అధ్యాయం 67


బ్రహ్మాండ చక్ర దర్శనం
(నా బ్రహ్మాండ చక్ర సాధన అనుభవాలు  )
 

P1:
బ్రహ్మాండ చక్ర సాధన అనుభవాలు( నా డైరీలో): 
ఫిబ్రవరి 21: ఈ రోజు నాకు ధ్యానము నందు నా ఏకముఖ కపాలము యొక్క బ్రహ్మరంధ్రము అతి సూక్ష్మాతి సూక్ష్మముగా దర్శనం అయినది. ఇందులో పిసరంత పరిమాణములో ఏదో అగ్నిశిఖ ఉన్నట్లుగా లీలగా కనిపించినది. 
ఫిబ్రవరి 22: ఈ రోజు నాకు ధ్యానము నందు ఈ అగ్నిశిఖ చాలా స్పష్టంగా పెద్దదిగా జూమ్ చేసినట్లుగా కనిపించినది. 

ఫిబ్రవరి 23: ఈరోజు నాకు ధ్యానము నందు ఈ అగ్నిశిఖ యందు అతి సూక్ష్మముగా ఏదో చక్రము తిరుగుతున్నట్లుగా అదికూడా వలయాకారంగా ఏదో ఒక భూచక్రం వెలిగిస్తే ఎలా తిరుగుతుందో అలా తిరుగుతున్నట్లుగా నాకు అనిపించినది. అదికూడా చాలా స్పష్టముగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ చక్రము అదికూడా బ్రహ్మతేజస్సు బ్రహ్మ వెలుగులతో సుడులు తిరుగుతూ తన చుట్టూ ఉన్న ధృవతారలు అంటే నిప్పు కణికలను తనలోనికి కలుపుకోవటం కనిపించసాగింది. 
P2:

ఫిబ్రవరి 24: ఈ చక్రమునకు ఒక వలయం ఉన్నట్లుగా ఈ కవచమునకు సుమారుగా 50 దాకా ఆకులు ఉన్నట్లుగా ఈ ఆకులు యందు ఏవో దృశ్యాలు కదలాడుతూ ఉన్నట్లుగా కనబడినది. అనగా రామాయణము మహాభారత దృశ్యాలు కనిపిస్తూ ఉండగానే నాకు ధ్యానము భంగం అయినది. 
ఫిబ్రవరి 25: ఈ రోజు ఈ చక్రము ఆకులమీద సత్య- త్రేత- ద్వాపర- కలి-యుగములలో జరిగే అన్ని రకాల సంఘటన దృశ్యాలు ఉన్నట్లుగా లీలగా కనిపించసాగింది. 
ఫిబ్రవరి 26: ఈ రోజు మళ్ళీ నాకు 36 కపాలాలు ధారిగా కనిపించాడు. కాకపోతే ఈ కపాలాలు కాస్త తలలు ఉన్నట్లుగా కనిపించినాయి. వీటి మనోనేత్రాలు ఒక్కసారిగా అనగా 36 మనోనేత్రాలు తెరుచుకుని ఏవో దృశ్యాలను రికార్డు చేస్తున్నట్లుగా అవే దృశ్యాలు నాకు చక్రము యొక్క 50 ఆకులమీద ఉన్నట్లుగా లీలగా కనపడసాగింది.
P3:
ఫిబ్రవరి 28: అంటే మనము ఈ 36 కపాలాలు రికార్డు చేసిన దృశ్యాలు చూస్తున్నామని నాకు అర్థం అయినది. ఎందుకంటే రామాయణంలో కాకభుంశుడు కాస్త కాలాతీత స్థితిని పొంది తాను ఇప్పటికే 11 సార్లు రామాయణమును 22 సార్లు మహాభారతమును చూసిన దానిని చూసినట్లుగా చెప్పిన సన్నివేశము లీలగా నాకు స్పురణ అయినది. నా బుర్ర తిరగటం ప్రారంభమైనది. 
మార్చి 2: ఎప్పుడైతే మనమంతా మనము చూసేదంతా మనకి కనిపించేది అంతా కూడా ఒకప్పటి ఆది యుగపు రికార్డు దృశ్యమే అనగా నాకు ఉన్న ఆనందము దొబ్బింది. కేవలము ఆనంద రహిత స్థితి మిగిలినది. 
మార్చి 3: అగ్నిశిఖ యందు తిరిగే చక్రమును మన పూర్వ మహర్షులు బ్రహ్మాండ చక్రం అన్నారని ఇదే చక్రమును తను త్రిప్పు తున్నట్లు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడని ఇదే చక్రమును మన శాస్త్రవేత్తలు కృష్ణబిలం అని అన్నారు అని నాకు అర్థం అయింది. అంటే సుడులు తిరిగే బ్రహ్మాండ చక్రమే శూన్యముగా మార్చే కృష్ణబిలం అని నాకు అర్థం అయింది.
P4:
మార్చి 4: ఎప్పుడైతే ఈ బ్రహ్మాండచక్రము నందు తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు సంపూర్తిగా అయిపోతాయో ఆనాడే ఇది కూడా కాంతి హీనమై అన్నింటిని తనలోనికి ఇముడ్చుకొని పరమ శూన్యము నందు పిండి రేణువుగా మారిపోతుందని అనగా నిర్జీవం అవుతుందని నాకు స్పురణ అయినది. 
మార్చి 8: ఈ రోజు నాకు ధ్యానం నందు నా పంచ శరీరాలు బ్రహ్మ రంధ్రములోని చితాగ్ని యందు ఉన్న అగ్నిశిఖ లోని బ్రహ్మ చక్రము నందు సుడులు తిరుగుతూ విలీనం అయినాయి. ఈ శరీరాలు తునాతునకలు అవుతూ అక్కడ నా గురువులను నా దైవాలను చూస్తూ తునాతునకలు అయిన నా శరీరాలు కాస్త పిండి రేణువులు లాంటి విభూది రేణువులుగా మారటం నాకు స్పురణ అనుభవము అయినది. ఎవరో జై విభూతినాథ్ అనే దీక్షా నామము పలికినట్లుగా అనిపించడంతో బాబా విభూతినాథ్గా నామమును పొందటము జరిగినది. 
మార్చి 10: ఈ దీక్ష నామముతో ఆనంద రహిత సమాధిస్థితి పొందటము జరిగినది. 49 రోజుల దాకా నా స్థూల శరీరము తట్టుకున్నది.ఆపై తట్టుకోలేక పోయినది. కారణం మా అమ్మ గారి అంతిమయాత్ర దాకా నేను ఉంటాను అని ఇచ్చిన మాట లీలగా గుర్తుకు వచ్చినది.
P5:
మార్చి 12: ఈ బ్రహ్మాండ చక్రం కృష్ణ బిలము నందు వాయువుల రూపంలో 36 మూలకాలు ఉంటాయని ఈ మూలకాలు 36 కోట్ల రూప మూలకాలు అయినాయి అని వీటిని మన పూర్వీకులు నామరూప దైవాలుగా నామకరణము చేసినారని అనగా సల్ఫర్ కి శివుడు గాను అదే శాస్త్రవేత్తలు అయితే S అన్నారని ఇలా మన నామరూప దేవుళ్ళు అందరూ కూడా అలాగే జీవరూపమైన మనము కూడా ఏదో ఒక మూలకమునకు చెందిన వారమని ఆ మౌలిక లక్షణాలు మన దైవాలకు అలాగే మనకి ఉంటాయి అని స్పురణకు రాగానే నాకు మతి పోయినది. కొండను త్రవ్వితే ఎలుక దొరికినట్లుగా చివరికి మూలకాలే మనమే అనే అనుభవం అయ్యేసరికి ఉన్న ఆనందము కాస్తా దొబ్బి ఆనందరహితం  మిగిలినది.ఆపై పరమ ప్రశాంత స్థితి కలిగినది. అనగా జీవ పదార్థానికి ఆక్సిజన్ ఉండాలని అదే నిర్జీవ పదార్థం గా మారటానికి హైడ్రోజన్ ఉండాలని అనగా O నుండి H గా మారటమే సాధన పరిసమాప్తి అని H అనగా హనుమంతుడు అలాగే హయగ్రీవుడు ఉంటారని ఇందులో హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ కావటం వలన ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిల్వము అధిపతి గా ఉన్నారని పరమహంస పవనానందగా నాకు స్పురణ అనుభవము అయినది.
P6:

మార్చి 15: ఈరోజు నాకు ధ్యానము నందు అగ్ని జ్వాలలతో ఉన్న బ్రహ్మాండ చక్రం దాని మధ్యలో అగ్నితో చుట్టుకుని ఉన్న పాము దాని మధ్యలో అందమైన రాజహంస దాని రెక్క మీద హనుమంతుడి ముఖము ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవము అయినది.
మార్చి 16: నాకు ధ్యానములో కనిపించిన వాటిని అన్నింటిని బొమ్మలు సేకరించి కలిపి చూస్తే ఇది అంతా పరమహంస పవనానంద అనే దీక్షా నామము గూర్చి చెబుతున్నాయని నాకు స్పురణ అయినది. ఈ లోగో కపాలమోక్షం గ్రంథము యొక్క ఆఖరి అట్టపైన రావాలని సూచన అందినది. ఇంతటితో నాకు 1989 నుండి 2019 దాకా 40 సంవత్సరముల పాటు కలిగిన అన్ని రకాల ధ్యాన అనుభవాలు సంపూర్తిగా సంపూర్ణంగా పూర్తి అయినాయి అని నాకు స్పురణ అయినది.
మార్చి 27: నాకు ధ్యానం నందు ఈ మధ్య ఎటువంటి అనుభవ దృశ్యాలు కనిపించడం లేదు. చాలా ప్రశాంత వదనముగా ప్రశాంత స్థితి కలుగుతుంది.  దేనియందు ఆశ, ప్రేమ, మోహము, వ్యామోహము, భయాలు, ఆనందాలు లేవు. సర్వము ఏమీ లేదు. సర్వము శూన్యం అనే అనుభవము మాత్రమే ఉంది. కేవలం విశ్రాంతి ఆలోచనే ఉంది. అది కూడా ఈ దేహము పరమ ప్రశాంతంగా చితి చేరేదాకా ఉంటుందని గ్రహించాను. ఈ రోజు నా పుట్టినరోజు కూడా కావడం విశేషం.
P7:
మార్చి 27:అలాగే నా అంతిమ సాధన పరిసమాప్తి కావటం విశేషం. నా పుట్టిన జీవపదార్థం కాస్త ఇదే రోజు నిర్జీవ పదార్థంగా మారిందని తెలిసిన ఎలాంటి అనుభవం అనుభూతి లేదు. ఏమీ లేదు. బాధ లేదు. ఆనందము ఏమీ లేదు. ద్వైత భావం లేదు. ఆనంద రహితమే మనస్సు లేని స్థితి. ఏమీ లేని స్థితి. ఇంతకీ ఈ ధ్యాన అనుభవాలు చెప్పిన గురువు దేవుడు ఎవరు అని అనుకుంటున్నారా? నా ఆత్మ. నా ఆత్మ గురువు అన్నమాట. ఈయనే నా గురుదేవుడు అన్నమాట. నా ఆత్మ ఒక ప్రక్క దైవముగా మరొక ప్రక్క గురువుగా ఉండటంతో నా ఆత్మకి గురుదేవుడుగా నామకరణం చేయడం జరిగింది. అలాగే నా మనస్సు సాధన శిష్యుడిగా సాధన భక్తుడిగా సాధన జీవాత్మగా ఉంది. అనగా విశుద్ధ చక్రము నందు నిజ బౌతిక గురువైన విచిత్ర వేదాంతి తప్పుకుంటే ఆజ్ఞాచక్రము వద్ద సద్గురువు శ్రీ త్రైలింగ స్వామి వారు అలాగే వివిధ రకాల
P8:
మార్చి 27:ఆధ్యాత్మిక గురువులు అలాగే ప్రకృతి గురువులు తప్పుకోవటం జరిగినది. ఆపై మా ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కూడా నా ఆత్మ గురువు అనుగ్రహం వలన సంపూర్తి అయినది. అనగా మా జీవాత్మ కాస్త పరమాత్మ ఆత్మ యందు అదే నా మనస్సు కాస్త ఆత్మయందు లీనమైనది. ఇదియే సంపూర్ణ యోగసాధన పరిసమాప్తి స్థితి అని ఇదియే సంపూర్ణ అద్వైతం అని గ్రహించండి. ఇదియే కపాల మోక్షం గ్రంథ సారం  అని తెలుసుకోండి. 
మన దైవాలెందుకు కపాలమోక్షం పొందడంలేదు:

