండి” అంటూ ఆమెకి మనోనేత్రం తెరిపించాను.ఇది మీరు కేవలం మీ అన్నయ్య గారి రహస్య రాసలీలలు 48 గంటల పాటు మీకు చూపిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాను. మరో రెండు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి నాతో “దయచేసి గురువుగారు! మీరు నాకు ఇచ్చిన ఈ దూరదృష్టి సిద్ధిని నా నుండి తప్పించండి. ఎరక్కపోయి అన్నాను.మా వాడి  రహస్య ప్రదేశాలలో చేసే రహస్య క్రీడా దృశ్యాలు ఏదో వీడియోలో చూసినట్లుగా ఖచ్చితంగా కనబడుతోంది. నా అజ్ఞానాన్ని మన్నించండి. వామ్మో! నావల్ల కాదు వాటిని చూసి తట్టుకోవడం. అసలే వైరాగ్యం మీద ఉన్నాను. ఖచ్చితంగా మనస్సు పెట్టి వాటిని నేను  ఆ రహస్య రతి దృశ్యాలు చూస్తే మా ఆయనకి విడాకులు ఇచ్చి నేను కాశీ కి చేరుకోవడం ఖాయము. నన్ను, నా సంసారమును కాపాడండి” అని వేడుకునేసరికి చచ్చింది గొర్రే అని అనుకుంటూ ఆమెకు తెరిపించిన జ్ఞాననేత్రం యధావిధిగా మూసివేయడం జరిగినది. ఇక దానితో నాలో అహం పదింతలు పెరిగినది. 

ఇది ఇలా కొనసాగుతుండగా ఒకరోజు గుప్తనిధులు ఒక బావిలో ఉన్నట్లుగా అది కూడా మా దగ్గర ప్రాంత గుడి బావిలో కనిపించేసరికి ఇది నిజమో కాదో తెలుసుకోవాలని  తీవ్రముగా అనిపించేసరికి ఆ ప్రాంతపు గుడికి వెళ్ళి విచారిస్తే ఉన్నాయని  మా పూర్వీకులు చెప్పేవారు.చాలామంది ఈ బావిలోకి దిగి త్రవ్వి చూస్తే నిధులు కనిపించేవి కావు. కానీ అందరికీ అంజన ప్రశ్న వేస్తే నిధులు ఉన్నట్లుగా కనిపించేవని తీరా వెతికితే కనిపించేవిగావని దాంతో చాలామంది దీనిని పట్టించుకోవడము మానివేశారని అనగానే నాకు ధ్యానములో కనిపించినది ఇదే బావి అని అనుకుని చూస్తే అందులో నీళ్ళు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ధ్యానములో ఇక్కడ నిధులు ఉన్నట్లుగా అంత చక్కగా ఎలా కనబడతాయి అనిపించేది. ఇందులో ఏదో మర్మ రహస్యం ఉన్నదని తెలియగానే ఆ గుడిలో రాత్రంతా నిద్రించి విషయము తెలుసుకోవాలనిపించింది. నిధుల మీద ఆశ కాదు కాని నిధులు ఉన్నాయని చెప్పే దృశ్యాలు నిజమా కాదా అనే ఆశ మాత్రమే ఉండేది. రాత్రి 12 గంటలు అయ్యేసరికి చిన్నపాటి శబ్దాలు గూడిన తరంగాలు ఆ బావిలో కదలటం ఆరంభమైనది. వామ్మో! ఇది ఏమిటి? ఒకవేళ కప్పలు, పాములు గాని తాబేలు గాని ఏమైనా ఉండి ఉండాలి. అవి చేసే శబ్దాలు అయి ఉండాలి అనుకుంటూ ధైర్యము తెచ్చుకొని ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు ధ్యానంలో ఈ బావి అలాగే నీళ్లు కనిపించసాగినాయి. కొన్ని క్షణాల తర్వాత ఏవో భూషణాలు కనిపించినాయి. వాటిలో ఏవో రత్నాలు,రత్న భాండాగారము ఉన్నట్లుగా అగుపించాయి కానీ ఇవి అన్నీ కూడా ఒక యంత్రము మీద అమర్చినట్లుగా క్రొత్తగా కనిపించసాగినది.అంటే ఈ గుప్త నిధులను యంత్రము  దిగ్బంధనం చేసినారని అందువలన ఎవరికీ నిధులు కనిపించటం లేదని నాకు అవగతమైనది. అప్పుడు ఈ యంత్రము ఎవరిది అని అనుకుంటుండగా ఒక వయో వృద్ధుడు ఒక త్రిశూలము పట్టుకొని నాకేసి తీక్షణముగా చూస్తుండేసరికి నాకు ధ్యానభంగమైనది.ఈయన ఎవరో? ఒక యంత్ర దేవుడా? ఈయనని చూస్తుంటే అచ్చంగా యోగివేమన సినిమాలో వేమన గురువుగా కనిపించి గురుబోధ చేసే ముసలి వాడి లాగా కనిపిస్తున్నాడని నాకు స్పురణకు వచ్చినది అంటే సాక్షాత్తు ఆ మహా శివుడే ఈ నిధులకు కాపలాగా ఉన్నాడని నాకు అర్థమయ్యే సరికి నా లో చెమటలు పట్టినాయి. అంతలో బావిలో ఏవో శబ్దాలు పెద్దగా వినిపించటంతో భయంతో ఆ బావి దగ్గరికి చాటుగా వెళ్లి లోపలకి తొంగి చూస్తే నాకు ధ్యానంలో కనిపించిన ముసలాయన కనిపించి నా కేసి తల పైకి ఎత్తి చూసేసరికి నా గుండె ఆగినంత పని అయింది. వామ్మో! వామ్మో! నిజంగానే గుప్త నిధులు ఉన్నాయి. అలాగే వాటికి బంధన శక్తులు ఉన్నాయి. ఇక ఈ జన్మలో వాటికి జోలికి వెళ్లకూడదు. ఇక వెళ్ళితే సాధన అదో గతి అవుతుంది. సాధన పరిసమాప్తి అవ్వవచ్చును లేదా ఈ జన్మ పరిసమాప్తి అవుతుంది అనుకొని ఆ కనిపించిన ముసలాయనకి నమస్కారం చేసి నన్ను ఏమీ చేయనందుకు సంతోషపడుతూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మల మూత్రాలు బయటికి వచ్చే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే వాటిని ఆపటం నా వల్ల కాదని పూజారి ఇంటి వైపు పరిగెత్తే నడకతో వేగంగా వెళ్లి పోయాను. కొన్ని రోజుల దాకా నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ ముసలాయన నేను కళ్ళు తెరిచిన మూసుకున్న కనిపించేవాడు. ఆయన తీక్షణ కళ్ళు ఇప్పటికి కూడా నా మదిలో ఉన్నాయి అంటే అవి ఎంత లోతుగా ముద్రించబడి ఉంటాయో ఊహించుకోండి. ఈ చక్ర జాగృతి అలాగే సిద్ధి సమయములో నేను తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న ధ్యానములో కనిపించే ఈ నిధులు వివరాలు తెలిసిన కూడా ఆశించే వాడిని కాను. వాటికి ఆశ పడితే నా సాధన అదోగతి అవుతుందని తెలుసు. నా అవసరాలకు తగ్గట్లుగా గుప్తనిధులు మాయలు ఉన్నాయని వాటి మాయలో నన్ను పడవేయడానికి అవి ప్రయత్నిస్తున్నాయని తెలిసింది. వాటికి స్పందించకుండా ఉండేవాడిని. ఎవరైనా నేను ధ్యానములో చూసిన ప్రదేశాలలో గుప్తనిధులు గూర్చి చెబుతున్నా మొదటిలో ఆసక్తి ఉండేది. కానీ రాను రాను భయంతో కూడిన విరక్తి వైరాగ్యాలుండేవి.వాటి గురించి పెద్దగా పట్టించుకునే వాడిని కాను. అవి మాత్రము కనిపించకుండా ఉండేవి కావు. వాటి పని అవి చేస్తున్నాయని అనుకొని నా పని నేనే చేసుకుంటూ అనగా వాటికి స్పందించకుండా మౌనం గానే ఉండే వాడిని. ఎవరికీ ఈ నిధులు గూర్చి చెప్పేవాడిని కాను. ఒకవేళ చెబితే నన్ను నమ్ముతారో లేదో పిచ్చివాడి కింద జమకడతారో తెలియదు. ఒకవేళ వాళ్లు పిచ్చివాళ్ళలా వాటి కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతే పాపం కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుప్త నిధులు వారి వారసులకు తప్ప ఇతరులకు ఎన్నటికీ దక్కదు అని తెలుసుకోండి. అందుకు తగ్గట్లుగానే వాటికి నాగ బంధనాలు,యంత్ర బంధనాలు,దైవ బంధనాలు, ప్రేత బంధనాలు, యక్షిణి, కిన్నెర ,మోహిని బంధనాలు ఇలా మున్నగు బంధనాలు వేసి వాటిని వారి వారసులకు అందేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు.అందువలన నిధులు ఉన్న ఎవరికి నిధులు కనిపించడం లేదని నాకు అవగతమైనది. కేవలము మనము వాటిని దూరదృష్టి ద్వారా చూడగలము. పొందలేము. ఒకవేళ ప్రయత్నం చేస్తే మతిభ్రమణము లేదా పిచ్చివాడిలాగా మారటం లేదా ప్రాణాలు పోవటం ఖాయం. నా స్వానుభవంలో చాలామందిని చూశాను. జాగ్రత్త తీసుకోండి. వాటిని పట్టించుకోకండి. అలాగని అవి నిజమా కాదా అని నాకు లాగా ప్రయత్నించకండి. ప్రాణాలమీదకు కొని తెచ్చుకోకండి. 

నాకు నేను ఒక జ్ఞానసిద్ధుడుగా ప్రచారం చేసుకునే స్థితికి చేరుకున్నాను. అలాగే నా చుట్టూ పొగడ్త మాయగాళ్లు ఉండి అప్పటికే మాయ ఉచ్చులో పడిపోయాను. నేను వాటికి బంధీ అయినానని నాకే తెలియని మాయా బంధంలో నేను ఉన్నాను. దానితో నాకు అసలు కనిపించే ఈ ప్రమాద దృశ్యాలు లేదా గుప్తనిధుల దృశ్యాలు నిజమేనా అనే నాకున్న ధర్మసందేహము తీర్చుకోవాలని అనుకున్నాను. ఎవరిని అడగాలో అర్థమయ్యేది కాదు. ఇది ఇలాయుండగా నేను మొట్టమొదటిసారిగా కాశీయాత్రకి బయలుదేరినాను.నేను రైలు ప్రయాణములో ఉండగా నా మనోనేత్రము నందు గుప్తనిధులున్న భోషాణము అలాగే ఒక స్త్రీమూర్తి ముఖము తరచుగా కనపడటం మొదలైనది.ఈమె ఏవరో తెలియదు.తెలియని వారే ఎక్కువగా కనబడే వారు. తీరా నేను కాశీకి చేరుకొని ఒక గదిని  అద్దెకి తీసుకున్న ఆ ఇంటి యాజమాని చూడగానే ...ఈవిడే తన ధ్యానములో కనపడిన స్త్రీమూర్తియని గ్రహించాను.కానీ ఈ గుప్త నిధుల విషయం బాగా తెలిసిన వ్యక్తి ఈమె కనిపించే సరికి  ఈమెనే అడిగి ఏదో ఒకటి తేల్చుకోవాలని అనిపించింది.ఒకరోజు అది రానే వచ్చింది. ఈమె నాకు ఎదురుగా కూర్చొని ఏదో దిగాలుగా ముఖం పెట్టి “స్వామి! స్వామి! వారం రోజుల క్రితమే నా కొడుకు శివైక్యం చెందాడు. వాడు లేకపోవటం తట్టుకోలేకపోతున్నాను. ఏదో మీ సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నా దైవనమ్మకం” అంటుండగా నేను వెంటనే ఈమెతో “ఏమిరా! నాటకాలు ఆడుతున్నావా? జార్ఖండ్లోని నాగబంధం గుప్త నిధులకి మీకు ఏమిటిరా సంబంధము. అవి మీ వాడి పేరు మీద పెట్టగానే మీ వాడికి చావు వచ్చినది.ఇలా అవి ఎవరి పేరు మీద ఉంటాయో వాళ్ళు చస్తున్నారని మీ అయ్య మొత్తుకున్నా వినకుండా నీ కొడుకు పేరు మీద కావాలని పెట్టించి వాడికి చావుకి కారణమై మళ్ళీ నా దగ్గరకు వచ్చి “వాడు చచ్చాడు. నాకు బాధగా ఉంది అని నాటకాలు ఆడతావురా! పై వాడే పెద్ద నాటక సూత్రధారి అనుకుంటే వాడిని మించిపోయావు కదరా! అసలు మీకు ఆ నిధులకి గల సంబంధం ఏమిటిరా ఇక్కడ కాశీలో ఉన్న వాడికి బీహార్ రాష్ట్రంలోని జార్ఖండ్కి సంబంధం ఏమిటిరా” అని ఈమెని నేను నిలదీసే సరికి ఈమె వెంటనే “స్వామి! మీకు నా అన్ని విషయాలు తెలిసి పోయాయి. ఏ నిధుల కోసం నేను ఆరాటపడినానో ఆ నిధులు అలాగే ఉన్నాయి. కానీ మా వాడు లేకుండా పోయాడు. అంతా నిజమే చెబుతాను. స్వామి నిజమే చెబుతాను. మా నాన్నగారు అనుకోకుండా జార్ఖండ్లో తక్కువ రేటులో ఒక అర ఎకరం స్థలం కొన్నారు. కొన్ని సంవత్సరములు దానిని గూర్చి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన ఆ స్థలంలో ఇల్లు కడదామని అనుకుని పునాదులు కడుతుంటే ఎవరో ఇక్కడ ఇల్లు కట్టవద్దు. నా మీద ఇల్లు కడతారా. ఖాళీచేసి వెళ్లిపోండి. ఇది నా స్థలము. అని ముమ్మార్లు వినిపించిందట. దానికి మా అయ్య భయపడి కట్టిన గోడను అలాగే ఉంచి మరుసటి రోజు వద్దామని మేస్త్రీతో అప్పుడున్న కూలీలతో వెళ్ళిపోయి ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి చూస్తే కట్టిన గోడ క్రింద పడిపోయి ఉంది. వెంటనే కట్టడానికి ప్రయత్నించటం తిరిగి ఆమె మాటలు వినిపించడం ఇలా వెను తిరిగి రావడం జరిగినది. ఇలా కొన్ని నెలల పాటు జరిగే సరికి మా అయ్యకి ఏదో సందేహం వచ్చి ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్లి తన సమస్య గురించి చెబితే ఆయన గవ్వలు వేసి అక్కడ నాగ శక్తి ఉందని మీరు కట్టే నేలలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అంజనము లో వాటిని మా అయ్యకి చూపించారట. వాటిని చూసిన దగ్గర నుంచి మా అయ్యకి తిరిగి వాటిని ఎలాగైనా  చేజిక్కించుకోవాలని ఆ జ్యోతిష్యుడితో అంటే దానికి ఆయన మరింత లోతుగా పరిశీలించి ఆ నిధులకు రెండు నాగులు ఉన్నాయని అవి రెండూ కూడా భార్యాభర్తలని నాగిని నాగుడు అని వాటిని రెండింటిని చంపగలిగితే మీకే గుప్తనిధులు దక్కుతాయని పౌర్ణమి రోజుల్లో అవి నాట్యమాడుతున్న సమయంలో వాటిని చంపమని దానికి ఎలా ఏమి చేయాలో వివరంగా చెప్పే సరికి మా అయ్య వెనుకా ముందు చూడకుండా ఆలోచించకుండా కొంతమంది పని వాళ్ళని తీసుకుని అసలు ఆ స్థలంలో నిధులు ఉన్నాయో లేదో పరీక్షించాలని అక్కడికి వెళ్లి ఆ స్థలములో సుమారుగా ముప్పై  అడుగుల దాక త్రవ్వి చూస్తే గుప్తనిధుల పైన ఉన్న ఇనుప చట్రానికి వీళ్ళ పలుగు తగిలి పెద్ద శబ్దం చేయడం వెంటనే నాగిని బెదిరించడం అంతా ఏక కాలం లో జరిగిపోయాయి.పౌర్ణమి దాకా మా అయ్య ఎదురు చూసి అవి మనిషి రూపాలు ఎత్తి నాట్యమాడుతున్న సమయంలో రెండింటిని చంపుదామని అనుకునే లోపల వాటిలో ఉన్న ఆడ పాము తప్పించుకుని పోగా మగపాముని చంపడము జరిగినది. ఆ తర్వాత మరుసటి రోజు మా అయ్య ఇక్కడికి వచ్చే సరికి ఏడుస్తూ ఒక స్త్రీ స్వరం వినిపించి “నీకు ప్రాణబిక్ష పెడదామని మొదటిలో నిన్ను వదిలి పెడితే నా భర్తనే చంపుతావురా. ఏ నిధుల కోసం నీవు నా భర్తను నా నుండి వేరు చేసినావో ఆ నిధులు నీవు ఎవరికి రాస్తావో వారు నా చేతిలో చస్తారు. నీ వంశం నిర్వంశం అవుతుంది ఇదియే నా శాపము” అని వినిపించింది.

దానితో మా అయ్య కి భయమేసి మళ్ళీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళితే రాత్రి ఆ పాము నన్ను చంపడానికి ప్రయత్నించినది. ఆమె వివరాలు చెప్పినందుకు నన్ను కూడా చంపుతుందని తెలిసినది. అసలు రెండిటిని చంపకుండా ఒక్కటే చంపినందుకు అది ఇప్పుడు పగ పట్టినది. నా చావు దగ్గరికి వచ్చినది.మీ వంశం నిర్వంశం అయ్యే సమయం దగ్గరికి వచ్చింది. అంతా చేతులారా చేసుకున్నది. విధి వ్రాతను ఎవరూ తప్పించలేరు కదా. ఎవరు కూడా అనుభవించకుండా తప్పించుకోలేరు గదా అంటూ వేగంగా ఇంటి లోనికి వెళ్లి పోయేసరికి మళ్ళీ ఈసారైనా ఆడ పాముని చంపాలని ప్రయత్నించి మా అయ్య చావు దాక వెళ్లి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పాము కాటు వలన ఆ జ్యోతిష్యుడు చనిపోయాడని తెలిసింది. అలాగే మా అయ్యకు పక్షవాతము వచ్చినది. ఈయనకున్న నలుగురు మగపిల్లల పాము కాటు వలన చనిపోయినారు. నా ఒక్క వారసుడు చనిపోయాడు. ఆయనకున్న ఆడపిల్లలు కూడా ఏదో ఒక నయంకాని తీవ్ర సమస్యలతో బాధపడుతూ వెళ్ళబుచ్చుతున్నారు. అటు చావలేక ఇటు బ్రతక లేక అని చెప్పి ఊరుకుంది. వెంటనే నేను అయితే మనము ఆ ఊరికి వెళ్ళి ఏమైనా పరిష్కారము దొరుకుతుందేమో చూద్దాము అనగానే వాడు వెంటనే సంతోషించి ఇంతకంటే భాగ్యమా స్వామి ఇప్పుడే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని వస్తాను అని చెప్పిన వాడితో కలిసి నేను ఆ గుప్త నిధులు ఉన్న జార్ఖండ్ కి వెళ్ళినాను. అక్కడ వాడు చూపించిన స్థలంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించి ఉన్న ఒక శోక స్త్రీ మూర్తి కనిపించి రా యజమాని. నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని నన్ను చూస్తూ మాట్లాడింది. అసలు నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు ఆమె నువ్వు గతజన్మలో ఫలానా వాడివి. ఫలానా వాళ్ళు మీ వాళ్ళు అంటూ నా గత జన్మ వివరాలు చెప్పడంతో నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఈ గుప్త నిధులు తీసుకొని నేనేమి చేయగలను అని అనుకొని వాటినుండి నాగ బంధ విముక్తి కలిగించినాను.కానీ అవి పై లోకాలకు వెళ్ళకుండా నాకోసం అక్కడే ఆ రెండు పాములు ఎదురు చూస్తుంటాము అని ప్రతిజ్ఞ చేసే సరికి మౌనం వహించి వెను తిరిగి కాశీ క్షేత్రానికి వచ్చేసాను. ఇక ఆ విషయమే పట్టించుకోవటం మానేశాను.

ఇది ఇలా ఉండగా ఒకసారి మావాడి ఇంటిలో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. సుమారు 150 మంది అతిథుల కోసం భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంతలో వర్షం ఆరంభమైనది. పెద్ద వర్షం పడుతోంది. దానితో మా వాడి లో దిగులు మొదలైనది. కారణం వీడు పిలిచిన వారు ఈ వర్షం కారణంగా రాకపోతే ఏర్పాటు చేసిన పదార్థాలు ఖర్చు కావు. వాటిని ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి. వాటిని ఎవరికి కూడా పంచాలో అవకాశం లేని స్థితి అని నా ముందు వాపోయాడు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే నేను పంచభూతాలు మీద ఆధిపత్య సిద్ధి పొంది ఉన్నాను కదా. ఇప్పుడు వర్షం ఆగిపోవాలని ఆజ్ఞాపిస్తే అది ఆగిపోతుందా లేదా అని చూడాలనిపించి ఇంటి బయటికి వెళ్లి వర్షం యొక్క ఉద్ధృతం తగ్గి పోవాలని తర్వాత నేను చెప్పిన తర్వాత ఉద్ధృతం పెరగాలి అని సంకల్పించి ఊరుకున్నాను. కొద్దిసేపటికి వర్షం నెమ్మది నెమ్మదిగా తన ఉధృతం తగ్గించుకోవటం అలా నెమ్మదిగా ఒక్కొక్క అతిథి రావటం ఆరంభమైనది.కానీ నేను ఈ విషయాలు పట్టించుకోలేదు. గమనించలేదు. అనుకున్న ఫంక్షన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసినది. అందరి భోజనాలు పూర్తి అయినాయి. కానీ తిరిగి వర్షానికి అనుజ్ఞ ఇవ్వాలనే విషయం కూడా మర్చిపోయాను. ఇంతలో మా వాడు నా దగ్గరికి వచ్చి “ఏమిరా! పెద్ద పోటుగాడిలా గా వర్షం ఆగిపోవాలి ఆగిపోతుందని అన్నావు. కానీ అది ఆగలేదుగా. ఉద్ధృతం తగ్గి చిరుజల్లుగా పడుతుంది కదా. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్పరా. పెద్దగా వర్షం ఉదృతంగా పడమని కోరుకో. ఏమి జరుగుతుందో చూద్దాం” అని అనగానే అప్పుడు నేను చేసిన మరిచిపోయిన వాగ్దాన విషయం గుర్తుకు వచ్చి నేను వేగంగా బయటకు వెళ్లి యధావిధిగా వర్షము ఉద్ధృతంగా పడమని నాకోసం ఆగవద్దు అని అలాగే నా కోసం మీ ఉధృతం ఆపుకో వద్దని అనుజ్ఞ ఇవ్వగానే మధ్యరాత్రి నుండి ఏకదాటిగా మూడు రోజులపాటు వరుసగా కుండపోత వర్షం కురిసే సరికి అది చూసే సరికి నాలో అహంకారం కూడా పూర్తిగా నాశనం అయినది. నా స్వల్ప కోరిక కోసం ప్రకృతిలోని పంచభూతాల శక్తిని నా అల్ప జ్ఞానంతో ఆపటం ఎంత తప్పో నాకు అర్థమయ్యే సరికి ఈ అనామకుడి మాటకి ప్రకృతి మాత స్పందించినందుకు నా కన్నీళ్లు ఆగలేదు. ఒక ప్రక్క వర్షపు ధార మరొక పక్క నా కన్నీటి ధార వర్షిస్తూనే ఉన్నాయి.ఇక దానితో నాకు ఉన్న ఈ సిద్ధులు ఇక ఎవరి కోసం ఎలాంటి వాటికోసం తిరిగి ఎవరి ముందు ప్రదర్శించనని ప్రతిజ్ఞ చేసుకొని ఆ సర్వేశ్వరునిని నాకు సంప్రాప్తి చెందే సిద్ధులు మరుగున పరచాలని వేడుకోవటం ఆరంభమైనది. నాలో అహము చచ్చిపోయిన సమయం ఆసన్నమైనట్లుగా నా రెండు చెవులలో ఓంకార నాదం వినబడసాగినది. అహంకారానికి విరుగుడు ఓంకారం.

