అధ్యాయం 71


దేవుడు లేడా?

ఇప్పటివరకు మనం 36 కపాలాలు ఆదిలో రికార్డు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం అని తెలుసుకోవడం జరిగినది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు మరి ఆదిలో ఏమి జరిగింది? ఎలా జరిగింది దీనిని చేసింది ఎవరు? ఎందుకు చేసినాడు? ఏ విధంగా చేసినాడు? చేసిన వాడు అనే వాడు ఉన్నాడా? వాడు చేసినది నిజమేనా? వాడు ఎలా చేశాడు? ఏమి చేశాడు? అనే మున్నగు ధర్మసందేహాలు నాకు రావడం మొదలయ్యాయి. అంటే నాకు కలిగిన అనుభవాల దృష్ట్యా చూస్తే మూలాధారంలో గణపతి నుండి బ్రహ్మరంధ్రములోని ఆదిపరాశక్తి ఇలా సుమారు 36 మంది నామరూప దైవాలు ఆయా చక్రాల దాటుతుండగా శూన్యములో అనగా చీకటి భాగంలో కలిసిపోవడం నాకు అనుభవాలు కలిగాయి. లోకాల గ్రహాలు ఇలా మున్నగు ఉన్నవి కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే కనిపించే విశ్వమంతా చివరికి పరమ శూన్యములో కలిసి పోవడం తో చివరకు శూన్యమే ఉండటంతో మరి అప్పటిదాకా సత్యంగా కనిపించిన అన్నీ కూడా అసత్యమని నిరూపిస్తూ శూన్యములో అంతరించి పోవడం జరిగినది. ఇవి నా ఒక్కడి అనుభవం కాదు. ఆదిశంకరాచార్యుడుకి లాహిరి మహాశయుడికి భృగు మహర్షికి ఇలా ఎందరికో జరిగినాయి. అంటే కనిపించే ఉల్లిపాయ కాస్త దాని పొరలు తీయగానే ఎలాగైతే ఉల్లిపాయ కనిపించదో అలా ఈ విశ్వం అనే బ్రహ్మ పదార్థం యొక్క పొరలు అనగా అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, త్రస్య రేణువు దాకా తీసుకొని పోతే ఈ విశ్వ పదార్థం మనకి కనిపించదు. సత్యంగా కనిపించేది కాస్త అసత్యంగా కనపడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ విశ్వ పదార్థం ఎవరైనా సృష్టించారా? ఎందుకు సృష్టించారు? ఏ విధంగా సృష్టించారు? ఇలా విషయాలు మన ముందుకు వస్తాయి. అప్పుడు విశ్వ సృష్టి చరిత్రలోకి వెళ్ళవలసి ఉంటుంది. 

నా అభిప్రాయం ప్రకారం నాకు కలిగిన వివిధ రకాల ధ్యాన అనుభవాల దృష్ట్యా బట్టి చూస్తే ఆదిలో శూన్యం ఉండేది. ఈ శూన్యంలో పిండి రేణువు లాంటి నిర్మాణాలు ఉండేవి. ఇవి అత్యంత శక్తివంతమైనవి అన్నమాట. అంటే ఒక రకంగా కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్స్ లాంటివి అన్నమాట. కృష్ణబిలం అంటే తమకు ఉన్న కాంతిని కాస్త కాంతి హీనం అయినప్పుడు ఏర్పడే చీకటి క్షేత్రాలను బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలం అంటారు. ఆదిలో శూన్యములో పిండి రేణువు అంత పరిమాణంలో కృష్ణ బిలాలు ఉండేవి. అవి కూడా కాంతిహీనంగా అవడం వలన శూన్యం అంతా కూడా పరమ చీకటిని ఆవరించడము జరిగినది. దానితో చీకటిలో చీకటిగా ఈ కృష్ణబిలాలు ఉండేవి. వీటికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ… ద్రవ్యరాశి కలిగి ఉండటము…. అత్యంత ఉష్ణోగ్రతను కలిగి ఉండటం… దీని లోపల ఉండే వాయువులు లోపల సుడులు తిరుగుతూ ఉండటం మనకు కనబడతాయి. పైగా ఏదైనా వస్తువు దీని లోనికి వెళితే అది తిరిగి రాదు. కాంతిని ఇందులోనికి ప్రసరింపజేసిన అది పరావర్తనం చెందదు. కాంతి కూడా దీనికి ఉన్న ఆకర్షణ శక్తి నుండి తప్పించుకోలేదు అని అర్థమవుతుంది కదా. మరి ఇలాంటి బ్లాక్ హోల్స్  ఎలా ఏర్పడ్డాయి అంటే ఏదైనా కారణం చేత నక్షత్రం లోపల ఉన్న పదార్థ స్థితి తరిగి పోతూ ఉంటే నక్షత్రాలు ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. తద్వారా ఈ నక్షత్రంలోని అణువులు  కాస్త పరమాణువులు ఇవి కాస్త ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గా విడిపోవటం ఆరంభము చేస్తాయి. అప్పుడు ఆఖరికి న్యూట్రాన్ నుండి వెలువడే కాంతి తగ్గిపోవటం క్రమంగా కాంతిని పూర్తిగా బయటికి వెళ్ళే వెళ్లలేని పరిస్థితికి ఇవి లోనయి కాంతిహీనమై చీకటి క్షేత్రముగా ఒక పరిధిని ఏర్పరచుకుని తనలో ఉన్న వాయువుల ప్రకంపనాలను సుడులు తిరుగుతూ తన పక్కనే ఉన్న వివిధ నక్షత్రాల గుంపులు తనలోనికి ఇముడ్చుకుంటూ వాటిని కూడా కాంతి హీనంగా చేస్తూ తనలో కలుపుకుంటూ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. అంటే పిండి రేణువు కాస్త పిండి పదార్థంగా మారుతుంది అన్నమాట.కాంతి ఉంటే నక్షత్రమని అదే కాంతిహీనంగా ఉంటే కృష్ణబిలం అని తెలుస్తోంది కదా. ఇంతవరకు బాగానే ఉంది.

ఆది కృష్ణబిలం
అసలు ఆదిలో మొట్టమొదటిసారిగా ఈ కృష్ణబిలం వంటి రేణువు ఎలా ఏర్పడింది అన్నప్పుడు స్త్రీమూర్తి గర్భాశయంలో అప్పటిదాక లేని అండము నెలసరి తర్వాత ఎలా ఏర్పడుతుందో అలా ఈ సృష్టిలో కృష్ణబిలం స్వయంగా ఏర్పడి ఉండాలి. అనగా స్వయంభువుగా అన్నమాట. అంటే ఇక్కడ పదార్థము లేదా భగవంతుడు స్వయంభూ అనటం లేదు. ఈ శూన్యములోని ఆది కృష్ణబిలం అనగా పిండి రేణు వంటి త్రస్య రేణువును ఇప్పుడు మన శాస్త్రవేత్తలు పిలిచే దైవ కణమును స్వయంభూగా ఏర్పడిందని నేను అంటున్నాను. పరమ శూన్యములోని అతి శక్తివంతమైనని ఇవేనని గ్రహించండి. వీటిని ఎవరూ సృష్టించలేదు. వీటికి ఎవరు సృష్టికర్త లేడు అని గ్రహించండి. సృష్టికర్త ఉంటే వాటిని స్వయంభూ అనడం ఎందుకు. సృష్టికర్త  ప్రదాత వలన ఏర్పడ్డాయని అనుకోవచ్చు కదా.ఇక్కడ ఒక విషయం గమనించండి. శూన్యము అంటే ఖాళీ ప్రదేశము. కానీ నిజానికి ఈ ప్రదేశమంతా కాంతి హీనమై చీకటిని కలిగి ఉన్న స్వయంభూ రేణువు వంటి కృష్ణబిలంలో ఉన్నదని గ్రహించండి. ఒకరకంగా ఇవి కాంతి హీనం అవడం వలన నిర్జీవమైనాయని తెలుసుకున్నారు కదా. అదేనండి వీటిలో ఉన్నది న్యూట్రాన్స్ కాంతిని కోల్పోవడంతో ఇవి ఇవి కాస్త కాంతి హీనమైనాయని చెప్పడం జరిగింది కదా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చచ్చిపోయినాయి అన్నమాట.అనగా నిర్జీవ పదార్థము అన్నమాట.అంటే ఆదిలో ఆది శూన్యమునందు ఆది  కృష్ణబిలము ఒక నిర్జీవ పదార్థము అన్నమాట. మరి ఈ నిర్జీవ పదార్ధానికి జీవపదార్థం ఎలా వచ్చినది అన్నప్పుడు కుళ్ళిన జీవపదార్థం నుంచి అలాగే మానవ జంతువులు మూత్రము నుంచి కూడా యూరియా లభిస్తుందని అలాగే పొటాషియం సైనైడు మరియు అమ్మోనియం క్లోరైడ్ ను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద కలిపితే యూరియా ఏర్పరచవచ్చునని మన శాస్త్రవేత్తలు నిరూపించారు కదా. అంతెందుకు మన ఇతిహాసాలలో భస్మము నుండి భస్మాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించినట్లుగా చెబుతారు కదా. అంటే ఈ లెక్కన చూస్తే నిర్జీవ పదార్థము నుండి జీవపదార్థం ఏర్పడుతోందని తెలుస్తోంది కదా. 

అలాగే ఈ సూత్రం ఆధారంగా నిర్జీవమైన కృష్ణ బిలం నుండి సజీవ బ్రహ్మపదార్థం ఏర్పడింది. అనగా నిరాకార పరబ్రహ్మము(శూన్యము) నుండి ఆకార పరబ్రహ్మము ఏర్పడిందని అంటే శూన్యము నుండి శూన్యబ్రహ్మ ఉద్భవించినాడు అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కదా. అంటే ఏమిటి? శూన్యము నుండి అనగా నిర్జీవమైన కృష్ణబిలము నుండి కాంతివంతమైన పరమాణువు ఏర్పడినది. కాంతి లేని చోట కాంతితో ఎలా ఏర్పడుతుంది అంటే రెండు నిర్జీవ పదార్థాలు కలిసి ఒక జీవ పదార్ధంగా అనగా ఒక యూరియా ని ఎలా ఏర్పరిచినాయో అలా ఆదిలో ఈ కృష్ణబిలం లో మార్పులు చెంది శాంతి హీనము కాస్త కాంతివంతంగా మార్పు చెంది ఉంటుంది. ఈ కాంతివంతమైన పరమాణువునే మన మహర్షులు పరంజ్యోతి అని లేదా పరమాత్మ అని చెప్పడం జరిగినది. పిండి రేణువు వంటి ఆది కృష్ణ బిలము ఆది బ్రహ్మగా పిలవడం జరిగినది. ఇదియే మన పూర్వీకులు దృష్టిలో భగవంతుడు అన్నమాట. దీనికి కాంతిశక్తి అధిక వేడిమి గురుత్వాకర్షణ శక్తులనే మన వాళ్లు కాస్త భగవంతుడికి సర్వజ్ఞత- సర్వవ్యాప్తి- సర్వశక్తి అనే మూడు లక్షణాలు ఉంటాయని చెప్పడం జరిగినది. సర్వజ్ఞత అంటే సర్వం తెలిసి ఉండుట… అధిక వేడి అనేది ఒక గుణము. అది కాలితే గాని మరి అది ఉన్నదనే ఙ్ఞానము తెలియదు. అలాగే సర్వవ్యాపి అంటే కాంతి శక్తి అన్నమాట. కాంతి వ్యాపించని ప్రదేశం అంటూ ఏమీ ఉండదు కదా. అలాగే సర్వశక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి అన్నమాట. ఇవి అన్ని సమస్యలకు మూల శక్తి కావటం వలన సర్వశక్తి అయినది. అంటే నిజానికి పరమాత్మ అంటే పరమాణువు అన్నమాట. 

ఈ పరమాణువును విడదీస్తే మనకి న్యూట్రాన్- ప్రోటాన్- ఎలక్ట్రాన్ అనే వస్తాయి. అనగా త్రిమూర్తులు అన్నమాట.  న్యూట్రాన్ శివుడు గాను ప్రోటాన్ విష్ణువు గాను ఎలక్ట్రాన్ బ్రహ్మగారు అనుకుంటే కలిస్తే ఏకస్వరూపము అదే దైవం భగవంతుని స్వరూపం ఏర్పడుతుందని మనకి దత్తాత్రేయ చరిత్ర లో అత్రి మహర్షి త్రిమూర్తులను ఏక స్వరూపంగా చూడాలని ఘోర తపస్సు చేస్తే త్రిమూర్తులు కాస్త ఏకమై త్రిముఖ దత్త అవతరణ జరిగినట్లుగా చెప్పడం జరిగినది. అంటే ఒక రకంగా చూస్తే దత్తస్వామి ఒక పరమాణువు. ఎందుకంటే ఈయనలో త్రిమూర్తులు ఉన్నట్లుగా ఈ పరమాణువులో కూడా ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా.మరి ఈ లెక్కన చూస్తే దత్తస్వామి పరమాత్మయే కదా. అనగా దత్తస్వామి పరమాణువు కదా. పైగా ఈయన విశ్వ గురువు కూడా. అంటే విశ్వ జ్ఞానం కలిగిన వాడు కదా.అనగా పరమాణువులో అంతా ఉన్నట్లే కదా. సర్వవ్యాప్తి- సర్వశక్తి- సర్వజ్ఞత ఉన్నట్లే కదా. అనగా కాంతి శక్తి గురుత్వాకర్షణ శక్తి ఇక ఉష్ణోగ్రత ఉన్నట్లే. ఎప్పుడైతే కృష్ణబిలం కాస్త పరమాణువుగా రూపాంతరం చెందినప్పుడు ఈ కారణం చేతనే ఒక రూపము నుండి మరొక రూపమునకు మారడం వలన ఇవి కాస్త కాంతిని కోల్పోయి చీకటి క్షేత్రముగా మారిపోతాయని గ్రహించండి. ప్రస్తుతానికి కృష్ణబిలం నుండి పరమాణువు ఏర్పడినది. పరమాణువులో ఎలక్ట్రాన్లు- ప్రోటాన్లు- న్యూట్రాన్లు సంఘాత విఘాతముల వలన పరమాణువులు కలిసి అణువుగా ఏర్పడినది.ఈ అణువునే ఆత్మ అని మన పూర్వ మహర్షులు అన్నారు. ఈ అణువులు కలిసి ఒక బ్రహ్మ పదార్థంగా రూపాంతరం చెందినది. అదియే జీవపదార్థం అన్నమాట. ఇది మాత్రమే మన భౌతిక కనులకి మాత్రం కనపడుతుంది. వైరస్లు బ్యాక్టీరియాలు మన కంటికి కనిపించనంత మాత్రాన లేవని ఎలాగయితే మనం అనలేమో ఆత్మ అనేది ఉంటుంది. ఇది మన భౌతిక నేత్రాలకు కనిపించదు. 

మరియు బ్యాక్టీరియా వైరస్ లు చూడటానికి మైక్రోస్కోప్ ను ఉపయోగించి ఎలా చూస్తామో అలా ఈ ఆత్మను చూడటానికి మనోనేత్రమైన త్రినేత్రము అనగా పీనియల్ గ్రంథి అనేది ఉంటుంది అని గ్రహించండి. కాకపోతే ఇది సహజంగా మూసుకుని ఉంటుంది. సాధకుడు తన సాధన స్థాయిలు అనగా పరిణామ క్రమాభివృద్ధి చెందుతుంటే అది తెరుచుకుని చీకటి అవతల ఉన్న ప్రపంచమును వెలుతురుకి ఇవతల ఉన్న ప్రపంచము మన భౌతిక కళ్ళు ఎంత చక్కగా చూస్తున్నాయో అదేవిధంగా త్రినేత్రం చూస్తుంది. ఇది ఎవరికి వారు స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి. మనము చూడలేనంత మాత్రాన అది లేదని అనుకోరాదు. పగలు నక్షత్రాలు కనిపించకపోతే ఎలా అయితే లేవని అనలేమో వీటిని చూడటానికి రాత్రి అయితే ఎలా ఉండాలో అలాగే ఆత్మలు చూడటానికి త్రినేత్రం ఉండాలని గ్రహించండి. అంటే రేణువు నుండి పరమాణువు దీనినుండి అణువు దీని నుండి జీవపదార్థం ఏర్పడిందని తెలుస్తోంది కదా. అదిలో రేణువు నిర్జీవమైనదని తెలుసు కదా. అనగా ఒక రూపము నుండి మరొక రూపానికి మారడము వలన అని తెలుసు కదా. అంటే నిర్జీవ పదార్ధం నుండి జీవపదార్థం ఏర్పడినది. త్రాడుని చూసి పాము అనుకున్నట్లుగా అన్నమాట. అనగా రేణువులు, పరమాణువులు, అణువులు సంయోగ వియోగముల వలన జీవపదార్థం అలాగే అందులో కదలికలు ఏర్పడినట్లే కదా. అంటే శూన్యము నుంచి కొత్త పదార్థం అంటూ ఏది ఏర్పడలేదు. ఉన్న పదార్థం కాస్త మరొక పదార్థంగా మారుతుంది అని తెలుసుకోండి. రేణువు కాస్త పరమాణువుగా ఆపై అణువుగా ఆపై పదార్థంగా రూపాంతరం చెందినది అని గ్రహించండి. అంటే పూర్ణము నుంచి పూర్ణము ఉద్భవించినది. పూర్ణము నుంచి పూర్ణము తీసివేసిన మిగిలేది పూర్ణమే కదా. ఎప్పుడైతే రేణువు కాస్త ఆఖరిగా జీవపదార్థం గా రూపాంతరం చెందినది.ఈ పదార్ధం అంతా చైతన్యవంతమై పరిణామక్రమ మైనదని గ్రహించండి. అనగా ఒకానొక నిర్జీవ పదార్థము( కృష్ణబిలము) నుంచి జీవపదార్థము ఏర్పడటానికి కారణం అందులో ఏర్పడే పరిణామక్రమం వలన జరిగినాయి. తద్వారా రూపాంతరాలు జరిగినాయి. 

36 లక్షణాలతో ఆది జీవ పదార్ధము
ముందుగా పంచభూతాలు, అష్ట దిక్కులు, త్రికాలాలు, త్రిగుణాలు, త్రిఆలోచనలు, త్రికర్మలు అలాగే ద్వైత భావాలు పాపపుణ్యాలు, ఆనంద భయాలు, సుఖదుఃఖాలు భయము ఆశలు, ఆలోచనలు, సంకల్పాలు, స్పందనలు ఇలా 36 లక్షణాలతో ఆది పదార్ధము ఏర్పడినది. ఇలా ఈ విశ్వం లో కనిపించే ప్రతి లక్షణము భావము రూపము ఈ జీవపదార్థం లోనిదే. ముందుగా ఈ జీవ పదార్థం నుంచి ఏకకణ జీవులు ఆపై బహుకణ జీవులు అటుపై బుద్ధిజీవులుగా రూపాంతరం చెందినది. అంటే మన పూర్వీకులు మహర్షులు చెప్పిన ఏకత్వం నుండి భిన్నత్వంలో కి మారడం అన్నమాట. అంతా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోను సంబంధం లేకుండా ఎవరు లేకుండా 

జీవ పదార్థంలో పరిణామక్రమంలో జరుగుతూ ఉండటంతో ఏకకణ జీవి అమీబా నుండి స్వయంగా ఆలోచించే జ్ఞాన శక్తి గల బుద్ధి జీవి అయిన మానవుడు రూపాంతరం చెందినాడు అన్నమాట. అంటే కృష్ణబిల్వము యొక్క అంతిమ రూపాంతరము స్వరూపమే ఆదిమానవుడు అన్నమాట. నిర్జీవ పదార్థం నుండి వచ్చిన ఆది జీవ పదార్థము యొక్క ఒకానొక పరిణామ రూపాంతరమే ఆదిమానవుడు అన్నమాట. పుట్టగానే బిడ్డ మాటలు చెప్పరు కదా. కాలానుగుణంగా ఒక క్రమ పరిణామంలో అభ్యాసం మీదనే నెమ్మదినెమ్మదిగా చిలకపలుకులు మాట్లాడుతూ వాగుతూనే వాగుడుకాయగా మారతాయి కదా. అలా ఈ శూన్యము నుండి ఆదిమానవుడు కూడా రూపాంతరం చెందినాడు అన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. 

మరి దేవుళ్ళ సంగతి ఏమిటి. వాళ్ళని మర్చిపోయారా? దేవుళ్ళ తర్వాతనే కదా. మానవుడు రూపాంతరం చెందినది అన్నప్పుడు దీనికి సమాధానముగా ఆదిమానవుడు ఆదిదేవుడు, ఆదిపురుషుడు, ఆదిమానవుడు, ఆది మాధవుడు అయితే ఆది స్త్రీమూర్తియే ఆదిశక్తి అన్నమాట. ఆది దేవత అన్నమాట. నిజానికి మన వైపు దైవాలుగా పూజించే వారంతా ఒకప్పుడు ఆదిలో మానవులేననీ ముందు తెలుసుకోండి. అసలు వాస్తవం ఏమిటంటే మానవుల్లో ఎవరైతే స్వార్థం లేకుండా, ఈర్ష అసూయ లేకుండా, రాగద్వేషాలు లేకుండా, భయమూ లేకుండా, ఎవరైతే ఉంటారో అలాగే త్యాగ గుణము, సహనం కలిగి ఉంటారో, మృదు స్వభావము, మంచి మనస్సు, మంచి మాట, మంచి దృష్టి, మంచి పని, మంచి జీవితం గడుపుతూ ఉంటారో వారిని మనం పురుషోత్తముడిగా భావించి లేని శక్తులు లేని దైవ శక్తులు అలాగే యోగ శక్తులు వారికి ఆపాదించి మనకన్న వారిని ఎక్కువగా గౌరవించి పూజాదికాలు చేయటం వలన దైవ విగ్రహారాధన చేసుకుంటూ రావడం వలన దానికి భక్తి అని పేరు పెట్టుకుని తమ సొంత కోరికలను వీరు తీరుస్తారని ఆశించి పూజించటం నిత్య ఆరాధన చేయటం వలన కోరికలు నెరవేరినాయని అమితముగా నమ్మడము లాంటివి చేయటంతో 

మానవుల్లో ఉత్తమ మానవుడు కాస్త మాధవుడు అయినాడు.జీవులలో ఉత్తమ జీవుడు కాస్త శివుడు అయినాడు. అదే స్త్రీలలో ఉత్తమ స్త్రీ కాస్త అమ్మవారు అయినది. జ్ఞానులలో ఉత్తమ జ్ఞాని కాస్త బ్రహ్మజ్ఞాని బ్రహ్మగా పూజలందుకోవడం జరుగుతోంది. యోగులలో ఉత్తమ  యోగి కాస్త ఆదియోగి గా పూజలందుకోవడం జరుగుతోంది. ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు పురుషోత్తముడిగా మారి పూజలందుకోవడం జరిగినది జరుగుతోంది. నిజానికి మనమంతా పరమాత్మలమే కానీ ఒక పరమాత్మ కాస్తా మరొక ఉత్తమ పరమాత్మగా భావించుకుని ఆరాధన చేయడంతో జీవాత్మ కాస్త పరమాత్మ అయినది. పరమాత్మ కాస్త జీవాత్మ అయినది. అందరూ సమానులే. అందరూ కూడా ఒకే తానులోని వారే. అందరూ ఒక బ్రహ్మ పదార్థం నుంచి వచ్చిన జీవపదార్థం జీవులే. ఒక కేక్ ను ముక్కలు చేసి వేరుచేసినంత మాత్రాన కేక్ కి అలాగే కేక్ ముక్కలు లోని రుచికి తేడా ఏమైనా ఉంటుందా ఉండదు కదా. పోతే ఆకారం పరిమాణాలలో తేడా ఉంటుంది.ఈ తేడాయే మానవులను మాధవులను వేరు చేసినది. జీవులను దైవాలను వేరు చేసినది. అందరిలోనూ ఒకే జీవపదార్థం శక్తి ఉన్నప్పటికీ నామ రూపధారి లోనూ పరిమాణము లోను, గుణాలలో, ఆకారాల్లో ఉన్న తేడా కనిపించడం వలన అనిపించటం వలన మన కొంపముంచినది. సాధ్యంకాని గుణకర్మలు మనకి సాధ్యంకాని గుణాలు వారిలో కనపడేసరికి వారికి మనము దాసోహం అవ్వటం మొదలైంది. వాడు చివరిదాకా పోరాడి విజయం పొందితే మనము కొంతవరకు మాత్రమే విజయం పొంది దానిని సాధించిన వారిని దేవుడిగా పూజించడము ఏమైనా అర్థం ఉన్నదా. వాడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయని ఎవరు గమనించడం లేదు. వాడు అన్నింటిని తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకొని విజయం పొందితే మనము మనకు ఉన్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక లేదా తెలిసినా కూడా మనలోని భయము వలన వాటిని సరిగ్గా ఉపయోగించుకోక అపజయం పొందితే జయం పొందిన వాడు గొప్పవాడు అని ఒక పరమాత్మ మరొక పరమాత్మని పూజించడం ఎంత విడ్డూరమో ఆలోచించండి. నేను దైవశక్తిని నిందించడం లేదు. అది రాయిలో లేదు. మనం పూజించే రాతి విగ్రహంలో లేదు. మనలోనే ఉంది. మన సంకల్ప స్థితిలోనే ఉంది. మన సంకల్ప శక్తి మనం అనుకున్న కోరికలు తీరుస్తుందని గ్రహించండి. మీరు పూజలు చేసినా చేయకపోయిన మన సంకల్ప శక్తి యొక్క సామర్ధ్యమును బట్టి మన కోరిక ఫలితాలు ఉంటాయని గ్రహించండి. సంకల్పం బలంగా ఉంటే మానవుడు కాస్త మాధవుడు అవుతాడు.సంకల్పానికి భయం తోడైతే శివుడు కాస్త జీవుడు అవుతాడు అని తెలుసుకోండి. అంతెందుకు మానవ దంపతులకు పుట్టిన నడయాడే దైవమైన శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు ఎన్ని కష్టాలు పడినారో రామాయణ మహాభారత కాలంలో చూడండి. మీకే తెలుస్తుంది కదా. వారు కూడా మనకు లాగానే నానా కష్టాలు పడుతూ తిరిగి లేస్తూ అవమానాలు పొందుతూ అపజయాలు పొందిన కూడా ధీరులై మడమతిప్పని వీర గుణముతో ముందుకి సాగి పోవడంతో మనము వారిని ఇప్పుడు దైవంగా పూజించడం చేస్తున్నాము కదా. సాధన సాధ్యతే సర్వం సాధ్యం గుర్తుంచుకోండి .తెలుసుకోండి. గ్రహించండి.
 