ఒకరోజు నాకు చిన్న సందేహం వచ్చినది. అసలు ఎందుకు బ్రహ్మదేవుడు తన 36 కపాలాలు విభేదనము గావించకుండా కపాలమోక్షం పొందకుండా ఉండిపోయి ఉన్నారో తెలుసుకోవాలని అనిపించింది. అందుకు పుస్తక గ్రంధాలు తిరగవేస్తే ఒక్కోచోట ఒకసారి బ్రహ్మదేవుడు అగ్నిదేవుడిని మొట్టమొదటిసారిగా సృష్టించినప్పుడు తన సహజ తత్వమైన దహించే గుణం ఉండుటవలన సృష్టించిన బ్రహ్మ దేవుడిని అగ్ని దహించడం మొదలు పెట్టేసరికి ఆదిపరాశక్తిని వేడుకొనగా జమ్మిచెట్టును సృష్టించి ఇచ్చినది. ఈ చెట్టుకి అగ్ని దహనశక్తిని నివారించగలదని మన మౌలిక ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా తన కపాలమోక్షం సమయములో కపాల దహనము ప్రారంభమయ్యే సమయానికి నేను మాత్రమే ఎందుకు చనిపోవాలి అనుకుంటూ తను కాస్త జమ్మి వేర్లు సహాయంతో బయటికి వచ్చినాడట. అనగా కపాలమోక్షం ప్రాప్తి పొందకుండా వెనుతిరిగినాడట.

మరొకసారి అసలు సదాశివుడు ఎందుకు కపాలమోక్షం పొందలేదో తెలుసుకోవాలని అనిపించింది. అప్పుడు మాకు ఒక విషయం స్పురణ అయినది. ఏమిటంటే అప్పటికే ఈయన 33 కపాలాలు విభేదనము గావించుకున్నాడు.కేవలము అప్పటికి సదాశివమూర్తి గాను దక్షిణామూర్తిగాను శరీరాలతో ఉండిపోయినాడట. ఒకసారి సదాశివమూర్తి గా ఉన్నప్పుడు దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు 9 విషాలు ఉన్న మహా కాలకూట విషము బయటికి వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా దీనిని త్రాగి వేయటం జరిగితే అప్పుడు ఈ కాల కోట విషాల వేడికి ఈయన తట్టుకోలేక గిలగిల లాడుతుంటే ఆదిపరాశక్తి కాస్త తారాదేవిగా అవతరించి శివుడికి తన చను పాలు ఇచ్చి వారి విషతాప శక్తిని తగ్గించి తీసుకున్న మహా కాలకూట విషము హరించి వేయడం జరిగిందని దానితో కపాలసిద్ధి పొందలేక నిత్య జీవుడుగా సదాశివమూర్తి శరీరముతో కైలాస పర్వతమున ఇప్పటికీ చిరంజీవి తత్వముతో ఉన్నాడని నాకు అర్థమైంది. అలాగే మరొక సారి దక్షిణామూర్తి అవతారంలో కపాలమోక్షం కోసం ప్రయత్నిస్తే చితాగ్ని స్వరూపమును చూసి తను పొందిన జ్ఞానమునకు ఇతరులకి పంచాలని వెనుతిరిగి వచ్చినాడట. దానితో ఈ రూపము కూడా చిరంజీవి తత్వముగా ఉండి మురుడేశ్వర క్షేత్రములో సముద్రం ఒడ్డున జ్ఞాన లింగంగా ఆత్మలింగముగా ఉన్నాడని నాకు స్పురణ అయినది. ఇక దీనితో ఈయన 33 కపాలాలు విభేదించి సదాశివుడుగా జ్ఞాన దక్షిణామూర్తిగా ఉండిపోతూ మూల కపాలమోక్షం సాధన కోసం ఉండిపోవటం జరిగినది. 

ఇలా హనుమంతుడు వారు తాను చనిపోతే రామయ్య ఏమవుతాడో అనే ఆలోచనతో చితాగ్ని నుండి సంజీవని వేరులతో రక్షించుకొని బయటపడినాడట. 

అలాగే మహా దుర్గాదేవి కూడా తన మూల కపాలమోక్షం స్థితికి వచ్చేసరికి చితాగ్ని దహనం చేస్తున్న సమయంలో దీప దుర్గా కవచంతో వేపాకులతో రక్షణ పొంది దీప దుర్గగా మారడం జరిగింది. అలాగే మహావిష్ణువు కూడా తన నరసింహమూర్తిగా తన మూల కపాలమోక్షం స్థితికి వచ్చేసరికి చితాగ్ని దహనశక్తి తట్టుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటే ఆదిపరాశక్తి కాస్త ఆయనకి మేడి చెట్టు ఇస్తే దీని వల్ల దహనశక్తి  నుండి విముక్తి పొంది స్త్రీ మూర్తిగా ప్రత్యంగిరా దేవతగా ఉన్నారు.ఇలా ఎవరికి వారే తమ మూల కపాలమోక్షం స్థితికి వచ్చేసరికి ఏదో మాయ లేదా దహన శక్తి తట్టుకోలేక పోవటం వలన వారి మంత్ర తంత్ర యంత్రాలను రక్షణ కవచాలుగా చేసుకొని శాశ్వత మరణమును పొందకుండా ఉండిపోవడం జరుగుతుందని నాకు అర్థమైనది. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు ఎందుకంటే ఆయనకి బలహీనత ఉంది కాబట్టి మూల ఆది దేవుడికే ఏదో ఒక బలహీనత ఉండుటవలన శాశ్వత మరణమును పొందకుండా వెనుతిరిగి రావడం జరుగుతుందని నాకు అర్థమైనది. చితాగ్ని యొక్క దహనము భరించే సహన శక్తి సంపూర్ణంగా ఎవరు కూడా అనుభవించలేక పోతున్నారు. శాశ్వత మరణమైన మూల కపాలమోక్షం జ్ఞానమును పరిపూర్ణముగా తెలుసుకున్నారు కానీ దీనిని అనుభవంగా సంపూర్ణముగా అనుభవించలేక శాశ్వత మరణమును పొందలేక అశాశ్వత మరణాలు అనగా ఎనిమిది రకాల ముక్తులు అలాగే భౌతిక మరణాలు పొందటం జరుగుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని యుగాలు, ఎన్ని మహాయుగాలు, ఎన్ని మన్వంతరాలు, ఎన్ని రకాలు కల్పాలు, ఎన్ని మహా కల్పాలు జరిగిన కూడా తాము శాశ్వత మరణానికి పొందటానికి వెళుతూ ఇక్కడ బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకుని అక్కడి దాకా వెళ్లి చితాగ్ని దర్శనము పొంది లేదా మహా నిర్వాణ శక్తి అయిన చితాగ్ని దహనశక్తి భరించలేక మంత్రము, తంత్రము, యంత్రము విధి విధానాలతో వెనుతిరిగి రావడం జరిగి మహా నిర్వాణము చెందకుండా మూల కపాలమోక్షం పొందకుండా వస్తున్నారు. ఆదిలోనే ఆదిదేవుడు కాస్త ఆదియోగి గా మారి ఈ మూల కపాల మోక్షం స్థితి యొక్క చితాగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోలేక వెనుతిరిగితే ఆయన రూపాలే అయిన మనము కూడా వెనుతిరుగుతాము కదా. కాకపోతే ఏదో ఒక కారణం పెట్టుకొని వస్తాము. అంతే తేడా. మాకు బజ్జీలు ఇష్టమైతే మీకు చుక్కకూర లేదా గోంగూర పెట్టుకొని వెనక్కి తిరిగి వస్తారు. అంతే తేడా. ఎందుకంటే చితాగ్ని యొక్క దహనశక్తి వలన సహన శక్తి కోల్పోయి మన మనస్సు ఏదో ఒక కారణంతో బయటికి వచ్చి మనను కాస్త శాశ్వత మరణ స్థితి నుండి బయటపడ వేస్తుందని అందుకే బ్రహ్మరంధ్రము వద్ద చిత్రాగ్ని వద్ద సహనశక్తి మాయగా వుంటుందని యోగశాస్త్రం గ్రంధాలు చెప్పిన విషయము లీలగా గుర్తుకు వచ్చింది. 

దేవుళ్ళు సాధించకపోతే మనలాంటి సాధకులు ఎందుకు సాధించలేరని అన్నపుడు

దేవుళ్ళు సాధించకపోతే మనలాంటి సాధకులు ఎందుకు సాధించలేరని అనే సందేహం రావచ్చును. దీనికి నిదర్శనమే ఒక పాలకుండలో ఒక్క చుక్క కాలకూట విషము వేస్తే ఆ పాలు అన్నీ కూడా విషపూరితమే కదా. ఈ పాలలో ఉండే రేణువులు పరమాణువులు అణువులు అన్నీ కూడా విషపూరితము అవుతాయి కదా.అలాగే విశ్వ జగత్తులో సహన శక్తిని కోల్పోయే గుణ మాయ ఉన్నప్పుడు అందులో జీవించే మనకి వాటిని తట్టుకునే శక్తి ఎలా వస్తుందో చెప్పండి. సృష్టిలోని వారిమే కదా. సృష్టిని దాటిన వారికి ఈ సహన శక్తి ఉంటుంది.ఇలా ఎవరున్నారు? ఎవరు ఉండరు.అందరూ కూడా ఈ విశ్వ జీవులే. రూపాలే వేరు. అంతే తేడా. కాకపోతే ప్రతి జన్మలో కపాల మోక్ష సాధన చేస్తూ 36 కపాలాలు విభేదనము కోసం సాధన చేసుకుంటూ తమ నామ రూప జన్మలు నాశనము చేసుకోవడానికి సాధన కోసం ఈ యోగ భోగ జన్మలు ఉన్నాయి. అది ఏమిటి? భోగ జన్మలు కూడా యోగసాధన క్రిందకి ఎలా వస్తాయి అనేది కదా. భోగజన్మలో చింతలు అనే చితాగ్ని ఉండనే ఉంటుంది కదా. వీటిని తట్టుకునే సహన శక్తిని పెంపొందించుకోవాలి అనేది నిజమైన యోగసాధన అవుతుంది. అలాగే దేనికి స్పందించకుండా సహన శక్తి కలిగి ఉండటమే నిజమైన యోగసాధన. దీనికి భోగ జన్మకి యోగ జన్మకి అలాగే సన్యాసి జన్మకి గృహస్థు జన్మ కి ఎలాంటి జన్మ లైనా సాధనకి పనికివస్తాయని నా వ్యక్తిగత అభిప్రాయము. నా స్వానుభవం. ఏ జన్మ అయినా కోరికలు లేని స్థితి పొంది కోరికకు స్పందించకుండా, ఆలోచించకుండా, సంకల్పించకుండా ఉండగలిగితే వారికి మాత్రమే కపాలమోక్షం స్థితి అనగా శాశ్వత మరణము పొందటం జరుగుతుంది. ఇది జరిగేదాకా మన విశ్వ సృష్టిలో సృష్టి స్థితి లయము జరుగుతూనే జగన్నాటకం కొనసాగుతూనే ఉంటుంది. నిరంతరముగా అవిశ్రాంతిగా ముగింపు లేకుండా ఆది లేకుండా అంతం లేకుండా మరణంలేని జీవులుగా కొనసాగుతూనే ఉంటాము. సరే అయితే ప్రస్తుతానికి ఇది అంతా కపాలమోక్షం జ్ఞాన అనుభూతి మాత్రమే జరిగినది. కానీ అనుభవ కపాలమోక్షం అనుభవము ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాకు 12 సంవత్సరముల పాటు ఎదురు చూడ వలసిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతానికి మేము ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈ కర్మల నివారణకి సుమారుగా 12 సంవత్సరములు పడుతుంది. కాబట్టి మా కపాలమోక్షం స్థితి అనగా మేము మూల కపాల మోక్షమును పొందినామో లేదో తెలియాలంటే పన్నెండు సంవత్సరములు ఎదురు చూడాలి. 