ఇలా కొన్ని రోజుల తర్వాత క నాకు తీవ్ర ధ్యానమునందు ఒక దేవతా స్త్రీ మూర్తి స్వరూపం నీడలా నా భ్రుకుటి ప్రాంతంలో తరచుగా కనపడసాగింది. నా మనోనేత్రం ముందు ఆవిడ చాలా స్పష్టంగా కనబడింది. ఆ దైవ స్వరూపం నేను ఎక్కడ ఫోటోలలో గాని విగ్రహ మూర్తిగా గాని చూసినట్లుగా అగుపించలేదు. ఈ కొత్త దేవత ఎవరో అర్థం కాక ఆవిడ ఎందుకు దర్శనం ఇస్తుందో అర్ధం కాక అయోమయంలో ఉండగా యోగ శాస్త్ర గ్రంధాలు తిరగ వేయగా ఆవిడఈ ఆఙ్ఞా చక్రదేవత అయిన హాకిని దేవి అని ఈమెకు ఉన్న ఆరుముఖాలతో నాలుగు చేతులలో వరుసగా పుస్తకము, కపాలము, డమరుకం, జయమాల ఉంటాయని తెలిసినది.ఈ దేవిక శక్తియే ఈ చక్రానికి ఉన్న నాలుగు ఉప చక్రాలు అయినా గుణ, కర్మ,కాల,  బ్రహ్మ చక్రాల సంకేతంగా పుస్తకము, కపాలము, డమరుకం, జయమాల ఉన్నాయని అర్థం అయినది. ఈమె ద్వి దళ పద్మం లో ఉంటుందని ఈ పద్మము ఇడా పింగళ నాడులు కలిసే వరుణ అసి నదుల రూపంలో వారణాసి తీర్థంలో ఉంటుందని తెలిసింది. ఈమె త్రికోణ యంత్రముగా ఉంటుంది. ఈ యంత్ర మధ్య బిందువుగా త్రినేత్రుడైన మహాకాళుడైన సిద్ధి లింగం ఉంటుంది. ఈయన అర్ధనారీశ్వర తత్వంగా ఉంటాడు. అంటే నాకు ఇప్పుడు ఈ తత్వం మాయ పరీక్షను ఎదుర్కొంటే కానీ నాకున్న రుద్రగ్రంధి విభేదనం కాదు. అప్పుడు మిగిలిన 4 ఉప చక్రాలకు వెళ్ళటానికి మార్గం సుగమము కాదు. ఈ ఆజ్ఞ చక్రమునందు ఈ సిద్ధాదేవి చేసే శక్తి మాయను తట్టుకోలేక చాలా మంది యోగులు అనగా 80% బోల్తాపడి మాయలో పడి తమ యోగసాధనకి స్వస్తి పలుకుతారని నా స్వానుభవంలో గ్రహించాను. ఈ మాయ దాటితే గాని మిగిలిన ఈ నాలుగు ఉప చక్రాలకి ప్రవేశం ఉండదు. ఈ మాయ ఏ రూపంలో ఎలా ఉంటుందో ఎలాంటిది ఉంటుందో చెప్పటం చాలా కష్టం. కాకపోతే ద్వైత స్థితికి సంబంధించినది ఉంటుంది. దేవుడు- భక్తుడు లేదా గురువు- శిష్యుడు ఇలా ఇద్దరి అనుబంధం ఉంటుందని గ్రహించాను. ఈ మాయ దాటిన వారికి నిజ బ్రహ్మ జ్ఞాని అవుతాడు. అతడికి తత్వ, ఆత్మ, బ్రహ్మ జ్ఞానము అవలీలగా సహజసిద్ధంగా అబ్బుతాయి. శాస్త్రాలు, పురాణాలు, వేదాలు సంబంధించి వివిధ రకాల శబ్ద పాండిత్యాలు ఇతనికి ఆధీనం అవుతాయి. అతడి నాలుక మీద వాగ్దేవి తిష్టవేస్తుంది అంటే నమ్మండి. కానీ ఈ సిద్ధా దేవి పెట్టే మహామాయ తట్టుకొని నిలబడలేక ఈ చక్ర మాయ దగ్గర చాలా మంది సాధువులు, సాధకులు భ్రమ,  మాయ భ్రాంతిలలో పడటం నేను కళ్ళారా చూసాను. కానీ నాకు అప్పుడు ఈ మాయ ఈ చక్రానికి సంబంధించినదని తెలియదు. ఇక చూద్దాం. ఆ మహాతల్లి ఎలాంటి మాయ మర్మాలు నాయందు ప్రదర్శిస్తుందో ఎదురుచూడక తప్పదు అని నా ధ్యానము  నేను కొనసాగిస్తున్నాను.

ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత నా భ్రుకుటి స్థానము నందు ఒక నగ్న యువతి దర్శనం ఇచ్చింది. ఎక్కడో ఈమెను నేను బాగా చూసినట్లుగా గుర్తుకు వచ్చింది. ఆమెకు 10 లేదా పన్నెండు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఈమె వయస్సు సుమారుగా 25 నుండి 28 సంవత్సరముల మధ్య ఉన్న యువతిగా కనబడుతోంది. నా మర్మాంగం తన పని అది చేసుకుంటూ పోతోంది. అయినా నేను స్పందించలేదు. ఏమి జరుగుతుందో చూద్దామని చూస్తూనే ఊరుకున్నాను.ఇలా కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో కనిపించిన అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది.ఈమె ఎవరో కాదని నేను డిగ్రీ చదివేటప్పుడు ఆమె ఏడో తరగతిలో ఉండి నా చేత కంప్యూటర్ క్లాసులు చెప్పించుకున్నది అని ప్రస్తుతం ఆమె ఎంబీఏ పూర్తి చేసి ఇంటర్వ్యూల కోసం నేను ఉన్న చోటికి వస్తుందని ఎన్నో సంవత్సరముల పాటు నా ఫోన్ నెంబరు తెలియలేదని నా అడ్రస్ కూడా తెలియలేదని ఈ రోజే అనుకోకుండా ఈ రెండు వివరాలు తెలియటంతో ఆపుకోలేక సంతోషం పట్టలేక నాకు ఫోన్ చేసిందని తెలియగానే నాకు నవ్వాలో ఏడవాలో అర్థంకాని స్థితి. ఎందుకంటే సిద్ధాదేవి ఈమె ద్వారా కామ బాణ ప్రయోగం చేస్తుందని నాకు అర్థం అయినది. కానీ ఆమె నన్ను ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తుంది కదా. ఆమె మీద ఈ ప్రయోగం ఎలా చేస్తుందని అనుకొని మౌనం వహించి ఆమెకి లాగానే నేను కూడా సిద్ధాదేవి మాయ పరీక్షకి సిద్ధపడినాను. అనుకోకుండా ఆమె మా ఇంటికి రావటం మా ఆవిడ నన్ను ఒంటరిగా వదిలి పెట్టి ఉద్యోగానికి వెళ్లి పోవడం జరిగినది. నాలో కంగారు భయం మొదలైంది.కామ బాణం  ఏమైనా చేయవచ్చును. నేను ఒక్కటే అనుకున్నాను ఒకవేళ నేను ఈ మాయ పరీక్షలో తప్పు చేస్తే ఏదైనా అదే నా ఏకపత్నీ ధర్మము దాటితే గంగలో దూకి చచ్చిపోవాలని బలముగా నిశ్చయించుకున్నాను. ఏది జరిగితే అది జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు అన్నట్లుగా తప్పు చెయ్యని వాడు రాముడు కాదు…. తప్పు చేసే అవకాశం వచ్చినా కూడా తప్పు చేయని వాడు శ్రీరాముడు అవుతాడని చెప్పినట్లుగా ప్రకృతి మాత నా కామ పరీక్ష పెడుతుందని దానిని తట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. మా ఇద్దరి మధ్య చిన్ననాటి మాటల నుండి ప్రస్తుత కాల పరిస్థితుల్లో మాటలు కొనసాగుతుండగా తన మనస్సులోని 143 మాటను బయటపెట్టింది. నేను నవ్వుతూ “చెల్లి! నన్ను ఒక పక్క అన్నయ్య అంటూ మరొక ప్రక్క నాగురించి ఇలా చెడు భావాలు ఎందుకు పెంచుకుంటున్నావు. అది నీ తప్పు కాదు. నీ వయసు తప్పు .నీ శరీర కోరికల తప్పు. నేను ఏకపత్నీ ధర్మము దాటను. మా ఆవిడ లోనూ నీ లోనూ అదే అంగాలు ఉన్నప్పుడు నీ మీద కొత్తగా నా మనస్సు ఎలా పోతుంది. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు. నేనేమో కామిని దాటితేగాని మోక్షగామి కాలేను. అమ్మాయి! నీ పొందు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే నా మోక్షకాంత నా ఇల్లాలు నన్ను విడిచి పోతారు. నన్ను వదిలేయ్. నేను అలాంటి వాడిని కాను” అనగానే నన్ను ఎన్నో రకాలుగా భయపెట్టి బాధపెట్టి బెదిరించి నానా యాగీ చేసినా కూడా మౌనం వహించాను. ఆమె చేయటం లేదు. ఇదంతా ఆమె మీద ఉన్న సిద్ధాదేవి చేస్తుందని నాకు అర్థమైనది. ఇలా మూడు రోజుల పాటు కొనసాగింది. నేను ఏ మాత్రం గాడి తప్పలేదు. నిగ్రహం గానే ఉన్నాను. దానితో ఆమె విసుగు చెంది నన్ను ఇక ఈ జన్మలో చూడనని శపధము చేసి వెళ్ళిపోయింది. నాకు కావలసినది అదే కదా. దాంతో ఈమెను దాటాను అనుకునే లోపల నాకు ఒకప్పుడు జ్యోతిషవేత్తగా ఉన్నప్పుడు నా క్లైంట్స్ అయిన అమెరికా నుండి ఇద్దరు అమ్మాయిల నుండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఫోన్ రావడం మొదలైనది.నేను జాతకాలు చెప్పటం మానివేశాను అని చెప్పిన కూడా వారు వినేవారు కాదు. తన బాధంతా చెప్పుకోవటం తిరిగి ప్రారంభమైంది. ఒకరికి తెలియకుండా మరొకరు నాకు ఫోన్లు చేస్తూ వారి బాధలు నాతో చెప్పుకునేవారు. నా బాధ వారికి తెలియదు. నేను ఏ చక్ర స్థితి మాయ లో ఉన్నానో వారికి చెప్పిన అర్థం కాదు.

వాళ్లు నాతో మాట్లాడవద్దు అని చెప్పిన ఆపరు. ఇక్కడ ఏ క్షణంలోనైనా ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.చచ్చింది గొర్రే. ఈసారి ఈ సిద్ధాదేవి తన కామ మాయ కోసం వీరిద్దరిని వాడుకుంటోందని నాకు అర్థమైనది. మౌనం వహించాను. ఒకరోజు వీళ్ళు ఇండియాకి నన్ను చూడటానికి వస్తున్నారని తెలియగానే నా గుండె గుభేలుమన్నది.వామ్మో! ఏమి మాయ. దేశాలు దాటి నన్ను చూడటానికి వస్తున్నారా. వామ్మో! వీళ్ళ జీవితాలు నాశనం కాకూడదు. వీళ్లు అమాయక జీవులు. నా యోగ మాయ వలన వీరికి కామము వెర్రి తలలు వేస్తుందని నాకు అర్థమైంది. నేను ఎప్పటికీ వారిని చూడనని మాట తీసుకున్నాను.ఇంతవరకు వాళ్ళు ఆరు సార్లు పైగా స్వదేశానికి రావటం నన్ను కలుసుకోవాలని ప్రయత్నించి విఫలం కావడం నా భార్య దృష్టికి వచ్చిన కూడా ఆమె ఏమంతగా ఆశ్చర్యం చెందలేదు. ఎందుకంటే ఆమె కూడా ఒక యోగ సాధకురాలు కదా.ఎప్పుడో తను కూడా ఇలాంటి మాయలు ఎదుర్కోవలసి వస్తుందని నేను ఎలా ఎదుర్కొన్నానో తెలుసుకొని వాటిని దాటాలని చూస్తోంది. యోగసాధనలో ఎవరి స్వార్థం వారికి ఉండాలి.ఒకరి కోసం మరొకరు ఆగి పోకూడదు. ఉన్నది ఒకటే. మరొకటి లేదని భావముతో ముందుకు పోవాలి. ఎవరు తప్పు చేసినా లేదా మాయలో పడిన వారి సాధన ఆ జన్మలో అంతటితో పరిసమాప్తి అవ్వక తప్పదు అని తెలుసుకోవాలి. దాంతో వీరిద్దరి మాయ దాటుకున్నాను. ఇది ఇలా ఉండగా ఇప్పటిదాకా 20 సంవత్సరములు లోపల ఆపై ముప్పై రెండు సంవత్సరములు లోపల స్త్రీలు కామ మాయ దాటాను. విచిత్రంగా 50 సంవత్సరములు నుండి 80 సంవత్సరములు వయసు ఉన్న స్త్రీమూర్తులు కూడా నన్ను కావాలని నా పొందుకావాలని కోరుకునే సరికి నా మతి పోయింది. మాయ అంటే ఇదే కదా. నేను నా ఇంటి బాల్కనీ లో ఉండగా అవతలి ఇండ్లలోని బెడ్రూమ్స్ తెరిసి నలభై ఐదు సంవత్సరముల వయస్సు ఉన్నవారు నేను చూస్తున్నానని తెలిసికూడా నగ్నంగా మారి బట్టలు మార్చుకునే స్థాయిలో ఉండేది నా మాయ. మా శ్రీమతికి ఎప్పటికప్పుడు ఈ దృశ్యాలు చూపేవాడిని.పరీక్షను తట్టుకోండి.మాయను దాటండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.కోక మాయకు గురి అయితే ఆకలి మాయ మొదలవుతుంది అని అనగా పునర్జన్మలు ఏర్పడతాయని తన వేదాంత ధోరణిలో చెబుతుండేది. ఏ మాత్రం ఆసక్తి చూపేది కాదు. నన్ను అవమానించేది కాదు.అలాగే నన్ను అనుమానించేది కాదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తన మీద ఎవరైనా చెడు దృష్టితో చూశారో భయపడకుండా నాతో చెప్పేది. దానిని ఎలా దాటాలో చెప్పేవాడిని. అలాగే నా మీద అమ్మాయిల ప్రభావము ప్రతిదీ చెప్పే వాడిని. వాటిని ఎలా దాటాలో ఆమె చెప్పేది. పురుషుల గూర్చి మాయలు నేను చెబితే ఆమె స్త్రీ మాయల గూర్చి  ఎలా దాటాలో చెప్పేది. సాధువుల సాధకుల మధ్య ఎలాంటి రహస్యాలు ఉంచుకోకూడదు. ఉంచుకుంటే అది రేపు మాయ గా మరి సాధనకు అడ్డంకిగా మారుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నా అదృష్టం ఏమిటంటే స్త్రీ మాయలను ఇలా దాటించే  స్త్రీ గురువుగా మా శ్రీమతి నాకు దొరకటం అలాగే పురుష మాయలను ఎలా దాటాలో ఆమెకి నేను ఒక మంత్ర గురువుగా దొరకటం ఆ సర్వేశ్వరుడి లీల విన్యాసంలో ఒక లీల. ఇలా కొన్ని నెలలు గడిచినాయి. సుమారు ఇలా 27 మంది కామ స్త్రీ మాయలను దాటినాను. 

ఇది ఇలా ఉండగా నాకు ధ్యానములో గంధర్వ కిన్నెర యక్షిని మోహిని కామిని ఇలా సుమారుగా 13 దేవ జాతుల 33 మంది నగ్న దేవతలుగా నా మనోనేత్రం ముందు అగుపించి నగ్న నృత్యాలు చేసి చేసేవారు.నన్ను కవ్వించే వారు.వరాలు ఇస్తామని మభ్య పెట్టేవారు. స్వర్గలోకాలకు తీసుకొని పోతామని ఆశ పెట్టేవారు.అయినా నేను చలించలేదు. మౌనం వహించాను. అదేదో సినిమా లో నువ్వు మగాడివేనా అని హీరో ను అడిగితే అమ్మా! తల్లి నాకు ఉండే సందేహాలు నాకు ఉన్నాయి కొత్త వాటిని అడిగి నన్ను చంపకు అని హీరో సమాధానము గుర్తుకు వచ్చే సరికి నాకు నవ్వు ఆగలేదు. నా పరిస్థితి కూడా అదే. ఇప్పటిదాకా మానవ స్త్రీ కాంతలు దాటితే ఇప్పుడు కొత్తగా దేవతా స్త్రీలు ఈ మాయ పరీక్షలో భాగస్వామ్యులు అయినారు అని నాకు అర్థం అయింది.ఈ చక్ర స్థితిలోనే మన విశ్వామిత్రుడు మేనక, రంభ వంటి దేవతా స్త్రీలకు కామానికి బలై తన పది లక్షల సంవత్సరముల సాధన శక్తిని కోల్పోవటం జరిగినదని లోక విదితమే కదా. ఈ దేవతా స్త్రీలు లేదా రాక్షస స్త్రీలు లేదా ప్రేత స్త్రీలు వచ్చిన ప్రతిసారి అమ్మ నేను వివాహ పురుషుడిని. మిగిలిన వారంతా నాకు తోబుట్టువులు. నన్ను వదిలేయండి. నన్ను ముట్టుకుంటే మీకు మిగిలేది ఈ బూడిద శరీరమే అని తెలుసుకోండి.క్షణిక భోగము కోసము నా మోక్ష కాంతను నేను వదిలిపెట్టను. నా భార్య ఇచ్చే సుఖాలకి మించి మీ దగ్గర అదనంగా వేరే సుఖాలు ఇస్తారా చెప్పండి అనగానే వాళ్లు మాయం అయ్యే వారు. మరొక జాతి స్త్రీ మూర్తి కొన్ని రోజుల తర్వాత వచ్చేది. ఆమె నగ్న పరీక్ష పెట్టేది. నేను మౌనము వహించే వాడిని. స్పందించే వాడిని కాను. స్పందిస్తే ఇంతటితో నా సాధన పరిసమాప్తి అవుతుందని నాకు తెలుసు. ఒక క్షణిక సుఖం కోసం 10 లక్షల సంవత్సరముల సాధన శక్తిని నాశనం చేయటం అవసరమా. సంయోగము నుండి సమాధి స్థితి ఇట్టి స్థితిలో రాదు. మాయ మాత్రమే వస్తుంది. ఇలా మరి కొన్ని నెలలు గడిచిపోయాయి. మరి ఈ దేవత జాతుల స్త్రీ మూర్తులను దాటినాను కదా. 

మరి ఈసారి ఇక కామ పరీక్షకి ఎవరు వస్తారు? వస్తారా రారా? వస్తే ఎవరు వస్తారు? నాకు ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు నేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా ఆది పరా శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవి కాస్త నా మనోనేత్రం ముందు నగ్నంగా కనపడేసరికి గతుక్కుమన్నాను. వామ్మో! అందరికీ తల్లి అయిన ఆది పరాశక్తి ఏకంగా నగ్నం గా కనబడుతుంది.భ్రమ లేక భ్రాంతియా?  ఇన్నాళ్ళు ఈ దృశ్యాలు చూసి చూసి నేను ఈమెను ఇలా ఊహించుకుంటున్నానా అని అనిపించింది. నాకు ధ్యాన భంగమైనది. కళ్ళు తెరిచిన మూసిన ఆమె నగ్న రూపం దృశ్యమే కనిపించేది. చివరికి కన్న తల్లి కూడా కామమాయ చూపితే మరి బిడ్డ పరిస్థితి ఏమిటి? కన్నతల్లిని ఆ దృష్టితో చూడటం అంటే కొడుక్కి ఎంత నరక బాధ అని అర్థమవుతుంది కాని ఏమి చేయగలను. ఈమె కాస్త లజ్జ గౌరిగా నగ్నంగా మారి నా మనోనేత్రం ముందు కనపడి కవ్విస్తూ ఉండేసరికి నాకు ఏమి చేయాలో అర్ధమయ్యేది కాదు. నా సాధనను ఆపి వేసేవాడిని. దీనికి తోడుగా మేము అనుకోకుండా మహబూబ్ నగర్ లోని జోగులాంబ దేవాలయానికి వెళ్ళాము. అక్కడున్న మ్యూజియంలో ఈ నగ్న లజ్జా గౌరిదేవి విగ్రహమును దర్శించే సరికి నాకు కనిపించే ఆది పరాశక్తి నగ్న దృశ్యాలు నిజమేనని తెలుసుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. చివరికి తన బిడ్డ యొక్క కామ పరీక్ష కోసం అమ్మవారు ఇలా వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఈ అనుభవం రాస్తున్నప్పుడు నాకు ఏడుపు ఆగడం లేదు అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నానో ఒకసారి గ్రహించండి. ఈ అమ్మ నగ్న మాయను నేను పూజించే బాలదుర్గ యంత్రము ద్వారా ఎలా దాటినానో తెలుసుకొండి.

