అధ్యాయం 59

సీతాపతి బాణము చూశాను
(మా కర్మచక్రానుభవాలు)

 ఎప్పుడైతే నాకు శ్రీదత్తుడు నాలో ప్రవేశించినట్లు అనుభూతి కలిగినదో ఆ క్షణం నుండి నాలో నాకే తెలియని అవధూత లక్షణాలు ప్రకటితము అవుతున్నాయి. దానితో ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత లాగా ఉండేవాడిని. అలాగే వేరే సాధకులకు నేను ఒక దీక్ష గురువుగా మారుతున్నానని అనుభూతి కలగ సాగింది. నేను దీక్ష గురువుగా 27 మందికి అలాగే సద్గురువుగా ఐదు మందికి పరమ గురువుగా ఒకరికి మోక్షప్రాప్తి కలిగించాలని అదే ఈ చక్రము యొక్క ప్రారబ్ధ కర్మయని...ఏపుడైతే వీరందరి శిష్యకర్మ నివృత్తి అవుతుందో ఆనాడే నాకు ఈ కర్మచక్రము ఆధీనమవుతుందని నా మనోనేత్రం ముందు ప్రస్ఫుటంగా కనపడసాగినది. దానితో తమ ధర్మసందేహాలు, సాధన సందేహాలు తీర్చుకోవటానికి సాధకులు రావటం మొదలు పెట్టినారు. వీరిలో నా వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి అలాగే కానీ వాళ్ళను వదిలించుకోవటానికి అచ్చంగా నేను కూడా శ్రీ దత్త స్వామి లాగా ప్రవర్తించడం మాట్లాడటం, చేష్టలు చేయడం అంతా నా ప్రమేయం లేకుండా జరుగుతుండేది. కొన్నిసార్లు నా ప్రమేయము ఉంటే ఎక్కువ సార్లు నా ప్రమేయం ఏమీ ఉండేది కాదు. నా శరీరమును ఉపయోగించుకుని నా చేతులతో ఆయన (దత్తస్వామి) చేతలు చేస్తున్నాడు అని నాకు అవగతమైనది. లోకానికి బయటికి చెప్పుకోలేని స్థితి పరిస్థితి. ఎక్కడ నేను ధన, వ్యాప్తి,పీఠ,మఠ, కామ, మోహ, వ్యామోహ ఆశలకి గురి అయితే “నా స్వామి నా నుండి వెళ్ళి పోతాడు” అని చెప్పకనే చెప్పటంతో మౌన బ్రహ్మగా మారి అతన్ని చూస్తూ గమనిస్తూ ఊరుకోవడమే తప్ప ఏమి చేయ లేక పోయేవాడిని. కొన్ని సార్లు నాలో నేను నవ్వుకోవటం ఏడవటము పెద్దగా అరవటం, గంతులు వేయడం, ఆకాశం కేసి వెర్రి చూపులు చూడటము, నా దగ్గరికి వచ్చే వారిని తిట్టడం, బండ బూతులు తిట్టడం, నా అనుకునే వారితో ప్రేమ ఆప్యాయత గా ఉండటం కాని వారిని నానా విధాలుగా బాధపెట్టడం, నా వాళ్ళు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను వారిని ఏదో రకంగా శిక్షించడం, వారికి ప్రాయశ్చిత్తము చేయటం, నా దగ్గరికి చెడు ఆలోచనలతో చేరే వారిని దూరంగా ఉంచటం, వారిని భయపెట్టి నేను మాయ లో ఉన్నాను అని నమ్మకం వాళ్ళకి కలిగించడానికి నానా మాటలు అనడం, వారిని కష్టాలతో బాధపెట్టడం చేస్తుండేవాడిని. ఈ విధముగా దత్త ఉపాసకులు దత్త స్వస్వరూప దర్శనం పొందిన అవధూత యోగులు అయిన శ్రీ పాద శ్రీ వల్లభుడు, మాణిక్య ప్రభు, అక్కల్ కోట స్వామి, షిరిడి సాయి బాబా. తాజుద్దీన్ బాబా, శ్రీ త్రైలింగస్వామి, పవనానంద సరస్వతి ఇలా ఎందరో యోగులు ఉన్నారని వారి చరిత్రల ద్వారా తెలుసుకున్నాను. 

నా పంచశిష్యుల వేట:

యోగి రమణ: 3
ఇందులో నా తృతీయ శిష్యుడిగా యోగి రమణ నిలుస్తాడు.ఇతడు గూర్చి మీకు “నిజ వెంకన్న భక్తుడు” అనే అధ్యాయములో చెప్పడము జరిగినది. అనగా యోగి రమణ  తన ఇష్ట దైవము వెంకన్న స్వామి యొక్క ఇష్ట దేవత సాక్షాత్కారం మాయ దాటలేకపోయినాడు. అనగా మణిపూరక చక్రం మాయ దాటలేకపోయాడు. దానితో వారి సాధన పరిసమాప్తి అయినది.సంసారి అయినా బ్రహ్మచారి జీవితం సాగిస్తున్నాడు. ఇతను నాకు పరిచయము అయ్యే సమయములో నా సాధన ప్రారంభ దశలోనే ఉండుటవలన ఇతనికున్న ఈ సాక్షాత్కరమాయను దాటించలేకపోయినాను. నా సాధన పరిసమాప్తి సమయానికి నాకు అందుబాటులో దొరకకుండా పోయినాడు. ఇపుడు ఎక్కడ ఉన్నాడో...ఎలా ఉన్నాడో కూడ తెలియదు. కాలమే చెప్పాలి అని మౌనము వహించాను.

కాకాజీ: 5
ఇక నా పంచమ శిష్యుడైన కాకాజీ. ఇతని గూర్చి మీకు “అమాయకపు భక్తి” అనే అధ్యాయములో చెప్పడము జరిగినది. ఇక ఇతని విషయానికి వస్తే స్త్రీ కామ మాయను దాట లేకపోయినాడు. వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధలు వచ్చినాయి. దానితో ఈమెకి విడాకులు ఇవ్వకుండా వైరాగ్యం చెంది ఎవరితోను చెప్పకుండా కాశీ క్షేత్రములో మూడు సంవత్సరములు పైగా ఉన్నాడు.ఆ తర్వాత వాడిలో తీవ్రమైన స్త్రీ వాంఛ మొదలైంది.విదేశీ స్త్రీలు నగ్నంగా అక్కడ కనిపించిన మనస్సు చలించలేదు. విడిపోయిన భార్య జ్ఞాపకాలతో ఏక పత్ని ధర్మము పాటించడంతో మోక్ష ప్రాప్తిలో ధర్మం లోనికి అడుగు పెట్టాడు. ఇలా మూడు సంవత్సరముల పాటు ఈ ధర్మమును పాటించినాడు. ఒకనాడు తన మాజీ భార్య నుండి ఫోన్ కాల్ రావటం వాడు పవిత్రమైన కాశీ వదిలి అపవిత్రమైన శరీరం కోసం వచ్చినాడు.అప్పటికే ఆమె తన ఏక పతి ధర్మానికి తిలోదకాలు ఇచ్చినదని తెలిసేసరికి మనవాడి మనస్సు విరిగిపోయింది. తిరిగి మళ్ళీ మనస్పర్ధలు వచ్చినాయి. అలాగని కాశీకి వెళ్లలేని దుస్థితి. ఈమెను వదల్లేని స్థితి. అప్పుడిక జరిగినది ఏదో జరిగినది అంతా మరిచిపోయి కలిసి ఉందామని మనవాడు అన్నాడు. కావాలంటే నాకు మీరిద్దరూ ఉన్న నాకు అభ్యంతరం లేదు అనేసరికి మా వాడికి మతి పోయింది. దానితో ఇష్టమైన తను ప్రేమించిన స్త్రీ మూర్తియే తప్పు చేసినది. నేను చేస్తే ఏమిటి అని అప్పటిదాకా ఏక పత్ని ధర్మమును పాటించిన వాడు కాస్త మాయలో పడి వాడి యోగ జీవితానికి అంతము పలుకుతూ భోగ జీవితానికి నాంది పలికాడు. అలా ఈ ధర్మం తప్పటంతో వాడి ఇష్టదైవమైన శివయ్యకి దూరమై ఆయన చూపుకి దహనమై శవాలు ఇచ్చే శరీర వాంఛలతో కాలం గడుపుతూ మోక్షప్రాప్తికి దూరమైనాడు. 