అసలు మనమెందుకు కపాలమోక్షం పొందడం లేదు

విచిత్రమేమిటంటే తనకి కూడా మూల కపాల దర్శనము కలిగినదని శ్రీ లాహిరి మహాశయులు తన అనుభవ డైరీలో రాసుకోవడం జరిగినది. ఈ మూల కపాల దర్శనము అనేది నిజమని వివిధ యోగుల అనుభవాలు చెబుతున్నాయి కదా. కానీ మాకు అర్థం కాని విషయము ఏమిటంటే 34 కపాల విభేదనము చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చివరి రెండు కపాలాలు ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావటం లేదు ఎందుకు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోగానే మాకు ఒక విషయము స్పురణ అయినది. అది ఏమిటంటే ఒక కపాలానికి జ్ఞాన శక్తి ఉండటం, మరొక కపాలానికి సహన శక్తి లేకపోవడం వలన ఇలా జరిగి ఉండి ఉండాలి. 

చితాగ్నిలో దహించే శక్తి అయిన చండీమాత శక్తి మొదట నవశక్తి గాను, ఆ తర్వాత శతశక్తిగానూ, ఆపై సహస్ర శక్తిగానూ, ఆపై ఆయుతశక్తి గాను, ఆపై నియుత శక్తిగానూ, ఆపై ప్రయుతశక్తి గాను క్రమక్రమంగా పెరిగేసరికి భరించలేని తీవ్రమైన స్థితికి చేరుకుని తన సహన శక్తిని కోల్పోవటం జరిగి అసహన శక్తితో వెనువెంటనే అమ్మా! అమ్మా! నన్ను రక్షించు. భరించలేక పోతున్నాను అంటూ ఆదిపరాశక్తిని ఆనాటి శివుడు నుండి ఈనాటి జీవుడు దాకా అలాగే మాధవుడు నుండి మానవుడి దాకా రక్షించమని చేస్తున్న పనియే. దానితో ఆమె వచ్చి మనల్ని తిరిగి రక్షించటం జరుగుతుంది. దానితో సదాశివమూర్తి కపాలము అలా మిగిలిపోవడం జరుగుతోంది. ఈ దహనశక్తి ఇలా ఉంటుందని మన పూర్విక యోగులు తెలుసుకొని చండీహోమములో ఇన్ని రకాల చండీహోమం చేయటం ఆచారముగా పెట్టిన మన వాళ్ళ  జ్ఞాన శక్తికి జోహార్లు. ఇక జ్ఞానశక్తి కపాలము కూడా తన అంతిమ చితాగ్ని  స్థాయికి వచ్చేసరికి తనకున్న జ్ఞానము వలన చితాగ్ని యొక్క దహనశక్తి యొక్క బాధ యొక్క జ్ఞానము ఙ్ఞప్తికి వచ్చి తాను ఎందుకు చనిపోవాలి నేను చనిపోతే మాకు తెలిసిన జ్ఞానము మిగిలిన వారికి ఎలా తెలుస్తోంది జ్ఞానము పంచడానికి లేదా అందించటానికి లేదా చెప్పటానికి నేను పరిపూర్ణ జ్ఞానంతో ఉండాలి అనుకుంటూ వెనుతిరగడం జరిగి జ్ఞాన దక్షిణామూర్తిగా మిగిలిపోతున్నారు.ఈ లెక్కన ఈ రెండు కపాలాలు ఎన్నటికీ కపాల విభేదనము జరగదు. పోనీ తను అపస్మారక స్థితి పొందిన కూడా తను తనకు తెలిసిన ఈ జన్మ జ్ఞానం మర్చిపోవటం జరుగుతుంది. జన్మాంతరాల జ్ఞానశక్తి ఎన్నటికీ పోదు. అనగా అప్పుడే పుట్టిన లేగదూడకి తన పాలు తన తల్లి పొదుగు దగ్గర దొరుకుతాయి అని ఎవరైనా చెబుతారా. చెప్పరు కదా. వాటి అంతట అవే ఎలా తెలుసుకుంటాయి. ఇదియే జన్మాంతర జన్మ జ్ఞానం. కాబట్టి జ్ఞాన శక్తి వలన జ్ఞాన కపాలము నాశనము అవ్వదు.మతి భ్రమణము చెందిన కూడా దహనశక్తి వాడికి తెలుస్తుంది కదా.దానిని తట్టుకోలేక నానా అగచాట్లు పడేసరికి దానితో దహన కపాలము కూడా నాశనము అవ్వదని మాకు అర్థం అయినది. మిగిలిన 34 శక్తులను వశము చేసుకున్నారు. కానీ ఈ దహన జ్ఞానశక్తిలకి ఆదిదేవుడైన ఆదియోగి వశము అయినాడు. మీలో ఎవరైనా వీటిని వశము చేసుకుంటారా అయితే మీకు మూల కపాలమోక్షం జరిగినట్లే. మీలో ఎవరైనా వశము చేసుకుంటారని ఆయనే ఇలా ఏకత్వం ఉండి మనలాంటి భిన్న రూపాలు ఎత్తినాడు. సాధనలు చేస్తున్నాడు. తిప్పలు పడుతున్నాడు. మా అనుభవ జ్ఞానము ప్రకారం చూస్తే మాయ అంటే పౌర్ణమి వెన్నెల లో త్రాడు కాస్త పాముగా అని భ్రమించడం కాదు. అది పాము అని జ్ఞానము కలిగి ఉండటమే అసలు సిసలైన మాయ అవుతుంది. ఎందుకు అంటే వాడికి ఏది తాడు ఏది పాము అనే జ్ఞానము ఉండటంవల్ల తాడు కాస్త పాముగా భ్రమ కలిగిస్తుంది. ఇలాంటి బ్రహ్మ జ్ఞానమే నిజానికి మాయ అవుతుంది. ఈ జ్ఞాన మాయ ఉన్నంతవరకు ఎవరికి కూడా మూల కపాలమోక్షం పొందటము జరగదు ఎందుకంటే జ్ఞానము వస్తే పోదు. అజ్ఞానము పోతే రాదు. ఈ లెక్కన చూస్తే జ్ఞానము రాకపోతే మాయలో ఉంటాము. జ్ఞానము పోకపోతే శాశ్వత మరణమైన మూల కపాల మోక్ష సిద్ధి కలుగదు. అందుకే మహా మృత్యువు అంటే తాము ఆత్మ అని మరిచిపోవడమే అని చెప్పటం జరిగినది. తాము ఆత్మ అని తెలుసుకోకపోవడం అజ్ఞానము. మాయ. తెలుసుకుంటే మహా మృత్యువు అయిన కపాల మోక్షం రాదు. అంతవరకు మన అందరిలో సాధారణముగా జరిగే అంతిమ దహన సమయంలో మెదడులో పిట్యూటరీ గ్రంధి విభేదనము జరిగి అందులో ఉన్న కారణశరీరధారి కాస్త మన దహనము అయిన తరువాత మిగిలిపోయే కపాలములోని బ్రహ్మరంధ్రము నందు చేరి కుండలిని శక్తితో ఆవాసము చేస్తాడు. అలాగే దహనము అయినప్పుడు ఏర్పడిన బూడిదలో ఆ జీవుడు యొక్క ప్రాణశక్తి చేరి ప్రాణమున్న విభూదిగా మారుతుందని ఎందరికీ తెలుసు. అందుకే ఇలాంటి భస్మము నుండి భస్మాసురుడు అనే రాక్షసుడు జన్మించాడని ఎవరి నెత్తి మీద అయితే ఇతగాడు ఎడమ చెయ్యి పెడితే భస్మము అయిపోతారు అని వరము పొందటము చివరికి జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వచ్చి చెయ్యి తనకి తానే తన మీద పెట్టుకునేటట్లుగా చేయటంతో భస్మాసురుడు చనిపోవటం కథ మీరు వినే ఉంటారు కదా. ఈ లెక్కన మన బూడిదకు ప్రాణ శక్తి ఉన్నట్లే కదా. అలాగే శివుడి తలకి ప్రతిరూపముగా శివ లింగ మూర్తిని పూజించటం జరుగుతుంది కదా. మరి తలలో ఏముంటుంది కపాలమే కదా. ఈ లెక్కన స్మశానంలో ఉండే కపాలములో ఈ ప్రాణశక్తి ఉన్నట్లే కదా. దహనాలు అయినా కూడా ప్రాణ శక్తులతో కపాలము బూడిద మిగిలి పోవటం అనేది చూస్తుంటే జ్ఞానశక్తి (కపాలము) సహనశక్తి (బూడిద) మిగిలినట్లే కదా. వామ్మో! వాయ్యో! మాకు బోలెడు విషయాలు ఇలా ఎలా తెలిసిపోతే ఎలా? ఒకప్పుడు మేము కూడా ఇలాంటి విషయాలు మీకు చెప్పటానికి అక్కడిదాకా అనగా చితాగ్ని దాకా వెళ్లి వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళమే అని ఈ మధ్యనే మాకు స్పురణ అయినది. అందుకే ఈ గ్రంథ రచన చేయడం జరిగినది. కానీ ఎవరికి తెలుసు. క్రిందటి సారి జ్ఞానశక్తి ఆపితే ఈసారి సహన శక్తి  ఆపుతుందో ఏమో ఎవరికి తెలుసు.
 
ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. మీరు చెప్పిన విషయాలు బాగానే ఉన్నాయి. కపాలము లో చేరిన కారణ శరీరధారి మరి ఎలా స్థూల శరీరధారిగా మారుతాడు అన్నప్పుడు పిండ ప్రధాన కార్యక్రమం ద్వారా పునర్జన్మగా నాలుగు రోజులలో ఎవరో ఒకరి గర్భంలోనికి చేరుతాడు. పిండ ప్రధాన కార్యక్రమం చేసేవారికి చేస్తున్నవారికి తినేవారికి తినే ఆవులకి నీళ్లలో కలిపితే అక్కడున్న తినే జీవులలో అంగుళ పరిమాణమున కారణ శరీరధారి చేరడము పెద్ద విషయం కాదని ఈపాటికి గ్రహించి ఉంటారు. మరి పిండప్రదానములు చేయకపోయినా లేదా సరిగ్గా దహనసంస్కారాలు జరగకపోయినా ఈ కారణ శరీరాలు మూడు అంగుళాల పరిమాణం శక్తిగా మారి పునర్జన్మ కోసం శరీరము కోసము చింతచెట్టు క్రింద, మరి చెట్ల వూడల యందు, దీపారాధన చేయని ఇండ్ల యందు, పాడుపడిన ఇండ్ల యందు, దేవాలయాల యందు ఆవాసం చేస్తూ ఉంటారు. తమ శత్రువులను, బంధువులను, కుటుంబ సభ్యులను, శ్రేయోభిలాషులకు, మిత్రులకు కలలలోనికి వచ్చి నానా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. కాశీ క్షేత్రంలో మరణం పొందిన జీవులకు అనగా ఆజ్ఞాచక్రం ప్రత్యేకమైన ఈ క్షేత్రము నందు మనకి సాయుజ్యము ముక్తి కలుగుతుంది. అప్పుడు మన అస్థికలు గంగానదిలో కలిపితే 10 లక్షల సంవత్సరాల దాకా కైలాసమున సర్వసుఖాలు అనుభవించి తిరిగి ప్రారబ్ద కర్మలు అనుభవించటానికి పునర్జన్మలు పొందటం జరుగుతుంది. ఇలా సప్త మోక్షపురులు అలాగే సప్త ముక్తి పురాలు ఉన్నాయి. 