మాకు మా ముత్తాతలు ఆరాధించిన బాల దుర్గా యంత్రం వచ్చినదని మీకు భుజము ఇచ్చిన దుర్గాదేవి అనే అధ్యాయములో ఈపాటికే వివరించడం జరిగినది కదా. ఆ విషయాలు కాస్త గుర్తుకు తెచ్చుకుంటే మీకు ఈ అధ్యాయము తేలికగా అర్థం అవుతుంది. ఈ యంత్రము ఆషా మాషి యంత్రము కాదని బాల దుర్గ శక్తులు ఇందులో నిజంగానే ఆత్మశక్తి రూపంతో నిక్షిప్తం చేసినారు అని మాకు కొన్ని విచిత్ర అనుభవాలు కలిగేదాకా మాకు కూడా తెలిసి రాలేదు. అది ఏమిటంటే దుర్గాష్టమి నాడు మా దగ్గరికి ఈ యంత్రము రావడం జరిగినది కదా. కానీ ఆ రోజు పూజలో గారెలు పులిహోర ఈ యంత్రమునకు మహా నైవేద్యాలుగా పెట్టాలి అనే నియమం మాకు అప్పుడు తెలియదు. యధాలాపంగా ఆ రోజుకి ఇంటిలో ఏమి వండినారో అదే నైవేద్యంగా పెట్టడం జరిగింది. రాత్రి కల్లా ఇంటిలోని వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు బయటకి ధారాపాతంగా రావటం మొదలైంది. ఇది ఎలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కాలేదు. పైపులు ట్యాంకులు అన్నీ సరిగానే ఉన్నాయి. మరి ఎవరి ప్రమేయం లేకుండా ఆ నీళ్ల ట్యాంకు ఎలా నిండి పొర్లి బయటకు నీళ్లు ఎలా వచ్చినాయో అర్థం కాలేదు.ఇలా వరుసగా మూడు సార్లు జరిగేసరికి నాలో తెలియని భయం మొదలైనది.ఇలా కాదనుకుని ధ్యానం చేస్తే ధ్యానములో ఈ యంత్రము నుండి కాంతి శక్తి తరంగాలు బయలుదేరి వాటర్ ట్యాంక్ లోని నీటి లోకి చేరి బయటికి వచ్చేటట్లు చేస్తున్నట్లుగా కనిపించేసరికి ఇది ఈ యంత్రం యొక్క తంత్రం అని నాకు అర్థమైనది. అంటే పూజ లో ఏదో లోపము జరిగి ఉండాలి అనిపించి ఈ యంత్రం ఇచ్చిన మామయ్యను అడిగితే ప్రతి సంవత్సరము దుర్గాష్టమి రోజున మహా నైవేద్య ముగా ఈ యంత్రానికి కుంకుమ అర్చన చేసి నైవేద్యంగా గారెలు, పులిహోర పెట్టాలని వాడు చెప్పే సరికి అప్పుడు నేను చేసిన తప్పు ఏమిటో తెలుసుకుని వెంటనే ఆ రోజున వీటిని ఇంటిలో చేయించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. దానితో ఈమె శాంతపడి ట్యాంక్ నుండి నీళ్లు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే దేవి శక్తి అనేది జల తత్వమునకు సంబంధించినది. ఎప్పుడైనా దేవి పూజలందు ఏవైనా లోపాలు జరిగితే ఆ దైవ శక్తి దగ్గరలో ఉన్న గుడి బావి లేదా గుడి కోనేరులో జల ప్రవేశం చేసి నీటిని అల్లకల్లోలంగా చేస్తూ ఆ తప్పు కి పరిహారము  చేసేదాకా చేస్తూనే ఉంటాయి. నేను అప్పటికే శబ్ద పాండిత్యము ద్వారా తెలుసుకొని ఉండటంతో వాటర్ ట్యాంక్ లోని నీళ్లు అందుకే బయటికి వచ్చినాయి అని నాకు అర్థమైనది. అలాగే ప్రతి శుక్రవారముఈ యంత్రానికి అభిషేకం కుంకుమ పూజలు చేయటం ప్రారంభించాను. నిత్య నైవేద్య ముగా బెల్లపు ముక్క పెట్టేవాడిని. ఏమి జరిగినది కాదు.ఇలా జరుగుతున్న రోజులలో ఒకరోజు అనుకోకుండా మళ్లీ నీళ్ళ ట్యాంక్ నుండి నీళ్లు బయటికి రావటం మొదలైనది. దానితో అమ్మవారు కాస్త గారెలు పులిహోర తినాలని అనుకుంటుందేమోనని ఇంటిలో చేయించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినాను. ఈ నీళ్ళు పొర్లటం ఆగకపోయేసరికి నా బుర్ర తిరగటం మొదలైనది. కారణం ఏమై ఉంటుందో అని ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో కామాఖ్య దేవి యొక్క యోని భాగము కనబడినది. నాకు అర్థం కాలేదు. ఈసారి మా అమ్మమ్మను ఈ విషయం గురించి అడిగితే “ఇంట్లో ఎవరైనా నెలసరి రోజులు ఉన్న స్త్రీ మూర్తి ఉంటే నెలసరి అయిన తరువాత ఆ ఇంటిని శుద్ధి చేయకపోతే అమ్మవారే ఇలా నీళ్లు పొంగించి శుద్ధి చేసుకుంటుంది” అని చెప్పగానే విషయం అర్థమై చేసిన తప్పు తెలుసుకొని ఈ విషయం చెప్పటానికి దుర్గమ్మ నాకు ధ్యానము నందు కామాఖ్య యోని మాతగా దర్శనమిచ్చారనీ నాకు అర్థమైంది. ఆనాటి నుండి తప్పనిసరిగా నాలుగవ అలాగే 5వ రోజు శుద్ధి చేయటం మొదలు పెట్టినాను. దానితో నీళ్లు పొర్లటం ఆగిపోయాయి. ఒకసారి నిజంగానే అమ్మవారు నేను పెట్టిన పులిహోర తింటుందా అనే ధర్మ సందేహం నాకు వచ్చినది. ఎందుకంటే మా తాతల కాలంలో దుర్గాదేవి 8 సంవత్సరముల పాప గా కనిపించి వీరు పెట్టిన పులిహోర గారెలు తినేది అని వారి ఇంటి కోడలు అయిన మా అమ్మమ్మ నాకు చెప్పటం జరిగినది. కానీ నాకు ఎప్పుడూ ఇలాంటి దృశ్యం కనిపించలేదు. ధర్మ సందేహం రాక చస్తుందా. వస్తుంది కదా. వచ్చింది. దీనికి సమాధానముగా ఆ రాత్రి నుండి పూజ గదిలో స్త్రీ మూర్తి ఎవరో తిరుగుతున్నట్లుగా ముఖ్యంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి 3 గంటల వరకు కాలి గజ్జెలు శబ్దాలు వినడం మా అమ్మకు అనుభవం అయినది.  దీనిని నేను నమ్మలేదు.ఒకసారి అక్క మా ఇంటికి వచ్చి మూడు రోజులపాటు ఉన్నప్పుడు రాత్రిపూట దీనికి 80 సంవత్సరముల ఎవరో వృద్ధ స్త్రీ మూర్తి ఆకుపచ్చని చీర కట్టుకొని తన చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించినదని నాతో చెప్పినది. దీనిని కూడా నేను నమ్మలేదు. ఆ తర్వాత నేను దేవి నవరాత్రులు వస్తున్నాయని ఈ యంత్రానికి మెరుగుపెట్టిద్దాం అని కంసాలి దగ్గరికి వెళ్లి మెరుగు పెట్టించి ఇంటికి రాగానే నా ఒంటిలో మంటలు మొదలయ్యాయి. అసలు నాకు ఏమి జరుగుతుందో అర్థం అయి చావలేదు. ఒళ్లంతా నిప్పులు పోస్తే ఎలా ఉంటుందో అలా నా శరీరమంతా మంటలు సెగలు మొదలయ్యాయి. స్నానాలు చేసిన తగ్గలేదు. పసుపు అలాగే గంధము రాసుకున్న ఉపశమనం కలగలేదు. దానితో ధ్యానము చేయగానే త్రిశూలముతో నన్ను పొడుస్తున్నట్లుగా నా గుండెల మీద నిల్చుని ఉన్న దుర్గా దేవి ఉగ్ర స్వరూపము కనిపించేసరికి అప్పుడు నాకు సీను అంతా అర్థమైంది. అంటేఈ యంత్రానికి మెరుగులు పెట్టే సమయంలో కంసాలి దీనిని కొంతసేపు నిప్పులలో ఉంచి అగ్నిశుద్ధి చేసి ఇస్తున్నాను అని చెప్పిన విషయాలు నాకు లీలగా గుర్తుకు రావడంతో అలాగే ఈ యంత్రము నందు బాల దుర్గా దేవి యొక్క ఆత్మ శక్తి ఉన్నదని రూఢీ అవటంతో వెంటనే ఈ యంత్రమును పంచామృతాలతో పసుపు కుంకుమ నీళ్లతో శుద్ధి చేయటంతో నెమ్మది నెమ్మదిగా నా ఒంటి మంటలు తగ్గినాయి. దానితో నాకు బుద్ధి వచ్చింది. ఈ యంత్రము విషయంలో పిచ్చి వేషాలు వేయడం మానుకున్నాను.

నేను వృత్తిరీత్యా జ్యోతిషవేత్త అవతారం ఎత్తినప్పుడు జాతక సమస్యలు ఉన్నవారికి నా భౌతిక గురువు సహాయంతో గ్రహ హోమాలు, దేవతా హోమాలు, గ్రహ జపాలు, గ్రహ దానాలు ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఆరంభించాను. ఎప్పుడైనా దీర్ఘకాలిక జాతక సమస్యలు వస్తే అప్పుడు ఈ యంత్రమును కాస్త బయటికి తీసి దానికి అభిషేకముచేసి ఆ జలమును మేము చేసే ముందు హోమము నందు పోయగానే ఆ హోమ దేవత ఈ హోమ అగ్నియందు అగ్ని రూపంలో సాక్షాత్కారం అయ్యేది.ఇలా మేము చేసిన వివిధ హోమాలు ఆయా దేవతలు సాక్షాత్కారమును ఈ హోమాలు జరిగే సమయాలలో మేము తీసిన ఫోటోలలో కనిపించేవి. దానితో మాకు వారి జాతక సమస్యలు తీరుతాయని నమ్మకము కలిగేది. అలాగే వారి సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికేవి. సమస్యలు తీరిపోయాయి. నా సాధన పరిసమాప్తి సమయానికి వచ్చేసరికి నాకు దుర్గ అమ్మవారు దీప దుర్గాదేవిగా దర్శనం ఇవ్వడం జరిగినది. ఆనాటి నుండి మొదట అశరీరవాణి వినిపించేది. ఆపై 8 సంవత్సరముల ఎరుపు లంగా పసుపు జాకెట్లు వేసుకున్న బాలిక రూపము నాకు ధ్యానములో కనిపిస్తూ “నీకు యోగసిద్ధులు ఇస్తాను కావాలా” అని అడిగేది. నేను వెంటనే “నువ్వు ఉండగా అవి  నాకెందుకు అమ్మా” అని అనగానే మాయమయ్యేది. అలాగే మరొక సారి “రత్నాలు మణులు ఇస్తాను” అనేది. నేను “వద్దు” అని నవ్వి ఊరుకునేవాడిని. అలాగే ఒకసారి “అందమైన లోకంలోకి నిన్ను తీసుకుని వెళ్తాను వస్తావా” అనేది. “అవి ఏమీ నాకు వద్దు” అనేవాడిని. మరొకసారి చిన్న పిల్లలాగా “అది కావాలి ఇది కావాలి” అంటూ ఉండేది. ఇస్తాను అనగానే వద్దులే అని అదృశ్యమయ్యింది. ఒకవేళ నేను ఆమె చెప్పిన వాటిలో కావాలని అడిగితే మాయలో పడినట్లే దానితో ఆమె నా నుండి వెళ్లిపోయేదని అర్ధమయ్యేది. నాకు నవ్వు వచ్చేది. నేను కావాలని ఆమెను ఏది అడగలేదు. ఆమెను రమ్మని చెప్పలేదు. కావాలని ఆమె మా ఇంటికి వచ్చింది. నా దగ్గరే నచ్చిన అన్నాళ్ళు ఉంటుంది. నచ్చకపోతే వెళ్ళిపోతుంది. ఆమె ఉన్నందుకు ఆనందము లేదు. వెళ్ళిపోతాను అన్నందుకు బాధ లేదు. ఎందుకంటే నేను ఈ అమ్మవారి సాక్షాత్కార మాయలో పడలేదు కదా. పడి ఉంటే ఆమె నా సర్వస్వం అని అనుకునేవాడిని. అంతటితో నా సాధన ఆగిపోయి ఉండేది. నేను ఈ విశ్వంలో దేనియందు, వేటి యందు, ఎవరియందు, ప్రేమ… మోహం… వ్యామోహాలలో… పడకూడదని బలంగా నిశ్చయించుకున్నాను. రాయి అయినా నీటిలో కరుగుతుంది. నా హృదయం కరుగదు. కరిగితే మాయలో పడతాను. మాయలో పడినట్లే కదా. నేను స్పందిస్తే, నేను ఆలోచన చేస్తే, నేను సంకల్పము చేస్తే, నేను ఆనందము పడితే, నేను ఆశ పడితే, నేను భయపడితే మాయలో పడినట్లే కదా. అందుకని నా హృదయము లేనివాడిగా నిశ్చల స్థితిలో ఉండటానికి ఎల్లప్పుడూ జ్ఞాన తపస్సు ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని. ఇలా ఈ బాల దుర్గా యంత్రం యొక్క ఆత్మ శక్తి నా హృదయమును కరిగించాలని స్పందింప చేయాలని బాలగా దుర్గగా త్రిపురగా   సుందరిగా దేవిగా అవతారాలు ఎత్తి నానా రకాల మాయలు చూపించినది. వాటిని అన్నిటిని వద్దు అని ఇది అంతా భ్రమ భ్రాంతి మాయ అనుకొని చిరునవ్వుతో వాటిని దాటుకొనే వాడిని.దేవత స్త్రీ మూర్తులు దగ్గరనుండి మానవ స్త్రీ మూర్తులు రూపంలో అలాగే మహిమాన్విత మణుల వివరాలు అలాగే రస సిద్ధి విద్యలు ఎన్నో రకాల యోగసిద్ధులు యోగ శక్తులు నాకు వరాలుగా ఇవ్వాలని చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి ఆవిడ చిట్టచివరికి నగ్నంగా లజ్జగౌరిగా దర్శనమిచ్చిన నా పుట్టుక స్థానం చూస్తున్నాను తల్లి అనగానే ఇక వీడు కామానికి చలించడని ఆమె కి అర్థమైంది.

ఆ తర్వాత చాలా ఉగ్ర స్వరూపముగా తన ఎనిమిది చేతులతో వివిధ రకాల ఆయుధాలతో సింహవాహినిగా నా ముందు సాక్షాత్కారించి నన్ను భయపెట్టాలని చూసిన కూడా చిరునవ్వు నవ్వి అమ్మా! ఎక్కడైనా సింహమును చూసి సింహ పిల్లలు బెదురుతాయా? నువ్వు సింహవాహిని అయితే నేను కూడా నీ సింహ బిడ్డ నే కదా అనగానే ఇక వీడు భయానికి కూడా చలించడని ఆమెకి అర్థమైంది. అంతర్ధానమైంది. మరొకసారి నాకు సంతానము లేని కారణంగా ఈసారి మూడు సంవత్సరముల పాప నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా తొడ మీద కూర్చుని నా గడ్డం పీకటం, ముక్కులో వేలు పెట్టడం, చెవులు లాగటం, ముక్కు లాగటం, జుట్టు పీకటం ఇలాంటివి ఎన్నో సార్లు చేసేది. అప్పుడు కూడా ఓర్పు కోల్పోకుండా ఆమె ఏమి చేసినా నవ్వేసి ఆమె మీద ఏమాత్రం కోపము అలాగే ప్రేమ ప్రదర్శించకుండా మౌనముగా అంతా భరించేవాడిని. ఒకసారి నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా ముఖము మీద నగ్నంగా వచ్చి మూత్రం పోసేది. మరొకసారి నా తొడ మీద మలము వెళ్ళినట్లుగా చూపించేది. నేను వెంటనే ఏముంది అమ్మ? నేను నా శరీరమును కడుకుంటాను. ఈ శరీరము నాది కాదు. నీవు ఇచ్చినదే కదా. నువ్వు దీనిని ఎలా వాడుకుంటావో అలా వాడుకో. నాకు ఎలాంటి కోపం అసహ్యం విసుగు చికాకు కలగవని తెలుసుకో.ఇది ఇలా ఉండగా ఒక రోజు ఈ అమ్మవారు కాస్త మనుష్య శరీర వాణితో నగ్నమూర్తి గానే ఉండి “నేను నీకు తల్లిగా ఉండాలా లేదా భార్య గా ఉండాలా” అని అడిగింది. నాకు ఏమీ అర్థం కాలేదు. తల్లిగా ఉన్న భార్యగా ఉన్న కూడా ఈమె కామ మాయ పెడుతూనే ఉంటుంది. 

మహాశివుడుకి కూడాఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి సంకట పరిస్థితి వచ్చి ఉండాలి. అందుకే ఆయనని ఆదిపరాశక్తి ప్రశ్నించినప్పుడు తనని మొదటిసారిగా భార్యగా రావాలని అడిగాడట. అప్పుడు ఆవిడ కాస్త పరమేశ్వరిగా మారి పరమేశ్వరుడికి భార్యగా మారినది. దానితో మన ఆదియోగి కామ మాయలో పడినాడు. మళ్ళీ వెయ్యి సంవత్సరముల తర్వాతతిరిగి శివుడు ఈ చక్ర స్థితికి వచ్చినప్పుడు ఆది పరాశక్తి అడిగినప్పుడు ఈసారి తల్లిగా ఉండాలని అన్నాడట. అప్పుడుఈమె కాస్త తారా దేవిగా మారి పరమేశ్వరుడికి తన చను పాలు ఇచ్చింది. ఈయన అయినా కూడా కామ మాయను దాటలేకపోయినాడు. మళ్లీ వెయ్యి సంవత్సరముల తర్వాత తిరిగి శివుడు ఈ చక్ర స్థితికి వచ్చినప్పుడు పరాశక్తికి తన అర్ధభాగం శరీరం  ఇచ్చినాడు. అప్పుడు కూడా ఈయన కామ మాయను దాటలేకపోయాడు. మళ్ళీ వెయ్యి సంవత్సరముల తర్వాత శివుడు ఈ చక్ర స్థితికి వస్తే ….ఆది పరాశక్తిని కాస్త పురుషుడుగా మారమని అడిగినప్పుడు ఆమె కాస్త జగన్మోహిని రూపధారి అయిన మహా విష్ణుమూర్తి గా అవతరించినది. అయినా ఆదియోగి మన ఈ జగన్మోహిని రూపంలో విష్ణువుని మోహించి అయ్యప్ప జనానికి కారకుడైనాడు. కామ మాయ ను దాటలేకపోయినాడు. దాంతో ఆజ్ఞా చక్ర అధిపతిగా ఈ అర్ధనారీశ్వరుడు ఉండిపోయాడు.

 ఈ మహా శివయ్య పరిస్థితి ఇలా వుంటే మరి జీవుడి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. పాము చావకూడదు కర్ర విరగకూడదు. వెనుకనుయ్యి ముందు గొయ్యి ఏమిచేయాలో అర్థంకాని తికమక పరిస్థితి. చచ్చింది గొర్రే. పుస్తకాలు తిరగ వేశాను. ఎక్కడ ఎలాంటి సమాధానము దొరకలేదు. ఏమి చేయాలో అర్థంకాని స్థితి. ఇలాంటి స్థితిలో కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒకరోజు నేను చూస్తుండగా టి.విలో రామారావు నటించిన భక్తిరస చిత్రం చివరి అంకం నడుస్తోంది. మహాలక్ష్మీ దేవి అతనికి కనిపించి “నాయనా! నేను మీకు తల్లిగా భార్యగా ఉండాలా అని అడిగినప్పుడు నాకు వీరిద్దరూ వద్దు. కూతురుగా ఉండాలి” అని అడుగుతాడు. లక్ష్మీ పుత్రిక తండ్రిగా చేయి తల్లి అని వరం పొందుతాడు. ఇది ఏదో బాగానే ఉంది కదా. మరి కూతురుగా పుట్టమని అడిగితే ఇప్పటివరకు సాధన కోసం సంతానం మాయ వదిలించుకొన్నాను. ఈమెను కూతురుగా పొందాలి అంటే మళ్లీ తను సంతానం మాయలో పడాలా? వామ్మో! ఇది ఎలా సాధ్యం అని ధర్మసందేహము రావటం మళ్లీ ఏమి చేయాలో అర్థంకాని స్థితి. ఇలాంటి స్థితే దశరథ మహారాజుకి వస్తే లక్ష్మీదేవిని కాస్త తన కోడలుగా రమ్మని కోరాడట. దానితో విష్ణుమూర్తి రూపంలో శ్రీ రాముని కోసం లక్ష్మీదేవి కాస్త సీతాదేవిగా అవతరించక తప్పలేదు. అంటే మనకి  కూతురిగా లేదా కోడలిగా అవకాశాలు ఉన్నాయని అర్థం అయినది.తల్లి గాను భార్యను గాను ఉంటే ఈమెను దాటటం చాలా కష్టం. ఎందుకంటే తల్లి మాయ దాటలేక వేదవ్యాసుడు ఇప్పటికీ హిమాలయాలలో చిరంజీవి తత్వంతో సజీవుడిగా సంచారం చేస్తున్నాడు. అదే భార్యగా పొందిన శ్రీదత్తుడు అనఘా దేవితో చిరంజీవి తత్వమును పొంది భారత దేశ సంచారం చేస్తున్నారు..కాబట్టి తల్లిగాను భార్యగాను కాకుండా కోడలిగా లేదా కూతురుగా కావాలని అడగాలి అని నిశ్చయించుకున్నాను.ఇలాంటి చక్ర స్థితిలో స్త్రీ మూర్తులు సాధనలో ఉంటే పరమశివుడు నగ్నం గా కనిపించి తండ్రి గా ఉండాలా లేదా భర్త గా ఉండాలా అని అడుగుతాడు. అప్పుడు చాలా మంది స్త్రీ మూర్తులు ఈయనని తమ భర్త గానే ఊహించు కొని కామ మాయను దాటలేకపోవటం నా స్వానుభవం లో చూశాను. అలాగే ఒకానొక స్థితిలో మా శ్రీమతి ఈ శివుడిని తన భర్తగా ఊహించుకొని సాధనను అర్ధాంతరముగా ఆపుకోవలసి వచ్చింది. అలాగే శ్వేతా అనే యోగిని కూడా ఈ జన్మలో నగ్నంగా పరమేశ్వరుడు ఆమెకి కనిపించి కవ్వించే వాడట. తన యోని భాగము ఆయన లింగములో అమర్చుకొనేవాడట. అనగా మహాకాళి మహాకాలుడు రతి దృశ్యాలు గా ఉండేదని ఈమె ఈ శివ కామ మాయ దాటలేక పోతున్నానని నాతో వాపోయేది. ఆమెను దాటించాలని నేను ఎన్నోసార్లు విఫల ప్రయత్నాలు చేశాను. ఎన్నో విధాలుగా విఫలమయ్యాను. ఆమె దాటలేక శివ మాయ దాటే సమయానికి పదిహేను లక్షల కర్మలకు ధనము అందక శివ కోటి 15 కోట్లు రాయలేక తన యోగ సాధనను అర్ధాంతరముగా ఆపుకోవలసి వచ్చింది.మల్లమ్మ, రాధాదేవి, మీరాబాయి,సక్కుబాయి, అక్కమహాదేవి, పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవి ఇలా యోగినులు ఈ చక్ర స్థితికి వచ్చేసరికి తమ ఇష్టదైవాలను కాస్త నిజరూప భర్తలుగా వారి ప్రేమాభిమానాలు పొందటానికి సఖిలుగా మారినారు అని వారి చరిత్రలలో అంతరార్ధములో ఉన్న ఈ విషయం ఎవరూ కూడా గమనించని స్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది. ఈ చక్ర స్థితిలో వచ్చే ఈ మహత్తర సిద్ధా దేవి యోగమాయ కి 80%  సాధకులు కామ బలికి గురి అయ్యారంటే ఇది ఎంతటి యోగ మాయ శక్తియో ఒకసారి ఆలోచించండి. కాకపోతే అది మాయ అని తెలుసుకుంటే మాయ మాయం అవుతుంది. తెలుసుకోకపోతే మాయ కాస్త బంధం అవుతుంది. తెలుసుకుంటే బంధవిముక్తి అవుతుంది. అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. సాధన చేస్తే సాధ్యం కానిది. లేదు. నువ్వు కావాలని స్పందిస్తే ఆ మాయలో పడితే ఎవరు కూడా రక్షించ లేరు. మాయను మాయగా చూసి స్పందించకుండా ఉంటే ఏ మాయ మనల్ని ఏమీ చెయ్యదు. మూడు నిమిషములు కామ సుఖం కోసం అమ్మ వెంపర్లాడక పోతే మనల్ని ఎవరు సృష్టించగలరు. చెప్పండి. ఆమె కామ మాయ కి గురి అవ్వటం వలన మనము ఉన్నాము కదా. పుడుతున్నాము. మన వలన ఆమెకి సుఖదుఃఖాల మాయలు కలుగుతున్నాయి కదా. దీనికి మూలం ఏది?కామమే  కదా. అనగానే అదృశ్యమయ్యేది. ఇలా ఈ అమ్మవారు చేసిన చిత్రవిచిత్ర లీలలు చెప్పటానికి ఈ గ్రంథమే సరిపోదు. నాకు బాగా గుర్తున్న కొన్ని లీలలు మాత్రమే వ్రాసి పెట్టుకున్నాను.వాటిని ఇందులో పొందు పరచటం అయినది. ఇవి అన్నీ మీకు నిజమా కాదా అనే సందేహం వస్తే ఇలాంటి ఆత్మ శక్తి ఉన్న మహత్తర యంత్రమును పూజించండి. అప్పుడు నా స్వామిరంగా! మీకు పండగే పండగ. ఆవిడకి ఆటయే ఆట అన్నమాట. నేను కూడా మొదటిలో మా ముత్తాతల అనుభవాలు నమ్మలేదు. అవే అనుభవాలు నాకు జరిగేసరికి నమ్మక తప్పలేదు. ఏదైనా స్వానుభవం అయ్యేదాకా దీనిని మన మనస్సు ఒక పట్టాన నమ్మదు కదా. దెబ్బ తినేవాడికి మాత్రమే దాని బాధ ఎలా అయితే తెలుస్తుందో అలా మీకు కూడా స్వానుభవం అయ్యేదాకా తెలియదు. నేను చెప్పిన వాటిని నమ్మరని నాకు తెలుసు. కాకపోతే దైవసాక్షాత్కారం మాయలు ఎలా ఉంటాయని మీకు నేను సమాచారం ఇచ్చాను. వీటిని నమ్మటం లేదా నమ్మకపోవడం మీ వంతు అన్నమాట. మీరు నమ్మిన లేదా నమ్మక పోయినా నాకు ఒరిగేది ఏమీ లేదు. పోయేది ఏమీ లేదు.వచ్చేది ఏమీ లేదు. కేవలము నా ఆత్మ సంతృప్తి కోసం వీటిని వ్రాయడము జరిగినది అని తెలుసుకోండి. ఆపై మీ ఇష్టం.

దానికి ఈ యంత్రమును ఏవేని విగ్రహానికి అనుసంధానం చేస్తే ఆ విగ్రహం లోనికి స్వయంభూగా ఆత్మ శక్తి ప్రవేశించి జీవ కళ కలిగి ఆవిడ స్వయంగా తిరుగుతున్న దృశ్యాలు అందరికీ ఖచ్చితముగా కనబడతాయని నా ప్రగాఢ విశ్వాసం. నా స్వానుభవం కూడా. కానీ గుడి కట్టే ఆర్థిక స్తోమత నాకు లేదు. అలాగని గుడిని కట్టిన దాన్ని చూసుకొని బాధ్యతలు మోస్తానని గ్యారెంటీ నాకు లేదు. నాకు వారసులు లేరు. ఒకవేళ గుడి కడితే అది కాస్త భక్తి వ్యాపారం గుడి గా మారితే అది చాలా కష్టం కదా. దేవుడిని దర్శించుకోవాలంటే డబ్బులు కట్టాలి. దేవుడు ప్రసాదాలు తినాలంటే కొని తినాలి. దేవుడికి పూజలు చేయాలంటే డబ్బులు కట్టాలి. హారతి తీసుకోవాలంటే పళ్లెములో డబ్బులు వేయాలి.ఇలా భక్తిని కాస్త వ్యాపారంగా మార్చేసిన దేవాలయాలు కాస్త వ్యాపారసంస్థలు గా మారుతున్న ఈ తరుణంలో కొత్తగా నేను గుడి కడితే ఏమి లాభము. నేను తప్పుకున్న మరుక్షణం అది కూడా వ్యాపార సంస్థ గా మారే అవకాశం ఉన్నదని భయముతో గుడి కట్టే ఆలోచనను ఆదిలోనే సమాధి చేసినాను. ఇక దుర్గ యంత్రమును ఆవిడ ఏమి చేయాలని అనుకుంటుందో కాలానికే వదిలి వేశాను. నా చేతుల్లో ఏముంది కనుక.అంతా ఆవిడ ఇష్టప్రకారమే చేస్తాను. ఆమె ఏమి చెబితే అది చేయడమే నా వంతు. ఇలాంటి యంత్రాలతో కట్టిన దేవాలయాలు కొన్నింటిని నేను చూశాను. కొన్ని దీనావస్థలో ఉంటే మరికొన్ని వ్యాపార సంస్థలను మించి నడుస్తున్నాయి. ఏది వీలుకాకపోతే కాశీక్షేత్రంలో గంగానదిలో నిమజ్జనం చేయడం తప్ప ఏమి చేయలేను అంతే.