అంటే ఒక దేవుడు మరొక దేవుని పూజించడం అంటే ఇదే కదా. రాముడు భార్య వియోగ దుఃఖముతో మరణం పొందలేదా? తన భార్యని రావణాసురుడు ఎత్తుకొని పోతే విలవిలలాడలేదా? మరి శ్రీకృష్ణుడు పదహారువేలమంది గోపికలతో వివాహమైన రాధను ప్రేమతో దరిచేర లేదా? వారు కూడా ఎన్నో తప్పులు చేసినారు. ఆ తర్వాత వాటిని తట్టుకుని ముందుకు సాగిపోయారు కానీ వాళ్లకి మనకి ఉన్న తేడా ఇదే. ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడని ఆది రేణువైన కృష్ణబిలమైన ఆది బ్రహ్మము రూపాంతరం చెంద లేదని గ్రహించండి. మీరు పూజించే 36 కోట్ల దేవతలు కూడా ఒకప్పుడు ఆదిలో ఎన్నో తప్పులు చేసి వాటిని దాటుకుని ఇప్పుడు మన చేత దైవాలుగా పూజలందుకుంటున్నారు. అంతెందుకు ఇంద్రపదవి కోసం ఇంద్రుడు ఎన్నో పాపాలు చేసినట్లుగా ఇతిహాస కథలు ఎన్నో ఉన్నాయి కదా. ఉన్నా కూడా మనము వీరిని దేవుడిగా పూజిస్తాం. గౌరవిస్తున్నాము. అదే మానవుడు తెలిసి లేదా తెలియక చేసిన తప్పు ఉంటే మాత్రం నానా చంకలు వాడికి చూపిస్తాము. మనము పూజించే దైవాలు-వాళ్ళు చేసిన తప్పులు కనిపించినా ఎంచరు.ఎందుకంటే లోకకల్యాణార్థం చేసినారని దానికి ఒక పెద్ద పిట్టకథలు కలిపి చెబుతారు. వాలిని దొంగచాటుగా శ్రీరాముడు చంపితే తప్పు లేదు అంటారు. సీతాదేవిని అనుమానించిన అవమానించిన లోకము కోసమే చేసినారు అని మన పెద్దలు చెబుతారు. అది అతి పెద్ద తప్పు. యదార్ధము యదార్ధముగా ఎవరూ అంగీకరించడం లేదు. నిజము నిజాయితీగా ఒప్పుకోరు. వాళ్ళు చేసిన తప్పులకి ఏవో గత జన్మ కలిపి ఆ జన్మలో అది జరిగింది కాబట్టి ఇలా చేశారని అంతా లోకకల్యాణార్థమే చేసినారని మనకి మభ్య పెడతారు. రావణబ్రహ్మ పరస్త్రీ వ్యామోహం ఉంటే రాక్షసుడు. అదే ఇంద్రుడుకి అహల్య మీద పరస్త్రీ వ్యామోహం ఉన్న కూడా ఆయన రాక్షసుడు కాదు. దేవుడవుతాడు. ఇది ఎలా సాధ్యం…. ఇది చేసిన మన మిడిమిడి జ్ఞానం పండితులుకి ఈ విషయం తెలియాలి. జ్ఞాన కాండ కాస్త భక్తి కాండగాను అటుపై కర్మకాండగాను  అటుపై కర్మకాండను భుక్తికాండగా మార్చటం కవి కాస్త కాసులకు కక్కుర్తిపడి కావ్యాలు కూడా మిడిమిడి జ్ఞానంతో రూపాంతరం చెందాయని అందరూ ఒప్పుకోవాల్సిన నగ్నసత్యం అని గ్రహించండి. ఆది కావ్యంలో ఉదాహరణకి ముందు ఇంటికి సున్నం వేయండి అని ఉంటే కాసులకు కక్కుర్తిపడి నమ్మిన వాళ్లు… పేరుప్రఖ్యాతులను అలవాటుపడిన వాళ్లు అసంపూర్ణ జ్ఞానులు కలిసి ముందున్న ఇంటికి సున్నం వేయండి అని మార్చి ప్రచారం చేసినారు.ఆది కావ్యంలో గ్రంథకర్త చెప్పిన భావం ఏమిటంటే ముందుగా తమ ఇంటికి సున్నం వేయండి అన్నమాట. దానిని ఆ తర్వాత తరం వాళ్ళు ముందున్న ఇంటికి సున్నం వేయండి అని భావమే మార్చి ప్రచారం చేసినారు. ఉదాహరణకు నాసికాగ్రం అంటే ముక్కు చివర అని ప్రచారం చేసినారు. నిజానికి ముక్కు మొదలు అనగా ముక్కు ప్రారంభమైన కనుబొమ్మల మధ్య ప్రాంతం అని అర్థము. మనమే దైవాలు అయితే అది కాదని నువ్వు వేరు నేను వేరు అనగా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని పనికిమాలిన అంశాలు చేర్చి ఏవీ కూడా వాదనలో చర్చలో నిలబడలేని అంశాలను ఏరికోరి ఆది కావ్యాల యొక్క జ్ఞాన రహస్యాలను తమకున్న మిడిమిడి జ్ఞానంతో తమకు తోచిన భావ అభిప్రాయాలు వ్రాసుకుంటూ వచ్చినారు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తుండగా ఒక కావ్యం నుండి పదులలోనూ వందల, వేల, లక్షల, కోట్ల మార్చిమార్చి తిప్పి అసంపూర్ణ గ్రంథ రచయిత లోకానికి హేతుబద్ధమైన శాస్త్రాలు పురాణాల కాస్త ఎందుకు పనికిరాని పుక్కిటి పురాణాలుగా మార్చడం జరిగినది. ఈ చెప్పిన వాటిని మన వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అనే విధంగా గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిస్తే బాగుండును. దేవుణ్ణి మానవుడిగా పూజించకండి. మానవుడే దేవుడు అని గుర్తించండి. భగవంతుడు అంటే నామాలు లేని రూపాలు లేని ఒక అద్భుతమైన మహత్తర మహోన్నత శక్తి స్వరూపం అని గుర్తించండి. ఇప్పుడు మనం పూజించే నామరూపధారులు అంతా కూడా ఒకప్పటి మానవులేనని వారంతా కూడా ఎప్పుడో అంతరించి అనగా మరియొక రూపముతో రూపాంతరం చెందినారని గ్రహించండి. నిజానికి మీరు పూజించే ఇష్ట దైవం యొక్క రూపం ఆది రూపంని ఇప్పుడు మీరు పూజిస్తున్నారు. ఈ భూమి ఏర్పడి సుమారు 195 కోట్ల సంవత్సరాలు కావస్తోంది. మరి మీ దైవం ఆ రూపముతో ఎలా ఉంటాడు. ఈ పాటికి కోటాను కోట్ల రూపాలకు రూపాంతరం చెంది ఉంటాడు కదా. ఎందుకంటే విశ్వమంతా ప్రతిక్షణము పరిణామక్రమంలో ముందు నుండి రూపాంతరం చెందుతూనే ఉంటుంది కదా. మరి మీ ఇష్ట దైవం ప్రస్తుతం ఏ రూపంలో ఉన్నాడో వాడికి తెలియదు. ఎందుకంటే ఏ క్షణం ఏ విధంగా రూపాంతరం చెందుతాడో వాడికి మాత్రమే ఏమి తెలుస్తుంది. వాడి చేతుల్లో లేదు.ఎవరి చేతుల్లోను లేదు. ఇదంతా కనిపించేదంతా ఈ విశ్వమంతా నిరంతరం పరిణామ రూపమేనని తెలుసుకోండి. ఏది శాశ్వతంగా ఉండదు. ప్రతిదీ మారుతూనే ఉంటుంది. కాకపోతే మన కంటికి కనిపించని స్థాయిలో. మన శరీరంలోని కోటాను కోట్ల అణువులలో సంయోగ వియోగములతో రూపాంతరం చెందుతుంది. అందులో మన ఆలోచనలే ప్రధానమే అన్నమాట. శ్వాసక్రియ వలన మన శరీరంలోని అణువుల సంయోగ వియోగాలు ఒక లిప్త కాలము అనగా కనురెప్ప మూసి తెరిచే కాలంలో మన ఆలోచనలతో మార్పులు వచ్చి సంకల్పాలుగా రూపాంతరం చెందుతాయి. అటుపై స్పందన గాను ఆపై ఆశలుగాను, భయాలుగాను, ఆనందంగానూ, కోరికల గాను, కర్మలు రూపాంతరం చెందే విషయము మనము తెలుసుకోలేము.మన శ్వాస బట్టియే వీటి రూపాంతరమైన మనస్సు యొక్క ఆలోచన భావ స్థితి ఉంటుంది. ఎక్కువ శాతం ఆక్సిజన్ మనం శ్వాస ద్వారా తీసుకుంటే మనస్సు కాస్త స్థిరమై వివేక జ్ఞానము బుద్ధితో మంచి ఆలోచన చేయడం ఆపై మంచి కర్మలు గా మారటం అది అనుకున్న ఫలితాలు పొందడం జరుగుతుంది. అనుకున్న స్థాయిలో శ్వాస తీసుకోకపోతే మనస్సు కాస్తా అస్థిరమై అవివేక ఆలోచన చేసి పాప కర్మలు చెయ్యడము ఆపై అవమానాలు పొందడం జరుగుతుంది. 
 
అందుకే మన పూర్వ మహర్షులు తమ అష్టాంగ విధానములో శ్వాసక్రియ నియంత్రించే ప్రాణాయమము విధానములో ప్రాముఖ్యతను ఇచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టమని అది చేస్తే నెమ్మదినెమ్మదిగా మనస్సు ఆధీనమై స్థిరమై ఏకాగ్రతను పొంది మంచి ఆలోచనలు తద్వారా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఆనందసిద్ధి పొందటంతో మనోనిశ్చల స్థితి పొంది పరమ ప్రశాంత స్థితి పొందటం జరుగుతుంది. ఇది అసలు సిసలైన మోక్ష స్థితి. అన్ని రకాల కర్మ బంధాలనుండి విముక్తి చెంది కర్మ శేషం లేకుండా చేసుకోవడమే మనస్సు స్వాధీనం చేసుకోవడం అన్నమాట. దీనికోసం పతంజలి అష్టాంగ యోగమైన, బుద్ధుడు అష్టాంగయోగం అయిన భగవద్గీత చెప్పిన 18 రకాల యోగాలైనా ఆది యోగి చెప్పిన 108 సాధన విధానాలైన ఉన్నాయి అని గ్రహించండి. నువ్వు సోహం చేస్తే వేరే వారికి దాసోహం చేయకుండా ఉంటే నువ్వు శివోహం అవుతావు అని గ్రహించు. ఎప్పుడైతే నీవు ప్రస్తుత జన్మ యొక్క జీవపదార్థం( మానవజన్మ) నుండి యోగసాధన చేసి వెనక్కి తిరిగి వెళ్లి నీ ఆదిరూపమైన రేణువు వంటి కృష్ణ బిలముగా రూపాంతరం చెందితే మోక్షప్రాప్తి పొందినట్లు అవుతుంది. అనగా జీవ నాటకం నుండి ముక్తి పొందటం అన్నమాట. అంటే భిన్నత్వము రూపాంతరము నుండి తిరిగి మళ్ళీ ఏకాత్మ రూపాంతరం చెందటం యోగసాధన అంటారు. అనగా జీవ పదార్ధం నుండి నిర్జీవ పదార్థంగా మారటం అన్నమాట. కొన్నాళ్ళకి నిర్జీవ పదార్థం నుండి మళ్ళీ జీవ పదార్థంగా రూపాంతరం చెందటం అన్నమాట.ఇది ప్రకృతి ధర్మము.ఇదియే విశ్వ పరిణామ క్రమ విధానము. ఇక ఇందులో పుట్టడము ఉండదు.మరణము పొందటము ఉండదు.జన్మలు ఉండవు. పునర్జన్మ ఉండదు. కేవలం ఒక రూపము నుండి మరొక రూపం గా రూపాంతరం చెందటం జరుగుతుంది. ఇది ఏ భగవంతుడు ప్రమేయము లేకుండా వారి ఆలోచనలు లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా జరుగుతుంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాలి. 

అది ఏమిటంటే ఆది కృష్ణబిలం నుండి ఆది జీవ పదార్ధం ఆది దేవుడిగా 36 తలలతో అనగా 36 భావాలతో ఆది సదాశివమూర్తి స్వరూపం ఏర్పడినట్లుగా మన పురాణ ఇతిహాసాలలో కనపడుతుంది. ఈయన ఒక పిరమిడ్ ఆకారంలో అనగా 1, 3, 5, 7, 9, 11 తలలతో 36 కపాలాలుగా ఉన్న అస్తిపంజరంగా మారడం జరిగినది. ఈయన జీవసమాధి చెందుతున్న సమయంలో రూపాంతరం చెందిన వెయ్యి కోట్ల పరమాత్మ రూపాలను 36 కోట్ల ఆత్మ స్వరూపాలను 84 లక్షల జీవ జాతులను రూపాలతో కూడిన విస్తార దృశ్యం చూడడం జరిగినది.ఇదంతా ఒక జ్ఞాపకం లాగా తన మెదడులో నిక్షిప్తం అయినది. దానితో తన వేసిన రూపాంతర రూపాలను చూసి అమిత ఆనందపడుతూ తట్టుకోలేని ఆనంద పరిస్థితి పొంది జీవ సమాధి చెందడం జరిగింది. దానితో అప్పటిదాకా ఈ మెదడులోని పిట్యూటరీ గ్రంధిలో నిక్షిప్తమైన జ్ఞాన సమాచారము కాస్త ఒక విశ్వ జీవ నాటక దృశ్యంగా రికార్డ్ అయినది. దానితో ఈయన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న ఆది కృష్ణ బిలము యొక్కరూపము తనలోనికి ఈ నిక్షిప్తమైన సమాచార దృశ్యాలను నెమ్మది నెమ్మదిగా తీసుకోవడం ప్రారంభించింది. నూట ఎనిమిది నిమిషాల నిడివిగలది అనగా 71 మహాయుగాలు అనగా ఒక మన్వంతర కాలము వరకు ఇది తనలోనికి తీసుకున్నది. అప్పటిదాకా ఇవే దృశ్యాలు మనకి కనపడటం మనము చూస్తున్నాము. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదిలోనే రేణు వంటి కృష్ణ బిలము ఎన్ని రూపాలుగా రూపాంతరం చెందిందో అన్ని రూపాలు రూపాంతరం చెంది ఆపై నిశ్చల స్థితి అనగా నిర్జీవ పదార్థం అయినది. జీవ పదార్ధ దృశ్యాలు వరకే రికార్డ్ అయినాయి. అంటే మనం కొత్తగా ఏమి చేసేది లేదు. కొత్తగా పొందేది ఏమీ లేదు. రూపాంతరం చెందేది ఏమీ లేదు కూడా. రికార్డు దృశ్యాలను మనం చూస్తున్నాము. నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు అంతే. నిజానికి మనం ఏమీ చేయటం లేదు.
 
అలాగే మనము కొత్తగా రూపాంతరం చెందటం లేదు. ఎందుకంటే రామాయణంలో కాకభుంశుడు రాక్షసుడు అలాంటి పరిస్థితి నెలకొంది. జరిగిన రామాయణ మహాభారతాలను కార్యక్రమాలు చూడటం జరిగింది అని చెప్పడం జరిగింది కదా. అంటే జరిగిన రామాయణ మహాభారతాలే మళ్లీ తిరిగి తిరిగి రిపీట్ అవుతున్నాయంటే ప్రతి మన్వంతరమునందు ఒకసారి ఈ దృశ్యం రిపీట్ అవుతోందని తెలుస్తోంది కదా. అంటే మనం చూస్తున్న చేస్తున్న అనుకునేది అంతా కూడా రికార్డ్ దృశ్యమే కదా. అనగా అది జీవ పదార్థము యొక్క భావ, సంకల్ప, ఆలోచన, స్పందన, ఆశభయ రూపాలే మనము ఎత్తినాము. మన దైవాలు ఎత్తినారు.మన పరమాత్మలు ఎత్తినారు అని చెప్పినారు. అవే జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు అన్నమాట. సాధన ప్రారంభంలో మూలాధారచక్రంలో జీవ పదార్థంగా మహాగణపతి కనిపిస్తే అదే బ్రహ్మరంధ్రము వద్ద ఇది నిర్జీవ పదార్థంగా బ్రహ్మాండ చక్రము అనే కృష్ణ బిలము కనపడినది. దానితో ఈ అనుభవాలను క్రోడీకరించి వ్రాయటం జరిగింది. ప్రతి జీవిలోనూ ప్రతిదానిలోనూ ఇవే నా అనుభవాలు అనుభూతులు దృశ్యాలే ఉంటాయి. ఎందుకంటే విశ్వమే ఒక పదార్థం అయినప్పుడు అందులో ఉన్న మనము జీవపదార్థంలే కదా. ఈ జీవ పదార్థము కాస్త అణువులు పరమాణువులు రేణువులు కూడా సంయోగ వియోగ రూపాంతరం రూపమే కదా. కాకపోతే ఆది మన్వంతరము దాకా జరిగిన వాటిని రిపీట్ అవుతూ ప్రస్తుతం ఏడవ మన్వంతరం దాక వేచి చూడడం జరిగినది. రాబోవు మన్వంతరములలో ఇవే రికార్డ్ దృశ్యాలను చూడడం జరుగుతుంది. దృశ్యం మారదు. సాగదు. ఆగదు. అని గ్రహించండి. కాకపోతే ఇది రికార్డు దృశ్యమని గ్రహించలేకపోయారు. ఆదిలో అత్యంతిక ప్రళయం దృశ్యాలు చూసిన మన పూర్వ మహర్షులు తాము తెలియకుండా చేసిన పాపపుణ్యాల వలన భూమి అలాగే విశ్వానికి విపత్తు జరగబోతుందని భయపడి ఆది జీవ పదార్థాల్లో ఉత్తమమైన నిర్జీవ పదార్థానికి భగవంతుడు అని నామకరణం చేసి ఈ పదార్థమే ఎత్తిన రూపాలను ఆయన అవతారాలుగా మార్చి సహస్ర నామాలతో పూజాది కార్యక్రమాలు చేయడం ప్రారంభించి జ్ఞాన కాండ కాస్త భక్తికాండగా మార్చడం జరిగినది. ఇదియే వారు తెలిసి లేదా తెలియక చేసిన అతి పెద్ద తప్పు. దీని వలన పాపాలు తగ్గి పుణ్యకార్యాలు చేస్తారని వారు అనుకున్నారు. కానీ దోచే వాడికి పాపభీతి భయ భీతి లేదు. కానీ దోచుకోబడినవాడు మాత్రము తానే ఏదో పాపం చెయ్యి బట్టి ఇలా జరిగింది అని భయపడుతూ ఇష్ట దైవ నామ స్మరణ చేయు చున్నారు. వీళ్ళ దృష్టిలో భగవంతుడంటే భయము, భక్తి ,నమ్మకము, భుక్తి. వీరికి ఉన్న బలహీనతలను, ఆశలను, కోరికలను ఆసరా చేసుకుని పండిత పామరులు భుక్తి పొందుతున్నారని నగ్నసత్యం అని గ్రహించండి. భక్తిని కాస్త భక్తి వ్యాపారసంస్థలుగా మార్చారు. రాతి బొమ్మలు చూడడానికి డబ్బులు, ప్రసాదాలకి డబ్బులు, పూజలకి డబ్బులు మరి ఆయన కావాలనే ఎవరినైనా అడిగాడా? మహా లక్ష్మి చెంత  వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చే డబ్బులు ఎంత వరకు అవసరం పడతాయో అలాగే కుబేరుడునే మిత్రుడుగా ఉన్న పరమేశ్వరుడికి మన డబ్బులు ఎంత అవసరం పడతాయో ఏదో ఒకసారి ఒకరైన ఆలోచించారా. మనము చనిపోయినప్పుడు ఒక్కపైసా కూడా తీసుకుని వెళ్ళమని అందరికీ తెలిసిన విషయమే కదా. మరి మీరు పూజించే నామదేవుడు అంతా కూడా స్మశానవాసులే కదా. ఎవరు కూడా ఇప్పటికి సజీవమూర్తి గా బతికి ఉన్న ఒక నామరూప దేవుణ్ణి చూపించండి. అదికూడా ఉత్తమ మానవుల్లో కాని వారిని చూపించండి.
 
ఎక్కడ కనిపించడు. అందరు కూడా ఎప్పుడో వారి అణువుల మధ్య తేడాల వలన విచ్ఛిన్నమై మరొక రూపంగా అవతరించిన వారే కదా. మరణము అంటే అణువులుగా విడిపోవడమేనని…. జననము అంటే అణువులు సంయోగం చెందటం అని గ్రహించండి. మీరు పూజించే ఉత్తమ మానవుల అదే నామరూప దైవాలు అంతా జీవ సమాధి ద్వారా మరణం పొందిన వారే కదా. ఈ కోవలో మహాశివుడు, మహావిష్ణువు, ఆది పరాశక్తి, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, షిరిడి సాయిబాబా, శ్రీ దత్తుడు ఇలా ఎందరో ఉన్నారు. అసలు భగవంతుడే ఎక్కడా లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే మాట ఎక్కడి నుండి వస్తుంది. జీవ పదార్ధము యొక్క పేరుయే భగవంతుడు.ఇది కూడా నిర్జీవ పదార్థం యొక్క రూపాంతరమే అని తెలుసుకున్నారు కదా. అంటే భగవంతుడు ఆది రూపము ప్రాణం లేని స్థితి అనగా మరణ స్థితియే కదా. మరణించిన దేవుడు ఎక్కడ నుండి వస్తాడు. ఏ దేవుడు ఉన్నాడని మిగిలిన జీవ పదార్థాలు యొక్క అసంపూర్ణ జ్ఞాన ఆలోచన భావాల నుండి వచ్చినదే కదా. ఉత్తమ లక్షణాలు ఉన్న ఉత్తమ మానవుడుని ఎంచుకుని వారిని ఆదిలో మన దేవుడుగా, ఆది గురువుగా, ఆదియోగిగా, ఆది పరమాత్మగా నామాలను పెట్టుకుని అర్చన విధానాలు యోగ విధానాలు ఏర్పరచుకుని ఆరాధన యోగ ప్రక్రియలు చేసుకుంటూ వచ్చినాము. చేస్తున్నాము. చేయబోతున్నాము. ఒక పదార్థము మరొక పదార్థంను పూజించటం ఒక దేవుడు మరొక దేవుని పూజ చేయడమా ఆలోచించండి. పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీభత్సాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వానల నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . అమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదని , ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షలు లేని దేవుడు ఉన్నట్లుగా...వివిధ వేద,శాస్త్ర,పురాణ,ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడము జరిగినది!  నమ్మకమే జీవిత నావకు దిక్చూచి. నిజానికి ఈ విశ్వము విశ్వాసముతోనే నడుస్తోంది!  ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనస్సులు ... మనిషి మనిషి కి తేడా , మనస్సు మనస్సు కి తేడా ఉంటుంది . మనస్సు + శరీరము కలిస్తేనే మానవ జీవి . ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి. పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికి తెలియదు . తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు!తెలియనివాడు తెలుసుకోలేడు! ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. మనం చేస్తున్న అవివేక పని ఏమిటో తెలుసుకోండి. ఎప్పుడైతే మనలో పాపపుణ్యాలు, భయాలు, మరణ భయాలు, ఆరోగ్య భయాలు, సమస్యల భయాలు, పాప కార్యాల భయాలు, పాప ఆలోచన భయాలు పోతాయో అప్పుడే నీ మనస్సుస్సు కాస్తా స్థిరమై నీవే దేవుడివి నీకే స్పురణ కలిగిస్తుంది. అప్పటిదాకా ఈ భయాల వలన పంచభూతాలు, ప్రకృతి శక్తులు, నామరూప దేవుళ్ళు, దైవిక వస్తువుల ఆరాధనలు మనల్ని భయపడుతూనే ఆశ పడుతూనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని గ్రహించండి. మీరే దేవుడు అనే విషయం మర్చిపోయే దాకా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా ఈ విషయంలో భగవంతుడు ఉన్నట్లుగా ఆయన పాత్రని సృష్టిలో గాని స్థితిలోగాని లయము లో గాని ఉన్నట్లుగా మనకి కనిపించ లేదు కదా. 
 
అదే నిజమైతే ఈ విశ్వమంతా కూడా ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండాలి కదా. గొడవలు కలహాలు హత్యలు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడో ఆలోచించండి. దేవుడు ఉంటే ఎలా ఊరుకుంటున్నాడో ఆలోచించండి. మంచి వాడికి కష్టాలు దొంగ వాడికి సుఖాలు ఎందుకు కలుగుతాయి. అది అంటే వారి వారి ప్రారబ్ధ కర్మ ఫలితాలు అని చెబుతారు. దేవుడి దృష్టిలో మంచివాడు చెడ్డవాడు అనే వారు ఉండరు. అందరిని సమానంగా చూస్తాడు అని చెబుతారు. మరి అందరిని సమ దృష్టితో చూసినప్పుడు ఒకడు ఆయాసంతో చస్తూ ఉంటే మరొకడు అసలు నీరసంతో ఎందుకు చస్తున్నాడు. దీనికి సమాధానమే గత జన్మలో వారు చేసుకున్న ప్రారబ్ధ కర్మ ఫలితాలు అంటారు. నిజానికి మనకి ఆదిలో కర్మ లేనపుడు కర్మ ఫలితాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి. అంటే మీ భగవంతుడే 50 శాతం పాపాలు 50 శాతం పుణ్యాలు ఇచ్చి ఉండాలి కదా. మరి ఆయన ఇలా ఇచ్చినప్పుడు మనకి కలిగిన కర్మ ఫలితాలు ఎందుకు మార్చలేక పోతున్నాడు అంటే విధి విధానాలకు కట్టుబడి ఉండాలి అంటారు. మరి ఆయన తప్పులు చేయవచ్చును. అదే మనం చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్తారు కదా. ఇదంతా ఇలా సృష్టించి మిడిమిడి జ్ఞానులు మెట్టవేదాంతులు పాపం చేస్తే దేవుడికి పూజలు చేస్తే పోతాయట. అక్కడేమో అసలు ఆయన లేడు. ఆయన పేరు చెప్పి వారిని భయపెట్టి బాధపెట్టి ఆశపెట్టి తమ వృత్తి కోసం వాళ్ళని పూజలు యాగాలు, హోమాలు, యజ్ఞాలు పేరుతో నానా చంకలు నాకించి వీళ్ళని బికారులుగా చేసి వాళ్ళు బిలియనీర్లు అవుతున్నారే. ఇదేమైనా న్యాయమా? జ్ఞానకాండని కాస్త భుక్తికాండగా మార్చి వాడుకున్న ఉద్దండ పండితులు అలా మనిషి చనిపోతే కర్మకాండలు పేరుతో పిండప్రదానాలు పేరుతో దశదానాలు పేరుతో బాధలో ఉన్న వాడి నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి పూజలు చేస్తారు. ఎక్కడైనా ఆత్మలు పిండాలు తినటం చూసావా? విగ్రహాలు నైవేద్యం తినటం చూశారా? వాళ్ల పేర్లు చెప్పుకునే మనం తింటున్నామని ఎవరు గ్రహించరు. అదేమిటంటే భక్తులు వంటిమీదకి ఆత్మ రూపంలో చనిపోయిన వారు బోజ్య పదార్ధాలు సేవిస్తారని చెబుతారు. మరి ఆ పది రోజులే ఎందుకు? రోజు రావచ్చు కదా. అది అంటే కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతారు అని చెబుతారు. పాపం ఈ రూపేణ వాటి ఆకలి తీరుస్తున్నారు.ఏ కాకి లో ఎవడి ఆత్మ ఉన్నది ఎవరైనా చెప్పగలరా? ఎవరి శరీరంలో ఎవరి ఆత్మ ఉందో ఎవరైనా గుర్తించగలరా చెప్పండి. పైగా కాశీక్షేత్రంలో పిండప్రదానము అవసరం లేదని అవిముక్త క్షేత్రమని ఒకపక్క చెబుతూనే ఇక్కడ మన చేత లక్షల్లో డబ్బులు గుంజి           పిండ ప్రధాన కార్యక్రమాలు 12 రోజులపాటు చేయటంలో ఏమైనా అర్థం ఉందా? ఒక సిద్ధాంతం మీద నిలబడటం లేదు. ఒకచోట అవసరం లేదు అంటారు. మళ్లీ ఇదే వేరేచోట అవసరం ఉందని అంటారు. ఈ రెండు నాలుకల మాటలు పూజా కార్యక్రమాలు నేను పూర్తిగా వ్యతిరేకం. వాటిని సమర్థించను. కేవలం వారి భుక్తి కోసం ఏర్పాటు చేసుకుని విధివిధానాలు ఇవి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. 12 రోజుల కింద పిండప్రదానము చేసిన వాళ్ళు కూడా చచ్చినవాడు ఏ రూపంలో ఉన్నాడో ఎత్తినాడో లేదో చేసిన వారికి తెలియదు. చేయించుకున్న వారికి కూడా తెలియదు. చేయకపోతే పితృ దోషాలు, మాతృ దోషాలు, దైవ శాపాలు కలిగి అశుభాలు కలుగుతాయని ముందుగానే భయపెడతారు కదా. అంతెందుకు ఈ పిండప్రదాన దానాలలో ఆవు దానము ఒకటి.ఒక గోవునే అన్నిచోట్ల అందరి చావులకి తిప్పుతారు. అందరి చేత ఆ గోవును దానంగా ఇస్తారు. మరి వాడు పాపం చేయటం లేదా పాపం చేసిన వాడితో పుణ్య కార్యక్రమాల ఫలితం ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించండి. సూక్ష్మములో మోక్షమని మనకి వీళ్ళు నీతులు సూక్తులు కథలు చెబుతారు. 

అంటే మీరు ఆత్మలు లేవా అంటారా? అంటే అణువుల సంయోగము వలన ఆత్మ పదార్థం ఏర్పడుతుంది. దీనికి ఆత్మ శక్తి ఉంటుంది. ఈ శక్తి పాజిటివ్, నెగిటివ్ గానే ఉంటుంది. బలమైన తీరని కోరిక ఉంటే ఆత్మ సంయోగం తాత్కాలికంగా దూరమై మళ్లీ కలుసుకుని ప్రేత శక్తిగా మారుతుంది. అదే ఎట్టి కోరిక లేకపోతే అణువులు విడిపోయి శూన్యములో కలిసిపోతుంది లేదా వేరే రూపంలో రూపాంతరం చెందుతాయి. వీటికి మనము పిండ ప్రధాన కార్యక్రమాలు పూజలు చేసిన చేయకపోయిన జరిగేతంతు సహజసిద్ధంగానే జరుగుతుంది. అంతెందుకు శూద్రులకు ఎటూ పిండ ప్రధాన కార్యక్రమాలు లేవు. మరి వారి ఆత్మలు విశ్వం అంతా నిండి ఉండాలి కదా. ఎందుకంటే పిండ ప్రదానం దొరకకపోతే ఆత్మకి ఆత్మశాంతి పొందక కోపంతో రగులుతూ ఆవేశపడుతూ అశాంతిగా పాడుబడిన బావులలోనూ, గుట్లలోను, పాడుబడిన గృహాలను, పాడుబడిన దేవాలయాల్లోనూ తిరుగుతున్న కథలు ఉండనే ఉన్నాయి కదా. అదేమిటి ఇది ఇలా ఈ ప్రాంతాల్లో దయ్యాలను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అసలు వీరికి ముందు దెయ్యం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఎప్పుడైతే పుస్తకాల ద్వారా పెద్దల ద్వారా వీటి గురించి కథలు కథలుగా పుకార్లు తెలుసుకుంటాడో ఆ క్షణము వాడిలో దెయ్యం భయం మొదలవుతుంది. దానితో ఎప్పుడైనా ఎక్కడైనా స్మశానాల వెంట లేదా పాడుబడిన గృహాలను ఒక్కసారి చూడగానే ఆకులు గాలికి కదిలినా అంతే మన వాడికి ఉచ్చ బయటికి వచ్చి దెయ్యం అనుకుంటూ అని భయపడుతూ అసలు అక్కడ ఏమి జరిగిందో దానికి గల కారణం ఏమిటో విశ్లేషణ చేయకుండా ఊర్లో వాళ్లకి తాను రాత్రి చూసి దడుసుకున్న భయం కథలు కథలుగా చెప్తాడు.అవి కాస్తా అంతులేని కథగా ప్రచారంలోనికి వస్తాయి. ఆత్మలు ఉన్నాయి. వాటిని నమ్ముతాను అని నిజానికి అణువుల సంయోగం ఆత్మ పదార్థం అని తెలుసుకోండి.ఇది నిజము కాదు. సత్యము లాంటి అసత్యమని గ్రహించండి. మనము పదార్థంతో ఏర్పడిన స్థూల శరీరము అయితే ఆత్మలు అనే అణువులతో ఏర్పడిన సూక్ష్మశరీరం అని గ్రహించండి. వాటికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ సత్యం కాదు. సత్యం లాంటి అసత్యమేనని గ్రహించండి. దయ్యాలైనా దేవుడైన అంతేనని గ్రహించండి. మీలో ఉన్న అణువుల శక్తి వాటిలో ఉన్నది అని గ్రహించండి. వాటి మీద మనం ఏర్పరచుకున్న భయాల నుండి విముక్తి పొందండి. అప్పుడు దెయ్యము దేవుడు అని వేర్వేరుగా మనకి కనపడవు. ఎప్పుడైతే మనలో భయం మొదలయిందో దయ్యము అదేం మనలో ఆశ మొదలయిందో దేవుడు కనిపిస్తాడు. మనలో ఆశ భయం అనేది రెండు లేకపోతే ఏమీ ఉండవు. దేవుడు లేడు. దయ్యం లేదు అని నమ్మే నాస్తికుడు ఎంతో ధైర్యవంతుడు అన్నమాట. దేవుడున్నాడు అలాగే దయ్యం ఉన్నది అని నమ్మే ఆస్తికుడిలో బలహీనత కలిగిన బలహీనుడు అని నా ప్రగాఢ విశ్వాసం. 