సప్త మోక్ష పట్టణాలు అంటే 

1.హరిద్వార్ - మూలాధార చక్ర స్థితి 
2.కంచి - స్వాధిష్టాన చక్రం స్థితి 
3.అయోధ్య - మణిపూరక చక్రం స్థితి 
4.ఉజ్జయిని - అనాహత చక్రం స్థితి 
5.మధుర - విశుద్ధ చక్రం స్థితి 
6.కాశీ -ఆజ్ఞ చక్రం స్థితి  
7.ద్వారక - సహస్రార చక్రం స్థితి 

అలాగే సప్త ముక్తి పురాలు

1. కొల్లూరు- మూకాంబికా దేవి -సామీప్య ముక్తి 
2.ఉడిపి- బాలకృష్ణుడు- శరాస్థి ముక్తి 
3.గోకర్ణం- ఆత్మలింగము -కైవల్య ముక్తి 
4.సుబ్రమణ్య క్షేత్రము- కుమారస్వామి- సాలోక్య ముక్తి (కర్ణాటక మంగుళూరు) 
5.కుంభసి- హరి హర క్షేత్రము- సాయుజ్య ముక్తి 
6.కోటేశ్వర- పరమశివుడు-సారూప్య ముక్తి 
7.శంకరనారాయణ -శివకేశవులు -జీవన్ముక్తి 

కర్మ జన్మ రాహిత్యము ఇచ్చే క్షేత్రాలు

అలాగే మనకి కర్మ జన్మ రాహిత్యము ఇచ్చే క్షేత్రాలు కూడా ఉన్నాయి వీటిని ఆదియోగి మహా శివుడే స్వయంగా చెప్పటం జరిగినది అది ఏమిటంటే 
1.               చిదంబర క్షేత్రంలోని శివ లింగ దర్శనము జరిగిన 
2.               కేదారేశ్వర క్షేత్రములోని నది తీర్థసేవనలు జరిగిన 
3.               కాశీ క్షేత్రములో మరణము జరిగిన 
4.               అరుణాచల క్షేత్రము నివాసము జరిగిన 
5.               శ్రీశైల క్షేత్రములో శిఖరదర్శనము జరిగిన 
6.               తిరువనంతపురంలో జననము జరిగిన 
ఇలా ఈ క్షేత్రాలలో ఆయా పనులు జరిగితే మనకి ఖచ్చితంగా పునర్జన్మ లేని స్థితి కలుగుతుంది. ఈ క్షేత్రాలలో ప్రక్రియలు కేవలం ప్రారబ్ద కర్మలు కారణజన్ములుకే సాధ్యపడుతుందని మాకు అర్థం అయినది. 

పంచ మహా పాతకాలు నివారించే క్షేత్రాలు 

1.శ్రీశైలము 
2.కాశీ 
3.కేదారము 
4.శ్రీకాళహస్తి 
5.పట్టిసీమ

శ్రీశైల క్షేత్రానికి వెళ్లి శిఖర దర్శనం  పొందితే :

ఒకసారి మాకు దగ్గరలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి వెళ్లి శిఖర దర్శనం పొంది కర్మ జన్మ రాహిత్యమును పొందవచ్చు కదా అని ఊపుకుంటూ వెళ్ళినాను. ఏముంది ఒక శిఖరం చూస్తే చాలు సాధన ఉండదు. జన్మలు ఉండవు కదా అని మా ఉద్దేశ్యం. అనుకున్న వెంటనే ఈ క్షేత్రానికి వెళ్ళడము జరిగినది. అక్కడికి వెళ్లి శిఖరదర్శనము ఉన్న చోటికి వెళ్ళి చూస్తే నా బొంద అక్కడ గాలిగోపురాలు సిగరెట్ ప్యాకెట్ లాగా కనబడుతుంటే దీని పైన ఉండే బంగారం కలశాలు కనపడకపోతూ ఉంటే వీటి మధ్యలో ఉన్న మల్లన్న గుడి బంగారపు త్రిశూల శిఖరము ఇంకా ఏమి కనబడుతుంది చెప్పండి. బైనాక్యులర్ పెట్టి చూసాను. గాలిగోపురం కనిపించాయి. మల్లన్న గుడి బంగారపు త్రిశూల శిఖరము కనిపించలేదు. ఇంత కష్టమని మనవాళ్ళు కర్మ జన్మరాహిత్యానికి ఈ క్షేత్రమును ఎంపిక చేసినారని మాకు అర్థం అయ్యేసరికి ఎక్కడలేని నీరసం వచ్చినది. విచిత్రం ఏమిటంటే మా మావయ్యకి అయ్యవారి త్రిశూల శిఖరదర్శనము చాలా చక్కగా కనబడుతుందని మాకు చెప్పిన ఆరునెలలకి ఆయన కిడ్నీ వ్యాధితో మరణించడం జరిగినది. గత జన్మ లో ఈయన మా తాత వీడి లాగా జన్మించినారు అని ఆ జన్మలో ఆయన దుర్గాదేవి ఉపాసకులు నీటి మీద తేలే వారని ఆయన కోసం శ్రీ కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి వారు వచ్చినారు అని హిమాలయాల నుండి యోగులు వచ్చి తమ సందేహాలు తీర్చుకునే వారిని ఇప్పుడే హంస వచ్చింది సందేహం తీర్చుకొని ఎగిరిపోయింది అని అంటుండేవారు అని మా అమ్మ గుర్తుకు చేసుకొని ఒక్కొక్కటి చెబుతూ ఉండేది. ఇలా ఈయనే మా మామయ్యగా ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకోవటానికి పునర్జన్మ ఎత్తి ఇలా శ్రీశైల శిఖర దర్శనం పొంది పునర్జన్మ లేని స్థితి పొంది ఆత్మశాంతిగా హిమాలయాలలో కారణ శరీరంతో యోగసాధన చేస్తున్నారని మాకు అర్థం అయినది. ఇలా ప్రారబ్ద కర్మలు ఉన్నవారికి అలాగే సంపూర్తిగా తీరే వారికి మాత్రమే ఈ పై క్షేత్రాలలో ఈ ప్రక్రియలు అనగా శివ లింగ దర్శనము మరణాలు నిరూపణలు తీర్థసేవనలు జరుగుతాయని మాకు అర్థం అయినది.

నవ ఖండ సిద్ది :

మరొక రోజు మాకు చిన్న సందేహము వచ్చినది. అది ఏమిటంటే నవ ఖండ సిద్ది ద్వారా అఘోరాలు సాధించేది ఏమిటి? వారి శరీర భాగాలను హోమాగ్ని నందు దహింప చేసుకుంటారు కదా. మరి వీరికి ఎందుకు మూల కపాలమోక్షం కలగటం లేదు అనుకున్నప్పుడు మాకు ఒక విషయము స్పురణకి వచ్చినది. అది ఏమిటంటే అఘోర సాధనలు మొదట ఏక ఖండి త్రి ఖండి పంచ ఖండి సప్త ఖండి నవ ఖండి దాకా విధి విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా తమ శరీర భాగాలకు దహన శక్తిని క్రమ క్రమంగా పెంచుకుంటూ వస్తారు. అనగా నవ ఖండి విధానముగా చితాగ్ని యొక్క ప్రారంభ సహన శక్తి అయిన నవశక్తి దాకా శక్తి మాత్రం వీరి సాధన శక్తి రాగలుగుతుంది. 

ఆపై వచ్చే దహన శక్తి యొక్క శక్తిని ఈ అఘోర శరీరం తట్టుకోలేకపోవడం జరగటంతో తమ ఇష్టదైవమైన హింగలాజి మాత లేదా శ్రీ దత్త స్వామి లేదా త్రిముఖ ఈశ్వరునిని ప్రార్ధించి తమ ప్రాణాలను తిరిగి రక్షించుకోవటం జరుగుతుంది. నిజానికి ఈ అఘోర సాధన అనేది అగ్ని యొక్క దహన శక్తిని తట్టుకోవటానికి తమ శరీరాలకు శక్తి సాధన అన్నమాట. అలాగే కాపాలిక సాధన అనేది మూల కపాలంలో 36 కపాలాలు దర్శనము అయినప్పుడు సాధకుడు భీతి చెందకుండా ముందుగానే కపాల భయము మరణ భయం మృత్యుభయం అపమృత్యు భయం చావు భయాలు లేకుండా చేసుకోవడానికి సాధన అన్నమాట. అలాగే బైరవ సాధన అనేది నిజానికి ఇష్ట కోరికను నశింప చేసుకోవటం అన్నమాట. వీటిలో 90% ఇష్ట కోరికగా కామకోరిక ఉంటుంది. కాబట్టి మైధున ప్రక్రియ మీద వివేక వైరాగ్యము కలిగించడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది. అలాగే నాగసాధువు దీక్ష అనేది అగ్ని సాధన ద్వారా చితాగ్ని అంటే భయం లేకుండా దానిని తమ ఆధీనం లోనికి తెచ్చుకోవాలని నిర్దేశింపబడింది. కానీ మిడిమిడి జ్ఞానంతో ఈ సాధనలలో తాంత్రిక విధానాలు వచ్చి చేరి శాశ్వతంగా మరుగున పడి పోయే ప్రమాదం అంచులకి చేరుకోవడం జరుగుతుందని మేము గ్రహించినాము.

మహా మృత్యువును ఇచ్చే దైవ స్వరూపము ఎవరు:

ఒక రోజు మాకు ఉన్నట్టుండి మహా మృత్యువును ఇచ్చే దైవ స్వరూపమును చూడాలని జిజ్ఞాస మాలో మొదలైనది. దానితో దీపారాధన ద్వారా అగ్ని సాధనను చెయ్యటం ప్రారంభించినాము. ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత ఒక రోజు అర్ధరాత్రి పూట ధ్యానము నందు టెంపుల్ రన్ ఆట మొదలైంది. హృదయ చక్ర స్థితి దాకా అనగా అష్టదళ పద్మము కనిపించే దాకా అనేక దృశ్యాలు కనిపించినాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి చితాగ్ని దర్శనము అయినది. ఆ తర్వాత ఏదో చీకటి గుహ మార్గము కనపడినది. ఇంతలో నాలాంటి ఆకారము శరీరము మీద పాత సినిమాలలో కనిపించే వృద్ధ ఆకారము ఉన్న ఒక మాంత్రికురాలు ఆకారములో స్త్రీ మూర్తి ఈ నా దేహము మీద ఎక్కి దీనిని వాహనంగా చేసుకుని గాలిలో ఎగురుతూ ఈ చీకటి గుహ మార్గంలో వేగముగా పోసాగింది. ఈమె చూడటానికి అచ్చంగా పాత సినిమాలలో కనిపించే ఆడ మాంత్రికురాలుగా అనగా వంకరలు తిరిగిన గోర్లు విరబోసిన తెల్లని జుట్టు గ్రద్ద ముక్కుతో అచ్చంగా ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఈమెకి లాగా మంత్రగత్తెలాగా కనపడినది.కొన్ని నిమిషాల తరవాత ఏదో చిమ్మ చీకటి ఉన్న గదిలోనికి వెళ్ళడము జరిగినది. అక్కడ పుర్రెలు ఎముకలు ఎన్నో చెల్లాచెదురుగా పడినట్లుగా కనిపించగా ఆ గది మధ్యలో ఉన్న రాతి మీద ఉన్న మానవ కపాలం లోనికి ఈ మహా మంత్రగత్తె ఈ కపాల బ్రహ్మ రంధ్రము ద్వారా లోపలికి ప్రవేశించగానే ఈ కపాలము కాస్త చితాగ్నిలో దహనము అవ్వటము ప్రారంభమైనది. ఈ చితాగ్ని కాస్త గది అంతా విస్తరింప చేస్తుండటంతో ఇది ఏదో హ్యారీపోటర్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించి మాకు ధ్యానము భంగం అయినది.ఈ మంత్రగత్తె ఎవరో ఈ మానవ కపాలము ఎవరిదో మాకు అర్థం కాలేదు. ఇలా కొన్ని వారాలు గడిచిన తరువాత హిమాలయ గురువుల అనుభవాలకి సంబంధించిన ఒక పుస్తకము మేము చదవటం జరిగినది. అందులో ఒక యోగికి కూడా ఒక వృద్ధ స్త్రీ వచ్చి తమ సాధనను చాటుమాటుగా రహస్యముగా ఉండి వారి అవసరాలు తీరుస్తూ సహాయపడుతూ ఉండేది. ఒకసారి ఈ వృద్ధ స్త్రీ ఎవరా అని ధ్యానములో చూస్తే ఒక మంత్రగత్తెగా కనిపించినది. మరొకసారి పేదరాశి పెద్దమ్మగా కనిపించినది. మహా మృత్యువు ప్రసాదించే మహా దేవత అని గ్రహించి మౌనము వహించినారు. అంటే వీరి అనుభవం ప్రకారం చూస్తే మహా మంత్రగత్తె అనేది మహా మృత్యువుదేవత స్వరూపము అని తెలుస్తోంది.అనగా మాకు ధ్యానమునందు కనిపించిన మహామాయ మంత్రగత్తె ఈ లెక్కన మా కోరిక మహా మృత్యువు దేవతా దర్శనము అయినది అని మాకు అర్థం అయినది. ఆ గుహ వివరాలు నెట్లో వెతికితే అది బద్రీనాథ్ క్షేత్రం లో ఉన్న వ్యాస గుహ అని మాకు తెలిసినది. అనగా ఈ రాతి మీద ఉన్న కపాలము వేదవ్యాసుడు కపాలము అయి ఉండాలి లేదా ప్రస్తుత మా జన్మ కపాలము అయినా అయి ఉండాలి అని అనిపించింది. అది ఎవరికపాలమో ఎవరికి తెలుసు.కానీ ఖచ్చితంగా మహా మృత్యుదేవత మహా మంత్రగత్తె జోగులాంబ దేవతలాగా ఉంటుందని మేము గ్రహించినాము. 

