మాకు అరుణాచల శివ నుండి అనుజ్ఞ రావడముతో పరమహంస యొక్క ఇతర రచన గ్రంథలైన శ్రీ విశ్వగురుచరిత్ర ఆడియోఫైల్స్ ను అలాగే టెక్ట్స్ ఫైల్స్ గా యోగదర్శనం, జాతకప్రశ్న, సాధనకథలు, కపాలమోక్షం, యోగగీత, ది బుద్ధకోడ్, అంతర్వేదం ... ఇలా వీటిని మేము కొత్తగా ఈ సం.2023లో ప్రారంభించిన మన యూట్యూబ్ ఛానల్
Kapala Moksham (కపాలమోక్షం) అను ఛానల్
https://youtube.com/@kapalamoksham
యందు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టడము జరుగుతుంది.అలాగే ఈ ఛానల్ కి లోగో గా జ్ఞానహంస ను పెట్టడము జరిగింది. కాబట్టి మీకు ఈ ఛానల్ వివరాలు ఎపుడికపుడు మీకు తెలియాలంటే గుడి లాంటి ఈ ఛానల్ కి ఉన్న Notifications అను BELL icon గంట ను కొట్టి Subscribe లాంటి ఉచిత దర్శన టిక్కెట్ను తీసుకుంటే అపుడు మీకు ఈ ఛానల్లో ఉన్న దైవదర్శనము లాంటి వీడియోలు దర్శనమిస్తాయి.దానితో మీరందరుగూడ అరుణాచల శివ అనుగ్రహము వలన కపాలమోక్ష ప్రాప్తిరస్తు దీవెనెలు పొందుతారని ఆశిస్తూ.... అలాగే మన ఛానల్ పేరుతో ఏన్నో వీడియోలున్నాయి.వీటికి మన ఛానల్ కి ఎలాంటి సంబంధము లేదు.కాబట్టి మనది Kapala Moksham యూట్యూబ్ ఛానల్ అని తెలుసుకొండి.మీరందరి కోసము మన ఛానల్ లింక్ ఇస్తున్నాము గమనించగలరు.
https://youtube.com/@kapalamoksham
xxxxxxxxxxxxxxxxxxxxx
మా ఇంటికి గణపతి వచ్చాడు
(నా మూలాధార చక్ర అనుభవాలు)
మూలాధార చక్ర అనుభవాలు నా డైరీలో:
ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.
అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.
P1:
జులై 1: ఈరోజు నాకు ధ్యానములో ఏదో తెలియని పదార్ధ వాసన వస్తుంది. దానితో నాకు ధ్యాన భంగమైనది. తీరా కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు.
జులై 8: ఈరోజు నాకు ధ్యానములో మలము వాసన బాగా వచ్చినది. ఎక్కడైనా డ్రైనేజీ దెబ్బతిని ఉన్నదా లేదా ఇంట్లో దెబ్బతిన్నదా.దాని వాసనకి వాంతులు వచ్చేటట్లుగా ఉంది అనుకోగానే నాకు ధ్యాన భంగమైనది.
జులై 12: ఈరోజు నాకు ధ్యానములో జుట్టు కాలుతున్న వాసనలు విపరీతంగా రావటంతో నాకు ధ్యాన భంగమైనది.తీరా కళ్ళు తెరిచి చూస్తే ఎలాంటి వాసన లేదు. కేవలం నాకు ధ్యానంలోనే ఈ వాసనలు వస్తున్నాయి అని తెలుస్తోంది.
జులై 15: ఈరోజు విచిత్రంగా చీము వాసన వస్తుంది. వామ్మో!చీములాంటి మాగురు వాసన ఇది. వామ్మో!నా వల్ల కాదు అనుకుంటూ ధ్యాన భంగము చేసుకున్నాను.
P2:
జులై 16: ఈరోజు గుద స్థానము లోపల విపరీతమైన నొప్పి రావటం మొదలైంది. ఇది దేనికి సంకేతం.
జులై 20: ఏదో శక్తి గుద స్థానంలో సుడులు తిరుగుతున్నట్లుగా అనుభవ అనుభూతి కలగ సాగింది. చెడు వాసనలు రావటం తగ్గినాయి.
జులై 22: విచిత్రంగా నాకు ధ్యానములో నాకు తెలియకుండానే కొద్దిపాటి చుక్కలు చుక్కలుగా మూత్రము బయటికి వచ్చింది. నాకు ఏమైనా మూత్ర వ్యాధులు వచ్చినాయా లేదా వస్తున్నాయో ఏమో
జులై 27: ఈరోజు నాకు తెలియకుండానే నాకు ధ్యానములో కొద్దిపాటి వీర్యం కూడా బయటకి వచ్చింది. వామ్మో అసలు నాకేమి జరుగుతోంది. నేను పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. భయం వేస్తోంది.
జులై 29: ఈరోజు నా మూలాధార చక్ర స్థానంలో ఏదో శక్తి విపరీతంగా సుడులు తిరుగుతోంది. తద్వారా నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం ఉద్రేకం చెందుతోంది. అసలు నాకేమీ జరుగుతుందో తెలుసుకోవాలి. పుస్తకాలు చదవాలి. ఈరోజు విచిత్రంగా నాకు నా స్నేహితుడు నా కోసం విజయవాడ నుండి ఒక అంగుళం ఉన్న పంచలోహ గణపతి విగ్రహం తెచ్చినాడు. దానిని నా పూజ మందిరంలో పెట్టుకొని పూజించడం ఆరంభించినాను.
P3:
ఆగష్టు 1: ఈరోజు పుస్తకాలు చదివితే ఇప్పటిదాకా నాకు జరిగిన అనుభవాలు మూలాధార చక్ర జాగృతి సంబంధించినవి అని తెలిసినది.అంటే కుండలినీ శక్తి ప్రవాహం మూలాధారచక్రము లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాల్లో ఈ అనుభవాల భాగం అని తెలుసుకున్నాను..
ఆగష్టు 5: ఈ మూలాధార చక్ర శుద్ధికి నేను ధ్యానము ముందు ఏదైనా పూల వాసన చూసి వాసనను జ్ఞాపకం ఉంచుకొని ధ్యానమునకు కూర్చుంటే మూలాధారచక్రము శుద్ధి అవుతుందని మా గురుదేవులు చెప్పినాడు.ఇలా ఆరునెలలపాటు చేయాలంట.
ఆగష్టు 7: ఈ మూలాధార చక్ర శుద్ధి అవుతున్న సమయంలో నాకు ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు అనగా తల్లిదండ్రుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ,బంధుమిత్రుల గురించి ఆలోచనలు అది కూడా ధ్యానంలోనే రావడం గమనించాను.
ఆగష్టు 12: నాకు ధ్యానములో వచ్చే వివిధ రకాల చెడువాసనలు అనేది నా గత జన్మలలో నేను చేసిన పాప కర్మ ఫలితాలని నా గురుదేవుడు చెప్పినారు. ధ్యానంలో ఉండగా మన దగ్గర లేని ఏదైనా పదార్థం వాసన అది మంచిదే గాని చెడుదే గాని వచ్చిన కూడా వాసనను గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా కళ్ళు తెరవకుండా ధ్యాన భంగము కాకుండా చేసుకోమని నా గురుదేవుడు చెప్పినాడు.
P4:
నాకు వచ్చిన శోణా నది నుండి గణపతి శిల
ఆగష్టు 15: ఇలాంటి చెడు వాసన వస్తుంటే మూలాధార చక్ర శుద్ధి ప్రారంభమైనట్లేనని ఈరోజు నా గురుదేవుడు చెప్పినారు. ఈరోజు నాకు శివ పంచాయతనంలోని శోణా నది నుండి గణపతి శిల నాకు వచ్చినది.
ఆగష్టు 18: ఈరోజు నేను విచిత్రంగా ధ్యానము చేసుకుంటున్నా ఆసనము నుండి నా ప్రమేయం లేకుండా క్రింద పడి పోయాను. గురు దేవుడిని దీనిని గూర్చి అడగాలి.
ఆగష్టు 20: మూలాధార చక్ర శుద్ధి సమయంలో కుండలిని శక్తి ప్రవాహం ధాటికి తట్టుకోలేక పోవటం వలన ఇలా జరుగుతుందని నా గురుదేవుడు చెప్పినారు.దానితో ఆయన మూలబంధం ఎలా వేయాలో నేర్పించి అభ్యాసం చేయించారు.
ఆగష్టు 28: నాకు ధ్యానంలో శరీరం ఊగడం, పడిపోవడం యొక్క తీవ్ర ఉధృతి తగ్గిస్తున్నట్లు అనుభూతి కలగ సాగింది.
నాకు వచ్చిన శ్వేతార్క గణపతి విగ్రహం
సెప్టెంబర్ 2: విచిత్రంగా ఈ మధ్య నేను ఏదైనా దేవాలయం క్షేత్రాలకి వెళుతుంటే నాకు విపరీతంగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. దీనిని గూర్చి గురుదేవునిని అడిగితే ఈ చక్రములోని ప్రారబ్ద కర్మలు నివారణ ఫలితమని ఈ విధంగా చక్ర శుద్ధి అవ్వడం ఒక భాగం అని చెప్పినారు.ఈ రోజున నాకు కాణిపాక క్షేత్రం నుండి శ్వేతార్క గణపతి విగ్రహం తీసుకొని వచ్చి ఇచ్చినారు.
P5:
సెప్టెంబర్ 10: ఈరోజు నాకు ధ్యానములో నా శరీరం బాగా తేలికై గాలిలో ఎగురుతుందేమో అన్నట్లుగా అనుభవ అనుభూతి కలగ సాగింది. దీనిని గూర్చి గురుదేవుడుని అడగాలి.ఈరోజు శ్వేతార్క గణపతిని పూజిస్తుంటే నా చేయి వేలు తెగి రక్తం ఈ విగ్రహం మీద పడినది. అంటే ఈ మూర్తికి నా రక్తముతో ప్రాణప్రతిష్ట జరిగినది అన్నమాట.
సెప్టెంబర్ 13: ఈరోజు నా గురుదేవునిని కలిసి నాకు కలిగిన అనుభవం గురించి చెబితే “నాయనా! పూర్వజన్మ కర్మ వాసనలు తొలగుతూ ఉన్నప్పుడు మీ ప్రారబ్ధ కర్మల కి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు వస్తుంటాయి.తర్వాత వారి రుణాలు బంధాలు తీరుతూ ఉండేసరికి అప్పటిదాకా వాటిని మోస్తున్న నీ మూలాధార చక్రం శుద్ధి అవుతూ వచ్చినది. దాంతో మీ శరీరం తేలికగా అవ్వటం మొదలైంది. దీనిని తట్టుకోవాలి.లేదంటే ఎప్పుడైనా ఈ చక్రము ఉత్తేజం పొందితే నువ్వు కూడా పక్షిలా గాలిలో ఎగురుతూ ఉంటావు జాగ్రత్త” అని చెప్పినారు.
సెప్టెంబర్ 20: ఈరోజు నేను నా ధ్యానంలో ఒక అంగుళం మేర గాలిలో లేచిన అనుభవం నా కళ్ళతో నేనే చూసుకునేసరికి గుండె ఆగినంత పని అయింది. దానితో నేను నేల మీద దబ్బున పడి ఉన్నాను.వెంటనే గురుదేవుని కలవాలి అనుకున్నాను. ఈరోజు శ్వేతార్క గణపతి కోసం ముత్యాల మాల వచ్చినది.ఆయనికి వేసినాను.
P6:
సెప్టెంబర్ 21: నా విషయం చెబితే ఆయన నా శరీరము తట్టుకోవటానికి ఎనిమిది రకాల ఆసనాలు అదే పతంజలి అష్టాంగ యోగము చెప్పిన ఆసన అంగంలోని ఎనిమిది రకాల ఆసనాలు నాచేత చేయించి అభ్యాసం చేయించారు.
సెప్టెంబర్ 22: నాకు ధ్యానము నందు మనస్సు స్థిరమై తీవ్రమైన ధ్యానం చేస్తున్నానని అనుభవ అనుభూతి కలగ సాగింది.
సెప్టెంబర్ 30: ఈరోజు వినాయక చవితి. పూజ శ్రద్ధగా చేశాను. విచిత్రంగా పూజ అయిన తర్వాత గణపతిలాంటి లావున్న ఒక వ్యక్తి మా ఇంటికి బిక్షకు వచ్చి ఉండ్రాళ్ళు,పానకము వడ పప్పు తిని వెళ్ళినాడు. ఇదేమి విచిత్రమో నాకు అర్థం కాలేదు.
P7:
అక్టోబర్ 1: ఈరోజు విచిత్రంగా నేను ధ్యానంలో ఉండగా నా శరీరం నా ప్రమేయం లేకుండా ఒక అడుగు గాలిలోకి పైకి లేవటం లేస్తుందేమో అనుకోనేసరికి నాకు ధ్యాన భంగమైనది.
అక్టోబర్ 5:ఈరోజు కూడా నేను గాలి లోనికి లేవటం జరుగుతుంది.ఆసనాలు వేస్తున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది.వామ్మో! మా మామయ్య లాగానే నేను కూడా చనిపోతానా? ఆయన కూడా శ్రీశైలంలోని ఘంటా మఠంలో ఆకాశ సిద్ధికి ప్రయత్నం చేస్తూ గాలిలో ఒక అడుగు మేర లేచిన ఆరు నెలలకి మూత్రపిండాల వ్యాధితో మరణించారు అని తెలిసింది.
అక్టోబర్ 10: నేను గాలిలో లేవటం గూర్చి మా గురుదేవులుని అడిగితే “కంగారుపడకు. నీకు భూచరసిద్ధి వచ్చినది అంటే భూమి మీద ఆధిపత్యం వహిస్తావు. అది నీకు ఆధీనమైంది” అని చెప్పినారు.
అక్టోబర్ 12: నాకు ఈ రోజు ఒక ఆశ పుట్టినది. నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చినది. నేను చెప్పినట్లుగా ఈ భూమి నా మాట వింటుందని ఇలాంటి విపరీతమైన ఆలోచనలు నన్ను వెంటాడినాయి. నాకు ధ్యానము కుదరలేదు.
నాకు వచ్చిన క్షిప్ర గణపతి రాతి విగ్రహమూర్తి
ఈరోజు నాకు క్షిప్ర గణపతి రాతి విగ్రహమూర్తి అడుగు పరిమాణము ఉన్న విగ్రహం వచ్చినది.ఇది ఎంతో సజీవ కళతో ఉండటంతో ఈయన కళ్ళకి వెండి కళ్ళు అమర్చాను.
P8:
అక్టోబర్ 18: ఈ రోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి. అదికూడా ధ్యానములో. విచిత్రంగా ఉంది. ఈ విషయం గూర్చి గురుదేవుని అడిగితే.. ఆయన నా గురించి చెడుగా అనుకుంటే.. వద్దు. అడగవద్దు.
అక్టోబర్ 20: ఈ రోజు దుర్గాష్టమి. కానీ అమ్మవారి ధ్యాస కన్న అమ్మాయి ధ్యాసయే నాకు ధ్యానములో అవుతుంది. వామ్మో ఏం జరుగుతోంది.
అక్టోబర్ 30: ఈ రోజు నాకు ధ్యానంలో విపరీతంగా నా మర్మాంగము ఎందుకో ఉత్తేజం పొందినది. వామ్మో కామవాంఛలు తట్టుకోలేమా?
నవంబర్ 2: ఈ రోజు నాకు పంచముఖ గణపతి ఫోటో బహుమతిగా వచ్చినది.
నవంబర్ 5: ఈరోజు నాకు షిరిడి నుండి విద్యా గణపతి పాలరాతి విగ్రహ మూర్తి వచ్చినది.
నవంబర్ 8: ఈరోజు గుడి మీద ఉన్న పావురాల సంయోగము చూశాను. అలాగే చిలుకల సంయోగము చూశాను. దానితో కామ ఉద్రేకము పెరిగినది.
P9:
నవంబర్ 10: వామ్మో! ఈ రోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్లయినా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది.