 
ఈ విశ్వంలో ప్రతి దానికి ప్రతి వాడికి ఏదో ఒక బలహీనత తప్పనిసరిగా ఉంటుంది. లేకపోతే అణువుల సంయోగ ఈ విశ్వ పదార్థమును ఏర్పరచలేవు కదా. బలహీనత లేని బలవంతుణ్ణి అది కూడా నిర్జీవ పదార్థం ఇంతవరకు తయారు చేయలేదు. రూపాంతరం చెందలేదు. ఎందుకు అంటే ప్రాణం లేని దానికే బలహీనత ఉన్నది అంటే విషయం మీరే ఆలోచించుకోండి. ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం రావచ్చు. ఈ అణువుల సంయోగాలు వియోగాలు ఎవరు సంకల్పము లేదా ఆలోచన లేదా స్పందన మీద ఆధారపడి చేస్తూ ఉండవచ్చు కదా అన్నప్పుడు అణువుల మధ్య ఆకర్షణ వికర్షణ అనే శక్తులు మాత్రమే ఉంటాయి. సజాతి ధ్రువాలు కలుస్తాయి. విజాతి ధ్రువాలు విడిపోతాయి. మీకు అర్థం కావాలంటే విశ్వంలో విశ్వ రేణువులుగా అయస్కాంతాలు ఉన్నాయని అనుకోండి.ఐస్కాంత లక్షణం ఏమిటి అతుక్కోవటం లేదా విడిపోవడం. దీనికి ఎవరైనా ప్రమేయము అవసరం పడుతుందా... ఉండదు కదా. వీటి ఆకర్షణ వికర్షణ బలం వాటిని కలుపుతూ మరొకచోట విడిపోతూ ఉంటాయి కదా. కలిసిన చోట మన కంటికి అగుపించే జీవపదార్థం కనపడుతుంది. విడిపోయి ఉన్నచోట ఎట్టి రూపము కనిపించదు. ఈ సూత్రమును మన యోగులు సాధించే సాక్షాత్కారమునకు అన్వయించి చూడండి. 

ప్రాణం లేని శిల్పం కాస్త ఒక దైవ విగ్రహంగా మారుస్తారు. దీనికి యంత్ర ప్రతిష్ట కావించి ఆత్మశక్తి తో ప్రాణప్రతిష్ట చేసి ఈ విగ్రహం సజీవ కళతో పూజలు అందుకునేట్లు చేస్తారు. అసలు వాస్తవం ఏమిటంటే ఈ శిల్పంలో అణువులు పరమాణువులు రేణువులు పంచభూత శక్తితో ఆకర్షణ వికర్షణ శక్తులతో ఈ రాయిగా రూపాంతరం చెందుతుంది. అది నిశ్చల స్థితిలో ఉన్నప్పటికి ఆ రాయి కేంద్రకంలో ఇవి తిరుగుతూనే ఉంటాయి. అప్పుడు శిల్పి కాస్తా తనకు కావలసిన రూపమును చెక్కుతాడు.ఈ విగ్రహమునకు పూజారులు కాస్త యంత్ర ప్రతిష్ఠ అలాగే ఆత్మశక్తితో జీవ కళ తెప్పిస్తారు. అనగా ఆ పరిసరాల్లో నెగెటివ్ శక్తి యొక్క ఆత్మ శక్తి అణువులు ఈ విగ్రహం ఆకర్షించుకునేటట్లుగా వివిధ పూజాకార్యక్రమాలు చేస్తారు. తద్వారా ఆకర్షించబడిన అణువులు విడిపోకుండా ఉండడానికి దానికి కావలసిన ఆకర్షణ యంత్రము బిగించి దానికి తమ జప ఉపాసన మంత్ర శక్తులు ధారపోస్తారు. తద్వారా ఈ విగ్రహం జీవపదార్థంనకు ఉండే లక్షణాలు వస్తాయి.అనగా నిర్జీవ రాయి కాస్తా సజీవ మూర్తిగా అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ విగ్రహానికి పంచామృత అభిషేకాలు తో చేసిన తీర్థము మనము సేవించినట్లైతే ఈ యంత్ర ఆకర్షణ శక్తి మన లోనికి ప్రవేశించి అప్పటిదాకా బలహీనంగా అతుక్కుని ఉన్న మన శరీరంలోని అణువుల మధ్య ఆకర్షణ కలిగి బలంగా అతుక్కోవడంతో అప్పటిదాకా వాడికున్న వివిధ సమస్యలు తొలగిపోతాయి. మనలో 13 ఆకర్షణ యంత్రాలు ఉన్నాయి. అవే యోగ చక్రాలన్నమాట. ఎప్పటికప్పుడు యోగ  క్రియల ద్వారా ఈ చక్రాలు ఖర్చుచేసిన శక్తిని తిరిగి పుంజుకునేటట్లు చేయవచ్చును. శ్వాస మీద ధ్యాస బెడితే మనలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. తద్వారా మన లో ఈ చక్రాలకి కొత్త శక్తి కలిగి ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఆవు నే ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ను తీసుకుంటుంది. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవుపేడ వీటినే పంచామృతాలు గా మన పూర్వీకులు చెబితే అది కాస్త ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె పంచదారగా మన మధ్యవర్తుల అజ్ఞానంతో మార్చడం జరిగినది.అపుడు యోగులు తమ త్రినేత్రములో చూసినపుడు సజీవ జీవ పదార్ధ సూక్ష్మ శరీరము వారి దైవముగా కనబడుతుంది.ఇది ఎవరికి వారే స్వానుభవము పొందాలి. ప్రాణాలు లేని రాతి నుండి ప్రాణం ఉన్న విగ్రహం మూర్తికి మార్చటానికి విధివిధానాలు నిజమని నమ్ముతాను. ఎందుకంటే ఈ విశ్వ సృష్టి అంతా రేణువు వంటి నిర్జీవ పదార్థం నుండే జీవ పదార్థం గా ఏర్పడింది కదా. కానీ నేను వ్యతిరేకించేది మాత్రము భయపెట్టే పూజలు ,డబ్బులు పూజలు, భక్తి వ్యాపారాలు అన్నమాట. మోసపోయిన వాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. ఎవరి ధర్మం వారిది. ఎవర్ని ఏమీ అనలేం. ఎవరి దగ్గర వారి వాదాలు వారికి ఉంటాయి. 

విశ్వంలో ఆదిలో రేణువంటి నిర్జీవ కృష్ణబిలం ఉన్నది అని ఎలా చెప్పగలరు అన్నప్పుడు ఈ సందేహం నీకే కాదు శ్రీ ఆది శంకరాచార్యుడుకి కూడా వచ్చినది. దానితో ఆయన ఈ విశ్వమును నాలుగు ద్వారాలు ఉన్న పీఠంగా భావించుకుని గీతలు కలుపుతూ కోణాలు కలుపుతూ త్రిభుజాలు గీస్తూ మొత్తం 67 త్రిభుజాల తీసి చివరికి ఒక ఆఖరికి త్రిభుజము ఒక బిందువును అదే శ్రీ చక్ర బిందువును ఉంచినాడు. ఈ బిందువే రేణువైన కృష్ణబిలం అన్నమాట. దీనికి అధిదేవతగా ఇష్టకామేశ్వరుడు కామేశ్వరీ ఉంచినారు. శ్రీచక్ర నిర్మాణమే చెప్పింది కదా ఈ విశ్వమంతా ఒక బిందువు నుండి వచ్చినదని తెలుసుకున్నారు కదా. అదే మా సాధన పరిసమాప్తి సమయములో బ్రహ్మరంధ్రం వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మతేజస్సు తో ఉన్న బ్రహ్మాండ చక్రము వంటిది కృష్ణబిలం కనిపించినది. అది తనలోనికి ఆ చుట్టుపక్కల ఉన్న వెలుగుతున్న నిప్పు కణికల పరిమాణంలో ఉన్న నక్షత్రాలను తనలో కలుపుకోవటం నాకు సాక్షాత్కారమైనది. దానితో ఆది చిట్టచివరి పదార్థము కృష్ణబిలం అని అదియే ఆది మొదటి పదార్థము జీవ పదార్థమైన నామరూపధారి గణపతి రూపం అని గ్రహించాను. చివరికి ఈ రెండూ కూడా విశ్వమంతా కూడా ఆకర్షణ వికర్షణ శక్తుల సంయోగ వియోగ పదార్థాలు రూపాలని ఏవీ శాశ్వతంగా ఉండవని రూపాలు మార్చుకుని నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటాయి అని నేను స్వానుభవము పొందడం జరిగినది. కనిపించేదంతా అసత్యమైనదని కనిపించనదంతా సత్యమైనదని ఙ్ఞానోదయమైనది.నా అభిప్రాయం ప్రకారం అంతిమ సత్యము పరమ శూన్యము.సర్వం ఏమీ లేదు.సర్వం శూన్యమని నా అనుభవ అనుభూతి జ్ఞాన సత్యం. ఈ విశ్వ పదార్థం ఏర్పరచిన ఆది రేణువు గూడ నిర్జీవమే కదా. 

దీని నుండి సజీవ పదార్థం ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఎవరి సహాయం లేకుండా కేవలం ఆ రేణువుల మధ్య ఉన్న ఆకర్షణ వికర్షణ శక్తి వల్ల కలయిక వలన రేణువులు కలిసి పరమాణువులు అణువులు గాను ఇవి కాస్తా జీవపదార్థం గా ఏర్పడినాయని ఈపాటికి గ్రహించి ఉంటారు కదా. ఈ విశ్వములో మీరు నిర్జీవపదార్థం తీసుకున్న లేదా సజీవ పదార్థం తీసుకుని భేధించుకొంటూ పోతే మిగిలేది రేణువు వంటి నిర్జీవ పదార్థమే కదా. ఇదే కదా శ్రీచక్ర బిందువు చిదంబర రహస్యం. కాకపోతే మన పూర్వీకులు మహర్షులు ఈ నిర్జీవ పదార్థమును కాస్తా ఏర్పడిన జీవపదార్థం లో ఒక దానిని తీసుకుని మిగతా వాటి నుంచి దీనిని వేరు చేసి నువ్వు వేరు నేను వేరు అంటూ భావన పెంచుతూ జ్ఞాన కాండం కాస్త భుక్తికాండ దాకా మార్చడం వలన మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయి. లేని దేవుడు లేడని ఆనాడే ఆదిలోనే ఒప్పుకుంటే ఆదిలో మనకి ఈ తిప్పలు ఉండేవి కావు. ఏదో చేయాలని అనుకుని ఏదో చేసినట్లుగా ఉంది. ఏదో పొందాలనుకుని ఏదో పొందినట్లుగా ఉంది. ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏదో విధంగా చేసినట్లుగా నాకు అనిపించింది.

మన శాస్త్రవేత్తలు తీసిన ఆది కృష్ణబిలం  ఫోటో
 విచిత్రం ఏమిటంటే ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు ఆది కృష్ణబిలం ఎలా ఉంటుందో అని టెలిస్కోపును ఉపయోగించి ఫోటో తీయడం జరిగినది. మీరు బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము అనే అధ్యాయంలో చదివి ఉన్నారు కదా. అలాగే ఆది అణువు ఎలా ఉంటుంది దాని నిర్మాణం ఏ పదార్థాల వల్ల జరిగినదో 10 సంవత్సరాల ప్రయోగాల తర్వాత తెలుసుకోవడం జరిగినది. అంటే ఈ లెక్కన నా జన్మలో కనిపించిన బ్రహ్మాండ కృష్ణబిలాలు సాక్షాత్కార జ్ఞాన అనుభవం నిజమేనని అలాగే ఆదిలో ఒక ఆది అణువు వలనే ఈ విశ్వపదార్థం ఏర్పడిందని నాకు కలిగిన అనుభవం నిజమేనని ఈ శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిరూపించడం జరిగినది. నా వాదనకి సరియైన సజీవ సాక్ష్యాధారాలను సరైన సమయంలో అందించడం జరిగినది. ఎందుకంటే అంతర్దృష్టి సాక్షాత్కారము అనేది ఎవరికి వారికే జరుగుతుంది. అనగా స్వయంభువు అణువు అనుభూతి పొందడం జరుగుతుంది. కాబట్టి ఇది నాకు జరిగింది అని చెబితే నమ్మటానికి నమ్మించడానికి నా దగ్గర హేతుబద్ధ ఆచరణీయ శాస్త్రీయత సాక్షాలు ఉంటే అందరూ నమ్ముతారు. నాకు కనపడింది నాకు ఎరికే అయినది మీకు కనిపించడం లేదా అని నేను ఈ మధ్యనే దేవుడని అని నేనంటే ఎవరైనా నమ్ముతారా. నమ్మరు కదా. నా స్వానుభవం అయ్యేదాకా నేనే దేవున్ని అని నేను నమ్మే వాడిని కాను. ఎప్పుడైతే నా స్వానుభవం అయిందో అనగా నా బ్రహ్మరంధ్రము వద్ద బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము అలాగే నిర్జీవ ఆది అణువు నుండి జీవ పదార్థం ఏర్పడిన విధానం మాకు జ్ఞాన స్పురణ అయినాయో వీటిని శాస్త్రీయ ఆధారాలు మన శాస్త్రవేత్తలు ప్రయోగాలు కూడా విజయం పొంది నా అనుభవాలు నిజమని నిరూపించారు కదా. 
 
చాలామందికి ఒక చిన్న సందేహం రావచ్చును. అదేమిటంటే కృష్ణబిలంలో పడిన ఏది కూడా వెనక్కి తిరిగి రాదని మన శాస్త్రవేత్తలు చెబుతుంటే ఆది కృష్ణబిలం నుండి మనం ఎలా వచ్చినాము అన్నప్పుడు ఆది కృష్ణబిలం నిశ్చల స్థితిలో అనగా చలన రహితంగా ఉంది. దానిలో 36 మూలకాలు ఉన్నాయి. ఇవే భగవత్ తత్వాలు లేదా సదాశివుని 36 కపాల సంకేతాలు. ఇవి కూడా ఒక పిరమిడ్ ఆకారము 1, 3, 5, 7, 9, 11 వరుసలో 36 మూలకాలు ఉన్నాయి. దానితో ఈ కృష్ణబిలాలు ఆదిలో తేజస్సుతో వెలుగుతున్న మహా నక్షత్రముగా ఉండేది.ఎప్పుడైతే మూలకాల మధ్య ఉన్న బంధాలు హెచ్చుతగ్గులకు రావడంతో వీటిలో ఉన్న న్యూ ట్రాన్స్ ఉన్న కాంతి తగ్గుతూ రావటం ఈ మూలకాలు లోని వాయువులు సుడులు తిరగడం ఆరంభమయ్యే ఇవి కాస్త పరమాణువులుగా మారి బయటికి తొయ్యబడి ఆ తర్వాత ఈ కృష్ణబిలం వేగంగా సుడులు తిరుగుతూ తమ కాంతిని పూర్తిగా కోల్పోయి చీకటి క్షేత్రము గల కృష్ణబిలం గా మారిపోయినది. దానితో కృష్ణబిలం చలన స్థితిలో ఉండి దాని పరిధిలో ఉన్న వాటిని తనలోనికి తీసుకోవడం ఆరంభించింది.అందుకే మాకు బ్రహ్మరంధ్రము వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మండ చక్రం అనే కృష్ణబిలం చిట్టచివరిది ధ్యాన అనుభవమైన అలాగే ఆది అణువు  అనగా శ్రీ చక్ర బిందువు దర్శనం అనేది కూడా ధ్యాన అనుభవమైనది. విచిత్రము ఏమిటంటే ప్రతి జీవ పదార్థం కూడా ఒక చిన్నపాటి కృష్ణబిలంతో సమానం. ఈ లెక్కన చూస్తే 84 లక్షల జీవరాశులలో ఒక జాతిలో వెయ్యి కోట్ల మానవజాతి ఉంటే అనగా వెయ్యి కోట్లు కేవలం మానవ జాతి కృష్ణబిలాలు ఉంటే మరి మిగిలిన జీవజాతులు ఎన్ని కోటాను కోట్ల కృష్ణబిలాలు ఉన్నాయి కదా. అలాగే దైవ జాతులు 36 కోట్ల జాతులలో ఎన్ని కోటాను కోట్ల కృష్ణబిలాలు ఉన్నాయి అలాగే పరమాత్మ జాతిలో ఒక కోటి జాతిలో మరి ఎన్ని కోట్ల కోట్ల కృష్ణబిలాలు ఉన్నాయి ఆలోచించండి. అంటే మనకి కనిపించే విశ్వమంతా కనిపించే కృష్ణబిలాలుతో కనిపించని కృష్ణబిలాలుతో కోటాను కోట్లు గా ఉన్నాయని తెలుసుకోండి. ఎవరైతే తమ సాధనా పరిసమాప్తి బ్రహ్మరంధ్రము వద్ద బ్రహ్మాండ కృష్ణబిలం దర్శనానుభూతి పొందుతాడో వారు తమకున్న వాటిని కర్మశేషం లేకుండా వాటిలో లయం అవుతూ వారి జీవపదార్థం నాశనం అవుతుంది.ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మన జీవపదార్థం అనగా స్థూల శరీరము ఐదు పదార్థ స్థాయిలలో నిర్మితమవుతుంది. స్థూల శరీర పదార్థము పదార్థముతోనూ, సూక్ష్మ శరీర పదార్థం అణువులతోను, కారణ శరీర పదార్థము పరమాణువులతో, సంకల్ప శరీర పదార్థము ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ లతో, ఆకాశ శరీర పదార్థము రేణువులతో నిర్మితమవుతుంది. అంటే ప్రతి జీవపదార్థం ఇలా ఐదు పదార్థాలతో నిర్మితమవుతుంది. వీటికి వరుసగా పంచభూత తత్వాలు ఉంటాయి. యోగ పరిభాషలో చెప్పాలి అంటే స్థూల జీవ పదార్థము మూలాధార చక్ర ఆధీనంలో ఉంటే సూక్ష్మ జీవ పదార్థము ఆజ్ఞా చక్రము నందు… కారణ శరీరం పదార్థము సహస్రార చక్రము నందు… సంకల్ప శరీర పదార్థం హృదయ చక్రము నందు… ఆకాశ జీవపదార్థం బ్రహ్మరంధ్రము బ్రహ్మాండ చక్రం వద్ద ఉంటాయని చెప్పడం జరిగినది. ఈ పదార్థాలన్నీ మూలక సంయోగ వియోగాల వలన వాటిలోని బంధాలకు వలన మనకి ఆలోచనలు- సంకల్పాలు- స్పందనలు- గుణాలు- భావాలు- ఆశలు- భయాలు- ఆనందాలు- కష్టాలు- సుఖాలు- పాపపు ఆలోచనలు- పుణ్యకార్యాలు- కోరికలు లాంటివి కలుగుతాయి. కాకపోతే ఇవేవీ లేవని అనటానికి లేవు అన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని ఎవరో ఒకరు ఉండి నడిపిస్తున్నారని చేయిస్తున్నారని సృష్టిస్తున్నారని చెప్పే భగవంతుడు పాత్ర  అనేది లేదు. కేవలం పదార్థం మూలకాల సంయోగం వియోగాల హెచ్చుతగ్గుల వలన జీవపదార్థం ఆలోచనలో మార్పులు రావడం జరుగుతుంది. తద్వారా కర్మసిద్ధాంతం ఆరంభమవుతుంది. కాని కర్మ ప్రదాత అనేవాడు లేడు. మనకి పాపపుణ్యాలు ఇచ్చేవాడు చూసేవాడు లేడు. కేవలము ఉన్నాడని పాపాలు చేస్తే నరకానికి వెళతారని పుణ్యము చేస్తే స్వర్గానికి వెళతారని భయపెట్టి ఆశపెట్టి నడిపించడం జరుగుతోంది. నిజానికి ఈ పదార్ధముల మూలకాల మధ్య ఏర్పడిన బంధం బలంగా ఉంటే వాడు పుణ్యాత్ముడు. ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా వివేక బుద్ధితో చేయడం జరుగుతుంది. తద్వారా వాడు స్వర్గానికి వెళతాడు. అలాగే ఎప్పుడైతే మన మూలకాల మధ్య బాగా  బలహీన బంధాలు ఉంటాయో వాడు పాపాత్ముడు అన్నమాట. వారి ఆలోచనలు వారి పనులన్నీ కూడా పాపపూరితముగాను ఇతరులకు హాని కలిగించే విధంగానూ అస్థిర మనస్సుతో అవివేక బుద్ధితో చేయడం జరుగుతుంది. అదియే నరకం అన్నమాట. అంటే ఈ రెండు ప్రక్రియలు అనేది మన పదార్థం మూలకాల లోని స్పందన హెచ్చుతగ్గుల వలన మాత్రమే జరుగుతుంది అని అర్థం అవుతోంది కదా. మరి ఇందులో మీరు పూజించిన భగవంతుడు పాత్ర లేదు కదా. అందువలన మన వాళ్లు భగవంతునికి మనం చేసే పాపపుణ్యాలతో ఎట్టి సంబంధం ఉండదని ఆయన కేవలం కర్మ ప్రదాత అని అవి ఇచ్చే ఫలితాలు మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మల మీద ఆధారపడి ఉంటాయని ఇలా ఎన్నో కారణాలు చెప్పి మన ఆధ్యాత్మిక వేత్తలు మీరు పూజించే దేవుడిని తమ అతి తెలివితేటలతో తప్పించడం జరిగింది. కానీ పాపాలు చేస్తే నరకములో మరణశిక్షలు అదే పుణ్యం చేస్తే స్వర్గంలో సర్వసుఖాలు ఉంటాయని భయపెట్టి ఆశపెట్టి కథనాలు వ్యాప్తి చేయడం దిట్ట అయినారు. నిజానికి వీరు చెప్పిన స్వర్గాలు నరకాలు ఎక్కడా లేవు. అని మనలోనే ఉన్నాయి. మూలకాల బంధనాలు బలంగా ఉంటే ఆనందం స్థితిలో ఉంటాడు అదే వాడి స్వర్గ సర్వసుఖాలు.అదే బలహీనంగా ఉంటే వాడి మనస్సు చేసే నానాయాగీ ఆవేదనలు, ఆవేశాలు, విరహవేదనలు, బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నరకప్రాయం. ఇంతకంటే నరక శిక్షలు ఉండవు కదా. స్వర్గ వాసులు అంటే మానవుల్లో కొద్దిపాటి మంచి లక్షణాలు కలిగి ఉన్న ఉత్తమ మానవుడు ఉండే చోటు అని ఇక్కడ ఉన్న వారిని దేవతలు అని అంటారు అని గ్రహించండి. అలాగే నరకము అంటే మానవులలో అధమ లక్షణాలు కలిగి ఉన్న అధమ జాతి మానవుడు ఉండే చోటు ఇక్కడ ఉన్న వారిని రాక్షసులు అంటారు అని మన భారతీయ ఇతిహాసాలు చెప్పడం జరుగుతోంది. పైగా మనిషి చనిపోయేటప్పుడు ఏదో గుహ లాంటిది గుహ మార్గం గుండా పోయానని చచ్చి బతికిన చెప్పిన వారి అనుభవాల బట్టి చూస్తే ఈ స్వర్గ నరకాలు అనేవి మన భూమి మీదనే ఉన్నాయని నాకు అర్థం అయినది. బహుశా హిమాలయ ప్రాంతాలను దేవభూమి అవటం వలన అది స్వర్గము అలాగే శ్రీ లంక ప్రాంతము పరిధి అంతా రాక్షస రావణాసురుడు నివాస ప్రాంతం ఉండటం వలన అది నరకం అయి ఉండవచ్చును. కాకపోతే ఎందుకంటే మన భారత ఇతిహాసాల ప్రకారం గా చూస్తే భూమి నుండి పై ఏడు లోకాలు ఉంటాయని వాటిలో ఒకటి స్వర్గ ద్వారం ఉన్నది అని చెప్పడం జరిగింది. అలాగే భూమి నుండి కిందకి ఏడు అధోలోకాలు ఉంటాయని వాటిలో ఒకటి నరకము ఉన్నది అని చెప్పడం జరిగినది. అదే మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం చూస్తే భూగోళానికి అట్టడుగున భూ కేంద్రంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు పాములు ఉండే నాగలోకం ఉండే ప్రసక్తి లేదని ఈ వేడికి జీవులే కాదు రాళ్ళు రప్పలు ఉండవని అక్కడ కేవలం మండే వాయువులు ఉంటాయని అంటారు. మరి కొంతమంది శాస్త్రవేత్తలు వాదం ఇలా అయితే మరి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రకారంగా చూస్తే భూ మధ్యభాగము లోనికి వెళ్లి అక్కడ 50 మైళ్ల లోతును త్రవ్వితే రెండువేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అగ్నిజ్వాలలు కనబడతాయట. ఈ జ్వాలలలో వస్తున్న వేడి చీలిక లో దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న విచిత్రమైన క్రిములు కనిపించినాయని 