ఒకటి గుర్తుంచుకొండి!ఈచక్ర సాధన చేస్తునపుడు మన సాధన ముందుకు వెళ్తున్న కొలది మీ ఇష్ట దేవత మీకు ఇష్ట భార్య/ఇష్ట భర్త భావాలు ఖచ్చితంగా ఇస్తారు. ఉదాహరణకి మీరు ఇష్ట దేవత మహాశివుడును ఎంచుకొని పూజ చేస్తుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీ సాధన శక్తి బాగుగా( ఆజ్ఞా చక్రం) పెరగటం వలన మీ మనోనేత్రం ముందు ఆయన భర్తగా వస్తాడు. మీరు పార్వతిగా మారిపోతారు. ఒకవేళ ఇలాగే మీరు మనస్సులో కొనసాగిస్తే భార్య /భర్త గా ఉండి పోయి అది యోగమాయగా మారిపోతుంది. దానిని దాటాలని అనిపించదు. ఒకవేళ ఎలా దాటాలో అర్థం అయి చావదు. మీరు గృహస్థులైన బ్రహ్మచారులు అయినా మీకు ఈ విషయ వాంఛ కలగకుండా మారదు. అదేగా ప్రకృతి  యోగ మాయ అంటే. అదే మీ ఇష్ట దేవత అమ్మవారు అయితే అది కాస్త మీరు భర్తగాను ఆమె కాస్త భార్యగాను మారిపోయి భార్య భర్త సంబంధం మానసికంగా కొనసాగుతుంది. అంటే సాధనలో మగవారు ఉంటే వారి దేవతలు ఆడవారు గాను, ఒకవేళ సాధనలో ఆడవారు అయితే వారి దేవతలు పురుషుడి రూపాలతో దివ్య మధుర భక్తి కలిగి  భార్యాభర్తల అనుబంధం రాధాకృష్ణ భక్తిగా అనుభవించడం ఎంతో మంది సాధకులను చూసిన విషయం కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవి తన సాధన స్థాయి  ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి కాశి క్షేత్రం చేరుకుని ఆ చక్రం శుద్ధి చేసుకునే సమయంలో సాక్షాత్తు ఆమె ఇష్టదేవత అయిన పరమేశ్వరుడు అప్పటిదాకా దేవుడుగా ఉన్నవాడు కాస్తా భర్తగా అగుపించాడు.దీనితో ఆమె నాతో “మీరు నా భర్త కాదు.ఆయనే నా భర్త. నేనే అమ్మవారిని. వారి ఇష్టసఖిని అని నానా యాగీ చేసేది. వామ్మో! ఇదేమి గోల. కొంపతీసి సాధన వలన దాని శక్తి తట్టుకోలేక మతిభ్రమణం చెందలేదు కదా” అనుకొని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఉంచుకోలేక అనేక రకాల గ్రంధాలు పుస్తకాలు తిరగవేస్తే ఈ చక్ర స్థాయి లో ఉన్న తమ జీవమాయ వలన ఈ మాయ ఏర్పడుతుందని దీనిని ఖచ్చితంగా దాట వలసి వస్తుందని లేదంటే సాధన ఆగిపోవాల్సి వస్తుందని చెప్పగానే దీనికి సద్గురువు వచ్చి తన శక్తి పాత సిద్ధితో ఆయన ఈ జీవమాయ  మాయం చేస్తారని, మా ఆవిడ సాధన చేస్తే దీనితో ఆమె శక్తి ఆ సద్గురువు చేరటం ఆయన రావడం ఏదో చేయడంతో దాంతో తాను తిరిగి తన ఇష్టదేవతను దైవంగా భావించి పూజించుకోవడం జరిగినది. ఇదంతా జరిగి పూర్తి అవటానికి ఆరు సంవత్సరాలు పట్టింది. మరి ఈ ఆరు సంవత్సరములు ఆమె సాధన జీవితంలో సాధన వృధా అయినట్లే కదా. అంతెందుకు నా ఇష్ట దేవత సాధన స్థాయికి వచ్చేసరికి  భార్యగా కనిపించసాగింది. నాకు నవ్వు వచ్చింది.ఎందుకంటే ఇలాంటివి ఒకటి ఉంటుందని నేను ముందుగానే గ్రహించాను. కాబట్టి పెద్దగా కంగారు పడలేదు. ఆశపడలేదు. భయపడలేదు. మాయలో పడలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె తిరిగి కనిపించి నేను మీ భార్య గా ఉండాలా? తల్లిగా ఉండాలా? అన్నప్పుడు నేను వెంటనే  కూతురుగా ఉండాలి  అన్నాను!  ఎందుకంటే భార్య ప్రేమ మాయ, తల్లి ప్రేమ మాయ ఎన్నటికీ దాటలేము. అదే కూతురు గా ఉంటే ఆమెకి నేను తండ్రి స్థానంలో ఉంటాను అంటే ఆమె చూపే మాయను దాటి హెచ్చుస్థాయిలో నేను ఉంటాను. దీనికి నిదర్శనంగా కాలభైరవి రూపంలో(కుక్క) మా ఇంటికి వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుండి నాతోనే వుంటుంది. యోగ సాధన కోసం సంతానం వద్దు  అనుకొని ఆ సంతానం మాయ  దాటాలి అనుకొని సంతానం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాము.తద్వారా నాకు సంతాన రూపంలో రావలసిన బాలాదేవి కాలభైరవి రూపం(కుక్క)గా వచ్చింది. ఇది వచ్చిన రోజున మా ఆవిడకి విశ్వ గురువైన దత్తాత్రేయ స్వామి, నాకు శివపార్వతుల భ్రమరాంబబాల-మల్లన్న)  దర్శనాలు కలిగినాయి. నాకు ఇంతకంటే నిదర్శనాలు ఏమి కావాలి. పైగా ఇది టెలిపతి ద్వారా మా ఇద్దరితో అవసరమైనప్పుడల్లా కనిపించి సంభాషణలు చేస్తుంది.అలా మనం చేసే నిర్ణయం బట్టి ఈ సాధన మాయ వస్తుంది అదే ఈ చక్రంలో త్రికోణంలో ఉండే త్రిముఖ ఈశ్వరుడు త్రిముఖ ఈశ్వరి చేసే త్రిశక్తి రూపాల అనగా బాలా త్రిపుర సుందరి అంటే ఐదు సంవత్సరాల బాలిక/బాలుడుగా,,30 సంవత్సరాల యువతి/యువకుడుగా, 65 సంవత్సరాల వయసున్న స్త్రీ/పురుషుడుగా  రూపాలు ధరించి మనల్ని పరీక్ష పెడతారు. ప్రతి యోగ సాధకుడు ఈ పరీక్షను ఎదుర్కోక తప్పదు. అప్పుడు మీరు ముందుగానే మీ ఇష్టదైవంను మీ ఇష్ట గురువుగా సాధన చేస్తే ఈ చక్ర స్థాయిలోకి ఈ మాయ పరీక్షకు వచ్చేసరికి భర్త/భార్యగా ఉండాలా? గురువుగా ఉండాలా అని అడిగితే మీరు వెంటనే గురువు గా ఉండాలి అని అడిగితే రుద్రగ్రంధి మీ ఆధీనం అవుతుంది లేదంటే ఈసాధన ఆజ్ఞా చక్రము నందు మీకు తెలియకుండానే నీ ఇష్టం దైవమే మీ భర్త/భార్య అనుకోవడం వలన మీరు జీవ మాయలో పడటం వలన దానిని దాటలేకపోవటం వలన మీ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది.అందుకే ఈ జాగ్రత్త తీసుకోండి.ఇలాంటి మాయను ఎదుర్కోవలసి వస్తుందని అని ఒక సాధకుడు అతిగా ఆలోచించి పురుషులు స్త్రీదేవతలను అలాగే స్త్రీలు తమ ఇష్టదేవతలుగా పురుష దేవుళ్ళను ఎంచుకోవడం వలన ఈ మహా మాయ లో పడుతున్నారని నేను పురుషుడును కాబట్టి  పురుష దేవుడిని ఎంచుకొని యోగ సాధన చేస్తానని శ్రీకృష్ణునిని తన ఇష్ట దైవంగా ఎంచుకొని తన సాధన స్థాయిని పెంచుకుంటూ ఈ చక్ర స్థాయి కి వచ్చినాడు అనగా ఆజ్ఞా చక్రంలో జీవ మాయకు వచ్చినాడు. మాయ ఎలాంటిదో ఈ అనుభవం చూడండి. వెంటనే కొన్ని రోజులకు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడు కాస్త జగన్మోహిని రూపంలో కనిపించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడిగా ముందువైపు వెనుక వైపు జగన్మోహినిగా మారడంతో మన వాడికి ఏమి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. వామ్మో!ఇలా కూడా జరుగుతుందా. వామ్మో! మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తిని చూసిన మహాశివుడు మోహావేశంతో వెంటపడి  అయ్యప్ప స్వామి జన్మించిన లీల లీలగా మెల్లగా అతనికి గుర్తుకు వచ్చే సరికి అతని యోగసాధన అర్ధాంతరంగా ఇంతటితో ఈ జన్మకి పరిసమాప్తి అయ్యింది అని చెప్పటానికి చింతిస్తున్నాము. ప్రకృతి తన సాధకుడు సాధన స్థాయిని పరీక్షించడానికి ఎన్ని రకాల పరీక్షలు కావాలో అన్నింటిని ఏర్పరచుకున్నది. అందులో పుట్టిన మనము మనల్ని పుట్టించిన ప్రకృతి మాత కి ఏమి తెలియదు అని అనుకోవటం ఈ సాధకుడు లాగానే ఉంటుంది.

బాల నిజ రూప దర్శనం:

ఇది ఇలా ఉండగా ఒకరోజు టీవీలో శ్రీశైల వైభవం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగం వస్తోంది. అందులో శ్రీశైల గుడి పరిసరాలలో అమ్మవారు 5 నుండి 8 సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక రూపములో పట్టు పరికిణీ లంగా వేసుకొని కొంతమంది సాధకులకు తిరుగుతూ కనబడుతోందని అలాగే కాంచీపురము నందు అమ్మవారు ప్రతినిత్యము వివిధ రూపాలలో అనగా బాలికగా గాని యవ్వన స్త్రీగా గాని వృద్ధాప్య స్త్రీ మూర్తి గా గాని  ఇప్పటికి తిరుగుతోందని నా స్వానుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పగానే నాలో ఏదో తెలియని ఉత్తేజం కలిగి ఆనందం వేసింది. ఇది నిజమైతే శ్రీశైల క్షేత్రం లోనికి వెళ్లి ఈ సిద్ధాదేవి చూపించే లజ్జా గౌరీ దేవి మాయ దాటాలి అని నిశ్చయించుకున్నాను. దానితో నేను మా శ్రీమతి తో కలిసి శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళటం జరిగినది. అప్పటికే ఆ క్షేత్రానికి వచ్చి మూడు రోజులు అయినది. కానీ ఎలాంటి దైవ అనుభవాలు కలుగలేదు. బాధ ఆవేదన మొదలైనది. అంటే అమ్మవారిని బాలా రూపములో అనగా బాలిక రూపంలో నిజరూప దర్శనం చూసే స్థితిలో నా సాధన శక్తి లేదని అనిపించసాగింది. ఏమి జరిగితే అది జరుగుతుంది. ఏదో ఒకటి తేలేదాకా ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను. నేను మాయ సహితుడునా  లేదా మాయరహితుడునా  అనేది శ్రీశైల క్షేత్రములో తేల్చాలని నిశ్చయించుకొని గుడి పరిసరాలలో ఉండే త్రిఫల వృక్షము (రావి వేప మేడి చెట్టు కలయిక)క్రింద నా చక్ర ధ్యానమును చేసుకోవటం ఆరంభించాను.నాతో పాటు మా శ్రీమతి కూడా జపం ధ్యానం చేసుకునేది.ఇలా మరో రెండు రోజులు గడిచినాయి. ఒకరోజు నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా లజ్జా గౌరీ దేవి నా మనో నేత్రం నందు నగ్నము రూపముతో దర్శనమిచ్చి నన్ను “నేను నీకు తల్లి గా ఉండాలా…. భార్యగా ఉండాలా” అని అడిగసాగింది. దానితో ఏమి జరిగితే అది జరుగుతుంది అని తెగించి “అమ్మా! నువ్వు నాకు కూతురుగా ఉండు. నీకు తండ్రి గా ఉండే భాగ్యం ప్రసాదించు. కానీ నాకు ఎట్టి సంతాన మాయను కల్పించకు” అని వేడుకునేసరికి “తధాస్తు” అని దీవించగానే 

ఆమె కాస్త అదృశ్యమై ఆ స్థానంలో రెండు బాణలింగాలు ఒకదానికొకటి కలుస్తూ విడిపోతూ రతీ మన్మధులలాగా కామిని కామేశ్వరి లాగా రెచ్చిపోతున్నాయి. వాటిలో ఒకటి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే మరొకటి నల్ల రంగులో ఉంది. ఈ బాణలింగాలు వస్తాయని నాకు అర్థమైనది. అంటే అర్థనారీశ్వరులు మహామాయను దాటడం జరుగుతోందని నాకు అవగతము అయ్యే సరికి నాకు ఏడుపే శరణ్యము అయినది. గత ఒకటిన్నర సంవత్సరాల నుండి అనగా 18 నెలలపాటు ఈ చక్రం ఎలా దాటాలో అర్థం అవ్వక కొట్టుకొని చచ్చేవాడిని. చివరికి కూతురు లాగా రమ్మని అడిగేసరికి ఈ మాయను దాటే స్థితికి నా సాధన శక్తి ఉన్నదని తెలియగానే అప్పటిదాకా కుంపటిలాగా ఉన్న బరువు కాస్త పూర్తిగా దించినట్లుగా ఉంది. ఆనందం పట్టలేక పోయాను. ధ్యానము చేయలేక పోయినాను. ఏదో తెలియని అద్వితీయ ఆనంద స్థితిలోనికి నా మనస్సు నా శరీరము పొందుతుండగా వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి కూల్డ్రింక్స్ తాగటానికి నా మనస్సు కోరుకునే సరికి నా ధ్యానం ఆపక తప్పలేదు. 

ఆ రోజు రాత్రి ధ్యానములో ఉదయము కనిపించిన బాణలింగాల కోసం అన్ని షాపులు వెతుకుతుండగా అనుకోకుండా ఒక షాపు ముందు నా మనోనేత్రం ముందు మళ్ళీ ఈ రెండు బాణలింగాలు కొట్టుకోవడము కనిపించేసరికి ఆ షాప్ లోకి వెళ్ళి వెళ్ళగానే అక్కడే ఎవరో చూసి వదిలి వెళ్ళిన ఈ రెండు బాణలింగాలు కనిపించేసరికి వాటి ఖరీదు కట్టి తీసుకుని నేను బస చేసిన గదులకి మేమిద్దరము వెళ్ళిపోయాము.మరుసటి రోజు మల్లన్న దర్శనానికి వెళితే ఉచిత దర్శన క్యూలో జనాలు బాగా ఉండేసరికి డబ్బులు కట్టే దర్శనానికి వెళ్ళినాము. అది తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో అన్నమాట. అక్కడ కౌంటర్లో సుప్రభాత సేవ టికెట్ మాత్రమే ఇస్తారని చెప్పగానే నా చేతిలో ఉన్న 600/- కట్టి రెండు టికెట్లు తీసుకుని నేను మా శ్రీమతి స్వామివారికి జరిగే సుప్రభాత సేవ కి చేరుకున్నాం. ఉదయం 5 గంటల సమయానికి 200 మంది భక్తజనులు సమక్షంలో సుప్రభాత సేవ మొదలైంది. ఈ సేవను ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిందే. ఈ సేవను శ్రీ చాగంటి గారు చెప్పిన విధానం వింటే తప్పకుండా అందరూ చూస్తారు. అప్పటికే ఆయన ద్వారా ఈ సేవ గురించి విని ఉన్నాం. కానీ టికెట్లు దొరుకుతాయని మేము ఊహించలేదు. ఎందుకంటే 2030 సంవత్సరం దాకా తిరుపతి వెంకన్న సుప్రభాత టికెట్లు ముందే బుకింగ్ అయినాయని నాకు తెలిసినది. అలాగే ఈయనకి కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో జరిగి పోయి ఉంటాయని అప్పుడు మేము అనుకున్నాము. కానీ విచిత్రం చేయటం శివయ్య కి మించిన ఆటగాడు ఎవరు ఉండరు కదా. ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు కదా. కవి సార్వభౌమ శ్రీనాథుడు అన్నట్లుగా శివయ్య కి ఇష్టమైన మనకి ఇష్టం లేకపోయినా అది జరిగి తీరుతుంది. మనకి ఇష్టమైన శివయ్యకు ఇష్టం లేకపోతే అది ఎన్నటికీ జరుగదు. అప్పటికే రాత్రి మేము కొన్న బాణ లింగాలు నా చేతిలో ఉన్నాయి. ఇదంతా వాటి ప్రభావము అని నాకు అర్థమైనది. ఈ అర్ధనారీశ్వరుడుని ఇలా స్త్రీ పురుష లింగ రూపంలో మా ఇంటికి వస్తున్నారని తెలియగానే ఏదో తెలియని కిక్ వచ్చినది. 18 నెలల కష్టానికి ఫలితం దొరికినది అని నాకు అర్థమైనది. ఈ రెండు బాణలింగాలు చెవిటి మల్లన్న లింగమూర్తికి తాకించడంతో ఈ సేవా కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఉదయం 7:00 గంటలు అయినది. మూడున్నర గంటల పైగా ఈ సేవా కార్యక్రమం జరిగినది అని అనుకుంటూ ధ్యానము చేసుకోవటానికి యధావిధిగా మేమిద్దరమూ త్రిపల వృక్షము కింద కి చేరుకొని ధ్యానం చేసుకుంటుండగా నా మనోనేత్రం నందు 8 సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక దర్శనము ఆరంభం అయ్యే సరికి అంటే శ్రీ చాగంటి గారు చెప్పినట్లుగా ఈ క్షేత్ర దేవత అయిన శ్రీ భ్రమరీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు నాకు కనిపించే బాలిక రూపంలో ఈ గుడి ప్రాంగణంలో సంచారము చేయటానికి వస్తుందని తెలియగానే ……..

ఆ పక్కనే దూరముగా ధ్యానం చేసుకుంటున్న మా శ్రీమతికి అమ్మవారు బాలిక రూపం వస్తుందని గుసగుసలాడుతూ చెప్పగానే అవునా అయితే చూద్దామని ఎదురుచూస్తూ ధ్యానం చేసుకుంటూ వుండగా ఒక 8 సంవత్సరముల వయస్సు బాలిక పట్టు పరికిణీ లంగా అది కూడా ఎరుపు బోర్డర్ ఉండి గోధుమ రంగులో ఉన్న వాటిని ధరించి బొద్దుగా ముద్దుగా లావుగా ఉన్న బాలిక మూర్తి అచ్చం నా మనోనేత్రం నందు దర్శించిన రూపరేఖలతో ఉండేసరికి నా గుండె గతుక్కుమన్నది.వామ్మో! ఏమిటి బాలా మూర్తి ఇలా నిజరూపంతో ప్రత్యక్ష అనుభూతిగా దర్శనమివ్వటం. వామ్మో! ఇది నిజమేనా. నా స్వామిరంగా! ఫోన్ చేతిలో ఉంటే ఎన్నో ఫోటోలు కొట్టేవాడిని. కానీ సెక్యూరిటీ కారణంగా మా ఫోను రానియ్యలేదు. ఏమీ బ్రతుకు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని లాగా ఉంది. ఆమె కాస్త ఓరకంటితో ఓర చూపుతో నన్ను చూస్తూ నా చుట్టూ ఏదో పని ఉన్న దానిలాగా అమ్మవారి నడక అయిన గంభీర నడకతో గంభీర హుందాతో గంభీర చూపులతో నన్ను చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటే నా స్వామిరంగా! ఆ మహత్తర దృశ్యము గూర్చి వర్ణించాలంటే నా నోటి పలుకులు చాలవు. నా చేతి వ్రాతలు సరిపోవు. ఎవరికి వారే అనుభూతి పొందవలసినది. ఖచ్చితముగా శ్రీశైల క్షేత్రము నందు, జోగులాంబ క్షేత్రము నందు, జొన్నవాడ కామాక్షి క్షేత్రము నందు, కంచిపురం నందు నేను ఇలాంటి మహత్తర స్వానుభవాలు స్వయంగా పొందటం జరిగింది. మీరు కూడా మీ నిజ నిష్కామ భక్తితో సాధన చేస్తే తప్పకుండా అమ్మవారు తన వివిధ రూపములైన బాలిక, యవ్వన స్త్రీ, వృద్ధాప్య స్త్రీ లలో ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహించ గలరని నేను ఘంటాపధంగా చెప్పగలను. నాతో పాటుగా ఇంతటి మహత్తర స్వానుభవ అనుభూతిని మా శ్రీమతి కూడా పొందినది. సుమారుగా ఎనిమిది నిమిషముల పాటు ఈ బాలిక రూపంలో అమ్మవారు మా చుట్టూ అంటే మేము ఉన్న వృక్ష పరిధి చుట్టూ తిరుగుతూ ఎటో వెళ్లిపోయింది. దాంతో నేను ధ్యానం ఆపి వేసి ఆమె మళ్లీ ఎక్కడైనా కనబడుతుందని గుడి ఆవరణ అంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. మా కళ్ళ ముందు తిరుగుతూ మా కంటి చూపు నుండి భలే గమ్మత్తుగా అమ్మవారు తప్పుకున్నదని నాకు అర్థమై ఇలాంటి దివ్యమైన ప్రత్యక్ష అనుభూతి ఇవ్వటానికి వాటి వంతు సహాయం చేసిన ఆ రెండు బాణలింగాలను చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా మా ఇల్లు ఉన్న మా ప్రాంతానికి చేరుకోవడం జరిగినది. 