నవంబరు 20: వామ్మో! కనీసం ఒక్క ఆడ కుక్క అయినా దొరికితే బాగుండును. ఈ కామవాంఛలు తట్టుకోలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు.
నవంబర్ 27: వామ్మో! ధ్యాన సమయంలోనే నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగము ఉత్తేజం చెందుతుంది.ఏది అయితే అది అయింది.దీనిని గూర్చి గురుదేవునినిఅడగాలి.లేదంటే ఆడ జాతికి నా వలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు యోగివేమన సినిమాను మా బంధువుల అమ్మాయితో కలిసి చూశాను. ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న ఫోటో చూశాను. నాకు చాలా ఆశ్చర్యమేసినది.
నవంబరు 28: వామ్మో! 80 సంవత్సరాల ముదుసలి మీద కూడా కామవాంఛలు ఉండటం ఏమిటి? అసలు నాకు ఏమి జరుగుతుంది. ఈ రోజు యోగి వేమన శతకాల పుస్తకం కొని చదివాను.పద్యాలు చదువుతున్నంతసేపు స్త్రీల మీద, కామము మీద వైరాగ్య భావాలు కలిగినాయి. పుస్తకము మూయగానే నాలో కామ వాసనలు తెరుచుకునేవి.
నవంబర్ 30: ఈరోజు ఎద్దు ఆవు, గేదె దున్నపోతు, కాకుల సంయోగం చూశాను. దానితో నాలో మన్మధుడు నిద్రలేచాడు.
P10:
డిసెంబరు 1: పాపం రా! ఐదు సంవత్సరాల చిన్న పిల్లల మీద కూడా ఏమిటిరా నీ కామవాంఛలు ఆలోచనలు. అసలు నీకు బుద్ధి లేదు రా.
డిసెంబర్ 5:పాపిష్టి వెధవ! చివరికి కన్న తల్లి మీద కూడా నీకు కామవాంఛలు కలగటం ఏమిటిరా. మనసా! నీ మెదడు దొబ్బినదా.అసలు నాకు ఏమి జరుగుతోంది. గురుదేవునిని అడగాలి.ఈరోజు పుండరీకుడి సినిమా చూశాను. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను.
ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం
ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న పంచలోహ విగ్రహమూర్తి చూడటము జరిగినది. నాకు చాలా ఆశ్చర్యమేసినది.
డిసెంబర్ 7: వెధవ నాయాల! అక్క, చెల్లి మీద కూడా కామవాంఛలు రావడం ఏమిటి రా. ఈరోజు భక్తతుకారం సినిమా చూసి అందులో ఆయన ఎలా అయితే తనకు వచ్చిన కామమాయ పరీక్ష దాటినారో తెలుసుకున్నాను.
డిసెంబర్ 10: అందమైన అబ్బాయి ల మీద కూడా నీ మనస్సు పోవడం ఏమిటి రా. మనసా! అసలు నీకు ఏమి జరుగుతోంది. రానురాను తేడాగా మారతావా ఏమిటి. నాకైతే అర్థం కావడం లేదు.
డిసెంబర్ 15:ఆడ గేదెను అనుభవించాలని విపరీతమైన ధోరణికి ఎలా వెళుతున్నావు? మనుషులు జంతువులతో సంయోగం చేయటం ఏమిటి రా. మనసా! అసలు నీకు ఈ రోజు ఏమి జరుగుతోంది.
డిసెంబర్ 20: వామ్మో నాకు ధ్యానంలో కలిగే విపరీతమైన కామవాంఛలు ధోరణి గూర్చి ఎలాగైనా నా గురుదేవుడుని అడిగి తెలుసుకోవాలి. లేదంటే నాకు నయం కాని ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మర్మాంగము దెబ్బకి తట్టుకోలేకపోతున్నాను. ప్రణవ మంత్రము కాస్త ప్రణయమంత్రము అయ్యేటట్లుగా ఉంది.
ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న రాతి విగ్రహమూర్తి చూడటము జరిగినది. నాకు చాలా ఆశ్చర్యమేసినది.
P11:
జనవరి 1:నా దీనావస్థ పరిస్థితి చూడగానే నా గురుదేవుడు చిరునవ్వు నవ్వి “కంగారుపడకు. నువ్వు ఈ చక్ర భూచర సిద్ద మాయలోని అహములో పడినావు.ఎప్పుడైతే నాకు ఈ భూమి ఆధీనము అయినదని అనుకున్నావో తక్షణమే ఈ చక్రం బలహీన పడటం మొదలైంది. దానితో ఈ మర్మాంగము యొక్క కామ వాంఛ కాస్తా విపరీతమైన ధోరణి లోకి వెళ్ళింది. తిరిగి ఈ చక్రము బలం చేకూర్చడానికి ఒక ఆరు నెలల పాటు పెసరపప్పు తో కూడిన అన్నము అనగా పులగము తినాలి. ఆతర్వాత నేను శృంగార ఉచ్చిష్ట గణపతి గూర్చి అడిగితే దానికి ఆయన వెంటనే “ భక్తుల అభీష్టానికీ, ఊహలకూ అనుగుణంగా తమ ఇష్టదేవతను వివిధ రూపాలలో పూజించుకోవడం అంతటా ఉండేదే! అలాగే గణపతిని కూడా 32 రూపాలుగా కొలుచుకునేవారని శ్రీతత్వనిధి వంటి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. వారిలో ఒక భిన్నమైన రూపమే ఉఛ్చిష్ట గణపతి..
ఉచ్ఛిష్ట గణపతి రూపం తంత్రోపాసనకు ప్రసిద్ధం. వామాచారానికి అనుగుణంగానే ఈ గణపతి నగ్నంగా కనిపిస్తాడు. ఆ గణపతి తొడ మీద శక్తి స్వరూపిని అయిన దేవత కూడా నగ్నంగానే కనిపిస్తుంది. అలాగే ఈ గణపతి తన ప్రక్కన ఉన్న అమ్మవారి రహస్య మర్మాంగమైన యోని భాగమును తన తొండముతో తాకుతూ ఉంటే...ఆ అమ్మవారు అయితే తన భర్త రహస్య మర్మాంగమును పట్టుకొని ఉంటుంది. చాలా గ్రంథాలలో ఈ గణపతిని నీలం రంగులో ఉన్నవాడిగా వర్ణిస్తారు. సాధారణంగా ఆరు చేతులతో కనిపించే ఈ గణపతి దానిమ్మపండు, వీణ, అక్షమాల, నీలపు పద్మాలను ధరించి దర్శనమిస్తాడు. ఈయన ఉచ్ఛిష్ట గణపతి కాబట్టి, తాంత్రికులు ఏదో ఒకటి (తాంబూలము, మోదకము..) నములుతూ ఈయనను ఆరాధిస్తారు. సాధారణ జనాలని దూరంగా ఉంచేందుకు తాంత్రికులు ఈ ఎంగిలి, నగ్నత్వం వంటి అసభ్యంగా తోచే లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారని కొందరి నమ్మకం. తమ ఆచారానికి అనుగుణంగానే వారు ఉచ్ఛిష్ట గణపతిని రూపొందించుకొని ఉండవచ్చు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మొదలుకొని కోర్టుకేసులని పరిష్కరించుకోవాలనుకునే వారి వరకూ ఈ ఉచ్ఛిష్ట గణపతిని పూజిస్తూ ఉంటారు. అలాగే సంతాన సమస్యలున్నవారు ఈయనను పూజిస్తే త్వరలో సంతానవంతులవుతారు. నిరంతరం ఏవో ఆపదలు, అవాంతరాలతో కోరుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయేవారు, ఈ గణపతిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఆయన ప్రతిరూపాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. అది...
నీలాబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
ఉచ్ఛిష్ట గణపతి రూపాలు ఉన్న ఆలయాలు చాలా తక్కువే. వాటన్నింటిలోకీ పెద్దది, ప్రముఖమైనదీ తమిళనాడులోని తిరువన్వేలిలో ఉంది. ఇక్కడి ఆలయంలో ఉన్న గణపతి తన తొడ మీద కూర్చుని ఉన్న శక్తి ఉదరభాగాన్ని, తొండంతో తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ భంగిమ సంతానప్రాప్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకనే సంతానాన్ని కోరుకునేవారు, ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందని తమిళులు నమ్ముతారు అని … అలాగే ఏ సాధకుడైతే ఈ గణపతి విగ్రహమూర్తి దర్శనము పొందుతారో వారికి కామజయం కలుగుతుంది.అనగా ఇంద్రియ మనోనిగ్రహమును పొందుతాడు! కాబట్టి నీకు త్వరలో ఇంద్రియనిగ్రహము కల్గి కామజయం కలుగుతుందని సూచనగా ఈ చక్రము కల్గించే కామమాయ యందు జయం పొందాలని ఈ ఉచ్చిష్ట గణపతి అనేక రూపాలలో కనిపించి సూచన ఇచ్చాడని గ్రహించు! అని చెప్పడము జరిగినది.
జనవరి 10: నెమ్మదిగా గా నాలో విపరీత పశు ధోరణి కామపు ఆలోచనలు తగ్గటం మొదలైనాయి అని ఈరోజు నాకు అనిపించసాగింది.
జనవరి 15: ఈ రోజు ఎందుకో నాకు స్వార్ధ గుణము, తెలియని భయం నాలో కనబడ్డాయి.
జనవరి 20: ఈరోజు అందరినీ మూర్ఖపు పట్టుదలతో ఎదిరించడము జరిగినది. అది నాకు తెలుస్తుంది. కానీ ఆపుకోలేకపోతున్నాను.
P12:
జనవరి 28: ఈరోజు విచిత్రంగా అందరితో అనాగరిక మనస్తత్వంతో మూర్ఖంగా ప్రవర్తించాను. ఇలా ఎందుకు జరుగుతుందో గురుదేవుడుని అడగాలి.
ఫిబ్రవరి 3: నా మానసిక రుగ్మతలు గూర్చిగురుదేవుడుని అడిగితే “మూలాధార చక్రం బలహీన పడుతున్నప్పుడు వచ్చే సమస్యలని… వీటిని ఇప్పుడే అదుపు చేయాలని లేదంటే ఈ చక్రం మరింతగా బలహీనపడుతుందని తద్వారా మనకి ఎముకల వ్యాధులు,కీళ్ళ వాతము, నయంకాని కురుపులు, చర్మవ్యాధులు, కంటి చూపు తగ్గటం ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వీటి నివారణ కోసం కొన్ని రకాల చేతి ముద్రలు చేయాల్సి ఉంటుందని అనగా అశ్విని ముద్ర, పృద్వి ముద్ర, మహాముద్ర అలాగే మూలబంధనము చేయాల్సి ఉంటుందని చెప్పి అవి ఎలా చేయాలో, ఎలా వేయాలో చెప్పి నా చేత చేయించారు.
మార్చి 4: ఈరోజు నాకున్న మానసిక రుగ్మత లక్షణాలు క్రమేణా నా నుండి దూరం అవుతున్నాయని నాకు ధ్యానంలో అనిపించసాగినది.ఈ రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా జాగరణ చేస్తున్నాను. అనుకోకుండా ఈ రోజు పరమానందయ్య శిష్యుల కథ సినిమా చూశాను. అందులో హీరో గారు స్త్రీ మూర్తి స్తన్యమును లింగమూర్తిగా భావించుకొని ఆరాధించడము ఈ దృశ్యము నాకు బాగా నచ్చినది. అందుకే కాబోలు మహా శివుడికి ఈ పూజా విధానము నచ్చి మెచ్చినారు గదా అని అనిపించినది.
P13:
మార్చి 10: ఈరోజు నాకు ధ్యానంలో తుమ్మెదల ఝుంకార నాదము విచిత్రంగా వినిపించసాగింది. కొంపదీసి నా కడుపులో తుమ్మెదలు కూడా గూడు పెట్టలేదు కదా అనే సందేహం వచ్చే సరికి నాకు ధ్యాన భంగమైంది.ఇది ఏమిటి క్రొత్తగా. ఈ నాదం వినబడటం ఏమిటో అర్థం కావడం లేదు.
మార్చి 27: ఈ రోజు నా పుట్టిన రోజు.అయినా ఆనందము గా లేను. నా ధ్యానములో తుమ్మెదల నాదముకి నా చెవులు దెబ్బతిని చెముడు వస్తుందో ఏమో అని భయంగా ఉంది. దీనిని గూర్చి నా గురుదేవుడుని అడగాలి.
ఏప్రిల్ 1: ఈ నాదము ఈరోజు బాగా చాలా స్పష్టంగా వినబడుతోంది.ఎవరో నా లోపల కూర్చుని ఈ నాదం చేస్తున్నట్లుగా నాకు అనిపించినది.
ఏప్రిల్ 3: ఈ నాదమును బాగా జాగ్రత్తగా వింటుంటే ఏదో ప్రాణం కదలిక వలన అలలుగా విడిపోతూ ఈ శబ్దము వస్తుందని నాకు అనిపించసాగింది.
P14:
ఏప్రిల్ 15: ఏదో నీటి అలలు బాగా కదిలితే వచ్చే శబ్దం లాగా ఈ ఝుంకారనాదం రానురాను వినబడసాగుతోంది. అసలు నాలో నాకు ఏమి జరుగుతుంది.
ఏప్రిల్ 16: ఖచ్చితంగా ఈ శబ్ద నాదము నా మూలాధారచక్రము లోని ఏదో అలల మాదిరిగా వస్తుందని నాకు అర్థం అవసాగింది.
ఏప్రిల్ 18: ఈ రోజు విచిత్రంగా ఈ అలల నుండి 'లం' అనే శబ్దం వినబడుతోంది. ఇదేమి విచిత్రం.
ఏప్రిల్ 20: నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు విచిత్రంగా నా మనస్సు అంతా ఈ 'లం' అనే శబ్దంతో లయం అయిపోయినట్లుగా అనిపించసాగింది.
ఏప్రిల్ 25: రానురాను ఈ చిన్న శబ్దం కాస్త చాలా పెద్దదిగా చాలా స్పష్టంగా 'లం' అనే శబ్దనాదం వినబడుతుంది అని నాకు అనిపించసాగింది.
P15:
ఏప్రిల్ 28: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో నాలుగు దళాలు ఉన్న ఏదో కమలంగా దాని మధ్యలో 'లం' అనే సంస్కృత బీజాక్షరము ఉన్నట్లుగా అలాగే నాలుగు దళాల మీద వం,శం,షం,సం అనే అక్షరాలు ఉన్నట్లుగా ఎరుపు వర్ణంలో కొన్ని క్షణాల పాటు కనబడినది.
మే 1: ఈ రోజు విచిత్రంగా 'లం' అనే బీజాక్షరము బదులుగా శివలింగం దాని చుట్టూ ఏదో పాము చుట్టుకుని ఉన్నట్లుగా కనిపించింది.
మే 5:ఈ రోజు విచిత్రంగా మట్టి రంగులో వున్న ఒక ఏనుగు తల కనబడింది. పైగా అది తన తొండము అటు ఇటు ఊపుతూ నాకేసి చూస్తున్నట్లు గా కనిపించింది. వామ్మో ఈ ఏనుగు ఏమిటి?ఈ శివలింగం ఏమిటి? పద్మము కనిపించటం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.దీనిని గూర్చి గురుదేవుని అడగాలి అనుకున్నాను.ఈ రోజు చింతామణి గణపతి గూర్చి వివరాలు చదవడం జరిగినది.