నాకు విచిత్ర కీ చైన్లు రావడం

నా యోగమిత్రులు వివిధ క్షేత్రాలకి వెళ్ళినపుడు వాళ్ళకి నచ్చిన కొన్ని రకాల కీచైన్లు నాకోసం తీసుకొని రావడము జరిగినది. అవి ఏమిటంటే బల్లి, తేలు, గబ్బిలం, కపాలము,గుడ్లగూబ, ఇలా వీటిని తీసుకొని రావడము జరిగినది.ఇది వరకు కూడ ఇలాగే 10 కీచైన్లు వీళ్ళు తీసుకొని వస్తే...అవి కాస్త విష్ణువు దశావతారాల సంకేతాలని నాకు తెలిసినట్లు మీకు తెలుసు గదా! మరి ఈ కొత్తగా వచ్చిన ఈ కీచైన్లు నాకు ఏమిచెప్పుతున్నాయో ఒక పట్టనా అర్ధమయి చావలేదు.కొన్ని రోజులు గడిచినాయి.

అలంపుర జోగులాంబ

ఒక రోజు భక్తి టివిలో అలంపుర జోగులాంబ అమ్మవారి గూర్చి చెపుతూ ఆమె తలలో బల్లి,తేలు, గుడ్లగూబ లేదా గబ్బిలం,ఒక మానవ కపాలము ఉంటాయని...ఈమె మానవ శవము మీద కూర్చుని ఉంటుందని..ఇలా ఇంక ఏదో చెపుతుండగా...నాకు వెంటనే నాకు వచ్చిన విచిత్ర కీచైన్లు గుర్తుకి రావడము వాటిని ఒక వరుస క్రమములో పెడితే ఇవి కాస్త జోగులాంబ తలకాయలోని జంతువులుగా జ్ఞానస్పురణ అయినది.అంటే మనకి మహామృత్యువు దేవత ఈవిడేనని...నాకు కలిగిన ఈమె ధ్యానానుభవం నిజమేనని తెలిసినది. గాకపోతే నాకు ఇక్కడ చిన్న సందేహము వచ్చినది.అది ఏమిటంటే ఈ జంతువులే ఎందుకు ఆమె తలలో ఉన్నాయి.ఇవి వేటికి సంకేతాలు ?...పైగా అమ్మవారి తలలో ఒకరు గబ్బిలము ఉంది అంటే మరొకరు గుడ్లగూబ ఉన్నదని అంటున్నారు.ఈ తేడా ఎందుకు వచ్చినది.అసలు ఈ జంతువులు ఏమి చెపుతున్నాయి అనుకొని పుస్తక గ్రంథాలు తిరగవేస్తూంటే.... పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
అని తెలిసినది.అంటే ఈవిడ అనుగ్రహము వలన బ్రహ్మాండచక్రము కాంతి హీనమవుతుంది.తద్వారా మనలో ఉన్న ఆరా వంటి జీవకళను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ మనల్ని శాశ్వతమరణమునకు చేరువ చేస్తుందని జ్ఞానస్పురణ అయినది. అలాగే గుడ్లగూబ అనేది మహాలక్ష్మీ వాహనము అవ్వడము వలన అది ధనశక్తిని పెంచేది గావడము వలన నిజానికి అమ్మవారి తలలో గుడ్లగూబ ఉండదని గబ్బిలము మాత్రమే ఉంటుందని ఎందుకంటే మన జీవకళను తగ్గించడములో గబ్బిలము పాత్ర ఉంటుందని  నేను గ్రహించాను.

శివ లింగ మూర్తిని తిట్టినట్లుగా:

ఒక రోజు మాకు ప్రారంభ అధ్యాయములో శివ లింగ మూర్తిని తిట్టినట్లుగా (నా ఏడుపే నా తొలి గురువు) గుర్తుకు రాసాగింది. అవును కదా. ఆయనని నానా మాటలు నానా తిట్లు తిట్టి నాము కదా. ఇప్పుడు మేమే ఆయన. ఆయనే మేము కదా. అంటే ఎవరైతే గత జన్మలో తమకి మోక్షం ప్రసాదించమని అడిగితే వారికున్న ప్రారబ్ధ కర్మలు ఇంకా మిగిలి ఉండటంతో వారికి పునర్జన్మ లు ఇవ్వటం జరిగిందని ఈ జన్మలో వారికి ప్రారబ్ద కర్మలు పూర్తి అయ్యేసరికి వారికి తుఫానుల రూపంలో వరదల రూపంలో జల ప్రళయాల రూపంలో వారి కోరిక అయిన ముక్తిని ప్రసాదించుట జరుగుతుందని మాకు అర్థం అయినది. ఇది ఎలా ఎందుకు అంటే ఎప్పుడైతే ఇలాంటి ముక్తి జీవులు (125000)లక్షా పాతిక వేలు ఎప్పుడైతే ఒకేచోట చేరుతారో వారందరినీ ఒక్కసారిగా ఇలాంటి ప్రకృతి బీభత్సాలు ద్వారా వారికి ముక్తిని ఇవ్వటం జరిగినది అని మేము గ్రహించినాము. విచిత్రం ఏమిటంటే ఇంతటి ప్రళయము జరిగిన 75% శాతం జీవులు బ్రతికే ఉంటున్నాయి కదా. కేవలం 25% శాతం మాత్రమే జీవులు ఎందుకు చస్తున్నాయి అంటే ఈ లెక్కన ఈ జీవులు గత జన్మలో మోక్షమును ప్రసాదించమని కోరటంతో వారి ప్రారబ్ద కర్మలు తీరిన తర్వాత వీరికి ఈ రూపాలలో మరణము ప్రసాదించడం జరుగుతుందని గ్ర హించినాము.

సాధకుడు మూల కపాలమోక్షం ఎందుకు పొందలేకపోతున్నాడు:

అసలు సాధకుడు మూల కపాలమోక్షం ఎందుకు పొందలేకపోతున్నాడో మాకు కొన్ని నెలలు వరకు అంతుచిక్కలేదు. హృదయ చక్రము దగ్గరకి తొమ్మిది మంది సాధకులు చేరుకుంటారని అందులో ఒకడు మాత్రమే బ్రహ్మరంధ్రము వద్దకు చేరుకొని జ్ఞానశక్తి మాయ వలన ఏదో కోరిక సంకల్పించుకుని వెనుతిరగడం లేదా సహన శక్తి యొక్క మహా మృత్యువు భయము వలన వెనుతిరిగి మూల కపాలము యొక్క నోటి నుండి సహస్ర కమలము నందు చేరి వెయ్యి ముక్కలు అవుతున్నాడని మాకు ధ్యాన శక్తి వలన స్పురణ అయినది. పది లక్షల మంది సాధన మొదలు పెడితే హృదయ చక్రానికి కేవలం తొమ్మిది మంది మాత్రమే ఎన్నిక అవ్వడము అలాగే మళ్ళీ వీరిలో ఒక్కడు మాత్రమే ప్రవేశానికి యోగ్యత అర్హత సంపాదించడం ఈ బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న చితాగ్ని యొక్క దహన శక్తి లేదా మూల కపాలము యొక్క జ్ఞాన శక్తికి 96 నిమిషముల పాటు ఎవరైతే స్పందించకుండా ఆలోచించకుండా నిశ్చలస్థితి పొందుతారో వారికి మాత్రమే మూల కపాల మోక్షం కలుగుతుందని తద్వారా నేను అనేది నిజం కాదని ఇది అంతా నిజములాంటి కల అని మాయ యొక్క భ్రమ భ్రాంతి అని అనుభవం అనుభూతి పొందగానే కనిపించే విశ్వము అంతా క్షణాలలో అదృశ్యం అవుతుందని పరమ శూన్యమే మిగులుతుందని అది ఉందని ఎవరికీ తెలియని స్థితిని పొందడం జరుగుతుందని 54 హిమాలయ గురువుల అనుభవాల ద్వారా తెలుసుకున్నాము. 

ఈ చక్ర పరీక్ష స్థితి మీకు తెలియాలంటే హీరో జగపతి బాబు నటించిన 'కీ' అనే సినిమా చూడండి. ఇందులో ఒక కంపెనీ యొక్క చైర్మన్ పదవి కోసం తొమ్మిది మందిని ఒక గదిలో ఉంచి పరీక్ష పెట్టటం జరుగుతుంది. ఒకే ఒక ప్రశ్నకి సమాధానము 90 నిమిషాల లోపు ఒక కాగితం మీద వ్రాయాలి. ప్రశ్న ఏమిటో తెలియదు. దానికి సమాధానము ఏమై ఉంటుందో తెలియదు. ప్రశ్నను వాళ్లే వెతకాలి. దానికి సమాధానము వాళ్ళే వెతకాలి. దీనికి నాలుగు రూల్స్ ఉంటాయి. సినిమా మేము చూస్తున్నంతసేపు మా మెదడులో హృదయ చక్రం పరీక్ష విధి విధానము ఇలాగే ఉండి ఉంటుందని స్పురణ అయినది. చివరికి ఒక అమ్మాయి మాత్రమే గెలుస్తుంది. ఏడుగురు మగ వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తొమ్మిది మంది మాత్రమే ఈ పరీక్షను ఎదుర్కోవటం జరుగుతుంది. చివరిలో జగపతిబాబు వచ్చి గెలిచిన అమ్మాయితో ఏ కారణాల చేత మిగిలిన వాళ్లు ఓడిపోయినారో చెప్పటం బాగుంది. ఈ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు  చెప్పటం కన్న చూడటమే మజా వేరు. నిజంగానే ఇలాంటి పరీక్షలు పెడతారని ఆ తర్వాత మాకు తెలిసినది. ఇక్కడ ఎనిమిది మంది సాధకులు ఓడిపోవడానికి ఎనిమిది కారణాలు ఉంటాయి. అవి సాధకులు 

1.సహన శక్తి లేకపోవడం 
2.విపరీతమైన ధన కాంక్ష ఉండటం 
3.ఈర్ష అసూయ కలిగి ఉండటం 
4.నెగటివ్ ఆలోచనలు కలిగి ఉండటం 
5.నేనే గొప్ప అనే అహము కలిగి ఉండటము 
6.మృత్యువుకి భయపడటం 
7.ఇష్ట కోరికను కలిగి ఉండటం 
8.మోసము చేసి గెలవాలని అనుకోవటం/ నాశనం చేయాలని అనుకోవటం

ఈ ఎనిమిది అవలక్షణాల వలన ఈ హృదయ చక్రం వద్ద 8 యోగసాధకులు ఆగిపోవటం జరుగుతుందని మాకు ఈ సినిమా చూసిన తరువాత అర్థం అయినది. అలాగే ఈ అవలక్షణాలు లేని ఏకైక వ్యక్తి మాత్రమే ఎన్నుకోబడి బ్రహ్మరంధ్రము వరకు ఆకాశ శరీరముతో బ్రహ్మనాడి ద్వారా ఒక రేణువు లాగా చేరుకొని జ్ఞాన శక్తి లేదా చితాగ్ని యొక్క దాహక శక్తికి 96 నిముషముల పాటు ఏమీ ఆలోచించకుండా దేనికి స్పందించకుండా ఉండలేక యుగానికి ఒక్కడు లాగా వెనుతిరిగి సహస్ర చక్రానికి చేరుకొని మరో శ్రీ కృష్ణుడి లాగా మారిపోయి జగద్గురువుగా జ్ఞానబోధ చేస్తూ ఈ మూల ప్రకృతిని పరిరక్షించే స్థితిబ్రహ్మగా ఉండిపోవటం జరుగుతున్నది. ఈ విశ్వము అనేది కల అని తెలియకుండానే నిజంలాంటి కలలో బ్రతికి వేయటం జరుగుతుంది. నామరూపధారిగా కలలాంటి నిజంలాగా అందరూ కూడా ఉండిపోవటం బ్రతికి వేయడం జరుగుతుందని మాకు అర్థం అయినది.అవిశ్రాంతిగా అవిచ్ఛిన్నంగా మాయా సహితముగా ఈ జగన్నాటకంలో తనే పాత్రధారి తనే సూత్రధారి తనే ప్రేక్షకుడిగా మిగిలిపోయిన యుగానికి ఒక్కడు అయిన పరమ యోగి ఆత్మ ఉండి పోతున్నాడు. తనకి తానే వెయ్యి భాగాలుగా విడిపోయి జీవ దైవ జాలాలుగా పునర్జన్మలు ఎత్తుతున్నారు. ఆ సత్యమును సత్యముగా కలను నిజముగా తన లీలా విన్యాసాన్ని మాయతో ఈ జగన్నాటకం మూలప్రకృతిలో నడిపిస్తూ కాలం గడుపుతున్నాడు. 