ఇది ఇలా ఉండగా నాకు రుద్రగ్రంధి లోనికి ప్రవేశించినట్లు నాకు అనుభూతి కలగ సాగింది. దీనికి సంకేతముగా నాకు శ్రీశైలం నుండి త్రిశూలం, కాశీ నుండి ఢమరుకము, రామేశ్వరం నుండి యోగదండము వచ్చేసరికి ఈ రుద్రగ్రంధి విభేదనం జరిగినది. అప్పుడు నాకు లక్షా పాతికవేల ప్రారబ్ద కర్మలు ఉన్నాయని వాటిలో 36,000 జాతకర్మలు అని 1,000 పరిహార కర్మలు అని 27 మంది శిష్యుల కర్మలు అని ఇరవైఒక్క మంది జాతక భక్తులకు కర్మలు అని నా 12 పూర్వజన్మల వివరాలు 54 గత జన్మల వివరాలు నెమ్మది నెమ్మదిగా నా మనోనేత్రం ముందు ఆవిష్కరణ జరిగినాయి. ఒకటవ తరగతిలో బలపాల దొంగతనము నుండి మొదలై నా సమాధి స్థితి వరకూ ఉన్న నేను చేసిన చేయబోయే ప్రారబ్ద కర్మలు వాటి ఫలితాలు వాటి పరిహారాలు నా మనోనేత్రం ముందు వీడియో లాగా ఒక్కొక్కటి కనిపిస్తుండే సరికి నాకు భవిష్యత్తు మీద కిక్కు లేకుండా పోయింది .ముందే భవిష్యత్తు తెలిస్తే ఏమి ఉంటుంది. మీరే చెప్పండి. మూడు రోజుల ముందుగానే వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో తెలిస్తే ఫైనల్ మ్యాచ్ అయిన క్రికెట్ మనము ఎంజాయ్ చేయగలమా? చేయలేము కదా. తెలియకుండా ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరు కదా. కానీ నా బ్రతుకు ఏమిటో రాబోవు బ్రతుకులు ఏమిటో ఇలా ముందుగానే తెలుసుకునే సరికి తెలిసేసరికి నాకు అన్నిటి మీద నాకు తెలియకుండానే వైరాగ్యము అందరికీ దూరం కావటం ఆరంభమైనది. ఉన్నది నేను ఒక్కడినే. నేను తప్ప ఈ విశ్వంలో ఏమీ లేదు. అంతా నేనే ఉన్నాను. నేను కానిది లేదు. నేను లేనిది లేదు అనే భావన నాలో పెరగసాగింది. దాంతో నాకు తీవ్ర ధ్యానంలో ఉండగా శరీర స్పృహ కోల్పోవటం జరుగుతుంది. ఈ దేహము నేను కాదు. ఈ వస్తువులు నేను కాదు. నా పేరు నేను కాదు. నా కుటుంబం నేను కాదు. అసలు నేను నేనే కాదు. అంటే నేను కానీ నేను ఎవరో తెలుసుకోవాలి. దీని కోసం తీవ్ర ధ్యానం చేయాలనే ఆకాంక్ష తప్ప భార్య తో కలిసి సినిమాలకు పార్కుల కి వెళ్లాలని గాని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగలు జరుపుకోవాలని లేదా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పలకరించాలని గాని కనీసం వారితో గాని బంధుమిత్రులతో గాని మాట్లాడాలని అనిపించేది కాదు. చూడాలనిపించేది కాదు. పలకరించాలని అనిపించేది కాదు. నాకు నేను నాలో నేను మాట్లాడుకోవటం తిట్టుకోవడం నవ్వుకోవటం ఆరంభమైనది. నాకు ఈ విశ్వమంతా నేను తప్ప అంతా శూన్యం లాగా నేను కలగన్న ప్రపంచము లాగా నిజము లాంటి కలలాగా  జీవితము అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం అని నాకు అర్థం అవసాగింది. బట్టలు గూర్చి, జుట్టు గూర్చి, గోర్లు గురించి, నా గురించి నన్ను నేను పట్టించుకోవడం లేదని మా శ్రీమతికి అర్థమైనది. కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే నేను ప్రారంభ సమాధి నుండి సవికల్ప సమాధి స్థితిలో నా యోగసాధన ప్రవేశిస్తుందని నాకు అర్థమైనది. ఈ పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయిన వాడికి ఈ లోకంతో ఏమి పని ఉంటుంది. ఆశ భయం లేని వాడికి ఈ లోకము ఏమి చేయగలదు. మాయ మాయం అయిన వాడికి ఈ లోకంతో పని ఉండదు కదా. శాశ్వత మరణం పొందే మార్గాలు గురించి తెలుసుకోవడం తప్ప ఇట్టి స్థితిలో ఏమి పని ఉండదు అని నాకు అర్థమైనది. వాడు చేయాలని అనుకున్న కర్మలు చేయలేడు. ఎవరికైనా ఉంటే వాడికి ఏదో విధంగా కర్మలు రూపంలో సేవలు చేసి రుణాలు పొందడం లేదా తీసుకోవడం జరుగుతోంది. కర్మ లేని వారితో కర్మబంధము ఎలా అవుతుంది. ఇది బాగానే ఉంది కానీ నాకు ఎట్టి అనుభూతి కలగడం లేదు. కేవలం ఆ వేదన బాధ మాత్రమే కలుగుతుండేది. సవికల్ప సమాధి స్థితిని నేను పొందాలంటే నేను మొదట ఈ చక్రం యొక్క గుహలో ఉండే నాలుగు చక్రాలు అయిన గుణ,కర్మ,కాల, బ్రహ్మ చక్రాలను దాట వలసి ఉంటుంది. దక్షిణాచార సాధన చేస్తే ఒక్కొక్క చక్రానికి 6 నుండి 12 సంవత్సరములు పైగా సమయం తీసుకుంటుంది.అదే వామాచారం అయిన తాంత్రిక విధానములో సాధన చేస్తే ఈ నాలుగు చక్రాలు ఆధీనమవ్వటానికి 4x6=24 నెలలు అనగా రెండు సంవత్సరములు మాత్రమే పడుతుంది. అందుకే చాలామంది యోగ సాధకులు తమ ఆజ్ఞ స్థితి మాయ దాటగానే ఉప చక్రాల సాధన స్థితి కోసం తాంత్రిక విధానాలను అవలంబించి తాంత్రిక యోగులుగా అనగా కాపాలికులు, అఘోరీలుగా, భైరవీలు, నాగ సాధువులు లాగా మారి తమ ఈ చక్ర సాధనను కొనసాగిస్తారు. కానీ నాకేమో తాంత్రిక విధానములో సాధన చేయటము అస్సలు ఇష్టం లేదని మీకు ఇంతకుముందే చెప్పినాను కదా.కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉండక ఈ తిప్పలు మనకు అవసరమా అనిపించేది. మా శ్రీమతి తో ఇదే మాట అంటే “ఇప్పటికే ఎన్నో కోట్ల జన్మల నుండి ఈ ఆనందాలు పొందుతూనే ఉన్నారు కదా. ఏమైనా సంతృప్తిని మిగిల్చిందా?. ఎప్పుడూ తీరని కోరికగా ఉన్నది కదా. ఎప్పటికీ తీరని వాటిని పట్టుకుని తీరే వాటిని వదిలి పెడితే ఎలా స్వామి!ఈ భోగానందాల కన్న యోగానందాలు మిన్న అని తెలుసుకోండి. సమస్యలు వస్తే సాధనను వదిలి పెడితే కష్టాలు వస్తాయని సంసారమును వదిలి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా.అసలు యోగములోనికే రాకూడదు. వస్తే మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే సాధన అనేది పులి మీద స్వారీ లాంటిది. స్వారీ చేయకపోతే అది మిమ్మల్ని మాయ రూపంలో తినేస్తుంది. అంత అవసరమా ఇప్పుడు. ఈ జగత్తు అంతా మాయ నాటకం అని తెలుసుకున్న తర్వాత అంటే ఒక సారి చూసిన సినిమాను ఎన్ని సార్లు చూస్తారో చెప్పండి. తీసిన సినిమాని మళ్లీ తీస్తూ (సృష్టి) చూసిన సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ (స్థితి) చేసిన సినిమానే మళ్ళీ మళ్ళీ నాశనం చేస్తూ (లయము) మళ్ళీ అవే పాత్రలతో అవే నవరసాలతో అదే కథాకథనాలతో ఏదో కొత్తగా మళ్లీ తీయాలని తీస్తున్నానని కొత్త దానిని చూస్తాం అని అనుకోవటం కొన్ని కోట్ల యుగాల నుండి కొన్ని కోట్ల జీవులు చేస్తున్న పని ఇది అని తెలిసి కూడా మళ్లీ మీరు మాయ వైపు కి ఎందుకు వెళుతున్నారో నాకేమీ అర్ధం కావటంలేదని” వంటగదిలోకి వెళ్ళింది. ప్రతిరోజు చేసిన వంటనే మళ్ళీ చేయటానికి కాబోలు. 

ఇది ఇలా ఉండగా నాకున్న జాతక కర్మలు అలాగే నాకు బాకీ ఉన్న 21 మంది జాతక సమస్యలున్నవారిని అలాగే నాకున్న 27 మంది శిష్యులను ఎలా పట్టుకోవాలో అర్ధము కాలేదు. అపుడు మా గురుదేవుడిని అడిగితే దానికి ఆయన వెంటనే "నాయనా!నీవు జాతకాలకి సంబంధించిన గ్రంధము రాయ్యి!దానిని ఉచితముగా పంచు!ఇదియే వారందరిని నీదగ్గరికి తీసుకొని వస్తుందని...ఇపుడి దాకా నీవు భుక్తి కోసము జాతకాలు చెప్పినావు!ఇంతటితో దానిని ఆపివేసి కేవలము నీ ప్రారబ్ధకర్మలున్న జాతకులకి మాత్రమే జాతకాలు చెప్పడము ఆరంభించు!వీరి దగ్గర అవసరమైతే నీ మనస్సుకి నీకు వీళ్లు బాకీ ఉన్నారని తెలిస్తే మాత్రమే వీరి దగ్గర డబ్బులు తీసుకొని వారిని బంధవిముక్తి గావించు.వీరిని నీ దగ్గరికి ప్రకృతిమాతయే పంపిస్తుంది.అని చెప్పినారు.దానితో నేను వీరందరి కోసము “జాతకప్రశ్న” అను గ్రంధము రాయడము...దానిని కొంతమందికి పుస్తకరూపములో ఉచితముగా ఇస్తే...మరికొంతమందికి కోసము దీనిని ఒక వెబ్ సైట్ చేసి ఉచితముగా ఇచ్చేసరికి...సుమారుగా దీనిని 54వేల591 మంది చూడటముతో...ఇలా నాకున్న 36వేల జాతక కర్మలు నివారణ అయినాయి. దానితో ఈ సైట్ మూసి వెయ్యడము జరిగినది.అలాగే  నాకున్న 27మంది శిష్యుల పరిహారమును ఎలా కలుసుకొన్నానో ఈ చక్ర రెండవ ఉపచక్రమైన కర్మచక్ర అనుభవాల యందు వివరించడము జరిగినదని గ్రహించండి. 

నా సాధన పరిసమాప్తి చేసుకోవడము ఏలా?

 ఇది ఇలా ఉండగా “నేను ఎవరిని” అనే విషయం దేని వలన తెలుస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే నేను వేదవ్యాస అంశ స్వరూప ఆత్మ అని తెలుసు. మరి ఆయన ఎవరి అంశ స్వరూపము అంటే మహా విష్ణు మూర్తి అన్నారు. మరి ఆయన ఎవరి అంశ అంటే ఆది పరాశక్తి యొక్క జగన్మోహిని అంశ అని ఈమె ఎవరి అంశ అంటే మహా శివుడు అంశ అని ఈయన ఎవరి అంశ అంటే ఇష్ట లింగమూర్తి శివమూర్తి అంశ అని ఇది స్వయంభూ బిందువు అంశ అని ఈ బిందువు ఒక అణువు అంశ అని ఇది కాస్త ఒక పరమాణువు అంశ అని పరమాణువు కాస్త దైవకణం అంశ అని ఇది కాస్త ఒక రేణువు అంశ అని ఇది స్వయంభూ అని బ్రహ్మరంధ్ర స్థానం వద్ద చితాగ్ని యొక్క అగ్ని శిఖ అని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. అదే సైన్సు ప్రకారముగా చూస్తే పదార్ధము దీనిని విడదీస్తే అణువులు దీనిని విడదీస్తే పరమాణువులు వీటిని విడదీస్తే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వీటిని విడదీస్తే దైవ కణము (గాడ్ సెల్) అని తేల్చారు.మరి స్వయంభువు అయిన ఆ రేణువు ఎవరు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. అంటే నేను కానీ నేను ఎవరో ఎవరికీ తెలియదు. తెలిసిన వాళ్ళు అది స్వయంభూ అని మాత్రమే తెలిసినది అని నాకు అర్థమైనది. నేను ఎవర్ని అనేది ఎలా తెలుసుకోవాలో శ్రీ లాహిరి మహాశయులు వారి అనుభవాల ద్వారా తెలియజేసినారు. ఆజ్ఞా చక్రము నందు ఉన్న మధ్య భాగంలో త్రికోణములో ఒక బిందువు ఉంటుంది. ఇదియే చంద్రబింబం వంటి నాలుగు భాగాలుగా రెండు అర్థ భాగాలుగా అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది.దీనినే చతుర్ధ గుహ లేదా గగన గుహ అందురు.ఇందులో స్థిర గృహము అనగా గుణ చక్రము అన్నమాట. ఆ తర్వాత అగమ్య గృహము అనగా కర్మచక్రం అన్నమాట. ఆ తర్వాత అక్కడ నుంచి అజర గృహము అనగా కాలచక్రము ఆ తర్వాత అక్కడ నుండి అమర గృహానికి అనగా బ్రహ్మ చక్రానికి చేరుకుంటారు. అప్పుడు మహాశూన్యం రూపుడైన ప్రభువు బ్రహ్మ దేవుడు మాత్రమే దర్శనం ఇస్తాడు. అక్కడ నుండి ఈయన పుట్టుకకు కారణమైన మహావిష్ణువు దర్శనం కోసం సూర్య లోక ఒక బిందువు లోనికి అనగా ఈ బ్రహ్మ చక్ర మధ్య బిందువు లోనికి ప్రవేశిస్తే అప్పుడు సహస్రార చక్ర కమలంలోని అనగా మహా శూన్య కారకమైన అతి శూన్యమునకు వెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ శ్రీకృష్ణుడి లీలామాయ ఉంటుందని దీనిని దాటితే అతికష్టమైన ఇరుకైన దారి కనపడుతుందని చెప్పి ఆపి వేసినారు. అక్కడ రమణ మహర్షి అనుభవాలను బట్టి ఇదియే జీవనాడి అని దీని ఒక కొన హృదయ చక్రమును కలుపుతుందని ఈ జీవనాడిలో హనుమంతులవారు యోగసాధన చేసుకుంటూ దర్శనము ఇస్తారని హృదయ చక్రమునందు అంగుళ పరిమాణంలో సంకల్ప శరీరధారి అయిన అనంతపద్మనాభుడు ఒక చేతిలో ఇష్ట లింగమూర్తి పెట్టుకొని యోగ నిద్రావస్థలో అనగా బ్రహ్మ తదాకార స్థితిలో దేనికి స్పందించని స్థితిలో ఉంటాడు అని అక్కడున్న హృదయ గ్రంధి వద్ద అనగా చిన్నమస్తా దేవి చేతిలో కారణశరీరము తల నరకబడితే అక్కడ అంగుళ పరిమాణం ఉన్న సంకల్ప శరీరం బయటకు వస్తుందని దీనితో ఇరుకైన గొట్టము అనగా శ్రీకాలభైరవుడు నోటీయందు ఉన్న గొట్టము వంటి మార్గం కనబడుతుందని దీని లోనికి రేణువు అంత పరిమాణములో సంకల్ప శరీరమును మార్చుకొని ప్రయాణించగలిగితే అప్పుడు బ్రహ్మరంధ్రము వద్దకి చేరుకుంటామని ఇక్కడ యోగ పతంజలి మహర్షి అనుభవాలు చూస్తే బ్రహ్మరంధ్రము వద్ద వరి వడ్లు యొక్క ముక్కు పరిమాణంలో చితాగ్ని స్వరూప దర్శనం ఇస్తుందని అధిదేవతగా దీప దుర్గ ఉంటుందని ఈమె మానవ ఆది జన్మ కపాల మోక్ష ప్రదాతగా ఉంటుందని ఇక్కడ ఈమె పెట్టే సహనశక్తి యోగ మాయ పరీక్షను సాధకుడు మూడు నిమిషాల నుండి తొంభై ఆరు నిమిషాల పాటు తట్టుకోగలిగితే అప్పుడు ఆది బ్రహ్మకపాల మోక్ష ప్రదాత అయిన ప్రత్యంగిరా దేవత దర్శనం లభిస్తుందని ఈమె మహామాయావి అయిన మహా విష్ణు మూర్తి యొక్క నరసింహ స్వామి యొక్క స్త్రీ మూర్తి స్వరూపము అయిన ఈ ప్రత్యంగిరా మాత యొక్క కాలు క్రింద ఉన్న ఆది బ్రహ్మకపాలం విస్పోటనము చెందితే ఈ విశ్వ సృష్టి స్థితి లయ పరిపూర్ణముగా అచేతన స్థితిలోకి శాశ్వతంగా వెళ్లిపోతాయని వారి అనుభవాల ద్వారా నాకు తెలిసినది. అంటే మనము ఆజ్ఞాచక్రము లోని త్రికోణము మధ్యలో ఉన్న బిందువు వంటి చంద్రుడిని అనగా చంద్రలోకము చేరుకోవాలి. అక్కడున్న వివిధ దైవ మాయలు దాటితే మనకి ఇక్కడ ఉన్న చతుర్ధ గుహలోని నాలుగు గదులుగా అనగా గుణ,కర్మ, కాల, బ్రహ్మ చక్రాల యొక్క వరుసగా గుణాతీత స్థితి, కర్మాతీత స్థితి, కాలాతీత స్థితి,జ్ఞానాతీత స్థితి పొందాల్సి ఉంటుంది. అప్పుడు మనకి బ్రహ్మ చక్రమునందు ఉండే విశ్వం యొక్క మహా శూన్యము దర్శనము ఇచ్చును. ఇక్కడ మనకి శూన్య బ్రహ్మ వస్తుంది. ఇక్కడ నుండి ఈ చక్ర బిందువు అయిన సూర్యుడు అనగా సూర్య లోకానికి వెళితే అనగా సహస్రార చక్రమునకు చేరుకోవాలి. ఇందులో శ్రీకృష్ణుడి లీలా మాయ, 1000 సహస్ర లోకాలు అన్నియు పరమశూన్యములో ఉన్నట్టుగా దర్శనం ఇస్తాయి. 

మహా విష్ణువు సహస్ర శిరస్సులతో సహస్ర చేతులతో దర్శనమిస్తాడు. మరొక ప్రక్క సంభ్రమాశ్చర్యములతో సహస్ర కాళ్లతో విశ్వరూపంతో మహాశివుడు కైలాస పర్వత దర్శనం ఉంటుంది. విశ్వరూపధారిగా మహావిష్ణువు మానససరోవరం లో ఉంటాడు. ఒకరు వెలుగు ప్రపంచానికి విష్ణుమూర్తి అధిపతిగా ఉంటే చీకటి ప్రపంచానికి మహాదేవుడు అధిపతిగా ఉంటారు. అనగా శివ కేశవ అర్ధనారీశ్వర తత్వం ఈ సహస్ర చక్ర స్థితిలో కనబడుతుంది. అనగా ఆజ్ఞాచక్రంలో శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం లాగా అన్నమాట. ఇక్కడదాకా మనము నిజానికి అద్వైత స్థితి లోనే అనగా నేను వేరు దేవుడు వేరు అనే భావములో ఉంటాము. ఆ తర్వాత ఈ సహస్ర చక్రములోని శ్రీకృష్ణుడి లీలా మహామాయ దాటితే అప్పుడు మనకి హృదయ చక్రానికి వెళ్లే మార్గం దొరుకుతుంది. జీవనాడి మార్గము దొరుకుతుంది. ఈ మార్గమునకు అధిపతిగా శ్రీ  చిరంజీవుడైన హనుమంతులవారు సజీవుడుగా మనకి దర్శనమిస్తూ హృదయ చక్రానికి తీసుకొని వెళ్తారు. కాకపోతే మనము ఈయనకిలాగా అనగా సహస్రార చక్రంలో ఎంచుకున్న మన ఇష్ట దైవ రూప మాయలో పడకూడదు అనగా హనుమంతుల వారు తమ ఇష్ట దైవమైన శ్రీ రాముడి మాయను ఇప్పటిదాకా దాటలేకపోయినారు. వారి ప్రేమను పొందిన అలాగే వారితో యుద్ధము చేసినను వారి ప్రేమ మాయ ని దాటలేకపోయినారు. అప్పుడు మనకి ఈ హృదయ చక్రం దేవాధిదేవుడైన అనంత పద్మనాభుడి దర్శనము లభించును. వీరి ఎడమ చేతిలో ఉండే ఇష్టలింగము మనకి అనుగ్రహించ బడుతుంది. ఈ ఇష్టలింగము తీరని మనకి ఇష్టమైన ఏకైక కోరిక ఏమిటో తెలియచేస్తోంది. ఏకైక కోరిక దాటగలిగితే అనగా హనుమంతుల వారిని ఇక్కడ తన ఇష్ట కోరికగా శ్రీరామ పాదాలు సేవగా వచ్చినదని గ్రహించండి. అదే మహాశివుడికి పాల పాయసం, దుర్గాదేవికి గారెలు, విష్ణువుకి దద్దోజనం, హనుమంతులవారికి అప్పాలు, లక్ష్మీదేవికి పరమాన్నము ఇలా 33 కోట్ల దైవాలకు ఆయా ఆహార పదార్థాలు వారి ఇష్ట దైవ స్వరూపాలు ఇష్టకోరికగా మారినాయని తద్వారా వారంతా ఈ హృదయ చక్రం మాయకు బలి అయినారు అని గ్రహించాను. నేను ఈ సాధన స్థాయికి వస్తే త్రిపుర భైరవి ఇష్టదేవత మాయగా ఇష్టకోరికగా  మిరపకాయ బజ్జీలు వచ్చినాయి. వీటిని ధాటుకోవడానికి ఇక్కడ వచ్చే నవపాషాణం (తొమ్మిది రకాల విషాలతో) నిర్మితమైన ఇష్టలింగ ఆరాధనను ప్రస్తుతానికి చేస్తున్నాను. అలాగే మన జిజ్ఞాసి కూడా ఈ చక్ర స్థితిలో ఉన్నపుడు ఇష్ట దైవము గా తారక రాముడు ఇష్టకోరికగా గోంగూర పచ్చడి వచ్చినాయి. వాటిని మేము దాటినామో లేదో తర్వాత అధ్యాయాలలో వస్తుంది. అప్పుడు మనకి చిన్నమస్తా దేవి దర్శనం ఇచ్చి మన కారణ శరీరం తలను నరుకుతుంది. అప్పుడు మన తలలోని మెదడు మధ్యభాగంలో ఉన్న పిట్యూటరీ గ్రంధినుండి అంగుళ పరిమాణం ఉన్న సంకల్ప శరీరధారి బయటికి వచ్చి ఈ విభేదనము అయిన హృదయగ్రంధి ద్వారా అక్కడ ఉన్న సన్నని మార్గంలో పిండి రేణువు అంత పరిమాణంలో బ్రహ్మ రంధ్రానికి చేరుకొని అక్కడ ఉన్న చితాగ్ని లో తన ఆది జన్మ కపాలము తో మోక్షమును చేసుకుంటే జీవన్ముక్తి పొందుతాడని ఒకవేళ ఆది బ్రహ్మకపాల మోక్షమును పొందితే శాశ్వత మరణస్థితి అనగా సంపూర్ణముగా పరిపూర్ణముగా శాశ్వత అచేతన స్థితిని పొందుతాడని అదే ఆది జన్మ కపాలమోక్షం పొందలేకపోతే మహావిష్ణువు లాగా ఆరు నెలలపాటు అచేతన స్థితికి అనగా యోగ నిద్ర స్థితి అని మరో ఆరు నెలలు చేతన స్థితి అనగా భోగ నిద్రాస్థితి పొందటం జరుగుతుందని అనగా తొలి ఏకాదశినాడు ఈయన యోగ నిద్ర లోనికి వెళ్ళడము అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఈయన ఈ నిద్ర నుండి బయటకు రావడం జరుగుతుందని నాకు అవగతమైంది. ఇది అంతా ఈయన విషయంలో తన హృదయ చక్రములోని ఇష్టలింగ మాయను దాటి తన కారణ శరీరం తల విభేదనము చేసుకుని సింహం తలతో నరసింహుడిగా మారిన కానీ బ్రహ్మరంధ్రము వద్ద ఈయన సహనంతో లేకపోవటంతో సహన శక్తి మాయకు గురి అయితే  ఈయన కాస్త ఉగ్ర నరసింహ మూర్తి యొక్క స్త్రీ స్వరూపమైన ప్రత్యంగిరా దేవతగా మారినారని నా మనో దృష్టికి వచ్చినది. ఏ బ్రహ్మకపాలం మాయ తనని వదల లేదో దానిని తన ఎడమ కాలి కింద ఉంచుకుని తన ఆది జన్మల కపాలముల 108 మాలగా వేసుకుందని నాకు అవగతమైనది. తన ఆది జన్మ మోక్షము పొందకపోవటం వలన ఈయన మానవ అవతారాలుగా దశావతారాలు పొందుతున్నాడని నా మనో దృష్టికి వచ్చినవి. మొట్టమొదట మహావిష్ణువుగా స్థూల శరీరంతో పరశురాముడిగా సూక్ష్మ శరీరంతో వామనుడిగా కారణ శరీరంతో సాధన చేయగా బ్రహ్మరంధ్రం సాధన వద్ద ఈయన కాస్త హయగ్రీవుడి అవతారమును పొందాల్సి వచ్చింది. అదే మళ్లీ శ్రీ గౌతమ బుద్ధుడిగా స్థూల శరీరంతో శ్రీరాముడిగా సూక్ష్మ శరీరధారిగా శ్రీకృష్ణుడిగా కారణ శరీరం ధారిగా బ్రహ్మరంధ్రం సాధన వద్ద అగ్ని సాధన చేస్తే సహన శక్తి కోల్పోయి నరసింహ మూర్తి గా అవతరించారు. 