P16:
మే 11: నాకు కలిగిన ఈ చక్రము అనుభవాలు గూర్చి మా గురుదేవునిని అడిగితే దానికి ఆయన “నాయనా! అవి అన్నీ కూడా శుభసూచకాలే.నీకు మూలాధారము చక్రము జాగృతి, శుద్ధి, ఆధీనమైంది. ఈ చక్రమునకు అధిపతి మహాగణపతి. దీనికి నిదర్శనమే ఏనుగు దర్శనం అన్నమాట. అలాగే ఈ చక్ర అధిష్టాన దైవం పరబ్రహ్మము. దీనికి నిదర్శనమే శివ లింగ మూర్తి దర్శనం. అలాగే ఈ చక్రం యొక్క పద్మము 4 దళాలతో 'లం' అనే బీజాక్షరము కలిగి ఉంటుంది. ఇక ఈ లింగమూర్తిని చుట్టుకున్న పాము సంగతికి వస్తే అది ఈ బ్రహ్మాండమును మోసే ఆదిశేషుడు అని గ్రహించు. పైగా ఈ ఆదిశేషుడు అంటే సర్పమే కదా. అందుకే మన కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంటుందని శాస్త్ర వచనము.ఈ సర్పము యొక్క కదలిక శబ్దనాదమే 'లం' అనే బీజాక్షరము నాదం అని గ్రహించు..ఈ విశ్వ సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక శబ్దం ఉంటుంది. ఈ శబ్దమే అన్ని అణువులను కలిపి ఉంచటం వలన అది మనకు పదార్థంగా కనబడుతుంది. లేకపోతే పదార్థం ఏర్పడదు. అణువులుగా విడిపోతాయి. కనబడతాయి. అలా ఈ విశ్వ సృష్టికి మూల పదార్థం ఈ మూలాధార చక్రము గావడము వలన అందులో 'లం' అనే బీజాక్షర నాదమే ఈ మూల పదార్థం అణువులను కలిపి ఉంచుట వలన మనకి ఈ బ్రహ్మము కాస్త బ్రహ్మ పదార్థంగా బ్రహ్మాండంగా కనబడుతుంది.అందుకే మూల ఆది పరబ్రహ్మముగా రేణువు వంటి మహా గణపతి ఉన్నాడని ఈపాటికి గ్రహించి ఉంటావు.ఈయన నుండి ఈ సకల జీవ స్వరూపాలు ఏర్పడినాయి. వాటి స్థూల శరీరములు ఏర్పడినాయి. అందుకే వీరికి ఏనుగు తల, ఎలుక వాహనం, పాము జంధ్యం మున్నగు వాటిని ఉంచినారు అని చెప్పడంతో నా మనస్సు కుదుటపడింది.
P17:
మే 18: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఒక ఏనుగు తల కనిపించి తొండముతో ఏదో తీసుకుని లోపలికి పెట్టుకున్నట్లుగా లీల మాత్ర దర్శన అనుభవం కలిగినది. అది ఏనుగు తల లేదా గణపతి తల ఏదో మాత్రం తెలియరాలేదు.
మే 21: ఈరోజు నాకు ధ్యానంలో ఉండగా నిజంగానే నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చినదో లేదో తెలుసుకోవాలనే చిలిపి ఆలోచన వచ్చింది.
మే 26: ఈ రోజు అనుకోకుండా 100 కేజీల బరువు ఉన్న దేవత విగ్రహలను నేనొక్కడినే దూదిపింజలాగా మోయడము నాకు ఆశ్చర్యం వేస్తోంది. కొంపతీసి భూమి ఆకర్షణ శక్తిని తట్టుకునే శక్తి నాకు వచ్చినదా ఏమో ఎవరికి ఎరుక.
మే 30:ఈ రోజు దేవతా విగ్రహలు ఉన్న పల్లకిని ఒక వైపు నుండి మోసాను. నాకు అంత బరువు గా అనిపించలేదు. విచిత్రంగా ఉన్నది.
జూన్ 2:ఈ రోజు అనుకోకుండా నా కాళ్ళ మీద బండ రాయి పడినను నాకేమీ కాకపోవటం విచిత్రంగా ఉంది. ఇదేనేమో భూచరసిద్ధి అంటే.
P18:
జూన్ 5: భూమి మీద ఆధిపత్యం పరీక్ష కోసం మరో ఆరు నెలలపాటు ఈ మూలాధార చక్ర ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాను.
జూన్ 18: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఎవరో కాంతి శరీరమున్న నగ్న స్త్రీ మూర్తులు కనిపించి కవ్వించడం మొదలు పెట్టారు.నాలో మన్మధుడు నిద్ర లేస్తున్నాడని అనిపించింది.
జూన్ 25: ఈరోజు పార్వతి అమ్మవారు నగ్నంగా కనబడసాగింది. ఇదేమి ఖర్మయో అర్థం కావడం లేదు. వామ్మో! నాకు ఏమి జరుగుతోంది. మళ్లీ ఈ మూలాధార చక్రం కాస్త బలహీన పడుతుందా? అర్థం కావడం లేదు.
జూన్ 27: ఇలా నాకు నగ్న స్త్రీ మూర్తులు, దేవతా స్త్రీ మూర్తులు కనిపించడం సర్వసాధారణం అయింది.దానితో నా మర్మాంగం ఉత్తేజం చెందడం ప్రారంభమైంది.కామ దేవత నాలో ప్రవేశించినట్లుగా అనిపించసాగింది.
P19:
జూలై 1:ఎప్పుడూ లేనిది ఈ రోజు అమ్మవారి విగ్రహమూర్తి మీద నాకే విపరీతమైన కామవాంఛ మొదలైంది. నాకు ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు.
జూలై 10: ఈరోజు తెగించి నాకు కలుగుతున్న మళ్ళీ కామ అనుభవాలు మా గురుదేవునిని అడిగితే దానికి “ఆయన మంచిదే కదా నీ చక్రం బలంగానే ఉంది. కాకపోతే ఇందులో నీవు చేసిన తప్పు ఏమిటంటే ఈ చక్రం ఇచ్చే యోగసిద్ధి పొందాలని అనుకోవడమే. అలా ఎప్పుడైతే అనుకున్నావో ఆ క్షణమే ఈ ప్రకృతి మాత తన భాగమైన భూతత్వ సిద్ధికి నీకు అర్హత ఉన్నదో లేదో పరీక్షించటానికి యధావిధిగా నీకు కామ యోగ పరీక్షలు పెట్టటం ఆరంభించినది. ఇన్నాళ్లు మానవ స్త్రీ మూర్తులు దర్శనమిచ్చారు. ఎప్పుడైతే ఈ సిద్ధి కోసం సాధన చేయటం ప్రారంభించినావో ఆ క్షణమే ప్రకృతి దేవతా శక్తి మాతలు నగ్నంగా కనబడి కామ పరీక్షలు పెట్టడం జరుగుతోంది.ఇది రానురాను వివిధ ఊర్ధ్వలోకాల నుండి నిజంగానే దేవతా స్త్రీలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు ఇలా 13 రకాల జాతి స్త్రీమూర్తులు నీ దగ్గరకి ప్రత్యక్షంగా వచ్చి నీ కామ సుఖం కోసం పరీక్షలు పెడతారు. ఎలా అంటే విశ్వామిత్రుడికి మేనక వచ్చి ఎలా అయితే పరీక్షలు పెట్టి వారి మాయలో వీరిని ఉంచి వీరి 10 లక్షల సం!!లు తపోశక్తిని నాశనం చేసినారో. అలా నీ సాధన శక్తిని నాశనం చేసి నిన్ను పంచభూత సిద్ధుల మాయలో ఉంచుతారు. నీకు సాధన ముందుకు వెళ్లాలంటే సాధన యోగసిద్ధులు వదులుకోవాలి. లేదంటే ఈ 13 రకాల జాతి దేవతల మాయలో పడి పోవాలి. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇదే చేయమని నేను చెప్పను. ఒకటి గుర్తుంచుకో. ఎప్పుడైతే ఒక సిద్ధి నువ్వు పరీక్షించాలని అనుకున్నప్పుడు ఒక పరీక్షతో అది ఆగిపోదు.అనేక పరీక్షలకి దారితీస్తుంది. దానితో ఈ సాధన శక్తి తరిగిపోతుంది. అప్పుడు కుండలినీశక్తి నిద్రావస్థ కి చేరుకుంటుంది. నువ్వు తిరిగి మాయలో పడతావు. పునః జన్మలు ఎత్తుతావు అని చెప్పినారు.
P20:
జూలై 18: ఈరోజు రజనీకాంత్ నటించిన బాబా చిత్రం చూశాను. దానితో యోగ శక్తుల జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను.
జూలై 25: ఈరోజు విచిత్రంగా లీలామాత్రంగా నా మహాగణపతి విగ్రహమూర్తి కనిపించి నవ్వుతున్నట్లుగా తొండం ఊపుతున్నట్లుగా, చెవులు కదుపుతున్నట్లుగా కళ్ళు కదుపుతున్నట్లుగా, చేతివేళ్లు కాలివేళ్లు కదుపుతున్నట్లుగా ఎలుక తోక ఊపుతున్నట్లుగా లీలగా సజీవమూర్తిగా కొన్ని క్షణాలు కనపడి శూన్యంలో అదృశ్యమైంది. ఇది దేనికి సంకేతమో అర్థమై చావట్లేదు.
నాకు వచ్చిన కాణిపాక గణపతి
ఇలా కనపడిన ఐదవ రోజు కల్లా కాణిపాక క్షేత్రం నుండి ఆయన లాంటి ఒక నల్లటి గణపతి విగ్రహం సజీవ మూర్తిగా మా ఇంటికి వచ్చింది. ఈయన శూన్యంలో అదృశ్యమవ్వడము వలన గణపతి మూర్తి శాశ్వతం కాదని నాకు అర్థమైంది.
వినాయక చవితి పండగ సమయమున నేను ఎప్పుడూ కూడా ఒక అడుగు మట్టి గణపతి విగ్రహం కొని దానిని పూజలో ఉంచి మూడో రోజు నిమజ్జనం చేయటం అలవాటు. నాకు ఎప్పుడైతే గణపతి విగ్రహంమూర్తి కాస్త సజీవమూర్తిగా దర్శనమిచ్చినారో ఆ సంవత్సరం నుండి ఈ రోజు దాకా ప్రతి వినాయక చవితి పండుగకి విగ్రహం కొనే ముందు ఆయన ఏనుగు తల సజీవమూర్తిగా ఒక లిప్త కాలము పాటు కనిపించడము అలాగే ఏ విగ్రహం మూర్తిని తీసుకోవాలని అనుకుంటున్నానో ఆ విగ్రహమూర్తి ఒక లిప్త కాలము పాటు సజీవమూర్తిగా కనిపించటం సర్వసాధారణమైనది.ఇది నేను అహముతో చెప్పటం లేదు. అణకువతో చెబుతున్నాను. దైవ శక్తిని నమ్మితే అది ఉన్నదని ఆయన నిరూపించినారు అని చెబుతున్నాను.విచిత్రం ఏమిటంటే ఈయన పూజ చేసిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి కావాలని ఆ రోజు గణపతికి నివేదించిన ప్రసాదాలు మాత్రమే తిని వెళ్ళటం ఇప్పటికి జరుగుతోంది.అలాగే ఎడమ తొండమున్న గణపతి మట్టి విగ్రహమూర్తులు చచ్చినా కూడా నిమజ్జనానికి వెళ్లకుండా ఇంట్లోనే తిష్ట వేసేవి.అప్పుడప్పుడు నేను తెలిసో తెలియకో ఏమైనా తప్పుడు ఆలోచనలు లేదా తప్పుడు పనులు చేస్తే మరుక్షణమే ఈ విగ్రహములు కాస్త నాకు కళ్ళముందు లిప్త కాలము కనబడి ఉగ్ర స్వరూపంగా చూస్తున్నట్లుగా కనబడతాయి. దానితో నేను చేసిన తప్పును గుర్తించి ప్రాయశ్చిత్తము చేసుకునే వాడిని.
నాకు వచ్చిన బాల గణపతి
అలా 32 గణపతులలో ఫోటో మొదలై ఆత్మలింగమును కాపాడే బాల గణపతి విగ్రహం వచ్చేదాకా ఈ గణపతి విగ్రహ మూర్తులు వచ్చినాయి. అంటే మూలాధార చక్ర గణపతి నుండి హృదయ చక్రం స్థాన పతియైన బాల గణపతి దాకా ఈ విగ్రహ సజీవ మూర్తులు నా పూజా మందిరంలో చేరి పూజలందుకుంటున్నాయి. ప్రస్తుతం మేము నిత్య పూజలు చేయలేక వినాయక చవితి పూజ మాత్రమే చేస్తున్న కూడా ఆ మహాగణపతి సంతృప్తి చెందటం నాకే ఆశ్చర్యం వేస్తోంది.కొండంత గణపతికి నా పిసరంత భక్తి ఆయనకి ఎందుకు తృప్తిని ఇస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయమే.
ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!
***************************
మూలాధార మా సాధనానుభవాలు
నేను ఇంటిలో అలాగే మా జిజ్ఞాసి ఏమో శ్రీశైల క్షేత్రంలో మా యోగ చక్రాల జాగృతి చేసుకోవడానికి యోగసాధన కొనసాగిస్తున్నాము. కానీ ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఈ అధ్యాయములో మీకు సౌలభ్యం కోసం మూలాధార చక్రము యొక్క అన్ని స్థితులు అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదన చేసుకొనేటప్పుడు నాకు కలిగిన దైవ ధ్యాన అనుభవాలు మీకు యథాతథంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ నిజానికి మాకు అన్ని చక్రములు జాగృతి అయిన తర్వాతనే శుద్ధి ప్రారంభమయ్యాయి.ఆ తర్వాత ఆధీనము అయినాయి. ఇది అంతా కూడా సుమారు 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే నాలుగు స్థితులకి 6 నెలలు చొప్పున 2 సంవత్సరాలు పైగా పట్టినది. మీ కోసం వాటిని వెంటవెంటనే ఇవ్వడం జరుగుతోంది.అంటే మూలాధార చక్రానికి సంబంధించిన అన్ని రకాల అనుభవాలు అన్ని ఒకే అధ్యాయములో అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము స్థితులు ఇస్తే సాధకులు అయోమయంలో పడకుండా శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటారని ఈ విధంగా రాయటం జరిగింది.అన్ని చక్రాలు జాగృతి పూర్తి అయిన తర్వాతనే….. శుద్ధిస్థితి రావడం ఇది అన్ని చక్రాలు పూర్తి అయిన తర్వాతనే…. ఆధీన స్థితి రావటం జరిగిందని తెలుసుకోండి.అర్థం చేసుకోండి. అలాగే మా జిజ్ఞాసి తన యోగ చక్రాలను శ్రీశైలం క్షేత్రమందు జాగృతి చేసుకుంటే తిరిగి మహా కాశీ క్షేత్రమునకు చేరుకొని అక్కడ చక్రాలను శుద్ధి చేసుకున్నాడు.ఆ తర్వాత తమ చక్రాల ఆధీనం కోసం మౌన ముని ఆవాసమైన రమణ మహర్షి ఆశ్రమము ఉన్న అరుణాచలమందు 18 సిద్ధ యోగుల సమక్షములో యోగ శక్తులతో తమ యోగ చక్రాలను ఆధీనము చేసుకున్నాడు.
మరి నేనేమో నాకు కనపడిన ఆయా దేవతల క్షేత్రాలకు వెళ్లి జాగృతి, శుద్ధి, ఆధీనము చేసుకోవడం జరిగినది. వాడేమో కేవలము మూడు స్వయంభు క్షేత్రాలు మాత్రమే (శ్రీశైలం, కాశీ, అరుణాచలం) తిరిగి జాగృతి, శుద్ధి, ఆధీనము చేసుకుంటే నేనేమో ఒక్కొక్క దానికి 3 క్షేత్రాలు చొప్పున (13 చక్రాలు+ 3 గ్రంధులు) 16x3=48 క్షేత్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనము కోసం తిరగవలసి వచ్చింది.జ్ఞానమార్గానికి అలాగే సిద్ధ మార్గానికి నాకు తెలిసిన తేడా ఇదే. రెండవది జ్ఞాన యోగి యోగ శక్తులు వచ్చినను పెద్దగా పట్టించుకోడు అనగా రామకృష్ణ పరమహంస లాగా అన్నమాట. అదే సిద్ధ యోగి కి మాత్రమే సిద్ధులు, శక్తులు వస్తే వాటిని ప్రదర్శించకుండా ఉండలేరు. అనగా శ్రీత్రైలింగ స్వామి లాగా అన్నమాట.నాలో కుండలినీ శక్తి జాగృతి అవుతున్నప్పుడు ఏకాగ్రతతో కూడిన తీవ్ర ధ్యాన స్థితి కూడా ఆరంభమైంది.ఆలోచనలు తీవ్రతరం తగ్గుతూ వస్తున్నాయి. మనస్సు స్థిర స్థితిలోకి రావటం అలాగే ధ్యానానికి సహకరించడం చేస్తోంది.
ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నాకు ధ్యానమునందు ఒక నల్లటి పెద్దగా వెడల్పుతో ఉన్న రాతి విగ్రహమూర్తి బావి నుండి బయటకి సగం మాత్రమే వచ్చినట్లుగా అగుపించినది.కానీ ఆ విగ్రహం నీడ మాత్రమే లీలగా కనబడింది. అది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇలా సుమారు 21 రోజులపాటు కనిపించి తర్వాత వెలుగుతూ విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా కళ్లు ఆర్పుతూ తెరుస్తూ కనబడుతూ అది కాణిపాక గణపతి విగ్రహం మూర్తిగా కనబడసాగింది! ఇది భలేగా ఉంది. సజీవమూర్తిగా ఉన్నాడు అనుకొని సాధన చేస్తుండగా ఆ విగ్రహమూర్తి అదృశ్యమైనది. నాకేమీ అర్ధం గాక ఆయన ఎందుకు కనిపించాడు ఎందుకు అదృశ్యమైనాడు అనుకొని ఆవేదనతో ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చాను. ఇలా వరుసగా మూడు రోజులు ఇదే సాధన స్థితి జరిగినది. ఇది ఇలా ఉండగా మా స్నేహితుడు మా ఇంటికి వచ్చి “భయ్యా! నేను ఈ మధ్యనే కాణిపాకంకి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు నీ గురించి ఏమీ ఆలోచించని వాడిని ఒక కొట్టులో ఈ విగ్రహము నీకోసం తీసుకోవాలని బలంగా అనిపించింది. తీసుకొని వచ్చినాను.” అనగానే ఎంతో ఆశపడి కాణిపాకం విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చాడు కదా అనుకుంటుండగా వాడు ఒక అంగుళం సైజులో ఉన్న వేరే ఆకార గణపతి విగ్రహమూర్తిని చేతిలో పెట్టినాడు. అంటే వీడు ఆ క్షేత్రానికి వెళ్లి ఆ క్షేత్ర దేవుడి విగ్రహమూర్తి కాకుండా మామూలుగా సహజంగా దొరికే సాధారణ గణపతి విగ్రహం నాకోసం తెచ్చాడు అనుకునేసరికి తీవ్రమైన ఆవేదన, బాధ ,కోపం కలిగినాయి. నాకు ధ్యానములో కనిపించిన విగ్రహమూర్తిగా ఆయన మా ఇంటికి వస్తే ఏమి సొమ్ము పోతుందని ఏదో ఒక రూపంలోనైనా వచ్చినాడని అసంతృప్తి కూడిన ఆనందంతో ఆ విగ్రహ మూర్తిని తీసుకొని పూజలో ఉంచినాను. ఎవరికి తెలుసు ఏ విగ్రహంలో ఏముందో?
మూలాధార చక్ర జాగృతి:
సరే కదా అని ఈ విగ్రహమూర్తిని నా మూలాధార చక్ర జాగృతికి ఉపయోగించుకోవచ్చు కదా అని నా మనస్సు ఒక సూచన చేయటం ప్రారంభించింది. సరే అని దీనిని కుడి చేతిలో పెట్టుకుని తీవ్ర ధ్యానం చేస్తుండగా “నాకోసం స్తోత్రము ప్రతి నిత్యము చెయ్యి” అని ఎవరో చెప్పినట్లుగా నా చెవిలో లీలగా వినబడింది. వెంటనే ధ్యాన భంగం అయినది.ఆ తర్వాత మూడు రోజులకి ఒక వ్యక్తికి “ఏదో ప్రతి సమస్యకి ఆటంకాలు వస్తున్నాయని వాటిని తొలగించడానికి ఏదైనా మంత్రము చెప్పండి” అని నా దగ్గరికి వచ్చినాడు. నేను వాడి ముఖం చూసి ఏదో యథాలాపంగా “గణపతి సంకటహర స్తోత్రము ప్రతిరోజు 11 సార్లు తక్కువ కాకుండా చేసుకోమని బెల్లం నైవేద్యం పెట్టమని” చెప్పటం జరిగినది.అతను వెళ్లిపోయిన తర్వాత నాకు ఏదో స్పురణకు వచ్చి అంటే కొంపదీసి నన్ను కూడా ఈ స్తోత్రము చేయమని గణపతి చెప్పడం లేదు గదా అనుకోగానే ఎవరో పెద్దగా మూడు సార్లు తుమ్మారు.అంటే అదే సత్యమని ఆనాటి నుండి శ్రద్ధగా 11 సార్లు ఈ స్తోత్రం చదువుతూ దానిని 108 సార్లు పెంచుకునే స్థాయికి వెళ్లేసరికి నా ధ్యానం చేసే సమయంలో ఏదో తెలియని నా దగ్గర లేని పదార్థ వాసన రావటం ఆరంభమైనది. అది నా ముక్కులోకి ఈ వాసన తెలుస్తోంది. ఇది ఏమి వాసన? ఎక్కడ నుండి వస్తుందో అని ధ్యానం నుండి బయటకు రావటం… అక్కడ ఏమీ కనిపించక పోవటం… మళ్లీ ధ్యానంలోకి తిరిగి ఆ వాసనలు రావటం అవి కూడా జుట్టు కాలిన వాసనలు, శవాలు కాలిన వాసనలు, మల మూత్ర వాసనలు, మాడు వాసనలు, మురుగు వాసనలు రావడం ఆరంభమైనది. ఈ కంపు భరించలేక పోతున్నాను. ఎక్కడైనా డ్రైనేజీ గొట్టం పగిలి ఉంటుందా అనే అంతగా వాసన వస్తుంటే కడుపు త్రిప్పుతోంది తీరా కళ్ళు తెరిచి చూస్తేబయట ఎలాంటి వాసనలు వచ్చేవి కావు. కేవలము ధ్యానములో కళ్ళు మూసుకుని ఉండగా ఈ విపరీత భయంకర వాసనలు వస్తుండేవి. వాటి కంపు వాసన భరించలేక పోవటం నా ధ్యానానికి మూడు నెలలకు పైగా అవాంతరాలు ఏర్పడినవి.ఎందుకంటే నాకు ఏదో రోగం వచ్చిన వారి లాగా విపరీతంగా వాంతులు అయ్యేవి. రోజుకి 3 నుండి 10 లేదా 15 దాకా నా ప్రమేయం లేకుండానే అవుతుండేవి. ఇలాంటి సూచనలు మీకు కూడా జరిగితే మీరు మూలాధార చక్రం జాగృతి లో ఉన్నట్లుగా భావించుకోవచ్చు.అప్పుడు నాకు తెలిసేది కాదు అన్న మాట. ఇది జరిగిన 12 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మూలాధార చక్రం శుద్ధికి నా సాధన స్థాయికి చేరుకున్నది. కంగారు పడకండి.అప్పటిదాకా నాకు వాంతులు రాలేదు. సుమారుగా మూడు నుండి ఆరు వారాల పాటు మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే మూలాధార చక్రంలో ఉన్న గతజన్మ పాప కర్మలు ఏవైనా ఉంటే అవి ఇలా వివిధ రూపంలో మన నుండి బయటికి వెళ్తాయి అని ఆనాడు తెలియకపోయినా ఈనాడు తెలిసినవి.ఈ చక్రంలో మీకున్న పాప కర్మలను బట్టి ఆయా వాసనలు మీకు వస్తాయి. అలాగే వాంతులు అవుతాయి. అది ఒక నిమిషములో ఒక వాంతిలో అయిపోవచ్చు.ఆరునెలలు లేదా 12 సంవత్సరములు అయిన పట్టవచ్చును. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ!
మూలాధార చక్ర శుద్ధి:
నాకు నెమ్మది నెమ్మదిగా వాంతులు ఆగిపోయాయి కానీ వాసనలు తగ్గుముఖం పట్టలేదు. ఈ వాసన భరించలేక వాంతులు అవుతాయేమోనని కడుపులో తిప్పటం మాత్రమే జరిగేది.కానీ వాంతులు అవటం జరిగేది కాదు. ఈ కడుపులో తిప్పటం ఆపటానికి మందులు వేసుకున్నా అది పెరగటమే తప్ప తగ్గేది కాదు. ఇది మందులతో తగ్గదని దానికి అంతట అది తగ్గుతుందని అనిపించేది. అయినా ధ్యానం వదిలి పెట్టకుండా ఆపకుండా, వాయిదా వేయకుండా చేసుకుంటూ ఉండే వాడిని. ఎందుకంటే ధ్యానం నుండి మన మనస్సుని మళ్ళించడానికి తన మాయ చేత ప్రకృతి మాత ఇలా చేస్తుందేమోనని భయముతో భక్తితో నా ధ్యానం ఆపకుండా చేస్తుండేవాడిని. ఇది ఇలా ఉండగా ఈ రోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి. అదికూడా ధ్యానములో. విచిత్రంగా ఉంది. ఈ విషయం గూర్చి గురుదేవుని అడిగితే.. ఆయన నా గురించి చెడుగా అనుకుంటే.. వద్దు. అడగవద్దు. వామ్మో! ఈ రోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్లయినా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది. వామ్మో! కనీసం ఒక్క ఆడ కుక్క అయినా దొరికితే బాగుండును. ఈ కామవాంఛలు తట్టుకోలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. వామ్మో! ధ్యాన సమయంలోనే నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగము ఉత్తేజం చెందుతుంది.ఏది అయితే అది అయింది.దీనిని గూర్చి గురుదేవునినిఅడగాలి.లేదంటే ఆడ జాతికి నా వలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది.
ఒకరోజు నాకు ధ్యానంలో ఒక అంగుళం ఉన్న లింగం లాంటి జేగురు రంగులో ఉన్న సాలగ్రామం అదేపనిగా కనబడసాగింది. అందులోనికి కాణిపాక వినాయకుడు ప్రవేశించినట్లుగా ధ్యానములో కనిపించేది. అలాగే ఎప్పుడూ స్వయంగా వెళ్లి చూడని కాణిపాక క్షేత్ర ఆలయం కనిపించేది.ఎప్పుడూ కూడా టీవీలలో ఈ గుడిని గూర్చి చూడటమే తప్ప నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. కానీ జరిగేది జరగక మానదు కదా.మా బంధువులు ఫంక్షన్ తిరుపతిలో పెట్టుకున్నారని దానికి తప్పకుండా నన్ను రమ్మని ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించారు. వెళ్లకపోతే బాగుండదని నా దేవత పూజ సామాగ్రి తో కలిసి తిరుపతి చేరుకొని హోటల్ గదికి వెళ్లి స్నానాలు పూర్తి చేసి ధ్యానం చేసుకుంటుండగా మళ్లీ అదే సాలగ్రామము కాణిపాక వినాయక దర్శనం కనిపించసాగింది. ఒకవేళ కాణిపాకం రమ్మంటున్నాడు అని ఈ పంక్షన్ పూర్తి అయిన తర్వాత నేను బయలుదేరినాను. అక్కడికి వెళ్లి గుడిలో ఉన్న కాణిపాక గణపయ్యను దర్శించుకుని బయటకు వస్తుండగా ఒక సాధువు కనిపించి “నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నం పెట్టించగలవా” అన్నాడు.విచిత్రమేమిటంటే డబ్బులు కావాలని అడగలేదు. అన్నము కావాలని అడిగారు. ఆ విషయము నేను గమనించలేదు అనుకోండి .వెంటనే అతడిని ఒక హోటల్ కి తీసుకొని వెళ్ళి భోజనాలు తిని బయటికి రాగానే ఆయన వెంటనే “స్వామి! మీరు నన్ను ఒక బిచ్చగాడిలా కాకుండా సాటి మనిషిగా నన్ను గుర్తించి మీతోపాటుగా నన్ను కూర్చోబెట్టుకుని మారు మాట్లాడకుండా అన్నం పెట్టిన మీ మనస్సుకి ఏమి చేసినా ఏమి ఇచ్చినా తక్కువే” అంటూ తన చిరిగి పాడైపోయిన విపరీత కంపు తో కూడిన సంచిలో నుండి ఒక చిన్న రాయి వంటి సాలగ్రామం బయటికి తీసి “నాయనా! ఇది గణపతి శిల. శివ పంచాయతనం లో గణపతి స్థానంలో ఇది వాడతారు. ఇది నాకు ఈమధ్యనే నది ఒడ్డున దొరికినది. డబ్బులకు దీనిని అమ్మాలని నాకు అనిపించలేదు.నా మనస్సుకి నచ్చిన వ్యక్తికి ఇవ్వాలని అనిపించి జాగ్రత్తగా నా దగ్గరే ఉంచినాను. నీ కంటే ఎవరు దొరుకుతారు. ఆ దైవమే ఇలా వచ్చినాడు అనుకొని పూజలో అట్టిపెట్టుకో.అంతా మంచే జరుగుతుంది” అంటూ దానిని నా చేతిలో పెట్టి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. అది ఏమిటని చూసేసరికి నేను గతుక్కుమన్నాను. అది ఏమిటంటే నాకు ధ్యానంలో కనిపించిన గణపతి సాలగ్రామ శిల ఇదేనని తెలుసుకున్నాను. మరి ఇందులో కాణిపాక గణపతి ఉన్నట్లుగా కనిపించినది కదా అది నిజమేనా అని శిల లింగమూర్తి ని పరీక్షగా నెమ్మదిగా శోధించడం మొదలు పెట్టినాను. ఎక్కడ నాకు ఎలాంటి గుర్తులు ఆ లింగం మీద కనిపించలేదు. నాకు పొరపాటున అలా ధ్యానంలో కనిపించి ఉండవచ్చు అని దానిని జాగ్రత్త చేసుకొని నా హోటల్ గది కి వెళ్ళినాను.
నేను బాగా అలసి పోవటంతో తీవ్రమైన నిద్ర ఆవహించింది. అలా నిద్రపోతున్న సమయంలో కలలో నిజం లాంటి కలగా “నేను నీ దగ్గరికి వచ్చాను. అయినా నన్ను నీవు సరిగ్గా గుర్తించలేదు. నేను ఉన్నాను నన్ను గుర్తు పట్టు” అని ఎవరో అన్నట్టుగా అనిపించేసరికి నాకు అంతటి గాడ నిద్రలో కూడా మెలుకువ వచ్చింది. ఎవరా అని చూస్తే ఎవరు లేరు అని తెలిసేసరికి మళ్లీ నిద్రపోదామంటే నిద్ర పట్ట లేదు. అసలు కలలో మనకు వచ్చిన సందేశం ఏమిటి అని ఆలోచించి ఇందులో ఏదో మర్మము ఉన్నది అని గ్రహించి వచ్చిన గణపతి లింగమును జాగ్రత్తగా పరిశీలించటం మొదలు పెట్టే సరికి నా ముఖం మీద చిరునవ్వు తో నేను యురేకా!యురేకా! కనిపెట్టాను. ఇందులో ఎలా ఎక్కడ ఉన్నావో తెలిసినదని అనుకున్నాను.ఈ లింగమూర్తి మీద ఎలుక ఆకృతి ,లింగము లోపల నీటి బుడగలు వంటివి కలిపి కూర్చిన ఆరు కోణాల గణపతి ఆకారం చాలా స్పష్టంగా కనపడేసరికి ఇలా కూడా ఈ లింగ మూర్తులు ఉంటాయా అని అనుకునేసరికి నాకు ఆశ్చర్యానికి హద్దులు లేవు. అంటే నా చక్రం శుద్ధి అయ్యే అవకాశం ఉన్నదని తెలియగానే చెప్పలేని ఆనందం వేసింది. ఇది ప్రసాదించిన ఆ గణపతికి బిచ్చగాడికి మనఃపూర్వకముగా కృతజ్ఞతలు చెప్పుకుంటుండగా ఆ దేవాలయంలో ఎందుకో గుడిగంటలు పెద్దగా మ్రోగించడం నాకు లీలగా వినిపించేసరికి ఇదియే ఆయన నుండి మనకి వచ్చిన సూచనని అనుకుని ఇంటికి బయలుదేరాను.