వీటిని దాటితే మనకి బాధతో రోదించే అనేకమంది మానవ స్వరాలు తన మైక్రోఫోనులో రికార్డ్ అయినాయని దీనితో తనకు నరకము ఉన్నదని నమ్మక తప్పటంలేదు అని డాక్టర్ అజ్ కోవ్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగినది. అంతే విచిత్రంగా బైబిల్లో కూడా భూమి అడుగున మధ్యభాగంలో అగ్ని తో నిండిన ఒక సరస్సు ఉన్నదని ఆ సరస్సులో లక్షలాదిమంది పాపులు పురుగులుగా మారి శిక్షలు అనుభవిస్తూ ఉంటారని మరికొంతమంది పాపులు తగలబడుతూ ఉంటారని వీరే పెద్దగా కేకలు వేయడం ఏడవడం రోదించడం పళ్లు కొరకడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. అదే భారతీయ పురాణాలలో ఏకంగా దీని గురించి గరుడ పురాణం అనేది ఉంది. మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళితే పాపాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో సవివరంగా చెప్పడం జరుగుతోంది.ఇక నా అభిప్రాయం ప్రకారంగా చూస్తే నాకు కలిగిన అనుభవాల దృష్ట్యా స్వర్గం నరకం అనేవి ఉన్నాయి. నాకు స్వర్గంలో బంగారంలాంటి మేలిమి ఛాయతో సంచరించే దైవాత్మలు అలాగే నరకం వద్ద భయంకరమైన తోడేలు వంటి రెండు నల్లని కుక్కలు కాపలా కాయడం నల్లని కాంతి శరీరాలు ఉన్న ఆత్మలను దర్శించుకోవడం జరిగింది. ఇది ఎలా అంటారా ఎవరైతే వారి మణిపూరక చక్రం వద్ద తమ మనస్సును ధారణ చేస్తే వారికి స్వర్గ ధామము స్వర్గ వాసుల జీవన విధానం కనబడుతుంది. అలాగే ఎవరైతే తమ నాలుగో చక్రమైన అనాహత చక్రము వద్ద ధారణ చేస్తే నరకము నరకము లోకవాసులు కష్టాలు కనపడతాయి. ఇవి లేవని కొట్టిపారేయలేం. గాలి కనిపించటం లేదని గాలి లేదని అనగలమా. మన పూర్వికులు పిచ్చివాళ్ళా? పేజీలకు పేజీలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు రాసినది. నా దృష్టిలో వేదాలు అనేవి మానవ జాతి యొక్క విజ్ఞానమే కదా. మానవ జాతి అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎప్పటికప్పుడు తాము తెలుసుకున్న తాము నేర్చుకున్న అన్ని రకాల ప్రాథమిక విషయాలు అనగా విజ్ఞాన సంబంధిత విషయాలను పొందుపరుస్తూ వేరు వేరు కాలాల్లో వివిధ మహర్షులు చేత ఈ మూలవేదాలకు పొందుపరుస్తూ రావడం జరిగినది. వేదాలు ఆదిలో నిరాకార పరబ్రహ్మమే అనగా ఇప్పుడు మనం అనుకుంటున్న పరమ శూన్యమే ఉన్నది అని చెప్పడం జరిగినది. ఆ తర్వాత వచ్చిన మహానుభావులు యొక్క స్వంత అభిప్రాయాలు తమ స్వార్థం కోసం తమ కీర్తి కోసం తన ధన దాహార్తి కోసం తన గురు స్థానం కోసం తన దైవ ప్రచారం కోసం తన సిద్ధాంతాల అమలు కోసం తమ అభిమతాలను కాస్త మతాలుగా మార్చి స్వచ్చమైన పరిశుద్ధ బ్రహ్మజ్ఞాన రహస్యాలతో కూడిన వేదాలను తమ అతి తెలివి తేటలతో వారి అభిప్రాయాలను చొప్పిస్తూరావడమే దానితో జ్ఞానకాండ కాస్త భక్తి కర్మ కాండలుగా మారేదాకా మార్చకుండా ఉండలేకపోయారు. ఆది వేదాల జ్ఞానము సత్యము. మధ్యలో మార్పులతో వచ్చిన వేద విజ్ఞానము ఎందుకు పనికిరాని అసత్యం అని నాకు అర్థం అయింది. ఇలా అది వేదాలను ఆది పురాణాలు ఇతిహాసాల గ్రంధాల విశ్లేషణ చేస్తే అవి పుక్కిటి పురాణాలు కాదని విశ్వ రహస్యాలను నిక్షిప్తం చేసిన జ్ఞానభాండారాలని తెలుసుకోండి. మనిషికి అర్థంకానిది దైవం మీద పెట్టడం అనేది మధ్యవర్తి విజ్ఞానులు వలన జరిగినది అని గ్రహించండి. ఆదిలోనే అంతము జరగాల్సిందంతా జరిగిపోయిందని ఆది వేదాలు చెప్పకనే చెప్పినాయి. ఎప్పుడైతే ఈ వేదాలలో దైవ ప్రస్తావన తీసుకు వచ్చినారో ఆనాటి నుండి ఇవి భ్రష్టు పట్టడం మొదలయ్యాయి. అంతెందుకు కణనాథుడు అనే మహర్షి ఆనాడు అణువు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనకి కంటికి కనిపించని మూడు పరమాణువులతో అనగా త్రస్య రేణువుతో సృష్టి జరిగిందని చెప్పడం జరిగినది. అదే ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు ఎన్నో వందల సంవత్సరాల ప్రయోగాలు చేసి అతి సూక్ష్మాతి సూక్ష్మ మైన రేణువుల వల్లనే ఈ సృష్టి జరిగిందని ఇదియే ఆది అణువు అని దీనిని దైవకణం అని చెప్పడం జరిగినది. అంటే మన పూర్విక మహర్షులు చెప్పిన దానిని వీళ్లు ప్రయోగాలు చేసి దానికి పేరుమార్చి చెప్పినారు అని తెలుస్తోంది కదా. అదే పూర్వీకులు పసుపు యొక్క ఔషధ గుణాలు గ్రహించి అన్నిటిలోనూ పసుపును అనుసంధానము ఉండాలని అనుబంధము ఉండాలని గడపకు పసుపు రాయటం, పూజలో పసుపు వాడకం పసుపు గణపతి చేయించటం, పసుపు నీళ్లు తాగించడం, పసుపుతో స్నానాలు చేయించడం, ఒంటికి పసుపు పూసుకోవడం లాంటివి ముందుగానే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పి వాటిని ఆచరణలో ఉంచితే వాటిని మనము నమ్మకుండా పాటించకుండా కొట్టిపారేయడం జరిగినది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల తర్వాత అదే ప్రయోగాలు చేసి పసుపుకి ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరో బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబితే వామ్మో పసుపు తినాలి, తాగాలి, వాడాలి అంటూ మొదలు పెడుతున్న భారతీయుని ఏమనాలో మీకే వదిలేస్తున్నాను. ప్రతి వాడు మన పూర్వీకులు చెప్పిన దానిలో అర్థం పరమార్థం ఉన్నదని గ్రహించకుండా అవహేళనతో అవి అన్ని కూడా పుక్కిట పురాణాలు అని అనడం తప్పు. ఇప్పుడు మనం చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పుట్టించే విధానము ఆనాడు వేదవ్యాసుడు చేసినట్లుగా శ్రీ మహాభారత గాధ ఉన్నది కదా. అప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా వాటి పేర్లతో వారికి ఉన్న జ్ఞానముతో ఆ ప్రక్రియలు చేయడం జరిగినది. దీనిని అవహేళన చేయకుండా కుండలో పిండం పెడితే అది కాస్త వంద మంది పిల్లలు ఎలా పుట్టారో పరిశోధన చేసి ఉండి ఉంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానమని తెలిసేది కదా. ఆనాడు కుండతో ఈ విధానము చేస్తే ఈనాడు  ట్యూబ్ లో ఈ విధానమే చేస్తున్నారని సిద్ధాంతాల్లో తేడా లేదని వారు ఉపయోగించే విధానాలలోనే తేడాలు ఉన్నాయని గ్రహించండి. కాకపోతే మనం అంతా ఎప్పుడో తెలుసుకున్న దానిని తిప్పితిప్పి పేర్లు మారుస్తూ చేస్తున్నామని గ్రహించండి. చేసిన ప్రక్రియ మళ్లీ మళ్లీ చేస్తున్నామన్నమాట. చేయవలసింది అంతా తెలుసుకోవాల్సింది అంతా పొందవలసిన అంతా ఆదిలోనే పొందినదంతా రికార్డ్ అయినది. ప్రస్తుతం ఆ రికార్డు దృశ్యాలు చూస్తున్నాము కానీ ఆ విషయం గ్రహించలేని నమ్మలేని స్థితిలో ఉన్నాము. మరొక విషయం వేదాల సృష్టికర్త భగవంతుడు కాదు. మన ఆదిమానవులలో తెలివైన మానవుడి యొక్క కృషి ఫలితమే వేదాల సృష్టికర్త అయినాడు. వీరికి భగవంతుడు అనే నామమును మనవాళ్ళు పెట్టుకున్నారు అని గ్రహించండి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే పాపపుణ్యాలు అనేవి మూలకాల లోని హెచ్చుతగ్గుల వల్ల కలుగుతుంది అని తెలుస్తోంది. అలాగే మన జీవపదార్థం ఐదు రకాల పదార్థాలతో నిర్మితమైనది అని తెలుసుకున్నారు కదా. ఈ పదార్థం విభాగాల్లో ఉన్నప్పుడు అణువులు విడిపోతే అదే మరణము పొందితే ఆపై శరీర పదార్థము ఆకర్షించబడే చోటికి వెళుతుంది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్వర్గము నరకము అనేది భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న లేయర్స్ లో ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. భూమికి ఉత్తరదిశలో స్వర్గం ఉన్నదని దీనికి అధిదేవత కుబేరుడు అని పైగా స్వర్గం దేవతలు ఇందులో ఉంటారని ఉత్తర దిక్కు దేవస్థానం అని చెప్పడం జరిగింది కదా. అలాగే భూమికి దక్షిణ దిక్కు ఇదియే మృత్యు దిక్కు అనగా నరకము ఈ దిక్కు అధిపతిగా యముడు ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది కదా. దక్షిణం దిక్కు యమ స్థానం అని ఉత్తరదిక్కు కుబేరుడు స్థానం అని వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఈ భూమికి ఉన్న నార్త్ సౌత్ ఐస్కాంత శక్తి వలన ఆయా విబేదన శరీరాలని దాని తగ్గట్లుగా ఆకర్షింపబడి స్వర్గమునకు లేదా నరకమునకు వెళతాయి. ఇవి వెళ్లడం అనేది మన జీవపదార్థం మూలకాల హెచ్చుతగ్గులే కారణమని ఈ బంధాలు బలంగా ఉంటే స్వర్గం వైపు అనగా ఉత్తరం వైపుకి అదే ఈ బంధనాలు బలహీనంగా ఉంటే నరకము అనగా సౌత్ వైపుకి దక్షిణం వైపుకి పాప స్థలము అన్నమాట.బంధాలు బలంగా లేదా బలహీనంగా ఉండటం అనేది మన శరీర యోగ చక్రాలుచే నిర్దేశించబడ్డాయి. మన శరీరము నిజానికి 13 యోగ చక్రాలు కాదని 303 యోగ చక్రాలు ఉన్నాయని గ్రహించండి. విచిత్రమేంటంటే మన శరీరంలో ఎముకలు కూడా 303 అన్నమాట. ప్రతి ఎముక కూడా ఒక యోగ చక్రం తో సమానం అని గ్రహించండి. ఎముక ఎముక కి మధ్య అనుసంధానంగా ఈ 303 యోగ చక్రాలు కృష్ణబిలం గా తిరుగుతూ ఉంటాయి. కాంతిని మొదట తీసుకుంటూ ఆపై కోల్పోతూ ఉంటాయి. ఇవి కాంతితో ఉంటే ఆరోగ్యంగా మనం ఉంటాము అయితే వీటికి కాంతి అనేది తగ్గితే ఇవే బలహీనపడతాయి. తద్వారా మనకి తీవ్రమైన మానసిక శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటాయి. కాంతి హెచ్చుతగ్గులు అనేది న్యూ ట్రాన్స్ వల్లనే అని తెలుసు కదా. ఇవి బలంగా ఉండాలి అంటే ఆ మూలకాలలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇలా 36 మూలకాలలో ఆక్సిజన్ శాతం బాగా అనగా 80 శాతం ఉంటే వాడు ఆరోగ్యంగా వివేక బుద్ధితో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. వద్దు అన్నా కూడా చేస్తూనే ఉంటాడు. ఇలాంటి వారే మానవులలో పురుషోత్తముడిగా దేవుడిగా, యోగ గురువుగా గుర్తింపు పొందుతారు.పూజింపబడతారు. గౌరవించ పడుతున్నారు. అదే తనలో ఆక్సిజన్ శాతం 60 శాతం ఉంటే పాపాత్ములు గానే మానవుడిగానే పాప ఆలోచనలు పాప కార్యాలు చేసే వారిగా ఉంటున్నారు. అది ఇరవై శాతం కన్న తక్కువ ఆక్సిజన్ ఉన్న వారినే మనం రాక్షసులుగా గాను, ప్రేతాత్మలుగా, దెయ్యాలు, పిశాచాలుగా, భూతాలుగా పిలవడం జరుగుతోంది. అంటే మనలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని బట్టి మన శరీర స్థాయిలు ఉంటాయని వాటికి తగ్గ గౌరవ మర్యాదలు వాటిలోకాలు ఉంటాయని గ్రహించండి. అందుకే ఈ ఆక్సిజన్ శాతం పెంచుకోవటానికి క్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు పెట్టడం జరిగినది. ఆవులలో ఆక్సిజన్ శాతం అధికంగా ఉండటం వలన దీనికి సంబంధించిన  పంచామృతాలు మన జీవన విధానంలో అర్చక విధానం లో పెట్టడం జరిగినది. గంగానదిలో ఆక్సిజన్ 23 శాతం ఉంటుందని మన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఆనాడే మన పూర్వీకులు చనిపోయిన వాడి నోట్లో గంగ తీర్థము పోయండి అని చెప్పడం జరిగినది. ఎందుకంటే ఇందులో ఉన్న ఆక్సిజన్ ఈ జీవిలోనికి వెళ్ళి వారు బ్రతికే వచ్చే అవకాశాలు ఉండవచ్చునని ఆక్సిజన్ వాడు తీసుకునే స్థితిలో ఆ జీవ పదార్థము లేదు అంటే ఆ శరీరం అణువులు మరణము పేరుతో విడిపోవడం ఖాయమని మనము నిర్ధారణ చేసుకోవటానికి ఈ విధానం చెప్పడం జరిగినది. అలాగే తులసి చెట్టు కూడా ఆక్సిజన్ శాతం పెంచటం చేస్తుందని కాబట్టి తులసి పూజ చేయడం అనేది పెట్టడం జరిగినది. ఏది ఏమైనా ఏ విధానములో అయినా మనము కర్మ మార్గం లోకి వెళితే పదిమందికి కలవటం వలన వారి నుండి మన ఆక్సిజన్ శాతం పెరగడం వలన మనస్సు పరిశుద్ధముగా ఉంచుకోవాలని భక్తి మార్గంలో వెళితే మనము చేసే విగ్రహారాధన ఉపయోగించే పదార్థాలు వలన మనలో ఆక్సిజన్ శాతం పెరగడం జరుగుతుందని అదే జ్ఞానమార్గము లోనికి వెళితే మన మనస్సు తీవ్ర ఆలోచనలు వలన బయటనుండి శ్వాస ద్వారా మెదడుకు ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఉన్నదని అదే కుండలిని మార్గంలో ప్రాణాయామ విధానం ఉండనే ఉన్నది కదా. అంటే ఏ మార్గంలో వెళ్ళినా జీవుడికి ఆక్సిజన్ శాతమును పెంచే విధానం అంతర్గతంగా ఉండటం జరిగినది. ఇప్పటికైనా మాయ అంటే ఏంటో తెలిసిందా? అదేనండి మాయా సహితము అంటే మనము ఆక్సిజన్ శాతం తగ్గటం తద్వారా మన మెదడు ఏదో ఒక విషయం దగ్గర ఆగిపోవడం అదే సత్యం అదే నిత్యం అనుకోవడం చేస్తున్నాము. అదే మాయా రహితం అంటే మనలో ఆక్సిజన్ శాతం పెరగడం తద్వారా మెదడు అభివృద్ధి చెందుతూ వివేక జ్ఞానముతో అన్ని విషయాలు విశ్లేషణ చేస్తారు. తార్కిక బుద్ధితో హేతుబద్దమైన శాస్త్రీయమైన విధి విధానాలు తెలుసుకోవడము అదే నిజమైన బ్రహ్మజ్ఞానం అవుతుంది. తద్వారా వీరికి మాయ మాయమవుతుంది. మనలోని ఆక్సిజన్ మూలకమే భోగ జీవితానికి యోగ జీవితానికి భౌతిక మరణానికి జీవన్ముక్తియైన మోక్షమును స్వర్గ నరకాలు  ఇలా ప్రతి ద్వంద్వ ప్రవృత్తికి కారణమవుతోందని ఎవరైనా ఊహించగలరా? నమ్మగలరా ఆలోచించండి. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆక్సిజన్ సంకేతం 0 కానీ వ్రాసేటప్పుడు O2 అనేది రాస్తాము ఇందులో 0 అనేది సున్నా లాగానే కనపడుతుంది. నిజానికి సున్నాకి Oకి రాయటంలో తేడా కనిపించదు. 

పైగా ఆక్సిజన్ మూల రూపము షట్ కోణములో రాస్తారు.ఇదే శ్రీ చక్రంలో కనపడుతుంది. పైగా గణపతిని కూడా షట్ కోణములో ఇవ్వడం జరుగుతుంది. పైగా అన్ని రకాల జీవ పదార్థాలకి మూల ఆది జీవ బ్రహ్మము మహాగణపతయే కావడం విశేషం. సున్నా అంటే శూన్యమే కదా.శూన్యమంటే అంతరించిపోతున్న కృష్ణ బిలమే కదా. ఇది అంటే రేణువే కదా. అంటే రేణువులోని ఆక్సిజన్ శాతం పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూ జీవ పదార్థంగా మారింది అని మనకే అర్థమవుతుంది కదా.అంటే ఆక్సిజన్ అనే మూలకం మూలాధారచక్రంలో శివలింగంగా ఉంటే అదే బ్రహ్మాండ చక్రము నందు ఆక్సిజన్ గా ఉంటుంది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా విశ్వ రహస్య చేదనం కోసం ప్రయత్నాలు చేస్తే చివరికి రేణువులోని ఆక్సిజన్ మూలకం దగ్గరికి రావడం ఏమిటి. నా బొంద, నా పూజ నిజమే కదా. శ్వాస ఆడితే జననం శ్వాస ఆడకపోతే మరణమే కదా. మరి మన ప్రాణానికి ఆధారభూతమైనది ఆధారమైనది సాక్షిభూతం అనేది మనలోని ఆక్సిజన్ యే కదా. ఈ ఆక్సిజన్ యే ఆత్మ అన్నమాట. ఆత్మయే భగవంతుడు. ఆక్సిజన్ మనలో ఉంటే అంతర్యామీ ఆక్సిజన్ బయట ఉంటే సర్వాంతర్యామి అనగా మన వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చెప్పిన భగవంతునికి అంతర్యామిగా సర్వాంతర్యామిగా నీలో నాలో ఈ విశ్వంలోని ఉండటానికి ఉంటాడు అని చెప్పకనే చెప్పినారు కదా. మన శాస్త్రవేత్తలు ఈ ఆది మూలకానికి ఆక్సిజన్ అని పేరు పెడితే మన పూర్వీకులు మహర్షులు ఆత్మ అని పేరు పెట్టినారు. ఆక్సిజన్ ఉంటే నువ్వు ఉన్నట్లే ఆక్సిజన్ లేకపోతే నువ్వు లేనట్లే దేవుడి లాగ. ఉన్నవాడు లేనివాడిలా లేనివాడు ఉన్నవాడిలా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గానే ఉంటుంది. విచిత్రమేంటంటే మన దేవతలకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. మన పరమాత్మకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది. వీరికి తగినంత ఆక్సిజన్ లేకపోతే వారు మరణావస్థను పొందుతారు. ఎలా 
 

మచ్చింద్ర నాథుడు
అంటే నవనాథులులో మచ్చింద్ర నాథుడు వాయుతార్షణము అస్త్రము ద్వారా సకల దేవతలను పరమాత్మను వారికి తగినంత ఆక్సిజన్ను అందనీయకుండా చేసి వశపరచుకున్నాడు. సాక్షాత్తు హనుమంతుని కూడా వశపరచుకున్నాడని నవ నాథుల పురాణంలో చూస్తే తెలుస్తుంది. మన పూర్వీకుల మహర్షులు ఈ ఆక్సిజన్ కి ఒక నామం పెట్టినారు అదియే శివలింగము. అదియే శ్రీచక్ర బిందు స్థానము. ఎందుకంటే రూపములైన అలాగే నామము లేనిది అయిన ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళాలి అంటే రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువు మీద ఏకాగ్రత ఏర్పరచాలని ఉద్దేశంతో విగ్రహ ఆరాధన నుండి విశ్వ ఆరాధన దాకా తీసుకుని రావడం జరిగింది. ఆస్తిక దర్శనం నుండి నాస్తిక దర్శనం దాకా తీసుకొని రావడం జరిగినది. నిరాకార పరబ్రహ్మ నుండి ఆకార పరబ్రహ్మ దాకా తీసుకుని రావడం జరిగినది. ఎందుకంటే రూపంలో ఉన్న వాడు రూపం లేని వాడుగా మారటానికి కర్మ- భక్తి –జ్ఞాన- ధ్యాన- కుండలిని సిద్ధ ఇలా పద్దెనిమిది యోగ మార్గాలు భగవద్గీత ద్వారా లోకానికి లేని దేవుడు ఉన్నట్లుగా చెప్పడం జరిగినది. అదేవిధంగా ఋభు గీత ద్వారా లోకంలో ఏమీ లేదు సర్వం  ఏమీ లేదు సర్వం శూన్యం అని చెప్పడం జరిగినది. ఇదే విధానము సమాధి గీత కూడా చెప్పడం జరుగుతోంది. మన ఆది మానవులు తెలివైన వారు. వారి సాధన స్థాయిని బట్టి వారు తీసుకున్న ఆక్సిజన్ శాతం బట్టి వారి మెదడు అభివృద్ధి చెందిన దాన్ని బట్టి తద్వారా వారికి కలిగిన స్పందన భావ స్థాయిలో మనకి వేద శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. అలాగే మన శాస్త్రవేత్తలు కూడా పాన్ థీయిజం సిద్ధాంతమును ప్రతిపాదించిన బెనెడిక్ట్ స్పినోజా నుండి విచ్చిన్న భావ సిద్ధాంతమును ప్రతిపాదించిన పోపెనార్ వరకు వారి ఆక్సిజన్ను తీసుకునే స్థాయిలో బట్టి వారి వృత్తిని బట్టి వారికి కలిగిన అనుభవాలు చెప్పడం జరిగినది. ఈ లెక్కన చూస్తే ఏ సిద్ధాంతము ఏ వాదం ఏ అభిప్రాయం తప్పు కాదు. కాకపోతే వారు ఎక్కడి వారు అక్కడ చివరిదాకా వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయి అదే అంతిమ సత్యం అని భ్రమ పడుతున్నారు. ఇది అంతిమ సత్యము కాదని తెలుసుకుని కొంతమంది వారి వారి వారి అభిప్రాయాలతో పాత వాదనలను ఖండించుకుంటూ పోవడం జరిగింది. ఎవరు ఎటూ వెళ్లిన చివరికి ఆక్సిజన్ మూలకం దగ్గర రావాల్సి ఉంటుంది. చార్మినార్ కి నాలుగు మార్గాలు ఉన్నట్లుగా ఈ ఆక్సిజన్ మూలకము దగ్గరికి వెళ్లడానికి నాలుగు మార్గాలు అనగా మన పూర్వీకులు మహర్షులు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలు చెప్పడం జరిగినది. మనము ఇక్కడికి ఎలా వెళ్లాలో హిందూమతంలో శ్రీ చక్రము ద్వారా రేఖాచిత్రముతో చూపిస్తే అదే బౌద్ధమతంలో కాల చక్రం ద్వారా చూపించడం జరిగింది. ఇది అందరి వెళ్లే దారి ఒకటే. ఆ దారి వెళ్ళటానికి ఎన్నో విధివిధానాలు మనవాళ్లు తెలుసుకున్నారని నాకు అర్థమైనది. మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఆక్సిజన్ యే ఆత్మ ఆక్సిజన్ యే అంతరాత్మ ఆక్సిజన్ యే పరమాత్మ. ఈ లెక్కన భగవంతుడు ఉన్నాడో లేదో మీకే వదిలేస్తున్నాను. కానీ నామరూప భగవంతుడి లీల కేవలం ఆ భగవంతుడు ఉన్నాడు అది కూడా పరమ శూన్యం లాగా అన్నమాట. 
 
అలాగే కాశీయాత్ మరణం అనే నానుడి ఉంది కదా. కాశీ క్షేత్రములో మరణము పొందితే అదియే శాశ్వత మరణము అని చెప్పడం జరిగినది.విచిత్రము ఏమిటంటే కాశీ క్షేత్రములోని పంచక్రోశ ప్రాంతము నుండి ఆది బ్రహ్మ విశ్వసృష్టి చేసాడని యోగ పదార్థాలకు, పంచభూత శరీరాలను ఇక్కడే ఇచ్చినాడని ఇక్కడున్న విశ్వనాథ శివలింగము విశ్వానికి కేంద్రమని ఈయన తారక రామ మంత్రోపదేశం చేస్తాడని తద్వారా జీవునికి కర్మశేషము లేకుండా కర్మ  సమాప్తి అవుతుందని తద్వారా జీవన్ముక్తి పొందుతాడని పైగా ఇక్కడ ఆక్సిజన్ శాతం భూమి మీద 65 శాతం నీటిలో 80 శాతం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా. ఈ లెక్కన చూస్తే ఇక్కడ ప్రవహించే నిత్య గంగా స్నానము వలన తొమ్మిది రోజుల నుండి 9 సంవత్సరాల పాటు ఏకధాటిగా చేస్తే మన జీవపదార్థం లోని పంచ శరీర పదార్థాలులో పేరుకుపోయి ఉన్న పాప పుణ్యాల కర్మల ఫలితాలు నశించి తద్వారా మనలోని ఆక్సిజన్ శాతం పెరగడం వలన యోగ చక్రాలు తిరిగి బలం పుంజుకుని మూలక అణువులలో బంధాలు బలంగా ఏర్పడి తద్వారా మనస్సు స్థిరమై వివేక జ్ఞానము బుద్ధిని పొంది మూలాధార చక్రము నుండి మన ప్రయాణం మొదలై బ్రహ్మ రంధ్రము ద్వారా చేరుకుని ఆది నిర్జీవ పదార్థమైన బ్రహ్మాండ చక్రము కృష్ణబిలంలో లీనమైతే జీవన్ముక్తి పొందినట్లే. ఇదంతా విశ్వంలో ఒకే ఒక కాశీ క్షేత్రమునకు మాత్రమే ఉన్నది. అక్కడే ఆక్సిజన్ ఉంది అది ఇచ్చే గంగా నది నీళ్లు కర్మలను నాశనము చేసే విశ్వనాధ్ లింగము అలాగే మన పాపాలను నశింపజేసే కాలభైరవుడు.. మన మనస్సును స్థిరంగా చేసే సంకటహర హనుమ… మన శరీరంకు పూర్తిగా అవసరమైన ఆహారం ఇచ్చే అన్నపూర్ణాదేవి… మనలోని అన్ని రకాల భయాలు పోగొట్టే వారాహి దేవి… అన్ని రకాల అభయాలు ఇచ్చే విశాలాక్షి దేవి… తమ సాధన అనుభవాలు చెప్పటానికి ఎన్నో రకాల మతాలు ఆశ్రమాలు ఉన్నాయి. ఎందరో గురువులు యోగులు ఉన్నారు. అన్ని రకాల సాధనలు విధివిధానాలు అనగా దక్షిణాచారం అలాగే వామాచార విధివిధానాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిద్ధ పురుషులు ఉన్నారు. అఘోరాలు ఉన్నారు. ఇక్కడ లేనిది లేదు అంటే సప్త మోక్ష పట్టణాలలో కాశీ క్షేత్రములో మరణము పొందితే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు ఆక్సిజన్ మూలకం యందు లీనమయ్యినట్లేనని గ్రహించండి. ఈ విషయం స్వయంగా ఆది యోగ సాధకుడైన ఆది యోగి అయిన పరమేశ్వరుడు శివ పురాణము నందు చెప్పడం జరిగినది. అంటే విశ్వనాథ లింగమయ్య 0 అదియే ఆక్సిజను ఆదిమూలం కేంద్ర స్థానము కాశీ క్షేత్రం. ఆదిమూల పదార్థము ఆక్సిజన్. అదే విశ్వనాథ లింగము. పైగా ఇది దక్షిణ దిక్కులో దక్షిణామూర్తిగా ఉన్న లింగం. గురు లింగం. అదియే దక్షిణామూర్తి లింగము. మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఆక్సిజన్ యే కదా. ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమైన మూర్తి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అంటే గాలిలో పుట్టిన ఆ గాలిలో కలిసి పోవాలి. అంటే కాశీలో పుట్టినప్పుడు మరణం కూడా కాశీలోనే జరగాలి కదా. కాశీ క్షేత్రములోని మన ఆక్సిజన్ అణువులు కలిసి జీవపదార్థం జననము పేరుతో ఏర్పరచినపుడు అదే కాశి క్షేత్రం జీవన్ముక్తి అయిన శాశ్వత మరణమును ఆక్సిజన్ అణువులు విడిపోయేది కూడా అదే అవుతుందని తెలుస్తోంది కదా. మరెందుకు ఆలస్యం. అసలు విషయం తెలిసింది కదా. చిదంబర రహస్యం వీడినది. బలమైన సత్యము తెలిసినది. అదేనండి ఆక్సిజన్ నుండి పుట్టిన మనము తిరిగి ఆక్సిజన్ లో కలుసుకోవడానికి కాశీ క్షేత్రానికి బయలుదేరండి. నేనైతే కాశీ వాసం చేస్తున్నాను. కాశీలో నా జీవ సమాధి 2032లో పొందేటట్లుగా ఆనాడు నా జీవ అణువులు విడిపోయేటట్లు నిర్ధారణ చేసుకోవడం జరిగినది. తద్వారా ఆనంద రహిత పరమ శాంతిని పొందడం జరుగుతుంది. మనో నిశ్చల స్థితి పొందటం జరుగుతుంది. ఇదియే సంపూర్ణ కపాలమోక్షం. 
 