శ్వేతదేవి: 2
ఒకసారి ఇట్టి స్థితిలో ఉండగా నాకు అమెరికా నుండి స్వాతి కాశీవిశ్వనాధన్ అలాగే స్వాతి నటరాజన్ పేర్లతో ఇద్దరు అమ్మాయిలు ఏదో జాతకరీత్యా సమస్య పరిష్కారానికి ఫోన్ చేస్తుండేవాళ్ళు. వీళ్ళిద్దరి పేర్లు ఒకటే కావటం, ఒకే తమిళ  రాష్ట్రం కావటం విశేషం. వీరిలో నిజానికి నేను ఒక్కరికే దీక్షా గురువుగా, సద్గురువుగా ఉండే యోగం ఉంది. మరి వీరిలో ఎవరో నాకు అర్థం కాలేదు.నా మనో నేత్రము ముందు వీరి రూపురేఖలు అగుపించటంతో ఫోటోలు పంపించమంటే వారిలో ఒకరు తమ భర్తతో ఉన్న తన ఫొటోను నాకు సాగదీసి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో పంపిస్తే మరొకరు చాలా నీట్ గా ఉన్న ఫోటోలు పంపించడం జరిగింది.వీళ్ళ ఫోటోలు చూస్తే పెళ్లి అయిన ఫోటోలు వచ్చినాయి కానీ నాకు ధ్యానంలో వీళ్ళు పెళ్లి కాకముందు ఎలా ఉంటారో మాత్రమే కనిపించింది. దీనమ్మ జీవితం. ఇలా కాదనుకొని ఒక స్వాతితో కర్మలు నివారణ చేసుకోండి. పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి పొందడానికి ప్రయత్నించండి. మీ కర్మ నివారణ కోసం రెండు లక్షల డబ్బులు అవుతాయని నిజం చెప్పే సరికి ఆమె నా మీద ఉన్న నమ్మకంతో ఆలోచించుకుని చెపుతాను అని ఫోన్ పెట్టేసింది. ఇంతలో కొన్ని రోజుల తర్వాత మరో స్వాతి నటరాజన్ ఫోన్ చేసి నాకు మోక్ష ప్రాప్తి పొందాలంటే ఏమి చేయాలని నేను ఏమీ ఆమెకి చెప్పకుండానే అడగకుండానే నన్నే ఏకంగా అడగవలసిన ప్రశ్నలు అడిగే సరికి నేను కొంత కంగారు పడినా సరే పరీక్షించాలని “అయితే మీరు మీ దేహాభిమానము లేకపోతే మీ నగ్న ఫోటోను ఒకటి పంపించండి” అనగానే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా “ఎప్పుడు పంపించమంటారు” అనగానే మా శ్రీమతికి నాకు మతి పోయింది. “వామ్మో! ఈ పిల్ల ఇలా అంది అని” మేము ఇద్దరము తల బాదుకోవడం జరిగినది. మా శ్రీమతికి అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ప్రారబ్దకర్మ గా వీరిలో ఒకరికి మాత్రమే నేను గురువు పదవి చేపడితే వారి సాధనను ముందుకు తీసుకొని వెళితే గాని నా సాధన ముందుకి వెళుతుందని మా శ్రీమతికి కూడా తెలుసు. కానీ నేను ఎలాంటి గురు మాయలు పెడతానో అని ఆసక్తిగా గమనించటమే ఆమె చేస్తున్న పని అన్నమాట. వీరిద్దరిలో నా వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకుంటానో అని ఈమె ఎదురుచూస్తోందని నాకు అర్థమైంది.కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు అడిగిన మొదటి స్వాతి నాకు ఫోన్ చేసి “నాకు మా శ్రీవారు డబ్బులు ఇవ్వరట. నాకైతే చేయించుకోవాలని ఉంది. ఏ అవకాశము దొరికిన వదిలిపెట్టను అంటూ ప్రస్తుతానికి అద్ధములో డబ్బులు కనబడుతున్నాయని అనుకోండి” అని ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండవ స్వాతి ఫోన్ చేసి నా ఫోటోలు ఎప్పుడు పంపించాలంటే…. నేను వెంటనే “వద్దు! ఊరికే మీకు దేహాభిమానము ఉందో లేదో పరీక్ష పెట్టినాను. మీరు నెగ్గినారు. బాగుంది. అవును! ఒక విషయము అడుగుతాను!నేను ఎవరో మీకు తెలియదు.కాని మీ నగ్నపోటో అడగగానే పంపిస్తారని ఎలా అన్నారు” అనగానే దానికి ఆమె వెంటనే "జీజీ(గురువు గారు)…..  నాతల వేరేవారి నగ్నశరీరమునకు అతికించి ఈ పోటోను పంపించేదానిని” అనగానే నా మనస్సులో వామ్మో!ఎంత మోసం!వీళ్ళు గురువులను మించిన శిష్యులు కారు...గురువులను ముంచే శిష్యులు అనిపించి... కాకపోతే మరొక పరీక్ష. మీకున్న మోక్ష కోరిక తీరాలంటే మీకున్న కర్మలు పరిసమాప్తి చేసుకోవాలి. దానికి రెండు లక్షలు ఇస్తారా? అని అడిగాను. వీరిద్దరినీ డబ్బులు అడిగితే నేను ఒక డబ్బులు ఆశించే మాయ గాడిని అనుకొని నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతారని  ఆ ప్రయత్నం అన్నమాట. ఆమె వెంటనే “నాకు రెండు నెలలు సమయం ఇవ్వండి. మీరు అడిగిన డబ్బులు మీకు ఇస్తాను. మీరు అడిగారు. నేను ఇవ్వటము వరకే నా బాధ్యత. వాటిని ఏమి చేస్తారో ఏమి చేసుకుంటారో నాకు తెలియదు. కారణము లేకుండా మీరు ఏ పని చేయరని మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను చూడక పోయినా నా మనస్సు చెబుతోంది. మీరు మా లాంటి మనిషి కాదని కారణజన్ముడని మాలాంటి వారికి దారి చూపడానికి వచ్చిన వారని మీరు రచించిన యోగ దర్శనం గ్రంథం చెప్పకనే చెబుతోంది. నేను ఇన్నాళ్లు ఎవరి కోసం ఎలాంటి వ్యక్తి కోసం తపన పడినానో నాకున్న ధర్మసందేహాలు నా సాధన సందేహాలు నాకు అర్థమయ్యేటట్లుగా విడమర్చి చెప్పగలిగే సమర్థుడిని నాకు ప్రసాదించమని నా ఇష్ట దైవమైన మహాశివుడిని నా గురువైన శిరిడి సాయి బాబాని వేడుకొని రోజు అలాగే క్షణము లేదని” ఆపుకోలేని దుఃఖం ఆమెకు వచ్చే సరికి ఫోన్ కట్ చేసింది. కొంపదీసి ఈమె మాటలను బట్టి ఈమే నా శిష్యురాలేమో అనిపించేది. మొదట స్వాతి కాశీవిశ్వనాధన్ ఎందుకు కాకూడదు అని అనిపించేది. ఇలా కాదనుకొని ఎవరికైతే నేను అడిగిన డబ్బులు ఇచ్చి వారి భౌతిక కర్మలు నివారణ చేసుకుంటారో వారే నా శిష్యురాలని నాకు నమ్మకం ఏర్పడింది. మరి కొన్ని రోజుల తర్వాత మొదటి స్వాతి కాశీవిశ్వనాధన్ ఫోన్ చేసి “అయ్యా! పవన్ గారు! నాకు డబ్బులు దొరకటం లేదు. అద్ధములో మాత్రమే కనబడుతున్నాయి. నన్ను క్షమించండి. నేను ఇవ్వలేను. పూజలు చేయించుకోలేనని” తన ఫోన్ పెట్టేసింది. అప్పుడు అనుకున్నాను. నేను ఈమె దృష్టిలో డబ్బులు ఆశించే మాయగాడు అని ఈమె అనుకోవటం జరిగినదని నాకు అర్థమైనది. ఇంతలో రెండవ స్వాతి నటరాజన్ నాకు ఫోన్ చేసి …జీజీ(గురువు గారు)…..  మీరు అడిగినట్లుగా డబ్బులు ఎపుడు పంపించాలి అనగానే అమ్మాయి! అవి రూపాయిలు గాదు లక్షలు అనగానే ఆమె వెంటనే “వాటి విలువ నాకు అనవసరం!కారణము లేకుండా మీరు అడగరు.ఆ విషయము నాకు బాగా తెలుసు” అనగానే నాకు ఆశ్చర్యము వేసినది. అపుడు ఆమెతో “అమ్మాయి! నీకు మొదట కామ పరీక్ష పెట్టినాను!ఇక రెండవది ధన పరీక్ష పెట్టినాను!సాధకునికి సాధనలో ధన,కాంత మాయలే అవరోధాలుగా వస్తాయి కాబట్టి వీటి మీద మీకు మోహ, వ్యామోహలు ఏమైనా ఉన్నాయా అని ఈ రెండు యోగ పరీక్షలు పెట్టినాను!నాకు నీ ధనముతో పనిలేదు.ఇక నుండి నేను మీకు కపాల దీక్ష సాధన గురువుగా ఉండి...నీ సాధన శక్తి నిన్ను ఎక్కడిదాకా తీసుకొని  వెళ్ళుతుందో అక్కడి దాకా నేను నీ వెంట ఉండి నీ సాధనను ముందుకి తీసుకొని వెళ్ళతాను అని చెప్పి ఆమెకున్న భౌతిక కర్మ నివారణ పూజలు, హోమాలు చేయించడం జరిగినది. అక్కడి నుండి ఆమె నన్ను పరీక్షించటం మొదలు పెట్టింది. ఒకప్పుడు చిన్న పిల్లలలాగా  ఆమె అడిగే ప్రశ్నలు ఉండేవి. మరొకప్పుడు పెద్ద ముత్తయిదువులాగా ప్రశ్నలు ఉండేవి. నాకున్న పరిజ్ఞానంతో ఆమెకి సంతృప్తి సమాధానాలు ఇస్తూ ఉండేవాడిని.ఆమెకి అర్థం అయితే వెనక్కి తిరిగి అడిగేది కాదు. ఒకవేళ అర్థం కాకపోతే ఆమెకి అర్థం అయ్యే దాకా నన్ను వదిలేది కాదు. అన్ని కూడా సాధన సందేహాలు. మా మధ్య వేరే విషయాలు అంతగా వచ్చేవి కావు. రాత్రి 9:00గంటలకి ఫోన్ చేస్తే అంటే చంద్రదర్శనము సమయంలో మొదలుపెడితే సూర్యోదయము దాక ఉదయం 7 గంటల దాకా మా సంభాషణలు కొనసాగేవి. ఆమెకి ఆధ్యాత్మిక వివరణలతో మేమిద్దరము సమయం కూడా చూసుకునే వాళ్ళం కాదు. పట్టించుకొనే వాళ్ళము కాదు. సరే ఈమెకు ఉన్న తీవ్రమైన మోక్ష కాంక్ష చూసి ఈమె ఎక్కడిదాకా సాధనలోకి వెళితే అందాక సాధన ప్రాప్తి ఇవ్వాలని అనుకునేవాడిని. ఆమె దానికి తగ్గట్టుగా సాధన ప్రక్రియలు చేస్తుండేది. తన ఇష్ట దైవంగా మహాశివుడిని అలాగే ఇష్ట గురువుగా షిరిడి సాయిబాబా వారిని ఆరాధన చేసేది. నేను ఆమెకి మంత్ర, దీక్ష, సద్గురువుగా ఉండి ఆమెకున్న ఆరు చక్రాలు జాగృతి, శుద్ధి చేయడం జరిగినది. ఇది అంతా కూడా టెలిపతి విధి విధానములో అన్నమాట. ఆమె నా గత జన్మ ప్రారబ్దకర్మ శిష్యురాలని నేను గ్రహించి ఆమెకు శారదాదేవి దీక్షనామమును ఇచ్చి యోగ సాధన ప్రారంభింప చేసినాను.ఈ చక్రంలో వచ్చే యోగ మాయ, దైవ అనుభవాలు నాకు వివరించడము వాటిని ఎలా దాటాలో చెప్పి దాటించేవాడిని.ఈమెకి తన ఏక పత్ని ధర్మము ఇవ్వటం జరిగినది. ఆమె గత జన్మలోనే కాల చక్రము యొక్క నాగ భైరవి సాధన స్థాయి వరకు వచ్చినది అని నాకు అర్థమైనది. ఆ తర్వాత ఈ ఆజ్ఞా చక్రము నుండి శ్వేతాదేవి నామముతో నేను ఒక సద్గురువు గా మారి ఆమె సాధనను ముందుకి అనగా ఏక పతి ధర్మముతో గుణ చక్రము దాటించటం జరిగినది.  ఈమె దాని కోసం నానా అగచాట్లు పడి చాలా జాగ్రత్తలు తీసుకొని తనని పరీక్ష పెట్టడానికి వచ్చిన కామ యోగ పరీక్షలు తట్టుకొని దాటుకుంది. ఇంతవరకు ఎవరు ఈ ధర్మచక్రము దాటలేదు. పర్వాలేదు. కనీసం ఈమె రెండవది అయిన “అర్థం” పురుషార్ధము లోనికి అడుగు పెట్టింది కదా అనుకొని సాధన కొనసాగించటం జరిగినది. ఇందులో వచ్చే 10 లక్షల కర్మలు బాలను, 12 లక్షల కర్మలు త్రిపుర మాయ దాటి,15 లక్షల కర్మలు సుందరి మాయకి   దగ్గరకి వచ్చింది. నాగ అంశతో జన్మించి ఆనందభైరవి సాధన చేసినదని గత జన్మ ద్వారా నాకు తెలిసినది. ఆ జన్మలో తన తోటి యోగ సాధకుడుతో కామ మాయలో పడి సాధన పరిసమాప్తి కావలసి వచ్చినది అని నాకు అవగతమైనది. దానితో 10,12 లక్షల కర్మలు గత జన్మ లలో పరిసమాప్తి అయినది. ప్రస్తుత ఈ సాధన జన్మలో ఇక 15 లక్షల కర్మలు దగ్గరికి అంటే సుందరి మాయకి వచ్చినది. ఈ కర్మలకి కారకులైన 15 మంది వ్యక్తులను ఈమెకి ప్రత్యక్షనిదర్శనాలతో ప్రకృతిమాత చూపించినది.దానితో ఈ 15లక్షల కర్మలఫలితాలున్నాయని ఆమెకి అర్ధమైసరికి నెమ్మదిగా ఈమెకి బుర్ర తిరగడము మొదలైనది. కానీ ఇక్కడే ఆమె దగ్గర నయా పైసా లేదు.అలాగని ఉద్యోగం లేదు. వ్యాపారం లేదు. ఎలా సంపాదించి ఇవ్వాలో అర్థం కాలేదు. నా మీద కొండంత నమ్మకం ఉన్నది. కానీ ఇవ్వటానికి గురుదక్షిణగా 15 పైసలు కూడా లేదు. ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది. సమయానికి అవి అందక పోయేసరికి అంతటితో ఆమె సాధన ప్రస్తుతానికి ఆగిపోయినది.కాని పరిసమాప్తి కాలేదు.ఈమెకి యోగ్యత అదే కపాల మోక్షం పొందటానికి ఉంది కాని అర్హత లేదు.ఈమె ఈ సుందరిమాయ దాటితే హృదయచక్ర ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఒకవేళ అందుంటే ఆమె తన ఏకైక ఇష్ట కోరిక ఉన్న హృదయ చక్రానికి వచ్చేది. నాతో పాటుగా ఇక్కడ లభించే నవపాషాణాలు ఇష్టలింగేశ్వర స్వామిని గురు-శిష్యురాలుగా ఆరాధన చేస్తుండేది. అంటే మోక్ష ప్రాప్తి లో మూడవది అయిన కోరిక (కామము) పురుషార్థం సమయానికి 15 రూపాయలు గురుదక్షిణ అందలేక తన యోగ జీవితము ప్రస్తుతానికి ఆగిపోయినది. అంటే ఎనిమిది అడుగుల కర్రలో రెండు అడుగుల రెండు భాగాలు కర్రలు అనగా ధర్మము, అర్థము మాత్రమే లభించాయి కానీ మూడవది అయిన కామము అనగా ఇష్ట కోరిక భాగము కూడా లభించి ఉంటే ఏమి జరిగేదో దైవానికి తెలియాలి. ఈ హృదయ చక్రంలో ఈమెకు తన ఇష్ట కోరికగా చుక్కకూర వచ్చినది. దానిని దాటేదో లేదో దైవానికి తెలియాలి. కానీ అర్ధ పురుషార్ధములో 15 రూపాయలు కూడా వచ్చి ఉంటే ఈ పురుషార్థము దాటి సుందరి స్థాయికి వచ్చి ఉండేది. కానీ ఏమి చేయగలం. ఎవరికి ఏమి సంప్రాప్తి ఎంతవరకు ఉందో శివయ్యకి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు కదా. ఆమె నా మీద అమితమైన భక్తి విశ్వాసాలతో నన్ను ఒక గురువుగా భావించుకుని తన సాధనను మూలాధార చక్రము నుండి మొదలుపెట్టి ఏడు సంవత్సరములలో ఆజ్ఞాచక్ర స్థాయి వరకు చేరుకుంది. ఒక ప్రక్కన నా సాధన చేసుకుంటూ నా 27 మంది సాధకుల చేత అలాగే సద్గురు స్థాయిలో ఐదుగురి చేత సాధనలు చేయిస్తూ ఉండేవాడిని. కానీ ఈమె కాస్త మహాశివుడిని తన భర్తగా అగుపించేసరికి ఈ మాయను దాటటానికి నానా కష్టాలు పడేది. ఎల్లప్పుడూ మహా శివుడితో తను మైధునము చేస్తున్నట్లుగా ధ్యానములో స్వప్నంలో అనుభవాలు కలుగుతున్నాయని చెబుతుండేది.ఈ మహా మాయను దాటమని చెప్పినను నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినను ఆమె దాటలేక పోయేసరికి ఈమెకున్న కర్మలు లెక్క వేస్తే 15 లక్షలు దాకా వచ్చినాయి. దానితో 15 కోట్ల శివకోటి 1500 పుస్తకాలు రాయమంటే రాయలేనని చేతులు ఎత్తేసరికి ఈ సాధన కాస్త కర్మచక్రం వద్ద సంసారం మాయలో భర్త కోసం సంతానం కోసం ఈమెకున్న ఈ ప్రారబ్ద కర్మ నివారణ అయితే గాని ఈ సాధన ముందుకు వెళ్లలేదని ఇది ఈ జన్మాంతంగా ఉండే కర్మలు కావటం చేత నేను ఏమీ చేయలేక ఆమెను మోసం చేయలేక మౌనము వహించి ఆమె యోగసాధన ఈ చక్రం వద్ద ప్రస్తుతానికి ఆగిపోయినదని నాకు అర్థమయ్యే సరికి ఆమెకు నేను ఉన్న గురు పదవి నుండి నన్ను తప్పించడం జరిగింది. నేను అయితే నా సద్గురువులో పంచ శిష్యులలో ఈమె ఒకటి కాగలిగినది కానీ పరమ గురువులో ఏక శిష్యురాలు అవుతుందేమో అని అనుకున్నాను కానీ కాస్త పంచ శిష్యుల వద్దనే ఆగిపోయినది. 