ఇంటికి వచ్చిన వారం రోజుల తర్వాత కొత్తగా వచ్చిన గణపతి లింగము విగ్రహమును కుడి చేతిలో పెట్టుకొని ఆరాధన చేసుకుంటుండగా ధ్యానములో ఏదో నాలుగు దళాలు ఉన్న పద్మము దాని మధ్యలో 'లం' అనే బీజాక్షరం ఈ దళాలు మీద లోపల కూడా ఏవో బీజాక్షరాలు ఉన్న కూడా అవి లీలగా కనపడసాగింది. ఇది ఎందుకు ఇలా కనపడిందో నాకు అర్థం కాలేదు.ఇలా సుమారుగా నాలుగు నెలలకు పైగా ఇదేవిధంగా ధ్యానంలో తరచుగా కనపడేది. నాకు అర్థమై చచ్చేది కాదు. అసలు అంత స్పష్టంగా 'లం' అనే హిందీ బీజాక్షరాలు ఎందుకు కనబడుతోందని దానిని ఒక్కదానినే శ్రద్ధగా చేస్తూ వచ్చే సరికి నాకు తెలియకుండానే నా దగ్గర లేని సువాసనలు రావటం మొదలైంది. అప్పటిదాకా చెడు వాసనలు వచ్చేవి కాస్త సువాసనలు రావడంతో నాకున్న శబ్ద పాండిత్యంతో నేను ఈ చక్రం శుద్ధిలో ఉన్నాను అని అర్థమయ్యేసరికి మరింత శ్రద్ధగా ధ్యానము చేయడం ప్రారంభించాను. ఇలా ఒక సంవత్సరం పాటు ఈ చక్రం శుద్ధికి సమయం తీసుకోవటం జరిగినది. ఇలా మిగిలిన అన్ని చక్రాలు కూడా శుద్ధి చేసుకుంటూ మళ్ళీ క్రిందకి నా కుండలిని శక్తి వచ్చి ఈసారి మూలాధార చక్ర ఆధీనము కోసం ప్రవేశం చేయడం జరిగినది. అంటే ఈ స్థితికి రావటానికి నాకు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత జరిగినది అని గ్రహించండి.
మూలాధార చక్ర ఆధీనము:
ఇలా ధ్యానమునందు నాకు సువాసనలు సహజసిద్ధంగా వస్తూ ఉండే సరికి నా మనస్సుకి ఏదో తెలియని యోగమత్తు ఆవహించసాగినది.ఇంతలో నా ప్రమేయం లేకుండానే నేను నా చేతులతో ఏవో ముద్రలు వేయడం ఆరంభించాను. అలాగే ఆసనాలు వేయటం అనగా సిద్ధాసనం లేదా వజ్రాసనం వెయ్యడము జరిగేది. ఇదంతానేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మన ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నా చేతులతో ముద్రలు వేయడం అలాగే నా శరీరం కాస్త ఆసనాలు వేయడం జరిగేది. ఇలాంటి సమయంలో అసలు కథ ఆరంభమైనది. అదేనండి బాబు! మహామాయ. ఈ చక్రంలో కామ మాయ ఉంటుందని తెలుసు కదా.ఈ చక్రానికి అధిదైవము గణపతి అయితే అధిష్ఠాన దైవం ఇంద్రుడు అన్నమాట. ఇంకా ఏముంది ఎక్కడ సాధకుడికి మూలాధార చక్రము ఆధీనము అవుతుందో ఏమోనని భయంతో తన ఇంద్ర తెలివితేటలు కామ మాయ రూపములో పరీక్షలు ప్రారంభించాడని నాకు తెలిసేసరికి నోట మాట రాలేదు.అదే ఇంతవరకు చక్ర జాగృతి,శుద్ధి మాత్రమే జరిగాయి. కానీ ఈ చక్ర మాయ దాటితేగాని ఆధీనము కాదని ఆలోచించి నా ధ్యానం ఆపకుండా కొనసాగిస్తున్నాను. ఇలా మూడు నెలల పైగా జరిగినది.ఒకరోజు నాకు తెలిసిన బంధువుల అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో మా ఇంటికి పెళ్లి కోసమని వచ్చినది. తొలి చూపులు కలిశాయి. మాటలు కలిశాయి. అదే కామ మాయ అని తెలుసుకోలేని పరిస్థితి. ఇంకా ఏముంది. నా స్వామిరంగా! ఆమెతో మాటలే మాటలు. కవ్వింపులు. బుజ్జగింపులు. ఆటలు పాటలు. నా ప్రపంచమే ఆమెగా ఉండేది. ఆమె కూడా అలాగే ఉండేది. మా ఇద్దరి మధ్య కాఫీలు, టిఫిన్లు మాత్రమే మిగిలిపోయాయి. మాటలు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగినాయి.పెళ్లిళ్లు దాకా మేము ఇద్దరము వెళ్ళిపోయాము. కానీ మ్రొక్కుబడి గా నా ధ్యానం చేసుకోవటం ఆపలేదు. క్రమం తప్పకుండా వేళ తప్పకుండా చేసుకుంటూ ఉండే వాడిని. ఇలాంటి సమయంలో యోగివేమన సినిమాను టీవీలో మేమిద్దరమూ చూడటం జరిగింది. కానీ ఆమెకి మొదట అర్థం కాలేదు. నచ్చలేదు. కానీ నా మనస్సు ఏదో శంకించడం మొదలు పెట్టినది. ఈ సినిమాలో నా కోసం ఏదో సందేశం ఇస్తోందని చెప్పడం జరిగినది. అయినా అది అర్థం కాలేదు. మా ఇద్దరి మధ్య టిఫిన్లు అయ్యేలోపు ఆమె వాళ్ళ ఊరికి తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి పోవడం జరిగినది.కొన్ని రోజులపాటు ఏదో తెలియని బాధ. దగ్గరివాళ్ళు దూరమయ్యినారని ఆవేదన. ఎవరికీ చెప్పుకోలేను. అలాగని భరించలేను. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. ఆమె ఉన్న చోటికి వెళ్లాలంటే అది రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. అది జరిగే పని కాదు. అలాగని మనస్సు ఆగే స్థితిలో లేదు. కనీసం టిఫిన్ కూడా జరగలేదని ఒకవైపు బాధ. అంత అందగత్తెను చూడకుండా ఉండలేని పరిస్థితి. అయినా కూడా నాకు తెలియకుండానే మొక్కుబడిగా నా ధ్యానం చేస్తూనే ఉన్నాను. వచ్చే ముద్రలు, ఆసనాలు వేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఏమి ఆగ లేదు. కానీ నా మనస్సు మాత్రమే అక్కడ ఆగిపోయినట్లుగా విపరీతంగా అనిపించేది. ఇలా మరో ఆరు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. కానీ ఆమె ఆలోచనలు నన్ను దాటి వెళ్ళలేవు కదా. ఇది ఇలా ఉండగా మరొక సారి ఏదో ఫంక్షన్ ఉన్నదని మా దగ్గర ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి ఆమె కూడా వచ్చిందని తెలియగానే “గోవిందా! ఇంకా ఏమైనా ఉందా. వెళ్లిపోవాలి. ఆమెను చూడాలి. ఆమెను తిట్టాలి. ఆమెతో ముద్దుగా తిట్టించుకోవాలి” అనుకుంటూ బస్సు ఎక్కాను.
పేపరు చదువుతూ ఉండగాఈసారి యోగి వేమన సూక్తి ఒకటి కనబడింది. ఇది చదివేసరికి నా మనస్సుకి ఏదో స్ఫురణ వచ్చినట్లు అనిపించింది.లోగడ యోగివేమన సినిమా ఈమె వచ్చిన సమయానికి వచ్చినది. అలాగే ఈ సూక్తి కూడా ఇప్పుడే ఈమె వచ్చిన సమయానికి వచ్చినది అంటే ఇందులో ఏదో మర్మం ఉన్నది. ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను దూరంగా ఉండమని యోగివేమన ఏదైనా సందేశం ఇస్తున్నాడా? ఆయన సకల సుఖాలు అనుభవించాడు కదా. మరి నన్నుఎందుకు వెళ్ళమని సందేశం ఇస్తున్నాడు. ఒకవేళ ఈమె ఈ చక్ర కామ మాయ కాదు గదా. ఒకవేళ అది అయితే ఈ చక్రం ఆధీనం అవటం దేవుడెరుగు. దేనికి పనికిరాకుండా పోతాను అనుకొని బస్సు దిగి ఇంటికి వెనక్కి వెళ్ళినాను. నేను వెళ్ళినాను కానీ నా మనస్సు రాలేదు కదా. నా శరీరమే మా ఇంటికి వచ్చింది కానీ నా మనస్సు ఆమెను చూడాలని తహ తహ లాడుతూ ఉంది.అన్నీ తెలిసిన తెలిసి వలచి విలపించుటలో ఉన్న ఆనందం ఎవరికి తెలుసు అన్న పాట లీలగా వినబడుతుంటే గాఢ నిద్రలోకి జారుకున్నాను. నేను నిద్ర లేచే సరికి ఎదురుగా చిలిపిగా నవ్వుతూ ఆమె కనబడినది. ఇది కలా నిజమా అనుకొనే లోపల “బావ! ఏంటి నా మీద కోపమా? నన్ను చూడటానికి తమరు బయలుదేరి కూడా వెనక్కి వచ్చేశారట. ఏమి జరిగినది. ఒంట్లో బాగాలేదా? అత్తయ్య చెప్పినది” అనగానే నాకు మాట రాలేదు. “వామ్మో! మాయ అంటే ఇదే కాబోలు వదిలించుకుందామని అనుకున్న వదలడం లేదు. నావల్ల కావడం లేదు. ఏమి చేయాలిరా దేవుడా” అని అనుకుంటూ ఆమెకి నా సాధన విషయాలు చెప్పలేను. చెప్పిన ఆమెకి అర్థమవుతాయని ఖచ్చితంగా తెలియదు. నేను పూజలు చేసుకునే పూజారిగా మాత్రమే ఆమెకి తెలుసు. ఏమి చేయాలి రా భగవంతుడా కామి కానీ వాడు మోక్ష గామి కాలేడని అని అందుకే అన్నారు కాబోలు అనుకుంటూ ఆమెతో వచ్చి రాని భావంతో కూడిన మాటలతో నాకే అర్థం కాని పదాలతో ఆమెకు నచ్చజెప్పి “ఈ సమయంలో నీతో సంయోగం చెందిన లేదా పెళ్లి చేసుకున్న కూడా నేను కామ మాయలో పడినట్లు అవుతుందని తద్వారా నా జాగృతి అయిన కుండలినీశక్తి వెనక్కి తిరిగి నిద్రలోకి జారిపోతుందని తద్వారా మీ మోహంలో పడి వ్యామోహంగా మారి నీ మోహ మాయలో నేను ఉండిపోతానని కాబట్టి నేను యోగ సాధనలో ముందుకు వెళ్లాలని” ఆమెకి చెబితే అయితే “బావ! నీవు ఎన్నటికీ పెళ్లి చేసుకోవా? నన్ను చేసుకోవా?” అని అమాయకంగా అడిగేసరికి బాధ వేసి ప్రస్తుతము నేను నా చక్ర ఆదీనస్థితిలో ఉన్నాను.ఈ స్థితిలో నేను ఎవరితోనూ సంయోగం చెందిన లేదా పెళ్లి చేసుకున్న నా సాధన శక్తి అధోగతి పాలవుతుంది. అలాగని నేను నీ ప్రేమలో ఉండలేను. నేను నా చక్ర ఆధీనం అయిన తర్వాత వివాహం చేసుకుంటే ఆమె ప్రేమకే అంకితమవుతాను. ఆమె మోహ, వ్యామోహంలలో నేను బంధీ కాను. ఆమె ఉన్నంత వరకు నాకు ప్రేమ బాధ్యతలు ఉంటాయి. ఆమె లేకపోతే మహాశివుడు లాగా వ్యామోహం చెందను.ప్రస్తుతానికి నేను ఎవరికీ మోహంలో పడరాదు అని ఆమెకు చెప్పి అక్కడ నుండి ఆమె మాట్లాడేది కూడా వినకుండా మౌనంగా వెళ్ళి పోయాను. కొన్ని రోజులు ఆమె ముభావంగా ఉండి నాతో చెప్పకుండానే ఆమె ఊరికి వెళ్ళిపోయినది. దాంతో ఆమె నుండి కామ మాయను దాటినాను అని సంతోష పడే లోపల నా స్నేహితుడి చెల్లెలు నన్ను అదోలా చూడటం మొదలు పెట్టే సరికి నా గుండెలు దడదడ లాడాయి. మాయ అంటే ఇదే కాబోలు. ఇలా ఎంతమందిని దాటాలి అని అర్థం కాలేదు.ఆమె తొలకరి వయస్సులో ఉండటం వలన వయస్సు అలాగే మనస్సు చేసే మర్మాలు ఆమెకి తెలియదని ఆ స్నేహితుడి ఇంటికి పూర్తిగా వెళ్లడమే మానివేశాను.
ఇలా సుమారు ఇట్టి స్థితిలో 12 సంవత్సరాల వయస్సు నుండి 65 సంవత్సరాల పైన వయస్సు ఉన్న స్త్రీమూర్తులు తమ కామ భావాలతో 143 అంటూ నన్ను ఆడుకున్నారు. కానీ ఎవరితోనూ సంయోగం చెందకుండా జాగ్రత్తలు తీసుకునే సమయంలో నన్ను కొత్తగా చంపటానికి కాబోలు అన్నట్లుగా ఒక బంపర్ ఆఫర్ రావడం మొదలైంది. నాకు ధ్యానంలో తెలిసిన వారివి తెలియని వారివి ఎవరివి కావాలన్న వారి రతి క్రీడా దృశ్యాలు ఏవో వీడియోలు చూస్తున్నట్లుగా నా కళ్ళముందు కనపడటం మొదలైనది. వామ్మో! ఇది ఏమిటి గోల? ఉన్నది చాలక ఈ మాయ కూడానా అనుకుంటూ ఉండగా ధ్యానములో నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం గట్టిపడి పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది. వామ్మో! ఇలా అయితే నా పరిస్థితి చంకనాకి పోయినట్లే.అయిపోయింది నా జీవితం చంక నాకి పోయినట్టే అనుకుంటూ నా ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగేది. కానీ విచిత్రమేమిటంటే ఈ చక్ర జాగృతికి అలాగే శుద్ధికి కేవలం ఒకటిన్నర సం!!లు మాత్రమే పడితే ఆధీనస్థితి కి వచ్చి అప్పుడే సుమారుగా 11నెలలు గావొస్తోంది.వామ్మో ఏమి చేయాలి రా భగవంతుడా! గురువు కనిపించడు. దేవుళ్లు ఏమీ చేయరు. నా చావు నన్ను చావమని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని నాకు అర్థం అయింది. ఆగ్రహంతో పిచ్చిపట్టినట్లు అయింది. దానితో నాలో వచ్చిన తెలియని చెప్పుకోలేని వేడిని తగ్గించుకోవటానికి చన్నీటి స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ధ్యానానికి కూర్చోగానే నా కోసం ఎదురుచూస్తున్నానని మాయ నా మీద కామ బాణాలు వేయడం, దాంతో నా మర్మాంగం నిద్రలేవటం అన్ని కూడా షరా మామూలుగానే నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మనలో రేతస్సు(వీర్యం) బయటకు రాకుండా ఈ స్థితిలోచాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 1000 వయాగ్రా బిళ్ళలు వేసుకుంటే ఎంతటి కామప్రకోపం వస్తుందో అనగా మనిషి తట్టుకోలేనంత స్థితి పొందాల్సి ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ ఏమి చేయాలి?ఎలా ఈ మాయలో పడకుండా ఉండాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ చక్రానికి అధిపతి అయిన గణపతికి ఈ కామానికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు.అందుకే లక్ష్మీ గణపతి అన్నారు కదా. అంటే ఈయన ధన మాయ చూపించాలి కానీ కామ మాయ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అపుడు నాకు విచిత్రముగా ఉచ్చిష్ట గణపతి శృంగార దృశాల ఉన్న విగ్రహమూర్తులు,పటములు నేను చూడటము జరిగినది.దానితో ఈ చక్ర కామమాయగా ఈయనే ఉంటాడని గ్రహించాను!