 ఆక్సిజన్యే మూలకమని మీకు బాగా తెలియటంతో నేను చెప్పే సైన్సు యోగ విషయాలు మీద మీకు అవగాహన ఉంటే అర్థం అవుతాయి. శ్వాసక్రియ ద్వారా శ్వాస గుండెకి చేరుకుంటుందని అందరికీ తెలుసు కదా. ఈ శ్వాస లో ఉండే ప్రాణ శక్తిని ఇచ్చే ఆక్సిజను వల్లనే మన గుండె పనిచేయడం ప్రారంభిస్తుంది. శ్వాస ఆగిపోతే గుండె ఆగిపోతుంది కదా. గుండె ఆగి పోతే ప్రాణం లేనట్లే కదా. ఇంతవరకు బాగానే ఉంది. యోగ పరిభాషలో ఉదయ ఆకాశం అది మన హృదయ చక్రం స్థానమైన గుండెకాయలో అని తెలుసు కదా. ఆకాశమంటే లేత నీలం వర్ణములో ఉంటుందని తెలుసు కదా. మనం పూజించే అందరి నామరూప దేవుళ్ళు అందరూ కూడా అనగా మహాశివుడికి మహాకాళి శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీమహావిష్ణువు అందరికీ లేత నీలి రంగు శరీరధారియై నీలవర్ణము తో ఉన్న వర్ణ చిత్రాలు చూడటం జరుగుతోంది. అంటే వీరంతా తమ సాధన పరిసమాప్తి స్థానమైన హృదయ చక్రమునకు అనగా నీలం వర్ణ హృదయ ఆకాశం పొందడం జరిగింది అని చెప్పకనే చెప్పినారు కదా. పైగా పురుషసూక్తం లో భగవంతుడు అనే ఆత్మ అనేది అంగుళ పరిమాణంలో మన హృదయంలో నీలి వర్ణ అష్టదళపద్మం మధ్య స్థానంలో ఉంటుందని చెప్పడం జరిగింది కదా. అంటే మనం పూజించే ఆరాధించే వారంతా కూడా ఉండే స్థానము మన హృదయం అని తెలుస్తోంది కదా అది కూడా నీలం వర్ణములో శరీరముతో ఆకాశ తత్వంతో అంగుళ పరిమాణంలో ఉంటారని తెలుస్తోంది. విచిత్రమేమిటంటే మన సైన్స్ ప్రకారంగా చూస్తే ఆక్సిజన్ యొక్క రంగు కూడా లేత నీలం రంగు యే కదా. ఆలోచించండి. పైగా గుండె వ్యాధులు ఉన్నవారు నీలి వర్ణ కాంతి ఉన్న బల్బులు పరిసరాల్లో ఉంటే ఈ వ్యాధి తీవ్రత చాలా మటుకు తగ్గుతుందని వైద్య పరిశోధనలు చెప్పకనే చెబుతున్నాయి కదా. పాము కాటుకు గురైన వ్యక్తి శరీరం కూడా నీలవర్ణముకు మారటం అందరికీ తెలిసిన విషయమే కదా. ఎటు చూసినా కూడా చివరికి మన ప్రాణ శక్తిని నిల్పేది మన నీలవర్ణ ఆక్సిజన్ అని తెలుస్తోంది కదా. అందుకే హృదయ చక్రం లో ఇష్ట లింగమును ఇంద్రనీల వర్ణముతో ఉంటాయి. అలాగే దైవిక విగ్రహాలు కూడా కారు నలుపుతో ఉంటాయి. ఇవన్నీ కూడా చీకటి స్థితి ఉన్న కృష్ణబిలం వద్దకు చేరుస్తాయి. నల్ల మేఘశ్యాముడే అంటే నల్లని కాంతి శరీరం కలవాడు అని అర్థం కదా. చివరికి చితాగ్ని మండటానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. అగ్ని యొక్క తుది రూపం నీలవర్ణము ఏ రంగు లేని పారదర్శకంగా మారుతాయని తెలుసు కదా. అందుకే మన పెద్దలు ఆదిదేవుడు రూపము అగ్ని అని ఆదేశించడం జరిగినది. పరంజ్యోతి సాక్షాత్కారం అనుభూతి పొందుతున్నట్లు యోగులు చెప్పడం జరిగినది. పైగా ఇది నీటితో కలిసి పోతోంది. ఆక్సిజన్ నీటితో కలిసి పోతుంది. H2O అనగా నీరే కదా. విచిత్రం ఏమిటంటే ఆది అణువు యొక్క మూల పదార్థం హైడ్రోజన్ అని ఈ మధ్యన మన శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. 

విశ్వంలోని తొలి అణువు ఇదే!
హీలియం హైడ్రైడ్‌ అయాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
బెర్లిన్‌: విశ్వంలో అత్యంత పురాతన అణువును శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. హీలియం హైడ్రైడ్‌ అయాన్‌ (హెచ్‌ఈహెచ్‌+) అనే ఈ అణువు 1400 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన ‘బిగ్‌ బ్యాంగ్‌’లో జనించిన తేలికపాటి మూలకాల పునఃమిశ్రమానికి నాటి ప్రత్యేక ఉష్ణోగ్రతలు దోహదపడ్డాయని వివరించారు. నాడు అయనైజ్డ్‌ హైడ్రోజన్‌, న్యూట్రల్‌ హీలియం పరమాణువులు చర్య జరిపి హెచ్‌ఈహెచ్‌+ను ఏర్పరిచాయి. తొలినాటి విశ్వంలో ఈ అణువుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ దీని ఆచూకీ దొరకలేదు. 1925లోనే దానిపై ప్రయోగశాలలో అధ్యయనం చేశారు. అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ‘హెచ్‌ఈహెచ్‌+’ గుర్తించదగ్గ స్థాయిలోనే ఉన్నట్లు 1970లలో వృద్ధి చేసిన ఖగోళ-రసాయన నమూనాల్లో వెల్లడైంది. సూర్యుడు లాంటి నక్షత్రాలు తమ చివరి దశలో వెలువరించే గ్రహ నెబ్యులాల్లో దీన్ని పసిగట్టవచ్చని తేలింది. దీని తరంగ దైర్ఘ్యం 0.149 ఎంఎంగా గుర్తించారు. అయితే ఈ తరంగ దైర్ఘ్యానికి భూ వాతావరణం ‘పారదర్శకం’ కాకపోవడం వల్ల నేలమీదున్న అబ్జర్వేటరీలు దీన్ని పసిగట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎత్తయిన ప్రదేశంలో సంచరిస్తూ విశ్వాన్ని పరిశీలించే ‘సోఫియా’ అబ్జర్వేటరీని ఇందుకు ఉపయోగించారు. అందులోని గ్రేట్‌ ఫార్‌-ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోమీటర్‌ తాజాగా హెచ్‌ఈహెచ్‌+ అణువును గుర్తించింది. ఎన్‌జీసీ 7027 అనే గ్రహ నెబ్యులాలో ఇది వెలుగు చూసింది.
తొలినాటి విశ్వంలో ఉష్ణోగ్రతలు 4000 కెల్విన్‌ కన్నా తక్కువకు పడిపోయాయి. దీంతో బిగ్‌ బ్యాంగ్‌లో ఉత్పత్తయిన హైడ్రోజన్‌, హీలియం, డ్యూటీరియం, లిథియం వంటి తేలికపాటి మూలకాల అయాన్లు తమ అయనీకరణ సామర్థ్యానికి వ్యతిరేక క్రమంలో పునఃమిశ్రమానికి లోనయ్యాయి. ఫ్రీ ఎలక్ట్రాన్లతో హీలియం కలవడం ద్వారా మొట్టమొదటి న్యూట్రల్‌ పరమాణువును ఏర్పరిచాయి. ఆ సమయంలో హైడ్రోజన్‌ ఇంకా ఒట్టి ప్రొటాన్ల రూపంలోనే ఉంది. హీలియం పరమాణువులు ఈ ప్రొటాన్లతో కలసి హీలియం హైడ్రైడ్‌ అయాన్‌ (హెచ్‌ఈహెచ్‌+)ను ఏర్పరిచాయి. ఇది విశ్వంలో ఏర్పడ్డ తొలి అణు బంధం. ఈ పునఃమిశ్రమ ప్రక్రియ కొనసాగడంతో పరమాణు హైడ్రోజన్‌ ఆవిర్భవించింది. ఇది ఆధునిక విశ్వానికి బాటలు పరచింది.
 
అంటే ఆది అణువు హైడ్రోజన్ ను కలిసి ఆది మూలమైన ఆక్సిజన్ తో విలీనమై నీటిని ఏర్పరచటం చేసి దీనినే ప్రాణమున్న జీవపదార్థం ఏర్పడుతోందని అర్థం అవుతుంది కదా. ఇదే విషయాన్ని మన పూర్వ మహర్షులు శ్రీ మహా విష్ణువు నుండి బ్రహ్మదేవుడు పుట్టినట్లుగా పైగా ఈయన విశ్వ సృష్టి చేసినట్లుగా చెబితే వాటిని మనము చిన్న పిల్లల కథలలాగా ఎగతాళి చేసి పుక్కిటి పురాణాలని అవహేళన చేస్తున్నాము. పైగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఆది అవతారం మత్స్యావతారము. ఇది జలములోనే తిరుగుతుంది కదా. ఈ చేప జలము లేకపోతే చనిపోతుంది కదా. అంటే ఆక్సిజన్ యొక్క రూపమే జలము గదా. జలము నుండి జీవపదార్థం ఏర్పడినదని అనగా చేపగా ఏర్పడిందని ఆ నాడు మన పూర్వ మహర్షులు చెప్పకనే చెప్పినారు కదా. నిజానికి విశ్వ రహస్యాలను అందరికీ అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో సహజమైన చిత్రాలతో సరళమైన కథనాలతో మనకు వివరించడం జరిగిందని అందరికీ తెలుసు. జలము నుండి జీవం జరిగినదని దశావతారాల ద్వారా జీవ పరిణామ క్రమం ద్వారా చెప్పకనే చెప్పినారు కదా. జలమునకు అధిపతి శ్రీమహావిష్ణువే కదా. ఆది అణువు H2O అన్నమాట. ఇదియే స్థితికర్త పోషకుడు అని చెప్పడం జరిగినది. తొలి రేణువు బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నామ రూపం లేని దైవం అయితే తొలి పరమాణువు పరమేశ్వరుడు O గానూ అదే తొలి అణువు ఆదిపరాశక్తి H గానూ అదే తొలి జీవ పదార్థంగా శ్రీ మహావిష్ణువు H2O. వేదాంతం నుండి సైన్స్ గా మార్చి చూస్తే ఇద్దరు చేసినది ఒకటే అని తెలుస్తుంది కదా. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు వారు కనుగొన్న వాటి ప్రాణములేని వాటి గా చూస్తే ఆదిలో మన భారతీయ మహర్షులు తను చూసిన ప్రతిదానికి ప్రాణశక్తి ఉంటే ఎలా ఉంటుందో ఆ మూలక లక్షణాలు ఆ ప్రాణశక్తి రూపానికి ఆపాదించి నామం పెట్టుకున్నారు. అది మనకు అర్థం కాక నా నా చంక నాకుతున్నాము. వాళ్ళు ఆత్మ అంటే మనం ఆక్సిజన్ అంటున్నాము. ఇది అర్థమైతే సిద్ధాంతం అర్థం కాకపోతే వేదాంతం అర్థమై అర్థం కాకపోతే రాద్ధాంతం. ఈ లెక్కన చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు గాను ఉంది కదూ. విచిత్రం ఏమిటంటే మన మూలకాలు 108 ద్వారా అలాగే విష్ణుమూర్తి యొక్క నామాలు కూడా 108 ఉన్నాయి. మన మూల కణాల రికార్డు దృశ్యం కూడా 108 నిమిషాలే ఉన్నాయి. మన జపమాల పూసలు 108 అలాగే 27 నక్షత్రాల్లో నాలుగు పాదాల లెక్కన 108 పాదాలుగా ఉన్నాయి. అలాగే 12 జన్మ రాశులు 9 గ్రహాలు కలిస్తే 108 భావాలు కలిగిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెప్పకనే చెబుతోంది కదా. ఈ మూలకాలు గ్రూపు వివరాలను శ్రీ ఆది శంకరాచార్యుల శ్రీచక్రము ద్వారా అలాగే కాలచక్రం ద్వారా లోకానికి వివరిస్తే మన శాస్త్రవేత్తలు పీరీయాడిక్ టేబుల్ ద్వారా లోకానికి వివరించడం జరుగుతుంది. మూల సిద్ధాంతం ఒకటే. కానీ అది ప్రతిపాదించే విధివిధానాలు తేడాలు ఉన్నాయని నాకు అర్థమైనది. అంటే ఆదిలో పదార్థం మూలకణాలను మన పూర్వీకులు మహర్షులు దేవతలు అన్నారు. అదే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు మూలకాలు అంటున్నారు. మూలకం లేకపోతే మూల పదార్థం ఉండదు కదా. బ్రహ్మ లేకపోతే బ్రహ్మ పదార్ధం లేదు కదా. అంటే ఇన్నాళ్ళు మనం పూజించే నామరూప దేవుడు అంతా కూడా మూలకాలు అని తెలుస్తోంది కదా. మీకు బుర్ర తిరుగుతోందా నాకైతే ఎప్పుడో తిరగడం ఆరంభించింది. పిచ్చి ఎక్కడమే తరువాయి అంటే మన దైవాలు మనమంతా కూడా మూలకాలే కదా. కొంపదీసి మన పేరులో ప్రథమ అక్షరమే మూలకం యొక్క అక్షరమే ఏమో ఎవరికి తెలుసు. మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్రాల పేర్లు పెడతారు కదా.కొంత మంది వారి వారసుల పేర్లు పెడితే వారి ఇష్టదైవాలను లేదా వారి ఇష్టమైన పేర్లు పెడతారు. ఏ పేరైనా ఏదో ఒక మూలకము పేరుతో సరిపోతుంది కదా. అంటే నా పేరు తీసుకుంటే పవనానంద లో పవన్ అంటే P అంటే పాస్పరస్ అటామిక్ నెంబర్ 15 అని చిన్నప్పుడు చదివినట్లు గుర్తు. అదే మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి పేరు కూడా S అంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ 16 అని తెలిసినది. అందుకే కాబోలు శివుడిలో S ఉండటం వల్ల సల్ఫర్ కి మండే గుణం ఉండటం వలన ఈయన ఎప్పుడు కోపతాపాలతో రగిలిపోతూ లయం పేరుతో నాశనము చేస్తున్నాడు. విష్ణుమూర్తి తీసుకుంటే V అని వస్తుంది అంటే వనడియం(Vanadium) అనగా టైటానియం అన్నమాట. ఇది ఖగోళ యుగపు లోహం అని పిలువబడుతుంది. పైగా దీనికి వెండి రంగు ఉంటుంది. ఈ లోహం సముద్రపు నీటి లేదా మంచి నీటి వలన, క్లోరిన్ మొదలగు వాటి వలన తుప్పు పట్టదు అందుకే కాబోలు శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద హాయిగా ఉంటున్నాడు. పైగా యుగపురుషుడు అనే ఖ్యాతి ఉండనే ఉన్నది కదా. వామ్మో! నా బుర్ర తిరుగుతుంది. నిజంగానే మన పూజించేవారంతా కొంపతీసి మూలకాలు కాదు కదా. పోని బ్రహ్మదేవుని చూసుకుంటే B తో మొదలవుతుంది. B అంటే బోరాన్ లేదా బ్రోమియం కావచ్చును. ఇందులో మొట్టమొదటిసారిగా బోరాన్ కనిపెట్టడం వలన బోరాన్ ను తీసుకుంటే అటామిక్ సంఖ్య 5 అంటే మన బ్రహ్మదేవుడికి 5 తలలు అన్నమాట. పంచముఖము కదా. పైగా బోరాన్ భూమిలో దొరకదు. ఇది పాలపుంతలో రెండు కాస్మిక్ కిరణాలు డీ కొంటున్నపుడు మాత్రమే వాయు రూపము బోరాన్ ఉంటుంది. అలాగే ఇది భూమి మీద ఏదో ఒక చోట భూ ప్రకంపములకు కారణం అవుతుందని తెలిసింది. విష్ణువు జగన్మోహిని రూపధారి కదా. అందుకే ఈయన బొడ్డు నుండి బోరాన్ లాంటి బ్రహ్మదేవుడు పుట్టినాడు. రెండు కాస్మిక్ ఎనర్జీ అనగా శ్రీ మహావిష్ణువు ఆది మహాలక్ష్మి కలిసి జగన్మోహిని రూపంలో అయితే అదే బోరాన్ అంటే బ్రహ్మ జన్మకి కారకమైనారని నాకనిపిస్తోంది. వామ్మో! ప్రస్తుతానికి మన వాళ్లు 119 మూలకాల కనుగొన్నారు అంటే మనకున్న 36 కోట్ల దైవాలలో 119 వివరాలు తెలుస్తున్నాయి. తెలిసింది గోరంత తెలుసుకోవాల్సింది కొండంత అని మన పెద్దలు చెప్పకనే చెప్పినారు కదా. ఏమంటారు నిజమే కదా. మీరు ఏ మూలకమో తెలుసుకోండి. మీరు పూజించే ఇష్ట దైవము ఏ మూలకమో తెలుసుకోండి. మనశ్శాంతి పొందండి. మూల పదార్థం తెలిస్తే గాని యధార్థం తెలియదు కదా. పదార్థం దాటితేగాని యధార్థం తెలియదని పెద్దలు చెప్పి ఉన్నారు కదా.దీనమ్మా జీవితం. నాకు ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా మూలకాలుగా కనబడుతున్నారు. అందరికీ శివమయం గా కనపడితే నాకు అంతా కూడా మూలకంగా కనబడుతోంది. యద్భావం తద్భవతి. వాళ్లు మూలం శివుడు అని అనుకుంటే వాళ్లకి శివమయం కనపడింది. నాకు మూలం మూలకం అని తెలియడంతో సర్వము మూలకంగా కనబడుతోంది. పైగా జగన్ మోహిని రూపం భస్మాసురునిని చంపినది. అంటే నిజంగా పదార్థమైన భస్మము నుండి ఒక పదార్థంగా భస్మాసురుడు వస్తే వాడి ఎడమ చేయి ఎవరి నెత్తి మీద పెడితే వాడు భస్మము అవ్వటం ఇది తెలుసుకున్న మహావిష్ణువు కాస్త జగన్మోహిని రూపంలో వచ్చి భస్మాసురునికి మోహ వేషాలు కలిగించి వాడికి తెలియకుండానే వాడి భస్మ హస్తమును వాడి నెత్తిమీద పెట్టుకునేలా చేయటంతో కాస్త తిరిగి భస్మమయ్యాడు. జీవ పదార్థం కాస్త తిరిగి రేణువు అయినది అని తెలుస్తోంది కదా. నిర్జీవ పదార్ధం నుండి జీవపదార్థం పుడుతుందని ఆనాడే మన పూర్వక మహర్షులు ఈ కథనం ద్వారా చిలకకి చెప్పినట్లు చెప్పినారు కదా. ఎవరికి తెలిసింది. అందరికీ తెలిసింది జగన్మోహిని రూపంకు సొల్లు కార్చుకోవడం తప్ప. అందులో ఉన్న అర్ధము అలాగే పరమార్ధము ఎవరైన పట్టించుకున్నారా? చెప్పండి. అలాగే అమ్మవార్లు పేర్లు చూస్తే పరాశక్తి అంటే P అంటే మండే పాస్పరస్ తెలుస్తోంది. శివాని అంటే S అని మండే సల్ఫర్ వస్తుంది. పార్వతి అంటే P అనగా మండే పాస్పరస్ వస్తోంది. అలాగే చండీమాత అంటే C గా కార్బన్ ఇది కూడా మండుతుంది. పోనీ బాల అంటే B అనగా మండే భాస్వరం వస్తోంది. అంటే మనకున్న అమ్మవారు అంతర్గతంగా రగిలిపోయే గుణానికి అనుకోవచ్చు కదా, అలా అంటారు ఏంటి? సరస్వతి శాంతి స్వరూపిణిగా పైగా ఈ ఈ లెక్క ప్రకారం S అని మండే సల్ఫర్ కదా. ఎలా లెక్క కుదురుతుంది అన్నప్పుడు దీనికి సమాధానముగా సరస్వతి దేవి కూడా తాంత్రిక విధానంలో ఉగ్రరూపం నీల సరస్వతి రూపం ఉండనే ఉన్నది కదా.నీల సరస్వతి గా కూడా పిలుస్తారు. సరస్వతి అనే దేవత అలాగే తాంత్రిక విధానములో నీల సరస్వతి అనే ఉగ్ర దేవతగా సరస్వతి దేవిని పూజిస్తారు. విచిత్రం ఏమిటంటే ఆది యుగంలో మన పూర్వ మహర్షులు సల్ఫర్ మూలకానికి శివుడు శివాని సరస్వతి అని S తో పేర్లు పెట్టడం జరిగితే ఇప్పుడు మనమందరం 27 మహాయుగంలో ఉన్న మన ఇప్పుడు శాస్త్రవేత్తలు అవే మూలకాలకి ఉదాహరణ ప్రకారం S అని సల్ఫర్ కి పెట్టడం జరిగినది. నా బొంద నా బూడిద. 68 కోట్ల కోట్ల సంవత్సరాలు జరిగినా కూడా మూల సిద్ధాంతం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఆనాడు S తో శివుడు అంటే ఈనాడు S పేరు సల్ఫర్ అంటున్నారు. పేర్లు మారిన గానీ అవి చేసే పదార్థం గుణము మారలేదు. మార్చలేదు కదా. దీనిని బట్టి పదార్ధం రూపాంతరం చెందుతుంది కానీ నాశనం కావడం లేదని అర్థమవుతుంది కదా. విశ్వ మూల సిద్ధాంతం మారటం లేదు. కానీ అది చెప్పేవారు అలాగే వారి విధి విధానాల్లో మార్పు ఉండవచ్చును. మూలం మూలంగానే ఉంది. మూలముని ఎవరు మార్చలేరు. మార్పులేదు మారదు ఎందుకంటే ఇదంతా కూడా అది లో జరిగిన పదార్థము మార్పులు రికార్డు దృశ్యాలే మనము జీవ పదార్థంగా చూస్తున్నామని గ్రహించండి. ఒక మూలకంగా చూస్తున్నాను. ఈ మూల జీవపదార్థం కాస్త యోగసాధన ద్వారా మూల కణముగా మారితే అదియే మోక్షప్రాప్తి. ఇక్కడ కొంత మందికి చిన్న సందేహం రావచ్చు. అదేమిటంటే బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు నిజంగానే ఆక్సిజన్ ఉంటుందా ఎందుకంటే అంతరిక్షంలో ఆకాశంలో ఎత్తు కొండపైన లోతైన సముద్రం లోపల ఆక్సిజన్ ఉండదని అందువల్ల ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్తారు అని తెలుసు కదా అన్నప్పుడు దీనికి సమాధానముగా కృష్ణబిలమందు ప్రకృతిసిద్ధంగా 98 మూలకాలు ఉన్నట్లు కనిపెట్టడం జరిగింది. అనగా హైడ్రోజన్ తో మొదలై కాలిపోర్ నియం(Californium) ఉన్నాయి. హైడ్రోజన్ కాస్తా రెండవ మూలకం అయిన హీలియం గా రూపాంతరం చెందుతోంది. ఇలా CF దాకా అనగా 98 మూలకాల దాకా రూపాంతరం చెందుతోంది. ఇందులో ఆక్సిజన్ మూలకం సంఖ్య 8 అనగా ప్రకృతి అనేది ఎనిమిది అంగాలతో అనగా పంచభూతాలతో మనస్సు బుద్ధి అహంకారం అనే వాటితో ఏర్పడింది అని మన పూర్వ మహర్షులు చెప్పడం జరిగింది. ప్రకృతి అంటే అంతా ఆక్సిజన్ మయం అని తెలుస్తోంది కదా. ప్రకృతి అనే మూల జీవపదార్థం లోని ప్రతి పదార్థం కూడా ఆక్సిజన్ లేకుండా లేదని అర్థమైంది కదా. ఇంతవరకు బాగానే ఉంది. ఎత్తైన కొండలు లోతైన అంతరిక్షంలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది మనకు కావలసిన అంతగా ఉండదు అనే మాట సత్యమే. అదే యోగ పరిభాషలో చూస్తే యోగసాధనలో మనకు 8వ చక్రము అయిన హృదయ చక్రమునందు వరకే మనకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అనగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప శరీరముకి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఆపై అవసరమే అంతగా ఉండదు. ఎందుకంటే వాడి శరీరము అప్పటికే సంకల్ప శరీరము అనగా వాయు శరీరము అయిపొతుంది. ఆక్సిజన్ ఇచ్చే వాడిగా మారిపోతాడు. ఆక్సిజన్ మూలకంగా మారిపోతాడు అన్నమాట. ఇంతటితో వాడి సాధన ఆగిపోతుంది. అప్పటికి వాడికి తన బ్రహ్మరంధ్రం వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలము దర్శనమిస్తుంది. ఆపై తన లోనికి కలుపుకోవడానికి ఆకర్షించడం మొదలుపెడుతుంది. అక్కడి నుండి వాడి బ్రహ్మరంధ్రం వద్ద రేణువు వంటి ఆకాశ శరీరముతో చేరి అక్కడున్న సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలమునందు లయం అవుతాడు. అందులో హైడ్రోజన్ మూలకము ఉంటుంది ఆక్సిజన్ కాస్త హైడ్రోజన్  గా వివిధ పరిణామాల రూపాంతరం చెందుతుంది. అనగా O నుండిH గా మారిపోతాడు. అనగా బ్రహ్మాండ కృష్ణ బిలము నందు హైడ్రోజన్ వాయువు రూపంలో ఉంటాడు ఇక వెనక్కి తిరిగి రాడు. అందులో వివిధ రకాల మూలకాలు వాటి ప్రమేయం లేకుండా రూపాంతరం చెందుతూనే ఉంటాడు. అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా అన్నమాట. కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఈ బ్రహ్మాండం యొక్క కృష్ణబిలమునందు  H నిల్వలు తగ్గిపోయి కాంతి హీనమై అంతరించి పోతుంది. దానితో చీకటిలో పుట్టినది కాస్తా చీకటిలో సంపూర్తిగా కలిసిపోతుంది. ఇదియే శాశ్వత మరణమగు సంపూర్ణ మోక్ష స్థితి అవుతుంది. అంటే సజీవ పదార్థం కాస్త నిర్జీవ పదార్థం గా మారడమే నిజమైన సంపూర్ణ యోగసాధన అవుతుందని గ్రహించండి. మాకు వరకు ప్రస్తుతానికి మా బ్రహ్మరంధ్రం వద్ద తిరుగుతున్న బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలము దర్శన అనుభూతి 13/ ఏప్రిల్/ 2019 సంవత్సరం శ్రీరామనవమి నాడు జరిగినది. దానితో మాకు 49 రోజుల పాటు ఆనంద రహిత సమాధిలోనికి వెళ్లడం జరిగింది. అటుపై మాకు కలిగిన ఈ స్పురణ భావాలు రాసుకోవడం జరిగినది. మూలం మూలకము అని తెలిసినది. అంతిమ సత్యము మూలకం అని గ్రహించినాము. మా అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది. సత్యమా లేదా అసత్యమా అనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆలోచన లేని మూలకమే కదా. స్పందన లేని వాళ్ళమే కదా. సంకల్పం లేని మూలకమే కదా. అలాగే నేను ఆదియుగంలోనే జీవపదార్థం గా పుట్టి తిరిగి నిర్జీవ పదార్థం గా మారటానికి నాకు 2,97,500  లక్షల సంవత్సరాలు పట్టింది. ఎలా అంటే యుగానికి 125 సంవత్సరాల ఆయుష్షు చొప్పున నాలుగు యుగాలు ఐదు వందల సంవత్సరాలు వస్తుంది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఆయుష్షు ఉంది అదే 71 యుగాల కి 71X500=35,500 సంవత్సరాలు అవుతుంది.ఇది ఒక మన్వంతరం కాలము. మనం ప్రస్తుతానికి ఎనిమిదవ మన్వంతరంలో 27 మహాయుగములో ఉన్నాము. అంటే 35500X8=2,84,000+13,500= 2,97,500 లక్షలు పట్టినది. ఈ లెక్క అంతా యోగ జనం ఒక మానవ జన్మకి మాత్రమే అన్నమాట. మానవ జన్మ ఎత్తడానికి 83 లక్షల 99,999 జన్మలెత్తి రావాలి. మళ్లీ వచ్చిన మానవ జన్మలో స్మశాన వైరాగ్యం కలిగిన యోగ జన్మ రావాలి. ఇది రావాలంటే ప్రతి మానవ జన్మ 48వ జన్మ యోగ  జన్మ అవుతుంది. ఈ యోగజన్మలు 8 ఎత్తితే కాని మానవుడికున్న  15 కోట్ల కర్మలు సంపూర్తిగా అవ్వవు.అంటే ప్రస్తుతం ఆ జన్మ ఎనిమిదవ జన్మ కావడంతో నా జీవ పదార్ధం మూలమైన 8వ ఆక్సిజన్ కాస్తా హైడ్రోజన్ గా మారి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము  నందు రాబోవుకాలంలో పడి అంతరించిపోతుంది. ఆపైన నా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఎప్పుడు అంతరించి పోతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే తెలుసుకునే వాడు లేడు కదా. తెలిపే వాడు లేడు. చెప్పే వాడు లేడు. చూసేవాడు లేడు ఎవరు లేరు కదా. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రతి నక్షత్రము లేదా ప్రతి గ్రహం కూడా కృష్ణబిలంగా మారాలని లేదు. అలాగే ప్రతి జీవి కూడా ఈ యుగములో యోగిగా మారాలని ఉండదు. ఎవరైతే తమ సుమారు మూడు లక్షల సంవత్సరాలు ఈ లోకమునందు నాకు లాగా పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే తమ బ్రహ్మరంధ్రం వద్ద  బ్రహ్మాండ కృష్ణబిలం దర్శనానుభూతి పొందటం జరుగుతుంది. తద్వారా జీవసమాధి యోగములో జీవన్ముక్తి పొందడం జరుగుతుంది. అది కూడా ఆది యుగంలో మన జీవ పాత్ర అంతిమ దృశ్యం దాక రికార్డ్ అయి ఉండాలి.ఎందుకంటే మనము చూస్తుంది అంతా ఒకప్పటి రికార్డు దృశ్యమే కదా. కానీ ఇంతకు ముందు 36 కపాలాల ఫ్రేము కథ బ్రహ్మాండం యొక్క రికార్డు దృశ్యాలు ఎన్నటికీ ఆగదని అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుందని స్పురణ భావన కలిగింది. కానీ ప్రస్తుతం బ్రహ్మాండ చక్రమునకు ఒక కృష్ణబిలం ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉండటంతో ఇది కాస్త బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అయినది. దానితో సైన్స్ సిద్ధాంత ప్రకారంగా చూస్తే ఒక కృష్ణబిలం హైడ్రోజన్ నిలువలు తగ్గిపోతే అంతరించిపోవడం ఖచ్చితంగా ఖాయమని చెప్పడం జరిగినది. అంటే ఒక కృష్ణబిలం తన సైజ్ 0.000001% శాతం తగ్గటానికి సుమారుగా 10 లక్షల మిలియన్ల మిలియన్ల మిలియన్ల మిలియన్ల మిలియన్ల మిలియన్ల ఇలా 11 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అదే సంపూర్తిగా నాశనం అవ్వాలంటే ఎంత కాలం పడుతుందో క్యాలిక్యులేటర్ చెప్పడంలేదు. కాకపోతే ఖచ్చితంగా కృష్ణబిలం  ఎప్పటికైనా అంతరించి పోవడం ఖాయమని తెలుస్తోంది కదా. తద్వారా రికార్డ్ దృశ్యాలు ఉన్న బ్రహ్మాండ కృష్ణబిలం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా అంతరించి పోవడం ఖాయం అని తెలిసినది. కాకపోతే అప్పటి దాకా ఈ రికార్డు దృశ్యాలు మీరు చూస్తారు చూస్తూనే ఉంటారు. అప్పుడు దాకా అంటే మీ బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం యొక్క రికార్డు దృశ్యాలు వచ్చేదాకా అన్నమాట. అయితే మేము మాత్రం ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు చూసిన దృశ్యం జీవపదార్థం నాటక దృశ్యము కాలంలో సంపూర్తిగా అంత మవటంతో మేము బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలో ప్రవేశ యోగ్యత రావడంతో ఇక మా దృశ్యాలు మాకు మేమే చూసుకునే అంతిమ బాధనుండి విముక్తి చెంది అంతిమ ప్రారబ్ద కర్మ నుండి విముక్తి చెంది మన జీవన నాటక దృశ్యం నుండి జీవన్ముక్తి పొందుతాము. అనగా మా బ్రహ్మాండ చక్ర బ్లాక్ హోల్ నందు సమాధి యోగము ద్వారా ఈ యుగములో చేరడం ఆపై అంతరించి పోవడం జరుగుతుంది అని మాకు అంతిమ స్పురణ భావం కలిగినది.