జిజ్ఞాసి: 1
ఏకైక శిష్యుడిగా వాసు దేవానంద సరస్వతి అనే కర్మయోగి వచ్చినాడు. వీరే నా యోగమిత్రుడైన జిజ్ఞాసి అన్నమాట.ఈ గ్రంధములో నా సాధనానుభవాలతోపాటుగా ఇతని అనుభవాలు మీరు చదువుతున్నారు గదా! ఈమెని దాటి…. వాడు అన్ని కర్మలు నివారణ చేసుకున్నాడు. ఎందుకంటే వీడు బ్రహ్మచారి. శ్వేతదేవి సంసారి. వీరిద్దరిలో అదే తేడా. ఒకవేళ ఈమె వివాహం చేసుకోకుండా ఉండి ఉంటే నా చేతిలో మోక్ష ప్రాప్తి పొంది ఉండేది. కానీ కేవలం నా నుండి శబ్ద అనుభవ పాండిత్యము పొందిన శిష్యురాలిగా ఉండిపోయినది. 

దీక్షాదేవి: 4
ఇట్టి స్థితి లో స్వయానా మా శ్రీమతి కూడా నా పంచ శిష్యులలో ఒక శిష్యురాలిగా ఉండిపోవటం గమనించదగ్గ విషయం. ఇక నా చతుర్ధ శిష్యురాలైన నా శ్రీమతి అయిన దీక్షాదేవి సాధన సంగతి విను. ఈమె ఇష్టదైవంగా మహాశివుడు, ఇష్ట గురువుగా షిరిడి సాయిబాబా అన్న మాట. సాధన కొనసాగిస్తూ ఆజ్ఞాచక్రం చేరుకున్నది. అప్పటిదాకా ఇష్టదైవమైన పరమేశ్వరుడు ఇష్ట భర్తగా అగుపించాడు. ఈమె కాస్త పరమేశ్వరి గా భావించి సాధన కొనసాగినది. తనకి తెలియకుండానే ఏక పతి ధర్మము దైవపరంగా దెబ్బతినేటట్లు గా చేసుకుంది. మహామాయ అంటే ఇదే కాబోలు.ఇలాంటి సమస్య సతీ అనసూయకి వచ్చినది. ఏకంగా త్రిమూర్తులు ఆమెను నగ్నంగా వడ్డించమని అడిగితే ఆమె తన పతి ధర్మము దాటకుండా వారిని తన పిల్లలుగా మార్చి వారికి నగ్నంగా పాలు పట్టినది. కానీ దీక్షాదేవి చేయలేక పోయింది. అలా శివ మహామాయను దాటలేకపోయినది.రాధా కృష్ణ ప్రేమ లాగా వీరి ప్రేమ కూడా అలాంటిదేనని బలంగా నమ్మసాగింది. అన్నీ నాతో చెప్పినది. నేను వెంటనే “ఇది శివ మాయ. భర్తగా ఊహించుకునే శక్తి తనను సాధనను విరమించుకొనేలా చేస్తుంది దీనిని దాటు. శివయ్యను ఒక గురువుగా భావించుకో. అప్పుడు ఆయన పరమ గురువు దక్షిణామూర్తి గా మారి నీకు కావలసిన సాధన శక్తి ఇస్తాడని” నెత్తీనోరు మొత్తుకున్నాను. ఆమెకి నేను చెప్పినవి వినే స్థితిలో నమ్మే స్థితిలో కానీ లేదు.  ఇంతలో ఆమెకు అనుకోని ధనలాభం వచ్చినది. వాటిని కాదన లేక పోయినది. ఆమెకి తెలియకుండానే ధనమాయకు గురి అయినది. దీనికి కారకమైన తల్లి మాయకు లోబడినది.. దానితో పునః జన్మ కు కావలసిన అన్నియు ఈ జన్మలో ఏర్పాటు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ప్రకృతి తన మాయలు దాటించడానికి ఈమెను 10 లక్షలు అడిగింది. “నా దగ్గర ఏమీ లేవు. అవి ఉన్న ఇవ్వలేను. నా సాధన ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో నేను నమ్మిన శివయ్య చూసుకుంటాడు అని” నా మాటలకి విలువ ఇవ్వలేదు. నాకు నవ్వు ఆగలేదు. మాయకి మరో జీవి బలి అని ఊరుకున్నాను. అది ఎలా జరుగుతుంది అని ఎదురు చూశాను. కర్మ చక్రంలో ఉన్నప్పుడు అయోధ్య, గుణ చక్రములో గాణ్గాపురం శ్రీ దత్త దర్శనం పొందినది. ఆనాటి నుండి దత్తుడు తన యోగ మాయను ఈమె మీద పెట్టడం జరిగినది. అన్నీ తెలిసిన నేను చెప్పలేని మౌన స్థితి నాకు అప్పుడు కల్పించారు. నేను ఏమి చెప్పలేను. ఆమె అర్థం చేసుకోలేని పరిస్థితి. అపార్థాలు చేసుకునే పరిస్థితి. ఆ తర్వాత ఉజ్జయిని క్షేత్రానికి తన కాల చక్రం సమయములో వెళ్లడం జరిగినది.రాజస్థానీ కోడలిగా అవతారము ఇచ్చినారు .ఈమె మహాకాళేశ్వరుని ఈ దుస్తులతో దర్శనం చేసుకునే స్థితికి కల్పించారు అన్నమాట. ఉజ్జయిని అంటే సకల జ్యోతిష్యాలకు పుట్టినిల్లు. నవగ్రహాలు ఆవాస క్షేత్రము. కుజుడు పుట్టిన ప్రాంతం. కుజుడు పుట్టినది భూమాతకే కదా. అనగా పునర్జన్మ కారకమైనవాడు అన్నమాట. దానితో ఈమెకి రాబోవు జన్మ రాజస్థాన్ ప్రాంతం అని రాజస్థానీ  కోడలు అని నాకు అర్థమైనది. పైగా కుండ దానముగా చేసినది. అంటే కుండ నీటి ఎద్దడి కోసం ఏర్పాటు చేయబడినది కదా. నీటి ఎద్దడి ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో ఉంటుంది కదా. మరి దానికి అదే రాజస్థాన్ కదా.ఆ తర్వాత బ్రహ్మ చక్రమునకు వచ్చేసరికి రాజస్థాన్ లోని బ్రహ్మ ఆలయమైన  పుష్కర్ కి వెళ్లడం జరిగింది. అంటే ఏమిటి? ఈమెకు పునర్జన్మ ఉన్నాయని సూచనలు ప్రకృతి ఇచ్చినది. మరి ఈ జన్మ సాధన శక్తి సంగతి ఏమిటి అని అనుకుంటుండగా ఈమె తన సాధన శక్తిని సహస్రార చక్రమునకు చేర్చినది. అప్పుడు ఈమెకు ఛార్ ధాం యాత్ర కి రమ్మని అవకాశం వచ్చింది. అంటే బద్రి నారాయణుడు తీసుకుంటాడు అనిపించినది. నేను వద్దని చెప్పిన వినే స్థితిలో ఆమె లేదు. నన్ను అపార్థం చేసుకునే స్థితిలో ఉండేసరికి నాలో సహనం తగ్గి చిరాకులు పెరగసాగాయి. చూస్తూ చూస్తూ మాయలో పడే వారిని ఏమి చేయగలం. అది కూడా కావాలని దూకేవారిని ఎలా రక్షించాలి అనిపించేది. కానీ అనుకోని విధంగా ఈమె ప్రయాణం ఆగినది.హమ్మయ్య! ఈమె సాధన కొనసాగించి తనకున్న మాయలను విభేదించటానికి అవకాశాలు ఉన్నాయి అనుకున్నాను. కానీ నేను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచినది. సహస్ర చక్రం అధిపతి అయిన మహాశివుడు ఆవాసమైన దైవ నిర్మిత పిరమిడ్ నిర్మాణమైన కైలాస పర్వత దర్శనం, మానససరోవరం రమ్మని ఆహ్వానం జరిగినది. పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయిన వారి నుండి జీవ శక్తి సంగ్రహించి వాళ్లు పునః జీవులుగా పుట్టించే శక్తి వీటికి ఉన్నాయని ఈజిప్ట్ పిరమిడ్స్ నిర్మాణాలు చెబుతున్నాయి. అంటే కైలాస పర్వతము కూడా ఇంతటి మహత్తరమైన శక్తివంతమైన పిరమిడ్ నిర్మాణం కావటం విశేషం. జీవుల పుట్టుకకు కారణం జలము. జలము నుండి ఆది మత్స్య అవతారం అదే చేప వచ్చింది కదా. అంటే ఈ జన్మలో ఈ సాధన శక్తి అంతా ఈ కైలాస పర్వతంలో నిక్షిప్తము చెంది మాయ కారణంగా కర్మలు చేయడానికి కావలసిన సూక్ష్మ కర్మలు ఉన్న శరీర నిర్మాణం ఆ ప్రక్కనే ఉన్న మానస సరోవరం చేస్తుందని అలాగే స్థూలకర్మలు చేయడానికి స్థూల శరీరమును ఉజ్జయిని క్షేత్రము చేస్తుందని నాకు అర్థమైనది. ఏకత్వం కాస్త భిన్నత్వం అయినది. అందరికీ ఈ అవకాశాలు ఈ చక్ర స్థితికి వచ్చినప్పుడు వస్తాయి. నాకు వచ్చినాయి కానీ వాటిని నేను నా జ్ఞానంతో దాటుకున్నాను. ఇవి శక్తిని సంగ్రహించేవి అని నా వ్యక్తిగత నమ్మకం. నా స్వానుభవాలు చెబుతున్నాయి. ఇతర యోగుల అనుభవాలు  చెబుతున్నాయి. ఇంతటితో ఈమె సాధన కూడా అర్ధ పురుషార్ధము వద్ద పరిసమాప్తి అయింది. కనీసము ఈమె అయిన నా పరమ గురువు స్థాయిలో ఉన్నప్పుడు ఏకైక పరమ శిష్యురాలిగా వస్తుందేమోనని అనుకున్నాను కానీ కాలచక్ర మాయను దాటలేకపోయినది. ఎవరికి తెలుసు శివయ్య తనని తెలుసుకునే ప్రయత్నాలు చేసే వారిని ఎలా ఎప్పుడు ఆపుతాడో తెలియదు కదా. అంతా మనం అనుకున్నట్లుగా జరిగితే దానిని సాధన జీవితం అనరు కదా. స్వయంగా ఆయనే హృదయ చక్ర సాధన స్థితి దగ్గర ఆగిపోయినాడు. మనకోసం ఆదియోగి ఆగిపోతే మనం ఆగటంలో ఆశ్చర్యం ఏముంది. 
 
కాస్త వెనకా ముందు చావు లాగా మన సాధన ఆగిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే. పరిపూర్ణంగా ఉన్నా సంపూర్ణముగా నిలబడలేం. పరిపూర్ణ జ్ఞానం ఉంది కాని సంపూర్ణముగా దానిని అనుభూతిని పొందలేమని నా స్వానుభవం. మనము మరణించామని మనకే తెలియని స్థితి. ఎవరు చెప్పినా అర్థం కాని స్థితి. చచ్చినవాడికి వాడు చచ్చిపోయిన విషయం ఎలా తెలుస్తుందో అలా మనము మోక్షప్రాప్తి పొందిన విషయం మనకి తెలియకుండా పోతుంది. ఎవరికి ఎంత ప్రాప్తి ఉందో అంతవరకే మన సాధన ప్రాప్తి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఇలా నా సాధనలో ఎందరికో నానా విధాలుగా పరీక్షలు పెట్టేవాడిని. నన్ను బాగా విసిగిస్తున్నారని అనిపించగానే అమ్మాయి అయితే కామసంబంధ విషయములతో మాటలతో వారికి ఇబ్బంది కలిగించి నా నుండి తప్పించే వాడిని. అదే పురుషుడు అయితే డబ్బులు ఇవ్వమని, శ్లోకాలు చదవమని, దైవిక వస్తువులు ఇవ్వమని. వారి ధన సంబంధ విషయాలను అడుగుతూ వారిని బాగా విసిగించి నా నుండి తప్పించేవాడిని. నేను పెట్టే మాయలన్ని దత్తస్వామి పెట్టేలా గా ఉండేవి. వీటిని తట్టుకొని వచ్చేవారు చాలా కొద్ది మందిగా ఉండేవారు. వారే నా ప్రారబ్దకర్మ జీవులు. ఇలా నేను 27 మంది యోగసాధకులని పంచ శిష్యులని ఏక పరమ శిష్యుడిని వెతుక్కునే సరికి అలాగే ఒక లక్షా పాతిక వేల మంది నా శబ్ద పాండిత్యమును వినే యోగ భక్తులని వెతుక్కునే సరికి నా ప్రాణాలు తోకకి వచ్చినాయి. వీరు అందరూ కూడా నా ప్రారబ్ధ కర్మల ఫలితాలు. ఈ కర్మలు సంపూర్తిగా పూర్తి చేయగలిగితే గాని నా సాధన సంపూర్తి కాదని శ్రీ దత్త స్వామి చెప్పకనే చెప్పి ఉన్నాడు. ఇంతటితో నా గుణచక్రము ఆదీనమై ఈ చక్రసాధన పరిసమాప్తి అయినది.