అలాగే మీన కూర్మ వరాహ నరసింహ ప్రత్యంగిరా అవతారాలు ఏర్పడి ఉండి ఉండవచ్చును.ఈ అగ్ని సాధన స్థితిలోనే నర ముఖము ఉన్న గణపతి కాస్త గజముఖ గణపతి గాను ఐదు సార్లు ప్రయత్నించిన హనుమంతుల వారు కాస్త పంచముఖ హనుమంతుడుగా పంచముఖ గాయత్రీ గాను ఏకముఖ దత్తుడు కాస్త మూడు సార్లు ప్రయత్నించి త్రిముఖ దత్తుడిగాను, ఈశ్వరుడు కాస్త త్రిముఖ ఈశ్వరుడుగాను, దుర్గాదేవి కాస్త త్రిముఖ దుర్గ గాను ఇలా వారి వారి అంతిమ బ్రహ్మ రంధ్రము వద్ద సాధన చేసి అక్కడ ఉండే సహనశక్తి మాయను తట్టుకోలేక తలలు మార్చుకొని అవతారాలు ఎత్తుతూ ఉన్నారని నాకు అవగతము అయినది. ఇలా తలలు లేని వారు చిరంజీవి తత్వమును పొంది హిమాలయ పరిసరాలలో గుప్త శరీరాలతో గుప్త యోగులు గా సుమారు 1080 కోట్ల యోగులు సాధన కొనసాగిస్తున్నారు. తమకి ఆది బ్రహ్మ కపాలమోక్షం ఇచ్చే మోక్షగామి కోసం కొంతమంది పరమాత్మ స్వరూపాలు 36 కోట్ల దైవ స్వరూపాలు 84లక్షల జీవ జాతులు 1080 కోట్ల వివిధ రకాల యోగులు ఎదురుచూస్తున్నారని నాకు అవగతమయ్యేసరికి నాలో నాకే తెలియని వణుకు,భయము, దడ మొదలైంది. అంటే ఏకైక కోరిక మాయ వలన ఏకైక ఆత్మ కాస్త ఏకత్వము నుండి భిన్నత్వం గా ఇలా వివిధ రూపాలతో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలతో యోగ సాధన చేస్తూ బ్రహ్మ తదాకార స్థితిలో స్పందన లేని స్థితి హృదయ చక్ర ఆది జన్మ కపాల సిద్ధి కోసం అలాగే బ్రహ్మరంధ్రము వద్ద సహనశక్తి స్థితి కోసం అగ్ని సాధన చేస్తూ ఆది బ్రహ్మకపాల మోక్ష సిద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అనగా రావడమైతే పరమ శూన్యము వంటి రేణువు నుండి స్త్రీ బిందువుగా దీని నుండి మహాశూన్యం నుండి లింగమూర్తి గా పురుష దైవ కణంగా రావడం జరిగినది. ఈ రెండు కూడా కలిసిన అర్ధనారీశ్వరతత్వం లేదా శివ కేశవతత్వము గా మారినా ఏకతత్వ స్థితికి చేరడం లేదని భిన్నత్వము కాస్త తిరిగి ఏకత్వం స్థితిలోనికి అనగా పరమశూన్యంలోకి శూన్యంగా మారడం లేదని రేణువుగానే 24 అడుగుల శరీరము నుండి శరీరము లేని పిండి రేణువు గా మారినను ఈ శూన్య స్థితిని పొందలేక శూన్య బ్రహ్మగానే మిగిలిపోతుందని నాకు స్పురణ అయినది. అంటే అనంత పద్మనాభుడి కమలం నుండి వచ్చిన సృష్టి బ్రహ్మ కాస్త శూన్యంలో కలిసిపోకుండా (అనంత పద్మనాభుడు మహాశూన్యం అనుకుంటే) రేణువుగా మారి శూన్య బ్రహ్మగా అంటే ఏకైక కోరిక కోసం ఏకైక ఆత్మగా శూన్య బ్రహ్మగా మారిపోతున్నాడు ఈ పిండి రేణువునుండే పంచముఖ గణపతిగా అవతారము జరిగినది కదా.నేను అనేది నేను కానీ నేను గానే మిగిలిపోతుంది. నేను అనేది కాస్త నీది నాది మనది అనే త్రిమూర్తుల స్వరూపములుగా మారి సృష్టి స్థితి లయములతో నిజంలాంటి కలను నడుపు తున్నాయి. అసత్యము లాంటి దానిని సత్యముగా చూపుతున్నాయి. భ్రమ భ్రాంతి మాయలతో మర్మాలు చేస్తున్నాయి. ఈ విషయము నేను అనేది మరిచిపోయి నేను కానీ నేను గా మారకుండా మాయవలన నీది నాది మనదిగా మారి ఈ విశ్వసృష్టిని నడిపిస్తోంది. నేను అనే దానికి తను ఏమిటో ఎరుక అయితే గాని మాయ మాయం అవ్వదు. అంటే ఈ విశ్వమంతా ఉన్నదంతా నేను అనేది అన్నమాట. ఏకైక ఆత్మస్వరూపము అన్న మాట. నేను కానిది లేదు. నేను లేనిది లేదు. నేను ఇన్నాళ్ళూ మాయ వలన నేను కాదు అనుకుని నేను కానీ నేను ఉన్నదని దాన్ని ఆత్మ అని భగవంతుడిని పరమాత్ముడిని గురువు దైవము అని పేరు పెట్టుకుని తనకి తానే వేరువేరు అయిపోయింది. మాయలో పడిపోయింది. తల్లిగర్భము నుండి బిడ్డ వచ్చినట్లుగా నేను కాని నేను నుండి నేను బయటకి వచ్చిన అనంత పద్మనాభుడి బొడ్డు వద్ద ఉన్న మణిపూరక చక్రం కమలమునుండి విశ్వసృష్టి బ్రహ్మ వచ్చి వేరు పడినట్లుగా అన్నమాట. నిజానికి తల్లికి ఆ తల్లి నుండి పుట్టిన బిడ్డకి ఎలాంటి తేడా ఉండదు. కానీ మాయ వలన స్త్రీ పురుష లింగ బేధం హృదయ చక్రం వద్ద ఉన్న ఇష్టలింగము చేస్తోందని అనగా ఏకైక కోరిక చేస్తుందని సంతానము కావాలనే కోరిక కలిగితే గాని అది ప్రేమ మోహం వ్యామోహములుగా మారి కామ మాయ కి గురై స్త్రీమూర్తిని చేరి సంతానం పొందడం జరుగుతుంది కదా. అసలు సంతానం కావాలని కోరిక లేకపోతే ఈ విశ్వ సృష్టిలో సృష్టి చక్రం, బ్రహ్మాండ చక్రం, కాలచక్రం, ధర్మచక్రం, జన్మ చక్రాలు ఉండేవి కావు కదా. అంటే ఒకరకంగా ఎవరికి వారే తమ ఆది జన్మ అయిన నేను నుండి ఒక కోరిక మాయలో పడి ఈ విశ్వములో తమ ఇష్ట లోకాలు ఏర్పరచుకున్నట్లు గా (సృష్టి) వాటిలో ఉండునట్లుగా (స్థితి)వాటిలో పడిపోతున్నట్లుగా (లయం) ఊహించుకుంటూ కలలు కంటున్నారు. అంటే నేను అనేది తన ఇష్ట కోరిక అంటే తనకి సహచర్యం కావాలని అనుకోవటం తో నిజము లాంటి కలవంటి విశ్వ ప్రపంచము ఏర్పడి బ్రహ్మాండాలు గ్రహాలు లోకాలు అందులో వివిధ రకాల శరీర వాసులు ఇలా ఊహా ప్రపంచం ఏర్పడి ఎవరికి వారే ఈ లోకంలో ఇలాంటి అసత్య బ్రతుకులు బతుకుతున్నారు అన్నమాట. ఇందులో ఏవి నిజము కాదు. ఏవి సత్యము కాదు. నేను అనేది ఉండటము సత్యము లాంటి కల. ఎందుకంటే ఇది పరమ శూన్యము యొక్క రూపమే తను కాస్త ఆకార స్వరూపుడిగా అనగా నిరాకార పరబ్రహ్మ కాస్త ఆకార పరబ్రహ్మముగా ఉంటే ఎలా ఉంటుందని చూడాలనిపిస్తే ఇలా ఆకార స్వరూపము అనగా ఆకారము లేని నిరాకార పరమాత్మ శూన్యం నుండి ఆకారము ఉన్న శూన్యబ్రహ్మగా బయటకి వచ్చినాడు. అది కూడా ఆత్మస్వరూపముతో వచ్చి అది కాస్తా స్త్రీ పురుషులుగా విభేదనము చెంది అవి కాస్త చేరి 3 పురుష /త్రిమూర్తులు 3 స్త్రీ స్వరూపాలు/ త్రిశక్తులుగా రూపాంతరముగా ఇవి కాస్త సృష్టి స్థితి లయ అంటూ మాయ కర్మలు సృష్టించుకొని ఇచ్చా క్రియా జ్ఞానశక్తిల వంటి త్రిగుణ మాయ లను సృష్టించి బ్రహ్మాండాలు అండాలు పిండాలు అంటూ జీవక్రియలు చేస్తున్నట్లుగా కలలు కంటూ నేను దుంప తెంచినాయి. అసలు విషయము మర్చిపోయేటట్లు గా చేసినాయి. అంటే ఇది అంతా ఎలా ఉంది అంటే ఒక యోగి మహా శివరాత్రి నాడు గంగా స్నానం చేద్దామని స్నానానికి వెళుతూ తన ఇష్టమైన కమండలము ఆ నది ఒడ్డున ఉంచి దానిమీద గుర్తుగా మట్టితో లింగము లాగా పోసి కప్పివేసి స్నానానికి వెళ్లి పోయినాడు. ఇది గమనించిన ఒకడు ఆ యోగి ఇలా చేశాడు అంటే ఏదో పరమార్ధం ఉంటుందని వీడు ఏదో ఊహించుకుని వాడు కూడా మట్టితో లింగము లాగా చేసినాడు. వీడిని చూసి మరొకడు ఇలా సుమారుగా అక్కడ కోటానుకోట్ల మట్టి లింగాలను సృష్టించబడినాయి. ఇంతలో స్నానానికి వెళ్ళిన యోగి తన కమండలము తీసుకుందామని వచ్చే సరికి తను చేసిన మట్టిలింగం లాంటివి కోటానుకోట్లుగా కనిపించేసరికి అందులో తన మొదటి లింగంఏదో తెలుసుకోలేక తన కమండలము మరవలేక వదిలి పెట్టలేక ఎప్పటికైనా అది కనబడక పోతుందా అని ఎదురు చూస్తూ ధ్యాన స్థితిలో ఉండి పోయినాడు. 
ఈ యోగి ఎవరో కాదు. ఆదియోగి అయిన పరమశివుడు. ఆయన ఏకైక ఇష్ట కోరిక శాశ్వత మరణావస్థ అనగా బ్రహ్మకపాల మోక్ష ప్రాప్తి కోసం ఆయన నిరంతరముగా ధ్యాన స్థితి లో ఉంటున్నాడు. కానీ తన ఇష్ట లింగము యొక్క కోరిక మాయను దాటలేక పోతున్నాడు. కైలాస పర్వతము లో సాంబశివుడుగా ప్రతి జీవి సహస్రార చక్రము పిట్యూటరీ గ్రంథి లోపల కారణ శరీరంతో నేను నేనుగా నిరంతరముగా అర్థ నిమీలిత నేత్రాలతో నిద్ర మెలుకువగాని సమాధి అవస్థలో మనలో నిరంతరం ఓంకారనాదంతో తారకరామ మంత్రముతో ధ్యానము చేస్తున్నాడని నాకు అవగతమయ్యే సరికి అలాగే హృదయ చక్రము నందు అనంతపద్మనాభుడు బ్రహ్మతదాకార స్థితిలో తుంకార నాదముతో స్పందన రాహిత్యము స్థితి కోసం అంగుళ పరిమాణంలో సంకల్ప శరీరముతో సాధన చేస్తున్నాడని బ్రహ్మరంధ్రము వద్ద ఉండే ప్రత్యంగిరా దేవత మహామాయ సహన శక్తి కోసం అగ్ని ఆరాధన చేస్తున్నాడని అవగతమైనది. ఇదంతా చైనా పెట్టెల మాదిరిగా ఉందని నాకు అనిపించసాగింది. ఇందులో సైజులు తగ్గుతూ ఒక పెట్టెలో మరొక పెట్టె అందులో మరొక చిన్న పెట్టె అందులో మరొక చిన్న పెట్టె ఇలా ఒక అడుగు పెట్టే పరిమాణం నుండి అంగుళం పెట్టె అనగా సుమారుగా తొమ్మిది పెట్టలు ఒకే ఒక పెట్టెలో ఉన్నట్లు గా ఉన్నారని మనకు వారికున్న ఏకైక కోరిక మాయ తీరితేగాని పదార్థ మాయ దాటలేరని యదార్థము తెలియదని దానివలన మూలస్థానం తెలుస్తోందని టీవీలో ఆ సమయానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు వచనము నా చెవిలో పడుతుండగా నాకు తెలియకుండానే యోగ మత్తు నన్ను ఆవరించినది. నేను కి ఇష్ట కోరిక మాయ ఆవరించినట్లుగా... నేను నిద్ర లేచే సరికి ఇదంతా కూడా అర్థం అయ్యి అర్థం కానట్లుగా ఉంది. నేను అనేది ఇష్ట కోరిక మాయలో ఉన్నదని ఈ మాయను ఛేధిస్తే మనకి కపాల మోక్షప్రాప్తికి అవకాశం కలుగుతుందని నెమ్మది నెమ్మదిగా అర్ధం అవ్వ సాగినది. అంటే చిదంబర క్షేత్రంలో పార్వతి మహేశ్వరుడికి తీవ్ర పోటీలో నాట్యం చేస్తూ ఉండగా శివుడు తన నగ్నత్వం యొక్క మాయను దాటి ఎడమ కాలును పైకి లేపితే అమ్మవారు తన నగ్నత్వంకు సిగ్గుపడి భయముతో కాలు ఎత్తక పోయేసరికి మహేశ్వరుడు కాస్త దిగంబర తత్వముతో విజేత అయితే అమ్మవారు సిగ్గు వలన ఏర్పడిన నగ్నత్వం  వద్ద ఆగిపోయిందని ఇదే అసలు సిసలైన చిదంబర రహస్యం అని అంటే అమ్మవారికి ఉన్న నగ్నత్వం సిగ్గు అనే కోరిక వలన విశ్వం అంతా చలన స్థితిలో ఉందని నిజములాంటి భ్రమ కలిగిస్తోందని అదే శివుడు తన చలన రహిత స్థితి నేను పొందిన దిగంబర తత్వ సిద్ధి వలన అచేతన స్థితిలో ఉన్న తనలో ఉన్న నేను కానీ నేను అనేది చేతన స్థితిలో ఉండటం వలన బ్రహ్మము సత్యముగాను ప్రకృతి అసత్యంగా ఇలా ద్వంద్వ ప్రవృత్తిగా ఈ లోకవాసులకు అగు పడుతుందని స్పురణకు వచ్చినది. అంటే ఇది అంతా ఒక యోగి గోచీ గుడ్డ కథ లాగా ఉంది. అంటే ఒక నగ్న యోగికి ఒకరోజు తన మర్మాంగం చూసి సిగ్గు కలిగి దానిని ఎవరికి చూపకూడదని ఒక గుడ్డ కట్టుకోవడం ఆరంభించాడు. ఇది గమనించిన గణపతి ఎలుక కాస్తా దీనిని ఎత్తుకొనిపోవడము ఆరంభించినది. దీని బాధ పడలేక అమ్మవారి పులి అంశ అయిన పిల్లిని పెంచసాగినాడు.దీని పోషణార్ధము దత్తుడి మాయావి అయిన ఆవును పెంచసాగినాడు దీని పోషణార్ధము గడ్డి కోసము అన్నపూర్ణాదేవి అంశ అయిన గడ్డిని పెంచటం కోసం వ్యవసాయం చేయడం ఆరంభించాడు. ఇటు వ్యవసాయము అటు ఇంటి పనులు చేసుకోలేక అనగా బ్రహ్మతదాకార స్థితిలో ఉండలేక ఇల్లాలును తెచ్చుకున్నాడు. ఈమెను చూసిన మోహ వ్యామోహం కాస్త ఏకైక కామ కోరికగా మారి 12 మందిని కన్నాడు. వీరికోసం గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, లోకాలు, బ్రహ్మాండాలుతో కూడిన విశ్వమును తయారు చేసుకొని ఇదంతా చేసిన తర్వాత విసుగు చెంది బైరాగి విరాగిగా మారి ఏకైక ఆత్మగా నేను గా మారిపోతున్నాడు . వేరేగా ఏకైక ఆత్మగా నేను గా మారిపోతున్నాడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సిగ్గు అనే నగ్నత్వం మాయ వలన ఆశకి లోనై ఎలుక నుండి ఈ బ్రహ్మాండములను సృష్టించి దానిని ఆడించడం వైరాగ్యం చెంది నాశనం చేస్తున్నాడు కానీ తను నాశనం అవ్వడం లేదు. 

ఎందుకో తెలియని కోరిక మాయలో పడుతున్నాడు. కష్టాలే కోరిక యొక్క మూలం అని తెలుసుకొనికోరిక లేని సమాజము చూడాలని కోరికను పెట్టుకున్న బుద్ధుడి లాగా నేను పరిస్థితి ఉన్నదని కోరికలు మూలమని తెలుసుకొని వాటిని తీరని కోరికలు,తీరే కోరికలు, తీర్చే కోరికలు కూడా దాటుతూ ఏకైక ఇష్ట కోరికను నేను అనేది దాటలేక పోతుందని అనగా మహా శివుడి శాశ్వత మరణ కోరికలాగా మహావిష్ణువు స్థితి కోరికలాగా మహా బ్రహ్మ సృష్టి కోరిక లాగా దత్తుడు భక్త దీనజనోద్ధరణ కోరికలాగా మహా ఆదిపరాశక్తి నగ్నత్వ కోరికలాగా హనుమత్ తన ఇష్ట దైవ సేవ కోరికలాగా ఏదో ఒక తమ ఏకైక ఇష్ట కోరిక మాయలో తనకి తెలియకుండానే నేను పడిపోతుందని నాకు అవగతమైనది. అంటే నేను అనేది తన అంతిమ సాధన స్థాయికి అనగా బ్రహ్మరంధ్రము వద్ద అగ్ని సాధన స్థితికి వచ్చేసరికి రూపము దహనము కావలసిన చోట అనగా రూపము అంతము కావలసిన చోట రూపాంతరం చెందుతుందని అక్కడికి వచ్చే తన ఇష్ట కోరిక మాయ వలన సహన శక్తి కోల్పోయి రూపమును నేను అనేది మార్చుకొని రూపాంతరం చెంది మరొక కొత్త రూపంతో అవతరిస్తుందని నాకు మనో దృష్టి  ముందు కదలాడి స్పురణకి వచ్చింది. అంటే మొదట నేను కి ఇష్ట కోరికగా తిరుపతి లడ్డు వ్యామోహం ఉంటే అది కాస్త రూపాంతరం చెంది మోతీచూర్ లడ్డు గా మారిన ఇష్ట కోరిక గా మారి దీనిని అనుభవించడానికి కర్మగాను జన్మగాను నేను అనేది రూపాంతరం చెందుతుంది.పోనీ లడ్డూలు మానేస్తే మిరప బజ్జీలుగా ఇష్ట కోరికగా మారితే నేను ఏమి చేస్తుంది. కోరిక లేని స్థితి పొందాలనేది కూడా కోరిక గదా.అంటే ఈ లెక్కన కపాల మోక్షము పొందాలనే కోరిక ఉంటే అది మనకు సాధన అంతిమ స్థాయిలో తీరని ఇష్ట కోరికగా మారవచ్చును కదా. మరి కోరిక లేకపోతే ఆ కోరిక తీరినట్లుగా ఎలా తెలుస్తోంది.తెలుస్తోంది  అంటే నీవు ఉన్నట్లే కదా. తెలియకపోతే అది తీరినట్లు అవునా కాదా తెలియని అయోమయ స్థితి. తెలుసుకుంటే మాయ తెలుసుకో లేకపోతే అనుమానము. స్పందిస్తే మాయ. స్పందించకుండా ఉండలేని స్థితి. అంటే చచ్చిన వాడికి వాడు చచ్చాడని వాడికి తెలియదు. వేరే వాళ్ళు ఉండరు. ఉన్నది తను ఒక్కడే కదా. అదే నేనే కదా. వేరే వాళ్ళు ఉన్నా కూడా చచ్చిన వాడికి ఎలా అర్థమైనట్టుగా తను చచ్చిపోయాడని చెబుతారు. అంటే ఇదంతా సిరివెన్నెల సినిమా లాగా ఉంది. అందులో హీరో గుడ్డివాడు. హీరోయిన్ మూగది. మరి గుడ్డివాడికి ఈమె చేసే సైగలు కనిపించవు. వాడు చెప్పే మాటలు ఈమెకి అర్థం కావు. మధ్య లో మూడో వ్యక్తి తో ఎవరితో సంబంధము లేక పోతే. అంటే చచ్చిన వాడికి తను చచ్చిన విషయం తెలియని స్థితి. రేపు నేను కూడా సాధన చేస్తే కపాల మోక్షం పొందినను కూడా తెలియని స్థితి. పొందినానో పొందలేదో తెలియని అయోమయ స్థితి. పొందినాను అంటే మోక్ష కోరిక మాయ కు గురి అయినట్లే కదా. మళ్ళీ మోక్ష లోకమును సృష్టించటం జరుగుతుంది కదా. అందుకే కాబోలు ఉరి తీసే ముందు తన చిట్ట చివరి కోరిక ఏమిటో తెలుసుకుని అది వారికి తీర్చి ఉరి తీస్తారు. అలాగే చచ్చినవారికి పిండ ప్రధాన ద్వాదశ కర్మ ప్రక్రియలో వారికి ఇష్ట పదార్థాలు ఆనవాయితీగా పెట్టడం జరిగింది అని నాకు స్పురణకు వచ్చినది. మోక్షప్రాప్తి గూర్చి శ్రీ లాహిరీ మహాశయుడు ఒక డైరీలో తనకి మోక్షము కలిగినది అని ఎవరైనా అన్నట్లు అయితే అతనికి మోక్షము కలగలేదని తెలుసుకోవాలని ఎందుకంటే ఆకలి దప్పికలు, దేహ బోధ, దేహ జ్ఞానము మొదలైనవి మాయలో ఉన్న వాడికే కలుగుతున్నాయని కానీ వస్తుతః మోక్షప్రాప్తి పొందిన వారికి ఆకలి దప్పికలతో పాటు దేహ బాధలు,బోధలు, ఈతిబాధలు,జ్ఞానములు  ఉండవని అతనికి సుఖదుఃఖాలుయందు రాగద్వేషాలుయందు జ్ఞానము అజ్ఞానము యందు అనగా తనకి మోక్షము కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతడికి ఉండకపోతే శూన్యములో విలీనం అవుతాడని కాకపోతే ఇది ఒక విచిత్రమైన అవస్థ అని ఈ అవస్థను పొందలేని వారు ముక్తి జీవులుగా ఉండిపోతారని కానీ వీరందరికీ అంతా బ్రహ్మ మయం గానే కనబడుతుందని భౌతిక పదార్థము కాస్త బ్రహ్మ పదార్థంగా కనబడుతుందని అద్వైత స్థితిని అనుభవిస్తుంటారని కానీ ఏకత్వం స్థితిని మీరు పొందలేరని అనగా ఈ విశ్వ బ్రహ్మ పదార్ధము లో మీరు విలీనం కాకుండా శూన్య బ్రహ్మగా మారి అనగా శుకమహర్షి లాగా (వేదవ్యాసుడి కుమారుడు) బ్రహ్మమును చూస్తారని వీరు ఎన్నటికీ దైవ ద్వైత స్థితిలోనికి తిరిగి రారని పైగా అన్నిటియందు బ్రహ్మమును చూస్తూ ఎలాంటి ప్రయాస లేకుండా బ్రహ్మములో విలీనం కాకుండా వారిని చూస్తూనే శూన్యబ్రహ్మగా నిలిచి ఉండి పోతారని ఇట్టివారిని భగవద్గీత స్థితప్రజ్ఞుడు అని  తత్వమసి అని చెప్పినదని రాసుకున్నారు. అంటే ఈ లెక్కన చూస్తే చావాలని అనుకునేవాడు ఎలాంటి కోరికలు లేని అతీత స్థితి పొందితే కలిగేది మోక్షప్రాప్తి. ఒకవేళ ఏదైనా ఏకైక ఇష్ట కోరిక మాయలో పడితే కలిగేది ముక్తి ప్రాప్తి అంటే నేను అనేది నేను కానీ నేను గా మారితే మోక్షప్రాప్తి లేకపోతే నేను అనేది ఎలాంటి రూపాంతరము చెందకుండా నేను గా ఉండగలిగితే ముక్తి ప్రాప్తి అంటే నేను అనేది ఆత్మయని స్వస్వరూప జ్ఞానం పొందితే ముక్తి ప్రాప్తి అది కాస్త నేను అనేది ఆత్మ అని మరిచిపోతే మోక్షప్రాప్తి అన్న మాట. నేను అనేది నామ రూపాలలో ఇరుక్కుంటే అజ్ఞానప్రాప్తి నేను అనేది ఆత్మ గా ఉంటే జ్ఞానప్రాప్తి నేను అనేది చలన స్థితిలో ఉంటే మాయ సహితము అదే స్థిరంగా ఉంటే మాయ రహిత స్థితి అన్నమాట. అన్నమాట ఏమిటి ఉన్నమాట ఇది. వామ్మో! ఇదంతా అర్ధమయ్యి అర్ధం కాని అయోమయంగా ఉంది. అంటే ఈ లెక్కన నేను సాధన చేసి చిట్టచివరి అంతిమ స్థాయికి వచ్చిన తర్వాత నాకు మోక్షప్రాప్తి కలిగిందో లేదో తెలియని స్థితి అన్న మాట. పొందినాను అంటే మాయలో ఉండినట్లు. పొందలేదు అంటే పొందకపోవడం కాదు. దీనమ్మ జీవితము. అన్నిటిని వదిలిపెట్టి జీవితానికి సాధన ప్రక్రియలతో నానా చంకలు నాకిస్తే చిట్టచివరికి మనకు మిగిలేది అర్థమై అర్థం కాని విచిత్ర అవస్థ. అదే మోక్ష ప్రాప్తి కలిగిందో లేదో తెలియని అవస్థ. పోనీ సాధన ఆపేస్తే కోరికలు, కర్మలు, జన్మలు, విషయ వాసనలు,పుట్టడాలు,చదవడాలు,ఉద్యోగాలు ,పెళ్లిళ్లు, పిల్లలు, ఈతిబాధలు, కష్టసుఖాలు, మరణాలు ,ఆవేదనలు, వంశాల అభివృద్ధి, కష్టనష్టాలు ఇలా జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎన్నటికీ ఆగదు. ఇందులోనించి మనకి మనమే బయట పడే దాకా ఆ జీవితం నాటకం ఆటలో మనకి మనమే ఈ నాటక పాత్ర నుండి తప్పుకోవాలి. మనము తప్పుకున్న జీవిత ఆట నాటకము కొనసాగుతూనే ఉంటుంది. నేను కాకపోతే నా పాత్రను మరో నేను వేస్తూనే ఉంటారు కదా. ఆట ఆగదు. నాటకము సాగదు అంటే వెయ్యి కొరడా దెబ్బలు (సహస్రారచక్రము 1000 పద్మము) తినాలా ఒకే ఒక కొరడాదెబ్బ (ఏకైక ఇష్ట కోరిక హృదయ చక్రం) తింటూ ఉండాలా ఏది చేసినను కొరడాదెబ్బలు లేదా కొరడాదెబ్బ తప్పదు. సాధన చేస్తే ఒక దెబ్బ సాధన చేయకపోతే వెయ్యి దెబ్బలు ఉంటాయని అవగతమైనది. వెయ్యి కోరికలు వెయ్యి కోట్ల జన్మలు 1000కోట్ల జన్మలుx10 లక్షలు =10 లక్షలు ఆయుష్షు తో  84లక్షల జీవజాతులతో భూలోక వాసులుగా మన కాలచక్రంతో కూడిన జీవిత చక్రము నడుస్తుంది. అదే ఒక కోరిక ముక్తి జీవి.శూన్య బ్రహ్మ స్థితి. పరమాత్ముడుగా కారణలోకవాసిగా జీవిస్తాము. జీవించటం ఖాయం. అది శివుడిగానా జీవుడిగానాఅని మనకి మనమే నిర్ణయించుకోవాలి. సాధన చేస్తేజీవుడు కాస్త శివుడు అవుతాడు.సాధన  చేయకపోతే శివుడు కాస్త జీవుడు అవుతాడు.శివుడి గా ఉంటే తనలో తాను స్పందించాలి. అదే జీవుడుగా ఉంటే తనకు తాను స్పందిస్తాడు. 

