అధ్యాయం 5

నాగ పాముల అర్చన


నమ్మకం లేని గాయత్రి మంత్రమును భక్తిలేకుండా… అనురక్తి లేకుండా ..అపనమ్మకంతో ..ఆవేదనతో …ఏమీ చేయలేని… ఉపయోగం లేని… మంత్రాలు కనిపెట్టారని ఆవేశపడుతూ… మొక్కుబడిగా …క్రమం తప్పకుండా… శ్రీశైల క్షేత్రంలో కొన్ని రోజులుగా చేస్తున్నాను! నాకు కలిగిన వయోవృద్ధుల అనుభవం గురించి ఆలోచిస్తున్నాను! ఎవరికీ చెప్పుకోలేని…. ఎవరికీ చెప్పకుండా ఉండలేను! ఒకపక్క భయంతో కూడిన అవమాన సంఘటన అది! మరోపక్క లోకానికి తెలియని ఏదో శక్తి ఉందని అనుమానం! ఏదో జరుగుతోంది… ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని… ఇలాంటి వింత అనుభవం మరొకటి చూడాలని తపన తాపత్రయం నాలో మొదలైంది! శ్రీశైల క్షేత్రం లో ఏదో తెలియని శక్తి ఉంది! అది ఏదో తెలుసుకోవాలని… ఏదో విధంగా ప్రయత్నించాలని… అనుకుంటున్న సమయంలో మళ్లీ నా కాళ్ళకి పసుపు పారాయణంతో రాత్రి ఏడు గంటల తర్వాత పంచమఠాల వైపు అడుగులు వేసినాను! అది రాత్రి 10 గంటలకు అన్ని మఠాలు తిరగటం పూర్తి అయినది! 


చివరికి మళ్లీ మొదలైన ఘంటా మఠమునకు చేరుకున్నాను! ఎందుకంటే అక్కడ ఉన్న ఒక సిద్ధియోగి విగ్రహము అలాగే  పెద్ద గంట మీద ఉన్న శిలాఫలకం నన్ను బాగా ఆకర్షించింది! ఆ గంట మీద ఆకాశ తత్వం సిద్ది ఎలా పొందాలో అని … ఈ ఆకాశ సాధన సిద్ధి ఎలా చేయాలో బొమ్మలు గీసి చెప్పి ఉన్నది! శిలా ఫలకం మీద ఉన్న వివరాల్లోకి వెళితే ఆ పక్కనే ఉన్న నీటి గుండం లోనే ఉన్న నీటిని తీసుకుని…. అక్కడే ఉన్న శివలింగం మీద పోస్తూ ఉంటే … అక్కడే ఉన్న పెద్ద గంట మోగిస్తూ ఉంటే …శివ పంచాక్షరి మంత్రంతో ప్రాణాయామం చేస్తూ ఉంటే….. అక్కడ ఈ ప్రాణాయామం చేస్తున్నవారికి ఆకాశంలో ఎగిరే సిద్ది వస్తుందని రాసినట్లుగా కనపడింది! 