 మరి మనిషి దేవుడా అంటారా అన్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం మనిషి దేవుడు కాడు. పరిణామక్రమంలో రూపాంతరం చెందుతున్న జీవి మాత్రమే మనిషి అవుతాడు. ఈ విధంగా ఈ సృష్టిలో అన్ని రకాల జీవరాశులతో పాటు మనిషి పుట్టినాడు. కాలానుగుణంగా పరిణామ క్రమం గా మెదడు అభివృద్ధి క్రమంలో రూపాంతరం చెందుతున్నారు. కాకపోతే ప్రకృతి సహాయం లేకుండా ఇతను ఏమీ చేయలేడు. ఏమీ తెలుసుకోలేడు. మనిషి దేవుడు అయితే పువ్వు విచ్చుకునేటట్లుగా డైరెక్టుగా చేయమనండి.విత్తనమును సృష్టించమనండి. కాకపోతే రెండు రకాల విత్తనాలు కలిపి మరొక విత్తనము చేయడం కాదు. రెండు జంతువుల అనుసంధానం చేసి మరొక జంతువు సృష్టించడం గొప్పకాదు. ప్రకృతిలో లేనిదానిని ప్రకృతి సహాయం లేకుండా సృష్టించగలగాలి. అంటే ప్రకృతిలో ఉన్న ఏవో రెండు పదార్థాలు తీసుకొని మూడో పదార్థము సృష్టించడం అనేది వారి మేధస్సు పరిణామక్రమం అవుతుంది కానీ సృష్టి కాదు. ఈ సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించి సృష్టి చేస్తే ఏమంత గొప్ప విషయం కాదు. ఇదెలా ఉంటుందంటే ఆర్కిటెక్చర్ వర్క్ లాగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ఆలోచనతో ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తారు. గోల్డ్ స్మిత్ వాడి ఆలోచన దగ్గరగా కొత్త డిజైన్లతో బంగారపు వస్తువులు తయారు చేస్తారు. ఫ్యాషన్ డిజైనర్ వాడుకున్న కొత్త ఆలోచనలతో కొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేస్తారు. ఇది వారి మెదడు యొక్క అభివృద్ధి వలన కలిగిన స్పురణ ఆలోచనలు ఆచరణలో పెడితే అది కాస్త గుర్తింపు పొందడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు స్పురణ భావ ఆలోచన కోసం ప్రయోగాలు చేస్తూ ఉంటే యోగులు అడవుల్లో కూర్చొని తమ మెదడుకు కలిగిన అనుభవాలను ఈ గ్రంథాల రూపంలో రాసి మనకు అందిస్తున్నారు. కాకపోతే విచిత్రమేమిటంటే వీరిద్దరూ చేసే పని ఒకటే. ఈ విధానమే తేడా. కానీ వీరిద్దరూ కూడా ప్రకృతికి అతీతంగా ఏమీ చేయటం లేదు. ఈ ప్రకృతిలో ఇంకా ఏమైనా చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. పంచభూతాలను ఉపయోగించుకుంటూ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఎగిరే పక్షిని చూసి ఈ విమానం కనిపెట్టాడు. అసలు పక్షి లేకపోతే వీళ్ళు విమానమును ఎన్నటికి కనిపెట్టేవారు కాదు కదా. ఎగిరే ఆలోచన గాని ఎగిరే అవకాశం ఉన్నది గాని వీళ్ళకు తెలిసేది కాదు కదా ఆలోచించండి. ప్రకృతి మూల భావము ఆలోచిస్తోంది. అప్పుడు మనిషి మనం కూడా పక్షిలాగా ఎగరాలంటే ఏమి చేయాలి ఆలోచన చేసి తనకు ఉన్న పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న వస్తువులుతో తన ఆలోచన పరిధిని పెంచుకుంటూ విమానం దాకా వెళ్ళినాడు. అదే యోగులు అయితే అసలు పక్షి ఎలా ఎగురుతుంది అలా నేను ఎందుకు ఎగురలేను అంటే నేను కూడా ఇలాగే ఎగిరే అవకాశం ఎక్కడో మన శరీరంలో ఉంది అనుకుని యోగ చక్రాలను నెమ్మదినెమ్మదిగా ఆధీనము చేసుకునే సరికి వాడుకున్న మొదటి చక్రమైన మూలాధార చక్రము నందు భూతత్వము యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశ శక్తి పొందటంతో వీడి శరీరము ఒక అడుగు ఎత్తులో లేవడం ఆరంభమవుతుంది. అదే వీడికి నాలుగో  చక్రమైన అనాహత చక్రము నుండి వాయు తత్వము బయటికి వచ్చేసరికి వీడి శరీరం కాస్త పక్షిలా గాల్లో ఎగరటం ప్రారంభమవుతుంది. అదే ఆరో చక్రం ఆఙ్ఞా చక్రం కి వచ్చేసరికి ఇతనికి ఎక్కడికి కావాలంటే అక్కడికి తన శరీరంతో ప్రయాణం చేసే స్థితి పొందటం జరుగుతుంది. అంటే యోగి తను ఉన్న ప్రకృతిలోని వివిధ జంతువులు పొందినవి చక్ర స్థాయిలను తను పొందటంతో వాటికి ఉన్న లక్షణాలు ఈయనకి రావడం జరిగినది. ఇలా ప్రకృతిలోని ప్రతి విషయమూ యోగి సాధించడం మొదలు పెడుతూ ఉంటే ఇదే సాధనా విధానము శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఉన్న వస్తువులను ఉపయోగించి వాటికి తగ్గ యంత్రాలను తయారు చేస్తున్నారు.అక్కడేమో యోగి తన శరీరంతో గాలిలోకి ఎగిరితే ఇక్కడేమో మనిషి తన వస్తువుతో(విమానం) గాలిలో ఎగురుతున్నాడు. కాకపోతే యోగి ఎగరటం చూడలేము కానీ మనిషి చేసిన వస్తువు ఎగరటం చూస్తాము. అంతే తేడా. కానీ ఎగరటం అనేది ప్రకృతిలో ఉన్న ధర్మమే కదా. వస్తువు ఎగిరితే ఏమిటి లేదా శరీరం ఎగిరితే ఏమిటి ఎగరటం అనే ఆలోచన ప్రకృతిలోనిదే కదా. కొత్తగా వీరిద్దరు కనిపెట్టింది అలాగే పొందినది ఏమీ లేదు కదా. ప్రకృతి కాస్త పక్షితయారు చేసి ఎగరింప చేస్తే మనిషి తన ఒక వస్తువును తయారు చేసి ఎగరింప చేస్తే యోగి తన శరీరం ఎగరింప చేస్తున్నాడు. విధివిధానాల మారుతున్న ఈ సిద్ధాంతం ఒకటే కదా. అంటే మనిషి గాని యోగి గాని ఏ కొత్త సిద్ధాంతము ఏ కొత్త ఆలోచనలు చేయడం లేదు. కేవలం ప్రకృతి లో ఉన్న సిద్ధాంతములు ఉపయోగించుకుని వీరిద్దరూ వారి వారి మెదడు పరిణామక్రమము అభివృద్ధిలో కలిగిన ఆలోచన భావ స్పురణ క్రియారూపముగా చేస్తున్నారు. వీరిద్దరూ దేవుడు కాదు. అంటే ప్రకృతియే దేవుడు. ప్రకృతే గురువు అన్నమాట. ప్రకృతిని దాటి ముందుకు వెళ్లలేదు. దీనిని దాటి జ్ఞానమును పొందలేదు. ఉన్నదంతా ప్రకృతియే ఇస్తోంది. కానీ చేసేది యోగి పొందేది మానవుడు అన్నమాట. ఎలా అంటారా? మన వేదాల్లో పుష్పకవిమానము నమూనా ఉండబట్టి యంత్ర సహాయంతో గాలిలో ఎగరవచ్చు అనే ఆలోచన బుద్ధిని మనిషి చేసి విజయం పొందినాడు. ఇందులో వీడి గొప్పతనం ఏమీ లేదు. ఎప్పుడో జరిగి పోయిన పనిని వీడు ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టుగా చేస్తున్నాడు. అంటే మనిషి క్రియేటింగ్ క్రియేషన్ ఎన్నటికీ చేయలేదు. ఎక్కడో ఏదో ఆలోచన పట్టుకొని దానిని ఆచరణలోకి తీసుకువస్తున్నాం. ఎప్పుడో చేయవలసిన మొత్తం క్రియేషన్ ఈ ప్రకృతి చేసేసింది. కొత్తగా చేయటానికి పొందటానికి మనిషికి ఏమీ లేదు ఉన్నది వాడుకోవడం తప్ప. ప్రకృతి ఇచ్చిన అగ్నిని వంటకి వాడతావా పూజకి వాడతావా? హోమానికి వాడతావా? దీపారాధనకు వాడతావా కొంప అంటించడానికి వాడతావా అనేది నీ ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది. నేను ఈ మంటతో కాయితాన్ని తగలబెట్టడం అంటే అది నీ గొప్పతనం కాదు. ఈ మంటతో వంట చేస్తున్నాను అంటే నీ గొప్పతనం కాదు. మంట యొక్క గొప్పతనం దానికి మండే గుణం ఉండటం గొప్పతనము. దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే మానవుడి విధి అన్నమాట. అదియే ఙ్ఞానము. ప్రకృతి తనకి అనుకూలంగా మార్చుకోవడం మనిషి చేస్తున్న పరిణామక్రమం అని గ్రహించండి. ప్రకృతిని దాటి ఏమీ చేయలేకపోతున్నాడు అని గ్రహించండి. అంతేగాని ప్రకృతిలో మనిషికి అతీతమైన ఎన్నో శక్తులు ఉన్నాయని సాటి మనిషి గ్రహించాలి. మనిషి తెలుసుకున్నది గోరంత. పొందింది పిసరంతా.తెలుసుకోవాల్సింది కొండంత అని గ్రహించండి. మన మెదడుయే మన ప్రకృతి అని గ్రహించండి. అంటే మన మెదడుని కేవలం ఇప్పటిదాకా 0.00001%మాత్రమే ఉపయోగించినాము. మనము 0.1%శాతంకే మంది విర్రవీగుతుంటే ప్రకృతి ఎప్పుడో ఏనాడో సంపూర్ణంగా 100% లో ఉంది. మరి మనము ఎప్పుడూ చేరుకుంటామో ఆలోచించండి.0.0001% చేరుకోవడానికి మనిషికి 10 వేల బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ లక్షల సంవత్సరాలు పట్టింది. అదే సంపూర్తిగా తెలుసుకోవాలంటే మన మెదడు పనిచేయదు. యోగులు అయితే 1% నుండి 12% శాతం వరకు అభివృద్ధి చెందినవారు. అతీత శక్తులను అష్ట సిద్ధుల రూపంలో పొందినారు.యోగి తన రసవిద్య సిద్ధితో బంగారం స్వయంగా తయారు చేస్తే మనిషి ప్రకృతిలో ఉన్న బంగారు గనులు వెతుకుతున్నాడు. యోగులు చేసేవన్నీ పుక్కిటి పురాణాలు కాదు. లోకానికి హేతుబద్దమైన మాత్రమే. వారు లోకానికి చెబుతారు. ప్రతి వాడు రసవిద్య నేర్చుకుంటే ప్రతివాడు కోటీశ్వరులు అవుతారు. అందరూ పల్లకి ఎక్కేవారే అయితే పల్లకి మోసే వారు ఎవరు? అంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉన్నది కదా. దానితో వాడిలో స్వార్థము, అహంకారము, భయము లేకపోవడము, అత్యాశ ఇలా మొదలగు లక్షణాలు పెరిగిపోయి ప్రకృతి దెబ్బతినే అవకాశం ఉన్నది. అంటే వీరి మెదడు దెబ్బ తింటుంది. తద్వారా వీరు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది కదా.ఈ ఉపద్రవాలు కలగకుండా ఉండటానికి లోకకల్యాణార్థం వాటిని దైవ రహస్యంగా ఉంచడం జరిగినది. ప్రకృతికి సాధ్యం కానిది ఏమీ లేదు. చేయలేనిది ఏదీ లేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ చేస్తుంది. నాకు మాత్రమే సాధ్యపడింది కదా అని నేనే గొప్పవాడిని అనుకోవడం నీ అవివేకం తెలివి తక్కువ తనం అవుతుంది. కంటికి కనబడేది ఏది సత్యం కాదు. మనము చేయలేకపోతే ఎవరు చేయలేరు అని అనుకోవడం కూడా తప్పే అవుతుంది. యోగి వాడికి తగ్గ పని వాడు చేసి జయం పొందుతాడు. మనిషిని దాటి ముందుకి ఏనాడో వెళ్లిపోయినాడు. కానీ మనిషి మాత్రం ప్రకృతిని ఉపయోగించుకునే పనిలోనే ఉన్నాడు. వాడికి కన్నా నేనే గొప్ప అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. 

నిజ యోగి నిరాహారిగా 10 లక్షల సంవత్సరాలు ఉంటాడు అంటే మీరు నమ్మగలరా. నమ్మలేరు. కానీ ఆయన ఉండగలడు. ఎలా అంటే ప్రకృతిలో మొక్కలు ఎలా అయితే సూర్యరశ్మి ఉపయోగించుకుంటూ ఆహారాన్ని తయారు చేసుకుంటాయో అదేవిధంగా యోగి తన సహస్ర చక్ర స్థితికి వచ్చినప్పుడు కూడా తన శరీరంతో స్వయంగా తయారు చేసుకుంటాడు.చేసుకోగలుగుతాడు. అదియే యోగి గొప్పతనము. ప్రకృతి మొక్క ద్వారా సాధ్యపడిన విధానమును యోగికి సాధ్యపడకుండా ఉంటుందా? సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని గ్రహించండి. అంతెందుకు మా ముత్తాతగారైన బుద్దు కుటుంబరావుగారు జల సిద్ధుడు.ఈయన విజయవాడ కృష్ణా నదిలో అటూ ఇటూ నీటి మీద నడుచుకుంటూ వెళ్లేవాడని నీటి మీద తేలే వాడని నీటిలో మునిగిపోయి కొన్ని గంటలపాటు జలస్తంభన విద్యలో వుండేవాడని ఆ కాలం వంశములోని వారు ఈ గ్రంథంలో రాయడం జరిగింది. ఆయనను నేను చూడనంత మాత్రాన ఈ ఒక సిద్ధుడు కాకుండా పోతాడా? కాకపోతే మనుషుల్లో చెడ్డవాడు దుర్మార్గుడు కపటధారులు ఉన్నట్లుగానే యోగులులో నకిలి యోగులు నకిలీ గురువులు నకిలిస్వాములు హెచ్చుగా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్లి మోసపోయి అసలే యోగత్వము లేదు అని అనుకోవడం మనిషి చేస్తున్న అతి పెద్ద తప్పు. ప్రకృతిలోనివి నీవు చేస్తున్నప్పుడు యోగి చేయకుండా ఎలా ఉంటాడు. ఆలోచించు. నా దృష్టిలో మనిషి గొప్పవాడు కాడు. అలాగే యోగి ఏమీ చేయలేని వాడు కాదు. ఎవరికి తగ్గ ఆలోచనలు వారికి ఉన్నాయి. ఎవరి రంగంలో వారు నిష్ణాతులు. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. ఇద్దరు కూడా నిత్యఅన్వేషకులే. సత్యాన్వేషకులే. ఎవరి పరిధిలో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఇద్దరు ఙ్ఞానులే.ఇద్దరు ప్రకృతి పురుషులే. కానీ ప్రకృతికి అతీతమైన వాళ్లు కాదు. ఎవరైనా ప్రకృతికి అతీతమైన వాడు నా దృష్టిలో నిజమైన భగవంతుడు. కానీ ఇంతవరకు భగవంతుడు కూడా లేరు. ఎందుకంటే బలహీనత లేని బలవంతుని ఈ ప్రకృతి సృష్టించలేదు. తయారు చేయలేదు. అనగా మార్పు చెందని రూపాంతరం చెందని మూలకమే ఈ ప్రకృతిలో లేనేలేదు. ఏదో ఒక కారణం చేత అది బలహీనపడే రూపాంతరం చెందుతోంది.అనగా మనిషికి లాగా యోగి లాగా అన్నమాట. మనిషి తన ఆలోచన దగ్గర బలహీనతకు గురి అయితే యోగి తన శక్తుల దగ్గర బలహీనతకు గురి అవుతున్నాడు. ప్రకృతిలో బలహీనత లేనిది ఏదీ లేదు. ఎందుకంటే ప్రకృతి కూడా ఏదో ఒక బలహీనత ఉండి బలహీనపడి అత్యంతిక ప్రళయములో నశించిపోతుంది.నిర్జీవము అవుతుంది. అప్పుడు ఈ నిర్జీవము నుండి కొత్త జీవ ప్రకృతి పదార్థం ఏర్పడుతుంది. అంటే నాశనమయ్యేది ఏమీ లేదు. కొత్తగా సృష్టించబడేది ఏమీ లేదు. కేవలం రూపాలను మార్చుకొని రూపాంతరం చెందుతోంది. అనగా రూపము అంతం కావాల్సిన చోట రూపాంతరం అవుతోంది. అంతమే ఆరంభం అవుతోంది. ఇది అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా కొనసాగుతూనే ఉంటుంది. ఏది కూడా ప్రకృతిలో అనుకుని జరగదు. అనుకున్న జరగదు. అనుకో పోయిన జరగదు. మూలకాల స్వయం శక్తి కేంద్రాల హెచ్చుతగ్గుల వలన ఈ ప్రకృతి ఏర్పడినది. ఈ మూలకాలు కనుగుణంగానే ఈ ప్రకృతిలోని విశ్వపదార్థాలు కదులుతున్నాయి. చేస్తున్నాయి. పొందుతున్నాయి. అందుకే అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. అందరు చేసే పనులు ఒకే విధంగా ఉండవు. అందరూ పొందే ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి వారి స్థాయిలో మూలకాల సమ్మేళన మార్పుల వల్ల ఇది సాధ్యపడుతుంది. నీలో O ఉంటే జీవపదార్థం. అదే H ఉంటే హైడ్రోజన్ ఎక్కువగా ఉంటే నిర్జీవ పదార్థం అన్నమాట. జీవ పదార్ధం నుండి జీవం రావచ్చును. అలాగే నిర్జీవ పదార్థం నుండి జీవపదార్థం రావచ్చును. అనగా జననం నుండి మరణం రావచ్చును. అలాగే మరణం నుండి జననం రావచ్చును. ప్రకృతికి సాధ్యపడని సాధ్యం కానిది ఏదీ లేదు. అన్ని చేస్తుంది. అన్ని చేయగలుగుతుంది. మనం వాటిని పొందుతున్నాము. అంతే. పదార్థంలో మనిషి జాతి జీవపదార్థం 0.000001% మాత్రమేనని గ్రహించండి. మనిషికన్నా యోగి పరిణితి చెందినవాడు. ఈ ప్రకృతి అంతా ఒక బూటకం అని గ్రహించి మూలకంగా మారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అదే మనిషి ఈ ప్రకృతిలోని మూలకాలను ఉపయోగించుకుని మరో కొత్త మూలకం తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది ఎన్నటికీ తరగని ఎన్నటికీ అందని అంతులేని కథ అని తెలుసుకున్నాడు. కాబట్టే  సమాధి ద్వారా మూలకంగా మారి ప్రకృతిలో మూలకాలులో కలిసి పోతున్నాడు. మనిషి మాత్రం అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా అంతులేని కథ లాగా తన భావ ఆలోచనలతో ముందుకు కొనసాగుతూ ఉండటంతో ఈ మూల ప్రకృతి కాస్త అసత్యమైనది కాస్త సత్యంగా కనపడుతోంది. యద్భావం తద్భవతి కదా. ఎందుకంటే అది లోని ప్రకృతి జీవ పదార్ధం నుండి పుట్టినది నశించినది. నాశనమైనది.అత్యంతిక ప్రళయము ద్వారా నశించిపోయింది. కాకపోతే ఇదంతా మన బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము 36 మూలకాలు రికార్డు చేసినాయి.అదే దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ 36 మూలకాలే 36 తత్వాల సదాశివమూర్తియే జీవ పదార్ధము అన్నమాట. ఈయన నశించిపోయే సమయంలో రికార్డు చేసిన దృశ్యాలే ఇప్పుడు మనం చూస్తున్నాము.కాకాసురుడు అనే రాక్షసుడు కాలాతీత స్థితిలో ఉండి చూసినానని చెప్పడం జరిగినది. అత్యంతిక ప్రళయం వచ్చి ఈ ప్రకృతి నశించిపోయింది అని మన భారతీయ పురాణాలలో చెప్పడం జరిగింది కదా. నశించినది మళ్లీ ఎలా తిరిగి వస్తుంది. ఒకసారి కృష్ణబిలం నశించిపోతే తిరిగి వస్తుందా? రావటం లేదు కదా. ప్రకృతి కూడా అంతే.పుట్టడం అభివృద్ధి నాశనమవడం అన్ని కూడా జరిగిపోయాయి.చచ్చిన వాడు తిరిగి వస్తున్నాడా? రూపం లేదు కదా. అలాగే ఆదిలోనే జరిగిపోయాయి. జరుగుతున్న వాటిని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము యందు రికార్డు దృశ్యాలుగా ఉన్నాయి. మూల ప్రకృతికి మూల బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము ఉంటే ప్రతి మనిషికి తమ బ్రహ్మరంధ్రము నందు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఉన్నది. ఈ మూల ప్రకృతిలో ఆదిలో తను చేసిన పాత్ర దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిని ఇప్పుడు మనం ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల నుండి చూస్తున్నాము.ఎందుకంటే కృష్ణబిలములు అంతరించిపోలేదు. కాకపోతే అంతరించడం ప్రారంభించినాయి. ఒకప్పుడు ఇవి ఎంతో కాంతితో కాంతివంతంగా వెలిగినవి కాస్త ఇప్పుడుకాంతిహీనమై  కృష్ణబిలములుగా మారి అంతం ఆరంభమైనది. ఎవరికి వారే వారి బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము నందు అంతరించే దాకాఈ రికార్డ్ దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. వాటిని మనము చూస్తూనే ఉంటాము. ఇది జరగడానికి ఇంకా కొన్ని కోటాను కోటాను కోటాను కోటాను కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది. ప్రకృతిలో ఒక రేణువు ఏర్పడటానికి కొన్ని లక్షల కోట్ల కోట్ల సంవత్సరాల సమయం తీసుకుంటే అది అంతరించి పోవడానికి ఎంత సమయం తీసుకుంటుందో కదా. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే నక్షత్రం కాస్త కృష్ణబిలం మారేదాకా జరిగిన దృశ్యాలు రికార్డ్ అయినాయి. అనగా మూలాధార చక్రము కాస్త బ్రహ్మాండ చక్రం దాకా మారేదాకా మన పాత్ర దృశ్యాల రికార్డయ్యాయి. మనం పుట్టడం జరిగినది. మరణించడం జరిగినది. హీరో పుట్టడం జరిగినది. హీరో మరణించడం జరిగినది. కాకపోతే హీరో పుట్టిన దగ్గర నుండి వాడు చచ్చేదాకా జరిగిన సంఘటనలు అన్ని కూడా రికార్డు అయ్యాయి. ఇప్పుడు అదే మన విషయంలోనూ జరుగుతుంది. అంటే ప్రకృతి పుట్టినది. అభివృద్ధి చెందినది. నశించినది. కాకపోతే ప్రస్తుతం మనం ప్రకృతి అభివృద్ధి దృశ్యాలు చూస్తున్నాము. ఈ ప్రకృతి అంతమయ్యే దృశ్యాలు ఇంకా చూడవలసి ఉంది. అనగా ఆది మానవుడు పుట్టడం ఎప్పుడో చూసినాము. ఇప్పుడు ఈ మానవుడు అభివృద్ధి దశ మనం చూస్తున్నాము. ఈ మానవుడు అంతరించిపోయే దృశ్యాలు రాబోవుకాలంలో అనగా పది వేల మిలియన్ సంవత్సరాలకు వచ్చినప్పుడు ఆది మానవుడు మరణించిన విషయాలు అలాగే ఆది ప్రకృతి అంతరించే దృశ్యాలు ఆది జీవ పదార్ధం అంతరించే దృశ్యాలు కనపడతాయి. ఖచ్చితంగా ఉన్నాయి. కనపడతాయి. మరి అన్ని సంవత్సరాల మనం ఉండం కదా అన్నపుడు మన పాత్ర ఈ ప్రకృతిలో ఎంతవరకు ఉన్నదో ఎవరికి ఎరుక. ఈరోజు మీ మరణ దృశ్యం రావచ్చును.రేపే రావచ్చును.నాది మాత్రం రాబోవుకాలంలో నా మరణ దృశ్యం కూడా చూస్తామని నాకు స్పురణ కలిగినది. అంటే 27 మహాయుగములో కలియుగము యొక్క ప్రథమ పాదములో నా మరణ దృశ్యము రికార్డ్ అయినది. ఇది తెలుసుకోవడానికే యోగి యోగ సాధన చేస్తాడు. తను జీవపదార్థ దృశ్యనాటకం నుండి జీవన్ముక్తి ఎప్పుడు పొందుతున్నానో తెలుసుకోవడానికి సాధన చేస్తాడు. బొంద చేసేది ఏమిటి. ఆదిలో చేసి ఉంటే అది రికార్డు దృశ్యం  అయితే దానిని చేస్తున్నాను అనుకోవడం తప్ప కొత్తగా చేసేది ఏమీ లేదు కదా. అప్పటి దాకా మౌనంగా సాక్షీభూతంగా చూడడం తప్ప ఏమి చెయ్యలేమని నేను గ్రహించాను. వడ్లగింజలో బియ్యపు గింజ అన్నమాట. అనగా వడ్ల గింజ కాస్త బియ్యం గింజగా మారేదాకా జరిగే విధివిధానాలు ఎలా ఉన్నాయో నా జీవ పదార్ధం నిర్జీవ పదార్థంగా మారే దృశ్యాలు వచ్చేదాకా చూడడం తప్ప ఏమీ చేయలేము కదా. అప్పటిదాకా ఈ ప్రకృతి జీవపదార్థం లో ఆటలో అరటిపండులా ఒక మూలకం లాగా ఉండటం తప్ప ఏమీ చేయలేము. అనగా రాబోవు కాలంలో మనకు ఉన్న ప్రారబ్ద కర్మ ఇదే అన్నమాట అని తెలుసుకున్నాను. మీరు తెలుసుకోండి. మీ మరణ దృశ్యాలు ఎప్పుడు వస్తాయో యోగసాధన ద్వారా మీరు అనుభూతి పొందండి. జీవ పదార్థము కాస్తా నిర్జీవ పదార్థంగా మారిపోండి. మూల పదార్థం నుండి మూల మూలకంగా మారిపోండి. జననం నుంచి జీవన్ముక్తుడిగా మారిపోండి. అది కూడా మీ మరణ రికార్డు దృశ్యాలు వచ్చేదాకా అన్నమాట. అంటే మీ భౌతిక మరణం దృశ్యాలు చూడడం కాదు. ఎప్పుడైతే చనిపోయి ఎక్కడికి వెళ్తారో అక్కడికి మీరు బ్రతికి ఉండగానే వెళ్లి అక్కడ మరణించిన దృశ్యాలు చూడటమే నిజమైన జీవసమాధి అవుతుంది. ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదని గ్రహించండి. ఇక్కడేమో సాధన లేదు. సాధించడానికి ఏమీలేదు. అంతా రికార్డు దృశ్యాలే అంటే మీ రికార్డులు విషయాలలో భౌతిక మరణం దృశ్యాలు ఉంటే ఈ యుగం మీకు మోక్షం లేనట్లే. ఎప్పుడైతే మీకు జీవసమాధి మరణం దృశ్యాలు కనపడతాయో అప్పుడే మీకు ఈ ప్రకృతి నుండి విముక్తి కలిగి జీవన్ముక్తిపొందిన వారు అవుతారు. అందరికీ ఈ దృశ్యాలు రికార్డయినాయి. కాకపోతే మూలకాల వ్యత్యాసాల వలన హెచ్చుతగ్గుల వలన ఆయా కాలాల్లో మార్పులు వచ్చి వారి పదార్థ మూలకాల తగ్గట్లుగా ఆయా విభిన్న రకాల యుగాలలో జీవసమాధి దృశ్యాలు రికార్డయ్యాయి. అంటే అప్పటిదాకా ఎన్ని భౌతికమైన దృశ్యాలు చూసిన ఎట్టి ఉపయోగం లేదు. ఎప్పుడైతే మీరు జీవసమాధి దృశ్యాలు చూస్తారో ఆ యుగమే మీకు అంతిమ యుగమని గ్రహించండి. అప్పటిదాకా మీకు పండగే పండుగ. ప్రకృతికి ఆటయే ఆట అన్నమాట. మరి మీకు మీ జీవసమాధి దృశ్యాలు చూసే అవకాశం మీకు వచ్చినదని తెలియాలి అంటే మీ బ్రహ్మరంధ్రము వద్ద బ్రహ్మ తేజస్సుతో సుడులు తిరుగుతూ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము మాకు కనిపించేటట్లుగా మీకు ధ్యాన అనుభవం అయిందో ఆ యుగమే మీకు అంత యుగము అవుతుంది. అప్పటిదాకా మీ జీవపదార్థం కాస్త జీవసమాధి ద్వారా నిర్జీవ పదార్థంగా మారే దృశ్యాలు అగుపడతాయని సూచన అన్నమాట. ఇది కనపడే దాకా మీరు మీ జీవపదార్థం రూపాంతరం భౌతిక మరణం దృశ్యాలు చూడడం జరుగుతుంది. దీనినే పునరపి జననం పునరపి మరణం దృశ్యాలు అన్నమాట. అంటే వడ్లగింజ మొలకెత్తే దృశ్యాలు చూస్తారు అన్నమాట. ఎవరైతే జీవసమాధి దృశ్యాలు చూడడం అంటే వడ్లగింజ కాస్త బియ్యం  గింజగా  మారటం అన్నమాట. ఈ బియ్యం  గింజ నుండి చెట్టు మొలవదు కదా. అలాగే మీ జీవపదార్థం కాస్త నిర్జీవ పదార్థం అయినది అన్నమాట. అనగా ఆక్సిజన్ నుండి హైడ్రోజన్ను కు మారినారని గ్రహించండి. ఇదియే జీవసమాధి . ఇదియే  కపాలమోక్షం ప్రాప్తి.ఇదియే  సంపూర్ణ యోగసాధన.
 