ఈ అవస్థ ఎలా ఉన్నది అంటే మహా కాలకూట విషము సేవించిన మహాశివుడు మరణము పొందకపోవడం అదే అమృతం సేవించిన అమర జీవులైన దేవి దేవతలు మరణావస్థను పొందటం లాగా ఉన్నది.విషము  త్రాగిన వాడు బ్రతికే ఉండటం ఏమిటో అమృతము త్రాగిన వాడు చచ్చిపోవటం ఏమిటో నాకైతే అసలు అర్థం అవ్వటం లేదు. కనీసం మీకైనా అర్థం అవుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పండి. ఆలోచించండి. నాటకము వెయ్యాల( పాత్రధారి) నాటకము చూడాలా(ప్రేక్షకుడిగా) నాటకం ఎన్నటికీ ఆగదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ మన స్థితియే మారుతుంది. అనగా ప్రేక్షకుడుగానా పాత్రధారిగానా.ఇందులో ప్రేక్షకుడు అంటే నాటకం చూడాలనే ఎకైక  కోరిక ఉన్న ముక్తి జీవి అదే నాటకం వేయాలనే  పాత్రధారి అయితే వివిధ రకాల వేషాలు పాత్రలు వేయాలని 1000 కోరిక పాత్రలు కోసం తపన పడే భోగ జీవి అవుతాడని ఈ రోజునే కాస్త కాస్తగా నెమ్మది నెమ్మదిగా నాకు అర్థం అవుతోంది. బుర్ర తిరుగుతోంది. మెదడు మొద్దుబారుతుంది. పుర్రె ఒక్కటే కాని దానికి బుద్ధులే అనేకము అన్నమాట. పుర్రెకో బుద్ధి అని ఊరికేమన పెద్దలు అనలేదు. చిట్టచివరి సాధన అంతిమ స్థాయిలో మనకి మిగిలేది ఆది బ్రహ్మకపాలమే. దీని యొక్క బ్రహ్మరంధ్రమును పూడ్చడానికి మూలాధార చక్రంలో ఉన్న స్వయంభువు లింగమును అన్ని చక్రాలు దాటిస్తూ ఈ బ్రహ్మ రంధ్రములో పెట్టే సమయానికి ఇష్ట కోరిక మాయ అయిన ఇష్టా దేవి కనిపించి సహనశక్తిని పరీక్షించి అందులో నెగ్గితే మనకి బ్రహ్మకపాల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే గది బయట ఉన్నవాడు ఖాళీ గదిలోనికి వెళ్లి మాయం అవ్వటము అన్నమాట.చూసే వాడు ఉండేవాడు. ఉండేవాడు ఉండడు. ఏమిలేని ఏమి కాని స్థితి. అంటే ఈ విశ్వము యొక్క ఆదిలోనే ఆది బ్రహ్మ యొక్క బ్రహ్మకపాలం యొక్క చితాగ్ని నుండి పిండి రేణువు వంటి కపాల లింగమూర్తి అగ్ని శిఖ తేజస్సు బయటికి వచ్చి ఉండాలి. అది కాస్త హృదయ చక్రానికి ఇష్ట కోరిక మాయ వలన చేరి ఉంటుంది. అది కాస్త అంగుళ పరిమాణంలో ఇష్టలింగముగా మారి ఉంటుంది. అంటే కపాల లింగము కాస్త ఇష్టలింగముగా మారినది. ఈ హృదయ చక్రము నందు స్పందన వలన నారాయణుడు వానరుడిగా జీవనాడి మార్గం ద్వారా సహస్రార చక్రానికి చేరుకొని ఉంటారు. ఇక్కడ ఏకైక కోరిక కాస్త 1000 కోరికలుగా రూపాంతరము చెంది ఉండాలి. దానితో ఇష్టలింగము కాస్త సహస్రలింగంగా మారిపోయి ఉండాలి. వానరుడు కాస్త వానరుడుగా నారాయణుడిగా ఈ సహస్రంలో శివ కేశవుడిగా ద్వైత భావము లోనికి వచ్చి ఉండాలి. ఈ సహస్ర లింగము కాస్త బ్రహ్మ చక్రం లోనికి వచ్చి బ్రహ్మ లింగముగా రూపాంతరం చెంది సృష్టి బ్రహ్మ గా మారి నరులను, దైవాలను,జీవాలను సృష్టించటం జరిగి ఉండాలి.ఈ వెయ్యి కోరికల కోసం ఈ జీవరాశి వెయ్యి కోట్ల జన్మల ఆయుష్షుకోసం ఈ లింగము కాస్త కాలలింగముగా మారి కాలచక్రము లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న మహాకాళుడు మహాకాళికల చేత కాలభైరవుడు సృష్టి యజ్ఞము చేయించి స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలను సృష్టించి వారికి జన్మలు జననాలు మరణాలు ఇవ్వటం జరిగినది. ఏ యే కర్మలకి ఏ యే జన్మలు ఎత్తడానికి వీలుగా ఈ కాలలింగము కాస్త కర్మ చక్రమునందు ప్రవేశించి యోగ లింగము గా మారి వారి కర్మ వాసనల కోసం నర నారాయణుడు అవతారాలు ఎత్తించడం జరిగినది అన్నమాట. కర్మవాసనలు అనేవి కోరిక యొక్క త్రిగుణాలు స్పందించడం వలన కలిగించాలని ఈ యోగ లింగము కాస్త భోగలింగముగా మారి త్రిముఖ త్రిశక్తి అవతారి అయిన శ్రీ దత్త స్వామిని ఏర్పరిచి ఉండి ఉండాలి. ఈ భోగలింగము కాస్త మరి మాయలో పడి ప్రకృతిని ఏర్పరిచి పంచభూతాల కోసం పంచభూత లింగాలుగా విడిపోయి ఆజ్ఞాచక్రము చేరుకొని జీవ మాయలలో జీవరాసులని అనగా తను ఏమిటో వారికి తెలియని స్థితిలో ఉంచింది. దానితో నేను అనేది ఎవరో సంపూర్తిగా మర్చి పోయే స్థితికి అసంపూర్తిగా చేరుకోవడం జరిగినది. ఇక అక్కడ నుండి ఈ లింగము కాస్త విశుద్ధ చక్రమును చేరుకొని జ్ఞాన లింగముగా మారి జీవరాసులకు వివిధ రకాల పదార్థాలు మాయల జ్ఞానం ఇచ్చి వేదమాతగాను జ్ఞానదేవుడి గా రూపాంతరం చెంది అప్పుడు మళ్లీ ఈ లింగము కాస్త అనాహత చక్రంకి చేరుకొని చావు మరణాల భయాలు కలిగించే మృత్యుంజయ లింగంగా మారి మరణాలు తీసుకోవటం ఆరంభించి ఉండాలి. అది కాస్తా మహాకాలుడు మహాకాళిక రూపంలో వినాశన కర్తలుగా రూపాంతరం చెంది ఉండాలి. ఆ తర్వాత ఈ లింగము కాస్త మణిపూరక చక్రానికి వచ్చి జ్ఞానము పొందిన వారిని  సిద్దుల మాయలలో శక్తుల మాయలలో తీర్చే వారిని తీర్చే వారిగా వీరిని మార్చే దైవత లింగముగా రూపాంతరం చెంది ఉండాలి. ఆ తర్వాత ఇది కాస్త స్వాధిష్ఠాన చక్రానికి చేరుకొని జ్ఞానము తెలియని స్థితి పొందటానికి బంగారు లింగముగా మారి లక్ష్మీనారాయణుడుగా ధన మాయను ఏర్పరచినది. ఆ తర్వాత మూలాధార చక్రానికి చేరుకొని ఇన్ని రకాల ప్రక్రియల మూలమైన ఆధారమైన సృష్టి లింగముగా మారి గణపతి రూపంలో వివిధ రకాల మాయ పదార్థాలును మాయ రూపాలను సృష్టించి అండ పిండ బ్రహ్మాండాలను అధినాయకుడిగా ఏర్పరిచి ఉండాలి. ఇది నా ఊహ. నా వ్యక్తిగత అభిప్రాయం. నిజమో కాదో తెలియదు. మోక్ష లింగము కాస్త సృష్టి లింగము ఎందుకు కాకూడదు. కపాల మోక్ష లింగం కాస్తా(బ్రహ్మ రంధ్రం) మూలాధార చక్రములోని సృష్టిలింగము ఎందుకు కాకూడదో ఆలోచించండి. నిజానికి యోగ సాధన అంటే మన మూలాధార చక్రంలో ఉన్న పరమ లింగమును (సృష్టి లింగము) బ్రహ్మరంధ్రము లోనికి తీసుకొని వెళ్లి ఆ రంధ్రమును ఈ రేణువు వంటి లింగముతో పూడ్చగలిగితే అంతా సర్వము చీకటి మయం అవుతుంది. చీకటి గదిలో అన్ని ఉంటాయి. ఏమి ఉన్నాయో ఎవరికీ తెలియదు. గుర్తుపట్టలేరు కదా.

అలా ఈ లింగము తో ఆ బ్రహ్మరంధ్రమును శాశ్వతముగా మూసివేస్తే సర్వము చీకటి అవుతుంది మహా చీకటి ఉన్న విశ్వం అంతా చీకటిగా పూర్వ యదార్థ స్థితికి చేరుకుంటుంది బ్రహ్మకపాలం యొక్క బ్రహ్మరంధ్రము వలన ఈ కపాలంలో ఉన్న వెలుగు బయటికి వచ్చి కారు చీకటిలోఉన్న విశ్వము ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. లేని దానిని ఉన్నట్లుగా తెరమీద సినిమాలాగా నిజానికి సినిమా సత్యము కాదు కదా. తెర ఒక్కటే సత్యం.కాని మనకి సినిమా చూస్తున్నంతసేపు సత్యమైన తెర కనిపించదు. కేవలం అసత్యమైన సినిమా సత్యము గా కనబడుతుంది. అలాగే మనకి చావుకి అంతమైనప్పుడు మిగిలే కపాలము యొక్క బ్రహ్మ రంధ్రం కనిపించదు.ఈ కపాలమునకు కారణమైనఇష్ట లింగం యొక్క వివిధ రూపాలు అవస్థలు మాయలు సినిమాలోని పాత్రలుగా పాత్రధారులుగా కనపడినట్లు గా కనబడుతుంది. నిజానికి ఈ సృష్టిలో ఏదీ లేదు. దేవుడు లేడు. జీవుడు లేదు. భయము లేదు. ఉన్నాయని భావన మోక్షము పొందాలనే కోరిక తను జీవించి ఉన్న అనే ఆశ తను మరణించలేదని తెలియని మరణభయము. నువ్వు ఎప్పుడో ఆదిలోనే 3 క్షణాలలోనే పుట్టటం పెరగటం మరణము పొందడం జరిగిన ఎవరూ నమ్మలేని నగ్నసత్యం ఇదే. ఇప్పుడు కొత్తగా పుట్టేది లేదు.చచ్చేది లేదు.నువ్వు చచ్చిపోయావని తెలుసుకోవడమే నీ జీవిత యోగ సాధన అని నేను చెబితే మీరు నమ్మగలరా! ఈ జీవితం అసత్యమని సత్యం తెలుసుకోవటమే జీవిత సత్యం అంటే నమ్ముతారా! నమ్మలేరు. నా మీదకి యుద్ధానికి వస్తారు. చచ్చినవాడితో ఎలా చచ్చావు అని చెప్పాలో మీకేమైనా తెలిస్తే చెప్పండి. మనమంతా ఎప్పుడో చచ్చిన జీవులమే. ఆది బ్రహ్మ వచ్చి బ్రహ్మ కపాలం గా మారిపోతూ తను చనిపోయిన విషయమును అనుభూతి పొందకుండా చచ్చి పోవడం వలన (ఒకవేళ అనుభూతి పొందితే వాడు నిజానికి చచ్చినట్టు కాదుగదా) తనలో మిగిలి పోయిన ఊహలు కాస్త ఈ బ్రహ్మకపాలం అమితంగా ఊహించుకోవటం వలన అది కొద్దిగా బ్రహ్మ రంధ్రంలో విచ్చిన్నం చెంది ఒక రేణువు వంటి లింగంగా మారి ఈ సృష్టిలో అధిదైవముగా ఆదిదేవుడిగా ఆదియోగిగా లేని రూపాలుగా అవతారమెత్తినట్లు గా కదులుతున్నట్లుగా చేస్తున్నట్లుగా తనకి తానే ఊహాలోకాన్ని కలలో ఒక నాటకం లాగా ఏర్పరచినది. అంటే ఏమీ లేని శూన్యం నుంచి ఒక విత్తనము ఏర్పడితే దాని నుండి ఒక చెట్టు ఏర్పడటం నిజమా అబద్దమా ఒకసారి ఆలోచించండి.అంటే ఒక చిన్న మర్రి విత్తనములో అంత పెద్ద మర్రి చెట్టును దాచి ఉంచడం సాధ్యమా? ఆలోచించండి. సాధ్యము కాదు కదా. అంటే నిజానికి ఏమి జరుగుతోంది. శూన్యము నుంచి చిన్నపాటి శూన్యము కలిగిన విత్తనము వచ్చింది. ఇది కాస్త నేను పగిలితే ఎంతటి చెట్టులాగా పెరగాలో ఊహించుకుంటుంది.ఆ ఊహే మనకి ఒక చెట్టులాగా పుట్టినట్లుగా పెరిగినట్లుగా చచ్చినట్లు కనబడుతోంది. మరి నిజానికి చెట్టు ఉందా? లేదు కదా. ఉంటే విత్తనములో చెట్టు కనబడాలి గదా.కనబడటం లేదు గదా. అంటే ఒక సినిమాని మీరు 70mm థియేటర్లో చూడవచ్చును. ఇదే సినిమాను మూడు అంగుళాలు ఉన్న మీ ఫోన్లోనూ చూడవచ్చును కదా. ఇది ఎలా సాధ్యమో అలా ఈ సృష్టి అనేక రహస్యాలు కూడా సాధ్యమే. విత్తనము విడదీస్తే మిగిలేది మనకి శూన్యమే కదా. మరి చెట్టు ఏది? ఈ చెట్టు అనేది విత్తనము యొక్క కల. మరి ఈ విత్తనం అనేది శూన్యము యొక్క కల. శూన్యము అనేది అంటే ఉన్నదో లేదో తెలియని స్థితి. అంటే గాలి ఉందా అంటే అనుభూతి ద్వారానే తెలుస్తుంది. కానీ దానికి ఆకారము లేదు కదా. అలాగని లేదు అనలేం కదా. దేవుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు. ఇప్పుడు లేడు.మా దేవుడు చచ్చిపోయాడు. మా దేవుడు సమాధి చెందినాడు అని మహా దేవుడు స్మశాన వాసి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు గదా. లేనివాడిని లేనివాడు ఊహించుకోవటం ఎంత విడ్డూరమో ఒకసారి ఆలోచించండి. ఇది నా ఊహ. నా భావన. ఇది నిజమో అబద్ధమో మీరే తేల్చుకోండి. ఎవరు కూడా వేరే అర్ధాలతో అపార్థం చేసుకోకండి. పదార్థం దాటితే గాని యదార్థము తెలియదు. యదార్థము దాటితే గాని మూలార్ధము తెలియదు అనే దానిని నేను ఖచ్చితంగా నమ్మే వ్యక్తులలో ఒక్కడిని. అంతెందుకు మనము నిత్యం పూజించే మన దేవుళ్ళు అందరూ కూడా మరణమును పొందిన వారే కదా. పరమశివుడు స్మశాన వాసిగా ఆదిపరాశక్తి  చితాగ్నిగా(లలిత నామములలో) శ్రీరాముడు కాస్త సరయూ నదిలో శరీర త్యాగం శ్రీకృష్ణుడు కాస్త విలుకాని చేతిలో మరణం శిరిడిసాయి కాస్త 1918వ సంవత్సరంలో జీవ సమాధి చెందడం యేసు ప్రభువు సిలువ మరణము (మూడు రోజుల తర్వాత సూక్ష్మధారిగా)ఇలా వారి మతాలలో వారి దైవాలు చిట్టచివరికి ఆది బ్రహ్మకపాల స్థితికి చేరినవారని తెలుస్తోంది కదా. ఇది నిజమా? అబద్దమా మీరే ఆలోచించుకోండి .

అంటే మన వివిధ దైవాలు అందరూ గూడ ఇలా బ్రహ్మకపాల స్థితికి చేరుకున్నారు. చివరికి జీవుడు చనిపోయిన మిగిలేది కపాలమే కదా. ఈ కపాలానికి ఉన్న బ్రహ్మరంధ్రమే కదా. మన ఆదిదేవుడు పుట్టడం నిజం. జీవించడం నిజము. మరణించడం నిజము. బ్రహ్మకపాలంగా మిగిలిపోవటం అంతే నిజం. ఇదే నగ్నసత్యం. మా ముత్తాత ఇప్పుడు లేడు. ఒకప్పుడు ఉండేవాడు అనేది ఎంత నిజమో అలా మన దేవుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు ప్రస్తుతానికి లేడు. కాకపోతే బ్రహ్మకపాలంగా ఉన్నాడు. ఈ కపాలం యొక్క బ్రహ్మరంధ్రం తెరమీద మనమంతా ఆయన అంశము ఊహల స్వరూపముల నాటక పాత్రధారులమని మనము నిజము కాదని  ఈ ప్రకృతి నిజము కాదని బ్రహ్మము సత్యము అని అంటే శూన్యం నిజం అని గ్రహించండి. శూన్యము యొక్క శూన్య బ్రహ్మనే నేను పరంబ్రహ్మగా చెబుతున్నాను. సినిమా లేకపోయిన తెర ఉన్నట్లుగా విశ్వము లేకపోయినా శూన్యము అలాగే ఉంటుంది. శూన్యము యొక్క సంకల్పముగా శూన్య బ్రహ్మగా బ్రహ్మకపాలం ఉంటుంది. దీని ఊహా ప్రపంచమే నిజము లాంటి కల అయిన విశ్వమని నేను చెబితే మీరు నమ్మరు. నమ్మితే ఈ బాధలు ఎందుకుంటాయి. దీనిని నమ్మటానికి తెలుసుకోవటానికే యోగ సాధన ఏర్పడినది. చివరికి అంతిమ సాధన స్థాయిలో ఒక అడుగు దూరంలో ఈ చచ్చిపోయిన బ్రహ్మకపాల మాయకి గురై జీవుడు ఇష్ట కోరిక స్పందనకి బలి అయ్యి జీవ రూపము పొందుతూ తను సత్యము కాదని తెలుసుకొనేలోపల అసత్యము గా మారిపోతున్నాడు అని నా గట్టి వ్యక్తిగత అభిప్రాయము. మీరే కాదు నేనే ఒకప్పుడు ఇది అంతా నమ్మితే సాధన చిట్ట చివరి దాకా వెళ్లి ఏమి జరుగుతుందో చూడాలని అన్ని రకాల మాయలు దాటుకుంటూ నేను వెళితే ఏమి జరిగినదో చిట్ట చివరికి మిగిలేది ఏదో తెలుసుకోవాలని ఉందా... ఇంకా ఆలస్యం ఎందుకు? నాతో పాటుగా ఈ నాలుగు ఉప చక్రాల సాధనను ఆరంభించండి. అలా ముందుకి ప్రయాణించండి. అంతదాకా ఈ బాధను ఈ భావాలు రూపంలో బయటికి వచ్చినాయి.

అది భౌతికులు -- అది దైవికులు
వివేచన వాదులు... అణువాదులు
 అనుభవైక వాదులు...స్వభావ వాదులు 
సాంఖ్యులు..యోగులు 
మీమాంసకులు ...వేదాంతులు
చార్వికులు.... జైనులు
బౌద్ధులు... వైశేషికులు

ఎందరో మరి ఎందరో 
మహానుభావులు వారి వారి వాదాలతో 
తర్కంతో దర్శనాలతో 
అన్వేషణతో అనుభవంతో 
ఆలోచనలతో వివేక బుద్ధితో 
ఈ భౌతిక అనుభవైక ప్రపంచానికి 
అతీతమైన అలౌకికమైన 
పారమార్థికమైన నిక్షిప్తమైన 
నిరపేక్షమైన వాస్తవిక సత్యాన్ని 
సమున్నత వాస్తవికతో చెప్పటానికి 
ప్రయత్నించి అభిమతాలు ఏర్పరచి 
మతాలుగా మఠాలుగా
పీఠాలుగా ముఠాలుగా 
రూపుదాల్చి అసత్యాన్ని 
సత్యంగా రూపు చేసి 
ఈ రోజు వరకు వీటిలో ఏ ఒక్కటి 
నిజ సత్యదర్శనంను ఆవిష్కరించ 
లేకపోయినందుకు బాధ వేస్తుంది.
 ఆవేదనను మిగిలిస్తున్నాయి.