నా పరిస్థితి ఇలా ఉంటే అరుణాచలంలో ఈ చక్ర ఆధీనము కోసం వెళ్లిన జిఙ్ఞాసి పరిస్థితి తల్చుకొని బాధ, ఆనందంతో కూడిన నవ్వు వచ్చింది.వాడు కూడా శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి అలాగే కాశీక్షేత్రంలో ఈ చక్ర శుద్ధి చేసుకున్నాడు. త్వరలో ఈ చక్ర ఆధీనము కోసం అరుణాచలం వెళుతున్నాడని టెలిపతి ద్వారా చెప్పడం జరిగినది.తనకి ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత తన అనుభవాలు అన్నీ కూడా చెబుతానని టెలిపతి ద్వారా సూచనలు పంపినాడు. చూడాలి మరి మన వాడి పరిస్థితి.ఇక్కడేమో అదేదో సినిమా లో చెప్పినట్లు చూస్తే చాలు అమ్మాయిలు పడిపోతున్నారు. నాలో వారికి ఎలా అంత కామత్వం కనబడుతుందో అర్థం కావడం లేదు. కానీ నిజానికి నాలో కూడా వారి యందు కామత్వం ఉన్నప్పటికీ ఆపుకుని నగ్నత్వం చేధించి యోగత్వము పొందాలని నా తాపత్రయం.కానీ ఏమి చేద్దాం. ఇది ఇలా ఉండగా ఒకరోజు తెలిసినవాడు ఒకడు గుడికి వచ్చి అయ్యా! నాకు పెళ్లయి 5 సంవత్సరములు అయినది కానీ పిల్లలు పుట్టలేదు. ఏవైనా మంత్రాలు లేదా పూజలు చేయించుకుంటాను అన్నాడు. నేను వాడి ముఖం వైపు దీనంగా మొహం పెట్టి “బాబు! నీవు ఇలా సంసారం చేస్తే ఎలా పుడతారు. నిన్న ఇలా సంయోగం చెందినావు. మొన్న అలా చేసినావు. అంతకు మొన్న అలా చేసినావు” అంటూ నేను ధ్యానంలో చూసిన వారి సంయోగ వివరాలు గురించి పూస గ్రుచ్చి చెప్పే సరికి వాడికి నోట మాట రాలేదు.నాకు గుండెల్లో దడ ఆగలేదు. ఎక్కడ మా అయ్యకి చెబుతాడో. దానికి ఆయన ఎక్కడ నన్ను అపార్థం చేసుకుని వాళ్లు శృంగారం చేసుకుంటే చూస్తావా అని బడిత పూజ చేస్తారేమోనని అనుకుంటూ ఉండగా వాడి ముఖం అదోలా పెట్టి దేవుడికి కూడా నమస్కారము కూడా చేయకుండా నన్ను కన్నెత్తి చూడకుండా మౌనముగా వాడి కామ రహస్యాలు బయటికి వచ్చేసరికి ముఖము మీద నెత్తురు చుక్క లేకుండా పాలిపోయిన ముఖముతో వెళుతుంటే నా బాధ వలన వాడి బాధ ఎక్కువైంది కదా. చచ్చినాడు కదా. అనుకొని నిత్య పూజ కి వెళ్లడం జరిగింది.
ఇది ఇలా ఉండగా మరో బంపర్ ఆఫర్ మరొకటి వచ్చినది. మానవ నగ్న స్త్రీమూర్తులు కనిపించటం పోయి దేవత స్త్రీమూర్తులు కనబడి కవ్వించడం ప్రారంభమైనది. వామ్మో! ఈసారి కామ దేవతలు మొదలైనారా? అంటే విశ్వామిత్రుడు ధ్యానం చేసే సమయంలో ఉండగా ఈ కామమాయలోనే మేనక రావడం ఆమె మోహ మహా మాయకి లోనై శకుంతల జన్మకి కారకుడైనాడు కదా. ఆ తర్వాత 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైనదని తెలుసుకొని వైరాగ్యం చెంది ఈసారి తీవ్రమైన ధ్యానం చేస్తుండగా మళ్ళీ కామమాయ వచ్చే సమయమునకు ఈసారి రంభ వచ్చేసరికి ఆయనకి కోపం వచ్చి ఆమెను శపించేసరికి మళ్లీ 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైందని గుర్తుకురాగానే వామ్మో అంతటి జపశాలికే ఇంతటి పరీక్షలు ఉన్నాయని అనుకొన్నాను కానీ ఎప్పుడైతే మానవ స్త్రీ మూర్తులను దాటినానో ఆనాటి నుండి రతి క్రీడా దృశ్యాలు ఆరంభమయ్యాయి.వీటిని కూడా దాటేసరికి ఇప్పుడు దేవతల నగ్న దేవతలు దర్శనాలు ఆరంభమయ్యాయి. వామ్మో! ఇప్పుడు గాని నాకు కలలో కూడా వీర్యస్కలనం అయినా కూడా నా సాధన శక్తి అది కూడా ఎన్నో కోట్ల జన్మల నుంచి చేస్తూ వచ్చిన శక్తి గంగలో కలిసిపోయినట్లే. ఈ జన్మ ఇంతటితో సాధన ఆగిపోయినట్లే.మళ్ళీ ఆకలి కోసం జన్మ తప్పదు కదా అనుకుంటుండగా ధ్యానం భంగమై అప్పుడు నిద్ర లేచాను.ఉవ్వెత్తున లేచిన నా మర్మాంగము ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పూజ గది నుండి నా గదిలోనికి వెళ్లి ఏడవటం తప్ప ఏమి చేయలేకపోయాను. ఇలా కొన్ని వారాలు గడిచేసరికి నా ధ్యానంలో నగ్న దేవతా స్త్రీలు,గంధర్వ స్త్రీలు,ప్రేతాత్మలు, కామ పిశాచాలు ఎవరికి వీలు పడితే వారు వరుసగా నన్ను కవ్వించడం ప్రారంభించినారు. అసలు వీళ్ళతో ఎలా శృంగారం చేస్తామో అర్థం కాని స్థితిలో ఉండగా ఒక పేపర్ కటింగ్ నన్ను బాగా ఆకర్షించింది.
ప్రేతాత్మతో శృంగారదృశ్యం
తమిళనాడులో ఒక నంబూరి అనే తాంత్రిక యోగి తన ఉపాసనలో ఉండగా ఒక ప్రేతశక్తి ఉన్న కామిని ఆయనను నానారకాలుగా కవ్వించడం మొదలు పెట్టింది.ఇలా ఆయన నిగ్రహంగా ఆరు సంవత్సరములు ఉన్నారట. ఆ తర్వాత కామిని శక్తి తట్టుకోలేకపోతే ఆమె ఈయన ఒంటి మీద సూక్ష్మ శరీరధారిగా వచ్చి ఆయనతో శృంగారం జరిపేది. కానీ ఈమె ఈయనకి మాత్రమే కనిపించేది. ఇంకా ఎవరికీ కనిపించేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఆడపిల్లను కన్నాను అని చెప్పి ఆ పిల్ల పిశాచిని కూడా ఈయనకి చూపించినదని ఆయన అనుభవములో తెలిసినది. ఆయన చనిపోతూ తనకి మాత్రమే కనిపించే కామినికి, ఆమె పిల్లకి తన ఆస్తిలో భాగం కూడా రాసి చనిపోవడం జరిగినదని వీలునామా బయటపడటంతో అసలు విషయం లోకానికి తెలిసిందని చదవగానే నాకు నోట మాట రాలేదు. వామ్మో దీనమ్మ జీవితం. అందరూ కూడా ఈ కామ మాయలో పడిన వారే వరుసగా కనబడుతున్నారు. అంటే నేను కూడా ఈ కామ మాయ దాటలేనా?కాదు. నేను దాటాలి. ఎలాగైనా దాటాలి అనుకొని ఎలా దాటాలో అర్థం కాక ఏమి చేయాలో అర్థం కాక ఇలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.రానురాను ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా మారసాగినది. కామ స్మరణే ధ్యానంగా మారే సరికి విపరీతమైన దుఃఖం రాసాగింది. దాంతో ఏదో తెలియని దిగులు, విచారము దానితో పాటు ఎలాంటి పాపం కూడా తెలియని ఈ స్త్రీ మూర్తులను చూసేసరికి నాలో తెలియని భయం మొదలైంది. నిగ్రహం కోల్పోయి వాళ్ళతో ఎలా ఉంటానో నాకే అర్థం కాని స్థితి. తను ఈ స్థితిలో ఇలాగే కొనసాగితే ఏదో ఒకటి చేసి కాని ఊరుకునే స్థితి కాదు.అనర్థం తప్పదు.వెంటనే కామ దేవుడైన మన్మధుడు గుర్తుకు వచ్చేసరికి “స్వామి! నా మీద ప్రయోగించిన మానవ, దేవత,రాక్షస, గంధర్వ, పిశాచ స్త్రీ మూర్తులు కామ బాణాలు ఉపసంహరించు. మానవమాత్రులమైన నా మీద దయ చూపించు. నన్ను కరుణించు. ఒకవేళ నేను ఈ మాయలో పడితే మళ్లీ ఈ సాధన స్థితికి రావాలంటే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని నాకు తెలుసు. అలాగే మీకు తెలుసు. తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ మాయలో పడ వేస్తావు.అంతగా అయితే ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత నేను ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు నువ్వు చూపే కామ బాణం స్త్రీమూర్తిని వివాహం చేసుకుంటాను. వివాహం అయిన నాకు నీకు ఇబ్బంది ఉండదు కదా.ఒకవేళ ఇప్పుడున్న స్థితిలో నేను కామ మాయలో పడితే పునర్జన్మ లే నాకు మిగులుతాయి. నన్ను వదిలిపెట్టు. జనన చక్రం నుండి బయటపడాలని అనుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఈ జనన చక్రంలో పడవేస్తే నీకు ఏమి మిగులుతుంది. నేను ఇప్పటికే ఎన్నో లక్షల జన్మల పాటు నేను ఈ కామ మాయను దాటలేక జన్మలు ఎత్తినాను కదా. నాతో ఇలా ఆడుకున్నది చాలు. ఇకనైనా నన్ను కరుణించి ఈ జన్మ నాకు ఆఖరి జన్మ అయ్యేటట్లుగా చేయటం అనేది మీ చేతలలో నా చేతుల్లో ఉంది.స్వామి నన్ను కరుణించమని ఎంతగా వేడుకున్నా ఆయన కరుణించలేదు. కామ బాణాలతో నన్ను చంపడానికి సిద్ధపడే వాడిని చంపద్దు అంటే చంపకుండా ఊరుకుంటాడా. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.
మన ప్రయత్నాలు మనం చెయ్యాలి అనుకుంటూ ధ్యానానికి కూర్చునేసరికి sex వీడియోలు ప్రారంభమయ్యాయి.నాకు ధ్యాన స్థితి కి భంగం కావటము జరగటంతో నేను బలవంతపు నిద్రలోకి జారుకోవడం జరిగినది. ఇది ఇలా ఉన్న రోజులలో ఒకసారి టీవీలో భక్త తుకారాం సినిమా నడుస్తుంది. అందులో తుకారాంను తన శరీర సొంపులతో కామ మాయలో పడ వేస్తానని ఒక నర్తకి శపధం చేయటం,ఆ తర్వాత ఆయనని తన ఇంటికి పాండురంగ పూజ చేయడానికి రమ్మని చెప్పడము ఆయన రావడం ఆమె ఈయనని కవ్విస్తూ కామ పాట పాడటం అది పూర్తి అయిన తరువాత తుకారాం ఆమెతో అమ్మా అని సంబోధించి 80 సంవత్సరాల తర్వాత నీవు నిజం అనుకునే అందచందాలు ఎలా ఉంటాయో అని ఆయన తిరిగి పాట పాడేసరికి ఆమెకి అంతా అర్థమయ్యి ఆయన కాళ్ళమీద పడి క్షమించమని చెప్పి ప్రాయశ్చిత్తంగా పాండురంగ భక్తురాలిగా మారటం దృశ్యం చూసేసరికి నాలో ఏదో తెలియని ఆనందం వేసింది. ఈ సినిమాను ఈ దృశ్యం కోసం 20 సార్లు చూశాను. ఆ తర్వాత మహా శివరాత్రి నాడు పరమానందయ్య శిష్యుల కథ సినిమా రావటం అందులో హీరో తన ఇష్ట నర్తకి తో సుఖలాపాలు పూర్తి అయ్యి ఉండగా మెలుకువ వచ్చి “ఈ రోజు మహాశివరాత్రి. తను నిత్యం చేసే క్రమం తప్పని వేళ తప్పని శివారాధన గుర్తుకు రావటం ఆ గది తలుపులు బిగించి ఉండటం చేత సమయానికి శివలింగ మూర్తి ఎక్కడ కనిపించకపోయేసరికి తీవ్రమైన మనోవేదన చెందుతూ తను చేసిన పాడు పనికి బాధపడుతూ వుండగా అప్పటిదాకా ముగ్ధ మనోహరంగా కనిపించిన స్త్రీ మూర్తి యొక్క వక్షోజము కాస్త కొండ మీద ఉన్న లింగమూర్తి గా కనపడేసరికి మనస్సు కుదుటపడి దానిని మహా శివ లింగమూర్తి గా భావించుకొని పూలతో ఆరాధన చేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా ఈ పూజ మహా కైలాసము లోని కైలాసపతి పాదాల మీద పడుతూ ఉన్న దృశ్యం చూసేసరికి నాలో నాకే తెలియని మహదానందం వేసింది.ఏదో స్ఫురణ కలిగినది. అంటే ఇప్పటి దాకా హీరోకి ఆమె వక్ష స్థలము శృంగార భాగంగా కనబడితే ఎప్పుడైతే శివలింగారాధన కోసం తపన పడినాడో ఆ క్షణమే శృంగారభాగం కాస్త కామ లింగముగా కనపడేసరికి అది లింగార్చన కాస్త కైలాసపతి కి చేరింది. అంటే పశుపతి కాస్త కైలాసపతి గా ఎలా మారినాడు అంటే యద్భావం తద్భవతి అనేసరికి అసలు ఇన్నాళ్లు నాకు అగుపించే వారిని నేను ఆ కామత్వముతో చూస్తుంటేసరికి వారు నాకు కామమును కలిగించే వారిగా కనబడుతున్నారు.వారి నగ్నత్వం బదులుగా దిగంబరత్వం అనగా ఆడతనం కాకుండా అమ్మతనం చూడ గలిగితే చాలు కదా. అన్ని రకాల మాయలు మాయం అయిపోతాయి కదా.కామ మాయ ఉండబట్టి తల్లిదండ్రులకి మనము పుడుతున్నాము. అదే కన్నతల్లి మూడు నిమిషాల పాటు ఎలాంటి కామ ఉద్రేకానికి గురికాకపోతే ఎవరు కూడా మనల్ని కనే శక్తి ఉండదు కదా.అంటే ఇన్నాళ్ళు నేను చేస్తున్న తప్పు ఏమిటో అర్థమయ్యేసరికి మాయ మాయం అవ్వటం మొదలైంది. ఇప్పుడు రండి. నా స్వామిరంగా! ఇప్పుడు ఎవరు వస్తారో ఏమి చేస్తారో చూద్దామని తీవ్ర ధ్యానములో ఉండేసరికి యధావిధిగా మొదట వివిధ రకాల స్త్రీ మూర్తులు కనిపించేసరికి వెంటనే వారితో “అమ్మా! మిమ్మల్ని నేను ఇంతవరకు అమ్మగా కాకుండా అమ్మాయి గా గుర్తించడం వలన నా మీద కామ బాణాలు వేసినారు. కానీ ఇప్పుడు నేను మీ బిడ్డను అయ్యాను కదా. బిడ్డ మీద ఎక్కడైనా తల్లికి కామము కలగదు కదా” అనగానే వారు అదృశ్యమయ్యారు. అంటే అప్పటిదాకా మహాశివుడికి శృంగార దేవతగా కనపడిన పార్వతి దేవి కాస్త తారా దేవిగా మారినప్పుడు ఆయనకే తన చనుబాలు పట్టించి తల్లిగా మారింది కదా.అంటే మనము కామత్వము గా చూస్తే భార్యగా అదే ఆమెలో దైవత్వం చూస్తే తల్లి గా కనబడుతుంది అనే నగ్నసత్యం నాకు తెలిసేసరికి ఆరు సంవత్సరములు పట్టినది. ఇక ఆనాటి నుండి అప్పటిదాకా ప్రణయ మంత్రం కాస్తా నెమ్మది నెమ్మదిగా ప్రణవ మంత్రంగా మారింది.ఈ స్త్రీ నగ్న తత్వమును ఛేదించటానికి మహాశివుడు కాపాలికుడుగా మారి నానా కష్టాలు పడినాడు అని గుర్తుకు వచ్చే సరికి ఎన్నో రోజుల తర్వాత ఆనందంతో కూడిన నిద్ర మత్తు ఆవహించింది.ఈ మూలాధార చక్రము ఇచ్చే కామమాయ చేదించినందుకుగాను అలాగే దానిని దాటినందుకు గాను నాకు కాణిపాకం నుండి తెల్ల జిల్లేడు వేళ్ళు అయినా స్వయంభూగా వెలసిన శ్వేతార్క గణపతి రావడం జరిగినది.వీటితో పాటుగా ఆయన నిజ రూప విగ్రహమూర్తి, ఏనుగు తోక వెంట్రుకలు రావడం జరిగినది. 35 సంవత్సరముల పాటు ఒక తెల్ల జిల్లేడు చెట్టు బ్రతికితే వేళ్ళు గణపతి ఆకారంగా లేదా హనుమత్ ఆకారంగా మారతాయి.వీటినే స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారు. ఇది మీ ఇంటికి వచ్చినది అంటే మీరు మీ సాధన స్థాయిలో మీ మూలాధార చక్ర ఆధీనమునకు కావలసిన సాధన ఆయన ఇస్తాడు. వారిని నిత్యపూజలో ఉంచి అర్చన చేస్తే సకల వాస్తు దోషాలు తొలగి సకల ఆటంకాలు తొలగిస్తాడు.అదే ఈయన మీద ధ్యానంలో కనిపించిన బీజాక్షరాలు(శుద్ధి సమయం )సహితము మంత్రముతో సిద్ధి పొందితే మనకి భూచర సిద్ధి వస్తుంది. ఒక అంగుళం ఎత్తునుండి 30 అడుగుల ఎత్తు వరకు భూమి నుండి గాలిలో లేస్తారట.అలాగే ఎప్పుడైనా మన కాళ్ళ మీద పెద్ద బండరాళ్ళు దొర్లినను మనకేమీ కాదట. కానీ నేను మాత్రము తీవ్ర ధ్యానంలో ఉండగా గోరు పరిమాణం అంత ఎత్తు గాలిలో ఉత్తేజము చెందుతూ మాయలు తొలగిపోయి గాలిలోకి ఎగిరిపోవ పోతే భయము వేయడంతో క్రిందకు వచ్చినాను. ఇంకా ఎప్పుడు ఈసిద్ధి గురించి నేను ప్రయత్నించ లేదు. ఎందుకంటే ఈ చక్ర సిద్ధి మాయ లో ఉంటే మిగిలిన చక్రాలలోనికి నేను ప్రవేశించలేనని అనిపించి ఆపి వేశాను.ఇది చేసిన 21 రోజుల తరువాత కాణిపాకం నుండి నల్లటి రాతి విగ్రహమూర్తి కాణిపాకం వినాయకుడి లాగా మా ఇంటికి వచ్చారు.ఇక దానితో ఈ చక్ర సిద్ధ మాయను దాటటం జరిగినదని నాకు అర్థమైంది. మరో చక్రమైన స్వాధిష్ఠాన చక్రం కోసం తీవ్ర ధ్యానం చేయడం ప్రారంభించాను.
జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు
ఇక శ్రీశైలము,కాశి,అరుణాచల క్షేత్రములో తన మూలాధార చక్ర జాగృతి, శుద్ధి,ఆధీనము ఎలా చేసుకున్నాడో నా జిఙ్ఞాసి మాటలలోనే చూడండి. “భయ్యా! నాలో కుండలినీశక్తి జాగృతి అయిన తరువాత నాకు తీవ్ర ధ్యానం చేసే శక్తి లభించినది. ఏకధాటిగా 10 గంటల దాకా ధ్యానములో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం జరిగినది.ఒకసారి శ్రీశైల క్షేత్రం లో ఉండగా నాకు ధ్యానం లో మొట్టమొదటి సారిగా స్వయంభూ గణపతి కనిపించారు. ఆయన ఏమి మాట్లాడడు. అలాగని ధ్యానంలో కనిపించకుండా ఉండడు.ఇది దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరావేశంతో ఉన్న నల్లని ఏనుగు కనపడసాగింది.నా మీదకి ఉగ్రంగా తొండమును ఎత్తి కుమ్మటానికి వచ్చినట్లుగా అనిపించడంతో కళ్ళు తెరిచేవాడిని.మళ్లీ కళ్ళు మూసుకోగానే ఇదే దృశ్యం కనిపించేది. క్రిందటి జన్మ లో ఎప్పుడైనా నేను ఏనుగును బాధ పెట్టడం జరిగి ఉంటుంది అనుకొని అలాగే ధ్యానం కొనసాగిస్తూ ఉండేవాడిని.ఒకసారి నేను తీవ్రమైన ధ్యానంలో ఉండగా నాకు మాగుడు వంటి దుర్వాసన నా ముక్కుల కి సోకడం మొదలైనది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు. నాకు ఏమీ అర్థం అయినది కాదు.కానీ మళ్ళీ ధ్యానములో కూర్చోగానే ఇలాంటి తీవ్రమైన కంపు వాసన వచ్చేది. దానిని భరించలేక మూడు రోజులపాటు నాకు తీవ్రమైన వాంతులు అయినాయి.వాటితోనే నేను పోతానేమో అని అనిపించేది. ఎవరూ లేకుండానే ఎవరిని చూడకుండానే ఏమి జరగకుండానే ఏమి పొందకుండానే చచ్చిపోతానేమో అని తీవ్ర భయం వేసింది. ఇది జరిగిన రోజులలోనే అనుకుంటా. నాలో నాకే తెలియని తీవ్రమైన కామవాంఛ మొదలైనది. తరచుగా నిద్రలో నాకు తెలియకుండానే వీర్య స్కలనం జరిగేది.
దానితో నేను సిగ్గుతో బాధపడేవాడిని. రాను రాను నాకు ధ్యానము కామవాంఛ తప్ప వేరే స్మరణ ఉండేది కాదు. ఇంద్రియానికి మనస్సు లోబడి కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని విపరీతంగా గోల చేసేది. ధ్యానములో నగ్న స్త్రీ దర్శనము సిగ్గుపడుతూ కనిపించటం ఆరంభమైనది. ఇలాంటి స్త్రీ మూర్తులు నేను చిన్నప్పుడు భౌతికముగా మా ఇంటి చుట్టు ఉన్న చూసిన వారే నాకు నగ్నంగా కనిపించి కవ్విస్తుంటే క్రమంగా నాకు ధ్యాన సమయం తగ్గుతూ ఈ కనిపించిన నగ్న స్త్రీల గురించి ఆలోచించటం ఎక్కువ అయినది. దాదాపుగా నా నిగ్రహం కోల్పోయి ప్రమాదస్థాయికి నేను చేరుకున్నానని నాకు అర్థమైనది. దానితో స్త్రీలను చూడాలంటే సిగ్గు భయం వేసి స్త్రీలే కనిపించని చోటుకి వెళ్లాలని శ్రీశైలం అడవుల్లో లోపల ఉండే తండా గూడెమునకు వెళ్ళిపోయాను.అక్కడ నాలాంటి మనిషి ని చూడటం వాళ్లకి మొదటే కాబోలు ఆడ మగ అనే తేడా లేకుండా నా దగ్గరకి వచ్చి నన్ను వింత జంతువును చూసినట్లుగా చూసి నా వలన వారికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని గ్రహించుకొని నన్ను కూడా వారి గూడెం లోని ఒక గుడిసెలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా యధావిధిగా ఒక గూడెపు నగ్న స్త్రీ నాకు ధ్యానములో కనిపించి కవ్వించి సైగ చేయడంతో నేను కళ్ళు తెరిచి ధ్యానం ఆపేసే వాడిని. నా ధ్యానం ఇంకా ముందుకు వెళ్లేది కాదు.అలాగని ఈ నగ్న స్త్రీ ఆలోచనలు ఉండకుండా పోయేవి కావు.
ఇలా ఎందుకు కన్పించి కవ్విస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. తిరిగి ధ్యానానికి కూర్చోగానే నగ్న స్త్రీ దర్శనము దానితో నా ఇంద్రియము విజృంభించి నా మర్మాగం పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది.దాంతో నాకు విపరీతమైన ఆవేశంతో పిచ్చిపట్టినట్లు గా అనిపించేది. ఏ పాపం తెలియని చెంచుస్త్రీలు కూడా నగ్నం గా కనిపించే సరికి నేను అక్కడే ఉంటే వారిలో ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసి గాని ఊరుకోలేనని బలంగా అనిపించడంతో కాశి క్షేత్రంకు వెళ్ళి మరణం పొందాలని నిర్ణయించుకుని ఆ క్షేత్రమునకు వెళదామని అనుకుంటుండగా సుప్రభాత సేవ మొదలైనదని సూచనగా గుడిగంటలు మ్రోగే సరికి మల్లన్న సూచనగా భావించుకొని అక్కడి నుండి కాశీ క్షేత్రమునకు బయలుదేరినాను. నేను ఈ క్షేత్రమునకు చేరుకొని విశ్వనాధుని దర్శించుకుని శ్రీ త్రైలింగస్వామి మఠమునకు చేరుకొని నాకు కొత్తగా వచ్చిన నగ్న స్త్రీ దృశ్యాలు గూర్చి ఆయన విగ్రహనికి చెప్పి నన్ను రక్షించమని చెప్పి పంచగంగా ఘాట్ నందు ధ్యానం చేస్తుండగా ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మణి కర్ణిక ఘాట్ లో అప్పుడే అక్కడికి స్త్రీ శవమూర్తి వచ్చినది. ఎందుకో అక్కడికి వెళ్లాలని దగ్గర ఉండి ఆమె దహన సంస్కారాలు చూడాలని బలముగా అనిపించినది. వెంటనే వెళ్లి చాలా దగ్గరగా ఆమె దహనసంస్కారాలు చూశాను. తడిసిన ఆమె శరీర భాగాలు చాలా స్ఫుష్టంగా కనిపించేవి.జీవము లేని చూపులు, అందములేని శరీరము నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్న సమయములో దహనం చేయడం ఆరంభించారు. అప్పటిదాకా ఈ దేహము కాస్త విగత దేహముగా మారగానే బ్రతికున్నప్పుడు కామాగ్ని లోనూ చనిపోయినప్పుడు చితాగ్నిలోనూ తగలబడుతోంది కదా. అంటే ఈమె స్త్రీ అని పురుషుడని నగ్నం గా ఉన్నది అని అతను నగ్నంగా ఉన్నాడు అని భావము లేని స్థితికి తను వెళ్లాలని అంటే నగ్నత్వం నుండి దిగంబరత్వం వైపు ముందుకు వెళ్లాలని స్ఫురణకు రాగానే విశ్వనాథుడికి, శ్రీ త్రైలింగస్వామికి కృతజ్ఞతలు చెప్పి ధ్యానం చేస్తుండగా నగ్న స్త్రీలలో ఈ సారి కామము అలాగే నగ్నత్వం తగ్గి వారి స్థానంలో దిగంబరత్వం గా కనిపించసాగింది.ఇలా కొన్ని రోజులు ధ్యానంలో ఉండగా అక్కడికి సాధువులకు సాధకులకు కావలసిన బియ్యం ఇతర వంట సామాగ్రి వస్తువులను ఒక నడివయస్సు ఉన్నస్త్రీ మూర్తి ఇవ్వడం నేను గమనించాను.మా బోటి వారికి కి ఆమె చేస్తున్న సేవ గూర్చి ఆనందమేసింది. ఆమె నన్ను చూడగానే ఆమె మనస్సు చెదిరినట్లై ఆమె నేను ఏ యే ఘాట్ నందు ఎక్కడ ఉంటే పని పెట్టుకొని ఆ ఘాట్ కి వచ్చి అక్కడున్న సన్యాసులకు వస్తువులు ఇస్తున్న నెపంతో నన్ను కామవాంఛతో చూడటం చూసేది. దొరికే చిన్న అవకాశం కూడా మాయ వదులుకోలేదని నాకు అర్థమైంది.
ఇలా ఆమె చేస్తున్న సేవలు పూర్తిగా అప్పటికే నాకు తెలిసి ఉండటంతో నా మనస్సు ఆమెకు కృతజ్ఞతగా ఈ విధంగా ఆమెకు కామ కోరిక తీరిస్తే మంచిదే కదా అని ఒక క్షణం నేను నా మనస్సు జారిపోయింది. వెంటనే అంతలో మణికర్ణికా ఘాట్ స్త్రీ దేహం యొక్క అంతిమ సంస్కారం గుర్తుకు వచ్చినది. దానితో బ్రతికియున్న ఈ దేహమును మానసికంగా చర్మము ఒలిసి దర్శించి చూశాను. మాంసము, నెత్తురు,చీము, నరాలు,అంగాలు,మలము మూత్రమున్న భాగాలు … ఇవి అన్నియిలేని చివరికి మిగిలిపోయే ఆస్ధిపంజరమును దర్శించే సరికి నాలో ఆమె మీద ఉన్న కామోద్రేకం పూర్తిగా క్షణాలలో నశించిపోయింది.దానితో నా కోసం ఎదురు చూస్తున్న ఆ స్త్రీ మూర్తి వైపు తిరిగి “తల్లి! కామం తీర్చు కోవడం అనేది నా దృష్టిలో కేవలం సంతానోత్పత్తి కి మాత్రమే ఉపయోగించే విధి విధానము. అది నేను తల్లిదండ్రులు చేసే సృష్టి యఙ్ఞంగా భావిస్తాను. నాకు ఎన్నడూ నగ్నత్వం మాత్రం కనిపించదు. కేవలం దిగంబర తత్వము మాత్రమే అగుపించును. అంటే దిక్కులనే వస్త్రములుగా ధరించి చూసేవాడు దిగంబరి అన్నమాట. అలాంటప్పుడు నాకు నగ్నత్వం కనిపించదు .బాహ్యంగా మీరు వస్త్రాలు తీసినప్పటికీ నాకు మీ చుట్టూ ఈ దిక్కులే వస్త్రాలు ధరించి నాకు అగుపించును. మంచికి చెడుకి కారణము మనస్సు అని గ్రహించి దానిని అదుపులో పెట్టుకునేవాడు దేవుడు దానిని అదుపులో పెట్టుకో లేనివాడు జీవుడు అవుతాడు.మోక్షము ఉన్నచోట భోగాలుఉండవు. భోగాలు ఉన్నచోట మోక్షము ఉండదు. కాబట్టి నా చర్మమును వలిచి చూడండి. దుర్గంధ పూరితమైన శరీర భాగాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకో తల్లి. నీవు చేయాలనే తప్పు దేనితో చేస్తున్నావో గుర్తించండి. ఈ జీవము కాస్త శవమే కదా. ఇది శవము అయ్యే లోపల శివము అవ్వాలని ప్రయత్నంలో ఉండగా మీలాంటి మాయలో పడితే నా గతి అధోగతియే గదా”. ఏమనుకుందో ఏమో నాకు దండం పెట్టి మౌనంగా వెళ్ళి పోయింది.ఆ క్షణం నుండి నా శరీరములో ఏవో కర్మలు కూడా తొలగిపోతున్నాయి అని అనిపించ సాగుతుండగా నేను నెమ్మదిగా గాలి లో ఒక అంగుళం ఎత్తు ఎగిరే సరికి నాకు ఆనందం వేసింది. అంటే తన మూలాధార చక్ర జాగృతి శుద్ధి మొదలై ఆధీన స్థితికి చేరుకున్నానని నాకు అర్థమై కాశీ లో ఉంటే ఇలాంటి స్త్రీ మూర్తుల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేకపోయినా వారు ఇచ్చే వస్తువుల సేకరణ వలన వారి కర్మలు తీసుకొని ఈతి బాధలు పడాల్సి వస్తుందని స్ఫురణకు రాగానే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకోగానే ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది సాధువులు నా దగ్గరికి వచ్చి “స్వామి! మీరు ఆమెకి చేసిన హితబోధ విన్నాము. మీరు మూలాధార చక్ర ఆధీనంలో ఉన్నారనిమాకు అర్థమైనది.మీ లాంటి యువ సాధకులను చూసేసరికి మాకు తెలియని ఆనందం చేసినది. మేము అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి వెళుతున్నాము. మీరు కూడా వస్తారా?” అనగానే విశ్వనాధుని ఆఙ్ఞగా భావించుకుని వారితో కలసి అరుణాచలం వెళ్ళినాను.