యోగులు దగ్గర సిద్ధులు ఉంటాయంటే మానవులు ఎందుకు నమ్మరో నాకైతే అర్థం కాదు. నిజానికి అదే సిద్ధులు మానవులు చేస్తున్నారు. పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకోవడం లేదు. గమనించడం లేదు. ఉదాహరణకు అష్ట సిద్ధులలో అణిమా సిద్ది తీసుకుంటే పెద్ద వస్తువు కాస్తా పరమాణువుగా మారిపోవడం.దీనికి రామాయణంలో మనకు అర్థమయ్యే విధంగా హనుమంతుడి దేహమును భారీగా పెంచడం అలాగే లంకలో ప్రవేశించేటప్పుడు లిల్లీపుట్ గా అతి చిన్న మరుగుజ్జు హనుమంతుడిగా మారటం ఉన్నదని రాసినారు. ఇది ఎలా సాధ్యం. ఇందులో సత్యం లేదని మానవుడు అనడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే 70 MM సినిమాను నువ్వు 30MM సెల్ ఫోన్ లో ఎలా చూస్తున్నావో దానిని అణిమా సిద్ది అంటారు. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు సినిమాని చిన్నదిగా చేసి చూపించే దానిలో రాబోయే కాలంలో నీ దేహము చిన్నదిగా మార్చుకునే వీలు ఉంటుంది. వీలు ఉంది. అది కూడా సాధించే కాలం మానవుడికి అట్టే కాలం పట్టదు. ఎందుకంటే ఎప్పుడో యోగులు ఈ సిద్ది పొందినారు కదా. అలాగే దూరశ్రవణం సిద్ధి యోగులు పొందితే అదే మానవుడు ఒకప్పటి వీడియో ద్వారా ఈ దూరశ్రవణం సిద్ధి పొందినాడు. అలాగే దూరదృష్టి సిద్ధి యోగి పొందితే టీవీ ద్వారా మానవుడు ఈ స్థితిని పొందడం జరిగినది. అదే యోగి కాస్త ప్రాప్తి సిద్ధితో ఏమి కావాలని అనుకుంటే అది పొందుతుంటే మానవుడు ఈ నాటి ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ప్రపంచం ద్వారా తనకు కావలసిన సమాచారం తనకు కావలసిన వస్తువులను పొందడం జరుగుతుంది. ఇలా యోగులు పొందిన సిద్ధులు మానవులు కూడా పొందుతారని పొందుతున్నారని అనుభవిస్తున్నారని గ్రహించలేకపోతున్నారు. కాకపోతే యోగి ఒక్కడే తనకు వచ్చిన సిద్ధి ద్వారా లాభం పొందితే అదే మానవుడికి సిద్ధులు వలన ఇతర మానవులందరికి ఉపయోగపడుతోంది. యోగి ఏకత్వం అయితే మానవుడు భిన్నత్వం అన్నమాట. వీరిద్దరిలో ఇదే తేడా నాకు కనిపించింది. దానికి ఇద్దరూ కూడా సిద్ధపురుషులే. 
 
H అంటే హైడ్రోజన్ యే కదా. పైగా కృష్ణ బిలము నందు హైడ్రోజన్ వాయువు ఉంటుందని మన శాస్త్రవేత్తలు ఈపాటికి గుర్తించి ఉన్నారు కదా. పైగా వీరు ఇద్దరిలో ఒకరు హనుమంతుడు భవిష్యత్తు అయితే మరొకరు బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమైన శ్రీ చక్ర ఉపాసన అనగా శ్రీ లలితా దేవి సహస్ర నామాలు లోకానికి అందించడం జరిగింది. అంటే ఒక రకంగా వీరిద్దరికి బ్రహ్మాండ చక్ర  కృష్ణబిలం తో అనుబంధం ఉండటం విశేషమే కదా. ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే ఇప్పుడు మీ జీవసమాధి దృశ్యాలు చూడడం జరిగింది కదా. మరి రాబోయే కాలంలో మళ్లీ మీ ఆది జనన మరణ దృశ్యం చూసే అవకాశం ఉన్నదా అన్నప్పుడు లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆదిలో ఆది యుగాము జననము నుండి ప్రస్తుతం 28వ మహాయుగంలో మేము జీవసమాధి తో మా జీవపదార్థం పాత్ర సంపూర్తి అయినది. ఎవరైతే తమ బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు ప్రవేశించుతారో వారి రికార్డు దృశ్యాలు కూడా నెమ్మది నెమ్మదిగా నాశనము అవ్వడం మొదలవుతాయి. ఎందుకంటే ఈ కృష్ణబిలం వల్ల వీటికి సంబంధించిన సమాచార దృశ్యాలు అలాగే సహాయం చేసిన ఇతరజీవ  పదార్థాలన్నీ కూడా చేరి నాశనము అవ్వడం అనగా చిన్నచిన్న ముక్కలు అవటం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిక్సీలో వేసిన పదార్థం ఏదైనా మునుపటికి ఎలాగైతే మార్చలేమో అలా ఈ కృష్ణ బిలము నందు పడిన కూడా అదే పరిస్థితి అన్నమాట. దానితో అప్పటిదాకా తిప్పితిప్పి చూపిస్తున్న వారి పాత రికార్డు దృశ్యాలు కూడా సంపూర్తిగా నాశనమవుతాయి అన్నమాట. కాకపోతే కొంత మందికి ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. అదేమిటంటే కాకాసురుడు తన కాలాతీత స్థితిలో రామాయణము మహాభారతమును చూశాను అని చెప్పినాడుకదా అన్నప్పుడు ఎవరైతే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు ప్రవేశించినారో వారి రికార్డ్ దృశ్యాలు ఈ బ్రహ్మాండ చక్రం వెలుపల దీనికి రక్షణ కవచంగా ఉన్న వలయంలో నిక్షిప్తము అవుతాయి. నిజానికి మన అందరి సమాచారం అంతా కూడా దీని యందు నిక్షిప్తము అవుతాయి.అయితే ఈ కృష్ణ బిలమునందు ప్రవేశించాలంటే పిసరంత కర్మ ఫలశేషము, బంధము, ఆశ,భయము ,సంకల్పము, స్పందన, ఆలోచన లాంటివి ఏమీ ఉండకూడదు. కానీ శ్రీరాముడు తన భార్య వేదన బాధ పడటం అలాగే శ్రీకృష్ణుడికి తను ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేక పోయాను అని మనో వ్యధ వారిని వెంటాడటంతో  వీరిద్దరు కూడా తమ బ్రహ్మాండ చక్రము కృష్ణ బిలమునందు నాశనము కాలేదు. అందుకే శ్రీకృష్ణుడు నిత్య అవతారి. శ్రీరాముడు నిత్య దైవము అయినాడు. ఇప్పటికీ వీరిద్దరికి కూడా ఈ భూమితో జ్ఞానభూమి తో ఒకరు మరొకరు భక్తి భూమి తో అనుసంధానించబడి ఉన్నారు. అలాగే శ్రీ దత్తాత్రేయుడు దీన జనోద్ధరణ… ఏసుప్రభువుకి పాపులను రక్షించాలని తపన, మంచి వారిని కాపాడాలని తపన… గురునానక్ తన శిష్యులను ఎల్లవేళలా రక్షించాలని తాపత్రయమే, జైనుడికి తన వాళ్ళ సాధన పరిసమాప్తి చేయాలని తపన… బుద్ధుడికి కోరిక లేని సమాజం చూడాలని కోరిక… మహాశివుడికి జ్ఞానము పంచాలని ఆశయము…. ఆదిపరాశక్తికి అండ పిండ బ్రహ్మాండాలను అదుపు ఆఙ్ఞలో ఉంచాలని లక్ష్యము…. శ్రీ మహా విష్ణువు ఈ విశ్వమును ఆపదల నుండి రక్షించాలని…. ఇలా చెప్పుకుంటూ పోతే మన 36 కోట్ల దైవాలు కూడా ఏదో ఒక అంశతో ఆగి పోవడం జరిగినది. దానితో వీరిలో కొంతమంది కృష్ణబిలముగా మారలేకపోయారు. మారిన వారు ఈ బిలమునందు ప్రవేశించలేక మృత్యుభయముతో వ్యాప్తి ఆశతో ఇలా పలు రకాల కారణాలతో వెనుదిరిగి సంకల్ప శరీరాలతో రూపాంతరం చెందుతూ ఈ భూలోకమందు అనుసంధానించబడిన తద్వారా మహాత్మునిగా గుర్తించబడి ఆపై దైవాలుగా పూజలందుకుంటూ వారి రికార్డు దృశ్యాలు మాత్రమే తిప్పితిప్పి చూప బడుతూనే ఉంటాయి. కాకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక మహా సముద్రం మధ్యలో నీటి పడవలో కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సుడిగుండం చూసి భయపడి వెనక్కి వస్తాడు. ఆ తర్వాత కొంత కాలమునకు ఈ సుడిగుండం తన పరిధిని పెంచుకోవడము చేస్తుందని ఈ నావికుడు గమనించడు. ఎప్పుడు కూడా ఈ సుడిగుండం నుండి తప్పించుకోవాలనే తపనతో ఉండి దానికి దొరక్కుండా ఎలా ఉంటాడో ఆలోచన చేస్తూనే ఉంటాడు. కాకపోతే కొంత కాలానికి ఆ పైన మరి కొంత కాలానికి మహా సునామీగా మారి వాడిని అమాంతముగా తనలో కలుపుకోవడం ఖాయం. సాధన చేసినా చేయకపోయినా కూడా విశ్వం యొక్క విశ్వ బ్రహ్మాండ  చక్ర కృష్ణ బిలము నందు పడి నాశనము చెందవలసి ఉంటుంది .అప్పటిదాకా ఉన్న పాత రికార్డు దృశ్యాలు సమూలంగా నాశనం జరుగుతుంది. 99.99 శాతం మాత్రమే నాశనం అవుతుంది. కానీ 0.00001 శాతం మాత్రం మిగిలిపోతుంది అనగా జీవపదార్థం గా మిగిలిపోతుంది. మన పెద్దలు చెప్పినట్లు ఎన్ని రకాల జల ప్రళయాలు వచ్చినా కూడా కాశీ క్షేత్రం ఉన్నది. ఎందుకంటే అది శివుడి యొక్క త్రిశూలము యొక్క అగ్రభాగంలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి ఈ కాశి క్షేత్రం అన్ని రకాల జీవ పదార్థాలకు విముక్తి కలిగించి నిర్జీవ పదార్థంగా మారుస్తుంది కదా. అనగా ఇది మహా స్మశాన క్షేత్రము కదా. స్మశానము అంటే నిర్జీవ పదార్థాలు ఉండే చోటు కదా. మరి అత్యంతిక ప్రళయంలో కూడా ఈ క్షేత్రం మిగిలిపోవడం ఇక్కడ నుండి మళ్లీ కొత్తగా జీవపదార్థం ఉద్బవించే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అందుకే ఆదిలో ఆది బ్రహ్మ ఇక్కడ నుండి విశ్వ సృష్టి చేసినాడు అని చెప్పడం జరుగుతోంది. మరి ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చును.ఈ విశ్వములో అన్నీ కూడా నాశనం అయినప్పుడు ఈ కాశీక్షేత్రం నాశనం కాకుండా ఎలా ఉంటుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నిర్జీవ పదార్థం అంటే వాయు రూప మూలకముల సమ్మేళనమే కదా.జీవ పదార్ధము అంటే అణువుల సమ్మేళనమే కదా. బ్రహ్మాండ చక్రము బ్రహ్మ తేజస్సుతో తనలో ఉన్న లక్షల దహన శక్తితో అన్ని రకాల జీవ పదార్థాలను సమ్మేళన బంధనాలను విడదీసి వాటిని నిర్జీవ పదార్ధముగా మారుస్తూ వస్తుంది. అప్పటికే నిర్జీవ పదార్థంగా మారి ఉన్న శ్రీ కాశీ క్షేత్రాన్ని నిర్జీవ పదార్థం మీద కూడా తన ప్రతాపం చూపలేదు. అంటే నీటిలో ఉండే నీటి బిందువులు నీటిని ఎలా అయితే నాశనం చేయలేదో అలా అన్నమాట. ఈ కాశి క్షేత్రం 99.99 శాతం మాత్రం నిర్జీవంగా మారి మిగిలిన 0.0000001 శాతం జీవపదార్థంగా విశ్వనాథ శివ లింగమూర్తిగా ఉండిపోతుంది. ఈ లింగమును అగ్నిలో వేస్తే అగ్ని లింగంగాను జలంలో వేస్తే జల లింగంగాను వాయువులో వేస్తే వాయు లింగంగాను  భూమిలో వేస్తే భూలింగంగాను  ఆకాశంలో వేస్తే ఆకాశ లింగంగాను  ఏదైతే తనని నాశనం చేయాలని ప్రయత్నిస్తే అది కూడా ఇదే జీవపదార్థంగా మారిపోవడంతో దానిని నాశనం చేయడం జరగదు. భగవద్గీత ఆత్మని నాశనం చేయలేము. నాశనం కానిది. అగ్ని నశింప చెయ్యదు.జలము తడుపదు. వాయువు ఎండనియ్యదని చెప్పడం జరిగినది. ఈ ఆత్మయే విశ్వనాథ లింగమైన ఆత్మలింగం అన్నమాట. అందుకే ఇది విశ్వమునకు పుట్టుకకు కేంద్రం విశ్వనాథ లింగం అయినది. అలాగే నిర్జీవ పదార్థాలు తయారు చేసేది కూడా ఈ క్షేత్రమే కావడం విశేషం. నిజానికి అసలైన విశ్వనాథ లింగము ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొందరు రామేశ్వరం హిందూ మహా సముద్రంలో ఉన్నదని మరికొందరు మణికర్ణికా ఘాట్ లో ఉన్నది అని మరి కొందరు మసీదులో ఉన్నది అని మరికొందరు ఙ్ఞాన బావిలో అని మరికొందరు మక్కా మసీదులో ఉన్నదని ఇలా పలు పండితులు అభిప్రాయాలు చెప్పడం జరిగినది. ఈ నిజమైన కాశీ విశ్వనాథ లింగం ఎక్కడ ఉన్నదో ఆ విశ్వనాథథుడికే తెలియాలి. మనము కేవలం ప్రస్తుతం అహల్యాబాయి ప్రతిష్ట లింగమునే కాశీ లింగముగా పూజలు చేస్తున్నారని తెలుసుకోండి. నిజమైన కాశీ లింగం ఎక్కడుందో తెలుసుకునే సరికి నా ప్రాణం తోకకు వచ్చింది. వీటిని మేము ఈ గ్రంథంలో నిమజ్జనము అనే అధ్యాయంలో చెప్పడం జరిగినది. గమనించగలరు. 
 
అసలు ఒక జీవ పదార్ధం ఎలా తమ సాధన ద్వారా నిర్జీవపదార్థంగా మారుతుందో తెలుసుకుందాము. ఎప్పుడైతే కుండలినీ శక్తి జాగృతి అవుతుందో వారిలో యోగాగ్ని పుట్టినట్లే అన్నమాట. ఇది క్రమక్రమంగా తన లో ఉన్న పదార్థాలను గుణ సమ్మేళనము నెమ్మదినెమ్మదిగా మన సాధన స్థితిని బట్టి విడదీస్తూ చివరికి నిర్జీవంగా చేస్తుంది. అది ఎలా అంటే మూలాధార చక్రము నందు ప్రవేశించి అక్కడ ఉన్న భూతత్వము అణువులను విభేదన గావించి భూఆకర్షణ శక్తి మీద ప్రభావం చూపుతుంది. అలాగే స్వాధిష్ఠాన చక్రము లోనికి ప్రవేశించి జలతత్వము మీద అలాగే మణిపూరక చక్రము లోనికి ప్రవేశించి అగ్నితత్వము మీద అనాహత చక్రం లోనికి ప్రవేశించి వాయుతత్వం మీద అలాగే విశుద్ధ చక్రము నందు ప్రవేశించి ఆకాశ తత్వం మీద ఆధిపత్యం చూపించి వాటిని స్వాధీనం చేసుకుని మన జీవపదార్థం లో ఈ పంచభూత అంశాల ప్రభావం చూపకుండా చేస్తుంది. అంటే వీటి అణువుల సమ్మేళనం విడదీస్తుంది. అప్పుడు సాధకుడికి ప్రారంభ సమాధి స్థితి కలుగుతుంది. అంటే అన్నిటి మీద నెమ్మదిగా స్మశాన వైరాగ్య భావాలు కలిగిస్తుంది. అప్పుడు ఆజ్ఞా చక్రము నందు ప్రవేశించి విడివిడిగా ఉన్న పంచభూత అణువులను ఒక స్థితికి తీసుకొని వస్తుంది. అంటే జీవపదార్థం లోపలిదాకా పొరలుపొరలుగా ఉన్న అణువులు కాస్త ఒకే పరమాత్మ స్వరూపంగా ఆత్మఅణువుగా మార్చటం జరుగుతుంది.అంటే సూక్ష్మ శరీరమును ఏర్పరుస్తుంది. దీనినే అంతరాత్మ అంటారు. ఇంతకీ ఈ అణువులు కలిసి పదార్థంగా మారి స్థూల శరీర పదార్థంగా ఉంటే ఇప్పుడు ఈ అణువుల మధ్య సంబంధాలు లేనందున అవి కాస్త ఒకచోటకు చేరి ఆత్మగా మారి పోయేటట్లుగా మనలోని యోగాగ్ని చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత కర్మ గుణ కాల బ్రహ్మ అనే నాలుగు ఉప చక్రాలు యందు ప్రవేశించి కర్మ బంధాలు లేకుండా గుణ ప్రభావాలు లేకుండా కాలాతీత గుణాతీత స్థితులను కలిగించడం చేస్తుంది. అంటే అణువుల మధ్య ఉన్న బంధాలు మరింతగా బలహీనమవుతాయి అన్నమాట. ఎప్పుడైతే సహస్రార చక్రము లోనికి  ప్రవేశించగానే ఈ అణువులు కాస్తా బలహీనపడి పరమాణువులుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. అంటే కారణశరీరం ఏర్పడుతుంది. మూలాధార చక్రం లోని ఆదిదైవమైన మహాగణపతి ఈ చక్రం దగ్గరికి వచ్చేసరికి వివిధ రూపాలు మారుస్తూ ఇక్కడికి వచ్చేసరికి అందులో కాస్త పరమాణువులు గా రూపాంతరం చెందే సరికి శ్రీకృష్ణపరమాత్మ గా మారటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పరమాణువులు కాస్త జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రం చేరుకుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మరింతగా బలహీనపడి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గా రూపాంతరం చెందుతాయి.అనగా సంకల్ప శరీరముగా రూపాంతరం చెందుతుంది. దైవ భాషలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు కాస్తా సర్వేశ్వరుడుగా( ఇష్టలింగము) ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి గా అనగా ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గా మారిపోవడం జరుగుతుంది అన్నమాట. మూలాధార చక్రము వద్ధ జీవ పదార్ధం కాస్త హృదయ చక్రానికి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ గా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తోంది కదా. ఇప్పుడు ఈ హృదయ చక్రం లో ఉన్న హృదయ గ్రంథి విభేదనము ద్వారా ఈ న్యూట్రాన్ మాత్రమే దీపకాంతితో బ్రహ్మనాడీ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రము వద్ధకు నెట్టవేయబడి ఉంటుంది. అంటే దృవతారలాగా ఉంటుంది.అనగా ఆకాశ శరీరంగా రూపం మారుతుంది. కాకపోతే ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఎందుకు రావు అంటే హృదయ చక్రం కేంద్ర స్థానంలో ఉన్న ఇష్టలింగము చుట్టూ ఈ రెండు నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదే దైవ భాషలో చెప్పాలంటే ఇష్టలింగము ఇచ్చే ఇష్ట కోరిక మాయలో ఎలక్ట్రాన్ అయిన ఇష్టకామేశ్వరుడు ప్రోటాన్ అయిన ఇష్టకామేశ్వరి పరిభ్రమణం చేస్తూ ఉంటారు. అందుకే పరమేశ్వరుడు అలాగే పరమేశ్వరి ముందు ఒక శివలింగం మూర్తి నుంచి పూజలు చేస్తూ ఉన్న ఫోటోలు మనకి కనబడతాయి. అంటే వీరిద్దరూ తమ హృదయ చక్రం యొక్క ఇష్ట కోరిక మాయకి బందీ అయ్యారని మనకు ఇప్పుడు తెలిసింది కదా. అందుకనే వారి పేర్లలో ఇష్టకామేశ్వరుడు  ఇష్టకామేశ్వరి అని పేర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే మిగిలిన న్యూట్రాన్లు కాస్త రేణువు పరిమాణంగా ఒక్కసారిగా మారిపోవడం జరిగింది కదా. అంటే బ్రహ్మరంధ్రము అంటే విశ్వం అన్నమాట. అంతరిక్షము అన్నమాట. ఈ అంతరిక్షంలో మన న్యూట్రాన్ కాస్త దీపకాంతి పరిమాణం అనేది కూడా ఒక ధ్రువతారగా మారిపోతుంది. ఈ దీపకాంతి పరిమాణం అంగుళం అంటే విశ్వంలో అది ఒక సూర్యుని కన్నా 20 రెట్లు పెద్దది అని తెలుసుకోండి. కాకపోతే అది మన మనో నేత్రదృష్టికి అది ఒక అంగుళం లాగా కనబడుతుంది. ఎలా అంటే విశ్వ అంతరిక్షంలో మన భూమి ని చూస్తే ఒక అంగుళం లాగా ఒక రేణువులాగా ఎలా అయితే కనపడుతుందో అలా మన న్యూట్రాన్ నక్షత్ర పరిమాణం కూడా ఒక విధంగా ఒక రేణువులాగా కనపడుతుంది. ఇంతటితో మన సాధన పరిసమాప్తి అవుతుంది. ఇకపై చేయడానికి ఏమి ఉండదు. కొన్ని అనివార్య కారణాల వలన మనలో ఎప్పుడైనా సహనశక్తి కోల్పోతే మన న్యూట్రాన్ నక్షత్ర కాంతి నెమ్మదినెమ్మదిగా తగ్గటం రూపాంతరం చెందుతుంది. అది అక్కడి నుండి ఆ జీవి యొక్క సజీవ పదార్థం మూలకాలన్నింటిని అనగారేణువులు పరమాణువులు అణువులు పదార్థశరీరాలు తనలోనికి తీసుకోవడం ఆరంభిస్తుంది. కోటాను కోట్ల నుండి ఈ జీవపదార్థం ఎత్తిన అన్ని రకాల రూప పదార్థాలను నెమ్మదినెమ్మదిగా తనలో ఇముడ్చుకుని నాశనము చేయడం ఆరంభిస్తుంది. ఇది ప్రారంభ జీవసమాధి అన్నమాట. అంటే మన జీవపదార్థం కాస్త నిర్జీవ పదార్థంగా రూపాంతరం చెందుతుంది అని గ్రహించండి. కాకపోతే ఈ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము సంపూర్ణంగా అంతరించి పోవడానికి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ఎప్పుడైతే మన మూలాధార చక్రము కాస్త బ్రహ్మాండ చక్రంగా రూపాంతరం చెందిందో ఆనాటి నుండి మన శాశ్వత అంతిమయాత్ర మొదలైనట్లే. పునర్జన్మ లేని పునరపి జననం పునరపి మరణం అసలు అనేది లేని స్థితిలోకి వెళ్లిపోవడం జరిగిపోతుంది. అంతమే ఆరంభం అవుతుంది అన్న మాట. ఇదియే సంపూర్ణ జీవన్ముక్తి. ఇదియే సంపూర్ణ మోక్ష స్థితి అన్నమాట. 99 శాతం మంది బ్రహ్మాండ చక్రం కృష్ణబిలము గా మారడం లేదని కేవలం ఒక్క శాతం మాత్రమే కృష్ణబిలంగా మారుతున్నారని అందులో 0.01% మాత్రమే ఈ కృష్ణబిలమునందు పడి నాశనము పొందుతున్నారని అలా తమకున్న ఏకైక న్యూట్రాన్ రూపము కాస్త దైవకణముగా మార్చుకొని అంతరించిపోతున్నారని మేము జ్ఞానస్పురణ పొందడం జరిగినది. ఇప్పుడు మేము ఈ 0.01%లో ఉన్నందున ఈ జన్మ ధన్యమైనది. దాదాపు మూడు లక్షల సంవత్సరాల నుండి మా జీవపదార్థం ఏర్పడి ఇలా సంపూర్తిగా నిర్జీవ పదార్థంగా తీసుకోవడానికి సమయం తీసుకున్నదని ఇంతకు ముందు అధ్యాయాలలో మీకు వివరించడం జరిగింది కదా. అందరూ కూడా ఇట్టి స్థితిని తప్పకుండా పొందుతారు. నేను పొందినాను అంటే మీరు పొందకుండా ఉంటారా.కాకపోతే ఈ యుగంలో నేను పొందడం జరిగినది. అదే మీరు రాబోయే కాలంలో ఏదో ఒక యుగము నందు పొందడం జరుగుతుంది. కాకపోతే అప్పటి దాకా ఎదురుచూడక తప్పదు. అందరూ అంతరించిపోయే వాళ్ళమే. గాలిలో పుట్టిన మనము తిరిగి గాలిలో కలిసి పోయే వాళ్ళం. కాకపోతే కాస్త వెనకా ముందు అన్నమాట. మన చావుపుట్టుకలలో తేడాలు ఉన్నట్లుగా మన సాధన రూపాంతరాలలో తేడాలు ఉంటాయని తెలుసుకోండి. ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండరు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. ఇంకా కంగారు ఎందుకు. అందరూ చివరికి కాడికి పోవలసిన వాళ్ళమే.ఆ మహాస్మశానమైన కాశీ క్షేత్రానికి చేరుకోవాల్సిన వాళ్లమే. ఎందుకంటే ఈ క్షేత్రానికి చచ్చిన వాళ్ళు వస్తారు చచ్చేవాళ్ళు వస్తారని చచ్చినవాడు అస్థికల రూపంలో వస్తే చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో వస్తారు కదా.అంటే ఈ బ్రహ్మాండం చక్ర కృష్ణబిలం ఏ పదార్థంను వదిలిపెట్టడము లేదని అన్నిటినీ నాశనం చేస్తుందని తెలియజేస్తోంది కదా. కాకపోతే బలముగా అమితముగా తమ ఇష్ట కోరిక నందు ఆలోచన స్పందన సంకల్పం ఉన్న వారిని మాత్రమే ఎలక్ట్రాన్ ప్రోటాన్ అనగా స్త్రీ పురుష శక్తులుగా మారి ఆ విశ్వనాథ లింగముగా జీవపదార్థంగా రూపాంతరం చెందుతుంది అని గ్రహించండి. అందుకే ఈ లింగమును నాశనం అవ్వడం లేదని గ్రహించండి. అప్పటికే 60% నిర్జీవమయినప్పటికీ40% జీవ పదార్థంగా ఈ రెండు ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఉండేసరికి వాటి నుండి తిరిగి అత్యంతిక ప్రళయము జరిగిన తర్వాత ఈ ఆది లింగము కాస్త ఒక తెల్లని గ్రుడ్డుగా మారి ఈ విశ్వ సృష్టి ఆరంభిస్తుంది. సమస్త జీవకోటికి ఆధార భూతము అవుతుంది. పునః సృష్టిని ఆరంభిస్తుంది. మళ్లీ కొత్త జీవపదార్థం నాటకం మొదలవుతుంది. అందుకే మోక్షమును పొందాలనే కోరిక కూడా ఉండకూడదని ఉంటే కోరికాతీతస్థితి పొందలేరని తద్వారా మనస్సులేని స్థితికి వెళ్ళలేరని 40 శాతం మిగిలిపోతుందని అనగా ఇష్ట కోరిక మాయ పదార్ధాలుగా మారి పోవడం జరుగుతుందని చెప్పడం జరిగినది. విచిత్రమేమిటంటే కోటాను కోట్లమంది యోగసాధన ద్వారా నిర్జీవ పదార్ధాలుగా మారాలని సాధన చేస్తే కేవలం ఒక్కరు మాత్రమే అనగా తమకున్న ఇష్ట కోరిక మాయ దాటిన వారికి మాత్రమే ఏ బంధానికి గురికాకుండా ఏ బంధము లేకుండా బంధ విముక్తి చెంది న్యూట్రాన్ అనే ధ్రువతారగా మారిపోతాడు. వీరే ఆ యుగానికి యుగపురుషుడు అన్నమాట. అంటే మాకు లాగా అన్నమాట. 27 మహాయుగమునకు మేము యుగపురుషుడు అన్నమాట. అలాగే మీరు కూడా మాకు లాగానే ఏదో ఒక యుగము నందు యుగపురుషులు అవుతారని గ్రహించండి. అలాగే హృదయ చక్రమునందు నీలి రంగు అష్టదళపద్మం ఉంటుందని ఇందులో అష్ట దంపతులుగా ఉంటారని యోగ భాషలో చెప్పడం జరిగినది. మీరే ప్రకృతికి అష్టాంగాలు అనగా పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనగా ఎలక్ట్రాన్ ప్రోటాన్ గా మారి ఈ విశ్వనాథ లింగమూర్తిలో అనగా ఇష్ట లింగమునందు నిక్షిప్తమవుతారు. ఇదియే ఆది రేణువుగా అనగా దైవకణముగా మారి పరమ శూన్యము నందు ఉండిపోతుంది. ఈ కణము కాస్త అనివార్య కారణాల వల్ల పరమాణువు గాను ఆపై అణువుగాను ఆపై జీవపదార్థంగాను ఈ విశ్వసృష్టిని ఏర్పరచి అందులో ఏక పదార్ధము నుండి భిన్న జీవ పదార్ధాలుగా మారి జీవ పదార్థ పాత్రలు వేసి స్మశాన వైరాగ్యం చెంది ఆపై సాధన చేసి తను మర్చిపోయిన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకుని మళ్లీ హృదయ చక్రానికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న 0.01%మాత్రమే ఇక్కడ ఉన్న ఇష్ట కోరికను దాటుకుని మిగిలిన జీవపదార్థం ధాతువులతో 80 శాతం జీవపదార్థం గాను ఇరవై శాతం నిర్జీవ పదార్ధముగాను మారి తిరిగి పరమ శూన్యము నందు దైవకణముగా మారిపోతుంది. అంటే ఇది సంపూర్తిగా నిర్జీవ పదార్ధముగా మారటానికి సుమారు 10 లక్షల బిలియన్ బిలియన్ బిలియన్ బిలియన్ ఇలా 11 బిలియన్ సం!!లు పడుతుందని మన వేదాంతులు అలాగే మన శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగినది. ఇదే సమయం బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కూడా అంతరించిపోవడానికి తీసుకోవడం విశేషమే కదా. నిర్జీవ పదార్ధమే కృష్ణబిలం కదా. ఏమంటారు నిజమే కదా. అంతిమ సత్యము తెలిసినది. చిదంబర రహస్యంగా వీడినది కదా. ఇంకేమిటి పండగ చేసుకోండి .ఆట ఆడుకోండి. ఆడించండి. ఆడండి. ఆపండి. అంతరించి పొండి. ఇదియే సృష్టి స్థితి లయ లాస్యము. ఇదియే  బ్రహ్మ విష్ణువు శివుడు శ్రీ దత్తుడు. ఇదియే పదార్థము అణువు పరమాణువు రేణువు మూలకము ఇదియే జీవాత్మ అంతరాత్మ పరమాత్మ విశ్వాత్మ ఆత్మరహితము( ఆత్మ సిద్ధాంతం). ఇదియే స్థూలశరీరం సూక్ష్మశరీరం కారణశరీరం సంకల్ప శరీరం ఆకాశ శరీరం.ఇదియే  భూమి జలము అగ్ని వాయువు ఆకాశం(సృష్టి సిద్ధాంతం).  ఇదియే ఆలోచన సంకల్పం స్పందన ఆశ భయము(భావ సిద్ధాంతం).  ఇదియే కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలినీ మార్గము(యోగ సిద్ధాంతం).  ఇప్పటికైనా దైవ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ దేవుడు పేర్లతోనూ యోగ సిద్ధాంతము చెప్పిన యోగసాధన విధానాలను సైన్సు సిద్ధాంతము చెప్పిన పదార్ధ రూపాలు కర్మ సిద్ధాంతము చెప్పిన కర్మ విధానాలు మాయ సిద్ధాంతము చెప్పిన మాయ విధానాలు భావసిద్ధాంతంలో చెప్పిన భావాలు వేదాంతం చెప్పిన వేద విధానాలన్నీ కూడా ఒకే దానిని చెప్పినాయని గ్రహించినారు కదా. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. నదులు వేరైనా చేరుకునేది సముద్రంలోనికి... అందరు ఈపాటికి గ్రహించే వుంటారు. జీవపదార్థం కాస్త నిర్జీవపదార్థం అవ్వక తప్పదు. ఆక్సిజన్ హైడ్రోజన్ గా మారక తప్పదు. మూలాధార చక్రము కాస్త బ్రహ్మాండ చక్రము అవ్వక తప్పదు. ఆత్మ కాస్త అంతరించకుండా పోక తప్పదు. మరణము కాస్త శాశ్వత మరణము పొందక తప్పదు.సాధకుడు మోక్షగామి కాక తప్పదు.కపాల మోక్షమును పొందక తప్పదు.సాధన చేసినా చేయకపోయినా పూజలు చేసినా చేయకపోయినా ధ్యానాలు చేసినా చేయకపోయినా కాకపోతే వీటిని చేసినవాడు త్వరగా కపాల మోక్ష స్థితిని పొందితే అలాగే వీటి రికార్డ్ విషయాలు చూస్తాడు. చేయనివాడు చాలా అనగా పది లక్షల సంవత్సరాలకి  తను పొందే సమాధి రికార్డ్ దృశ్యాలు చూస్తాడు. అంతే తేడా. త్వరగా చావాలని ఉందా ఇంకా బతకాలని ఉందా అనేది మీ నిర్ణయం బట్టి మీ సాధన బట్టి ఉంటుంది. మీలోని ఆక్సిజన్ మూలకముని బట్టి అది త్వరగా హైడ్రోజన్ గా మారాలనుకుంటే మీరు త్వరగా జీవసమాధి స్థితిలోకి వెళ్తారు. జీవుడు కాస్త శివుడై పరమశూన్యములో అంతరించిపోతాడు. మీ జీవాత్మ కాస్త విశ్వాత్మ గా మారి విశ్వమందు అంతరించి పోతుంది. జయం పొందండి.
 