నా కర్మచక్ర సాధన

ఇలా నేను కర్మ చక్రమునందు ప్రవేశించటం జరిగినది. అప్పుడు నేను ఈ చక్ర స్థితుల కోసం గురువుల వద్ద ఖేచరీ ముద్ర సాధన చేస్తూ నాలిక ను వెనక్కి మడిచి కొండనాలిక నుండి వచ్చే అమృత ధార సేవిస్తూ ఈ నాలుక వెనక్కి మడిచిన సమయములో నేను ఎవరితో మాట్లాడలేని స్థితిని పొందటం తరచుగా జరిగేది. నా ప్రమేయం లేకుండా అప్పుడప్పుడు సహజసిద్ధంగా ప్రకృతి సిద్ధంగా నా నాలుక కాస్త ఈ ముద్ర సాధన చేస్తూ ఉండేది. నేను ఎప్పుడైతే ఎవరితోనైనా చాలా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు ఈ విపత్కర పరిస్థితి ఏర్పడే సరికి నాకు మాట్లాడటం చాలా కష్టంగా అనిపించేది. ఎవరితోనూ వారం రోజుల దాకా మాట్లాడాలని ఉన్న మాట్లాడలేని పరిస్థితి వచ్చేది. దానితో నాకు ఎవరితోనూ మనస్సు విప్పి మాట్లాడాలి అని అనుకున్నప్పుడల్లా ఈ విపత్కర పరిస్థితి వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా నా నాలుక వెనక్కి తిరిగేసరికి విపరీతమైన నొప్పితో పాటుగా మాట్లాడకపోవటం ఒక సమస్యగా ఉండేది. దానితో ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవటం ఆరంభమైనది. ఇదియే మాంస భక్షణ స్థితి అందురు. నేను ఇలా ఒక రోజు తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నాకు నా మనోనేత్రం నందు ఎవరో నా మీదకి వెలుగులు విరజిమ్ముతున్న ఒక బాణం వేసినట్లుగా నా మీదకి వస్తున్నట్లు గా అనిపించేసరికి ఇది కాస్త మన్మధబాణం కాదు కదా అనే ఆలోచన వచ్చేసరికి నాకు ధ్యానము భంగమైనది. ఇలా తరచుగా ఏక బాణ సందర్శనము అవ్వటము ఈమధ్య మొదలైనది. ఇది ఎవరు ఎందుకు నా మీద సంధిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారో నాకు అర్థం అవ్వక అయోమయ స్థితిలో ఉండగా….

"రామ" భక్తురాలితో స్నేహం:

నా సాధన స్ధాయి ఈ స్ధితిలో ఉండగా నాకు పెళ్ళి కాని ఒక రామభక్తురాలు పరిచయము అయింది.ఈమె పేరు శిలా..ఇంజనీరు చదువుతోంది.మంచి మానసిక రామభక్తురాలు.మాటకి ముందుకు వెనుక కూడ అంతా మా రామయ్య చూసుకుంటాడు.నాకు ఏమిగావాలో వారికి తెలుసు..అనే పిచ్చి రామ భక్తి అన్నమాట.నేను సాధనలో ఉన్నానని ఈమెకి తెలియదు.కాని ఈమె మంచి రామభక్తి సాధనలో ఉన్నదని నాకు తెలుసు.దానితో మా మధ్య స్నేహము పెరిగి మంచి ప్రాణస్నేహితులు అయ్యాము.మా మధ్య ఎపుడైన కామ సంబంధ విషయాలు వస్తే మాత్రము ఆమె కాస్త "రామ-రామ" అంటూ వెళ్ళిపోయేది.ఇలా మా స్నేహం 10 సం!!రాలు పైగా కొనసాగింది.ఒకరోజు నేను మా ఇంటిలో ఒంటరిగా ఉన్నాను.ఆరోజు నాలో అతీ తీవ్రమైన స్ధాయిలో కామోద్రేకము కల్గింది.ఇంతలో ఎపుడు లేనిది..ఎపుడు రాని మా ఇంటికి ఈమె వచ్చింది.ప్రశాంత కోసము నీ దగ్గరికి వచ్చాను.కాసేపు రామజపము చేసుకొని వెళ్ళిపోతాను అంటూ సోపాలో కూర్చుని జపము చేసుకోవడము ఆరంభించింది.నాలో కామము..ఆమెలో రామము జపము మొదలైంది.ఇలా 8 గం.లు పైగా సాగుతూండగా..నాలో ఉద్రికతమైన కామము కాస్త ఆమెను తాకటానికి నా చేతులు వెళ్ళాయి.కాని ఎందుకో తెలియదు కాని నా మనస్సు అలాగే నా శరీరము స్తంభించి పోయ్యేవి.ఇలా దాదాపుగా 10 సార్లు ప్రయత్నించాను.ప్రతిసారి ఇలాగే జరిగేది.నాకు ఎందుకో సందేహము వచ్చి ధ్యానములో కూర్చుగానే ఆమె మానసిక రామభక్తి శక్తి తరంగాలు కాస్త నా మనస్సులో ఉన్న కామశక్తి తరంగాలను అపుతున్నాయని నాకర్ధమైంది.దానితో ఈమె రామశక్తి ముందు నా కామశక్తి నశించిపోయింది.ఇంతటి భక్తితరంగాల శక్తి నాలో లేనందుకు బాధవేసింది.గాకపోతే వివిధ జాతుల స్త్రీల నగ్నదేహలు చూసిన గూడ స్పందించని నా మనస్సు ఈ రోజు ఏందుకు స్పందించినదో నాకు అర్ధగావడము లేదని అనుకుంటూండగా..ఎవరో చెప్పినట్లుగా ..." నువ్వు నాలో ఐక్యము కాకూడదు.నన్ను దాటి ..నా మాయ దాటి ఆదిలో ఐక్యము చెందాలి" అని అంతర్వాణి చెప్పినట్లుగా అనిపించింది.అంటే నా భక్తి రామభక్తిని దాటిపోవాలని నాకర్ధమైంది.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక లక్షరూపాయిలు అవసరము పడితే ఈమెను అడగడము..ఈమె కాదనకుండా ఇవ్వడము..మూడు నెలలు తర్వాత ఈమెకి ఇవి తిరిగి ఇచ్చివెయ్యడము జరిగింది.దానితో మా ఇద్దరి మధ్య ఉన్న ఈ చిట్టచివరి కర్మనివారణ సంపూర్తిగావడముతో..ఈ బాకీ తీరిన ఆరు నెలలకి మా మధ్య స్నేహ గొడవలు వచ్చి మన:స్పర్ధలు వచ్చి విడిపోయాము.మళ్ళీ ఈ దేహ జన్మలో ఒకరినొకరు ఎదురుపడలేదు.కాని సాధనపరిసమాప్తి సమయములో తారక రామ మంత్రసిద్ధి నేను పొందుతున్న సమయములో అంటే దాదాపుగా 11 సం.రాలు తర్వాత ఆమె నుండి ఫోను వచ్చింది.మా మధ్య మన:స్పర్ధాలు తొలిగాయి.కాని ఆమె భక్తి విగ్రహా రామభక్తి దగ్గర ఆగిపోతే నా భక్తి నిరాకార తారక రామభక్తి దాటిపోవడముతో..ఈ భక్తురాలి స్నేహము ఇక్కడితో స్వస్తి పలకవలసి వచ్చింది.ఈమె ఎక్కడ ఉన్నదో ఏమి చేస్తుందో నాకు తెలియదు. నా తారక రామభక్తి సాధనలో మునిగియుండగా... 



ఒకరోజు నాకు ధ్యానము నందు ఆశ్రమవాసిగా రాముడు ఒక బాణం సంధిస్తున్నట్లుగా ఒక విగ్రహం కనపడటం మొదలైనది. అప్పుడు నాకు కనిపించేది మన్మధ బాణం కాదని రామ బాణం అని ఈయన తన మాయలేడిని కొట్టటానికి వేస్తున్న స్థితి అని అలా తనలో ఉన్న వివిధ రకాల కర్మలు అనగా నా పరముగా ఒక లక్షా 25 వేలు స్థూల కర్మలు, 36,000 సూక్ష్మ కర్మలు, వెయ్యి కారణ కర్మలు, 36 ప్రారబ్ధ కర్మల మాయలు నాశనం చేయటానికి ఈ రామ బాణప్రయోగము చేస్తున్నాడు అని నాకు అవగతమయ్యే సరికి ఆనందము వేసినది. ఇలాంటి విగ్రహమూర్తి ఏదో ఒక షాపు నందు చూసినట్లుగా గుర్తుకు వచ్చే సరికి ఆ షాపుకి నా స్నేహితుని పంపించి తెప్పించి దీనిని వాడు విపరీత రామభక్తుడు కావటం చేత ఈ విగ్రహం మూర్తిని వాడి దగ్గర ఉంచుకో అని చెప్పినాను. వాడు దానిని ఖరీదు చేసుకుని కొన్ని రోజులు వాడి దగ్గర ఉంచుకుని కొన్ని అనివార్య కారణాల వలన ఆ విగ్రహం నా దగ్గర ఉంచి వెళ్లిపోయినాడు. ఇలాంటి అనుభూతి తాను పొందినానని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగినది. 


ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మగారు అమ్మగారికి వంశపారంపర్యంలో వచ్చిన సీతారాముల విగ్రహాలను నాకు పూజలో ఉంచుకోమని ఇవ్వటం జరిగినది. దానితో నేను ఈ విగ్రహం మూర్తులకి వరుసగా ఐదు సంవత్సరాల దాకా శ్రీ రామ నవమి పూజలు చేసి కళ్యాణాలు చెయ్యటం జరిగినది. ఉడత బొమ్మలు రావటం కూడా జరిగినది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానము నందు అయోధ్య రామ దర్శనము తరచుగా జరుగుతూ ఉండేసరికి మా కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య క్షేత్ర దర్శనానికి వెళ్ళటం జరిగినది. అక్కడ నాకు ఎలాంటి నిజరూప రామ దర్శనాలు కలగలేదు కానీ రాములవారు శరీరత్యాగం చేసిన సరయూనదికి వెళ్లి స్నానాదికాలు చేయకుండా కేవలము ఆ నీటిని రామతీర్థము గా తీసుకునేసరికి నాకే తెలియకుండానే కళ్ళవెంట కన్నీరు రావటం మొదలైంది. తన ఇష్టసఖి అయిన సీతాదేవి భార్య వియోగం భరించలేక ఈ నది లోనికి వెళ్లి శరీర త్యాగం చేసుకొని తన వియోగాన్ని అందరికీ ఇచ్చినారని గుర్తుకు రాగానే ఏదో తెలియని ఆవేదన నాలో మొదలైంది. అక్కడ కొంతసేపు ధ్యానం చేసుకుంటుండగా నా మనోనేత్రం ముందు 48 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక యువకుడు జలసిద్ధితో నీటి మధ్యలో తీవ్ర ధ్యానస్థితిలో ఉన్నట్లుగా కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది. ఈయన ఎవరో ఏమిటో తెలుసుకోవాలని నాకు అప్పుడు అనిపించలేదు. సర్వసాధారణంగా టెలిపతి లో సరి సమానమైన శక్తి ఉన్నవారు వారి సూక్ష్మ శరీరాలు అనగా వైఫై లాగా కలవడము జరుగుతుందని నాకు ఇదివరకే ఎన్నోసార్లు స్వానుభవాలు అయినాయి. అందుకే ఈ సూక్ష్మధారి గురించి ఆలోచించలేదు. విచారించలేదు. ఆయన రాముడు కావచ్చును కాకపోవచ్చును.



కొన్ని రోజుల తర్వాత నాకు ధ్యానంలో మెరుపు కాంతులతో ఉన్న ఒక పరి శుద్ధ స్పటిక లింగము దర్శనము అవ్వటము జరిగినది. ఎందుకంటే సూర్య గ్రహ దేవత శ్రీరాముడు. ఈ గ్రహ అధిపతి యొక్క రత్నము కెంపు. దీని ఉప రత్నము స్పటికము. అందుకే మనకి ఈ కర్మ చక్రములో దక్షిణాచార పద్ధతిలో చూస్తే అధిపతిగా శ్రీరాముడు ఉంటే వామాచారంలో ఈ చక్ర దైవముగా అఘోర మూర్తి ఉంటాడు. మనకి శ్రీరాముడు ఉండటం వలన ఈ చక్రంలో స్పటికమునకు సంబంధించిన దైవిక వస్తువులు వస్తాయని గ్రహించండి. నా పంచ శిష్యులలో ముగ్గురికి అనగా వాసుదేవానందకి, శ్వేతాదేవికి, దీక్షాదేవికి ఈ చక్ర స్థాయిలో శుద్ధ స్పటిక లింగం రావడం జరిగినది. కానీ నాకు ఎలాంటి స్పటిక లింగము రాలేదు కానీ మా అయ్యకి తన గురువైన దత్త పీఠాధిపతి అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నుండి ఒక స్పటిక లింగము వచ్చింది. దానిని కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకుని అమ్మ కి ఇవ్వడం జరిగినది. కొన్ని నెలలు తర్వాత అమ్మ దీనిని నాకు ఇవ్వటము దీనిని పూజలో ఉంచుకోవటం జరిగినది. ఇది ఎందుకు వచ్చిందో నాకు ఆనాడు తెలియదు. 