ఇది ఇలా ఉండగా అదే రోజు రాత్రి ఈ 'కీ' సినిమా గురించి ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాను. అప్పుడు నాకు హీరో కాస్త సదాశివమూర్తిగాను సెక్యూరిటీ గార్డు కాస్త దక్షిణామూర్తిగా కనిపించారు. 9 మంది 9 సంప్రదాయ యోగులుగా కనిపించినారు. మహా మోక్ష అధిదైవముగా ఎవరిని ఉంచాలో ఈ పరీక్షలు పెట్టినట్లుగా అందులో చివరి దాకా మహాశివుడు అలాగే శివాని వచ్చినట్లుగా అందులో అపస్మారక స్థితి పొంది మహాశివుడు ఆగిపోతే( ఆఖరి సీనులో ఒక వ్యక్తికి బుల్లెట్ దెబ్బతగిలి పడిపోతాడు) శివాని కాస్త అన్ని రకాల పరీక్షల లో గెలిచి మూల కపాల మోక్షమును ఇచ్చే మహామృత్యువు దేవతగా ఆదిపరాశక్తి రూపంలో ఉంటుందని దీనిని ఇలా ఎన్నిక చేసిన వ్యక్తియే సదాశివమూర్తి అని కాబట్టి చిట్టచివరి లో మిగిలిపోయిన శక్తి పురుష శక్తి అని కానీ స్త్రీ శక్తి కాదని అందుకే మిగిలిన మతాలలో అనగా సర్వేశ్వరుడు- ఏసుప్రభువు- గురునానక్- బుద్ధుడు- అల్లా - ఇలా పురుష దైవాలనే ఆదిదేవుడుగా కొలవడము జరుగుతుందని మాకు అర్థం అయినది.

బ్రహ్మాండ చక్ర దర్శనానుభవం

ఈ రోజు నాకు ధ్యానము నందు నా ఏకముఖ కపాలము యొక్క బ్రహ్మరంధ్రము అతి సూక్ష్మాతి సూక్ష్మముగా దర్శనం అయినది. ఇందులో పిసరంత పరిమాణములో ఏదో అగ్నిశిఖ ఉన్నట్లుగా లీలగా కనిపించినది. ఈ అగ్నిశిఖ చాలా స్పష్టంగా పెద్దదిగా జూమ్ చేసినట్లుగా కనిపించినది. ఈ అగ్నిశిఖ యందు అతి సూక్ష్మముగా ఏదో చక్రము తిరుగుతున్నట్లుగా అదికూడా వలయాకారంగా ఏదో ఒక భూచక్రం వెలిగిస్తే ఎలా తిరుగుతుందో అలా తిరుగుతున్నట్లుగా నాకు అనిపించినది. అదికూడా చాలా స్పష్టముగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ చక్రము సుడులు తిరుగుతూ తన చుట్టూ ఉన్న ధృవతారలు వంటి నిప్పు కణికలను తనలోనికి కలుపుకోవటం కనిపించసాగింది. అదికూడా బ్రహ్మతేజస్సు బ్రహ్మ వెలుగులతో. ఈ చక్రమునకు ఒక వలయం ఉన్నట్లుగా ఈ కవచమునకు సుమారుగా 50 దాకా ఆకులు ఉన్నట్లుగా ఈ ఆకులు యందు ఏవో దృశ్యాలు కదలాడుతూ ఉన్నట్లుగా కనబడినది. అనగా రామాయణము మహాభారత దృశ్యాలు ఈ చక్రము ఆకులమీద సత్య- త్రేత- ద్వాపర- కలియుగములలో జరిగే అన్ని రకాల సంఘటన దృశ్యాలు ఉన్నట్లుగా లీలగా కనిపిస్తూ ఉండగానే నాకు ధ్యానము భంగం అయినది.
 
మనకి కపాలమోక్షం స్థితి ప్రారంభమైనదని గుర్తుగా మన మధ్య మాడు ప్రాంతంలో అనగా బ్రహ్మరంధ్రం ప్రాంతంలో ఒక వెలుగుతూ తిరుగుతున్న భూచక్రము 
దర్శనమిస్తూ… ఇది కూడా దీపావళికి వెలిగించే భూచక్రం లాగా తిరుగుతూ ఉంటూ… నిజానికి దీపావళి భూచక్రము వెలుగులను బయటికి విరజిమ్ముతూ ఉంటే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న భూ చక్రము ఒక జ్యోతి లాగా ఉండి గుండ్రంగా తిరుగుతూ… తన చుట్టూ ఉన్న రేణువు లాంటి కాంతి శరీర రేణువులను తనలో ఇముడ్చుకున్న ట్లుగా మనకి దర్శనమిస్తూ…. అనగా అచ్చముగ బ్లాక్ హోల్ యానిమేషన్ లాగా అన్నమాట. వీటిని చూసే మన పూర్విక మహర్షులు బ్రహ్మ చక్రము లేదా బ్రహ్మాండ చక్రము లేదా సుదర్శన చక్రము లేదా కృష్ణ చక్రము అని పిలవడం జరిగింది అని యోగశాస్రాలను చదివినపుడు మాకు అర్థమయింది. వేదాంతులు దీనిని బ్రహ్మ చక్రం అని పిలిస్తే మన శాస్త్రవేత్తలు దీనిని కృష్ణ బిల్వం లేదా బ్లాక్ హోల్ అన్నారు.

నాకు  మరియు నా జిజ్ఞాసికి వచ్చిన సుదర్శనచక్రాలు:

నాకు కల్గిన ఈ ధ్యానుభవము నిజమని చెప్పటానికి మాకు రుషికేశి క్షేత్రము నుండి నిజ సుదర్శనచక్రము వచ్చినది.దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ చక్రము మీద బంగారుపూత ఉన్నది.కారణము ఏమిటంటే నిజసాలగ్రామాలలో ఒక గ్రాము బంగారముంటుంది.దీనికోసము కొంతమంది వీటిని పగలకొట్టి లోపల ఉన్న బంగారమును తీసుకుంటారు.రెండు సుదర్శన చక్రాలు కలిసి ఒక సాలగ్రామముగా పైగా సహజ బంగారముతో ఏర్పడతాయని తెలుసుకోండి. ఇది వచ్చినరోజు నుండి నాకు విచిత్రముగా ఆగని ఎక్కిళ్ళు వచ్చినాయి.ఎన్ని చేసిన ఏమి చేసిన నాకున్న ఎక్కిళ్ళు తగ్గలేదు.నాకు ఆశ్చర్యమేసినది.ఇందులో ఏదో మర్మమున్నదని గ్రహించి కళ్ళు మూసుకోగానే నాకు నా మనోనేత్రము నందు సుడుళ్ళు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర దర్శనమై అదికాస్తా ఒక సుదర్శనచక్రముగా మారి ఏదో నదిలో మునిగి అంతర్ధానమైనట్లుగా లీలగా కనిపించగానే...నాకు ఏదో స్పురణ కల్గి వెంటనే నాకు వచ్చిన సుదర్శనచక్రమునకు అభిషేకము చెయ్యగానే నా ఎక్కిళ్ళు ఆగిపోవడముతో...దీనికి ప్రాణశక్తి జలమని గ్రహించి నిత్య అభిషేకము చెయ్యడము ఆరంభించినాను. కొన్నిరోజులకి నా ధ్యానమునందు సుడులు తిరుగుతున్న నేను పూజించే సుదర్శన చక్రము కనపడినది.ఇది అచ్చముగా బ్రహ్మాండ చక్రములాగా తిరుగుతోందని నేను అనుకొనేలోపుల నేను పూజించే సకల దైవాల దైవిక వస్తువులు వరుసగా ఇందులో పడి లయం అవుతున్నట్లుగా విచిత్రముగా కనపడేసరికి అంటే విశ్వ బ్రహ్మాండ చక్రమే ఈ సుదర్శన చక్రమని అనుకొనేలోపుల నా ధ్యాన భంగమైనది. దానితో మాకు శాశ్వతమరణము ఇవ్వడానికి ఇది వచ్చినదని తెలియగానే దీని మీద మరింత శ్రద్ధభక్తివిశ్వాసాలు మరింతగా పెరిగినాయి. 
 
ఆ తర్వాత కొన్నిరోజులకి ఒక చిన్న సందేహము నాకు వచ్చినది.అది ఏమిటంటే ఎక్కడో ఆకాశములో ఉండే బ్రహ్మాండ చక్రానికి అలాగే నా దగ్గర ఉన్న సుదర్శన చక్రానికి ఏలా అనుసంధానము అవుతున్నాయని అనిపించినది. నేను కాస్త పుస్తక-గ్రంథాలు చదివిన గూడ ఒక పట్టాన నాకు అర్ధము కాలేదు.అనుకోకుండా ఒకరోజు “అంతర్వేదం” సినిమాను చూడటం జరిగినది.అందులో కొంతమంది కలిసి ఊర్ధ్వోలోకాలకి వెళ్ళడానికి దానికి తగ్గ హోమాలు చేస్తూ ఈ లోకాలు వెళ్ళటానికి బయలుదేరుతూ అదిగూడ యోగనిద్ర విధానములో తమ సూక్ష్మశరీరాలను ఈ లోకాలకి పంపించాలని...తిరిగి రావటానికి ఈ భూమి మీద నిరంతర శంఖనాదము చేస్తుండాలని..ఈ నాదమును బట్టి మన సూక్ష్మశరీరాలు కాస్త మన స్ధూలశరీరాలలోనికి యధావిధిగా ప్రవేశించగలవని తెలుసుకొని ఒక అఘోరుడుని ఈ శంఖనాదము చెయ్యటానికి వినియోగించడము…. ఆ తర్వాత వీరందరు తమ యోగనిద్రలో ఊర్ధ్వోలోకాలకి వెళ్ళడం...ఈ నిరంతరముగా చేస్తున్న శంఖనాదములో వీళ్ళంతాగూడ వెనక్కి రావడము జరుగుతుంది.అంటే భూలోకమును అలాగే ఉర్ధ్వోలోకాలకి ఓంకార శంఖనాదము అనుసంధానము చేస్తూందని అలాగే ఈ విశ్వములో ఈ నాదము సహజసిద్ధముగా ఉండుటవలన ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానము అవుతున్నాయని నాకు జ్ఞాన స్ఫరణ అయినది.