 
ఈ విశ్వ సృష్టి అంతా కూడా మూలకాల నిర్మితమైందని బంధనాలు ఏర్పడిన సంయోగ వియోగాల బంధనాలే అని చెప్పినారు కదా. కానీ జగత్ చూస్తే ఎవరో చేసినట్లుగా ఎవరో చెప్పినట్లుగా ఎవరో నడిపిస్తున్నట్లు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది కదా. మరి ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దీనికి సమాధానముగా ఎవరైనా ఈ జగత్తును చూస్తే ఇంకొక సృష్టికర్త ఉండి వారి ఆధీనములో ఇదంతా జరుగుతుందని మనకు భ్రమ భ్రాంతి కలిగించడం నిజమే కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ విశ్వ సృష్టి అంతా మనకి కనిపించే దంతా అన్ని రకాల జీవ దైవ పరమాత్మ పదార్థాలన్నీ కూడా మూలకాల సంయోగం అని తెలుసుకోండి. ఎలా అంటే మూలకాలు కలిసి మూల జీవపదార్థం అనగా మనలాగా రూపాంతరం ఎలా చెందాయో అలా వీటిలో కొన్ని రథచక్రాలు గా రూపాంతరం చెందినాయి. అనగా బ్రహ్మ చక్రము,పిండ చక్రము,బ్రహ్మాండ చక్రము, అండ చక్రము,సృష్టి చక్రము,కాల చక్రము,లయ చక్రము ఇలా మన శరీరములోనే 303 చక్రాలు ఉన్నట్లుగా ఈ విశ్వమునందు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి సుమారుగా 30 67 20,000 కోటాను కోట్ల చక్రాలు గా రూపాంతరం చెంది నాయి. ఇవి వాటి పరిధిలో ఉండి వాటి చుట్టుపక్కల ఉన్న వాటిని తమకున్న విద్యుత్ అయస్కాంత గురుత్వాకర్షణ శక్తితో సమన్వయ పరుస్తోంది. కాకపోతే మనకు ఒక బ్రహ్మ చక్రం దర్శనం అయ్యేసరికి ఒక జీవితకాలం అలాగే మనం ఒక బ్రహ్మాండ చక్రం అని తెలుసుకునే సరికి ఒక జీవిత కాలము పట్టింది. దానిని బట్టి ఇన్ని చక్రాల దర్శనం కావాలంటే మానవ జన్మలే సరిపోవు. కాకపోతే వారి వారి మెదడు అభివృద్ధి క్రమంలో వారికి కలిగిన ఆలోచన భావస్పురణ స్థితిని బట్టి వారు పొందిన అనుభవాలను బట్టి మన పూర్వ మహర్షులు ఈ చక్రాలు అన్నిటినీ ఒక్కొక్కరుగా చూడడం జరిగినది. వాటి వివరాలను వేద శాస్త్ర పురాణ ఉపనిషత్తుల యందు పొందుపరచడం జరిగింది. ఇందులో బ్రహ్మాండ చక్రం అంటే మూలకము రూపాంతరం చెందిన ప్రతి దానిని తనలో ఇముడ్చుకుని నాశనం చేసే విధంగా ఏర్పడింది అని గ్రహించండి. ప్రారంభంలో సృష్టి చక్రము అంటే అంతములో బ్రహ్మాండ చక్రం ఉంటుంది అని గ్రహించండి. ఈ చక్రాలను కూడా వాటికున్న శక్తుల ఆధారంగా తిరుగుతూ వాటి మధ్య ఉన్న బంధాలు హెచ్చుతగ్గుల వలన మిగతా వాటిని అదుపులో ఉంచుతాయి. మీకు బాగా తెలియాలి అంటే సూర్యుని చుట్టూ నవగ్రహాల పరిభ్రమించడం అలాగే వాటి చుట్టూ అవి భ్రమణం చేయడం లాంటివి అన్నమాట. ఇందులో ఎలాంటి దైవ శక్తి లేదు. భగవంతుడు సృష్టి లేదు. కేవలం వీటికి ఉన్న గురుత్వాకర్షణశక్తి అన్నమాట. ఈ సత్యాన్ని మన పూర్వీకులు దైవశక్తి అనవచ్చు. దైవము అంటే ఎలాంటి రూపాంతరం చెందని వాడై ఉండాలి. వేటియందు నిష్పక్షపాతం లేకుండా ఉండాలి. కాని ఈ శక్తి అలా ఉండదు కదా. ప్రతి క్షణం ఏదో ఒక చోట రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా. అలాగే హెచ్చుతగ్గులు ఒకలాగే ఉంటుంది కాబట్టి ఈ శక్తిని దైవము అనలేం కదా. ఈ శక్తిని భగవంతుడు అని సృష్టికర్త అని అనలేము. ఎందుకంటే సృష్టికర్త అయితే ఈ శక్తి ఈయన ఆధీనంలో ఉండి వీరి ఆదుపాజ్ఞలను పాటించాలి కదా. మరి అలా జరగడం లేదు కదా. దీనికి ఉదాహరణే మనకి శివ పురాణము నందు కనపడుతుంది. తారకాసురుడు ముగ్గురు కుమారులు ఉండే మూడు పురములను ఒక తాటి మీదకు తెచ్చి వాటిని నాశనం చేయటానికి మహాశివుడికి వెయ్యి సంవత్సరాల కాలం పట్టింది అని చెబుతారు. మరి ప్రకృతి శక్తి వీరి ఆధీనంలో ఉంటే కావాలంటే ఈ శక్తితో ఈ మూడు పురములను ఒక క్షణంలో వాటిని ఒక తాటి మీదకు తెచ్చి నాశనం చేయవచ్చు కదా. అలా జరగలేదు. కాలము వచ్చేదాకా అంటే ఈ మూడు పదార్థాలు ఏకకాలంలో ఎప్పుడు వస్తాయో వాటి మధ్య ఎప్పుడు వియోగ బంధము బలపడుతుందో అప్పటిదాకా కూడా ఎదురు చూడక తప్పలేదు. దానికి మన పెద్దలు వెంటనే లేదు లేదు శివుడు ప్రకృతి లో ఉన్నప్పుడు తను సృష్టించిన ప్రకృతి నియమాలు దాటటానికి ఉండదు కదా. కాబట్టి సాధారణ మానవుడిలా ఎదురు చూడక తప్ప లేదని ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. కాకపోతే వీణ్ణి చంపడమే లోకకల్యాణార్థం అనుకుంటే ఒక క్షణములో చెయ్యవచ్చు కదా. మన్మధుడిని ఒక క్షణములో భస్మము చేసినట్లుగా వీరిని నాశనం చేయవచ్చు కదా. మన్మధుడిని చంపినపుడు ప్రకృతి నియమాలు ఉండవు. అదే ఈ రాక్షసులను చంపినపుడు మాత్రమే వచ్చినాయా మీరే ఆలోచించండి. విషయం తెలుస్తుంది. అంతెందుకు వాలిని చాటుగా చంపిన శ్రీరాముడు యుద్ధనీతి తప్పలేదా? రావణాసురుడు గురించి తెలుసుకొని వారి బొడ్డు వద్ధనున్న అమృత భాండం నాశనం చేసినప్పుడు యుద్ధనీతి తప్పలేదా? అప్పటికి తన ప్రాతివత్య ధర్మమును అగ్నిలో దూకి నిరూపించుకున్న తన అనుమానం చావక పతి ధర్మమును తప్పలేదు. ఇన్ని తప్పులు ఇన్ని నియమాలు తప్పడం జరిగితే ప్రకృతి నియమాలు తప్పించడం తప్పు కాదు అనుకుంటా? ఆలోచించండి. నిజము నిక్కముగా చెబితే ఎవరు తట్టుకోలేరు. ఈ విశ్వ సృష్టి అంతా సర్వ మూలకాల నిర్మితమేనని నా సాధన అనుభవం చెబుతోంది. మూలకాల మూల రూపము త్రస్యరేణువు అని గ్రహించండి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న దైవకణం అన్నమాట. ఈ త్రస్యరేణువు బంధ శక్తులు వలన ఈ విశ్వ సృష్టి నడపబడుతుంది. దీనివల్ల సృష్టించబడుతుంది. అలాగే వీటి హెచ్చుతగ్గుల వల్ల నాశనం చేయబడుతోంది. ఇందులో వీటి ద్వారా సృష్టించబడిన మానవ జీవ పదార్ధం యొక్క ఉత్తమ పరిణామక్రమంలో రూపాంతరమే భగవంతుడు అన్నమాట.అనగా పుట్టిన మానవులలో ఉన్నవాళ్లలో అతి తెలివైన వాడు భగవంతుడు. వీరికి ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయలతో సంబంధం లేదు. ప్రకృతిని తన అవసరాలకనుగుణంగా మార్చుకోవడం తప్ప ఏమీ చేయలేరు అని గ్రహించండి. తను కూడా రూపాంతరం చెందుతూ ఉండేవాడు అని తెలుసుకోండి. ఇదే అసలు సిసలైన అహం బ్రహ్మస్మి. తత్వమసి. ఇదే అద్వైత స్థితి. ఇదియే సంపూర్ణ అద్వైత స్థితి. అలాగే ద్రౌపదిని రక్షించాడు కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడు అయ్యాడు. పితృ వాక్య పరిపాలన చెయ్యబట్టి శ్రీరాముడు దేవుడు అయినాడు. సత్య ధర్మము పాటించి ఉండబట్టే సత్యహరిశ్చంద్రుడు ఆదర్శపురుషుడైనాడు.ప్రాతివత్య  ధర్మమును పాటించబట్టి ఆదర్శస్త్రీ మూర్తి అయినది. అంతేగాని వీరందరూ ప్రకృతి పురుషులే. కానీ ప్రకృతి సృష్టికర్త కాదని గ్రహించండి. అంతెందుకు ఆదియోగి పరమేశ్వరుడు కూడా ప్రకృతిలోని వాడే. ప్రకృతి తత్వాలను అర్థం చేసుకోవడం వలన వారిని మనం భగవంతుడు అనే నామం పెట్టి పూజాది కార్యక్రమాలు చేస్తున్నాము. ఈయన గురించి తెలియాలంటే శ్రీశైల క్షేత్రం మల్లన్నయే ఈయన అన్నమాట. ఆదిమానవులు పరిణామ క్రక్రమాభివృద్ధిలో ఈ మల్లన్నయే వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకుని అభివృద్ధి పరిచాడు. ఆయుధాలు తయారీ జంతువుల మచ్చిక జంతువుల వలన ఉపయోగాలు పశుపోషణ కుటుంబ పోషణ కుటుంబ వ్యవస్థ బంధుమిత్ర సత్సంబంధాలు ఆధ్యాత్మికత బోగత్వము, కామత్వము, యోగత్వము, విజ్ఞాన తత్వము ఇలా మున్నగు విషయాలు యందు ఎంతో పరిణితి చెంది అందరికీ ఆదర్శమూర్తి అవటంతో ఆది దేవుడు పేరుతో పూజించడం జరుగుతుంది. నిజానికి ఇదే పని మన శాస్త్రవేత్తలు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం కనిపెడుతూనే ఉన్నారు. అంటే మీరు కూడా దేవుళ్లే కదా. అలా ప్రతి జీవి కూడా ఏదో ఒక కొత్త అనుభవమే ఏదో ఒక విషయం యందు పొందుతూనే ఉంటుంది కదా. తెలుసుకుంటూనే ఉంటుంది కదా. అందరూ కూడా దేవుళ్లే కదా. ఆలోచించండి. నిజమే కదా. అందరికీ ఒకే ఆలోచనలు ఉండవు. ఎవరి పరిణామ క్రమాభివృద్ధి తగ్గట్లుగా వారి పరిధికి తగ్గట్లుగా వారి ఆలోచనా విధానాలు ఉంటాయి. ఎవరి ఆలోచన వారికి గొప్పదనము. ఎవరికి వారే దేవుడు అన్నమాట.నా దృష్టిలో ఆలోచనే భగవంతుడు. ఆలోచన అభివృద్ధియే భగవత్తత్వం. మంచి ఆలోచన చేస్తే పుణ్యాత్ముడు దేవుడు అవుతారు. అదే చెడ్డ ఆలోచన చేస్తే పాపాత్ముడు రాక్షసుడు అవుతాడు. అంతే తేడా. ఈ ఆలోచనలకు మూలము మన మూలక బంధమే కారణం అని గ్రహించండి. ఆలోచన రహితము అయితే ఆదియోగి. ఆలోచన సహితుడు అయితే ఆది భోగి అవుతావు. అన్నీ నీవే. అన్నిటిలోనూ నీవే. నువ్వు కానిది లేదు. నువ్వు లేనిది లేదు. అంతా నీవై ఉన్నావు. ఇదే శివోహం. నీవే దేవుడివి. నీవే భగవంతుడివి. నీవే శివుడివి. నీవే శివానివి.నీవే బ్రహ్మము. నీవే బ్రహ్మ పదార్థము. నీవే అబ్బాయివి.నీవే అమ్మాయివి. నీవే త్రిమూర్తి స్వరూపానివి. నీవే త్రిశక్తి స్వరూపిణివి.అన్ని నీకు నీవే ఉన్నావు. ఏకాకి గా ఉన్నావు. ఆత్మ గా ఉన్నావు. ఏక్ నిరంజన్ నీకు నీవే ఆడుతున్నావు ఆడిస్తున్నావు ఆట ఆపుతున్నావు. ఇదే త్రిమూర్తి తత్వము. ఇది ఏక్ నిరంజన్. కానీ నీవు ఎన్నటికి ప్రకృతి అతీతుడవు లేవు. ఎందుకు అంటే బలహీనత లేని బలవంతమైన జీవపదార్థం ఆదిమూలము సృష్టించలేదు. బలహీనత లేని వాడిని బంధించడం ఎవరికీ సాధ్యం కాదు. వాడే అవిముక్త జీవుడు అవుతాడు. అదే నిజమైన భగవత్ తత్వం కలిగిన వాడు భగవంతుడు అవుతాడు. ఇంత వరకు ఇలాంటి భగవంతుడు కనిపించలేదు. ఆగుపించలేదు. అంటే అందరికీ వారికి తగ్గ బలహీనత ఉండే ఉంటుంది కదా. నాకు చెప్పాలని బలహీనత…. మీకు వినాలనే బలహీనత… నాకు తెలుసుకోవాలని బలహీనత… నాకు రాయవలెను బలహీనత ….మీకు చదవాలనే బలహీనత…. నాకు తినాలనే బలహీనత…. మీకు వండాలని బలహీనత… నాకు చూడాలని బలహీనత…. మీకు చూపించాలని బలహీనత ఇలా బలహీనత లేని బలవంతుడు ఇంతవరకు పుట్టలేదు. పుట్టబోడు. పుడితే విశ్వమే ఉండదు కదా. విశ్వమంతా మూలక బలహీనత వల్ల ఏర్పడినది. మనిషి అసంతృప్తి వల్లనే పెరిగినది. అభివృద్ధి చెందినది. నాశనం చేయబడుతోంది. సర్వ పరిత్యాగి చేసిన పరమయోగులకు ఏమీ బలహీనతలు ఉంటాయి అన్నప్పుడు సిద్ధులు ఉండవచ్చును. సిద్ధ శక్తులు ఉండవచ్చును. ప్రకృతి ఆధీన తపన ఉండవచ్చును. ప్రకృతి ఆధీనమవుతుంది అనే అహంకారం ఉండవచ్చును. పేరుప్రఖ్యాతులు రావాలని ఉండవచ్చును. తను ఏమిటో ఇతరులకు చూపించాలని తపన ఉండవచ్చును. కాషాయము వేసినంత మాత్రాన కామము ఉండకుండబోదని గ్రహించండి. యోగి బయటికి చెప్పడు. భోగి చేయకుండా ఉండలేడు. అంతే తేడా. ఇద్దరికి వారికి తగ్గ బలహీనతలు ఉండనే ఉంటాయి. దొరికితే దొంగలు. దొరకకపోతే దొరలు. దొరికితే భోగి. దొరకకపోతే యోగి. మన ఆలోచనలే మన బలహీనత. ఆలోచన రహిత స్థితి భగవంతుడు. బంధ విముక్తి పొందే అవిముక్త జీవి. కానీ ఇలాంటి వారు మాకు దైవ అన్వేషణలో కనిపించలేదు. భగవంతుడు లేడు కానీ భగవంతుడు పేరుతో ఉన్న వాళ్లు పూజింపబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అని గ్రహించి మౌనం వహించాను.  మౌన బ్రహ్మ అయినాము. దానితో నాకు తత్వాలు రావటం మొదలయ్యాయి. అవి ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు ఏమి చేయాలో తెలుసు కదా. 
 
శుభం భూయాత్

పరమహంస పవనానంద

**************************************
గమనిక:నా వ్యక్తిగతాభిప్రాయ ప్రకారము దేవుడు లేడు...దయ్యం లేదు..ఆత్మలేదు...ఎందుకంటే పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీభత్సాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వానల నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . అమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . మానవులలో పరిణితి చెందిన ఉత్తమమానవుడే మాధవుడు...జీవులలో ఉత్తమ జీవియే శివుడు అవ్వడము జరిగినది. దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదని , ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షలు లేని దేవుడు ఉన్నట్లుగా...వివిధ వేద,శాస్త్ర,పురాణ,ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడము జరిగినది!  నమ్మకమే జీవిత నావకు దిక్చూచి. నిజానికి ఈ విశ్వము విశ్వాసముతోనే నడుస్తోంది!  ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనస్సులు ... మనిషి మనిషి కి తేడా , మనస్సు మనస్సు కి తేడా ఉంటుంది . మనస్సు + శరీరము కలిస్తేనే మానవ జీవి . ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి. పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికి తెలియదు . తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు!తెలియనివాడు తెలుసుకోలేడు! ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. మనం చేస్తున్న అవివేక పని ఏమిటో తెలుసుకోండి. ఎప్పుడైతే మనలో పాపపుణ్యాలు, భయాలు, మరణ భయాలు, ఆరోగ్య భయాలు, సమస్యల భయాలు, పాప కార్యాల భయాలు, పాప ఆలోచన భయాలు పోతాయో అప్పుడే నీ మనస్సు కాస్తా స్థిరమై నీవే దేవుడివి నీకే స్పురణ కలిగిస్తుంది. అప్పటిదాకా ఈ భయాల వలన పంచభూతాలు, ప్రకృతి శక్తులు, నామరూప దేవుళ్ళు, దైవిక వస్తువుల ఆరాధనలు మనల్ని భయపడుతూనే ఆశ పడుతూనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని గ్రహించండి. మీరే దేవుడు అనే విషయం మర్చిపోయే దాకా కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా ఈ విషయంలో భగవంతుడు ఉన్నట్లుగా ఆయన పాత్రని సృష్టిలో గాని స్థితిలోగాని లయము లో గాని ఉన్నట్లుగా మనకి కనిపించ లేదు కదా.
 

3 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. krishna bilvam kaanti heenam aithe nirjeeva padaardhamani dheeninundi jeebapadaardham erpaduthondani, ee nirjiva padaardahm

    రిప్లయితొలగించండి
  3. krishnabilvam kaanti heenam aithe nirjeeva padaardamani dheeninundi jeevapadaardham erpaduthundani, ee nirjiva padaardham nundi sajeeva brahmapadaardam erpadindani, shunyam nundi shunya brahma udbhavinchadani krishnabilvam kaantiheenamai rupantharam chenduthundani, uthama paramathmaga bhavinchukoni pujinchatam valla bhagavanthudu erpadinaadani shwaasa meeda dhyaasa valla ye vidhanga mokshapadam cheravachani bhayam tholigite manassu sthiramai neeve devudivani spurana kaluguthundani anuvula samyogam valla atmapadaardam erpadindani... manassu, shareeram kalisthene maanavajeevi mulakala madhya bandham valla punyathmudu,paapathmudani...prakruthi ye manishi medadu, mixielo vesina padaardam purvamugaa ela maarchalemo krishnabilvam lo paddadhaanni paristhithi ade rupaantharam chenduthundi...

    రిప్లయితొలగించండి