ఆ తర్వాత నాకు తీవ్ర ధ్యానమునందు నా చెవుల నుండి రాగి పాత్రలు మోగిస్తే ఏలాంటి శబ్ధము వినబడుతుందో...అలాంటి శబ్ధనాదము మొదటగా లీలగా వినబడి...అటుపై కొన్నిరోజులకి స్ఫష్టంగా వినబడేది. దీనిని గూర్చి ఆరా తీయగా ఈ నాదమును కాంస్య నాదమని అంటారని యోగ శాస్త్రం చెప్పడము జరిగినది. అంటే ఈ చక్రశుద్ధి ఆరంభమైనదని నాకు అర్ధమైనది.కొన్ని వారాలు అయిన తరువాత నాకు వచ్చిన స్పటిక లింగమును మా అయ్య నన్ను అడిగి మరీ వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుండి ఈ శబ్ధనాదము వినిపించడము ఆగిపోయినది.ఆ తర్వాత ఈ స్పటిక లింగమును ఏమైందో నాకు అగుపించలేదు. తెలియ రాలేదు. ఇలా చక్రాల సాధన స్థాయిలో ఉండగా వచ్చిన దైవిక వస్తువులు మోహంలో పడి ఇతరులకి ఇవ్వటం జరిగినది.మొదటి వస్తువు ఇదే కావటం అలాగే ఆఖరిది కావడం జరిగినది. ఒకవేళ నా దగ్గర ఈ స్పటిక లింగము ఉన్నట్లయితే ఎప్పుడో నాకు కర్మలు పరిసమాప్తి అయ్యేవని నాకు ఇప్పుడు తెలిసినది. ఇది నేను చేజార్చుకోవడం వల్ల కర్మలు చేయాల్సి వస్తుందని నాకు ఇప్పుడు తెలిసినా ఏమీ చేయలేని స్థితి పరిస్థితి. అందుకే దయచేసి ఇలాంటి చక్ర సాధన చేసేవాళ్లు తమకి వచ్చిన దైవిక వస్తువులు ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంచుకొని పరిరక్షించుకోండి. ఎవరి స్వార్థం వాళ్లకి ఉండాలి. ఒకరి మాయ మోహాలలో పడి మీ వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వకండి. తస్మాత్ జాగ్రత్త. 

నిజరూప రామదర్శనం:

కొన్ని వారాల తర్వాత నాకంటూ కాశీక్షేత్రము నుండి హిమాలయాల నుండి తెప్పించిన పరిశుద్ధ స్పటిక మాల రావడం జరిగినది. నేను ఒక స్పటిక లింగము పోయినదని బాధ పడితే ఆ సదాశివుడు తను ఉండే కైలాస పర్వతం నుండి నా కోసం ఏకంగా 54 స్పటిక మాల కన్పించేసరికి నా ఆనందానికి అవధులు లేవు. దైవ విశ్వాసముతో ఆయనని నమ్ముకుంటే ఆయన మనకి వెయ్యింతలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని నాకు అర్థమైనది. మీకు కూడా అర్థమైనది అనుకుంటా. నేను ఒకరోజు తీవ్ర ధ్యాన స్థితిలో ఈ స్పటిక మాల వేసుకుని ధ్యానంలో ఉండగా నాకు కంఠము ప్రాంతము అంతా ఏదో తెలియని మంచుగడ్డ ఉంటే ఎంతటి చల్లగా ఉంటుందో అలాంటి స్థితిని నేను అనుభూతిగా పొందటం నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో నాకు నా మనోనేత్రం ముందు ధనస్సు చేతబట్టుకొని ఆత్మారాముడు నా మీదకి రామబాణం వేయటం చూసేసరికి నాలో తెలియని ఉత్తేజం కలుగుతుంది. నాకు ఏవో జ్ఞాన సంబంధముగా స్పురణ వస్తుండగా ఏమి నా అదృష్టము.ఈ దేహామే ఒక విల్లు కదా..నా శ్వాసే ఒక అమ్ము కదా.. నా కర్మయే రామబాణం కదా..ఈ విల్లంబులను నడిపించే వాడు నా ఆత్మా రాముడే కదా అంటే తారకరాముడు నాశనము లేని వాడు మరణం లేని వాడు పుట్టుకలేని వాడు మనకి మోక్షమిచ్చే తారక మంత్ర అధిపతి అయిన తారక రామ బ్రహ్మ 10 ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని జితేంద్రియుడు కావటం వలన ధాశరధి కదా. రామ అంటే రావాలి మరణం అని మరా అంటే మరణము రాదని ఖేచరీ ముద్ర సిద్ధి పొందిన వారికి తారకరామ బ్రహ్మ దర్శనానికి ఉన్న ఈ రామ ద్వారబంధనం తెరచుకొని అమృతధారను ఇస్తుంది కదా ఈ రామ ద్వారాన్ని చూస్తూ ఎవరైతే తమ శరీరాన్ని వదిలి పెడతారో వారికి పునర్జన్మ ఉండదని స్వయంగా కబీరుదాసు చెప్పకనే చెప్పినారు కదా. జీవిక కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మలు చేస్తూ ఉండాలి. అది ప్రకృతి ధర్మము.అలాగే దేహ ధర్మము కూడా. అదేవిధంగా సహజ కర్మ అయిన శ్వాస ప్రక్రియలు అనే కర్మ మనలో నిరంతరం కొనసాగకపోతే ఈ దేహయాత్ర పరిసమాప్తి అయ్యి వల్లకాడుకు చేరుకోవలసినదే కదా. అందువలన కర్మను పూర్తిగా విడవటము అనేది ఈశ్వరుడి వల్లనే కాలేదు. ఇంకా మన వల్ల ఏమి అవుతుంది. ఆసక్తి లేకుండా చేయాలి. ఆ ఆసక్తి వలన మనలో కోరిక పుడుతుంది. దీనివలన త్రిగుణాలు నిద్రలేస్తాయి. దీని వలన మన మనస్సు చంచలమౌతుంది. ఈ చంచల స్థితి మనం తీసుకునే ప్రాణశక్తి శ్వాసల మీద ఆధారపడుతుంది. అదే స్థిర మనస్సుగా మారితే మనము చేసే కర్మలు కాస్త నిష్కామ కర్మ గా మారితే మన మనస్సు నిశ్చల స్థితిలో ఉంటుంది. చంచల మనస్సు ద్వారా ఆసక్తి ని పూర్తిగా విడవడము సాధ్యం కాదని గ్రహించండి. ప్రాణము చంచలము గా ఉన్నంత వరకు మన మనస్సు కూడా చంచలము గానే ఉంటుంది. మనస్సు చంచలంగా ఉన్నంతవరకు మనకి ఆసక్తి ఉంటుంది. అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆకలి, దాహం, నిద్ర, సోమరితనం, బద్ధకం, అలసట, చిరాకు, చింత, బాధ, ఆనందం, దుఃఖము, ఆసక్తి , ప్రేమ, దేహ బుద్ధి ఇలా ఎన్నో మానసిక శారీరక ప్రవృత్తులు అనగా ఆలోచన తరంగాలు అన్నీ కూడా చంచల మనస్సు లోనివే గదా. అంటే నువ్వు చేయవలసిన కర్మలను చెయ్యాలి. కర్మను బొత్తిగా చేయకుండా ఉండకూడదు. ఉండలేరు. ప్రతిఫలాపేక్ష లేనిది ఇష్టదైవ అర్పణముతో చేసే ప్రతి కర్మ కూడా తనకి నిష్కామ కర్మ అవుతుంది. అంటే కర్మ ఫలము ఆశించని కర్మయే నిష్కామ కర్మ అంటారు. అనగా పరీక్షలు రాయటం నీ కర్మ. నువ్వు నీకు కావలసిన ఫలితాలు రావాలని అనుకోవటం కామి కర్మ అవుతుంది. ఫలితాలు దైవానికి అర్పించడం నిష్కామకర్మ అవుతుంది. ఫలితాలు ఆశించే కర్మ కాస్త అది నీకు బంధనముగా మారుతుంది. నువ్వు అనుకున్న మార్కులు వస్తే ఆనందపడటం రాకపోతే ఆవేదన అనే పరిస్థితులు కలుగుతాయి. ఎట్టి ఫలితాలతో సంబంధం లేకుండా నువ్వు ఉండగలిగితే ఏమి వచ్చిన నీకు ఆనందం అలాగే బాధ ఉండదు. ఇదియే నిష్కామ కర్మ ఫలితము.అందులో ఇట్టి కర్మ నీకు ఎన్నటికీ కర్మబంధము కాదు. పైగా కర్మ విముక్తి కలుగుతుంది. మొదటివాడు తను అనుకున్న మార్కులు రాలేదని మళ్ళీ పరీక్ష రాస్తే రెండవవాడు తనకు వచ్చిన మార్కుల తో సంబంధం లేకుండా ఉండటం వలన అది వీడు మళ్ళీ పరీక్ష అనగా కర్మ చేయని స్థితి అనగా కర్మ విముక్తి పొందుతాడు అన్నమాట. దైవ అర్పణ తో చేసే ప్రతి కర్మ కూడా నిష్కామ కర్మ అవుతుంది. ఇలాంటి కర్మ చేయటం వలన మనస్సుకి బాహ్యశుద్ధి అలాగే అంతరశుద్ధి కలుగుతాయి. మంచి ఆలోచనలు కలిగి వివేక బుద్ధితో మంచి కర్మలు చేయడానికి ఆసక్తి కలుగుతుంది. చెడు కర్మలు చెయ్యటానికి మనస్సు విముఖత చూపడం వలన సగము దాక కర్మలు వాటికి కర్మఫలితాలు తగ్గించుకోవటం జరుగుతుంది. మనకి నువ్వు చేసే కర్మను బట్టియే కర్మ ఫలితం కలుగుతుంది. తగ్గుతుంది. మంచి కర్మ చేస్తే మనకు మంచి ఫలితాలు అలాగే చెడు కర్మ చేస్తే మనకి చెడు ఫలితాలు కలుగుతాయని లోకవిదితమే కదా. కర్మ లేకుండా ఏది లభించదని చివరికి మనకి ఈశ్వర ప్రాప్తి కలగాలన్న మనము నిష్కామ కర్మ అనగా శ్వాస ప్రక్రియ నిరంతరము జరుగుతున్నట్లుగా చేస్తే గాని మనకి ప్రాప్తి కలగదని తెలుసుకోండి. ఈశ్వరప్రాప్తి కోసం చేసే నిష్కామ కర్మ ఏకైక కర్మ అని నాకు అనుభూతి కలుగుతుండగా నా వెన్నుపాము క్రింద భాగము నుండి ఏదో తెలియని అలజడి తీవ్రస్థాయిలో మొదలై వేగంగా పైకి పాకినట్లుగా జర జరా పాము ప్రాకినట్లుగా పాకుతుండగా నా శరీరము ఈ ప్రవాహ తాకిడికి తట్టుకోలేక పూనకం వచ్చిన వాడి లాగా ఊగుతూ ఉండే సరికి నా కర్మ చక్రములోనికి ఈ శక్తి ప్రవాహము ప్రవేశించినదని నాకు స్వానుభవము పొందుతుండగా నేను కాస్త కర్మాతీత అవస్థ స్థితికి చేరుకున్నాను అని నాకు అనుభూతి కలగ సాగింది. తీవ్రమైన యోగమత్తు నన్ను ఆవరించే సరికి ధ్యానంలోనే యోగ నిద్ర లోనికి జారుకున్నాను. నిద్ర లేచిన తర్వాత చూస్తే నా మనస్సు అలాగే నా శరీరము కూడా ఏదో తెలియని అద్వితీయ ఆనంద స్థితి పొందుతుందని నాకు అర్థమైనది. నాకు ఏ కర్మ చేయాలని అనిపించని స్థితి. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించని స్థితి. అన్నింటిని కర్మసాక్షి భూతములుగానే ఉన్నానని అనిపించే స్థితి. ఇంద్రియాలు చేసే పనులు అనగా చూడటం, తినడం, పడుకోవడం, మాట్లాడటం, తీసుకోవటం, చెప్పటం, శ్వాసించటం, నడవటం, తాకటం, వినటం ఇలా పలు రకాల ఇంద్రియ విషయాలలో వాటి పని అవి చేసుకుని పోతున్నాయని నేను ఏమీ చేయటం లేదని పాపపుణ్యాలు లేని కర్మ స్థితి అని… ఏమీ ఆశించని కర్మ స్థితి అని…. ప్రతిఫలాపేక్ష లేని కర్మ అని…. బ్రహ్మఅర్పణము చేస్తే నిష్కామ కర్మ స్థితి అని…  ఆసక్తి లేని స్థితి అని…. కర్మఫలితాలు ఆశించని స్థితి అని…. చేసేది పొందేది తాను కాదని ఉత్కృష్ట స్థితి…. ఈ కర్మ చక్రములో పొందే స్థితి అని నాకు అనుభూతి పొందుతూ ఉండగా నాకు శ్రీ రామ దర్శనం జరుగుతూ ఉండగా నేను వెంటనే “స్వామి! నాకు కావలసినది నీ రూప దర్శనము కాదు. రామ చైతన్యమైన తారకరామ బ్రహ్మ అనుభూతి కావాలని అనుకోగా శ్రీరామ మాయ నా నుండి విడిపోయింది. ఇట్టి చక్ర స్థితిలో ఉండగానే హనుమంతులవారికి ఈ రామ మాయను దాటలేక చిరంజీవి తత్వము పొందిననూ రాబోవుకాలంలో భవిష్య బ్రహ్మ అయినను రామ పాద సేవచే తనకు మోక్షప్రాప్తి కలుగుతుందని చిరంజీవి తత్వముతో కాశీ క్షేత్రము నందు సంచారిగా తిరుగుతున్నాడు. ఇలాంటి చక్ర స్థితిలో కబీరుదాసు ఉన్నప్పుడు అయోధ్య రాముడు దర్శనం ఇస్తే నాకు కావలసినది నీవు కాదు తారకరామ బ్రహ్మానుభూతి అని చెప్పటం నాకు స్ఫురణకు వచ్చేసరికి నేను కూడా అదే కావాలని కోరడం జరిగినది. దానితో నాకు రామయ్య మాయ వీడిపోయింది. కర్మాతీత స్థితిని పొందడం జరిగినది. ఇంతటితో రామ కళ్యాణ పూజలు ఆగిపోవటం జరిగినాయి. కొన్నిరోజులకి నాకు భద్రాచలమునుండి ఆయన విగ్రహమూర్తుల ఫోటోతో పాటుగా వాళ్ళు సజీవమూర్తులుగా ఉన్న ఫోటో రావడము నాకు ఆశ్చర్యమేసినది.