అక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామి ని దర్శించుకుని అవతల వైపు అడవిలాంటి ప్రాంతమునకు చేరుకొని ఏకాంతంగా ఒక రాతి మీద కూర్చొని ధ్యానం చేస్తుండగా “లే! లేరా! నా మీద కూర్చుని ఎలా ధ్యానం చేస్తున్నావురా. ఇక్కడ నుండి పో” అని ధ్వని వినబడింది. కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. అలాగే నేను ధ్యానం చేసుకునే రాతి మీద అంతవరకు ఎవరూ కూడా కూర్చోలేదు. ఏమోలే! నా ఆలాపన అనుకుని తిరిగి ధ్యానంలో ఉండగా మరల ఇవే మాటలు చాలా కటువుగా వినబడేసరికి “స్వామీ! మీరు ఎవరో నాకు తెలియదు.నేను మీ మీద ఎప్పుడు ఎలా ఎక్కడ కూర్చున్నానో తెలియదు. దయచేసి చెప్పండి” అనగానే “పిచ్చివాడా! నీవు కూర్చున్న రాతి మీద సూక్ష్మధారిగా ఇక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నాను.నువ్వు నన్ను చూడగలిగితే ఇక్కడికి ఎందుకు వస్తావు” అనగానే నేను దడాలున లేచి అప్పటి దాకా ఖాళీగా ఉన్న రాయి మీద సూక్ష్మధారి ధ్యానం చేసుకుంటున్నారని నేను ఊహించనందుకు ఎంతో సిగ్గుతో బాధపడుతూ “నన్ను క్షమించండి” అనగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు?నువ్వు ఎవరివి అనగానే నేను వెంటనే “స్వామి! అది తెలుసుకుందామని… కామ మాయను కూడా దాటి ఇక్కడికి వచ్చాను” అనగానే గాలిలో లేద్దామని అనుకుంటున్నావా అయితే నన్ను చూడు అంటూ ఉండగానే ఆ రాతి మీద స్థూల శరీరము జడదారి అయిన సాధువు కనిపించి గాలిలో లేవడము అతడు సుమారుగా 30 అడుగుల ఎత్తులో గాలిలో లేచిన తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందకి దిగినాడు.అది చూసే సరికి నాకు ఆశ్చర్యం వేయగా “నువ్వు వస్తావని నాకు తెలుసు రా. నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రా.శ్రీశైల రత్న గణపయ్య నాకు ముందే చెప్పి ఏర్పాట్లు చేయించినాడు రా. నువ్వు ఎప్పుడైతే ఆయన తండ్రి చోటులో జయం పొందినావో నిన్ను చూసుకొమ్మని నన్ను పురమాయించాడు. రా వెళ్దాం” అంటూ ఒక దివ్య జ్యోతి దారి చూపుతూ దట్టమైన అడవిలో కారు చీకటి ఉన్న చిన్నపాటి గుహలోకి వచ్చేసరికి ఆ కాంతి పుంజము కాస్త స్థూల శరీరధారిగా మారినది. అప్పుడు ఇక్కడికి 15 మంది దాకా సాధువులు వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్లి జామకాయలు,అరటి పండ్లు త్రాగడానికి నీళ్ళు ఇచ్చి మౌనముగా తమకేమీ పట్టనట్లుగా తిరిగి వారంతా ధ్యాన నిమగ్నులైనారు.ఆ వాటిని ప్రసాదంగా భావించి తీసుకొని ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చోగానే నా శరీరం నాకు తేలికగా అనిపించి గాలిలోనికి తేలిపోతానేమోననే అనుభూతి కలగటము
దానితో మళ్లీ ఏదో తెలియని భయం నన్ను ఆవహించటం జరగటంతో ధ్యానం భంగమైనది. ఇలా కొన్ని వారాలు జరిగిన పిమ్మట నా శరీరం ఒక అడుగు ఎత్తున గాలిలో తేలడము మళ్ళీ తిరిగి నేను ఎప్పుడైతే భయపడతానో అప్పుడు నెమ్మదిగా క్రిందకి రావడం జరిగినది.అక్కడున్న మిగిలిన వారంతా ఇది అంతా చూసి ఏమీ తెలియనట్లుగా అసలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించడం నాకు వింతగా అనిపించేది. ఇలా వారి సమక్షంలో 14 నెలల పాటు ఉండేసరికి నేను సుమారుగా పది అడుగుల ఎత్తు గాలిలో ఉండే వాడిని.కానీ నాకు మొదట ఆనందము వచ్చేది కానీ రాను రాను విసుగు అనిపించేది. ఎందుకంటే నా ప్రమేయం లేకుండా ధ్యానంలో కూర్చోగానే గాలిలో లేవటం జరుగుతుండేది.కొన్నాళ్ల తర్వాత నా ధ్యానము లేకపోయినా నేను ఎవరితోనైనా చాలా తీవ్రంగా మాట్లాడుతుండగా నాలో ఉత్తేజం వచ్చి నా ప్రమేయం లేకుండా నేను వారితో మాట్లాడుతూ ఉండగానే గాలిలోనికి వెళుతుండేవాడిని.మళ్లీ కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా క్రిందకి దిగడం జరిగేది. ఇది నాకు చాలా ఇబ్బందిగా,సిగ్గుగా చికాకుగా అనిపించింది.అనవసరముగా ఈ భూచర సిద్ధిని పొందినాను అని నాకు అనిపించింది. కానీ నా ప్రమేయం లేకుండా గాలిలో ఎగరడం చూసిన సూక్ష్మధారి నన్ను పిలిచి “నాయనా! నువ్వు మూల బంధనము వేయటం నేర్చుకో.అప్పుడు నీ ప్రమేయం లేకుండా గాలిలోనికి ఎగరలేవు” అని చెప్పగానే కొన్ని నెలలపాటు ఈ ఆసనాలు వేసి సిద్ధి పొందటంతో కావాలి అనుకున్నప్పుడు గాలిలో ఎగరడం వచ్చినా కూడా నాలో ఆనందం కలగలేదు.శాశ్వత ఆనందస్థితి పొందాలని ఆరాటపడుతున్నాను. నీ టెలిపతి ద్వారా నీ సాధన వివరాలు నాకు తెలుస్తున్నాయి. మీరు కూడా మూలాధార చక్రము ఆధీనము చేసుకొని నల్ల గణపయ్యను ఇంటికి పిలిపించుకొన్నావని తెలిసినది.మంచిది. తర్వాత నా స్వాధిష్ఠాన చక్రం అనుభవాలు త్వరలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే గాలిలో లేచే సమయం ఆసన్నమైంది” అంటూ తన టెలిపతి ముగించాడు. దానితో మేమిద్దరము కూడా స్వాధిష్ఠాన చక్రం జాగృతి, శుద్ధి, ఆధీనము గురించి రాబోవు అధ్యాయములలో చూడండి. ఉంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు. మీరు కూడా గాలిలో లేచే సిద్ధి కోసం లేదా మీ ఇంటికి నల్ల గణపయ్య వచ్చే విధంగా ప్రయత్నించండి.
శుభంభూయాత్
పరమహంస పవనానంద
***************************************
గమనిక: దయచేసి చక్ర జాగృతి అయ్యే సమయంలో వచ్చే గణపతి విగ్రహన్ని అలాగే చక్రం శుద్ధి సమయంలో వచ్చే గణపతిని అలాగే చక్ర ఆధీన మాయ దాటే సమయంలో వచ్చేగణపతిని ఎక్కడా కొనకండి.కొని మీరు తెచ్చుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే మీ బంధువులతో కావాలి అని చెప్పి తెప్పించుకున్న ఉపయోగం లేదు.లేదా ఎవరి దగ్గర నుండైనా దొంగతనము చేసినను ఎవరి దగ్గర నుండి తీసుకున్నను లేదా సేకరించిన ఉపయోగం లేదు. వాటంతట అవే మీ ఇంటికి రావాలి అది తెలిసిన వారితో లేదా తెలియని వారితో నైనా రావచ్చును.అవి వచ్చేదాకా నీకే తెలియకూడదు. అలానే అవి వచ్చేవి ధ్యానములో కనపడి ఫలానా రోజున వస్తున్నామని చెప్పి వస్తాయని గ్రహించండి.మీకు ధ్యానం లో కనిపించకుండా వచ్చిన వాటి వలన మీకు ఉపయోగము లేనట్లే. మీ టెలిపతి ద్వారా మీ భక్తి తరంగాలు కైలాసంలో ఉండే గణపతి దాకా వెళ్లాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తించి మీకు కావలసిన రూపాలలో మీకు ధ్యానంలో కనిపించినట్టుగానే వస్తాడు.చిన్న అంగుళముతో గణపతి పంచలోహ విగ్రహంతో మీ సాధన మొదలై పంచాయతనములోని గణపతిశిల, శేతార్కగణపతి, నల్లరాతి అరచేతి పరిమాణము ఉన్న విగ్రహం వచ్చే దాకా మూలాధార చక్రములో జాగృతి,శుద్ధి, ఆధీనము స్థితులలో మీరు ఉన్నట్లేగా భావించండి. ఇలా వచ్చిన విగ్రహములను దయచేసి ఎవరికీ ఇవ్వకండి. కేవలం మీ ఇంటి కుటుంబ సభ్యులకే అవి చెందాలని తెలుసుకోండి. ఒకవేళ మీకు వారసులు లేకపోతే వాటిని మీ మరణావస్థలో దగ్గరలో ఉన్న దేవాలయమునకు సమర్పించండి. అక్కడ వాటికి నిత్య దూప దీప నైవేద్యం పూజలు జరుగుతాయి. మా ఆవిడకి తన ధ్యానంలో తనకు సంబంధం లేని వాసనలు వస్తున్నాయి అనగానే ఈ చక్రంలో నాకు వచ్చిన దైవిక వస్తువులు ఇచ్చి పూజించుకోమని ఇవ్వటం జరిగినది.ఆమెను ఈ చక్ర సాధన పరిసమాప్తి చేసుకొమ్మని అనుజ్ఞ ఇవ్వటం జరిగినది.
అలాగే మన మూలధారచక్రము నందు మరియు మన ఆజ్ఞాచక్రము నందు గూడ శృంగార దృశ్యాలే మహామాయని గ్రహించండి.ఎందుకంటే ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానమై ఈ మాయలు చూపుతాయి. మూలధారచక్రములో మనకి ఈ శృంగార మాయ దృశ్యాలు కలలయందు,ధ్యానమునందు కనపడితే...అదే ఆజ్ఞాచక్రము నందు అయితే ఇలలో అనగా మానుష్యరూపేణ ప్రేతాత్మలు,శృంగార దేవతలు,గంధర్వులు,మోహిని,యక్షిణి,...ఇలా 13 రకాల జీవజాతులు ఇలలో కనపడి మనతో శృంగార మాయలో పడవెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తాయని నేను గ్రహించాను!
అసలు నాకులాగా ఈ చక్రము నందు గణపతిదర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ
చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికిగూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.
నా సాధన పరిసమాప్తి సమయములో
ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను కాశీ క్షేత్రమునకు వెళ్ళినపుడు నాకు అక్కడ అనగా కేధార్ ఘాట్ వద్ద ఒక 28 నుండి 30 సం!!రాల వయస్సు ఉన్న సాధకుడు కనిపించాడు. వాడిని చూడగానే నాకు సాధనకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని గ్రహించి వాడి దగ్గరకి వెళ్ళి"నువ్వు సాధన సమస్యతో బాధపడుతున్నావని” నాకు అర్ధమైంది.అనగానే దానికి వాడు వెంటనే “నాకు ఒక నిజ గురువు గావాలి” అన్నాడు.నేను వెంటనే “దేనికి” అన్నాడు.దానికి వాడు “నాకున్న ఉగ్రమైన కామమాయ సమస్యను తొలగించటానికి” అన్నాడు.అప్పటికి నాకు వీడి కధంతా అర్ధమై వాడితో “నాయన!ఇక్కడున్న మణికర్ణిక ఘాట్ యందు ఏమి చేస్తారు” అనగానే వాడు వెంటనే “చితాగ్నిలో శవదహనాలు చేస్తారు” అన్నాడు.అపుడు నేను వెంటనే “అయితే శవము అంటే” అనగానే దానికి వాడు “ప్రాణము లేనిది” అన్నాడు. ఈ లెక్కన చూస్తే “కామప్రక్రియ వేటి మధ్య జరుగుతోంది” అనగానే “ప్రాణమున్న జీవుల మధ్య” అన్నాడు.దానికి నేను వెంటనే “శవాల మధ్య సంయోగము జరగదని అర్ధమవుతోంది గదా!ఇన్నాళ్ళు నీవు కామమును రెండు ప్రాణమున్న తోలుతిత్తులున్న శరీరాల మధ్యగానే చూశావు.అలాగే భావించావు.కాని నిజానికి ఈ మైధునము అనేది రెండు అస్ధిపంజరాల మధ్య జరుగుతోందని తెలుసుకో.ఈ తోలు తీసివేస్తే మిగిలేది అస్ధిపంజరాలే గదా.మరి వీటి మధ్య జరిగే సృష్టియజ్ఞం నీకు కామమాయ ఎలా అవుతుంది.జాగ్రత్తగా ఆలోచించు.మర్మము నీకే బోధపడుతుంది.పదార్ధశరీరాలు దాటు.యదార్ధము నీకే తెలుస్తోంది.” అనగానే వాడు నాకు మౌనముగా నమస్కారము చేసి “నాకు ఈ జన్మ వృధాగాకుండా చేసినారని” ఆనందముగా చెపుతూ అక్కడనుండి...కామమాయ నుండి తప్పుకొని...వెళ్ళిపోయాడు.
ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!
రిప్లయితొలగించండిmooladhara chakram lo oche kaama Maya ni ela daatarani aa chakra shudhi, aadeena,
రిప్లయితొలగించండిjagruthi lo padda kashtalu avi adigaminchadam. Musalamma tho love annappudu interview lo
adigina question gurinchi cheppi chusi viddhanam lo untundani..... 6yrs chaala kashtapadi ee chakra
aadhenam cheskunnarani movies lo scene lu chusi analyze chesukoni maaya ni daatatam chaala
bagundi avasthalu padthunna saadhakulaku manchi daari chupincharu.... evaro oka saadhakudu
ishta daivanga krishnudini select chesukunte oka vaipu krishnudu venaka jagan mohini
kanipinchatam tho ela saadhana aagipoyindani.....