నాకు వచ్చిన పాంచజన్య-గణపతి మహాశంఖాలు

ఇక దానితో నాకు వచ్చిన పాంచజన్యశంఖముతో లేదా ఓంకార గణపతి శంఖముతో ఓంకారనాదము చేస్తూ ఈ సుదర్శన చక్ర అభిషేక పూజతంతు చెయ్యడము ఆరంభించినాను. అలాగే మా జిజ్ఞాసి గూడ తనకి వచ్చిన చాలా అరుదైన ఊదే దక్షిణావృంత శంఖముతో ఓంకారనాదము చేస్తూ తనుగూడ సుదర్శనచక్రమునకు నిత్య పూజ చేస్తున్నాడు.

ఇది ఇలాయుండగా అసలు ఈ చక్రస్ధితికి వచ్చినపుడు ఎవరికైనా సుదర్శన సాలిగ్రామము వచ్చినదా?ఇది రావడము నిజమేనా? మాకు లాగా దీనికి పూజ చేస్తారా? అని ధర్మసందేహము వచ్చినది.అపుడు జిజ్ఞాసి వెంటనే” నేను వివిధ క్షేత్రాలలో సాధన చేస్తున్నపుడు కొంతమంది యోగగురువుల దగ్గర అలాగే కొంతమంది పీఠాధిపతి, మఠాధిపతి, ఆశ్రమవాసుల దగ్గర అనేక సాలగ్రామాల అర్చన చూడటం జరిగినదని...అపుడు ఈ పూజవిధానము ఎందుకు చేస్తున్నారో తెలియరాలేదు.ఇపుడు తెలిసినదని” వాడు చెప్పినగూడ నాకు ప్రత్యక్ష అనుభవము గావాలని ఇంటర్ నెట్లో ఈ పూజ చేసేవారి గూర్చి వెతకడము ఆరంభించాను.అపుడు మా బుర్ర తిరగడము మొదలైనది. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర సుమారుగా 100 కి పైగా సాలిగ్రామాలను పూజించే విధానమును చూసేసరికి...ఇక్కడేమో నేను ఒక సాలిగ్రామ అర్చన విధానమునకు నానా కష్టాలు పడుతూంటే... ఏకంగా ఒక కాశీ కర్మయోగి తను సేకరించిన కాశీ గంగా 65 వేల సాలిగ్రామల నిత్యపూజ విధానము గూర్చి చదివేసరికి…. ఇన్ని సాలగ్రామాల అర్చన విధానము చూసిన తర్వాత నాకు ఈ పూజ రావడము సత్యమేనని తెలిసినది.

 ఇది ఇలాయుండగా...కృష్ణబిల్వము బ్లాక్ హోల్ అనగా ఇది ఎలా ఉంటుందో ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు విశ్వంలో దీనిని గురించి పది సంవత్సరాల పాటు ప్రయోగాలు చేసి అనగా  బ్రహ్మాండ చక్రం అయిన కృష్ణబిలం ఫోటో తీయడం జరిగినది. దీనిని 11-4-2019 తేదీ ఈనాడు తెలుగు దినపత్రిక లో అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ కృష్ణబిలాలు గురించి వివరాలు రాయడం జరిగింది. మీ కోసం వాటిని ఇక్కడ ఇస్తున్నాము చూడండి. అంటే ఈ కృష్ణబిలాలు మీకు దర్శనం అయితే మీలో ఉన్న కర్మలు సంపూర్తిగా అనగా కర్మ శేషము లేకుండా కర్మ క్షయం అవుతుంది అని గ్రహించండి.
  
ఇదిగో కృష్ణబిలం!

మానవాళి చరిత్రలో తొలిసారి ఆవిష్కరణ
  రెండేళ్ల శ్రమ ఫలితం ఈ అద్భుతం
  ఫొటో విడుదల చేసిన శాస్త్రవేత్తలు
చుట్టూ నారింజ రంగు తేజోవలయంతో కనువిందు

విశ్వంలో సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలనూ స్వాహా చేసే కృష్ణబిలం (బ్లాక్‌ హోల్‌) ఫొటో మొట్టమొదటిసారిగా మానవాళి ఎదుట ఆవిష్కృతమైంది. గురుత్వాకర్షణ కవచం సాయంతో మనకు కనిపించకుండా విశ్వంలో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఖగోళ వింతను భారీ టెలిస్కోపు సాయంతో శాస్త్రవేత్తలు క్లిక్‌మనిపించారు. చీకటిమయంగా ఉన్న కేంద్ర భాగం,  చుట్టూ నారింజ రంగు తేజస్సును వెదజల్లుతున్న శ్వేతవర్ణపు వేడి వాయువు, ప్లాస్మాతో ఈ కృష్ణబిలం చిత్రం అద్భుతంగా ఉంది. గత 30 ఏళ్లలో చిత్రకారులు వేసిన ఊహాచిత్రంలానే ఇది ఉండటం గమనార్హం. ఇది అద్భుతమైన సాంకేతిక విజయమని ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఖగోళ భౌతికశాస్త్రవేత్త పాల్‌    మెక్‌ నమారా చెప్పారు. బ్రసెల్స్‌, షాంఘై, టోక్యో, వాషింగ్టన్‌, శాంటియాగో, తైపైలో ఏకకాలంలో శాస్త్రవేత్తలు విలేకర్ల సమావేశం పెట్టి ఈ చిత్రం గురించి వివరించారు.

ఏమిటీ కృష్ణబిలం?

కృష్ణబిలాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. బిలాలుగా పేర్కొంటున్నప్పటికీ నిజానికి అవి ఖాళీగా ఉండవు. వాటిలో భారీ మొత్తంలోని పదార్థం.. ఒక చిన్న ప్రదేశంలోకి కుచించుకుపోయి ఉంటుంది. ఫలితంగా ఈ ఖగోళ వస్తువుకు అపరిమిత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. వాటి నుంచి కాంతి పుంజం కూడా తప్పించుకోలేదు.
* కృష్ణబిలం వెలుపలి అంచును ‘ఈవెంట్‌ హొరైజన్‌’గా పేర్కొంటారు. అక్కడికి చేరిన ఏది కూడా తిరిగి రావడం ఉండదు.
* అదృశ్యంగా ఉండే ఈ ‘చీకటి నక్షత్రాలు’ 18 శతాబ్దం నుంచే శాస్త్రవేత్తల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటిపై పరోక్ష ఆధారాలే లభించాయి. ఇవి ఎన్నడూ టెలిస్కోపు కంటికి చిక్కలేదు. అందువల్ల ఫొటోలు సాధ్యం కాలేదు.
* బ్లాక్‌ హోల్‌ పేరును 1960లలో అమెరికా భౌతికశాస్త్రవేత్త జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్‌ పెట్టారు.

ఎలా క్లిక్‌మనిపించారు?

* ఈహెచ్‌టీని 2017 ఏప్రిల్‌లో అనేక రోజుల తరబడి శాజిటేరియస్‌-ఎ, ఎం87 అనే నక్షత్రమండలంలోని కృష్ణబిలంపైకి శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు.
* శీతాకాలంతో తలెత్తిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణ ధ్రువ టెలిస్కోపు నుంచి డేటా సేకరణ వెంటనే సాధ్యపడలేదు. అందువల్ల ఆరు నెలల పాటు వేచి చూడాల్సి వచ్చింది. అంతిమంగా 2017 డిసెంబర్‌ 23న డేటా అందింది.
* ఈహెచ్‌టీ నుంచి వచ్చిన డేటాను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోనమీకి చెందిన శాస్త్రవేత్తలు 8 నెలల పాటు కష్టపడి కుదించారు.
* విశ్వం మొత్తం విద్యుదయస్కాంత ‘ధ్వని’తో నిండి ఉంటుంది. భారీ డేటా నుంచి ఎం87లోని అస్పష్ట సంకేతాలను ఒడిసిపట్టగలమా అన్నదానిపై నమ్మకం లేదు. ఈ డేటా భారీగా ఉండటం వల్ల ఇంటర్నెట్‌ ద్వారా పంపడం కూడా సాధ్యంకాలేదు. అందువల్ల దాన్ని వందలాది హార్డ్‌ డిస్క్‌లలో నిల్వ చేసి, సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రానికి తరలించారు.
* డేటాను గుదిగుచ్చి, ఒక పూర్తిస్థాయి చిత్రంగా మలచడానికి మరో ఏడాది పట్టింది. అంతిమంగా ఎం87లోని కృష్ణబిలం చిత్రం స్పష్టంగా ఆవిష్కృతమైంది. శాజిటేరియస్‌-ఎ చాలా క్రియాశీలంగా ఉంది. అందువల్ల స్పష్టమైన చిత్రం దొరకలేదు.
* కచ్చితత్వాన్ని నిర్ధరించుకోవడానికి నాలుగు భిన్న బృందాలతో నాలుగుసార్లు పరిశీలన చేయించారు. ప్రతిసారీ ఇదే చిత్రం రావడంతో దీన్ని తాజాగా వెలువరించారు.
ఎం87 మనకు 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఉంది. దీనితో పోలిస్తే శాజిటేరియస్‌-ఎ భూమికి కేవలం 26వేల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. ఎం87 నక్షత్ర మండలంలోని కృష్ణబిలాన్ని ఫొటో తీయడమంటే చంద్రుడి మీదున్న ఒక చిన్న గులకరాయిని క్లిక్‌మనిపించడంతో సమానం.
* కృష్ణబిలంలో ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే అది అంతపెద్దగా ఉంటుంది. తాజాగా తీసిన ఎం87లోని కృష్ణబిలం వెడల్పు 40 బిలియన్‌ కిలోమీటర్లు. భూమితో పోలిస్తే ఇది 30 లక్షల రెట్లు ఎక్కువ. సూర్యుడితో పోలిస్తే దీని ద్రవ్యరాశి 650 కోట్ల రెట్లు అధికం.
భారీ టెలిస్కోపు..
కృష్ణ బిలాన్ని చిత్రీకరించడం ఒక్క టెలిస్కోపు వల్ల అయ్యే పనికాదు. అందువల్ల హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ షెపర్డ్‌ డోల్‌మన్‌ నేతృత్వంలో ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఒక భారీ టెలిస్కోపును నిర్మిస్తే స్వీయ బరువు కారణంగా అది కుప్పకూలుతుందని అంచనావేశారు. అందువల్ల హవాయ్‌, ఆరిజోనా, స్పెయిన్‌, మెక్సికో, చిలీ, దక్షిణ ధ్రువం వద్ద ఉన్న 8 టెలిస్కోపులను కలగలపడం ద్వారా ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోపు’ (ఈహెచ్‌టీ) పేరుతో ఒక భారీ సాధనాన్ని సిద్ధం చేశారు. విడివిడి భాగాలతో ఏర్పడ్డ ఒక భారీ అద్దం తరహాలో ఈ టెలిస్కోపు 12 వేల కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక వర్చువల్‌ అబ్జర్వేటరీని ఏర్పరిచాయి. ఇది సుమారు భూమి వ్యాసానికి సమానం కావడం విశేషం.

కనువిందు చేసిన అంతరిక్ష అద్భుతం
మానవాళికి తొలిసారి పరిచయం
ఆమ్‌స్టర్‌డామ్‌, ఏప్రిల్‌ 10: అంతరిక్ష మండలంలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి.. ఒళ్లు పులకరించే దృశ్యాలు, వహ్వా! అనిపించే సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ అనంత కోటి విశ్వంలో అలాంటి దృశ్యమే తాజాగా కనువిందు చేసింది. అంతుచిక్కకుండా పాలపుంతల మధ్య దాగుడు మూతలు ఆడిన ‘కృష్ణ బిలం’ తొలిసారి మానవాళికి పరిచయమైంది. కృష్ణబిలం ఉంటుందని తెలిసినా, అది ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియదు. ఎలాగైనా దాన్ని మనుషులకు చూపించాలని తలచిన ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఎనిమిది టెలిస్కో ప్‌లను అమర్చి వాటి సహాయంతో ‘ఎమ్‌87’ అనే పాలపుంత మధ్యలో ఉన్న ఈ అద్భుతాన్ని బంధించారు. ఆ చిత్రాన్ని బుధవారం ద ఈవెంట్‌ హారిజాన్‌ టెలిస్కోప్‌ కొలాబొరేషన్‌ విడుదల చేసింది. మధ్యలో కటిక చీకటి, చుట్టూ భగభగమండే అగ్ని గోళాన్ని, దాని నీడను కలిగి ఉందా కృష్ణ బిలం. ఈ చిత్రాన్ని బంధించేందుకు 200 మంది శాస్త్రవేత్తలు, పదేళ్ల పాటు శ్రమించారు.
 విశేషాలివీ
ఈ కృష్ణబిలాన్ని ‘రాకాసి బిలం’గా అభివర్ణించిన శాస్త్రవేత్తలు.. 500 మిలియన్‌ ట్రిలియన్‌(50 లక్షల కోట్ల కోట్లు) కిలోమీటర్ల దూరంలో దాన్ని గుర్తించారు.
భూమి కంటే 30 లక్షల రెట్లు పెద్దదిగా ఉంటుంది. 4వేల కోట్ల కిలోమీటర్లు వ్యాపించి ఉంది.
సూర్యుని కంటే 650 కోట్ల రెట్లు ఎక్కువ బరువుంది.
మన సౌర వ్యవస్థ మొత్తం కంటే కూడా చాలా పెద్దది.
కోట్లాది నక్షత్రాలు కలిసి వెలుగును ప్రసరింపజేసినా.. కృష్ణ బిలం విడుదల చేసే కాంతి ముందు అవి దిగదుడుపేనట.