ఇది ఇలాయుండగా కొన్ని వారాలు తర్వాత నా ఆత్మ సంధాన ప్రక్రియలో నా జిజ్ఞాసి (సిద్ధ రామ) సూక్ష్మశరీర దర్శనము నా మనోనేత్రం ముందు అగుపించటం ఆరంభమైనది కానీ ప్రస్తుతము నేను ఉన్న స్థితిలో వాడితో మాట్లాడలేను ఏమో అనిపించినది. కర్మాతీత స్థితి అంటే ఈ జన్మలో సాధకుడు కేవలం తన ప్రారబ్ధకర్మ ఫలితాలు కర్మలు మాత్రమే చేస్తాడు. కానీ భౌతిక కర్మలు అనగా తిండికోసం ఉద్యోగాలు వ్యాపారాలు ధనసంపాదన కార్యాలు లాంటివి చెయ్యాలని ఉన్నా చేయలేడు. ఎందుకంటే వీడు అన్ని కర్మలయందు రాహిత్య స్థితి పొంది ఉంటాడు.ఇట్టివాడు కేవలము తన ప్రారబ్ద కర్మలు అనగా గత జన్మలో తనకి బాకీ అదే రుణాలు ఉన్న వారి నుండి రుణ విముక్తి పొందుతాడు. తను బాకీ అనగా తన రుణాల కోసం జన్మల బాకీలను తీర్చుకొని రుణ బంధ విముక్తి పొందుతారు. అంటే అర్థం కాలేదని నాకు అర్థమైనది. గత జన్మలలో వీరికి ఎవరు బాకీలు పడినారో వారి నుండి బాకీలు వసూలు చేసుకుంటాడు. గత జన్మలలో వీడు ఎవరికి రుణాలు ఉన్నాడో తెలుసుకుని తీర్చడమే ప్రారబ్ద కర్మ ఫలాలు అన్నమాట. ఇలాంటి వారినే కర్మ అతిథులని కర్మ సన్యాసులని కర్మయోగులు అని అంటారు. ఈ కర్మ జీవితం గూర్చి ఏకంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక కర్మసన్న్యాసయోగము అధ్యాయము గా చెప్పినాడు అంటే కర్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోండి. కర్మ ఉంటే జన్మ ఉంటుంది. జన్మ వస్తే అది జన్మలకి అవసరాలను ఏర్పరుస్తుంది. అదే కర్మ లేకపోతే జన్మ ఉండదు. పునర్జన్మలు ఉండవు. ప్రారబ్ద కర్మలు చేసే స్థాయిలో ఉన్న వాడికి అనగా కర్మాతీత స్థితి పొందిన వారికి మాత్రమే కర్మ చేయలేని స్థితి కలుగుతుంది. తద్వారా వచ్చే కర్మరాహిత్యం వలన జన్మరాహిత్యం కలుగుతాయి. ఇలాంటి ప్రారబ్దకర్మ స్థితిలో ఉన్న వాడికి ప్రకృతిమాత వాడి జీవనానికి కావలసిన జీవిత చక్రము నడుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయక తప్పదు కదా అలా అన్నమాట. కాకపోతే వీడికి కావలసిన విధంగా ఫలితాలు ఉండవు. ప్రకృతి ఏది ఇస్తే అది తీసుకొనే స్థితి ఉండాలి. నిజమైన కర్మాతీత స్థితి పొందినవాడికి బిర్యానీ వచ్చిన ఆవకాయ అన్నము దొరికిన ఎంగిలి మెతుకులు దొరికిన ఒక్కటే స్థితిలో ఉంటారు. దేహ ఆకలికి ప్రకృతి ఇచ్చిన మహత్తర అవకాశం గా ప్రకృతి ప్రసాదంగా తీసుకుంటారు. ఇలాంటి వాడినే కర్మ సన్యాసి అయిన కర్మ యోగి అనాలి. అంతేగాని సంసార బాధ్యతలు చేయలేక ఉద్యోగ బాధ్యతలకు భయపడి వాటిని చేయలేక భార్య పిల్లల పోషణ బాధ్యతలు భయపడి పారి పోయే వాడిని ఇలాంటి వారిని కర్మసన్యాసి కాదు కదా కర్మ సన్నాసి అందురు. ఇలాంటి వారే మిడి మిడి జ్ఞానాలతో సన్యాసి దీక్షలు తీసుకుని ఆకలి బాధను భరించలేక నానా అవస్థలు పడి దొరికినది తినలేక దానికోసం తిప్పలు పడలేక వెనక్కి తిరిగి రాలేక ఆ సన్యాసిగా ఉండలేక సన్నాసులు గా మారిన వారిని నా స్వానుభవం లో చాలామందిని చూడటం జరిగినది. కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. కర్మ చేయాలని అనిపించకపోవటం కర్మ చేసే అవకాశాలు లేక పోవటం నిజమైన కర్మసన్న్యాసయోగము అవుతుంది. బలవంతముగా కర్మలు ఉన్నా కూడా చేయకుండా తప్పించుకొని తిరగటం లేదా పారిపోవటం కర్మ సన్యాసం కాదని కర్మ సన్నాసి అవుతారని గ్రహించండి. ప్రతిఫలాపేక్ష లేని కర్మ లే బంధరహిత కర్మలుగా అదే శాస్త్రీయ కర్మలు అవుతాయి. ఎప్పుడైతే మన కర్మల నుండి ఫలాలు ఆశించటం మొదలవుతుందో ఆ కర్మలు కాస్త బంధహేతు కర్మలు అవుతాయి. ఎవరైతే ఆత్మానందము నందు ప్రీతి కలుగుతుందో ఎవరైతే  ఆ ఆత్మతృప్తి కోసం తహతహలాడుతారో వారికి భౌతిక కర్మలతో పనిలేదు. చేయాల్సిన అవసరమే ఉండదు. ఇట్టివారు కర్మలు చేసిన చేయకపోయినను ఎట్టి ఫలితాలు ఉండవు. కర్మరాహిత్యం పొందటం జరుగుతుంది. నిజానికి కర్మ అనేది సత్వ రజో తమో గుణ త్రయ మాయవలన చేస్తున్నానని జీవుడు అనుకుంటాడు. అట్టివాడు చేసే ప్రతి ఒక్కటి కూడా వీరికి కర్మబంధము అవుతుంది. అదే తను చేయటంలేదని చేసేది భగవంతుడని ఆ కర్మ ఫలితమును ఆయనకే అర్పణం చేస్తూ చేసే కర్మలు కాస్త కర్మబంధ విముక్తి అవుతాయి. నిష్కామ కర్మ అవుతుంది. ఈ కర్మ చేసుకుంటూ పోతే ప్రారబ్ద కర్మలు మారి వాళ్ళు కర్మసన్యాస యోగులు అవుతారు. కర్మరాహిత్యం స్థితి పొంది జన్మ రాహిత్యమును పొందుతారు. ఇట్టి వాడే నిజమైన కర్మయోగి అవుతాడని స్వయంగా శ్రీకృష్ణుడు తన గీతలో చెప్పకనే చెప్పి ఉన్నారు.ఇతరులు యందు రాగద్వేషాలు లేకుండా అసూయ చెందకుండా దోషాలు ప్రకటించకుండా ఇతరుల దోషాలు చూడకుండా ఇతరులకి చెప్పకుండా కేవలం ఎలాంటి ఫలితాలు ఆశించకుండా కర్మఫలము దైవానికి ఇచ్చేవాడు పుణ్య పాపకర్మల నుండి విముక్తుడౌతాడు.అరిషడ్వర్గాలును సప్త వ్యసనాలను దూరముగా ఉంచి కర్మలు చేయు వాడు కూడా కర్మరాహిత్యం స్థితి పొందుతాడు అని తెలుసుకోండి. తను చేసే ప్రతి కర్మయందు తను చేసే ప్రతి వస్తువు ల యందు పదార్థాల యందు తను రుచి చూసే వాటి యందు వాసన చూసే ప్రతి వాటియందు తను తినే ప్రతి వాటియందు తను విన్న ప్రతి విషయమునందు తను నడిచే ప్రతి చోటా యందు తను మాట్లాడే ప్రతి పనియందు తను వదిలే మల మూత్ర విసర్జన యందు కూడా తన ఇష్ట ఏకైక దైవ స్వరూపం చూడగలిగిన వాడికి కళ్ళు మూసినా తెరిచినా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుపోతున్నాయి అని వాటిని నేను అనేది నామమాత్రమేనని అనుభూతి కలుగుతుంది. ఇట్టివాడు కర్మలు చేస్తున్న కూడా తామరాకుమీద నీటిబొట్టులాగా వీళ్ళు కర్మల నుండి విముక్తులవుతారు. సంసార విషయాలు వీరిని సంసార కామ మాయ వీరిని తమ ఆధీనంలో ఉంచలేవు. ఇట్టివాడు ఇంద్రియాలు జయించి జితేంద్రియుడు అవుతాడు. ఇట్టి వాడిని ఆత్మారాముడు అని అందురు.త్రిగుణ రాహిత్యమును పొందితేగాని కర్మ రాహిత్యమును పొందలేరు. ఇలా పొందినవాడు ఆత్మారాముడు కావటం వలన వారిని ఈ కర్మ చక్ర దైవముగా శ్రీరాముడు మనకి ఆదర్శం గా ఉంచడం జరిగిందని నాకు అవగతమవుతుంది. 

జిజ్ఞాసికి ఈ చక్రానుభవాలు:

యోగమత్తు ఆవహిస్తున్నట్టుగా ఉండగా నాకు తిరిగి నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి అదే తన ఆత్మ సంధానంలోనికి రావటం మొదలైంది అని నాకు అర్ధం అవుతుండగా శివ జ్ఞాని! మీరు మీ దక్షిణాచార విధానములో తారకరామ బ్రహ్మ అనుగ్రహమును పొంది ఉన్నారని నాకు అర్థమైనది. 

ఈ కర్మ చక్ర ఆధీనము కోసం వామాచారంలో నేను అఘోర సాధన కోసం మహా కాశీ క్షేత్రమునకు చేరుకుని అక్కడ ఉన్న ఇలాంటి అఘోర సంప్రదాయాలకు నాంది అయిన కీనారాం  సమాధి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను. ఈయన జన్మించిన మూడు రోజుల తర్వాత ముగ్గురు యోగులు వచ్చి వీరి చెవిలో ఏదో మంత్రోపదేశము చేసినారని ఆ క్షణమే ఈయన ఈ ప్రపంచానికి వచ్చినారని గుర్తుగా ఏడ్వడం ఆరంభించారట. 9వ ఏటనే భార్యని కోల్పోయే సరికి ఈయన ఆధ్యాత్మిక సాధన కోసం బాబాశివదాస్ దగ్గర శిష్యరికం చేసినారు. వీరి వద్దనుండి అఘోరాలకి  కులదైవమైన హింగ్లాజ్ మాత యొక్క బీజాక్షర మంత్రము వీరి యంత్రమును గురుసేవ ఫలితముగా ఇతను పొందడం జరిగినది. కొన్ని నెలల తరువాత ఈ కీనారాంకి లియారి అనే ప్రాంతం వద్ద హింగ్లాజ్  మాత దైవసాక్షాత్కార అనుభూతి ఇతనికి ఈమె స్వయముగా అఘోరా దీక్షను అనుగ్రహించినది. ఆనాటి నుండి ఈయన బాబా కీనారాంగా ప్రసిద్ధి పొందటము జరిగినది. ఆ తర్వాత ఈయన కాశీ క్షేత్రములోకి చేరుకొని తన అఘోర సాధనను కొనసాగించటం ఆరంభించినాడు. ఈయన సిద్ది పొందే సమయానికి శ్రీ దత్త స్వామి ప్రత్యక్షమై నా చేతిని తిను అంటూ తన చేతిని నరికి ఇవ్వగానే అయ్యో! నా దైవమైన మీ చేతిని నేను ఎలా తినగలను అని ఈయన ఒక లిప్త కాలంలో అనుకొన్నాడట. దానితో దత్త స్వామి “అయితే నీవు ఇంకా నాది- నీది అనే భేద భావము లోనే నీ సాధన ఉంది. నీకు ఏక బ్రహ్మపదార్థముగా కనిపించడం లేదా? నేను నీవు ఒకటే కదా” అంటూ అంతర్ధానమైనాడు. అప్పుడుగాని తను చేసిన తప్పు ఏమిటో తెలియరాలేదు. మరి కొన్ని సంవత్సరముల తరువాత దత్తస్వామి కనిపించగానే ఆయన “నీకు ఏమి కావాలి” అన్నాడట. దానికి ఈయన వెంటనే “మీకు ఏమి కావాలో చెప్పండి! అది మీకు ఇస్తాను” అనగానే “సిద్ది పొందినావు” అని దీవించి అదృశ్యం అయినాడట. ఆనాటి నుండి అఘోర మతానికి ఆద్యుడిగా శ్రీ దత్త స్వామి ఆరాధ్యదైవంగా  హింగ్లాజ్ మాత ఈ కీనారాం సంప్రదాయ గురువుగా ఉండటం జరిగినది. వివిధ రకాల ఈతి బాధలతో బాధపడేవారిని, రోగాలతో వ్యాధులతో బాధపడే వారిని తన శక్తి పాతముతో వారి కర్మ దోషాలను తొలగించి వారి బాధలనుండి రోగాల నుండి విముక్తి కలిగించారు. ఇలా 175 సంవత్సరములు జీవించి జీవసమాధి చెందినప్పుడు ఆయన గురువైన బాబా శివదాస్ ప్రసాదించిన హింగ్లాజ్ మాత యంత్రమును ఈ సమాధి లో ఉంచి సమాధి చేయడం జరిగినది.ప్రస్తుతము ఈ సమాధి వారణాసిలోని రవీంద్రపురి లోనే ఆశ్రమంలో ఉంది అని చెబుతూ నేను ఈ జీవసమాధిని దర్శించుకుని అక్కడున్న ఈ సంప్రదాయ గురువుని కలిసి అఘోర సాధన విధానం దీక్షను తీసుకొని సాధనకు ఉపక్రమించాను. దట్టమైన స్మశానమునకి అర్ధరాత్రి పూట ఒంటరిగా ఏకాంతంగా నగ్నముగా చేరుకున్నాను. నాతో పాటుగా పంచ మాంస సాధన ఒక శవం మీద కూర్చొని చేయటం ఆరంభించాను. 
  