ఈ ఆకాశ సాధన సిద్ధి కోసం …1. నీళ్ళు తోడేవారు, 2. శివలింగం మీద నీళ్ళు పోసే వారు,  3. పెద్ద గంట మోగిస్తూ ఉండేవారు, 4.  ప్రాణాయామం చేసే వారు అంటే మొత్తం నలుగురు వ్యక్తులు కావాల్సి వస్తుంది ! చివరికి ప్రాణాయామం సిద్ది పొందిన వారికి మాత్రమే  ఆకాశంలో ఎగిరే శక్తి వస్తుందని తెలిసింది! ఇది చదివిన వెంటనే నాకు తెలియని ఆనందం వేసింది! అంతవరకు ఉందో లేదో తెలియని ఆకాశ సిద్ది పరిశీలించ వచ్చు కదా! ఏదో ఒక ప్రయత్నం చేస్తే గానీ లోకానికి కొత్త విషయం చెప్పలేము కదా! లేదా మనకి కొత్త అనుభవము మిగిలి పోతుంది కదా ! కాకపోతే ఈ నలుగురు వ్యక్తులు కావాలని తెలుసుకుని కొంతమేర నిరుత్సాహపడినాను! నాకు నేను తోడుగా ఒంటరిగా ఉన్నాను! ఈ విషయంలో నాకు ఎవరు తోడు వస్తారు అని అనుకుని అక్కడే ఉన్న నీళ్ళు త్రాగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను! ఇంతలో నిద్ర మత్తు వచ్చి నిద్ర పోయాను! ఏదో శబ్దాలు వినపడటంతో  నాకు మెలుకువ వచ్చింది! అక్కడ ఉన్న సిద్ధి లింగం పై నాగుపాములు తిరుగుతున్నట్లుగా నాకు కనిపించింది! కప్పలు ఎలకలు ఆహారం కోసం పాడుపడిన దేవాలయానికి వచ్చి ఉంటాయని… కదలకుండా మెదలకుండా మౌనంగా నిద్రపోతున్నట్లు నటిస్తూ అవి నన్ను ఎక్కడ కాటు వేస్తాయో అని భయంతో నేత్రాలతో ఓరకంట వాటిని చూస్తూ ఉండగానే అక్కడ ఉన్న సమాధిలో నుండి ఏదో తెలియని జ్యోతి ఈ సిద్ధి లింగ లో కి వెళ్ళటం… ఆనందంతో ఈ పాములు ఈ లింగం చుట్టూ నాట్యమాడుతూ వాటి పడగలు విప్పి తలలు ఊపుతూ నాదస్వరం వింటే ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తున్నాయి! కొంతసేపటికి ఆ జ్యోతి కాంతి తిరిగి అక్కడున్న సమాధి లోనికి వెళ్లి పోవడం నేను గమనించాను! అసలు ఈ జ్యోతి కాంతి ఏమిటి? సమాధి నుండి బయటకి రావడం ఏమిటి? ఈ సిద్ధి లింగం లోకి వెళ్లి తిరిగి రావడం ఏమిటి? గాయత్రి మంత్రము బాగా చెయ్యడము వలన నాకు పిచ్చి కాని ఎక్కలేదు గదా? ఒకవేళ మతి చెడినదా? పాములు అర్చన చేయడము ఏమిటి? 

ఈ జ్యోతి దర్శనము ఏమిటి? అసలు సమాధి నుండి దీపజ్యోతి రావడము సంగతి ఏమిటి? వీటి గురించి ఎవరికీ చెప్పటానికి వీలులేని దృశ్యాలు కనపడుతున్నాయి! ఎవరికీ చెప్పుకోలేని.. చెప్పుకుంటే పిచ్చివాడికింద చూస్తారు! వీటి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు తిరగేస్తే ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి అని అనుకుంటూ ….నాగ పాములు నా వైపు రావడం గమనించేసరికి నాలో భయముతో …చావు భయంతో …మాటలు రాని స్థితిలో… శరీరం కదలలేని స్థితిలో… గుండె ఆగిపోయిందా? అనే భయభ్రాంతులలో ఉండగానే నేను గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగినది! అప్పుడు ఏం జరిగిందో చూడాలని…. వినాలని అనుకుంటున్నారా అయితే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

పరమహంస పవనానంద


2 కామెంట్‌లు:

  1. Kapala Moksham is the only book that answered many(if not all) of my questions. Your experiences has diverted my spiritual practice into a new path. May be this is the time I should start my life afresh. ... Thank you very much. You did a great job

    రిప్లయితొలగించు
  2. aakaasha siddhi gurinchi adi ela pondalo kuda ala bommalu geesi undatam gurinchi inka naagu paamula archana.... aa jyoti evaraa annadi cheppakunda.... maree aasakthini penchuthunnaru...

    రిప్లయితొలగించు