ఇక ఈ బ్రహ్మాండచక్ర దర్శనముతో కర్మ జన్మ స్పందన రాహిత్యమును పొందడం జరుగుతుందని గ్రహించండి. కాకపోతే ఈ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్ని దహన శక్తిని సాధకుడు తట్టుకోవాలి. వారు తట్టుకునే స్థితిని బట్టి మన పంచ శరీర కపాలమోక్షం స్థితి ఆధారపడి ఉంటాయని గ్రహించండి. అనగా 96 నిమిషాలపాటు అనగా ఒక మన్వంతర కాలము అంటే 30,67,2000 కోట్ల సంవత్సరాలు అనగా బ్రహ్మాండ చక్ర దహన శక్తి అప్పటికీ 10లక్షల శక్తికి చేరుకోవటంతో సాధకుడు సహన శక్తిని కోల్పోవడంతో ఆపై ఆకాశ శరీర కపాలమోక్షం స్థితిని పొందలేక కేవలం స్థూల సూక్ష్మ కారణ సంకల్పం కపాల మోక్షం స్థితిని పొందడం జరుగుతోందని మాకు అర్థమయింది. 

ఎందుకంటే ఆదియోగి అయిన పరమేశ్వరుడు 48 నిమిషాల పాటు అనగా ఐదులక్షల శక్తిని మాత్రమే తట్టుకుని ఆపై తట్టుకోలేక స్పృహ తప్పితే 85 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తి అనగా ఆదిపరాశక్తి కాస్త తారా దేవిగా మారి ఈయనికి తన చను పాలు ఇచ్చి దహన శక్తి యొక్క ఈతిబాధల నుండి విముక్తి కలిగించినదని ఒక కథనం ఉంది. ఆ తర్వాత ఈయన బిల్వదళాలతోనూ, అలాగే శ్రీవిష్ణువు తన తులసీ దళాలతోనూ, అలాగే నరసింహస్వామి మేడి ఆకులతో, హనుమంతుడు తమలపాకులతోను, గణపతి గరికతోను ఈ దహన శక్తి నుండి సేద తీర్చుకోవడానికి విరివిగా ఉపయోగించుకోవటం జరిగినది. ఇలా 34 కపాలాల విభేదనము దాకా ఒక సదాశివమూర్తి మాత్రమే వచ్చి ఆపై మిగిలిన రెండు కపాలాలు విభేదనము చేయలేక వెనుతిరిగి ఇప్పుడు హిమాలయాల్లోని కైలాస పర్వతము నందు ఆజ్ఞ ముద్రతో మౌన భాష తో 36 కపాలాలతో సాక్షి భూతంగా చూస్తూ ఏక మూల కపాల మోక్షం స్థితి సాధన కోసం స్వప్న శరీరముతో అనగా సంకల్ప శరీరముతో యోగ సాధన ఇప్పటికీ చేస్తున్నారు. ఇక బ్రహ్మరంధ్రము వద్ద తిరిగే శ్రీ బ్రహ్మాండ చక్రం యొక్క చితాగ్నియొక్క దహనశక్తి వివరాలు మేము తెలుసుకోవడం జరిగినది. దీనికి చండీమాత అధిదేవతగా ఉంటుంది. అలాగే చండీ హోమమునకు ఎంతటి శక్తి ఉంటుందో మన బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్రము దహనశక్తికి అంతటి శక్తి ఉంటుందని వివిధ యోగులు అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది. ప్రారంభములో దీని దహన శక్తి నవాంశ శక్తి అయితే అటుపై శతాంశక్తి అటుపై సహస్ర శక్తి అటుపై పదివేల శక్తి అనగా ఆయత ఆపై నియతశక్తి అనగా లక్ష ఆపై ప్రయత శక్తి అనగా  పది లక్షల శక్తి దాకా పెరుగుతూ ఉంటుందని తెలిసినది. అనగా 21 రోజులతో మొదలై 30672000 కోట్ల సంవత్సరాలు అనగా తొంబై ఆరు నిమిషాల పాటు ఈ దహన శక్తి ఉంటుందని గ్రహించండి. సాధారణముగా మన స్థూల శరీరము ఈ దహన శక్తికి నవాంశ శక్తి కి వచ్చేసరికి తట్టుకోలేక నాశనమవుతుందని స్వయంగా రామకృష్ణ పరమహంస చెప్పియున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి స్థూల శరీరము కపాలమోక్షం స్థితి పొందాలి అంటే ఈ బ్రహ్మరంధ్రము బ్రహ్మాండ చక్రం చితాగ్ని దహన శక్తిని నవాంశశక్తి దాకా తట్టుకోవాలి.అప్పుడే మన స్థూల శరీరానికి కపాలమోక్షం స్థితి కలుగుతుంది. అటుపై శతాం శక్తిని తట్టుకోగలిగితే మన సూక్ష్మ శరీరానికి కపాలమోక్షం స్థితి అటుపై సహస్ర శక్తిని తట్టుకోగలిగితే మన కారణ శరీరానికి కపాలమోక్షం అటుపై ఆయుత శక్తిని తట్టుకోగలిగితే మన సంకల్ప శరీరానికి విముక్తి కలుగుతుంది. ఇక అటు పై ఆయుత శక్తి నుండి ప్రయతశక్తి మధ్య ఉన్న దహన శక్తిని తట్టుకోగలిగితే మన రేణువు వంటి ఆకాశ శరీరానికి విముక్తి కలిగి సంపూర్ణ కపాలమోక్షం స్థితిని పొందటం జరుగుతుంది. లేదంటే స్వప్న శరీరముగా మిగిలి పోవడం జరుగుతుంది. అనగా పరమ శూన్యము యొక్క స్వప్నములో మనము ఏదో ఒక పాత్ర వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆదియోగి అయిన పరమేశ్వరుడు అనగా సదాశివుడు ఒకరు మాత్రమే ఆయుత అలాగే ప్రయతశక్తి  మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనగా లక్షల శక్తి నుండి పది లక్షల దహనశక్తి దాకా వెళ్ళటానికి స్వప్న శరీరముతో స్వప్న సాధన చేస్తున్నాడు. మనము అలాగే మన దైవాలు కూడా మరియు మన పరమాత్మలు కూడా ఈ దహనశక్తిని తట్టుకోవటానికి స్వప్న శరీరాలతో స్వప్న సాధన చేసే స్వప్న సాధకులమని ఈపాటికే గ్రహించి ఉంటారు కదా. మరి మీరు ఇన్ని వివరాలు తెలుసుకున్నారు కదా.మరి మా కపాలమోక్షం స్థితి ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు. మాతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. 

ఇంతటితో  నా సాధన దీక్ష  అనుభవాలు అనే తృతీయ విభాగములోని 20 అధ్యాయాలు పూర్తి అయినాయి!
ఇక చతుర్ధ విభాగమైన కపాల మోక్ష సాధన అనుభవాలు లోని 33 అధ్యాయాలు ప్రారంభమవుతాయి!


శుభం భూయాత్

పరమహంస పవనానంద

****************************************
గమనిక: ఇట్టి చక్రస్ధితి యందు సాధకుడు కాస్త సహనశక్తితో,ఓర్పుగా,నమ్మకముగా,నేర్పుగా ఉండాలి. ఏ క్షణమైనా పిసరంతా సహనశక్తిని సాధకుడు కోల్పోతే మాత్రము అతడి సాధనశక్తి వెనువెంటనే హృదయచక్రానికి చేరుతుంది. అటుపై ఇక్కడ ఒకవేళ ఇందులో కనిపించే ధ్యాన అనుభవ దృశ్యాలకి మనము గాని ఆలోచించడము లేదా సంకల్పించడము లేదా స్పందించడము చేస్తే మన సాధన శక్తి కాస్త సహస్ర చక్రానికి చేరుతుంది.ఇందులో మనము అహమునకు గురి అయితే మన సాధన శక్తి కాస్త ఆజ్ఞాచక్రానికి చేరుతుంది.ఇందులో జీవ లేదా గురు మాయలకి గురి అయితే మన సాధన శక్తి కాస్త విశుద్ధచక్రానికి చేరుతుంది. ఇందులో ఉన్న జ్ఞానమాయకి గురి అయితే మన సాధన శక్తి కాస్త అనాహత చక్రమునకు చేరుతుంది. ఇందులో ఉండే మృత్యభయానికి గురి అయితే మన సాధన శక్తి కాస్త మణిపూరక చక్రమునకు చేరుతుంది. ఇందులో ఉండే త్రిగుణాలకి గురి అయితే మన సాధన శక్తి కాస్త స్వాధిష్టాన చక్రమునకు చేరుతుంది. ఆ తర్వాత ఇందులో ఉండే ధనమాయకి గురి అయితే మన సాధనశక్తి కాస్త మూలాధార చక్రమునకు చేరుతుంది. ఇందులో ఉండే కామమాయకి గురి అయితే సాధకుడు కాస్త బుద్ధిని కోల్పోయి అపస్మారక స్ధితి అనగా తను తెలుసుకున్న జ్ఞానమును సంపూర్తిగా కోల్పోయి అధోగతి పొందుతాడు అని గ్రహించండి. ఇవి ఏవి జరగకుండా ఉండాలంటే సాధకుడు కాస్త సహనశక్తితో ఉంటే గాని అతనికి నిశ్చలస్ధితి రాదు. ఇది వస్తే కాని మనస్సు లేని స్ధితిని అనగా పసిపాప స్ధితిని పొందలేడు.ఇది పొందితే గాని సాధకుడు పరమ ప్రశాంత స్ధితి పొందడము జరుగుతుంది.దీనినే శాశ్వత మరణం అగు మోక్షపధం పొందడము అంటారని తెలుసుకోండి.

2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. meeru baba vibhudhinath naamam pondatam. Devathalu sahitham chithagni shaktini thattukoleka venuthirguthunnarani ayna rupaalaina manam kuda anthe ani, paalakundalo visham udaaharana tho baaga arthamaindi.bhogamlo unde chinthalu thattukovalani,prati janmalo 36 kapaalalu vibedhanam kosam ee janmalani.mahaa mruthyuvuniche jogulamba darshanam avvatam, bhulakamunu alage urdhvalokalaki omkaara shankhanaadhamu anusandhaanamu chesthundani sudarshanachakralu,shankham, keychainlu raavatam....
    manam chesedantha record yenani ee adhyaayamlo ardhamayyela, burra thirigela chepparu, entha saadhana chesina sahana shaktini kolpothe ye chakraniki padipotham ani,aadiyogi maatrame prayathashaktilo kottukuntunnarani, 2 kapaalalu okadaaniki gnanashakti undatam, maroka dhaaniki sahanashakti lekapovatam valla migilipothunnayani....pitutory gland pagili kaarana shareeram kundalini shaktini kaligi ela migilipothundani.mokshapadham ela pondagalmo...
    Annitikante mukhyam naa burra mooladhaaram lo thiragatam modalaithe inka giragira aagakundaa thiruguthundi meeku thiruguthundi ani cheppinappudu inka speed peruguthundanthey...

    రిప్లయితొలగించండి