పంచ మాంసములు అనగా కుక్క, గుర్రం, ఏనుగు, ఆవు, మనిషి శవ మాంసాలు అన్నమాట. వీటి మాంసం తినటం వలన పంచేంద్రియ జ్ఞానాల మీద ఆధిపత్యం కలుగుతుంది. అనగా కుక్క మాంసం తినటం వలన వాసన గ్రహించే శక్తికి కారకమైన ముక్కు మీద అలాగే గుర్రం మాంసం తినటం వలన వినికిడి జ్ఞానం కలిగించే చెవులమీద అలాగే ఏనుగు మాంసం తినటం వలన స్పర్శ ఆనందం కలిగించే చర్మము మీద ఆవు మాంసం తినటం వలన రుచిని కలిగించే నాలిక మీద చచ్చిన మనిషి మాంసం తినటం వలన చూపును కలిగించే కన్నుల మీద ఆధిపత్యం కలుగుతుంది. ఈ పంచ మాంసాలను అలాగే ఈ జీవుల మలం, మూత్రం, రక్తం, వీర్యం సేకరించి వీటిని కలుపుతూ ఒక కపాలము వీటితో ఉడికించి కొన్ని ప్రత్యేక తాంత్రిక విధానాలతో సాధనలు చేస్తూ ఈ ఆహారమును ప్రతి రోజు తింటూ వుంటే ఇలా క్రమము తప్పకుండా వేళ తప్పకుండా 12 నెలల నుండి 12 సంవత్సరాలు తినేవారికి దశేంద్రియాల మీద ఆధిపత్యం కలిగి జితేంద్రియుడు అవుతాడు.

అఘోర సాధన - పంచ మాంస భక్షణ సాధన అంటే ఈ జంతువులకి ఉన్న అతీంద్రియ శక్తులు ఈ సాధకుడి లో ప్రవేశించి వాడికి జితేంద్రియానుభూతిని కలిగించటం జరుగుతోంది. నేను ఇలాంటి సాధన స్థితిలో ఉండగా నాలోని కుండలిని శక్తి కాస్త ఆజ్ఞా చక్రమునకు చేరుకొని అటుపిమ్మట గుణ చక్రము దాటి కర్మ చక్రములోని ప్రవహిస్తూ ఉండగా అఘోరా  సాధన అంటే శవాల సాధనం కాదని నగ్న పూజల ఆరాధన కాదని స్మశానముల జీవనము కాదని నిజానికి అఘోరా  సాధన అంటే పదార్థం మాయను దాటి ఏక బ్రహ్మ పదార్థముగా ఈ విశ్వమును చూడగలగటం దీని సాధన ముఖ్య ఉద్దేశ్యమని అందుకే ఈ సాధన అనుభూతికోసం పంచ మాంస సాధన విధి విధానమును పెట్టటం జరిగినదని పదార్థము దాటితేగాని యదార్థము అర్థం కాదని అంటే ఈ సాధన ద్వారా నిజమైన అఘోర్లు తమకున్న పదార్థం మాయలను దాటుకోవడానికి తొలగించుకోవటానికి అసలు సిసలైన బ్రహ్మ జ్ఞాన అనుభూతి అనగా ఏక బ్రహ్మపదార్థం అనుభూతి కోసం ఈ అఘోర సాధన చేసే అఘోరులని అనగా ప్రేమ లేని వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు కర్మలు సంపూర్తిగా నిర్వహించలేని వాళ్లు స్వార్థం గుణము ఉన్నవాళ్లు బంధాలకు విలువ ఇవ్వ లేనివాళ్లు పర స్త్రీ/ పురుష వ్యామోహం పొందిన వాళ్లు వీళ్లకి చచ్చిన శవాలు లాగా కనపడతారు. అలాగే వీళ్ళు ఉన్న ప్రపంచం అంతా వీరికి స్మశాన క్షేత్రముగా కనబడతారని ఇలాంటి జీవులంతా కూడా వీరికి బ్రతికున్న శవాలుగా కనబడతారని అంటే వీరికి చచ్చిన శవాలకి బతికిన శవాలకి భేద జ్ఞానము ఉండదని నగ్న పూజలు ఆరాధన వలన సిగ్గు భయాలు తొలగించుకోవటానికి ఉపయోగపడుతుందని ఇలా ఏకైక భౌతిక పదార్థము చూపించే విభిన్న స్వరూపాలు ఏకైక స్వరూపం అని బ్రహ్మ పదార్ధం అని అనుభూతి కోసం ఈ సాధన ఉన్నదని అనుభూతి పొందుతుండగా లీలామాత్రుడైన అఘోరదత్తమూర్తి కనిపించేసరికి నాకు యోగమత్తు నెమ్మది నెమ్మదిగా ఆవరించడం మొదలైనది. కొన్ని రోజుల తర్వాత నేను తినే పంచ మాంసాలు కాస్త పంచభక్ష పదార్థాలుగా మారడం ఆరంభమైనది. కుక్క మాంసం తిన్న సిద్దయ్య కి అది కాస్త తీపి పదార్థాలుగా మార్చిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లీల అలాగే ఒక ముస్లిం తనకి పెట్టిన మాంస పదార్థాలు అరటి పండ్లు గా మార్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి లీలలు నాకు స్ఫురణకు రావటం ఆరంభమైనది. అంటే మన దృష్టిలోనే శుద్ధ అశుద్ధ పదార్థాలుగా ఆహారము - మలము అనే భావాలు ఉంటాయని ఆహారం మానవ జీవులకి ఆహారమైతే మలము అనేది పందులకి ఎలా ఆహారము గా మారుతుంది అంటే నిజానికి ద్వంద్వ భావాలు లేవు. ఏక భావము మాత్రమే ఏక పదార్థము మాత్రమే ఉన్నది కానీ మనకున్న త్రిగుణాల మాయ వలన మన ఇంద్రియాలు కలిసి ద్వంద్వ పదార్థములు లాగా ఏర్పరుస్తున్నాయని ఏకైక బ్రహ్మ పదార్థము కాస్త విభిన్న నామరూప భౌతిక పదార్ధాలుగా కేవలం కనబడుతోందని అది సత్యం కాదు అని నేను నా జీవపదార్థ మాయను దాటిన తరువాత యదార్ధ జ్ఞానమైన బ్రహ్మ పదార్థముగా అంతటా కనబడటం ఆరంభమైనది. దానితో నేను కర్మాతీత స్థితికి చేరుకోవడం జరిగినది. ఇన్నాళ్లు అంతా నేనే చేస్తున్నాను అని అనుకున్న నా జీవ దేహము కాస్త చేసేది పొందేది నేను కాదని నేను అనేది కేవలం నిమిత్తమాత్రమేనని స్ఫురణకు రాగానే కర్మ చేయడానికి ఫలితము పొందటానికి ఏమీ లేదని చేయటానికి పొందటానికి ఏమీ లేదని అంతా మనమే చేస్తున్నామని మనమే ఏదో పొందుతున్నామని వివిధ రకాల మోహ మాయ భ్రమ భ్రాంతులతో వివిధ నామ రూప స్వరూపాలలో కనబడుతున్నదని నిజానికి ఇదంతా త్రిగుణాల వలన ఏర్పడిన కర్మలు చేయడం వచ్చే ఫలితాలు కర్మ ఫలితాలే కారణమవుతుందని కర్మరాహిత్యం పొందిన వాడికి పాప పుణ్య కర్మఫలితాలు ఉండవని తామరాకు మీద ఉన్న నీటిబొట్టులాగా నేను కర్మలు చేస్తున్నానని అనుభూతి కలగ సాగింది అంటూ

అజ్ఞానమనే అంధకారంలో 
ఉన్నప్పుడు ఏమి కావాలంటే 
అది అన్నియు పొందినట్లుగా 
కనబడుతుంది... జీవా..
 జ్ఞానోదయమయ్యాక 
ఏమి కావాలని అనిపించదు
ఏమి పొందినను అనుభూతి 
ఇవ్వదని తెలుసుకో జీవా..

మేఘాన్ని చేసింది జ్యోతి 
జ్యోతినే మూసింది మేఘం 
మేఘాన్ని చేర్చేది గాలి 
మేఘాన్ని చెరిపేది గాలి 

బంధాలు కలిగించు మనస్సు 
బంధాలు తొలగించు మనస్సు 
జీవులలో చేరింది ఆత్మ 
ఆత్మనే మరిచేది జీవి...

 మారేది మానవుడు 
మారనిది మాధవుడని తెలుసుకో...

 అంటూ జిజ్ఞాసి తన స్థిర జిజ్ఞాసము వలన కలిగిన సహజసిద్ధ జ్ఞాన అనుభూతిని అనర్గళంగా చెబుతూ నా టెలిపతి నుండి తప్పుకున్నాడు.

తారక రామ నామ నాదము:

 నేను ఈ చక్ర సాధన స్థితి తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నా బొడ్డు ప్రాంతము నుండి 'రా' అనే శబ్ధము వినటం ఆరంభమైనది. ఓంకార నాదములాగా 'రా' అనే ఈ శబ్దం వినబడుతుంది అని నాకు అర్థమైనది. నేను ధ్యానానికి కూర్చున్న ప్రతిసారి ఈ శబ్ద నాదము మాత్రమే వినబడటం నాకు ఆశ్చర్యం వేసేది. ఇలా కొన్ని వారాలు వినిపించినాయి. ఆ తర్వాత నా ఆజ్ఞ చక్రంలో వున్న త్రికోణం మధ్య బిందువు నుండి 'మ' అనే శబ్దం రావడం మొదలైనది. ఇప్పుడు ఈ ఒక శబ్ద నాదమే వినబడ సాగినది.ఇది ఎందుకు వినబడుతుందో అర్థం అవ్వక తికమక పడుతుంటే నా మనో నేత్రమునందు కాశీక్షేత్రము గంగానది తరచుగా కనపడసాగాయి. దానితో నేను మా శ్రీమతి దీక్షా దేవితో కలిసి మూడవసారి కాశీక్షేత్రము యాత్ర కి వెళ్లడం జరిగింది. అక్కడ నలభై ఒక్క రోజుల పాటు కార్తీక మాసంలో ఉండవలసి వచ్చినది. ఇలాంటి సమయంలో మేము శ్రీ త్రైలింగస్వామి మఠమునకు వెళ్లి ధ్యానము చేసుకుని తిరిగి మధ్యాహ్న సమయానికి స్నానానికి అని మణికర్ణికా ఘాట్ కి చేరుకోవడం జరిగినది. ఈ సమయములో ఒక 80 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక ముసలాయన తెల్లని గడ్డంతో తెల్లని జుట్టుతో జటాజూటము ఉన్న మహాశివుడు లాగా ఉండి ఎవరికో దహన కార్యక్రమం విధానము చేస్తుండగా ఆ దృశ్యం చూసి నాకు ఏదో తెలియని ఉత్తేజం కలిగి నా మనోనేత్రం ముందు ఒక మహత్తరమైన మనోహర దృశ్యమాలిక కనపడ సాగింది. అది ఏమిటంటే మృత జీవి సూక్ష్మశరీరమును కాలభైరవ స్వామి తన కొరడాతో 8 కొరడాదెబ్బలు కొట్టగా స్పృహ తప్పటం ఇంతలో అమ్మ వారు ఈ జీవాత్మ కి విసనకర్రతో విసురుతూ ఉండగా గణనాధుడు తన తొండముతో గంగా నది నీటిని తీసుకొని ఈ మృతదేహంకి గంగా స్నానం చేస్తుండగా మహాశివుడు ఇతని కుడి చెవి యందు తారకరామ మంత్రమును ముమ్మారు చెబుతూ ఉండగా అతడికున్న సర్వపాపాల నుండి సర్వకర్మల నుండి సర్వ జన్మల నుండి విముక్తి చెందిన వాడై ఆ జీవాత్మ కాస్త దివ్య ఆత్మ గా మారటం నేను గమనించే లోపల నా మణిపూరక చక్రము బొడ్డునుండి 'రా' అనే అక్షరం అలాగే ఆజ్ఞాచక్రము బొట్టు పెట్టుకునే భ్రూమధ్య ప్రాంతంలో 'మ' అనే శబ్ద నాదం ఏకకాలంలో రామ అనే శబ్దంగా మారి ఇదే అసలు సిసలైన తారకరామ మంత్రమని తారక బ్రహ్మమని అనుభూతి కలుగుతుండగా 