మతాలుగా కులాలుగా 
ముఠాలుగా  గోత్రాలుగా
రూపాంతరం చెంది చెందుతూ 
మనిషి మనిషిని ప్రేమించలేని 
దీన స్థితికి చేజారినాయి మనకి 
మనోవేదనను మిగిలిస్తున్నాయి
తోటి మనిషిని ప్రేమించక పోగా 
మతమనే మత్తుకు లోబడి 
హింసకి దిగుతున్నాయి ప్రాణాలు 
గాలిలో కలుపుతున్నాయి దీనికి ఎవరు బాధ్యులు.

మాయో మిధ్యో
మర్మమో నిజమో 
అర్థము కాని స్థితి  విచిత్ర పరావస్థ స్థితి
జనన మరణ సముదాయాలు 
అండజాలు స్వేదజాలు ఉద్బిజాలు జరాయుజాలు
ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికాలు ఎందుకు?
ఆత్మ జన్మ విశ్వాసము తితిక్ష ముముక్షత్వము 
ఎందుకు ఏమిటి?
 ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం 
ఎందుకు ఏమిటి?
 గుణ త్రయాలు కర్మ త్రయాలు కాల త్రయాలు జన్మ త్రయాలు 
ఎందుకు ఏమిటి?

ఎవరు తామసిక వాదులు 
ఎవరు సాత్విక వాదులు 
ఏది ఉత్తమ అధమ స్పందనలు 
ఏది శివోహం 
ఏది సోహం 
ఏది దాసోహం...
దేవుడు లేడు జీవుడు లేడు 
గురువు లేడు శిష్యుడు లేడు 
నేను లేను ఆత్మ లేదు.
ఇహ ముత్ర ఫలభోగ విరాగ సాధనం
ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించు... వేదవ్యాసా.. పాహిమాం... పాహిమాం..

 గమనిక: ఈ అధ్యాయములో వ్రాసిన విషయాలు అన్నీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయలే. ఇది నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి. అంతేగాని మీ మనోభావాలు కించపరచాలని వ్రాసినది కాదని గ్రహించండి. దీనివలన ఎవరికైనా ఏమైనా వేదన కలిగితే నన్ను మన్నించండి.ఇంతటితో నా స్థూలశరీర సాధన  పరిసమాప్తి అయినది. నా సూక్ష్మ శరీర సాధన ఆరంభమైనది. నేను బ్రహ్మజ్ఞానిని కావటం వలన నాకు బ్రహ్మపదవి ఏర్పడినది.ఇక ఆలస్యం ఎందుకు. మీరు కూడా భోజనం చేసి నాతో ముందుకి ప్రయాణించండి. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం మరి.  

శుభం భూయాత్

పరమహంస పవనానంద

***********************************************
గమనిక: మా శ్రీమతి అయిన దీక్షా దేవికి ఈ చక్ర స్థితి ఉన్నప్పుడు దానికి వాళ్ల కుటుంబ సభ్యుల నుండి తెల్లని బాణలింగము వంశపారంపర్యంగా అలాగే 27 నిజ రుద్రాక్ష మాల వచ్చినాయి. ఈ సమయంలో దత్త స్వామి విగ్రహము, బాబా వారి పాదాలు, నాగపడగ విగ్రహము, నల్ల బాణలింగము ఇవ్వటం జరిగినది. ఈమే నాతో పాటుగా 41 రోజులు కాశీక్షేత్ర నివాస సమయములోతనఆది జన్మ వివరాలు అనగా లోపాముద్రాదేవి అని సద్గురువుగా శ్రీ తాజుద్దీన్ బాబా వారు అని తన సాధన దీక్ష నామంగా దీక్షాదేవి గా ఉన్నాయని స్వానుభవ అనుభూతిని పొందడం జరిగినది. కానీ ఈమెకి అప్పటిదాకా ఇష్టదైవము గా ఉన్న పరమశివుడు కాస్త భర్తగా అగుపించే సరికి ఈమెకి దాటటానికి తన సాధన శక్తి సరిపోలేదు. అలాగే ఇట్టి స్థితిలో ఉన్న అమెరికా నివాసి అయిన శ్వేత కూడా తన ఇష్టదైవమైన పరమ శివుడి యొక్క భర్త మాయను దాటలేకపోయినది. వీరిద్దరికి ఉన్న పది లక్షలు అలాగే 15 లక్షలు కర్మ నాశనం చేయటానికి వారి సద్గురువులు గురుదక్షిణ కింద పది పదిహేను లక్షలు లేదా నామకోటి రాయమని అనుజ్ఞ ఇవ్వగా మా శ్రీమతి దీనిని అసంపూర్తిగా అపనమ్మకంతో ఉండి తన దగ్గర ఉన్న ఇవ్వలేకపోవటం అలాగే శ్వేత తన దగ్గర లేకపోయినా శివకోటి 15 కోట్లు రాయమని అనుజ్ఞ ఇస్తే అది రాయలేనని ఆమె చేతులు ఎత్తేసరికి వారి సాధన ఇంతటితో పరిసమాప్తి అయినది. ఆ తర్వాత వచ్చే నాలుగు ఉప చక్రాల మాయలను దాటి సహస్ర చక్రములోని శ్రీకృష్ణుడి లీలలుమాయకి బలి అయ్యి సాధన శక్తినంతా వారి ఇష్ట దైవం ఉన్న కైలాస పర్వతమునకు సమర్పించడం మా శ్రీమతి చేస్తే శ్వేతాదేవి మాత్రము సంసారం మాయలో పడటం వలన కర్మ చక్రమును దాటలేక తన సాధన శక్తినంతా తన భర్తకి ఆమె పిల్లలకి వారసత్వంగా ధారపోసే స్థితికి చేరుకోవడం జరిగినది. దానితో వీరిద్దరి నిజ యోగ సాధన పరిసమాప్తి అయింది. అందుకే 20% మాత్రమే నిజ జ్ఞాన యోగ సాధకులు ఇట్టి ఆఙ్ఞా చక్రమాయను దాటకలుగుతారు. దీనికోసమే షిరిడి సాయి బాబా వారు మనకి శ్రద్ధ సబూరి (నమ్మకం) నాయందు ఉంచుకో అని మనకి భోధ చేసేది. నిజానికి వీరిద్దరూ కూడా శిరిడి సాయిబాబా భక్తులు కావటం విశేషం.

అందుకే బాబా వారు నిజానికి అందరు కూడా నా నిజభక్తుల మని చెప్పుకుంటున్నారు కానీ నేను చెప్పేది మాత్రం అర్థం చేసుకోరు. చేసుకున్న ఆచరించరు. ఎందుకు గురువుల దగ్గరికి వచ్చేది. పిడకలు ఏరుకోవటానిక అని అంటూ ఉండేవారు. వీళ్ళని ఏమీ అనటానికి లేదు. వీరి గురువులు కాస్త అంత పెద్ద మొత్తంలో డబ్బులు అడిగేసరికి ఉన్న నమ్మకం పోయినది. మాయలో పడినారు. గతుక్కుమన్నారు. నిజానికి వీరి గురువులు ఏమీ ఆశించలేదు. కర్మలు పరిశుద్ధి చేయటానికి ఆతురత పడినారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటే ఏమి లాభము. చేతిదాకా వచ్చిన అన్నం ముద్ద నోటి కాడకి వచ్చేసరికి చేజారిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వీరిద్దరి సాధన సమాప్తి చూసిన తర్వాత నాకు అవగతమైనది. నన్ను అనుసరించి వచ్చిన వీరిద్దరూ ఈ చక్ర స్థితి మాయ వలన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరికి వారు తమ సొంత ఆలోచన విధివిధానాలతో తమకున్న మిడిమిడి జ్ఞానంతో సాధనలో ఉన్నామని భ్రమలో సాధన చేస్తున్నారు అని నాకు అవగతమయ్యే సరికి మౌనం వహించాను. ఎవడి చావు వాడే చావాలి కదా. కాకపోతే వీరిద్దరికి కూడా శాశ్వతమైన చావు పొందాలని నాతో పాటుగా వీరిద్దరిని సాధనలో ఇక్కడిదాకా తీసుకొని వచ్చాను కానీ అర్ధనారీశ్వరి యోగమాయకి వీళ్లు బలి అవుతారని ఎవరికి మాత్రం తెలుసు. నేను ఒకటి ఊహిస్తే దైవము మరొకటి ఊహించినారని నాకు అర్థమైనది. అందుకే రమణ మహర్షి అన్నట్లుగా ఎవరికి వారే తమ సహజ స్థితి లోనే ఉండాలని ఎవరికోసమో బ్రతుకకుండా అలాగే చావకుండా వారికోసం బ్రతకాలని వారికి కావలసిన విధముగా చావాలి అని అంటుండేవారు. యోగ సాధకులు లారా! ఈ చక్రం ఇచ్చే జీవ మాయ అయిన అహంకారం మాయను అలాగే అర్ధనారీశ్వరుడు ఇచ్చే రూప కామ మాయను తప్పకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధ భక్తులతో ఓపికగా సహనంగా స్పందనలు లేకుండా మాయా మర్మం పడకుండా సిద్ధులు ఆశించ కుండా ఉండ కలిగితేనే దాటగలరు. అంతేగాని మీ సద్గురువు అనుగ్రహం పొందిన మీ ఇష్ట దైవ సాక్షాత్కారము పొందిన దాటలేరని గ్రహించండి. గురువులు కేవలం మార్గము మాత్రమే చెబుతారు. సాధన చేయ వలసినది మీరే. అనుభవాలు దాటవలసినది మీరే అని గ్రహించండి. తస్మాత్ జాగ్రత్త. అసలు వీరిద్దరూ అదే మా శ్రీమతి దీక్షాదేవి అలాగే శ్వేతాదేవి వారి సాధన ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలని అనిపించినది. పాపము మా శ్రీమతి ఎప్పుడు కాశీ క్షేత్రమునకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద ఉన్న ఆవులు ఎద్దులు దీని మీదకి వస్తూ ఉండేవి. నాకు అప్పుడు ఎందుకో అర్థం అయ్యేది కాదు అక్కడ యోగులు మహర్షులు ఇలా జంతువులు రూపాలలో తిరుగుతూ సాధన చేస్తారని కాశీఖండము చెబుతూ ఉంటే మరి మా ఆవిడని చూసి అవి ఎందుకు పైకి వచ్చేవో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ కారణం ఏమిటో తెలిసింది. మా శ్రీమతి పెరిగిన ప్రాంతంలో రాజనంది వంటి స్వయంభూ ఆంబోతు జీవ సమాధి చెందినది.ఈమె గత జన్మ శివలోక భక్తుడైన నందీశ్వరుని అంశ జన్మని ఆ తర్వాత జన్మలో లోపాముద్రా దేవి అని మహర్షి పత్ని జన్మ అని నాకు అవగతమైనది. అందువలన శివ మాయను దాటలేకపోయింది. పశుపతినాథుడ్ని దాటటం పశువులకు సాధ్యం కాదు కదా. పైగా నందీశ్వరుడు అపార మహా శివభక్తుడు కాబట్టి వారి వంశస్తురాలు కావటం వలన ఈ జన్మలో ఆజ్ఞా చక్రము నందు కలిగే సామీప్య ముక్తి ద్వారా కైలాస పర్వత కైలాసమునకు చేరుకుంటుందని ప్రస్తుత స్థితి వలన అవగతమైనది. ఇక శ్వేతాదేవి తన ఆది జన్మ శ్వేతనాగు అని ఇది పరమ శివుడి మెడలో ఉండేదని మహాకాళుడు మహాకాళి రతిక్రీడ దృశ్యాలను అనుకోకుండా ఈమె చూసేసరికి భద్రకాళీ శాపము ఇవ్వటం జరిగినది. దానితో ఈమె స్వయంభూగా వెలిసిన ప్రాంతంలోని ప్రస్తుత జన్మలో జన్మించి యోగసాధనను ఆరంభిస్తూ తిరిగే కాలచక్రంలో వచ్చే మహాకాళుడు మహాకాళి రతిక్రీడ దృశ్యాలను తన మనోనేత్రం ముందు చూసి కామ మాయ కి గురై తన భర్తని శివుడిగా భావించుకుని శివుడితో సుఖ సంసారం చేస్తున్నానని భావాల పరంపరలో పడి పోయి కర్మ చక్రము దగ్గర సంసారం మాయలో పడి పోతూ తన యోగ శక్తి అంతా తన కుటుంబ సభ్యులకి ధార పోస్తుందని దానితో ఈమె కూడా సామీప్య ముక్తి ద్వారా కైలాసమునకు చేరుకొని పరమశివుడు ఆధీనములో ఒక శ్వేతనాగు గా ఆ దైవానికి తన ఇష్ట సేవలు చేసుకుంటుందని నాకు అవగతమైనది. 

ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఇష్టదైవాలను మీ ఇష్ట గురువులు మీ ఇష్ట దైవ వస్తువుల మీద మోహం వ్యామోహాలు పెంచుకోకండి. వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకుని అవి మీ చేతిలో పోయిన బాధ పడకండి. అవి ఉన్నా లేకపోయినా మీ యోగసాధనను కొనసాగించండి. ఒకవేళ మీ నిజ గురువులు మీ దైవిక వస్తువులు లేదా మరేదైనా దానిని అడిగితే గురుదక్షిణ క్రింద మనస్ఫూర్తిగా ఇచ్చేయండి. ఏ మాయ దాటటానికి అది ఉపయోగపడుతుందో ఎవరికి తెలుసు. సప్తసముద్రాలు దాటి ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో పడి చచ్చినట్లుగా వారు అడిగినది ఇవ్వకపోతే వాటి మీద వ్యామోహం పెంచుకుంటే కూడా ఇలా జరుగుతుందని తెలుసుకోండి. అది కూడా మీ ఇష్ట గురువులు నిజ గురువులా లేదా నకిలీ గురువులా ముందు ఎన్నో పరీక్షలు పెట్టి వారు నెగ్గిన తర్వాతనే మనస్ఫూర్తిగా వారికి దాసోహం అవ్వండి. ఇదే నియమము మీ ఇష్ట విగ్రహ దైవానికి కూడా వర్తిస్తుందని తెలుసుకోండి. చివరికి ఈ చక్ర స్థితికి వచ్చేసరికి మీరు అందరిని వదిలి పెట్టే స్థితికి మీ మానసిక స్థితి ఉండాలని గ్రహించండి. వేటి మీద అయిన లేదా ఎవరి మీద అయిన మోహ వ్యామోహాలు ప్రేమలు కలిగితే వాటిని దాటుకునే మనో ప్రయత్నాలు చేయాలి. ఈ మూడు స్థితులు ఈ చక్రం లో ఉండే త్రికోణం చేస్తుందని గ్రహించండి. కాబట్టి వీటిని అడ్డుకోవడానికి ఎవరికోసమో దేనికోసం మీ సాధన ఆగిపోకూడదు. కాకపోతే మీరంతట మీరే మాయలో పడితే మాత్రం ఎవరూ కూడా రక్షించలేరు. తప్పించ లేరు అని గ్రహించండి. ఇక్కడ వరకే అన్ని రకాల జీవ మాయలు వచ్చేవి. వీటిని అనగా 84 లక్షల జీవ మాయలు దాటాలి. అప్పుడే మీకు మీరు 36 దైవ మాయలకు అడుగుపెట్టే అవకాశం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ చక్రం మాయను దాటితే మీ సాధన బాలా అనగా ప్రారంభ సాధన స్థాయి దాటినట్లే. ప్రకృతి మాయను దాటినట్లే. బాల నిజరూప దర్శనమే ఇందులకు నిదర్శనం అని తెలుసుకున్నాను. నాకు శ్రీశైల క్షేత్రం లో బాల రూప దర్శనము ఇచ్చినట్లుగా మీ సాధన ఒకవేళ ప్రారంభ బాల స్థాయి దాటితే తప్పనిసరిగా ఖచ్చితముగా 3, 5, 8 సంవత్సరముల వయస్సు ఉన్న బాల రూపముగా స్వయంగా ప్రకృతి మాత అమ్మవారు దర్శనం ఇస్తుంది. అప్పటిదాకా మీ సాధన ప్రారంభ సాధన అనగా పంచభూతాలతో కూడిన ప్రకృతిని దాటలేదు అని తెలుసుకోండి. ఎప్పుడైతే మీ సాధన బాల స్థాయి దాటుతుందో అప్పుడు మధ్యమ స్థాయి అనగా త్రిపుర దర్శనంలో అమ్మవారు అనగా 28 నుండి 35 సంవత్సరముల లోపు ఉన్న స్త్రీగా దర్శనము అలాగే మీ సాధన స్థాయి అంతిమ స్థాయి కి వెళితే అమ్మవారు కాస్త అరవై ఐదు సంవత్సరముల ఉన్న వృద్ధ స్త్రీ మూర్తిగా దర్శనము ఇస్తారు. ఒకవేళ మీరు మహా మృత్యువు చూసే స్థాయికి మీ సాధన స్థితి ఉంటే అమ్మవారు కాస్త 85 సంవత్సరముల రూపంలో ఒక పేదరాశి పెద్దమ్మ లాగా లేదా తాంత్రిక విధానంలో అయితే జోగులాంబ వంటి మహా వృద్ధురాలి మంత్రగత్తె రూపంలో దర్శనం ఇస్తుంది అని గ్రహించండి. శ్రీ లాహిరి మహాశయులు కి ఈ చక్ర స్థితిలో ఉన్నప్పుడు మనిషి రూపంలో మహాదేవుడు అలాగే పార్వతి రూపాలు దర్శనం ఇచ్చినట్లుగా మాతృ ప్రేమతో పార్వతి దేవి ఆయన నుదుట ముద్దు పెట్టుకున్న దని వారి సాధన అనుభవాల్లో రాసుకున్నారు.

అసలు నాకులాగా ఈ చక్రము నందు దత్తదర్శనం అలాగే బాలదర్శనం అలాగే ఓంకారనాదము ఎవరైనా విన్నారా అని అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి గూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది. వారు చెప్పిన ఈ చక్రానుభవాలు ఇక్కడ మీకోసము ఇస్తున్నాను! ఆజ్ఞాచక్రము గూర్చి చెప్పడం,శివశక్తి దర్శానుభవం గూర్చి చెప్పడం,తను విన్న ఓంకారనాదం గూర్చి చెప్పడం,తను చూసిన అమ్మవారి యోనిభాగ దర్శనం (లజ్జాగౌరి) గూర్చి చెప్పడం,ఆయనలో నేను అంటే ఏమిటో అనే దాని గూర్చి చెప్పడం,అమ్మవారు తనని ముద్దుపెట్టుకున్న విషయము చెప్పడం,ఆయనలాంటి రూపమున్న వ్యక్తిని చూసినట్లుగా చెప్పడం,తన ఆదిజన్మ కబీర్ జన్మయని సూచనలు ఇవ్వడం,
తమ గురుదేవుడిగా మహా అవతార్ బాబాజీ గూర్చి చెప్పడం జరిగినది


*********************
నా సాధన పరిసమాప్తి సమయములో

నేను నా సాధన పరిసమాప్తి సమయములో విష్ణుగయకి వెళ్ళడము జరిగినది.అక్కడ నాకు 56సం!!రాల వయస్సున్న ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించాడు.వారి దగ్గరికి వెళ్లి విషయము ఏమిటని అడుగగా ఆయన వెంటనే నా వైపు తిరిగి “స్వామి!ఈ రోజు ఇక్కడ మా పిల్లవాడికి పిండప్రధానం చేసినాను.మూడు నెలలు క్రితం మా ఆవిడ కూడ కాలంచేసినది.ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను.నేను ఇంక ఎవరికోసము, దేనికోసము బ్రతకాలి. వాళ్ళతోపాటే నేను గూడ చనిపోవాలని ఎన్నోరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు చేసినాను.కాని మరణం రావడములేదు.దానితో ఏమి చెయ్యాలో అర్ధము గావడము లేదు.మరణం రావలంటే ఏమి చెయ్యాలి స్వామి!” అన్నాడు.అపుడు మేము వెంటనే"అయ్య!మీకు మరణము రావలంటే శివయ్య తలుచుకోవాలి గదా!ప్రారబ్ధకర్మ తీరేదాకా మనకి మరణము రాదని తెలుసుకొండి.అది తీరినాడు మీకే తెలియకుండానే పోతారు. గాలిద్వారా పుట్టినవారు గాలిలో కలిసిపోతారు.అవును!మీకు ఈ జీవమాయలెందుకు!అమ్మ ఎవరు?అయ్య ఎవరు?కొడుకు ఎవరు?కూతురు ఎవరు?తల్లి ఎవరు?భార్య ఎవరు? చెప్పండి.మీరు చనిపోతే మీ భార్య మీ ఇంటి గుమ్మం దాకానే వచ్చేదిగదా!అదే పిల్లలు అయితే స్మశానము దాకానే వస్తారు కదా!మీరు ఒంటరిగానే పుట్టినారు.అలాగే ఒంటరిగానే పోతారు గదా!ఇంక దేనికి ఏడుపులు,భాధలు!పిల్లలకి అన్నప్రాశము చేసినట్లుగానే వారికి ఎపుడో ఒకప్పుడు అంత్యక్రియలు గూడ చెయ్యవలసి వస్తుంది గదా! ఒకటి ఆనందం మరొకటి ఆవేదన ఇస్తాయి గదా! ఈ రెండింటిని సమదృష్టితో చూడండి!రెండుగా కాకుండా ఒకటిగా చూడండి!అపుడు మీరు అశాంతినుండి ప్రశాంతతని పొందుతారు. నారాయణుడిని నిత్యం ఆరాధించే నారదుడికి సంసార కృష్ణమాయ తప్పలేదని పురాణవచనముగదా!ఆ లెక్కన మనమెంతో ఆలోచించండి. మీకు ఆ శివయ్య చాలా త్వరంగా ఈ మాయ మమకార బంధాలనుండి విముక్తి కలిగించినందుకు సంతోష పడండి!ఇక్కడ...ఎక్కడ ఏమి లేదు! జీవితము అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం మని గ్రహించండి.మీకున్న జీవమాయలను తొలగించుకోండి!దానికి మార్గమేదో మీ మనస్సే చెపుతుంది!” అని చెప్పి గుడి లోపలకి వెళ్ళినాను!కొన్ని గంటలు తర్వాత మేము పలకరించిన ఆస్వామి కాస్త కాషాయవస్త్రధారి సన్యాసిగా అగుపించేసరికి ఆయనతో మేము వెంటనే “స్వామి!ఈ జన్మ వృధా గాకుండా చేసుకున్నారు! జయం పొందండి!మోక్షపధమును చేరుకోండి” అని దీవించి అక్కడ నుండి మేము మౌన:ముగా గుడి నుండి బయటికి వచ్చినాను!


3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. yantranni mergu pettataniki theesukelli chesina thappu ki ammavariki panchambruta
    abhishekam cheyatam, appudu mee mantalu thaggatam, meeru tantrika saadhana cheyatam,
    meeku sadguru trailingaswamy darshanam vaari mataaniki vellatam meeru vedavyasa Amsha ani
    thelsukovatam, meeku datha darshanam avvatam chaavadaniki velthu brathakataniki erparlu
    cheskunnarani, ee chakra saadhana lo janthuvula arupulu raavatam, jyoti bindi uvu meeda mee
    drushti saarinchi dhyaanam cheyatam alage prathi adhyayam lo meeku oche bhuchara siddhi, neeti
    siddhi ala anni siddhulu vadulukovatam pradarshisthe aa chakralu balaheenapadatam
    karguthundani appudu mudralu, konni rakaala food thinta saadhana chesthe malli aa chakralu
    aadheenam avthayani.... Jignyasi gaaru andarimida dweshanni pradarshinchakunta vaaru pettina
    baadhalu mounamga bharinchi unte bagundu anedi cheppatam nak nachindi endukante nenu ade
    aalochana lo unna.... ika ramanamaharshi vaaru kanipinchi sadhaana sahasraaram vadda aagadani
    malli jeevanaadi dwara hrudaya chakram cherukovalani cheppatam, Meeru tante ika saadhana
    dakshinacharam lo leka vaamacharam lo cheskovalo ardham kaakapovatam sri dattudu cheppina
    nammakam kalugakapovatam,meeku tante ika saadhana books raavatam, meeru vedavyasulani
    nirdhaeinxhukovadam, mee nundi mee lanti vyakti ochi anni panulu cheyatam mee doubts ki answer
    kuda ivvatam, mee ammamma gaari deggariki velliravatam asal ee adhyayam loni anubhavalu naku
    pichi pichi ga nachayi,mee snehithudu kashi ki vellatam mee laanti vaadu aynani
    patrukovadam,ahankaaram daatithe kaani evanni raavani guptha nidhula kosam baavi deggariki
    vellatam, edaina answer dorkuthundemo ani jharkhand daaka vellatam mee kosame akkade
    nireekshistha ani cheppatam, cinema nijam kaadani Thera maatrame nijamani, alage shweta devi,
    deeksha devi saadhana lu ela aagipoyayani......chivarlo bharya pilladu chanipiyina vyaktiki ni
    kashayam vesukunela cheyatam.

    రిప్లయితొలగించండి