ఏవో గ్రహాలు గ్రహశకలాలు కనబడుతూ నక్షత్రాలు గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు కనబడుతూ 477 సంఖ్య మాత్రం చాలా స్పష్టంగా కనపడ సాగింది. ఇది దేనికి సంకేతం అని నేను అనుకుంటూ ఉండగానే ఈ దివ్య దృశ్యమాలిక కాస్త అదృశ్యమైనది. ఇలాంటి స్థితిలోనే మహమ్మద్ ప్రవక్త కి కూడా 786 సంఖ్య కనపడి ఉండాలి. అందుకే వారు తమ అర్థచంద్రాకారము దగ్గర 786 సంఖ్య వేసి ఉండాలని అలాగే ఏసుప్రభువు కూడా 7x7=49x7=343 సంఖ్య కనబడినట్టు వారి చరిత్రలో ఉంది. అలాగే మన జిజ్ఞాసి కూడా తన ధ్యానములో 480 సంఖ్య కనపడినట్లు గా చెప్పటం జరిగినది. ఈ అంకెల గారడి నుండి భవిష్యత్తు చెప్పే సంఖ్యాశాస్త్రము అభివృద్ధి చెంది ఉండాలని నాకు అనిపించసాగింది. అంటే మణికర్ణికా ప్రాంతంలో మహా శివుడు చేసే తారకరామ ఉపదేశము నిజమేనని ఇలాంటి అనుభూతి తాను కూడా పొందినానని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చదవటం లీలగా గుర్తుకు వస్తూ ఉండగా అందుకే కాబోలు కాశీక్షేత్రంలో ప్రతి జీవి కూడా తన కుడిచెవిని పైకి అనగా ఆకాశమువైపు పెట్టుకొని చనిపోవటం ఈ తారకరామ మంత్రోపదేశము కోసమని అని నాకు తెలియగానే నాలో తెలియని ఆనంద ఉత్తేజం కలుగుతుండగా రోడ్డు మీద అక్కడక్కడ కోతి పిల్లలు, కుక్క, పిల్లి ,గాడిద, గుర్రము, ఆవు,ఎద్దు,కాకి,పిచ్చుక,బాతు,అనాధ శవం యొక్క కుడి చెవులు ఆకాశంకేసి చూడటము నా ప్రత్యక్ష అనుభవం పొందుతూ కాల భైరవ మూర్తి దర్శనం చేసుకుని వారి అనుమతితో పవిత్ర కాశీ క్షేత్రమును వదిలి వెళ్ళుటకు అనుమతిని తీసుకొని వస్తూండగా ……

 అక్కడ ఒక యోగి నాకు కనిపించి  తన యోగదండమును నాకు ఇస్తూ “తారక రామ దీక్షను పొంది నావు.దీనితో ఈ సాధన దీక్ష గావిస్తూ బ్రహ్మతదాకార స్దితికి చేరుకొమ్మని” ఆశీర్వాదము చేసి...ఏమి ఆశించకుండా...ఆ కాశీ విశ్వనాధుడి గుడి వైపుకి వెళ్ళిపోయినాడు.ఇంతలో అక్కడున్న కొంతమంది నా దగ్గరికి వచ్చి"స్వామి!మీరు చాలా అదృష్టవంతులు.ఆయన ఏవరో గాదు.ప్రతిరోజు మన విశ్వనాధ లింగమునకు సప్తరుషి హారతిని ఇచ్చేవారిలో ఈయన ఒకరు...వీళ్లు ఎవరితో మాట్లాడరు.ఎవరిని చూడరు.అలాంటి ఆయనే మీకు స్వయంగా తన యోగదండము ఇచ్చినారు అంటే మీరు నిజముగానే కారణ జన్ములు అయ్యింటారు అంటూ వీళ్లంతా నా కాళ్ళమీదపడి నమస్కారాలు  చేస్తూంటే నేను వీటిని స్వీకరించకుండా ఆ కాశీవిశ్వనాధుడికే సమర్పించడము జరిగినది. ఆతర్వాత కొన్ని రోజులకి మా ప్రాంతానికి చేరుకోవడం జరిగినది. ఇక ఎందుకు ఆలస్యం. ఇప్పుడు నాతో పాటుగా చేపలు తినటానికి (మత్స్యము) ముందుకి బయలుదేరండి. స్వాములు... 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

**************************************
గమనిక: ఈ చక్ర స్థితిలో మనకి శ్రీ రాముడి విగ్రహాలు, శుద్ధ స్ఫటిక లింగము,ఒక స్ఫటిక మాల,యోగదండము, నిజరూప శ్రీరామ దర్శనాలు అదే దక్షిణాచారం చేస్తే కలుగుతాయని నాకు అర్థం అయినది. అలాగే తప్పకుండా ఏదో ఒక శ్రీరామ క్షేత్రానికి వెళ్లి వారి నిజరూప దర్శనం అనుభూతిని పొందటం జరుగుతుంది. 
అలాగే నేను కోల్పోయిన స్ఫటిక లింగము తిరిగి నా సాధన శక్తి కాస్త బ్రహ్మరంధ్రమునకు చేరుకున్నపుడు రుషికేశి క్షేత్రము నుండి రావడము జరినది.అంటే దానితో నాకున్న స్ధూలశరీర 48 లక్షల కర్మలు అదిగూడ కర్మశేషం లేకుండా పూర్తి అయినాయని నాకు జ్ఞానస్ఫురణ అయినది.అలాగే ఈ చక్ర స్ధితి యందు లాహిరి మహాశయుడికి త్రి కర్మల ప్రతీక అయిన శ్రీరామ బాణ దర్శనం అయినట్లుగా వారి "పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి" గ్రంథ అనుభవాలలో చెప్పడం జరిగినది.
 
ఒకవేళ శ్రీరాముడు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి కాస్త ఒక ముస్లిమాన్ రూపములో దర్శనమిచ్చినాడేమో...ఎవరికి ఎరుక...

*********************
నా సాధన పరిసమాప్తి సమయములో

నా సాధన పరిసమాప్తి సమయములో అయోధ్య క్షేత్ర సందర్శనమునకు వెళ్ళడము జరిగినది.అక్కడ ఒక యువ సాధకుడు ఏదో తెలియని ధర్మసందేహముతో ఉన్నాడని నాకు అనిపించి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే…. అతను వెంటనే "స్వామి!భోగి తన కూటి కోసము కర్మలు చేస్తే...యోగి తన కాటి కోసము కర్మలు చెయ్యక తప్పదు గదా!మరి ఈ కర్మలు కాస్త కర్మబంధనము కాకుండా ఎలా ఉంటాయి” అని అడిగాడు.అపుడు మేము వారితో  “ప్రతి జీవి కూడా తన జీవనం కోసం ఏదో ఒక కర్మ చేయాలి కానీ ఈ కర్మలు చేసేటప్పుడు స్వార్థముతో గాని, రాగద్వేషాలతో గాని కామంతో, మోహము తో, వ్యామోహంతో, అతి ప్రేమతో, అసూయతో, కోపముతో, ఆవేశంతో, అశ్రద్ధతో, పెద్ద ఆసక్తి లేకుండా, ఆనాసక్తితో, ఏదో ఆశించి చేయకుండా, ఫలితాలు ఆశించడంతో ఇలా భావాలతో ఈ కర్మలు చెయ్యటం వలన అవి కాస్త కర్మ బంధనాలుగా మారుతున్నాయి. వీటి వలన వారికి మీరు రుణపడటం గాని లేదా వాళ్ళు మీకు రుణము పడటం జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఉపకారము చేయటం వల్ల మీకు రుణపడి ఉంటారు కదా. అదే అపకారము చేయుట వలన మీరు వాళ్ళకి రుణ పడతారు. ఈ రుణాల నుండి విముక్తి పొందుటకు కర్మలు చేయాల్సి వస్తుంది. ఈ కర్మల కోసం జన్మ ఎత్తవలసి వస్తుంది. అది కాస్తా పునర్జన్మ కారకమైన జన్మచక్రం ఎత్త వలసి వస్తుంది. అదే మీరు మంచి ఆలోచనలతో ఇతరులకు హాని లేకుండా, మీరు ప్రతిఫలం ఆశించకుండా, కర్మ ఫలితమును దైవానికి అర్పణ చేస్తూ కర్మలు చేయగలిగితే అది కాస్త నిష్కామ కర్మ గా మారి మీకు ఆ కర్మ బంధంనుండి విముక్తి కలిగి కర్మ విముక్తి పొంది కర్మరాహిత్యం స్థితి పొందటం వలన ఆ తర్వాత వచ్చే జన్మ రాహిత్యమును పొందటం జరుగుతుంది. ఇదియే ఈ చక్ర ఆధీనము అవుతుంది. అంటే నిజానికి చక్రాలు జాగృతి అంటే ఆయా చక్రాల లోని కర్మలు మాయలు అన్న మాట. అదే చక్ర శుద్ధి అంటే ఉండే పాప కర్మలు చేయడానికి అవకాశాలు ఉన్న చేయకపోవటమే వాటి యందు నిగ్రహమును పొందటం అన్న మాట. అదే ఆధీనము అంటే ఈ చక్రాలలో ఉండే వాటి మీద ఆధిపత్యం సంపాదించు కోవటము అన్నమాట. ఉదాహరణకి ఈ కర్మ చక్రములో కామము అనే కర్మనే చూద్దాం. పర స్త్రీ / పురుషుల కామ కోరిక నిద్రలేస్తే మీ చక్రం జాగృతి అవుతుంది. అదే ఈ పర స్త్రీ/ పురుషుని యందు కామ మాయలో అతి మోహ మాయ అయి జన్మకి కారణమవుతుంది. వివాహము చేసుకొని వీటియందు నిగ్రహంగా పాతివ్రత్య ధర్మముతో వుంటే ఈ చక్రము శుద్ధి అవుతుంది. వివాహము అయిన కూడా పాతివ్రత్య ధర్మమును తప్పితే అది కాస్త అది కామ మాయ కు గురై పునర్జన్మల కి కారణం అవుతుంది. అదే తప్పులు చేసే అవకాశాలు వచ్చినా కూడా ఎంతో నిగ్రహముతో మీరు ఉండగలిగితే కామము మీ ఆధీనములో  మీ అదుపులో తెచ్చుకుంటే ఈ చక్ర ఆధీనము అయినట్లుగా భావించుకోవాలి. అంతేగాని చక్ర జాగృతి శుద్ధి ఆధీనము అంటే ఏమిటో అనుకోకండి. ఏవో శక్తులు అనుభూతులు అనుభవాలు కలుగుతాయని అనుకోకండి. మనస్సు యందు కోరిక కలగటంతో చక్ర జాగృతి అయితే ఈ కోరిక హితమైతే పాపం అయితే చక్రం శుద్ధి అలాగే ఈ కోరికను మీ అదుపులో ఉంచుకుంటే ఆ చక్రము స్వాధీనం అయినట్లే. లేదంటే ఆ కోరికే మిమ్మల్ని అదుపులో ఉంచుకుంటే చక్ర మాయకు గురి అవుతున్నారు అన్నమాట. జన్మలకి కారణము కర్మలు. వీటికి కారణం త్రిగుణాల మాయ. దీనికి కారణము స్థిర మనస్సు స్థిర బుద్ధి లేక పోవటం అన్నమాట. ఇట్టి కర్మరాహిత్య స్ధితి కోసము సాధకులు తమ కర్మచక్ర ఆధీనము కోసం ఇక వామాచారం అయితే పంచ మాంసభక్షణ అదే దక్షిణ ఆచారము అయితే ఖేచరీ ముద్ర సాధనతో నాలుక యొక్క వాక్యం భక్షణ చేయాలని తెలుసుకో! మరి ఈ రెండూ కూడా చేయలేని వారు ఈ కర్మ చక్ర స్థితుల కోసం అర్ధ పురుషార్థము అనగా ధర్మ సంపాదన కలిగి ఉంటే చాలు. మీ కష్టమే మీ సంపాదనగా జీవించాలి. అనాలోచితంగా వచ్చిన డబ్బు మీద ఆశ పడకూడదు. ఇతరుల నుండి వచ్చిన ఆస్తులు సంపాదన మోసముతో, స్వార్థంతో, వారి నుండి ఆశించకూడదు. లాక్కోకూడదు.ఇతరుల నుండి ఉచితంగా ధనము ఆశించకూడదు. ప్రలోభాలతో మోసాలతో ఇతరుల సొమ్మును దొంగతనం  చేయకూడదు. దొరికిన ఎవరిదో వారికి ఇవ్వాలి లేదంటే సంబంధిత కార్యాలయాలలో నిజాయితీగా ఇవ్వాలి. అంతే గాని మీకు మోసపోతూ ఇతరుల ధనం కోసం మోహము చెందరాదు. డబ్బులు సంపాదనే జీవిత పరమావధి కాకూడదు. మన జీవితానికి ఎంత అవసరమో అంతే దానిని నిజాయితీగా ధర్మయుతంగా సంపాదించుకోవాలి. ధనము కొంతమేర మనల్ని రక్షిస్తుంది. దాని పరిధి దాటి మీరు సంపాదిస్తే దానిని మీరు రక్షించే పరిస్థితి అవుతుంది. గడ్డివాము దగ్గర కుక్క కాపలాగా ఈ అధికధనముకి కాపలా కాయాలి. కుక్క ఈ గడ్డిని తినలేదు. వేరే వారిని తిననీయదు.సంపాదించిన డబ్బు ఖర్చుపెట్టి అలాగని దాచుకోలేదు. రాజు సొమ్ము రాళ్లపాలు అవ్వక తప్పదు కదా. వాడికి పనికిరానట్లుగా అధిక ధన సంపాదన కూడా ఒక మాయగా మారుతుందని మన పూర్వీకులు గ్రహించి సాధకులు తమకు ఎంత అవసరమో అంతే సంపాదన ధర్మయుక్తముగా సంపాదించు కలిగితే ఈ కర్మ చక్ర స్థితులు కలుగుతాయని  గ్రహించు” అని వారికి చెప్పి...ఇతడితో నాకున్న ప్రారబ్ధకర్మ ఈవిధంగా తీరినదని...దీనికోసమే నేను ఈ క్షేత్రదర్శనకోసము వచ్చినానని నాకు జ్ఞానస్ఫురణ కలిగినది.

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. mee pancha shishyula parichayam vaari saadhaana sthayilu, himalayalo meeku
    shivudi gn una muffa darshanam, arunachalam lo dakshina Murthy darshanam, sookshma shareera
    kaashi yaanam,ishtalingam raavatam adi ochi puja chesthe saadhakudu dheniki spandinchakunda
    pothadani, ee Ashtadala padmam lo 8 maaya lu untayi ani....36 kapaala dhaari ela untadu 35
    kapaalale poyi okati migalatam, brahmanda chakram darshanam science em chepthundi ani dhaani
    prakaaram monna ne theesina photolu petti cheppatam bagundi.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు ఈ బుక్ చదవడమే ఒక ముక్తి,మీకు నా ఆత్మ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి